యేసుక్రీస్తు యొక్క దైవత్వము

యేసుక్రీస్తు యొక్క దైవత్వము

148 paragraphs in the table.we update the paragraphs for this sermon soon,..ధన్యవాదములు సహోదరుడా గ్రాహం, ప్రతి ఒక్కరికి ఉదయకాల శుభములు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రియమైన చిన్న గుంపుతో వుండుటకు తిరిగి ఈ ఉదయకాలం ఇక్కడ టాబర్నికల్ లో పుండుట చాలా సంతోషంగా వుంది.

ఒక విషయాన్ని నేను గ్రాహంతో కలసి అక్కడ మాట్లాడుచుంటిని. అతడు అడిగాడు, “సహోదరుడా బిల్, ఈ ఉదయనేళ నీ హృదయంలో ఏదైనా ప్రేరణను పొందియుంటివా?”

“కేవలం క్రీస్తు” అని నేనన్నాను. ఆమెన్. అంతే. మనమెల్లప్పుడు దానిని కలిగియుండెదము. సర్వసాధారణంగా మనందరిలో ఆయనను ఎల్లప్పుడు కలిగియుందుము.

2

డల్లాస్ నుండి వచ్చేసరికి రాత్రి చాలా ప్రొద్దుపోయి౦ది, మేము కలిగియున్న కూటాలలో మహిమకరంగా జరిగినవాటిల్లో అది ఒకటి. దేని నిమిత్తం మేము చాలా కాలం నుండి ప్రార్థించుచుంటిమో, అది ఇప్పుడు జరుగుతుంది; సరిగ్గా ఇప్పుడే, అది అనగా దేశవ్యాప్త ఉజ్జీవము కార్యరూపము దాల్చుచున్నది. నిన్న సేవకులందరు,లేదా కొద్ది దీనాల నుండి, అన్నిరకాల మరియు ప్రముఖ సేవకుడు లేదా కూటాలు, ఈ కూటముల నిమిత్తం మేము ఒకటిగా కూడితిమి. మరి అక్కడ పదిహేను, పద్దెనిమిది మంది సేవకులు కూడుకొనిరి. వారిలో కొందరు మూడు నుండి పదిహేను వేలమంది, బహుశా ఇరవై వేలమంది జనులు కలిగిన వారున్నారు. ఉదాహరణకు రెమెండ్ టి. రిచీ, బోస్వర్త్, మరియు ఓరల్ రాబర్ట్స్, మరియు, జాక్సన్ ఇంకొందరు పాల్గొనిరి.

సహోదరుడు జాక్సన్ జరిపిన ఒక రాత్రి కూటములో ఒకేసారి ఐదువందల మంది పరిశుద్ధాత్మను పొందుకొన్నారు, కావున అదెంతో అద్బుతం.

3

మరి నిన్న మేమంతా సంవత్సరానికి సరిపడే ఒప్పందములను గూర్చి మాట్లాడుకొనుటకు కూడుకొన్నాము, తద్వారా లోకము ఇదివరకు ఎన్నడూ చూడనటువంటి ఒక కార్యమును, ఒక కదలికను జరిగించుటకు దేవుడిక్కడ వున్నాడని మేమంతా నమ్ముచుంటిమి. ఏదో ఒక అద్భుతమైన దానిలోనికి మనమిప్పుడే ప్రవేశించామని స్నేహితులారా, నేను నమ్ముచున్నాను. మరి ఈ సేవకులు, ప్రభువు అనుమతిస్తే, రాబోయే ఈ వేసవి కాలమందు ప్రతీరాత్రి ఎక్కడో ఒక చోట కూటములను ఏర్పరచుదురు. బహుశా వారు పదిహేను లేక పదహారు మంది కావచ్చును. వారు అమెరికా అంతటా ఒకేసారి ఎనిమిది లేక పదివేలమంది జనం పట్టే పెద్ద గుడారములను వేసి కూటాలు జరుపుదురు.

ఓ, మనం ఉజ్జీవమును పొందుకోవల్సి వుంది. అది ఇప్పటికి వచ్చియున్నది. వందలాది మంది జనులు పరిశుద్ధాత్మను పొందుచూ, ఇప్పుడు దేవుని రాజ్యములోనికి వచ్చి చేరుతున్నారు. అదేదో ముందు భవిష్యత్తులో జరుగనైయున్నదని చూడాల్సిన పన్లేదండీ, అది ఇదివరకే వచ్చియున్నది. దేవుడు ఇప్పుడే దానిని చేయుచున్నాడు.

4

[సహోదరుడు స్నెల్లింగ్ మైక్రోఫోను గురించి సహోదరుడు బ్రెన్హాంతో మాట్లాడుచున్నాడు.] అవునయ్యా.. అవును, సహోదరుడా గ్రాహం. నేనెల్లప్పుడూ కోరుకొనే విషయం అదే... మంచిది. సహోదరుడు గ్రాహం, నేను కలిసి చాలా చక్కగా పని చేయుచున్నామని మీకు తెలుసా; అతడేమో పొడవరీ మరియు నేనేమో పొట్టివాడిని. కనుక నేను... [“అతడు తక్కువ ఎత్తులో ఉన్న ఫలమును పొందుకొనును, మరియు నేను ఎక్కువ ఎత్తులో ఉన్న ఫలమును పొందుకొందును,” అని సహోదరుడు స్నెల్లింగ్ అనిన దానికి సహోదరుడు బ్రెన్హాం మరియు సమాజము నవ్వుచున్నది.] కొన్నిసార్లు కొన్నింటిని క్రిందికి రాల్చుటకు అతడు నాకు అవసరమై యుండెను... [టేపు మీద ఖాళీ.]

సహోదరుడా గ్రాహం, నీకు వందనాలు. ఆ అగ్నిని నేనింకా కనిపెట్టలేదు. అది బలిపీఠము మీద ఉండాలని మేము కోరుచున్నాము, మనం కోరట్లేదా? ఆమెన్. ఓ నేను....

ఒకరాత్రి మేమచ్చట వున్నాం, వేలాదిమంది వచ్చారు, వారంతా తమ చేతులతో చప్పట్లు కొట్టుచూ దేవుని స్తుతించుచున్నారు. అక్కడ మేము ఒక అద్భుతమైన సమయాన్ని కలిగియున్నాం, సరిగ్గా అప్పుడే బలిపీఠము మీద అగ్నిని మేము కలిగియుంటిమి.

5

ఉజ్జీవం కొరకు రాబోయే ఈ వేసవికాలపు కార్యక్రమములను ప్రకటించుటకు మేమెంతో సంతోషిస్తున్నాం.

ఇప్పుడు, రాబోయే ఎనిమిది పది దినముల పాటు నేను ఇక్కడ సంఘములో, మీ అందరితో, సహోదరుడు గ్రాహంతో కలిసి ఉందునని నాకు తెలిసినంత వరకు నేననుకొనుచున్నాను, శక్యమైతే, ప్రతీ కూటములోను నేనుండగోరుచున్నాను. పిమ్మట నేను..

అటు తర్వాత మేము టెక్సాస్ రాష్ట్రం, హూస్టన్ లో వున్న కొలీజియం వద్ద ఉండెదము. అక్కడ పదిహేడు వేలమంది జనులు కూర్చొనే సామర్థ్యం గల చక్కని భవనం పున్నది, అక్కడొక గొప్ప సమయంను కలిగి ఉండుటకు మేము ఎదురుచూస్తున్నాం.

6

ప్రయత్నించాము... మేమంతా ఒక ప్రార్థనా వరుసను కలిగియుండునట్లు ప్రయత్నించాము; ఒక సేవకుడు ఒక చోట, మరో సేవకుడు మరో చోట, మరొకరు ప్రార్థనా వరుసలో వుండునట్లు చేసాము, కానీ అది అలా పనిచేయలేదు. సహోదరుడు జాగర్స్ అలా ముందుకు వెళ్ళవల్సింది.

మరియు చెప్పాలి, ఒక ప్రకటనను నేను చేయగోరుచున్నాను. కాల్గరీలో మేము చేసినట్లు సహోదరుడు జాగర్స్ నిలబడి అలాంటి బాధ్యతను తీసికొన్నాడు. అతడు... మీషనెరీ బాప్టిస్టు సంఘాలు మరియు ఫ్రీవిల్ బాప్టిస్టులు, మరియు అందరు (టెక్సాస్ నిండా బాప్టిస్టులేనని మీకు తెలుసా.), వారు అతని కొరకు నిలువబడిరి, అయితే సనాతన బాప్టిస్టులు మాత్రం కార్యక్రమానికి విరోధముగా లేచి నిలబడ్డారు. మరి, ఓ, వారు పేపర్లో అతడికి వ్యతిరేకంగా ఎలాబడితే అలా వ్రాయనుద్దేశించారు. ఇంకా ఏదేదో చేసారు. మంచిది, వారు కొన్ని బైబిల్ ప్రశ్నలను అతడికి పేపరు ద్వారా సంధించారు. వాటికి అతడు బదులిచ్చాడు... వారికి వారి సొంత రుజువు దొరికిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు నిల్చున్నారు, ఎందుకు, వాటిని పేపర్లో వేయనివ్వలేదు. కనుక సహోదరుడు జాగర్స్ కలిసి అక్కడొక కూటము జరిపించాము, ఆ పట్టణములో డెబ్బై-ఐదు శాతం మంది సేవకులు మాలో సహకరించుటకు ముందుకి వచ్చారు. దాని యొక్క జిరాక్స్ ను మేము తీసికొని ఇలా అన్నాం, “వాక్ స్వాతంత్ర్యమంటే ఇదేనా? పత్రికా స్వేచ్చ అంటే ఇదేనా?” ఆ విధంగా దానిని పంచాము. అప్పుడు ఆ పేపరు వాళ్ళు మరుసటి రోజుకల్లా పదివేల సభ్యత్వాలను కోల్పోయారు (పోగొట్టుకొన్నారు).

వారు ఏడ్చుకొంటూ వచ్చి, తమ మోకాళ్ళ మీద పడి ఇలా ప్రాధేయపడ్డారు, “ఉచితంగానే మేము మీ ప్రకటనలను ప్రచురిస్తాం, మీరు ఒక్క పైసా కూడా కట్టనక్కర్లేదు.”

7

ఓ, సహోదరుడా, సంఘమా వినండి, ఒకప్పుడు మేము రైలు ట్రాక్ ప్రక్కన నివసించేవారము; ఆ తరువాత నుండి అచ్చట లేము. ఇప్పుడు హల్లెలూయా అవెన్యూలో నివాసమును కలిగియున్నాము. అవునయ్యా. మేము లక్షల శ్రేణిలోకి వెళ్ళితిమి. అలా వుంటిమి, అయితే ఒకప్పుడు కేవలం వందల సంఖ్యలో వు౦టిమి, ఇప్పుడైతే లక్షల, లక్షల్లోకి వెళ్ళితిమి. ఆందరిని కలిసితిమి, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సంఖ్యపరంగా చాలా బలమైన సంఘము మేమేనని, బహుశా విశ్వవ్యాప్తంగా కూడా ఆ విధంగా వు౦టిమని నేను భావించుచున్నాను. గడిచిన సంవత్సరంలోనే మా ద్వారా పదిహేను లక్షల మంది మార్చబడిరి. దానిగూర్చి ఆలోచించండి: సంపూర్ణ సువార్త జనులుగా పదిహేను లక్షల మందిని సర్వసాధారణంగా గత సంవత్సరం పట్టుకొంటిమి. ఓ, మేము ఇప్పుడు పైపైకి ఎగబాగుచుంటిమి.

8

మరియు ఈ చిన్న కాగితము మరియు జరిగిన కార్యములు, వారు క్యాథలికనులను గూర్చి మాట్లాడుట లేదు, క్యాథలిక్కులంటే వారికి భయం. చూశారా, దానిని చేయుటకు వారు భయపడుదురు, కానీ మనం ఇప్పుడు దాని మీద లెక్కించుచున్నాం. మనము కొన్ని హక్కులను పొందుకొన్నాం. కావున దేవుని వలన మనకు ఇవ్వబడిన హక్కులను ప్రస్తావించెదం. అది నిజం. ఈ సంవత్సరం దేవుడే మన సహయంగాను, మన దుర్గముగాను వుండి ముందుకి సాగిపోదాం, ఒక ఉజ్జీవమును కలిగియుండుటకు శాయశక్తులా ప్రయత్నిద్దాం, ఇప్పుడు నేను..

[సహోదరుడు బ్రెన్హాంతో ఎవరో మాట్లాడుచున్నారు.] ఓ, ఇక్కడేనా? ఎప్పుడు ఆపవలెనో నీవు నాకు చెప్పవలెను. అక్కడా, సరిగ్గా అక్కడేనా. సరే. నేను ఇలా పైకి నడుస్తూ వెనక్కి చూచెదను.

9

మరి, చాలా బాగుంది. క్రిస్మస్ కొరకు ఎంతమంది సంతోషంగా వుందని భావించుచున్నారు? “ఆమేన్.” చెప్పండి [సమాజము “ఆమేన్” చెప్పుచున్నది.] ఓ, మై, మై. ఇది ఆనందించే సమయం, మనమందరం కలిసివచ్చి క్రీస్తుని ఆరాధించే సమయమది.

మరి నా యొద్ద లేదు, ఒక వర్తమానమును లేదా ఒక సంగతీలాంటి దానిని నేను నా యొద్ద కలిగి లేను. అక్కడ వుండి ఆయన మాట్లాడుచూయుండిన సంఘటనను నేను బైబిల్ తెరచినప్పుడు నాకు కనబడింది. నేను ఇక్కడికి తిరిగివచ్చి, అన్నాను, “క్రీస్తు యొక్క పుట్టుక ఎక్కడ?” ఇంచుమించు ప్రతిఒక్కరు ఇప్పుడు దానినే మాట్లాడుతున్నారు. మరి నేను కొద్దిసేపు చదివి, కొంత కనుగొనాలి, ప్రభువు ఆత్మ ఏదో తీసికొని నాకు చెప్పువరకు నేనలా వేచియుండెదను.

ఇప్పుడు, లూకా మొదటి అధ్యాయంలో ఆరంభింతుము. అది క్రీస్తు పుట్టుకతో ఆరంభమగును. సాధ్యమైతే మనమిక్కడ కొంత పఠించి, వాక్యము మీద కొంత బోధించుకొందుము. మన కొరకు ప్రభువు ఏమి చేస్తాడో మనమెరుగము, కానీ ఆయన మనకి గొప్ప దీవెన ఇచ్చునని మాత్రం నమ్ముచున్నాం.

10

మీ ప్రచారాలను నేను విన్నాను, అవి చాలా బాగున్నాయి. వాక్యాన్ని ప్రకటించడాన్ని అలా నిరంతరం కొనసాగించండి.

