పుత్రస్వీకారము #3

పుత్రస్వీకారము #3

VGR COUNT-227 ...నెవిల్ సోదరుడా. శుభోదయం. తరగతికి వచ్చిన వారికి శుభములు. సర్వ సంపూర్ణతగల సరిపడు ప్రభువైన యేసు నామములో మిమ్మును అభినందించుటకు మరల వచ్చినందుకు మేము బహుగా సంతోషించుచున్నాము. ఆయనను స్తుతించుచూ, ఆయన దీవెనలను పొందుచూ గొప్ప వారమును మీరు అనుభవించారని నమ్ముచున్నాను.

ఈ ఉదయము వచ్చుచుండగా ఒక చిన్న బాలుడిని కలిసికొన్నాను. అతడు నాకు ఇద్దరు చిన్న పిల్లలను కావలి కాయుచున్న దేవదూతను చెక్కిన ఫలకమును ఇచ్చెను. అతడు చిన్న డాల్టన్ అని నాకు తెలియదు.

2

మరియు కొన్ని వారాల క్రితం, దాదాపు రెండు వారాల క్రితం ఇక్కడ ఒక క్రైస్తవ తండ్రి, క్రైస్తవురాలు కాని తన యువ కుమార్తె గూర్చి ప్రార్థించమని అడిగెను. అతడు ప్రార్ధన వరుసలో నిలబడియుండగానే, పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పెను, “నేను నీ బిడ్డను నీకు ఇచ్చెదను.” ఆమె ఈ ఉదయమున రక్షింపబడి ప్రభువైన యేసు నామములో బాప్తిస్మము పొంది వేదిక మీద కూర్చొనియున్నది, పరిశుద్ధాత్మ చెప్పినట్లే జరిగెను. ఇతర పిల్లలు చుట్టూ కూర్చొనియున్నారు. డాల్టన్ కుటుంబము సంతోషించుచున్నదని నేను ఎరుగుదును.

3

అక్కడున్న చిన్న స్త్రీని చూడండి గత ఆదివారము ఆమె తన చనిపోవుచున్న బిడ్డ కొరకు ప్రార్ధించినాము. బిడ్డ ఈ ఉదయము మనతో యున్నది, సోదరీ. దానిని బట్టి మేమెంతో సంతోషించుచున్నాము. వారు అది ఒక కండరముల వ్యాధి అనుకొనిరి కాని, కాదు. కాబట్టి చాలా వందనములు చెల్లించుచున్నాము.

4

మన మంచి స్నేహితులందరూ కనబడుచున్నారు. ఇక్కడున్న ఈయన ఒకసారి చటక్వాలో నాతో ప్రత్యేకముగా మాట్లాడుటకు వచ్చినట్లు గుర్తున్నది. మీ భార్య, పిల్లలతో నేను అల్పాహారము చేశాను, మిడిల్-టవున్, అక్కడైతే.... నేను దాని పేరు మరచిపోయాను, అందుకే దానిని చటక్వా అని పిలచాను. అవునండీ.

చాలామంది నా మంచి స్నేహితులున్నారు. సహోదరుడు చార్లీ కాక్స్ మరియు సోదరి నెల్లీ ఇచ్చటున్నారు, వారి గృహము నాకు రెండవ గృహములాంటిది. వారి పిల్లలు నా స్వంత పిల్లల వంటివారే. అక్కడికి నేను వెళ్ళాను. ఎక్కువగా నేను విశ్రాంతి కొరకు సమయమును అచ్చటే గడుపుచుందును. నేను ఇండియానాలో ఉన్నప్పుడు, కెంటాకీలో ఉడుతలను వేటాడుటలో అతడు గొప్ప ప్రవీణుడు. చార్లీ, చారలుగల ఉడుతలను కొన్నింటిని నేను అచ్చటికి వెళ్లక ముందే పట్టుకోవలెనని తీవ్రమైన కోరిక కలిగియున్నాను. నాకు చాలా ఆశగా యున్నది.

5

సహోదరుడు పార్నెల్... ఆర్నెట్ దక్షిణ కరోలినా నుండి వచ్చెను. చాలామంది చాలా స్థలముల నుండి వచ్చిరి, వారు ఈ ఉదయము మనలను దర్శించ వచ్చిరి.

ఇక్కడ మనకు క్రమ సభ్యత్వము ఏమియూ లేదని మీకు తెలియును, మనము ఒకరితో ఒకరము సహవాసము చేయుచున్నాము, దేవుని కుమారుడగు యేసుక్రీస్తు యొక్క రక్తము, సమస్త దుర్నీతి నుండి మనలను శుద్ధిచేయును.

6

మనము అద్భుతకరమగు అధ్యయనమును చేయుచున్నాము, చాలా మహిమ కరముగా యున్నది. మరియు నేను ఎంతో దానిని అనుభవించుచున్నాను. మీరందరును దానిని అనుభవించుచున్నారని నాకు తెలియును. కొన్నిసార్లు పగలు నేను రెండు వచనములను చదివి దానిమీద మాట్లాడవలెనని తలంచి ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు చదువుచుందును, అది పూర్తి కాదు.

హెబ్రీ గ్రంథమును చెప్పుటకు మనము సమయము తీసికొనవలెను, ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నెలలలో ఉడుతలు వేటాడు సమయము వచ్చును. ఆ తరువాత విదేశములకు వెళ్ళవలసి వచ్చును. ప్రతి రాత్రి హెబ్రీ గ్రంథమును గాని లేదా నిర్గమకాండమును గాని అధ్యయనము చేయగోరుదును. దేవుడు తన జనులను ఐగుప్తులో నుండి బయటకు తీసికొని వచ్చెనో, ఒక నిర్గమనము. మనమిప్పుడు బయటకు వచ్చుటకు సిద్ధముగా యున్నాము. మనకిది చక్కని మాదిరి. ఓ, అది చాలా మంచి సంగతి. ప్రతి వాక్యమును ముడివేసినచో అది ఒకే పెద్ద గాధ యగును.

7

ఎఫెసీ గ్రంథములోని మొదటి మూడు అధ్యాయములను ఈ ఉదయము మనము తీసికొందము. ఎఫెసులో ఉన్న ఎఫెసు వారికి పౌలు వ్రాసిన ఉత్తరము. సంఘము యొక్క స్థానమును చూపించ ప్రయత్నించెను. మరియు దానిని సమీపించు ముందుగా ఒకటి రెండు నిమిషములు ప్రార్థనలో గడుపుదము.

8

ఓ ప్రభువా, మా దేవా, ఇప్పుడు మేము నీ సన్నిధిలోనికి వచ్చుచున్నాము, మేము ఆయోగ్యలమైనను పాపపరిహార రక్తము మా కొరకు ఎదురు చూచుచున్నదని ఎరుగుదుము, సమస్త అపవిత్రత నుండి మమ్మును కడుగును, నిందారహితులుగాను, నిర్దోషులుగాను తండ్రి ఎదుట మనలను నిలువబెట్టును. మనము ఏ మంచిపని దీని కొరకు ఎన్నడూ చేయలేదు, కాని యేసు దీనిని మనకొరకు చేసెను, కావున ఆయన సన్నిధిలో, ఆయన నామమునకు దీనముగా మేము వంగుచున్నాము. ఈ ఉదయము మా మధ్యకు పరిశుద్ధాత్మను పంపమని అడుగుచున్నాము. ఒక వేదాంత పండితుడను కాను లేదా లేఖనములను విశదీకరించగలవాడిని కాను, కాని ఆసక్తితో యున్నాను. పరిశుద్ధాత్మ తాకినందుకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. పరిశుద్ధాత్ముడు నాలో కదలుచున్నాడు. నీ వ్రాయబడిన వాక్యమును చదువుచుండగా పరిశుద్ధాత్ముడు మమ్మును దీవించును గాక! అది మాకు నిత్యజీవమగు గాక, తండ్రీ! అనుగ్రహించుము. యేసు కొరకే దీనిని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

9

మొదటిగా నేను చెప్పదలచినది - మీకు అంగీకారము కానిది గానీ, సరిపడనిది కానీ, మీ బోధకు పూర్తి విరోధమైనది కానీ నేను చెప్పినట్లైతే, పరిశుద్ధాత్మకు దానిని ఉప్పువేసినట్లుగాను, ఎంతో మాధుర్యముగాను మార్చి ఎవరూ అభ్యంతరపడకుండా చేయును గాక! చూచారా; ప్రేమ మరియు సహవాసము కొరకే ఇది ఉన్నది.

ఇదంతయూ గత ఆదివారం ఉదయం వర్తమానముతో మొదలయినది. “తిరస్కరించబడిన రాజు” అను వర్తమానము. ఆ టేపు ఎవరి యొద్దనైనా ఉన్నదా? వారియొద్ద ఉన్నదనుకొనుచున్నాను. కావలసిన వారు, “తిరస్కరించబడిన రాజు,” అను వర్తమానము తీసికొనుడి.

10

కొద్ది రోజులలో ఓహాయోలోని, మిడిల్-టౌవున్ లో కూటములు ఆరంభమగును. ఆ సమయములో సెలవులున్న వారు తప్పకుండా మమ్మును కలసికొనవలెను, ఎ౦దుకనగా ఓహాయోలోని మిడిల్-టవున్లో గొప్ప సమయము కొరకు ఆశించుచున్నాము. డాక్టర్ సలివాన్ ఆ కమిటీకి అధ్యక్షుడని తలంచుచున్నాను. అయిదు రాత్రులుండును. ఇంటర్ డినామినేషనల్ చర్చ్, ఇంటర్నేషనల్ కన్వెక్షన్ కు నేను అతిధి ప్రసంగీకుడును. ఆ తరువాత మన స్వంత కూటములు ఆరంభమగును. పన్నెండు వరకు వాటిని నిర్ణయించాము, కాని ఆ తరువాత మరో వారం రోజులు కొనసాగించాలని అనుకొనుచున్నాము. పరిశుద్ధాత్మ నడిపింపు మీద ఆధారపడుదుము. మనందరము ఆత్మ ద్వారా నడిపించబడగోరుచున్నాము. ఆత్మ ఏది చేయమని చెబితే దానిని త్వరగా చేయుదుము.

11

ఆత్మకు లోబడుచుండగా మనము ఒక గొప్ప పాఠము నేర్చుకొనుట మరువరాదు, అదేమనగా ఎన్నడూ త్వరపడరాదు. సమయము తీసికొనండి, విశ్వాస ముంచండి. మనము దేవుని ఏమడిగిననూ దేవుడు జవాబిచ్చునని గుర్తుంచుకొనండి. ఆయన తన సమయములో దానిని ఇచ్చును. శ్రేష్ఠమగు విధానములో జవాబిచ్చి అది మన మేలు కొరకు జరుగునట్లు చేయును. ఆలాగుండనియెడల, ఈ ఉదయము ఇక్కడ మనము ఏమి చేయుచున్నాము? క్రైస్తవ్యమును ఎందుకొరకు మనము ప్రకటించుచున్నాము? ఇది దేవుని వాక్యము కానియెడల, ఇది సత్యము కానియెడల మనము జనులందరి కన్న దౌర్భాగ్యులమగుదుము.

ఇది తప్పిపోని దేవుని వాక్యమని ఎరిగిన చాలామందితో హృదయములను కలుపుటకు నేనెంతో సంతోషించుచున్నాను. ఇది సత్య వాక్యము. ఇందులో ప్రతి మాట, ప్రతి భాగము సత్యము. ఒక రోజున మనము చేరవలసియున్న దేశమును చూచు భాగ్యము దేవుని కృప వలన నాకు దొరికినది.

12

నిన్న ఇటువంటి సేవలో ఎటువంటి నిరాశా సమయములు వచ్చునో జనులకు తెలియదు. నేను నిజంగా నిరాశ చెందాను. “వెళ్ళిపోతే బాగుండును?” అని నా భార్యతో అన్నాను.

“బిల్, నీవెందుకా మాట అనుచున్నావు?” అన్నదామె.

“ఓ, ఇక్కడ నాకు శ్రమలు తప్ప మరేమీ లేవు,” అన్నాను.

అప్పుడు పరిశుద్ధాత్మ నాతో ఇట్లు చెప్పినట్లు వినబడినది. “నీవు వాటిని తప్పించుకొన చూచుచున్నావా? నీవు వాటిని దాటిపోవ ప్రయత్నించుచున్నావా?” చూచారా?

“లేదు, వాటి మధ్యలోనే నన్ను నిలబడనిమ్ము వాటిని ఎదుర్కొననిమ్ము, అన్నాను. చూశారా, కేవలము....” చూశారా?

అది ఎంతో మంచిది. నిజాయితిగా, నిజంగా దీనిని నా ప్రత్యక్ష సాక్ష్యము ద్వారా చెప్పుచున్నాను, ఈ జీవితము అయిపోయిన తరువాత, మనము ఒక దేశములో ప్రవేశించుదుము. అది ఎవరి ఆలోచనకు అందనంత అతీతమైనది. మరియు ఇక్కడ ఎవరైనా క్రొత్త వారున్నచో, నన్ను పిచ్చివానిగా ఎంచవద్దని దేవుని ప్రార్ధించుచున్నాను. నేను యధార్థంగా సత్యము చెప్పుచున్నాను. తప్పు చెప్పినయెడల నాకేమి లాభము? దానిగూర్చి ఏ అసత్యమైనా ఎందుకు మనము చెప్పవలెను? చూడండి. ఇది ఇది కేవలము సత్యము.

13

ఆశ్చర్యము లేదు.... పౌలు మూడవ ఆకాశములోనికి కొనిపోబడెనని నాకు తెలియును, చెప్పుటకు అతనికి చేతకాని సంగతులను చూచెను. ఒకనాడు అతడిట్లు పలికెను, “దేవుడు తనను ప్రేమించు వారికి దాచిన సంగతులను కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరించలేదు.”

ఓ, మనము కేవలము జీవించుచున్నాము... ఇక్కడ మనము చెత్త కుప్పలో జీవించుచున్నాము. ఇది చెత్త కుప్ప, మురికి కంపు కొట్టుచున్నది. దానితో మనము కలుషితం కాకపోయినా, అందులోనే మనము జీవించుచున్నాము. పాపపు పొగలు పైకి లేచుచున్నవి. పట్టణములోని చెత్తను కాల్చనప్పుడు వచ్చు వాసనకంటె ఘోరమైనది మరొకటి నేను ఎరుగను. వాటి దగ్గరకు మీరు ఎప్పుడైనా వెళ్ళారా? అది భయంకరము. మురికి పొగ పైకి లేచును. అన్ని రకముల చెత్త యుండును. నీవది ఒక్కసారి పీల్చినచో వాంతి చేసికొందువు.

14

న్యూ-ఆల్బనీకి వెళ్ళుచున్నప్పుడు జరిగినది నాకు గుర్తున్నది. పద్దెనిమిదవ వీథి గుండా వెళ్ళుచుండగా, పెంట పోగువేసే చోటు చూచాను. ఆ ప్రాంతంలో నేను మీటర్ రీడింగులు తీసుకొనేవాణ్ణి, నాకు ఆ 18వ వీధిలో మీటరు రీడింగు తీసికొను రోజు భయంకరముగా అనిపించెడిది. ఆ కంపును భరించలేక పోయెడివారము. చచ్చిన ఎలుకలు, కుక్కలు కాలిపోతుంటే భయంకరమగు కంపు వచ్చెడిది.

ఈ జీవితమును సరిగా పోల్చవలెనన్న దానితో పోల్చవచ్చును. కంపు కొట్టుచున్నది. ఎక్కడ చూచినా పాపపు వాసనే. ఆత్మ సంబంధముగా మాట్లాడుచున్నాను. స్వేచ్చగా వీచుచున్నది. అక్కడ ప్రేమ, సంతోషము, నిత్యజీవము సమాధానము ఉన్నది. నదికి ఆవల అది యున్నది. కానీ మనము యుద్ధములో ఉన్నాము, “త్వరగా అక్కడికి వెళదాం,” అని మనము అనరాదు. మనము మనతో తీసికొని వెళ్ళ కలిగిన వారందరినీ తీసికొని వెళ్ళాలి. అవును.

15

ఈ పాఠముల యొక్క ఉద్దేశ్యము అదే. ఇప్పటికే ఆ దేశములోనికి దాటిన వారిని లంగరువేయునట్లు చేయ ఉద్దేశించి యున్నాము. ఈ అధ్యయనము యొక్క ఉద్దేశ్యము, ఎఫెసీ గ్రంథము యొక్క ఉద్దేశ్యము అదే, సంఘము యొక్క స్థానము క్రీస్తులో ఎక్కడున్నదో చూపించును. ఇది పాత నిబంధన గ్రంథములోని యెహోషువా గ్రంథమునకు మాదిరిగా యున్నది. యెహోషువా భూమిని పంచెను. గత ఆదివారము దానిని మనము చూచాము. ప్రతివారికి యెహోషువా భూమిని పంచెను. మరియు ఆత్మ ప్రేరణ ద్వారా అతడు దానిని చేసెను.

ఉల్లిగడ్డల ఐగుప్తులో నుండి మోషే జనులను ఎట్లు బయటకు తెచ్చెనో చూడండి, నాలుగు వందల సంవత్సరముల క్రితం దేవుడు వారికి వాగ్ధానము చేసిన స్థలమును ఇచ్చెను. ఆయన వారిని పౌలు తేనెలు ప్రవహించు మంచి దేశమునకు తీసికొని వచ్చెను. ఆ దేశము వరకు మోషే నడిపించెను గాని అవతలకు దాటించలేదు.

ఆత్మ సంబంధులకు యేసు ఆది నుండియూ పరిశుద్ధాత్మను వాగ్దానము చేసెను. వాగ్దానము వరకు యేసు మనలను నడిపించెను. కాని పరిశుద్ధాత్మ యెహోషువా వలె వచ్చెను. అవతలకు దాటించి భూభాగమును లేదా సంఘమును స్వాస్థ్యము పొందునట్లు నడిపించెను. దీనిని మనము ప్రధానంగా చూడగలము.

16

ఇక్కడ నేను కఠినముగా వ్యవహరించి సోదరులను లెక్కచేయుట లేదని జనులు తలంచుదురు. ఆలాగు నేను లేను. దేవుడే నా తీర్పరి. ఆలాగు నేను లేను, చూచారా. నేను సత్యమునే మీకు చూపించగోరుచున్నాను, చూచారా. పరిశుద్ధాత్మ నాయకత్వమునకు బదులుగా మనము మానవ నాయకులను ఎన్నుకొన్నాము. మానవులు మన భాగములను పంచవలెనని కోరితిమి. మెథడిస్తు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, లూథరన్, క్రీస్తు సంఘము, పెంతెకోస్తు మొదలగు శాఖలను, సంస్థలను ఒక మాదిరిగా ఎంచుకొని వాటిని వెంబడించాము.

అటువంటి విధంగా చేయవలెనని బైబిల్ నందు ఎచ్చటనూ లేదు. ఒక సంఘమును వ్యవస్థగా మార్చినట్లుగాని, ఒక సంస్థ గూర్చి చెప్పుటగాని దేవుని బైబిల్ అంతటిలో ఎక్కడా ఒక్క వాక్యము కూడా లేదు - కాని ఎల్లప్పుడూ దానికి వ్యతిరేకత చూపెను. లోక మర్యాదను అనుసరించ వద్దని ఆయన కోరెను. ఆయన మనలను వింతగా, ప్రత్యేకంగా ఉండుమని కోరెను.

“ఇచ్ఛకము”లాడు వారిగా ఇప్పుడు మనముండరాదు. బయటకు పిలువబడిన జనులము గాను, దీవించబడిన పరిశుద్ధ జనాంగముగాను, నిందకు అస్పదమియ్యని జీవితములను జీవించువారముగాను, చేతలు, ప్రవర్తన ఆయన మనలో జీవించుచున్నట్లుగాను, ఆయన చేతి పనివలెను, సత్క్రియలు చేయుటకు క్రీస్తు యేసునందు సృజింపబడిన వారముగాను మనము ఉండవలెను.

17

ఇప్పుడు, బుధవారము రాత్రి మీలో చాలామంది ఇక్కడలేరు. 8వ వచనము లేదా 5వ వచనము అనుకొంటాను. “కుమారులనుగా స్వీకరించుటకు...” లేదా జనులను స్థానములో ఉంచుట.

దేవుడు తన జనులను స్థానములో యుంచుటకు ఎట్లు ప్రయత్నించుచున్నాడో చూడండి. ఒకనిని దేవుడు ఒక స్థానములో యుంచితే తక్కిన సంఘమంతయూ ఆ వ్యక్తివలె ఉండగోరుచున్నది. అదే విధంగా ప్రవర్తించగోరుచున్నారు. మనము వేరుగా చెక్కబడితిమి. మనము వేరుగా చేయబడితిమి. మన స్వభావములు వేరు. ప్రతి వారికి వేర్వేరు స్థానములలో నియమించబడితిమి. ప్రతివారు వేర్వేరు పనుల కొరకు నియమింపబడితిరి. ఒకరు ఒక చిన్న రకమగు పనికి, మరొకరు పెద్ద రకమగు పనికి ఏర్పాటు కాబడియుండవచ్చును. దావీదు లేదా ఒక ప్రవక్త ఇట్లు చెప్పెను, చెప్పిన వారెవరో మరచిపోయాను. “ప్రభువు యొక్క మందిరములో కాళ్ళు తుడుచుకొను చాపగా యు౦దును. దుష్టుల గుడారములో నివసించుట కన్న అదియే మేలు.”

