పక్షిరాజు తన గూడును రేపునట్లు

పక్షిరాజు తన గూడును రేపునట్లు

VGR COUNT-365 
మనము ప్రార్ధన కొరకు ఒక్క క్షణము లేచి నిలబడెదము. చివరి కూటములు ఎల్లప్పుడును నాకు చాలా సన్నిహితముగా నుండును. మనము ఒకరినొకరము ఏదో విధముగా కనుగొని మరి వారితో మెలగుటకు ప్రారంభించి మరియు వారితో సహవాసము చేయుటకు ప్రారంభించు సమయమునందే, అప్పుడే వేరే ఎచ్చటికో వెళ్ళిపోవలసిన సమయము వచ్చును. ఆ విధముగా ఒకొరినొకరము విడిపోయి వెళ్ళిపోవు సమయము ఆసన్నమైనప్పుడు నాకు ఎల్లప్పుడూ అది వేదనను కలిగించును. అయితే మనము భూమిలో మరల కలుసుకొనుటకు ముందే ఒకవేళ యేసు వచ్చినయెడల మనము మరల ఎన్నటికిని ఎడబాయని ఒక స్థలమందు సంధించుకొను విడిపోని ఒక స్థలములో కూడుకొను ఆ దినమునకై నేను ఎదురు చూచుచున్నాను. ఈ మధ్యాహ్నము ఎందరో తమ చేతులను పైకెత్తి, దేవుడు మనలను జ్ఞాపకముంచుకొనవలెనని కోరుచూ అడుగుచున్న వారిని నేను చూచి ఆశ్చర్యపడ్డాను. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక! ఒక్క నిమిషము మనము మన తలలను వ౦చెదము.

2

సర్వశక్తిగల దేవా, పరలోకమునకును మరియు భూమికిని సృష్టికర్తా, నిత్యజీవమునకు గ్రంథకర్తా, ప్రతి మంచి యీవులను అనుగ్రహించువాడా, మీ కుమారుడగు యేసు నామము ద్వారా ప్రార్ధన వలన ఈ గొప్ప టుల్సా కూటములకు మా యొక్క కృతజ్ఞతలు అర్పించుటకు మీ యొక్క కృపయను నీడలలో మేము వచ్చుచున్నాము, అది మా హృదయములలో మరువలేనంత ఒక స్థానమును కలిగియున్నది, ఈ చక్కటి జనులను మరి నేను వారి హృదయములో - మీ యొక్క పరిశుద్ధాత్మ వారిలో యుండుట అది మాకు ఎంతో అమూల్యముగా నున్నది. అది ఒక చక్కటి సహవాసముగా యున్నది; మా జీవితములలో పరలోకమును సృజించినంతటి మరువలేని అనుభవమును మేము పొందుకున్నాము.

తండ్రీ, మీ యొక్క ఆత్మ ఎల్లప్పుడును ఈ జనులలో ఉండనిమ్మని మేము ప్రార్ధించుచున్నాము. ఈ చిన్న కూడిక ద్వారా వచ్చు సారమువలన దేశములోని ప్రతి సంఘములోను ఒక ఉజ్జీవము కలుగునట్లుగా చేయుము, అనేక గొప్ప సూచనలును మరియు అద్భుతములును నెరవేరనిమ్ము. ప్రభువా, మీరు ఈ గొప్ప కార్యములను చేయవలయునని మేము ప్రార్ధించుచున్నాము.

3

ఈ మధ్యాహ్నము ఈ బల్లపై వ్యాధిగ్రస్తుల యొద్దకు మరియు బాధపడుచున్న వారి యొద్దకు వెళ్ళుటకు చేతిరుమాళ్ళ మరియు చిన్న వస్త్రములు యున్నవి. సర్వోన్నతమైన దేవా, వ్యాధితో బాధపడుచున్న వారెవరైనను వీటిని తాకినప్పుడు, వారు స్వస్థత నొందవలయునని యేసు నామములో నేను ప్రార్ధించుచున్నాను. ఇది నా యొక్క ప్రార్ధన మాత్రము కాదు, తండ్రి అయితే ఈ మధ్యాహ్నము ఈ గొప్ప హాలులోయున్న క్రైస్తవులందరి ప్రార్ధన ఇది. అవసరతలలోనున్న వారికి మేము ఏక మనస్సుతో ఈ ప్రార్ధన చేయుచున్నాము.

ప్రభువా, ఈ దినమున మేము కొనసాగించబోవు రాబోవు ఆత్మీయ అభ్యాసములను మీరు ఆశీర్వదింపవలయునని మేము ప్రార్ధించుచున్నాము. ఈ రాత్రి మేము సంఘముల కొరకు ప్రార్ధించుచున్నాము. మరియు ప్రతి సంఘములోను మహిమను మరియు చెప్పలేని ఆనందమునును కలుగును గాక. ఈ మధ్యాహ్నము మీ యొక్క ప్రసన్నతను గొప్పగా మాపై కుమ్మరింపుము. ఈ మధ్యాహ్నము పరిశుద్ధాత్మ వాక్యములోనికి ప్రవేశించి మరియు వాక్యము మా శరీరములోనికి ప్రవేశించి మరి మాతో ఇక్కడ నివసింపనిమ్ము. మేము యేసు నామమున దీనిని అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చును.

4

ప్రతి యొక్క వాక్య పరిచారకునికిని, ప్రతి సేవకునికిని, కావలికాయు వారికిని మరియు ద్వార పాలకులకును మరందరికి, నాకు మరి నాతో కూడా వచ్చిన వారికి; సహోదరుడు డేవిడ్, సహోదరుడు రాయ్, బిల్లీ పాలు, లాయస్, సహోదరుడు ఫ్రెడ్ సాత్మేన్, సహోదరుడు జిమ్ మేగ్వైర్, సహోదరుడు జెనీ, మరియు లియో, మరి మీకందరికిని మీ యొక్క దయ కొరకును, ఈ కూటములో మీరు మాకు చేసిన సహాయమంతటికిని మేము మీకు వందనములు చెప్పగోరుచున్నాము. మీరు నిజముగానే మాకు చాలా మంచి కార్యములను చేసిరి. మా యొక్క హృదయములలో మరటువంటి గౌరవమును మరియు ప్రేమను మీ కొరకు మేము కలిగియున్నాము. అది తుడిపివేయను వీలు కాదు. అది మాసిపోనిది. మరియు మీరు అడుగుదానికన్నను లేక తలంచుదానికన్నను అత్యధికముగా దేవుడు మీకు అనుగ్రహించునని మేము నమ్ముచున్నాము. యేసుక్రీస్తుయను ఆయన యొక్క కుమారుని కృపయను ఐశ్వర్యములలో దేవుడు దానిని మీకు అనుగ్రహించును గాక.

5

సహోదరుడు టోమీ అస్ట్బర్న్ (అతనిక్కడ కూటములో నున్నాడు) ప్రభువైన దేవుడు సహోదరుడు టోమీ తో నుండును గాక; ఓరల్ రాబర్ట్స్ ఈ మధ్యాహ్నము ఇక్కడికి వచ్చుటకు ప్రారంభించెను మరియు అతని కాలులో నరములు తిరిగిపోవుట వలన కాలు నొప్పితో బాధపడుచుండుట వలన అతని కొరకు ప్రార్ధించుటకై నేను ఆరాధన ముగిసిన వెంటనే వెళ్ళుచున్నాను. మరిప్పుడు సహోదరుడు రాబర్ట్స్ సహచరులకును మరియు సహోదరుడు టోమీ సహచరులకును మరియు సంఘములన్నింటికిని దేవుడు మీతో కూడా యుండవలయుననుటయే నా ప్రార్ధన. మీరు ఎల్లప్పుడును నా యొక్క హృదయములో నుండెదరు గాక; మరియు టుల్సా చిరకాలము నిలిచియుండును గాక. దేవుని యొక్క కార్యము దానిలో చిరకాలము నిలిచియుండవలయు ననుటయే మా యొక్క ప్రార్ధన.

మరియు కొంత కాలమైన పిదప మేము మరల మీ యొద్దకు మీతో నుండుటకు వచ్చెదమని నమ్ముచున్నాము. మరియు మేము మీకు ఏ విధముగా నైనను ఉపయోగముగా నుండవల యుననిన... నేను ఈ విధమైన కార్యమును చెప్పుచుందును: రాత్రియందు అధికముగా చీకటి లేక యుండవచ్చును లేక వర్షము అధికముగా కురువకుండ నుండవచ్చును, అయితే మా యొద్దనున్న శక్తి కొలది మీ యొక్క జీవితమును చక్కగాను మరియు ఆశీర్వాదముగాను నుండునట్టు చేయుటకు మేము ఏదైనను చేసెదము. మేము మీకు ఏ విధముగా సహాయముగా నుండవలెనని మీరు కోరుచున్నారో మాకు తెలుప౦డి, జెఫర్సన్ విల్ ఇండియానాలో బట్లర్ 2-1519లో నున్న మమ్ములను సంప్రదించండి, లేక నన్ను జఫర్సన్-విల్ లోనున్న టెలిఫోను ద్వారా సంప్రదించండి. మేము మీకు ప్రార్థనా గుడ్డలను పంపించెదము, మీ కొరకు ప్రార్ధించెదము - మేము చేయగలిగిన దేనినైనను చేసెదము. మేము ప్రభువునందు మీకు సేవకులమై యున్నాము.

6

అయినను, ఈ విధముగా మనము అద్భుతమైన సమయమును కలిగియున్నపుడు కొన్ని సమయములలో ఈ విధముగా కూటములు అయిపోయిన తరువాత ఒకరినొకరము వదిలి వెళ్ళుటకు, చాలా వేదనగా యుండును, అయినప్పటికిని మనము ఆ విధముగానే విడిపోవలసివచ్చును. అయితే నదికి ఆవలి ప్రక్కన ఒక రోజు జీవితము ముగిసిన పిదప నేను ఆకాశమంత పరచి యుంచబడిన ఆ గొప్ప బల్లనొద్ద కూర్చొనియుండగా, పెండ్లి విందులో మరియు మనము ఒకరికొకరము ఎదురుగా ఆ బల్లయొద్ద కూర్చొని చూచుకొనుచు, ఈ ఓక్లేండులో జరిగిన కూటములను గురించి జ్ఞాపకముంచుకొనెదము.

నిస్సందేహముగా ఆనందముతో మన చెక్కిళ్ళపై మీదుగా కన్నీరు కారును మరి రాజు తనయొక్క సమస్త వైభవముతో ఆయన యొక్క తెల్లని దుస్తులతో బయటికి వచ్చి మన కన్నుల నుండి కారు కన్నీటినంతటిని తుడిచివేసి మరి చెప్పును, “ఇకనుండి ఏడ్వవద్దు. సమస్తమును ఇప్పుడు సమాప్తమైనది. జగత్తు పునాది వేయబడినప్పటి నుండి మీ కొరకు సిద్దము చేయబడిన ప్రభువు యొక్క ఆనందములోనికి ప్రవేశించుడి.” ఆ ఘడియ కొరకు నేను జీవించుచున్నాను.

7

నాకు వాక్య పరిచర్యలో సహకరించే సేవకులను నేను చూచినప్పుడు వారిలో అనేకులు నాకంటె వయస్సులో పెద్దవారు, వారు వీధులలో ఒక గిటారుతో, మరియు ఒక తంబూరతోను సేవ చేయుచు దేవుడు నాకియ్యబడిన పరిచర్యను సరాళము చేయుటకుగాను చక్కని రాళ్లను పరచి, నేను చక్కగా సేవలో పయణించుటకై నాకు మార్గమును ఏర్పాటు చేసిరి.

నా అమూల్యమైన సహోదరులారా, మీరు క్రింద కూర్చొనియుండగా నేనిలా పైన నిలబడటము నాకు చాలా చిన్నతనముగా నున్నది, నేను దీనికి అర్హుడును కాను. ఏ సత్కారము పొందాలన్నా అది మీకే చెందును. దేవుడు మిమ్ములను అమితముగా ఆశీర్వదించును గాక. ఆ దినమున బహుమతులు ఇచ్చుచున్నప్పుడు, నేను అచ్చట నిలబడుకొని మీరు ఆయన మహిమతో కిరీటము ధరించుకొనునప్పుడు నేను మిమ్ములను చూచెదనని నమ్ముచున్నాను.

కొద్ది క్షణముల క్రితము అక్కడ ఒక వాక్య సేవకునితో నేను మాటలాడితిని. అతని పేరు సహోదరుడు నాతాను, అతను చెప్పెను. అతను యూదుల మధ్య పనిచేయువాడు. మరియు అతను చెప్పెను, “సహోదరుడా బ్రెన్హాం, మీరు ఇక్కడయున్న మొదటి రాత్రి [అతను మరి అతని భార్యయు వ్యాధితో నుండిరి]” మరియు అతను చెప్పెను, “మీరు కూటములలో మమ్ములను పిలిచి, మరియు నేనెవరు మరియు నా భార్య ఎవరని చెప్పుట మాత్రమే కాదు గాని, నా భార్య యొక్క వ్యాధిని గురించి కూడా తెలిపిరి. అప్పటి నుండి ఆమె బాగుగా యున్నది.” మరియు అనేక ఉత్తరములు మరియు సాక్ష్యములు.

8

ఇప్పుడు మీరు ఒకవేళ మీ చేతిరుమాలును తీసికొని రాకుండ యుండవచ్చును. మేము మీకు గనుక ఏ విధముగానైనను సహాయము చేయాలనుకుంటే ఆ చిన్న గుడ్డను మేమే మీకు పంపించెదము... ఇప్పుడు, అక్కడ ఒక చిన్న ఫామ్ యుండును; ప్రపంచమంతటను పోవు ఒక ప్రార్ధనా పట్టి మా యొద్ద కలదు. జనులు రాత్రులయందు మేల్కొని వుంటూ అన్ని గంటలూ ఈ ప్రార్ధనా పట్టినిబట్టి ప్రార్డించుచునే యుండెదరు. ఎవరైనను తూర్పు కాలప్రమాణము ప్రకారము, ఉదయము తొమ్మిది గంటలకు, పన్నెండు గంటలకు మరియు మూడు గంటలకు మేము ప్రార్ధి౦చెదము. ఆ సమయములో పాత నిబంధనలోని యూదులు బలి అర్పించు వేళలుగా అది యున్నది. ఆ గొప్ప ప్రార్థనా గొలుసు వలన ప్రపంచమంతటాయున్న జనులందరూ వివిధ సమయముల యందు మేల్కొని ఒకరి కొరకు ఒకరు మేమందరమూ కలసి ప్రార్ధించుచూ యుండెదము. కావున దేవుడు ప్రార్ధన వినునని నేను నిశ్చయముగా నున్నాను. ఆయన చేసిన అద్భుతమైన కార్యములు కొన్ని ఆ ప్రార్ధన ద్వారానే జరిగినవి. మరియు మీ యొక్క పేరును మా ప్రార్థనా పట్టీలో చేర్చి మాతోపాటు ఆ సమయములలో మీరు కూడా ప్రార్ధి౦పవలయునని మేము కోరుచున్నాము.

9

మరిప్పుడు, ప్రభువు చిత్తమైనయెడల, నేను అతి త్వరలో మరల విదేశములకు వెళ్ళుబోవుచున్నాను. మేమిక్కడ అందుకొరకై కొంత డబ్బును కూడా సేకరించితిమి. మరి ఆ విధముగా ప్రభువు దానిని నేను చెప్పుటకు అనుగ్రహించెను, కావున నేను జ్ఞాపకముంచుకొనెదను. వారు నా కొరకు రెండు ప్రేమ కానుకలను తీసిరి. దానిని నేనెంతగా అభినందించుచున్నానో మీకు తెలియునా? ఇప్పుడు దానిలో ఒక సెంటు కూడా నా వ్యక్తిగత ఖర్చుకు నేను ఉపయోగించను. అది విదేశ వాక్య పరిచర్య కొరకును, సంఘము కొరకును ఉపయోగించబడును. వ్యక్తిగతముగా రాలేని జనులకును మరియు సువార్తను వినలేని జనులకు మరి వారు వాక్యమును వినుటకై ఆ ధనము వినియోగింపబడుచున్నది. మేము మాకు వీలైనంతవరకు దానిని క్రమముగా చేయుచున్నాము. దేవుడు మిమ్ములను అత్యధికముగా ఆశీర్వదింపవలెననుటయే మా యొక్క మనఃపూర్వకమైన ప్రార్ధన.

10

మరిప్పుడు మీరు ఈ ప్రార్థనా గుడ్డలను ఒకదానిని కోరిన యెడల, నాకు వ్రాయండి. మరియు తపాలా పెట్టె సంఖ్య 325 లేక జెఫర్సన్-విల్, ఇండియానా అనే చిరునామాకు వ్రాసినా అది నాకు వచ్చి చేరును. మరియు మీరు గనుక ఆ గుడ్డను మీ బైబిలులో ఉంచుకొనవలయుననిన, దానిని అపొస్తలులు కార్యములు 19లో పెట్టవలెను. మరియు అనేక జనులు నాతో చెప్పిరి . ఒక స్త్రీ చెప్పెను.... ఆమె కుమారుడు, ఒక కారు అతనిపై గ్రుద్దుట వలన కారు యొక్క అద్దములు పగులుట వలన అతడికి గాయములు తగిలి ఎంతో రక్తము పోవుట వలన మరణాపాయములో యుండెను, మరప్పుడు ఆమె వెంటనే పరుగెత్తుకొని వెళ్ళి మరి ఈ ప్రార్థనా గుడ్డను తీసి ఆ బాలునిపై నుంచెను (ఆమె ఈ ప్రాంతములో నివసించుచున్నది), మరి వెంటనే రక్తము కారుట ఆగిపోయినది. మరియు ఆ విధముగా అనేక కార్యములు సంభవించినవి. జర్మనీలోనున్న ఒక స్త్రీ పక్షవాతముతో నుండెను. (అది మీకేమి చేయవలయునో చెప్పును. ఈ ప్రార్థనా గుడ్డలను మీపై నుంచబడినప్పుడు, మీ హృదయముపై నుంచబడినప్పుడు మీ యొక్క క్రైస్తవ పొరుగువారిని పిలిచి ప్రోగుచేయుడి.) మరియు ఆమె స్వస్థతనొందిన పిదప చెప్పెను. (ఆమె చాలా సంవత్సరములుగా పక్షవాతముతో నుండెను) మరియు ఆమె ఆ విధముగా ప్రార్థనా గుడ్డను ఉంచుకొనిన పిదప ఆమె చెప్పెను, “సాతానా, ఇప్పుడు నీకు దేనికిని ఇక్కడ స్థలము లేదు. నాయొద్ద నుండి తొలగిపొమ్ము.” మరి కుర్చీనుండి పైకి లేచి మరి మామూలుగా నడచి వెళ్ళెను. అది అంతటి సాధరణ కార్యముగా నున్నది, చూశారా.

కావున మీరు దానిని కోరినయెడల, దానికి క్రయము లేదు, వెల లేదు. మీరు మీ పేరు పంపిన చాలును మరి మేము మీకు దానిని తపాలా ద్వారా పంపించెదము. దానిని ఏ విధముగా ఉపయోగింపవలయునని వ్రాయబడియున్న ప్రతులను మీకు పంపించెదము, అయితే గుర్తుంచుకొనుడి, మీకు పంపు గుడ్డలను నేనే స్వయముగా ప్రార్ధించి పంపుచున్నాను.

11

ఒకవేళ నా యొక్క బిడ్డ, నా భార్య, లేక నా తండ్రి మరియు నా తల్లి వ్యాధిగా నున్నయెడల, మరి నాకు ఎవరి ప్రార్ధనపై నమ్మకమున్నదో మరి ఆ వ్యక్తిని కాకుండా ఆ వ్యక్తి యొక్క కార్యదర్శి ప్రార్ధించుటకు నేను కోరుకోను. ఎవరి ప్రార్ధనపై నమ్మకమున్నదో వారే దానికొరకు ప్రార్ధి౦పవలయునని కోరుకొనెదను. “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుకుందురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది బంగారు సూత్రము.

కావున మేము మీకు మాకు వీలైనంత మట్టుకు సహాయపడుటకు ఆనందించుచున్నాము. దేవుడు ఎల్లప్పుడును మిమ్ములను ఆశీర్వదించును. మరియు సంభవించినది యావత్తును ఎంతో మధురముగా మరియు ప్రేమగా సంభవించినది, మరి మేము దానిని అభినందించుచున్నాము.

12

ఇప్పుడు, నేను విదేశ పర్యటనలో నున్నప్పుడు, అది చాలా కఠినముగా నుండును, ఏలయనగా మాంత్రికులు చిల్లంగిలు మిమ్మల్ని ఎదిరించుటకు భయపడవు. సమీప కాలమున ఇక్కడ సుమారుగా పదిహేను మాంత్రికులు చొప్పున ఇరు ప్రక్కలను వారు ఒక గాలి వానను సృష్టించి మరి ఆ గాలి వాన నన్ను విసిరివేసేయంతటి వేగముతో యుండెడిది. మరియు నమ్మెదరో లేదో, గాలివాన వచ్చెను. సుమారుగా ముప్పది వేలమంది జనులు గల ఆ స్థలము ఆ గాలి వలన స్తంభించిపోయి అది భయంకరముగా యున్నది. క్రైస్తవ వ్యాపార పురుషులకు చెందిన సహోదరుడు ఆర్గన్ బ్రైట్ (అతనిని మీరెరుగుదురు), అతను నా వెనుక కూర్చొని యుండెను. అతను చెప్పెను, “సహాదరుడా బ్రెన్హాం....”

నేను చెప్పాను, “నెమ్మదిగా నుండుము. పరిశుద్ధాత్మ నన్ను ఇచ్చటికి పంపెను.” మరి ఆ కారణము వలననే ఆయన యొక్క అనుమతి లేకుండా ఎచ్చటికి నేను కదలను. ఆయన అనుమతితో వచ్చుటచే ప్రభువు నామమున నేను వచ్చితిననే దానిని నేనెరుగుదును, చూశారా. నేను చెప్పాను, “ఆయన నన్ను ఇచ్చటికి పంపియున్నాడు.”

మరియు అక్కడ వారు పెద్ద కాన్వాసు గుడ్డలను దానిపై కట్టు విధముగా చాలా పెద్ద గుడారముల వంటి వాటిని కట్టిరి. మరి ఆ స్థలము పైకి క్రిందికి ఊగుచున్నది. సరిగా సుమారు మధ్యాహ్నము రెండు గంటలకు, చాలా తేటగా వాతావరణమున్నప్పుడు మరి ఆ గాలివాన, పెద్ద గాలి ముప్పై నిమిషములలో వచ్చెను.

13

మరియు నేను నిలిపివేసి మరి నేను చెప్పాను, “మీరు దీనిని అనువదించ వద్దు. అచ్చట వారు కూర్చొని, కత్తెరతో కత్తిరించియున్న ఒక ఈకతో తమ చేతులను త్రిప్పుచున్నారు. ఆ ఇరు ప్రక్కలనుండి వచ్చు ఆ దయ్యపు శక్తిని నేను గ్రహించగలుగుచున్నాను. దానిని వారే విధముగా చేయుచున్నారో మీరెరుగుదురా?

మరియు నేను చెప్పాను, “ప్రభువైన యెహోవా, పరలోకమునకును మరియు భూమికిని సృష్టికర్తా, మీరే నన్ను ఇచ్చటికి పంపిరి. మీ కొరకు నేను కొనసాగించు వాక్య పరిచర్యకు మీరే బాధ్యులు. ఆ పెద్ద గాలి వానను ప్రభువైన యేసు నామములో నేను గద్దించుచున్నాను.”

మరి అప్పుడే అది వెనుదిరిగి పోయెను, ఉరుములు దొర్లిపోయెను, మరియు సూర్యుడు రెండు నిమిషముల లోపున ప్రకాశింపతొడగెను. మరియు వేలకొలదిమంది జనులు వేదిక యొద్దకు పరుగెత్తికొని వచ్చిరి మరియు వారిలో కమ్యూనిస్టులు మరియు ఇతరులు అనేక విధములగువారు గలరు. మరియు ఎట్లు.... నేనిక్కడ నిలుచుకొని మీకు సాక్ష్యములు చెప్పజాలను, ఏలయనగా ఇవి నాయొక్క స్వంత కూటములు. ఇతరులు సాక్ష్యమిచ్చిన అది బాగుండును. అయితే లైబ్రరీలు.... అక్కడ సర్వ సంగ్రహ నిఘంటువు ఉండును. నా యొక్క చిన్న పరిచర్యలో ప్రభువైన యేసు చేసిన దానిని గురించి నేను చూచిన దానిని గురించి, అనేక పుస్తకములు వ్రాయవచ్చును. ఆలాగైనయెడల సహోదరుడు టామీ ఆన్బర్న్, సహోదరుడు ఓరల్ రాబర్ట్స లా౦టి వ్యక్తుల గురించి వ్రాయవలసియుండిన ఏలాగుండును? అది చాలా గొప్పది. మన ప్రభువు నిశ్చయముగా చాలా గొప్పవాడు.

14

ఇప్పుడు, నేను కొన్ని లేఖన వాక్యములను ఈ మధ్యాహ్న సమయమున చదువవలయునని కోరుచున్నాను. మరియు నేను గనుక వాటిని తీయగలిగినయెడల, నా యొద్ద నేను గుర్తుంచుకొనిన కొన్ని కార్యములు కలవు. మరలు పిదప మనము కొన్ని ప్రార్ధనా కార్డులను ఇచ్చానని నా కుమారుడు చెప్పెను. మరి మనము వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్ధింపబోవుచున్నాము. ఒకవేళ నా కన్నులు మీపై మరల పడనియెడల, ఈ జీవితములో నేను మరల మిమ్ములను చూడనియెడల, మీరు క్రీస్తు నొద్ద నిలుచుటకు ముందు ఆ ద్వారము నొద్ద నేను మిమ్ములను సంధించినప్పుడు, అప్పుడు దేవుని యొద్ద నుండి నాకు వచ్చిన దర్శనములు సత్యము మరి నిజమని తెలిసికొనెదరు. ఆ అగ్నిస్తంభములోను వెలుగులోను నున్న ప్రభువు యొక్క దూత నాకు సహాయపడును, సర్వోన్నత్తమైన దేవుడు, నా యొక్క న్యాయవాది, అదక్కడ యున్నది. అది సత్యము. అందువలన అది సత్యమని మీరు తెలిసికొనెదరు. దేవుడు సత్యవంతుడు. ఆయన తప్పుగా యుండినయెడల ఆయన దేవుడుగా నుండజాలడు. ఆయన.... ఆయన అబద్దికుడుగా యుండలేడు, ఏలయనగా ఆయన సత్యవంతుడుగా నుండవలయును. ఏదైనను అసత్యమైనది యున్నయెడల, అది సాతానుగా యుండవలయును.

అయితే ఆ వెలుగుని, నేను దానిని చూచాను, నేను దానివైపు చూచాను, మరి నాకది... నేను గనుక దైవ ద్రోహిగా నటించుచున్నయెడల, దయచేసి నన్ను మన్నించండి, అయితే అది నాకు ఇశ్రాయేలీయులను వెన్నంటిన అదే అగ్నిస్తంభము; ఏలయనగా, అది యేసు అను ఒక మానవునిలో నివసించెను. ఆయనే ఆ దేవుని కుమారుడు, మరియు ఆయన జీవించిన అదే జీవితము మరల ఈ దినము అదే కార్యము ద్వారా ఉత్పత్తి చేయబడెను.

15

ఆయన చెప్పెను, “నేను దేవుని యొద్ద నుండి వచ్చాను; నేను దేవుని యొద్దకు పోయెదను.” మనందరికి అది తెలియును. “నేను దేవుని యొద్ద నుండి వచ్చియున్నాను మరి దేవుని యొద్దకు పోయెదను.” ఆయన చెప్పెను, నేను ఉన్నవాడను అనువాడనైయున్నాను.“ అదియే అగ్నిస్తంభము; ఆ పొదలోనున్నది ఆ దూతయే. అది శరీరధారియై మరి మనమధ్య నివసించెను, తిరిగి వెళ్ళెను, మరియు ఈ దినమున అదే రూపమున నున్నది. అది మీకు తెలియునా?

