పుత్రస్వీకారము #2
vgr count -211 ఒక సంఘముగా, బయటకు పిలువబడిన ఒక గుంపుగా, ఈ రాత్రి తలలు వంచుచున్నాము. విశ్వసించు జనులముగా చేరి ఈ రాత్రికి నీ వాక్యమును బోధించుచున్నాము. మేమెచ్చటికి చెందినవారమో, క్రీస్తు శరీరములోని సభ్యులముగా స్థిరంగా ఏకీభవించి పనిచేయగలమో, ఆ శరీరములో నిర్ణయ స్థానము నందు మేము పొందుపరచబడినవారమై యున్నాము.
త్వరపడి వెళ్ళవలెననే ఆజ్ఞ ఇప్పుడు మాకు ఇవ్వబడినది. తండ్రులమగు మేము ఒక్కొక్కరము మా బాలికకు అది జరిగినయెడల, మా హృదయములు అవేదనతో నిండి ఆ చిన్న బాలిక కోసము ప్రార్ధనకై వెంటనే మేము సంఘమును కోరెదము. ఈ దినమున ఇచ్చటయున్న ఒక్కొక్క తండ్రి యొక్క హృదయము ఆ విధముగానే వేదనతో రగులుచున్నది. ప్రభువా, ఆ గొప్ప వ్యక్తియగు పరిశుద్ధాత్మ ఇప్పుడా తండ్రి హృదయములోనికి వచ్చును గాక! ప్రతి సందేహపు ఛాయను, ప్రతి బాధను తీసివేయుము. నీవే దేవుడవనియు, నీ సంఘము ద్వారా, నీ జనుల ద్వారా జారీ చేయబడిన దైవాజ్ఞవలన నీ సన్నిధిలో ఏ వ్యాధి నిలువజాలదని వారికి తెలియజేయుము.
2
గత ఆదివారము నుండి ఈ వారమంతా మేము ప్రార్ధించియున్నాము, ఈ ప్రార్ధనా విధానములు లేదా మార్గములు గూర్చి నేను ఆలోచించాను. లోకమునకయితే మన యొద్ద ఏ ఆయుధము లేనట్లు కనిపించుచున్నది, కాని ఈ చిన్న వడిసెలను విశ్వాసపు వ్రేళ్ళ మధ్య ఉంచినప్పుడు మారణాయుధముగా పనిచేయును. ఓ ప్రభువా, మా ప్రార్థనలు, గృహమును తాకి ఆ బిడ్డపైన వ్రేలాడుచున్న మరణము బ్రద్ధలగును గాక. చిన్న బాలిక లేదా శిశువు, లేదా బిడ్డ పడక ప్రక్కనున్న చీకటి, అంధకారము పారిపోవును గాక! దేవుని సన్నిధి యొక్క గొప్ప వెలుగు దానిమీద ప్రకాశించు గాక! ఆ ఆస్పత్రి నుండి స్వస్థతనొందిన బిడ్డగా తిరిగి వచ్చును గాక.
దేవా, నదికి ఆవల మా ప్రియులు ఎదురుచూచుచున్నారనియు, అది మహిమకరముగా యుండుననియు మేమెరుగుదుము. మేము మా చిన్నవారిని ప్రేమించుచున్నాము. ప్రభువా, నీ మహిమ కొరకు ఆ బిడ్డ యొక్క ప్రాణమును రక్షించమని ప్రార్ధించుచున్నాము. నీ సంఘమైన మేము మరణమును గద్దించుచున్నాము. “అక్కడ నిలబడు! నీవా బిడ్డను తీసికొనలేవు, ఎందుకనగా ఆమె ప్రాణమును దేవుని రాజ్యము నిమిత్తము విడిపించుచున్నాము,” అని చెప్పుచున్నాము. ప్రభువా, ఈ సంగతులను దయచేయుము. మా రక్షకుడగు యేసుక్రీస్తు నామములో వాటిని మేము అడుగుచుండగా తిన్నగా గురి యొద్దకు అది చేరును గాక. ఆమేన్.
3
మనము నమ్ముచున్నామా? నేను క్రైస్తవుని కానియెడల ఏమి చేయుదునో నాకు తెలియదు. నేను ఎక్కువ కాలము ఉండుటకు ఆశించను. ఇతరులను రక్షించబడుటకై జీవించుట కంటే మరొకటి ఏదియూ లేదు, నాకు తెలిసినంతవరకు అదే శ్రేష్ఠమైనది.
ఈ రాత్రి మన ముందు పాఠములు కొద్దిగా సమీక్షించుదము. నేను చదువుటకు ప్రయత్నించుదును, ఎందుకనగా సాధ్యమైతే రాత్రికి అధ్యాయమంతా చెప్పెదను. ఆదివారము ఉదయము మరియు రాత్రి కూడా వీలైతే నేను త్వరపడి దానిని చేయవలసి వచ్చుచున్నది. అది అలాగైనట్లైతే సంఘము దేనినైతే చూడాలని నేను ఆశించుచున్నానో, ఆ గమ్యమును చేరుటకై నేను ప్రయత్నిస్తాను. నీ స్థానమును నీవు కనుగొనుటనునది ఎంతో మహిమకరమగు విషయము.
నీవు చేయుచున్నది ఏమిటో సరిగా నీవు ఎరిగినప్పుడే నీవు ఏదయినా చేయగలవు.
4
నీకు ఒక శస్త్రచికిత్స జరుగబోవుచుండగా నీవేమి చేయబోవుదువు. ఇంతకు ముందెన్నడూ ఏ శస్త్రచికిత్సను చేసి అలవాటు లేని ఒక యవ్వన వైద్యుడు.... అప్పుడే పాఠశాల యొక్క విద్యను ముగించుకొని వచ్చినవాడనుకొందాము. అతడు చాలా అందముగా యున్నాడు. చక్కగా తలదువ్వుకొన్నాడు. చక్కగా దుస్తులు ధరించి మర్యాదస్తుడుగా కనబడుచున్నాడు. అతడు ఇట్లు చెప్పెననుకొనండి, “నేను కత్తులకు పదునుపెట్టాను. అన్ని పరికరములను వేడి నీటిలో మరిగించాను.” అయితే ఈ విషయమును గూర్చి మీరు వింతైన అనుభూతిని పొందెదరు.
అంతకు ముంద చాలాసార్లు అటువంటి ఆపరేషను చేసిన ముసలి వైద్యుని యొద్దకు వెళ్ళుటకే నేను ఇష్టపడుదును. అప్పుడే విద్య ముగించుకొని వచ్చినవారు కాదు గాని, కొంత అనుభవము గలవారినే నేను కోరుకొందును. నాకు తెలిసినంత వరకు అతి గొప్ప అనుభవముగల వానిని ఈ రాత్రి పిలచుదును, ఆయనే పరిశుద్ధాత్మ. ఆయన దేవుని యొక్క మహా వైద్యుడు మరియు గొప్ప బోధకుడు.
5
ఆదివారపు ప్రసంగము నుండి నేను కొన్ని సంగతులను ప్రస్తావించి ఈ రాత్రి నా ప్రసంగమును ప్రారంభించెదను. ప్రభువు వాక్కు కలిగిన సమూయేలును వారు విసర్జించిరి. కీషు కుమారుడగు సౌలును వారు అంగీకరించిరి. పరిశుద్ధాత్మకు సాదృశ్యముగానున్న సమూయేలును వారు తిరస్కరించిరి, ఎందుకనగా అతడు మాత్రమే ఆత్మ నడిపింపు కలిగి ప్రకటించెను. అతడు వారికి ఇట్లు చెప్పెను, “గుర్తుంచుకొనండి, ప్రభువు నామములో నేను ప్రవచించినది ఎన్నడైనా జరుగక మానెనా? మీ యెదుట అక్రమంగా ఎన్నడూ నేను నడువలేదు. నాలో పాపమున్నదని ఎవరూ ఆరోపణ చేయజాలరు.”
యేసు కూడా అలాగే అడిగెను, “నాలో పాపమున్నదని ఎవరు నిరూపించ గలరు?” చూశారా?
అతడు ఇంకా ఇట్లనెను, “నేను ద్రవ్యమును గాని మరి దేనిని గాని మీ యొద్ద నుండి కోరలేదు. మీ నుండి ఏదీ నేను తీసికోలేదు. అంతా మీ మేలు కొరకే చెప్పాను. ప్రభువు వాక్కును మీకందించాను.”
“అది నిజమే. అదంతా సత్యమే. అయినా మాకు రాజు కావలెను. మేము తక్కిన ప్రపంచమువలె ఉండగోరుచున్నాము,” అని వారనిరి.
6
ఈ రాత్రి మనము ఎఫెసి గ్రంథమును విభజించుదము... క్రొత్త నిబంధనలోని యెహోషువా గ్రంథము ఇది. “జయించిన వారిని” విభజించి ఒక క్రమములో ఉంచుచున్నది. 8వ వచనము నుండి మనము చదివి ప్రారంభించక ముందు కొన్ని నిమిషములకు ఇది పునరాలోచనగా వుండును. గత ఆదివారము రాత్రి పాత నిబంధనలోని ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక వాగ్దానపు విశ్రాంతి దేశమును ఇచ్చెదనని చెప్పెను, ఎందుకనగా వారు యాత్రికులును, పరదేశులును అయిరి. వారు తమది కాని దేశములో యుండిరి. పరజనుల మధ్య ఆ ప్రజలు నాలుగు వందల సంవత్సరములు పరదేశులుగా యుండి, వారిచే నానా హింసలు పొందుదురని దేవుడు అబ్రాహాముకు వాగ్దానము చేసెను. కాని ఒక బలమగు హస్తము ద్వారా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు ఆ సంతతి తీసికొని రాబడునని చెప్పెను.
7
మరియు ఇప్పుడు ఆ వాగ్దాన కాలము సమీపించుచున్నప్పుడు ఆ దేశమునకు వారిని రప్పించుటకు దేవుడు ఒకరిని లేపెను. అతడెవరో - ఈ రాత్రి ఈ పాఠము వినుచున్నవారిలో ఎందరికి తెలియును? మోషే! చూడండి. మనలను వాగ్దాన దేశమునకు నడిపించుటకు వచ్చిన క్రీస్తుకు అతడు ఎంతో, ఎంతో నిజమైన ఒక సాదృశ్యముగా యున్నాడు. మనకు ఒక వాగ్దానమున్నది. మన వాగ్దానము ఆత్మీయ సంబంధమైన విశ్రాంతి. వారిది శారీరక సంబంధమైన విశ్రాంతి. కాబట్టి వారు ఒక దేశమునకు వస్తూ, “ఇది మా దేశమని చెప్పగలిగిరి. ఇక మేము యాత్రికులము కాము. ఇక్కడ స్థిరపడితిమి. ఇది మా భూమి. ఇక్కడ మాకు విశ్రాంతి యున్నది. మనము పంటలను పండించెదము. ద్రాక్ష తోటలను నాటుదుము. మన ద్రాక్షా తోటలను అనుభవించుదుము. మేము వెళ్ళిపోయిన తరువాత మా పిల్లలు దానిని తిందురు,” అని వారా దేశములో చెప్పగలిగిరి.
8
ఓ, ఆ దేశములోనికి ఎట్లు వెళ్ళగలమో చూడండి, చట్టబద్దమైన స్వాస్థ్యమది. నయోమి, రూతు, బోయజులను చూడండి. దానంతటినీ తిరిగి తెచ్చును. ఏ విధముగా ఇశ్రాయేలీయులలో ఒక సహోదరుడు తాను పోగొట్టుకొనిన ఆస్తినంతా తిరిగి విడిపించుటకు... ఒక సమీపబంధువుడగు విమోచకుడు కావలెను. ఓ, ఎంత చక్కగాయున్నది! వారముల తరబడి చెప్పినా గాని ఈ అధ్యాయము తరుగదు. ఈ ఒక్క అధ్యాయమునకు మొత్తం బైబిలును ముడివేయగలము. మరియు, ఓ, దానిని అధ్యయనము చేయుట నాకు ఇష్టము. మనము దానిని తీసుకునే వారము, సంవత్సరము మరియు సంవత్సరమున్నర పాటు బోధించి, ఒక్క అధ్యాయము కూడా విడువలేదు. కేవలము దానిలో నిలచియుండుము.
9
ఇప్పుడు, అయితే స్వాస్థ్యము అనునది ఎంత ఒక శ్రేష్ఠమైనది. ఆ దేశములోనున్న ఒక స్వాస్థ్యమును (వారసత్వపు ఆస్తిని) ఒక సమీప బంధువుడు తప్ప మరెవ్వరూ ఆ స్వాస్థ్యమును విడిపించలేరు. ఇప్పుడు, గత రాత్రి నన్ను తాకిన చిన్న గురుతు కొరకై తల్లులైన మీ కోసము నన్ను కొద్దిసేపు నిలబడనివ్వండి. తప్పిపోయిన మీ ప్రియుల కొరకు ఎందరు ప్రార్ధించారు? మంచిది. అది “మీ స్వాస్థ్యము,” చూచారా.
పౌలు ఆ రోమనుతో ఇట్లు చెప్పెను, “ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు.” నీ మట్టుకు నీవు రక్షింపబడుటకు నీకు చాలినంత విశ్వాసమున్నచో, ఆ దారితప్పిన బాలుడు లేదా బాలిక ఎంతటి మొండివారైనను వారేవిధముగానైనను రక్షించబడుదురు. దేవుడు, ఎలాగైనా.... వారిని ఏ ఆస్పత్రిలోనో పడవేసైనా, మరణావస్థలోనైన వుంచి వారిని తీసికొని వచ్చి, ఆయన వారిని రక్షించును. అది దేవుని వాగ్దానము. స్వాస్థ్యము! ఓ “వారక్కడ ఉందురు,” అని యెషయా చెప్పెను. “వారి సంతతి అంతయూ వారితో యుండును. నా పరిశుద్ధ పర్వతము మీద వారు హానికి గాని నాశనమునకు గాని గురికారని యెహోవా సెలవిచ్చుచున్నాడు.”
ఓ, నేనొక గురుతును పొందుకొనియున్నాను. ఈ రాత్రివేళయందు నేను దానిని మీ కొరకు తీసుకొని రాగలనని నేను ఆశించుచున్నాను. నా హృదయములో అది మండుచున్నది. అది తిరిగి వచ్చుచున్నది.
కాని ఇప్పుడు ముందుకు సాగిపోవలెను.
10
మోషేను గమనించండి. అతడు గొప్ప అద్భుతములు చేయగలిగెను. ఇశ్రాయేలీయులను వాగ్దాన భూమికి రప్పించగలిగెను, కాని వారి స్వాస్థ్యమును పంచి ఇవ్వలేకపోయెను. వారియొక్క స్వాస్థ్యమును అతడు వారికి ఇవ్వలేదు. వాగ్దాన భూమి వరకు అతడు వారిని తీసుకొని రాగలిగెను, కాని యొహోషువా ఆ భూమిని పంచి జనులకు ఇచ్చెను. అది నిజమేనా? ఎచ్చటైతే వారియొక్క స్వాస్థ్యము వారికి ఏర్పరచబడినదో ఆ స్థలము వరుకు క్రీస్తు తన సంఘమును తీసుకొని వచ్చెను, వారికి దానిని యిచ్చెను, యోర్దాను మాత్రము దాటితే చాలును, కాని పరిశుద్ధాత్మ సంఘమును క్రమములో పెట్టెను. నేడు యెహోషువా సంఘమును దానియొక్క క్రమమునందు యుంచి ప్రతీ ఒక్కొక్కరికి వరములను, స్థలములను నిర్ణయ స్థానములను ఇచ్చుచున్నాడు. ఆ పరిశుద్ధాత్మ, క్రీస్తు రక్షించిన అంతరంగ పురుషుని ద్వారా మాట్లాడు దేవుని యొక్క స్వరముగా యున్నాడు.
ఇప్పుడు నీవు అంతవరుకు దానిని అర్ధము చేసుకొన్నావా? ఇప్పుడు మనము ఎఫెసీ పత్రికలోనికి వెళ్ళుచున్నాము. ఇప్పుడు, అదే విధముగా, అయన తన సంఘమును వారే స్థానమనకు చెందినవారో, ఆ స్వాస్థ్యము నందు వారిని ఉంచుచున్నాడు. యెహోషువా ప్రకృతి సంబంధమైన దేశమునందు వారిని వారియొక్క స్వాస్థ్యమునందు యుంచెను. సంఘము యొక్క స్థానము కూడా ఆత్మీయ సంబంధమగు దేశములో వారియొక్క స్వాస్థ్యముమునందు, వారే స్థానమునకు చెందినవారో - ఆ స్వాస్థ్యముమును వారికి ఇప్పుడు పరిశుద్ధాత్మ కేటాయించుచున్నది.
11
ఇప్పుడు, ఇచ్చట ప్రధమముగా అతడు ప్రారంభించుచూ, అతడు తన పత్రికలో - పౌలు, అనే మాటను సంబోధించుచున్నాడు. దానికి కొంచెంసేపు తర్వాత ఈ మర్మమునంతా అతనికే బయలుపరచబడినదని మనము తెలుసుకోబోవుచున్నాము - ఒక వేదాంత పాఠశాల యందు కాదు, ఏ ఒక వేద పండితుని యొద్ద కాదు, అయితే పరిశుద్ధాత్మ ద్వారానే పౌలుకు దేవుడు ఆ దైవిక ప్రత్యక్షతను అనుగ్రహించెను. అతడు చెప్పిన రీతిగా, దేవుని యొక్క మర్మము, జగత్తుపునాది వేయబడక ముందే మరుగుచేయబడి పరిశుద్ధాత్మ ద్వారా అతనికి అవి ప్రత్యక్షపరచబడినవని ఎరుగుదుము. పరిశుద్ధాత్మ ప్రజల మధ్యయుండి ప్రతీ ఒక్కొక్కరిని క్రమమునందు యుంచుచు, సంఘమును దాని స్థానమునందు యుంచుచున్నది.
12
ఇప్పుడు, మొదటి విషయముగా ప్రారంభించుచూ ప్రజలకు పౌలు ఈ విధముగా చెప్పుచున్నాడు, ...
గుర్తుంచుకొనండి, ఇది సంఘమునకే గాని బయటి వారికి కాదు. ఇది అతనికి విప్పుడు కథలోని మర్మమువలె యుండెను, ఎన్నడూ దానిని గ్రహించజాలకపోయెను, అతని తెలివికి అందలేదు. దానిగూర్చి అతనికి ఏమీ తెలియలేదు. కాని సంఘమునకు అది బండలోని తేనెవలె యుండెను. అది చెప్పనశక్యమగు ఆనందము. అది శుభప్రధమగు నిరీక్షణ. అది ఆత్మకు లంగరు. అది మన నిరీక్షణ మరియు ఆనందము, అది యుగముల బండ. ఓ, అది పూర్తిగా మేలు, ఎందుకనగా భూమాక్యాశములు గతించునుగాని దేవుని మాట ఎన్నడూ గతించదు.
13
కాని కానానుకు బయటనున్న వ్యక్తికి దానిగూర్చి ఏమీ తెలియదు. ఇంకా అతడు గురిలేక తిరుగును. అతడు మంచివాడు కాడని నేననను. నేను దానిని చెప్పుట లేదు. ఐగుప్తులోనున్న వ్యక్తి మంచివాడు కాడని నేను చెప్పుట లేదు. అయితే అతడు, తన స్వాస్థ్యము యొద్దకు వచ్చేంత వరుకు అది అతడికి చెందదు, మరియు ఆ స్వాస్థ్యము.....
సంఘమునకు ఇవ్వబడిన వాగ్దానము స్వాభావిక భూమి కాదు, కాని అది ఆత్మ సంబంధమగు భూమి, ఎందుకనగా మనము ఒక రాజులమగు యాజక సమూహమును, ఒక పరిశుద్ధ జనమును అయి యున్నాము. ఆ తరువాత ఈ రాజులగు యాజక సమూహములో - పరిశుద్ధ జనులు, వింత ప్రజలు, బయటకు పిలువబడిన వారు, ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన, ప్రత్యేకించబడినబడినవారుగా వీరున్నారు - అటు తర్వాత సమస్త వెలుపలి లోకము వారికి చచ్చినదిగా ఉన్నది, మరియు మనము అత్మ ద్వారా నడిపించబడియున్నాము. దేవుని కుమారులు మరియు కుమార్తెలు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుదురు. మానవుని ద్వారా కాదు గాని, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుదురు.
14
ప్రేమలో సమస్తము ఇప్పుడు కట్టివేయబడియున్నది. చాలాసార్లు దీనిని నేర్పించవలెనని ప్రయత్నించాను. నాకంటె ఆ గొప్ప వేదాంతులు లోతుగా వెళ్ళియున్నారని నిస్సందేహముగా చెప్పగలను. కాని నేను మీకు చెప్ప ప్రయత్నించుచున్న సంగతి ఇది, పరిశుద్ధాత్మతో క్రీస్తునందున్న వ్యక్తి, తప్పుగా నున్న ఒక వ్యక్తియందు దీర్ఘశాంతముతో, దయాళుత్వముతో, సహనముతో ఓర్చుకొనును. ఆయన మాధుర్యముగలవాడు గాను, దీనుడు గాను, నమ్మకస్తుడు గాను, ఆత్మ నింపుదలగలవాడుగా యుండి - ఎన్నడూ వ్యతిరేకముగా వుండకుండా, నిరంతరము అనుకూలుడుగానే యుండును. అతడు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా యుండను.
దానిని ఒక వ్యక్తి మాత్రమే కలిగియుండటము కాదు గాని, “ఒకప్పుడు మేము దానిని కలిగియుంటిమి, మేము పెద్దగా కేకలు వేసినచో, మేము దానిని పొందినట్లే, ఓ, మేము పెద్దగా కేకలు వేసినప్పుడే, మేము ఆ దేశములోనికి వెళ్ళితిమి,” అని మెథడిస్టులు చెప్పుచున్నారు. అది మంచిదే. దానిని నేనూ నమ్ముచున్నాను.
ఆ తరువాత పెంతెకోస్తువారు అన్యభాషలో మాట్లాడుచూ వచ్చిరి, “దానిని పొందుకున్నాము, అన్యభాషతో భాషలు మాట్లాడేవారందరూ దానిని పొందుకున్నారు,” అని వారన్నారు. దానిని కూడా నేను నమ్ముచున్నాను. అయినా గాని దానిని పొందనివారు చాలామంది యుండుటను మేము కనుగొనియున్నాము, చూశారా. చూశారా?
15
ఈ అంత్యదినములయందు ఇప్పుడు దేవుని కుమారులకు బయలుపరచబడుచున్న జగత్తుకు పునాదిని వేయబడక ముందే మరుగైయున్న ఈ గొప్ప మర్మముల యొద్దకు ఇప్పుడు మనము వచ్చుచున్నాము. దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడ్డారని మీరు నమ్ముచున్నారా? అన్నిటికంటె ముందుగా రోమా 8వ అధ్యాయము ఒక నిమిషము చూద్దాం. మీ కొరకు నేను దానిని చదివెదను. ఇచ్చట నేనేమి మాట్లాడనై యున్నానో దానియొద్దకు ఇది వచ్చుటను గమనించండి. ఇప్పుడు మనము రోమా 8వ అధ్యాయము 19వ వచనమునకు వెళ్ళుచున్నాము - రోమా 8వ అధ్యాయము:
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది.
16
ముందుగానే ఊహించి మొత్తం సృష్టి ఆ ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నది. ఆ ప్రత్యక్షతను చూడండి! ప్రత్యక్షత కొరకు. ప్రత్యక్షత అనగా ఏమిటి? తెలియ చేయబడుట.
సమస్త ప్రపంచము చూచుచున్నది. ఆవల మహమ్మదీయులు దానికొరకు ఎదురుచూచుచున్నారు. నలుదిక్కులవారును దానికొరకే ఎదురు చూచుచున్నారు. “ఈ జనులు ఉన్నారు?” మనకున్న.... మనకు బలమైన గాలి ఉండెను, మెరుపులు మరియు ఉరుములు ఉండెను, రక్తము మరియు నూనె మనకు ఉండెను. అన్ని విధములగు కార్యమలుండెను, కాని “ఇదిగో ప్రభువా! ఇచ్చట యున్నాను,” అని చెప్పుచూ తన అంగీని కప్పుకొంటూ నడుస్తూ వెళ్ళుచున్న ఆ ప్రవక్తను ఆకర్షించిన ఆ మెల్లని స్వరమును వినుటకు మనము విఫలమైపోయాము. చూశారా?
17
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మూలుగుచూ కనిపెట్టుచున్నది. ఇప్పుడు, పౌలు మొట్టమొదటగా సంఘము దేనికి చెందియున్నదో, ఖచ్చితమైన ఆ స్థానమందే దానిని పెట్టుచున్నాడు. వెనుకటి దానిని తెలిసికొనుటకు మరల చదువుదము.
దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో నున్న పరిశుద్ధులును క్రీస్తు యేసు నందు విశ్వాసులమునైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. [వారు “పరిశుద్ధులు.”]
క్రీస్తులోనికి ఎట్ల మనము వచ్చామో, ఈ పాఠము వినుచున్నవారు మరచిపోకూడదు. క్రీస్తులోనికి వచ్చుటకు మనము సంఘములోకి చేరామా? క్రీస్తులోనికి చేరుటకు మనము ఒక ఉద్యోగము చేయవలయునా? క్రీస్తులోనికి వచ్చుటకు మనము నీటిలో మునిగామా? క్రీస్తులోనికి ఎట్లు మనము వచ్చాము? I కొరింథి 12వ అధ్యాయము: “ఒకే ఆత్మ ద్వారా [పెద్ద అక్షరములలో (S-P-I-R-I-T) ఆత్మ - అదే పరిశుద్ధాత్మయైయున్నది] మనమందరము వాగ్దాన దేశములోనికి బాప్తిస్మము పొందియున్నాము.”
