ఆత్మ యొక్క వివేచన

ఆత్మ యొక్క వివేచన

VGR COUNT-112 మా పరమ తండ్రి, నా హృదయము ఎలాంటి అనుభూతి చెందుచున్నానో ఈ ఉదయాన నేను తెలుపగోరుచున్నాను. నా వంటి పాపిని రక్షించుటకు మహా పరిశుద్ధుడవైన నీవు భూమి మీదికి దిగివచ్చినందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదే విధముగా ఇక్కడకు వచ్చిన బోధకులందరు అదే ఉద్దేశ్యము కలిగియున్నారని నేను గట్టిగా నమ్ముచున్నాను. “మీ కృప చేతనే మేమందరము పడిపోయిన ఆదాము సంతానమునకు అనుగ్రహించిన ఈ నిబంధన సేవకులముగా నియమింపబడియున్నాము. ఈ తరమునందున్న ప్రజలు క్రీస్తును తెలిసికొనుటకు మేము ఏమి చేయవలయునో తర్ఫీదు పొందుటకు, నీ చిత్తము ఏమైనదో నేర్చుకొనుటకు ఈ ఉదయ కాలమున మేము కూడియున్నాము. తీర్పు దినమున ఈ తరము వారితో ముఖాముఖిగా కలిసికొనుటకు మమ్మును తీసికొని వచ్చేది. మేము నిశ్చయముగా ఎరుగుదుము, ఏలయనగా సేవకులముగా మేముండుటను బట్టి న్యాయాధిపతులుగా మమ్ము నియమించెదవు. ఏ ప్రజలకు మేము వాక్యము తెలియజేసితిమో, వాక్యముయెడల వారి ప్రవర్తన, వారి నిత్య గమ్యము నిర్ణయింపబడుచున్నది. కాబట్టి ప్రభువా, న్యాయాధిపతులుగా నుండి మేము బోధించిన ఈ తరము వారికి వ్యతిరేకముగనో, లేక అనుకూలముగనో తీర్పు తీర్చవలసి యుండును.

2

తండ్రియైన దేవా, వాక్యమందు ఏ తప్పైనను బోధించకుండునట్లు యేసు నామము ద్వారా భద్రపరచుము. నీ వాక్యమును మేము అంగీకరించునట్లు మంచి హృదయమును, పక్షపాతము లేని మననును కలిగియుండునట్లు మాకు దయచేయుము. ఈ ఉదయకాలమున మాకు అనుగ్రహించిన వివిధములైన సేవలను మేము ఇంకా బలముగా చేయుటకు మాకు బలము దయచేయుము. ఇంకను బలముగా చేయునట్లు మాకు సహాయము చేయుమని ఈ ఉదయ కాలమున వేడుకొనుచున్నాము. ఈనాడు నీవే మాతో మాట్లాడుము. నీవే మాకు చెవిగాను, నాలుకగాను మరియు మా ఆలోచనలుగా నుండవలెనని ప్రార్థించుచున్నాము. ప్రభువా, నా హృదయ ధ్యానమును, నా ఆలోచనలను నా యందున్న సమస్తమును, ఇక్కడున్న సహోదరులు, సహోదరిలు అందరు మి సన్నిధిలో వాటిని కలిగి నీకు అంగీకారముగా నుండును గాక. ఈ గదిలోనున్న మమ్ములను దేవుని యొక్క మహిమా మేఘముగా మారువరకు మమ్మును మేము కూర్చున్న ఈ గదిని కాదు, మీ ఆత్మతోను, మి ప్రసన్నతతోను నింపుము. ఈ ఉదయ కాలమున ఇక్కడ నుండి మేము వెళ్ళునప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి మరణస్థితిలో నున్న ఈ తరము వారికి మేము మా జీవితములో ఇంతవరకు చేయని దానిని, నీ సందేశమును తీసికొని వెళ్ళుటకై తీర్మానము చేయుచున్నాము. ప్రభువా, మా విన్నపములను ఆలకించి మీ వాక్యమూలముగా మాతో మాట్లాడుటకు నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాము. ఆమెన్.

3

ఈ ఉదయకాలమున 105వ కీర్తనలోని కొంత భాగమును చదువ నపేక్షించుచున్నాను. వారిలో చాలామంది సేవలుకు మరియు మొదలగువారు. వాక్యమును చదువుట మంచిదైయున్నది. (మరియు ఇప్పుడు, వారు ఎప్పుడు వెళ్ళిపోవుదురు, పన్నెండు గంటలకా? ఏమంటారు? వందనములు.) కీర్తనలు 105:

యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి.

ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి.

ఆయన పరిశుద్ద నామమును బట్టి అతిశయించుడి, యోహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు గాక.

యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి.

ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతివారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసికొనుడి.

ఆయన చేసిన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసికొనుడి.

ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమియందంట జరుగుచున్నవి.

తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను,

ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును - నిత్యము ఆయన జ్ఞాపకము చేసికొనును.

వారి సంఖ్య కొద్దిగా నుండగను, ఆ కొద్దిమంది ఆ దేశమందు పరదేశులైయుండగను.

కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను.

అ మాట యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరచియున్నాడు.

వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యము నుండి మరియొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా

నేనభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి,

ఆయన ఎవరినైనను వారికి హింస చెయ్యనియ్యలేదు, ఆయన వారికొరకు రాజులను గద్దించెను.

ప్రభువు చదువుచున్న ఆయన వాక్యమును ఆశీర్వాదించును గాక. ఇచ్చటికి వచ్చుటకు నేమ ప్రయాణము చేయుచుండగా వ్రాయబడిన ఒక లేఖనమును ధ్యానించితిని.

4

ఎన్నికలు వచ్చుచున్నవని మీరెరుగుదురు. రాబోపు దేశాధ్యక్షుడెవరో అని నేను ఎరిగియుండిన ఆశ్చర్యపడుదును? దానిని నేను ముందుగా ఎరిగియుండి చెప్పినను ఏమి ప్రయోజనము? దేవుడు మాత్రమే దాని నెరుగును. ఒకవేళ రాబోవు దేశాధ్యక్షుడెవరా, అని నాకు బయలుపరచెననుకొనుడి, నేను ఈ ఫినిక్స్ లో నిలువబడి, ఫలానా వాడు దేశాధ్యక్షుడుగా వచ్చునని చెప్పినను, చెప్పిన ప్రకారముగా జరిగినను, దానిని వార్తాపత్రికలో ప్రకటించినను ప్రయోజనమేమి? అది ఎంతో ఖక్చితముగా ఉండును, మరియు చప్పబడినది అంతయు నెరవేరును. కాని దేవుడు ఏమి చేయును? అలాంటి విషయము దేవుడు తెలిపినయెడల ఏమి ప్రయోజనము. అలంటి దానిని ప్రవచించినచొ, ఫలానా-ఫలానా పత్రికవారు దానిని గురించి ప్రచురించుదురు.

5

అయితే మీకు తెలుసా, దేవుడు అటువంటి కార్యములను చేయడు. దేవుడు అవివేకమునకు ఆయన యొక్క శక్తిని, వరములను ఉపయోగించడు. ఎవరు దేశాధ్యక్షుడుగా ఉండునో, ఉండబోవునో అని తెలిసికొనినను దానివలన ఒక పైసా కూడా ప్రయోజనము లేదు. దేవుడు అటువంటి కార్యములు చేయడు.

నేను ముందుగా తెలిపినది నెరవేరెనని వార్తాపత్రికలు, పత్రికలు ప్రకటించినచో అది నన్ను మహిమపరచుచున్నది. ఎవరు దేశాధ్యక్షుడో అది నెరవేరుటకెంతో ముందుగానే అతడు మనతో చెప్పెను, కావున ప్రజలు సోదరుడు బ్రెన్హాం గొప్ప ప్రవక్త కాడా? అని చెప్పుదురు. అది నాకు మాత్రమే మహిమ కలిగించును. అయితే నా మహిమ కొరకో లేక ఏ మానవుని మహిమ కొరకో దేవుడు ఏ కార్యమునెన్నడూ చేయుటకు ఇష్టపడడు. ఆయన మహిమను బయలు పరచుటకును, ఇతరులకు ప్రయోజనకరముగా నుండునట్లును ఆయన కార్యము జరిగించుటకు ఇష్టపడును.

6

“మనము భాషలతో మాట్లాడిన, అర్థము చెప్పువాడు లేనిచో ప్రయోజనమేమి?” అని పౌలు చెప్పెను. మనలను మనమే మహిమ పరచుకొనుట లేదా? లేదా మనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనుటయై యున్నది. ఇది దేవుని చిత్తమునకు విరోధముగానున్నది. దేవుడు తన్ను మాత్రమే మహిమపరచుకొన గోరుచున్నాడు. స్వమహిమను కాక మన క్రియల మూలముగా దేవుని మాత్రమే మహిమ పరచవలెను.

కావున, నేను నమ్ముచున్నాను ఈ ఉదయము, ఒకవేళ ఖచ్చితముగా ఎవరు మరియు ఎప్పుడు ఎన్నుకోబడునో అని, మరియు ఎన్ని ఓట్లు వచ్చునో, మరియు అది ఏమైనను, దానిని చెప్పుట వలను ఏ మంచి చేయదు. ఒకవేళ నాకు తెలిసినా దానిని అలాగే వదిలిపెట్టుట ఉత్తమము. దానిని చెప్పుటకు ప్రయత్నము చేయుట కాదు, ఎందుకనగా దానిని చేయుటకు నాకు ఏ కారణము లేదు. ఎందుకనగా, అది ఎలాగైనా జరుగబోవుచున్నది. మరియు ఎవరు ప్రెసిడెంట్ అవుతారో అనునది మనకు అంత వ్యత్యాసము తీసుకొని రాదు.

7

దేవుడు తన వరములను ఆయన సొంత మహిమ నిమిత్తమును, ఆయన జనుల మహిమ నిమిత్తమును, తన సంఘము యొక్క మహిమ కొరకును, క్రీస్తు శరీరము యొక్క క్షేమాభివృద్ధి కొరకును దేవుని రాజ్యము యొక్క మహిమ కొరకును ఉపయోగించునని గుర్తుంచుకొనుడి. అందువలన తన సంఘమునందు ఆయన మహిమను బయలుపరచు నిమిత్తము తన సంఘమునకు ఉపదేశకులను, ప్రవక్తలను, సువార్తీకులను, కాపరులను, అపోస్తలులను నియమింపబడిరి. బిలాము వలె ప్రవక్త తన వరమునుపయోగించుటకు ప్రయత్నించక, లోకమునకు వేరైయుండును. కీడు కలుగకుండునట్లు ఆ వరమును ధనార్జనకై ఉపయోగించుటకు ప్రయత్నించడు. ప్రవక్త సంఘమునకు దేవుని బయలుపరచువాడై యుండును. ఈ లోక విషయములకు వేరైయుండును. సమస్తము దేవుని మహిమార్థమైయుండును.

8

ఈనాడు మనమటువంటి విషయములను చూచుచున్నప్పుడు సేవకులమైన మనము నియమమును పాటించి అనుసరించి నడచినయెడల, అది మనకు మేలుగా నుండునని తలంచుచున్నాను. ఆత్మలను వివేచించి గుర్తించుటకు దేవుని నుండి మనమొక నియమమును కలిగియున్నాము. ఏ విధమైన ఆత్మ అనునది గుర్తించుట సంఘమునకు గొప్ప పాఠమైయున్నదని నేను నమ్ముచున్నాను. ఆత్మల వివేచన కలిగియుండుము. మనము ప్రజలు ఏ స్థాపన సంఘమునకు లేదా ఏ గుంపునకు చెంది సమాజముగా కూడుకొను దానిని బట్టి వారెవరైనది నిర్ణయించగలమని నేను తల౦చుట లేదు. బహుశ వారు మెథడిస్టు, బాప్టిస్టు, పెస్బిటేరియన్, పెంతెకోస్ట్ లేదా వారెవరైనా రావచ్చు, మనము ఆ మనుష్యుని తాను చేందియున్న సంఘమును బట్టి తానెట్టివాడైనది నిరూపించలేము. అతడు కలిగియున్న ఆత్మను బట్టి అతనిని గమనించి నిర్ణయించవచ్చును. అతడు కడవరి వర్షపువాడా, తొలకరి వర్షపువాడా, లోపలి వర్షపువాడా, వెలుపలి వర్షపువాడా, వర్షము లేనివాడా? అతడేదైనా అయి వుండవచ్చును, దానివలన అతనినేమి నిర్ణయించలేము. కాని ఆత్మ వలన అతనిని నిర్ణయించగలము. ఆత్మలను వివేచించువారమై యుండవలెను. అతని తలంపులో ఏమున్నదో గమనించుము, అతడు దేనిని సంపాదించ ప్రయత్నించునో దానిని గమనించుము. ఒకవేళ ఒక మనుష్యుడు, ఒక వరము ద్వారా, ఆ వరము ఎంత గొప్పదైననను...