మీరు చెప్పవచ్చును, “యేసు....” సరి, నేను యేసులోనున్న దేవుని గురించి మాటలాడుచున్నాను. పౌలు దమస్కునకు పోవు దారిలో ఒక వెలుగు అతనిని తాకెను, అది ఒక అగ్నిస్తంభము. తక్కినవారెవ్వరూ దానిని చూడలేదు, అయితే పౌలు దానిని చూచెను. అది అతనిని గ్రుడ్డివానిగా చేయనంతటి ప్రకాశముగా నుండెను. మరియు “ప్రభువా నీవెవరవు?” అని అతను అడిగెను,

“నేను యేసును,” అని ఆయన చెప్పెను. ఆయన ఎచ్చటి నుండి వచ్చెనో మరి ఆ దేవుని యొద్దకు తిరిగిపోయెను. నామట్టుకు నాకు, ఈ దినమున ఆయన మరల ఆయన యొక్క క్రియను సంఘములో చివరి దినములలో ముగించుచున్నాడు.

16

మనము మన పాఠ్యాంశమునకు వెనుక అంశముగా ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము, 11వ వచనమునకు త్రిప్పెదము. మరియు సాధ్యమైనయెడల ఒక గంట లోపున ప్రార్ధనా వరుసను కలిగియుండెదము. [శ్రోతలలో ఒక స్త్రీ ప్రవచించుచున్నది. “అవును, ప్రభువు మీకు ఒక సూచను ఇచ్చెను, మరియు ఆయనచే మీకు పంపబడిన విమోచనపై మీరు స్థిరముగా ఉండవలెను, మరియు ఎల్లప్పుడు నీ చుట్టూ ఆయన యొక్క కమ్ముకొను సన్నిధి కలిగియున్నది. అభిషేకము నీపై యున్నది, మరియు నీవు ఎన్నడూ దానిని విరువరాడు మరియు వేరుచేయవద్దు; మరియు ప్రభుని యొక్క మహిమ నీతో ప్రతి స్థలములో ఉండును, ఎక్కడైతే నేను... [స్పష్టత లేని మాటలు], మరియు ప్రభువు ఈ ప్రజలకు ఒక సూచనగా ఉండుటకు నిన్ను ఎన్నుకొనెను.”]

ఓ, తండ్రియైన దేవా, ఎంత దీనముగా దానిని నేను నా హృదయములో అంగీకరించితిని. నా యొక్క కాళ్ళను నడిపించుము ప్రభువా. నా చేతిని పట్టుకొనుము, నేను ఎవరికిని వారు తప్పిపోవుటకు కారణముగా నుండ నియ్యకుము, అయితే నేను ప్రతియొక బాటసారికి పైకెక్కు ఒక నిచ్చెనగా నుండనిమ్ము, ప్రభువా. మీ యొక్క నామమునకు లేక మీ యొక్క కార్యమునకు మచ్చ కలుగునట్లుగా నేను నా జీవితములో ఏదియును చేయకుండును గాక. మీకు సేవ చేయుటకు నాకు సాధ్యమైనదంతా నేను చేసెదను. దీనికొరకు నేను నా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనములు చెల్లించుచున్నాను. ఆమేన్.

17

అది ఎట్లు నన్ను సాత్వికముగా చేయుచున్నది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము, 11వ వచనము.[ఇంకా ఎక్కువ ప్రవచనములు ఇవ్వబడుచుండెను.] ఆమేన్. ప్రభువు యొక్క నామము ఆశీర్వదింపబడును. [మరియొక ప్రవచనము ఇవ్వబడెను.] మన మధ్యలో క్రియ చేయుచున్న ఆయన యొక్క ఆత్మ కొరకు మనమేవిధముగా ప్రభువుకు వందనములు చెల్లింపగలము.

పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని, వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు:

అది ఒక పెద్ద లేఖనము చదువుట కాదు, అయితే అది దేవుని యొక్క వాక్యము. జనులు మేలుకొని మురి ప్రభువును తలంచుకొనునట్లుగా ఈ చదువబడిన లేఖనముల నుండి ఒక అంశమును రానున్న ఇరవై లేక ముప్పై నిమిషములకు దేవుడు మనకిచ్చిన చాలును.

18

మీకు తెలియునా, కొద్ది కాలము.... కొద్ది సంవత్సరముల క్రితము నేను అబ్రాహాము లింకన్ యొక్క జీవితములోని ఒక కథను చదివాను. అక్కడ ఒకతను ఒక చెరశాలలో నుండెను, మరియు అతను ప్రభుత్వమునకు విరోధముగా చేసిన క్రియకు నిమిత్తము శిక్షను పొందుచుండెను. మరియు అతను కాల్చి చంపబడబోవుచున్నాడు, మరి అతని మంచి స్నేహితుడొకడు దేశాధ్యక్షుడైన అబ్రాహాము లింకన్ యొద్దకు వెళ్ళెను. అబ్రాహాము లింకన్ ఒక అద్భుతమైన క్రైస్తవుడు. మరియు ఆ స్నేహితుడు ఆయనతో చెప్పెను, “శ్రీ. లింకన్ గారు, మీరు చాలా మంచివారని నేనెరుగుదును, మీరు క్రైస్తవులని నేనెరుగుదును, మరియు మీ ప్రభుత్వ నేరారోపణ క్రింద, ఈ వ్యక్తి సైనిక క్రమపద్దతిని మీరెను. అతను నా యొక్క స్నేహితుడు. అతను దానిని చేయాలనే ఉద్దేశ్యముతో చేయలేదు. తాను చేసిన దోషమును తానంగీకరించుచున్నాడు. అతను చేయాలనే ఉద్దేశ్యముతో దానిని చేయలేదు. మీరొక్కరు మాత్రము అతని జీవితమును కాపాడగలరు. మీరు దయచేసి అతని ప్రాణమును కాపాడరా?” మరి లింకన్ దయగలిగిన వాడు గనుక అతను ఒక కలమును తీసికొని ఒక చిన్న కాగితపు ముక్కపై వ్రాసెను. (అతను కాగితపు ముక్కపై వ్రాసెను, ఏలయనగా ఆ సమయమున అతను తన కార్యాలయములో లేడు కావున అతనియొద్ద ఆయన పదవీ ముద్ర లేదు). కావున ఆయన ఇట్లు వ్రాసెను: “నేను ఈ వ్యక్తిని మన్నించితిని,” అని వ్రాసి తన సంతకము చేసెను: అబ్రాహాము లింకన్.

19

చెరశాలలోనున్న వ్యక్తి యొక్క అమూల్యమైన స్నేహితుడు ఎంత వేగముగా పోవలయునో అంత వేగముగా చెరశాలకు వెళ్ళి, మరి అతనితో చెప్పెను, “ఓ, నా స్నేహితుడా, నీవు విడుదల పొందబోవుచున్నావు! నీవు స్వతంత్రుడవు! ఇదిగో ఇక్కడ ఈ కాగితపు ముక్కపై అధ్యక్షుని పేరు కలదు. నీవు క్షమించబడితివి!”

మరి అతను చెప్పెను, “నన్ను హేళన చేయవద్దు, ఏలయనగా నాకు మరణశిక్ష విధింపబడినందున నేను చనిపోవుటకు సిద్ధముగా నున్నాను; మరి నీవేమో ఇప్పుడు చిన్న కాగితపు ముక్కను తీసికొని వచ్చి నాతో పరిహసించుచున్నావు. ఆ కాగితపు ముక్క గనుక అబ్రాహాము లింకన్ దే అయినట్లైన, అది ఆయన కార్యాలయపు ముద్రతో మరియు పలు విధములైన కార్యములతో నిండి యుండెడిది.”

“అయ్యా, ఇది అధ్యక్షుని యొక్క పేరు! నీవు మన్నింపబడి యున్నావు.” మరి ఆ ఖైదీ తన వీపును అతని స్నేహితుని వైపుకు త్రిప్పి ఆ మాటను వినలేదు.

తదుపరి ఉదయము సూర్యోదయమప్పుడు ఆ వ్యక్తి తుపాకి కాల్చు వారిచే కాల్చి చంపబడెను.

ఇప్పుడిక్కడ అధ్యకుని యొద్ద నుండి ఒక మన్నింపు, “ఆ వ్యక్తిని చంపవద్దు,” అని ఆ దినమున చేవ్రాలు వేయబడెను; మరుసటి దినమున ఆ వ్యక్తి కాల్చి చంపబడెను. అటు పిదప ఆ కేసు ప్రభుత్వ ఫెడరల్ కోర్టులో పరిశీలింపబడెను; మరి అమెరికా సంయుక్త రాష్ట్రముల ఫెడరల్ కోర్టు ఈ కేసును పరిశోధించిన పిదప మరి కోర్టు ఈ విధముగా, “ఒక క్షమాపణను క్షమించబడిన వ్యక్తి ఆ క్షమాపణను క్షమాపణగా అంగీకరించనంత వరకు అది క్షమాపణగా పరిగణించబడదు,” అని తన తీర్చు నిచ్చెను.

20

మరియు దేవుని వాక్యము కూడా ఆ విధముగానే యున్నది. మీరు అంగీకరించగలిగినయెడల వ్యాధినుండి మీరు స్వస్థతనొందగలరు. మీరు మన్ని౦పుగా అంగీరించగలిగినయెడల అది మీకు ఒక మన్నింపు. దేవుడు వ్రాసిన విధముగా మీరు వాటిని అంగీకరించగలిగినయెడల ఇక్కడున్న ప్రతీ ఆశీర్వాదమును మీకు సొంతమగును.

“పక్షిరాజు తన గూడు రేపి, తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు...” ఎన్నిసార్లు నేను దేవుడు తనయొక్క బిడ్డలను పక్షిరాజులకు పోల్చుటను తలంచి చూచితిని. మరియు దేవుడు తనను తాను ఒక పక్షిరాజుగా పిలుచుకొనుట నేను బైబిలులో కనుగొన్నాను. ఆయన యోహావా-పక్షిరాజు. మరి ఆయన దానిని ఏ విధముగా చేయును?

నేను సృష్టిని ఆనందించువాడిని, కావున నేను... నా యొక్క మొదటి బైబిలు ప్రకృతి. ప్రకృతి ఏ విధముగా క్రియ చేయునో మీరు గనుక గమనించినయెడల, మీరు దేవుని కనుగొనగలరు. మీరు గనుక దేవుని మీ హృదయములో నుంచుకొని మరి ఏ ప్రక్క చూచినను, ఎట్లు చూచినను మీరు దేవుని చూడగలరు. వారు పునర్జన్మను గురించి మరి ఆ విధమైన కార్యములను గురించి మాటలాడునప్పుడు, అది బుద్ధిహీనతగా యున్నది; ఆ విధముగా ఏదీ లేదు. ఒక చెట్టు చనిపోయినయెడల, అది మట్టిలోనికి భూమిలోనికి వెళ్లి, మరి విత్తనము కుళ్ళిపోవును; మరల అది జీవించును; అది పునరుద్దరణ. మరియు క్రైస్తవ్యము పునరుత్థానముపై ఆధారపడియున్నది. మరియు అది సత్యమని మనము చూచుచున్నాము; మరణించుట, సమాధి చేయబడుట, పునరుత్థానమగుట. ఎ౦డా కాలము, శీతకాలము, ప్రకృతియంతా ఒకదానితో యొకటి మిళితమైయున్నది.

21

ఆ చెట్టు ఏ విధముగా చనిపోవునని, ఏ విధముగా మొలకలు మరల పైకి వచ్చునని, ఏ విధముగా గాలి దానిపై వీచునని, అదెట్లు తిరిగి వచ్చును, ఏ విధముగా ఆ చిన్న పువ్వు చనిపోయి మరల జీవించునని గమనించుటయే నా యొక్క మొదటి బైబిలు. మరియు ఈ విధమైన కార్యములన్నియును ఎక్కడో పునరుత్థాన శక్తి యున్నదని నేను తెలిసికొనునట్లు చేసెను.

ఇప్పుడు, వృక్షమునకు నిరంతరమైన జీవము కలదు; మనకు నిత్యజీవము కలదు. వృక్షము తనయొక్క చివరి దశకు వచ్చును; మనకు ఆ విధముగా లేదు. మనకు నిత్యజీవము కలదు.

22

ఇప్పుడు, నేను దీనిని చదువుచున్నప్పుడు పక్షిరాజును గురించి చదువుటకు నేను ప్రారంభించితిని. పక్షిరాజును గురించి ఏమున్నది? పక్షిరాజు ఒక వింతైన పక్షియని నేను కనుగొనియున్నాను. ఇతర పక్షుల కన్నను ఇది చాలా ఎత్తుకు ఎగరగలదు. ఇది ప్రత్యేకముగా నిర్మింపబడిన పక్షిగా యున్నది. ఇది తన గూటిని బండలలో చాలా ఎత్తుగా కట్టును. ఇది ఒక వింత పక్షి. మరియు ఇంకొక కార్యమేమనగా దానియొక్క రెక్కలు చాలా గట్టిగా నుండును, వాటిని మనము.... మనము కటింగ్ ప్లయర్తో కూడా లాగలేము. అది ఎంతో పెద్ద పక్షి, ఉన్నవాటిల్లో అదే పెద్దది. మరియు ఇది ఒక చాలా వింతైన పక్షి. దానిలోని ప్రత్యేకత ఏమనగా ఇది శ్రేష్ఠమైన పక్షిగా నిర్మింపబడి యున్నది. “పక్షిరాజా” అనగా “ముక్కుతో చీల్చునదని” అర్ధము. మరియు అది తన ముక్కుతో తన పిల్లలకు తినిపించును - దేవుని వాక్యమును గురించిన ఒక చక్కని కార్యముగా అది యున్నది: దేవుడు తన నోటిద్వారా తన బిడ్డల నోటిలోనికి ఆహారమును తినిపించునట్లుగా ఇది యున్నది.

మరలు పిదప అది తన గూటిని చాలా ఎత్తైన స్థలములో కట్టును మరియు దానిని అది ఒక ఉద్దేశ్యము కొరకు ఆ విధముగా చేయున్నది. ఇప్పుడు అది విమోచించుటకై పక్షిరాజు ఒక గొప్ప బలముగల రెక్కను కలిగియున్నది మరియు పక్షిరాజులో గల ఇంకొక గొప్ప గుణము, అది తన యౌవ్వనమును నూతనపరచుకొనునట్లుగా తనను నూతనపరచుకొనును. ఎంతో కాలము గడిచిన పిదప కూడా ఈ పక్షిరాజు తన యౌవ్వనమును మరల, మరల నూతనపరచుకొనుచూ యౌవ్వన దశలోనికి ప్రవేశించి మరల యౌవన పక్షిరాజుగా మారును. అది తన యౌవ్వన దశను నూతనపరచుకొనును. దేవుని బిడ్డలైన సంఘమునకు ఇది ఒక సాదృశ్యముగా యున్నది. మనము కూడా దిగజారిపోతూ, పాతబడి, చప్పగా నుండినను పిదప ఉన్నట్టుండి పరిశుద్ధాత్మ వచ్చి మనలను మరల నూతనపరచును - దేవుడు ఆయన సంఘము యొక్క అనుభవమును మరియు యౌవ్వనమును క్రొత్తదగునట్లు చేయుచున్నాడు, వారికి ఒక నూతన అనుభవమును ఇచ్చుచున్నాడు. అది పక్షిరాజుకు మాదిరిగా యున్నది.

23

కొన్ని సంవత్సరముల క్రితము నేను అశ్వవర్ణన స్థానములో గుర్రములు పశువులున్న చోట గుర్రపు స్వారీ చేయుట అలవాటు, మేమప్పుడు కొలరాడోలో నున్న ట్రబుల్సమ్ నది యొద్ద యున్నాము. హియర్ ఫోర్డ్ ఆవుల సంఘము కొండలపైనున్న అరాపవో పచ్చికలలలో ఆ ఆవులను మేయుటకు పంపించెడివారు మరియు ఆ చుట్టు ప్రక్కలనున్న కొండలలో కూడా మేసెడివి. మేము ఆవులను మేకలను అక్కడికి తీసికొని వెళ్ళెడివారము, మరి ఆకురాలు కాలమున వాటిని తోలుకొనివచ్చి నేషనల్ అడవులలో వదిలి మరలు పిదప శీత కాలములో వాటిని పోషించుటకు కొండ దిగువ భాగమున ఎండు కసవును పెంచెదము.

మరియు నేను ప్రతి సంవత్సరమును వేటాడుటకు అచ్చటికి వెళ్ళెదను; ఇప్పుడుకూడా వెళ్ళుచున్నాను. నగరములోనున్న అనేక జనులు అచ్చటికి వెళ్లి మరియు ఆడ జింకలు, జింక పిల్లలు మరియు చిన్న ఆవులు, మరియు దారి త్రప్పిన పెద్ద జింకలను అక్కడ దిగువ ప్రాంతములో వేటాడి చంపి వెళ్ళిన పిదప, నేను నా స్నేహితుడును అక్కడికి వేటాడుటకై వెళ్ళుట అలవాటు. మేము చాలా ఎత్తుకు వెళ్లి మరక్కడ గుడారము వేసెడివారము, మీరచ్చటికి రాలేరు. అతను తూర్పు లేక పశ్చిమ భాగము వైపుకు వెళ్ళును మరి నేను ఇంకొక ప్రక్కకు వెళ్ళెడివాడిని. మేము అనేక దినములు గడచిన తరువాత ఒకరినొకరము కలుసు కొనెడివారము.

24

మరియు నేను మరువలేను, ఒక సంవత్సరము మంచు కురియ లేదు. మంచు కురియు కాలము సాధారణముగా అక్టోబరు నెల. మరియు కొండలపై మంచు వచ్చుచుండగా అక్టోబరు నెలలో అప్పుడు నిజముగా ఒక అందమైన మధ్యాహ్నముగా నుండును; ఒక గంటసేపు మంచు కురవగా, ఇంకొంచె౦ తర్వాత వర్షము కురియును, మరల ఉన్నట్టుండి సూర్యుడు ప్రకాశించును, ఆ విధముగా మారుచుండును. మంచు కురియనప్పుడు, అది ఆ పెద్ద జింకలను మానవ సంచారము వుండని దూర ప్రాంతములకు తరిమి కొండ సందులుగల కనుమలలోనికి ఆ పెద్ద జింకలను ఆ మంచు తరుమును. మరక్కడ మీరు సులభముగా వాటిని వేటాడ వచ్చును.

25

ఈ సంవత్సరము మంచు ఇంకా కురియ లేదు. నేను చాలా ఎత్తైన స్థలమునకు వెళ్ళాను. మరియు నేను నా గుర్రమును అక్కడ అనేక మెళ్ళ దూరమున క్రింద ఒకచోటు కట్టివేసాను, అక్కడ అది మేయుటకు తగినంత గడ్డి యున్నది, మరి నేను చెట్టుగుండా ప్రతి చోట గమనించుచు పైకి వెళ్ళుచున్నాను.

ఆ మధ్యాహ్నము అక్కడ ఒక గాలి వాన తుఫాను వలె కొండలవైపు నుండి వచ్చెను మరియు ఉరుముల శబ్దము గర్జి౦చుచు మరియు మెరుపులు మెరియుచుండెను. మరియు నేను ఒక చెట్టు వెనుక గాలివాన ఆగిపోయే వరుకు అచ్చటే నిలబడియున్నాను. అది చెట్లలోనికి వచ్చి ఆగిపోయెను. అక్కడ గాలి వీచుచున్నది. మరియు నేను గాలివాన ఆగిపోయే వరకు చెట్టు వెనుక నిలుచుకొని ఆలోచించుచుంటిని. మరియు నా తుపాకీని చెట్టుకు ఆనించియుంటిని. మరియు ఆ గాలివాన ఆగిపోయిన తరువాత పిదప నేను ఆయన ఎంతటి అద్భుతమైనవాడని దేవుని గురించి తలంచుకొనుచుంటిని. మరియు గాలివాన పోవుచునుండగా చల్లటి గాలులు వీచుటకు ఆరంభించి పచ్చని స్థలములయందు వాటిమీద నుండి నీరు కరిగి మంచువలె పచ్చని ఆకుల నుండి ఐస్ వ్రేలాడుచున్నట్లుండెను. సూర్యుడు మేఘముల నుండి బయటికి వచ్చినప్పుడు, ఆ దృశ్యము చూచుటకు కొండల సందు నుండి దేవుని నేత్రము తొంగిచూచునట్లుగా యుండెను.

26

దేవుడు ప్రతీ చోటా యున్నాడని మీరెరుగుదురు. మీరు గనుక ఆయనను చూడాలనుకుంటే మీరు ఆయనను ఎక్కడైనను చూడగలరు. ఆయనక్కడ యున్నాడు, ఆయనను చూడడమే మీ పని. ఆయన ఇక్కడ కూడా యుండగలడు. ఆయన ఇప్పుడిక్కడ యున్నాడు. మీరు గనుక చుట్టూ చూచినయెడల, మీరు ఆయనను చూడగలరు. మరలు పిదప నేను అక్కడ నిలుచుకొని యుండగా ఆ సూర్యాస్తమయమును చూచి మరి నేను నా చేతులను పైకెత్తి మరి నేను చెప్పాను, “ఓ గొప్ప యెహోవా దేవా, మీ కన్నులు భూమియందంతటను అటు ఇటు చూచుచున్నవి.” అప్పుడు ఒక మగ పెద్ద జింక అరచుచున్న బూర వంటి శబ్దమును విన్నాను. ఆ జింక ఆ గాలి తుఫాను వలన తన మంద నుండి చెదరిపోయి దూరమైపోయి ఒక కీచు మను స్వరముతో శబ్దము చేయుచున్నది. మరియు దాని స్వరమునకు ఇంకొక స్థలము నుండి మందనుండి జవాబుగా వేరొక శబ్దము వచ్చుట నేను వింటిని.

మరియు పైన కొండకు ప్రక్కగా వృద్ద నెరసిన తోడేలు కూయుటకు ప్రారంభింపగా, క్రింద నుండి దాని జత తోడేలు బదులు స్వరము నిచ్చుచుండెను. కొండల మధ్యయుండు ఆ సందుల ద్వారా నేను చూశాను; వర్షధనస్సు అచ్చట కనిపించుచుండెను. అంతెందుకు, నేను చూచే ప్రతీ చోటూ, ప్రతీ ప్రక్క దేవుడక్కడ యుండెను.

27

నా తల్లి సగము ఇండియను. చెరోకి ఇండియనులకని ప్రత్యేకించబడిన స్థలముయందు జన్మించెను. మరియు ఆమె యొక్క తల్లి పెన్షన్ పొందుకొనుచున్నది. నేను మారిన పిదప కూడా అది నా నుండి పోనంటున్నది. అరణ్యములలోను మరియు వెలుపలి ప్రదేశములలోను నేను ప్రేమించుటకై ఏదో ఒక కార్యమున్నది. ఆ తోడేలు కూయుటయు మరియు దాని జత తోడేలు దానికి బదలిచ్చుటయు నేను వినునప్పుడు, నా చెంపలపై కన్నీరు కారుటకు ప్రారంభించెను. మరియు ఆ పెద్ద జింక అక్కడ తనయొక్క మంద కొరకు అరచుటయు మరియు దానియొక్క మంద దానికి బదులిచ్చుటయు నేను విన్నాను.

నేను వర్షధనుస్సును చూశాను మరియు నేను చెప్పాను, “అవును, అక్కడ దేవుడున్నాడు.” ఆయన ఆల్ఫాయు, ఓమెగయునై యున్నాడు. ఆయనే వర్షధనుస్సుయను నిబంధనలోనున్న వర్ణములుగా యున్నాడు. మీరు గనుక ఆయనను చూడవలెనని ఆయన కొరకు చుట్టూ చూచినయెడల, దేవుడు ప్రతి చోటూ దృశ్యమగును.

28

నేను చాలా సంతోషముగా నున్నాను నేను నా చేతులు పైకెత్తాను మరియు నా చెంపలగుండా కన్నీరు కారెను. నేను ఆ విధముగా ఆ చెట్టు చుట్టూ తిరుగుచు, తిరుగుచూ పరిగిడుచున్నాను. ఒక గొప్ప సమయమును నేను కలిగియుంటిని. నాయొద్ద నుండి ముప్పై మైళ్ళ దూరము వరకు ఎవ్వరూ లేరు - క్రిందికి పైకి ఎగురుచూ నేను శక్తియంతటిని కూడదీసుకొని బిగ్గరగా కేకలు వేయుచున్నాను. ఎవరైనా నా స్థితిని నిజముగా ఆ సమయమున గమనించినయెడల, నేను పిచ్చాసుపత్రి నుండి అచ్చటికి వచ్చితినని అనుకొనియుండెదరు. కాని దానిని నేను లెక్కచేయను - ఎందుకనగా నేనొక మంచి అనుభూతిని అనుభవించుచున్నాను. నా యొక్క ప్రభువైన దేవుని నేను ఆరాధించుచుంటిని. ఎవరైనను ఏమి అనుకొన్నను నాకు అది ఏ బేధమును కలిగించదు.

మరియు నేను ఒక మంచి అనుభూతిని అనుభవించుచున్నాను, ఆ చెట్టు చుట్టూ అలా తిరుగుచు, తిరుగుచూ మరియు తిరుగుచున్నాను. ఆ తోడేలు అరుచుటను విని నేను ఆగాను, అది మరల అరచుచున్నది, నేను కూడా మరలా ఆ చెట్టు చుట్టూ అలా తిరుగుచు, తిరుగుచు మరల మరల తిరుగుచున్నాను.

29

మరియు నేను ఒక కార్యమునకై ఉద్రేకమునకు లోనైయాను.

మరియు అక్కడ ఒక చిన్న ఆడ ఉడుత ఉండెను. ఓక్లోమాలో యున్న మీకు అది ఏమిటని తెలుసునా, మీకు తెలియునో లేదో నాకు తెలియదు, అది చిన్నదిగా ఇంత పొడవుగా నుండి శబ్దము చేయును. అది అడవులలో యున్న నీలి రంగు కోటును ధరించియున్న పోలీసు మేన్. అది ఎవరిని లెక్కచేయదు అరచుచునే యుండును. మరియు ఆ ఉడుత ఒక చెట్టు మొద్దుపైకి దూకి మరి “అరుస్తు, అరుస్తు, అరుస్తూ” యుండును. మరియు నేను దానిని చూచి అనుకొంటిని, “నీవు ఉద్రేకపడవలసిన అవసరము లేదు. నేను ప్రభువును ఆరాధించుచున్నాను. నీవు గనుక దానిని ఇష్టపడనియెడల, దీనిని గమనించుము.” మరియు నేను నాకు వీలైనంతమట్టుకు అలా చుట్టూ తిరుగుచూ, తిరుగుచు తిరుగుచుయుంటిని. మరియు నేను చెప్పాను, “అది అద్భుతముగా లేదూ? నీ సృష్టికర్త, నా దేవుడు. ఇక్కడ మేము మరల పోవుచున్నాము!” దానిచుట్టూ తిరుగుచూ నుంటిని. మరి ఆ చిన్న ఉడుత తన తలను ప్రక్కకు త్రిప్పి గాలివాన వీచిన ఆ స్థలమును చూచుటను నేను గమనించాను.

