త్రోసివేయబడిన రాజు

త్రోసివేయబడిన రాజు

VGR COUNT-248 వాక్య పరిచర్య ద్వారా నేడు మన మీదికి ప్రభునియొక్క మహిమ కొరకు, గత వారం ఒక రకమగు వాతావరణ ప్రభావానికి గురైయ్యాను - ఖచ్చితంగా వాతావరణమే కారణమని చెప్పలేను. నేను ఒక వైద్య పరీక్షకు తీసుకోవలసి వచ్చెను. అది ఒక శారీరిక పరీక్ష అందువలననే నేను ఆస్పత్రిలో యున్నట్లుగా మీరు వినిరి. అందువలన నేను నదిని దాటి రాకపోకలు సాగించలేకపోయాను. వాయు సంబంధమగు రుగ్మత వలన పెద్ద ప్రేవులలోను, చిన్న ప్రేవులలోను ఒత్తిడి ఏర్పడినది. నిమిష-నిమిషమునకు వారు వచ్చి ఎక్స్ రే తీయుచుండిరి.

రాబర్ట్స్, ఇంకా ఇతరులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలను చేయించుకొనుచున్నారని నేననుకొనుచున్నాను, కాని నేనయితే గత నాలుగు సంవత్సరములుగా వాటిని చేయించుకొనలేదు.

2

ఒక బాధ యున్నది - నాకు ఆముదమంటే ఇష్టముండదు. అదీ అసలు విషయము. దానికి బదులుగా మరేమీ ఇచ్చుటకు లేదని వారు చెప్పిరి, దానిని వారు నాకిచ్చినప్పుడు ఎంతో జబ్బుకు నేను గురియగుదును. అది నన్ను ఎంత వ్యాధికి గురిచెసెనో నా జీవిత గాధలో చెప్పాను. నాకది చాలా అసహ్యము. నా స్నేహితుడగు దయగల డాక్టరును ఇట్లడిగాను, “ఇంకేమైనా యున్నది?”

“బ్రెన్హాం సోదరుడా, మరేమీ లేదు,” అన్నాడు.

3

ఓ, ఆ స్త్రీ దానితో లోనికి వచ్చినప్పుడు..... నేను కొంచం అతిశయముగా చెప్పుచున్నాను, కాని అది ఒక మోతాదులో ఉంది. అంతగా నేను ఎప్పుడూ చూడలేదు. నేను ముక్కు మూసికొని మింగాను, ఆఖరుకు దానిని మ్రింగాను.

కాని ఇప్పుడు, ఆ పరీక్షలన్నింటి గుండా నేను వెళ్ళియున్నాను. పరిపూర్ణమైన పరీక్ష నిమిత్తము ప్రభువుకు నేను వందనములు చెల్లించగోరుచున్నాను. ఆ వైద్య పరీక్షలలో నేను నూటికి నూరు శాతము ఉత్తీర్ణుడనైతిని. ప్రపంచములో నాకిష్టమైన చోటికి నేను వెళ్ళవచ్చును. వైద్యులను నేనడిగాను, వారు ముగ్గురు, అత్యుత్తమ నిపుణులు. లూయస్విల్లో వారిని మించిన వారు లేరని తలంచుచున్నాను. “నాకు పదిశాతమైనా బలహీనతయినా యున్నదా?

అతడు చెప్పెను, “అసలు వ్యాధి అనేది నీకు లేనే లేదు.” “నీవు అన్ని విధములగాను పరిపూర్ణ ఆరోగ్యముతో యున్నావు,” అన్నారు. దేవునికి నేనెంతో వందనములు చెల్లించుచున్నాను. పరలోకపు తండ్రి వలననే నేను ఆ విధముగా ఉండగలిగితిని గాని మరెవరి వలనను కాదు. “నీ కదలికలన్నియూ నీవింకా యవ్వనములో యున్నట్లుగా చూపించుచున్నవి. నీ రక్త కణములు ఇంకా బలహీనమగుచున్న సూచనలే లేవు. బ్రెన్హాం సోదరుడా, నీవు మంచి ఆరోగ్యములో యున్నావు,” అన్నారు.

“అయితే చాలా సంతోషము,” అనుకొన్నాను.

4

ఆస్పత్రిలో ఉన్న ప్రతి నర్సుకు, ప్రతి డాక్టరుకు దేవుని రాజ్యము గూర్చి చెప్పగలిగిన భాగ్యము నాకు అచ్చట దొరికినది, సాక్ష్యమును ఇయ్యగలిగాను. ఒక డాక్టరు ఈ ఉదయమున ఇచ్చటకు వచ్చుదునని చెప్పెను, ఈ లోకములో ఇంకా మంచి వారున్నందుకు నేను సంతోషించుచున్నాను - చక్కనివారు. వారు అయిదు రోజుల పాటు నా శరీరమునకు పరీక్షలు చేసిరి, ప్రతి పరీక్షకు దాదాపుగా రెండు లేదా మూడు వందల డాలరు ఖర్చగును. అంతా అయిపోయిన తరువాత వారిట్లనిరి, “ఇది నీవు చేయుచున్న దేవుని పనికి మా విరాళము,” “మీకు రుణపడియున్నాను, అని నీవన్నాగాని మేము సిగ్గుపడుదుము. మా అందరి కొరకు నీవు ప్రార్ధించిన చాలును,” అన్నారు వారు.

“మాకు అర్ధము కాని ఏదో ఒక చలనమును లోపట మేము కనుగొన్నాము. బయట నీకు ఎట్టి నరముల ఉద్రిక్తత గాని, విసుగు గాని లేదు, కాని లోపట మాకర్థము గాని ఒక ఉద్రేకము కనుగొనియున్నాము,” అనిరి.

“ఒక్క క్షణము ఇచ్చట కూర్చోండి, మీకు చెప్పెదను,” అని వారితో అన్నాను. నేను దర్శనముల గూర్చి వివరించసాగాను. అది వారికి తెలియని రంగము. దానిని గూర్చి వారికేమీ తెలియదు. పరిశుద్ధ గ్రంథము గురించి వారికి చెప్పాను. ఒకరోజున దేవుడు నాకిచ్చిన దర్శనమును వారికి వివరించాను. వారు చిన్నపిల్లలవలె ఏడ్చిరి, వారు కూర్చొని ఏడ్వసాగిరి.

“నన్ను ఏదో మతపిచ్చివాడు అని మీరు తలంచవద్దు,” అన్నాను.

5

“ఏ విధంగానో అలా అనుకోము బ్రెన్హాం సోదరుడా! నా హృదయమంతటితో దానిని నమ్ముచున్నాను,” అని చెప్పెను. “కాని ఒక సంగతి నేను చెప్పగోరుచున్నాను, వీటిని నేర్చుకొనుటకు నీవు బడికి వెళ్ళలేదు గదా? అవి సర్వశక్తుడగు దేవునియొద్ద వచ్చినవని నేను నమ్ముచున్నాను,” అని అన్నారు. లూయిస్విల్లో అత్యుత్తమ వైద్యులు ముగ్గురు అచ్చట నిలబడియుండిరి. అక్కడ దేవుడు కొన్ని విత్తనములు నాటుటకు దేవుడు నాకు అవకాశమిచ్చినందుకు ఎంతో సంతోషించుచున్నాను.

6

ఒక్కొక్క నర్సుతో నేను మాట్లాడితిని, ఒక ఉదయమున ఎక్స్ రే గదిలో నుండి నేను బయటకు వచ్చుచున్నప్పుడు, ఒక దీన వృద్దురాలివైపు చూచాను, ఆమె చాలా వ్యాధిగ్రస్తురాలై యున్నది. నేను మెల్లగా త్రోసుకుంటూ ఆమె యొద్దకు వెళ్ళితిని, ఆమె చనిపోవుచున్నదని నాకు అర్థమైనది. “సోదరీ, నిన్ను ఒక ప్రశ్న అడుగగోరుచున్నాను,” అన్నాను.

“అడుగుము అయ్యా,” అన్నదామె.

“నీవు క్రైస్తవురాలవా?” అన్నాను.

“నేను పలాని సంఘమునకు చెందితినని,” అన్నది.

అందుకు నేనన్నాను, “దానిని కొద్ది విపులంగా చెప్పమని కోరుచున్నాను. నీవు క్రైస్తవురాలవేనా? నిజమైన క్రైస్తవురాలవా? నీవు ఈ లోకము వదలి ఆవలి యడ్డుకు చేరిన తరువాత, నీ సంగతి ఏమిటి? నీవాయనను ప్రేమించుచున్నావా? నిజంగా నీవు రక్షించబడితివా?”

“అవును అయ్యా, నేను ప్రేమిస్తున్నాను,” అన్నది.

“అయితే దేవుడు నిన్ను దీవించును. గాలి ఎటు వీచినా పరవాలేదు, నీవు సరిగానే యుందువు, ఆ విధంగా ఉన్నంతకాలము ఏమీ బాధ లేదు,” అన్నాను. మనము చూచినట్లయితే, ప్రపంచంలోని ఎందరో జనులు ఇంకా అయోమయ స్థితిలోనే యున్నారు.

7

ఈ రోజు నేను ఒక దర్శనంతో వచ్చియున్నాను, దానిని తరువాత చెప్పెదను; మొదట నేను ఒక మాట మీద మాట్లాడగోరుచున్నాను, ఎందుకనగా వాక్యమే అవసరమైనదని నేను నమ్ముచున్నాను - ఇప్పుడది ఎంతో అవసరమైనది.

8

చార్టీ కాక్స్ ను మరియు సోదరుడు.... అచ్చట కలసి నిలబడియున్ననా స్నేహితులనందరినీ చూచి సంతోషించుచున్నాను. (ఆ సోదరుని పేరు గుర్తు రాలేదు) సహోదరుడు జెఫ్రీస్. చాలామంది, ప్రశస్త్ర సోదరులు జార్జియా నుండి వచ్చిరి, ప్రశస్తమగు సోదరులు, దేశంలోని వివిధ ప్రాంతముల నుండి వచ్చిరి. నా ప్రాచీన ఆప్తమిత్రుడు బిల్ ఈ ఉదయము ఇచ్చట కూర్చొనియున్నాడు, వారే నాకు ఈ సూటును ఇచ్చిరి. నాకున్న సూటులలో ఇదే అత్యుత్తమైన సూటు; చాలా బాగున్నది. నిజంగా వాతావరణమునకు తగియున్నది, నాకిది ఎంతో నచ్చినది. ఈ గత కొద్ది రోజులలో ఏమి జరిగెనో మీకు నేను చెప్పాను, అందువలననే ఇది ఎంతగానో తగియున్నదని చెప్పుచున్నాను.

9

ఇప్పుడు, ప్రభుని చిత్తమయితే, నా జీవితంలో ముందెన్నడూ పోరాడని రీతిగా ఇప్పుడు యుద్దములో పోరాడవలెనని కోరుచున్నాను, ఎందుకనగా ఈ రోజు మాత్రమే నాకున్నదన్నట్లుగా పోరాడుదును. ఎందుకనగా మనకు తెలియదు, ఎలక్రికల్ హృదయ పరీక్షలు, ఎక్స రే లు, పదహారు వేర్వేరు యంత్రములతో పరిశోధనలు చేశారు. నా శరీర పరిస్థితి మామూలు మానవులవలెనె నిలకడగా యున్నదని చెప్పిరి, దానినిబట్టి ఎంతో వందనములు చెల్లించుచున్నాను. దేవుడు నన్ను ఇంకా తన సేవలో ఉంచి వాడుకొనుచున్నందుకు ఎంతగానో వందనములు, కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. అది నన్ను ఎంతగానో పరవశపరచుచున్నది, దానిని గూర్చి ముందే ఆయన చూపించెను.

10

ఇప్పుడు, ఈ రోజు రాత్రియందు, మీకు పరవాలేదు కదా! అంతా సక్రమముగా యున్నది గదూ? మన ప్రశస్త్ర సోదరుడు నెవిల్ స్వార్థమెరుగని వ్యక్తి, మీలో కొందరు గత ఆదివారం ఇక్కడ యుండి అతడందించిన అద్భుతమగు వర్తమానమును వినియుందురు. “నూనె బుడ్డే” అను అంశము - నేను అంత అద్భుతమైన ప్రసంగమును ఎన్నడూ వినలేదు. సహో, నెవిల్ పరిశుద్ధాత్మ ద్వారా గత ఆదివారం దానిని అందించెను. దేవుడు సమకూర్చిన, ఈ చిన్న గొర్రెల గుంపుకు దానిని అందించెను. అదంతా పరవాలేదు, ప్రభువు చిత్తమైతే సహో. నెవిల్ కు, సంఘమునకు ఇష్టమయినచో ఈ రాత్రి నేను మరల వర్తమానమందించ గోరుచున్నాను. ఆదివారం రాత్రి, సోమవారం రాత్రి, బుధవారం రాత్రి ఈ కూటము లుండును — ఆ ధ్యానాంశములను అధ్యయనం చేశాను.

11

ఆస్పత్రియొద్ద నేను ఉండనవసరం లేదు గాని, నాకు వారెంతో మంచిగా యున్నారు. నాకు గదిని మూడో వంతు ఖరీదుకు ఇచ్చిరి, నా బైబిలును, పుస్తకమును, తీసికొని వెళ్ళి పడకంతా వాటిని పరచుకొని అచ్చట కూర్చొన్నాను. నా బైబిలు అధ్యయనం కొరకు అన్నీ పరచి అక్కడ కూర్చొనియుంటిని. వారు నాకు ఆముదమును ఇచ్చిరి; అంతటితో నా పని అయిపోయినది. నా మంచి సమయం ముగిసినది. పాట్ సోదరుడా, నిజంగా నాకు జబ్బు చేసినది, దానిని నేను తట్టుకొనలేను; కాని మొదటి మూడు లేదా నాలుగు రోజులు మంచిగా అక్కడ సమయము దొరికినది,

మంచి సమయమును గడిపాను. ఎఫెసీ పత్రికను గూర్చి అధ్యయనం చేశాను, అది సంఘమును క్రమపరచి సమాధానపరచినదిగా మరియు చాలా అద్భుతమైన సంగతిగా నేను గ్రహించాను.

12

మీరు ఏదయినా ఆలయమునకు వెళ్ళుచున్నట్లయితే అక్కడికే వెళ్ళండి, మీ విధిని నిర్వహించండి. మీరు ఏ సంఘమునకు లేనిచో ఈ రాత్రికి మరల రండి. ఈ రాత్రి, బుధవారం రాత్రి, ఆదివారం రాత్రి నేను తీసికొందును. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము, ఈ రాత్రికి తీసికొందును. బుధవారం రాత్రికి ఎఫెసీ పత్రిక 2 అధ్యాయము తీసికొందును, తరువాత ఆదివారము ఎఫెసీ 3వ అధ్యాయము తీసికొందును. సంఘమును క్రమశిక్షణలోకి తీసుకొని వచ్చుటకు నేను ఆశించుచున్నాను. నా భావమును గ్రహించండి — దానియొక్క స్థానములో దానిని అమర్చుటయగును. అది సంఘమును ముందుకు కొనసాగిపోవునట్లు చేయు కార్యమని నేను తలంచుచున్నాను.

బ్రెన్హాం ఆలయమునకు వచ్చు వారికి నేను ఈ సంగతులు చెప్పగోరుచున్నాను. నా ప్రియ సోదరులలో కొందరికి కూటములున్నవని నేనెరుగుదును. సెల్లర్స్ బర్గ లోను, ఇంకా ఆయా చోట్లను మన సోదరులకు కూటములున్నవి, చూడండి, అవి ఉజ్జీవ కూటములు. మీరు వాటికి హాజరుకండి. వారు క్రీస్తు సేవకులు - ఏర్పడిన ఖాళీని నింపుటకు వారు బయటకు పిలువబడిన యువకులు. వారి స్వంత సంఘమే సత్యమును నిరాకరించినది, దానిలోనుండి వారు బయటకు వచ్చిరి, మరియు సేవ చేయుటకు వారిని దేవుడు పిలచెను.

13

వారిని నేను ప్రశంసించుచున్నాను... అతనియొక్క పేరు నాకు గుర్తులేదు కాని చక్కని యువకుడు, అందముగా కనబడు వ్యక్తి, చక్కని భార్య, పిల్లలున్నారు.

సహో. జూనీ జాక్సన్ ఇక్కడ కొన్ని కూటములను ఏర్పాటు చేసియున్నాడు, దేవుని యొక్క ఆశ్చర్యకరమగు కృపకు అతడు ఒక అద్భుతమగు, గుర్తింపదగు బహుమానము.

మీ సంఘములలో వారు కూటములను ఏర్పరచునప్పుడు, మీరు వెళ్ళుడి, ఎందుకనగా అది చేయవలసిన కార్యము, ఎందుకనగా మీకు తెలియదు - ఒక పాపి బలిపీఠము యొద్దకు రావచ్చును, ఆ వ్యక్తిని క్రీస్తు నొద్దకు నడిపించునట్లు ప్రభావితము చేసిన వ్యక్తివి నీవే కావచ్చు, అది ఆవలి దరిని నీకు గొప్ప బహుమానము కలుగవచ్చును. ఇది కేవలము ఉపదేశము మాత్రమె మరియు ఆలయము యొద్దనున్న సంఘమును క్రమపరచుట కావచ్చును, ఈ ప్రార్థనా మందిరములో మేము ముందుకు కొనసాగిపోవుటకు, ఇది మాకు ప్రయోజనకరముగా యుండును.

14

నా గడియారమును నేను తెచ్చుకొనలేదు గనుక మీలో ఒకరు నా గడియారముగా పనిచేయవలెను. డాక్స్ నా కొరకు గడియారమును ఇచ్చుదునని పలికియున్నాడు. [సహో, బ్రెన్హాం తన సోదరుడగు ఎడ్లర్ “డాక్” బ్రెన్హాంతో సంభాషించుచున్నాడు]

15

ఇప్పుడు, నేను ఎక్కువసేపు మాట్లాడను. మనయొద్దకు క్రొత్తవారు వచ్చియుండవచ్చును, మా నిండు హృదయములతో మేము మిమ్ములను లోనికి ఆహ్వానించుచున్నాము. ఈ చిన్న ఆలయములోనికి మీకు ఎంతో సాదరముగా ఆహ్వానమందించుచున్నాము. మనకు పెద్ద భవనము లేదు, దానిని నిర్మించవలెనను కార్యక్రమము మనకున్నది. పెద్దదేమీ కాదు, ఇది మరీ ఇరుకు అయిపోయినది. ప్రభువు అనుమతించినట్లయితే ఇక్కడ త్వరలోనే ఒక చక్కని సౌకర్యము గల ఆలయమును నిర్మించుదుము. అందుకు ప్రయత్నించుచున్నాము, దీనికొరకు మీలో అనేకులు పాటుపడుచున్నారు, దానిని నిశ్చయంగా ప్రశంసించుచున్నాము.

16

ఈ ఉదయమున నాతో పాటు మీరు వాక్య భాగమును చదువుటకు I సమూయేలు 8వ అధ్యాయము - 19 మరియు 20 వచనములను తీసికొందము. మన అంశము నిమిత్తము చిన్న సందర్భమది, మనము దానిని చదువుచుండగా గమనించండి, తరువాత ప్రార్థన చేసికొందము. “నన్ను జ్ఞాపకము చేసికొనుడి” అని చెప్పవారెవరైనా యున్నారా? ఏవైనా విన్నపములున్నచో తెలియచేయండి.

