నీవు దీనిని నమ్ముచున్నావా?
1మనము ప్రార్థించక ముందు, నేను దీనిని చెప్పగోరుచున్నాను, గత సాయంకాలము, అది గత సాయంకాలమని నేను నమ్ముతాను, నేను ఒక స్త్రీతో అన్నాను, “ఆ లావు తల కలిగిన బిడ్డకు, మేము సూచనలను ఇచ్చిన ప్రకారము చేయండి, అది ముడుసుకు పోతుంది.” మరియు ఆ బిడ్డ తల, గత రాత్రి, ఒక దారపు కొలత ప్రకారము, ఒకటిన్నర అంగుళములు ముడుచుకుపోయింది, కాబట్టి ఆ స్త్రీ, ఆ బిడ్డను ఇప్పుడు ఇక్కడకు తెచ్చింది.
2 ఇప్పుడు, నేను దానిని చేసిన కారణమేమనగా, ఒక ఉద్దేశ్యము కొరకు. చూడండి? తాకగలుగునట్లు ఏదైనా మీరు చూడగలిగినట్లైతే, దానిని నమ్ముచూయుండుటకు, అది మీ విశ్వాసమును పెంచుతుంది. కొన్నిసార్లు, బహుశ, ఆ వ్యక్తి పైకి లేచి, ఒకటి రెండు అడుగులు వేసి, మీ చేతిని కదపమంటాను. లేక నీ వ్రేళ్ళను ఆడించమంటాను, నేను దానిని ఎందుకు చేస్తానంటే, వాళ్ళు దానిని కొంచెము వేరుగా చేసి, అది బాగుగానే యున్నదని, వారిని చూడనిచ్చుటకు. అది సంభవించబోవుటలేదని వారు ఉద్రేకపడతారు, కాని అది అన్ని వేళలా, సంభవిస్తూనే యున్నది. చూడండి? అది సంభవించవలసి యున్నది.
3 ఇప్పుడు, ఎంత మంది ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకొనబడవలెనని కోరుచున్నారు? “ప్రభువా, దానిని చేయుమని,” మీ చేతులను ఎత్తి చెప్పగలరా?
4 ప్రభువా, “కేవలము నమ్ముము,” అను పాల్ రాడార్ చే వ్రాయబడిన ఈ గొప్ప పాత పాటను, సంఘము పాడుట వినుచుండగా, తన తండ్రి ద్వారా శిష్యులు యొద్దకు తేబడిన, ఒక కుర్రవాడిని గూర్చి మనము ఆలోచన చేస్తున్నాము, దయ్యములను వెళ్ళగొట్టుటకు మరియు రోగులను స్వస్థపర్చుటకు, వారికి అధికారమివ్వబడి, ఇంకా పది దినములు కాక ముందే, శిష్యులు, మూర్ఛల రోగి విషయములో సంపూర్ణముగా ఓడిపోయియున్నారు. ప్రభువు వచ్చుటను వారు చూశారు, మరియు తండ్రి పరుగెత్తు కొనిపోయి, అతడన్నాడు, “ప్రభువా, నా కుమారుని పై కనికరమును చూపుము. నా కుమారుడు ఒక దయ్యముతో నానా విధములుగా బాధపడుచున్నాడు. నీ శిష్యులు యొద్దకు అతనిని తీసుకొని వచ్చాను, కాని వారు అతనిని స్వస్థపర్చలేక పోయారు.”
5 యేసు అన్నాడు, “నీవు నమ్మినట్లైతే, నేను చేయగలను. కేవలము నమ్ముము.” ఓ, దేవా, అప్పటి నుండి నీవు ఒక్క రవ్వంత మారలేదు. నీవు సరిగ్గా అదే ప్రేమగల, తియ్యని, దయగల దేవుడవై యున్నావు. అప్పుడు నీవు యుండినట్లుగానే, ఈ రోజున నీవు ఆలాగునే యున్నావు. మరియు ప్రభువా, ఆ తండ్రి వలె, “మాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయుమని,” మేమును మొర్ర పెట్టుచున్నాము. అది ఎంతో సూక్ష్మముగా యున్నది; దాని మీద, తండ్రి, మేము తడబడుచున్నాము.
6 గతరాత్రి వాచియున్న ఆ పుర్రెను, ఆ ఎముక ముందుకు పొడుచుకొని వచ్చుట, మరియు అరఅంగుళము ముడుచుకొని పోవుటను, చూచుటను బట్టి, ఆ చిన్న బాలుని ముట్టినందుకు, మేము నీకు స్తుతులు, వందనములు చెల్లించుచున్నాము. తండ్రీ, దానిని బట్టి మేము నీకు కృతజ్ఞుల మై యున్నాము. మా వైద్యులు వారి పరిశోధనలో దానిని గూర్చి ఏమియు వారి యొద్దలేదు, దానిని గూర్చి వారు ఏమియు చేయలేరని మాకు తెలుసు; కాని నీవు ఇంకను దేవుడవై యున్నావు, అన్ని పరిస్థితులపై యజమానుడవు. తండ్రి, మేము నీకు వందనములు చెల్లిస్తాము. దేవుని యొక్క మహిమ కొరకు, ప్రజలకు ఈ సాక్ష్యమును ఇక్కడ చూపుటకు, ఈ తల్లి యొక్క నమ్మకత్వమును బట్టి, మాధుర్యతను బట్టి, మరియు ఆధారమును ఈ పేపరు పై ఉంచుటకు, తిరిగి తెచ్చినందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. ఆమె చిన్న బిడ్డ నీ మహిమార్ధమై సాధారణమైన బిడ్డగా జీవించును గాక.
7 తండ్రి, పైకెత్తబడిన ఆ చేతులను చూడండి. వారిలో ప్రతి ఒక్కరికి ఒక అవసరత యున్నది. తండ్రి, నా చెయ్యి కూడా ఎత్తబడింది. నాకు అవసరత వున్నది. మరియు ఇక్కడ ఎందరో, నిజమైన అవసరతతో యున్నవారు, ఉత్తరము రూపములో, లేక ఈ పెట్టెలో వేసినవారు, వారు అవసరతలో యున్నారు. ప్రభువా, ఈ రాత్రి, ప్రతి ఒక్కరి విన్నపము, నెరవేరును గాక. నీవు ఏదైనా చెప్పినపుడు, అది ముగించబడి యున్నదని, వారు ఈ తల్లి యొక్క సాక్ష్యమును, మాదిరిగా చూపుటకు తీసుకొందురుగాక. మేము చేయవలసినదంతా, దానిని స్వీకరించి, దానిపై పని చేయుటయే. అది ఒక ముగించబడిన కార్యమైయున్నది.
8 ప్రభువా, ఈ ఉత్తరములలోని మనవులను దయచేయుము వారిక్కడ యుంచిన చేతిరుమాళ్ళను దీవించండి, వారు స్వస్థపడుదురుగాక. తండ్రి, తమ చేతులను ఎత్తిన ప్రతి ఒక్కరి, హృదయ వాంఛను దయచేయుము…యేసు నామములో దానిని అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చును.
9 ఆ స్త్రీ తీసుకొనివచ్చిన దారమును, నేను మీకు చూపగోరుచున్నాను…నీవు అక్కడే యున్నావు. గతరాత్రి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు, మనకు వాగ్దానము చేసియున్నట్లుగా. ఆ బిడ్డ యొక్క తల లావు తగ్గి కుదించుకొని పోయింది. అది అద్భుతము కాదా? కాబట్టి. అది మనము ఎంతగానో నమ్ముటకు ధైర్యమును మరియు విశ్వాసమును ఇస్తున్నది.
10 ఇప్పుడు, మార్కు 11:23లో, ఆ చెట్టుతో మాట్లాడినపుడు, “ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురుగాక.” ఆయన బయటకు బిగ్గరగా కేక వేయక పోవచ్చు. ఎందుచేత, నిజానికి, దానిని గూర్చి ఆయన ఎంతో తేలికగా యున్నాడు. చివరకు ఆయన శిష్యులు, వారిలో ఒకరు ఆయన మాట విన్నారు. ఆ మూర్ఛల వ్యాధిగల కుర్రవాడిని, ప్రభువైన యేసు నొద్దకు తెచ్చినపుడు, బహుశ ఆ కుర్రవాడికి అతి కఠినమైన మూర్ఛలు వచ్చినవి, అతడు నేలమీద చచ్చిన వాని వలె పడియుండెను, కాని అపొస్తలులు కంటే ఎక్కువుగా ఉన్నతమైన విశ్వాసమును కలిగియున్న దానిని, అతడు కలుసుకొన్నాడని అతడు గ్రహించాడు.
11 దైవిక స్వస్థతను నమ్మనివారు, ఎవరైనా ఒకరిని, దీనిని గమనించాలని నేను కోరుచున్నాను. దయ్యములను వెళ్ళగొట్టుటకు యేసు, వారికి శక్తి నిచ్చియున్నాడు, కాని వారు తప్పిపోయారు. శక్తి తప్పిపోలేదు, కాని వారు తప్పిపోయారు:
“మేము ఎందుకు దానిని వెళ్ళగొట్టలేక పోయాము.”
యేసు అన్నాడు, “మీ యొక్క అవిశ్వాసమును బట్టి.”
12 సంఘము ఇంకనూ శక్తిని కలిగియున్నది. ఎన్నడూ దేవుడు ఆయన శక్తిని సంఘము నుండి తీసివేయలేదు, కాని సంఘము దానిపై పనిచేయుటకు తగినంత విశ్వాసమును కలిగియుండలేదు. అంతమట్టుకే. అది అంత సూక్ష్మమైనది. కొన్నిసార్లు ఎందుకు దానిని చిక్కుగా చేస్తారు. అయితే వార్తను ఎంత సూక్ష్మముగా మీరు చేస్తారో. దానితో మీరు సూక్ష్మముగా వచ్చినపుడు అంత ఎక్కువ యదార్థతను మీరు కలిగియుంటారు; దేవుడు ఆ రీతిగా చెప్పియున్నాడు. అది దానిని పరిష్కరిస్తుంది. మరియు దానిని సరిగ్గా నమ్మి, ముందుకు వెళ్ళుము.
13 “నీ పండ్లు ఎవరును తినకుందురు గాక,” అని చెప్పినపుడు, ఎందుచేత, ఆకులు ఉంచవలసినంత చక్కగా అవి ఇది వరకున్నంత తేటగా యున్నవి. బెరడును ఆలాగునే కనబడింది, కాని నేలలోని క్రింద వేరులలో జీవము ఎండిపోవుట ప్రారంభమైంది.
14 కాబట్టి ఏ విధమైన వ్యాధి మీదయైన. కాన్సర్ తో ను అది ఆలాగునే యున్నది నీవు ఆలోచించినపుడు. నీవు దేవుని యొక్క వాక్యమును అంగీకరించ గలిగినప్పుడు, క్రింద లోతుల లోని వేరులలో, ఇంకా కాన్సర్ అక్కడ యుoడవచ్చును; నీ చెయ్యి యుండవలసి నంత కరుకుగా యుండవచ్చు. అది దైవిక స్వస్థత తో చేయునది ఏమియు లేదు. అదే, “నీవు నమ్మగలిగినట్లైతే.” చూడండి? క్రింద ఎక్కడో అది, ఇది వరకే పని చేయుటకు వెళ్ళింది.
15 యేసు అన్నాడు, “ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడుము అని చెప్పి, తన హృదయములో సందేహింపక, తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల, నీవు చెప్పిన దానిని పొందవచ్చును.” అది ప్రియముగా లేదా? అది ఎవరి యొద్ద నుండి వస్తుంది? ఎవరి మాటలు, దేవుని కుమారుని మాటలు…భూమ్యాకాశములు గతించును కాని, నా మాటలెన్నడు గతించవు.
16 ఇప్పుడు, నీవు దానిని చేయగలిగే ఒకే మార్గము, నీవు సరియైన లక్ష్యమును మరియు ఉద్దేశ్యమును కలిగి యుండవలసియున్నావు. ఇప్పుడు, నేను బయటకు వెళ్లి, “నేను ఈ కొండను కదిలించగలను, అని ‘పర్వతమా, కదిలిపొమ్ము,’” అంటే, అది కదలదు. నిశ్చయముగా కదలదు. నేను ఏమి కలిగియున్నను లెక్క కాదు. అది తప్పక…మొదటగా అది దేవుని చిత్తముగా యుండవలసి యున్నది.
17 ఆ కారణమును బట్టియే, సాధారణముగా ప్రార్ధనా వరుసలలో, నేను అతి కఠినమైన దానిని పొందుతాను, కారణము అది ఏదో ఆ వరుసలో గుండా వెళ్లి యున్నది, మరియు అక్కడే నీవు దానిని వెనుకకు పొందుతావు. కాని చూడు, నీవు ఒప్పుకొన్న పాపమును కలిగియున్నట్లైతే…ఆ దురాత్మను వెళ్లి పొమ్మని అడుగుటకు ముందు, ఆ సందర్భములో నీవు ఎన్నడైనా గమనించావా? ఆ సందర్భములో, నా జీవితములో ఏదైనా అడ్డగించునది యున్నదా అని, నేను నిశ్చయతతో గమనిస్తాను, చూడండి, కారణమేమనగా గుర్తుంచుకోండి, ఈ వరముల మీద, నీవు వాటితో ఇబ్బందిలో పడతావు.
18 మీకు గుర్తున్నదా, దేవుడు ఒక సారి, ఒక మనిషిని ప్రవక్తగా చేశాడు, అతడే మోషే, మరియు అక్కడకు వెళ్లి ఆ బండతో మాట్లాడమని అతనితో చెప్పాడు. ప్రవక్త ఎంతో ఉద్రేకభరితుడై, వెళ్లి, ఆ బండను కొట్టాడు, ఆయన రెండవ సారి చనిపోవలసి యున్నదని, లేక రెండవ సారి కొట్టబడవలసి యున్నదని అది క్రీస్తు యొక్క బలహీనతను మాట్లాడుచున్నది. దానిని తెచ్చుటకు ఆయన శక్తిని కలిగియుండెను, కాని అది దేవుని యొక్క చిత్తమై యుండలేదు.
19 ఏలీయా వారి చుట్టూ వెళ్ళుట, అది దేవుని యొక్క చిత్తమైయున్నదని నేను ఎన్నడూ నమ్మలేను, ’ఏలయనగా ఆ పిల్లలు, అతడు బోడివాడని, ఆట పట్టించుచుండిరి. అతడు తప్పక దానిని చేస్తాడని నేను తలంచను. కాని అతడు ఒక ప్రవక్తయై యున్నాడు, మరియు కోపగించి, ఆ పిల్లలను శపించాడు, మరియు రెండు ఆడ ఎలుగుబంట్లు, నలభై ఇద్దరు అమాయకులైన పిల్లలను చంపినవి. చూడండి? కాని అతడు దానిని తప్పకుండా చేశాడని నేను నమ్మను.
20 ఆయన తన సంఘమును శక్తితో యుంచుటకు ముందు, దేవుడు, ఆయన సంఘము ఏమి చేస్తుందో చూడాలని, ఆయన ప్రయత్నించుచున్నాడు.
