ముంచుకొచ్చుచున్న తుఫాను

ముంచుకొచ్చుచున్న తుఫాను

VGR COUNT -188 ప్రార్థన కొరకు ఒక క్షణము నిలబడియుందము. మన తలలు వంచుదము. మా కృప కలిగిన పరమ తండ్రీ, నీ మహిమాన్విత ముఖమును చూడకలిగి, నిన్ను మా తండ్రీ అని ఈ రాత్రి పిలచుటకు మేము నిశ్చయంగా ఒక భాగ్యము కలిగిన జనులమే. మేము మరణములో నుండి జీవములోనికి దాటితిమని ఎరిగియున్నాము, ఎందుకనగా మేము దేవుని కుమారులము కుమార్తెలమని పరిశుద్ధాత్మ మాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. ఆ గీతను మేము దాటితిమనుటకు ఆయనే సాక్షి. మేము లోకములోనున్న వాటిని ప్రేమించి, అపేక్షించుటకు అలవాటయినాము గాని, ఇప్పుడు అది చచ్చినది. ఇప్పుడు మేము క్రీస్తుతో కూడా నూతనముగా లేపబడి, ఆయనతో పాటు ఉన్నత స్థలములందు కూర్చుండపెట్టబడి ఆయన సన్నిధిని అనుభవించుచున్నాము. దీని కొరకు ఎంతగా మేము నిన్ను స్తుతించవలెను.

మరియు ఈ రాత్రి, ఈ సందర్భమున, ఒక బలమైనరీతిగా ఆయన దర్శించవలెనని ప్రార్థించుచున్నాము. ఈ చిన్న సంఘమును దీవించుము, దీనిని మేము ప్రేమించుచున్నాము. దీనిపట్ల, ఈ సంఘ కాపరి పట్ల, సభ్యులందరి పట్ల, ఈ కూటములో మాతో ఇప్పుడు సహవాసము చేయుచున్న వారందరి పట్ల మేము ప్రేమ కలిగియున్నాము. ఇది గొప్ప సహవాసము.

పరమ తండ్రి, ఈ రాత్రి, మేము దీర్ఘకాలము ఆయన సన్నిధిని జ్ఞాపక ముంచుకోగలిగిన ఒక ప్రత్యేక రాత్రిగా ఉండునుగాక అని ప్రార్థించుచున్నాము.

ఈ రాత్రి, ఇక్కడ ప్రభువైన యేసును తమ స్వరక్షకునిగా ఎరుగని వారు కొందరున్నట్లయినచో వారు అయనను ఈ రాత్రి కనుగొందురు గాక! గొర్రెల దొడ్డిలోనికి రాని ఆ తప్పిపోయిన గొర్రెను వెదకుటకు అరణ్యములోనికి వెళ్ళిన ఆయనను, ప్రభువా, ఈ రాత్రి వారు కనుగొందురు గాక! ప్రభువా, అనుగ్రహించుము! కూడికలో ఈ రాత్రి కృప నిలిచియుండును గాక ! అదే మేము వేడుకొనుచున్నాము. ప్రభువైన యేసు నామమున దీనిని మేము అడుగుచున్నాము. ఆమెన్. మీరు కూర్చొనవచ్చును.

2

ఈ ఆలయము, లేదా సంఘమలో ఈ రాత్రి చక్కని సహవాసము కొరకు తిరిగి కూడుకొనుట ఎంతో బాగున్నది. ఈ రోజు నేను గత సాయంకాలము యొక్క చిన్న ముద్దలను బట్టి మాత్రమే జీవించాను.

ఆ బయటి జనసమూహములోనికి ఊస్తున్నప్పుడు వివిధ రకములవారిని, నేను కలిసికొనిన వారి ముఖములను చూచుచున్నాను. గడచిన కాలములో నేను ఎంతగా వారిని బయట చూచి వారితో కరచాలనము లేదా మరేదో చేయగోరితినో గదా! కాని, ఓ, మనము కొద్దిగా ఆలస్యమయినాము. నేను కొద్దిగా త్వరపడవలెను. గత సాయంకాలము ఇక్కడున్నవారు చాలా మంది ఉన్నారని నేను మీకు తెలుపగోరుచున్నాను. అది నేను ఇతర కూటముల నుండి గుర్తించాను.

3

గతరాత్రి ఇంటికి వెళ్ళి, నా భార్యతో నేను, ఈ విధంగా అన్నాను, మనము ఆ గీతను దాటి వెళ్ళినచో అది ఎట్లుండునో అని నేను ఆశ్చర్యపడుచున్నాను. అక్కడ నిలబడి, క్రిందికి చూస్తూ అదిగో అక్కడ ఫలాని సోదరుడు, ఫలాని సోదరుడు ఉన్నారని అందుము. అక్కడ.... అది ఒక వాస్తవిక సమయముగా నుండబోవుచున్నది! త్వరగా త్వరగా రావలెనని ఆ దినము కొరకు మనము ఎదురు చూచుచున్నాము. అదెప్పుడో నేనెరుగను గాని, అది నిశ్చయంగా ఒక మహిమకరమగు సమయము, దేవుని యొక్క గొప్పమహిమలను యోహాను చూచిన తరువాత, అవి అతనికి బయలు పరచబడినప్పుడు, ప్రకటన గ్రంథములో ఇట్లు పలికెను, “ప్రభువైన యేసూ, త్వరగా రమ్ము.” అది అద్భుతమని అతడు చూచెను.

4

కొద్ది వారములు లేదా షుమారు రెండు వారముల క్రితం నేను జమైకాలోని కింగ్స్టన్ లో ఉన్నాను. వేదిక వద్ద మాత్రమే దర్శనములు వచ్చునని చాలామంది తలంచారు, ఇంకా తలంచుచున్నారు. అది వారనుకొన్న దానిలో పదవ వంతు కూడా కాదు. అది వారనుకొన్న దానిలో ఒకటికి తొంభై పాళ్ళు కూడా కాదు. అవి అన్నివేళలా కనబడును, అన్నిచోట్లా వచ్చును; ఒక్కటి కూడా ఏది ఒక్కసారి కూడా తప్పిపోలేదు.

క్రైస్తవ పనివారు, సంపూర్ణ సువార్తికులు, నిర్వహించనున్న సమావేశములో నేను ఒక అతిధిగా లేదా దానిని దర్శించుచూ యున్నాను. రెండు రాత్రులు గడిచినవి, మరియు మాకు సువార్త బోధ జరిగెను. అప్పుడు జనసమూహముతో ఒక విధమగు పరిచయము ఏర్పడినది, జనుల యొక్క ఆత్మను తాకినట్లయినది. “ఈ రాత్రికి కొన్ని ప్రార్ధనా పత్రములిచ్చి, రోగులకు ప్రార్థించ నారంభించుట చాలునని నేను నమ్ముచున్నాను,” అని చెప్పాను. ప్రభువు మనలను దీవించెను. మరియు రెండవ రాత్రి గడిచినది.

5

అపుడు మేము, బసచేయుచున్న ఫ్లెమింగో హోటల్ లోని భోజనపు గది యొద్దకు నడిచి వెళ్ళాము. దానిని ఇక్కడ “ఆవరణ” అని మనము పిలుచుదుము, అక్కడ ప్రతీదియు ఐరోపా ప్రణాళిక మీద ఆధారపడి యున్నది. నీవు అద్దె చెల్లించినప్పుడు అందులో నేనీ భోజనపు ఖర్చు కూడా చెల్లించవలెను. అదంతా ఆ అద్దెలోనే ఇమిడి యుండును. మేము ఉదయ భోజనము చేయుచున్నాము. అక్కడ చాలామంది సంపూర్ణ సువార్తికులు ఇంకా ఇతరులు కూడా యున్నారు. “ఆ దర్శనములు” గూర్చిన ప్రశ్న వచ్చినది, వారు ఇట్లనిరి, “అవి అద్భుతము, అవి ఎక్కడైనా ప్రత్యక్షమైనచో చాలా అద్భుతముగా నుండును గదా.”

“ఓ, నిశ్చయంగా అవి వచ్చును, అయినా అవి ఎవరిని స్వస్థపరచవు. దేవుని విశ్వసించుటకు, నీ నమ్మకమునకు అది దోహదపడును! మీరెప్పుడైనా గమనించినచో జనులను ఈ ప్రశ్న నేనడుగుదును,” అని చెప్పాను.

దర్శనములు స్వస్థత నీయవు; క్రీస్తు ఇది వరకే దానిని చేసెను. అది కేవలము నీ విశ్వాసమునకు దోహదపడును. దేవుడు నీకు అదనముగా ఇచ్చునది అది. తాను పంపుదునని వాగ్దానము చేసిన ఒక దీవెన, చివరి దినముల యొక్క ప్రత్యక్షత. ఈ వారములో దానిని గూర్చి తరువాత తెలిసికొందము.

6

కాని మేము ఆ బల్లనొద్ద కూర్చునియుండగా, నేను చెప్పాను, “ఇక్కడిప్పుడు పరిశుద్ధాత్మ యున్నది.” సహోదరుడు షెకారియన్ ను మీలో చాలామంది ఎరుగుదురు, సహోదరుడు డియోస్ నాకు బహు సన్నిహిత మిత్రుడు. సహోదరుడు ఆర్గన్ బ్రైట్, మరియు ఓ, చాలామంది, సహోదరుడు సన్మోర్, సంపూర్ణ సువార్త సంఘపు అధ్యక్ష, ఉపాధ్యక్షులు, తదితరులున్నారు.

నేనిట్లు చెప్పాను, “ఇక్కడికి వచ్చుచున్న బాలుడు వ్యాధిగ్రస్తుడు,” అతడు నిరీక్షకుడు. అతడు బల్ల దగ్గరకు రాగా, పరిశుద్ధాత్మ అతనితో మాట్లాడి ఇట్లు చెప్పసాగెను, “ఇప్పుడు నీవు గుండె జబ్బుతో బాధపడుచున్నావు. నీ భార్య కూడా ఒక క్రైస్తవురాలే. నీవు నమ్ముచున్నావు గాని, భయపడుతున్నావు.” అతడెవరో, ఏమిటో అంతా అతని గూర్చి చెప్పసాగెను. ఆ కుర్రాడు దాదాపు నా పళ్ళెములో ఆ వెన్న గిన్నె జారవిడిచాడు.

కావున అతడు చెప్పెను, “అది ఎంతో సత్యము!”

అప్పుడు నేను అతనికి చెప్పాను - నేను కాదు, కాని పరిశుద్ధాత్మ ఇంటియొద్ద నున్న అతని భార్య బలహీనత ఏమిటో చెప్పెను. అతడు ఇల్లు విడుచు ముందుగా వారిద్దరు కలిసి ఏమి ప్రార్థించారో ఆ ఉదయమున, ఆ దినము నన్ను చూడవలెనను అతని కోరికను తెలియ చెప్పెను. ఓ, మై, అతడు స్పృహ కోల్పోయినట్లు ఆయెను.

“అదేట్లు జరిగినదో నాకు అర్థము కాలేదు,” అని అతడనెను.

“నాకూ అంతే,” అని నేనన్నాను.

7

నాకు తెలిసిన ఒకే ఒకాయన సహోదరుడు షెకారియన్ లేదా.... క్షమించండి నేను కారు నడుపుకొని వచ్చినప్పుడు సహోదరుడు డుప్లెసిస్ ఆ కారు వద్ద బయట ఉండెను. మరియు ఈ సంఘములోనున్న చక్కని ఆత్మను గూర్చి సహోదరుడు మెర్సియర్, నేను ముచ్చటించాము. అట్టి చక్కని సహవాసమును మేము ప్రేమింతుము. (సహోదరులారా, అది చాలా మంచిది, అలాగే కొనసాగించుడి, మన సోదరుడు, సంఘ కాపరి, అది చాలా మంచిది.) మేము మాట్లాడుకొనుచున్నాము, మరియు అతడిట్లు పలికెను, “సహోదరుడా బ్రెన్హాం, నీకు చాలా కష్టములున్నవని ఊహించుచున్నాను....”

అందుకు నేను, “కాదు, నన్ను ఆశ్చర్యపరచునది దేవుని కృపయే. అనేకసార్లు నేను ఆయన కృపను వెచ్చించాను, కాని ఆయన దయను నేను ఎన్నడూ వెచ్చించలేను, దానిని బట్టి నాకెంతో ఆనందముగా యున్నది,” అని చెప్పాను.

8

ఆ ఉదయాన మేము బల్ల వద్ద మాట్లాడుకొనుచుండగా, ఒక యువతి తన భుజములపై కొన్ని దుప్పట్లు పట్టుకొని ఆ స్థలము గుండా ఆ హాలులోని ఒక దానిలోనున్న పరుపులను సర్దుటకు వెళ్ళుచున్నది. నేనిట్లు పలికాను, “ఆ బాలిక పైన ఆ వెలుగు ఇప్పుపుడు వ్రేలాడుచున్నది. ఇక్కడికి అమెను పిలచుకొని రండి.” మేము ఆమెను వెనుకకు పిలిచాము. అప్పుడు పరిశుద్ధాత్మ ఆమె యొక్క బాధను గూర్చి పూర్తిగా చెప్పనారంభించెను.

ఆమె ఒక క్రైస్తవురాలు కాదు - సంపూర్ణ సువార్త విశ్వాసురాలు కాదు, ఆలాగు నేను చెప్పవచ్చును. ఆమె చిన్న బాలికగా నున్నప్పటి నుండి ఉద్యోగమును చేసికొనెను, ఆమె తల్లి ఆమెను సంఘమునకు తీసికొని వెళ్ళెను. మరియు ఆమె పండ్రెండు లేదా ఆ దరిదాపు వయస్సులో ఉన్నది. ఆమె బాప్తిస్మము పొందెను గాని ఎన్నడూ సంఘానికి హాజరు కాలేదు. ఆ కారణమును బట్టియే నేను క్రైస్తవురాలు కాదు, అని చెప్పెను.

సంఘము నిన్ను ఒక క్రైస్తవునిగా చేయజాలదు. ఒక క్రైస్తవునిగా ఉండుటకు, నీవు జన్మించిన దానిలో నిలిచియుండుటకు, నీ అనుభవమును కొనసాగించుటకు, నీ వలె ప్రశస్త విశ్వాసముతోనున్న సోదరులతో కలిసి సహవాసమును నీవు చేయుచుండగా పై చెప్పిన విషయములలో నీకు సంఘము సహాయపడును.

9

మరియు అక్కడ కూర్చొనియుండగా, నేను చూచుచుంటిని, అందులో నుండి సహోదరుడు డిమాస్ షెకారియన్ నన్ను పిలిచి ఇట్లు పలికెను, “ఏమిటి సంగతి?” ఆ సమయములో అతడు ఆలాగున అడుగవలసిన పనిలేదు.

నేనిట్లు చెప్పాను, “గుర్తుంచుకో, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నాకు దగ్గర నున్న ఎవరో ఒక వ్యక్తి చనిపోవ సిద్దముగానున్నారు. ఒక యువకుడు నోటి నుండి రక్తము కక్కుటకు సిద్ధముగానున్నాడు.” “బిల్లీ ఎక్కడ?” అని నేనడిగాను.