9

మీరు వివిధ స్థాపన సంఘములుగా నుండి, ఈ ఉదయకాలము ఈ ప్రార్థన మందిరంలో సమాజముగా కూడిన మీరు జీవముగల దేవుని సంఘముగా కూడియున్నారు. మీకు తెలుపగోరినదేమనగా, మనము వాస్తవముగా విభజింపబడినవారము కాము. దేవుని మహిమ నిమిత్తము మనము వేరు వేరు ఆకారములుగా చెక్కబడిన రాళ్ళమై యున్నాము.

ఇప్పుడీ దినములలో వరములనేకములున్నవి. అనేకమంది ప్రజలు, ప్రజలు తాము కలిగియున్న వరమునుబట్టి వారెవరైనది నిర్ణయించుచున్నారు. మంచిది, ఇవన్నియు వరములని నేను నమ్ముచున్నాను. ఏమి జరుగుచున్నవో చూచినప్పుడు, అవి వరములై యున్నవని నేను నమ్ముచున్నాను. అవి దేవుడనుగ్రహించిన వరములు. దేవుడు వాటినెందుకు ఉపయోగించగోరినో, ఆ సరియైన మార్గమున మనము వాటినుపయోగించనిచో - ఆ వరములు కలిగి ఉండకముందు కలిగించువాటికంటే మరెక్కువ కీడు కలిగించిన వారమగుదుము. గతరాత్రి ప్రసంగ వేదిక నుండి చెప్పినట్లు, మనమొక స్వస్థత కార్యమును కలిగియుండకపోయినను, దానికంటే సహోదర ప్రేమ సంఘము మధ్యలో చూచుటకు ఇష్టపడుదును అని తెలిపితిని. చూచారా, ఈ విషయములు మనము తప్పక తెలిసికొనవలెను.

10

ఒక మనుష్యుడొక గొప్ప వరమును కలిగియుండి, అతడు మన సంఘము లేదా వేరొక సంఘమునకు చెందియుండుటలో ఏ వ్యత్యాసము లేదు. అతడు ధరించిన వస్త్రములను బట్టి అతడే స్థాపన సంఘపువాడో నిర్నయించలేము. అతడే ఉద్దేశ్యముతో వరమును పయోగించ ప్రయత్నించుచున్నాడో మనమది చూడవలెను. గొప్ప పేరు సంపాదించుటకు అతని పలుకుబడిని ఉపయోగించుటకు ప్రయత్నించినచో, అది తప్పని గుర్తించుటకు తగినంత ఆత్మీయ వివేచనను కలిగియున్నాను. అతడెంత గొప్ప ఉపదేశకుడైనను, ఎంత శక్తి కలిగినను లేదా ఎంత జ్ఞానియైనను, వరమును ఎంతగా ఉపయోగించగలిగినను, అతడు క్రీస్తు శరీరము యొక్క అభివృద్ధికై ఏదైన పొందుటకు ప్రయత్నించని ఎడల మీ యొక్క ఆత్మీయ వివేచన తప్పు అని మీకు తెలియజేయును. అది ఎంత సరియైనదిగను, లేదా ఎంత పరిపూర్ణమైనదిగను పుండవచ్చును, కాని యేసుక్రీస్తు శరీరము కొరకు ఏదైనా పొందుటకు ఉపయోగించని ఎడల అది సరికాదు.

11

ప్రజలను మహాజ్ఞానముతో లేదా ఆత్మీయ శక్తితో రాబట్టుకొనగల గొప్ప వరము అతడు కలిగియుండవచ్చును, మరియు ఆ వరముతో తన్ను హెచ్చించుకొని ప్రయత్నించును. దాని వలన అతడు గొప్ప పేరు తోడైయుండుట వలన, ఇతర విశ్వాసులు అతనివైపు చూచునట్లు ప్రయత్నించిన, అది సరికాదు. ప్రతి ఒక్కరును ఆ దృశ్యము నుండి వెలుపలనుండునట్లుగాను మరియు అతడును అతని గుంపువారును ఆ దృశ్యమందు౦డునట్లు కోరుచుండును. అది కూడా సరికాదు, చూచారా.

12

అతడు దేవుని వరమును కలిగి క్రీస్తు శరీరము యొక్క క్షేమాభివృద్ధికి ప్రయత్నించినను. అతడు దేనికి చెందినవాడైనను నేను లక్ష్యపెట్టను. మీరు మనుష్యుని వివేచించుట లేదు; మనిషి జీవితములో వున్న ఆత్మను బట్టి ఆ అత్మను గుర్తించుచున్నారు. దీనినే మనలను చేయమని దేవుడు చెప్పెను. మనుష్యుని యొక్క గుంపును బట్టి వివేచించుటకు మనమెప్పుడును ఆజ్ఞాపింపబడలేదు. మనము దేవుని ద్వారా అతడేమి చేయుటకు ప్రయత్నించునదియు, అతని జీవితములో ఏ ఆత్మను కలిగి తానేమి చేయుటకు నడిపింపబడుచున్నాడో, దానిని వివేచించుటకు మనము ఖండితముగా ఆజ్ఞాపింపబడితిమి. అతడు తొలకరి వర్షపువాడైనను, కడవరి వర్షపువాడైనను, మరి ఎవరైనను అతడు ప్రజలను విభజించుటకు కాక, వారిని తెచ్చి సమకూర్చుటకు ప్రయత్నించిన యెడల, జీవముగల దేవుని సంఘమును స్థాపన సంఘముగ నుండుటకు కాక సహవాసము ఆత్మ యొక్క ఐక్యతను గ్రహించునట్లు నడిపించినప్పుడు, అతని యొక్క ఆత్మ, మరియు ఉద్దేశ్యమును సరియైనవని మనము చూడగలము. అతడు దేనికి చెందినవాడైనను దానితో పనిలేదు. తన విషయమైనను మరి దేని విషయమైనను అను దానిని తెలియజేయు వాటి నుండి వేరు చేయబడి, అతనిలో సున్న ఆత్మ ప్రజలను కలువరి వైపు చూపుటకు ప్రయత్నించుచుండును. అతని ముఖ్య అన్వేషణ ప్రజలను కల్వరి వైపు చూపుటయే. అతడు ఎరుగబడిన, ఎరుగబడకపోయిన దానితో అతనికి పని లేదు. అతడు మంచి కదిలిక కలిగియుండినను దానినతడు ఎన్నిక చేయడు. అతడొక మెథడిస్టు కావచ్చును, పెస్బిటేరియన్, రోమన్ కథోలిక్ లేదా మరేదైనా స్థాపన సంఘపువాడై యుండుటకు కోరియుండవచ్చును.

13

అయితే అతడు ఏమి చేయ ప్రయత్నము చేయుచున్నాడు, దేనిని పొందుకొనుటకు అతడి యొక్క హృదయ ఉద్దేశమేమైయున్నది? అతని జీవితమెట్లున్నది, ఇంకేముండునది, దీని మూలముగా నీవు చూడగలవు. అతని ఉద్దేశ్యము అతని స్థాపన సంఘము కొరకో, తన కొరకో, లేక లోక సంబంధమైన వాటికొరకో నీవు చెప్పగలవు. గొప్ప పేరు కోరకా, నేను చెప్పిన రీతిగా అది అలాగే జరిగినదని చెప్పుట నీవు గమనించెదవు. దాని ప్రారంభమే సరికాదని చూచెదవు. కాని దేవుడు దేనినైతే ఒక ఉపదేశకుడుగానో లేదా ఒక దీర్ఘ దర్శిగానో ఇచ్చినట్లయితే, అతడు దానిని ఉపయోగించుటకు ప్రయత్నించుచుండిన ఎడల...

14

క్రొత్త నిబంధన ప్రవక్త ఒక బోధకుడైయున్నాడు. బోధకుడైన నాకు కొత్త నిబ౦ధన ప్రవక్తయైయున్నాడని మీరెరుగుదురు. అతడు ప్రవచించిన (బోధించిన) యెడల, తన స్వంత ఉన్నతికైనను, పెద్ద పేరు సంపాదించుకొనుటకైనను లేదా తన స్థాపన సంఘము యొక్క అభివృద్ధికైనను చేయడు. అతడు ఒక స్థాపన సంఘములోనుండును. ఒక్కడును లేకుండ నేను ఇక్కడున్నాను. కాని నీవు బోధించునప్పుడు నీవు ఒక్కడవుగా నుండవలెను. అది నిజము ప్రతి మనుష్యుడు ఒక ఆరాధన గృహమును కలిగియుండవలెను. ఈ స్థలము నుండి మరొక స్థలమునకు, ఆ స్థలము నుండి మరొక స్థలమునకు గాలికి కొట్టుకొని పోవునట్టి వారుగా నుండక, ఏదో ఒక స్థలమును ఆరాధించుటకు కలిగియుండవలెను. దానిని నీ సంఘమని చెప్పవలెను. నీ దశమభాగము చెల్లించుటకు, మరియు సేవాకార్యమునకు సహాయపడు నిమిత్తం ఏదో ఒక స్థలమును కలిగియుండవలెను. నీకిష్టమైన దానిని స్వీకరించుము, కాని అప్పుడు ఎన్నడైనను మా గుంపునకు చెందినవాడు కాడని, మరొక మనుష్యుని స్నేహము చేయుటకు మానకుము. అతని ఆత్మను వివేచించుము. మరియు అతడు నీవు కలిగినట్లుగా, అదే ఉద్దేశ్యమును అతడు తన హృదయములో కలిగియున్నాడేమో చూడుము. అప్పుడు నీవు ఒకరితో ఒకరు సహవాసమైయు౦దురు. నీవు ఒక ప్రాముఖ్య విషయము కొరకు పనిచేయుచున్నావు. అది క్రీస్తు నిమిత్తమైనది. అది ఏ అనుమానముగా నుండక సత్యమైయున్నదని నేను తలంచుచున్నాను.

15

పాత నిబంధనలోని ప్రవక్తల ఉద్దేశ్యము మరియు వారి గురి గమనించుము. ఆ మనుష్యులు ఒకే ఉద్దేశ్యమును కలిగియుండిరి. అది యేసుక్రీస్తును గూర్చినదైయుండెను. పాత నిబంధన యొక్క ఒక ముఖ్య విషయము: మెస్సియా రాకడకు సంబంధించిన (ప్రవచనములు) వాటితో చుట్టు ముట్టడిగా కట్టుబడినట్లుండెను. ధనార్జనమునకై లేదా పేరు ప్రసిద్ధి చేసికొనుటకుగాని, కార్యములను జరిగించుటకు బయటకు వెళ్ళినవారు కారు. వారు దేవుని ఆత్మవలన అభిషేకింపబడినవారై మరియు మెస్సియా రాకడను గూర్చి ప్రవచించుచుండిరి. కొన్ని సమయములందు వారిలో నున్న ఆత్మ వలె వారు ప్రవర్తించుచున్నంతగను వారు, ఆత్మతో అభిషేకింపబడిరి, మరియు వారు స్వయముగా మాటలాడినట్లుండిరి. దేవుని ఆత్మ వారినెట్లు నడిపించెనో కనిపెట్టుము.

16

ఏలాంటి స్వార్థ ఉద్దేశ్యము లేని గొప్ప ప్రవక్త యైన మోషేను ఉదాహరణముగా తీసికొందాము. అతడు ఐగుప్తునకు రాజుగా కాగలడు. ప్రపంచమే అతని కాళ్ళ క్రింద నుండగలదు. కాని అతడు హృదయమున ప్రవక్తయైయుండుటను బట్టి, అతడు ఫరో కుమార్తె యొక్క కుమారుడనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు; ఏలయనగా ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందే దృష్టినుంచెను. ఐగుప్తు ధనముకంటే, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాల పాపభోగము అనుభవించుటకంటె, దేవుని ప్రజలతో కష్టములనుభవించుట మేలని ఎంచెను. అతడు ఈ సమస్తము పొందగలవాడైనను, వాటికంటే శ్రేష్ఠమైన వాటిని మరొక ప్రక్కన మించియుండుటను చూడగలిగెను.

17

ఈనాడు ఒక సేవకుని తీసికొనుము. అతడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కలిగియున్న యెడల, అతడు వాక్యమును ప్రసంగించినయెడల అతని ఖ్యాతి తగ్గింపబడునని అతడెరుగును. ఎన్నికలేని ఏదో ఒక చోట ఒక చిన్న సంఘమునందుండుటకు అతడు గెంటివేయబడును లేదా వీధిలో నుండునంతగా అతడు బయటకు వెళ్ళగొట్టబడవచ్చును. అయితే ప్రభువు రాకడను చూచుటకు తన హృదయమందు మండుచున్నట్లు కూడా అతడు ఎరుగును. అతడు పెద్ద సంఘమును లేదా చిన్న సంఘమును కలిగియున్నాడను చింత లేదు. ఈ నాటికి అతనికి భోజనమున్నదా లేదా అను చింత అతనికి లేదు. అతనికి మంచి దుస్తులు వున్నవా లేదా అను చింతయు లేదు. తనయందున్న ప్రాణము దేనికై కృ౦గుచున్నదో, ఆ ఒక్క విషయము నిమితము మాత్రము జాగరూకతగలవాడై యుండును. దేవుని మహిమ కొరకు ఏదైన సాధించుటకు అతడు ప్రయత్నము చేయుచుండును. ఆ మనుష్యుడు తనలో వున్న ఆత్మ యొక్క జీవము కలిగినంతగా అతడు ప్రవర్తించును. నేను చెప్పినది మీరు గ్రహించితిరా? దానిని అతడట్లు నెరవేర్చును.