17

మనము గత... రెండు లేదా మూడు వారముల క్రితము నేను జరిపిన కూటములలో, మీరు పరిశుద్ధ గ్రంథమును త్రిప్పచుండగా, దీనిని ఆలకించండి, చటాకా కూటములు ఆరవ తేదీన ప్రారంభమగును. ఓహియోలోని మిడిల్ టవున్లో గొప్ప సమయము కొరకు మేము ఎదురుచూచుచున్నాము, సెలవులు యున్నవారు అక్కడికి రండి. నదియొద్దనే పెద్ద కూటము జరుగును, మీరెన్నడు వినని బోధను విందురు. వారందరూ నదియొద్దకు వచ్చుచూ, పోవుచూ ఉందురు - ప్రతి ఉదయమున బోధకులు వచ్చెదరు మరియు పగలంతా, రాత్రంతా బోధించెదరు. కావున వారందరునూ వచ్చెదరు. అది పెద్ద సమావేశ మైదానము, సిల్వర్ హిల్స్ కంటే ఎన్నో రెట్లు పెద్దది; ఎనిమిది లేదా పదివేలమంది పట్టునంత పెద్ద స్థలమది, అదెప్పుడూ క్రిక్కిరిసియుండును. ఓహియోలో ఎంతో గొప్ప సమయమనుభవించు తరుణము ఆసన్నమైనది.

18

వృద్దుడగు సహో, కిడ్ కు ప్రార్ధి౦చుటకు ఒక ఉదయాన వెళ్ళాను - మూడు వారముల క్రితం నేను చెప్పిన దానిని మీరందరూ వినియుందురు. అతడు ఇరవై నాలుగు గంటలు మాత్రమే జీవించునని వైద్యుడు చెప్పెను. ఇప్పుడతడు, లేచి తిరుగుచున్నాడు, పాట కూడ పాడలేని స్థితిలో ఉండిన అతడు ఒక లేఖనమును ఉదహరించెను. నేను లోనికి వెళ్ళి ఒక ఉదయము అతడిని చూచినప్పుడు, అతడిపై పల్చటి దుప్పటి ఒకటి కప్పబడియుండినది. అతని యొద్దకు చేరుకోవలెనని మూడు, నాలుగు గంటల పగటి వేళ లేచి పయనించాను. ఆ దినము చనిపోవునని వైద్యుడు చెప్పెను - ప్రాస్టేట్ గ్రంధిలో కాన్సరున్నది.

19

ఆయన యొక్క ప్రశస్తమగు వృద్ధ భార్య, బట్టలుతికి, దినమునకు ఏబది సెంటులు సంపాదించుచుండెను. కూలి కొరకు ప్రొద్దు పొడవక ముందే వెళ్ళి చీకటి పడిన తరువాత ఏబది సెంటుల కొరకు పనిచేయుచు, ఆ విధముగా ఆమె తన భర్తను సువార్త సేవకు పంపించినది. రెండు వారముల ఉజ్జీవ సభలను ఏర్పరచి ఒక్కసారే కానుక తీసి చూచిన యెడల అతడికి ఎనభై సెంటులు మాత్రమే వచ్చుచుండెను. వారిరువురు, ఇప్పుడు వృద్దులైపోయిరి. ఒకరోజున వారు కూర్చొనియుండగా చూచాము. (చిన్న జంటగా యుండిరి) అతడు చిన్న బట్టను కప్పకొనియుండెను. ఆ వృద్ధ సేవకుని యొక్క పరిచర్యలో రక్షణను పొందిన ఒకడు తొంబది రెండు సంవత్సరముల వాడై అక్కడ కూర్చొని యుండెను, తెలివైన వాడు, మరియు అసలైన పెంతెకోస్తు, మీకు తెలుసు.

“వృద్దులారా, ఇక్కడెందుకు కూర్చొనియున్నారు?” అనడిగాను.

“పడవ కొరకు ఎదురు చూచుచున్నాము,” అన్నారు.

వారి పని, వారు తమకు అప్పగింపబడిన పనిని చేసిరి, తమ ఉద్దేశ్యమును తాము నెరవేర్చిరి, తమ బహుమానము అందుకొనుటకు వారిప్పుడు సిద్ధముగా యున్నారు. ఆ ఉదయమున కిడ్ సోదరుని ఇట్టడిగాను, “చటాకా కూటమునకు వచ్చెదరా?'

అతడు నిన్నటి దినమున నాకు ఫోను చేసి పిలిచి, ఇట్లనెను, “బ్రెన్హాం సోదరుడా! నేనక్కడికి వచ్చుదును,” అది చాల మంచిది.

20

నా నూతన సేవ ద్వారా మారిన వారనేకులు, అచ్చటికి వచ్చుచున్నారు. ఒక బాప్టిస్తు సోదరుడు ఇరువది సంవత్సరముల వయస్సు గల తన కుమార్తెతో ఇచ్చట నిలబడియున్నాడు. అస్సలు మాట వినని కుమార్తె, ఒకానొక దినమున ఉదయమున అతనితో నేనిట్లన్నాను, “నీ కుమార్తెను ప్రభువైన యేసు కొరకు నేను నీకు యిచ్చుచున్నాను.” అతడు గృహమునకు వెళ్ళి చూచినప్పుడు, ఆమె రక్షించబడియున్నది. ఇచ్చటయున్న ఇంకొక కుమార్తె ఈ రోజు యున్న బాప్తిస్మము ఆరాధనలో బాప్తిస్మము తీసుకొనబోవుచున్నది. ఇంకా ఇక్కడ బాప్తిస్మము పొందవలసినవారున్నారు, అనేకులు వచ్చుచున్నారు.

కెనడా నుండి వచ్చిన నా స్నేహితుడు సాదీమన్ ఉన్నాడు - అతని అత్త చావు బ్రదుకుల మధ్య ఉన్నది. “నీవు ఇంటికి వెళ్ళేసరికి నీ అత్తను మంచి ఆరోగ్యస్థితిలో చూచెదవు; ఆమె బాగవును,” అని చెప్పాను మరియు ఆ విధంగానే జరిగినది. ప్రజలు వచ్చుచున్నారు, అది ఇప్పుడు ప్రారంభ దశలో యున్నది. అది ఆ విధముగా వర్ధిల్లుచూయున్నది. ఓ, మనము విన్నవించుకొనుచున్నాము, తలంచుచున్న దానికంటే అత్యధికముగా ఎదురుచూచుచున్నాము, మనము పక్షిరాజు కాలములో యున్నాము, చివరి దినములే గాని, మహిమకరమగు ఘడియ ఇది.

21

ఇప్పుడు, చదువుటకు మీరు బైబిల్ తెరచుదురా? సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము. రికార్డు యొద్దనే నిలచియుందునని జినీకి చెప్పాను, మన కూటమును ఇప్పుడే ఆరంభించుకొనుచున్నాము.

అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవినిబెట్టనొల్లక; ఆలాగున కాదు. జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను;

మా రాజు మాకు న్యాయము తీర్చును; మా ముందర పోవుచు, అతడే మా యుద్ధములను జరిగించుననిరి.

సమూయేలు జనుల యొక్క మాటలనన్నిటిని విని, యెహోవా సన్నిధిని వాటిని వివరించెను.

గనుక యెహోవా - నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలుకు సెలవియ్యగా, సమూయేలు - మీరందరూ మీమీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చెను.

ఈ ఉదయమున కొద్ది నిమిషముల కొరకు నేను ఎన్నుకొనిన అంశము: “త్రోసివేయబడిన రాజు,” నేను ఏర్పాటు చేసుకొనిన అంశము.

22

అన్ని కాలములలోవలెనే, ఈ కాలములోను, జనులు దేవుని నడిపింపునకు ఒప్పుకొనలేదు. వారికి వారి స్వంత నాయకత్వమున్నది. దానినే వారు ఆశించిరి. ఆ గాథనే ఈ ఉదయము చదివియున్నాము (మీరు ఇంటికి వెళ్ళిన తరువాత, మొత్తం గాథను చదువుడి, మీకది మంచిది.) దైవజనుడును, ప్రవక్తయునగు సమూయేలు కాలములో ఇది జరిగినది. అతడు నీతిమంతుడు, మంచివాడు, గౌరవనీయుడు, పేరుపొందినవాడు, సత్పురుషుడు, ప్రజల పట్ల యధార్థముగా ప్రవర్తించి ఎన్నడూ మోసము చేయనివాడు. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,” అని సూటిగా తప్ప మరే విధంగానూ మాట్లాడేవాడు కాడు.

23

కాని ప్రజలు ఈ కార్యక్రమమును మార్చివేయవలెనను ఆలోచనకు వచ్చిరి. వారు ఫిలిస్తీయులను, అమాలేకీయులను, అమోరీయులను, హిత్తియులను, ఇంకా ఇతర ప్రపంచ దేశముల వారిని వారు చూచుచుండిరి. వారిని రాజులు పరిపాలించుచుండిరి, రాజులే వారిని ఏలుచుండిరి, మార్గమున నడిపించుచుండిరి, యుద్ధములను జరిగించుచుండుటకు వారు చూచిరి.-ఈ ప్రజలవలెను, ఈ రాజుల మాదిరిగాను తమకు కూడా యుండవలెనని ఇశ్రాయేలీయులు తలంచిరి.

కాని తమ ప్రజలు లోక జనులవలె, ప్రవర్తించవలెనని ఏ యుగములోనూ దేవుడు ఉద్దేశించలేదు. ప్రపంచ ప్రజలవలె వారు పరిపాలించబడరాదు, వశపరచుకొనబడరాదు. దేవునియొక్క ప్రజలు ఎల్లప్పడును ఒక వింత జనాంగముగాను, ఒక ప్రత్యేక ప్రజలు గాను, బయటకు పిలువబడినవారుగాను, వారి క్రియలు, మార్గములు, జీవన విధానములలో ప్రపంచ ప్రజలకు పూర్తి భిన్నమైనవారిగాను ఉందురు. వారియొక్క వాంఛలు, వారియొక్క వస్త్రధారణ, ఎల్లప్పుడును లోకము యొక్క ప్రజల కోరికలకు వేరుగా నుండును.

24

ఇశ్రాయేలీయులు ప్రజలు సమూయేలు నొద్దకు వచ్చి ఇట్లనిరి, “నీవు ముసలివాడవగుచున్నావు, నీ కుమారులు నీ మార్గములో నడచుట లేదు,” ఎందుకనగా వారు సమూయేలు వంటి వారు కారు. వారు లంచగొడులు, ధనాశపరులు. సమూయేలూ, నీ కుమారులు నీవంటి వారు కారు, కావున నీవు వెళ్ళి మా కొరకు ఒక రాజును చూడుము, అతనిని అభిషేకించుము, లోకములోని ఇతర జనులవలె మమ్మును చేయుము,“ అనిరి.

అది మంచి పని కాదని సమూయేలు చెప్ప ప్రయత్నించెను. మీరావిధముగా చేసినచో ఆ రాజు ఎట్లు౦డునో ముందే అతడు చెప్పెను, “రాజు మీ కుమారులను ఇంటిలో నుండి బయటకు పిలచి సైనికులనుగా చేయును, తన రథముల ముందుర పరుగెత్తించును, తన ఈటెలను, యుద్దాయుధములను మోయునట్లు చేసికొనును. అంతే కాదు. అతడు మీ కుమార్తెలను పిండి పిసుకు వారినిగా చేయును. మీ యొద్ద నుండి వారిని తీసికొనిపోయి సైన్యమునకు ఆహారము వడ్డించువారినిగా చేయును, అంతే కాకుండా మీ యొద్దనుండి అతడు సుంకము వసూలు చేయును, మీ పంటను తీసికొనును, మీ రాబడిని తీసికొనును. ప్రభుత్వ అప్పులను తీర్చుటకు మీకున్నదంతా అతడు తీసికొనును, కాబట్టి మీరు పెద్ద పొరపాటు చేయుచున్నారు, గ్రహించండి.”

“అయినా గాని మాకును ఇతర ప్రజల మాదిరిగా రాజు కావలెను,” అని వారనిరి.

25

స్త్రీలు, పురుషులు ఎప్పుడూ మరియొకరివలె ఉండగోరుదురు. మనకు మాదిరిగా యుండుటకు ఈ భూమి మీద ఒకే ఒక వ్యక్తి జీవించెను, ఆయనే మనందరికొరకు చనిపోయెను; ఆయన వున ప్రభువును, రక్షకుడును అగు యేసుక్రీసు. మనమేలాగుండవలెనో ఆయనే పరిపూర్ణ మాదిరి చూపించెను, ఎల్లప్పుడూ తండ్రి పనిమీద ఉండి, సరియైన దానిని చేయుచుండెను.

26

సమూయేలు ప్రజలను ఎంత ఒప్పింప ప్రయత్నించినా కుదరలేదు. దివారాత్రులు వారు ఒకే మనవి చేయుచుండిరి, “మాకు ఒక రాజు కావలెను, ఒక వ్యక్తి మాకు కావలెను, ఆ వ్యక్తి మాకు మార్గదర్శిగా యుండును,” అనుచుండిరి. అది ఎన్నడునూ దేవుని చిత్తము కాదు, అది దేవునికి ఇష్టము కాదు. మానవులు ఒకరినొకరు ఏలుకొనుటనునది ఎన్నడునూ దేవునికి ఇష్టమైన పని కాదు. దేవుడే మానవుని ఏలవలెను, దేవుడే మన రాజు మరియు పరిపాలకుడు. ఈనాటికిని మానవుని ఉద్దేశ్యములో ఏమీ మార్పు రాలేదు. మానవుని మానవుడు ఏలుటకు బదులుగా, దేవుడు మానవుని ఏలుచుండవలెనను సంగతి వీరికి అర్థమగుట లేదు.

కావున వారు సౌలు అను ఒకనిని తమకు రాజుగా ఎన్నుకొనిరి, అతని తండ్రి పేరు కీషు. అతడు గౌరవము, పేరు-ప్రఖ్యాతులుగలవాడు, అతడు ప్రజలకు సరిగ్గా సరిపోయెను, ఎందుకనగా చాలా ఎత్తు, లావుగల మనిషి దేహదారుఢ్యము గలవాడు. ఇశ్రాయేలీయులలో ఎవరునూ అతని భుజముల యొద్దకు రాలేదు. అతనిది రాజ ఠీవి. అందమగు ముఖ వర్చస్సు గలవాడు. అతడు అమోఘమగు మనిషి, అందరిని మించినవాడు.

27

ఈనాడు కూడా జనులు అటువంటి మనిషి కొరకే ఎదురుచూచుచున్నారు. దేవుడు పరిశుద్దాత్మ ద్వారా తన సంఘము పరిపాలించబడి, వశపరచుకొనబడవలెనని కోరుచున్నాడు, కాని అది ప్రజలకు సంతృప్తికరముగా ఉన్నట్లు తోచుట లేదు. వారికి ఒకవ్యక్తి కావలెను, ఒక శాఖ కావలెను, సంఘమును పరిపాలించుటకు ఒక గుంపు కావలెను. వారు పూర్తిగా తమ్మును దేవుని హస్తమునకు అప్పగించుకొనక, ఆత్మ సంబంధులుగా యుండకుండా, పరిశుద్దాత్మ ద్వారా నడిపించబడుటకు వారిని వారు దేవునికి సమర్పించు కొనరు, వారిని నడిపించుటకు ఒకరు కావలెననియు, ఎవరో ఒకరు తమ కొరకు చేయవలెననియు, అది ఏ విధముగా చేయవలెననియు, దానినంతటిని ఎవరైనా తమకు చెప్పవలెననియు వారు ఆశించుచున్నారు. కావున ఇతడు తగిన వ్యక్తిగా కనిపించెను, ఎందుకనగా అతడు చాలా మేధావి.

ఇది చాలా వరకు నేటివలెనెయున్నది. మనము కూడా అటువంటి వారినే ఎన్నుకొనుచున్నాము. మన సంఘములను వశపరచుకొనుటకు, దేవుని యొక్క సంఘమును నియంత్రించుటకు అటువంటి వారినే మనము ఎన్నుకొనుచున్నాము. దానికి వ్యతిరేకముగా నేనేమీ చెప్పుట లేదు, కాని దానిని చెప్పి తీరవలయునని చెప్పుచున్నాను. అది ఆ విధముగా లేదు, అది ఆ విధముగా ఉండనూ లేదు, అది ఎన్నటికి ఆ విధముగా యుండదు కూడా. అది ఆ విధముగా యుండాలనేది దేవుని యొక్క చిత్తము కూడా కానే కాదు. దేవుడు తన ప్రజలను ఏలవలెను, ప్రతివారిని ఆయనే పరిపాలించవలెను.

28

ఈ కీషు కుమారుడు - చాలా గొప్ప మనిషి, అతని వ్యక్తిత్వము గొప్పది. ప్రజలకు అతడు తగినవానిగా యుండెను, అతడు ధరించిన అంగీ గొప్పగా కనబడెను. అతని తలమీద కిరీటము పెట్టితే బాగుండుననిపించినది. ప్రజలందరికంటె అతడు గొప్పవానిగా కనబడెను. ఇశ్రాయేలు రాజ్యమునకు అతడు నిజమైన ఆస్తిగా కనిపించెను. ఇతర దేశములలోని ఇతరు రాజులు ఇట్లనుకొందురు. “ఎట్లున్నాడో అతనిని చూడండి!” వారందరూ వ్రేలు పెట్టి చూపించి ఇట్లందురు “మనకు దొరికిన రాజు, మహా గొప్ప వ్యక్తి, మనలను ఏలుటకు ఎంత గొప్పవాడు వచ్చెనో చూడండి.”

విచారముతో దీనిని నేను చెప్పుచున్నాను, కాని నేటి సంఘములో అది ఎంత వాస్తవముగా యున్నదో చూడండి. వారట్లు చెప్పుటకు ఇష్టపడుదురు, “మా సంఘకాపరి సంకుచిత భావలుగలవాడు కాడు, అతడు చాలా గొప్పవాడు, అతడు హార్వార్డ్ లో పట్టబద్రుడుగా ఉత్తీర్ణుడయ్యెను, లేక ఏదో పెద్ద వేదాంత కళాశాల నుండి చదివి వచ్చినవాడు, పలాని-పలాని చోట నుండి నాలుగు డిగ్రీలు పొందియున్నాడు, అతడు జనుల మధ్య ఎంతో చక్కగా కలిసిపోవును.” అదంతా సరియే కావచ్చును. మ౦చి స్థానములోనే ఉండియుండవచ్చును, కాని దేవునియొక్క సంఘము దేవునియొక్క పరిశుద్దాత్మ ద్వారానే నడిపించబడవలెను. ఆయన ఆత్మద్వారానే నడిపించబడవలెను, కాని వారు ఈలాగున చెప్పగోరుదురు, “మేము ఈ గొప్ప శాఖకు చెందియున్నాము, మేము ఎప్పటినుండియో ఈ సంఘమును ప్రారంభించాము. అప్పుడు చాలా తక్కువగా మేమున్నాము, ఎందుకనగా ప్రారంభించినది మేమే. చాలా కొద్దిమందిమిగా మేముండేవారము; మేమిప్పుడు ఎంతగా పెరిగిపోయామంటే, ఈ స్థలము చాలుట లేదు. మాదే అన్నింటికన్న పెద్ద శాఖ, మాకు అత్యుత్తమ పాఠశాలలున్నవి, గొప్ప విద్యనభ్యసించిన సేవకులున్నారు, మాకు అత్యుత్తమ వస్త్రములను ధరించుకొను జనులు వచ్చెదరు. పట్టణములోని అతి గొప్ప మేధావులు మా శాఖకు హాజరగుదురు, మేము దాతృత్వపు పనులను చేయుచున్నాము, మేము ఎంతో మంచి కార్యములు చేయుచున్నాము,” అని చెప్పుకొనుటకు వారు ఆశించెదరు. వాటివలన ఏ ప్రయోజనము లేదు — దానికి వ్యతిరేకముగా ఒక్క మాట చెప్పినా గాని దేవుడు నన్ను మన్నించడు, ఎందుకనగా అవన్నీ మంచి పనులే; అయినా గాని మానవునిపై మానవుడు ఏలుబడి చేయుట మాత్రము దేవుని చిత్తము కాదు.

