విశ్వాసమనునది ఆరవ ఇంద్రియము
VGR COUNT-302 ...ఆదిలో మనయందుంచబడిన ఐదు ఇంద్రియముల నుండి అది మనలను విడిపించును మరియు వదిలించును. ఇచ్చట క్రిందయున్న ఆ ఐదు ఇంద్రియములలో ఐదవ ఇంద్రియము, అతని ఆకలి వలన మానవుడు అచ్చట ఆ ఇంద్రియములతో పడిపోయెను.
ఇప్పుడు, గమనించుడి, ఈ ఇంద్రియములు మీ యొక్క భూ సంబంధమైన నివాసమును స్పర్శించుటకే మీకు ఇవ్వబడెను, మీరు చూచులాగున, రుచించులాగున, స్పర్శించి తెలిసికొనులాగున, వాసన చూచులాగున మరియు వినులాగున.
అయితే అవి ఏ విధముగాను మిమ్ములను నడిపించుటకు కాదు. మరిప్పుడు అనేక సమయములలో నేను చూచుటకు నిరాకరించినయెడల, మరియు నేను నా కన్నులను మూసికొని, “నేను చూచుటకు నిరాకరించుచున్నాను,” అని చెప్పిన యెడల, అప్పుడు నా కన్నులు నాకు ఏ విధముగాను ఉపయోగపడవు. అట్లైనయెడల, నేను - చివరికి గ్రుడ్డివాడనగుదును. మరటుపిదప నాకు కుమారుడు కలిగిన పిదప, నేను అతని కన్నులు మూసి మరి చెప్పిన, “లేదయ్యా, చూచుటయను అటువంటి కార్యము లేదు.” అతను చూడకుండులాగున నేను అతని కన్నులను పైన కట్టివేసెదను.
అతను చెప్పను, “చూచుటయను కార్యము లేదని నా తండ్రి చెప్పెను, కావున నా కుమారుని కండ్లను నేను కట్టివేసెదను.” మంచిది, మొదట విషయమేమైయున్నదో మీరెరుగుదురా, మన సంతతి గ్రుడ్డివారుగా ఉ౦డెదరు. అది నిజము. మీరు గనుక మీ ఆరు ఇంద్రియములను ఉపయోగించని యెడల, అవి చలనరహితముగా ఉ౦డును. అవి పనిచేయనే చేయవు.
2
సహోదరుడా, దేవుడు మనకు అనుగ్రహించిన ఆరవ ఇంద్రియమును సంఘము ఆ విధముగా పనిచేయనీయకుండా చేసివేసినది. అతని విశ్వాసమంతా అద్భుత కార్యముల యందును మరియు సూచక క్రియలయందే యుంచియున్నాడు. మరియు దేవుడిని స్పర్శించు కార్యములు, అవి అతనికి పరిశుద్ధాత్మను అనుగ్రహించును. అతడు ఎచ్చటో సూదూరమునందు దానిని వదిలివేసెను, లేదా ఇచ్చట వెనుక భాగమున ఉంచెను, మరియు దానిని మరణావస్థతతో యుండునట్లు చేసెను. అది నిజము. దానిని ఏ విధముగా ఉపయోగించవలయునో అతనికి తెలియదు. ఆ క్రియ అతనికి ఏ ప్రయోజనము లేనిదిగా యున్నది.
“సరి, దేవుడు స్వస్థపరచు వాడు.” అని మీరు చెప్పవచ్చును.
“ఓ, దానిని గురించి ఏమనుచున్నావు, దేవుడు స్వస్థపరచువాడనుటను గురించి ఏమనుచున్నావు.”
ఆయన గనుక స్వస్థపరచువానిగా యుండినయెడల, ఆయనింకా ఒక స్వస్థపరచువాడుగానే యున్నాడు! ఆయన గనుక ఒక రక్షకునిగా యుండినయెడల, ఆయనింకా ఒక రక్షకునిగానే యున్నాడు. ఆయన గనుక దేవుడై యుండినయెడల, ఆయనింకా దేవుడుగానే యున్నాడు. కావున, మీరు చూడుడి, అది జనులకు విశ్వాస-రహితమైన ప్రసంగముగా యున్నది, ఆ విధముగా విశ్వాసము లేకుండా ప్రసంగించుటవలన ఆ ఆరవ ఇంద్రియమును వారు వదిలి వేయునట్లుగా అది చేయుచున్నది, అదియే విశ్వాసము, అది చలనము లేకున్నది.
3
మరియు వారు సంవత్సరము పొడుగునా వ్యాధితో బాధపడుచూ వైద్యుని యొద్దకు పరుగెత్తికొని వెళ్ళినా మరి చెప్పెదరు, “వైద్యుడా, ఓ, నాలో ఏదో లోపమున్నది.”
వైద్యుడు దాని తట్టు చూచును మరియు అతను ప్రయత్నించును. అతను ఒక మానవుడు, ఒక మంచి నమ్మకమైన వైద్యుడు తాను చాలా ఓర్పుతో క్రియ చేయును, దేవుడు అతనికి ఇచ్చిన శక్తితో తాను చేయగలిగినదంతయు మీకు సహాయము చేయులాగున, చేయును. మరి దానికి పిదప జరుగు మొదటి కార్యమేమనగా ఆ వ్యాధి ముదిరిపోవునని మీరెరుగుదురా! నిజము. అతను చెప్పను, “చేయవలసినదంతా నేను మీకు చేసితిని, ఇక నేనేమి చేయలేనని మీకు చెప్పాలని ఆశించుచున్నాను. వేరొక వైద్యుని యొద్దకు వెళ్ళి చూడదలచిన యెడల మీరు వెళ్ళి చూసుకోవచ్చు.
సరి, అప్పుడు మీరు ఇంకొక వైద్యుని యొద్దకు వెళ్ళెదరు; అతను చెప్పును, “వీలు కాదు, ఏమియు చేయుటకు వీలు కాదు. అది బాగా ముదిరి పోయినది.”
ఇప్పుడు అదే తగిన సమయము. ఆరవ ఇంద్రియమును పిలుచుటకు అదే తగిన సమయము. దేవునిని అంగీకరించుటకు అదే తగిన సమయము. దేవుడు మీలో యుంచిన విశ్వాసమును ఆత్మపై ఆధారపడుటకు అదే తగిన సమయముగా యున్నది.
4
మరిప్పుడు జనులకు అది చాలా కాలము క్రిందట ఆ విధముగా బోధింపబడియుండుట వలన దానిని నమ్ముటకు వారికి చాలా కఠినముగా యున్నది. సహోదరుడు బోజ్ ఈ దినమున నాతో చెప్పుచుండెను, “సహోదరుడా బ్రెన్హాం, నీవు దేనికెదురుగా మాటలాడుచున్నావో అని నేను గుర్తించలేకున్నాను.” చూశారా? అదేమిటని మీరు గుర్తించలేకున్నారు, అది ఎటువంటి ఒక విషాదకరమైన విషయము, మీరు దానిని తీసికొని వచ్చినయెడల, మరియు దేవుని యొక్క శక్తి క్రిందికి దిగి వచ్చి జనులకు అది నిజమని అనిపించునట్లుగా నుండి, మరియు వారు జనుల మధ్య ఆత్మ కదలాడుటను చూచినయెడల, మరి ఎవరో ఓకరు అచ్చట కూర్చొని “ఓ, నీవు గనుక దీనిని చేసిన లేక దీనిని లేక దానిని లేక వేరొకదానిని ఏదైనను చేసిన ఒకవేళ అది నాకు సహాయపడ వచ్చును,” అని చెప్పెదరు.
ఓ, సహోదరుడా, ఈ వారములో మనము దేనిని ప్రసంగించుచున్నామో దానిని గనుక ఆ ఆరవ ఇంద్రియమును గ్రహించగలిగిన (ఆమేన్), ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానమును చేసెను. క్రీస్తు ఈ వాగ్దానమును చేసెను. దేవుడు వాగ్దానము చేసిన అతీతమైన ఈ కార్యమును ఈ దినమున ఆయన చేసెనని మనము గ్రహించునట్లుగా మనము దానిని ఈ వారమున లేఖనములను ముందుకు, వెనుకకు తిరగవేయుట వలనను మరియు దానిని వెదకి చూచుట వలన కనుగొని యున్నాము. ఇప్పుడు నిజమైన, స్వచ్చమైన విశ్వాసము దానిని చూచి మరి దానిని పట్టుకొనును, మరియు నరకములోనున్న దయ్యములన్నియూ అతను పొందిన దానిని అతని యొద్ద నుండి తీసివేయజాలవు.
అయితే మనము తడబడుచున్నాము. మనము దానిని అధికముగా ఉపయోగించుట లేదు. మనము ఎక్కువగా ఐదు ఇంద్రియములపైనే ఆధారపడియున్నాము. మరియు అనేక సమయములలో, తొంబది తొమ్మిది శాతము జనులకు వారి ఐదు ఇంద్రియములు ముగించబడినప్పుడు, “సమస్తము సమాప్తమైనది,” అని చెప్పెదరు. “నా సమాధి త్రవ్వుడి; నా పెట్టె సిద్దపరచుడి.” చూశారా?
5
ఓ, ఒకటి-లేక-రెండు దినములకు ముందు ఒక దీనురాలైన స్త్రీతో నేను సంభాషించిన సంభాషణను గురించి ఆలోచించుచుంటిని. ఇప్పుడు వారిని నేనిచ్చట చూచుట లేదు. ఆ వ్యక్తి పేరు (ఒక విధమైన జర్మను పేరు) డార్స్ (Dorch), డాష్ లేక డౌగిష్ (Dash, or Doughish) మరియు అతని భార్య, ఆమె ఒక కల కనెను, ఆ కలను గురించి ఆమె నాతో చెప్పుచుండెను. మరియు ఆమె చెప్పెను, “సహోదరుడా బ్రెన్హాం, దయ్యము నా పడక చుట్టు వచ్చినట్లు నేను కలగన్నాను. మరియు వాడు నా వైపు తన కోల ముఖముతో చూస్తూ ఈ విధముగా చెప్పెను, ”ఇప్పుడు నేను నిన్ను పట్టుకొనియున్నాను.“ మరియు చెప్పెను, నేను, నాకు ఏదో సంభవించినది. మరియు నేను పడుక నుండి లేచి మరి చెప్పాను, ”యేసు నామమున ఇచ్చటి నుండి పొమ్ము మరియు నేను అతనిని బయటికి తరిమితిని మరి అతను ఇంటి నుండి బయటికి పరుగెత్తికొని పోయెను. మరియు “దాని అర్థమేమిటో నాకు అర్థము కావటము లేదు,” అని ఆమె చెప్పెను.
పిదప అచ్చట పరిశుద్దాత్మ యుండి దానికి అర్ధం చెప్పెను. దానికి పిదప కొంచెముసేపైనా తరువాత, ఆమె భర్తకు ఒక గుండెపోటు వచ్చెను. మరియు ఆమె తన భర్త పడిపోవుట చూచెను, మరి ఆతను ఒక వృద్ధుడు, భారి వ్యక్తి, మరి అతని చేతులు వెనుకకు వెళ్లి మరి అతని కండ్లు ముసుకొనెను. అతనిని తీసుకోని వెళ్ళుటకు మరణము వచ్చెను, అయితే దేవుడు అతనితో ఇంకా పని ముగించలేదు, మరియు ఆ చిన్నస్త్రీ యొక్క విశ్వాసం పైకి లేచి మరి ఆమె చెప్పెను, “నేను దానికి నిలువలేను! యేసుక్రీస్తు నామములో నేను అతని ప్రాణమును పిలుచుచున్నాను.” అతను స్వస్థత నొందేను. చూచారా?
ఎందుచేత? ఆ ఆరవ ఇంద్రియము పైకి లేచెను, ఆ క్లిష్ట పరిస్థితిలో ఆ సమయమున అది ఆమెకు విశ్వాసమునిచ్చెను. ఆ స్వప్నము యొక్క భావమును ఆమెకు ఇవ్వకున్నను దేవుడు ఆమెకు ఆ కలను ఇచ్చెను. అయితే నేను చెప్పాను, “ఆ కల యొక్క భావము అదే.” మరియు ఆ చిన్న వ్యక్తి కేకలు వేయుచు మరియు దేవుని స్తుతించుచుండెను. ఆమె చెప్పెను, “మరి ఖచ్చితముగా ఆ విధముగా సంభవించినది? చూశారా? అది. ఇప్పుడు, అది కృపలోనికి వెళ్ళెను. చూశారా? అదేమిటని తెలియకున్నను ఆమెకు కలను ఇచ్చెను. అయితే జనులు వారియొక్క స్థానములోనున్న యెడల దేవుడు నమ్మకముగా మరియు కృతజ్ఞుడుగా నుండును.
6
మనము గనుక ఆత్మీయ సంబంధులమై మరి ఆ ఆరవ ఇంద్రియమును ఉపయోగించిన యెడల, మనము. ఓ, మనము ఎన్ని కార్యములను దాటి పోవచ్చును, సంఘము గనుక క్రమములోయున్న యెడల ఎన్ని కార్యములను మనము తెలిసికొనగలము, సంఘములో ఆత్మలు మరియు వరములు పని చేయుచున్నవని మనము తెలిసికొనగలము. అననీయ మరియు సప్పీరాలను మనము ప్రతి చోటను కలిగియుండెదము. అది నిజము. సంఘములో పాపము అనేది లేకుండా యుండెడిది.
అయితే మనము మన ఇంద్రియముతో భూ-సంబంధమైన వాటిని అనుసరించుట వలన, మరి “సరి, నేను గనుక చూడలేకున్న యెడల, నేను గనుక చూడలేకున్న..” మరి అటు పిదప దయ్యము ఆ ఇంద్రియములలోనికి జొరబడును. మరియు అతను మీ కండ్ల ద్వారా దేనినో చూచుటకు అనుమతించును మరి మీరు ఎట్లైనను దానిని నమ్మరు. ఏలయనగా మీరు గ్రుడ్డివారుగా యున్నంత కాలము అనేక సార్లు మీరు మీ కండ్లను మూసికొని యుందురు.