18

మోషేను చూడుడి. అతని జీవితమంతట క్రీస్తు యొక్క ఆత్మను కనుపరచుచున్నది, ఏలయనగా క్రీస్తు అతనిలో నుండెను. మోషేలో క్రీస్తు ఒక పరిమాణముగా నుండెను. అతడు శ్రమపరచబడుచున్న కాలమందు పుట్టెనని జ్ఞాపకము ఇప్పుడు చేసికొనినయెడల, యేసు పుట్టినప్పుడు ఏమి జరిగెనో సరిగా అదే, మోషేను చంపుటకు అనేకమంది పసి పిల్లలను ఐగుప్తీయులు చంపిరని చూడగలము. ఇశ్రాయేలీయులు ఎచ్చట దేవునికి అవిధేయులుగా నుండి, ఆయన కోపము వారి మీద రగులుకున్న స్థలమునకు మోషే వచ్చినప్పుడు, “నీవు ఊరకుండుము, నా కోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి, నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పెను.”

మోషే మధ్యవర్తిగా దేవుని న్యాయవిధి మార్గమందు తాను నిలిచి, తన దేవుడైన యెహోవాను, “వారి మీద పడుటకంటే నీవు ముందుగా నా పైన పడుమనెను.” మొరొక మాటలో, “నీవు వారిని నాశనము చేయు ముందు, నన్ను ముందుగా నాశనము చేయమనెను.”

ఏ వ్యత్యాసము లేకుండ ఖక్చితముగా దానినే యేసుక్రీస్తు చేసెను. భూమి మీద నుండి పాపులనెల్లరిని, నిన్ను, నన్ను, దేవుడు తుడిచివేయబడకుండునట్లు క్రీస్తు తన్ను తాను ఆ న్యాయతీర్పు మార్గమందు నిలిచెను. దేవుడు దానిని చేయలేకపోయెను. ఆయన తన స్వంత కుమారుని మీదుగా దాటిపోలేకపోయెను.

ఆ స్యాయతీర్పును బట్టి సిలువలో వ్రేలాడుచు, “వారికంటే ముందుగా నీవు నన్ను ప్రధమమున తీసికొనుము, వారి యొద్దకు నీవు వెళ్ళజాలవని పలుకుచున్న ఆత్మను దేవుడు మోషే యందుండుట చూచెను.” మోషేయందున్న దేవుని ఆత్మను చూచితివా? అతడు ఐగుప్తునకును, ప్రపంచమంతటికిని రాజుగా నుండు సమయమైయుండెను. అతడు ప్రసిద్ధిగాంచుటకై అన్ని విధములైన ఈలోక సుఖభోగములు అనుభవించుటకు అవకాశములుండెను. అయితే ఐగుప్తు ధనముకంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాల పాపభోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యెంచుకొనెను. ఆ మార్గమందు అతడు తన్ను తాను విసరివేయబడినవాడాయెను. ఎందుకు? మోషేలో వున్న దేవుడే దానిని చేసెను. స్వాభావిక ఆలోచన, బుద్ధియు గల మనుష్యుడు అట్లెన్నడు చేయడు. అతడు అనుకూలమగు మార్గమునే అవలంభించును. మోషే ఎంత మూఢభక్తిగలవాడుగా కనబడినను, అతడు దేవుని యొక్క నిజమైన ప్రవక్తయైయుండెను. అతడు దేవుని రాజ్యము నిమిత్తము ఏదైన సాధించుటకు ప్రయత్నించుచుండును.

19

అతడు ఇప్పుడు కలిగియున్న ఆ గొప్ప ప్రవచన వరమును బట్టి ఒక జ్ఞానిగా కావచ్చును, ఐగుప్తునందు నిలుచుండి, “ఇప్పుడు కనిపెట్టుడి, ఫలానా ఫలానిది జరుగునని నేను ప్రవచించుచున్నాను,” చెప్పగలడు. అట్లు లోకములో ఖ్యాతి కలిగినవాడుగా కాగలడు. అయితే, అట్టిది అతని హృదయమందు లేదు. అది అతని హృదయమందుండనేరదు.

కావున ఒక వ్యక్తి తాను కలిగిన ఆ గొప్ప వరముమ తన గొప్పతనమునకై ప్రయత్నించినయెడల అది తప్పిదమైనదని నీవు వివేచించు ఆత్మ నీకు తెలియజేయును. కాని మోషే దేవుని మహిమ కొరకు ఏదైనా సాధించుటకు ప్రయత్నించుచుండెను. అది ఎంత చెడ్డదిగా తోచవచ్చుమ, ఎంత కీడుగా కనబడినను లేదా దాని విషయమై ఎంతగా మాట్లాడినను, మోషేలో వున్న ఆత్మ అతనిని తిన్నగా తన బాధ్యతగల పని క్రమమునకు నడిపించెను.

20

యోసేపును గమనించుడి. అతడు పుట్టినప్పుడు తండ్రివలన ప్రేమింపబడెను, మరియు అన్నల వలన ద్వేషింపబడెను — ఇది క్రీస్తు యొక్క జీవిత పరిపూర్ణ ఛాయా చిత్రమైయున్నది. వీరెల్లరు తన రక్త సంబంధమై సహోదరులు అదే తండ్రిని కలిగియున్నారు. అతని సహోదరులు ఏ కారణము లేకుండ అతనిని ద్వేషించిరి, ఏలయనగా దేవుడు అతనిని ఒక ప్రవక్తగాను, ఆత్మీయ దీర్ఘదర్శిగాను ఏర్పరచెను. అది దేవుని వలన జరిగినది గనుక, యోసేపు ఏమియు చేయజాలడు.

21

ఇప్పుడు యోసేపులో వున్న దేవుని ఆత్మ చేసినది కనిపెట్టుము. అతడు క్రీస్తు యొక్క పాత్రను కూడ వహించినట్లు నిర్వర్తించెను. తన తండ్రివలన ప్రేమింపబడినను, తన సోదరులవలన ద్వేషింపబడెను. ఆత్మ ఆ వ్యత్యాసమును కలుగజేసెను. అతడు ఒక ఆత్మీయ మనుష్యుడు. దర్శనములు చూచుచుండెను, కలల భావమును తెలుపుచుండెను. తన స్వంత మహిమ కొరకు అతడు దాని ఉపయోగించలేదు. దేవుని యొక్క ఆత్మ అతనిలో నుండెను గనుక అతడు వాటిని తెలియజేసెను. దీన స్థితిలోను, వృద్ధాప్యమందున్న తన తండ్రికి ఆ కాలమందు తీరని దుఃఖ స్థితిలో నుంచుటకు అతడు గుంటలో పడవేయబడుటకు స్వయముగా వెళ్ళలేదు. యోసేపు సుమారు ముప్పది వెండి నాణెములకు అమ్మబడెను. అతడు ఆ గుంటలో నుండి బయటకు తీయబడి, ఫరో యొక్క కుడి పార్శ్వమునందు కూర్నుండు వ్యక్తిగానాయెను, మరియు ఆ సమయమున అతడు భూతలమునకు రాజుగానుండెను. అతడు తన కారాగార గృహమందుండినప్పుడు పానదాయకుడు మరియు భక్ష్యకారుల అధిపతియు అతనితో నుండిరి. అతడు జరుగబోవు వాటిని వారికి తెలియజేసిన ప్రకారము ఒకడు ప్రాణము పోగొట్టుకొనెను, మరొకడు రక్షింపబడెను.

22

యేసు ఈ లోకమునకు వచ్చినప్పుడు, అతడు తండ్రికి ప్రియుడుగా నుండెను అని గుర్తించితివా? యేసేపు యొక్క తండ్రియైన యాకోబు విచిత్ర రంగుల అంగీని అతనికి ఇచ్చెను. నిబంధనగానున్న వర్ష ధనుస్సునకు సాదృశ్యమైనది, తండ్రియైన దేవుడు తన కుమారుడైన యేసునకు అటువంటి నిబంధనను అనుగ్రహించెను. అటు పిమ్మట యూదా సోదరులు కారణము లేకుండ ఆయనను ద్వేషించిరి. ఆయన ఆత్మీయుడుగను మరియు ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమైయుండుట తప్ప, వారు ఆయనను ద్వేషించుటకు మరి వేరే ఏ హేతువు లేదు. తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఆయన వచ్చెను. లేఖనములు నెరవేర్చుటకు ఆయన వచ్చెను. మరియు వారికి సమాధానము తెచ్చుటకు ఆయన వచ్చెను. అయితే, వారు ఆయనను గుర్తించక, ఏ హేతువు లేకుండగనే ఆయనను ద్వేషించిరి. ఆయన దేనిని సాధించుటకు ప్రయత్నించుచుండెనో దానిని చూచుటకు వారు నిలువరైరి; ఆయన వారికి అనుకూలముగా సమ్మతించనందున వారు ఆయనకు తీర్పు విధించిరి. “తన్ను తాను దేవునిగా చేసికొనుచున్నాడని,” వారు నిందించుచుండిరి. కాని ఆయన దేవుడైయుండెను, “క్రీస్తునందు దేవుడు వుండి లోకమునకు తన్ను తాను ప్రత్యక్షపరచుకొనుచుండెను.” ఆయన మహిమగల దేవుడై యుండి. దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచుచుండెను.

23

మోషేను చూడుడి. నేను మీతో చెప్పినట్లుగా, దేవుని యెదుట తన్ను తాను ఉపేక్షింపబడినవాడై ఆ మార్గమందు అడ్డుపడినవానిగా పడవేయబడినట్లు తప్పినది కాదు. వంచనగా అతడట్లు చేయలేదు. దేవుడు అతనితోనుండెను గనుక అతడు దానిని చేసెను. యోసేపును నిస్సహాయుడుగా నుండి, అట్లు చేయుటకు తప్పినది కాదు, ఏలయనగా దేవుడు అతనియందుండెను. మానవుని ద్వారా తన్ను ప్రత్యక్షపరచుకొనుచున్నాడు. అతడు తన సొంత మహిమ కొరకు దానిని చేయలేదు.

ఈ ఉదయమున నేను మాటలాడుచున్న: ఆత్మ యొక్క వివేచనను, ఈ బోధకులు కలిగియుండినయెడల, ఆయన విషయము ఈ లోకము ఏది ఎంతగా మాట్లాడినను, వారాయన విషయము ఇంకను బాగుగా ఎరుగుదురు. వారు వాక్యమును చూచినయెడల, ఆయన ఉద్దేశ్యమును ఎరిగియుందురు. ఆయన చేసిన ప్రతిదియు తండ్రిని మహిమపరచుటకు చేసెను. “ఈ మనుష్యుడు గొప్ప స్వస్థత కార్యములు చేయువాడైయున్నాడని” వారు యేసును గూర్చి చెప్పిరి.

కాని ఆయన “తండ్రి నాకు చూపించువరకు, నేనేమియు చేయలేను, ఆ పని చేయునది నేను కాను, నాయందున్న తండ్రి దానిని చేయుచున్నాడు. ఆ పనిని చేయువాడు ఆయనే,” అని చెప్పెను. మహిమను ఆయన ఎన్నడును తీసికొనలేదు.

24

దేవుని సేవకుడెవరైనను ఆ మహిమను తీసికొనడు లేదా దేవుని యొక్క వరమును తన స్వంత మహిమ కొరకు లేదా మరి దేనికైన ఉపయోగింపడు. అతని జీవితమందు ఏదైనా సాధించవలెనని యుండిన, అది దేవుని మహిమ కొరకై అతడు చేయుచుండును. అందువలననే ఈనాడు దానినే మీరు చూచుచున్నారు. వారు ఏమి చేయ ప్రయత్నము చేయుచున్నారో చూచుటకు మనము ఆత్మ వివేచనను తప్పక కలిగియుండవలెను. వారు దేవుని మహిమపరచుటకు ప్రయత్నము చేయుచున్నారా? వారు తమను తాము మహిమపరచుకొన చూచుచున్నారా?

25

ఒక మనుష్యునిలో దేవుని ఆత్మ పనిచేయుచుండిన, ఆ మనుష్యుని దేవునివలె ప్రవర్తింపజేయును. “మీరు దైవములై యున్నారని, వ్రాయబడియుండలేదా?” అని యేసు చెప్పుటలో ఆశ్చర్యమేమియులేదు. “మీరు దైవములని నేనంటినని ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు గదా! దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల, నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపినవానితో - నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? దేవుని యొక్క ఆత్మ మోషేలో నుండెను గనుక అతడు దైవమైయుండెను. మోషే ఒక దైవమైయుండెను, మరియు యోసేపు ఒక దైవమైయుండెను. ప్రవక్తలెల్లరు దైవములై యున్నారు; ఏలయనగా వారు దేవుని యొక్క ఆత్మను కలిగినవారై, సంపూర్ణముగా తమ్మును తాము ఆ దేవుని ఆత్మకు సమర్పించుకొనినవారై, దేవుని యొక్క మహిమ కొరకు పనిచేయుచుండిరని,” బైబిలు చెప్పెను.

