ప్రభువా, నీ మాట చొప్పున

ప్రభువా, నీ మాట చొప్పున

ఈ దేశ ప్రజలను పట్టిన ప్రతిదయ్యముపై విజయం. [టేపులో ఖాళీ ఏర్పడింది.] వారి ...? ... మీరే మా రక్షకుడు, మా దేవుడు, మరియు మమ్మును స్వస్థపరచువాడు. ఓహ్, ప్రభువా భవనాన్ని కదిలించే శక్తితో దిగి రండి. ఇక్కడ కుమ్మరింపు ఉండునుగాక.... [టేపులో ఖాళీ ఏర్పడింది]. ప్రభువా, ఈ లోక కార్యాలన్నిటి పైన జీవించడానికి ఆ ఏడవ ఆకాశములోనికి ప్రతీ హృదయం ఎత్తబడునుగాక. ఈ ఘడియలో పరిశుద్ధాత్మను పంపుట ద్వారా ఈ రాత్రి మాకు దీని నిమిత్తము మీ నిశ్చయతను ఇవ్వండి. నాకు సాయం చేయండి; ఇప్పుడే ఈ మర్త్య పెదవుల ద్వారా మాట్లాడుమని, సజీవుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో మేము అడుగుతున్నాము. ఆమెన్.

2

ఏదో ఒకరోజు ఈ రాత్రి మన మధ్యలో ఉన్న ఆ అదృశ్యమైన వ్యక్తిని అతి త్వరలో మనము చూడబోతున్నాము. చదివిన లేఖనాలను బట్టి ఈ సమయములో, యేసు పరిచర్య బాగా ప్రసిద్ధిగాంచింది. దాదాపు డెబ్భై శాతం ఆయన పరిచర్య దైవిక స్వస్థతపైననే కలదు. తన అధికారాన్ని చూపించడానికి ఆయన ప్రజలను స్వస్థపరచలేదు; ఆయన లేఖనాలను నెరవేర్చడానికి ప్రజలను స్వస్థపరిచాడు. వారిలో చాలామంది ఆయన వద్దకు వచ్చి, “మేము సూచక క్రియలను కోరుకుంటున్నాము” అని అడిగినట్లు లేఖనము చెబుతుంది.

ఆయన, “వేషధారులారా, మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను వివేచింపలేరు.. ఉదయమున ఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా” అని అన్నాడు. అయితే, ఆయన “ఇప్పుడు, మీరు దానిని గుర్తించగలిగితే, మీరు ఆయన దినములు తెలుసుకోవాలి, ఎందుకంటే ప్రవక్తలు ఈలాగున చెప్పారు, ”కుంటివాడు దుప్పివలె గంతులు వేయును; మూగవాని నాలుక పాడును“ అని యెషయా చెప్పాడు.

మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు గురించి దేవుని సాక్ష్యం యొక్క ప్రత్యక్షతను చూడటానికి ప్రజలు నివసిస్తున్న దినములు అవి.

3

మరియు దేవుడు ఒకేరీతిగా ఉన్నాడు. క్రీస్తు తాను... నేనే, నేను ఉన్నవాడను అనువాడనైయున్నాను అని చెప్పుకున్నాడు. మరియు ఆయన...అందువల్ల, ధర్మశాస్త్ర ప్రకారం ఇద్దరి సాక్ష్యం సరైనది.“ ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను” అని అన్నాడు. నేను దేనికైతే సాక్ష్యం ఇచ్చానో అని ఆయన చెప్పుచూ, తనవారిపై హక్కును కలిగి ఉన్నాడు. మరియు దేవుడు ఆయనలో సాక్ష్యమిచ్చాడు. ఆపై అది స్థిరపరచబడింది.

మంచిది, ఈ రాత్రి కూడా అలానే ఉన్నది అవునా? ఆయన తన ప్రజలను దర్శించు దినములలో, పూర్వము యెహోవా మోషేతో అరణ్యములో ఉండిన విధముగా వారితో ఉండవలెనని కోరుతున్న ప్రజలను ఆయన కలిగి ఉన్నాడు. కానీ ఆయన, “మీరు దేవుడిని విశ్వసిస్తే, నన్ను కూడా నమ్ముతారు” అని చెప్పాడు. దేవుడు క్రీస్తులో ఉండి తనతో లోకమును సమాధానపరచుకొనెను. ఇప్పుడు, ఆయన ఇలా అన్నాడు, “ఆయన ఆత్మ రూపంలో ఉన్నప్పుడు మీరు ఆయనను విశ్వసించారు, ఇప్పుడు తండ్రి నాయందు ఉన్నాడు. మరియు తండ్రియందు నేనును, నాయందు తండ్రియు ఉన్నాము. లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.”

4

ఇప్పుడు, చాలా మంది ఎదురు చూస్తున్నారు ... వారిలో కొందరు, “దేవుడు అన్ని కార్యములు చేయగలడని నేను నమ్ముతున్నాను” అని అంటారు. తగిన బుద్ధి ఉన్న ఎవరికైన దేవుడు అన్నిటినీ చేయగలడని తెలుసు. ఆయన అన్ని కార్యాలు చేయలేకపోతే, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కాదు. అయితే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు అయినట్లయితే, ఆయన అన్ని కార్యాలు చేయగలడు.

అందువల్ల, ఈ రాత్రి ప్రజలతో ఉన్న ఇబ్బంది ఏమిటంటే, దేవుడు ఇప్పుడు మీ మధ్యలో ఉన్నప్పుడు, వారు దేవుడి కొరకు మిలియన్మైళ్ల దూరానికి చూస్తున్నారు. దీని గురించి ఆలోచించండి. మీరు ప్రేమించే, మీరు సేవించే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఆయన ఈ మాటలు చెప్పాడు, “ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.” మిగిలిన లేఖనములన్నీ ఎంత సత్యముగా ఉన్నవో అది అంతే సత్యముగా ఉన్నది.

5

ఇప్పుడు, ఆయన ఈ కార్యములు చేస్తానని, సూచక క్రియలు మరియు అద్భుతాలు పంపుతానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు, దేవుడు దానిని ప్రజలకు తెలియజేసాడు. ఇప్పుడు, మీరు దాని దర్శనమును పొందగలిగితే, మరియు దానిని విశ్వసిస్తే, ఈ రాత్రే మీరు స్వస్థత పొందేరాత్రి అవుతుంది. ఇప్పుడు, మీరు సందేహించినట్లైతే... క్రీస్తు స్వయంగా నా సూట్ మరియు నా బూట్లు ధరించి, ఆయన ఇక్కడ నిలబడి ఉన్నపటికినీ మరియు మీరు (సందేహించినట్లయితే)... [టేపు పై ఖాళీ ఉంది.] ఇప్పుడు ఇక్కడ మీరు ఎంత అనారోగ్యముతో ఉన్నారో అదే అనారోగ్యముతో అలాగే తిరిగి వెళ్ళిపోతారు. ఆయన మీ స్వంత ఇష్టానికి వ్యతిరేకంగా మిమ్మల్ని రక్షించలేడు. ఆయన మీ స్వంత ఇష్టానికి వ్యతిరేకంగా మిమ్మల్ని స్వస్థపరచలేడు. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్నువెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఆమెన్. మరియు అది సరైనదేనా?

ఇప్పుడు, ఈ రాత్రి స్వస్థపరచడానికి ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన కొంతమందిని స్వస్థపరచి, ఇతరులను ఎందుకు వదిలేస్తాడు? చూడండి, మీలో ఎవరైనా స్వస్థత పొందకుండా వెళ్ళేది దేవుని చిత్తం కాదు. మీలో ఎవరైనా రక్షించబడకుండా వెళ్ళేది దేవుని చిత్తం కాదు. ఆయన చనిపోయాడు. ఆయన తిరిగి వచ్చాడు... [టేపుపై ఖాళీ ఉంది]...? ... మరియు అనారోగ్యం ... పాపం కారణముగా అనారోగ్యం కలుగుతున్నది.

6

దాన్ని వదిలించుకోవడానికి, దూరంగా ఉంచండి. విసర్జించి, దాని నుండి బయటపడండి. మనుష్యుల మీద ఉన్న ప్రతీదానిని దేవుడు తుడిచిపెట్టాడు... [టేపు పై ఖాళీ ఉంది.] క్రీస్తు సిలువలో మరణించినప్పుడు పరిపూర్ణ విడుదల దొరికింది. కేవలం సిలువ వద్ద క్రీస్తు మరణించడం ద్వారా పాపం నుండి, అనారోగ్యం నుండి. ... అన్నిటినుండి విడుదల దొరికింది. [టేపుపై ఖాళీ ఉంది.] మంచిది. మనము దేవుడిని కలిగి ఉండుటకు కారణం ఏమిటి...?... విడుదల పొందుటకు... [టేపుపై ఖాళీ ఉంది.]

ఇప్పుడు, అక్కడ, నా కన్నా ముందు సేవకుడు మాట్లాడుతున్నాడు, విశ్వాసంచుట్టూ ప్రజలను కట్టుకుంటూ, అద్భుతమైన దేవుడు అనే అంశంపై బోధించాడు. ఆయన...

ఇప్పుడు, మీరు గుడ్డిగా జన్మించిన వ్యక్తుల కళ్లను చూశారు; ఇక్కడ నిలబడి చూడటం, లైట్లను లెక్కించడం, మరియు వివిధ రంగులను చూసి అవి ఏమిటి అని అడగడం వంటివి జరిగాయి; చెవిటివారు, మూగవారు, వికలాంగులు ఉన్నారు...

7

ఒక వ్యక్తి టెక్సాస్ నుండి చక్రాల కుర్చీలో కూర్చున్న తన భార్యతో అక్కడికి వచ్చాడు, ఆమె పదహారేళ్లుగా చక్రాల కుర్చీలో ఉన్నది. ఆమెను విమానం ద్వారా తీసుకొచ్చారు. మరియు ఆమె కోసం ప్రార్ధించిన కొన్ని క్షణాల తర్వాత, ఆమె దేవుణ్ణి మహిమపరుస్తూ మధ్య దారిలో నడుస్తోంది.

మరుసటి రాత్రి, ఆ వ్యక్తి ప్రార్థన వరుసలోనికి వచ్చాడు. నాకు తెలియదు. నేను అతని చేతిని పట్టుకున్నాను; కంపనాలు లేవు. నేను తలపైకి ఎత్తి చూసినప్పుడు అతను ఏడుస్తున్నాడు. అతను, “ఇప్పుడు, బ్రదర్ బ్రాన్హాం, నేను వేషధారి పాత్రను పోషించాను అని అనుకుంటున్నాను. కానీ మీరు పేదవారు అని నాకు అర్థమైంది. నేను మీకు—దేవునికి ఒక చిన్న కానుక ఇవ్వాలనుకుంటున్నాను” అని అన్నాడు.

“నేను కానుకలను స్వీకరించను” అని చెప్పాను.

మరియు అతను, “సరే, ఇక్కడ ఒక చిన్న చెక్కు ఉంది ...” “కేవలం ప్రార్దించినందుకు కాదు.” “చూడండి. పదహారేళ్లుగా అంగవైకల్యంతో ఉన్న నా తల్లి అక్కడే ఉంది” అని చెప్పాడు.

నేను, “సరే, నేను ఆమెను ఎన్నడూ స్వస్థపరచలేదు. క్రీస్తు ఆమెను స్వస్థపరిచాడు” అని అన్నాను.

మరియు అతను, “సరే, ఇక్కడ. నేను ఈ చెక్కు వ్రాసాను.” ఐదువేల డాలర్లకు చెక్కు వ్రాయబడింది. అతను తైల పరిశ్రమ కార్యనిర్వాహకుడు గనుక దానికి అర్హుడు. నేను దానిని చింపివేసాను. నేను- నాకు ఏది అక్కరలేదు. అయితే, మీరు చూడండి, నాకు కావలసినది మీ విశ్వాసమే.