7
ఒకప్పుడు ఒకతను నాతో చెప్పెను, “నన్ను గ్రుడ్డివానిగా చేయుము; నన్ను గ్రుడ్డివానిగా చేయుము! నీవు దైవీక స్వస్థతను పౌలు ప్రసంగించిన అదే పరిశుద్ధాత్మతో నమ్ముచున్నావు. నన్ను గ్రుడ్డివానిగా చేయుము!”
నేను చెప్పాను, నేను దానిని చేయలేను, ఏలయనగా నీవు ఇది వరకే గ్రుడ్డివానిగా యున్నావు? నేను చెప్పాను, “నీ తండ్రియైన అపవాది చాలా కాలము క్రిందట నిన్ను గ్రుడ్డివానిగా చేసెను. (చూశారా?) నీవు ఇది వరకే గ్రుడ్డివానిగా యున్నావు.” ఏలయనగా, పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, అతను గ్రుడ్డివాడని. ఈ సువార్త ఎవరికైనను మరుగుపరచబడి యున్నయెడల, అది గ్రుడ్డివారికి మరుగుపరచబడిన విధముగానే యుండును, మరి వారు వారి ఇంద్రియములము ఉపయోగించుటకు ప్రయత్నింపలేదు. ఇంద్రియము - దేవుడు వారికిచ్చెను. ఆ ఇంద్రియము, అది గనుక ఉపయోగించబడినయెడల, మిగిలిన ఐదు నిరుపయోగమైనప్పుడు అది విమోచించు ఒక ఇంద్రియముగా ఉపయోగపడును. ఈ యొక్క ఇంద్రియము ద్వారా అనేక గొప్ప కార్యములు చేయబడినవి.
ఇచ్చట కొద్ది కాలమునకు మునుపు నా కూటములలో ఒక కూటములో వేదికపైకి ఒక స్త్రీ వచ్చెను. మరియు ఆమెకు కడుపులో పుండు యుండి రక్తము కారుచుండెను. మరియు పరిశుద్ధాత్మ మాటలాడుటకు ప్రారంభించెను. (ఆమెకు తెలుసు, నేను దానిని చేయలేనని) ఆమె ఎవరనియు, ఆమె ఎచ్చటి నుండి వచ్చినదని చెప్పెను. ఆమెకు కడుపులో పుండు యుండెను. పిదప ఆమె ద్వారా ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది చెప్పెను, “ప్రభువు సెలవిచ్చుచున్నాడు, నీవు స్వస్థతనొందియున్నావు” మరి ఆమె గృహమునకు వెళ్ళిపోయెను.
8
మరియు అక్కడ ఒక స్త్రీ యుండెను..... పొరుగువారు ప్రార్థనా వరుసలో నుండిరి. అచ్చటకు వచ్చినప్పుడు ఆమెకు గొంతులో ఒక గడ్డ యుండెను. మరియు ఆమె ప్రార్ధనా వరుసలో వచ్చినప్పుడు, ఆమెకు ఉన్న వ్యాధి ఏమిటనియు, ఆమె ఎచ్చటి నుండి వచ్చినదనియు దానిని గురించి పూర్తిగా చెప్పెను. ఆమె చెప్పెను, “అదంతా నిజమే.”
చెప్పెను, “ప్రభువు సెలవిచ్చుచున్నాడు, నీవు స్వస్థపరచబడితివి.” కావున మరి ఆ ఇరువురు స్త్రీలు ఆ రాత్రి ఒక్కటిగా కలిసి వెళ్ళారు. వారికి ఏ విధమైన బేధము తెలియలేదు.
దానితో మరి ఏ సంబంధము లేదు. మీరు ఏ అనుభూతిని పొందితిరో దానితో ఒక్కవిశాయంకుడా సంబంధము లేదు, మీరు అనుభుతిచెందరో లేదో. ఈ అనుభూతుల నుండి దూరముగా యుండుడి. మీరు గనుక వాటిపైన ఆధారపడినయెడల, మీరు వాటిపైననే యుండలేరు. ఏలయనగా, అది మీరు చూడని, రుచిచూడని, అనుభవించని లేక వినని కార్యముల నిరూపణయై యున్నది. అది ఇంకొక ఇంద్రియము.
9
ఏమి జరిగినది గమనించుడి. సుమారుగా రెండు వారములు గతించినవి. కడుపులో పుండుతో యుండిన ఆ స్త్రీ తినుటకు ప్రయత్నించెను మరి ఆమె చనిపోవు స్థితిలో యుండెను. అయితే ఆమె ఇంకా నమ్ముచుండెను. ఆమె చెప్పెను, “దానిని గురించి అతీతమైన కార్యమొకటి యున్నది. ఏలయనగా ఆ వ్యక్తి నన్ను ఇంతవరకు జీవితములో ఎన్నడూ చూడలేదు. అయినను నేనెవరని అతను చెప్పెను. మరియు అది దైవిక కార్యము, ఏలయనగా అది పరిశుద్ధ గ్రంథముతో పోల్చబడి యున్నది.” చూశారా? మరియు ఆమె చెప్పెను, “నాకు ఆ వ్యక్తిని గురించి తెలియును. అతను ప్రసంగమును నేను వినియున్నాను మరియు అతను చదువుకొన్నవాడు కాడు. ఈ కార్యములను గురించి అతనికి ఏమియును తెలియదు మరి దానిని గురించి అతను అంతా చెప్పెను. మరియు అదే వ్యక్తి ”ప్రభువు సెలవిచ్చుచున్నాడు, అని చెప్పెను, మరియు అతను దేవుని సేవకుడైన యెడల, అతను ఏదో ఊహించుకొని దానిని చెప్పలేదు. నీవు స్వస్థత నొందినావని పరిశుద్ధాత్మ అతని ద్వారా పలికెను.“
మరియు ఆమె ఆ విధముగా చెప్పుచునుండెను, మరియు, ఆమె భర్త ఒక క్రైస్తవుడు, ఆమె బిడ్డలు కూడా. మరియు ఆమె చెప్పెను, మరియు ఆమె తనయొక్క స్నేహితురాలిని చూచుటకు వెళ్ళెను, ఆమె కూడా అటువంటి బాధతోనే బాధపడుచున్నది. అయితే ఇరువురును అది దేవుడని వారి హృదయములలో ఉద్దేశించుకొని యుండిరి; దానిలో ఉన్న విషయము అదే.
10
ఒక ఉదయమున పిల్లలు పాఠశాలకు వెళ్ళిరి, మరియు ఆమె అక్కడ నిలుచుకొని పాత్రలను కడుగుచుండెను. మరియు ఆమె ఏమియు తినుటకు వీలులేకుండా యుండెను, ఏలయనగా ఆ పుండు ఆమెను దహించి వేయుచుండెను. ఆమె పాత్రలను కడుగుచుండెను, మరియు ఆమె చెప్పెను, “ఉన్నట్లుండి ఒక నిజమైన చల్లని అనుభూతి వచ్చెను.” మరియు ఆమె అదేమిటని తలంచుకొనుచుండెను, “అదేమిటి? నాకు ఏదో వింతగా అనిపించుచున్నది. నిజమైన తేలికగానున్నట్లు మరియు చల్లని భావము.” మంచిది, ఆమె పాత్రలను కడుగుకొనుచుండెను.
కొద్ది క్షణములలో ఆమెకు నిజముగా ఆకలి వేసెను. కావున ఆమె టేబుల్ యొద్దకు వెళ్ళి. ఆమె యొక్క పిల్లలు కొద్దిగా ధాన్యపు గంజిని మిగిల్చియుండగా ఆమె ఒక స్పూసుతో దానిని తీసికొని తిని, మరియు కాల్చిన రొట్టెను కొద్దిగా కొరికి తినెను. ఆమె అనుకొనెను, సరి, ఇంకా కొంచెం సేపటిలో ఎప్పుడూ వచ్చేలా నాకు వాంతి వస్తాదని? ఆ విధముగా అనుకొనెను. మొదటగా సంభవించిన విషయమేమని మీరెరుగుదురా, అది వాస్తవమైనదే, ఆ విధముగానే సంభవించినది. ఆమెకు స్వస్థత జరిగెను. అటు పిదప మళ్ళీ ఆమె వెళ్ళి కొంచెం భుజించినది, బాగానే వున్నది, ఆమెకు అది ఒక పండుగవలె వుండి కడుపునిండా భుజించినది. ఆమె వెళ్ళి రెండు గ్రుడ్లను, పంది మాంసమును వేపుకొని భుజించినది. అంతే కాకుండా ఒక కప్పు కాఫీని కూడా త్రాగినది. ఆమె ఆ విధముగా తినుచు గిన్నెలను కడుగుచున్నది. అంతేకాకుండా తన కాళ్ళపై నిలబడి, ఆమె ఎంతో చక్కని అనుభూతితో ఆనందించుచు తన చేతులను పైకెత్తి దేవునికి స్తుతులను స్తోత్రములను చెల్లించుచు ఆమె వీధిలోనికి పరిగెత్తుకొని వెళ్ళినది. తనకు ఏమి సంభవించినదో దానిని తెలుపుటకు ఆమె తన సహోదరి యొద్దకు వెళ్ళుచున్నది.
ఆమె అచ్చటికి వెళ్ళినప్పుడు, ఈ దీన స్త్రీ అందరివలె చక్కగా నడుచుచు కనిపించినది, “మంచిది, సహోదరీ నీకేమి సంభవించినది?” అని అడిగినది.
“చూడు, అది నా మెడ నుండి వెళ్ళిపోయినది, అదే విధముగా జరిగినదో నాకు తెలియదు, దానిని నేను కనుగొనలేకపోతున్నాను, నాకు ఏ మాటలు రాక జవాబు చెప్పలేకపోతున్నాను.” అది పోయినదని ఆమె చెప్పెను.
అదేమిటి? “లేదు” అనే పదమే లేని దేవుని వాక్యము యొక్క ఆరవ ఇంద్రియమును వారు పట్టుకొన్నారు. సుమారుగా అది సంభవించిన రెండు నెలలకు పిదప వారు కూటమునకు వచ్చి మరి వారేవిధముగా స్వస్థత నొందినారని నాకు చూపి మరి సమస్తమును చెప్పారు. అదేమిటి? ఆరవ ఇంద్రియము, ఆ ఆరవ ఇంద్రియము, శక్తివంతమైన ఇంద్రియముగా అది పరిగణింపబడుచున్నది, అది వారిని విడిపించినది. నేను ప్రార్ధించినందువలన కాదు గాని, అయితే వారు దానిని నమ్ముటవలననే జరిగినది. అదే. అది చేసినది.
11
ఇప్పుడు వారు ఇండియానాపోలిస్లో నుండు కేడెల్ గుడారములో నుండిరి లేక ఇండియానాపోలిస్కు వెళ్ళు దారిలో యుండిరి. పోలియో కలిగిన ఒక బాలుడు వారికుండెను. మరియు వారు తీసికొని వచ్చిరి. సహోదరుడు రెడీగార్ కుమార్తె అక్కడ బొగ్గుల షెడ్లో యుండెను. ఆమెకు మతి స్థిమితము లేనందువలన వారు ఆమెను పట్టుకొనిరి.
పోర్ట్ వెన్ సువార్త గుడారము యొక్క కాపరి బి. ఇ. రెడీగార్ను ఇచ్చట ఎందరికి జ్ఞాపకము ఉన్నది? ఓ, స్వస్థతను నమ్ము వ్యక్తులను గురించి మాట్లాడుచుండగా... సహోదరుడు బోస్వర్త్... అతడు మీకు జ్ఞాపకమున్నాడా? డాక్టరు, సులివన్? మరియు ఒక చక్కని వ్యక్తి.
మరియు అతని కుమార్తె అక్కడ కూర్చొని యుండెను, ఆమె సహోదరి మతి స్థిమితము లేక చనిపోయెను. మరియు ఆమె ఒక మంచి స్త్రీ, అది ఈస్టరు ఉదయము. మరియు ఆమె తల్లి కూడా అచ్చట కూర్చొని యుండెను. నేను ప్రార్ధనా వరుసకు వెళ్ళి ప్రార్ధించిన పిదప, ఎవరో చెప్పారు, “ఆ బొగ్గుల షెడ్లో ఇచ్చట ఒక స్త్రీ యున్నది - సంఘములో తన కుమార్తెతో యున్నది.” అని చెప్పిరి, “ఆమె శ్రీమతి. బి. ఇ, రెడీగార్, ఫోర్టీ వేన్ సువార్త గుడారము నుండి వచ్చియున్నది.”
నేను తలంచాను, “ఏమిటి, బి. ఇ. రెడిగర్ యొక్క భార్య మరియు కుమార్తె నాయొక్క బొగ్గుల షేడ్లో యున్నారా?” మరియు నేను వెలుపలికి వెళ్ళి అచ్చటికి వెళ్ళాను.
మరియు వారు అక్కడ చిన్న బల్లలో కూర్చొనియున్నారు, ఆ బల్లలు ఆదివారపు పాఠశాల నుండి బయటికి వేయబడినవి, వారు కాగితములను పట్టుకొని యుండిరి. ఇంచుమించు పదునెనిమిది ఇరువది సంవత్సరములు వయస్సు గల అందమైన అమ్మాయి అక్కడ కూర్చోనియుండెను, తన వెంట్రుకలను ఈ విధముగా లాగుకొనుచు మరియు చెప్పుచుండెను, “ఐదు పైసలు ఐదు పైసలే, ఒక పైసా ఒక పైసానే. ఐదు పైసలు ఐదు పైసలే. ఒక పైసా ఒక పైసానే. ఒక పైసా దాచినచో - ఒక పైసా సంపాదించినట్లే, ఒక పైసా దాచినచో. ఐదు పైసలు పోయినట్లయితే, ఐదు పైసలు పోయినట్లే.” ఆ విధముగా మతి-స్థిమితము లేక ఆమె వెంట్రుకలు లాగుకొనుచునుండెను...
12
నేను అడిగాను, “శ్రీమతి రెడిగర్.” నేను అడిగాను, “నీవు శ్రీమతి. రెడిగర్ కదా?”
ఆమె చెప్పెను, “అవును, నేనే ఆమెను.”
మరియు నేను చెప్పాను, “నేను బ్రెన్హాం సహోదరుడను.”