అక్కడున్నప్పుడు నేను సహోదరుడు గ్రాహంతో చెప్పుచుంటిని, “క్రైస్తవులు ఒకరికొకరు అవసరమయ్యే సమయం ఏదైనా వున్నదంటే, అది ఖచ్చితంగా ఇదే అయి యున్నది, అది ఇప్పుడే.” నీవు ఏది చేసినా, ప్రతి దానిని ప్రక్కనబెట్టుము; ఎందుకనగా దేవుని కృపను బట్టి నేను నమ్మేది ఏమనగా... దానిగూర్చి కొద్దిసేపు నేను మాట్లాడుదును — ఏలాగు మనమిప్పుడు ఒకరికొకరం అవసరమై యున్నామో నేను చెప్పగోరుచున్నాను.

ఆ గొప్ప... మనం ఎదుర్కొనుచున్నామని నేను నమ్ముచున్నాను... నేను చెప్పే దానిని మీరు వినుచున్నారా? [సమాజము “ఆమెన్” చెప్పుచున్నది.] మంచిది. మనము ఎదుర్కొనుచున్నాము, ఇప్పుడు మానవ చరిత్రలో ఎన్నడూ జరుగని ఒక గొప్ప నాటకము వైపు ఇప్పుడు చూస్తున్నాం, అదిప్పుడు మన ముందు జరుగుచుండెను. లోకమనే గొప్ప పొలములో దేవుడు ఇప్పుడు నటించబోవుచున్న నాటకం ఇది. అదొక ఉలిక్కిపాటు, లోకాన్ని చుట్టూ చూచుటకు మరియు సంగతి ఎలాగు కలిసి కదులుతున్నదో చూచుటకు. ఓ, ఏదో జరుగుటకు నిర్ణయించబడింది, మనం మాట్లాడేది, చెప్పేది ఇప్పుడిక్కడ వున్నది. చూశారా? ఇది ఇదివరకే ఆరంభమైంది, ప్రతిచోట, దృష్యరూపం దాల్చింది.

11

ఈ ఉదయం నేను గొప్ప చిత్రమును మీ ముందు ఉంచగోరుచున్నాను. పొలములో వుండి ఒక గొర్రెపిల్ల మేత మేయుచుండటను నేను చూస్తున్నాను. ఆ చిన్న పిల్ల ఎంతో భయకంపితురాలై, అది తిరుగుచున్నది. దాని వెనుకనే రెల్లులో ఒక సింహం మెల్లగా దానివైపే వస్తుండటాన్ని నేను చూస్తున్నాను (చూశారా?) అది తన తోకను నేలమీద కొట్టుకొనుచూ, కాళ్ళతో ఎగిరి దుముకుటకు సిద్దపడుచున్నది.

పొలములో వున్న గొర్రెపిల్లవలే సంఘము కూడా వున్నది. కమ్యూనిజం యొక్క చీకటి ఛాయలు లోకమంతా అలుముకొనుచూ, నీడవలే ముగింపునకు వచ్చుచున్నది.

ఇది వైపరిత్యపు నియమం (చట్టం). ప్రొద్దుపొడవక ముందు తీసికొనుట, పగలు వచ్చుటకు ముందు ఎల్లప్పుడు చీకటి వుండును. చీకటిని పగలు పారద్రోలుతుంది. అది ప్రకృతి నియమము (మీరు చూశారా?) ప్రొద్దుపొడిచి పగలు కాంతి వచ్చుటకు ముందు చీకటి వుండును.

12

సరిగ్గా మనం ఇప్పుడు అలాగే వున్నాం. ప్రొద్దుపొడుచుటకు ముందువున్న చీకటి వుంది. ఆ గొప్ప చీకట ఛాయలు ఇప్పుడు పావపురుషున్ని నెరవేర్చుటకు అలుముకొంటున్నవి. మీరు గమనించారా, సరిగ్గా ఈ క్రిస్మస్ కాలమందే, కమ్యునిష్టు దేశాలన్నీ పశువుల తొట్టిలో వున్న క్రీస్తుని ప్రకటించటానికి బదులు, వారు స్టాలిన్ పుస్తకాలను, వాటి మీద స్టాలిన్ బొమ్మలను వేసి పంచుతున్నవి; దేవునికంటే తన్ను తాను హెచ్చించుకొన్న వ్యక్తి అతడు, లోకాన్ని తనవంతుగా గొప్ప ఉరిలోకి తీసికెళ్తున్న వ్యక్తి అతడు. మరియు మరో సంగతి ఏమనగా, ఇవన్నీ జరుగుచుండుటకు కారణం లేఖనముల నెరవేర్పు కొరకు.

13

అలాగే మరో సంగతిని అనగా మరో నెరవేర్పును గమనించాలని కోరుచున్నాను. నామకార్థ క్రైస్తవ సంఘాలలో వున్న ఈ నామకార్థ జనులు దేవుడు పంపిన కదలికకు విరోధముగా లేచుచున్నారు. బైబిల్ ఇలా సెలవిస్తుంది, “వారు పైకి భక్తిగలవారివలె ఉండియు, దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు; ఇట్టివారికి విముఖుడవై యుండుము.” వారు తమ పాత్రను తాము నెరవేరుస్తున్నారు. కమ్మునిజం తన పాత్రను అది నెరవేరుస్తుంది. దేవునికే స్తోత్రం, పరిశుద్ధాత్మ కూడా తన పాత్రను నెరవేరుస్తుండెను. అవును. “శత్రువు వరద ప్రవాహాంవలె వచ్చినా, నేనొక దుర్గమును దానికి విరోధంగా నిలబెడతాను.” అది నిజం. సంఘము, పరిశుద్ధాత్మతో నిండిన సంఘము తన పాత్రను పోషిస్తున్నది.

స్నేహితులారా, ఇప్పుడు నా కుతూహలమంతయు అదే, అందుకే నేనిక్కడ వుంటిని. బయటకి వెళ్ళునప్పుడు రోగుల నిమిత్తం నేను ప్రార్థించెదను. అయితే ఇక్కడైతే ఏదో రకంగా నేనొకదానియందే ఆసక్తి కలిగియున్నాను, తిరిగి-జన్మించిన సంఘమును గూర్చే నా ఆసక్తి. విధుల(నియమాలు)ను గూర్చి గానీ, మరి సంఘ పెద్దలను గూర్చి గానీ నాకు ఆసక్తి లేదు. నేడు మనం జీవిస్తున సంఘము మీదకి పరిశుద్ధాత్మ బాప్తిస్మము వచ్చి నిలబడాలనే దాని మీదనే నేను ఆసక్తిని కలిగియున్నాను. అదే ప్రధానమైన భాగము. దానినే మనం చూస్తున్నాం.

ఇప్పుడు ప్రార్థన చేసికొందాం.

14

పరలోకపు తండ్రీ, మా మధ్యలోకి ఈ ఉదయం దిగి రమ్ము. ప్రభువా, దానిని అనుగ్రహించుము, దేవుని ఆత్మ కూటమును తన ఆధీనంలోకి తీసికొనును గాక. ప్రభువా, ఇక్కడ జరుగుచున్న పనిని దీవించుము. మా సహోదరుడు గ్రాహంను దీవించుము. దేవా, ఈ రాత్రి అతడికి జ్ఞానము గల మాటలను అందించుము, అతడు రేడియో ప్రసారాలు చేస్తుండగా, దేవుని వాక్యాన్ని ప్రకటించుట ద్వారా అతడు జనులను కదిలించునట్లు అతడికి సామర్థ్యమును దయచేయుము. దానిని అనుగ్రహించండి, ప్రభువా. పాపులు ఏడ్చుచూ, వారున్న గదిలోనే మోకరించుచూ, తమ హృదయాలను క్రీస్తుకి సమర్పించుకొందురు గాక. ఈ ఉదయకాలం ఇక్కడ ఎవరైనా అవిశ్వాసులు పున్నట్లైతే, లేదా క్రీస్తుని ఇంకా అంగీకరించనివారు వున్నట్లైతే, వారు కూడా వచ్చుదురు గాక.

ప్రభువా, ఈ ఉదయకాలం జనుల హృదయాలలో ఒక ఉజ్జీవాన్ని ఆరంభించుము. అది వారికొక నూతనపర్చబడే సమయముగా ఉండును గాక. ఆత్మ వారిని నూతనపరిచే సమయముగా ఉండును గాక. మరియు ఓ తండ్రి, ఈ విధంగా మేము ప్రార్థించుచుంటిమి. నీవు వచ్చి మమ్మును చేజిక్కించుకొని, ఇక్కడున్న ఈ వీధిలో మాతో కలసి నడువుము. ఇక్కడ క్రమంలో పెట్టబడిన ఈ గొప్ప చిత్రమును మాకు చూపండి. ఈ ఉదయకాలం పరిశుద్దుల హృదయాలకి నీ మర్మములను బయలుపర్చండి, తద్వారా మా ముందు వున్నదేదో మేము ఇక్కడ చూచెదము. మరప్పుడు ప్రభువా, మేము సర్వాంగ కవచముతో నడచిపోవునప్పుడు, ధీరత్వముగల సైనికునివలె శత్రువును ఎదుర్కొందుము గాక. వాడి కుయుక్తులనేవి తెలియకుండా మేమెలా వాడిని ఎదుర్కోగలము? మరి ఈ ఉదయకాలం అర్థం చేసికొనుటకు సహాయము చేయుము, మరలాగే మాకు కనపరుచుము — వాడిని కలుసుకొనే చోటును కనపర్చుము, అప్పుడు మేము వాడిని ఎక్కడ కలుసుకొనవలెనో తెలిసికొందుము. వీటన్నింటిని యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్.

15

రెండవ అధ్యాయమును మనం చదువుదాం. లూకా 2:1-7.

ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను.

(ఇది కురేనియ సీరియ దేశమునకు అధిపతియై యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య.)

అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి.

(యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక), తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన

మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ వున్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గమక

తన తొలిచూలి కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.

16

ఇప్పుడు నేను దీని నేపద్యముగా... ఈ ఉదయకాలం నేను దానిని వాడుకొనునట్లు దానిలో ఒక భాగమును మనం పట్టుకొనే వరకు దాని నేపద్యమును చూద్దాం. మరియు మీ అందరు ప్రభువు ఆత్మకి మిమ్మును మీరు అప్పగించుకొండి.

నేడు లోకమంతటిలో మనం యేసు పుట్టుకను ఉత్సవంగా జరుపుకొనుచుంటిమి, అది ఒక ఆచారంగా మారిపోయింది. యేసు నిజానికి డిసెంబర్ అయిదు నాడు లేదా అటువంటి ఒక తేదీన జన్మించలేదు. లేదా డిసెంబర్ 25న జన్మించలేదు. అది అసాధ్యమని మనకి తెలుసు. ఎందుకనగా ఆ కాలమందు (డిసెంబర్ నెలలో) యూదయ కొండలు మొత్తం మంచుతో కప్పబడి వుండును. కావున అదెలా సాధ్యం? జోతిష్య శాస్త్రం ప్రకారం లేక అటువంటి దాని ప్రకారం, సాధారణంగా యేసు ఏప్రిల్ మొదటి వారంలో జన్మించి యుండెను. అది వసంతకాలం. సరే, నేటి ఈ దినమనేది ఆరాధించుటకు ప్రత్యేకించబడుటకు పరవాలేదు, ఈ లోకానికి ఆయన వచ్చిన దానిని పురస్కరించుకొని గుర్తుచేసికొనుటకు.

17

ఈ లోకానికి దేవుడెన్నడు ఇవ్వని అతి గొప్ప బహుమానం యేసుక్రీస్తు. అది మనకి తెలుసు. ఆయన ఎవరైయుండెనో అనే ఆయన యొక్క దైవత్వమును గూర్చి నేను మాట్లాడాలని కోరుచున్నాను. చాలామంది ఆయనను ఇంకా పశువుల తోట్టెలో పడుకొన్నవానిగానే చూస్తున్నారు. కాని అది లేఖనాలలో ఒక భాగము మాత్రమేనండీ, నాటకములో కేవలము అదొక భాగము మాత్రమేనండీ, నిజంగా ఆయన ఎవరు అనేది, ఆయన దైవత్వమనేది తెలుపుటలో ఆయన యొక్క పుట్టుక కేవలం నాటకములో భాగమే సుమా.

తన రాకను గూర్చి ఆయన ముందుగానే లేఖనాలలో చెప్పియుండెను, యోహాను దినముల నుండే ఆయన చెప్పుకొంటు వచ్చెను... ఆదికాండము మొదలుకొనే చెప్పుకొంటువచ్చాడు. అక్కడ ఇలా చెప్పబడింది, అదేదనగా, “స్త్రీ సంతానము సర్పము యొక్క తలను చీదక తొక్కును,” క్రీస్తు యేసు అను ఈ బిడ్డను గూర్చి వాగ్దానము చేయబడెను. ప్రవక్తలందరు ఆయన గూర్చి చెప్పారు. బైబిల్ నందున్న ప్రతి ప్రవక్తయు ఈ లోకమునకు ఆయన యొక్క మొదటి రాకడను అలాగే రెండవ రాకడను గూర్చి చెప్పుకొంటూ వచ్చారు.

18

మూడుసార్లుగా యేసు రాకడ వుండును. తన సంఘమును విమోచించుటకై ఆయన మొదటి-రాకడ వుండెను. తన సంఘమును చేర్చుకొనుటకు ఆయన రెండవ-రాకడ వచ్చును. మూడవ-రాకడ, ఆయన తన సంఘముతో వచ్చును. బైబిల్ లో వున్న ప్రతీది త్రిత్వమందు సాగుచుండెను. మూడులో సాగును, అయితే అంతయూ క్రీస్తులోనే సాగెను. గుర్తుంచుకోండి, మొదటిసారి, తన సంఘమును విమోచించుటకు; రెండవసారి, తన సంఘాన్ని చేర్చుకొనుటకు; మూడవసారి తన సంఘముతో అనగా, రాజు మరియు రాణి వలే వచ్చును.

ఇప్పుడు, ప్రభువు చిత్తమైతే, ఆయన యొక్క మొదటి-రాకడను గూర్చి కొద్దిగా మాట్లాడుకొందాం. ఆయన ఇక్కడ మానవ రూపము దాల్చిన సంగతిని, అటుతరువాత ఆయన రెండవ-రాకడను గూర్చి కొంత సేపు, అటు తరువాత ఆయన యొక్క మూడవ-రాకడను గూర్చి మాట్లాడుకొందాం.

19

మరి ఆ దినాలలో సంఘానికి వ్యతిరేకంగా గొప్ప హింస కలుగుచుండెను. కైసరు ఓ గొప్ప పన్నాగము పన్నెను, ఆదేదనగా, సర్వలోక జనులు పన్ను చెల్లించాలనేది. కేవలం ఒకే ఒక ఉద్దేశ్యము కొరకు అది జరిగెను.