18

దత్తతను గూర్చి చెప్పుకొనుటకు ఒక నిమిషము ఆగుదము. 5వ వచనము, వీలయినంత వరకు చెప్పుకొందము. కాని అంశము మరువకుడి, స్థానము గూర్చియే మాట్లాడుదును. ఎందరికిది అర్థమగును? ఒక్క మాటలో చెప్పండి. [సమాజము సహోదరుడు బ్రెన్హాంతో పాటు చెప్పుచున్నారు.]: క్రీస్తులో యేసుక్రీస్తు యొక్క శరీరమును స్థానములో పెట్టుట, పరిశుద్ధాత్మ అక్కడికి మనలను నడిపించుచున్నది. నీవు అక్కడే ఉన్నావు, ఇప్పుడు - మనము పొందుకున్నాము, చూచారా. మన స్థానమును చూపించెను - ఎఫెసీ గ్రంధము దానిని చూపించుచున్నది.

19

మహా ఉపదేశకుడగు పౌలును చూడండి. మొదటగా అతడు పడిపోవుట అను ఉద్దేశ్యమంతటినీ కొట్టివేసెను, “నేడు క్రైస్తవునిగా యుండి, రేపు పడిపోవుదును. మరుసటి రోజు దేవుడు నన్ను శిక్షించును. ఆ తరువాత రోజు మరల లేచెదను,” అను అభిప్రాయమును కొట్టివేసెను. అది బుద్ధిహీనత! ఈ గ్రంథము సువార్తిక ఉపదేశము కొరకు, సువార్త ప్రసంగముల కొరకు వ్రాయబడలేదు. కూటములలో నేను దీనిని అంటుకొనను. దీనిని నేను సంఘములోనే ఎత్తుదును, ఎందుకనగా పౌలు దీనిని పరిశుద్దులకు, పిలువబడి భద్రపరచబడిన వారికి, నింపబడి ప్రత్యేకించబడిన వారికి, పరిశుద్ధాత్మలో ఉన్నవారికి, కానాను దేశములో యున్నవారికి వ్రాసెను. మొదటగా మీ మనస్సులో నుండి నశించిపోదుమని ఉద్దేశ్యము తొలగించుకొనుడని చెప్ప ప్రయత్నించెను. దేని గూర్చి మీరు భయపడవద్దని వ్రాసెను. దేనికీ మీరు భయపడకుడి. మీరెక్కడుందురో, మీరెవరో, మీరెట్లు నిలబడియుందురో అతడు చెప్ప ప్రయత్నించెను.

20

మీరు తప్పులు చేయవచ్చును. మీరు తప్పు చేసిన ప్రతిసారి దానికి వెల చెల్లించవలసి యందురు. అవునండి. మీరు విత్తినదే కోయుదురు! కాని మీ రక్షణకు దాని వలన ఏమి సంబంధముండదు. మీరు దేవుని ఆత్మ మూలముగా జన్మించినప్పుడు నిత్యజీవము పొందుదురు. దేవుడు మరణించడు గనుక నీవును మరణించవు. నీవు దేవునిలో ఒక భాగముగాను, దేవుని కుమారునిగాను ఉందువు.

నేను బ్రెన్హాంగా జన్మించాను, మీరు మరో పేరు నాకు పెట్టవచ్చును. అయినా నాకేమీ మార్పు౦డదు. నేను బ్రెన్హాంను. నేను బ్రెన్హాంగా జన్మించాను గనుక ఎల్లప్పుడూ బ్రెన్హాంగానే యు౦దును. ఒక రోజుకు నా రూపము మారిపోవచ్చును, ఎముకల వ్యాధితో క్షీణించవచ్చును, నేను పూర్తిగా ఆరోగ్యము చెడినవాడినై జంతువువలె కనబడవచ్చును, అయినా గాని నేను బ్రెన్హాంగానే యుందును. ఎందువలన? నా లోపట బ్రెనాం రక్తమున్నది.

21

మీరును అంతే. మరియు దేవుడు నిన్ను చేసినంతవరకు . ఇప్పుడు గుర్తుంచుకొనండి, క్రీస్తుకు బయటనున్నవారితో నేను మాట్లాడుట లేదు. క్రీస్తునందున్న వారితో నేను మాట్లాడుచున్నాను. క్రీస్తులోనికి ఎట్లు మీరు వెళ్ళగలరు? “ఒకే ఆత్మ ద్వారా,” పెద్దక్షరములలో యున్నది. “మనమందరము ఒకే పరిశుద్ధాత్మ ద్వారా ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము.” మనమెట్లు అందులోనికి వెళ్ళియున్నాము? నీటి బాప్తిస్మము ద్వారానా? బాప్టిస్టు వారికి, క్రీస్తు సంఘము వారికి నేను ఈ విషయములో వ్యతిరేకిగా కనబడుదును. నీటి బాప్తిస్మము వలన కాదు! I కొరింధీ 12లో చెప్పెను, “ఒకే ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆ శరీరములోనికి మనము తీసికొని రాబడినాము.” ఆ శరీరమువలె మనమును క్షేమముగా యందుము. ఆ విధంగా దేవుడు వాగ్ధానము చేసెను.

22

కల్వరి యొద్దకు వెళ్ళిన ఆయనను దేవుడు మరల ఎట్లు శిక్షించును? గొల్గొతా యొద్ద ఆయన కొట్టబడెను, గాయపరచబడెను. ఆయన స్వస్థతనొందలేకపోయెను, ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయెను. కారణము ఎందువలన? లోకములో వున్న పాపములు ఆయనపై వుండెను. ఆయన పాపి కాడు గాని ఆయన “పాపముగా చేయబడెను.” నీ కొరకు, నా కొరకే ఆయనాలాగు మారెను. ఆదాము మొదలుకొని ఆయన రాకడ వరకు ఉండు లోకపాపమంతటిని ఆయన తన భుజముల పైన వేసికొనెను. దేవుడు తన కుమారుని శిక్షించుట లేదు. ఆయన పాపమును శిక్షించుచున్నాడు. అదెంత ఘోరమో చూడండి? ఆయన ఒక పరిహారము చేయుచున్నాడు. ఎవరు వచ్చుదురని దేవుడు తన ముందు జ్ఞానము ద్వారా ఎరిగెనో వారందరూ తప్పించుకొనునట్లుగా ఆయన ఒక మార్గము ఏర్పరచెను. కొద్ది నిమిషములలో దానిని మనము చూతుము.

23

ఇప్పుడు, అటు తరువాత.. “ఒకే ఆత్మ ద్వారా క్రీస్తు అను ఆ శరీరములోనికి మనము బాప్తిస్మము పొందియున్నాము,” కనుక నిత్యము మనము క్షేమముగా ఉందుము.

ముఖ్యంగా ఆర్మీనియను విశ్వాసులకు ఇది వింతగా తోచును, ఎందుకనగా వారు ఏదో మంచి పని చేయుటకు ప్రయత్నించెదరు. ఒకేసారి రెండు క్రియలు ఎట్లు జరుగును? కృప ద్వారానయినా అగును లేదా క్రియల ద్వారా అయినా కావలెను... ఆ రెండు వేర్వేరు; ఒక్కదానివలనే అగును.

24

నేను దేవుని కృపను తప్ప మరి దేనిని చూడలేను. అదే నా గురి. నేనెల్లప్పుడూ కృపనే నమ్ముదును. అంతము కృపతోనే నేనున్నాను. బాలునిగా ఉన్నప్పటి నుండి, నా జీవితంలో కృపను మాత్రమే చూచుచున్నాను. “నీవు నా వీపు గోకితే నేను నీ వీపు గోకుదును,” అని అందురు. అది ఘోరమగు సామెత. మీరు నా వీపు గోకినా గోకక పోయినా మీ వీపు గోకుట అవసరమయితే తప్పక నేను గోకుదును. చూచార? కృప! అవునండీ! ప్రేమ ద్వారా కృప పని చేయును. నీకది అవసరమైతే నీవు నాకెన్నడూ ఏమి చేయకపోయినా, నీతో నాకే సంబంధము లేకపోయినా, నీకవసరమైతే నేను చేయుదును. అదే కృప! ఎందుకనగా అది నీకు అవసరము.

25

నాకు రక్షణ అవసరము. నన్ను రక్షించునది ఏదియూ లేదు. నాయంతట నేను ఏమీ చేసికోలేను. నన్ను నేను రక్షించుకోలేను. కాని నాకు రక్షణ అవసరము, ఎందుకనగా దేవునియందు నేను విశ్వాసముంచితిని. దేవుడు తన కుమారుని పంపెను. నా స్థానములో శ్రమపడుటకు పాపపు శరీరముతో ఆయనను చేసెను. నేను కృప ద్వారా మాత్రమే రక్షించబడితిని. నేను, నీవు రక్షింపబడుటకు చేయకలిగినది ఏమియూ లేదు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన వారిని ముందుగా ఎరిగియుండెను.

26

గత బుధవారం దానిలోనికి వెళ్ళాము. ఎలాహ్, ఎలోహింగా దేవునిని చూచాము. ఆయన స్వయం ఉనికిగలవాడని చూపించాను. కాని ఆయన లోపల పితృత్వము, రక్షకుడు, స్వస్థపరచువాడు ఉన్నాడు. ఆయనలో ఎన్నో గుణములుండెను. దేవుడు స్వయం ఉనికిగలవాడు. ఆయన రక్షకునిగాను, తండ్రిగాను ఉండెను. ఆయనకు దేవదూతలు గాని మరెవరూగాని లేరు. ఆయన తప్ప మరెవరూ లేరు. ఆయన ఆది సంభూతుడు. దేవుడు తప్ప మరేదియూ లేదు.

అయితే ఆయన దేవుడై యుండినందున ఆయనను ఆరాధించుటకు ఒకరు కావలసియున్నారు, ఎందుకనగా ఆయన ఆరాధనను ప్రేమించెను. ఆయనను ఆరాధించుటకు ఆయనే జీవులను సృష్టించెను. (ఇప్పుడు అంతా చెప్పుకోలేము గాని పైపైన చూద్దాం. అయితే దానిని మీరు టేపులో విందురు.) ఆయన దేవుడు గనుక తనను ఆరాధించునట్లు దేవదూతలను చేసెను. మరియు దేవదూతలు ఆయనను ఆరాధించెను. దేవదూతలు ఇంకా ఆయనను ఆరాధించుచున్నవి. దేవుని సన్నిధిలో నిలబడి యుండు దేవదూతలకు ఆరేసి రెక్కలున్నవి. రెంటితో తమ ముఖమును, రెంటితో తమ పాదములను కప్పుకొని రెంటితో ఎగురుచూ ఆయన సన్నిధిలో దివారాత్రులు ఇట్లు కేకలు వేయుచున్నవి, “సర్వశక్తుడగు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరిశుద్దుడు.” ఆ విధంగా వాక్యము చెప్పుచున్నది. అవి ఆయనను ఆరాధించుచున్నవి. ఆయనను ఆరాధించుటకే అవి సృజింపబడెను.

27

ఆయన లోపల రక్షకునిగా యుండు గుణలక్షణమున్నది. పాపముగాని, పాపపు తలంపుగాని లేని ఆ జీవులు ఎట్లు నశించగలవు? అది జరుగని పని. రక్షకునిగా రావలెనన్నచో నశింపబడినది కావలెను. ఆయన లోపల స్వస్థపరచువాడుండెను. ఆయన రక్షకుడని మీరు నమ్ముచున్నారా? ఆయన స్వస్థపరచువాడని మీరు నమ్ముచున్నారా? కాని రక్షింపబడునది, స్వస్థపరచబడునది లేనియెడల ఇదెట్లు బయటపడును? కాబట్టి ఆ విధంగా ఒకటి చేయబడవలసియున్నది.

ఆయన ఎన్నడూ దానిని ఆ విధంగా చేయలేదు, కాని మానవుడిని ఆయన స్వేచ్చాజీవిగా చేసెను. “దీనిని తీసికొనినచో నీవు బ్రదుకుదువు; దీనిని తీసికొన్నచో నీవు చనిపోయెదవు.” ఈ లోకము లోనికి వచ్చు ప్రతి మానవుడు ఇంకా అలాగే యున్నాడు. ఎవరు పొందరో, ఎవరు పొందుదురో దేవుడు తన ముందు జ్ఞానము ద్వారా ఎరిగియుండెను.

28

కూటమునకు వచ్చిన లేదా టేపు వినిన ఒక వేదాంత పండితుడు నిన్న నన్ను ఒక ప్రశ్న అడిగెను, “దేవుడు సర్వాంతరర్యామి. ఆయన ఎక్కడయినా ఉండగలడు.”

అతడి చెప్పెను, “వాక్యము చెప్పుచున్న ప్రకారము ఆయన ఈ రీతిగా సర్వాంతర్యామి కాడు. ఒక జీవిగా ఉండి ఆయన సర్వాంతర్యామిగా యుండలేడు. ఆయన సర్వాంతర్యామియైనచో, నీవు పరిశుద్ధాత్మ కొరకు ఎందుకు ప్రార్థించుచున్నావు? ఆయన సర్వాంతర్యామియైనచో, ఆయన ప్రతి సందును, ప్రతి మూలను, ప్రతి గదిని ప్రతి నాళమును ప్రతి దానిని నింపును. ఆయన సర్వాంతర్యామియైనచో, చివరకు మోషే కొరకు ఎందుకు వెదికెను? ఆయన సర్వాంతర్యామియైనచో ఏదెను తోటలో 'ఆదామా, ఆదామా, నీవెక్కడ,' అని ఎందుకు అడిగెను? ఆయన సర్వాంతర్యామి అయినచో?”

ఆయన సర్వజ్ఞాని గనుక సర్వాంతర్యామి. ఆయన అనంతుడు గనుక ఆయనకు సమస్తమూ తెలియును. ఆయన అనంతుడైనందునే అంతటా ఉన్నవాడాయెను. అంతటా ఉన్నవాడు గనుకనే అనంతుడు అయ్యెను. ఆకాశములందు ఆయన కూర్చొనును. ఆయన ఒక జీవి గనుక ఒక స్థలములో ఆయన నివసించును.

29

కానీ అనంతునడైనందున ఆయనకు అన్నియూ తెలియును. దోమ కనురెప్ప వేసిన ప్రతీసారీ ఆయనకు తెలియును. ప్రతి తేనెటీగ తేనెను తెచ్చి పట్టులో పెట్టుట ఆయనకు తెలియును. చెట్టు మీద కూర్చొన్న ప్రతి పిచ్చుక ఆయనకు తెలియును. నీ మనస్సులో ఉన్న ప్రతి ఆలోచన ఆయనెరుగును, ఎందుకనగా ఆయన అనంతుడు మరియు సర్వజ్ఞాని. ఆయన అనంతుడు మాత్రమే కాదు గాని, అంతయూ తెలిసినవాడు. ఆయనకు సమస్తమూ తెలియును. కాని ఆయన ఒక జీవి. దేవుడు ఒక జీవి, ఈ జీవిలో నుండియే ఇవన్నియూ రాసాగినవి.

30

గత రాత్రి నేను చెప్పినట్లుగా, పాపము సృష్టించబడలేదు. పరిపూర్ణత తప్ప మరేదియూ సృజింపబడలేదు. దేవుడు అన్నీ మంచివే సృజించెను. పాపము సృజించ బడలేదు. “అది పాపముయొక్క సృష్టియే” అని చెప్పుట మీరు విన్నారు. కాని అది తప్పు. పాపము! దేవుడొక్కడే సృష్టికర్త, దేవుడు పాపమును సృష్టించలేడు, ఎందుకనగా ఆయన పరిశుద్దుడు మరియు ఆయనలో దానిని సృష్టించునది ఏదియూ లేదు. వంకరతనమే పాపము. సృష్టి కాదు గాని, అది వంకరతనము. వ్యభిచారమనగా నీతి కార్యమును వంకరగా చేయుటయే. సత్యమును తప్పుగా చేయుటయే అబద్దము. ఏ పాపమయినా గాని నీతి పనిని వంకరచేయుటయే.

31

కాబట్టి ఇప్పుడు, దేవుడు కూర్చొనియున్నాడు... ఎప్పుడో ఆయన తన్ను తాను బయలుపరచుకొనెను, ఆయన దేవుడు. ఆయన ఎప్పుడో తన్ను తాను రక్షకునిగా బయలుపరచుకొనెను. మానవుడు తప్పిపోగా, ఆయన రక్షించెను. ఆయన ఎప్పుడో స్వస్థపరచువానిగా బయలుపరచుకొనెను. ఆయన గూర్చి జనులేమి చెప్పినా లెక్కకు రాదు. ఆయన ఎల్లప్పుడూ మారనివానిగానే యున్నాడు. ఆయన స్వస్థపరచువాడు, ఆయన రక్షకుడు, ఆయన దేవుడు, ఆయన నిత్యుడు. ఆయనకు ఒక ఉద్దేశ్యమున్నది. ఆయనను ప్రేమించి, ఆయనను ఆరాధించు వారిని సృజింపవలెనను ఉద్దేశము అదిలోనే ఆయన కలిగియుండెను.

ఆయన జీవులను చేసెను, ఆ జీవులు పడిపోయినవి. అప్పుడు దేవుడు తన అనంతత్వము వలన కాలమును ముందే చూచెను. రక్షింపబడు ప్రతి మనిషిని చూచెను. ఆయన తన ముందస్తు జ్ఞానము ద్వారా ప్రతి మనిషిని ఎరిగియుండెను. ఎవరు రక్షించబడుదురో, ఎవరు రక్షింపబడరో ఆయన తన ముందస్తు జ్ఞానము ద్వారా ఎరిగి యుండెను. ఆయన ముందే నిర్ణయించగలడు. అది అంత చెడ్డ మాట కాదు గదా? ఆయన ముందే నిర్ణయించగలడు, ఎందుకనగా ఆయన ఎవరు రక్షింపబడుదురో, ఎవరు రక్షింపబడరో ఎరుగును. రక్షింపబడు వారి కొరకు ఆయన పాపప్రాయశ్చిత్తము చేయవలసి యుండెను. వీలయితే కొన్ని వచనములను క్రింద చూద్దాం. నిత్యజీవమునకు ఆయన మనలను ముందుగా నిర్ణయించెను. ఎవరు సమస్తమూ ప్రక్కకు త్రోసి వేయుదురో ఆయనకు తెలియును. ఈలోకపు పిల్లలకు అది (లోకస్తులకు) అది ఎంత వేరుగా కనబడినా గాని, అది వారికి ఏమాత్రము లెక్కకు రాదు, ఎందుకనగా వారు దేవుని పిల్లలైయుండిరి.

32

ఆయన వారిని పిలచెను.

ఆయన యేసును పంపెను, ఆయన రక్తమే ఒక పరిహారముగా ఉండును, ప్రాయశ్చిత్తము చేయుటకు ఆయన రక్తము ఒక పరిహారముగా యున్నది, లేదా అంగీకరించుటకు లేదా శుద్ధిచేయుటకు, శుద్దీకరణ నిరంతరము కొనసాగుటకు... ఏదో ఒక్కసారి కాదు, ఒక్క ఉజ్జీవములో కాదు, అయితే “సదా జీవించి, మధ్యవర్తిత్వము చేయుట.” క్రైస్తవుడు దివారాత్రులు పరిశుద్ధముగా యుండును. క్రీస్తు యొక్క రక్తము సిలువ మీద అంగీకరించబడినది. సమస్త పాపము నుండి దివారాత్రులు, నిరంతరమూ అది మనలను శుద్ధి చేయుచున్నది. మనము క్షేమముగా యుండగలము. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువైన యేసు శరీరములోనికి అతుకబడి క్షేమముగా యుందుము. “నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. అట్టివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటును.” తీర్పు ఇక లేదు. క్రైస్తవుడెన్నడూ తీర్పులోనికి రాడు. క్రీస్తే ఆతని కొరకు వెళ్ళెను. నా న్యాయవాది నా స్థానములో నిలబడెను. ఆయన నా వ్యాజ్యమును వాదించెను. నేను తెలియక చేసితినని చెప్పెను. నేను యోగ్యుని కానని మరియు నాకు ఏమి తెలియదని ఆయన తండ్రికి చెప్పెను. కాని ఆయన నన్ను ప్రేమించి, నా స్థానమును తీసికొని, నా వ్యాజ్యమును వాదించెను, మరియు నేడు నేను స్వతంత్రుడను! అవునండి. మన పాపముల కొరకు ఆయన తన రక్తము చిందించెను.