ఒక మనుష్యుడు ఆత్మవలన అంతగా అభిషేకింపబడినప్పుడు... (ఇది నిజముగా గూఢార్థమైనదిగా ఎడమ ప్రక్కలోని ఐదవ ప్రక్కటెముక క్రిందికి పోనిచ్చెదము). ఒక మనుష్యుడు దేవుని యొక్క ఆత్మ వలన అభిషేకింపబడినప్పుడు, అతని అలవాటులు, అతని చలనము మరియు సమస్తమును కూడ దేవుడతనియందుండి నడిపించుటయైయున్నది.

కొన్ని సమయములందు అతడు అన్యాయపు తీర్పు పొందినవాడగును.

26

కీర్తనలు 22:1 లో దావీదును చూడుడి. “నా దేవా, నా దేవా, నన్నేల విడనాడితివి?” అని మొర్రపెట్టుచున్నాడు. విడనాడబడిన మనుష్యుడు తానైనట్లు అతడు మాట్లాడుతున్నాడు. అటు పిమ్మట మరల అతడు చెప్పెను, “నన్ను చూచు వారందరు పెదవులు విరిచి నన్ను అపహసించుచున్నారు.”

అతడు దేవునికి అప్పగించుకొనునంతగా అభిషేకింపబడియుండెను, మరియు అతడు దేవుని ఆత్మవలన మొర్రపెట్టుచున్నప్పుడు సమీపమున ఎవరో కొందరు నిలువబడి, “మంచిది, అతనివైపు చూచెదము, చూచువారు పెదవులు విరుచుచు, దేవుడు అతనిని ఏల విడనాడినని అతడు తలంచుచున్నట్లుగా వారు చెప్పుదురు.

అట్లు చేసినది దావీదు కాదు; కాని ఆత్మ దావీదు ద్వారా మొర్రపెట్టుచు కేకవేయుచున్నది. “నా యెముకలన్నియు నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.”

27

సమీపమున ఎవడో ఒకడు నిలువబడి, “ఎవని చేతులను పొడిచిరి? ఎవని పాదములను పొడిచిరి? ఆ వంచకుని వినుడి,” అని చెప్పుచున్నాడు. అది బుద్దితో మాటలాడుటయైయున్నది.

కాని ఏ యొక్క వ్యక్తి ఆత్మ వివేచన కలిగియుండునో అతడు అట్లు మొర్రపెట్టుచు అరచుచుండును. దావీదునందున్న దేవుని యొక్క ఆత్మ అని ఎరుగును. దేవుని యొక్క ఆత్మ వలన ఒక మనుష్యుడు అభిషేకింపబడినప్పుడు, అతడు దేవుని యొక్క చలనము కలిగియుండును. మరియు దేవుని యొక్క చలనము మనలను విభజించదు, కాని ఒకటిగా కూడుకొనునట్లు చేయును. ఏలయనగా క్రీస్తు యేసునందు మనమెల్లరము ఒకటై యున్నాము. మరియు దేవుని యొక్క ఉద్దేశ్యము మనమెల్లరము ఒకటిగా నుండునట్లు కూడుకొనుటయైయున్నది. ఒకరి నొకరు ప్రేమించుటయే!

28

ఇప్పుడు, ఆ గొప్ప ప్రవక్తలు, వారిలో ఆత్మ కదలుట మనము చుచాము. యేసు వారిని “దైవములని” పిలచెను. వారు దైవములైయున్నారని ఆయన చెప్పెను. ఆత్మ ప్రవక్తల మీదికి ఒక కొలతగా వచ్చును, కాని (దేవుని కుమారుడగు) యేసు మీదికి వచ్చినప్పుడు - కొలత లేనంతగా ఆత్మను అనుగ్రహించెను. “ఏలయనగా, దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.” ఏలయనగా, ఆయన (క్రీస్తు యేసు) పరిపూర్ణమైన మాదిరియైవున్నాడు. ఆయన మహిమగల దేవుడై యుండి, ప్రజలకు దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచుచుండెను. ఆయన జీవితమును చూడుడి. పాత నిబంధనలోని వాక్యమందలి విషయము ఆయనైయుండెను. పాత నిబంధనలోని ప్రవక్తలు తమ కొరకు మొర్ర పెట్టుచు ప్రలాపింపలేదు, కాని దేవుని యొక్క ఆత్మను కలిగియుండుట వలన దైవములని చెప్పబడిన ప్రకారము, దైవముల వలే ప్రవర్తించిరి. అటుపిమ్మట దైవత్వము యొక్క పరిపూర్ణ ఆత్మ యేసుక్రీస్తు నందు ప్రత్యక్షపరచబడెను.

29

దావీదును చూడుడి. ఇశ్రాయేలీయులకు రాజుగా నుండునట్టి సింహాసనము నుండి తొలగింపబడి, తన స్వంత ప్రజలు అతనిని నిరాకరించినప్పుడు (యెరూషలేమునకు ఉత్తరపు దిక్కున నున్న) ఓలీవ పర్వతమునకు వెళ్లుచు వెనుక తిరిగి యెరూషలేము పట్టణమును చూచెను మరియు తన్ను నిరాకరించుటను బట్టి ప్రలాపించెను. ఆ విధముగా చేయుటకు అతనికి ఏమి కారణమాయెను? అతడు క్రీస్తు ఆత్మను కలిగియుండెను.

ఐదువందల సంవత్సరములకు తర్వాత దావీదు కుమారుడగు యేసు అదే కొండపై నిరాకరింపబడిన రాజుగా కూర్చుండి, ఆ పట్టణమును గూర్చి, “యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకేలాగు చేర్చుకోనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని, మీరు ఒల్లకపోతిరి.”

ఇప్పుడు దావీదునందున్న అదే ఆత్మ, పరిపూర్ణముగా క్రీస్తునందు ప్రత్యక్షపరచబడి క్రీస్తు సంఘమునందుండి, “మిమ్మును పలుమార్లు చేర్చుకొనవలెనని,” ప్రజల నిమిత్తము ఈనాడు ప్రలాపించుచున్నది. వేరు పరచబడుటయు, భేదములు, సోదర ఐక్యత విరగగొట్ట బడుటయు మరియు క్రైస్తవులు ఒకరికి విరోధముగా నొకరు లేచుటయు మీరు చూచినప్పుడు దేవుని యొక్క ఆత్మ నీ హృదయములో క్రు౦గుచు మొర్రపెట్టును. నీవు ఏదో సాధించుటకు ప్రయత్నించుచున్నావు. ఒక నిజ దేవుని ప్రవక్త గాని, ఒక నిజ ఉపదేశకుడు గాని వారు దేవుని గుర్తించునట్లుగా క్రీస్తు సంఘమును ఆత్మ యొక్క ఐక్యతకు తెచ్చుటకు ప్రయత్నించుచుందురు. ఆ మనుష్యుడు ఏ స్థాపన సంఘమునకు చెందినవాడై యుండినను, ఆ మనుష్యునిలోని ఆత్మను వివేచించునట్టి ఆత్మను కలిగియున్నందున, అది దేవునియొక్క ఆత్మయా, కాదా అనునది నీవు గుర్తించిగలవు.

30

మరొక విషయము నా మనస్సునకు వచ్చినది. దావీదు నిరాకరింపబడిన రాజుగా పట్టణము వెలుపలికి వెళ్ళినప్పుడు, ఒక సాధారణ కుంటివాడైన బెన్యామీనీయుడు, అతడు అతనికి సహోదరుడనబడినవాడు, నిరాకరింపబడిన రాజుగా అతడుండుటను చూచినప్పుడు, విచారపడవలసినవాడై యుండవలసినవాడు. అతడు తన కుంటితనపు స్థితిలో నుండి మందు సేకరించినవాడై, దావీదు పైకి మలినము విసరివేసెను, అన్ని రకములై చెడ్డ పేరులతో దూషించుచు పిలుచుచుండెను, మరియు ప్రభువు నామమున అతనిని శపించుచుండెను. ఈ పాత కుంటివాడైన బెన్యామీనీయుడు రాజైన దావీదును ప్రభువు నామమున శపించుచుండెను!

దేవుని యొక్క ఆత్మను మరియు దయ్యపు యొక్క ఆత్మను వాని పనినిబట్టి కనిపెట్టుము.

31

ఆతడు కుంటివాడైయుండెనని నీవు చూచినయెడల. ఇది ఈనాడు ప్రజల యొక్క ఆత్మీయ కుంటితనపు స్థితిని సూచించుచున్నది, క్రీస్తునందు స్వయముగా ప్రత్యక్షపరచబడిన నిజమైన దేవుని యొక్క ఆత్మను హేళనచేయు ఆత్మీయ కుంటి స్థితిని సూచించుచున్నది. రాజుగా నుండుటకు నిరాకరింపబడిన, ఆ క్రీస్తు యొక్క ఆత్మ దావీదునందుండెను. ఈనాడు పరిశుద్ధాత్మ పొంది ఏదో సాధించుటకు ప్రయత్నించుచున్న ప్రజలను వారు పరిహాసము చేయుదురు. మరియు మెథడిస్టువారిని, పెంతికోస్తువారిని, బాప్టిస్టువారిని, పెస్బిటేరియనులను, క్రీస్తు శరీరముగా ఐక్యతలో కూడునప్పుడు, ఈ విధముగా ఆత్మ పనిచేయుట వారు చూచినప్పుడు, వారు “మంచిది, చూడుము, అతడు ఒక పెంతికోస్తు, అతనికి దూరముగా నుండుము,” అని చెప్పుచున్నారు. ఒకడు మరొకని భార్యను తీసికొని పారిపోయెనని నేను ఎరుగుదును. వీరిలో ఒకడు తాగుబోతు అని నేను ఎరుగుదును. మరొకడు అది చేసెను, మరియు ఇది చేసెనని నేను ఎరుగుదును. వారియొక్క స్వంత చెడు విషయములను కప్పిపెట్టునట్లుగా వారు పెద్ద సముదాయమైయున్నారు. వారు దానిని కప్పిపెట్టగలరు, దావీదైతే వెల్లడిపరచబడెను. ఏల? అతడు క్రీస్తు యొక్క ఆత్మను తనలో కలిగియుండెను.

“ఈ చచ్చిన కుక్క నా యేలినవాడవును రాజవునగు నిన్ను శపింపనేల? నీ చిత్తమైతే, నేను వానిని చేరబోయి వాని తలను ఛేదించి వచ్చెదనని,” దావీదుతోనున్న రక్షకభటుడు చెప్పెను.

32

దావీదునందున్న క్రీస్తు ఆత్మను కనిపెట్టుడి. అందుకు దావీదు - “వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చియున్నాడు గనుక, వానిని శపింపనియ్యుడని,” జవాబిచ్చెను.

మేము అతనిని ఎదిరించి, పోరాడి, ఈనాడు అతని తలను ఛేదించి ఇచ్చుటకు తీసుకొని వచ్చెదమనిరి.

కాని దావీదు - “మీరు వాని జోలిమానుడి. యెహోవ వానికి నన్ను శపించునట్లుగా సెలవిచ్చియున్నాడు,” అనెను. ఆ కుంటివాడు వారితో కూడ పరుగెత్తుచు దావీదుపై దుమ్ము ఎత్తి పోసెను.

ఈనాడు సరిగా అదే క్రీస్తు యొక్క ఆత్మయెడల జరిగించుచున్నారు. “వీరు దొర్లువారైన పరిశుద్ధ గుండ్రాళ్ళ గుంపు ఇది, అది అను దానియొక్క గుంపు. వారికేమియు లేదు. దైవిక స్వస్థత, అని వారు చెప్పునది ఏదియులేదు. దూతలని చెప్పబడునట్టివియు లేవు, ప్రవక్త అని వారు చెప్పునదియు లేదు. అద్భుత కార్యములు జరిగింపబడు దినములు గతించిపోయినవి,” అని వారు చెప్పుదురు. అటువంటి నిందలను దుమ్మెత్తి పోయుచున్నారు. కాని వారు చేయునది, చేయనివ్వుడి. దావీదు అధికారములోనికి తిరిగి వచ్చినప్పుడు, సర్వ ఇశ్రాయేలీయులకు రాజుగా వచ్చెను. హల్లేలూయా! చింతించనక్కరలేదు, ఏ ఆత్మను ఈనాడు మనము కలిగియున్నామో, ఈ యేసు తన పాత్రను నిర్వహించుచున్నాడు, మరియు రెండవమారు ప్రకృతి శరీరమునందు మహిమయందును, శక్తితోను మరియు రాజ ప్రతాపమునందు తిరిగి వచ్చును.

33

దావీదు ముఖము పై దుమ్ము ఎత్తిపోసిన ఆ అధముడు అతని ఎదుట సాష్టాంగపడి ప్రాణభిక్షమునకై అతని దయను కోరుచున్నాడు. “అతని జోలి విడువుడి,” అని దావీదు చెప్పెను. క్రీస్తు ఆత్మ మనలో వున్నది. అతనిని వెలివేయకుడి. ఇవన్నియు రావలసియున్నవి గనుక అవి వచ్చియున్నవని జ్ఞాపకము చేసికొనుడి. “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని,” దేవుడు వాగ్దానము చేసియున్నాడు. గనుక మనము ఆత్మల యొక్క వివేచనను కలిగియుండి, ఆ విషయము యొక్క గురి సరిగా నుంచుకొందాము. మనలో ప్రతి ఒక్కరును దేవుని సేవ చేయుటకు ఇక్కడ కూడి ఉన్నాము. దేవుని సేవ చేయుటకు సహవాసముగా కూడి వెళ్ళుదుము, అయితే తప్పు ఉద్దేశ్యమును ఒక మనుష్యుడు కలిగియుండినయెడల, అప్పుడు సంభవించునదేమి? చూచారా?

