నేనెరుగుదును

నేనెరుగుదును

VGR COUNT-110 మరియొక గొప్ప ఈస్టరు సమయమును చూచుటకు యిక్కడ ఈ ఉదయము యుండినందులకు, భూమి మీద మనము సజీవులమైయున్నందుకు, నిజముగా మనము ధన్యులగు ప్రజలమైయున్నాము. ఈస్టరు ఎల్లప్పుడు కూడా మన౦దరికిని మహిమకరమైన సంగతిని, నూతనమైన నిరీక్షణను తీసుకొనివస్తుంది. మరియు ఎంత ఘనమైనది!

ఈ ఉదయం వెనుకనున్న గదిలోకి నేను నడుస్తూయుంటిని. ఒకరు నన్ను కలసికొని యిలాగు చెప్పాడు, “సహోదరుడా, బ్రన్హం! గత సంవత్సరం చటాక్వా అను ప్రదేశములో (Chatauqua) ఒక చిన్న పిల్లవాడు లేక చిన్న బిడ్డ కొరకు ప్రార్ధి౦చియుంటివి, నీకు తెలుసా? తనకు గుండె తీసివేయవలసియుండెను, కవాటాలు లేక మరేదో సరిచేయవలసి యుండెను.” చెప్పెను అయితే, ఆ బిడ్డ స్వస్థపరచబడి ఈ ఉదయం భవనంలో ఉన్నాడు.“ కాబట్టి, అది మంచిదే, మరి యొక ఇంకో కూటమును మనం ప్రారంభించక ముందు మనకొక చిన్న సాక్ష్యమున్నది. మరి మనమెంతో ఆనందభరితులమైన ప్రజలము..

2

ఇపుడు, నేను సహోరరుడు నెవిల్ ను, ఇంతవరకు పునరుత్థానమును గూర్చిన మత్తయి లేక లూకా యొక్క లేఖన భాగమును, నీవు చదవనట్లయితే. నీవు చదివావ సహోదరుడా? అయితే, మనము ప్రార్ధన కొరకు సిద్ధపడుచుండగా....

ఈ కూడిక అనుసరిస్తూనే స్వస్థత కూడిక యుంటుంది. ఈ కూడిక తరువాత తదుపరి మీ ప్రాతఃకాల ఫలహారానికి మీరు వెళ్ళండి. అటు తరువాత మనము తొమ్మిది ముప్పయ్కి తిరిగి వచ్చి మరొక కూడికను ప్రారంభించుకుందాం. అటు పిదప స్వస్థత కూడిక దానిని అనుసరించియుంటుంది, తరువాత బాప్తీస్మముల కూడిక దాని తరువాత ఉంటుంది.

3

ఆ బాప్తీస్మము కొరకు ఎంతటి మనోహర సమయమో! ఓ, మై! పునరుత్థానము. ఆ కారణము చేతనే మనము బాప్తీస్మము పొందియున్నాము, ఎందుకనగా ఆయన తిరిగి లేచాడు.

ఇప్పుడు, బాప్తీస్మపు తొట్టి మనకు యిక్కడ యుండక ముందు నాకు జ్ఞాపకమున్నది, యిక్కడి నది యొద్దకు వారిని తీసుకొనివెళ్ళుచుండెడివాడను. ప్రాతఃకాల వేళలో చల్లని గడ్డ కట్టిన మంచు వలెనున్న ఉదయం, నదిలో వారికి బాప్తిస్మము యిచ్చువాడను. దానిని గూర్చిన ఒక ప్రత్యేకతయున్నది. అది కేవలం పవిత్ర సమయం ఈస్టరు, అది యొక గొప్ప సమయం.

ఇక్కడే కూర్చొనియున్న సహోదరుడు పాట్ టైలర్ కొరకు నేనెదురుచూస్తున్నాను. గత రాత్రి నేనొకరితో మాట్లాడుచున్నాను, అది ఒక్లాహోమాలో మా యొక్క చివరి కూటము, నేనిది ప్రయత్నించుటకై (నేను దీనిని ప్రకటన చేస్తాను) దేవుడు నన్ను పిలచువరకు ప్రక్కకు పెట్టి నేను ప్రయత్నించాను. ఆత్మ వివేచనను గూర్చిన నా పాత పరిచర్య ఎందుకనగా, నేను అనుకుంటున్నాను ప్రారంభంలో.... క్రొత్త పరిచర్య లోనికి వచ్చుచున్నది అని.

అందును గూర్చి ఎవరికి ఏమి తెలియదు. గడచిన రాత్రి వేదికనొద్దకు ఒక చిన్న బిడ్డ వచ్చుచుండుట నేను పరీక్షించాను. అది పుట్టుకతోనే గ్రుడ్డిదై పుట్టిన బిడ్డ సంపూర్తిగా గ్రుడ్డివాడు. షుమారు పదహారు సంవత్సరాల బాలుడు. వెంటనే పెద్దగా అరుసూ “సహోదరుడా బ్రన్హం! నేను చూస్తున్నాను.” అక్కడే ప్రక్కగా సహోదరుడు పాట్ టైలర్, దగ్గరగా నిలబడియున్నాడు. అతని యొక్క జీవిత కాలమంతటిలో మొట్టమొదటగా తన కళ్ళు తెరచినపుడు అతని ప్రక్కగా నిలబడ్డాడు, కాబట్టి నాతో నీవు కూడా అత్యాసక్తితో ఎదురు చూస్తున్నావని అనుకుంటాను. దేవుడు మనకై ఒకటి చేయాలని మనమేమైయున్నామో ఆ స్థానానికి పైన మరియొక స్థానమునకు మనలను తీసుకొనిరావాలని ఒక దానికొరకు నేనెదురు చూస్తున్నాను. ప్రార్ధన కొరకు మనమిపుడు తలలు పంచుదాం.

4

కృపగల మా పరలోకపు తండ్రీ, రహదారి ప్రక్కగా యిక్కడ ఈ చిన్న ఆలయంలో ఈ ఉదయం మేము కూడుకొని యుండుటనుబట్టి, నీకు ఎంతో కృతజ్ఞులమై యున్నాము, దీని నంతటి కొరకై, ఇది మా కోరకైన ధన్యత, మరియు ప్రత్యేకించి ఈ ఈస్టరు ఉదయము కొరకై కృతజ్ఞులము. ఒక ఈస్టరు అనునది లేనట్లయితే, ఈ రోజున్న స్థితిలో మేము యుండెడివారము కాదు. అదే, ఈస్టరే, దేవుని వాగ్దానములన్నిటిని ముద్రించియున్నది. మా కొరకై అదే నిర్ధారణ చేసినది. అన్ని కాలాలలో ఆయన చేసిన ప్రతియొక్క వాగ్దానమును ఈస్టరు (రోజున) అదంతా కూడా వాస్తవమని తెలియజేసినది. సంవత్సరమంతటిలో మాకున్నటువంటి ఘనమైన ఒక పండుగ ఇది.

ఎవరైతే ఈస్టరు తరువాత వచ్చి యున్నారో, మమ్ములను ఆదరించుటకు, మహాబలమైన కొలమానిగా మా విశ్వాసమును పునరుద్ధరణ చేసి, యేసు మాకై నియమించిన జీవిత త్రోవలో మేము నడచులాగున మా హృదయాలపైకి ఎవరు వచ్చియున్నారో, అ పరిశుద్ధాత్మకై మేము కూడుకొని ఎదురుతెన్నులు చూచుచుండగా ప్రభువా! మా హృదములను ఆదరించుమని ఈ దినాన మేము అడుగుచున్నాము.

5

ప్రతివ్యక్తి కొరకు, ప్రతి ఒక్కొక్కరి కొరకు మేము ప్రార్ధిస్తున్నాము, మరియు ప్రత్యేకించి ఎవరైతే ఆపుచేయబడ్డారో, ఎక్కడైనా కానీ, ఈ దినమందు కూటమునకు రాలేకపోయారో వారికై ప్రార్ధిస్తున్నాము. దేవా! వారితో ఉండుము. మరియు ఈ ఈస్టరు వారికొక నిజమైన ఈస్టరుగా యుండును గాక. పడకలో నుండి లేపబడి, జీవితంలో ఏనాడు ఎరుగనటువంటి నూతనమైన ఆరోగ్యమును కలిగిన ఈస్టరుగా ఉండును గాక. ప్రభువా! అనుగ్రహింపుము.

ఈ దినాన ఎవరైతే ఈ గొప్ప ప్రపంచంలోనున్న జ్ఞాపక చిహ్నంగాయుండే దీనిని ఆచరించుచున్నారో, అలాంటి ప్రపంచంలో ఉన్న నీ యొక్క ప్రతి సేవకుడు ప్రతి బోధకుడు అభిషేకముతో, బలముతో, మరియు శక్తిని కలిగినవారై వారి కుడికలలో ఎదురుచూచు గొర్రెలను, దేవుడే తన ప్రజలకై భద్రపరచిన ఆహారం యొద్దకు వారిని తెచ్చుదురు గాక. ప్రభువా, దయచేయండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో విధేయతతో మా భాగమునకై మేము కనిపెడుచున్నాము. ఆమేన్.

6

పునరుత్థానము యొక్క లేఖనము చదువుటకు సహోదరుడు నెవిల్కు నేను ఇవ్వబోవుచున్నాను. మత్తయి 28:

విశ్రాంతి దినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి.ఇదిగో, ప్రభువుదూత పరలోకము నుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను, అప్పుడు మహా భూకంపము కలిగెను.ఆ దూత స్వరూపము మొరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను.అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారివలె నుండిరి.దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి.ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయ లోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిననెను.వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా.యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పటుకొని ఆయనకు మొక్కగా.యేసు-భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను.వారు వెళ్ళుచుండగా కావలివారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పిరి.కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొనిపోయిరని మీరు చెప్పడి.ఇది అధిపతి చెవిని బడిన యెడల మేమతని సమ్మతిపరచి మీకేమియు తొందర కలుగకుండ చేతుమని చెప్పిరి.అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదయలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైయున్నది.పదునొకండు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి.వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని, కొందరు సందేహించిరి.అయితే యేసు వారియొద్దకు వచ్చి, పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని, యొక్కయు పరిశుద్దాత్మ యొక్కయు, నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు:నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారిక బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఆమేన్.

[టేపు మీద - ఖాళీగానున్నది] చదివిన ఆయన వాక్యమునకు ఆయన ఆశీర్వాదములు తోడవును గాక.

