పుత్రస్వీకారము #4
VGR COUNT -241 మన ప్రశస్తమైన స్నేహితులకు, ఈ రాత్రి తిరిగి ఇక్కడ సంఘములో ఉండుటను బట్టి మేము సంతోషిస్తున్నాము. కొద్దిగా వేడిగా ఉన్నది, కావున వీలయినంత త్వరగా, నేరుగా వర్తమానములోనికి వెళ్ళుటకై త్వరపడెదము.
మొదటగా మనకు కొన్ని ప్రకటనలు చేయవలసి ఉన్నవి, మరియు ఒక ప్రత్యేక ప్రార్ధన అవసరత వున్నది. మెదడులో కణితి వున్న ఆ సహోదరి గూర్చి మీరు ఇచ్చిన ఉత్తరము నా వద్ద ఉన్నది. మరియు లూయిస్ విల్ లో మరొకరున్నారు, మరియు మరొక సహోదరుడు సేవకుడు, అతని - తండ్రికి గుండెపోటు వున్నది. మరియు ఈ దినమున ప్రపంచములో అనేక వ్యాధిగ్రస్తులున్నారు. అనేకులు పిలుచుచున్నారు మరియు దేవుడు సహాయము చేయునట్లు మేము నిశ్చయముగా హృదయపూర్వకముగా వారి కొరకు ప్రార్ధించెదము.
2
సాధారణముగా నా పరిచర్యలో తొంభై-ఐదు శాతం ఎల్లప్పుడూ రోగులకు ప్రార్ధించుటే అయి యున్నది, మీరు చూడండి, కాని నేను కేవలం ఒక విధమైన... నేను ఇంకనూ రోగుల కొరకు ప్రార్ధించుచున్నాను, ఇప్పుడు, దానిని గుర్తుంచుకొనండి. అది సరిగ్గా దానితో వెళ్ళును. కాని, ఓ, తన స్థానములో పెట్టబడిన సంఘము మనము కలిగివున్నట్లైతే... మరియు మనము పనిచేయునట్లు క్రమములో ఉంచబడినట్లైతే, మీరు చూడండి. క్రమమును కలిగియుండి, ప్రతిదీ సమేతముగా పొందవలెను.
కొద్ది నిమిషముల క్రితం ఏదో నా హృదయమును తాకెను. అది ఒక వృద్ద యోధుడు, అతని చేతులలో ఒకటి, కాలు ఒకటి దాదాపు పేల్చివేయబడినప్పుడు జరిగెను. నేను చెప్పునది వినుటకు అతనిప్పుడు ఇక్కడ లేడు, అయితే ఒక నిజమైన యువరాజు వంటివాడు, మరియు ఇక్కడ మన సంఘ ధర్మకర్తలలో ఒకడైనవాడు మరియు ఒక మంచి క్రైస్తవ పెద్ద మనిషి అయిన రాయ్ రాబర్సన్ అను పేరుగలవాడు. అతడు అక్కడ కూర్చొని మరియు చెప్పెను, “సహోదరుడా బ్రెన్హాం, అధ్యక్షుడిని మరువ వద్దు.” చెప్పెను, “అతను అడుగుపెట్టినప్పుడు అది నన్నెంతగానో విచారపడునట్లు చేసెను.” “అతను చెంపలగుండా కన్ళీళ్ళు కారుతూ మరియు అతని నోరు ప్రక్కగా తొలగి విమానం నుండి దిగుచుండగా, ఒక టెలివిజన్లో చూచెను. అతను సరిగ్గా అక్కడ రాయ్ తో ఉండెను మరియు వారు, ఆ పోరాటములో ఉన్నారని మీకు తెలియును.
3
రాజకీయంలో వారితో మీకు భేదాభిప్రాయాలునప్పుటికీ ఫరవాలేదు, అతనింకనూ మన అధ్యక్షుడై యున్నాడు. అవునండి. నా మట్టుకైతే, నేనొక డెమోక్రాట్ లేదా రిపబ్లికన్ను కాను; నేను ఒక క్రైస్తవుడను. అయితే అధ్యక్షుడు డ్వయిట్ ఇసన్హోవర్ పట్ల నాకు ఖచ్చితముగా గొప్ప అభిమానం కలదు అని మీకు చెప్పుచున్నాను. నిశ్చయముగా, నా ఆలోచనా విధానంలో అతడు నిశ్చయంగా గొప్ప మనిషి అతడు మరలా పోటీచేయనున్నయెడల, మరియు నేను ఓటు వేయనున్నట్లైతే అతనికే మరలా నేను ఓటు వేయుదును. అది నిజము. అతను వంద సంత్సరములవాడైననూ నేను లెక్క చేయను, నేను యింకనూ అతనికే ఓటు వేయుదును, ఎందుకనగా అతనిని నేను ఇష్టపడుచున్నాను. మరియు ఈ రాత్రి ప్రార్ధనలో మనము అతనిని జ్ఞాపకముంచుకొందాము.
జే.టి., మీరు మరియు సహోదరుడు విలార్డ్, మీరంతా ఈ వారములో కలిగివున్న ఆ కూటమును నిశ్చయముగా నేను అభినందించుచున్నాను. ఒకవేళ బయట నుండి నేను లోపలికి నడిచి వచ్చినయెడల, మీరంతా, “మంచిది, సహోదరుడా బ్రెన్హాం ఇప్పుడు, ఫలాని మరియు ఫలాని” అని చెప్పెదరని మీకు తెలియును. అయితే కేవలం నేను బయట నిలబడి మరియు మీరు చెబుతుండగా వినడమే బాగున్నది, మీరు ఆ విధంగా ఆలోచించుట లేదా? చాలా మంచిది.
4
మీరందరూ కోరినయెడల, మీరు సంఘ కాపర్వతము చేయుటకు సిద్ధముగా నున్నయెడల, మీరు తర్ఫీదు పొందినయెడల కొన్ని సంఘముల కొరకై ప్రతిపాదనలు నా యొద్ద నున్నవి. మరియు మీరు తర్ఫీదు పొందియున్నారనియు, మరియు అందరూ స్థిరపడియున్నారనియు నేను నమ్ముచున్నాను. ఆరెగాన్ లో ఒకటి నాకు ఉన్నది, వాషింగ్టన్లో కొన్ని కాలిఫోర్నియా మరియు ఆరిజోనాలో, ఇంకా వివిధ ప్రాంతములున్నవి. మరియు మీరు ఒక సంఘమును లేదా మరిదేనినైననూ తీసికొనగోరినయెడల, ప్రారంభించుటకు ఇదే చక్కని స్థలమై యున్నది. సరిగ్గా ఇక్కడ నుండే కనీసం ఇండియాకైననూ మరియు మీరు ఇంకెక్కడికి వెళ్ళవలెనని కోరిననూ, ప్రతి స్థలములో ఆత్మలు మొరపెట్టుచున్నవి. కేవలం మనము తెలిసికొనెదము, ఎందుకనగా పిల్లలైన మీరు ఇప్పుడు లంగరు వేయబడినారని నేను నమ్ముచున్నాను. అది నిజము.
వారు దానిని చేయుటను నేను చూచుటకు ప్రేమించుదును. అక్కడ సహోదరుడు రడెల్ వున్నాడు. కొద్ది దినములలో అతనికొరకు కూటము నిమిత్తమై వెళ్ళుదును. సహోదరుడు రడెల్ నిమిత్తము ఒక ఉజ్జీవము కలుగుటకై వెళ్ళుచున్నాను. మరియు నేను అతనిని ప్రతి స్థలములో ముందుకు త్రోయుచూ, అతనే ముందుకు వచ్చి మరియు ప్రసంగించున్నట్లు నేను ప్రయత్నించుట నాకు గుర్తున్నది. అతను చాలా వెనుకబడియున్నాడు. “నేను మాత్రము మాట్లాడలేను” అని అతడు చెప్చును. మీరు గనుక వినగలిగినట్లైతే, అతడు ప్రసంగించగలడు కూడా. అవునండి. చూడండి, పరిశుద్దాత్మ మిమ్మును స్వాధీనపరచుకొనునట్లు మీరు అనుమతించే వరకు మీరు ఏమి చేయగలరో మీకు తెలియదు. అది నిజము.
5
యూటికాలో సహోదరుడు గ్రహం స్పెల్లింగ్ మరియు ఆ దిగువగా సహోదరుడు జూనియర్ జాక్సన్ ఉన్నారు. వాటన్నిటిని మనము మన సహోదరి సంఘాలుగా ఎ౦చియున్నాము. మన మందరము సమేతముగా ఉన్నాము. మనము మన సిద్దాంతముల విషయమై ఏకీభవించనివారమై ఉండము. మన నిరీక్షణ మరియు గురి, మన సిద్దాంతములు ఒక్కటైయున్నవి. మనము కలసికట్టుగా నిలబడెదము, కేవలం ప్రతిదానిలో కలిసికట్టుగా ఉన్నాము. మనము కేవలం ఒకే సంఘమై యున్నాము. మరియు నిశ్చయంగా వారు అంతటా చెదరిపోవుట మనము ఇష్టపడుచున్నాము. మనకు కొందరు ఆఫ్రికాలో కొందరు ఇండియాలో మరియు దేశమంతటా ఉన్నారు. వార్తను విస్తరింపచేయుచూ వారు అక్కడ వుండుటనే మనము కోరుచున్నాము.
మరియు నేను వృద్ధుడనైతుండగా సహోదరుడు జే.టి. పార్నెల్ మరియు సహోదరుడు విలియమ్ మరియు ఆ యవ్వనస్తులు వచ్చుటను నేను చూచుచున్నాను. రేపు అనునది ఉన్నయెడల, రేపటికొరకై ఒక మనుష్యుడు ఉండును. ఈ వర్తమానము ఎన్నటికీ చనిపోకూడదని నా కోరికయై యున్నది. అది చనిపోదు. అది జీవించవలసియున్నది. మరియు దానిని తీసికొని వచ్చుటకు ఇంకా చాలా కాలం మనకు ఉంది అని నేను నమ్ముటలేదు.
సహోదరి, చావనైయున్నదని వారు చెప్పిన ఆ చిన్న బిడ్డను ఈ దినమంతా సంఘములో నీవు పట్టుకొనివుండుట చూచాను. అది చాలా మంచిది. దాని విషయమై ప్రభువు కృపయు, కనికరముగలవాడైనందున ప్రభువునకు మనము కృతజ్ఞతలు చెల్లించెదము. సరిగ్గా ఇక్కడ ఏదైతే చెప్పబడుతుందో దానిపై కేవలము నమ్మిక మాత్రము ఉంచండి, చూడండి. మరియు అది సరిగా యుండును.
6
ఇప్పుడు, మీరు ఉపదేశమునందు ఆనందించుచున్నారా? మీరు ఉపదేశమును ఇష్టపడుదురా? నిజముగా అది మనకు మేలు చేయునని నేను తలంచుచున్నాను. రోగుల కొరకు ప్రార్ధించుట నుండి, మరియు దర్శనములు మరియు దైవీక స్వస్థత నుండి అది మనకు కొద్దిగా విశ్రాంతిని కలిగించును. ఇప్పుడు, ఈ రాత్రి మనము కూటమయిన తరువాత మనము ఈ రాత్రి మరలా రోగుల కొరకు ప్రార్థించెదము. మనము ఎల్లప్పుడు దానిని చేయగోరుచున్నాము, ఎవరినైనా, ఏ సమయమైనా బాప్తిస్మమిచ్చెదము.
నేను తరచూ కరెంటు లైన్ల మధ్య నడవటం ఎందరికి గుర్తున్నది? మంచిది, నేను సరిగ్గా కరెంటు లైన్ల గుండా, అనేకసార్లు, రోజుకి ముప్పది మైళ్ళు అడవిలో నడవవలసి వచ్చేది. నేను రెండు వందల-ఎనభై మైళ్ళ లైన్ల మధ్య నడవలసియుండేది. చొక్కా చేతులో పట్టుకొని మరియు ఓ, చాలా అలసిపోయినవాడినై ముండ్ల పొదలను కత్తిరిస్తూ దారి చేసుకొంటూ అడవిలో నడిచేవాడిని. ఎవరైనా ఒక వృద్ధ రైతును కలిసి మరియు ఒక చెట్టు క్రింద కూర్చొని ప్రభువైన యేసు నామములో బాప్తిస్మము పొందుటను గూర్చి మాట్లాడేవాడిని, “మంచిది, నాకు ఎప్పుడూ బాప్తీస్మము పొందాలనే కోరిక వుంది” అని అతను చెప్పేవాడు.
“నీటి కొలను ఎంతో దూరము లేదు” అని నేను చెప్పేవాడిని.
7
మరియు అతడు చెప్పేవాడు...
చాలా మందిని నేను, తీసుకొని వెళ్ళి యేసు నామములో బాప్తిస్మము ఇచ్చాను. వరుసలో వారిని నిలువబెట్టి చాలా శ్రమనోర్చి బాప్తీస్మము ఇచ్చాను. అది వాస్తవము. చాలాసార్లు నా పాత పని బట్టలతోనే వచ్చిన వారికి బాప్తిస్మము ఇచ్చాను. ఒకసారి నేరుగా కరెంటు స్తంభము దిగి ఒక వ్యక్తికి బాప్తిస్మమిచ్చాను. నేను స్తంభము యొద్ద లైన్ మేన్ గా పనిచేసి అక్కడున్న ఒకతనితో ప్రభువును గూర్చి మాట్లాడాను. అతను ఇట్లు చెప్పెను, “మంచిది, బిల్లి, ఏదో ఒక రోజున నీ సంఘమునకు వచ్చి బాప్తిస్మము పొందుదును.”
“అంతవరకు ఎందుకు ఎదురు చూచుట? మనం నది ఒడ్డునేయున్నాము గదా, సరిగ్గా ఇక్కడ కావలసినంత నీరున్నది” అన్నాను. వెంటనే వారిని పట్టుకొనవలెను. అది వాస్తవము. అదే సమయము.
ఫిలిప్పు చెప్పెను...
8
ఫిలిప్పుతో నపుంసకుడు ఇట్లు చెప్పెను, “ఇక్కడ నీరున్నది. ఇంక ఆటంకమేమి? ఏమియూ లేదు. మీరు సిద్ధముగాయన్నచో అదే ఆ సమయము. అపవాది అందులో చొరబడకుండా మీరుండవలెను. అందుకు అవకాశము ఇయ్యరాదు. నేడు నీవు చేయకలిగిన వాటిని రేపటికి వాయిదా వేయవద్దు. రేపు అనునది నీకుండకపోవచ్చును. ఒకసారి ఆలాగు నేను చేసినది నాకు జ్ఞాపకమున్నది. నేను ఒక పాఠము నేర్చుకొన్నాను. ఒక రోజు నేను చేయవలసియున్నదానిని వాయిదా వేయగా, మరుసటి రోజుకు అది ఆలస్యమయిపోయింది.
9
ఇప్పుడు, నిజంగా నేను మిమ్మును ఎక్కువసేపు ఉంచగోరుట లేదు, అయితే నేను చాలా చుట్టబడియున్నాను, మరియు ఎందుకో నాకు తెలియదు, నేను అదుపులో ఉండలేనంత సంతోషాన్ని అనుభవిస్తున్నాను. చాలా సంతోషాన్ని అనుభవించుచున్నాను.
వాక్యమును సమీపించు ముందుగా ఇప్పుడు ఒక క్షణము మన తలలు వంచుదము.
మా పరలోకపు తండ్రీ, నీవు నిత్యమూ జీవించుచున్న సజీవ దేవుడవు. ఈ అస్తమించిన సూర్యుడు, అదే సూర్యుడు, అది అస్తమించుటను దానియేలు చూచెను. అది అస్తమించుటను యిర్మియా చూచెను. అది అస్తమించుట ఆదాము కూడా చూచెను. యేసు కూడా అస్తమయమును చూచెను. వారు నడిచినది, వారు జీవించినది ఈ ప్రపంచములోనే. మరియు నీవు ఇంకనూ అదే దేవుడవై ఉన్నావు.
ఈ రాత్రి చాలా విన్నపములున్నవి. మెదడులో కణితితో ఒక సోదరుడు వచ్చియున్నాడు. మరో సోదరి కూడా అదే భయములో యున్నది. ప్రభువా, దానికి నీవు మాత్రమే నిరీక్షణగా కనబడుచున్నావు. ఆ కణితి ముదిరిపోయి యున్నది. ఎవరూ దానిని ఆపలేరు. వైద్యుల చేతికి అందకుండా అది దాటిపోయినది. అయితే ఈ రాత్రి మేము చిన్న వడిసెలను పట్టుకొని ఆ గొర్రెపిల్లను విడిపించి, తండ్రి యొక్క మందలో చేర్చగోరుచున్నాను. ప్రభువైన యేసు నామములో కణితి అను సింహమును చంపుటకు, వారిని క్షేమముగా మందలోనికి తెచ్చుటకు మేము ప్రార్ధించుచున్నాము.
10
దేవా, ఈ రాత్రి మేము, మా అధ్యక్షుడు మరియు సోదరుడగు డ్వయిట్ ఐసెన్హోవర్ను జ్ఞాపకము చేసికొనుచున్నాము. ప్రభువా, దేశమును ఆయన నడిపించియున్నాడు. మమ్మును యుద్ధములో నుండి బయకు లాగుటకు ప్రయత్నించియున్నాడు. కొరియా యుద్దమును ఆపుటకు తాను చేయకలిగిన ప్రయత్నమును చేయగలనని వాగ్దానము చేసియున్నాడు. ఆ బాలురను బయటకు తీసికొని వచ్చెదనని, ఆ తల్లలకు అతడు వాగ్ధానము చేసియున్నాడు. “కాని నా అంతట నేను దీనిని చేయలేను. ప్రయత్నము చేసెను. దేవుడు మాత్రమే దీనిని చేయగలడు” అని అతడు చెప్పెను. ప్రభువా, నీవతనితో యున్నావు. ఇప్పుడ౦తయూ చల్లారినది. వారు ముందే ఆ విధంగా ఎందుకు చేయలేకపోయిరి? దేవా, నీవతనికి సహాయము చేయుమని ప్రార్థించుచున్నాను. ప్రభువా, ఆ యోధుని ఆత్మను దీవించుము. ఆ తరువాత నాయకుని కూడా మా కొరకు నీవు ఎన్నుకొనుము. ప్రభువా, నీ ముందు నిర్ణయమే జరుగును గాక!
రాత్రి మరో ఆయన మీద మాకు ఎక్కువ ఆసక్తి యున్నది. మా దేశ వ్యవహారములు పక్కకు పెట్టి నీ కుమారుడగు ప్రభువైన యేసును జ్ఞాపకము చేసికొనుచున్నాము. మహా మహిమతో ఆయన వచ్చి అంతము లేని రాజ్యమును స్థాపించవలెనని కోరుచున్నాము. అప్పుడిక యుద్దములు ఉండవు. ఆయుధములు నిర్జివమగును. ద్రాక్షా తోటలు నాటి, వాటి ఫలములను వారు తిందురు. ఇండ్లు కట్టుకొని వాటిలో నివాసముందురు. ఆ తరువాత మరెట్టి బాధయుండదు.
వాక్యమును ఇప్పుడు మేము సమీపించుచుండగా మమ్మును దీవించుము. తండ్రీ! ఈ వాక్యమును ఏ కారణము చేత సమీపించుచున్నానో నీవెరుగుదువు. ఈ విధముగా చేయమని నీవు నన్ను కోరుచున్నావనిపించుచున్నది. ఇది నీ దైవిక చిత్తము. ఇది నీ క్రమములో యున్నది. ఇది దిన క్రమము. జనులు తమ స్థానమును గుర్తించి యుద్ద ఘడియకు సన్నద్దులగునట్లు కృప చూపుము. కొద్దిసేపటి క్రితం మా సోదరుడు ప్రార్ధనలో ఇట్లు చెప్పెను, “ప్రభువా! చాలా కాలము నీవు మాకు శిక్షణ ఇచ్చితివి.” తండ్రీ, ఇప్పుడు మా స్థానములను చూపించుము. మేము తండ్రి పనిమీద ఉండగలుగునట్లుగా, మేము చేయవలసియున్న దానిని మాకు చూపించుము. నీ కుమారుడగు యేసు నామములో దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్.
11
ఈ మధ్యాహ్నాము చాలా అద్భుతముగా గడిచినది. లూయస్విల్లోని ఒక పేరొందిన వైద్యునితోను, అతని నర్సుతోను నేను సంభాషించాను. వారు ప్రభువు యొక్క మహిమకరమగు సంగతుల గూర్చి వినియున్నారు. మరియు ఆమె తండ్రి ఒక డాక్టరు. ఆమె వచ్చి దాదాపు మధ్యాహ్నమంతా నా గదిలో కూర్చొనియున్నది. ఒక అద్భుతమగు వ్యక్తి కొద్దిగా మొండి వ్యక్తి మీకు తెలియును, ఒక రకమగు గంభీరమైన వ్యక్తి నిజమగు ప్రెస్బిటేరియనుగా ఆమె వచ్చినది, కాని వెళ్ళేటప్పుడు కన్నీరు కార్చుచూ వెళ్ళినది.
ఓ, దేవుడు ప్రతిచోట పనిచేయుచున్నాడు, వైద్యుల కార్యాలయములలోను, నర్సులతోను పనిచేయుచున్నాడు. పరిశుద్దాత్మను కలిగియుండుట గూర్చి నార్ధన్ ఇన్ఫర్మరీ ఆస్పత్రిలో నేను సాక్ష్యమిచ్చాను. దానిని వినని నర్సు ఒక్కరు కూడా ఉండరని నేను నమ్ముచున్నాను. యేసు నామములో బాప్తీస్మము పొందెనేమో అడిగాను. ప్రతి డాక్టరుతో నేను మాట్లాడాను, చూచారా.
దానిని గూర్చి వారికి చెప్పండి. సోదరుడా, సమయము ఎక్కువ లేదు. ఇక్కడ ఎంత కష్టముగా కనిపించినా గాని చివరి శ్వాస విడిచి ఆవలకు చేరువరకు దానిని నీవు చేయవలెను. అవునండి. దానిని చేయుటకు వేచియుండవద్దు; ఇప్పుడే దానిని చేద్దాం. ఇదే ఆ ఘడియ, వారు అంగీకరించకపోవచ్చును. దానిని గూర్చి వారు చిరాకు పడవచ్చును, కాని అది వారి భావము కాదు. నిజంగానే వారి ఉద్దేశ్యం అది కాదు. వారు మంచివారే. వారు నిన్ను చిరాకుపడుచున్నప్పుడు నిజంగా వారాలాగు చేయవలెనని చేయుట లేదని గమనించవలెను. వారు తమకు నేర్పించిన దానిని పట్టుకొని వ్రేలాడుచున్నారు. వారి ఉద్దేశ్యమును నీవు చూడగలవు. వారితో నీవు వివాదపడవద్దు. ఎవరితోనూ గొడవపడవద్దు, అయితే కేవలము వారిని ప్రేమించుము. తరువాత వారికొరకు ప్రార్ధించుము.
12
మనము 9వ వచనము యొద్దకు వచ్చితిమనుకొనుచున్నాను. ఖచ్చితంగా చెప్పలేను. 8వ అధ్యాయమునకు అది చాలా దూరములో యున్నది. కదా సోదరులారా? ఓ, నాకది బండలోని తేనెవలె యున్నది. మరల మనము వెనుకటి దానిని కొద్దిగా చూద్దాం... (మరియు ఇప్పుడు, నెవిల్ సోదరుడా, నేను సమయమునకు ముగించనియెడల నన్ను కొద్దిగా లాగుము, కావున నేను రోగులకు ప్రార్థించెదను.) ఈ రాత్రి మనము చేయకలిగిన ప్రతి చిన్న కార్యమును చేయవలెను. వేదిక పిలుపును ఇవ్వగోరుచున్నాను. ఇక్కడ ముగించి తక్కిన దానినంతటినీ చదువవలెను.