33

గత బుధవారము రాత్రి చెప్పినది గుర్తుంచుకొనండి, ఏ క్రైస్తవుడు... క్రైస్తవులు పాపము చేయుదురు, కాని ఒక పాపి - పాపము చేయలేడు. పాపి - పాపము చేయడు, ఎందుకనగా అతడు పాపి. ప్రారంభములోనే అతడు పాపి, అంతే! ఈ పుస్తకపు వెనుకభాగమంతా నల్లగా యున్నది. ఎంత నలుపున్నది? అది అంతయూ నలుపే. అందులో ఏ మాత్రమూ తెలుపు లేదు. అది నలుపు. మీరు, “ఇక్కడ కొద్దిగా తెల్లగా యున్నదనుటకు,” వీలులేదు. అది మొత్తం నల్లగానే యున్నది. పాపి కూడా ఆ విధంగానే యున్నాడు. వాడు ప్రారంభములోనే త్రోయబడెను. మంచిది, “వ్యభిచారము చేసినచో ఏమిటి? స్త్రీని చెరచినచో ఏమిటి? జూదమాడితే ఏమిటి? ఎవరినైనా తుపాకీ చేత పేల్చితే ఏమిటి? అని నీవనవచ్చు. అది మన పని కాదు. అది మన పని కాదు. ఆ విషయమును చూచుటకు చట్టములున్నవి. మనము సంస్కరణకర్తలము కాము; మనము సువార్త బోధకులము. మనము అతడు చేసిన దానిని బట్టి అతనిని ఖండించము. అతడు వ్యభిచరించుటను బట్టి అతని ఖండించము; అతడు పాపియని అతనిని మనము ఖండించుచున్నాము. అతడు క్రైస్తవుడయినచో ఆలాగు చేయడు. అది నిజము. అతడు మారినయెడల ఆలాగు చేయడు. అయితే ఎందుకనగా అతడు పాపియైనందున, అదే అతనిని ఆలాగు చేయించును.

34

లీగలిస్టులు ఇక్కడే తప్పిపోవుచున్నారు. అవునయ్యా. సహోదరుడా, నన్ను చెప్పనివ్వండి. నేను చెప్పునది, క్రియల ద్వారా కాదు గాని, కృప వలనే, విశ్వాసము చేతనే మనము రక్షింపబడియున్నాము. అవును! లీగలిస్టు సోదరులను నేను ఖండించుట లేదు. వారు నా సోదరులు. తక్కిన వారందరూ యున్నట్లే వారును అక్కడ యందురు, ఎందుకనగా దేవుడు తన సంఘము అచ్చటుండునట్లు ముందుగానే నిర్ణయించెను. కాని మీరు జనులను చాలా అయోమయంలో పడవేసిరి. వారికి అర్థమగుట లేదు. లోకపు ఆకలి వారికున్నంత కాలము వారు అసలు ఆరంభించనే లేదని అర్ధము.

35

నా భార్య నాకు విడాకులిచ్చునని నేను నా భార్య పట్ల నమ్మకంగా జీవించుట లేదు గాని, ఆమెను ప్రేమించుచున్నందునే నేను ఆమె పట్ల నమ్మకముగా జీవించుచున్నాను. మనము చట్టబద్ధముగా ఆలోచించుచున్నాము. ఒకరినొకరము ప్రేమించవలెననుకొనుచున్నాము. దానికి ముందు అక్కడ ప్రేమ ఉండవలెను. నేనామెను ప్రేమించుదును. నేను తప్పుచేసినా గాని ఆమె నన్ను క్షమించునని తెలిసినా, నేను తప్పు చేయను. ఆమెను నేను ప్రేమించుచున్నాను.

క్రీస్తుతో కూడా అంతే! ఒకవేళ నేను జీవిస్తే... నాకు ఏబది సంవత్సరాలు. నేను వంద లేదా మరో ఏబది సంవత్సరాలు జీవించినా, నేను ఏలాగూ రక్షించబడితిని గనుక ఇక బోధించుట ఆపి, నది యొద్దకు వెళ్ళి కూర్చుందుననుకొనను. దేవుడు తన కృప ద్వారా నన్ను రక్షించెను. నేను ఏదీ మంచి చేయలేదు. నేను మంచి ఎన్నడూ చేయలేను. ఆయనను, ఆయన జనులను నేను ప్రేమించుచున్నందున బోధించుచున్నాను. ఆ కారణము చేతనే నేను మరణములో నుండి జీవములోనికి దాటియున్నానని ఎరుగుదును. నేను వారిని ప్రేమించి, వారి వెంబడి వెళ్ళుచున్నాను. వారు ఎట్టి స్థితిలో యున్నను వారిని నేను వెంటాడుదును. ఏలాగయినా వారిని బయటకు లాగుదును. సేవకులు సమ్మతించకపోయినను, ఇతరులు సమ్మతించకపోయినను, శాఖలు సమ్మతించక పోయినను, అవి నన్ను ఆపవు. ఒకటున్నది... అది ఆయనను ఆపజాలదు! ఆయన ఏలాగయినా ముందుకు కదలును. అదే మనము చేయుచున్నాము. బయటకు వెళ్ళి, వారిని ఎలాగైననూ పట్టుకొనుచున్నాము. అవిశ్వాసము మధ్యనే ఆయన నిలబడును. ఏమయినా గాని వారిని చేరుకొని, లాగి, నీ బలమంతటితో వారిని పట్టుకొని తీసికొని రమ్ము, వారెవరో నీవెరుగవు. వారిని రక్షించుము. ప్రేమను బట్టియే అది చేయుదుము, చేయవలసియున్నాము, అని కాదు గాని, మిమ్మును ప్రేమించుచున్నందునే, మీరును ప్రేమించుచున్నారు గనుకనే, ఇది చేయుచున్నాము.

36

“నేను సంఘమునకు వెళ్ళుచున్నాను గనుక ఆమెతో నేను సరిచేసుకో వలెను,” అని అనుట తప్పు. మొదటగా నిన్నునీవు సరిచేసికోవలెను, చూచారా. నీ హృదయములో దేవుని ప్రేమ లేనియెడల, నీవు తప్పు చేయుచున్నట్లు ఏలాగయినా తెలిసినయెడల, వెళ్ళి దేవునితో సరిచేసికొనుము. అప్పుడు నీ పొరుగువానితో సరిచేసికొనుము.

యేసు దానినే బోధించెను. “నీవు బలిపీఠము యొద్దకు బల్యర్పణ అర్పించుటకు వచ్చినప్పుడు, నీ సోదరునియెడల, నీ పొరుగువానియెడల విరోధమేదయినా యున్నట్లు తెలిసినయెడల, మొదట వారితో సరిచేసికొనుము.”

37

రాబోవు యుగములను ఇప్పుడు చూద్దాం. బుధవారము రాత్రి “ప్రత్యక్షపరచబడుట” గూర్చి చూచాము. ఈ ఉదయం దానిని మరల పట్టుకొన్నాము, దేవుని కుమారుల ప్రత్యక్షత, అక్కడే దేవుడు ఎదురు చూచుచున్నాడు. అంత్యకాలములో మనమందరము ఆయన ఎదుట నిలబడి.... దేవదూతలు తప్పిపోలేదు. మనవలె దీవెనలను ఆనందించుటకు వారికి తెలియదు; వారెన్నడూ తప్పిపోలేదు. అయితే ఎక్కడ నుండి వచ్చానో నాకు తెలియును, ఏ రాతినుండి చెక్కబడితినో నాకు తెలియును, నేను పాపిని. మీరెక్కడ నుండి చెక్కబడితిరో మీరెరుగుదురు. ఇప్పుడు మనము కనుగొనబడినప్పుడు, దేవుని ఎదుట నిలబడగలము. ఓ, అదెట్టి దినముగా ఉండును!

38

అప్పుడు పుత్రస్వీకారము, స్థానమును నిర్ణయించుట. ఇప్పుడు, దేవుడు ఈ పని చేస్తు [స్పష్టతలేని మాటలు]. దీనిని మీకు చెప్పవలెనన్న 5వ వచనము చదువుదము. నేను దానిని చదువవలెనని కోరుచున్నాను:

తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను.

దేవుడు తన సంకల్పము చొప్పున కుమారులనుగా స్వీకరించుట తనకు సంతోషకరమైయున్నది. ఇప్పుడు ఆయన ఏమి చేయుచున్నాడు? తన సంఘమునకు స్థానము నిర్ణయించుచున్నాడు. మొదటగా ఆయన తన సంఘమును పిలచెను. మెతడిస్టు, ప్రెస్బిటేరియను, లూథరన్, బాప్టిస్టు, మొదలగు వాటిలో నుండి ఆయన వారిని పిలచుచున్నాడు. తరువాత ఆయన ఏమి చేసెను? పరిశుద్ధాత్మను పంపి, వారికి పరిశుద్ధాత్మ బాప్తిస్మమిచ్చెను.

39

పెంతెకోస్తు వారు దీనిని తమ హృదయములలో నుండి తీసివేసికోవలెనని కోరుచున్నాను. పెంతెకోస్తు ఒక శాఖ కాదు; పెంతెకోస్తు ఒక అనుభవము. అది పరిశుద్ధాత్మ. అది ఒక సంస్థ కాదు. పరిశుద్ధాత్మను నీవు సంస్థగా మార్చలేవు. దాని దగ్గర ఆయన నిలబడలేడు. నీవు ఒక సంస్థగా కలిగియున్నావు, కాని పరిశుద్ధాత్మ వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోవును. నీవు ముందున్న చోటనే కూర్చొనియుందువు. ఆత్మ ముందుకు కదలుచుండును, చూచారా. పెంతెకోస్తు ఒక సంస్థ కాదు; పెంతెకోస్తు ఒక అనుభవము.

40

దేవుడు తన బిడ్డలకు క్రొత్త జన్మను ఇచ్చెను. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా అది కలిగెను. నజరీన్, పిలిగ్రిం హోలినెస్ ద్వారా వారు తమ్మును తాము శుద్ధి చేసికొని దగ్గర వరకు వచ్చిరి; ఆ తరువాత పెంతెకోస్తు అనుభవము వచ్చెను. పరిశుద్ధాత్మ బాప్తిస్మము, వరముల పునరుద్ధరణ వచ్చెను. వారు భాషలు మాట్లాడుచూ, భాషలకు అర్ధము చెప్పుచూ, అద్భుతములు, సూచక క్రియలు, స్వస్థతా కార్యములు చేయుచూ వారిని అనుసరించిరి. వారు పిల్లలు. వారు దేవుని పిల్లలు. వారు క్రీస్తునందు స్థానము కలిగియున్నారు. జన్మ ద్వారా వారు పిల్లలయి యున్నారు. క్రొత్త జన్మ మరియు మారుమనస్సు, పరిశుద్ధాత్మయై యున్నది.

పరిశుద్ధాత్మను పొందువరకు నీవు అసలు మారుమనస్సు పొందనట్లే, లేఖనము అదియే చెప్పుచున్నది. యేసు పేతురతో చెప్పెను... ఎవరినయినా అడగండి, మీ వాక్యమును చదవండి. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుట ద్వారా నీతిమంతునిగా తీర్చబడెను. ఒక శిష్యునిగాను, అపోస్తులునిగాను మారెను. రాజ్యపు తాళపుచెవులు యేసు అతనికి ఇచ్చెను. యోహాను 17:17, ఆయన వారిని శుద్ధి చేసెను, వారికి శక్తిని ఇచ్చెను, బయటకు పంపెను. దయ్యములను వెళ్ళగొట్టి వారిని శుద్దీకరించెను. “నీ సత్యము ద్వారా వారిని పరిశుద్ధపరచుము, తండ్రీ. నీ వాక్యమే సత్యము. వారిని బట్టి నన్ను నేను శుద్దీకరించుకొనుచున్నాను.”

41

నేను వినిన అతి మాధుర్యమగు మాటలు: “తండ్రీ, వారి నిమిత్తము నన్ను నేను శుద్దీకరించుకొనుచున్నాను.” మీకు తెలుసా, ఆయనకు ఒక ఇల్లు కలిగియుండు హక్కున్నది? ఆయన ఒక మానవుడు. భార్యను కలిగియుండు హక్కు ఆయనకున్నది అని మీకు తెలుసా? ఆయన నరుడు. వీటన్నింటినీ పొందు హక్కు ఆయనకున్నది, అయితే ఆయన ఇట్లు చెప్పెను, “తండ్రీ! వారి నిమిత్తము నన్ను నేను శుద్దీకరించుకొనుచున్నాను. నన్ను నేను పవిత్రపరచుకొనుచున్నాను.”

42

నిన్న నేను ఒక చిన్న బోధకునితో మాట్లాడాను. పెద్ద కూడలిలో యున్న ఆయన స్థలంలో నేను కొన్ని రాత్రులు ఆయన కూటములలో ప్రసంగించుదును. ఒక ప్రత్యేకమగు సంగతి గూర్చి నేనడిగినప్పుడు అతడు, “అవును, బ్రెన్హాం సొదరుడా, అయితే మా ప్రజలు చాలామంది దానిని నమ్మరు.”

“వారిలో ఎక్కువమంది లీగలిస్టులు?” అని నేను అన్నాను.

“అవును!” సోదరుడా, వారు దానిని నమ్మరు. “కాని,” అతను “వారి నిమిత్తము...” అని చెప్పెను. నేనతని కౌగలించుకొని అతని మెడను ముద్దుపెట్టుకోవాలనుకున్నాను. “వారి నిమిత్తము నన్ను నేను శుద్ధిచేసికొనుచున్నాను.”

43

యేసు పండ్రెండు మందికి శిక్షణ ఇచ్చెను, ఆ పండ్రెండు మంది ద్వారా సువార్త ప్రపంచములోనికి వెళ్ళవలెను. “వారి నిమిత్తము నన్ను నేను శుద్ధిచేసికొనుచున్నాను,” అని ఆయన చెప్పెను. నీ పొరుగువాని నిమిత్తము, మరెవరి నిమిత్తమో నిన్ను నీవు శుద్దీకరించుకొనుము. నీ స్వేచ్ఛ కొరకు నీవు జీవించుట కాదు గాని, నిన్ను నీవు పవిత్రీకరించుకోవలెనని పౌలు చెప్పెను. నీ పొరుగువారి దగ్గర నీవు క్రైస్తవునివలె ప్రవర్తించుము. నీ సంభాషణ... నీ శత్రువును కలిసికొన్నప్పుడు కూడా అపవిత్రము కాకూడదు, అతని నిమిత్తము నిన్నునీవు పవిత్రపరచుకొనుము, నీవేమీ ప్రతీకారము చూపవద్దు.

44

కుమారునిగా స్వీకరించుట గూర్చి చూద్దాం. పుట్టిననాడే అతడు కుమారుడు, కాని అతని ప్రవర్తన బట్టి దత్తత జరుగును. అతని ప్రవర్తన సరిగా యున్నదో లేదా అని చూచును.

ఇప్పుడు ఇది ఒక పెంతెకోస్తు... పెంతెకోస్తు ఒక శాఖ కాదు, అని నన్ను చూపించనివ్వండి. ఇక్కడున్న బాప్టిస్టులలో ఎందరు పరిశుద్ధాత్మను పొందారో, చేతులెత్తండి. చూచారా? ఇక్కడున్న మెతడిస్టు వారిలో ఎందరు పరిశుద్ధాత్మను పొందారో, చేతులెత్తండి. ఇక్కడున్న నాజరీనులలో ఎందరు పరిశుద్ధాత్మను పొందిరో, చేతులెత్తండి. ప్రెస్బిటేరియనులు, పరిశుద్ధాత్మను పొందుకొనుట. చూడండి! లూథరనులు ఇంకా ఇతర శాఖల వారు పరిశుద్ధాత్మను పొందిరి. పెంతెకోస్తుకు చెందని వారెందరో పరిశుద్ధాత్మను పొందియున్నారు. వారందరి చేతులు చూడండి? కాబట్టి పెంతెకోస్తు ఒక శాఖ కాదు గాని ఒక అనుభవము.

45

దేవుడు నిన్ను క్రీస్తు శరీరములోనికి తీసికొని వెళ్ళెను. ఇప్పుడాయన ఏమి చేయును? ప్రపంచము ఏమి చెప్పినా గాని నీవు పరిశుద్ధాత్మకు లోబడి, నీ మంచి ప్రవర్తన ద్వారా నిన్నునీవు పవిత్రపరచుకొని రుజువు చేసికొనుము.

46

దీనిని చాలా గట్టిగా చెప్పగోరుచున్నాను, చూడండి, ఎందుకనగా... అమర్యాదగా నేను మాట్లాడగోరుట లేదు. దయచేసి నిజంగా దీనిని చూడండి. నేను మర్యాద లేనివాడిని అని తలంచకండి. ఆలాగు నేనుండగోరుట లేదు. దేవుడు-పంపిన సత్యమును ప్రజల యొద్దకు తీసుకొని వెళ్ళి బోధించుచున్నాను, కాని వారు దానిని తిరస్కరించి ఎప్పటి వలనె ప్రవర్తించుచున్నారు. అది నన్ను బాధించుచున్నది. వారు పరిశుద్ధాత్మను పొందినామని చెప్పుకొనుచున్నారు. అది నిన్ను నాశనము చేయును. ఏమిటి సంగతి? వారు నేరుగా అదే విషయము వద్దకు వచ్చిరి, ఈ ఇశ్రాయేలీయులవలెనె వీరును ఉన్నారు. అమోరీయులు, అమాలేకీయులు, ఫిలిష్తియులవలెనె వారు ప్రవర్తించగోరిరి. వారివలెను మాకు రాజు కావలెనని కోరిరి. రాజు తమ్మును ఏలవలెనని కోరుకొనిరి.

47

పురుషుల దుస్తులు ధరించుట తప్పు అని స్త్రీలారా మీకు తెలియదా? మీ జుట్టు కత్తిరించుకొనుట తప్పు అని మీకు తెలియదా? పొగత్రాగుట మరియు ఆ విధముగా ప్రవర్తించుట తప్పు అని మీ మగవారికి తెలియదా? ఇంటికి యజమానివగు నిన్ను నీ భార్య కోపముతో బయటకు తరిమి కొట్టినప్పుడు, నీవు భర్తగా ప్రవర్తించకుండా - ఆమెను నీవు దీవించుచు మరల ఇంటికి వచ్చుదునని చెప్పి వెళ్ళిపోవుచున్నావు. నీ స్వంత ఇంటిని నీవు వశములో ఉంచుకొనలేనప్పుడు, దేవుని ఇంటిని ఎట్లు కాయగలవు? సోదరీ, నీ భర్త కేవలము నీకు భర్త కాదు గాని, నిన్ను ఏలువాడు అని ఎరుగుదువా? ఆ విధంగా దేవుడు చెప్పెను, ఎందుకనగా భర్త మోసపరచబడలేదు. స్త్రీ మోసపరచబడెను. మీరు స్త్రీ బోధకులను తయారు చేయుచూ వారిచేత సంఘములలో బోధింపచేయుచున్నారు. దేవుని వాక్యము దానిని ఖండించుచున్నదని ఎరుగుదురు.

48

“తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను నామమునుపయోగించి మీరు బాప్తిస్మ నిచ్చుచున్నారు. దానికి ఆధారము బైబిలులో ఒక్క వాక్యము కూడా లేదు. ”తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎవరైనా, ఎన్నడైనా బాప్తిస్మము పొందినట్లు బైబిలులో యున్నదేమో, ఒక ఆర్చి-బిషప్పు నాకు చూపించమని అడుగుచున్నాను. యేసు నామములో తప్ప మరే విధముగానయినా గాని ఎవరైనా ఎప్పుడైనా బాప్తిస్మము పొందిరేమో నాకు చూపించమనండి. ఆయన వచ్చుచున్నాడని విశ్వసించి యోహాను బాప్తిస్మము ఇచ్చెను గాని ఆయనెవరో వారికి తెలియదు. కాని వారు దానిని గుర్తించిన వెంటనే, వారు మరల యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుటకు వచ్చిరి. అసెంబ్లీస్-ఆఫ్-గాడ్, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను మొదలగు శాఖలకు చెందిన బోధకులను అడిగాను. ఓ, దానిగూర్చి వారు మాట్లాడలేకపోయిరి. వాక్యమును నేను చూడగోరుచున్నాను.

నన్ను “మూఢుడు” “పిచ్చివాడు” “మతిలేని వాడు” అనుచున్నారు. సత్యము చెప్పుటకు ప్రయత్నించుచున్నందునే ఆలాగనుచున్నారు గదా? సోదరులారా, అది నిజము. నేను దేవుని కొరకు అమ్ముడు పోయాను. మీరు లోకములోని వాటి కొరకు అమ్ముడు పోయిరి. దేవుని కొరకు మీరు ప్రత్యేకించబడినయెడల వేరే సృష్టిగా యుందురు.

49

పిలువబడిన వారనేకులు; ఏర్పరచబడిన వారు కొందరే. అవును. చాలా మంది పిలువబడిరి. నీ హృదయములో నీకు ఒక పిలుపున్నది. “దేవుడు నన్ను ప్రేమించుచున్నాడని నమ్ముచున్నాను,” అని నీవనుకొనుచున్నావు.

కాని సోదరుడా, నీవును వారివలె నశించియున్నావు, ఎందుకనగా వారు ఆ దినమున అక్కడికి వచ్చి ఇట్లందురు, “ప్రభువా, నీ నామములో నేను దయ్యములను వెళ్ళగొట్టియున్నాను. నీ నామములోనే అన్నీ చేశాను. స్వస్థతా కూటములు ఏర్పాటు చేశాను. సువార్తను బోధించాను. అపవిత్రాత్మలను పారద్రోలాను.”

మరియు యేసు ఇట్లనును, “వేషధారీ! నిన్ను నేను ఎన్నడు ఎరుగను. ఇక్కడ నుండి తొలగిపొమ్ము. నా తండ్రి చిత్తము జరిగించువాడే నా వాడు.” దానిని జనులెందుకు చూడలేకపోవుచున్నారు? ఇప్పుడు ఇది బాధకరమే. మిమ్మును నేను బాధించుట కాదు. ఆ విధముగా ఉండవలెనని నేను కోరుటలేదు, కాని, సహోదరుడా, నేను...

