ఏలియా మరియు భోజన-అర్పణ
VGR COUNT-147 ఓ, అది నిజము కాదా! ''ప్రభువా, నేను పొందుకున్నాను.'' నేను పొందుకున్నది ఏమిటి? ఆయన చేసిన ప్రతియొక్క వాగ్ధానము, అది నాదే అయియున్నది.
ఇప్పుడు, మనము కూర్చొను ముందుగా, కొద్ది సమయము మనము మన తలలు వంచుదుము కావున అప్పుడు నేను ఇక్కడ ఉంచబడిన చేతి రుమాళ్ళ నిమిత్తము ప్రార్ధన చేయుట మరిచిపోకుం
2
మా ప్రభువా, సియ్యోను పాటల నిమిత్తము ఈ రాత్రి మేము నీకు ఋణపడియున్నాము, ఆ యొక్క పాత-కాలపు సువార్త మా హృదయాలను చెడుతనము నుండి శభ్రపరచును, మరియు పరిశుద్ధ గ్రందము నందు గల గొప్ప కపా వాగ్ధానములన్నీయు కూడ మావే. విశ్వాసము ద్వారా వాటిని మేము పొందుకొంటాము. మరియు దేవుడు ఒక వ్యక్తికి బట్టి చూడడు అని మనకు తెలుసు. మరియు పౌలు జీవించినటువంటి తరములో, ప్రజలు... చాలా మంది జబ్బున పడెను. వారు ఆయన యొద్దకు చేతిరుమాళ్ళు తీసుకు వచ్చెను, కండువాలు, మరి అతను వాటిని తన శరీరముపై యుంచి, మరియు మరలా వాటిని జబ్బుపడిన వారిపై మరియు బాధపడుచున్న వారిపై యుంచెను. మరియు మనకు లేఖనములు తెలియజేయున్నవి, ఆ యొక్క చెడు ప్రభావము కలిగిన ఆత్మలు ఆ ప్రజలను విడచి వెళ్ళగా - మరియు వారి భాదలు కూడ వారిని విడిచెను, ఎందుకనగా ప్రభువైన యేసునందు వారి యొక్క విశ్వాసమును బట్టి. దేవా, పౌలు సుమారుగా రెండువేల సంవత్సరముల క్రితమే నీ సన్నిదికి చేరెను. ఆ తరము ఆయనతో గతించెను, కాని నీవైతే ప్రతియొక్క తరమునకు దేవుడవైయున్నావు. ఇప్పుడు, ఈ రాత్రి కాల సమయమున ప్రజలు నీ యందు విశ్వాముంచారు మరియు మమ్మనుమేము నీకు సమర్పించుకొనుచున్నాము, ఈ రాత్రికి, ఈ యొక్క చేతిరుమాళ్ళు మరియు ఈ చిన్న వస్తువులు కలిగిన పెట్టెలను, మరియు మా పూర్ణహృదయముతో మా యొక్క ప్రార్ధనకు నీవు జవాబు ఇచ్చెదవనియు మరియు వారు తప్పకుండ స్వస్థత పొందుదురనియు నమ్ముచున్నాను. దీనిని దయచేయుము ప్రభువా. వీటిని మేము వారికి దేవుని యొక్క మహిమ నిమిత్తమై పంపుచున్నాము, ఆయన కుమారుడగు యేసుక్రీస్తు నామములో. ఆమేన్.
3
మీరు కూర్చోనవచ్చును. మరియు ఎవరైతే వీటిని ఇక్కడ ఉంచియున్నారో వారు ఈ యొక్క కూటము ముగిసిన వెంటనే వచ్చి తీసుకొనవచ్చును.
ఈ రాత్రి నేను ఎంతగానో ఆనందముగా ఉన్నాను. నేను హాజరు కావలసిన ఇంటర్వ్యూలు పూర్తి కాగానే ఆ పర్వతము మీదికి ప్రార్ధన చేయుటకు వెళ్ళాను. మరియు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ యొక్క ఎడారి సూర్యుడు మరలా నేను ఇక్కడికి వచ్చేట్లుగా చేస్తుంది. కాని ఈ రాత్రి నేను సంతోషముగా ఉండుటకు గల ఒక కారణము, నా యొక్క భార్య... మేము కలిసి ఉన్నంతవరకు, మరియు ఆమె దేవుని యొక్క గొప్ప దర్శనములను మరియు అవి జరుగుటను చూచెను. ఆ రోజున ప్రభువు యొక్క దూత మొదటిగా కన్పించినప్పుడు జెఫర్సన్-విల్ నందు ఆమె కూడ నదీ తీరమున ఉండెను, మరియు అది సంబంధిత జాతీయ దినపత్రికయందు కూడ ముద్రించబడెను. అది 1933 లో అనుకుంటా, ఆమె అక్కడ నిలచియున్నది, కాని.... ఆమె స్వరమును వినగలిగెను కాని వెలుగును చూడలేకపోయెను. అక్కడున్నటువంటి వార్త పత్రికలకు ఫోటోలు తీసేవారు కూడ ఆ వెలుగును చూచెను. కాని ఆమె చాలా చిన్న వయస్సులో ఉంది, ఆమెకు 12 సంవత్సరముల వయస్సుండవచ్చును, ఆమె ఎప్పుడ కూడ వెలుగును చూడలేదు. ఆమె ప్రజలను గమనిస్తూ ఉన్నది, చాలా మంది ప్రజలు మూర్చపోయారు. మరియు అది అక్కడే ఒక నిమిషము పాటు నిలిచియుండెను మరియు వెంటెనే అది నేరుగా తిరిగి ఆకాశములోకి వెళ్ళినది. మరియు వార్త పత్రిక దీని మీద ఒక పెద్ద వ్యాసాన్ని ప్రచురించినది, ''స్తానిక బాప్తిస్టు సేవకుడు పైన బాప్తిస్మము ఇచ్చుచుండగా, మర్మమయుక్తమైన వెలుగు అగుపించెను.“ ఈ వార్త కెనడా ప్రాంతమంతయు వ్యాప్తిచెంది, కెనడా ప్రెస్ అను పత్రికనందు కూడ ప్రచురించబడెను.
4
మరియు మూడు లేక నాలుగు సంవత్సరముల క్రితము, నేను చివరిగా ఫీనిక్స్ లో ఉన్నప్పుడు, నాతో పాటుగా సహోదరుడు జాక్-మూర్ కూడ ఉన్నాడని నేను నమ్ముచున్నాను, అతను ఒక రకమైన.... నా భార్య చాలా పిరికిదానివలె యున్నది. కాబట్టి అతను ఆమెను అనుకోకుండా వేదిక యొద్దకు పిలిచాడు, మరియు ఆమె కూడ మూర్చపోయినట్లు అయినది. మరియు నేను ఆ వేదిక యొద్దకు వెళ్ళిన తరువాత ఆమె పైకి వచ్చినది, మరియు అక్కడ స్వస్థత కొరకు అభిషేకముండెను; మరియు, ఆమె చెప్పినది, ఇలాంటి సన్నిదిని కలిగియుండటమనేది ఆమెకు ఇదే మొదటి సారి అని చెప్పినది. మరియు, గత రాత్రికి ముందు, ఆమె వేదికపై ఆయనను చూసింది, ఆమె మొదటి సారి ఆయనను చూసింది, ఇంతకు మునుపు ఎన్నడూ కూడ ఆమె ఆయనను చూడలేదు, అది (వెలుగు)వేదిక వద్ద నిలబడి ఉన్నప్పుడు. మరియు ఆమె వెలుపట ఉన్నప్పుడు నేను ఆమెను కలిసినప్పుడు.... ఆమె కళ్ళలో నీళ్ళు ఉన్నాయి, మరియు ఆమె చెప్పినది, ''బిల్లీ, నా జీవితములోనే మొట్ట మొదటిసారి, నేను దానిని (వెలుగును) చూసాను,'' అని ఆమె చెప్పినది. “నీవు ఒక స్త్రీ కొరకు ప్రార్ధన చేయుచున్నప్పుడు, మరియు ఆ స్త్రీ ముందుగా అది వచ్చియుండుట మరియు అక్కడ కొద్దిసేపు నిలిచియుండుట చూసాను, మరియు నీవు ఉన్నచోటనే అది తిరుగుచూ ఉండెను. మరియు, ఆ తరువాత, మరియు నీవు మాట్లడుట ఆపివేసిన వెంటనే, అది వెళ్ళిపోయెను,'' కాబట్టి దాని నిమిత్తమై నేను ఆనందించుచున్నాను అని ఆమె చెప్పెను. అది ఆ స్త్రీ కళ్ళముందుకి వచ్చిన దానిని బట్టి నేను ఆనందిస్తున్నాను. గమనించండి, మరియు ఆ చిన్న యవ్వనస్తురాలు దీనిగుండా వెళ్ళుటకు ఎంతో సిద్దపాటును కలిగియుండవలసి ఉన్నది, మరియు దానిని బట్టి నేను ఆనందంగా మరియు సంతోషంగా ఉన్నాను.
5
ఇప్పుడు, రేపు రాత్రి స్వస్థత కూటముగా ఉన్నది. మీకు తెలుసా, ఈ వారం అంతా కూడ స్వస్థతా కూటములు శుక్రవారం రాత్రికి ఉంటాయని మనము మాట్లడుచూ వస్తున్నాము. ఇప్పుడు, రేపు మధ్యాహ్నం లేక సాయంత్రము పెందలకడనే ఆరు గంటలకు రండి, కాబట్టి మీరు మిగతా కూటమునకు అబ్యంతరము కలుగజేయకుండా యుందురు. మరియు బిల్లీ, లియో, జీన్ మరియు వారు, ప్రార్ధనా కార్డులతో ఇక్కడ యుందురు, మీకు ఒక ప్రార్ధనా కార్డును ఇచ్చేదాని కొరకు(ఇక్కడకు వచ్చెదరు). మేము వేదికపై ప్రజలను తీసుకొని వారికి ప్రార్థన చేస్తున్నప్పుడు. ఇప్పుడు మేము... ప్రజలు నేర్పబడిన విధంగా నేను అమెరికన్ సమావేశాలను తీసుకురావాలి: హస్త నిక్షేపము చేయుట ద్వారా. ఇప్పుడు, అది లేఖనమైయున్నది, కాని అది యూదుల సంప్రాదాయం. అది అన్యజనులకు కాదు, కాని అన్యుజనులు దానిని కోనసాగించుచున్నారు. అన్యజనుడు ఒకడు, ''మీరు నా గృహమునకు రావటానికి నేను అర్హుడను కాదు, కేవలం వాక్యమును పలుకుము మరియు నా సేవకుడు బ్రతుకుతాడు.'' అది సరియే. కాని యూదుడు, ''మీరు వచ్చి నా కుమార్తె మీద చేతులుంచండి, ఆమె బ్రతుకుననెను.'' గమనించండి, అది వారి యొక్క సంప్రాదాయమై యున్నది; అది అన్యజనులకు కాదు.
6
రాత్రి వెంబడి రాత్రి, మరియు గడియ వెంబడి గడియ, రాత్రి యందు మరియు పగటి యందు, పరిశుద్ధాత్మ దిగివచ్చును, బయలుపరచుచూ, భవనము గుండా వెళ్ళుచూ, హృదయ రహాస్యములను గూర్చి మాట్లాడుచుండును. మీరు ప్రతిసారి అలాగు జరుగుట చూస్తున్నారు. అది మీకు ప్రభుని యొక్క సన్నిధి ఇక్కడయున్నదని మీకు తెలియజేస్తుంది. ఇప్పుడు, దీనిని మీరు అంగీకరించినట్లైతే, మీరు వెంటనే స్వస్థత పొందుతారు, ఎందుకనగా మీకు కలుగవలసిన స్వస్థత అంతయూ కూడ, అది ముందుగానే జరిగిపోయినది, అది 1900 సంవత్సరముల క్రితమే జరిగినది. మీరు పొందుకునటువంటి రక్షణన కొరకై మందుగానే వెల చెల్లించబడియున్నది, ఇప్పుడు అది మీదే, కేవలము నీవు దానిని స్వీకరించవలసియున్నది. నీకు రక్షణగా మారి 1900 సంవత్సరములు, లేక అంతకంటే ఎక్కువే అవుతున్నది. కాని మీరు కూటములలో నన్ను గమనించినట్లైతే, నేను చెప్తూ ఉంటాను, ''అది మిమ్ములను నమ్మునట్లుగా చేయుచున్నదా?'' చూడండీ, సూచనలు మరియు అద్భుతాలనేవి స్వస్థతకు మరియు రక్షణ కొరకు కాదు, కాని ఇవి దేవుని సన్నిది ఇక్కడ ఉన్నదని జనులు గ్రహించి మరియు అర్ధం చేసుకొనుటకు మాత్రమే. అప్పుడు ఆయన... ఆయనైతే... మరి అది ఎలాగు ఉండును…
7
అది ఎక్కువ మట్టుకు అద్భుతమైయున్నది. మనము ఇప్పుడు కేవలం అద్భుతాలు చూడటం ప్రారంభించాము. ఇప్పుడు అది ఒక వ్యక్తి యొద్దకు వచ్చినప్పుడు, వారిలో చాలామంది స్ట్రెచర్లలలో మరియు చక్రాల బండ్లలలో మరియు ఇంకా అలాంటి వాటిలో నుండి లేచి వెళ్ళెదరు. అది ఖచ్చితంగా ఒక అద్భుతం కాదు. కాదు. చూడండీ, క్రైస్తవ విజ్ఞాన శాస్త్రం దానిని కలిగి యున్నది. అది ఒక మానసిక స్థితి అయి యుండవచ్చు, దానిని బట్టి మీరు మీ యొక్క ఆలోచనా సరళిని మార్చుకొనవచ్చు. అది అదే అయి యుండెను అని మనము నమ్మటలేదు, ఎందుకనగా ఇది విశ్వాసమైయున్నదని నేను నమ్ముచున్నాను. కాని ఇంకా...
8
నేను ఫ్రాన్స్ నందు గల అల్సాస్-లోరైన్ లో, నేను ప్యారిస్ లో ఉన్నప్పుడు. నేను చనిపోయిన స్త్రీని అక్కడే ఉంచిని చోటికి వెళ్ళాను, ఆమె సమాధి చేయబడినది. మరియు వారు అక్కడున్నటువంటి ఒక రాయిని రుద్దుతారు, మరియు ప్రజలు అక్కడికి వికలాంగులతోను, చంక కర్రలతోను వెళ్ళారు, మరియు వారిని అక్కడ క్రిందికి దించి అక్కడ నుండి నడిచి వెళ్ళెను, ఆ చనిపోయిన స్త్రీ సమాధి యొద్ద రుద్దుతూ ఉన్నారు. ఆమె చనిపోయినది, మరియు ఇంక ఎంత మాత్రము మధ్యవర్తిగా యుండలేదు... అక్కడ కేవలం మానవునికి మరియు దేవునికి ఒకే ఒక మధ్యవర్తి యున్నాడు, మరియు ఆయనే యేసుక్రీస్తు. ఒక కాథలిక్ కుటుంబం నుండి రావడం వలన, వారు చనిపోయిన ప్రజలపై నమ్మకం కలిగియుందురని నాకు తెలుసు, అది వారి ఆత్మలు వారికి కొరకు మధ్యవర్తిగా ఉంటాయని వారు నమ్ముతారు. వేర్వేరు వ్యక్తులు, రాజకీయాలకు కొందరు, మరికొన్ని విషయాలకు ఇంకొందరు ఉన్నారని (కాథలిక్) ప్రజలు నమ్ముతారు. నామట్టుకైతే అది ఒక దురాత్మ కార్యమైయున్నది. నేను మీ యొక్క భావాలను దెబ్బతీయడం లేదు అని ఆశించుచున్నాను, అయితే నేను నిజాయితీగా ఉండవలెను. గమనించుడి, ఎదైనా చనిపోయినవారితో మధ్యవర్తిగా యుండటమనేది ఒక దురాత్మ కార్యము.
9
వారు నన్ను మెక్సికోలో, ''యేసు విషయమేమిటి?'' అని అడిగారు.
నేను అన్నాను, ''ఆయన చనిపోలేదు. ఆయన తిరిగి లేచాడు. ఆయన నిత్యమూ జీవించువాడు.'' చూచారా? ఆయన చనిపోలేదు; ఆయన సజీవుడు. మిగతావారందరు కూడ ఆవలిగట్టుకు చేరెను, లేఖనములు ఈ విధంగా చెప్పుచున్నాయి, 'అక్కడివారు ఇక్కడికి రాకుండా ఉండునట్లు, మరియు ఇక్కడివారు అక్కడికి పోకుండా ఉండునట్లు. ఏ మనుష్యుడు దాటకుండా ఉండునట్లుగా లేక ఎన్నటికి చేయకుండునట్లుగా. కావున అలాగని యేసు చెప్పినట్లైతే, అది దానిని స్థిరపరచును.
అయితే ఈ కార్యములు కార్యరూపములో ఉండుట మనము చూచాము. కాబట్టి ఇప్పుడు మరియు ప్రతిరాత్రి పరిశుద్ధాత్మ నిన్ను చేరుటకును ఆయన యొక్క ఉనికిని ఇక్కడుంచుటకును, ఒక మనిషి యొక్క సన్నిది కాదు. ఒక మనుష్యుడు కేవలం తనను తాను తగ్గించుకోలడు. ఒక వరము ద్వారా అతను ఆత్మ యొక్క ఒక నిర్దిష్ట రాజ్యములోకి తనను సమర్పించవచ్చు, అది మీకు దేవుని బయలుపరుచును. కాని దానిని నీయంతట నీవుగా విశ్వసించి మరియు స్వీకరిస్తే తప్ప అది పని చేయదు; మరియు ఆ తరువాత అది పని చేయును. చూడండి, మీరు ఆ విధముగా అక్కడ ఉన్నట్లైతే మరియు మీలో ప్రతి ఒక్కరూ - మీలో ప్రతి ఒక్కరూ అపనమ్మకంగా ఉన్నట్లైతే, దీని ఒక్క వాక్యమును కూడ నమ్మనట్లైతే, అది ఎప్పటికి పనిచేయదు.