క్రీస్తులో మీ స్థానమును చూచుటయే దీనియొక్క ఉద్దేశ్యము; మీరు పొరపాటున ఇందులోనికి రాలేదని చూచుటయై యున్నది. ఏదో మంచిపని చేయుట వలన ఇక్కడికి రాలేదు; కాని ఇది దేవుడు మీ కొరకు చేసినది. మీరు మంచివారైయుండి, ఒక రాత్రి మీరు చర్చికి వెళ్ళినప్పుడు, ఎవరో ఒక దీన సోదరుడు మిమ్మును వేదిక యొద్దకు నడిపించినందువలన కాదు. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ముందుగా నిన్ను నిత్యజీవమునకు నిర్ణయించెను. ఆ దినమున అచ్చటికి నీవు చేరునప్పుడు...
ఇరువది నలుగురు పెద్దలు తమ కిరీటములను క్రింద పడవేసి సాష్టాంగపడుదురు. ఏ బోధకునివలన, ఏ పెద్దవలన ఇది జరుగలేదని చెప్పెదరు. సమస్త మహిమ గొర్రెపిల్లకే! ఆ దినమున దేవుడు సమస్తమును ఆయనలో సమకూర్చును. ఓ, వారు ఆ సిలువవేసిన ఆయన ఎవరో మనము గ్రహించకలిగినయెడల, మరియు తెలిసికొనినయెడల ఎంత మేలు!
ఇప్పుడు....
13
కొద్దిగా వెనక్కు వెళ్ళుటకు 8వ వచనము నుండి ఆరంభించుదము:
సమస్త జ్ఞానము, వివేచన ఆయన మన పట్ల విస్తరింపచేసెను;
ఆయన చిత్తము యొక్క మర్మమును మనకు తెలియచేసెను...
“ఆయన చిత్తముయొక్క మర్మము.” మరియు గుర్తుంచుకొనండి ఎంతగా దానిపై మనము వ్రేలాడియున్నాము? ఈ ఉదయము ఇక్కడెందరున్నారో చూద్దాం, “ఆయన చిత్తము యొక్క మర్మము” అను విషయమును ఎంతసేపయినా చెప్పుకోగలము. ఇప్పుడు ఇది చిన్న సంగతి కాదు; అలాగైతే ఇది ఒక మర్మము. దేవుని చిత్తము ఒక మర్మము. మరియు ప్రతి వ్యక్తి తనపట్ల లేదా ఆమె పట్లగల దేవుని చిత్తమును వెదుకవలసియున్నారు, అది దేవుని మర్మము.
మనమెట్లు కనుగొనగలము? అది పౌలుకు తెలియబడెను. ఏ మనిషితోను, శరీర, రక్తసంబంధులతోను సంప్రదించలేదని అతడు చెప్పెను. అతడు ఏ పాఠశాలకు, ఏ సెమినరీకి వెళ్ళలేదు. దానితో అతనికి సంబంధము లేదు. అయితే దమస్కు మార్గములో వెలుగులో, అగ్ని స్తంభమువలె ఆయన ఎవరిని కలిసికొనెనో ఆ యేసు క్రీస్తు ద్వారానే అది అతనికి బయలుపరచబడెను మరియు ఆయనను పిలిచెను.
మరియు అతడు అరేబియాకు వెళ్ళెను, మరయు అక్కడ మూడు సంవత్సరములుండెను. ఈగన్ సోదరుడా! నీవు ఊహించగలవా? అది చాలా కాలము కదా? పౌలు అరేబియాలో మూడు సంవత్సరములుండెను. ఎక్కడో చిన్న ఇల్లు అద్దెకు తీసికొనెను. పైకి క్రిందికి నడిచెను. ఆ పాత కాగితము చుట్టలు... వారియొద్ద క్రొత్తవి లేవు. వాటిని గురించే పౌలు ఎక్కువ వ్రాసెను.
దేవుడు మనలను ఆదియందే నిత్యజీవమునకు ఎట్లు నిర్ణయించెనో ఆ పాత కాగితపు ప్రతులతోనే తెలిపెను. ఆయన యేసును పంపి, ఈ బలిద్వారా మనందరము జీవ వృక్షమునకు వారసులమగునట్లు త్రోవ చూపెనో తెలిపెను. ఆయన ముందుగా ఎవరిని ఎరిగెనో వారిని పిలచెను. ఆయన ఎవరిని పిలచెనో వారిని ముందుగానే నీతిమంతులనుగా తీర్చెను. ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని పూర్వమే మహిమపరచెను. దేవుడు ప్రపంచ ఆరంభము నుండియు కుమారులనగా మనలను దత్తత చేసికొనుటకు నిర్ణయించెను. ఇప్పుడు సృష్టి యావత్తు మూలుగుచూ, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నది. పౌలు చాలా అద్భుతమగు సమయము కలిగియుండెనని నేను తలంచుచున్నాను. నేను అతనితో అక్కడ ఉండుటకు ఇష్టపడుదును. మీరు ఇష్టపడరా?
14
అతడు ఇట్లు చెప్పెను, “ఆయన మనకు మర్మమును తెలియచేసెను.” నీ మీదికి కొంతసేపు పరిశుద్దాత్మ వచ్చినయెడల అదెట్లు పనిచేయునో చూడుము. ఈ మధ్యాహ్నము అది నాకు కలిగినది, ఓ, దాదాపు ముప్పయి నిమిషములు అధ్యయనము చేశాను, పాఠమును చూచాను. నేను అందులో సగము అనగా పదిహేను నిమిషముల సంగతులు చెప్పెదను. నేను పరుగెత్తవలసియున్నాను. “మర్మము — అదెంత మర్మము!” అనుకొన్నాను. మరియు ఆ లేఖనము నన్ను పాత నిబంధనలోనికి, మరియు తిరిగి క్రొత్త నిబంధనలోనికి తీసికొని వెళ్ళినది. ఆయన రాకడ యొక్క మర్మమును, ఆయన చిత్తము యొక్క మర్మమును, మనము కలిసి కూర్చొనుట యొక్క మర్మమును సమకూర్చి అది చెప్పినది.
గుర్తుంచుకొనండి, ఏ సెమినరీలోను దానిని నేర్చుకోలేము. అది ఒక మర్మము. విద్య ద్వారా గాని, వేదాంతము ద్వారా గాని దానిని నీవు ఎరుగలేవు. అది జగత్తు పునాదికి ముందు నుండి దాగియున్న మర్మమైయుండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నది.
15
నా సహోదరీ, సహోదరుడా, దేవుని కుమారులు ప్రత్యక్షమగు కాలము ఇదిగాక మరెప్పుడో నాకు చెప్పండి? సర్వసృష్టికి విమోచన కలిగించు సమయము చరిత్రలో ఇప్పుడు గాక మరెప్పుడైనా వచ్చునా? సృష్టి యావత్తు మూలుగుచు ప్రత్యక్షతా సమయుము కొరకు ఎదురుచూచుచున్నది. ఎందుకు, పరిహారము చెల్లించబడక ముందు, పరిశుద్దాత్మ కుమ్మరింపబడక ముందు, పాత నిబంధన లేక ముందు, ప్రత్యక్షత అనునది యుండుటకు వీలులేదు. ఈ కాలము వరకు అది ఎదురు చూడవలసియున్నది. అన్ని సంగతులు ఇప్పుడు ఒక ముగింపుకు వచ్చుచున్నవి, తలరాయిగా రూపుదిద్దుకొనుచున్నది, దేవుని కుమారుల ప్రత్యక్షత తిరిగి వచ్చుచున్నది; మరియు దేవుని ఆత్మ ఈ జనులలోనికి పరిపూర్ణముగా వచ్చుచున్నది — ఎంతవరకు అనగా, వారి సేవ క్రీస్తు సేవకు బహు దగ్గరగా, ఆయనను మరియు ఆయన సంఘమును అది కలుపునంతవరకు.
16
పిరమిడ్ యొక్క చరిత్రను ఎందరు చదివారు? ఒకామె చేయిని ఎత్తినది. మంచిది.
దేవుడు మూడు పరిశుద్ధ గ్రంథములను వ్రాసెను. అందులో ఒకటి ఆకాశ మందలి రాశి చక్రము. అదే మొదటి బైబిలు. దేవుడుపై నుండి వచ్చెనని మానవుడు పైకి చూడవలసియున్నాడు. రాశి చక్రమును చూచితిరా? ప్రతి కాలమును అది చూపించును, క్యాన్సరు కాలమును కూడా. అది క్రీస్తు పుట్టుకను చూపించును. రాశి చక్రములోని మొదటి బొమ్మ ఏది? — కన్య. చివరిది ఏది? — సింహము. క్రీస్తు యొక్క మొదటి రాకడ, రెండవ రాకడ కూడా అందులో వ్రాయబడినవి.
ఆ తరువాత “పిరమిడ్లు” అను రాయిలో మరో బైబిలు వ్రాయబడినది. దేవుడు పిరమిడ్లలో వ్రాసెను. మీరు వాటిని అధ్యయనము చేసినచో, జల ప్రళయము రాక ముందే అవి ఎట్లు నిర్మించబడినవో ప్రాచీన చరిత్రలను మరియు యుద్ధములను గమనించండి.
17
మూడవది కాగితము మీద వ్రాయబడెను — అదే బైబిలు — రానున్న గొప్ప తెలివిగల ప్రపంచము కొరకు. దేవుడు కాలముతో కదులుచున్నా కొద్దీ, మనము సింహము యొద్ద ఉన్నాము. పిరమిడ్ పైకప్పు యొద్దకు వచ్చియున్నాము. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయములో మనమున్నాము. అర్ధరాత్రికి మూడు నిమిషములే యున్నదని సైన్సు చెప్పుచున్నది. ఓ, మనం ఎచ్చటున్నామో ఆలోచించండి!
గమనించండి, పిరమిడ్ ను తీసికొందము. అది తేలిక. అది త్రికోణకారముగా యుండును.
సంఘము యొక్క ఆది కాలమునకు తరువాత లూథరు యొక్క సంస్కరణ ప్రారంభమాయెను. క్రైస్తవుడనని చెప్పుకొన్నచో జీవమో లేక మరణమో, కనీసం క్రైస్తవుడనని చెప్పుకొన్నందుకే వారు అతనిని చంపెడివారు. కావున హింస ద్వార వెళ్ళుట... కాబట్టి ప్రతి కాలములోను హింస యున్నది. “క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించువారందరూ హింస పొందుదురు.” లూథరు కాలమును చూడండి, “లూథరన్” అని చెప్పుకొనుట భయంకరము. నిన్ను పిచ్చివానిగా ఎంచి మరణ శిక్ష విధించెడివారు. చాలా మందిని ఉరికొయ్యలకు కట్టి చంపిరి,
కాల్చి చంపిరి, లూథరనులను నానా రీతులుగా హింసించిరి.
18
ఆ తరువాత సంఘము పిరమిడ్ వలె సన్నబడినది. అది కృపలోనికి మరో అడుగు వేసినది. దానినే శుద్దీకరణము అందుము. అంగ్లికను చర్చిని ఎదిరించి శుద్దీకరణమును బోధించినప్పటి వెస్లీ కాలము. మరల అది అల్ప సంఖ్యలోనే యున్నది. వారిని ఒక పిచ్చివారి గుంపు అనిరి.
ఇంతకు ముందు మెతడిస్తుగా యున్నవారు, లేదా మెతడిస్తు చర్చితో సంబంధమున్న వారెందరు ఇక్కడున్నారు? సగము మంది ఉన్నారు. ఒకప్పుడు మెతడిస్తు చర్చి దాదాపు పరిశుద్దాత్మను పొందినదని మీకు తెలియునా? నేను మెతడిస్తు సంఘములకు వెళ్ళాను. వారు నేల మీద పడి, ముఖం మీద నీరు చల్లుకొని పంఖాతో విసరుకొనుట చూచాను. ఇది నిజము. కెంటాకీ కొండలలో మాకు మెతడిస్తువారు ఉన్నారు. మీరా సంఘములో చేరిరి; అక్కడ మేము మెతడిస్తులు, బాప్టిస్తులతో యున్నాము. మేము వేదికయొద్ద చేరి ఒకరి వీపును ఒకరము కొట్టుకొని ఏదో పొందితిమని తలంచేవారము. ఆ తరువాత మేము కొద్దిగా మార్పును పొందినవారముగా జీవించేవారము.
కాని మీరు కేవలం పుస్తకంలో పేరు వ్రాసికొని మరియు “నేను మెతడిస్తును” అని చెప్పుచూ కొద్దిగా నీళ్ళు మీపైన చిలకరించుకొని మరియు అంతయూ ఇదే అనుకొనుచున్నారు. బయటకు వెళ్ళి పొట్టి దుస్తులు ధరించి, రంగులు పూసికొని, గుర్రపు పందెములు, జూదము, అల్లరితో కూడిన ఆట పాటలలో పాలుపొందుచున్నారు. అయినా మేము మంచి మెతడిస్తులమని చెప్పుకొనుచున్నారు, చూడండి. వారు మెతడిస్తులు కారు; వారు కేవలము సంఘ సభ్యులు. అది వాస్తవము. బాప్టిస్తులు, ప్రెస్బిటేరియను ఇంకా తదితరులందరూ ఆ విధంగానే యున్నారు.
19
డెవిడ్ డ్యుప్లెసిస్ ఇట్లు చెప్పెను, “మనుమలు, దేవునికి మనుమలు ఎవరూ లేరు.” దేవునికెన్నడూ మనుమడుండడు. ఆయనకు కుమారులున్నారు గాని మనుమలు లేరు. అది వాస్తవము. మీరు మెతడిస్తు, బాప్టిస్తు, పెంతెకోస్తు మొదలగు శాఖలలోనికి వచ్చుటకు కారణము మీ తల్లిదండ్రులు అందులో యుండుటయే. అందువలన మీరు మనుమలుగా యున్నారు. వారు కుమారులు; మీరు వారి పిల్లలు గనుక మనుమలు, చూడండి. అటువంటివి దేవుని యొ౦ద్ద ఏమీ లేవు. సంఘములకు అట్టివి చాల యున్నవి గాని దేవునికి ఏమియూ అట్టివి లేవు.
20
ఇప్పుడు, వీటిని గమనించండి, సంఘము అల్ప సంఖ్యలోనే యుండును. పెంతెకోస్తు యుగము వచ్చినది, అది చాలా అడ్డంకులను నిశ్చయంగా నరికి వేసినది. అప్పుడు అదేమి చేసినది? అది మెతడిస్తు మరియు లూధరనులను వెనుక విడిచిపెట్టినది.
ఇప్పుడు పెంతెకోస్తు కాలము నుండి పరిశుద్దాత్మ కదిలి వెళ్ళిపోయినది. వారేమి చేసిరి? సంస్థగా మారిరి, వారికి వారే.... “మేము అసెంబ్లీ-ఆఫ్-గాడ్, మేము ఏకత్వము, మేము ద్విత్వము, మేము చర్చి-ఆఫ్-గాడ్, మేము ఇది, అది. మాలో చేరి మా పుస్తకంలో నీ పేరు వ్రాసికొననిచో నీవు పరలోకములో ప్రవేశించవు” అని వారు చెప్పుకొనిరి. ఓ! అదెంత బుద్ధిహీనత! నీవు బాప్టిస్టువైనా, మెతడిస్తువైనా, ప్రెస్బిటేరియను నైనా, నాకు లెక్క లేదు. దేవుడు దానిలో పెట్టినప్పుడు, నీ పేరు జీవగ్రంథములో ఉండును.
నీవు నిత్యజీవమునకు ముందుగా నిర్ణయించబడిన యెడల దేవుడు నిన్ను, ఏదో రీతిగా పిలచును. నిశ్చయంగా ఆయన పిలచును. “తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు. ”నీవే సంఘమునకు చెందియున్నావన్నది ముఖ్యము కాదు, దానితో ఏమి సంబంధము లేదు. సంఘ శాఖ నీకు ఏమీ చేయజాలదు, కానీ దేవునితో నడువకుండా అది నిన్ను ఆటంకపరచును, మరేమీ సహాయము చేయదు. నిన్ను విశ్వాసుల, అవిశ్వాసుల గుంపుతో కలుపును. నీవు వెళ్ళు ప్రతిచోట దానిని చెప్పుకొందువు. పరలోకములో కూడా వారు అది చెప్పుకొందురు... అది పరవాలేదు, కాని నీవు నీ సంఘ శాఖ వైపు చూచుచున్నావు. యేసువైపు చూడుము. నీవు చూడవలసియున్నది ఆయనవైపే.
21
ఇప్పుడు మనము వారు కలిగియున్న దానికి సరిగ్గా వచ్చుచుండగా... ఎంతమంది.... పిరమిడ్ను గూర్చి చదివినట్లు ఇక్కడున్న స్త్రీ చేతిని ఎత్తినదని నేను నమ్ముచున్నాను. పిరమిడ్ కు పై కప్పు లేదని మీకు తెలియును, ఉన్నదా? దానిమీద ఎన్నడూ పై కప్పు లేదు. ఉన్నదా? కనీసం దానిని వారు కనుగొనలేకపోయిరి. అదేమయినదో ఎవరికీ తెలియదు. ఎందుకు? ఆ తలరాయి లేదా పై రాయి ఎందుకు పెట్టబడలేదు? ఎందుకనగా ఆయన వచ్చినప్పుడు ఆయన త్రోసివేయబడెను. నిషేధించబడిన రాయి ఆయనే. అది వాస్తవము. అయితే ఆ కప్పు పెట్టబడును. అది వాస్తవము.
దానివంటి రాయి మాత్రమే అన్ని విధములా దానికి సరిగా సరిపోవును. పిరమిడ్ చాలా సంపూర్తిగా నిర్మాణమైనది. రాతికి రాతికి మధ్య రేజర్ బ్లేడును పెట్టలేవు. ఆ విధంగా రాళ్ళను జతచేసిరి. అంత అందమైన కట్టడము. అందులో కొన్ని రాళ్ళ వందల టన్నుల బరువైనవి. గాలిలోనికి వాటిని చక్కగా జతచేసిరి.
22
దేవుడు తన సంఘమును కూడా ఆ విధంగానే తీసికొని వచ్చుచున్నాడు. మనము కూడా చక్కగా అతుకబడియున్నాము, ఏక ఆత్మ ఏక మనస్సు కలిగియున్నాము. “ఆ లూధరనులు ఎందుకూ పనికిరారు” అని కొందరందురు. దానిని మీరు నమ్మకండి. మిగతావారు పునరుత్థానములో లేచునట్లుగానే లూధరన్లు కూడా పునరుత్థానులగుదురు. బాప్టిస్టులు, ప్రెస్బిటేరియను, ఇంకా దేవుని పిల్లలందరూ పునరుత్థానములో లేచెదరు. అందుకే ఈనాడు జనులిట్లు చెప్పుచున్నారు, “ఒక గొప్ప ఉజ్జీవము పెల్లుబికి వందలాది మిలియనుల మంది పెంతెకోస్తువారు రక్షించబడుదురు. వారందరూ రక్షించబడుదురు. మరియు ఎత్తబడుట యుండును.” మీరు పొరబడుచున్నారు. ఆ ఎత్తబడుటలో వందలాది వేలమంది యుందురు. అది నిజమే; కాని వారు ఆరువేల సంవత్సరములుగా రక్షణలో ఉన్నవారు, ఆరువేల సంవత్సరాల క్రితము.
తనయొద్దకు వచ్చు వెలుగును బట్టి ఒక వ్యక్తి వెలుగులో నడచును. అతడు వంతెనలను దాటి వచ్చును. దానిని అతడు తిరస్కరించినచో చీకటిలోనే యుండును. కాని అతడు ముందుకు కదలిపోవుచుండినయెడల....
23
ఇప్పుడు, గమనించండి, ప్రభువైన యేసు యొక్క రాకడ బహు సమీపముగా యున్నది. నీతీకరణ, శుద్దీకరణ, పరిశుద్దాత్మ బాప్తిస్మము తరువాత తలరాయి వచ్చుచున్న కాలములో ఉన్నాము. సంఘము క్రీస్తువలె పరిపూర్ణతలోనికి రావలసియున్నది. అదే ఆత్మతో సంఘము ఏకమగును. మరియు క్రీస్తు ఆత్మ నీలోయున్న యెడల నీవు క్రీస్తువంటి జీవితము జీవించునట్లుగా అది చేయును. క్రీస్తు యొక్క జీవితము నీలోయుండి ప్రవర్తించును. క్రీస్తు యొక్క క్రియలను చేయును. “నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును” అని యేసు చెప్పెను, చూచారా. సరిగ్గా క్రీస్తు జీవితమువలె యున్న సేవను మనము పొందబోవుచున్నాము. ఆ సేవ దేనిని గుర్తించును? ప్రభుని రాకడను.
నేటి ప్రపంచమును చూడండి మరియు కృశ్చేవ్ ఏమి చెప్పుచున్నాడో గమనించండి. జరుగుచున్న ఈ గొప్ప సంగతులను చూడండి. గొప్ప ప్రపంచ వ్యాప్త యుద్ధములు ఏ సయమములోనయినా చెలరేగవచ్చును. ఏ క్షణములోనయినా ధూళిగా మారవచ్చును. అది నిజము. అది చేరువలోనే యున్నదని మనకు తెలియును. జ్ఞానముగల ఏ వ్యక్తి అయినా గాని పేపరు చదివి లేదా రేడియో విని అదంతా సమీపములో యున్నదని తెలిసికోగలడు. అది జరుగుటకు ముందే క్రీస్తు తన సంఘము కొరకు వచ్చునని గుర్తుంచుకొనండి. కావున ప్రభువైన యేసు రాకడ ఎంత సమీపములో యున్నదో చూడండి? ఈ రాత్రి ఈ కూటము ముగించక ముందే అది జరుగవచ్చును. మనము అంత్యకాలములో యున్నాము. ఇది కచ్చితముగా నిజము.
24
సంఘము కదలుచున్న తీరును, దాని చలనమును గమనించండి. దానిని మీ మనసులో గుర్తించండి. చరిత్రను చదువు చరిత్రకారులు చూడండి. నీతికరణ క్రిందున్న లూధరన్ సంఘమును చూడండి. కాథలిజం నుండి తాజాగా వచ్చిన అది కదలుట చూడండి. తరువాత వెస్లీయనులు శుద్దీకరణములోనికి మరి దగ్గరగా వచ్చుట చూడండి, లేఖనములను పరిశోధించుచున్నారు. వెస్లీకి మధ్యలో వచ్చుచున్న వారిని చూడండి. ఆ తరువాత పెంతెకోస్తు యుగము వచ్చుచున్నది. పెంతెకోస్తు యుగము వరములను పునరుద్దరించుట, ఆత్మ సంబంధమగు వరములు. ఇప్పుడు, తలరాయి వచ్చుచున్న కాలమును చూడండి. నా భావము గ్రహించారా? ప్రభుని యొక్క రాకడ తెలియబడుచున్నది. సర్వసృష్టిలో నుండి దేవుడు సంఘము దాని స్థానము కనుగొనుటకు వేచియున్నాడు.
25
నేను కలిసికొనిన దాదాపు ప్రతివారు ఈ విషయములో పొరబడుచున్నారు. నాకు శరీరక పరీక్ష జరుగవలసియున్నది. విదేశములకు వెళ్ళు మిషనెరీలకు అది తెలియును. నేను పరీక్ష చేయించుకొనుచున్నప్పుడు, వారు నన్ను గదిలో నుండి బయటకు తీసికొని వచ్చిరి. నేను ఒక రకమగు ద్రవాహారమును త్రాగుచున్నాను. అది నా కడుపులోనికి వెళ్ళినదో లేదో వారు చూచుటకు అరగంట సేపు ఉంచిరి.