50

మనము అంత్యకాలములో యున్నట్లు నాకు కనిపించుచున్నది. దేవుడు సంఘమును దత్తత చేసికొని క్రీస్తు శరీరములో ఒక స్థానమును ఏర్పరచుచున్నాడు. ఇప్పుడు, మరీ ఎక్కువ మందిని ఆయనందులో ఉంచుట లేదు. మొదటి నుండియు అదే నేను చెప్పుచున్నాను. “ఓ, చాలా గొప్ప సంఖ్యయున్నది గదా? అందురేమో, కానీ ఆ సంఖ్యను లాగుటకు ఆయనకు ఆరువేల సంవత్సరములు పట్టెను. గురుంచుకొనండి, పునరుత్థానము జరుగును, వారితో కూడా మనము కొనిపోబడుదుము. కొద్దిమంది మాత్రమే యుందురని మరువకండి. మీరు మీ యొక్క రక్షణను త్వరగా వెదకండి. మిమ్ములను మీరు పరిశోధించుకొని మరియు ఏ తప్పు జరిగిదో చూడండి. ఏమిటో సంగతి చూడండి. అది కష్టమని నాకు తెలియును, కాని సోదరుడా, అది సత్యము. అది దేవుని సత్యము.

పుత్రస్వీకారము!

51

దేవుని కొరకు మనము అగ్నిని కలిగియుండవలెను. దివా రాత్రులు మనము మండుచుండవలెను. ఏదీ మనలను ఆపజాలదు. మనము ఎంతో మాధుర్యముగాను, అనుకూలముగాను, దయగాను, క్రీస్తువలె జీవించవలెను. ప్రతి దిన జీవితము ఆలాగే ఉండవలెను. యేసు చెప్పెను, “అడవిలోని గడ్డి పువ్వులు ఏలాగు ఎదుగుచున్నవో, కష్టపడుచున్నవో, వడుకుచున్నవో చూడండి. సమస్త వైభవముతో కూడిన సాలోమోను సహితము వీటిలో ఒకదానివలెనైనను అలంకరించబడలేదు.” సోలోమోను మహిమగల సిల్కు వస్త్రములు మరియు కుట్టిన అంగీలు చాలా కలిగియుండెను, కాని ఆయన వాటిగూర్చి మాట్లాడుట లేదు. ఒక గడ్డి పువ్వు ఎదుగవలెనన్నచో, దివా రాత్రులు అది శ్రమపడవలెను. ఈ వరుసలో నీవు ఎట్టివానిగా ఉండగోరుచున్నావు? నీతిమంతుడు రక్షించబడుటయే దుర్లభమైతే - పాపియు (అది అవిశ్వాసులు) మరియు భక్తిహీనుడును ఎక్కడ నిలుతురు? (వాక్యము వినియు అందులో నడుచుటకు నిరాకరించువారు ఎక్కడుందురు?)...? మనిమిప్పుడు ఏమి చేయబోవుచున్నాము?

52

ఇప్పుడు, ఇది మన సంఘము. మన మధ్య నలుగురు లేదా అయిదుగురు క్రొత్తవారున్నారు. సంఘమునకు దీనిని నేను ఉపదేశించుచున్నాను. ఇది టేపుల మీద వెళ్ళుచున్నది. టేపులు వినుచున్నవారికి గుర్తుంచుకోవాలని చెప్పుచున్నాను, ఇది కేవలము నా సంఘమునకు చెప్పుచున్నాను. బయట నున్నవారికి నేడు పెద్ద మనిషివలె చెప్పగోరుచున్నాను, వారి అభిప్రాయములు వెన్నలేని పాలవలె యున్నవి. అందుకే వారికి నెమ్మదిగా చెప్పెదను. కాని సత్యమును నిజంగా చెప్పక తప్పదు.

53

సరైన స్థానములో యుంచుటయే కుమారత్వము! వారెచ్చట యున్నారు? వారెక్కడున్నారో చూపించండి? దేవుడు తన పిల్లలను ప్రత్యక్షత ద్వారా ప్రక్కకు పిలుచుచున్నాడు. దానిగూర్చి వారు ఒక్క మాట కూడా చెప్పనక్కరలేదు, ఏదో జరిగినదని మీకే తెలియును. తన కుమారుని సరైన చోట ఉంచుచున్నాడు. అతనిని క్రమములో ఉంచుచున్నాడు. అతనికి గొప్ప అధికారము ఇయ్యబడినది. అతని మాట ప్రధానదూత మాటకంటె మిన్నగా యున్నది. కుమారుని దత్తత చేసికొని ఉన్నతమగు స్థానములో యుంచెను. అతని రూపమును, అతని వస్త్రమును మార్చివేసెను. తండ్రి ఒక ఉత్సవము జరిపి ఇట్లనెను, “ఇతడు నా కుమారుడు. ఇకనుండి ఇతడే పాలకుడు. ఇతడే అధికారి. నా ఆస్తి అంతటికి వారసుడు. నాదంతయు ఇతనికి చెందును.” అది నిజము.

54

అప్పుడు మనము తిరిగి ఎలాహ్, ఎలాహ్, ఎలోహిం యొద్దకు వెళ్ళగలము, చూచారా, ఆయన స్వయం ఉనికి గలవాడు. అప్పుడు తిరిగి యెహోవా ద్వారా వచ్చి సృష్టించును. ఆయన భూమి మీద మానవునికి అధికారమిచ్చెను. మనము ఎందుకొరకు కనిపెట్టుచున్నాము? ప్రత్యక్షతల కొరకు, భూమి మూలుగుచున్నది. దానిని మనము చదువుదుము. అది సరియే.

తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను.

తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమను కీర్తి కలుగునట్లు...

ఆయన కృప అనగా ఏమిటి? ఇంతకు ముందు, ఆయన తండ్రిగా లేనప్పుడు, ఆయన కృపయే ప్రేమయైయున్నది. ఆయన ఒక పిల్లవానిగా మారెను. అందువలన మనము ఆయన కృపా సంకల్పము చొప్పున కుమారులముగా స్వీకరింపబడుటకు ముందే నిర్ణయించబడితిమి.

క్రీస్తు అను తన ప్రియుని (వ్యక్తి)యందు ప్రేమ చేత మనలను ఏర్పరచుకొనెను.

ఏలాగు మనము ఏర్పరచకొనబడితిమి? ఆయన ద్వారా, ఆయన లోనికి, మనమెట్లు వచ్చితిమి? ఒకే ఆత్మ ద్వారా అందరము ఆయన లోనికి బాప్తిస్మం పొందితిమి. వినండి.

ఆయన రక్తము వలన విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగియున్నది.

55

ఎక్కడో ఒక పాపపరిహారము జరుగనియెడల దేవుని యొక్క ముందు నిర్ణయమును, ముందు అభిషేకమును గూర్చి నీవెట్లు బోధించగలవు? ప్రతి దినము ఎందుకు నీవు పొరపాటు, తప్పిదము చేయుచున్నావు? నీవు తిరిగి జన్మించినట్లయితే, స్త్రీ అయినా, పురుషుడయినా సరే, తప్పు చేసిన వెంటనే దానిగూర్చి నీవు చింతించుదువని దేవుడు ఎరుగును. నీవు దేశాధ్యక్షుడగు రూజ్-వెల్డ్ లేదా యింకెవరి సన్నిధిలోనైనా నిలబడి, “నేను తప్పు చేశాను. దేవా, ఈ విషయము గూర్చి క్షమించు,” అనుట కాదు. ఎందుకు? నీ కొరకు దేవుడు రక్తపరిహారమును చెల్లించెను.

“పాపములు,” అను మాటను మీరు గమనించారా; పాపి - పాపియే; అతడు పాపము చేయడు. అయితే సంఘము పాపము చేయును - తప్పు చేయును, తప్పుడు ఆలోచనను కలిగియుండును, తప్పుడు అభిప్రాయములను కలిగియుండును. నడక నేర్చుకొనుచున్న చిన్న పిల్లవలె తప్పటడుగులు వేయును. ఏలాగు నడువవలెనో నేర్చుకొనును. బాగా నడచుట ఎట్లో ఇంకా బిడ్డకు తెలియలేదు, ఎందుకనగా అతడు చిన్నవాడు. కాని మనలను నిలబెట్టు ఒక హస్తమున్నది, “కుమారుడా! ఇటు అడుగు వేయుము,” అని చెప్పును. మనము తప్పు చేశామని చెప్పి పట్టుకొని కొట్టడు. మనము నడచుటకు ప్రయత్నించుచున్నందువలన మనకు మరణ దండన విధించడు. మనము మన పిల్లలను ప్రేమించునట్లే ఆయన మనలను ప్రేమించును.

56

తన బిడ్డ నడక నేర్చుకొనుచూ క్రింద పడిపోయినప్పుడు ఒక నిజమగు, తండ్రి ఆ బిడ్డను కొట్టడు. తన బలమగు చేతితో పట్టుకొని లేపి, అతని రెండు చేతులను పట్టుకొని, “కుమారుడా! ఈ విధముగా నీవు చేయుము. ఈలాగు నడువవలెను,” అనును.

దేవుడు తన సంఘముతో కూడా ఆలాగే వ్యవహరించుచున్నాడు. తన హస్తము చాపి, తన చేతులు మీదికి తీసుకొని అతనిని పైకి లాగి “కుమారుడా! ఈలాగు నడువుము” అని చెప్పును. “ఆలాగ మాట్లాడవద్దు. ఈలాగు మాట్లాడుము. సంఘము ఏమి చెప్పుచున్నదో, ఇది ఏమి చెప్పుచున్నదో, అదేమి చెప్పుచున్నదో నేను లెక్క చేయను. నీవు దానిని ఈ విధముగా చెప్పుము. ఈలాగు, ఈ రీతిగా చెప్పుము! దానిని నా వాక్యము బోధించినయెడల, నీవు సరిగ్గా దానితోనే నిలబడుము, దానితోనే నడువుము. దానితోనే సరిగ్గా నిలబడుము. ఎవరేమి చెప్పిననూ లెక్క చెయ్యకు, దానితో సరిగ్గా నిలబడుము. ఈ విధముగా నడువుము. నీవు అడుగులు వేయవలసిన విధానం అదే.”

57

మన అపరాధములకు పరిహారము దొరికినది. మన పాపములను బట్టి ఆయన మనలను ప్రేమించకూడదు. అలాగయితే మనకు తరుణము లభించియుండెడిది కాదు. ఆ మాటలలో ఎంతగానో మనము లంగరు వేసికొనియుండ వచ్చును!

దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి....

అది విస్తరించెను.

“విస్తరించుట,” అనగా ఏమిటి? ఓ, మై! విస్తరించుట అనగా “పెద్ద కుప్ప,” అని చెప్పవచ్చును.

మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనయెడల విస్తరింపచేసెను.

“మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనయెడల విస్తరింపచేసెను.” సంపూర్ణమైన “జ్ఞానము,” లోక సంబంధమైనది కాదు. లోక జ్ఞానము ఆయనకు వెర్రితనము, మరియు దేవుని జ్ఞానము లోకమునకు వెర్రితనముగా ఉండును. పగలు, రాత్రివలె అవి ఒకదానికొకటి సమ్మతించుకొనవు. సూర్యుడు ఉదయించ నారంభించినప్పుడు, పగలు వచ్చినప్పుడు రాత్రి అయా చోట్లకు మాయమైపోవును. మరియు సువార్త వెలుగు ఉదయించ నారంభించగానే లోక సంగతులన్నియూ మాయమగుట ఆరంభమగును. మరియు అదేమి చేయును? ఆయన తన పిల్లల మీద సూర్యుని కాంతిని విస్తరింపచేసి, ఆత్మలో నడుచుచు, దేవుని ఆత్మ ద్వారా నడిపించును. ఆ కృపను వారిపట్ల విస్తరింపచేయును. సమస్త జ్ఞానము, వివేచన, అవగాహన, తెలివి వారికి వచ్చి ఎట్లు నడువవలెనో తెలియును. ఒకటి తప్పు అని నీవు చూచినప్పుడు, నీవు చేయుచున్న దానిగూర్చి జాగ్రత్తపడుము. నీవెట్లు... అది తప్పు అయినట్లయితే, నీవు దానిని సమీపించుటకు జాగ్రత్త వహించవలెను. వివేకము కావలెను! దానినెట్లు సమీపించవలెనో నీవు ఎరుగవలెను. నిశ్చయత కలిగియుండుము. “పామువలె వివేకులును, పావురమువలె నిష్కపటము కలిగి ప్రవర్తించవలెను.” అదే యేసు చెప్పెను.

58

ఓ, స్నేహితులారా! ఇవి ఆణిముత్యములు! ఎన్ని దినములు చెప్పుకొన్నా తరగవు. అవి ఆశ్చర్యముగా లేవా? వివేకము, జ్ఞానము కావలెను. వాటిని ఆయన మనయెడల విస్తరింపచేసెను. మన మీద కుమ్మరించెను. ఒక చెంచాడు మనకు ఇచ్చి ఊరుకోలేదు గాని, ఒక పెద్ద పారతో త్రవ్వి ఎడతెగక పోయుచున్నాడు. ఆయన కృప యొక్క జ్ఞానము మరియు వివేకము మనపట్ల విస్తరింపచేసెను. ఓ, ఆశ్చర్యమైన ప్రేమ, ఎంత మాధురమైన స్వరము!

తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనయెడల విస్తరింపచేసెను.

ఆయన ఎవరితో మాట్లాడుచున్నాడు? సంఘ శాఖలతోనా? నా సోదరులారా, దయచేసి నేను మీ శాఖలను చిన్నపరచుచున్నానని తలంచవద్దు. నేను అల్లరి చేయుట లేదు. దాని ప్రారంభమే తప్పు అని నేను మీతో చెప్ప ప్రయత్నించుచున్నాను. “వెళ్ళి సువార్తను ప్రకటించుడి,” అని యేసు చెప్పెను. మనము వెళ్ళి శాఖలను తయారు చేశాము. అందువల్లనే ఏమీ మనము పొందలేకపోయాము, మానవ జ్ఞానమును బట్టి మనము నడచుచున్నాము.

కాల్విన్ లేచినచో ఎట్లుండును!

59

ఎందువలన, ఒక గొప్ప సంఘసంస్కర్త యొక్క సమాధియొద్ద నేను కొంతకాలం క్రిందట నిలబడితిని. మరియు అతడు ఎంత గొప్పవాడు, అనుకొన్నాను. అతడు గొప్పవాడే! మంచిది, వారిలో అందరు... ఆయన పేరు జాన్ వెస్లీ. మరియు నేడు జాన్ వెస్లీ తన సమాధిలో నుండి లేచి తన సంఘము యొక్క స్థితిని చూచినచో, తన పేరు దానికి పెట్టుకొన్నందుకు అతడు సిగ్గుపడునని నేను తలంచాను. జాన్ వెస్లీ దైవజనుడు. అగ్నిజ్వాలవంటి వాడు. జాన్ వెస్లీ దేవునియందు విశ్వాసముంచిన పరిశుద్దుడు. మరియు ఆయన మార్గములోనే అతడు తన అడుగులు వేసెను. కాని జాన్ వెస్లీ చనిపోయిన తరువాత వారిట్లనిరి, “జాన్ కొరకు మనమొక సంఘమును తయారు చేయదము. దానిని మనము మెతడిస్టు చర్చి అని పిలచుదము, ఎందుకనగా అతని యొక్క శుద్దీకరణ పద్దతి కృప యొక్క రెండవ కార్యమైయుండెను.”

ఆ తరువాత వారొక సంఘమును తయారుచేసిరి. మరియు ఈనాడు ఆ సంఘపువారు ఆనాడు జాన్ వెస్లీ ఏ సంగతుల కొరకు నిలబడెనో వాటినే తిరస్కరించుచున్నారు. జాన్ వెస్లీ దైవిక స్వస్థతను బోధించెను. ఆత్మ బాప్తిస్మమును జాన్ వెస్లీ నమ్మెను. అన్ని వరముల పునరుద్ధరణను జాన్ వెస్లీ నమ్మెను. జాన్ వెస్లీ, మార్టిన్ లూథర్, మొదలగు దైవభక్తులందరూ భాషలలో మాట్లాడి వాటికి అర్ధము చెప్పిరి. మరియు ఈ రోజు నీవు మెతడిస్టు లేదా లూథరన్ సంఘములో భాషలతో మాట్లాడినచో నిన్ను బయటకు గెంటివేయుదురు. అసలు సంగతి ఏమిటి? కుమారులముగా మనముండవలసిన సమయములో ఎట్లున్నాము, అసలు విషయము ఏమిటి? వారు మరొక దానిని దత్తత చేసుకున్నారు, ఎందుకనగా వారికి దేవుని యొక్క మర్మమును తెలియదు. మరియు ఒక సెమినరీ ద్వారా వారెన్నడూ దానిని తెలిసికొనలేరు.

60

ఇక్కడ నన్ను కొంత చదువనివ్వండి. పరవాలేదు కదా? మంచిది. ఇక్కడే నేను కొంత వ్రాసియుంచాను. పౌలు ఈ వర్తమానపు ఉపదేశకుడు. అపోస్తలుల కార్యములు 9:5 ఒక నిమిషము చూద్దాం. [టేపు మీద ఖాళీయున్నది.] నన్ను తెలిసికోనివ్వండి ఎప్పుడు నేను....

సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను హింసించుచు, [ఓ కోపిష్ణుడు, అహాంకారముగల యూదుడు.]... హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధానయాజకుని యొద్దకు వెళ్ళి -

దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను.

“నేను వెళ్ళి వారి పని చూతును. అబ్బాయి, నేను వారిని కనుగొనినయెడల, వారిని పట్టుకొని ఏమి చేతునో చూడండి! చూశారా, నేను వారిని కనుగొనిన యెడల!” కాని అతడు ముందుగానే నిర్ణయించబడెను!

61

ఎందుకూ పనికిరాని దుర్మార్గుడు నిత్యజీవమునకు నిర్ణయింపబడలేదని నీవెట్లు చెప్పగలవు? ఆ తిరుగుబోతుతో నీవసలు మాట్లాడనే లేవు. కాని నీవు కరచాలనము చేసి సంఘమునకు ఆహ్వానించినట్లయితే, దేవుని కొరకు పరిశుద్దురాలిగా మారదని ఎట్లు చెప్పగలవు? అవతలి మహిమలో నీవామెను కనుగొందువు. చెడిపోయిన ఆ స్త్రీ పరిశుద్దురాలు కాలేదని నీకెట్లు తెలియును? అదే మనకు తెలియదు. కాని అది మన కర్తవ్యము. ఒక జాలరివాడు సముద్రములోనికి వలను విసరి బయటకు లాగినప్పుడు, అందులో నుండి కప్పలు, చేపలు, పురుగులు, నీటిలోని వివిధ క్రిములు వచ్చును; అయితే అందులో కొన్ని చేపలుండును. అతనికి తెలియదు, కేవలము వల విసరెను. మనము చేయునదంతా అదే. పౌలును గమనించండి:

ఆ మార్గమందున్న పురుషులనైనను, స్త్రీల నైనను కనుగొనినయెడల వారిని బంధించి యోరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. [సోదరుడా! నిజంగా అతడు కఠినుడు!]

అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఆకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టు ప్రకాశించెను.

ఇప్పుడు, అది కేవలము అధిక తెలివి ఆ దారిలో యాజకుడగు డాక్టర్ ఎఫ్. ఎఫ్ జోన్స్ ఎదురయ్యి అతనితో చెప్పెననుకొందాం, “నీకిప్పుడు సెమినరీ అనుభవము కావలెను, కుమారుడా, మరియు అప్పుడు దేవుడు నిన్ను వాడుకోగలడని నమ్ముచున్నాను.” అటువంటి మాట చాలా ఘోరముగా యుండును గదా? ఇప్పుడు, అది కేవలము అధిక తెలివి.... నేను దీనిని హేళనగా చెప్పుట లేదు. ఆ మాట వంటి అర్థములేని మాటలనే నేడు మనమును మాట్లాడుకొనుచున్నాము. “నీ తల్లి చాలా మంచిది. నేను నమ్ముచున్నాను నీవు ఒక మంచి బోధకుడవగుదువు,” అనుచున్నారు.

62

ఏమి జరిగినదో గమనించండి:

అతడు ప్రయాణము చేయుచూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఆకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. [అతీతమైనది ప్రారంభమయినది]:

అప్పుడతడు నేల మీద పడి - సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.

ప్రభువా, నీవెవడవని అతడడుగగా, ఆయన - నేను నీవు హింసించుచున్న యేసును; మునికొనకు ఎదురు తన్నుట నీకు కష్టము.

మరియు అతడు వణికిపోయి నీవు ఎవరు ప్రభువా, నీవు ఏమి చేయవలెనని నన్ను కోరుచున్నావు? ప్రభువు అతడితో ఇలా చెప్పెను, లేచి పట్టణములోనికి వెళ్ళుము. అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను.

