వెళ్ళి, ప్రకటించుడి

వెళ్ళి, ప్రకటించుడి

1…సాక్ష్యమివ్వండి, మరియు ఆ వెనుక ఉన్న ఆ చిన్న సహోదరి, ఆ పాటను అది వ్యక్తపరుస్తుందని నేను తలంచుచున్నాను:

ఓ, దేవుని ప్రేమ, ఎంత ఉన్నతమైనది మరియు స్వచ్ఛమైనది!

ఎంత లోతైనది మరియు దృఢమైనది!

ఇది మనకు ఎటువంటి ఒక దినము కదా! ఇప్పుడు మనం మన తలలు వంచినవారమై, ప్రార్థనకు ముందు, మెల్లగా దానిని ప్రభువు కొరకు పాడెదము. టెడ్డీ, మీరు ఇవ్వగోరినచో, కొద్దిగా, ఆ చిన్న రాగం మాకు ఇవ్వండి. మరియు సరిగ్గా ప్రార్థనకు ముందు, మన తలలు వంచి, మన కళ్ళు మూసుకొనియుండగా…మనం దానిని పాడుకుందాము.

ఓ, దేవుని ప్రేమ, ఎంత ఉన్నతమైనది మరియు స్వచ్చమైనది!

కొలువలేనిది మరియు దృఢమైనది!

అది ఎప్పటికీ…[టేపుపై ఖాళీ ఉన్నది—సంపా.]

2 ఒకవేళ ఆ సిరా, నీరంతయు సిరాగా మారి, మరియు ఆకాశమంతయు చర్మపు కాగితముగా మారి, మరియు భూమిపైనున్న ప్రతీ కొమ్మ ఒక కలముగాను, మరియు ప్రతి మనిషి ఒక లేఖకుడిగా మారినా గానీ, ఇంకనూ అది పడిపోయిన ఆదాము జాతికి దేవుని ప్రేమను వ్యక్తపరచలేదు. తండ్రీ, ప్రభువైన యేసు యొక్క, ఆ అమూల్యమైన రక్తమును బట్టియు, మరియు పునరుత్థానముయొక్క ఆ జ్ఞాపకార్థ ఉదయం కొరకును, మరియు పరిశుద్ధాత్మ ద్వారా నేడు మా హృదయాలలో కుమ్మరించబడిన నీ విమోచనా ప్రేమకై, మేము నీకు కృతఙ్ఞతలు చెల్లించుచున్నాము. సృష్టికర్తయైన, ఆ దైవముతో, ఆయనతో ఒక సహవాసంలోనికి మమ్మల్ని తీసుకురమ్ము. భూమి మీద, ముందెన్నడూ లేనటువంటి, ఒక సహూదరత్వములోనికి మమ్మల్ని తీసుకురమ్ము. తిరిగి-జన్మించిన స్త్రీ పురుషుల యొక్క సహూదరత్వముతో, ఏ లాడ్జి గాని, ఏ ప్రతిజ్ఞ గాని, ఎన్నటికీ సరిపోల్చబడదు. మరియు అది ఎప్పటికీ పరిశుద్ధులు మరియు దేవదూతల పాటగానుండును!

3 నీవు మా కోసం చేసిన దాని నిమిత్తము నీ కొరకు మా హృదయాలలో ఉన్న కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచే ప్రయత్నంలో, మేము—మేము చేసే దానంతటినీ నీవు ఆశీర్వదించాలని, ఈ రోజు మేము ప్రార్థిస్తున్నాము. మరియు ఆ ఉదయమున శిష్యులు, మరియ మరియు మగ్దలేనే మరియల హృదయాలు మాత్రమే సంతోషపరచబడటం కాదు గానీ, ఈనాడు నీ శిష్యులమైన, మేము కూడా, ఆయన మృతుడు కాదు కానీ, సజీవముగా ఉన్నాడని మేము కనుగొనిన ఆ ఘడియలో మా హృదయాలు సంతోషపరచబడ్డాయని ఎరిగియున్నాము. ఆయన మా హృదయాలలో, మా మధ్య ఎప్పటికీ సజీవుడిగా ఉండునుగాక. మేము యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

ఆ పునరుత్థానమును వ్యక్తపరచువారు ఎవ్వరునూ లేరు!

4 ఇప్పుడు, ఈ పునరుత్థాన ఉదయమున, సంఘములో చిన్న కార్యక్రమాలు జరగడానికి ఇప్పుడిది చాలా అద్భుతమైన సమయమైయున్నది, అదేమిటంటే, తల్లులు తమ బిడ్డలను ప్రతిష్ట చేయడమైయున్నది. అది ఏదో నూతనమైనది, ఏదో వారి గృహమునకు చేర్చబడినది. వారికి ఏదో నూతన ఆశీర్వాదము వచ్చినది. మరియు వారు, దానికి ప్రతిగా, దానిని దేవునికి ఇవ్వాలనుకుంటున్నారు.

5 మరియు పిదప ఈ—ఈ ఉదయకాల వర్తమానము తర్వాత, మీరు మీ అనారోగ్యం నుండి, నూతన ఆరోగ్యంలోకి పునరుత్థానమగునట్లు, మనము రోగుల కొరకు ప్రార్థనను కలిగియుండబోవుచున్నాము. పిదప వెంటనే దాని తర్వాత, బాప్తీస్మము పొందనివారికి, నీటిలో పాతిపెట్టబడి, నూతన జీవములోనికి లేచునట్టి; ఆ పునరుత్థానమును మనము కలిగియుండబోవుచున్నాము. ఈ ఉదయం ఇది పూర్తిగా పునరుత్థానమైయున్నది, పునరుత్థానము! ఈ అద్భుతమైన పునరుత్థాన ఉదయమును గూర్చి మనం పాటలు పాడుతూ, మరియు ఇతరుల సాక్ష్యాలను వింటుండగా, మన హృదయములు సంతోషంగా మరియు తేలికగా చేయబడినవి. మరియు మనం బయటకు చూచి దాని గూర్చి దేవుడు సంతోషిస్తున్నాడని మనం చూస్తున్నాము, ఆ చెట్లు పునరుత్థానము చెందుచున్నవి.

6 కొంత కాలం క్రితం, కెంటకీలో, శ్రీ. ఉడ్ మరియు నేను ఉడుతలను వేటాడుచున్నాము, మరియు మేము ఒక వ్యక్తి యొక్క స్థలానికి వెళ్ళాము. నాకు తెలిసినంతమట్టుకు, ఆ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ కూర్చునియుండవచ్చును. మరియు అతడొక నాస్తికుడిగా ఎంచబడినవాడు. మరియు సోదరుడు ఉడ్ అతణ్ణి ఇలా అడిగాడు, ఇట్లన్నాడు, “నేను మీ స్థలంలో ఉడుతలను వేటాడవచ్చా?”

అతడిట్లు చెప్పాడు, “అవును, ఉడ్, నీవు ఉడుతలను వేటాడవచ్చు. వెనుకకు వెళ్ళు.”

అతడిట్లన్నాడు, “సరి, నేను నా సంఘకాపరిని వెంట తెచ్చుకున్నాను.”

7 మరియు అతడు ఇట్లన్నాడు, “ఉడ్, నీవు ఎల్లప్పుడూ ఒక బోధకుణ్ణి నీ వెంట తీసుకు వెళ్ళాల్సినంత దయనీయమైన స్థితిలోకి వెళ్ళావని నాకు చెప్పాలని అనుకోవడంలేదు కదా!”

8 మరి అయితే అతడు—నన్ను పరిచయం చేయడానికి నన్ను దగ్గరకు పిలిచాడు. మరియు అతడు ఒక కఠినమైన వ్యక్తి అని ఈయన చెప్పాడు. ఇతరులు అతనికి దానిని చెప్పియున్నారు, కానీ, అతణ్ణి నమ్మునట్లు చేయునదేదియు అతనికి కనబడలేదు.

9 మరియు అక్కడ ఒక యాపిల్ చెట్టు ఉండియున్నది నేను దాని నుండి ఒక యాపిల్ ను తీసుకున్నాను. అది ఆగస్టులో జరిగింది. మరియు నేను ఆ పెద్ద మనిషితో అన్నాను, నేను ఇట్లన్నాను, “ఆ చెట్టుకి ఎంత వయస్సు ఉంటుంది?”

10 మరియు అతను చెప్పాడు, “దాదాపు ముప్పై సంవత్సరాలు,” లేదా మరొకటి. అతడే దానిని నాటియున్నాడు.

11 మరియు నేను అన్నాను, “అది ఫలములు ఇచ్చుచున్నప్పటి నుండి మీరు ఆ యాపిళ్ళను తినుచున్నారా?”

“అవును, అయ్యా.”

12 నేను చెప్పాను, “ఆ చెట్టుకు ఏమి జరుగుతుంది? మీరు దానిని పరిశీలిస్తే, ఇప్పుడు ఇది ఆగస్టు కాలం, ఇంతవరకు వేడి వాతావరణం ఉండియున్నది; కానీ ఇప్పుడు ఆ చెట్టు నుండి ఆకులు రాలిపోవుచున్నాయి, మరియు ఆ గుజ్జు కొమ్మలను విడిచిపెట్టి, వేర్లలోనికి వెళ్ళుచున్నది. శీతాకాలమంతా అది ఇక్కడే ఉండవలసియుంటే, ఆ చెట్టు ఇక ఎంతమాత్రము బ్రతుకదు; అయితే చల్లటి గాలుల నుండి దానినది దాచుకోవడానికి, అది ఆ మురికిలోకి దిగిపోతుంది. అది పైన ఇక్కడే ఉన్నట్లైతే, అది చనిపోవును, అది యాపిల్ పండ్లను ఇక ఎంతమాత్రము కాయదు. కానీ అది దానికదే ఆ వేర్లలో దాగుకొనుటకు క్రిందకి దిగిపోతుంది, ఎక్కడి నుండో మీకు కొన్ని యాపిల్ పండ్లను మరియు కొన్ని ఆకులను తీసుకురావడానికి, మరుసటి సంవత్సరం మరలా వస్తుంది.”

13 మరియు నేను అన్నాను, “ఇప్పుడు, అయ్యా, నీవు నాకు చెప్పాలని నేను—నేను వేడుకునేది ఏమిటంటే ఏ చల్లని వాతావరణమైనా రావడానికి ముందే ఆ గుజ్జు చెట్టును విడిచిపెట్టి, మరియు దాగుకొనుటకు ఆ వేర్లలోనికి వెళ్ళేలా ఏ మేధస్సు చేస్తుంది? దానిని ఏమి చేస్తుందో నీవు నాకు చెప్పగలిగితే, మరియు దానిని ఏది చేస్తుందన్నది, నాకు వివరించగలిగితే, అప్పుడు నేను నిన్ను దేవుని విషయంలో చేయి పెట్టుటకు అనుమతిస్తాను.” నేను చెప్పాను, “మీరు ఒక స్తంభముపై నీళ్ళు పోసి, అది దానిని చేస్తుందేమో చూడండి, ఋతువుల మార్పు దానిని చేస్తుందేమో చూడండి. ఆ గుజ్జును క్రిందకి ఆ చెట్టుయొక్క వేరులోకి స్రవింపజేసి, మరియు పిదప మళ్ళీ నూతన జీవంతో తిరిగి తీసుకువచ్చే ఏదో గొప్ప మేధస్సు ఉన్నది. అది దేవుడే.”

14 మరియు అతను చెప్పాడు, “నేను ఎప్పుడూ చర్చికి అంతగా వెళ్ళలేదండి.” అతను చెప్పాడు, “అయితే ఒకసారి ఇక్కడ యాక్టన్ వద్దకు, ఒక బోధకుడు వచ్చాడు, మరియు ఆ కొండపై నివసించే, ఒక ఫలానా స్త్రీతో, ఆ రాత్రి కూటములో ఆమె యొక్క సహోదరి ఉన్నట్లు చెప్పెను, మరియు ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక సహోదరి కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పెను.” మరియు, “ఆమెకు సహాయం చేయడానికి నేను మరియు భార్య అక్కడ ఉన్నాము,” అని చెప్పెను. మరియు ఇట్లన్నాడు, “ఆమె కడుపు క్యాన్సర్‌తో చాలా దురవస్థలో ఉన్నది, వారు ఆమెను మంచంలో ఒక దుప్పటితో ప్రక్కకు త్రిప్పవలసినంతగా ఉన్నది, మరియు ఆ రీతిగానున్నది. ఆమె సహోదరి చేతి రుమాలును తిరిగి తీసుకువచ్చినది,” ఇట్లు చెప్పెను, “ఆ వ్యక్తి ఆమె పరిస్థితులు మరియు అవన్నియు ఆమెకు చెప్పిన తర్వాత, ఇట్లు చెప్పెను, ‘ఆమెపై ఆ చేతి రుమాలును పెట్టండి.’” పిమ్మట ఇట్లు చెప్పెను, “ఈ రోజు ఆమె బాగైనది.”

15 “మరియు అది కేవలం దీనిని చూపిస్తుంది,” నేను చెప్పాను, “ఏ జ్ఞానమైతే సంవత్సరం వెంబడి సంవత్సరం, మీ కళ్ళముందే, ఆ చెట్టులోని గుజ్జుకు, ఆ వేర్లలోనికి వెళ్ళి దాగుకొనమని చెప్పినదో, అదే జ్ఞానము ఆమె పెట్టినప్పుడు ఆ స్త్రీ స్వస్థపరచబడుతుందని నాకు చెప్పినది…” నేను చెప్పాను, “అది అంత—అంత మర్మయుక్తముగా ఏమి లేదు. నీ ఇంటి పెరట్లో నిలిచియున్న మరి శ్రేష్టమైన బోధకుణ్ణి నీవు కలిగియున్నావు, అదే ఆ చెట్టు, అది మీకు సంవత్సరం వెంబడి సంవత్సరం బోధిస్తూనే ఉండును.”

16 మనం కేవలం చుట్టూ చూస్తే, ప్రతిచోటా మనము దేవుణ్ణి చూస్తాము. ఆయన ప్రతి చెట్టులోను, ప్రతి గడ్డిపూచలోను ఉన్నాడు. దేవుడు తప్ప దానిని ఉత్పత్తి చేయునది మరేదియు లేదు. మనం దానివలె కనిపించే దేనినైనా ఉత్పత్తి చేయవచ్చు; కానీ ఆ జీవాన్ని కాదు, అది దేవుడే.

17 ఇప్పుడు, ఇక్కడ కొన్ని గృహాలకు ఒక చిన్న గడ్డిపూచ జతపరచబడినది, మరియు మనము ఈ చిన్న బిడ్డలను ప్రభువుకు ప్రతిష్ట చేయగోరుచున్నాము. టెడ్డీ, వారిని లోనికి తీసుకురండి, అని మనమిక్కడ పాడే ఒక చిన్న పాట కలదు, తమ బిడ్డలు ప్రతిష్టించబడాలని కోరుకునే తల్లులు, మరియు తండ్రులు, వారు తమ చిన్నవారిని ఇక్కడ వేదిక వద్దకు తీసుకు వస్తుండగా మీరు దానిని వాయించుతారా.

18 మరియు మనము ఈ ఉదయం వేదికపైన అనేక చిన్న ఈస్టర్ పుష్పాలను కలిగియున్నాము, మనము కలిగిలేమా? ఓ, మై! చిన్న మేరీ, రూత్, రిబ్కాల యొక్క, చిన్న జేమ్స్, పాల్ మరియు జాన్‌లు అందరూ ఇక్కడ ఉన్నారని నేను అనుకొనుచున్నాను, వీరు మరొక తరానికి చిన్న ఈస్టరు పువ్వులైయున్నారు.

19 ఇది బాగానే ఉంది, సరిగ్గా అక్కడే. సహోదరుడు బీలర్ ఇక్కడ నిలబడియున్న ఈ—ఈ చిన్న పిల్లవాణ్ణి ఫోటో తీయగోరుచున్నాడని నేను నమ్ముచున్నాను, అది—అది ఉడ్ సహోదరుని యొక్క మనవడు, సహోదరి ఉడ్ ఇక్కడ ఉన్నది. మరియు ఇప్పుడు ఇతరులు తమ చిన్నారులతో వచ్చుచున్నారు. ప్రజలారా, వెంటనే రండి. అది సరియే. సహోదరుడా నెవిల్.

20 పరిశుద్ధ వివాహముయొక్క కలయిక ఎంతో ఘనమైనది, అది దేవునిచేత నియమించబడినది. మరియు పరిశుద్ధ వివాహమే ఈ ప్రియమైన చిన్న పిల్లలను తీసుకువస్తుంది.

21 ఇప్పుడు మీరు ఆ పేరును నాకు ఇక్కడ చెప్పవలసియుంటుంది. బ్రెండా స్యూ. నేను నిన్ను మొదటిసారి చూసినప్పటికంటే, చిన్నారి, నువ్వు ఇప్పుడు చాలా భిన్నంగా కనిపిస్తున్నావు. మంచిది, ఇక్కడ చిన్న బ్రెండా స్యూ ఉడ్ ఉన్నది, నిజంగా ఈమె మనందరి హృదయాలకు, మరియు ప్రత్యేకంగా ఈ యౌవన తల్లిదండ్రులకు ప్రశస్తమైన చిన్న సంపదయైయున్నది.

22 మరియు బైబిలు కాలములలో, చాలా మంది ఈ చిన్న పిల్లలను చిలకరించేవారు, కానీ మనము బైబిలుయొక్క ధోరణిని మనకు వీలైనంత దగ్గరగా అనుసరించడానికి ప్రయత్నించెదము, బైబిలు గ్రంథములో వారు ఎక్కడైనా చిలకరించబడినట్లు మనమెన్నడూ చూడలేదు, కానీ వారు ప్రభువైన యేసునొద్దకు తీసుకురాబడ్డారు, మరియు ఆయన వారిని ఆశీర్వదించాడు. మరియు ఆయనయొక్క సేవకులుగా మనము వారిని తీసుకొని, మరియు వారిని ఆయన వైపుకు ఎత్తిపట్టెదము.

23 మీకు తెలుసుకదా, తాత ఎంత గర్వంగా ఉంటాడో మీకు తెలియునని నేను నమ్ముచున్నాను. కాబట్టి ఒక్క క్షణం మనం మన తలలు వంచుదాము.

24 ప్రభువైన యేసూ, మా అపరాధముల నిమిత్తము పంపించబడిన, దేవుని బిడ్డవు. మరియు చిన్న బిడ్డలు నీ వద్దకు తీసుకురాబడుటను చూడటం ఎంతో ప్రశస్తమైన విషయమై ఉన్నది, అనేక సంవత్సరాల క్రితం, తల్లిదండ్రులు తమ పిల్లలను నీ వద్దకు తీసుకువచ్చినప్పుడు జరిగినదానికి జ్ఞాపకార్థంగా ఇది చేస్తున్నాము. చిన్న బ్రెండా స్యూ వుడ్‌ ని, విశ్వాస హస్తాలలో, మేము ఈ రోజు, నీ యెదుట పట్టుకొనియున్నాము, ఈమె మా సహోదరుడు డేవిడ్ మరియు తన ప్రశస్తమైన భార్యయొక్క కుటుంబములోనికి పంపబడినది. తండ్రివైన దేవా, ఈ బిడ్డను ఆశీర్వదించుము.

25 వారి కలయిక యొక్క సంతానాన్ని సమర్పిస్తుండగా, వారు నీయందు వారికున్న విశ్వాసాన్ని ఒప్పుకొనుచున్నారు. మరియు నీవు వారిని ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తున్నాము. మరియు వారి హృదయాలు పరిశుద్ధాత్మచేత ఆదరింపబడును గాక, తద్వారా అటువంటి దైవీకమైన, సమర్పించబడిన జీవితాలను జీవించే క్రైస్తవ గృహములో, ఈ శిశువు తీసుకురాబడి, దేవుని ఉపదేశంతో పెంచబడుతూ, మరియు చిరకాలం ఈ భూమి మీద, సంతోషకరమైన జీవితం జీవించును గాక, మరియు తన జీవితకాలమంతా నిన్ను సేవించును గాక. మరియు మహిమలో, ఎక్కడైతే కుటుంబాలు చుట్టూ కూడుకొనునో, చిన్న బ్రెండా స్యూ మరియు తన తల్లిదండ్రులు, మరియు వారి ప్రజలందరూ, ఇప్పుడు మనం ఎవరి వైపునకైతే ఆమెను ఎత్తుచున్నామో, అట్టి క్రీస్తు యొక్క కృప ద్వారా విమోచింపబడి, దేవుని సింహాసనం చుట్టూ గుమిగూడుదురు గాక.

26 నా చిన్న సహోదరీ, ఆయనను సేవించే ఒక జీవితం కొరకు, నేను ఇప్పుడు నిన్ను ప్రభువైన యేసుక్రీస్తుకు అప్పగించుచున్నాను, దేవుని కుమారుడైన, యేసుక్రీస్తు నామములో. ఆమేన్.

27 మార్లిన్, డేవిడ్, మిక్కిలి ఆనందము మరియు విజయంతో దేవుడు మిమ్మును దీవించును గాక. ఈ చిన్నది దేవుని రాజ్యము నిమిత్తము జీవించును గాక.

28 ఇప్పుడు, ఇక్కడొక చక్కని బాలుడు ఉన్నాడు, అతని ముఖంలో పెద్ద చిరునవ్వు ఉన్నది. అతని పేరేమిటి? [ఆ తల్లి సమాధానమిస్తున్నది. టేపుపై ఖాళీ ఉన్నది—సంపా.]

షారోన్ రోజ్…[ఆ తల్లి ఇట్లు చెప్తుంది, “షారోన్ డాల్టన్.”—సంపా.] డాల్టన్. డాల్టన్. ఈమె సహోదరుడు ఎడ్ యొక్క బిడ్డనా? మంచిది, దాదాపు, ఇరవై-రెండు సంవత్సరాల క్రితం, దేవుడు నా చేతుల నుండి నా చిన్న షారోన్ రోజ్ ని తీసుకున్నాడు, ఈనాడు ఆమె పరలోకములో ఉన్నది. మరియు ఇప్పుడు, ఆయనకు ప్రతిష్టించడానికి, చిన్న షారోన్ రోజ్ డాల్టన్ ఉన్నది. ఇక్కడ సహోదరుడు ఎడ్ మరియు సహోదరి డాల్టన్ లను, మన ప్రశస్త స్నేహితులుగా మనము ఎరిగియున్నాము. ఎటువంటి ఒక ప్రియమైన బిడ్డ!

మా పరలోకపు తండ్రీ, మేము ఈ చిన్న షారోన్ రోజ్‌ని నీ వద్దకు తీసుకువస్తున్నాము. భూమి మీద నిలిచిన గొప్ప ప్రభువైన యేసు, ఆనాడు చేసినదానికి జ్ఞాపకార్థంగా ఇది ఉన్నది, మరియు వారు ఇటువంటి చిన్నారులను ఆయన వద్దకు తీసుకువచ్చారు, ప్రభువా, నేను ఈ బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను. ఈమె బలంగా మరియు ఆరోగ్యంగా జీవించునుగాక. ఈమె దేవుని మహిమార్థమై జీవించునుగాక. ఈమె తల్లిని మరియు తండ్రిని ఆశీర్వదించుము. ఈమె దేవుని యొక్క ఉపదేశములతో పెంచబడును గాక. వారు తమ బిడ్డను నీకు సమర్పిస్తుండగా నీపై తమ విశ్వాసాన్ని వారు ఒప్పుకొనుచున్నారు. నీవు ఈమె జీవితాన్ని ఆశీర్వదిస్తావని, చిన్న షారోన్ రోజ్ డాల్టన్ ను, నీకు మేము సమర్పిస్తున్నాము, ప్రభువా. ఆమె తల్లితండ్రుల చేతుల నుండి, నా ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తువైన నీకు, ఆయన మహిమార్థమై, నేను ఈమెను సమర్పించుచున్నాను. ఆమేన్.

సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక, మరియు సహోదరుడా, నిన్ను కూడా.

ఓ, మై! ఒక చిన్న, అనారోగ్యంతోనున్న బాలుడు. అతని సమస్య ఏమిటి? [ఆ తల్లి చెప్తుంది, “అతని తల చాలా పెద్దదగుచున్నది.” టేపుపై ఖాళీ ఉన్నది—సంపా.]…ఏదో భిన్నమైనది. నేను ఆయనను నమ్ముచున్నాను.

ప్రభువైన, దేవా, నేను ఈ చిన్న మేసన్ ను నీవైపు ఎత్తిపట్టుకొనుచున్నాను. అతణ్ణి నీకు ప్రతిష్టించడానికి, ఇక్కడ నా చేతుల్లో నేను పట్టుకొనియున్న, ఈ శిశువును నీవు స్వీకరించవలసిందిగా, నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నేను అతడిపైనున్న ఈ వ్యాధిని శపిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో, ఈ చిన్న మేసన్‌ నీ చేతుల్లో పెట్టబడునుగాక, మరియు ప్రభువా, అతణ్ణి ఆ బాధ విడిచిపెట్టునుగాక. ఈ శిశువు దేవుని యొక్క ఘనత మరియు మహిమ కొరకు జీవించును గాక. అతడిని తీసుకువచ్చుచుండగా ఆ తల్లిదండ్రులు తమ విశ్వాసాన్ని వ్యక్తపరచుచున్నారు. నీవు ఈ బిడ్డను స్వస్థపరచి మరియు బాగుచేయుదువు గాక. నిన్ను సేవించుటకు, అతడు దేవుని మహిమార్థమై జీవించునుగాక. ప్రభువైన దేవా, అతని జీవితము మరియు అతని స్వస్థతనిమిత్తము, యేసుక్రీస్తు నామములో, నేను నీకు చిన్న మేసన్‌ ని అప్పగిస్తున్నాను. ఆమేన్.

[టేపు పై ఖాళీ ఉన్నది—సంపా.] కేవలం మీ హృదయమంతటితో నమ్మండి.

ఓ, ఒక చిన్న అమ్మాయి, కూడానా? సరి, అది మంచిది. చిన్నదానా, ఇక్కడికి రమ్ము. సరిగ్గా ఇక్కడ నిలబడుము. నీ పేరు…? [ఆ తండ్రి ఇట్లు చెప్తున్నాడు, “సమ్నర్.”—సంపా.] సమ్నర్. సహోదరుడు మరియు సహోదరి సమ్నర్. మీరు జార్జియా నుండి వచ్చారని నేను నమ్ముచున్నాను, అవును కదా? ప్రార్థన నాకు గుర్తున్నదని నేను అనుకున్నాను. అక్కడ చాలా మంది ప్రజలున్నారు. ఈమె…[“లాట్రెల్లే.”] లాట్రెల్లే. [“డ్వైట్.”] డ్వైట్. [“డేవిడ్.”] మరియు డేవిడ్. మీరు వారి పేరు విన్నారు. దేవుడు వారి పేర్లను గొఱ్ఱెపిల్ల జీవగ్రంథములో వ్రాయును గాక.