7

ఇపుడు, మరలా ప్రకటన చేయుచున్నాము ఈ ఉదయకాల కూటము ముగిసిన వెంటనే, ఉదయము కొరకు కూటములు యదావిధిగా తొమ్మిది-ముప్పయ్కి కొనసాగించబడును. తరువాత దీనిని సూర్యోదయపు ఆరాధన అని పిలుద్దాం. మరియు జరిగిపోయిన కూటములను గూర్చి ఒక గొప్ప వివరణ మా యొద్దనున్నది. మీలో ప్రతి యొక్కరు వ్యాధి బాధలతోనున్నవారు, ఈ ఉదయం విశ్వాసముతోను, ఈ పునరుత్థానుడైన యేసు ఈ దినాన సజీవుడుగా ఉన్నాడను నమ్మికతోను, అన్ని కాలాలలో ఏలాగున్నాడో ఆయన అలాగేయున్నాడు, కొంచెము కూడా మారలేదు అను విశ్వాసముతో రావలయునని మేము కోరుచున్నాము.

8

యోబు 19వ అధ్యాయం, 15వ వచనము ప్రారంభముతోనున్న కొంత లేఖనము ఇక్కడ నేను చదవాలని ఆశిస్తున్నాను.

నా యింటి దాసదాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశనై యున్నాను.నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండనున్నాడు. నేను వాని బ్రతిమాలవలసి వచ్చెను.నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము.చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు, నేను లేచుట చూచిన యెడల బాలురు నా మీద దూషణలు పలికెదరు.నా ప్రాణ స్నేహితులందరికి నేనసహ్యడనైతిని, నేను ప్రేమించినవారు నా మీద తిరుగబడియున్నారు.నా యెముకలు నా చర్మముతోను, నా మాంసముతోను అంటుకొనియున్నవి. దంతముల ఆస్తి చర్మము మాత్రము నాకు మిగిలింపబడియున్నది. దేవుని హస్తము నన్ను మొత్తియున్నది.నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి.నా శరీరమాంసము పోవుట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు?నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను.అవి ఇనుప పోగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను.అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును.ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరములో నేను దేవుని చూచెదను. నా మటుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను.

ఈ యోబు 19లో అగుపిస్తున్న దీనిలో “నేనెరుగుదును” అను ఒక పాఠమును తీసుకొన ఆశిస్తున్నాను.

9

ఈ దినమున మనం ఏలాగున్నామో, ఆ విధముగనే మూల పురుషుడగు ఇతడు ఆ సమయంలో ఉన్నాడు, బహు భీభత్సమైన శ్రమలలో అతడుండియుండెను. దానిని మనం “సముద్రపు ఆటు-పోటు,” అని అనగలం మరియు అతడు నిరాశలో పడిపోయాడు. అనేక దినాలు బూడిద దిబ్బపై కూర్చొని తనను ఆదరించబడు మాటలు కనుగొనుటకై ప్రయత్నించాడు. అతడు ప్రాణం అతనిలో నుండి ఆరిపోవుట చూచి అతనికి ధైర్యము నిచ్చు ఒకదానిని, తనకు ఓదార్పునిచ్చు యొక దానిని కనుగొనుటకు ప్రయత్నించాడు.

మొదటి స్థితియందు, అతడు ఒక వృదుడైన మనుష్యుడు. బహుశా తొంభై సంవత్సరములవాడు. దేవుని హస్తము వలన అతడు మొత్తబడెను. దేవుడు, ఆయన హస్తము వలన అతనిని ముత్తలేదని మనకు తెలుసు. కానీ, అతనిని ముట్టుటకు సాతానుకు దేవుడు అనుమతించాడు. కార్యములు చేయుటకై దేవునికి కార్యకర్తలున్నారు. కీడు చేయువాడు దేవునికి కావలసియుండెను. అది చేయుటకు ఆయన సాతానును విడిచిపెట్టాడు. మరియు ఆయన మంచి చేయాలనుకుంటే అది చేయుటకు ఆయనకు ఆయన సేవకులున్నారు.

10

అతనిని శోధించుటకొరకై ఒక ఉద్దేశ్యము కొరకై సాతాను అతనిని ముట్టినది, ఎందుచేతననగా దేవునీతో అతడు ఒక వాదము (వాగ్వాదము), పెట్టుకున్నారు, “భూమి మీద నాకొక సేవకుడున్నాడు. అతనివంటివారు ఎవ్వరు లేరు, నేనతనికి ఏమి చెప్తానో, దానినతడు చేస్తాడు. అతడు యదార్థవంతుడు, నీతిమంతుడు,” అని దేవుడు సాతానుతో చెప్పాడు.

“నీవు అతనిని నాకు అప్పజెప్పితివా, అతడు నీ యెదుటనే నిన్ను దూషించునట్లుగా చేయుదును,” అని సాతాను అన్నాడు.

యోబుకు, యివన్ని జరుగబోవుచున్నవని ఎరుగకనేయుండెను, అది బహు ఘోరమైన హీన స్థితిలోకి మూల పురుషుని తెచ్చెను. అయినప్పటికి, ఏ విధముగానైనా అవన్ని అతని నుండి గతించిపోయిన తరువాత క్రీస్తులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. “నా విమోచకుడు సజీవుడని నేనెరుగియున్నానని,” అతడు చెప్పెను.

11

ఇప్పుడు, మనము ఆలాటి స్థానానికి వస్తాము. మనమందరము వచ్చెదము. అటువంటి ఉద్దేశ్యము గల ఒక దానికొరకు ఈ దినాన మనమిక్కడే కూడుకొని యున్నామని నేను నమ్ముచున్నాను. మనమందరము కూడా బూడిద దిబ్బల మీద కూర్చున్నాము. మనకు మనయొక్క యిబ్బందులు మరియు ఆటు పోట్లు, మన యొక్క విషాద క్షణాలు, మన వ్యాధులు, మన గుండె జబ్బులు మరియు మన నిరాశ నిస్పృహలు మనకున్నవి. యోబు ఏ విధముగా తనయొక్క స్నేహితుల నుండి ఆదరణ మాటలు పొందవలెనని కోరియున్నాడో, ఈ ఉదయమున, ఈ ఈస్టరు ఉదయమున ఈ విధంగా మనం వచ్చియున్నాము.

వారిలో ఏ ఒక్కరు ఏ విధమైన ఆదరణ యివ్వలేకపోయారు. అతని యొక్క శ్రమను బట్టి, అతడొక రహస్య పాపియని నేరారోపణ చేశారు. ఆ తరువాత ఆ యొక్క యిబ్బందుల మధ్య దేవుడు అతని యొక్క సహాయకుడుగా వచ్చాడు.

12

యోబు ప్రశ్నించబడ్డాడు. అతడెరిగినట్లుగా, అతని యొక్క వ్యాధి, అతని కురుపులు మరియు శ్రమలు, తన యొక్క కుటుంబమును, తన యొక్క ఐశ్వర్యమంతయును పోగొట్టుకొనుట వలన కలిగిన హృదయవేదన, చివరకు తన ప్రాణం పోయే స్థితులో మాత్రమే కాక, అతడు బాగా ఏళ్ళు గడచిన వృద్దుడైయుండెను. మరియు సమాధికి సమీపించిన స్థితియందున్నవాడని ఎరిగియుండెను, భూమిపైకి ఒకరు తనను తెచ్చియున్నారని తనంతట తానే రాలేదని నమ్మకం కలిగినవాడని ఎరిగియుండెను. మరియు తల్లి, తండ్రి వలన అతడు వచ్చాడని అతనికి తెలుసు, అయితే అయినను ఆ తండ్రిని, తల్లిని తెచ్చుటకు ఒకరు వారికి యుండవలసినదని అతడు ఎరిగియుండెను. మొదటి వానిని ఎవరు తీసుకొని వచ్చారు. అది చుట్టూ తిరిగి అసలైన దాని యొద్దకు వస్తుంది.

13

అటు తరువాత “ఒక జంతువు కంటే ఔన్నత్యమైన బ్రతుకు బ్రతుకుట, ఒక మొక్క కంటే ఔన్నత్యమైన జీవితం జీవించుట, నేనిక్కడే యుండి ప్రతి క్షణం చేయుట అదొక ఆశ్చర్యకరమైన విషయం,” అని అందుకతడు ఆశ్చర్యపడ్డాడు. అయినప్పటికి అతడిలాగు పలుకుట మనం కనుగొనుచున్నాము. “వృక్షము చనిపోయిన యెడల అది తిరిగి బ్రతుకును, ఒక పువ్వు చనిపోయిన యెడల అది మరలా బ్రతుకును.” అయితే, “నరులు ప్రాణము విడచిన తరువాత, వారి ఆత్మను విడుచుదురు, వారేమైపోవుదురు? అతని కుమారులు వచ్చి అతనిని గౌరవించి, అతనిని గూర్చి అంగలార్పుదురు, అది అతడు గ్రహింపడు.” అతడు ఆలోచించును, పువ్వులకు, వృక్షములకు అవి తిరిగి జీవించుటకు దేవుడు - జీవము నిచ్చాడు. అయితే నరుడు తిరిగి ఎందుకు బ్రతుకుటలేదు? ఇదంతా అతనికి దుఃఖము కలుగజేసినది.

14

ఈ ఉదయం ఈ నిశ్చయింపబడిన అభిప్రాయము నుండి మనం గ్రహించగలిగినట్లయితే ఎంతమంచిది, మరియు అందుకొరకే మనం యిక్కడున్నాము... ఈస్టరు కధను మనం మరలా వినియున్నాము, ముందు వెనుకల అది చదివియున్నాము. ఈ రోజు మీ యొక్క రేడియో ప్రచురణలో అది పలు-రకాలైన దైవజనులు సందర్శించుట మీరు వింటారు. అయితే, ఈ ఉదయం నా యొక్క చిన్న గుంపు కొరకు నేనేమని తలంచితినో, ప్రభువు నాకిచ్చిన దానిని నాకు సాధ్యమైన విధముగా మరో విధమైన కోణములో నేను సమీపిస్తాను. ఈ శ్రమలు మనకెందుకు కలుగును? ఇది వచ్చుటకు ఎవరు కారకులు? ఎందుకని ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడు కలవరపడుతుంటాడు? ఎందుకని ఒక క్రైస్తవునికి సమస్తమును అనుకూలముగా యుండవు? అయితే అవి యుండవు, మరి మనకది తెలుసు.

15

మనము పాపులముగా ఒకప్పుడు యున్నదానికంటే మనం క్రైస్తవులముగా అయిన తరువాత కొన్నిసార్లు అనేకమైన యిబ్బందులు మనకు కలుతుంటవి. సందేహము లేదు, ఇలా వ్రాయబడియున్నది, “నీతిమంతునికి కలుగు శ్రమలు అనేకములు అయితే వాటన్నిటిలో నుండి దేవుడు వానిని విడిపించును.” అనేకములైన శ్రమలు, వింతైన అనుభూతులు మరియు మన గ్రాహ్యమునకు అందని వింతైన విషయాలు అని దేవుడు వాగ్దానము చేశాడు. అయితే, అవి ఎల్లప్పుడు కూడా మన యొక్క మేలు కొరకే జరుగును. వెంటనే మనమది అర్థం చేసికోలేము. ఎందుకనగా, మనమది అర్థం చేసికున్నట్లైయితే, అలాగైతే విశ్వాసము మనలో యుండదు, మనమొక ఆలోచనతో కొనసాగిపోతాము. అయితే మనము చేస్తాము. మనమది కలిగియుంటాము. మరియు విశ్వాసముతో ఆయన వాక్యమును నమ్ముతాము. అది మనకై ఒక మంచికార్యము జరగబోతున్నది. ఈ ఉదయం అందును గురించి ఈ దినమున గ్రహించగలిగితే, మనయొక్క అన్ని శ్రమలను గూర్చి మనం ఈ దినమున గ్రహించగలిగితే, మనయొక్క అన్ని శ్రమలను గూర్చి మనం గ్రహించగలిగితే.... (మనలో ఎవ్వరూ వాటినుండి తప్పించుకోలేరు), మరియు ఆ విషయాలన్ని మన మంచికొరకేయని గ్రహించగలిగితే....