21 వచ్చేసారి, బహుశ, ప్రభువు చిత్తమైన యెడల, నేను తిరిగి వచ్చినపుడు, దాని మీద మనము ఎక్కువ సమయమును గడుపుదాము, సంభవించుటకు నిర్ణయించబడిన దానిపై మరియు అప్పుడు దానిని గూర్చి మనము ఎక్కువ తెలుసుకొంటాము.
22 అయితే నీవు మాటను మాట్లాడినట్లైతే, “ప్రభువా, నేను నమ్ముచున్నాను,” అని చెప్పు, నీ హృదయములో, దానిని సందేహించవద్దు.
23 ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకొందాము, నేను ఒక లోయలో యున్నాను, లక్షల మందికి బోధించుచున్నాను, కాని ఆ పర్వతమునకు ఆవల, ఒక వంద మంది, చిన్న గుంపు ప్రజలున్నారు, మరియు వారు క్రీస్తును ఎరుగని స్థితిలో చనిపోవుచున్నారు. నేను ఇక్కడ బోధించుటకు పది లక్షల మంది వున్నారు, కాని, ఇంకనూ, ఏదో నా హృదయములో నుండి చెపుతుంది, “ఆ ప్రజల దగ్గరకు వెళ్ళు. వాళ్ళ యొద్దకు వెళ్ళు. వారు నశించిపోవుచున్నారు.” నాకై నేనుగా వెళ్ళుట నాకు ఇష్టము లేదు, కాని ఇంకనూ అక్కడ నాలో ఏదోయున్నది. అలాగైతే, అప్పుడది దేవుడు కదులుచున్నాడు. అక్కడికి వెళ్ళుటలో నీ ఉద్దేశ్యము ఏమిటి, అక్కడికి వెళ్ళుటకు, నీ ఉద్దేశ్యము ఏమిటో చూడు, నీ స్వార్ధము కొరకు కాదు…ఇప్పుడు, నేను ఈలాగు అన్నట్లైతే, “మంచిది…” అక్కడికి వెళ్ళుటకు నా ఉద్దేశ్యము సరైనదైతే, కాని అప్పుడు నేను ఆ పైకి వెళ్లాను మరియు అక్కడ ఒక కొండ యున్నది. నేనంటాను, “నేను ఆ కొండా దాటి వెళ్లి, ఆ వంద మందిని రక్షించినత్లైతే, ఒక రోజున వారు అక్కడ ఒక స్థూపమును కలిగి యుంటారు; బ్రాన్హాం సోదరుడా, అది గొప్ప పరిచర్య.” ఇప్పుడు, నా ఉద్దేశ్యము సరియైనది కాదు. ఆ కొండ పడదు, లేదండి.
24 కాని నా ఉద్దేశ్యము మరియు నా లక్ష్యము సరైన దేవుడు, మరియు దేవుడు నా హృదయములో యుండి నన్ను నడిపించుచున్నప్పుడు, నేను కొండ పైకి, కొండ చుట్టూ, కొండ క్రిందికి వెళ్లి, నేనంటాను, “కొండా, కదులు.” నేను ఆ మాట చెప్పినపుడు, ఎంత మాత్రము అది లేదు, సరియైన హృదయముతో, నేను ఆత్మ ద్వారా నడిపించబడి, దేవుని చిత్తములో యున్నప్పుడు, అక్కడ ఒక చెంచా నిండుగ కంటే ఎక్కువ కాకుండా, ఆ కొండ క్రిందకు పడిపోతూ యుండవచ్చు, కాని అది అది పడిపోయే మార్గము లో యున్నది. నేను తిన్నగా అక్కడే నిలబడి, అది సంభవించుటను చూస్తాను, కారణము దేవుడు ఆ రీతిగా చెప్పాడు, మరియు అది దానిని పరిష్కరిస్తుంది.
25 అక్కడ యున్న నీ తల్లిని గూర్చి నీవు దానినే తలంచెదవా? మంచిది, నీవు దానిని తలంచినట్లైతే, ఆమె బాగుపడుతుంది. మంచిది. నీవు దానిని కేవలము నమ్మినట్లైతే; మాటను మాట్లాడి, సరిగ్గా దానితో నిలిచి యుండుము. చూడండి? కేవలము నమ్ముము; దానితో వ్రేలాడుము. అది నిత్య జీవమైయున్నది.
26 ఇప్పుడు, రేపు మధ్యాహ్నము…ఈ రాత్రి నేను బిల్లీతో చెప్పాను, కొంచెము ప్రార్థనా కార్డులను తీసి వేయమని, ఎందుకంటే నేను మాట్లాడాలను కొన్నాను. నేను సత్యమును ఒప్పుకొనుచున్నాను. జనవరి మాసము నుండి, విదేశములకు వెళ్ళుచూ, తిరిగి వస్తున్నాను, తిన్నగా ఇంటి యొద్ద, ఇప్పుడు ఫినిక్సులో యున్నాను, మళ్ళీ వెనక్కి, అంత పరిపూర్ణముగా…ఆ వివేచనా వరము…చివరకు నేను ఎక్కడ నిలబడి యున్నానో, కొన్నిసార్లు నాకు తెలియదు. అది సరిగ్గా నన్ను కొరడాలతో కొట్టి వేసినట్లున్నది.
27 అలాగైతే, నేను విడిచివెళ్ళాలి, సోదరులైన మీరు, మరి కొన్ని దినములు మీతో యుండమని ఆహ్వానించారు. దానిని నేను ఎంత మెచ్చుకొంటానో. నిశ్చయముగా, ఒక అద్భుతమైన సేవకుల గుంపు ఇక్కడ యున్నారని, నేను నిశ్చయముగా ఆలోచిస్తాను. మన సహవాసము కొరకు, మరి కొంచెము ఎక్కువ సమయముగా ఆలోచిస్తాను. మన సహవాసము కొరకు, మరి కొంచెము ఎక్కువ సమయము ఉంటే బాగుంటుంది. ప్రభువు చిత్తమైన యెడల, నేను ఎప్పుడో తిరిగి వస్తాను. ఏమియు మిగలకుండా, ఒక సంఘము నుండి మరొక సంఘము దర్శిస్తూ, పట్టణమంతా చుట్టివేసి, మీ అందరిని దర్శిస్తాను. దానిని చేయుట నాకు సంతోషము. దేవుని యొక్క రాజ్యము కొరకు, సహాయపడుటకు, మీరు కోరినది ఏదైనను, నేను చేయగలిగినది ఏదైనను చేస్తాను. మరలా ఏదో సమయములో తిరిగి వచ్చి, మీతో కలిసి, చక్కని, మంచి కూటమును ఎక్కడో కలిగి యుందాము.
28 సోదరులారా, గుర్తుంచుకోండి, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ ఒక్క విషయము నిశ్చయము. మరియు మీరందరూ నా కొరకు ప్రార్థించమని కోరుచున్నాను.
29 రేపు రాత్రి, ఈ పట్టణమంతట, చక్కని సంఘములతో, వివిధమైన సంఘ కూటములున్నవి.
30 ఇప్పుడు, ఇక్కడ జఫర్ సన్ విల్ నుండి వచ్చిన కొన్ని గుంపులువారు, నా స్నేహితులు కొందరు నా సంఘ దర్మకర్తలలో ఒకరు, సోదరుడు ఫ్రెడ్ సాత్ మన్ ఇక్కడ యున్నాడు. కూటములో ఎన్నడూ నేను అతనిని చూడలేకపోయాను. సోదరుడా, జఫర్ సన్ విల్ నుండి వచ్చిన నా స్నేహితులలో అనేక మంది, నా సెక్రటరీ, అనేకులు ఇక్కడ కూటములో ఎక్కడో యున్నారు. ఇంకా నేను వారిని చూసి యుండలేదు.
31 సోదరులారా, ఇక్కడ ఈ పట్టణములో కొన్ని చక్కని సంఘములున్నవి. యాత్రికులైన మీరందరూ, రేపు, ఈ సంఘములలో ఒక దానికి వెళ్ళండి. వాళ్ళు మీకు మేలు చేస్తారు. నాకు నిశ్చయత యున్నది. అక్కడ యున్న సోదరులు, ఈ రకమైన పరిచర్యనే వారు నమ్ముతారు. ఆ కారణమును బట్టియే, వారు ఇక్కడ వేదిక మీద, ఆ క్రింద స్థలములలో కూర్చొన్నారు, కారణము వారు దానిని నమ్ముతారు, మరియు ఆ మనుష్యులను నేను మెచ్చు కొంటాను.
32 ప్రభువా ఈ కూటమును ఇక్కడ పరిచయము చేసిన సంపూర్ణ సువార్త వ్యాపారస్థుల యొక్క కూటమిని దీవించండి. అది నిజమని నేను నమ్ముతాను, వారే ఈ కూటములను భరించియున్నారు. వారి స్పాన్సర్స్ లో అనేకుల యొద్దకు నేను వెళతాను. కారణమేమనగా అక్కడ…అనేక సార్లు, మనము తప్పక ఈలాగున యుండాలి అనే చిన్న చిన్న భేదములు, ఒకరు ఒక విధముగా, మరొకరు మరొక విధముగా నమ్ముట, ఆ పాత గాయముల నుండి, ఒక చిన్న ఘర్షణ ఏర్పడింది, అది తప్పక ఈ సమయమునకు మాని పోవాలి. నేను సంపూర్ణ సువార్త సేవకులను కలిగియున్నట్లైతే, అప్పుడు ఆ రకమైన సహాయము దానిని ముడి వేస్తుంది, మేము ఏకమవుతాము, మరియు మనము అందరము కలసి నిజమైన సహవాసమును కలిగియుంటాము. దేవుడు ఆ కూటమిని దీవించును గాక. ఒక ఉద్దేశ్యము కొరకు ప్రభువు దానిని లేపియున్నాడని, నేను నమ్ముతాను.
33 తరువాత, మొన్నటి దినమున, సోదరుడు ఓరల్ రాబర్ట్స్ యొక్క స్థలమును చూసే అవకాశము నాకు దొరికింది, అయ్యో, ఎలాటి గంభీరమైన స్థలము, ఎలాటి చక్కని స్థలము. అది పెంతెకొస్తుకు, ఒక జ్ఞాపక చిహ్నముగా యున్నది.
34 తరువాత నేను సోదరుడు టామీ ఆస్ బర్న్ యొద్దకు వెళ్ళాను, మరొక అద్భుతమైన స్థలము, ఒక అద్భుతమైన దైవజనుడు, సోదరుడు టామీ, మరియు నేను, సోదరుడు ఓరల్ కూడా, మేము సన్నిహితమైన సోదరులము, మేము ఒకరిని ఒకరము ప్రేమిస్తాము, మరియు దేవుని యొక్క రాజ్యము లోని ప్రజలు మేలు కొరకు, మేము చేయగలిగిన శ్రేష్ఠమైన పనిని చేయుటకు ప్రయత్నము చేయుచున్నాము.
35 మీరు కలిగియున్న ఈ చక్కని మనుష్యుల మధ్య, ఈ పట్టణములో మీరు ఆ మనుష్యులను కలిగియుండుటను బట్టి, నేను నిశ్చయముగా మెచ్చుకొంటాను. గొర్రెలైన మీరు, అద్భుతమైన గొర్రెల కాపరులను కలిగియున్నారు. అది నాకు ఇష్టమని నేను చెపుతాను. మీ అందరిలో ప్రభువు యుండుట కొనసాగాలని నా ప్రార్థనయై యున్నది. రేపు మధ్యాహ్నము, సోదరులారా, ఏ సమయములో కూటము ఆరంభమవుతుంది? రెండున్నర గంటలకు, అయితే ఒంటిగంట లేక ఒకటిన్నరకు, మీరు తప్పక ఇక్కడ యుండాలి, ఆ ప్రకారము, వారు ఇతర కూటములకు ఆటంకముగా యుండరు.
36 ఇప్పుడు, ఈ రాత్రి ఇక్కడ కూటముల యొక్క కొన్ని పుస్తకములు, చిత్రములు, మరియు టేపులు యున్నవని, ఇది వరకే పిల్లలు మీకు చెప్పలేదా, వారు వాటిని అమ్ముతారు. అయితే రేపు, ఆది వారమని వాటిని మేము అమ్మము. లేదు, రేపు పుస్తకములు గాని మరియు ఏదియు అమ్మబడదు. కాబట్టి అనేకులు “మీరు బాగా తప్పు అని…” అన్నప్పటికిని, మేము ఎన్నడు దానిని అనుమతించము.
37 వృద్ధ తండ్రియైన బోస్ వర్త్, చెపుతూ యుండేవాడు, “ఓ, బ్రాన్హాం సోదరుడా, అక్కడ నీవు తప్పు యై యున్నావు,” అయితే, ఆ విధముగానే, నేను భావిస్తాను (చూడండి?) నా భావన నీకు ఒకటి అవసరమైతే, వారు నీకు ఒకటి ఇస్తారు, అయితే ఆదివారమున మేము అమ్మము. లేదు. అంతవరకే. నేను దానిని నమ్మినట్లైతే, నేను తప్పక దానిని జీవించాలి, నాకై నేనుగా తప్పక దానిని జీవించాలి. మీరు చూడండి? నా ఒప్పు కోలులతో, నేను తప్పక జీవించాలి, లేక మీరు దానిని ఇంటికి పంపండి, ఆ స్థలములో మీరు దానిని పొందండి.
38 ఇప్పుడు, ఈ రాత్రి, ఓ, అక్కడ ఏదైనా చేయవలసిన పనియున్నా, లేక మరి ఏదైనా, లేక ఈ దినపు ప్రయాసలు, వాటన్నిటిని మనము మర్చిపోదాము. మనము సమస్తమును ప్రక్కన పెట్టి, ఆయన వాక్యము ద్వారా దేవుడు ఏమి మాట్లాడతాడో, కొన్ని నిమిషములు వాక్యములోనికి చూద్దాము. మరియు ఈ రాత్రి చాలా గొప్ప దీవెనను, దేవుడు మనకు ఇవ్వాలని, నేను ప్రార్థిస్తాను.
39 జెనె, నా కొరకు ఆమెను అపహరించగలవా? నా కొరకు ఆ చిన్న పాపను అపహరించగలవా? ఆమె ఒక చక్కనిదిగా లేదా? నీవు నాతో ఇంటికి వచ్చి, ఇంత ఎత్తులో, నా చిన్న శారాతో ఆడుకొంటావా? ఓ, నీకు ఇష్టమా? నాకును ఇష్టమే. ఆమె సరిగ్గా నీ పరిమాణము లో యున్నది, మరియు ఆమె డాడీ యొక్క చిన్న కూతురు. నేను పందెము కాస్తాను, నీవును నీ డాడీని ప్రేమిస్తావు, అమ్మా, కాదా? ఓ, నిశ్చయముగా నీవు ప్రేమిస్తావు. ఎంతో చక్కని బాలిక, నేను ఇక్కడ కూర్చొని ఆమె వైపు చూస్తున్నాను. చిన్న నేత్రములు దుప్పటిలో కాలిపోయిన, రెండు రంధ్రముల వలె యున్నాయి, చిన్న గోధుమ రంగు వెంట్రుకలు.
40 చిన్న పిల్లలంటే నాకు ఇష్టము. ఇంటి యొద్దనాకు ఇద్దరు చిన్న బాలికలు యున్నారు, వారిలో ఒకరు రిబ్కా, మరొకరు శారా.