మీలో చాలామంది నా కుమారుడు బిల్లీ పాల్ ను ఎరుగుదురు, అతడు చిన్న బిడ్డగా నున్నప్పుడు తల్లి చనిపోయెను. నేను అతన్ని ఎత్తుకొని పెంచాను. రాత్రులందు గదిలో కుంపటిని ఆరిపోకుండా వేడిగా నుంచేందుకు కావలసినంత బొగ్గు కూడా ఉండేది కాదు. రాత్రులందు వెచ్చగా నుండునట్లుగా అతని పాలబుడ్డిని ఈ విధంగా నా భుజముల క్రింద ఉంచుకొనేవాడిని. అతడు లేచి తల్లి కొరకు ఏడ్చుచుండగా, ఆ బుడ్డిని ఆతని నోటిలో ఉంచెడివాడిని. “ఎప్పుడూ బిల్లీని హత్తుకొని ఉండు,” అని ఆమె చనిపోవుచున్నప్పుడు నాకు చెప్పినది. నిజముగా మేము ఎల్లపుడు అత్యంత సన్నిహిత స్నేహితులవలె మెలగుదుము. కనుక నేను వెళ్ళు చోటకల్లా నేను బిల్లీని తీసికొనిపోదును, ఆతడు నన్ను అంటిపెట్టుకొని యుండును.

10

కాబట్టి అప్పుడు బిల్లీ కొన్ని చిత్రములు తీసికొనుటకు, “నిరీక్షణ తోట” అని వారిచే పిలువబడు చోటకు వెళ్ళుటకు సిద్ధమయ్యెను. నేను త్వరగా అతన్ని పిలిచాను “వెళ్ళవద్దు. ఏదో జరుగనైయున్నది” అని నేను చెప్పాను.

అవి ఏమిటో మనకు తెలియని విషయములను చాలాసార్లు దర్శనములు చెప్పను. దేని గురించి వారు వ్రాయుచున్నారో బైబిలులోని ప్రవక్తలు ఎరుగరు. వారు దానిని వ్రాశారు. అంతే, వారు ఆత్మ ప్రేరితులై, ప్రత్యక్షత పొందినవారు.

సహోదరుడు, షెకారియన్ చెప్పెను, “సహోదరుడా బ్రెన్హాం, ఏది జరుగునని నీవు చెప్పుచున్నావు?”

నేనిట్లు పలికాను, “నాకు తెలియదు. ఎవరో పళ్ళు అసలు లేని వారు, రెండు సార్లు నోటితో గాలి పీల్చుటకు కష్టపడి, మరణించెను. మరోవ్యక్తి, వారన్నారు, వారి నోటనుండి రక్తము కక్కెను. ఒక యువకునివలే కనిపించెను; అయితే ”అతడు సిద్దముగా లేడు, గనుక చనిపోజాలడు,“ అని చెప్పెను.

11

అప్పుడు మేము పరీక్షించి చూచాము. ప్యూర్టోరికోకు కాకుండా జమైకాకు వెళ్ళుటకు నడిపించబడినట్లు అనిపించినది.

కనుక మాకు సమయము వచ్చినప్పుడు ప్యూర్టోరికోకు వెళ్ళు సమయము వచ్చినప్పుడు, జమైకాలో విమానము కూలి జనులను చంపిన అదే స్థలములోనికి నడిపించబడినాము. వారు సురక్షిత దట్టీలో నుండి వ్రేలాడుతూ పందులవలె కన్పించారు. వారి శరీరములోని భాగము కాలిపోయినది. వారు దానిని త్రోసివేశారు. మేము లోనికి వెళ్ళినప్పుడు ఆ విమానము ఇంకా అక్కడే పడివున్నది. మా విమానము ప్యూరిటోరికోకు తీసికొని వెళ్ళుటకు తిరిగి వచ్చినప్పుడు, మమ్ములను ఎక్కించుకొనుటకు ఆగినప్పుడు, అదే స్థలములో పిస్టనులను బయటకు తన్నినది. “నాన్నగారూ, దానిలో ప్రయాణము చేయుటకు మనము చొరవ తీసికోవచ్చునా?” అని బిల్లీ అడిగాడు.

“ఆ క్రైస్తవ పనివారల కూటమి నేను తప్పక రావలెనని చెప్పెను. వారి యొక్క సహవాసము కొరకే ఈ రెండు రాత్రులు నేను వెళ్ళుచున్నాను,” అని అన్నాను.

“మీకు ఆ దర్శనము జ్ఞాపకమున్నదా?” అని అన్నాడు.

“అవును,” అని చెప్పాను.

12

నేను వచ్చిన మూడు రోజుల తరువాత....... నేను నిలబడి యున్నాను........ప్యూర్టోరికోలోని ఒక తోట అది (అంత అందమైనది ఎన్నడూ నేను చూడలేదు) నా కెనడా స్నేహితుడగు ఫెడ్ సూద్మన్ చిత్రములు తీసికొనుచున్నాడు. (అతడు ఈ రాత్రి ఇక్కడుండి యుండును) ఈ గొప్పది.... ఇక్కడ ఫీనిక్సులో ఉన్నది అందమైనదే, లాస్-ఏంజలస్లో ఉన్నది అందమైనదే, మయామీలో ఉన్నది అందమైనదే, కాని అవి ప్యూర్టోరికోలోని ఒక క్రొవ్వొత్తికి కూడా సమానమైనవి కావు. ఓ, అది సుందరమైనది. నా జీవితములో అట్టిది ఎన్నడూ చూడలేదు. నీటిలో మునిగియుండు పెద్ద రాతి గట్టులు బయటకు ఒక అరమైలు దూరము పొడుచుకొని వచ్చినవి. అ ఉష్ణమండల సంబంధమగు ఉద్యానవనములలో నీటి కొంగలు నడుచుచున్నవి. పరలోకమువలేనున్న అటువంటి దానిని ఎన్నడూ నేను చూడలేదు. సహోదరుడు సోద్మన్ నా వైపు తిరిగి ఇట్లు పలికెను, “సహోదరుడా బ్రెన్హాం, పరలోకము ఈలాగే కనిపించి తీరును.”

“ఓ, అది ఈలాగుండదు, పరలోకములోని ఒక క్రొవ్వొత్తికి కూడా ఇది సమానము కాదు,” అని నేను చెప్పాను.

అతడిట్లు పలికెను, “ఓ, అవి ఆ గొప్ప సముద్రము!''

అందుకు నేనిట్లు చెప్పాను, “కాని అది భూమికి ఉయ్యాలవలే ఉండి, తరంగములను తయారు చేయుచున్నది. ”కాని అక్కడ ప్రశాంతముగా నుండును. సాధ్యమైనంత ప్రశాంతముగా అది ప్రవహించును. అక్కడి ఉద్యానవనములో నీటి కొంగలు సంచరించవు గాని, మనము సహవాసము చేయు ఆ ఉద్యానవనములో దేవుని దూతలు సంచరించును.“

13

అప్పుడే నా అత్తమామలు నా వైవునకు నడిచి వచ్చుట చూచాను, షుమారు ఎనిమిది, పది సంవత్సరాల క్రితం మా మామగారు మరణించిరి. మరియు సరిగ్గా అదే నిమిషములో మా అత్తగారు ఆయనను కలిసికొనుటకు గతించి పోయినది. అదే సమయములో ఆమె మృతి పొందెను.

ఆ తరువాత రెండు గంటలకు నేను మయామి చేరుకొన్నప్పుడు ఇంటి యొద్ద అంతా ఎట్లున్నదో తెలిసికొనుటకు ఫోను చేశారు. మా అత్తగారు (ఆమెకు పళ్ళు లేవు) రెండు సార్లు నోటితో గాలి పీల్చుటకు కష్టపడి, మృతిచెందెను. ఆమె కుమారుడు చనిపోవ సిద్దముగా లేడు. కొద్దో గొప్పో త్రాగుబోతు, కడుపులోని ఏదో భాగము చిట్లి రక్తస్రావము కలిగినది. అన్ని విధాలుగా అతడు తన నోటనుండి రక్తము క్రక్కుచుండెను.

14

ఒక రోజు సహోదరుడు షెకారియన్ నన్ను పిలిచెను. “సహోదరుడా బ్రెన్హాం, నేను ఇంతకు ముందు విననది ఏదియూ ఇంతగా నన్ను ఆశ్చర్యములో ముంచలేదు,” అని చెప్పెను. దానిని ఆపుటకు ఆ సమయములో అతడు మాత్రమే ఆ దర్శనమును జ్ఞాపకము చేసికొనగలడు. దర్శనమొచ్చిన సమయములో వ్యక్తి ఎవరో తెలియదు, కనుక అతడు అర్థము చేసికొనుటకు అది కొంత దోహదపడును. “ఈ సేవ ఫలితములోనికి వచ్చుటకు ఇది ప్రారంభము అని నమ్ముచున్నాను,” అని చెప్పెను.

అలాగే అది జరుగును గాక! ప్రతివారిని ప్రేరేపించునది ఏదో ఒకటి ఇక్కడి ఫీనిక్సులోనే జరుగును గాక! మన యుద్దోపకరణములను బిగించుకొని, ఆయన రాకకు సిద్ధపడునట్లుగా, పరిశుద్ధాత్మ మన మధ్యకు వచ్చి ఏదో జరిగించును గాక! ప్రభువు దీవించును.

15

ఇప్పుడు, మిమ్ములను ఎక్కువసేపు ఉంచను, ఎందుకనగా మీరు నిలబడియున్నారు, కాని నేను రాత్రంతా మాట్లాడినా వినగలిగినటువంటి చక్కని జనులు మీరు. కాని నేను అలాగు చేయననుకొనుచున్నాను, కాని గతరాత్రి ఆ విధంగా చేయుటకు ప్రయత్నించానని మీరనుకొనుచున్నారని నేను తలంచుచున్నాను.

నేను మీకు చిన్న సూచన ఇచ్చెదను. ఒక రోజు ఉదయాన నా ఆలయములో తొమ్మిదిన్నరకు ఆరంభించి, షుమారు పండ్రెండున్నర వరకూ, ఒక అంశముపై బోధించాను. అయినా ముందుగానే నేను వారికి చెప్పాను. “వినుట, గుర్తించుట, పనిచేయుట” అను అంశముపై ప్రసంగించాను. ఏదైనా ఒక ఆదివార మధ్యాహ్నము లేదా మరెప్పుడైనా, ఆదే అంశముపై మనము ప్రసంగించుకోవచ్చును. దానిని గూర్చి బోధించమని షుమారు ఒక సంవత్సరము నుండి పరిశద్ధాత్మ నాతో మాట్లాడుచున్నది. చివరకు సంఘములో మాట్లాడాను. మనము వెళ్ళిపోయే ముందుగా తీసికొని వెళ్ళుటకు ఎన్ని టేపులున్నవో ఆ కుర్రవాళ్ళ దగ్గర మరచిపోయాను.

16

ఇప్పుడు మన బైబిలులో త్వరగా మత్తయి 7 అధ్యాయము, 24 వచనము నుండి ప్రారంభించి మనము చదువుకొందము.

కాబట్టి ఈ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.

వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు.

మరియు ఈ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతీవాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్దిహీనుని పోలియుండును.

వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడది కూలబడెను; దానిపాటు గొప్పదని చెప్పెను.

17

చదువబడిన ఆయన వాక్యమునకు ప్రభువే తన దీవెనను సమకూర్చును గాక. “ముంచుకొచ్చుచున్న తుఫాను” అను అంశముపై కొద్ది క్షణములు నేను మాట్లాడగోరుచున్నాను. పరిశుద్ధాత్మకు మనలను మనము అప్పగించుకొనగలమని దేవుని నేను నమ్ముచున్నాను, ఎందుకనగా ఎవరికైనను నేను ప్రసంగీకుని కానని తెలియును. నా వెనుక ఇక్కడ బోధకులున్నారు. ఒక సేవకునిగానుండు విద్యను నేనెన్నడూ పొందలేదు. కాని నా పాత, మెల్లని రీతిలో, కాని నేను... వేయుటకు దేవుడు నాకు ఒక దానిని, ప్రభువు అనుగ్రహించెను. కాని నేను ప్రభువును గురించి నాకు తెలిసిన “దానిని, ఆయన యొక్క, మంచితనమును గూర్చి, ఇతరులకు చెప్పయత్నించుటకు, వివరించగలుగుటకు సమయమును తీసికొనుట నాకెంతో ఇష్టము. ఇప్పుడు ఈ రాత్రి ముంచుకొచ్చుచున్న తుఫానుపై మాట్లాడుకోనై యున్నాము, నా హృదయములో దేనిని కలిగియున్నానో దానిని వ్యక్తపరచుటలో మాటల్లో విఫలమైనచో, దానిని పరిశుద్ధాత్మ బయలుపరచునట్లుగా ప్రార్థించుచున్నాను.

18

ఈ లోకములో పుట్టిన ప్రతి స్త్రీ, పురుషుని ఎదుర్కోనైయున్న ఒక ముంచుకొచ్చుచున్న తుఫానును గూర్చి యేను ఇక్కడ మాట్లాడుచున్నాడు. దాని నుండి తప్పించుకొను మార్గమేమీ లేదు. ఏదో ఒక సమయాన ఆ తుఫాను నిన్ను ఎదుర్కొనును. నీవెట్టి విధమగు పునాది కలిగియున్నావో, దాని మీదనే నీ గృహము దానిని తట్టుకొనునో లేదో ఆధారపడియున్నది.

తుఫానుల గూర్చి సిద్దపాటు కలిగియున్నందున చాలా జీవితములు రక్షించబడినవి. రానున్న తుఫానుల గూర్చిన హెచ్చరికను నిర్లక్ష్యము చేసినందున చాలా జీవితములు నశించినవి.

19

కొంత కాలము క్రిందట, జరిగిన ఒక వృత్తాంతము నాకు చెప్పబడెను. ఫ్లోరిడాలో ఒక వార్తా పత్రికలో నేను చదివానని నేను నమ్ముచున్నాను.

ఫ్లోరిడా గుండా గొప్ప తుఫానులు చొచ్చుకొని పోయినవి. సముద్రము నుండి తుఫానులు వచ్చి పట్టణము తీసికొనిరాబడిన నీటితో నిండిపోయి, సమస్తమును కొట్టుకొనిపోయెను. అట్టి తుఫానులు గమనించి హెచ్చరించుటకు వారి వాతావరణ పరిశోధకులు ఎల్లప్పుడూ కనిపెట్టి చూతురు. ఏదో పద్ధతిలో, మూల వస్తువుల ద్వారా వాతావరణము, గాలీలోని మార్పులను గమనించి, ఏ మార్గమున ఈ వాతావరణము రాశిగా చేరుచున్నదో గమనించెదరు. అదే ఈ తుఫానులను తీసికొని వచ్చును. ఎందుకనగా వారు దాని స్వభావమును అధ్యయనంచేసి, ప్రత్యేక సాధనములు మొదలగువాని ద్వారా, సైన్సు వారికిచ్చిన వానిబట్టి చెప్పకలుగుచున్నారు. అప్పుడు వారు ముందుగా హెచ్చరించుట ద్వారా, ఏ దిశగా తుఫాను వచ్చుచున్నదో విని, దాని వెనుక ఎంత బలంగా గాలి వచ్చుచున్నదో, తక్కిన తుఫానులు ఎటువైపు వచ్చునో, ఆ గాలులు తుఫానును తేల్చివేయగలిగినంత సామర్థ్యమును కలిగియున్నవో లేదో తెలిసికొని హెచ్చరించెదరు.