29

మానవుల హృదయములను ఏలుటకు, వారి జీవితములను పాలించుటకు దేవుడు పెంతెకోస్తు దినమున పరిశుద్దాత్మను పంపెను. మనిషి మనిషిని ఏలుట కొరకు కాదు.

కాని దానిని చెప్పుటకు మనం ఇష్టపడుచున్నాము.

అటువంటి గొప్ప సంస్థకు చెందినవారిమని చెప్పుకొనుట చాలా అతిశయించవలసిన విషయమే కావచ్చును. నీవు క్రైస్తవునివా? - ఈ అంశమును అందుకే నేను తీసికొన్నాను. నేను ఆస్పత్రి యొద్ద ఉండగా ఒకరిని ఇదే అడిగాను, “నీవుక్రైస్తవునివా?” “నేను పలాని-పలాని సంస్థకు చెందాను,” అని జవాబిచ్చెను.

“నీవు క్రైస్తవునివా?”

“నేను పలాని-పలాని దానికి చెందియున్నాను.”

నేను పడక మీద యుండి ఆస్పత్రిలో పరిశుద్ధ గ్రంథమును చదువుచుండగా, ఒక నర్సు నాయొద్దకు వచ్చినది, ఆమె క్రొత్తగా వచ్చినది, ఆమె నన్ను పలుకరించినది, “మీరెట్లున్నారు? మీరు రెవరెండు బ్రెన్హాం గారు కదా? వైద్య పరీక్ష నిమిత్తం ఇక్కడికొచ్చిరి.”

“నేను అవును,” అన్నాను.

“మీకు మరికొంత ఆరోగ్యము కలిగేందుకు, మీ వీపును కొద్దిగా మందుతో మర్ధనము చేయవలెను,” అన్నది.

“ఆలాగె నీవు చేయవచ్చు,” అన్నాను.

ఆమె నా వీపును మర్ధనా చేయుచూ, “మీరు ఏ సంఘమునకు చెందినవారు?”

“ఓ! నేను అతి పురాతనమైన శాఖకు చెందినవాడను,” అని జవాబిచ్చాను.

“ఆ శాఖ పేరు ఏమిటి?” అన్నదామె.

“అది ప్రపంచము ఏర్పడక ముందే ఏర్పడిన శాఖ,” అన్నాను.

“ఓ! ఏమిటి” “మీరు చెప్పేది నాకర్థమగుట లేదు,” అన్నది. “నేను పలాని సంఘమునకు చెందియున్నాను, మీది కూడా అదే సంస్థ కదా?” అన్నది.

నేనన్నాను, “కాదు, అది కేవలము 200 సంవత్సరముల నాటిదే కదా! కాని నేను చెప్చే ఈ శాఖ, మానవ జాతిని రక్షించుటకు ఒక రక్షకుడు వచ్చుటను చూచినప్పుడు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పడు, దేవుని కుమారులు ఆనందముతో చప్పట్లు కొట్టినప్పుడు ఏర్పడినది.”

30

ఆమె నా వీపుకు మర్ధనా చేయుటను ఆపినది, ఆమె మర్ధనా చేయుటకు వీలుగా ఒకవైపుకు కొద్దిగా వంగాను. (ఆమె ఇక్కడున్న కారిడాన్ వాస్తురాలు) మేము సంభాషించుకొన్నాము, ఆమె ఇట్లడిగినది, “అయ్యా! నేను దేవునియందు విశ్వాసముంచుచున్నాను, ఆయన పూర్వకాలములో ఎట్లు౦డెనో ఇప్పుడును ఆ విధంగానే యున్నాడని నమ్ముచున్నాను. మా సంఘము దీనిని కాదన్నా గాని నేను మాత్రం అది సత్యమని నమ్ముచున్నాను.”

“ఓ యువతీ, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు,” అన్నాను.

“ఆయన స్వస్థపరచువాడైనప్పుడు, నేడును ఆయన స్వస్థపరచువాడే,” అన్నది.

“సోదరీ, ఆయన కచ్చితముగానే ఆలాగు చేయును,” అన్నాను.

31

కాని మానవుడు ఏలవలెనని కోరుకొనుచున్నాడు, మనిషి మనిషిని ఏలవలెనని కోరుచున్నాడు. దేవుడు తనను ఏలవలెనని మానవుడు కోరుకొనుట లేదు.

ఈ కీషు కుమారుడు (సౌలు అను పేరుగలవాడు) వారియొక్క కోరికకు జవాబుగా వారికి కనబడెను, చాలా హుందాగా కనిపించెను. వారి తరుపున యుద్ధములు చేయునని తలంచిరి, కాని అది దేవుని విధానము కాదు. దేవుడు తనయొక్క నమ్మకమగు వృద్ధ ప్రవక్త వారిని నడిపించి, తన మాటలను వారికి అందించవలెనని కోరెను.

32

ఈనాడు మనం గొప్ప సంఘకాలములో జీవించుచున్నాము, దేవుడు మన కొరకు నిర్ణయించిన దానిని మనము చేయకుండా నిశ్చయంగా వాటిని తలక్రిందులుగా చేసి, వారు చేసినటుగానే మనము కూడా చేయుచున్నామని హృదయపూర్తిగా నేను నమ్ముచున్నాను. మన రక్షకుని యొక్క చివరి పలుకులు మార్కు 16లో యున్నవి: “మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వసృష్టికి సువార్తి ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును; నమ్మనివానికి శిక్ష విధించబడును. నమ్మినవారివలన ఈ సూచకక్రియలు కనబడును, నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు, వారు క్రొత్త భాషలు మాట్లాడుదురు, వారు సర్పములను ఎత్తి పట్టుకొందురు, విషకరమైనది ఏదయినా వారు త్రాగినా గాని; అది వారికి హాని చేయదు, వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు బాగవుదురు.”

33

పరిశుద్దాత్మ యొక్క నాయకత్వమును తలదన్ను మానవుడు ఎవడునూ లేడు, కీషు కుమారుడు గాని మరెవరూ గాని అందుకు సరిపోరు. కాని మనం పాఠశాలలను ఏర్పాటు చేసికొన్నాము, మనం సెమినరీలను ఏర్పరచుకొన్నాం, మిగిలిన ప్రపంచమువలె కనబడుటకు, సంతృప్తి చెందుటకు సంస్థలను ఏర్పరచుకొన్నాము.

ఇప్పుడు, ఆనాటి కాలమున పరిశుద్దాత్మయే ఈ దేశమునకు నాయకత్వము వహించుచుండెడిది. ఈ దేశమును దైవాత్మ ఏలుచుండెడిది, వారు స్వాతంత్ర్య ప్రకటనను వ్రాసినప్పుడు, అచ్చట ఒక ఖాళీ కుర్చీయుండెడిది. ఆ కుర్చీ మీద దేవునియొక్క కుమారుడు కూర్చొనియుండేవాడని నిస్సందేహముగా చెప్పగలను. ఈ దేశము యొక్క నియమములను గమనించండి, మత స్వాతంత్ర్యము, అ౦దరికి స్వేచ్చ అను దేవుని యొక్క నిత్య వాక్యసూత్రములను ఆధారము చేసికొని రాజ్యాంగము వ్రాసిరి. కాని మనం కలుషితము చేశాము — రాజకీయము. వ్యాపార సరళిలో మనం ఓటు వేయుచూ, అబద్ధపు వాగ్దానములను నమ్ముచూ, మన దేశమును, మన రాజకీయమును, మన ప్రజాస్వామ్యమును కలుషితము చేశాము - కమ్యూనిజం మరియు ఇతర “వాదము” లతో దానిని కలుషితము చేసియున్నాము.

34

ఐక్యరాజకీయ సమితి సమావేశములు ప్రారంభమగునప్పుడు, చర్చలకు ముందు మన నాయకులు సమావేశమై ప్రార్థి౦చెడివారు. ఈ మధ్య ఒక గొప్ప చర్చ సందర్భముగా వారు కూడికొనినప్పుడు అసలు ప్రార్థన ప్రస్తావనే రాలేదు. ప్రార్ధన లేకుండా మనం ఈ సమస్యలను ఎట్లు పరిష్కరించగలము? పరిశుద్దాత్మ నాయకత్వము లేకుండా మనం ప్రపంచములో ఏదయినా సాధించగలమనుకొనుట: పెద్ద పొరపాటు.

కాని దేశం పట్ల ప్రేమతోను, గౌరవముతోను దీనిని చెప్పుచున్నాను, దాని పతాకమును గౌరవించెదను, ఇది రిపబ్లిక్ దేశము, అందుకొరకే ఏర్పడినది: పరిశుద్దాత్మ అను మన నాయకుని మనం త్రోసివేసియున్నాము, చెడిపోయిన రాజకీయముల ద్వారా మనుష్యులలోనికి వంకర బుద్ధిని తీసికొని వచ్చియున్నాము. వారు ముందెన్నడూ చేయని ఘోరమగు తప్పును ఇపుడు చేయుచున్నారని మీరు గ్రహించగలరు. ఎందుకనగా మనుష్యుడే ఏలవలెనని జనులు కోరుకొనుచున్నారు.

35

ఈ అమెరికా దేశపు రాజధానిలో అధ్యక్షునిగా ఉండవలసిన వ్యక్తి, కాంగ్రెస్ లో ఉండవలసిన సభ్యులు, మన న్యాయస్థానములో నియమితులు కావలసిన వారు దైవభక్తి కలిగి జీవితములను సమర్పించుకొనినవారై యుండవలసిన అవసరమున్నది. వారు పరిశుద్దాత్మతో నింపబడి దైవసన్నిధి ద్వారా నడిపించబడవలెను. కాని దానికి బదులుగా, మనం తెలివిగలవారిని, పైపై భక్తిగలవారిని, దేవుని శక్తిని ఆశ్రయింపనివారిని, దేవుని మీద నమ్మకంలేనివారిని, హీనులను మన దేశ రాజకీయములలోనికి తీసికొని వచ్చియున్నాము. అంతే కాదు — మన సంఘములలోనికి మనము తీసికొని వచ్చితిమి.

మన సంఘములు చెడిపోయియున్నవి. మనం అటువంటి కాపరులను మన నాయకులుగా ఎన్నుకొంటిమి. మనం సెమినరీలలోనికి వెళ్ళి, మహా-మేధావులని పేరొందిన వారిని తీసికొని వచ్చాము. వారు బహు మేధాశక్తిగలవారే కావచ్చు, గొప్ప పండితులే అవవచ్చు, జనులలో గొప్పగా కలిసిపోవువారే కావచ్చు, పొరుగువారి మధ్య గొప్ప పేరొందిన వారే కావచ్చు, వారికి నేను విరోధిని కాను. వారి జీవితపు విధానమది, వారు జాగ్రత్తగా శిక్షణ పొందిరి, జనుల మధ్యవారి ప్రవర్తన చక్కగా చూచుకొంటారు, తమ రంగములలో మహా ప్రవీణులు, వారి గూర్చి చెడ్డ మాట్లాడను — నా ఆత్మ అంతగా చెడిపోయినచో దేవుడు మందలించును గాక! అయినా, దేవుడు అందుకొరకు మనలను ఏర్పరచుకొనలేదు! పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వము మనకు కావలసియున్నది, మానవుల హృదయములలో క్రీస్తు ఉండవలెను.

36

మన ప్రసంగ వేదికల మీద నిలబడియున్న ఎందరో మేధావులు, పరిశుద్ధాత్మ యొక్క వాస్తవ ఉనికిని ధిక్కరించుచున్నారు. వారిలో చాలామంది దైవిక స్వస్థత మరియు ఆత్మ శక్తి యొక్క ఉనికిని త్రోసివేయుచున్నారు.

37

నేను ఒక వ్యాసం చదువుచున్నాను (అది నిన్న అని నమ్ముచున్నాను) జాక్-కో, వ్రాసిన కొన్ని వ్యాసముల సంపుటిని చదువుచున్నాను, జాక్-కో చనిపోయెను, నేనతనిని ప్రభువైన యేసు నొద్దకు నడిపించాను. అతని దినమున మహా-యోధునిగా జీవించెను, ప్లారిడాలో అతనిని ప్రశ్నించుటకు పిలచిరి, ఎందుకనగా అతడు ఒక యవనస్తుని కాళ్ళ బంధకములు తొలగించి వేదిక మీద నడవమని కోరెను. ఆ విధంగా చేసినప్పుడు, అతడు మామూలుగానే వేదిక మీద నడువగలిగెను, కాని తన తల్లి యొద్దకు రాగానే పడిపోయెను - అదంతయూ క్రీస్తు విరోధులు పన్నిన తంత్రము.

ఈ యువతి, ఆమె భర్త కలిసి మన యోధుడగు సోదరుని న్యాయస్థానములోనికి తీసికొని వచ్చిరి. ప్రతి సంఘము సహో. జాక్ పక్షముగా నిలబడియుండవలెను. యేసుక్రీస్తు నామమునుచ్చరించు ప్రతి సంఘసభ్యుడు, ఆ గొప్ప సోదరుని వైపు నిలబడియుండవలెను. ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేయు ప్రతి ఒక్క వ్యక్తి, తన మోకాళ్ళ మీద యుండి ప్రార్ధి౦చవలెను. కాని అందుకు బదులుగా వార్తా పత్రికలలో పెద్దక్షరములలో పడినది చూడండి. గొప్ప శాఖలలో ఒకటి క్రీస్తు నామమును తగిలించుకొని నాస్తికులతో చేతులు కలిపి సహో. జాక్ కోను ఖండించి చెరశాలలో వేయించిరి. ఆ సంఘము ఎట్టిదో మీరూహించగలరా? దైవజనుని ఖండించుటకు నాస్తికులతో చేతులు కలిపిరి. ఆ దైవజనుడు తన పూర్ణ హృదయముతో పరిశుద్ధ గ్రంథము పక్షముగా నిలబడుటకు ప్రయత్నించెను, కానీ వారతనికి మద్దతునియ్యలేదు.

38

అప్పుడు సహో, గార్డన్ లిండ్సే, అడ్డము నిలచి తప్పించెను. అవిశ్వాసియగు న్యాయాధిపతి ఇట్లనెను, “ఇతడు అబద్ధికుడు, ఎందుకనగా ఇతడు బిడ్డ యొక్క బంధకములను విప్పి, వేదిక మీద నడిపించెను. బిడ్డ స్వస్థపడెనని చెప్పెను, అది అబద్ధము. వైద్యులు వేసిన కట్లు విప్పి తప్పు చేసెను, కాబట్టి ఇతనిని మోసము చేసిన నేరము క్రింద బంధించుచున్నాము,” అని చెప్పెను.

అప్పుడు సహో, కో నిలబడి ఇట్లనెను, “అయ్యా! ఆ నేరారోపణ తప్పు. దేవుడు ఆ బాలుని బాగుచేసెను.”

న్యాయాధికారి ఇట్లనెను, “ఈ న్యాయస్థానపు ఆవరణలో ఉన్నవారెవరయినా నాకు జవాబు చెప్పవచ్చును. వేదికకు ఒక చివర ఉన్న బాలుని దేవుడు స్వస్థపరిచెనని చెప్పుచున్నాడు, అయితే వేదిక యొక్క ఈ చివరకు వచ్చేసరికి మరల వ్యాధిగ్రస్తుడయ్యెనా? అతడు చెప్పిన ఆ మాటను పరిశుద్ధ గ్రంథము ద్వారా నిరూపించినయెడల శ్రీ. కో చెప్పినది నిజమేనని చెప్పి విడిచి పెట్టుదుము.”

ఒక దైవజనుడు నిలబడి తన చేతిని ఎత్తి ఇట్లనెను, “అయ్యా! దానిని నేను వివరించవచ్చునా?”

“తప్పకుండా,” అని న్యాయాధికారి పలికెను.

39

ఆ దైవజనులు నిలబడి ఇట్లు చెప్పెను, “ఒక రాత్రి కరకుగానున్న సముద్రము మీద చిన్న నావ తలక్రిందులై మునిగిపోవుచుండెను, ఇక దానిని రక్షించు ఆశ ఏమీ లేకపోయెను, అంతట అందులోని వారి దేవుని కుమారుడగు యేసును చూచిరి. అందులోని ఒక శిష్యుడు, అనగా పేతురు అను పేరుగల వ్యక్తి, ”ప్రభువా, నీకిష్టమయితే నీ యొద్దకు నడిచి వచ్చుటకు నాకు సెలవిమ్ము,“ అని అడిగెను. అంతట ప్రభువు తన శిష్యుడగు పేతురుతో ”రమ్ము“ అని పలికెను. వెంటనే అతడు దోనె నుండి దిగి యేసు నొద్దకు నీళ్ళ మీద నడిచి రాసాగెను. యేసు నీటి మీద నడిచి వచ్చినట్లే నడిచెను, కాని పరిస్థితి చూచి ఎప్పుడయితే భయపడసాగెనో, అతడు యేసునొద్దకు రాక ముందే మునిగిపోసాగెను.

“కేసును రద్దు చేయుచున్నాము,” అని న్యాయాధిపతి పలికెను.

40

మనకు పరిశుద్దాత్మ నాయకత్వము కావలెను - మేధావులు కాదు.

కీషు కుమారుడగు సౌలు అప్పుడు జనుల మీద అధిపతి అయ్యెను. అతడు 2000 మందిని, యోనాతాను వెయ్యిమందిని, తీసికొనెను. అమ్మోరీయులు లేదా అమ్మోనీయులు కొందరిని ఓడించుటకు యోనాతాను వెళ్ళెను. అతడు వారిని జయించినప్పుడు బూరనూది ఇట్లు పలికెను, “సౌలు ఏమి చేసెనో మీరెరుగుదురా?” అతడు గర్వించుట ప్రారంభమాయెను.

ఒక గొప్ప డాక్టర్ ఆఫ్ డివినిటీ డిగ్రీ పొందగానే, తన పేరుకు చిన్నది ఏదైనా తగిలించబడగానే, అతడు “ఇక నాకు అంతా తెలియును” అనును. దేవుని ప్రజలు దీనులు, దేవుని యొక్క జనులు సాత్వికులుగా యుందురు.

కొందరు పరిశుద్దాత్మను పొందియున్నామని చెప్పుకొందురు, కాని వారేదో ప్రత్యేకింపబడినట్లుగా ప్రవర్తించెదరు, విశ్వాసమున్నట్లుగా అసలు కనిపించరు, తమకు లేని దానిని ఉన్నదన్నట్లుగా ప్రవర్తించగోరువారిని మీరు చూచినప్పుడు; వారసలు ప్రభువైన యేసును చేర్చుకొననే లేదనే దానిని మీరు గుర్తించుకొనండి.