41 కొద్దికాలము క్రితము నేను దూరములో యున్నాను. మీకు తెలుసు, వారిద్దరూ, డాడీ యొక్క చిన్న కూతుర్లు, నేను వారిని ప్రేమిస్తాను. వారు లోనికి రాగానే, నేను వారిని బాగా హత్తుకోవాలి కేవలము జెక్కీ దానికి ఎంతో లావుగా ఉంది; నేను ఎంత లావుగా యున్నానో, ఆమె అంతలావుగా యుంది. ఇప్పుడు ఆమె నా వీపును విరుగగొడుతుంది. కాని ఎలాగైనను ఆమె ఇంకనూ డాడీ యొక్క చిన్న కుమార్తె. ఇప్పుడు, ఒక సంవత్సరము పాటు, పబ్లిక్ స్కూలు నుండి దూరముగా, ఎక్కడో బైబిలు స్కూలుకు ఆమెను పంపాలి.
42 మీకు తెలుసా, వాళ్ళు డాడీ ఇంటికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. నేను కూటముల కొరకు బయట యున్నాను. రేపు రాత్రి, నేను ఇంటికి వచ్చువరకు, అర్ధరాత్రి దాకా వాళ్ళు నా కొరకు కనిపెడతారు. కాబట్టి, మూడు లేక నాలుగు గంటల సమయములో, ఎంతో పెందలకాడ నేను ఇంటికి వచ్చాను. తల్లి తలుపు దగ్గరకు వచ్చి, నన్ను లోనికి రానిచ్చింది, నేను ఎంతో అలసిపోయి, సొమ్మ సిల్లి పోయాను. ఇక్కడ వేదిక మీద, అభిషేకించబడినపుడు, అది చక్కగా యుంటుంది, కాని ఒక్కసారి అది నిన్ను విడిచిపెట్టగానే, అప్పుడే నీవు ఇబ్బందిలో పడతావు. ఎన్నడైనా మీలో ఎంతమందికి అది తెలుసు? ఎందుచేత, నిశ్చయముగా అది చేస్తుంది.
43 చూడండి, ఏలీయా కొండ మీదకు ఎక్కి, ఆకాశము నుండి అగ్నిని పిలిచాడు, ఆకాశము నుండి వర్షమును పిలిచాడు, మరియు ఆత్మ అతనిని విడిచిపెట్టినపుడు, నలుబది రోజులు అతడు అరణ్యములో తిరుగుతాడు. మరియు దేవుడు అతనిని, ఎక్కడో గుహలో కనుగొని, వెనుకకు లాగాడు.
44 యోనా, అతడు వెళ్లి మూడు రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో నివశిస్తాడు, అది అతనిని మరలా ఒడ్డున కక్కినపుడు, అతడు చుట్టూ బోధించుటకు వెళ్ళాడు. మొత్తము పట్టణము పశ్చాత్తాపపడి, దేవుని యొద్దకు వచ్చింది. మరియు అభిషేకము అతనిని విడిచి పెట్టినపుడు, అతడు కొండ శిఖరము మీదికి వెళ్లి, తన ప్రాణమును తీసుకొమ్మని దేవుని అడిగాడు. చూడండి?
45 ఈ మధ్యనే నేను విల్లియం కౌపర్ సమాధి ప్రక్కన నిలబడ్డాను అతడే, మనము ప్రభురాత్రి భోజనము సమయములో పాడే ప్రఖ్యాతిగాంచిన కీర్తనను వ్రాసింది:
అక్కడ రక్తముతో నింపబడిన ఊటయున్నది,
ఇమ్మానుయేలు రక్తనాళముల నుండి తీయబడింది,
అక్కడే పాపులు, ఆ ప్రవాహములు క్రింద మునుగుతారు…
46 అతనికి ఏమి సంభవించిందో, ఎన్నడైనా మీరు విన్నారా? దాని నుండి, అతనిని ప్రేరేపణ విడిచిన తరువాత, ఆత్మహత్య చేసుకొనుటకు అతడు ఒక నదిని కనుగొనుటకు ప్రయత్నించాడు.
47 నేను తిన్నగా, నా పాత కెంటక్కీ గృహము దగ్గరగా అతని ప్రక్కన జీవించాను. స్టెఫెన్ ఫోష్టార్, అమెరికాకు అత్యంత ప్రసిద్ధి గాంచిన యుగళగీతమును ఇచ్చాడు. ఆ ప్రేరేపణ లోనికి వెళ్లి అతడు పాటను వ్రాసిన తరువాత, అతడు దానిలో నుండి బయటకు వచ్చి, బాగా త్రాగేవాడు. చివరగా, తన పనివానిని పిలిచి, ఒక కత్తి తీసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.
48 ఆ ఆత్మ సంబంధమైన పరిధి గుండా జీవించిన ప్రజలు ఎలాటి వాటి గుండా వెళతారో ప్రజలకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ, నీవు ఒక కొండను కదిలించగలిగినట్లుగా యుంటావు. కాని అభిషేకము నిన్ను విడిచి పెటనియ్యి, నీవు ద్వారము గుండా నడిచివస్తావు…నిన్ను పట్టుకొనుటకు, అక్కడ ఎవరులేనట్లైతే…చూడు? తరువాత, బహుశ కొన్ని గంటల వరకు, కనీసము నీవు ఎక్కడ యున్నావో అని, ఆశ్చర్య పోతావు. అప్పుడు రాత్రి తరువాత రాత్రి, నీ నుండి శ్రేష్ఠమైన దానిని అది తీసుకొంటుంది.
49 నేను చిన్న శారా మరియు రిబ్కాను గూర్చి చెపుతాను. కాబట్టి తరువాత రోజు ఉదయమున, నేను నిద్రపోలేకపోయాను, నేను మేల్కొని, కుర్చీలో కూర్చొన్నాను, కొద్ది సేపటికి, బెక్కీ పెద్దదైనందున, శారా కంటే పొడవైన కాళ్ళను కలిగియున్నందున, మేల్కొని, మంచము మీద నుండి దూకి, పరుగెత్తుకొంటూ, తన సహోదరిని లేపకుండా, ఇంటిలో ఆమె పరుగెత్తవలసి నంత వేగములో పరుగెత్తుచూ వచ్చింది. ఆమె “డాడీ, డాడీ…” అంటున్నది…నేను ఒక కాలును చాపియున్నాను. ఆమె ఒక్క సారిగా ఎగిరి దూకి, ఎంతో చక్కగా నిలదొక్కుకొని వుంది. మీకు తెలుసా, ఒక విధముగా అధునాతన సంఘము వలె, ఆమె ఎంతో దీర్ఘకాలము, ఎన్నో వందల సంవత్సరముల నుండి, ఆటలో యున్నది. ఆమె చక్కగా తన్నుతాను నిలుపుకొనగలదు, ఆమె తన చేతులను నాపై యుంచి, “ఓ, నా డాడీ, నా డాడీ…అన్నది…”
50 చిన్న శారా, మేల్కొని, బాగా అల్లరి చేస్తున్నది. మంచిది, మీ పిల్లలు ఆలాగున చేస్తారో, లేదో నాకు తెలియదు, కాని పిల్లలు చేస్తారు. చిన్నది, పెద్దది వాడినవి వేసుకొంటుంది. కాబట్టి శారా, బెక్కీ యొక్క పజామాను వేసుకొంది, మీకు తెలుసా, కాళ్ళు అంత పొడవుగా వున్నాయి. ఈ చిన్న పొట్టి వ్యక్తి, తడబడుచూ ఇక్కడకు వచ్చింది. ఆమె కొంచెము ఆలస్యముగా అక్కడకు వచ్చింది. కాబట్టి బెక్కీ, చుట్టూ తిరిగి, ఇలా అంది, “నా సహోదరివైన శారా, నేను నీకు ఒకటి చెప్పగోరుచున్నాను.” “నేను ముందు ఇక్కడకు వచ్చాను, అంది. అంతా నాదే. కాబట్టి డాడీది అంతe నాదే, నీకు ఏమీ మిగలలేదు.”
51 కొందరు ప్రజలు, ఆ విధముగానే, మతమును గూర్చి ఆలోచించుటకు ప్రయత్నిస్తారు, అది కాదా? అది నిజము.
52 దీనమైన చిన్న శారా, తన చిన్న పెదవిని విరిచించి, మరియు ఆమె చిన్న నల్లని కన్నులు నావైపు చూసినవి, ఆమె ఏడ్వడం ప్రారంభించిది. బెక్కీ తన చెంపను నాకు ఆనించి, నన్ను హత్తుకొనుచున్నది. నేను ఆమెను ప్రేమిస్తాను. శారా నడిచి వెళ్లి పోవుట ప్రారంభించిది, ’కారణము డాడీనంతా బెక్కీ కలిగియున్నది. నా మరొక మోకాలును ఈరీతిగా కదిలించి మరియు ఆమె వైపు ఆరీతిగా కదిలించగా, ఓ, ఆమె దుముకుచూ వచ్చి, తిన్నగా పైకి ప్రోత్సహించబడినదై, నా మోకాలు పైకి దూకి కూర్చొంది. ఆమె ఎక్కువ సేపు నా చుట్టూ యుండ లేదు, మరియు ఆమె కాళ్ళు కనీసము, నేలను తాకలేదు. ఆమె ఒక రకముగా తప్పటడుగులు వేసింది (బహుశ, నావలె, చిన్న తప్పటడుగు, మీకు తెలుసా), ఆమె కనీసము నేలను తాక లేకపోయింది. మీకు తెలుసా, ఆమె ఒక పెద్ద శాఖయై యుండలేదు, కాబట్టి స్థిరమైన నేలపైకి దిగలేకపోయింది. ఎక్కువ సేపు ఆమె చుట్టూ యుండలేక పోయింది.
53 కాబట్టి, ఆమె ఒక రముగా తప్పటడుగులు వేస్తుండగా, ఈరీతిగా నా రెండు చేతులను ఆమె చుట్టూ వేసి, నాకు దగ్గరగా ఆమెను హత్తుకొన్నాను, ఆమె తన చిన్న నల్లని కన్నులు మెరయునట్లుగా చూసి, రిబ్కా వైపు తిరిగి చూసింది. “రిబ్కా, నా సహోదరీ,” “అది నిజము కావచ్చు, నీవు డాడీని అంతా కలిగియున్నావు, కానీ నీవు ఒక విషయం తెలుసుకోవాలి, అదేంటంటే, నా మొత్తాన్ని డాడీ కలిగి యున్నాడు,” అన్నది.
54 కాబట్టి నా మొత్తాన్ని ఆయన కలిగియున్నాడు. ఆ పైన పెద్ద పెద్ద వాటిని ఉంచుటకు నాకు విద్య లేదు, కాని నేను ఆయనను ఎరిగియున్నంత కాలము, ఆయన నా మొత్తాన్ని కలిగియున్నాడు, నా తప్పటడుగులలో, ఆయన తన రెండు హస్తములను, నా చుట్టూ వెయ్యనియ్యండి, అది నన్ను సంతోషింప చేస్తుంది.
55 మంచిది, మనము వాక్యమును తెరవక ముందు, ఆయనను మరొక చిన్న మాటతో ప్రార్థన చేద్దాము.
56 ఇప్పుడు, పరలోకపు తండ్రి, మేము కూడా పిల్లల మేనని గ్రహించుచున్నాము. నీ ప్రేమ మాతో యుండాలి, మాతో నీవు ఆరాధించబడాలి. మేము నిన్ను ఆరాధించుచుండగా, నీవు మమ్మును ప్రేమిస్తావు, నీ చేతులలో మమ్మును పట్టుకొంటావు, మరియు నీ పరిశుద్ధాత్మను క్రిందికి పంపండి, నీవు మా తండ్రివని, నీవు జీవించుచున్నావని మాకు తెలియ చేయండి, నీకు ఎంతో కృతజ్ఞతలు. ఇప్పుడు, ఈ రాత్రి పరిశుద్ధాత్మను మా యొద్దకు రానిమ్ము. ప్రభువా, ప్రతి హృదయమును ప్రేమించండి. మాకు తాజా ఆశీర్వాదమును ఇవ్వండి, తండ్రి, కృపా హిమ బిందువులను మాపై క్రుమ్మ రించండి. మా పాపముల వైపు చూడవద్దు. అవి ఎన్నో వున్నాయి. ప్రభువా, వారిని కొంచెము క్షమించండి. తండ్రి, వారిని విడిచి పెట్టండి, నీ చేతులలోనికి వారిని తీసుకొనండి, మా వ్యాధులను స్వస్థపర్చండి, మా ఆత్మలను శుద్ధి చేయండి, ప్రభువా, నిన్ను ఆరాధించునట్లు, నిన్ను స్తుతించునట్లు, మా ఆత్మలకు విడుదలను ఇవ్వండి, ఇంట్లో పిల్లలు వలె చుట్టూ పరుగెత్తు చుండగా, తండ్రి మమ్ములను కనిపెట్టుచున్నాడని మేము తెలుసు కొందుముగాక. ప్రభువా, దానిని దయ చేయుము.
57 ఇప్పుడు ఏ మనిషియు వాక్యమును అనువదించలేడు. మేము దానిని గ్రహిస్తాము. సింహాసనము మీద కూర్చొన్న వాని కుడి చేతిలో యున్న గ్రంథమును యోహాను చూశాడు; మరియు పరలోకములో గాని, భూమి మీద కాని, భూమి క్రిందకాని. ఆ గ్రంథమును తెరుచుటకు గాని, దాని ముద్రలు విప్పుటకు గాని యోగ్యుడైన వాడు లేడు. అప్పుడు జగత్తు పునాదికి ముందే వధించబడిన గొర్రెపిల్ల, పైకి వచ్చాడు, ఆయన యోగ్యుడైయున్నాడు. ఆయన గ్రంథమును తీసుకొని, ముద్రలను విప్పి, గ్రంథమును తెరిచాడు. ఓ, గొర్రె పిల్లా, ఈ రాత్రి రండి. తండ్రి, నీ కొరకు కనిపెట్టు చుండగా, మా కొరకు గ్రంథమును తెరవండి, కారణము దేవుని గొర్రె పిల్లయైన యేసు’ నామములో, మేము అడుగుచున్నాను. ఆమేన్.
58 ఒక చిన్న లేఖన వచనములో, మూడు మాటలను ఈ రాత్రి నేను ఎన్నుకొనియున్నాను. అయితే మొదట యోహాను సువార్త లో నుండి, 23వ వచనముతో ప్రారంభించి, ఒకటి లేక రెండు వచనములను నేను చదువ గోరుచున్నాను.
యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా.
మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థాన మందు లేచునని యెరుగుదుననెను.
అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాస ముంచు వాడు చనిపోయినను బ్రతుకును:
బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాటను నమ్ముచున్నావా? అని ఆమెను అడిగెను.
ఆమె-అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు వని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.
59 ఒక అంశము కొరకు నేను ఈ మూడు మాటలను వాడ గోరుచున్నాను: నీవు దీనిని నమ్ముచున్నావా?