ఆమె చెప్పెను, “మంచిది, సహోదరుడు బ్రెన్హాం, మిమ్ములను సంధించుటకు నేను చాలా ఆనందించుచున్నాను.”
నేను చెప్పాను, “నీ భర్తచే నాకు ఎంతో గౌరవము గలదు, నా చిన్నప్పటి నుండే నాకు ఆయనంటే నా మనస్సులో ఒక ప్రత్యేకమైన అభిమానము వుండెడిది. అతడు అంతటి ఒక గొప్ప వ్యక్తి.” ఆమె దుఃఖించుచున్నది. నేను అడిగాను, “ఈమె అతని కుమార్తెయా?”
చెప్పెను, “అవును, బ్రెన్హాం సహోదరుడా, ఆమెను అనేక చోట్లకు తీసుకొని వెళ్ళాము గాని ఎచ్చటా ఏమి చేయలేకపోయిరి. మరియు ఆమె సహోదరి రోమైన్ చనిపోయెను.”
నేను అడిగాను, “రోమైన్ ఆ జబ్బుతో చనిపోయెనా” నేను చెప్పాను, “మీయొక్క ఛాయా చిత్రములు మరియు సమస్తమును, సహోదరుడు రెడిగర్ వ్రాసిన జీవించు జలములను గురించిన మీయొక్క పుస్తకములు మరియు మొదలగునవి మా గృహములో గలవు.” నేను చెప్పా, అంతెందుకు, నేను చాలా చిన్న బాలునిగా వున్న సమయమందే అతను ఒక గొప్ప వ్యక్తిగా నుండెను. అతనిని గురించి నేను రేడియోలో వినుచుంటిని. నేను అడిగాను, “ఈమె అతని కుమార్తెయా.”
“ఈమె అతని కుమార్తెయే,” అని చెప్పెను.
13
నా పైకి ఏదో వచ్చెను. ఆమె తండ్రి చనిపోయి మరి పాతిపెట్టబడెను. నేను నడచి వెళ్ళి. ఆ ఆరవ ఇంద్రియము కదలాడుటకు ప్రారంభించెను. నేను చెప్పాను, “సాతానా, నీవు ఆమెను ఇకమీదట బంధించి యుంచుటకు వీలు లేదు. యేసు క్రీస్తు నామములో ఆమె నుండి బయటికి రమ్ము.”
కావున తల్లి అనెను.....ఆమె చెప్పెను, “నేనేమి చేయవలయును?”
నేను చెప్పాను, “ఆమె స్వస్థత నొందియున్నది; ఆమెను ఇంటికి తీసికొని వెళ్ళుము.”
ఆమె ఇంకా ఆ విధముగానే అచ్చట కూర్చొనియుండెను, “ఐదు పైసలు ఐదు పైసలే, ఒక పైసా సంపాదించినచో, ఒక పైసా పోవును,” మరియు ఆమె ఆ విధముగా చెప్పుకొంటూ ఏదో చేస్తున్నది. వారు ఆమెను ఇంటికి తీసికొని వెళ్ళిరి. మరియు తదుపరి దినమున ఆమె తన యధా స్థితికి వచ్చి, అందరి స్త్రీలవలె ఆమె కూడా చక్కని స్త్రీగా మారి మరియు వివాహము జరిగి ఒక గుంపు పిల్లలతో ఇప్పుడున్నది. అదేమిటి? ఆరవ ఇంద్రియమును పట్టుకొనుట.
14
కొద్ది కాలమునకు క్రితము (ఆరవ ఇంద్రియము ఏ విధముగా క్రియ చేయుననేదానికి ఈ సాక్ష్యము ఒక ఋజువుగా కావలెనని మీరు ఆశించినయెడల) నేను 505 విక్టరు వీధి, లిటిల్ రాక్, ఆర్కన్సాస్లో సహోదరుడు జి.హెచ్. బ్రౌన్తో యుంటిని, మరియు అచ్చట నేను నా జీవితములో చూచిన ఘోరమైన సంభవములలో ఒకటిగా దానిని చూశాను. (చాలా సేపుగా నేను ప్రార్థనా వరుసలో నిలుచుకొని ప్రార్ధించిన పిదప కొద్ది విరామ సమయమున నేనుండగా) సహోదరుడు బ్రౌన్ చెప్పెను, “సహోదరుడు బ్రెన్హాం, ఈ భవనము యొక్క క్రింది భాగమున (Basement) నున్న ఈ ఆడిటోరియమ్లో నీవు చూచిన దృశ్యములలో అది ఒక భయంకరమైన దృశ్యమై యున్నది.” అని చెప్పెను, “మిస్సీసిప్పిలో యున్న ఆ స్త్రీ పిచ్చి నుండి స్వస్థత నొందినది; ఆమె యొక్క కుమారుడు ఒక సైనికుడు; ఆమె అచ్చట ఇరువది సంవత్సరములు యుండెను; ఆమెకు ఒక కుమారుడుగలడనే సంగతి కూడా ఆమెకు తెలియదు. నేను ఆమె కొరకు ప్రార్ధించుచుండగా ఆమె మరలా చక్కని యధా స్థితికి వచ్చెను. అది నిప్పంటుకొనుట వలన కాలుటకు ప్రారంభించినది. అటు పిదప . అతడు ”ఇదిగో దీనివైపు చూడు,“ అని చెప్పాడు. మరియు నేను క్రిందికి వెళ్ళితిని, మరి అచ్చట బరువైన భారీ-శరీరము గల స్త్రీ యవ్వన స్త్రీ ఆమె కాళ్ళు నిటారుగా పైకి చాపుకొని యున్నది, ఆ పిచ్చి వైద్యశాలలో ఆమెపై వారు ధరించిన దుస్తులను ఆమె ధరించుకొని యుండెను, ఏలయనగా ఆమె ఎన్నడును తన కాళ్ళపై నిలబడియుండలేదు, రెండు సంవత్సరములుగా కాళ్ళపై నిలువబడలేదు. ఆమె కాళ్ళు నుండి మరియు చేతుల నుండియు రక్తము కారుచుండెను. మరియు ఆమె కాళ్ళు పైకి చాపుకొని పండుకొని యుండెను, చేతులు కూడా పైకి చాపుకొని యుండెను.
మరియు నేను ఆ మనుష్యుని అడిగాను, “ఆమెకు ఏమి సంభవించినది?”
చెప్పెను, “సహోదరుడా బ్రెన్హాం, ఆమెకు మతి చలించినది. ఆమె నాకు ఒక కుమారుడిని కనినది. కుమారుడిని కనిన పిదప ఒక ఇంజక్షన్ను వేసిరి, అటు తర్వాత ఆమెకు ఏదో సంభవించినది,” “అది ఆమె యొక్క మనో స్థితిని దెబ్బతీసి మతి స్థిమితం లేకుండా చేసినది? అని అతడు చెప్పెను.” “ఆమె ఇప్పటికి రెండు సంవత్సరములుగా ఆ పిచ్చాసుపత్రిలోనే యున్నది,” మరియు చెప్పెను.
నేను అడిగాను, “ఆమెకు ఎందులకు రక్తము కారుచున్నది?”
“ఆ పిచ్చాసుపత్రిలో నుండి వారు ఆమెను వెలుపలికి తీసుకొని రాలేకపోయిరి, అని అతడు చెప్పెను,” “అంతేకాకుండా వారు ఒక అంబులెన్స్ను కూడా తీసుకొని వచ్చి ఎక్కించలేకపోయిరని, ఎందుకనగా ఆమె అంత భయంకరముగా యున్నది.” అతడు చెప్పెను. “అప్పుడు నేను ఒక సహోదరుడి యొక్క సహాయముతో ఒక చెవర్లెట్ కారును అద్దెకు తీసుకొని మరియు దానితో పాటు నలుగురు మనుష్యులను మాతో తీసుకొని వెళ్ళుటకు మాట్లాడి కుదుర్చుకున్నాము. ఆమెను కారులో సీటులో కూర్చొండబెట్టుటకు బహుగా శ్రమపడితిమి. ఆమె తన కాళ్ళుతో ఆ కారు అద్దములను ఒక తన్ను తన్నుట వలన ఆ అద్దములు పగిలిపోయినవి? అని అతడు చెప్పెను. (ఆ పిచ్చాసుపత్రి నుండి ఇచ్చటికి సుమారు తొంబది మైళ్ళు).”
మరియు నేను అడిగాను, “మరి ఆ విధముగా ఆమెకు రక్తము కారు చున్నదా?” నేను చెప్పాను,
“సరి, నేను అచ్చటికి వెళ్లి మరి నా చేతులను ఆమెపై యుంచెదను.”
అతను చెప్పెను, “ఓ, మీరు దానిని చేయవద్దు.” చెప్పెను, “ఆమె మిమ్ములను చంపివేయును.”
సరి, నేను వాక్య పరిచర్యలో ఇంకా అనుభవము లేనివానిని, నేను ఒక సంవత్సరమే ఈ పరిచర్యలో యున్నాను. మరియు నేను తలంచాను, “దేవా, దానిని నీ అధీనంలోకి తీసికొనుము.” నేను నడుచుకుంటూ వెళ్ళాను. మరి ఆమె తన చేతలును పైకెత్తెను. నేను అడిగాను, “సహోదరి ఎట్లున్నావు.”
15
మరియు నేను ఆమెను గమనించుచుండుట చాలా మంచిదైనది. ఆ గొప్ప బలమైన చేతులు (దయ్యము ఆవరించియున్న వ్యక్తులు పదింతల బలము కలవారై యుందురు). మరియు ఆ విధముగా కదలినప్పుడు బలముగా ఆమె ఒక విదిలింపు విదిలించి, ఆమె చివుక్కున నన్ను గట్టిగా లాగుటవలన నా కాళ్ళు పట్టు సడలినవి. నా కాళ్ళు ఆమె రొమ్ములకు అడ్డగముగా తగిలినవి. మరియు ఆమె నన్ను పట్టుకొని లాగుటచే నా చేతులు పట్టును సడలినవి. మరియు నేను ఆమె యొద్ద నుండి పరిగెతుకొని పారిపోయాను. మరియు ఆ మెట్లపైన ఆ విధముగా పరుగెత్తికొని వెళ్ళాను మరి ఆమె భర్త అక్కడ నిలుచుకొని యుండెను.
మరియు ఆమె తన వీపును నేలకు ఆన్చి పామువలె ప్రాకుచు నా వెనుక నన్ను వెంటాడుచూ వచ్చినది. వీపుతో క్రింద పండుకొని ఆమె తన చేతులను కాళ్ళను పైకెత్తుకొని నన్ను తరముకొని వచ్చెను. నాకు ఇంకా కూడా ఆ వికారమైన భయంకరమగు శబ్దము వింటునట్లుగానే యున్నది. నేలపై అడ్డముగా చర చరమని ప్రాకుకొనుచూ వచ్చుచున్నది. ఆమె సుమారుగా వంద, డెబ్బది పౌండ్ల బరువు కలిగియుండెను మరియు ఆమె ఆ విధముగా ప్రాకుచు వచ్చుచున్నది. ఆమె తిన్నగా అచ్చటికి వచ్చి మరల తిరిగి తన పెద్ద బలమైన కాళ్ళతో ఆ గోడను ఒక్క తన్ను తన్ని బలముగా గోడను తన్నెను, ఆ విధముగా చేయునప్పుడు అచ్చటనున్న ఒక బల్లపై గ్రుద్దుకొనినది. మరి తన తలను వేసి కొట్టుకొనెను, ఆమె తలపై చర్మము చిట్లి రక్తము కారుటకు మొదలిడెను. మరియు ఆమె ఆ విరిగిన బల్లనుండి ఒక కట్టను తీసికొని మరి ఆ కట్టును తన భర్తపై విసిరి మరియు గోడపై కొట్టుచుండగా ఆ గోడపై సిమెంటు రాలెను. మేము తప్పించుకొనుటకు మా తలలను వంచితిమి. అతను చెప్పెను, నేను మీకు చెప్పితిని కదూ?
నేను చెప్పాను, “నా యొక్క జీవితములో ఇటువంటి దానిని ఎన్నడును నేను చూడలేదు.”
“అదేమిటి, సహోదరుడా బ్రెన్హాం?” అని అతడు అడిగెను.
“అది దయ్యము,” అని నేను చెప్పాను.
మరి అప్పుడే ఆమె ప్రాకుచు నా యొద్దకు వచ్చి మరి “విల్లియం బ్రెన్హాం, నీకు నాతో ఏ పని లేదు. నేను ఆమెను ఇచ్చటికి తీసికొని వచ్చియున్నాను,” అని చెప్పినది.
మరియు ఆమె భర్త దానిని చూచి మరి చెప్పెను, “ఏల, అసలు ఆమె ఎవరనేది ఆమెకు తెలియదు. ఆమె నిన్ను ఎరుగదు.”
మరియు “అది ఆమె కాదు; అది దయ్యము. అది ఆ దయ్యము,” అని నేను చెప్పాను.
మరియు నేను చెప్పాను, “సాతానా, నీపై నాకు ఎటువంటి అధికారము లేదని నీవు ఎరుగుదువు. కాని నాపై అధికారము నా ప్రభువుకు యున్నది, ఏలయనగా ఆయన కల్వరిలో నీపై జయమును పొందియున్నాడు. మరియు దూత ద్వారా నాకు ఇవ్వబడిన దైవిక వరము ద్వారా నాకు ఈ విధముగా చెప్పబడెను, నీవు గనుక జనులు నిన్ను నమ్ములాగున చేయగలిగినయెడల, నీ ప్రార్థనకు ముందు ఏదీ కూడా నిలువజాలదు. మరియు నేను చెప్పాను, ”యేసు క్రీస్తు నామములో ఆమె నుండి బయటికి రమ్ము.“ ఏ విధమైన మార్పులేదు.
16
ఆమె యొక్క భర్త తన కోటు ధరించుకొని మరి నా మెడ చుట్టూ తన చేతులను వేసి నన్ను హత్తుకొని “సహోదరుడా బ్రెన్హాం నేను ఆమెతో ఏమి చేయవలెను?”
నేను చెప్పాను, “వారు గనుక మరలా ఆమెను పిచ్చాసుపత్రిలో చేర్చుకోగలిగిన యెడల అచ్చటికే ఆమెను తీసికొని వెళ్ళుము.”