16

బైబిల్ గ్రంథములోని, ఒక లేఖన భాగములలలో అది ఈ విధముగా వ్రాయబడినది. “మన పైకి వచ్చు శోధనలు, సువర్ణము కంటే విలువైనవి, ఎందుకనగా యివి దేవుడిచ్చు శ్రమలు.” మనము ఆయన సొత్తు అయిన తరువాత, మన యొక్క ఒప్పుకోలు, మన యొక్క బాప్తిస్మము, మరియు ఆయన కొరకై మన జీవితంలో నడిచెదమును, మన యొక్క వాగ్దానము, అటు తరువాత మన మీదికి వచ్చు ప్రతి యొక్క శ్రమ కూడా ఆయన మహిమ కొరకు మనలను పరిపూర్ణులుగా చేయుటకొరకే, అవి వచ్చును. శ్రమ రాకముందు కంటే, దేవుడు మరెక్కువగా అయనను మనలను కనపరచుకొను స్థానమునకు, అది మనకు తీసికొనివచ్చును.

అది నిజమేనని నేను ఎరుగునట్లుగా నేను చాలా కాలము జీవించాను అని యోబుతో కలసి ఈ ఉదయం చెప్పుటకు మీరు ఏకీభవించవలెనని నేను ఆశపడుచున్నాను. నా యొక్క స్వంత బ్రతుకులో దానిని నేను చూశాను. నేను దాని చుట్టూ వెళ్ళలేనటువంటిదియగు ఒక ఆసాధారణమైన విషమ స్థితి నాకు సంభవించినపుడు, దేవుడు మార్గమును సిద్ధపరచి మహిమకరముగా సాధ్యపరుస్తాడు. ఆయన కృప ఏలాగు చేయగలినదని నేను ఆశ్చర్యపడతాను. అయితే ఆయనే అది చేసినది.

వీటన్నిటిలో జ్ఞాపకముంచుకొనుము! సాతాను మనలను తలక్రిందులు చేయుటకు, భయభీతులు కలిగి౦చుటకు, “ఓ! ఇదెందుకు జరిగినది?” “ఈ విధంగా నేనెందుకు ఉండకూడదు?” అని ఆలోచించునట్లుగా చేస్తుంది.

17

కొద్ది దినముల క్రితం, నా బ్రతుకులో నేనెన్నడు చూడనటువంటి అమితమైన అందమైన, అతి ఆడంబరమైన స్థలములో నుండి నేను వచ్చుచుంటిని. అది మన సహోదరుడగు ఓరల్ రాబర్ట్ యొక్క గొప్ప ఇల్లు కట్టడం. అది మిశ్రితము కాని ఒకే ఒక చలువరాయి కట్టడం ఏ ఒక్కచోట కిటికీలేదు. అయితే అదెలా అమర్చియుండిరో నాకు ఆశ్చర్యం. నేను హాలీవుడ్లో ఉంటిని, రాజ గృహాలలోనూ యుంటిని. సొగసైన, అందమైన స్థలాలు, గృహాలు చూచితిని, అయితే దానితో సమానము చేయుటకు ఏలాటి దానిని ఎటువంటి స్థలమును, ఎక్కడా నేను చూడలేదు. ఏ విధముగా, చిన్న అల్యూమినియం తీగలను లోపల కలిపి అమర్చినది. ఓ! అలాటి అమిత అడంబరమైన దానిని నా జీవితంలో నేనెప్పుడు చూడలేదు. నేనక్కడ నడుస్తున్నప్పుడు, నా చేతులు తీసి గోడలో కట్టిన చతురస్రాకార స్థంభములు రుద్దితిని, గొప్పనైన గ్రానైట్ను రుద్దాను. అవన్ని కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క చెక్కడములు త్రిత్వ రూపములోనున్నవి. దాన్నికూడా ఆ విధముగానేయున్నవి. టామీ అస్ బాన్ యొద్ద నుండి యిప్పుడే నేను వచ్చాను. అక్కడ సహోదరుడు ప్రభువు కొరకు అతనికి గల అతని ఘనమైన గొప్ప పనిని నేను చూశాను.

18

నేను బయట నిలబడ్డాను, అనుభవం వెనుకకు చూశాను, నేను అనుకున్నాను, “దేవా, నేను నిజముగా ఎక్కడో, ఒకచోట నేను వేషధారినైపోయాను. నేనెక్కడో వెలివేయబడిన వాడనై పోయాను. ఎందుకనగా, ఈ మనుష్యులు నా యొద్ద నుండి వెళ్ళినవారు,” అని నేననుకున్నాను. మరియు, నేను అనుకొన్నాను, ఏంటి.... ప్రభువా, ఒక వేళ, నేను అపనమ్మకస్తుడనై యున్నానేమో, ఆ విధముగా నేనుండుటకు నీవు నమ్మలేదేమో. చిట్ట చివరకు నిర్వహించు సభలకు తదితరమైన వాటికి నేను చెల్లించుటకు నీవు అనుమతించు కొద్ది డాలర్లు కూడా, అందుకొరకైన వారు నన్ను కారాగారమునకు పంపుటకు ప్రయత్నించుచున్నారు. నేనెందుకని అటువంటి వేషధారినైపోయాను, లేక ఎందుకని నేను అపనమ్మకస్తుడనగు వ్యక్తినైపోయాను?“ అని తలంచాను. ముసలివాడైన యోబువలె నేను బూడిద దిబ్బ మీద ఉంటిని.

19

నేను గాలి పీల్చలేనంతగా అక్కడ బయట నిలబడియున్నాను, అంతటి అనుహ్యమైన ఔన్నత్యమా? అని అనుకుంటున్నాను. ఒక పెంతెకొస్తు, చెట్టు తొర్రలాంటి సొరంగంలో జన్మెత్తిన పేద బాలుడు, బ్రహ్మండమైన పెద్ద భవనాన్ని కట్టుట.

“ఓ దేవా, బహుశా, నేను యోగ్యుడను కాదేమో,” అని అనుకున్నాను. తటాలున, ఆ చిన్న వసారాల గుండా ఒక చిన్న స్వరము వచ్చి, “నేను నీ యొక్క భాగమును,” అని చెప్పినది.

అప్పుడు నేననుకున్నాను, “ఓ ప్రభువైన దేవా, ఓహో! అది అలాగే యుండనీయ, తరువాత, ప్రభువా, ఎందుకనగా నేను నీ కొరకై అంతటి పెద్ద పనిని భరించుటకు నాకంతటి విజ్ఞత ఉండదు మరియు నేను ఒక పామరుడను; అయితే నీవు, నా భాగమైయున్నంత వరకు నేను నీవాడనైయుంటాను, నీవు నన్ను నడిపించెదవు. నాకై నేను నడిపించుకోలేను, అయితే దేవా, నన్ను నడిపించుము,” అని అనుకున్నాను.

20

అటువంటి విషమ ఘడియలే అటువంటి పవిత్రమైన ఇసుక తిన్నెలలోకి మనలను నడిపించునది. అది బైబిల్ గ్రంధములోనే యున్నది. జ్ఞాపకముంచుకో, విపత్తు ఎంతటి గొప్ప అయినప్పటికి, దేవుడు నీతో ఆయన కార్యము ముగించువరకు సాతాను నీ ప్రాణమును తీసికొనలేదు. దేవుడు అనుమతి౦చే వరకు నీకు ఏది తాకలేదు. దేవుడు దానిని అనుమతిస్తే తప్ప ఏలాటి కీడు రాదు. మరియు అది నీ క్షేమము కొరకే. ఆయన కార్యము చేయుచున్నాడు.

ఆలోచిద్దాం. లోకమును నాశనము చేయుటకు వరదలు వచ్చినప్పుడు, అది నోవాహును నాశనము చేయలేకపోయెను. నోవాహు నాశనము కాలేదు, ఎందుకనగా అతడు చేయుటకై దేవుడతనికి ఒక పని యుంచియున్నాడు.

21

ఒకానొక దినమున, ఘనమైన ఆ దేశములో, భయంకరమైన బానిసత్వంలో కొందరు హెబ్రియుల పిల్లలున్నారు. వారు షడ్రకు, మేషాకు, అబెద్నెగొలని మనకు తెలుసు. వారు తీర్మానము చేయవలసిన ఒక స్థలము, ఒకటి జరుగవలసినది యొకటి వచ్చెను. వారి విశ్వాసము పరీక్షకు పెట్టబడెను.

నీ యొక్క విశ్వాసము పరీక్షకు పెట్టబడినపుడు, అప్పుడు తొణకవద్దు! నీవు నమ్మిన దాని మీదనే నిలబడు.

మరియు, వారి విశ్వాసము పరీక్షకు పెట్టబడినపుడు వారు భీకరమైన ఘడియల్లోకి వెళ్ళిపోయిరి. వారు, బూడిద దిబ్బల మీదికి వెళ్ళిపోవుట మాత్రమే కాదు గాని, వారు అగ్ని గుండాల్లోకి వెళ్ళిపోయిరి. అయితే, సాతాను వారిని నాశనం చేయలేకపోయెను, ఎందుకనగా దేవుని యొక్క ఉద్దేశ్యము యింకా పరిసమాప్తి కాలేదు. కాబట్టి “నా విమోచకుడు సజీవుడను,” ఈ నిరీక్షణతో వారు వెళ్ళియుండవచ్చు. “ఈ యొక్క అగ్ని గుండములలో నుండి దేవుడు మమ్ములను విడిపించుటకు సమర్దుడు, అయినను మేము ప్రతిమకు సాగిలపడము,” అను ఈ నిరీక్షణతో వారుండి యుండిరి.