60 కొద్ది కాలము నేను ఒక కథను చదివాను. అది ఒక ఊహాతీతమైన కథ కావచ్చు అని నేను తలస్తాను. దరిదాపుగా అందరు సేవకులు, డాక్టర్. ఇన్ గ్రహం యొక్క దావీదు ఇంటి యొక్క రాకుమారుడు, అది ఒక గొప్ప పుస్తకమైయున్నది. అది పరిపూర్ణముగా ముద్రణలోనే, లేదని నేను ఊహిస్తాను. అది ముద్రణలో యుంటే బాగుంటుందని నేను కోరతాను, ఆ ప్రకారము అది ప్రజల మధ్యలో ఉంచబడగలదు.
61 దానిలో, ఈ లాజరు మీద, లాజరు సహోదరీలైన మరియు మార్తలు, మరియ యేసు మీద నేను ఒక వ్యాసమును చదువుచుంటిని. దానిలో, మరియ, మార్తల యొద్ద, యేసు జీవించియున్నాడని నేను చదువుచుంటిని. వారిద్దరూ ప్రియమైన హెబ్రీ బాలికలు. లాజరు, ఆలయము నొద్ద, యాజకులకు అక్షరములను తయారు చేస్తూ, ఒక లేఖకుడిగా తర్ఫీదు పొందుచున్నాడు.
62 మరి విశేషముగా యేసు, లాజరుతో గొప్ప సహవాసమును కలిగియున్నాడు, ఆ గ్రంథములో చదివినప్పుడు, ఆయన ఆ గృహమునకు వచ్చినపుడు, మార్త ఆయన మాటలు వినుటకు కొంచెము జాగు చేసేది, కాని ఆమె రాత్రి భోజనపు బల్లను సిద్ధ పరిచేది, అయితే మరియ ఆయన పాదముల యొద్ద కూర్చొనేది. మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నదని యేసు చెప్పాడు.
63 తరువాత, దావీదు ఇంటి యొక్క రాజకుమారుడు, అను డాక్టర్. ఇన్ గ్రహం యొక్క గ్రంథములో, యేసును, యోహాను యొద్దకు తీసుకొనివచ్చినది, లాజరు అని చెప్పబడింది, ఏమైనప్పటికీ, అది సత్యము కాకపోవచ్చు, నాకు తెలియదు, కాని దాని యొక్క పూర్వ వృత్తాంతము కొరకు, ఆయన తప్పక వారితో జీవించుచున్నాడు.
64 ఇప్పుడు, దీని గూర్చి గతవారము, మనము నేర్చు కొన్నట్లుగా, యోహాను 5:19 లో యేసు అన్నాడు, “తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని, తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును, ఆలాగే చేయును.” చూడండి? “తండ్రి యేది చేయుటను ఆయన చూస్తాడో.”
65 కాబట్టి దీనిని నిజమైన కథగా చేయుటకు, తండ్రి, తప్పక కుమారుడైన క్రీస్తుతో మాట్లాడి యుంటాడు, “నీ స్నేహితుడైన లాజరు, చనిపోవబోవుచున్నాడు, అయితే, అది మేలు కొరకే జరుగబోవుచున్నది, కాబట్టి నీవు వారి గృహమును విడిచి వెళ్ళు, అని చెప్పాడు. దూరముగా వెళ్ళిపో, ’ఎందుకంటే అతడు స్వస్థపడాలని, వారు నిన్ను ప్రార్థన చేయమని అడుగుతారు, మరియు నీవు అది చేయుట నాకు ఇష్టము లేదు.” మనము మార్గము గుండా వెళ్ళుచుండగా, మీరు ఈ కథను గమనించినట్లైతే, ఆ సత్యమునకే అది గుట్టగా చేరుటను మీరు చూస్తారు. కాబట్టి యేసు, ఏ విధమైన హెచ్చరిక లేకుండా, ఇంటి నుండి దూరముగా నడిచి వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్లి పోయాడు, ఆ రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. ఆయన కొన్ని యితర పట్టణాలకు వెళ్ళాడు. యేసు ఆ ఇంటిని విడిచి వెళ్ళగానే, ఇబ్బంది లోనికి వచ్చింది.
66 యేసు నీ గృహమును విడిచినపుడు, ఇబ్బంది దారిలో వుంటుంది, కొంచెము గుర్తుంచుకోండి, ఆయన నీ గృహమును విడిచినపుడు, ఇబ్బంది దారిలో వుంటుంది నీవు సాంఘిక సమాజములను మరియు సమస్తమును, ఆలయములో నీవు ఎంతో పరిపూర్ణముగా నడుపుచున్నప్పుడు, ఒక గొప్ప పదహారు సిలిండర్ల రికెన్ బెకర్ కారును నడుపుచున్నప్పుడు, నీవు దాని నుండి యేసును విడిచిపెడతావు, యేసు నీ సంఘము నుండి వెళ్లి పోయినపుడు, ఇబ్బంది నీకు దారిలో యుంటుంది. అవునండి, ఒక సంఘశాఖను యేసు విడిచినపుడు, వారు ఆయనను ఒక ప్రక్కన పెట్టి ఇలా అంటారు, “బాగుంది, ఈ సంగతులు సరిగ్గా యిలా ఉంటాయని, మేము నమ్మము,” మరియు మీరు మరొక దానిని అలవాటు చేసుకొంటారు, అప్పుడు దారిలో యున్నది, కొంచెము దానిని గుర్తుంచుకోండి.
67 లూకా సువార్తలో మనము కనుగొన్న ఒక కథ, నాకు యేసును గూర్చి గుర్తు చేస్తుంది. మీకు తెలుసా, అప్పుడు ఆయన సరిగ్గా పన్నెండేళ్ళ బాలుడు, ఆయన ప్రజలు వాడుక చొప్పున, ప్రతి సంవత్సరము పెంతెకొస్తు పండుగకు తీసుకొని వెళ్లారు. వారు యెరూషలేము పట్టణములో, ఆ పండుగ నొద్ద యుండగా, వారు మంచి సమయమును గడుపుచుండిరని, బైబిలులో మనము కనుగొంటాము, వారు ఆయన లేకుండా మూడు రోజుల ప్రయాణము చేశారు బహుశ, వారనుకొన్నారు, ఆయన వారి బంధువుల యొద్ద తప్పక యుంటాడని అనుకొన్నారు. ఇప్పుడు, మనము దానిని చేయలేము. వారి దగ్గర బంధువుల యొద్ద ఆయనను కనుగొనుటకు వారు వెళ్ళినపుడు, ఆయన అక్కడ లేడు.
68 మనము మెథడిస్టు యైనందున, బాప్తిస్టు యైనందున, ప్రెస్భిటేరియన్ యైనందున, పెంతెకొస్తు యై నందున, మరియు వెనుకటి మన వృత్తాంతములను బట్టి, మన పితరులు గొప్ప విశ్వాసు లైనందును బట్టి, మనము దానిని అంగీకరించరాదు, యేసు మనతో యున్నాడని తీసుకొనరాదు. మనము దానిని చేయలేము. మనము తప్పక ఆయనతో ప్రతి నిమిషము, ప్రతి రోజు సంబంధము కలిగియుండాలి ఓ, నేను దానిని ప్రేమిస్తాను.
69 ఇప్పుడు దేవుడు ఏమి యున్నాడో అది నాకు కావాలి. నా తల్లిదండ్రులు ఏమి కలిగియున్నారో, నా పితరులు ఏమి కలిగియున్నారో, అది అద్భుతమై యున్నది అయితే వారు ఏమి కలిగియున్నారో అది మంచిదే. మనము మార్గములో ఇంకా దూరములో యున్నామని నేను అనుకొంటాను.
70 ఈ రోజున దేవుడు ఏమైయున్నాడో మనము చూద్దాము, నేను వెనుకకు చూసి శ్రీ. మూడీ కంటే మనము మార్గములో ఇంకా పైన యున్నాము. మన సంఘములతో వచ్చిన ఇబ్బంది ఏమనగా, మనము వెనుకకు చూసి, బాగుంది, “జాన్ వెస్లీ ఏమి చెప్పాడో, ఇతరులు ఏమి చెప్పారో,” అని అంటాము ఆ కారణమును బట్టియే, ఆ దినమున మతము యున్న దాని కంటే, సైన్సు కూడా వారికి అంత దూరములో యున్నది.
71 మూడు వందల సంవత్సరముల క్రితము, నీవు గంటకు 35 మైళ్ళు విపరీతమైన వేగముతో వెళ్ళినట్లైతే, ఒక ఫ్రెంచి శాస్త్ర వేత్త ఏమని ఋజువు చేశాడంటే, నీవు భూమ్యాకర్షణ నిన్ను భూమికి పైగా తీసుకొని వెళుతుందన్నాడు. ఈ రోజున సైన్సు వెనుకకు వెళ్లి దానిని సూచిస్తుందని నీవు తలంచెదవా? వారు గంటకు పందొమ్మిది వందల మైళ్ళ వేగము వెళుతూ, ఇంకా వెళుతూనే యున్నారు, వారు ముందుకు నెట్టుకొని వెళ్తున్నారు, ముందుకు చూస్తున్నారు. అయితే మనము వెనుకకు వెళ్లి మూడీ ఏమి చెప్పాడో, కాల్విన్ ఏమి చెప్పాడో, ఫిన్నీ ఏమి చెప్పాడో, నాక్స్ ఏమి చెప్పాడో, సాoకీ, ఏమి చెప్పాడో, వారిలో కొందరు ఏమి చెప్పారో చూడాలనుకొనుచున్నాము. వారు చెప్పింది సరియే. అది వారి యుగము కొరకై యున్నది, కాని మనము ముందుకు వెళ్తున్నాము.
72 నా తాత ఎద్దుల బండిని నడిపాడు. నేను ఫోర్డ్ V8 కారును నడుపుతున్నాను. నా కుమారుడు జెట్ విమానము మీద ఎగురుతాడు. అదే, మనము ముందుకు వెళ్తున్నాము. మతము తప్పక ఆలాగునే నీ యుండవలసి యున్నది. ప్రభువు రాకడ సమీపమైయున్నది. సంఘము తప్పక వారి శక్తులలోనికి కదలవలసియున్నది. సైన్సు కొంత దూరమే ఎక్కి, తరువాత అది ఆగిపోవలసియున్నది, కాని మనము ఎవ్వరూ ముట్టుకోని వనరులను కలిగియున్నాము, అది ఎన్నడూ తాకబడలేదు, అదే హద్దులు లేని దేవుని యొక్క శక్తి, మనము తప్పక దానిలోనికి కదిలి వెళ్ళ వలసి యున్నది. క్రైస్తవులుగా మనము అనుభవించవలసిన ఆధిక్యతలకు, ఒక పదిలక్షల మైళ్ళ దూరములో మనము జీవించుచున్నాము. ఇప్పుడే తిన్నగా, వెళ్ళుచున్న ఇబ్బందులో, రోగములు, మరియు వాటి ఆసుపత్రులను, బయటచూసి, నాకై నేను సిగ్గు పడుచున్నాను. మన సంఘము తప్పక వీధులలో నడుస్తూ, రోగులను స్వస్థపర్చుచూ మృతులను తిరిగి బ్రతికించుచూ, అద్భుతములు మరియు సూచక క్రియలను చేస్తూ, యేసు క్రీస్తు జీవించుచున్నాడని, లోకమున తెలపాలి. అదే మనము తప్పక చేయవలసిన అవసరమున్నది.
73 ఎందుచేత, నీవంటావు, “శ్రీ మూడీ ఎన్నడూ…” శ్రీ మూడీ ఈ దినమున జీవించలేదు. అది నిజము. మనము ప్రభువు యొక్క రాకడలో జీవించుచున్నాము. మన సమీప బంధువులతో, ఆయన యుంటాడని మనము నమ్మాము. కాని మొన్నటి దినమున ఆ సవాళ్ళు విసురువాడు బిల్లీ గ్రహంను సవాలు చేసినపుడు, ఆయన మన సమీప బంధువుల మధ్య లేడని మనము కనుగొన్నాము.
74 వారు ఆయనను ఎక్కడ కనుగొన్నారు? వారు యేసును ఎక్కడ కనుగొన్నారు? తిన్నగా ఎక్కడ ఆయనను విడిచారో అక్కడే. వారు ఆయనను ఎక్కడ విడిచి పెట్టారు? పెంతెకొస్తు పండుగ నొద్ద. పాత కాలపు పెంతెకొస్తు శక్తి మరియు పెoతెకొస్తు పండుగ నుండి మనము దూరముగా వెళ్లిపోయినపుడు, మనము యేసు నుండి దూరముగా నడిచి వెళ్ళాము. స్నేహితుడా, అది ఖచ్చితముగా సత్యము. మన ఆధిక్యతలకు బయట మనము జీవిస్తున్నాము, అవునండి.
75 వారు పెంతెకొస్తు పండుగ నొద్ద ఆయనను మర్చిపోయారు, మరియు ఆ మెథడిస్టు, బాప్తిస్టు, ప్రెస్భిటేరియన్, పెంతెకొస్తు వారు ఎన్నడైనా ఆయనను తిరిగి కనుగొను చోటు, ఆయనను ఎక్కడ విడిచి పెట్టారో, అక్కడకు తిరిగి వెళ్ళుటయే. ప్రభువు యొక్క సంతోషము ఎక్కడ యున్నది? ప్రభువు యొక్క శక్తి ఎక్కడ యున్నది? “చరిత్రలోని దేవునికి ఏమి సంభవించింది?” అని ఈ రోజున సంఘము అడుగుతుంది. ఆయన ప్రజలు ఆయనను రంగము మీదికి పిలుచుట కొరకు, ఆయన ఎదురుచూస్తున్నాడు.
76 సంఘశాఖల ద్వారా మనము దానిని చేయలేము. మనస్తత్వశాస్త్రము క్రింద దానిని మనము చేయలేము. విద్యతో మనము దానిని చేయలేము. గణితము క్రింద మనము దానిని చేయలేము. మనలను మనము వేరుచేసుకొని, మనలను విభజించుకొన్నాము. మనము విభాగించ బడలేదు. క్రీస్తు యేసులో నిజానికి మనము ఒకే వ్యక్తిగా యున్నాము. క్రీస్తులో మనము ఒక్కటిగా యున్నాము, మరియు మన సంఘశాఖలు ఎన్నడూ దానిని చేయలేవు. వారు ఎంత మంచి వారై యున్నను, వారు దానిని చేయలేరు. ఎన్నడైనా సువార్త కలిగియున్న అతి గొప్ప ఆటంకము, మన విద్యయైయున్నది
77 మనకు అవసరమైనది విద్య కాదు. దేవుని యొక్క శక్తిని ప్రదర్శించుటకు, మనకు పరిశుద్ధాత్మ యొక్క ప్రదర్శన శక్తి అవసరమైయున్నది. “మీరు సర్వలోకమునకు వెళ్లి ఉపదేశించండి,” అని యేసు ఎన్నడూ చెప్పలేదు. “మీరు సర్వలోకమునకు వెళ్లి దానిని చేయండి,” అని ఆయన ఎన్నడూ చెప్పలేదు…ఆయన అన్నాడు, “మీరు సర్వ లోకమునకు వెళ్లి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి.” మరియు సువార్త అనగా, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, పునరుత్థానము ప్రదర్శించుట. మనము ఎక్కడ తప్పక యుండాలో, దాని కంటే ఇంకనూ మనము, పదిలక్షల మైళ్ళ తక్కువగా యున్నాము. మనము ముందుకు కదులుదాము, ఎక్కడ మనము ఆయనను విడిచిపెట్టామో, ఆ పెంతెకొస్తు పండుగ నొద్ద కు తిరిగి వెళదాము.