41

శత్రువులోనికి ప్రవేశించియున్నాడు, చిన్న గుంపుగా ఉన్న దేవుని ప్రజలలోకి వచ్చుటకు వాడు ప్రయత్నించును, వాడు ప్రతియొక్కరి కుడి కన్నును పీకి వేయుటకు ప్రయత్నించును. శత్రువు ఎప్పుడూ ఆలాగే చేయుటకు ప్రయత్నము చేయును, వీలయితే రెండు కన్నులను పీకివేసి, తద్వారా జనులు తామేమి చేయుచున్నామో చూడలేని స్థితికి వారిని తీసుకొని వచ్చుటకు ప్రయత్నించును. ప్రతి క్రైస్తవునికి సాతాను నేడు అదే చేయుటకు ప్రయత్నించుచున్నాడు; ప్రకృతి సంబంధమగు మనస్సునే అతడు వెంబడించుటకును, పరిశుద్దాత్మ అతడిని నడిపించుటను అతడెరుగకుండా యుండునట్లు చేయుటకై, అతడి యొక్క ఆత్మ సంబంధమగు కన్నులను పీకివేయుటకు సాతాను ప్రయత్ని౦చుచు౦డెను.

వారా విధంగా వారు చేసినప్పుడు, యుద్ధములో శత్రువులకు గొప్ప అపజయము కలుగుటను చూసినప్పుడు, వెంటనే సౌలు రెండు మంచి ఎద్దులను వధించి జనులందరికీ పంపించెను. దీనిని మీరు గమనించవలెనని కోరుచున్నాను, ఇశ్రాయేలీయులందరికీ సౌలు ఆ మాంసమును పంపి ఇట్లు చెప్పెను, “సమూయేలును మరియు సౌలును వెంబడించనివాడు ఈ ఎద్దువలె అగును.” అతడు ఎంత మోసకరముగా తన్నుతాను దేవుని ప్రతినిధితో సమానముగా ఎంచుకొనెనో చూచారా? అదెంత క్రైస్తవ రాహిత్యము! ప్రజలందరూ సమూయేలుకు భయపడుచుండిరి. కాని వారందరూ తనను వెంబడించవలెనని సౌలు కోరుకొనెను. ప్రజలు సమూయేలుకు భయపడుట అతనికి నచ్చలేదు, తననే జనులందరూ వెంబడించవలెనని సౌలు కోరుకొనెను, ప్రజలయితే సమూయేలుకు భయపడిరి. “సమూయేలుకు, సౌలుకు వారు భయపడవలెను,” అని ఇప్పుడు పలికెను.

42

ఈనాడు మనం ఆ మాటను ఎన్నిసార్లు వినుట లేదు: “మాది గొప్ప సంఘము,” “మాది క్రీస్తు సంఘము,” “మాది దేవుని సంఘము,” “మేము పలాని-పలాని,” అని మనము వింటూనే యున్నాము. అందువలన ప్రజలకు ఒక భయముతో కూడిన ఆలోచన వచ్చుచున్నది. దేవుడు నిజంగా ఇందులోనే క్రియ చేయుచున్నాడేమో అనే తలంపు వారిలో కలిగినది. పరిశుద్దాత్మ యొక్క నాయకత్వము వారికి నచ్చలేదు; వారు అటువంటి మనిషినే వెంబడించుదురు, ఎందుకనగా వారు తమ ఇష్టానుసారముగా జీవించగోరుదురు. వారు తమకు నచ్చిన దానినే నమ్మగోరుదురు.

పరిశుద్దాత్మయే మన న్యాయాధిపతియని మీరు గ్రహించారా? పోపును గాని, బిషప్పును గాని, లేదా మరొకరిని గాని న్యాయాధిపతిగా; దేవుడు మనకు ఇయ్యలేదు. దేవుని యొక్క వ్యక్తిత్వమే పరిశుద్దాత్మ రూపముగా యున్నది, పరిశుద్దాత్మయే మనయొక్క న్యాయాధిపతి మరియు మార్గదర్శియై యున్నది.

43

ఇప్పుడది ఎందుకున్నది?

ఈ కరకయిన మాటను మన్నించండి. ఇది చాలా కఠినమగు పదజాలము, నా మనస్సులోని భావము వేరు; ప్రేమతో దీనిని చెప్పుచున్నాను. అయితే మన స్త్రీలు జట్టును కత్తిరించుకొనుట తప్పు అని పరిశుద్దాత్మ చెప్పుచున్నది, మరియు పొట్టి బట్టలు మరియు మగవారి దుస్తులు ధరించి, పెదవులకు, ముఖమునకు రంగు వేయుట తప్పు, అని పరిశుద్దాత్మ చెప్పుచున్నది. పరిశుద్దాత్మ అది తప్పు అని చెప్పుచున్నది, కాని పరవాలేదని చెప్పే సేవకులు మనము కోరుకొందుము.

“నన్ను మరియు సమూయేలును వెంబడించితే చాలు,” అని చెప్పే మానవులను నేడు మనము కలిగియున్నాము, ఆరు రోజులు వారి ఇష్టము వచ్చినట్లు జీవించవచ్చును. ఆదివారం ఉదయం ఆలయానికి వెళ్ళితే చాలు, మంచి తెలివితేటలు గల, కళాశాలలో పట్టమును పొందిన ఒక వ్యక్తి చిన్న ప్రసంగము వారికందించి, కొన్ని సరసోక్తులు పలుకుచు, అది వారి చెవులకు ఇంపుగా యుండునట్లుగా మాట్లాడుచు, ఏదో ఒక చలన చిత్రకథవలెనో లేదా ఒక టెలివిజను కార్యక్రమమువలెనో అది వారికి వినోదభరితముగా యుండవలెను. వారికి చిన్న ప్రార్థన చేసి, వారు తమ మత సంబంధమగు దానిని చేసి ముగించారనే ఒక విధమగు స్వకీయ సంతృప్తిగల భద్రతతో వారిని ఇంటికి పంపించవలెను, వారి మత కార్యక్రమము అదే.

అది పరిశుద్ధాత్మ యొక్క చిత్తము కాదు. వారములోని ప్రతి పగలు, ప్రతి రాత్రి నీవు భక్తిగా జీవించవలెనని, లోక విషయములలో నుండి నిన్ను-నీవు వేరుచేసికోవలెనని పరిశుద్దాత్మ కోరును. కాని సంఘమునకు అది అక్కరలేదు. వారు వినుటకు ఇష్టపడు రీతిగా ఇంపుగా పరిశుద్ధ గ్రంథములోని కార్యములను చెప్పవారే వారికి కావలెను. పరిశుద్ధ గ్రంథము ద్వారా మాట్లాడుచున్న పరిశుద్దాత్మ యొక్క స్వరము వారు వినరు.

44

వారిలో చాలామంది “అద్భుతములు జరుగు దినములు గతించినవి,” అని చెప్పెదరు. ప్రజలకది గమ్మత్తుగా నుండును. “పరిశుద్దాత్మ బాప్తిస్మము లేదు,” అని చెప్పుదురు. లోకము ప్రవర్తించు దానికంటె భిన్నముగా ప్రవర్తించుటకు వీరికి ఇష్టముండదు. వారు వీధులలోకి వెళ్ళునప్పుడు ముఖములను శుభ్రపరచుకొనుటకు ఇష్టపడరు, మగవారు శుభ్రమైన ముఖముతో కాక, లోకస్తులు చేయు విధముగానే వారి నోట్లో సిగరెట్లు, సిగారు పైపులు కనబడుచున్నవి; మరియు స్త్రీలయితే ఎంతో పొట్టిగా జాట్టును కత్తిరించుకొనుచున్నారు, పొట్టి దుస్తులు ధరించుచు, వారి శరీరముల యొక్క అంగాంగములను కనపరచుకుంటూ, వారికి ఇష్టము వచ్చినట్లు చేయుటయే వారు ఆశించుచున్నారు. ఏమి చేసినా పరవాలేదని చెప్పే వారే వారికి కావలెను.

45

ఒకనాటి రాత్రియందు ఒక విషయము చేప్పుటకు వ్యక్తి నా యొద్దకు వచ్చెను, నేను మతశాఖకు వ్యతిరేకంగా ప్రసంగించినందువలన, ఒక పెద్ద సంస్థయు మరియు దానికి చెందిన ఐదు సంస్థల వారు కలిసి ఇట్లనిరి, “సహో, బ్రెన్హాంను మేము వెలివేయుచున్నాము, మాకతనితో ఏమీ సంబంధము లేదు. మీరు ఆ టేపులను తుడిచిపెట్టి క్షమాపణ కోరుకొంటే సరి, లేనియెడల మీతో మాకు సంబంధము లేదు.”

“నా జీవితములో ఉన్నదానినంతటినీ మీరు తీసికొన్నా గాని, నేను మాత్రం దేవుని వాక్యముతోనే నిలబడియుందును. వాక్యమే నా అంతిమ గురి,” అని చెప్పాను.

“పలాని-పలాని టేపును నీవు ఉపసంహరించుకోవా?” అని అడిగిరి.

“నేను సిగ్గుపడిన దానిని గూర్చి ఎన్నడూ నా జీవితంలో బోధించలేదు. ఏ టేపును, ఏ రిక్టారును నేను ఉపసంహరించుకొనను, పరిశుద్దాత్మ చెప్పినదానితోనే నేను నిలచియు౦దును; దానితోనే నేను జీవించెదను, దానితోనే నేను మరణించెదను. నా యంతట నేను దీనిని చెప్పలేదు. జరుగుచున్న దానిని ఉదహారణగా తీసికొని నేను చెప్పియున్నాను గాని, నా స్వంత మాటలు కావు. దీనిని మీరు చూచి అర్ధ౦ చేసికొనండి, మానవుని ద్వారా నడిపించబడవలెనని మనుష్యులు కోరుకొనుచున్నారు.”

46

వారికి సమూయేలు అక్కర లేదు. సమూయేలును రాజుగా - మన్నించండి, సౌలును రాజుగా అభిషేకము చేయుటకు ముందుగా - సమూయేలు వారి యొద్దకు మరల వచ్చెను. ఆనాడు సమూయేలు ఏ విధముగా మాట్లాడెనో అదే రీతిగా నేడు నేను కూడా మీతో మాట్లాడగోరుచున్నాను. మీరది చదువవచ్చును.

''దేవుడు మీకు రాజుగా ఉన్నచో మీకేమయినది?“ అనడిగెను.

“మంచిది, మాకు దేవుడు కనబడలేదు,” అని వారు చెప్పిరి.

“నేనే ఆయన ప్రతినిధిగా యున్నాను కదా?” అనెను. “నేను మీకు ఎన్నడయినా తప్పు చెప్పానా? నెరవేరని ప్రవచనమును ఎన్నడయినా నేను ప్రవచించానా? నేను మీకు యెహోవా వాక్కును తప్ప మరి దేనినీ చెప్పలేదే? మీరే జవాబు చెప్పండి. మీ యొద్దకు వచ్చి, డబ్బు కావలెనని ఎన్నడయినా అడిగితినా? మీ యొద్ద నుండి నేను దేనినయినా తీసికొన్ననా? నేను మీకు సూటిగా ”యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు“ అనునది తప్ప మరేదియూ చెప్పుట జరిగినదా? అది సత్యమని దేవుడు ప్రతిసారి బయలుపరచెను. ఆయన ఉరుమును, వర్షమును పంపెను.” సమూయేలు దేవుని యొక్క ప్రతినిధియని రుజువుచేయు లేఖనమును మీరే ఎరుగుదురు.

ఈనాటి పరిశుద్ధాత్మకు సమూయేలు ఖచ్చితమగు నిదర్శనముగా యున్నాడు. పరిశుద్దాత్మయే దేవుని యొక్క నోటికి నోరుగా యున్నది. పరిశుద్ధ గ్రంథము ఖచ్చితంగా దానినే చెప్పుచున్నది. పరిశుద్ధ గ్రంథములో ఏమున్నదో దానిని అట్టే నమ్మవలెను. అందులో ఏ ఒక్క తేడా కూడా లేదు. అయితే వారికి దానికి భిన్నమయిన దానిని చెప్పే వ్యక్తి కావలెను.

47

సమూయేలు యొక్క ప్రవచనము పరిపూర్ణమైనది కాదని జనులు అనలేరు. వారు ఈ విధముగా జవాబిచ్చిరి, “సమూయేలూ, యొహోవా నామము పేరట నీవు పలికినది యావత్తు అక్షరాలా నెరవేరినది ఒక్క పొరపాటు కూడా లేదు. నీవెన్నడూ మా యొద్దకు వచ్చి డబ్బు అడుగలేదు. నిన్ను నీవే పోషించుకొన్నావు. నీ కొరకు మమ్మును ఏ గొప్ప త్యాగము చేయమని నీవు అడుగలేదు. నీ దేవునినే నీవు విశ్వసించియుంటివి. ఆయనే అన్నింటిలో నుండి నిన్ను విడిపించెను. నీ మాటలు నిజము. యెహోవా నామము పేరట నీవు పలికిన సమస్తమూ నెరవేరినది; అయినా గాని మాకు రాజు కావలెను!”

48

ఆ మోసమును మీరు గమనించారా? మానవులలో అపవాది యొక్క కుతంత్రము ఎట్లు పనిచేయునో మీరు గమనించారా? వారు లోబడుటకు బదులుగా, పరిశుద్దాత్మ యొక్క మాటను ఆలకించుటకు బదులుగా, “యొహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడను” మాటను చెవియొగ్గుటకు బదులుగా, పవిత్ర జీవితము, పరిశుద్ధమగు శీలము, వేరయిన జీవితము, వింత జనాంగము, పరిశుద్ద ప్రజ, ప్రత్యేక ప్రవర్తనగల దేశముగా యుండుటకు బదులుగా, వారు లోకముతో ఏకీభవించిరి, లోకస్తులవలె జీవించగోరిరి. “ఏమి చేసినా పరవాలేదు, ఆలాగు నటిస్తే చాలును,” అని చెప్పే వారిపట్ల వారు ఆకర్షితులయిరి.

అది ఏమై యున్నదో దానిని మీరు కనుగొనగలిగిరా? ఇది ఏమిటో మీరు చూచారా? స్వస్థత అనునది లేదని, పరిశుద్దాత్మ బాప్తిస్మము అనునది సంఘ ప్రారంభపు పునాది మాత్రమేనని చెప్పెదరు. మరో విధంగా చెప్పవలెనన్నచో దేవుడు మానవులను ఎన్నుకొని, పరిశుద్దాత్మను సంఘములో నుండి తొలగించి, సంస్థాపన శాఖ దానిని నిర్మించునట్లుగా అనుమతించెనని చూపించునట్లుగా చేయుచున్నారు. అదెన్నడూ ఫలితమియ్యదు. అటువంటిది లేనే లేదు. పరిశుద్దాత్మ సత్యవాక్యము మిమ్మును యేసు వచ్చు వరకు నడిపించును. అదే అసలు విధానము.

49

సౌలు అధికారములోనికి వచ్చెను, అతనిని వెంబడించుటకై గొప్ప జనసమూహము అతడికి యుండియుండవచ్చు, చక్కని ఆయుధములు అతనికి ఉన్నవి, గాయకులు దేశముల వారికంటేను అతడు మించిపోయెను. ప్రజాస్వామ్యమును వారికి అందించెను, మునుపెన్నడూ ఎవరూ ఆ విధముగా పరిపాలన చేయలేదు.

మన శాఖలు మరియు సంఘములు ఖచ్చితంగా నేడు అదే చేయుచున్నవి. ప్రపంచములో మరెవరికి మాకున్నంత ఆలయము లేదనుచుందురు, “మా జనులంత చక్కని దుస్తులు మరెవరునూ ధరించరు అందురు, మాకున్న గొప్ప పండితులు మరెవరికిని లేరందురు. సౌలుకు చక్కని శిక్షణ పొందిన జనులున్నారు. వారు ఈటెను చక్కగా త్రిప్పగలరు. వారి నైపుణ్యము చూచి దేశముల వారు భయపడిరి. వారు అన్ని విషయములలోను సుశిక్షితులు.

కాని ఒక దినము వచ్చినది, ఒకడు వారిమీదికి సవాలు విసిరెను. ఇశ్రాయేలు సైన్యము గజగజ వణికెను. భయముచేత వారి కాళ్ళు పట్టు సడలించినవి. గొల్యాతు వారికి సవాలు విసిరెను: మీరు చెప్పు విధముగా మీ దేవుడు యున్నట్లైతే మీ దేవుని గొప్పతనమును, మీ గొప్పతనమును నిరూపించుకొనుడనెను, వారికి సవాలు చేసెను. వారికేమీ తోచలేదు. వారియొక్క చక్కని, మొరయుచున్న ఆయుధములు పనికిరాలేదు, వారి ఈటెలు పనికి రాలేదు. ఇటువంటిది వారింతకు ముందు ఎదుర్కొనలేదు, చూడలేదు.

50

నేను దీనిని గౌరవము, దైవ మర్యాదతో, ఘనత, హోదా, ప్రేమ, సకల క్రైస్తవ సహవాసముతో, దీనిని చెప్పుచున్నాను: ఒకనాడు నేను ఆఫ్రికను పత్రికలో చదివాను, మనకు ఒక కీషు కుమారుడు ఉన్నాడు, సవాలు చేయుచూ సువార్తను ప్రకటించుచున్నాడు, ఒక మహమ్మదీయుడు - బిల్లీగ్రాహంను ఒకనాడు సవలు చేసెను, చెప్పెను, “మీ దేవుడే దేవుడయితే, ఈ రోగిని స్వస్థపరదునని ఆయన చెప్పెను గదా?” ఆ కీషు కుమారుడు తన సైన్యముతో సహ మొత్తబడిపోయి ఆ దేశమును విడిచి, ఓడిపోయి వచ్చెను. అది అవమానము. మన దేవుడే దేవుడు!

మనకు మంచి సంఘములున్నవి, మనకు మంచి సువార్తికులున్నారు, మనకు చక్కని గాయకులున్నారు, అత్యుత్తమ గాయక బృందములున్నవి, దేశములో ఎవరికీ లేని తలాంతు గలవారు మనకున్నారు, చాలా గొప్పవారున్నారు, ఎంతో డబ్బున్నది, మన వద్ద మేధావులున్నారు, మనయొద్ద గొప్ప పండితులు, వేదాంతులున్నారు. మనము బోధించగలము, మనము చెప్పగలము, సువార్త ప్రకటించగలము, ప్రజలను తీసికొనిరాగలము, ప్రతి సంవత్సరం పది లక్షలమందిని మార్చగలము, సంఘాలను నింపగలము. డబ్బుకు పాడే మన గాయకులు, మన తెలివిగల సువార్తికులు అటువంటి సవాలును ఎట్లు ఎదుర్కొనవలెనో ఎరుగరు. దానినిగూర్చి వారికేమీ తెలియదు. ఆయన యొక్క స్వస్థతా శక్తి వారికి తెలియదు, పరిశుద్దాత్మ బాప్తిస్మము వారికి తెలియదు, ఆ శక్తి, కాన్సరుతో చనిపోవుచున్న మనిషిని విమోచించగలదు. దానిని గూర్చి వారికేమీ తెలియదు. వారు ఆ రంగములో తర్పిదు పొందుకోలేదు, సౌలు మరియు ఆయన యొక్క మానవ-నిర్మిత గుంపువలె వీరికి ఇటువంటి కార్యములయందు శిక్షణ లేదు.