“మంచిది, మీరేమనుకొనుచున్నారు?” అని అడిగెను.
నేను చెప్పాను, “అది నేనేమి తలంచుచున్నానని కాదు, నీవేమి తలంచుచున్నావు?”
అతను చెప్పెను, “ఆమె స్వస్థత నొందునని నేను నమ్ముచున్నాను.”
నేను చెప్పాను, “నీవు చేయవలసినదంతయు అదే.”
“ఆమె స్వస్థత నొందునని నేను నమ్ముచున్నాను.” ఆ రోజు రాత్రి వారు తిరిగి వెళ్ళుచుండగా ఆమె వారినేమీ ఇబ్బంది చెయ్యలేదు. ఆ మరుసటి దినపు ఉదయమున వారు ఆమెను తీసికొని వెళ్ళుటకు వచ్చినప్పుడు, ఆమె చక్కగా కూర్చొని ఆ వైద్యశాల యజమానురాలితో మాటలాడుచుండెను. మరి దాని మరుసటి దినమున ఆమె వైద్యశాల నుండి చక్కగా స్వస్థతనొంది మరి చక్కగా తన గృహమునకు వెళ్ళిపోయినది.
17
దానికి పిదప సుమారు ఆరు నెలలకు తరువాత నేను ఆర్కన్సాస్లోనున్న జోన్స్ బోరో (ఒక స్థలము పేరు), రిచర్డ్ రీడ్తో పాత రకపు ఉజ్జీవ కాలపు గుడారములలో యుంటిని, జోన్స్ బోరో, ఆర్కన్సాస్, అది ఒక పెద్ద బాప్తిస్తు గుడారము, ఇచ్చటికన్నను అధిక కుర్చీలు కూర్చొనుటకు అచ్చట కలవు. మరియు నేను ప్రసంగించుటకు ప్రారంభించితిని మరియు ఎవరో నా వైపు చేతులు ఊపుచు నుండిరి మరి అది ఎవరో నాకు తెలియకుండెను. మరియు ఆమె ఇక ఓపిక పట్టలేక ఆమె చెప్పెను, “మీకు నేను జ్ఞాపకమున్నానా?” అచ్చట నాలుగు లేక ఐదుగురు చిన్న పిల్లలు యుండిరి.
మరియు నేను చెప్పాను, “నాకు జ్ఞాపకమున్నట్లు లేదు.”
ఆమె చెప్పెను, “నేను కూడా మిమ్ములను ఇంతకు మునుపు చూడలేదు.” ఆమె చెప్పెను, “అయితే వీపుతో క్రింద పండుకొని ప్రాకుచు మిమ్మల్ని వెంటాడుకొంటూ వచ్చిన ఆ స్త్రీని నేనే.” మరియు ఆ ఆరు నెలలలో ఆమె భర్త దేవుని సేవకై పిలువబడి మరి సువార్తను ప్రసంగించు చుండెను. ఓ, మై!
అదేమిటి? ఆ ఆరవ ఇంద్రియమును పట్టుకొనియుండుట, విశ్వాసము దానిని చెప్పెను. ఆయన చెప్పెను, “దానిని నేను నా హృదయములో ఉ౦చుకొన్నాను. దేవుడు గనుక ఇతరులకు అటువంటి కార్యమును చేసినయెడల, నా భార్యకును అది ఆయన చేయును.” అతను దానిని గట్టిగా పట్టుకొనియుండెను. దాని నుండి అతనిని ఎవరూ వేరుచేయలేరు. మరి ఆరవ ఇంద్రియమును గనుక ప్రయోగించబడి మరి ఆ ఆధీనపరచు శక్తి గనుక దాని నుండి క్రియ చేయుటకు అనుమతింపబడిన యెడల అది ఆ విధముగా చేయును.
18
ఒక రాత్రి నేను ఇంటికి వచ్చాను; నేను పండుకొని యుంటిని. మీరు గనుక ఈ సాక్ష్యములకై వ్రాసిన యెడల, నేను చిరునామాలు ఇచ్చుచున్నాను. మీరు మిల్ టౌన్, ఇండియానాలోనున్న జార్జి కార్టర్కు వ్రాయుడి, మరి ఆ ఉత్తరము ఆమె ఇంటి చిరునామాకే వెళ్ళును; జార్జి కార్టర్, మిల్ టౌన్, ఇండియానా, మరియు దైవిక స్వస్థతను నమ్మని ఒక సంఘమునకు ఆమె చెందినది. ఆమె ఒక చిన్న బాలికగా నున్నప్పుడు పియోనా పాఠములు నేర్చుకొనుచుండెను, మరియు ఆమె మావయ్య ఆమెను ఆ పాఠములు నేర్చుకొనుటకు తీసికొని వెళ్ళుచుండెను. మరియు అతను దీనిని చేసినప్పుడు, అతను ఒక పెద్ద ఎదిగిన వ్యక్తిగా యుండెను. మరి ఆమె ఒక చిన్న బాలిక, ఆ బాలికను అతడు మానభంగము చేసెను. మరి ఇది ఆమెకు సంభవించినప్పుడు ఆమెకు టి.బి వచ్చెను. ఆమె తన వెనుక భాగమున స్త్రీ గ్రంథులలో మరియు ఆమె శరీరమంతయును, ఊపిరితితులలోను టి.బి, వ్యాపింపగా పడుకలో తొమ్మిది సంవత్సరములు మరియు ఎనిమిది నెలలు పండుకొని యుండెను. మరియు ఆమె సుమారుగా ముప్పది ఏడు పౌండ్లు బరువు కలిగియుండెను. మరియు ఆమె బరువు అంతేయని నేను అనుకొనుచున్నాను.
ఇప్పుడు, మీరు గనుక ఆమెకు వ్రాయవలయుననియున్న యెడల వ్రాయ వచ్చును. అది మీ యొక్క ఇష్టము. ఆమె తిరిగి మీకు సంతోషముగా జవాబు వ్రాసి పంపును. మరియు నాకు ఆ బాలికను గురించి ఏమియూ తెలియదు. మరియు నాకు మిల్ టౌన్ ఎచ్చట ఉన్నదో అని కూడా తెలియదు.
మరియు నేను ఇంటిలోనికి వచ్చితిని మరి తల్లిని చూచితిని. మరియు నేను చెప్పాను, నేను ఈ రాత్రి త్వరగా నీవు నిద్రపోవాలనుకుంటున్నాను, ఏలయనగా, నేను లోనికి వెళ్ళి ప్రభువును ధ్యానింపవలయునని ఆశించుచున్నాను.“
“అలాగే మంచిది, బిల్లీ, లోనికి వెళ్ళి పండుకొనుము,” అని ఆమె చెప్పెను.
19
నేను గదిలోనికి వెళ్ళి మరియు చాలా సేపు ప్రార్థించుచుంటిని, మరియు కొద్దిసేపైన తరువాత నేను అచ్చట చూశాను. మరియు నా తల్లి ప్రాచీన కాలపు పల్లెటూరి స్త్రీలవలె బట్టలు ఉతికి మరి ఒక కుర్చీపై వేయును (స్త్రీలైన మీరు దానిని చేసెదరో లేదాయని నాకు తెలియదు) ఆ బట్టలు ఇస్త్రీవేయు వరకు ఆరవేయును మరి అక్కడ కాళ్లకు చెప్పులు లేకుండా నిలుచుకొనియుండును. మరియు నేను, మా తల్లి అక్కడ కుర్చీలు వేసి అక్కడ ఇంటిలోయున్న మా మగ పిల్లల యొక్క బట్టలన్నియును ఆరవేయును. మరియు అప్పుడు నేను ఇంటిలో యుంటిని. అది నేను నా భార్యను పోగొట్టుకొనిన తరువాత జరిగిన సంభవమది.
మరియు నేను చూచుచుండగా ఆ కుర్చీ నా వైపుకు వచ్చుచున్నట్లుగా కనిపించినది. మరియు నేను చూచినప్పుడు అది నా వైపుకు వచ్చుచున్న ఒక వెలుగుగా అది కనబడుచున్నది. మరియు అది నాకు సమీపముగా వచ్చినప్పుడు, నేను ఒక అరణ్యములోకి వెళ్ళుచున్న అనుభూతిని పొందుచున్నాను. మరియు నేను ఒక చిన్న గొర్రెపిల్ల “బాబా, బాబా,” యని అరచుచున్నట్లుగా కేకలను వినుచున్నాను. మరియు నేను తలంచితిని, “ఓ, ఆ దీన చిన్నది ఎక్కడో చిక్కుకొని యున్నది.” మరియు నేను ఆ పొదల ద్వారా దానిని కనుగొనుటకు ప్రయత్నించితిని, మరియు దాని సమీపమునకు నేను వెళ్ళగా, నేను మరల దానిని వింటిని; నేను చెప్పకొంటిని, “అదెచ్చట యున్నది.” నేను తలంచాను, “ఆ దీనమైన చిన్న గొర్రెపిల్ల” మరియు నేను చాలా దగ్గరగా వెళ్ళి పొదలను తోసికొనుచు వెళ్ళి చూచితిని, మరియు అది బాయని అరచునప్పుడు, “మిల్ టౌన్, మిల్ టౌన్, అని వినిపించెను. మరియు అదేమిటాయని నేను కనుగొనుటకు ప్రయత్నించుచుంటిని, మరియు నేను ఆ దర్శనము నుండి బయటికి వచ్చితిని. నేను తలంచితిని, ”మిల్ టౌన్ ఎచ్చట ఉన్నది? నేను తలంచితిని, “మిల్ టౌన్లో ఏదో విషయమున్నది. ఏదో గొర్రెపిల్ల అక్కడెక్కడో చిక్కుకొని యున్నది, అదెక్కడో.”
20
మరియు నేను బయటికి వెళ్ళి, మరి బుధవారము రాత్రి మిల్ టౌన్ అను స్థలము ఎవరికైనను తెలియునా అని నా సంఘమును అడిగితిని. ఎవరికిని అది తెలియదు. సరి, ఆదివారము మరల నేను అడిగితిని, '' మిల్ టౌన్ యను పేరు గల చోటు ఎవరికైనను తెలియునా?“ జార్జ్ రైట్ (అనేక సంవత్సరములుగా సంఘమునకు వచ్చు జార్జి రైట్ను గురించి గుడారములో అనేకులకు తెలియును), అతను చెప్పెను, ”ఎందుకని, సహోదరుడా బ్రెన్హాం,“ అని అడిగెను. ”అక్కడ దక్షిణముగా ఇచ్చటి నుండి సుమారుగా ముప్పది ఐదు మైళ్లకు ఒక చిన్న నగరము మిల్ టౌన్, అక్కడున్న ఒక చిన్న కొండపైన అది యున్నది.“ అని చెప్పెను, ”అదెచ్చట యున్నదని నేనెరుగుదును.“
నేను అడిగాను, “అచ్చటికి నీవు నన్ను తీసికొని వెళ్ళెదవా?”
అతను చెప్పెను, “నేను తీసికొని వెళ్ళెదను.”
“సరి, పిదప వచ్చే శనివారము నేను అచ్చటికి వెళ్ళెదను,” అని నేను చెప్పాను.
21
మంచిది, నేను మిల్ టౌన్కు వెళ్ళాను. మేము అచ్చటికి వెళ్ళాము; వారు అచ్చట రెండు చిల్లర సామానుల అంగళ్ళు కలిగియుండిరి. మరియు జనులు అచ్చటికి వారి వాహనములలోను మరియు బండ్లలోను వచ్చుచుండిరి (కెంటకీలో కొండల ప్రదేశములలో వారు చేయునట్లుగా) మరియు నేను తలంచితిని, “సరి, ఇచ్చట నాకేమీ కనబడుట లేదు.” నేను లోనికి వెళ్ళి మరి ఒక మనుష్యుని అడగితిని, అతనియొద్ద నుండి ఒక చిన్న చెక్క పెట్టెను కొనగలనాయని.
“సరి, నీవు ఆ చెక్క పెట్టెను కొని దానితో ఏమి చేస్తావు?” అని అతడు అడిగెను.
నేను చెప్పాసు, “అచ్చట అనేకులు నిలుచుని యున్నారు; నేను ఈ చెక్క పెట్టెతో వేదికవలె చేసి నిలుచుకొనెదను. నేను ఒక ప్రసంగిని. నేను ప్రసంగించాలని ఆశించుచున్నాను.”
అతను చెప్పెను, “నీవు నాకు ఏమియు ఇవ్వనక్కర లేదు. అది అచ్చటకు తీసికొని వెళ్ళుము. అది నిజము.”
22
మరి కావున, నేను ఆ పెట్టెను తీసుకొన్నాను. మరియు నేను నా పెట్టెను తీసికొనిపోవుచుండగా, సహోదరుడు రైట్ వచ్చుట నేను చూచితిని. అతను చెప్పెను, “సహోదరుడా బ్రెన్హాం, ఇచ్చటనున్న కొండపై నేను కొద్దిగా కొన్ని వస్తువులు కొనవలయును.” చెప్పెను, “నీవు గనుక కోరినయెడల, నీవు నాతో కూడా రావచ్చును.”
నేను చెప్పాను, “అది మంచిది. నేను నా పెట్టెను అచ్చట యుంచితిని నేను తిరిగి వచ్చులోపల ఇంకా ఎక్కువ మంది జనము కూడుకొనెదరను ఉద్దేశముతో.” మరియు నేను కొండపైకి వెళ్ళాను, మరి మేము ఒక పెద్ద, పాత తెల్లని చర్చిని దాటుకొని వెళ్ళాము. నేను అడిగాను, “అదెటువంటి సంఘము?”
“అది పాత బాప్తిస్టు సంఘము,” అని అతను చెప్పెను, “అచ్చట ప్రసంగి కొన్ని ఇబ్బందులలో చిక్కుకున్నాడు. మరియు.” చెప్పెను, “అతను ఒక ముఠా నాయకునిగా మారి మరి ఎవరో ఒక వ్యక్తి యొక్క భార్యను మానభంగము చేసెను మరి వారు అతనిని కాల్చివేసిరి. మరియు ఆ విధముగా సమస్య పెరిగెను. సంఘమంతయును చెదరిపోయెను. మరియు చెప్పెను, ”వారికి అప్పటినుండి సంఘము లేకుండా పోయెను.“
23
సరి, మరి నేను అతనితో సంఘమంతయును చుట్టి చూచుటకు వెళ్ళాను. మరియు నేను ఆ విధముగా చేసినప్పుడు ఏదో చెప్పెను, “ఆ చర్చికి వెళ్ళుము.” మరియు నేను అచ్చటకి వెళ్ళాను, మరి అతను.