8

చూడండి. ఇప్పటి నుండి కొన్ని సంవత్సరాలలో, ఐదు సంవత్సరాల వ్యవధిలో అని నేను చెబుతాను, బహుశా కొంచెం ఎక్కువ లేదా తక్కువ కాలంలో, మీ డబ్బు మీరు రాసిన కాగితం అంత కూడా విలువ చేయదు. దానికి ఏ విలువ ఉండదు.

నేడు రష్యాలో, వారి ఇళ్లు అన్నీ వెయ్యి డాలర్లతో నిండియున్నవి. దానికి ఏ మాత్రము విలువ లేదు. సమాఖ్య... అది నిజం. మరియు మేము అదే విషయానికి వస్తున్నాము.

మరొక రోజు ఇక్కడ మియామిలో ఒక మిషనరీ నాతో మాట్లాడుతున్నాడు. అతను లండన్, ఇంగ్లాండ్ వీధులు తిరిగాడు, మేము లండన్ హాల్ వద్ద నున్న స్థలానికి వెళ్తున్నాము. అతను, “నా జేబులో ఆరువందల పౌండ్లు ఉన్నాయి, అవి డాలర్లు. మరియు, ”నా చిన్న అమ్మాయికి ఒక చిన్న బిస్కెట్ కావాలి. మరియు ఆ ఆరు వందల డాలర్లు ఆ చిన్న బిస్కెట్టును కొనుగోలు చేయలేవు. నా వద్ద ముందుగా ముద్ర (స్టాంప్) ఉండాలి. అది కొనుగోలు చేయడానికి అర్హతను గలిగిన వస్తువు“ అని అన్నాడు.

మృగం యొక్క ముద్ర... ముద్ర ఉన్న వ్యక్తి తప్ప ఎవరూ కొనలేరు లేదా అమ్మలేరు. మరియు అది ఇప్పుడు ఇక్కడకు వస్తోంది. మీరు దాని గురించి వింటారు. బహుశా నేను మళ్లీ ఇక్కడకు తిరిగి రావడానికి ముందే మీరు దానిని చూస్తారు. అది ద్వారము వద్దనే ఉన్నది, మరియు మనము అంతమునకు సమీపించి ఉన్నాము.

9

కాబట్టి డబ్బు గురించి ఆలోచించవద్దు. ఇల్లు మరియు భూమి గురించి ఆలోచించవద్దు. రాబోవుచున్న క్రీస్తును గురించి ఆలోచించండి. ఇప్పుడు క్రీస్తులో తప్ప మరెవరూ దేనిలోనూ నిరీక్షణ కలిగి ఉండలేరు. అది సరియైనది. ప్రతీదీ, మన భవిష్యత్తు అంతా ప్రభువురాకపై ఉంది. అది సరియైనది. అదే నిద్రిస్తున్నవారికి, మరియు సజీవంగా ఉన్న మనకు ఉన్న నిరీక్షణ.

ఇప్పుడు, ఇది గమనించండి. ఇప్పుడు అద్భుతమైన దేవుడు అన్న అంశముపై ఈ సేవకుడు మాట్లాడిన ఆ కూడికలో...[టేపు పై ఖాళీ ఉంది.] ... ఆ దేవుడు ఎలా వచ్చాడు. ఆదిలో ఆకాశము మరియు భూమిని సృష్టించాడు; ఆయన ఎలా ఇత్తడి సర్పము మీదకు వచ్చాడు.

ఆపై ఎవరో, ఆ వాదనలు చేసినప్పుడు, వారు ... “ఎందుకు, ఇలాంటివి ఎవరు విన్నారు.” మీరు దానిని బైబిల్ ద్వారా నిరూపించలేకపోయారు అని అన్నారు.

కానీ దేవుడు మోషేకు సర్పమును చేయమని చెప్పాడు. ఆయన ఎందుకు అలా చేశాడు? ప్రజలు చూచుటకు ఏదో ఒకదానిని కలిగి ఉండవలెను. ఇప్పుడు, అది కేవలం మానవుడు. మనుషుల కోసం ఏదైనా చూడడాని కొరకు దేవుడు అది పెట్టాడు. సహజమైన కన్ను ఏదో చూడాలి.

10

ఇప్పుడు, స్వస్థత కలిగించేది సర్పము కాదు. అయితే దేవుడు తన స్వస్థతా వరమును ఆ సర్పము పైన ఉంచాడు. మీరు నమ్ముతారా? ఆయన అలా చేశాడు. ఇప్పుడు, కొంతమంది చూసి కూడా నమ్మలేదు. కానీ కొంతమంది చూసి నమ్మారు. మరియు వారు అలా చేసినప్పుడు, పాముకాటు నుండి స్వస్థతపొందారు. అప్పుడు ఇతరులు చూసి నమ్మడం ప్రారంభించారు. దేవుడు ఆ సర్పము ద్వారా సాక్ష్యమిస్తున్నాడనియు, ఆయన యెహోవా-రాఫా, వైద్యుడు అని వారు అప్పుడు తెలుసుకున్నారు. మరియు ఆయన ఇంకనూ యెహోవా-రాఫా, స్వస్థపరచువాడిగానే ఉన్నాడు. ఆయన ఉండేవాడు కాదు; ఆయన ఉన్నవాడు, ఉండేవాడు కాదు, ఉన్నవాడు, ఇప్పుడు, వర్తమాన కాలం.

అయితే సరే. ఇప్పుడు, వారు ఆ ఇత్తడి సర్పమును చూసినప్పుడు, వారు స్వస్థత పొందారు, ఇప్పుడు, అది అద్భుతం. అయితే ఇత్తడి సర్పము దినముల తరువాత, ఆయన నీటికొలను మీదకు తన దూతతో కిందకు దిగి వచ్చాడు.

11

ఇప్పుడు, చూడండి. ఆ ఇత్తడి సర్పం ఎవరి కోసమూ ప్రార్థించలేదు, ప్రార్దించగలదా? అది ఎవరిపైనా చేతులను ఉంచలేదు. అయినప్పటికీ వారు ఆ ఇత్తడి సర్పములో దేవుడిని, ఆయన వరమును గుర్తించారు. ఆ కొలను ఎవరి కోసమూ ప్రార్థించలేదు, అవునా? కానీ దేవుడు తన దేవదూతను ఆ కొలనుపై ఉంచాడు, మరియు దానిని గుర్తించి దానిలోకి ప్రవేశించిన ప్రజలు స్వస్థత పొందారు. అది సరియైనదేనా? ఇప్పుడు, అద్భుతమైన దేవుడు.

ఆపై దేవుడు దిగి వచ్చి క్రీస్తులో నివసించాడని చెప్తూ కొనసాగాడు. దేవుడు తన వరమును అపొస్తలుడైన పేతురులోనూ, పౌలులో కూడా, వారి నీడలో ఉంచబడి స్వస్థత పొందిన వారిలోకి పంపించాడు. అది సరియైనదేనా? వారు దేవుడిని, అద్భుతమైన వాడిగా గుర్తించారు ...

ఆపై అతను ఇలా అన్నాడు, “ఇప్పుడు, ఇది విచిత్రముగా ఉన్నది, దేవుడు ఇశ్రాయేలుకు విమోచన వాగ్దానం చేసిన దినములలో, నాలుగు వందల సంవత్సరాలు అక్కడ తాత్కాలికముగా నివసించిన తరువాత, ఆయన ప్రజలకు స్వస్థత లేదా విడుదల అవసరమైనప్పుడు దానిని అమలులోకి తెచ్చారు. ఆయన వారికి విడుదలనిచ్చాడు. ఆయన వారికి విడుదలను తీసుకొచ్చాడు. ఇప్పుడు, దేవుని ప్రజలకు స్వస్థత అవసరమై ఉన్నది. మరియు దేవుడు వరమును పంపుతానని వాగ్దానం చేశాడు. ఇది దేవుడు తన మాటను నిలబెట్టుకుంటాడు అనే దానికి సానుకూల వాస్తవం అవునా? ఖచ్చితంగా ఆయన చేస్తాడు.”

12

ఆపై అతను ఇలా అన్నాడు, “మనిషి దేనినైనా తనదని వాదించగలడు, కానీ దేవుడు దాని గురించి సాక్ష్యమివ్వకపోతే, అది తప్పు.” “ఇప్పుడు దేవుడు...” [పదహారు సెకన్ల టేప్ నాణ్యత చాలా పేలవంగా ఉంది సమాచారం చేర్చబడలేదు ఎందుకంటే ఇది అర్థమయ్యేది కాదు.] నేను ఎక్కడికైనా వెళ్లి కూర్చుని పాతకాలపు, పరిశుద్ధాత్మ, ప్రసంగించబడిన దైవిక ప్రసంగాన్ని వినడానికి నా వద్ద ఉన్నది ఏదైనా ఇస్తాను. ఓహ్, మై. [టేపుపై ఖాళీ ఉంది ] ...? ... కానీ మీరు అక్కడికి వచ్చినప్పుడు, ప్రతి ఆలోచన స్వస్థతవైపే ఉంటుంది , ఆపై జబ్బుపడిన వారికోసం ప్రార్థించడం జరుగుతుంది.

13

నేను ఈ రాత్రికి వచ్చాను మరియు ఆ అమ్మాయిలు పాడటం నేను విన్నాను. మరికొన్ని పాటలను వినడానికి నేను రేపు రాత్రి త్వరగా ఇక్కడకు రావాలనుకుంటున్నాను. అది నాకు సహాయం చేస్తుంది. అది నన్ను ప్రోత్సహిస్తుంది. నేను వీటిని వినడానికి ఇష్టపడతాను. నాకు మంచి బోధకులు చెప్పేది వినడం ఇష్టం.

నేను- దేవుడు తన కోసం ఏమి చేస్తున్నాడో మాట్లాడటానికి ఉదయం యేసు సముద్రతీరానికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడింది వినడానికి ఇష్టపడతాను. ఆ ఉదయం నేను అయన మాట్లాడినది వినాలనుకుంటున్నాను, మీరు అనుకుంటున్నారా? ఆయన క్రిందికి వెళ్ళినప్పుడు, ప్రజలు దేవుని వాక్యం వినుటకు ఆయనపై ఒత్తిడి తీసుకువచ్చారు.

ఇప్పుడు, చూడండి. వినుట ద్వారా మరియు దేవుని మాటను వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. అది సరియైనదేనా? మరియు ఆయనే వాక్యము. ఆదియందు వాక్యము ఉండెను, దేవుని యొద్దనుండి లోగోస్ బయలువెళ్ళెను. ఆ వాక్యము శరీరధారియై, మనమధ్య నివసించెను. ఆయనే భూమిపై ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్యము. మీరు నమ్ముతారా?

ఆయన ఇక్కడ ఇలా చెప్పారు. మరియు వారు వాక్యాన్ని వింటూ అక్కడ నిలబడ్డారు. ఇప్పుడు, వారిలో కొంతమంది సహోదరీలు ...

[టేపుపై ఖాళీ ఉంది.]

14

ఆయనపై అది పని చేయలేదు. నది వద్ద కూడిక జరుగుతుందని వారు విన్నారు. కాబట్టి వారు నది యొద్దకు వెళ్ళారు. కొంతమంది సహోదరులు, వారు ఉదయం దున్నడానికి వెళ్లలేదు, లేదా..[టేపుపై ఖాళీ ఉంది.] వారు క్రీస్తు మాట వినడానికి నదియొద్దకు వెళ్ళారు. ఈ రోజు స్వస్థత తమ కొరకే అన్న కార్యమును ఎలా నమ్మటం లేదో ఆలాగుననే వారిలో కొందరు ఆయనను క్రీస్తు అని నమ్మలేదు. వరముల పునరుద్ధరణపై వారికి నమ్మకం లేదు. అంతమాత్రాన అది అలా ఉండకుండాపోలేదు. ఎవరో వినబోవుచున్నారు. ఎవరో దానిని నమ్ముతున్నారు.