మా పరలోకపు తండ్రీ వారి తల మీదనున్న చిన్న జడల మీద, ఈ అబ్బాయిలయొక్క మృదువైన జుట్టు మీద నేను నా చేతిని పెట్టియుండగా, ఈ ఉదయం, ఈ చిన్న ప్రియమైనవారిని నీ వద్దకు తీసుకువచ్చుచున్నాము. ఓ ప్రభువా, వారిని దీవించుము. వారి తల్లిదండ్రులు తమ పిల్లలను సమర్పించుట ద్వారా నీపై తమ ప్రేమను మరియు విశ్వాసాన్ని వ్యక్తపరచియున్నారు. మరియు వారి తల్లిదండ్రుల చేతుల నుండి వారిని తీసుకొనగా, ప్రభువా, మేము వారిని నీకు ప్రతిష్టించుచున్నాము, అది ఈ ఉదయం ఈ బలిపీఠం మీద నిలబడి, వీరి జీవితాలను దేవునికి సమర్పించుటకైయున్నది. తండ్రీ, వారిని ఆశీర్వదించుము. వారి జీవిత కాలమంతా రాబోయే లోకములోని నిత్యజీవమంతా, వారు సంతోషంగా జీవించునట్లు, నీవు వారికి అనుమతిస్తావని మేము ప్రార్థించుచున్నాము. ఒక క్రైస్తవ గృహంలో, దేవుని ఉపదేశములో వారు పెంచబడుదురు గాక.

ఇప్పుడు, ఆయన చేసిన దానినే వారు పాటించాలని, తన సేవకులకు ఇచ్చిన ఒక మాదిరి చొప్పున, యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞచేత, యేసుక్రీస్తు నామములో, నేను వీరిని నీకు సమర్పించుచున్నాను. ఆమేన్.

[టేపు మీద ఖాళీయున్నది—సంపా.]

సూర్యోదయపు రాష్టమైన జార్జియా నుండి, తన ప్రియమైన తల్లి మరియు తండ్రి ద్వారా ఈ జ్ఞాపకార్థ ఉదయమున, నీకు ప్రతిష్టించడానికి ఈ శిశువు ఇక్కడకు తీసుకురాబడింది. ఇది వారి కుటుంబంలో నీ కృపయొక్క ఒక విజయ పతకమైయున్నది. నీవు ఈ చిన్న రెనీని, ఆమె తల్లి మరియు తండ్రిని ఆశీర్వదించాలని నేను ప్రార్థించుచున్నాను. మరియు ఈమెపై నీ ఆశీర్వాదములను కోరుకుంటూ, వారు ఈ బిడ్డను ఇక్కడకు తీసుకురావడం ద్వారా, నీపై తమ విశ్వాసాన్ని వ్యక్తపరచుచున్నారు. మరియు ఆమె తన జీవితకాలమంతయు, ఒక దృఢమైన, సంతోషకరమైన క్రైస్తవరాలిగా జీవించును గాక; మరియు రాబోయే రోజుల్లో మరియు రాబోయే లోకంలో, నిత్యజీవాన్ని కలిగియుండునుగాక. తండ్రీ, దీనిని అనుగ్రహించుము. ఈ ఉదయమున ఎంతో మాధుర్యమైన ఈ చిన్నవారిని, అనగా ఈ పిల్లలను నీ స్వంత హస్తములలోనికి నీవు తీసుకొనగా, వారిని నీ సేవకుల వద్దకు తీసుకురావడం ద్వారా, ఆ కుటుంబాలు నీయందు వారికున్న విశ్వాసాన్ని వ్యక్తపరచిరి. మరియు మేము చిన్న రెనీని ఆశీర్వదించి మరియు, ఆమె తల్లిదండ్రుల చేతుల నుండి, ఆమెను నీకు అందించుచున్నాము. యేసుక్రీస్తు నామములో, నీవు ఆమెను ఆశీర్వదించుదువు గాక. ఆమేన్.

సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. రెనీ, దేవుడు నిన్ను దీవించును గాక.

కేవలం ఆ పాటలోని ఒక చిన్న పల్లవిని మనం పాడుకుందాం.

వారిని లోపలికి తీసుకురండి, వారిని లోపలికి తీసుకురండి,

పాప క్షేత్రాల నుండి వారిని లోపలికి తీసుకురండి;

వారిని లోపలికి తీసుకురండి, వారిని లోపలికి తీసుకురండి,

ఆ చిన్న పిల్లలను యేసునొద్దకు తీసుకురండి.

29 ఓ, నేను వరుసలో నిలబడి మరియు ఈ చిన్న పిల్లలలో ప్రతి ఒక్కరి గురించి మాట్లాడటానికి నేను ఎంతో ఇష్టపడతాను, కానీ ఏదేమైనా, నేను చాలా నింపాదిగా ఉన్నాను, మరియు ప్రజలు నిలబడియున్నారు. సహోదరుడు ఉడ్ ఈ ఉదయం నాకు చెప్పాడు, నిలబడియుండుట వలన, అతడి వెన్ను నొప్పిగా ఉందని చెప్పాడు. మీరు నిలబడి మరియు వేచియుండుటను నేను ఎంతగా అభినందిస్తానో మీకు తెలియదు! మరియు నేను వీలైనంత త్వరగా, వర్తమానమును అందిస్తాను. మరియు మీరు చాలా జాగ్రత్తగా వినండి.

30 ఈ ఉదయకాల కూటమును, లేదా ఈ ఉదయం ఈ వర్తమానమును సిద్ధపరచుకొనుటకు నాకు సమయం లేదు, కేవలం ఒక్క క్షణము. నేను ఒక పాఠ్యభాగమును మరియు ఒక భిన్నమైన దానిని తీసుకున్నాను.

31 మరియు గడిచిన ఈస్టరున నేను ఈ అంశంపై బోధించాను: “జీవించుచూ, ఆయన నన్ను ప్రేమించాడు. మరణించుచూ, ఆయన నన్ను రక్షించాడు. సమాధిచేయబడి, ఆయన నా పాపాలను బహు దూరంగా తీసుకుపోయాడు. తిరిగిలేచుచూ, ఉచితంగా నీతిమంతునిగా చేసాడు. ఎదో ఒక దినమున ఆయన రాబోవుచున్నాడు, ఓ, మహిమకరమైన దినము!”

మరియు పిదప ఈ ఉదయం మనము ఈ అంశంపై బోధించాము: నేను ఎరుగుదును.

32 మరియు ఇప్పుడు, ప్రభువు చిత్తమైతే, నేను పరిశుద్ధ మార్కులోని అధ్యాయం నుండి చదవగోరుచున్నాను. మరియు ఇప్పుడు మీరు నాతో కూడా ప్రార్థించండి.

33 మరియు ఇది ముగిసిన వెంటనే స్వస్థతా కూటము ఉండును. మరియు పిదప స్వస్థతా కూటము తరువాత బాప్తీస్మ కార్యక్రమము ఉంటుంది. మరియు తదుపరి కూటములు ఈరోజు రాత్రి ఏడున్నర-గంటలకు ఉండును.

34 ఇప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయము:

మరియు విశ్రాంతిదినము గడచిపోగానే, మగ్దలేనే మరియయు,…యేసు తల్లియైన మరియయు, సలోమేయు, సుగంధద్రవ్యములు తెచ్చిరి, వారు వచ్చి మరియు ఆయనను అభిషేకించుటకు వాటిని తెచ్చిరి.

…వారము మొదటి దినమైన ఆదివారమున పెందలకడ, సూర్యోదయమైనప్పుడు వారు సమాధి యొద్దకు వచ్చిరి.

మరియు సమాధి ద్వారమునుండి మనకొరకు ఆ రాయి యెవడు పొర్లించునని, వారు ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి?

మరియు వారు కన్నులెత్తి చూడగా, ఆ రాయి పొర్లించబడుటను వారు చూసిరి: ఏలయనగా ఆ రాయి ఎంతో పెద్దది.

మరియు వారు సమాధిలోనికి ప్రవేశించగా, తెల్లని నిలువుటంగీ ధరించుకొనియున్న యొక పడుచువాడు, కుడివైపున కూర్చుండుటను వారు చూచిరి; మరియు వారు మిగుల కలవరపడిరి.

మరియు వారు వారితో చెప్పిరి…మరియు అందుకతడు చెప్పెను, కలవరపడకుడి: సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు: ఆయన ఇక్కడ లేడు; ఆయన లేచియున్నాడు: వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి.

అయితే మీరు వెళ్ళి, మరియు ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన శిష్యులతోను మరియు పేతురుతోను చెప్పుడి: ఆయన మీతో చెప్పినట్టు, అక్కడ మీరు ఆయనను చూతురు.

మరియు వారు త్వరగా బయటకు వచ్చి, విస్మయము నొంది వణకుచు; సమాధియొద్దనుండి పారిపోయిరి: వారు భయపడినందున; ఎవనితో ఏమియు చెప్పలేదు.

వారములో మొదటి దినమున తెల్లవారున యేసు లేచినప్పుడు, తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు, ఆయన మొదట కనబడెను.

మరియు వారు దుఃఖపడి యేడ్చుచుండగా, ఆయన…ఆమె వెళ్ళి ఆ సంగతి ఆయనతో ఉండినవారికి తెలియజేసెను.

35 మీరు చూడండి, వారు కూడా, బూడిద కుప్ప మీద ఉన్నారు.

మరియు వారు, ఆయన బ్రదికియున్నాడనియు, మరియు ఆమెకు కనబడెననియు వారు విన్న తర్వాత, వారు నమ్మకపోయిరి.

36 దేవుని మాటలు ఎంత మర్మయుక్తమైనవి కదా!

ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, ఆయన మారురూపముగలవాడై, వారికి…ప్రత్యక్షమాయెను.

మరియు అప్పుడు…మరియు వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని: వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి.

పిమ్మట పదునొకండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, ఆ-…వారి—వారి అపనమ్మిక నిమిత్తమును హృదయకాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను, ఎందుచేతననగా తాను లేచిన తరువాత తన్ను చూచినవారి మాట వారు నమ్మలేదు.

మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి,…సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, అని ఆయన వారితో చెప్పెను.

నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును;…నమ్మని వానికి శిక్ష విధింపబడును.

మరియు నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు; క్రొత్త భాషలు వారు మాటలాడుదురు;

పాములను ఎత్తి పట్టుకొందురు;…మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు; వారు రోగులమీద చేతులుంచినప్పుడు,…వారు స్వస్థత నొందుదురు.

ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత, ఆయన పరలోకమునకు చేర్చుకొనబడి, మరియు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను.

మరియు వారు బయలుదేరి, అంతటా ప్రకటించిరి, ప్రభువు వారికి సహకారుడైయుండి, వెనువెంట జరుగుచువచ్చిన సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్.

37 నేను రెండు పదములనుండి ఒక అంశాన్ని తీసుకొనగోరుచున్నాను: వెళ్ళి, ప్రకటించుడి.

38 మీకు తెలుసా, ప్రకటించడానికి ఏదైనా మీకు లేనిచో వెళ్ళడం అంత ప్రయోజనకరమేమీ కాదు. అదే ఈనాడు చాలా ఇబ్బందికరమైన విషయం అని నేను అనుకుంటున్నాను. మనము చెప్పడానికి వెళ్తాము, మనము వెళ్తాము కానీ, చెప్పడానికి ప్రయోజనకరమైన దేనినీ, ప్రజలకు సహాయం చేయునట్టి దేనినీ కలిగియుండము.

39 కానీ ఆజ్ఞను పొందిన ఈ శిష్యులవలె మనము ఆ సూచనలను వెంబడించినచో చాలును, మనమూ అదే ఆజ్ఞను పొందియున్నాము, “వెళ్ళి, నేను మృతులలో నుండి లేచానని నా శిష్యులకు చెప్పుడి.” వెళ్ళి, దానిని ప్రకటించుడి!

40 అప్పుడు ఆయన ఇట్లు చెప్పును, “వెళ్ళి, దానిని ప్రకటించుడి, మరియు నేను మృతులలోనుండి లేచి సజీవుడనైయున్నానని ఈ సూచనలను చూపించుడి.” ఎటువంటి ఒక వర్తమానము! “వెళ్ళి, చెప్పండి, మరియు వెళ్ళి, నేను మరణించలేదు కానీ, మృతులలో నుండి లేచియున్నానని, మీరు చూసిన ఈ విషయాలను నా శిష్యులకు చూపించండి.”

41 ఈ ఉదయకాల వర్తమానములో, మనలో ప్రతి ఒక్కరము చిన్న బూడిద కుప్పల్లాంటి ఇబ్బందులను మరియు పరీక్షలను కలిగియున్నామని మనము కనుగొన్నాము మనం దానిపై కూర్చొని, కొంత సమయం, ఆదరణ కోసం వేచియున్నాము. గొప్ప మూల పురుషుడైన యోబుకు ఒక దర్శనం వచ్చినదని మనం కనుగొన్నాము, ఏలయనగా అప్పటికి వారు ఇంకనూ ఒక ఈస్టరును కలిగిలేరు, కానీ అతడు ఈ ఉదయాన్ని నాలుగు వేల సంవత్సరాల క్రితమే చూశాడు. అతడు నాలుగు వేల సంవత్సరాల ముందే, ఈస్టరును చూశాడు, మరియు తన బాధలో ఉండగనే, కేకలు వేశాడు, “నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును! అంత్య దినములలో, ఆయన భూమి మీద నిలబడును. పురుగులు ఈ శరీరమును నాశనము చేసినప్పటికీ, అయిననూ నా శరీరంతో నేను దేవుని చూసెదను.”

42 ఇప్పుడు, ఈస్టరు తర్వాత, దేవుడు మానవునికి ఒక ఆజ్ఞను ఇచ్చాడని మనం కనుగొన్నాము, “వెళ్ళి, ప్రకటించుము! మరియు మీరు ప్రకటించినయెడల, ఇది మిమ్మల్ని వెంబడించును. వెళ్ళుము మరియు ప్రకటించుము!”

43 ఇప్పుడు, నేను చెప్పినట్లు, మీరు ప్రకటించడానికి దేనినైనా కలిగియుంటే తప్ప, మీరు వెళ్ళడం, వెళ్ళడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. మరియు మీరు ప్రకటించడానికి ఒక తప్పుడు సందేశాన్ని కలిగియున్నయెడల, అప్పుడది ఏ మేలు చేయదు. మీరు రహస్యమైన దానిని చెప్పవలసియున్నది.

44 కొంతకాలం క్రితం ఒక పోటీలో ప్రవేశించినట్టి…ఒక చిన్న పిల్లవాని గూర్చి నేను ఒక పుస్తకములో చదువుచుంటిని. మరియు ఈ పోటీలో అతడు తనకంటూ ఒక గొప్ప పేరును సంపాదించుకొనవలసి యున్నది. ఆ సాంకేతిక పదాన్ని తన మనస్సులో ఉంచుకోగల ఏ చిన్న పిల్లవాడైనా ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుకున్నప్పుడు, అతడు ఈ సాంకేతిక పదాన్ని చెప్తాడు, అప్పుడా ద్వార పాలకుడు అతణ్ణి అనుమతిస్తాడు. అది ఆ పిల్లవాని తెలివితేటల్ని పరీక్షించుటకొరకై యున్నది. మరియు అతడు ఆ స్థలానికి చేరుకున్నప్పుడు, అతనికి ఇవ్వబడిన ఆ సాంకేతిక పదాలను పలుకుటవలన, ఆ ద్వారం తెరుచుకుంటుంది మరియు అతనొక గొప్ప గౌరవాన్ని గెలుచుకుంటాడు.

45 ఒక చిన్న పిల్లవాడు, చాలా వేగంగా-అడుగులు వేయుచుండుటనుబట్టి, అతడు ఆ పోటీలో మిగతా అబ్బాయిలందరినీ అధిగమించగలడని బాగుగా ఎరిగియున్నాడు, లేదా అతడు చేయగలడని అతడనుకున్నాడు. అతడు అనుదినం, పరుగును సాధన చేసాడు. అతడు పరిగెత్తేటప్పుడు అలసిపోకుండునట్లు, అతడు తన చిన్న ఊపిరితిత్తులకు గాలిని పీల్చుకుంటూ, తన భౌతిక శరీరాన్ని ఎంతగానో క్రమపరచుకున్నాడు. మరియు అతడు తన పాదాలతో ఎలా ప్రారంభించి, మరియు మిగిలిన అబ్బాయిలకంటే ముందుగా తన తలను ముందుకు పెట్టి ఎలా దూకాలన్నది సాధన చేశాడు. మరియు అతను పరుగెత్తుచున్న సమయంలో ఎలా శ్వాస తీసుకోవాలో సాధన చేశాడు, తద్వారా అతని గుండె అంతగా మందగించకుండా, అతడు శ్వాస తీసుకొనునట్లు, అతని శరీరానికి వచ్చిన ఆ ప్రాణవాయువును బిగపట్టుటకైయున్నది. అతను తనకు వీలైన ప్రతీ కోణం నుండి దానిని అధ్యయనం చేశాడు.

46 మరియు పరుగు పందెం ప్రారంభమైన ఆ ఉదయమున, ఒక నిర్దిష్ట వయస్సు కలిగిన నూట యాభై కంటే ఎక్కువ మంది అబ్బాయిలు, ఆ వరుసలో నిలబడియున్నారు. ఈ చిన్న పిల్లవాడు తన వయస్సుకు తగ్గట్టుగా మంచి-ఆకారంలో ఉన్నాడు. మరియు అతడు తన శిక్షణనంతటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. మరియు అతడు సిద్ధమయ్యాడు. వారు వరుసలోకి వచ్చారు, అటుగా ఉన్న ఆ—ఆ తీగ ఎదురుగా వారి చిన్న ముఖాలను ఉంచారు, దానికి ఎదురుగా వారి చిన్న ముక్కును పైకెత్తి ఉంచారు. తనను తాను సిద్ధపరచుకుంటూ, దానికి సంబంధించిన నియమాలన్నిటినీ అతడు అధ్యయనం చేసాడు.

47 మరియు పిదప ఆ తుపాకీ పేలినప్పుడు, ఆ వరుస విడిపోయి, ఆ చిన్న అబ్బాయిలు ముందుకు దూకారు. మరియు ఈ చిన్న అబ్బాయి మిగిలిన వారికంటే శారీరకంగా ఎంత దృఢంగా ఉన్నాడంటే, అతడు ఆ మిగతా వారికన్నా ఎంతో ముందుకు దూకాడు. మరియు బాగా శిక్షణను పొందుటనుబట్టి, పందెంలో ఉన్న ప్రతి అబ్బాయిని అధిగమించేంతవరకు, అతడు మహత్తరమైన వేగంతో పరుగెత్తాడు. మరియు ఓ, ఎంతో ముందుగానే, బహుశా ఒక నిమిషం, లేదా అంతకంటే ముందే, ఇతర పోటీదారులలో అత్యంత ఉత్తమమైనవారు ఆ స్థానానికి చేరుకోకముందే, అతడక్కడికి చేరుకున్నాడు.

48 కానీ, అతని శారీరక శిక్షణంతటి తర్వాత, అతడు ఆ సాంకేతిక పదాన్ని మర్చిపోయాడు. తనను ద్వారము లోపలికి అనుమతించుటకు, తాను చెప్పవలసిన ఆ పదాన్నే అతడు మరచిపోయాడు. మరియు అతడు ముందుకు వెనుకకు నడిచాడు, మరియు దానిని ఆలోచించాడు, మరియు అతని మనస్సులో శోధించాడు. అతడు ఆ ప్రధాన విషయమును మరచిపోయేంతగా, తన శరీరము యొక్క సహజమైన, భౌతిక పరిస్థితుల మీదనే అతడు ఎంతో ఆసక్తిని కలిగియున్నాడు. వరుసలో, అంత వేగంగా పరుగెత్తని కొంతమంది అబ్బాయిలు, ఆ సాంకేతిక పదాన్ని గుర్తుపెట్టుకుని, లోపలికి ప్రవేశించారు.

49 ఈనాడు అది అలాగే ఉన్నది! మనము గొప్ప క్షేత్రాలను, మరియు సంఘాలను మరియు భవనాలను, మరియు మొదలగువాటిని నిర్మించడంలో చాలా ఆసక్తిని కలిగియున్నాము, మరియు మన సంఘాలను చక్కటి భవనాలతో మరియు ఖరీదైన చక్కని పీఠములతో మరియు చక్కటి వాయిద్యములతో అలంకరించడంలో, మనం ఎంతో ఆసక్తి కలిగియున్నాము. మన సేవకులు చాలా బాగా తర్ఫీదు పొందారు…వారికి డాక్టరేట్లు DL., Ph.D., LL.D డిగ్రీలు కలవు, కానీ మనము దేనికొరకు పరిగెత్తుచున్నామన్నది మనము మర్చిపోయాము. సమస్య అదే. “వెళ్ళి, నేను మృతులలో నుండి లేచాను మరియు నేను గలిలయలో వారిని కలుస్తానని నా శిష్యులతో చెప్పండి.” మనము ఆ ముఖ్యమైన పదాన్ని మర్చిపోయాము. మనము ఇతర విషయాలతో తీరికలేకున్నాము, మనము ఆ ముఖ్యమైన పదాన్ని మర్చిపోయేంతగా, పెద్ద సంఘాలను కట్టుచూ, పెద్ద సంఘశాఖలను నిర్మించుకుంటూ ఉన్నాము.

50 రాబోయే సంఘటనల నిమిత్తం సిద్ధపడటంవల్ల చాలా మంది ప్రాణాలు రక్షించబడ్డాయి. కొంతకాలం క్రితం నాకు ఇట్లు చెప్పబడినది, ఫ్లోరిడాలో, ఒక పత్రికా విలేఖరి, ఒక వాతావరణ శాఖ, ఒక పెద్ద తుఫాను రాబోవుచున్నదని ఒక వార్తను ప్రసారం చేసింది. మరియు ఒక వ్యక్తి కోళ్ళ పెంపకం చేసేవాడు, మరియు అతడు తన పొరుగువాని వద్దకు వెళ్ళి తుఫాను వస్తుందని చెప్పాడు. అతడు పట్టించుకోకుండా, “బుద్ధిహీనత!” అని అన్నాడు. మరియు అతడు అలాగే కొనసాగాడు. అతడు తన కోళ్ళను అసలు లోపల పెట్టలేదు. అతడు అసలు ఆ గూడులోనికి వెళ్ళనేలేదు. అతడు అసలు ఎలాంటి ఏర్పాట్లు చేయనేలేదు. మరియు అతని పొరుగువాడు మాత్రం ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే, ఆ హెచ్చరికను లెక్కచేయని వ్యక్తికి చెందిన ప్రతీది, అతని కోళ్ళన్నీ, కొట్టుకుపోయాయి మరియు చంపబడ్డాయి, అతని ఇల్లు కూల్చివేయబడినది, అతని సరుకంతా పోయింది, అతడు ఆసుపత్రికి తరలించబడ్డాడు. అతడు ఆ హెచ్చరికను పట్టించుకోలేదు గనుకే అదంతా జరిగినది! ఆ వార్త ముందుగానే ఇవ్వబడినదని అతనికి తెలుసు, కానీ అతడు ఆ వార్త పట్ల శ్రద్ధ వహించడంలో విఫలమయ్యాడు.

51 ఈనాడు మన ప్రజలలో చాలా మందితో, మన సంఘాలలో అనేక వాటితో ఆ విధంగానే ఉన్నది. యేసుక్రీస్తు నిన్నా, నేడు, మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడని బైబిలు బోధించుచున్నదని మనకు తెలియును. యోహాను సువార్త 14:12 లో, యేసు చెప్పాడు, దానిని బైబిలు బోధిస్తుందని మనకు తెలుసు, “నాయందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలను, అతడు కూడా చేయును; నేను తండ్రియొద్దకు వెళ్ళుచున్నాను గనుక, వారు వీటికన్నా మరి గొప్ప కార్యములు చేయుదురు.” ఇప్పుడు హెచ్చరికను తీసుకొనుటలో కాకుండా, శ్రద్ధ వహించుటలో కాకుండా, ఇతర విషయాలపైనే మనము ఆసక్తిని కలిగియున్నాము. మనము పరిగెత్తాము, కానీ ఆ వర్తమానాన్ని పట్టించుకొనుటలేదు. మనము వెళ్ళాము, కానీ అక్కడికి చేరుకున్నప్పుడు ఏమి ప్రకటించాలో మనకు తెలియలేదు.

52 కొన్ని రోజుల క్రితం ఈ ప్రపంచంలోని సంఘములు, క్రైస్తవ సంఘాలు సిగ్గుచేటుకు మరియు అవమానానికి గురైనది ఎప్పుడనగా, గౌరవనీయమైన మరియు ప్రముఖమైన మరియు దేవునికి-భయపడే సేవకుడు, బిల్లీ గ్రాహం, బైబిల్‌తో ముఖాముఖిగా సవాలుకు తీసుకురాబడినప్పుడైయున్నది. అతడు పరుగెత్తాడు, కానీ ఆ వర్తమానాన్ని మరచిపోయాడు; అదెప్పుడనగా ఆ మహమ్మదీయుడు తన ముఖం ముందే నిలబడి అతనితో ఇట్లన్నప్పుడైయున్నది, “ఇది దేవుని వాక్యమైతే, నీవు దానిని ప్రత్యక్షపరచడాన్ని మమ్మల్ని చూడనివ్వు.” అతడు బాగానే పరుగెత్తాడు, గొప్ప ఉజ్జీవములు, గొప్ప కార్యములు చేసాడు. కానీ, సరైన చోటుకు వచ్చేసరికి, అతని వద్ద ఆ వర్తమానము లేదు.

53 “నేను మృతులలో నుండి లేచాను. నేను నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్నాను.” భౌతికంగా పరిగెత్తుచున్నవి, చక్కటి సంఘాలు, చాలా మంది సభ్యులు, గొప్ప సంఘశాఖలు, కానీ అది ఆ ముఖ్యమైన పదం కానే కాదు. ఏమి వెంబడించినవో గమనించండి, “మరియు నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును.” వెళ్ళారు, కానీ ఏమి ప్రకటించాలో తెలియలేదు.

54 ప్రకటించుటకు ఆయన ఏదైనా అతనికి ఇవ్వకుండా దేవుడు ఎన్నడూ ఒక మనిషిని పంపలేదు. దేవుడు ఎల్లప్పుడూ తన మాటలను ధృవీకరిస్తాడు.

55 వెళ్ళుచున్నారు, కానీ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రకటించలేక పోవుచున్నారు. మీ ఉజ్జీవాలు ఎంత పెద్దవిగా ఉన్నాగానీ, మీ సంఘము ఎంత పెద్దగా ఉన్నాగానీ, లేదా మీ సంస్థ ఇతరులపై ఎంత ఆధిపత్యం చేయుచున్నాగానీ అది లెక్క లేదు, వారికి ప్రకటించడానికి మీ వద్ద ఏదైనా లేకపోతే, ఒక లాడ్జి వలె పోగుచేయబడిన ఒక గుంపు ప్రజలను తప్ప మీరు మరేమి కలిగియున్నారు?

56 ప్రపంచానికి ప్రకటించడానికి మా వద్ద ఒక వర్తమానము ఉన్నది, “యేసు సజీవుడు! ఆయన మృతుడు కాడు!” వర్తమానాన్ని జాగ్రత్తగా వినండి సుమీ!

57 మనము దీని కొరకు కృతజ్ఞులమైయున్నట్టి ఈ గొప్ప దేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దాని గందరగోళమంతటిలో, దాని అసభ్యకరమైన, చెడు అంశాలన్నియుండి కూడా, ఇంకనూ ఇది ప్రపంచంలోనే గొప్ప దేశంగా ఉన్నది, మరియు ఎందుకనగా, ప్రారంభంలో అది సరిగ్గా స్థాపించబడినది. కానీ అది వర్తమానాన్ని పట్టుకొనియుండలేదు.