యేసు, ఆయన తన స్వంతవారి యొద్దకుకు వెళ్ళినప్పుడు, అతని స్వదేశమునకు, వారి అపనమ్మకము వలన ఎన్నో అద్భుత కార్యములు చేయలేకపోయెను. మరియు అప్పుడు చేయనట్లైతే, ఆయన ఇప్పుడు కూడ చేయలేడు, ఎందుకనగా అపనమ్మకము చేతనే. గమనించండి, ఇది మీ విశ్వాసమైయున్నది.
కావున ఈ కార్యములు నెరవేర్చుటకై అది నిన్ను మరియు నన్ను ఏకముగా పరిశుద్ధాత్మతో పాటుగా తీసుకువెళ్తుంది; అదే దేవుడు తన వాక్యమును నిలుపుకొనుటకు ఇక్కడ ఉన్నాడు అని, నన్ను మరియు నిన్ను ఆనందింపచేయును.
10
అయితే పరిశుద్ధాత్మడు కూటములోనికి వచ్చినప్పుడు, ఆయన ఈ చివరి దినములలో ఏమిజరుగునని లేఖనములలో చెప్పెనో దానిని నెరవేర్పుచేయను, మరియు ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఏ విధముగా చేసాడో అలాగునే శ్రోతలపైకి వెళ్ళెను, మరియు హృదయ రహాస్యాలను బయలుపరుచును, మరియు ఆలోచనలను మరియు హృదయము మరియు మనస్సు యొక్క ఉద్దేశ్యాలను వివేచించునప్పుడు ఎవరైనా ఎలాగు అనుమానించగలరు? చూడండి, అక్కడ ఖచ్చితమైన అద్భతకార్యముండెను. వికాలంగులు నడుచుటకంటెనూ కూడ అక్క ఏదో ఒక అద్భుత కార్యమున్నది, ఎందుకనగా ఆత్మీయమైన శక్తి లేకుండా అది జరుగటనేది అసాద్యమైన కార్యము. ఆ విదముగా చేయుటకు అది ఖచ్చితముగా ఆత్మీయమైన శక్తియైయుండవలెను. కావున, మరియు మీరు చూచినట్లైతే, ఖచ్చితముగా బైబిల్ ఏదైతే చెప్పుచున్నదో మరియు వారు ఏదైతే... మరియు మనము ఎమి నమ్మచున్నామో. అది అరుచుకంటే కూడ ఒక అద్భుమైయున్నది. చూడండీ, భాషలు మాట్లాడేదానికంటే కూడ ఇది ఒక అద్భుతమైయున్నది. పౌలు ఆలాగు చెప్పెను. నిజమైన పరిశుద్ధాత్మ వలన భాషలు మాట్లాడుట కంటే, ఇది ఎక్కువైనా అద్భుత కార్యము. మనము చివరి అద్భుతము దగ్గర ఉన్నాము. ఇది బైబిల్ ద్వారా ఆ విధముగా ప్రవచింపబడెను.
11
కావున, ఈ రాత్రికి, వరుస గుండా మీపై చేతలుంచబడుటకు రేపటి రాత్రి వచ్చువరకు ఎదురు చూడనవసములేదు. ఇప్పుడు, మీపై చేతులువేయడం వలన మీ ఆలోచనలను వివేచించుట తప్ప అది ఇంకా ఎక్కువ ఏమి చేయదు — నాకైతే అది అంత ఎక్కువ కాదు. అప్పుడు మీరు స్వీకరించగలరు, దానిని పట్టుకొనుడి, ఇది మీదే. మరియు దానిని మీరు మీ హృదయమంతటితో నమ్మండి.
కాని రేపటి రాత్రి, మీరు... లేఖనము ఇలా చెప్పుచున్నది, ''సర్వలోకమునకు వెళ్ళి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి; నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును,'' అన్నీ సూచక క్రియలు. మరియు అప్పుడు, చివరిగా, ఆయన చెప్పెను, ''రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతనొందుదురు.'' అది సత్యము. అది నమ్మినవారి వలన కనబడును. మంచిది. ఇప్పుడు, మనము నమ్మినవారము, కావున ఆ విధముగానే రాత్రి తరువాత రాత్రి రోగులపై చేతులుంచుచున్నాము, మరియు దేవుడు వారితో గొప్ప అద్భుతాలను చేసెను. మనము చేతిరుమాళ్ళ మీద ప్రార్ధించగా, గొప్ప అద్భుతాలను కలిగియుంటిమి. మనము హృదయ రహాస్యాలను బయలుపరుచుట యందు గోప్ప అద్భుతాలను కలిగియుంటిమి. చూడండి, ఇదంతయు కలిసి దేవుని మహిమ కొరకు పనిచేయును. ఇది మనుష్యుని కొరకు కాదు, ఇది సంఘము కొరకు కాదు, ఇది దేవుని మహిమ కొరకు. దేవుని మహిమ కొరకు!
12
ఇప్పుడు, మనము ఈ రాత్రికి వాక్యమును తెరిచే ముందుగా... ఓ, మనము ఈ విధము పేజీలను వెనుకకు త్రిప్పెదము, కాని దేవుడే దానిని తెరువాలి; ఎందుకనగా లేఖనమనేది వ్యక్తిగత వివరణ కాదు (అనువదించేది కాదు), కాని లేఖనాన్ని రాసిన పరిశుద్ధాత్ముడే దానికి అనువాదకుడైయున్నాడు. కావున మనము ప్రార్థన చేయుచుండగా, ఇప్పుడు మన తలలను వంచెదము. మరియు మీలో ఎంత మంది ప్రార్థనలో జ్ఞాపకముంచుకోవాలనుకుంటున్నారు? దీనిని ఇప్పుడే తెలుసుకొనుటకు మీ చేతులను పైకెత్తుడి, ఏదీ ఏమైనా గాని, ఓ దేవా, చూడుము. మనందరికి అవసరతలున్నాయి, మనకు లేవా? నేను కూడ అవసరతలో ఉన్నాను, స్నేహితులారా. నేను నా చేతులను పైకెత్తియున్నాను.
13
పరలోకపు తండ్రీ, వినయముతో మరియు నెమ్మదిగా మరియు గౌరవముగా మేము మీ గొప్ప ఘనమైన సన్నిదిలోనికి వచ్చాము, ఒక విషయము జరుగబోవు ముందుగా, నీవు ఇక్కడ ఉండెదవని ఎరుగుదుము, ఎందుకనగా నీవు వాగ్ధానము చేసియున్నావు. నీవు వెళ్లిపోవుటకు ముందుగా చెప్పావు, ''ఎక్కడ ఇద్దరూ లేక ముగ్గురు నా నామమున కూడియుందురో, అక్కడ నేను వారి మధ్యన వుండుదునని. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చియైనను భూమి మీద ఏకీభవించినయెడల, అది పరలోకమందున్న నా తండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను“. ప్రభువా, నీ వాగ్ధానమును ఇక్కడ తెచ్చుటకు — నీ యొక్క రక్తము ద్వారా కొనబడిన — మరియు ఈ రాత్రి చేతులెత్తిన ప్రతీ మనుష్యుని, స్త్రీని, లేక పిల్లలను నేను అడుగుచున్నాను, వారి హృదయాలను మీరెగుదురు, వారు దేనికొరకైతే అడుగుచున్నారో దానిని వారు పొందుకొనెదరు గాక. ప్రభువా, దానిని దయచేయుము.
మేము అవసరతలో ఉన్నవారము. నీ యొక్క మహా విరోధియైన శత్రువుతో మేము ఒక అంధకార లోకములో నడుచున్నాము, మీ యొక్క పరిశుద్ధాత్మ లేనట్లయితే మేము వానితో ఏ విధముగాను పోరాడలేము. అందుచేతనే మేము నమ్ముచుతూ, విశ్వసిస్తూ, మరియు ఆయన మాకు ముందుగా వెళ్ళి, మార్గమును సరాళము చేయుటకును విశ్వాసములో నడచుకొనుచున్నాము. మా అలసిన అడుగుల కొరకు ఏర్పాటు చేసిన మార్గములో చాలా ఇబ్బందులు కలవు, కాని మరణమును, పాతాళమును, సమాధిని జయించిన రక్తము కారుచున్న ఆయన పాదములను అనుసరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము.
నీ పరిశుద్ధాత్మచే ఈ రాత్రి మమ్ములను నడిపించుము, ప్రభువా, చెప్పబోవు మాటలకు, మరియు ఆ మాటలను అవసరత కలిగిన వారి హృదయాలకు చేర్చుము. అప్పుడు, ప్రభువా, ఈ కూటము అనంతరము మరియు మా యొక్క వేర్వేరు గృహములకు వెళ్ళుచుండగా, మేము మరలా చెప్పులాగున, ఎమ్మాయు గ్రామము నుండి వచ్చిన వారి వలె, ''ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా?'' యేసు నామమున, ఆయన నిమిత్తము దీనిని అడుగుచున్నాము. ఆమెన్.
14
మీరు లేఖనాలను చదవగోరినట్లైతే, నాతో పాటుగా I రాజుల గ్రంధమునకు త్రిప్పుము. నేను 17వ వచనంలోని కొద్దిభాగమును చదువుటకు ఇష్టపడుచున్నాను... 17వ అధ్యాయము, మరియు దానికి ముందుగా నేను 14వ వచనమును మొదలుపెట్టెదను. I రాజుల గ్రంధము 17వ అధ్యాయములోని 14వ, 15వ మరియు 16వ వచనములను చదువుడి.
భూమిమీద యోహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యోహోవా సెలవిచ్చియున్నాడు అనెను.
అంతట ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాటచొప్పున చేయగా: అతడును ఆమెయు ఆమె యింటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి.
యోహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు.
15
ఆమె నిద్రలేచినప్పుడు అది దాదాపు పగటివెలుగు వచ్చేయుంటుంది. ఆమె ఒక చిన్న దుఃఖకరమైన ఎడ్పును గది నుండి వచ్చుట వినెను, ఆమె తన అలసిపోయిన తలను ఆ దిండుపై త్రిప్పెను. మరియు ఆమె ఆ రాత్రంత కూడ నిద్రపోలేకపోయెను. ఆమె ఈ గొప్ప విషాద పరిస్థితి నుంచి చలించిపోయి యున్నది. మరియు ఆ చిన్న బాలుడు ఇంకా నీరసించిపోయెను, కనీసం 20 లేక 30 నిమిషాలు కూడ నిద్రించలేకపోయెను, మరియు అతని చిన్న స్వరమును వినగలుగుచున్నాను, ''అమ్మా, నువ్వు మరలా వంటగదిలోకి వెళ్ళి చూడు మరియు అక్కడ కనీసం ఒక చిన్న రొట్టె ముక్క అయినా ఉందేమో? నేను చాలా ఆకలితో ఉన్నాను! నేను ఏ మాత్రము నిద్రించలేక పోవుచున్నాను.''
మరియు ఆమె అతని యొక్క చిన్నబోయిన ముఖమును చూసెను, అతను కుంగిపోయే చిట్టి బుగ్గలతో, మరియు అతని యొక్క చిట్టి కళ్ళు పసుపు రంగుగా మారెను, అతని పొడవాటి జుట్టు కత్తించకుండానే క్రిందపడిపోతుంది, అతని చిరిగిపోయిన చిన్న రాత్రి చొక్కా, ఆమె కన్నుల నుండి పెద్ద కన్నీటి బొట్లు అతని చిట్టి ముఖముపైన పడిగా, ఆమె అతని చెంపలపై నిమిరి, ''చిట్టి తండ్రీ, అర్దం చేసుకొని నిద్రపోవటానికి ప్రయత్నించు,'' అని చెప్పెను.
16
మూడు సంవత్సరాల గడచెను భూమి మీద ఎక్కడా వర్షము లేదు. ఆమె నేలపై మోకరించెను. ఆమె దేవుని మోర్రపెట్టుట నేను చూడగలుగుచున్నాను. ''ఓ ప్రభువైన దేవా, యోహోవా, నీవు మా పితరుల దేవుడవు, సంవత్సరము వెంబడి నీ పిల్లలను పోషిస్తూ వస్తున్నవాడవు, మరియు నీకు నిజాయితీగా మరియు నమ్మకంగా ఉండుటకు నేను ప్రయత్రించాను,'' అని చెప్పెను. మరియు ఇప్పుడు నా చిన్న పిల్లవాడు ఏదో ఒకటి తినుటకు కేక వేయుచున్నాడు, మరియు అతనికిచ్చుటకు ఏదియును లేదు. చాలా వారముల నుండి మేము 3 లేక 4 రోజులకు ఒకసారి ఆహారము తీసుకుంటున్నాము, మరియు ఇప్పుడు అది కూడ అయిపోయి, కొంచెం పిండి మరియు కొంచెం నూనె మాత్రమే మిగిలియున్నది. మరియు దీనిని ఉదయము వరకు ఉంచుటకు నేను ప్రయత్నిస్తున్నాను, ఎందుకనగా మేము రాత్రి పూట చనిపొవుటకు ఇష్టపడుటలేదు. ఓ దేవా, నేను ఏమి చేసాను? నేను నీ దాసురాలను, నీతిగా జీవించినదానను. నా భర్త ప్రభువు కొరకు యుద్దము చేసి చనిపోయాడు, మరియు ఇప్పుడు నేను కొన్ని సంవత్సరాలుగా విధవరాలిగా ఉన్నాను, మరియు నేను నీ ఆజ్ఞను అనుసరించి నిజాయితీగా ఉండుటకు ప్రయత్నించాను. మరియు చనిపోవలసిన సమయం వచ్చినా నేను చింతించను; కాని నా చిన్న బాలుడు, ఎదో ఒకటి తినుటకు అర్ధించినప్పుడు అతనికి తినుటకు ఏమి ఇవ్వలేక - అది నా హృదయమును ముక్కుగా చీల్చి కన్నీరు పెట్టించుచున్నది.''
17
మరియు ఆమె ప్రార్ధన చేయుట ముగించి, ఆమె పైకి లేచెను. మరియు అతను మరలా కొంత సమయము నిద్రపోయెను. మరియు ఆమె తన చేతులను పైకెత్తెను, మరియు పూర్తిగా చినగిపోయిన రాత్రి గౌను ఆమె ధరించెను. ఆమె కిటికి దగ్గరకు వెళ్ళి బయటకు చూస్తూ, మరియు ఉదయము కాబోవుచున్నది. ఓ, చాలా వేడిగా ఉండెను!
తీర్పు యొక్క వేడి గాలులు దేవుని మరచిన ఒక దేశముపైన వీచుచున్నవి. అది అహాబు యొక్క పరిపాలనా సమయము, ఇశ్రాయేలీయులకు అంత్యంత క్రూరమైన మరియు చెడ్డవాడైన రాజతడు. మరియు ఒక పాపియైన, విగ్రహారాధికులైన యెజబెలును వివాహము చేసికొనెను. మరియు ఎప్పుడూ విజయము పొందని ఆలాంటి ఒక మిశ్రమ వివాహం. అది ఎన్నడూ విజయము పొందనేరదు. స్త్రీయైన పురుషుని మార్గములోనికి రావాలి, లేదా పురుషుడైన స్త్రీ మార్గములోనికి వెళ్ళాలి. మరియు ఆమె ఒక ఆకర్షణీయమైన చిన్నదైన స్త్రీ, మరియు ఆహాబు నులివెచ్చని విశ్వాసి, ఆమె ఆలోచనలకు తావిచ్చెను, ''ఓ మంచిది, మతమనేది నాకెందుకు పనికిరాదు, నేను ఒక రాజును,'' అని చెప్పెను. మరియు ఇంకనూ వారు దేవుని యొక్క బలిపీఠములను పడగొట్టి, బయలు యొక్క బలిపీఠములను కట్టుకొనెను. మరియు అదికారము క్రిందనున్న సేవకులు అనుమతించే వరకు నిజమైన మతస్తులకు చాలా భాదాకరముగా వుండెను.
18
కొంతకాలం క్రితం నేను సేవకులను గూర్చి లేక ఇలాంటి దినమున మరొక విషమును గూర్చి ఒక వ్యాఖ్యను చేశాను, మరియ ఒక గుంపు వారు నన్ను కలిసి, ''సహోదరుడా బ్రెన్హాం, మా ప్రజలు మమ్ములను ఇబ్బంది పెడుతున్నారు!'' అని చెప్పిరి. దానివలన అదే జరుగును. సంఘ సమూహమును సేవకుడు గనుక అలరించునట్లయితే వారు బయటకు వెళ్ళిపోతారు.
మరియు చాలాకాలం సేవకులు రాజు ప్రభావం క్రింద ఉన్నారు. ఎందుకనగా పాపము అనుమతించబడెను, అక్కడ పరిమితులే లేవు. ఇది నేడు ఉన్న స్థితికి సరిగ్గా పోలియున్నది. ఎందుకనగా దేశమే ఈ విషయాలను అమోదించినది, ప్రజలు పేరు-ప్రఖ్యాతులు పొందాలని కోరుకుంటున్నారు. వారు అనుకొనుచున్నారు, ''దేశం ఆలాగు చేయమని చెప్పినంత కాలము, ఇది సరియైనదే.'' వారు నేడు ఆ విదముగానే చెప్పుచున్నారు, ''దేశం చెప్పినంత కాలము బీరు అమ్ముట కూడా సరైనదే, కాబట్టి త్రాగుట కూడా సరైనదే. దేశం కనుక మన స్త్రీలను వీదులపై సగం దుస్తులను అనుమతించినట్లైతే, మరియు చట్టం కూడ వారినేమి చెయ్యదు, ఎందుకనగా అది అనుమతించబడెను కనుక.'' అది దేశానికి సరైనదే కావచ్చు, కాని దేవుని యొక్క గొప్ప గ్రంధములందు నీవు బాధ్యుడవు, మరియు దేవుని ఎదుట తప్పక సమాధానం చెప్పవలసి ఉంటుంది. కాని వారు పడిపోయి ఉన్నారు, వారు తప్పక భారము క్రింద యుండవలెను.
19
మరియు దేశమంతటా సంపద పెరుగుటవలన, మరియు వారు సంపద పెరుగుటనేది దేవుడు వారితో ఉన్నాడనుటకు ఒక సూచనగా భావిస్తున్నారు. అదంతా నిజము కాదు. దేవుడు నీ దగ్గరకు వచ్చే విధానం...