18
ఈ వాగ్దాన దేశములో ఉన్నదంతయూ మనకే చెందును. కాలిన్స్ సొదరుడా, దీనిని చూచావా? వాగ్దాన దేశములోనున్న సమస్తము! ఈ యోర్దానును దాటి ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశములోనికి ప్రవేశించినప్పుడు, అన్నిటి కొరకు యుద్ధము చేసిరి...
ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఈ వాగ్దాన దేశములో వ్యాధుల నుండి నీవు తప్పించుకొనెదవనేది దానియొక్క భావము కాదు, శోధనల నుండి నీవు తప్పించుకొనెదవనేది దానియొక్క భావము కాదు. కాని అది ఈ విధముగా సంబోధించబడుచున్నది (ఓ, ఇంకా లోతుగా వెళ్ళెదము!), అది నీది! అని అది చెప్పుచున్నది. కేవలము లేచి దానిని తీసుకొనుము, చూశారా?
19
మరియు, గుర్తుంచుకొనండి, ఇశ్రాయేలీయులలో ఒక వ్యక్తిని పోగొట్టుకొనుటకు ఒకే ఒక కారణము గలదు, పాపము వారియొక్క పాలెములోనికి ప్రవేశించుట వలననే. మనము అపజయమును పొందుకొనుటకు అదే ఒక కారణముగా యున్నది. పాలెములో పాపము ప్రవేశించినందువలన, ఎచ్చటో ఏదో పొరపాటు జరిగినందున, ఆకాను దోపుడు సొమ్మును మరియు బబులోను వస్త్రమును దొంగిలించినప్పుడు పాలెములోనికి పాపము ప్రవేశించినది, యుద్ధమునందు అపజయమును పొందిరి.
మచ్చలేని ఈ సంఘమును, మరియు దేవుని యొక్క వాగ్ధానమునందు పరిపూర్ణముగా యుండి, పరిశుద్ధాత్మతో పరిపూర్ణులైయుండి, ఆత్మలో ముందుకు కొనసాగిపోతున్న ఈ గుంపు ప్రజలను ఈ రాత్రి సమయమునందు నాకివ్వండి, అప్పుడు నేను ఎటువంటి వ్యాధినైనను లేదా ఎటువంటి బాధనైనను, లేదా అచ్చట యుండు ఏదైనా గాని, దేశములో యున్న ప్రతీ జో-లెవిస్ ను, అతనిలో యున్న సమస్త నాయకత్వమును, మరియు అచ్చట యున్న ప్రతీ అవిశ్వాసిని, వారిని ఇచ్చటకు తీసుకొని రమ్మని నేను సవాలు చేయుచున్నాను. ఎటువంటి వ్యాధిగలవాడినైనను, లేదా బాధలలో యున్న వాడినైనను ఈ దినమున తీసుకొని రండి, వారు పరిపూర్ణముగా స్వస్థతను నొంది ఇచ్చట నుండి వెళ్ళెదరు. అవునయ్యా, దేవుడు వాగ్దానము చేసెను. అవిశ్వాసమును పాపము మాత్రమే దానిని రాకుండా ఆపును. కొద్దిసేపటి తరువాత ఈ చిన్న పాపము ఏమిటో చూద్దాం. ఇప్పుడు:
.... క్రీస్తు యేసునందున్న వారు.
మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు, సమాధానమును కలుగును గాక.
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక! ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
20
క్రీస్తునందు మనమున్నప్పుడు, మనకు ఆత్మ సంబంధ ఆశీర్వాదములుండును; క్రీస్తుకు బయటనున్నప్పుడు, మనకు ఉదేక్రములో ఉండును. క్రీస్తునందు మనకు అనుకూల దీవెనలుండును. వేషధారణ కాదు, తెచ్చిపెట్టుకొనుట కాదు. నీవు వాగ్దాన దేశములో యున్నానని చెప్పుకొనుచూ కూడా లేకుండినయెడల, నీ పాపమే నిన్ను పట్టుకొనును. ఏమీ లేకుండా, ఏదో ఉన్నట్లుగా భ్రమపడుటవంటిది కాదు అది. దీనిని ఉబ్బుట అని లోకరీత్యా అందుము. నీవు దేనిగూర్చి మాట్లాడుచున్నావో, అది నీకు లేదని అర్థమగును. అయితే నీవు క్రీస్తు యేసులో ఉన్నప్పుడు, ఆయన నీకు పరలోక సమాధానమును వాగ్దానము చేయును. పరలోక దీవెన, పరలోక ఆత్మ, సమస్తమూ నీదే అగును. నీవు వాగ్దాన దేశములో యున్నావు. సమస్తము నిండుగా కలిగియున్నావు. ఆమేన్. ఎంచ అద్భుతము! ఓ, దానిని చదువదము.
ఆయన మనలను ఏర్పరచుకొనెను....
ఇక్కడే సంఘము బహుశా తొట్రిల్లుచున్నది.
ఆయనయందు మనలను ఏర్పరచుకొనెను...
ఎవరియందు? క్రిస్తునందు!
21
ఆదికాండములోను, ప్రకటనలోను అది మనము చూతుము. ప్రకటన 17:8, జగత్తు పునాదికి ముందే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇప్పుడు, వాక్యము.... తరువాత దానిని నేను చదివెదను.
మనము తన యెదుట పరిశుద్ధులమును, నిర్దోషములునై యుండవలెనని జగత్తుకు పునాది వేయబడక మునుపే...
మనలను ముందుగా నిర్ణయించుకొని....
ఇప్పుడు, “ముందుగా నిర్ణయించుకొనుట,” అను మాట దగ్గర నేను ఆగుదును. “నేను సహోదరుడు నెవిల్ ను ఎన్నుకొన్నాను, మరియు నేను సహోదరుడు బీలర్ ను ఎన్నుకోను,” అని ముందు నిర్ణయమునకు అర్థము కాదు. దేవుడు తన ముందస్తు జ్ఞానము వలన ఎవరు సరిగా యుందురో, ఎవరు సరిగా యుండరో ఎరుగును. తాను చేయబోవు దానిని దేవుడు ఎరుగును. ఆయన తన భవిష్య జ్ఞానము ద్వారా ముందుగా నిర్ణయించి, దేవుని ప్రేమించువారందరికి సమస్తమూ మేలు కొరకు సమకూడి జరుగునట్లు చేసి, రాబోవు యుగమునందు క్రీస్తు యేసు అను ఒకే వ్యక్తియందు సమస్తమును ఏకము చేయును.
22
ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పెదను. అది మంచిది. దాని మీద గత రాత్రి నేను కొద్దిగా మాట్లాడాను. అది ఆదికాండము 1వ అధ్యాయము 1:26లో యున్నది. “ప్రభువగు దేవుడు,” గా దేవుడాయనను పిలచెను. అది ఎల్, ఎలాహ్, ఎలోహింలో యున్నది. దానికి “స్వయం ఉనికి గలవాడు,” అని అర్ధము. ఆయన తప్ప మరేదియూ లేదు. అచ్చట గాలి గాని, అచ్చట వెలుగు గాని, అచ్చట నక్షత్రములు గాని, అచ్చట ప్రపంచము గాని లేదు. అచ్చట అసలు ఏమీ లేదు. అది దేవుడైయున్నాడు, దేవుడు మాత్రమే, దేవుడు అనగా ఎల్, ఎలాహ్, ఎలోహిం మాత్రమే యుండెను. ఇప్పుడు, ఆయన దానిని చేసెను.
23
దాని లోపట అనగా.... ఎల్, ఎలాహ్, ఎలోహిం లోపట కొన్ని ఈ గొప్ప గుణలక్షణములున్నవి లేదా ఒక.... ఆ స్వభావమనేదేమిటో మీరెరుగుదురా, లేదా దానిని నేను ఈ విధముగా చెప్పెదను, అది ఒక “స్వభావము.” పసిబాలుడు దానిని పొందును. ఆ విధంగా స్వభావము పొందిన బాలురలో నేనొకడను. తండ్రిగా నుండు స్వభావము ఆయనలో యుండెను. కాని ఆయన స్వయం-ఉనికి గలవాడు; ఆయన తండ్రిగా నుండుటకు ఏదియూ ఉండనక్కరలేదు. ఇంకా ఆ లోపల మరియొకటున్నది. అది ఆయన దేవుడై యుండెను. దేవుడు అనగా ఆరాధనకు పాత్రుడు అని అర్ధము. కాని ఆయన స్వయం ఉనికి గలవాడు. ఎల్, ఎలాహ్, ఎలోహిం. ఆయనను ఆరాధించుటకు ఏదియూ లేదు. అంతరంగమందే ఆయన రక్షకుడుగా యుండెను. నశించిపోకుండానే ఆయన రక్షకుడుగా ఉండెను, చూచారా. ఆయన అంతరంగమందు స్వస్థపరచువాడుగా యుండెను. స్వస్థతనొందవలసిన ఏ రోగి లేడు, లేదా రోగము అప్పుడు లేదు. దీనిని గ్రహించారా? కాబట్టి ఆయన గుణలక్షణములు, ఆయన స్వభావము నేడు బయటపడినవి.
24
“దేవుడు ఆదిలోనే దీనిని ఎందుకు ఆపలేదు?” అని కొందరడుగుదురు.
“ఆయన కఠిన హృదయుడు. అసలు దేవుడే లేడు,” అని జోలెవిస్ చెప్పెను, విమర్శకులలో ఒకరైన జో... లేదా జాక్ కో దానిని చెప్పెదరు, చూడండి. “ఆయన కేవలము క్రూర హృదయము గలవాడు అని అన్నారు. దేవునిలో అటువంటిదేమీ లేదు. అది ఆ విధముగా యుండినయెడల, ఆయన ఆ విధముగా యుండినయెడల...” ఓ, కేవలము ఆయనను అన్ని పేర్లుతో పిలవవచ్చును, చూశారా. అది కేవలము అతడికి ఇచ్చట ఎంతో జ్ఞానము కలదు కాబట్టి, అయితే అతడికి ఇచ్చట ఏమీ లేదు.
ఇప్పుడు, అది ఆ విధముగానే అచ్చట యున్నది, చూశారా. ఆయన దానిని మరుగుచేసెనని వాక్యము ఇచ్చట చెప్పుచున్నది. ఈ మర్మములు ఇప్పుడు దాచబడియున్నవి, ఇప్పుడు గుర్తుంచుకొనండి, బైబిలు ఇట్లు చెప్పెను, “జగత్తు పునాది వేయబడినప్పటినుండి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, అనగా వారిని సంఘమునకు బయలుపరచుటకై సృష్ట్రి ఎదురు చూచుచున్నది.” ఓ, మై! మీరిది గ్రహించారా?
25
తరువాత ఆలోచనకు వెళ్ళుటకై కొద్దిగా నా వృత్తాంతమును ఆపుదును. ఇప్పుడు గుర్తుంచుకొనండి, గతించిన కాలములన్నింటిలోను, మోషే కాలములోను ప్రవక్తల కాలములోను, గతించిన కాలములన్నింటిలోను లేఖనముల ప్రకారముగా ఈ కడవరి కాలము వరుకు ఈ విషయములు బహిర్గతమగునేమోనని వారు ఎదురు చూచిరి. అవును, వాస్తవమది, దేవుని కుమారులను అది ప్రత్యక్షపరచవలసియున్నది. ఎందువలన? నేను చెప్పిన ప్రకారముగా పిరమిడ్ వలె సన్నిహితముగా, సన్నిహితముగా ఇంకా సన్నిహితముగా కట్టుకొంటూ వచ్చుట.
26
నేను తరచుగా దీనిని చెప్పుచుందును, దేవుడు మూడు బైబిలులను చేసెను. మొదటి దానిని ఆయన ఆకాశమందుంచెను. అది రాశి చక్రము మీరెన్నడైనా రాశి చక్రము, చూచారా? రాశి చక్రములోని మొదటి ఆకృతి ఏమిటి? కన్య. రాశి చక్రములోని చివరి ఆకృతి ఏమిటి? సింహము. ఆయన మొదటసారి కన్యక ద్వారా వచ్చెను. రెండవ సారి ఆయన యూదా గోత్రపు సింహముగా వచ్చును, చూచారా.
తరువాత దానిని ఆయన పిరమిడ్ లో చేసెను. పూర్వకాలములోని హనోకు కాలమందు వారు పిరమిడ్ ను నిర్మించిరి. వారు వాటిని కొలచిరి. అది నాకు అర్ధము కాలేదు, యుద్ధ సమయములందు వారు మోకాళ్ళపై ఎంతో సేపు నిలబడి యుద్ధముల యొక్క ఆ దూరమును కొలువగలరు. ఇప్పుడు వారు ఎచ్చటకు కొలచుచున్నారని మీరెరుగుదురా? రాజు యొక్క గదిని.
ఈ పిరమిడ్ పైకి వెళ్ళెను... దానిని మనము నిర్మించలేము. ఈనాడు మనకున్న వీటిన్నింటితో కూడా మనము దానిని నిర్మించలేము.
27
దానియొక్క ఎత్తు పెరుగుచుండగా దానియొక్క చివరి భాగము ఒక సూదివలె నిర్మించబడినది. కాని దానియొక్క తలరాయిని ఆ పిరమిడ్ యొక్క శిఖరముపై వారెన్నడూ పెట్టనే లేదు. ఐగుప్తు దేశమునందు యుండు పెద్ద పిరమిడ్ ను గురించి మీరు అర్ధము చేసుకున్నారో లేదో నాకు తెలియదు. ఆ పిరమిడ్ యొక్క పైభాగమున ఎన్నడూ దాని తలరాయి పెట్టబడలేదు. ఎందుచేత? తలరాయి తిరస్కరించబడినది. ఆయనే క్రీస్తూ, తలరాయి, గమనించారా, అది తిరస్కరించబడినది.
కాని మనము ఎదుగుచున్నప్పటి నుండి లూథరు కాలము నుండి, బాప్టిస్టు కాలము నుండి, మెతడిస్టు కాలము నుండి, పెంతెకోస్తు కాలము నుండి, ఇప్పుడు మనము తలరాయి యొద్దకు వచ్చుచున్నాము. ఆ తలరాయి క్రిందికి దిగి వచ్చి దానిపై అది అమర్చబడి, ఆ నిర్మాణము సమాప్తమగునని మనము కాంక్షతో ఎదురు చూచుచున్నాము. “ఆ రాయిని నిషేధించిరి, అని మీరు వాక్యములో చదువలేదా? [సాలొమోను దేవాలయము గూర్చి అది పలుకబడినదని మనకు తెలియును.] కాని నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయెను.”
దీనిని మీరు గ్రహించునట్లుగా చెప్పుచున్నాను. ఇప్పుడు, బైబిలు వాక్యము ప్రకారముగా మనము అంత్యకాలమందు, పిరమిడ్ యొక్క తలరాయి దిగివచ్చు కాలమందు, రాశుల ప్రకారము మత్స్యమును దాటి మకర రాశి కాలమందు సింహము రానైయున్న తరుణమునందు తలరాయి, దేవుని యొక్క పుత్రులు, ఎలియా ప్రత్యక్షమగు దినముల యందు మనము జీవించుచున్నాము. మీరు గమనించండి. మనమెక్కడున్నామో చూడండి. మనము అంత్యకాలములో యున్నాము.
28
ఈ వారం పత్రికలో కృశ్చెవ్ చెప్పినదానిని ఎందరు చదివారు? ఓ, వారు సిద్ధంగా యున్నారు; మనం కూడా సిద్ధంగా యున్నాము. ఆమేన్. సిద్ధముగా. అది పరవాలేదు, చూచారా. ఓ, ఎట్టి భాగ్యము, ఎట్టి దినము! మనము జీవించుచున్న ఈ కాలమును క్రైస్తవులు గుర్తించినట్లయితే ఎంత మేలు. మై!
ఈ గ్రంథకర్త దీనిని చూచెనని మీరు తలంచుచున్నారా? చివరి దినములలో అదెక్కడ ప్రత్యక్షమగునో, చివరి దినములలో దేవుని కుమారులు యుగము యొక్క అంతమునందు, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో లేచుటను, జగత్తుకు పునాది వేయబడినప్పటి నుండి మర్మమైయున్న రహస్యములను ప్రత్యక్షమగుటను చూచుటకు ఎంతగా నిరీక్షించుచూ, మూలుగుచూ యుండెననే దానిని గురించి మీరేమనుకొనుచున్నారు?
29
మరల మనము “జగత్తు పునాది” యొద్దకు వెళ్ళుదము. ప్రత్యక్షతను పొందుదము. మనది సరియో, కాదో చూద్దాం. దేవునిని నేను “తండ్రి (Papa)” అని పిలచుట తప్పు కాదు. మీరది అర్ధము చేసికోగలరు. తండ్రీ! తండ్రికి కొందరు పిల్లలు కావలెను. కాబట్టి ఆయన ఏమి చేసెను? “దేవదూతలు కలుగు గాక,” అనెను. వారు ఆయన చూట్టూ వచ్చిరి. ఓ, అది చక్కగా యున్నది. వారాయనను ఆరాధించిరి. అప్పుడాయన దేవునిగా యున్నాడు. అది దేవుని గుణలక్షణము. గుర్తుంచుకొనండి, ఆయన ఎల్ (ఏ-ల్) ఎలాహ్, ఎలోహిం. స్వయం-ఉనికి గలవాడు. ఆయన తప్ప మరెవరు లేరు. మొదటగా దేవదూతలు వచ్చిరి. దేవదూతలు ఆరాధించుట తప్ప మరేమీ చేయలేదు. అవి నశించలేదు, వాటికి వ్యాధి లేదు - అవి అమర్త్య జీవులు. కాబట్టి ఆయన తన స్వస్థతా శక్తిని గాని, రక్షణను గాని వెల్లడి చేయలేకపోయెను. కాబట్టి అప్పుడు, ముందు, ఇప్పుడు...
30
ఆ తరువాత ఆయన ఇట్లనెను, “ఇప్పుడు మనము స్పర్శనీయమైన (తాకుట వలన తెలిసెడు) ఒకదానిని చేయదము.” కనుక ఆయన భూమిని సృష్టించెను. ఆయన భూమిని సృజించినప్పుడు, ఆయన సమస్త జీవులను భూమినుండి సృజించెను. అటు తరువాత ఆయన మానవుడిని సృజించెను. ఒక కప్పపిల్ల లేదా జెల్లి చేప నుండి ఆయన దానిని చేయుటను ప్రారంభించెను. అది నీళ్ళపై తేలుచుండగా, ఒక విధమగు శరీరాకృతిని కలిగియుండి, జీవులన్నింటిలోనూ మిక్కిలి అల్పమైన ప్రాణి కప్పయని వారు చెప్పుచున్నారు. మిక్కిలి ఉన్నత ప్రాణిగా మానవుడగుచున్నాడు. అది కప్ప నుండి ప్రారంభమై బల్లి వరుకు వచ్చినది. బల్లి నుండి అది ఒక్కొక్కటిగా - ఒక్కొక్కటిగా మరియు ప్రతీసారి పరిశుద్ధాత్మ “హుష్” అని ఊదినప్పుడల్లా - ఒకదానికంటె ఒకటి శ్రేష్ఠమైన, శ్రేష్ఠమైన జీవులు సృజించటం ప్రారంభమైనది. దేవుని యొక్క స్వరూపమున మొట్టమొదటగా సృజింపబడిన వాడు మానవుడే. దీనికి ముందుగాని ఆ తర్వాత గాని మానవుని కంటె మిక్కిలి శ్రేష్ఠమైనదేదియూ ఏదీ గాని, ఎప్పుడు గాని సృజింపబడలేదు, ఎందుకనగా మానవుడు దేవుని స్వరూపమందు సృజింపబడెను, చూశారా. అటు తర్వాత మానవుడు...
31
ఆయన తన మొదటి మానవుని సృజించినప్పుడు... ఇప్పుడు, ఆయన తన దేవదూతలను సృజించినప్పుడు.... ఆయన మానవుని సృజించెను, “ఆయన స్త్రీ, పురుషులుగా వారిని సృజించెను.” రెండూ ఒకే శరీరమందు. అతడు స్త్రీ, పురుషుడిగా యుండెను. మరియు స్త్రీ, పురుష స్వభావములుగలవాడుగా యుండెను. ఆయన ఆదామును సృజించినప్పుడు, అతడిని రక్తమాంసములు గలవానిగా ఉంచెను... ఆదికాండము 1వ అధ్యాయమును గుర్తుంచుకొనండి, ఆయన పురుషుడిని మరియు స్త్రీని సృజించెను. మరియు ఆదికాండము 2వ అధ్యాయములో నేలను సేద్యపరచుటకు మాంస శరీరమునందు నరుడు లేడు అనెను. భూమిని సేద్యపరచుటకు ఏ నరుడు అప్పుడు లేడు, అయినప్పటికి ఆ సమయమునందు నరుడు దేవుని స్వరూపమందు యుండెను. దేవుడు ఒక [“ఆత్మ”గా యున్నాడని జనులు చెప్పుచున్నారు.] అది నిజము, చూచారా. ఆయన మొదటి మానవుని చేసెను, “స్త్రీని గాను, పురుషుని గాను, ఆయన సృజించెను.”
32
ఇప్పుడు, ఆయన ఆ విధంగా మొదటి మానవుని చేసినప్పుడు, ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఇదంతా ఆయన మనస్సులో యుండెను. ఆదివారం రాత్రి దానిని మీకు చెప్పాను, వ్యక్తపరచబడిన అలోచనయే మాట అనబడును. తాను దేవునిగా ఎట్లుండగలడో, ఏ విధంగా ఆరాధింపబడగలడో దేవుడు ఆలోచించెను. స్వస్థపరచువానిగాను, రక్షకునిగాను ఎట్లుండగలడో తలంచెను; ఆయన మాట పలికిన వెంటనే అది అయి పోయినది. ఓ, ఈనాటి దేవుని కుమారులు ఆ మాటను పట్టుకొని యుండిన ఎంత మేలు! దేవుడు మాట పలికిన వెంటనే అది జరిగెను - నిశ్చయంగా. భూగర్భ శాస్త్రవేత్తలు ఈ భూమి మిలియను సంవత్సరాల క్రితం నాటిదని చెప్పుచున్నారు. నాకు తెలియదు. అది ట్రిలియను సంవత్సరముల నాటిది కావచ్చును. దాని వయస్సు నాకు తెలియదు. దేవుడు కాలబద్దుడు కాడు. ఆయన దానిని పలికిన దానికంటే ఒక్క నిమిషము కూడా అది తగ్గిపోదు. ఆయన ఇంకా దేవుడుగానే యున్నాడు. ఆయనకు సమయ పరిధి లేదు.
నిన్న ఉదయము వరకు, లేక నిన్న రాత్రి వరకు అది ఆ విధముగా అని నేనెరుగను. నిత్యత్వము అనే దానికి నిన్న, రేపు లేవు. అదంతా ఇప్పుడే. “ఉన్నవాడను,” అను మాట మీరెన్నడైనా గమనించారా? “నేను ఉంటిని,” అని కాదు, లేక “నేను ఉందును,” అని కాదు. “నేను ఉన్నవాడను,” అను మాట నిత్యత్వముతో కూడినది - “నేను ఉన్నవాడను!” చూశారా. “నేను ఉన్నవాడను,” ఎల్లప్పుడూ!
33
కాని ఆయన సంగతులను కాలముతో ముడివేసెను. తనను ఆరాధన చేయుటకై ఆయన ఒకదానిని చేయవలసియున్నది. కాబట్టి ఆయన గుణలక్షణములు దీనిని ఉత్పత్తి చేసెను. తరువాత ఆయన మానవుని చేసెను. ఈ మనిషి ఒంటరిగా కనిపించెను. ఆయన యొక్క గొప్ప తలంపులయందు క్రీస్తును గుర్తించి, సంఘమును గూర్చి ఎటువంటి దృశ్యమును కలిగియుండెనో చూపించు ఉద్దేశ్యముతో ఆయన వేరొక బంక మట్టిని తీసుకొని స్త్రీని సృజించకుండా - ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి, ఆదాము యొక్క ఆత్మలోనున్న స్త్రీ తత్వమును ఆయన వేరుచేసి దానిని ఆ ప్రక్కటెముకలో ఉంచెను. పురుషునివలె ప్రవర్తించగోరు స్త్రీలో ఏదో పొరపాటు యున్నది, చూశారా. ఏదో పొరపాటు ఉన్నది. అవి రెండూ వేర్వేరు ఆత్మలు కలిసి ఏకముగా యున్నవి. ఏకమైన యెడల అవి ఒకే భాగమగుచున్నవి. “ఇవి రెండూ ఒక్కటే.” కాబట్టి ఆయన పురుషుని మరియు స్త్రీని సృజించెను. వారికి వృద్దాప్యము లేదు, మరణము లేదు, ఎన్నటికి తెల్ల వెంట్రుకలు రావు, ఎన్నటికి... వారు భుజించారు, వారు త్రాగారు, వారు నిద్రించారు, మనవలెనే చేసిరి, కాని పాపమేమిటో ఎన్నడూ ఎరుగరు.
34
నేను సర్ప సంతానము అను మరో పాఠమును ఇచ్చట చెప్పుటకై కొంచెంసేపు మార్గమును మళ్ళించుచున్నాను. మరల దానిని గూర్చి చెప్పమని అడిగిన దానిని బట్టి. అయితే ఎవరో ఒకరు వచ్చి ఆ వ్యత్యాసమేటనే దానిని చూపిస్తే నేను చూచెదను. దానిని నేను తెలుసుకొన గోరుచున్నాను, గమనించారా.
ఇప్పుడు, ఇదంతా అయిపోయిన తరువాత పాపము లోపలికి ప్రవేశించిన తర్వాత, సంభవించినదేమిటి?
కోట్ల, కోట్ల, వందల మైళ్ళ దూరము తర్వాత గొప్ప ఒక పెద్ద అంతరిక్ష స్థలము కలదు. అదే పరిపూర్ణమైన దేవుని ప్రేమ, అగాపే ప్రేమ. ప్రతీసారి నీవు ఇటు అడుగువేసిన వెంటనే అది ఒక అంగుళము కుదించుకు పోవుచున్నది. ఎంత అల్ప కాలములో అది భూమిని చేరెనో మీకు తెలియును. అది నీడలన్నింటిని మించిన నీడ, అదే నీవు కలిగియున్నది, అదే నేను కలిగియున్నాను, నీడలన్నింటిని మించిన నీడయైన ఆ అగాపే ప్రేమ యొక్క నీడయే యున్నది.