వారు ఆయనను దేవుని కుమారుడని విశ్వసించలేదు, అయితే దేవుడు ఆయనలో తనను తాను ప్రత్యక్షపరచుకుని దానిని అద్బుతములు సూచక క్రియలద్వారా నిరూపించాడు. అపహాస్యం చేసే సంఘము ఉంటుందని ఆయన చివరి రోజుల్లో వాగ్దానం చేసాడు. మనము వాటిని కలిగియున్నాము. మరియు సూచకక్రియలు వెంబడించే సంఘం ఉంటుందని ఆయన వాగ్దానం చేశాడు. మనము దానిని పొందాము. అది సరైనది. కనుక ఈరాత్రి దానికి ఒకవైపుగా ఉన్నది. మరియు ఇక్కడ మనలో ప్రతి ఒక్కరూ ఒక వైపు లేదా మరొక వైపు ఉన్నాము. అదిసరైనది.

15

ఇప్పుడు, గమనించండి. అప్పుడు, వారందరూ ఆయన మాట వినడానికి ఒత్తిడి తెచ్చినప్పుడు, అక్కడ... ఇద్దరు లేదా ముగ్గురు మత్స్యకారులు రాత్రంతా చేపలు పట్టారు. వారిలో ఒకరు సీమోను.

క్రీస్తుకు ఏమి జరుగబోతున్నదో మరియు సీమోను అక్కడ ఉంటాడని ఆయనకు ముందుగానే తెలుసు అని నేను ఎప్పుడూ నమ్ముతాను. మరియు ఇలా చెప్పబడింది ...వారు రాత్రంతయూ ప్రయాసపడ్డారు కాని యేమియు పట్టలేదు.

ఇక్కడి ప్రజలు.... ఇక్కడ ఎడారిలో మీకు పెద్దగా చేపలు పట్టుటను గురించి తెలియదు అని నేను అనుకుంటున్నాను. కానీ-కానీ ఏమైనప్పటికీ, చేపలు పట్టుటకు ప్రయత్నించి మరియు ఏమియు పట్టుకోకపోవడం అత్యంత నిరుత్సాహపరిచే విషయం.

కాబట్టి వారు లాగారు ...నేను చాలా మంది నవ్వుతున్నట్లు చూస్తున్నాను. ఇక్కడ కొంతమంది మత్స్యకారులు ఉన్నారు. కాబట్టి వారు రాత్రంతా ప్రయాసపడ్డారు కాని యేమియు పట్టలేదు. మరియు అక్కడ వారు వారి వలలను కడుగుతూ కూర్చున్నారు.

ఆపై అంద్రేయతో పేతురు చెప్పడం నేను వినగలను, “సరే, ఆ దైవిక స్వస్థత చేసేవాడు వస్తున్నాడు.” వారు ఆయన గురించి చాలా విన్నారు. “ఆయన ఏమి చెప్పబోతున్నాడో విందాము” అని అన్నాడు. నేను ఆయనను చూడగలను; ఆయన ఒక చెట్టు మొద్దుపై ఎక్కడో నది వద్ద కూర్చున్నాడు. తెలుసా మొదటిరాత్రి కూడికకు వచ్చినప్పుడు కొంతమంది... తోటివారు కొద్దిగా సందేహాస్పదముగా ఉన్నారు. ఆయన చాలా దూరంలో ఉన్నాడు...? ... సరే. అతను అక్కడ వెనక కూర్చుని ఉండగా, ఏమి జరుగుతుందో అని ఆశ్చర్యపోతున్నారు.

16

ఆయన ద్వారా ప్రజలను స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం చేసిన దాని గురించి ఆయన మాట్లాడడం మొదలుపెట్టడం నేను వినగలను. యెషయా ప్రవచనం నెరవేరింది. రాబోవు మెస్సియా ఆయనే. ఆయన ఆ విషయాలపై వారితో మాట్లాడుతున్నాడు, దేవుడు దేశంలోని ఇతర ప్రాంతాల వారిని ఆయన ద్వారా ఎలా స్వస్థపరిచాడో వారికి చెప్పాడు. ఇప్పుడు, ఆయన సరిగ్గా ఆయన ద్వారా స్వస్థత, ప్రజలకు రక్షణ, విమోచన మరియు మొదలైనవాటిని తీసుకువచ్చాడు.

మరియు నేను ఆ మునుపటి అపొస్తలులు కొంతవరకు తీసుకుని (అర్థంచేసుకుని), కొంచెం దగ్గరగా ముందుకి వెళ్లడం నేను చూడగలను. ఓ, మై. నేను కొంచెం దగ్గరగా వెళ్ళడానికి ఇష్టపడతాను, మీరు?

అతను వెనక్కి జరిగి, “రండి, అంద్రేయా. మనము ...?... కొంచెం దగ్గరగా జరగండి అని అనడం నేను చూడగలను. అప్పుడు మీకు తెలుసా మొదటిగా, అతను కొంత భాగాన్ని విడిచిపెట్టి, అతనితో మిగిలిన వాటిని పట్టుకుని నిలబడ్డాడు. ఆయన మాట విన్నాడు.

17

ఓ, ఆయన మాట్లాడటం వినడానికి నేను ఇష్టపడతాను, మీరు ఇష్టపడతారా? ఆయన సద్దుకయ్యులలో ఒకరిలా మాట్లాడలేదు. అధికారంతో మాట్లాడాడు. మరియు ఆయన ప్రజలతో మాట్లాడి, వేరే వారి గురించి కాదు, కానీ “నేను” అని చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు.

ఇప్పుడు. సీమోను, “మీకు తెలుసా, ఆ మనిషి బోధలో ఏదో ఉంది... [టేపుపై ఖాళీ ఉంది.] నేను ఆయనను ఇష్టపడుతున్నాను. ఆయన ఆ వర్తమానం అందించే విధానం నాకు నచ్చింది” అని చెప్పడం నేను వినగలను. అతను కొంచెం దగ్గరగా వెళ్లడం నేను చూస్తున్నాను. అప్పుడు యేసు ఆయన మాటలు ముగించిన తర్వాత, ఆయన సీమోను పడవలో ఉన్నాడు. ఆయన, “ఇప్పుడు, సీమోను...” అని మాట్లాడటం నేను వినగలను ఓ, మై. ఆయన ఏమి తలంచాడో అని నేను ఆశ్చర్యపోతున్నాను. “సీమోనూ, మన ఈ స్థితి నుండి బయటపడుటకు నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి.”

ఇప్పుడు, అది కాస్త విచిత్రంగా ఉన్నది. “నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుము? ఎందుకు, చూడండి. మనము మత్స్యకారులము. ఇప్పుడు, మనం కేవలం ఒడ్డున గాలము వేసే వారము కాదు...?... మనము చేపలు పడతాము.... చేపలను పట్టుకోడానికి సూచనలు ఎలానో మనకు తెలుసు. మరియు రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు. ఒక్కసారి ఆలోచించండి, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు”.

సరే ఇప్పుడు-ఇప్పుడు పేతురు... ఇప్పుడు, చూడండి. ఇక్కడ విశ్వాస పరీక్ష ఉంది. ఇప్పుడు దేవుడు ఎల్లప్పుడూ ప్రజలను విశ్వాస పరీక్షలో ఉంచుతాడు అని నేను నమ్ముచున్నాను. ముందు ఆయనను నిరూపించుకుంటాడు. అన్ని కార్యాలను నిరూపిస్తాడు. నిజమైన క్రైస్తవుడు విశ్వాస పరీక్షను ఆనందిస్తాడు. [టైపు పై ఖాళీ ఉంది.]

18

ఆపై ఆయన ఇక్కడ పర్వతం వైపుకు వచ్చినప్పుడు... [టేప్ పై ఖాళీ ఉంది.] అక్కడ ఏదో విషయం ఉన్నది అవునా? మనకు మన పరీక్షలు బంగారం కంటే మంచివని అపొస్తలుడు చెప్పినది నేను నమ్ముతున్నాను. దీనిని గురించి ఆలోచించండి. మీరు సాక్షిగా ఉండేందుకు, దేవుడు మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేసి ఉండవచ్చు, ఆపై మీరు ఆయన వాక్యముపై నిలబడడానికి, ఆయన మిమ్మల్ని స్వస్థపరచవచ్చు. అప్పుడు మీరు వ్యతిరేకత ఎదుర్కొన్నప్పుడు, సందేహం యొక్క నీడను దాటి, మీరు “నాకు తెలుసు” అని చెప్పవచ్చు.... ఓహ్,మై. యేరుషలేము, యూదయ, సమరియలో నాకు సాక్షులై ఉందురు. సాక్షి అంటే నిజంగా ఎదో చేసి, ఎక్కడో ఉండి మరియు ఏదో చూసి ఉంటాడు. అది సరియైనదేనా?

ఇప్పుడు, గుర్తుంచుకోండి. సాక్షి సాక్షిగా ఉండాలి, వారు దేని గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి ప్రత్యక్ష సాక్షిగా ఉండాలి. ఇది రెండవది కాదు. మీరు ఇక్కడ న్యాయస్థానం వద్దకు వెళ్లి, “నేను వీధిలో ఒక శిధిలాన్నిచూశాను”, మరియు మీరు దానిని కిటికీ అద్దంలోంచి చూస్తే, మీరు సాక్షిగా ఉండలేరు. మీరు వ్యక్తిగతంగా అక్కడే ఉండాలి. మీరు విషయాలను రెండుసార్లు చూడలేరు, మీరు సరైన సాక్షిగా ఉండాలి.

ఇప్పుడు సహోదరీ, ఒక ఆలోచన మనము ఆలోచించినట్లయితే ఇలా ఉండవచ్చును కదా. నీవు కళ్ళద్దములు పెట్టుకొని. ఇప్పుడు, అతను సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు ఆ చూపును ఆ స్థితిలోకి తెచ్చాడని తెలుసుకోవడం ఏదో కొత్త విషయం కాదా? ఆయన వచ్చాడని మనము తెలుసుకోవడం... ఇది అద్భుతమైనది అవునా?

19

“వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా?”

యేసు, “వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను.”అని అన్నాడు. దేవుడు కొందరు సాక్షులను కోరుకుంటాడు. ఇప్పుడు, మీరు బయటకు వెళ్లి సాక్షిగా ఉండడానికి, ఆపై విశ్వాస పరీక్షలో నిలబడటానికి ఆయన మిమ్మల్ని స్వస్థపరచడానికి తన స్వస్థతా వరమును పంపాడు. బయటకు వెళ్లి, మీకు దేవుడు ఇచ్చిన అధికారాన్ని పొందండి. ఖచ్చితంగా. అది సరియైనది.

ఇప్పుడు. ఆయన, “నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుము” అని చెప్పినట్లు నేను చూడగలను. ఇప్పుడు, తద్వారా అతను కార్యములను ఎలా చేయాలో తెలుసుకొనుటకు ఆయన ఆ వ్యక్తికి విద్యనందిస్తున్నాడు. కొంతసేపు తర్వాత, అతను, వారిలో చాలా మంది ఒక గొప్ప పరీక్షను కలిగి ఉన్నారు, గుర్తుంచుకోండి. కానీ అతను విద్యావంతుడు కావాలి.

20

ఇప్పుడు, బహుశా మీరు విద్యను నేర్చుకోవాలి. బహుశా అందుకే అనారోగ్యం మీపై ఉన్నది, దాని ద్వారా దేవుడు ఆయన ఏమైయున్నాడో ఆ స్థానాన్ని నీవెరుగుటకు దేవుడు నీకు బోధించి, తన్నువెదకువారికి ఫలము దయచేయును. బహుశా మీ విశ్వాసం మీకు ఇచ్చేది అదే కావచ్చు. మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి మీపై అనారోగ్యం వస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ ఫీనిక్స్నుండి, లేదా-లేదా డగ్లస్ నుండి, లేదా మీరు ఎక్కడి నుండి వచ్చినప్పటికినీ, “నాకు తెలుసు. ఎవరూ నాకు చెప్పలేదు; ఆయన స్వస్థపరచువాడని నాకు తెలుసు” అని చెప్పగలరు.

దైవిక స్వస్థత ద్వారా ఇక్కడ ఎంతమంది స్వస్థత పొందారు, చూద్దాం... మీకు తెలుసా? ఇది నిజం. ఆమెన్. ఇది నిజం. మీరే ఆయనకు సాక్షులు. ఓహ్, మై.