22

సాతాను వారిని తీసికొనలేకపోయెను. దేవుని యొక్క ఉద్దేశ్యము పరిసమాప్తమగువరకు నోవాహును, అతడు ముంచివేయ లేకపోయెను. దేవుని యొక్క ఉద్దేశ్యము పరిసమాప్తమగు వరకు, అతడు హెబ్రియులను అతడు కాల్చలేకపోయెను. దేవుని యొక్క ఉద్దేశ్యము పరిసమాప్తమగువరకు, పుండ్ల చేత, వేదనల చేత అతడు యోబును చంపలేకపోయెను. అలాగే దేవుని యొక్క ఉద్దేశ్యము పరిసమాప్తియగువరకు దానియేలును సింహములు తినలేకపోయెను. అలాగే దేవుని యొక్క ఉద్దేశ్యము పరిసమాప్తమగువరకు వృద్ధాప్యము గాని, మరణము గాని, అబ్రహామును తీసికొనలేకపోయెను.

అలాగుననే, మనయొక్క జీవితమును గూర్చి దేవుని యొక్క ఉద్దేశ్యం నెరవేరువరకు నిన్ను లేక నన్ను అది తీసికొనలేదు. కాబట్టి ఓదార్పుకై మనము సమకూడి యున్నాము.

23

శ్రమలు శోధనలు వచ్చుటకు దేవుడెందుకు అంగీకరిస్తాడు? నియంత్రణలోకి తెచ్చుకొని వినియోగించుకొను దేవుని శ్రమలు, వాటినోటిలో ముక్కలు పెట్టి ఆయనకు లోబడునటుగా చేయును. మరియు అటువంటి శ్రమలు దేవునితో సమీప సహవాసము చేయునట్లుగా చేయును.

జలప్రళయం రాకుండ వర్షధనస్సు లేదు. అతడున్నటువంటి అట్టి స్థానానికి నోవాహు బలవంతంగా నెట్టివేయబడిన తరువాత, తుఫానులో నలుబది రాత్రింబగళ్ళు తేలాడిన తరువాత, చిన్న ఓడ, నీటిలో పైకి క్రిందకు ఊగులాగుతూ యుండెను. జలప్రళయం అయిపోయిన తరువాతనే, నిరీక్షణ యొక్క నిబంధన మరియు వాగ్దానపు నిబంధనయగు వర్షధనస్సు అతడు మొట్టమొదటిగా చూడగలిగెను. శ్రమలు ద్వారా అతడు వెళ్ళిన తరువాతనే, అతడు వాగ్దానమును చూచెను.

ఆ విధముగనే, నీవు శ్రమలగుండ వెళ్ళిపోయిన తరువాతనే, వాగ్దానమును నీవు చూచెదవు. ఆ పద్యమును లేక గీతమును నేను యిష్టపడతాను. “మిగతావారు బహుమతిని సంపాదించుకొనుటకై పోరాడి, రక్తపు సముద్రముల గుండా పయనించినపుడు, సుఖసౌఖ్యమైన పూల పాన్పు మీద, నేను పరలోకమునకు కొనిపోబడెదనా?”

సమాధాన సౌఖ్యాలు మనమడుగుతాము. మనకివ్వగల శ్రేష్టమైనవి దేవుడు మనకు దయచేస్తాడు, అవి శ్రమలు, బాధలు, సమాధాన సౌఖ్యములకంటే అవి శ్రేష్టమైనవి. మన సుఖము కేవలము నది ఆవల మాత్రమే.

24

హెబ్రియ బాలురు బలవంతముగా మండుచున్న అగ్ని గుండములో వేయబడి, అవి వారి యొక్క అతి భయంకరమైన శ్రమలు వారికి, వాటి తరువాతనే వారు, దేవుని కుమారుని పోలిన ఒకరు వారి మధ్య నిలబడి ఉండుట వారు చూచిరి. వారి యొక్క శ్రమలలో, అగ్ని జ్వాలలో, దేవుని కుమారుడు వారిమధ్య నిలబడి వేడి మంటలను పారద్రోలుట వారి శ్రమలు పుట్టించెను. అయితే, అగ్నిలోకి వారు వెళ్ళు వరకు ఆదరణకర్త అగుపించలేదు.

ఎవరైతే, లోక విషయాల వలన తన్నుతాను అపవిత్రపరచుకొనకూడదని తన హృదయములో అనుకొన్నాడో, ఎవరైతే దేవునికే ప్రార్థన చేస్తానా లేక సింహపు బోనులో త్రోయబడతావా అని నిర్ణయం తీసికొనవలసియుండెనో, అది చేయుటకు బలవంతం చేయబడినవాడు, అతడు దానియేలు. అయితే, అది మంట పెట్టబడిన తరువాత, మరియు అతడు సింహపు బోనులోకి త్రోయబడెను. అటు తరువాత, అతని మధ్యనే నిలబడి, కాపాడుటకై నిలువబడియున్న ప్రభువు దూతను, అతనికి సింహాలకు మధ్య నిలబడియున్న గొప్ప అగ్ని స్తంభమును అతడు చూశాడు. సింహములు అతనిని సమీపించలేకపోయినవి, ఎందుకనగా అతడు శోధనలచేత, బాధలచేత, యిబ్బందులచేత కొనసాగిపోయెను. అట్టి వాటి నుండి, అతని దేవుడు తనను విడిపించుటకు సమర్ధుడని అతడు ఎరిగియుండెను.

25

అతడు అబ్రహాము. భూమి నిస్సారమైనదని, క్షామము వచ్చునని అతడు ఎరిగిన తరువాత మరియు లోతు తనకు తాను వేరైపోయి సారవంతమైన లోకములో తాను నివసించుటకు వెళ్ళిపోయిన తరువాత, తన యొక్క పశువులకు గ్రాసములేదని, తనయొక్క పసుల కాపరుల వలన కలిగిన మొరలు, ఫిర్యాదులు విన్న తరువాత, దేవుడతనితో చెప్పి, అతనికిచ్చి, అతనిని పరదేశిగా యుంచెనని అతడా దేశములలో మనుగడ కొనసాగించెను. అతని యొక్క సహనము సంపూర్తియగు వరకు, అతడు పరీక్షించబడిన తరువాత, ఆ దినమున, ఆ శోధన అయిపోయిన తరువాత, ఆ దినమున సింధూర వృక్షము క్రింద ముఖాముఖిగా ఎలోహిముతో ముఖాముఖిగా అతడు మాట్లాడెను. అది శోధనలచేత బాధించబడిన తర్వాత జరిగినది అతడు పొందిన శ్రమల చేత అతడు కొనసాగించబడిన తరువాత, మానవ రూపమున దేవుడు అతనికి కనబడెను. మరియు అక్కడే కూర్చొని అతడు వివాహితుడని, అతని భార్య పేరు శారాయని వెనక గుడారములో యుండి ఆయన మాటకు ఆమె నవ్వినదని అతనితో చెప్పబడెను. అక్కడే, ఆయనను అబ్రహాము “ఎలోహిము” అని పిలచెను. అది శోధన, శ్రమ తరువాత జరిగినది.

26

పెంతెకోస్తు సంఘము శ్రమలు, శోధనలు జరిగిన తరువాత సంఘము నవ్వులు అపహాస్యాలు పొందిన తరువాత, ఓ! దేవుడు మన మధ్య యుండి గొప్ప సూచక క్రియలు అద్బుతాలు చేయుచున్నాడని తెలిసికొని ఈ దినమున సంఘము తనకుతాను, మేల్కొన్నట్లయితే ఎంత బాగుండును. “దినములోని శ్రమలు బాధలు అయిపోయిన తరువాత అవన్ని జరిగిన తరువాత, తరువాత కడవరకు, మనము యేసును చూచెదము. ఆయన నా కొరకు ఎదురు చూస్తున్నాడు, యేసు ఎంతో మనోహరుడు మరియు సత్యవంతుడు. ఆ దినము గతించిన తరువాత, ఆయన అందమైన సింహాసనం పైకి గృహమునకు ఆయన మనలను ఆహ్వానించును.” పగలుండగనే మనము పనిని చేయుదుము.

27

ఈ ఘనులైన మనుష్యులందరు, అందరిని గూర్చి సంక్షిప్తంగా చెప్పుకొనిపోయిన యెడల, అది ఉదయవేళ మన కూటము సమయమును మరింత తీసికొనును. వారు శ్రమల గుండా వెళ్ళిపోయారు, దేవుని చూశారు. వారు శ్రమల గుండా సాగిపోయారు. దేవదూతలను చూశారు. వారు శ్రమల గుండా సాగిపోయారు ప్రత్యక్షతలు, పొందుకున్నారు. అద్భుతాలు సూచక క్రియలు మొదలైనవి చూశారు. అయితే, ఓ, యోబు చూచినది వారిలో ఎవ్వరూ చూడలేదు.

ఆ అందరు మనుష్యులు దేవదూతలను చూచిన తరువాత, మరియు దేవుని మిగతావన్ని చూచిన తరువాత, సమాధికి ఆవలనున్న ఆ నిరీక్షణలు వారు చూచుటకు యివ్వబడలేదు అయితే యోబు, పునరుత్థానమును చూశాడు. ఈస్టరును అతడు చూశాడు. ప్రతివారి హృదయమును ఓదార్చు విషయాన్ని అతడు చూశాడు. అది చూచిన తరువాత, “ఓ, నా మాటలు గ్రంధములో వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను! అవి ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడవలెనని కోరుచున్నాను, అని అన్నాడు.”

28

దానిని చూస్తున్నారా.... ప్రతిది కూడా అతనికి వ్యతిరేకముగా మారెను. చివరకు అతని యొక్క సేవకులు అతనితో మాట్లాడుట లేదు. అతని యొక్క భార్య అతనికి విడ్డురముగా యున్నది. ఆ గంభీరమైన శ్రమలు వచ్చెను, అతడు అక్కడ బూడిద దిబ్బల మీద కూర్చున్నాడు, సంఘము చివరకు ఏడు దినములు వారి వీపు చూపినది, ఎవ్వరూ అతనిని ఓదార్చలేదు.

“నా విమోచకుడు సజీవుడనియు, కడవరి దినములలో ఆయన భూమి మీద నిలచుననియు, అని అతడు అరచినపుడు. అప్పుడతడు ఈస్టరు దర్శనమును చుసియుండవచ్చును. నేనెరుగుదును. ఓ, నా మాటలు యినుప పోగరుతో బండ మీద చెక్కబడి, అవి నిత్యము నిలచునది, ఎందుకనగా నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును. నేనెరుగుదును! నేనెరుగుదును!”

యోబూ, నీవేమి ఎరిగియున్నావు? “నా విమోచకుడు సజీవుడనని నేనెరుగుదును.” మీరు గమనించారా? ఒకరు సజీవుడుగా అక్కడ యుండుట మాత్రమే కాదు, అయితే అతడు యోబుకు విమోచాకుడు కూడా!