35
నీలో ఒకటున్నది, ఇరవై సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ, ఇరవై సంవత్సరాలు దాటని ప్రతి పురుషునిలోను ఏదో ఒకటున్నది. అది చాలా కాలము నిలచియుండును. నీకు ఐదు సంవత్సరాలు మాత్రమే వున్నవి, అవి పదిహేను సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల వరకు. ఇరవై సంవత్సరాల తరువాత నీవు చనిపోవనారంభించుదువు. పదిహేను సంవత్సరాలకు ఇంకా నీవు బాల్య స్థితిలోనే యందువు. ఇరవై ఏళ్ళకు పరిపక్వతకు నీవు వచ్చెదవు. ఇరవై సంవత్సరముల తరువాత, ఓ, నీవు చెప్పుదువు, “నేను మంచి వ్యక్తిని.” నీవు ఆ విధముగా దానిని చెప్పెదవు, కాని అది సత్యము కాదు. నీవు ఏమి చేసినా - నీవు చనిపోవుచున్నావు, మరియు నీవు కాలిపోవుచున్నావు. ఆ వయస్సే నీకు దేవుడిచ్చెను, ఆ తరువాత నీవు చనిపోదువు. మరిప్పుడు ఏమి జరిగినది? నీవు చనిపోనారంభించుచున్నావు, అయితే నీలోనున్న ఏదో ఒకటి “మరల నేను పద్దెనిమిదేండ్ల వాడిని కాగోరుచున్నాను,” అని ఏదో నీలో చెప్పును.
36
ఒక సంగతి నేను మిమ్మును అడుగుదును. నీవు అయిదు వందల సంవత్సరాల క్రితం పుట్టి, నేటి వరకు పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో యున్నచో ఎలాగుండును? నీవు ఒక పురాతనమైనవానిగా, నీ ఆలోచనలు అయిదు వందల సంవత్సరముల నాటి పురాతనమైనవిగా ఉండును. (యాత్రికులైన పితరులు ఇచ్చటికి వచ్చుటకు ముందు.) నీవు ఒక యవ్వన రాణిగా యుండి, ఈ పూర్వకాలము నాటి పురాతన అభిప్రాయములను నీవు కలిగియుండినయెడల, వృద్ధాప్యరాలివై ఐదువందల సంవత్సరములు ఇంకా జీవించి వుంటే. చూశారా, ఏదో పొరపాటువున్నది.
“బ్రెన్హాం సోదరుడా! ఇప్పుడు నాకు చాలా బాగున్నది. ఓ, నేను - నా వయస్సు పద్దెనిమిది లేదా పదహారు. నేను చక్కగా యున్నాను,” అని నీవనవచ్చును. ప్రియమైనవాడా, నేను నీకు ఒక సంగతి చెప్పెదను. నీ తల్లి నేడు ఆలయములో లేనియెడల, ఈ నిమిషమున నీ తల్లి బ్రతికియుండునని నీవెట్లు ఎరుగుదువు. నీ స్నేహితుడు లేదా స్నేహితురాలు కొద్ది నిమిషాల క్రితం కొంచెంసేపు ముందు కొన్ని నిమిషముల ముందే చంపబడినదని నీవెలాగ ఎరుగుదువు? ఉదయానికి నీవు నీ ఇంటిలో శవముగా మారవను నమ్మకము నీకెక్కడిది? ఈ రాత్రి నీవు ఆలయములో నుండి సజీవముగా బయటకు వెళ్ళుదువను నిశ్చయత ఎక్కడిది? ఇంత అనిశ్చయత నీకున్నది. ఏ నిశ్చయత నీకు లేదు. నీకు పదిహేను, పన్నెండు, పందొమ్మది, డెబ్బది అయిదు, లేదా తొంబది సంవత్సరములుండవచ్చును - సమస్తము అనిశ్చయతయే. నీవెచ్చట నిలబడియున్నావో నీవెరుగవు. కాని నీవు పదిహేను లేదా పద్దెనిమిది ఏండ్ల వయస్సులోనికి రాగోరుచున్నావు. ఏది నిన్ను ఆ విధంగా చేయుచున్నది?
37
ఇప్పుడు, పద్దెనిమిదేండ్ల వయస్సులోనికి వచ్చి అక్కడే నీవు నిలచి, మరియు ఎన్నడూ జబ్బు పడకూడదనుకొనుచున్నావు.... నీతో పాటు ఆ విధముగా మరికొందరు ఉండాలనుకొనుచున్నావు, ఎందుకనగా దానిని నీవు మించిపోవాలనుకొనుచున్నావు, చూశారా. జనులందరూ వయస్సులో ఎదిగిపోవుచుండగా, నీవు మాత్రము పురాతనమైనవానిగా ఉండిపోగోరుచున్నావు. వారితో కలిసి నీవు ఎదిగే కొలది వికార రూపిగా మారిపోతావు. కాని అచ్చట యుండుటకు నిన్ను పిలచినది అచ్చట ఒకటి యున్నది. అది ఆ చిన్న ఆగాపే ప్రేమ, ఆ చిన్న నీడ ఇచ్చట వున్నదానికంటె ఉన్నత స్థాయికి అది నిన్ను కొనిపోవును.
38
ఇప్పుడు, ఆ రోజు రాత్రి లేదా ఆ రోజు ఉదయం, ఏడు గంటలకు పరిశుద్ధాత్మ తన దయ మరియు కృపను బట్టి ఈ శరీరము నుండి నన్ను కొనిపోయినది. దానిని నేను నమ్ముచున్నాను. (నేను నమ్ముచున్నాను; అవునో లేక కాదో, నేను చెప్పలేను.) ఆ దేశములోనికి ప్రవేశించి ఆ జనులను చూచాను, వారంతా యవ్వనంలో యున్నారు. నా జీవితంలో ఎన్నడూ చూడని అందమైనవారిని చూచాను. ఆయన నాతో ఇట్లు చెప్పెను, “వారిలో కొందరు తొంభై ఏండ్లవారు. వారు నీ ద్వారా మార్పు చెందినవారు. వారు నిన్ను చూచి ”సోదరుడా, నా సోదరుడా“ అని అందుకే కేకలు వేయుచున్నారు, ఆశ్చర్యముగా యున్నది.
అది పరలోక సంబంధమగు శరీరము, మనము మరణించిన పిదప ఒక కల్పనా కథవలె వుండము; కాని ఒక శరీరరమగుదుము. ఈ నిమిషంలో అణుబాంబు పేలినచో, మనందరము చనిపోదుము. ఇప్పటి నుండి మరో అయిదు నిమిషములలో మనందరము ఒకరి చేతులు ఒకరము కరచాలనము చేయుచూ, మెడ మీద పడి హత్తుకొని అరుపులు, కేకలతో దేవుని మహిమపరచుదుము! అవునయ్యా. సహోదరుడు, సహోదరియగు స్పెన్సర్ దంపతులు ఇచ్చట కూర్చొనియున్నారు. ఇచ్చటయున్న వారిలో వారే పెద్ద వయస్సుగలవారు. వారును పద్దెనిమిది లేదా ఇరవై సంవత్సరాల వయస్సులోనికి వచ్చెదరు. సహోదరుడు నెవిల్ ఒక యువకునిగా అగును. నేను ఒక యువకునిగా మారిపోదును. మనమందరము ఆ విధముగానే... ఇది అక్షరాలా సత్యము. “భూమిమీద ఈ మన గుడారము శిధిలమైపోయినను, మరొకటి మనకొరకు ఎదురు చూచుచున్నది.”
39
ప్రకృతి సంబంధముగా ఒక చిన్న బిడ్డ తల్లిలో నుండి వచ్చుట చూడండి. శరీరము మెలికలు తిరుగుచూ, కాళ్ళు కొట్టుకొనుచూ బయటకు వచ్చును. యువతులారా! మీరు నా మాటలను క్షమించండి. జీవ కండరములు ఆ రీతిగా కదలును. మొదటగా భూమి మీదికి వచ్చినప్పుడు, బిడ్డ ఊపిరి పీల్చును. అప్పుడే ఆ బిడ్డ యొక్క శరీరములోనికి ఆత్మ సంబంధమగు స్వభావము వచ్చును. చూడండి తన చిన్న తలను వంచి తల్లి స్తనములలో నుండి పాలు త్రాగుటకు ప్రారంభించును. అది ఆ విధముగా చేయనియెడల, పాలు బయటికి రావు.
అప్పుడే పుట్టిన దూడను మీరు చూచారా? కాళ్ళలోనికి బలము రాగానే అది లేచి నిలబడును. దానికెవరు చెప్పిరి? నేరుగా తల్లియొద్దకు వెళ్ళును, వంగి పాలు త్రాగు చుండును. ఓ, అవును.
40
భూసంబంధమగు శరీరమును ఇచ్చటకు తీసుకొని వచ్చినప్పుడు, ఆత్మ సంబంధమగు శరీరము కూడా దానికి సిద్ధముగా యున్నది. మరియు వెంటనే ఇది.... ఓ, హల్లెలూయ! “భూమి మీద ఈ శరీరమను గుడారము నశించిపోయినను, మరియొకటి సిద్ధముగా యున్నది.” దీనిని మనము దాటిన వెంటనే మనము దీనిని వదిలి వెలుపలికి వెళ్ళిన వెంటనే, మనము ఇంకొక దానిలోనికి అడుగుపెట్టెదము. దానికి ఒక చల్లని నీళ్ళు త్రాగుటకు అవసరము లేదు, నీళ్ళను త్రాగుటకు అవసరము రాదు; భుజించదు, వారు మట్టి సంబంధులు కారు. కాని వారు నిజ స్వరూపులు, వారిని తాకి కరచాలనము చేయవచ్చును, ప్రేమించవచ్చును, అదంతా పరిపూర్ణమైనది. అటువంటి ఒక శరీరము ఆవల ఎదురు చూచుచున్నది. అందులో ఇది భాగమైయున్నది.
అది మూడు భాగములైయున్నది.
41
ఈ వేదిక యొద్దనే నీ నిత్యజీవము ఆరంభమగుచున్నది. ఇచ్చట నుండే నీ నిత్యత్వము ఆరంభమగును. ఓ, నీవు ఇచ్చట నుండే నిత్యజీవమును ఆరంభించుచున్నావు. అటు తర్వాత నీవు దేవుని కుమారునిగా తిరిగి జన్మించుచున్నావు. అటు తర్వాత నీవు మరణించినప్పుడు, నీవు ప్రారంభించెదవు... ఈ శరీరమును మరణము తాకినప్పుడు, గుండె కొట్టుకొనుట ఆగిపోయి మర్త్య చక్రములు నిశ్శబ్దముగా నిలచిపోవునప్పుడు, ఆ చిన్న నీడ అది నీడలోని ఒక నీడగా యుండి, ఒక్క నిమిషమున అది నీడలో ఒక నీడగా మారి, అటు తర్వాత అది నీడగా మారి, అటు తర్వాత అది ఒక అది చిన్న ఊటగాను, తరువాత సెలయేరుగాను, తరువాత నదిగాను, తరువాత సముద్రముగాను మారును. కొంతసేపు తరువాత నీవు పరలోకమున దైవ సంబంధమగు శరీరమనే వస్త్రమును ధరించుకొని, నీ ప్రియుల సముఖమందు నిలబడెదవు, ఒకరినొకరు గుర్తెరుగుదురు, ఒకరినొకరు ప్రేమించెదరు, నీవు తిరిగి మీరు ఒక యవ్వన పురుషునిగాను మరియు యవ్వన స్త్రీగాను మారిపోయెదరు. ఖచ్చితముగా నిజము. ప్రభువైన యేసు రాకడ వరకు అది అక్కడ కనిపెట్టును. మరియు ఒక దినమున ఆయన యొక్క మహిమ శరీరము.... ఇప్పుడు గమనించండి, అది ఒక పరలోక సంబంధమగు శరీరము, ఒక మహిమ శరీరము కాదు - ఒక పరలోక సంబంధమగు శరీరము. ఒకానొక దినమున ఆ పరలోక సంబంధమగు శరీరము యేసుతో పాటు పరలోకమును విడిచిపెట్టును.
42
“నేను మీకు చెప్పుచున్నాను [II థెస్సలోనీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము, లేక I థెస్సలోనీయులకు 5వ అధ్యాయము, ఈ రెండింటిలో ఒకటి], ”సహోదరులారా, మీరు దుఃఖింపకుండు నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. నిరీక్షణ లేని ఇతరులవలె మీరుండకుడి. క్రీస్తు మృతిపొంది, మూడవ దినమున తిరిగి లేచెనని మనము నమ్ముచున్నాము. ఆ విధముగానే క్రీస్తునందు మృతిపొందిన వారిని దేవుడు తనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును. దీనిని మేము ప్రభువు యొక్క ఆజ్ఞను బట్టి చెప్పుచున్నాము. సజీవులమై ప్రభుని రాకడ వరకు నిలచుయుండు మనము, వారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము. నిద్రించిన వారిని మనము ఆటంకపరచము [లేక అడ్డుకోము, చక్కని మాట]. ఏలయనగా ప్రభుని యొక్క బూర మ్రోగును, క్రీస్తునందు మృతులు మొదట లేతురు. పరలోక సంబంధమగు శరీరములు క్రిందికి దిగివచ్చి, భూసంబంధమగు మహిమ శరీరములను ధరించును. ఆ మీదట సజీవులమై నిలచియున్న మనము, ఒక్క క్షణములో, కనురెప్పపాటులో మారుదుము. ప్రభువును మధ్యాకాశములో కలిసికొనుటకు వారితో కూడ కొనిపోబడుదుము.“
43
“నా తండ్రి రాజ్యములో మీతో పాటు క్రొత్తదిగా తిను వరకు మరెన్నడూ ద్రాక్షారసము త్రాగను. దీనిని భుజించను,” పెండ్లి విందు. క్రీస్తువిరోధి మూడున్నర సంవత్సరములు తన పరిపాలనను ముగించును. ప్రపంచమంతా నాశనమగును. యూదులు బయటకు పిలువబడుదురు. యోసేపు తన్నుతాను యూదులకు తెలియపరచుకొనును. గుర్తించుకొనండి, యోసేపు తన్ను తన సహోదరులకు తెలియపరచుకొనినప్పుడు, అచ్చట అన్యుడొక్కడును లేడు. ఆ గాధ మీరెరుగుదురు. యోసేపు అన్ని విధముల క్రీస్తుకు మాదిరి. యోసేపు తన సహోదరులకు కబురు పంపగా వారు వచ్చిరి. అతడు చిన్న బెన్యామీనును చూచెను, “అతడు వారిని అచ్చట చూచెను, అటు తర్వాత అతడు యోసేపును చంపకుండినచో బాగుండెడిది,” అని వారనుకొనిరి. క్రీస్తు తన్నుతాను వారికి తెలియచేసికొనినప్పుడు, యూదులు తాము చేసినది తప్పని తెలిసికొందురు. యోసేపు ఏడ్పును ఆపుకొనలేకపోయెను. తన భార్యను, పిల్లలను, కావలి వారిని రాజ భవనములోనికి పంపివేసెను. ఇది నిజము. అటు తర్వాత యూదుల సమక్షములోనే ఇట్లు చెప్పెను, “నేను మీ సోదరుడనగు యోసేపును. నేను మీ సహోదరుడను.” అప్పుడు వారు వణుకుచూ సాష్టాంగపడి ఇట్లనిరి, “ఇప్పుడు మనము శిక్షింపబడుదుము, ఎందుకనగా మనము మన సోదరుని చంపితిమి. ఇప్పుడితడు గొప్ప రాజాయెను.”
అతడిట్లనెను, “మీ ప్రాణములను రక్షించు ఉద్దేశ్యముతోనే దేవుడీలాగు చేసెను.” నిజంగా ఆ కారణము చేతనే దేవుడాలాగు చేసెను - అన్యులమగు మనలను రక్షించెను. కాని అన్యులు రాజ భవనములో యుండిరి. హల్లెలూయా! యోసేపు తన అన్నలచే విసర్జింపబడినవాడై, అతడు ఒక పెండ్లి కుమార్తెను ఏర్పరచుకొనెను. పెండ్లి ఒక కుమార్తె ఒక అన్యురాలే గాని ఒక యూదురాలు కాదు. మంచిది.
44
ఇప్పుడు, మనమెచ్చటికి ఇప్పుడు వచ్చియున్నాము! రాబోవు ఆ గొప్ప యుగములో మనము ఈ మహిమ శరీరమును ధరించుకొందుము. పరలోక సంబంధమగు ఈ శరీరము అప్పుడు మహిమ శరీరముగా యగును. ఇప్పుడు నా భావము గ్రహించారా? అప్పుడు నేను నడిచి వెళ్ళి, “నెవిల్ సోదరుడా!” అనగలను. చిన్న ఉదాహరణ మీకిచ్చెదను. “హ్యూమ్స్ సోదరుడా! ఈ ఉదయం నాన్నగారి వద్దకు వెళ్ళుదము,” అని నేనందును. ఆయన దేవుడు. ఇప్పుడాయనను మనము రక్షకునిగాను, స్వస్థపరచువానిగాను ఎరుగుదుము.
పాపము సృష్టించబడుట అనేటువంటి సంగతి అసలు అచ్చట యుండనే యుండదు. (అది లోపలికి వెళ్ళలేదు, వెళ్తుందా?) పాపము ఒక సృష్టి కాదు. లేదయ్యా! వంకరతనమే పాపము. ఒక్కడే సృష్టికర్త - ఆయన దేవుడు. నీతిని వక్రీకరించుటయే పాపము. వ్యభిచారమనగా ఏమిటి? నీతిని వక్రీకరించుట. అబద్దమనగా ఏమిటి? సత్యమును వక్రీకరించుట. సందేహము లేదు. శాపవచనమనగా ఏమిటి? దేవుని యొక్క దీవెనలను శాపముగా మార్చుట, అందుచేత దేవుని ఆశీర్వాదములకు బదులుగా వారు శాపమును పొందుకొనిరి. పాపము ఒక సృష్టి కాదు, వంకరతనమే పాపము. కాబట్టి, సాతాను పాపమును సృష్టించలేదు; వాడు కేవలము దేవుడు సృష్టించిన దానిని వక్రీకరించెను. ఇది ఖచ్చితముగా నిజము. జీవమును వక్రీకరించుటయే మరణము.
45
ఇప్పుడు, దీనిని గమనించండి. అటు తర్వాత నేను నడుచుకొంటూ వెళ్ళి, మరియు నేను చెప్పెదను, “హ్యూమ్స్ సోదరుడా, నీవు, నేను, బీలర్ సొదరుడు, ఇంకా మన సోదరులందరము మన తండ్రియైన దేవుని యొద్దకు వెళ్ళుదము. ఒక చిన్న షికారుకు వెళ్ళి వద్దాము అని చెప్పెదను. చిన్నపిల్లలగు మీరు కొండలను ఎక్కుటకు ఇష్టపడుదురు కదూ! మీరు చిన్నవారిగా ...”
“అవును, మేము ఆలాగే చేసాము.”
“ఓ, కోట్ల కొలది మైళ్ళ దూరము గల ఆ నూతన ప్రపంచమున వారచ్చట యున్నారు, ముందుకు వెళ్ళ, వెళ్ళి, మీరు వారితో తిరుగుదురు.”
“సూర్యుడు ఉదయించుటకై ప్రతీ దినము దానిని నేను ఉదయించునట్లు చేయవలెను. వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరమిచ్చెదను; వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను.” యెషయా 66. ఇది నిజము.
46
మరియు మీరెరుగుదురా, అచ్చట నేను నడుచుకొంటూ వెళ్తాను, మనందరము అక్కడ అయిదు వందల సంవత్సరములు నడిచినా గాని అది చిన్న ప్రయాణముగానే యుండును. మిలియను మైళ్ళయినా ఏమీ అనిపించదు. ఇది పిచ్చివాని మాటవలె యుండును, కాని సత్యము. చూడండి, ఇది సత్యము, ఎందుకనగా అక్కడ కాలము లేదు, అది నిత్యత్వము. అచ్చట నేను నడుచుకొంటూ వెళ్ళుచున్నప్పుడు ఎవరిని నేను సంధించెదనో తెలుసా? “ఆమె జార్జి బ్రూస్ సౌదరీ, జార్జి సోదరీ! నిన్ను చూచి చాలా కాలము అయినది,” అందును. ఎప్పుడూ వున్నట్లుగానే మీరు యుందురు..... ఆమె వయస్సు పది మిలియను సంవత్సరములు కావచ్చును, కాని యవ్వనముగా యుండును. ఆమె ఏదో ఒక దానియొక్క వీపును నిమురుచూ యున్నది, నేను అదేమిటని చూడగా, అది చిరుతపులి, సింహము.
“ఈ ఉదయమున చిరుతపులీ, ఎట్లున్నావు?” అని నేను అడుగుదును. పిల్లివలె, “మ్యావ్” అనును.
“ఓ, పెద్ద పుష్పములు చుట్టూవున్న స్థలమందున్న సహోదరీలతో నేను మాట్లాడుచుందును. మేము ఆ పుష్పములను చూచుకుంటూ ఐదువందల సంవత్సరములు అచ్చటనే యున్నాము.” ఆలకించుటకు అది పిచ్చితనముగా యుండవచ్చు, కాని అది సత్యము. అది ఖచ్చితముగా వాస్తవము. అది ఆ విధముగానే ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యమైయున్నది.
47
మంచిది, జార్జియా సోదరీ! నీకు దీవెన, ఏ హాని కలుగదు.
సాయంకాల సమయములో మేము కొండపై భాగమునకు వెళ్ళి, “ఓ తండ్రీ, దేవా, ఒకప్పుడు నేను నశించితిని. ఒకప్పుడు నేను పాపపు ఊబిలో యుంటిని. తండ్రీ, దేవా నీవు నన్ను రక్షించితివి.”
దానిని వివరించుటకు ప్రయత్నించువారు పిచ్చివారుగా కనబడుదురు. “ఓ దేవుని ప్రేమా!” అను పాటలోని చివరి వచనమును రచియించిన ఆ వ్యక్తి, దానిని పిచ్చాసుపత్రిలో నుండే దానిని రచియించెను. దేవుని యొక్క ప్రేమను అతడు వ్యక్తపరచుటకు ప్రయత్నించెను. ఆయన పాపులను రక్షించుటకు వంగెను. ఏ విధముగా నిలబడ్డాడో, మరియు దానిని ఏ విధముగా చేసెనో, ఆయన ప్రేమ నిన్ను నన్ను రక్షించుటకు దిగి వచ్చెను. ఆరాధన గురించి మాట్లాడిన, దేవదూతలకు దానిని గూర్చి ఏమీ తెలియదు, ఆరాధన, ఒక దేవదూత అచ్చట నిలబడుకొని, తన రెక్కలను కొట్టుకొంటూ, “హల్లెలూయా, హల్లెలూయా!” స్తుతియించుటయే ఎరుగును. కాని, ఓ, కనికరము! నేను నశించిపోతిని, కాని కనుగొనబడితిని; నేను మృతుడనైతిని, కాని తిరిగి జీవించుచున్నాము, అని ఎరిగినప్పుడు! ఓ, దేవా, నేను పాపినై, జికట మన్నై పెంట కుప్పలో యున్నాను, అని దీనిని తలంచినప్పుడు ఆరాధించెదను.
48
నీకివ్వబడు శ్రేష్ఠమగు జీవితము ఇక్కడున్నది. మీరెప్పుడైనా కాల్గేట్ చెత్త యొద్దకు వెళ్ళారా? అంతకంటె కంపు కొట్టు చోటును నేనెన్నడూ చూడలేదు. ఆ పొగను పీల్చినచో, నాకు జబ్బు వచ్చును. ఆ పొగను నీవు పీల్చినచో, నీ కడుపు ఆముదము త్రాగిన తరువాత ఉన్నట్లుగా ఉండును. బహుగా జబ్బు పడెదవు. ఎలుకలు నీ మీద ప్రాకి నిన్ను పీక్కొని తినుచున్నట్లుగా యుండును. ఆలాంటి జీవితములో నీవుండగా, ఎవరో వచ్చి నిన్నుపైకి లేపాలి. నీవు శక్తి లేక పడియుంటివి. ఒకరు నిన్ను పైకిలాగి పద్దెనిమిదేండ్ల బాలునిగా మార్చి నిండై ఆరోగ్యమనే కొండ మీద కూర్చోబెట్టెను. ఆరోగ్యకరమగు వాతావరణము మంచి గాలి, చల్లని మంచి నీరు నీకు దొరికెను. నీవు ఎన్నడైనా తిరిగి ఆ బురదలోనికి వెళ్ళగోరుదువా? ఎన్నడూ లేదు! సహోదరుడా, ఎన్నడూ నీవు తిరిగి ఆ కంపునకు వెళ్లవు.
49
ఇప్పుడు, స్నేహితుడా, దీని భావము ఇదే. అదే ఆ దర్శనము (లేదా మార్పుచెందుట, ఎదైతే నేమి, ఒక దర్శనము నేను దానికి - దర్శనము అని చెప్పుటకు కారణ మేమనగా, నేను “మార్పుచెందుట,” అనే దానిని చెప్పినట్లైతే, అది ఎవరినైనా నొప్పించునేమోనని భయపడుచున్నాను), కాని వాస్తవముగా అది అదే అయి యుండెను. ఇప్పుడు అచ్చట ఎప్పుడైతే దేవుడు కుమారులను, కుమార్తెలను ఆయన కొరకు తీసుకొని వచ్చుటకు దేవుడు చేసినది అదే. ఇప్పుడు, ఎవరు ఈ ప్రజలు? ఏ విధముగా వారు ఎప్పుడూ ... దీనిని పొందుటకు వారేమి చేసిరి? దానిని ఎన్నడైనా ఎట్లు పొందగలను? దేవుడు, ఆది యందే, దేవదూతల సృష్టికి... ముందే అనంతుడని ఎందరికి తెలియును?