ఇప్పుడు, మనము ఇక్కడ ఉన్నాము. మీరు దానిని గమనించాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు ఆయన, “దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుము” అని అన్నాడు.

కాబట్టి ... పేతురు, “ప్రభువా, మేము రాత్రంతయు కష్టపడ్డాము.” ఇతర మాటలలో మేము నీటిలో వలను వేసాము అని చెప్పాడు. “మరియు రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు.”

ఇది ఇక్కడే ఉన్నది, గ్రహించండి. “అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను..” చూశారా? “మనం మానవ స్వభావం ప్రకారముగా అన్నీ చేసామని తెలుసు. అన్నీ......మన జ్ఞానం, మన సామర్థ్యం, ​​మనం ముగింపులో ఉన్నాము. కానీ ప్రభువా, నీ మాట చొప్పున వలలు వేతును.

21

ఇప్పుడు చూడండి. మీరు బహుశా డాక్టర్ వద్దకు వెళ్లి ఉండవచ్చు. మీకు ఆపరేషన్ జరిగింది. మీరు ప్రతీదీ ప్రయత్నించారు. మీరు ఇంతకు ముందు ప్రార్థనా వరుసలలో ఉండి ఉండవచ్చు. కానీ “ప్రభువా, నీ మాట చొప్పున ఈ రాత్రి వలలు వేతును. ఈ రాత్రి వలలు వేయడానికి నేను వస్తున్నాను. నేను వెళ్తున్నాను...”

సరే, మీరు... “అక్కడ చేపలు లేవు” అని చెప్పవచ్చు.

పేతురు, “నువ్వు వలను వేసావు. మీకు తెలుసా-మీరు రాత్రంతా వలను వేసి ప్రయాసపడ్డారు, మరియు అక్కడ చేపలు లేవు.”

“మీ వలలు వేయుము” అని ఒకవేళ దేవుడు చెప్పినట్లయితే ఆయన అక్కడ చేపలు ఉంచుతాడు. చూశారా?

మరియు ఈ రాత్రి నేను నమ్ముచున్నాను, వైద్యుడు మీరు బాగవ్వలేరు అని చెప్పినట్లయితే, దేవుని వాక్యం నువ్వు క్షేమంగా ఉండగలవు అని చెప్తుంది, దేవుడు ఏదైనా పెట్టగలడు... ఆయన కొత్త కణాలు; కొత్త కళ్ళు, కర్ణభేరి, ఏది ఏమైనా, ఆయన దానిని అక్కడ ఉంచగలడు. మీరు దీనిని నమ్ముతున్నారా?

22

అక్కడ ఆదికాండములోని 6వ అధ్యాయములో ఆయన అబ్రహామును కలుసుకున్నప్పుడు, ఆయన అతనిని సర్వశక్తిమంతుడైన దేవుడైన యెహోవా నామములో కలుసుకున్నాడు. ఇప్పుడు, హెబ్రీలోని ఈ పదము “ఎల్ షద్దాయి” అనే పదము నుండి వచ్చింది దాని అర్ధం “రొమ్ము, బలవర్ధకమైనది” ఒక తల్లి తన బిడ్డను ఏ విధముగా పోషిస్తుందో ఆ మాదిరిగా. అబ్రహాముకు తొంభై తొమ్మిది సంవత్సరాలు, పిల్లలులేరు. అతని భార్య శారాయి ఎనభై సంవత్సరాలు దాటింది. ఆమెకు... వారికి పిల్లలు లేరు. కానీ దేవుడు అతనితో, “నేను ఎల్ షద్దాయిని. నేను ధైర్యముగల -రొమ్ములు గలవాడను. నేను సర్వశక్తిమంతుడను” అని అన్నాడు. మరో మాటలో చెప్పాలంటే, “మీరు ఎంత బలహీనంగా ఉన్ననూ, నేను మిమ్మల్ని మళ్ళీ పోషించి తిరిగి ఆరోగ్యముగా ఉంచగలను. ఆయన ఇప్పటికీ సర్వశక్తిమంతుడైన దేవుడుగానే ఉన్నాడు. ఆయన ఈ రాత్రి ఎల్ షద్దాయిగా ఉన్నాడు.

“బ్రదర్ బ్రాన్హాం, నేను ముసలివాడిని. నాకు స్వస్థత కలుగుతుందా?” అని మీరు అనవచ్చు.

కలుగుతుంది. ఆమెన్. “ఆశించిన వారిని రానివ్వండి.”

“నేను మెథడిస్ట్‌కు చెందినవాడిని” అని మీరు అనవచ్చు.

మీరు దేనికి చెంది ఉన్నారని నేను పట్టించుకోను, మీరు నమ్మితే స్వస్థత మీ కొరకే అవుతుంది. ఎల్షద్దాయ్ , సర్వశక్తిమంతుడైన దేవుడు. ప్రభువా, వలలు వేయనిమ్ము.

మీరు, “సరే, నేను వృద్ధుడిని. సరే, నాకు ఈ స్త్రీ బలహీనత ఉన్నది; దీనిని సంవత్సరాల తరబడి నేను కలిగి ఉన్నాను. నేను వైద్యుల యొద్దకు వెళ్ళాను మరియు ప్రతీదీ ప్రయత్నించాను అని చెప్పవచ్చు. కానీ ”ప్రభువా, నీ మాట చొప్పున ఈ రాత్రివలలు వేయుదును.“

23

చూడండి, మీరు నిలబడటానికి ఏదైనా కలిగి ఉంటే ...దేవుని వాక్యం స్వస్థత గురించి మాట్లాడుతుంది. అది స్వస్థత ఉందని చెప్తుంది. మరియు అది ఉన్నది...[టేపు పై ఖాళీ ఉంది.]...?... మరియు ఈ రాత్రి... [టేపు పై ఖాళీ ఉంది.] ...?... ఈ రాత్రి, ప్రభువా, నేను వలను దించబోతున్నాను అని అడగండి [టేపుపై ఖాళీ ఉంది.]

రక్త సమస్యతో బాధపడుతున్న ఒక మహిళ ఉంది. ఆమె... [టేపుపై ఖాళీ ఉంది.] ఆ సమస్యతో జీవితమంతా గడిపింది ... [టేపుపై ఖాళీ ఉంది.]... వైద్యులను మరియు అన్నీ విధాలలో ప్రయత్నించింది మరియు అవును... వాళ్ళలో కొందరు, ఇంకా ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రయోజనము లేకపోయింది. బహుశా ఆమె కోసం ప్రార్థించి ఉండవచ్చు. బహుశా ఆమె కానుకలను సమర్పించి ఉండవచ్చు... [టేపుపై ఖాళీ ఉంది.]

ఆమె ప్రార్థనను పొందలేనంత పెద్దగా ప్రార్థనా వరుస ఉన్నది...[టేపుపై ఖాళీ ఉంది.] అయితే ఆమె “నేను ఆయన వస్త్రపు అంచుని మాత్రం తాకగలిగితే, నేను స్వస్థత పొందుతాను” అని తన హృదయములో అనుకున్నది ......మహిమ. మరియు ఆమె ఆ జనసమూహములో వెనుకకు వెళ్ళి ఆయన వస్త్రపు అంచును తాకింది... [టేపుపై ఖాళీ ఉంది.]

తిరిగి, ఇలా అన్నాడు... [టేపు పై ఖాళీ ఉంది.]

పేతురు, “ఇదిగో జనసమూహము...” అన్నాడు.

ఆయన, “నేను గ్రహించాను” అని అన్నాడు...[టేపు పై ఖాళీ ఉంది.]... ప్రభావము బయలువెళ్లెను?... మిత్రులారా, బలహీనపడ్డాడు.

ఈ రాత్రి ఆయన ఇంకా అలాగే ఉన్నాడు.

24

గదరేనీయుల దేశము వద్ద ఉన్న ఆ పిచ్చివాడు, అతని మతిపోయింది. సమస్తమూ, ఆశలన్నీ ఆవిరైపోయినవి. అతను తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. అతను ఒక పిచ్చివాడు, అరణ్యములో, సమాధుల వద్ద, స్మశాన వాటికలో, నిజముగా దయ్యములు పట్టినవాడై, అలాంటి పాతకాలపు మరణ స్థలాలలో ఉండేవాడు. అది సరి. వారు ఇప్పటికీ అలాంటి ప్రదేశాలను ఇష్టపడతారు.

గమనించండి. కానీ అతను...?... [టేపుపై ఖాళీ ఉంది.] వైద్యులు...[టేపుపై ఖాళీ ఉంది.] వారు విఫలమయ్యారు.

బహుశా దేవుడు అనగా మెస్సియా వచ్చునని అతడు సరియైన మనసుతో గ్రహించగలిగాడు.

ఆయన ఆ రోజు ఎలా ఉన్నాడో ఈ రాత్రి కూడా ఆ విధంగానే ఉన్న దేవుడు. మిత్రులారా, మేల్కొనండి. ఆ ఘడియ...[టేపుపై ఖాళీ ఉంది.]...?... ఆయన వరములు, శక్తి, దేవుని వాగ్దానం సమీపములో ఉన్నాయి. ఈ రాత్రి ఆశించిన వారిని రానివ్వండి. ఇది ఇతరులపై పని చేస్తే, దేవుడు దాని గురించి సాక్ష్యమిస్తాడు. మరియు దేవుడు దాని గురించి సాక్ష్యమిచ్చినట్లైతే, అదినిజం. అది మిమ్మును దాటి వెళ్లనివ్వవద్దు. దేవుడిని ఆయన మాట చొప్పున తీసుకోండి. అవునండి.

25

అక్కడ ఒక మనిషి ఉన్నాడు; అతని చిన్న అమ్మాయి, పన్నెండు సంవత్సరాలు గల అతని పాప చనిపోయింది. యేసు యాయీరు కుమార్తెకు స్వస్థత చేకూర్చేందుకు మార్గమధ్యములో ఉన్నాడు. మరియు ఆ అమ్మాయి అప్పటికే చనిపోయింది, “బోధకుడిని ఇబ్బంది పెట్టవద్దు” అని వార్త వచ్చింది.

అతని ముఖం చిన్నబుచ్చుకోవడం నేను చూస్తున్నాను. ఓ. అతను,“మా అమ్మాయి చనిపోయింది” అని అనుకున్నాడు అతను అవిశ్వాసులతో చేరాడు. కానీ అతను యేసును అన్నివేళలా విశ్వసించాలనుకున్నాడు.

ఈ రాత్రి ఈ నగరంలో చాలా మంది సంపూర్ణ సువార్తను విశ్వసించాలనుకుంటున్నారు, కానీ వారు తమ స్థానాన్ని బట్టి భయపడుతున్నారు. అదినిజమే. వారికి అది కావాలి. దేవునికి మహిమ అని అరచుచూ, ఆరాధన చేయుటకు వారికి చాలినంత రక్షణ కలిగి ఉండుటకు వారు తృష్ణగొనుచున్నారు. అది సరైనది. అలాంటివారు చాలా మంది ఉన్నారు. కానీ వారి ఇబ్బంది ఏమిటంటే, వారు మనోహరమైన దేవుడైన క్రీస్తుకంటే వారి గర్వం మరియు వారి గౌరవం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఓహ్, మై.

కానీ ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇప్పటికీ క్రీస్తే. మరియు ఆయన దానిని స్వీకరించడానికి దేవుడు ఏర్పరచిన మార్గములో వచ్చినవారికి పరిశుద్ధాత్మను ఇస్తానని తనను తాను నిరూపించుకున్నాడు. ఆమెన్. అది నిజమే. అలాగే ఇప్పుడు, ఆయన దానిని స్వీకరించడానికి దేవుడు ఏర్పరచిన మార్గంలో వచ్చిన వారిని స్వస్థపరుస్తాడు కూడా.