అక్కడ నేను ఒకామెను చూచాను. ఆమె చనిపోవ సిద్ధముగా యున్నది. ఆమె ఎంతో.... కాళ్ళు, చేతులు చిన్నగా యున్నవి. నేను ఆమె దగ్గరకు వెళ్ళు వరకు, ఆ మనుష్యుని ఈ మనుష్యుని దాటి వెళ్ళాను. ఆమె దీనముగా చనిపోవ సిద్ధముగా యున్నది. నేను దగ్గరకు వెళ్ళి, “అమ్మా! క్షమించండి” అన్నాను.
“ఎట్లున్నారు?” అని ఆమె నన్ను పలుకరించినది. ఓ, ఆమె ఎంతో జబ్బుగానున్నది!
“మీ వ్యాధి ఏమిటి?” అని నేనడిగాను.
“నా కుమార్తెను దర్శించుటకు టుసాన్కు వెళ్ళాను. నాకు జబ్బు చేసినది. వ్యాధి ఏమిటో వారు కనుగొనలేకపోయిరి” అని ఆమె చెప్పినది.
“ఒక సంగతి నిన్ను అడుగగోరుచున్నాను. నేను సువార్త బోధకుడిని. నీవు ఒక క్రైస్తవురాలివా? ఆ గడియ వచ్చినచో, నీవు వెళ్ళుటకు సిద్ధముగా యున్నావా?” అని నేనడిగాను.
“నేను పలాని-పలాని చర్చికి చెందియున్నాను” అని ఆమె అన్నది.
“నేనడిగినది ఆ ప్రశ్న కాదు. నీవు దేవుని ఆత్మతో నింపబడిన క్రైస్తవురాలివా? ఆయన నిన్ను పిలచినప్పుడు వెళ్ళుటకు సిద్ధముగా యున్నావా?” అని అడిగాను. ఆమెకు నేను మాట్లాడుచున్నది అసలు అర్ధమవలేదు, చూచారా. ఓ, లోకము ఎంత విచారకరమగు స్థితిలో యున్నదో చూడండి!
26
ఇప్పుడు, “ఆయన చిత్తము యొక్క మర్మములను మనకు తెలియపరచెను,” ఆయన రాకడ.... ఒక సంగతి మీ కొరకు చదివెదను. మనము ఆయన చిత్తము యొక్క మర్మములను గూర్చి చదువుదము. ఒక నిమిషము హెబ్రియులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము చదువుదము. దానిని గూర్చి ఆలోచించినప్పుడు మనకు ఎంతో బాగుండును, మనము పరలోక స్థలములందు కూర్చొనుట గూర్చియున్నది. హెబ్రి 7వ అధ్యాయము:
షాలోము రాజగు ఈ మెల్మీసెదెకు [ఇప్పుడు గమనించండి], మహోన్నతుడగు దేవునికి యాజకుడు,
27
ఇప్పుడు మర్మము ఏమిటి? ఇక్కడే మర్మము ఉన్నది, దీనిని గమనించండి. ఆయన చిత్తము యొక్క మర్మమును బయలుపరచుచున్న ఈ మెల్కీసెదెకు ఎవరు? అందరూ బైబిలు తీయవలెనని నేను ఎదురు చూచుచున్నాను. పరిశుద్ధ గ్రంథములు ఇంకనూ త్రిప్పుచున్నారు. గలతీ పత్రిక వ్రాసిన అదే మనుష్యుడు. హెబ్రి 7వ అధ్యాయము, పౌలు మాట్లాడుచున్నాడు:
రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, యెవనికి అబ్రాహాము అన్నిటిలో పదియవ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్మీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరును మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. [ఈ మనుష్యుడు ఎవరు?]
అతడు తండ్రిలేని వాడును, తల్లిలేని వాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆదియైనను జీవనమునకు అంతమైనను లేనివాడునై యుండి....
28
ఈ మనుష్యుడెవరు? ఇతడెవరు? అతనికి తండ్రి గాని, తల్లి గాని, అతనికి ఆది గాని, చనిపోవు సమయము గాని లేదు. రాజులను సంహరించి వచ్చుచున్న అబ్రహామును అతడు కలిసికొనెను. అతడేమి చేయుచున్నాడు? తప్పిపోయిన తన సోదరుడగు లోతును తీసికొని వచ్చుటకు వెళ్ళుచుండెను. మరియు అతడు రాజులను సంహరించెను, పది లేదా పదిహేనుమంది రాజులను, వారి రాజ్యములను నాశనము చేసెనని నేను విశ్వాసించుచున్నాను. అబ్రహాము తన దాసులతో కూడా వెళ్ళి రాత్రిలోనే తన్ను వేరుచేసికొనెను. అతడు ఎప్పుడు వచ్చెనో చూడండి? రాత్రి సమయము. ఓ, సహోదరుడా! మనము చీకటిలో ఇప్పుడు పనిచేయుచున్నాము. మనకున్న ఒకే వెలుగు అది సువార్త వెలుగైయున్నది. కాని అతడు తన్నుతాను వేరుచేసికొని, అతనిని పట్టుకొని తీసికొని వచ్చెను.
యుద్ధమయిపోయిన తరువాత తిరిగి తన మార్గమున వచ్చెను.... ఒక్క నిమిషము ఆదికాండము 14 యొద్దకు వెళ్ళుదము, ఆ గాధను ఇంకా తేటగా చూడగలము. ఆదికాండము 14 అని తలంచుచున్నాను. ఆదికాండము 14:18 “మరియు మెల్మీసెదెకు...” ఇప్పుడు, రాజులను సంహరించి అబ్రహాము తిరిగి వచ్చుచుండెను. వారు కొనిపోయిన లోతును, ఇతరులను తిరిగి తీసికొని వచ్చుచుండెను.
29
అందరు.
దావీదు చేసినట్లు, వెళ్ళి తీసుకొని వచ్చెను... దావీదు ఏమి చేసెను? చిన్న వడిసెలను తీసికొని సింహము నొటిలో నుండి గొర్రెపిల్లను విడిపించెను. గొర్రెల కాపరియొక్క వడిసెలను గూర్చి ఆలోచించండి. లోకంలో ఎవరు ఆ పనిని చేయగలరు? ఇక్కడున్న వారిలో ఎవరైనా ఆలాగు చేయగలరేమో చేయి ఎత్తండి. ఆలాగు ఎత్తినయెడల మీరు పొరబడితిరని నేను చెప్పగలను. నా మటుకు నేను ఎత్తను. తుపాకితో కూడా నేను దానిని ఎదుర్కొనలేను. కాని ఇతడు చిన్న వడిసెలతో వెళ్ళెను — చిన్న తోలు ముక్క మరియు రెండు త్రాడులు గల ఆ వడిసెలను త్రిప్పుచు.
గొల్యాతును అతడు ఎదుర్మొన సమయము వచ్చినప్పుడు, అతడు చెప్పెను, “సింహపు నోట నుండి మరియు ఎలుగుబంటి నోట నుండి గొర్రెపిల్లను విడిపించిన దేవుడు నాకున్నాడు.” అది వడిసెల కాదని అతనికి తెలియును; అది దేవుని శక్తి, అతనితో కూడా వెళ్ళెను. ఆయనే గొర్రెపిల్లను బయటకు విడిపించెను.
30
మరియు అదే నేడు మనము చెప్పెదము. తండ్రి గొర్రెల మందను మేపుచున్న దావీదులు దేవునికి చాలామంది యున్నారు. అవునండి, అప్పుడపుడు కంతులు, కాన్సరులు, వచ్చి వైద్యుల చేతులకు కూడా అందకుండా పోవును. అది దావీదును ఆపజాలదు. అతడు వడిసెలతో దానిని తరుమును; “నా నామమున ఏది అడిగినా మీకు అనుగ్రహించబడును.” వైద్యులు నవ్వుదురు, అందరూ హేళన చేసెదరు, అయినా అతడు లెక్కచేయక దానిని తరుమును, గొర్రెను మరల మందలో చేర్చుదును. అవునండి. “అతడు దేవుని బిడ్డ, అతడి మీదనుండి చేయి తీసివేయుము!” ఆ సింహమును పడద్రోసెను. అప్పుడు సింహము పైకి లేచెను, ఆయన దాని గడ్డము పట్టి చీల్చి మరియు దానిని చంపివేసెను. దాదాపు ఎనభై లేదా తొంభై పౌనుల బరువగల ఎర్రని బాలుడు అతడు.
31
ఇప్పుడు గమనించండి. షాలేము రాజగు మెల్మీసెదెకు సమాధానమునకు రాజు. వాస్తవముగా ఆ కొండకి ఆవలగా షాలేము ఉండును. ఎవరై యుండెననగా, అతడు యెరూషలేము రాజు. అతడు కచ్చితముగా యెరూషలేము రాజు. యెరూషలేమును ముందు షాలేము అని పిలచెడివారు, అనగా “సమాధానము.” అతడు యెరూషలేమునకు రాజు, నీతికి రాజు, సమాధానమునకు రాజు, షాలేము రాజు. అతనికి తండ్రి లేదు, అతనికి తల్లి లేదు. ఆది గాని, అంతము గాని లేవు. అతనికి వంశావళి లేదు. ఇతడెవరు? అతనిని గమనించండి. యుద్ధము ముగిసిన తరువాత, జయము పొందిన తరువాత, ఆయన చెప్పినది గమనించండి. “మరియు మెల్మీసెదెకు...” ఆదికాండము 18వ వచనం, 14వ అధ్యాయం:
మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షారసమును తీసికొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.
అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి - ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్సోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు,
నీ శత్రువులను నీ చేతికప్పగించిన సర్నోన్నతుడగు దేవుడు సుత్తింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి పదియవ వంతు ఇచ్చెను.
ఇంకొద్దిగా ముందుగా చదువెదము:
సౌదొమ రాజు - మనుష్యులను నాకిచ్చి ఆస్తిని తీసికొనుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము - నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను, చెప్పుల వారైనను, నీ వాటిలో ఏదైనను తీసికొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా యెదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసియున్నాను.
అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప...
32
రాజులను సంహరించి వచ్చుచున్న అబ్రహామును అతడు కలిసికొనిన వెంటనే ఈ మెల్మీసెదెకును గమనించండి. ఆయన ఎవరు? — అను దేవుని మర్మము ఇప్పుడు తెలియజేయబడును. ఆయన గూర్చిన చరిత్ర వారికేమీ దొరకలేదు, ఎందుకనగా అతనికి తల్లిగాని - తండ్రిగాని, ఆది గాని - అంతము గాని లేకయున్నాడు. ఆయన సదా జీవించియున్నాడు. ఆయనకు ఆది లేదు. కావున ఆయన ఎల్, ఎలాహ్, ఎలోహిం తప్ప మరెవరూ కాదు — స్వయం ఉనికిగలవాడు, స్వయంగా జీవించుచున్నాడు, సర్వశక్తుడు దేవుడు!
యేసుకు ఒక తల్లి, ఒక తండ్రి కలరు. యేసుకు ఆది యున్నది. ఈ యేసు జీవితమునకు అంతమున్నది. అయితే ఈయనకు తల్లిదండ్రలు లేరు, ఆమేన్, యేసుకు తల్లిదండ్రులు కలరు. కాని ఈయనకు తల్లి కాని తండ్రి కాని లేరు. ఆమెన్. యుద్ధము జయించి, తన స్థానమును పొందిన తరువాత అబ్రహాము ఏమి చేసెను?
సంగము తన స్థానమును తీసుకొనినప్పుడు, పరిశుద్దాత్మ ద్వారా కుమారులముగా మనము పిలువబడితిమి. మరియు ప్రతి మనుష్యుడు వాని వాని స్థానమును తీసికొనినప్పుడు. దేవుడతనిని చేయమన్నది చేసి, నశించినవారిని వెదకుచూ చివరి వరకు తన పనిని కొనసాగించవలెను...
33
మొదటగా, పౌలు దానిలోని భయమునంతటినీ తీసివేసెను, “మీరు పిలువబడిన వారయితే — మీరు మీ మనస్సుతో లేదా ఏదో విధమగు వేదాంతముతో పనిచేయుట కాదు — నిజంగా మీరు దేవుని ఆత్మ చేత జన్మించినయెడల, అప్పుడు దేవుడు జగత్తు పునాదికి ముందే నిన్ను నిర్ణయించి, నీ పేరును గొర్రెపిల్ల జీవగ్రంథముందు వ్రాసెను. మరియు ఇప్పుడు మనము క్రీస్తు యేసుతో కూడా పరలోక స్థలములందు కూర్చొని యున్నాము. పరిశుద్ధ ప్రజలమును, పరిశుద్ధ జనాంగమును, వింతయిన ప్రజలమును, రాజులమగు యాజకులమును అయి యుండి, దేవునికి ఆత్మ సంబంధమగు బాలులను అర్పించుచున్నాము, ఆయన నామమును సుత్తించుచూ మన పెదవుల ఫలములను అర్పించుచున్నాము.
“ఆ ప్రజలు పిచ్చివారు” అని జనులనుచున్నారు. నిశ్చయంగానే. దేవుని జ్ఞానము మనుష్యులకు వెర్రితనము, మరియు మనుష్యుల జ్ఞానము దేవునికి వెర్రితనము. అవి ఒకదానికి ఒకటి విరోధముగా యున్నవి.
34
అయితే నిజంగా ఆత్మతో నింపబడిన సంఘము, దేవుని శక్తితో నిండియుండి, పరలోక స్థలములందు కూర్చొనియుండును, ఆత్మసంబంధమగు బలులు అర్పించును, దేవునిని సుత్తించును, వారిమధ్య పరిశుద్దాత్మ సంచరించును, పాపమును వివేచించును మరియు జనుల మధ్యనున్న తప్పులను బయటపెట్టును, దానిని చక్కదిద్ది - తిన్నగా చేయును... ఎందువలన? దేవుని సన్నిధిలో నిరంతరము ఆ రక్త అర్పణ ఉన్నది.
ఇప్పుడు గుర్తుంచుకొనండి (ఈ ఉదయము దానిని చూచాము), మీరు రక్తము ద్వారా రక్షింపబడలేదు; మీరు రక్తము ద్వారా రక్షించబడి భద్రపరచబడి యున్నారు. కాని మీరు కృప ద్వారా విశ్వాసము చేతనే రక్షించబడియున్నారు, దానిని మీరు నమ్మిరి. దేవుడు నీ హృదయము తట్టెను, ఎందుకనగా ఆయన నిన్ను ముందుగా నిర్ణయించెను. నీవు దానిని చూచి అంగీకరించియున్నావు. ఇప్పుడు రక్తము నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలుగచేసెను. నేను చెప్పినది గుర్తుంచుకొనండి, “పాపము చేసినందుకు దేవుడు ఒక పాపిని శిక్షించడు.” ఆదినుండియే అతడు పాపి. పాపము చేసినందుకు ఒక క్రైస్తవుని ఆయన శిక్షించును, ఎందుకనగా క్రీస్తు మన శిక్షను తనపై వేసికొనెను. కాగా “క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. వారు శరీరానుసారముగా కాగ, ఆత్మానుసారముగా నడచుకొందురు.”
మరియు నీవు తప్పు ఏదయినా చేసినచో, అది ఇష్టపూర్వకంగా చేయవు. ఇష్టపూర్వకంగా నీవు పాపము చేయవు. ఇష్టపుర్వకముగా పాపము చేసిన వ్యక్తికి ఆ శరీరములోనికి వచ్చు అర్హత ఉండదు. కాని ఒకసారి అందులోనికి వచ్చిన వ్యక్తి చనిపోయినను, అతని జీవము క్రీస్తు ద్వారా దేవునిలో దాచబడియుండును, పరిశుద్దాత్మ ద్వారా ముద్రించబడును; అపవాది అతనిని కనుగొనలేడు, అతడు దానికి బహు దూరముగా యున్నాడు. అతడు అందులో నుండి బయటకు వచ్చినపుడే అపవాది పట్టుకొనును.
ఎందుకనగా నీవు చనిపోయి యున్నావు.
35
చనిపోయిన వానిని నీవు వేషధారివని చెప్పి ఏమి జరుగునో చూడు. నీవు అతనిని పక్కలో తన్ని, “వేషధారి” అని తిట్టినా. అతడు ఏమీ అనడు. ఒక్క మాట కూడా పలుకక అక్కడే పడియుండును. క్రీస్తునందు చనిపోయియున్న ఒక వ్యక్తిని నీవు “వేషధారీ” అని, లేదా మరో పేరు పెట్టి పిలిచినా, అతడేమీ అనడు. నీవేమన్నా గాని అతడు నెమ్మదిగా ప్రక్కకు వెళ్ళి, నీ కొరకు ప్రార్ధించును. ఇది నిజము.
అయితే, ఓ, వారిలో చాలామంది ఇంకా బ్రతికి యున్నారు. వారిని గూర్చి నేను ఆలోచించుచున్నాను... మనము చనిపోయిన వారిని సమాధి చేయవలసియున్నాము. క్రీస్తునందు చనిపోయిన వారిని మనము నీటిలో పాతిపెట్టవలెను. కొన్నిసార్లు మనము బ్రదకిన వారిని సమాధి చేయుచున్నాము. వారిలో ఇంకా బహు ఎక్కువ అపవిత్రత, కలహములు, ఇంకా మిగిలియున్నవి. సంఘములో చాలామంది అట్టివారున్నారు, కాని వారిని మనము వేరుచేయలేము. అయితే దేవుడే వేరు చేయును. ఆయన తన ప్రజలను ఎరుగును. ఆయన తన గొర్రెలను ఎరుగును. ఆయన ప్రతి స్వరమును ఎరుగును. ఆయన తన పిల్లలను ఎరుగును. మరియు బయటకు పిలువబడు వారిని, ముందుగా నిర్ణయించబడిన వారిని ఆయన ఎరుగును. ఈ సంగతులు ఎవరికి అనుగ్రహించబడినవో, వారిని ఆయనెరుగును. వారిద్వారా ఆయన తన్నుతాను బయలుపరచుకొనుచున్నాడు. అతడు ఏ విధంగా....
దేవుడు తన బిడ్డలపై నమ్మకమును ఉంచగలడు, ఏమి చేయవలెనో, వారేమి చేయుదురో ఆయనకు బాగుగా తెలియును. దేవుడాలాగు చేయునని నీవు నమ్ముదువా?
36
సాతాను ఒకనాడు యోబు గూర్చి దేవునితో ఇట్లన్నది, “నీ సేవకుని చూడు!”
“అతని వంటివాడు భూమి మీద ఎవరూ లేరు. అతడు పరిపూర్ణుడు” అని దేవుడు చెప్పెను. అతనియందు దేవునికి నమ్మకమున్నది.
సాతాను ఇట్లన్నది, “ఓ! అతనికి అంతా చక్కగా జరుగుచున్నది. నాకు కొద్దిగా అవకాశమిమ్ము. నిన్ను భూమి మీదే అతడు దూషించునట్లు చేసెదను.”
“అతడు నీ చేతిలో యున్నాడు, కాని అతని ప్రాణము తాకవద్దు” అని ఆయన చెప్పెను, చూచారా. అతని ప్రాణము తీయుట తప్ప సమస్తమూ సాతాను చేసియున్నాడు.
కాని యోబు ఏమి చేసెను? తన బిడ్డలను పోగొట్టుకొన్నప్పుడు, తనకు కలిగిన సమస్తమును పోగొట్టుకొన్నప్పుడు దేవునిని అతడు దూషించెనా?యోబు ప్రశ్నించలేదు. అతడు సాష్టాంగపడి దేవుని ఆరాధించెను. హల్లెలూయా! “యెహోవా ఇచ్చెను మరియు యెహోవా తీసికొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక.” సరిగ్గా అదే.
యోబు యొక్క నమ్మకత్వమును దేవుడు ఎరిగెను. నిన్ను ఎంతగా నమ్మవలెనో దేవునికి తెలియును. నన్ను ఎంతగా నమ్మవలెనో దేవునికి తెలియును.
అయితే ఇప్పుడు మనము ఈ బిడ్డయొక్క స్థానము గూర్చి మాట్లాడుకొనుచున్నాము.
37
యుద్ధము అంతా అయిపోయిన తరువాత మనము చేయవలసినది ఏమిటి? పరిశుద్ధ గ్రంథములో చూడండి. యుద్దము సమాప్తమైన తరువాత మనము చేయవలసినది ఏమిటి? మీరెరుగుదురా? మెల్కీసెదెకును మనము కలిసికొందుము. మత్తయి 16:16ను త్వరగా చూద్దాం. అది సరియో కాదో చూడండి. మత్తయి 16వ అధ్యాయము 16వ వచనము. అదే వచనమని నేను అనుకొనుచున్నాను. మత్తయి 16:16, కాదు, అది సరి కాదు. మత్తయి 26:26, ఇక్కడ ఆయన పేతురుతో మాట్లాడుచున్నాడు. క్షమించండి, నేను చెప్ప తలంచినది అది కాదు. నేను చివరి విందు గూర్చి చెప్పగోరుచున్నాను. మత్తయి 26వ అధ్యాయము 26వ వచనము. చివరి విందు గూర్చి ఇక్కడున్నది.
వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దానినాశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసికొని, తినుడి, ఇది నా శరీరమని చెప్పెను.
మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి వారికిచ్చి - దీనిలోనిది మీరందరు త్రాగుడి.
ఇది నా రక్తము. అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము, [పా-ప-ము-లు, పాపములు, పొరపాటు చేయు క్రైస్తవులున్నారు.]
మంచిది. ఇప్పుడు 29వ వచనమును వినండి.
... నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.
ఏమిటి? అబ్రహాము తన స్వాస్ట్యమును పొందిన తరువాత మెల్కీసెదెకు కూడా అదే చేసెను. తన జనులను సమావేశపరచి యుద్దమును జయించి తిరిగి వచ్చెను. మరియు మెల్మీసెదెకు రొట్టె మరియు ద్రాక్షారసముతో వచ్చెను. యుద్ధము అయిన తరువాత క్రొత్త ప్రపంచములో ప్రభువైన యేసుతో మనము పెండ్లి విందులో పాల్గొందుము. ఓ, ప్రభుని నామము సుత్తింపబడును గాక.
మంచిది.
38
“ఆయన చిత్తము యొక్క మర్మములను మనకు తెలియచేయుటకు ఆయన ఇష్టపడెను.” [ఎఫెసీ 9లో చూచెదము.] ఆయన యొక్క సంకల్పము అదియే.
కాలము సంపూర్ణమైనప్పుడు..
దానిని మనము దాటిపోయామని మరువకుడి. ఎఫెసీ 1వ అధ్యాయము 10వ వచనము.
కాల సంపూర్ణత దేనికొరకు ఎదురుచూచుచున్నదని మనము నేర్చుకొన్నాము. ఇప్పుడు, అది కాలమంతటికీ సంపూర్ణత,
పాపము ఆగిపోవు కాలము, మరణము ఆగిపోవు కాలము, వ్యాధి ఆగిపోవు కాలము, పాపము ఆగిపోవు కాలము; అన్ని వంకరలు ఆగిపోవు కాలము, దయ్యము అన్నింటినీ వంకరగా చేసినవి ఆగిపోవును — కాలమే ఆగిపోవును. గమనించండి.
ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గానీ, భూమి మీద వున్నవే గానీ, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.
“క్రీస్తుద్వారా అన్నియూ ఏకమవును.” ఈ ఉదయ కాలము నేను మీతో చెప్పినట్లుగా చిన్నచిన్న బంగారు తునకలను ఆదికాండములో మెరుగుపెట్టవలెను, లేవీ కాండములో మీరు మెరుగుపెట్టగలరు, నిర్గమ కాండములో మీరు మెరుగు దిద్దగలరు, మరియు ప్రకటన వరకూ మీరువాటిని మెరుగుదిద్దగలరు, అవి అన్నియు యేసులో సమాప్తమగును. యేసేపును, అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, దావీదును, ఇంకా దైవజనులందరినీ మీరు తీసికొనండి. వారందరిలోను యేసుక్రీస్తు వెల్లడి అయ్యెనో లేదో మీరే చూడండి. “యేసుక్రీస్తులో ఆయన సమస్తమునూ ఏకము చేసెను.”