30

నేను అతనిని బెదిరిపోవునట్లు చేసినట్లుగా కనిపించలేదు; వేరే ఏదో దేనికోసమో అది బెదిరిపోవుచున్నది. మంచిది, నేను అనుకొన్నాను, “నేను వింతగా ప్రవర్తింపలేదు, ఏలయనగా నా మట్టుకు నేను వింతగా ప్రవర్తింపలేదు. ఆయన నన్ను ఆశీర్వదించుచున్నాడని నేనెరుగుదును. కావున నీవు కూడా నాతో కలిసి నేను దేవుని గురించి స్తుతించునట్లు చేయవచ్చును.” మరి ఆ విధముగా నేను చూచుచుండగా, ఆ గాలివాన ఒక పెద్ద పక్షిరాజును క్రిందికి వచ్చునట్టు చేసినది. మరి ఆ తుఫాను ఆ పక్షిరాజును క్రిందికి దిగునట్లుగా చేసినది, అది బహుశా తినుచు నుండవచ్చును. ఆ తుఫాను దానిని పైకి ఎగిరి వెళ్ళుటకు వీలు కల్పించకుండా అది క్రింద పొదల యొద్దకు వచ్చునట్లు చేసెను. మరి అక్కడ ఆ పక్షిరాజు ఈ పొదల చుట్టూ తిరుగుచున్నది మరి ఆ పక్షిరాజు అక్కడుండుట వలన ఆ చిన్న ఉడుత బెదిరిపోవుచున్నది.

మరియు ఆ ఉడుత ఆ పక్షిరాజును చాలా జాగ్రత్తగా గమనించుచు, గొంతు చించుకొని కీచు, కీచు కీచుమని అరచుచు పక్షిరాజాను ముక్కముక్కలుగా ఖండించునట్లుగా అది అరచుచుండెను. ఆ ఉడుత దేనినైనను చీల్చగల పెద్ద జంతువు కాదు. కావున అది ఆ చెట్టు మొదుపై నిలుచుకొని తన చిన్న తోకను ఆ విధముగా చుట్టుకొని మరి “కీచు, కీచు, కీచు, కీచు, కీచు, కీచు” మని అరచుచుండెను.

నేను అనుకొన్నాను, “మంచిది, నీవు బెదిరిపోవద్దు; అతను నిన్ను ఏమి చేయడు.” మరియు ఆ పెద్ద పక్షిరాజు ఒక కొమ్మ పైనుండి ఆ విధముగా ఎగిరి దూకెను మరియు నేను తలంచుచుంటిని, “ఓ, దేవా, అక్కడ నీవు ఆ తోడేలు పిలుపులో యున్నావు. ఇక్కడ అడవి జంతువుల కేకలలో నీవున్నావు. అక్కడ సూర్యాస్తమయములో నీవున్నావు. అక్కడ వర్షధనుస్సులో నీవున్నావు. ఆ పక్షిరాజును నీ వెందులకు నాకు ముందుగా ఉంచావు? ఆ పక్షిరాజు అక్కడ ఏమి చేయుచున్నది? ఆ పక్షిరాజులో నేను నిన్ను చూచుట లేదు.”

31

ఆ పక్షిరాజును నేను గమనించాను. నేను దానియొక్క పెద్ద బూడిద రంగు కన్నుల తట్టు చూచుచుంటిని, ఆ పక్షిరాజు ఆ ఉడుతను గమనించుట లేదు, అది నన్ను గమనించుచుండెను. ఆ కన్నులు నన్ను గమనించుట నేను చూడగలుగుచున్నాను; మరియు నేను తలంచాను, “సరి, అవును, ఆ పక్షిరాజులో దేవుని చూచుచున్నాను, ఏలయనగా అది భయపడుట లేదు; అది భయపడకుండా ఉండుటకు అతనిలో ఏదో కార్యమున్నది.”

నేను చెప్పుకొన్నాను, “అది భయపడునాయని నేను ప్రయత్నించి చూచెదను,” చెప్పుము సహచారి, “నీకు తెలియునా, నేను నిన్ను చంపగలనని?” నేను చెప్పాను, “ఇది నా యొక్క రైఫిల్, నేను నిన్ను చంపగలను.”

అది ఆ విధముగా నన్ను చూసినది. అది తన రెక్కలను విరుచుట నేను గమనించుచుంటిని. “ఇప్పుడు నేను చూచుచున్నాను. అదియే కారణము. నీవు భయపడుట లేదు, ఏలయనగా దేవుడు నీకు రెండు రెక్కలను ఇచ్చియున్నారు. మరియు నేను ఆ రైఫిల్ను చేతిలో తీసికొనుటకు మునుపే నీవు ఆ అడవులలోనికి వెళ్ళగలవు,” అని నేను చెప్పాను.

నేను తలంచుకొన్నాను, “ఆపదల నుండి తప్పించుకొనుటకు దేవుడు నీకిచ్చిన రెక్కలపై ఆ విధముగా నమ్మకముతో నీవు ఆధారపడినయెడల, మరి సంఘము ఈ లోక కార్యముల నుండి మరియు ఇతర కార్యముల నుండి దేవుని ద్వారా అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ మన మధ్యనుండగా సంఘము వాటికి ఎంత దూరముగా నుండవలయునో కదూ, మరియు నేను అతనిని గమనించితిని, మరియు అతను ఆ రెక్కల ద్వారా ఏ విధముగా అనుభూతి చెందుచున్నాడో. మరి....

ఎవరో నన్ను ఒకప్పుడు అడిగిరి, “సహోదరుడా బ్రెన్హాం మీరు తప్పు చేసెదరని మీకు భయము లేదా? లేదయ్యా, నా చుట్టూ ఏదో ఉన్నదని నేను అనుభూతి చెందువరకు అది నాకు బాగుండును. అది నిజము. ఆయన అక్కడ యున్నంతవరకు, దానిని చేయునది ఆయనే.

32

మరియు నేను పక్షిరాజును చాలాసేపు గమనించుచుంటిని. మరియు నేను అతనిని అధికముగా ప్రేమించుచున్నానని అది ఎరిగెను. నేను అతనిని ఏమి చేయను. మరి కావున, అతను నన్ను గురించి భయపడుట లేదు, అయితే ఆ ఉడుత కీచు కీచు కీచుమని అరచుట అతని కిష్టము లేకుండెను, అతను దాని గురించి అలసిపోయెను, కావున అతను గొప్పగా తన రెక్కలను విరచి రెండు సార్లు ఆడించి పైకి ఎగిరినప్పుడు, ఎందుచేత ఉడుత నన్ను చూచి అరచినదని అప్పుడు నాకు అర్థమైనది.

ఆ పెద్ద పక్షిరాజు తనయొక్క రెక్కలను మరల కొట్టుకొనలేదు. అతనికి తెలియును, తన రెక్కలను ఎటు విరిచి పెట్టుకొనవలయునని మరియు గాలి వీచునప్పుడెల్లను అతను కొద్దిగా పైకి ఎగురును. మరియు గాలి వీచునప్పుడు అతను ఇంకొద్దిగా పైకి ఎగురును. మరియు ఆ పక్షిరాజు ఆ విధముగా పైకి ఎగురుచు పోవుచునుండగా అది పైకి ఎగిరి ఒక చిన్న మచ్చగా కనిపించు వరకు నేను దానిని గమనించుచుంటిని.

మరియు నేను చెప్పాను, “ఓ దేవా, అదియే అది.” అతను ఆ “కీచు కీచు కీచు,” మని అరచు ఉడుత అరుపులతో అలసిపోయెను. ఒక సంఘము నుండి ఇంకొక సంఘమునకు పోవుట కాదు, దీనితో చేరుట మరి దానితో చేరుట కాదు; మరి ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తివలన మీ యొక్క రెక్కలను ఏ విధముగా విరచుటయని తెలిసికొనుటయే అది. ఆయనలోనికి వచ్చినప్పుడు, సవారి చేయుచునుండుడి, చేయుచునుండుడి, అద్భుతములు జరుగు కాలము గతించినవని “కీచు కీచు కీచుమని అరచు ఈ మార్గమును వదిలి పైకి వెళ్ళుడి.” “పరిశుద్ధాత్మయను ఒక కార్యము లేనే లేదు.” “మీరందరును ఈ కార్యములో తప్పుగా నున్నారు!” “దైవిక స్వస్థతయను కార్యము లేనే లేదు,” అని అరిచే అరుపులు నుండి దూరముగా వైదొలగిపోయి పైకి ఎగురుడి. మరియు పరిశుద్ధాత్మను మీ లోపలికి ప్రవేశించుటకు అనుమతించి, వీటన్నిటిని విడిచి ఎగిరిపోవుడి. ఇవన్నియును వినబడని దూరమునకు పైకి ఎగిరి వెళ్ళుడి.

33

మై! దేవుడు పక్షిరాజును చేసియున్నాడు. ఇప్పుడు అతనికి గనుక.... డేగ కనుక పక్షిరాజును వెంబడించుటకు ప్రయత్నించినయెడల, అది గాలిలో శిథిలమైపోవును. ఒక కాకి, పక్షిరాజును వెంబడించుటకు ప్రయత్నించినయెడల, దాని రెక్కలు ఆ కాకి నుండి రాలి పోవును. అతను ఒక విశేషమైన పక్షి.

దేవుడు ఆయన యొక్క ప్రవక్తలను తన పక్షిరాజులతో పోల్చుచున్నాడు. ఒక ప్రవక్త చాలా ఉన్నతమైన ఎత్తైన మండలమునకు వెళ్లి, మరి అక్కడ నుండి దూరముగా చూచును. అంత ఎత్తుకు అతనిని తీసికొని వెళ్లు గొప్ప రెక్కలు పక్షిరాజుకు కలిగియుండి, మరి అతని కన్నులు దానికి తగినట్లుగా లేనియెడల ఆ పక్షిరాజు అంత ఎత్తుకు ఎగిరిపోయిన పిదప దానిని అతను చూడలేడు. మరందువలననే ఒక డేగ - పక్షిరాజువలె నుండుటకు ప్రయత్నించి చాలా ఎత్తుకు ఎగిరినయెడల అతను చూడలేడు; కావున అది పైకెగురుట వలన అది దానికి ఏ ప్రయోజనము నుండదు. చూశారా, అతను ఒక ప్రత్యేకముగా చేయబడిన పక్షి. మరియు ఒక క్రైస్తవుడు ఒక ప్రత్యేకముగా చేయబడిన వ్యక్తి. అది ఖచ్చితముగా సరియే.

సంఘములో సమస్తమును ఉన్నదని ఏదో మీకు చెప్పుటవలన మీరు దానిని పొందకున్నయెడల, మీరు సంఘమునకు పోవనవసరము లేదు. దానిని దేవుడు మీ కొరకు చేయు ప్రత్యేకమైన కార్యముగా యున్నది. మీరు చూడలేనంతటి ఎత్తుకు పక్షిరాజు పైకి ఎగిరి వెళ్ళును, మరియు అది క్రింద నేలపై నుండు దేనినైనను అంత ఎత్తు నుండి అది చూడగలదు, చిన్న వస్తువులను కూడా అది చూడగలదు, అతని కన్నులు చాలా గొప్పవి.

34

కొద్ది సమయము క్రితము - సుమారుగా మూడు లేదా నలుగు సంవత్సరముల క్రితము - నా కుమార్తె మరియు నేను సిన్సినాటి అను ప్రదేశములో గల జంతు ప్రదర్శనశాలలో నడచుచుండగా. మరియు నేను అక్కడ వారిని శనివారము మధ్యహ్నన్నము, వారిని వివిధ జంతువులను చూపించుచుంటిని. చిన్నదైన సార మరియు నేను.... ఆమె అప్పుడు చిన్నదై, కేవలము మూడు ఏళ్ళు. మరియు మేము అక్కడ చుట్టూ నడచుచుంటిమి, మరియు అక్కడ పంజరములో పెద్ద పక్షిరాజు ఉన్నది.

మరియు నేను జంతువులు బోనులో బంధించబడి యుండుటను చూచుటకు ఇష్టపడువాడను కాను. నాకు తెలియదు, కానరీ పక్షిని మీరు పంజరములో నుంచుట నాకిష్టము లేదు. మరియు మీరు చిలుకలను బంధించుట కూడా నాక్లిష్టము లేదు, ఏది బంధించియుండుట నా క్లిష్టము లేదు. స్వేచ్చ లేకుండా బంధింపబడియుండు ఒక మతమువలె అది యుండును, అక్కడ మీకు స్వేచ్చ లేదు. మరియు నేను స్వేచ్చగా నుండుటను ఇష్టపడుచున్నాను.

35

అది ఎట్లున్నదనగా, మీ యొక్క పాట పాడు పక్షికి దానికి మంచి రెక్కలు మరియు మంచి ఈకలు పెరుగుటకు మంచి విటమిన్లు గల ఆహారమును ఇచ్చుచు మరి దానిని గూటిలో వేసి బంధించుట. అందువలన దానికి ఏ ప్రయోజనము కలదు? మరి ఆ విధముగానే ప్రసంగికులను సెమీనరిలకు మరియు ఆ విధమైన వాటికి పంపించి చదివించి మరటు పిదప, “అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి, మరటువంటి కార్యము లేదు,” అని చెప్పి వారిని బంధించుట వలన వారికే ప్రయోజనము గలదు. వారికి విద్య నేర్పులు వలన ప్రయోజనమేమి?

సహోదరుడా, నేను స్వేచ్చగా నుండుటను కోరుచున్నాను, అప్పుడు మీరు ఎగురవచ్చును, అభ్యాసము చేయవచ్చును, మీరు స్వతంత్రముగా నుండుటకు అనుమతించు ఒక మత మార్గమును నేను ఇష్టపడుచున్నాను.

36

ఈ పెద్ద పక్షిరాజును నేను గమనించితిని. వారు అప్పుడే దానిని పట్టి మరి దానిని గూటిలో బంధించిరి. దీనికి ముందు చూచిన దృశ్యములకంటే ఈ దృశ్యము నాకు చాలా వేదన కలిగించినది. నేను నిలుచుకొని యుండగా ఆ పెద్ద పక్షిరాజు అక్కడ నేలపై పండుకొని యున్నది. అతని పెద్ద రెక్కలు అక్కడ నేలపై నున్నవి. మరియు అతని తల నుండియు మెడ చుట్టూను యున్న ఈకలు అన్నియును అతని రెక్కల చివరి నుండి రాలిపోయున్నవి.

నేను దానివైపు చూచాను. అది కొంచము దూరము ఆ పంజరములో నడచి. అలా ఆ పంజరము చుట్టూ చూచినది. అది వచ్చి! మరియు ఆ పంజరమును దాని తలతో మరియు రెక్కలతో కొట్టుచున్నది. దాని ఈకలు ఎగురుచున్నవి; మరియు అది పడిపోవుచున్నది. అది మరలా లేచి, మరల ఆ విధముగా పడిపోయి, పైకి చూచుచున్నది. దాని శక్తి కొలది అది ఎగిరి అలా దానిని తలను కొట్టి పడిపోవుచున్నది. అక్కడ అది పడియున్నది, మరియు దాని పెద్ద కండ్లు, అలా పైకి చూచుచున్నవి.

ఓ, నేను తలంచితిని, “మనుష్యుడు చూడగలిగిన అతి బాధకరమైన దృశ్యము!” అది ఆకాశపు పక్షి. అది ఆకాశపు ఎత్తులో ఎగిరే పక్షి, మరియు ఇక్కడ, మనుష్యుని యొక్క యుక్తి మరియు పరికారాల చేత, బందీగా యున్నది. అది ఆకాశపు పక్షి. దానికి భూమి గురించి ఎక్కువగా ఏమి తెలియదు. అది అక్కడ ఆకాశములో నివసి౦చవలసిన జీవి.

అక్కడ పడియుండి పైకి చూస్తూ, అది నిజముగా ఎక్కడ నివసించవలసినదో, మరియు దాని హృదయము అక్కడ ఉన్నది, అయితే దానికి ఆ ఆకాశమునకు మధ్య ఇనుప చువ్వలు అడ్డుగా యున్నవి.

37

అది దుఃఖకరమైన ఒక దృశ్యమని నేను తలంచుకొనియుంటిని, అయితే ఒకప్పుడు ఆయన తనయొక్క స్వరూపములో సృష్టించిన మానవ సంతతి, సంఘ శాఖలు స్థాపింపబడిన మరి ఆ కార్యములతో దైవిక స్వస్థతను నమ్మని విధముగా బంధింపబడి, మరి వారు స్వేచ్చగా నుండుటకు వీలులేకుండా ఆ విధముగా ఆ బోనులో బంధింపబడి యుండుటను చూచువరకు ఆ విధముగా దుఃఖపడుచుంటిని. వారు పరలోకవాసులుగా నుండుటకై జన్మించినవారు, ఆ విధముగా దేవుడు పంపిన ఆత్మలు యున్నవి, అయితే వారిని బంధించి యుండుట వలన వారు బయటికి వచ్చుటకు వీలు లేకపోవుచున్నది.

చూడుడి, పురుషులు మరియు స్త్రీలు వీధులలో అసభ్యకరమైన దుస్తులు ధరించుకొని నడచుచున్నారు. స్వేచ్చాపరులుగా నుండవలసిన దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలును త్రాగుబోతులుండు స్థలములలో బంధింపబడియున్నారు. వారు స్వేచ్చగా నుండుటకు ప్రయత్నించి, ఏదో ఒకదానిపై వారి తలను బాదుకొని వారి మెదడులను పాడుచేసికొనుచున్నారు.

38

ఓ, దేవా, నాకు గనుక శక్తియున్నయెడల..... లేక అధికారమున్నయెడల నేను ఆ పాత పక్షిరాజును కొని మరి అది ఎచ్చటికి వెళ్ళవలయునని కోరుకొనుచున్నదో అచ్చటికి దానిని స్వేచ్చగా విడిపించెదను.

అతనిని ఆ విధముగా బంధించుట చాలా ఘోరమైన కార్యము, అయితే దేవుని కుమారులను తీసికొని మరి వారిని ఆ విధమైన స్థలములో బంధించుట ఎటువంటి ఘోరమైన కార్యము, వారు... నిజముగా వారి ఆత్మలు అక్కడి నుండి బయటికి వచ్చి మరి ఏదో చేయవలయునని కోరుచున్నారు. పిదప ఎవరైనను చెప్పెదరు, “దైవిక స్వస్థతయను కార్యము లేదు.” “పరిశుద్ధాత్మ యొక్క శక్తియనే కార్యము ఏదియు లేదు.” ఈ విధమైన కార్యములంటూ ఏదియును లేదు. అది వారిని బోనులో వేసి బంధించుటయే యగును. సహోదరుడా, నేను మీకు చెప్పనిమ్ము, అక్కడ స్వేచ్చ యున్నది.

39

ఒకప్పుడు ఒక వ్యక్తి ఒక పాత వృద్ద కాకిని పట్టుకొని మరి ఆ కాకిని కట్టివేసెను, ఏలయనగా ఆ కాకి ధాన్యపు పొలములో నుండగా తక్కిన ఇతర కాకులు పక్షులు ఎగురుచు వచ్చి మరి, “జానీ కాకి రమ్మ, మనము దక్షిణ వైపుగా ఎగిరి పోయెదము; దక్షిణముగా పోయెదము; చలికాలము వచ్చుచున్నది,” అని చెప్పచునుండెను.

ఆ కాకి చాలా బలహీనమైన పరిస్థితులలో నున్నందువలన అతను నడుచుటకు కూడా వీలులేక పోయెను. అయితే ఒక రోజు ఒక మంచి వ్యక్తి ఆ దారిన వచ్చి మరి అనుకొనెను, “ఆ దీన వృద్ద కాకి,” అని తలంచి మరి ఆ బంధకములను తెంపివేసెను. మరి కాళ్ళకు కట్టు తెంపివేసిన వెంటనే ఇతర కాకులు వచ్చి మరి పిలిచెను, “జానీ కాకి రమ్ము, మనము దక్షిణవైపుగా పోయెదము.” అయితే ఆ కాకి అంత కాలము తన కాళ్ళు కట్టబడియుండుట వలన మరి అతను కొద్ది దూరము నడచి మరి, “నేను మీతో రాలేను; నేను దానినిచేయలేను,” అని చెప్పెను. తాను బంధముల నుండి విడిపింపబడి స్వేచ్చగానే యున్నాననే దానిని ఆ కాకి ఎరుగకుండెను.

ఈ దినమున మరి మానవుడు ఆ విధముగానే యున్నాడు. సహోదరుడా, యేసుక్రీస్తు మిమ్ములను స్వతంత్రులుగా చేసెనని మీరెరుగలేదు. మనము దాని నుండి బయటికి వచ్చెదము. మనము ఎచ్చటికో వెళ్ళెదము. దేవుడు మనలను విడుదల చేసెను. ఆకలితో మరణించవద్దు. ఆకాశమంతటూ పెంతెకోస్తు ఆశీర్వాదములు మరియు ఆయన యొక్క మంచితనపు వంటి స్వాధీనపరచుకొనలేని అనేక వనరులు దేవుని యొద్ద గలవు. మనము దానియొద్దకు వెళ్ళెదము! “ఎవరికి ఆ ఆశీర్వాదములు కావలయునని కోరుచున్నాడో మరి అతడిని రానిమ్ము రమ్ము, అతనిని రానిమ్ము; జీవపు నీటినుండి ఉచితముగా త్రాగనిమ్ము.”

40

పక్షిరాజు, తనయొక్క గూటిని చాలా ఎత్తుగా బండలలో కట్టును. అతను సంఘమునకు మాదిరిగా యున్నాడు. యేసుక్రీస్తు యొక్క సంఘము వెలుగు నిచ్చుచు ఒక కొండపై కట్టబడిన సంఘముగా యున్నది. దానికి ఎన్నో కోరికలున్నవి. దానికి చాలా గొప్ప కోరికలున్నవి. దానికి ఎన్నెన్నో ఆశలుండవలయును, ఏలయనగా దేవుడు ఏదో కార్యమును చేయవలయునని మనము ఎదురు చూచుచున్నాము.

ఈ రోజు మధ్యాహ్నము మీరు ఇచ్చటికి వచ్చి ఈ విధముగా “మంచిది, నేను పైకి ఎత్తబడుదును. నేను గనుక ప్రార్ధనా వరుసలో వెళ్ళినయెడల సరిపోవును. మంచిది, సరి. సరి, నేను స్వస్థత నొందినానని ఆయన గనుక చెప్పినయెడల, దానిని ప్రభువు గనుక నాకు తెలియపరచినయెడల నేను...” అని మీరు చెప్పవచ్చు. ఓ, ఆ విధముగా ఎదురు చూడవద్దు. “అయితే ఆయన గనుక దానిని చేయనియెడల, అప్పుడు నేనేమి పొందుకోలేను.”

మీరు అపేక్షించునవి ఎన్నో కావు. మీరు ఆనారోగ్యము గలవారై ఈ మధ్యాహ్నము సంఘమునకు వచ్చి స్వస్థతను పొ౦దుకొని నా గృహమునకు వెళ్ళెదనని ఆశిస్తున్నాను.“ అది జరుగువరకు నేను వదిలి వెళ్ళును,” అని చెప్పండి.

మీరు గనుక పరిశుద్ధాత్మను పొందనియెడల చెప్పుడి, “నేను ఈ చోటనే యుండి మరి కుళ్ళిపోయెదను, లేదా నేను పరిశుద్ధాత్మను పొందెదను. నేను పరిశుద్ధాత్మతో నిండియున్న జనుల మధ్యకు వచ్చియున్నాను, ఎక్కడైతే ఆత్మయున్నదో నేను అచ్చటికి వచ్చియున్నాను. నేను దానిని పొందువరకు ఇచ్చటనే నిలిచియుండెదను!”

ఒకప్పుడు వరి పండించు పొలమునొద్ద బడ్డీ రాబిన్సన్ ఉన్న విధముగా ఉండుడి. అతను చెప్పెను, “ప్రభువా, మీరు గనుక నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహింపనియెడల, మీరు మరల భూమిపైకి తిరిగి వచ్చినప్పుడు, మీరు బడ్డీ రాబిన్సన్ యొక్క ఎముకల కుప్పను మాత్రమే చూడగలరు. దానిని చేయవలసిన విధానము అదే. అది ఖచ్చితముగా అంతే. మనము దానిని అకస్మాత్తుగా తీసుకొనవలెను.

41

ఒకప్పుడు ఒక వ్యక్తి దేవుని కనుగొనుటకు ప్రయత్నించుచుండగా మరి ఆ విధమైన ప్రయత్నములో ప్రతిసారీ అతను చెప్పును, “నేను రక్షింపబడితిని,” మరి దయ్యము చెప్పును, “నీవు రక్షింపబడలేదు.” మరి ఒక దినమున అతను ఒక కొయ్యను ఒక స్థలమున వాలెను. అతను చెప్పెను, “సాతానా, ఇప్పటినుండి, నేను ఈ నాటబడిన కొయ్యకు చూపించెదను; ఇక్కడే ఈ స్థలముననే నేను దేవుడు నా నుండి కోరుకొనిన కార్యములను చేసియున్నాను.”

మీరు ఈ మధ్యాహ్నము మీ కుర్చీ ప్రక్కన మీ యొక్క వాడియైన కొయ్యను నాటి, “సాతానా, ఇక్కడే ఈ స్థలముననే ప్రతీ సందేహమును పడవేసాను, మరియు నేను ఈ మధ్యాహ్నము ఆయనతో కూడా ఎగిరి వెళ్ళిపోవుచున్నాను. నేనేమి చేయగలనని ఆయన నాతో చెప్పెనో మరి దానిని ఖచ్చితముగా నేను అంగీకరింపబోవుచున్నాను,” అని చెప్పండి. మీరు నమ్మినయెడల.

42

ఈ వృద్ద పక్షిరాజు ఆమె తనయొక్క గూటిని కట్టుకొనుటకు సిద్ధమై రాతి బండలపై ఎత్తైన స్థలముల యొద్దకు వెళ్ళి ఆమె తన గూటిని ఎత్తుగానున్న చోటు కట్టును, ఏలయనగా ఆమె.... ఆమె తన చిన్న పిల్లలను కాపాడుకోవలెనని కోరుకొనుచున్నది.

మరి ఆ విధముగానే దేవుడు చేయును. ఆయన తనయొక్క సంఘమును ఎత్తైన స్థలమునకు లేవనెత్తును, మీరు గనుక ఆయనను అనుమతించినయెడల మరి ఆయన మిమ్ములను ఒక స్థలములో నుంచును మరి భూమిపైనున్న రాబందులకు దూరముగా మిమ్ములను ఉంచును. నిశ్చయముగా ఆయన దానిని చేయును.

దానికి మరియు కోడికి మధ్య ఎంతో తేడా యున్నది! కోడి కూడా ఒక పక్షియే, అయితే అయితే అది తనయొక్క గూటిని ధాన్యపు కొట్టు ముంగిలి యొద్ద భూమిపై కట్టును, అక్కడ అడవి పిల్లివంటి జంతువులు మరియు పాములు మొదలగునవి ఆ కోడి పిల్లలను పట్టుకొని నాశనము చేయును. ఆ కోడికి పైనున్న ఆకాశమును గురించి ఏమీ తెలియదు, అయినప్పటికిని అతను ఒక పక్షి; ఒకవేళ సంఘ శాఖకు చెందిన ఒక సహోదరుడుగా నుండవచ్చును, అయితే అతను భూమిపైననే యున్నాడు. పరలోకమును గురించి, ఎత్తుగా పైకి ఎగురటను గురించి, ఎచ్చటో ఆ పైన అచ్చటయుండు నీలి గగనము గురించియు, దాని అందమును గురించి అతడికి ఏమీ తెలియదు.

43

ఆ వృద్ద పక్షిరాజు ఆమె తన గూటిని కట్టునప్పుడు .... ఆ పక్షిరాజు వెళ్ళి పెద్ద పుల్లలను తీసికొని వచ్చి మరి తన ముక్కుతో వాటిని ఆ బండల సందులలో దూర్చి మరి ముండ్ల పొదనుండి తీగలను తెచ్చి వాటితో ఆ పుల్లలను ఒక్కటిగా చేర్చి కట్టును. అది ఆ విధముగా తన గూటిని కట్టేటప్పుడు నేను దానిని గమనించాను. మరియు ఆ గూటి లోపల చిన్న కట్టు ముక్కలతో గట్టిగా చుట్టూ కట్టి లోపలంతా పొదలో నుండి తీసుకొచ్చిన తీగలతో దానిని అల్లును. ఏ గాలి తుఫాను కూడా ఆ గూటిని కదిలించలేనంతగా అది తన గూటిని ఎంతో గట్టిగా కట్టును.