29

ఓ, ప్రభువు నామమునకు స్తుతి కలుగును గాక! నేను ఈస్టరు యొక్క భాగమునైనందుకు, ఆ పునరుత్థానము యొక్క భాగమైనందుకు నేనెంతగానో ఆనందిస్తున్నాను, దానిలో మనము పాలిభాగస్తులమై యున్నాము, ఎందుకనగా ఆ ఈస్టరును తీసికొనివచ్చిన ఆ పునరుత్థానపు జీవము, మనలో నివసించుచున్నది. (అంటే, పాలిభాగస్తులము) “నా విమోచకుని నేనెరుగుదును.” నీవేమి ఎరిగియున్నావు? “అది నేను తలంపుగా అనుకొనుటలేదు. [ఈ రోజు మనకు చాలా చాలా అనుకునేవియున్నవి.] నా విమోచకుడు సజీవుడనని నేనెరుగుదును! ఔనండి.”

ఆయన ఎవరైయుండెను? ఆయన సజీవుడైనట్లయితే, యోబుకు ఆయన విమోచకుడై యుండెను. “నాకు” [వ్యక్తిగతము - నాకు] “నా విమోచకుడు సజీవుడు.”

యోబు! యింకా నీవేమి ఎరిగితివి? ఆ యొక్క దర్శనములో నీవు ఏమి చూచి యుంటివి? “కడవరి దినములలో ఆయన భూమి మీద నిలచును. నా శరీరమును పురుగులు తినివేసినప్పటికీ, నా శరీరముతోనే నేను దేవుని చూచెదను. నాకు నేనే చూచెదను. నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును. భూమి మీద ఆయన కడవరి దినములలో నిలచును. నాలో నా శరీరము చితికిపోయినను, నా శరీరమును పురుగులు తినివేసినను, అయినను నా శరీరముతో నేను దేవుని చూచెదను.”

గంభీరమైన దర్శనము అక్కడ యుండెను.

30

దానియేలు దేవదూతను చూశాడు. హెబ్రియ బాలురు దేవుని కుమారుని చూశారు. నోవాహు వర్షధనస్సు చూశాడు. అబ్రహాము ముఖాముఖిగా దేవుని చూశాడు. అయితే యోబు పునరుర్థానమును చూశాడు. యోబు ముందున్న దానిని చూశాడు. బైబిల్ గ్రంథములోని ఘనమైన భక్తులందరు, పితరులందరు ఆ యొక్క దినము కొరకు ఎదురుచూచిరి. పునరుర్థాన సమయం ఒకటి రాబోతున్నదని వారి యొక్క నిశ్చయతతో, వారి యొక్క దర్శనాలతో, వారి యొక్క ప్రత్యక్షతలతో వారుండిరి.

ఇపుడు ఘనమైన కార్యాలు జరుగుట చూస్తున్నాము. దేవుని గంభీరమైన శక్తులు మనము చూస్తున్నాము. ఆయన చేయగలిగిన గొప్ప సంఘటనలు చూచుచున్నాము. ఆ సూర్యుని చుట్టు యుంచిన ఆ ప్రపంచమును తెచ్చిన దేవుని యొక్క శక్తి కాదని నీవు సూర్యుని వైపు చూడలేవు. ఒక దేవుడున్నాడని నీవు ఎరుగకుండ నీవు ఒక వసంత ఋతువును చూడలేవు. గ్రుడ్డి వారికి స్వస్థత, బదిరులకు వినికిడిని నీవు చూచి, అది దేవుడని నీవు తెలిసికుంటావు. అయితే, మనం చనిపోయిన తరువాత, మనం వెళ్ళిపోయిన తర్వాత అదంతా అక్కడే ఉండినట్లయితే ఏమౌతుంది? అయితే పునరుత్థానము! ఓ, దేవుడు వాగ్దానం చేసిన వాటినన్ని౦టిని ముద్రించినది ఈస్టరు, అది పునరుత్థానము.

31

నీకు పునరుత్థానము కలుగకముందు వారికి ఒక శిలువ యుండవలసియున్నది. పునరుత్థానపు శక్తిని సంఘము చూడకముందు, క్రొత్త పరిచర్యను నేను చూడకముందు, క్రొత్త సహవాసమును దేవునితో నీవు ప్రవేశించకముందు, ఒక పునరుత్థానము కలుగుటకై స్వీయమైన-శిలువ అనుభవం యొకటి యుండవలసియున్నది. మన స్వంత తలంపులలోను, మన స్వంత మార్గములలోను, మన చుట్టూనున్న వాటన్నిటిలోను మనము చావవలసియున్నది. క్రొత్త పునరుత్థానమును క్రొత్త జీవమును మనము చూచుటకై శ్రమలు యిబ్బందుల యిరుకుల గుండా మనం వెళ్ళవలసియున్నది. ఒక పాపీ క్రైస్తవుడు కాకమునుపు మరణము రావలసియున్నది, తరువాత పునరుత్థానము.

32

ఎలోహీమును అబ్రహాము చూడకముందు ఇరువది-యైదు సంవత్సరముల పరీక్ష యుండవలసియుండెను. హెబ్రియ బాలురు, దేవుని కుమారుని చూడకముందు, వారు అగ్ని గుండములోకి వెళ్ళవలసియుండెను. దానియేలు దేవదూతను చూడకమునుపు, అతడు సింహపు బోనులోనికి వెళ్ళవలసియుండెను. యోబు పునరుత్థానమును చూడకమునుపు అతడు తనకు కలిగిన దాని నంతటిని పోగొట్టుకోవలసియుండెను. అయితే అటు తరువాత దర్శనములో అతడు చూచెను.

ఒక దర్శనము వలననే యోబు, ఎంతో స్థిరుడుగా వాగ్దానము మీద అతడు నిలబడగలిగినట్లయితే, ఆ నిద్రించిన వారిలో ప్రథమ ఫలమగుటకై క్రీస్తు మృతులలో నుండి లేచి, మనము జీవించుట కొరకై ఒక వాగ్దాన ముద్రగా మన పైకి పరిశుద్ధాత్మను పంపిన తరువాత మనమెంత ఎక్కువగా చేయవలసియుంటుంది! “నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించుదురు.” ఆయన గంభీరమైన సన్నిధి మన మధ్యనుండి పనిచేయుచూ, ఆయన భూమి మీద యున్నప్పుడు ఏవైతే అద్భుతాలు సూచక క్రియలు చేసెనో వాటినే చేయుచూ, నిరీక్షణ యిచ్చుచున్నాడు. మనము పునరుత్థానము యొద్దకు వస్తాము, తరువాత బూడిద దిబ్బల మీద కూర్చుందామా? నూతనమైన శక్తితో, ఆయన బలములో దేవుని మనము చూచెదమనునటువంటి నూతనమైన తీర్మానముతో నూతనమైన దర్శనముతో, ఈ దినము బూడిద దిబ్బపైనుండి మనం క్రిందకు దిగుదాం. రానున్న పునరుత్థానపు సంగతులను మనము చూచెదము.

33

మరణపు ఘడియలలో మనమున్నాము. మరణము యొక్క వాకిళ్ళలలో మనము కూర్చొనియున్నాము. దేశములు మరణపు వాకిళ్ళలో యుండియున్నవి.

రేడియోలోను తదితరమైన వాటిలోను మీరు విన్నట్లుగా, రష్యా యిపుడు క్రొత్త ఆయుధమును కనుగొనినది. ఇక్కడకే వారు వచ్చి బాంబుతో పేల్చి వేయనవసరంలేదు. వారు ఒక చిన్నదానిని యిక్కడకు తెచ్చి, వారి వేగుల వారిని యుంచి, ఏ దేశములోనైనా పదార్ధమును కొద్దిగా చిమ్ముతారు. ప్రతి ఒక్కరు ఇరవై నాలుగు గంటలు నిస్సత్తువగా పడిపోతారు. ముందుకు రా, నీవు మేల్కొంటే ప్రక్కలో రష్యా తన్నులు నీకు తగులుతవి, ఒక పెద్ద రష్యా కాపలావాడు నీ గృహమును అక్రమిస్తాడు, నీ భార్యను బలత్కారముగా పట్టుకుంటాడు, వీధులలో నీ పిల్లలను విసిరివేస్తాడు మరియు నీ గృహమును పట్టుకుంటాడు. వారది చేయగలరు. ఒక్కదానిని కూడా వారు విడిచిపెట్టరు. వారది పొందుకోవలసియున్నది. అదేమైయుంటుందో ఏ ఒక్కరికి తెలియదు. చూశారా, ప్రతీది కార్యమౌతుంది. వారు దానిని వాడుకుంటారు, అందుకై వారు భయపడరు, ఎందుకనగా ఎవ్వరూ దానిని కలిగియుండలేదు.

34

అది ఏ విధముగా వచ్చునో మనకు తెలియదు, ఏమి జరుగునో మనకు తెలియదు, అయితే ఒకటి మాత్రము మనకు తెలుసు, అదేమనగా మనము బూడిద దిబ్బ మీద కూర్చున్నాము. దేశము బూడిద దిబ్బ మీద కూర్చున్నది. ప్రపంచము బూడిద దిబ్బపై కూర్చున్నది.

“లోకము బూడిద దిబ్బపై కూర్చున్నది కనుక దేవుని యొక్క ఆత్మ రాగలయందులకు నేనెతో ఆనందముగా ఉన్నాను. ”నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును, కడవరి దినమున ఆయన భూమి మీద నిలచునని మనము చెప్పగలము.“ ఒకానొక దినమున ఆయన వచ్చును. పధ్యకారుడు (యీలాగు) వ్రాయుటలో అతిశయోక్తిలేదు. ”జీవించుచు, ఆయన నన్ను ప్రేమించెను; మృతినొందుచూ, ఆయన నన్ను రక్షించెను; పాతిపెట్టబడి, ఎంతో దూరమునకు నా పాపములు కొనిపోయెను; తిరిగిలేచి, నిరంతరముగా నన్ను ఉచితముగా నీతిమంతునిగా చేసెను; ఒకానొక దినమున ఆయన రాబోతున్నాడు ఓ, మహిమగల రోజు!“

35

అంతకుముందు, అది గెత్సేమనేకు కొనపోబడి ఆ శరీరముగుండా పగులుటవలన రక్తపు ధారలు కారెను. మృతులలో నుండి ఎవరైతే లేచిరో అట్టి నిత్యుడగు దేవునికి ఒక ఋజువుగా కల్వరి యొక్క క్రూరమైన కల్వరి వేదన ముందుగా జరగవలసియుండెను. అది ఒక ఈస్టర్ చేయుటకై గెత్సేమనే, కల్వరి యొకటి స్వీకరించవలసియుండెను. అది తప్పక చేసి ఉంటుంది.

ఆ ఉదయవేళలో ఆ యొక్క శిష్యులు ఎంతగానో నిరాశ చెందిపోయినపుడు, ఎంతవరకనగా నేనెంతో నిరాశపడిపోయాను, నేను తిరిగి వెనుకకు వెళ్ళిపోయి చేపలు పడతాను అని పేతురు చెప్పునంతగా నిరాశపడ్డారు, నేను వెనుకకు తిరిగి వెళ్తాను. నేనాయనను చూచితిని......“

వారెన్నో ఘనమైన నిరీక్షణలు కలిగియుండిరి. ఆ మహా గంభీరమైన చీకటి స్థలానికి వారు వచ్చువరకు ప్రతీది వారు నమ్మియుండిరి. దేవుడు ఏమి చేయుచుండెను? ఆ యొక్క అపోస్తలులను ఆయన బూడిద దిబ్బ మీదికి తెచ్చుచుండెను? వారి యొక్క విశ్వాసము వారిలో నిర్ధారణయగు స్థలము వరకు, ఆయన వారిని తెచ్చుచుండెను.