26

ఇప్పుడు, గమనించండి. గొప్ప వ్యత్యాసముతో...మరియు ఈ ప్రజలు ఇప్పుడు వచ్చినప్పుడు. ఈచిన్న దీన యాయీరు, అతని గుండె జారిపోయింది; “కుమార్తె చనిపోయినది; బోధకుని శ్రమ పెట్టవద్దు.”

ఆ పవిత్రమైన కన్నులు అతని వైపుకు త్రిప్పడం నేను చూడగలను, ఆయన “భయపడవద్దు; నమ్మిక మాత్ర ముంచుము” అని అన్నాడు. ఓ, మై. అతను ఎక్కడ నిలబడి ఉన్నాడో ఆయనకు తెలుసు. యాయీరు బిడ్డ లేస్తుంది అని ఆయనకు తెలుసు, అయితే సందేహించు అనేకుల మధ్య ఆయన వచ్చుటను గూర్చి యాయీరు నిజమైన విశ్వాసం కలిగియున్నాడు.

వారు తిరిగి వెళ్ళినప్పుడు నేను వారిని చూడగలను. వారిలో ఒకరు, “ఆ దైవిక స్వస్థతను జరిగించే వ్యక్తి గురించి నేను మీకు ఏమి చెప్పాను? ఆయన గురించి నేను మీకు ఏమి చెప్పాను? ఆయన ఇప్పుడు అక్కడికి వెళ్లి సంఘముపై అవమానం మరియు మొదలైనవి తీసుకువచ్చాడు.”

కానీ యేసు నేరుగా వరుసలోకి వెళ్లాడు. గదిలోకి వెళ్ళగానే ఆయన ఇలా అన్నాడు, “ఈ బిడ్డ... ఈ అమ్మాయి చనిపోలేదు, నిద్రించుచున్నది.” అందుకు వారు ఆయనను అపహాస్యం చేసిరి. వాళ్ళు ఇప్పటికీ ఆయనను అపహాస్యం చేస్తున్నారు. అయితే ఆయన వారిని బయట ఉంచాడు. మరియు నేడు, ఎవరైతే సర్వశక్తిమంతుడై యున్న దేవుని శాశ్వతమైన శక్తిని చూసి అపహాస్యం చేస్తున్నారో, వారు రాజ్యం నుండి బహిష్కరించబడతారు. సరే.

27

వారు ఆ స్థలానికి వచ్చినప్పుడు, ఆయన లోపలికి వెళ్లి, పేతురును, యాకోబును, యోహనును తప్ప మిగిలిన వారందరినీ పంపించాడు....?... [టేపుపై ఖాళీ ఉంది.]...?...... అక్కడ ఉన్నవారంతా వెళ్ళిపోయారు. మానవ స్వభావం తీసివేయబడినది. వారి విశ్వాసం ఆయనకు తెలుసు. కానీ ఆయన పట్టబడ్డాడు. గ్రహించండి! అవి శక్తులు. ఆయన యొక్క ఈ మర్త్య శరీరం నుండి బయటకు వెళ్ళి ఆత్మ ఉన్న స్థలము నుండి, కొన్నిగంటల ముందే చనిపోయిన ఆ అమ్మాయి ఆత్మను ఆ స్థలము లోనికి తిరిగి పిలిచాడు...

ఆత్మ ఉన్న స్థలములోనుండి తిరిగి జీవములోనికి ఆత్మలను పిలవగలిగిన అదే వ్యక్తితో పరిచయం ఉన్నందుకు ఈ రాత్రి నేను కృతజ్ఞుడను.

మరియు ఆయన అక్కడ లాజరు సమాధివద్ద నిలబడి ఉన్నాడు. ఆశలన్నీఆవిరయ్యాయి. లాజరు నాలుగు రోజుల ముందు చనిపోయి మరియు దుర్వాసనతో సమాధిలో ఉన్నాడు. దానిని చూడండి...?....... యేసు వచ్చుచున్నాడు అని వారు విన్నారు....?.... వాళ్ళు బయటకు వెళ్ళారు...?... కన్యక గర్భమున పుట్టిన యేసు...?... సర్వశక్తిమంతుడైన దేవుడు ...?... నేను నమ్ముతున్నాను...?...

[టేపు నాణ్యత చాలా తక్కువగా ఉంది, చాలా వరకు సమాచారం చేర్చబడలేదు ఎందుకంటే స్పష్టత లేదు.]

28

చనిపోయినవారిని దేవుడు లేపుతున్నాడు. అవునండి. ఆయన ఆకలిగొన్నాడు అని చెప్పబడింది. ఆయన ఆ కొండ దిగి వచ్చినప్పుడు, ఆ చెట్లను చూసినప్పుడు, తినడానికి అంజూరపు పండ్లు కనబడలేదు. ఆయన ఒక మానవుని వలే ఆకలిగొనెను అని చెప్పబడింది. ఆయన చెట్టుపై చూస్తున్నప్పుడు ఆయన ఆకలితో ఉన్నాడని నాకు తెలుసు...[టేపుపై ఖాళీ ఉంది.] కానీ ఆయన ఐదు రొట్టెలు తీసుకొని ఐదువేల మందికి ఆహారముగా పంచినప్పుడు, ఆయన దేవుడు. అది నిజమే. అవునండి. అది నిజం. అది నిజమని నాకు తెలుసు.

ఆయన ఒక రాత్రి పడవలో అక్కడ ఉన్నప్పుడు, నేను ఊహిస్తున్నాను, పదివేల సముద్రపు దెయ్యాలు ఆయనను ముంచివేస్తామని ప్రమాణం చేసాయి. ఆయన స్వస్థత కూడికలనుండి అలసిపోయి అలసటతో పడవ వెనుక భాగంలో నిద్రపోతున్నాడు. దేవునికి తెలుసు, అయన అనుభవించిన దాని గురించి కొంచెం అవగాహన నాకు ఉన్నది. అలా పడుకుని గాఢ నిద్రలో ఉన్నాడు. తరంగాలు మరియు గాలి ఆయనను మేల్కొలపలేదు, ఆయన అంత గాఢ నిద్రలో ఉన్నాడు. కానీ అప్పుడు ఆయన అక్కడ ఉన్నప్పుడు, ఆయన మానవునిలా నిద్రపోయాడు. అవునండి. అప్పుడు నేను - ఆయన ఒక మానవునిలాగా నిద్రపోయి, ఆయన మేల్కోవడం చూసినప్పుడు, లేచి, పడవ అమరముపై తన కాలు వేసి, ఆకాశము వైపు చూసి గాలిని గద్దించి సముద్రముతో మరియు ఇలా అన్నాడు, “నిశబ్ధముగా ఊరకుండుము.” ఆయన గాలులు మరియు అలలు ఆయనకు లోబడునట్టుగా చేసినప్పుడు... ఆయన ఒక నిద్రిస్తున్న మనుష్యుడు, కానీ ఆయన గాలులు మరియు అలలను నిమ్మలపరచిన దేవుడు.. అది నిజమే.

29

ఆయన సిలువ వద్ద, “నా దేవా, నా దేవా, నన్నేల విడనాడితివి?” అని ఏడుస్తూ మరణిస్తున్నప్పుడు ఆయన తన మరణములో ఒక మనుష్యుడు, కానీ పునరుత్థానములో ఆయన దేవుడు. అది సరియైనది. “నా ప్రాణాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసికొనుటకు నాకు అధికారము కలదు.. ఎవడునూ నా ప్రాణము తీసికొనడు; కానీ నేను దానిని స్వేచ్ఛగా పెట్టుచున్నాను. ఆయన ఆవిధముగా చేసాడు. ఆయన ఈ రాత్రి ఇంకా ఆ రీతిగానే ఉన్నాడు.

ఆయన అక్కడ లాజరు యొక్క సమాధి పక్కన నిలబడి ఉన్నప్పుడు. మరియు నేను ఆయనను అక్కడ మానవునిగా నిలబడి, బలహీనముగా, ఏడుస్తూ, మరియు ఆయన బుగ్గల మీదుగా కన్నీళ్లు కారడం చూడగలను. తాను లాజరును లేప సమర్ధుడనని ఆయనకు తెలుసు . కానీ అది ప్రజల పట్ల ఆయనకున్న మానవీయ భావన. మరియు ఆయన సమాధి పక్కన నిలబడి ఉన్నప్పుడు, ఆయన, “ఆ రాయిని తీసివేయుడి” అని అన్నాడు. ఎవరో ఒక భాగం చేయాల్సి ఉంది అని ఆయనకు తెలుసు.

మీరు మీ వంతుగా చేయవలసినది ఉంది. [టేపుపై ఖాళీ ఉంది.]...?... రాయిని తరలించడం. ఆ ఇద్దరు బలహీనమైన మహిళలు. మరియు వారు రాయిని తీసివేసినప్పుడు, నేను ఆయన మాట్లాడినది స్పష్టంగా వినగలను, “నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నందుకై నేను కృతజ్ఞతలు తెలుపుచున్నాను. అయితే ఇక్కడ నిలిచే వారికి...”

30

ఆయనను చూడండి. ఇదిగో; గ్రహించండి. ఆక్కడ ఆత్మ స్థలములో ఆయన బిగ్గరగా “లాజరూ”, అని కేకలు వేయడం నాకు వినబడుతుంది. ఆయన అతనిని పేరుపెట్టి పిలిచి ఉండకపోతే అక్కడే సాధారణ పునరుత్థానం జరిగి ఉండేది అని నేను నమ్ముతున్నాను. మరియు నేను దీనిని నమ్ముతాను. నేను ఆయన గురించి అలా అనుకుంటున్నాను. అది నిజమే.

“లాజరూ, బయటికి రా” అని అన్నాడు. ఓహ్, మై. కుళ్లిపోయిన శరీరం దాని యజమానుని గుర్తించింది, అనగా దాని ఆత్మ. లాజరు చనిపోయి నాలుగు రోజులైంది. అతని ఆత్మ నిత్యత్వములో ఎక్కడో ఉంది. అది ఎక్కడ ఉందో నాకు తెలియదు; మీకు కూడా తెలియదు. అతని ఆత్మ ఎక్కడ ఉందో దానిగురించి మేము వాదించము. అయితే ఏదేమైనప్పటికీ, అది దేవుని కుమారుని స్వరాన్ని విన్నది. మరియు నాలుగు రోజుల క్రితము చనిపోయిన వ్యక్తి, మళ్ళీ [టేపుపై ఖాళీ ఉంది.] లేచి నిలబడ్డాడు.

అతను నిన్న, నేడు మరియు నిరంతరం (ఏకరీతిగా ఉన్నాడు)... [టేపుపై ఖాళీ ఉంది.] మీరు నమ్ముతున్నారా? “అయినప్పటికీ, ప్రభువా,... [టేపుపై ఖాళీ ఉంది.] నేను వలను వదులుతాను.”

31

దీనుడైన పౌలు... పరిశుద్ధ పౌలు, తన ప్రయాణం ముగింపులో, “మంచిపోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతి కిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకు అనుగ్రహించును.” అక్కడ అయన మంచి పోరాటం పోరాడి వెళ్ళినట్లు చెప్పినప్పుడు ఆయన చెప్పిన మరోవిషయం గమనించండి. ఆయన, “ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? ఓ మరణమా, ఎక్కడ ఉన్నదో నాకు చూపించు...?... ఎక్కడ ఉన్నావు?” ఒక సవాలు విసురుతున్నాడు. “మరణమా, క్రిందికి రా. నన్ను భయపెట్టగలవేమో చూడు.” అయితే సరే. కిందకి చూసి, అక్కడ ఆరడుగుల మన్ను పడి ఉండడం చూసి, “ఓ మరణమా, ఎక్కడ నీ... [టేపు పై ఖాళీ ఉంది.] ”నీవు దీన్ని ఎక్కడ చూపించగలవో నాకు చూపించు.“, ”నేను నిన్ను పట్టుకోగలను. నేను నీకు యేరుషలేములో ఖాళీ సమాధిని చూపించగలను“ అని చెప్పుము. ఆమెన్! ఈ రాత్రి ఆయన ఇప్పటికీ క్రీస్తుగానే ఉన్నాడు. ”ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?“

అపోస్తలుడైన పౌలుతో నేను దీన్ని జోడించవచ్చు, “అనారోగ్యమా, మా దేవుని ముందు నిలబడే నీ స్థలము ఎక్కడో నాకు చూపించు...?...”