44

“ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దానియెదుట నిలువనేరవు.” అందునిమిత్తమై నేను ఆనందించుచున్నాను. ఎటువంటి బండ అది? అది ఒక ఆత్మీయ బయలుపాటు.“

మనుష్య కుమారుడేవడని జనులు చెప్పుకొనుచున్నారు?“

“కొందరు ఏలీయాయనియు, కొందరు మోషే అనియు చెప్పుకొనుచున్నారు.”

“అయితే మీరేమి చెప్పుకొనుచున్నారు?”

“నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువి,” అని పేతురు చెప్పెను.

“యోనా కుమారుడైన సీమోను నీవు ధన్యుడవు. రక్తమాంసములు నీకు దీనిని బయలుపరచలేదు. [నీవు దీనిని ఒక సేమినరిలో నేర్చుకొనలేదు. వేరెవరో నీకు చెప్పుట ద్వారా నీవు దీనిని నేర్చుకొనలేదు.] అయితే పరలోకమందున్న నా తండ్రీ దీనిని నీకు బయలుపరచియున్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకద్వారములు దానియెదుట నిలువనేరవు. జీవితములో వచ్చు తుఫానులు దానిని కదిలించలేవు.

45

ఆ కారణము వలననే ఆయన తాను ఒక పక్షిరాజుయని చెప్పెను. ఆయన గూటిని కట్టెను.

మరలు పిదప ఆ వృద్ద పక్షిరాజు తనకు పుట్టబోవు తన పసి పిల్లల కొరకు ఆమె బయటికి వెళ్లి, తాను తేగలిగిన సమస్తమును తీసికొని వచ్చి, ఆ గూటిలో మృదువైన ఆకులను తెచ్చి గూటి మూలలలో వాటిని పేర్చి మరి వాటిని చుట్టూ పేర్చి ఆ చిన్న పక్షిరాజు పిల్లలకు గుచ్చుకొనకుండా ఆ ఆకులను అమర్చును. మరియు ఆమె బయటికి వెళ్లి ఒక గొర్రేపిల్లనో లేక ఒక కుందేలునో లేక దేనినో ఒక దానిని చంపి దాని మాంసమును తిని, అటు పిదప దానియొక్క చర్మమును తీసికొని వచ్చి తన చిన్న పిల్లలకు మెత్తగా యుండుట కొరకు తన గూటిలో దానిని అమర్చును.

మరి ఆ విధముగానే యెహోవా పక్షిరాజు కూడా చేయును. ఆయన సమస్తమును చక్కగా అమర్చును. ఓ, మై, దేవుని యొక్క రాజ్యములో నూతన బిడ్డ జన్మించినయెడల అతను అనుకొనును తాను నడువగలనని, అయితే అతను క్రింద, మీద పడి మరి చుట్టూ గంతులు వేయుచు, పరుగెత్తుచూ ఒక మంచి సమయమును కలిగియుండును. అతను ఈకలతో చేయబడిన మెత్తటి గూటిలో నుండునని మీరెరుగుదురా. గూటిలో క్రింద పడినను మెత్తగా నుండుట వలన దెబ్బ తగులదు. అందువలననే ఆ తల్లి పక్షిరాజు దానిని ఆ విధముగా అమర్చియున్నది. పుట్టబోవు బిడ్డల కొరకు తల్లి పక్షిరాజు కూడా ఆ విధముగా ఒక మెత్తలనీ మృదువైన గూడును సిద్దపరచి యుంచును.

46

కొద్ది కాలమైన పిదప గ్రుడ్డు వచ్చును మరి దాని నుండి చిన్న పక్షిరాజు పిల్లలు వెలుపలికి వచ్చును మరి తల్లి పక్షిరాజు మరి తండ్రి ఆ పిల్లలు పెద్దదగు వరకు వారిని పోషించెదరు.

మరి ఆ పిల్లలు ఒక స్థితికి పెరిగి ఎదిగిన పిదప ఆ చిన్న పక్షిరాజులు కోళ్ళవలె నుండవని తల్లి పక్షిరాజు ఎరిగియుండును. అది నిజము. అవి భూమి పైనుండు పక్షిరాజు పిల్లలుగా నుండకూడదని ఆమె కోరుకొనును. మరి అవి పక్షిరాజు పిల్లలని ఆ తల్లికి తెలియును.

మరి ఆ విధముగానే యెహోవా పక్షిరాజు చేయును. ఆయన మనలను కోడిపిల్లలుగా, ధాన్యపు కొట్టు ముంగిలియందు నుండవలయునని కోరుకొనుట లేదు. ఆయన మనలను పక్షిరాజుగా నుండవలయునని కోరుకొనుచున్నాడు. ఆ నీలి గగనముపై నుండుటయే మనయొక్క స్వభావముగా యున్నది. మనము స్వేచ్చగా పైన ఉండవలసినవారము. “కుమారుడు ఎవరినైతే స్వతంత్రులుగా చేసియున్నాడో వారు నిజముగా స్వతంత్రులు.” అక్కడ పైన వారుండవలయునని ఆయన కోరుకొనుచున్నాడు.

47

కావున కొన్ని దినములు (ఎన్నోసార్లు నేను వాటిని గమనించాను), గూటిని రేపుటకు కొన్ని దినములకు మునుపు తల్లి పక్షిరాజు ఆ గూటి ప్రక్కన నిలుచుకొనును. వెచ్చని సూర్యరశ్మి వేడిలో నేను అనేక దినములు అక్కడ పండుకొని వాటిని గమనించుచు, ఒక చిన్న బాలునివలె ఏడ్చాను. ఆ తల్లి పక్షిరాజును చూడండి, అవి పెద్దవి. తల్లి పక్షిరాజు తండ్రి పక్షిరాజు కన్నను పెద్దది. వాటిలో కొన్నిటి యొక్క రెక్కలు ఈ చివర నుండి ఆ చివర వరుకు పధ్నాలుగు అడుగుల పొడవు యుండును.

మరి ఆమె అక్కడ లేచును, మరి ఆమె గర్వముతో ఆ గూటి చుట్టూ నడచి మరి ఆ పిల్లల యొద్దకు వెళ్ళును. ఆమె తనయొక్క గొప్ప పెద్ద రెక్కలను విప్పారి మరి అరచును. మరి ఆమె ఆ విధముగా చేసి అరచినప్పుడు కొన్ని సమయములలో చిన్న పక్షిరాజు పిల్లలు వెనుకకు పడిపోవును. అవి ఆ విధముగా పడిపోవాలనే ఆమె ఆశించుచున్నది. అవి ఆ విధముగా చేయుటను ఆమె కోరుకొనుచున్నది. పిదప అవి లేచును. మరియు ఆమె మరల కేకలేసి బిగ్గరగా అరచును. ఎందుకని? ఆమె వాటికి తన స్వరమునకు తర్ఫీదు నిచ్చుచున్నది. “మరియు నా గొర్రెలు నాయొక్క స్వరము వినును.”

ఆ పక్షిరాజు పిల్లలు అరచు సమయము వచ్చునప్పుడు అదేమిటని తెలిసికొనవలయునని అది కోరుకొనుచున్నది. మరియు ఆమె కేకలేయుచున్నది. ఓ, మై! “నా యొక్క స్వరములోని ప్రతి భావమును మీరు గ్రహించవలయునని నేను మిమ్ములను కోరుకొనుచున్నాను,” అని ఆమె చెప్పుచున్నది. “ఏలయనగా పెంట కుప్పలను గెలిగేవాళ్ళు అనేకమంది గలరు. మీరు పక్షిరాజులని మీరు తెలిసికొనవలయునని నేను కోరుకొనుచున్నాను. మరియు పక్షిరాజు యొక్క స్వరమును మీరు గుర్తెరగవలెనని నేను మిమ్ములను కోరుకొనుచున్నాను.” ఆమేన్. హల్లేలూయ! “ఒక పక్షిరాజు స్వరము ఏ విధముగా యుండునని మీరు ఎరుగవలెనని నేను కోరుకొనుచున్నాను. మరటు పిదప ఆమె తన గొప్ప రెక్కలను విప్పారి, ”ఇటు చూడండి, మొదటిసారి మీయంత మీరే ఏ విధముగా ఎగరాలనేదానిని నేను మీకు చెప్పెదను, కాని దానికి ముందు నేనెంత పెద్దదానిగా యున్నానో మీరు గమనించవలెనని,“ చెప్పెను.

ఓ, ఒకవేళ కొన్ని సమయములలో మీ వెనుకనుండి వ్యాధి వచ్చి మిమ్ములను తాకవచ్చు లేదా మరేదైనా వచ్చి తాకవచ్చు, పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన అనే యెహోవా యొక్క రెండు రెక్కలను ఆధారముగా చేసుకొని, మన కన్నులను పైకెత్తి చూచి, “నీవు ఎంత గొప్పవాడవు, నీవు ఎంత గొప్పవాడవు ప్రభువా,” అని చెప్పినయెడల, ఓ, అది ఎంత మధురముగా యుండును.

48

ఓ, ఆమె వారికి చూపింపవలయునని యున్నది. “నేనెంత బలవంతురాలనో ఇటు చూడుడి.” ఆమె కేకలేసి అరచుచున్నది, “ఇది నా యొక్క స్వరము.” మరి అట్లైన ఆ పక్షిరాజు ప్రతి దినమును ఒకే స్వరముతో అరువలేడని ఏ విధముగా ఆ ప్రసంగి చెప్పగలడు, ప్రతి సారియు అది కేకలేయునప్పుడు అదే స్వరము. నిశ్చయముగా, ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా నున్నాడు.

పాత నిబంధన చెప్పుచున్నది, “నేను యెహోవాను. నేను ఎర్ర సముద్రమును తెరచితిని. హెబ్రి బిడ్డలను మండుచున్న అగ్నిగుండము నుండి నేను వెలుపలికి తీసికొని వచ్చితిని. దేవుని కుమారుడిని పునరుత్థాములో లేపినవాడను నేనే. హల్లేలూయ! ”పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను పంపినవాడను నేనే.“ ఆమె యొక్క గొప్ప రెక్కల ద్వారా చూచుచున్నది, మీరు దానిని చూచుటకు ఇష్టపడుట లేదా? అది మీ హృదయములను పులకరింపజేయుటలేదా?

ఆ చిన్న పక్షిరాజు పిల్లలు, “ఓ, అమ్మా, నిశ్చయముగా మేము నిన్ను నమ్ముచున్నాము. నీవు నిజముగా గొప్పదానివి, మరియు శక్తివంతురాలివి,” అని చెప్పుచున్నవి.

49

ఏదైనా రాత్రి బయటికి వెళ్లి మరి పైకి చూచి సూర్య కుటుంబమును చూచియున్నారా? ఇక్కడ కొద్ది కాలమునకు పిదప నన్ను పోలమార్ కొండపైకి తీసుకొని వెళ్ళిరి. మరి అచ్చట ఒక అద్దము ద్వారా పైనున్న సూర్య కుటుంబము మరియు ఇతర గ్రహణములను మీరు నూట-ఇరవై మిలియనుల సంవత్సరపు దూరములోనున్న ఆకాశపు వెలుగును వాటిలోని కార్యములను చూడవచ్చును. దాని దూరమును లెక్క వేసి చూడుడి. అదెన్ని మైళ్ళు, ఎన్ని మైళ్లు, వెలుగు ఎంత వేగముగా ప్రయాణము చేయును? మరియు నూట-ఇరువది మిలియనుల సంవత్సరముల వెలుగు దూరము. (వెలుగు ఒక సెకండుకు 186,000 మైళ్ళు ప్రయాణము చేయును - తెలుగు తర్జుమాదారుడు.) మీరు లెక్కవేసి చూచుకొనండి మరి దానికి తరువాత ఇంకా చంద్రుడున్నాడు, మరియు నక్షత్రములు మరియు ప్రపంచములు ఉన్నవి. నీవెంత గొప్పవాడవు. నీవెంత గొప్పవాడవు!

50

ఈ చిన్న పక్షిరాజులు చుట్టూ చూచుటకు ప్రారంభించి, “నీవెంత గొప్పదానిగా నున్నావు,” అని చెప్పుచున్నవి.

ఇదిగో ఇక్కడొక పుష్పమున్నది. అది చనిపోయి, భూమి క్రిందకు వెళ్ళును. అయితే అదిక్కడ మరల వచ్చుచున్నది. నీవెంత గొప్పవాడవు!

ఇక్కడ ఒక దీన వృద్దుడు కాన్సరు వ్యాధితో బాధపడుచున్నాడు. అది ఒక నీడవలె అతనిపై యున్నది, అతని కొరకు ప్రార్ధి౦చాము. అటు తర్వాత అతను స్వస్థతనొంది పెద్ద ఎర్రని ముఖముతో అతను చక్కగా కనిపించుచున్నాడు. నీవెంత గొప్పవాడవు, నీవెంత గొప్పవాడవు.

వీధిలోని కుక్కలు కూడా చూచుటకు నోచుకోలేని దీన వృద్ద స్త్రీని చూడండి. దేవుని యొక్క శక్తి ఆమె యొక్క దృష్టిని తాకినప్పుడు, “నీవెంత గొప్పవాడవు,” అని కేకలేయుచు ఆమె అరచినది. సుళువుగా చిక్కులబెట్టు పాపమును మరియు ప్రతి భారమును ఆమె విడిచి పెట్టెను. ఆ పిదప ఆమె చేసిన మొదటి కార్యము, ఆమె ఒక పవిత్రురాలుగా మారి ఆ విధముగా చక్కగ కనిపించెను. ఆమె తన చేతుల ద్వారా ఒక సువార్త కరపత్రముతో ఏదో చేయుచున్నది.

ఆ మూల సారాయి మొదలగునవి విక్రయించు ఆ నీచ వ్యక్తి “నీవెంతటి గొప్పవాడవు” అని తన కన్నులు పైకి చూచుటకు ఒక తరుణము అనుగ్రహించండి. అటు తర్వాత అతడు విస్కీని విక్రయించుటను, మద్యము సేవించుటను, పొగ త్రాగుటను, అసత్యములను పలుకుటను మరియు సమస్త చెడు కార్యములను విడిచిపెట్టి, పరిశుద్ద గ్రంథమును తన చేతులతో పట్టుకొని దేవుని యొక్క మహిమను గురించి సాక్ష్యమిచ్చుటను గమనించుడి. నీవెంత గొప్పవాడవు!

దేవుడు తనయొక్క పాత నిబంధన మరియు నూతన నిబంధనను అనే తన రెక్కలను మీపై ఒకసారి విప్పారనివ్వండి. దాని పుటలలోనికి (Pages) తొంగి చూచి అదేమిటనే దానిని గమనించండి. అక్కడి నుండి ఒక స్వరము కేకలేసి, “నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు,” అని చెప్పుటను మీరు వినెదరు. నేను వారికేమి చేసియున్నానో మీకును అది చేసెదను. “నేను ఏకరీతిగా యున్నాను. నేను యొహోవాను, నేను మారనివాడను!” ఇప్పుడే నేను ఆత్మ పరవశమును చెందుచున్నాను. ఓ, మై! అది సత్యమని నాకు ఎంత బాగుగా తెలియును.

51

ఇప్పుడు, ఆ తల్లి పక్షిరాజు ఆ చిన్న పిల్లలు కోళ్ళుగా ఉండకూడదని ఉద్దేశించుకొనియున్నది. అయితే వారు కోడి పిల్లలు కారని ఆమె నిర్ణయించుకొనెను. అటు పిదప ఆమె ఏమి చేసెనని మీరెరుగుదురా? ఆమె గూటి చుట్టూ అటు ఇటు తిరిగిన తరువాత తన రెక్కలను విప్పారి, “ప్రియా, ఇటు చూడుము, నేనెంత గొప్పదానినో. ఇచ్చట చూడుము. మీరు నన్ను నమ్మవలయును. నేను నిన్ను ఎచ్చటికో తీసికొని పోబోవుచున్నాను, మీరు నన్ను నమ్మి, నాపై ఆధారపడవలయును,” అని ఆమె చెప్పును.

ఈ మధ్యాహ్నము ఈ వ్యాధిగ్రస్తులను దేవుడు అదే విధముగా ఆ స్థితిలో పంపించి యున్నాడని నాకు ఎట్లు తెలియును? వైద్యులు మిమ్ములను చేయి విడచిన స్థితిలో ఆయన మిమ్ములను ఉంచియుండవచ్చును. “నేను ఒక క్రైస్తవుని, సహోదరుడా బ్రెన్హాం,” అని మీరు చెప్పవచ్చును. నాకు తెలియును. మరియు “నేను పరిశుద్ధాత్మను పొందుకొని కూడా ఇచ్చట నేను బాధపడుచున్నాను.”

ఆయన యొక్క రెక్కలను మీరు చూచి ఆయన ఎంతటి గొప్పవాడని మీరు తెలుసుకొనవలయునని యొహోవా ప్రయత్నించుచున్నాడా లేడాయని మీకు ఎట్లు తెలియును? నేనెంతటి గొప్పవాడిని. మీరు నాపై ఆధారపడునట్లుగా నేను మీ కొరకు ఏదో కార్యము చేయబోవుచున్నాను.“ అక్కడే మీరున్నారు. ”అయితే మీరు మొదలు దేనిని నమ్ముచున్నారనుటను నేను తెలుసుకొనగోరుచున్నాను. నా యొక్క గొప్ప రెక్కలను చూచితిరా?“

52

అటుపిదప కొద్ది దినములైన పిదప, ఆ తల్లి ఏమి చేసినదో మీకు తెలియునా? ఆ గూటిలోని పడక మెత్తగా నుండునంత వరకు ఆ చిన్న పాత పక్షిరాజు పిల్లలు ఆ గూటిని వదిలిపెట్టి వచ్చుటకు ఇష్టపడలేదు. అది నిజము. ఆమె ఏమి చేసినదో మీకు తెలియునా? పిదప అది తన ముక్కుతో ఆ గూటిలోని ఈకలను బొచ్చును పీకివేసి గూటి నుండి వాటిని విసిరి వేసెను. వారు లోకరీతిగా నుండకూడదని ఆమె నిర్ణయించుకొనెను. అది నిజము.

దేవుడు మరి ఆ విధముగా కొన్ని సమయములలో చేయును. ఓ, మీరు పెద్ద కార్యములను గురించి తలంచుకొనుచు మరి పైపై మెరుగులు చూపించుకొనుచు గొప్పవారమని చెప్పుకొనుచు నుండెదరు. వాటికొరకు చూడవద్దు. మీరు పెంతెకొస్తుకు లక్షలకొలది మైళ్ళ దూరములో నున్నారు. పెంతెకోస్తు జనులు సులభమైన కార్యములకు చూడలేదు. వారికి కలిగినది యావత్తును అమ్మి, బీదల కిచ్చిరి మరి క్రీస్తుతో ఒంటరిగా నడచి వెళ్లిరి. మరియు ఆత్మీయముగా ఉండుటకు బదులు ముందు కాడిలాక్ కార్లకు సొంతదార్లుగా యుండుటకే ఈ దినమున మనము కోరుకొనుచున్నాము. ఏమి సంభవించినది? ఎక్కడో ఏదో పొరపాటున్నది.

53

నేను ప్రభువు కొరకు నిందలనుభవించు ఆ కొద్దిమంది నడచు మార్గములో నన్ను కూడా నడువనిమ్ము ప్రభువా, నేను యేసుతో ప్రారంభించితిని. ఎటువంటి పరిస్థితులలోనైనను నన్ను గైకొనుము ప్రభువా. నూతనముగా జన్మించుటకు జనులు భయపడుచున్నారు. అదే అచ్చటయుండు సంగతిగా యున్నది. వారు మరల జన్మించుటకు భయపడుచున్నారు.

ఎటువంటి పుట్టుకైనను - అది ఎక్కడ అనేది నాకు అక్కర లేదు - అది ఒక గందరగోళమని మీరందరు ఎరుగుదురు. ఒకవేళ అది సందుల దొడ్డిలో నున్నను, లేక గడ్డిపరకల యందైనను లేదా చక్కగా అలంకరించబడిన ఒక వైద్యశాల గదిలోయైనను, ఒక పుట్టుకయనునది గందర గోళముగానే నుండును. మరియు జనులు గందరగోళపు స్థితిలో నుండుటకు ఇష్టపడుట లేదు. అయితే నేను మీకు చెప్పుచున్నాను, దేవుడిని నాయొక్క పరిధిలో నా స్థాయిలో సంధించుటకు నేను కోరుట లేదు. దేవుని యొక్క పరిధిలో ఆయన స్థాయిలో నేను ఆయనను సంధించుటకు కోరుకొనుచున్నాను. ఒకవేళ నేను అరువవలసి వచ్చినను, పెద్దగా కేకలేయవలసి వచ్చినను, అన్యభాషలలో మాటలాడవలసి వచ్చినను, నేనేమి చేయవలసినను నేను లెక్క చేయక, దేవుని కొరకు చేసెదను. నాయొక్క పొరుగువారు నన్ను గురించి ఏమి పలికినను నాకు అక్కర లేదు, నేను మరల జన్మించనిమ్ము! నేనెటువంటి స్థితిలో నున్నను నాకు లెక్క లేదు.

54

నా యొక్క సమస్త పేరు ప్రఖ్యాతులను వదిలి వేయవలసియున్నయెడల, నాకు అటువంటి ఏ పేరు ప్రసిద్దులు లేవు. నాకు లేని ఆ ఒక్క కార్యము నేను వదలనక్కర లేదు. నాకు ఏ పేరు ప్రఖ్యాతులు గౌరవములు లేవు. నేను కొండ ప్రాంతములో నివసించు చిన్న బీదవాడిని. కావున నాకు ఏమియూ లేవు. అయితే నాకు అదేమైనాగాని అనవసరము. దేవుని రాజ్యము కొరకు ఒక మూఢుడుగా నుండుటకుగాను నేను దేనినైనను వదలుకొనుటకు సిద్దముగా నున్నాను. మీరు నన్ను ఒక పరిశుద్ద దొర్లువాడు లేక ఒక దయ్యముల ద్వారా మాటలాడువాడనియు, లేక ఒక దయ్యమనియు, లేక మనస్సులను వివేచించి చదువువాడని పిలిచినా, వారేమి చెప్పినను నాకు లెక్క లేదు, నాకు కావలసినది యేసు మాత్రమే. అదియే నా యొక్క ముఖ్య ఉద్దేశ్యము. అది ఎటువంటి స్థితియైనను, నేను దానిని లెక్క చెయ్యను. నేను చెప్పెదే సత్యమనే దానిపైన గాని లేక వేరే ఎవరైనా చెప్పెది నిజమనే దానిపైన గాని ఆధారపడకుండా ఆయన పరిధిలోనే, ఆయన చిత్తానుసారముగా నేనాయనను సంధించవలయును. దేవుడు ఏది సత్యమని చెప్పుచున్నాడో, దానిపైనే ఆధారపడుటకు నేను ఆశించుచున్నాను. అది నిజము. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని ఆయన గనుక చెప్పినయెడల, ఆ స్థాయిలో నేను ఆయనను చూడగోరుచున్నాను.

అతి స్వల్పమైన బిస్కెట్లు తిని, పారుచున్న సెలయేటి నీటిని త్రాగి కొన్ని స్తంభములకు నేను గనుక ప్రసంగించవలసి వచ్చినను, నేను ఇంకా సువార్తనే కోరుకొనెదను. క్రీస్తు ఏ స్థాయిలో రానైయున్నాడో మరి ఆ స్థాయిలోనే క్రీస్తు నాకు కావలయును.

55

ఆ తల్లి పక్షిరాజు లోపలికి వెళ్లి మరి మెత్తని వాటినన్నిటిని పారవేయును. అప్పుడు ఆ చిన్న పిల్లలు కూర్చొనవలయుననిన యెడల, కఠినమైన వాటిపై కూర్చొనవలయును, అది ఒక విధముగా అతుకుకొనునట్టుగా నుండును. ఆమె.... అదియే దయ్యము ఏమైనను.... అనియున్నంత వరకు....

“ఓ, గతరాత్రి నీవు రక్షింపబడినావా?”

“అవును, ఉహ్ - హు. అవును రక్షింపబడితిని.”

“ఓ దానికొరకై నేను చాలా సంతోషించుచున్నాను. అయితే మీరు జీవితమును జీవించుటకు ప్రారంభించుడి; వారు ముఖమునకు ఎదురుగానే, ”పరిశుధ గుండ్రాళ్ళు మరి ఆ విధముగా, ఓ, నీవు ఏ గుంపుకు చెందిన వాడవోయని నేను చూచుచున్నాను,“ అని చెప్పెదరు.

చూశారా, ఒకప్పుడు ఆయన మీరు అతుకుకొని యుండుటకు అనుమతించెను. మీరు ఈ ప్రపంచమునకు అలవాటుపడవలయునని ఆయన మిమ్ములను కోరుట లేదు. మీరు చూశారా? ఆయన మిమ్ములను కోరుట లేదు... ఆ తల్లి ఆ పక్షిరాజు పిల్లలు, కోడి పిల్లలుగా నుండుటకు కోరుట లేదు. ఆ గూటి నుండి అవి బయటికి రావలయునని ఆమె వాటిని కోరుచున్నది. వారు ఏ బండపైనున్నను లేక ఎక్కడున్నను ఫరవాలేదు, ఆమె వాటికొరకు శ్రేష్ఠమైన దానిని తనయొద్ద కలిగియున్నది. సంఘమునకు దేవుడు ఏదో శ్రేష్ఠమైన దానిని కలిగియున్నాడు. “నేను పెంతెకోస్తు,” నని చెప్పుకొని అక్కడనే నిలిచిపోవద్దు.

56

ఒకప్పుడు ఒకసారి ఎవరో నాతో చెప్పిరి, చెప్పిరి, “సహోదరుడా బ్రెన్హాం...” అర్కాన్ లో నున్న ఒక వృద్దుడు స్వస్థపరచబడెను. అతను ఆ తదుపరి దినమున తన కర్రలతో ఆ చుట్టూ ప్రక్కల నడచుచుండెను. అతను అనేక సంవత్సరములుగా వీథులలో పెన్సిళ్ళు అమ్ముకొనుచుండెను స్వస్థత నొందిన పిదప, “ఆ చేతి క్రింద నుంచుకొను ఊతకర్రలను పట్టుకొని, వాటితో నాకు ఇక పనిలేదు, ఏలయనగా యేసు నా యొద్దకు వచ్చెను,” అని అరచి చెప్పుచుండెను. మరియు ఆ రాత్రి అతను జనుల మధ్య నిలుచుకొని లిటిల్ రాక్ లో నున్న రాబిన్సన్ మెమోరియల్ ఆడిటోరియమ్లో మరి అతను చెప్పెను, “ఒక్క నిమిషము, సహోదరుడా బ్రెన్హాం.” నేను ప్రసంగించుచుంటిని, అతను చెప్పెను, “ఒక్క నిమిషము.” [అతను ఒక నజరీన్ వారికి చెందినతను], “మీకు తెలియునా, మీరు ఒక నజరీన్ వలె ప్రసంగించుచున్నారు. మరియు ఇక్కడున్న అనేకులు పెంతెకోస్తువారని నేను గమనించాను, మరిప్పుడు మీరు ఒక బాప్టిస్ట్ అని ఎవరో నాకు చెప్పిరి. నాకు ఇది అర్ధము కావటము లేదు,” అని అతను చెప్పెను.

“ఓ” నేను చెప్పాను, “అది చాలా సులభము. నేను ఒక పెంతెకోస్తు-నజరీన్-బాప్టిస్ట్-వాడను. ఖచ్చితముగా అదియే అది. అవునయ్యా.