అదేమనగా దేవుని యొక్క గొప్ప ప్రవచనం నెరవేరుటకే. గూడార్థమైనది, లేక కొంచం మూడత్వమైనది బైబిల్లో నీకు కనబడినప్పుడు నీవు చేయవల్సిందల్లా ఒక్కటే, అదేమనగా దానిని అయన నీకు చెప్పుటకు దేవునికి కొంత సమయాన్ని కేటాయించుము. దేవుడు ఏ మాత్రం తొందరపడడు. అయితే మనమే బహుగా తొందరపడతాం. దేవునికి కొద్ది సమయము కేటాయించాము, అప్పుడు నీవు ఆ పాత ప్రవచనాత్మక చక్రాలు మొదలగునవి, ఆ యొక్క క్రమముగా చిత్రములో చక్కగా వెళ్ళుచున్నట్లు నీవు చూడగలవు. అది పూర్తి చిత్రమును గీసి నీకు చూపించును.

20

మొన్న ఎవరో ఇలా అన్నట్టున్నారు, “దేవుడు, ఆయన ఎలా వుంటాడు?” ఆయన ఇదివరకు పూర్వం, కోటానుకోట్ల సంవత్సరాలకు మునుపు, ఏమీ లేనప్పుడు... ఈ శూన్యం (విశాలం) ఇక్కడున్నట్టు ఆయన అప్పుడు లోగోస్ (వాక్యము)లో తన్నుతాను సమకూర్చుకొనెను; అప్పుడు ఆయన అక్కడ నుండి క్రీస్తులోనికి వచ్చెను. చూశారా, అది అలా దేవుడు ఈ భూమ్మీదికి వచ్చినట్టు వున్నది, అటు తిరిగి దేవునిలోనికి వెళ్ళినట్టుంది. నా భావాన్ని మీరు పట్టుకొన్నారా? అది అలా చుట్టు తిరుగుచున్నట్టు అన్నమాట. ఆకాశవిశాలములో నుండి, నిత్యత్వములో నుండి ఆలా దొర్లుకొంటూ లోగోస్ (వాక్యము)లోకి వచ్చి, మరచ్చట నుండి ఒక మనిషిలోకి మరచ్చట నుండి తిరిగి దేవునిలోకి వెళ్ళుట. దీనంతటికి గల ఏకైక కారణం, పడిపోయిన మనిషిని తిరిగి విమోచించుటకే.

ఇప్పుడు, ఒక విమోచకునిగా వుండుటకే ఆయన వచ్చెను. దేవుడు ఒక విమోచకునిగా రాకమునుపు చట్టప్రకారం ఆయనొక రక్తసంబంధియగు విమోచకునిగా ఉండి తీరవలెను. మనకి ఆయన సమీప బంధువునిగా ఉండవలెను.

21

ఆదియందు దేవుడు తనయొక్క మొదటి నరుని సృజించెను, అతడిని ఒక ఆత్మగా సృజించెను. ఆత్మ అనేది మనిషిలో అదృశ్యముగా వుండే ఒక భాగము. దానిని నీవు చూడలేవు. ఇప్పుడు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. నేను చెప్పేది వింటున్నారా? [సమాజము “ఆమెన్” చెప్పుచున్నది.] మంచిది. దేవుడు తన సొంత స్వరూపమందు నరుని సృజించెను. “దేవుడు ఒక ఆత్మ,” అని బైబిల్ చెప్పుచున్నది. నేడు సంఘము మీద పరిశుద్ధాత్మ ఏలాగు ఏలుబడి చేయుచుండెనో మరి అలాగే ఆనాడు నరుడు కూడ ఈ సృష్టి అంతటి మీద ఏలుబడి చేయుచుండెను. సృష్టిని దేవుడు నడుపుచుండెను. జంతువులను అతడు నడిపించుచుండెను.

కాని భూమిని సేద్యపర్చుటకు ఏ మనిషి అక్కడ లేకుండెను, గనుక నేల మట్టిలో నుండి దేపుడు మనిషిని నిర్మించెను. మరి ఆ మనిషి కోతికి వున్నట్టు చేతులను ఆయన అతడికి ఇచ్చి వుండొచ్చును. ఎలుగుబంటికి కాళ్ళు ఇచ్చినట్టు అతడికి ఆయన కాళ్ళు ఇచ్చివుండొచ్చును. ఆయనేమి చేసినా, కేవలం అన్ని కలిపి ఒక మనిషిని ఆయన చేసెను. అయితే ఈ మనిషిలో ఎన్నడూ నశింపు కాని అమర్త్యమగు ఆత్మను ఆయన ఉంచెను, ఈ మనిషిలో వుంచెను. మరియు ఈ మనిషి ఒక క్రూరజంతువు కంటే ఎక్కువే, అతడు ఒక మనిషయ్యెను.

22

అప్పుడు ఇక్కడ ఈ మనిషిని గూర్చి హేతువాదులు, వారిలో కొందరు చేరి వాదించుచున్నారని నేను అనుకొనుచున్నాను. దేవుడు తన వెలుగును పంపే ఒక గడియ వచ్చినది దేవుడు కార్యములను చేయు ఒక గడియ ఇక్కడున్నది. అది వాస్తవం. మరిప్పుడు వారిలా వాదించుచున్నారు, “మంచిది, ఆ మనిషి పాదాలు ఎలుగుబంటి పాదాలవలే వున్నవి, అతడి చేతులు ఒక చింపాంజీ వలె లేక ఒక కోతి వలెవున్నవి, లేదా ఒక రకంగా వున్నవి.” ఈ మనిషి యొక్క ఆదిమ స్థానం వాటిలో నుండి వచ్చినట్టుగా వారు చెప్ప ప్రయత్నించుచున్నారు. దానితో చేయునది ఏదియు లేదు.

అతడు నివసించే ఈ దేహము గృహము లాంటిది. అది తిరిగి భూమికి మన్నుగా వెళ్తుంది. కాని అందులో వున్న ఆత్మ అమర్త్యమైనది. ఆ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చినది. అది దేవుని స్వరూపమైయున్నది, ఎందుకనగా దేవుడు ఒక ఆత్మయై యున్నాడు.

అయితే ఆ ఆత్మ ఏదేను తోటలో తన మూలాన్ని (ఆరంభ స్థానాన్ని) పోగొట్టుకొనెను. పాపము, అవిశ్వాసము వలన అతడు దేవునితో తనకున్న బంధాన్ని, సహవాసాన్ని తెంచుకొనెను. దేనియందు ఆవిశ్వాసం? దేవుని వాక్య విషయమందు. ఒకసారి ఒక చిత్రము హవ్వను గూర్చి వేయబడినది, దేవుని వాక్యమను కొద్దిగా - కేవలం కొద్దిగా విస్మరించమని, అప్పుడు అదెంతో తేజోమయంగా ఉండునని, ఆమెకి వుండునని చెప్పబడినది, “హేతువు వైపు చూడుము,” అని చెప్పబడినది, కాని అది నీవల్ల కాదు. దేవుడు..

దేవుని వాక్యమునకు హేతువు అనేదానికి వ్యత్యాసమున్నది. దేవుని వాక్యము సత్యము, హేతువు అనేది అసత్యము. దేని విషయమై నీవు హేతువు(కారణం) అడుగలేవు. అది వాస్తవం. దేవుని నిత్యజ్ఞానాన్ని ఎన్నడూ కలువలేనంత చిన్నది మన మనస్సు, (చూశారా?), మరి, అందుచేత నీవు దానిని కారణం అడుగజూలవు; దానిని కేవలం నీవు నమ్మాలి.

23

అదిగో ఆ వెనుక మన తల్లి మన తండ్రి పడిపోయారు అనే చిత్రము గీయబడింది, అందును బట్టి దేవునితో వారికున్న సహవాసం తెగిపోయి, వారు ఏదీను తోటలో నుండి బయటకు గెంటి వేయబడే పరిస్థితి ఏర్పడినది. ఇక అప్పటి నుండి దేవుడు తోటలలో పైనా కిందా అరుచుచు, తప్పిపోయిన తన బిడ్డ కొరకు వెదకుటకు మొదలు పెట్టెను.

మరటు పిదప అతడిని రక్షించుటకు దేవుడికున్న ఏకైక మార్గం, ఏర్పర్చుకున్న మార్గం... స్వయంగా ఆయనే అతడిని విమోచించుటకు తనంతట తానే క్రిందికి దిగివచ్చుట అయి వుండెను, మరొకరిని, వేరొకరిని పంపించుట కాదండీ. ఒక దూతను ఆయన పంపజాలడు, ఒకవేళ అలా చేస్తే అది సరైనది కానేరదు. మనిషిని రక్షించుటకు దేవునికున్న ఏకైక మార్గం ఏదనగా, స్వయంగా ఆయనే దిగివచ్చి వానిని విమోచించుట.

24

ఇక్కడెవరైనా పాపము చేస్తే, దానికి, ఈ గుంపు జనులకి నేను జడ్జిగా వున్నాను. మీ మీద ఒక న్యాయ స్థానం యొక్క అధికార పరిధిని నేను కలిగి వుందును, నేనైతే... ఎవరైనా పాపం చేస్తే, “ఇప్పుడు, సహోదరుడా గ్రాహం, నీవు వెలను చెల్లించాలని నేను కోరుచున్నాను,” అని అన్నట్లైతే, అది సరిగా వుండదు, నా సొంత కుమారున్ని దానికి వెల చెల్లించమని నేను కోరినా అది కూడా సరిగా వు౦డదండీ...? మరి సరిగా వుండే ఒకే ఒక విధానం ఏదనగా, ఆ స్థానాన్ని నేను భర్తీ చేయుటే. ఏమిటది? తీర్పు తీర్చేవాడిని నేనే గనుక ఆ శిక్ష నుండి వాడిని విమోచించాలంటే, ఆ స్థానాన్ని నాయంతట నేను తీసికోవల్సి వుండెను. నేను చెప్పే దానిని మీరింకా వినుచున్నారా? [సమాజము “ఆమేన్” చెప్పుచున్నది.]

25

ఇప్పుడు, చూడండి, మీరొక దానిని గమనించాలని కోరుచున్నాను. దేవుడు మానవున్ని విమోచించగలిగిన ఏకైక మార్గం స్వయంగా ఆయనే దిగివచ్చి అతడి స్థానమును తీసికోవల్సి వుంది. మోషే ద్వారా ఇవ్వబడిన విమోచనను గూర్చిన నియమమది, ఒక రక్త సంబంధియైన విమోచకుని ద్వారానే విడుదలనొందవలయును. ఒక యోగ్యుడైన వ్యక్తి, వెల చెల్లించగల సమర్థుడైన వ్యక్తి, బహిరంగంగా తన సాక్ష్యమును చెప్పగల ఒక వ్యక్తి మాత్రమే పడిపోయిన స్థితిలో వున్నవాడిని విమోచించ వచ్చును. మరిప్పుడు, దేవుడే దానికి పూర్తిగా అర్హుడు. సుమారు పందొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఆయన ఒక బాలునిగా పశువుల తొట్టిలో పుట్టెను. శరీరేచ్చల వలన కాక, పరిశుద్ధాత్మ కమ్ముకొనుట ద్వారా ఆయన జన్మించియుండెను. ఆయన దేవుడైయుండెను. దేవుని రక్తం ఆయనలో వుండెను.

26

పుట్టిన బిడ్డలో ప్రవహించే రక్తం ఎల్లప్పుడు తండ్రిదే గాని తల్లిది మాత్రం కాదండీ. మనందరికి అది తెలుసును. అది లేకుండా... గతంలో నేను అనేకసార్లు దీనిని బోధించాను. అదేదనగా, తల్లి యొక్క రక్తముతో బిడ్డకి ఎటువంటి సంబంధముండదు, (తల్లి రక్తం బిడ్డలో మచ్చుకైనను కలువదు) అది మీకు తెలుసు. అవునండీ. అది అలాగుండును. కేవలం పురుషుని రక్తమే ఎల్లప్పుడు వుండేది.

ఒక కోడిపెట్ట గ్రుడ్డును మాత్రమే పెట్టగలదు, కాని అది సారవంతము కాకపోతే అదెన్నడు జీవాన్ని బయటకి తేలేదు, లేదా పొదగలేదు. గ్రుడ్డు చూపునకు ఎంత చక్కగా కనబడినప్పటికి, దానిని అది ఎంత వేడి చేసినప్పటికి అదేప్పుడు అదలా నిష్పలంగా ఉండాల్సిందే. మగ పక్షి ఆడ పక్షిని కూడనంత కాలం (కలవనంత కాలం) ఆ గ్రుడ్డు అలా వుండి కుళ్ళిపోవటం తప్ప ఇంకేం వుండదు, జీవకణము మగదానిలో నుండి రావల్సి వున్నది.

27

కావున, మరియు పురుషుని ఎరుగదు, కాని దేవుడు, గొప్ప సర్వశక్తిగల యెహోవా అనే పురుషునితో ఆమె వున్నది, ఆయన ఆమెను కమ్ముకొనెను. మరియ గర్భములో రక్తకణమును సృజించిన సృష్టికర్త దేవుడై యుండెను, “ఆమె ఏ మానవ పురుషున్ని అసలు ఎరుగదు,” ఆ సృజనాత్మకమగు దేవుని రక్తం వచ్చి శరీరేచ్చల వలన పుట్టిన మనల్ని విమోచించుచున్నది.

కల్వరి సిలువలో ఇమ్మానుయేలు రక్తనాళాల నుండి ఆ రక్తం కారుచున్నది. మరియు కల్వరి యొద్ద సిద్దపర్చబడిన ఆ రక్త మార్పిడి నేడు కూడా అదే విమోచించు శక్తి, రక్షించు శక్తి, పరిశుద్ధ శక్తిని కలిగియుండినది. దానిని మీరు నమ్ముచున్నారా? [సమాజము “ఆమెన్” చెప్పుచున్నది.] ఆమెన్. ఇప్పుడు, అది సత్యం, దేవుని రక్తము వలన మనం విమోచించబడితిమి. “రక్తము చేత కొనబడితిమని, రక్తముచేత విమోచించబడితిమి, దేవుని స్వరక్తము చేత విమోచించబడితిమని,” బైబిల్ చెప్పుచున్నది.

28

అది దేవుని రక్తమెలా అవుతుంది? దేవునికి రక్తం లేదు కదా. అదెలా సాధ్యం? మనల్నీ విమోచించటానికి ఆయన సృజించుకొన్న ఆ శరీరములోనికి వచ్చి జీవించిన దేవుని యొక్క సృజనాత్మక రక్తమది. గనుక ఆయన చేయలేక... శోధనను దేవుడు సహించవల్సి వచ్చెను. ఆయన శోధనను సహించలేకపోయెను. లైంగికపరమైన శోధనను ఆయన సహించవల్సి వచ్చెను. ఐశ్వర్యం, అధికారం, ఏలుబడి అనేవి అపవాది చేత, ఇలా అని రకములగు శోధనలను అనుభవించవల్సి వచ్చెను. ఆయన వాటన్నిటిని ఎదుర్కొవల్చి వచ్చెను. ఇవన్ని అనుభవించాలంటే ఆత్మలో వున్న దేవునిగా అది కుదరదు, కనుకనే ఆయన శరీరములో వున్న దేవునిగా ఉండవల్సి వుండెను.