78 యేసు అన్నాడు, యోహాను 15వ అధ్యాయములో అని నేను నమ్ముతాను, “నేను ద్రాక్షా వల్లిని, మీరు తీగెలు.” అన్నాడు. ఇప్పుడు బాగుంది, ఆ ద్రాక్షా వల్లి మొదటి కొమ్మ ముందుకు వచ్చినపుడు, ఆ కొమ్మ నుండి ఒక అపోస్తుల కార్యములు వ్రాయబడింది, రెండవ కొమ్మ మరొక అపోస్తలుల కార్యమును తయారుచేస్తుంది. మూడవ కొమ్మ మరొక అపోస్తలుల కార్యములు తయారు చేస్తుంది. మరియు ఆ ద్రాక్షా వల్లి నుండి వచ్చే ప్రతికొమ్మ, దాని మొదటి కొమ్మ వలె యుంటుంది.
79 ఇప్పుడు, మీరు అంటుకట్టవచ్చు, మనకు అది తెలుసు. ఒక పుల్లని పండ్ల బెట్టు, దాని మీద ఎనిమిది వేరు వేరు రకములైన పండ్లు కలిగియున్నది. బత్తాయి చెట్టు, ద్రాక్ష పండ్లను, నిమ్మకాయలను, మరియు సమస్తమును దాని మీద కలిగియున్నది, అయితే అవి దానిలో అంటుకట్టబడ్డాయి.
80 ఈ దినమున ఇబ్బంది అదియే. మన ఆలోచనలను, మన సంఘశాఖలను లోనికి అంటుకట్టాము, కాని ఆ చెట్టు ఎన్నడైనా, దానికి అది, మరొక ఫలపు కొమ్మను వేసినట్లైతే, అది లోనికి వెళ్ళిన అసలైన వాటి వలె యుంటుంది. హల్లెలూయ! ఓ, సంఘము ఏకముగా మిశ్రమమవుతుంది, కాని మనకు అవసరమైనది అసలైన శక్తియే. మనకు పరిశుద్ధాత్మ, యేసు క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి అవసరమై యున్నది. ఆయన మనలను చెయ్యమని చెప్పింది అదియే.
81 “నేను ద్రాక్షా వల్లిని, మీరు తీగెలు.” ద్రాక్షా వల్లి ఒక కొమ్మను వేసినట్లైతే, మరియు అది చక్కని నీలి రంగు ద్రాక్షలను కాసినట్లైతే, తరువాత ద్రాక్ష వల్లి కూడా దాని మీద నీలి రంగు ద్రాక్షలను తెచ్చును. మొదటి ద్రాక్షా వల్లి బయటకు వచ్చినపుడు, అది పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము క్రింద, వారు గొప్ప అద్భుతములు, సూచక క్రియలను చేశారు, మరియు లోకమునకు ఒక సాక్ష్యమును ముద్రించారు. వారిలో అనేకులు, వారి సొంత సాక్ష్యమును, వారి రక్తముతో, వారి సాక్ష్యమును ముద్రించారు. సువార్తను బయటకు తెచ్చుటకు, వారు అన్ని రకములైన అపాయములుగుండా వెళ్లారు. వారు శ్రమపడ్డారు; వారు కొట్టబడ్డారు; వారు శిక్షించబడ్డారు. “రక్తపు నదుల గుండా, ఇతరులు బహుమానము పొందుటకు పోరాడినపుడు, మనము తప్పక సుఖమైన పూల పాన్పు మీద పరలోకపు గృహమునకు మోసి కొనిపోబడతామా?” మనము ఏది చేయుటకు ఎదురు చూస్తున్నాము? “నేను తప్పక ఏలవలెనంటె, నేను తప్పక పోరాడాలి. ప్రభువా, నా ధైర్యమును పెంచుము.” నిశ్చయముగా.
82 మనకు సంఘశాఖ అవసరము లేదు. మనకు క్రొత్త సంఘ కట్టడము అవసరము లేదు. ఈ దినమున మనకు అవసరమైన దేమనగా, పాత కాలపు అడవులలోని, నీలి ఆకాశపు రంగు, పాపమును చంపు పెంతెకొస్తు ఉజ్జీవము, పెంతెకొస్తు నొద్ద పుట్టినది, తిరిగి సంఘము లోనికి రావలసి యున్నది, తిరిగి యేసును రంగము మీదికి తెచ్చు పరిశుద్ధాత్మ యొక్క శక్తి.
83 ఎల్లప్పుడు క్లిష్టమైన తరుణములో, చరిత్ర లోని దేవుడు రంగము మీదికి లేస్తాడు. అది మనకు అవసరము. అదే ఈ దినమున మన సంఘములతో యున్న ఇబ్బందియై యున్నది. మనము ఎంతో దూరముగా వెనుకకు వెళ్ళుచున్నాము. మనము లోక సంబంధమైన నాజూకులలోనికి పడిపోవుచున్నాము. మరియు క్రమేణ, ప్రతి సంవత్సరము, అది కొంచెము కొంచెముగా చనిపోతు, ఎండిపోతుంది.
84 అతి త్వరలోనే, ఇది కొమ్మలను నరుకు కాలమై యున్నది. నేను వేదిక మీద ఎంత ఖచ్చితముగా నిలబడియున్నానో, అంతే ఖచ్చితముగా, దేవుడు దానిని వెనుకకు నరికి వేస్తాడు. ఈ దినములలో ఒక దినమున, లోక సంబంధమైన కార్యములను దానిలో నుండి నరికివేస్తాడు. మతము పేరు క్రింద, సంఘము కొనసాగుచున్న విధానము, ఎలాటి అపకీర్తి.
85 యేసు వెళ్లిపోయినపుడు, మరణము లోనికి వచ్చినట్లు మనము కనుగొంటాము. యేసు మన సంఘమును విడిచి పెట్టినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి సంఘమును విడిచిపెట్టినపుడు, అది వాడి పోయి, చనిపోవుట ఆరంభమవుతుంది. కొంచెము తరువాత, దానికి ఇక ఎంత మాత్రము ఇక ఎక్కువ లేదు. ఇప్పుడు, యేసు వెళ్లిపోయినపుడు, మరణము లోనికి వచ్చింది. ఓ, అది ఎలాటి విచారకరమైన సమయము.
86 గమనించండి, వారు ఇటు అటు తిరుగు లాడారు, వారు యేసుకు కబురు పెట్టారు, కాని ఆయన రాలేదు. మళ్ళీ ఆయన కొరకు కబురు పెట్టారు, ఆయన రాలేదు, అయితే ఆయన ఏమి చేయుచున్నాడో ఆయన ఎరిగియుండెను. ఈ రాత్రి ఆయన ఏమిచేయుచున్నాడో, ఆయన ఎరిగియున్నాడు. అది ఆయనతో తప్పిపోలేదు. ఆయన ఖచ్చితముగా ఏమి చేయుటకు నిర్ణయిoచబడిందో, ఆయనకు తెలుసు, నేను ఈ వేదిక మీద ఎంత నిశ్చయముగా నిలబడియున్నానో, అంతే నిశ్చయముగా, ఆయన ఒక ప్రజను పైకి లేపబోవుచున్నాడు. ఆయన నామము కొరకు అన్య జనాంగములో నుండి ఒక ప్రజను, ఆయన లేపుతాడు. ఆయన దానిని చేస్తాడు.
87 ఇప్పుడు తిన్నగా ఇది యూదుల సమయమై యున్నది, మరియు అన్యుల సమయము అంతమగుచున్నది, కారణము వారు తిన్నగా ముందుకు వెళ్ళిపోయారు. వారు క్రీస్తును తృణీకరించుచున్నారు; వారు వారి యొక్క సూచనలను తృణీకరించుచున్నారు; దేవుడుగా పిలవబడిన సమస్తమును వారు తృణీకరించి, అది ఒక రకమైన మనసు చదివే శాస్త్రముగా, లేక దయ్యపు శక్తిగా, దానికి ముద్ర వేస్తున్నారు…వారు పరిశుద్ధాత్ముని దూషిస్తూ, దేవునికి దూరముగా తమ్మును తాము ముద్రించుకొనుచున్నారు. మరియు కొద్ది సేపటి తరువాత, దేవుడు అల్ప సంఖ్యను తీసుకొని, దానిని ఒక శక్తి గల సంఘముగా లేపుతాడు, మరియు అప్పుడు ఆత్మను యూదుల వైపు త్రిప్పుతాడు, మరియు అన్య సంఘమును గృహమునకు తీసుకొంటాడు. ఖచ్చితముగా నిజము. ఇప్పుడు ఆమె సిద్ధ పర్చబడుచున్నది. ఓ, ఎలా, దరిదాపుగా, మనము అంతములో యున్నాము.
88 యేసు, ఆయనకు తెలుసు. కొద్ది సేపటి తరువాత, ఆయన అన్నాడు “మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు.”
89 ఎందుచేత, అతడు కొంచెము విశ్రాంతి తీసుకొనుచున్నాడని శిష్యులు తలంచారు ఆయనన్నాడు, “అతడు నిద్రపోతున్నట్లైతే, అతడు చాలా బాగున్నాడు.”
90 బాగుంది, వారు గ్రహించునట్లు, ఆయన వారి మాటలు మాట్లాడాడు, ఆయనన్నాడు, “అతడు చనిపోయాడు, నేనక్కడ లేనందుకు మీ నిమిత్తము నేను సంతోషిoచుచున్నాను.” చూడండి? “మీ నిమిత్తము, నేనక్కడ లేనందుకు సంతోషిoచుచున్నాను.” ఎందుకంటే అతనిని స్వస్థపర్చుమని, వారు ఆయనను అడుగుచున్నారు, కాని ఆయన దానిని చేయలేనని ఎరిగియుండెను, ఎందుకంటే దర్శనము ప్రకారము, తండ్రి చెప్పినట్లు అది ఇంకా సమయమై యుండ లేదని, ఆయన ఎరిగి యుండెను. ఎంత రమ్యముగా యున్నది; ఆ సమాధి నొద్ద ఆయన అన్నాడు, “తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను, కాని నిలిచియున్న ఈ జన సమూహము నమ్మునట్లు, వారి నిమిత్తము ఈ మాటను చెప్పితిని.” చూడండి? ఆయన ఏమి చేయుచుండెనో, ఇదివరకే ఆయన ఎరిగియుండెను. ఆయనన్నాడు, “నేను వెళ్లి అతనిని మేలు కొలుపుదును.”
91 ఇప్పుడు, నేను ఊహించగలను, ఆ చిన్న గృహము నిజముగా విరిగిపోయింది. పోషకుడు గతించిపోయాడు, విచారము…ఓ, ఒక విచారకరమైన గృహము. లేక ఒక విచారకరమైన హృదయమును కలిగి యున్నప్పుడు, అది అద్భుతము, అప్పుడు అకస్మాత్తుగా యేసు ప్రత్యక్షమవుతాడు, కాదా? నేను ఊహించగలను, నల్లని ముసుకును తన ముఖమున వేసుకొన్న మార్త, మరియు మరియలు, ఒకరి హస్తములను ఒకరు పట్టుకొని, “మనము ఏమి చేద్దాము? అని చెప్పుకొంటున్నారు, మన తండ్రి, తల్లి, మరియు మన ప్రశస్త సోదరుడును చనిపోయాడు…ఇప్పుడు, మనము సంఘమును వదిలిపెట్టాము, వారి నుండి మనము వెలివేయబడ్డాము, మరియు యేసును వెంబడించటానికి మనము బయటకు వచ్చాము. ఆయన మనలను విడిచి, ఎక్కడికో దూరముగా వెళ్ళిపోయాడు.”
92 ఒక విమర్శకుడు వచ్చి, “హే, ఆ దైవిక స్వస్థ పర్చువాడును, గలలీయ ప్రవక్త ఎక్కడ? అని చెప్పుటను నేను వినగలను. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడు? చూడండి, ఆయన ఏదైనా చేయవలసిన సమయము వచ్చేసరికి, ఆయన వెళ్ళిపోయాడు.” అది అక్కడే యున్నది. చూడండి, దానిని చేయుటకు దేవుడు ఇష్టపడుచున్నాడు, ప్రజలు వారు ఏమైయున్నారో చూచుటకు ఆయన ప్రయత్నము చేయుచున్నాడు. ఆయన వారికి దీవెన ఇస్తాడు. ఆయన ప్రత్యక్షమై, తన్ను తాను ప్రజలకు పరిచయము చేసుకొని, దానిని గూర్చి వాళ్ళు ఏమి చేస్తారో, ఎలాటి ప్రతి స్పందన ఇస్తారో, ఆయన చూడగోరుచున్నాడు.
93 ఇప్పుడు, మనము కనుగొనేదేమనగా, లాజరు చనిపోయి నాలుగు రోజులైంది. వారు అతనిని సమాధి చేశారు. రెండవ రోజైంది, మూడవ రోజైంది, నాల్గవ రోజైంది…ఇప్పుడు, మూడు దినముల తరువాత, క్రుళ్ళిపోవుట ఆరంభమవుతుంది. మొదటగా, ముక్కు ముఖము మీద రాలిపోతుంది. అప్పుడు క్రుళ్ళిపోవుట ఆరంభమవుతుంది అప్పుడు ఏలుక పురుగులు, శరీరమును తినుట ప్రారంభిస్తాయి. అతనిని సమాధిలో యుంచి, పెద్ద రాయిని ఆ గుహపైన పెట్టారు. మరియు అప్పుడప్పుడు, ఈ యవ్వన బాలికలు, సమాధి యొద్దకు వెళ్లి, మోకరించి ఏడుస్తున్నారు.
94 కొద్ది సమయము తరువాత, “యేసు వచ్చాడని, వార్తలు వ్యాపించాయి. ఆయన పట్టణములోనికి వచ్చుటను మనము చూడగలము.” ఓ, ఆ చిన్న మార్త, అది ఎంతో ఆలస్యమై నట్లుగా కనబడుచున్నప్పటికి, ఆమె దేనినుండి తయారు చేయబడిందో ఋజువు చేసింది, ఆమె అప్పుడు రోడ్డు మీదకు వచ్చి, బయటకు పరుగెత్తుచు ఆయనను వెతుకుతుంది. ఆ దారి నుండి వెంబడి యున్నవారు, ఈలాగు చెప్పుట నేను వినగలను, “బాగుంది, ఇప్పుడు మీరు తృప్తి చెందారా, మీ మతము అబద్ధము,” ఆమె వారిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళింది, తిన్నగా విమర్శకులందరినీ దాటింది. ఆయనను చూచువరకు, ఆమెదారి గుండా వెళ్ళింది, బహుశ ఆయన ఒక వీధి మూలన కూర్చొన్నాడు.