51

కాని దేవుని పిల్లలతోను, ఆయన ప్రజలతోను ఇది నన్ను చెప్పనివ్వండి, ఒక సాక్ష్యము లేకుండా ఎన్నడూ మిమ్ము దేవుడు విడిచిపెట్టడు. సౌలుకు అది తెలియదు — సౌలుకు దాని గురించి ఏమీ తెలియదు — కాని ఎక్కడో ఆవల కొండ మీద దేవుడు ఒక చిన్న దావీదును కలిగియున్నాడు. మతసంబంధమగు కలుపు మొక్కలతో గొర్రెలను పెంచువాడు కాడు, పచ్చిక గల చోట్లను, శాంతికరమగు జలముల యొద్దకు అతడు వాటిని నడిపించు చున్నాడు, తన తండ్రి గొర్రెలను శ్రద్దగా మేపుచున్నాడు. తన తండ్రి గొర్రెలలో ఏ గొర్రెనయినా ఏదయినా ఎత్తుకు పోసాగినచో, ఆ గొర్రెను విమోచించు శక్తి దేవునిలో యున్నదని అతనికి తెలియును.

దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క గొర్రెను విడిపించుట ఏలాగో ఎరిగిన దావీదు వంటివాడిని నేడు కూడా దేవుడు ఎచ్చటో ఒక చోట కలిగియున్నాడు. అతనికి ఆ సంగతి బాగుగా తెలియును. సౌలు యొక్క కవచము గూర్చి గాని, వాటి నిపుణత గూర్చి గాని, అతనికి తెలియదు. వారి శాఖలు అతనికి అవసరము లేదు; ఆ పాత కవచము అతనికి అక్కర లేదు. “ఇది నాకు అలవాటు లేనిది! కాని నాకు తెలిసిన శక్తితోనే నన్ను వెళ్ళనిమ్ము,” అని అతడనెను.

52

అతడు తన తండ్రి గొర్రెలను మేపెను. అతడు పచ్చిక గల చోట్లను ఎరుగును. వాటికతడు సరియగు ఆహారము ఇచ్చెను, అవి హాయిగా జీవించినవి. “మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును.” నిజమగు గొర్రెలకాపరి వాటిని పోషించును — “యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.” శత్రువు ఒకదానికి అనారోగ్యము కలుగజేసినయెడల, దానికి తగిన దేవుని శక్తిని అతడెరుగును.

అక్కడ నిలబడియున్న, చిన్న దావీదును చూడండి. వారిట్లనిరి, “అతడు పుట్టినప్పటి నుండియు యుద్ధములో ఆరితేరినవాడు. అతని యవ్వన కాలము నుండి ఈటె త్రిప్పుట తోను, కవచము మోయుటతోనే ప్రారంభమాయెను. అతడు చాలా తర్ఫీదు పొందినవాడు, అతడు వేదాంతి, కాని నీకు ఏమీ రాదు గదా?”

అతడు చెప్పెను, ''అది నిజమే, అయ్యా. అతని యొక్క వేదాంత విద్యను గూర్చి నాకేమీ తెలియదు, కాని ఒకటి మాత్రం నాకు తెలియును; ఒకనాడు నా తండ్రి గొర్రె నొకదానిని శత్రువు పట్టుకొని పోవుచుండగా, దేవుని శక్తితో దానిని విడిపించాను! మంచి ఆరోగ్యము గల దానిగా తిరిగి దానిని చేశాను. పచ్చిక గల చోట్లకును, మంచి ఆరోగ్యమునకును, నీరున్న చోట్లకును నడిపించితిని. సింహము నోట నుండి దానిని దేవుడు నన్ను విడిపించునట్లు చేసెను. గొర్రెపిల్లను ఎత్తికొనిపోవుచున్న దానిని చంపాను, గొర్రెపిల్లను తీసికొనిపోవుచున్న ఎలుగుబంటిని చంపాను, కావున సున్నతి లేని ఈ ఫిలిస్తీయుని దేవుడు నా చేతికి అప్పగించును!'' పరిశుద్దాత్మ యొక్క నాయకత్వము మనకు అవసరము.

53

నా దినములు నాకు తెలియవు. ఎవరికీ తెలియవు. ఒక ఉదయమున నేను పడక మీద ఉంటిని. నేను ఇంకా నిద్రలోనే ఉన్నాను, నా కలలో జోసఫ్ జబ్బుతో ఉన్నట్లు చూచాను, అతనికి ప్రార్థన చేయుటకు దగ్గరకు వెళ్ళాను. అంతలోనే మెళకువ వచ్చినది, మనసంతా అందోళనగా ఉండెను. “జోసఫ్ కు ఏదైనా జబ్బు వచ్చుననుకున్నాను.” నా ముందుర ఒక నల్లని నీడ ఉండుట చూచాను. మరీ నల్లగా లేదు గానీ ఆ నీడ నాదే అని గుర్తించాను. దానిని గమనించుచుండగా దాని వెనుక తెల్లని రూపము కనిపించినది, అది ప్రభువే. ఆ నీడను నా భార్యకు చూపించవలెనని తలంచి, ఆమె వైపు చూచాను; కాని ఆమె ఇంకా నిద్రలో నుండి మేల్కొనలేదు. ఆమె ఈ దర్శనమును చూడగల్గును, కాని ఆమె నిద్రించుచున్నది. నేను అన్నాను, “ఓ, నన్ను మన్నించుము, ప్రభువా, కాని అది నా జీవితమైయున్నది. నేను చేసిన ప్రతీ కార్యమును, నీవు నన్ను నడిపించవలసియున్నది. ఏదైన జరిగిన ప్రతీసారి, అది నీ ద్వారా జరిగినట్లే భావించాను, మరియు నేను గ్రహించాను అది సాతాను దాని నుండి దూరపరచవలెనని ప్రయత్నించున్నది.” నేను చెప్పాను, “నీవు మాత్రమే నన్ను నడిపించగలిగితే.” ఆలాగు ఉండగా నేను ఎన్నడూ చూడని ఒక సుందరమగు ముఖము గల వ్యక్తిని చూచాను. ఆయన నా ముందరే ఉండి వెనుకకు చూచుచున్నాడు. అతడు తన చేతిని పైకి చాపి నన్ను పట్టుకొని ముందుకు కదలిపోసాగెను. అంతలో దర్శనము నన్ను విడిచినది.

54

గత ఆదివారము ఉదయం పెందలకడనే మేల్కొన్నాను. ఈ దర్శనము శనివారము వచ్చినది. నేను ఎల్లప్పుడూ ఆందోళన చెందుదును. నేను చనిపోతానేమో అని ఎల్లప్పుడూ తలంచుదును. నాకు ఏబది సంవత్సరములు, నా సమయం ఇంకను రాలేదు అని తలంచాను... అది ఎక్కువ సమయము కాదు అని నేను అనుకుంటున్నాను. వాక్య శరీరము (Theophany)లో ఉన్నప్పుడు ఏలాగుండునో అని ఆశ్చర్యపడసాగాను. ఆ పరలోక శరీరములో ఉండి నా ప్రశస్తమగు స్నేహితులను మరియూ చిన్న తెల్లటి పొగమంచును ఎగిరిపోతూ చూడగలనేమో అని తలంచాను. నేను వెళ్ళిపోతూ నెవిల్ సోదరుని చూడగలను, కానీ అతడు “హలో, బ్రెన్హాం సోదరుడా!” అని అనలేడు. అయితే యేసు వచ్చినప్పుడు, నేను మరలా మానవుడనగుదును అనే ఈ ఆలోచన తరచుగా నాకు వచ్చుచుండును.

నేను పశ్చిమానికి వెళ్ళినట్లు కలలో చూచాను, ఒక చిన్న పొదగుండా వచ్చుచున్నట్లు చూచాను, నా భార్య నాతోనే ఉండెను, మేము త్రౌట్ చేపలు వేటాడుటకు వెళ్ళుచున్నాము. నేను ఆగి తలుపు తెరచాను, పైన ఆకాశము చాలా అందంగా ఉన్నది. అది ఈ లోయలో ఉన్నట్లుగా కనిపించలేదు. ఇది అందముగా నీలము, తెల్లని రంగుగల మేఘములు విడిపోయి కనిపించెను. ''ప్రియమైనదానా, ఇక్కడికి మనము ఇంతకు ముందే వచ్చియుండినచో ఎంతో బాగుండెడిది,“ అని నా భార్యతో అన్నాను.

“బిల్లీ, పిల్లల కోసమైనా సరే ఇక్కడకు వచ్చియుండవలసినది,” అని అన్నదామె.

''అది.....'' అన్నాను నేను.

55

నేను మేల్కొన్నాను. నేను అనుకున్నాను, “నాకు ఎక్కువగా కలలు కంటున్నాను, ఎందుకో నాకు ఆశ్చర్యము కలుగుచున్నది.” నేను చూడగా ఆమె నా ప్రక్కనే పరుండియున్నది. నా దిండును లేపి గోడకు ఆనించి చేరబడ్డాను, మీలో అనేకులు ఇలాగు చేయుచుందురు, నా తలను మంచము యొక్క చెక్కపై ఆనించి చేతులు వెనక్కి పెట్టుకున్నాను. ఈ విధముగా పెట్టుకొని ఆలోచించుచున్నాను, మరియు నేను అన్నాను, “మంచిది, ఆ అవతలి దరిన ఎట్లుండునో అని ఆశ్చర్యము చెందుచున్నాను. అప్పుడే నాకు ఏభై సంవత్సరములు దాటిపోయాయి, ఇంకా నేను ఏమీ చేయలేదు. ప్రభువు కొరకు ఏదైనా సహాయము చేయగలిగితే బాగుండును. నేనిక దేహముతో ఉండనని నాకు తెలియును.... నా సగము కాలము గతించినది. ఇంకా ఎక్కువే గతించినది. నా కుటుంబీకుల వలె చాలా కాలము నేను జీవించినా, నా సగము కాలము అయిపోయినది.” మరియు నేను చుట్టూ చూచాను. పైకి లేచుటకు సిద్ధముగా ఉన్నాను. అప్పుడు దాదాపు 7.00 గంటల సమయమైనది. నేను అన్నాను, “ఈ ఉదయము నేను ఆలయమునకు వెళ్ళవలెను, నా గొంతు బొంగురు పోయినది. నెవిల్ సోదరుడు బోధించినచో వినవలెనని నాకు ఉన్నది.”

''నీవు మేల్కొన్నావా?'' అని నా భార్యను అడిగాను. మరియు ఆమె చాలా గాఢ నిద్రలో ఉన్నది.

దానిని మీరు జాగ్రత్తగా వినవలెను, దీనిని విదిచిపెట్టవద్దు. అది నాలో మార్పు తీసుకొని వచ్చినది. నేను ఇంతకు ముందు ఉన్న బ్రెన్హాంగా ఇప్పుడు ఉండలేను.

56

నేను చూచాను, మరియు ఎదో నాతో చెప్పుట విన్నాను, “నీవు ఇప్పుడే ప్రారంభించావు. యుద్ధమును కొనసాగించుము! ముందుకు దూసుకొని పొమ్ము.!”

ఒక నిమిషము పాటు నా తలను విదిలించాను. “ఎప్పుడూ నేను ఈలాగు ఆలోచించుకొనుచుందును గనుక ఇటువంటి ఊహలే వచ్చుచుండునులే,” అని అనుకున్నాను. “ఇవన్నీ నా ఊహలైయుండును,” అని నేను అనుకున్నాను.

“యుద్ధము కొనసాగించుము! ముందుకు పొమ్ము! సాగిపొమ్ము” అని ఎవరో చెప్పుచుండిరి.

“బహుషా, నేను చెప్పను,” అని అనుకున్నాను.

నేను నా పెదవులను పంటి క్రింద నొక్కుకొని, నా నోటి పైన చేయి వేసికొని కూర్చొనియుండగా మరల ఇట్లు వినబడినది, “నీవు ముందుకు సాగిపొమ్ము. మార్గాంత మందు ఏమున్నదో నీవెరుగవు.” గ్రిమ్ స్మెల్లింగ్ లేదా మరెవరో ఇలాగు పాడిన పాట; ఈ పాటను నేను వినునట్లుగా నాకు తోచినది, అన్నా మే మరియు ఇంకా మీరందరూ దానిని పాడుదురు:

నాకు ఇంటి మీద బెంగగా, చింతగా యున్నది. నేను యేసును చూడగోరుచున్నాను;

ఆ మధురమగు నౌకాశ్రయ గంటలు మ్రోగుట నేను వినగోరుచున్నాను;

అది నా మార్గమును వెలుగుగా జేయును, సకల భయములను పారద్రోలును; ప్రభువా, కాలమను తెరకు ఆవల నన్ను చూడనిమ్ము.

ఈ ఆలయములో ఆ పాట పాడుటను మీరు విందురు.

“కాలమను తెరకు ఆవలగా చూచెదవా?” అని ఎవరో అడిగినట్లు వినబడినది.

''అది నాకు ఎంతో సహాయపడును,“ అన్నాను. నేను చూచాను. ఒక్క క్షణములో, ఒక్క తృటిలో, బల్లపరుపుగా యున్న ఒక చోటకు వచ్చాను, వెనక్కు చూచాను, నేను మంచము మీద పరుండియున్నాను. ”ఇది చాలా వింతగా యున్నదే,“ అనుకొన్నాను.

57

ఇప్పుడు, మీరు దీనిని పునరావృతము చేయరాదని కోరుచున్నాను. నా సంఘము ఎదుట లేక నేను బోధించుచున్న నా గొట్టెలు ఎదుట నేను దీనిని చెప్పుచున్నాను. నా శరీరములో యున్నానో లేక శరీరమునకు వెలుపల యున్నానో లేక రూపాంతరము చెందానో ఎరుగను... నేను చూచు మామూలు దర్శనం వలె ఇది లేదు. నేను అటు చూడగలిగాను, మరియు ఇటు ప్రక్కన కూడా చూడగలిగాను. ఆ చిన్న స్థలమునకు నేను వెళ్ళినప్పుడు, ఎంతోమంది జనులు నా యొద్దకు పరుగెత్తుకొని వచ్చిరి, నేనెన్నడూ అందరిని చూడలేదు. వారు కేకలు వేయుచుండిరి. “ఓ! మా ప్రశస్త సోదరుడా!” అనిరి. యువతులు, ఇంకా ఇరవై ఏండ్లు నిండనివారు కనిపించుటను నేను చూచాను, దాదాపు పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల లోపువారే, వారందరూ నాపై చేతులును వేయుచూ, “మా ప్రశస్త సోదరుడా?” అనుచూ అరుచుచుండిరి.

ఒక మంచి యవ్వన ప్రాయంలో ఉన్న యువకుడు కనిపించాడు, చాలా ఉత్సాహంతో అతని కన్నులు మెరుస్తున్నవి, దట్టమైన చీకట్లో మెరిసే నక్షత్రాలుగా ఉన్నాయి, వారి పండ్లు ముత్యముల వలె మెరయుచున్నవి, మరియు వారు నన్ను పట్టుకొని ఆనందముతో కేకలు వేయుచు, “ఓ మా ప్రశస్త సోదరుడా!” అనిరి. నేను ఆగి చూచాను, నేను కూడా యువకునిగా మారిపోయాను. నా తల క్రింద చేతులుంచిన నా ముసలి శరీరము అక్కడ పడియుండుట చూచాను. నేను అన్నాను, “ఇది నాకేమీ అర్థం కాలేదు.”

ఈ యువతులు నా చుట్టూ చేతులు వేసియున్నారు.

58

ఇప్పుడు, ఇది కలగలుపు జనాంగమని నేను గ్రహించాను, మరియు దీనిని నేను ఆత్మీయ మాధుర్యము తోను, పరిపక్వముతోను చెప్పుచున్నాను. పురుషుడు స్త్రీ మీద చేయి వేసినప్పుడు ఒక మానవ అనుభూతి కలుగుట తధ్యము. కాని అక్కడ ఆ విధంగా లేదు. నిన్న అనునది గాని, లేదా రేపు అనునది గాని అచ్చట లేదు. వారికి అలసట లేదు. వారు... నా జీవితంలో ఎన్నడూ అంత అందమైన యువతులను చూడలేదు. వారి తల వెండ్రుకలు నడుము క్రిందకు వ్రేలాడుచున్నవి, పాదముల వరకు వారి గౌనులున్నవి, వారు నన్ను హత్తుకొనుచుండిరి. ఇక్కడ కూర్చున్న నా స్వంత సోదరి కూడా నేను అలా కౌగలించుకొనను. వారు నన్ను ముద్దు పెట్టుకొనుట లేదు, వారిని నేను ముద్దు పెట్టుకొనుట లేదు. దానిని నేను వివరించుటకు పదజాలము లేదు; చెప్పడానికి మాటలు చాలవు. పరిపూర్ణత అనే పదము కూడా సాటిరాదు. ఆమోఘం అనే పదం దానికసలు చాలనే చాలదు. అది నాకెన్నడూ అందని సంగతి, దానిని మీరు ఎరగాలంటే మీరచ్చట ఉంటేనే తెలియును.

59

నేను ఇటు ప్రక్కన, అటు ప్రక్కన చూచాను, వారు వేలకొలదిగా వచ్చుచుండిరి. మరియు “నాకిది ఏమీ అర్ధము కాలేదు.” నా మొదటి భార్య హోప్ వచ్చుట చూచాను. ఆమె పరుగు పరుగున వచ్చి, ''నా ప్రశస్త్ర సోదరుడా!' అన్నది గాని 'నా భర్తా' అనలేదు. ఆమె నన్ను కౌగలించుకొనినది. అక్కడ నిలబడియున్న మరో సోదరి నన్ను ఆలింగనము చేసికొనినది. ఆ తరువాత హోప్ ఆ స్త్రీని ఆలింగనము చేసికొనెను. ఆ విధంగా అందరూ ఒకరినొకరు కౌగలించుకొనిరి. ఇది చాలా వేరుగా యున్నదే అనుకొన్నాను. ఇది భూలోక సంబంధమైనది ఇందులో ఏదో ప్రత్యేకత గలదని అనుకున్నాను. నేను మరల ఆ పాత మృతదేహములోనికి వెళ్ళుటకు ఇష్టపడలేదు. నేను అటు పైపు చూచి “ఇదేమిటని ప్రశ్నించుకొన్నాను?” నేను చాలా చక్కగా కనిపించాను, కాని “నేను అర్థము చేసుకోలేక పోవుచున్నాను,” అని అన్నాను. హోప్ అచ్చట నిజంగా ఘనపరచు అతిధివలె కనిపించినది. అందులో ఏమీ తేడా లేదు, ఒక గౌరవమగు అతిధివలెనే ఆమె కనిపించినది.

60

తర్వాత ఆ గదిలో మాట్లాడిన స్వరము నాతో ఇట్లు పలుకుట నేను విన్నాను, “నీవు బోధించిన పరిశుద్ధాత్మ అదే. ఇది పరిపూర్ణ ప్రేమ. అది లేకుండా ఎవరూ ఇక్కడికి రాలేరు.”

అక్కడికి వెళ్ళవలెనన్నచో పరిపూర్ణ ప్రేమ మాత్రమే కావలెనని, నేను నా జీవితంలో ముందెన్నడూ నిర్ణయించుకొనని రీతిగా నిర్ణయించుకొన్నాను. అక్కడ అసూయ లేదు. అక్కడ అలసట లేదు. అక్కడ మరణము లేదు. వ్యాధి అనునది ఎన్నడూ అచ్చటికి ప్రవేశించజాలదు. దేహము వలన వచ్చు వృద్ధాప్యము అచ్చట లేదు, వారు ఏడ్వలేరు. అది అంతా ఒక్క సంతోషమే - ''ఓ నా ప్రశస్త సోదరుడా!''

వారు నన్ను తీసికొని వెళ్ళి ఒక ఎత్తయిన స్థలము మీద కూర్చోబెట్టిరి. “నేను కలగనుట లేదనుకొన్నాను, ఎందుకనగా నా శరీరము మంచము మీద పరుండియుండుటను నేను చూడగలుగుచున్నాను.” వారు నన్ను అచ్చట కూర్చోబెట్టిరి, నేను, “ఓ, ఇచ్చట నేను కూర్చొనరాదు,” అని అన్నాను.