ఇప్పుడు, ఈ ఉదయకాలం క్రీస్తు యొక్క దైవత్వమును గూర్చి నేను మాట్లాడగోరుచున్నాను, అందువలన నేడు మనం ఎవరిని ఆరాధిస్తున్నామోననే సంగతిని మీరు తెలిసికొందురు. పశువుల తొట్టిలో పరుండిన చంటిబిడ్డను కాదు, శాంతాక్లాస్ కాదు గాని, తన కుమారుని యొక్క దైవత్వములో వున్న సర్వశక్తి గల దేవుని మనం ఆరాధించుచుంటిమి.

29

గమనించండి, రక్తము దిగివచ్చి మరియు... అది క్రీస్తు యేసు. స్వయంగా దేవుడే ఆత్మలో నుండి వచ్చి క్రీస్తు యేసులోనికి వెళ్ళెను. మరి బైబిల్ సెలవిచ్చుచున్నది, “దేవుడు క్రీస్తునందుండి లోకముతో సమాధానపర్చుకొనెను. అది నిజమేనా? స్వయంగా దేవుడే, యెహోవా క్రీస్తునందు నివసించి మనకి రక్తసంబంధి ఆయెను, ఎందుకనగా ఆయన మనవలే మానవ శరీరములో జన్మించెను. అది నిజమేనా? దేవుని ద్వారా రక్తకణాలు వృద్ధిచెందగా, మరియ గర్భములో మాంస కణాలు వృద్ధి చెందినవి. ఆ విధముగా బిడ్డ తీసికొని రాబడెను. దేవుడు దిగివచ్చి, మాంస దేహమందు నివసించి, మనవలే అన్ని విధములుగా శోధించబడెను. దానిని మీరు నమ్ముదురా? మంచిది.

ఇప్పుడు, అప్పుడు ఆయన దానిని చేసెను, ఆయన ఉచితముగా రక్తమును ఇచ్చెను. దానిని ఆయన చెయ్యవల్సిన పనిలేదు. అయినను ఆయన ఆ బలిని అర్పించెను. ఆయన అలానే మహిమలోకి వెళ్ళివుండొచ్చును. రూపాంతర కొండ మీద ఆయన ఎలాగైతే రూపాంతరం చెందినో, అదే రీతిన ఆయన ఎన్నడూ మనకొరకు చనిపోకుండా పరలోకమునకు వెళ్ళివుండొచ్చును. అయితే మన కొరకు చనిపోవుటకు ఇష్టపడే కల్వరి యొద్ద ఉచితంగా ఆయన తన రక్తమును ఇచ్చెను. అది నిజం. మరి ఆయన బయటకి తీసి.. ఆయన దుఃఖాక్రాంతుడు, వ్యసనాక్రాంతుడు, మరియు బహిరంగంగా ఆయన సాక్ష్యము ఇచ్చెను.

30

రూతు గ్రంథములో, చాలా చక్కని దృశ్యకావ్యమది, ఆ బోయజు క్రీస్తుకి మాదిరి, ఆ రూతు స్వదేశమును విడిచి, వెనుకకు జారిపోయినదై, తెలియని ఒక అన్యదేశమునకు వెళ్ళెను... నా భావము నయోమి, ఆమె వెళ్ళి రూతును తీసికొనివచ్చెను. రూతు తిరిగి వచ్చినప్పుడు, ఆమె ఒక... ఆమె మోయాబు దేశస్తురాలు. ఆమె ఒక మోయాబీయురాలు, ఆమె అన్యవధువు సంఘమునకు ఖచ్చితంగా మాదిరి.

నయోమికి వీడ్కోలు పలుకుటకు ఆమె వెళ్ళినప్పుడు, నయోమి ఆమెతో చెప్పెను, ఆమెను ముద్దు పెట్టుకొని ఆమె స్వజనుల యొద్దకి తిరిగి పొమ్మని రూతుతో చెప్పెను. అందుకామె, “నీ ప్రజల యొద్దకి నీతో కూడ నేను వచ్చెదను. నీ జనులే నా జనులు, నీవు నివాసమున్న చోటే నేను నివాసముందును; నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప మనల్ని ఏది విడదీయలేదు. నీవు మరణంచుచోటే నేను మరణించెదను. నీవు పాతిపెట్టబడే చోటునే నేనును పాతి పెట్టబడెదను.”

31

ఇప్పుడు, అన్య సంఘం క్రీస్తు నొద్దకు వచ్చే ఒక చక్కని మాదిరి ఇక్కడ వున్నది. ఎందుకనగా ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులం, కేవలం యూదులు మాత్రమే రక్షణ నొందువారు. కాని మనం క్రీస్తులో మృతిపొందుట ద్వారా అబ్రహాము సంతానమైతిమి, వాగ్దానమును బట్టి వారసులమైతిమి, క్రీస్తు ఒక అన్యవధువును పొందుకొనెను. అది ఖచ్చితంగా వాస్తవం.

ఇప్పుడు, విమోచనము ప్రకారం, బోయజు వచ్చి నయోమి కోల్పోయిన ఆస్థి(భూమి) నీ విమోచించవలెను, అది వెనక్కి జారిపోయిన ఇశ్రాయేలీయుల భూ భాగమందు వుండెను. అప్పుడు మోయాబు -మోయాబులో నుండి బయటికి రావల్సివుంది, దానిని అతడు చేసినప్పుడు... బోయజు బయటికి వచ్చినప్పుడు, ఆస్థిని కోల్పోయిన ఆ స్త్రీ యొక్క స్వాస్థ్యమును విమోచించుటకు అతడు గవిని వద్ద పెద్దలయెదుట బహిరంగ సాక్ష్యార్ధం తన చెప్పును తీసి ఆమెపై విసరవలెను, దానిని చేయుట ద్వారా అతడు మరో కార్యమును కూడా పొందుకొంటాడు. అదేమనగా అక్కడ అతడు తన వధువును పొందుకొనెను, అతడు - అతడు ఎదురుచూస్తున్న ఆ స్త్రీ ఆమెయే. వధువును పొందే క్రమములో అతడు మొదటిగా ఆ స్త్రీని విమోచింపవలెను. దానిని మీరు చూడట్లేదా?

క్రీస్తు కూడా సరిగ్గా దానినే చేసెను, ఆయన యెరూషలేము గవిని వద్ద బహిరంగ సాక్షార్ధం ఆయన కొట్టబడినప్పుడు, మొత్తబడినప్పుడు, బాధింపబడినప్పుడు, మరియు కల్వరి వైపు నడిపించబడినప్పుడు అదే చేసెను. కల్వ... గొల్గొత కొండ ఆ కొండ ఆయన యొక్క స్వరక్తముచే తడపబడింది. మొదటి నుండి పడిపోయిన వారందరి విమోచన నిమిత్తం అదొక బహిరంగ సాక్ష్యంగా, అంతే కాదు నరకయాతనల నుండి, మరియు పాపము యొక్క శాపము నుండి ఆయన తన ప్రజలను విమోచించెను.

32

ఆమె ఇప్పుడు ఏదైతే పొందుకొన్నదో దానికంటే మరెక్కువగా ఆమెకి అవసరం లేదని ఆయనకి తెలుసును, అందుకే ఆయనిలా అన్నాడు, “మిమ్ములను అనాధలుగా విడువను. పరిశుద్ధాత్మ అను మరొక ఆదరణకర్తను ఆయన మీ కొరకు పంపునట్లు నేను మీ కొరకు తండ్రిని వేడుకొందును. ఆయన మీలో ఎల్లప్పుడు వుండును. కొద్దికాలం లోకము నన్ను చూడదు; కాని నేను పరలోకమునకు వెళ్ళుచుంటిని మరియు జరుగనట్లు చేయబడిన ఈ కార్యమును పొందుదును, మరియు యుగసమాప్తి వరకు మీతోను, మీలోను వుండుటకై నేను మరలా తిరిగి వత్తును.” నేను దానీ గురించే మాట్లాడుచున్నాను. మీరింకా వినుచున్నారా, అలాగైతే ఆమెన్ చెప్పండి. [సమాజము “ఆమెన్” చెప్పుచున్నది.] మంచిది. ఆయన మరలా తన బలప్రభావంతో తిరిగి వచ్చుచున్నాడనే సంగతిని నేను చెప్పుచున్నాను.

33

కాలాలు అలా దొర్లుతున్నవి, “ఓ ఆయన ఎవరు?” మై, ఈ ఉదయం, ఆరాధింపబడే ఏదో ఒక దానిని గూర్చి, అక్కడొక పశువుల తొట్టిని గురించి వారు తలంచుచున్నారు, లేదా కొండా... అటువంటి దానిని నేను తలంచట్లేదు. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో వున్న మహిమ నిరీక్షణయగు క్రీస్తును గూర్చి ఈ ఉదయకాలం నేను తలంచుచున్నాను. అది నిజం.

ఓ, లోకము చేత తృణీకరించబడెను. దేవుడెల్లప్పుడు లోకములోనికి వచ్చుచూనే వుండెను. ఆయన వచ్చినప్పుడు లోకము ఆయనను ద్వేషిస్తుంది. “నోవాహు దినములలో జరిగినట్టు, మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినములలో జరుగును.” మిత్రులారా, మనమిప్పుడు ఆ దినములో వున్నాము.

34

మరిప్పుడు గమనించండి, “కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను మీతోను, మీలోను యుగ సమాప్తి వరకు ఉ౦దును.” అది నిజం. ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నాడు. గతములో ఎలాగైతే ఆయన యొక్క గొప్ప చిత్రం త్రిప్పబడిందో మరియు అదే ఇప్పుడు కూడా జరగటమును మనం చూస్తున్నాము. గొప్ప నాటకము పెట్టబడింది, మరి గొప్ప కార్యాలు జరుగటమును మనం చూచుటకు మనమిప్పుడు సిద్దంగా వున్నాము.

ఉయ్యాల్లో నుండి సంఘము తీసికొనబడింది. అది నిజం. దూరానా అక్కడ పెంతెకోస్తులు దానిని కుదిపివేసారు, కొద్ది సంవత్సరాల క్రితం, వెనుక అక్కడ జనులు రాళ్ళు వేసి, హేళన చేసి, గేలిగా నవ్వారు, కాని ఇప్పుడు ఆమె పరిపక్వమునకు ఎదిగినది. అది నిశ్చయంగా వాస్తవం. గడియ ఇక్కడ ఇప్పుడున్నది. హల్లెలూయ. అది నిజం. నేను ఆసక్తి కలిగియున్నది. దానియందే, దేవుని సంఘము ఒక్కటిగా కూడి రావాలని చూడగోరుచున్నాను. మనం ఇప్పటి వరకు ఇక్కడ అక్కడ కొట్టబడ్డాము. కాని దేవుడు తన దుప్పటిని మన మీద వేసి, లోనికి మనల్ని చేర్చు గడియ వచ్చినది, ఎందుకనగా శత్రువు ద్వారము వద్ద ఉండెను, హల్లెలూయ, అవునయ్యా.

ఇప్పుడు ఆయన తన ప్రజల కొరకై నిలబడియున్నాడు. దానియేలు ఇలా చెప్పాడు, “అంత్యదినములలోని గొప్ప కార్యాలు, ఇవి నెరవేరటం ఆరంభమైనప్పుడు, మై, ప్రజలు గొప్పవాటిని జరిగించును, ఆ దినమందు విశ్వాస వీరులు చేయుదురు.”

35

గొప్ప నాటకం, కడవరి వర్షంను గూర్చి దేవుడిచ్చిన చిత్రం ఇప్పుడు వచ్చేసింది. యోవేలు ఇలా అన్నాడు, “అంత్యదినములయందు నా ఆత్మను సర్వశరీరుల మీద కుమ్మరించెదను, మీ కుమారులు మరియు కుమార్తెలు ప్రవచించెదరు. నా దాసుల మీదను, దాసురాండ్ర మీదను నేను నా ఆత్మను కుమ్మరించెదను. మరియు ఆకాశమందును భూమియందును మహాత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనబరిచెదను. యెహోవా యొక్క మహాదినము మరియు భయంకరమైన దినము రాకముందు, యెహోవా నామమును బట్టి ఆయనకి ప్రార్థన చేయువారందరు రక్షించబడుదురు.”

అక్కడ యేసు ఇలా చెప్పెను, “నేను చేయు కార్యములను మీరు కూడా చేయుదురు, వీటికంటే మరి గొప్పవి చేయుదురు, ఎందుకనగా నేను నా తండ్రియొద్దకు వెళ్ళుచున్నాను.” హల్లెలూయ. హల్లెలూయ. అక్కడ ఆయన ఏదైతే చెప్పాడో, అదే ఇక్కడ వున్నది. అక్కడ ఆయన చెప్పిన మాటయే ఇక్కడ వున్నది. “మీరు నాయందును, నా మాట మీయందు నిలిచియున్న యెడల, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడును.”

36

కొద్ది సంవత్సరాల క్రితం, ఈ చుట్టుప్రక్కల ప్రజలు ఇలా అన్నారు, “ఆ టాబర్నికల్ లో వున్న జనులు పరిశుద్ద-గుండ్రాళ్ళు. మీరంతా అది, ఇది ఏదేదో అయి వున్నారు. మీరు పిచ్చోళ్ళు!”

కాని, ఓ, మై, పరిశుద్ధాత్మ బాప్తీస్మము కొరకు ఆ బండపై నిలబడితిమి, అది నిజము, మరిప్పుడు సర్వశక్తి గల దేవుని శక్తి సంఘములో రూపించబడి, ముందుకి తీసికొని రాబడుతుంది. హల్లెలూయ. అంతటా సమస్తాన్ని దేవుడు కదిలించే కార్యాన్ని నేను చూడగోరుచున్నాను. సహోదరుడా, అది ఇదివరకే క్రియారూపము దాల్చినది. అది జరుగుచున్నది. అది నిజం.