20

నేనిక్కడ ఆగి, దానిపై ఒక గంట ప్రసంగింతును, అయితే ముంచు కొచ్చుచున్నది ఒక గొప్ప తుఫాను, ఆ తుఫానును త్రిప్పికొట్టగలిగినది ఒక పెద్ద గాలి మాత్రమే. నేడునూ ఆలాగేయున్నది! మనకొక పెద్ద తుఫాను రానైయున్నదని మనందరకు తెలుసు. ఆ తుఫానును త్రిప్పికొట్టగలిగిన గాలి నాకు తెలిసినది ఆ పెంతెకోస్తు దినమున వీచిన బలమైన గాలియే. కమ్యూనిజానికి వ్యతిరేకంగా మాట్లాడు జనులు ఈ పట్టణంలో సహితము ఉన్నారని నాకు చెప్పిరి, తప్పక ఆలాగు చేయాలి. కాని కేవలము దానికి వ్యతిరేకంగా మాట్లాడుట చాలదు; దానిని త్రిప్పికొట్టగలిగినది మనము కనుగొనవలెను. ఆ గొప్ప తుఫానును త్రిప్పికొట్టగలిగినది ఒకే ఒకటున్నది, అదేదనగా దానిని పడగొట్టి, దాని గమనమును మార్చగల మరో ఎక్కువ శక్తివంతమగు తుఫాను.

21

ఈ ఫ్లోరిడాలోనున్న వాతావరణ పరిశోధకులు తమ ప్రవచనములో చాలా ఖచ్చితముగా నున్నారు. జనులను హెచ్చరించుటకు, ఆ పని కొరకే వారు ప్రత్యేకించబడిరి.

ఇప్పుడది మరచిపోయాను గాని ఒక తుఫాను గూర్చి కొన్ని సంవత్సరాల క్రితం ఒక వార్తాపత్రికలో చదివాననుకొంటాను. ఫ్లోరీడా గుండా, మధ్య ఫ్లోరిడా మార్గములో వెళ్తూండగా ఒకీచోబీ చుట్టూనున్న ప్రాంతాలన్నింటిలో నున్న వారిని హెచ్చరించారు. ఈ తుఫానుల గూర్చి అన్నివేళలా రేడియో సంబంధమును నిలిపియుంచిన ఒక పొరుగు ఆయన ఉన్నాడు. దానిని నేను షుమారు అయిదు వారాల క్రితమే విడిచిపెట్టాను. అతడు ఒక గుర్తింపబడిన క్రైస్తవుడు. ఆ మార్గము ద్వారా ఆ గొప్ప తుఫాను చెట్లను విరిచివేయుచూ వచ్చునని అతడు వినెను. అందరూ సురక్షిత స్థలములకు చేరిపోవలెనని హెచ్చరించారు.

కోళ్ళ క్షేత్రము కలిగియున్న తన పొరుగువాని గూర్చి ఆతడు ఆలోచించెను. కొన్ని తేలికపాటి భవనములు, అందులో కోళ్ళు వాటి పొదిగే గృహములు, అవి గ్రుడ్లు పెట్టు స్థలములు మొదలగునవి అక్కడున్నవి. జీవితములో వారికి కలిగినదంతయూ ఈ కోళ్ళుతోనే ముడిపెట్టబడియున్నది, అది వారి జీవనము. అతడు బహు త్వరగా ఆ గేటు వద్దకు దూసికొనిపోయి తన కారును ఆపి బయటకు దూకి ఉద్వేగముతో అతనితో ఈలాగు చెప్పసాగెను, “నీ కోళ్ళన్నింటినీ బయటకు తీసి, వాటిని తుఫాను వచ్చునప్పుడు భద్రపరచు గదిలో నుంచుము, మరియు నా యొద్దకు నీవు బహుత్వరగా రమ్ము. సమస్తమును ధ్వంసము చేయు తుఫాను లేదా గాలివాన రానున్నది.”

22

ఆ వ్యక్తి నిలబడి ఇతని ముఖంలోకి చూచి నవ్వుతూ ఇట్లనెను, “వెర్రివాడా, వారు ఇంతకు ముందు ఈ విధంగా ప్రవచనము చెప్పుట విన్నాను, కాని అదెన్నడూ జరుగలేదు.”

అయితే ఆ క్రైస్తవ పొరుగువాడు బహుగా కలతచెంది, “ఒకవేళ అలాగు జరిగితే ఏమగును?” అని ప్రశ్నించెను.

మార్గములో అలాంటి మాటలు మనము విందుము, “ఇది జరుగునని చెప్పుట విన్నాను. అది జరుగునని చెప్పట ఎరుగుదును.” కాని ఈ దినములలోనే ఏదో ఒక రోజున అది సంభవించును! ప్రతి హెచ్చరికను విని జాగ్రత్తపడుటకు అది మనకు బుద్ధికలుగ చేయుచున్నది.

23

కాని ఈ వ్యక్తి పలికినది, “ఆ బుద్దిహీనత వినుటకు నాకు, సమయము లేదు. నేను కోళ్ళు పెంచుచున్నాను, మరియు నాకటువంటి వానికి సమయము లేదు.”

అతడు మొర్రపెట్టెను, పొరుగువాడిట్లు పలికెను, “దేవుని నామములో ఆ కోళ్ళను విడిచిపెట్టి, జాన్, నీవు నీ కుటుంబము త్వరగా రండి. ఒకవేళ నీవు దానిని నమ్మనిచో, నీ కుటుంబమునైనా రానిమ్ము.”

అందుకతడు ఇట్లనెను, “ఏవో కొద్ది రేడియో హెచ్చరికలను విని నా పిల్లలను కలవరపడనీయను. నా పిల్లలు నేను ఎప్పటివలె నావలె జీవించుటకు తీర్మానము చేసికొన్నాము. నా భార్య నా మాట వినును, ఎందుకనగా ఈ ఇంటికి నేనే పోషకుడిని, తప్పక ఆమె నా మాట వినాలి, ఇక్కడ నేను యజమానిని. ఏదో ఆ బుద్ధిహీనపు మాటలు విని నా పిల్లలందరూ ఉద్వేగముతో కంపించిపోవుట నాకు ఇష్టం లేదు.”

ఆ పొరుగువాడు వెనుదిరిగి, తన గృహమునకు వెళ్ళి, తన ఆశ్రయ స్థలమునకు వెళ్ళెను.

24

అకస్మాత్తుగా వారది తెలిసికోకముందే ఆ మేఘములు ఆతనిపై అలముకొనెను! తీర్పు అలాగే మొత్తబడును! అది అంత త్వరగా వచ్చును. అది అంత శీఘ్రముగా ఎట్లు వచ్చెనా అని ఆశ్చర్యపడెదవు. ఒకప్పుడు దేవుని దూషించిన క్రూరులు పడిపోయి, “ఈ విధంగా నీవు నన్నెందుకు చేయుచున్నావు,” అని కేకలువేయుట నేను చూచాను. ఒక్క క్షణములో అతని క్రింద నున్న మొత్తము పునాది, సమస్తమూ, తుడిచి పెట్టుకొనిపోయెను. హెచ్చరికను విని లక్ష్యపెట్టవలెను.

ఓ, నీవు వర్తమానికుని చూచి నవ్వవచ్చును, నీవు ఒకవేళ అతనిని చంపుట కూడా చేయవచ్చును; కాని నీవు ఆ వర్తమానమును చంప జాలవు, అది ఎప్పటివలె కొనసాగును. దేవుని వర్తమానము నిత్యమైనది. ఆయన మాటలెన్నడూ తప్పిపోవు.

సైఫనును రాళ్ళతో కొట్టి చంపుటలో పౌలు జయము పొందెను, కాని అతని జీవితమంతటిలోను, క్రీస్తుకు స్వాధీనమగు వరకు, ఎన్నడు అతడు ఆ వర్తమానము నుండి దూరంగా వెళ్ళజాలక పోయెను. ఆ వర్తమానము, “పరలోకము తెరువబడుటయు, దేవుని కుడిపార్శ్వమున యేసు నిలచియుండుటయు నేను చూచుచున్నాను,” అనునదే. ఏదో అతనిని పట్టుకొన్నది. వర్తమానికుడు కాదు గాని; అతడు పొందిన వర్తమానమే అది.

25

ఆ దేశము గుండా తుఫాను చొచ్చుకొనిపోయినప్పుడు, అది ఆ కోళ్ళ గృహమును, ఆ వ్యవసాయకుని నాశనము చేసినది. అతని శవము నెన్నడూ వారు కనుగోలేకపోయిరి.

అతని భార్య పిచ్చెక్కిన దానివలె పోరాడినది. వారు ఆ మహా ఒకీబోబీ సరస్సుకు దగ్గర్లోనే జీవించిరి. ఆ సరస్సు గర్భము నుండి ఆ తుఫాను నీటినంతటినీ ఎత్తినప్పుడు, జలములు పైకి లేపసాగెను. అదే వారిని ఆపదలో ముంచెను! అవి గుల్లగా నుండును, దోనెలు ఊగిసలాడును. ఆ విధంగానే అలలు లేచి దోనెలను క్రింది నుండి త్రిప్పివేయును. తుఫానులు వచ్చి నీటిని సుడిగా త్రిప్పి, మైళ్ళ దూరానికి దానిని విసిరివేయును. ఆ నీరు తుడిచిపెట్టుకొని పోవుచున్నది. ఆ తల్లి అది ఎరిగి పిల్లలను భవనము పైకి తీసికొనిపోవుట తప్ప మరో ఆశ లేక, ఆ పిల్లలను ఆ భవనము పైకి కొనిపోయెను. వారు ఆ ఇంటి యొక్క పొగ గొట్టుమును పట్టుకొనిరి.

26

అప్పుడా వన్యజీవులు, కాటన్ మవుత్ మొకాసిన్ అనుకొంటాను, (అది మా డైమండ్ బ్లాక్ రాట్లర్ సర్పము కన్నా విషతుల్యమైనది.) అవి రక్షణకొరకు ప్రాకుకొంటూ ఆ ఇంటి పైకప్పు మీదికి ఆమెతో చేరినది. తన భర్త మాట విని, హెచ్చరికను పాటించనందు వలన ఆమె దానిని బలముగా తొక్కినది, కొట్టినది కాని ఆమె ఆ భయంకర సర్పములు, పిల్లలను ఆ పైకప్పుపైన చనిపోవు వరకు కరచుట ఆమె చూస్తూ నిలబడినది తప్ప మరేమీ చేయజాలక పోయెను. ఆ తల్లి కూడా చాలా కాటుకు గురి యగుటచే చివరకు ఆమె చనిపోయినది. అదే మనకు తెలిపిన గాధ. తుఫాను సద్దుమణిగిన పిదప మృతుల కొరకు వెదకుచున్న వారికి ఆమె తన ప్రక్కన పిల్లలతో పాటు ఆ పైకప్పుపైన పడి యుండుట కనబడినది.

27

ఓ, హెచ్చరికను మనము లక్ష్యపెట్టవలెను!

మొదటిగా చేయవలసినది, హెచ్చరిక అనునది వినబడుటకు ముందుగానే, భద్రత కొరకు సిద్దపాటు కావలసియున్నది, లేనిచో ఆ హెచ్చరికను పంపించవలసిన అవసరము లేదు. ప్రమాదము నుండి బయట పడుటకు నిన్ను సిద్దపరచుటకు పంపబడునదే ఆ హెచ్చరిక అను స్వరము. మొదటగా ఒక సిద్దపాటు మనము చేసికొనవలెను. అప్పుడు సిద్దపాటు అయినచో, హెచ్చరిక నీ తీర్మానమును అనగా దానిని వినవలెనో, లేదో అను తీర్మానమునకు హేతువై ముందుకు కొనసాగును. నీవు దానిని వినగోరనిచో అది నీదే. నీవు దానిని వినినచో, భధ్రత యుండును.

28

దేవునికిని అదే పద్దతి యున్నది. మనము దేవుని పద్ధతిపై ఆలాగే పనిచేయుదుము. దేవుడు పూర్వదినములలో జలప్రళయమునకు ముందటి ప్రపంచమున్న దినములలో, ప్రజలు బహు దుర్మార్గులై, బహు పాపులైనప్పుడు, దేవుడు దానిని చూచి ఊరుకొనజాలకపోయెను.

దేవుడు న్యాయవంతుడు, ఆయనకు న్యాయసూత్రములున్నవి. ఆ శాసనములు విచ్ఛిన్నమయినప్పుడు.... ఏ శాసనమయినా గాని అతిక్రమించబడినప్పుడు, శిక్ష విధింపబడనిచో అది ధర్మసూత్రము కాదు. ఎక్కడో ఒకచోట దానికి జరిమానా చెల్లించకుండా నీవు దేవుని యొక్క న్యాయ సూత్రమును ఉల్లంఘించలేవు. తప్పక నీవు అది చేయవలెను. బైబిలు ఇట్లు చెప్పెను, “నీ పాపములు నిన్ను పట్టుకొనునని నిశ్చయముగా తెలిసికొనుము.”

పాపమనగా ఏమిటి? ఒక్క క్షణము ఇక్కడ నేను నిలువగోరుచున్నాను. సిగరెట్లు త్రాగుట పాపమని చాలామంది అనుకొందురు. అది కాదు. అబద్ధమాడుట పాపమనీ చాలామంది అనుకొందురు. అది కాదు. వ్యభిచరించుట, అది పాపము కాదు. అవన్నియూ అవిశ్వాసము యొక్క లక్షణములు. నీవు అవన్నియు చేయుటకు కారణము, నీవు అవిశ్వాసివి కనుకనే.

29

రెండే రెండు ఉన్నవి: అవేవనగా నీవు విశ్వాసివిగా లేదా అవిశ్వాసివిగా వుంటావు. నీవు విశ్వాసివైనచో, ఆ పనులు చేయవు. నీవవి చేయుచున్నచో ఎట్టి విధమగు విశ్వాసమును నీవు కలిగియున్నావో నాకు తెలియదు; కాని నీవు అవి చేయుచున్నచో “దేవుని ప్రేమ నీలో లేదు.” బైబిలు ఆలాగు చెప్పెను! మనము అతిగా ఒప్పుదలను కలిగియున్నాము గాని దానియొక్క “స్వాస్థ్యమును పొందలేదు; చాలా చెప్పదుము గాని దాని ప్రకారము జీవించుటలేదు.”

ప్రసంగములపై చాలా సాధన యున్నది గాని కావలసినంత

ప్రసంగమును మనము జీవించుట లేదు, మన ప్రసంగమును జీవించినచో చాలా బాగుండును. ప్రతి ఒక్కరము ఒక బోధకునిగా అగుదుము. ఒక ప్రసంగము బోధించుట కంటే ఆ ప్రసంగమును నేను జీవించుట శ్రేష్ఠము. బైబిలు చెప్పునదేమనగా, “మనుష్యులందరి చేతను చదువుబడుటకు వ్రాయబడిన దేవుని పత్రికలు మీరు.” కనుక ప్రసంగమును జీవించుట శ్రేష్ఠము.

30

నీవు నమ్మనందున పాపము చేయుచున్నావు. యేసు తాను శరీరధారిగా ఈ భూమి మీద నుండిన దినములలో చెప్పలేదా? అబద్దమాడని వారు, దొంగతనము చేయనివారు, వ్యభిచారము చేయనివారు, నీతిమంతులు, బోధకులు, యాజకులు, మొదలగువారిని ఆయన, “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు,” అని పిలువలేదా! ఎందుకనగా వారు దేవుని కుమారుని యందు విశ్వాసముంచలేదు. “విశ్వసించనివానికి ఇదివరకే శిక్ష విధించబడియున్నది.”