58 చాలా సంవత్సరాల క్రితం, అది దాని యొక్క పసితనములో ఉన్నప్పుడు, నాకు ఒక కథ గుర్తుకు వచ్చుచున్నది, అదేమనగా బ్రిటిష్ వారు ఈ దేశము యొక్క సహజ సంపదలను తీసుకొనబోవుచున్నారు. మరియు అక్కడ ఒక గుంపు పురుషులు తమకు తాముగా సమావేశమై మరియు గమనించుచూ, వారి కర్తవ్యమును నిర్వహించుచుండిరి. మరియు అక్కడ ఒక గుఱ్ఱము కళ్ళెము వేయబడియున్నది, మరియు ఒక స్వారీ చేయువాడు ఏ నిమిషములోనైనా దానిని ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నాడు. బ్రిటీష్ వారు వచ్చుచున్నారు అనేది అతనికి వచ్చిన మొదటి సంకేతం, అప్పుడు అతడు తన గుఱ్ఱముపై కూర్చున్నాడు. తన గుఱ్ఱమును తొందర చేయుటవలన అతనికి ఏమి ప్రయోజనం? ఆ గుఱ్ఱాన్ని కొట్టి, మరియు అతడు ఆ చర్చి నుండి బోస్టన్‌కు వెళ్తే ఏమి ప్రయోజనం? ప్రజలకు ప్రకటించడానికి అతడు ఒక వర్తమానమును కలిగిలేని యెడల అది అతనికి ఏమి మేలు చేస్తుంది? వారు తమను తాము సిద్ధపరచుకోవాలని వారికెట్లు తెలుస్తుంది?

59 మన ఆధునిక పాల్ రివేర్ బాగానే పరిగెత్తాడు, కానీ, వారు కేవలం పరుగెత్తుచున్నారు, వారి వద్ద వర్తమానము లేదు. ఘడియ వచ్చియున్నది, సంక్షోభం వచ్చియున్నది! ప్రపంచం ఒక ముగింపులో ఉన్నది! సంఘాలు వాటియొక్క చివరి దశను చేరుకున్నాయి. దేశాలు తమ అంతిమ ఘట్టానికి చేరుకున్నాయి. మానవ జీవితం దాని చివరి దశను చేరుకుంది. విజ్ఞాన శాస్త్రం దాని అంతిమ ఘట్టానికి చేరుకుంది. మనము సంస్థాగతమైపోయి మరియు పెద్ద సంఘాలను తయారు చేసాము, మన బోధకులను నునుపు చేసి మరియు భౌతికంగా వారిని క్రమపరిచాము, తద్వారా వారి యొక్క వ్యాకరణ క్రియ మరియు క్రియా విశేషణాలను, మరియు వాటి శబ్దాలను మరియు—మరియు ఆ అచ్చులన్నిటిని ఎలా ఉపయోగించవలెనో వారికి తెలిసియున్నది, మరియు ప్రజలను సంప్రదించడానికి, మనో విజ్ఞాన శాస్త్రమును కలిగియున్నారు. కానీ యేసు చెప్పినది అది కాదు!

60 “నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. వారు క్రొత్త భాషలతో మాట్లాడుదురు. మరణకరమైన విషసర్పము వారిని కరిచినా, అది వారికి హాని కలిగించదు. వారు రోగుల మీద చేతులుంచగా, వారు స్వస్థత నొందుదురు.” దేనినైనా ప్రకటించుటకు, ఒక వర్తమానమును కలిగియున్న ఒక వర్తమానికుడు లోకానికి అవసరమైయున్నాడు, మరియు ఆ వర్తమానం ఎక్కడ నుండి వచ్చినదో మరియు ఎవరి వద్ద నుండి వచ్చినదో వారు ఎరిగియుండవలసియున్నది.

61 పాల్ రివేర్, అతడు తన గుఱ్ఱము పైకి ఎక్కినప్పుడు, ఒక పరాక్రమశాలి, చరిత్రగా ఉండుటకు ఒక దేశం ఉన్నంతకాలం చరిత్రలో ఉన్న వ్యక్తియైయున్నాడు. అతడు పేదవారినుండి ధనవంతుల వరకు, రైతు నుండి వ్యాపారవేత్త వరకు, ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేసే ఒక వర్తమానముతో, చర్చి మెట్ల నుండి ఆ గుర్తించదగిన స్వారీ చేసాడు, అదేమిటనగా, “బ్రిటిష్ వారు వచ్చుచున్నారు!” మరియు సైనికులు దాడికి తమను తాము సిద్ధపరచుకున్నారు. మరియు ఈ గొప్ప దేశం రక్షించబడినది.

62 దేవునియొక్క ఈ వారసత్వము, దేవుడు తమ కొరకు మరణించినట్టి ఈ ప్రజలు, ఆయన పేరుతో పిలువబడుచున్న ఈ సంఘము, ఎన్నడైనా రక్షించబడాలంటే, ఈ దినముయొక్క సవాలును ఎదుర్కొనడానికి, సింహాసనము నుండి ఒక వర్తమానముతో ఒక వర్తమానికుణ్ణి మనం కలిగియుండవలసి యున్నది. ఒక గొల్యాతు ఉన్నాడు, అయితే నిశ్చయంగా దేవుడు ఎక్కడో ఒక దగ్గర ఒక దావీదును కలిగియుంటాడు. ఆ సంధించేదానిని మనము కలుసుకోవలసియున్నది. మనము ఒక…మనము ఒక వర్తమానమును కలిగియుండవలసియున్నది.

63 మనము వెళ్ళుచున్నాము, కానీ ప్రకటించడానికి ఏమీ లేకుండా వెళ్ళుచున్నాము. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదని తిరస్కరించే, ఒక దేశము లేదా ప్రజలు, నేటి మన అత్యంత సవాలు చేసే సేవకుల ఎదుట నిలబడే ఒక స్థితికి మనము వచ్చినప్పుడు అది దానిని ఋజువు చేస్తుంది. ఆపై మన గొప్ప సంఘ సమితిలో, ఇరవై లేదా ముప్పై సంవత్సరాలుగా ముప్పై మంది కమ్యూనిస్టులు, వారు కమ్యూనిస్టు పార్టీ సభ్యులని పత్రికలను తెచ్చుటను కనుగొనుచున్నాము, అది మన సంఘముల సమైఖ్యలోయైయున్నది. మనం ఏమి చేయగలం? వారు ఒక వర్తమానము లేకుండానే పరిగెత్తారని అది చూపించుచున్నది; దేశము యొక్క జన్మహక్కులనే అమ్మివేయుచున్నారు, సంఘము యొక్క సాధారణ జన్మహక్కులను అమ్మివేయుచున్నారు.

64 అదంతయూ ఒక ముఖాముఖికి వచ్చియున్నది. అది ఎటువంటి ఒక చోటుకు వచ్చినదంటే ఆ వర్తమానాన్ని నమ్మి, మరియు రెండు కాళ్ళ మీద నిలబడిన ఆ చిన్న సంఘము, వారి కన్నులు సిలువ వైపు కేంద్రీకృతమై ఉన్నాయి, వారి హృదయములో యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము మండుచున్నది! దేశాలు దానిని గుర్తించవలసిన ఒక స్థితికి అది వచ్చినది. అది ఒక అంతిమ పరీక్షకు వచ్చినది. ఆశ్చర్యమేమీ లేదు ఆ సంఘములు…ఆ సంఘముల సమైఖ్యలు, అది కమ్యూనిస్టులతో ఎంతగానో ఐక్యమైనప్పుడు, వారు సహజాతీతమైన దానిని విశ్వసించలేకపోవడంలో ఆశ్చర్యం లేదు. వారు దైవిక స్వస్థతను విశ్వసించలేకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు; వారు ఎంతగా పరిగెత్తుచున్నాగానీ, వారి హృదయంలో ఎటువంటి వర్తమానమును వారు కలిగిలేరు.

65 పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి యొక్క హృదయములోనికి వస్తే, యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడని అతడు నమ్ముతాడు, మరియు చేయుటకు, ఆయన ఏమి చేయుటకు వచ్చెనో ఆ సంకల్పమును నెరవేర్చుటకు; ఆ సంకల్పమును, దేవుని యొక్క సంకల్పమును ఆ మానవుని జీవితం ద్వారా నెరవేర్చుటకు, ఆయన అతనిలో సజీవముగా ఉన్నాడు.

66 కానీ, సమస్య ఏమిటంటే, మనము పరుగెత్తుతాము, ఒక వర్తమానము లేకుండానే మనము వెళ్తాము. మనము ఒక వేదాంతశాస్త్రంతో వెళ్తాము. మనము లేఖనములను గూర్చిన ఒక విధమైన సంఘపు అనువాదముతో వెళ్తాము.

67 మనము పునరుత్థానముతో వెళ్ళవలసియున్నది! “నేను ఒక నూతన సంఘాన్ని ఏర్పాటు చేస్తానని మీరు వెళ్ళి, నా శిష్యులకు చెప్పండనా”? లేదు, అయ్యా! “వెళ్ళి, నేను చెప్పినట్లే, నేను మృతులలోనుండి లేచియున్నాను అని నా శిష్యులతో చెప్పండి.” ఈ ఉదయం ఈ సంఘానికి వర్తమానము అదే, అదేమనగా యేసు మృతుడు కాడు. ఆయన సజీవంగా ఉన్నాడు, మరియు ఆయన ఎప్పటిలాగే ఈ రోజు కూడా అంతే గొప్పవాడుగాను మరియు శక్తిమంతుడుగాను ఉన్నాడు.

68 మనము సిద్ధపడటానికి, అనేక హెచ్చరిక వర్తమానాలను పొందియున్నాము, పాల్ రివేర్ మరియు ఇతర గొప్ప వ్యక్తులను, మరియు గొప్ప యుద్ధాలను మరియు తుఫానులను, మరియు ఇతర కార్యములను కలిగియున్నాము.

69 అప్పుడు, దేవుడు ఓదార్పు వర్తమానమును కూడా పంపుతాడు. ఇది ఒక ఓదార్పు వర్తమానము.

70 కొంతకాలం క్రితం, వారు దక్షిణాన బానిసత్వమును కలిగియున్నప్పుడు, ఈ రోజు మనం, “నల్ల జాతీయులు,” అని పిలిచే, ఆ స్థానికులను దక్షిణాఫ్రికా నుండి బోయర్స్ వారు తీసుకువచ్చారు. మరియు వారు వారిని ఇక్కడికి తీసుకువచ్చి మరియు వారిని బానిసలుగా చేయడానికి, దక్షిణాన ఉన్న అమెరికన్లకు అమ్మేసారు.

71 ఈనాడు ఆఫ్రికాలో దాని గురించి గొప్ప తిరుగుబాటు విప్లవాలు, హత్యలు మరియు మొదలగునవి జరుగుచున్నవి. వారు తమ స్వేచ్ఛ కోసం పోరాడుచున్నారు. దాని కోసం పోరాడే హక్కు వారికి ఉన్నది. దేవుడు మానవుని కలుగజేసెను; మానవుడు బానిసలను కలుగజేసాడు. అది ఎన్నడూ ఉద్దేశించబడలేదు.

72 కొన్ని సంవత్సరాల క్రితం, నేనొక క్రీడా స్థలములో, లేదా, ఒక గొప్ప మ్యూజియంలో ఉన్నాను. నేను కళను అభినందిస్తాను గనుక, విభిన్న చిత్రాలు మరియు వస్తువులను చూస్తూ, చుట్టూ తిరుగుచుంటిని. దేవుడు కళలో ఉన్నాడని నేను అనుకుంటాను. మరియు నేను పైకి నడిచాను, అక్కడ వృద్ధుడైన ఒక నీగ్రో మనిషి ఉండుటను నేను గమనించాను, అతను చాలా వృద్ధుడు, వంగిపోయిన భుజాలతో ఉన్నాడు, అతని తల వెనుక కేవలం కొంచెం జుట్టు మాత్రమే ఉన్నది. అతను తన టోపీని ధరించియున్నాడు. మరియు అతను చుట్టూ తిరుగుచున్నాడు, మరియు ఆ రీతిగా, అతడు ఆ మ్యూజియంలో దేనినో గమనిస్తున్నట్లు లేదా దేని కొరకో వెతుకుతున్నట్లు, చుట్టూ చూస్తున్నాడు. నేను వెనుక నిలబడి అతణ్ణి కొంచెం సేపు గమనించాను.

73 మరియు కొంత సమయం తర్వాత అతను అక్కడ ఒక ఫలానా చిన్న పెట్టె వద్దకు వచ్చాడు. మరియు అతడు దానిలోకి చూశాడు, మరియు అతను ఆశ్చర్యపోయాడు, మరియు అతని కళ్ళు ప్రకాశవంతమయ్యాయి. అతడు ఒక నిమిషం ఆ పెట్టె నుండి వెనక్కి దూకి, తన చిన్న ప్లగ్ టోపీని తీసి, దానిని తన చేతిలో పట్టుకున్నాడు. మరియు నేను అతణ్ణి గమనించాను. మరియు వృద్ధుడైన ఆ నల్లవాడు తన తలను వంచినప్పుడు, అతని చెంపల మీదుగా కన్నీళ్ళు కారడం మొదలైనది. మరియు నేను అతనిని కొద్దిసేపు, ఆశ్చర్యంతో గమనించాను.

74 అప్పుడు నేను ఇట్లనుకున్నాను, “ఈ వృద్ధుడు దేనిని గూర్చి అంతగా ఉత్సాహపడుచున్నాడో నేను కనుగొంటాను.” నేను ఇటు వైపుగా నడిచాను, మరియు అక్కడ ఒక వస్త్రము ఉన్నట్లు నాకు కనిపించినది.

75 మరియు అతను అక్కడ నిలబడియుండుటను నేను చూశాను. మరియు నేను అక్కడికి నడిచి వెళ్ళి, నేను ఇట్లన్నాను, “అంకుల్, నీవు ఎలా ఉన్నావు?”

మరియు అతడు ఇట్లన్నాడు, “అయ్యా, నీవు ఎలా ఉన్నావు.”

76 మరియు నేను అన్నాను, “నేను ఒక సేవకుడను. నీవు ఈ స్థలంలో ప్రార్థన చేయడం చూసి నేను ఆశ్చర్యపోయాను.” “నీవొక క్రైస్తవుడవని నేను నమ్ముదును,” అని నేను అన్నాను.

“అవును, అయ్యా,” అని అతడు చెప్పాడు.

మరియు నేను ఇట్లన్నాను, “నిన్ను అంతగా ఉత్సాహపరిచినది ఏమిటి?”

77 అతను ఇట్లన్నాడు, “ఇక్కడికి రండి.” మరియు నేను ఆ వృద్ధునితో కలిసి, అక్కడికి వెళ్ళాను. అతను చెప్పాడు, “నీవు ఆ వస్త్రమును చూశావా?”

“అవును, అయ్యా,” అని నేనన్నాను.

అతను చెప్పాడు, “అక్కడ ఆ మరకను నీవు చూశావా?”

“చూశాను, అయ్యా,” అని నేను చెప్పాను.

ఇట్లన్నాడు, “నా ప్రక్కలో నీ చెయ్యి పెట్టుము.”

నేను చెప్పాను, “ఆ కరుకుగా ఉన్న భాగం ఏమిటి?”

78 అతను చెప్పాడు, “ఒక రోజు, ఒక బానిస కొరడా దాని మీదుగా వెళ్ళినది. మరియు అది అబ్రాహాము లింకను యొక్క రక్తము.” అతడు ఇట్లన్నాడు, “అతని రక్తము నా పైనుండి బానిస కొరడాను తీసివేసినది.” ఇంకా ఇట్లన్నాడు, “అది, నిన్ను కూడా ఉత్సాహపరచదా?”

79 నేను విస్మయమునొంది అక్కడ నిలబడిపోయాను. నేను అనుకున్నాను, “తన పైనుండి ఒక బానిస కొరడాను తీసివేసినందుకు, అబ్రాహాము లింకను యొక్క రక్తము ఒక బానిసను ఉత్సాహ—ఉత్సాహపరచినయెడల, మద్యపానానికి బానిసయైన రోసెల్లా, దౌర్భాగ్యుడైన దోషిగా మరణించుచున్నట్టి నాలాంటి ప్రజలకు; యేసుక్రీస్తు యొక్క రక్తము ఏమి చేయవలసియున్నది?” నా హృదయము నుండి పాపపు కొరడాను ఆయన తీసివేసాడు. అది ఒక మనిషిని ఉత్సాహపరచవలసిందిగా లేదా? అది అతనికి భిన్నమైన అనుభూతిని ఇవ్వదా? అతడు దాని గురించి ఆలోచించినప్పుడు అది అతనికి భక్తిమర్యాదను కలిగించదా? ఆ మ్రానుపై యేసు మీ జీవితమును విమోచించాడని ఎరిగియుండి, మీ తలను వంచకుండా, మీరు ఒక చెట్టును చూడలేరు.

80 ఒక క్షణం, ఆ బానిసలతో, మరియు మన ఆలోచనతో, మనము కొనసాగుచుండగా. ఒక ప్రకటన ఉన్నది, సంతకం చేయబడి, బంధకము నుండి విముక్తి కలిగించు ప్రకటన ఉండియున్నది, మరియు ఒక ఫలానా దినమున బానిసలు స్వతంత్రులు అవ్వబోవుచున్నారు. మీకు తెలియదు, ఓ, మీరు ఎన్నడూ క్రీస్తును కలుసుకొనని యెడల, అది ఆ బానిసలకు ఎంత విలువైనదో మీకు ఎన్నడూ తెలియదు. ఆ ప్రకటన, ఆ దేశమంతటా అది వెళ్ళినప్పుడు, అదేమనగా, “మీరు ఫలానా-మరియు-ఫలానా రోజున, తెల్లవారు జామున విడుదల పొందబోవుచున్నారు. మీరు స్వేచ్ఛగా ఉండబోవుచున్నారు. మీరు ఇకపై బానిస బెల్టులను ధరించాల్సిన అవసరం లేదు, అలాగే ఇకపై మీకు కొరడా దెబ్బలు కూడా తగలవు. అయితే మీరు స్వతంత్రులు, మరియు మీరు ఈ గొప్ప అమెరికా దేశపు పౌరులైయుందురు. ఒక ఫలానా-ఫలానా ఉదయాన్న సూర్యోదయం తర్వాత, మీరిక ఎంత మాత్రము బానిసలు కారు.” ఓ, వారు గొప్ప అంచనాలతో వేచియున్నారు.

81 పాపి దానిని చూడగలిగితే చాలు! ఒక పాపి సత్య సువార్తను వినగలిగితే చాలు! ఒక సంఘములో చేరటం కాదు గానీ, మీరు పాపం నుండి మరియు మీ వ్యాధి నుండి విడుదల పొందగలరన్న, సువార్త ప్రకటనయైయున్నది. “ఒక నిర్దిష్ట-నిర్దిష్ట సమయములోనైయున్నది,” అది మీరు విశ్వసించే ఒక సమయం.

82 మీకు తెలుసా, ఆ బానిసలు వారు విడుదల పొందే ఆ ఘడియ కోసం వేచి చూస్తూ, అటువంటి ఒక ఎదురుచూపుతో ఎంతో ఉత్సాహంతో ఉన్నారు, ఎంతగా అంటే, వారు ఒక కొండ దిగువన సమావేశమయ్యారని, వారు నాకు చెప్పారు, తల్లులు మరియు చిన్న పిల్లలు, మరియు కొంతమంది వృద్ధులు, అందరూ గుమిగూడారు. మరియు వారు అర్ధరాత్రి సమయంలో, కొండపైకి ఎక్కారు. తెల్లవారుజామున సూర్యుడు ఉదయించినప్పుడు, వారు స్వతంత్రులవుతారని వారికి తెలుసు. కొండపై నుండి సూర్యుడు ప్రకాశించడానికి ఒక అరనిమిషం కంటే ఎక్కువ సమయం పట్టదు, అయితే వారిలో కొంతమంది కొండపైకి ఎక్కి, ఎదురుచూస్తూ, ఎదురుచూస్తూ ఉన్నారు. “ఓ, సూర్యుడు ఉదయించినప్పుడు, మనము విడుదల పొందెదము.” అది కు-మా-రు-డు…లేదా, సూ-ర్యు-డు.

83 అయితే ఈ రోజుల్లో ఏదో ఒక దినమున కు-మా-రు-డు ఉదయించినప్పుడు! మరియు పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం కు-మా-రు-డు ఉదయించినప్పుడు, ఆయన ప్రతి బానిస కట్లను తెంచాడు, ఆయన ప్రతి బంధీని విడిపించాడు, ఆయన ప్రతి వ్యాధిని స్వస్థపరిచాడు, బంధకములో ఉన్నవారికి ఆయన స్వేచ్ఛను అనుగ్రహించాడు. మనం పైకి ఎక్కి ఎంతగా ఎదురుచూడవలసి యున్నాము కదా!

84 మరియు సూర్యుడు తొంగిచూసినప్పుడు, మొదట, ఆ కొండపై ఎగువున ఉన్న వ్యక్తి, దానిని చూశాడు, మరియు దిగువన ఉన్న ఆ తదుపరి వ్యక్తికి అతడు కేక వేసి ఇట్లు చెప్పాడు, “మనము స్వతంత్రులము!” మరియు ఆ తదుపరి వ్యక్తి కొండ క్రింద దూరాన ఉన్న వ్యక్తికి కేక వేసి ఇట్లు చెప్పెను, “మనము స్వతంత్రులము!” ఆ శిబిరానికి చేరుకునే వరకు, “మనం స్వతంత్రులము!” అని అరిచారు. ఎందుకంటే, సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఆ ఘడియ కోసమే వారు ఎదురుచూస్తూ, ఎదురుచూస్తూ, వేచియున్నారు.

85 ఈ రోజు, మనం దేవుని కు-మా-రు-ని కొరకు, ఎంత ఎక్కువగా ఎదురు చూడవలసియున్నది కదా. మనం పాపము నుండి విడుదల పొందియున్నాము. మనం బంధకాల నుండి విడుదల పొందియున్నాము. మనం అలవాట్ల నుండి విడుదల పొందియున్నాము. మనం ధూమపానం, మద్యపానం, త్రాగుబోతుతనం నుండి విడుదల పొందియున్నాము, ఎందుకనగా దేవుని కు-మా-రు-డు సమాధి నుండి లేచి మరియు ప్రతి బంధకాన్ని బ్రద్దలు చేశాడు. శిక్షావిధి అంతయు తొలగిపోయెను! అప్పు తీర్చబడెను. అపరాధ రుసుము చెల్లించబడెను. పాపములు కడిగివేయబడెను, మరియు మనం స్వతంత్రులమయ్యాము. ఓ, మనము స్వతంత్రులమైన, ప్రజలము! బానిసత్వమా? దేవుని కుమారుడు తన స్వస్థతా రెక్కలతో ఉదయించినప్పుడు, విడుదల!

86 ఏదో ఒక దినమున ఆయన సింహాసనం నుండి లేచి, తిరిగి భూమి మీదకు వచ్చును. మరియు అప్పుడు ఆయనతో సదా జీవించుటకు మనము అన్ని బాధలు మరియు అన్ని శోధనల నుండి విడుదల పొందుతాము, అన్ని శారీరకమైన నొప్పుల నుండి, మరియు ఈ మర్త్య జీవితంలో సంభవించే వాటన్నిటినుండి విడుదల పొందుతాము. మనము స్వతంత్రులమౌతాము. “వెళ్ళి, ప్రకటించుడి,” దానినే చేయవలసియున్నది.

87 బైబిలు కాలంలో, ఒక సునాద సంవత్సరం వచ్చుచుండేది. తాము చేసిన అప్పుల నిమిత్తము అమ్మబడిన ప్రజలు, వారు అప్పుబడియుండి మరియు దానిని చెల్లించలేకపోయేవారు, కాబట్టి వారు వెళ్ళి తమను తాము ప్రజలకు, బానిసలుగా అమ్ముకున్నారు. మరియు వారు తమ జీవిత కాలమంతా, వారికి బానిసగా, వారి యొక్క దాస్యత్వములో ఉండవలసియున్నది. కానీ, తరచుగా, సునాద సంవత్సరముగా తెలియబడిన, ఒక కృపా దినము వచ్చును. మరియు ఆ సునాద సంవత్సరం వచ్చినప్పుడు, అప్పుడు ఒక యాజకుడు బయటకు వెళ్ళి ఒక బూరను ఊదుతాడు. అతడు ఎంతకాలంగా సేవ చేస్తున్ననూ, మరియు ఇంకెంత కాలం సేవ చేయవలసియున్ననూ, ఆ బూర మ్రోగినప్పుడు, ఆ దాసుడు విడిపించబడ్డాడని ఆ బూర ప్రతి బానిసకు సూచిస్తుంది. అతడు ఆ పారను అక్కడ పడవేసి మరియు తన ఇంటికి పిల్లల వద్దకు వెళ్ళవచ్చును. అతడు ఇక ఎంతమాత్రము పని చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే సునాద సంవత్సర బూర మ్రోగినప్పుడు అతడు స్వతంత్రుడయ్యాడు. ఆ బూర ఒక స్పష్టము కాని ధ్వనిని ఇవ్వలేదు గానీ, అది ఒక స్పష్టమైన ధ్వనినే ఇచ్చినది. మరియు ఆ మనిషి తన పనిముట్టును క్రిందపెట్టి, బానిసత్వం నుండి విడుదల పొంది ఇంటికి వెళ్ళవచ్చును.

88 ఈ ఉదయం, బైబిలు ఇట్లు చెప్పుచున్నది, “మరియు బూర స్పష్టముకాని ధ్వని ఇచ్చునప్పుడు, ఏమి చేయవలెనో ఎవరికి తెలియును?” యేసుక్రీస్తు మృతులలోనుండి లేచాడనియు, ఆయన నిన్నా, నేడు మరియు నిరంతరం ఒక్కటేరీతిగా ఉన్నాడనియు బైబిలు బోధించిన యెడల, మరియు ఈ రోజు మనం వింటున్న ఈ బూరలు, “అద్భుతాలు జరుగు దినములు గడిచిపోయినవి, దైవిక స్వస్థత వంటిదేదియు లేదు,” అని చెప్పినయెడల తమను తాము ఎలా సిద్ధపరచుకోవాలో ఎవరికి తెలియును?

89 ఈనాడు దేవుని యొద్ద నుండి అభిషేకించబడిన వర్తమానికులు మనకు అవసరము! “ఆయన మృతులలో నుండి లేచియున్నాడు! ఆయన నిన్నా, నేడు మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు!” అదే ఈ దినపు వర్తమానము.

90 ఓ, గొప్ప వర్తమానములు ఉండియున్నవి, కానీ ఈస్టరు వాటన్నిటికి పైకప్పు అయ్యున్నది! గొప్ప వర్తమానములు; అదంతయు ఈస్టరు అయ్యున్నది! ఎప్పుడైతే మృతులు…ఆ ఆఖరి శత్రువు…పాతనిబంధనలో రోగాలు బాగవ్వడం మనం చూసాము. పాతనిబంధనలో అద్భుతాలు జరగటం మనం చూసాము. పాతనిబంధనలో దర్శనాలు వచ్చాయి. కానీ అతడు ఎన్నడైనా తిరిగి లేస్తాడా అని ఆశ్చర్యపోతూ, ప్రతి మనిషి సమాధిలోనికి వెళ్ళాడు. అయితే ఈస్టరు ఉదయాన, ఈ శిష్యులకు ఏ మనిషి అయినా పొందలేని గొప్ప వర్తమానము వచ్చినప్పుడు, వారు ఏమి పొందుకున్నారు? “నేను మృతులలో నుండి లేచియున్నానని, వెళ్ళి, నా శిష్యులతో చెప్పండి!” మరణము జయించబడినది!