63

అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు మౌనులై నిలువబడిరి. ఎక్కడో యున్న అననీయ దర్శనమును చూచెను. అంతా అతీతమైనదే! ఆ పాత సౌలు చాలా భయంకరుడు. ఈ అననీయ తన ఇంటిలోనే దర్శనమును చూచెను. అతడు ఒక ప్రవక్త, తన ఇంటిలో ప్రార్ధించుచు మరియు అతను ఒక దర్శనము చూచెను. అతడు.... ప్రభువతనితో మాట్లాడి ఇట్లు చెప్పెను, “ఆ దారిగుండా ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. అతడు గ్రుడ్డితనముతో మొత్తబడెను. అతని పేరు సౌలు. అతడు తార్సువాడు.”

“ప్రభువా, నేనతని గూర్చి చాలా విన్నాను. నేను చిన్న మనిషిని నన్ను అతని యొద్దకు పంపవద్దు,” అని అతను చెప్పెను.

“కాని చూడు! అతడు దారిన వచ్చుచున్నాడు. నేనతనికి ఒక దర్శనము చూపించాను. అగ్నిస్తంభములో అతనికి నేను ప్రత్యక్షమయ్యాను. అతనిని అంధత్వముతో మొత్తాను. అతనిని నేను వాడుకొను ముందుగా, అతనిని నలుగ గొట్టి చీల్చవలసియున్నాను. చూడండి, అతని పాండిత్యమునంతా నేను తీసివేయవలసి యున్నాను. మీకు తెలియును, అతను ఆ సంఘములలో అతడు చాలా గొప్పవానిగా యున్నాడు. అతనికి చాలా డిగ్రీలుండెను. అతనికేమీ మెరుగులు దిద్దనవసరము లేదు. అయితే ”నేను చేయవలసినదేమనగా, అతనిలో వున్నదంతయూ తీసివేయుటయే,“ అని చెప్పెను.

64

అదీ సంగతి. అతనిలోనికి ఇంకా ఎక్కువ పోయుట కాదు గాని, ఉన్నది తీసి వేయవలెను. ఈనాడు మన చాలామంది బోధకులకు అదే అవసరము. వారిలో ఉన్నదంతయూ తీసివేయవలెను, తద్వారా దేవుడు వారిలో తన పరిశుద్ధాత్మను ఉంచును. బయటకు తీసివేయవలెను!

మరియు అతడు చెప్పెను, “ప్రభువా! ఇతడు చాలా క్రూరమైన వాడు.”

“ఇదిగో, అతడు ప్రార్ధన చేయుచున్నాడు. ఫలాని వీధిగుండా నీవు వెళ్ళినప్పుడు నీకు ఒక ప్రవాహము కనబడును. అక్కడి నుండి ఎడమకు తిరిగి వెళ్ళుము. మరియు అట్లే వెళ్ళుము. అక్కడ ఒక తెల్లని ఇల్లు కనబడును. వెళ్ళి దాని తలుపు తట్టుము. అతడు ఆ పడసాలలో పరుండియున్నాడు. అతని మీద చేతులు వేయుము. దమస్కు నదియొద్దకు తీసికొని వెళ్ళి, యేసు నామములో బాప్తిస్మము ఇమ్ము. నేను చేయబోవు దానిని నీతో చెప్పుదును. అతడు నా కొరకు ఎన్నో శ్రమలు భరించవలసియున్నాడు. అతడు అన్యులకు నా వర్తమానికుడు,” అని ఆయన చెప్పెను. ఆమేన్!

65

“మంచిది, ఇప్పుడు, ఒక్క నిమిషము ఆగు! ప్రభువా! ఏ స్కూలుకు వెళ్ళుమని చెప్పును అనెనా? గలతీ పత్రిక చదివి మరియు కనుగొనెదము. గలతీ 1వ అధ్యాయము 10వ వచనము చూడండి. పౌలు ఏ స్కూలుకు వెళ్ళెనో, ఏ సెమినరీకి వెళ్ళెనో, అతని పైన ఎవరి చేతులుంచబడెనో చూడండి. గలతీ 1వ అధ్యాయము. సమయము లేదు గనుక అతని మార్పును గూర్చి చదువుదము. 10వ వచనము:

ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోష పెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును.

ఓ, మై, మై! ఇక్కడ నేను చిన్నమాట చెప్పెదను. గలతీ 8వ అధ్యాయము తీయండి. ఆ జనులకు మరల యేసు నామములో బాప్తిస్మము పొందునట్లు చేసినది పౌలేనని ఎందరికి తెలియును? అపోస్తలుల కార్యములు 19 చూచారా? 8వ వచనము చూద్దాం. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరియొక్క సువార్తను మేమైనను, పరలోకము నుండి వచ్చిన ఒక దూతయైనను మీకు ప్రకటించిన యెడల, అతడు శాపగ్రస్తుడవును గాక.

“పౌలూ, ఈ సువార్త నీకు ఎక్కడ నుండి వచ్చినది?” 9వ వచనము:

మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి ఎవడైనను మీకు ప్రకటించినయెడల, వాడు శాపగ్రస్తుడవును గాక!

ప్రధాన దూతయైనను, బిషప్పయినను, పర్యవేక్షకుడయినను, డాక్టరైనను, ఎవరైనా సరే, యేసు క్రీస్తు నామములో నీటి బాప్తిస్మమును బోధించనియెడల, పరిశుద్ధాత్మ బాప్తిస్మము బోధించనియెడల, వరముల పునరుద్ధరణను బోధించనియెడల, క్రీస్తు రాకడను బోధించనియెడల, ఇవన్నియూ బోధించనియెడల శాపగ్రస్తుడవును గాక? ఇందులో ఏ వాక్యమునైననూ గాని తీసికొని, ఇది మరో దినమునకు చెందినదని చెప్పినయెడల, లేదా దానిగూర్చి తనకు తోచిన క్రొత్త అభిప్రాయమును వెల్లడించినయెడల, లేదా ఏదో సెమినరీలో నేర్చుకొన్న దానిని చెప్పినయెడల, అతడు శాపగ్రస్తుడగును గాక!

66

మనము చదివెదము, పౌలు దానిని ఎట్లు పొందెనో చూద్దాం. దానినే ఈ ఉదయమున మీకు నేను చెప్ప ప్రయత్నించుచున్నాను.

ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించ జూచుచున్నానా లేక దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? మనుష్యులను ఇప్పుటికిని నేను సంతోషపెట్టగోరువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును.

దేవుని ప్రేమించువాడు, ముఖ్యంగా బోధకుడు మనుష్యులచే ద్వేషింపబడుట తప్ప మరేమి ఆశించగలడు? మనుష్యులు మిమ్మును ద్వేషించుదురు. మంచిది, వారు చెప్పిరి, “నేను యాజమానిని. మీ అందరికంటె గొప్పవాడిని. మీ అందరికంటె ఎక్కువ అద్భుతములు, పరిశుద్ధాత్మ క్రియలు నేను చేయగలను, ఎందుకనగా నాలో సంపూర్ణతయున్నది. ”వారు నన్ను బయల్జేబూబు, అని పిలువగా మిమ్మును మరింత ఎక్కువగా పిలుచుదురు?“ ఏమి జవాబు చెప్పవలెనా, అని తలంచవద్దు, ఎందుకనగా మాట్లాడువారు మీరు కారు గాని, ఆ సమయములో తండ్రి మీలో నివసించి మాట్లాడును. వాక్యముతోనే నిలచియుండుడి,” అని యేసు చెప్పెను. ఆయన గ్రంథము వ్రాసినప్పుడు ఇట్లు చెప్పెను, “ఈ గ్రంథములో నుండి ఒక్క మాట తీసివేసినా, దీనికి ఒక్క మాట కలిపినా, అట్టివాని పేరు జీవగ్రంథములో ఉండకుండా కొట్టివేయబడును,” అని ఆయన చెప్పెను. దానితోనే నిలచియుండుటకు దేవుడు సహాయము చేయును గాక!

67

ఇప్పుడు తరువాత వచనమును త్వరగా చదువుదము:

సహోదరులారా! నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనదని కాదని మీకు తెలియ చెప్పుచున్నాను. [ఇప్పుడు, నేను మెతడిస్టును కాను, బాప్టిస్టును కాను, ప్రెస్బిటేరియనును కాను, లేక పెంతెకోస్తును కాను. ఇది మనుష్యుని వలన పొందినది కానే కాదు.]

మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దానిని బోధింపను లేదు.

“ఒక మనుష్యుని వలన గాని, సెమనరీల వలన గాని, డాక్టరు వలన గాని, వేదాంతి వలన గాని, పాఠశాల విద్య వలన గాని దానిని నేను పొందలేదు. ఆ విధంగా నేను దానిని పొందలేదు. ఆ విధంగా నేను నేర్చుకొనలేదు, ఆ విధంగా దానిని నేను కనుగొనలేదు, ఆ విధంగా అది ఎన్నడూ నాయొద్దకు రాలేదు.” అయితే పౌలూ, అదెట్లు వచ్చినది?

నాకెవడును దాని బోధింపలేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది.

“క్రీస్తు తానే దేవుని కుమారుడనని నాకు బయపరచుకొనినప్పుడు, ఆ దినమున అగ్నిస్తంభము నన్ను తాకినప్పుడు, ”ప్రభువా! నీవెవరవు?“ అని నేనడుగగా, ”నేను యేసును,“ అని ఆయన చెప్పెను.

68

ఇప్పుడు అతనికేమి జరిగినదో చూపించనివ్వండి. ఇప్పుడు, సరిగ్గా ఇప్పుడు ఒక వ్యక్తికి అనుభవము వచ్చుటకు పది సంవత్సరములు గ్రీకు, పది సంవత్సరములు మరేదో చదువవలె నందురు, కాని అది ముగియక ముందే అతడు చనిపోవును. చూడండి:

మనుష్యునివలన దానిని నేను పొందలేదు. నాకెవడును దానిని బోధింపను లేదు, కాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది.

పూర్వమందు యూద మతస్థుడనైయున్నప్పుడు యూదుల మతములో అధిక్యత నొందితినని, నా నడవడిని గూర్చి మీరు వింటిరి.

“అబ్బాయి, నేను గొప్ప డాక్టరును, నాకా డిగ్రి యున్నది.” అతడు గమాలియేలు యొద్ద చదువుకొనెను. ఆ దేశములో అతడే గొప్ప ఉపదేశకుడు. గమాలియేలు గొప్ప ఉపదేశకులలో ఒకడని ఎందరికి తెలియును? అవునండి. “నా యూదా మతము గొప్పదనుకొంటిని. అపోస్తలుల సిద్ధాంతము, ఇంకా అయా సంగతులు నేను కంఠత పెట్టాను. మీరు చూశారా. ఉదయకాల ప్రార్థనలు ఎట్లు చెప్పి ప్రజలను దీవించవలెనో నాకు తెలియును.” చూచారా?

నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచుంటిని. [పరిశుద్ద గుండ్రాళ్ళను నాశనము చేయ ప్రయత్నించాను, చూచారా?]:

యూదుల మతములో ఆధిక్యత నొందితిని...

“నేను గొప్పవాడిని. అబ్బాయి, నేను నిజముగా.... చాలా లాభము పొందితిని, వారిని నాశనము చేయగలనని తలంచాను. ఎందుకనగా సైఫనును, ఇంకా చాలా మందిని చంపించాను. నేను ఎన్నో ఘన కార్యములు చేశాను.” చూశారా నేను ఎట్లు చేశానో!“ అపరిమితముగా అతడు హింసించెను.

69

నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనైనా స్వజాతీయులలో నా సమాన వయస్ములైన అనేకుల కంటె యూదుల మతములో ఆధిక్యత నొందితిని.

ఇప్పుడు, గుర్తుంచుకొనండి, దేవుని వాక్యము కాదు గాని, “పితరుల పారంపర్యాచారము.” మరో మాటలో చెప్పవలెనన్న, సంఘ ఆచారము. “నేను పూర్తిగా మెథడిస్తును, నేను పూర్తిగా బాప్టిస్టును. నేను పూర్తిగా పెంతెకోస్తును,” అని చెప్పుచున్నారు. ఓ, అవునా? నేను దేవునికే చెందగోరుచున్నాను. అంతే, చూచారా. మంచిది.

పితరుల పారంపర్యాచారము.

అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలచిన దేవుడు,

నేను అన్యజనులలో తన కుమారుని బయలుపరచవలెనని...

అదెట్లున్నది? “నాలో పరిశుద్ధాత్మ యున్నది. నన్ను ప్రత్యేకించుటకు దేవుడు సంతోషించెను. అందుకొరకు నా తల్లి గర్భములోనే నన్ను వేరుచేసెను, కుమారుని నాకు ఇచ్చెను, ఆత్మ రూపములో పరిశుద్ధాత్మ నాలో యున్నది. ఆయన తన్నుతాను నాలో బయలుపరచుకొనెను.” ఓ, మై! నాకు కొద్దిగా కేక వేయాలనిపించుచున్నది.

70

చూడండి, నన్ను చెప్పనివ్వుము సోదరుడా, దేవునికది ఇష్టమాయెను! ఓ, హల్లెలూయా! దేవునికది ఇష్టమాయెను! తండ్రి ఒక త్రాగుబోతు. (అమ్మా, దేవుడు నిన్ను దీవించు గాక! నీకు విరోధంగా నేనేమీ చెప్పుటలేదు.) కాని ఆ తల్లికి దేవుని గూర్చి బొత్తిగా తెలియదు. తండ్రి త్రాగి, వీధులలో పడియుండెను. చెప్పులు కూడా లేకుండా బడికి వెళ్ళాను. జుట్టు మెడమీద పడుచుండెను. మరియు అందరు నన్ను అసహ్యించుకొనుచుండిరి, ఎందుకనగా నేను ఇండియానాలోని కెంటాకీవాడను గనుక, మరియు, ఓ, అది నిజముగా ఘోర దృశ్యము. కాని దేవునికి ఇష్టమాయెను! ఆమేన్. దర్శనము చూచినట్టియు, మరియు సూచక క్రియలు మరియు అద్భుతములు మరియు మహత్కార్యములు జరుగునట్టి వాక్యము యొక్క సేవకునిగా నన్ను చేసి, సరిగా దానితోనే నిలచియుండునట్లు చేసి, తద్వారా తన కుమారుని నాయందు బయలుపరచవలెనని నన్ను తల్లి గర్భమునందే వేరుపరచిన ఆ దేవునికి అది ఇష్టమాయెను.

71

ఆయన దేనిగూర్చి మాట్లాడుచున్నాడో చూచారా? ఆలాగు చేయుట దేవునికి ఇష్టమాయెను. ఏలాగు? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 16వ వచనమును తీసికొనెదను:

నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరచ ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతించలేదు.

“నేనెన్నడూ ఏ బిషప్పు యొద్దకు వెళ్ళి ఏమి చేయవలెనని అడుగలేదు. ఏ రక్తమాంసము యొద్దకు వెళ్ళలేదు. ఏ సంఘశాఖల యొద్దకు వెళ్లలేదు, లేదా ఇంకా ఎవరియొద్దకు వెళ్లలేదు. వాటితో నాకసలు ఎట్టి సంబంధము లేదు. శరీరులతో ఎన్నడూ నేను సంప్రదించలేదు. యెరూషలేములో నున్న పరిశుద్ధ యాజకుల యొద్దకు గాని, పరిశుద్ధ తండ్రుల యొద్దకు గాని ఎన్నడూ నేను వెళ్ళలేదు, మరియు ఈలాగు చెప్పలేదు, ”ఇప్పుడు నాకో దర్శనం వచ్చెనని నీకు తెలుసు, దానినిగూర్చి నేను ఇప్పుడు ఏమి చేయవలెను? నేను ఆశీర్వదించబడిన ప్రభువైన యేసును దర్శనములో చూచాను.“ ”పరిశుద్ధ గుండ్రాయివైన నీవు ఇక్కడినుండి వెళ్లిపో!“ అని వారు చెప్పియుందురు. మంచిది, నీకేమి జరిగినది? కాదు, నేను దాని ప్రారంభించే ముందు చాలా డిగ్రీలున్నవి.”

72

ఇక్కడ పౌలు చెప్పిన దానిని వాక్యములో నేను మీకు చూపించెదను. తాను క్రీస్తుని తెలిసికొనునట్లు అతను నేర్చుకొన్నదంతయూ మరచిపోయి మరియు దానిని పెంటగా ఎంచకోవలసివచ్చెనని అతను చెప్పెను. ఓ!

నా కంటె ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని.

అటు పైన మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి, అతనితో కూడా పదునయిదు దినములుంటిని.

ఇంకా మనము చదివినట్లయితే అతడును, అపోస్తలుడగు పేతురును జీవితములో ఎన్నడూ ఒకరినొకరు, చూచుకొనలేదనియు, ఒకరినొకరు ఎరుగరనియు తెలియును; కాని వారు ఒకే సువార్తను ప్రకటించినట్లు ఆ తరువాత కలిసికొన్నప్పుడు తెలిసికొనిరి. దేవునికి ఒక పాఠశాల యున్నది. అవును!

73

పెంతెకోస్తు దినమున పేతురు లేచి ఇట్లనెను, “మీలో ప్రతివాడును మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.”

ఫిలిప్పు ఇట్లు చెప్పెను, “ఓ, ఇదెంత మహిమకరముగా యున్నది! నేను కూడా ఏదో చేయవలెను. సమరయకు వెళ్ళవలసిన పిలుపు నాకున్నది. అక్కడికి వెళ్ళి వీధిలో సాక్ష్యమిచ్చెదను. మొదటగా అక్కడికి ఒక రోగి రాగా, అతని మీద చేతులుంచెను. అతడు ఆనందముతో గంతులు వేసెను. దేవునిని సుత్తించెను. గొప్ప కూటమును ప్రారింభించగోరెను. మీరందరూ పరిశుద్ధాత్మను పొందవలెను, అందుకొరకు మీరు యేసు నామములో బాప్తిస్మము పొందవలెను,” అని చెప్పి, వారందరికి యేసు నామములో బాప్తిస్మమిచ్చెను. “పేతురూ, రమ్ము! ఇప్పుడు వారి మీద చేతులుంచుము,” అని చెప్పెను. అంతట వారు పరిశుద్ధాత్మను పొందిరి.

కొర్నేలి ఇంటియొద్ద పేతురు కూడా ఆలాగే చేసెను.

74

పౌలు ఎన్నడూ అతనిని చూడలేదు లేదా ఎన్నడూ అతని గూర్చి వినలేదు. కాని అతడు ఎఫెసు పై ప్రదేశములో వెళ్ళుచూ కొందరు శిష్యులను చూచెను. అతను ఒక బాప్టిస్టు బోధకుని కలిసికొనెను. అతని పేరు అపొల్లో, మారిన న్యాయాధిపతి, చాలా తెలివితేటలు గలవాడు, పాత నిబంధనను తీసికొని యేసు దేవుని కుమారుడని రుజువు చేసెను. అవునండి, అతడు తెలివైనవాడు. వారు అరుచుచు ఆనందించుచుండిరి. అలాగని బైబిలు చెప్పుచున్నది. అపోస్తలుల కార్యములు 18 మరియు 19 అధ్యాయము చదవండి. అది నిజమో కాదో చూడండి. వారు ఆనందించుచుండిరి. వారు ఆత్మలో నాట్యమాడుచుండిరి. అంతటా తిరుగుచుండిరి, మీకు తెలియును. “కాని మీరు నమ్మినప్పటి నుండియు పరిశుద్ధాత్మను పొందితిరా?” అని పౌలు అడిగెను.

75

బాప్టిస్టు సోదరులతో చెప్పుచున్నాను, ఆదిమ గ్రీకులో చూడండి, “నమ్మినప్పటి నుండి మీరు పరిశుద్ధాత్మను పొందితిరా?” అని యున్నది. గ్రీకు అనువాదము నా యొద్దకు తెమ్మని సవాలు చేయుచున్నాను. ఆదిమ గ్రీకు గ్రంథము నాయొద్ద ఉన్నది. అరామిక్, హెబ్రి కూడా నాయొద్ద ఉన్నవి. వాటన్నింటిలోను అదే యున్నది. “నమ్మినప్పటి నుండి మీరు పరిశుద్ధాత్మను పొందితిరా?”

విశ్వాసము ద్వారా మీరు రక్షించబడితిరి, అది దేవునియందు మీకున్న విశ్వాసమే. రక్తము మిమ్మును పాపము నుండి పవిత్రపరచును, ఎందుకనగా అదియే పాపపరిహార్ణ బలి. రక్తము నిన్ను రక్షించదుగాని, రక్తము నిన్ను పవిత్రపరచును. నీవు రక్షింపబడితివని ఎట్లు చెప్పెదవు? విశ్వాసము ద్వారానే నీవు రక్షింపబడితివి, దేవుడు తన ముందస్తు జ్ఞానము ద్వారా నిన్ను పిలచెను. నీవు రక్షింపబడితివి, రక్తము పరిహారము చేసినది. నిరంతరము నిన్ను పవిత్రముగా ఉంచుచున్నది. ఒకే ఆత్మ ద్వారా మీరు పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మము పొందియున్నారు. విశ్వాసుల సహవాసములోనికి వచ్చియున్నారు. పరిశుద్ధాత్మ యొక్క సహవాసము లోనికి వచ్చియున్నారు. ఆత్మ ద్వారా నడిపించబడుటకును, అద్భుతములు, సూచక క్రియలు చేయుటకును వచ్చియున్నారు.