31

కొంత కాలము క్రిందట నేను దానిని చేశాను, వేదిక పిలుపులు ఇచ్చాను. నాకు యోహాను 5:24 అంటే ఇష్టము: “నా మాటలు విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు. అట్టివాడు తీర్పులోనికి రాక, మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు.” నమ్మినవాడు!

“అది చాలా తేలిక,” అని చెప్పెదరు.

కాదు, అది చాలా లోతు, ఎందుకనగా నీవు నమ్మినప్పుడు.... “పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఏ మనుష్యుడును యేసును, ”క్రీస్తు“ అని పిలువజాలడు. నీవు పరిశుద్ధాత్మను కలిగియున్నప్పుడు, నిత్యజీవములోనికి, నీవు విశ్వసించినావు. నిత్యజీవమును కలిగియుందువు. ”నా మాటలు విని, నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. అట్టివాడు తీర్పులోనికి రాక, మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు.“ సిద్దపాటు, తయారగుట!

32

దేవుడు ప్రపంచము యొక్క దుష్టత్వమును చూచెను, ఆ దుర్మార్గ, వ్యభిచార తరమును చూచెను. ఆయన పరిశుద్దత ఏ మాత్రము దానిని సహింపజాలక పోయేను. ఓ, ఈ పాప ప్రపంచము!

నా భార్యతో కాయగూరల అంగడికి వెళ్తూ ఒక రోజున ఆగాను. మా పట్టణములోని ఒక యువతి గూర్చి మేము సంభాషించుకొనుచున్నాము. చాలా చలి వాతావరణములో ఒక చిన్న లావు కోటు వేసికొని, ఆసభ్యకరంగా దుస్తులు ధరించినది. చిన్న షార్టులు వేసికొన్నది. వాటిని వారు ఎండా కాలములో వేసికొందురు. అప్పడేమో భూమి మీద చిన్న మంచు కణములున్నవి. “అమె హాయిగా ఉండజాలదని నీవెరుగుదునా?” అని నా భార్య నాతో అన్నది.

“కాదు, ఆమె మతి సరైన స్థితిలో లేదు,” అని నేనన్నాను.

“నీకు తెలుసా, ఆమె ఉన్నత పాఠశాలకు వెళ్ళెను,” అని చెప్పినది.

“ఆమె హై-స్కూలుకు వెళ్ళవచ్చును, కాని అది ఆమెను అన్ని విధాలా సరిగా చేయజాలదు. ఆమెకు మతి సరిగా లేదు,” అని నేను అప్పుడు చెప్పాను.

33

మేము జర్మనీ వెళ్ళాము. కొద్దికాలం క్రిందట నేను జర్మనీలో ఒక పెద్ద కూటములో యున్నాను. ఒక్క రాత్రిలోనే షుమారు పదివేల ఆత్మలను ప్రభువు ఇచ్చెను. ఒక చిన్న భోజనమునకు ఆహ్వానించబడినందున ఒక స్థలమునకు కూటమునుండి వస్తూ వీధిలో ఒక దృశ్యము చూచి ఆ రాత్రి ఆశ్చర్యము చెందాను. అది కూటముల ముగింపు. క్రైస్తవులందరూ చుట్టూ కూర్చొని బీరు త్రాగుచున్నారు. క్రైస్తవులు త్రాగకూడదని నిషేధించు దేశములు అమెరికా, కెనడా, ఇంగ్లాండు మాత్రమేనని నాకు తెలుసు. వారు త్రాగరు. కాని మన అమెరికనులు త్రాగుదురు........ నేను దానిని త్రాగను. కనుక కొద్ది సేపటి తరువాత ఆ బల్ల వద్ద ఒక ప్రశ్న వచ్చినది. “ఏమిటి సంగతి?” నేను నా బీరు త్రాగుటలేదు. “అది బాగోనందున త్రాగుటలేదా?”

34

(డాక్టర్ గుగ్గిన్ బుల్ నా ప్రక్కన కూర్చొనియున్నాడు, ఆయనే నాకు అనువాదకుని ఏర్పరచెను.) వారు నా గూర్చి ఏమిటి గొణుగుకొనుచున్నారు?“ అనడిగాను.

“నీవెందుకు త్రాగుట లేదని వారు ఆశ్చర్యపడుచున్నారు,” అని చెప్పాడు.

ఇప్పుడు, ఆ వ్రాయబడినది నేనెరుగుదును. నీవు రోమ్లో నున్నప్పుడు రోమన్ వానివలె ఉండు.“ ”వారికీలాగు చెప్పుము: నేను వారిని ఖండించను. కాని నేను నాజీరు పుట్టుకను కలిగియున్నాను. నేను త్రాగకూడదు,“ అని చెప్పాను. నేను వారిని బాధపరచగోరలేదు. వారది అర్థము చేసికొని త్రాగుడును కొనసాగించారు.

ఇటలీలో కూడా దాదాపు అదే స్థితిని కనుగొన్నాము. లోకము యొక్క విభిన్న భాగములలో, దేశములలోనికి నీవు వెళ్ళినప్పుడు, నీవు ఆ దేశము యొక్క ఆత్మను కనుగొందువు.

35

ఫిన్లాండులోని యువ క్రైస్తవ సంస్థ (YMCA) యొద్దకు వెళ్ళవద్దని పరిశద్దాత్మ నాకు చెప్పుట జ్ఞాపకమున్నది. ఎందు గురించియో నాకు తెలియదు. కనుగొనినదేమనగా వారికి అక్కడ స్నానపు స్త్రీలు ఉన్నారు. నేను దూరంగా ఉన్నాను. డాక్టర్ మాన్నినాన్, తదితరులతో నేను ఈతకు వెళ్ళలేదు. పురుషులకు స్నానము చేయించు స్త్రీలు ఆక్కడుండుట నేను కనుగొన్నాను. “అది సరి కాదు” అని నేనన్నాను.

“సరే, సహోదరుడా బ్రెన్హాం, మీ అమెరికాలో నర్సులు ఎంత సరియో, అంతే అది కూడా. వారు దానికి శిక్షణ పొందారు,” అని చెప్పాడు.

వారెంతగా శిక్షణ పొందినా నాకక్కర లేదు. ఆ విధముగా అదెన్నడూ ఉద్దేశించబడలేదు! దేవుడు వారిని కప్పియుంచి, వారిని వేరుగా నుంచెను!“ అని నేను చెప్పాను. అది నిజము! కాని వారు దానికి లెక్క చెయ్యరు.

36

వారు ఫిన్లాండు వారు, అద్భుతమగు జనులు, కాని అది ఆ దేశము యొక్క ఆత్మ. నీవెక్కడికి వెళ్ళినా గాని, ఆ దేశము యొక్క ఆత్మను నీవు కనుగొందువు. మీరు అమెరికా వచ్చినచో అక్కడ దానిని మీరు నిజంగా కనుగొందురు. అది అన్నిటికంటే నీచమైనది.

నా భార్య నాతో ఇట్లు పలికెను, “ఎందుకని? వారు సంఘమునకు వెళ్ళుదురు గాని వారి మనస్సాక్షి ఎందుకు దాని గద్దించదో నాకు ఎప్పుడూ ఆశ్చర్యము కలుగును.”

“నా ప్రియ భార్యా, నన్ను చెప్పనీ. వారు అమెరికనులు,” అని నేను చెప్పాను.

“అయితే, మరి మనమెందుకు ఆలాగు లేము?” అని అన్నది.

“కాదు. మనము కేవలము ఇక్కడ బ్రతుకుచున్నాము. కాని మనము పైనుండి జన్మించియున్నాము. దేవుని పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చియున్నది,” అని నేను చెప్పాను.

కాబట్టి ఇక్కడ మనము - యాత్రికులమును, పరదేశలమునై యున్నాము. ఇది మన నివాస స్థలము కాదు, కాని మనము దేనికి దేవుడు శిల్పియు, నిర్మాణకుడో, ఆ రానైయున్న పట్టణము కొరకు ఎదురుచూచుచున్నాము. కాబట్టి నీవు పై నుండి జన్మించినచో, నీలో దేవుని నుండి పరిశుద్ధాత్మ దిగివచ్చి నీ స్వభావమును మార్చును. నీ సోదరి, నీ తల్లి, నీ ఉత్తమ స్నేహితులు ఆలాగు దుస్తులు ధరించుకొనినను నీ కక్కరలేదు; కాని దేవుని ఆత్మమూలముగా పుట్టిన క్రైస్తవుడు పైనుండి జన్మించినవాడు. వారి ఆత్మ మరొక రాజ్యమునకు చెందినది. ఓ, దానిని బట్టి నేనెంతగానో ఆనందించుచున్నాను! పరిశుద్ధాత్మ యొక్క సామాన్యత - దానిని వెంబడించుట, దానిని గమనించుట, అదెట్లు ప్రవర్తించునో చూచుట. నీవును ఆలాగే ప్రవర్తించునట్లు చేయును.

37

నోవహు దినములలో అది ఆ విధముగానే యుండెను. దేవుడు దానితో అంతగా నింపబడి యుండెను! సర్వప్రపంచమును నాశనము చేయుటకు ఒక తుఫానును ఆయన పంపు ముందుగా, దానికి వెలుపలగా జీవించగోరిన వారికి దేవుడు సిద్దపాటును తయారు చేసెను. ఆ ఓడ గుమ్మమునొద్ద నోవహు నిలబడి నీతిని గూర్చి బోధించుట నేను చూడగలను.

ఓ, అతని మాటను విన్నవారు ఎక్కువ మంది లేరు. వారు నేటివలెనే ఉండిరి. వారికి సువార్త కాదు, వినోదము కావలెను. పాపమును “పాపము” అని పిలుచుటకు భయపడుచున్న ఈ హాలీవుడ్ సువార్తికులకు శ్రమ!

ఒక విధమగు రబ్బరు చేతి తొడుగులతో చేతులు కప్పుకొనక, యేసు ప్రభుని రాకను, దుర్మార్గుల తీర్పును, నీతిమంతుల పరలోకమును, సమీప ఆగమనమును బోధించుటకు, తమ వట్టి చేతులతో సువార్తను బోధించుటకు భయపడని పరిశుద్ధాత్మను కలిగిన వెనక అడవుల బోధకులు, పాత-పద్ధతి ప్రసంగీకులు కొందరు మనకు అవసరము! ఏ కాలము? నాకు తెలియదు, ఎవరునూ ఎరుగరు. కాని నా తరమును నేను హెచ్చరింతును. అది ఇప్పుడే వచ్చినచో జాగ్రత్తగా నుండమని వారిని హెచ్చరించగోరుదును.

38

ఆ ఓడ ద్వారము యొద్దనే నోవహును నేను చూడగలను. ఓ, ఒక్క సంగతి నేను నమ్మగోరుచున్నాను: అది ఆ విధముగా లేదు, కాని... నోవహు ద్వారము నొద్ద నిలబడి యుండెను. సురక్షితమునకు అదొక్కటే మార్గము.

ద్వారబంధపు కమ్ములపై రక్తముతో, తీర్పును బోధించుచూ, ఆ రక్తముతోనున్న ద్వారపు కమ్ముల యొద్ద ఆ తరువాత మోషే నిలబడుట నేను చూడగలను.

ఈనాడు ఆ గొర్రెల దొడ్డికి ద్వారము యేసే, సువార్త పరిచారకులు ఆ ద్వారములో నిలబడియుండి, భధ్రతకు రండని జనసమూహములను బ్రతిమాలుచున్నారు.

నిస్సందేహముగా అనేకులు నోవహును చూచి నవ్విరి, అపహాస్యము చేసిరి. “వారు అపహాసకులని బైబిలు చెప్పెను. ఈలాగు వారు చెప్పుట నేను విందును, ”నోవహూ, అంతకంటే మంచి వినోదము మరేదైనా నీ యొద్ద లేనిచో, మేము ఇంటి యొద్దనే ఉందుము.“

39

నేడు ప్రపంచము, అమెరికా సువార్తను కోరుటలేదు. వారికి వినోదము కావలెను. వారిని వినోదపరచునది ఏదో వారికి కావలెను. చాలా వింత సంగీతము, లేదా అట్టిది మరొకటి, లేదా ఏదో విధమగు విందు ఒక రకమగు వేపుడు కావలెను. అవన్నీ సరియే, కాని సంఘమునకు వెలుపట ఉండాలి. ఒక హెచ్చరిక మరియు ప్రభువైన యేసు యొక్క పునరుత్థాన శక్తిలో తీర్పును గూర్చి సంఘములో బోధించవలసియున్నది. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగును! విందులు కాదు; తీర్పు!

లోతు హెచ్చరించబడెను. ఆ దేవదూతలు, వారు దేవదూతలని అతనికి తెలియనప్పటికి, వారు వెళ్ళినప్పుడు, సొదొమకు వారిచ్చిన వర్తమానము, “ఈ పాపస్థలము నుండి బయటకు రమ్ము. దేవుడు నీకు తప్పించుకొను మార్గమును ఏర్పాటు చేసియున్నాడు! ఈ పాపపుచోటు విడిచి రమ్ము!”

40

యేసు చెప్పెను, “సొదొమ దినములలో ఉండినట్లుగానే వారెట్టి విధమగు జీవితము జీవించుచున్నారో చూడుము. యేసు ఆ దినమును ఈ దినముతో పోల్చెను. పాపముతో నిండినది!

లోతు తన జనులతో చెప్పుటకు వెళ్ళుటను గమనించండి. వారతని చూచి నవ్వి, ఎగతాళి చేసిరి. “ఆ పట్టణ పాపము ఆ నీతిమంతుని ఆత్మను బాధపెట్టెను.” దేవదూతలు వర్తమానము వారిని కదిలించలేదు. వారిపై ఎట్టి ప్రభావము చూపలేదు. కాని వారిని బయటకు రమ్మని కోరిరి, ఎందుకనగా తీర్పు ఆ పట్టణముపై యున్నది. దేవుడు ఆ పట్టణముపై అగ్ని తుఫానును పంపనైయుండెను. వారు నడచుటకు నిరాకరించిరి. బయటకు వచ్చుటకు తిరస్కరించిరి. వారు తమ పాపములతో సంతృప్తి చెందిరి.

41

నేడు ప్రజలు పాపములో ఎంతో సౌకర్యవంతముగా కనిపించుచున్నారు, ఎందుకనగా మనమొక క్రొత్త కారును కలిగియున్నాము, దినమునకు మూడు రోజనములు తినగలము, శుభ్రమైన పరుపుపై నిద్రించగలము. అది అద్భుతమే. అది మంచిదే, కాని ఆలాగు అభివృద్ధిని పొందినప్పుడు దేవుని మరచిపోదుము. మనము ఆలాగే యున్నామని నేను తలంచుచున్నాను. బోధకులము, క్రైస్తవులము అయిన మనము సంఘ భవన నిర్మాణములోను, మంచి సంఘమును సంపాదించుటలోను, లేదా అట్టి కార్యక్రమములలోను, లేదా ఒక పెద్ద సంఘము సంపాదించుట మంచి బల్లలు సంపాదించుటలో చాలా ఆసక్తి కలిగియున్నాము (లేదా, మీకు నా భావము తెలియును.) మనము ప్రధానమైన దానిని విడిచిపెట్టాము: తీర్పు, నీతి, పరిశుద్ధాత్మ శక్తి, పునరుత్థానము, నిత్య తీర్పు.

వర్తమానమును బోధించుటలో దేవదూత ఎన్నడూ తప్పిపోదు. వారిని ఆపుటకు వారు ప్రయత్నించినా గాని, వారి వర్తమానము అదే రీతిగా వెళ్ళెను.