91 భూమిపై జయించగల వారు ఎవ్వరూ లేరు, ఏ ప్రవక్త, ఏ గొప్ప వ్యక్తి, ఏ పరిశుద్ధుడూ లేరు…వారు దేవుని ఆత్మ చేత వ్యాధిని జయించగలరు. వారు దేవుని ఆత్మ ద్వారా కాలమును జయించి, మరియు సంభవింపబోవు సంగతులను ముందుగా చూడగలరు. వారు దానిని జయించగలరు. కానీ దేవుని నుండి అంతటి అభిషేకంతో అభిషేకించబడి ఈ ప్రకటన చేయగల ఒక వ్యక్తి ఎన్నడూ లేడు, అదేమనగా, “నా ప్రాణమును పెట్టుచున్నాను, నేను దానిని మరలా తీసుకొనెదను. ఈ దేహమును పడగొట్టుడి, మూడవ దినమున నేను దానిని లేపుదును.” అటువంటి ఒక ప్రకటన చేయగల వ్యక్తి ఎన్నడూ లేడు. మరియు ఇది నిజమౌనా లేదా అని, వారి హృదయాలలో ఆశ్చర్యపడుచుండిరి.

92 అయితే ఈస్టరు ఉదయమున, వారికి ఒక వర్తమానము వచ్చినది, “మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నేను మృతులలో నుండి లేచియున్నాను. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు, సదాకాలం మీతో కూడా ఉన్నాను. నమ్మి బాప్తీస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మనివానికి శిక్ష విధింపబడును. మరియు నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును: నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు; వారు క్రొత్త భాషలతో మాటలాడుదురు; వారు సర్పములను ఎత్తి పట్టుకున్నను లేదా మరణకరమైనవి ఏవి త్రాగినను, అది వారికి హాని చేయదు; వారు రోగులమీద చేతులుంచగా, వారు స్వస్థత నొందుదురు.” ఈస్టరు వర్తమానము, అత్యున్నతమైన వర్తమానములలో ఇదొకటైయున్నది. మరణము జయించబడినది!

93 మనము ఒక జయశీలుని గూర్చి ఆలోచించెదము. ముప్పై-మూడు ఏండ్ల వయస్సులో, నెపోలియన్, ప్రపంచమును జయించెను. అతడు ప్రపంచమును జయించెను, ఓడించవలసిన ప్రతి దేశమును అతడు ఓడించెను. మరియు పోరాడటానికి ఇక ఎవరూ లేనందున అతడు ఎంతగానో నిరుత్సాహపడెను, అతడు కూర్చుని మరియు ఏడ్చెను. పోరాడుటకు ఇక ఎవరూ లేరు, అయితే అతడు ఆట యొక్క నియమములను పాటించలేదు. పదివేల మంది వేశ్యలు అతని సైన్యాన్ని వెంబడించారు, అతడు ఒక తుపాకీతో మరియు ఒక ఖడ్గముతో వెళ్ళాడు. ముప్పై-మూడు ఏండ్ల వయస్సులో, అతడు ప్రపంచమును జయించెను. అయితే ఒకప్పుడు అతడు మద్యపానాన్ని నిషేధించాడు, మరియు అతడు విపరీతమైన మద్యపానిగా చనిపోయాడు, ఎందుకనగా అతడు ఆట యొక్క నియమములను పాటించలేదు. అతడు ఆ వర్తమానమును మర్చిపోయాడు. అతడు జయించాడు, కానీ అతడు ఆ వర్తమానమును మర్చిపోయాడు. అతడు వెళ్ళాడు, కానీ అతడు దేనికొరకు వెళ్ళుచున్నాడో దానిని అతడు మర్చిపోయాడు.

94 పరుగు పందెంలో పరుగెత్తిన ఆ చిన్న పిల్లవాడి వలెనే, ఈనాడు పరిగెత్తుచున్న సంఘమువలెనే, పరిగెత్తుచున్న ప్రజల వలెనే, పరిగెత్తుచున్న దేశం వలెనేయైయున్నది! మన ఆశ్రయము అణు బాంబులు కావు, మన ఆశ్రయము యేసుక్రీస్తు మరియు ఆయన పునరుత్థానమైయున్నది.

95 నెపోలియన్ ఆ ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయాడు. అతనికి ఏమి సంభవించినది? అతను పూర్తిగా ఓడిపోయి, ఒక త్రాగుబోతువలె మరణించాడు. ఎందువలన? అతడు భౌతికంగా, ప్రపంచమును జయించినప్పటికినీ, అతడు ఆటను సరిగ్గా ఆడలేదు. అతడు ఒక సైన్యమును తయారు చేసెను. అతడు ఒక సైనిక మేధావి, అతడు ప్రతి దేశమును జయించి మరియు (అతడు) అతనిలాగా మరెవ్వరూ ఎన్నడూ చేయలేనట్టి లేదా ఎన్నడూ చేయనట్టి, కార్యములను అతడు చేసెను, అయితే నిజమైన వర్తమానం ఏమిటన్నది అతడు మరచిపోయెను. అతడు దానిని జయించి, మరియు తన సైనిక బలాన్ని కలిగియున్నాడు, కానీ అతడు ప్రభువు యొక్క బలమును మరచిపోయాడు.

96 ప్రభువు యొక్క బలము మనకు ఆదరణయైయున్నది. మనకు ఏ ఇతర బలము లేదు. నాకు వేరే ఏ ఆశ్రయము లేదు, ఏదీ లేదు! దేవా కరుణించుము! నా జీవితాన్ని తీసుకొనుము, కానీ నా బలం ఎక్కడ నుండి వచ్చినదో నన్ను ఎప్పటికీ మరచిపోనీయకుము. అది ప్రభువు యొద్ద నుండే వచ్చును! ఈ లోకము యొక్క శ్రేష్ఠమైన కార్యములు నాకు అక్కర్లేదు. నాకు యేసు కావలెను, ఆయన యొక్క పునరుత్థానము నా జీవితంలో మండుచుండుట నాకు కావలెను.

97 ముప్పై-మూడు ఏండ్ల వయస్సులోనున్న యేసుక్రీస్తునకు అది ఎంత భిన్నంగా ఉన్నది కదా! ముప్పై-మూడు సంవత్సరాల వయస్సులో, యేసుకు ప్రతీది స్వంతమైయుండెను; ఆయన లోకమును కలుగజేసెను. మరియు ఆయన ఈ లోకములో ఉండెను, మరియు లోకము ఆయనను ఎరుగకుండెను. ఆయన స్వయంగా తన కొరకు ఎన్నడూ పేరు సంపాదించుకొనలేదు. ఆయన ఎటువంటి సైనికులను ఎన్నడూ సమకూర్చలేదు. ఆయన ఎన్నడూ ఎటువంటి సంఘములను స్థాపించలేదు. ఆయన ఎన్నడూ తన కొరకు ఎటువంటి గొప్ప పేర్లను సంపాదించుకొనలేదు. ఎటువంటి సిద్ధాంతము, వేద పాండిత్యము, మరియు అటువంటి బడాయిగల పట్టాలతో ఆయన ఎన్నడూ వచ్చియుండలేదు, ఆయన ఏ వేదాంత పాఠశాలకైనా వెళ్ళినట్లు దాఖలాలు లేవు. అయితే ఆయన దేవుడిని కలిగియుండెను. ఆయన దేవుడిని కలిగియుండెను. మరియు ముప్పై-మూడు సంవత్సరాల వయస్సులో, నరకం నుండి తన తలను బయటకు పెట్టిన ప్రతి దయ్యమును ఆయన జయించెను. ఆయన వ్యాధిని జయించెను. ఆయన మూఢ నమ్మకాలను జయించెను. ఆయన దయ్యములను జయించెను. ఆయన మరణమును జయించెను. మరియు ఆయన సిలువ వద్ద మరణించినప్పుడు, ఆయన పాతాళము యొక్క అడుగులేని అగాధములోనికి వెళ్ళి, మరియు పాతాళమును జయించెను.

98 మరియు ఈస్టరు ఉదయమున ఆయన సమాధిని జయించెను. ఎందువలన? ఆయన వర్తమానముతో పరుగెత్తుచూ, ఆటయొక్క నియమములను సరిగ్గా పాటించెను. ఆయన పాటించెను, ఆయన వెళ్ళెను! “వెళ్ళుము.” దేవుడు ఆయనను పంపెను, మరియు వారికి చెప్పుటకు ఆయన ఒక వర్తమానమును కలిగియుండెను. మరియు దేవుడు ఆయనకు ఇచ్చిన వర్తమానముతో, ఆయన సాతాను యొక్క శక్తులను జయించెను. ఆయన వ్యాధిని జయించెను. ఆయన మరణమును జయించెను. ఆయన పాతాళమును జయించెను. ఆయన సమాధిని జయించెను. ఎందువలన? ఆయన వెళ్ళెను! “వెళ్ళి, ప్రకటించుము!” “నేను ఏమి చేయవలెనని తండ్రి చూపించునో నేను ఎల్లప్పుడూ దానినే చేయుదును. ఆయన చేయమని చెప్పినది కాక మరి దేనిని నేను చేయను.”

99 పిదప ఆయన మరణించుటకు ముందు, ఆయన దీనిని చెప్పెను, “తండ్రి నన్ను పంపిన ప్రకారము, నేను మిమ్మల్ని పంపుచున్నాను.” సైనిక బలంతో మనుషులను నిర్మించుటకు కాదు; అధ్యక్షుడు ఎవరు అనే దానిలో మీ సమయమంతటినీ వెచ్చించటకు కాదు. అది అవసరమై ఉండవచ్చును, కానీ దీనిలో అది అవసరం లేదు. లోకం పని అయిపోయినది. మనము ఒక వర్తమానమును కలిగియున్నాము, అదేమనగా, యేసుక్రీస్తు మృతులలో నుండి లేచియున్నాడు, మరియు ఆయన నిన్నా, నేడు మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు.

100 నిన్న, ఒక చిన్న కోర్టు గదిలో, సరి కాని ఒక విషయమును నాతో చెప్పించుటకు వారు ప్రయత్నించుచుండిరి. నేను ఇట్లన్నాను, “నేను మోసగాడిని కాను.” నేను చెప్పాను, “నేను—నేను—నేను నిజాయితీపరుడను. మరియు సత్యమైనది తప్ప మీరు వేరే దేనిని ఇక చెప్పలేరు.”

101 మరియు ఒక ఫలానా వ్యక్తి నాతో ఉన్నాడు, అతడిట్లన్నాడు, “ఒక వ్యక్తి నాతో అలా మాట్లాడితే, అతనిపై ఒక పుస్తకాన్ని విసిరేయాలని నాకు అనిపించును.”

102 నేను చెప్పాను, “లేదు, అయ్యా. లేదు, అది సరి కాదు. దానిని సమీపించే విధానం అది కాదు. సరి కాదు.”

103 అతను చెప్పాడు, “సరే, ఈ విషయాలు కొనసాగుతాయని మీకు ఎందుకు తెలియదు? మీరు బయట ఎందుకు ఇలా చేయడం లేదు?”

నేను చెప్పాను, “నేను యేసుక్రీస్తును సేవించుటలోనే నా సమయాన్ని వెచ్చిస్తాను.”

104 ఓ దేవా, ఓ, ప్రజలు గుడ్డివారైయ్యుండి మరియు దానిని చూడలేకున్నారు! “తండ్రి నన్ను పంపినట్లు,” తండ్రి ఆయనను పంపెను, ఆయన వెళ్ళెను. ప్రజలకు చెప్పడానికి ఆయన ఒక వర్తమానాన్ని కలిగియున్నాడు. మరియు మరణ ఘడియలో, ఆయన మరణాన్ని జయించాడు మరియు ఆయన పాతాళమును జయించాడు, మరియు ఆయన సమాధిని జయించాడు. “తండ్రి నన్ను వర్తమానముతో పంపినట్లే, నేనునూ మిమ్మల్ని వర్తమానముతో పంపుచున్నాను; సంఘాలను, సంస్థలను నిర్మించడానికి కాదు కానీ, మీరు సర్వలోకమునకు వెళ్ళి మరియు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ప్రదర్శించుడి. నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును; నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు.” మరియు మన శరీరాలు సమాధికి వెళ్ళునట్లే, ఆయన శరీరము వెళ్ళియుండగా, ఆయన మరణమును, సమాధిని, పాతాళమును జయించెను. ఆయన ఆ బలిష్టుడైన జయశాలి.

105 ఆయన తన వర్తమానముతో మనలను పంపును. ఆ వర్తమానముతో మనము వెళదాము, ప్రకటించడానికి దేనినైన కలిగియుండి వెళదాము. “వెళ్ళి, ప్రకటించుడి!” పరుగెత్తి మరియు పిదప చెప్పలేకుండుట కాదు, మొదటిగా దానిని మనము మన స్వంత హృదయాలలో పొందుకుందాము.

106 మీరు ఈ ఉదయం, ప్రార్థించబడుటకు వచ్చినప్పుడు, అనాలోచనగా రాకండి. మీ హృదయంలో ఈ వర్తమానముతో రండి, “నేను మృతుడనైతిని గానీ, మరలా సజీవుడనైయున్నాను. వర్తమానమును ఇచ్చువాడను నేనే, ‘నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును.’” సర్వశక్తిమంతుడైన దేవుడు మెల్ల-కన్ను కలిగిన ఒక—ఒక బిడ్డను తీసుకొని మరియు తన చూపును సరిచేయగలిగిన యెడల; తన జీవితంలో ఎన్నడూ చూడనటువంటి ఒక బిడ్డను, జన్మించిన ఒక మగ బిడ్డను, దేవుడు తీసుకొని, మరియు పదహారు ఏండ్ల వయస్సప్పుడు, తన కంటి చూపును అతనికి పునరుద్ధరించగలడు; క్యాన్సర్-బారినపడి-తినివేయబడిన ఒక దయనీయమైన వ్యక్తిని దేవుడు తీసుకొనగలడు…

107 మరియు వర్తమానము సరైనది గనుక, దేవుడు వర్తమానాన్ని పంపెను గనుక, మరియు దేవుడు ఆ వర్తమానికుడిని పంపెను గనుక, పాతాళం యొక్క ప్రతి తుపాకీ అతనిపై కాల్పులు జరుపుతుందనుటలో ఎటువంటి సందేహం లేదు. అది వాస్తవము, అతడు త్రొట్టిల్లి మరియు పడిపోవును, అయితే పైకి లేచి మరియు తన తలను దులుపుకొని, మరియు కొనసాగుతాడు. మనమొక వర్తమానము కలిగియున్నాము, దానిని ఏదీ ఆపలేదు! హల్లెలూయా! “ఈ బండమీద నా సంఘమును కట్టుదును, మరియు పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవు.” వారు కోరినది వారు చెప్పవచ్చును, వారు కోరినది వారు చేయవచ్చును, దయ్యం ఆగ్రహంతో కేకలు వేయవచ్చును. అయితే యేసు మృతులలోనుండి లేచియున్నాడు, ఆయన ఈనాడు మనలో జీవించుచున్నాడు!

108 బైబిలును అరామిక్ నుండి ఆంగ్లము లోనికి అనువదించిన గొప్ప డాక్టర్ లామ్సాతో, కొద్ది రోజుల క్రితం, మాట్లాడుచుంటిని. మరియు నేను ఆ చిన్న గురుతును, దానిలో మూడు చిన్న చుక్కలను కలిగియున్న, దేవుని యొక్క గురుతును అక్కడ చూశాను. నేను అడిగాను, “డాక్టర్ లమ్సా, అది ఏమిటి?”

అతడు చెప్పాడు, “అది, మూడు గుణలక్షణాలతో ఉన్న దేవుడు.”

109 మరియు నేను ఇట్లన్నాను, “తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ, అను మూడు కార్యాలయాలలో దేవుడు నివసించుటయని, నీ ఉద్దేశ్యమా?”

110 అతను లేచి నా వైపు చూసెను, ఆ యూదుడి కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి, అతడు ఇట్లన్నాడు, “బ్రెన్‌హామ్ సోదరుడా, నీవు దానిని నమ్ముచున్నావా?”

“నా హృదయమంతటితో,” అని నేను చెప్పాను.

111 అతడు నన్ను కౌగిలించుకొని, మరియు ఇట్లు చెప్పెను, “అక్కడ ఆ గొప్ప కార్యములు జరుగుటను, మరియు నీవు చేయుచున్న ఆ సూచనలను నేను చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను.” ఇంకా ఇట్లన్నాడు, “నీవు ఒక ప్రవక్తవని వారు నాకు చెప్పారు. ఇప్పటివరకు, నేను దానిని నమ్మలేదు. ఇప్పుడు నీవు ప్రవక్తవని నేను ఎరిగియున్నాను.” అతడిట్లు చెప్పెను, “అంతే! అదియే వర్తమానము. దేవుని రాజ్యమును కుదిపివేయు విషయము అదేయైయున్నది.” అవును. అతడు ఇట్లన్నాడు, “అబ్బాయి, ఏదో ఒక రోజు నీవు దాని కొరకు మరణిస్తావు.” ఇంకా ఇట్లన్నాడు, “ఆ కార్యముతోనే నీవు నీ సాక్ష్యాన్ని ముద్రించుకుంటావు.”

112 మనము కలిగియున్న గొప్ప వ్యక్తులలో అతడు ఒకడు, ఐసెన్‌హోవర్ మరియు ప్రపంచంలోని గొప్ప వ్యక్తులు, హాలీవుడ్ యొక్క, అన్ని రకాల సినీ తారలు మరియు ప్రతీది ఆయనను పిలుచుచుండగా, ఆయన మాత్రం సరిగ్గా ఆ కూటములోనే ఉండియున్నాడు. అతడు ఇట్లు చెప్పెను, “దాదాపు ముప్పై సంవత్సరాలుగా, వ్యాటికను గ్రీకు నుండి కాదు గానీ, అరామిక్ నుండి; నేరుగా దాని నుండియే, అరామిక్ నుండియే, ఆంగ్లంలోకి ఈ అనువాదమును నేను చేయుచున్నాను.” మరియు అతను చెప్పాడు, “నేను ఆ సమయమునంతా వెచ్చించాను,” ఇట్లన్నాడు, “బైబిల్ యొక్క దేవుడు కదులుచుండుటను, నేను చూసే ఆ చోటుకి నేను ఇప్పుడే వచ్చాను.” అతను చెప్పాడు, “బ్రెన్హామ్ సోదరుడా, నీకు తెలుసా, మేము సూచనలను మరియు అద్భుతాలను చూడగలము, కానీ ఆ సూచన ఏ స్వరమును కలిగియున్నదని మేము గమనిస్తాము. యూదులమైన మేము, మేము ఒక సూచనను చూస్తాము, కానీ మేము ఆ సూచన యొక్క స్వరాన్ని గమనిస్తాము.”

113 ఓ, హల్లెలూయా! సూచన యొక్క స్వరము! దేవుడు మోషేతో ఇట్లు చెప్పెను, “వారు ఆ స్వరమును, ఆ మొదటి సూచన యొక్క స్వరమును వినని యెడల, అప్పుడు వారు రెండవ సూచన యొక్క స్వరమును వింటారు.” సూచన మాత్రమే కాదు గానీ, ఆ స్వరము దానితో వెళ్ళినది.

114 ఆ యూదుడిని, చూడండి, తానేమి మాట్లాడుచున్నాడో అతడు ఎరిగియున్నాడు. అతడు చెప్పాడు, “నేను వివేచనలను చూశాను, నేను సూచనలను, అద్భుతాలను, గుడ్డివారు బాగవుటను, మరియు అన్ని రకాల వివిధమైన సూచనలను చూశాను, కానీ నేను ఆశ్చర్యపోయాను, అయితే ఇప్పుడు దాని వెనుకనున్న ఆ స్వరమును నేను చూచుచున్నాను అది దేవుడిని మూడు భాగాలుగా చేయదు, మరియు ఇట్లు పలుకదు, ‘ఆయన తండ్రి అనబడే ఒక దేవుడు, మరియు తరవాత, కుమారుడు,…’ ఆయన ఇట్లు పలుకుతాడు,‘దేవుడు దేవుడే: దేవుని యొక్క మూడు గుణలక్షణములు; దేవుని యొక్క మూడు కార్యాలయములు.’” ఇట్లన్నాడు, “అది దానిని నిర్ధారిస్తుంది.”

115 ఓ, సహూదరుడా, మనము ఒక వర్తమానమును పొందుకున్నాము! “వెళ్ళి, నా శిష్యులకు చెప్పండి! నేను ఒకడిని మరణించి, మరియు మరొకరు దాదాపుగా మరణించి, మరియు ఇంకొకరు సజీవంగా ఉండుట కాదు. ఉండియున్నవాడను, ఉన్నవాడను, మరియు రాబోవు వాడను నేనే; దావీదు యొక్క వేరును మరుయు చిగురును; ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను.” అవును!

116 ప్రకటించటానికి మీరు దేనినైనా కలిగిలేనియెడల, వెళ్ళుట, వెళ్ళుటవలన అది ఏమి మంచి చేస్తుంది? ప్రకటించుటకు ఏదైనా ఉండవలసియున్నది, అది నిజం: “దేవుని కుమారుడైన, యేసుక్రీస్తు మీ అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన మీ అందరి కొరకు మరణించాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమించండి.”

117 ఎంతమంది ఈ కూటములలో ఉండి, మరియు ఆయన—ఆయన ప్రత్యక్షమగుటవలనైన గొప్ప సూచనలను మరియు అద్భుతాలను, ఆయన ఎట్లు వివేచించి మరియు చూపించున్నన్నది, మరియు ఆ కార్యములను చూశారు? అది మృతులలోనుండి లేచిన ఆ పరలోకపు దేవుడైయున్నాడు.

118 మీరు దీనియొక్క సూచన అయినట్టి ఆ హెబ్రీ సూచనను చూడవలసియున్నది. అది అగ్ని స్తంభము వంటి, ఒక వెలుగైయున్నది, మరియు అక్కడ మూడు చిన్న గురుతులు కలవు, అది ముగ్గురు వ్యక్తులు కానటువంటి, తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ. అది మూడు కార్యాలయములలో నివసించుచున్న ఒక్క దేవుడైయ్యుండెను. అదే దేవుడు! హల్లెలూయా! దేవుడు మీ పైన ఉండుట, దేవుడు మీతో ఉండుట, దేవుడు మీలో ఉండుట. ఆయనే స్వయంగా దిగివచ్చుచూ, తాను నివసించునట్లు, తన సంఘమును శుద్ధిచేయుటయైయున్నది. మీరు ఆయనను ముక్కలుగా చేసి, మరియు ఒకరిని ఇక్కడ, మరియు ఒకరిని ఇక్కడ, ఒకరిని అక్కడ ఉంచినప్పుడు, అది అన్యత్వముగా మారుతుంది.

119 మృతులలో నుండి లేచిన, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును నేను నమ్ముచున్నాను. మరియు ఆయన మాత్రమే దీనిని చెప్పగలడు, “పరలోకములోను మరియు భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడెను. పరలోకము మరియు భూమి యొక్క సర్వాధికారాలు నా చేతికి ఇవ్వబడెను. మీరు సర్వలోకమునకు వెళ్ళి, మరియు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి.” సువార్త కేవలం మాటవలన మాత్రమే కాక, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరియు ప్రదర్శనల ద్వారా వచ్చినది. దానిని నమ్మడానికి దేవుడు మీకు సహాయం చేయును గాక, దానిని నమ్మడానికి దేవుడు నాకు సహాయం చేయును గాక, మరియు మనం ఏదో ఒక రోజున యేసును చూస్తాము.

జీవితము యొక్క శ్రమ ముగిసినప్పుడు, తుదకు మనము యేసును చూస్తాము;

ఆయన యొక్క అందమైన సింహాసనము మీద దినము గడిచిన తర్వాత,

ఆయన నన్ను ఇంటికి స్వాగతిస్తాడు. (అది నిజము.)

గలిలయ తీరం నుండి వచ్చిన ఆ అపరిచితుని యొక్క

అడుగుజాడలలో ఆ ఇసుక కడుగబడినది.

120 ఆయన తనను తాను దేవునిగా చేసుకున్నందుకు వారు ఆయనను చంపారు, అయితే ఆయన దేవుడైయ్యుండెను. వారు ఆయనను వ్రేలాడదీసిరి, ఎందుకంటే, ఆయన మరణ శిక్ష విధించబడి మరణించెను. ఆ కారణము చేతనే నేను మరణ శిక్షను నమ్మను. రోము యొక్క ఆ—ఆ ఫెడరల్ ప్రభుత్వం నుండియైన మరణదండన శిక్ష క్రింద యేసు మరణించెను. ఆ మరణ శిక్ష, ఏమిటనగా, ఒక సిలువపై వ్రేలాడదీయబడుట. ఆయన మరణ శిక్ష వలన మరణించాడు, ఆయనను వస్త్రహీనునిగా చేసి, మరియు అక్కడ వ్రేలాడదీసి, ఆయనను అవమానపరిచారు, మరియు ఆయన అటువంటి స్థితిలో మరణించెను. అయితే మూడవ దినమున దేవుడు ఆయనను లేపెను!

121 మరియు మనము ఆయన యొక్క సాక్షులము. మరియు మనము ఆయన కొరకు నిలబడనియెడల, మరి ఆయన కొరకు ఎవరు నిలబడతారు?

122 ఒక దినమున ఒక వ్యక్తి నన్ను కలిసాడు, ఇట్లన్నాడు, “ఓ, బ్రెన్‌హామ్ సహోదరుడా, నీవు చెప్పవద్దు. నీవు చెప్పడం ఆపివేయుము. నీవు—నీవు స్త్రీల మనోభావాలను గాయపరచుచున్నావు, అది వారు పొట్టి జుట్టు ధరించుట, మరియు వారు దీనిని చేయుట, మరియు దానిని చేయుట, మరియు అటువంటి వాటి విషయమైయున్నది.”

123 నేను ఇట్లన్నాను, “నేను వారికి చెప్పనియెడల, వారికి ఎవరు చెబుతారు? వాటిని ఎవరు చెప్పెదరు?”

ఇట్లన్నాడు, “సరే, నీవు ఆ బోధకులకు కోపము తెప్పించుచున్నావు.”

124 ఆయన నా మీద కోపపడుటకంటే, వారు నా మీద కోపాన్ని కలిగియుండుటను నేను కోరుకుందును. అది సత్యము. అది వాస్తవము! [టేపుపై ఖాళీయున్నది—సంపా.] సరి. దానిని ఎవరు చెప్పెదరు? ఎవరో ఒకరు దానిని చెప్పవలసియున్నది.

125 యేసు చెప్పెను, “వెళ్ళి, చెప్పుడి. వెళ్ళి మరియు ప్రకటించుడి, నేను మృతులలోనుండి లేచితినని నా శిష్యులతో చెప్పుడి. [టేపుపై ఖాళీయున్నది—సంపా.] ఇదిగో, నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతోకూడా ఉన్నాను.”

126 స్నేహితులారా, మీరు దానిని నమ్ముచున్నారా?

ఇప్పుడు ప్రార్ధనకై మన తలలు వంచుచుండగా, మనము ప్రార్ధన చేద్దాము.