57

ఓ, సహోదరుడా, ఆ రకములైన జాతులు. నేను అక్కడ ఆ కొండలలో ఆవులను మేపుకొని వెళ్ళుట అలవాటు మరియు ఆ అటవీశాఖ అధికారి ఆ ఆవులు లోపలికి ప్రవేశించినప్పుడు వాటిని తనిఖీ చేయుటను నేను గమనించెదను. మా ఆవులు త్రిపోడ్ జాతికి చెందినవి. డైమండ్ టి-బార్ జాతి ఆవులను గ్రైమ్స్ తోలుకొని వచ్చెను. అనేక జాతి రకములు వాటి ద్వారా లోనికి వెళ్ళెను. ఆ అటవీశాఖ అధికారి ఆ జాతులను గురించి శ్రద్ద వహించలేదు. అతను రక్తపు చీటిలను గమనించెను. ఆమేన్!

మరి దేవుడు దానినే గమనించును! ఆయన రక్తపు చీటీలను (చిహ్నములను) గమనించును; ఆయన మీరు ఏ గుంపునకు ఏ రకమునకు చెందినవారని ఆయనకు అక్కర లేదు. ఎందుచేత? మంచి జాతియైన హియర్ ఫోర్డ్ తప్పనిచ్చి మరి ఏదియూ అచ్చటికి వెళ్ళి, మేయుటకు వీలులేదు.

58

మరియు యేసుక్రీస్తు రక్తము ద్వారా మరి తిరిగి-జన్మించితేనే గాని ఎవరూ పరలోకపు ద్వారముల ద్వారా ప్రవేశింపలేరు. మీరేమి చేసినను, మీరు ఎంత జ్ఞానులైనను, లేక మీరు ఎంత మంచి ప్రసంగియైనను, లేక ఎంత మంచి సంఘ సభ్యుడైనను నాకు వాటితో అక్కర లేదు; మీరు యేసుక్రీస్తు రక్తము ద్వారా జన్మించి, మీపై రక్తపు చిహ్నపు గుర్తుతో ఉంటెనేగాని మీరు లోపలికి ప్రవేశించలేరు. మరి దానిలోనున్న కార్యము అదే. నేను రక్తమును చూసినప్పుడు నేను మిమ్ములను దాటిపోయెదను.“ అది అంతే. మరియు రక్తము చిహ్నము గనుక సరిగా నున్నయెడల, ఆయన మిమ్ములను లోపలికి అనుమతించును. ఆయన తనయొక్క స్వకీయ కుమారుని యొక్క రక్తమును సంఘములో గమనించును.

59

ఈ తల్లి పక్షిరాజు ఆ చిన్న పక్షిరాజు పిల్లలను గమనించుచుండును. ఓ, ప్రతి సమయము.... వారు గూటిలో కూర్చొనలేరు. ఎచ్చట చూసినను ముండ్లు, ముండ్లు, ముండ్లు.

ఇప్పుడు, మరి ఆ గూటిలో కూర్చొనియున్న పెంతెకోస్తు సంఘమునకు ఏదో చేయవలయును, మరి కావున వారు గూటిలో నుండకుండ వెలుపలికి రావలయును. అది నిజము. ఇప్పుడు, నేను సంఘ శాఖలకు విరోధముగా మాటలాడుట లేదు; మరి ఆ విరోధమైన విరోధ భావమును మీరు మీ మనస్సులో నుంచుకొనవద్దు. అయితే నేను చెప్పుటకు ప్రయత్నించునది ఏమనగా, “మీరు అచ్చటనే నిలిచిపోవద్దు, అది మీ స్థలము కాదు. మీరు చాలా మంచివారు; సంఘ శాఖలను నేను ఇష్టపడెదను. వాటిలో నేను ప్రతియొక్క దానికి చెందినవాడను, చూశారా. నిశ్చయముగా. అవునయ్యా. నేను వారిలోనే జన్మించితిని. సంఘములో నున్న ప్రతియొక్కరును నేను కూడా సంఘ శాఖలోనే జన్మించితిని. అయితే అక్కడ ఆ సంస్థ వద్ద నిలిచిపోవద్దు. మీరు స్వయముగా ఒంటరిగా పోరాడు వరకు దేవునితో నడవండి.

60

ఇప్పుడు, మొదటి కార్యము, ఆ వృద్ధురాలైన తల్లి ఒక చిన్న అనుభవమును తనయొక్క బిడ్డలకు ఇచ్చుటకు తీర్మానించుకొనెనని మీకు తెలియునా, ఇప్పుడు వారు సంఘములో చేరెదరు మరియు సమస్తమును బాగుగానే యున్నవి, అయితే ఆ కార్యములు మీకు అతుకుకొనుచున్నవి. అక్కడేదో దోషమున్నది.

మరటు పిదప పాత వృద్ద తల్లి ఒక దినమున ఆ గూటికి ఎదురుగా వచ్చుచుండును. ఆమె ఆ చిన్న పిల్లలను గమనించి చూడగా, మరి వాటికి ఒకదానితో ఒకటి అతుకబడని అనేక ఈకలు వాటిపై నుండెను. మరియు ఆ చిన్న పిల్లలను గనుక ఆమె ఈ విడి ఈకలతో పైకి తీసికొనిపోయినయెడల అవి వాటి మెడను విరిచివేయునని ఆమెకు తెలియును.

మరియు నేను మీకు చెప్పుచున్నాను, పెంతెకొస్తు సంఘము గనుక సరైన శుద్దీకరణ లేకపోయినయెడల, వారు కూడా వారి మెడలను విరుచుకొనెదరు. మీరు దానిని గుర్తుంచుకొనుడి. అక్కడ అనేక విడివిడిగా నుండు ఈకలు కలవు. సంగతి అదే.

61

ఆమె ఏమి చేయునో మీకు తెలియునా? ఆమె ఆ గూటి పైకెక్కి మరియు ఆమె తన పెద్ద రెక్కలను ఆ విధముగా దానిపై విసరును. ఓ, మీరు ఇదివరకు ఈ విమానమునకు వెనుక నిలువ లేదు. బలమైన గాలి ఆ ఈకల ద్వారా వీయబడినప్పుడు, ఆ చిన్న పిల్లల విడిగానున్న ఈకలు ఎగిరిపోవును, మీరు దాని కనుగొనగలరు... నేను మీకు చెప్పుచున్నాను, కార్యము గూటిని కదిలించు ఒక బలమైన గాలి సంఘమునకు అవసరమై యున్నది, పెంతెకోస్తు సంఘము నుండి ప్రపంచమంతటిని కదిలించగల బలమైన గాలి అవసరమై యున్నది, అక్కడ అప్పుడు మనము ఒంటరిగా ఉండుటకు.

ప్రాచీన కాలపు సువార్త, పరిశుద్ధాత్మ, దేవుడు పంపించు ఉజ్జీవము మనకు ఇంకొకటి అవసరమై యున్నది. అది ఖచ్చితముగా సరియే. మనకు నూతన అధ్యకుడు అవసరము లేదు. మనకు ఒక చక్కనివాడు ఉన్నాడు. మన నగరమునకు క్రొత్త మేయర్లు అవసరము లేదు. ఏది ఏమైనను, ఇప్పుడు అది వారియొక్క పని కాదు. అయితే పరిచారకులుగా మనకు కావలసినది సువార్తను ప్రసంగించుట మరియు పెంతెకోస్తునకు సంఘమును మరల తీసికొని వచ్చుట, పక్షిరాజు అనుభవమునకు తిరిగి తీసికొని వచ్చుట. అదియే సంఘమునకు కావలసియున్నది. ఓ, ఊరక మీరు కోడి పిల్లలుగా నుండనక్కర లేదు. మీరు పక్షిరాజులు. మీరు పక్షిరాజు ఆహారమును తీసికొనవలయును.

62

మరిక్కడ ఆ తల్లి పక్షిరాజు కూర్చొని ఆ చిన్న పాత ఈకలనన్నిటిని ఎత్తి వేయుచున్నది. ఏలయనగా, ఆమె గనుక దానిని చేయనియెడల.... అవి ఎగురుటకు కావలసిన ఈకలు లేనియెడల, మరియు ఆ చిన్న లేత ఈకలన్నియును వాటినుండి రాలిపోవు వరకు ఆమె వాటిని తీసికొని వెళ్ళదు. పిదప ఆమె అచ్చటికి వచ్చి మరి ఆమె కేకలేయును. ఆమె అప్పుడు వాటికి కొంత అనుభవమును ఇచ్చుటకు సిద్దపడును. ఆమె తనయొక్క గొప్ప పెద్ద పధ్నాలుగు అడుగుల రెక్కలను విప్పారును. ఆ చిన్న పక్షిరాజులు అచ్చటికి వెళ్లి మరి దానిపై కెక్కును. అప్పుడు ఆమె వాటిని తీసికొని వెళ్ళును, ఏలయనగా ఆ చిన్న పక్షిరాజు పిల్లలు ఆమె స్వరమును వినియున్నవి. ఆమెపై ఆధారపడుటకు వాటికి తెలియును.

ఆమె చెప్పును, “ఇప్పుడు పిల్లలారా, నేను మిమ్ములను, మీరు ఒంటరిగా ఎగురుటకై తీసికొని వెళ్ళుచున్నాను. ప్రతి పక్షిరాజు పిల్లయు తనయొక్క చిన్న పాదముతో ఆ రెక్కలను పట్టుకొని తన చిన్న ముక్కుతో ఆ ఈకలను గట్టిగా పట్టుకొనును. అప్పుడు అవి క్రింద పడిపోవు. తనయొక్క రెక్కలలో గల ఈకలలో గల శక్తి ద్వారా అది యాభై పక్షిరాజు పిల్లలను పట్టుకొని తీసికొని వెళ్ళగలదు. పక్షిరాజు పిల్లలు ఈకలను ఆ విధముగా పట్టుకొనును మరియు తల్లి తనయొక్క రెక్కలను ఆ విధముగా పైకి లేపి, బండనుండి ఎగిరిపోవును. ఇక్కడి నుండి ఆమె పైకి వెళ్ళిపోవును, పైకి ఎగిరి, పైకి పైకి ఇంకా పైకి ఎగిరి నీలి ఆకాశములో చాలా ఎత్తుకు ఎగిరి పోవును. ఆ చిన్న పక్షిరాజు పిల్లలు ఆ చోటికి అంతవరకు వెళ్ళలేదు. ఓ, వారు ఒక చక్కని అద్భుతమైన సమయమును పొందుకొనుచున్నారు.

63

ఆమె చేయు మొదటి కార్యము ఏమని మీకు తెలియునా? ఆమె తనపై నున్న ఆ పిల్లలన్నింటిని విదిలించి వేయును. అవి పక్షిరాజాలు, వాటికి ఎటు ఎగరవలయునో తెలిసియుండవలయును. అది ఖచ్చితముగా సరియే. ఆ పిల్లలు వాటంతట అవే వాటిని గమనించుకొనునట్లుగా ఆమె వాటిని విదిలించి వేయుచున్నది. ఎందుకని, ఆ చిన్న వాటిలో కొన్ని.... ఆమె కేకలు వేయుచున్నది, “పిల్లలారా, ఫరవాలేదు, మీరు పక్షిరాజులు. ఎగురండి!”

“మంచిది, నేను ఈ సంఘమునకు చెందినవాడను, నాకు దానిని గురించి ఏమీ తెలియదు,” అని మీరు చెప్పువరకు మీరు ఎగరలేరు. మీరు ఆకాశము నుండి ఒకసారి విదిలింపబడవలయును. ఆ చిన్న పక్షిరాజు పిల్లలు ఎగురుటకు ప్రారంభించినవి. ఆమె కేకలేయుచున్నది, “పిల్లలారా, మీ రెక్కలను ఆడించుడి. మీ యొక్క విశ్వాసమును క్రిందికి పైకి కొట్ట౦డి. మీరు ఇప్పుడు ఉన్నతమైన స్థలములలో యున్నారు గనుక మీరు క్రిందపడి భూమిని తాకలేరు.”

ఏమిటని మీకు తెలియునా? పిదప ఆమె ఏమి చేయును; ఆమె ఒక ప్రక్కకు వెళ్లి మరి వాటిని గమనించును. ఆమె వాటిచుట్టూ తిరుగుచుండును. కొట్టుచు వారు చేయగలిగినదంతయును చేయుచున్నారు. వారు దేనిని గురించి బాధపడుట లేదు. మరి అక్కడే వారి దగ్గరనే యుండి మరి వారిని గమనించుచున్న వారియొక్క తల్లిపై వారికి ప్రగాఢ నమ్మకమున్నది. మరి సంఘము ఏమి చేయవలసి యున్నది.

64

మరి ఆ చిన్న పక్షిరాజు పిల్లలలో ఒకటి గనుక దారి తప్పి, అదుపును కోల్పోయి పడిపోవుచున్న యెడల, ఆమె తనయొక్క పెద్ద రెక్కలతో ఆ చిన్న పక్షిరాజును పట్టుకొని తీసికొని మరల కృపతో మోసికొనిపోవును. (ఇప్పుడు ఇది బాప్తిస్టు బోధ కాదు, అది బైబిలు.) కావున అతనిని తిరిగి పైకి తీసికొని వచ్చును, తిరిగి అతనిని విదిలించును, అతను తిరిగి నూతనముగా ఎగురుటకు ప్రారంభించునట్లుగా చేయును. ఆమేన్.

ఆ పక్షిరాజు పిల్లలకు వారి తల్లిపై నమ్మకము కలదు, ఆ తల్లి వారికి సహాయపడి వారు పడిపోయినను వారిని లేవనెత్తి తిరిగి మోయునని వారికి గాఢమైన నమ్మకము కలదు. వారిని ఆ పక్షిరాజు రెక్కలపై మోసికొని వెళ్ళి మరి పైకి వారిని తీసికొని వెళ్ళి, మరల వారిని విదిలించి వేయును, అతను మరల ప్రారంభింప నిమ్ము. “నేను గనుక పడిపోయినయెడల లేక నేను గనుక ఓడిపోయినయెడల, నేను మరల లేచి ప్రయత్నింపనిమ్ము, ఓ, ప్రభువా.”

మరల వెళ్ళండి. దేవుడు మిమ్ములను మరల లేవనెత్తి పైకి తీసికొని వెళ్ళి, మరల వదలి వేయును, విదిలించును. మీకు మీరు పడిపోకుండా అదుపును కోల్పోకుండా నుండుటకు ప్రయత్నించుడి. మీరు ముందుకు సాగిపోండి. మీరు ఎగురుటకు తెలిసికొనువరకు రెక్కలు కొట్టుకొనుడి. ఓ, మై! దీన వృద్ద కోడికి దానిని గురించి ఏమియూ తెలియదు. దానిని గురించి అతనికి ఏమియూ తెలియదు, ఏలయనగా అతను దీనికి ముందు పైకి వెళ్ళిన అనుభవము లేదు, అతని పితరులు అతనికి మునుపున్న వారు కూడా పైకి వెళ్ళలేదు. అతనికి తెలిసినదంతా సంఘములో చేరుట మరి ధాన్యపు కొట్టునొద్ద నుండుటయే. దానికంటే ఇంకా ఎక్కువ అతనికేమి తెలియదు

65

ఒకసారి ఒకతను గ్రుడ్లను పొదుగుటకై ఒక కోడిని ఏర్పరచెను, మరి అతనికి తగినంత గ్రుడ్డు దొరుక లేదు; కావున అతను ఒక పక్షిరాజు గూటిని కనుగొని మరి పైకెక్కి పక్షిరాజు గ్రుడ్డును తీసికొని మరి దానిని కోడి క్రింద పొదుగుటకై నుంచెను. మరియు ఆ గ్రుడ్డు పొదిగి పగిలి పిల్లలు బైటికి రాగా, ఆ పక్షిరాజు పిల్ల తక్కిన కోడి పిల్లలతో పోల్చిచూడగా వింతగా కనిపించుచుండెను.

మరి ఆ విధముగానే జరుగును; పొదిగించినపుడెల్లను ఆ విధముగానే సంభవించుచుండును. అది సత్యము.

మరిక్కడ అతను వింతగా కనిపించుచున్న చిన్న పిల్ల. కోడి యొక్క కేకలను గురించి అతనికి తెలియనందు వలన దానిని అతను అర్ధము చేసికొనలేకపోయెను. ఆ పెద్ద కోడి ఆ కొట్టు దగ్గర మరియు ఎరువులు దిబ్బ యొద్ద నుండి, “మనకు ఈ రోజు రాత్రి ఒక విందు కలదు. మనము దీనిని చేయబోవుచున్నాము,” ఈ విధముగా, “క్లక్, క్లక్, క్లక్ అనే శబ్దముతో, అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి, దైవిక స్వస్థతయను నటువంటి కార్యము లేనే లేదు, క్లక్, క్లక్, క్లక్, క్లక్,” అని అరచుచు, ఆ చెత్తను తినుచు ఆ పాత విందులు, వేడుకలు, వినోదములు మరియు అర్ధనగ్నముగా వస్త్రములను తీసివేసి, నాట్యమాడుచు మొదలగు కార్యములు చేయుచు, టెలివిజన్ చూస్తూ అటువంటి బుద్ధిహీనతయైన కార్యకలాపములు చేయుచున్నారు. ఆ చిన్న పిల్ల ఒక పక్షిరాజు. దానికి ఈ కార్యములతో పొత్తు కుదరలేదు. వాటి వాసన చూడగానే దానికి వాంతి వచ్చుచున్నట్లుగుచున్నది. మరియు అతను, “మై నేను దానిని చేయలేను.” ఆ చుట్టూ నడచుచు మరి చూచుటకు వింతైన చిన్న పక్షిగా నుండెను.

ఆ కోడి చెప్పెను, “ఓ, ప్రియమైనదానా రమ్ము, ఈ రాత్రి మేము ఒక పెద్ద విందును జరిపించబోవుచున్నాము, మరియు మేము పంచబోవుచున్నాము....”

అయితే ఆ పక్షిరాజుకు అదంతా అక్కర లేదు. అతను ఆ చుట్టూ తిరుగుచు మరి తలంచెను, “ఏమిటిది? ఏల నేనిక్కడ ఒక వింత పక్షిగా కనిపించుచున్నాను.”

66

మరియు ఒక కార్యమును నీకు చెప్పెదను సహోదరుడా, ఒక వ్యక్తి గనుక దేవుని యొక్క బిడ్డగా జన్మించినయెడల పాత శాఖలు, సంఘ సంస్థలు అతనికి తృప్తినివ్వవు! లేదయ్యా. ప్రపంచపు కార్యములు: బాస్కెట్ బాల్ ఆటలు మరియు విందులు, వినోదములు మరియు పేకాటలు మరియు ఈ రకమైన కార్యకలాపములు ఈ దినమున మన నవీన సంఘములు చేయుచున్నవి, వారు దేవుని దుఃఖపరచుటలో ఆశ్చర్యము లేదు, “దేవుడెక్కడ?” వారు దేవుని దుఃఖపరచి వారియొద్దనుండి దూరముగా ఆయనను త్రోసివేసిరి. అది ఖచ్చితముగా సరియే. అవునయ్యా.

కోడి పిల్లలకు ఆ విధమైన కార్యములు ఇష్టము, అయితే పక్షిరాజుకు కాదు. అది పక్షిరాజు ఆహారము కాదు.

67

ఇక్కడ అతను చుట్టూ తిరుగుచున్నాడు, మరియు వారందరూ చుట్టూ చూచుచున్నారు; మరి వారు ఈ స్థలమునకు పరుగెత్తుచు వచ్చి మరియు పెంట కుప్పలను గెలుకుచూ, మరియు దానిపైనే నడుచుచూ దానినే తినెదరు. హుమ్మ్! “మంచిది, రమ్ము, రమ్ము. మాతో కలువుము.” అయితే అతను వేరుపరచబడిన వ్యక్తి. అవునయ్యా. ఆ విధమైన ఆహారము అతనికి అక్కర లేదు. అది అతనికి నచ్చదు; అది సరియని అనిపించ లేదు; అక్కడ సరియైన వాతావరణము చుట్టు ప్రక్కలు లేవు. అతను దానిని ఇష్టపడుట లేదు. “వద్దు, వద్దు,” అని అతను చెప్పెను.

68

మరియు ఒక రోజు వృద్ద తల్లి పక్షిరాజు ఆ పిల్ల పక్షిరాజు కొరకు వెతకుచు వచ్చెను. ఆయన నా కొరకు వచ్చుట కొరకు నేను చాలా ఆనందించుచున్నాను. ఆ తల్లి పక్షిరాజు ధాన్యపు కొట్టుపై ఎగిరి చూచి అక్కడ క్రిందకు చూచి మరి అతను అక్కడ తన చిన్న పిల్లను కనుగొనెను, మరియు ఆ తల్లి పక్షిరాజు అరచెను. ఆ తల్లి పక్షిరాజు చెప్పెను, “ప్రియమైనదానా! నీవు ఒక కోడి పిల్లవు కావు! నీవు నాకు చెందినదానవు!” అతను ఆ స్వరమును వినినప్పుడు అతను పైకి చూచెను. ఆ ధ్వని చక్కగా యుండి స్పష్టముగా ధ్వనించెను. దాని స్వభావము ఒక పక్షిరాజు. అతని స్వభావము...

“యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా నున్నాడు.”

“ఆమేన్!” అతను తిరిగి అరచెను.

“లోకమును లేక లోక కార్యములను ప్రేమింపవలదు. మీరు గనుక ప్రేమించినయెడల దేవుని ప్రేమ మీలో యుండదు.”

“ఆమేన్,” అతను చెప్పెను, “అది స్పష్టముగా ధ్వనించుచున్నది.”

“నేను తిరిగి వచ్చునప్పుడు ప్రియమైన దానా! నీవు ఎగుర వచ్చును. నీవు చేయవలసిన ఒకే కార్యము నీ యొక్క చిన్న విశ్వాసమనే రెక్కలను కొట్టుకొనవలయును. నేను నిన్ను పైకి తీసికొని వెళ్ళెదను.”

“దీనినుండి నేను ఎటు బయటికి రాగలను, తల్లీ?”

“నీ రెక్కలను మాత్రము కొట్టుము, అది మాత్రము చాలును. నీవు బయటికి రాగలవు. నీ యొక్క విశ్వాసమును ఆధారము చేసుకొని మరి దానిపై నిలుచుకొనుము; విశ్వాసమును కొట్టుచు యుండుము, ఏలయనగా నీవు ప్రారంభము నుండి ఒక పక్షిరాజువు! నిశ్చయముగా. నీవు ప్రారంభము నుండి ఒక పక్షిరాజువు. నీ యొక్క రెక్కలను కొట్టుము.”

69

ఆమె దానికి పైగా ఎగురుచు నుండెను. “నీ వున్న చోటు నాయొక్క బిడ్డగా నీవు కనిపించుచున్నావు.” మరియు ఆ చిన్న పక్షిరాజు పిల్ల తనయొక్క కాళ్ళతో ఎగిరి మరి నాలుగు లేక ఐదు సార్లు పైకి క్రిందికి ఎగురుచు నుండెను, మీకు తెలియునా, అది తనయొక్క చిన్న చేతులను కొట్టినట్లు లేక రెక్కలను ఒక్కటిగా కొట్టుచున్నది. మొదలు అది చేసిన కార్యమేమిటో మీరెరుగుదురా, అది తనయొక్క కాళ్లను నేలపై నుండి తీసివేసెను.

అయితే అది ఏమి చేసినది తెలియునా? ఈ చిన్న పక్షిరాజు ధాన్యపు కొట్టులోనున్న స్తంభము పైకెక్కి కూర్చొనెను, ఒక పెద్ద పెంతెకోస్తు సంఘ శాఖ మధ్యలో నుండెను. ఏమిటని మీకు తెలియునా? తల్లి పక్షిరాజు మరల దాని చుట్టూ తిరిగెను. ఆ తల్లి పక్షిరాజు దానివైపు చూచెను, ఆ పిల్ల పక్షిరాజు వెంట్రుకలు కత్తిరించుకొని, ముఖమునకు రంగు వేసికొని యుండెను. “ప్రియమైన దానా, నీవు ఒక పెంతెకోస్తు డేగవలె కనిపించుచున్నావు, పెంతెకోస్తు పక్షిరాజువలె లేవు; నిన్ను నీవు ఇంకొద్దిగా కడుగుకొనవలయును, లేనియెడల నేను నిన్ను తీసికొనిపోలేను,” అని చెప్పెను. అది నిజము!

70

నేను మీ యొక్క మనస్సులను నొప్పింపవలయునని కాదు గాని, అయితే నీ యొద్దనున్న కొన్ని కార్యములను నేను కత్తిరింపవలయును. నేను మీకు చెప్పనిమ్ము, సహోదరుడా; పెంతెకోస్తు సంఘమునకు అవసరమైన కార్యము ప్రసంగ పీఠము నుండి కుర్చీ వరకు శుద్దీకరింపబడుటయే. అది ఖచ్చితముగా నిజము. హృదయ భారమును ప్రక్కకు పెట్టి. మనకు ఉజ్జివపు కూటములు లేకుండ నుండుటలో ఆశ్చర్యము లేదు - రాబందు యొక్క కార్యములను తినుచు, ప్రార్ధనా కూటముల ఆరాధనకు పోవుటకు బదులుగా, ఇంటిలోనే యుండి రాత్రులలో ఇష్టమైన కొన్ని టెలివిజను కార్యక్రమములను చూస్తూ, ఈ పాతవాటిని ధరించుకొని... స్త్రీలు ఈ దుస్తులను ధరించుకొని మరియు పురుషులు యధాప్రకారముగానే మద్యమును త్రాగుచు మరియు అసభ్యమైన పరిహాసములాడుచూ మరియు మొదలగు కార్యములతో ఒకరి మధ్య ఒకరు పరిహాసములాడుకొనుచూ. పురుషులారా, మీరేమి అనుకొనుచున్నారు? దేవుడు మరి అటువంటి గందర గోళముగానున్న కార్యములలో క్రిందికి దిగి మీ యొద్దకు రాడు.

71

దేశములోనే మీరు గొప్ప పెద్ద సంఘములను కలిగియుండవచ్చు, ఇంత వరకు మీ యొద్ద లేని అధిక ధనమును మీరు కలిగియుండవచ్చు, దానివలన ఏ ప్రయోజనము లేదు. ఎంతో మేధాశక్తిగల సమూహములో మీరున్నట్లుగా మీరు అనుకొనవచ్చును. మీరు మంచి దుస్తులు ధరించుకొనవచ్చును, కాని సహోదరుడా, దేవుడు ఒక పరిశుభ్రమైన హృదయమును మరియు పరిశుద్దమైన చేతులను కలిగియుండవలయునని కోరుచున్నాడు. శుద్దీకరించిన సంఘమునే ఆయన కోరుచున్నాడు. పిదప ఆయన తననుతాను చూపించుకొనగలడు. దేవుడు గనుక ఆయన యొక్క గొప్ప రెక్కలను విప్పారి మరియు ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా నున్నాడని ఆయన యొక్క శక్తిని గనుక చూపించినయెడల, పక్షిరాజు అప్పుడు, “అవును ప్రభువా, దానినే నేను కోరుకొనుచున్నాను. దానికొరకు నేను పోరాడుచున్నాను. దానియొద్దకు నేను వచ్చుచున్నాను,” అని చెప్పును, నిశ్చయముగా. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా నున్నాడు.