32

అయినప్పటికీ, ప్రభువా, నీ మాట చొప్పున నేను వలను వదులుతాను. మర్త్యమైన జీవిత చక్రాలు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నా ఆత్మను ఇక్కడ నుండి నీవు ఎలా తీసుకువెళతావో నాకు తెలియదు, కానీ నీ మాట చొప్పున, ప్రభువా, ఇదిగో నేను నిన్ను విశ్వసిస్తూ అంధకార నిత్యత్వంలోనికి వస్తున్నాను...

“ఎవరో ఒకరి ప్రార్థన ద్వారా మీరు నన్ను ఎలా స్వస్థపరుస్తారో నాకు తెలియదు, ప్రభువా. అయినప్పటికీ, ప్రభువా, నీ మాట చొప్పున.”

“అది ఆయన వాక్యములో ఉందా?” అని మీరు అంటారు.

“నమ్మినవారి వలన ఈ సూచకక్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు (అది నిజమేనా?); క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను”.

“ప్రభువా, నీ మాట చొప్పున నేను వచ్చాను. ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేను ఇక్కడ ఉన్నాను.” దేవుణ్ణి వేలెత్తి చూపించుటకు ప్రయత్నించవద్దు, ఆయన మాట చొప్పున ఆయనను స్వీకరించండి.

33

అక్కడ పేతురు రాత్రంతా మేల్కొని పడవ తిప్పుతూనే ఉన్నాడు. మరియు మీకు తెలుసా, మొదటిగా, అతను యేసు రావడాన్ని చూసాడు. అతను, “ప్రభువా, ఒకవేళ...” [టేపు పై ఖాళీ ఉంది.] అతను ఏమి చెబుతున్నాడో తెలియలేదు... [టేపుపై ఖాళీ ఉంది.] అయితే మీరు పొందుకుంటారు. “రండి.” “ప్రభువా, ఇక్కడ బహుశా నలభై అడుగుల లోతు ఉంటుందని నాకు తెలుసు. నేను ఎలా నడుస్తానో నాకు తెలియదు. ఆ గాలిలో నడవడం ఎంత అసాధ్యమో ఈ నీటి మీద నడవడం కూడా అంతే అసాధ్యము అని నాకు తెలుసు. నేను మొదట రసాయనాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. అక్కడ కింద నేను నడవడానికి బల్ల ఉందో లేదో తెలుసుకోవడానికి నేను ప్రయత్నించడం లేదు, నీవు నడిచి రమ్మని చెబితే ప్రభువా, ఇదిగో నీ మాట ప్రకారం వస్తున్నాను.” అది సరైనది.

34

అతను (పేతురు) అక్కడ ఆయన మాట ప్రకారం ఆయనను నమ్మితే, పంతొమ్మిదివందల సంవత్సరాల పరీక్ష కాలం తర్వాత ఈ రాత్రి మీ సంగతి ఏమిటి... హల్లెలూయా. ఎందుకు సహోదరుడా... [టేపుపై ఖాళీ ఉంది.] వాక్యము... [టేపు పై ఖాళీ ఉంది.]... దాన్ని గుర్తించడానికి... [టేపు పై ఖాళీ ఉంది.]...?... “నేను నీ మాట ప్రకారము...” [టేపు పై ఖాళీ ఉంది.]

ఒకసారి ఆయన మాట ప్రకారం ఆయనను స్వీకరించిన కొంతమంది ఆ కాలపు కుర్రాళ్ళు, భయపడలేదు. బబులోనులో కొంత మంది హెబ్రీపిల్లలు ఉన్నారు. రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు: షద్రకు, మేషకు, మరియు అబెద్నెగోయను వారు కూడా.

మరియు, ఒక నిర్దిష్ట ప్రతిమకు నమస్కరింపనివాడెవడో, వారు ఎప్పటికన్న ఏడంతలు వేడిమిగా ఉండే అగ్ని గుండములో వేయబడుడురు అని ఒక ఆదేశం వచ్చియున్నది. అయితే సరే. ఇప్పుడు, అక్కడే పరీక్ష ఉన్నది.

35

మీరు రేపు ప్రార్ధించబడిన తర్వాత, ఆ మరుసటి రోజు పరీక్ష వస్తుంది. నీవు చింతించ వద్దు. మీరు... ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి ఒక్కరూ, కొన్ని రోజుల తర్వాత, పరీక్ష కాలాన్ని ఎదుర్కొంటారు. అది సరియైనదేనా?మీరు స్వస్థత పొందినప్పుడు, అది ఆ దెయ్యం, దాని శరీరం చనిపోవడం ప్రారంభమవుతుంది. పరీక్ష వస్తోంది. సాతాను తిరిగి రావడానికి ప్రయత్నించబోతున్నాడు. ఒక వ్యక్తి నుండి అపవిత్రాత్మ బయటకు వెళ్ళినప్పుడు, అతను నీరులేని ఖాళీ ప్రదేశాల్లో తిరుగుతాడు. వాడు తిరిగి వచ్చేటప్పుడు, వాని కంటే భయంకరమైన మరి ఏడు దెయ్యాలను తీసుకువస్తాడు. అది సరియైనదేనా?

గమనించండి. ఇంటిని అమర్చి, ఊడ్చి, ఆ ఘడియ కొరకు సిద్ధంగా ఉండనివ్వండి... ఇదిగో, గ్రహించండి. వాడు తిరిగి వచ్చాడు. అయితే వాడు ఇల్లు అమర్చబడి, ఊడ్చి పెట్టినట్లు కనుగొన్నాడు. అప్పుడు ఆ సమయములో వానిని దూరంగా ఉంచడానికి అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నది.

36

ఇప్పుడు, ఈ హెబ్రీ పిల్లలు, నేను వారిని గమనించగలను. వారు ప్రార్థిస్తున్నప్పుడు, వారు రాజుపట్ల ఎటువంటి శ్రద్ధ వహించలేదు; వారు అతని ఆజ్ఞకు భయపడలేదు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనేదాన్ని వారు తెలుసుకోవాలనుకున్నారు. మరియు వారు తమ ముఖాలను తిప్పుకుని... [టేపుపై ఖాళీ ఉంది.]...?...అదే విధముగా ప్రార్థించారు.

ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. సరే. శాసనము ఇవ్వబడింది. అప్పుడు రాజు తన ముద్ర అక్కడ వేసినట్లయితే, అతను దానిని చేయవలెను. అతను ఈ ముగ్గురు హెబ్రీయులను కాల్చివేయబోతున్నాడు. నేను బెల్తేషాజరు , లేదా—లేదా నెబుకద్నేజరు, “మనము ఈ పరిశుద్ధ దొర్లువారికి ఇక్కడ ఏమి చేయాలో నేర్పిద్దాం. ఇక్కడ అధికారి ఎవరో మనము వారికి చూపిద్దాం” అని అనడం వినగలను.

మరియు మీరు చింతించకండి, కానీ మరలా ఆ సమయం వచ్చినట్లయితే ఏమిటి. అది నిజమే. అది ద్వారము వద్దనే ఉన్నది... ఓహ్. మీరు ఇప్పుడు ఛాయలో నివసిస్తున్నారు.

37

గమనించండి. చూడండి. అతడు, “ఈ అబ్బాయిలకు ఏమి జరుగుతుందో చూద్దాం. ఆ పరిశుద్ధాత్మ మతం ఏమి చేస్తుందో మనము పరీక్షిద్దాము. మనము దానిని వారి నుండి కాల్చివేద్దాము” అని అన్నాడు. సహోదరుడా, ఇది చాలా మంది యొద్ద నుండి కాల్చివేయడానికి ప్రయత్నించబడింది. అయితే మీరు పరిశుద్ధాత్మను కాల్చివేయలేరు; స్వయంగా దానికదే అగ్ని. అవునండి. వారు దానిని యోహాను యొద్ద నుండి మరిగించి తీయడానికి ప్రయత్నించారు. కానీ వారు ఆ వేడి చమురులో దానిని మరిగించలేకపోయారు. అదినిజమే. మీరు దానిని ఆహుతి చేయలేరు; మీరు దానిని భయపెట్టలేరు; మీరు దానిని వెళ్లగొట్టలేరు; అది అక్కడే ఉండును.

గమనించండి. “మనము వారిని మండుచున్న అగ్ని గుండములో పడవేద్దాము” అని వారు చెప్పడం నేను వినగలను. రాజగు నేబుకద్నేజరు... యాజక సంబంధమైన అత్యున్నత వస్త్రాలతో చుట్టబడి కూర్చుని ఉండటం నేను చూడగలను. “ఇప్పుడు, వారిని చూడండి... వారి పరీక్షలో వారు కేకలువేయడాన్ని చూడండి” అని అన్నాడు. [టేపుపై ఖాళీ ఉంది.]...?... ఈ స్వస్థత కూడిక తర్వాత కూడా మీరు (పరీక్షలో ఉంచబడతారు). అయితే నీ మాట ప్రకారమే ప్రభువా. అది నిజం. దావీదు మరియు గొల్యాతులు... [టేపు పై ఖాళీ ఉంది.]

38

“అయితే ప్రభువా, నీ మాట ప్రకారమే నేను వచ్చాను.” ఓ, ఎంత పెద్ద వ్యతిరేకత కనిపించినా సరే.. నేను…నీవు కవచమును ధరించిన ఫిలిస్తీయునిగా నన్ను కలుసుకుంటావు...“ [టేపుపై ఖాళీ ఉంది.] ”నేను నిన్ను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామములో కలుసుకుంటాను.“ ఇదిగో ఇక్కడే ఉంది.

సాతాను అంటాడు... వైద్యులందరూ ఇక ఎంత మాత్రమును జరగదు అని చెప్తారు... [టేపుపై ఖాళీ ఉంది .] ఆయన...[టేపుపై ఖాళీ ఉంది.]...?...నేను వస్తున్నాను, దీని కొరకే, నేను వచ్చాను అంటాడు. “నేను వెంటనే నిన్ను కలుస్తాను. నేను స్వతంత్రుడను గనుక నీకు నాపై అధికారముండదు. ఆ క్రీస్తే నన్ను విడిపించాడు”.

39

వారు అక్కడికి నడిచి వెళ్లడం నేను చూస్తున్నాను. వారి చేతులను వారి వెనుకకు కట్టి, వారిని క్రిందికి మండుతున్న అగ్నిగుండము వద్దకు మరణం వద్దకు తీసుకువెళ్తున్నారు. వారు పెద్ద గుంటల యొద్దకు పైకి వెళ్ళినప్పుడు నేను ఆ పరంజాను (పైకి ఎక్కుట కొరకు పొడవుగా కర్రలతో నిర్మించినది) చూస్తున్నాను. ఆ ఉదయం... [టేపు పై ఖాళీ ఉంది.] మంటలు ఎగసిపడుతున్నాయి. నేను ఆ గొప్ప దృశ్యమును చూడగలను.

ఇప్పుడు ఒక్క నిమిషం గమనించండి. మీ ఏకాగ్రతను నాకు ఇచ్చి మరియు ప్రార్థించండి. వారు ఇప్పుడు ఈ గొయ్యి వద్దనుండి ప్రారంభించడం నేను చూడగలను. రాజగు నేబుకద్నేజరు అక్కడ కూర్చుని “ఇప్పుడు చూడండి. వారు అక్కడికి వెళ్లినప్పుడు ఎలా గట్టిగా కేకలు వేస్తూ దొర్లుతారో చూడండి” అని చెప్పడం నేను చూడగలను.

ఈ సమయం అస్థిరమైన సమయం. నేను చూడగలను... మీకు తెలుసా మొదటిగా, షద్రకు మేషకు వైపు చూసి, “దీని గురించి నీవు ఏమనుకుంటున్నావు?” అని అడిగాడు. ఈ వేడి అతనిపై వస్తున్న అనుభూతిని పొందుతున్నాడు. మనము దానిని అనుభవిస్తాము; చింతించవద్దు.