ఇప్పుడు, త్రిత్వ సోదరులు ఇచ్చటున్నారు. మిమ్మును నేను బాధపరచగోరుట లేదు, అయితే దేవుని యొక్క మంచి వాక్యపు పేరట మీరు ఏ విధముగా యేసుక్రీస్తుని దేవుని యొద్దనుండి ప్రత్యేకమైన వ్యక్తిగా వేరుపరచుచున్నారు? దేవుడు మరొకరిని పంపి, అతడిని చంపుట ద్వారా ఇచ్చటయున్న ఒక వ్యక్తికి విమోచన కలుగ చేసినయెడల ఆయన అన్యాయస్తుడగును. దేవుడు దానిని చేయుటకై గల ఏకైక మార్గమేదనగా, ఆయనే ఆ వ్యక్తి యొక్క స్థానమును తీసుకొనుట. మరణ బాధను రుచి చూచునట్లుగాను, మన నుండి మరణమును, ముల్లును తీసివేయునట్లుగాను దేవుడే శరీరధారి అయ్యెను. ఆయనే స్వయంగా మనలను విమోచించెను. అందుకే ఆయనను ఎంతో ఆరాధించవలెను. యేసు నిశ్చయంగా ఒక నరుడే, నిశ్చయంగా నరుడే. ఆయన ఒక నరుడు, కన్య మరియకు జన్మించిన నరుడే. కాని ఆయనలో ఉన్న ఆత్మ కొలవలేని దేవుడై యున్నాడు. ఆయనయందు శరీరరీత్యా దేవత్వము సంపూర్ణముగా నివసించెను. ఆయన యెహోవా యీరే, ఆయన యెహోవా రాఫా, ఆయన యెహోవా-మనష్షే, ఆయన యెహోవా మన కేడెము, మన ఆశ్రయము, మన వైద్యుడు, ఆయనే ఆల్ఫా, ఓమేగా, ఆది - అంతము; ఆయనే మొదటి వాడు, కడపటి వాడు, ఆయనే భూత, భవిష్యత్, వర్తమాన కాలములలో ఉన్నవాడు. దావీదు వేరు మరియు చిగురు. ఆయనే వేకువ చుక్క. ఆయనే సర్వములో సర్వము. ఆయన యందు శరీరరీత్యా దైవత్వము సంపూర్తిగా నివసించెను.
50
మరణమునకు ఎప్పుడూ ఒక మల్లు౦డును. దానితో అది జనులను కుట్టుచుండును. “నీవు నా మాట విన్నావు గనుక నిన్ను నేను పట్టుకొనియున్నాను. నిన్ను కుట్టుదును! నిన్ను సమాధిలో పెట్టెదను. ఆ గొర్రె రక్తము నీకేమీ పని చేయదు. అది కేవలము ఒక జంతు రక్తము,” అని అపవాది నీకు చెప్పును. కాని దేవుడు తన జ్ఞానమును బట్టి, జగత్తు పునాది వేయబడక మునుపే వధించబడిన గొర్రెపిల్ల వచ్చుచున్నట్లు ఎరిగియుండెను. అవునయ్యా. మరియు వారు ఆ కాలము సంపూర్ణమగుట కొరకు ఆయన చూచెను.
కాని ఒక రోజున ఈ మానవ గొర్రెపిల్ల వచ్చెను, సాతాను ఖంగుతిన్నది. వాడు ఆయన వైపు చూట్టూ చూచి, “నీవు దేవుని కుమారుడవైనచో, ఇది చేయుము. నీవు దేవుని కుమారుడవైనచో, ఒక అద్భుతము చేసి దానిని నేను చూచునట్లుగా చెయ్యి. నీవు దానిని చేసినయెడల, నేనది చూచెదను. కళ్ళకు గంత కట్టి నిన్ను కొట్టదుము. నీవు ప్రవక్తవైనచో, నిన్నెవరు కొట్టిరో చెప్పుము. నీవు ప్రవక్తవని నాకు నమ్మకము లేదు. నీవు ప్రవక్తవైతే సూటిగా మాకు చూపించు,” అని పలికినది. ఆయన తన నోరు తెరువలేదు. ఓ! ఓ, ఆయనప్పుడు తన కన్నుల మీద ఉన్నని లాగివేసెను.
51
ఆయన తన శిష్యుల వైపు చూచి ఇట్లనెను, “నేను నా తండ్రిని కోరినయెడల, ఆయన పండ్రెండు వ్యూహముల దేవదూతలను పంపును.” నీకు తెలియునా, పిలాతు దానిని వినలేదు.
“నీవే అయితే... నీవే అయితే... ఓ, ఆయన కాడు. ఎందుకని, ఆయనలో నుండి కారుచున్న రక్తమును చూడండి. ఇదిగో సైనికులారా మీలో కొందరు వెళ్ళి, ఆయన ముఖం మీద ఉమ్మివేయండి. [ఆయన మీద ఉమ్మివేసి, ఆయనను హేళన చేసి, ఆయన యొక్క గడ్డమును పట్టుకొని లాగిరి.] ఓ, ఆయన కాడు... అది ఆయన కాడు! ఆయనలో నా ముల్లను విరచుదును. ఆయనను అక్కడ పట్టుకొందును. ఇప్పుడు నీవు నాకు దొరికావు!”
ఆయన “ఏలీ! ఏలీ! నా దేవా! నా దేవా! అని బిగ్గరగా కేకవేసినప్పుడు, [ఆయన ఒక నరుడు.] ”నీవేల నన్ను విడిచిపెట్టితివి?“
గెత్సెమనె తోటలో అభిషేకము ఆయన మీద నుండి తప్పుకొన్నది. ఒక పాపి వలె ఆయన మరణించవలసి వచ్చెను. ఒక పాపిగా మరణించెనని మీరెరుగుదురా! ఆయన పాపములు కాదు గాని, నా యొక్క మరియు నీ పాపములు కోసము. ఏ విధముగా ఆయన నా పాపములను మోసేనో అనే దానియందే ఆయన ప్రేమ అందులో కనబడుచున్నది. ఓ, హల్లెలూయా, ఆయన నా పాపములు మోసెను!
52
ఆయన అచ్చట ఆ విధముగా యుండి ఆయన తనయొక్క నోరును తెరువ లేదు, “నీకు తెలుసా, ఆయన కేవలము ఒక సామాన్య మానవుడేనని నేను నమ్ముచున్నాను, ఆయన కన్యకకు జన్మించ లేదు. నా ముళ్ళను ఆయనలో వుంచితిని,” అని అతడు చెప్పెను.
మరియు అతడు అచ్చటకు వచ్చి ఆయనలో తన ముళ్ళను గుచ్చెను, కాని ఆ సమయమున అది లాభము లేకపోయెను, బాలుడా! అటు తరువాత అతడి ముళ్ళను ఆయన వెలుపలికి లాగివేసెను. ఆ తరువాత నుండి ఇక అతడు ముళ్ళతో పొడవలేకపోయెను. అతడు తన ముళ్ళను అచ్చటే విడిచిపెట్టెను. మూడవ దినమున ఆయన లేచెను. “నేను మృతుడనైతిని గాని తిరిగి జీవించుచున్నాను; యుగా యుగములు జీవించియున్నాను. మరణము యొక్కయు, పాతాళము యొక్కయు తాళపు చెవులు నాయొద్ద ఉన్నవి,” అని ఆయన చెప్పెను. అవునయ్యా. ఆయన ఎవరో అని చూచుటలో వాడు విఫలుడాయెను. “నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించెదరు. అది ఇంకా....”
53
ఒక దినము, మూడు లేదా నాలుగు రోజులకు ఆ తరువాత ఆయన తండ్రి యొద్దకు ఎక్కిపోయి తిరిగి వచ్చినప్పుడు, “ఓ, ఆయన ఒక భూతమై యుండవచ్చు, ఆయన ఒక రకమగు భూతమై యుంటాడు. నీవు చూచినప్పుడు, నీవు ఒక దర్శనమును చూచావు,” అని ఎవరో చెప్పిరి.
“కాదు, ఆయన నిజమగు యేసు.”
“నేను ఆయన చేతులను మరియు సమస్తము చూడాలి, అవి ఆ విధముగా యుండినయెడల నేను చెప్పెదను,” అని తోమా చెప్పెను.
“ఇదిగో నేను,” అని ఆయన చెప్పెను. “మీ యొద్ద చేప గాని, రొట్టె గాని యున్నదా? నాకు కొంత రొట్టె తీసుకొచ్చి యివ్వండి,” అని ఆయన అడిగెను. ఆయన కొరకై రొట్టెను తీసుకొని వచ్చారు, అచ్చట నిలబడి ఆయన దానిని తినెను. “ఇప్పుడు, నేను తినిన విధముగా ఒక ఆత్మ తినగలదా? నాకు వున్న విధముగా శరీరము మరియు ఎముకలు ఒక ఆత్మకు వండగలవా?” అని ఆయన వారిని అడిగెను. గమనించారా? “నేనే ఆయనను, అది నేనే,” అని ఆయన చెప్పెను.
54
పౌలు ఇట్లు చెప్పెను, “మనము ఏ రకమగు శరీరము పొందుదుమో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కాని ఆయన వంటి ఒక శరీరమును కలిగియుందుమని మనమెరుగుదుము.” ఏమిటి? ఆయన థియోఫనీ శరీరమును ఎన్నడైనా కలిగియున్నాడా? అవును. ఆయన చనిపోయినప్పుడు, పరిశుద్ధ గ్రంథము దానిని ఈ విధముగా చెప్పుచున్నది. (“ఆయన,” అది ఒక వ్యక్తిగత సర్వనామము), “ఆయన పాతాళము లోనికి వెళ్ళి చెరలోనున్న ఆత్మలకు బోధించెను.” ఆయన అచ్చటకు ఏ విధముగా ఆ క్రిందికి వెళ్ళును? మరియు ఆయన దానిని ఏ విధముగా చేసెను? ఆయన స్పర్శించుటకు ఇంద్రియాలు గలవు, ఆయన వినుటకై ఇంద్రియములు గలవు, ఆయన మాట్లాడుటకు ఇంద్రియములు గలవు, ఒకసారి ఒక రోజు రాత్రి సమయము నందు నేను ఆ మహిమకరమగు వారిని చూచితిని, వారికున్న అదే విధమగు శరీరముతో ఆయన వారికి బోధించెను. పాతాళములో నున్న ఆత్మలకు ఆయన బోధించెను. నోవహు దినములలో దీర్ఘశాంతమును చూపి మారుమనస్సు పొందని ఆ పాతాళములోనున్న ఆత్మలకు భోదించెను.
ఈస్టరు నాడు ఆయన తిరిగి లేచెను. ఆ శరీరము కుళ్ళిపట్టినది కాదు, ఎందుకనగా ప్రవక్తయగు దావీదు ముందే దానిని చూచెను. “ఆయన ఆత్మను పాతాళములో నేను విడిచిపెట్టను. నా పరిశుద్ధుని కుళ్ళుపట్టనియ్యను. నా శరీరరము నిరీక్షణలో విశ్రమించును, ఎందుకనగా నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టడు. నా పరిశుద్ధుని కుళ్ళుపట్టనియ్యడు.” క్రుళ్ళు పట్టిపోవుటకు సిద్ధముగా యుండు ఆ డెబ్భది రెండు గంటలలోనే, నోవహు దినములలో దీర్ఘశాంతమును చూపి కూడా మారుమనస్సు పొందని చెరశాలలోనున్న ఆ ఆత్మలకు ఆ థియోఫనితో, ఆ శరీరముతో, వెళ్ళి వారికి బోధించెను. ఆయన తిరిగి లేచెను. మర్త్యత - అమర్త్యతను ధరించుకొనెను. ఆయన నిలబడి ఆహారము తినెను, ఆయన ఒక నరుడు [స్పష్టతలేని మాటలు]. హల్లెలూయా!
55
ఇవన్స్ సోదరుడా! ఆ విధంగానే ఆయనను మనము చూచెదము. ఆయన ఆ విధముగా దావీదు సింహాసనము మీద కూర్చొనును. హల్లెలూయా! ఆ విధముగా మనము కలిసి నడుచుకుంటూ వెళ్ళుచున్నప్పుడు, ఇప్పుడు అచ్చట, నేను మీతో పాటు కొండల మీద షికారుకు మిలియను సంవత్సరముల పాటు తిరిగెదను. గమనించిరా, కేవలము కొన్ని దినములలో, కేవలము కొన్ని నిమిషములలోనే, మనమచ్చటకు వెళ్ళి చేరెదము, అచ్చట కూడుకొనెదము.
భుజించు సమయము వచ్చేటప్పటికి, మీరెరుగుదురా, మొదటి విషయము మీకు తెలుసా, సహోదరి ఉడ్ చెప్పను. “సహోదరి ఉడ్, మంచిది, ఇంత సేపు నీవు ఎచ్చట యున్నావు? నేను నిన్ను చూడనే లేదే, కాని అది నాకు పదిహేను నిమిషముల వ్యవధివలె కనిపించును.”
“ఓ, బ్రెన్హా౦ సోదరుడా, అది రెండువేల సంవత్సరముల క్రితం మాట.”
“ఓ, ఎట్లున్నావ్?” ఇక్కడ బాగుండుట తప్ప మరొకటి లేదు.
“పిల్లలారా, సోదరులారా, ప్రియ సోదరులారా, ఇటు రండి. ఒక సంగతి మీకందరికి నేను చూపించెదను. ఇక్కడ ఒక నీటి ఊట ఉన్నది, ఇంత మంచి నీటిని మరెన్నడూ త్రాగలేదు. మరియు ఓ, మంచిది, చల్లని నీరు మనము త్రాగుదము. నేను అచ్చటికి వెళ్ళి, ఒక పెద్ద ద్రాక్ష గెలను తెచ్చెదను. మనమందరము అచ్చట కూర్చొని దానిని తిందుము.” అది అద్భుతము కాదా? ఖచ్చితంగా, అది అలాగే యుండును. అది అదే.
56
దానిని మనము ఏ విధముగా పొందుకున్నాము? దానిని మనమెలాగు ఎరుగుదుము? జగత్తు పునాది వేయక ముందే దేవుడు మనలను నిర్ణయించెను. ఎవరు వీరు? ఆ వాగ్దాన దేశములో యున్నవారు.
తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను.
తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు [ఆయన ఏమైయున్నాడో దానిని బట్టి ఆయనను మనము స్తుతించునట్లు; ఆయన దేవుడు మనము ఆయనను స్తుతించవలెను.] తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు క్రీస్తునందు మనలను ఏర్పరచుకొనెను.
ఎవరి రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగియున్నది .....
57
పుత్రస్వీకారము యొద్దకు నేను వెళ్ళవలసియున్నాను, కాని “పాపములు?” యొద్ధ ఇచ్చట నేను ఒక నిమిషము ఆగుదును. “పాపములు,” అను మాటను మీరు గమనించారా? పాపము చేసినందుకు ఒక పాపిని దేవుడు శిక్షించడని మీరెరుగుదురా? ఒక పాపిగా ఉండినందుకే అతనిని శిక్షించును. ఒక పాపి పొగత్రాగినచో, అందుకు అతని శిక్షించడు; ఏలాగయినా అతడు ఒక పాపియే, చూచారా. అతనికి ఏ పాపములు లేవు, పాపికి ఉండవు. అతడు కేవలము పాపి, చూచారా. అతడికి ఏ పాపములు లేవు. కాని నీకు పాపము గలదు, క్రైస్తవులగు మీకు పాపములున్నవి. మీరు గమనించండి, ఆయన ఇక్కడ సంఘముతో మాట్లాడుచున్నాడు. ఆమెను సరిదిద్దుచున్నాడు, చూచారా. “పాపముల క్షమాపణ,” పాపములు. మనము పాపము చేయుదుము, కాని పాపి కేవలము ఒక పాపియే. దేవుడతనిని క్షమించడు.....
58
“మంచిది, అతడు ఎవరినో కాల్చి చంపెను. దానిని గూర్చి నీవేమి చేయుదువు?” అని మీరందురు. అది నా పని కాదు. నేను సంస్కర్తను కాదు కాని, నేను ఒక బోధకుడను. చట్టము వారిపై చర్య తీసికొనును - వారు సంస్కర్తలు. అది వారి పని. మంచిది, “అతడు వ్యభిచారము చేసెను.” చట్టము దానిని చూచుకొనును. అది అతనికి చట్టమునకు మధ్య ఉన్నది. నేను సంస్కర్తను కాదు. నేను ఒక సంస్కర్తను కాను. నేను ప్రజలను సంస్కరించను. వారిని నేను మార్చవలె ననుకొనుచున్నాను. నేను ఒక బోధకుడను. గమనించారా, వారిని దేవుని యొద్దకు నడిపించుటయే నా పని. వాడు పాపము చేసినచో, దానికి అతడే బాధ్యత వహించును. అతడు ఒక పాపియగును. దేవుడు హెచ్చు దశలో అతనికి శిక్ష విధించును. ప్రారంభము నుండియే వాడు పాపి. అతడు మొదటి మెట్టు దగ్గరకు కూడా రాలేదు. అతడు ఎక్కడా లేదు. చెప్పాలంటే అతడు ప్రారంభము నుండే పాపి. అతడు పాపి గనుక ఏ పాపములు అతనికి లేవు.
59
“ఇంతయితే రాత్రి, ఇంతయితే రాత్రి కాదు,” అని నీవు చెప్పలేవు. అంతయూ రాత్రియే. కాదు, అదంతయూ రాత్రియే, అదంతయూ రాత్రియే. దేవుడా విధంగా చెప్పెను. అతడు కేవలము పాపి అని నేను మీకు చెప్పాను, అదంతే. “ఇప్పుడు, అతడు దేనిని చేసెను, ఇది ఇంత రాత్రి, ఇచ్చట ఇది నిజముగానే ప్రకాశవంతమైన రాత్రి.” మీరందురని నేనెరుగుదును, కాని ఇదంతా కేవలము రాత్రియే, అంతే, గమనించారా.
“ఇంత వెలుగు ఇచ్చటున్నది,” అని నేననలేను. కాదు, చూచారా, వెలుగే. అదెంతో నీవు చెప్పలేవు, చూచారా. కాని ఇందులో అచ్చట ఒక నల్లని మచ్చ యున్నట్లైతే అలాంటప్పుడు అందులో చీకటి ఉంటున్నది.
60
కావున “పాపములు,” పా - ప - ము - లు, ఆయన యొక్క ప్రశస్త రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ కలుగుచున్నది, ఏమిటి? ప్రశస్త రక్తము ద్వారా.
దేవుని మహా కృపదైశ్వర్యమును బట్టి....
దానినెట్లు మనము మరువగలము? మనము మనంతట మన పాపములను పోగొట్టుకొని యోగ్యులమైతిమా? మరేమిటి?
...కృప;
ఓ, మై! ప్రభువా, నా చేతులతో నేనేమియూ తేలేదు. నేనేమియూ చేయలేను. నేను చేయకలిగింది ఏదీ లేదు. చూడండి! ఆయన నన్ను ముందుగా నిర్ణయించెను, ఆయన నన్ను పిలచెను. ఆయన నన్ను ఏర్పరచుకొనెను. నేనెన్నడూ ఆయనను ఎన్నుకొనలేదు, ఆయనే నన్ను ఏర్పరచుకొనెను, ఆయనే నిన్ను ఏర్పరచుకొనెను. మనందరినీ ఆయన ఏర్పరచుకొనెను. మనమాయనను ఏర్పరచుకోలేదు. “మీరు కాదు, నేనే మిమ్మును ఏర్పరచుకొంటిని,” అని యేసు చెప్పెను. “మొదటగా నా తండ్రి ఆకర్షించితేనే గాని ఎవడును నాయొద్దకు రాడు. తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నాయొద్దకు వచ్చెదరు. అందులో ఎవరును నశింపరు. లేఖనము నెరవేరునట్లు, నాశనపుత్రుడు మాత్రమే లయమగును,” అని ఆయన చెప్పెను. మీరు చూచారా? “తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నాయొద్దకు వత్తురు.”
61
ఓ, చాలా ఆలస్యమగుచున్నాను, కదా? దీనిని ఎన్నడూ పూర్తి చేయలేను. ఇంకా దీనిని ఆరంభించనే లేదు. త్వరపడుదును. త్వరగా ఇక్కడ ఒక సంగతి ఇప్పుడు నేను చెప్పవలెను. త్వరపడుదుము. ఒక నిమిషములో ఈ దత్తపుత్రత్వము యొద్దకు నేను వచ్చెదను. ఒక నిమిషము పాటు నన్ను క్షమించుదురా? దానియొద్దకు వచ్చెదము, దూరము నుండి జార్జియా నుండి వచ్చిన కొంతమంది ఈ రాత్రి వరుకే ఇచ్చట యుందురు. ఇప్పుడు వారి హృదయములు దీవించబడు గాక! జార్జియా, లేదా టెక్సాస్, లేదా మరెచ్చట నుండి వచ్చినా గాని, ఈ 5వ వచనమును వినండి, దీనికొరకు కొన్ని నిమిషములను మనము తీసుకొనెదము.
62
మనలను ముందుగా నిర్ణయించెను....
“కోసము” అనే పదమునకు అర్థమేమిటి? “కోసము” అనే పదమునకు ఏదో ఒక దానికోసము మనము వచ్చుచున్నామని దాని అర్ధము. కోసము. “నేను ప్రవాహము యొద్దకు వెళ్ళుచున్నాను. నేను కుర్చీ యొద్దకు వెళ్ళుచున్నాను. నేను బల్ల కోసము వెళ్ళుచున్నాను,” అని మనము చెప్పుచుందుము. హ్యూమ్స్ నీకిది తెలిసినదా?
తన చిత్త ప్రకారమగు దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను.
ఎంత దయా సంకల్పము? ఇదెవరి చిత్తము? ఎవరియొక్క మంచితనము, అది ఆయన స్వంతది. ఆయన యొక్క స్వకీయ దయా సంకల్పము యొక్క ఆయన స్వకీయ చిత్తము!
63
ఇప్పుడు, “పుత్రస్వీకారము” అనగా ఏమిటి? (నన్ను దానిని ఇప్పుడు తియ్యనివ్వండి, నాకు తెలియదు ఒకవేళ... దానిని తీయుటకు నాకు సమయము లేదు, కాని దానిని నేను సూటిగా చెప్పెదను. మీకు ఏదైనా ప్రశ్న యున్నచో, వర్తమానములో నుండి కొద్దిసేపు అయిన తరువాత మీరు నన్ను అడుగవచ్చును.) వినండి. నీ దత్తపుత్రత్వము, అనగా నీ జన్మ కాదు. మీ దత్తపుత్రత్వము మీ యొక్క స్థానమైయున్నది. మీరు తిరిగి జన్మించిన తరువాత (యోహాను 1:17 అనుకొంటాను.) దేవుని ఆత్మ వలన మనము పుట్టినప్పుడు మనము దేవుని కుమారులమగుదుము. కాబట్టి మనము ముందుగా నిర్ణయించబడితిమి. అంత్యకాలమందు ఈ కుమారులు మీరు గమనించండి, ఇప్పడిచ్చట ఇదే మీరు అర్ధము చేసుకోవాలని నేను ప్రయత్నించుచున్నాను. మనము దత్త పుత్రులమగుటకు ముందుగా నిర్ణయించబడినాము.
ఇప్పుడు, ఇప్పుడిచ్చట మనము యున్నాము. ఇప్పుడు, పెంతెకోస్తు వారిని ఈ మాట కొద్దిగా బాధపరచును. వారిట్లందురు, “నేను తిరిగి జన్మించాను. దేవునికి స్తోత్రము! పరిశుద్ధాత్మను పొందాను.” మంచిదే. నీవు దేవుని బిడ్డవు. అది నిజము. కాని దానిగూర్చి నేను మాట్లాడుట లేదు. చూశారా, దత్తపుత్రత్వముకై నీవు ముందుగానే నిర్ణయించబడితివి. కుమారునిగా స్థానమును పొందుటయే పుత్రస్వీకారము.
దానికి నేను చాలా దగ్గరగా వచ్చుచున్నాను. నేను దానికి బాగా దగ్గరకు వచ్చినందున వెనుక యున్న వారికి వినిపించుట లేదని బెక్కీ చెప్పినది.
నేను అయివుంటిని ..... చూచారా,
64
ఒక కుమారుడు... పాత నిబంధనలో పుత్రస్వీకారము గూర్చిన నియమములు ఎందరికి తెలియును? బహుశా మీరు చదివియందురు. ఒక కుమారుడు జన్మించెను. ఒక నా ప్రసంగములో దానిని చెప్పినట్లు గురుతున్నది. అదేమిటో నీకు గుర్తున్నదా, జెనీ? అది ఒక టేపు మీద యున్నది. ఓ, అది ఏమిటి? నాకది జ్ఞాపకము వచ్చుచున్నది. ఓ, అవును, అది నాకు లాభించినది. ఆయన మాట వినుడి. ఆయన మాట వినుడి అను వర్తమానము. బిడ్డలను దత్తత తీసికొనుట.
పాత నిబంధనలో ఒక కుటుంబములో ఒక బిడ్డ జన్మించినప్పుడు, అతడు జన్మించినప్పుడు, అతడొక బాలుడు. ఎందుకనగా అతడు తన తల్లిదండ్రులకు పుట్టెను. అతడు కుటుంబములో కుమారుడు గనుక అన్నింటికి వారసుడగును. కాని ఈ కుమారుడు శిక్షణనిచ్చు వారియొద్ద పెరుగును. గలతీ 5వ అధ్యాయము 17వ వచనము నుండి 25వ వచనము వరుకు. మంచిది. అతడు శిక్షణనిచ్చు వారి వలన, ఉపదేశకుల వలన పెంచబడెను. నాకు కుమారుడు పుట్టగానే నేను తండ్రిని అగుదును.