72

మై, మన సమయము ఎట్లు వేగముగా గతించిపోవుచున్నది? ఇప్పుడు నేను ఇంకా ప్రసంగిస్తూనే ఉండాలనే అనుభూతిని పొందుచున్నాను. ఓ, పెంతెకోస్తు సంఘమునకు అవసరమైనది ఏమనగా, శుభ్రము చేయబడవలసియున్నది! దానిని కడుగుట అవసరము. దానికి ఒక శుభ్రముచేయు కార్యము, ఒక శుద్దీకరణ అవసరమై యున్నది. జనులారా, మీరు లోకమునకు చెందినవారు కారు. మీయంతట మీరే ఇతరులవలె మాదిరిగా వారిని మీరు అనుసరించ వద్దు. సినిమా తారలను మాదిరిగా అనుసరించుటకు మీరు ప్రయత్నించ వద్దు. నీవు ఒక దేవుని కుమార్తెవు. నీవు ఒక దేవుని కుమారుడవు. మాట్ డిల్లన్ లేక వేరేవరోవలె నుండుటకు ప్రయత్నింప వద్దు. పీబాడి ఎర్నీ లేక అతని పేరు ఏమో లేక ఆ వ్యక్తులవలె నుండుటకు ప్రయత్నింపవద్దు. లోకములోని కార్యములను ప్రేమింపవద్దు. మీరు గనుక లోకమును లేదా లోకములోని కార్యములను ప్రేమించినయెడల, దేవుని ప్రేమ మీలో లేనే లేదు. సహోదరుడా, అది నిన్ను బాధపెట్టుచున్నదని నేనెరుగుదును. అది మిమ్మల్ని బలహీనులుగా చేయును.

73

దక్షిణ ప్రాంతమునకు చెందిన నా దీన వృద్ద తల్లి నాకు చెప్పుట అలవాటు... చిన్న పిల్లలమైన మేము అందరము శనివారము రాత్రి వచ్చెదము మరియు అక్కడ ఒక పెద్ద చెక్క తొట్టె యుండును మరి మా తల్లి దానిలో నీళ్ళ పోసి మాకు స్నానము చేయించును. మరియు మా పదిమందిలో నేనే చివరగా స్నానము చేయుదును మరియు అదే తొట్టిలో నేను చివరగా స్నానము చేసేవాడిని, కొద్దిగా దానిని వేడి చేసెడివారు. మరియు అటు పిదప నా తల్లి నన్ను తీసుకోనిపోవును.... మేము చాలా పేదవాళ్ళము, మేము - ఆమె పాత జంతువు యొక్క మాంసపు చర్మమును తీసుకొని, దానినుండి క్రొవ్వును తీయుటకు దానిని ఎండలో ఎండ వేసెడిది. క్రొవ్విన వెన్నను కొనుటకు మాకు స్తోమత లేదు. మరి అందువలన ఆమె దానినుండి క్రొవ్వును తీసి మరి రొట్టెలపై పూయును; మరియు మాకు నల్లగా నుండు బఠాణీలు, పచ్చటి ముల్లంగి (దుంప) మరియు ధాన్యపు రొట్టెలు ఆహారముగా భుజించుటకు యుండెడివి.

74

మరియు మాకు అలెర్జీ అయినయెడల, మా తల్లి ప్రతి శనివారము రాత్రి కొద్దిగా ఆముదమును ఇచ్చెడివారు. దాని వాసనయే నాకు ఇష్టముండదు, సహింపలేను. నా యొక్క ముక్కును మూసికొని నా తల్లియొద్దకు వచ్చి చెప్పెదను, “తల్లీ, నాకు వద్దు, వద్దు! నేను దానిని భరించలేను.”

ఆమె నాకు ఒక మంచి మాటను చెప్పుచుండెడిది, “కుమారుడా, అది గనుక నిన్ను ఇబ్బందిపరచక పోయినయెడల, అది నీకు ఏ మంచిని చేయదు.”

మరియు ఆ విధముగానే ఈ వాక్యమును ప్రసంగించుటలో కూడా యున్నది. అది గనుక మిమ్మల్ని ఆ విధముగా బలహీనులుగా చేయునట్టు అనుభూతి నియ్యని యెడల, మీ యొక్క ఆత్మీయ కడుపు నొప్పి అజీర్ణముతో మీకు పనిచేయనియెడల, దానివలన మీకు ఏ ప్రయోజనమును నుండదు. అది నిజము. వాక్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును మరియు బంధకముల నుండి తెంచివేయును.

దానిని మీరు నమ్ముచున్నారా? సంఘమునకు పరిశుద్ధాత్మ యొక్క ఉజ్జీవము అవసరమైయున్నది. ఒక గృహ శుద్దీకరణ దానికి అవసరమై యున్నది. ఇవి పక్షిరాజులు; వాటికి కోళ్ళ యొక్క ఆహారము ఇవ్వవద్దు - అవి పక్షిరాజులు. వాటిని పైకి తీసికొని వెళ్ళుడి, అక్కడ అవి ఎగురును లేకపోతే చనిపోవును. అదంతే. మరియు దేవుడు తన స్వస్థ్యమును గమనించును. ఆయన ఎన్నటికి దూరముగా నుండడు. ఆయన మిమ్ములను పైకెత్తుటకు ఎల్లపుడూ మీకు దగ్గరగా నుండును. దానిని మీరు నమ్ముచున్నారా?

75

ప్రార్ధనకై మనమిప్పుడు మన తలలు వంచెదము. ఇప్పుడు ఎందరు వారిని జ్ఞాపకములో నుంచుకొనవలయునని కోరుకొనుచున్నారు మరి, “ప్రభువా, నాపై దయ కలిగియుండుము. నాకు పక్షిరాజు తలంపుల నియ్యుము. పక్షిరాజు కోరికల నియ్యుము. నాకు పక్షిరాజు జీవితము నియ్యుము. నమ్మువారికందరికి సమస్త కార్యములను సాధ్యములని చెప్పబడు ఆ నీలి రంగు ఆకాశములో నన్ను ఎగురనియ్యుము, ప్రభువా! నాలో విశ్వాసమును కలుగజేయుము. నా యొక్క రెక్కలు ఎదుగనియ్యుము. నేను యేసును నిజముగా చూచువరకు నా యొక్క కండరములు, నా రెక్కల చుట్టును ఎదుగనిమ్ము” అని చెప్పండి. ఓ, దేవుడు మిమ్ములను ఆశీర్వదించును.

76

పరలోకపు తండ్రీ, ఓ, వర్తమానము క్లిష్టముగా ధ్వనించియుండ వచ్చును, ప్రభువా. అయితే మరి అది ఆ విధముగా ఉండాలనే ఉద్దేశ్యము కాదు. అది కొద్దిగా.... ప్రజలు తెలిసికొనుటకు నాకు ఈ ఒక్క మార్గమే కలదు. ప్రభువా, దేనినైతే నేను నమ్ముచున్నానో, అది మీ యొక్క గొప్ప స్వాస్థ్యమును, ఈ గొప్ప పెంతెకోస్తు సంఘమును, వారిని పొందుకొనుటకై సంఘమును కదిలించుటకు నీవు ప్రయత్నించుచున్నావు. గొప్ప సంఘము అది ఉన్న విధముగానే, సమస్త విధములగు సూచనలతోను, మరియు అద్భుత కార్యములతోను మరియు సమస్త విధములగు వరములతో వారిచుట్టూ నీవు వారిని కదిలించినను, కొన్నిసార్లు వారు కోళ్ళవలె వెనుకనే యుంటున్నారు. ఓ, దేవా వారు పక్షిరాజులని వారు గ్రహించుకునేలా చేయుము; వారు ఎగురగలరు. వారు వారియొక్క విశ్వాసమును తీసికొని మరి దానినుండి దూరముగా ఎగిరిపోవుదురు గాక. “అది జరుగదు. దానిలో కార్యమును లేదు,” అను పాత సామెత నుండి దూరముగా వెళ్ళుము.

ఓ, దేవా, ఈ మధ్యాహ్నము ఇక్కడ యుండు ప్రతియొక్కరిని మీరు ఆశీర్వదింపవలయునని నేను ప్రార్ధించుచున్నాను మరియు వారిలో ప్రతి యొక్కరును యెహోవా యొక్క రెక్కల క్రింద దానికి సమీపముగా ఎగురుచు నుండునట్టుగా చేయుము. తండ్రి, దానిని అనుగ్రహించుము. మీ కుమారుడైన యేసు నామములో నేను వారిని మీకు సమర్పించుచున్నాను. ఆమేన్.

77

ఆయన ఏమి చేయుచున్నాడో ప్రభువైన దేవునికి సంబంధించినది. ఇప్పుడు మనకు ప్రార్ధనా వరుస కలదు. కావున మనము ఇచ్చటినుండి బయటికి వెళ్ళవచ్చును... ఈ రాత్రి మీరు సంఘమునకు వెళ్లవలయునని నేను మిమ్ములను కోరుచున్నాను. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక. మీరు ప్రభువును ప్రేమించుచున్నారా? ఆమేన్. మనము మరియొక సారి పాడెదము, కావున టుల్సా లోనున్న ఈ పెద్ద గుంపు పాడుట నేను వినగలను

నేను ఆయునను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను,

ఏలయనగా ఆయన నన్ను మొదటగా ప్రేమించెను,

నాయొక్క రక్షణను

కల్వరి వృక్షము పై కొనెను.

ఆయనకు వినపడునట్లు చేసెదము. వర్తమానము ముగింపబడి యున్నది. ఆయనను మనము ఆరాధించెదము.

నేను ఆయనను ప్రేమించుచున్నాను,

ఏలయనగా ఆయన నన్ను మొదటగా ప్రేమించెను.

మరియునా యొక్క రక్షణను

కల్వరి వృక్షముపై కొనెను.

ఇప్పుడు, జనులు నిశ్శబ్దముగా యుండు ఈ సమయమున మనము మన తలలు వంచి మరి మన చేతులను పైకెత్తెదము.

నేను ఆయనను ప్రేమించుచున్నాను,

నేను ఆయనను ప్రేమించుచున్నాను

(సన్నిహితముగా ఆకర్షించుకొనుము, ప్రభువా.)

ఏలయనగా ఆయన నన్ను మొదటగా ప్రేమించెను.

మరియు నా యొక్క రక్షణను

కల్వరి వృక్షముపై కొనెను.

78

[సహోదరుడు బ్రెన్హాం తనలోతాను పాడుకొనుచున్నారు] అదేమిటి? 100 లేక 50? 50? మీలో ఎవరియొద్ద 1వ సంఖ్య ప్రార్ధనా కార్డు కలదు, మీ చేతులను పైకెత్తుడి. ప్రార్ధనా కార్డు సంఖ్య 1 మీకు గనుక వీలైనయెడల లేచి నిలువుడి. హెచ్ - హెచ్- సంఖ్య 1, మీ చేతులను పైకెత్తుడి. ప్రార్ధనా కార్డు సంఖ్య 1, లేచి నిలువుము . మీరు గౌరవింపదగిన స్త్రీయా? హెచ్ - సంఖ్య - 1, ఇచ్చటికి రమ్ము హెచ్ సంఖ్య - 2.

79

...తప్పిపోయిన ఇశ్రాయేలు యొక్క గొర్రెలు. అది నిజమేనా? ఇప్పుడు, భూమిపై ఎన్ని జాతులకు చెందిన జనులు యున్నారు? మూడు వంశములకు చెందినవారు షేము, హాము, యాపెతు వారి యొక్క జనులు. ఇప్పుడు వారె యూదులు, అన్యజనులు మరియు సమరియులు, అది సగము యూదులు మరియు అన్యజనులు. మీరు గమనించితిరా? పెంతెకోస్తుకు తాళపుచెవులను యేసు పేతురుకు ఇచ్చెనని ఎందరికి తెలియును? మునుపు... అది నిజము. రాజ్యపు యొక్క తాళపు చెవులను యూదులకు అతను యెరూషలేములో తెరచెను. అది నిజమేనా?

ఫిలిప్పు అచ్చటికి వెళ్లి మరి సమరయలో వారికి బాప్తిస్మమిచ్చెను. పరిశుద్ధాత్మ వారి పైకి రాలేదు, ఏలయనగా పేతురు తాళపుచెవులు కలిగియుండెను మరి అతను వచ్చి తన చేతులను వారిపై నుంచగా సమరయులు పరిశుద్ధాత్మను పొందిరి. అది నిజమేనా? కొర్నేలి ఇంటియందు పైన అచ్చటికి ఎవరు పిలుచుటకు పంపబడిరి? పేతురు. మరప్పటినుండి దానిని గురించి ఏమి చెప్పబడలేదు. సమస్త సంతతికి.... సమస్త వంశములకు సువార్త తెరువబడెను: షేము, హాము, మరియు యాపెతు జనులు.

80

ఇప్పుడు, మీరు గనుక గమనించినయెడల.... మీరు గమనింపవలయునని నేను కోరుచున్నాను. ఇప్పుడు అక్కడ రెండు రకముల తరగతులైన జనులున్నారు, రెండు వంశములు ఒక మెస్సీయా కొరకు ఎదురు చూచుచున్నారు. అదెవరు? అదెవరు? యూదుడు మరియు సమరయుడు. అయితే అన్యజనులు, మనము ఆంగ్లో సాక్సెన్లము. మనము దుడ్డుకర్ర మన వెనుక నుంచుకొని ఒక విగ్రహమును ఆరాధించుచుంటిమి. మనము ఏ మెస్సీయా కొరకును ఎదురు చూడలేదు.

ఇప్పుడు, నేను గనుక ఇప్పుడు, మీ యొక్క ధ్యాసను ప్రార్ధనా వరుసను సిద్దపరచువరుకు నేను అదుపులో ఉంచకలిగినట్లైతే, కావున వారందరును వరుసలోనికి వచ్చుటకు సిద్దముగా నుండెదరు.

81

ఇప్పుడు, మనము ఏ మెస్సీయా కొరకు మనము ఎదురు చూచుట లేదు, కావున మనము ఎవరిని గైకొనలేదు. కావున పిదప, అయితే ఇప్పుడు, ఆయన కొరకు ఎదురు చూచువారికి, ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఇప్పుడు, దానిని ఎందరు నమ్ముచున్నారు?

ఇప్పుడు, వారు వారి మెస్సీయాను నిరాకరించిన పిదప, అప్పుడు... గుర్తుంచుకొనుడి, ఆయన యూదుల కొరకై వెళ్ళెను. ఆయన ఎటువంటి ఒక సూచనను చూపించెను? ఆయన వారియొక్క హృదయ రహస్యములను ఎరిగియున్నాడు. ఇప్పుడు ప్రామాణికమైన సంఘము ఆయనను గురించి ఏమి చెప్పెను? “ఆయన బయల్జెబూబు, ఒక సోదె చెప్పువాడు,” అని చెప్పెను.

యేసు చెప్పెను, “దాని నిమిత్తము నేను మిమ్ములను మన్నించెదను; అయితే ఒక దినమున పరిశుద్ధాత్మ అదే కార్యమును చేయుటకు వచ్చును, మరియు దానికి విరుద్దముగా మాటలాడు వారికి ఈ లోకములోను మరియు రానున్న ప్రపంచములోను వారికి మన్నింపబడదు.” అది సరియేనా?

82

ఇప్పుడు గమనించుడి. ఆయన ఆ సూచనను యూదులకు ముందే చేసెను; ఆయన సమరయులకు దానిని చేసి చూపించెను, అయితే అన్యజనులకు చేయనే లేదు. మీరు ఆ విధముగా ఒకదానిని కూడా కనుగొనలేరు. లేదయ్యా. అయితే ఆయన విడిచి వెళ్ళుటకు ముందు... ఇప్పుడు ఆయన స్త్రీకి చెప్పెను.... ఇప్పుడు, ఈ స్త్రీని గమనించుడి, ఆ వ్యభిచారిని, మనము ఆ విధముగా ఆమెను పిలుచుచున్నాము. అమెరికా సంయుక్త రాష్ట్రములలోనున్న సగము మంది ప్రసంగికులకన్నా ఆమెకు దేవుని గురించి ఎక్కువగానే ఎరిగియున్నది. అది నిజము. వారు ఎంతో బుద్ధి కుశలతగలవారై యున్నందువలన, వారు ఒక సహజాతీతమైన ఆత్మకు వారియొద్ద స్థలము లేదు. వారిలో అనేకులు మంచి క్రైస్తవులు గలరు, సహజాతీతమైన సహోదరులు గలరు, అయితే వారిలో కొందరు ఇంకను కోడి పిల్లలుగానే నున్నారు.

83

పిదప, ఆమె అచ్చటికి వచ్చెను. మరియు ఆ చిన్న స్త్రీ.... ఆయన శిష్యులను పంపివేసి సమరయ జనులు ఎదురు చూచుచున్నందు వలన అచ్చటికి వచ్చి అచ్చట కూర్చునెను.... మెస్సీయా కొరకు సమరయులు ఎదురుచూచుచున్నారని ఎందరెరుగుదురు? దానిని మీరు నమ్ముచున్నారా? మంచిది, నేను మీకు పరిశుద్ద, యోహాను 4ను చూపించెదను. ఇప్పుడు ఒక స్త్రీ బావియొద్దకు వచ్చినది, సమరయ స్త్రీ. ఆయన చెప్పెను... [ప్రార్ధనా వరుసను పిలచుచుండెను].

84

ఇప్పుడు, గమనించుడి, ఆయన బావియొద్దకు ఆ దినమున వెళ్లి మరి అచ్చట కూర్చొండెను మరియు శిష్యులు భోజన పధార్థములు కొని తీసుకొని వచ్చుటకై నగరములోనికి వెళ్ళిరి. వారు వెళ్ళిన సమయమున చూచుటకు చక్కనిదైన ఒక స్త్రీ ఒక కుండ తన తలపై పెట్టుకొని నడచుచు వచ్చెను. మరియు ఆమె నీరు చేదుకొనుటకై ఆ రాట్నమును క్రింద దించెను మరి, “నాకు దాహమునకు ఇమ్ము,” అని ఎవరో అడుగుట ఆమె వినెను. అప్పుడామె తిరిగి చూచి మరి ఒక యూదుని చూచెను. ఆయనకు ముప్పది సంవత్సరములు మాత్రము ఉండవచ్చును, అయినను ఆయన యాభై సంవత్సరముల వయస్సుగల వానివలె లేఖనములు చెప్పుచున్నవి. ఎందరికి అది తెలియును?

“నీకింకను ఏబది సంవత్సరములు కూడా లేవే మరియు నీవు అబ్రాహామును చూచినావని చెప్పుచున్నావు.

“ఆయన చెప్పెను, ”అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నాను.“ అది నిజము.

కావున వారు చెప్పిరి, “నీకింకను యాబై సంవత్సరములు కూడా నిండ లేదే.”

85

మరి అక్కడ ఆమె బావియొద్ద యుండెను. మరక్కడ యేసు బాగుగా కనిపించునట్టుగా అక్కడ బావి యొద్ద కూర్చు౦డి మరి, “నాకు దాహమునకు నీళ్ళు ఇమ్ము,” అని ఆయన అడిగెను. (దక్షిణ ప్రాంతములో నలుపువారు తెలుపువారు అని బేధములున్నట్లుగా వారికి అక్కడ బేధములుండెను.)

ఆమె చెప్పెను, “యూదుడవైన నీవు ఒక సమరయ స్త్రీని దాహమున కిమ్మని అడుగుట ఇచ్చటి వాడుక కాదు.”

“స్త్రీ [నేను మీకు చెప్పునది మీరిప్పుడు వినండి. మీరు దానిని వదిలి వేయుదురు.] ”స్త్రీ, మాటలాడుచున్నదెవరని నీవు గనుక ఎరిగినట్లైతే నీవు నన్ను దాహమునకిమ్మని అడుగుదువు. మరియు నీవు ఇక్కడికి వచ్చి నీళ్ళు చేదుకొనకుండునట్టు నేను నీకు నీళ్ళు ఇచ్చెదను,“ అని ఆయన చెప్పెను.

ఆమె చెప్పెను, “ఈ బావి చాలా లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే.” మరటు పిదప ఆ విధముగా సంభాషణ కొనసాగినది. ఆయన ఏమి చేయుచున్నాడు? ఆమె ఆత్మను తాకుచున్నాడు. అదే కార్యమును నేను ఇప్పుడు మీ యెడల చేయుచున్నాను, మీ యొక్క దృష్టిని పట్టుకొనుటకు ప్రయత్నించుచున్నాను.

86

ఆయన అడిగెను, “నాకు దాహమునకిమ్ము.” ఆమె యొక్క వ్యాకులమును కనుగొను వరకు ఆ సంభాషణ కొనసాగెను. అదేమిటిని ఎందరికి తెలియును? ఆమె వ్యభిచారములో జీవించుచుండెను. కావున “నీవు వెళ్ళి, నీ భర్తని పిలుచుకొని ఇక్కడికి రమ్ము,” అని ఆయన అడిగెను.

ఆమె చెప్పెను, “నాకు భర్త లేడు.”

ఆయన చెప్పెను, “అది నిజము. నీకు ఐదుమంది భర్తలుండిరి, మరియు ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాడు.”

ఇప్పుడు, ఆ స్త్రీ ఆ స్థితిలో ఆమె జీవించుచు (మనము ఆ స్త్రీని ఒక వ్యభిచారి యనియు, చెడు ప్రవర్తనగల స్త్రీయనియు పిలిచియుండెడివారము), అయితే ఏ లేఖనముల గురించి ఆమె ఎరిగెనో వాటికి ఆమె చెవి యొగ్గినది. ప్రసంగికులు ఆయనను “బయెల్జెబూబు, సోదె చెప్పువాడు, ఒక దయ్యము,” అని పిలిచినప్పుడు, ఆమె ఆయనను ఆ విధముగా పిలువలేదు.

మరియు సోదె చెప్పడమనేది దయ్యము యొక్క క్రియని ఎవరికైనను తెలుసు. కావున సోదె చెప్పుట అనగా ఏమిటి? అది ఒక తారుమారైన ఒక అంశముగా యున్నది.

87

దయ్యము దేనిని సృష్టించలేదు. అతను గనుక సృష్టికర్త అయినయెడల, వాడు తనంతట తానుగా ఒక ప్రపంచమును సృష్టించగలడు. కాని దేవుడు సృష్టించిన దానిని వాడు తారుమారు చేయగలడు. దానిని మీరు గ్రహించితిరా? ఇక్కడ మిశ్రమమైయున్న ఈ జనుల మధ్య ఇది బహిరంగముగా చెప్పునట్టుగా నుండవచ్చును. ఒక వ్యక్తి ఒక స్త్రీని వివాహమాడి, మరి తన భార్యగా అతడు ఆమెతో జీవించును, పడక మాలిన్యము కాకుండ నుండును. అదే చర్య మరి ఇంకొక స్త్రీతో చేసినయెడల, అతను తప్పు చేయుచున్నాడు. చూడుడి, సరైన కార్యమును తారుమారు చేయుట అది. నేనేమి చెప్పుచున్నానో మీరు గ్రహించుచున్నారా? సాతానుడు తారుమారు చేయును. ఒక సోదె చెప్పువాడు దేవుని యొక్క దర్శనమును తారుమారు చేయువాడు, దయ్యము వాడియొక్క పరిధిలోకి వెళ్ళి క్రమమైన దానిని అక్రమముగా మార్చువాడు.

88

మరలు పిదప గమనించుడి, ఆమె ఆయనను ఆ విధముగా పిలువ లేదు. ఆమె చెప్పెను, “అయ్యా, నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను.” ఆమె ఆ విదంగా చెప్పినదని ఎంతమందికి తెలుసు? అనేకమందగు ఆ ప్రసంగీకులు చెప్పినదానికి వ్యతిరేకముగా ఆమె చెప్పెను, “నీవు ఒక ప్రవక్తవని గ్రహించుచున్నాను.” ఇప్పుడు గమనించుడి, వినండి! “మేమెరుగుదుము, సమరయులమైన మాకు ఆ విధముగా బోధించబడియున్నది. మెస్సీయా వచ్చినప్పుడు, ఈ కార్యములన్నియును ఆయన చేయునని మేమెరుగుదుము.” అది మెస్సీయా యొక్క సూచన కాదా? అదియేనా అది? “మెస్సీయా వచ్చినప్పుడు ఆయన ఈ కార్యములు చేయునని, మేమెరుగుదుము; అయితే నీవెవరవు?”

యేసు చెప్పెను, “నీతో మాటలాడుచున్న నేనే ఆయనను.”

ఆమె నగరములోనికి పరుగెత్తికొని వెళ్లి, మరి ఆ వ్యక్తులతో చెప్పెను, “నేను చేసిన కార్యములను నాతో చెప్పిన ఒక మనుష్యుని వచ్చి చూడండి. ఈయన ఆ మెస్సీయా కాడా?”

అయితే ఆయన దానిని అన్యజనులకు చేయలేదు. అయితే ఆయన అన్యజనులకు చేసెదనని వాగ్దానము చేసియున్నాడు. ఎందుచేత? ఒక మెస్సీయా కొరకు యూదులు మరియు సమరయులు ఏ విధముగా ఎదురు చూచిరో మనకు కూడా ఆ విధమైన అనుభవము కొరకై రెండువేల సంవత్సరములు కలిగియుంటిమి.

89

ఇప్పుడు, యేసు చెప్పెను, “లోతు మరియు సొదొమ దినములలోవలె మనుష్యకుమారుని రాకడ దినములయందు ఉండును.” ఇప్పుడు, గమనించుడి, సోదొమ దినములలో, బుద్ధి కుశలతగలవారైన వారు ఒక ఉజ్జీవమును లోతుతో కూడా కలిగియుండిరి. ఒక నవీన బిల్లీ గ్రాహం, అక్కడకి వెళ్లి మరి సువార్తను ప్రసంగించెను, వారిని గ్రుడ్డివారిగా చేసెను.

అయితే అబ్రాహాము ఎవరని గమనించండి, ఎన్నుకొనబడిన సంఘము, పెంతెకొస్తు, పిలువబడినవాడు, లోకములోని కార్యముల నుండి వేరుపరచబడినవాడు.

ఇప్పుడు, మెతడిస్టు సంఘములో పెంతెకొస్తువారు కలరు. బాప్తిస్టు సంఘములో పెంతెకొస్తులు కలరు. పెంతెకొస్తు ఒక సంఘశాఖ కాదు; అది ఒక అనుభవము, ఎవరెవరైతే కోరుకొనెదరో వారు దానిని పొందవచ్చును. ఏ పెంతెకొస్తు ఆశీర్వాదములపైనను పెంతెకొస్తు సంఘ శాఖకు ఎలాంటి ఎంపిక లేదు. కాతోలిక్కులు దానిని పొందవచ్చును. మీ హృదయములో ఒక పెంతెకొస్తు ఆశీర్వాదములు మీరు కలిగియున్నందువలన మీరు ఒక పెంతెకొస్తులుగా యున్నారు.

90

కావున, అబ్రాహాము పిలువబడినవాడు. అబ్రాహాముతో కూడా అక్కడ యున్న ఈ దూత మరి ఆ దూత వెళ్ళిన పిదప అబ్రాహాము ఆయనను, ప్రభువా, ఎలోహిమ్ అని పిలిచెను.

ఆ ఎలోహిమ్ గొప్ప యొహోవా దేవుడని ఎందరెరుగుదురు? నిశ్చయముగా, ప్రభువైన దేవుడు. మరియు ఆయన చెప్పెను, ఆయన వెనుక భాగమున యున్న గుడారము వైపు తిరిగి అబ్రాహాముతో ఆయన ఏమి చెప్పెనో గమనించండి. ఇప్పుడు, ఆయన ఒక అపరిచితుడు, అచ్చటికి ఇంతకు ముందు రాలేదు. ఆయన అడిగెను, “అబ్రాహాము, నీ యొక్క భార్యయైన శారా ఎక్కడ?” అతనికి ఒక భార్య కలదని ఆయనకెట్లు తెలియును మరియు ఆమె పేరు శారా, అని ఆయనకెట్లు తెలియును?