39
ఇప్పుడు, ఇంకొద్దిగా ముందుకు, అనగా 11 వచనము చదువుదము:
ఆయనలో మనకు స్వాస్థ్యము దొరికెను....
ఓ, “ఒక స్వాస్థ్యము.” మీకు స్వాస్థ్యము రావలెననిన ఒకరు దానిని మీకు విడిచిపెట్టవలసియున్నది. అవునా? ఒక స్వాస్థ్యము — ఎట్టి స్వాస్థ్యము మనము పొంది యున్నాము? ఎట్టి స్వాస్థ్యము నాకున్నది? నాకేదియూ లేదు. కాని ఎప్పుడైతే నా పేరును ఆయన జగత్తు పునాదికి ముందే గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాసియుంచెనో, అప్పుడే దేవుడు నాకు ఒక స్వాస్థ్యమును విడిచి పెట్టెను.
“సోదరుడా, ఒక్క నిమిషము ఆగుము. యేసు నీ కొరకు చనిపోయినప్పుడే ఆలాగు జరిగినది” అని నీవందువు. లేదు, ఎన్నడు ఆయన చేయలేదు. యేసు ఆ స్వాస్థ్యమును నా కొరకు కొనిపెట్టుటకు వచ్చెను. సరిగ్గా తరువాత వచనము చదవండి:
మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయనయందు స్వాస్థ్యముగా ఏర్పరచెను.
40
దేవుడు జగత్తు పునాదిని వేయక ముందే దీనిని చేసెను, మన పాఠములో చూచాము. దేవుడు ఎట్లు స్వయం ఉనికిగలవాడని: ఏ విధముగా ఆయనలో ప్రేమ యున్నది, మనము చూచాము. ఆయన దేవుడైయుండుటకు ఆయనను ఆరాధించునది ఏదియూ లేదు. తండ్రిగా ఉండునది ఆయనలో యుండెను. తనకు తానుగా ఆయన ఉండెను. ఆయనలో రక్షకుడుండెను (ఏదియూ నశించిపోలేదు); స్వస్థపరచువాడు ఆయనలో వుండెను... ఇవ్వన్నియూ ఆయన గుణలక్షణములై యున్నవి. అక్కడ ఏదియూ లేదు, కావున ఆయన తనకుతానుగా, తన స్వంత ఆలోచనే వీటిన్నిటిని కలుగజేసెను, ఎట్లనగా క్రీస్తు యేసును ఒక్క మనుష్యుని ద్వారా, దానినంతటిని మరలా సమకూర్చెను. ఓ, కన్ను దానిని చూడలేదు, చెవి..... అది ఒక మర్మమగు విషయము అనుటలో ఆశ్చర్యము లేదు.
41
చూడండి... “ఈ స్వాస్థ్యమునకు ఆయన ముందుగా మనలను నిర్ణయించెను.” “విలియం బ్రెన్హాం, ఎప్పుడో నిన్ను నేను పిలిచాను. సువార్తను బోధించుటకు జగత్తు పునాదికి ముందే నిన్ను పిలిచాను” అని నా హృదయమును తట్టి దేవుడు పిలిచినట్లైతే, నాకు ఒక స్వాస్థ్యమున్నది. అది నిత్యజీవమను స్వాస్థ్యము. దానిని నాకు వాస్తవ రూపముగా చూపించుటకే దేవుడు యేసును నా కొరకు పంపెను, ఎందుకనగా దానిని స్వతంత్రించుకొను హక్కు నాకు లేదు. నాలో ఏమియూ లేదు. శూన్యముగా ఉన్నాను. కాని కాలము సంపూర్ణమైనప్పుడు, దేవుడు తన మంచి సమయములో జగత్తు పునాదికి ముందే వధించబడిన గొర్రెపిల్లమైన యేసును పంపెను. నేను నా స్వాస్థ్యముమునకు వెళ్ళునట్లుగా ఆయన తన రక్తమును చిందించెను. దేనికొరకు? ఎట్టి స్వాస్థ్యము? కుమారత్వము, దేవుని కుమారునిగా యుండుటకు.
42
ఇది మిమ్మును బహుశా మరణమునకు గురిచేయ వచ్చును, అయితే దేవుని కుమారులగు మనుష్యులు దైవములని మీరెరుగుదురా? ఎందరికిది తెలియును? యేసే ఆ విధంగా చెప్పెను, బైబిలులో ఇట్లు చెప్పెను, “మీరు దైవములని. మీ ధర్మశాస్త్రము చెప్పుట లేదా.” దేవుడు వారు దైవములని ఆదికాండము 2లో చెప్పబడెను, ఎందుకనగా లోకము మీద వారికి పూర్తి ఆధిపత్యముండెను. సమస్తము మీద ఆయన వారికి ఆధికారమిచ్చెను. మరియు ఆయన తన దైవత్వమును, కుమారత్వమును, ఆధిపత్యమును కోల్పోయెను, మరియు దానిని సాతాను తీసికొనెను.
కాని, సహోదరుడా, ఎవరైతే తిరిగి వచ్చి మరలా దానిని తీసుకొనెదరో, అట్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూచుచున్నాము. కాలము యొక్క సంపూర్ణత కొరకు ఎదురు చూచుచున్నాము. పిరమిడ్ యొక్క పైరాయి వచ్చినప్పుడు, దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడినప్పుడు, దేవుని యొక్క శక్తి బయటకు వచ్చినప్పుడు (హల్లెలూయా!) సాతాను తన దగ్గర పొందిన ప్రతి శక్తిని తిరిగి తీసికొనును. అవునండి. అది ఆయనకే చెందును.
43
దేవుని నుండి బయలు వెళ్ళిన వాక్యము (లోగోస్) ఆయనే. ఇది సత్యము. ఆయన దేవుని కుమారుడు. మానవుని ఒక చిన్న దైవముగా ఆయన చేసెను. “ఎవరి యొద్దకు దేవుని వాక్యము వచ్చునో, (ప్రవక్తలు) వారు దైవములని వారు పిలచుచున్నారు.” వారు దైవములని దేవుడు స్వయముగా చెప్పెను. మోషేతో ఆయన చెప్పెను, “నిన్ను నేను దేవునిగా చేసియున్నాను, అహరోను నీకు ప్రవక్తగా యుండును.” ఆమేన్. నేను మత పిచ్చిగల వానివలె కనబడుచున్నాను గాని నేను కాను. ఓ, మీ కన్నులు తెరువబడినప్పుడు మీరు చూచెదరు. మంచిది.
ఆయన మానవుని ఒక దేవునిగా చేసెను, అతనికి ఆధిపత్యమిచ్చెను. మరియు సముద్రము నుండి సముద్రమునకు, దరినుండి దరికి నీ ఆధిపత్యము వ్యాపించియున్నది. అది నీ అధీనములో యున్నది. మరియు పాపము లేని దేవునిగా యేసు వచ్చెను. దానిని ఆయన రుజువు చేసెను. గాలులు చెలరేగినప్పుడు ఆయన “నిమ్మళమగు గాక” అనెను. ఆమెన్. మరియు “ఎవరూ నీ ఫలము తినకుందురు గాక” అని ఆయన పలికెను.
“మీరు చిన్న దైవములని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ కొండను కదిలిపొమ్మని చెప్పి, హృదయములో సందేహించని యెడల, నీవు చెప్పినది జరుగునని నమ్మినయెడల, ఆలాగు జరుగును.”
44
మూలమగు ఆదికాండము యొద్దకు వెళ్ళండి, మూలమైన దానియొద్దకు.
అది ఏమిటి? ప్రపంచము మరియు ప్రకృతి మూలుగుచున్నది, కేకలు వేయుచున్నది, సమస్తమూ కదలుచున్నది. ఏమిటి? దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు. నిజమగు కుమారులు, జన్మించిన కుమారులు, నింపబడిన కుమారులు మాట్లాడుచుండగా, ఆ మాట స్థిరపరచబడుచున్నది. ఇప్పుడు మనము దానియొక్క సరిహద్దులో ఉన్నామని నేను నమ్ముచున్నాను. అవునండి. “ఆ కొండతో చెప్పుము, అది అలాగే జరుగును.”
“సోదరుడా, పలాని సంగతి జరుగవలెనని నేను ఆశించుచున్నాను. నేను యేసుక్రీస్తుని విశ్వాసి౦చుచున్నాను.”
“ప్రభువైన యేసుక్రీస్తు నామములో దానిని నీకు ఇచ్చుచున్నాను.” ఆమేన్. అది ఒక ప్రత్యక్షత.
“ఓ! సోదరుడా, నా పంట నాశనమగుచున్నది. ఏ వర్షము లేదు.”
“ప్రభువు నామములో నేను నీకు వర్షము పంపెదను. అవునండి.” సమస్త సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ మూలుగుచున్నది! ఆదిలోనే దేవుడు దానిని నిర్ణయించెను. మానవునికి ఆయన ఆధిపత్యము ఇచ్చెను.
45
ఆయన యేసుక్రీస్తుకు ఇచ్చెను, మరియు యేసు తన నామములో ఈ నిశ్చయతతో ఇచ్చెను, “నా నామములో తండ్రిని మీరేమి అడిగినను నేను అనుగ్రహించెదను.” ఓ, పామర్ సోదరుడా! సంఘము, స్థానము, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నది.
ఎఫెసీ గ్రంథము యొహోషువా గ్రంధమునకు సారూప్యమని మీకు చెప్పాను. జనుల స్థానమును యెహోషువా చూపించెను. ఎవరి స్థానములో వారుండనిచో కలహములు చెలరేగునని చెప్పెను. ఎఫ్రాయీము స్థానములోనికి మనష్హే రాకూడదు. వారాలాగు కలిసి జీవించలేరు. “నేను బాప్టిస్తును, నేను మెతడిస్తును, నేను పెంతెకోస్తును, నేను ఏకత్వము, నేను ద్విత్వము, నేను పలాని” అని చెప్పుకొనుచు వారు ఏలాగు ఒకటిగా వెళ్ళగలరు. మీరెట్లు దానిని చేయుదురు? నెమ్మదిగా యుండండి. దేవుడే సంఘము యొక్క స్థానమును నిర్ణయించెను. తన కుమారులనుగా మరియు కుమార్తెలనుగా స్వీకరించెను.
దానిని చూచువరకు నన్ను జీవింపచేయు దేవా అని నేను ప్రార్థించుచున్నాను. సోదరుడా! దానిని దాదాపు నా చేతులతో నేను ఇక్కడ తాకుచునే యున్నాను. దానిని చూచుటకే నేను ఆశపడియున్నాను. ఆ సమయము కొరకు ఎదురు చూస్తూ వీధిలో నడుచుచున్నాను. తల్లి గర్భము నుండి కుంటివానిగా పుట్టిన ఒకడు కలడు. “వెండి బంగారములు నా యొద్ద లేవు....” దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాము, హల్లెలూయా, దేవుడు తన్నుతాను బయలుపరచుకొనునప్పుడు — అప్పుడు వారు రోగాలను ఆపివేయుదురు, వారు క్యాన్సరును నిలిపివేయుదురు, వారు వ్యాధులను నిలిపివేదురు.
46
క్యాన్సరును మీరు ఏమని తలంచుచున్నారు? మనుష్యులు శరీరములోనే కుళ్ళిపోవు సమయము వచ్చునని బైబిలులో వ్రాయబడెను, వారు చనిపోకముందే వారి శరీరమును రాబందులు తినును. రానున్న దానికి క్యాన్సరు ఒక మంగుర్తు. కాని గుర్తుంచుకొనండి, ఆ భయంకరమైనది దేవుని ముద్రగల వారిని తాకుటకు నిషేధించబడినది. అందుకొరకే ఇప్పుడు మనము శ్రమపడుచున్నాము, ఆ భయంకర తెగుళ్ళు రాకముందే దేవుని రాజ్యములో స్థానము సంపాదించుకొనుటకు పాటుపడుచున్నాము. ఓ, ఎంత మంచిది! కాల సంపూర్ణత, స్వాస్థ్యము పొందు కాలము!
ఆయనలో మనము కూడా.... స్వాస్థ్యము పొందుటకు ముందుగా నిర్ణయించబడితిమి...
47
ఏ విధంగా మనకు స్వాస్థ్యము ఇవ్వబడినది, దేని ద్వారా? ముందు నిర్ణయము ద్వారా, ముందు నిర్ణయము అనగా ముందు జ్ఞానము, నీవు బోధకునివని ఆయన నమ్ముటకు దేవునికేలాగు తెలియును? ఆయన ముందు జ్ఞానము. “ఇచ్చయించువానివలన గాని, పరుగెత్తు వానివలన కాదు గాని, కృప చూపు దేవుని వలనే జరుగును.” అది వాస్తవము. అది ముందు నిర్ణయము. నీలో ఉన్నదానిని ఆయన ఎరుగును. నీవు భూమి మీదికి రాక ముందే నీలోయున్న దానిని ఆయన ఎరుగును. నీవు ఇక్కడికి రావడానికి భూమి ఉండకముందే, నీలో ఉన్నదానిని ఆయన ఎరిగి యుండెను. అది ఆయనే, ఆయన అనంతుడగు దేవుడు. అనంతుడు. మనము అనిత్యులము, మనము అనిత్యము గూర్చి మాత్రమే తలంచగలము.
48
దాని తరువాత అది నాకు ఎంతో... నాకు ఏమి జరిగినదో - నేను ఎరుగను. నేను ఆలోచించినప్పుడు... నేను కొన్ని ఆనంద క్షణముల కొరకు అక్కడ నిలచియున్నప్పుడు, “రేపు అనునది లేదు, నిన్న అనునది లేదు, వ్యాధి లేదు, దుఃఖము లేదు. అక్కడ కొద్ది ఆనందము కాదు; అది పూర్తిగా ఎక్కువైన ఆనందము. అంతా సంతోషమే.” ఓ, మై! ఓ, నేను అక్కడ నిలబడినప్పుడు, మరియు “ఏమిటది?” అని అనుకొన్నాను.
ఆ స్వరము ఇట్లు పలికెను, “ఇది పరిపూర్ణ ప్రేమ, మరియు నీవు ప్రేమించిన సమస్తము ఇప్పుడు ఇచ్చటున్నది.”
“నీ సేవా గురుతులుగా వీరిని యేసు వచ్చినప్పుడు ఆయనకు నీవు బహూగా కనికరించెదవు.” అందమగు స్త్రీలు అక్కడ నిలబడుట నేను చూచాను, మరియు వారు నన్ను పట్టుకొని ఇట్లనిరి, “నా ప్రశస్తమగు, ప్రియ సోదరుడా!” అక్కడ పురుషులను చూచితిని, వారికి మెడ వరకు జుట్టున్నది, “నా ప్రియ సోదరుడా? అని పరిగెత్తుకొని, నన్ను హత్తుకొనుచుండిరి.
“దీని భావము ఏమిటి?” అని నేను అనుకొన్నాను.
“వారు నీ జనులు” అని ఆయన చెప్పెను.
“నా జనులా? మిలియనుల మంది బ్రెనాంలు ఉండరు గదా?” అన్నాను.
ఆయన చెప్పెను, “వారు నీ సేవలో మారినవారు.” [హల్లెలూయా] “వారు నీ సేవలో మారినవారు. అక్కడ నిలబడిన స్త్రీ చూచావా?” అనడిగెను. [నేను ఎన్నడూ చూడని అందమగు స్త్రీ.] “ఆమెను నీవు ప్రభువునొద్దకు నడిపించినప్పుడు, ఆమె వయస్సు తొంభై సంవత్సరాలు దాటినవి. నా ప్రియ సోదరుడా! అని ఆమె కేక వేయుటలో ఆశ్చర్యము లేదు.” “ఇక ఎన్నడూ ఆమె ముసలిది కాదు. ఆమె దానిని దాటిపోయెను. ఆమె యవ్వన దశలో యున్నది. ఆమె ఇక్కడ నిలబడియున్నది. ఆమెకు చల్లని నీరు త్రాగనవసరము లేదు; అది ఆమెకు అక్కర లేదు. నిద్రపోనవసరము లేదు, ఎందుకనగా అలసట లేదు. అక్కడ రేపు లేదు, నిన్న లేదు — ఇప్పుడు మనము నిత్యత్వములో యున్నాము. అయితే ఒక మహిమకరమగు దినమున దేవుని కుమారుడు వచ్చును, నీవు వారికి బోధించిన వాక్యము బట్టి నీకు తీర్పు తీర్చబడును.” ఓ, సహోదరుడా!
“పౌలు తన గుంపును తీసికొని వచ్చునా?” అని నేను అడిగాను.
“అవునండి.”
“కచ్చితముగా పౌలు బోధించినదే నేను బోధించాను. నేనెన్నడూ మార్గము తప్పలేదు. ఏ సంఘ బోధలు లేక మరేదియు నేను అంగీకరించలేదు. నేను దానియందే నిలచియున్నాను.”
మరియు వారందరూ ఏక స్వరముతో ఇట్లనిరి, “అది మేమెరుగుదుము! మేము నిశ్చయతతో విశ్రాంతి తీసుకొనుచున్నాము.” చెప్పెను, “మమ్మును నీవు ఆయనకు బహుకరించెదవు, నిత్యమూ జీవించుటకు, అప్పుడు మనమందరము భూమి మీదికి తిరిగి వెళ్ళెదము.” ఓ, మై!
49
సరిగ్గా అదే సమయంలో నేను రాసాగాను. నేను పడక మీద పరుండి యుండుట నాకు కనబడెను. నా శరీరము ముడుతలు పడి వ్యాధితో చీకిపోయి యుండుట చూచాను. నా తల క్రింద చేతులుంచుట చూచాను, “ఓ! మరల అందులోనికి నేను వెళ్ళవలెనా?” అనుకొన్నాను.
“ముందుకు సాగిపో! ముందుకు సాగిపో!” అని స్వరము నాతో పలుకుట విన్నాను.
“ప్రభువా! నేనెల్లప్పుడు దైవిక స్వస్థతను నమ్మాను. దానిని నేను నమ్ముచూనేయు౦దును. నేను అత్మల కొరకు వెంటాడుదును, కావున నాకు సహాయము చేయుము. ఇక్కడ నేను ఎక్కువ మందిని కలిగియుందును, నేను... నన్ను జీవించనిమ్ము — ఒకవేళ నీవు నన్ను కేవలము జీవించునట్లు చేసినయెడల, ప్రభువా, మరియు నేను మరో మిలియను మందిని అద్దరికి తీసికొని వచ్చుదును.”
50
వారి రంగును, మతమును, దేశమును నేను లెక్కచేయను. వారందరూ అక్కడ చేరినప్పుడు ఒక్కటిగానే యుందురు. ఆ పాత సరిహద్దు గీతలు చెరుగును. ఓ, ఆ స్త్రీలు ఎంతో అందముగా యుండుట నేను చూచాను. పొడగాటి జుట్టు కలిగియున్నారు, పొడవైన దుస్తులు ధరించియున్నారు, వారి కాళ్ళకు ఏమీ లేవు. ఆ మగవారు మెడవరకు జుట్టును కలిగి, ఎరుపు రంగువారు, నలుపువారు, మరియు వేర్వేరు రంగులలో యున్నారు. మరియు వారందరూ వారి చేతులు వేసి కౌగిలి౦చుకొనుచున్నారు. వారిని నేను తాకగలను. వారి చేతులు నేను స్పర్శించాను (నేను ఈ పవిత్ర గ్రంథము తెరచియుండగా, దేవుడే నా తీర్పరి).... నా చేతులను, నా ముఖముపై నేను తాకగలిగినట్లే - నేను వారిని తాకాను.
వారు నన్ను కౌగలించుకొనుచుండిరి — ఇప్పుడున్నట్లుగా అప్పుడు స్త్రీలను తాకినా ఏలాటి అనుభూతి ఉండదు. నీవెంత పరిశుద్దుడవైనా, ఎటువంటి బోధకుడవైనా, ఎట్టి మత గురువువైనా, ఒక స్త్రీని కౌగలించుకొన్నప్పుడు మానవ ఉద్రేకము రాకమానదు. ఇది ఖచ్చితముగా సత్యము. అయితే సోదరుడా, నీవు అద్దరికి చేరినప్పుడు, అక్కడ అటువంటిదేదీ లేదు. అది అసాధ్యము! అక్కడా అంతా ప్రేమయే. నిజమగు సోదరుని గాని, నిజమగు సోదరిగాను వారిని నీవు చూచెదవు. అక్కడ మరణము లేదు, దుఃఖము లేదు, అసూయ లేదు, మరేదియూ లేదు. ఏదియూ అక్కడ ప్రవేశించలేవు. అంతా పరిపూర్ణతయే.
అందుకొరకే నేను పాటుపడుచున్నాను. అందుకొరకే స్థానమును సంపాదించగోరుచున్నాను.
51
“ఓ ప్రభువా! ఈ సంఘములో అందుకొరకే నేనున్నాను. సంఘమును క్రమములో ఉంచగోరుచున్నాను” అని చెప్పాను. సోదరీ సోదరులారా, పరిపూర్ణ ప్రేమ మాత్రమే అందులో ప్రవేశించగలదని నేను చెప్పుచున్నాను. నీవు బ్రెన్హాం గుడారమునకు, లేదా మెతడిస్తు, లేదా బాప్టిస్తు సంఘమునకు లోబడియున్నావని కాదు. అది మంచిదే. నీవు లోబడియుండాలి.... భాషలతో నీవు మాట్లాడినందున కాదు, ఆత్మలో నాట్యమాడినందున కాదు, దయ్యములను వెళ్ళగొట్టినందున కాదు, లేదా విశ్వాసము ద్వారా కొండలను పెకలించినందున కాదు. అది మంచిదే, కాని అక్కడ నిజమగు పరిపూర్ణ ప్రేమలేనట్లయితే.... పరిపూర్ణ ప్రేమ అక్కడ [టేపు మీద ఖాళీ యున్నది].
52
ఒక స్వాస్థ్యము పొందియున్నాము. [మనము దేనిని స్వాస్థ్యముగా పొందియున్నాము? నిత్యజీవమను.], ముందుగా నిర్ణయించబడుటవలన..
ఏలాగు? దానిని అందరూ గ్రహించారా? దేవునికి నీవు ప్రార్ధించావా? లేదు, దేవుడే నిన్ను పిలచెను. ఏ మానవుడూ ఎన్నడును దేవుని వెదుకలేదు; దేవుడే మానవుని వెదుకుచుండెను. “మొదటగా నా తండ్రి ఆకర్షించితేనే గాని ఎవడునూ నాయొద్దకు రాడు” అని యేసు చెప్పెను. చూచారా, దేవుని నుండి పారిపోవుట మానవుని స్వభావము. మరియు ఇప్పుడు మీరు...
జనులగు మీకు బోధించునప్పుడు నన్ను అదే తొందరపెట్టుచున్నది; నీలో ఉన్న స్థితిలోనే నిలచియుండవద్దు. ఇప్పుడు మారుము! “ఇది యెహోవా సెలవిచ్చుచున్నాడని...” నేను చెప్పుట వినుము. నాయంతట నేను దీనిని చెప్పుట లేదు, (నేను కాదు.), అయితే మీరు నన్ను మీ యొక్క ప్రవక్త అని లేదా ఒక ప్రవక్త అని పిలచుచున్నారు. ప్రపంచములో నున్న మిలియనులకొలది, మిలియనుల కొలది జనులు దానిని నమ్ముచున్నారు. ప్రత్యక్షంగాను లేదా పరోక్షంగాను దాదాపు పన్నెండు మిలియనుల మంది జనులతో మాట్లాడాను. వేలకొలది దర్శనములు, సూచక క్రియలు, అద్భుత కార్యములు నేను చూచాను, మరియు వాటిలో ఏ ఒక్కటి తప్పిపోలేదు. మరియు అది వాస్తవము. ఆయన చెప్పిన ఏ సంగతి ఖచ్చితంగా జరగకుండ ఎన్నడూ తప్పిపోలేదు. దాని విషయమై నేను ఏ వ్యక్తినైనా తన విచారణ కొరకు తీసికొని వచ్చెదను. అది వాస్తవము.