34

యేసునందు దేవుని యొక్క ఆత్మ ఉండెనని మనము గమనించుచున్నాము. ప్రాచీన ప్రవక్తలు యెల్లరు ఆయనను గూర్చియే మాట్లాడిరి. ప్రతి నిజ ప్రవక్తయందు ఆత్మ పరిమాణముగల భాగముగా నుండెను. మరియు ఆ ప్రవక్త తన్ను తాను మహిమపరచుకొనలేదు. నిజ ప్రవక్తలు ఆయనను గూర్చి మాట్లాడుచు, ఆయనను ప్రత్యక్షపరచుచుండిరి. వారు బయలుపర్చిన ప్రతిదియు ఆయనయందు నెరవేర్చబడెను. దేవుని యొక్క ఆత్మ వారిలో నుండెనని అది నిరూపించుచున్నది. దేవుడు స్వయముగా (వారి ద్వారా) మాటలాడుచుండెను. ఈ ప్రవక్తల ద్వారా తన్ను ప్రత్యక్షపరచుకొనుచుండెను.

35

రాబోవు (అమెరికా) అధ్యక్షుడు ఎవరైనది అని ప్రవచించి తమ్మును తాము మహిమవరచుకొనుటకై అట్టిది వారు చేయరైరి లేదా అయన తలమీద కొట్టి, “నిన్ను కొట్టినదెవరో, చెప్పమని అప్పుడు మేము నిన్ను నమ్ముదమను ప్రశ్నకు జవాబుగా నుండునట్లు అ పరిహాసకుల గుంపు యేసుతో చేసిన దానివలె వున్నది. ఏదైనను అది దేవుని ప్రత్యక్షపరచునదై యున్నది. ఇచ్చటనున్న సహోదరుడు వెదర్సును ఏదో గొప్ప చేయవలెనని కాదు.” సహోదరుడు షోర్సును లేదా మరో సోదరుని అతని సంఘములో నున్న తక్కినవారందరికంటే ఆతనిని గొప్పగా చేయవలెనని కాదు. ఫినిక్స్ లో నున్న వారందరికంటె అతనిని ప్రసిద్ధినొందినవానిగా చేయుట కాదు. సహోదరుడు విలియం బ్రెన్హాంమును ఏదో గొప్ప చేయుట కాదది. సహోదరుడు ఓరల్ రాబర్టు లేదా బిల్లీగ్రామును గొప్ప చేయునట్టిది కాదది. అది మన హృదయములోనిది, దేవుని రాజ్యము కొరకు ఏదైన సాధించుటకు మనము ప్రయత్నించుచున్నాము. అది దేవుని ప్రత్యక్షపరచుచున్నది. ఈ కృపావరములు మరియు వాటి కార్యములు జరిగించుటలో ఒకనికంటే మరొకని గొప్ప చేయుటకు కాదు. అవి అవన్నియు క్రీస్తు శరీరము పరిపూర్ణత కొరకు మనమందరము కూడుకొని పనిచేయుటకు, దేవుని యొక్క ఒక్క ప్రజగా మనము కూడుకొనుటకు, ఒకే ప్రజగా నుండునట్లు తెచ్చుటకు చేయుచున్నవి. ఒకడు దానికి ప్రతికూలముగా వెళ్ళుట నీవు చూచినప్పుడు, అతనిని నీవు శపించవద్దు. వాని జోలి విడువుము. అది ఎవడైనా ఒకడు చేయవలసియుండును. యేసు శక్తితో (అధికారమున) వచ్చువరకు కనిపెట్టుదము.

36

ఈ ప్రవక్తలందరు మాట్లాడుట మనము చూచుచున్నాము. వారిలో ప్రతివారును దేవుని మహిమపరచుచున్నారు, రానున్న మెస్సీయా ఆయనే. వారు ఆ ఆత్మను కలిగినప్పుడు, మెస్సీయావలె సరిగా, వారు ప్రవర్తించిరి, మాట్లాడిరి, అదే జీవముగల జీవితమును జీవించిరి. సిలువకు ఆవలివైపు ఆ రీతిగానుండగా (ఆయన రాకడను గూర్చి మాట్లాడుచుండగా) ఆయన రాకడ తరువాత, మరెంతగా మెస్సీయా యొక్క ఆత్మ క్రీస్తు సంఘమునందుంచబడి ప్రవర్తించుటకును, పనిచేయుటకును మరియు మెస్సీయావలె జీవించుటకు కలిగియుండును. అది దేవుని ఆత్మయై ఉన్నది.

దేవుని సంబంధమైనదా, కాదా అని చూచునట్లు ఆత్మను వివేచించుడి. ఆయనవలె అది నడుచుచున్నదేమో చూడుము. నీ యొక్క విచారములు ఆయన కలిగినట్లుగా వున్నవా అని చూడుము. నీవు దేవుని యొక్క ఆత్మను కలిగియున్నావనియు మరియు నీవు ఎంత నిర్దోషిగా నుండుటకు నీవు అంతగా నుండినప్పుడు, ఎవడైన నీ జీవితముపై మలినము పడవేసినను, నీకు ఏదైన విరోధముగా నిన్ను తన్నినయెడల, ఆతని నుండి వేరై యుండుటకు ప్రయత్నించకుము లేదా వారియెడల చెడుగా ప్రవర్తించకుము. వారిని శపించవద్దు. దేవుడు నిన్ను పరీక్షించగా, నీవు దాని యెదుట ఎట్లు నిలువబడగలవు అను దానిని ఎరిగినవాడవై తిన్నగా వాటిని చూడక వెళ్ళుము. ఏలాగైన అతడు అక్కడికి రావలెను.

37

వేరొక దినమున సహోదరుడు పుల్లర్సు సంఘములో కెనడాలో సైకిలు నడిపించువాని కథను చెప్పియుంటిని. సైకిల్ యొక్క హేండిల్ బార్ పట్టుకొనుటకు గల అడ్డు కమ్మిని పట్టుకొనకుండ నడిపించలేని ఈ ఆడంగి బాలుని ఓడించగలరని తక్కిన సైకిల్ సవారి చేయువారు తలంచిరి. అతడు ఒక్కడు మాత్రమే సైకిల్ పట్టుకొను అడ్డుకమ్మిని పట్టుకొనకుండ నడిపించలేనివాడు.

నేను కూడా హేండిల్ బార్ ను పట్టుకొని నపించగలిగినవారిలో ఒకనిగా ఉండగోరుదును, ఆ సిలువ యొక్క రెండు వైపులా పట్టుకొని, చెప్పనిము, “నా చేతుల్లో ఏమి తీసుకొని రాలేదు. ప్రభువా, నన్ను ఆ సిలువను పట్టుకొననిమ్ము. నాకు జ్ఞానము లేదు. నా దగ్గర ఏమియు లేదు. కేవలము నన్ను పట్టుకొననిమ్ము, ఆ దూరపు వైపు చూడనిమ్ము.”

38

ఆ సైకిల్ సవారి చేయువారు పండ్రెండు అంగుళముల వెడల్పు గల చెక్కపలకపై సవారి చేయుచు నగర చివరకు చేరవలెను. అందు గెలిచిన వానికి వంద డాలర్ల స్కీవిన్ బైసికిల్ బహుమానముగా ఇవ్వబడును. వీరందరు వారి తల్లి దుకాణము నుండి ఏదైన వస్తువులు తెమ్మనినప్పుడు, ఈ ఇతర బాలురు సైకిల్ హేండల్ బార్ ను పట్టుకోనకుండనే సవారి చేయువారు. వారు ఈ పందెమును ప్రారంభించినప్పుడు వారు ఆ సైకిల్ హేండల్ బార్ పట్టుకొనక క్రిందికి చూచుచుండిరి, వారెల్లరు

పడిపోయిరి. కాని ఆ దీన పిల్లవాడు ఆ సైకిలు హేండల్ బార్ పట్టుకొని సవారి చేయుచు తిన్నగా ఆ దరి అంతమును చేరెను. “అది నీవెట్లు చేసితివని ఆ ఇతర బాలురు వానిని అడిగిరి. అందుకు అతడు — ”మీరెల్లరు నాకంటే బాగుగా నడిపించగలరు, కాని మీరు చేసిన పొరపాటు ఏమిటనగా, మీరు నడిపించునప్పుడు క్రిందికి చూచుచుంటిరి, అది మిమ్మును భయమును కలుగచేసినది. మిమ్మును మీరు నిలువబెట్టుకొనుటకు ప్రయత్నించితిరి, అయినను మీరు పడిపోతిరి. నేనైతే నా చుట్టు ఏది ఉన్నదియు చూడలేదు, గాని అటు ఇటు కదలక అంతమును చేరునట్టి చూపుతో ముందుకు సాగుచు పోవుచుంటినని,“ వారితో చెప్పెను.

మనము కూడా అదే చేయవలెను. ఇప్పుడు, “వారు ఇది చేశారా లేక వీరు అది చేశారా?” అనే ఆ చిన్న విషయముల వైపు చూడవద్దు. గమ్యము వైపు చూడుము మరియు నిలకడగా ఉండుము. క్రీస్తు వచ్చుచున్నాడు. గమ్యము వైపు చూడుము మరియు నిలకడగా ఉండుము. ఏమి జరుగుచున్నదా ఇప్పుడు అని చూడవద్దు. కడవరి సమయమున మన జీవితములో మనము చేసిన ప్రతిదానికి లెక్క చెప్పవలసియున్న దానికొరకు వెళ్ళునప్పుడు, మనతో కూడా అచ్చటకు ఏమి వచ్చుచున్నదో కనిపెట్టుడి.“

39

దావీదు తనపై దుమ్ము ఎత్తి పోసినాడని అధముడగు బెన్యామీనీయుని కనిపెట్టుచుండుట లేదు, వాడు ఏలాగైన కుంటివాడు. దావీదు ఎన్నడును అతనిని గమనించలేదు. తన రక్షకభటుడు అతని శిరస్సును ఛేదింపనియ్యలేదు. కాని పైపెచ్చు అతడు చెప్పినదేమనగా - “వాని జోలి విడువుడి, దేవుడు వానిని ఆ విధముగా చేయుటకు చెప్పెను. నన్ను శపించుటకు దేవుడు అతనికి చెప్పెను, వాని జోలి వీడుము.'' ఏదో ఒక దినము తిరిగి తాను అధికారములోనికి వచ్చెదనని దావీదు ఎరుగును. ఆ బెన్యామీనీయుడు తన సమయమును కలిగియుండును.

అవును, అది వాస్తవమైయున్నది. సంఘము విజయమందు లేచును. ఆయన యొక్క వ్యాధిగల పిల్లలకు ప్రార్థించుటకు నేను ఇప్పుడు పంపబడితిని. అది మాత్రమే నేను చేయగలను. వారెక్కడ నున్నవారైనను, ఏ సంఘమునకు చెందినవారైనను నాకేలాంటి వ్యత్యాసము లేదు. ఆయన యొక్క వ్యాధిగల పిల్లలకు ప్రార్థించుటకు ప్రయత్నించుచున్నాను. మరియు ఆయన అనుగ్రహించిన కృపావరమును ఆయన మహిమను ప్రత్యక్షపరచుటకై ప్రయత్నించుచున్నాను. ఈ కారణమును బట్టి నేను (ఏ సంస్థకు) దేనికి చెందినవాడను కాను.

ఇప్పుడు జ్ఞాపకముంచుకొనుడి, అది సరియే. అది ఇప్పుడు నేను చెప్పను. నేను చెప్పు విషయము మీరు చక్కగా గ్రహించవలెను. దేవుడు ప్రతి సంఘములోను క్రైస్తవులను పెట్టియున్నాడు. ఏలయనగా వారెల్లరు ఆయన పిల్లలైయున్నారని నమ్ముచున్నాను. ఆ విషయ మున ఆయన నన్ను ప్రశ్నించుటలేదు. ఆయన పిల్లల కొరకు ప్రార్థించుటకును, ఆయనను ప్రత్యక్షపరచుటకును నేను పంపబడియున్నాను.

40

ఇప్పుడు, యేసు మరియు ప్రవక్తలు మాటలాడినదెల్ల సత్యమైయుండవలెను, ఏలయనగా వారిలో దేవుని శక్తి యుండెను. దేవుడే వారి ద్వారా ఆయన స్వంత రాకడను గూర్చి తన మహిమ కొరకు స్వయముగా మాటలాడుచుండెను.

“రాబోవు అధ్యక్షుడెవరు అనునది చెప్పుట కాక, లేదా ఈ సంవత్సరము కావలసినంత వర్షము వచ్చునా అని ప్రవచించినట్లయితే, అందు ఏలాంటి అర్థము లేదు. ఒక నిజ ప్రవక్త ఏదైన దేవుని మహిమ కొరకును ఏదైన సంఘమును క్రమములో పెట్టుటకును లేదా దేవుని శక్తిని గూర్చి మాటలాడును; అతడు తన పేరు పెద్దగా చేసికొనుటకు గాక, దేవుని మహిమపరచుటకై అతడు చేయును.