76

ఒకదానికొరకు మనము ఎదురు చూచుచున్నాము. (కేవలము కొద్ది సమయములో మనము దానిని పొందెదము, ఎట్లయినను దానిని పొందెదమని నిరీక్షించుచున్నాను. ఈ సమయములో నన్ను పిలువమని మీకు చెప్పితిని, అవునా? కేవలము దానివైపు నేను చూచుట జరిగినది. కేవలము ఒకటి లేదా రెండు మాటలు, - ఇంకా కొద్దిసేపు మాత్రమే.)

77

ఈ రక్షణ ఎంత కాలము నిలచును, ఎంత కాలము? ఇది ఏ రకమగు రక్షణ? సంఘము నుండి సంఘమునకా? హెబ్రి 9:11 చదువుదము. కొద్ది నిమిషములు దానిగూర్చి చూద్దాం. హెబ్రీ పత్రిక తెరచెదము మరియు ఈ రక్షణ ఎంత కాలము నిలచునో కనుగొనెదము. అది ఎటువంటి రక్షణో చూచెదము? ఇప్పుడు హెబ్రి 9:11 చదివెదము:

అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధానయాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృత్యము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా, [పౌలు దీనిని పలుకుచున్నాడు].

మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. [ఎన్నిసార్లు? ఒక్కసారే.] [ఒక వారము పాటు రక్షణా? వచ్చే ఉజ్జీవము వరకు రక్షణా? ఎంతకాలము?] మన కొరకు నిత్యమైన విమోచన.

78

క్రీస్తులో నేను నమ్మిన తరవాత... “నిత్యత్వము” అను మాటకు అర్థమేమిటి? పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడును యేసును క్రీస్తుగా పిలువజాలడు. కాబట్టి మూడు తరగతుల జనులున్నారు: అవిశ్వాసులు, నటించు-విశ్వాసులు, మరియు విశ్వాసులు. కాని నిత్యజీవము కొరకు విశ్వాసించిన వారే అవరణలో ప్రవేశించెదరు.

ఆ పురాతన గుడారమును చూడండి. వారు చేసిన మొదటి కార్యము ఏమిటి? అన్యులు అవరణలో ప్రవేశించిరి. ఆ తరువాత ఇత్తడి బలిపీఠమున్నది, బంగారు గంగాళము యొద్ద వారు అర్పణను కడిగిరి. ఆ తరువాత బలిని చంపిరి. రక్తమును బలిపీఠము మీద ప్రోక్షించిరి. ఆ తరువాత సంవత్సరమునకు ఒక్కసారి అహరోను, షారోను పద్మముల సుగంధములతోను, ప్రశస్తమగు నూనెతోను దానిని పూయుచుండెను. అతని తల మీద వారు సుగంధ నూనెలను పోయగా, అది అతని అంగీ అంచుల మీద నుండి దిగజారుచుండెను. సంవత్సరమునకు ఒకసారి ఇతడు ఆ తెర వెనుకకు ఎలాగు వెళ్ళుచుండెనో గమనించండి. కరుణా పీఠము కొరకు అతని ఎదుట రక్తము ఉంచబడును. సంవత్సరమునకు ఒకసారి అతడు తన దండమును తీయుచుండెను. వారు వెళ్ళిపోగానే అది చిగురించి పూయుచుండెను. అది ఒక పాత కర్ర. బహుశా అరణ్యములో నలుబది సంవత్సరములు దానిని వాడియుండును. దానిని పరిశుద్ధ స్థలములో యుంచెను. చూడండి, వారు నిబంధన రక్తమును తీసికొనిన సమయములో అతడు అభిషేకించబడెను. అతని వస్త్రము మీద గంటలు, దానిమ్మ పండు ఉండెను, అతడు నడువవలసిన విధానమే వేరు. అతడు తన కాలును కదిపి అడుగువేయునప్పుడెల్లా, “ప్రభువు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు, ప్రభువు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు,” అని వారు పలుకుచుండిరి. ఓ, మై!

79

నేను దేనినిగూర్చి మాట్లాడుచున్నాను? బ్రెన్హాం ఆలయమా, వినుము! నీకు ఒక తరుణమున్నది. ఒక వ్యక్తి ఒకసారి పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు, దేవుని కుటుంబములో కుమారునిగా స్వీకరించబడినప్పుడు, తండ్రి ద్వారా స్థానమును పొందినప్పుడు, సేవకొరకు నియమింపబడినప్పుడు, అతని జీవితమునకు ఒక ఉద్దేశ్యము నిర్ణయించబడినప్పుడు దేవుడతనిని పిలచినప్పుడు, అతని నడక, “ప్రభువు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు,” అనునట్లు యుండవలెను.

ఓ, “నీవు ఇటు తిరుగవలెను మరియు ....”

“ప్రభువు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు.”

“ఆ పెద్ద చెప్పినదంతయూ నీవు నమ్మవలెను.”

“ప్రభువు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు.” ఆయన మాటయే ముందుండవలెను. అది నీ హృదయములో స్థిరముగా యుండవలెను. అదే నీ సర్వస్వమైయుండవలెను. నీ నడక వాక్యములోనే యుండవలెను. “ప్రభువు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు.”

“ఓ, నీవు కేవలం ఇక్కడికి వచ్చినయెడల, మేమేమి చేయుదుమో చెప్పుదుము. మేము సంస్థను తయారుచేసి, ఆ సంస్థలో నిన్నుంచెదము. నీవు గొప్పవానివగుదువు.

“ప్రభువు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు, ప్రభువు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు,” అని ముందుకు సాగవలెను. ఎవరేమన్నా ఆగవద్దు.

“ఈ టేపులను పారవేయుము! దీనిని చేయుము, దానిని చేయుము, మరియొక దానిని చేయుము అందురు.”

“ప్రభువు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు.” నీవు నీ కన్నులను కల్వరి తట్టు నిలుపవలెను. మరియు ఏదియూ నిన్ను ఆపజాలదు. నీ జీవితపు నడక వేరుగా ఉండును. నీవు రాజ మార్గములో నడచుచున్నావు. ప్రశస్తమగు తైలముతో అభిషేకింపబడియున్నావు. అతి పరిశుద్ధ స్థలములోనికి కదిలిపోవుచున్నావు. ఆమేన్. మంచిది.

80

దీనిని మానవుని యొద్ద నుండి పొందలేదని పౌలు చెప్పుచున్నాడు. ఇప్పుడు మన పాఠము అయిన గలతీయులలో ఆయన చెప్పుచున్నది చూద్దాం. “ఆయన చిత్తము యొక్క మర్మమును మనకు బయలుపరచెను.” ఆయన యొక్క చిత్తమేమిటి? ఆయన చిత్తము యొక్క మర్మమును బయలుపరచెను. 9వ వచనము. (ఆలస్యమగుచున్నది గనుక మనము త్వరపడవలెను.)

ఓ, ప్రతి మాట ఎంతో గొప్పది! ప్రతి మాట ఒక బంగారు తునక. దానిని మీరు ఎంత మెరుగుపెట్టినా ఇంకా మెరయును. అందులోని ఒక మాటను తీసికొని దానిని ఆదికాండముతో మెరుగుదిద్దండి. దానిని మరల నిర్గమ కాండముతో మెరుగుదిద్దండి. దానిని తీసికొని మరల లేవీయ కాండముతో మెరుగుదిద్దండి. ప్రకటనతో మెరుగు దిద్దండి. అంతా యేసే! ఆమేన్! నీవెంత మెరుగుపెట్టినా, నీకు యేసే కనబడును. ప్రకటనలో ఆయన ఇట్లు చెప్పెను, “భూత, భవిష్యత్, వర్తమాన కాలములలో ఉన్నవాడను నేనే. దావీదు యొక్క వేరు మరియు చిగురు నేనే. వేకువ నక్షత్రమును నేనే. ఆల్ఫా - ఓమేగాను నేనే.” అనగా గ్రీకు అక్షరమాలలో ముందున్న అక్షరము, చివరి అక్షరము. “సర్వమూ నేనే.” “నేనే! నేను సర్వములో సర్వము.” అది నిజము. “మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు జీవించియున్నాను. మరణము యొక్కయు, పాతాళము యొక్కయు తాళపు చెవులు నాయొద్ద ఉన్నవి.” ఓ, మై! ఆ ప్రతి బంగారు తునకను మీరు తీసికొని మెరుగుదిద్దండి, అందులో యేసే ప్రకాశించును.

81

(ఇప్పుడు, ఇంకొంచెమైన తరువాత మనము ఆగుదము.) అయితే దేనికొరకు మనము ఎదురు చూచుచున్నాము? ఈ కూటములో ఎందుకొరకు మీరు కూర్చొన్నారు? దానియొక్క ఉద్దేశ్యమేమిటి? లోకము దేనికొరకు మూలుగుచున్నది? ఎందుకొరకు అణుబాంబు వ్రేలాడుచున్నది? అణువులు, పరమాణువులు ఎందుకొరకు? మరియు ఇదంతా దేనికొరకు?

ఒక నిమిషము రోమా 8 తీయండి. అది దేని కొరకు ఎదురు చూచుచున్నది? ఇదంతా దేనికొరకు ఎదురు చూచుచున్నది? సమయము ఎంత? రోమా 8వ అధ్యాయము. 19వ వచనము నుండి ప్రారంభించుదము మరింత మధురముగా దానిని చేయుటకు ఇది చదువుదము. అది నిజము. అది నాకు తెలియును. మంచిది. అవునండి. రోమా 8వ అధ్యాయము 18వ వచనము. 14వ వచనము నుండి ప్రారంభించుదము.

దేవుని ఆత్మ ద్వారా ఎందరు నడపించబడుదురో వారందరూ దేవుని కుమారులైయుందురు. [అది నిజము.]

ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు.

82

“ఓ, ఒకవేళ నేను పట్టుకొనియుంటే ఎంత అద్భుతము. ఓ, ఇప్పుడు నేను పట్టుకొనియుంటే!” దేనిని పట్టుకొనకుండా! అది నేను పట్టుకొనియున్నా; ఆయన పట్టుకొనియున్నా. ఇప్పుడు నేను ఆయనలో యున్నాను, చూడండి.

మంచిది, “ఆయనలో యుంటే బాగుండును..” అందువు. ఇప్పుడు మీరు, “మేమెల్లపుడూ దానినే నమ్ముచున్నాము,” అని మీ ప్రెస్బిటేరియను వారు చెప్పుచున్నారు. కాని మీరు నమ్ముటలేదని మీ జీవితము రుజువు చేయుచున్నది. ఆయన నడిచిన జీవితము వంటి జీవితమును మీరు నడువనియెడల, ఆయన బోధించిన సువార్తను నమ్మలేరు.

“నిశ్చయంగా నేను నిత్య భద్రతయందు నమ్మికయుంచుచున్నాను,” అని బాప్టిస్టు వారందురు. కాని బయటకు వెళ్ళి సిగరెట్లు త్రాగుచున్నారు, డాన్సులకు పరుగిడుచున్నారు, స్త్రీలు జుట్టు కత్తిరించుకొనుచున్నారు, ముఖములకు రంగులు పులుముకొనుచున్నారు. నాకేమీ తెలియదన్నట్లు ప్రవర్తించుచున్నారు. నీవు నమ్ముట లేదని నీ ఫలములే రుజువు చేయుచున్నవి.

“దైవిక స్వస్థతను నీవు నమ్ముచున్నావా?” అని నేనడిగితే?“

“ఓ, అది పూర్వదినములకు మాత్రమేనని డాక్టర్ జోన్స్ చెప్పెను,” అందువు.

మంచిది, నీవు ఓ వేషధారి! నీ సంగతి ఏమిటి? నీవు మోసపరచబడిన బిడ్డవు. నీవు సువార్త నుండి తొలగిపోతివి. నీ మీద జాలి కలుగుచున్నది. నీవు బురద దారిలో లేదా పెంట కుప్పలో కాలు జారిపడియున్నావు. ఆయన ఇక్కడ చెప్పినది నీవు చూడలేదా? యేసు శరీరధారిగా రాలేదని చెప్పు ప్రతి ఆత్మ అబద్ధ ఆత్మయైయున్నది. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని బైబిలు చెప్పుచున్నది. అప్పుడాయన ఏమి చెప్పెనో, ఇప్పుడు ఆయన అదే చెప్పును, ఎల్లప్పుడూ ఆయన ఆ విధముగానే యున్నాడు. వినండి:

83

ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని, మీరు దత్తపుత్రాత్మను పొందితిరి... [జనులు “దత్త పుత్రాత్మ” అని చెప్పిరి.]

ఇప్పుడు, మీరు దత్తత చేసికోబడిన తర్వాత మీరొక స్థానములో యుంచబడిరి. చెక్కబడిన వర్తమానమును మీరు గ్రహించెదరు. అప్పుడు మీరు శరీరములో సరిగా ఉంచబడితిరి. నీవు ఒక కుమారుడవు. నిశ్చయంగా నీవు ఒక కుమార్తెవు. నీవు తిరిగి జన్మించినప్పుడు అలాగుందువు. అదే నీ జన్మము. అయితే ఇప్పుడు, నీవు నీ స్థానములో ఉంచబడితివి.

మనము భయము కలిగించు ఆత్మను పొందలేదు, కాని మనము దత్త పుత్రాత్మను పొందియున్నాము. అందువలన అబ్బా, తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. [“నా దేవా” అని దానికి అర్ధము. మంచిది.]

మనము దేవుని పిల్లలమని ఆ ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది:

దానిని అదెట్లు చేయును? “దేవునికి మహిమ! హల్లెలూయా! అది నన్ను బాధించుట లేదు. నేను దేవుని బిడ్డను,” అని నీవందువు. మరియు నీవు బయటకు వెళ్ళి, నీవు చేసే చెడు కార్యములు చేయుదువు. దేవుని ఆత్మ దేవుని కార్యములు చేయును.

“నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును,” అని యేసు చెప్పెను, చూచారా.

84

ద్రాక్షా తీగె ద్రాక్షా కాయలనే కాయును. ఆ తీగెలో నుండి గుమ్మడి కాయలు వచ్చినచో, ఎక్కడో తప్పుయున్నది, చూచారా. అది అంటుకట్టబడిన సంఘము. అది అంటుకట్టబడిన ద్రాక్షావల్లి, అతడు అంటు కట్టబడిన వ్యక్తి. ఒక వ్యక్తి ఒక శాఖకు చెందియుండి, తన్ను తాను క్రైస్తవునిగా పిలచుకొనును; పరిశుద్ధాత్మను గాని, దేవుని శక్తిని గాని కలిగియుండడు, మరియు ఈ సంగతులన్నీ...

85

ఇప్పుడు, ఒకవేళ నీవు భాషలతో మాట్లాడుచున్నావు కనుక నీవు వెళ్ళి ఆ గుంపు ప్రజలతో చేరి, వారి వలె ప్రవర్తించినయెడల... దయ్యములు భాషలతో మాట్లాడుట నేను చూచాను. అవునండి. ఆత్మలో అవి నాట్యమాడుట, కేకలు వేయుట, మొదలగు క్రియలు చూచాను. దానిని గూర్చి నేను మాట్లాడుట లేదు గాని, నేను దేవుని ఆత్మ గూర్చి మాట్లాడుచున్నాను.

మనము దేవుని పిల్లమని ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు:

పిల్లలమైతే వారసులము, దేవుని యొక్క వారసులము, క్రీస్తులో కూడ సహవారసులము; ఆలాగయితే ఆయనతో కూడా మనము శ్రమపడుదుము. ఆయనతో కూడా మహిమపరచబడుదుము.

ఏలయనగా ఇప్పటి కాలపు శ్రమలు...

దీనిని వినండి! ఓ, ఎంతో చక్కగా యున్నది!

మనలో ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను. [మనలో!]

ఎందుకనగా సృష్టి యావత్తు....

ఇక్కడ “సృష్టి” అను మాటను గ్రీకులో చూచాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి వేచి చూచుచున్నది.

86

అంతయూ దేనికొరకు ఎదురు చూచుచున్నది? సృష్టి యావత్తు దేనికొరకు ఎదురు చూచుచున్నది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, సంఘము తన స్థానములోనికి వచ్చుట కొరకు అది ఎదురుచూచుచున్నది. దేవుని కుమారుడెవరు? ఎప్పుడైతే ఆదాము...? ఆయన అధికారము ఎక్కడున్నది. భూమిమీద. భూమిమీద ఆయనకు ఆధికారమున్నది. నిజమేనా? అతడు ఎలాహ్, ఎలోహిం కాదు; ఆయన యెహోవా, చూచారా. “నేను దేవుడను, నాకంటె కొద్దిగా తక్కువవారిని నేను సృజించాను. మరియు వారికి నేను ఒక అధికారము ఇచ్చాను. భూమి వారి అధికారము క్రింద ఉన్నది.” మానవునికి భూమి మీద అధికారమున్నది. మరియు సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు తేరి చూచుచున్నది. ఓ!

ఆ సంతోషకరమగు వెయ్యేండ్ల పాలన

రాక కొరకు మనము ఎదురు చూచుచున్నాము,

ధన్యుడగు మన ప్రభువు వచ్చునప్పుడు,

ఎదురు చూచుచున్న తన వధువును తీసికొనిపోవును.

ఓ, భూమి మూలుగుచున్నది.

ఆ మధుర విడుదల కొరకు మొర్రపెట్టుచున్నది.

మన రక్షకుడు భూమి మీదకు మరల వచ్చును.

87

అది నిజమేనా? ఎదురు చూపు! దేవుడు తన సంఘమును దాని స్థానములో ఉంచుటకు ప్రయత్నించుచున్నాడు. తన్నుతాను బయలుపరచుకొనును. ఆయన తన పనిని నెరవేర్చగల సంఘము ఈలాగుండవలెనని కోరుచున్నాడు. “నా ఆత్మ ఇందులో స్వేచ్చగా ప్రవహించుచున్నది. ఇక్కడ నేను పని చేయగలనను స్థానములో దానిని ఉంచగలను.” ఒక ఉత్సవము ద్వారా కుమారునిగా అతనిని స్వీకరించును. దేవదూతతో అతని దర్శించును. ప్రత్యక్షతను ఇచ్చును. అతని ద్వారా సత్యము పలికించును. తన స్వప్రయత్నము వలన ఏమీ చేయజాలడు. లేదు, లేదు - అది పని చేయదు, అటువంటి వారు చాలామంది యున్నారు. కాని దేవుని కుమారుల ప్రత్యక్షత గూర్చి నేను మాట్లాడుచున్నాను. దేవుడు ఆయనను బయలుపరచి బయటకు పంపును. అప్పుడతడు వచ్చి సత్యమే పలుకును. అతని క్రియలు సత్యము, అతను చేయునది క్రీస్తును బయలుపరచును. అతనికి నీవెట్లు తీర్పు తీర్చెదవు? వాక్యముతో అతడు నిలచియున్న విధానము బట్టియే. వాక్యముతో ఒకడు నిలచియుండు విధానము బట్టియే అతడు తీర్పు తీర్చబడును. “వారు వాక్యప్రకారము మాట్లాడనియెడల వారిలో జీవము లేదు,” అని బైబిలు చెప్పుచున్నది, చూచారా. అట్టివారికి విముఖులై యుండుడి.

88

ఇప్పుడు మనము చదివెదము, తరువాత మనము ఆగవలెను, ఎందుకనగా సమయము మించిపోవుచున్నది. సరే, 10వ వచనములో, లేదు, 9వ వచనము చదువుదము:

కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున, తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనయెడల విస్తరింపచేసెను.

జగత్తుపునాది వేయక ముందే దీనిని ఆయన సంకల్పించెను. ఎంతమందికి ఇది అర్థమైనది?

కాలము...

ఓ మై. ఇక్కడికి మరలా మనము వచ్చుచున్నాము! ఓ, మంచిది, దానిని దాటిపోవుదము, చూచారా.

..... కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటును బట్టి..

89

కాలములను మీరు నమ్ముచున్నారా? “కాలము సంపూర్ణమైనప్పుడు,” అని బైబిలు చెప్పుచున్నది. కాలము సంపూర్ణమగుట అనగా ఏమిటి? మోషే ధర్మశాస్త్రము యొక్క కాలము ఒకటుండెను. బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క కాలము ఒకటున్నది. క్రీస్తు యొక్క కాలము ఒకటున్నది. సంఘ సంస్థ యొక్క కాలము ఒకటున్నది. పరిశుద్ధాత్మ కుమ్మరింపు యొక్క కాలము ఒకటున్నది. ఇది కుమారులను స్వీకరించు కాలము. దానికొరకే లోకము తేరి చూచుచూ మూలుగుచున్నది. “కాలము సంపూర్ణమైనప్పుడు? ఆ కాల సంపూర్ణత అనగా ఏమిటి? మృతులు తిరిగి లేచినప్పుడు, వ్యాధి మాయమయినప్పుడు, భూమి మూలుగును ఆపినప్పుడు. ”కాలము యొక్క సంపూర్ణత.“ దీనిని గమనించండి.

కాలము సంపూర్ణమైనప్పుడు, ఆయన సమస్తమును క్రీస్తు నందు ఏకముగా సమకూర్చును.