నేను ప్రవక్తనని చెప్పుకొనుటలేదు, కాని మీరు నా మాట వినిరి:
53
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ స్థానములో నిన్నుంచగలిగినది పరిపూర్ణ ప్రేమయే. అక్కడున్నదంతా అదే. నీవెన్నో మంచి పనులు, మత కార్యక్రమములు చేసియుండవచ్చును. ఆ దినమున అవేమీ లెక్కకు రావు. పరిపూర్ణ ప్రేమయే కావలెను. కాబట్టి నీవు ఏమి చేసిననూ, అన్నీ ఒక ప్రక్కకు పెట్టి నిన్ను ద్వేషించువారిని పేమించునంత వరకు కేవలం దేవుని పేమతో నింపబడుము.
ఈ ఉదయము నేను చెప్పినట్లుగా, కృపయే నన్ను పూర్తిగా ఆవరించెను. “ఇప్పుడు, నీవు నా వీపును గోకుము మరియు నేను నీ వీపును గోకెదను.” సరి. “నీవు నాకేదయినా చేసినచో, నేను నీకు ప్రతికారము చేయుదును,” అని చాలామంది అందురు. అది కృప కాదు. నీవు నాకు ఏమి చేసినా, చేయకపోయినా నేను నీకు చేయుటయే కృప. నీవు నా చెంప మీద కొట్టినా నిన్ను నేను ప్రేమించుటయే కృప. చూచారా, అది అంతే. ఆలాగున చేయండి. క్రియలయందు నాకు విశ్వాసము లేదు. ప్రేమ మాత్రమే పనిచేయునని నేను నమ్ముచున్నాను. కృప వలన క్రియలు ప్రత్యక్షమగును.
నేను నమ్మకముగా జీవించనియెడల, నా భార్య నాకు విడాకులు ఇచ్చునని నేను నమ్మకముగా జీవించుట కాదు, కాని ఆమెను నిజంగా నేను ప్రేమించుచున్నాను గనుక నమ్మకముగా జీవించెదను.
54
ఒకవేళ నేను నరకమునకు వెళ్ళుదునని చెప్పి సువార్తను బోధించుట లేదు గాని; నేను ఆయనను ప్రేమించుచున్నందునే సువార్త బోధించుచున్నాను. నిశ్చయంగా! తుఫాను సముద్రములను దాటుచున్నాను, విమానము ఇటు అటు జరుగుచున్నది, మెరుపులు భయము పుట్టించును, మరియు సమస్తము, మరియు ఏ నిమిషములోనయినా.... మరియు అందరూ కేకలు వేయుచు, మరియు “మేరీని స్తోత్రించు” అను వారందరూ విమానములో, మరియు సమస్తము? సురక్షిత బెల్టులు కట్టుకొందురు, “పదిహేను నిమిషములకు సరిపడు ఇంధనము మాత్రమే మిగిలియున్నది గనుక మనము ఎక్కడ ఉన్నామో ఎరుగమని పైలట్ చెప్పును.” — నేను అది కేవలము తమాషా కొరకు చేయుదునని మీరు అనుకొందురా? హు!
నేను అరణ్యములలోనికి వెళ్ళి జర్మను సైనికులను కలిసికొని, ప్రతి రాత్రి కూటము జరిపాను. (పరిశుద్దాత్మ ఎన్నో అద్భుతములను జరిగించినది), మైలు దూరము నుండి నన్ను కాల్చివేయుటకు కమ్యూనిష్టులు దూరదర్శన యంత్రములతో కూర్చొని యుండిరి. నేను నవ్వులాటగా దానిని చేయగలనా? నాలో ప్రేమయున్నది. ఆ మానవుల కొరకు క్రీస్తు చనిపోయెను. పౌలు ఇట్లనెను, “యెరూషలేముకు వెళ్ళుటకు ఇష్టపడుట మాత్రమే కాదు గాని, అక్కడ సిలువ వేయబడుటకు నేను సిద్ధముగా యున్నాను. నేను అక్కడ మరణించ వెళ్ళుచున్నాను. ప్రభువు నిమిత్తము చావ సిద్ధమై వెళ్ళుచున్నాను.” అది ఎదో — ప్రేమ — నిన్ను బలవంతపెట్టును, అది నిన్ను చేయునట్లు చేయును. అది ఖచ్చితముగా వాస్తవము.
55
నేను డబ్బు కొరకు సువార్త ప్రకటించుచున్నయెడల, అది అలాగైనయెడల, ఈ రాత్రి నేను ఇరవై వేల డాలర్ల అప్పులో ఉండేవాడిని కాను. అంత అప్పు నాకుండేది కాదు. లేదండి, నాకిచ్చిన మిలియనులను దాచాననుకొనుచున్నారా? నాకు ఒక ఎఫ్.బి.ఐ. ఏజెంట్ ఒక-మిలియను-ఐదు-వందల-డాలర్ల చెక్కు పంపెను. దానిని తిరిగి పంపివేశాను. నేను డబ్బు కొరకు పనిచేయను! అది డబ్బు కొరకు కాదు. నేను డబ్బు కొరకు సువార్త ప్రకటించను. అది దానికొరకు కాదు; అది ప్రేమవలనే బోధించుచున్నాను.
నా తుదిశ్వాస విడుచు సమయము వచ్చును, బహుషా ఇప్పటి నుండి అయిదు నిమిషములు.... లేదా ఇప్పటి నుండి రెండు గంటలు, లేదా ఇప్పటి నుండి ఏబది సంవత్సరములు పట్టవచ్చును — అదెప్పుడో నాకు తెలియదు. కాని అది జరిగినప్పుడు... నేను అక్కడ వెళ్ళినప్పుడు, నేను మరల యువకునిగా మారుదును, “నా ప్రియ సోదరుడా!” అని వారు పలకరించెదరు. అదే నా హృదయములో యున్నది. అందుకే పనిచేయుచున్నాను. ఎదో ప్రత్యేకముగా ఉండుటకు నేను మీతో విభేది౦చుటలేదు, కాని మిమ్మును సరైన మార్గములోనికి పెట్టుటకే ప్రయత్నించుచున్నాను. లోనికి అదే మార్గము. నీ సంఘము కాదు, నీ సంఘ శాఖ కాదు, కాని క్రీస్తునందు నీ జన్మయే. ఓ మై.
56
మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు:
వినండి. మరి కొద్ది నిమిషములలో ముగించెదను. ఇప్పుడు మనము ముగించుటకు ముందు జాగ్రత్తగా వినండి.
మనము ఆయనను స్తుతించువారమై యుండవలెను, మొదటగా క్రీస్తునందు.
మనము విశ్వాసముంచియున్నాము...
దీనిని జాగ్రత్తగా ఇప్పుడు వినండి. మీ కోటులు దరించుకొనుడి — సువార్త కోటులను ధరించుకొనండి. మీ చెవులు తెరచి వినండి, జాగ్రత్తగా వినండి. 13వ వచనము చదువుచున్నాను.
సత్య వాక్యమును వినిన తరువాత ఆయన యందు మీరు విశ్వసించితిరి. [వాక్యము వినుట వలన విశ్వాసము వచ్చును. (జనులు “దేవుడు” అని పలికిరి.)] ఆయన యందు విశ్వసించితిరి.
సత్యము అనగా ఏమిటి? దేవుని వాక్యము. అది నిజమేనా? యోహాను17:17, వాక్యములను వ్రాసికొనేవారు, యేసు చెప్పెను, “వారిని సత్యము ద్వారా పవిత్రపరచుము తండ్రీ: నీ వాక్యమే సత్యము.”
57
“మీరు సత్యమును వినిరి... అదే మీ రక్షణ సువార్త...
వారికతడు చెప్పగోరుచున్న రక్షణ ఏమిటి? భూమికి పునాది వేయబడకముందే నిర్ణయించెను (నిజమేనా?) పుత్రస్వీకారమునకు. నిత్యజీవమునకు ముందే నిర్ణయించెను. ఇప్పుడు, నీవు నిత్యజీవములోనికి వచ్చిన తరువాత — నీవు రక్షింపబడి, శుద్దీకరించబడి, పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత — నీవు ఒక కుమారునివి; ఇప్పుడు దేవుని రాజ్యము మరియు మహిమ కొరకు నీవు పనిచేయునట్లుగా దేవుడు నిన్ను ఒక స్థానములో ఉంచగోరుచున్నాడు.
సువార్త అనగా అదే. మొదట వాక్యము వినవలెను: “ప్రతివాడును మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను.” వాగ్ధాన దేశముకొరకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్ధించి నీ పాపములన్నింటిని తీసివేసికోవలెను. ఈ వాగ్దానము ప్రతి యాత్రికునికి చెందును. నీవీ రాత్రి పాపిగా నీ ఇంటిని విడిచిపెట్టి యుండవచ్చును. “బ్రెన్హాం గుడారమునకు నడిచి వెళ్ళుదును,” అని నీవు చెప్పియుండవచ్చును. ఈ రాత్రి దేవుడు నీకు ఒక అవకాశము ఇచ్చెను. నీకును, వాగ్ధాన దేశమునకును మధ్య ఒక్కటే యున్నది. వాగ్ధాన దేశమనగా ఏమిటి? పరిశుద్దాత్మ.
యొహోషువాకు, వాగ్ధాన దేశమునకు మధ్యనున్నది ఏమిటనగా, యోర్దాను. ఖచ్చితముగా సత్యము.
58
మోషే, క్రీస్తుకు మాదిరైయుండి, ఇశ్రాయేలీయులను వాగ్ధాన దేశము వరకు నడిపించెను. తరువాత... మోషే ఇశ్రాయేలీయులను వాగ్ధాన దేశములోనికి నడిపించలేదు; యెహోషువా జనులను అందులో ప్రవేశపెట్టి భూమిని పంచి ఇచ్చెను. యేసు వెల చెల్లించి, వారిని పరిశుద్దాత్మ యొద్దకు నడిపించెను. దేవుడు పరిశుద్దాత్మను క్రిందికి పంపి మరియు సంఘమును ఒక క్రమములో ఉంచెను. ప్రతివానిని ఆయన సన్నిధితో నింపెను. నా భావము మీరు గ్రహించారా? అంతా క్రీస్తు యేసులోనే యున్నది. ఈ సువార్త పిలుపుకు దేవుడు మనలను ముందుగా నిర్ణయించెను.
గలతీ 1:8లో పౌలు ఇట్లు చెప్పెను, “దేవదూత దిగి వచ్చి మరొక సువార్త ప్రకటించినా, శాపగ్రస్తుడగును.” — సత్యము, సువార్త. ఒక్కటే ఈ ముగింపు వచనమును జాగ్రత్తగా వినండి:
... మీ యొక్క రక్షణ సువార్త: ఆయన యందు [జాగ్రత్తగా వినండి] మీరు విశ్వసించిన తరువాత, పరిశుద్ధాత్మ వాగ్దానముచే ముద్రించబడితిరి.
59
చివరి దినములలో, (ఇప్పుడు గమనించండి) చివరి దినములలో రెండు తరగతుల జనులందురని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఒకరు దేవుని ముద్ర కలిగియుందురు; మరొకరు మృగము యొక్క ముద్ర కలిగియుందురు. అది నిజమేనా? ఇది ఎందరికి తెలియును? మంచిది, దేవుని యొక్క ముద్ర పరిశుద్దాత్మ అయినచో, పరిశుద్దాత్మను కలిగిలేకుండుటయే మృగము యొక్క ముద్ర. ఆ రెండు ఆత్మలు చాలా దగ్గరగా యుండి, సాధ్యమయితే, ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చునని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. అది ఎన్నడూ చేయదు, ఎందుకనగా వారు నిత్యజీవమునకు ఎన్నుకోబడిరి, చూచారా. సంఘము వెళ్ళుచున్నది [స్పష్టతలేని మాటలు]
60
మరియు ప్రభువును కలిసికొనుటకు పదిమంది కన్యకలు బయలు వెళ్ళిరి, అందరూ శుద్దీకరించబడిరి, అందరూ పరిశుద్దులే, వారిలో ప్రతి ఒక్కరూ పవిత్రపరచబడిరి. అయిదుగురు దివిటీలు ఆరిపోయినవి. అయిదుగురికి దీవిటీలలో నూనె యున్నది. మరియు “ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు.” మరియు దివిటీలలో నూనెగల అయిదుగురు పెండ్లి విందుకు వెళ్ళిరి. మరియు మిగిలినవారు బయటకు విడిచిపెట్టబడిరి — అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకటయు ఉన్నది. సిద్ధపడండి, ఎందుకనగా ఏ నిమిషమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు. మరియు పరిశుద్ధ గ్రంథములో నూనె దేనికి సాదృశ్యము? పరిశుద్దాత్మ.
61
ఇప్పుడు ఈ రోజు మీకు, ఏడవ దినము దేవుని ముద్ర అని చెప్పుచు ఏడవ రోజును ఆచరించు సెవెంత్-డే-అడ్వెంటిస్తు వారైన మీరు, దానికి రుజువగు ఒక్క లేఖనమును చూపించండి. పరిశుద్దాత్మయే దేవుని ముద్ర అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. దీనిని గమనించండి. ఇప్పుడు 13వ వచనము గమనించండి.
మీరు విశ్వసించిన తరువాత పరిశుద్దాత్మ వాగ్దానముచే ముద్రింపబడిరి.
ఎఫెసీ 4:30 చూడండి, ఎఫెసీ 4వ అధ్యాయము 30వ వచనము.
దేవుని యొక్క పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి, మీరు మీ విమోచనా దినము వరకు దానివలన ముద్రింపబడియున్నారు.
62
ఎంత కాలము? మీరు నిజంగా, నిజంగా పరిశుద్దాత్మను పొందినచో అది ఎంత కాలము నిలచును? మరుసటి ఉజ్జీవము వరకా? మీ అమ్మమ్మ చనిపోవు వరకా? నీ పై అధికారి నిన్ను తీసివేయు వరకా? కాదు. నీ విమోచనా దినము వరకు! హల్లెలూయా!
నీవు చనిపోయిన తరువాత, నీవు ఆ దేశములోనికి దాటిపోయిన తరువాత నీవు నీ ప్రియులతో నిలబడియుందువు. అప్పుడు కూడా నీవు పరిశుద్దాత్మను కలిగే యుందువు. ఇది వాక్యము! ఇప్పుడు నీవున్న రీతిగానే యుందువు. కేవలము నీకు ఒక... మరో శరీరములోనికి నీవు కలిగియుందువు. నీ ఇల్లు మాత్రమే మార్చియున్నావు. ఇది పాతదై శిధిలమగును. కాబట్టి పాతది గతించును మరియు క్రొత్త నివాసము లోనికి మారుదువు. నిజమేనా? “భూమి మీది ఈ గుడారము శిధిలమైపోయినను ఒకటి మనకొరకు ఎదురు చూస్తున్నది.”
63
దానిని గూర్చి గడిచిన దినమున మీకు చెప్పినది గుర్తున్నదా? తల్లి గర్భములో చిన్న బిడ్డ రూపొందినప్పుడు, మరియు ఈ చిన్న కండరములు ఏర్పడి కదులుచుండును. మరియు గంతులు వేయును. అయితే తల్లి గర్భములో నుండి బిడ్డ భూమి మీద పడిన వెంటనే, ఆ చిన్న స్వాభావిక శరీరమును పట్టుకొనుటకు ఒక ఆత్మీయ శరీరము ఉండును. అప్పుడు వైద్యుడు ఆ శరీరమును కదుపును. [సహో, బ్రెన్హాం చప్పట్లు కొట్టుచున్నారు.] ఆ విధంగా, లేదా దానిని కదుపుటకు ఏదో చేయును, మరియు “వా, వా, వా.” వెంటనే బిడ్డ తల్లి రొమ్ముకు అంటుకొనును. తల్లి రొమ్ము మీద తన చిన్న తలను కదుపుచూ పాలు త్రాగును.
చిన్న దూడ తల్లి గర్భములో నుండి పడిన వెంటనే, కొద్ది నిమిషములకు తన మోకాళ్ళు మీద నిలబడును. అదేమి చేయును? కదిలి వెళ్ళి తల్లిని పట్టుకొనును. మరియు తలను ఆడించుచూ పాలు త్రాగును. హల్లెలూయా!
అవునండి, ఈ స్వాభావిక శరీరము భూమి మీదికి వచ్చిన వెంటనే దానికొరకు ఒక ఆత్మీయ శరీరము ఎదురుచూచును.
మరియు ఈ భౌతిక శరీరము అక్కడ పడిన వెంటనే మరొకటి దానికొరకు ఎదురు చూచును. హల్లేలూయా! మనము కేవలము ఒక దానిలోనుండి మరొక దానిలోనికి మారుదుము. మనము మన నివాసములను మార్చుదుము. ఈ మర్త్యత - అమర్త్యతను ధరించుకొనును. ఈ క్షయత - అక్షయతను ధరించుకొనును. ఈ ముసలి ముడుతల శరీరము, వంగిపోయిన శరీరము అవతలకు వెళ్ళినా అదే ఆత్మను కలిగి యుండును.
64
ఒక చిన్న సంగతి చెప్పెదను. మీకిది చిన్న వింతగా తోచవచ్చును, కాని ఇది పరిశుద్ధ గ్రంథము. మీరు కలవరపడకుండునట్లు దీనిని చెప్పెదను. దీనిని గమనించండి. సౌలు రాజు చాలా ఉన్నత దేహముగలవాడు. చాలా ఎత్తరి. ఆనాటి వారికి సహజాతీతమైనది తెలియదు. సింహపు నోట నుండి గొర్రెపిల్లను విడిపించిన దావీదు, గొల్యాతును చంపెను. అతనిని చూడండి. సౌలు దేవుని నుండి పూర్తిగా దూరమైపోయెను. దావీదుకు సహాయము చేయుటకు బదులుగా అతనిపై కుట్ర చేసెను. ఈనాడు ఆలాగే లేదా, అతని మీద తిరుగుబాటు చేసెను.
65
నేను నా మొదటి పర్యటనలో “దావీదు, మరియు గొల్యాతును చంపుట” అను ప్రసంగము చేశాను. ఎందరికి గుర్తున్నది? కొంతమంది పాతకాలపు వారికి తెలియును. దీనిని మరల గుర్తుచేయగోరుచున్నాను. గత ఆదివారము నాటిది మీకు గుర్తున్నదా? అది మరో దశలోనికి చేరుచున్నది. అది దావీదు సేవలో రెండవ దశ, ఇది ఖచ్చితముగా సత్యము. తరువాత అతడు ఇశ్రాయేలు మీద రాజాయెను. ఆ సేవ ఇంకా ఎక్కువ దశలోనికి కదిలి వెళ్ళుట మీరు గమనించండి. దావీదు కూడా ఆలాగే యున్నాడు. దావీదు సింహమును, మరియు ఎలుగుబంటిని, తరువాత ఫిలిష్తియుని చంపెను.
ఇప్పుడు, ఈ దావీదును అసహ్యించుకొను దురాత్మను దేవుడు పంపునటువంటి సమయము వచ్చెను. మరియు నేను నమ్ముచున్నాను...
66
(ఇప్పుడు, ఈ టేపులు: టేపులు వినుచున్న సహోదరులారా, ఇప్పుడు వినండి. మీరు నాతో సమ్మతించనియెడల క్షమించండి. చూడండి. మిమ్మును నేను ప్రేమించుచున్నాను. అవతల మిమ్మును నేను కలిసికొందును. చూచారా, మీరు నిజంగా దేవునివారయితే ఏలాగయినా మిమ్మును నేను ఆవల కలిసికొందును.) అయితే నేను దీనిని చెప్పుటకు ఒక కారణమున్నది. కేవలం తనకు లేనిదేదో దావీదు కలిగియున్నాడని సౌలు తెలిసికొనెను. అప్పుడు ఏమి జరిగినది?
అతడు అంత చక్కగా లేనివాడు అతడు అందముగా లేడు, కాని ఎర్రని పిల్లవాడు అని బైబిలు చెప్పుచున్నది. సౌలు యొక్క కవచమును దావీదు మోయలేక పోయెను. ఆ కవచములో అతడు మునిగిపోయెను. “ఈ చెత్తను తీసివేయండి” అని చెప్పెను. అతనికి నీవు ఒక డాక్టరు డిగ్రీ, ఒక పి.హెచ్.డి. డిగ్రీ, ఒక ఎల్.ఎల్.డి. డిగ్రీ ఇవ్వవచ్చును. కాని ఆ చెత్త గూర్చి నాకేమియు తెలియదనును, ఎందుకనగా దానిని నిరూపించజాలనని చెప్పును. కాని అతడు తనకు తెలిసినది చేయగోరెను. అవునండి. అతడు వడిసెలను తీసికొనెను.
67
మరియు వారు దావీదును పిచ్చివాడనిరి, ఎందుకనగా ఆ కుమార్తెలు, ఆ సంఘములు ఇట్లు పాడిరి, “సౌలు వేలకొలదిగాను, దావీదు పదివేలకొలదిగాను హతము చేసెను.”
అప్పుడతనికి అసూయ వచ్చెను. “ఆ పాత యేసు నామము బోధ అక్కర్లేదు.” అది నిజము. మరియు దేవుడతనికి ఏమి చేసెను? దేవుడతని మీదికి ఒక దురాత్మను పంపెను. దావీదును ద్వేషించుటకు, ఖచ్చితముగా జరిగినది అదే అయి యున్నది. మరియు అతడు కారణము లేకుండానే దావీదును ద్వేషించెను.
దావీదు అతని మెడను కొన్నిసార్లు పిండేవాడైయుండెను. అతడు అట్లు చేయగలడు, అయితే అతడు కేవలం విడిచిపెట్టెను. అతడేమియూ చెప్పలేదు. సౌలును ఎన్నోసార్లు అతడు చంపు అవకాశము దొరికినా అతడు ఏమీ చేయలేదు. అతని అంగీని కోసెను. దానిని అతడు చూపించెను. అవునండి. అతడు దానిని చేసియుండగలడు కానీ అతనిని వదిలిపెట్టెను. అతడు కోరినయెడల ఆ సమాజమును చీల్చి ఒక స్వంత శాఖను ప్రారంభించెడివాడే. కాని అతడు ఆలాగు చేయలేదు. సౌలును విడిచిపెట్టెను. యుద్ధమును దేవునికే విడిచిపెట్టెను. అవునండి.
68
సౌలునకు దేవుని యొద్దనుండి ఏ జవాబు రాకుండునట్లు దురాత్మ పట్టెను. కొద్ది సమయమైన తరువాత అతడు, దేవుని ఆత్మ అతని యొద్దనుండి వేరైపోయెను. మరియు సమూయేలు, నిజంగా వారికి దేవుని స్వరమై యుండెను. వారు ప్రపంచ మర్యాదను అను సరించరాదని హెచ్చరించెను.
సంఘము లోకమువలె ఎట్లు ప్రవర్తించగోరినది? పెంతెకోస్తువారు, బాప్తిస్మము పొందినవారు, పరిశుద్దాత్మ అనుభవము కలిగిన మెతడిస్తువారు, ప్రెస్బిటేరియనులు, బాప్టిస్టులు లోకమువలె ఎట్లు ప్రవర్తించగోరుదురు? వారెందుకలాగు చేయుచున్నారు? నాకు తెలియదు. నాకది అర్థమగుట లేదు. అది కేవలము సరదాగా, పేకాట ఆడుట, దానిని మీరు ఏమి అన్నా. అది పాపము. నీ ఇంటిలో అట్టి పనులు చేయరాదు. “కొద్దిగా బీరు త్రాగితే పరవాలేదు. నేను నా భార్య మధ్యాహ్నం కొద్దిగా పుచ్చుకొన్నాము” అనుచున్నారు. మరియు నీ పిల్లలు కూడా అదే చేయుదురని మొదటిగా తెలిసికొనుము.