127 ఓ తండ్రివైన దేవా! నిజంగా, “వెళ్ళి, ప్రకటించుడి. వెళ్ళి, నేను మృతులలో నుండి లేచియున్నాను అని నా శిష్యులతో చెప్పండి.” మరియు తండ్రివైన దేవా, నీవు నీ శిష్యులతో చెప్పడం మాత్రమే కాదు గానీ, నీవు మృతులలోనుండి లేపబడియున్నావని వారికి నిరూపించితివి. వారితో నిన్ను నీవు కనబరచుకున్నావు, మరియు సరిగ్గా నీవు మరణించుటకు ముందు చేసినట్లే నీవు చేసితివి. పంతొమ్మిది వందల సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోయాయి, ప్రభువా, కానీ ఆ వర్తమానము ఇంకా మండుచున్నది. ఆ శిష్యులకు అది ఉన్నట్లుగానే ఈ రోజు అది మా హృదయాలలో ప్రకాశవంతంగా ఉండి మరియు మండుచున్నది, ఏలయనగా ఆయన ఇది వరకు చేసిన కార్యములనే చేయుచున్న, ఆ తిరిగి లేచిన ప్రభువును సరిగ్గా మా మధ్యలో మేము చూచుచున్నాము. ఆయన మృతులలోనుండి లేచియున్నాడని మేము ఎరుగుదుము.

128 ఈస్టరు మాకు ఎంతో విలువైనది, ఎందుకనగా మేము చేరి మరియు ఆయన యొక్క పునరుత్థానపు సహవాసంలో ఆనందించుచున్నాము. ఎట్లనగా ఆ తప్పిపోయిన కుమారునివలె, మేము ఒకప్పుడు పాపము మరియు అపరాధములలో చచ్చియున్నాము, అయితే మేము ఇప్పుడు కృపను కనుగొన్నాము, మరియు దేవుడు మా పాపముల విషయమై మమ్ములను క్షమించెను. ఆయన మమ్మల్ని అంగీకరించెనని నిర్ధారించడానికి, పితరుడైన అబ్రాహాముకు చేసినట్లే, మాకు కూడా ముద్రను అనుగ్రహించెను. తండ్రియైన అబ్రాహాము తాను దేవుడిని నమ్మెనని చెప్పెను, కానీ అతడు ఆయనను నమ్మెనని ధృవీకరణగా ఆయన అతనికి సున్నతి గురుతును అనుగ్రహించెను. మరియు ఇప్పుడు, తండ్రీ, ఈనాడు మేము పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి పొందియున్నాము, ఈ లోకపు కార్యములన్నియు గతించిపోయినవి. మాకు ఒకే ఒక్క లక్ష్యం ఉన్నది: అది నిన్ను సేవించుటయే. మాకు ఒకే ఒక్క కోరిక ఉన్నది: అది నిన్ను ప్రేమించి, నీ శిష్యులుగా ఉండుటయే.

129 మరియు ఇప్పుడు, ప్రభువా, ముక్కలుగా ఉన్న ఈ చిన్న వర్తమానమును ప్రతి హృదయానికి నీవు నిర్ధారించవలెనని నేను ప్రార్థించుచున్నాను. వారు దానిని తప్పిపోనీయకుము. నీవు నిన్నా, నేడు మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నావనియు, మృతులలో నుండి లేచి, ఇక్కడ ఉన్నావనియు, మరియు మరలా రెండవ రాకడలో ఆ—ఆ ఆత్మ మరియు శరీరము ఐక్యమయ్యేవరకు ఇక్కడ ఉందువనియు వారిని చూడనిమ్ము.

130 తండ్రీ, ఈ ఉదయం, ఇక్కడున్న రోగుల కొరకు నేను ప్రార్థించుచున్నాను. నేను ఇప్పుడు, ఈ ఈస్టరు ఉదయాన, ప్రక్కకు పెట్టాను (లేదా, ప్రక్కకు పెట్టేయడం కాదు గానీ, కేవలం ఒక్క క్షణకాలము వరకు ప్రక్కకు ఉంచాను) అది నీవు నాకు అనుగ్రహించినట్టి, వివేచన వంటి వరములనైయున్నది. ఈ లోకము, ప్రభువా, నేను దేశములన్నియు తిరిగియున్నాను, అది వారందరికీ తెలుసు. ఇప్పుడు నేను ప్రార్ధించుచున్నాను, కొద్ది రోజుల క్రితం, ఆ సృష్టించే శక్తిపై నీవు నాకు ఇక్కడ అరణ్యములో వర్తమానమును ఇచ్చితివి, అది, ఏ ప్రజల నిమిత్తమై సృష్టించబడినదో, అట్టి ఈ సంఘములో ఈ ఉదయమున అది ఉన్నది, దేవా, ఈ ఉదయం, ఇక్కడున్న నా సహోదరులతో కలిసి, రోగులపై నా చేతులుంచడానికి నేను వచ్చుచుండగా, నీవు దయతో, ఈ ఉదయం ఈ సంఘముపై కుమ్మరించబడెదవని, మరియు నీవు ప్రజలను స్వస్థపరచెదవని, కూటము ముగిసేసరికి మా మధ్య ఒక్క బలహీనుడు కూడా ఉండకూడదని నేను ప్రార్థించుచున్నాను. వారిలో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడి మరియు స్వస్థపరచబడెదరు గాక.

131 ప్రభువా, అది మాకు మేముగా చేయగలిగేదేదీ కాదని, మేము గ్రహించాము. అది సామాన్యమైన చిన్న-బిడ్డలాంటి విశ్వాసము, నమ్ముచుండటము. రోగులను స్వస్థపరిచే అధికారం వారికి ఇవ్వబడిన తర్వాత, శిష్యులను మేము చూడగలము, వారు వెళ్ళి మరియు ఒక మూర్ఛ వ్యాధిగ్రస్తుని విషయములో ఓడిపోయారు; బహుశా, అరుస్తూ మరియు కేకలువేస్తూ, మరియు పైకి క్రిందికి దూకుచూ, మరియు ఆ దయ్యమును వెళ్ళగొట్టుటకు ప్రయత్నించుచుండిరి. కానీ అతడు యేసును కలిసినప్పుడు, ఓ, ఎంత భిన్నంగా ఉన్నది! ఆయన ఇట్లన్నాడు, “అపవిత్రాత్మా, అతని నుండి బయటకు రమ్ము.” ఎంత తేడా! ఓ, అది ఒక అపొస్తలుడు కాదని అతడు ఎరిగియున్నాడు. అది స్వయంగా ప్రభువేయైయున్నాడు. మరియు ఆ ఆత్మ ఆ బాలుడిని వణికించి మరియు నేలపై విసిరేసినది. అయితే యేసు చెప్పాడు, “అతడు చనిపోలేదు. అతణ్ణి పైకి తీసుకువెళ్ళి కొంచెం ఆహారం ఇవ్వండి.” ఆ అపవిత్రాత్మ విడిచిపోయినది.

132 ఓ యేసూ, దేవుని కుమారుడా, నీవు మరలా వచ్చి, నీ సంఘమును ధారాళంగా, సమృద్ధిగా, శక్తివంతముగా అభిషేకించుము. పునరుత్థానుడై జీవించుచున్న యేసు యొక్క ఆత్మ ఈ ఉదయం ఈ చిన్న సంఘమును ఒక నూతన విశ్వాసంలోనికి, శక్తి, విశ్వాసం యొక్క శక్తిలోనికి పునరుద్ధించును గాక, తద్వారా లాభమునాశించి మాట్లాడే ప్రతీ వ్యక్తినీ సిగ్గుపడేటట్లు మేము చేయుదుము. దీనిని అనుగ్రహించడి, ప్రభువా. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, నీవు వారిని ఆశీర్వదించి మరియు వారి ఆత్మలకు రక్షణను, వారి శరీరములకు స్వస్థతను దయచేయమని అడుగుచూ, ఈ ప్రజలందరినీ నీకు అప్పగించుచున్నాను.

133 మరియు మా తలలు వంచియుండగా, నేను ఆ ప్రశ్నను అడగబోవుచున్నాను. క్రైస్తవులు కానివారైయ్యుండి, ఇప్పుడు జ్ఞాపకము చేసుకోబడవలెనని కోరుచు, మరియు ఇట్లు చెప్పువారు ఎవరైనా ఇక్కడున్నారా, “సహోదరుడా బ్రెన్‌హామ్, నా కొరకు ప్రార్థించండి”? అక్కడున్న మిమ్మును దేవుడు దీవించును గాక. ఇంకెవరైనా, “నేను క్రైస్తవుడిని కాను. యేసు మృతులలోనుండి లేచాడన్న వార్తను నేను విన్నాను కానీ, నిజంగా అది నాకు తెలియదు. ఆయన నా హృదయంలో ఎన్నడూ లేచియుండలేదు. నాకు సంతృప్తి లేదు. నేను అనారోగ్యంతో కూడా, ఉన్నాను. నేను ప్రార్థన వరుస గుండా వెళతాను, తిరిగి వచ్చి మరొక వరుస గుండా వెళ్తాను, తిరిగి వచ్చి మరలా ఇంకొక దాని గుండా వెళ్తాను. నేను సంఘము నుండి సంఘమునకు, మరియు ప్రాంతము నుండి ప్రాంతమునకు వెళ్తాను.” విషయం అది కాదు. అది ఆయనను విశ్వసించడమైయున్నది. ఆయన మృతులలోనుండి లేచాడు. అదే దానిని స్థిరపరుస్తుంది. మరెవరైనా మీ చేయి ఎత్తుదురా? ఇట్లు చెప్పండి…దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. మరెవరైనా ఇట్లు చెప్పుదురా, “నేను నమ్మగోరుచున్నాను. నేను నమ్మగోరుచున్నాను”?

134 ఇక్కడ ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు? మీ చేయి పైకెత్తి, ఇట్లు చెప్పండి, “నేను నమ్మగోరుచున్నాను. నేను ఈ ఉదయం ఈ వర్తమానమును తెలుసుకొనగోరుచున్నాను.” దేవుడు నిన్ను దీవించును గాక. అది మంచిది. అవును, కుమారుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. మంచిది. అది సరియే.

135 ఇప్పుడు, టెడ్డీ, ఒక్క నిమిషం నువ్వు వాయించినయెడల “గొప్ప వైద్యుడు,” అనే దానిని వాయించాలని నేను కోరుచున్నాను, “ఇప్పుడు ఇక్కడున్నాడు.” మరియు మీరు అలా చేస్తుండగా…

136 ప్రస్తుతం అది కష్టం. భవనమంతా దర్శనములు వచ్చుచున్నవి, చూడండి. అవును, నేను ప్రయత్నిస్తున్నాను, నేను కూర్చుండిన ఆ బూడిద కుప్ప కంటే, కొంచెం ఉన్నతముగా, మరి కొంచం ఉన్నతంగా, దీనిని ఒక—ఒక పునరుత్థానముగా ఉంచుటకు నేను ప్రయత్నించుచున్నాను. నాకు మరికొంత ప్రత్యక్షత కావలెను. నేను ఒక విషయమును ఎరిగియున్నాను: నేను ఆ మొదటి పరిచర్యను పట్టుకొని ఉన్నంత కాలం, ఆ రెండవది రాదు, అది వచ్చియుండలేదు. ఇప్పుడు నేను రెండవదాన్ని పట్టుకొని ఉన్నంత కాలం, ఆ మూడవది రాదు, చూడండి. నేను నేరుగా బయటకు అడుగు వేయవలసియున్నది, బయటకు అడుగుపెట్టి మరియు దానిని నమ్మవలసియున్నది, “దేవుడు అలాగు చెప్పెను!” కొద్ది రోజుల క్రితం…

137 ఇప్పుడు మీరు కోరినయెడల మీరు మీ తలలను పైకెత్తవచ్చును. నేను మీ చేతులను పట్టుకున్నాను; దేవుడు వాటిని పట్టుకొనియున్నాడు.

138 నేను మీకు ఒక చిన్న విషయమును చెప్పగోరుచున్నాను. సహోదరుడు ఎడ్ డాల్టన్, అతడు ఇప్పుడే లోపలికి వచ్చెనని నేను నమ్ముచున్నాను, చక్కని బాప్టిస్టు సహోదరుడు, అతడు మరియు అతని భార్య. సహోదరుడు జెఫ్రీస్ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. ఒథెల్ జెఫ్రీస్. మరియు అతడు ఇక్కడున్నాడు, అతడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడని నాకు తెలియును. ఏమైనప్పటికీ, నేను వెళ్ళడానికి, ఆ సహోదరులు కెంటకీలో ఒక కూటమును ఏర్పాటు చేశారు. సహోదరులు, ప్రశస్తమైన సహోదరులు, తమ పొరుగువారిని మరియు వారి ప్రజలను ప్రేమించుచున్నారు. వారు ఆడిటోరియంలను మరియు మిలిటరీ భవనాలను మరియు వాటిని తీసుకున్నారు, కేవలం ఒక్క రాత్రి కూటము కొరకు, వారు మిలిటరీ భవనాలను అద్దెకు తీసుకున్నారు. చిన్న జే. టీ. హూవర్, అతనిది ఏదైనా గానీ…ఎల్. జి. హూవర్ ఎలిజబెత్‌టౌన్‌లో ఒక దానిని ఏర్పరిచారు. మరియు సహోదరుడు ఎడ్ డాల్టన్ విల్లో షేడ్ వద్ద లేదా—లేదా సోమర్సెట్, సోమర్సెట్ వద్ద ఏర్పరచారు. మరియు సహోదరుడు, దిగువున నేను జన్మించిన గ్లాస్గో వద్ద, ఆ సహోదరుడు ఉండియున్నాడు. ప్రభువు దూత నాకు మొదట ప్రత్యక్షమైన ఆ ప్రదేశంలో, నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో వారు అక్కడి ప్రజలైయున్నారు.

139 మరియు నేను తిరిగి వెళ్ళగోరాను. కానీ ఏదో చిన్నగా తట్టినట్లు నాకు అనిపించినది. మరియు నేను ఇట్లన్నాను, “సరే, ఆ సహోదరుల నిమిత్తము, నేను ఆ కూటమును ఏర్పాటు చేస్తాను.” నేను ఈ లోయలోకి రాగానే, నా గొంతు వెంటనే మూసుకుపోయినది మరియు కూటములు ముగిసేవరకు, నేను తొమ్మిది రోజులు మాట్లాడలేదు.

140 సహోదరుడు రడెల్, అతడు ఈ ఉదయము కూడా, ఇక్కడ ఉండవచ్చును, ఈ ఆలయానికి చెందిన సోదరులలో ఒకడు, అతడు మరియు జూనీ జాక్సన్ మరియు వారు, నేను అతని కోసం ఒక కూటమును కలిగియుండవలసియున్నది. అయితే వెంటనే, నా గొంతు బొంగురుపోయినది. మరియు మొదటి విషయమేమిటో మీకు తెలుసా, నాకు దాదాపు నూట ఐదు డిగ్రీల జ్వరం వచ్చినది. మరియు నేను కూటమునకు వెళ్ళుచుంటిని, మొదట, మరియు—మరియు డాక్ శీన్ నాతో ఇట్లన్నారు…నేను చెప్పాను, “నా గొంతు బొంగురుపోయినది.”

141 అతడు చెప్పాడు, “మీ యొక్క స్వరపేటికను సవరించడానికి నేను మీకు దేనినైన ఇస్తాను, మరియు మీరు వెళ్ళి బోధించండి.” మరియు అతడు నాకు ఇచ్చిన మరొకదానిని నేను తీసుకున్నాను, మరియు, అది ఏమిటనగా, ఆ సైనస్‌ను క్రిందికి లాగి దానిని నిరోధించినది. అప్పుడు నేను తీవ్రమైన జ్వరంతో, తొమ్మిది రోజులు మంచం మీద పడుకున్నాను.

142 ఇక్కడున్న నా సోదరులలో చాలా మంది నా దగ్గరకు వచ్చారు, చాలా మంది ప్రసిద్ధ సోదరులు వచ్చి నా కోసం ప్రార్థించారు. ఇదిగో సహోదరుడు గ్రాహం స్నెల్లింగ్, ఇక్కడ సహోదరుడు రడెల్, ఇక్కడున్న ఈ సహోదరులు, అందరూ గుమిగూడి, ప్రార్థనలు చేయుచూ మరియు ప్రతీది చేసారు. నేను ప్రార్ధించుచూ, నా వంతు మంచి ప్రయత్నం చేయుచుంటిని, కనీసం గుసగుసగానైనా మాట్లాడలేకపోయాను. నేను ఆశ్చర్యపోయాను, “ఇదంతా దేని గురించి?” నా ప్రియమైన చిన్న భార్య అక్కడ కూర్చునియున్నది, ఆమె మరియు వారు నా కొరకు ప్రార్థించుచుండిరి, కేవలం అలాగే ఉండిపోయారు. వారు అర్థం చేసుకోలేకపోయారు.

143 ఇప్పుడు, తీసుకోవడానికి అతడు ఏదో మందును నాకు ఇచ్చాడు, కానీ నేను దానిని తీసుకోలేదు, ఎందుకంటే అదొక మత్తు పదార్ధమైయున్నది. ఆపై నేను దానిని వదిలివేసాను. మరియు “ప్రభువా, నిశ్చయంగా!” అని నేను ఆలోచిస్తూ ఉన్నాను.

144 మరియు పిదప, కూటములన్నీ ముగిసిన తర్వాత, ఒక సోమవారం నాడు (అది, ఆ చివరి కూటము, శనివారము జరగవలసియున్నది), ఆపై (నేను నమ్ముచున్నాను), మరియు పిదప, సోమవారం నేను లేవడానికి ప్రయత్నించాను. నేను చాలా బలహీనంగా ఉన్నాను, నేను ఆ గదిలో నడవలేకపోయాను. నేను కూర్చునియున్నాను.

145 దేవుడు-అనుగ్రహించిన భార్య విషయంలో నేను చాలా కృతజ్ఞుడనైయున్నానని, మీకు తెలుసు. మీరు అలా లేరా, సోదరులారా? ఒక నిజమైన భార్య, ఒక నిజమైన తోడు!

146 నేను కూర్చున్నాను. నేను ఆమెకు సైగ చేసి, మరియు ఆమెను నా దగ్గరకు తీసుకున్నాను. మరియు నేను ఇట్లన్నాను, “మేడా, కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతాను,” నేను చెప్పాను, “విషయం ఏమిటని, నేను ఆశ్చర్యపోతాను.” నేను అన్నాను, “అక్కడ ఆ కూటములు జరగడం ఏమిటి, మరియు దేవుడు నన్ను ఈ విధంగా ఉంచడం ఏమిటి?” నేను చెప్పాను, “ఇది ఎందుకు జరిగినది?” మరియు నేను అన్నాను, “అసలు ఆయన నన్ను పిలిచాడా లేదా అని కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతాను.”

147 ఆమె ఇట్లన్నది, “మీ గురించి మీరు సిగ్గుపడుటలేదా?” చూసారా? మరియు ఆమె నాకు చెప్పింది, ఇట్లన్నది, “బిల్, దేవుడు నీతో ఏమి చేస్తున్నాడో ఆయనకి తెలియునని నీకు తెలియదా? కేవలం, కేవలం మౌనంగా ఉండు.”

148 మరియు కావున నేను లోపలికి వెళ్ళాను. మీకు తెలుసా, అది నన్ను కొద్దిగా ఒక రకంగా గద్దించినట్లైనది. మరియు నేను లోపలికి వెళ్ళి మంచం మీద పడుకున్నాను. ఆమె దుప్పట్లు మార్చడానికి వచ్చినది. మరియు ఆమె తన చేతిపై ఆ—ఆ వస్తువులను కలిగియున్నది, మరియు ఆమె వెళ్ళనారంభించినప్పుడు, నేను చూసాను, మరియు అక్కడ ఒక…

149 సూర్యుడు ప్రకాశించి మరియు దానిని నేలపై పగలగొట్టినటువంటి-…ఒక పెద్ద గొప్ప మిలిటరీ భవనమును నేను చూసాను, పరలోకము నుండి ప్రకాశిస్తున్న సూర్యుడు, దానిని ముక్కలుగా బ్రద్దలు చేసెను. మరియు అక్కడ ముగ్గురు స్త్రీలు మరియు ఒక పురుషుడు, పైకి వచ్చారు. మరియు వారు చిన్న పాటి, చిన్న…ఒక విధమైన చిన్న కాల్పుల తుపాకుల వంటివి, కలిగియున్నారు. మరియు అతడు ఇట్లన్నాడు, “అది మేకులను దించుతుంది.” మరియు ఇట్లన్నాడు, “మేము…సహోదరుడా బ్రెన్హామ్, మీరు ఈ ముక్కలను పట్టుకోండి, మరియు మేము మీ కోసం ఈ మిలిటరీ భవనమును తిరిగి నిర్మిస్తాము.”

మరియు నేను అన్నాను, “సరే, నేను దానిని చేస్తాను.”

150 కానీ ఏదో ఇట్లు చెప్పినది, “దానిని చేయకుము.” సరే, నేను ఒక భాగాన్ని తీసుకోవటానికి క్రిందికి చేరుకున్నాను, ఇలా, దానిని ఇలా నిర్మించుటకైయున్నది. మరియు సరిగ్గా అప్పుడే ఒక స్వరము నాతో మాట్లాడి, మరియు ఇట్లన్నది, “ఇప్పుడు వారు నిన్ను వెనుకకు తీసుకొనిపోవుటకు దారిలో ఉన్నారు. నీవు దానిని నమ్మకుము.” ఇట్లు చెప్పెను, “వారు ఎప్పుడూ చాలా నిజాయితీగా ఉన్నారు, మరియు వారు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు తో, నీ వద్దకు వచ్చుచున్నారు, కానీ వారు తప్పైయ్యున్నారు.” చూసారా?

151 ఫ్రెడ్ సోత్‌మన్, ఇక్కడున్న వారిలో చాల మంది, నేను దాని గురించి వారికి చెప్పినప్పుడు సరిగ్గా అక్కడున్నారు. ఒక గంట లోపే, ప్రజలు నేరుగా నా తలుపు వద్దకు వచ్చారు. నేను అన్నాను, “ఇదిగో ముగ్గురు స్త్రీలు మరియు ఒక పురుషుడు ఉన్నారు.”

“అది ఖచ్చితంగా సరియే.”

“వారు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు తో వచ్చారా?”

“అవును, అయ్యా, వారు…”

152 నేను ఇట్లన్నాను, “ఖచ్చితంగా, వారికి ఏమి చెప్పాలో నీకు తెలుసు.” యదార్థంగానే తప్పైయున్నారు, చూడండి. మంచి వ్యక్తులే, కానీ యదార్థంగా తప్పైయ్యున్నారు. చూసారా?

153 అప్పుడు నేను అనుకున్నాను, “సరే, నేను ఏమి చేయగలను? నేను ఏమి చేయాలి?” మరియు అప్పుడు మేడా లోపలికి వచ్చినది, మరియు ఆమె వెనుకకు వెళ్ళినది. మరియు సహోదరుడు ఫ్రెడ్డీ వెళ్ళి ప్రజలకు చెప్పాడు. మరియు పిదప కొంత సమయం తర్వాత, నేను అక్కడ ఆ—ఆ మంచం మీద ఉన్నాను, మరియు నేను ఇట్లనుకున్నాను, “అది ఎందుకని అలా జరిగినది? నేను ఎందుకని మాట్లాడలేకున్నాను? నేను ఎవరితోనో లేదా దేనితోనో ఎందుకని మాట్లాడలేకున్నాను?” మరియు నేను అక్కడ పడుకొనియున్నాను. మరియు మేడా లోపలికి వచ్చి, గది నుండి తిరిగి బయటకు వెళ్ళుచున్నది.

154 మరియు నేను చూశాను, మరియు ఒక వైపుకు ఏదోఒకటి మినుకు మినుకుమనే ప్రకాశాన్ని కలుగజేయుటను నేను చూశాను. మరియు నేను చూశాను, మరియు అక్కడ ఈ…నా గోడ తెరుచుకుంది, మరియు నేను యేసును చూశాను. నేను యేసును నా జీవితంలో రెండుసార్లు దర్శనంలో చూశాను అని నేను చెప్పడం, మీలో ఎంతమంది విన్నారు? మరియు అంత్య కాలానికి ముందు నేను ఆయనను మరలా చూస్తానని నేను నమ్ముచున్నాను, చూడండి, ఆయనను మరలా చూచెదను. ఇప్పుడు, నేను చూసాను, మరియు ఆకాశం సరిగ్గా అక్కడే ఉన్నది, నేను గోడ గుండా చూస్తున్నట్లుగానే కనిపించినది. మరియు బైబిల్ సరిగ్గా ఇలా నిలబడి ఉన్నది, ఆకాశంలో చాలా పెద్ద పరిశుద్ధ గ్రంథము నిలబడియున్నది. సరే, బైబిల్ చుట్టూ ఏదో వెలుగు ఉండియున్నది, మరియు ఆ బైబిల్ నుండి చాలా అందమైన ఒక బంగారు సిలువ వచ్చినది. మరియు అది ఇలా నిలబడినది, మరియు దాని చుట్టు వెలుగులు వచ్చుచున్నవి, మరియు ఆ సిలువ నుండి ఆయన బయటకు నడిచి వచ్చెను. బైబిలు సిలువను ప్రతిబింబిస్తుంది, సిలువ ఆయనను ప్రతిబింబిస్తుంది. మరియు ఆయన బయటకు నడుచుకుంటూ వచ్చి, మరియు నేరుగా నేను ఉన్న చోటికి వచ్చెను. నేను దానిని స్పష్టముగా చూడగలను, అక్కడ నిలబడియున్న ఆయన ముఖం మీదుగా వ్రేలాడుచున్న తన వెంట్రుకలపై, ఆ సిలువ ప్రకాశించుటను నేను చూడగలను.

155 ఆయన నా వైపు అలా చూసి, మరియు ఆయన నాతో ఇట్లన్నాడు, “నీ నూతన పరిచర్య, నీకు ధృవీకరించబడటానికి నీవు వేచియున్నావు.” ఆయన చెప్పాడు, “నేను ఇదివరకే దానిని నీకు ధృవీకరించాను. అది ఇదివరకే ధృవీకరించబడినది. నీవు దానిని అంగీకరించవలసియున్నది.” చూసారా? మరియు నేను నిలబడి ఒక నిమిషం ఆయన చెప్పేది విన్నాను. మరియు అది నా మనస్సులోనికి వచ్చినది. నేను దానిని వినలేదు, అది కేవలం నా మనస్సులోనికి వచ్చినది.

156 తన జీవితమంతా ఒక పాపియైయ్యున్న ఒక వ్యక్తి వలె ఉన్నది, పరిశుద్ధ గ్రంథమొకటి ఉన్నిదని అతనికి తెలుసు, ఒక దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ అతను ఒక్కసారిగా ఒక ప్రసంగమును వింటాడు, అప్పుడు ఏదో అతనికి ఇట్లు చెబుతుంది, “అది నీవే.” అప్పుడు, అదే వాక్యము అన్నివేళలా అక్కడ ఉన్నది, అయినప్పటికీ అది అతనికి ధృవీకరించబడినది, అప్పుడు అతడు ఇట్లంటాడు, “ప్రభువా, నన్ను క్షమించుము.” అయితే అతడు తన రక్షణను అంగీకరించే వరకు దాని వల్ల ఏ ప్రయోజనం ఉండదు, పిదప అతడు బయటకు వెళ్ళి మరియు ఒక క్రైస్తవునిగా ఉంటాడు. అతడు ఎంతగా ఏడ్చిననూ, ఎంతగా వేడుకున్ననూ, అతడు దానిని అంగీకరించవలసియున్నది.

157 మరియు అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, “నీవు దానిని అదే విధంగా అంగీకరించవలసియున్నది. నీవు దానిని నమ్మవలసియున్నది.”