నేను చెప్పాను, “నీవు కొండపైకి వెళ్ళి వచ్చువరకు నేనిచ్చటనే నిలుచుకొని యుండెదను.”
అతను చెప్పెను, “అది సరి,”
నేను చెప్పాను, వారికి ఇక్కడ చర్చి లేదా?“
“లేదు.”
నేను ఆ చర్చి తలుపులు తెరచుటకు ప్రయత్నించితిని మరియు ఆ తలుపులు తెరుచుకోలేదు. నేను అడిగాను, “పరలోకపు తండ్రీ, నీవు నన్ను పిలుచుటలో ఈ సంఘమును గురించి కార్యమేదైనను యున్నాదా? పొదలలో చిక్కుకొని యున్నది ఈ సంఘమేనా? మిల్ టౌన్ యని నీవు కేకలు వేయుట దీనిని గురించేనా? నీవు గనుక ఈ స్థలమునకు నేను వెళ్ళాలని ఆశించినయెడల నా కొరకు తలుపులు తెరువుము. నేను తలుపును పట్టుకొన్నాను; అది తెరుచుకోలేదు. సరి, మెట్లపైన కూర్చొంటిని.
మరియు ఆ సమయమున ఎవరో ఒక వ్యక్తి ఆ చర్చి ప్రక్కగా నడచి వచ్చుచుండెను. అడిగెను, “మీరెట్లున్నారు.”
నేను చెప్పాను, “మీరెట్లున్నారు, అయ్యా?”
అతను అడిగెను, “నీవు చర్చిలోనికి పోదలుచుచున్నావా?”
మరియు నేను చెప్పాను, “అవును అయ్యా.”
అతను చెప్పెను, “నా యొద్ద తాళపు చెవి గలదు,” అని అతను తలుపు తెరచెను.
24
నేను అచ్చట చుట్టూ చూచి మరి నేను అడిగాను, దీనికి సొంతదారుడు ఎవరు?“
చెప్పెను, “నగరము.”
నేను అడిగాను “వారు గనుక ఇచ్చట కొన్ని కూటములను ఏర్పరచుకొనిన బాగుండును కదూ?”
చెప్పెను, “దానికి అనుమతించు వారి యొద్దకు వెళ్ళి వారిని అడిగి చూడుము.”
మరి పిదప నేను అచ్చటికి వెళ్ళి, నేను ప్రభుత్వ సంస్థలో పని చేయుచున్నాను, నేను స్వయముగా ఒక మీటరు పెట్టి కొన్ని ఆరాధనలను అచ్చట జరిపించవలెనని ఆశించుచున్నాను.“
చెప్పిరి, “నీవు దానికి అద్దెను ఇవ్వనక్కర లేదు, నీవే అంతా చూచుకొనుము. జాగ్రత్తగా చూచుకో.”
మరియు నేను చెప్పాను, “చాలా వందనములు అయ్యా; నేను దానిని చేసెదను.”
మరియు నేను దానిలోనికి వెళ్ళి, ఒక మీటరు దానిలో పెట్టి, ఒక ఉజ్జీవమును ప్రారంభించితిని. మొదటి రాత్రి, “దేవుడు ఒక, యేసు క్రీస్తు నిన్న, నేడు, మరియు ఎన్నటికిని మారనివాడు. దేవుడు దేవుడుగా యుండును. మరియు సహోదరుడు హాల్. అచ్చట ఒక చిన్న కాగితములో ఒక వ్యక్తి ఏదో వ్రాసెను.. లేక సహోదరుడు హాల్ కాదు; సహోదరుడు రైట్ అచ్చట ఒక చిన్న కాగితములో ఏదో వ్రాసి మరి చెప్పెను, ”వచ్చి, ఒక చిన్న బిల్లీ సన్డేను వినుడి.“ సరి, ఆ రాత్రి నేను ఒక గొప్ప సమాజమును కలిగితిని; శ్రీ రైట్, అతని ఇరువురు కుమార్తెలు, మరియు అతని కుమారుడు, సుమారు ఐదు వందల మంది కూర్చొనగల సంఘము అచ్చట యుండి కూడెను. సరి, నేను నాకు సాధ్యమైనంత వరుకు చాలా కఠినముగా ప్రసంగించితిని.
25
దాని తరువాత రాత్రి నేను అదే గుంపును కలిగితిని. నేను ప్రసంగ వేదికకు వెనుకయున్న కుర్చీని సరిచేసికొనుచు దానిలో కూర్చొని సంఘమును క్రమ పద్ధతిలో నడిపించుటకు ఏర్పాటు చేయుచు, పాట పుస్తకములను అందరికి పంచులాగున చేయుచు మరి అక్కడ అన్నిటిని శుభ్రము చేయుచు సరిచేయుచుంటిని. ఆ దినమంతా చాలా శ్రమపడి ఆ స్థలమంతటిని శుభ్రపరచుచుంటిని, పాట పుస్తకములను అందరికి పంచి ఇచ్చుచు... సహోదరుడు రైట్కు ఒకటి, తక్కిన ఇతరులకు ఒకటి, మరల వెనుకకు వెళ్ళి కూర్చొంటిని, మరి ఆ సమయమున తలుపు దగ్గర ఏదో సంభవించుటను నేను విన్నాను. [సహోదరుడు బ్రెన్హాం ప్రసంగ వేదికపై నాలుగు సార్లు కొట్టుచున్నారు.] నేను గమనించగా మరిచ్చట ఒక వ్యక్తి లోనికి వచ్చెను.
సహోదరుడు రైట్ చెప్పెను, “ఓ, అయ్యో” “ఈ నగరములో యున్న పెద్ద వేషధారి మరియు గొప్ప నాస్తికుడు అతను,” అని చెప్పెను, మరియు ఆ వ్యక్తి తన యొక్క ఇంటి ప్రక్కనున్న గొట్టమును విరిచి లోపలికి ఈ విధముగా ప్రవేశించెను. అతను పండ్లలో ఒకటి ఊడిపోయి, అతని కళ్ళపైన అతని వెంట్రుకలు వ్రేలాడుచుండగా లోనికి వచ్చెను. “చిన్న బిల్లీ సన్డే అని పిలువబడు అతను ఎక్కడ?” అని అతడు అడిగెను.
నేను వెనుకకు వెళ్ళి మరి అడిగితిని, ''మీ పేరు ఏమిటయ్యా?“
అతను చెప్పెను, నేను బిల్ హాల్, ఇచ్చట పుష్పముల వర్తకుడిని.“
నేను చెప్పాను, “సరి, నేను సహోదరుడు బ్రెన్హాం.”
అతను అడిగెను, “నీవు చిన్న బిల్లీ సన్డేవా?”
“నేను చెప్పాసు, అది పొరపాటు,” నేను చెప్పాను, “నేను ఒక చిన్న బిల్లీ సన్డే కాను.” నేను అడిగాను, “నీవు ఇచ్చట ముందుకు వచ్చి కూర్చొనకూడదా?”
చెప్పెను, “నేనిచ్చటనే కూర్చొనేదను.”
నేను చెప్పాను, “అది మంచిది, ఇది నీ స్వగృహములా భావిస్తూ, స్వేచ్చగా ఉండవచ్చును. ఇదిగో పాటల పుసక్తము.”
చెప్పెను, “నాకు ఏ విధముగా పాడవలయునో తెలియదు.”
నేను చెప్పాను, “సరి, మాకు కూడా ఎట్లు పాడవలయునో తెలియదు. అయితే మనము ప్రభువుకు ఒక ఆనందమైన గానము చేసెదము.”
26
మరియు నేను ప్రసంగించుటకు మొదలు పెట్టితిని. మరియు నేను ప్రసంగించుటకు ప్రారంభించగా, అతను కొద్ది, కొద్దిగా ముందుకు వచ్చుచుండెను. మరియు చివరగా నేను వేదిక పిలుపునియ్యగా, అతను వేదికపైకి వచ్చియుండెను మరియు అతను ఆ సంఘమునకు ఈ దినము వరకు కాపరిగా యుండెను. చూశారా?
ఇప్పుడు దాని తరువాత రెండు దినములకు నేను దైవిక స్వస్థతపై ప్రసంగించుటకు ప్రారంభించితిని. బయటి ప్రపంచమునే చూడని తొమ్మిది సంవత్సరములు మరియు ఆరు లేక ఎనిమిది నెలలుగా పడుకలోయున్న కొండకు ఆ ప్రక్కగా జీవించుచున్న ఒక బాలిక గురించి వారు నాకు చెప్పిరి. సరి, నేను చెప్పాను, “సరి, నాకు తెలియదు...” వారు వెళ్ళుచున్న సంఘ శాఖ యొకటి వారికి చెప్పిరి, “అద్భుతముల దినములు ఎప్పుడో సమాప్తమై పోయినవి.” అచ్చట చుట్టు ప్రక్కలనున్న సంఘములన్నియును “ఎవరైనను అచ్చటికి వెళ్ళిన యెడల, మీరు బహిష్కరింపబడెదరు,” అని చెప్పినవి. కావున ఆమె తండ్రి ఆ సంఘము యొక్క పెద్ద (డీకన్). కావున వారచ్చటికి వచ్చుట వారికి చాలా కష్టముగానుండెను.
27
మరియు “యేసు క్రీస్తు నిన్న, నేడు యుగయుగములకు ఒక్కటే రీతిగా యున్నాడు,” యను నా చిన్న పుస్తకమును మీరు చదివి యుందురని అనుకొనుచున్నాను. అచ్చట. ఆ చిన్న నైల్ బాలిక, ఆమె స్వస్థత పొందిన సాక్ష్యము గలదు.
సరి, టి.బి తో బాధింపబడుచున్న మరి ఒక బాలిక కొరకు వారు నన్ను అచ్చటికి పంపిరి. మరియు ఆమె తల్లి తండ్రులు వారు ఆశించిరి. నేను అచ్చటికి వెళ్లి మరి ప్రార్థించితిని. ఆమె నాతో కూడా ఆలయమునకు వచ్చి మరి నా రాకకై ఎంతో సేపు అచ్చటనే పండుకొని యుండెను.
జార్జ్ దీనిని పట్టుకొని మరి ఆమె ఏడ్చుటకు ప్రారంభించెను. చివరకు ఆమె తల్లి తండ్రులు నేను ఆమె యొద్దకు వెళ్ళి ప్రార్ధించుటకు ఒప్పుకొనిరి, అయితే వారు ఆ సమయమున ఇంటిలో లేరు. వారు బయటికి వెళ్ళిరి మరి నేను లోనికి వెళ్ళాను.
28
చాలా దీన పరిస్థితి ఆమెది. ఆమె దగ్గుటకు ప్రయత్నించుచున్నది; ఆమెకు పోవును (సహోదరుడు వ్యాధిగ్రస్తులు దగ్గుటను చేసి చూపించు చున్నారు — సంపా.) ఆమెకు ఎంగిలి ఉమ్మివేయుటకు గల ఆ కప్పును కూడా పట్టుటకు శక్తి లేదు. మరియు ఆమె చెప్పెను, “నేను చదివితిని. చిన్న.... పుస్తకమును.” మరియు ఆ చిన్న పుస్తకమును నేను చూచితిని మరియు ఆ పుస్తకముపై, “యేసు, నిన్న, నేడు, యుగయుగములకు ఒక్కటే రీతిగా యున్నాడు.” మరియు ఆమె చెప్పెను, “నేను నమ్ముచున్నాను. ఆయన నన్ను స్వస్థపరచును.”
మరియు నేను చెప్పాను, “సరి, నేను మీ సంఘములో సమస్యలను సృష్టించుటకు రాలేదు బాలికా, అయితే నీ తల్లి తండ్రులు ఎక్కడ?” కన్నీళ్ళు (ఆమెకు కన్నీళ్ళు వచ్చుటకు ఆ తడి ఎచ్చటి నుండి వచ్చినదో నాకు తెలియదు) ఆ చర్మము ఎముకలు అతుకుకొని యుండుట కనపించు ఆమె ముఖములో కన్నీరు కారుచుండెను. దేవుని యొక్క శక్తిని తిరస్కరించు ఒక గొప్ప సంఘమునకు ఆమె చెందినది. ఒక నవీన పరిసయ్యులు, వారు పరిశుద్ధాత్మ యున్నదనుటను నమ్మరు, దేనిని నమ్మరు. వారు నీటిలో బాప్తిస్మము పొంది మరి సంఘమునకు చెందినవారై యుండెదరు. మరియు కావున నేను జనుల మధ్య ఎటువంటి మనస్పర్ధలను సృష్టించుటకు ఆశించుట లేదు.
29
మరియు నేను చెప్పాను, “సరి, ఇప్పుడు నేను నీ కొరకు ప్రార్థించెదను.”
మరియు ఆమె చెప్పెను, “మీరు ఆ నైల్ అను బాలికకు చేసినట్లు నాకు కూడా చేయగలారా.”
నేను చెప్పాను, “సహోదరి, అది ఒక దర్శనము. దేవుడు చెప్పినట్లు మాత్రమే నేను చేయగలను.”
మరియు నేను ఆమె కొరకు ప్రార్ధించితిని; ఆమెలో ఏ విధమైన మార్పులేదు. నా యొక్క ఉజ్జీవము ముగిసినది. మరియు ఆ వారము చివర సుమారుగా అరువది లేక డెబ్బది ఐదు మందికి నేను బాప్తిస్మము ఇవ్వవలసి యుండెను. మరియు ఆమె దేవునికి వాగ్దానము చేసినది, ఆమె గనుక స్వస్థపరచబడిన యెడల, ఆమె అచ్చటనున్న చిన్న నీలి రంగు నదిలోనున్న టోటన్ ఫోర్డ్ అని పిలువబడు స్థలమున బాప్తిస్మము పొందెదనని చెప్పెను.