42

ఇప్పుడు, మీరు గమనించారా? సూర్యుడు ప్రకాశించుచున్నాడంటే నేను నమ్మను, నాకు సూర్యునితో పని ఏమిలేదు,“ అని కండ్లు మూసికొని, తన ఇంటిలోని దిగువ భాగమునకు వెళ్ళి, ”సూర్యుడు ప్రకాశించుచున్నాడన్న మాటను నేను తిరస్కరించుచున్నాను,“ అని చెప్పిన వ్యక్తివలే అది యుండును.

“సహోదరుడా బ్రెన్హాం, ఆ వ్యక్తి మతి సరిగ్గా లేనందునే ఆ విధంగా అన్నాడు,” అని నీవందువు.

ఆలాగే, యేసుక్రీస్తును నిరాకరించు వ్యక్తి కూడా అదే కారణమును కలిగియుండును. సూర్యరశ్మి కంటే పరిశుద్ధాత్మ మరింత వాస్తవమైనది. సూర్యుడు తప్పిపోవచ్చును గాని, పరిశుద్ధాత్మ తప్పిపోడు. దృష్టి యొక్క జ్ఞానము కొరకు మాత్రమే అది వెలుగిచ్చుటయే గాక, ఆత్మను అది వెలిగించును. దేవుని యొద్దకు మనలను నడిపించు ఒక మహిమ వెలుగు - మనకది కల్వరి, మరియు ప్రభువైన యేసు యొక్క శ్రమలను చిత్రించి చూపును, రానున్న తీర్పు, రాగోరువారికి తప్పించుకొను మార్గమును చూపించును. నేను శారీరకంగా అంధుడనైనా గాని, ఆత్మీయ దృష్టినే కోరుకొందును. శారీరకంగా దృష్టి కలిగియుండి ఆత్మీయముగా అంధుడనగుట కంటే అదియే నాకు మేలు. నేను ఆత్మీయ చూపును కలిగి యుండగోరుచున్నాను.

43

గమనించండి, ఆ మనుష్యుని యొక్క తప్పిదమేమిటి? వారు, అతని స్నేహితులు, వచ్చి ఈలాగందురు, “జిమ్,” [జాన్ లేదా ఏదో అతని పేరును బట్టి పిలచి], “నీవు పొరపాటులో నున్నావు! ఆ పాత చీకటితో కూడిన చిన్న గదిలో నుండి బయటకు రమ్ము.”

అతడు నిలబడి ఇట్లు చెప్పవచ్చును, “నేనున్న చోటనే నేను సంతృప్తి కలిగియున్నానని నేనందును.” స్వాగత మిచ్చుచున్న సూర్యకాంతిని అతడు కోరుటలేదు. దానియొక్క స్వస్థతనిచ్చు కిరణములు అతనికి ఇష్టము లేదు. దాని అందము అతనికిష్టము లేదు. తన జీవితమునకు దాని వేడి అతని కక్కరలేదు. ఆ వ్యక్తి ఏదో తప్పులో నున్నాడు.

అవిశ్వాసమను పాపపు అంధకారములో దాక్కొని ఇరుకు ప్రపంచములో ఉండగోరుచున్న స్త్రీ లేదా పురుషులు ఆలాగేయున్నారు. “అద్భుతాలు జరుగు దినములు గతించిపోయినవి. దైవిక స్వస్థత అనునట్టిది ఏదీ లేదు. పరిశుద్ధాత్మ లేదు,” అని అందురు. కారణమేమనగా నీవు ఆ దయ్యము, నరకము, పాపము, గర్వము యొక్క గుహ, చీకటి నుండి బయటకు వచ్చుటకు నిరాకరించుటయే.

నీకు వేడిని పుట్టించు సువార్త వెలుగులో నడువుము.

44

ఓ, రానున్న తీర్పులను, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ తాకిడిని అనుభవించుట చూచినప్పుడు అది ఎంత సౌఖ్యముగా ఉండును! అణు బాంబులను గూర్చి వారు మాట్లాడుట విన్నారా? సమస్త అవగాహనను దాటిపోయిన ఒక శాంతిని, జరిగిన దానిని గూర్చి ఆలోచించు. నిత్యజీవముతో యేసు సన్నిధిలో మనముండువరకు తుఫాకీలో నుండి బాంబు బయటకు రాదు. వృద్ధులమగు మనము తిరిగి యువకులమగుదుము. బాలలు ఒక వయస్సుకు వత్తురు. దుఃఖము, మరణము ఇక లేదు. ఓ, ఎంత గొప్ప ఆశ్చర్యకర సంగతి! బయటకు వచ్చి దానిలో నడచుటకు నిరాకరించు వ్యక్తిని గూర్చి ఇప్పుడు నీకు అర్థమగునా? ఏదో తప్పు అతనిలో ఉన్నది.

చివరగా, సూర్యరశ్మిని అతడు చూడనిచో - అతడు పాలిపోవును. నిజంగా పాలిపోయి వ్యాధిగ్రస్తుడగును.

45

నేడు లోకము సంగతి ఆలాగే యున్నది. నేడు మనయొక్క చాలా సంఘముల స్థితి ఆలాగే యున్నది. మనము రక్తహీనులమగుచున్నాము. మనకు ఒక రక్త మార్పిడి జరుగవలెను. తప్పిపోవుచున్నాము గనుక మనము పాలిపోయితిమి. మనలో ఆత్మీయ ఆరోగ్యము తప్పిపోవుచున్నది. ఆత్మలను వెంటాడుటకు, జనులను హెచ్చరించుటకు, మన పొరుగువారిని సంపాదించుటకు, మన స్నేహితులను సంపాదించుటకు, పాలవానిని, వార్తాపత్రికనిచ్చు కుర్రవానిని సంపాదించు ఆసక్తి మనకే మాత్రము లేదు. అదేమైనా గాని, ప్రభువైన యేసు కొరకు కొందరిని సంపాదించుము! మనము పాలిపోతిమి. “వెలుగులో నడచుటలో విఫలమైతిమి, అది మన భాగ్యము, దైవిక స్వస్థత ద్వారా దేవుని ఆరోగ్యమందు విశ్వసించుటలో తప్పిపోతిమి.

46

ఈ ఆశ్చర్యకరమగు కుమారుని వెలుగులో ఉండనివారి దేహములను ఆకాశపక్షులు తినివేయు ఒక కాలము వచ్చునని బైబిలులో నాకు చెప్పబడెను; “ఆ వ్యాధులు దాని త్రోవలలో ఉన్నవి, వైద్యులు ఎన్నడూ వాటిని ఆపజాలరు. అవి దేవుని యొక్క తెగుళ్ళు.

నేడు మనకున్న వైద్యులందరి కంటేను అధికమగు తెలివితేటలు గల ఆ ఐగుప్తు వైద్యులు గాని, సోదేగాండ్రు గాని, లేదా వారి యొక్క అనుకరణచేయు శక్తిగల మాంత్రికులు గాని దేవుని తెగుళ్ళను ఆపజాలకపోయిరి. ఆయన యొక్క జనులను పట్టుకొని యుండగలిగినది గోషేను, దేవుని యొక్క శక్తి మాత్రమే, గొర్రెపిల్ల రక్తము క్రింద నుండిరి.

ఈనాడు ఆ ద్వారము పరిశుద్ధాత్మయే. ఈనాడు ఆ భధ్రత పరిశుద్ధాత్మయే.

47

కొద్దికాలము క్రిందట నేను ఒక కూటములో యున్నాను. ఇక్కడ కూర్చొనియున్నాడనుకొంటాను. ఆ వర్ణజాతి సోదరుని, అతని భార్యను చూచుచున్నాను. నేను బోధించుచున్నప్పటి నుండి గమనించుచూయున్నాను; అతడు తల ఊపుచూ, కూటములో ఆనందించుచున్నాడు. ఒక ఆలోచనకు అతడు నన్ను తీసికొనివచ్చాడు.

ఒకసారి ఒక బాలుడు కూటములోనికి వచ్చెను. పరిచర్య ముగిసిన వెంటనే అతడు నా యొద్దకు పరుగెత్తివచ్చి “పార్సన్” అని పిలిచాడు. అతడు దక్షిణాదివాడు. “పార్సన్, ఈ రాత్రీ యేసుక్రీస్తు ప్రభువును కనుగొనగోరుచున్నాను,” అని చెప్పెను. నేను ఒక స్వస్థత కూటమును నడిపించుచున్నాను.

“నిశ్చయంగా, నా సోదరుడా, ఆయన యొద్దకు నిన్ను నడిపించుటకంటే అధికమైన సంతోషము నాకు లేదు,” అని నేను చెప్పాను.

తన హృదయమును ప్రభువుకిచ్చిన తరువాత అతడిట్లు పలికెను, “అక్కడ నుండి ఈ విధంగా నేనెందుకు పరుగెత్తి వచ్చానా అని మీరు ఆశ్చర్యపడుతున్నారను కొంటాను. మీరు పట్టణములో ఉన్నారని విన్నాను. మిమ్ములను చూచుటకు నేను వచ్చాను. నేను నా కథను చెప్పెదను. నేను దరిదాపుగా తిరుగుబోతును. నా వృద్ధ తల్లి నిజంగా క్రైస్తవురాలు. నా సోదరి కైస్తవురాలు. నాకొక క్రైస్తవ సోదరుడు ఉన్నాడు. నేను, కుటుంబములో చిన్నవాడిని. నేను చెడిపోయిన పిల్లవాడిని. ప్రారంభము నుండి ఆలాగే యున్నాను, ఎందుకనగా వారు నన్ను గారాబముగా చూచి ఎంతో మంచిగా నన్ను చూచారు. కాని నేను నా తల్లి మాటను గాని, దైవభక్తిగల కుటుంబీకుల మాట గాని లక్ష్యపెట్టలేదు. నేను దేశదిమ్మరిగా ఉండగోరాను. నేను ఒక పెద్దవానివలె జీవించగోరాను. క్రైస్తవునిగా నుండుట ఒక స్త్రీకి లేదా బలహీనులకు మాత్రమే తగునని భావించాను. నేను ఒక వంటవానిగా తయారయ్యాను. నా వృత్తిలో నేను చాలా చక్కగా ఉంటిని,” అని చెప్పాడు.

నేను ఉత్తరాదికి వెళ్ళాలనుకొన్నాను, ఒక రోజున నేను ఒక గుజ్జు తయారుచేయు పాళెములో ఆగియున్నాను. వారు గుజ్జు తయారుచేయు కర్రను నరకుచుండిరి. నేను మాట్లాడ తెగించాను, ప్రధాన నిర్వాహకునితో, “మీరొక వంటవానిని ఉపయోగించుకోగలరా?” అనడిగాను. అతడు తన జేబులోనున్న సిఫారసులను గురించి నాకు చెప్పెను, గొప్ప స్థలములలో ఎక్కడెక్కడ ప్రధాన వంట నిర్వాహకునిగా అతడు పనిచేసినది చెప్పసాగెను.

48

ఇంకా ఇట్లు అతడు పలికెను, “సరే, ఇప్పుడు మాకు ఒకడున్నాడు, కాని ఏమైనా సరే, నీవు నిలదొక్కుకొనే వరకు నీ పక్షముగా కొద్దిపాటి డబ్బు ఇచ్చెదము. ఇప్పుడు అక్కడ మాకు ఒక నల్లజాతి పెద్ద స్త్రీ మంచి వంట నిపుణురాలున్నది. కాని లోనికి వెళ్ళి మాట్లాడు, బహుశా ఆమె నిన్ను ఉపయోగించుకోవచ్చును. ఆమె వాడుకోకలిగినచో, మేము నీకునీవు నీ కాళ్ళపై నిలబడేంతవరకు కోంత డబ్బు ఖర్చుకు ఇచ్చెదము.”

తాను కోరుకొన్నది అదే గదా, అంతకన్న మేలు ఏమున్నది అని అతడు అనుకొన్నట్లు చెప్పెను. లోనికి వెళ్ళి, ఆ వృద్ధ స్త్రీని కలిసికొని, రెండు మూడు రోజులు ఆమెకు సహాయము చేసినట్లు చెప్పెను.

49

ఒక రాత్రి అక్కడ అతడు పరుండి యుండగా, “గోడ ప్రక్కను వెలుగు మేరిసినట్లుగా ఉండుట గమనించసాగెను.” కొద్దిసేపటి తరువాత ఆశ్చర్యపడి, “ఎవరైనా బయట గాని ఉన్నారా?” అనుకొనెనట. కొద్ది సేపటి తరువాత, “ఒక గాఢమగు గర్జనను వినెనట. అది ఒక ఉరుము.” అతడు బయట ఎవరో మాట్లాడుచున్న స్వరములు వినెను. “మనము గుర్రముల యొద్దకు వెళ్ళిపోదము, ఎక్కువ సేపు ఇక్కడ మనము ఉండక పోవచ్చును,” అని వారు చెప్పుకొనుట వినెను. తన తలపైనున్న ముసుగు తీసి గోడ ప్రక్క చెవినుంచి వినెను.

మెరుపులు మెరసెను తన యజమానిని, ఆ గుర్రపు దళ యజమానిని అతడు చూచెను. వారి మాటల వలన అతడు గ్రహించినదేమనగా, ఆ పర్వతముల గుండా ఒక తుఫాను రానున్నదని.“ ఉత్తర ప్రాంతములో మేము వాటిని, ”ఒక ఉత్తర ప్రాంతపుది,“ అని పిలుచుచుందుము. త్వరగా హెచ్చరిక లేకుండానే వచ్చాను. ఏది చేయుటకు నీకు సమయముండదు. ఆ పర్వతములు అంత ఎత్తుగా నుండును. అకస్మాత్తుగా అవి పైనుండి ఒకేసారి విరిగిపోవును.

50

మెరపులు తళుక్కుమని మెరయుచున్నవి. “కొంత సేపటి తరువాత ఇక్కడ మనము ఇక ఉండకపోవచ్చు. ఒక భయంకర ధ్వంసము చేయు తుఫాను వచ్చుచున్నట్లు ఆ మాటల వలన అర్థమయినది,” అని చెప్పెను.

“నేను ఆలోచించసాగాను. ఇక్కడికది రాకపోవచ్చునులే అని అనుకొన్నాను, ఎందుకనగా వెళ్ళిపోవుటకు నేను సిద్ధపడలేదని నాకు తెలియును,” అని చెప్పెను. కొన్నిసార్లు చాలా సేపు నీవు కనిపెట్టవలసి యుందువు.

ఇంకా ఇట్లు చెప్పెను, “కొద్ది క్షణములలో గాలివీచ నారంభించును. చెట్లు ఊగిపోవును,” వాటిని వినినట్లు చెప్పెను. నిద్రపోవుచున్న ఆ వృద్ధ స్త్రీకి, తనకు మధ్య ఆ కాన్వాసు గుడ్డ ఉన్నట్లు చెప్పేను! ఆమె ఆ గుడ్డను తట్టి, “కుమారుడా, ఓ కుమారుడా !” అని పిలువసాగెనని చెప్పాడు.

“అవును?” అని అతడన్నాడు.

“నీవు నా ప్రక్కకు వచ్చెదవా? నేనొక దీపము వెలిగించాను,” అని అన్నది.

“నేను ఆమె యొద్దకు వెళ్ళాను, ఎందుకనగా నేను మరణమగునంతగా భయము చెందాను. ఒక పాత సబ్బు పెట్టెపై ఆమె తన లాంతరును పెట్టియుంచెను, 'నిన్ను ఒక సంగతి అడుగగోరుదును'” అని ఆమె అన్నది.