65
ఆ కారణము చేతనే కింగ్-జేమ్స్ అనువాదములో, ఎంతమంది ఆ కింగ్-జేమ్స్ అనువాదములోయున్న దానిని గూర్చి చదివి ఆలోచించిరి, “నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు,” ఒక గృహము అనేక నివాసములు?“ చూచారా? వాస్తవముగా, పరిశుద్ధ గ్రంథమును కింగ్-జేమ్స్ అనువాదము చేసిన దినములలో ఒక ఇళ్ళు అనగా ఒక ”రాజ్యము“ అని అర్ధము. ”నా తండ్రి రాజ్యములో చాలా నివాసములు కలవు.“ ఒక ఇంటిలో కాదు, నివాసములో, అయితే ఆయన ఈ రాజ్యమునకు తండ్రిగా అతడు పిలువబడెను. వారు దానిని పరిశుద్ధ గ్రంథానుసారముగా చేసిరి, పరిశుద్ధ గ్రంథములో అది ఆ విధముగానే యుండవలయును.
ఒక తండ్రికి ఒక పెద్ద వేయి ఎకరముల వ్యవసాయ భూమి లేదా ఆ విధమైనది ఏదైనా ఉన్నట్లైతే, అచ్చట అతని దగ్గర అనేకమంది బ్రతుకుచున్నారు. అతని గొర్రెలను కాయుటకు అతని యొద్ద జీతమునకు మనుష్యులు గలరు, అతని పశువులను మేయుటకు కొంతమంది అతని యొద్ద జీతమునకు గలరు, అచ్చట పైభాగమున వందల మైళ్ళ దూరములో అతని యొద్ద కొంతమంది గలరు, ఇచ్చట కొంతమంది మేకలను కాయుటకు గలరు. మరియు గాడిదలను కాయుటకును మరి వివిధ రకముల వాటిని చూచుకొనుటకు అతని యొద్ద కొంతమంది మనుష్యులు గలరు. అతడు ఒక పెద్ద రాజ్యమును కలిగియున్నట్లుగా యున్నాడు. అతడు చిన్న గాడిదపై ఎక్కి వెళ్ళుచూ, ప్రతీ చోటుకు వెళ్ళుచు - వారెట్లు పనిచేయుచున్నారో, గొర్రేలకు బొచ్చు కత్తిరించుట వంటి వాటన్నింటిని చూచును, అతనికి సమయమే ఉండదు.....
(ఇచ్చట నుండి నేను వెనుకకు వెళ్ళినయెడల, మీకు వినిపించదు. నేను ఇచ్చట నుండే ప్రయత్నించెదను. ఇప్పుడు మీకు సరిగా వినబడుచున్నదా?) గమనించండి.
66
అతడు ఆ విధముగా సవారీ చేయుచూ, అతని రాజ్యము కొరకు జాగ్రత్త వహించుటకై ప్రయత్నించుచు వెళ్ళిపోయెను. అతనికున్నవాటన్నింటికి కుమారుడే వారసుడగును. అతడు వారసుడు.
యేసుక్రీస్తు ద్వారా దేవుని రాజ్యములో మనము జన్మించినప్పుడు మనము పరలోకమునకు వారసులమగుదుము. యేసుతో సహవారసులమగుదుము, ఎందుకనగా ఆయన మన స్థానము తీసికొనెను. మనము ఆయన (నీతి)గా మారునట్లు, ఆయన మనవలె (పాపము) ఆయెను. చూచారా? నేను ఆయనగా మారునట్లు ఆయన నావలె మారెను, చూడండి, ఆయనతో కూడా సహ-వారసులము. మంచిది, మీ ప్రతి ఒక్కరు దానిని ఇప్పుడు గుర్తుంచుకొనండి.
67
ఇప్పుడు, గుర్తుంచుకొనండి, నీవు ఈ విధంగా అగుదువని దేవుడు తన ముందస్తు జ్ఞానము ద్వారా నిన్ను నిర్ణయించెను. అందరూ దీనిని అర్ధము చేసికొన్నారా, అర్ధమైనచో చేతులెత్తండి. ఈ వాగ్దాన దేశమునకు నీవు వచ్చునట్లుగా దేవుడు తన ముందస్తు జ్ఞానము ద్వారా నిన్ను నిర్ణయించెను. ఈనాడు క్రైస్తవులకు వాగ్దాన దేశం ఏమిటి? మీకు తెలిసినట్లయితే చేయి ఎత్తండి. “ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, దూరస్తులందరికిని చెందును. అంత్యదినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించుదునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ కుమారులు, కుమార్తెల మీద కుమ్మరించెదను. యెషయా 28:18, ”ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము ఇక్కడ కొంచెము, అక్కడ కొంచెము; మేలైన దానిని పట్టుకొనియుండుడి. నత్తి పెదవుల ద్వారాను, ఇతర భాషల ద్వారాను ఈ జనులతో నేను మాట్లాడుదును. ఇదే విశ్రాంతి. వారు ప్రవేశించు నేను చెప్పిన సబ్బాతు దేశము ఇదే. ఇదంతయూ వారు వినక తమ తలలూపచూ పోవుదురు. దానిని వినరు,“ చూచారా. వాస్తవము.
68
ఏమిటది? ఐగుప్తు నుండి దానినంత దాటుకొని కానానుకు దగ్గరగా వచ్చి, ఆ అరణ్య మార్గము గుండా, ఆ ద్రాక్షలను రుచి చూచుటకు కావలసినంత చేరువగా వచ్చి, ఆ దేశమునకు ఎంతో దగ్గరగా వచ్చిన ఆ జనులవలె వీరున్నారు. సహోదరుడా, అచ్చట, వారు నన్ను వెలుపలికి లాగాలనుకున్నట్లుగా, హెబ్రియులకు 6వ అధ్యాయములో యున్న రీతిగా, దానిని నేనెట్లు చేయగలను? వారు సరిహద్దు విశ్వాసులుగా యున్నారు, వారెన్నడూ అచ్చటకు చేరుకోలేరు! వారచ్చటకు చేరలేరు. “మా పితరులు అరణ్యములో మన్నాను తినిరి,” అని వారనిరి.
“వారందరూ చనిపోయిరి,” అని యేసు చెప్పెను. అదే వారిని వేరుచేసెను. ప్రతి ఒక్కరు చనిపోయిరి. అది నిజము. “కాని నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమునై యున్నాను. ఈ రొట్టెను తినువాడు ఎన్నడూ చనిపోడు. అవును. దీనిని అతడు తినినచో, నిత్యజీవము పొందును. ఏదెను తోటలోని ఆ జీవ వృక్షమును నేనే,” అని ఆయన చెప్పెను.
69
ఇప్పుడు, చూడండి, ఈ జనులు చాలా దగ్గరగా వచ్చిరి! చూశారా, దాని కోసము వెనుకకు వెళ్ళకుండానే హెబ్రీయులు 6వ అధ్యాయమును మీరు గమనించినయెడల, తిరిగి వెనక్కు వెళ్ళలేదు. కాని హెబ్రీ 6లో ఇట్లున్నది, “ఒకప్పుడు పాలివారైన వీరు చాలా దగ్గరగా వచ్చి, పరలోక వరమును రుచి చూచిరి.” వారు చుట్టూ కూర్చుండి, వారు స్వస్థతను చూచెదరు, దేవుని శక్తితో నింపబడియున్న జనులను వారు చూచెదరు, మార్పుచెందినవారి జీవితములను వారు చూచినా గాని, దాని మీద ఒక చెయ్యిను కూడా దానిపై పెట్టరు. లేదయ్యా, లేదండి. “రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయుచు, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక తాము పరిశుద్ధపరచబడుట కొరకై ఉన్నటువంటి నిబంధనా రక్తమును వారు ఈ విధముగా లెక్కించుచున్నారు.....”
“శుద్దీకరణమును నమ్ము సంఘమునకు నేను చెందియున్నాను.” అది కొనసాగునంత కాలము మంచిదే, కాని నీవు అంత దూరము వరుకు వెళ్ళెలేవు, చూశారా. అవునండీ. అరణ్యము వారిని శుద్దీకరించినది. అవును నిశ్చయంగా! వారికి ఇత్తడి సర్పము, ఇత్తడి బలిపీఠము యుండెను. శుద్దీకరణ అచ్చటుండెను, సమస్తము అచ్చట యున్నది, కాని వారు విశ్రాంతి కొరకు పాలస్తీనాలో ప్రవేశించిరి.
70
హెబ్రీ 4లో చూడండి, “మరియొక విశ్రాంతి,” గురించి ఆయన చెప్పలేదా? దేవుడు ఏడవ దినమును సృష్టించి వారికి ఏడవ దినమున విశ్రాంతిని ఇచ్చెను. మరో చోట ఆయన విశ్రాంతి దినము గూర్చి చెప్పెను, “నేడు దావీదు నందు.” అప్పుడాయన వారికి మరో విశ్రాంతిని ఇచ్చెను: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. మీకు నేను విశ్రాంతిని ఇచ్చెదను.” ఈ విశ్రాంతిలోనికి ప్రవేశించుడి. సబ్బాతు దినమున దేవుడు తన పనులన్నిటి నుండి విశ్రాంతి పొందినట్లుగానే ఈ విశ్రాంతిలోనికి ప్రవేశించిన మనమును పనుల నుండి విశ్రాంతి పొందియున్నాము. నిశ్చయంగా! అదే మీ సబ్బాతు, విశ్రాంతి. ఈ వాగ్దాన దేశములోనే మీ నిజ విశ్రాంతియున్నది.
పరిశుద్ధాత్మ ప్రజల యొక్క వాగ్దానమై యున్నది. పాండిత్యము కలిగి చదివిన బోధకులను వారెందుకు కోరుకొనుచున్నారు? కురచ దుస్తులు ధరించినా, జుట్టు కత్తిరించుకొన్నా పెదవులకు రంగులు పూసికొన్నా పురుషులు జూదమాడుచూ, బూతు సరసోక్తులు పలుకుచున్నా వారిని సంఘ సభ్యులుగానే ఈ బోధకులు ఎంచుచున్నారు. వారు అటువంటిది అంగీకరించి పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వమును నిరాకరించుచున్నారు. ఎందుకని? దేవుని యొక్క వాక్యము రెండంచుల ఖడ్గము కంటెను వాడిగలదియై, ప్రాణాత్మ కీళ్ళను విభజించుచూ, అవును, హృదయలోచనలను పరిశోధించును. మనస్సులోని ఆలోచనలను కూడా బయలుపెట్టును.
71
లోకమును గాని, లోకములో ఉన్నవాటిని గాని మనము ప్రేమించినయెడల, దేవుని ప్రేమ మనలో యుండదు. “పిలువబడిన వారనేకులు గాని ఏర్పరచబడిన వారు కొందరే; జీవమునకు పోవు మార్గము ఇరుకుగాను, సంకుచితమై యున్నది. దానిని కనుగొనువారు కొందరే. ఆ దినమున అనేకులు వచ్చి అబ్రాహాము ఇస్సాకు, యాకోబులతో కూడా వచ్చి రాజ్యములో కూర్చొందురు,” అని యేసు చెప్పెను. కాని రాజ్య సంబంధులు బయటకు త్రోసివేయబడుదురు. వారిట్లందురు, “ప్రభువా, నీ నామములో వీటిని మేము చేయలేదా? మేము బోధించలేదా? మేము ఫలాని డాక్టర్ లేదా రెవరెండు గదా?” అని వారు చెప్పెదరు. మిమ్మను ఎన్నడూ నేనెరుగను. అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. మిమ్మును నేనెరుగను. “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలచువారందరూ ప్రవేశించరు కాని, పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే లోపల ప్రవేశించును.”
72
నీవు అచ్చటే యున్నావు.
ఈ వాగ్దానపు దేశములోనికి ప్రవేశిస్తూ, మనమెట్లు అందులోకి ప్రవేశించగలము? దేవుని ముందస్తు జ్ఞానము వలన సంఘమగు మనము అందుకు నిర్ణయించబడితిమి. దేనికొరకు ముందుగా నిర్ణయించబడితిమి? ఆయన కృప ద్వారా ఆయనను ఘనపరచుటకు, మహిమపరచుటకు, ఆరాధించుటకు నిర్ణయించబడితిమి. ఆయన ఆదియందు స్వయం ఉనికిగలవానిగా నాన్నగారు కూర్చొని యుండిరి. ఆయన చుట్టూర ఏదియూ లేదు. ఆయనను ఆరాధించుటకు ఏదో ఒకటి కావలసియున్నది. కాబట్టి జగత్తుకు పునాది వేయబడక ముందే ఒక సంఘమును ముందుగా నిర్ణయించి, వారి పేర్లను గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము నందు వ్రాసెను. అప్పుడే వారు కూడా జగత్తు పునాది వేయబడక ముందే ఆయన యొక్క మహిమా స్తుతుల కొరకై, వారిని ఆయన కనబడునట్లుగా చేసి, కాలాంతమందు క్రీస్తు యేసు అనే ఆ ఒక్కనియందే ఏకమగునట్లు చేసెను. వ్యూ! మహిమ! అంతే. అది అచ్చటే యున్నది, నా సహోదరుడా, నా సహోదరీ, దానినుండి ఎన్నటికీ నీవు తొలగిపోవద్దు.
73
దేవుడు తన ఎన్నిక కృపను బట్టి మిమ్మును పిలచెను. దేవుడు తన ఎన్నిక కృపను బట్టి నిన్ను శుద్దీకరించెను. దేవుడు తన ఎన్నిక కృప ద్వారా, తన శక్తి ద్వారా, నీకు బాప్తిస్మము ఇచ్చి ఈ విశ్రాంతి దేశములో నిన్ను ఉంచెను. ఈ విశ్రాంతిలోనికి ప్రవేశించిన వారు త్రోవ తప్పుటకు అవకాశము లేదు. ఆదిలో దేవుడు తన పని నుండి విశ్రాంతి పొందినట్లే వీరును విశ్రాంతి పొందుదురు. వారు చెప్పనాశక్యము కాని ఆనందమును, సంపూర్ణ మహిమను పొందుదురు. జీవ వృక్షము వారిలో వికసించును. వారు దీర్ఘశాంతమును, దయాళుత్వమును, మంచితనమును, సహనము ద్వారా వచ్చిన నమ్మకమును, విశ్వాసమును, సాత్వికమును ఆశా నిగ్రహమును కలిగి యందురు. జీవ వృక్షము వారిలో వికసించును, ఎందుకనగా వారి నిరీక్షణ క్రీస్తులో లంగరు వేయబడియున్నది. విశ్వాసులలో సూచక క్రియలు మరియు అద్భుత కార్యములు, బయటకు కనబడి పరిశుద్ధాత్మను రుజువు చేయును. “నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును.” వారు రోగులను స్వస్థపరచుదురు, దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, దర్శనములు చూచెదరు, వారు దేవునితో నడచెదరు, దేవునితో మాట్లాడెదరు. ఏ దయ్యమూ వారిని కదపజాలదు. వారు నిలకడగా యుండి నిత్యజీవము కొరకు ఎదురు చూచెదరు. వెనకుండిన వాటిని మరచి క్రీస్తు యేసు నందున్న ఉన్నత పిలుపు యొక్క గురిని చేరుటకు ముందుకు సాగిపోదురు. అక్కడే వారున్నారు. అక్కడే వారున్నారు. అది సంఘము యొక్క స్థానము!
74
వారెట్లు అచ్చటికి వెళ్ళిరి? “మంచిది, ప్రభువా, మీరెగుదురురు, ఒక దినమున నేను మరలా సిగరెట్లు కాల్చటం మొదలుపెట్టి నేను పడిపోయాను, తరువాత నేననుకున్నాను,” అని నీవు చెప్పలేవు. ఓ, లేదు, లేదు, లేదు, లేదు.
ముందస్తు నిర్ణయము! ఆయన మనలను పిలచెను. ఆయనను మనము వెంబడించినప్పుడు మనమిట్లు చెప్పెదము, “దేవా! మేము నశించిన అప్రయోజకులము.” మమ్మును మేము రక్షించుకోవలెనను తలంపే మాకు లేదు, మాది పంది స్వభావము. మా ప్రారంభమే ఆలాగున్నది.“
మీరు పందులను పెంచు చోటకు వెళ్ళి ముసలి పందిని చూడండి. “ఇప్పుడు ఇటు చూడు, ముసలి పందీ, నేను ఒకటి నీతో చెప్పాలనుకుంటున్నాను. ఆ మురికి నీరు త్రాగుట తప్పు,” అని చెప్పండి.
అది “ఆంక్, ఆంక్” అని అరచును, చూచారా. నిన్ను నీవు రక్షించుకొనుటకు కూడ ఆలాగే యుండును. ఇది సత్యము.
75
“అమ్మా, నీవు అటువంటి బట్టలు ధరించరాదు. నీవు చక్కగా దుస్తులు ధరించవలెను. నీవు ఈ విధంగా ఉండవలెను. నీకు ఆ జూదపు విందులు వద్దు. నీవు సిగరెట్లు త్రాగరాదు. నీవిది చేయకూడదు. ఓయీ! నీవది చేయకూడదు,” అని చెప్పండి.
“ఆంక్-ఆంక్ అని అతడు అరచుచూ, నేను ఆంక్-ఆంక్ కు చెంది యున్నానని,” చెప్చును. వాటికి “అంక్” మాత్రమే తెలియును. “మంచిది, నేను నీకంటె మంచివాడినని అంక్-అంక్! అని అరచును. చూడండి, వారు పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వమును విసర్జించుదురు. మీరు లోకమును గాని, లోకములో ఉన్నవాటిని గాని ప్రేమించినయెడల, దేవుని ప్రేమ మీలో యుండదని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది.
76
ఏది వారిని వింతగా మార్చినది? మీరు ఒక పరిశుద్ధ జనాంగమైయున్నారు. దానికొరకు నీవేమి చేసితివి? ఒక దేశమును విడిచి మీరు మరో దేశములో ప్రవేశించిరి. అందులోనికి మీరెట్లు వెళ్ళితిరి? అది వాగ్దాన దేశము. అది ఎటువంటి ఒక వాగ్దాన దేశము? “అంత్యదినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించుదునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.” ఒకే ఆత్మ ద్వారా మనమందరము ఈ ఒకే వాగ్దాన దేశములోనికి బాప్తిస్మము పొందియున్నాము. ఆమేన్. సోదరీ సోదరులారా, హల్లెలూయా, హృదయ శుద్దుని కలిగియున్నాము, అసూయగాని, శత్రుత్వము గాని లేదు! ఒక సహోదరుడు దారి తప్పి వెళ్ళినయెడల, అతడు ఎంతటి తప్పును చేసినా గాని నేను లెక్క చేయను, అతడిని మీరు వెంటాడుచూ సరిదిద్దుటకు ప్రయత్నించండి.
77
కొంత కాలం క్రిందట దారి తప్పిన ఒక సోదరుని వెంటాడాను. “ఆ పనికిమాలిన వాడి జోలికి పోవద్దు,” అని ఒక యవ్వనస్తుడు నాతో అనెను.
నేనిట్లన్నాను, “నా సహోదరునితో వెళ్ళలేని స్థితికి నా హృదయము వచ్చినయెడల, నేను వెంటనే బలిపీఠము యొద్దకు వెళ్ళవలసిన సమయమదే, ఎందుకనగా నేను కృప నుండి తొలగిపోతిని.” “అతని శరీరములో ఊపిరి ఉన్నంత వరకు నేను అతనిని వెంటాడుదును. ఏదో చోట ఆ గీత దగ్గర అతడిని నేను పట్టుకొందును.” అవునండీ. అతనిని పట్టుకొని తిరిగి తీసికొని వచ్చాను. (హల్లెలూయా), అవునండీ, ఇప్పుడతడు మందలో క్షేమముగా యున్నాడు. అవునండీ, లోకమునకు ఎంత త్వరగా వెళ్ళాలో అంత త్వరగా అతడు దారి తప్పియుండేవాడు.
78
కొద్దిసేపటి క్రితం ఒక పేద దీన స్త్రీ అచ్చట కూర్చొని యుండుటను నేను చూచాను, పోలీసు నన్ను పిలిచి, “ఎందుకు, నేరస్తులు లేక పిచ్చివారికి చేతులు కట్టియుంచే, బిగుతైన జాకెట్ ఆమెకు దరింపచేయాలి,” అని అతడు నాతో అన్నాడు. “ఆమెకు మతి తప్పిపోయినది, ఆమె పిచ్చిది,” అని చెప్పెను. ఆమెను నేను వెళ్ళే వరుకు హోటల్లో ఉంచారు.
“అది పరవాలేదు,” అని నేను అన్నాను.
చెప్పెను, “ఎందుకని బిల్లీ!” అని పోలీసు అడిగెను. [నేనతనిని బాగా ఎరుగుదును, నా చిన్ననాటి నుండియే నేనతడిని ఎరుగుదును.] “నీకు సహాయము చేయుటకు నేనేదయినా చేయుదును బిల్లీ,” అని అతడు నాతో అనెను.
“అది పరవాలేదు,” అని నేను అన్నాను.
“ఆమెకు సహాయము చేయుగలవా?” అని అనడిగాడు.
“నేను చేయలేను, గాని ఆయన చేయగలడు. ఆమెను నా యొద్దకు తెండి,” అన్నాను.
వారెమెను బయటకు తెచ్చిరి. కొంతసేపటికి ఆమె నెమ్మది పొంది వెళ్ళినది? ఏమిటది? మేము ఆమె కొరకు ప్రార్ధించాము. ఆమేన్! ఆమె ఎంతో....
“వైద్యుని పిలువమంటారా?” అని వారు ఆమె యొక్క భర్తను అడిగిరి.
“వైద్యుడేమియూ ఆమెకు చేయలేడు,” అన్నాను. అది నిజమే. ఆమె పిచ్చిది. వైద్యుడామెకు ఏమియూ చేయలేడు.
“అక్కడికి వెళ్ళుట ఒక్కటే మనకు గల నిరీక్షణ,” అని చెప్పెను.
“బిల్లీ! అది నాకు అర్థమగుటలేదు,” అని అతడన్నాడు.
“నీవాలాగుందువని ఎన్నడూ నేనూహించలేదు,” అని నేను అన్నాను.
79
కాని, ఓ, నాకు కూడా అది అర్థమగుట లేదు! లేదు. కాని సోదరుడా, ఒకప్పుడు పరలోకమందున్న దేవుడు ఒక మార్గమును చేకూర్చెను. ఏదో నన్ను వెంటాడినది. ఆమేన్! నేను దానిని వెంటాడాలని ఆశించలేదు, కాని అదే ఏదో ఒకటి నన్ను వెంటాడినది; ఎందుకనగా జగత్తు పునాది వేయబడక మునుపే, (హల్లెలూయా), ఆయన యొక్క మహిమకు ఘనతగా మనము ఆయన వారముగా యుండుటకై దేవుడు ముందుగా ఏర్పరచుకొనెను. గమనించండి! ఆయన ఎవరిని ముందుగా ఏర్పరచుకొనెనో, వారిని ఆయన ఏమి చేసెను? పిలిచెను. అది నిజమేనా? ఆయన నిన్ను పిలిచెనా? అవును, ఆయన ఎందుకు నిన్ను పిలచెను? ఆయన నిన్ను ముందుగా ఎరిగెను. ముందుగా ఆయన ఎవరిని ఎరిగెనో, వారిని పిలచెను. ఆయన ఎవరిని పిలచెనో, వారిని నీతిమంతులనుగా తీర్చెను. నిజమేనా? ఆయన నిన్ను పిలిచెనా? అవును! ఎవరిని ఆయన నీతిమంతులనుగా తీర్చెనో, వారిని ఆయన మహిమపరచెను. ఆమేన్! అదే బైబిలు చెప్పుచున్నది. ఆయన ఎవరిని ముందుగా ఎరిగెనో, వారిని పిలచెను. ప్రతీ తరమునందు! ఎవరిని ఆయన పిలచెనో, వారిని ఎప్పుడో మహిమపరచెను. ఏమిటి? ఇక్కడ మీకు ఆ వాక్యమును చదివెదను. మంచిది.
తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించెను.
తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు....
ఓ, దానిని మీరు గ్రహించారా? తన కృపా మహిమకు కీర్త కలుగునట్లు రానున్న నిత్య యుగములలో ఆయన అచ్చట కూర్చొనియుండగా, ఆయన పిల్లలు, “అబ్బా, తండ్రి! అబ్బా, తండ్రి!” అని మొర్రపెట్టుదురు.
“వారు దేనిగూర్చి మాట్లాడుచున్నారు? వారేమి చెప్పుచున్నారు?” అని దేవదూతలు అడుగుదురు.
80
తప్పిపోయిన కుమారునిలో అది చక్కగా వివరించబడెను. నేను నశించితిని. “ఇతడు నా కుమారుడు. ఇతడు తప్పిపోయి మరల దొరికెను. ఇతడు చనిపోయి మరల బ్రదికెను. క్రొవ్విన దూడను తెండి. మంచి వస్త్రములు ధరింప చేయుడి. అతని వ్రేలికి ఒక ఉంగరము పెట్టడి. మరియు మనము.....” ఉదయ నక్షత్రములు కూడి పాడుటలో ఆశ్చర్యము లేదు, దేవుని కుమారులు ఆనందముతో కేకలు వేసిరి, ఎందుకనగా వారు రక్షణ సంకల్పమును చూచిరి, జగత్తు పునాది వేయబడక ముందే నీ పేరును దేవుడు ఆ గ్రంథములో వ్రాసెను.
81
ఇప్పుడు మీరిట్లందురు, “కాల్విన్ కూడా అటువంటి దానినే నమ్మెను గదా?” నేను కాల్విన్ను నమ్మట లేదు. కాల్విన్ ఒక హంతకుడు. ఒకనిని కాల్విన్ మరణమునకు గురిచేసెను, ఎందుకనగా అతడు యేసు నామమున బాప్తీస్మం ఇచ్చినందు వలన. అతడు ఒక వంచకుడు, తనకు తానే మార్పు చెందవలసిన వాడు. అవునండీ. కాని అతడు కొన్ని సంగతులు చెప్పెను, అవి సరియే. కాని అతని క్రియలు ఒకదానిని గూర్చి ఒక వ్యక్తిని అతడు ఆ విధముగా చంపినయెడల అది ఎంతో భయంకరమైన విషయము, అది పాప కార్యము. సరే.