ఒక పాత సామెత ఉండేది, దేవుని అవమానపరుచు సామెత, అది, ''దేవుడు తమకు తాము సహాయం చేసుకొనేవారికి సహాయం చేస్తాడు.'' అది దేవునికి అవమానకరమైనది! దేవుడు తమకు తాము సహాయం చేసుకోలేనివారికి సాయం చేస్తాడు. ఎవరికైతే కృప అవసరమో, వారికే ఆయన దేవుడైయున్నాడు. మరియు ఆయన కృపగల దేవుడైయున్నాడు. మరియు ఆ సామెత ఏమి చెప్తుందంటే, ''దేవుడు తమకు తాము సహాయం చేసుకోనేవారికి సహాయం చేస్తాడు,'' నీకు నీవు సహాయపడినట్లయితే, నీకు ఆయన అవసమనేది ఉండదు. కాని ఆయన తమకుతాము సహాయం చేసుకోలేని వారికే సహాయం చేస్తాడు.
20
కాని దేశము ఏమనకుంటుందంటే, వారు మంచిగా తినునంతకాలం మరియు మంచిగా దుస్తులు వేసున్నంత కాలము, అప్పుడు అంతా సరియైనదే అని.
కాని అక్కడ ఒకరున్నారు (ఏలియా) ఇప్పటికి పాత-కాలపు పద్దతులతో, వారు అక్కడ దేవుడున్నాడని అది పాత-కాలపు విధముగా ఉన్నాడని నమ్మెను, ఆయన వాక్యమును నిలుపుకొను దేవుడని నమ్మెను; అబ్రహాము, ఇస్సాకు, మరియు యాకోబు దేవుడని, పరిశుద్దుడని మరియు ఆయన పరిశుద్ధతకు పూర్తిగా సమర్పించుకోవాలని నమ్మెను. కాని యెజెబేలు మరియు ఆమె యొక్క ఆధునికవాదులు అతడిని ద్వేషించెను. అతను వారికి యొక్క సంఘ కాపరియైయుండెను, కాని వారు దానిని నమ్మలేదు. కాబట్టి ఆయన తన జీవితము కొరకు దాగియుండవలసి వచ్చెను.
21
మరియు దేవుడు అతనిని కొండపైకి పంపెను, మరియు చెప్పెను, అతనికి వార్తమానము ఇవ్వుము, మరియు ''క్రిందికి దిగి వెళ్ళి, ఆ చెడ్డవాడైన ముసలి రాజుతో, 'యోహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,' “నీవు సెలవిచ్చువరకు ఇక మీదట వర్షమైనను, లేక కనీసం మంచైననూ పడబోదు,'' అని చెప్పమనెను. సమయం వచ్చినప్పుడు వర్షమును పిలుచుటకు ఏలియాకు అదికారము ఇవ్వబడెను. కాని ఆయన పరలోకపు తాలపు చెవులను కలిగియున్నాడు, ఆయన తెరువ గలడు లేక మూయగలడు. మరయు, ''మరియు నీవు అరణ్యములోనికి పొమ్ము... ఈ గంధర గోళములో నుండి అరణ్యములోనికి, వారినుండి బయటకు రమ్ము. నీవు వారికి బోధింతివి కాని వారు నీ మాట వినక పోయిరి, మరియు వారు నిరంతరము దారుణంగా తయారగుచున్నారు. అరణ్యములోనికి వెళ్ళుము, కెరీతు వాగు దగ్గర గాగియుండుము, మరియు నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలముకు ఆజ్ఞాపించియున్నాను'' అని చెప్పెను. ఓ, ప్రజలు ఆహారమివ్వట్లయితే, దేవుడు దానిని చేయుటకు కాకులతో చేయించగలడు!
22
యోహాను చెప్పెను, ''దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు.''
యేసు చెప్పెను, ''వీరు ఊరకుండినయెడల ఈ రాళ్ళు కేకలు వేయును.''
దేవుడు ఏది అనుకుంటే దానిని చేయగలడు. ''నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని, మరియు అవి నీకు ఆహారమునుతెచ్చును,'' అని ఆయన చెప్పెను. మరియు అవి అతనికి మాంసమును రొట్టెను తెచ్చెను.
ఎవరో ఒకసారి, ''అవి ఎక్కడ నుండి తెచ్చెను, సహోదరుడా బ్రెన్హాం?'' అని చెప్పెను.
''నాకు తెలియదు. నాకు తెలిసినది ఒక్కటే, అవి తెచ్చెను. యేసు అయిదు చేపలను మరియు... లేక అయిదు రొట్టెలను మరియు రెండు చేపలను తీసుకొని అయిదువేల మందికి వడ్డించెనో, అక్కడ నుండే అవి కూడ తెచ్చెను. ఇది సర్వశక్తిమంతుడైన అదే దేవుని చేతిలో నుండి వచ్చెను,'' అని నేను చెప్పాను. అవి అతనికి చేపలను మరియు రొట్టెలను తెచ్చెను, కాకులు, క్రిందికి దిగివచ్చి ఏలియాకు అప్పచెప్పెను, మరియు అతను వాటిని తినెను, మరియు అతడు క్రిందికి వంగి మరియు వాగు నీటిని త్రాగెను. దేవుడు తన ప్రవక్తకు విశ్రాంతిని ఇచ్చెను.
23
ఓ, దేవునికి తప్పించుకొను మార్గమున్నదని నేను చాలా సంతోషించుచున్నాను! మరియు వారు ఆతనిని గూర్చి వెర్రివాడని తలచిరి, ఆ ముసలి ప్రవక్త. ఒక ముసలి సంతోషమును హరించువాడు ఎప్పుడు కూడా వారి చిన్న ఆనందపు విందుల నుంచి సంతోషమును తీసివేసి, వారికి అది పాపము అని చెప్పెను. మరియు అతను దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ, పర్వతముల మీదికి వెళ్ళి, ఉన్నత శిఖరములపై కూర్చుండెను, దేశములోనే ఎడారియైన ప్రాంతము, కాని దేవుడు ప్రవహించు వాగును ఉంచెను. మరియు వారు నీటి కొరకు అలమటించుచున్నారు.
24
మీకు తెలుసా, దేవుడు ప్రార్ధనలకు జవాబిచ్చు మార్గమును కలడు. ఈ దయనీయమైన స్త్రీ నీతిగా ఉండెను. మరియు ఆమె మరలా పెండ్లి చేసుకొనలేదు, ఆమె మహిమనందు తన భర్తను కలుసుకొనుటకు ఒంటరిగా జీవిస్తున్నది. ఆమె ఒక గౌరవమైన స్త్రీ. మరియు కొద్ది వారాలలోనే కుండ తరిగిపోవుచుండెను, మరియు ఆమె నిరంతరము ప్రార్ధించుచుండెను, మరియు ఇప్పటికి ఇక్కడ చూచుటకు ఏ ఒక్క అవకాశము కూడ లేనట్లుగా ఉండెను.
మీకు తెలుసా, దాని నుండి మనము ఒక పాఠమును నేర్చుకొనవచ్చును. అదేమనగా, నీవు ప్రార్ధించియున్నట్లయితే మరియు దేవుడు నిన్ను కలిసికొనుటకు కావలసిన అన్నీ అవసరతలను కలియుండి, మరియు ఇప్పటికి ఆయన నిశబ్దముగా ఉంటే, కాని నీవు అర్హత పొందియున్నప్పటికి, ఆయన నీకేమి సమాధానమివ్వకపోతే, ఇప్పుడు, ఆ తరువాత ఏమి జరుగును? ఆయనకు కావలసిన వాటిని నీవు చేరుకున్నావని నీకు తెలిసినపుడు మరియు నీకు తెలిసినందతయూ నీవు చేసియున్నప్పుడు, విశ్వాసమనేది స్థిరత్వమును కొల్పోదు. అది ఇంకా బలపడుతుంది మరియు సానుకూలముగా ఉండుంను. ఈ రాతి యుగములయందు విశ్వాసము నిరంతర పట్టును సాధిస్తుంది, మరియు అది చలించదు.
''విశ్వాసము'' గొప్ప సహవాసిగా పిలువబడుతుంది! నేను తరుచుగా చెప్పుచూ ఉంటాను, ''విశ్వాసము హృదయమందు అధికారము కలిగియున్నది.'' అది మాట్లాడినచో, ఏదైన సరే ఆగవలసినదే. విశ్వాసము గనుక ఆగమని చెప్పినచో ఏదైన సరే ఆగిపోతుంది, ఎందుకనగా అదే యాజమాని కాబట్టి.
25
మరియు ఆమె ప్రతి అవసరతను కలిగియుండెను. ఆమె నిజాయితీగా జీవించెను, ఆమె పద్దతిగా జీవించెను, ఆమె మర్యాదగా జీవించెను, మరియు దేవునికి కావలసిన అవరసతలన్నీటిని కలియుండెను. కాని, ఆయన చూడటానికి నిశబ్ధముగా ఉన్నట్లుగా ఉండెను. దేవుడు ఒకానొకసారి నిన్ను పరీక్షించుటకు అలా చేయును, నీవు ఏ విధముగా స్పంధిస్తావో చూచుటకు అలా చేయును. దీనిని మరిచి పోకండి!
నీవు వేదిక మీదుగా వెళ్ళినపుడు, నీవు ప్రార్ధన చేసినదానిని కొరకు, నీ మీద చేతులుంచబడినపుడు, మరియు అది చూడటానికి ఏమీ జరిగినట్లు అనిపించకపోవచ్చును, అది విశ్వాసమును ఏ మాత్రము ఆపలేదు — నీవు దేవుని అవసరతలను నెరవేర్చావు. ఇప్పుడు, నీవు వాటిని నెరవేర్చినట్లయితే.... ఇప్పుడు, నీవు దేవునిపై ఆధారపడనట్లయితే, నీకు తెలుసు నీ హృదయము నిన్ను ఖండిస్తుందని. మరియు మనకు తెలుసు, ''మన హృదయము కనుక మనలను ఖండించనట్లయితే, అప్పుడు మనము...'' ఇప్పుడు, అయితే మన హృదయము మనలను ఖండించినట్లయితే, ఈ వేదిక గుండా రావసిన పనిలేదు, దేనిగురించి అయినా దేవుని అడగవలసిన అవసము కూడ ఉండదు, ఎందుకనగా నీవు దానిని పొందుకొనుటకు విశ్వాసమును కలిగి లేవు. అయితే నీవు దేవునికి కావలసిన ప్రతి అవసరతను నెరవేర్చినప్పుడు, అక్కడ విశ్వాసము ముందడుగు వేస్తుంది, ''దేవుడు దేవుడైయున్నాడు! నేను అవసరతలను నెరవేర్చాను,'' అని చెప్పును.
26
''ప్రభువు కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు,'' అని లేఖనము చెప్పుచున్నది. ''ఎలా వేచియుండాలో నాకు నేర్పుము ప్రభువా! ఓ, నాకు నేర్పుము, ప్రభువా,'' అని పాటలో చెప్పిన విదముగా. కల్వరి రక్తములో నా ఆత్మను కడిగివేయండి, ప్రతి అవసరతను చేరులాగున, చుట్టూ ఉన్న వంతెనలను కాల్చివేయండి, ''ఇప్పుడు, ప్రభువా, నేను తీసుకొని వచ్చినది ఏదీ లేదు, కేవలం నేను నీ సిలువకు వ్రేలాడుటయే, నీవు దానిని వాగ్ధానము చేసియున్నావు ప్రభువా,'' అని చెప్పుము. అటువంటి పరిస్థితి... అందుచేతనే ప్రజలు నేను ఒంటరివాడినని అనుకొంటారు. కాని గదిలోనైన, లేక ఎడారి ప్రాంతములోనైన, మీరు ఈ వేదికపైకి రాకమునుపు అలాంటి పరిస్థితిని ఇక్కడ ఎదుక్కొనవలసి ఉంటుంది. కారణము, సాతాను ఎప్పుడు కూడ చిన్న ఇబ్బందులు పెట్టి ఆటంక పరుచుటకు ప్రయత్నిస్తూ ఉంటుంది. మరియు నీవు తప్పక నీ సొంత బలముపై, ఆలోచనలపై ఆధారపడక, సిలువ వైపునకే చూడు, కేవలం శాశ్వతమైన హస్తములపై ఆనుకొనుము. నీ సొంత జ్ఞానమును ఉపయాగించక, నీ ఆలోచనను ఉపయోగించక, నీకు నువ్వుగా కనపరచుకొని మరియు పరిశుద్ధాత్మకు మాట్లాడనిమ్ము. అలాంటి పరిస్థితిని దేవుడు తన సంఘములో కోరుచున్నాడు, సరియైన రీతిలో ఉండుట.
27
దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుని ముందుగా పరీక్షించి, శిక్షించును — అతడు శిక్షకు సహించునో అని చూచుటకు. ''నా పాపముల నిమిత్తం చనిపోయి మరలా మూడవరోజు తిరిగిలేచిన యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను, నా అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను. నా సమాధానార్ధమై శిక్ష ఆయన మీద పడెను, మరియు ఆయన పొందిన దెబ్బలచేత నేను స్వస్థతనొందియున్నాను,'' అని మనము ముందుకు వచ్చి చెప్పినట్లయితే. మీరు దానిని ఒక ఒప్పుకోలుతో చెప్పినపుడు... మీ యొక్క పాపములన్నియూ మరియు దోషములన్నియూ మరియు సామర్ధ్యములన్నిటిని బలిపీఠముపై వేయండి. అప్పుడు, అక్కడ నీ చేతిలో ఏమి ఉండదు, సాతానుడు నీపై వాడు వేయగలిగిన అన్ని బాణములను వేయును. కాని నీవు వెనుదిరిగి, ''సరే, నేను రక్షింపబడకపోవచ్చును, నేను స్వస్థపడకపోవచ్చును,'' అని చెప్పినట్లయితే, దానినుండి వెనుతిరిగుము, అక్రమ సంతానమని మరియు దేవుని పిల్లలు కాదు, అని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది.
28
మనము అబ్రహాము సంతానమగునట్లు దేవుడు అబ్రహామును పరీక్షించినట్లుగా అతని కుమారులనూ పరీక్షించును. క్రీస్తునందు మృతిచెంది, అబ్రహాము సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులమైయున్నాము. అబ్రహాము సంతానము, అబ్రహాము కలిగిన ఆత్మనే కలిగియుండును. అతడు వాగ్దానమును కలిగియున్నాడు. మరియు మన తండ్రి దేవుని నమ్మి ఇంతకు ముందెన్నడూ జరుగనటువంటి ఒక అసాధారణమైన వాగ్దానమును పొందుకొని, దానిపై ఇరువై-అయిదు సంవత్సరములు నమ్మికయుంచి, అన్ని సమయములలో బలముతో యుండెను, మరి అతని సంతానము కూడ అలాగే చేయును. మనము ప్రార్ధించినపుడు ఏమి జరిగినా సంబందము లేదు, అది ఇవ్వబడుతుంది! అన్నీ దారులు మనకు మూసుకుపోయినపుడు, అన్ని అవసరతలు కలిగియున్నపుడు, అన్ని దారులు మూసుకుపోయినపుడు, అప్పుడు దేవుని అడగండి, మరియు మీరు అడిగినదానిని పొందుకున్నామనే నిశ్చయతను కలిగియుండుడి.
29
దేవుడు యోబును కూడ ఆ విదముగానే పరిక్షించెను. యోబు కృపను వేడుకున్నప్పుడు, తన పిల్లల కొరకు బలిని అర్పించెను... కేవలం ప్రవక్త చేసినది దహనబలులను అర్పించుట మాత్రమే, అయితే దేవుడు కోరినది అంతయు అదే.
విద్య మరియు చాలా అర్ధం లేనివి దేవునికి అక్కరలేదు, ఆయనకు కావలసినదల్లా ఆయన చిత్తమునకు లొంగిపోవు హృదయము. ఆయన నిన్ను ఒక నిర్దిష్టమైన విదముగానే దుస్తులు ధరించాలని, లేక కొన్నిచోట్లకు మాత్రమే వెళ్ళమని, లేక ఫలాన కళాశాలలకు వెళ్ళమని, లేక డిగ్రీలు పొందమనేమి అడుగడు. ఆయన వినయమును, పశ్చాత్తాపమును, విరిగిన మనస్సు మరియు ఆయనను అంగీకరించుటకు తగిన చిత్త మనస్సును గూర్చి అడుగుతాడు.
ఆయన యోబును పరిక్షించెను, మరియు చూడండి ఏ విదమైన చర్యను ఆయన అతనియొద్ద కనుగొన్నాడో. కాని ఆయన తన గొర్రెలను మరియు ఎద్దులను తీసుకున్నపుడు, మరియు ఒంటెలను తీసుకున్నపుడు, మరియు ఆయన పిల్లలను తీసుకున్నపుడు, ''యోబు ఏమంటాడో ఇప్పుడు నేను చూచెదను.''
''దేవుడే ఇచ్చెను మరియు దేవుడే తీసుకొనెను, ప్రభువు యొక్క నామము స్తుతింపబడును గాక,'' అని అతను చెప్పెను.
ఆయన యోబును గూర్చి, ''భూమి మీద అతనివంటివాడు ఎవడును లేడు,'' అని సాతానుతో చెప్పెనో దానినే కనుగొనెను.
మరియు ఉరుములు గర్జించుట ప్రారంభించెను, మెరుపులు మెరుయుట ప్రారంభించెను. ప్రవక్త మీదికి ఆత్మ దిగి వచ్చెను, ''నా విమోచకుడు సజీవుడనియు, మరియు అంత్యదినములయందు ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదను,'' అని అతను గట్టిగా అరచెను. ఈలాగు పురుగులుపట్టి చర్మమును నాశనం చేసినను, నా శరీరముతో నేను దేవుని చూచెదను: మరెవరును కాదు, నా మట్టుకు నేనే చూచెదను, నా కన్నులారా చూచెదను.''