30
సరి, బాప్తిస్మమియ్య వలసిన దినము వచ్చినప్పుడు, నేను అచ్చటికి నడచి వెళ్ళాను. మరియు అచ్చట ఒక ప్రసంగి యుండెను, అతను నీటి బాప్తిస్మమును గురించి నాతో పరిహాసమాడెను. ఓ, మై, మై మరియు అతను ఆ కొండపైన ఒక గుడారములో ఒక ఉజ్జీవమును కలిగియుండెను. మరియు నేను నీటిలో బాప్తిస్మము ఇచ్చుచుండగా, నేను చెప్పాను, “దేవుని యొక్క దూతలు ఇచ్చట యున్నారని నాకు అనిపించుచున్నది....” మరియు నన్ను పరిహసించిన ఆ వ్యక్తి యొక్క సంఘములోని ప్రతి వ్యక్తియు (మంచి దుస్తులు ధరించుకొని ఆ మురికి నీటిలో బాప్తిస్మమునకై వచ్చియుండిరి) ఆ నీటిలోనికి నడిచి, మరి వారిలో ప్రతి యొక్కరును క్రైస్తవ మార్గమున బాప్తిస్మము పొందిరి. అది నిజము. ఓ ఎటువంటి ఒక సమయము అది
మరియు సాయంకాలపు భోజనమునకై శ్రీ రైట్ యొక్క గృహమునకు బయలు దేరితిమి, మరియు నేను దానికి ప్రారంభించగా, “ఈ రాత్రి కూటమునకు వెళ్ళుటకు మునుపు నేను భుజించను. నేను వెళ్ళి ప్రార్థించెదను. ఆ చిన్న బాలిక కొరకు నా హృదయములో ఒక భారమున్నది,” అని నేను చెప్పాను.
మరియు నేను అచ్చట కొండపైకి ఎక్కి మరి ప్రార్థించుటకు ప్రారంభించితిని. సుమారుగా రెండు వారములకు మునుపు నేను అదే పొద యొద్ద యుంటిని. దేవుని వైపు చూచుచు నేను అచ్చట మోకాళ్ళుని ప్రార్ధించుచుంటిని. నేను నిశ్శబ్దముగా సుండుటకు ప్రయత్నించితిని, మరియు అచ్చట పచ్చని ముండ్ల పొద నా కాళ్ళ చుట్టునుండుచు నన్ను గీకుచుండెను. మీరు ప్రార్థించుటకు లేక ఏదైనను చేయుటకు ప్రయత్నించుచుండగా సాతానుడు ఏ విధముగానైన మిమ్ములను పట్టుకొనుటకు ప్రయత్నించునో యని మీకు తెలియునా, మరియు నేను వెనుదిరిగి వెళ్ళుచుండగా సూర్య రశ్మి నా కండ్లలో పడి ప్రకాశించు చుండెను. మరియు నేను ఈ ప్రక్కగా వెళ్ళుచున్నాను, మీరున్న ప్రతి చోట. మరియు చివరికి నేను వదిలి వేసితిని, మరియు నేను చెప్పాను, “ప్రభువైన దేవా, ఈ పుల్లలు గ్రుచ్చుకొంటూ నా మోకాళ్ళను బాధించినను, లేదా ఈ రాళ్ళు గ్రుచ్చుకొంటూ నా మోకాళ్ళను బాధించినను మరియు ఏది ఏమైనను నేను ప్రార్థించెదను.” మరియు నేను ప్రార్ధింప తొడగితిని.
31
మరియు ఆ సమయమున నేను నిజముగా చాలా దీర్ఘముగా ప్రార్ధించుచుంటిని, మరియు నేను చూడగా ఆ చిన్న గుబురుగానుండు పొద నుండి. ఎవరైనను ఆ పొదను గురించి ఎరుగుదురా! ఓ, నిశ్చయముగా, ఓహాయో ఆ పొద గురించి ఎరుగును. మరియు అచ్చట చిన్న పొద. ఆ వెలుగు, ఆ దేవుని దూత ఆ ఛాయా చిత్రమును మీరు ఇచ్చట కలిగియున్నారు; ఆ పొద నుండి ఆ వెలుగు ప్రకాశించుచున్నది, చెప్పెను, “లేచి నిలువుము.”
నేను చెప్పాను, “అలాగే, నా ప్రభువా?”
చెప్పెను, “కార్టర్యొక్క మార్గమున వెళ్ళుము.” ఆయన చెప్పెను అంతే.
32
సరి, నేను ఆ గంట శబ్దమును వినినప్పుడు . మరియు శ్రీ రైట్ నాతో చెప్పెను, “ఆ గంట మోగినప్పుడు, తల్లి సాయంకాలపు భోజనమును బల్లపై సిద్ధముగా యుంచును మరి నీవు రావలయును.” గంట శబ్దమును. చెప్పెను, “నీవు దానిని మ్రోగించుము. ఆమె దానిని మ్రోగించునప్పుడు నీవు రమ్ము.” దానిని నేను వింటిని. అయితే నేను దర్శనములో యుంటిని, మరి నేను వెళ్ళలేకపోతిని. మీకు తెలియునా, దేవుడు ఇరుప్రక్కలను క్రియ చేయును. దానిని మీరు నమ్ముచున్నారా?
అదే సమయమున చిన్న జార్జి చాలా ఉద్రేకముతో బలహీనముగా ఉ౦డెను, ఏలయనగా నేను నగరమును విడిచి వెళ్ళబోవుచున్నానని ఎరిగియుండెను, ఆమె ఏడ్చుచుండెను; మరియు ఆమె వచ్చి బాప్తిస్మమును పొందవలయునని యుండెను; మరియు ఆమె దేవునికి వాగ్దానము చేసెను, మరియు ఆమె చాలా కలవరపాటుతో యుండెను.
మరియు ఆమె తల్లి, ఒక అద్భుతమైన స్త్రీ, మరియు ఆమె వంట గదిలోనికి వెళ్ళెను మరి వెూకాళ్ళునెను, మరియు ఆమెకు జార్జికి మధ్యనున్న తలుపును మూసివేసెను. మరియు ఆమె చెప్పెను, “ఓ, పరలోకపు దేవా,” ఆమె చెప్పెను, “ఇచ్చట ఈ నగరమునకు వచ్చిన ఆ వేషధారునికి ఏదైనను చేయుము. తొమ్మిది సంవత్సరములుగా నా చిన్న బీద కూతురు ఆ పడుక పైననే యున్నది, ఆమె ఎన్నడును దానిని గురించి నా యొద్ద ఫిర్యాదు చేయలేదు. మరియు ఇప్పుడు ఆమె మనస్సంతయు ఆ స్వస్థతాదారుని గురించియు లేక వేరే కార్యములను గురించి గందరగోళముగా ఉన్నది.” మరియు ఆమె చెప్పెను, “ఆ మనుష్యుని గద్దించుము. ప్రభువా, ఆ మనుష్యుని గద్దించుము.” ఆమె దానిని గురించి అది సత్యమని నమ్ముచున్నది. ఆమె చెప్పెను, “అతనిని ఈ సగరము నుండి తరిమివేయుము. నా దీన చిన్న కూతురు అక్కడ చనిపోవుచు పండుకొని యున్నది, తిరిగి లేచెదనను నమ్మకములేకుండా పండుకొని యున్నది. మరి ఆ వేషధారి ఒక తప్పుడు నమ్మకమును కలిగించి ఆమె మనస్సును నాశనము చేయుచున్నాడు.”
33
ఆమె చెప్పెను, ఇప్పుడు ఇది ఆమెయొక్క సాక్ష్యము; నేను అచ్చట లేను. ఆమె చెప్పెను, “ఆమె పైకి లేచెను.” ఎవ్వరో వచ్చుచున్నట్లు ఆమెకు వినబడెను. ఆమె పైకి లేచెను. ఆమె కుమార్తె ఆ కొండకు ప్రక్కలో నివసించుచుండెను. మరి అది ఆమె కుమార్తెయని ఆమె తలంచెను. ఆమె వెనుదిరిగి చూచెను. ఆమె వెనుతిరిగి చూచి మరి చెప్పెను, “గోడపైన సూర్యుడు క్రిందికి దిగుచుండెను (అదే సమయమున నేను ప్రార్ధించుచుంటిని), ఒక నీడ గోడ క్రింద వచ్చుచున్నట్లు ఆమె చూచెను. అది యేసు. ఆమె చెప్పెను, ”ఆయన గడ్డముతో ఎప్పుడూ అందముగా యుండునట్లుగానే ఆయనక్కడ యున్నాడు.“
ఆయన అడిగెను, “నీవెందుకు ఏడ్చుచున్నావు? ఎవరు వచ్చుచున్నారు?” చెప్పెను, “ఆమె ఈ ప్రక్క చూచెను మరి నాయొక్క నీడను చూచెను, కొద్దిగా బట్టతలతో మరియు ఇదే పరిశుద్ధ గ్రంథమును పట్టుకొని, ఇంకొక వ్యక్తి నన్ను వెంబండించుచుండగా లోనికి నేను వచ్చుచుండుటను చూచెను.”
మరియు ఆమె లోపలికి పరుగెత్తుకొని వెళ్లి మరియు చెప్పెను, “జార్జి, వింతైన సంభవము సంభవించినది.” ఆమె చెప్పెను, “నేను నిద్రపోవుచుంటిని. నేనొక కల కంటిని. ఆ ప్రసంగి లోనికి వచ్చుట చూచితిని.”
34
సుమారుగా అదే సమయమున, కారు తలుపులు తెరువబడెను. నేను దాని నుండి బయటికి వచ్చితిని, ఓ, మీరు గనుక ఆయనను అనుమతించిన దేవుడు ఇరు ప్రక్కలా క్రియ చేయును. అక్కడ ప్రతీ అవిశ్వాసమునకు విరోధముగా జార్జి యుండెను. దేవుడు ఆమెను స్వస్థపరచునని ఆమె ఇంకా ఆయనను పట్టుకొని యుండెను. ఆయన గనుక ఒక అమ్మాయిని స్వస్థపరచినయెడల, ఆయన ఇంకొకరిని కూడా స్వస్థపరచగలడు. అవును. మరియు ఆమె నన్ను చూచెను. మరియు నేను అభిషేకముతో లోనికి ప్రవేశించితిని. నేను తలుపును కూడా తట్టలేదు. నేనే తలుపును తెరచితిని. ఆమె యొక్క తండ్రి పాలు తీసికొని వచ్చుటకై కొట్టుకు వెళ్ళెను, మరియు అతను ఆ పనిలో ఉ౦డెను. మరి నేను అచ్చటకి నడచి వెళ్ళి తలుపును తెరచి, లోపలికి ప్రవేశించాను. మరియు ఈ స్త్రీ, ఆమె తల్లి, మూర్చబోయి నేలపై పడిపోయెను. మరియు జార్జి అచ్చట నుండెను ఆమె నా ఆ వైపు చూచెను.
మరియు నేను చెప్పాను, “సహోదరి, జార్జి, నీవు ప్రేమించు యేసు క్రీస్తు....” మరి అచ్చట ఆమె మంచమునకు వెనుక ఒక చిన్న స్తంభము కలదు, దానిని ఆమె తన చేతులను వెనుకకు చాచి దానిపైనున్న పెయింట్పై అంతటిని గోకి లాగివేసి మరి ఆ స్తంభమును పట్టుకొని వ్యాధి నివారణకై దేవుని యొద్ద మొరలిడుచుండెను. మరియు ఆమె అద్భుతములు జరుగు దినములు ఎప్పుడో అయి పోయినవని సంఘము చెప్పుచుండెను. దేవుని బిడ్డగా ఉ౦డులాగున ఆమె జన్మించెను. మరియు ఆ వాగ్దానమును పట్టుకొని ఆమె యుండెను. ఆయన కృప ద్వారా దేవుడు నాకు ఒక దర్శనమును చూపించి మరి అచ్చటికి నన్ను పంపెను. అదియే అక్కడ యుండెను. నేను చెప్పాను, “నీవెవరవనే దానిని నేనిప్పుడు కనుగొన్నాను. ఇచ్చటనున్న వేదాంతమను పాండిత్యపు గుంపులో చిక్కుకొనియున్న నేను చూచిన ఆ గొర్రెపిల్ల నీవే.” హల్లేలూయా! నేను చెప్పాను, “జార్జి, నీవు ప్రేమించి సేవించుచున్న, కొంత కాలమునకు మునుపు ఆ కొండపైన నాకు కనపడిన ఆ నైల్ బాలిక పైన వ్రేలాడిన అదే వెలుగైనన ప్రభువైన యేసు నాకు ఈ దారి గుండా రావలయునని చెప్పెను. యేసు క్రీస్తు నామమున ఈ దయ్యము నిన్ను వదిలి వెళ్ళవలయునని నేను ఆజ్ఞాపించుచున్నాను.” నేను చెప్పాను, “లేచి నీ కాళ్లపైన నిలువుము.”
సాతానుడు చెప్పెను, “ఒక చీపుర పుల్లవలె యుండు ఆమె కాళ్ళుతో ఏ విధముగా లేచి నిలువబడగలదు,” అది ఒక తలంపు కాదు. “ఏది ఏమైనను లెమ్ము!” మరియు ఆమె తన ఉమ్మివేయు కప్పును కూడా ఎత్తలేక యుండెను.
35
మరియు ఆమె పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొంది పైకిలేచి నేలపైన అటు ఇటు తిరుగులాడుచు దేవుని స్తుతించుచు, బయట ఆవరణలోనికి వెళ్ళి మరచ్చట కూర్చొని గడ్డిని, ఆకులను మరియు పుష్పములను తాకి వాటిని ఆహ్వాదించుచుండెను. ఆమె వాటిని తొమ్మిది సంవత్సరములుగా చూడలేదు. నేను ఆ ప్రక్కగా తిరిగి నడచి వెళ్ళితిని. ఆమె యొక్క తల్లి పైకి లేచి మరి కేకలు వేయుచు పడుచు లేచుచు వసారాలో పడి మరి ముంగిలి వైపునకు పోయెను. చుట్టు ప్రక్కలనున్న వారు జార్జి చనిపోయినదనుకొని లేక ఏదో సంభవించినదనుకొని లోనికి రాతొడగిరి, మరి ఆమె ఇచ్చట ముంగిలిలో నుండి చుట్టు నడచుచు ఆకులను తాకుచు వాటిని తట్టుచు మరి దేవుని ఆశీర్వదించుచుండెను.