69
మరియు స్త్రీలారా అపవాది ఆదిలో అదే చేసెను. మీ సోదరీలనే ఒక గురిగా పెట్టుకున్నాడు, ఎందుకనగా అతడేమి చేయగలడో అతను ఎరుగును. పురుషునికంటె స్త్రీని మోసము చేయుట వానికి వెయ్యిరెట్లు తేలిక, మీరు ఆ మాటకు బాధపడుదురని నేనెరుగుదును, కాని అది సత్యము. ఏదెను తోటలో వాడు అదే చేసెను. ఆమె యధార్థపరురాలు; కాని ఆమె మోసపుచ్చబడినది. “ఆదాము మోసపుచ్చబడలేదు” అని బైబిలు చెప్పుచున్నది. అతడు కాదు గాని ఆమెయే మోసపుచ్చబడినదని బైబిలు చెప్పుచున్నది. కాబట్టి వాడు ఆమెను మోసము చేయగలడు.
అయినా గాని ఈ సంఘ కాపరులు వెళ్ళి స్త్రీ బోధకులను అభిషేకించుచున్నారు. సంఘముల మీద నియమించుచున్నారు. ఆదికాండము నుండి ప్రకటన వరకు దానిని బైబిలు ఖండించుచున్నది. “అది మంచిదే, అది పరవాలేదు. వారు మంచి బోధకులు. అది సరియే అని నాకు తెలియును” అని మీరందురు.
70
నేను ఒకసారి బోధించుచుండగా ఎవరో భాషలు మాట్లాడుట ప్రారంభించారు. నేను ప్రసంగించుచునే ఉన్నాను. మరియు నేను బయటకు వచ్చినప్పుడు ఒక స్త్రీ నా కుమారునితో ఇట్లన్నది, “రేపు రాత్రికి ఇచ్చు వర్తమానము నా యొద్ద ఉన్నది. మీ డాడీ వేదిక పైకి వచ్చినప్పుడు చెప్పుదునన్నది.”
“ఒక వర్తమానమా, మీ భావాము ఏమిటి” అనడిగాను.
ఆ రాత్రి నేను సిద్ధపడి వేదిక పిలుపును ఇచ్చుచుండగా, ఆమె బాగా ముస్తాబయి మేజోళ్ళు తీసి ఆ మధ్యలో ఎగురుచూ భాషలు మాట్లాడుచూ, ప్రవచించసాగినది. నేను వేదిక పిలుపును ఇచ్చుచూ బోధించసాగాను. నేను అటువంటి విధానాన్ని ఏ మాత్రమూ గౌరవించలేదు, ఎందుకనగా అది సరి కాదు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో యున్నవని బైబిలు చెప్పుచున్నది. దేవుడు వేదిక మీద మాట్లాడుచున్నాడు, ఆయనను మాట్లాడనీయవలెను. నీకు ఏదయినా బయలుపరచబడినయెడల, ఆ ముందు వ్యక్తి ముగించు వరకూ మౌనముగా యుండవలెను“ అని పౌలు చెప్పెను. అది వాస్తవం.
నేను బయటకు వచ్చినప్పుడు, పెద్ద గుంపు నాతో ఇట్లనిరి. “ఈ రాత్రి నీవు పరిశుద్దాత్మను దుఃఖపరచితివి.”
“నేనేమి చేశాను?” అనడిగాను.
“ఆ సోదరి ఆ వర్తమానము ఇచ్చినప్పుడు, హల్లెలూయ,” అట్లు చెప్పిరి.
“ఎందుకు” “నేను బోధించునప్పుడు ఆమె మాట్లాడుట తప్పు” అన్నాను.
“ఓ, నీవు బోధించుచున్నదానికంటె ఆమెకు వచ్చినది నూతనమైనది. అది దేవుని సింహాసనము యొద్దనుండి తాజాగా వచ్చినది” అన్నారు.
71
ఇప్పుడు, అది మీకు చూపించును. లేక మరొకటి — ఆమె పిచ్చిదయినా కావాలి లేదా మర్యాదలేనిదయినా కావాలి. లేదా దేవుని గూర్చి ఎరుగనిదయినా కావాలి. నేను దీనిని హేళనకు చెప్పుట లేదు. ఇది పూర్తిగా సత్యము. దేవుడు అల్లరికి కర్తకాడని తెలిసికొనండి. ఆయన సమాధానకర్త వారికి బైబిల్ తెలియదు. క్రిందికి మీదికి ఎగురుట, భాషలు మాట్లాడి “నేను పరిశుద్దాత్మను పొందాను” అని హల్లేలూయ చెప్పుట మాత్రమే వారికి తెలియును.
మంత్రశక్తి గలవారు ఒకసారి అయిదు వేలమంది కూడి వచ్చి క్రిందికి పైకి ఎగురుచూ, ముఖము మీద రక్తము పూసికొని, భాషలు మాట్లాడుచూ, మానవ పుర్రెలో నుండి రక్తము త్రాగుచూ అపవాదిని పిలచుట నేను ఆఫ్రికాలో నిలబడి చూచాను.
72
అయిననూ భాషలు మాట్లాడుట అనునది దేవుని వరమే, కాని అది పరిశుద్దాత్మకు తప్పిపోని రుజువు మాత్రము కాదు. ఇప్పుడు దానిని మీకు చెప్పెదను. ఆత్మావేశముగల పరిశుద్దులందరూ భాషలు మాట్లాడుదురని నేను నమ్ముచున్నాను. ఒక వ్యక్తి దైవావేశము పొంది భాషలు మాట్లాడును. అది నేను నమ్ముదును. కాని నీవు పరిశుద్దాత్మను పొందితివనుటకు అది ఎటువంటి సూచన కాదు. అవునండి.
నీకున్న విశ్వాసముతో ఒక క్యాన్సరున్న బిడ్డ మీద చెయ్యివేసి ప్రార్ధించినపుడు ఆ బిడ్డ బాగవును. అందుకు కారణము ఆ తల్లికిగల విశ్వాసమే. ఆమెకు విశ్వాసము లేనియెడల ఏబది మంది బోధకులు వచ్చి ప్రార్ధించినా ఫలితముండదు. దానిని దేవుడే ఆమెకు ఇచ్చును, ఆమె క్రీస్తు శరీరములో ఒక సభ్యురాలు. అవునండి. దానిని నేను నమ్ముచున్నాను. ఆలాగు జరుగుట నేను చూచాను. మరియు అది సత్యమని నేనెరుగుదును. అయితే అది ఏమిటనగా మనము పనిచేయునట్లు సంఘమును క్రమములో ఉంచుటయై యున్నది.
73
మనము ముగించు ముందుగా, ఆ మిగిలిన వచనమును పూర్తి చేయదము.
దానిని మీరు పొందిన తరువాత పరిశుద్ధాత్మ వాగ్దానముతో ముద్రించబడుదురు.
“ముద్ర” — ముద్ర అనగా ఏమిటి? ఒక ముద్ర అనగా ఏమిటి? ముద్ర అనగా మొదటగా పూర్తి అయిన ఒక పనిని అది చూపించును; తరువాత దాని యజమాన్యమును అది చూపించును; మరియు అటు తరువాత భద్రతను అది చూపించును.
ఉదాహరణకు చెప్పుచున్నాను, నేను పెన్సిల్వేనియా రైల్ రోడ్డుకు పనిచేసేవాడిని. నేను నా తండ్రితో కలిసి పనిచేయుచుంటిని. మేము కార్లు ఎక్కించేవారము. ప్యాకింగ్ కంపెనీ నుండి అవి వచ్చెడివి. మేము వాటి మధ్యలో కొన్ని మెత్తటి చెక్కల నుంచెడివారము. ఆ కారుకు ముద్ర వేయుచుండగా తనిఖీ అధికారి వచ్చి దానిని అటు ఇటు చూచి, “ఇవి పనికి రావు. ఇది బ్రద్దలయినది, తీసివేయండి” అని చెప్పెడివాడు.
74
పరిశుద్దాత్మయే తనిఖీ అధికారి. ఆయన నిన్ను అటు ఇటు కదుపును. దేవుని వాక్యమంతటినీ నీవు నమ్ముచున్నావా?
“నేను ఆ పాత యేసు నామపు బోధను నమ్మను” అన్నచో ముద్రవేయడు.
నిన్ను కదిపి చూచును.
“నేను దైవిక స్వస్థతను నమ్మను” అన్నచో నిన్ను బయటకు తీసివేయును.
“యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని నీవు నమ్ముచున్నావా....”
“నమ్మనిచో నిన్ను బయట ఉంచును.” అవునండి.
సోదరుడా, నీవు అందుకు “ఆమేన్!” అని చెప్పుటకు సిద్ధపడుము.
నీవు పరిశుద్దాత్మను పొందితివా? “ఆమేన్” అంతా ముగిసినదా, “ఆమేన్.” అప్పుడు తనిఖీ అధికారి ఏమి చేయును? సువార్తలో అంతా చక్కగా గట్టిగా యున్నది. ఓ, “దేవుని యొక్క ప్రతి మాట మంచిదే. ప్రతి మాట పరిపూర్ణమైనదే. నేను ప్రతి మాట నమ్ముచున్నాను. ఆమేన్! ఆమేన్! ఆమేన్!” దేవుడింకా స్వస్థపరచునని నీవు నమ్ముచున్నావా? ఆమేన్! యేసు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని నమ్ముచున్నావా? “ఆమేన్.” పరిశుద్దాత్మ ఎప్పటివలె వాస్త్రమముగా యున్నదని నమ్ముచున్నావా? “ఆమేన్.” పౌలు మీద దిగిన అదే ఆత్మ, మన మీదను దిగునని నమ్ముచున్నావా? “ఆమేన్.” ఇప్పుడామె గట్టిపడుచున్నది. మనము తలంపును మూయుటకు సిద్ధముగా యున్నాము. మంచిది.
75
అప్పుడు తనిఖీ అధికారి తలుపు మూయును. అతడేమి చేయును? దానిమీద ఒక ముద్రవేయును. దానిని ఎవరూ బ్రద్దలు చేయరాదు. ఆ కారు దాని గమ్యమగు బోస్టన్ చేరువరకు బద్దలు చేయరాదు. బోస్టన్ చేరుటకు ముందు దానిని బద్దలు చేసినచో, అది గొప్ప నేరము.
ఆ ముద్రను తెరచు అధికారము గల వ్యక్తి మాత్రమే దానిని తెరువగలడు. అది వాస్తవం. ఫలాన - ఫలాన కంపెనీకి అది చెందును. “ముద్రించబడినది.” ఆ కారు సిద్ధమయినదని ఆ ముద్రవలన నిశ్చయమగును, అది వారికే చెందును. వారు పెన్సిల్వేనియా మీద వేరే ముద్ర వేయజాలరు.
నీవు ముద్రింపబడవలెను, మరియు అది ముద్రించబడినప్పుడు...
76
మరియు క్రైస్తవుడు సువార్తతో కట్టబడినప్పుడు, దేవుని మంచితనముతో నింపబడినప్పుడు, దేవుని యొక్క మంచి సంగతులన్నియూ అతనిలో యుండినప్పుడు తెరువబడిన హృదయముతో పనిచేయుటకు సిద్ధమయినప్పుడు, తన స్థానమును తీసికొనుటకు ఇష్టపడినప్పుడు, పరిశుద్దాత్మ చేయమని చెప్పిన ప్రతి పనిని చేయునప్పుడు, మరణములో నుండి జీవములోనికి దాటునప్పుడు, లోక సంగతులన్నిటిలో నుండి పవిత్రపరచబడునప్పుడు అతనికి వచ్చిన వెలుగును బట్టి ఆ వెలుగులో ముందుకు కదలుచు నడచునప్పుడు అతడు సిద్ధపడును. అప్పుడు దేవుడతని వెనుకనున్న లోకపు తలుపును మూయును. పరిశుద్దాత్మ వాగ్ధానముతో అతనిని ముద్రించును. హల్లెలూయా!
ఎంత కాలము? గమ్యస్థానము చేరువరకు. అవన్నీ బాగున్నవో లేదోనని మధ్యలో సీలు విప్పి చూచు హక్కు నీకు లేదు. దాని సంగతి నీకు అక్కరలేదు. తనిఖీ అధికారి దానిని పరీక్షించెను. ఎంత కాలము వరకు నీవు ముద్రించబడుదువు? నీ విమోచనా దినము వరకు. అంతవరకు నీవు ముద్రించబడెదవు.
“మంచిది, బ్రెన్హాం సోదరుడా! నీవు చనిపోయిన తరువాత కూడా దానిని నీవు కలిగియుందువా?” అని మీరడుగుదురు. దానిని నిత్యమూ నీవు కలిగియుందువు. జీవము ఎక్కడ ప్రారంభమగును? వేదిక (ఆల్టర్) యొద్దనే. అక్కడే నీవు చిన్న ఛాయను చూచెదవు. ఆ నీడ పరిశుద్దాత్మ ముద్ర. గడిచిన దినము నేను చెప్పినట్లుగా అది ఛాయలన్నింటికి ఛాయ. అయితే నీవు చనిపోయినా ఆ ఛాయలగుండా పయనించుచునే యుందువు. నీవు ఒక చెమ్మనుండి మరో చెమ్మయొద్దకు వచ్చి, ఒక ఊటగాను, ఒక నదిగాను, ఒక సముద్రముగాను, మారి దేవుని ప్రేమను చూచెదవు. నీవు అదే వ్యక్తినై యున్నావు.
77
ఇటు చూడండి. సౌలు పడిపోయినవాడు, అతడు వెనుకకు జారి తిరిగి దేవుని చేరుకొనలేకపోయెను, అయినను అతడు నశించలేదు. నిశ్చయంగా నశించజాలడు. అతడు ఒక ప్రవక్త, కాని దేవుని నుండి బయటకు పోయెను. సోదరులారా, ఆ కారణము చేతనే “నశించలేదు” అని చెప్పితిని. కావున గుర్తుంచుకొనండి, అతడు కేవలము దేవుని చిత్తములో నుండి బయటకు వచ్చెను. కావున మొదటగా మీకు తెలియును, అతడు సమ్మతించలేదు. (ఇప్పుడు, బహుషా దానిని నేను చెప్పకూడదు. మంచిది, ఈ రాత్రి సంతోషకరమగు సంఘము కొరకు నేను ఎదురు చూచుచున్నాను.) కావున అప్పుడు మీకు తెలియును, మరియు మొదటగా అతడు ఊరీము మరియు తుమ్మీము దగ్గరకు వెళ్ళెను.
ఊరీము, తుమ్మీము అనగా ఏమిటో మీరెరుగుదురు. అది అహరోను రొమ్మున ధరించిన ఎఫోదై యున్నది. దేవుడు ఎల్లప్పుడూ సహజాతీతునిగా యుండి సహజాతీత ధోరణిలోనే జవాబు ఇచ్చుచుండును. ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు, ఆ మర్మయుక్తమగు వెలుగు ఊరీము, తుమ్మీము మీద వెలుగును చూపనియెడల అతడు తప్పిదస్తుడు. ఒకడు కల కని ఆ కలను చెప్పినప్పుడు, ఊరీము తుమ్మీము మీద వెలుగు చూపనియెడల, అది ఎంత చక్కగా వినిపించినప్పటికీ - నేను లెక్కచేయను, అది తప్పైయున్నది.
78
నీకు ఎన్ని డిగ్రీలున్నాయన్నది మరియు నీ సంస్థ ఎంత పెద్దదయినది నేను లెక్క చెయ్యను, నీవు ప్రవచించినా, బోధించినా వాక్యానుసారముగా లేనియెడల, నీది తప్పు సహోదరుడా. ఇదే దేవుని ఊరీము తుమ్మీము. జగత్తు పునాది వేయబడక ముందే నీవు ముందుగా నిర్ణయించబడినావని ఒప్పుకొననిచో - అది వెలుగదు, ఎందుకనగా అది బైబిలు మాట. తండ్రి, కుమార, పరిశుద్దాత్మ నామములో బాప్తిస్మము పొందవలెనని నీవు చెప్పినచో - అది వెలుగదు, ఎందుకనగా బైబిలులో ఎవరూ ఆ విధంగా బాప్తిస్మము పొందలేదు. ప్రభువైన యేసు నామములో మాత్రమే బాప్తిస్మము పొందిరి. అది వెలుగనిచో ఎక్కడో ఏదో తప్పున్నదని అర్ధము.
79
కావున ఊరీము మరియు తుమ్మీముల వలన సౌలుకు జవాబు దొరక లేదు. మరియు అతనికి కనీసం ఒక కల కూడా రాలేదు. అతడు స్వప్నమునైనా పొందలేనంత దూరమాయెను. కాబట్టి అతడేమిచేసెనో ఎరుగుదురా? ఒక సోదె చెప్పు వ్యక్తి యొద్దకు వెళ్ళెను. “నీవు జవాబు చెప్పెదవా?” అని అడుగగా,
“చెప్పెదను కాని సౌలు చంపనేమోనని భయపడుచున్నాను” అన్నది.
“నిన్ను నేను కాపాడెదను మృతుల లోకములో నుండి వారిని బయటకు తీసికొని [దీనిని వినండి.] రమ్ము ప్రవక్తయగు సమూయేలు ఆత్మను తీసికొని రమ్ము” అనెను.
ఆ సోదె చెప్పు స్త్రీ వెళ్ళినది. “దైవములు దిగి వచ్చుట నాకు కనబడుచున్నది” అని చెప్పినది. ఆ స్త్రీ అన్యురాలు. వారికి తండ్రి, కుమార, పరిశుద్దాత్మవలె ముగ్గురు లేదా ఇద్దరు దేవుళ్ళున్నారు. “దేవుళ్ళు వచ్చుటను నేను చూస్తున్నాను,” అని చెప్పినది.
“అతడెట్లున్నాడో వివరించుము. ఏలాగు కనిపించుచున్నాడు?” అని అడిగెను.
“అతడు సన్నగా యున్నాడు. భుజముల మీద దుప్పటి కప్పుకొని యున్నాడు” అని చెప్పినది. అతడు కొంచము కూడా మారలేదు.
“అతడు సమూయేలు. ఈ గదిలోనికి, నా ముందుకు అతని తీసికొని రండి” అనెను.
మరియు సౌలు ఎదుటకు సమూయేలు వచ్చుటను చూడండి. “ నన్నెందుకు పిలచితివి, నీవు దేవునికి శత్రువుగా మారితివి?” అని అతడు ప్రశ్నించెను. మరియు గమనించండి. సమూయేలు స్వరూపము మాత్రమే మారకపోవుట కాదు గాని, అతని ప్రవచన ఆత్మ కూడా మారలేదు. అది వాస్తవం. అతడు ఇంకను ప్రవక్తగానే యున్నాడు. ఇట్లు ప్రవచించెను, “రేపు నీవు యుద్ధము చేయుదువు. నీవు నీ కుమారులు ఆ యుద్ధములో హతులవుదురు. రేపు రాత్రి ఈ సమయమునకు నీవు నాతో కూడా యు౦దువు.” నిజమేనా? ఇంకా అతడు ఒక ప్రవక్తగానే ఉన్నాడు!
“ఓ అది చేసినది సోదెకత్తె” అని మీరనవచ్చును.
80
మంచిది, సోదెకత్తె కాని దానిని మీకు చెప్పెదను. ఒకసారి యేసు రూపాంతరపు కొండ మీదికి పేతురు, యాకోబు, యోహానులను తీసికొని వెళ్ళెను. మరియు వారా కొండమీద నిలచియుండిరి. మరియు యేసు, దేవుడు తన కుమారుని స్థానమును చూపించుచుండెను. అక్కడ మోషే మరియు ఏలియాలు నిలబడియుండుట వారు చూచిరి. వారు మాట్లాడుకొనుచుండిరి. మేఘములు కాదు గాని వారే మాట్లాడుచుండిరి. మోషే చనిపోయి ఎనిమిది వందల సంవత్సరములాయెను. అతని సమాధి ఎవరికీ తెలియదు. ఏలియా రధము మీద ఆరోహుణుడై, అయిదు వందల సంవత్సరములాయెను. ఇక్కడ వారిద్దరూ సజీవముగా నిలబడిరి. ఆయన కల్వరికి వెళ్ళుముందు సమయమది. వారాయనతో ముచ్చటించిరి. హల్లేలూయా! “విమోచనా దినము వరకు ముద్రించబడిరి.”
81
నేను త్వరపడుదును. ఆలస్యమయినది. గనుక ముగించదును, మరియు మనము రోగులకు ప్రార్ధించెదము. ఇంకా అయిదు నిమిషములు చాలును. 13వ వచనము నుండి 14వ వచనము వరకు చదువదము,
సత్య వాక్యము వినిన తరువాత మీరాయన యందు విశ్వసించితిరి. ఆ సువార్త మీకు రక్షణ కలుగచేసెను.
వారెట్టి రక్షణను పొందిరో ఇప్పుడు గుర్తుచేసికొనండి. వీరు ఎఫెసు క్రైస్తవులు, కొరింథీయులను మీరు గమనించారా? వారితో ఎప్పుడూ అతడీలాగు చెప్పుచుండెను. “నేను మీ మధ్యకు వచ్చినప్పుడు, ఒకరు భాషా వరమును, ఒకరు కీర్తనలు పాడు వరమును, ఒకరు ప్రవచించు వరమును కలిగియుండుట చూచితిని.” అతడు వారికేమీ బోధించలేదు, కాని వారు ఎప్పుడూ ఏదో ఒకటి పొందగోరిరి. వీరును అదే కలిగి యుండిరి, కాని దానిని క్రమములో పెట్టిరి. కొరింథీయులకు ఈ విధంగా అతడెన్నడును బోధించలేదు. ఎందుకనగా దానిని బోధించునంత క్రమములో సంఘము లేదు. ఇప్పుడు, ఈ జనులకు ఇతడు నిజమగు దానిని బోధించెను.
ఆయన యందు విశ్వసించుట ద్వారా రక్షణ పొందితిరి. మీరిప్పుడు పరిశుద్ధాత్మ వాగ్దానముతో ముద్రించబడితిరి.
[దీనిని తప్పిపోకూడదు.] మీ స్వాస్థ్యమునకు ఇది సంచకరువు. ఆ స్వాస్థ్యమును వెలపెట్టి కొని విమోచించెను, ఆయన మహిమను ప్రచురించెదరు.
82
పరిశుద్దాత్మ అనగా ఏమిటి? (ఇప్పుడు, నేను ఆ మిగిలిన దానిని త్వరగా చదివెదను వినండి.) మైక్ సోదరుడా, గత రాత్రి మనం ఎక్కడున్నాము? వారందరూ సంతోషంగా ఉండిరి. సమాధానము, పరిపూర్ణ ప్రేమ అచ్చటున్నది. నీవు అడుగువేయు ప్రతిసారి ఒక అంగుళము ముందుకు వచ్చెదవు. నీలో ఎంత వరకు పరిశుద్దాత్మ యున్నదో చూచుకొనుము. అదే ప్రేమై యున్నది. అయితే, ఓ, నీవు ఒకదాని కొరకు దాహము గొందువు.