“అవును, అడుగవచ్చమ్మా” అని చెప్పాడు.

“ప్రభుని కలిసికొనుటకు నీవు సిద్దముగా వున్నావా?” అనడిగినది.

“అప్పుడు నేను నిజంగా భయపడితిని. లేదమ్మా, లేదు,” అని చెప్పెను.

“మంచిది, కుమారుడా, ఒక్క విషయము నీతో చెప్పగోరుచున్నాను. ఇప్పడే నీవు సిద్దపడట మంచిది. రానున్న కొద్ది క్షణములలో బహుశా నీవు సిద్ధపడకుండానే ఆయనను కలిసికొనవచ్చునేమో.” “నాతో కలిసి, మోకరించుదువా ఇక్కడే?” అని అడిగెను.

51

“ఆ పాత సబ్బు పెట్టే ప్రక్కనే మేము మోకరించాము,” అని అంటూ నాతో ఇంకా ఇట్లు చెప్పెను, “పార్సన్, నేను నీతో నిజమే చెప్పుచున్నాను. నేను ప్రార్థించుటకు భయపడ్డాను, చెట్లు ఆ భవనమును రాచుకొంటున్నది. మెరుపులు మెరుస్తున్నవి. ఉరుములు కంపింప చేస్తున్నవి. నేను ప్రార్థించుటకు బహుగా భీతి చెందాను. ”ప్రభువా, నాకు దయ చూపుము,“ అని చెప్పనారంభించాను. ఆ మెరుపుతో పాటుగా పెద్ద ధ్వని, బయలు వెళ్ళెను, ”నేనెక్కడున్నాను? ప్రభువా, దయ చూపుము,“ అని చెప్పాను. మెరుపుతో పెళ-పెళ మను ధ్వని బయలు వెళ్తున్నది.

“కాని ఒక పాఠము నేను నేర్చుకొన్నాను. ఆ ముసలి పరిశుద్ద స్త్రీ, ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా కూర్చున్నది. ఆయనను తన బాల్యము నుండి ఎరిగియుండినట్లుగాను, ఆయన తన తల్లి తండ్రి అయినట్లుగాను ఆమె ఆయనతో మాట్లాడెను, ఆమె దేనివలన కలవరము చెందలేదు,” అని చెప్పెను.

“నేను మృత్యు భయంతో ఉన్నాను. చివరగా నేను ఈ మాటలు బయటకు పలుకసాగాను, ”ప్రభువా, నీవు నన్ను బ్రతుకనిచ్చినచో, మరెక్కువగా ప్రశాంతముగానున్న చోటును వెదకుకొనెదను, నేను నీ యొద్దకు వచ్చెదను,“ అనెను.

అతనికి మరొక తరుణము దొరికెను, కాని నీకు లేకపోవచ్చును. దేవుని తీర్పులు కుమ్మరించబడ నారంభించినప్పుడు ఇక ఏ తరుణము ఉండదు. ఇప్పుడే నీవు నీ తరుణమును కలిగియున్నావు. ఇది నీ తరుణము.

52

ఆతని పైకి తుఫాను వచ్చెను! అతడిట్లు పలికెను, “పార్సన్, నావంటి మనిషికి ఆ భద్రతలో కప్పివేయబడుట సాధ్యమేనా? ఆ మరణము నా మీదికి రానారంభించినప్పుపుడు, నేనును ఆ ముసలి పరిశుద్ధురాలు మాట్లాడినట్లుగా ఆయనతో మాట్లాడుటకు ప్రవేశము దొరకునా?” అని అడిగెను.

“కుమారుడా, ఆమెను ఆ విధముగా నుండునట్లు చేసిన యేసుక్రీస్తు రక్తము, ఇప్పుడే నిన్నును ఆలాగు ఉండునట్లు చేయును,” అని పలికాను.

నేను నా కారు వద్ద నిలబడియున్నాను. అతడు చక్కగా దుస్తులు ధరించి, విద్య, సంస్కారము కలిగిన వ్యక్తి. ఆ బురద ఆవరణలో తన మోకాళ్ళూనెను; అక్కడే అతడు ఆ దాగు చోటును, తుఫానులోని ఆ ఆశ్రయమును, అలసిన నేలలో ఆ బండను కనుగొనెను.

నీవు ఆ బండలో ఉన్నంత కాలమూ అలసిపోవలసినపని లేదు. అలసటలేని స్థలము ఆ బండ ఒక్కటే, ఆ బండయే సంతృప్తినిచ్చు స్థలము, నీవు చక్కగా కూర్చుని, బయటకు చూడవచ్చును, అంతకన్న భద్రత నీకుండదు.

53

ఆ ఘడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది (ముద్రించబడుట సమాప్తమవబోవుచున్నది, నోవహు దినములలో వలెనే), ఈ భూమీమీద నున్న స్త్రీ పురుఘలందరూ ఆ ఆశ్రయ స్థలములో నుండవలెను లేదా దాని బయట నుందురు. నీ తీర్మానమును నీవు చేసికొనవలెను. ఆ క్షేమము యేసుక్రీస్తే. అయన మాత్రమే ఆ స్థలము, ఆయనే నిత్యజీవము గలవాడు. ఆయన ద్వారానే తప్ప మరే విధముగాను ఎవరును తండ్రి యొద్దకు రాజాలరు. ఆయనే మన భద్రతకు ఓడ. మనము మరణము నుండి జీవములోనికి దాటి యున్నామని ఇప్పుడు మనతోపాటు పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చుచున్నది.

మనము సమాధివైపు చూచినప్పుడు, మనందరమును అక్కడకు వెళ్ళుదుమని ఎరుగుదుము!

54

మనము వార్తాపత్రికలను చూచుచున్నాము. ముంచుకొచ్చుచున్న తుఫానును చూచుచున్నాము. ఈ రాత్రి నీవు గృహమునకు వెళ్ళినప్పుడు, నాకు ఒక్క మేలు చేయుము - ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము చదువు వరకు పడకకు వెళ్ళవద్దు. భూమిని రాబోవుచున్న తెగుళ్ళు, తుఫానులు మరియు ఆకాశమును కదిలించు మెరుపులు, ఉరుములు నీవు చూచెదవు. “దేశము మీదగా శోకములు దాటును. మనుష్యులు తమ శరీరములోనే కుళ్ళిపోదురు. వ్యాధులు వారిని మొత్తును. వైద్యులు దాని గూర్చి ఏమియూ ఎరుగరు.

కాని గుర్తుంచుకొనుము, అది జరుగు ముందుగా ముద్రించుట బయలు వెళ్ళును. “తమ నొసటి మీద ముద్రగలవారి యొద్దకు సమీపించవద్దని,” దేవునిచే ఆ మరణదూతలకు, తెగుళ్ళకు ఆజ్ఞ ఇయ్యబడెను! దేవుని యొక్క ముద్ర పరిశుద్ధాత్మ యొక్క బాప్తీస్మమే. ఎఫెసీ 4:30 చెప్పెను, “దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచనా దినము వరకు మీరు దాని ద్వారా ముద్రింపబడితిరి.” ఎంత బలంగా ఆ ఓడ ఊగినా, దానికి దగ్గరగా ఎన్ని మెరుపులు మెరిసినాగాని లెక్కకు రాదు. “నీ కుడిప్రక్కను పదివేల మంది పడినను, నీ ఎడమప్రక్కను వేలమంది కూలినను, అది నిన్ను సమిపించదు.” పరిశుద్ధాత్మ!

55

“పాండురంగు గుర్రముపై ఒకడు బయలువెళ్ళెను, వాని పేరు మరణము, పాతాళము వానిని వెంబడించెను,” అని చదివాను.

చేతిలో త్రాసు కలిగిన యొకడు నల్లని గుర్రముపై బయలువెళ్ళెను: “ఒక దేనారమునకు సేరు గోదుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలయనియు; కాని నా నూనె, నా ద్రాక్షారసము నొద్దకు రావద్దనియు చెప్పెను.”

బైబిలును బట్టి రానున్న దేవుని తీర్పులను నేను వినుచున్నాను. దేశములను వ్యాధులు, బాధలు, విపత్తులు కొట్టగా ప్రతి దేశము ముక్కలుగా బ్రద్దలగును. నేను బైబిలులో చదువుదును.... [టేపుపై ఖాళీ యున్నది.]

56

అంతా నెమ్మదిగా యుండెను. కాని ప్రభువైన యేసు అతని కండ్లలో నుండిన చీకటిని తీసివేసెను. అతడు ఆ పట్టణపు మేయరును పట్టుకొని, “నేను చూడగలను! నేను చూడగలను!” అని కేకలు వేసెను.

మహమ్మదీయులు మొదలగు వారు వేలాదిమంది అక్కడ నిలబడి యుండిరి. “ఇప్పుడు, రక్షణ ఓడ ఏమిటి?” ఒక రోజున మీ వార్తాపత్రికలో, గోడలలో బండలలో నున్న చిన్న పక్షులు గూళ్ళు పెట్టుకొని యుండినవి, మూలల్లోనున్న పెద్ద భవనపు బురుజులలో నివాసము చేయుచున్న ఆ పిట్టలు ఏమైనవో చదివాను,“ అని చెప్పాను.

57

మీకు తెలియును గదా, ఇండియా ఒక పేద దేశము. వారు పొలములోని రాళ్ళను ఏరి తమ కంచెలు తయారు చేసికొందురు. ఈ రాళ్ళలో, ఆ బండ సందులలో, రంధ్రములలో, చిన్న పిట్టలు తమ గూళ్ళు కట్టుకొనును. వర్షము నుండి కాపుదలకు అవి అక్కడకు వెళ్ళి, తమ గూళ్ళు పెట్టుకొనును. ఈ పశువులు అన్నియూ, సూర్యుడు పశ్చిమాన ప్రయాణించు సమయములో, మధ్యాహ్నమందు, ఈ పశువులు, కొన్ని ప్రత్యేక కంచెలు మరియు పెద్ద గోపురముల క్రింద, అనగా నీడ కొరకు వచ్చి చేరును.

కాని సుమారు రెండు రోజులు ఒక వింత సంగతి జరిగినది. ఈ చిన్న పిట్టలన్నియూ తమ చిన్న పిల్లలను, అనగా చిన్న పక్షులను ఒక చోటకు తీసికొని, ఆ గోడలలో నుండి దూరంగా ఎగిరిపోయినవి. రాత్రులందు కూడా అవి తిరిగి రాలేదు. అవి పొలము మధ్యలోనికి వెళ్ళి, క్రింద కూర్చొనెను. పశువులు మధ్యాహ్నమందు కూడా రాలేదు. అవి గోడలకు దూరంగా నిలిచియుండెను. అవి ఒక దానికొకటి హత్తుకొని కూర్చొన్నందున, అవి ఒక దాని కొకటి నీడను తయారు చేసికొన్నవి.

58

సోదరుడా, సోదరీ, సంఘము అదే చేయవలసియున్నది! ఆధునికత అను నేటి ఈ గోపురపు బబులోనుల నీడ మనకు అవసరము లేదు. ఒకరి ఆశీర్వచనము మరొకరికి అవసరము. మనము కలిసి, మన సాక్ష్యము ఇవ్వవలెను. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో క్రైస్తవ ప్రేమ, మరియు సహోదరత్వము నెలకొల్పబడవలెను. అది నీడను తయారు చేయును. నేను నా సోదరుని చేతిని పట్టుకొన్నప్పుడు, నా సోదరి హస్తమును పట్టుకొన్నప్పుడు, దేవుని రాజ్య పౌరులమని ఎరుగుదుము. క్రీస్తు యొక్క ఈ గొప్ప పనికొరకు, ఈ ఒక్క గొప్ప కారణము నిమిత్తము మనమంతా కలిసి నిలబడి ఒకని నొకరము ప్రేమించుదము. నీవు ఒక మెతడిస్టు, బాప్టిస్టు, పెస్బిటేరియను, ఏకత్వము, ద్విత్వము, త్రిత్వము, మరేదైనా గాని భేదములేదు. యేసుక్రీస్తు యొక్క రక్తము మన సమస్త పాపము నుండి మనలను కడుగుచున్నంత వరకూ - ఏ భేదము లేక, మనము ఒకరితో ఒకరు సహవాసము కలిగియుందుము. అదే మనము కోరుచున్నది - సహోదరత్వము, సహవాసము!

59

అవి పొలములలో నిలిచియుండెను. గోడల యొక్క నీడలో నిలబడుటకు అవి నిరాకరించెను. అది ఏదో వింత అని ప్రజలు తలంచిరి. అది ఒక వింత కార్యమే. ఏమి సంభవించెను? అకస్మాత్తుగా, ఒక భూకంపము వచ్చి గోడలను కుదిపి నేల మట్టము చేసెను. ఆ చిన్న పిట్టలు ఆక్కడ గాని ఉండియుండినచో అవి తమ పిల్లలతో పాటుగా, ఆ మియామి లేదా ఒకీబోబీలోని ఆ స్త్రీ, ఆమె భర్త, పిల్లలు చనిపోయినట్లుగానే, ఆ గోడ క్రిందపడి చనిపోయియుండెడివి, ఆ గోడలను ఆధారము చేసికొని ఆ పశువులు గాని నిలబడి యుండినచో, ఆ గోడలతో పాటుగా నశించియుండెడివి. అది మూడు సంవత్సరాల క్రితం జరిగెను. ఆ వార్తను పత్రికలో నుండి కత్తిరించినది నా యొద్ద ఉన్నది. కాదు, ఇప్పుడు అది టామీ నికెల్ యొద్ద (Christian Men's “Voice”) క్రైస్తవుల “స్వరము” కొరకు ఉంచబడినది. ఆ పేపరులోని ప్రధానవార్త ఇట్లున్నది, “పక్షులు తమ గూళ్ళకు తిరిగి చేరుచున్నవి, పశువులు పొలములలో నుండి వచ్చుచున్నవి.”

60

మోషే దినములలో దేవుడు, నోవహు దినములలో, పక్షులను, పశువులను రక్షణ కొరకు ఓడలోనికి రమ్మనియు, ఒక తుఫాను, నాశనము వచ్చుచున్నదనియు హెచ్చరిక చేసెను, నేటి రాత్రికిని ఆయన మారని దేవునిగా ఉన్నాడు. ఆయన ఇంకా పక్షులను, పశువులను ప్రేమించుచున్నాడు. తీర్పు ఉగ్రత నుండి తప్పించుకొనుటకు ఒక పక్షికి, ఒక ఆవుకు ఆయన ఒక మార్గము ఏర్పాటు చేసినప్పుడు, ఆయన సృష్టి యొక్క సంతతియైన నీకు మరియు నాకు మరింత ఎక్కువగా ఒక తప్పించుకొను మార్గమును చేయును గదా! ఆయన మన కొరకు మరింత ఎక్కువగా ఒక తప్పించుకొను మార్గమును ఏర్పరచునో గదా! పరిశుద్ధాత్మ మన హృదయములో పట్టుపట్టుట మనము వినగలము. ఆ ఘడియ వచ్చుచున్నది. మనము ఆ అణుయుగపు ఛాయలను చూస్తున్నాము. హైడ్రోజను యుగపు ఛాయలను మనము చూచుచున్నాము. దేశములు బద్దలగుటను, ఇశ్రాయేలు మేల్కొనుటను మనము చూస్తున్నాము.

రాజ్యములు బద్దలగుచున్నవి,

ఇశ్రాయేలు మేల్కొనుచున్నది,

ప్రవక్తలు ముందుగా చెప్పిన సూచనలు;

అన్యజనాంగపు దినములు లెక్కించబడినవి,

పొలమును దున్ని చదును చేయు సాధనము బరువెక్కినది.