37

ఆయనను గూర్చిన దైవత్వం, ఆయన ఎవరు? అక్కడ కొందరు ఆయన్ని ఒక చంటిబాలుడిని చేసి చూపిస్తున్నారు. అదృశ్యముగా ఆయన వేదిక మీద నిలిచి (ఓ, మై) తన చేతులను చాచి, ఇలా పలికి చెప్పెను, “వెలుగు కలుగును గాక,” వెంటనే వెలుగు కలిగెను. అది యేసుక్రీస్తుయే. “ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన ద్వారా కలిగెను, కాని లోకము ఆయనను ఎరుగకుండెను.” ఆయనే దేవుని యొక్క దైవత్వము. ఆ వెనుక ఆయనేమి చేసియుండెనో చూడుము. అక్కడ జరిగించిన అద్భుతాలను గూర్చి మాట్లాడుదుము, కేకలు గూర్చి నీవు మాట్లాడుతున్నావా? ఆయన ఆశ్చర్య కార్యములను జరిగించినప్పుడు, లేనివాటిని ఇప్పుడున్నట్టుగా వాటిని ఆయన చేసెను, ఆయన పలుకగా, అవి అక్కడ కలిగెను.

38

మరి అదే శక్తి, అదే క్రీస్తు... హల్లెలూయ. సాంప్రదాయవాదులు, దేవుని శక్తిని అంగీకరించనివారు తప్పు అని; లోకమును ఉనికిలోకి రమ్మని పలికిన అదే శక్తి, ఇప్పుడు పరిశుద్ధాత్మ నొందినవారిలో వున్నదని చెప్పాలి. అది నిజము. స్త్రీ, పురుషులారా మనం ఎవరిమి అనే దానిని కనుగొనే సమయమిదే. దయ్యము నిన్ను ఆ వెనుక దాచాలని, భయపెట్టాలని (మరుగు చేయాలని) ప్రయత్నించుచుండెను. కాని నీవు ఒప్పుకోవద్దు, బెదిరిపోకు, మరుగునపడకు. మీరు దేవునికి కుమారులును, కుమార్తెలునై యున్నారు. దైవత్వం పరలోకమందు లేదు, అది నీలో వున్నది. హల్లెలూయ.

నేను పిచ్చోడిని అని నీవు అనుకోవచ్చు కాని నీకో విషయం చెప్పనివ్వు, సహోదరుడా. సర్వశక్తిగల దేవుడు, అమర్త్యజీవము నీలో నివసించుచున్నదనే విషయాన్ని నీవు గుర్తించుము. “నా జీవము, (దేవుడు కలిగియున్న అదే జీవం) నీకిచ్చుచున్నాను,” దేవుని జీవం మానవునిలో వుండెను.

39

ఆయన ఆ వెనుక నిలబడియున్నాడు; సమస్తమునకు ఆయన సృష్టికర్త, ప్రాణులను ఆయన చేసెను, కప్పలు, ఓ, తేనెటీగలు, బాతులు, కోళ్ళు, జంతువులు, అన్నింటిని సృజించెను. “కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు.” ఎవరు ఆయన? క్రీస్తు దైవత్వము. “ఐగుప్తు దినాలలో ఆయన తెగుళ్లను తీసికొని వచ్చెను.” ఎవరు? క్రీస్తు. “సింహాల నోళ్ళను ఆయన మూసెను. అగ్ని బలమును ఆయన చల్లార్చెను. కత్తిపోటు నుండి వారు తప్పించుకొనిరి. సమాధిలో నుండి వారు మృతులను లేపిరి.” ఎవరు? క్రీస్తు. ఓ, మై, ఏమైయుండెను అది? ఆయన ఎవరై యుండెను? క్రీస్తు, దైవత్వము.

40

సహోదరుడా, సహోదరీ, ఆ దైవత్వము మీలో వున్నది. “కొంతకాలమైన తరువాత లోకము నన్ను ఎన్నడును చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను యుగసమాప్తి వరకు మీలోను, మీతోను ఉందును.” క్రీస్తు పశువుల తొట్టిలో ఉన్నాడా? లేదు. క్రీస్తు నీలో వున్నాడు. హల్లెలూయ. పశువుల తొట్టిలో వున్న క్రీస్తుని మనం ఆరాధించుటలేదు, కాని నీలో వున్న క్రీస్తుని, అనగా పరిశుద్ధాత్మను, నిరీక్షణజీవాన్ని (హల్లెలూయ.), సృష్టికర్తను, స్వయంగా మానవునిలో నివసించే దేవున్ని మనము ఆరాధిస్తున్నాము. “మనమిక ఏమవుదుమో అదింకా ప్రత్యక్షపరచబడలేదు, కాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనున్నట్లుగానే ఆయనను చూతుము.” ఏలయనగా మనం ఆయన వలె మార్పుచెందుతాము...?...ఆయనకి చోటు లేదు.

41

ఈ చుట్టున్న జనులు తాము క్రీస్తుకి చెందినవారమని, తాము వెళ్ళుచున్న సంఘము క్రీస్తుకి చెందినదని అంటు అనుచున్నారు, మరియు గత రాత్రి ఏం జరిగింది? వారు తమ క్రిస్మస్ బహుమానముల పెట్టెలను విప్పి చూసారు. తండ్రిది చూద్దాం; ఏమున్నాయో అందులో — క్రిస్మస్ చెట్టు క్రింద రాత్రి చాలామంది పురుషులు చేరి ఒక పెద్ద పెట్టి నిండా బీరు బాటిళ్ళు పెట్టిరి. యేసుకి చోటెక్కడిదండీ; చోటంతా బీర్లకే సరిపోయెను. ఇప్పుడు అమ్మ పెట్టె విప్పి చూద్దాం, అందులో పేకాట ముక్కలే వుండెను. క్రీస్తుకి చోటెక్కడిదండీ; కేవలం పేకాట ముక్కలే. అది నిజం. చిన్న బిడ్డలకి ఒక చిన్న బైబిల్ ఇచ్చటకు బదులుగా, కల్పిత కథల పుస్తకాలు అటువంటివి ఇచ్చుచుండిరి. యేసుకి చోటు లేదాయెను. సంఘమునకు వెళ్ళుటకు బదులు వారు వినోదపు ఆటలకి, నాట్యాలకి, అంతటికి వెళ్ళుచు తమ్మును తాము క్రైస్తవులుగా పిలుచుకొనుచుండిరి.

సహోదరుడా, దేవుని యొక్క దైవత్వం. పరిశుద్ధాత్మ ద్వారా మానవ హృదయాలలోనికి వచ్చినప్పుడు, అది సమస్తమును నీలో నుండి బయటకి పిలుస్తుంది, అది క్రీస్తువలన కలుగనిదానంతటిని బయటికి పంపివేయునని నీకు తెలుసా, అది నిజం.

42

ఓ, మహిమ నిరీక్షణయుగు క్రీస్తు నీలో ఉన్నాడు, పశువుల తొట్టిలో కాదండీ, నీలో వున్నాడు. ఒకప్పుడు; ఆరంభములో దేవుడు, ఆయన మోషేలోకి వచ్చాడు, ఇశ్రాయేలీయులలోకి వచ్చాడు, పశుపుల తొట్టిలోనికి వచ్చెను. కాని ఇప్పుడు వారు ఏదో పురాతన పద్ధతిలోనే ఆయనను ఆరాధింతురు, ఆయన నీలోవుండెననే దానినే వారు మనస్కరించరు. ఈ రోజు ఆయన ఇక్కడ ఉన్నాడు, దేవుని కుమారుడు కదులుచున్నాడు; ఆయన గొప్ప సంఘము కదులుచున్నది.

43

నేడు సంఘము సూప్ తో కూడిన విందుభోజనాలను, రకరకాల వంటలతో కూడిన భోజనాలను కలిగివుండెను, చూడండి, ఎవరు చక్కగా వస్త్రధారణ కలిగియున్నారు, ఆడంభరముతో మందిరానికి వెళ్ళటం, గొప్పల కొరకు వెళ్ళటం, ఎవరికి శ్రేష్టమైన చక్కని మందిరం, కూర్చోటానికి అతి శ్రేష్టమైన కుర్చీలు, ఎవరు చక్కని సంగీతం అందిస్తారు, అది ఇది చేస్తారు, మరియు స్థలము ఉండదు; ప్రార్ధన తప్ప అన్నీ చేస్తారు; వారు ఇక ఏ మాత్రము ప్రార్ధన చేయలేరు. వారు ప్రేమించలేరు — ఒకప్పటివలె దేవున్ని సేవించలేరు. “వసతి గృహములో (inn) ఆయనకి చోటు లేదు.” స్నేహితులారా, ఇది అంత్యకాలము. “వసతి గృహంలో ఆయనకి చోటులేదు.” నిజానికి వసతి గృహం అనేదానికి అర్థం ఏమిటో నాకు తెలియును, కాని నేను దాన్ని అంత్యకాలానికి అన్వయిస్తున్నాను.

“ఆ దినమున బాదము వృక్షము పువ్వులు పూయును, మనిషి కోరిక విఫలమగును; ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు పోవుచున్నాడు, మరియు వాని నిమిత్తం ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు; వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధారయొద్ద కుండ పగిలిపోవును,” అని బైబిల్ సెలవిచుచున్నది. ఓ, కృప, నా మిత్రుడా...

44

కాని ప్రవక్త ఇలా కూడా అనెను, “సాయంకాలమున వెలుగు కలుగును.” అది నిజం. నిశ్చయముగా మహిమకు మార్గమును నీవు కనుగొందుపు. అది వాస్తవం. సాయంకాల సమయం వచ్చింది. ఇప్పుడు సంఘము, ఒకప్పుడు పశువుల తొట్టిన అందంగా అలంకరించుచు వచ్చిన అనుభవాలలో నుండి ఇప్పుడు దైవత్వమును మరియు సర్వశక్తిగల దేవుని యొక్క బలప్రభావము మానవునిలో నివాసము చేయుచుండెననే చోటుకి అది వచ్చియున్నది,

45

ఓ, బ్రదర్, సిస్టర్, ఈ ఉదయకాలము యేసు నామములో నేను నీతో మాట్లాడనిమ్ము, మీరింకావి౦టూనే వున్నారుగా? [సమాజం “ఆమెన్” చెప్పుచున్నది.] ఓ, మై, ఇంకో సంగతి నన్ను చెప్పనివ్వండి.

స్త్రీ, పురుషులిద్దరు ఒకేలా వుండే సమయం వచ్చుచున్నది. వారు ఒకేలా వస్త్రధారణ చేస్తారు, ఎవరు మగ, ఎవరు ఆడ అని నీవు చెప్పలేవు. అది వాస్తవం. అవన్ని జరుగుతాయని బైబిల్ లో ముందే చెప్పబడింది. అది నిజం. అది సత్యమేనా? [సమాజం “ఆమెన్” చెప్పుచున్నది.] అది సత్యమేనా? [“ఆమెన్”] అవును, అది సత్యము. వారు ఒకేలా జీవిస్తారు, ఒకేలా కనబడతారు, హావభావాలు ఒకేలా చూపుతారు, ఒకేలా మాట్లాడుతారు అలావుందురని బైబిల్ సెలవిచ్చినది. ఆయన ఇలా సెలవిచ్చెను, “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును. మనుష్యులు దేవునికంటే సుఖానుభవములనెక్కువుగా ప్రేమించే స్వార్ధప్రియులగుదురు; అతిద్వేషులు, అపవాదకులు(నిందలు మోపేవారు).” అదిక్కడ వుందా? అది వాస్తవం.

46

ఓ, దేవునికే మహిమ. నా ఆత్మలో ఏదో దొర్లుచున్నట్టుగా నాకనిపిస్తుంది. ఓ, నేనిక్కడ బయట ప్రపంచాన్ని చూచినప్పుడు.. “నోవాహు దినములలో వున్నట్టే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినాలలో వుండుటను,” చూస్తున్నాను. ఆ దినాన కొంతమంది నమ్మకస్థులను నోవాహు కలిగియుండెను. అలాగే నేడు కూడా దేవుడు కొంతమంది నమ్మకస్థులను కలిగియున్నాడు. ఏర్పటు చేయబడిన ఈ గొప్ప నాటకం ప్రదర్శింపబడే గడియ వచ్చియున్నది,

స్త్రీ మరియు పురుషులారా, పరిశుద్ధాత్మ మీలో నివాసమున్నట్లైతే, పందొమ్మిదివందల సంవత్సరాల క్రితం పుట్టిన క్రీస్తు వయస్కుడాయెను. ఎన్నడూ ఆయన తొట్టిలో ఉండలేదు.

మరి నేడు, ఆయన పుట్టినరోజు యొక్క స్మారకదినాన, వారేమి చేస్తున్నారు? వారు కొన్ని చెట్లు కొట్టకొచ్చి నరికి, పిల్లల కొరకు క్రిస్మస్ చెట్లును తయారు చేస్తున్నారు? కాని వారు అనుకోను... అది పర్వాలేదండీ; వాటికి విరోధంగా నేను చెప్పుటలేదు. అయితే అసలు సంగతేంటంటే, క్రీస్తు కంటే ఎక్కువగా వారు క్రిస్మస్ చెట్టు మీదనే శ్రద్ధ పెడుతున్నారు.

47

క్రిస్ క్రింగిల్స్ అనువాడే దేశమంతా వినబడుతున్నాడు. ఎవడతడు? ఒక జర్మనీవాడు, కొన్నేళ్ళ క్రితం ఉండిన ఒక పరిశుద్దుడు, అందరికి మంచి చేసిన ఒక వృద్దుడు. అయితే నేడు అది ఇంచుమించు ఒక ఆరాధనలా మారిపోయింది. అది నిజం. చిన్నపిల్లలకి అవి చెప్పటం వరకైతే సబబే, లేదా నీవేం చెయ్యాలనుకొంటున్నావో నాకు తెలిసినంతమట్టుకు అది సరేనని నాకనిపిస్తుంది. అయితే దానిలో నీవు ఒక విషయం గమనించాలి, అదేమంటే ఇలా చేస్తూ చేస్తూంటే రానురాను అదొక ఆచారముగా మారే ప్రమాదముంది, క్రీస్తుని, క్రీస్తు యొక్క ప్రాధమిక సంగతులను, క్రిస్మస్ యొక్క నిజమైన ఉదేశ్యాన్ని ప్రక్కకు నెట్టే ప్రమాదముంది. నిజ క్రిస్మస్ స్థానాన్ని క్రిస్ క్రింగిల్స్ భర్తీ చేస్తాడు; “ఆ వసతి గృహములో ఆయనకు చోటు లేకపోయెను.”

మనకి సమయమున్నట్లైతే, దానంతటిని చక్కగా చెప్పుకోవచ్చును. ఇప్పటికే ఆలస్యమైందని నాకు తెలుసు. ఆలస్యమైపోతుంది.

48

కాని మిత్రులారా చూడండి, గడియ వచ్చియున్నది, ఇప్పుడది ఇచ్చటే వున్నది, దేవుని యొక్క గొప్ప నాటకము మనగుండా ఇప్పుడు రంగము మీద కదలాడుచున్నది. పశువుల తొట్టిలో వున్న దేవుని కుమారుడు ఇప్పుడు హృదయంలో వున్నాడు. ఆయనే దేవుని యొక్క దైవత్వం. ఆయనే సృష్టికర్త దేవుడు. ఆయన చెప్పెను, సమస్తము... “ఆయన లోకములో వుండెను, లోకము ఆయన ద్వారానే కలిగెను, అయితే ఆ లోకము ఆయనను ఎరుగకుండెను.”