30
ఆయన హెబ్రీ పిల్లలను వారు ఏ విదముగా స్పంధిస్తారో చూచుటకు పరిక్షించెను. వారు ''సజీవమైన దేవుడున్నాడనియు, యోహోవా దేవుడున్నాడనియు, భూమి మరియు ఆకాశములకు ఆయనే దేవుడనియు, మరియు ప్రతి ఆత్మను తనచేత పట్టుకొనివున్నాడనియు,'' అన్యుల యెదుట ఒప్పుకొనెను. కావున దేవుడు వారిని పరిక్షించెద అనుకొనెను. మరియు వారు దేవుని ప్రతి అవసరతలను నెరవేర్చిరి. వారు ప్రార్ధన చేయుట ద్వారా మార్గమునకు కావలసిన ప్రతిదానిని పొందుకొనెను. మరియు వారు రాజుయొక్క ప్రతిమకు మ్రొక్కలేదు. మరయు అతను అగ్నిగుండమును ఇంతకుముందర కంటెను ఏడంతలు ఎక్కువగా వేడిమిగా చేసెను. మరియు సందేహమేలేదు, సాతాను వారికి ''ఇదే మీకు అంతిమ యాత్ర,'' అని చెప్పుటకు ప్రయత్నించియుండవచ్చు. ''మా దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్ధుడు, ఒక వేళ ఆయన రక్షింపకపోయినను, మేము దేవుని యొక్క ఆజ్ఞలను మాత్రము మీరము అని వారు చెప్పిన విదానమును నేను ఇష్టపడుచున్నాను! మేము నిజాయితిగా ఉండెదము! మనము రాబోవు సంవత్సరములయందు, దేవుని వాగ్ధానమునకు నిజాయితిగా ఉన్నాము అని మన యొక్క విశ్వాసమును చాటి చెప్పును గాక.''
31
''నా దేవుడు దీనినుండి నన్ను స్వస్థపరుచుటకు సమర్ధుడు.'' లేక, ''నా దేవుడు ఈ చక్రాలకుర్చి నుండి నన్ను లేవనెత్తుటకు సమర్ధుడు. నా దేవుడు దీనిని చేయుటకు సమర్థుడు. అయితే ఆయనను నేను స్వస్థపరచువానిగా అంగీకరించాను. నా పాపములను నేను ఒప్పుకున్నాను, నా అవిశ్వాసము, మరియు ఆయనే నన్ను స్వస్థపరచువాడని నేను విశ్వాసముతే ఒప్పుకొనుచున్నాను. ఏది వచ్చినా, ఏది పోయినా సరే. నేను ఈ దినమున బాగుపడకపోతే, నేను రేపు బాగుపడెదను; రేపు బాగుపడకపోతే, వచ్చే సంవత్సరము బాగుపడెదను. ప్రభువే ఇచ్చెను మరియు ప్రభువే తీసికొనెను, ప్రభువు యొక్క నామము స్తుతింపబడును గాక!''
32
ఓ, అది అక్కడేయున్నది! మరియు వారు విచారణ నిమిత్తము, ఒక పరీక్ష కొరకు మండుచున్న అగ్నిగుండములోనికి నడిచినపుడు, అంతమువరకు వారు నిజాయితీగా ఉండెను. అయితే దేవుడు ఒక క్షణవ్యవదిలోనే అక్కడ ఉన్నాడు, మరియు ఆయన వారిని రక్షించెను. వారు ప్రార్ధన చేసినపుడు వారి పాపములు తీసివేయబడెనని వారికి తెలుసు. వారు ప్రతి అవసరతను నేరవేర్చియున్నారు అని వారికి తెలుసు, మరియు ఇంకనూ ఆయన నిశ్శబ్దంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆయన మిమ్ములను పరీక్షించుటకు, నిజముగా నీవు ఏమైయున్నావో చూచుటకు, నీ లోపట ఏమున్నదో చూచుటకు, నీవు పెదవులతో ఏదైతే చెప్పుచున్నావో దానిని నీ హృదయమందు కలిగియున్నావో లేదో చూచుటకు మాత్రమే నిశ్శబ్దంగా ఉన్నాడు. దానిని ఇంకా లోతునకు చూద్దాం. మన పెదవులతో మనము చెప్పవచ్చు, కాని మన హృదయము కూడా దానిని చెప్పుచున్నదా?
33
ఇప్పుడు, ఆ చిన్న స్త్రీ కావలసిన అవసరతలన్నీ నేరవేర్చేను అని ఆమె ఎరిగియుండెను, మరియు దేవుడు ఇంకనూ నిశ్శబ్దంగా ఉన్నాడు. చూడటానికి ఆమె కోసం ఏ మాత్రము జాగ్రత్త వహించనట్లుగా కనబడుచుండెను, ఆయన ఆమె జీవించియున్నదా లేక చనిపోయినదా అని కూడ ఆయన పట్టించుకోవడం లేదు. అయితే అన్నివేళలా దేవుడు పనిచేస్తూనే ఉంటాడు. దాన్ని గూర్చి ఆమె తెలియదు, కాని దేవుడు ఏలియాతో చెప్పెను. ఆయన వాగు దగ్గరకు వచ్చి, తన చేతితో పారుచున్న వాగును ఆపి ఎండిపోవునట్లుగా చెసెను, మరియు ఏలియా, ''ప్రభువా, ఎందుకు ఇది ఆగినది?'' అని అడిగెను.
ఆయన, ''నిన్ను పోషించుటకు నేను ఒక విధవరాలికి ఆజ్ఞ ఇచ్చితిని,'' అని చెప్పెను. ఆయన ఇప్పటికే ఆమెకు ఆజ్ఞాపించియున్నాడు, కాని దానిగురించి ఆమెకు తెలియదు.
34
ఆయన మీ స్వస్థతను గూర్చి సాక్ష్యమును ఆజ్ఞాపించియుండవచ్చును. నీకది తెలియకపోవచ్చును, కాని ఆలాగే గట్టిగా పట్టుకొని ఉండుము. మీరు కావలసిన అన్నీ అవసరతలు నెరవేర్చారు అని ఖచ్చితముగా ఉన్నప్పుడు, మీకు తెలిసిన ప్రతిదాన్ని మీరు జరిగించారని మీరు తెలుసుకున్నప్పుడు, మరియు నీవు దేవుని యెదుట నిలబడియున్నప్పుడు, చేయవలసినదల్లా ఒక్కటే - ఆయన వాగ్దానమును పట్టుకొని అక్కడే నిలిచియుండుము! దేవుడు సమాధానమిచ్చునని వాగ్దానము చేసియున్నాడు, ఆయన దానిని చేయగలడు. ఆయన ఏ దూతకు, ఏమి చేయమని ఆజ్ఞాపించెనో మీకు తెలియకపోవచ్చును. స్వస్థత పరిచర్య రేపురాత్రి ప్రారంభమగుటకు ముందుగా ఇది ఈ రాత్రే కావచ్చును. దేవుడు ఈ రోజే నీ పరిస్థితిని యెరిగియుండవచ్చును, ఆయన నీ ప్రార్ధన వినియుండవచ్చును.
35
నేను ఈ చెవీటి మరియు మూగ ప్రజలను గూర్చి చాలా విచారించుచున్నాను. నేను వారిపైన చేతులుంచి మరియు వారికొరకు ప్రార్ధించాలని కోరుచున్నాను. గత ఆపుటకు ప్రారంభించాను, కాని మిగతావారికి అది మంచిది కాదని నేను అనుకున్నాను. కానీ హృదమునెరిగిన ఒక నిశ్శబ్ద దేవుడు ఎక్కడున్నాడని నేను ఏలా తెలుకునేది, దేవునికి అపసరమైనవాటన్నీటిని ఈ ప్రజలు నెరవేర్చారు, మరియు వారు సిద్ధముగా వున్నారు, మరియు ఈ రాత్రి వారి సమస్త బాధల నుండి తప్పించుటకు ఇక్కడ ఒక దూత ఉన్నది? నేను ఏలా తెలుసుకోగలను? దేవుడు వారి రక్షణార్ధమై ఆజ్ఞాపించి వుండవచ్చును. నేను రోగుల కొరకు ప్రార్ధించినా లేక ప్రార్ధించకపొయినా సరే, వారు దానిని పొందుకుంటారు, ఎందుకనగా దేవునికి అది అవసరము. దేవుని యెడల నమ్మిక కలియుండుము, దాని తరువాత దానిపైనే నిలిచియుండుము, ఆయనకు కావలసినదానిని నెరవేర్చుము. ఈ కార్యములను ఏలా చేయాలనేది దేవునికి తెలుసు, అది నిజము, దానిని సరైన రీతిలో ఏ విధముగా చేయాలో కూడ తెలియును.
36
ఇప్పుడు, దేవుడు ఒక విధవరాలైన స్త్రీ గృహమునకు ఆయన ప్రవక్తను పంపించుటనేది విచిత్రమైన విషయమై ఉన్నది. ఏలాంటిదా స్థలము! కానీ ఆమె నిజమైన ఒక మర్యాద గల స్త్రీ అయివుండాలి, లేక ఆయన తన ప్రవక్తను ఎప్పుటికి అక్కడికి పంపియుండక పోవచ్చును. ఓ, ఒక వ్యక్తి ఏలియా లాంటి ఒక ప్రవక్తకు పరిచర్యను చేయాలంటే, అతను కూడ విలువైన వ్యక్తి అయివుండాలి.
జకర్యను గూర్చి మీకు గుర్తుందా, అతడు తన గృహములో నీతిగాను మరియు సత్యమును అనుసరించుచూ, వారికి పిల్లలు కలుగుటకు దేవుని కొరకు ఎదురుచూచుండెను, మరియు గాబ్రియేలు దూత ఇంటికి వచ్చెను. మరి స్వచ్చముగా మరియు నీతిగా జీవించిన కన్యక అయిన మరియ, మరియు దేవుని వాగ్ధానము కొరకు ఎదురుచూచెను, ఆమె యొద్దకు కూడ దేవుడు తన దూతను పంపెను.
37
ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నవాటిని గూర్చి మరియు ప్రపంచముతో పరిహాసము చేయువాటిని గూర్చి మాట్లాడకుందాం, మరియు అప్పుడు దూతలను చూడాలని మరియు అద్ధుత కార్యములు జరగాలని అనుకొనుట? ఇది దేవుని ప్రణాళికలోనిది కాదు. నీవు ఖచ్చితముగా నీతిగా జీవించాలి. ఇంటిని శుబ్రపరుకోవాలి, నీ అలవాట్లను తీసివేసుకోవాలి, లోకసంబదమైనవాటిని శుబ్రపరుచుకోవాలి, మీరు కలియున్న గుర్తింపులను మరియు లోక సాంగత్యమును వదుకోవాలి, సిద్దముగా ఉండుము, అప్పుడు దేవుని దూత, ''బయపడకుము ఇది నేనే,'' అని పలుకును. అప్పుడు కార్యములు జరుగును.
38
ఆ చిన్న స్త్రీ పర్వతము మీద నుండి ప్రవక్త నడిచివస్తాడని తెలియుకుండానే, మోకరించి ప్రార్ధించుచుండెను, ఎక్కడికి వెళ్ళాలో ఆయన ఒక దర్శనమును కలిగియున్నాడు, దేవుడు ఆయన ప్రజలను గ్రుడ్డిగా నడిపించడు, వారు ఎక్కడికి వెళ్తున్నారో కూడ వారికి తెలియపరచును. ఆయన పట్టణములోనికి చూస్తున్నాడు. ఓ, అది చాలా ఘోరమైన స్థితిలో ఉన్నది. జనులు మరణము మ్రింగివేయబడినట్లుగా వుండెను, మరియు నీటి కొరకు మరియు ఆకలితో అలమటిస్తున్నారు. ఇది అనైతికతకు ప్రతిబింబమైయున్నది. ఇది పాపమునకు ప్రతిబింబమైయున్నది.
మరియు ఈ దేశము దీనికొరకు ఉంచబడినది. ప్రకృతి నియమము కూడ ఇలా జరుగటకు అంగీకరించదు, మనము మనము అనాగరిక జీవనము కొరకు డబ్బును వృదా చేయుచుండినచో, మరియు ప్రపంచములో సగభాగము ఆకలితో చనిపోవును. క్రీస్తు మానవులందరి కొరకు చనిపోయాడు.
39
ఆ కారణం చేతనే మిషన్-ఫీల్డ్స్ నా హృదయమందు ఉన్నది. ఇక్కడ ఈ ఫీనిక్స్‌లో మీకు అద్భుతమైన సేవకులున్నారు, మరియు అమెరికా సంయుక్త రాష్ట్రములయందంతట, ప్రతి మూలన ఉన్న సంఘములయందు, దేవుని యొక్క గొప్ప ప్రజలు, స్వస్థత కూటములు, ఓరల్ రాబర్ట్స్ వంటి మరియు ఇతర గొప్ప మనుషుల ప్రసంగములు. మరియు దూరంగా ఉన్న ప్రజలున్నారు, యేసుక్రీస్తు పేరును ఎన్నడూ వినని వారు ప్రతిరోజూ వేలసంఖ్యలో చనిపోవుచున్నారు. దీనమైన మురికి పేదవారు, ఆఫ్రికాలో ఆకలితో ఉన్న నీగ్రో జాతివారు; మరియు ఇండియాలో ఉన్నవారు, వీధిలో పడుకొనే చిన్న ప్రజలు, కనీసము, ''దేవుడు'' అంటే ఎమిటో కూడ తెలియకుండా చనిపోవుచున్నారు. మరియు తర్వాత మనము మనయొక్క మతపరమైన విశ్వాసములో చిన్న వ్యత్యాసములను గూర్చి వాదించుకుంటాము. ఓ, ఇది ఖచ్చితంగా సరికాదు, స్నేహితులారా, నేను అనుకోవట్లేదు — దానిని చూచుటకు అది మీ హృదయమందున్నట్లయితే.
40
ఇప్పుడు, ఈ యొక్క పేదరాలైన చిన్న స్త్రీని గమనించండి, ఆమె కిటికి వెలుపలికి చూచిన తరువాత మరియు ఇది ఒక చివరి దినముగా చూచెను, ఆమె కొరకు ఎదురు చూస్తూన్నదేమిటో ఆ చిన్న స్త్రీకి తెలియదు. ఇది ఆమె కుమారునికి మరియు ఆమెకు మరణమైయున్నదని ఆమె ఆలోచిస్తున్నది. కావున ఆమె నిద్రపోవుచుండగా, మనము ఇంకా కొద్ది నిమిషముల పాటు ఆమె వైపు చూద్దాం. ఆమె ప్రార్ధన చేసిన తరువాత వెళ్ళి, మరియు అతని కళ్ళ మీదున్న చిన్న వెంట్రుకలను వెనుకకు తీస్తు, ''ప్రియమైన చిన్నవాడా, నీవు చూడడానికి అచ్చం ప్రశస్తమైన నీ పరిశుద్ధుడైన తండ్రివలె ఉన్నావు. అతను దేవుని ఎలా విశ్వసించాడు! అతను ఎలా యుద్ద రంగములో ఇశ్రాయేలు కొరకు తన జీవితాన్ని ఏ విధముగా త్యాగము చేసాడు! మరియు నీవు కూడా చాలా వరకు అతనిలానే ఉన్నావు. మరియు, మధురమైనవాడా, ఏ విధముగా ఆ అమాయకులు బాధను అనుభవిస్తున్నారనేది నేనెరుగను, కాని వారు అనుభవించారు,'' అని చెప్పెను.
రాజకీయాల్లో అవినీతి కారణముగా ఈ దేశము, క్రైస్తవులు, శ్రమను అనుభవింతురు, ఈ దేశమంతటినీ కూడ శ్రమలపాలు చేయుదురు.
41
మరియు ఆమె వెళ్ళి, ''నేను ఇప్పుడు ఒక చిన్న రొట్టెను సిద్దపరిచెదను. నేను చిన్న రొట్టెను తయారు చేయుటకు మాత్రమే పిండిని కలియున్నాను, మరియు మనము ఇది తినినపుడు, మనము చనిపోయెదము,'' అని చెప్పుట చూచుచున్నాను. కావున అమె గదిలోనికి వెళ్ళుచున్నది, మరియు ఆహారపు కుండలో నుండి భోజనమును తీసుకొనెను. ఆమె ఎముకలు బయటకు కన్పించుచున్న తన చేతితో దులుపుచున్నది, ఆమె ఆ చిన్న కుండను కొట్టుచూ దానిలో ఉన్న పిండి అంతా బయటకు వచ్చునట్లుగా కొడుచూ, చివరికి ఒక రొట్టెను తయారు చేయుటకు సరిపడ పిండిని కలియుండెను. మరియు ఆ చిన్న నూనె ఉన్న కుండ దగ్గరకు వెళ్ళి దానిని పైకి లేపి దానిలో ప్రతినూనెను బొట్టును కూడ వంచి ఒక స్పూను అంత వంచెను.
42
ఇప్పుడు, ఆ యొక్క ఆహారము, ఆ కార్యములన్నియూ ఒక భావమును కలియుండెను. భోజనము క్రీస్తును సూచిస్తున్నది. క్రీస్తే బలి అర్పణ. వారు అల్లాడింపబడు నైవేద్యమునకు వారు భోజనమును సిద్దపరిచినపుడు — క్రీస్తు కొరకు, పాత నింబధనలో అల్లాడింపబడు నైవేద్యములో ఉన్నది క్రీస్తు అయివున్నాడు — వారు ఒక రకమైన రోకలితో దానిని సిద్దపరచెదరు, ప్రతి చిన్న ఆహార ధాన్యపు ముక్క ఒకేవిధముగా నలుగగొట్టబడువరకు, ఎందుకనగా యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు.
43
మీకు గుర్తున్నదా అక్కడ ఉన్న కొన్ని పాఠశాలకు దోసకాయలకు మరియు బటానీలకు వ్యత్యాసము తెలియదు, మరియు వండుటకు కొన్ని అడవి దోసకాయలను బటానీలున్న కుండలో వేసెదరు, మరియు వారు గట్టిగా అరచెదరు, ''అక్కడ ఆ కుండలో మరణము ఉన్నది.''
ఏలియా చేతికి సరిపడ ఆహారమును తీసికొని కుండలో వేసి, మరియు ''తినుము!'' భోజనము ఏమి చేయును? కుండలో ఉన్న భోజనము మరణము నుండి జీవములోనికి మార్చెను; మరణము కలుజేయు పదార్ధము నుండి జీవమును కలుగజేయు పదార్ధములోనికి మార్చెను.