తృణీకరింపబడినదానా, నీ స్వజనము నొద్దకు తిరిగి రా!

నేడు ఆలాగేయున్నది!

హేఉడ్స్ పాత పాట మీరందరు ఎరుగుదురు.

విమోచనా దినం సమీపిస్తోంది.

భీతితో మానవ హృదయాలు పగిలిపోతున్నవి;

ఆత్మతో నింపబడుడి, మీ దీపములు తేటగా వెలుగనీయుడి.

పైకి చూడు! నీ విమోచనా దినము ఆసన్నమయినది.

61

తుఫానులు వచ్చుచున్నవి. అక్కడొక దాగు చోటున్నది, ఓ, ఒక దీవెనకరమగు దాగుచోటు! అది క్రీస్తులోనే.

ఒక క్షణము తలలు వంచుదము, తరువాత క్షణము మీరు యధార్థంగా, గంభీరంగా ఆలోచించవలెనని కోరుచున్నాను.

ఉగ్రత నుండి తప్పించుకొను ఆ దీవెనకరమగు దాగు చోటును నీవు ఎన్నడైనా కనుగొన్నావా? గుర్తుంచుకొనుము, అక్కడ రెండు దాగు చోటులు లేవు; ఒక్కటే ఉన్నది. ఏదో సంఘములో నీవు ఒక మంచి సభ్యునివై యుండవచ్చును. దానికి వ్యతిరేకముగా చెప్పుటకు - ఏ చెడూ నా వద్దలేదు. కాని నీ కున్నదంతా అదే అయినచో, నీ జీవితము అపొస్తలుల కార్యముల గ్రంథముతో సరిపడనిచో, ఉన్నదని నీవు చెప్పుకొను పరిశుద్ధాత్మ, అపొస్తలులు కార్యముల గ్రంధములోని వారు జీవించినట్లుగా నిన్ను చేయనిచో నీ జీవితము మరొక గ్రంధమును వ్రాయగలదు, కనుక హెచ్చరిక పాటించుట మంచిది. మొదటి ద్రాక్షావల్లి ఒక పెంతెకోస్తు తీసికొని వచ్చెను; రెండవ ద్రాక్షావల్లి, లేదా కొమ్మ, ద్రాక్షావల్లి నుండి, మరొక పెంతెకోస్తు ఉద్భవించును. పెంతెకోస్తు అనుభవముతో ఆ తొలి సంఘమున కుండిన అదే ఫలములను ఫలించును. ప్రభువు యొక్క ధన్యకరమగు, పవిత్రమగు సాన్నిధ్యములో జీవించుచున్నావా? నీవు మరణములో నుండి జీవములోనికి దాటియున్నావా? నీవు ఏదైన ఒక ఉద్రేకము, ఏదో మానసిక ప్రభావము, లేదా ఏదో బాహ్యజ్ఞాన ప్రసంగమును ఆధారము చేసికొనియున్నావా? లేక నీ జీవితములో ఆత్మ ఫలముతో నిరంతరము ఆయన సన్నిధిలో జీవించుచున్నావా? దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, దయాళుత్వము కలిగియున్నావా? నీ గూర్చి ఎవరైనా మాట్లాడినచో, నీవు నీ హృదయములో వారి కొరకు ప్రార్థించునంతగా ప్రేమ కలిగియున్నావా? లేక, నీది స్వార్థముతో కూడిన చిన్న ప్రార్థనయా? “ఓ, ప్రభువా, అతని గూర్చి ప్రార్థించవలెనని నాకు తెలియును, కాని....” ఓ, కాదు, సోదరుడా, ఆ మాధుర్యము, దేవుని ప్రేమ. “ఓ, నా ఆత్మను చిమ్మివేయుదు గాక! ఓ, పరిశుద్ధాత్మా, నా ఆత్మ చిమ్మీ ఊడ్చికొనిపోమ్ము!” నీవు ఆ సురక్షిత స్థలమును కనుగొననిచో, నా సోదరుడా. . . .

62

ఏదో ఒక దినమున నేను ఆఖరిసారిగా ఫీనిక్సును దర్శించుదును. నాకు తెలిసినంత వరకు అది ఇదే కావచ్చును. ఈ వేదిక మీద చివరి సారిగా సువార్త బోధించబడుట ఇదే కావచ్చును. నాకు తెలియదు. మనము అంత్యకాలమునకు బహు ఘోరమగు చేరువలోనున్నట్లు కనబడుచున్నాము. ఇశ్రాయేలు తన స్వదేశము తిరిగి వచ్చెను. ఇవ్వబడిన చివరి సూచన అదియే.

వారు తమ ముసలి, కుంటి వారిని ఓడలు మొదలగువాని నుండి దింపి తీసికొని వచ్చుటను గూర్చిన పటము ఒకరాత్రి నేను చూచుచుంటిని. “మీరు చనిపోవుటకు మాతృదేశము వచ్చారా?” అని వారిని అడిగారు.

“కాదు, మేము మెస్సీయాను చూచుటకు వచ్చాము,” అని చెప్పిరి.

బాధపడకండి, అంజూరపు చెట్టు చిగురించుచున్నది. అదే చివరి గురుతు. ప్రపంచములోని పురాతన పతాకము యెరూషలేముపై ఎగురుచున్నది, అదొక సూచన. స్వంత సైన్యముతో అది ఒక దేశముగా రూపొందినది. కొద్దికాలము అది గ్రుడ్డిదాయెను గాని ఇప్పుడు అది తిరిగి ఏకమై వచ్చుచున్నది. దానిని దేవుడు వాగ్దానము చేసెను. అప్పుడు అన్యుల కాలము సమాప్తమగును. వారు ఒక మెస్సీయా కొరకు ఎదురు చూస్తున్నారు.

“నీవు ఇశ్రాయేలును మరతువా?” అని ఒకసారి దేవున్ని అడిగారు మీకు తెలుసును.

“ఆకాశములు ఎంత ఉన్నతముగా నున్నవి? భూమి ఎంత లోతున్నది? దానికి కొలతవేయుము,” అని చెప్పెను.

“నేను వేయజాలను,'' అని ప్రవక్త చెప్పెను.

“నేనును ఇశ్రాయేలును ఎన్నడూ మరువజాలను. అది నా కను గ్రుడ్డు,” అని చెప్పెను.

అక్కడ చివరి సూచన ఉన్నది. “అంజూరపు చెట్టు లేతపై చిగురించ నారంభించినప్పుడు సమయము బహు సమీపము ఉన్నది, ద్వారము నొద్దనే యున్నదని తెలిసికొనుడి,” అని యేసు చెప్పెను. ఇశ్రాయేలు సమకూర్చబడటం మొదలయినది, వారికి స్వంత ద్రవ్యమున్నది. నాలుగు వారాల క్రితమే అది జరిగెను, ఆమె తన స్వంత ద్రవ్యమును సమస్తమును కలిగియున్నది. ఆమె ఒక పూర్ణరాజ్యము.

దేనికొరకు మనము ఎదురు చూచుచున్నాము? అన్యుల కాలము సంపూర్ణము కొరకు.

63

అన్యులకు అనుగ్రహించబడునని ప్రవచించబడిన ఆఖరి సూచన, దేశమునకు, ప్రపంచమంతటా, సొదొమ దినములలో చూపించబడినట్లుగా చూపించబడినది.

“నీ భార్యయైన శారా ఎక్కడ?” అని ఆయన అడిగెను, ఒక క్రొత్త వ్యక్తి ఆమె శారాయని ఎట్లు ఎరుగును? ఆమె పేరు శారాయని, అబ్రాహాము భార్య అని అతనికెట్లు తెలియును?

“ఆమె నీ వెనుకనున్న గుడారములో యున్నది,” అనెను.

ఆ వెనుక గుడారములో శారా తనలో తాను నవ్వుకొనెను, ఆ మనుష్యుడు “ఎందుకు శారా నవ్వెను?” అని అడిగెను.

“ఇది జరుగునప్పుడు సమయము ఆసన్నమయినది,” అని యేసు చెప్పెను. అది జరుగుట చూచారు, అది జరిగిపోయెను. తరువాతది ఇక తీర్పు.

64

స్నేహితుడా, నీవు ఆ ధన్యకరమగు దాగుబోటులో నున్నావా? దేవుడు కృప చూపును గాక! నీవు లేకపోయినచో, ఈ రాత్రి ప్రార్థనలో జ్ఞాపకము చేసికొనబడగోరుచున్నచో నీ చేతిని పైకెత్తి, “సహోదరుడా బ్రెన్హాం, నా కొరకు ప్రార్థించుము,” అని చెప్పుము. ఈ భవనములో ఎక్కడున్నను, పైకెత్తుము.... మిమ్మును, మిమ్మును, మిమ్మును, దేవుడు దీవించును, అది మంచిది. దేవుడు దీవించును. దేవుడు మిమ్ము దీవించును, “సహోదరుడా బ్రెన్హాం , నన్ను జ్ఞాపకము చేసికొనుము,” అని ఎవరైనా చెప్పగలరా? సోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక! సోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక! ఆ వెనుకనున్న మిమ్మును దేవుడు దీవించుగాక! ఆ బాగా వెనుకనున్న యువతిని, దేవుడు దీవించును గాక! ఇక్కడున్న ఈమెను దేవుడు దీవించును. అవునండీ, ప్రభువు మిమ్ము దీవించును. మిమ్మును కూడా. ఓ, అది మంచిది. ఎవరైనా సరే, నీ చేతిని పైకెత్తుము.

“సహోదరుడా బ్రెన్హాం, దాని భావమేమి,” అని మీరడుగ వచ్చును

65

సోదరీ, దేవుడు నిన్ను దీవించును, ఆ వెనుకనున్న మిమ్మును దేవుడు దీవించునండి. ఇక్కడున్న ఈమెను దేవుడు దీవించును. అది అద్భుతము.

“నా చేతులెత్తినప్పుడు దాని అర్థమేమిటి సహోదరుడా బ్రెన్హాం?”

సైన్సు ప్రకారము, మిరు చేతులను లేపలేరని ఎరుగుదురా? నీలో జీవము లేనిచో అది నీవు చేయలేవు. జీవమనగా ఏమిటో సైన్సుకు తెలియదు, అది జీవమని వారెరుగుదురు గాని, అదేమిటో వారికి తెలియదు, దానిని వారు తయారు చేయలేరు. అది ఏమిటి? భూమి మీద నీ పాదములను నిలిపియుంచుచున్నట్లే భూమ్యాకర్షణ శక్తి నీ చేతులను క్రిందికి ఉంచునట్లు చేయుచున్నదని సైన్సు చెప్పుచున్నది.

కాని నీలో ఒక ఆత్మను కలిగియున్నావు, ఆ ఆత్మ.... ఏదో నీ దగ్గరలో ఉన్నది. యేసు చెప్పెను, “మొదటగా నా తండ్రి ఆకర్షించితేనేగాని ఎవడును నాయొద్దకు రాడనియు, తండ్రి నా కనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురనియు చెప్పెను.” నీ హృదయముతో దేవుడు పనిచేయ గలడనియు, అక్కడ ఒక మెల్లని స్వరము, “భద్రతకై రమ్ము,” అని పిలచుటయు నీవు ఈ రాత్రి ఎరిగియున్నందుకు ఆనందముగా లేదా? ఇప్పుడు గమనించుము, “నా యొద్దకు వచ్చువానిని ఏ మాత్రమును త్రోసివేయును.''

66

ఏమి జరుగనైయుండెను? నీ దగ్గర ఏదో కూర్చొని, “నీవు పొరపాటులో వున్నావు,” అని చెప్పినది. ఓ, నీవు ఒక సంఘమునకు చెందియుండ వచ్చును, కాని నీవు పొరపాటులో వున్నావు, ఇంకనూ పరిశుద్ధాత్మను నీవు పొందలేదు. నీవు ఓడలో లేవు.

ఎట్లు మనము ఓడలో ప్రవేశింతుము? దానిలోనికి నడుచుటవలన కాదు, ఎట్లు అందులో ప్రవేశించుదుము? “ఒకే అత్మద్వారా మన మందరమును ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము.” ఏలాగు? పరిశుద్ధాత్మ ద్వారా, “నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు కనబడును.” క్రీస్తు శరీరములో, క్షేమంగా, అక్కడ మనమున్నాము.

నీవు అందులో లేనిచో, ఈ రాత్రి నీ చేతిని ఎత్తనీయకుండా సాతాను చేయునట్లు నీవు అవకాశము ఇయ్యకుము. మంచిది, అది ఏమి చేయును? ప్రతి శాస్త్రీయ చట్టమును అది నీవు చేతినెత్తినప్పుడు బ్రద్దలు చేయును. నీలోని ఏదో ఒక తీర్మాణమును చేసెనని అది చూపించును. సైన్సు కంటే మిన్నయైనది ఏదో, సైన్సు సూత్రములను ఉల్లంఘించినది ఏదో ఇట్లు చెప్పెను, “నాలో ఒక ఆత్మ ఉన్నది, అది నేను పొరపాటులో ఉన్నానని చెప్పెను.” నా దగ్గరలో ఒకరు కూర్చొనియుండి, “నన్ను అంగీకరించుము,” అని చెప్పగా, స్వరము ఏ వైపునుండి వచ్చినదో ఆ పరలోకము వైపునకు నా చేతిని ఎత్తియున్నాను. ఓ దేవా, నా పట్ల కృప చూపుము. నీవు నాకు కావలెను. నాకు పరిశుద్ధాత్మ కావలెను. నేను సురక్షితముగా నుండగోరుచున్నాను. నా పాపములు రక్తము క్రింద నుండవలెనని కోరుచున్నాను. నేను హాయిగా నుండునట్లు, స్వస్థతా కిరణములను అనుభవించునట్లు, నా ఆత్మలో దైవిక స్వస్థతా కిరణములను అనుభవించునట్లు, నా శరీరములో ఒక భౌతిక స్వస్థత పొందునట్లు, అనుదినము గొర్రెపిల్లతో నడుచునట్లు, క్షేమముగా నుండునట్లును, క్రీస్తు యొక్క శరీరములో నేను ముద్రించబడగోరుచున్నాను. వార్తాపత్రికలు ఏమి చేప్పునో నాకక్కరలేదు. బైబిలు అనబడు గొప్ప పత్రిక చెప్పినది నేను విన్నాను. నేను క్షేమమునకు వెళ్ళాను, ఏది జరిగినా పరవాలేదు. నేను క్షేమంగా ఉందును, “వారికి” (ఒకవేళ మృత్యువు నన్ను కబళించినచో), “క్రీస్తునందున్న వారిని దేవుడు తన రాకడలో తనతో కూడా తీసికొని వచ్చును.” నేను ఇంకా క్షేమంగా యుందును. మరణము నన్ను తొందర పెట్టజాలదు.

67

దేవుడు మిమ్ము దీవించునండి. దేవుడు నిన్ను దీవించును. మనము ప్రార్థించుముందుగా ఎవరైనా గాని, “నేను ఆ సురక్షిత నివాస స్థలమును కోరుకొనుచున్నాను సహోదరుడా బ్రెన్హాం,” అని ఇప్పుడు చెప్పెదరా? ఇంకా చేతిని లేపని వారెవరైనా ఉన్నారా? అమ్మా, దేవుడు నిన్ను దీవించును. అది మంచిది. ఆ బాగా వెనుక నున్న నిన్ను దేవుడు దీవించును. అది అద్భుతము!