అక్కడ ఇరువైపుల నుండి స్త్రీ, పురుషులు నిండు యవ్వనముతో వచ్చుచున్నారు. సంతోషముతో కేకలు వేయుచున్నారు. ఒకామె అచ్చట నిలబడి నన్ను చూచి “ఓ, మా ప్రశస్త సోదరుడా! నిన్ను ఇక్కడ చూచుట చాలా సంతోషముగా యున్నది” అని అరచినది.

“నాకిది అర్థమగుట లేదు. ఏమిటి?'' అన్నాను.

అప్పుడు పైనుండి నాతో మాట్లాడుచున్న ఆ స్వరము ఇట్లు పలికినది, “ప్రవక్తలు తమ ప్రజల యొద్దకు చేర్చబడుదురను పరిశుద్ధ గ్రంథములోని మాటను నీవు ఎరుగుదువు.”

''అది లేఖనములలో యున్నదని నేను ఎరుగుదును,“ అన్నాను. ''నీవిప్పుడు నీ జనులతో చేర్చబడియున్నావు,'' అనెను.

''వారు నిజమైనవారయితే, నేను వారిని స్పర్శించుదును గదా?“ అనుకొన్నాను.

“ఓ, అవును.”

''వారు లక్షల, లక్షలకొలది మందిగా యున్నారు, అంతమంది బ్రెన్హాంలు ఎక్కడున్నారు?'' అనడిగాను.

ఆ స్వరము ఇట్లనెను, ''వారు బ్రెన్హాంలు కారు; వారు నీ ద్వారా మారిన వారు, వారిని నీవు ప్రభువు నొద్దకు నడిపించావు.“ నీవు ఎంతో అందముగా యున్నారని ఆ స్త్రీలను చూచి అనుకొనుచున్నావే, అందులోని కొందరి వయస్సు తొంబది సంవత్సరములున్నప్పుడు వారిని నీవు ప్రభువు నొద్దకు నడిపించతివి. మరి వారందుకే 'మా ప్రశస్త సోదరుడా' అని కేకలు వేయుటలో ఆశ్చర్యము లేదు.''

''నీవు మమ్మును నడిపించియుండనియెడల మేము ఇచ్చటికి వచ్చియుండెడివారము కాము,'' అని వారందరూ ఒకేసారి పలికిరి.

61

నేను చుట్టూ చూసాను మరియు నేను అనుకున్నాను, “మంచిది, నాకు అర్థం కావడంలేదు.” నేను అన్నాను, ''యేసు ఎక్కడ? ఆయనను నేను చూడవలెనని బహుగా ఆశి౦చుచున్నాను.

“ఆయన ఇంకొంచెము ఎత్తున, పైన ఉన్నాడు,” అని వారు చెప్పిరి. “ఒక దినమున ఆయన నీ యొద్దకు వచ్చును,” అనిరి. చూచారా? “నిన్ను ఒక నాయకునిగా దేవుడు ఏర్పరచి పంపించెను గనుక ఆయన వచ్చును, ఆయన వచ్చినప్పుడు, నీవు వారికి బోధించిన దానిని బట్టి నీకు తీర్పు తీర్చబడునని, మొదటగా, వారు లోనికి వెళ్ళినా, వెళ్ళకపోయిన. నీ బోధనను అనుసరించియే మేము లోనికి వెళ్ళుదుము.”

''ఓ, నాకు చాలా సంతోషముగా యున్నది! పౌలు కూడా ఈలాగే నిలబడవలెనా? పేతురు కూడా ఈలాగే నిలబడవలెనా?“ అని నేను ప్రశ్నించాను.

“అయితే, నేను ఖచ్చితంగా వారు బోధించిన దానినే బోధించాను.” దానికి వేరయిన దానిని దేనినీ నేను బోధించలేదు. వారు బోధించిన యేసుక్రీస్తు నామములోని బాప్తిస్మమునే నేను కూడా బోధించాను, వారు బోధించిన పరిశుద్దాత్మ బాప్తిస్మమునే నేను కూడా బోధించాను, వారేమి బోధించిరో అదే నేను బోధించాను,“ అని పలికాను.

ఆ ప్రజలు ఈ విధముగా కేకలు వేసి చెప్పిరి, “దానిని మేము ఎరుగుదుము, ఒక దినమున మేము నీతో కలిసి భూమి మీదికి వచ్చుదుమని ఎరుగుదుము.” చెప్పెను, “యేసు వచ్చును, నీవు మాకు బోధించిన దానిని బట్టియే నీకు తీర్పు తీర్చబడును, ఆ సమయమున నీవు అంగీకరించబడినయెడల - నీవు అంగీకరించబడెదవు, మమ్మును నీ సేవ యొక్క ప్రతిఫలములుగా నీవు పొందుదువు. నీవు మమ్మును ఆయన యొద్దకు నడిపించుదువు, మనము సదాకాలము జీవించుటకు భూమి మీదికి తిరిగి వెళ్ళుదుము.”

''ఇప్పుడు నేను మరల తిరిగి వెళ్ళవలెనా?'' అనడిగాను.

''అవును, ముందుకు కొనసాగుము.''

62

నేను చూచాను, ప్రజలు నాకు కనిపించారు, నా కనుచూపు మేరకు చూచాను. జనులు ఇంకా వచ్చుచునే యున్నారు, వారందరూ నన్ను “మా ప్రశస్త సోదరుడా” అని చెప్పి ఆలింగనము చేసికొనుచుండిరి.

అంతలోనే ఒక స్వరము ఇట్లు చెప్పెను, “నీవు ఎవరిని ప్రేమించావో వారిని, నిన్నెవరు ప్రేమించిరో వారిని నీవిక్కడ చూచుచున్నావు. దేవుడు వారిని నీకు ఇచ్చెను.” నేను తిరిగి చూడగా, నా పాత కుక్క నడిచి వచ్చుటను చూచాను. నా గుర్రము వచ్చి నా భుజము మీద తల ఆన్చి సకిలించసాగినది. “నీవు ప్రేమించినవారందరూ, నిన్ను ప్రేమించినవారందరూ నీ యొద్దకు వచ్చిరి, దేవుడే వారిని నీ చేతికి, నీ పరిచర్యద్వార అనుగ్రహించెను,” అని చెప్పెను.

నేను ఆ అందమగు స్థలములో నుండి కదిలి వచ్చినట్లుగా గ్రహించాను. నేను చుట్టూ చూచాను. నేను అన్నాను, “నీవు నిద్రలేచావా, ప్రియా?” ఆమె ఇంకా నిద్రబోతున్నది. నేనిట్ల అనుకొన్నాను, “ఓ దేవా, నాకు సహాయము చేయుము, ఓ దేవా! ఒక్క మాట విషయములో కూడా నన్ను ఎన్నడూ రాజీపడనీయకుము. వాక్యముతోనే నేను నిలచియుండి దానిని బోధించునట్లు నాకు కృప చూపుము. ఏది జరిగినా, ఎవరేమి పలికినా, ఎందరు సౌలులు లేదా కీషు కుమారులు లేచినా; నేను లెక్కచేయను. ప్రభువా! నన్ను ముందుకు తోడుకొని పొమ్ము”

63

మరణ భయమంతా.... నా ముందు పరిశుద్ధ గ్రంథమును ఉంచుకొని ఈ ఉదయమున ఇది మీతో చెప్పుచున్నాను. నాకు ఒక బాలుడున్నాడు, అతనికి నాలుగేండ్లు, నేనతనిని పెంచవలెను. నాకు తొమ్మిదేండ్ల బాలిక యున్నది మరియు ఒక యువకుడున్నాడు, వారిని బట్టి నేను దేవునికి వందనములు చెల్లించుచున్నాను. వారు ప్రభువు మార్గమువైపు తిరిగి యున్నారు. వారిని దేవుని హితబోదలో పెంచుటకు గాను నాకు దేవుడు ఆయుష్కాల మియ్యవలెనని ప్రార్ధించుచున్నాను. అంతే కాకుండా, ప్రపంచమంతా నా క్రొరకు వేచియున్నటుగా కనిపించుచున్నది. తొంబది సంవత్సరముల ముసలివారున్నారు, యువకులున్నారు, నేను నడిపించనియెడల వారచ్చటకు రాకపోయి యుందురని చెప్పిరి. దేవా, నేను యుద్ధములో ముందుకు కొనసాగిపోవుటకు సహాయము చేయుము, ఒకవేళ చనిపోవలసివచ్చినచో నేను భయపడను, నేను ఎక్కువగా.... అది సంతోషము. ఈ కలుషితము మరియు అవమానములో నుండి వేరగుట గొప్ప ఆనందదాయకము.

ఆవలకు నేను వెళ్ళవలెను, పదహారు కోట్ల మైళ్ళ ఎత్తులోయున్న ఒక చదరమైన స్థలమునకు నేను వెళ్ళగలిగినయెడల, అది పరిపూర్ణ ప్రేమ యగును. ఈ ప్రక్కన, ఒక్కొక్క మెట్టూ కుంచించుకుపోతూ యుండి, ఇప్పుడు మనము యున్న చోటికి అది చేరుచున్నది. అది కేవలము ఒక చిన్న క్షయత నీడగా కనిపించును. ఎచ్చటో ఒకచోట ఏదో ఒకటి చిన్నగా యున్నదనే చిన్న అనుభూతి మనలో కలుగుచున్నది. అది ఒక స్థలములో యున్నది, అది ఏమిటో మనమెరుగము. ఓ, నా ప్రశస్త స్నేహితులారా, నా ప్రియులారా, సువార్తలో నాకు మిక్కిలి పాత్రులారా, దేవునికి అద్వితీయులుగా జన్మించిన పిల్లలారా, మీ సంఘకాపరినగు నా మాట వినుడి. దానిని మీకు వివరించగల మరో విధానము నాకు ఏదయినా యున్నచో బాగుండును. మాటలలో చెప్పలేను. మాటలు నాకు దొరుకుట లేదు. ఎక్కడనూ ఆ మాటలు దొరకవు. కాని ఈ చివరి శ్వాసకు ఆవల మీరెన్నడూ ఎరుగని మహిమకరమగు అనుభవమున్నది. దానిని వివరించుటకు మాటలు లేవు. మార్గము లేదు; నా వల్ల అది కాదు. కాని నీవు ఏమి చేసినా గాని స్నేహితులారా, ఆ పరిపూర్ణ ప్రేమను మీరు పొందువరకు, ప్రతిదానిని మీరు అవతలకు త్రోసివేయుడి. అందరినీ ప్రేమించు స్థాయికి మీరు ఎదుగవలెను, ప్రతి శత్రువునూ, ప్రతివారినీ మీరు ప్రేమించవలెను. ఒక్కసారి నేను దానిని దర్శించుటవలన నేను వేరే మనిషిగా మారిపోయాను. నేను మరెన్నడునూ ముందున్న బ్రెన్హాం సోదరునిగా ఉండను, ఎన్నటికి ఉండలేను.

64

భూమి కంపించిపోయినా, మెరుపులు మెరుస్తున్నా, గూఢచారులు గురిపెట్టి నన్ను కాల్చి చంపినా, అది ఏమైనా గాని దానిని గురించి నాకు ఏ బాధ లేదు. దేవుని కృపను బట్టి యుద్ధమును కొనసాగించుటకు ముందుకు సాగిపోయెదను. నాకు వీలయిన వారందరికీ సువార్తను బోధించెదను, ఆవలగల చక్కని దేశమునకు రమ్మని వారిని ఒప్పించుచున్నాను.

అది కఠినముగా కనబడవచ్చును, అందుకొరకు ఎక్కువ బలముకూడా అవసరమగును. ఇంకెంతకాలమో నాకు తెలియదు. మనకు తెలియదు. భౌతికంగా మాట్లాడు రీతిగా దానిని మనమెరుగము. ఆ రోజు నాకు పరీక్ష జరిగినది. వారిట్లనిరి, “నీవు 25 ఏండ్లు కఠినముగా శ్రమించవచ్చును, నీవు బలముగానే యున్నావు,” అని అనిరి. అది నాకు సహాయము చేసినది. కాని అది మాత్రమే చాలదు. అంత మాత్రాన సరిపోదు. ఇంకా లోన ఎదో ఒకటి ఉన్నది. ఈ క్షయత, అక్షయతను పొందుకొనవలెను; ఈ మర్త్యత, అమర్త్యతను పొందుకొనవలెను.

65

కీషు కుమారులు లేవవచ్చును, వారెన్నో మంచి పనులు చేయవచ్చును, వారికి నేను విరోధంగా మాట్లాడను - వారు పేదలకు సేవ చేయుచున్నారు. సౌలుతో సమూయేలు చెప్పిన దానిని గుర్తి౦చుకొనండి, “నీవు కూడా ప్రవచించెదవు.” వారిలో చాలామంది గొప్ప ప్రసంగీకులైయున్నారు, ప్రధాన దేవదూతలవలె వారు వాక్యము బోధించగలరు. అయినా గాని అది దేవుని చిత్తము కాదు. దేవుడే వారికి రాజుగా యుండవలెను. సోదరీ, సోదరుడా, పరిశుద్దాత్మయే నిన్ను నడిపించనీయుము. ఒక్క క్షణం మనము తలలు వంచుదము.

నాకు ఇంటి మీద బెంగగా, చింతగా యున్నది,

యేసును నేను చూడగోరుచున్నాను.

ఆ మధురమగు నౌకాశ్రయ గంటలు నేను వినగోరుచున్నాను.

అది నా మార్గమునకు వెలుగు చూపి, సకల భయమును చెదరగొట్టును; ప్రభువా, కాలమును తెరకు ఆవలగా నన్ను చూడనిమ్ము ప్రభువా. దుఃఖము మరియు భయమును తెరకు ఆవలివైపు నాకు చూపించుము;

ఆ ప్రకాశమానమగు దేశము చూపించుము.

అది మా విశ్వాసమును బలపరచి, సమస్త భయమును చెదరగొట్టును;

ప్రభువా, కాలపు తెరకు ఆవలగా ఉన్నదానిని మాకు చూపించుము.

66

ప్రభువా, ఈ ఉదయమున ఈ చిన్న సంఘము ఆ తెరకు ఆవలగా చూడగలిగిన ఎంతో మేలు.... వారిమధ్య ఒక్క శ్రమకుడా యుండదు, ఎన్నటికి ఉండజాలదు. వ్యాధి ఎన్నడూ అక్కడికి రాదు, పరిపూర్ణత తప్ప మరేమీ అక్కడ లేదు. అక్కడికి, ఇక్కడికి మధ్య దూరము ఒక్క ఊపిరి మాత్రమే — ముసలి తనము నుండి యవ్వనములోనికి, కాలములో నుండి నిత్యత్వములోనికి. చింతగల రేపులో నుండి మరియు దు:ఖముండిన నిన్నటి నుండి నేటి పరిపూర్ణత మరియు నిత్యత్వములలోనికి అడుగిడుదుము.

దేవా, ఇక్కడున్న ప్రతి వ్యక్తిని దీవించుమని నేను ప్రార్ధి౦చుచున్నాను. ప్రభువా, నీ ప్రేమ విధానమును ఆ విధముగా ఎరుగనివారు ఇక్కడ కొందరు ఉండియుందురు. తండ్రీ, అటువంటి ప్రేమ లేకుండా ఎవరునూ నిజంగా అందులో ప్రవేశించజాలరు — నూతన జన్మతో, తిరిగి జన్మించవలెను. పరిశుద్దాత్మ దేవుడు, ప్రేమయైయున్నాడు. అది నిజమని మనకు తెలియును. కొండలను పెకిలించగల విశ్వాసము మనకుండవచ్చును, గొప్ప కార్యములు మనము చేయవచ్చును, అయినా గాని ప్రేమ లేనియెడల ఆవల ఉన్న ఆ గొప్ప నిచ్చెనను మనము ఎక్కలేము. అయితే దానితో, అది మనలను ఈ భూమిమీదనుండి దాటి పైకి లేపును.

తండ్రీ, ఈ జనులను ఆశీర్వదించుమని ప్రార్ధి౦చుచున్నాను, ఈ ఉదయమున ఈ సత్యమును ప్రతిఒక్కరు వినిరి. ప్రభువా, నీవే దీనికి సాక్షివి. ఆనాటి సమూయేలు అదే చెప్పెను, “యెహూవా నామములో సత్యమును గాక మరిదేనినయినా ఎన్నడయినా నేను చెప్పానా?” వారే న్యాయనిర్దేతలు. ప్రభువా, ఇప్పుడు వీరికి చెప్పుచున్నాను, నీవు నన్ను ఆ దేశమునకు తీసికొని వెళ్ళినావు. అది సత్యమని నీకే తెలియును. తండ్రీ, నిన్ను తెలియనివారు ఇక్కడ ఉన్నచో ఈ ఘడియలోనే వారు ఈ విధముగా పలికెదరు గాక! “ప్రభువా, నీ చిత్తము జరిగించు బుద్ధి నాకనుగ్రహించుము.” తండ్రీ, దానిని దయచేయుము.

67

ఇప్పుడు మీరు శిరములను వంచి చేతులెత్తి ఈ విధంగా చెప్పండి, “బ్రెన్హాం సోదరుడా, నా కొరకు ప్రార్ధి౦చుము, దేవుని చిత్తము నా లోన నెరవేర్చుము.”

మీరిప్పుడున్న చోటనే యుండండి, మాధుర్యముగా మీ తండ్రితో ఈలాగున చెప్పండి. “దేవా, ఈ ఉదయమున నా హృదయములోని లోక సంగతులనన్నింటినీ విసర్జించుచున్నాను. నిన్ను ప్రేమించుటకు నేను సమస్తమూ విసర్జించుచున్నాను. నా జీవితకాలము నిన్ను సేవించెదను. ఈ దినమునుండి నేను పరిశుద్ధ గ్రంథములోని ప్రతి లేఖనమును వెంబడించెదను.” మీరు ఇంకా క్రైస్తవ బాప్తిస్మమును పొందనియెడల, “నేను పొందెదను ప్రభువా.” “ఒకవేళ నేను పరిశుద్దాత్మ బాప్తిస్మమును ఇంకా పొందనియెడల...” దానిని మీరు పొందినప్పుడు ఎరుగుదురు. అది మీకు ఇచ్చును.... మీకు అవసరమగు నిశ్చయతను మరియు ప్రేమను అది అనుగ్రహించును. ఓ, మీరు ఇంకెదో చేసియుండవచ్చును - గంతులు వేసి, చప్పట్లు కొట్టి, బాషలు మాట్లాడియుండవచ్చును, అది సరియే, కాని ఇప్పుడు నన్ను నమ్మండి, దైవప్రేమ లేనిచో అది వ్యర్ధము.