ఓ, నేను మరల పదిహేను లేదా ఇరవై సంవత్సరాల వయస్సు వాడనయినచో ఎంతో బాగుండును! అందుకొరకు నేను దేనినయినా ఇచ్చెదను. అయితే దాని వలన ఏమి లాభము? నేను పదిహేనేండ్ల వాడనైననూ ఈ రాత్రికే చనిపోవచ్చును. ఇది అనిశ్చితము. ఈ రాత్రి నీవు పదిహేనేండ్ల వాడివైననూ, నీవు యింటికి వెళ్ళేసరికి అమ్మ బ్రదికియుండునో లేదో నీకెట్లు తెలియును. ఈ రాత్రి నీవు పదిహేనేండ్ల వాడివయినా గాని, ఇంటికి తిరిగి వెళ్ళుదువను నిశ్చయత కలదా? నీవు పన్నెండు సంవత్సరాల వాడివైనా గాని, రేపు మంచి ఆరోగ్యముతో జీవించగలవను నిశ్చయత ఎచ్చటున్నది? నీవు ఒక ప్రమాదములో చనిపోవవచ్చును, నీకు ఏదయినా సంభవించ వచ్చును. అనిశ్చితము! చూశారా. ఇక్కడ నిశ్చయమైనది ఏదియూ లేదు. కాని దాని కొరకు నీవు చూచుచున్నావు. అది ఏమిటి? ఆపై నున్నది నిన్ను ఆలాగు చేయుచున్నది.
83
ఇప్పుడు, నీవు దీనిలోనికి వచ్చినప్పుడు నీవు నిత్యజీవము పొందెదవు. అందువలన ఏమి జరుగును? అది “సంచకరువై” యున్నది.
సంచకరువు లేదా భయానా డబ్బు అనగా ఏమిటి? నేను ఒక కారును కొనుటకు వచ్చినయెడల, “ఆ కారు ఎంత?” అనడుగుదును.
“బ్రెన్హాం సోదరుడా! ఈ కారు మూడు వేల డాలర్ల ఖరీదు చేయును” అని నీవు అందువు.
“ముందుగా ఎంత ఇమ్మందువు?”
“మంచిది, అయిదు వందల డాలర్లు ఇమ్ము.”
“సరే, ఇవిగో అయిదు వందల డాలర్లు. మిగిలినది వీలయినంత త్వరలోనే చెల్లించెదను. కారు నా కొరకు ఉంచుము. ”నేను అయిదు వందల డాలర్లు ఇచ్చాను. అదే సంచకరువు. నిజమేనా?
ఇప్పుడు, అదే “సంచకరువై యున్నది.” “బయానా.... వాగ్దాన ఆత్మతో మీరు ముద్రించబడియున్నారు.
[పరిశుద్దాత్మ వాగ్దానము చేసిన ఈ వాగ్దాన ముద్ర ఏమిటి?] మన స్వాస్థ్యమునకు సంచకరువు. మన కొరకు ఆ స్వాస్థ్యమును వెలచేత విడిపించెను.
84
ఏమిటది? అది సంచకరువైయున్నది. మరియు ఇది సంచకరువు అయినచో మనమంతా అక్కడికి వెళ్ళిన తరువాత అదేమైయుండును కదా! అది ఏమైయుండును? దీనినే మనము ఎంతో అనందముగా అనుభవించుచున్నయెడల... తొంబది సంవత్సరములు దాటిన వారు గంతులు వేయుట నేను చూచాను...
ఒక రాత్రి ఒక వృద్ధ బోధకుడు వేదిక మీద లేచి మరియు ఇటు అటు కదలుట చూచాను. అంత ముసలివాడు బోధించగలడా? అనడిగాను.
“ప్రభువుకు స్తోత్రము!” అన్నాడు. ఒక నల్లజాతి వ్యక్తి ఒక పెద్ద అంగీ ధరించెను. అది బోధకుని అంగీ.
“వారు ఆ యవ్వన భోధకులను ఎందుకు బోధించనియ్యరు? ఆ ముసలివాడు ఏమి బోధించగలడు?” అన్నాను.
అతడిట్లనెను, “మంచిది.” “సోదరులారా! ఈ దినమంతా నేను సోదరులు బోధించుట విన్నాను. వారంతా భూమి మీద యేసు చేసినవి చెప్పిరి అని అతను చెప్పెను. కాని ఆయన పరలోకములో ఏమి చేసెనో నేను చెప్పెదను. నేను నా అంశమును ఈ రాత్రి యోబు 7:27 నుండి తీసికొందును. లోకమునకు పునాది వేయక ముందున్న సంగతి ఇది. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవుని కుమారులు ఆనందముతో కేకలు వేసిరి. ఆ సమయములో జరిగినదానిని చూడండి.” పరలోకమందు జరిగిన దానిని అతడు చెప్పసాగెను. రెండవ రాకడలోనికి దానిని తీసికొని వచ్చెను.
ఆ సమయములో పరిశుద్దాత్మ అతనిని తాకెను. (అతడు దాదాపు తొంబది అయిదేండ్ల వృద్దుడు. అతనిని వారు నడిపించవలసి వచ్చెను.) అతడు ఉప్పొంగుచూ బోధించసాగెను. “హల్లెలూయా! మహిమ! అని చెప్పిగంతులు వేయుచుండెను. ”ఇక్కడ నేను బోధించుటకు కావలసినంత చోటు లేదు. అతడు గంతులు వేయుచుండెను. అదే ఆ సంచకరువు. ఓ!
85
పరిశుద్దాత్మ ఏమి చేయును? ఆ తరువాత అధ్యాయము 1వ వచనము చదివెదను. చదవవలెనా? అది సరియైనచో “ఆమేన్” చెప్పండి. త్వరగా 2వ అధ్యాయము 1వ వచనము చదువుదుము. వినండి.
అపరాధములలోను, పాపములోను చచ్చిన మిమ్మును ఆయన బ్రదికించెను.
“మిమ్మును ఆయన బ్రదికించెను” బ్రదికించుట అనగా అర్ధము ఏమిటి? “జీవింప చేయుట.” చనిపోయినదానిని ఆ సంచకరువు ద్వారా బ్రదికించెను. పౌలు మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. “తన్ను ప్రేమించు వారికొరకు దేవుడు దాచి యుంచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరించ లేదు.” దానిని దేవుడెరుగును. చూడండి, చెప్పనాశక్యముగాని ఆనందము మరియు పూర్ణ మహిమ గూర్చి మీరు మాట్లాడుదురు. ఒకప్పుడు మీరు పాపములోను, అపరాధములలోను చనిపోయిరి. ఆయన మిమ్మును బ్రదికించెను. మీరు ఛాయనుండి ప్రవాహమునకు, నదియొద్దకు, సముద్రము యొద్దకు వచ్చితిరి.
86
మరియు మీరు విమోచించబడి సరిక్రొత్త శరీరమును ధరించుకొనిరి. మరల ఒక యువకునిగా, ఒక యువతిగా మారుదురు. మరణము ఇక లేదు. మీరు భూమి వైపు చూచి ఇట్లనుకొందురు, “నేను కొన్ని ద్రాక్షలు, చల్లని నీరు అనుభవించ గోరుచున్నాను, కాని వాటి అవసరత ఇక్కడలేదు!”
అయితే ఒక దినమున యేసు వచ్చును, ఈ దేవదూతల శరీరము, జీవించుచున్న ధియోఫనీ, స్త్రీ గర్భములో నుండి వచ్చినది కాదు. శారీరక ఇచ్ఛవలన కలిగినది కాదు, ఎందుకనగా ఆయన శరీరేచ్చ వలన పుట్టలేదు, అది లేకుండానే నేను పునరుత్థానము పొందుదును. ఒక దినమున ఆయన మాట్లాడగా, క్రీస్తునందున్న మృతులు లేచెదరు. ఒకప్పుడు నేను జీవించిన ఆ శరీరము, మహిమ శరీరముగా తిరిగి లేచును. నేను మాట్లాడుదును, నడచెదను, జీవితమును అనుభవించెదను. (హల్లెలూయా!) రానున్న ఆ మహిమ యుగము లన్నింటిలో మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా జీవించెదను. సోదరుడా! అదే సువార్త,
87
పౌలు తన్ను గూర్చి చెప్పుకొనుచున్నాడు. దీనిని చదివిన తరువాత రోగులకు ప్రార్థించెదను. “స్వాస్థ్యమును పొందుటకు ముందు ఇది సంచకరువు.” ఆయనను సుత్తించవలెను.
ప్రభువైన యేసునందు మీకున్న విశ్వాసమును గూర్చి నేను విన్నాను. పరిశుద్దులను మీరు ప్రేమించుచున్నారు. [దీనిని మీరు విశ్వసించిరని నేను విన్నాను. ముందు నిర్ణయమును, నిత్యజీవమును, రక్షణను మీరు నమ్ముచున్నారని విన్నాను]
మిమ్మును నా ప్రార్ధనలో జ్ఞాపకము చేసికొనుచూ, మీ గూర్చి ఎడతెగక దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను;
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడును, మహిమ యొక్క తండ్రియు మీకు జ్ఞానాత్మను, ప్రత్యక్షతను ఇచ్చును గాక! ఆయనను గూర్చిన జ్ఞానము మీకు వచ్చును.
అన్ని కాలములలోను ఆయన తన్ను మీకు బయలుపరచు కొనుచునేయున్నాడు. కృప నుండి కృపకు, శక్తి నుండి శక్తికి, మహిమ నుండి మహిమకు ఎదుగుచూ యున్నారు. వెనుకకు పడిపోవ ముందుకు సాగిపోవుచున్నారు. మీ కొరకు నేను ప్రార్ధించుచుందును.
మీ అవగాహనా నేత్రములు...
88
మీకు తెలియును, మీరు గ్రుడ్డివారై దానిని ఎరుగరని బైబిలు చెప్పుచున్నది. కాని ఇక్కడ పౌలు “మీ అవగాహనా నేత్రములు తెరువబడునట్లు ప్రార్థించుదును” అని చెప్పెను. మీరు మీ హృదయముతో అర్ధము చేసికొనెదరు. దానిగూర్చే ఆయన మాట్లాడుచున్నాడు. మీరు మీ నేత్రముతో చూచుచున్నారు, కాని మీరు మీ హృదయముతో చూడండి. దానిని మీరెరుగుదురు. 18వ వచనము చూద్దాం:
మరియు మీ మనో నేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్దులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో,
ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలిసికొనవలెనని,
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును, ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్ధనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.
ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను, అధికారముకంటెను, శక్తికంటెను, ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందు మాతమే గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొనియున్నాడు.
ఓ-ఓ-ఓ! ఎందుకనగా.... లేదు, నేను చెప్పకుండుట మంచిది. దీనిని చెప్పవలెనన్న రాత్రంతా చాలదు.
... ఈ యుగము నందు మాత్రమే గాక రాబోవు యుగము నందును పేరు పొందిన ప్రతి నామము కంటెను హెచ్చించెను.
89
ప్రతి వ్యక్తి యొక్క పేరు ఎవరి పేరును మోయును? [“యేసు” అని జనులు చెప్పిరి.] పరలోకమంతటికీ యేసు నామమే పెట్టబడినది. సంఘమంతటికీ యేసు నామమే పెట్టబడినది. ప్రతిదానికి యేసు నామమే పెట్టబడినది, ఎందుకనగా దేవునికున్న పేరు అది ఒక్కటే. ఆయనను యెహోవా అని, యెహోవా యీరే అని పిలచెను. అనగా యెహోవాయే బలిని చూచుకొనును. యెహోవా రఫా అనగా నిన్ను, స్వస్థపరచు ప్రభువు. యెహోవ, ప్రభుని ధ్వజమని అర్ధమున్నది; మరియు యెహోవా... వివిధ యెహోవాలున్నవి. వేకువ చుక్క తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ, ఆల్ఫా, ఒమేగా, ఆది, అంతము, కొమ్మ అను ఎన్నో బిరుదులు కలవు; కాని ఆయనకు ఒకే ఒక్క పేరున్నది.
మత్తయి అదే చెప్పెను, “మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. తండ్రియొక్కయు, కుమారునియొక్కయు పరిశుద్దాత్మయొక్కయు నామము లోనికి వారికి బాప్తిస్మమియ్యుడి.” నామములు కాదు. “తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, మరియు పరిశుద్దాత్మ యొక్కయు నామమున. తండ్రి అనునది పేరు కాదు, కుమారుడు అనునది పేరు కాదు, పరిశుద్దాత్మ అనునది పేరు కాదు. అవి నామముకున్న బిరుదులు. ఒకే దేవునికి చెందిన మూడు గుణ లక్షణములు అవి. ఆయన పేరేమిటి? ”నీవాయనకు పేరు పెట్టెదవు“ అని దేవదూత చెప్పెను. [”యేసు“ అని జనులు చెప్పిరి.] ”ఏలయనగా ఆయన తన ప్రజలను వారి పాపమునుండి రక్షించును.“ ఆ కారణము చేతనే బైబిలులోని వారందరూ ఆ విధముగా బాప్తిస్మము పొందిరి. క్రీస్తు చనిపోయిన రెండు వందల సంవత్సరములకు పరిశుద్ధ ఆగస్టీన్ యేసుక్రీస్తు నామములో ఇంగ్లాడు రాజుకు బాప్తిస్మము ఇచ్చెను. అది సరియే.
90
సమస్తమైన అధిపత్యముకంటెను, అధికారముకంటెను, శక్తికంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందు పేరుపొందిన ప్రతి నామముకంటెను ఆయనను హెచ్చించెను:
సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.
ఇప్పుడు, సమస్తము పైని నా శరీరమునకు శక్తియున్నచో, అప్పుడు నేనేమై యు౦దునో అదే నా శరీరమై యుండును. అది నిజమేనా? నేను అదే అయియు౦దును, నన్ను ఆ ప్రకారమే మీరు ఎరుగుదురు. అది నిజమేనా? మంచిది, మరియు, దేవుడు కలిగినదంతయూ, క్రీస్తులో కుమ్మరించెను, ఏలయనగా ఆయన శరీరములో దైవత్వము యొక్క సంపూర్ణతయై యున్నాడు. అది నిజమేనా? మరియు యేసు కలిగినదంతయూ ఆయన సంఘములో కుమ్మరించెను. “నేను చేయు ఈ క్రియలు మీరునూ చేయుదురు. ఇంతకంటె గొప్పవియు చేయుదురు, ఏలయనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను.
“ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది.
91
ఓ! నేనాయనను ప్రేమించుచున్నాను! ఎంతగానో ఆయనను ప్రేమించుచున్నాను. ఆఫ్రికాలోని నా పర్యటన సమయములో ఒక సేవకుని యొద్దకు వెళ్ళిన సంఘటనను గూర్చి ఒక పుస్తకంలో నేను చదువుచున్నాను. ఇంతకు ముందెన్నడూ దానిని నేను చదువలేదు. ప్రవక్త అఫ్రికాను దర్శించుట అను పుస్తకమును ఎంతమంది చదివారు? అందులో నేను చిన్న ఇండియను బాలుని చూచాను. ఆ బొమ్మను ఎందరు చూచారు?
పదిహేను సంవత్సరములకు పైగా ఒక సువార్తికుడు రోగులకు ప్రార్ధన చేయుచున్నట్లు నేను విన్నాను, “నా జీవితంలో ఒక్క అద్భుతమైనా జరుగుట ఎన్నడూ చూడలేదు” అన్నాడు. కాని తల నొప్పిగలవారు బాగయినట్లు చెప్పుట విన్నాను. కడుపు నొప్పిగలవారు బాగయినట్లు విన్నాను. కాని అద్భుతము ఎదో సృష్టించబడి, మరియు దేనినో చేయుట వంటిది మాత్రము జరుగుట చూడలేదని చెప్పెను.
అతడు అక్కడ నిలబడి చూచినాడని నేను తలంచాను. ఆ ఇండియను బాలుని కాలు పెద్దగా యున్నది. మరో కాలు మామూలుగా మానవ కాలువలె యున్నది. అతని బూటు పదిహేను అంగుళముల పొడవున్నది. దాని అడుగున ఇనుప ప్లేటు యున్నది. అతనిని నా యొద్దకు తెచ్చిరి. అతనికి రెండు చంక కర్రలున్నవి. తన పెద్ద ఇనుప జోడును ఎత్తి అడుగులు వేయుచుండెను. ఆ కాలు ఎంతో పెద్దగా ఉండుటను నేను చూచాను.
92
ఆ ప్రజలు మహమ్మదీయులు, మహమ్మదీయులై యున్నారు. పేపర్లో ఏమి వ్రాసిరో గత ఆదివారం నేను చెప్పినది మీరు విన్నారా? అది సరిగ్గా ఇప్పుడు నా దగ్గరే యున్నది, ఆఫ్రికా నుండి ఒక మిషనెరీ దానిని నాకు పంపెను. బిల్లీగ్రాహంను గూర్చిన వ్యాసమును సాహోదరుడు స్టికర్ పంపెను. మహమ్మదీయులు అతనిని సముద్రము లోనికి త్రోసివేతుమనిరి. ఎందువలన? వారుండుటవలన ఏమీ ప్రయోజనము లేదు. అందుకే మిషనెరీలు తిరిగి వచ్చుచున్నారు. వారిని తరుముచున్నారు.
నేను బిల్లీగ్రాహంను ప్రేమించుచున్నాను. అతడు గొప్ప దైవజనుడని నేను తలంచుచున్నాను. కాని బిల్లీగ్రాహం ఏమి చేయవలసియుండెను, ఈ స్వార్ధపు బాప్టిస్తులు అతనిని చేయనిచ్చినయెడల, అతడు చేసియుండును. బిల్లీగ్రాహం, దైవజనుడని నేను నమ్ముచున్నాను. అతడు ఈలాగు చెప్పినచో ఏమగును, “ఒక నిమిషం ఆగండి! నేను సువార్త బోధకుడను. మీరు పాత నిబంధన నమ్ముచున్నారు. యేసు కేవలము మానవుడని మీరనుచున్నారు. నేను మిమ్ములను సవాలు చేయుచున్నాను.”
“అటువంటి దయ్యపు సవాళ్ళను తీసుకొనుటను నేను నమ్మను, లేదండి, కాని నేను తిరిగి సవాలు చేయుదును, మరియు చెప్పెను, ”ఇద్దరం కలిసి వచ్చి తర్కించుకొందము“ అనవచ్చును. [బిల్లీగ్రాహంకు డాక్టర్ ఆఫ్ డివినిటీ డిగ్రీ యున్నది.] ”దీనిని నేను సవాలు చేసెదను, మరియు యేసే క్రీస్తని నేను నిరూపించెదను. దైవిక స్వస్థత మాటకొస్తే, ఆ వరము నాకు లేదు కాని, అది ఉన్న సోదరులు మాకున్నారు. ఓరల్ రాబర్ట్స్, లేదా ఇంకొందరు, ఇంకా చాలామంది గొప్పవారు ఆ సేవ చేయుచున్నారు. నీవు చూడాలంటే అక్కడికి రా? క్రైస్తవ్యమంటే నీవనుకొనుచున్నట్లు కాదు,“ అనవచ్చును.
93
అటువంటి సమయములో అందరూ అతనిని విడిచి వెళ్ళిపోవుదురు. దయ్యము నీకు సవాలు చేయుటను నేను నమ్మను. నేను దాని ముఖం మీద ఊసి అతడి నుండి వెళ్లిపోయాను. ఇది నిజము. కాని బిల్లీ ఆ మహమ్మదీయుడిని ఏలాగు జయించగలడు? బైబిలులోని యెషయా 9:6లో ఇట్లున్నదని చెప్పి జయించగలడా? “ఏలయనగా మనకు కుమారుడు పుట్టెను. శిశువు అనుగ్రహించబడెను.” ఎవరీయన? ఎవరిగూర్చి చెప్పబడినది? ఈ ప్రవక్త ఎవరు? రాబోవు ఈ మెస్సీయా ఎవరు? మహమ్మద్లో ఆయన స్థానమును చూపించమని అతడు ప్రశ్నించును.
“ఆయన మన పాపముల నిమిత్తము గాయపరచబడెను. మన అతిక్రమముల నిమిత్తము నలుగగొట్టబడెను. మన సమాధానార్ధమైన శిక్ష ఆయన మీద పడెను. ఆయన పొందిన దెబ్బలవలన మనము స్వస్థత పొందితిమి.” దానిని మహమ్మదులో నాకు చూపించు. “నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి? వారు నా చేతులను, పాదములను గాయపరచిరి” అని ఆయన కేకలు వేసెను. మీ గ్రంథములో అది చూపించు. అతడు ఎక్కడున్నాడో కూడా తెలియని రీతిగా మనము మహమ్మదీయుడ్ని చిత్తు చేయగలము. అది వాస్తవం.
94
అయితే నేను ఆ పేపరు చూడగా, నా హృదయము జల్లుమన్నది. “బిల్లీగ్రాం? వెనుదిరిగినప్పటికీ అది తప్పని మొహమ్మదీయులు ఎట్లు చెప్పగలరు,” చెప్పెను, “దక్షిణాఫ్రికాలోని డర్బన్లో రెవరెండు విలియం బ్రెన్హాం దైవ శక్తి ద్వారా ఎడతెరిపిలేని అద్భుతములు జరిగించెను. పదివేలమంది మహమ్మదీయులు నేలమీద పడి యేసుక్రీస్తుకు తమ జీవితములను సమర్పించిరి.” నిశ్చయంగా! దానిని మీరెరుగుదురు. ఆ ఛాందసులు దాని గూర్చి ఎరుగుదురు. మీరు నాకు చెప్పవద్దు.
ఒకసారి యేసు దగ్గరకు ఒకడు వచ్చెను. (అతడు పరిసయ్యడని మీకు తెలియునా.) “రబ్బీ! నీవు దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము, అని చెప్పెను, ఎందుకంటె దేవుడు తోడైయుంటేనే గాని ఎవడును నీవు చేయు కార్యములు చేయలేడు. మాకు అర్థమైనది. అది మాకు తెలియును, కాని దానిని నేము అంగీకరించలేము - ఎందుకనగా మేము మా చర్చి నుండి వెలివేయబడుదుము. చూశారా, మా పరువు పోవును” అని ఆ పరిసయ్యుడు పలికెను. కావున అతడు తప్పక తిరిగి జన్మింపవలెనని యేసు అతనితో చెప్పెను.
95
ఆ మహమ్మదీయ బాలుడు అచ్చట నిలబడియుండెను. ఆ పటము అక్కడున్నది. కెమేరా అబద్దమును తీయదు. అక్కడే అతడు నిలబడియున్నాడు. అతని కాలు ఇంకొక కాలుకన్నా చాలా చిన్నగా యున్నది. దానికి ఇనుపజోడు వేసికొనెను. (పధ్నాలుగు అంగుళములున్నది) “నీవు ఇంగ్లీష్ మాట్లాడుదువా?” అనడిగాను.
“మాట్లాడలేనండీ!” అని అతడు చెప్పగా దానిని నాకు అనువాదకుడు చెప్పెను.
“ఎంత కాలము నుండి ఆ విధముగా నీవున్నావు?” అని అనువాదకుడు అడిగెను.
“పుట్టుక నుండి.”
“నీవసలు కాలు కదపగలవా?”
“కదపలేను.”
“యేసు క్రీస్తును నమ్ముచున్నావా?”
“నేను మహమ్మదీయుడను” అని చెప్పెను.
“నిన్ను యేసుక్రీస్తు బాగుచేసినయెడల నీవాయనను నమ్ముదువా?” అనడిగాను.
“యేసుక్రీస్తు నన్ను బాగుచేసినయెడల, ఆయనను నా స్వరక్షకునిగా నేను అంగీకరించెదను.”
“ఆ కాలును తక్కిన కాలువలె ఆయన మార్చినచో నమ్ముదువా?”
“నేను నమ్ముదును.”
96
“దేవా! నీవేమి చేయుదువు?” అనునది తదుపరి కార్యమైయున్నది. అన్ని ప్రశ్నలకు జవాబు వచ్చినది. సహో, మైక్ ఉన్నాడు. దేవుడేమి చెప్పునో అని కొంతసేపు ఎదురు చూచాను. నేను ఆ బాలుడు మామూలుగా నడచి గోడవైపు వెళ్ళుట చూచాను.