ఇప్నీపుడు, వు తప్పిదములో నువ్నావని నిన్ను ఒప్పించిన ఆ దేవుడే నిన్ను తనతో సరిచేసికొనుటకు సిద్దముగా యున్నాడు.

ఇప్పుడు మనము ఎడతెగక మన తలలు వంచి, ప్రార్థించుదము. మీ స్వంత విధానములో ఇప్పుడు ఆయనతో మాట్లాడుడి, “దేవా, పాపినైన నన్ను కరుణించుమని,” గుండె బాదుకొనిన ఆ సుంకరి చేసిన దానికంటే ఎక్కువ నీవు చేయలేకపోవచ్చును. అతడు చెప్పినదంతా అదే; తక్కినదంతయూ దేవుడు ఎరుగును. నీతిమంతునిగా తీర్చబడి అతడు ఇంటికి వెళ్ళెను. నీవును ఈ రాత్రి తుఫాను నుండి క్షేమముగా ఆలాగే వెళ్ళుదువు గాక.

68

మా పరమ తండ్రి, ఈ కొద్ది మిశ్రిత మరియు విభాగింపబడిన మాటలు నేను వాటిని చెప్పుటకు నడిపించబడిన ప్రకారము అవి బయలు వెళ్ళినవి, అక్షరమాలను చిన్న పిల్లవాడు తిరిగి తిరిగి చెప్పు రీతిగా చెప్పాను, నీవు మాటలన్నియూ ఎరుగుదువు, అక్షరములన్నింటినీ కూర్చగలవు. పిల్లవానికి తెలిసినదంతయూ అదే. దానికొరకు ప్రార్థించుచున్నాను. అతని హృదయము యొక్క సామాన్యతను నీవు చూచావు. దేవా, నా పేద హృదయమును ఈ రాత్రి చూడుము, నా హృదయము యొక్క సూక్ష్మతను చూడుము. ప్రభువా, ఈ వర్తమానము ప్రజల పట్ల ప్రేమ, మాధుర్యములతో ఉద్దేశించబడినది. నాకును, ఇంకా వేలాదిమంది ఇతరులకును ఇచ్చిన ఈ విశ్రాంతిని వారును పొందుదురు గాక! వారి అత్మలకు యేసు ఒక్కడే రక్షకుడని వారెరుగుదురు గాక! మన తండ్రియగు దేవుని యొద్దకు వారిని అయన నడిపించును గాక! ఆయన చీల్చబడిన ప్రక్క ద్వారా, ఆయన రొమ్మున క్షేమముగా ఆనుకొనియుండి వారు జీవించెదరు గాక! ఆయనను అంగీకరించి తీర్పు నుండి స్వేచ్ఛగా విడిపింపబడుదురు గాక.

69

ప్రభువా, ఈ రాత్రి అనేకులు, అవును, చాలామంది తమ చేతులు ఎత్తియున్నారు. “విశ్వసించుడి” అని చెప్పుట తప్ప మరేది నేను చేయగలను ప్రభువా? వారు గనుక నమ్మినచో, ఆ విషయములో యధార్థముగా నున్నచో, ఈ ఘడియలో నిత్యజీవము పొందలేకుండా ఉండుట వారికి అసాధ్యము. ఎందుకనగా నీ వీలాగు చెప్పితివి, “నా మాట వినువాడు....” వారు నీ వారు. అవి బహుశా సరిగా అన్నీ ఒకచోట పెట్టి యుండక పోవచ్చును, కాని నీవు వాటిని సమకూర్చగలవు. చేతులు లేపిన వారితో నీవు జహుశా ఆలాగు చేసియున్నావేమో, ఎందుకనగా నీ విట్లు చెప్పితివి, “నేను ఆకర్షించితేనేగానీ ఎవడును నాయొద్దకు రాడు. నా యొద్దకు వచ్చిన వారందరినీ త్రోసివేయక, నిత్యజీవమును అనుగ్రహించి, చివరి దినమున అతనిని లేపెదను.” ప్రభువైన దేవా, అది నీవేనని మేమెరుగుదుము. వారు చేతులెత్తియున్నారు. వారు నిన్ను కోరుచున్నారు. ఇప్పుడు తండ్రి, వారి హృదయములు నింపుము. మంచి తనము, కృపలతో వారి హృదయములను నింపుము. పరిశుద్ధాత్మతో నింపుము. ఇది వారెన్నడూ మరచిపోని రాత్రిగా నుండును గాక, ఎందుకనగా ఈ రాత్రియే వారు యేసుక్రీస్తును తమ స్వరక్షకునిగా అంగీకరించి, చేర్చుకొని, పరిశుద్ధాత్మతో నింపబడిరి.

70

మన తలలు వంచియుంచుదము, నా ప్రార్థనను దేవుడు వినునని నీవు నమ్మినచో, నీ పై నా చేతులుంచి నీతో కలిసి ప్రార్థించవలెనని నన్ను కోరినచో నీవు కొద్దిగా.... అందరూ తలలు వంచియుండగా, దయచేసి బహు మృధువుగా సంగీతము వినిపించండి. పరిశుద్ధాత్మను, ఈ గొప్ప రక్షణ వర్తమానమును అంగీకరించగోరువారు ఎందరున్నారో వారందరూ ఇక్కడికి రావలెనని కోరుచున్నాను. ఇట్లు చెప్పండి, “సహోదరుడా బ్రెన్హాం, ఇప్పుడే నేను ముందుకు రాగోరుచున్నాను. నేను తప్పుతో ఉన్నానని ఒప్పుకొనుటకు రాగోరుచున్నాను. కాని పరిశుద్ధాత్మ నన్ను క్షమించవలెనని, ఇప్పుడు నాతో మాధుర్యముగా నుండవలెనని, కదిలిపోవు కాలములో నాకు శాంతిని ఈయవలెనని కోరుచున్నాను.”

కదిలి పోగల ప్రతిదియు, ఇప్పుడు కదిలి పోవునని మీరెరుగుదురు. “కాని కదల్చబడని ఒక రాజ్యమును మనము పొందియున్నాము.” అది క్రీసే.

71

నాతో పాటుగా ఈ వేదికపైకి వచ్చి ఇక్కడ మీరు నిలబడగలరా? మీ వేలిని పట్టుకొని, మీతో ప్రార్థించనీయుడి ఇష్టపడినచో లేచి, ఇప్పుడు నెమ్మదిగా పాడుచుండగా రండి, చేతులెత్తిన మీరు ఇక్కడికి ఇప్పుడు రండి వేదిక నొద్ద నిలబడండి. మేము ఈ వచనము ఇప్పుడు పాడుచుండగా, మీరు ఇష్టపడినచో ఒక్క క్షణము బలిపీఠము నొద్దకు రండి.

ఇంటికి వచ్చుచున్నాను. . . .

ఇది నీవు చివరిసారిగా వినుటయైనచో ఏమి చేతువు? దాని గూర్చి ఆలోచించు. ఇదే ఆఖరిసారిగా వినుటయైనచో ఏమిటి? కొద్ది సేపటి తరువాత బయట వీధిలో సైరను మ్రోగినచో, అది నీవే అయినచో, నీ శరీరమును తీసికొనిపోవుటకే వారు వచ్చుట సంభవించినచో ఎట్లుండును? షుమారు ఉదయము రెండు గంటలకు నీవు వైద్యుని పిలచుట జరిగినచో, ఒకవేళ అది ఒక గుండెపోటు అయినచో ఏమి చేతువు? నీవు నీ స్వంత దానిమీదనున్నావు. ఇది మ్రోగుట లేదా? ఇప్పుడే సురక్షిత స్థలమునకు రమ్ము. రావా? ఎందుకనగా నీవు చివరి దినములలో నిలబడవలసియున్నావు.

. . . . నేను ఇంటికి వచ్చుచున్నాను.

ఇంటికి వచ్చుచున్నాను, ఇంటికి వచ్చుచున్నాను.

అయ్యా, దేవుడు నిన్ను దీవించును. [సహోదరుడు బ్రెన్హాం వేదిక నొద్ద జనులతో ప్రార్థించుచున్నారు.]

72

మీరు కాస్త లేచి ఇక్కడ వేదిక నొద్ద నిలబడియున్న వారి యొద్దకు వచ్చెదరా? రండి, ఇప్పుడు తీర్పు రానైయున్నది. నీవు రావా? ఇప్పుడే రమ్ము, ఇప్పుడే నీ పాపములను ఒప్పుకొనుము, నీవు తీర్పులోనికి వెళ్ళనవసరము లేదు. ఇప్పుడే వచ్చిన ఈ జంటను దేవుడు దీవించును. అయ్యా, దేవుడు మిమ్ము దీవించును. అది మంచిది. యవ్వనస్తురాలా, దేవుడు నిన్ను దీవించును. క్రిందికి రండి. అయ్యా, రండి.

నేను దేవుని నుండి దూరంగా తిరిగాను,

(రా, నా స్పానిష్ సోదరుడా.)

ఇప్పుడు నేను వచ్చుచున్నాను. . . .

మీరు లేచి ఇక్కడకు రారా? ప్రార్థించుదము, ఆశ్రయము నొద్దకు రండి.

. . . ఎంతో కాలము పాపమును త్రోక్కాను

ఓ, ప్రభువా, నేను ఇంటికి వచ్చుచున్నాను.

ఆర్గను ఎడతెగకుండా వాయించబడుచుండగా కొద్దిసేపు నేనిది చెప్పెదను. ఈ రాత్రి వర్తమానము ప్రేమ, కృప, మరియు హెచ్చరికల వర్తమానము. రేపు రాత్రికి ఎక్కడో మీ చేవులలో ఈ వర్తమానము శిక్ష మరియు తీర్పులకు వర్తమానముగా నుండునేమో. దానిపై ఇంకా కృప నిలిచియుండగానే వచ్చి దానిని చేర్చుకొనుము. చేర్చుకొనవా స్నేహితుడా? ఈ రాత్రి నేను చెప్పిన దానితో ఒక దినమున నేను నిన్ను కలిసికోవలసియుందును. నీవు రావా? నీ పక్షమున దయకొరకు దానిని మాట్లాడనిమ్ము. మనము మరోసారి పాడుచుండగా, “ఇప్పుడు నేను ఇంటికి వచ్చుచున్నాను,” నీవది చేయవా?

73

ప్రియమైన, సోదరీ, ఇక్కడే నిలిచియుండుము. ఒక్క క్షణము మీరు ఇష్టపడినచో అందరూ ఇక్కడే నిలిచియుండుడి. బలిపీఠము నొద్ద వీరితో ప్రార్థన చేయగోరుచున్నాము. వారెక్కడున్నారో అక్కడే వారిని నిలబడనీయండి. ఇప్పుడు మరొకసారి.

నేను దూరంగా వెళ్ళిపోయాను.... (లేచి రండి,

నీవు రావా? నీన్ను ఆహ్వానించుచున్నాను.)

ఇప్పుడు నేను ఇంటికి వచ్చుచున్నాను;

పాపపు త్రోవలు చాలా కాలం నేను తొక్కాను,

ప్రభువా, నేను ఇంటికి వచ్చుచున్నాను.

క్రైస్తవులారా, ఇప్పుడు ప్రార్థించండి. ఇంటికి రమ్ము. రమ్ము, నా పాపి స్నేహితుడా; సోదరీ, ఎవరి కొరకు క్రీస్తు చనిపోయెనో, ఆయన రక్తము ద్వారా కొనబడిన వారలారా రమ్ము. ఇప్పుడు నీవు రావా? ఈ గొప్ప ఘడియలో లోకపు తలుపుల యొద్దను, దేశము యొక్క తలుపుల యొద్దను తీర్పు వ్రేలాడుచుండగా, నిన్ను నేను ఒప్పింప చేయనిమ్ము. నీవు రావా? క్రీస్తుకు బదులుగా నేను నిన్ను బ్రతిమాలుచున్నాను. నీకు సాధ్యముగా నున్న ఈ సమయములోనే క్రీస్తు నొద్దకు రమ్ము. తీర్పు కాదు, కృపయే నీపై నిలచియుండనీ.

74

ఇప్పుడు మనము దానిని ఆలపించుదము.

ఇక్కడ ఇప్పుడు మనము కనిపెట్టియుండగా, ఒక్క క్షణము, ఇంకా ఎవరైనా ఉన్నారా? వారి చుట్టూ విభిన్నమైన వారు తమ స్థానములను ఆశ్రమించుకొనుచున్నారు. ఇది ఒక మధురమగు సమయము కాదా? నాకు తెలియదు, అది కేవలము నేనే అయి ఉండవచ్చును, కాని ఇప్పుడు నేను ఎంతో చక్కగా అనుభూతి చెందుచున్నాను. నేను ఎదురు చూచుచున్నది ఇదే. నేను ప్రేమించుచున్నది ఇదే.

నేను ఒక బాల బోధకునిగా ఉన్న సమయములో ఒక సేవకుని చెల్లెలు ఒకసారి తనతో నృత్యము చేయుటకు రమ్మని కోరినది. నేను నృత్య ములకు వెళ్ళనని ఆమెకు చెప్పాను. ఒక ప్రదర్శనకు తనను తీసికొని వెళ్ళమని నన్ను అడిగినది. నేనది చేయలేను. “నేను సినిమాలకు వెళ్ళనని,” చెప్పాను.

“అయితే ఏదైనా ఆనందమును నీవు ఎక్కడి నుండి పొందుదువు?” అని అడిగినది.

“నాతో కూటమునకు రమ్ము,” అని చెప్పాను.

75

ఆ రాత్రి నేను ఒక గుడారపు కూటమును కలిగియున్నాను. నేను ఒక బాలుడిని షుమారు ఇరవై-ఒక్క సంవత్సరాల యువకుడిని. ఆ రాత్రి చాలామంది వేదిక నొద్దకు వచ్చిరి. ఆమె వెనుక కూర్చొని ఏడ్చుట చూచాను. నేనామెను సూచించి ఇట్లు చెప్పాను, “గతరాత్రి నీవు నన్ను ఒక ప్రశ్న అడిగావు. ఈ రాత్రి నేను జవాబు ఇవ్వగలను.”

“అదేమిటి బిల్లీ?” అన్నది.

నేనిట్లు చెప్పాను, “నా కాలములో ఇదే అతి గొప్ప సంతోష సమయము. పాపులు వచ్చుట చూస్తున్నాను. ఏదో సంతృప్తి; నా హృదయములో ఏదో సమాధానమును గూర్చి చెప్పుచున్నది. ఇంటికి వచ్చుచున్నామ!

నేను ఇంటికి వచ్చుచున్నాను, ఎన్నడూ....

కేవలము ఆ మాధుర్యమును నేను ఇష్టపడుదును. “బాగా చేశావు, బాగా చేశావు” అని సంతోషించుచూ, పరిశుద్ధాత్మ ఇక్కడుండి చెప్పుచున్నట్లు మీరు అనుభూతి పొందుతున్నారా? ఇది సిద్దపాటు, ఒక స్వస్థత కూటము, ఆత్మీయ స్వస్థత మొదట. క్రీస్తు శరీరము వ్యాధితో యున్నది, దానికి స్వస్థత అవసరము, ఆత్మీయ శరీరము.

నేను ఇంటికి వచ్చుచున్నాను.

ఇప్పుడు మీ తలలు వంచండి, అందరూ ప్రార్థించండి, అందరూ ప్రార్థనలో ఉండండీ.

ఇంటికి, ఓ, ఎన్నడూ ఇక మీదట తిరుగను.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...