ఈ రాత్రి కూడ అదే కార్యమైయున్నది, నీ పాత్రలో మరణమున్నట్లయితే. క్రీస్తు, నీ పాత్రలో త్రోసివేయుబడెను, నిన్ను మరణము నుండి జీవములోనికి రక్షించెను. క్రీస్తు ఆ వ్యత్యాసమును చేయును. మానవ హృదయములోనికి వచ్చి, ఓ, ఆయన జ్ఞానమును కలుగజేయునటువంటి సమాధానమును ఇచ్చును. మరియు అది నిత్యజీవమును కలుగజేయును: ''కుమారునియందు విశ్వాసముంచువానికి నిత్యజీవము కలదు, మరియు అతడెన్నడు నశింపడు.''
44
ఇప్పుడు, ఆమె ఆహారమును కలియుండెను, అది క్రీస్తును సూచిస్తున్నది. మరియు క్రీస్తు వాక్యమైయున్నాడు. ''ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద వుండెను, మరియు వాక్యము దేవుడైయుండెను. మరియు వాక్యమే శరీధారియై మన మద్య నివసించెను.'' క్రీస్తే, బలి అర్పణ. మరియు ఆమె వెళ్ళి నూనెను తీసుకొనెను మరియు నూనె ఆత్మను సూచిస్తున్నది. కనుక ఆమె వాక్యమును మరియు ఆత్మను ఒక్కటిగా చేసి, దానిని కలుపుటకు ప్రారంభించెను.
ఓ, అలా చేయునపుడు ఏదో ఒక కార్యము జరుగవలసియుండెను! నేను బోధించున్న వాక్యము ఈ రాత్రి మీ హృదయములోనికి వెళ్ళును గాక. అప్పుడు పరిశుద్దాత్మడు అక్కడికి వచ్చి మరియు వాక్యమును దానితో కలుపును గాక. నీవు వాక్యమును మరియు ఆత్మను ఒకటిగా కలిపినపుడు ఏమి జరుగునో గమనించండి! యేసు బావి దగ్గరున్న స్త్రీతో, ''స్త్రీ, నేను నీకు చెప్పుచున్నాను, సమయము వచ్చియున్నది, మరియు ఇప్పుడు వచ్చియున్నది, దేవుని ఆరాధించువారు ఆత్మతోను మరియు సత్యముతోను ఆరాధించవలెను,'' అని చెప్పెను. మరియు ఆయనే సత్యమైయున్నాడు!
45
ఆహారము... ఆమె ఏమి చేసినదో చూడండి, ఆమె వాక్యమును ఆత్మతో ఒకటిగా కలిపినది. చాలా మంది ప్రజలు వాక్యము లేకుండా ఆత్మను కలియుంటారు; కొంతమంది ఆత్మ లేకుండా వాక్యమును కలిగియుంటారు. కాని నీవైతే, ఆ రెండింటిని సరియైన రీతిలో తీసుకొన్నట్లయితే అక్కడ మార్గమందు రొట్టె ఉండును! అక్కడ తయారీలో ఏదో ఒక విషయం ఉంటుంది.
46
దీనమైన ఆ చిన్న విధవరాలు, ఆమె ఏమి చేయుచున్నదో ఆమెకు తెలియదు, కాని దేవుడు ఏలియాతో, ''నేను ఆమెకు అజ్ఞాపించితిని,'' అని చెప్పెను.
మరియు ఏలియా మార్గమునందు గులకరాళ్ళపై నుండి తన దర్శము ఎక్కడ నెరవేరునో చూచుటకు క్రిందికి దిగి వచ్చెను. మరియు ఇక్కడ ఆమె నిలుచుని వున్నది, ఏడుస్తూ తన పాత, చిరిగి కండువాతో తన కళ్ళను తుడుచుకుంటూ, మరియు, ''ఓ యోహోవా దేవా, నా విశ్వాసము ఏన్నడు తప్పిపోదు, మరియు అది తప్పిపోదు. ఏదైననూ లేక మరోకటైననూ, అది ఏలా అనేది నాకు తెలియదు, కాని మేము సమస్తమును సమకూడి అంతయు మేలుకొరకే జరుగునని మేము నేర్చుకొన్నాము,'' అని చెప్పుచుండెను. ఆమె ఆ కొద్ది ఆహారమును మిశ్రమముగా చేసి, ఆ చిన్న రొట్టెను తీసుకొని దానిపై వేసినది. ''ఇప్పుడు నాకు బయటకు వెళ్ళి మరియు కొంత కలప తెచ్చుటకు సమయము వచ్చినది,'' అని ఆమె చెప్పెను. ఆమె వెనుకకు వెళ్ళి, తలుపును తెరిచి, ''ఓ ప్రభువా, అక్కడ ఆ చిన్న కడుపు ఆకలితో ఉన్నది, మరియు నేను రెండు లేక మూడు వారముల నుండి తినుటులేదు. నేను నా రొట్టె ముక్కను కూడ (నా బిడ్డకే) ఇచ్చాను,'' అని ఆమె చెప్పెను.
అదే ఒక తల్లియైయున్నది, ఒక తల్లి తన శిశువును ప్రేమించును. దీనివలె ఏదీ ఉండదు, అది కేవలము దేవుని ప్రేమ మాత్రమే. ''ఒక తల్లి పాలిచ్చు పసికందును మరచునేమో, కాని నేను నిన్ను ఎన్నడు మరవను. మీ పేర్లు నా అరచేతిలో చెక్కుకున్నాను.'' ఆయన నిన్ను ఏ విధంగా మరువగలడు? నేను నిన్ను ఏన్నడు విడువను, లేక ఏన్నడు ఎడబాయను. నేను ఎల్లప్పుడూ, ప్రపంచము యొక్క అంతము వరకు కూడ నీతోనే ఉండెదను.''
47
అక్కడ ఆమె తన కుమారుని వైపు చూస్తూ వెనక్కి వచ్చి తన చిన్న నుదిటిపై ముద్దుపెట్టుకొనెను. ఒకవేళ ఆమె బయటకు వెళ్ళి, మూర్చపోయి చనిపోయినట్లయితే? ఇది సూర్యుడు యూదయ పర్వతములపై ఉదయించు మాదిరిగా ఉన్నది. మరియు ఆమె అప్పుడే ఉదయిస్తున్న సూర్యునివైపు చూస్తూ. వీధిగుండా వెళ్ళుచూ శాపమును గూర్చి వింటూ ముందుకు వెళ్ళుచున్నది. మరియు ఆమె అంగడిలోకి వెళ్ళి, మరియు గమనించండి, ఆమె రెండు కట్టెపుల్లలను మాత్రమే తీసుకున్నది. చేతిలో పట్టేంత కాదు — రెండు కట్టెలను. ఏమిటి ఇది? ఆ ''సిలువే.''
48
ఇప్పుడు, ఎవరికైనా తెలుసు, ఇక్కడున్న నా ఇండియన్ స్నేహితులకు ఎవరైనా, లేక ఏ వేటగానికైనా, మంటను మండించాలంటే, సరియైన పద్దతి - రెండు కట్టెలను అడ్డంగా ఉంచి, మధ్యలో మండించి, మరియు చివరలను లోపలికి నెట్టుచూ వుండాలి. ఇది రాత్రంతటా ఉండును. చాలా సార్లు నేను అరణ్యములో ఉన్నప్పుడు, రెండు కట్టెలతోనే అంతకంటే ఎక్కువ కూడ కాదు, మరియు అవి రాత్రంతటా వేడిగా వుంచును. వేడిగా వుంచుటకు అవి సరిపోవును, వాటిని మధ్యలోనికి నెట్టుచూ ఉండాలి.
49
ఇప్పుడు ఆమె ఏమి చేయబోవుచున్నది? ఈ రెండు కట్టెలను వెలగించి. మరియు వాక్యము మరియు ఆత్మ సిలువపై ఆత్మార్పణను తీసుకువచ్చినది, పనికి సిద్దముగా ఉన్నది, జీవితమిచ్చుటకు కూడ సిద్దముగా ఉన్నది. పరిశుద్దాత్మ చేత దేవుని వాక్యమందు ఆమె యొక్క విశ్వాసమును వాక్యమందు మరియు ఆత్మలో ఉంచుట ద్వారా, ఆమెను తనకుతానే సిలువకు అత్మార్పణ చేసికొనుటకు దారితీసింది. మరియు ఆమె తన చేతిలో ఆ రెండు కట్టెలను తీసుకొని వెనుకకు తిరిగినపుడు, వెనుకకు తిరిగినపుడు, మరియు ద్వారము నుండి ఒక స్వరము, ''ఓ స్త్రీ'' అని వెచ్చెను.
దానికి ముందగానే, ముసలి, బట్టతలతో కావచ్చును, మీసాల క్రింద బూడిద రంగుతో వ్రేలాడుచు, మరియు అతని వెంట్రుకలు క్రిందికి వ్రేలాడుచూ, అతని చేతిలో ఒక చిన్న కర్రతో, గొర్రె తోలుతో చుట్టుకొని లేక అలాంటిదానితో చుట్టూ కట్టుకొని, ఆ వీధిగుండా నడుచుకుంటు, ''ప్రభువా, ఇది ఒక చిన్న తెల్లని కంచె. అక్కడ ఒక సుందరమైన యువతి ఉండియుండవచ్చును [అక్కడ ఖచ్చితంగా ఆమె యువతియై యుండవచ్చును, ఆ బాలుడు కూడ యువకుడైయుండెను] పొలము బయట, నీవు నాకు విధవరాలు నిన్ను పోషిస్తుందని చెప్పావు. ఇప్పుడు, ఆమె ఏక్కడ ఉన్నది? నేను నడుచచూ ఉన్నాను.'' ఆత్మ అతనికి ఈ మార్గమున నడవమని చెప్పి, అప్పుడు అతనిని వెనుకకు మరలించెను. ఓ, ఇది ఏంతో అద్భుతముగా ఉన్నది! దేవుని కుమారులు, దేవుని ఆత్మచేత నడిపించబడినట్లుగా వున్నది. ఇది ఎంత వెర్రితనముగా ఉన్ననూ పరవాలేదు, వారు నడిపించబడుచున్నారు! అతడు ఒక వీదిగుండా వెళ్ళి మరియు మరలా ఇంకొక వీదిగుండా వచ్చుచున్నాడు, ఒక వీధిగుండా వెళ్ళి మరొక వీదిగుండా వచ్చుచున్నాడు.
కొంత సేపటి తరువాత, ఆత్మ, ''నీ కుడిప్రక్కకు తిరుగుము'' అని చెప్పెను.
మరియు ఆయన ఆ విధముగా చుట్టూ తిరిగి చూచెను, ఆయన ఈ వేదిక మీద కూడా అదే విదముగా చేయుచున్నాడు, రాత్రి వెంబడిరాత్రి — ఓ, దేవుడు ఇంకనూ అదేరీతిగా ఉన్నాడు! ''నీ కుడికి మరియు ఎడమకు చూడుము, అక్కడ ఎవరో ప్రార్ధన అవసరతను కలిగియున్నారు.''
50
మరియు అతను తన కుడికి చూచెను. ''అక్కడ ఒక చిన్న తెల్లని కంచె ఉన్నది అని చెప్పెను. అది ఖచ్చితముగా కుడివైపునకే. నేను దీని నుండి ఏ మాత్రము ముందుకు వెళ్ళలేకపోవుచున్నాను, ఎందుకనగా అక్కడ ఒక పాత చెట్టు ఉన్నది. మరియు అక్కడ అంతా కూడా నేను దర్శనములో చూచిన విదముగానే యున్నది.'' తలుపు తెరవబడెను మరియు ఒ చిన్న సన్నగా ఉన్న స్త్రీ బయటకు వచ్చెను.
ఇప్పుడు, గుర్తుంచుకొనుడి, ఆమె కేవలము రెండు కట్టెపుల్లలను తీసుకొనుటకు వెనుకకు వెళ్ళెను. ఆమె మూడు పుల్లలను కాదు తీసుకున్నది, సిలువను చేయుటకు రెండు మాత్రమే తీసుకున్నది. ఆమె రెండు పుల్లలను తన చేతిలోనికి తీసుకొని మరియు వెనకకు వెళ్ళుటకు ప్రారంబించెను, ''కుమారుడు నిద్ర లేచినపుడు నేను ఒక చిన్న రొట్టె ముక్కను చేసెదను మరియు అతనికి దానిని తినిపించెదను, దానిని నేను కొంచెము కూడా తినను. మరియు నేను నా చిన్న బాలుని నా చేతులలోనికి తీసుకుని, మరియు మేము అక్కడే కూర్చుని చనిపోవుదుము,'' అని ఆమె అనుకొనెను. మరియు ఆమె ఇంటిలోనికి వెళ్ళుటకు ప్రారంభించెను.
51
మరియు ఆమె ఎవరో తెలియని వ్యక్తి యొక్క స్వరము ద్వారము నుండి, ''స్త్రీ, నా కొరకు ఒక పాత్రలో కొంచెము త్రాగు నీరు తీసుకొని రాగలవా?'' అని చెప్పుట వినెను.
మరియు ఆమె వెనుకకు తిరిగెను, మరియు ''అక్కడ ముసలి వ్యక్తి ద్వారము యొద్ద నిలబడెను,'' అని అనుకొనెను. ఆమె అయనను దగ్గర నుండి చూచి, మరియు ఆమె కన్నీరు పెట్టుకొనెను. అప్పటికి అది చాల వేకువజాము సమయము. మీకు తెలుసా, దేవుడు చాలా కార్యములను వింతగా చేయును. ఆమె త్యాగము చేయుటకు సిద్ధపాటును కలిగియుండెను. నీరు కొరతగా ఉండెను. అది మూడు-సంవత్సరముల-ఆరు-నెలల నుండి వర్షము పడలేదు.
''నా కొరకు తీసుకుని రాగలవా....?'' బహుశా ఆమె యొక్క స్పందన కొరకు దేవుడు అయనకు ఆ విదముగా చెప్పమని యుండవచ్చును, ఆమె ఏమి చేయునో గమనించండి. ''నా కొరకు ఒక పాత్రలో కొంచెము త్రాగు నీరు తీసుకొని రాగలవా?''
మరియు ఆమె ఆయన వైపు చూచెను. ''ఆయన మాట ప్రత్యేకముగా ఉన్నది. నేను జాలి పడుటకు ఆ ముసలి వ్యక్తి గురించి ఎదో ఒకట ఉన్నది.''
52
దేవుని విశ్వసించిన ఏ విశ్వాసియైన సరే ఇతర వ్యక్తులతో చాలా క్రొద్ది విషయాలను మాత్రమే పంచుకుంటారు. అవును. పెంతెకొస్తు ప్రజల చేయునది అదే — వారు వేసుకున్న చొక్కాయి కూడ ఒక అవసరత కొరకు ఇచ్చివెయగలరు. అది నిజము. ఇది సత్యమైయున్నది. అది చాలా గొప్ప కార్యము, వారికున్న గొప్పవాటిలో ఇదొకటి. ప్రపంచమంతటిలోనే వారు గొప్ప దానగుణము కలిగిన వారు, ఎందుకనగా ఈ భూసంభంధమైన వస్తువులు ఎందుకు పనికిరావని వారికి తెలియును. వారు పరలోకమందు ధనాన్ని సమకూర్చుకుంటున్నారు, ఎందుకనగా ఈ రానున్న దినములలో వారు అక్కడికి వెళ్ళెదరు అని.
53
మరియు ఆ విధముగా ఈ స్త్రీ, ''నేను నా నీళ్ళను ఇచ్చెదను. మేము చనిపోబోవుచున్నాము, కాబట్టి నా త్రాగునీటిని త్యాగము చేసెదను, మరియు ఆ గౌరవముగల నిలుచుని ఉన్న ముసలి వ్యక్తికి ఇచ్చెదను, ఆయన చూడడానికి దాహంతోను మరియు అలసటతో వున్నట్లుగా ఉన్నాడు,'' అని అనుకొనెను. ''నేను దానిని తెచ్చెదనని,'' ఆమె చెప్పెను. మరియు ఆమె నడచటకు ప్రారంభించెను.
మరియు మరలా ఆమె, ''మరియు నీ ఇంకొక చేతిలో, ఒక చిన్న రొట్టె ముక్కను తీసుకుని రాగలవా?'' అని ఒక స్వరము చెప్పుట వినెను. ఓ, మై! ఇప్పుడు, ఇప్పుడు ఏంటి?
తన బిడ్డ యొక్క జీవము తన చివరి ఆశ. వారికున్న చివరి ఆశ, మరియు రొట్టె అయిపోవును, నూనె అయిపోయెను, ఇప్పుడు అంతాకూడా అయిపోవును. కాని ఆమె వెనుక తిరిగి చూచి, మరియు ఆమె ఆశ్చర్యపడెను. ''కుండలో కొంచెము మాత్రమే ఆహారము మిగిలియున్నది. మరియు దానిలో వేయుటకు సరిపడు నూనెను కలిగియున్నాను, మరియు దానిని నేను ముందుగానే (ఆ రొట్టెకు) కలిపియున్నాను, లేక నేను దానిని కలిపియున్నాను. [నేను వాక్యమును కలిగియున్నాను మరియు అక్కడున్న ఆత్మతో కలిపియున్నాను. జీవమిచ్చుటకు రొట్టెను తయారు చేయుటకు నేను సిలువను తీసుకున్నాను.]'' మరియు ఆత్మ మరియు వాక్యము ఎప్పుడైతే సిలువపై కలిసిపోతాయో అది నీకు జీవము గల రొట్టెను తయారు చేయును. అది సత్యము. ''మరియు నేను రొట్టె నూనె మిశ్రమమును తీసుకుని, అక్కడ చనిపోబోవుచున్న నా చిన్న బాలునికి ఇచ్చుటకు వెళ్ళుచున్నాను, అతడు రాత్రంతా ఎదో ఒకటి తినుటకు ఏడ్చెను, నేను అతనికిచ్చుటకు తీసుకున్నాను. నా కొరకు నేను త్యాగం చేసకొనబోవుచున్నాను. ఆ తరువాత అతన్ని నా చేతులలోనికి తీసుకుని, మరియు మేమిద్దరము మరణము కొరకు చూచెదము.''