ఇట్లు పలుకుము, ''ప్రభువా, నా హృదయములోను, నా అంతరాత్మలోను నీ ఆత్మ నుంచుము, అప్పుడు నేను హృదయములో దైవప్రేమ కలిగియుండి ప్రేమను, గౌరవమును వ్యక్తము చేయగలుగుదును. అప్పుడు, నేను నా తుదిశ్వాస విడిచిన తరువాత ఆవలనున్న దేశమునకు వెళ్ళుదును.'' మేము ప్రార్థించుచుండగా, మీరును మీ స్వ౦త విధానములో ప్రార్థన చేసికొనుడి. దేవుని సహాయమును అందుకొరకు అడుగుడి. మీరంటే నాకు ఇష్టము. మిమ్మును నేను ప్రేమించుచున్నాను. ప్రశస్తమగు తలనెరసిన వృద్దులు ఇచ్చట కూర్చొనియున్నారు. వారు కష్టించి పనిచేసి పిల్లలను పోషించిరి. కన్నీరు కార్చిన వృద్ధ తల్లులు ఇచ్చట యున్నారు. ప్రియులారా, మీకిది నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆవలియొడ్డున పరిస్థితి వేరుగా యున్నది, దానిని నిరాక్షేపముగా నేను చూచాను, అది మనము నివసించు ఒక పరిధి; ఇప్పుడు మనము క్షయతలో బ్రదుకుచున్నాము. “ప్రభువా, నీ చిత్తమే నాలో సిద్ధించు గాక!” మనం కలిసి ప్రార్థించుచుండగా, మీరును ప్రార్థించుడి.

68

ప్రభువా గౌరవముతో, నీ వాక్యమును, నీ పరిశుద్దాత్మను ప్రాతిపదికగా తీసికొని, మా జన్మ ఎక్కడనుండి వచ్చినదో మేము ఎరిగి ఎంతగానో సంతోషించుచున్నాము. మానవ ఇచ్చనుబట్టి కాదు, శరీరేచ్చబట్టి కాదు గాని దేవుని చిత్తముబట్టి మేము జన్మించియున్నామని ఎరిగి ఆనందించుచున్నాము. తండ్రీ, క్షమాపణ కృప కొరకు ప్రార్ధి౦చుచున్నవారి నిమిత్తము అడుగుచున్నాము, ప్రభువా, నీ ఆత్మయే పనిచేయును. నేను ఏ విధముగాను వారికి ఇయ్యలేను. నేను కేవలము మానవుడను, కీషు యొక్క మరో కుమారుడను. కాని పరిశుద్దాత్మ యున్న నీవు మాకు అవసరము. దేవా, నన్ను సమూయేలుగా ఉండనిమ్ము — వాక్య సత్యమును చెప్పునట్లు చేయుము. ఇంతవరకు నీవు దానిని బయలుపరచియున్నావు, నీ పట్ల నేను నమ్మకముగా జీవించినంత కాలము నీవు ఆ విధంగానే దీనిని కొనసాగించుదువని నేను నమ్ముచున్నాను.

తండ్రీ, ఇప్పుడు వారందరూ నిత్యజీవమును పొందుదురు గాక. ఈ దినము వారియొద్దనుండి ఎన్నడునూ తొలగిపోకుండును గాక! వారు ఈ లోకమును విడిచిపెట్టు ఘడియ వచ్చినప్పుడు, నేనిప్పుడు చెప్పిన వాస్తవమును వారు తెలిసికొందురు. నేడు మనము శరీరముతో కూర్చొనియున్నాము, మా గడియారములను చూచుకొని భోజనమునకు సిద్ధపడుచున్నాము, రేపటి పనిగూర్చి ఆలోచించుచున్నాము, జీవిత విచారములతో అలసిపోవుచున్నావు, ఇవేమీ అప్పుడు ఉండవు. ఇవన్నియూ అంతరించిపోవును. చింతలు ఇక ఉండవు — అచ్చట గొప్ప నిత్య సంతోషము మాత్రమే యుండును. తండ్రీ, ఆ రకమగు జీవితమును ప్రతిఒక్కరికిని దయచేయుము. తండ్రీ, ఈ ఉదయమున ఈ దర్శనమును వినిన ప్రతిఒక్కరు ఆవలి యొడ్డున ఉండునట్లు కృప చూపుము. ఒకవేళ నాతో సమ్మతించని మగవారు, స్త్రీలు ఇక్కడ ఉండియుండవచ్చును, కాని అదెన్నడూ మాకు అభ్యంతరకరముగా ఉండకుండును గాక. అవతలి దరిలో యున్నవారిని మేమందరమూ సంధించునట్లుగా చేయుము. వారివలెనె పరుగిడుచూ, “మా ప్రశస్త సోదరుడా” అని కేకలు వేయుదుము గాక. ప్రతియొక్కరికి, అచ్చట చూపించిన విధముగానే అది యుండనిమ్ము, ప్రభువా. ఆ విధముగా ఉండునట్లు కృప చూపుమని ప్రార్థించుచున్నాను. నేను ప్రేమించువారినందరిని, మరియు నన్ను ప్రేమించువారినందరికి. అది ఆ విధముగా ఉండును అని ప్రార్దించుచున్నాను, ప్రభువా. వారినందరినీ నేను ప్రేమించుచున్నాను.

తండ్రీ, వారిని కనబడనిమ్ము. ఇప్పుడు నేను వారికి నిత్యజీవమును అందించుచున్నాను. దానిని అంగీకరించుటలో వారు తమ వంతును పూర్తిచేయుదురు గాక. యేసు నామములో దీనిని అడుగుచున్నాను. ఆమేన్.

69

రోగుల కొరకు ప్రార్ధి౦చుటకు మనకు కొద్ది సమయమున్నది. ఒక వ్యాధిగ్రస్తురాలగు బాలిక మరియు కుర్చీలో ఒక స్త్రీ యున్నట్లుగా నేను చూచుచున్నాను. ఇప్పుడు, నాకత్యంత ప్రశస్తమగు సోదర సోదరీలను గుర్తుచేసికొనుచున్నాను, దయచేసి నన్ను అపార్థము చేసికోవద్దు. ఏమి జరిగినదో నేనెరుగను, సంభవించినదేమిటో నాకు తెలియదు. కాని, దేవా, నేను చనిపోయినప్పుడు తరిగి అక్కడికి నన్ను చేర్చుము. ఆ స్థలమునకే మరల నన్ను పంపించుము. అది ఎచ్చట యున్నాగాని అక్కడే నేనుండగోరుచున్నాను. మూడవ ఆకాశమునకు కొనిపోబడిన పౌలు వలె నేనున్నానని చెప్పుకొనుటకు ప్రయత్నించుటలేదు. ఆలాగు నేను చెప్పుట లేదు. ఆయన నన్ను ప్రోత్సాహపరచుటకు ప్రయత్నించెనని నేను నమ్ముచున్నాను, రాబోవుచున్న నా క్రొత్త పరిచర్యలో నన్ను కొద్దిగా ఉత్తేజపరచుటకు దీనిని ఇచ్చెనని నేను నమ్ముచున్నాను.

70

ఒక నిమిషముపాటు నేను ఇక్కడ ఒక సంగతిని చదివినయెడల అసందర్భముగా యుండునా? చదువుట పరవాలేదా? దేశములోని ప్రముఖ పత్రికలలోని ఒక పత్రికలో వ్రాయబడినది — బిల్లీగ్రాహం గురించి వెలువడిన ఒక విషయమిది: “డాక్టర్. బిల్లీగ్రాహం ఇస్లామ్ వారియొద్దకు ఆహ్వానించబడుచున్నట్లుగా ఆఫ్రికన్ టైమ్స్ అను పత్రిక ముందు పేజీలో 1960 ఫిబ్రవరి 15న ఇట్లు వ్రాయబడినది. ఆ వ్యాసమును వ్రాసిన వ్యక్తి ముస్లిం (మహమ్మదీయుడు), యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని ప్రసంగించేటప్పుడు అద్భుత కార్యములు ఆ సేవను వెంబడించుచూ యుండవలయుననే అభిప్రాయమును వ్యక్తపరచు వ్యక్తి అతడు వ్రాసినది చదువుదును:

“ఈ క్రీస్తే తన అనుచరుల గూర్చి ఈలాగున వ్రాసెను, ”నాయందు విశ్వాస మంచువాడు, నేను చేయు క్రియలు చేయును; అంతకన్న గొప్పవియు చేయును.“ పరిశుద్ధ గ్రంథములో క్రీస్తుకున్న గుణలక్షణములను సంఘము ఎన్నడయినా కలిగి యుండెనా? ఈనాడు అవి చూపించగలరా? ప్రసిద్ధి చెందిన ఏ సంఘమైనా గాని క్రీస్తు చేసిన అద్భుత కార్యములలో సగమైనా చెయ్యగలదా? వాటికంటె గొప్ప క్రియలను గురించి ఇప్పుడు మాట్లాడవద్దు. క్రైస్తవ మతమును గురించి బోధించే నీవు చనిపోయినవారిని మరల బ్రదికించగలవా? నీవు సముద్రము మీద నడవగలవా? వ్యాధిగ్రస్తులను స్వస్థపరచగలవా, గ్రుడ్డివానికి చూపును యివ్వగలవా? పైన ప్రస్తావించబడిన విషయములను బట్టి మహమ్మదీయుల వలన నియమించబడిన అంశముగా ఇది యున్నది కదా! ఎవరో ఈ కార్యములను చేయుట వలన వారియొక్క విశ్వాసమును వెంబడించునట్లు చేయుటయా లేక నీ విశ్వాసము ద్వారా వెంబడించునట్లు చేయుటయా అనే క్రీస్తుయొక్క పరీక్షగా ఇది యున్నదా!”

71

ఈ ముస్లీము వ్రాసిన వ్యాసములకు ఎంతో తేటగా ఒకదాని తరువాత ఒకటి తప్పు ప్రకటన. ఈ మహమ్మదీయుడిని మాటలు త్రోసివేయాలని వారు తలంచిరి, కాని అతడు చెప్పినది సరియే. వారు ఏమి చెప్పారో అది ఇక్కడ ఉన్నది:

“పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయుటయు మరియు ఖురానును ఎరిగియుండుటయే యగును. ఖురానుతో జతచేసి ఈ క్రియలను చూచిన ఎడల దానికి ముప్పు వాటిలును. మహమ్మదీయ మార్గము క్రైస్తవ మార్గముకంటే ఉన్నతమైనటుగా, దీనిని అది మించిపోవునట్లుగా యున్నదని చెప్పుకునే మహమ్మదీయుల మాటలు డాంభికమైనవియే, అది ఊహ మాత్రమే. వ్యాసకర్త వ్రాసిన అద్భుత కార్యములనే ముఖ్యమైన అంశమును గురించి వ్రాసి, అది సంఘమును తాకునట్లుగా చేసెను. అయినా గాని ఇచ్చట వ్యాసకర్తయొక్క యధార్థతను సందేహించవలసియున్నది. ఇచ్చట చూడండి. దక్షిణాఫ్రికాలో రక్షకుడగు క్రీస్తును 10,000 మంది అంగీకరించుటకు రెవ. విల్లియం బ్రెన్హాం ముస్లిముల ఎదుట జరిగించిన అద్భుతములను ఎవరు కాదనగలరు. దానినెవరు కాదనగలరు? దక్షిణాఫ్రికాలోని డర్బన్లలోను, ఇంకా ప్రపంచమంతటను విల్లియం బ్రెన్హాం సేవ ద్వారా ఇవి జరిగియున్నవి. తూర్పు ఆఫ్రికాలో టి.ఎల్. ఆస్బార్న కూడా ఆలాగే చేసెను. మనం 100% బిల్లీగ్రాహం పక్షముగా నిలబడుదుము. మనం అసలు విషయం చూచాము — ఈ అంశమునకు విలువ లేదు.”

72

అతడు వ్రాసిన దానిలో మనలను మతోన్మాదులని విమర్శించెను, మనం చేయుచున్నది మనకే తెలియదనెను. అయినా గాని దేవుడు చేసిన వాటిని వారు తమ స్వంత పత్రికలో ప్రచురించక తప్పలేదు. దేవుడు ఎన్నటికిని ఒకే రకంగా యున్నాడు. వారది నమ్మరు, వారది చూడరు అని మీరు తలంచవచ్చును గాని, అది మరుగుగా చేయబడలేదు మరియు ఏదో ఒక మూలన అది జరగలేదు. వేలాది, వేలాదిమంది జనులు అచ్చట కూర్చొని దానిని చూచిరి, ఒక కుంటి బాలుడు అచ్చటికి వచ్చినప్పుడు పరిశుద్దాత్మ అతని గూర్చి అన్ని సంగతులను బయలుపరచెను. అప్పుడు 10,000 మంది ముస్లిమ్లు తమంతట తామే నేల మీద బోర్లన పడి యేసుక్రీస్తును తమ స్వరక్షకునిగా స్వీకరించిరి.

టి.ఎల్. ఆస్బార్న్ వంటివారు ఇంకా మనకున్నారు, వారింకా గొర్రెలకు మేతపెట్టుచున్నారు. సహో, ఆస్బార్న్ ఇంకా ముస్లిముల యొద్దకు వెళ్ళలేదనుకొంటాను. వారు తామెంతో గొప్పవారమని చెప్పుకొందురు. కాని సింహము నోటిలోనుండి, ఎలుగుబంటి నోటిలోనుండి గొర్రెలను విడిపించగల దేవుడు మనకున్నాడు.

73

వారు దానిని గూర్చి వ్రాసియున్నారు మరియు వారు దానిని గూర్చి గుర్తించినదానిని చూచినందువలన నాకు ప్రయోజనమైనది. వారు అసలు ఆ కార్యములను చెయ్యనే లేదని వారనుకొనుచున్నారు. వారు నడచి వెళ్ళి మరియు వారి వీపును వెనకకు త్రిప్పి చెప్పెదరు, “ఓ, ఆ దినములు గతించినవి.” “ఓ, మొత్తం మీ బైబిల్ అంతా గతించినది. మీరందరూను తప్పు. మీరు మానవుని ఆరాధించుచున్నారు, అతని పేరు యేసు, అతడు ఒక నరుడు, ఎప్పుడో అతడు చనిపోయెను. మరియు మరల ఎన్నడూ పునరుత్థానము చెందలేదు,” అని మహమ్మదీయులు చెప్పెదరు.

కాని డర్బన్ కూటములో వారామాట పలుకలేకపోయిరి. అక్కడ ఆయన అవే కార్యములను చేయగా వారు స్వయంగా చూచిరి, మరియు అవి రుజువయ్యెను. శాఖలు సహితము తిరిగి వెనక్కి రావలసియున్నది... పరిశుద్ధ గ్రంథముపై యున్న నా ప్రసంగములను నేను మరలా పరిశీలించవలెనని నాకు వ్రాసిన అదే వ్యక్తి ఆ అద్భుత కార్యములను గురించి అతడే తన స్వంత పత్రికలోనే వ్రాయవలసివచ్చినది. ఏదో విధంగా వారు దేవునిని స్తుతించక తప్పలేదు. అది నిజము. దేవుడు వారిని ఏలాగయినా ఆయనను స్తుతింపచేయును.

74

ఒక వ్యాధిగల బాలిక ఇచ్చట కూర్చొనియున్నది. ఆమె మీ బిడ్డా? సోదరీ, ఆమె వ్యాధి ఏమిటి? మెదడులో రక్తస్రావము. నలుగు ఏళ్ళు. ఇది అమ్మాయి? (ఆ వ్యాధిగల బిడ్డయొక్క తల్లితో సహో, బ్రెన్హాంతో “మునుపటికంటే ఇప్పుడు ఆమె చాల బాగున్నది.”) అమ్మా! బిడ్డను రక్షించగలవారు ఒకేఒకరున్నారు, ఆయన దేవుడు. అందునిమిత్తమై నేనెంతో సంతోషించుచున్నాను. నెవిల్ సహాదరుడా నీవామెకు ప్రార్తి౦చుట జరిగినదా? నెవిల్ సోదరుడు ప్రార్ధించినప్పటి నుండి ఆమె మెరుగవుచున్నది. గొర్రెలయొక్క ఆహారమును గూర్చి ఎరిగిన గొర్రెల కాపరులు ఇంకా ఉన్నారు.

75

అక్కడ కుర్చీలో కూర్చొనియున్న ప్రియ సోదరీ, నీ యొక్క వ్యాధి ఏమిటి? నీకు కాన్సరు. ఇక్కడే నీ గూర్చి ప్రార్ధి౦చెదను. ఇక్కడున్నవారిలో ఎందరు కాన్సరు వ్యాధినుండి బాగుపడిరో చేతులెత్తి చూపించండి. సోదరీ, ఇటు చూడుము.

దేవుడే బాగుచేయువాడు. దానిని మనం ఎరుగుదుము. నేను ఆ బాలికయొక్క మొదడులోని వ్యాధిని బాగుచేయుదునని చెప్పినయెడల అబద్ధికుడనగుదును. నాది తప్పు. ఆ స్త్రీయొక్క కాన్సరును బాగుచేయగలనని చెప్పినయెడల అబద్ధికుడనగుదును. కాని ఒక సంగతి నాకు తెలియును: ఒక దినమున దేవునియొక్క గొర్రెను ఒక ఎలుగుబంటి, ఒక కాన్సరు, ఒక కణితి, ఒక గ్రుడ్డితనము, మరణము పట్టుకొనినది. నేను దేవునియొక్క శక్తితో దాని మీదికి వెళ్ళాను. నేను దానిని చంపి, ఆ గొర్రెను విడిపించాను. అది నిజము. పలానిది నేను చేయగలనని చెప్పి గొప్పతనంతో మనం వెళ్ళుట కాదు. ప్రార్థన అను చిన్న వడిసెలను నేను పట్టుకొని వెళ్ళుచున్నాను. అది వారికి విడిపించి తెచ్చును. సోదరీ, దానిని నీవు నమ్ముచున్నావా? నీవు కూడా దానిని నమ్ముచున్నావా సోదరీ?

76

మీ హృదయపూర్తిగా నమ్ముచున్నారా? నేను ప్రార్థన చేయుచుండగా మీరు శిరములు వంచండి. [రోగుల కొరకు ప్రార్ధి౦చుటకు సహో, బ్రెన్హాం వేదికపై నుండి దిగియున్నారు.] మంచిది.

ప్రియమైన తండ్రి, ఇక్కడ ఒక అందమైన స్త్రీ పడుకొని ఉంది, కేవలం మీరు సహాయం చేస్తే తప్ప ఆవిడ ఎప్పటికి నడవలేదు మరియు తిరుగలేదు. శత్రువు తనను పట్టుకొని ఉంది; వైద్యులు ఆవిడను బాగు చేయలేనంతగా ఉన్నది. శత్రువు ఆవిడను చాల దూరం కుదిపివేసినది కనీసం వైద్యులు కూడా ఏమి చేయలేని స్తితిలో ఉన్నది. కాని ఆవిడ నీ చేరువలో నుండి దూరముగా లేదు, ప్రభువా. ఆవిడ నీవు చేయి పెట్టునంత దూరములోనే ఉంది. నీ యొక్క వాక్యము ఆధారము చేసుకొని నేను నా చేతులు ఈ యొక్క యవ్వన స్త్రీ పై ఉంచి ఈ మెదడులోని రక్తస్త్రావాన్ని గద్దిస్తున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు నామములో, మరొకసారి తనను పూర్వ స్తితి స్త్రీగా తీసుకొని రమ్ము. ఆవిడ దేవుని యొక్క మహిమ కొరకు జీవి౦చును గాక. ఈవిడ బాగుపడును గాక, మరియు ఇతరులు నిన్ను తెలుసుకొన్న వలే, బాగుపడి ఈ సంఘములో లోపల మరియు బయటకు తిరుగున గాక. దేవునికి మహిమ చేల్లించండి. యేసుక్రీస్తు ద్వారా ఇది ఆలగ ఉండును గాక...