158 నేను ఓటమిని గూర్చి భయపడుచున్నాను. ఏదైనా, నేను ఒక నిందను తీసుకువస్తానేమోనని నేను భయపడుచున్నాను. నేను ఎల్లప్పుడూ దాని గురించి భయపడుతుంటాను, గమనిస్తుంటాను, నేను ఏదైనా తప్పును పలుకుతానేమోనని అనుకుంటూ ఉంటాను. ఎందుకనగా, నేను బైబిలుయొక్క హెచ్చరికను తీసుకున్నాను, మోషేకు ఆ గొప్ప శక్తి ఇవ్వబడినది, మరియు అతడు బండతో మాట్లాడుటకు బదులుగా దానిని ఎలా కొట్టాడు అన్న దాని గూర్చియైయున్నది. నేను ఏలియాను గూర్చి గుర్తుచేసుకున్నాను, ఎందుకనగా అతనికి బట్టతల వచ్చినది, బట్టతలను కలిగియుండుటను గూర్చి ఆ చిన్న పిల్లలు అతణ్ణి ఎగతాళి చేయుచుండిరి; మరియు అతడు ఆ పిల్లలపై ఒక శాపమును పెట్టాడు, మరియు వారిలో నలభై-రెండు మంది ఎలుగుబంట్లచేత చంపబడ్డారు, చూడండి. మరియు అది పరిశుద్ధాత్మ కాదు గానీ, కోపోద్రేకుడైనది, ఆ ప్రవక్తయైయుండెను. మరియు వాస్తవానికి, నేను—నేను అన్ని విషయాల గుండా వెళ్ళాను.

159 మరియు నాతో మాట్లాడుచూ, ఆయన అక్కడ నిలబడియుండెను. మరియు ఆయన ఇట్లన్నాడు, “కానీ నీవు చాలా మందితో నడుస్తావు.” ఆయన చెప్పాడు, “నాతో నడవాలంటే, నీవు ఒంటరిగా నడువు.”

160 అప్పుడు నేను చూశాను, నేను సంఘశాఖలు మరియు అవన్నీ చెప్పేది ఎక్కువగా వినుచుంటిని, మీరు చూడండి, ఏమి చేయాలో మరియు ఏమి చేయకూడదో ఎవరో మీకు చెప్పడానికి ప్రయత్నించుటయై యున్నది. మీరు ఆయనను వెంబడించవలసియున్నది. ఇప్పుడు, చేపల గురించి ఆయన నాకు ఇచ్చిన దర్శనమును గుర్తుంచుకొనండి, మీకు తెలుసు కదా, మరియు ఎట్లు సహజాతీతమైన సూచనలను పెంతుకోస్తు శిశువులకు మీరు బోధించలేరన్న దాని గూర్చియైయున్నది. మీకు జ్ఞాపకమున్నదా. మరియు అదిగో అది అచ్చటే ఉన్నది. మరియు నేను సరిగ్గా ఈ నూతన పరిచర్యయొక్క అంచున ఉన్నాను.

161 ఆ దర్శనము నన్ను విడిచిపెట్టిన వెంటనే, నేను ఇట్లన్నాను, “ప్రభువా, ఆమేన్!” మరియు నా భార్య అక్కడ నిలబడియున్నది, దాదాపు మూర్ఛబోయినది. మరియు నేను మంచం మీద నుండి బయటకు గెంతాను, నేను ఎప్పటిలాగే మంచిగా మాట్లాడగలుగుచున్నాను. కేవలం ఒక్క క్షణములోనే, జ్వరం యొక్క ప్రతి అణువు నన్ను విడిచిపెట్టినది.

162 నేను డాక్ శీన్ కు ఫోను చేశాను, నేను ఇలా అన్నాను, “మీరు నన్ను చూడాలని నేను కోరుచున్నాను.”

అతడు ఇట్లన్నాడు, “ఏమిటి?”

163 మరియు నేను అక్కడికి వెళ్ళాను, మరియు అతడు నన్ను చూశాడు, మరియు ఆ ముక్కు రంధ్రాలను పరీక్షించాడు, అతడన్నాడు, “సహోదరుడా బ్రెన్హామ్, ఏమి జరిగినదో నాకు చెప్పండి.”

మరియు నేను అన్నాను, “నీవు నా కథను నమ్ముతావా?”

అతను చెప్పాడు, “నేను దానిని ఎలా సందేహించగలను? అది జరిగింది కదా.”

164 అంతే, చూడండి. స్నేహితుడా, అంతే. నిన్ను ఒక బూడిద కుప్పపై ఎలా ఉంచాలో దేవునికి తెలుసు. ఏదైనా చేయుటకు, చూడండి, ఆయన నీకు ఆ వర్తమానము పంపే వరకు, నీకు ఏమి జరిగించాలో ఆయన ఎరిగియున్నాడు.

165 ఈనాడు, ఎంత ఓటమో నాకు తెలియదు. నేను కొద్ది కాలం క్రితం, లోపలికి వెళ్ళి ఒక రేడియో ప్రసారంను వినుచున్నాను. మరియు మొదటి కొరింథీ 15 నుండి, ఒక సేవకుడు పునరుత్థానముపై బోధిస్తున్నాడు. మరియు అతడు పునరుత్థానమును బోధిస్తున్నాడు. మరియు అతడు తన ప్రసంగము మధ్యలో ఆపి, మరియు అతడు ఇట్లన్నాడు, “మీకు తెలుసా, చాలా మంది ప్రజలు ఓటమికి భయపడతారు.” అతను చెప్పాడు, “జనరల్ ప్యాటన్ ఒక సైనికుల గుంపును కోల్పోయినప్పుడు,” అన్నాడు, “అప్పుడు వారు అతనికి చెప్పారు…అతనికి మరి కొంతమంది కావలెనని అతడు వెనుకకు పంపాడు, మరియు వారు అతనికి మరి కొంతమందిని పంపారు. వారు చంపబడ్డారు, మరియు అతడు మరి కొంతమంది కొరకు పంపాడు. మరియు అతడు ఆ మూడవ గుంపు వారిని అక్కడ పొందినప్పుడు,” ఇట్లు చెప్పాడు, “ఒక బుల్లెట్టు పేలిన ప్రతిసారి, వారు భయంతో, ఒక రేకు తట్ట క్రిందకు పరిగెత్తేవారు, లేదా మరొక దాని క్రిందకు పరిగెత్తేవారు.”

166 అతను చెప్పాడు, “నాకు పురుషులను పంపించండి, పిల్లలను కాదు.” అతడు ఇట్లన్నాడు, “చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మనుషులు నాకు కావాలి. చనిపోవడానికి భయపడే వారు నాకు వద్దు. మనం పోరాడుచున్న కారణము దానికొరకు మరణించేంత విలువైనది కానియెడల, అప్పుడు వారిని నా నుండి దూరంగా ఉంచండి. నాకు పురుషులు కావలెను.”

వారు ఇట్లన్నారు, “కానీ నీవు రెండు లేదా మూడు పోరాటములలో ఓడిపోయావు.”

167 అతడన్నాడు, “నేను యుద్ధంలో ఓడిపోలేదు. నేను కేవలం ఒక పోరాటములో ఓడిపోయాను.” ఏదో నా హృదయంలో మాట్లాడినది.

168 ఐసెన్‌హోవర్ అన్నది నాకు జ్ఞాపకము వచ్చినది, “నేను తూటాను విసిరి, ఆజ్ఞాపించినప్పుడు మరియు వారు తూటాను తుపాకీలో విసిరారు, వారు దానిని లాగారు మరియు అది పేలలేదు, అది పనిచేయలేదు,” అతడు అన్నాడు, “నేను ఆపివేసి మరియు లొంగిపోలేదు. నేను ఆ తూటాను బయట పడవేసి మరియు మరొకదాన్ని లోపల పెట్టాను, దానిని ప్రయత్నించాను. అది పనిచేయని యెడల, ఒకటి పనిచేసే వరకు, నేను మరొకదాన్ని లోపల పెడుతూనే ఉన్నాను.”

169 ఆ విధంగానే అది చేయబడవలసి యున్నది. అది ఎలా జరుగుతుందో నాక తెలియదు. అయితే ఈ వేదిక యెదుట దేవుడే నాకు తీర్పరియైయుండగా, ఎన్ని ఓటములన్నది మరియు ఎన్ని—ఎన్ని పోరాటాలలో నేను ఓడిపోతానన్నది నాకు తెలియదు, కానీ నేను ఆ యుద్ధంలో మాత్రం ఓడిపోను. ఆయన నాతో ఉంటాడని ఆయన నాకు చెప్పాడు. ఆ పరిచర్య నిర్ధారించబడి మరియు అది అమలులో ఉండుటను నేను చూసే వరకు నేను నిలబడతాను. దేవుని కృప ద్వారా, ఈ ఉదయం నేను ప్రారంభిస్తున్నాను. ఇది ఇక్కడ పని చేస్తుందా, అది వేరే ఎక్కడైనా పని చేస్తుందా, అది ఎలా పని చేస్తుంది లేదా ఏమి జరుగుతుంది అనేది నాకు తెలియదు. కానీ ఏమి జరుగుతుందో నాకు తెలిసే వరకు, నేను రోగుల కొరకు ప్రార్థిస్తూ, నేరుగా ప్రార్థన వరుసల గుండా నడుస్తాను. రెండు లేదా మూడు సార్లు అది జరగటం నేను చూశాను.

170 హెట్టీ యొక్క గృహములో అది జరగడం నేను చూశాను. ఉడుతలను గూర్చి, మరియు ఆ చిన్న అమ్మాయి, ఆ చిన్న స్త్రీని గూర్చిన కథను ఎంతమంది విన్నారు? శిష్యుల దినముల నుండి, మనము ఎరిగియున్నప్పటి నుండి, మీరు అక్కడ ఉన్నప్పుడు, “నీకు ఏది ఇష్టమో అడుగుము,” అని చెప్పబడే భాగ్యము ఇవ్వబడిన మొట్టమొదటి వ్యక్తి. మీరు ఎప్పుడైనా ఆ కథను విన్నారా? మీరు ఎప్పుడైనా ఆ స్త్రీని చూశారా? ఆమెను ఎప్పుడూ చూడక, మరియు ఎంతమంది, అది జరిగిన ఆ స్త్రీని చూడాలనుకుంటున్నారు? మేము…

హెట్టీ, నీవు లేచి నిలబడతావా? అదిగో ఆ స్త్రీ అక్కడున్నది.

171 ఆమె ఇంట్లో నిలబడియున్నాను. అది నేను ఎనిమిది ఉడుతలను చూసిన తర్వాతయైయున్నది, అవి ఖచ్చితంగా ఆ చుట్టుప్రక్కల ఎక్కడా లేకుండెను, మరియు, మాట మాత్రం పలికాను, మరియు అవి అక్కడ నిలబడ్డాయి. అది నిజం. అది, అక్కడ అవి కలిగినవి. మరియు ఆమె భోజనపు బల్ల వద్ద కూర్చొని, “ఆ ఉడుతలను అక్కడ కలుగజేసినది ఏమిటి?” అని నేను అన్నాను. మరియు తన తల్లి, సహోదరి రైట్, ఇక్కడున్న సహోదరుడు రైట్, అక్కడ కూర్చునియున్నారు. ఆ బల్ల వద్ద ఉన్నవారు ఎంతమంది, ఎంతమంది ఈ ఉదయం ఇక్కడున్నారు? మీ చేతులు పైకి ఎత్తండి. మంచిది, వారు ఆక్కడ ఉన్నారు, భవనమంతటా ఉన్నారు. చూశారా? మంచిది, వారు అక్కడ ఉన్నారు. మరియు నేను చెప్పాను, “ఏదో ఒక రోజు…” వికలాంగురాలైన తమ చిన్న సహోదరి అక్కడ కూర్చునియున్నది.

172 నేను చెప్పాను, “అది దర్శనము ద్వారా, అటువంటి వాటి ద్వారా రావలసియున్నది, కానీ ఏదో ఒక రోజున అది భిన్నంగా వచ్చును.” ఆ విధంగా మాట్లాడుచుంటిని. ఒక్కసారిగా, ఏదో అభిషేకించినది (దీనిని ఈ జనులకు విడిచిపెట్టుము), నేను అటువంటి ఒక అభిషేకమును ఎన్నడూ అనుభవించలేదు. ఎందుకు? ఎందుకనగా హెట్టీ సరియైన విషయమును చెప్పినది.

173 నేను ఇట్లన్నాను, “ఆ ఉడతలు ఎక్కడ నుండి వచ్చాయి? అక్కడ ఒక్కటి కూడా లేదు, అవి ఉండే ప్రదేశము కూడా కాదు, సరిగ్గా అక్కడ ఒక టెలిఫోన్ స్తంభము వంటిదైయున్నది. మరియు వరుసగా ఎనిమిది సార్లు అది జరగుటను నేను చూశాను.” మరియు నేను అన్నాను, “అది ఎక్కడ నుండి వచ్చినదో నాకు తెలియదు.” నేను చెప్పాను, “నాకు తెలిసిన ఒకే ఒక్క విషయం ఏమిటనగా, ఒకసారి దేవుడు అబ్రాహాముకు ఒక సందేశాన్ని నిర్ధారించుటకు ప్రయత్నించెను, మరియు ఆయన ఒక పొట్టేలును ఉనికిలోకి పలికెను, ఎందుకనగా దానిని నిర్ధారించడానికి, ఆయనకు ఒక పొట్టేలు అవసరమైనది. బహుశా నాకు పలకడానికి, నాకు ఒక ఉడత అవసరమైయ్యుండవచ్చును. మరియు ఆయన దానిని వరుసగా ఎనిమిది సార్లు, లేదా, వరుసగా ఏడు సార్లు, వరుసగా ఏడు సార్లు చేసెను.” మరియు నేను చెప్పాను…

174 మరియు, హెట్టీ, బహుశా ఆ స్రీ ఏమి చెప్పుచున్నదో ఎరుగకయే ఉండవచ్చును. అది ధనవంతులను మరియు అహంకారులను ఎట్లు దాటిపోయినదో చూడండి. ఏ విధంగా అది అన్నిటినీ దాటిపోయి, మరియు ఒక బీద పల్లెటూరు స్త్రీ వద్దకు వచ్చేనో చూడండి.

175 ఆ స్త్రీకి తిరిగి ఇవ్వడానికి, నా జేబులో ఇరవై డాలర్లను నేను కలిగియున్నాను, అవి, ఈ నూతన సంఘ నిర్మాణానికై ఆమె యాభై డాలర్లను ఇస్తానని ప్రమాణము చేసినది. మరియు నేను ఆమెను ఇబ్బంది పెట్టుటకు దీనిని చెప్పడం లేదు కానీ; నిజానికి, దానిని ఇచ్చుటకు, యాభై సెంట్లు కూడా ఇచ్చే స్తోమత ఆమెకు లేదు. కానీ, ఆమె హృదయము వర్తమానములో ఉండుటను బట్టి, ఆమె ఇవ్వగోరినది. సహోదరుడు నెవిల్, దానిని అంగీకరించాడని, నేను నమ్ముచున్నాను, ఆ మిగిలిన దానిని తీసుకొనడు, ఇరువది డాలర్లు మాత్రమే ఇచ్చుటకు ఆమెకు అనిమతించెను. మరియు సరుకుల కొరకు మేడా నాకు ఇచ్చినటువంటి, రెండు పది-డాలరు నోట్లు నా జేబులో ఉన్నాయి, మరియు నేను అన్నాను, “నేను ఈ రోజు వాటిని ఆమెకు తిరిగి ఇవ్వబోవుచున్నాను.”

176 అప్పుడు నేను ఆలోచించాను, ఏదో నాతో మాట్లాడి, ఇట్లు చెప్పెను, “ఆ బీద విధవరాలు తనయొక్క మూడు కాసులను వేయడం యేసు చూసెను, మరియు ఆయన ఎన్నడూ ఆమెను వెనుకకు ఆపలేదు.” ఆయన ఆమెను అలా వెళ్ళనిచ్చెను ఎందుకనగా మార్గములో ఏదో మరి గొప్పదైన విషయాన్ని ఆయన కలిగియున్నాడు.

177 ఒక విధవరాలి గూర్చి, ఆయన నాతో అదే విధంగా మాట్లాడుచున్నాడని నేను ఎరిగియుండలేదు, ఆమెకు భర్త లేడు. ఆమె భర్త చంపబడినాడు. నేను ఇట్లు చెప్పినప్పుడు, అది ఆయనే అని కూడా నేను ఎరిగియుండలేదు, “అట్లయిన నేను ఈ ఇరవై డాలర్లను ఉంచెదను, ఆమె కొరకు నీవు మరి దేనినో కలిగియున్నావు.”

178 నేను అన్నాను, “నాకు తెలిసిన ఒకే ఒక్క విషయం ఏమిటనగా, యెహోవా ఇంకనూ యెహోవా-ఈరే యైయున్నాడు. ఆయన ఒక అర్పణను సమకూర్చగలడు.”

179 మరియు హెట్టీ, తాను ఏమి చెప్పుచున్నదో ఎరుగకయే, లేచి మరియు ఇట్లన్నది, “బ్రెన్హామ్ సహోదరుడా, అది సత్యము కాక మరొకటి కాదు.” ఓ, మై! చెప్పుటకు అది సరియైన విషయము. పలుకుటకు అది సరియైన విషయమైయున్నది.

180 అంతలో, దేవుని శక్తి ఆ స్థలమును తాకినది; అటువంటి అభిషేకమును నేనెన్నడూ అనుభవించలేదు. అది జరిగినప్పుడు, నేను ఇట్లన్నాను, “హెట్టీ, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు కోరుకున్నది అడుగుము! అది ఏమిటన్నది నేను లెక్కచేయను, సరిగ్గా ఇప్పుడే నీ హృదయ వాంఛను నీకు అనుగ్రహించుటకు దేవుడు నాకు అధికారమును ఇచ్చెను. నీవు ఒక మిలియను డాలర్లను అడిగినయెడల, వాటిని నీవు పొందగలవు. కుంటిదైన ఆ చిన్న ఆమ్మాయి లేచి నడవవలెనని అడిగినయెడల, ఆమె దానిని పొందుకొనును. మరి దేనినైనా అడుగుము.”

ఆమె ఇట్లన్నది, “బ్రెన్‌హామ్ సహోదరుడా, నేను ఏమి అడగాలి?”

181 నేను చెప్పాను, “నీవు కోరే దేనినైనా అడుగుము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” ఓ, అది ఎటువంటి ఒక అనుభూతి!

182 ఆమె చుట్టూ చూసినది. దాదాపు మరణ స్థితిలో నుండి తిరిగి తీసుకురాబడినట్టి వృద్ధుడై నెరసిన-వెంట్రుకలుగల తన తండ్రి, అక్కడ కూర్చునియున్నాడు. వృద్ధురాలైన తన తల్లి, అనారోగ్యంతో అక్కడ కూర్చునియున్నది. కుంటిదైన, తన చిన్న సహోదరి అక్కడ కూర్చునియున్నది.

183 అయితే ఆమె సరైనదాన్ని మాత్రమే ఎంచుకున్నది. సరిగ్గా ఆ నిర్లక్ష్యపు వయసులోనున్న యవ్వనస్థులైన-ఇద్దరు అబ్బాయిలు ఆమెకు ఉన్నారు. తన ప్రశస్తమైన భర్త మహిమలోనికి వెళ్ళిపోయాడు; ఆమె ఒక క్రైస్తవురాలు, వేచి చూస్తున్నది. కానీ ఆ అబ్బాయిలు క్రైస్తవులు కారు. ఆమె చెప్పింది, “నా ఇద్దరు అబ్బాయిల ఆత్మలు.” దేవుడు ఆమె హృదయాన్ని దీవించును గాక.

184 నేను చెప్పాను, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు వారిని పొందుకుంటావు.”

185 మరియు ఈ విశ్వాసంలోకి బాప్తిస్మము పొంది, ఇదిగో వారు ఇక్కడ ఉన్నారు. వారు ఆ మరుసటి రాత్రి నాకు చెప్పుచుండిరి, ఆ చిన్న పిల్లవాడు కూడా, అక్కడ కాళ్ళు కడుగుచుండెను, సహోదరుడు నెవిల్ తలపై తన చేతులను ఉంచి, మరియు అతడు పాదములు కడుగుచుండగా అతని కొరకు ప్రార్థించుచుండెను.

186 ఈ ఉదయం ఆ ఇద్దరు అబ్బాయిలు బహుశా ఈ కూటములో ఇక్కడే ఎక్కడో కూర్చుని ఉన్నారు. వారు ఉన్నారా, హెట్టీ, వారు నీతో ఇక్కడ ఉన్నారా? [సహోదరీ హెట్టీ ఇట్లు చెప్తున్నది, “వారు అక్కడ వెనుక ఉన్నారు.”—సంపా.] వెనుక, ఆ వెనుక. అబ్బాయిలు, మీరు ఎక్కడ ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి. ఆ ఇద్దరు అబ్బాయిలు ఎక్కడ ఉన్నారు? అదిగో వారు అక్కడ, ఆ వెనుక నిలబడియున్నారు. దేవుడు మిమ్మును దీవించును గాక. మంచిది. మీరు అక్కడ ఉన్నారు.

187 ఇప్పుడు, ఏమి జరిగినది? అదే కార్యము, అది ఏమైనా గానీ, ఆమెకు…ఆమె ఏమి అడిగిననూ, ఆమె దానిని పొందుకొనవచ్చును. ఆమె దానిని పొందుకొనవచ్చును.

188 ఇప్పుడు అది జరుగుటను చూడాలని నేను కోరుచున్నాను. అది వర్తమానము పట్ల ప్రజల యొక్క వైఖరిపై ఆధారపడి ఉంటుంది. ఆమె దానిని ఎట్లు చెప్పినదో చూశారా? ఆమె సరిగ్గా సరియైన విషయమును చెప్పినది. మీరు ఏమి చెబుతారో, అదే దానిని చేస్తుంది. మీరు చెప్పునదే!

189 ఆ సురోఫెనికయ స్త్రీ యేసు వద్దకు వచ్చినప్పుడు ఆమెను చూడండి. ఆమె ఇట్లన్నది, “ప్రభువా, నా కుమార్తె దెయ్యంతో తీవ్రంగా బాధించబడుచున్నది. దావీదు కుమారుడా, వచ్చి ఆమెను స్వస్థపరచుము.”

190 ఆయన ఇట్లు చెప్పెను, “పిల్లల రొట్టెముక్కలు తీసుకొని, కుక్కలైన మీకు ఇవ్వటం నాకు యుక్తము కాదు.”

191 వ్యూ! ఆయన మనలో కొందరితో అట్లు చెప్పినయెడల ఏమగును? మనము ఇట్లంటాము, “నన్ను కుక్క అని అంటాడా? హహ్, ఎట్లైననూ, ఆయనతో ఏమీ లేదు! ఆ పెద్ద సంఘము చెప్పినది సరియే. ఆయన ఒక పరిశుద్ధ-గుండ్రాయి తప్ప మరేమీ కాదు. ఆయన ఒక బయెల్జెబూబు తప్ప మరొకటి కాదు.” మనము అటువంటి వైఖరిని కలిగియుంటాము. కానీ ఆమె కాదు.

192 ఆమె ఇట్లు చెప్పింది, “అది నిజమే, ప్రభువా. నీవు సరిగ్గానే చెప్పావు. కానీ కుక్కలు కూడా యజమాని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలను తినగోరుచున్నాయి.”

193 అది ఆయనను తాకినది. ఆయన ఇట్లు చెప్పెను, “ఈ మాటను చెప్పినందుకు, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినది. ఈ మాటను చెప్పినందుకు!”

194 స్నేహితులారా, అది మీ వైఖరియైయున్నది. ఆయన దానిని చెప్పలేదా? స్నేహితులారా, మీరు దానిని నమ్మవలసియున్నది. మీరు, నన్ను నమ్మకండి, నేను ఒక మానవుడను; కానీ నేను మీకు చెప్పుదానిని నమ్మండి, వర్తమానాన్ని నమ్మండి. మీరు వర్తమానికుడిని నమ్మనియెడల, ఆ వర్తమానమును నమ్మండి. ఒక టెలిగ్రాంతో, ఒక మనిషి అక్కడ ఆ గదిలోనికి నడిచి వచ్చినచో, అతడు ఎవరైనా గానీ, ఆ మనిషి ఎలా కనిపించినా గానీ లేదా అతడు చిన్న లేక పెద్ద, ఎవరైనాగానీ, ఆ టెలిగ్రామ్‌లో ఏమి ఉన్నదో దానిని మీరు నమ్మండి, ఆ మనిషిని కాదు. మీకు ప్రకటించడానికి దేవుడు నన్ను పంపెను. నేను ఒక వర్తమానమును కలిగియున్నాను. మృతులలో నుండి ఆయన లేచాడనియు, ఈ ఉదయం ఆయన ఇక్కడ ఉన్నాడనియు మీకు ప్రకటించడానికి దేవుడు నన్ను పంపెను. ఆయన ఇక్కడ ఉన్నాడన్నదానిని, సూచనలు మరియు అద్భుతాల ద్వారా ఆయన నిరూపించెను, మరియు మీరు వచ్చుచుండగా మీరు కేవలం సరైన వైఖరిని కలిగియుంటే మీలో ప్రతియొక్కరూ మీ అనారోగ్యం నుండి స్వస్థత పొందగలరు. మనము కేవలం నమ్ముము, అనే పాటను పాడుచుండగా, మీరు దానిని చేస్తారా.

195 ఇప్పుడు ప్రార్ధించబడబోవు వారందరూ, నేరుగా ఇచ్చట పైకి వచ్చి మరియు ఇక్కడ చుట్టూ వరుసగా నిలబడండి. ఇప్పుడు, మీరు మీ హృదయమంతటితో విశ్వసిస్తేనే తప్ప ఇక్కడకు రావద్దు.

196 ప్రశస్తమైన ప్రభువా, ఇదే ఆ ఘడియ. ప్రభువా, ఈ ప్రజలను నీవు స్వస్థపరిచెదవని నేను ప్రార్థిస్తున్నాను. మరియు, ఈ నూనెను శుద్ధీకరించుము. తండ్రీ, నీకే మహిమ తెచ్చుకొనుము. యేసుక్రీస్తు నామములో వీటిని మేము పంపుచున్నాము. ఆమేన్.

197 ఇక్కడ ఈ ప్రక్క నిలబడియున్న ఆ ప్రజలు, వారికి ఇక్కడ కొంత స్ధలము ఇస్తారేమోనని, మనము అడగవచ్చా అని నేను ఆశ్చర్యపోవుచున్నాను, మీరు ఇవ్వగలిగిన యెడల, తద్వారా మనము ప్రజలను నేరుగా ఇక్కడకు తీసుకొని వచ్చుటకైయున్నది. నేరుగా ఇక్కడ నుండి, ఆ మార్గము గుండా బయటకు వెళ్ళెదరు. అప్పుడు వారందరూ నేరుగా ఆ వరుసలో, ఈ మార్గం గుండా రావచ్చును, ఆ మార్గము గుండా బయటకి వెళ్ళేందుకు ఒక వరుసను తాయారు చేయుటకైయున్నది.

198 నెవిల్ సహోదరుడా, ఏదో ఒకటి జరగవలసియున్నది. [సహోదరుడు నెవిల్ ఇట్లన్నాడు, “ఆమేన్. అది సరిగ్గా ఇప్పుడు జరుగుచున్నది. దేవునికి స్తోత్రం! యేసు ఇక్కడ ఉన్నాడు. అవును. వారిలో ప్రతీ ఒక్కరు దేవుని యొక్క శక్తి చేత స్వస్థత పొందారు.”—సంపా.] ఆమేన్.