41

ఇప్పుడు ప్రవక్తలు ఆయన విషయము ఏమి చెప్పిరో, అవన్నియు నెరవేరినవని చూచుచున్నాము. ఏలయనగా, ఆయన పాత నిబంధనలోని ముఖ్య విషయమైవున్నాడు. ఆదాము నుండి మలాకీ వరకు ప్రతి ప్రవక్త యేసు అనబడు రానున్న మస్సీయా కొరకు కనిపెట్టుచుండిరి. ప్రతి ప్రవక్త యేసు యొక్క ఆగమనము గురించి మాట్లాడుచుండిరి.

ఇప్పుడు, దానిపై మనము ఎక్కువ సమయము ఉండినయెడల బాగుండును అని కోరుచున్నాను. అయితే, గమనించండి, వారు చెప్పిన ప్రతియొక్కటి నెరవేరినది. ప్రవక్త చెప్పిన వాటిలో నెరవేరిన వాటిని కొన్నింటిని తీసికొనెదము.

42

“కన్యక గర్భవతియై కుమారుని కనును.” అది నెరవేరినదా? తప్పక ఆలాగే జరిగినది. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.“ ఆయన అదే అయి యుండెను, ఖక్చితముగా, ”నిత్యుడగు తండ్రి.“ మరియు భూమిమీద ఎవనినైనను ”తండ్రి“ అని పిలువవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు.

మంచిది, ఇప్పుడు మరల చూద్దాము. “మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను; మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను; అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలిగినది.” పిలాతు న్యాయాలయమందు ఈ లేఖనము ఏ మనుష్యుని గూర్చి చెప్పెనో నిలుచుండెను, తొమ్మిది తోలు దారములతో పేనిన కొరడాతో ఆయన వీపున కొట్టిరి. ఆ విధముగా జరుగునని లేఖనము చెప్పబడియుండెనని వారు యెరుగరైరి. వారు అత్మలను వివేచించుటను కలిగియుండలేదు. ఆ ధర్మోపదేశకులు “అతని నుండి తొలగిపోవుడి, తొలగిపోవుడి,” అని చెప్పిరి.

43

ఆయన సిలువ మీద వ్రేలాడబడినప్పుడు, “నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి?” అని మొర్రపెట్టుచుండగా, తమ పెదవులు విరిచి, అపహసించుచుండిరి. వారు వివేచించుటను కలిగియుండలేదు. ఆ విషయమునే దావీదు కీర్తనలు 22లో మాట్లాడుచున్నాడు. వారు పెదవులు విరిచి ఎందుకు అపహసించుచున్నారో వారెరుగరు. దావీదు యొక్క రాజ్యపరిపాలన నియమమును దావీదుతో సమ్మతించక, అన్ని విషయములలో దావీదును నేరస్థునిగా యెంచిన ఆ బెన్యామీనీయునివలె వారుండిరి. దావీదునందు దేవుని యొక్క ఆత్మనుండెనని ఆతడు గుర్తించలేదు.

ఈనాడు ఒకడు ఏమి చేయుటకు ప్రయత్నించుచున్నాడో తెలిసికొనుటకు ఆ మనుష్యుని ఆత్మను వివేచింపవలెను - ఫలాని గుంపునకు చెందినవాడని కాదు. అతడు తెల్లని మనిషియో, నల్లని మనిషియో, పసుపు పచ్చ వర్ణముగల మనుష్యుడో లేదా వాడెటువంటివాడైనను కావచ్చును దానికి బదులుగా, అతడు దేనిని సాధించుటకు ప్రయత్నించుచున్నాడు, మరియు దేవుని రాజ్యము కొరకు ఏమి చేయుటకు ప్రయత్నించుచున్నాడు అనునది చూచెదము మరియు దానిని తీసికొనెదము. అతని యొక్క అభిప్రాయము మన స్వంత ఉద్దేశ్యమునకు సరిగా నుండినట్లు కనబడకపోవచ్చును, కాని అతడు దేవుని యొక్క రాజ్యము కొరకు అతడు దానిని సాధించుటకు ప్రయత్నించుచున్నంతవరకు అది లోపరహితముగా సరియే. అతనియందున్న దానిని నీవు తప్పక వివేచింపవలెను. అతడు తప్పుగా నుండినను, అతడు తన హృదయమందు సత్యమును కలిగియుండినయెడల, దేవుడు ఆ విషయము యొక్క సత్యమునకు చుట్టూ తిప్పి కొంత సమయమునకు అతనిని తీసికొనివచ్చును. అతని జోలి విడిచెదము, అతని జోలి విడిచెదము, అతడు ఏమి చేయుటకు ప్రయత్నము చేయుచున్నాడో చూచెదము.

44

యేసు సిలువ మీద మరణించినప్పుడు ప్రవక్త ముందుగా తెలియజేసినవన్నియు ఆయన మొర్రపెట్టినట్లుగా పలికెను, “వారు నా చేతులను, నా పాదములను పొడిచిరి.” అది అచ్చట సరిగా నెరవేరినది. ప్రవక్తలు చెప్పినది నిజమైనది. అది తామైయుండినట్లుగా వారు తలంచిరి లేదా వాస్తవముగా వారే అట్లు అణచుచుండినట్లుగా వారు మాటలాడుచుండిరి, కాని అది సిలువయందు ప్రత్యక్షపరచబడెను.

“అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను.” ఆయనను అదే చేసిరి. ఆయన అతిక్రము చేయువారిలో ఎంచబడినవాడాయెను. “అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను.” ఒక ధనికుని యొక్క సమాధియందు ఆతనిని సమాధి చేసిరి. దావీదులో వున్న దేవుని యొక్క ఆత్మ, “నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్లు పట్టనియ్యవు,” అని మాటలాడుచు, చెప్పెను. దావీదు ఆ పరిశుద్దుడు తానై యుండినట్లుగా మాట్లాడెను. అది దావీదు కాదు, దావీదులోయున్న దేవుని యొక్క ఆత్మ కేకలేయుచు మొర్ర పెట్టుచున్నది.

“అచ్చటనున్న ప్రాచీన వంచకుడు చెప్పునది వినుడి,” అని మరొకరు చెప్పుచుండవచ్చును.

అతడు ఒక వంచకుడు కాకుండెను, అది దేవునియొక్క ఆత్మయై వుండి మొర్ర పెట్టినట్లుగా కేకలేయుచున్నది. చూచారా, దేవుని యొక్క ఆత్మ తన్ను ప్రత్యక్షపరచుకొనుచున్నది, “నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్లు పట్టనియ్యవు.”

45

సహోదరులా ఇప్పుడు ఈ ముగింపునందు - పాత నిబంధన యొక్క ఉపదేశ విషయమును, దేవుని యొక్క ఆత్మవలన అభిషేకింపబడిన పరిశుద్ధ ప్రవక్తలు ఎవరిని గూర్చి చెప్పియుండిరో, అవి అన్నియు అక్షరార్థముగా ఆయన యెడల నెరవేర్చబడిన ఒక మనుష్యుడు యుండినయెడల, దేవుని కుమారుడని పిలువబడిన ఆ గొప్ప పురుషుడు నూతన నిబంధన సంఘము కట్టుటకు ఎరిగినవాడైయున్నాడని నేను చెప్పవచ్చును. అది మీరు నమ్మరా? క్రొత్త నిబంధన సంఘమును ఎట్లు కట్టవలెనో ఆయన దాని సరియైన విధానమును తప్పక ఎరుగును.

46

ఇప్పుడు ప్రధమముగా మీ ధ్యానమును మత్తయి 16వ అధ్యాయము వైపు ఉంచవలెనని మిమ్మును కోరుచున్నాను. ఆయన తన శిష్యులతో మాట్లాడుచు, చెప్పినదేమనగా: “మనుష్యకుమారుడైన నన్ను ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా?”

అందుకు ఆయన శిష్యులు - “బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు,” చెప్పుకొనుచున్నారనిరి.

అందుకు యేసు, “మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని?” వారినడిగెను.

అప్పుడు పేతురు, “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని,” చెప్పెను.

అందుకు యేసు, “సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనే కాని రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండమీద నా సంఘమును కట్టుదును మరియు పాతాళ లోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను,” అని చెప్పెను. సంఘమును గూర్చి యేసు ఇచ్చట, ఇప్పుడు మాట్లాడుచున్నాడు. నేను పొరపాటు కలిగియున్నయెడల సమీపించి కనిపెట్టుడి. దేవుడు నన్ను క్షమించును గాక, మరియు మీరును నన్ను క్షమించుడి.

47

పేతురు అనగా రాయి, అచ్చట ఆ రాయిని ఆనాటి ఆయన సంఘమును పేతురు మీద కట్టెను అని కథోలిక్ సంఘము ఇప్పుడు చెప్పుచున్నది. అది సరికాదని మనమెరుగుదుము. ప్రొటెస్టె౦టువారమైన మనము దానికి ఎన్నడు ఒప్పుకొనము.

అయితే ప్రొటెస్టెంటు వారమైన మనము ఆయన తన సంఘమును తనపై కట్టుకొనెనని చెప్పుచున్నాము. కాని వాస్తవముగా దానికి నేను సమ్మతించుట లేదు. అది ఎంత మాత్రమును సరికానేరదు.

తనను గూర్చిన ఆత్మీయ ప్రత్యక్షత మీద అది కట్టబడియున్నది. రక్తమాంసములు.... మానవ సంబంధమైన బైబిలు సెమినరివారెంత మంచివారైనను దీనిని అందు నేర్చుకొనలేవు, స్థాపన సంఘములు అవి ఎంత మంచివైనను దీనిని అందు నీవు నేర్చుకొనలేవు. రక్తమాంసములు దీనిని నీకు బయలు పర్చలేదు. నీవు ఎట్లు నీ యొక్క తెలివి తేటలతో ప్రసంగించుటకు గల భావము కాదు అది, నీవు ఎట్లు వంగి వందనములు చేయవలెనో అట్టి తాత్పర్యమును కలిగియుండుట కాదు. అది లేదా ఏ గొప్ప కార్యమును నీవు ఈ భూమిమీద చేయవలెననునట్టి తాత్పర్యము కలిగినది కాదు. అది ఏమైయుండవలసియున్నదో, అది కాదు ఇది. ఏదో ఒక గొప్పగా కట్టునది లేదా చేయునది కాదు, అది దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతను గూర్చినదైయున్నది. ఆయన వాక్యమైయుండెను. “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద వుండెను, వాక్యము దేవుడైయుండెను. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను.” అది దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతయై యుండెను.

48

యేసు ప్రత్యక్షపరచబడిన దేవుని కుమారుడని - పేతురునందున్న ఆత్మ బయలుపర్చెను - మహిమైశ్వర్యముగల దేవుడు, దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచుచు, “ఈ బండ మీద [వాక్యము యొక్క ఆత్మీయ బయలుపాటు] నా సంఘమును కట్టుదును.” ఎందుకు? ఈయన దేవుని కుమారుడని ఈ ప్రవక్తలు దేవుని స్వాధీనమందుండి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడినయెడల, సిలువకు ఈ ప్రక్కననున్న ఆ ఆత్మయే అదే విషయమును బయలుపరచును. నీవు దానిని గ్రహించితివా?

“రక్తమాంసములు....” దానిని నీవు ఒక సెమినరీలో (బైబిలు కళాశాల) నేర్చుకొనలేవు. నీవు ఒక డి.డి. మరియు ఒక పి.హెచ్.డి. మరియు ఎల్.ఎల్.డి. డిగ్రీలు కలిగియుండగలవు. అది మంచిదే. దానిని కలిగియుంటినని నేను ఇచ్చయించితిని. అది సరియే, అయితే అదియును కాదు అది. ఆ డిగ్రీలు కలిగియుండనవసరము లేదు, అయినను వాటిని కలిగియుండుట మంచిదే. నీవు కలిగియున్న దీని అంతటితో (ఆ డిగ్రీలు) (+) కలుపగలవు; కాని కలిపిన (+) ఈ డిగ్రీలు తుడుపు పెట్టిన, దీనిని నీవు పొందుదువు. (వాక్య ప్రత్యక్షత అను) అదియే ఇదియై యున్నది! (ఆ వాక్య ప్రత్యక్షత అనునది) అది కానిచో, ఏలాగైతేనేమి (వాక్య ప్రత్యక్షతను కలిగించు) దీనినే కలిగియుండునట్లు నేను ఇచ్చయించుచున్నాను.

49

“రక్తమాంసములు నీకు బయలుపరచలేదు.” విద్యాభ్యాస మార్గము ద్వారా నీ వెన్నడైనను దానిని నేర్చుకొనలేవు. స్థాపన సంఘము ద్వారానైనను నీవు దానిని నేర్చుకొనలేవు. విద్యనభ్యసించుట మరియు స్థాపన సంఘములు మంచివే, అవి అందులో ఒక భాగమైయున్నవి. కాని ప్రజలు ఎక్కువ ప్రాధాన్యతను ఈ భాగమగు దానికి ఇచ్చుచు, ఆత్మీయ ప్రత్యక్షతను నిరాకరించుచున్నారు.

“పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి మీకు బయలు పర్చెనేగాని రక్తమాంసములు మీకు బయలుపర్చలేదు. ఈ బండమీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నాను.”

ఇప్పుడు పాతాళ లోక ద్వారములు దేనికి విరోధముగా నున్నవో గమనించి చూడుము. అది స్థాపన సంఘములకును, ప్రభుత్వము వారి అనుమతిని పొందు వాటికిని విరోధముగా లేవు. వాటన్నిటిని ఈ లోకము అనుమతించును. మనలో ప్రతి ఒక్కరును అమెరికా పౌరులుగానున్నారు గనుక ఒక స్థాపన సంఘముగా నుండుటకు హక్కును కలిగియున్నాము. అది మంచిదే, దానిని మనము అభినందించుచున్నాము. అయితే పాతాళ లోక ద్వారములు దానికి వ్యతిరేకముగా లేవు. అవి యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు యుగ యుగములు ఒకే రీతిగా ఉన్నాడను ఆత్మీయ ప్రత్యక్షత. ఇప్పుడు మనము ఇచ్చట కలిగియున్న దానికి విరోధమైయున్నది. దేనిని అది వ్యతిరేకించుచున్నవో అదే ఇది. ఆ పాతాళ లోక ద్వారము వానికి విరోధముగా నుండినను అవి దాని ఎదుట నిలువబడనేరవు.

50

అక్కడే నీవున్నావు, ఆత్మీయమైన వివేచనయైయున్నది. అది ఎవరైనప్పటికిని, నేను పనిచేయుచున్న ఉద్దేశ్యము సాధించుటకు కొరకు అతడును పనిచేయ ప్రయత్నము చేయుచున్నంత కాలము, అతడు నా సహోదరుడు. అతడు ప్రవక్తగాను, పాష్టరుగాను, డికనుగాను, లేదా మరేదైనదిగానో అతనిని ఉండనిమ్ము; ఏ మార్గమందైనను దేవుడు అతనిని గౌరవింపనిమ్ము, అతడు నన్ను అగౌరపర్చనీయుడి, లేదా అతనికిష్టమైనది నా ఎడల చేయనీయుడి, అయినను అతడు నా సోదరుడే. మేము ఒకే ఉద్దేశ్యము కొరకు పనిచేయుచున్నాము. మా యొక్క పనినంతటిని దూరమందు అదృశ్యముగా నున్న ఆ దేవుని రాజ్యములోనికి పంపుచున్నాము. నేను ఏ ఆత్మీయ వివేచన కలిగి దేవుని ఆత్మీయ ప్రత్యక్షతతో పని చేయుచున్నానో, అతడును అదే విషయము కలిగి పనిచేయుచున్నాడు.

51

మరొక రాత్రి ఒకచోట నేను, “ఆదినుండి ఆలాగు జరుగలేదు,” అను అంశముపై వేరొక రాత్రి నేను ప్రసంగించియున్నాను. నీవు ఆరంభమునకు తిరిగి వెళ్ళవలయును. ప్రారంభమందు భూసంబంధమైన జ్ఞానముగల కయీను ఉండెను. అతడు చక్కని చర్చిని కట్టెను. అతడు చక్కని బలిపీఠము కట్టెననియు దానిపై బలిని అర్పించెననియు యదార్థముగా ప్రార్థించెననియు, వందనములు చెప్పెననియు, మరియు, అతని యొక్క దశమభాగములను అర్పించెనని మనము చెప్పుదుము. అతడు హేబేలు వలే దైవభక్తిగలవాడిగా నుండెను.

52

ఆ దినములలో బైబిలు లేకుండెను, కాని ఆత్మీయ ప్రత్యక్షత వలన, పొలమందలి ఫలము పాపము చేయుటకు కారణము కాదని హేబేలు ఎరిగెను. వారు తినినది యాపిల్ ఫలము కాదని అచ్చట నుండి బయటకు గెంటివేయబడిన హేతువు ఆ ఫలము కాదని అతనికి ప్రత్యక్షత తెలియజేసెను. అది జీవమైయుండెను, వేరుచేయబడిన జీవము; అందువలన అతడు తనకు కలిగిన ఆత్మీయ ప్రత్యక్షతను బట్టి విశ్వాసము వలన అతడు ఒక గొర్రెపిల్లను తెచ్చి దానిని బలిగా అర్పించెను. ఆమెన్! దేవుని యొక్క ప్రత్యక్షత అతడు అర్పించవలసినది ఫలము కాదని అతనికి ఆత్మీయ ప్రత్యక్షత ద్వారా బయలు పర్చబడెను. అది యాఫిల్ అనియో, ఒక ఎర్రని పండు అనియో, ఎండిన ద్రాక్షఫలమనియో, మరి ఏ ఇతర ఫలములు కాదు, జీవము నుండి వేరు చేయబడుటయైయున్నది. అందువలన జీవమును తీసికొని వచ్చుటకు వెళ్ళి ఈ ఫలములకు బదులుగా దానిని అర్పించెను.

53

ఫలము నీ సొంత చేతిపనియైయున్నది. “నేను వెళ్ళి దీనిని కట్టుదును.” “నేను వెళ్ళి దానిని చేయుదును.” “నేను ఇతరులకు సహాయము చేయుదును.” అదంతయు మంచిదే.

వారిరువురు బలిపీఠములను కలిగియుండిరి. అది మంచిదే. అయితే దేవుని యొక్క ఆత్మవలన సత్యము బయలు పర్చబడియుండుట కలిగియుండవలెను. యుగముల నుండి బండగా చెప్పబడుచు వచ్చిన ఆ బండపై హేబేలు తన గొర్రెపిల్లను వధించినట్లు, ఆ బండపై క్రీస్తు వధింపబడెను. హేబెలు తన చేతులను ఆ చిన్న గొర్రెపిల్ల మీద ఉంచెను, (ఆ దినములలో ఈటె లేదా బల్లెము కాని లేకుండెను), రాతిని తీసికొనెను, మరియు ఆ చిన్న గొర్రెపిల్ల గొంతును నరుకుటకు ఆరంభించెను. ఆ స్వల్పమైన దీనత్వముగలది, ప్రాణము విడుచుచు, చనిపోవుచుండగా హేబేలు యొక్క చేతిని దాని రక్తమునందు ముంచినది మరియు దానియొక్క ఉన్నిని కూడ ఆ రక్తముతో ముంచినది. అది కొట్టుకులాడుచు, అరచుచు చనిపోయెను.

54

అది దేనిని గూర్చి సూచించునట్లు మాట్లాడెను? నాలుగువేల సంవత్సరములకు తరువాత దేవుని యొక్క గొర్రెపిల్లను గూర్చి చెప్పబడిన దానిని సూచించు ఆత్మీయ ప్రత్యక్షతయై యున్నది. ఆయనను మతసంబంధమైన సంఘము నిరాకరించినది, మరియు ఆయనను బెయల్జేబూబు, దయ్యము పట్టిన వాడని పిలుచుచుండిరి. దీనిని గూర్చి మాట్లాడిన ప్రవక్తలను ద్వేషించిరి. “మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని, లోపల చచ్చినవారి యెముకలతోను నిండియున్నది,” అని యేసు చెప్పెను. “మీరు వారి సమాధులను కట్టించిరి. వారిని ఆ సమాధులలో పెట్టినవారు మీరే. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. వారు ఆత్మీయ ప్రత్యక్షతను కలిగినవారు కారు, ఆయన దేవుని యొక్క గొర్రెపిల్లయు ఈ విధముగా అతని యెడల జరుగబడునని మరియు ఆ విధముగా ఆయన ప్రవర్తి౦చవలసియున్నదని వారెరుగకుండిరి.

55

ఆయన దేవుని వాక్యమును నెరవేర్చుచుండెను; ఈనాడు పరిశుద్ధాత్మ సంఘము చేయుచున్న కార్యములు మరియు వారు ప్రవర్తించునవి దేవుని యొక్క వాక్యమును నెరవేర్చుచున్నది. పెంతికోస్తు దినమున పేతురు చెప్పినదేమనగా, “ఈ వాగ్దానము మీకును, మీ పిలకును, దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.”

వీటినే ప్రవక్తలు దేవుని ఆత్మ వలన పేరేపింపబడినవారై - సాయంకాలము వెలుగు కలుగుననియు, మరియు తొలకరి వర్షము, కడవరి వర్షము కూడి ఈ కృపాకాలమందు వచ్చునని చెప్పిరి. అది ఏమైయున్నది? రానున్నది తొలకరి వర్షమైయున్నది, కడవరి వర్షము ముందుగానే జరిగిపోయినదై యున్నది. అవి జరిగిపోయినవి, అనగా తొలకరి మరియు కడవరి వర్షము కూడ శక్తితోను మరియు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానముగా పరిశుద్ధాత్మ ప్రత్యక్షపరచబడెను. దానిని నీవు సరిగా గ్రహింపగలిగితివి. నోవహు దినములలో ఆయన దేవుని యొక్క దీర్ఘశాంతము కనిపెట్టినట్లుగా. ఈ దినములందు ఇచ్చటను, పురాతన దినములందుండిన మేఘములను మరియు ఈ దినమునందుండిన మేఘములను ఒకదానిపై ఒకటి కూర్చినట్లుగా - దీర్ఘశాంతము కనిపెట్టుచున్నది. ప్రధమముగా తొలకరి వర్షము వచ్చెను. తొలకరి వర్షమును మనము కలిగియుంటిమి. ఇప్పుడు ఇక్కడ కడవరి వర్షమునందు, కడవరి వర్షము తొలకరి వర్షముతో వచ్చుచున్నది. తూర్పు మరియు పశ్చిమము కూడ కలిసికొనుచున్నవి, రెండు వర్షములు కూడి పడుచున్నవి. దైవిక స్వస్థతయు దానితో కలిపి (+) దేవుని యొక్క దూత హృదయమందలి రహస్యములను బయలు పరచుటయు మరియు అవన్నియు సంభవించుటకు తెచ్చుచున్నది. ప్రత్యక్షతపై ఆయన సంఘమును కట్టుదునని యేసు చెప్పెను.

56

కొందరు అప్పుడు లేచి, “మంచిది, తప్పనిసరిగా మేము ఫలాన వారమైయున్నాము; దానిమీద కట్టువారు మేము మాత్రమే,” అని చెప్పుచున్నారు.

ఆయన వాక్యమును కొంత ముందుకు చూచెదము. ఆయన యొక్క సంఘమునకు కడవరిగా ఆజ్ఞాపించినదేమనగా - “మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.” ఎంతవరకు అది అన్వయించును? సర్వసృష్టికి. ఎందరికి? సర్వసృష్టికి. “నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును...” సంఘమునకు అని కాదు. “వాడు” అను నది వ్యక్తిత్వమును సూచించు సర్వనామము “నమ్మినవాడు,” ఒక మనుష్యుడు.

దేవుని యొక్క రాజ్యములో మనమళ్లు లేరని డేవిడ్ డ్యూప్లెసిప్స్ చెప్పిన రీతిగా, పిల్లలు మాత్రమే అచ్చటనుందురు. మా తండ్రి పె౦తికోస్తు సంఘమునకు చెందిన వాడైనప్పటికిని కూడ, మరియు పరిశుద్ధాత్మను పొందియుండినను, నీవు ఈ సంఘమునకు అతడు వచ్చుచున్నాడని నీవు వచ్చినయెడల, అతడు నిన్ను ఒక మనముడినిగా తీసికొని వచ్చుచున్నాడని నీవు తలంచుచుండిన అది తప్పు. దేవుడు తన్ను తాను నీకు ప్రత్యక్షపరచుకొనవలెను.

ఏ మనుష్యుడు యేసును క్రీస్తు అని స్వంతబుద్ధితో పిలువడు. ఏ మనుష్యుడును యేసే క్రీస్తని పిలువడు, ఏలయనగా తన పాపమును గూర్చి ఒప్పుకొనుటకు మరియు వచ్చి, పశ్చాత్తాపపడుటకు అతడు నీచమైనదిగా ఎంచును. ఏ మనుష్యుడును పరిశుద్ధాత్మ అనుగ్రహించు బయలుపాటు ద్వారా తప్ప, యేసే క్రీస్తని పిలువడు. “మరియు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును; పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవు.” అక్కడే బయలుపాటు ఉన్నది. అక్కడే ఉన్నది, దానిపై ఆయన తన సంఘమును కట్టును.

57

ఎవరు కట్టిరి? పేతురా? కాదు, కాదు, కాదు. ఎవరు కట్టిరి? “దేవుని యొక్క ప్రత్యక్షతను పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించునని,” క్రీస్తు చెప్పెను. “కొంత కాలము, మిమ్మును విడిచి వెళ్ళుదును. నేను తండ్రిని వేడుకొందును, ఆయన ఆదరణకర్తను మీ కనుగ్రహించును, మరియు ఇవన్నియు మీకు జ్ఞాపకమునకు తెచ్చును.” అది నిజమేనా? ఈ ఉదయకాలమందు ఆయన ఏమి చేయుచున్నాడు? రాబోవు విషయములను ఆయన మీకు చూపును.“ ఈ కడవరి దినములలో పరిశుద్ధాత్మ సంఘమునందు ఉండుట.