మీకు సంతోషముగా లేదా? దానిని ఆయనెట్లు చేయునైయున్నాడు? సమస్తమును ఏకముగా ఎవరిలో సమకూర్చును? [“క్రీస్తులో అని జనులు చెప్పిరి.] క్రీస్తులోనికి మనమెట్లు వెళ్ళగలము? [”ఒకే ఆత్మ ద్వారా.“] ఒకే ఆత్మ ద్వారా మనమంతా ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము. [”ఓకే శరీరము.“] ఆ శరీరము ఎవరిది? [క్రీస్తుది.”] ముందే తీర్పు పొందెను. ఆయన మన తీర్పును భరించెను. అయితే మనమెవరము? “రక్తమును చూచినప్పుడు నేను మిమ్ము దాటిపోయెదను.” ఆయన ప్రతిసారి ఆ రక్తము చిందించిన శరీరమును చూచుచున్నాడు. అక్కడ నేను ఏలాగున్నాను? పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన దాటిపోవుచున్నాడు. ఓ, మై!

కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన సమస్తమును క్రీస్తు నందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను.

90

మీరు పేరును గూర్చి సంభాషించవలెనన్నచో దానిని గురించి ప్రారంభించుదము. పరలోకములోయున్న కుటుంబము యొక్క పేరు ఏమిటి? [“యేసు క్రీస్తు” అని జనులు చెప్పిరి.] భూలోక కుటుంబము యొక్క పేరేమిటి? [“యేసు క్రీస్తు”]

నిజమైన చక్కని స్త్రీలు ఇచ్చటున్నారు. శ్రీమతి. విలియం బ్రెన్హాం, నా భార్య. ఆమె నాతో కూడా ఇంటికి వచ్చును. తక్కినవారందరూ వారి వారి భర్తలతో వెళ్ళుదురు.

సజీవ దేవుని యొక్క ఒక గొప్ప సజీవ సంఘమున్నది. అది ఆయన నామమును భరించును. ఆమె ఆయనాత్మతో నింపబడియున్నది. అది నిజము.

91

మంచి క్రియలను నేను ఖండించుట లేదు. వారి ఆస్పత్రులను, మరియు వారు చేయుచున్న మంచి కార్యములను నేను ఖండించుట లేదు. అవి అద్భుతకరముగా వున్నవని నేననుకొనుచున్నాను. పేదలకు, శ్రమపడుచున్న మానవాళికి అది దేవుని దీవెన, వారు చేయుచున్న ఈ ఇతర క్రియలను నేను ఖండించుట లేదు. అది చాలా మంచిది. వారి గొప్ప సంస్థలు మిలియనుల డాలర్లను ఖర్చు చేయుచున్నవి. పనికి మాలిన పనులకంటే ఆ కార్యములే నేను చూడగోరుచున్నాను. నేను నిశ్చయముగా వాటిని చేయుచున్న ఈ వేదికపైయున్న సేవకులను ఘనపరచుచున్నాను.

అయితే కాలము సంపూర్ణమైనప్పుడు, దేవుని కుమారులు ప్రత్యక్షమగుదురు. ఆ కాలములో ఆయన సమస్తమును ఏకముగా సమకూర్చును. సమస్తమూ క్రీస్తులోనికి తీసికొని రాబడును. క్రీస్తు అనగా ఏమిటి? ఆయన లోనికి ఎట్లు మనము ప్రవేశించగలము? I కొరింథి 12, “ఒకే ఆత్మ ద్వారా మనమందరము ఒకే శరీరములోనికి అనగా క్రీస్తు శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము. ప్రతి వరమునకు ఆయన యొక్క ప్రతి ఈవికి మనము పాలిభాగస్తులముగా చేయబడియున్నాము.” నిజమేనా? మరియు క్రీస్తు మరియు ఆయన సంఘము ఏకమగు ఆ దిన ప్రత్యక్షత కొరకు భూమి యావత్తు మూలుగుచూ, మొర్రపెట్టుచూ, ఎదురుచూచుచున్నది.

ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను:

మనలను ఆయనయందు స్వాస్థ్యముగా ఏర్పరచెను.

92

ఓ, నెవిల్ సోదరుడా, ఈ సమయము తీసికొన్నందుకు క్షమించుము. “స్వాస్థ్యము” అను మాట చూడండి. రక్తసంభంధియగు సోదరుడని నాకు తెలియును. నేను పిచ్చివాడిని కాదనుకొనుచున్నాను. ఏమిటది? “ఒక స్వాస్థ్యము.” మనము ఒక స్వాస్థ్యము పొందాము. నీ కొరకు ఒకరు దానిని విడిచిపెట్టిరి. దేవుడు జగత్తు పునాదికి ముందే ఒకదానిని నీ కొరకు విడిచిపెట్టెను. గ్రంథము మీద పేరు వ్రాయబడెను. గొర్రెపిల్ల వధించబడినప్పుడు, దానితో పాటుగా నీవు గుర్తించబడెదవు. ఓ, ఈ రాత్రికి దానిని ఆపుదము. దానిని కొద్దిగా చదువుదము. ఈ రాత్రికి 3వ వచనము చదువుదము. మై! మై! నాలుగయిదు వచనములు చదువలేము. ముగించబోవుచున్నాము.

93

మనలను ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను.

ఏమిటి? ఈ స్వాస్థ్యమును ఎట్లు మనము పొందగలము? దానినెట్ల సంపాదించగలము? మనము నీతిగా నడచినందునా? కాదు గాని ముందుగా నిర్ణయించబడినందువల్లనే. ఆమేన్! నా ఆర్మీనియను సోదరులకు ఇది చాలా కఠినముగా యుండునని నాకు తెలియును. వారిని బాధించుటకు ఇది చెప్పుట లేదు. సోదరులారా, దీనిని మీరు తెలిసికోవలెను. దీనిని చూచుట చాలా మంచిది. అవును. సహోదరుడు నెవిల్ ఆర్కేడ్ గురించి నిన్న ఈలాగు చెప్పెను, “నిచ్చెన ఎక్కి నీవు ముందు ఏమున్నదో చూడవలెను.” అవునండి. అదే ఇది. దేవుని పరిశుద్ధాత్మయే మన నిచ్చెన. మనమేమి పొందామో మనకు చెప్పును, చూచారా.

94

స్వాస్థ్యమును చూడండి. ఓ, మై ఎటువంటి స్వాస్థ్యము ఇది?

ఆయన తన చిత్తనుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.

ఆయన తండ్రిగాను, దేవునిగాను, రక్షకునిగాను, స్వస్థపరచువానిగాను, ఉండక ముందే నిర్ణయించెను. గొర్రెపిల్ల పేరును గ్రంథములో యుంచెను. ఆయన తన ముందస్తు జ్ఞానము ద్వారా నీ పేరును చూచెను. దానిని అక్కడుంచెను. ఏమిటది? కొంతకాలమైన తరువాత పాపపు తల్లిదండ్రులకు మనము పుట్టి ఎదురు తిరిగాము. లోకము చుట్టు మనము తిరిగాము, మీకు తెలియును. మొదటి కార్యము మీకు తెలియునా - అదేదనగా ఆ పొగరుగల యూదుడు పౌలు, మీకు తెలియును - మరియు అతడు చీల్చుచుండెను; మరియు, మొదటి కార్యము, ఎదో చెప్పెను, “ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ!”

“ఓ, అబ్బా, తండ్రీ!” అని నీవు చెప్పితివి.

ఇక్కడ మనము చూడనారంభించాము, చూచారా. ఆయనలోని స్వాస్థ్యమునకు మనలను ముందే నిర్ణయించెను. జగత్తు పునాది వేయబడుటకు ముందే దానిని మనము పొందితిమి, చూచారా. ఓ, ఆయన స్వంత ఉద్దేశ్యము, ఆయన స్వంత చిత్తము మనలో నెరవేరునట్లు ఆయన దేవుడు, రక్షకుడు ఆయెను.

95

సత్యవాక్యమును విని ఆయనయందు మీరు విశ్వాసముంచితిరి.

మరియు సత్యమనగా ఎవరు? యేసే సత్యము. ఆయనే సువార్త యొక్క సత్యము. ఏ సువార్త? ఒకే ఒక సువార్త ఉన్నది. గలతీ Iలో చెప్పెను, “మరో సువార్తను పరలోకము నుండి దూత దిగి వచ్చి బోధించినా గాని శాపగ్రస్తుడగును. ఇదే సువార్త మీ రక్షణ సువార్త; మరియొకటి లేదు. ఆకాశము క్రింద ఇవ్వబడిన మరే ఇతర నామము వలనను రక్షణ కలుగదు.” మరి ఏ నామము? [“ప్రభువైన యేసుక్రీస్తు” అని జనులు చెప్పిరి.] ఓ, మై!

క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రి౦పబడితిరి. క్రీస్తు కృపచేత ముద్రి౦పబడ్డారు

ఓ, “మీరు విశ్వాసముంచిన తరువాత!” సోదరుడా, దానినెట్లు మనము దాటిపోగలము? కేవలము ఈ రాత్రికి దానిని వదిలి పెట్టెదము. మీరు ఏమందురు? ఇంతకంటె ఇక ముందుకు వెళ్ళలేను. ఈ రాత్రికి దానిని ఆపుదము. “ముద్రించబడిరి,” అను మాట వదలలేను. దానిలోకి మీరెట్లు పోవుదురో, చూడండి.

96

ముందస్తు నిర్ణయము ద్వారా స్వాస్థ్యము. నేను కొంత స్వాస్థ్యముగా పొందియున్నాను. ఏ స్వాస్థ్యము? ఎవరో నాకు స్వాస్థ్యమును విడిచిపెట్టవలెను. “యేసు నీకు స్వాస్థ్యము విడిచిపెట్టెను గదా?” అని మీరనవచ్చును. క్షమించండి, యేసు నాకెన్నడూ స్వాస్థ్యము విడిచి పెట్టలేదు. యేసు ఎన్నడూ నీకు స్వాస్థ్యము విడిచిపెట్టలేదు. ఆయన దిగివచ్చి నీ స్వాస్థ్యము కొరకు వెల చెల్లించెను. నిన్ను నీ స్వాస్థ్యము యొద్దకు తీసికొని వచ్చెను. కాని నీ పేరు జగత్తు పునాది వేయబడక మునుపే గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడెను. దేవుడు నీకు నీ స్వాస్థ్యము నిచ్చును. నీ స్వాస్థ్యము మొదటిది. యేసు మాత్రమే అను గుంపువారు వచ్చి... వారు ఇలా చెప్పుటకు ప్రయత్నము చేయుదురు: “చాలామంది నశించిపోవుచున్నారు గనుక యేసును పంపి వారిని రక్షించెదనని దేవుడనుకొనెనని వారు చెప్పెదరు. బహుశా ఒకడు తప్పునెరిగి, మరియు అతడు ఏమి చేసెనో ఎరిగి మరియు రక్షింపబడును.” ఓ, కృప! నా కార్యాలయమును నేను ఆలాగు నడుపను - ఒక్కోసారి ఎలాగైనా నడుపుదును, జీన్. ఆ విధంగా నేను నడుపను. దేవుని మాట ఏమిటి?

97

ఎవరు రక్షించబడుదురో, ఎవరు రక్షించబడరో దేవుడు తన ముందస్తు జ్ఞానము ద్వారా ఖచ్చితంగా ఎరిగియుండెను. ఆయన ముందే ఏర్పరచుకొనిన వారిని రక్షించుటకు యేసును పంపెను. దీనికి అయిదు వచనముల ముందు పౌలు చెప్పలేదా? “ప్రపంచమనునది లేక మునుపే ఆయన మనలను ఏర్పరచుకొనెను.” అదే మన స్వాస్థ్యము. దేవుడు మనలను ఏర్పరచుకొనెను. యేసు వచ్చి, వెల చెల్లించెను. ఏమిటి? మనకు పాపము ఆరోపించబడకుండునట్లు ఆయన తన రక్తమును చిందించెను. నీవేమీ చేయలేదు. అయితే ఒకవేళ నీవు....

“సత్యజ్ఞానమును ఎరిగియుండియూ ఇష్టపూర్వకముగా పాపము చేయువానికి బలి ఇకలేదు.”

“బ్రెన్హాం సోదరుడా! అదేమిటి?” అని మీరు లేచి అడుగుదురు.

కాని గుర్తుంచుకొనండి, “సత్యజ్ఞానమును పొందినవారెవరు.” వారెన్నడూ సత్యమును చేర్చుకొనలేదు గాని దానియొక్క జ్ఞానమును వారు తెలిసికొనిరి, చూచారా. ఒకసారి వెలిగింపబడి, పరిశుద్ధాత్మతో పాలుపొంది, మంచి వాక్యము యొక్క శక్తిని రుచిచూచిన వారు పడిపోవుట అసాధ్యము. పూర్వకాలమందు సరిహద్దు విశ్వాసులైన వారి వలె. దాని మీద చాలామంది నాకు ఉత్తరములు వ్రాసిరి.

98

ఆ సరిహద్దు విశ్వాసులు యెహోషువా, కాలేబులతో పాటు నడిచి వెళ్ళిరి. ఎందువలన? అక్కడున్న దేశమును మనము పరిశుద్ధాత్మ అని పిలచుదము. వారు అచ్చటికి వెళ్ళిరి. పరిశుద్ధాత్మ ఇదే అని చెప్పిరి, మరియు అక్కడి నుండి వెనుకకు తొలగిపోయిరి, మీరు చూడండి. అక్కడే వాగ్ధానమున్నది. మంచిది, వారు చెప్పిరి, పది గోత్రముల నుండి పదిమంది గూడచారులను పంప౦డి. మన స్వాస్థ్యము ఎట్టిదో వారు తెలిసికొనునట్లు వారు వెళ్ళెదరు. మన స్థానములు ఎచ్చటున్నవో, కావున నేను కొందరు వేగులవారిని పంపెదను.

వారందరూ అచ్చటకు వెళ్ళిరి. ఓ, మై! మనము పరిశుద్ధ గుండ్రాలని పిలువబడతాము. “అయినా అది మనకు సాధ్యము కాదు,” అనిరి. చూచారా.

యెహోషువా మరియు కాలేబులు ఇట్లనిరి, “అదెట్లు కాదో చూద్దాం.” కావున వారు వచ్చి దానిని చూచిరి. పెద్ద ద్రాక్ష గెలను తెంపిరి. వారిట్లు తిరిగి వచ్చి పలికిరి. “ఆ దేశము చాలా గొప్పది. దానికి రుజువును చూడండి. ఎంతో మంచి భూమి!”

“ఓ, అది మంచిది, కాని మనము వారియెదుట నిలువలేము. అవి పెద్ద సంస్థలు, అవి పెద్ద సంస్థలు. మనము స్వాధీనపరచుకొనలేము. లేదండీ, లేదు, లేదు, మనము స్వాధీనపరచుకోలేము, లేదండీ.” మరియు తిరిగి ఐగుప్తుకు పోవుదము. అక్కడ ఉండిపోయినచో బాగుండేది. ఇది చాలా ఇరుకు దారి. ఓ, మనము దానిని చేయలేము, మనము దానిని చేయలేము,“ అని వారు పలికిరి.

99

వృద్ధ కాలేబు చెప్పెను, “మీరందరూ ఊరకొనుడి!”

యొహోషువా చెప్పెను, “మీరందరూ నోరు మూయండి. ఒక సంగతి నన్ను చెప్పనివ్వండి.”

“ఓ, అయ్యో, అయ్యో! మనము స్వాధీనపరచుకోలేము! బ్రెన్హాం సోదరుడా! నా జూదము నేను వదలలేను. నేను ముసలి కాలపు స్త్రీల వలె జుట్టు పెంచుకోలేను. నా పొట్టి బట్టలు తీసివేయలేను. నా సిగరెట్లు మానలేను.” మీరు ఎట్టి హీనమగు మాదిరిగా యున్నారో చూడండి. “నేను చేయలేను,” అనుచున్నారు.

యెహోషువా చెప్పెను, “ఓ, అది మంచిది. హల్లెలూయా! దానిని మనము స్వాధీనపరచుకోగలము.” ఏమిటది? ప్రాకారములు గల పెద్ద పట్టణములను వారు చూచుచున్నారు. కాని యెహోషువా, కాలేబులు దేవుడు చేసిన వాగ్ధానములను చూచుచున్నారు. నీవెవరివైనా గాని వాక్యముతోనే నిలచియుండుము. అంతే చాలు. వాక్యముతో నిలువుము!

100

పేతురు చెప్పెను, “ప్రతివాడును మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.” [వాగ్దాన దేశము ఏమిటి?] “ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరికిని, ప్రభువు ఎందరిని పిలచెనో వారందరికిని చెందును.”

దయచేసి (ముగింపులో) మీరేమీ బాధపడవద్దు, చూచారా. పిలిగ్రిం హోలీనెస్, నాజరీన్ మొదలగు శాఖలకు చెందిన మీరు శుద్దీకరణములోనికి వచ్చియున్నారు. ద్రాక్షాపండ్లను చూచు స్థితికి వచ్చిరి, కాని వెనుదిరిగారు. ఏమి జరిగినదో చూడండి. వాగ్దాన దేశములోనికి ఎన్నడూ వెళ్ళలేకపోవుటకు కారణం అదే. నాజరిన్ లేదా పిలిగ్రిం హోలినెస్ లేదా మరెవరైనా గాని, నేడు గొప్ప స్వస్థతా కూటములు గాని, అద్భుతములు, సూచక క్రియలు గాని జరిగించుచున్నారేమో చెప్పండి. ఒక్కటి చూపించండి. మీరు ఐగుప్తులోనే స్థిరపడిరి, ఉల్లిగడ్డల తట్టు తిరిగిరి. మీరు కాదేషు- బర్నేయలో ఆగిరి. అది నిజము.

101

గమనించండి, మరియు హెబ్రి 6వ అధ్యాయములో ఒక విషయమును మీకు చెప్పనివ్వండి. “ఒకసారి వెలిగించబడి తప్పిపోయిన వారు, నూతనపరచబడుట అసాధ్యము. [మీకు బాగుగా తెలియును. మీకు తెలియనియెడల, ఇప్పుడు తెలిసికొనుడి, చూచారా.], ”పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, పరిశుద్ధాత్మతో పాలివారై....“

రుచి చూచిరి, చూడండి! జనులు చర్చికి వెళ్ళుదురు, కూర్చొని ఇట్లను కొందురు, “వారిది నిజమే కావచ్చును. అది నిజమవవచ్చు, కాని అబ్బాయి అందుకు చాలా విశ్వాసము కావలెను.”

“పరలోక సంబంధమైన వరములను రుచి చూచి, మరియు పరిశుద్ధాత్మలో పాలివారై, నిబంధన రక్తము ద్వారా శుద్ధిపొంది తిరిగి దానినే అపవిత్రము అనుచున్నారు.”

ఒక బోధకుడు తన తల్లి ద్వారా పంపబడి, “నేను ప్రభువు దాసునిగా ఉండునట్లు నాకు పిలుపు ఉన్నది,” అని చెప్పును.

“మంచిది. బాబూ! మొదట నిన్ను ఒక బడికి పంపవలెను.” అంతకంటె ఆమె చేయకలిగిన కీడు మరొకటి లేదు. అది వాస్తవం. దేవుడు అతనిలో ఉంచుటకు ప్రయత్నించుచున్న ప్రతి సంగతిని వారు తీసివేయుదురు.

102

ఇప్పుడు గమనించండి.

“మనము బుద్ధిపూర్వకంగా పాపము చేసినయెడల, సత్యము యొక్క జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసినయెడల....” జ్ఞానము - వాక్యములో చూడండి మరియు ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని బైబిలు చెప్పుచున్నదని తెలిసికొనుడి. దానిని చూడండి, అది సత్యము యొక్క జ్ఞానము, దానిని చూచుటకు మనము ముఖము త్రిప్పుకొనెదము మరియు నిబంధన రక్తమునే త్రోసి వేయుదుము...

“ఓ, నేను దేవుని యందు విశ్వాసముంచుచున్నాను,” అని ఒక వ్యక్తి చెప్పును. మంచిది, అయితే నీవు మొదటి అడగు వేసినట్లే.

“నిశ్చయంగా, నేను శుద్దీకరణమును నమ్ముచున్నాను.” మంచిదే. నీవు సరిహద్దులో యున్నావు. పరిశుద్ధాత్మను పొందుటకు సిద్ధముగా యున్నావు. కాని నీవు వెనుదిరిగి, “దానిగూర్చి నాకేమీ తెలియదనుచున్నావు. నాకు తెలియదు. కాని వారేమని చెప్పుకొనుచున్నారో తెలియునా? దానిని చేయగలనో లేదో నాకు తెలియదనుకొనుచున్నాను. కాదు, అందులో చేరితే చాలుననుకొనుచున్నాను,” చూశారా.

మరియు ఏమి జరుగునో మీరెరుగుదురా? “వారు ప్రవేశించుట అసాధ్యము.” వారు తమ కృపా దినమును మీరి పాపము చేసిరి. ఆ విధంగా బైబిలు చెప్పుచున్నది. ఇది కఠినమగు మాటని నాకు తెలియును, కాని బైబిలు చెప్పుచున్నది. “పరలోక్ష సంబంధమైన వరములను రుచి చూచి, తప్పిపోయినవారు....”

103

“శుద్దీకరణను నేను నమ్ముదును. మంచి, పవిత్రమగు, పరిశుద్ధ జీవితమును జీవించవలెను,” అందురు.