మరి నేడు సంఘంలో వుండిన సంగతంతా అదేనండీ. మహిమ నిరీక్షణ, పరిశుద్ధాత్మ బాప్తీస్మము ప్రజల హృదయాలలోనికి వచ్చియున్నది, కాని అవేమిటో జనులు గుర్తించలేకున్నారు. అది సంఘములో చేరుట లాంటిదని, మరలాంటిది ఎదో అని వారనుకొనుచున్నారు.

49

కాని అది దేవుడే, సృష్టికర్త, నీలో నివసించుచూ, నీకు సమస్త శక్తినిచ్చుచున్నాడు. ఆయన కలిగియున్న సమస్తము నీ స్వాధీనలో ఉన్నది. కావున చెడు నుండి దూరమునకు, మంచి చేయుటకు, దుష్టత్వమును అసహ్యించుకొనుటకు, నీతియొద్దకు పరుగెత్తుటకు, శోధన నుండి మళ్ళుటకు అనునవి నీలో వున్నవి. సమస్త దుర్భిద్ధి, ద్వేషభావం, కలహాం, అసూయి అనేవి దానినుండి నిన్ను తప్పివేస్తాయి. అవన్నీ నీ నుండి ఆయన తీసివేయును. నీవాయనను స్వీకరించినట్లయితే, ఆయన్ని హత్తుకొని మరియు ఆయన్ని ప్రేమించి, నీ హృదయంలో ఆయన్ని గట్టిగా పట్టుకో మరియు ఆయన్ని ప్రేమించు. అలాంటి ప్రేమలో సంఘమంతా కలిసివస్తే, ఆకాశములను మూయవచ్చు, రోగులను స్వస్థపర్చవచ్చు, గ్రుడ్డివారి కళ్ళు తెరువవచ్చు, (హల్లెలూయ), చెవిటివారు మాట్లాడగలరు — మూగవారు మాట్లాడుదురు, మరియు చెవిటివారు విందురు, కుంటివారు నడుతురు, గ్రుడ్డివారు చూతురు. ఎందుకని? నీ హృదయములో వున్న సర్వశక్తి గల దేవుని బలప్రబావమేనని నీవు గుర్తించగలవు. ఆయన అక్కడ వున్నాడు, దైవత్వము.

మీరాయనను ప్రేమించుచున్నరా? [సంఘము “ఆమెన్,” చెప్పుచున్నది.] ఆ కవి దానిని చెప్పుటలో ఆశ్చర్యమే లేదు:

అద్భుతమైన కృప! మధురమైన స్వరం,

నా వంటి పాపిని రక్షించెను!

ఒకప్పుడు నేను నశించితిని, కానిప్పుడు కనుగొనబడితిని,

ఒకప్పుడు గ్రుడ్డివాడిని, కానిప్పుడు చూచుచున్నాను.

50

ప్రియ సహోదరుడా, సహోదరీ, ఈ ఉదయకాలము మీరు పరిశుద్ధాత్మ బాప్తీస్మమును పొందనట్లైతే, మీకు వీలైనంత త్వరగా దేవుని రాజ్యములోనికి పరుగిడి రండి. ముద్రించే సమయం అందుబాటులో వుంది. శత్రువు వరదవలే పోటెత్తి వచ్చినా, ఆయన మన కొరకు దానికి విరోధముగా ఒక ద్వజమును ఎత్తును. నాటకము మొదలైనది; నిశ్చయంగా సంఘము గృహమునకు వెళ్ళుచున్నది. చూచారా? వేచియుండుటకు నీ దగ్గర ఎక్కువ మార్గాలు లేవు, మిత్రుడా. వేచియుండుటకు కావలిసిన సమయము నీ దగ్గర లేదు. నీవు ఇప్పుడు వచ్చుట మంచిది. దానిని నీవు ఈ రోజునే చేయుట మంచిది. (అది నిజము.), నేడు అనేది నీకు అందుబాటులో వున్నప్పుడే. ఇప్పుడే త్వరపడుము.

గుర్తుంచుకోండి, మిత్రులారా, అది వింతగా అనిపించవచ్చును. లోకములో ఎన్నడు, క్రీస్తు యొక్క మతము ఎన్నడు ప్రసిద్ధిగాంచలేదు; అదెల్లప్పుడు అప్రసిద్దమైనదే, దేవుని మార్గములు కొరగానివిగా జనులకి అగపడును, ఎందుకనగా ఈ లోకాధిపతి, ఆకాశమండలపు అధిపతి అపవాది కనుక. సమస్త ప్రభుత్వాలు వాడి నియంత్రణలో వున్నవి. బైబిల్ చెప్పినదాని ప్రకారం ప్రతీ ప్రభుత్వం అపవాది స్వాదీనంలో వుండి నడిపించబడుచుండెను. అది నిజం. అతడే అన్ని ప్రభుత్వాలను తన నియంత్రణలో వుంచుకొనెను.

51

అంతట బైబిల్ ఇలా చెప్పినది, “పరిశుద్ధ దూతలారా, భూమ్మీదున్న పరిశుద్ధులారా, మీరందరు ఆనందించుడి, ఎందుకనగా ఈ లోకరాజ్యములన్ని మన దేవుని రాజ్యమాయెను, మరియు ఆయన క్రీస్తు రాజ్యమాయెను, మరియు వారు — ఆయన ఏలుబడి చేయును.”

అపవాది ఎత్తైన పర్వత శిఖరము మీదికి యేసుని కొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటిని ఆయనకి చూపించి, “ఇవన్నీ నావశములో వున్నవి, వీటిని నీకిచ్చెదను,” అనెను.

అందుకు యేసు, “సాతానా నా వెనక్కి పొమ్ము” అని గద్దించెను. అది వాస్తవము. ఆయన దేనిని పట్టించుకోలేదు...

“నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను నా దూతల సైన్యమును పిలుచుదును వారు వచ్చి పోరాడుదురు, నా రాజ్యము పరసంబంధమైనది,” అని ఆయన పలికెను. మరియు ఆయన అన్నాడు, “దేవుని రాజ్యము మీ మీలోనే,” వున్నది. కావున సైన్యము మరియు శక్తులు, పరిశుద్ధ దూతల ప్రోత్సాహాం (హల్లెలూయా.) నీలో వున్నది, అంతయు ఆ ఉదయకాలం క్రీస్తు దైవత్వమును బట్టి, పరిశుద్ధాత్మ బాప్తీస్మమును బట్టి నీలో వుండెను. అవునయ్యా.

52

ఈ ఉదయమును నీవు ఎవరివి? క్రీస్తు యేసు ఎవరు? నీవు ఆయనను అనుమతించే కొలదిగా ఆయన నీలో వుండును. ఈ రోజు ఆయన నీలోకి వచ్చి, నీలో కదలాడుటకు ఆయన ప్రయత్నిము చేయుచున్నాడు. అయితే నీవువున్న చోట నిలబడి, ఆశ్చర్యపడుచు, చూస్తూ, తదేకంగా చూస్తూ, కొద్దిగా వెనుక్కి జరుగుచున్నావు. దానిని నీవు చేయవద్దు. దేవుని రాజ్యములోనికి తిన్నగా కదిలిపొమ్ము. ఇదే ఆ సమయం. హల్లెలూయ.

ఓ, నేను ఎంతగా ఆయనను ప్రేమించుచున్నాను. ఈ దినాలలో ఒక దినాన ఆయన రానైయున్నాడు. నేనాయనను చూడగోరుచున్నాను. మీకు లేదా ఆశ? నేనాయనను చూడగోరుచున్నాను. మనమాయనను చూస్తామని నేను నమ్ముచున్నాను. మీరు. నమ్ముదురా? ఇప్పుడు ఆయన ఇక్కడ వున్నాడు. ఆయన శక్తి కదులుచున్నది.

ప్రజలు ఏడ్చునట్లు, కేకలువేయునట్లు, అలా చేయునట్లు ఏం చేస్తుంది? సంగతేంటి? పరిశుద్ధాత్మ వారిలో వుండి కదులుచుండెను? వారు దానిని గుర్తిస్తే, ఆయనను హత్తుకొనుము, పరిశుద్ధాత్మను హత్తుకొనుము, ఆయనను నమ్ముము, కౌగిటిలోకి ఆయనను చేర్చుకొనుము. సత్యముగా బ్రతుకుము; ఆయనను ఆటంకపర్చే దేనిని చేయకుము. “ఓ, ప్రభువైన యేసు, నీవు నాకు కావాలి. నీవు నా ప్రక్కన నిలబడాలని నేను కోరుచున్నాను, తండ్రీ, నీ పక్షాన నేను నిలబడగోరుచున్నాను,” అని చెప్పుము. నీవు దానిని చేస్తున్నట్లైతే, ఆయన నీలోనికి వచ్చుటకు ప్రయత్నము చేయుచున్నాడు. ఆయన నీలో వుండగోరుచున్నాడు. అన్నివేళలయందు, ఆయన నిన్ను తనవైపు త్రిప్పుకోనుటకు ప్రయత్నము చేయుచున్నాడు.

53

ఇప్పుడు, మిత్రులారా, అది సత్యముగా ఉండెనని నేనెరుగుదును. నీవెవరో అనే సంగతిని జనులు గుర్తించలేదని నేనెరుగుదును. ఇక్కడున్న ప్రతి వ్యక్తి పాపమునకు పైగా జీవించగలడు. పాపము లేకుండా జీవించగలడు, దేవునిలో జీవించగలడు; నీవు పొరపొట్లు చేస్తావు, కాని క్రీస్తు రక్తము నిన్ను క్షమించును. “తండ్రి, వారిని క్షమించుము, వారేమి చేస్తున్నారో వారెరుగరు.” అది నిజమేనా? కల్వరి సిలువలో వ్రేలాడిన క్రీస్తు యొక్క శక్తి పునరుత్థాన దినమందు లేపిన, అదే దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన నీలో వున్నాడు. ఓ, మీరాయిసను ప్రేమించరా? ఓ, మై. నేడు ఆయన పిలిచే స్వరాన్ని వినుము.

ఆయన్ని నీ గుండెలో హత్తుకొనుము, నీ రొమ్మునకు అతి సమీపముగా ఆయనను తీసికొనుము ఇలా చెప్పుము, “ఇప్పుడు, ప్రభువైన యేసు, ఈ క్రిస్మస్ నాడు నీవెవరివో అనే దానిని గుర్తించితిని, కావున నిన్ను గూర్చిన ఆలోచన ధోరణిలో నాకు కొంతమార్పు కలిగినది. ఒకప్పుడు నిన్ను ఒక పశువుల తొట్టిలో పరుండిన చంటిబాలునిగా ఆరాధించితిని. పందొమ్మిది వందల సంవత్సరాల క్రితం నిన్ను ఒక చంటిబాలునిగా నేను చూచి ఇలా అనుకొన్నాను. ”ఓ నేను యెరూషలేము వెళ్ళ గలిగినట్లైతే బాగుండును.“

54

నేడు, వారు వెళ్ళుచున్నారు, ప్రతీ ఒక్కటి ఆ పశువుల తొట్టి యొద్దకు వెళ్ళుచుండెను, ఆయన జన్మించిన చోటుకి అనగా, ఆ పశువుల తొట్టి యొద్దకి వెళ్ళుచుండిరి. కాని మిత్రులారా, అక్కడ ఆయన జన్మించిన చోటు దగ్గర ఏమిలేదు, ఇదిగో ఇక్కడే ఆయన పుట్టిన ఇక్కడే అంతా వుంది. మనలో ప్రతిఒక్కరి దగ్గరకి దేవుడు ఆయనను తీసికొని వచ్చాను, ఆయన సజీవునిగా మనలో ప్రతి ఒక్కరిలో జీవించుచుండెను. ఓ, సృష్టికర్త, లోకములో వున్నదంతటిని సృజించినవాడు, ఆకాశములను సృజించినవాడు, భూమిని కలుగజేసినవాడు, నరుని కలుగజేసినవాడు, నేడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము నొందిన ప్రతి ఒక్కరిలో ఇప్పుడు వున్నాడు. అది సంగతి. అది రహస్యం. మరియు ఆయనే పరిశుద్ధాత్మ, ఆయన నీలో వున్నాడు; ఆయనే మహిమ నిరీక్షిణ.

55

మరి ఇక్కడ చూడండి, పాతనిబంధనలో ఒప్పందం అనే దానిని చూడండి, చాలాసార్లు నేను దీని గూర్చి చెప్పాను. ఒక ఒప్పందం చేయబడినప్పుడు, అది (పత్రము) రెండు ముక్కలుగా ఆ మృత జంతు దేహముపై చింపబడును. ఆ రెండు ఒప్పందాలు ఒక దగ్గరికి వచ్చినప్పుడు, ఆ ఒడంబడిక ఒకదానికొకటి సరిపోవాలి.

మరి నేడు, దేవుడొక ఒడింబడికను చేసియున్నాడు. నీవు మంచివాడివి కాదండి, సంఘములో నీవు చేరినందున కాదండీ, సమాజంలో ఒక మంచి హోదా వున్నందున కాదండీ, నీవొక శుద్ద జీవితం జీవించినందున, నీవెంతో మంచివాడివివై వుండొచ్చును, అనుదినము నీవు చర్చీకి వెళ్ళవచ్చును, అనుదినం నీవు అర్పణలు అర్పించవచ్చును, నీకున్న ధనంలో కొంతభాగం ఇవ్వవచ్చును. లోకపాపములన్ని నీవు త్యజించవచ్చును, అన్నీ చేయవచ్చును, నీవు వుండగలిగినంత నమ్మకముగా, యదార్థముగాసు నీవు వుండవచ్చును. అయినప్పటికి తూర్పుకి పడమర వున్నంత దూరాన నీవు పరలోకాన్ని చేరుటను తప్పిపోవచ్చును, అది నిజం. మంచితనమును బట్టి మనం రక్షించబడలేదు, కాని దేవుడు తనకి కుమారులుగా కుమార్తెలుగా చేయుటకే ఆయన తన కృపాకనికరమును బట్టి మనల్ని కొనెను. దేవుని ఆత్మయే వారిని అలా చేయును. ఒకవేళ దేవుడు అలా కాకపోతే, ఆయన పరిశుద్ధాత్మను కూడా పంపియుండేవాడు కాడు సుమా, ఏ విధముగా పరిశుద్ధాత్మ సంపూర్ణముగా... లేదా ఒడంబడిక అనేది ఏ విధంగా సంపూర్ణమవ్వగలదు? యేసు అన్నాడు, “నేను

వెళ్ళుచున్నాను, అయినను తిరిగి వత్తును, మీతోను, మీలోను వుందును. పరిశుద్ధాత్మను మీకివ్వమని తండ్రిని వేడుకొందును. ఆయన మీకు ఇచ్చును. ఆయన వచ్చి మీతో సదా కాలము వుండును.“

56

సంఘము యొక్క పుస్తకాలలో తమ పేర్లును ప్రజలు నమోదు చేసికొంటున్నారు. క్రిస్మస్ పండుగ రోజున కొత్త పేజీ తిప్పుటకు ప్రయత్నించెదరు, సంఘములోకి నడిచి వచ్చి, అక్కడున్న పశువుల తొట్టికి (కప్పము) చెల్లించ ప్రయత్నిస్తున్నారు. పరిశుద్ధాత్మ అంతటా సంచరిస్తూ, కనుగొనుటకు ప్రయత్నిస్తున్నది....?... మరియు దేవుని వాక్యము. మరియు వారు ఎంతో గ్రుడ్డివారై, అక్కడికి నడిచి వచ్చి, “మంచిది, వారొక పరిశుద్ద గుండ్రాళ్ళు,” అందురు. సరిగ్గా నోవాహు దినములలో వున్నట్లే ఇప్పుడును పుండెను.