54
ఆయన చెప్పెను, ''అయితే ముందు కొంచెము నా కొరకు చేయుము.'' ఆ ముసలి వ్యక్తి విధరాలైన స్త్రీని ఆ విధముగా అడుగుట వింతగా లేదు, చనిపోబోవుచున్న, ఆమె కలిగియున్న చివరి ఆహారపు ముక్క, చనిపోబోవుచున్న పిల్లవాని కొరకు? దేవుడు కార్యములను చాలా వింతైగా చేయును! ''ముందుగా కొంచెము నా కొరకు చేయుము!'' అని చెప్పెను.
''మీకు తెలుసా, మనము అపరిచుతుల పట్ల కనికరము కలియుంటామని బైబిల్ చెప్పుచున్నది. మనము అపరిచితులకు — వారు దేవదూతలు — మనమేమి చేయుచున్నామో తెలియకుండానే పరిచర్య చేయుదుము.'' ''మంచిది, నేను చేసెదనని,'' ఆమె చెప్పెను.
మరియు ఆమె తిరిగిన వెంటనే, ''దాని కొరకు....'' ఓ, మై, అక్కడనే ఇది ఉన్నది, విశ్వాసి వినునటువంటి గొప్పనైన ఆదరణ మాటలు, ''యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు!'' అదే మాట కొరకు ఆమె ఎదురు చూచుచున్నది. ''యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, దేవుడు భూమి మీదకు వర్షం కురిపించేవరకు, ఆ పిండి పాత్ర ఇక ఖాళీ అవ్వదు, నూనె సిసా ఇక ఎండిపోదు.
55
మనము అక్కడ ఏమి పొందుకున్నాము? ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. ''సహోదరుడా బ్రెన్హాం నేను ఎలా తెలుకొనెదను? నేను ఎలా తెలుసుకొనెదను? నాకు తెలిసిన ఒకే ఒక కార్యం, దేవుని మొదటి స్థానమునిచ్చి ముందుకు సాగిపోవడమే. త్యాగము! నూనెను కలుపుము, వాక్యమును మరియు ఆత్మను కలిపినట్లుగా, మీమ్ములను మీరు సిలువ వద్ద ఉంచుకొని, ''ప్రభువా, నేను ఇక్కడున్నాను,'' అని చెప్పండి. ప్రతివిషయములో దేవున్ని ముందుగా ఉంచుకొనుము!
''దేవుడైన యోహోవా సెలవిచ్చినదేమనగా, యోహోవా భూమి మీదకు వర్షమును కురిపించే వరకు, నూనెబుడ్డి తరగదు, మరియు పాత్రలోని పిండి అయిపోదు.'' అప్పుడు ఆమెతో మాట్లాడుచున్నది దేవుని ప్రవక్తయని ఆమె తెలిసుకొనెను. ఓ, ఇప్పుడు ఆమె హృదయము తప్పక గంతులేసి యుండవచ్చును! ఆమె లోనికి పరుగెత్తి ఒక చిన్న రొట్టెను చేసికొని నీటితో, దీనమైన ఎండిపోయిన చెంపలతో, వణుకుచున్న చేతులతో, ఆయన కొరకు తెచ్చెను. దేవుడు చివరిలోనే వచ్చునని, ఆ యొక్క చిన్నముక్క కొరకు వచ్చునని ఆమె ఎరుగును.
56
ఓ, నీవు కేవం దేవుని యొక్క ఆ చిన్న వాగ్ధానమును తీసుకొనుము, అప్పుడు అన్నీ సరిచేయబడును, మార్గమంతటిలో, ఏమి జరుగునో గమనించుము! ఆ హృదయమును కలిగియుండుము, అవిశ్వామనేది హృదయము నుండి దూరముగా పోనిమ్ము. నీవు కలిగియున్న ఆ చిన్న విశ్వామును తీసుకొనుము, సిలువ వద్దకు రమ్ము, ''నేను కలిగియున్నదంతయూ ఇదే ప్రభువా. దీనిని తీసుకొనుము,'' అని చెప్పుము.“ అప్పుడు ఏమిజరగనైయున్నదో గమనించుము, ''యోహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.'' ఓ, ఆయన ఎల్లప్పుడు ఉన్నవిధముగానే ఈ రోజు కూడా ఆయన మారనివానిగా ఉన్నాడు. ఆమె దాని కొరకే ఎదురు చూచుచున్నది.
ఇప్పుడది చూచుటకు చాలా భయంకరమైన చీకటి కావచ్చును, కాని, మీకు తెలుసు, కొన్నిసార్లు మనము ఇలా బోధించబడ్డాము, (మరియు దాని మీద నేను గతరాత్రి మాట్లాడియుంటిని) పగటికి ముందు ఎల్లప్పుడు చీకటిగా ఉండును. ఇది ఉదయకాలపు సూర్యని ప్రకాశమునకు ముందుగా వచ్చునటువంటి రాత్రి యొక్క చిమ్మచీకటి గడియైయున్నది. ఇది సూర్యుని రాకను తెలియజేయుచున్నది.
57
జెర్మనీలో వారు చాయాచిత్రమును తీసారు, వారు దానిని, ''మేఘము'' యొక్క చిత్రము,“ అని పిలిచెదరు. అది లాస్-ఏజేల్స్ లోని ఫారెస్ట్-లాన్ లో ఉన్న ఆ గొప్ప సిలువ యొక్క చిత్రపఠమునకు పోటిగా ఉన్నది. ఆ గొప్ప చిత్రపఠము ఈ భవనము పొడవునా అంత వెడల్పుగా ఉన్నది. వారు అక్కడ వారు దాని చుట్టూ ఒక బుల్డింగును నిర్మించవలసివచ్చెను. మీలోని చాలా మంది దానిని చూసియుండవచ్చును. కానీ దీనిని జెర్మనీలో ''దూత...'' లేక '' మేఘపు దినము,'' వారు అలా పిలుస్తారు అని నేను నమ్ముచున్నాను. మరియు దానినుండి కొంచెము మేఘమును మాత్రమే తీసికొని దాని వైపు చూడండి. ఓ, ఇది చూడడానికి ఆకారము దేనివలే కన్పిస్తుంది, కోపంగా ఉన్న మేఘాలు ఒకనితో మరొకటి కలిపోయినట్లుగా కన్పిస్తుంది, ఆ విదముగా కన్పిస్తుంది. కాంతి దానిపై పడినపుడు, మరియు చూచుటకు మేఘాలు నడుచుచున్నట్లుగా, చూడటానికి మేఘమువలె కన్పిస్తుంది. ఒక ముంచుకొచ్చుచున్న తూఫాను వలె కన్పిస్తున్నది. మరియు నీవు మార్గదర్శకునిచే (గైడ్), ''దగ్గరా చూస్తూ, మరియు అలాగే చూస్తు ఉండము.'' మరియు నీవు దానిని దగ్గరగా చూసినట్లయితే, అది మేఘములు కాదు; ఇది దూతల యొక్క రెక్కలు ఒకదానితో మరోకటి ఆనందముతో ఎగురుచుండుట. అది దాచబడియున్న ఆశీర్వాధము.
58
ఈ రాత్రికి మీ యొక్క అనారోగ్యము కావచ్చును, ఇక్కడికి వచ్చుటకు మీ యొక్క త్యాగమైన కావచ్చును, అది కేవలము దాచబడియున్న ఆశీర్వాధము. దేవుని యొక్క దూతలు వారియొక్క రెక్కలను కలిపి మరియు ఆనందించుటకు ఇక్కడ వచ్చియున్నారు, ఎందుకనగా ''ఒక పాపి రక్షింపబడినప్పుడు పరలోకపు దేవదూతలు సంతోషించెదరని, లేఖములలో వ్రాయబడియున్నది. దానిని గూర్చి ఆలోచించుడి. యోహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, “యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన కృప ఎన్నడూ తరిగిపోదు. మరియు ఆయన నీ హృదయవాంఛను తీర్చుటకై సిద్ధము ఉన్నాడు.
59
ఇప్పుడు మనము కొద్ది క్షణము ప్రార్ధించుకొనెదము, మన తలలు ప్రార్ధనలో అలాగే వంచియుండగా, మరియు మీరు ప్రార్ధనా సిద్దపాటును కలిగి నిలుచున్నారని నేను నమ్ముచున్నాను. ఇక్కడ ఎవరైన ఉన్నారా (మీ కనులు మూసికొని మరియు మీ తలలు మీరు తీయబడిన నేల వైపు చూస్తూ; మరియు, ఒకవేళ యేసు ఆలస్యము చేసినట్లయితే, నీవు తిరిగి మట్టిలో కలిసిపోయెదవు) మరియు నీవు రక్షించబడలేదు, మీరు కొద్దిగా మీ చేతిని పైకెత్తి మరియు ''సహోదరుడా బ్రెన్హాం, నా జీవితము కూడ భాదాకరము ఉన్నది, నేను రక్షింపబడలేదు. సహోదరుడా ఈ రాత్రికి మీ ప్రార్ధనలో నన్ను జ్ఞాపకము చేసికొనుము, నేను నా చేయి పైకెత్తుచున్నాను'' అని చెప్పగలరా. ఇక్కడున్న బాలుడైన, బాలికైన, పురుషుడైన లేక స్త్రీయైన ఇంకా రక్షింపబడని వారు? మరియు మిమ్ములను ఇకమీదట అడగబోను, ఇప్పుడే మీ చేతిని పైకెత్తుడి కావున నేను మీ కొరకు ప్రార్ధించెదను.
60
నా కుడిప్రక్కనున్న వారికి, దేవుడు మిమ్మును దీవించును, దేవుడు మిమ్మును దీవించును, మరియు మిమ్మును, మరియు మిమ్మును. ఎక్కడో చివరగా ఉన్న, మధ్యలో ఉన్న, కేవలం మీరు చేయి ఎత్తండి చాలు. ఎవరూ చూడం లేదు, నన్ను మరియు పరిశుద్ధాత్ముని మాత్రమే చూడనివ్వండి. ఇప్పుడు, దేవుడు నిన్ను దీవించును, దేవుడు నిన్ను దీవించును, దేవుడు నిన్ను దీవించును. అది మంచిదే.
ఈ మధ్య-వరుసలో ఇంకొకరు, మీ చేతిని పైకెత్తుము, ''సహోదరుడా, నేను క్రైస్తవుడను కాదు. నా నుండి దూరంగా పోవునట్లు నేను పరిశుద్ధాత్ముని దుఃఖపరిచాను, ఎంతవరకు అనగా అయిన ఇక ఏ మాత్రము నన్ను ఇబ్బంది పెట్టనంతగా. అయితే నిజానికి, నాదే తప్పని నాకు తెలుసు. నేను పరిశుద్ధాత్మ చేత ఎన్నడూ జన్మించబడలేదని నాకు తెలుసు. నేను సరిపోయినవాడను కాదని నాకు తెలుసు. నా యొక్క అన్ని విషాయలను నేను ఒప్పుకోనలేదు. నేను దేవుని యొక్క అవసరతలను నేను నెరవేర్చలేదు.“
61
బహుశా మీరు అనారోగ్యముగా ఉండవచ్చును. దేవుని అవసరతలను నీవు చేరుకునేంత వరకు అది నీకు ఏ మంచి చేయదు. ''సహోదరుడా బ్రెన్హాం, నేను క్రైస్తవ మతాన్ని చాలా రోజుల నుండి నమ్ముచున్నాను, కాని నిజానికి దైవిక స్వస్థతను నేను ఎప్పుడూ అనుమానించేవాడిని. నేను పరిశుద్ధాత్మ ఈ విధంగా చేస్తుందంటే నేను ఆశ్చర్యపోతున్నాను.'' ఓ, ప్రియమైన సహోదరి, లేక ప్రియమైన సహోదరుడా, ఆ విధంగా దేవుని నుండి నీవేమి పొందలేవు. లేదు. నీవు ప్రతి అవసరతను నెరవేర్చవలసియున్నది, మరియు అటు తరువాత దేవునితో నీవు సరిగా ఉన్నావనే నిశ్చయతను కలిగియుండు. అప్పుడు ఆయన వాగ్ధానమును తీసుకొని దానిపై నిశ్చయతను కలిగివుండు.
62
నాకు ఎడమ ప్రక్కగా, అక్కడ ఎవరైనా ఉన్నారా? మీలో వున్న కొంతమంది యవ్వనస్తులు, నీవు క్రైస్తవుడవు కానిచొ కేవలం మీ చేతినిపైకెత్తి, ''నన్ను గుర్తుంచుకొనుము, సహోదరుడా బ్రెన్హాం'' అని చెప్పండి చాలు. దేవుడు నిన్ను దీవించును, నేను చేతులను చాశాను, చివరిలో, అన్నింటికంటే చివరగా. సహోదరి నేను నిన్ను చూశాను. ఇక్కడ చివరలో, అవును. ఈ దారికి చివర్లో, అవును ఆ చిన్న బాలిక. అవును, అక్కడున్న ప్రతిఒక్కరిని ప్రభువు దీవించును గాక. అది మంచిదే.
ఇప్పుడు, నేను వాగ్ధానము చేసాను, కేవలం మీ చేతులను పైకెత్తుటకు మాత్రమే కోరుదును అని అన్నాను. ఇప్పుడు మనము ప్రార్ధించబోవుచున్నాము. ఇప్పుడు దీనిని మనము చేయబోవు ముందుగా (పాపులు చేతులను పైకెత్తిన తరువాత, ఇరవై లేక ముప్పై మందిని మనము కలిగియున్నాము), ఎంత మంది అనారోగ్యులు, మీ చేతులను పైకెత్తి, ''దేవుడు మాపై కృప చూపి స్వస్థపరచునట్లుగా మమ్ములను నీ ప్రార్ధనలో గుర్తుంచుకొనుము, సహోరుడా బ్రెన్హాం'' అని చెప్పండి. రెండు వందలు లేక ఇంకెక్కువమంది ఉండవచ్చును అనుకొనుచున్నాను. సరే. మనము ప్రార్ధించెదము.
63
మా పరలోకపు తండ్రీ, ఈ విన్నపములతో నీ యొద్దకు వచ్చుట ఎంతో కృపగా ఉన్నది. [టేపు నందు ఖాళీ ఉన్నది] ''... నేను మీ సృష్టికర్తనైయున్నాను.'' మరియు వారు తమ చేతులుంచినపుడు, అప్పుడది ఆత్మయే విజ్ఞానముకంటే గొప్పదని చూచిస్తుంది. ''నా తండ్రీ మొదటిగా ఆకర్షించనిదే ఎవడును నా యొద్దకు రాలేడు. మరియు నా యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను నిత్యజీవము ఇచ్చెదను,'' అని నీవు చెప్పావు తండ్రీ. ప్రభువా, ఇప్పుడు వారు నీ సొత్తు. వారు కూర్చున్నటువంటి కుర్చీలలోనే, ఇప్పుడే వారికి జీవము ఇవ్వుము. వారు నిత్యజీవమును పొందుకొనుదురు గాక. చివరి దినమంది వారిని నీవు లేపెదవు గాక, పరలోకమునకు తండ్రియైన దేవా, సంఘము యొక్క కిరీటములోని ఆభరణముల వలె వారిని నీకు సమర్పించుచున్నాను. దీనిని దయచేయుము, తండ్రీ.
ఇక్కడ జబ్బుతో భాదపచున్న వారి కొరకు నేను ప్రార్ధించుచున్నాను. వారిలోని చాలా చేతులు పైకి ఎత్తిరి, ఎందుకనగా వారు అక్కడ నిజముగా దేవుని అవసరత కలిగి ఒక స్త్రీని చూశారు; అమె ఆ కఠినమైన ఘడియలు వచ్చుట చూచెను. ఇక్కడున్న ప్రతిఒక్కరి పరిస్థితి కూడ అదే, సందేహించవలసిన అవసరం లేదు — అది తప్పక చావవలెను, కాని దేవుడు తన ప్రవక్తలకు ముందుగానే ఆజ్ఞ ఇచ్చాడు, మరియు ప్రతిదీ చక్కబడును. ఇది బాగా పనిచేయును. వారు అంతా సరిగ్గా ఉందని నిర్ధారించుకున్నట్లయితే, అప్పుడు వారు దేవుని యందు నిశ్చయతను కలిగియుంటారు. ఆయన తన వాగ్ధానములను నెరవేర్చునని వారు నిశ్చయతను కలిగియుండెదరు. ఈ రాత్రికి వారితో నీవు వ్యవహరించవలెనని ప్రార్ధించుచున్నాము, మీ ప్రియమైన, జబ్బు కలిగిన పిల్లలు, మరియు వారు భాదలు తొలగిపోవును గాక, వారికి విశ్వాసమును, కృపను మరియు శక్తని దయచేయుము. అలా చేయుము తండ్రి.
64
ఇక్కడున్న ప్రతి సేవకుని దీవించుము, నీ ప్రశస్తమైన ప్రవక్తలు. ప్రభువా, నీవు వారిని అభిషేకించమని మేము ప్రార్ధిస్తున్నాము, మరియు ఈ ప్రజల యొక్క గృహాలను వారు దీవించువారిగా ఉండుదురు గాక, వారి గృహములలో జీవము కలిగి, ఆహారమును వారు జీవించినంత కాలము కలిగియుందురు గాక. వారి నూనె బుడ్డి ఎన్నటికి ఎండిపోదు, లేక వారి గరిసెలు ఎప్పటికి అయిపోవు. ప్రభువా, ఈ భూమి మీద ఉన్న ప్రతి సంఘములో ఆధ్యాత్మిక ఆహారమును ఉండును గాక, అది ఆకలిగొన్న వారి ఆకలిని తీర్చును గాక. దీనిని దయచేయుము ప్రభువా.