ఇప్పుడు బైబిలు చెప్పుచున్నది, ఆమె ఆయనకు వెనుక గూడారములో నున్నదియని అబ్రాహాము ఆయనతో చెప్పెను. ఆయన చెప్పెను, “అబ్రాహాము, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నీ యొద్దకు వచ్చెదను, ఈ బిడ్డను నేను నీకు వాగ్దానము చేయుచున్నాను; నేను నీకు అనుగ్రహించబోవుచున్నాను.” మరియు శారా గట్టిగా కాదు గాని, తనలో త్రాను నవ్వుకొనెను. మరి ఆ దూత తన వెనుక భాగముననున్న గుడారము వైపుకు తిరిగి అడిగెను, “శారా ఎందులకు నవ్వెను?” అని అడిగెను. దానిని చూశారా? అంత్యకాలమునకు ముందు అన్యజనుల మధ్య ఆ విధముగా సంభవించునని యేసు చెప్పెను. వర్తమానము పరిశుద్ధాత్మ రూపములో క్రిందికి దిగును.

91

యోర్దాను నదిలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మము పొందిన పిదప మెస్సీయా చేసిన మొదటి కార్యము ఏమిటి? ఆయన ఏమి చేసెను? వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుటకు ప్రారంభించెను. ఆయన యొక్క సూచన ఏమైయున్నది, మరియు వారియొద్ద నుండి తిరిగి పోవునప్పుడు ఆయన యొక్క సూచన ఏమైయున్నది? అక్కడే ఆ సూచన యున్నది. పెంతెకొస్తు ఉజ్జివము దేనిని తీసికొని వచ్చెను? వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుట, అద్భుతములు మరియు సూచనలు తీసుకొని వచ్చెను. చివరి కార్యము ఏమిటి? ఇదిగో ఇక్కడ యున్నది.

అక్కడ ఎంతమంది వ్యాధిగ్రస్తులైయుండి మరి ప్రార్ధనా కార్డులను లేకున్నారు? మీ చేతులను పైకెత్తుడి. విశ్వాసము కలిగి మరి నమ్ముడి.

ఎవరో చెప్పుచున్నారు, “దానిని గురించి ఏమిటి సహోదరుడా బ్రెన్హాం?” ఆ దేవుని యొక్క ఆత్మ, వాగ్దానము చేసినవాడు, వాగ్దానము నెరవేర్చకుండా తప్పిపోడు.

92

ప్రార్ధనా కార్డులు లేని మీరు, నా యొక్క వెనుక భాగమును మీ తట్టుకు త్రిప్పియున్నాను. మీరు ప్రార్ధించుడి. మరియు దేవుడు గనుక దేవుడైనయెడల, ఆయన యొక్క ప్రత్యుత్తరము నిజమైనయెడల మరియు ఆయన యొక్క ప్రత్యేకత చాలా సమీపముగా యున్నదనుటకు ఇదియే సూచననే సత్యమును ఈ గడచిన వారములయందు నేను మీకు చెప్పితిని.

ఏదో కార్యము యొక్క అంతమందు వునమున్నామని నాగరికతగల సామాన్యమైన జ్ఞానముగల వారెవరైనను ఎరుగుదురు. నాగరికత ఇక ఎంతో కాలము ఉండబోదు; ఆమె కదలాడుచున్నది. దేనికొరకు అది నిరీక్షణను కలిగియున్నది. నోవహు దినములలోవలె జరిగినట్టుగా దీర్ఘశాంతము, కాలము గతించిపోయెను, కాని ఎన్నుకొనబడిన వారి నిమిత్తము కాలము పొడిగింపబడియున్నది. అయితే క్రమమైన రీతిలో దేవుడు తన సంఘమును పొందుకొనుటకు వేచియున్నాడు. ఆయన మీ కొరకు మరియు నా కొరకు ఆయన వేచియున్నాడు. ఆయన ఆశీర్వాదములను అనుగ్రహించును గాక. మీరు ప్రార్ధించుడి.

93

ఒక స్త్రీ తన వస్త్రపు అంచును తాకినపుడు....ఇపుడు వెలుపలయున్న మీలోని కొంతమందగు స్త్రీలకు, పరిశుద్ద గ్రంథములో యున్న కథవలె ఇది ఉండనిమ్ము, ఇప్పుడు నమ్ముచున్న మీలోనున్న కొంతమంది స్త్రీలు, మరియు దేవుని నమ్ముటకు తగినంత విశ్వాసము మీకు కలదని నమ్మువారు, దేవుడు చెప్పు దేనినైనను నిజమని నమ్ముడి, మరియు అక్కడ ఒక చిన్న స్త్రీ ఆయన యొక్క వస్త్రపు అంచును తాకెను; మరియు ఆమె ఆయన యొక్క వస్త్రమును తాకినపుడు, ఆయన తిరిగి, “నన్ను తాకినది ఎవరు? నన్ను తాకినది ఎవరు?” అని అడిగెను.

మరియు వారందరు దానిని నిరాకరించిరి, చెప్పిరి, “సరి, ప్రతియొక్కరు మిమ్ములను తాకుచున్నారు.” పేతురు ఆయనను గద్దించెను, “ప్రతియొక్కరు మిమ్ములను తాకుచున్నారు, మీరేల ఆ విధముగా చెప్పచున్నారు?” అని చెప్పెను.

“అయితే నేను బలహీనుడనైనట్టు గ్రహించుచున్నాను,” అని ఆయన చెప్పెను. (అదియే సరైన తర్జుమా.) “ప్రభావము నాలో నుండి వెడలిపోయున్నది.” మరియు 'ప్రభావము' అనగా బలము. దానిని గురించి ఎందరు ఎరిగియున్నారు “ప్రభావము నానుండి వెడలిపోయున్నది.”

మరియు ఆయన చుట్టూ చూచుచు జనులందరిని చూచి, ఆ చిన్న స్త్రీని కనుగొనెను మరి ఆమెతో చెప్పెను, ఆమె యొక్క రక్తస్రావము నిలిచిపోయినది, ఏలయనగా ఆమె యొక్క విశ్వాసమే ఆమెను స్వస్థపరచినది. అది నిజమేనా? ఆయన ఒక యూజకుడనియు మన బలహీనతలయందు సహానుభవముకలవాడు కనుక ఆయనను ముట్టవచ్చునని బైబిలు చెప్పచున్నది. నూతనముగా వచ్చినవారు దానిని నమ్ముచున్నారా?

94

ఇప్పుడు, గుర్తుంచుకొనుడి, స్వస్థత... ఆయన నాకిచ్చిన ఈ దుస్తులలో ఆయన గనుక ఇక్కడ నిలుచుకొనియున్నయెడల, ఆయన మిమ్ములను స్వస్థపరచలేడు. మీరు గనుక ఇక్కడున్న వేదిక యొద్దకు వచ్చి మరి ఆయనను, “ప్రభువా, మీరు నన్ను స్వస్థపరచగలరా?” అని అడిగినయెడల, ఆయన మీకేమి చెప్పునో మీకు తెలియునా?

“నేను ఇదివరకే దానిని చేసితిని. నేను మీ అతిక్రమములను బట్టి గాయపరచబడితిని. నేను పొందిన దెబ్బల వలన మీరు స్వస్థత నొందియున్నారు.” రక్షణ మరియు స్వస్థత ఒక ముగించబడిన కార్యమైయున్నది. మీ యొక్క విశ్వాసము దానిని అంగీకరించవలయును.

ఇప్పు డు,ఆయన మెస్సీయాయని నిరూపించుటకు ఆయన ఏదో కార్యమును చేయును. ఇప్పుడు, ఈ కార్యములు నేను మెస్సీయాయని నిరూపింపలేవు; నేను కృప ద్వారా రక్షింపబడిన ఒక పాపిని. మరియు దేవుడు ఎంతగా నన్ను అభిషేకించినను అందువలన నాకు ఏ ప్రయోజనము లేదు, కాని ఆయన మిమ్ములను కూడా అభిషేకించవలయును. నన్ను ఉపయోగించినంత మాత్రము అది క్రియ చేయదు; మీరు కూడా అది క్రియ చేయునట్టుగా చేయవలయును. పరిశుద్ధాత్మ ఎంతగా నా మీదికి వచ్చినను దానివలన ఏ ప్రయోజనము ఉండదు గాని, అది మీ మీదకి కూడా రావలయును. ఆయన మన యొక్క బలహీనతలను గురించి తాకగల ఒక ప్రధానయాజకుడుగానున్న యెడల మరి ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా నున్నాడని బైబిలు చెప్పుచున్నది, ఆలాగైన యెడల ఆయన అదే విధముగా కార్యములు చేయును. ఇక్కడ ఆయన మనలో నున్నాడు. దానిని మీరు నమ్ముచున్నారా?

95

ఇప్పుడు ప్రతియొక్కరు మీ సీటులో కూర్చొనుడి. భయభక్తులతో వుంటూ మరి ప్రార్ధించండి. మరి ప్రభువైన దేవుడు దానిని అనుగ్రహించును గాక. ప్రభువా దయచేసి, ఈ చక్కటి జనులు. ప్రభువా, నేనిక్కడ యుండుటకు గల ఉద్దేశ్యమును వారు గ్రహించునట్ముగా వారికి అనుమతించమని నేను ప్రార్ధి౦చుచున్నాను, వారు మరల రానియెడల ప్రభువు యొక్క రాకడ సమీపముగా నున్నదని వారు తెలిసికొనెదరు గాక. ఈ వర్తమానములు వారికి కఠినమైనవిగా కనిపించినను, వారిని కదిలించుచు వీటిని వారు ఎరుగునట్టుగా చేయుము. దానివలన నేనేదో చాకచక్యముగా వ్యవహరింపవలయునని కాదు, నాకునేనుగా ఆ విధముగా చేయుట లేదు, అయితే మీరు దానిని అభిషేకించుచున్నందువలన, ఆ విధముగా చెప్పవలసి వచ్చుచున్నది.

దానిని నిరూపించుము, ప్రభువా. నేను మీ కొరకు మాటలాడితిని. నా కొరకు మాటలాడుము, ప్రభువా, నా యొక్క మాటలు సత్యమైనవి, ఏలయనగా అవి నీ యొద్ద నుండి వచ్చుచున్నవి. యేసు నామములో నేను అడుగుచున్నాను. ఆమేన్.

96

మీ యొక్క పిలుపును అంగీకరించండి. మీ యొక్క దినమును కోల్పోవద్దు. ఈ ప్రార్ధన వరసలోనున్న అన్యులందరూ మీ చేతులను పైకెత్తుడి. బయటనున్న అపరిచితులు, వారి చేతులను వైకెత్తుడి. ఇక్కడున్న జీన్ గోడ్, పాట్ టైలర్ తప్ప నాకు మరి వేరే ఎవ్వరూ తెలియదు. నేను చూడగలుగుచున్నది వారిని మాత్రమే; నా కుమారుడు నా వెనుక నిలుచుకొనియున్నాడు, నాకు పరిచయమున్న వారు వారే.

ఎర్రని టోపీని ధరించుకొని కన్నులను నలుపుకొనుచు అక్కడ కూర్చొనియున్న, ఆ స్త్రీ, తలలోనున్న జలుబువలన వచ్చు తల నొప్పి నుండి స్వస్థతనొందవలయునని యేసు నొద్ద నీవు వేడుకొను ప్రార్ధనను ఆయన వినియున్నాడని నీవు నమ్ముచున్నావా? నీవు దానిని గురించి ప్రార్ధించుచున్నావు, నీవు ప్రార్ధించుట లేదూ? అది గనుక సరైనయెడల, మీ యొక్క కాళ్ళపైన మీరు లేచి నిలబడండి. అది గనుక నిజమైనయెడల, మీ చేతిని పైకెత్తండి. నాకు నిన్ను గురించి తెలియదు మరియు నీకును నన్ను గురించి ఇదివరకు తెలియదు, ఇంకొక చేతిని కూడా పైకెత్తుము, రెండు చేతులను పైకెత్తుము. మేడమ్, ఇదివరకు నా యొక్క ఉజ్జివపు కూటములలో పాల్గొని యున్నావా? కాని నిన్ను నేను చూచినట్లు లేదు, నేను నిన్ను ఎరుగను. కాదు, అది సరి.

97

అది సరి, ఇప్పుడు వారు చూడవలసినదిగా యున్నది. మీరు ఇంటికి వెళ్లి మరి స్వస్థత నొందుడి. జనులైన మిమ్ములను నేను ఒక కార్యము అడుగగోరుచున్నాను. ఆ స్త్రీ దేనిని తాకెను? ఇదిగో నా చేయి. ఆమె కూటములకు వచ్చినట్లు నాకు గుర్తులేదు. ఇప్పుడు మీరు చెప్పవచ్చును, “పైన బాల్కనీలోనున్న వారు లేక ఇక్కడ క్రిందనున్న వారు ఇంతకు మునుపు కూటములకు వచ్చి యుండవచ్చును.” మీరెవరని నాకు తెలియదు. నాకు తెలిసినదంతా మీరు ఇక్కడ కూటములో యున్నారు. మరి అదిగో అక్కడ ఆమె యున్నది. ఆమె దేనినో తాకెను.

మరియు కొద్ది సమయమునకు ముందు నేను ఏమి చెప్పితిని, ఆ అగ్నిస్తంభమ, మీరు దానిని చూచుట లేదా అది... ఎందరియొద్ద ఆ ఛాయా చిత్రము గలదు. ఆ ఛాయా చిత్రమును కూటములలోనే వారు పొ౦దుకొనిరి. ఇప్పుడు, అది అగ్నిస్తంభమువలె కనిపించుట లేదా, ఆ విధముగా అది లేదా? మరిప్పుడు దానియొక్క జీవము, అది దేనిని ఉత్పత్తి చేయుచున్నది? అదే జీవితమును, ఇప్పుడు నేను కాదు, అది దేనిని ఉత్పత్తి చేయుచున్నది? అది దేవుని కుమారునిగా నున్నప్పుడు దేనినైతే చేసెనో, అదే కార్యములను ఇప్పుడు చేయుచున్నది. ఇప్పుడు, నిజమైన దేవుని కుమారుని యొక్క కృప వలన ఆ కార్యములు స్వీకరించిన కుమారుడు మరియు కుమార్తెలలో అది జరుగుచున్నవి.

98

అక్కడున్న అయ్యా, మీ గుండె వ్యాధినుండి స్వస్థత నొందగోరుచున్నారా? అక్కడే నిలుచుకొని దేవుడు మిమ్ములను స్వస్థపరచునని నమ్మగలరా? మీరు చూచుచున్నారు, ఆశ్చర్యపడుచున్నారు మరి ఉన్నట్టుండి ఏదో అనుభూతి మీలో ప్రవహించినది. అది నిజము. మీరెవరో నేనెరుగను. నీవు నన్నెరుగుదువా? నన్ను మీరు ఎరుగరు మరియు నిన్ను నేను ఎరుగను. అది గనుక సత్యమైన యెడల, మీ చేతిని పైకెత్తుడి. మీయొక్క గుండె వ్యాధి స్వస్థపరచబడినదని మీరు నమ్ముచున్నారా, మీ చేతులు ఊపుడి. మంచిది, అది పోయినది.

మీరు నమ్ముచున్నారా? ఇక్కడ ఒక గౌరవింపదగిన స్త్రీ కూర్చొనియున్నది. ఆ స్త్రీ పై నున్న వెలుగును మీరు చూడగలుగుచున్నారా? ఆమె పిత్తాశయములో బాధ కలదు. ఆమె దానిని వదిలివేయబోవుచున్నది. దేవా, సహాయపడుము. కుమారీ స్మాల్, దేవుడు మీకున్న పిత్తాశయుము యొక్క బాధను స్వస్థపరచునని మీరు నమ్ముచున్నారా? మీరు లేచి నిలువుడి. మీరు మీకున్నదని తలంచుకొను విశ్వాసముకన్నను అధిక విశ్వాసము మీకు కలదు. నాకు ఆ స్త్రీని గురించి తెలియదు. అది దేవుని యొక్క కృప. మనము ఒకరికొకరము అన్యులమైనయెడల, ఈ విధముగా నీ చేతులను ఊపుము, స్త్రీ, అది... నేను నిన్ను ఎరుగను కదా? అయితే ఆయన మీకు చెప్పినది సత్యమే కదూ? నీ చేతిని వైకెత్తుము, ఆయన ఏమి చెప్పియున్నాడు. అది సరి, అయిన విశ్వాసము కలిగి ఇంటికి వెళ్ళుము. నీవు గనుక నమ్మినయెడల.

ఇక్కడ కూర్చొనియున్న ఈ స్త్రీ కడుపు నొప్పితో బాధపడుచున్నది. అవును, ఎఫీని గురించి నేను మాటలాడుచున్నాను. లేచి నిలువుము ఎఫీ. నీ యొక్క బాధ అదేనా? నాకు నిన్ను గురించి తెలియదు. అది గనుక నిజమైనయెడల, నీ చేతులను పైకెత్తుము. నా జీవితములో నేను నిన్ను ఇంతకు ముందు చూడలేదు. పరలోకములో గల దేవుడు దానిని ఎరిగియున్నాడు. అది సమాప్తమైనది. స్వస్థత కలిగియున్నది. దేవుడు నిన్ను ఆశీర్వదించును.

99

మీరు గనుక మీ పాపములో మరణించినయెడల, అది దేవుని యొక్క దోషము కాదు. మీరు సంఘమునకు నమ్మకముగా ఉండవచ్చు, కాని ఒక పాపి అవిశ్వాసిగా యున్నాడు. దేవునియందు విశ్వాసముంచండి.

మ౦చిది. ఇప్పుడు, ఈ జనులు ఇక్కడున్నారు, వ్యాధిగ్రసులపై చేతులుంచుటకు ఇది ఒక ప్రార్ధనా వరుస. ఏమి జరిగినను మీరు నమ్మెదరా? ఇప్పుడు అక్కడ వారు ప్రార్ధనా కార్డు లేకుండ యున్నారు, ప్రార్ధనా కార్డు లేని వారికొరకై వివేచన వరము ఇక్కడున్నది. ఇప్పుడు, తక్కిన వారు నమ్ముటకు ప్రారంభించండి. అటు ఇటు తిరుగవద్దు. చూశారా, మనలో ప్రతియొక్కరును ఒక ఆత్మగా యున్నాము. మీలో ప్రతియొక్కరు ఒక ఆత్మగా యున్నారు. అది మీకు తెలియునా? అది గనుక లేనియెడల, మీరు చనిపోయినవారగుదురు. కావున నేను మాటలాడునది మీ యొక్క ఆత్మను గురించి, మిమ్ములను గురించి కాదు. మీ యొక్క ఆత్మను గురించి.

100

స్త్రీ ఇచ్చటికి రమ్ము. నేను దేవుని యొక్క సేవకుడని నీవు నమ్ముచున్నావా? మనము ఒకరికొరకు అన్యులము. మనకు ఒకరిని గురించి ఒకరికి తెలియదు. అది గనుక సరైనయెడల, పైన బాల్కనీలోనున్న శ్రోతలు దానిని గ్రహించి యుండెదరు, మనము గనుక ఇదివరకు ఒకరినొకరు ఎరుగకున్నయెడల, మీ చేతులను పైకెత్తగలరా? ఇక్కడ ఒక దృశ్యము. వరుసలోనున్న మొదటి వారు ఒక స్త్రీ, ఇక్కడ పరిశుద్ద, యోహాను 4. ఒక వ్యక్తి మరియు ఒక స్త్రీ జీవితములో మొదటిసారిగా సంధించుచున్నారు. ఇచ్చట గనుక క్రీస్తు ఆత్మ యున్నయెడల, ఆయన క్రీస్తు యొక్క క్రియలను చేయును.

దయచేసి ఇటు అటు కదలవద్దు. దానివలన ఇప్పుడు మీరు అంతరాయం కలిగించెదరు. మీరు ఇతరులను అభ్యంతరపరచెదరు. చూశారా, మీలో ప్రతియొక్కరిపై నాకు అధికారము కలదు. నేను మీకు సహాయము చేయుటకు ప్రయత్నించుచున్నాను. నిశ్శబ్దముగాను మరియు భయభక్తులతో నుండుడి. అది సరి.

101

ప్రభువు గనుక మిమ్ములను గురించి నాతో చెప్పినయెడల... నేను గనుక ఇచ్చటికి వచ్చినయెడల... మీరు ఒకవేళ వ్యాధితో బాధపడుతూ వుండవచ్చు, లేదా వుండకపోవచ్చు. కాని ఒకవేళ మీరు గనుక వ్యాధిగ్రస్తులై యుండినయెడల, మరి నేనిచ్చటికి వచ్చి మీపై చేతులుంచి మరి, “స్త్రీ నీవు స్వస్థత నొందగలవు,” అని చెప్పినయెడల, నీవు దానిని నమ్మవచ్చును, ఏలయనగా అది సత్యము. అయితే పరిశుద్ధాత్మ గనుక ఇక్కడ నిలుచుకొని మరియు ఇక్కడ ప్రభువు ఈ సూట్ ధరించుకొని ఇక్కడ నిలుచుకొని యుండగా, మరి మీరు, “ప్రభువా, నన్ను స్వస్థపరచండి, నన్ను స్వస్థపరచండి,” అని మీరు అడగినయెడల, “నేను ఇదివరకే దానిని చేసితిని,” అని ఆయన చెప్పును. అయితే ఆయన ఇదివరకు ఈ భూమిలో నున్నప్పుడైతే మరి ఆ విధముగా ఆయన చేయును, ఆ బావియొద్ద స్త్రీతో మాటలాడిన విధముగా ఆయన ఆమె జీవితమును గురించి చెప్పి...

ఆ కార్యములను చెప్పి తనను తాను ఎవరని ఆమె తెలిసికొనునట్లుగా చేసెను. అది నిజమేనా? నూతనముగా వచ్చిన వారలారా? ఆమె జీవితములో మరుగైయున్న కార్యమును గురించి ఆయన చెప్పెను. ఇప్పుడు, ఆయన సీమోను పేతురుయెడల, లేక బైబిలులోనున్న ఎవరికో చేసిన విధముగా మరి ఇప్పుడు మీ జీవితములోనున్న ఏదో కార్యమును చెప్పినయెడల, అప్పుడు అది మీ యొక్క విశ్వాసమును వృద్ధి చేయును. అది మీలో ప్రతియొక్కరికి నమ్ముటకు తగిన విశ్వాసము నిచ్చునా?

102

ఇప్పుడు అది ఇచ్చట నున్నది, ఏదో తెర వెనుక మరుగైయుండుట కాదు, ఏదో దయ్యములు వెంటాడుట కాదు, అయితే ఇచ్చట ఇప్పుడే వేదికపై మీతో యున్నది. బైబిలులోని వాక్యముల నుండి. అది ఒకవేళ వేద పాండిత్యమును కలవరపెట్టునట్లు౦డును, అయితే అది అవే లేఖనములై యున్నవి. చూశారా? నేను గనుక మీకు సహాయము చేయుటకు సాధ్యమై యుండియు, దానిని నేను చేయనియెడల, నేను వంచకుడునయ్యెదను. నేను గనుక మీకు సహాయము చేయుటకు శక్తిగలవాడనై యుండియు మరి మీకు సహాయపడనియెడల, నేను ఈ పరిశుద్ద గ్రంథమునకు ప్రక్కన నిలబడుటకు కూడా అర్హుడునని కాను. ఏ సహాయము చేయలేను. నాకు సాధ్యమగు కార్యమంతా మిమ్ములను స్వస్థపరచుటకు క్రీస్తు ఇక్కడున్నాడనియు, మీరు గనుక వ్యాధిగ్రస్తులుగా యున్నయెడల, ఆయనే మిమ్ములను స్వస్థపరచునని మీరు గుర్తెరుగునట్టుగా చేయగల ఒకే కార్యమునే నేను చేయగలను.

నీవు వ్యాధితో నున్నావు. నీవు స్త్రీల వ్యాధితో బాధపడుచున్నావు. అది ఒక స్త్రీల బాధ. అది సరియే. అది గనుక సరైనయెడల, మీ చేతిని పైకెత్తుడి. కావున నేనేదో ఊహించుకొని చెప్పుచున్నానని మీరు అనుకొనరు. ఒక్క నిమిషము. మీ హృదయములో దేనినైనను ఉంచుకొనండి. దేవుడు మీకు ఏమి చేయవలయునని కోరుకొనుచున్నారో, మరి దానికొరకు మీ హృదయములో మీరే ప్రార్ధించుకొనండి. అవును, మీ హృదయములో ఇప్పుడే మీరేదో కలిగియున్నారు. అది నీ యొక్క భర్త, అది నీ యొక్క భర్త, అతనికున్న బాధ ఏమిటని దేవుడు నాకు చెప్పునని మీరు నమ్ముచున్నారా? అది మెదడులో ఏదో పొరపాటున్నది. అది మెదడులో రక్తనాళము గట్టిపడియున్నది, రక్తము గడ్డ కట్టుకొని యున్నది. అది సత్యము. అది సరియే. మీరెవరని దేవుడు గనుక నాకు చెప్పినయెడల, అది మీ యొక్క విశ్వాసమును వృద్ధిపరచునా? దానిని మీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? నాన్సీ గిల్లెస్పి, నీవు గృహమునకు వెళ్ళుము, యేసుక్రీస్తు నిన్ను మరియు నీ భర్తను స్వస్థపరచియున్నాడు మరియు మిమ్ములను స్వస్థపరచెను. ఆ చేతిగుడ్డను అతని యొద్దకు తీసికొని వెళ్ళు. అది నిజమే కదూ? అది సరి. మీ మార్గమున మీరు వెళ్ళండి.

103

ఇప్పుడు మీరు దేవుని నమ్ముచున్నారా? విశ్వాసము కలిగియుండుడి, సందేహింపకుడి.

ఇప్పుడు ఈ జనుల కొరకు నాతో కూడా మీరు ప్రార్ధి౦చెదరాయని నేను ఇక్కడున్న ఈ గొప్ప సంఘమును అడుగబోవుచున్నాను; అది ఎవరియొక్క తండ్రైనా ఎవరియొక్క తల్లియైన, ఎవరి యొక్క ప్రియమైనవారో, ఎవరియొక్క భర్తయో కావచ్చును; ప్రార్ధి౦చండి, దయచేసి అటు ఇటు తిరగవద్దు. మీరు ఆ విధముగా తిరిగినయెడల, ఈ కూటమును అంతరాయం కలిగించినవారగుదురు. నిలకడగా యుండి మరి ప్రార్ధి౦చండి, మీరు గనుక భయభక్తులతో ఉన్నయెడల, మనము ఇంకొక పది నిమిషములలో ముగించి వెళ్ళిపోయెదము.

గౌరవనీయ స్త్రీ, రమ్ము. నేను గనుక ఒక మాట కూడా చెప్పకుండా మరి మీ కొరకు ప్రార్ధి౦చినయెడల, మీరు దానిని నమ్మెదరా? ప్రభువైన యేసు మీరు ఆమెను స్వస్థపరచవలయునని యేసు నామములో నేను ప్రార్ధించుచున్నాను.

నా యొక్క సహోదరుడా, రమ్ము. నీ హృదయమంతటితో నమ్ముము. మా పరలోకపు తండ్రీ, యేసుక్రీస్తు నామములో అతనిని బాగుచేయండి. ఆమేన్. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, నా సహోదరుడా. [ఆ సహోదరుడు, సహోదరుడు బ్రెన్హాంతో మాటలాడుచున్నాడు.) ఓ, అది. అది మనకు ఏ విధమైన బేధమును చేయదు. ఇప్పుడు, అది సరి.

నీలో యున్న దోషమేమిటో నేనెరుగుదును, అయితే అది నీకు చెప్పుటలో ఏ ఉపయోగము లేదు. అది నీకు చెప్పుట వలన నీకు అది సహాయపడగలదా? నీకు సహాయపడదా. అది సరి. అయితే ఏది ఏమైనను, మీరు అక్కడి నుండి వచ్చినప్పుడే మీ గుండె బాధ వదిలి వెళ్ళిపోయినది. కావున ఆనందించుచు, “మీకు వందనములు ప్రభువా,” అని చెప్పుచు, మీ మార్గమున వెళ్ళండి.