36

మరియు పేతురు చెప్పెను, “నేను గొప్ప అద్భుతములను ఆయన గలిలయలో చేయుట నేను చూశాను, అయితే ఓహో, ఆయన చనిపోయి చల్లబడిపోయిన వానిగా సమాధిలో ఆయన పడియుండుట నేను చూశాను. ఈ ఉదయవేళ, నేను వెళ్ళిపోయి చేపలు పట్టుటకు సముద్రంలో వల వేస్తాను. అక్కడ దూరాననున్న సముద్రములో చూచి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.” ఆయన మనకొరకు ఆ నదివోడ్డును నిలబడుట నాకు గుర్తున్నది. నేను నమ్ముచున్నాను, అక్కడకు వెళ్తాను.“

అపోస్తలులు అన్నారు “నీకు తెలుసా యిది? నేను కూడా నీతో రావాలనుకుంటున్నాను.” ఓ, నిరుత్సాహపడిపోయారు, వారి నేత్రములు ఉబ్బిపోవునంతగా వారు ఏడ్చారు.

37

ఆ స్థలాలలో గుండా మనము వెళ్ళిపోతామని మనకెలాగు తెలియును. మనకు ఏలాగు తెలియును! అలాటి వాటన్నిటిలో మనమందరము పరిచయము కలిగినవారమే.

అక్కడ కొండపైన దూరమున యుండినటువంటి ఈస్టన్..... లేక వాల్నట్ రిడ్జ్ అను సమాధి తోటలో, నేను సమాధిలో పెట్టిన ఒక ప్రియమైన ఒకరు నాకు జ్ఞాపకమున్నారు. ఆ చిన్న బిడ్డను నేనక్కడ ఏలాగుంచితినో! తల్లి చంకలోనున్న ఆ బిడ్డను గూర్చి నేను ఏడ్వలేనంతగా ఏడ్చాను. నేనెరిగినదంతా నేను చేశాను. ఎంతవరకనగా నా తుపాకి తీసుకొని, నేను ఆత్మహత్య చేసికొనునంతగా, అంతటి సమయాన్ని నేను అభవించాను. అటువంటి ఆ ఘడియలో అక్కడయున్న ఆ చిన్న గదిలో, నేను మోకాళ్ళపై ఉ౦డగా, తిరిగి ఆకాశము తెరచుకున్నది. నిత్యత్వము యొక్క శోభలో అక్కడ ఆమె నిలువబడియుండుట నేను చూశాను. ఆ ఘడియలో, ఆమె నా యొక్క భుజములచుట్టు తన చేతులు పెట్టి “బిల్ నీకు అర్థం కాదు. మీ కంటే ఎంతో ఉన్నతమైన స్థితిలో మేము ఉన్నాము,” అని చెప్పినది.

38

చూడండి, శిలువ వేయుబడుట అవసరము, పువ్వు దాని నుండి సువాసనను యిచ్చుటకు, దానిని నలుగగోట్టుట అవసరమైయున్నది. అతి శ్రేష్టమైన జీవాన్ని పొందుటకు, దానిలోని జీవమును నలుగగోట్ట వలసియున్నది. ఆ హేతువుచేతనే, యేసు ఏమైయు౦డెనో బయటకు తెచ్చుటకు ఆయన నలుగగొట్టబడవలసి యుండెను. “పరలోకమందును భూమి మీదను నా చేతికి సర్వాధికారము యియ్యబడియున్నది,” అని ఆయన సిలువవేయబడక ముందు నిలబడి చేప్పలేకపోయెను. అయితే అదేమి జరిగించినది? అయితే శిలువవేయుబడిన తరువాత ఆయన నిలబడి చెప్పగలిగెను, “పరలోకమందును భూమి మీదను నా చేతికి సర్వాధికారము యియ్యబడియున్నది.” అయితే అది ఏమి చేసెను? అది మొదట సిలువవేయబడుట జరిగెను.

అది నలిపివేయబడుటను, నిరుత్సాహమును అపోస్తలుకు కలుగచేసినది. వారు అనుకున్నారు వారి రక్షకుడు.... ఆయనను ప్రేమించినవారు, సమాధిలో నుండి మ్రుతుడను లేపినవానిగా ఆయనను వారు చూశారు (ఆయన అది చేయుట వారు చూశారు), మరియు ఆ తరువాత “ఆయన చనిపోయినవాడుగా, అయనే ఈ ఉదయము చల్లగా సమాధిలో పడియుండుట,” అని వారు తలంచారు.

39

గ్రుడ్డివారి కన్నులను ఎవరైతే తెరచుట చూశారో, అక్కడే నిలువబడి ప్రజల హృదయాలలో ఏ తలంపులున్నాయో తెలియజేసిన ఆయనను ఎవరైతే చూస్తారో ఆ ప్రజలు ఆయనను చూస్తారు. “ఆయనకెలాగు తెలియును?” ఆయన వెంబడి వచ్చుచున్నవారు, ఆయనకు ఏలాగు తెలియును అని వారు అన్నారు. వారి యొక్క హృదయములోని తలంపులను ఆయన యెరిగి యుంటే, యూదా ఆయనకు ద్రోహము చేయునని “ఆయన వెంబడి వచ్చుచున్న వారు, ఆయనకు ఏలాగు తెలియును?” అని వారన్నారు. యూదా ఆయనకు ద్రోహము చేయునని ఆయన ఎందుకని అది తెలుసుకోలేదు? కత్తులతోను, గుదియలతోను ఆయనను పట్టుకొనుటకై కొండపైకి వచ్చుచున్న సైనికులను ఆయన ఎందుకని ఎరిగియుండలేదు?

చూడండి, ఒక బూడిద దిబ్బపై వారిని కూర్చుండబెట్టి దయ్యము వారి మీద పనిచేస్తుంది. ఎందుకనగా “నేనెరుగుదును” అను సాక్ష్యమును వారిచ్చుటకు ఇష్టపడెను. “నేను అనుకొనుచున్నాను,” లేదా “బహుశా యిది కాబోలు,” అనేది కాదు. “నేనెరుగుదును, నేనెరుగుదును.”

“సరే యిది సరియైనది కావచ్చునేమో, ఆ లేఖనము నిజము కావచ్చునేమో, దైవిక స్వస్థత నిజము కావచ్చునేమో, పరిశుద్ధాత్మ నిజము కావచ్చునేమో,” అని నీవు పలుకకుండునట్లుగా ఆ విధముగానే ఆ యొక్క శ్రమలు నీపైకి రాబడితివి. అయితే ఆ అనుభవమును నీవు పొందుకున్న తరువాత మరియు ఆ బూడిద దిబ్బల మీద నుండి నీవు దిగిన తరువాత మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు, “నా విమోచకుడు సజీవుడు, ఎందుకనగా ఆయన నాలో జీవించుచున్నాడు,” అని నీవు కేకపెట్టవచ్చును.

40

“నేను తిరిగి చేపలు పట్టుటకు వెళ్ళిపోతాను,” అని పేతురు అన్నాడు.

“మేము కూడా నీతో వస్తాము,” అని అనుకుంటున్నాము అని శిష్యులు చెప్పారు.

అక్కడ నడిసముద్ర మార్గములో బూడిద దిబ్బపైన వారున్నారు. శ్రమ, వారి పైకి అలాగు వచ్చినది. వారిలో ఒక్కరు, “పేతురూ, యిది ఏలాగు సంభవించినది? అటువంటి మనిషి, ఆ విధముగా చనిపోవుట ఏలాగు సంభవించినది? ఆ విధముగా ఆయన సమాధిలో పెట్టబడుట ఏంటి? వారు, ఆయన ముఖముపైన ఉమ్మివేసి, గడ్డము పెరికివేసి కిరీటమును తలపైన పెట్టుటకు ఆయన ఏలాగు నిలబడగలిగెను? ఆయన దేవుడైయుండి అది ఆయన ఏలాగ చేసెను. నేనది గ్రహించలేకున్నాను,” అని చెప్పుట నేను వినగలుచున్నాను. ఓ, ఎంతటి నిరాశ నిస్పృహ అది!

41

అకస్మాత్తుగా వారు సముద్రపు ఒడ్డువైపుకు చూశారు, యోబుకు కలిగిన అదే ప్రత్యక్షత. నాలుగువేల సంవత్సరములకు ముందు యోబు ఏది చూచెనో, అది వారక్కడ చూశారు. అక్కడ ఒడ్డున నిర్మలంగా, సజీవంగా నిలబడియున్న విమోచకుడిని వారు చూశారు, అక్కడ మంటలో కాల్చబడి చేప దానిపైయున్నది. వారికి ఆహ్వానము ఇవ్వబడెను:

ఎక్కడైతే దేవుని యొక్క పరిశుదులు భుజింతురో,

అచ్చట యేసు బల్లను యుంచి యుంచెను.

“రండి, భుజించుడి;”

అని ఆయన ఏర్పరచుకొనిన వారిని ఆయన ఆహ్వానించును,

ఆయన మన్నాతో ఆయన పోషించును,

మరియు మన ప్రతి అవసరత ఆయన తీర్చును;

ఓ! అన్నివేళలలో యేసుతో కలసి భుజించుట!

అది మాధుర్యము.

దానిని మనమెలాగు ఆలోచించగలము. ఆ ఘనమైన విషయాలు అవి ఏలాగు కలిగోనో.

42

ఎవరైతే శ్రమల ఘడియలలో గుండ, ఏలాగు వెళ్ళిపోయెనో ఆ ఘనుడైన అపోస్తులుడు, అపోస్తులుడైన పౌలు, అతడు సైఫను మరణమును గూర్చి అతడు సాక్ష్యమిచ్చినపుడు, అతడు ఏలాగుండెనో ముఖము మీద రాళ్ళువేసి కొట్టబడుతున్నాడతడు. మరియు అతడు పైకి చూచి “ఆకాశము తెరువబడుటయు, యేసు దేవుని కుడి పార్శ్వమున నిలచియుండుటయు,” నేను చూచుచున్నానని అతడు పలుకుచూ అతడు ఆకాశమువైపు తన ముఖము యుంచుట అతడు చూచాడు. “ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుము” అని అతడున్నాడు. పౌలు వస్త్రాలు పట్టుకున్నాడు, అవి అతనిని బూడిద కుప్ప మీద వారములు వారములు తరబడిగా ఉండునట్లు ముందు వెనుకల నడుచునట్లుగా చేసినవి. ఎంతవరకనగా, తన మనస్సు గజిబిజి అగువరకు, ఎంతవరకనగా ఒకడు తన దుఃఖమును దిగమింగుటకై విస్కీ బుడ్డీకి వెళ్ళునట్లుగా, తన అసాధారణమైన వత్తిడిని ఆపుకొనుటకై దమస్కు రహదారిపైకి అతడు వెళ్ళిపోవునట్లు చేసినవి.