ఆమె తండ్రి ఈ శబ్దమంతటిని విని లోపలికి వచ్చెను. మరి అచ్చట అతని భార్య పండుకొని యుండెను, జనులు ఆమెకు గాలి విసరుచుండిరి. మరియు ఎవరో పియోనో వాయించుటను అతను వినెను. మరి అతను ఇంటిలోనికి నడిచెను. అచ్చట అతని చిన్న కుమార్తె సంగీతపు పెట్టె యొద్ద కూర్చొని మరి వాయించుచుండెను.
ఇమ్మానుయేలు రక్త నాళముల నుండి
తీయబడిన రక్తముతో నింపబడిన ఒక ఊట యున్నది,
పాపులు ఆ ప్రవాహము క్రింద మునిగినప్పుడు
వారియొక్క పాపపు మరకలు పోగొట్టుకొనెదరు.
36
ఓ, మై, మరప్పటి నుండి ఆమె నిద్రపోవుటకు తప్పనిచ్చి మరి వేరే ఏ కార్యము కొరకును మంచము యొద్దకు వెళ్ళలేదు. అది జరిగి పదిహేను, పదహారు సంవత్సరములైనవి. ఓ, అదేమిటి? ఆ ఆరవ ఇంద్రియమును పట్టుకొనుట, అంతరంగములోనున్న ఏదో ఒక దానిని చెప్పుచున్నది, “ఆయన గనుక ఒకరిని స్వస్థపరచిన యెడల, ఆయన నన్ను కూడా స్వస్థపరచును.” హల్లేలూయా! అది సత్యము. అది నిజము.
37
ఫోర్ట్ వేన్లో నున్న వృద్దుడైన జాన్ ర్యాన్ గుర్తుంచుకొనుడి. బుగ్గ మీసములతో యున్నతనిని కాదు, వేరొక గ్రుడ్డివాడైన జాన్ ర్యాన్. ఒక పెద్ద గుడారములో నేను ఒక మీటింగులో యుంటిని. కూటమును ముగించుచు మరి వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుచుంటిని. ఈ మనుష్యుడు బాల్కనీలో కూర్చొనియుండెను. అతను ఒక కథోలిక్కు వారు అతనిని బలిపీఠము దగ్గరకు తీసికొని వచ్చిరి మరియు అతడి యొద్ద ప్రార్ధనా అట్ట యుండుటవలన వేదిక పైకి తీసికొని వచ్చిరి.
నేనున్న చోటికి అతను పైకి వచ్చినప్పుడు చెప్పాను, నీ పేరు జాన్ ర్యాన్.“
“అది నిజమే.”
“మరియు నీవు కాథోలిక్కు విశ్వాసమును కలిగియున్నావు.”
అతను చెప్పెను, “అది నిజమే.”
“నీవు సర్కస్ను నడుపువాడవు కదూ.”
“అది నిజము.” చెప్పెను
పిదప, “నీవు గత ఇరువది సంవత్సరములకు పైగానే గ్రుడ్డివాడిగా యున్నావు.”
చెప్పెను, “అది నిజమే.” మరియు లుకిమియా (కాన్సర్ వంటి జబ్బు) లేక ఆ విధమైనదేదో అతని కండ్లలోనికి వచ్చి మరి అతనిని గ్రుడ్డివానిగా చేసెను. నేను చెప్పాను, “నీవు ఒక బిక్షగాడివి.”
మరియు అతను చెప్పెను, “నిజంగా బిక్షగాడని కాదు.” కాని చెప్పెను, “నేను వీథిలో కూర్చునెదను.”
మరియు నేను చెప్పాను, “అదంతా నిజమే.” మరియు “యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచునని నీవు నమ్ముచున్నావా?” నేను అడిగాను.
“నేను నమ్ముచున్నాను,” అని అతను చెప్పెను.
నేను అతనిపైన చేతులుంచి మరి అతని కొరకు ప్రార్థించితిని. నేను చెప్పాను, “ప్రభువైన యేసు, యేసుక్రీస్తు నామమున నేను ఈ గ్రుడ్డితనమును గద్దించుచున్నాను. అది అతనిని వదిలి పోనిమ్ము.” మరియు నేను తిరిగి ఆ వైపు చుశాను, మరియు అతను దృష్టిపొందినడచి వెళ్ళుటను చూశాను. నేను చెప్పాను, “ప్రభువు సెలవిచ్చుచున్నాడు, (నీవు దాని కొరకు గమనించుము), ”ప్రభువు సెలవిచ్చుచున్నాడు, నీవు నీ కనుచూపును పొందితివి.“
మంచిది, అతను - అతను చెప్పెను, “నేను చూడలేక పోవుచున్నాను.”
నేను చెప్పాను, “దానితో ఏ సంబంధము లేదు. నీవు ఆనందించుచూ నీ దారిన వెళ్ళుము.” కావున, అతను క్రిందికి దిగి వెళ్ళిపోయెను.
38
అచ్చట ఇంకొద్ది నిమిషములలో, ఆమె గొంతులో ఒక పెద్ద కణితి వ్రేలాడుచు ఒక స్త్రీ యుండెను మరి మేము ఆమె కొరకు ప్రార్థించగా అది ఆమెను విడిచి పోయెను. ఇచ్చట మరల జాన్ ర్యాన్ తిరిగి వచ్చెను, అచ్చటయున్న కావలివారిని త్రోసికొని వచ్చెను. మరియు నాతో ప్రార్ధించుచు సహకరించుచున్న ఒక వ్యక్తిని త్రోసికొని వేదికపైకి వచ్చెను. అతను చెప్పెను, “నేను ఆ ప్రసంగికుని చూడగోరుచున్నాను.” మరి వారు అతనిని పైకి తీసికొని వచ్చిరి. అతను చెప్పెను; అతను నాతో చెప్పెను; అతను చెప్పెను, “నేను స్వస్థత నొందినట్లు మీరు చెప్పారు.”
నేను చెప్పాను, “నీవు స్వస్థత నొందియున్నావు.”
అతను చెప్పెను, “నేను గనుక స్వస్థతనొందిన యెడల నేను చూడగలుగుదును,” అతను చెప్పెను.
నేను చెప్పాను, “ఓ, కాదు, దానితో ఏ సంబంధమును లేదు. నీవు నాతో చెప్పావు ...”
అతను చెప్పెను, “మంచిది, నేను స్వస్థత నొందినట్లు నీవు చెప్పావు.”
నేను చెప్పాను, “నీవు నన్ను నమ్మినట్లు నీవు చెప్పావు.”
అతను చెప్పెను, “నేను మిమ్ములను నమ్ముచున్నాను.”
నేను అడిగాను, “అట్లైనయెడల ఇక నీవు దేనికి సందేహించుచున్నావు?”
అతను చెప్పెను, “సరి, నేను గనుక స్వస్థత నొందినయెడల, నేను చూడలేక పోవుచున్నానే.”
నేను చెప్పాను, “నీవు చూచెదవు. నీవు చూచుచున్నట్లు దేవుడు నాకు ఒక దర్శనమును చూపించినయెడల అది సంభవించును.” అతను ఒక కాథోలిక్కు మరియు అటువంటి సత్యమును ఎన్నడూ వారు అతనికి బోధించనే లేదు.
అతను చెప్పెను, “కాని దీనిని నేను అర్థము చేసికొనలేకున్నాను. నేనేమి చేయగలను.”
నేను చెప్పాను, “మంచిది, నీకు దేవుడు దృష్టిని అనుగ్రహించినందువలన దేవుని స్తుతించుచూ నీవు నీ మార్గమున వెళ్ళుము.”
అతను అడిగెను, “మీరెక్కడ యున్నారు?” త్రోసికొనుచు వచ్చెను, “ఒక్క నిమిషమాగుము,” అని చెప్పెను, “మీ పేరేమి?” అని నన్ను అడిగెను.
మరియు “బ్రెన్హాం,” అని నేను చెప్పాను.
అతను చెప్పెను, “నేను మిమ్ములను తాకాలని ఆశించుచున్నాను.” మరియు అతను నన్ను తాకుటకు అనుమతించితిని. అతను చెప్పెను, “శ్రీ బ్రెన్హాం, ఒక కాథలిక్కుగా నేను నా మత గురువును నమ్మునట్లుగా బోధింపబడితిని.” మరియు అతను చెప్పెను, నేను మీ యొద్ద సహాయము కొరకు వచ్చితిని. మరియు నేనెవరనియు నా పరిస్థితి ఏమిటనియు దేవుడు తప్పనిచ్చి మరి ఎవరికి తెలియని నా విషయములను గురించి మీరు చెప్పిరి. నేనది సత్యమని నమ్ముచున్నాను మరియు నేను “దేవునికి స్తోత్రము,” అని చెప్పుచున్నాను. వేదిక మీద నుండి అతను వెళ్ళిపోయెను.
39
దాని తరువాత రెండు రాత్రుల వరకు నేను ప్రసంగించలేకపోతిని. నేనున్న స్థలము యొద్దకు అతను వచ్చి “నన్ను స్వస్థపరచినందులకు దేవునికి స్తోత్రము,” అని చెప్పుచు లేచి నిలుచును. మరియు నేను ప్రసంగించుటకు ప్రారంభించితిని అతను లేచి “నన్ను స్వస్థపరచినందులకు దేవునికి స్తోత్రములు,” అని కేకలు వేయును.
వార్తా పత్రికలను అమ్ము పనిని వారు అతనికి ఇచ్చిరి. ఇంచుమించు ఒక నెల గడిచెను, “నన్ను స్వస్థపరచినందులకు దేవునికి స్తోత్రములు,” అని అతను కేకలు వేయుచుండెను. మరియు అతను అచ్చట యుండెను, అతను కేకలేసెను, “నన్ను స్వస్థపరచినందులకు ప్రభువుకు ఎంతో స్తుతి-స్తోత్రములు.” వారు అతనిని పరిహాసము చేయుచు హేళన చేసిరి, వార్తా-పత్రికలు అమ్మే ఆ చిన్న బాలురు కూడా అతనిని చూచి నవ్వుచూ మరియు పరిహాసము చేసెడివారు.
వీధులలో జనులు “ఆ వృద్దునికి మతి పోయినది,” అని చెప్పుకొనేవారు.
మరియు అతను చెప్పెను, “అధికమైన, అధికమైన, దానిని గురించి సమస్తమును చదువుము: నన్ను స్వస్థపరచినందులకు ప్రభువును స్తోత్రించుము. అధికముగా, దానిని గురించి సమస్తమును చదువుము: నన్ను స్వస్థపరచినందులకు ప్రభువుకు స్తోత్రము.”
40
(వారు అతనిని పిచ్చాసుపత్రికి తీసికొని వెళ్ళాలని తలంచిరి) వారు అతనిని పట్టుకొని ప్రశ్నలడిగిరి. అతను చెప్పెను, నేను ఎప్పటివలెనే మామూలుగా యున్నాను. అయితే నేను దేవుని నమ్ముచున్నాను. నన్ను స్వస్థపరచినందులకు దేవునికి స్తోత్రములు,“ మరి ఆ విధముగా చెప్పుచుండెను. అదేమిటి? అతను ఆ ఆరవ ఇంద్రియమును పట్టుకొనుచుండెను. అక్కడేదో దానిని పట్టుకొనెను. తాను దృష్టిని పొందుకొనెదనా లేదా అనే దానిని గురించి అతడు చింతించుట లేదు. ఆ దృష్టిని పొందుకొనుట కూడా అతడికి ఒక గొప్ప విషయముగా అనిపించుట లేదు. అతను వేరొక దృష్టితో దానిని చూచుచుండెను. అతను దేవుడిని చూచెను! మనము చూడని కార్యములను మనము చూచుచున్నాము. క్రైస్తవుని యొక్క ఆయుధమంతా ఆ విశ్వాసము ద్వారానే. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడని నమ్మవలయును. ఆత్మ యొక్క ఫలములన్నియూ, అదృశ్యమైనవన్నియూ, సమస్తమును విశ్వాసమే, మనము అదృశ్యమైన వాటిని చూచుచున్నాము. మనము అదృశ్యమైన వాటిని చూచుచున్నాము, విశ్వాసము ద్వారా దానిని చూచుచున్నాము. హల్లేలూయా!
41
ఒక చిన్న పిల్లవాడు అతనిని ఒక మంగలవాని అంగడికి నడిపించుకొని వెళ్ళెను. మరియు ఆ తెలివైన చిన్న మంగలి అతనిని పరిహసింప తొడగెను. కావున అతను అతని ముఖమునకు నురుగు పూసెను. మరియు ఆ మంగళి అతనికి క్షారము చేయుచుండగా మిగతా మంగలి వారందరూ చూస్తుండగా, మరియు ఆయన వారివైపు ఇలా కన్నుకొట్టి. ఆయన చెప్పెను.... క్షారము చేయుచుండెను, సగము వరకు చేసెను, టవల్ అతనిపై వేయబడి యుండెను, మీకు తెలియునా, ఆ మంగలి అడిగెను, “ర్యాన్ నాన్నా, చెప్పుము.”
అతను చెప్పెను, “అవును, కుమారుడా.”
చెప్పెను, “ఆ పరిశుద్ద దొర్లువాడు ఇచ్చటికి వచ్చినప్పుడు నీవు అతనిని చూచుటకు వెళ్ళినావని వినబడెను.”
“అవును, నేను వెళ్ళాను.” అని అతను చెప్పెను.
అతను అడిగెసు, “ఉమ్, నీవు స్వస్థత నొందినావని వినబడెను.”
అతను చెప్పెను, “అవును, నేను స్వస్థత నొందితిని. నన్ను స్వస్థపరచినందులకు దేవునికి స్తోత్రములు.” మరియు అతను ఆ మాటను పలికిన వెనువెంటనే, ఆ మంగలి అంగడి కుర్చీలో అతడు కూర్చొని యుండగా అతడికి కండ్లు తెరువబడెను. ఆ టవల్ అతని మెడచుట్టు వేసియుండగా దానితోనే అతను దాని నుండి ఎగిరి దూకెను. ఆ మంగలివాడు చేతిలో కత్తితో తలుపు నొద్దకు పరుగెత్తెను. ఆ వృద్ధుడైన ర్యాన్ వేగముగా అరచుచు మరియు కేకలేయుచు “దేవునికి స్తోత్రములు, ఆయన నన్ను స్వస్థపరచెను,” అని పరుగెత్తుచుండెను.