104

అయ్యా, రమ్ము. ప్రభువైన యేసు నామములో, తండ్రీ, మీరు ఇతనిని స్వస్థపరచమని నేను ప్రార్ధించుచున్నాను. ఆమేన్. ఇప్పుడు నమ్మ౦డి.

ఇప్పుడు విశ్వాసము కలిగియుండుము, సహోదరి, రమ్ము.. ఈ... చూడుము, అక్కడ ఇంచుమించు మూడు వేలమంది జనులు ఇచ్చట ఇప్పుడు నీ కొరకు ప్రార్ధించుచున్నారు. యేసు నామములో ఆమె స్వస్థత నొందనిమ్ము, దానిని అనుగ్రహించుము, తండ్రి.

అయ్యా రమ్ము. ఇప్పుడు మీకు గనుక విశ్వాసము లేనియెడల, ఆ కీళ్ళ నొప్పి ఒక రోజు మిమ్ములను బాధించును. మీరు దానిని ఇప్పుడు నమ్ముచున్నారా? అట్లైనయెడల, వెళ్ళి, యేసుక్రీస్తు నామములో స్వస్థత నొందుడి.

సహోదరి రమ్ము. తండ్రియైన దేవా, ప్రభువైన యేసు నామమున మా యొక్క సహోదరిని స్వస్థపరచుము.

ఇప్పుడు నమ్ముచు రండి. ప్రతియొక్కరు విశ్వసించి మరి ప్రార్ధి౦చండి.

పరలోకపు తండ్రీ, యేసు నామములో మీరు ఆమెను స్వస్థతపరచవలయునని నేను ప్రార్ధించుచున్నాను. ఆమేన్.

ఇప్పుడు, రండి సహోదరుడా, ప్రతియొక్కరిని గురించి ప్రతియొక్కరి కొరకు దర్శనములు మనకు వచ్చిన, అది.... మీరు - నేను ... వారు నన్ను వేదిక మీదనుండి తీసికొని వెళ్ళవలసియుండును. చూశారా? నేను క్రిందికి వెళ్ళి పోయెదను. అయితే మీరు ఈ రాత్రి మీ యొక్క భోజనము భుజించుటకై మీరు ముందుకు కొనసాగిపోవలెనని మీరెరుగవలెను. అది చాలా బాగుగా రుచికరముగా నుండును. కడుపు నొప్పి మిమ్ములను వదిలి వేసినది, మీరు చూశారా? వెళ్ళి స్వస్థతనొందుడి. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక.

105

రండి, సహోదరి, దానిని నేను ఒక ఉద్దేశ్యము కొరకు చేసెదను, నన్ను నేను దూరముగా ఉంచుకొనెదను, స్నేహితులారా, ఏలయనగా దర్శనములు.... యేసు ఈ విధముగా చెప్పుట ఎందరెరుగుదురు? “ప్రభావము నాలోనుండి వెడలిపోయినది?” ఇప్పుడు, నేను నిజముగా చాలా బలహీనునిగా యున్నాను.

తండ్రీ, యేసు నామములో మీరు మా సహోదరిని స్వస్థపరచుమని నేను ప్రార్ధించుచున్నాను. దానిని అనుగ్రహించుము.

ప్రియమైన సహోదరి, రమ్ము. ఇప్పుడు సందేహించకు. మీ పరిపూర్ణ హృదయముతో నమ్ముచు రండి. ఓ, ప్రభువా క్రీస్తు నామములో మా యొక్క సహోదరిని స్వస్థపరచుము. ప్రభువా, ఆమె యొక్క జయమును ఆమె కిమ్ము.

నా సహోదరి, రండి. “నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు కనబడును,” అని బైబిలు చెప్పుచున్నది. యేసు నామములో ఆమె స్వస్థతనొందును గాక.

సహోదరీ, రమ్ము. నీ యొక్క వెన్నెముక బాధ నిన్ను వదలిపోయున్నది, కావున నీవు నీ మార్గమున ఆనందించుచు వెళ్ళు ఇప్పుడు...?..

106

మీరు నమ్ముచున్నారా? ఎందుచేత? ఎందుకని? వినండి. నేను మిమ్ములను అడుగవలెననుకుంటున్నాను. వినండి, స్నేహితులారా. జనులు ఇక్కడికి వచ్చినప్పుడు, బైబిలు చెప్పుచున్నది, “రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు.” అది వారికప్పుడు చెప్పినట్టే, ఈ దినమున మనకు కూడా చెల్లును. దానిని మీరు నమ్ముచున్నారా? నిశ్చయముగా మీరు నమ్మవలయును.

అయ్యా, ఇచ్చట చూడుము. నేను ఆయన సేవకుడని మీరు నమ్ముచున్నారా? ఇప్పుడు కొద్దిసేపు క్రితము నేను ఆగమని చెప్పిన ఒక స్త్రీ అక్కడ యున్నది; నీవు ఒక పురుషునివి. నీ యొక్క బాధ ఏమిటని దేవుడు నాకు చెప్పుననియు మరియు నిన్ను స్వస్థపరచుననియు నీవు నమ్ముచున్నావు. నీవు కలిగియున్నావు . అవును అయ్యా. నీ కడుపు నిన్ను ఒక కారణము చేత ఇబ్బందిపరచుచున్నది, అది నిన్ను కొద్దిగా బాధించుచున్నది. అది నిజము. అవును, అయ్యా, అవును అయ్యా. మరియు నీ ప్రోస్టేట్ గ్రంధి. అవును అయ్యా. ఏలయనగా నీ యొక్క ప్రోస్టేట్ గ్రంధి నిన్ను భయకంపితునిగా చేసి మరి అదే నిన్ను తలక్రిందులుగా చేసి బాధించుచున్నది. అది ఖచ్చితముగా సరియే. నీవు గనుక నమ్మినయెడల నీ భార్య కూడా స్వస్థత నొందునని నీవు అనుకొనుచున్నావా? సరి. నీవు గనుక నీ పూర్ణహృదయములో నమ్మినయెడల, అప్పుడు నీ భార్య స్వస్థత నొందును. [సహోదరుడు చెప్పుచున్నాడు, ఆమె వ్యాధిగ్రస్తురాలుగా నున్నది.] అవును, నరముల బలహీనత, మరియు కలవరపడుట, బలహీనత మొదలగునవి గలవు. ఇప్పుడు ఆమె స్వస్థత నొందునని నీ పూర్ణహృదయముతో నమ్ముచున్నావా? మీ మార్గమున వెళ్ళి మరి, “ప్రభువైన ప్రియ యేసు మీకు వందనములు,” అని చెప్పుడి, మరి ఆమె కూడా స్వస్థత నొందును.

ప్రభువైన యేసు, దీనికొరకు మీరు సహాయపడవలయును, ఓ, ప్రభువా, దేవుని యొక్క మహిమ అతని మీదికి వచ్చి మరి అతను స్వస్థత నొందులాగున చేయుము. యేసుక్రీస్తు నామమున ఆమేన్.

ఇప్పుడు, నమ్ముచు వెళ్ళండి, శ్రీ. డాబ్స్, మరియు మీ హృదయమంతటితో నమ్ముడి మరి స్వస్థత నొందుడి.

107

అది మంచిది. అయ్యా, రండి, అయ్యా. పరలోకపు తండ్రీ, మీరు మా సహోదరుని స్వస్థపరచి మరి బాగు చేయవలయునని యేసు నామమున అడుగుచున్నాము.

ప్రియమైన సహోదరి రమ్ము; ఇప్పుడు మీ పూర్ణ హృదయముతో ఆయనను నమ్ముము. ఓ, దేవా, మా తండ్రి , మీరు ఆమెను యేసు నామమున స్వస్థపరచవలయునని నేను ప్రార్ధించుచున్నాను.

రమ్ము, సహోదరుడా. చిన్న పిల్లవానిని కూడా తీసికొని రండి. ఇప్పుడు సందేహించకుడి. మీరు సిలువ క్రింద వచ్చునట్టుగా అతనిని కూడా వరుసలోనికి తీసికొని రండి. ప్రభువా, యేసు నామమున నేను వారిని ఆశీర్వదించుచున్నాను. ఆమేన్.

రమ్ము, సహోదరి. రమ్ము, ఇప్పుడు మీ పూర్ణ హృదయముతో నమ్ముము. మరియు, తండ్రీ, యేసు నామమున మీరు ఆమె స్వస్థపరచవలయునని నేను ప్రార్ధించుచున్నాను. ఆమేన్. ఇప్పుడు నమ్మి మరి భయభక్తులతో నుండండి. మీ పూర్ణహృదయముతో నమ్ముడి. ప్రభువైన యేసు నామమున ఆమె స్వస్థతనొందును గాక, ప్రభువా. ఆమేన్.

రమ్ము, సహోదరి. మీ పూర్ణహృదయముతో నమ్ముచు రండి. ఆమె ఇప్పుడు స్వస్థతనొంది మరి ఆమె చూపును పొందునని నమ్ముడి, ఓ, ప్రభువా యేసుక్రీస్తు నామమున మీరు ఆమెను స్వస్థపరచుడి. ఆమేన్.

108

ఆ రోజు రాత్రి ఒక చిన్న బాలుని కొరకు ప్రార్ధించుచుండగా అతని వయస్సు సుమారుగా పదిహేను, పదహారు సంవత్సరముల వయస్సు యుండును. ఆ చిన్న బాలుడు గొప్ప విశ్వాసముతో ప్రార్ధనా వరుసగుండా వెళ్ళుచుండెను, నేను అతని తట్టు చూశాను; నేను చెప్పాను, “నీకు తెలియును కుమారుడా..” మరి కావున, అతడు వెలుపలికి వెళ్ళి, అచ్చటి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయెను. మరి ఆ చిన్న బాలుడు పుట్టు గ్రుడ్డివాడైయుండి తనయొక్క చూపును అప్పుడు పొంది మరి “ఓ, సహోదరుడా బ్రెన్హాం నేను చూడగలుగుచున్నానని,” అరచెను.

ఇక్కడ ఒక చిన్న బిడ్డ ఇచ్చట పండుకొని యున్నది, తలనిండా నీరు పట్టియున్నది. ఒక దినపు రాత్రి ప్రార్ధనా వరుసలో వెళ్ళుచుండెను. కార్యములు సంభవించుచుండెను. మీరు నమ్మవలయును. చూశారా? మీరు కోడి పిల్లలు కాదు; మీరు పక్షిరాజు పిల్లలు.

109

రమ్ము. యేసు నామములో, ప్రభువా, దేవుని మహిమ కొరకు ఆమె స్వస్థత నొందునుగాక. ఆమేన్.

విశ్వాసము కలిగి నమ్ముచు రండి. మీకు తెలియును, ఏదో కార్యము లేక ఇంకొకటి, నేనేమి తలంచుచున్నానో మీకు తెలియునా స్నేహితులారా? నేను జనులలోని దోషములను కనిపెట్టుట లేదు గాని, అయితే మీరు ఒక కార్యము తెలుసుకొనవలయునని నేను మిమ్ములను కోరుచున్నాను. మన జీవితములలో టెలివిజనుకు ఎంతో సమయమును వెచ్చించుచున్నాము.

మనకు విందులు, వినోదములు కావలయును. మనము కోరుచున్నాము... మిమ్ములను వేడుకలతో ఆనందపరచు కార్యములను దేవుడు మీకు చూపించుట లేదు. ఆయన యొక్క ప్రసన్నతను మీరు గుర్తెరుగవలెనని ఆయన మిమ్ములను కోరుచున్నాడు. ఆ కార్యములు ప్రతియొక్కరికి సంభవించును, కాని అది ఇంచుమించుగా చంపివేయునట్టుగా యుండును. ఓ, నేను ప్రార్ధనా వరుసగుండా పోవుట లేదు.

గౌరవనీయురాలైన స్త్రీ, ఇచ్చటికి రమ్ము. మనమిరువురము ఒకరికొకరము అన్యులము. నీ యొక్క బాధ ఏమిటని దేవుడు నాకు చెప్పునని నీవు అనుకొనుచున్నావా? అది నీకు ఉపయోగపడగలదా? ఇప్పుడు, ఈ స్త్రీకి ఏదైనను చెప్పినయెడల దానివలన మీకు ఏ ప్రయోజనమైన కలుగునా? అది మీయొక్క చెవివలన కలుగుచున్న బాధ. దేవుడు దానిని స్వస్థపరచగలడని నీవు నమ్ముచున్నావా? అది కాన్సరని నీవు భయపడుచున్నావు. మరియు అది నీ యొక్క ఎడమ చెవియొద్ద నున్నది... అది నిజమేనా? మంచిది, అది అక్కడ యుండెను, అయితే ఇప్పుడు అది అక్కడ లేదు.

ఇప్పుడు గమనించుము. దేవుని నీవు నమ్ముచున్నావా? నీవు ఎవరని దేవుడు నాకు చెప్పినయెడల, అది నీకు ఉపయోగపడగలదా? అది మంచిది. రూబీ కాస్టెన్స్, ఇంటికి వెళ్లి యేసుక్రీస్తు నామములో స్వస్థత నొందుము. చూశారా? విశ్వాసము కలిగియుండుము.

110

ఇప్పుడు రమ్ము. సందేహపడకుము. నీ యొక్క బాధను దేవుడు నాకు చెప్పగలడు, అది నీకు సహాయపడగలదని నీవు అనుకొనుచున్నావా? అట్లైన చక్కెర వ్యాధి, గుండె నొప్సి గలదు, నీ మార్గమున వెళ్లి మరి స్వస్థతనొంది మరి దేవుని నమ్ముము. అవును, అది నీకు వృద్ధాప్యము వలన వచ్చుచున్నది. ఇప్పుడు వెళ్ళి, దానిని నమ్ముము. ఓ, ప్రభువా, మీరు మా సహోదరుని స్వస్థపరచి మరి అతనిని బాగుచేయుదురని నేను ప్రార్దించుచుచున్నాను. ఆమేన్. దేవా దానిని అనుగ్రహించుము.

ప్రియమైన సహోదరి రమ్ము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మన యొక్క సహోదరి స్వస్థత నొందనిమ్ము. ఆమేన్. దేవునియొక్క ఆశీర్వాదములు అడుగుచున్నారా, అవి ఎట్లు తప్పిపోగలవు? ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ విధముగా జరుగనిమ్ము ప్రభువా. ఆమేన్.

నా యొక్క సహోదరుడా రమ్ము, మనయొక్క సహోదరుడు స్వస్థత నొందును గాక. ఆమేన్.

ప్రియమైన సహోదరుడా రమ్ము, దేవుడు నిన్ను ఆశీర్వదించును. తల్లిని పిలుచుకొని రమ్ము. రమ్ము సహోదరి. సహోదరి రమ్ము, యేసుక్రీస్తు నామమున నీవు స్వస్థత నొందెదవు గాక.

రమ్ము, యేసుక్రీస్తు నామమున మన యొక్క సహోదరి స్వస్థతనొందును గాక, తండ్రి. అవును, ఇప్పుడు నమ్ముము. మీరు సందేహించనియెడల, అచ్చట సంభవించిన అదే కార్యము ఇచ్చట సంభవించును.

111

ఓ, దేవా, ఈ బీద సహోదరుని ఆశీర్వదించుము. పరలోకపు తండ్రీ, మీరు అతనిని స్వస్థపరచి మరి గుణపరచుదురుగాక. మరియు అతను తనయొక్క దృష్టిని పొంది మరి స్వస్థత నొందులాగున యేసు నామమున జరుగును గాక. ఆమేన్.

ఇప్పుడు విశ్వాసము కలిగియుండుము. సందేహింపవద్దు. నేను స్వస్థపరచలేను. ఆయన ఇక్కడ యున్నారు. ఆయన స్వస్థపరచువాడు. సందేహపడకుము. గ్రుడ్డి బర్తిమయివలె నుండుము. నీ యొక్క చేతికొరకు చూడుము.

యేసుక్రీస్తు నామమున...?... ఈ సహోదరి స్వస్థత నొందనిమ్ము,

అది సరి. ప్రియమైన సహోదరి, రమ్ము. మీలో ప్రతియొక్కరు నమ్ముచున్నారా, నిజముగా ...

ఏదో కార్యము సంభవించినది. ఒక్క నిమిషము. అక్కడ కూర్చొనియున్న మీకు ఉబ్బస రోగము కలదు, అయ్యా. అది సరియే. మీరు ప్రార్ధించుచుండిరి మీరు, “అది అద్భుతముగా నున్నది కదూ?” అని చెప్పుటకు తిరిగియున్నారు. నేను మీకు ఇంకొక కార్యము చెప్పెదను; మీ యొక్క కడుపు నొప్పి కొరకు మీ కడుపులో మూడులో రెండు వంతులను వారు తీసివేసిరి. అది సరియేనా? అది సరైనయెడల, మీ చేతిని ఊపండి. మరియు మనము ఒకరికొకరము అన్యులము.

యేసుక్రీస్తు మిమ్ములను స్వస్థపరచెను. మీ విశ్వాసము వలన మిమ్ములను బాగుపరచియున్నాడు. మీ మార్గమున వెళ్ళి, ఆనందించుడి.

ఓ, సందేహింపకుడి; నమ్ముడీ.

112

అది సరి, అమ్మా. నీవు... ఒక్క నిమిషము వేచి యుండుము. ఇప్పుడు, నీవు నీ కొరకు ఇచ్చట లేవు. నీవు వేరెవరికొరకో ఇచ్చటనున్నావు. అది సరి. మరియు నీ యొక్క సహోదరుడు ఇచ్చట లేడు. నీ యొక్క సహోదరుడు ఈ రాష్ట్రములో కూడా లేడు. అతను సెయింట్ లూయిస్ లో నున్నాడు. అతను వైద్యశాలలో యున్నాడు. అతనికి గుండె నొప్పి కలదు మరియు అతను ఒక పరిచారకుడు. మరియు నేను మిమ్ములను దాటిపోవుచు మరి నీపై చేతులుంచిన యెడల, నీకు తెలియదు, నేను ఏమి మాటలాడుచున్నానో నీకు తెలియదు. అయితే నాకు తెలియును. కావున నీవు వెళ్ళి మరి మీ మార్గమున వెళ్ళండి. అతను ఇప్పుడు స్వస్థత నొందెదడు మరియు ...?... అది సరి. విశ్వాసము కలిగియుండుము. ముందుకు సాగిపోవుము.

మరియు అక్కడ తన కుమార్తె హత్య చేయబడుటచే దానిని గురించి తలంచుచు వేరొక స్త్రీ ఇచ్చట కూర్చొనియున్నది. శ్రీమతి. వెతరిమేన్ - అది శ్రీమతి. వాటర్మేన్, ఇప్పుడు నీ హృదయమంతటితో నమ్ముము. నీ కుమార్తె ఒక ఉద్దేశ్యము కొరకు తీసికొనిపోబడియున్నది. సందేహింపకుము. దేవుని నమ్ముము.

113

ఓ, దేవా, యేసుక్రీస్తు నామమున అతను స్వస్థపడనిమ్ము. ఆమేన్.

ఇప్పుడు నీ హృదయమంతటితో వచ్చి నమ్ముము. ఓ ప్రభువైన దేవా, పరలోకమును మరియు భూలోకమును సృష్టించిన దేవా, యేసుక్రీస్తు నామమున ఈ స్త్రీకి స్వస్థతను అనుగ్రహించుము. ఆమేన్. ఇప్పుడు నమ్ముము.

ఇప్పుడు, చూడుము. వైద్య శాస్త్ర ప్రకారము దానికి నివారణ లేదు; అయితే అక్కడ ఒక పరలోకపు స్వస్థత కలదు. అది సరియే. మీరు స్వస్థతనొంది మామూలుగా నుందురని నమ్ముచున్నావా? శాపము... ఈ బిడ్డకు కీడుచేసిన ఈ దయ్యమును నేను శపించుచున్నాను. యేసుక్రీస్తు నామమున నేను దానిపై నున్న శాపమును తీసివేయుచున్నాను. అది మామూలు స్థితిలో యుండు బిడ్డగా నుండనిమ్ము. ఆమేన్. అది ఆ విధముగా స్వస్థత నొందవలయును. అది సరి.

ఆనందించుచు వెళ్ళు, మరియు స్వస్థతనొందుము మరియు ఈ రాత్రి చక్కగా నీవు భోజనము భుజించు....

సరి. రమ్ము అయ్యా, మీ హృదయమంతటితో నమ్ముము. ప్రభువైన యేసు నామమున అతను స్వస్థనొందనిమ్ము. ఆమేన్.

114

అనేక స్థలములలో యున్న జనులను అది తాకుచున్నది, ఒక్క నిమిషము. అది.... ఎంతమంది కడుపులో ఆరాటముగలవారు ఇచ్చట యున్నారు? మీ చేతులను పైకెత్తుడి. అది ఎంతో మందికి, నేను.... అక్కడ చూడండి? కడుపులో ఆరాటమునుగలవారు వారందరూ మీ కాళ్ళపై లేచి నిలబడండి. దానిని ఇక్కడ మీరు వదిలించుకొనవచ్చును. ఒక్క నిమిషము మీ కాళ్ళపై నిలబడండి. అయ్యా, ఊరకుండుము. నా సహోదరుడా నమ్ముచు వెళ్ళు. యేసుక్రీస్తు నామమున నీవు స్వస్థత నొందెదవు గాక.

ఇప్పుడు రమ్మ. నీ హృదయమంతటితో నమ్ముము. సహోదరి నీవు నమ్ముచున్నావా? యేసుక్రీస్తు నామమున నీవు స్వస్థత నొందెదవు గాక.

నీ జీవితాంతము నీకు నరముల బలహీనత గలదు. దేవుడు నిన్ను ఆశీర్వదించును. నరముల బలహీనత మరియు మూత్రపిండముల వ్యాధితో బాధపడుచున్న ప్రతియొక్కరును మీ కాళ్ళపై నిలబడండి. అది అందరికి కలదా! ఇప్పుడు నమ్ముచు వెళ్ళండి మరియు యేసుక్రీస్తుపై విశ్వాసముంచుడి. అక్కడే లేచి నిలువుడి.

ఓ, ప్రభువైన దేవా, మా యొక్క సహోదరునిపై దయ చూపించి మరియు యేసుక్రీస్తు నామమున అతనిని స్వస్థపరచుమని నేను మిమ్ములను ప్రార్ధి౦చుచున్నాను. ఆమేన్.

దేవునియందు విశ్వాసముంచుము. ప్రియమైన సహోదరి నీవిప్పుడు నమ్ముచున్నావా? తండ్రీ, దేవుని యొక్క మహిమ కొరకై ప్రభువైన యేసు నామమున ఆమె స్వస్థత నొందును గాక.

115

ఏదో జరుగుచున్నది. బిల్లీ, ఇదంతయును ఇంతేనా? అవును, ఇచ్చటికి రమ్ము, అయ్యా. మనము ఒకరికొకరు అన్యులము కదూ? దేవుడు మన ఇరువురిని ఎరిగియున్నాడు, ఆయన ఎరిగియుండలేదా? ఓ, ఇది ప్రతి చోటును సంభవించుచున్నది.

నా సహోదరులైన ప్రసంగికులారా, గుర్తుంచుకొనుడి. నా యొక్క అమూల్యమైన పక్షిరాజు సహోదరులారా, నేనిచ్చటి నుండి వెళ్ళిన అనేక వారముల తరువాత, స్వస్థత నొందినామని మీ సంఘస్తులు చెప్పుటను మీరు కనుగొనెదరు. వారు స్వస్థత నొందియున్నారు, అయితే వారు దానిని ఎరుగక యున్నారు. చూడుడి, చూశారా? అది ప్రతి చోటను జరుగుచునేయున్నది. ప్రారంభము నుండి ఈ విధమైన విశ్వాసమును మనమేల కలిగియుండలేక పోవుచున్నాము, స్నేహితులారా? ఆ విశ్వాసము ఇదియే.

దేవుడు నీకు సహాయపడునని నీవు నమ్ముచున్నావా? నీవు దేనిద్వారా బాధింపబడుచున్నావని దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముచున్నావా? నీకు తీవ్రమైన తలనొప్సి గలదు. నీకు తల తిరుగుటయు కండ్లు తిరుగుటయు గలదు. నీ మెడలో కండ పెరిగియుండుటవలన అది ఏర్పడినది. అది సరియే. నీవెవరని దేవుడు ఎరుగునని నీవు నమ్ముచున్నావా? నీవు ఒక సేవకునివి. నీ పేరు రెవరెండ్ జాక్ కోల్, అది ఖచ్చితముగా సరియే. అయ్యా, వెళ్ళు మరి నమ్ముము.

116

మీలో తల తిరుగుటయు, కండ్లు తిరుగుటయు లేక తలనొప్పిగల ప్రతియొక్కరును లేచి నిలువబడుడి. మీలో వ్యాధిగ్రస్తులుగా నున్న ప్రతియొక్కరును లేచి నిలువబడుడి. ఓ దేవా, ఏమి సంభవించును అది గనుక... ఏమి జరుగును? దానిని మీరు నమ్ముచున్నారా? ఈ కార్యము పరిశుద్ధాత్మ వలనైనదని ఇచ్చటనున్న ఎందరు విశ్వాసులు నమ్ముచున్నారు? మీ చేతులు వైకెత్తుడి. ఈ కార్యములను నేను చేయలేను.

మీరు విశ్వాసులా? మీ చేతులు ఒకరిపై మరియొకరు ఉంచుడి, మరియు మీరు ఎవరిమీదైతే చేతులు ఉంచెదరో, మరి ఆ వ్యక్తిలోనున్న దయ్యమును వెళ్ళుమని చెప్పుడి. నేను చేయు ప్రార్ధనవలె మీ యొక్క ప్రార్ధనలు కూడా మంచివి. ఒకరిపై ఒకరు మీ చేతుల నుంచుడి. అక్కడున్న స్త్రీ అది సరియే, క్షయ రోగము అప్పుడే నిన్ను విడిచి వెళ్ళెను.

శుక్రాశయ పిండమువలనైన బాధ నిన్ను వదిలెను, సహోదరుడా. నీవు నీ చేతులను క్రిందికి దించి మరి బిగ్గరగా కేకలేసి దేవుని స్తుతింపవచ్చును..?... అక్కడ నిలుచుకొనియున్న చిన్న స్త్రీ. అది మంచికొరకై వెళ్లిపోయెను. యేసుక్రీస్తు నిన్ను బాగుచేసియున్నాడు.

117

స్నేహితులారా, ఉన్న కార్యము ఇదియే. దేవునికి మన స్తుతులనిచ్చెదము. ఓ ప్రభువా, మీరిచ్చటనున్నారు. దయ్యము చేయు కార్యములన్నిటిలోను నేను దయ్యమును ఖడించుచున్నాను. ప్రతియొక్క చెడు ఆత్మను నేను గద్దించుచున్నాను. సాతాను, నీ రంగు బయటపడినది. యేసుక్రీస్తు నామమున నీవు గద్దింపబడి యున్నావు. జీవించు దేవుని నామమున నిన్ను ఆజ్ఞాపించుచున్నాను; ఈ శ్రోతల మధ్యనుండి బయటికి రమ్ము. నీవు ఇకమీదట వారు సందేహించులాగున చేయలేవు. ఆయన నిజమైనవాడని పరిశుద్ధాత్మ వారి ముందు చూపించియున్నాడు. నీవు వారిని ఇకమీదట సందేహించువారిగా చేయలేవు. వారు వారి చేతులను ఒకరిపై ఒకరు యుంచియున్నారు. యేసు చెప్పెను, “నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును; రోగులమీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు.” సాతానా, నీవు ఓడిపోయున్నావు. యేసు సమీపములో నున్నావు, నీవు పరలోకపు దేవునివి. ఈ జనులపైనున్న వ్యాధియొక్క శక్తియు, మరియు దయ్యపు శక్తియు విరిగిపోయున్నది. యేసుక్రీస్తు నామమున.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...