పరలోకము నుండి ఒక స్వరము వచ్చునపుడు అతడు మార్గము మధ్యలో యుండెను. అపుడు గంభీరముగా ప్రకాశిస్తున్న వెలుగు వచ్చి “సౌలా, సౌలా, నీవు నన్నెలా హింసించుచున్నావు?” అని చెప్పినది. అతడు ఆయనను చూశాడు. ఆయన పునరుత్థానుడైన యేసు యని, చనిపోయి తిరిగి లేచినవాడైన సాక్షి ఆయనేయై యున్నాడని అతడు ఆయనను గుర్తించెను.

43

ఓ, నా స్వంత జీవితము నాకు జ్ఞాపకమున్నది, నాశనమునకు వెళ్ళు మార్గమందు, అప్పుడు నేను ఒక మధురమైన స్వరము విన్నాను, “నేను యేసును. నేను ఒకనాడు మృతుడనైతిని గాని నేను నిరంతరము జీవించుచున్నాను. ఏలయనగా నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించుదురు,” అని పలికెను. ఆ సమయము నుండి, ఆయనలో నా చేయి పెట్టియున్నాను. గాఢ౦ధకార స్థలములలో నేనాయనను నమ్మియుంటిని. నేను ఏ దారిన వెళ్ళవలెనో నేనది చూడనటువంటి ఘడియలు వచ్చినపుడు కూడా సేనాయననే నమ్మియుంటిని.

ప్రతియొక్క క్రైస్తవ విశ్వాసి అట్టి శ్రమలలోకి వెళ్ళవలసియున్నది. “నా విమోచకుడు సజీవుడను” యొక అనుభవమును తద్వారా తానెరుగుటకై ప్రతియొక్క క్రైస్తవ విశ్వాసి బూడిద దిబ్బ మీద ఉండవలసియున్నది.

44

ఈ ఉదయం మనం యిక్కడకు వచ్చినది కేవలం అలాగు కూర్చొని ఒక విధమైన చరిత్రాత్మకమైన సంగతిని గూర్చి మాట్లాడుకొనుటకు రాలేదు. (అదంతా నిజమైనది), మనము ఈ ఉదయము ఒక సాక్షముతో వచ్చితిమి: “యేసు క్రీస్తు దేవుని కుమారుడైయున్నాడని నేనెరుగుదును. ఎటువంటి సందేహమనునది లేకుండ అది నేనెరుగుదును. ఆయన మృతులలో నుండి లేచియున్నాడని, ఈ దినమున ఆయన నాలో జీవించుచున్నాడని నేను ఎరుగుదును. ఆయన నా వాడు. నేను ఆయన వాడను. నేను ఆయన రాజ్యములో ఆయనతో సహభాగస్తుడైన వారసుడను.”

ఈస్టరు. ఒక ఘనమైన యొక దానిని, ఒక పునరుత్థానమును, ఒక నూతనమైన నిరీక్షణను తెచ్చినది. ఈ ఉదయము నీవది పొందియున్నావా? అది నీ హృదయములో యున్నదా? నీ యొక్క విమోచకుడు సజీవుడని, ఆయన సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని నీకు తెలియునా?

45

“సహోదరుడా బ్రన్హం, నేనిక్కడ కూర్చొనియుండి ప్రార్ధనా వరుసకై ఎదురు చూచుచున్నాను,” అని నీవు చెప్పుచున్నావు?“

ఖచ్చితంగా దేవుడు మేలు కొరకే చేయుచున్నాడు. నిన్నటి దినాన ప్రశస్తమైన ఆ చిన్న బిడ్డ పుట్టినప్పటి నుండే గుడ్డివానిగా ఎందుకని మొత్తబడవలసియుండెను. అది, దేవుడు మహిమ తెచ్చుకొనుటకు మరియు పట్టణము తలక్రిందులుగా చేయబడుటకు అది ఆయెను. నిశ్చయము! ఆయన ఏమి చేయుచున్నాడో దేవునికి తెలియును. దేవునికి తెలుసు ఆయన మహిమను మనకు చూపించుటకై ఆయన మనలను బూడిద దిబ్బ పైన యుంచియున్నాడు.

కావున స్నేహితుడా, ఈ ఉదయం నేనిది చెప్పుచున్నాను. ముప్పై-ఓక్క సంవత్సరముల పరిచర్య తరువాత, పొలములో ముప్పై-ఓక్క సంవత్సరముల శ్రమ ప్రయాస తరువాత దీనికి నా యొక్క సాక్ష్యమును చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను నిరాశ నిస్పృహలు చూశాను. కార్యాల కొరకై నేనడిగిన సమయాలు నేను చూశాను. అట్టి విషయాలకై నేను ఏడ్చాను. విషయాల కొరకై బ్రతిమిలాడాను. అవి పొందుకొనుటలో విఫలమయ్యాను. అయితే, ఓపికతో, దేవుని మీద నేను కనిపెట్టినట్లయితే, అది ఖచ్చితముగా సరిగానే జరిగినదని, సరిగానే వచ్చినదని, సరిగానే కార్యము కాగలిగెనని నేనెరిగితిని.

46

నా యొక్క చిన్న షారోనును, నా బిడ్డను నేను పోగొటుకున్నప్పుడు, నన్ను పడద్రోసె విషయం అదొకటి. “అది మేలు ఎలాగా అవుతుంది?” అని నేను అన్నాను. నెలలు గడిచిన తరువాత, ఆమె అక్కడ ఒక యవ్వనస్తురాలైన నిండైన బాలికగా నిలబడి, నాతో మాట్లాడుట నేను చూశాను. అక్కడున్న పాత బండి ప్రక్కన నిలబడియున్నదామె. ఆమె జీవించియున్నట్లయితే, ఆమె తప్పులోకి తిరిగిపోయి యుండెడిదేమో అని నేను తెలుసుకున్నాను. ఆమె చిన్నగాను, మధురముగాను యున్నపుడే, దేవుడు ఆమెను తీసికొనవలసి వచ్చెను. నేనామెను మరలా చూచెదనని నాకు తెలుసు. నేను ఆమెను చూచెదనని నాకు తెలుసు. ఏలాటి అనుమానపు అణువు లేకుండ అది నాకు తెలుసు.

ఇరవై రెండు సంవత్సరాల వయస్సుగల నా భార్య తీసికొనిపోబడుట, నేను ఆలోచనచేస్తున్నాను. కేవలం ఒక బాలిక, ఒక చిన్న తల్లి ఆమె. ప్రాముఖ్య ప్రకటనగా “ఒక యవ్వనస్తురాలైన తల్లి.... రెవరెండ్.... చనిపోయినది”, ఓ! నా గుండె పగిలి రక్తము కారినది! ఏమి చేయవలెనో నాకు తెలియదు.

ఈ దినమునయితే, అదంతా నా మేలు కొరకే జరుగుచున్నదని నేనెరుగుదును. జీవితము లోపలయున్నదేదో బయటకు వచ్చుటకు అది క్రిందపడవేయబడి, నలుగగోట్టబడి మరియు పిండబడవలసియున్నది. దేవుడు తనకు తాను బయలుపరచబడక మునుపు, నాలోని బ్రన్హం పూర్తిగా పోవువరకు మరింతగా నన్ను పిండవలసియుండెను.

47

శ్రమల వలన దేవుడు దానిని బయట పిండేవరకు ఎంతో ఎక్కువ మీలో-మీరు యుండెను. ఆ వత్తిడి అనునది వస్తున్నప్పుడు అది కఠినంగా యుంటుంది. అయితే కొద్ది సమయం తరువాత, మబ్బులు తిరిగి వెళ్ళిపోతావి, అపుడు దేవునియొక్క ఉద్దేశ్యమును నీవు చూచెదవు, అపుడు నీవు - “నా విమోచకుడు సజీవుడనియు, కడవరి దినములలో ఆయన భూమి మీద నిలచుననియు నేనెరుగుదునని,” కేక వేస్తావు. పురుగులు ఈ శరీరమును నాశనము చేసినను, నా శరీరములో నా దేవుని నేను చూచెదనని నీవు చెప్పగలవు. ఈ చిన్న శ్రమలు మొదలైనవి కొద్ది క్షణికము మాత్రమే, అవి మరుగైపోయి గతించిపోతవి; అయితే, అవి కేవలం నీ మేలుకొరకే వచ్చును, తద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దానిని జ్ఞాపకముంచుకుందాము.

48

ఓ క్షణము తలలు వంచుకుందాము. ప్రార్థన చేయక ముందు నేను మిమ్మును అడుగుతాను. మేము ముగించకముందు యిక్కడ ఎవరైనా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడి కోరువారున్నారా? దేవుడు మిమ్ము దీవించును. “నూతనమైన అనుభవము నాకు యిచ్చుటకు తద్వారా నూతనమైన వానిగా తిరిగి వచ్చుటకు నా యొక్క యిప్పటి శ్రమ ఘడియలో నాకు దేవుడు కావలసియున్నదని, యిక్కడ యున్నవారు ఎందరు చెప్పెదరు? మీరు చేయిపైకి ఎత్తి ”నాకు కావలెను, నూతనమైన నిరీక్షణతో నూతనమైన బలముతో, నూతనమైన ఆరోగ్యముతో, నూతనమైన ఆనందముతో పునరుత్థానము నన్ను పునరుత్థానునిగా చేయుటకు ఇది నాకు ఒక పునరుత్థానము, ఒక ఈస్టరు కావలసియున్నది.“ నా ప్రియమైన వారలారా, ప్రభువు మిమ్మును దీవించును గాక.

49

ఓ! మా దేవా, మా రక్షకా, ఈ ఈస్టరు కొరకై, మా హృదయాలకు కావలసినది అదే, మేమెంతో నీకు కృతజ్ఞలమై యుంటున్నాము. ఆయన యొక్క రాజు వస్త్రములు ధరించుకొనినవాడై, తనకుతాను సంసిద్ధపడి దూరాననున్న అక్కడ దేశము నుండి ప్రభువైన యేసు వచ్చుచుండుట విశ్వాసముతో నేను చూడగలుగుచున్నాము. సంఘము, పెండ్లి కుమారుడు, ఆమె పెండ్లి వస్త్రమును ధరించియున్నది. ఎంతో త్వరలో ఘనమైన కూటమి సంసిద్ధత చేయబడియున్నది.