199 (ఏమంటారు? నిజమే…సరే, లేదు, సరిగ్గా అక్కడే. సహోదరుడు నెవిల్ మరియు నేను, అవును, ఆ చివరిలోనున్న వారి కోసం ప్రార్థించబోవుచున్నాము. కావున, వారిని ఈ మార్గములో తీసుకురాలేము, ఎందుకనగా మీరు చేసిన యెడల, మీరట్లు చేసిన యెడల, మీరు…ఒక్క నిమిషం…?…)

200 ఇప్పుడు వేచియున్న జనులతో నన్ను చెప్పనివ్వండి: ఇది దేవునియొక్క వాక్యము, ఎవరైతే నేను…దేవుని కృప మరియు సహాయము వలన, నేను జీవించినది, మరియు మరణించునది దీని పక్షమునేయైయున్నది. దేవుడే నా గంభీరమైన న్యాయాధిపతియై యుండగా, నేను మీకు సత్యమును చెప్పియున్నాను. నేను చూశాను, మరియు ఈ కార్యములన్నియూ దాని వద్దకు వచ్చుచున్నవి. అక్కడ ఆ చిన్న చేప లేపబడటం నుండి సైతం, మీరు ఎప్పుడైనా ఆ కథను విన్నారా? అది జరిగినప్పుడు అక్కడున్న ఆ ఇద్దరు, ఆ వ్యక్తులు సరిగ్గా అక్కడ ఆ వెనుక కూర్చునియున్నారు; అది జరుగుటకు ముందు రోజే చెప్పబడినది. ఇప్పుడు, జరిగిన ఈ సంగతులను నేను మీకు ఎలా చెప్పగలను? చూడండి, నేను ఈ రాత్రులలో, ఏదో ఒక రాత్రి, సరి తూకము మీద బోధించాలనుకుంటున్నాను. మనిషి మీకు ఏదైనా చెప్పి, మరియు ఆ విధంగా నిర్మించుచూ ఉండగలడు, కానీ దానిని సమతుల్యం చేయడానికి ఏ లేఖనము లేనియెడల, అది చివరకు కూలిపోతుంది. ఈ వివేచన, మరియు నేను మీకు చెప్పిన ఈ దర్శనాలు మరియు విషయాలు, అవి సత్యం కానియెడల; మొదటి విషయం, దానికి మద్దతిచ్చుటకు ఒక పరిశుద్ధ గ్రంథమున్నది, మరియు నేను సత్యమును చెప్పానని నిరూపించుటకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు.

201 ఇప్పుడు, నా ముందుకు రాగలిగిన ప్రతి విమర్శకుణ్ణి దాటుకుంటూ, దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా నేను రంగం మీద ఉన్నాను. విద్యావంతులు, మేధావులు, ప్రతీది, వారు ఒక్కసారి కూడా…

202 అప్పుడు వారు ఏమి అన్నారో మీకు తెలుసా? మీరు దానిని ఇక్కడ వినియున్నారు. వారు ఇట్లంటారు, “ప్రేక్షకులలో ఉన్న జనులు అంతటా వెళ్ళి, ప్రజలతో మాట్లాడతారు.” మొదట అట్లు చేయుటకు అక్కడికి వెళ్ళేది, నా సంఘపు ప్రజలని వారు అన్నారు. పిదప వారికి అది అర్థం కాలేదు, వారు చాలా మంది ఉన్నారు.

203 వారు చెప్పిన తదుపరి విషయం, ఏమిటంటే, “అది ఇట్లుండును ఆ సహోదరులు” నాతో వెళ్ళేవారు, “వారు అక్కడ వెనుక నిలబడి మరియు ఇట్లు చెప్తారు, ‘ఈ మనిషికి తన చెవులలో, వినికిడి సమస్య ఉన్నది.’”

204 పిదప వారు ఇట్లన్నారు, “బిల్లీ పాల్, బిల్లీ పాల్ వచ్చి మరియు—మరియు అక్కడ పైకి వెళ్ళి ప్రజలు చెప్పినదానిని, ఆ కార్డును చదువుతాడు. వారి చెవులలో ఏదైనా సమస్య ఉన్నయెడల, అతడు ఇట్లు చెప్తాడు, ‘వారి చెవులు’ లేదా ‘వారి కడుపు.’”

205 అక్కడ బయట ప్రార్థనా కార్డులు లేని వారిలో అసలు ఎలా సాధ్యమగును? పరిపూర్ణముగా అట్లే జరుగునట్టి సంగతులను ముందుగానే అది అసలు ఎలా చెప్పగలదు? అది ఆ విధంగా ఎలా ఉండగలదు? అది అట్లుండలేదు. వారి యొక్క సరియైన మతి స్థిమితమును కలిగియున్న, ఎవరికైనా అది తెలియును.

206 ఫిలిప్పు వెళ్ళి నతనయేలును తీసుకొని వచ్చినప్పుడు, వారు యేసు గురించి అదే విషయమును అన్నారు. “అతడు యేసు యొక్క స్నేహితుడు.” అతడు ఇట్లన్నాడు, “ఖచ్చితంగా, అతడు దాని గురించి యేసుకు అంతా చెప్పాడు. అతడు ఆయన వెంట వెళ్ళుచున్నాడు.”

207 మరియు పిదప ఆ శిష్యులు అన్నారు, లేదా ఆ పెద్ద సంఘము యొక్క శిష్యులు ఇట్లన్నారు, “ఈ మనుష్యుడు బయెల్జెబూబు. అతడు బయెల్జెబూబు. అతడొక సోదె చెప్పువాడు.”

208 యేసు ఇట్లు చెప్పాడు, “దానికై నేను మిమ్మల్ని క్షమించెదను. అయితే ఏదో ఒక రోజు అదే కార్యమును చేయుటకు పరిశుద్ధాత్మ వచ్చుచున్నాడు, దానికి వ్యతిరేకముగా ఒక్క మాట కూడా ఎన్నటికీ క్షమించబడదు.” ఇప్పుడు ఒకవేళ…

209 నిజాయితీగా ఎలా ఉండాలని నాకు తెలుసో, అంత నిజాయితీగా నేను మీతో ఉన్నాను. ఓ, చిన్న వేదాంతము మరియు ఆ విషయాలలో మీరు కలిగియున్న కొన్ని నమ్మకాలను నేను వ్యతిరేకించి ఉండవచ్చును. కానీ, నేను అలా చేయడానికి కారణం ఏమిటనగా, పౌలు ఇట్లు చెప్పెను, “పరలోకము నుండి ఒక దూత వచ్చి మరియు ఆ బైబిలు గ్రంథము చెప్పునది కాకుండా,” మరియు అతడు బోధించినది కాకుండా మరి దేనినైననూ బోధించినయెడల, “అతడు శాపగ్రస్తుడవును గాక.”

210 కావున, బైబిలు గ్రంథము ఏమి చెప్పినదో దానిని మాత్రమే నేను వెంబడించవలసియున్నది. “ఆయన నిన్నా, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు,” అని బైబిలు చెప్పినయెడల, నేను దానిని నమ్ముతాను. బైబిలు ఏమి చెప్పినదో, కేవలం దానిని మాత్రమే నేను నమ్ముతాను. సరిగ్గా అలాగే దానిని నేను చెప్తాను. నాకు ఏ విద్య లేదు, ఎలాంటి శిక్షణ లేదు. నేను పరిశుద్ధాత్మ మరియు బైబిలు చెప్పునది మాత్రమే విన్నాను. మరియు ఇప్పటివరకు, ఈ ఈస్టరు ఉదయం వరకు, ముప్పై ఒక్క సంవత్సరాలుగా, ఆయన నన్ను ఎప్పుడూ నిరాశపరచలేదు.

211 మరియు రాబోవుచున్న ఆ పరిచర్యను గూర్చి పరిశుద్ధాత్మ నాకు చెప్పెనని నేను మీకు చెప్పాను, గత రెండు లేదా మూడు సంవత్సరాలుగా, నేను ప్రతిచోటా సంఘములతో చెప్పుచున్నాను. మరియు సర్వశక్తిమంతుడైన దేవుడు నా న్యాయాధిపతియై యుండగా, సేలంకు ఇటువైపు సరిగ్గా ఇక్కడే, అసలు ఉడుతలే లేని ఆ చోట, ఆ ఉడుతలు ఉనికిలోకి వచ్చాయి. సరిగ్గా అక్కడ చార్లీతో పాటు, మరియు ఇక్కడ కెంటకీలో అనేకులు, వెనుక అక్కడ నిలబడియున్నాము; నేరుగా అవి లేని స్థలములలోనికి ఆ ఉడుతలు వచ్చాయి, అవి ఎక్కడ ఉండబోవునన్నది చెప్పబడెను. టోనీ మరియు వారు, బ్యాంక్స్, అక్కడ కూర్చునియున్నారు. మరియు అది ఖచ్చితంగా అక్కడే, జరిగినది. వెంటనే తిరిగి వచ్చాము, మరియు తమ మీద అది పలుకబడిన మొట్టమొదటి మనిషి, సరిగ్గా అక్కడ కూర్చునియున్న ఆ స్త్రీయైయున్నది, మరియు అది జరిగినది. ఒక రోజు ఉదయం అక్కడ పైన, నేను ఆ గొంతు సమస్యతో అనారోగ్యముగా ఉన్నప్పుడు, యేసు నాముందు నిలబడియుండుటను నేను చూశాను, మరియు ఆ పరిచర్య ఇదివరకే నాకు ధృవీకరించబడినదని ఆయన నాతో చెప్పెను.

212 ఇప్పుడు ఏమి జరుగనైయున్నదో, నాకు తెలియదు. కానీ, ఒక విషయం, నేను దీనిపై అడుగు పెట్టేందుకు, ఆ మరొకదానిని ప్రక్కన పెట్టాలి. చేయుటకు నాకు తెలిసిన ఏకైక మార్గం అదే. ఇప్పుడు అది తెలియబడును గాక, యోబు చెప్పినట్లుగా, ఈ ఉదయం, ఇది ఒక బండ మీద, ఇనుపపోగరతో చెక్కబడును గాక. ఏమి చేయాలో నాకు తెలియదు. నాకు తెలిసిన ఒకే ఒక్క విషయమేదనగా, అడుగు ముందుకు వేయడమే. ఆయన నాకు చెప్పెను. మరియు దేవుడే నా న్యాయాధిపతి, ఆయన నాకు చెప్పెను. నేను మీకు సత్యమును చెప్పాను. మరియు దేవుడు ధృవీకరించి మీకు చెప్పినయెడల, మరియు ఇక్కడున్న ఎవరైనా ఒక్కసారైనా ఏదైనా తప్పు జరిగినదని, ఎన్నడైనా వారి వేలెత్తి చూపించలేనియెడల, అప్పుడు ఇది కూడా, సరియైనదే. ఇది కూడా, సరైనదే.

213 ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి మరియు ఆ వరుస చివరిలో నిలబడినప్పుడు, ప్రజలను అభిషేకించడానికి, పెద్దయైన, నెవిల్ సహోదరుణ్ణి నేను అక్కడ కలిగియున్నాను, అతడు దైవభక్తిగల వ్యక్తి, ఇక్కడ మన సంఘ కాపరియైయున్నాడు, నేను ప్రజలపై చేతులు ఉంచబోవుచున్నాను, ఎందుకనగా, ఈస్టరు తర్వాత, యేసు యొక్క ఆజ్ఞ ఏమిటనగా, “వెళ్ళి రోగులుపై చేతులు ఉంచండి, వారు స్వస్థత నొందుదురు.”

214 ఆ వరుసగుండా, ఆయన నాకు ఏమి చెప్పబోవుచున్నాడో నాకు తెలియదు. నేను ఆ అతీతమైన అభిషేకాన్ని అనుభూతి చెందుటకు ప్రయత్నించబోవుచున్నాను. ఏమి జరుగునో నాకు తెలియదు. నేను ఎరుగను. అది ఏమైనా గానీ, కేవలం ఆయన చెప్పినట్లే నేను చేస్తాను.

215 ఇప్పుడు రండి, ఒక నిండు హృదయంతో రండి. ఆయన మిమ్మల్ని గద్దించినా ఫర్వాలేదు, ఆయన మీతో ఏమీ చెప్పనియెడల, అది ఏమైప్పటికినీ, మీరు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వెళ్ళిపోవుడి, మీరు చూడండి. ఎందుకనగా, పని పూర్తయినది, మిమ్మల్ని చేరుకోవడానికి దానికి ఏదో ఒక మార్గం ఉన్నది.

216 ఇప్పుడు, సహోదరుడా, అట్టి కాలు ఉండగా, నీవు దానిని నమ్మాలని నేను కోరుచున్నాను. ఆయన, టెలిఫోన్ గుండా, ఆ కడుపు సమస్యను నీ నుండి తీసివేయగలిగిన యెడల, ఈ ఉదయం ఖచ్చితంగా ఆయన ఆ కాలు సమస్యను కూడా నీ నుండి తీసివేయగలడు, చూడండి. ఇప్పుడు నీ పూర్ణ హృదయంతో నీవు నమ్ముము.

217 మరియు గుండె జబ్బును కలిగియున్న ఆ చిన్న బిడ్డతో ఉన్నటువంటి ఆ స్త్రీ, నీవు ఇక ఎంత మాత్రము సందేహించవద్దు. నమ్మికయుంచుము! నమ్మికయుంచుము!

218 ఇప్పుడు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండాలని నేను కోరుచున్నాను. మరియు ప్రార్థన చేయడానికి నేను క్రిందకు వెళ్ళుచున్నాను. నేను ఈ ప్రార్థనా వరుసను తీసుకువచ్చి, నా చేతులును ఉంచి మరియు ఒక ఆశీర్వాదాన్ని పలుకుచూ, అడుగుచుండగా, మీరందరూ ఇప్పుడు కేవలం ప్రార్థనలో ఉండండి.

219 మరియు, గుర్తుంచుకోండి, మీలో ఎవరైనా ఏదైనా ఒప్పుకొనని పాపమును కలిగియున్నయెడల, ఆ ఒప్పుకొనని పాపము ఉండగా దేవుడు మిమ్మల్ని ఎన్నడూ స్వస్థపరచడని మీకు తెలియబడును గాక. మీరు ఇక్కడికి రాకముందే దానిని సరిచేసుకొనండి, ఎందుకనగా అది మీకు మరింత హీనస్థితిని కలిగించవచ్చును. చూసారా?

220 ఇప్పుడు అది వివేచనలో కాదు. వివేచనలో, నేను ఆ విషయాలను కనుగొంటాను. కానీ, ఇది వివేచన కాదు, నేను ఒక నూతన పరిచర్య కొరకు వెదకుచున్నాను. మీ అందరికీ బాగా అర్థమైనదా? అయితే సరే. ఇప్పుడు నమ్మండి.

ఇప్పుడు మన తలలు వంచియుండగా మనము ప్రార్ధించెదము.

221 తండ్రివైన దేవా, ఈ వేదికపై ఇంకనూ, నా వేలిముద్రలు ఉన్నాయి, ఎట్లనగా దాదాపు ముప్పై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుండి, నేను ఇక్కడ నిలబడి గంటల తరబడి, ప్రపంచమంతటికీ బోధిస్తున్నాను. మరియు నేను ప్రకటించిన సువార్తను నీవు ధృవీకరించావు, ఎందుకనగా ఆ వర్తమానము నీ యొద్ద నుండియే వచ్చినది. నేను ఎన్నడూ ఏ పాఠశాలలకు వెళ్ళలేదు, నిన్ను తప్ప మరి ఎవరినీ సంప్రదించలేదు, నీ వాక్యాన్ని చదువుచూ మరియు ఆత్మ ఏమి చేయమని చెబుతుందో చూచుటకు వేచియున్నాను.

222 మరియు ఇప్పుడు, ప్రభువా, మార్కు 11:23 యొక్క ఈ పరిచర్య గురించి నీవు ఎరిగియున్నావు, మరియు ఘడియ సమీపించియున్నదని ఎరిగియుండి, ఆ ఉడుతల గురించి, మరియు సహోదరి హెట్టీ మరియు తన అబ్బాయిల గురించి నేను సత్యమునే చెప్పానని ఎరిగియున్నావు. ఇప్పుడు, తండ్రీ, మరి ఆ ఉదయం, అక్కడ మంచము మీద నా వద్దకు ఆ దర్శనం వచ్చినదని ఎరిగియున్నావు. నేను ఆ పరిశుద్ధ గ్రంథమును, పిదప ఆ సిలువను, మరియు పిదప నిన్ను చూశాను. మరియు నేను దానిని అంగీకరించవలసి యున్నదని నా మనసుకు బయలుపరచబడినది, ఎందుకనగా అది ధృవీకరించబడినది.

223 ఇప్పుడు, ప్రభువా, నీవు ప్రజల కొరకు మరింత శక్తివంతమైన, మరింత శక్తివంతమైన, ఒక నూతన వరమునకు నన్ను లేపెదవని ప్రార్ధించుచూ, ఈ ఈస్టరు ఉదయాన నేను ఇక్కడ నిలబడుట కొరకు, నేను నా సంఘములో ముందుకు వెళ్ళుచున్నాను. నా రక్షణ కొరకు కాదు; ఎందుకనగా ప్రభువా, ఇదివరకే, నీవు నన్ను రక్షించావు. నా కొరకు కాదు; నిన్ను తెలుసుకొనుటకు, గొప్ప విషయములన్నిటినీ నేను తృణీకరించాను. ఒక రోజు ఆ గొప్ప దేవాలయం వద్ద, “నేను నీ యొక్క భాగమును,” అని నీవు నాతో చెప్పియున్నావు. అట్లే ఇప్పుడు, ప్రభువా, నన్ను నీ భాగముగా ఉండనిమ్ము, తద్వారా నీ ఆత్మ నాలోనికి వచ్చునట్లు, నేను నీ దయ పొందగలను. మరియు బాధనొందుచున్న, ఈ ప్రశస్తమైన ప్రజలపై నేను నా చేతులు ఉంచినప్పుడు, ప్రభువా, నీ ఆత్మ, ఆ మిగిలిన పనిని చేయును గాక. ప్రభువా, చేయుటకు నాకు తెలిసినదంతా అదియే.

224 నాకు ఇవ్వబడిన ఆజ్ఞ నాకు జ్ఞాపకమున్నది, నేను “రోగుల కొరకు ప్రార్ధించుటకు జన్మించాను, వారు విశ్వసించులాగున చేయుము, మరియు నీవు ప్రార్ధించేటప్పుడు యధార్ధముగానుండుము.” ప్రభువా, నేను కేవలం…ఇంకెంత యధార్ధంగా ఉండాలో నాకు తెలియదు. నేను—నేను…ప్రభువా, వారు బాధపడుచున్నారు. మరియు స్వయంగా, నేను—నేను కూడా బాధపడ్డాను. ప్రియమైన దేవా, దయచేసి, వారు, ప్రతి ఒక్కరూ స్వస్థత పొందునట్లు అనుగ్రహించండి.

225 మోషే ఎర్ర సముద్రము వైపు అడుగు వేసినట్లు, ప్రభువా, నేను ఇప్పుడు, విశ్వాసంతో ముందుకు వెళ్ళుచున్నాను. నేను ఈ పవిత్ర వేదిక నుండి, ఈ ప్రార్థన వరుస వద్దకు, యేసుక్రీస్తు నామములో అడుగు వేయుచున్నాను. ఏ దేవుడైతే నాకు ఆ ఉడుతలను ఇచ్చాడో, ఏ దేవుడైతే సహోదరి హెట్టీకి ఆ మాటలను అనుగ్రహించాడో, ఏ దేవుడైతే నేను వాటిని పలుకునట్లు చేశాడో, ఆయనే నాతో వచ్చును గాక. నేను యేసుక్రీస్తు నామములో వెళ్ళుచున్నాను. [సహోదరుడు బ్రెన్‌హామ్ రోగుల కొరకు ప్రార్థించుటకు మైకును విడిచి వెళ్ళెను, ఆయన యొక్క అనేక మాటలు స్పష్టముగా లేవు—సంపా.]

226 సాతానా, నేను ఖండిస్తున్నాను…నీవు, యేసుక్రీస్తు నామములో, ఈ బిడ్డను విడిచి పెట్టుము. దానిని విడిచి, ఈ బిడ్డ నుండి బయటకు రమ్ము; పొమ్ము, మరియు ఆ బిడ్డ బాగవును.

227 యేసుక్రీస్తు నామములో నేను నా సహోదరునిపై నా చేతులు ఉంచుచున్నాను, మరియు అతని శరీరము యొక్క బాధను ఖండిస్తున్నాను. ఆమేన్.

యేసుక్రీస్తు నామములో, ఆమెకు తన విన్నపమును అనుగ్రహించుము.

228 ప్రభువా, యేసుక్రీస్తు నామములో, సహోదరి రూతుకు ఆమె యొక్క స్వస్థతను దయచేయుము. ఆమేన్.

229 నేను ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తాను. అయితే నేను—నేను ఆ వేదికనుండి దిగి వచ్చాను…నీవు ఎక్కడ నివసిస్తావు? [ఆ సహోదరి ఇట్లు చెప్పుచున్నది “బ్లూమింగ్టన్.”—సంపా.] ఇండియానా, బ్లూమింగ్టన్నా? ఈ బిడ్డ గురించి నాకు ఒక ఉత్తరమును రాయుము. ఇప్పుడు ఇక్కడ ఆ కడుపులో అంతా వాచిపోయి ఉన్నది. అది నిజమేనని, నీవు నమ్ముచున్నావా, స్త్రీ? [“అది నిజమేనని నేను నమ్ముచున్నాను.”]

230 అలాగైతే, తండ్రీ, నేను ఈ…ఈ బిడ్డపై నా చేతులను ఉంచి, మరియు ఈ దయ్యమును ఖండించుచున్నాను. ఈ బిడ్డను విడిచిపెట్టి పొమ్ము. మరియు బహుశా ఆ…?…ఇప్పుడు అది యదాస్థితికి వచ్చును గాక మరియు ఆ బిడ్డ స్వస్ధతనొందును గాక.

మీరు ఒక రెండు రోజుల్లో, నాకు ఒక ఉత్తరమును రాయండి.

231 మెల్ల-కన్ను గల ఆ చిన్న పాప అక్కడ పడుకొనియుండుటను చూశారా? మీరు ఇకపై సందేహించనియెడల, మీరు ఆ బిడ్డను తిరిగి తీసుకువచ్చి, మరియు అది సాధారణంగాను మరియు బాగైయ్యుండుటను చూపిస్తారు.

232 నేను ఈ సహోదరిపై చేతులు ఉంచుచున్నాను. మరియు ఈమె ఆ సురోఫెనికయ స్త్రీలాంటి వైఖరిని కలిగియుండును గాక. మరియు ఈమె యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందును గాక…?…

యేసుక్రీస్తు నామములో, ఆ గుండె బాగవును గాక.

233 నేను ఈ మాటలు పలుకుచున్నాను. అది బాగవ్వవలసియున్నది. అది ఇంకేమి అవ్వజాలదు. యేసు ఇట్లు చెప్పెను, “నీవు నమ్మినయెడల, నేను చేయగలను.” ఇప్పుడు, ఒకసారి పొట్టేలును కలుగజేసినట్లే, సరిగ్గా అలాగే, ఒక ఉడుత ప్రత్యక్షమగునట్లు ఆయన చేయగలిగినయెడల, ఆయన ఈ గుండెను బాగయ్యి మరియు యదావిధిగా ఉండేటట్లు చేయగలడు. అది జరగవలసియున్నది.

యేసుక్రీస్తు నామములో, ఆ గుండె బాగవును గాక. దీనిని అనుగ్రహించండి.

234 ఇప్పుడు, అది సామాన్యంగా లేదా? అది సామాన్యముగా ఉన్నది. దేవుడు చాలా సామాన్యముగా ఉన్నాడు, మనము దానిని దాటిపోతాము. ఇప్పుడు ఇకమీదట మీరు దాని గురించి కనీసం ఆలోచన చేయలేనంత సామాన్యముగా మీరు ఉండండి. అది సరిపోతుంది.

235 ప్రభువా, యేసుక్రీస్తు నామంలో, మా సహోదరి బాగవును గాక. ఆమేన్. సహోదరి…?…

236 ప్రభువా, ప్రజల యెదుట నేను చెప్పగలిగినంతగా, ఇప్పుడు నేను ఈ మాటలను యదార్ధంగా చెప్పాను. నేను వారికిట్లు చెప్పాను, “మీరు ఈ పర్వతముతో ‘కదిలిపో,’ అని చెప్పి, సందేహించనిచో, అప్పుడు మీరు చెప్పినది మీరు పొందుకుంటారు.” యేసుక్రీస్తు నామములో, ఈ బలహీనత, మరియు మీరు కలిగియున్న సమస్యలన్నియూ తీసివేయబడును గాక. ఇప్పుడు సందేహించవద్దు. ఇప్పుడు నేరుగా ఆయనకు సమీపముగా వెళ్ళండి.

237 ప్రభువా, ఈ భయంకరమైన తలనొప్పితో ఉన్న ఈ చిన్నవానిపై నేను నా చేతులను ఉంచుచున్నాను. యేసుక్రీస్తు నామములో, ఇతడు స్వస్థపరచబడును గాక. ఆమేన్.

238 ప్రభువా, యేసుక్రీస్తు నామములో, ఆ పర్వతం అతని నుండి తొలగిపోవును గాక, అది బాగవును గాక. మా సహోదరుడు ఇప్పుడు బాగవును గాక…?…ఆమేన్.

239 చెవిటివారు మరియు మూగవారు; చెవిటి మూగవారు. ప్రభువా, యేసుక్రీస్తు నామములో! నేను అనుదినము, సంవత్సరం వెంబడి సంవత్సరం నిలబడి బోధించాను, అక్కడ ఏదో ఒకటి జరుగకుండా, విశ్వాసము ఊరకే నిన్ను తాకుటను, నేను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు! ఇప్పుడు, ఇతడు చెవిటివాడు, మరియు అతని కడుపులో రంధ్రాలు పడియున్నవి. యేసుక్రీస్తు నామములో, ఇతను స్వస్థపరచబడును గాక. ఆమేన్.

ఇప్పుడు, సందేహించవద్దు.

240 ప్రభువా, అతని శరీర బాధలు నీకు తెలియును. అతనిపై చేతులను ఉంచియుండగా, ఒక యదార్ధ హృదయంతో అడుగుచున్నాను, యేసుక్రీస్తు నామములో, అతణ్ణి స్వస్థపరచబడనిమ్ము. ఆమేన్.

241 మరణము ఒక తలుపు వద్ద ఉండును, విశ్వాసం మరొకదాని వద్దనుండును. దేవా, ఆ రాయిని పారద్రోలి, విశ్వాసాన్ని స్వాధీనం చేసుకోనిమ్ము. యేసుక్రీస్తు నామములో, క్యాన్సర్ ఆమెను విడిచిపెట్టును గాక.

242 ప్రభువా, అతడు స్వస్థత పొందునుగాక. నేను అతని మీద చేతులను ఉంచుచున్నాను. ఈ వర్తమానము ఇంకనూ ఆ గోడల గుండా మ్రోగుచున్నది. యేసుక్రీస్తు నామములో, అతడు స్వస్థపరచబడును గాక.

243 తండ్రివైన దేవా, నా సహోదరునిపై నేను చేతులు ఉంచుచున్నాను. ప్రభువా, నీ ఆత్మ మరియు శక్తి, తన విన్నపమును అతడికి ఇచ్చునట్లు, అనిమతించుము. యేసుక్రీస్తు నామములో, అది జరుగును గాక. ఆమేన్.

అది పూర్తయినది. ఇప్పుడు దానిని సందేహించవద్దు.

244 ప్రభువా, అతడు ఈ పరిస్థితిలో ఉండి కూడా, నీ సన్నిధికి రావాలన్నది మా సహోదరుని కోరికయైయున్నది. ఇప్పుడు, యేసుక్రీస్తు నామములో, అతడు అడుగుచున్నది అతడు పొందుకొనును గాక. ఆమేన్.