మేము నిన్ను ప్రేమించుచున్నాము. మరియు నీవే మమ్ములను మొదటిగా ప్రేమించావని మాకు తెలియును. మేము ఇంకనూ పాపులముగా ఉండగనే నీవు మమ్ములను ప్రేమించితివి. పాపము చేయకయే క్రీస్తు మా కొరకు చనిపోయెను, మా పాపములను ప్రాయశ్చితముగావించుటకు, దేవుని యొద్దకు మమ్ములన తీసుకు వెళ్ళుటకు మేము చేయరాని కార్యము చేసి తప్పిపోయినప్పుడు, దేవుడు లేకుండా లేక ఆయన కుమారుడు లేకుండా — ఏదేను తోటలో నుండి, మా పితరుల అతిక్రమణలను బట్టి మనము పాపము యొక్క గందరగోళములోనికి వచ్చితిమి. మరియు యేసు మనలను ఎంతగానో ప్రేమించెను, ఆయన దేవుని చిత్తమును బట్టి వచ్చెను మరియు ఆయన తన సొంత జీవమును కల్వరి యొద్ద అర్పించుట ద్వారా మనలను మరలా దేవుని యొద్దకు వెళ్ళుటకు విమోచించెను. నీ యొక్క సమస్త మంచి కార్యములను బట్టి ధన్యవాదములు తండ్రీ.
65
మనము అంత్య-కాల చాయలలో నివసించుచున్నాము. రేపు రాత్రనేది ఉండకపోవచ్చు. నాకు తెలియదు, అది నీకే తెలియును ప్రభువా. కాని తండ్రి కొంతమంది ఈ రాత్రికి చేరుటకు అవకాశమున్నది, నీవు పరిశుద్ధాత్మను పంపెదవని నేను ప్రార్ధిస్తున్నాను.
''సొదోమ దినములలో ఉండునట్లుగా మనుష్యకుమారుని రాకడ దినములలో ఉండును.'' సొదోమ దినములలో, అక్కడ మూడు రకాల ప్రజలున్నారు: నుళివెచ్చని సంఘపు ప్రజలు, మరియు ఎన్నుకొనబడినవారు, మరియు పిలువబడినవారు; సొదోమ ప్రజలు, మరియు లోతు ప్రజలు, మరియు అబ్రహాము యొక్క ప్రజలు (లోకము నుండి బయటకు పిలువబడిన వారు). సొదోమ ప్రజలు గొప్ప వర్తమానముతో ఇద్దరు వర్తమానికులని పొందారు. మరియు అబ్రహాము గుంపైతే ఒక సూచనను పొందుకున్నది, మరియు ఆ సూచనేమిటంటే ఒక మనుష్యుడు అతని దుస్తులపై దుమ్ముతో, ఎవరైతే అబ్రహామును ఎరిగియున్నారో, అపరిచితుడైయుండి అతని భార్య పేరు ఎమిటో అబ్రహాముతో శారా అని చెప్పియున్నాడు, ఆ గుడారమునకు ఆయన తన వీపుభాగమును కలిగి ఉండి, ''ఆమె నవ్వనేల?'' ఓ దేవా, సంఘము మెల్కొని దీనిని చూచుదురు గాక, యేసు చెప్పినట్లుగా, ''సొదోమ దినములలో ఉండునట్లుగా మనుష్యకుమారుని రాకడ దినములలో ఉండును.'' ఆ దేవుడే తన సంఘమనే శరీరములో కన్పించును, మరియు ఇప్పుడు కూడా అదే సూచనగా ఉండును. ఈ రాత్రికి మరలా దీనిని దయచేయుము ప్రభువా. దీనిని మేము ప్రభువైన యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
66
నేను ఆయనను ప్రేమించుచున్నాను,
నేను ఆయనను ప్రేమించుచున్నాను,
(ఇప్పుడు ఆత్మలో మధురముగా ఆయనను ఆరాధించుడి)
ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను
నా రక్షణను కొనెను,
ఆ కల్వరి వృక్షముపైనే.
ఓ, ఒక వర్తమానము తరువాత, అంత శుభ్రమయినదని మీరనుకొనుచున్నారా? కేవలము పరిశుద్ధాత్మ ప్రతి అవిశ్వాసము నుండి మీ హృదయములను శుభ్రముచేయుచున్నది, మరలా మిమ్ములను దేవునితో సరియైన మార్గములో పెట్టుచున్నాడు. ఓ, ఇప్పుడు ఇది ఆయనను ఆరాధించుటకు సమయమైయున్నది. వర్తమానము ముగిసినది, కాబట్టి మనము, “నేను ఆయనను ప్రేమించుచున్నాను,” అనే పాటను పాడుచుండగా, ఆయనను ఆరాధించెదము. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా మరియు రమ్యముగా. మీ కనులు మూసికొని కేవలము మీ ఆధ్యాత్మికమైన కళ్ళతో మాత్రమే ఆయన వైపు చూస్తు, గమనించండి ఆయన ఆ విధవరాలి పట్ల ఏ విధముగా చేసాడో. ఆ విధవరాలి వలె నీవు కూడా ఆయనకు ప్రియమైనవాడవు, నీ జీవితమును కూడా ఆయన భద్రము చేసెను. మీరు ఆయనను ప్రేమించుటలేదా?
నేను ఆయనను ప్రేమించుచున్నాను,
నేను ఆయనను ప్రేమించుచున్నాను
ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను
మరియు నా రక్షణను కొనెను,
ఆ కల్వరి వృక్షముపైన.
గొప్ప వైధ్యుడు ఇక్కడవున్నాడు,
సానుభూతి కలిగిన యేసు,
నిరాశ కలిగిన హృదయమును ఆనందింపజేయడానికి
ఆయన మాట్లాడుచున్నాడు,
ఓ, యేసుని స్వరము వినుము.
సెరాఫ్ కీర్తనలో మధురమైన సంగతి,
మర్త్యమైన నోట మధురమైన నామము,
ఎన్నడూ పాడనడువంటి మధురమైన పాట,
ఓ, యేసూ, ప్రశస్తమైన యేసు.
67
ఆయన మృదువుగా వాయిద్యమును వాయించుచుండగా... [సహోదరుడు బ్రెన్హాం, “గొప్ప వైద్యుడు,” అనే పాటను ఆలపించనారంభించాడు.] నేను ఆ పాటను విన్నప్పుడు, అది నాకొకటి నేర్పినది. కొద్ది కాలము క్రితం, ఇండియానాలోని, ఫోర్ట్‌వేన్ నొద్ద అక్కడ ఒక చిన్న బాలిక పియానో వాయించుచుండెను. ఆమె పెంతెకోస్తురాలు కాదు, కాని ఆమె తన వెనుక అందమైన పొడవాటి జడను కలిగివుండెను. మరియు నేను రోగుల కొరకు ప్రార్ధించుటకు వెళ్ళుచుండగా, మరియు మొదటిగా వరుసలో నిలుచున్నది ఒక చిన్న బాలుడు, పోలియో సోకి వికలాంగుడైనటువంటి వ్యక్తి. మరియు నేను ఆ చిన్న బాలుడు సహోదరి యొక్క చేతులలో నుండి తీసుకొని, మరియు ఆ బాలుడను పట్టుకొని, ''నిజముగా, అందరి హృదయ రహాస్యములను ఎరిగిన గొప్ప వైద్యుడు ఇక్కడున్నాడు,'' అని చెప్పాను. మరియు ''మీరు దానిని నమ్ముచున్నావా?'' అని కొన్నివేల సంఖ్యలో ఉన్న జనుల వైపు చూసి చెప్పాను.
''అవును,'' వారందరు దీనిని నమ్ముచున్నారు, కాని వారు మొదటి వర్తమాను వినినపుడు వారందరూ సందేహించారు, మరియు వారు... వర్తమానమును అర్ధము చేసుకొనుటకువారికి కఠినముగా వుండెను.
68
మరియు, ''ఈ చిన్న బాలుడెవరో మరియు తన పెరేమిటో ప్రభువైన యేసు నాకు తెలియపరచునని మీరు నమ్ముచున్నారా? మీరు నమ్మెదరా? అబ్రహాము దర్శించి అదే దూత, శారాను గూర్చి తెలుసుకున్న ఆయనే... ఆ యేసుక్రీస్తే నతానియేలు వచ్చినపుడు కనుగొన్నది, ఎవరైతో పేతురును యెరిగి అతని పేరుతో పిలిచెనో, బావి యొద్ద ఆ స్త్రీకి తానెవరని చెప్పెనో, మరియు ఈ కార్యములన్నీంటి చేసిన ఆయనే? ఆ యేసే అయి ఉన్నాడని మీరు నమ్మెదరా?“ అని చెప్పాను. వారందరూ వారిచేతులను పైకెత్తెను, అలా జరుగునని వారనుకొనుచున్నారు.
మరియు పరిశుద్ధాత్మ దీనిని బయలుపరచుట ప్రారంభించినపుడు. మరియు, ఆయన చేసినపుడు, ఆ చిన్న బాలుడు నా చేతులలో నుండి క్రిందికి దూకి పరుగెత్తుకుంటూ వేదికపై గంతులు వేసెను. ఆ చిన్న బాలుని ప్రక్కగా కూర్చిలో కూర్చున్న ఆ తల్లి స్పృహ-కోల్పోయెను. మరియు ఆ చిన్న బాలుడు క్రిందికి పైకి పరుగెత్తుచున్నాడు. పియానో వాయించుచున్న ఆ అమిష్ లేక డంకార్డ్ బాలిక స్వచ్చమైన తెలుపు రంగులోనికి మారి, కూటము మధ్యలోని దూకెను మరియు ఆమె తలవెంట్రుకలు వీపంతటా పడెను. ఆమె ఒక తెల్లని వస్త్రమును ధరించుకొని ఉండెను. ఆమె చూచుటకు ఒక దేవదూత వలె ఉండెను. మరియు ఆమె అన్యభాషలలో పాడుట ప్రారంభించెను. మరియు ఆమె అలా పాడుచుండగా, ఆ వాయిద్యము ఎంతమాత్రము ఆగకుండా వాయించుచూ ఉండెను:
గొప్ప వైద్యుడు ఇప్పుడు చేరువలో ఉన్నాడు,
సానుభూతి కలిగిన యేసు,
నిరాశ కలిగిన హృదయమును ఆనందింపజేయడానికి ఆయన మాట్లాడుచున్నాడు,
యేసు తప్ప వేరొక నామము లేదు.
69
వేదిక చుట్టూ ఉన్న ప్రజలు క్రిందపడుచూ, మరియు ఏడ్చుచూ క్రిందపడుచూ, ''దేవా, నాపై కనికరము చూపుము!'' అని అరచుచూ ఉన్నారు. ఓ, ఎలాంటి కూటము అక్కడ వుండెను.
ఆ గొప్ప వైద్యుడు ఇప్పటికి ఇక్కడనే ఉన్నాడు. ఆయన ఎన్నడు తప్పిపోడు. ఇప్పుడు, ఇక్కడున్న వారిలో దానిని ఎందరు నమ్ముచున్నారు, అంతే కాకుండా, మీ హృదయమంతటితో, మరియు దేవుని శక్తి స్వస్థపరుచుననే నమ్మకమతో ఈ రాత్రి ఇక్కడ వున్నారా?
మరియు ఈ భవనములో ఇక్కడున్న వారే కాకుండా, ఇంకా నాకెవరైన తెలిసినవారు ఉన్నారా, ఇక్కడ కూర్చున్న ఈ మగపిల్లలు, వీరిలో ముగ్గురు నేను ఒక ముఖాముఖి సమావేశంలో ఆర్కన్‌సాస్‌లో మాట్లడియున్నాను; సహోదరుడు పాట్ టైలర్, మార్పు చెందినటువంటి నేరగాడైన వ్వక్తి; ఇక్కడే కూర్చున్న సహోదరుడు విలియమ్స్; మరియు నేను చూడగలిగినంతమట్టుకు.... మరియు సహోదరుడు జీన్ గోడ్, నా స్నేహితుడు, ఇక్కడే కూర్చొనియున్నాడు. మరియు ఇక్కడ కూర్చున్న వారు తప్ప ఈ భవనములో ఉన్న అందరినీ నేను ఇప్పుడే చూడటం అని అనుకొనుచున్నాను, మరియు ఈ రీతిగా ఇక్కడ కూర్చున్న వారిని నేనెరుగుదును.
70
ఇప్పుడు, ఒక చేతిలో ఖురాన్‌ను మరియు ఇంకొక చేతిలో బైబిల్‌ను పట్టుకొని అనేక వేల సంఖ్యలో వున్న వీరిముందు నిలుచుని, ''ఒకటి సరియైనచో, ఇంకొకటి తప్పైనదగును,'' అని చెప్పాను. మరియు క్రైస్తవ మతము మాత్రమే అన్ని మతములలోకెల్లా వేరైనది; మరియు సంపూర్ణ సువార్త అనేది యేసుక్రీస్తు ఇప్పటికి సజీవుడైయున్నాడని రుజువుపరచగల ఒక గుంపు. మరియు మిగతా వారికి వేదాంత శాస్త్రము కలదు, మరియు వారు మీకు దాని గురించి బోధించెదరు. ''మాకు కావలసినంత మానసిక శాస్త్రము కలదు,'' అని మహమ్మదీయులు చెప్పుదురు. ''మాకు కావలసినంత మానసిక శాస్త్రము కలదు, మీరు యేసును గూర్చి చెప్పినట్లుగానే మేము మా ప్రవక్త గురించి కూడా మేము గట్టిగా అరచి చెప్పగలము. కాని మా ప్రవక్త మాకు ఎన్నడూ దేనిని వాగ్ధానము చేయలేదు. అయితే మీ యేసు చనిపోయి తిరిగి లేతునని వాగ్ధానము చేసాడు, మరియు ఆయన చేసిన కార్యములను మీరును చేయుదురు, అంతే కాకుండా ఆయన మీలో నివసించును. మరియు నీవు మా ప్రవక్త శరీరమును సమాదిలో ఉన్నదని చెప్పెదవు, మరియు మీరైతే పునరుత్థానుడైన యేసును కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆయన కార్యములను చూద్దము.'' వారు ఉంచెదరు... మరి మీరు ఉంచరా...
71
మీరు చుట్టూ ఇక్కడున్న వేదాతంతులతో, కొంత గ్రీకు పదాల మీదను లేక మరి ఇంకేదైన మీరు గందరగోళం అవుతున్న విషయాలపైన మాట్లాడవచ్చు, కాని వారిలో కొందరు వ్యక్తులతో బలపరిక్షకు దిగవద్దు. మీరు దేనిని గురించి మాట్లాడుచున్నారో, దానిని కలిగియుండుట మంచిది. మీరు ఎరుగుట మంచిది. ఆ కారణముచేతనే ఇక్కడ సువార్తికులను తెచ్చుట కష్టము. వారు దేనిని గూర్చి మాట్లాడుచున్నారో వారికి తెలుసు. మరియు మీరు ఎరిగియుండుట మంచిది, ఎందుకనగా వారు నీ యొక్క సహాయమును కొరకు నీ చేతిని అడుగబోవుచున్నారు.
కాని స్నేహితులారా, ఈ రాత్రి దానిని తెలుసుకొనుటకు నేను చాలా కృతజ్ఞుడనైయున్నాను, అది మన యేసు, మరియు ఆయన చేసిన ప్రతి వాగ్ధానము సత్యమైయున్నది. నేను గనుక ఇక్కడున్న ఎవరినైన స్వస్థపరచగలిగినయెడల, దానిని నేను చేసియుండేవాడను. నేను దానిని చేయలేకపోయినట్లయితే, నేను ఒక వేషదారినగుదును. అయితే నేను స్వస్థపరచలేను.
72
అయితే ఆయన సంఘమునకు వరమును ఇచ్చియున్నాడు, ఆయన వాగ్ధానము చేసియున్నాడు... మనము లూథరు కాలములో నీతికరణలో జీవించాము. వెస్లీ కాలములో మనము శుద్ధీకణలో జీవించాము, అప్పుడు సంఘము అల్ప-సంఖ్యగా మారెను. పెంతెకోస్తు దినములలో మనము పరిశుద్ధాత్మ బాప్తిస్మములో జీవించాము మరియు వరముల పునరుద్ధరణ. ఇప్పుడు మనము నిజముగా అల్ప-సంఖ్యలో ఉన్నాము, దేవుని కుమారుని రాకడ సమయములో ఉన్నాము. ఇక్కడవారు విశ్వాసము ద్వారా నమ్మియున్నారు; ఇక్కడ వారు శుద్దీకరణలో కేకలు వేసారు; ఇక్కడ వారు వరముల ద్వారా భాషలలో మాట్లాడారు; కాని ఇప్పుడు నెగిటివ్ - పాజిటివ్ గా ఉన్నది, మరియు పిరమిడ్‌పైన తలరాయి వచ్చుచున్నది, మరియు ఇది అంత్య-కాలమైయున్నది, క్రీస్తు మరియు ఆయన సంఘము ఒక్కటిగా ఉందురు, ఎప్పటివరకంటే మెథడిస్ట్‌లలో, లూథరన్‌లలో, మరియు ఆ వెనుకవున్న వారందరిని మృతులలోనుండి బయటకు పిలిచేంతవరకు, మరియు అక్కడ ఒక పునరుత్థానము ఉండబోవుచున్నది. అక్కడ మొదటిగా, రెండవదిగా, మూడవదిగా, నాల్గువదిగా, ఐదవదిగా, ఆరవదిగా మరియు ఏడవదిగా చనిపోయినవారు, ఈ దినములలో ఒకానొక రోజు లేపబడబోవుచున్నారు, యేసును మధ్యాకాశములో కలుసుకొనుటకు. స్నేహితులారా, ఆ ఘడియ వచ్చియున్నది. ప్రభువు యొక్క రాకడ సమీపముగా ఉన్నది.
73
మనము యెరుషలేము వైపునకు చూచినట్లయితే, యూదులు మన నిమిత్తము గ్రుడ్డివారుగా చేయబడ్డారు. అంజూరపు చెట్టు దాని చిగురించుచున్నది. అతడు చెప్పెను, “మరియు ఇతర చెట్లన్నీయు....'' బిల్లీ గ్రాహామ్ సాదారణ ప్రజలలో ఉజ్జివమునకు కారణమైయున్నాడు. ఓరల్ రాబర్ట్స్ పెంతెకోస్తులకు ఉజ్జీవమునకు కారకుడైయున్నాడు. మరియు ఇప్పుడు, దేవుని కుమారుడైన యేసు, ప్రజలను తలరాయి ప్రత్యక్షతలోనికి లాగుటకు, దేవుని కుమారుని మరలా తిరిగి తెచ్చుటకు, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ నిమిత్తము జరుగవలసిన కార్యములను పూర్తి చేయుటకును ఆయన ఈ శేషించినవారిలోనికి వచ్చియున్నాడు. ''సోదొమ దినములలో ఉన్నట్లుగా, మనుష్యకుమారుని రాకడ దినములలోను ఉండునని,” ఆయన చెప్పెను.