ఈ యొక్క బూడిద కుప్ప ఎల్లకాలముండదు. ప్రజలు నవ్వుట మేము వింటున్నప్పుడు, మమ్ములను ఎగతాళి చేస్తున్నప్పుడు, పరిశుద్ధ గుండ్రాళ్ళు అని పేరు పెట్టి పనికిమాలిన వారమని మమ్ములను అనుచున్నప్పుడు, చివరికి మేము మతి తప్పిన వారమని చివరకు మమ్ములను గూర్చి చెప్పుకుంటున్నపుడు, ఓహో! ప్రభువా, అది చిరకాలము యుండునది కాదు. అయితే యోబు వలె మా సాక్ష్యాన్ని కాపాడుకొందుము గాక. దానియేలు వలె సింహపు బోనులో ఉందుము గాక. హెబ్రి బాలుర వలె అగ్ని గుండములో లేక యాత్రలోనున్న అబ్రహామువలె మేముందుము గాక.

50

“బూర ఊదబడినపుడు క్రీస్తునందు మృతులు లేచెదరు. బ్రతికియున్న మేము క్షణములో, కనురెప్పపాటులో మార్చబడెదము.” అటువంటి గంభీరమైనది సంభవించుట మేము చూచువరకు నమ్మకముగా మేము నిలబడునట్లు సహాయము చేయము. ఓ! ప్రభువా, అటు తరువాత ఆ ఈస్టరు మాకై వచ్చును. అది పందొమ్మిది వందల సంవత్సరముల క్రితము క్రీస్తు ఆనందించి! నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించుదురు“ అని పలికెను.

మనమధ్య నుండి కొనిపోబడిన ఈ యేసే, ఆయన వెళ్ళిన రీతిగానే మరలా తిరిగి వచ్చును. మనమాయనను చూచెదము. ఆయన చేతిలోని ప్రతి గాయపు గురుతును, ఆయన శిరస్సు మీది ప్రతి ముళ్ళ గురుతులో ఆయనను చూచెదము. ఓ! “నేను ఆయనను ఎరిగెదను, నేను ఆయనను ఎరిగెదను, మరియు విమోచింపబడి ఆయన ప్రక్కన నేను నిలిచెదను.”

51

“ఔను ప్రభువా! నా యొక్క దీన హృదయము ఈ బలహీనమైన నా యొక్క దేహము బరువు చేత క్రిందకు వంగిపోవుచుండగా, పొలములోని, సువార్త పొలములోని బరువు భాద్యతలచేత మరియు వడిదిడుకులచేత పలు స్థలాలలో తిరుగుబాటు చేయు సేవకుల మధ్య విభేదాలు మొదలగువాటి చేత దురాత్మల శక్తులతో ప్రజలు దూషణ పలుకుచున్నారు. (అందుకే నా దీన హృదయము కుంగిపోతున్నది) అయితే ప్రభువా, ఒక రోజు ఏలియావలె మేము నదీ తీరానికి వచ్చెదము. ప్రతి గుబురుకు నియంత్రించుకొని యుండిన అగ్ని రథము మమ్ములను కొనిపోవుటకు అక్కడ యుండుట చూచెదము. ఆ గంభీరమైన మహిమయుగు ముందెదురుగానున్న ఆ ఘనమైన వస్తువు మమ్ములను మరుగుచేసినటువంటి కేవలం బూడిద దిబ్బలే ఇది అని మేము తెలిసికొందము గాక.

“ఆయనను మేము ముఖాముఖిగా చూచువరకు యోబు వలె మేము నమ్మకస్తులముగా ఉందుము గాక. కల్వరికి వెళ్ళుటకై మనయొక్క మాదిరియైన మన ప్రభువు వలె నమ్మకస్తులుగా యుందుము గాక. సిలువ వేయబడుటకు తద్వారా మా బ్రతుకులో ఒక పునరుత్థానము యుండుటకు అలాగుయుందుము గాక. ప్రభువా అది అనుగ్రహము చూపుము.

పురాతన కాలమందలి ఆ పౌలు వలె, యిక్కడ ఎవరైనా అపహాసకులున్నట్లయితే ఎగతాళి చేయువారున్నట్లయితే, ఈ ఉదయం వారి యింటి దారిన వారు వెళ్ళినప్పుడు ఈస్టరును కనుగొందురు గాక. ప్రభువా, అనుగ్రహించుము.

ఎవరైతే నాశనమును బూడిద దిబ్బమీదనున్నారో, వ్యాధియును బూడిద దిబ్బమీదనున్నారో వారు విడుదల పొందుటకు ఇదే సమయం కావలెనని ప్రభువా, మేము ప్రార్ధిస్తున్నాము.

52

గతించిన రాత్రి అక్కడ తోపుడు బండిలోనున్న చిన్న స్త్రీతోను, ఆమె భర్తతోను అక్కడ దూర ప్రాంతమున ఫీనిక్స్ లో అక్కడ వారి మీదనున్న పెద్ద కేన్సరుతోను అపాయకరమైన స్థితిలో యుండగా మాట్లాడుచుంటిని, ఈ రోజు మంచిగాను మమూలుగాను యుండెను. ఆ యొక్క చిన్న బిడ్డకు తన గుండె తీసివేయబోవుచుండెను, ఈ ఉదయం మంచిగాను మామూలుగాయుండి భవనంలో కూర్చొని యుండెను. ఒక గుడ్డి బాలుడు ఏనాడు వెలుగు పగలు చూడలేదు. ఒకనాడు చీకటిలో నడచిన తాను ఈ రోజు నడుచుచు, పగటి వెలుగు చూస్తున్నాడు. ఓ దేవా! ఇందునిమిత్తము మీకు ధన్యవాదములు చెల్లించుచున్నాము. ఆ ఘనమైన పునరుత్థాన దినమునకు తెర వెనుక యిది కన్పించుచుండెను. తండ్రి అనుగ్రహము చూపుము! ఈ సంగతులు ఆ విధముగానే యుండివలసియున్నవని, అనగా చిన్న గుడ్డి అబ్బాయి చూడగలడని, గుండె జబ్బుతోనున్న ఆ చిన్న బిడ్డ యితరులకు ఒక సాక్ష్యము యివ్వగలదని, ఈ సంగతులు వారు ఎరుగుదురు గాక. ఈ సమస్తమైన సంగతులన్ని నిన్ను ప్రేమించువారి మేలుకై సమకూడి జరుగుచున్నవి.

53

అవన్ని మాకు సాధ్యమే, ఎందుకనగా అక్కడ శ్రమకు ఒకరు విధేయత చూపెను. అక్కడ ఒక్కరు పరీక్షకు నిలబడెను. ఆయనే యేసు. తండ్రి, ఈస్టరు ఉదయమున ఆయనను తిరిగి లేపు వరకు ఆ ఒక్కడు ఎంతో విధేయుడైయుండెను. “ఎందుకనగా మరణము ఆయనను పట్టుకొనుట అసాధ్యమాయెను.” “ఎందుకనగా నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యను. నేను ఆయన ఆత్మను పాతాళములో విడిచిపెట్టను,” ఎందుకనగా ఆయన నమ్మకస్తుడుగా కనుగొనబడెను. తండ్రి ఎల్లప్పుడు సంతోషపరచు కార్యమే చేసెను.

దేవా ఎల్లప్పుడు కూడ మేము మా యొక్క విధినిర్వహణలకు మేము నమ్మకస్తులముగా యుందుము గాక! మా యొక్క శ్రమలు ఏమైయున్నప్పటికి మా యొక్క ఇబ్బందులు ఏమైనప్పటికి మేమెల్లప్పుడు కూడా దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని మేము చెప్పుదము గాక! తండ్రీ అవి అనుగ్రహించుము.

నీ యొక్క ఆశీర్వాదములతో ఈ ఉదయం మేము ఈ ప్రజలను ఆశీర్వదించుచున్నాము. పెందలకడనే, వారి యొక్క స్థలముల నుండి వారు మందిరమునకు వచ్చెదరు గాక! ఆదరణ పొందుటకు వారు వచ్చెదరు గాక. “ఆయన మనతో మార్గమున నడచునపుడు మన హృదయము మండలేదా,” అని ఎమ్మాయి మార్గమున నడచుచు వచ్చినవారు చెప్పినట్లుగా, పరిశుద్ధాత్మ శక్తివారి యొక్క హృదయములలో మండుచూ ఈ ఉదయం వారి గృహములకు వారు వెళ్ళుదురు గాక! తండ్రి దానిని అనుగ్రహించుము. యేసుక్రీస్తు నామములో వారిని నీకు అప్పగించుచున్నాను. ఆమేన్.

54

మంచిది, సహోదరుడా, నెవిల్ యిపుడు కూటములు జ్ఞాపకముంచుకొనుడి. ఈ ఉదయం మా యొక్క ప్రార్ధనా కార్డులు లేవు, ఎందుకనగా మా యొద్ద ప్రార్థన కార్డులున్నట్లయితే, ఆ విధముగా ప్రజలను నేను నిలబెటుటకై అలాగు యుంచినట్లయితే, ఆ వరము మీద నేను అలాగే అనుకోవలసియుంటుంది. నేను దానిని ప్రక్కకు పెట్టి అక్కడకు నడిచి వెళ్ళిపోవునంతగా అలాంటి స్థలానికి రావలసియుంటుంది. నేను భయపడుతున్నాను, నేను భయపడుదునని అనిపించుచున్నది, తప్పు చేయుదునేమోనని భయపడుతున్నాను. యుద్ధమును విడిచి పెట్టుటకై పోరాటమును వదలుట కాదు. పాటన్ (వ్యక్తి) చాలా యుద్ధములు ఓడిపోయెను, అయితే అతడేనాడు పోరాటమును వదులుకోలేదు. నేను అనేకమైన తప్పిదములు చేస్తాను, అయితే నేను వ్యాజ్యమును (కారణమును) వదలుకోను. దేవుడే దానిని దయచేస్తాడు, దేవుడే దానిని జాగ్రత్త తీసుకుంటాడు. అది అభిషేకము, మరియు ఇప్పుడు ఆ ఘడియ వచ్చెను అని నమ్ముచున్నాను. మరియు నేను మొదలు పెట్టుచున్నాను, ఈ ఈస్టర్ దినాన నేను ఆ రోగులకోరకు ప్రార్ధ౦చిన విధముగా నేను చేయుదును. నేను చేయ గలిగితే..... అది అభిషేకము, అది నాలోనే జరుగవలసిన కార్యమైయున్నది. దానికి నేను ఎల్లపుడు అలవాటుపడిన వాడనుకాను. అది ఆ విధముగా నా యొద్దకు వచ్చును, బహుశా నేను దానిని అప్పుడే పసిగట్టలేను. అయితే నేను దానిని ఎరుగునంత వరకు ముందుకు వెళ్ళవలిసియున్నది, కావున దేవుని కృపవలన నేను ప్రయత్ని౦చుటకు అది ఈ దినమైయున్నది.

ప్రభువు మిమ్ములను దీవించును. సహోదరుడా నెవిల్. మరియు తొమ్మిది-ముపైకు కూటము ప్రారంభమౌతుంది. సహోదరుడా నెవిల్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...