ఆ కృపను ఆయన మనయెడల విస్తరింపజేసెను....
82
ఓ, ఆగండి, నేను ఆ “దత్తపుత్రత్వము” పొందుకోలేదు. నేను పొందుకొన్నానా? చాలా ఆలస్యం చేసానా? అచ్చటయున్న ఆ గోడ గడియారము ఏమి చెప్పుచున్నదో చూద్దాము, ఎంత సమయము అయినది. సరే, మంచిది. అవును, చాలా దూరము నుండి వచ్చిన ఈ జనుల నిమిత్తము పది నిమిషములు చెప్పెదము. చూడండి.
83
నేను ఆ “దత్తపుత్రత్వము” ఎందుకు అది ఆ విధముగా జరిగినదో ఇప్పుడు నేను మీకు చూపించెదను. ఒక తండ్రికి పెద్ద రాజ్యమున్నది. అతను అంతటను సంచరించుచున్నాడు. ఇప్పుడు అతనికి ఒక కుమారుడు జన్మించెను. ఓ, అతడు ఎంతో సంతోషించెను. (ఆయన దేవుడు.) కనుక ఆ తండ్రి ఏమి చేయునో మీకు తెలియునా? శ్రేష్ఠమైన బోధకుని కనుగొనెను. మీకు ఉపాధ్యాయుడంటే తెలియును కదా? పాఠములు నేర్పువాడు. దేశమంతా వెదికి కనుగొని ఒక శ్రేష్ఠమైన ఉపాధ్యాయుని నియమించును. (అటు తర్వాత మనమచ్చటికి వెళ్ళాము, వినండి.) త్రాను వెదకి కనుగొనిన ఉపాధ్యాయులలోకెల్లా అతి శ్రేష్ఠమైన ఉపాధ్యాయుని అతడు నియమించును. తన కుమారుడు అల్లరివానిగా కాదు గాని, మంచి వ్యక్తిగా ఎదుగవలెనని అతడు కోరును.
మీ పిల్లలు అలాగుండవలెనని మీరు ఆశించారా? ఉత్తమమైన దానిని మీరు నిశ్చయంగా వారికి ఇచ్చెదరు. అవునండి. ప్రకృతి సంబంధియగు మానవుడు ఆలాగు తలంచినయెడల, దేవుడు తన బిడ్డల గూర్చి ఏమనుకొనును అనే దానిని మీరు ఊహించగలరా? ఉత్తమమైన దానిని ఆయన ఇచ్చును.
84
కావున, ఒక యధార్థవంతుడగు ఒక వ్యక్తి కావాలని ఆయన కోరుకొంటాడు. ఇప్పుడు, ఆయన అటువంటి వ్యక్తి కాదు. “ఇప్పుడు, చూడు, నా బాబూ, నీవు ఏమి చేయాలనుకుంటున్నావో దానిని చేయవచ్చు, ప్రియమైన వాడా,” అని చెప్పే ఒక వ్యక్తిని కాదు, “ఓ, అవును, తండ్రి, హు-హుహ్, అతడు బాగానే వుంటాడు, అతడు ఒక మంచి అబ్బాయే.” వాడి వీపు నిమురుచూ బుజ్జగిస్తూ వాడి టోపిపై ఒక గడ్డి పువ్వును తీసుకొని గుచ్చెను. లేదు, కాదు. ఆ విధముగా చేసినయెడల ఆ చిన్నవాడు అప్పుడే భగ్గున మండిపడి లేచేవాడిగా ఎదిగి ఎదురు తిరుగువాడుగా అవుతాడు, ఖచ్చితముగా, ఒక మనిషి అతడు ఒక సత్యవంతుడుగా ఎదగాలనే ఆశించుతాడు. ఒకవేళ ఆ పిల్లవాడు చక్కని రీతిలో ఎదుగుచున్నయెడల అతడికి చెప్పవలెను. ఒకవేళ ఆ పిల్లవాడు అట్లు కానియెడల, ఎచ్చట తప్పిదము యున్నదో దానిని అతడికి చెప్పవలెను.
ఒక భూసంబంధమైన తండ్రియే ఆ విధముగా తలంచినయెడల.... ఒక మనిషి నీయందు యధార్థవంతుడుగా వుండాలని నీవు ఆశించవా, ఆ విధముగా నీ పిల్లల పట్ల ఉపాధ్యాయుడు యధార్ధముగా ఉండవలెనని నీవు కోరుకోవా? నిశ్చయముగా, మంచిది, దేవుడేమి తలంచుననుకొనుచున్నావు? ఆయనకు తెలియును. మనకు తెలియదు; ఆయన చేయును. మనము అంతము గలవారము, గనుక మనము చెప్పలేము; అయితే ఆయన అనంతుడు గనుక ఎరుగును.
85
కాబట్టి, తండ్రి ఏమి చేసెనో మీరెరుగుదురా? “నా పిల్లలు పోపు ద్వారా శిక్షణ పొందవలెను,” అని ఆయన చెప్పలేదు. “ఒక బిషప్పును ఏర్పరుచుదును,” అని ఆయన చెప్పలేదు. లేదు, లేదు. ఆయన ఆ విధముగా చేయడు. ఆ విధంగా అతడు చేయడు, ఎందుకనగా పోపు, బిషప్పు కూడ తప్పు అని ఆయనెరుగును, చూచారా. “నా సంఘములను కనిపెట్టి చూచుటకు ఒక సాధారణ పర్యవేక్షకుడిని నియమించుదును,” అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. లేదు, లేదు. ఆయనకు పరిశుద్ధాత్మ యున్నది. అది ఆయన యొక్క ఉపాధ్యాయుడు ద్వారా ఆయన పిల్లలు పెంచబడుదురు.
మంచిది. పరిశుద్ధాత్మకు తెలియునని నీవేలాగు చెప్పగలవు? ఆయన మానవ పెదవుల ద్వారా మాట్లాడును. అయితే ఆయన సత్యము చెప్పుచున్నాడని నీకెట్లు తెలియును? పరిశుద్ధాత్మ మానవ పెదవుల ద్వారా మాట్లాడుటను నీవు చూచునప్పుడు, అది ప్రతీసారీ సత్యమునే పలుకుచున్నది, సమూయేలు చెప్పిన రీతిగా, రాబోవు దానిని గూర్చి అది చెప్పినప్పుడు అది తప్పక జరిగే తీరుచున్నది. అప్పుడది సత్యమని నీవెరుగుదువు. అది ఆ విధముగానే నెరవేరుచున్నది, ఎందుకనగా దేవుడిట్లు చెప్పెను, “అతడు జరుగునని చెప్పినది నెరవేరనియెడల అతని మాట వినవద్దు, ఎందుకనగా అతనితో నేను లేను. అయితే అతడు చెప్పినట్లు జరిగినచో, అతని మాట వినుడి, ఎందుకనగా అతనితో నేనున్నాను,” చూచారా. అక్కడే నీవున్నావు. ఆ విధంగానే ఆయన పనిచేయును.
86
ఇప్పుడు, అటు తర్వాత అతడు చుట్టూ తిరుగుచూ వెళ్ళుచున్నాడు. ఇప్పుడు, ఆ తండ్రి యొద్దకు ఉపాధ్యాయుడు వెళ్ళి ఈలాగు చెప్పినయెడల దానిని గురించి నీవేమనుకుంటావు? “నేను మీకు చెప్పెదను, మీ పిల్లవాడు ఒక తిరుగుబాటుదారుడు. అతడు నిపుణత లేనివాడు. అటువంటి వాడిని అసలు నేను ఎక్కడా చూడలేదు! మై, అతడేమి చెస్తాడో తెలుసా? మీ కుమార్తె! ఓ, వ్యూ, ఆమెను మీరేమి చేసికొందురో నాకు తెలియదు. హుమ్! సరే, మీకు తెలియునా? ఆమె ఆ ఫిలిప్పీయ బాలికలవలె రంగులు పూసుకొనుచున్నది. అవును, వారివలెనె ఆమె ప్రవర్తించుచున్నది.”
“నా కుమార్తెయా?”
“అవును, మీ కుమార్తెయే.”
ఈనాడు సంఘము గూర్చి పరిశుద్ధాత్మ ఆ విధంగానే చెప్పుచున్నది. అందుకే మనకు ఒక ఉజ్జీవము లేకపోవుటలో ఆశ్చర్యమేమీ లేదు, చూచారా. ఇప్పుడు, అది నిజము.
87
“మీ కుమారుని సంగతి ఏమిటి? అతను కూడా అంతే.”
“ఏమిటి?”
“మంచిది, ఆ గొర్రెలు, గొర్రెల యొక్క ఆహారమగు గడ్డిని మాత్రమే మేయవలెనని మీరు ఎల్లప్పుడూ చెప్పుచుందురని మీరెరుగుదురు. అతడేమి చేసెనో నీవెరుగుదువా? కాని అతడు వాటిని పిచ్చి మొక్కలలోనికి తోలెను. అచ్చటికి వాటిని తీసుకొని వెళ్ళి, ఆ పిచ్చి మొక్కల దగ్గరకు వాటిని తీసుకొని వెళ్ళి, అచ్చటయున్న ఆ కాలువలో వాటన్నింటిని వదిలి వేసెను; ఆ పిచ్చి మొక్కలను అవి తింటూ మరియు అవి చాలా బలహీనమైపోయి అచ్చటనుండి లేవలేకపోయినవి. దేవుని శక్తిని నిరాకరించు బిషప్పులు, సంఘ కాపరులు అట్టివారే. ”మంచిది, నేను మీకు సత్యము చెప్పుచున్నాను. నా జీవితంలో అంత భయంకరమైన గొర్రెలను చూడలేదు. అవి అటువంటి భయపడు స్వభావము గల గొర్రెల మందను నా జీవితములో నేనెన్నడూ చూడలేదు. [అది ఆయనకు ఇష్టముండదు. లేదు.] ఏమిటో మీరెరుగుదురా? వారి గొర్రెలు ఇచ్చట యున్నవి. మీరెరుగుదురు - అచ్చటున్న బలమైన మేతనిచ్చి, దానితో వాటిని మేపమని నీవు వారితో చెప్పావు, వాటిని బలమైన వాటిగా చేయుటకని, నీవెరుగుదువా.“
“అవునా?”
“కాని వాటికి ఏమిచ్చాడో నీకు తెలియునా?
“తెలియదు.”
“ఆ ఎండిపోయిన పిచ్చి మొక్కలు వేశాడు. అవును వారు సొసైటీలలో చేరునట్లు చేశాడు. నీ జీవితంలో అటువంటివి ఎన్నడూ చూడలేదు. నీ జీవిత కాలమంతటిలో అట్టివానిని చూడజాలవు. అతడేమి చేయుచున్నాడో నీవెరుగుదువా? అక్కడికి వెళ్ళి పొగాకు కాల్చుచున్నాడు. పొగను వదులుచున్నాడు. అతని భార్య ప్రక్కనే యున్నది. ఆమె ఆ బయట ఫిలిష్తీయుల వారివలె చాలీ-చాలని బట్టలు ధరించియున్నది.” అవును, ఈనాడు సంఘమునకు పరిశుద్ధాత్మ అటువంటి వర్తమానమునే తీసికొని వచ్చుచున్నది. ఇప్పుడు దానిగూర్చి నీవేమి తలంచుదువు?
అదియే పుత్రస్వీకారము. ఆయనేమి చేసెను? పుత్రస్వీకారముకు ఆయన మనలను ముందుగా నిర్ణయించెను. ఆయన మనకు పరిశుద్ధాత్మను ఇచ్చెను - అయితే ఒక్క నిమిషము ఆగండి, పుత్రస్వీకారము - దాని గూర్చే మనము ముచ్చటించుకొనుచున్నాము. పుత్రస్వీకారము!
88
“అతడేమి చేయునో నీకు తెలియునా? ఒక రోజున బిషప్పు వచ్చి చిన్న స్వస్థతా కూటమును ఏర్పాటు చేసెను. బిషప్పు అచ్చటికి వచ్చెను. ఎవరో ఒకరు, ఒక సోదరుడు వచ్చి రోగులకు ప్రార్థించును. ”నీవు దానిని ఆపు!“ అని అతడనెను.”
“ఓ, ఓ, అవును, బిషప్పు తండ్రి, దానిని నేను చేయుదును.”
“మీరు సహకరించవద్దు.”
“ఓ, లేదు, లేదు, తండ్రి బిషప్పు ఖచ్చితముగా ఈ విషయమందు నేను సహకరించను.”
“నీ మాటలో నున్న సత్యమును నేను ఇక్కడికి వచ్చి చెప్పాను. చూడండి, అదిచ్చట యున్నది. అతడేమి చేయవలెనో నీ శాసనములలో నుండి ఉన్నది ఉన్నట్లుగా నేను చదివి వినిపించాను, అయినా అతడు నా మాట వినలేదు. ”ఓ, అది మరో కాలమునకు చెందును, మరో కుమారునికి చెందును, మరో సమయమునకు చెందును. అది నాకు వర్తించదు.“ అక్కడే నీవున్నావు. అది ఇప్పుడది నిజము, స్నేహితులారా. సంఘము ఎచ్చట దానిని కోల్పోయినదో, ఇప్పుడు నీవు చూడగలుగుచున్నావా? ఎందుకు మనకు ఉజ్జీవము రాలేదు? ఎందుకు మనము ముందుకు సాగలేకపోతున్నాము! ఇదే కారణము.
89
యెహోషువా ఇట్లు చెప్పెను, “గాదూ! నేను నీకు చెప్పాలనుకుంటున్నాను... నీ స్థలము నమూనా ప్రకారముగా ఇచ్చట యున్నది, నీ స్థలము ఇచ్చట యున్నది, ఇచ్చటే యున్నది. కాదు, లోపలికి వెళ్ళు, నీవు అచ్చటే నిలిచియుండు. బెన్యామీనూ! నీవు ఇటు వెళ్ళుము. మీరందరూ ఫిలిష్తీయుల సరిహద్దుల నుండి దూరముగా నిలచియుండండి.” యెహోషువా తిరిగి వచ్చి చూచేసరికి వారందరూ ఫిలిష్తీయుల ఉత్సవములో పాల్గొని డాన్సు వేయుచూ, స్త్రీలందరూ రంగులు పూసుకొని చుట్టూ గంతులు వేస్తూ నృత్యము చేస్తూ మహా ఆనందముతో యున్నారనుకొనండి. యెహోషువా తన తలగోక్కుంటూ, “ఇప్పుడు ఏమి చేయాలి?” అనుకొనును. ఇప్పుడు అక్షరాలా అదే జరుగుచున్నది. అందరూ కారు, దేవునికి వందనములు. అందరూ కారు, కాని అనేకమంది ఆ విధముగా గలరు. మంచిది.
90
అప్పుడేమి జరుగును? ఏమి జరిగినదో చూడండి. ఆ వ్యక్తిని గురించి నీవు ఊహించగలుగుచున్నావా, తండ్రి యెదుట అతని గూర్చి ఆలాగు చెప్పుటకు పరిశుద్ధాత్మ సిగ్గుపడదా? ఓ, మై! “నేనతనికి చెప్పాను, కాని అతడు దానిని అతడు వినిపించుకోవటము లేదు. నేను దానిని అతనికి చెప్పాను. ఆ గ్రంథములో చదివి చూడమని చెప్పాను. నాకొక చిన్న బోధకుడు ఉన్నాడు, అతడు వచ్చి యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని అతనికి చూపించెను. కాని అతడేమి చేసెనో తెలుసా? మేకలను మేయు ఒక ముసలివాడు అచ్చటికి వచ్చి అది మరో కాలమునకు వర్తించునది, అని చెప్పునట్లుగా అతడు దానిని అనుమతించెను, చూచారా. ఆ మేకలను మేయువాడు అచ్చటికి వచ్చినప్పుడు, అతడిపైన మేకల దుర్వాసన చుట్టలను పీల్చే వాసన, మొదలగు దుర్వాసనలు వచ్చెను. ఆ దుర్వాసనను అతడి వలన సహించలేకపోయెనని నీవెరుగుదువా, చూచారా! కాని నేను మీకు చెప్పుచున్నాను; ఆ మేకలను మేపు కాపరికి చాలినన్ని పతకాలు గుచ్చబడియున్నవి, అందువలన నేను మీకు చెప్పుచున్నాను, ఒక కాగితమును తీసుకొని అతని పేరును మీరు వ్రాసినచో, (చనిపోయిన అతని) బిరుదులన్నియు ఒక సగము కాగితము పైగానే నిండిపోవును, అవునండీ, ఆ దేశంలోని వారు అతడంటే ఇష్టపడుదురు, కాని నేను మీకు చెప్పుచున్నాను, గొర్రెలను ఏ విధముగా మేపవలెనో అతడికి ఖచ్చితముగా తెలియదు. దానిని గూర్చి ఒక విషయమై అది యున్నది. అతడు అసలు నా మాట విననే వినడు,” అని పరిశుద్ధాత్మ చెప్పును. నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నావని అతనికి చెప్ప ప్రయత్నించాను, గాని వినలేదు. అంత గొప్ప పిరికివాడిని నేనెన్నడూ నా జీవితంలో చూడలేదు. అవును. సంఘము అతనిని బిషప్పుగా, పర్యవేక్షకునిగా ఇంకా ఏవేవో చేసినది, జనులందరూ అతని మాటను ఆలకించుచున్నారు.
అటు తర్వాత ఏమి జరిగినదో మీరెరుగుదురా? వారు దానిని తీసుకొని... వారు ఒక చిన్న పాత వస్తువును తీసుకున్న దానిని “టెలివిజన్,” అని వారు పిలిచారు. ఒక చిన్న పాత పరికరములాంటి దానిని వారు పెట్టుకున్నారు; దానిని వారు ఆ విధంగా త్రిప్పినప్పుడు, అర్ధనగ్నపు దుస్తులను ధరించుకొన్న అన్నిరకముల స్త్రీలు వస్తూ కనబడిరి. మీరెరుగుదురా, మీ కుమర్తెలలో అనేకులు....
“ఓ, తప్పకుండా కాదు!”
91
“అవును, వారు అట్టి వారే. వారది చేయుచున్నారు. వారిలో కొందరు ఉజ్జీవము కోసం మొర్రపెట్టుచున్నారు. తండ్రీ, వారిలో కొందరికి అది నిజంగానే కావలెను. వారిలో కొందరు నిజంగానే మార్గంలో నడచుచున్నారు. వారిలో కొందరు తమకు చేతనైనంత వరకు వాక్యము మీద నిలబడియున్నారు. వారిలో కొందరు, వారిని ఏమి చేయవలెనో నాకు తెలియదు, వారు వెలుపల యున్నారు. వారేమి చేయుచున్నారో నీకు తెలియునా? ”వారు పిచ్చివారు,“ అని చెప్పి హేళన చేయుచున్నారు.” మంచిది, అందువలన తనకు చాలా బాధ కలుగుచున్నది.“
92
కాని ఇప్పుడు చిత్రమును మార్చుదము. ఆ తండ్రి యొక్క కుమారుడు మంచివాడు. అతని తండ్రి యున్నాడు. అతడితో ఇచ్చట ఒక ఉపాధ్యాయుడుగా పరిశుద్ధాత్మ యున్నాడు. ఆ విధముగా పరిశుద్ధాత్మ, “నేను నడుచుటకు వెళ్ళుచున్నాను,” అని ఆయన చెప్పెను, ఆ ఉపాధ్యాయుడు చెప్పెను.
“నేను నీతోనే నడిచెదను. నిన్నే వెంబడించెదను,” అని పిల్లవాడు చెప్పుచున్నాడు.
“ఓ, కుమారుడా! ఆ వెనుక అన్నీ కొండలే.”
“నేను నీతోనే వచ్చెదను. నీయందు నాకు విశ్వాసమున్నది. నేను అలసిపోయినట్లయితే నీవు నా చేయి ఎత్తి పట్టుకొందువు.”
“కాని ఆ కొండలలో సి౦హములున్నవి!”
“నీవు నా చుట్టూ ఉన్నంత వరకూ ఏమీ హాని కలుగదు. నేను ముందుకు సాగిపోయెదను..”
“అదిగో, అది జారుడు బండ, అచ్చట చాలా ప్రమాదముగా యుండును.”
“నీవు నా చేతిని పట్టుకొన్నంత వరకూ నాకేమీ బాధ లేదు. నీతో నేను నడిచెదను. నీతోనే నేను నడిచెదను.”
“ఓ, అదేమిటో నీవెరుగుదువా, నీ తండ్రి ఆ విధంగానే చేసెడివాడని నీవెరుగుము.”
“అదే మంచిది. అవునండి.”
93
అక్కడున్న కొండ పైకి ఎక్కుము. “ఓ,” అతడు చెప్పెను, “తండ్రి, అదేమిటని నీవెరుగుదువా? ”నీ కుమారుడు చెట్టులో నుండి వచ్చిన ముక్కవలె యున్నాడు, అతడు ఖచ్చితముగా, అక్షరాలా నిన్నే పోలియున్నాడు, నీవు చెప్పిన ప్రతి మాటకు అతడు, “ఆమేన్” అనుచున్నాడు. ఒక రోజున బైబిలులో అతనికి యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని చూపించాను. అతడేమనెనో తెలియునా? అతడు గాలిలోనికి చేతులెత్తి ఓ, ఇచ్చట చెప్పినదానిని నీవెరుగుదువా, నీ వాక్యము, నీకు తెలుసా, అచ్చట నీవు చెప్పినదానిని “హల్లెలూయా! ఆమేన్!” అని కేకలు వేసెను. “నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును!” అని నీ వాక్యములో యుండుట చూచెను.
“అవును, అది నా కుమారుని కొరకే వ్రాశాను. నాకది గుర్తున్నది. అవును, అది వ్రాయుట నాకు గుర్తున్నది.”
“ఓ, దానిని చూచి అతడు కేకలు వేసి గంతులు వేసెను. 'హల్లెలూయా! ప్రభువా, నాలో నుండి లోకమంతయూ తీసివేయుము. ఆలాగు నన్ను చేయుము!' అని అరచెను. అవునండి. మరియు అతను ఆ పనులన్నియూ చేసెను!”
“ఓ,” తండ్రి చెప్పెను, “నేను ఆ కుమారుని బట్టి నేను సంతోషించుచున్నాను. అతడు ఒక చక్కని కుమారుడు. మంచిది. కొద్ది సంవత్సరములు అతనిపై కన్ను వేసియుంచి, అతడెట్లు అభివృద్ధి చెందుచున్నాడో, ఎట్లు పనిచేయుచున్నాడో చూడుము.”
94
కొన్ని సంవత్సరములు గడిచినవి. “అతడెట్లున్నాడు?” అని ఆ తండ్రి అడుగును.
ఓ మై, అతడు ఇంకా కృపలో ఎదుగుచున్నాడు! ఓ, మై, అతడు కేవలము.... పిచ్చిమొక్కలు అతడు అంటుకొనడు. నేను నీకు చెప్పుచున్నాను, అతడు నిజముగా.... ఎందుకని, అతడు ఆ గొర్రెలను తీసుకొని నీవేలాగు వాటిని మేపావో ఆ విధముగానే అతడు కూడా వాటిని మేపుచున్నాడు. ఎన్నడూ వాటికి పిచ్చి మొక్కలు మేపడు. ఎన్నడూ వాటికి పడని మేతను పెట్టడు. “మేము సంఘములలో చేరుదుము,” అని అవి అతడు చుట్టూ వచ్చి చెప్పగా, నోరుముయ్యండి. మీకది అవసరము లేదు! లేదయ్యా, మీకు కావలసింది ఇది, “ప్రతివాడును మారుమనస్సు పొంది మీ పాపముల క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.” అవునయ్యా, ఆ విధముగానే అతడు అచ్చట చెప్పెను.
“ఓ, నిజంగా ఆయన అలాగు చెప్చెనా?”
“అవునండీ, నిశ్చయంగా ఆయనాలాగు చెప్పెను.”
“మంచిది, నేను ఆ విధంగానే వ్రాశాను.”
“ఆ విధంగానే ఆయన చెప్పెను.”
“అవునండీ.”
95
“పరిశుద్ధాత్మ మీపైకి వచ్చువరకు, పైనుండి శక్తిని పొందువరకు యోరుషలేము పట్టణములో కనిపెట్ట౦డి. యోరుషలేము, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్ష్యులై యుండుడి,” అను మాట చదివి అందులో ఒక వ్యక్తి, “హల్లెలూయా,” అని కేకలు వేసెను. అదే నీకు అవసరము. ఆయనేమి చేయునో నీకు తెలియునా? దానిని వారు పొందిన వెంటనే ఆయన వారితో నిలచియుండును.
“వారు గందరగోళము చేయుటకు ప్రారంభించిన యెడల, ”ఆగండి, ఆగండి, ఆగండి ఒక్క నిమిషము ఆగండి, ఒక్క నిమిషము ఆగండి. ఆ విధముగా చేయటం మేకల యొక్క పని. గొర్రెలు ఆ విధంగా ప్రవర్తింపవు, చూచారా. కొన్నిసార్లు అవి అతని వైపు సందేహముతో చూచినా, “ఒక్క నిమిషము ఆగండి, ష్, ష్, ష్, ష్ అదేమి పరవాలేదులే,” అని అంటూ వాటిని సముదాయించుట ఆయనకు తెలియును. అవునండీ, నేను మీతో చెప్పెదను.