మేషకు, “చూడు, నేను పట్టించుకోను. మన దేవుడు మనలను విడిపించగలడు. కానీ నీ మాట ప్రకారం, ప్రభువా, ఇదిగో నేను వచ్చుచున్నాను. ఆ అగ్ని బహుశా మనల్ని అలాగే దహించవచ్చు. కానీ నీ మాట ప్రకారం, ప్రభువా, ఇదిగో నేను వచ్చుచున్నాను. నేను దేనికీ తలవంచను. నేను మీ మాట ప్రకారమే నడుస్తున్నాను. నేను వస్తున్నాను” అని చెప్పడం నేను వినగలను.

అయితే సరే. వారు కొన్ని అడుగులు ముందుకు నడిచారు. ఓ, మై! పురుషులు బలహీనపడిన అనుభూతిని పొందే అంత ఎక్కువ వేడి ఉన్నది. వారు వారిని నెట్టివేస్తున్నారు...

[టేపు పై ఖాళీ ఉంది.]...?...

40

సమయం వచ్చినది. వారు తమ అడుగులను తగ్గించుకోవడం నేను చూడగలను; “కదలండి. ముందుకు సాగండి” అని బల్లెముతో ఇంకొంచెం గట్టిగా నెట్టుతున్నారు. షద్రకు మరొకసారి, “అబెద్నెగో, నీవు ఏమనుకుంటున్నావు దాని గురించి?” అని అనడం నేను వినగలను.

“సరే, నేను దేవుణ్ణి ఆయన వాక్యం ప్రకారం స్వీకరిస్తున్నాను. మన దేవుడు చాలా కార్యములు చేసాడని మనకు తెలుసు. ఆయనే తెరిచాడు... [టేపుపై ఖాళీ ఉంది.] ఆయనే మనలను ఇక్కడకి తీసుకువచ్చాడు. ఆయనే ఆ కార్యాలు చేసాడు.”

మరియు ఆ రోజు జీవించిన దేవుడు ఈ రోజు జీవిస్తున్నాడు. ఈ రాత్రి, మిత్రులారా, మనకు వందలాది, వేలాది సంవత్సరాల సాక్ష్యాలు ఈ వైపు ఉన్నవి. ఖచ్చితముగా ఆయన మాట చొప్పున ఆయనను మనము స్వీకరించవచ్చు.

41

మండుతున్న అగ్ని గుండము వద్దకు వెళ్ళారు. అక్కడే అగ్ని గుండములోనికి వెళ్ళారు. ఎవరూ పట్టించుకోనట్లు కనిపించింది.

“అక్కడ దానిగురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆ మతం గురించి మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు మీరు యెహోవాను విశ్వసిస్తున్నారా? ఆయన మిమ్మల్ని విడిపిస్తాడో లేదో చూద్దాము” అని అన్నారు.

“అయ్యో దేవా, వారి వ్యాఖ్యానములను చూడుము. అయినప్పటికీ, నీ మాట ప్రకారమే, ప్రభువా, నేను తదుపరి కొన్ని అడుగులనువేసి వస్తున్నాను.” అవి పైకి లేవడం చూడండి...?... దేవుడు తన ప్రజల గురించి ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తాడు. మీరు నమ్ముతున్నారా?

అక్కడ అలాగున జరుగుతున్నప్పుడు... [టేపుపై ఖాళీ ఉంది.] అదే సమయములో అక్కడ పరలోకములో ఏమి జరుగుతున్నదో పైకి చూద్దాం. ఓ... [టేపు పై ఖాళీ ఉంది.] ఆయన తన సింహాసనముపై కూర్చోవడం నేను చూడగలను. కుడి వైపునకు ఏదో వస్తున్నట్లు చూసాను మంచిది. ఇది ఏమిటి? ఇది ఒక దూత. వారు ఆయనను గబ్రియేలు అని పిలుస్తారు... [టేపు పై ఖాళీ ఉంది, పద్నాలుగు రెండవ భాగం అర్థం కాలేదు.]...బబులోను గురించి శ్రద్ధ వహించాడు, ఈ రాత్రి ఆయన ఫీనిక్స్‌ గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. బబులోనులో ముగ్గురు ఉన్నారు; ఫీనిక్స్‌లో వందల సంఖ్యలో ఉన్నారు. ఆయన ఇక్కడ ఉన్నాడు...[టేపుపై ఖాళీ ఉంది.] ప్రార్థన వరుస...[టేపు పై ఖాళీ ఉంది.] నీ మాట ప్రకారమే. నేను చెప్పేదానికి నేను తీర్పు పొందవలసి ఉంటుంది. మీరు నమ్మిన దాని కొరకు మీరు తీర్పు తీర్చబడవలసి ఉన్నది.

గమనించండి. నేను రాత్రంతా వారిని చూశాను... [టేపు పై ఖాళీ ఉంది.]...?...ప్రపంచంలోని...?... దుర్మార్గులు...[టేపుపై ఖాళీ ఉంది.]

42

“నేను ఒక శక్తివంతమైన లోతైనదానిలో నుండి నీటి గొట్టములను విప్పి, మరియు నేను భూమి పైకి వరద రప్పించి ప్రతీదీ మునిగిపోయేలా చేసాను. నన్ను అక్కడికి వెళ్ళనివ్వుము. నేను బబులోనును తుడిచివేస్తాను... [టేపుపై ఖాళీ ఉంది]... ఆయన అది చేయగలడని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? బబులోనును భూమ్మీద నుండి తుడిచివేయగల శక్తి ఆయనకు ఉన్నది.

“అవును, మాచిపత్రి, నీవు చేయగలవు...” [టేపుపై ఖాళీ ఉంది.] అని ఆ మహాత్యము గలవాడు చెప్పడం నేను వినగలను.... [టేపుపై ఖాళీ ఉంది.] సహోదరి మోర్గాన్ ఇక్కడ ఉన్నారు. నేను నమ్ముతున్నాను ఆమె ఒక అడుగు… [టేపుపై ఖాళీ ఉంది.] ఆ చివరి అడుగులు పైకి లేపడం చూడండి...[టేపుపై ఖాళీ ఉంది.]. పరిశుద్ధుల యొక్క ఒక రాజు....?... [టేపు పై ఖాళీ ఉంది.] లేచి...[టేపు పై ఖాళీ ఉంది .]...?...అక్కడ ఆయన సింహాసనం ఎదుట నిలబడటం నేను చూడగలను. ఆయన అక్కడ ఉన్న ఒక పెద్ద తెల్లటి మేఘానికి చెప్పడం నేను చూడగలను...?...[టేపుపై ఖాళీ ఉంది.], “తూర్పు వాయువూ, ఉత్తర వాయువూ, పశ్చిమ మరియు దక్షిణ వాయువులారా” అని చెప్పడం నేను వింటున్నాను. నాలుగు వాయువులను... [టేపుపై ఖాళీ ఉంది.]“...?... ఇటు రమ్మని భూమి వైపునకు పిలవడం' నేను చూడగలను. పరలోకములో ఉన్న ప్రతీదీ ఆయనకు లోబడుతుంది. [టేపు పై ఖాళీ ఉంది]...?...

43

మన హృదయాలను...?...ఆయన వాక్యాన్ని అంగీకరించడానికి మనము భయపడుతున్నాము. “ఇక్కడికి రమ్ము” అని అన్నాడు. గాలులు ఎలా చేస్తాయి? అని ప్రశ్నించడం నా పని కాదు. సింహాసనం గుండా ఈ పెద్ద తెల్లని మేఘం వచ్చింది. ఆయన ఈ పెద్ద తెల్లటి మేఘముపై అడుగు పెట్టడం నేను చూడగలను. దేవునికే మహిమ. ఇలా... మెరుపువలే. ఆయన ఇలా అన్నాడు, “తూర్పు వాయువు, ఉత్తర వాయువు, పడమర మరియు దక్షిణ వాయువులారా, నేను ఈ ఉదయం మిమ్మును బబులోనుకు తీసుకెళ్లబోతున్నాను. మన సహోదరులకు అవసరం ఉందని నేను చూస్తున్నాను. మాచిపత్రి, నేను నిన్ను వెళ్ళనివ్వలేను. గాబ్రియేలూ, నేను నిన్ను వెళ్ళనివ్వలేను. నేనే వెళ్తున్నాను.” ఆమెన్.

నేను ఆయనను ఆకాశములో చూడగలను... [టేపు పై ఖాళీ ఉంది.] చివరగా, ఆయన సమయాన్ని ఎంచుకున్నాడు.

మరియు వారు చివరి అడుగు వేసిన సమయానికి... మరియు, “నీ మాట ప్రకారమే, ప్రభువా, ఇక్కడ మేము వస్తున్నాము.” [కొంత సమాచారం దాటివేయబడినది. టేపుపై ఖాళీ ఉంది.] హల్లెలూయా.

44

ఆయన ఈ రాత్రి ఇంకా క్రీస్తుగానే ఉన్నాడు. భయపడవద్దు. ఆయన వాక్యము ప్రకారము ఆయనను స్వీకరించుము. “అయినప్పటికీ, ప్రభువా, నేను కేవలం స్వీకరిస్తాను... [టేపు పై ఖాళీ ఉంది.] అయితే నీ మాట ప్రకారం, ప్రభువా, ఇదిగో వచ్చాను. నేను మిమ్మల్ని మీ మాట ప్రకారమే స్వీకరిస్తాను. నేను ఇక్కడ ఉన్నాను, ప్రభువా. నేను ఈ చివరి అడుగు ఎలా తీసుకుంటానో నాకు తెలియదు. నేను చనిపోతానని డాక్టర్ చెప్పాడని నాకు తెలుసు... [టేపుపై ఖాళీ ఉంది.] నీ మాట ప్రకారమే, ప్రభువా, నేను వచ్చాను.” ఎలా ఉంటుందో మీకు తెలియదు... [టేపుపై ఖాళీ ఉంది.] “ఇది ఎలా జరుగుతుందో పరీక్షించడానికి నేను ప్రయత్నించడం లేదు. ప్రభువా, నీ మాట ప్రకారం, ఇదిగో నేను వచ్చాను. నా చేతుల్లో ఏమీ తీసుకురాలేదు; కేవలంనీ శిలువ యొద్ద అంటిపెట్టుకుని ఉన్నాను. నేను మీ మాట ప్రకారమే స్వీకరిస్తున్నాను (నమ్ముచున్నాను).”

తలలు వంచుదామా. ఓ దేవా, ఈ రాత్రి కరుణించుము. మీరు ఇక్కడ నిలబడి ఉన్నారు అది చాలు. నీవు యుగయుగాలుగా వైద్యుడవు.“ నమ్మినవారి వలన ఈ సూచకక్రియలు కనబడును” అని చెప్పినవాడవు నీవే. ఇవే చివరిగా ఈ లోకము నుండి వెళ్ళేముందు మీ పెదవుల నుండి పలికిన చివరి మాటలు...?....సువార్తలలో నమోదు చేయబడిన చివరి మాటలు, “రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు” అని మీరు చెప్పారు.

ఓ దేవా, నీవు పైకి ఆరోహణమయ్యావని లేఖనాలు చెబుతున్నాయి; మీరు మానవులకు వరములను ఇస్తారు. పంతొమ్మిది వందల సంవత్సరాలు గడచిపోయాయి. కాదు...[టేపుపై ఖాళీ ఉంది.] ఆ జీవ వృక్షము యొద్ద నుండి ప్రజలను... [టేపుపై ఖాళీ ఉంది.] ఓ దేవా…[టేపుపై ఖాళీ ఉంది.]

[సమాజం స్పానిష్‌లో పాడుతుంది. ఒక సేవకుడు స్పానిష్‌లో మాట్లాడుతున్నారు.]

[టేపు నాణ్యత చాలా తక్కువగా ఉంది కాబట్టి సమాచారం అర్థం చేసుకోలేని కారణంగా చేర్చబడలేదు.]