95 ఇప్పుడు, అది చూడటానికి, తప్పక ఆయన పై కోపగించుకొని, చెడుగా మాట్లాడవచ్చు. ఎందుచేత, “ఇటు చూడు, ఇటు చూడు, నీవు, అని ఆమె పరుగెత్తుకొంటూ వెళ్లి, ఎందుకు అనలేదు. నీవు ఒక ప్రవక్తగా యుండవలసిన వాడవు, ఒక దైవజనుడవు. మేము పిలిచినపుడు, నీవు ఎందుకు రాలేదు? ఎందుకు, ఇప్పుడు పల్లెనిండా మేము నవ్వుల పాలయ్యాము. నిన్ను వెంబడించుటకు మా సంఘమును విడిచిపెట్టాము.” ఆమెకు ఒక హక్కుయున్నట్లుగా అక్కడ కనబడుతుంది. కానీ, మీకు తెలుసా, గొర్రె పిల్ల మరియు పావురము, మీద నేను బోధించినట్లుగా, గొర్రె పిల్ల తన హక్కులన్నిటిని తాకట్టు పెడుతుంది. అది ఖచ్చితముగా సత్యము. అతనికి ఉన్ని తప్ప ఏమియు లేదు, కాబట్టి అతడు దానిని తాకట్టు పెట్టాలి. మరియు దేవునిని సేవించుటకు గాను, నీవు కలిగియున్న ప్రతి హక్కును నీవు ఆయనకు తాకట్టు పెట్టాలి. అది అక్షరాల సత్యము.
96 మీకు తెలుసా, ఈ స్త్రీలు ధరించుచున్న, ఈ పొట్టి బట్టలను గూర్చి నేను మాట్లాడుచున్నాను, వారన్నారు, “బాగుంది, మేము అమెరికా వారము. మేము కోరుచున్న దానిని మేము చేయగలము,”
97 నేనన్నాను, “అది అక్షరాల నిజము, కాని నీవు ఒక గొర్రె వైనట్లైతే, నీవు నీ యొక్క హక్కులను తాకట్టు పెడతావు.” సిగరెట్లు త్రాగుతూ, ఆలాగున నీవు కొనసాగుతున్నట్లైతే, అది ఎన్నడైనా ఒక స్త్రీ చేసిన నీచమైన కార్యము. అది అక్షరాల నిజము.
98 ఈ మధ్యనే, ఒక స్త్రీ నాతో మాట్లాడుచూ అన్నది, “అయితే, బ్రాన్హాం సోదరుడా, వాళ్ళు అవి తప్ప మరే ఇతర బట్టలను తయారు చేయుటలేదు.”
99 నేనన్నాను, “కాని వాళ్ళు ఇంకనూ కుట్టు మిషన్లను తయారు చేస్తూ, బట్టల సరుకులను అమ్ము చున్నారు. దానికి ఏ సాకు అక్కడ లేదు.” అది అక్షరాలా సత్యము.
100 గుర్తుంచుకో, నీ భర్తకు నీవు ఇక్కడ ఎంతో శుద్ధముగా ఉండవచ్చు, కాని ఒక దినమున, నిశ్చయముగా నీవు వ్యభిచరించినందుకు, దేవునికి జవాబు చెప్పాలి. “ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు, అప్పుడే హృదయములో, ఆమెతో వ్యభిచరించిన వాడగును.”
101 ఈ దినమున పెంతెకొస్తు స్త్రీలలో వచ్చిన చిక్కు ఏమిటి, దానిని గూర్చియే నేను ఆశ్చర్యపోవుచున్నాను. ఆ పాత నరకబడుచున్న వరసల నుండి, ఎలా మీరు దూరముగా వెళ్ళిపోయారు. మీ తల్లులు పూర్వము ఎలా పొడవైన వెంట్రుకలను కలిగియుండేవారో, కాని ఈ రోజు పెంతెకొస్తు స్త్రీలు, ఉత్సవవేడుకలోని స్త్రీల వలె, ముఖములకు రంగులు వేసి, జుట్టు కత్తిరించుకొని, చిన్న పొట్టి దుస్తులను ధరించుచున్నారు, మరియు ఆలాగునే వెళుతూ, మధ్యాహ్నము, పురుషులు ఆ దారిని వెళ్ళుచుండగా, పెరటిలో కొడవలితో కోస్తున్నారు, స్త్రీలారా, మీరు ఆ పురుషులతో వ్యభిచరించినందుకు జవాబు చెప్పవలసియున్నదని మీరు గ్రహించారా? ఆ ఉద్దేశ్యము కొరకే మిమ్మును మీరు, వారికి హాజరు పర్చుకున్నారు. అది సంఘము లోను మరియు ప్రజలలోను యున్న దురాత్మయై యున్నది, మరియు అది వారికి తెలియదు. గ్రుడ్డి వారు, అది వారికి తెలియదు. అది సత్యమై యున్నది.
102 బహుశ, ఒక సువార్తికుడిగా అది చెప్పుటకు నాకు హక్కు లేదని మీరంటారు. సరే, నేను పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును వెంబడించవలసియున్నది; నేను చెప్పేది అంత మట్టుకే. నేను తీర్పు నొద్ద మిమ్మును కలుసుకొన్నట్లైతే, నా చేతుల మీద మీ రక్తమును కలిగియుండును. సాతాను వలె కనబడే, ప్రతి చిన్న భూభాగము నుండి దూరముగా వెళ్ళండి. దానికి దూరముగా నిలబడండి. దాని నుండి వెళ్ళిపొండి. ఎంత మంది చలన చిత్ర తారలైనా నేను లెక్క చెయ్యను…నీవు ఇక్కడ ఒక చలన చిత్ర తారవలె లేవు; నీవు ఒక దేవుని కుమార్తెయున్నావు.
103 మొన్నటి ఉదయమున, ఆ పాత బానిసలను గూర్చి, ఎంతో కాలము క్రితము వారి అమ్మకమును గూర్చి, ఒక సంఘకాపరి సంఘములో బోధించాను. మరియు వారు వచ్చి, బానిసలను వేలము పాటలో కొనుక్కొనేవారు. ఆ బానిస ప్రజలు అక్కడ ఏడుస్తూ, మొర్ర పెట్టుచున్నారు, కారణమేమనగా, వారు ఇక ఎన్నడూ ఎంత మాత్రము తిరిగి వారి జన్మ భూమికి వెళ్ళలేరు. వారు కొరడాలతో కొట్టబడతారు. మనము ఒక కారును కొన్నట్లుగా, ఏ వెలకైనా కొనే వారిని కొనేవారు, మనుష్యులను అమ్ముచున్నారు.
104 ఒక రోజున, కొనుగోలు చేసే ఒక మారు బేరగాడు, ఒక పెద్ద చెట్లు నాటి వ్యవసాయ క్షేత్రము కొరకు వచ్చాడు. అతడన్నాడు, “నీ దగ్గర అమ్మకానికి ఎంత మంది బానిసలున్నారు?”
105 అతడన్నాడు, “నా దగ్గర కొద్ది మంది మార్పిడి కొరకు యున్నారు.” వారిని బలముగల వారిగా చేయుటకు ప్రయత్నము చేస్తున్నారు; ఆ తల్లులను, తండ్రులను తీసుకొని…గుర్రములు, మరియు జంతువుల వలె, అతడు పెళ్లి చేసుకొన్నా స్త్రీ, బలహీనమైన స్త్రీ యైతే, వారి ఈ పెద్ద ఆరోగ్యము గల వారితో, సంతానోత్పత్తిని చేయుచున్నారు. అది ఎన్నడూ సరికాదు. దేవుడు మనిషిని చేశాడు. మనిషి బానిసలను చేశాడు. ఎన్నడూ, ఆరంభము నుండే అది సరి కాదు. ఏ మనిషియూ బానిసగా యుండుట, దేవుని ఉద్దేశ్యముగా కాదు. కాదు…ఏమి సంభవించిందో చూడండి.
106 వారందరి మధ్యలో, ఈ మనిషి అన్నాడు, “బాగుంది, నేను వారిలో కొందరిని కొంటాను…” అక్కడ యున్న ఒక యవ్వనస్థుడిని అతడు గమనించాడు. వారు అతనిని కొరడాతో కొట్టవలసిన పనిలేదు. అతడు తన గడ్డమును, తన తలను, ఒక నిజమైన మర్యాదగల మనిషివలె పైకి ఎత్తి చుట్టూ నడుస్తున్నాడు. “నేను అతనిని కొంటాను,” అని ఆ మారు బేరగాడు అన్నాడు.
107 అతడన్నాడు, “అతడు అమ్మకానికి కాదు.”
108 అతడన్నాడు, “సరే, ఎందుకు?” “అతడు బాస్ ఆ?” అన్నాడు.
109 అతడన్నాడు, “లేదు, అతడు ఒక బానిస.”
110 “సరే,” “ఎందుకు? మిగిలిన వారి కంటే బాగుగా నీవు అతనిని పోషించుచున్నావా?” అన్నాడు.
111 అతడన్నాడు, “లేదు. అతడును మిగిలిన వారందరితో పాటు వంట శాలతో భోoచేస్తాడు. అతడును ఒక బానిస.”
112 అతడన్నాడు, “మిగిలిన వారందరి కంటే, ఏది అతనిని భిన్నముగా చేస్తుంది?”
113 బాస్ అన్నాడు, “దానిని గూర్చి ఎంతో కాలముగా నేను ఆశ్చర్యపడ్డాను, కాని ఒక రోజున నేను దానిని కనుగొన్నాను. అదేమనగా, అతడు పుట్టిన దేశములో, అతని తండ్రి ఒక తెగకు రాజై యున్నాడు. కాబట్టి అతడు తన ఇంటికి దూరముగా యున్నప్పటికి, అతడు ఒక రాజకుమారుడై యున్నాడని అతనికి తెలుసు, అతడు ఇంకనూ ఒక రాజ కుమారునివలె, తెలుసు, తన్ను తాను ప్రవర్తిoప చేసుకొనుచున్నాడు.” ఒక ఆఫ్రికా దేశ వాసుడు, అతని తండ్రి ఒక రాజైయున్నాడని గ్రహించినట్లైతే, ఒక విదేశములో యుండి, ఆ సముద్రమునకు అవతల, ఇంకనూ అతడు ఒక రాజకుమారుడై యున్నాడని, అతడు గ్రహించినట్లైతే, తప్పక ఎంత ఎక్కువగా, స్త్రీ పురుషులు, వారు దేవుని కుమారులు మరియు కుమార్తె లై యున్నారని, తమ్మును తాము ప్రవర్తింప చేసుకోవాలి? నిశ్చయముగా, దాని వలె ప్రవర్తించండి, మిమ్మును మీరు ప్రవర్తింప చేసుకోండి; మిమ్మును మీరు శుద్ధి చేసుకొని, దేవుని యొక్క కుమారులు, మరియు కుమార్తెల వలె ప్రవర్తించండి. ఏ పరిస్థితిలో యున్నను, ఆశ్చర్యము లేదు.
114 ఇక్కడ మనమున్నాము. ఓ, చిన్న మార్త, పరుగెత్తు కొంటూ బయటకు వస్తుంది. ఆమె ఆయనకు వ్యతిరేకముగా, ఏదో చెప్పుటకు కలిగియున్నట్లుగా కనబడుతుంది. “నీవు నా సోదరుని దగ్గరకు ఎందుకు రాలేదు? మేము నీకు ఏమి చేశామో చూశావా, నీవు మమ్మును క్రిందకు నెట్టావు.” సరే, ఆమె ఆలాగు చెప్పియుంటే, ఆ కథ ముగించబడవలసిన రీతిగా ముగించబడి యుండేది కాదు. లేదండి, అది నీవు దైవిక వరమును సమీపించు, నీ విధానమై యున్నది. దేవుడు ఒక వరమును పంపినట్లైతే, నీవు సరియైన విధముగా దానిని సమీపించవలసి యున్నది. నీవు ఎన్నడైనా, దాని నుండి ఏదైనా పొందుటకు ఎదురుచూసినట్లైతే, నీవు సరైన రీతిలో దానిని సమీపించవలసి యున్నది. మార్తకు అది తెలుసు. బహుశ ఆమె షూనేమీయురాలిని గూర్చి, ఆమె బిడ్డను గూర్చి చదివి యుండవచ్చు. మరియు దేవుడు ఏలీయాలో యున్నాడని ఆమెకు తెలుసు, అలాగైతే, మరి ఎంత ఎక్కువుగా ఆయన యేసులో వుంటాడు. నిశ్చయముగా.
115 కాబట్టి, ఆమె సరైన విధముగా ఆయన యొద్దకు వెళ్ళింది. ఆమె పరుగెత్తుకొని వెళ్లి ఆయన పాదముల మీద పడింది. అది నాకు ఇష్టము! ఆయన పాదముల యొద్ద సాగిల పడి, “ప్రభువా…” అన్నది, అది ఆయన సరియైన బిరుదు. ఆయన అదేయైయున్నాడు. ఆయన ఆమె ప్రభువైయున్నాడు. “ప్రభువా, నీవు ఇక్కడ యుండియుంటే, నా తమ్ముడు చనిపోయే వాడు కాదు.”
116 ఓ, అయ్యో. ఆ చక్కని స్త్రీ వైపు చూస్తూయుండగా, నేను ఆయన గొప్ప హృదయమును చూస్తూ ఊహించగలను, ఆమె చెంపల మీద నుండి కన్నీరు కారు చున్నది, “ప్రభువా, నీవు ఇక్కడ యుండి యుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు.” ఆమె ఏమి చెప్పిందో గమనించండి. “కాని ఇప్పుడైనను ప్రభువా, అతడు చని పోయినప్పటికి, ఏలుక పురుగులు అతని శరీరము నిండా పాకుచున్నప్పటికి, ఇప్పుడైనను ప్రభువా, నీవు దేవుని ఏమి అడిగినను, అది నీకు అను గ్రహించబడును.”
117 ఓ, అదే రహస్య మై యున్నది. “ప్రతి హాస్పిటల్ గుండా వల వేసినట్లుగా తిరిగాను. నేను చనిపోవబోవుచున్నానని వైద్యుడు చెప్పాడు, కాని ఇప్పుడైనను, ప్రభువా…నేను నరముల వ్యాధితో అంతా చచ్చు బడిపోయాను, నేను కదలలేను, కాని ఇప్పుడైనను, ప్రభువా…”
118 గత రాత్రి అంత పెద్ద లావుగా వాచిన తలను ఆ బిడ్డ కలిగియున్నది. అక్కడ నీవు ఏమియు చేయలేవు. ఆ వ్యాధి వ్యాపించి, దాని చిన్న తలను బ్రద్దలు చేసి చంపేస్తుంది, “కాని ఇప్పుడైనను, ప్రభువా…” ఆయన ఇంకనూ మారని దేవుడైయున్నాడు. ఆయన ఇంకనూ అదే దేవుడైయున్నాడు, “ఇప్పుడైనను, ప్రభువా…” ఆయన సర్వశక్తుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చోండి, ఆయన మన కొరకు చేసిన వాటి పై, మన వాదనలపై విజ్ఞాపన చేయుచున్నాడు.
119 ఇప్పుడు, నిజముగా నేను భక్తి పూర్వకమైన అనుభూతిని చెందుతాను. ఎలాగైనా మీరు నన్ను, ఒక పరిశుద్ధ రోలరు అని పిలవబోవుచున్నా, మీరు ఎలా ప్రారంభించినప్పటికీ, నేను దానిని మీద వేసుకొని వెళతాను.