96
“ఏమైనదో నీకు తెలుసా? ఫలాని - ఫలాని ఆర్చి బిషప్చు, అతని యొద్ద ఈ పట్టణమునకు వచ్చి ఈ కూటము జరిపించ కూడదని చెప్పుటను నేను చూచాను. నేను, అతనియొద్ద! 'నీవెట్లైనా వెళ్ళు,' కూటమును జరిపించు అన్నాను. ”ఈ టేపులను నీవు బయటకు పంపించకూడదు, అని అతనియొద్ద చెప్పబడినది. ఏదో విధముగా అవి బయటకు పంపించబడినవి! అ పట్టణములన్నింటికి అవి పంపించబడినవి, చెప్పెను, మంచిది, మేము విరాళాలు....“
అపవాది అచ్చటకు వచ్చి, “ఆ పట్టణములోనికి అతడు ప్రవేశించకుండా నేను అతడిని ఆటంకపరచగలను,” అని సవాలు చేసెను. నేను వాడితో, “నీకు అది చేతకాదు. అతడితో నేను అతడిని వెళ్ళు, అని చెప్పితే వెళ్ళును, అతడు ఖచ్చితముగా వెళ్ళును,” అని చెప్పాను. కాని వాడు, లేదు, లేదు, లేదు, అది అసాధ్యము, నేను వెళ్ళి, నా వారిని పోగచేసుకొని అందరిని ఒక్కటిగా సమకూర్చి, మీరందరూ కలసి ఆ పాత మూడులందరిని, ఆ పాత దైవిక స్వస్థతను, పరిశుద్ధాత్మ క్రియలు వంటివి మాకు వద్దు, అవి అపోస్తుల కాలమందే ముగించిపోయినవి, ఇప్పుడు వాటివలన ఏ ప్రయోజనము మాకు లేదని చెప్పండి, అని వారితో చెప్పెదననెను.“ వారు చెత్తను వారికి మేప ప్రయత్నించుచున్నారు.
97
“అయితే ఏమి జరిగినదో నీవెరుగుదువా? అతడు ఎలాగో వెళ్ళి కూటమును జరిపించి, అల్ఫాల్ఫా అనే గడ్డి మేతను వేయుటకు ఆరంభించెను. ఆ మేతను వాటికి వేసి అతడు వెళ్ళిపోయెను. ఏమైందో తెలుసా? ఆ గొర్రెలు వాటిని తిని బాగా బలిసినవి. అవునండీ. స్వస్థతలు, కూటములు జరిగినప్పుడు ఏమైందో తెలుసా? ఎంతోమంది యువకులు ముందుకు వచ్చారు. ఎందుచేత, అటువంటి అల్ఫాల్ఫా గడ్డి మోపును వారు చూచినప్పుడు, వారు దానివలన ఆశ్చర్యము చెంది తమ పొరుగు వారియొద్దకు వెళ్ళి, ”దీనిని తీసికొనండి, దీనిని అందుకొనండి. అందురు. యుక్త వయస్కులు [స్పష్టత లేని మాటలు]. అవునండీ, ఇక్కడున్న వారివలె యుందురు. ఇక్కడేయున్న వారిని చూడండి. అది యిచ్చటే యున్నది గమనించావా, ఇప్పుడే, కేవలము మారుమనస్సు పొందండి, మీలో ప్రతీవాడు, యేసు నామములో బాప్తిస్మము పొందుడి, మీరు పరిశుద్ధాత్మను పొందుదురు. ఇచ్చయించు వారందరికి ఇది దొరకును, అతడు రావలెను, పరిశుద్ధ గ్రంథము ఏమి చెప్పుచున్నదో దానిని చూచుటకై అతడు రావలెను! అక్కడ వారు గొప్ప సమయమును అనుభవించుచున్నారు.“
“ఓ, అతడు నా కుమారుడు. అతడు నా బాలుడు. మంచిది, అతడు బాగా పరిపక్వత చెందెనని నీవు తలంచుచున్నావా?”
98
“అవును. నిశ్చయంగా,” అని పరిశుద్ధాత్మ చెప్పును. అతనికి నేను పరీక్షలు పెట్టాను, అతనిని అన్నిరకాలుగా పరిశోధించాను, అతనిని వ్యాధికి క్రుంగిపోవునట్ల చేసాను. క్రింద పడగొట్టాను. అపవాది చేయకలిగినదంతా చేయునట్లు అతడికి అనుమతి ఇచ్చాను. అతడు మరలా తిరిగి వచ్చెను. ఉన్న విధముగా అతడు వచ్చెను, గమనించారా, మరలా వచ్చెను. నేను అతనిని వ్యాధికి గురి చేశాను. నేను దీనిని చేసాను. అతడిని నేను ఆస్పత్రిలో పడవేశాను. ఎన్నో అతనికి చేశాను. అతని భార్య, అతని పొరుగువారు అతనిపై తిరుగుబాటు చేయునట్లు చేశాను. అయినా ఏమీ చలించలేదు. “ఆయన నన్ను చంపినా నేను ఆయనను నమ్మదును,” అని చెప్పెను. అతని కుటుంబాన్ని నేను చంపాను. అన్నీ తీసివేసికొన్నాను, అయినా అతడు వంగలేదు. “ఆయన నన్ను చంపినా నేను ఆయననే సేవించుదును. ఆయన నా వాడు,” అని చెప్పెను.
“ఓ! అయితే అతనిని ఏదో ఒక చిన్న ప్రత్యేకమైన స్థలమునకు తెచ్చి దత్తత చేయదము.”
పాత నిబంధన కాలములో ఒక తండ్రి తన కుమారునికి యుక్త వయస్సు వచ్చినప్పుడు, పుత్రస్వీకారమును పొందుకొనుటకు అతడు అర్హతను కలిగియున్నాడని ఎరిగినప్పుడు, దత్త పుత్రుడుగా యగుటకు, అతడు ఒక కుమారునిగా జన్మించెను. కాని అతడు కమారుడైనప్పటికిని, అతడు ఎదిగి పరిపక్వము చెంది అతడి యొక్క శక్తి సామర్థ్యములను ఎటువంటివో చూచువరుకు, అతడు ఒక సాధారణ కుమారుడుగానే యుండును. అటు తర్వాతే తండ్రి అతడిని పిలుచును.
99
ఇప్పుడు సంఘముగా ఇచ్చట మనమున్నాము. మీరు సిద్ధపడిరా? కొద్దిగా ఆలస్యమయినది. అందరూ మీ వ్రేళ్ళు కోరుకుంటూ, మీ ప్రాణమును గ్రిల్లుడి, మీ హృదయాలను పీక్కొనండి, ఒక్క నిమిషము ఆలాగు చేయండి, చూచారా. ఇప్పుడు సంఘము యొక్క స్థానమును మనము చూడబోవుచున్నాము. సంఘము తన స్థానమునకు వచ్చినప్పుడు ఆయన ఇట్లనును, “మనష్షే, నీ చోటు ఇది. ఎఫ్రాయిమూ! ఇది నీ చోటు.”
ఆ తరువాత ఒక ప్రత్యేక స్థలమునకు తండ్రి అతనిని తీసికొని వెళ్ళును. ఎత్తైన స్థలమందు అతడు కూర్చొనబెట్టి ఒక గొప్ప వైభవముగా జరిపించును. అందరూ ఆ వైభవమునకు వచ్చెదరు. అప్పుడు తండ్రి ఇట్లనును, “ఇతడు నా కుమారుడని మీరందురు తెలిసికొనుడి, నా కుమారునిగా దత్తత చేసికొన్నాను. ఈనాటి నుండి అతడు పేరు.... శ్రేష్ఠమైన వస్త్రములను ధరింపజేయుచున్నాను. ఇకమీదట అతడి పేరు, నా పేరు యున్నట్లుగానే అధికారమును కలిగియుండునని మీరందరు ఎరిగియుండవలెనని నేనాశించుచున్నాను. అతడు నా కుమారుడు. ఇతడు జన్మించినప్పటి నుండే నా కుమారుడైనను, ఇప్పుడు అతడిని నా కుమారునిగా కుటుంబమునందు స్వీకరించాను. అతడు పరిశుద్ధాత్మను పొందుటచే నా కుమారుడాయెను. ఇప్పుడతనిని అధికార స్థానమందు కూర్చోబెట్టుచున్నాను. అతడేమి పనిలో నుండి తీసివేయునో అది తీసివేయుబడును; అతడేమి పనిలో పెట్టుకొనునో, అది పనిలో పెట్టుకొనబడును.
“ఈ పర్వతమును కదిలిపొమ్మని చెప్పి, హృదయములో సందేహించక, చెప్పినది జరుగునని నమ్మినయెడల దానిని పొందుదరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను,” చూచారా. అక్కడే మీరున్నారు, చూచారా. ఎంతమందికి పుత్ర స్వీకారము గురించి తెలుసు? అతడు నా కుమారుడు. అతడు మంచిగా నున్నట్లు రుజువయిన తరువాతనే కుమారునిగా స్వీకరించుట జరుగునని బైబిలు చదివిన వారికి తెలియును.
100
రూపాంతరపు కొండ మీద యేసును నిలబెట్టి దేవుడు కూడా తన కుమారునికి అదే చేసెను. ఆయన పేతురు, యాకోబు, యోహానులను తీసికొని వెళ్ళెను. వారు ముగ్గురు భూలోక సాక్షులు. యేసు, మోషే, ఏలియా మరియు దేవుడు ఆ కొండ మీద ఉండిరి. వారా కొండ మీద నిలబడిరి. యేసు వారియెదుట రూపాంతరము చెందుటను మొదట వారు చూచిరి? నిజమేనా? అది వాక్యమని ఎందరికి తెలియును? ఆయనేమి చేసెను? అమర్త్యత అను వస్త్రమును ఆయన ధరించెను. “ఆయన వస్త్రము సూర్యునివలె మెరసెను,” అని చెప్పెను. నిజమేనా? ఒక మేఘామాయనను కమ్ముకొనెను. పేతురు, యోహాను మొదలగు వారు సాగిలపడిరి. మోషే, ఏలియాలు నిలబడి ఆయనతో మాట్లాడుట వారు చూచిరి. మోషే చనిపోయి ఎనిమిది వందల సంవత్సరములయినది, అతని నెచ్చట సమాధి చేసిరో ఎవరూ ఎరుగరు. ఏలియా ఒక రధములో పరలోకమునకు ఆరోహణమాయెను. అయిదు వందల సంవత్సరముల క్రితం అది జరిగినది. కాని వారు ఇంకా అచ్చటే యున్నారు. అచ్చట వారు ఆయనతో మాట్లాడుచున్నారు. చూచారా! చూపించుటకై, వారికి వాటిన్నింటిని చూపించుటకై దేవుడు యేసును కొండపైకి తీసుకుని వెళ్ళెను, దానిని గమనించారా, ఆయన ఆ కార్యములను చూపించుటకు వారు ఆయనతో మాట్లాడుచూ యుండిరి, ఒక సమావేశమును ఆయనతో కలిగియుండిరి.
101
పేతురు వెనక్కు తిరిగిన వెంటనే యేసు నుండి ఆ మహిమ వెడలిపోయెను. వారు యేసును మాత్రమే చూచిరి. ఆ మేఘములో నుండి ఒక స్వరము ఇట్లు వినబడినది, “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినుడి. ఆయన పేరు ఇప్పుడు నా పేరు వంటిదే. ఆయన మాట వినుడి!” పుత్రస్వీకారము, లేదా కుమారునిగా స్వీకరించుట అదే. ఇప్పుడు ఎఫెసీ గ్రంథములో దేవుడు పెంతెకోస్తు సంఘమును అచ్చటికే తీసికొని రావలెనని కోరుచున్నాడు, చూచారా. మీరు గ్రహించారా?
చాలా ఆలస్యమయినది గనుక మనము ముగించవలెను. పిల్లలు నిద్రపోవుచున్నారు. 13వ వచనము లోని చివరి భాగమును నేను చెప్పగోరుచున్నాను, “పరిశుద్ధాత్మ వాగ్దానము ద్వారా ముద్రించబడిరి.” ఆదివారము దానిని చెప్పెదను, చూడండి. ఏది మనలను లోపలికి తీసుకు వెళ్ళునను దానిని గురించి, మనము దానివలన ఏ విధముగా మనము కాపాడబడుచున్నామో అర్థమగును.
102
ఇప్పుడు, “మీరు ఏ విధముగా మీ స్థానమునందు ఉంచబడుచున్నారు?” అనే దానిని గురించి చూద్దాము. మీరు పరిశుద్ధాత్మ ద్వారా పరలోక రాజ్యములోనికి ప్రధమ ఫలముగా జన్మించియున్నారు. దీనిని ఎందరు ఎరుగుదురు? మంచిది. మీరు ఆ తరువాత దేనికి నిర్ణయించబడితిరి? కుమారులుగా స్వీకరింపబడుటకు. ఏమిటది? మీరు ఆ స్థానమునకు ముందుగా నిర్ణయించబడితిరి.
103
స్కాట్ సోదరీ ఇచ్చట కూర్చొనియున్నదని నేను నమ్ముచున్నాను, నేడు నీవు గృహములో నున్నావు కదా? ప్రపంచములోను, వివిధ దేశములలోను ఒక బోధ బయలు వెళ్ళుచున్నది. దానిని గూర్చి నేను చాలా విన్నాను. యేసు శరీరధారిగా ఈ భూమిమీద నడచుచున్నాడని చెప్పుచున్నారు. ఆయన వచ్చి ఇది చేసెననుచున్నారు. అది అబద్ధము. ఆయన పరిశుద్ధాత్మ ఇక్కడున్నది. ఆయన తన సంఘమును క్రమములో నుంచు ప్రయత్నించుచున్నాడు. వాగ్దాన దేశమునందు ఉంచుటకై, అందువలన వారు అందులో ప్రవేశించునట్లుగా... కాబట్టి ఆ శత్రువులందరూ వెలుపలికి పారద్రోలబడుదురు.
104
మనష్షే తన చోటును ఆక్రమించలేడు. స్వస్థతా కూటము నేను పెట్టలేను. నేను వెళ్ళి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము గూర్చి బోధించుచుండగా, త్రిత్వము నమ్ము సహోదరులు, “ఓ, ఇతడు ఆ పాత యేసు మాత్రమే,” అను గుంపువాడు, అని చెప్చును. వారికి నేను దైవిక స్వస్థతను బోధించలేదు, కాని అందులో సగంమంది దైవిక స్వస్థత మంచిదే అనుచున్నారు. ప్రభువు యొక్క అద్భుతములను చాలామంది అనుభవించుచున్నారు, “సహోదరుడు బ్రెన్హాం, ఒక ప్రవక్త అని మేము నమ్ముచున్నాము. ఆత్మ అతని మీద యున్నంత వరకు వివేచించుచున్నాడు. అతడు దైవదాసుడు; కాని అతని బోధ చెడిపోయినది. మంచిది కాదు,” అని చెప్పుచున్నారు. ఎవరు అట్టి బుద్ధిలేని మాటలు వినగలరు? అది దేవునికి చెందినదయినా అగును లేదా దేవునికి చెందని దయినా అగును. మంచిది. అంతే! అది పూర్తిగా దేవునిది లేదా అసలు దేవునిది కాదు, అని చెప్పవలెను. ఆ విధంగా అది ఉన్నది.
కాని నీవెట్లు ప్రవర్తించబోవుచున్నావు? మనష్షే తనకొరకు భూమిని సంపాదించుకోలేడు. ఎఫ్రాయిము తన కొరకు భూమి సంపాదించుకోలేడు. గాదు తనకొరకు భూమి సంపాదించుకోలేడు. బెన్యామీను తనకొరకు భూమి సంపాదించుకోలేదు. వారందరూ ఫిలిష్తీయులతో కుమ్మక్కయి కలిసిపోయిరి. ఎట్లు మనము చోటు పొందియున్నాము? మనందరము పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించియున్నాము. నిజమేనా? ఎందుకొరకు మనము జన్మించాము? ముందుగా నిర్ణయించబడి.... ముందుగా నిర్ణయించబడి, దత్త పుత్రులముగా క్రీస్తు శరీరములో భాగముగా ఉండుటకు ముందే నిర్ణయించబడి మనము జన్మించాము. నా భావమును మీరు గ్రహించారా?
105
క్రీస్తు శరీరమనగా ఏమిటి? కొందరు అపోస్తలులు, కొందరు ప్రవక్తలు, కొందరు ఉపదేశకులు, కొందరు సువార్తికులు, కొందరు సంఘ కాపరులు. అవునా? అందుకే మనము పిలువబడితిమి. కొందరికి భాషల వరము, కొందరికి అర్ధము చెప్పువరము, కొందరికి జ్ఞాన వరము, కొందరికి వివేక వరము, కొందరికి అద్భుతములు చేయు వరము, మొదలగు వాటిని కలిగియున్నారు. ఇవన్నీ వివిధ వరములు. మరియు ఇప్పుడు వారేమి చేసిరి? దానిని వారు కొంత ఆచరణలో పెట్టిరి. ఏమిటి? ఒకరు లేచి భాషలతో మాట్లాడుచుండగా, మరొకరును లేచి “బ్లా-బ్లా-బ్లా,” అని మాట్లాడుచున్నారు. అదే విధముగా చేస్తున్నారు. బోధకుడు ప్రసంగించుచుండును, వేదిక పిలుపును ఇచ్చును. అదే సమయంలో కొందరు లేచి భాషలలో మాట్లాడుచూ “హల్లెలూయా, దేవునికి మహిమ” అందురు, బోధకుడు తాను పొందుకొనిన అభిషేకము యొక్క ప్రభావముతో ప్రసంగించుచుండినయెడల, వెంటనే జనులు “వెనక్కు జారినవాడు,” అందురు. ఎందుకనగా దానిని వారు నేర్చుకొనలేదు.
106
ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో యున్నవని బైబిలు చెప్పుచున్నది. దేవుడు అల్లరికి కర్త కాడు. నేనిచ్చట నిలబడినప్పుడు, దేవుని యొక్క అభిషేకము పొందుకొనినవానిగా సేవను చేయుచున్నాను. నీవు ఎంతగా భాషలలో మాట్లాడగోరినా గాని దేవుడు ముగించువరకు నీవు నిశ్శబ్దముగా యుండి తీరవలసినదే. వాక్యమును పదే పదే వల్లించుచూ భాషలలో మాట్లాడుట తగదు. వ్యర్థ మాటలు పలుకరాదని దేవుడు చెప్పెను. కాని అది ఎవరైనా గాని ఒక వ్యక్తికి అనుగ్రహించబడిన ప్రత్యక్షత వర్తమానముగా అది యుండవలెను. నేను పరిశుద్ధాత్మ వశములో యుండి వివేచించు సమయములో ఎన్నడైనా పరిశుద్ధాత్మ వాక్యమును తిరిగి తిరిగి చెప్పానేమో నాకు చూపించండి. వారు చేసిన ఏదో తప్పును గురించి, ఏదో వారు చేసిన దానిని మరియు ఏదో వారు తప్పకుండా చేయవలసిన దానిని లేదా ఏదో జరుగబోవుచున్న దానిని అది చెప్పును. అది నిజమేనా?
కాబట్టి భాషలలో మాట్లాడుట, భావము చెప్పుట కూడా ఆలాగే యున్నది. సంఘములో భాషతో మాట్లాడు వ్యక్తి యున్నచో, దానికి అర్ధము చెప్పు వ్యక్తియు ఉండవలెను. సహోదరుడు నెవిల్ లేచి భాషలతో మాట్లాడినచో, మరో సోదరుడు లేచి దానికి అర్థము చెప్పును. ఇచ్చటయున్న ఈ వ్యక్తి నిన్న బయటకు వెళ్ళి, ఒక తప్పుడు కార్యమును చేసెనని అది చెప్పును. ఇప్పుడు వైద్యుడు అతడికి కాన్సరు వ్యాధియని నిన్నటి దినమున అతనితో చెప్పును. దానిని వెళ్ళి సరిదిద్దుకో, మరలా వచ్చి దేవునితో క్రమపరచుకో, అని ఒక సందేశమును ఇచ్చును.
“సత్యము, అది నిజము,” అని ఆ వ్యక్తి అనును. అప్పుడు దేవుడు నీతో యున్నట్లు అగును.
107
కాని ఆ విధంగా ఏలాగు మనము చేయగలము? చూచారా? అది కేవలము దెబ్బ మీద దెబ్బ, అంతా అయోమయముగా యున్నదే! ఎలాగైతేనేమి, ఎచ్చటా స్థానము మాత్రము లేదు. ఇప్పుడు అది... చూచారా, ఎఫెసీయులు, వారు ప్రయత్నించుచు .... గమనించండి, వారు దానిని పోగొట్టుకొనిరి చూచారా, అటు తర్వాత వారు దానిని పోగొట్టుకొనిరి. కుమారులుగా స్వీకరించబడుటకు మనము ముందుగా నిర్ణయించబడితిమి. నేను చెప్పినది ఎందరికి అర్థమైనదో చేతులెత్తండి. పుత్రస్వీకారము! దేవుని ఆత్మలో మనము నిశ్చయముగా జన్మించియున్నాము, నిజమే పరిశుద్ధాత్మను పొంది, “అబ్బా, తండ్రీ! హల్లెలూయా! దేవునికి మహిమ!” అని అరచుచున్నాము. మనము పిల్లలమే, కాని ఎక్కడికీ వెళ్ళలేము. మనము ఫిలిష్తీయులను కొట్టలేము.
108
అక్కడ నిలబడియున్న బిల్లీ గ్రాహంను చూడండి. “దానిని రుజువు చేయుము” అని మహమ్మదీయుడు అడిగెను.
అక్కడ నిలబడియున్న జాక్-కో ను చూడండి. చర్చ-అఫ్-క్రైస్ట్, ఆ నాస్తికునితో చేతులు కలుపుచున్నది. క్రైస్తవునిగా ఉండవలసిన వాడు దయ్యము వంటి జో-లెవిస్ అను స్వేచ్చగా ఆలోచించువానితో, అసలు దేవుడే లేడని చెప్పువానితో, వీరు చేతులు కలుపుచున్నాడు. సంఘములో అట్టి సంగతులను అంగీకరించుచున్నవారు క్రీస్తు సంఘము మేమే అని చెప్పుకొనుచున్నారు. దయ్యముతో చేతులు కలుపుచూ, సహోదరుడు జాక్-కో ను వ్యతిరేకించువారితో ఏకీభవించుచున్నారు. అదేలాగు చేయగలరు? చాలామంది పెంతెకోస్తు వారు అతనికి విరోధులు; మన దేశములోని ప్రతి బోధకుడు తప్పక అతనితో భుజం కలిపి నిలబడి, “దేవా, నీ శక్తిని పంపుము,” అని చెప్పవలసియున్నది. చూచారా, అక్కడే మనము ఉన్నాము. మనకు స్థానము లేదు.
109
ఎఫ్రాయిముకు తన స్థానమందు యుండుటకు ఇష్టపడలేదు. వారిలో ఒకడు మనష్షే యొక్క స్థలము యొద్దకు వచ్చి, “ఓ, ప్రభువు నీకు ధాన్యము (లేదా మొక్కజొన్న) పండు ఒక మంచి పొలమును యిచ్చియున్నాడు!” అనును. గాదు వచ్చి దానిని చూచి, “మంచిది, ఇప్పుడు, ఒక్క నిమిషము ఆగుము, నేను యవలే పండించవలెను, కాని నేను మొక్కజొన్నను కూడా పండించెదను, అనెను. హల్లేలూయా!” చూచారా? నీకు, ధాన్యముతో కూడా ఏ సంబంధము లేదు, యవలను పండించుటయే నీ వంతగును; అందుచే యవలనే నీవు పండించు. నిన్ను పశువులను మేపుటకు పంపినయెడల, నీవు గొర్రెలను మేపకూడదు. దేవుడు సంఘమును దాని స్థానమందు ఉంచుచున్నాడు. కాని అందరూ ఒకేదానిని చేయుటకే ఆశించుచున్నారు. “హల్లెలూయా!” ఆ విషయమును గూర్చి మీరు ఏమి వారియొద్ద చెప్పలేరు. లేదు, లేదు. వారికింకా ఆ మేకల స్వభామే యున్నది, “ఛట్, ఛట్, ఛట్, ఛట్, ఛట్ ఛట్” గమనించావా. వారికి నీవేమీ చెప్పజాలవు. అది నిజము, ఇప్పుడు ఇది నిజము కాదా?
సంఘమును దాని స్థానములో నీవు ఉంచలేవు, చూచారా.
110
కుమారునిగా దత్తపుత్రత్వము పొందుకొనుట కొరకై సంఘము ముందే నిర్ణయించబడినది. అచ్చట ఒక వ్యక్తి.... దేవుడు ఒక మనిషిని తీసుకొని, అతడిని తన కుటుంబమునకు దత్త పుత్రునిగా స్వీకరించి, అతడికి ఏదైన ఒకదానిని యివ్వగలడు. అది, మొదట దానిని పరిశోధించిరి. అది సరియో - కాదో, చూడుము. ఆత్మను పరిశోధించమని బైబిలు చెప్పెను. ఈ మనిషి కొన్ని సంగతులను చెప్పినయెడల, అది సరియా, కాదా అని పరిశోధించి చూడండి. ఒకవేళ అది సరియైనయెడల, దానితో ముందుకు సాగిపోండి, పిదప “ప్రభువా, మాకు మరియొక దానిని పంపుము,” అని అడగండి. ముందుకు సాగిపోండి. చూచారా, ఈ విధముగా మీలో ప్రతీ ఒక్కొక్కరు వారి వారి స్థానమును చేరువరకు కేవలము ముందుకు సాగిపోతూ ఉండండి. అప్పుడు దేవుని సంఘము దాని స్థానములో యుండుట నీవు చూతువు, అప్పుడు ఫిలిష్తీయులు వెనుదిరుగుదురు. పొట్టి బట్టలు పోవును, జట్టు క్రిందికి ఎదుగును, ముఖములు కడుగబడును. సిగరెట్లు కనబడవు. సంఘము దానియొక్క మహత్తరమైన శక్తిని పొందుకొనునప్పుడు, అననీయ, సఫ్సీరాలు వారిలో కొందరు యుందురు, అవునండీ. ఆ పరిశుద్ధ సంఘము ఏకముగా తన శక్తియందు నిలబడినప్పుడు, దేవుని కుమారులుగా తన స్థానమందు యుంచబడినప్పుడు, దేవుని యొక్క కుటుంబము నందు చేయబడినప్పుడు, శక్తివంతమైన సంఘము అచ్చట దాని మహిమయందు నిలిచియుండుటను నీవు చూచెదవు. ఓ, అటువంటి సంఘము కొరకే ఆయన వచ్చుచున్నాడు.