దేవుని కుమారుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉన్నది. అది నిజం. పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే శక్తిని నింపుకొందురో, ఎవరైతే తమలో అక్షయ జీవాన్ని, పరిశుద్ధాత్మను తమలో కలిగి జీవించుచుందురో, అట్టివారే ఎంతో నిశ్చయంగా ఇక్కడి నుండి కొనిపోబడుదురు.

నోవాహు దినాలలో నీటిపై తేలాడిన ఆ చిన్న పురాతన ఓడను గూర్చి మరో సంగతి వున్నది. పై నుండి అది పొందుకొను శక్తి, దాని నేరుగా పై భాగాన వుండెను, అది పరలోకము నుండి దిగి వచ్చి, ఆ పైన నిలిచిన దేవుని మహిమైయుండెను.

57

మిత్రులారా, నేడు నేను చెప్పే మాటను వినుడి. అదేమనగా ఆకర్షించే ఒక శక్తి వున్నది. అది సంఘంలో నుండి వచ్చేది కాదండీ, పాస్టర్ నుండి వచ్చేది కాదండీ, కాని అది మహిమలో నుండి. సరైన విధానములో దిగివచ్చుచున్న పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము నుండి వచ్చి, సంఘాన్ని ఆకర్షిస్తుంది. ఏమిటది? అది దేవుని శక్తి, ఆయన కలిగియున్న అదే జీవాన్ని (Zoe) పొందే ఏకైక ప్రవేశమది.

“నేను చేయు ఈ క్రియలను మీరు కూడా చేసెదరు; అంతే కాదు వీటికంటే ఎక్కువైనవే చేయుదురు.” ఆయన హింసనొంది, నవ్వులపాలై, హేళనలు పొంది, చనిపోయి, సమాది చేయబడెను. అయితే ఆయన సత్యమైయుండెను; ఆయన తన యందు దేవుని ఆత్మను కలిగియుండెను, మరియు దేవుడాయనను మరణములో నుండి లేపియున్నాడు. మనము అదే త్రోవలో వెళ్ళినట్లయితే, సరిగ్గా అదే రీతిన బయటకి వస్తాము. ఓ, హల్లెలూయ. నేనాయనను ప్రేమించుచున్నాను.

58

నా మాటలు వింటున్నారా? [సమాజము “ఆమెన్,” చెప్పుచున్నది.] మీరాయనను ప్రేమించుచున్నారా? మీ పూర్ణహృదయముతో ఆయనను మీరు ప్రేమించుచున్నారా? ఆయన అద్బుతమైనవాడు కాదంటారా? ఓ, మై.

దేవుని వాక్యములో నమోదు చేయబడిన కార్యాలు, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు;

ఆయన అద్భుతకరుడు, అద్బుతకరుడు...

మన శిరములు వంచుదాము.

59

పరలోకపు తండ్రీ, ఓ యేసూ, గొప్ప గడియ కొరకు నేను ఎదురుచూస్తున్నాను, అది వచ్చుటను నేను చూస్తున్నాను. ఇంకెక్కడ ఏ రకమైన నీరీక్షణలుండుటను నేను చూచుటలేదు. కాలము అయిపోవుచుండుటను నేను చూస్తున్నాను. కమ్యునిజం అనే ఆ గొప్ప ఎర్రని దీపకాంతులు ప్రపంచమంతా అలుముకొనుటను నేను చూస్తున్నాను. మీ యొక్క సంఘమునకు వ్యతిరేకంగా నామకార్థ సంఘాలు నిలబడుటను నేను చూస్తున్నాను, వారు నీవారిని ఖండించుచూ ఇలా అనుచున్నారు, “దైవీక స్వస్థత తప్పు. అదంతా పెద్ద మూఢత్వము.” దీనంతటిని ఆపివేయుటకు వైట్-హౌస్ లో ఒక బిల్లును కూడా ప్రవేశపెటబడెను...

ఓ, కాని, దేవా, ఒకనాడు అక్కడ వుండి ఆ పరిశుద్ద ప్రజలను చూస్తు వారంతా దేవుని శక్తి ద్వారా ప్రకాశిస్తూ, వారి ముఖల మీదున్న దానిని చూస్తూ దేవుని మహిమను చూస్తువుందును మండుచున్న అగ్నిగుండములోనికి పోయిన హెబ్రీ పిల్లవలె వారుండిరి. “మేమెన్నడు తలవంచము. లేదు. మమ్మును విడిపించుటకు మా దేవుడు సమర్థుడు. ప్రభువైన యేసు నీవు త్వరగా వచ్చెదవు.”

“జనులు పైకి భక్తిగలవారివలే కనబడుదురు, కాని దేవుని శక్తిని ఆశ్రయించకుండా వుందురు: ఇట్టివారికి విముఖుడవైయుండుము,” అనే ఒక గడియ వచ్చుటను నేను చూస్తున్నాను. చివరి దినాలలో ఆత్మ మాట్లాడుచుండునని నీవు చెప్పితివి. సరిగ్గా మేమిప్పుడు ఆ దినమందే యున్నాము.

60

నిన్ను ప్రేమిస్తున్నారని నేను నమ్ముచున్న, నా చిన్ని సంఘము, స్త్రీ మరియు పురుషులు ఇప్పుడు ఇక్కడ కూర్చొనియున్నారు. ఎన్నో దినాల క్రితమే తమ హృదయాలలో పరిశుద్ధాత్మను పొందుకొనిన వారు ఇంకా లోతులోనికి వెళ్ళునట్లు చేయమని నేను ప్రార్థించుచున్నాను. వారు ప్రతివిధమగు దుష్టత్వము, ప్రతి వీధమగు కలహములను, నీకు ఇష్టములేని ప్రతిదానిని నేడు విడిచి వాటిలో నుండి బయటకి కదిలిపోవుదురు గాక. పశులతొట్టి యొద్దకు కాక, కల్వరి తట్టుకి వారు కదులుదురు గాక; పూర్తిగా కల్వరి వైపుకు కాక, క్రీస్తు యొద్దకు, అనగా మహిమ నిరీక్షణయగు దేవుని దైవత్వమగు, దేవుని యొక్క శోభయగు, మన హృదయాలలో ఇప్పుడున్న దేవుని శక్తియగు, లోక సంబంధమగు విషయాలలో నుండి మనల్ని బయటకి లాగుచూ ఒక దినాన మనల్ని ఈ భూమిమీద నుండి బయటకి తీసి ఒకే శ్రేష్ఠమగు దేశానికి మనల్ని తీసికెళ్ళువాడగు క్రీస్తు వైపుకి మమ్మును కదిలించుము. దేవా, దానిని నేడు అనుగ్రహించుము. నీ సేవకుని ప్రార్థనాలకింపుము, మరియు నీ ప్రజలతో మాట్లాడుము.

ఇక్కడ ఎవరైనా నశించినవారు ఉన్నట్లైతే, ఎవరైనా పరిశుద్ధాత్మ లేకున్నట్లైతే, అట్టివారు ఈ ఉదయకాలం నిన్ను స్వీకరించుదురు గాక. ప్రియదేవా, దానిని అనుగ్రహించండి, ఎందుకనగా దానంతటిని మేము నీ ప్రియకుమారుడగు యేసు నామమున అడుగుచున్నాము, పందొమ్మిదివందల సంవత్సరాల క్రితం ఆయన ఒక పశువుల తొట్టిలో జన్మించియుండెను, మా పాపముల కొరకు ముప్పై-మూడు సంవత్సరముల తర్వాత కల్వరియొద్ద ఆయన చనిపోయెను. కొన్ని దీనాల తర్వాత, నలబై దినాల తర్వాత ఆయన ఆరోహణమయ్యెను. ఆయన పరమునకు చేరెను, అటు తర్వాత పది దినములకి పరిశుద్ధాత్మ శక్తితో దిగివచ్చెను, ఇప్పుడు సంఘములో జీవించుచుండెను. ఆయనను మృతులలో నుండి లేపిన అదే పరిశుద్ధాత్మ శక్తితో సంఘమునకు బయటకి ఈ భూమీ మీద నుండి అతి శీఘ్రముగా తీసికొనబోవుచున్నాడాయన. ఓ దేవా, నీవు వచ్చి సంఘమును రక్షింపుము, నీవు వచ్చెదవా? ఆయన నామములో మేము ప్రార్థించుచున్నాము.

61

మనము ఈ విధముగానే శిరములు వంచియుండగా, “నేడే పిలుచుచున్నాడు,” అను పాటను పాడుదాం. ఇక్కడ ఎవరైనా క్రీస్తు లేకుండా, దేవుడు లేకుండా, నిరీక్షిణ లేకుండా వున్నారా? అట్టివారు దయచేసి ముందుకి రాగలరా?

నేడే పిలుచుచున్నాడు!

నేడే పిలుచుచున్నాడు!

యేసు పిలుచుచున్నాడు,

మృదుగా నేడు ఆయన పిలుచుచున్నాడు.

నేడే పిలుచుచున్నాడు!

నీవు దేవుడులేకుండా, నిరీక్షణ లేకుండా, క్రీస్తు లేకుండా వున్నావా?

పూర్తి దేవుని వాక్యామును సారమగు జీవితాన్ని మీరింకా పొందుకోలేదని క్రైస్తవులారా మీరు గుర్తించారా?

మీరు ముందుకు రాలేరా?

...దూరంగా అవతలికి?

ఆయన పిలుచుచున్నాడు!

నేడే (ఆయన) పిలుచుచున్నాడు,

నేడే పిలుచుచున్నాడు!

యేసు నేడే పిలుచుచున్నాడు

మృదువుగా నేడు ఆయన పిలుచుచున్నాడు.

62

వినండి. తండ్రి ఇక్కడ వున్నాడు మరియు ఆయన నిన్ను రక్షింపగోరుచున్నాడు. నీవు ఒకవేళ ఇంకా రక్షింపబడకపోతే, మీరు రక్షింపబడలేదని నాకు తెలుసు. కాని మిత్రులారా వినండి, మీరు ఇంకా ఆ విధంగా నిలబడియుండగానే, నేనోక దానిని మీ కొరకు చేయగోరుచున్నాను. మీరంతా అలానే కండ్లు మూసుకోవాలని నేను కోరుచున్నాను. ఇక్కడ నేను తెరను దించగోరుచున్నాను, తద్వారా మిమ్మును మరో దానిని చూచునట్లు చేయగోరుదును. ఆమె ఆ పాటకి సంగీతం అందించుచుండగా, ఈ ఉదయం మనం ఒక చిన్న యాత్రా దర్శనం చేయబోవుచున్నాము. ఈ టాబర్నికల్లో కూర్చొనియున్న యవ్వనుల కొరకు, వృద్దుల కొరకు మరియు అందరి కొరకు నేను తెరను దించబోవుచున్నాను.

ఈ ఉదయకాలాన కొద్దిసేపు పాతాళపు ద్వారములలోకి నేను చూడబోవుచున్నాను. రాబోవుచున్నది క్రిస్మస్ కాలమన దిగువున వున్నవారికి తెలుసు. క్రిస్మస్ కాలమందు వారేమి చేసారో వారు ఎరుగుదురు. వారిలో కొందరు మద్యంతో మత్తులైరి, కొందరు కలియతిరిగారు, కొందరు చర్చిలో వుండిరి, కొందరు హేళనచేసిరి, కొందరు హాస్యం చేసిరి. ఈ ఉదయకాలం వీరంతా ఆస్తిపంజర రూపమున ప్రాకుకొంటూ ఈ మందిర తలుపు దగ్గరకి వచ్చారనుకోండి, ఏం అగును? మీకు తెలుసా, మరుసటి క్రిస్మస్ కి బహుశ మీరందురేమో.

ఇప్పుడు, గుర్తుంచుకోండి, నీవు మానవ ఆత్మలతో వ్యవహరించుచున్నావు, ఆత్మీయ సంగతులతో నీవు వ్యవహరించుచున్నావు. మీలో ప్రతి ఒక్కరు తీర్పు దీనాన లెక్క అప్పగించవల్సి వుంది. నేను కేవలం యదార్థముగా ఉండగోరుచున్నాను. ఈ ఉదయమున నీవు ఇంకా క్రీస్తును చేర్చుకోకపోతే, ఆయన నీ కొరకు తెరువబడిన ద్వారము యొద్ద నిలబడియున్నాడని మాత్రమే నేను చెప్పగలను...?...

63

పరిశుద్ధాత్మను పొందిన మీరు, మీరు జరిగించిన కార్యముల నిమిత్తం మీరు తీర్పు తీర్చబడబోవుదురని గుర్తుంచుకోండి. పరిశుద్ధాత్మ ద్వారా నీవు క్రీస్తుని చేర్చుకొని యుండొచ్చును, అయినను నీవు ఖండించబడుదువు. తన దేహమందు జరిగించిన ప్రతిదాని కొరకు ప్రతీమనిషి తీర్పు తీర్చబడును. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత దానితో నీవు ఏం చేసావు? నీవు నీ పొరుగు వారితో మాట్లాడితివా? నీవు తప్పులను జరిగించితివా? నీకు గుర్తుంటే, నేనిప్పుడే జీవితాన్ని క్రొత్తగా ఆరంభింతును, ఇలా చెప్తాను, “ప్రభువైన యేసూ, నేటి నుండి నీవు నన్ను ఎలా వుండమంటే నేను అలా ఉండెదను. నా దేహమందు దేవుని యొక్క అక్షయభాగం, దేవుని ఆత్మ నివసించుచుండెనని నేను గుర్తించాను. మరి నేనింత వరకు తప్పులో వున్నట్లేతే, నన్ను ఇప్పుడే క్షమించుము. నేను ఇంటికి రాగోరుచున్నాను. నేను ఇంకా మెరుగవ్వ కోరుచున్నాను. ఈ ఉదయకాలము ఆ విధంగానే అక్కడ ఆయన్ని రుజువుపర్చుము. వెనుకవున్న నీవు అలానే నీ చేయి పైకెత్తి, ఇలా చెప్పుము, ”నేటి నుండి నూతనంగా నేను ఆరంభించగోరుచున్నాను, సహోదరుడా బ్రెన్హాం.“ దేవును నిన్ను దీవించును గాక. నేను కూడా నా చేతిని పైకెత్తుచున్నాను, మీకు తెలుసా; నేను కొత్తగా ఆరంభించ కోరుదును. ఇది వరకు చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా నేనాయన కొరకు చేయగోరుచున్నాను. నీవు కూడా...?..