120 కాబట్టి, అవునండి, “ఇప్పుడైనను ప్రభువా, నీవు దేవుని ఏమడిగినను దేవుడు దానిని చేస్తాడు.”
121 యేసు అన్నాడు, “నా నామమున మీరు తండ్రిని ఏమి అడిగినను, నేను దానిని చేస్తాను.”
122 “ఇప్పుడైనను, ప్రభువా, నీవు ఏమి అడిగినను, దేవుడు నాకు దానిని అనుగ్రహించును.” ఓ, అది తప్పక ఆయన గొప్ప హృదయమును కదిలించింది.
123 “నీ సోదరుడు మరలా బ్రతుకును,” అని ఆయన అన్నాడు.
124 ఆమె అన్నది, “అవును ప్రభువా, అతడు బ్రతుకుతాడు. అతడు ఒక మంచి కుర్రవాడు. అంత్యదినమున సాధారణ పునరుత్థానములో అతడు లేస్తాడు.” ఆ యూదులు సాధారణ పునరుత్థానమును నమ్మి యున్నారు. “చివరి దినములలోని పునరుత్థాన మందు అతడు తిరిగి లేస్తాడు.”
125 ఆయన వైపు చూడండి. ఆయన తన్ను తాను ఏకముగా లాగుకొన్నాడు. “పునరుత్థానమును మరియు జీవమును నేనే,” అన్నాడు, ఓ, అయ్యో! ఆ మాటను ఎన్నడూ ఇదివరకు ఎప్పుడూ ఎవరూ చెప్పియుండలేదు. దాని తరువాత ఎవరును ఎక్కడును ఒక్కరు ఆ మాట చెప్పలేరు. ఆయన ఒక్కడు మాత్రమే దాని చెప్పగలడు. “పునరుత్థానమును మరియు జీవమును నేనే,” అని ప్రభువు చెప్పాడు. “నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును మరియు బ్రతికి నా యందు విశ్వాసముంచు వాడెన్నడును చనిపోడు. నీవు దీనిని నమ్ముచున్నావా?”
126 ఆమె అన్నది, “అవును ప్రభువా,” ఏదో సంభవించుటకు నిర్ణయించబడి యున్నదని ఆమె ఎరిగియుండెను. సంభవించవలసి యున్నది.
127 ఒక యధార్థ హృదయము నుండి విశ్వాసము, దేవునిని కలుసుకొన్నప్పుడు, ఆ ఒకటి నొకటి ఎరిగియున్నవి, ఆరీతిగా ఏకముగా వస్తాయి. ఏదో సంభవించవలసి యున్నది. యేసు క్రీస్తు నామములో ఈ శ్రోతలకు నేను సవాలు చేయుచున్నాను, నీ విశ్వాసము దేవునితో ఆ రీతిగా ఏకము కానివ్వు, కొన్ని నిమిషములలో మనము మరొక పెంతెకొస్తును కలిగియుంటాము. ఈ పల్లెలో ఎలాటి ఉజ్జీవము బ్రద్దలగుననగా, ఈ పల్లెలో వారిని సముదాయించుటకు, పోలీసులు తగినంతగా సరిపోరు. అది నిజము. అక్కడ ఒక నిజమైన ఉజ్జీవము ఉంటుంది, “ఇప్పుడైనను, ప్రభువా…”
128 “ప్రభువా, మంచిది, మేము ఇక్కడ పట్టబడి యున్నాము; మేము ఇది, అది చేశాము.” నీవు ఏమి చేశావో లెక్క చెయ్యను, “ప్రభువా, ఇప్పుడైనను…” నీవు ఆయనను పిలవాలని ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. “దీనిని నమ్ముచున్నావా?” నిశ్చయముగా అవునయ్యా. ఇప్పుడైనను, నీవు ఆయనను ఏమి అడిగినను…
129 “అతనిని మీరు ఎక్కడ ఉంచారు?” ఇప్పుడు సమాధి యొద్దకు వెళ్తున్నాడు. ఏడ్చుటకు ఆయన తగినంతగా మనిషై యున్నాడు; మృతులను లేపుటకు తగినంతగా ఆయన దేవుడై యున్నాడు.
130 ఇక్కడ కొద్ది కాలము క్రితము, ఒక నిర్ణీతమైన గుంపు ప్రజలకు చెందిన స్త్రీ వున్నది…సంఘశాఖలను గూర్చి దానిని చేయుట, ఎన్నడూ నేను ఒక అలవాటుగా దానిని చేయను. కాని ఈ స్త్రీ…యేసు దేవుడని వారు నమ్మరు. ఆయన ఒక ప్రవక్త అని వారు చెపుతారు. ఇప్పుడు ఆయన కేవలము ఒక ప్రవక్త యై యుంటే, అప్పుడు మనమందరము పాపములో యున్నాము. ఆయన దేవుడైనా అయివుండాలి, దేవుడు కంటే ఏమి తక్కువ కాదు. లేక ఎన్నడైనా ప్రపంచము కలిగి యున్న అతిపెద్ద మోసగాడైనా యై యుండాలి. అది నిజము. ఆయన మనిషి కంటే ఎక్కువైన వాడు. “ఆయన దేవుడు కాదని” ఆమె అన్నది.
131 యేసు క్రీస్తును ఒక ప్రవక్తగా చేస్తూ, ఈ దినమున ఈ సాంఘిక సువార్తలో ఎంతో యున్నది. ఎందుకు, ఆయన ప్రవక్తలకు దేవుడై యున్నాడు. నిశ్చయముగా ఆయన యై యున్నాడు.
132 “నీ బైబిలు ద్వారానే, ‘ఆయన కేవలము ఒక మనిషియైయున్నాడని’ నేను ఋజువు చేస్తాను,” అని ఆమె అన్నది.
133 నేనన్నాను, “నీవు దానిని చెయ్యి.”
134 “ఆయన లాజరు సమాధి యొద్దకు వెళ్ళినపుడు ‘ఆయన ఏడ్చాడు,’ ఆయన ఒక మర్త్యుడై తేనే గాని, లేనిచో ఆయన ఏడ్వడు గదా,” అని ఆమె అన్నది.
135 నేనన్నాను, “స్త్రీ, అదేనా నీ లేఖనము?” దీనిని ఇక్కడ చెప్పుట నేను దైవ దూషణగా భావించను, కాని నేను ఆమెకు ఏమి చెప్పానో మీకు చెపుతాను.
136 ఆమె అన్నది, “అది అంతేనా.”
137 నేనన్నాను, “మరణమగుటకు ఆకలితో చనిపోవుచున్న, ఒక కోడిపిల్ల నీడ నుండి తయారు చేసిన రసము కంటే నీ మాట బహు బలహీనముగా యున్నది.” నేనన్నాను, “సరే, దాని మీద నిలబడుటకు, నీ దగ్గర ఒక్క సంగతి లేదు.”
138 ఆమె అన్నది, “ఆయన, ఎందుకు ఏడ్చాడు. అది చూపునది ఏమనగా ఆయన మర్త్యుడు.”
139 నేనన్నాను, “ఆయన మర్త్యుడు మరియు అమర్త్యుడు, రెండుయై యున్నాడు. ఆయన శరీరములో యున్న దేవుడు.”
140 ఆమె అన్నది, “ఓ, బుద్ధిహీనత.”
141 నేనన్నాను, “ఆయన ఏడ్చుచూ సమాధి యొద్దకు వెళ్ళాడు. అది తగినంత సత్యము, కాని ఆయన తన్ను తాను నిటారుగా చేసుకొన్నప్పుడు…” బైబిలు చెప్పింది, “ఆయనలో చూచుటకు ఏమియు లేదు; మనము చూచునట్లు ఆయనలో ఏ సొగసు లేదు.” కాని ఆయన తన చిన్న భుజములను వెనుకకు నెట్టి, “లాజరూ, రా బయటకి,” అన్నాడు, అప్పుడు సమాధిలో క్రుళ్ళిపోయి నాలుగు దినములైన వ్యక్తి, అతడు బయటకు వచ్చాడు. అది ఒక మనిషి కంటే ఎక్కువై యున్నది. ఒక మనిషి దానిని చేయగలడేమో నాకు చూపండి? అది ఏమైయున్నది? క్రుళ్ళు, దాని యజమానిని గుర్తించింది. జీవము దాని సృష్టికర్తను ఎరిగింది. ఏదో సంభవించవలసి యున్నది. మరణించి సమాధిలో నాలుగు దినములున్న వ్యక్తి, ఆయన మాట్లాడినపుడు, మృతులలో నుండి తిరిగి లేచి, అతడి పాదములపై నిలబడి, జీవించాడు. హల్లెలూయ! అది ఆయన కుమారునిలో యున్న దేవుడు. అవునండి. అది దేవుడు తన కుమారుని ద్వారా, తన్ను తాను తెలియపర్చుకొను చున్నాడు. అది దేవుడు మాట్లాడుట యై యున్నది, ఒక మనిషి కాదు.
142 ఏదైనా తినటానికి ఆ దినమున, ఆ చెట్టు మీద చూసినపుడు, ఆయన ఒక మనిషి. అది ఒక మనిషైయున్నాడు. కాని ఆయన ఐదు రొట్టెలు మరియు రెండు చేపలను తీసుకొని, ఆయన ఐదువేల మందికి ఆహారము పెట్టినపుడు, అది ఒక మనిషి కంటే ఎక్కువై యున్నది. అది దేవుడు వారికి భోజనము పెట్టుచున్నాడు. ఆయన ప్రవక్త కంటే ఎక్కువైన వాడు, మనిషి కంటే ఎక్కువైన వాడు, ఆయన దైవ-మానవుడు. నిశ్చయముగా.
143 ఆ రాత్రి ఆ చిన్న దోనెలో ఆయన విశ్రమించాడు, అలలు ఎగిసిపడుచు, బలమైన సముద్రము గర్జించుచున్న అలలతో, సీసా పై పెట్టు బెండు మూతవలె ఎగురుచున్నది. ఆ రాత్రి పదివేల దయ్యములు, ఆయనను సముద్రములో ముంచివేయాలని శపథము చేచినవి. నిశ్చయముగా. ఆయన ఒక మనిషై యున్నాడు, రోగుల కొరకు ప్రార్థన చేసి, బలహీనమై అలసిపోయాడు, ఆ పడవలో పరుండి యున్నాడు, మరియు గాలులు కనీసము ఆయనను కలతపర్చలేదు. ఆయన నిద్రించుచుండగా, ఆయన ఒక మనిషై యున్నాడు, కాని ఆయన మేల్కొని, ఆ పడవ అంచు మీద నిలబడి, పైకి చూసి, “నిమ్మళించుము,” అన్నప్పుడు, గాలులు మరియు అలలు ఆయనకు లోబడియున్నవి, ఒక మనిషి కంటే అది ఎక్కువై యున్నది. అది ఆయన తన్ను తాను తెలియ పర్చుకొనుచు, మనిషిలో యున్న దేవుడై యున్నాడు. అది సత్యము.
144 సిలువ నొద్ద కనికరము కొరకు మొర్ర పెట్టినపుడు, ఆయన ఒక మనిషై యున్నాడు. “నేను దప్పిగొనుచున్నాను,” అని మొర్ర పెట్టినపుడు, అది ఒక మనిషై యున్నాడు. ఆయన చనిపోయినపుడు, ఆయన ఒక మనిషైయున్నాడు, కానీ ఈస్టరు ఉదయమున, మరణము యొక్క, సమాధి యొక్క, పాతాళము యొక్క ముద్రలను చీల్చి, తిరిగి లేచినపుడు, ఆయన ఒక మనిషి కంటే ఎక్కువైన వాడు అది దేవుడు తన్ను తాను ప్రత్యక్ష పరచు కొనుటయై యున్నది. ఆశ్చర్యము లేదు, కవి ఈలాగున అన్నాడు.
జీవించి, ఆయన నన్ను ప్రేమించాడు, మరణించి, ఆయన నన్ను రక్షించాడు;
సమాధి చేయబడి, ఆయన నా పాపములను దూరముగా మోశాడు;
తిరిగి లేచి, ఉచితముగా, శాశ్వతముగా, నన్ను నీతి మంతుడిగా చేశాడు:
ఒక దినమున, ఆయన వస్తున్నాడు, ఓ, మహిమకరమైన దినము!
145 ఆయన అన్నాడు, “నేను జీవించుచున్నందున, మీరు జీవిస్తారు దీనిని నీవు నమ్ముచున్నావా?” ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. దీనిని నీవు నమ్ముచున్నావా? ఇప్పుడే తిన్నగా పరిశుద్ధాత్ముడు ఇక్కడున్నాడని నేను నమ్ముచున్నాను. దీనిని నీవు నమ్ముచున్నావా? ఆయన తన సన్నిధితో మనలను నిoపుతాడని నమ్ముతావా. దీనిని నీవు నమ్ముతావా. దీనిని నీవు నమ్ముతావా? పరిశుద్ధాత్ముడు తన సన్నిధిని క్రుమ్మరించగోరుచున్నాడని, రోగులను బాగుచేసి, పరిశుద్ధాత్మ లేని వారందరిని, నింపగోరుచున్నాడని నేను నమ్ముతాను. దీనిని నీవు నమ్ముచున్నావా? నీ హృదయ మంతటితో నీవు నమ్ముతావా? మన పాదములపై లేచి నిలబడి, ఆయనకు స్తుతిని చెల్లిద్దాము. తిన్నగా ఇప్పుడే ఆయన మన మీద క్రుమ్మరించబడతాడని నేను నమ్ముచున్నాను.
146 ఓ, ప్రభువైన దేవా, భూమ్యాకాశములకు సృష్టికర్తా, నిత్యజీవముకు కర్తా, ప్రతి మంచి ఈవిని అనుగ్రహించు వాడా, మేము “దీనిని నమ్ముచున్నాము,” ప్రభువా, ఈ కూటములో నీవున్నావని మేము నమ్ముచున్నాము. నీవు మా ఆత్మలను దీవించి యున్నావని మేము నమ్ముచున్నాము. నీ ఆత్మను మా మీద క్రుమ్మరించుచున్నావని, మేము నమ్ముచున్నాము. నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నావని, మేము నమ్ముచున్నాము. నీవు సదాకాలము జీవించుచున్నావని, మరియు మా పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో వ్రాయబడియున్నవని, మేము నమ్ముతాము. భూమ్యాకాశములు గతించును గాని, అయినను మేము సదాకాలము జీవిస్తాము, కారణము నీవు సదాకాలము జీవిస్తావు, ప్రభువా, నీవు దానిని మాకు వాగ్దానము చేశావు మా హృదయ మంతటితో మేము దానిని నమ్ముతాము. ప్రభువా, మాలోని సమస్తముతో, మేము దానిని నమ్ముతాము. నేను ఆయనను ప్రేమిస్తాను, నేను ఆయనను ప్రేమిస్తాను.