ఇప్పుడు, “హల్లేలూయా, సహోదరుడా! అది నా యొక్క సంఘము,” అని నీవు చెప్పవచ్చు.

ఒక్క నిమిషమాగుము. యేసు, యోహాను 13:35లో - “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.” అంతమున రానున్న దేవుని రాజ్యమును గూర్చి ఆత్మ బయలు పరచిన సత్యమును దూరమందు ఉండుట చూచిరి, మరియు ప్రవక్తలు దేనిగూర్చి మొర్రపెట్టుచుండిరో, యేసును దేనిగూర్చి చెప్పెనో చూచితిమి. అదే పరిశుద్ధాత్మ నీయందుండి, “అది వాస్తవము! అది వాస్తవము!” అని కేకవేయుచుండెను. అది ఏమిటి? అది ఆత్మవలన బయలుపరచబడిన సత్యము. నేను నా సహోదరులను ప్రేమించుచున్నాను, వారు ఏ సంఘమునకు పోవుచున్నారనునది నేను తలంచను. వారు తొలకరి వర్షపు వారుగా నుండవచ్చును, కడవరి వర్షమునకు చెందినవారుగా నుండవచ్చును, లేదా ఏ వర్షమునకు చెందినవారు కాకుండవచ్చును. వారు ఎంతవరకు క్రీస్తు శరీరమందుండి, ఈ భూమిమీద తమ్మును గూర్చి ఏదైన ప్రత్యక్షపరచుకొనుటకు ఏదో సాధించుటకు గాక, కాని దేవుని రాజ్యము నిమిత్తమును, ఆయన రాకడ యొక్క మహిమను, ఆయన త్వరలో కనిపింపజేయు ప్రత్యక్షతను బయలుపరచు ఉద్దేశ్యమును కలిగి ఏదో సాధించుటకు ప్రయత్నించుచుండిన వారిని నేను ప్రేమించుచున్నాను.

58

ఇప్పుడు, ముగింపునందు, దీని గురించి మనము ఆలోచించవలెను. “ఈ బండ మీద నా సంఘమును కట్టుదును,” ఖచ్చితముగా. యోహాను 14:12లో యేసు చెప్పిన దేమనగా - “నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును.” ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనుటకు ఏ కార్యములను ఆయన చేసెను? పేతురును, పిలిప్పును - బావియొద్ద ఒక స్త్రీతో చెప్పబడిన దానిని జ్ఞాపకము చేసికొనుడి, ఆయన వారిని అన్యజనుల యొద్దకు వెళ్ళవద్దని ఎట్లు ముందుగా తెలియజేసెను, కాని ఈ కడవరి కాలమందు ఆయన ఆ రీతిగానే యుండును. “ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును,” అని ఆయన చెప్పెను. అక్కడ బయలుపాటు యున్నది, లోకస్థులకు ఇది మర్మముగా నుండునట్లు వ్రాయబడినది, అందువలన వారు దాని విషయమై ఏదియు ఎరుగరు. కాని, అమూల్యమైన సహోదరులును, అమూల్యమైన సోదరీలు అగు మీరు, అంధకార సంబంధులు కారు. మీరు రాత్రి సంబంధులును కారు, గాని వెలుగు సంబంధులై యున్నారు. మీరు వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల, మనము అన్యోన్య సహవాసము గలవారమైయుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అక్కడే మీరున్నారు, దేవుని పరిచారకులై యున్నారు.

59

యేసు... నేను ఇక్కడ లేఖనములో చూపించినట్లుగా, మార్కు 16, అవును, మార్కు 16, ఆయన చెప్పెను, “మీరు సర్వలోకమునకు వెళ్ళి.” ఆయన ఏ విధమైన సంఘమును ఏర్పాటు చేసెను. సంఘమునకు చివరి ఆజ్ఞ: “మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మనివానికి శిక్ష విధింపబడును.” ఇప్పుడు ఇక్కడ గమనించుడి. చూడుము ఆత్మీయ వివేచన... “నమ్మి బాప్తీస్మము పొందినవాడు.” ఏ మార్గము అనునది ఆయన సరిగా చెప్పలేడు, కాని దాని విషయములో కొంత గడబిడ జేయుదుము. ఏలాగైతేనేమి, అతడు బాప్తిస్మము పొందవలసియున్నది, అది అతని ఇష్టము పై ఆధారపడియున్నది. అతడు సాధించునది దేవుని యొక్క రాజ్యము నిమిత్తమైనయెడల - సోదరుడా, రమ్ము. మనము అదే ఆత్మతో అడుగులు క్రమముగా వేయుచు నడుచుచున్నాము. ఒకవేళ నేను తప్పైన యెడల, అది అట్టి విధముగా బయటకు వచ్చును. ఒకవేళ నీవు తప్పైనయెడల, అదియు అంతే. అయితే మన హృదయములు, మన అభిప్రాయములు, మనయొక్క గురి యొక్క ఉద్దేశ్యములు దూరమందున్న దేవుని యొక్క రాజ్యము కొరకునున్నవి. దూరమందు ఉండి మనము కల్వరివైపు సాగుచున్నాము.

60

ఎర్రని ఫలముతో చేసిన కేక్ వంటకము నాకును, నా తలంపునకు కలిగినట్లుగా, మరొక సహోదరుడు నేను దానిని ప్రేమించినట్లుగా అతడు ఇష్టపడక పోయినను, అతడు నా సహోదరుడే. నేను చేపలు పట్టుటను, అడవిలో వేటాడుటను అనేకులైన నా సహోదరులకు ఇష్టము లేకపోవచ్చును, కాని అతడు నా సోదరుడే. నేను చెప్పిన దానిని నీవు గ్రహించగలుగుచున్నావా? నాకు నా స్వంత అభిప్రాయములు కలవు, దాని అర్థము అతడు నా సహోదరుడు కాదని కాదు. అతనియొక్క తండ్రియే, నాయొక్క తండ్రియైయున్నాడు; అతని కుటుంబము, నా యొక్క కుటుంబము. అక్కడే నీవున్నావు.

యాకోబు యొక్క కుమారులు ఒకరి నుండి మరొకడు వేరు వేరు ఉద్దేశ్యములు కలిగియుండినను, అయితే వారందరికి తండ్రి ఒక్కడే. వారందరు కలసి ఒకే కార్యమును సాధించవలసియుండు అగత్యముండెను, కాని వారిలో ముఖ్యమైన వానిని ద్వేషించిరి, ఏలయనగా అతడు ఆత్మీయుడై యుండెను. సోదరులారా, నేను దేని గురించి మాట్లాడుచున్నానో దానిని చూడలేకున్నారా?

61

ఇప్పుడు గమనించండి, ముగింపులో, “మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మని....” [టేపుపై ఖాలి స్థలము.] “నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును; నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాటలాడుదురు.” అది ఏమిటి? ఆత్మీయ ప్రత్యక్షత. “వారు క్రొత్త భాషలు మాటలాడుదురు. పాములను ఎత్తి పట్టుకొందురు, లేక మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు, వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను.” క్రొత్త సంఘము అనునది ఆలాగు ఉండెను. ప్రవక్తలందరు ఏ మహా వ్యక్తి యేసుక్రీస్తు యొక్క సంఘమునకు చేయుచున్న దానిని ప్రచురపరచిరో, అదే ఇదై యున్నది. ఆయన ఆత్మ తిరిగి వచ్చి, ఆయన చేసిన కార్యములు తిరిగి ఆయన చేయునని ఆయన యొక్క ఆత్మ జరుగబోవునున్నవాటిని బయలుపరచెనని మనము చూడగలము.

62

నేను దీనిని చెప్పి ముగించవచ్చునా. నాకు ఒక డజను వ్రాసియుంచిన లేఖన వచనములు గలవు, కాని మనకు సమయము లేదు, చూచారా. కాని దీనిని వినండి. దీనిని చెప్పి ముగించుదును. తరిగి-జన్మించిన దేవుని యొక్క నిజ ప్రవక్త, బోధకుడు, ఆదివారపు పాఠశాల ఉపాధ్యాయుడు, ప్రవక్త, అపోస్తులుడు, లేదా మిషనరీ, అతడు ఏదైనా కావచ్చు, ఆత్మతో అభిషేకింపబడిన నింపుదలగలవాడై, అతని పూర్ణహృదయమునందు నిమగ్నత కలిగినప్పుడు, అతడు పనిచేయు కార్యాలయము ఏదైనను — ఉపదేశించుటయో, బోధించుటయో, సువార్త ప్రకటించుటయైనను, దర్శనములు చూడగలిగినను — అది ఏమైనను, అతడు దేవుని యొక్క రాజ్యము కొరకు చేయును. అప్పుడు దేవుని యొక్క ఆత్మ నేరుగా ఆ మనుష్యుని ద్వారా మాట్లాడుచు, దేవుని రాజ్యమును ప్రత్యక్షపరచును.

63

మనము, నేను బాప్టిస్టువానిగా, పెంతికోస్తువారైన మిమ్మును చూచినప్పుడు, మీరు నా సహోదరులని నేనెరుగుదును. నేను బాప్టిస్టు సంఘమునకు చెందినట్లుగా, మీరు బాప్టిస్టు సంఘమునకు చెందినవారు కారు. నేను ఎప్పుడైన ఒక సంఘమునకు చెందియుంటిని, అది బాప్టిస్టు మాత్రమే. కాని అట్లు చెందియుండినందున అది నా సేవకు అభ్యంతరముగా నిలువలేదు. దేవుని యొక్క ఆత్మ మీతో నుండుట చూచుచున్నాను. మీరు ఏమి చేయుటకు ప్రయత్నించుచున్నారో నేను ఎరుగుదును. మంచిది, బాప్టిస్టుగా నున్న నేను ఆ దృష్టితో చూచిన, తప్పక అసెంబ్లీ-ఆఫ్-గాడ్, ది-చర్చ్-ఆఫ్-గాడ్, ది-యునైటెడ్-పెంతికోస్టల్, మరియు ఇన్డిపెండెంట్సు, మనమందరము సహోదరులుగా నుండి, మనమందరము ఒకే ఉద్దేశ్యమును కలిగి, దానిని సాధించుటకు ప్రయత్నించుచున్నాము. మనము ఆత్మీయ వివేచనను కలిగియుందము.

64

ఇప్పుడు వినండి. ముగింపులో, ఒక మాటను చెప్పగోరుచున్నాను. మీలో అనేకులు రోగులును, బలహీనులుగానున్నారు, చాలమంది నిద్రించుచున్నారు, ఆత్మీయముగా చనిపోయినారు, ఏలయనగా వారు ప్రభువు యొక్క శరీరమని వివేచించకుండిరి. మనము కలిగియున్నది ఈ శరీరము రోగగ్రస్తమైనది! దేవుడు మనకు దేవుని యొక్క రాజ్యమును గూర్చిన ఆ బయలుపాటును గూర్చిన ఆత్మీయ వివేచనను కలిగియుండుటకును, మరియు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి, మన చేతులు కలిపి - “మనము సహోదరులము,” అని చెప్పునట్లు సహాయము చేయును గాక. నా భావమేమిటో చూచితిరా? మీరు కలిగియున్న ప్రతీ యొక్క చిన్న వరములను ఏదో మన స్వార్ధము కొరకు సాధించుటకు ప్రయత్నించకుందుము గాక. కాబట్టి ఆ వరములను దేవుని యొక్క రాజ్యము కొరకును, మనము ప్రతి ఒక్కరితో కలిసి పనిచేయుదము, మరియు యేసుక్రీస్తు యొక్క కార్యాభివృద్ధి కొరకు ప్రయాసపడుదము, ఏలయనగా ఆయన రాకడ సమీపమైయున్నది. దానిని నీవు నమ్ముచున్నావా?

65

మిమ్మును ఎక్కువ సమయము ఇచ్చట ఉంచినందున నేను ఎంతో విచారపడుచున్నాను. బ్రదర్ డేవిడ్ రేపటి దినమందు ఇచ్చట మీకు లేఖనములు ఉపదేశించుటకు వుండును. ఒక నిమిషము మనము తలలు వంచెదము. [ఒక సహోదరుడు అన్యభాషలు మాట్లాడుచున్నాడు. ఒక సహోదరి అనువాదము చెప్పుచున్నది.]

క్రైస్తవ సైనికులు, యుద్ధమునకై ముందుకు సాగుచుండుగా,

యేసు యొక్క శిలువ ముందు కదలుచుండగా;

మనము ఏకముగా, అందరము ఒక్క శరీరముగా;

ఒకరు నీరిక్షణ మరియు మరొకరు ధర్మము.

క్రైస్తవ సైనికులు ముందుకు సాగుచుండుగా!

(మీరు నమ్ముచున్నారా? మీ చేతులు పైకి ఎత్తండి.)

యుద్ధమునకై ముందుకు సాగుచుండుగా, (దేనితో?)

(మన లక్ష్యం)..... యేసు మనకు ముందు కదలుచుండగా.

దేవుడు మిమ్మును దీవించును గాక. మీ యొక్క కాపరి.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...