77

తెల్లని తల వెంట్రుకలవలె కాక, ఇంకా కొద్ది దూరము, నేను చుసిన ఆవల ఉండును... ఏ మాత్రము వృద్ధురాలు వలే కాక యవ్వనముగా, కాని ఆమెను ప్రేమించు వారు తనను ఎడుచులాగు చేయుచున్నారు. ఓక గొప్ప శత్రువు తనను పట్టుకొని వైద్యులు తాకలేనంత దూరం కుదిపివేసినది, ఒక బయపెట్టుచున్న కాన్సర్ అనే సింహము. దేవా, నేను ఆమె వెనుక వచ్చుచున్నాను మరియు నేను వెనుకకు తికుకొని వచ్చుటకు. ఈ సింహమును చంపుచున్నాను.... ప్రభువైన యేసు క్రీస్తు నముమమున ఎవరికైతే నేను ప్రతినిధిగా ఉన్నానో. యేసుక్రీస్తు నామములో అది తనను విడిచిపోవును గాక. తను బాగుపడి మరి ఇంకా అనేక ఏళ్ళు దేవుని మహిమ కొరకు బ్రతుకును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఆమెన్.

మా పరలోకపు తండ్రి, గొప్ప కవచము లేక చక్కని మేరియుచున్న ఈటెతో గాక, మీరు చెప్పినట్టు మేము సాధారణ విశ్వాసం అను వడిసెలతో మీ ముందుకు ఈ ఆత్మా మరియు శరీరం కొరకు వచ్చి ఉన్నాము. కాన్సర్ అనే శత్రువు తనను పట్టుకొని వైద్యులు తాకలేనంత దూరం లాగివేసినది, కాని నేను ఈ ఉదయం ముందుకు వస్తున్నాను ప్రభువా, తనను మరొకసారి పచ్చని నీడలోని పచ్చిక మరియు నీటి ప్రదేశమునకు. విజయమునిచ్చు ప్రభువైన యేసుక్రీస్తు నామములో, నేను ఒక ఓడిపోని విశ్వాస ప్రతినిధి వలే, ఈ యొక్క ప్రార్ధన శక్తి ద్వారా తను బాగుపడుతుంది అని నేను నమ్ముచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆలాగు ఉండును గాక్.

ఇప్పుడే బాప్తిస్మము కార్యక్రమము ఉంది అని నేను నమ్ముచున్నాను.

ఒక్క క్షణము మీరు శిరములు ఎత్తుదురా? ఈ జనులు చాలా తీవ్ర రోగములతో యున్నారని ఇప్పుడే నాకు సంఘకాపరి చెప్పెను. వారు బాగవుదురు. దేవుని వాగ్దానము ఎన్నడూ విఫలము కొదు. వారిని మనము తప్పించుదము.

78

బాప్తిస్మపు కార్యక్రమమున్నది, వెళ్ళిపోవలసియున్న జనులున్నారు. ఈ రాత్రికి మరల మనకు అరాధన యుండును. ఈ రాత్రికి రాలేని వారెవరైనా యున్నచో వారికి ఇప్పుడే ప్రార్థన చేయుదుము - ఈ రాత్రికి మరల రాలేనివారు. మీరు ముందుకు రండి. ఈ రాత్రికి రాలేనివారు రండి. ఈ రాత్రికి చాలామందికి ప్రార్థన చేయుదుము. ప్రార్ధన వరుస యుండును. వారు ఈ జనులకు బాప్తిస్మము ఇయ్యవలెను.

ఇంకొద్ది నిమిషములు మీరు మాకు ఇచ్చినట్లయితే బాప్తిస్మపు ఆరాధన కొరకు మేము ప్రార్ధి౦చెదము. దానిని మీరు చూడగోరుచున్నారని నాకు తెలియును. ఈ ఉదయమున బాప్తిస్మము పొందగోరువారు వినండి - స్త్రీలు ఇటు వచ్చి బట్టలు మార్చుకొనవలెను, మగవారు ఇటువైపు రావలెను. ఈ రోగులను నేను ప్రార్థన చేయుచుండగా, మీరు బాప్తిస్మపు కార్యక్రమమునకు ఏర్పాటు చేయండి.

79

ఈ రాత్రికి ప్రార్థన వరుస యుండును. వారు వచ్చిన వెంటనే దానిని ఏర్పరచుదుము. దానిని మీరు చూడగోరుదురని నేనెరుగుదును. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయమును ఈ రాత్రికి ప్రారంభించుదము. మీకు ఏ సంఘము లేనియెడల ఇక్కడకు రండి, సంతోషముగా మిమ్మును చేర్చుకొందుము. మీకు మీ స్వంత సంఘము మరియు సంఘకాపరి ఉన్నయెడల మీ ప్రశస్తమగు సంఘమునకు మీరు హాజరుకండి మరియు మీ సహకారము ఇవ్వండి. మీరిప్పుడు వెళ్ళిపోవుచున్నయెడల దేవుని దీవెనలు మీమీద యుండవలెనని కోరుచున్నాను. మీకు వీలయితే మరల మా యొద్దకు రండి, మిమ్మును సంతోషముగా చేర్చుకొందుము. మిగిలినవారందరూ ఒక్క నిమిషము మీ శిరములు వంచుడి, మేము ప్రార్ధించగోరుచున్నాము.

తండ్రీ, చిన్న గొర్రెలకాపరి యొక్క వడిసెలనుబట్టి ఈ దినము నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రార్ధన వలన సింహము తన మోకాళ్ళపై తెచ్చినది, చిన్న గొర్రెపిల్ల బయటకు పరుగిడి తన తల్లిదండ్రుల యొద్దకు చేరినది. మా సోదరుని కొరకు ప్రార్థించుచున్నాము. ప్రభువా, ఇతనికి కూడా ఆరోగ్యము దయచేయుమని ప్రార్థించుచున్నాము. అతని శరీరములోని రక్తపుపోటు మరియు బాధలు ముగియును గాక ప్రభువా, వాటిని నేను తరుముచున్నాను. ఇతనిని మరల విడిపించుచున్నాను. యేసుక్రీస్తు నామములో ఆ ప్రకారమే జరుగును గాక. సోదరుడా, దేవుడు నిన్ను దీవించును!

80

మరియొక గ్రుడ్డి బాలుని నేను చూచియున్నాను. మరో సంగతి నేను చెప్పగోరుచున్నాను. నాకు చాలా జబ్బు చేసినది, వాంతులతో యున్నాను. దీనిని మీరు జాగ్రత్తగా వినండి; నేనీ విధంగా తలంచాను, “దేవా, బయట ఎవరో ఆగియుండుటను నేను వినినచో వారికి ఏమియ్యగలను?”

నా భార్య ఇట్లనును, “బిల్లీ, నిన్ను చూచుటకు ఒక వృద్దుడైన పెద్దమనిషి వచ్చెను,” అంతట నేను బట్టతల గల వ్యక్తిని చూచెదను. అతని గడ్డము నెరసిపోయి యుండును.

అతడు నడచి వచ్చి ఇట్లనును, ''మీరేనా సహో, బ్రెన్హాం?''

''అవునండీ! నేనే!'' అందును.

''నా పేరు సైమన్'' అని అతడు చెప్పి నా మీద తన చేయివేసి ఒక నిమిషం చూచును. “బ్రెన్హాం సోదరుడా, నీవు విశ్వాసివేనా?” అనును.

''అవును!''

“అంతా బాగవును.” పరిశుద్ధ గ్రంథములోని సీమోను పేతురు. దానిని ఎంతో నేను అభినందించుదును. అతడు ఇంకా ఎక్కువ మాట్లాడనవసరము లేదు — అతడు నా పై చేయి వేసినచో చాలును, నేను బాగవుదును.

అప్పుడు, నేనిట్లనుకొందును: దేవుని సహాయము ద్వారాను, దేవుని కృప ద్వారాను వేలాదిమంది ఆ విధంగానే నన్ను నమ్ముచున్నారు. వారియొద్దకు నేను వెళ్ళినప్పుడే వారాలాగే అనుకొందురు. నేనిట్లు తలంచుదును, ''ప్రభువా, నాకు వీలయినంత మంది దగ్గరకు వెళ్ళుదును,“ సీమోను పేతురు గాని లేదా పౌలు గాని నా యొద్దకు వచ్చి ”బ్రెన్హాం సోదరుడా,“ అని పిలచినచో ఎటుండునో వారికిని అదే రీతిగా యుండును.

“అవును.”

వారు నా మీద చేతులు వేసి నా పైపు చూచి ఇట్లనును, “మంచిది బ్రెన్హాం సోదరుడా,” బయటకు నడచిపోయెదరు. నేను బాగవుదును. నేను స్వస్థత పొందెదను నిశ్చయంగా, నాకప్పుడు ఎంతో ధైర్యము వచ్చును. నేను బాగవుదునని నమ్ముదును. అవును! ఈనాడు జనులు కూడా ఆ ప్రకారమే నమ్మదురు. ఇక్కడికి నేను అది చేయుటకే వచ్చియున్నాను. మీ మీద చేతులుంచి దేవునిని అడుగుదును.

81

నేను ఈ చిన్న బాలుడు దగ్గరకు పోవాలని ఉంది, సాహోదరి, ఒక్క నిమిషం, ఈ చిన్న గ్రుడ్డి బాలుడు. ఎంత కాలం ఈయన గ్రుడ్డితనముతో ఉన్నాడు. సహోదరి? పుట్టినప్పటి నుండి, చిన్ని బలుడా! ఓ, నీవు కాదు...?.. ఇప్పుడు, ఒక్క నిమిషము.

ఓ కృపగల దేవా, వైద్యులు అందుకోలేని దూరములో, పుట్టుకతోనే అందవత్వం, చూడలేడు, ఈ అందమైన, ప్రియమైన, చిన్ని బాలుడు.... మరియు శత్రువు ఈ చిన్న వ్యక్తికి అవకాశం లేక ముందే వైద్యులు అందుకోలేని స్తితిలో కుదిపివేసినది. నేను ఈ ఉదయకాలం ఈయన వెనుకాలే వస్తున్నాను, ప్రభువా. ఈ చిన్న సామాన్యమైన ప్రార్ధన అను వడిసెలతో.... వెనుకకు తీసుకోని రానిమ్ము, దేవా. ప్రభువైన యేసుక్రీస్తు నాముమలో నేను ఈ శత్రువును ఎదురుకోనుటకు, ఈ బాలుడను ప్రభువుకు ప్రకటిస్తున్నాను. నేను ఈయన చూపును దేవుని కొరకు ప్రకటిస్తున్నాను, సాతాను దొంగిలించిన దానిని వెనకకు ఇస్తూ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈయన పొందుకోనును గాక. అది ఆలాగు అవును గాక.

ఇప్పుడు, సహోదరి, ప్రియమైన, ఇప్పుడు రవ్వంత అయిన అనుమానము ఉంచకుము, ఈ చిన్న బాలుడు బాగవుబోతున్నాడు. మీరు ఈయనను సంఘమునకు మరల తిసుకు వచ్చి తను చూచును అని అందరికి చూపించండి ..... ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈయన చూపు ఇవ్వుము......

82

అవును...?... ప్రభువైన యేసు...?... ఈ చిన్న వక్తి మేము చాల ప్రార్ధనలు అర్పించాము, కానీ ఈ ఉదయం నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరల వచ్చాను, నేవు నాకు ఇచ్చిన ఈ చిన్న వడిసెలతో; నీవు నాకు సహాయం చేసావు, ప్రభువా, మరణము యొక్క నోట్లో నుండి తప్పించు సహితము నీ యొక్క శక్తి, మరణము నుండి లేపునట్లు, వారు చనిపోయారు అని ప్రకటించిన తరువాత కూడా, వారు చల్లగా మరియు గట్టిగ అయిపోయిన తరువాత కూడా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను ఈ శత్రువు వెనుక వచ్చుచున్నాను, కావున మరల తిరిగి చక్కని ఆరోగ్యమునకు తెమ్ము. దీనిని దయచేయండి; దేవుని మహిమ కొరకు అది ఆలాగు జరుగును గాక.

మీరు దేనికొరకు ప్రార్ధన... మీరు విశ్వాసియా? ప్రభువా నేను ఈమెను ఈ చిన్న వడిసెల అందు దూరములో తీసుకోని వచ్చుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇది ఈమెను విడిచి మరల ఎప్పుడు తిరిగి రాకుండును గాక. ఆమెన్......

మంచిది, అదే చిన్నని వడిసెల ఏదైతే వెళ్ళి హృదయమును తాకిందో, మరియు మీ కుమార్తె, మరియు...?.. ప్రియమైన పరలోకపు తండ్రి, నేను నీవు నాకు ఇచ్చిన ఈ యొక్క చిన్నని వడిసెల తెసుకొని ఈ యొక్క శత్రువు దగ్గరకు వచ్చుచున్నాను, నీవు చెప్పావు, నేను ప్రార్ది౦చినపుడు, నమ్మకముగా ప్రజలు నేను ప్రార్ధన చేసినప్పుడు నిన్ను నమ్మునట్లు ..?.. వెళ్ళుము ఇప్పుడు. నేను ఆమె కోరిక ప్రకారము పంపాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆలాగు ఉండును గాక. ఆమెన్.

83

మంచిది, సహోదరి. ఇప్పుడు మనం వైద్యులు అందలేని స్తితి. వారు నీకు ఏదైనా నీవు నెమ్మదిపడుటకు ఇచ్చారు, కాని అది నిన్ను మరి ఎక్కువగా నిను పాడు చేసినది...?.. ఇప్పుడు చూడుము, మనము దాని వెనుక వెళ్ళుచున్నము. దానిని వెనుకకు తీసుకోని వచ్చుటకు. [టేపు పై కాళి]

ప్రభువైన యేసు [టేపు పై కాళి] నేను ...[టేపు పై కాళి] ఐదు [టేపు పై కాళి] చిన్నాని రాళ్లు విశ్వాసం

(F-a-i-t-h), ప్రార్ధన అను వడిసేలలో, నేను నా సహోదరిని భయము అను చేతికర్రలు నుండి వెనకకు తెస్తున్నాను..?..వైద్యులు...?...నేను ఆమెను మరల శాంతి మరియు నీడగల పచ్చని ప్రదేశమునకు మరియు శాంతికర జలముల యొద్దకు తెస్తున్నాను. మరియు ఇది నేను ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేయుచున్నాను. ఆమెన్...?...

మంచిది. అది కండరముల బలహీనత. తండ్రి దేవా, ఈ చిన్న బాలిక, మేము చాల ఆనందంగా ఇది కండరముల బలహీనత కాదు అని; కాని అది ఏమైనా మరియు ఏదైనా అది ఇంకా నీ చేరువలో ఉంది, ప్రభువా, మరియు నేను ఈ చిన్న విశ్వాసముతో వచ్చుచున్నాను. మరియు నేను ఈ రాయిని నా బలమంతటితో విసురుతున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు ఇది గురిని తలుగును గాక. మా చిన్ని సహోదరి బాగావును. గాక. ఇది నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేయుచున్నాను.

84

తల్లి మరియు వారి సంతానము, ఈ చిన్న వ్యక్తీ మరియు ఆవిడ ఆవలి గట్టున కలుసుకోవాలని ఉన్నార, నేను ఇప్పుడే మాట్లాడిన ఆ యొక్క మహిమకరమైన్ ప్రదేశములోన. మరియు వారు, ఆ తల్లి ఆ చిన్నారిని పెంచుటకు బ్రతుకదు. మరియు ఆ చిన్నది నీ సహాయము లేకుండా బ్రతుకలేదు, కాని నేను ఈ వడిసెలతో నా యొక్క శక్తి అంతటితో నా గురి ఆ శత్రువును ఓడించుటకు వస్తున్నాను.. ప్రభువైన యేసుక్రీస్తు నామములో, ఆ యొక్క గురి పైన. వారు దేవుని మహిమ కొరకు బాగవును, ప్రభువైన యేసుక్రీస్తు నామములో..?...

ఓ, అది చాల మంచిది. నేను చాల ధన్యుడను, ఈ యొక్క పరిచర్య, మహా గొప్ప పరిచర్య వారి వైపు..?.. ఆవిడ మరి వారి స్తితి ఎక్కువగా భయంకరము. మా పరలోకపు తండ్రి, ఈ యొక్క తల్లిని సాతాను వైద్యులు అందుకోలేని స్తితిలో నెట్టివేసింది. వారు కేవలము ఓక మందు మాత్రమె ఇవ్వగలరు, ప్రభువా అది కేవలము తనను మరిఎక్కువగా బాధ పెడుతుంది, తను ఎక్కడ ఉందొ చాల కష్టంగా తెలియును. దాని నుండి బయటికి వచ్చిన తరువాత అది ఇంకా హీనము. కాని నేను విశ్వాసము అను వడిసెలతో రాయి సరిగా గురివైపు వస్తున్నాను. ఈ యొక్క భయమును ఆమెలో నుండి దేవుని మహిమ కొరకు తెసివేస్తున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు నామములో.

85

ప్రియమైన దేవా, సహోదరుడు జార్జ్ చనిపోవు స్తితిలో కొంతకాలం క్రితం. చూసారా, విశ్వాసం ఆయన కొరకు ఏమి చేసిందో. ఇప్పుడు ఆయనకు కీళ్ళవాతం, ప్రభువా. ఆయన ఎరిగి ఉన్నాడు, వారు ఆయనకు కొంచం వైద్యం (cortisone) లేక ఇంకేదో అది కేవలం బాధను తేసివేస్తుంది, కానీ పూర్తిగా తెసివేయదు; కావున మేము మా గురిని ప్రభువైన యేసుక్రీస్తు వైపు పెట్టుచున్నాము. ఈ యొక్క కీళ్ళవాతం పోవునుగాక. ఆయన ఇంటికి వెళ్ళి బాగవును గాక. ధన్యవాదములు...?...

మీరు ఎలా ఉన్నారు. ఓ, మై. అవునండి. మీరు అది మొత్తం విన్నారా? అది కేవలం అందని స్తితిలో ఉన్నది. మీరు ప్రభువైన క్రీస్తులో విశ్వసియా? నేను ఇక్కడ ఒక అందమైన స్త్రీని చూస్తున్నాను..?.. మీరు మరల యవ్వనముగా అవుతారు. నాకు తెలుసు మీరు ఇప్పుడు, ఆయన మహిమ కొరకు జీవించగోరుచున్నారు. చాల వేగముగా వేరే వైపు...?.. మీ కుమారుడు. మీరు ఆయనను కనుగోనలేర...?.. ఓ, ఆయన లేడు..?.. బాధ వెంటాడుతుంది, అవునా.

ప్రియమైన సహోదరి, నీవు దీనిని పొండుకోవాలని కోరుచున్నాను..?.. ఇక్కడ..?.. మంచిది, మీరు ఆమెకు చెప్పండి. మంచిది, ఆమె మీకు చెప్పబోవుచున్నది ఏమి జరిగిందో ఆ ప్రశస్త బాబు మీ కొరకు వేచి ఉన్నాడు. మీరు మరల యవ్వనముగా ఆయన వలె ఉండబోవుచున్నారు...?.. కేవలం..?..

ప్రియమైన పరలోకపు తండ్రి, జీవిత-పరుగు పరిగిడుచున్నది. ఇంకా ఎక్కువ సమయము లేదు, ఆమె యొక్క ప్రశస్త బాబు ఆ నది ఆవల. ఆయన కేవలం వెనకకు చూడగలడు..?.. కేవలం ..?.. ఆమె నావ కొరకు వేచి ఉన్నది, ప్రభువా, అది ఆమెను ఆ మహిమకరమైన ప్రదేశమునకు కొనిపోతుంది. మీరు ఆశీర్వదించండి, తండ్రి...?..ఆమె హృదయమును. అది గొప్ప పునఃకలయిక, నది ఆవల.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...