147 మీరు ఆయనను నమ్ముతారా? అది పరిశుద్ధాత్ముడని నేను నమ్ముతాను. ఏదో మనకి కురియుచున్నది. నీవు దీనిని నమ్ముతావా? తిన్నగా ఇప్పుడే ప్రతి వ్యక్తిని దేవుడు స్వస్థపర్చుతాడని, నేను నమ్ముతాను. నీవు దీనిని నమ్ముతావా? నీ చేతులను ఆయనకు ఎత్తుము. మీ పాదములపై లేచి నిలబడండి. నీవు దీనిని నమ్ముతావా? పరిశుద్ధాత్ముడు ఇక్కడ యున్నాడు. ఇది అదే యై యున్నది! పేతురు అన్నాడు, “ఇది అదే యై యున్నది.” ఇది అదే, పరిశుద్ధాత్మ యై యున్నాడు.
148 ఓ, ప్రభువా, భూమ్యాకాశాలకు సృష్టికర్తా, నీ శక్తిని, నీ దీవెనలను, నీ మంచితనమును ప్రజల పైకి పంపుము, వారి హృదయములను దీవించుము, మరియు మనుష్య కుమారుడు సదాకాలము జీవిస్తున్నాడని, వారిని చూడనిమ్ము, ఓ, ప్రభువా, దానిని దయ చేయుము. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నామములో నీకు వారిని బహుకరించుచున్నాము.
149 పరిశుద్ధాత్మ లేని వారు, ఎవరైనను మీ చేతులను ఎత్తి, దేవునిని స్తుతించండి. ఆయన మీ మీద క్రుమ్మరించబడతాడని నేను నమ్ముతాను. ఎవరైనను వారి మీద చేతులుంచండి. ఇదే ఆ ఘడియ యై యున్నది. మనము ఇంకా దీర్ఘకాలము వేచియుండుట ఎందుకు? ఇదే ఆ సమయమై యున్నది. ఇది దేవుని యొద్దకు తిరిగి వెళ్ళుచున్న పెంతెకొస్తు యై యున్నది. పెంతెకొస్తు యై యున్నది. పెంతెకొస్తు వారలారా! దేవునితో సమాధాన పడoడి. సజీవుడైన దేవుని శక్తి ద్వారా, మీ హృదయములు రేపబడనివ్వండి. మీ ఆత్మలు ఇంకిపోవునట్లుగా, పరిశుద్ధాత్మను మీ లోనికి రానివ్వండి. రోగులను స్వస్థపర్చుటకు, గ్రుడ్డి వారికి చూపునిచ్చుటకు, ఆయన సదాకాలము ఒక్కటిగా యున్నాడని. ఆయన గొప్ప బలమైన శక్తి ద్వారా, తన్ను తాను ఋజువు చేసికొనుచున్నాడు. హల్లెలూయ!
150 ఆయనను స్తుతించండి. మీ చేతులను ఎత్తండి. నీవు ఎక్కడున్నావో మర్చిపోమ్ము సరిగ్గా ఆయన చుట్టూ, ఆయన మంచితనము, ఆయన మహిమ, ఆయన శక్తి చుట్టూ యున్నావని తెలుసుకొనుము, మరియు ఆయన కృప నిరంతరముండును. ఆయన ఎల్లప్పుడు ఒకే రీతిగా యున్నాడు. ప్రభువు నామము సన్నుతించబడును గాక. హల్లెలూయ! ఓ, ఆయన పరిశుద్ధ నామమును స్తుతించండి.
151 ఓ, ఆయన ఎంత అద్భుతమైన వాడు, ఆయన ఎంత శక్తి గల వాడు, ఇప్పుడే తిన్నగా, ఎంత మంది మీ జీవితములను తాజాగా ఆయనకు ప్రతిష్టిoచుకొనగోరు చున్నారు? మీ చేతులను ఎత్తండి. ఎంతమంది మీ జీవితములను దేవునికి ప్రతిష్ఠించుకొనగోరుచున్నారు? అది అంతే. మీ చేతులను ఎత్తండి. మనము పెంతెకొస్తును చూద్దాము. మనము దేవుని యొక్క ప్రజలను చూద్దాము. నా చేతిని ఎత్తుతాను, “ప్రభువా, ఇక్కడే నేనున్నాను, నన్ను పంపండి.” అలాగైతే బలిపీఠము మీద నన్ను నిప్పు కొరివిలతో, ప్రభువా, నీ శక్తిని మా మీదికి పంపండి. దేవా, నీ ఆత్మ యొక్క సంపూర్ణతను దయ చేయుము, ఓ, తండ్రీ. మా ప్రార్థన అంగీకరించుము. ఆయన నామము స్తుతించబడును గాక.
152 ఓ, అలలవలె మహిమ, ఓ, కనికరము యొక్క మంచు చుక్కలు పడుచున్నవి. ఓ, దేవునికి మహిమ. మన ఆత్మలు కనిపెట్టును గాక. నీవు దీనిని నమ్ముచున్నావా? నీవు దీనిని నమ్ముచున్నావా? రానున్న పరిశుద్ధాత్మ ఇదియే. ఇదియే, మనలను దేవుని యొక్క రాజ్యములోని నెట్టు అదృశ్యమైన శక్తి, పెంతెకొస్తు యొక్క ఆశీర్వాదము. తిరిగి ఇంటికి రండి. నీవు తిరిగి వచ్చుటకు కనిపెట్టబడుచున్నావు. మీరు ప్రశస్తమైన ప్రజలు. నీకై నీవుగా, నీవు ప్రతిష్ఠిoచబడవలెనని దేవుడు కోరుచున్నాడు. స్త్రీలారా, మిమ్ములను మీరు శుభ్రము చేసుకోండి. పురుషులారా, మిమ్మును మీరు శుభ్ర పర్చుకొనండి. తిరిగి దేవుని యొద్దకు వెళ్ళుట ప్రారంభిద్దాము, మరియు ఒక నిజమైన, శుద్ధమైన హృదయముతో ఆయనను సేవిద్దాము.
153 దేవుని స్తుతించుడి, పరిశుద్ధాత్ముడు బయట కూటములో యున్నాడు. మీరు ఏది చేయాలని నడిపించబడతారో, సరిగ్గా దానిని చేయండి. పరిశుద్ధాత్ముని తిన్నగా మీ పై కదలనివ్వండి. నేను చెప్పేది ఏమియు లేదు. ఇప్పుడు నేను ఏమి చెప్పాలో నాకే తెలియదు. పరిశుద్ధాత్ముడు కట్టడము అంతటా యున్నాడు. ప్రభువు నామము సన్నుతించబడును గాక. ప్రభువు నామము స్తుతించబడును గాక. ఓ, హల్లెలూయ! హల్లెలూయ! ప్రభువు నామము స్తుతించబడును గాక ప్రభువుకు స్తోత్రము ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత మహిమగలవాడు…పరిశుద్ధుల ముఖముల మీద యున్న స్తుతులు, ఎంత రమ్యమైనవి, ఎంత అద్భుతమైనవి, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మీద ఇక్కడ కదులుచుండగా, ఈ గొప్ప జన సమూహములోని ఏక మనస్సు నుండి ఆయన నామము స్తుతించబడుచుండగా. మనకు ఆయన మహిమను చూపుచున్నాడు.
154 చుట్టూ తిరిగి ఎవరితోనైనా కరచాలనము చేసి ఇలా చెప్పండి, “సోదరుడా, ప్రభువుకు స్తోత్రము. ప్రభువుకు స్తోత్రము, సహోదరీ.” తిన్నగా మనము లోపలే పొందుదాము మరియు దేవుడు మనలను రేపును గాక. ప్రభువుకు స్తోత్రము. అది బాగుంది. మెథడిస్టు వారైన మీరందరూ, బాప్తిస్టులు, ప్రెస్బిటేరియన్లు, పెంతెకొస్తు వారు, సెవెంత్ డే ఏడవ రోజు, మరియు మీరు ఎవరై యున్నప్పటికి, ప్రభువైన దేవుని సన్నిధిలో, ఒకరితో ఒకరు కరచాలనము చేయండి. అది అంతే. ఓ, హల్లెలూయ! హల్లెలూయ! ఓ, నేను వారిలో ఒకడినైనందుకు నాకు ఎంతో సంతోషము. నాకు ఎంతో సంతోషము. ఓ, గోడలను చీల్లివేయుచూ, మష్టును విసిరి వేయుచున్నాను. మహిమ! ప్రభువులోని స్వేచ్చ, ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుట…ప్రభువు నామము సన్నుతించబడును గాక. ఓ, హల్లెలూయ! దేవునికి స్తోత్రము.
155 ఓ, అది చూచుట నాకు ఇష్టము; ప్రజలు ముఖములు ప్రకాశిస్తూ, ఒకరితో ఒకరు కరచాలనము చేయుట. దేవుని యొక్క శక్తి చెపుతుంది, “అది అంతే, అది అంతే, మనము దేవుని యొక్క పిల్లలమై యున్నాము. మనమందరము ఒక గొప్ప పెద్ద సంఘమై యున్నాము. క్రీస్తు యేసులో ఒక గొప్ప పెద్ద వ్యక్తిగా యున్నాము. ఆయన వధువు, మహిమ గలది.” ప్రభువు యొక్క రాకడ సమీపమైయున్నది. ఆయన ప్రజలు ఏకమగుచున్నారు. మరియు ఒకరిని ఒకరు ప్రేమతో, ఆయన సన్నిధి యొక్క శక్తితో ప్రేమించుచున్నారు. ఓ, ఇది పరలోకము వలె యున్నది. ఓ, ఇది బాగుంది. ఆమేన్. ఓ, ప్రభువును ఆత్మతోను, సత్యము తోను ఆరాధించుట, ఎంత అద్భుతము, ఎలాటి సమయము. అది ముగింపు…ప్రారంభిద్దాం.
156 నేను సోదరులతో చెప్పాను, “సోదరులారా, అక్కడ ఆగుట అనునది లేదు.” ఇక్కడ ఆ స్థలము లేదు…మనము ఎన్నడూ ప్రారంభించలేదు, కాబట్టి మనము ఆపము. ఎంత అద్భుతము. ప్రభువు యొక్క సన్నిధిని బట్టి ఎంత మంది, మంచి అనుభూతిని కలిగియున్నారు. ఓ, అయ్యో, అది అద్భుతము, ప్రభువు యొక్క సన్నిధి.
157 ఇప్పుడు, రోగులను బాగుచేయుటకు, వారిని సంపూర్ణులుగా చేయుటకు, ప్రభువు యొక్క సన్నిధి ఇక్కడ యున్నది. కేవలము ఆయనను నమ్మండి నీవు ఆయనను నమ్ముతావా? మనము ఆయనను నమ్మ గలిగినట్లైతే, సమస్తమును సాధ్యమే. నీవు దానిని నమ్ముతావా? అది ప్రభువు యొక్క సన్నిధి యై యున్నదని నీవు నమ్ముతావా?
158 ఇప్పుడు, ఒక్క క్షణము నాకివ్వండి, ఇప్పుడు ఒక్క క్షణము, ఒక్క క్షణము వినండి. ఇక్కడ అది పరిశుద్ధాత్ముడు యున్నాడని, నన్ను మీకు ఋజువు చెయ్యనివ్వండి, మాట్లాడిన వాడే, ఆ కార్యమును చేసిన వాడే, దానిని ఎరుగును ఎంతమంది, ఇక్కడ రోగులుగా లోనికి వచ్చారు. మీ చేతులను చూడనియ్యండి. వ్యాధితో యున్నవారు…ఆ ప్రజలు…
159 అక్కడ ఒక మనిషి నిలబడి యున్నాడు. నీవు నమ్ముతావా, సేవకుడా? బయట అక్కడ ప్రార్థనా కార్డుల లేవు, అయినను దేవుడు నిన్ను బాగుచేస్తాడని నమ్ముతావా? నీ ఇబ్బంది ఏమిటో, ఆయన నాకు చెప్పగలడని నీవు నమ్ముతావా? అది నీ ప్రక్కలో యున్నది. నీవు ఒక ఆపరేషన్ కొరకు సిద్ధమై యున్నావు. నీ పేరు శ్రీ. కార్ట్ రిట్. అది నిజమేనా? నీ చేతిని ఊపుము. మంచిది ఇంటికి వెళ్ళుము, బాగుపడుము, అది నీకు అవసరము లేదు. నీవు దానిని నమ్ముతావా?
160 ఆ చిన్న బిడ్డను తన చేతుల్లో పట్టు కొని యున్న ఆ మనిషి, నేను ఒక దేవుని సేవకుడనని నీవు నమ్ముచున్నావా? ఇది పరిశుద్ధాత్ముడై యున్నాడని నీవు నమ్ముచున్నావా? నీవు ఎవరవో నాకు తెలియదు, అది నిజమేనా? నేను ఎన్నడూ నిన్ను నా జీవితము లో చూడలేదు; మనము క్రొత్త వారము. ఆ చిన్న బిడ్డతో యున్న ఇబ్బంది ఏమిటో, పరిశుద్ధాత్ముడు నాకు చెప్పగలడని నీవు నమ్ముచున్నావా? ఆ బిడ్డ దద్దురు కలిగియున్నది. అది నిజము. అది నిజమేనా? నిశ్చయముగా. నీవు ఇక్కడ దానవు కాదు. కాదు. నీవు కడుపు జబ్బును కలిగియున్నావు, నీకై నీవు దానితో బాధపడుచున్నావు…అది నిజము. అది కాదా? నీవు కాన్సస్ పట్టణము నుండి వచ్చావు. మంచిది. తిరిగి వెళ్ళుము, యేసు నిన్ను బాగుచేస్తాడు. హల్లెలూయ! నీవు నమ్ముచున్నావా, నీ హృదయ మంతటితో నీవు నమ్ముచున్నావా?
161 ఇక్కడ ప్రభువు యొక్క దూత, ఈ చిన్న స్త్రీ మీద ఆవరించి యున్నాడు. ఇక్కడ కూర్చొని యున్న దయగల పెద్ద మనిషి. హెర్నియాతో బాధపడు చున్నాడు, సహోదరీ, ఆ హెర్నియా నుండి దేవుడు నిన్ను బాగు చేస్తాడని నమ్ముతావా? ఆ చిన్న ఎర్రని పుష్పమును నీ టోపి మీద కలిగియున్నావు నీవు, నీ చేతిని ఎత్తుము. మంచిది. ఇంటికి వెళ్ళుము, స్వస్థత నొందుము. ఆమేన్. ఓ, అది దేవుడై యున్నాడు, అది దేవుని కుమారుడైన క్రీస్తుయై యున్నాడు. ఆయన మృతులలో నుండి లేచియున్నాడు. ఆయన ఇక్కడ యున్నాడు.
162 ఇప్పుడు, నేను ఇక్కడకు ఎవరినైనా పిలవబోవుచుండగా, ఒకరి కొరకు ఒకరు మంచి సమయోచితమైన ప్రార్థనను అర్పించండి. సోదరుడా, ఇక్కడకు రండి. దేవుడు స్వస్థపర్చువాడని చూపుచు, మనము ఒకరి మీద ఒకరము చేతులను ఉంచుదాము. ఇక్కడ యున్న సోదరుడు కూడా ప్రార్థన చేయాలని నేను కోరుచున్నాను (ముందుకు వెళ్ళండి. మంచిది) ప్రభువైన దేవునికి స్తుతులు.