245 ఎంత గొప్ప విషయం! దేవుని మహిమార్ధమై పరిశుద్ధాత్మ ఈ బిడ్డపైకి వచ్చును గాక, తద్వారా వారు అతణ్ణి తీసుకువచ్చునట్లు…?…దేవుని రాజ్యము నిమిత్తమై, అతడు దానిని పొందుకొనును గాక. ఆమేన్.

246 తండ్రీ, యేసుక్రీస్తు నామములో, అది ఆ విధంగా జరుగును గాక, అదేమనగా యేసు నామములో మా సహోదరి స్వస్థత పొంది, మరియు తన విన్నపము అనుగ్రహించబడును గాక. ఆమేన్.

247 అది జరుగును గాక. నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. నీవు దానిని పొందకుండా చేయుటకు ఏ మార్గమూ లేదు…?…నీవు పొందవలసియున్నది! దేవుడు అట్లు చెప్పెను గనుక, నీవు దానిని పొందుకొనవలసియున్నది. నీవు దాని పక్షమున నిలబడుము.

కేవలం అక్కడ ఆ చిన్న పెంకును చీల్చుకొని రండి. కేవలం ఇట్లనండి…?…

248 పరలోకపు తండ్రీ, యేసుక్రీస్తు నామములో, మా సహోదరి యొక్క విన్నపమును అనుగ్రహించండి. ఆమేన్.

249 తండ్రీ, యేసుక్రీస్తు నామములో, మా సహోదరి యొక్క విన్నపమును అనుగ్రహించండి. ఆమె స్వస్థపరచపడును గాక. ఆమేన్.

250 వరుసగా ఏడు సార్లు, ఆయన ఒక ఉడుతను ఉనికిలోకి వచ్చేలా చేయగలడు. ఆయన ఆ స్త్రీకి ఆమె ఏది అడిగినా ఇచ్చును; ఆయన దానిని మీకును ఇచ్చును…?…

251 ప్రభువా, యేసుక్రీస్తు నామములో, మా సహోదరి యొక్క విన్నపమును అనుగ్రహించుము. ఇది నీ వాక్యమైయున్నది. నీకు వందనములు. మరియు తండ్రీ, యేసుక్రీస్తు ద్వా, రా అది ఆమెకు అనుగ్రహించబడును గాక. ఆమేన్.

252 మీ ప్రియమైన వారా? తండ్రీ, యేసుక్రీస్తు నామములో, వీటిని అనుగ్రహించుము…?…

253 ప్రభువా, ఈ చిన్న యూదా స్త్రీ…నీవు అబ్రాహాము దేవుడవు. యేసుక్రీస్తు నామములో, ఆమె విన్నపమును, అనుగ్రహించుము. ఆలాగు జరుగును గాక!

254 పరలోకపు దేవా, యేసుక్రీస్తు నామములో, ఆమె యొక్క విన్నపమును అనుగ్రహించుము. ఆమేన్.

255 ఈ చిన్న అమ్మాయి. నీవు ఆ వేదికపైకి వచ్చిన వెంటనే, దేవుడు నీ జీవితం గూర్చి అంతా నాకు చెప్పుచుండెను. ఆయన నీనుండి ఆ ఒత్తిడిని తీసివేయును.

256 ప్రభువా, ఈ అమ్మాయిలోనున్న ఒత్తిడిని నేను ఖండిస్తున్నాను. అది ఈ ఘడియలోనే ఆమెను విడిచిపెట్టును గాక మరియు ఆమె ఇక్కడ నుండి ఎంతో సంతోషంగా వెళ్ళును గాక. యేసుక్రీస్తు నామములో, అది జరుగును గాక.

257 మేము జరుపుకునే పునరుత్థానమందు, నీ కుమారుడైన, యేసును, లేపినటువంటి పరలోకపు దేవా, ఆమె ఈ రోజు దానిని మరింత గొప్పగా జరుపుకొనును గాక…?…యేసు నామములో. ఆమేన్.

258 దేవుని కుమారుడైన, యేసుక్రీస్తు నామములో, నా సహోదరిపై నేను నా చేతులను ఉంచుచున్నాను, యేసు నామములో ఆమె ఇప్పుడు స్వస్థత పొందాలని అడుగుచున్నాను.

259 దేవుని కుమారుడైన, ప్రభువైన యేసుక్రీస్తు నామములో, మా సహోదరి స్వస్థపరచబడును గాక. ఆమేన్. అది ఆమెలో ఉండలేదు. అది విడిచిపెట్టవలసియున్నది. వెళ్ళుము, ఇది విడిచిపెట్టవలసిందే.

260 ప్రభువా, యేసుక్రీస్తు నామములో, మా సహోదరి స్వస్థపరచబడును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో, ఈ నా సహోదరిని, నేను స్వస్థపరచుచున్నాను. ఆమేన్.

యేసుక్రీస్తు నామములో, నా సహోదరిని నేను స్వస్థపరచుచున్నాను. ఆమేన్.

యేసుక్రీస్తు నామములో, నేను నా సహోదరిని స్వస్థపరచుచున్నాను.

యేసుక్రీస్తు నామములో, ఈ నా సహోదరిని, నేను స్వస్థపరచుచున్నాను.

యేసుక్రీస్తు నామములో, నేను ఆమెకు తన విన్నపమును ఇచ్చుచున్నాను. ఆమేన్.

261 ప్రభువా, యేసుక్రీస్తు నామములో, నేను ఈ చిన్న తల్లికి తన యొక్క విన్నపమును ఇచ్చుచున్నాను.

ప్రభువా, యేసుక్రీస్తు నామములో, నేను ఆమెకు తన యొక్క విన్నపమును ఇచ్చుచున్నాను.

ప్రభువా, యేసుక్రీస్తు నామములో, నేను ఆమెకు తన విన్నపమును ఇచ్చుచున్నాను.

262 సాతానా, నేను నిన్ను వెళ్ళగొట్టుచున్నాను. యేసుక్రీస్తు నామములో, ఈ స్త్రీని విడిచిపొమ్ము.

263 నీవు చాలా కాలంగా బంధించబడియున్నావు. ఇప్పుడు నీవు విడుదల పొందావు. నీవు బాగవ్వబోవుచున్నావు. అయితే, ఇప్పుడు అంతా బాగానే ఉండును. ఇప్పుడు దానిని నమ్ముము.

264 దేవా, యేసుక్రీస్తు నామములో, నేను వికలాంగురాలైన, ఈ సహోదరికి, తన స్వస్థతను ఇచ్చుచున్నాను. ఆమేన్.

265 యేసుక్రీస్తు నామములో, నేను ఈ సహోదరికి తన స్వస్థతను ఇచ్చుచున్నాను. ఆమేన్.

266 సహోదరి, యేసుక్రీస్తు నామములో, నేను నీ స్వస్థతను నీకు ఇచ్చుచున్నాను. ఆమేన్. ఆలాగు జరుగును గాక!

267 నేను ఒక పొరపాటు చేయడం లేదని దేవునిపై నమ్మికయుంచుచున్నాను. విశ్వాసం ద్వారా, దీనిని అనుగ్రహించుము. ఆలాగు జరుగును గాక!

268 దేవుడు గుండె జబ్బును కూడా స్వస్థపరచుటకు నీకు శక్తిని ఇచ్చునని నీవు నమ్ముచున్నావా? నేను ఇప్పుడే చెప్పిన ఆ కథను నీవు నమ్ముచున్నావా? నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? అలాగైతే నేను నీ స్వస్థతను నీకు ఇచ్చుచున్నాను. యేసుక్రీస్తు నామములో, నీ స్వస్థతను నేను నీకు ఇచ్చుచున్నాను.

269 ఇప్పుడే ఆ వెనుకకు వెళ్ళిన ఈ స్త్రీ పేరు ఏమిటి? నీవు ఇక్కడే ఎక్కడైనా నివసిస్తుంటావా? [ఆ సహోదరి “అవును,” అని చెప్పుచున్నది.—సంపా.] నీవు స్వస్థత పొందావని నీవు గుర్తుంచుకొనుము! నేను ఇక్కడ నిలబడియుండుట ఎంత నిజమో అది సరిగ్గా అంతే వాస్తవమైయున్నది.

270 తండ్రీ, యేసుక్రీస్తు నామములో, దీనిని అనగా, ఆమె స్వస్థతను అనుగ్రహించమని, నేను ప్రార్ధించుచున్నాను. ఆమేన్.

271 తండ్రీ, యేసుక్రీస్తు నామములో, ఆమె తన స్వస్థతను పొందుకొనును గాక. ఆమేన్!

272 నేను—నేను—నేను పలుకుచున్నాను…నేను—నేను—నేను…దేవుని కృప చేత, ఒక దైవీక వరము ద్వారా, నేను నీకు నీ స్వస్థతను ఇచ్చుచున్నాను! ఆ దయ్యమును కూడా, వెళ్ళగొట్టుచున్నాను.

273 సహోదరీ రోజ్‌ నీవు నమ్ముచున్నావా? ఓ ప్రభువా, భూమ్యాకాశములకు సృష్టికర్తా, ఈ సహోదరీ రోజ్ ఆస్టిన్‌కు ఈ స్వస్థతను ఇవ్వండి, ప్రభువా, యేసుక్రీస్తు నామములో. ఆమేన్. అంతే, సహోదరీ రోజ్, ఇప్పుడు నమ్ముచు వెళ్ళుము.

274 ప్రభువా, యేసుక్రీస్తు నామములో, మా సహోదరికి ఆమె స్వస్థతను ఇవ్వండి. ఆమేన్…?…

275 నీవు దానిని నమ్ముచున్నావా? దానిలో ప్రతి ఒక్క దానిని నీవు నమ్ముచున్నావు. అలాగైతే నేను నీకు, యేసు నామములో, నీ విన్నపమును ఇచ్చుచున్నాను. దేవుడు ఆమెను బాగు చేస్తాడు.

276 అది ఆలాగు జరుగును గాక, ప్రభువా, ఆమె సహోదరుడు, శారీరకంగా మరియు ఆత్మీయముగా స్వస్థతనొందును గాక, యేసు క్రీస్తు నామములో. ఆమేన్!

ఇప్పుడిదే ఆ ఘడియ కావచ్చు…?…

277 ప్రభువా, ఆమె వైద్యులకైనా లేదా వైద్య శాస్త్రంలోని ఏ చికిత్సకైనా, పూర్తిగా నిరీక్షణలేని దానివలె ఉండగా, నేను ఆమెపై ఇప్పుడు నా చేతులు ఉంచుచున్నాను. కానీ పునరుత్థానుడైన క్రీస్తును కలుసుకొనుటలో అట్లు లేదు. యేసు నామములో, ఆమె స్వస్థతనొందును గాక. ఆమేన్.

…?…

278 ప్రభువా, ఆమె విన్నపమును సమీపముగా ఆలకించుచూ, ఆమె చెప్పు ప్రతీ మాటను గమనించుచూ, మా సహోదరికి దయచేయండి. అది రాజ్యము నిమిత్తమైయున్నది. యేసు నామములో, నీవు దానిని ఆమెకు అనుగ్రహించెదవని నేను ప్రార్ధించుచున్నాను. ఆమేన్.

[ఒక సహోదరి బ్రెన్‌హామ్‌ సహోదరునితో మాట్లాడుచున్నది—సంపా.]…?…

279 ప్రభువా, నీ సేవకునిగా, ఆ తల్లి తన బిడ్డ కొరకు ఏడ్చుటను వినుచుండగా, దీనిని చేసిన ఆ అపవాదిని నేను ఖండించుచున్నాను.

280 మరియు విశ్వాసము గూర్చి ఆ స్త్రీ యొక్క ఒప్పుకోలుపై, నేను ఈ దయ్యమును తరిమివేయుచున్నాను. నీవు ఈ బిడ్డకు వైకల్యం కలుగజేయలేవు. యేసు నామములో స్వస్థత పొందుము. ఆమేన్.

సహోదరీ, ఆమె ఇప్పుడే స్వస్థత పొందుచున్నది. అసలు రవ్వంతైనా, దానిని సందేహించవద్దు. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. అది మీ బిడ్డనా? అతడు పరిశుద్ధాత్మను పొందుకొనును గాక!

281 మీరు ఆ బిడ్డను ఎక్కడికైనా తీసుకెళ్ళి మరియు కేవలం కొద్ది నిమిషములు దానిని వినండి. ఆ బిడ్డకు ఏదో జరిగినదని నేను నమ్ముచున్నాను. మీరు దానిని పొందుకుంటారు. మీరు దానిని నమ్ముచున్నారా?

282 యేసుక్రీస్తు నామములో మన సహోదరుడు తన స్వస్థతను పొందుకొనును గాక.

283 ప్రభువా, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క శక్తి అతని శరీరం యొక్క బాధను గద్దించి, మరియు అతణ్ణి పరిశుద్ధాత్మతో నింపును గాక. ఇదే ఆ ఘడియ మరియు సమయము. యేసుక్రీస్తు నామములో, నేను దానిని అతనికి ఇచ్చుచున్నాను. ఆమేన్.

284 షుగరు వ్యాధి పోయినది. నీవు పరిశుద్ధాత్మను పొందావు. నీవు ఎంతకాలంగా బాధించబడియున్నావు…?…నీ జీవితమంతా. క్రీస్తు నిన్ను బాగుచేసి మరియు ఈ బాధ నుండి విడిపిస్తాడని; నిన్ను మామూలుగా చేస్తాడని నీవు నమ్ముచున్నావా?

285 నీ బిడ్డనా? నీ—నీ పాదం. నీవు ఒంటరిగా వచ్చావా? నేను కలిగియున్నయెడల, ఒకవేళ—నేను నాలోనే ఆ బలమును కలిగియున్నయెడల, చూడండి! అయితే దాని కొరకు విశ్వాసమును కలిగియుండుటకు దేవుడు నాకు సహాయం చేస్తాడని నేను నమ్ముచున్నాను. నా శక్తి మేరకు నేను ప్రతిదానిని చేస్తాను. నీవు నన్ను నమ్ముచున్నావా? ఆ ఉడుతలను గూర్చిన ఆ కథను నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? ఈ ఉదయము, దేవుడు నీ శరీరమును స్వస్ధపరచగలడనియు, మరియు నీవు మొదటిసారి నడవవలసిన రీతిగానే, నీవు మరలా నడవడం సాధ్యమని నీవు నమ్ముచున్నావా? సరిగ్గా అక్కడ నీ పుట్టుకలో ఏదో జరిగినది, అక్కడ ఏదో కొద్దిగా దేనికో అంతరాయము కలిగించినది మరియు నీవు సరిగ్గా ఎదగలేదు. ఒక అవయవముపై మరొక అవయవము ఎదుగుచున్నట్లే, అది దానిని క్రిందకు పట్టి ఉంచినది. మంచిది, ఆ అవయవము నుండి ఆ అవయవము రాగలిగితే, అప్పుడు అది నిఠారుగా చేయబడి మరియు సరిగ్గా అవుతుంది. చూశారా? అది నిజమేనా? అదొక శాపమైయున్నది. అదొక శాపము. ఆ శాపం నిన్ను విడిచిపెట్టగలిగితే, అప్పుడు నీవు బాగవుతావు. చూశావా?

286 ప్రభువా, ఇది నా బిడ్డ అయినయెడల ఏమిటి, ఇది నా సహోదరుడు అయినయెడల ఏమిటి, అని నేను ఆలోచిస్తున్నాను? విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తు నామములో, నేను ఆ శాపాన్ని తొలగిస్తున్నాను. ఆమేన్.

287 ప్రభువా, నేను అతనిపై నా చేతులు ఉంచి, యేసుక్రీస్తు నామములో అతని స్వస్థత కొరకు వేడుకొనుచున్నాను. ఆమేన్.

288 తండ్రివైన దేవా, యేసుక్రీస్తు నామములో, బాధపడుచున్న ఈ స్త్రీపై తన స్వస్థత కొరకు నేను చేతులు ఉంచుచున్నాను. ఆమేన్.

సహోదరి నాష్, కొన్ని సంవత్సరాల క్రితం, దేవుడు నిన్ను క్యాన్సర్ నుండి రక్షించాడు.

289 ప్రభువా, సహోదరి నాష్‌కు ఆమె విన్నపమును దయచేయుము. నీ సేవకునిగా, నేను దానిని అడుగుచున్నాను. అది జరుగును. సహోదరి నాష్, అదే జవాబైయున్నది.

యేసుక్రీస్తు నామములో, మా సహోదరికి ఆమె విన్నపమును దయచేయుము. ఆమేన్.

290 [సహోదరుడు బ్రెన్‌హామ్‌ గారితో ఒక సహోదరుడు మరియు ఒక సహోదరి మాట్లాడుచున్నారు—సంపా.] సహోదరుడా, నీకు ధన్యవాదాలు, మరియు అక్కడున్న నీ జనుల వద్దకు తిరిగి వెళ్ళుము. దేవుడు దానిని అనుగ్రహించును గాక. ఎంతో అద్భుతమైన ఒక సమయము, నేను అక్కడ ఉన్నప్పుడు నీ ప్రజలు చుట్టూ ర్యాలీ చేశారు. మేము అక్కడ ఉన్నప్పుడు నీవు బొంబాయిలో ఉన్నావా? సరే, అట్లయిన నేను…నీవు విన్న ఈ విషయాలను నీవు నమ్ముచున్నావా?

291 ప్రభువా, సముద్రము ఆవలిన ఉన్న తన ప్రజల వద్దకు అతడు తిరిగి వెళ్ళుచుండగా, అతడు దేవుని యొక్క శక్తితో నింపబడి, తాను అడుగుచున్న ప్రతి విన్నపములో స్వస్ధత పొందుకొని అతడు వెళ్ళును గాక. అతడు వెళ్ళి, మరియు యేసుక్రీస్తు నామములో దానిని పొందుకొనును గాక. ఆమేన్.

292 దేవుని కుమారుడైన, యేసుక్రీస్తు నామములో, మా సహోదరి తన మనవిని పొందుకొనును గాక.

293 ప్రభువా, మా సహోదరి యొక్క విన్నపమును అనుగ్రహించుము. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం ద్వారా, ఆమె సమస్య ఇప్పుడే ఆగిపోవును గాక. ఆమేన్. సహోదరి, ఆలాగు జరగవలసియున్నది, జరగవలసియున్నది అంతే!

294 [ఒక సహోదరి బ్రెన్‌హామ్‌ సహోదరునితో మాట్లాడుచున్నది—సంపా.] ఇది సువార్తలో పునరావృతం అవ్వాలని నీవు కోరుచున్నావా? [“అవును.”]

295 ప్రభువైన దేవా, ఏ స్వార్థపూరితమైన ఉద్దేశాలతో కాక, ఈ యవనస్త్రీ ఇక్కడ నిలబడియున్నది. ఆమె తన సహోదరుని కొరకు ప్రార్ధించుచున్నది, అతని రక్తంలో వ్యాధికారక క్రిములు ఉన్నాయి. నేను ఆమెకు తన విన్నపమును ఇచ్చుచున్నాను. ఒక దూతవలన నాకు ఇవ్వబడిన ఆజ్ఞ ద్వారా; మరియు కొన్ని వారాల క్రితం, నా గదిలో, యేసుక్రీస్తును గూర్చిన దర్శనము ద్వారా; నేను ఈ అమ్మాయికి తన మనవిని ఇచ్చుచున్నాను. ఆమేన్.

296 అది జరగవలసియున్నది. నీవు ఇక్కడికి సమీపంలో నివసిస్తావా? [ఆ సహోదరి ఇట్లు చెప్పుచున్నది, “మెంఫిస్, టేనస్సీ.”—సంపా.] మెంఫిస్, టేనస్సీ. నాకు ఒక ఉత్తరమును వ్రాయుము. నీవు—నీవు—నీవు నీ మనవిని పొందుకుంటావు.

297 సహోదరుడా గ్రిమ్స్లీ. [సహోదరుడు బ్రెన్‌హామ్ గారితో ఆ సోదరుడు మాట్లాడుచున్నాడు—సంపా.] సహోదరుడా గ్రిమ్స్లీ, దేవుడు నిన్ను దీవించును గాక.

298 ప్రభువా, ఈ సహోదరుడు ఎంత దూరం వచ్చాడన్నది, మరియు అతడు ఏ గుంట నుండి త్రవ్వబడ్డాడన్నది మేము జ్ఞాపకము చేసుకోగలము. అతడు నీ ఆత్మను మరింత ఎక్కువగా కోరుకొనున్నాడు, ప్రభువా. దీనిని నేను యేసుక్రీస్తు నామములో అతనికి ఇచ్చుచున్నాను. అతడు నిన్ను వెంబడించడానికి ప్రయత్నించినట్టి, తన వెనుకటి కార్యములను చూచుట ద్వారా, పిదప, యేసుక్రీస్తు ద్వారా నాకు ఇవ్వబడి, ఒక దూత మరియు ఒక దర్శనము ద్వారా ధృవీకరించబడిన ఒక—ఒక ఆజ్ఞ యొక్క శక్తి ద్వారా, నేను సహోదరుడు గ్రిమ్స్లీకి అతని కోరికను ఇచ్చుచున్నాను. అతడిని విశ్వాసంతో పూర్తిగా నింపుము, మరియు అతడు ఒక సమీపమైన నడకను కలిగియుంటాడు.

299 “దేవుని రాజ్యము నిమిత్తం, వెళ్ళి బాగవుము,” అని నేను నీతో చెప్పినయెడల ఏమిటి? ఆ ఉడుతల గూర్చి మరియు వాటిని గూర్చి నేను చెప్పినది, అది సత్యమని మీరు నమ్ముచున్నారా? అప్పుడు, నేను ఈ “పర్వతము” తో ఏమి చెప్తానో దానిని ఆయన, ఆయన నాకు అనుగ్రహిస్తాడు…?…ఇక మీకు మరొకటి ఉండదు. మీకు మరొకటి ఉండదు. ఇక మీదట వ్యాధి ఉండనే ఉండదు, మీరు ఇద్దరూ బాగవుదురు.

300 ఆమె అడుగుచున్న ఈ మనవిని, నేను ఆమెకు, యేసుక్రీస్తు నామములో ఇచ్చుచున్నాను. ఆమేన్.

301 తండ్రివైన దేవా, యేసుక్రీస్తు నామములో, మా ఈ సహోదరికి, తన మనవిని అనుగ్రహించండి. ఆమేన్.

సరే, సహోదరీ, వెళ్ళి, దానిని నమ్ముము.

302 తండ్రీ, ఈ స్త్రీ వెళ్ళుచుండగా, నీవు ఆమెకు తన విన్నపమును అనుగ్రహిస్తావని, యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.

303 యేసుక్రీస్తు నామములో, నేను ఈ స్త్రీకి తన విన్నపమును ఇచ్చుచున్నాను. ఆమేన్. దానిని సందేహించకుము.

304 [బ్రెన్‌హామ్‌ సహోదరునితో ఒక సహోదరి మాట్లాడుచున్నది—సంపా.] నీవు దానిని పొందుకొనబోవుచున్నావని నీవు నమ్ముచున్నావా? [“అవును.”] అలాగైతే నేను నీ విన్నపమును నీకు ఇచ్చుచున్నాను, యేసుక్రీస్తుయొక్క ఒక ఆజ్ఞ వలన నాకు అనుగ్రహించబడిన శక్తి ద్వారా, మరియు సాక్ష్యము…?…వెళ్ళుము, మరియు—మరియు దేవుడు నీతో ఉంటాడు.

305 సహోదరుడా ఫ్రెడ్, నీ హృదయంలో ఏమున్నది? [బ్రెన్హామ్ సహోదరునితో సహోదరుడు సాత్‌మన్ మాట్లాడుచున్నాడు—సంపా.] సోదరుడా ఫ్రెడ్డీ సాత్‌మాన్, నీ శరీరంలోని ఆ విషాన్ని నేను ఖండించుచున్నాను. యేసుక్రీస్తు నామములో అది నిన్ను విడిచిపెట్టును గాక. ఆమేన్.

306 సహోదరుడా కాలిన్స్. [సహోదరుడు కాల్లిన్స్ బ్రెన్‌హామ్‌ సహోదరునితో మాట్లాడుచున్నాడు—సంపా.]

307 ప్రభువా, ఈ ప్రశస్త సహోదరుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు వెదకుచున్నాడు. ప్రభువా, నాలో ఉన్నదానంతటితో, నా సహోదరుడు కాలిన్స్‌పై నేను ఈ ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాను. దీనిని అనుగ్రహించుము. పరిశుద్ధాత్మ అతనిపైకి వచ్చునుగాక, అతడు పరిశుద్ధాత్మతో నింపబడును గాక! ఆమేన్.

308 సహోదరుడా కాలిన్స్, నీవు దానిని స్వీకరించవలసియున్నది, అది రావలసియున్నది అంతే. దేవుడు కేవలం మనలను పరీక్షిస్తాడు.

309 ప్రభువా, అతని మనవిని అనుగ్రహించుము. అతడు, మరియు అతని కుటుంబము, వారి హృదయమంతటితో నిన్ను సేవించుదురు గాక.

310 దేవా, మా సహోదరికి తన విన్నపమును అనుగ్రహించుము. తాను అడిగినదంతయూ, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆమె పొందుకొనును గాక. ఆమేన్.

311 ప్రభువా, అతని సంఘానికి అతడు సహాయం చేయడానికి ఈ సహోదరునికి శక్తిని ఇవ్వుము. ఇది అనుగ్రహించబడును గాక. యేసుక్రీస్తు ద్వారా, నేను అతనికి ఈ శక్తిని ఇచ్చుచున్నాను. ఆమేన్.

312 [బ్రెన్‌హామ్‌ సహోదరునితో ఒక సహోదరి మాట్లాడుచున్నది—సంపా.] సహోదరీ, నీవు కలిగియున్న నరాల ఉద్రిక్తత, అది చాలా భయంకరమైనది. నేను నీకు చెప్పేది నిజమని నీవు నమ్ముచున్నావా? [“అవును, నేను నమ్ముచున్నాను.”] నేను—నేను నీతో నిజమే చెప్పానని, నీవు దానిని ఇప్పుడు నమ్ముచున్నావా? [“అవును.”] అలాగైతే నేను యేసుక్రీస్తు నామము ద్వారా, నీ స్వస్థతను నీకు ఇచ్చుచున్నాను. నేను ఈ వేదిక మీద నిలబడినంత ఖచ్చితంగా, నీ నరాల ఉద్రిక్తత నిన్ను విడిచిపెట్టినది.

313 [ఒక సహోదరుడు బ్రెన్‌హామ్‌ సహోదరునితో మాట్లాడుచున్నాడు—సంపా.]…?…అది నీ చుట్టూ, నిలబడియున్నది.

314 ప్రభువైన దేవా, ఇక్కడున్న నా ప్రశస్తమైన చిన్న సహోదరుడికి, అతని ఆత్మ యొక్క అంతరంగము కరడు కరడుని పిలచుచున్నట్లు పిలచుచున్నది. అతనికి పరిశుద్ధాత్మ కావలెను. ప్రభువా, అతడు అన్ని విధానములలో, నీ కూటమును గౌరవించాడు. పరిశుద్ధాత్మయొక్క శక్తి ద్వారా, అది నా సహోదరునిపైకి వచ్చునుగాక, అతడు దేవుని యొక్క శక్తి మరియు కృప, మరియు పరిశుద్ధాత్మతో నింపబడును గాక. అతణ్ణి నేను అప్పగిస్తుండగా, అతణ్ణి స్వీకరించుము… 

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...