నీవు చూచునట్లు, నేను నా వీపును నీకు చూపెదను. ఇప్పుడు, గుర్తుంచుకొనుడి, ఇది ఒక మనుష్యుడు కాదు. అక్కడున్న మానవుడు కేవలము కాల్షియం, పొటాషియం, మరియు పెట్రోలు, భూమిలోని పదహారు మూలకాలలోనికి దేవుడు ప్రవేశించెను, “ఉఫ్ఫ్,” ఏకముగా ఊదెను, మరియు అందులోనికి ప్రవేశించెను, మరియు జీవమాయెను.
74
యేసుక్రీస్తు కూడా ఆ విధముగానే ఉండెను. ఆయన మనుష్యకుమారుడు. ఆయన శరీరధారిగా ప్రత్యక్ష్యమైన దేవుడు, కాని ఆయన శరీరముగా ఒక నరుడు, ఆయన ఆత్మ దేవుడైయున్నాడు. మరియు ఆయన చివరి దినములలో తన సంఘములోని వస్తానని వాగ్ధానము చేసియున్నాడు. ''కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; అయితే నేను మీతోను, మీలోను ఉన్నాను గనుక మీరు నన్ను చూతురు. నేను చేసిన కార్యములు మీరును చేయుదురు.'' చూచారా? ఇప్పుడు ఆ గొప్ప వైద్యుడు ఇక్కడున్నాడు.
ఆయన చెప్పెను, “ఇప్పుడు, సోదొమ మరియు గొమెర్రో యొక్క సూచన...'' ఇప్పుడు అది ఏమైయున్నది? మన వార్తాపత్రికలను చూడండి. స్వలింగ సంపర్కులు, వక్రమార్గము, గడిచిన ఈ పది సంవత్సరములలో 40 శాతము పెరిగినది. భూకంపాలు, ఇవన్నీయు కూడ రాకడకు సూచనలైయున్నవి, సంఘము పడిపోవుచున్నది, అంత్య-కాలము వచ్చియున్నది.
ఇప్పుడు మనము దానిగురించి బోధించుకొనుచుండగా, మరియు దేవుడు కూడా ఆయన సూచనలను చూపించుచున్నాడు. ఇప్పుడు, ఈ బైబిల్ సత్యమైనట్లయితే, అది సత్యమైయున్నది, మరియు దానిని కొరకు నేను చావుటకైన సిద్ధమే. బైబిల్ సత్యమైనది. యేసుక్రీస్తు సజీవుడైయున్నాడు, మనము ఆయన సంఘమై యున్నాము, ఆయన ఆత్మతో నింపబడియున్నాము, అప్పుడు మనలో ఉన్న ఆయన జీవము, ఆయన మనుష్యకుమారునిలో ఉన్న జీవమునే ఉత్పత్తి చేయును, పరిశుద్ధాత్మ — దేవుని యొక్క పరిశుద్ధాత్మ — మనలో జీవించును.
75
సంఘము నిమిత్తము మరియు దేవుని యొక్క మహిమ కొరకు, మరియు మీ అనారోగ్యము కొరకు, మీ బాధ కొరకు మరియు జబ్బు కొరకు, ఆయన యొక్క వస్త్రపు అంచును ముట్టి చూడుము మరియు ఆయన నాలో నుండి ప్రభావము వెడలిపోయినది, తన సేపకుని వలే, ఆయనను ముట్టిన స్త్రీని పిలిచినట్లుగానే నిన్ను కూడా పిలువును. ప్రభువు దానిని అనుగ్రహించును గాక. అది నిన్ను మరెక్కువగా విశ్వసించునట్లుగా మరియు నీవు స్వస్థతను అంగీకరించునట్లుగా చేయునా? మీలో ఎంతమంది విశ్వాసులు దేవుడు ఆ విదముగా పిలిచినట్లయితే, స్వస్థత కలుగునని అంగీకరించుచున్నారు, లేక ఆయన పిలుచునని చూచుచున్నారు? మీ చేయిని పైకెత్తుడి. దీనిని ప్రభువు దయచేయును గాక. (“గొప్ప వైద్యుడు” అను పాటను ఆపకుండా వాయించుము, నీవు వాయించెదవా? అలాగు చేయుటకు నేను నడిపింపబడియున్నాను.)
76
మరియు ఈ రాత్రికి నేనిప్పుడు మరలా నా స్నేహితుల వైపు తిరుగుచున్నాను, కేవలం మిమ్మును చూచుటకు మాత్రమే. సహోదరులారా, సహోదరుడా డేవిడ్, నేను నీకు ఏదో చెప్పుటకు ప్రయత్నించుట లేదు..... దేవుడే నాకు సాక్షి, ప్రజలకు తగిన రీతిగా, (మాట్లాడుచున్నది) దేవుడేనని, ఇది నేను కాదని ఖచ్చితముగా చెప్పగలను. దీనిని చేయటకు నా యొద్ద ఏమి లేదు. నేను కేవలము... దేవుడు ఒకరిని వాడుకోవలసియున్నది. ఎవరి హస్తములు యోగ్యమైనవి కావు; అయితే దేవుడే వాటిని యోగ్యమైనవాటిగా చేయును. గమనించుడి, ఆయన యొక్క ఉద్దేశ్యమును నేరవేర్చుటకు జగత్తుపునాధి వేయబడక మునుపే ఆయన ఎన్నుకొనును; మరియు ఇది ఖచ్చితముగా జరుగవలసియున్నది, మరియు అది ఖచ్చితముగా నెరవేర్చబడవలెను.
77
సంఘము మచ్చ అయినను మరియు ముడతైననూ లేకుండా అక్కడ ఉండబోవుచున్నది. దేవుని కృపా దానిని చేయును గాక. అది జరుగవలెనన్న దానికి కృప తోడుకావలెను. ఆయన అబ్రహాముతో మాట్లాడిన రీతిగా, శారా ఆయనను విశ్వసించలేదు. మంచిది, అనుమానించినందుకు అప్పుడే శారాను ఆయన చంపేవాడు, ఎందుకనగా అవిశ్వాసము మాత్రమే ఘోరమైన పాపమైయున్నది — అదే పాపమైయున్నది. మరియు ఆమె అనుమానించి తన మనసులో గుడారరములో ఉండి నవ్వుకున్నది, దానిని దూత ఆ గుడారము గుండా ఆలోచనలను వివేచించెను. అది నిజమా? కాని శారాను ఎందుకు చంపలేదు? ఎందుకనగా ఆమె అబ్రహాములో భాగమైయున్నది, మరిప్పుడు అబ్రహామును కూడా చంపవలసియున్నది. మరియు మనము క్రీస్తు శరీరములో ఉన్నప్పుడు యేసులో భాగమైయున్నాము. ఒకవేళ ఆమె చేసిన విదముగా మనము కూడా తెలియక చేసినట్లయితే మన యొక్క అవిశ్వాసములు క్షమింపబడును, ఎందుకనగా ఆమె భయపడియుండెను.
78
వేదికపై ఏదో ఒకటి కన్పించుచున్నదని నీవు నమ్ముచున్నావా? ఓ, నేను దీనిని వివరించాలను ఆశించుచున్నాను. నేను తప్పక తిరగవలెను. నేను చర్మపు దురద కలిగిన ఒక స్త్రీని చూసాను, నీవు ఆయన తాకావు. అది నిన్ను వదిలిపోవును, ఎందుకనగా నీ చుట్టూ అంతా కూడ వెలుగున్నది. ''నీవు విశ్వసించినట్లయితే, సమస్తమును సాధ్యమే.'' ఇప్పుడు నమ్ముము.
కావున ఇది మనసు చదివే ఒక మానసిక శాస్త్రములాంటిది కాదని నీవు నమ్మెదవు, నేను నా వీపు భాగము నీవైపు ఉండునట్లుగా తిరిగెదను. దీనిని గురించి ఏ విదముగా అన్పిస్తుంది? ఇది ఒకసారి ఎంజిల్స్ అను గుడిలో జరిగినది, సహోదరి. సహోదరుడా డేవిడ్, నీకు గుర్తున్నదా. ఇప్పుడు నేను కేవలం... కావున నీవు చూచెదవు, నేను నీతో మాట్లాడుచున్నాను, అది ఏమి సూచిస్తున్నదనగా, అక్కడున్న ప్రజలతో నాకు ఎటువంటి సంబంధము లేదని. నీవు తప్పక... నీవు అక్కడ,... నీకు అర్ధమయినదని నాకు తెలుసు, చూశారా. కాని ప్రజలు ఎరుగునట్లు ఏదో ఒకటి చేయాలని నేను దేవుని కృపను అడుగుచున్నాను.
79
అవును, నేను ఒక యవ్వన వ్యక్తిని చూశాను, యవ్వన స్త్రీ. ఆమె ఇక్కడకు చాలా దూరస్తురాలు, ఆమె ఈ దేశపురాలు కాదు. ఆమె వర్షము కరుయు దేశము నుండి వచ్చినది మరియు చాలా చెట్లు మరియు నాచు కలిగిన ఒరేగాన్ దేశమునుండి వచ్చెను. ఆమెకు మూర్చ రోగము సోకినది. ఆమె బయటనే అక్కడ కూర్చొని ఉన్నది. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయనని నీవు నమ్ముచున్నావా? అలా జరుగునని నీవు అంగీకరించుచున్నావా? సహోదరి, పైకి నిలుచొనుము. ఇంటికి వెళ్ళు, నేను ఆ దయ్యమును గద్దించుచున్నాను. నీవు దానిని హృదమంతటితో నమ్ముచున్నావా? మంచిది.
80
మధ్యగా వేసిన ఈ దారిలో ఎవరో ఒకరు విశ్వాసమును కలిగియున్నారు. సందేహించవద్దు. నేను నీతో మాట్లడెదను, సహోదరుడా షోర్, అయితే ఇప్పుడు నీతో మాట్లాడుచున్నది నేను అని గ్రహించెదవు. మరియు అక్కడున్న ఒకరితో నేను తెలియజేయాలనుకుంటున్నాను... మీ వద్ద ప్రార్ధనా కార్డులు లేనిచో, కావున అది కేవలము... ఎవ్వరిని పైకి తెచ్చుటకు అవసరము లేదు కాని వారు చూచునట్లు.
అవును, అక్కడ సన్నగా ఉన్న ఒక్క స్త్రీ కలదు, ఆమెకు క్యాన్సరు వచ్చెను. అమె ఆసుపత్రిని ఈ రోజు కలువవలసి ఉండెనుయ. ఆమె ఇక్కడ ముందరనే కూర్చొనియున్నది, చూడటానికి సన్నగా ఉన్న స్త్రీ. ఆమె పేరు కుమారి పీటర్‌సన్. మంచిది, దేవుని యందు విశ్వాసముంచావా స్త్రీ. పరలోకమునకు దేవుడు ఆ దయ్యమును చంపి అది ఇంకెన్నడూ ఎవడును చూడకుండ చేయును. నీవు మనుష్యకుమారుని నమ్ముచున్నావా? నీ పూర్ణహృదయముతో ఆయనను నమ్ముచున్నావా? కేవలం ఆయనయందు విశ్వాసముంచుము, అది మాత్రమే నీవు చేయవలసిన పనియైయున్నది.
81
మంచిది. ఈ విధంగా అన్నింటిని నమ్మడానికి మీరు సిద్దంగా ఉన్నారా? ఇక్కడున్న సేవకునితో నన్ను మాట్లాడనివ్వండి. మీరు హృదయమంతటితో నమ్ముతున్నారా? అక్కడున్న కొంతమంది నమ్మారని నేననుకొనుచున్నాను. నేను మీతో మాట్లాడుచున్నానని మీరే తెలుసుకుంటారు. కాని దేవుని శక్తి మానసిక విషయాలన్నింటిని మరుగుచేసి, ఆత్మీయ మండలములోనికి తీసుకు వెళ్ళుట చూడండి.
అవును, నా వెనుక ఒక స్త్రీ ఉన్నది, మరియు ఆమె తనకేమైనదో తెలియకుండెను. ఆమె ఉన్నది... ఓ, ఆ పేదరాలైన స్త్రీ! ఆమెకు ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు శస్త్రచికిత్సలు జరిగాయి. అది ఏమైయున్నదో వారికి తెలియలేదు. ఆ వైద్యులకు కూడ అదేమిటో తెలియదు. ఆమె ఇక్కడకు, ఆరిజో నాకు విశ్రాంతి కొరకు పంపబడినది. ఆమె లూసియానా ప్రాంతము నుండి వచ్చినది, ఆమె పేరు శ్రీమతి. పియర్‌సన్. మంచిది, శ్రీమతి. పియర్‌సన్, ఎక్కడో నా వెనుక ఉన్నావు, లేచి నిలువుము, నా వైపునకు చూడుము. నేను దేవుని ప్రవక్తనైయున్నానని నీవు నమ్ముచున్నావా? నేను నిన్ను ఎరుగను. అది గనుక నిజమైనట్లయితే, నీ చేయి ఊపుము. మనము ఒకరికొకరము తెలియని వారము. ఏదైతే చెప్పబడినదో, అది సత్యము. అది నిజమేనా? వైద్యులు నీకేమైనదో వారికి తెలియదు. ఇది మీ నరములకు సంబంధించినది. నిజంగా ప్రశాంతంగా ఉండండి, విశ్వాసము కలిగి ఉండండి, మరియు బాగుపడి నీవు ఇంటికి వెళ్ళుదువు గాక. దేవునియందు విశ్వాసముంచుము! దేవుని కుమారుడు తిరిగి లేచెనని నీవు నమ్ముచున్నావా?
82
ఇప్పుడు, ఈ విభాగంలో ఉన్న ఇంకెవరి గురించో ఏమైయున్నది? మీరు ఇక్కడ తిరిగి విశ్వసించడానికి సిద్ధంగా ఉన్నారా? పాట్, నీవు క్రైస్తవుడవైనందుకు ఆనందించుచున్నావా? మీరు జీవిస్తున్న జీవితములో నుండి బయటికి వచ్చుటనేది ఆశ్చర్యమేమి కాదు, మరియు క్రైస్తవుడిగా ఉండుము?
ఇక్కడ ఒక మహిళ ఉన్నది. అమె ఒక స్త్రీ, ఒక పురుషుడు మరియు ఒక చిన్న పిల్ల. ఈ మహిళ దేవుని సంప్రదించుచున్నది. ఆమె నా వెనుక ఉన్నది. ఆమె ఒక రకమైన ఉదరమునకు సంబంధించిన బాదను కలిగి ఉన్నది. మరియు ఆమె తర్వాత ఆమె బలహీనతను కలిగి ఉన్నది. ఆమె ఇక్కడ నుండి వచ్చినది కాదు, లేక ఆమె ఒక ఎడారి ప్రాంతం వున్న దేశము నుండి వచ్చినది, కాని ఆమె కాన్‌సాస్ నుండి వచ్చినది. ఆమె భర్త ఒక సేవకుడు. ఆమె వెనుక అక్కడ కూర్చుని ఉన్నది. నేను నిన్ను ఎరుగను. అది సత్యమైతే, స్త్రీ - నీ చేతిని ఈ విధముగా ఊపుము. మంచిదండీ, ఇంటికి వెళ్ళుము, మంచిదయ్యా. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి మరియు బాగుపడుము. ప్రభువును నీవు నమ్ముచున్నావా?
83
ఈ భవనము చుట్టూ ఉన్నవారలారా, మీరు ప్రభవుని నమ్ముచున్నారా? ఖచ్చితముగా, ఆయన ఇక్కడున్నాడి! యేసుక్రీస్తు నిన్న, నేడు, మరయు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆ స్త్రీ ఎక్కడున్నదో ఏలియాకు చూపిన ఆ దేవుడే, మీరెక్కడున్నారో, ఎక్కడ కూర్చుని ప్రార్ధించుచున్నారో ఆ దేవుడే నాకు తెలియజేయును, ఎందుకనగా అది నిన్న, నేడు, నిరంతరము, ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు ఆత్మయైయున్నది. నీవు దీనిని నమ్ముచున్నావా? నేను మీ కొరకు ప్రార్ధించుచుండగా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీ చేతులను ఇంకొకరి మీద ఉంచండి. మీలోని ప్రతి ఒక్కరు ఇప్పుడే నమ్ముము, అప్పుడే మీరు దీనిలో ఏదో ఉన్నదని గ్రహించగలరు. మీరు విశ్వాసులు, అవునా? మీరు గనుక ''ఆమేన్'' చెప్పెదరా. దేవుని యొక్క సన్నిధిలో, విఫలమవ్వని యేసుక్రీస్తు యొక్క పునరుత్థానపు యొక్క రుజువులో, మీ చేతులను ఒకరిపై మరొకరుంచి, ఒకరి కొరకు మరోకరు ప్రార్ధన చేయుడి.
84
మా పరలోకపు తండ్రీ, ఈ వేచియున్న ప్రజలను నీకు అప్పగించుచున్నాను. ఇక్కడున్న ప్రజలందరు, వారి పాపములను బట్టి మారుమనస్సు నొందినవారు ఒక మంచి ఆలయ గృహమును కనుగొందురు గాక. ప్రభువా, జబ్బుతో ఇక్కడున్న వారు స్వస్థపడుదురు గాక. వారు జీవితములపై సాతాను యొక్క శక్తి ఇప్పుడే బ్రద్దలైపోవును గాక, ఆ దయ్యమును నేను గధ్దించుచున్నాను మరియు యేసుక్రీస్తు యొక్క శక్తి ఈ ప్రజల మీదకు వచ్చి మరియు ప్రతి రోగమును, ప్రతి జబ్బును, ప్రతి శ్రమను, ప్రతి అపనమ్మకమును తీసివేయును గాక. ప్రభువా, వారినుండి దానిని తీసివేయుము మరియు వారిని స్వస్థపరచుము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో నేను దీనిని అడుగుచున్నాను.