నిశ్చయంగా, నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును చూచావు. బైబిలులోని మిగిలిన సంగతులు చూచావు. కాని ఏమి చేశావు? నీవు ఏ నిబంధన రక్తముతో శుద్దీకరింపబడితివో దానినే అపవిత్రముగా ఎంచుచున్నావు. నీవా స్థితికి వచ్చుటకు లోకములో ఏది కారణము? అంత పాపిగా ఉండునట్లు నిన్ను ఏది చేసెను? నీ జీవితములో త్రాగుడు, స్త్రీ మొదలగు పాపములు ఎందుకు ప్రవేశించినవి? కాని వాటినన్నింటిని ఏది పోగొట్టెను? నిబంధనా రక్తము! అప్పుడు ఆ దేశములోని ద్రాక్షా పండ్లను రుచి చూచి దగ్గరగా వచ్చావు. మరియు సువార్త గూర్చి సిగ్గుపడితివి. నీ శాఖ గూర్చి భయపడితివి. దేవుడు కృప చూపు గాక! అవునయ్యా. “దేవుని రక్తమును అపవిత్రముగా ఎంచితివి. కృపా క్రియలను విసర్జి౦చితివి. ఆ దేశములో నీవు ప్రవేశించుట అసాధ్యము.”

104

ఏమయినది? నిన్ను అడుగుచున్నాను. నేను సాదృశ్య రూపంగా మాట్లాడుదును. మరియు బైబిలును ఎరిగిన ఎవరైనా గాని మాదిరులను తీసికొని మాట్లాడును. అందులోని ఏ ఒకరైనా వాగ్దాన దేశము చేరిరా? ఏ ఒక్కరూ చేరలేదు. ఎవరు చేసిరి, అందులోనికి ఎవరు వెళ్ళిరి? “మనము స్వాధీనపరచుకొనగలము,” అని అక్కడకు మొదటిగా వెళ్ళి మరియు తిరిగి వచ్చి చెప్పినవారు.

“మనము పరిశుద్ధాత్మను పొందగలము, ఎందుకనగా దేవుడాలాగు చెప్పెను! నేను మారుమనస్సు పొంది, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందినచో, పరిశుద్ధాత్మను పొందుదునని పేతురు పెంతెకోస్తు దినమున చెప్పెను. ఈ వాగ్ధానము నాది. అది చేయుటకు నేను ఇష్టపడుచున్నాను. నాది, ఆ వాగ్దానము నాది.” గ్రహించారా? “ఇప్పుడా వాగ్దానము నాది. దానిని నేను చేర్చుకొనుచున్నాను. అది నాది!” వారు మాత్రమే అందులో ప్రవేశించెదరు.

ఓ, “కాని బ్రెన్హాం సోదరుడా, పునరుత్థానములో...” అని నీవందువు. వారు ఉండరు. “ఓ, వారు ఉండరా?” లేదండి. యేసు చెప్పెను.....

105

వారిట్లనిరి, “నిన్ను నీవు మోషే అంత గొప్పవానిగా చేసికొనుచున్నావు. మరియు అబ్రాహామును చూచితినని చెప్పుకొనుచున్నావు. మరియు చెప్పెను... మరియు అబ్రాహాము చనిపోయెను... నీకు ఏబది సంవత్సరములైనా లేవు గాని అబ్రాహామును చూచాననుచున్నావే?”

“అబ్రాహామునకు ముందే నేనున్నాను” అని ఆయన చెప్పెను. “నేనున్నాను.” నిత్య వర్తమాన కాలము. ఆయన నిత్య దేవుడు. నిన్న కాదు, రేపు కాదు; “ఉన్నవాడను,” చూచారా. దేవుడు నిత్యమూ ఉన్నవాడు. ఎలోహిం “ఉన్నవాడను.” వారాయనను అందుకు చంపగోరిరి.

“మా పితరులు నలుబది ఏండ్ల పాటు అరణ్యములో మన్నాను తినిరి. దేవుడు ఆకాశములో నుండి ఆహారము కురిపించి వారిని పోషించెను. వారు చర్చికి వెళ్ళిరి. వారు నలుబది సంవత్సరముల పాటు మంచి సంఘ సభ్యులుగా ఉండిరి. మా మామ్మ చర్చిలోనే చనిపోయినది. మరియు ప్రతిదీ ఆ రీతిగా ఉన్నవి. మా పితరులు అరణ్యములో నలుబదేండ్లు మన్నా తినిరి,” అని వారు చెప్పిరి.

మరియు “వారందరూ చనిపోయిరి,” అని యేసు చెప్పెను. [చనిపోవుటనగా వారి “నిత్య ఎడబాటు” అని అర్ధము.] “వారు ప్రతి ఒక్కరు చనిపోయిరి. కాని నేను మీతో చెప్పునదేమనగా పరలోకము నుండి దిగి వచ్చిన జీవావారమును నేనే. ఈ ఆత్మీయాహారమును తినువాడు నిత్యజీవమును పొందును; మరియు అతడు నశించడు. మరియు అంత్యదినమున వానిని నేను లేపుదును.” ఓ, సోదరుడా, ఆయన ఆశ్చర్యకరుడు కదా?“

ఆయన ఆశ్చర్యకరుడు కాదా?

మన ప్రభువగు యేసు ఆశ్చర్యకరుడు కాదా?

దేవుని వాక్యములో యున్నదానిని

కన్నులు చూచెను, చెవులు వినెను.

మన ప్రభువగు యేసు ఆశ్చర్యకరుడు కాదా?

106

అది నిజమేనా? మనమధ్య ఆయన వివేచనాత్మ సంచరించుట చూచుచున్నాము. ఆయన అద్భుతములు జరిగించుట, సూచక క్రియలు, మహత్కార్యములు చేయుట మనము చూచాము. ఈ వాక్యములో అది వ్రాయబడుట చూచాము. మరియు అది ఇచ్చట స్థిరపడుట చూచాము. ఓ మై!

దేవుని వాక్యములో వ్రాయబడిన దానిని

కనులు చూచెను, చెవులు వినెను.

నా ప్రభువగు యేసు ఆశ్చర్యకరుడు కాడా?

107

మరో రెండు లేదా మూడు నిమిషములలో, నీటి బాప్తిస్మము ఇవ్వబడును. బాప్తిస్మము పొందగోరు వారు ఇటువైపు, పురుషులు అటువైపు రండి! పురుషులు ఎడమవైపు నుండి ఇక్కడికి రండి. స్త్రీలు ఇటు రండి. బట్టలు పట్టుకొని స్త్రీలు సిద్ధముగా యున్నారు. ఈ ఉదయము దేవుని వాక్యము విని మార్పుపొందిన స్త్రీ, పురుషులు ఇక్కడ ఉండినయెడల, రండి. నీవు నీ పాపము గూర్చి పశ్చాత్తాపపడినయెడల, దేవుడు తన వాగ్ధానమును నెరవేర్చును.

దేవునియందు నీ విశ్వాసమే క్రియ చేయును. మరియు దేవుడు పిలచుచున్నాడు. [సహో, బ్రెన్హాం మైక్రోఫోనులో ఊపిరిని హూష్ అని ఊదుచున్నారు.] నిన్ను పిలచుచున్నాడు. ఇప్పుడు అదే ఆయన చేయుచున్నాడు. “హూష్-హూష్.” “నేనెన్నడూ బాప్తిస్మము పొందలేదు.” మంచిది, మంచిది నేను ప్రారంభించి వేరుగా జీవించితే, మంచిది. (హూమ్) ప్రారంభించండి. అప్పుడు మీరు వేరుగా యుందురు. మొదట మీరు ప్రారంభించవలెను, చూచారా. మీరు ప్రారంభించి చూడండి.

“ఎన్నడూ ఆలాగు నేను చూడలేదు,” అని మీరు అందురు.

108

మంచిది, ప్రియ సోదరుడా! యేసుక్రీస్తు నామములో తప్ప మరో విధంగా ఎవరైనా ఒక్క వ్యక్తి బాప్తిస్మము పొందునేమో వాక్యములో చూపించండి. నేను ప్రపంచమంతా సేవార్థమై తిరుగుచూ ముప్పది-ఒక్క సంవత్సరాల నుండి దీనిని సవాలు చేయుచున్నాను. బిషప్పులను అడిగాను. యేసుక్రీస్తు నామములో కాకుండ వేరే ఏ మార్గములోనైన ఏ ఒక్క వ్యక్తియైనా బాప్తిస్మము పొందెనో చూపించమని అడిగాను. యేసు నామములో బాప్తిస్మము పొందని వారు వచ్చి తిరిగి ఆ నామములో బాప్తిస్మము పొందవలెను.

దేవునికి ఒకే పేరున్నది. మరియు ఆయన పేరు యేసు. అది ఆయన కుమారుడు. ఆయన తన కుమారుని పేరును తీసికొనెను. దేవుడు! ఇప్పుడు యేసు శరీరరీత్యా నరుడు. అది మనకు తెలియును. కమ్ముకొనినవాడు దేవుని కుమారుడు. ఏకత్వ మాదిరిని మనమిప్పుడు నమ్ముట లేదు. దేవుడు నీ వ్రేలివలె యున్నాడని జనులు చెప్పుచున్నారు. దేవుని యొక్క మూడు గుణలక్షణములను మనము నమ్ముచున్నాము. మూడు గుణలక్షణములలో మనము దేవుని నమ్ముచున్నాము. కానీ, ఒకే ఒక్క దేవుడున్నాడు, చూచారా. అది నిజము. వాటిలో దేవుడు ప్రత్యక్షమాయెను. కాని ఒక్కడే దేవుడు, చూచారా. అది నిజము. దేవుడు మూడు కార్యాలయములలో జీవించెనని మనము నమ్ముచున్నాము. ఒకసారి భూమి మీద ఆయనకు ఒక కార్యాలయముండెను.

109

(ఇప్పుడు, స్త్రీలు అటువైపుకు, పురుషులు ఇటువైపుకు రండి. అంతా సిద్ధమగుచున్నది. ఇప్పుడు వారు బాప్తిస్మపు ఆరాధనకు సిద్దమగుచున్నారు.)

110

మరియు, ఇప్పుడు, దేవునికి మూడు కార్యాలయములున్నవి. అందులో ఒకటి పితృత్వముగా పిలువబడెను, లేదా దానిని తండ్రి కాలము అందుము; మరియొక దానిని కుమారత్వమందుము; మరో దానిని పరిశుద్ధాత్మ అందుము. ఇప్పుడు, తండ్రి ఏ కాలములో ఇప్పుడు పనిచేయుచున్నాడు? [“పరిశుద్ధాత్మ,” అని జనులు చెప్పిరి.] పరిశుద్ధాత్మ గతములో ఆయన దేనిగా యుండెను? [“యేసు.”] యేసు. అంతకు ముందు దినములలో దేనిగా యుండెను? [“తండ్రి.”] కాబట్టి దేవుడు ఒక్కడే అది నిజమేనా? ఆయనే తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ - అవి మూడు ఒకే దేవుని యొక్క కార్యాలయములు. ఒక్కడే దేవుడు!

అయితే ఇప్పుడు, ఒక తండ్రి అనునది ఒక పేరు కాదు. అది నిజమేనా? మిమ్మును అడుగగోరుచున్నాను. మత్తయి 28:19 మీకియ్యగోరుచున్నాను. యేసు చెప్పెను, “కాబట్టి మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించుడి.” వారికి తండ్రియొక్క నామములో... “ [నామము] బాప్తిస్మమియ్యుడి.

111

ఇప్పుడు, మీరు వాక్యమును ఎంత బాగుగా ఎరిగియున్నారో నేను తెలిసికొన గోరుచున్నాను. నేను గీతను దాటిపోయినప్పుడు మీరు నాతో చెప్పండి. మరియు ఆయన వారితో చెప్పెను, “మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. నమ్మనివానికి శిక్ష విధించబడును. నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును. నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. [అది అంతా నిజమేనా?] క్రొత్త భాషలు మాట్లాడెదరు, సర్పములను ఎత్తి పట్టుకొందురు.” ఇప్పుడు నేను మీకు చూపించబోవుచున్నాను, మత్తయి...

ఇప్పుడు వినండి. చరిత్రకారులను అడుగుచున్నాను. ఇది టేపు మీద ఉన్నది. ఇది ప్రపంచమంతటికి వెళ్ళును. “తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమిచ్చుట కాథలిక్కు చర్చి నైసియా కౌన్సిల్ సభయొద్ద ప్రారంభించెను. అంతకు ముందు ఏ ప్రొటస్టెంటు అయినా గాని ఆ విధంగా బాప్తిస్మము పొందినట్లు చరిత్రలో గాని, లేఖనములో గాని ఉన్నదేమో చూపించండి. అది టేపు మీద యున్నది. ఇది ప్రపంచమంతటికీ వెళ్ళును. ముప్పది-ఏడు వివిధ భాషలలోనికి వాటిని అనువదించిరి. సముద్రము దాటి వచ్చుటకు అగు ఖర్చు నేను ఇచ్చెదను. ”తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ,“ అను సిద్దాంతము తప్పు. అది కాథలిక్కు తప్పుడు బోధ. క్రైస్తవ బాప్తిస్మము కాదు. నిజము. దానిని కాథలిక్కు చర్చినుండి లూథరు తెచ్చెను. వెస్లే దానిని వెంబడించెను. కాని ఇది దేవుని కుమారుల ప్రత్యక్షతా దినము, జగత్తు పునాది వేయబడక ముందు నుండి దాచబడిన మర్మములు బయలుపరచబడినవి. నిశ్చయంగా ఇదే ఆ ఘడియ.

112

“తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎన్నడూ ఏ వ్యక్తి బాప్తిస్మము పొందలేదని గుర్తుంచుకొనండి. చివరి అపోస్తలుడు చనిపోయిన మూడు వందల సంవత్సరముల వరకు ఎవరును ”తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ“ నామములో బాప్తిస్మము పొందలేదు. ”నైసియా తండ్రుల ముందు చరిత్ర, నైసియా ఆలోచన సభ,“ అను రెండు గ్రంథములను నేను చదివాను. అక్కడ నుండి వారు ”క్రైస్తవ సార్వత్రిక సంఘము, అను దానిని స్థాపించిరి. దానిలో నుండి ఒక సంస్థను తయారుచేసి జనులందరినీ బలవంతముగా అందులోనికి లాగిరి. అదే కాథలిక్కు సంఘము. కాథలిక్కు అను పదమునకు “సార్వత్రిక (universal)” అని అర్ధము. ఒక సార్వత్రిక క్రైస్తవ సంఘము, ప్రపంచ వ్యాప్తము, ఈ క్రైస్తవ్యమును ప్రపంచమంతా ఒక్కటే సంఘము కప్పును.

అందులోనికి జనులను బలవంతముగా లాగిరి. వారు వీనస్ను తీసివేసి మరియను పెట్టిరి. వారు జూపిటర్ ను తీసివేసి పౌలును పెట్టిరి. అది ఇంకా అన్యమతమే. అక్కడ నుండి కాథలిక్కు సంఘము వచ్చినది, మరియు అయిదు వందల సంవత్సరముల తరువాత ...

113

ఇప్పుడు లూయిస్-విల్ లో ఒక నాటకము ప్రదర్శించబడుచున్నది. దాని పేరు బెన్హార్, కొంతకాలం క్రిందట పది ఆజ్ఞల చిత్రమును ప్రదర్శించిరి. అంధకార యుగములలోని పదిహేను వందల సంవత్సరములను వారు చిత్రముగా తీసియుంటే బాగుండును. వారది నిర్మించితే బాగుండును. పదిహేను వందల సంవత్సరముల పాటు అన్యులు హింసించిరి. ప్రతివారిని వారు బలాత్కారముగా పట్టుకొని చంపిరి. త్రాళ్ళతో ఉరివేసిరి. ఎద్దును ఒక చేతికి, మరొక చేతికి మరో ఎద్దును కట్టి, వారు చెప్పినది చేయకపోయినయెడల, ఇరువైపులా ఆ ఎద్దులను తోలి వారిని చంపిరి. స్విట్జర్లాండులో వారి నాలుకలను కోసి వారిని కట్టి చంపిన కొయ్యలను నేను పట్టుకొన్నాను. వారిని దయ్యములని పిలచిరి. ఇది ఖచ్చితముగా వాస్తవం. నిజము!

114

మరియు నేడును అదే విధమైన ఆత్మ నివసించుచున్నది. చట్టమువలన వారేమి చేయలేకపోవుచున్నారు. అందుకు స్వాతంత్ర్యము వచ్చు వరకు ఎదురు చూచుచున్నారు. బైబిలు ఆ విధముగా చెప్పుచున్నది. తరుణము దొరికినచో వారి రంగులు బయటపడును. అంతవరకు వేచివుండండి. నాకు తెలిసినంతవరకు అందుకు త్వరలోనే ఓటు వేయుదురు, చూచారా. అది వచ్చును. దానిని తప్పించుకొను మార్గము ఏదీ లేదు. అది రావలసియున్నది. అది నిజము. అది వచ్చినప్పుడు, కేవలము దానిని మీరు గమనించండి. కాని సోదరుడా, ఒక సంగతి తెలిసికొనుము: నేను నమ్మినవానిని ఎరుగుదును. ఆమేన్. ముందుకు సాగిపొండి, చూచారా. అంతే.

115

లామ్సా బైబిలును అనువదించిన రచయిత ప్రాచీన దేవుని గురుతును చూచెను. అందులో మూడు చిన్న చుక్కలున్నవి. “అవేమిటి?” అనడిగాను.

“మూడు గుణలక్షణములలో ఉన్న దేవుడు,” అని అతడు చెప్పెను.

“తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కదా?” అని నేను అన్నాను.

“దానిని నీవు నమ్ముచున్నావా,” అని అతడు నా వైపు చూచి అనెను.

“అవును,” అని నేను అన్నాను.

అతడిట్లు చెప్పెను, “ఒక రాత్రి నేను ఆ వివేచనను చూచాను. నీవు దేవుని ప్రవక్తవనుకొన్నాను. దేవుడు నిన్ను దీవించు గాక! నన్ను కౌగలించి చెప్పెను, అది నాకు తెలియును. కాని ఈ అమెరికను వారికి అదేమిటో తెలియదు, అని చెప్పెను. వారికసలు ఏమీ తెలియదు అని చెప్పెను. వారు తూర్పు దేశపు గ్రంథమును తీసికొని దానిని పశ్చిమ దేశ గ్రంథముగా తయారు చేయుటకు ప్రయత్నించుచున్నారు. కనీసం వారి బైబిలు వారికి తెలియదు.” అతను చెప్పెను, “ఆకాశము క్రింద మరే ఇతర నామము ఇయ్యబడలేదు. ప్రతివారు యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మము పొందిరి. ఒకే దేవునిలో మూడు వ్యక్తులు లేరు. ఆ మాట చెప్పుచున్నందుకు వారు నిన్ను కాల్చి చంపవచ్చును. కాని చూడు, వారందరూ ఒకే కారణము కొరకే చనిపోయిరి.” ఈ మాటలు చెప్పినది సహోదరుడు లామ్సా, డాక్టర్. లామ్సా బైబిలుకు అనువాదకుడు. ఐసన్ హోవర్ కు మరియు ప్రపంచములోని మహా దౌత్యవేత్తలందరికీ అతడు సన్నిహిత స్నేహితుడు. నన్ను అతడు ఆలింగనము చేసికొని ఈ మాటలు చెప్పెను.

116

చెరసాలలో ఉంచబడిన ఆనాటి పేతురువలె నేనుండగోరుచున్నాను. ఒక చిన్న బాలుడు ఉద్వేగముతో, “ఓ, ఏమిటి సంగతి?” అని చెప్పెను.

“నీవు ఉరితీయబడుచున్నావని ఎరుగుదువా?” అన్నాడు.

“అవును,” అని పేతురు చెప్పెను.

“ఈ రోజు నీవు చనిపోవుచున్నావు,” అనెను.

“అవును,” అని పేతురు చెప్పెను.

“నీకు భయము లేదా?” అనడిగెను.

“లేదు,” అనెను.

“క్రైస్తవులుగా పిలువబడుచున్న వారిలో నీవు ఒకడవు కదా,” అనడిగెను.

“అవును,” అనెను.

“ఏమి జరిగినది?” అనడిగెను.

అతడు కూర్చొని వృత్తాంతము చెప్పెను. “ఈ ఉదయము నేను స్వేచ్చగా పోగలను. వారి శాఖలలో చేరి జీవించగలను. విడుదల పొందగలను, కాని నేను పట్టణపు గవిని యొద్దకు వచ్చినప్పుడు ఒకాయన నడిచి వచ్చుట చూచాను. ఆయనెవరో నాకు తెలియును. 'ప్రభువా! నీవెక్కడికి వెళ్ళుచున్నావు?' అని అడుగగా, 'నేను మరల సిలువవేయబడుటకు వెళ్ళుచున్నాను.'” “మరల నేను తిరిగి వచ్చెదను,” అని ఆయన జవాబు చెప్పెను.

అదే సమయంలో వారు, “సీమోను పేతురు ఎవరు?” అనడిగెను.

“ఇక్కడే ఉన్నాను,” అని అతడు చెప్పెను. [టేపు ఇక్కడ పూర్తైనది.]

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...