నేనిట్లడిగాను, “మహమ్మదీయులగు మీలో ఎందరు అంగీకరించెదరు? ఇక్కడున్న మహమ్మదీయ బాలుడిని చూడండి. వైద్యులారా! అతనిని చూడగోరుచున్నారా? అతడు అక్కడే నిలబడియున్నాడు.” చూడండి. మీరందరూ అతనిని పరీక్షించండి. ఓ, అప్పుడు మీరెక్కడున్నారో మీకు తెలియును. మీరెక్కడ నిలబడినారో మీకు తెలియును.
“కుమారుడా! ఇటు నడువుము” అన్నాను. వారతనిని అటు తీసికొని వచ్చిరి. “పన్నెండు లేదా పధ్నాలుగు అంగుళముల పొట్టిగా అది కనబడుచున్నది కదా,” అని నేను అన్నాను.
“అవును.”
“అయితే దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అతనిని బాగుచేయగలడు. మహమ్మదీయులగు మీరు దానిని నమ్మి ఆయనను స్వరక్షకునిగా అంగీకరించెదరా?” అనడిగాను,
వేలకొలది నల్లని చేతులు పైకి లేచినవి. “మంచిది, ప్రభువా, ఇప్పుడే ఆ సమయము.” “పరమ తండ్రీ! ఇప్పుడు నీవు నాకు జవాబు ఇచ్చితీరవలెను. నీ కొరకు, నీ మహిమ కొరకే ఇది అడుగుచున్నాను. ఈ బాలుని బాగు చేయుమని ప్రార్ధించుచున్నాను” అని చెప్పాను. నేను కేవలము ఆ రీతిగా ప్రార్ధించాను.
“నీ బూటు తీసివేయుము” అన్నాను. అతడు నా వైపు, అనువాదకుని వైపు వింతగా చూచెను. “నీ బూటు విప్పుము” అని నేను చెప్పాను. ఆ బూటును విప్పి తీసెను. (ఎందుకనగా జరగనున్న దానిని నేను దర్శనములో చూచాను.) దానిని అతడు తీసెను, నా యొద్దకు నడిచి వచ్చెను, ఆ రెండు కాళ్ళు మామూలుగానే యున్నవి. నా వైపు నడిచి వచ్చెను. “ముందు వెనుకలకు నడువగోరుచున్నావా?” అనడిగాను.
అతడు కేకలు వేయుచూ ముందు వెనుకకు నడచుచుండెను. అతనికి ఏమీ చేయాలో తోచలేదు. “ఓ, అల్లా, అల్లా!” అని అరచుచూ కేకలు వేసెను.
“యేసు, యేసు” అనమని చెప్పాను.
“ఓ యేసూ, యేసూ” అని చెప్పసాగెను. “యేసూ! యేసూ,” ఆ విధంగా.
“ఏమయినా ప్రశ్నలున్నవా?” అనడిగాను.
97
జూలియస్ స్టడ్ స్కైవ్ ను ఎందరెగుదురు? సహోదరుడు స్టడ్ స్కైవ్ ఈ ఆలయమునకు వచ్చును. అతడు జర్మనీ వెళ్ళెను. “బ్రెన్హాం సోదరుడా! ఒక్క నిమిషము ఆగుము! ఫోటోగ్రాఫర్ ను తెచ్చి ఫోటో తీయుదును” అన్నాడు.
“అలాగే” అన్నాను.
అతనిని ఆ బూటుతో కూడా నిలబడమని చెప్పాను. అతడు నిలబడియుండగా ఫోటో తీసెను. ఆ రెండు కాళ్ళు మామూలుగా యున్నవి; అక్కడ అతడి పాత బూటు మరియు ఇనుప ప్లేటు ఉన్నది.
“ఇప్పుడు మహమ్మదీయులైన మీలో ఎందరు మహమ్మదు ప్రవక్త కాడని ఒప్పుకొని మరియు యేసు దేవుని కుమారుడని నమ్మి, ఆయనను స్వరక్షకునిగా అంగీకరించెదరు?” అనడిగాను. పదివేల చేతులు గాలిలో నిలబడినవి. హల్లెలూయా! వారికి ఒక...
98
వారు మమ్మును ఏవో పేర్లతో హేళన చేసిరి, “పరిశుద్ధ గుండ్రాళ్ళు” అని వారు మమ్ముల్ని పిలచిరి. దేవుడు కదులుచూ తన సంఘమును స్థానములో ఉంచుచున్నాడు. మనము ఆలోచించు దానికంటెను, చేయకలిగిన దానికంటెను ఎక్కువగా ఆయన చేయుచున్నాడు. ఆయన ఎప్పుడూ ఉండిన దేవునివలె - ఈ రాత్రియూ ఉన్నాడు.
కావున, చిన్న స్నేహితులారా? మీకు ఒక సంగతి ఇప్పుడే నన్ను చెప్పనివ్వండి. మీరు నాకు ప్రశస్తమగు జనులు. ఈ దేశములోను బయట టేపు దేశములలోను ఉన్న మీరు — భయపడకండి. అంతా చక్కబడును. తండ్రియగు దేవుడు ప్రపంచ పునాది వేయక ముందే జరుగు ప్రతిదానిని ఎరుగును. అంతా సమకూడి జరుగును. మీరాయనను ప్రేమించుదురా? మీ హృదయములను సరిచేసికొనండి.
99
మరియు, గుర్తు౦చుకొనండి, ముసలివారయినా, యువకులయినా, తల్లలయినా, చిన్న పిల్లలయినా ఒకనాటికి చనిపోవుదురు. ఈ శ్వాస ఆగిపోవును. అయిదు లేదా ఎనిమిది రోజుల పాప ఈ మధ్య చనిపోయినది. ఆమె పెద్దయితే ఎంతో అందమగు స్త్రీ అయి యుండును. ఆ ముసలి తాత వంగిపోయియున్నాడు. తన దారిని తాను చూడలేడు. ఆ ముసలమ్మను చూడండి. ఒకప్పుడు యువతిగా యుండెను. ఇరవై ఏళ్ళ వయస్సులో వారెట్లుండిరో మీరు ఊహించండి, రాబోవు కాలములో అతడు, ఆమె ఆ వయస్సులో నిరంతరము యు౦దురు.
మీరాతని చేతిని తాకవచ్చును, అతనితో కరచాలనము చేయవచ్చును. నీవతనిని కౌగలించుకోవచ్చును, కాని అతడు భర్తగా యుండడు; అతడు సోదరునిగానే యుండును. ఓ, మై! అతడు భర్తగా ఉండుట కంటెను, అంతకన్నా గొప్పవానిగా వుండును. నీవు అతనిని ప్రేమించావని తలంచుచున్నావా? నిశ్చయంగా నీవు ప్రేమించావు. కానీ అది ఫిలియో ప్రేమ; ఆగాపే వరకు వేచి చూడుము. దైవిక ప్రేమ నిన్ను పట్టుకొనువరకు వేచి చూడుము. ఇది ఒక కంపుకొట్టుచున్న మురికి గుంట వంటిది. మరేమీ లేదు, దానికి మరేమీ లేదు. మీరు చేయవలెనని నేను యిప్పుడు మీకు ఇచ్చు ఒకే ఒక్క సలహ, ఇదే, నా స్నేహితుడా...
100
ఆ మిగతా రెండు అధ్యాయములు ఎప్పుడైనా నేను తీసికొనుటకు మీరు ఇష్టపడుచున్నారా? ప్రభువు. చటాక్వా యొద్ద నేను కొద్దిగా విశ్రాంతి తీసికొందును. ఇప్పుడు, ఆ కూటములలో ఇవన్నీ నేను బోధించలేను. ఎన్నో వేర్వేరు విశ్వాసములున్నవి, చూచారా. ఇది సంఘమునకు మాత్రమే చెప్పుచున్నాను, చూశారా. ఇక్కడ నేను ఇష్టమైనది బోధించగలను. ఇది నా ఆలయము. చూశారా.
వారు రక్షించబడిరని నేను నమ్ముచున్నాను. అవునండి, నేను నిజంగా నమ్ముచున్నాను. నీ నడకను నీవు ఎరిగియున్నప్పుడు, నీ క్రియను నీవు ఎరిగినప్పుడు - నీవు తొట్రిల్లవు, జారిపడవు. మనము వెలుగులో నిలబడి, వెలుగులో నడచినయెడల, నీ ముందున్న గమ్యము చేరేదవు. ఇది నిజము. ప్రభువు మీకు తోడైయుండును గాక.
101
మరియు ఇక్కడున్న మనం ప్రతి ఒక్కరము మన మన స్థానములను ఆక్రమించవలెను. నీవు గృహిణివిగా మాత్రమే ఉండవచ్చును; మంచిది, నీవిట్లు చెప్పెదవు, “బ్రెన్హా౦ సోదరుడా, నా జీవితంలో ఏమీ నేను చేయలేదు. నేను బోధకుడను కాను.” కుటుంబములో పిల్లలను పెంచుటకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసియుండును. ఆ పిల్లలలో నుండి మరో కుటుంబము వచ్చును. అందులో నుండి వచ్చిన ఒక బోధకుడు క్రీస్తుయొద్దకు మిలియనుల ఆత్మలను నడిపించవచ్చును. నీవు ఒక పని నిమిత్తము ఇచ్చట ఉన్నావు. దానిని నీవెరుగుదువా?
మంచిది, నీవిట్లు చెప్పవచ్చును, “నేను భూమి దున్నుట తప్ప మరేమీ చేయలేను. సాయంకాలము వరకు పనిచేసినా నా పిల్లలను పెంచలేకపోవుచున్నాను. నా పిల్లలు చెప్పులు కూడా లేని పేదరికంలో ఉన్నారు. నేను కూర్చొని ఏడ్చుచున్నాను. పాత గుర్రపు బండిలో మేము చర్చికి వెళ్ళుచున్నాము. సహోదరుడా! బాధపడవద్దు. ఆయనను ప్రేమించుచూనే ఉండండి. నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశ్యమున్నది. నీవున్న విధంగానే ఉండి ముందుకు సాగిపొమ్ము, చూచారా. నీవెన్నడూ ఒక ప్రసంగము చేయకపోవచ్చును, కాని ప్రసంగము చేయు ఒకనికి నీవు తాతవు కావచ్చును.
102
మెల్కీసెదెకును కలిసికొన్నప్పుడు, అబ్రహాము గర్భములోనున్న లేవీ దశమ-భాగములను యిచ్చుటను దేవుడు యోగ్యముగా ఎంచిన దానిని మీరెరుగుదురా, (అతని పేరేమిటో ఇప్పుడు మనము చూద్దాం?) దానిగూర్చి ఎంతమందికి తెలియును? మరియు మనము చూద్దాం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు లేవీని కనెను - అతడు తండ్రి, తాత, ముత్తాత. గర్భములో పడక ముందే మెల్కీసెదెకునకు అతడు దశమ-భాగము చెల్లించినట్లు బైబిలు చెప్పుచున్నది. మై, మై, మై, మై, సహోదరుడా! ఓ!
103
ఒక రాత్రి ఇంగ్లాండులో ఒక వ్యక్తి మారుమనస్సు పొంది, “నేను చాలా అనందముగా యున్నాను! చాలా సంతోషముగా యున్నాను!” అని చెప్పెను.
అవును, అది నిజము అని తెలిసికొనుటకు ఎంతో ఆనందము! ఆ దినము నాకు తెలియదు గాని ఒక మహిమకరమగు దినమును దర్శనంలో చూచాను. గుర్తుంచుకొనండి, దీనిని ఎల్లపుడూ మనస్సులో ఉంచుకొనండి (టేపు చేయువారు కూడా ఆలాగే చేయండి.), అది దర్శనమో లేక ఆత్మలో నేను కొనిపోబడితినో నాకు తెలియదు. ఆయితే అది ఇక్కడున్న నెవిల్ సోదరుని పట్టుకొన్నంత వాస్తవముగా యున్నది. మరియు ఆ జనులను చూచాను మరియు వారితో మాట్లాడాను. నా మొదటి భార్య అక్కడ నిలబడియున్నది. ఆమె నన్ను చూచి, “నా భర్త!” అని కేక వేయలేదు. ఆమె “నా ప్రియ సోదరుడా” అని కేక వేసెను.
104
చాలా సంవత్సరాల క్రితం నాకు పరిచయమైన బాలిక అక్కడున్నది. బహుశా ఆమె బంధువులు కొందరు ఇచ్చట ఉండియుందురు. యుటికాలోని అలైస్ లూయిస్. చాలా విధేయతగల క్రైస్తవురాలు. జీవితంలో ఆలస్యంగా పెండ్లి చేసికొన్నది. మొదటి బిడ్డను ప్రసవించి చనిపోయినది. ఆమెను చూచుటకు నేను సమాధియొద్దకు వెళ్ళాను. నేను ఇంటికి ఆ రోజే వచ్చాను. ఆమె చనిపోయినదని విన్నాను. నేనక్కడికి వెళ్ళాను, ఆమె ఉన్న గదిలో ఎవరూ లేరు. ఆమె పేరు శ్రీమతి. ఎమ్మర్క్ మరియు ఆమె ఒక మంచి క్రైస్తవ బాలుని పెండ్లి చేసికొన్నది.
ఆమె చక్కని క్రైస్తవురాలు. ఆమెతో చాలా చోట్లకు వెళ్ళాను. అప్పుడు మేము పద్దెనిమిది, పంతొమ్మిదేండ్ల పిల్లలము. ఆమె అసలయిన క్రైస్తవురాలు. నేను పాపిని; కాని ఆమెతో కలిసి వెళ్ళేవాడిని. ఆమె భర్త తిరిగి జన్మించిన క్రైస్తవుడు. ఆమె చనిపోయినదని నాకు తెలియదు. నేను పేపరులో చూచాను. నేను వెళ్ళగా, వారది నాకు చెప్పిరి. నేను కూట్సు యొద్దకు వెళ్ళాను, మరియు “శ్రీమతి ఎమ్మర్క్ ఇచ్చటున్నదా?” అనడిగాను.
“బిల్లీ! ఆమెను ఆ గదిలో ఉంచిరి” అని చెప్పెను.
నేను లోపలికి వెళ్ళాను మరియు ఆ శవ పేటిక ప్రక్కన నేను నిలబడ్డాను. ఇట్లనుకొన్నాను, “ఆలిస్, నేను అంధకార గుహలో యుండియున్నాను, చీకటి మార్గంలో యుండియున్నాను. నీవు నేను కలిసి రహదారుల గుండా మరియు నది దాటి నడిచాము. ఒకప్పుడు వారు పాత మంచు నావలను కలిగియుండె వారు, మేము అక్కడ కూర్చొని ఆ సంగీతమును వాయించుట వినేవారము. ఎన్నో ఆటలు ఆడాము. నీవెంత చక్కని స్త్రివి! నీ జీవితమును బట్టి దేవునికి ఎన్నో వందనములు చెల్లించాను. నా ప్రియ సోదరీ, దేవుని శాంతిలో విశ్రమించు.”
105
మరియు ఒక మరొక రాత్రి దర్శనంలో ఆమె పరుగెత్తి నా దగ్గరకు వచ్చుట చూచాను. ఆమె ఇట్లన్నది, “నా ప్రియ సోదరుడా!” నన్ను కౌగలించుకొన్నది. ఓ, సోదరి, సోదరులారా, అది నన్ను మార్చినది. నేనెన్నడూ ఇక ఆ విధంగా ఉండను. అది ఎంతో వాస్తవము. నేను మిమ్మును చూచుచున్నంత యధార్ధముగా అది ఉన్నది. అది అంత వాస్తవము. అక్కడ భయము లేదు. ఈ రాత్రి గడవక ముందే నేను చనిపోవవచ్చును.
నేను ఆ చిన్న యోసేపును పెంచవలసి వచ్చెను. అతనిని నేను వేదిక మీద చూడగోరాను. నేనొక స్థలములోనికి వెళ్ళినప్పుడు, అతడు యువకునిగా, పరిశుద్దాత్మచే నింపబడి, దేవుని ఆత్మచే అభిషేకించబడి బైబిలు పట్టుకొని వేదిక మీద ప్రసంగించుట నేను చూచెదను. అతడు ప్రవక్తగా యుండునని నమ్ముచున్నాను. అతని పుట్టుకకు ఆరు సంవత్సరముల ముందే నేనతనిని చూచాను. అతడు వచ్చుచున్నాడని నేను మీతో చెప్పుట గుర్తున్నదా? నేను పిల్లలను ప్రతిష్ఠించు సమయములో నాకు తెలియకుండానే, “యోసేపూ, నీవు ప్రవక్తవు” అని నేను చెప్పుటను గుర్తుంచుకొనండి.
106
మరియు ఒక రోజు నేను అవరణలో నిలబడియుండగా, అతడు వచ్చి “డాడీ! యేసుకు నీవంటి చేయి యున్నదా?” అనడిగాడు.
“మంచిది, అవును కుమారుడా. ఎందుకు?” అన్నాను.
అతను చెప్పెను, “నేను సైకిలు మీద కూర్చొని శారా కొరకు ఎదురు చూచుచున్నాను [అతని చిన్న సోదరి] స్కూలు నుండి యింటికి రావలెను.” అక్కడ కూర్చొని. నేను అతడిని రోడ్డు పైకి వెళ్ళనివ్వ లేదు; అతడు ఆలాగు వెనకకు కూర్చొని యున్నాడు. “నేను పైకి చూడగా” నీవంటి చేయి నన్ను పట్టుకొన్నది, తెల్లని అంగీ ధరించిన వ్యక్తి ఆయన,“ అని చెప్పెను. చెప్పును, ”అది ఆలాగు పైకి వెళ్ళెను.“ ”అది యేసు చెయ్యి కదా?“ అని అతడు అడిగెను. ఆ మాట విని అతని తల్లి, నేను ఒకరివైపు ఒకరం చూచుకొన్నాము. మేము శ్రీమతి ఉడ్స్ నొద్దకు వెళ్ళాము. (ఆమె ఇక్కడే కూర్చొని యున్నది.) మేమతనిని ప్రశ్నించాము, అడుగవలసినన్ని తికమక ప్రశ్నలు వేశాము. అది ఒక దర్శనము. దానిని అతడు చూచెను. యేసు రాకడ ఆలస్యమయితే, చిన్న యోసేపు పెండ్లిని చూచువరకు జీవించవలెనను ఆశ నాకున్నది.
107
మరియు నేను ముసలివాడను, నా వెండ్రుకలు తెల్లబడినవి. నాకు సాధ్యమయితే రెండు లేదా మూడు మిలియనుల ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించ గోరుచున్నాను. ప్రపంచములోని ప్రతిమూల సువార్తను బోధించవలెనను ఆశ నాకున్నది. అవునండి. ఆలాగు చేయుటకు దేవుడు సహాయము చేయును గాక! మైక్ సోదరుడా! ఆ సమయము కొరకు చూచుచున్నాను.
ఇదే సమయములో నేను మేడా వైపు చూడగలుగుచున్నాను, (ఆమెను నేను ప్రియమైన దానా), అని పిలచెదను. మేము ముసలివారమగుచున్నాము. చూడండి, ఆమె వెండ్రుకలు తెల్లబడుచున్నవి, మరియు మేము వెళ్ళిపోవుచున్నాము, వాడిపోవుచున్నాము.
రిబ్కాను బట్టి నేను వందనములు చెల్లించుచున్నాను. ఆమె సంగీత టీచరు ఒక రాత్రి నాతో ఇట్లన్నది, “బ్రెన్హా౦ సోదరుడా! ఆమె ఈ విధంగా కొనసాగితే, ఆమె ఏమి చేయునో చెప్పుట కష్టము.” ఆమె సంగీతములో అంత ఎదిగినది. శారా ఆర్గను యొద్ద, బెక్కీ పియానో యొద్ద, జోసెఫ్ వేదిక మీద నిలబడవలెనని నేను కోరుచున్నాను.
108
మరియు అది జరుగుట నేను చూచెదను. నేను నా భార్య నెమ్మదిగా వచ్చి చూతుము. నేను చేతి కర్ర పట్టుకొని ఒక రాత్రిలో వచ్చుదును. మరియు నా కుమారుడు పరిశుద్దాత్మతో నింపబడి ఇదే సువార్తను వేదిక మీద నుండి బోధించుట చూచెదను. నేను ఈ పాత గ్రంథము తీసి, “కుమారుడా! ఇది నీదే. దీనిని పట్టుకొని నిలబడు! ఒక్క వాక్య విషయంలో కూడా రాజీపడవద్దు” అని చెప్పగోరుచున్నాను. దీనితోనే నిలచియుండుము, ఎవరు నిన్ను వ్యతిరేకించినా లెక్క చేయవద్దు. దేవుడు నీ పక్షమున యుండును. ఇందులో వ్రాయబడియున్న రీతిగానే ప్రతి మాటను నీవు బోధించుము. నీ తండ్రి ఆవలి నదియొద్ద నుండి చూచును. నేను నా భార్యను చేతులతో పట్టుకొని యోర్దాను దాటుదును.
దేవా! ఆ సమయము వరకు ఈ పొలములో నమ్మకముగా నన్ను పనిచేయ నిమ్ము! వెల ఎంత చెల్లించవలసి వచ్చినా గాని, నేను లెక్క చేయను. నేనేమి చేయవలసి వచ్చినా లెక్క చేయను. సజీవ దేవుని వాక్యము పట్ల యధార్ధముగాను, నమ్మకముగాను ఉండునట్లు నన్ను చేయుము. ఆ దినము వచ్చినప్పుడు నేను దాటిపోవుదును, అవతలి వైపునుండి నేను చూచి ఇట్లందును, “అక్కడే నీవున్నావు.” ఓ, నా ప్రశస్త స్నేహితుడా, నా ప్రశస్త సోదరుడా, నా ప్రశస్త సోదరీ.
109
యవ్వన బోధకుడా! పొలములోనికి వెళ్ళుము. యువ బోధకులు కూర్చొని యుండవద్దు. పని లేకుండా గడప వద్దు. బయటకు వెళ్ళి ఒక ఆత్మను రక్షించుము. ఏదో చేయండి! ముందుకు కదలండి! యువ బోధకులారా! ఆగిపోవద్దు. మీ హృదయమును దేవుడు దీవించును!
ఆ వయస్సులో నేనేమి చేశానో గుర్తుకు వచ్చుచున్నది. ఇంతకంటె కొద్దిగా చిన్న వయస్సు. ఈ మూలరాయి వేసినప్పుడు నా వయస్సు దాదాపు ఇరవై సంవత్సరాలు. నీలి రంగు కోటు, తెల్లని పాంటు ధరించెడివాడిని. దాదాపు ముప్పయి-ఒక్క సంవత్సరాల క్రితం ఆ మూల రాయిని వేశాను. చూడండి, అప్పుడు నేను బాలుడను. నేను ఆ మూలరాయి వేశాను. ఒక్క మాటలో కూడా నేను రాజీపడలేదు. ఆ మూల రాయిని వేసినట్లే నేను దానిని కొనసాగించాను. అక్కడ నా సాక్ష్యమున్నది. బైబిలులోని పేజీ మీద వ్రాశాను. దానిని మూలరాయిలో వేశాను. ఇంకా అది అచ్చటే యున్నది. అది పరలోకములోని దేవుని నిత్య వాక్యములోని పేజీలలో వ్రాయబడును గాక! అంతము వరకు నమ్మకముగా నిలబడుదును గాక!
110
ఇప్పుడు, ఒక్క నిమిషము ప్రార్ధన కొరకు తలలు వంచుదము. ఈ ముగింపు రాత్రిలో, ఈ ఒక్క అధ్యాయపు ముగింపులో, ప్రార్థించుదము. మరొకటి చెప్పితే ఆయన తన సంఘము యొక్క స్థానమును ఎచ్చట నిర్ణయించెనో అర్థమగును. దేవుని చిత్తమయితే మరోసారి చెప్పుదును. మరో పెద్ద కూటమునకు షటాక్వాకు వెళ్ళు ముందుగా కొద్దిగా నేను విశ్రాంతి తీసికోవలెను. అక్కడ నుండి నేను ఓక్లహామాకు వెళ్ళుదును.