నాకు తెలియదు, నా ముందు నిలబడి ఉన్నదానితో నేను నిజాయితీగా ఉండాలి .... ఇప్పుడు మీకు తెలుసా...?...రోగాలు అనేవి దెయ్యాలు. మీరు వాటిని క్యాన్సర్, న్యుమోనియా (ఊపిరి తిత్తుల వ్యాది), క్షయవ్యాది అని పిలుస్తారు. యేసు వాటిని దయ్యం అని పిలిచాడు. ఇప్పుడు, “దెయ్యం” అనే పదానికి అర్ధం “హింసించేవాడు” అని ఎవరికైనా తెలుసు,“ మీ ఆత్మను హింసించేవాడు కాదు, ఎందుకంటే మీ సువార్త బోధకుని ద్వారా మరియు దేవుని వాక్యము ద్వారా మీరు దానినుండి విముక్తి పొందారు. అది సరియైనదేనా? నేను దాని కొరకు కాదు; నేను బోధకుడిని కాదు. నేను మీ శరీరం యొక్క స్వస్థత కొరకు వచ్చాను.

ఇప్పుడు, ఆ హింసించేవాడిని వదిలించుకోవాలంటే, మీరు చేయలేరు... మీరు దేవుని వాక్యాన్ని మరియు దానిని బోధించే వ్యక్తిని విశ్వసిస్తేనే తప్ప ఎప్పటికీ రక్షించబడరు మరియు పరిశుద్ధాత్మ పొందుకోలేరు. అది సరియైనదేనా? మీరు స్వస్థత పొందే మార్గం అదే, అదే విధంగా.

45

ఇప్పుడు, నేను ఈ ముప్పైఐదు లేదా నలభై నిమిషాలు ఎంత మంది వీలైతే అంత మంది కొరకు ప్రార్దిస్తాను కాబట్టి మీరు పొందవచ్చు...

మరియు రేపు రాత్రి, మీ జబ్బుపడిన వారందరినీ తీసుకురండి. రేపు రాత్రి అందరూ ప్రార్దించబడేవరకు ఇక్కడే ఉంటాం, ఎందుకంటే రేపు రాత్రి... రేపు రాత్రి చివరి రోజు అవునా...[టేపుపై ఖాళీ ఉంది.]

మరియు నేను అందరినీ చూడాలనుకుంటున్నాను. మీ ప్రజలను దగ్గరగా చేర్చుకున్న ప్రియమైన స్పానిష్ ప్రజలందరూ, వారు ఇప్పుడు టిజువానాలోప్రవేశించలేరు. అక్కడ, వారు టిజువానాలో ప్రార్థన వరుసలోనికి ఒక తెల్ల మనిషిని తీసుకురాగలరో లేదో అని వారు ఈ రోజు ఒరెగాన్ నుండి నన్ను పిలిచారు. టిజువానాలో తెల్ల ప్రజలకు ఇచ్చిన ఒకే ఒక్క వాగ్దానం ఏమిటంటే స్పానిష్ ప్రజలకు ఇవ్వబడిన ఒక్క మనిషే….?... కాబట్టి ఇప్పుడు, మీరు రండి...

46

మరియు అందరూ కలిసి రావడానికి అనుమతించిన ఈ స్పానిష్‌ ప్రజల యొక్క ఆతిథ్యమును బట్టి మరియు వారి స్నేహం కొరకు నేను ఖచ్చితముగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయినప్పటికీ ఈ కూడిక స్పానిష్ వారి కోసం మాత్రమే. తెల్లవారైన మనము వారిని ప్రేమిస్తాము, అవునా. అందరూ, అది సరైనదేనా?

మిత్రులారా, నేను మీకు చెప్తున్నాను, నేను ఇక్కడ చూసిన విశ్వాసాన్ని నా ప్రజలలో నేను చూడలేదు. అది నిజము. అది సత్యము.

మరియు నేను కేవలం... ఓహ్, నేను మెక్సికోలో కాసేపు ఉండాలని కోరుకుంటున్నాను. కానీ వారు అల్లర్ల కారణముగా దానిని ఇంకా అనుమతించలేదు. కానీ నా కొరకు ఈ చిన్న జో లేదా ఇంకెవరైనా నా కోసం తర్జుమా చేయగలిగితే, మరియు నేను కొంత సమయము ఉండగలను. ఓహ్, దేవుడు దేశాన్ని తలక్రిందులుగా చేయగలడని నేను నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నాను, ఎందుకంటే వారు...కాథలిక్ ప్రజలకు అలా భోదించబడ్డారు... భవనంలో కాథలిక్ వారు ఎవరైన ఉన్నారా? అలా అయితే మీ చేతిని చూపండి. ఖచ్చితంగా, చాలా మంది ఉన్నారు.

ఇప్పుడు, చూడండి. మంచిది. తన మతాధికారి చెప్పేది సరైనదని నమ్మాలని క్యాథలిక్‌లు బోధించబడతారు. అది నిజమేనా, కాథలిక్కు స్నేహితులారా. నాకు తెలుసు. నేను...నా ప్రజలు కాథలిక్కు వారము...

47

ఇప్పుడు, గమనించండి. ఇది వినండి. మీరు చూడండి, ప్రొటెస్టెంట్లు దానిని నమ్ముతారు. అవును. ఒకవేళ వారు ఈ సంఘముపై నమ్మకం లేకపోతే, వారు ఆ సంఘానికి వెళతారు. కానీ కాథలిక్కులు, వారు ఒక కాథలిక్కుగా ఉన్నంతకాలం, వారు ఉండవలసి ఉంటుంది ...

ఇప్పుడు, ఇక్కడ. వారు నమ్మడం నేర్పించారు. వారు దైవిక స్వస్థతను నమ్ముతారు. మరియు ఇక్కడ, వారు మనిషిని నమ్మేదానిని నేర్పిస్తారు, అతను చెప్పేది నిజమని నమ్మడం నేర్పిస్తారు. అందువల్ల, వారు వచ్చినప్పుడు, మరియు నేను వారికి ఈ విషయం చెప్పినప్పుడు, వారు మెల్ల కన్నులు సరిగా అవ్వడం లేదా చెవిటి చెవులు తెరవడాన్ని చూస్తారు, అది దేవుని నుండి రావాలని వారికి తెలుసు మరియు వారు దానిని నమ్ముతారు. వారు కొన్నిసార్లు సరిగ్గా దీని వద్ద, మీ పాదముల యొద్ద సాగిలపడతారు.

వారు వినయముగా మరియు మెచ్చుకుంటూ రావడాన్ని మీరు ఎన్నడూ చూడలేరు. ఓ, అక్కడే ఆ మార్గము ద్వారానే దేవుడు కదలాడుతాడు. ఇది అద్భుతమైనది, అవునా?ఖచ్చితముగా. దేవుడు తన ఆభరణమును తయారు చేసుకుంటున్నాడు. నేను ఏమి మాట్లాడుతున్నానో మీరు అర్థం చేసుకోండి.

48

ఇప్పుడు మనం ప్రార్థన కొరకు తలలను వంచుదాం. తండ్రి, మీరు నా చెయ్యి పట్టుకోకుండా ఇప్పుడు ఈ రాజ్యములోనికి అడుగు పెట్టుటకు నేను భయపడుతున్నానని గ్రహించాను... ఇప్పుడు, నా మనసు రెండు సంవత్సరాలు ముందుకి వెళుతోంది, ఆరాత్రి గదిలో ఉన్నప్పుడు, ఆ దేవదూత అక్కడికి నడుస్తూవచ్చి, “నీవు ఈ లోకములోనికి స్వస్థత వరమును తీసుకుని ప్రజల స్వస్థత కొరకు పుట్టావు. చాలామంది నిన్ను నమ్మరు; అయిననూ చాలా మంది నమ్ముతారు. నీవు నిజాయితీగా ఉండి మరియు ప్రజలు నిన్ను నమ్మేలా చేస్తే, నీప్రార్థన ముందు ఏ క్యాన్సర్ కూడా నిలబడదు” అని చెప్పింది.

దేవునిదూత, నేను మిమ్మును చూడలేదు. కానీ మీరు దగ్గరే నిలబడి ఉన్నారని నాకు తెలుసు. దయచేసి, నా హృదయం మీకు తెలుసు, నేను ఈ ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసు. ఈ రాత్రి నా దగ్గర నిలబడండి. మరియు విశ్వాసం లేకుండా ఎవరూ వెళ్ళకుండును గాక. మరియు మీ మాటలు నిజమని నాకు తెలుసు. నేను మీరు దేవుని యొద్ద నుండి పంపబడ్డారని మీరు చెప్పినందున, మీ మాట ప్రకారమే మిమ్మల్ని స్వీకరిస్తున్నాను. నేను మిమ్మును నమ్మాను. మరియు మీరు నాతో కూడా ఉన్నారు. మీరు క్రింది సూచనల ద్వారా వాక్యమును ధృవీకరించారు. ఇప్పుడు, మళ్ళీ ఈ రాత్రి, ఈ మార్చి ఐదవ తేదీ, ఈ జ్ఞాపకార్ద రాత్రి, మీరు ఇప్పుడు నిలబడి ప్రతి ఒక్కరినీ స్వస్థపరచుము. అనుగ్రహించండి. ప్రతి దయ్యం యేసుక్రీస్తు నామమునకు లోబడును గాక.

ఇప్పుడు, తండ్రీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దయ్యమును యేసుక్రీస్తు నామములో సవాలు చేస్తూ ఈ ఆత్మవిశ్వాసం యొక్క రాజ్యములో అడుగు పెడుతున్నాను.

49

ఇక్కడ ఒక చిన్న చెవిటి బాలుడు నిలబడి ఉన్నాడు. ఆ విధంగా పుట్టిన అతని చెవులకు చెవిటి యంత్రము ఉన్నది. ఇప్పుడు, గుర్తుంచుకోండి, చిన్న బాలుడికి వినికిడి అంటే ఏమిటో తెలియదు. ఇదిగో అక్కడ అది కదులుతోంది. ఇప్పుడు, ఎంత మంది నమ్ముతున్నారు. మొదటి వ్యక్తి ఇక్కడ ఒక అద్భుతం కొరకే అడుగు పెట్టాడు.

ఇప్పుడు, నాతో మాట్లాడిన వ్యక్తి నిలబడి ఉన్నాడు. నేను అప్పుడే అనుభూతి చెందాను. ఇప్పుడు అనుభూతి చెందుతున్నాను. నేను చెప్పేది నిజం కాకపోతే, దేవుడే నాకు తీర్పరి. రాత్రి, ఆ రాత్రి నాతో మాట్లాడిన వ్యక్తి గదిలో, “నీవు ఈ అనుభూతిని అనుభవించినప్పుడు (నేను ఇప్పుడు అనుభూతి చెందుతున్నట్లుగా), నేను మీ పక్కన నిలబడి ఉంటాను.” అని చెప్పాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. నేను దీన్ని చేయడానికి పంపబడ్డానని ఎంతమంది నమ్ముతారు?

ఇప్పుడు, “దయచేసి మీరు తలలు ఎత్తండి”, అని నా గొంతు ఈ మైకు ద్వారా మీకు వినబడేవరకు మీ తలలను ఎత్తవద్దు. లోపల ఉన్నవారు, బయట ఉన్నవారు, ఎందుకంటే మీరు...[టేపు పై ఖాళీ ఉంది.] చిన్న పిల్లవాడిపై పని చేద్దాము. [టేపు పై ఖాళీ ఉంది.]

సమస్తము సాధ్యమే, కేవలం నమ్ముము.

మీరు ఆయనను విశ్వసించగలిగితే సమస్తము సాధ్యమే.

50

బ్రదర్ జో మరియు నేను, అక్కడ ఆమె చిన్న కాలుని, ప్రార్థన ముందు ఆమె ఎలా చిన్నగా అలా కదిలిస్తుందో చూస్తున్నాము. మరి కొద్ది క్షణాల్లోనే దానినుండి ఆ ఒత్తిడి పోయినప్పుడు, ఆమె ఇతర చిన్న అమ్మాయిల వలె సాధారణముగా నడుస్తూ వెళ్ళిపోయింది...?...

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...