64

ఒకసారి నేను ఎన్నడు విననంత విచారకరమగు సంఘటనను వింటిని. ఒక యవ్వన స్త్రీ వుండెను. ఆమె నేటి తరము స్త్రీ. ఆమె ఒక చక్కని గృహములో వుంది. క్రీస్తుని గూర్చి ఆమెతో నేను మాట్లాడాను, ఆమె తండ్రి ఇలా చెప్పాడు, “నేను ఆమెతో నివసించుటలేదు.” ఎందుకనగా ఆమె చనిపోవుచున్నది. ఆమె ఒక రకపు ఉన్నత తరగతి ప్రజలను కలువబోవుచున్నది, ఎందుకనగా ఆమె... ఇప్పుడు, గుర్తుంచుకొనండి, అలక్ష్యము చేయబడి, ఆమె తనను తాను “వెర్రి” అను మనుష్యునితో ఉండలేకపోయెను. కాని ఆమెకు శ్రేష్టమైన విద్య వున్నది. సమాజంతో వెళ్ళుటకు ఆమె ఒక మార్పు కొరకు సిద్దపడి యుండగా, మనుష్యలలో వున్న వివిధ రకాల తరగతి ప్రజలతో మమేకమై పోవుచుండగా, ఏదోరూపేనా మరణం ఆమెను కబళించెను. ఆమెకి గుండెపోటు వచ్చినది. తాను నేర్చుకొన్న తర్పీదంతా తనకి ఏ మంచి చేయలేకపోయెను; మరి ఆమె ఎక్కడికో వెళ్ళిపోయినది.

ఏ దారిలో నీవు ఈ ఉదయం వెళ్ళుచున్నావు? దేనికొరకు నీవు కలలుగనుచున్నావు? మీలో ప్రతి ఒక్కరు ఏ గుంపునకు చెందినవారో నాకవసరం లేదు. ఈ దినాలలో నీవు ఒక దినాన నిత్యత్వము అనే దానికి వెళ్ళబోవుచున్నావు. క్రీస్తు లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా నీ ఆత్మ నశించిపోవును. దానిని గుర్తుపెట్టుకో.

65

కేవలము క్రీస్తుని స్వీకరించుట ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, నీవు రక్షిపబడులేవు. ఆయన నీలో వుంటే, ఆయనే దేవుని శక్తి. దానిని బట్టి నీవు జీవించుము. ఆయన నీలోవున్న దేవుడు. “మీరు దైవములని” బైబిల్ చెప్పుచున్నది. అది నిజం. మరి యేసు చెప్పెను...

“నిన్ను నీవు దేవునిగా చేసికొనుచున్నావని” పరిసయ్యులు అక్కడ అన్నారు.

“మీరు దైవములని మీ ధర్మశాస్త్రమందు వ్రాయబడెనని,” ఆయన చెప్పెను.

మోషేని పరోకి ఆయన దేవునిగా చేసిను. జనులకు ఆయన నిన్ను దైవముగా చేసాడు. అది నిజం. ఈ ఉదయకాలము నీవు వ్రాయబడిన దేవుని పత్రికవి. మీ యొక్క జీవితములు దేవునివి, పరిశుద్ధాత్మను మోసికొనిపోయేవి.

మిత్రులారా, ఇక్కడ చూడండి, దీనిని నీ నుండి దాటిపోనీయకు, అదొక కల్పనాగాధ అన్నట్టు దీనిని చేజారనీయకు.

66

తండ్రి, తగ్గింపు గలిగిన నీ పిల్లలుగా ఈ ఉదయకాలం మీ యొద్దకి వచ్చుచున్నాము. మేము ఆఖరి గడియలో బ్రతుకుచున్నామని, కాలము యొక్క ముగింపులో వున్నామని, ఏ క్షణానైన ఏదో ఒక కార్యం జరుగునని నేను గుర్తించాను. స్త్రీ, పురుషులు, బాలబాలికలు ఇక్కడ దేవుడు లేకుండా వున్నారు. తండ్రి, వారి మీద దయచూపమని నేను ప్రార్థించుచున్నాను. ఎవరైతే నిన్ను చేర్చుకొన్నారో, వారి హృదయాలకి నీవు సమీపముగానే వున్నావని గుర్తించునట్లు, వారి మీద నీ దయను చూపమని ప్రార్థించుచున్నాను. ఈ లోక సంబంధమైన విషయాలు, చింతలు మొదలగునవి వారు గుర్తుంచునట్లు చేయుము. ఈ ఉదయకాలం ఇక్కడున్న ప్రతి ఒక్కరు, రాబోయే దినాల కొరకు నీకు నిజంగా సమర్పించుకోవాలని, నీ రాకడ కొరకు ఎంత కాలమైన సరే మేము ఎదురుచూచునట్లు చేయమని, దేవా, నేను ప్రార్థించుచున్నాను. అది ఇప్పుడు ఇచ్చటే వున్నదని మేము నమ్ముచున్నాము. జనులు ఇటువంటి సువర్ణ అవకాశాన్ని చేజార్చుకొని తర్వాత రక్షించబడదాములే అని ప్రయత్నిస్తున్నారు, కాని అది వారివల్ల కాదు.

ఒకరాత్రి బలిపీఠం యొద్ద ఆ యవ్వనస్తులు రక్షించబడాలని ప్రయత్నించారు, కాని గీత దాటి వెళ్ళిపోయారు: వారికి ఏ విమోచన లేకుండెను; వారు వెళ్ళిపోయారు, రక్షించబడలేకపోయెను.

తండ్రి, ఇంకా సమయముండగానే వారు నిన్ను నేడు చేర్చుకొనునట్లు చేయమని, వారిలో ప్రతి ఒక్కరినీ నీవు దీవించమని, తండ్రి, నేను ప్రార్థించుచున్నాను. ఎందుకనగా వీటిని యేసు నామమున అడుగుచున్నాము, ఆమెన్.

67

మనము లేచి నిలబడదాం. మీ పూర్ణహృదయంలో మీలో ఎందరు ఆయనను ప్రేమించుచున్నారు? ఇంకొంచం దగ్గరగా ఆయన చెంతకు చేరవా, ఇంకొంచెం ఎక్కువగా ఆయనను ప్రేమించవా? ఈ ఉదయవేళ మనం ఆయన తట్టు చేతులెత్తి, “నా సమస్తము,” అను పాట పాడుదాము. దానిని మీరు చేయగలరా? సిస్టర్, ఆ పాటకి అవసరమైన సంగీతమివ్వగలరా.

నా సమస్తము, నా సమస్తము, (నీ అలవాట్లని, నీ మార్గములన్ని)

నా సమస్తము, నా సమస్తము,

నా సురక్షకా నీకిత్తున్ నా సమస్తము,

ఇది నిజంగా అర్థవంతంగా చెబుతున్నారా?

నా సురక్షకా నీకిత్తున్ నా సమస్తము.

68

ఓ తండ్రి, దయచూపండి. ప్రభువా, నిన్ను మేమెంతగానో ప్రేమిస్తున్నాము. ఈ దినాలలో ఒకదినాన బూర మ్రోగబోవుచున్నది. పొలములో నేను ఎక్కడో బయట ఉండొచ్చునేమో ప్రభువా, సంఘమును గూర్చి నేను అప్పుడు ఆలోచిస్తు వుండొచ్చును. గాలులు శబ్ధము ఆరంభమైనప్పుడు, లోకము అల్లకల్లోలం అయినప్పుడు, కొందరు, “సంగతి ఏమిటిని” అందురు. ఆకాశము ఎర్రగా మారుచుండును; తీర్పు గడియ సమీపముగా వుండెను. “ఓ, సహోదరుడు గ్రాహం ఎక్కడ? అందరు ఎక్కడ, అందరు గృహమున ఉన్నారా,” అని నేను అనుకొందును. తండ్రి, కొద్దిసేపటి తర్వాత ఇదివరకు ఎన్నడూ వినని ఒక శబ్దంను, అనగా బూర ద్వనిని మేము వి౦దుము; దూత బూర ద్వని చేయును. ఓ దేవా, ఎవరైతే మరణ గదిలో వెళ్ళినవారు లేచెదరు. “లోకానికి ఏమైనది? మనం మౌనంగా ఉండలేము, ఆమె కుదుపులు పాలైనది,” అంటు కేకలేయుదురు. మరియు అప్పుడు మనమంతా ఏకముగా కూడా ఆకాశమందు ఆయనను ఎదుర్కొనుటకు కలిసికొనుటకు కొనిపోబడుదుము.

69

ఓ తండ్రి, ఆ సమయమునకు ముందే మరణము మా యొద్దకి వచ్చినయెడల, అనగా భౌతిక మరణం ఈ భూమి మీద నుండి వేరుచేసినయెడల, ధీరత్వముగల విశ్వాస వీరులై, క్రీస్తు యొక్క వాస్తవముతో అనగా పరిశుద్ధాత్మతో చుట్టబడినవారమై ఆ మరణ గదిలోకి మేము ప్రవేశించెదము గాక. ఒక దినాన మేము అక్కడికి చేరవల్సివుంది, తండ్రి. ఆ వరుసలోనికి నేను కూడా నడువ వలసివుందని నేను తెలిసికొన్నాను. ఆ మరణ గదిలోనికి ప్రవేశించు గడియ అదెక్కడో నా యెదుటనే వుండెను. నా పేరు పిలువబడినప్పుడు, నేను భయము చేత వంగిపోవటం నాకిష్టం లేదు. ప్రభువా, నీవు వెళ్ళినట్లే నేను కూడా అక్కడికి (మరణగదిలోకి) వెళ్ళుటకు ఇష్టపడుచున్నాను. నా సొంత వస్త్రము చేత కప్పబడి వెళ్ళునట్టుగా కాక, పరిశుద్ధాత్మ అను క్రీస్తు వస్త్రముతో చుట్టబడి వెళ్ళునట్లు కోరుచున్నాను. పౌలు ఆ విధంగా వెళ్ళాడు, అతడు ఇలా అన్నాడు, “మరణమా, నీ ముళ్ళెక్కడ? పాతాళమా నీ విజయమెక్కడ?” ఇలా అనుచూ ఇదివరకే మృతులైన వారి మధ్యకి, ఆ చీకటి గదిలోనికి నేను వెళ్ళగోరుదును, అటు పిదప ఆయన స్వరము వినుచూ, ప్రధానదూత శబ్దం వినుచూ, మేము మా ప్రియులైన వారందరిని తిరిగి కలుసుకొనుటకు మృతులలో నుండి బయటకి పిలువబడెదము.

ఓ ప్రభువా, జీవితంలో మేము దానిని పోగొట్టుకొంటే, జీవితానికి అర్థమే వుండదు, మేము ఓడిపోయినట్లే, కాని మా హృదయములు ప్రశస్తమగు దానిని మేము కనుగొన్నట్లైతే, అప్పుడు దేవుని ఉద్దేశ్యమును మేము కనుగొనట్లే.

ఓ, ఈ ఉదయకాలం మేమెలా ఆయనను ప్రేమింతుము. ప్రభువా, ఈ ఉదయం ప్రతి క్రైస్తవుడు దర్శనమును త్వరగా చూచునట్లు చేయుము. ఇప్పటికే సమయం ఆలస్యమైపోయింది, వారు దర్శనం చూచునట్లు, నేడు జీవాన్ని పట్టుకొనునట్లు, నిరంతరం జీవించునట్లు చేయమని నేను ప్రార్థించుచున్నాను. యేసు నామమున దీనిని అడుగుచున్నాను. ఆమెన్.

70

మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారా? [సమాజము “ఆమెన్” అనుచున్నది.] ప్రక్కకు తిరిగి, ఒకరితోనొకరు కరచాలనం చేస్తూ, మేరి క్రిస్మస్ అని చెప్పుటకు బదులు, “గాడ్ బ్లెస్ యూ, క్రీస్తు నీకు తోడుండును గాక,” అని చెప్పండి. “మీరు ప్రక్కకు తిరిగి, క్రీస్తు నీకు తోడుండును గాక,” అని చెప్పండి. ఇప్పుడు వెళ్ళిపోవద్దు, ప్రక్కకు తిరిగి మరియు చెప్పుము, “క్రీస్తు నీకు తోడుగా ఉండును గాక.”

నా సమస్తా.. ఇప్పుడు కొద్ది క్షణాలు.

నా సురక్షకా నీకిత్తును, నా సమస్తము.

ఇప్పుడు, పండ్రెండు దాటిందని నేను అనుకొన్నాను. కాని ఇప్పుడు పదకొండు దాటింది. పండ్రెండు గంటల-ఇరవై నిముషాలు అయ్యిందని నేను అనుకొన్నాను. కేవలం... [“మరో గంట కూడ ఉందామని,” ఒక సిస్టర్ అనుచున్నది.] ఏం చెప్పుదుము? ఆమెన్.

71

ప్రతి ఒక్కరు ప్రభువుని ప్రేమిస్తున్నారా? “దేవునికి స్తోత్రం” చెప్పండి. [సమాజము “ఆమెన్, ”దేవునికి స్తోత్రం“ చెప్పుచున్నది.] ఇప్పుడు కొద్దిగా, కేవలం కొద్దిగా, ”నేను యేసుని ప్రేమిస్తున్నాను“ అనేటవంటి మూడు నాలుగు మాటలు సాక్ష్యం కలిగివుందాం. కేవలం చెప్పండి, అంతకు మించి వద్దు. [”నేను యేసుని ప్రేమిస్తున్నానని“ ఎవరో అనుచున్నారు.] అది నిజం. ఇంకా ఎవరైన చెప్పండి. [”నేను యేసుని ప్రేమిస్తున్నానని“ అనేకులు అనుచున్నారు.] నేనాయనను ప్రేమిస్తున్నాను. నేనాయనను ప్రేమిస్తున్నాను. ఓ యేసు!

యేసు, రక్షకుడా, నా మర్గదర్శిని

జీవితపు శోదన సంద్రము మీద

నా మార్గములో అనుకొని తుఫాను గాలులు

బండ గుండా నన్ను నడుపుము,

నా ప్రాణమును రక్షింపుము

చిత్రపటము మరియు చుక్కాని రమ్ము..

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...