111
సోదరులారా, ఈ స్థితి నుండి మనము ఎంత దూరములో ఉన్నామో చూచారా? వాక్యముతో మీకు ఏకాభిప్రాయము లేదు. ఏ ఒక్కమనిషైనా, ఏ ఒక్క వ్యకైయైనా పరిశుద్ధ గ్రంథమందున్న యేసుక్రీస్తు నామములో నీటి బాప్తిస్మమును చూడలేని వ్యక్తి గ్రుడ్డివాడయినా కావాలి, లేదా మతిపోయిన వాడయినా కావాలి. ఆ విషయము గూర్చే అచ్చట పెద్ద వివాదము జరుగుచున్నది.
క్రొత్త సంఘములో యేసుక్రీస్తు నామములో తప్ప మరే ఇతర నామములోనయినా ఒక వ్యక్తి బాప్తిస్మము పొందినట్లు నాకు లేఖనములో చూపించండి... లేదా మరో విధంగా బాప్తిస్మము పొందినయెడల, అట్టి వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుటకు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను. మీరు వచ్చి నాకు చూపించండి, అటువంటిది ఏదియూ లేదు. అటువంటిది ఏదీ లేదు. యేసు అక్కడ ఈలాగు చెప్పెను, “మీరు వెళ్ళి, సర్వ లోకమునకు సువార్త ప్రకటించుడి. తండ్రియొక్కయు కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు నామములో వారికి బాప్తిస్మ మియ్యుడి.” తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనునది పేరు కాదు. ఆ తరువాత పది రోజులకు పేతురు ఇట్లు చెప్పెను, “ప్రతివాడును మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి.” మరియు బైబిలులో ప్రతి చోటా ఆలాగే...
112
కొందరు ఇచ్చట వేరే విధముగా కేవలము మారుమనస్సు నిమిత్తము యోహాను ద్వారా బాప్తిస్మము పొందిరి. “మీరు మరల బాప్తిస్మము పొందవలసియున్నారు గనుక రండి,” అని పౌలు చెప్పెను.
“ఓ, మేము గొప్ప పరిశుద్ధుడగు యోహాను ద్వారా బాప్తిస్మము పొందితిమి. యేసుకు కూడా అతడే బాప్తిస్మము ఇచ్చెను.”
“మంచిదే. ఇదీ సువార్తే. దేవుని యొక్క ఆత్మ దీనిని నాకు బయలుపరచినది, నేను ప్రభువు యొక్క అపోస్తులుడను. పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి వేరొక సువార్త ప్రకటించినా శాపగ్రస్తుడగును.”
దానిని నేను చదివెదను. బైబిలు చెప్పెను, “దేవ దూతైనా...” పౌలు ఈలాగు చెప్పెను, “పరలోకము నుండి దేవదూత దిగి వచ్చినా, [బిషప్పు, ఆర్చి బిషప్చు, పోపు, పర్యవేక్షకుడు, మరెవరు వచ్చినా], నేను ప్రకటించిన ఈ సువార్తను గాక వేరొక సువార్తను ప్రకటించినయెడల, అట్టివాడు శాపగ్రస్తుడగును.” మాకు అటువంటి ఆచారములు లేవు. లేదండి. అటువంటిది ఏదియూ లేదు. ప్రజలు దానిని ఎందుకు చూడలేకపోవుచున్నారు. ప్రజలు దానిని ఎందుకు నమ్మట లేదు? [“ముందస్తు నిర్ణయము” అని జనులలో ఎవరో చెప్పిరి.] చూచారా? జెనీ, ఎవరో సరైన జవాబిచ్చిరి. నిశ్చయంగా, “ముందస్తు నిర్ణయమే. ఎందువలన? ”తండ్రి అనుగ్రహించిన వారందరూ? [ఏమిటి?] “నాయొద్దకు వచ్చెదరు.” ఎంత ఖచ్చితము! “తండ్రి నా కనుగ్రహించిన వారందరు నాయొద్దకు వచ్చెదరు.” (నేను దేనిని కనుగొనవలేనని ఇచ్చట ప్రయత్నించుచున్నాను? మనమిచ్చట ఉన్నాము. మంచిది.)
113
ఈ వచనము చదివెదను మరియు పౌలు ఏమనెనో వివరించెదను. ఈ రాత్రి నేను బోధించిన వర్తమానమునే పౌలు ఇక్కడ చెప్పెను. ముందస్తు నిర్ణయము, యేసు నామములో నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, సంఘ క్రమము మొదలగు సంగతులు ఇక్కడ అతడు చెప్పెను.
క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచినవానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా, నాకాశ్చర్యమగుచున్నది. [గలతీయులకు చెప్పుచున్నాడు.]
[ఎవరో వచ్చి మరో సువార్తను బోధించగా, మీరు తరిగిపోవుట చూచి మిమ్ములను బట్టి నాకు సిగ్గు కలుగుచున్నది.] మరో సువార్త తట్టు:
అది మరియొక సువార్త కాదు; క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరున్నారు, నిజమైన క్రీస్తు సువార్తను చెరుపగోరువారు కొందరున్నారు.
114
కాని గమనించండి. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందని ప్రతి వారిని తిరిగి వచ్చి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందమని పౌలు బలవంతము చేసెను. అది నిజమని ఎందరికి తెలియును? జగత్తు పునాది వేయబడినప్పటి నుండి దాచబడిన ఈ మర్మములను పౌలుకు బయలుపరచబడినవి, అని బైబిల్ చెప్పెను. దత్తపుత్రత్వము ద్వారా కుమారులముగా ఉండుటకు మనము ముందుగా నిర్ణయించబడితిమని ఉపదేశించెను. ఇక్కడ అతడు చెప్పినది చూడండి.
మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరియొక సువార్తను మేమైనను, పరలోకము నుండి వచ్చిన యొక్క దూతయైనను మీకు ప్రకటించిన యెడల, అతడు శాపగ్రస్తుడవును.
“నేను నీతో ఏకీభవించను అని చెప్పి తప్పించుకోలేవు.” అట్టివాడు శాపగ్రస్తుడవును. తరువాత వచనము చదివెదను.
మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి ఎవడైనను మీకు ప్రకటించిన యెడల, అతడు శాపగ్రస్తుడవును గాక!
115
అది నిజము. సోదరీ, సొదరుడా, ఆ దినమున అదే దేవుడైనయెడల, ఇది అగౌరవము కాదని నమ్మి దీనిని నేను చెప్పుచున్నాను. ఇప్పుడు, నేను ఉత్తేజితుడ.... నేను ఉత్తేజితుడనయ్యాను అని నేను అనుకోవట్లేదు, నేను ప్రసంగించుట వలన దీవించబడితిని. అందువలన నన్నునేను మరచిపోయి, మీరు అలసిపోయి - నిద్రపోయెంత వరుకు నేను మిమ్మల్ని ఇచ్చట ఉంచుచున్నానని నేనెరుగుదును. కాని ఓ, ఒకవేళ మీరు కూడా అచ్చటకు రావలెనని నేను ఎంతగా ఆశించుచున్నాననే దానిని మాత్రమే మీరు ఎరిగినయెడల! గమనించారా? ఎప్పుడైతే నేను — మరల నేను దీనిని చెప్పుచున్నాను, ఆయన దానిని చెప్పినప్పుడు..... నేను చెప్పాను, “అది చేయును....”
“అంతము ఏమై యున్నదో నీవు చూడగోరుచున్నావా?” అని ఆయనడిగెను.
116
నేను వెనక్కి చూడగా మరియు మంచము మీద పరుండియున్న నన్ను చూచుకొన్నాను. నేను చెప్పుప్పుచున్నది సత్యమని తెలుసుకొనుటకు నిశ్చయముగా నన్ను మీరు ఎంతో కాలముగా ఎరిగియున్నారు. నేను ఒకదానిని అడుగుటకు ఆశించుచున్నాను, పౌలును అభిషేకించక మునుపు, సమూయేలు చెప్పుచున్నట్లుగా, నేను ప్రభువు నామము పేరిట ప్రకటించినది ఎన్నడైనా జరుగక మానెనా? అది నిజమేనా? అది ఎప్పుడూ సత్యమే. నేను ఎన్నడైన మిమ్మును డబ్బు, లేదా మరేదయినా అడుగుట జరిగినదా? లేదు, చూడండి, ఎన్నడూ ఆ విధంగా చేయలేదు. క్రీస్తు నొద్దకు మిమ్మును నడిపించుటకు నా శాయశక్తులా ప్రయత్నించాను. అవునా?
నిశ్చయంగా, నేనొక మనస్సులు చదువుట ద్వారా బహు జ్ఞానముతో ఆలోచనలను వివేచించుచున్నారని వారిప్పుడు చెప్పుటకు ఆశించుచున్నారు. అటువంటి విషయములు వచ్చునని, అటువంటి వారు లేచెదరని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. యన్నె యంబ్రెలు మోషేను ఎదిరించిన రీతిగా యున్నది, ఆ బల పరీక్షలో వారి శక్తి బయలుపడే వరుకు వారు కూడా మోషే చేసిన వాటికి దగ్గరగానే వారు చేసిరి. అది వాస్తవము. అయితే గుర్తుంచుకొనండి, యన్నే యంబ్రేలు స్వస్థపరచలేకపోయిరి. వారు బాగు చేయలేరు. వారు తెగుళ్ళను రప్పించగలరు, కాని వాటిని తొలగించలేరు, చూచారా. మంచిది. ఇప్పుడు, దేవుడే స్వస్థపరచువాడు. దేవుని వాక్కు సత్యముగా నిలచును.
117
మీతో యధార్థముగా ఉండుటకు నేను ప్రయత్నము చేశాను. మీతో సత్యము చెప్పుటకు ప్రయత్నించాను. దాదాపు ముప్పది-ఒక్క సంవత్సరములు ఆ విధంగా ఉన్నాను, ముప్పయి-ఒక్క సంవత్సరాల పాటు ఈ వేదిక మీద తరచుగా నేను నిలబడితిని, ఒక రోజున ఈ వేదికను విడచి మహిమలోనికి పోవుదును. భార్య, కుమార్తె, తండ్రి, సోదరుడు, ప్రశస్త స్నేహితులు అందరూ ఆవల సమాధి చేయబడిరి. వారి పెట్టెలను, పూల మాలలను నేను చూచాను. ఒక రోజున నాది కూడ ఆలాగే యుండునని ఎరుగుదును. ఇప్పుడు, అది సత్యము. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిజ సువార్తను నేను మీకు బోధించితినని నా హృదయమంతటితో యధార్థముగా నమ్ముచున్నాను. మీ ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెనని చెప్పాను, మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందండి. ఆలాగు మీరు చేసినప్పుడు, మీకు ఆనందము, సంతోషము, సమాధానము, ధిర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము, సహనము, విశ్వాసము వచ్చును.
118
ఆ రోజు ఉదయము నాకేమి జరిగినదో నాకు తెలియదు. ఈ శరీరములో యుండి దర్శనము చూచానో లేక ఇక్కడ నుండి ఎత్తబడితినో చెప్పలేను, నాకు తెలియదు, నేను చెప్పలేను. ఒక విషయమును మాత్రమే నేనెరుగుదును, చనిపోవుటనగా నాకెప్పుడూ భయమే. అది ఒక చిన్న ముల్లు. కాని యేసు నన్ను చేర్చుకొనడని భయము కాదు, ఇప్పుడు, దానిని గురించి నేను భయపడుట లేదు, ఎందుకనగా నేను దానికొరకు భయపడుట లేదు; కాని ఒకవేళ నేను మిమ్ములను కలసినప్పుడు మరియు కేవలము ఒక చిన్న పురాణ కథ గాలిలో ఎగురుచున్నట్లు ఉండును. కాని ఇప్పుడు నేను చూస్తున్నాను. ఆ జనులను నేను చూచినప్పుడు, వారు వాస్తవంగా కనిపించారు.
119
పెంతెకొస్తుకు నిజమైన ప్రతినిధి ఎఫ్. ఎఫ్. బోస్వర్త్, అతడు నిజమగు అపోస్తులుడు, సూటియైన వ్యక్తి, నిజమైన సువార్తను బోస్వర్త్ బోధించెను. నేను అతనిని పట్టుకొని, “నా తండ్రి, నా తండ్రీ, ఇశ్రాయేలీయులకు రథములును, గుర్రములను నీవే,” అని కేక వేశాను.
అతడు ఇట్లనెను, “కుమారుడా, సువార్త సేవలో నిలచియుండుము. వీరిలో కొందరు యువకులను బయట దేశములకు పంపుము, అక్కడ మతమౌఢ్యము వ్యాపించక ముందే నీవది సాధ్యమైతే చేయుము. నీవు పొందిన నిజ సువార్తను వారియొద్దకు తీసికొని వెళ్ళుము, చూశారా.” అతడు చెప్పెను, “నీ సేవ ఇంకా చేయవలసిన రీతిగా ప్రారంభము కాలేదు. నీవింకా సరిక్రొత్త బ్రెన్హాంవు. కుమారుడా, నీవు యువకునివి.”
“బోస్వర్త్ సోదరుడా, నాకు నలుబది-ఎనిమిది సంవత్సరములు,” అన్నాను.
అతడు చెప్పెను, “నీవింకా ఆరంభించనే లేదు. విషయాన్ని విషపూరితమైనదిగా చేయు పెంతెకోస్తు యవ్వన బోధకులు నీవు వెళ్ళక ముందే అచ్చటకు వెళ్ళి, వారి విస్తారమైన బుద్ధిహీనతతో ఆ రాయబారులను, దేశమంతటిని నీకు వ్యతిరేకముగా చేయు దానిని నీవు అనుమతించకు.” చెప్పెను, “బ్రెన్హాం సోదరుడా, ముందుకు సాగిపొమ్ము! నీవు పొందిన సువార్తను తీసికొని పొమ్ము.” “నీవు అపోస్తలుడవు, లేదా ప్రభువగు దేవుని యొక్క ప్రవక్తవనియు నేను నమ్ముచున్నాను,” అని అతడు చెప్పెను.
120
నేనాయన వైపు చూచి, నా చేతులతో ఆయనను హత్తుకొన్నాను. “బోస్వర్త్ సోదరుడా! ఒక్క ప్రశ్న నిన్ను అడుగగోరుచున్నాను. నీవు బోధించిన సంవత్సరములన్నింటిలో ఆనందకరమగు క్షణము ఎప్పుడున్నది?”
“ఇప్పుడే! బ్రెన్హాం సోదరుడా,” అని ఆయన జవాబిచ్చెను.
“నీవు చనిపోవుచున్నావని గ్రహించావా?” అన్నాను
“నేను చనిపోను,” అని ఆయన చెప్పెను.
“ఇది అత్యానంద సమయమని నీవెందుకు చెప్పుచున్నావు?” అనడిగాను.
ఒక చిన్న ద్వారము అచ్చటున్నది. “ఇక్కడ నేను నా ముఖమును ఆ ద్వారము వైపు పెట్టి పరుందును. ఏదో నిమిషములో నేను ప్రేమించిన ఆయన ఎవని కొరకు నేను ఇన్ని సంవత్సరాలు నిలబడి బోధించి, నా జీవితమునిచ్చానో ఆయన ఏక్షణములో నైనా ఆ తలుపు దగ్గరకు నా కోసము వచ్చును. నేనాయనతో వెళ్ళిపోదును.” అతని వైపు నేను చూచి, ఇట్లనుకొన్నాను, “అబ్రాహాము, యాకోబు, లేదా ఇస్సాకులను చూచినట్లే ఈయనను నేను చూచుచున్నాను.”
ఆయన చేతిని పట్టుకొని ఇట్లన్నాను, “బోస్వర్త్ సోదరుడా! మనిద్దరము ఒకే దేవునిని నమ్ముచున్నాము. ఇద్దరం ఒకటే నమ్ముచున్నాము. దేవుని కృపను బట్టి నా శరీరములో నుండి చివరి శ్వాస విడుచు వరకు బోధించుదును. నాకు తెలిసినంత వరకు దేవుని పట్ల యధార్థముగా జీవించెదను. ఎక్కడా కూడా నేను సువార్త విషయంలో రాజీపడను. నేనెంత సత్యముగా నిలబడవలెనో, అంత యధార్ధముగా నిలబడెదను. నాకు తెలిసినంతవరకు యదార్థంగా జీవించెదను. బోస్వర్త్ సోదరుడా! శ్రేష్ఠమగు దేశములో నిన్ను నేను కలిసికొందును, అప్పుడు నీవు ఇక ఎన్నడు వృద్దునిగా ఉండవు. నీవు యవ్వనస్తునిగానే యుందువు.”
“బ్రెన్హాం సోదరుడా, నీవును అచ్చటుందువు, బాధపడవద్దు,” అని అతడు అన్నాడు.
121
ఆయన మరణించుటకు రెండు గంటల ముందు... అనగా దాదాపు ఈ సంఘటన జరిగిన రెండు నెలలకు క్రితము, అప్పుడే అతడు మరణించునని నేను తలంచాను, నా భార్య వచ్చి అతనిని చూచినది (ఆయన ఎప్పుడూ ఆమెను జ్ఞాపకము చేసికొనేవాడు), శ్రీమతి. బోస్వర్త్ ను కూడా ఆమె చూచెను. రెండు నెలలు అతడు నిద్రలో యుండెను. మెళకువ రాగా, లేచి చూచి పడక మీద నుండి దూకి, అతడు ఇట్లనెను, “అమ్మా! చాలా సంవత్సరాల నుండి నిన్ను నేను చూడలేదు. తండ్రీ! సహోదరుడా, జిమ్. ”ఇల్లినాయిస్, జూలియట్ కూటములలో ప్రభువు యొద్దకు రక్షణ మార్గములో నా ద్వారా రక్షింపబడితిరి.“ [అతడు చనిపోయి ఏబది సంవత్సరములైనది.] అవును! ”ఇక్కడ ఫలాని సోదరి యున్నది. అవును, నేను నిన్ను విన్నిపెగ్ కూటముల యందు ప్రభువు వైపుకు నడిపించితిని. అవును. ఏమిటి, ఇచ్చట ఫలానా - ఫలానా సహోదరి యున్నది. నేను నిన్ను చూడలేదు.... అవును, చూడండి, ఫలానా - ఫలానా స్థలమందు నీవు ప్రభువు యొద్దకు వచ్చితివి.“ అతడు రెండు గంటల పాటు తాను ప్రభువు యొద్దకు నడిపించిన వారితో కరచాలనము చేసెను. తిరిగి తన స్థానమునకు వెళ్ళి, పరుండి చేతులు ముడిచెను, అంతే! ఒక రాత్రి యేసు నాకు చూపించిన ఆ దేశములోనికి సహోదరుడు ఎఫ్. ఎఫ్. బోస్వర్త్ ప్రవేశించెనా? ఒకవేళ అది అట్లైనయెడల, ఈ రాత్రి అతడు ఆ దేశములో యువకునిగా ఉన్నాడు. దేవుడాయన ఆత్మకు విశ్రాంతిని ఇచ్చెను. ఆ దేశములో ప్రవేశించుటకు దేవుడు నన్ను నమ్మకస్తునిగా జీవించునట్లు చేయును గాక! క్రీస్తుకు నిజ దాసునిగా ఉందును గాక...
122
నా జీవితమును చూచి నేను సిగుపడితిని. నేను సిగ్గుపడ్డాను, కాని నా ప్రజలగు మీ యెదుట నేను పాపము చేసినట్లయితే, మీరు వచ్చి నాతో దానిని చెప్పుటకు బద్దలైయున్నారు, చూచారా. దేవుడు తన కృప ద్వారా నన్ను చేయమనిన ప్రతి పనిలోను నీతిగా జీవించుటకు ప్రయత్నించాను, చూచారా. కాని స్నేహితులారా, నా జీవితంలో ఏదయినా పొరపాటు మీరు చూచినచో, వచ్చి చెప్పండి. సత్య సువార్తను మీకు ఇక్కడ నిలబడి బోధించినందుకు మీకెంతో ఋణపడి యున్నాను. మీకు నేను అచ్చియున్నాను, ఎందుకనగా ఆవలి దేశములో యవ్వనులుగా మీ స్త్రీ, పురుషుల నందరినీ చూచెదను. అక్కడికి, ఇక్కడికి మధ్య దూరము ఒక్క ఊపిరి మాత్రమే యున్నది. ఇప్పుడది నిజము. అది అచ్చట యున్నది.
123
సమస్త కృప కలిగిన దేవుడు, పరలోక దేవుడు, మన “తండ్రి, (Papa),” దీనిని అమర్యాదగా నేను చెప్బుట లేదు గాని, గౌరవించు విధముగా చెప్పుచున్నాను. మనము తిరిగి భూసంబంధమైన శరీరమును పొందుకొని ఇచ్చటకు వచ్చు ఆ గొప్ప దినమున, మనము త్రాగెదము, ఆ దేశములోని ద్రాక్షా ఫలములను తిందుము. వారు గృహములు నిర్మించగా, అందులో వేరొకరు కాపురముండరు. వారు ద్రాక్షా తోటలను నాటగా, మరొకరు తినరు, చూచారా. ఒకడు ద్రాక్షా తోట నాటగా, అతని కుమారులు, కుమారుని కుమారులు దానిని స్వతంత్రించుకొందురు. కాని ఇచ్చట ఇది ఆలాగు కాదు - అతడు నాటిన చోటనే యుండును. చూచారా, ఇది నిజము. అక్కడ మనము సదా కాలము ఉందుము. ఆ దేశములో మీ ప్రతి ఒక్కరిని నేను చూచుదును గాక!
124
ఇక్కడ నేను త్రిత్వ సేవకులతో కూడా మాట్లాడుచున్నానని ఎరుగుదును. నా సోదరులారా, మిమ్మును బాధించుటకు నేను దీనిని చెప్చుట లేదు. నేను కూడా త్రిత్వవాదినే. త్రిత్వమును నేను నమ్ముచున్నాను, కాని ముగ్గురు దేవుళ్ళు కాదు. దేవుని యొక్క మూడు గుణలక్షణములు, (తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ), చూచారా. నిశ్చయంగా మూడు గుణ లక్షణములున్నవని నేను నమ్ముచున్నాను, నా పూర్ణహృదయముతో దీనిని చేయుచున్నాను, “తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ,” కాని వారు ముగ్గురు దేవుళ్ళు కారు. ఒకే దేవుని యొక్క మూడు గుణలక్షణములు లేదా మూడు కార్యాలయములు. ఒకప్పుడు దేవుడు పితృత్వములోను, కుమారత్వములో జీవించెను, ఇప్పుడు పరిశుద్ధాత్మగా యున్నాడు. ఒకే దేవుని మూడు కార్యాలయములవి. మరియు వారికి.....
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనునవి దేవుని పేరు కాదు. దేవునికి ఒక పేరున్నది. ఆయన పేరు యేసు. బైబిలు ఇట్లు చెప్పెను, “పరలోక కుటుంబమునకు యేసు అను పేరున్నది. మరియు భూమి మీద ఉన్న కుటుంబమునకు యేసు అను పేరున్నది.” అది నిజము. కాబట్టి దేవునికి ఒక పేరు కలదు, మానవ పేరు. యెహోవా యీరే, యెహోవా రాఫా అనునవి ఆయన దైవత్వపు బిరుదులు. అయితే ఆయనకు ఒక పేరున్నది - అది యేసు! అది ఆయనే.
నా సోదరులారా, నిజము, మీరు నాతో సమ్మతించనియెడల, గుర్తుంచుకొనండి, ఆవల ఏలాగైనా మిమ్మను నేను కలిసికొందును, చూచారా. అక్కడ మీతో నేనుందును. దేవుడు మిమ్ము దీవించును. మరియు మిమ్మను నేను ప్రేమించుచున్నాను.
125
ఇప్పుడు సంఘము దీనిని గుర్తుంచుకోవలెనని నేను కోరుచున్నాను. ఆదివారము ఉదయము ఇక్కడ మరల కలిసికొందుము, రెండు గంటలు దాటనీయకుండా ముగించుటకు ప్రయత్నించెదను, తద్వారా మనకు సాధ్యమైతే, మధ్యాహ్న కూటముండును. ఈ రాత్రి పదిన్నర అయినది, నన్ను క్షమించెదరా? స్నేహితులారా, ఎంతో సమయము మనకు లేదు. మిమ్మును “ప్రియులు,” అని పిలచుదును. మీరు నాకు ప్రియులు. తెలియునా? ఒక వాక్యమున్నది. పౌలు చెప్పెను, “దేవాసక్తితో మీయెడల ఆసక్తిని కలిగియున్నాను [తన సంఘము] నేను మిమ్ములను ప్రధానము చేసితిని....” అక్కడే మీరున్నారు, అది అక్కడ ఉన్నది. అంతే. “పవిత్రురాలైన కన్యకగా క్రీస్తుకు మిమ్మను ప్రధానము చేసితిని.”
126
ఇప్పుడు, అది సత్యమైనయెడల, ఆ దినమున అచ్చటున్న జనులు నాతో, “యేసు నీ యొద్దకు వచ్చును, అప్పుడు నీవు మిమ్మల్ని ఆయనకు ఒక పవిత్రమైన కన్యకగా సమర్పించెదవా,” అనిరి. నీవు వారికి ప్రసంగించిన వాక్యాన్ని బట్టి వారికి తీర్పు తీర్చెదవు. మరియు గమనించండి, పౌలు తన సంఘమునకు ఏదైతే ప్రసంగించెనో, నేను కూడా దానినే ప్రసంగించితిని, అతడి సమూహము దేనిని పొందుకుంటారో మనము కూడా దానినే పొందుకొనెదము, ఎందుకనగా మన మధ్య కూడా అదే సత్యమును కలిగియున్నాము. ఆమేన్. “దేవుడు మిమ్ములను దీవించును గాక,” అని చెప్పుచుండగా, ఇప్పుడు మనము మన తలలను వంచుకొనెదము.