42
అదేమిటి? ఆ ఆరవ ఇంద్రియమును పట్టుకొనుట. దానిని నిజ రూపముగా చేయు ఏదో యొకటి అది. ఈ ఆరవ ఇంద్రియము ద్వారా రాజ్యములను లోబరచుకొనిరి. ఆమేన్. ఆరవ ఇంద్రియము రాజ్యములను స్వాధీనపరచుకొనెను. ఆ ఆరవ ఇంద్రియము ద్వారా, యెరికో నగరపు గోడలు నేలకూల్చబడెను. ఆమేన్. దానిని మీరు నమ్ముచున్నారా? ఆరవ ఇంద్రియము ద్వారా యెరికో నగరపు గోడలు నేలమట్టమాయెను.
ఆరవ ఇంద్రియము ద్వారా సముద్రము పౌలును ముంచివేయలేకపోయెను. అతనచ్చటకి వెళ్ళినప్పుడు, నమ్మకమంతయు కోల్పోయినప్పుడు, అతను ప్రభువు యొక్క దూత దర్శనమును పొందుకొనెను. మరియు అతను తిరిగి వచ్చి, “ధైర్యముగా నండుడి,” అని చెప్పెను. దాని యొక్క కారణమేమిటి? చంద్రుడు మరియు నక్షత్రములు ఏమీ కనబడకుండా పధ్నాలుగు దినములు మరియు రాత్రులు గడిపెను; అది ఎప్పుడూ వున్నట్లుగానే అది యున్నది. ఆ తుఫాను ఎప్పటివలెనే తీప్రముగా నుండెను. అయితే అతను ప్రభువు యొక్క దూతను చూచినప్పుడు ఆ ఆరవ ఇంద్రియము క్రియ చేయుటకు ప్రారంభించినది. హల్లేలూయా!
ఆ ఆరవ ఇంద్రియము పేతురును చెరశాలలో యుంచలేకపోయెను. లేదయ్యా, దేవుని యొక్క శక్తి ఒక దూతను అచ్చటికి పంపి మరి అతనిని విడిపించెను.
ఆరవ ఇంద్రియపు పౌలును మరియు సీలను స్తంభములో కట్టి యుంచలేకపోయెను. దేవుడు ఒక భూకంపమును పంపి సమస్తమును కదిలించి వేసెను.
ఏదైనా ఒక సమయమున ఆ ఆరవ ఇంద్రియము మీ కొరకు క్రియ చేయుటకు అనుమతించుడి. ఆ ఆరవ ఇంద్రియము వలన ఆ సింహములు దానియేలును తినలేక పోయినవి. వారు ఆ ఆరవ ఇంద్రియమును మోసగించలేకపోయిరి. లేదయ్యా, ఆ ఆరవ ఇంద్రియము ద్వారా ఆ అగ్ని హెబ్రీ బిడ్డలను దహించివేయ లేకపోయెను.
ఆ చిన్న మార్తలో క్రియ చేయుచుండిన ఆ ఆరవ ఇంద్రియము, ఆమె యేసును చూచుటకు వచ్చినప్పుడు చనిపోయి నాలుగు దినములై సమాధిలోనున్న లాజరును దానినుండి లేపెను.
ఆ ఆరవ ఇంద్రియము ఒక కుష్టురోగిని స్వస్థపరచెను. ఆ ఆరవ ఇంద్రియము యేసు క్రీస్తును మూడవ దినమున లేపెను. ఆ ఆరవ ఇంద్రియము ఒకనొక దినమున సంఘమును పైకి కొనిపోయి మరి మహిమ లోనికి తీసికొని వెళ్ళును.
43
ఐదు పైన ఆధారపడ వద్దు, అవి వంచించును. అయితే ఆరవది సరైనది. మీరు గనుక కోరినయెడల. అక్కడ ఒక చిన్న వ్యక్తి ఈ రాత్రి యున్నాడు. చార్లీ కాక్స్ ఇచ్చట యున్నాడా లేదాయని నాకు తెలియదు. నేను ఆరవ ఇంద్రియమును గురించి అతనితో మాటలాడుచుంటిని. అతను దానిని గైకొని, మరి దానిని నమ్మి మరి దానిని టేపులో వేసి వినిపించసాగెను. (టేపులో ఖాళీ స్థలము కలదు - సంపా) అతని భార్య చెప్పెను, “నేను దానిని క్రియ చేయించెదను.” ఇంకొక గదిలోనికి పోయి మరి ఆమె దానిని క్రియ చేయించుటకు ప్రారంభించెను. ఆమె చెప్పెను, “ప్రభువా, నేను కూడా ఆరవ ఇంద్రియమును కలిగియున్నాను, మరి నేను దానిని క్రియా రూపమున ప్రయోగించబోవుచున్నాను. నాకు పరిశుద్దాత్మ కావలయును,” మరి అదిచ్చుటకు వచ్చియున్నది. అదేమిటి? మీరు గనుక నమ్మినయెడల, చూచుట. మనము చూడకుండానే దానిని నమ్మవలయును. అయినను, దేవుడు ఏదో విధముగా దానిని చూచుటకు అనుమతించెను. ఆయన మనకు చూపించును. ఆయన ప్రసన్నతను ఆయన చూపించును. ఖచ్చితముగా ఆ ఆరవ ఇంద్రియము క్రియ చేయదను సందేహమే లేదు. మనము మన తలలు వంచెదము.
44
మా పరలోకపు తండ్రీ, ఆరవ ఇంద్రియము, ఈ పరిశుద్ధ గ్రంథములోని సాక్ష్యముల వలన ఆ అరవ ఇంద్రియమును నేను దానిని విశ్వాసమని పిలుచుచున్నాను. నేను హెబ్రియులు 11వ అధ్యాయములో ఆరవ ఇంద్రియమును గురించి చదువుచుంటిని, విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటియొక్క నిజ స్వరూపమును, భూమి యొక్క ఇంద్రియములను రుజువుపరచు కార్యములను గురించి అవి తెలియపరచును. మరియు వారు రాజ్యములను ఏ విధముగా జయించిరి, మరియు సింహము యొక్క నోటిని ఏ విధముగా మూసిరి, ఖడ్గధారను తప్పించుకొనుటను మనము అక్కడ చూచుచున్నాము. మరియు హనోకు పరలోకమునకు ఆ ఆరవ ఇంద్రియము ద్వారా మరురూపమాయెను. అబ్రాహాము ఒక పరదేశిగా యుండి వంద సంవత్సరములైన పిదప ఒక కుమారుని పొందెను. అది ఆరవ ఇంద్రియము. శారా యొక్క గర్భము మృతతుల్యమై, అతను దానిని గురించి ఏ మాత్రము లెక్కచేయక, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింప లేదు. అయితే దేవుని మహిమపరచుచు బలవంతుడుగా ఉ౦డెను. దేవుడు వాగ్దానమును చేసెను గనుక దానిని ఆయన నెరవేర్చుటకు సమర్దుడని రూఢిగా విశ్వసించి దానిని తెలిసికొని యుండెను.
ఓ, దేవా, మేము అబ్రాహాము యొక్క బిడ్డలముగా యుండవలయును. ఎటువంటి దీన పరిస్థితి మనది. ఓ, దేవా, ఈ రాత్రి ఈ జనుల మధ్య ఈ సంఘములో ఆరవ ఇంద్రియమును మేల్కొలుపుము. మీరు అబ్రాహామునకు ఆ గొప్ప సూచనను అనుగ్రహించుటను మేము చూచితిమి, మరియు అచ్చట ఏమి సంభవించెను. దేవా, ఈ రాత్రి వారు దేవుని యొక్క దూతను చూచి మరి వారు వారియొక్క శారీరిక సంబంధమైన అనుభూతులనే వాటిపై ఆధారపడక, వారు చూచు దానిపైనను, ఆధారపడక మరి వాగ్దానము చేసిన దేవుని వాక్యమును ఆధారముగా చేసుకొని వారు దానిని చూచునట్లుగా చేయుము, మరియు ఇచ్చటనున్న ప్రతి వ్యక్తియు స్వస్థతను పొందుకొనునట్లుగా చేయుము, మరియు రక్షింపబడని ప్రతి యొక్కరును రక్షింపబడనిమ్ము మరియు పరిశుద్ధాత్మ పొందని ప్రతివారు దానిని పొందనిమ్ము నాకు చెవియొగ్గుము, తండ్రీ, యేసు నామమున నేను ప్రార్ధించుచున్నాను. ఆమేన్.
45
మీ స్వస్థతను పొందుటకు మీరు సిద్ధముగా యున్నారా? మీరందరునా? మీరు- మీరు ఆరవ ఇంద్రియమును క్రియ చేయునట్లుగా చేసెదరా? ఇప్పుడు ఆరవ ఇంద్రియము అనగా ఏమిటి? అది విశ్వాసమై యున్నది. మరియు విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటియొక్క నిజ స్వరూపము, మిస్సోరి చేసిన కార్యములు తప్పిదమని ఋజువుపరచుచున్నవి. “నేను మిస్సోరి నుండి వచ్చితిని. మీరు నాకు చూపించవలయును (మీకు తెలియునా), దానిని చూడవలయును.” విశ్వాసము రాజ్యములను జయించును, నీతి కార్యములను జరిపించును, మరియు సమస్త విధములైన అద్భుతములను మరియు ఆ ఆరవ ఇంద్రియపు సూచన క్రియలను జరిగించును. దానిని మేల్కొలుపుము; మీ ఆత్మీయ కన్నులకున్న కట్లను తీసివేయుము. చుట్టూ చూడుము, దేవుడింకా దేవుడుగానే యున్నాడనే దానిని మీరు చూడలేకపోతున్నారని గ్రహించండి.
అది సరి, మీ యొక్క సంఖ్యల ప్రకారము ప్రార్థనా అట్టలను కలిగియున్న మీలో ప్రతివారును నా కుడి ప్రక్కకు వచ్చి నిలబడండి. ప్రార్థనా అట్ట 1, 2,3, 4 లేచి వచ్చి నిలబడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ ప్రక్కగా ఇటు రండి. [సహోదరుడు బ్రెన్హాం ఎవరితోనో మాట్లాడుచున్నాడు.] అవును. ఉహ్-హు; అది బాగున్నది. మీ . తీసికొని రండి కావున జనులు చుట్టు రాగలరు, అది బాగున్నది. మీకు వీలైనయెడల వారిని ఇచ్చట క్రింద వదలండి. అది మంచిది. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, ఆరు. [టేపులో ఖాళీ స్థలము కలదు.]
46
ఒక మత సంబంధమైన గుంపు జనులు, ఒక ఎన్నుకొనబడిన జనులు రానున్న మెస్సియాను గురించి వారి సంతతికి అందరికీ చెప్పబడినవారు (యూదులు), ఆయన వచ్చినప్పుడు ఏమి చేయుననియు. మరియు ఆయన వచ్చినప్పుడు వారు ఆయనను గుర్తెరుగుటకు తప్పిపోయిరి. అది ఎంతో విషాదకరమైన విషయమై యున్నది. అవును కదూ? లోకములోయున్న విషాదకరమైన విషయములలో అది ఒకటియని నేను అనుకొనుచున్నాను. లోకము ఆయనద్వారా చేయబడెను మరి లోకము ఆయనను ఎరుగకుండెను. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయ జనులే ఆయనను అంగీకరింపలేదు. అది నిజముగానే ఎంతో విషాదకరమైన విషయమై యున్నది.
ఇప్పుడు గమనించుడి. వారు ఒక మెస్సీయ కొరకు ఎదురు చూచుచుండిరి. అది నిజమేనా? మరియు మెస్సీయ, ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక దేవుని ప్రవక్తగా యుండవలయును. దానిని ఎందరెరుగుదురు? ఆయన ఒక ప్రవక్తయొక్క సూచనను చేయవలసియుండెను. ఏలయనగా, మోషే చెప్పిన విధముగా ఆయన ఒక ప్రవక్తగా యుండునని, ఆయన శరీరధారియైనప్పుడు, ఒక ప్రవక్త యొక్క సూచన చేయుటకు ఆయన ఒక ప్రవక్తగా యుండును. అది ఇప్పుడున్న యూదుల వలె, నేను నిరీక్షించుచున్నాను.
47
సహోదరుడు యోసేపు మరియు నేను ఈ మధ్యాహ్నము సంభాషించుచుంటిమి. సహోదరుడు. స్టాక్ హోం, స్వీడన్, సహోదరుడు లూయి పెట్రూ ఒక ఐదు లక్షల పరిశుద్ద గ్రంథములను పంపెను. “మధ్య రాత్రికి ఇంకా మూడు నిమిషములు,” యను ఆ చిత్రమును సహోదరుడు ఆర్గన్ బ్రైట్ నాకు చూపించినప్పుడు. ఇరాన్ మరియు ఇతర దేశముల నుండి ప్రపంచమంతట నుండి ఆ యూదులు వచ్చినప్పుడు వారు యేసు నామమును ఎరుగక యుండిరి. వారు రోమనుల యొక్క బంధకములో నుండి అప్పటి నుండి అచ్చటనే యుండిరి. యేసు క్రీస్తూ అనే విషయమును గురించి అసలు వారు విననే వినలేదు. సహోదరుడు పెట్రూస్ ఈ పరిశుద్ధ గ్రంథములను వారి కొరకు అచ్చటికి పంపెను. వారు దానిని చదువుచుండిరి.
మరియు కావున వారు వారితో ఒక సమావేశమును కలిగియుండిరి. సరిగ్గా. నా దగ్గరే ఆ చిత్రము కలదు. మరియు వారు దానిని చూచుచుండిరి. మరియు వారు “మీరు మీ మాతృ భూమికి మరల ఏల వచ్చుచున్నారు, చనిపోవుటకా?” అని అడిగిరి. వారికున్నవన్నీ సర్దుకొని అన్నియు తీసికొని వచ్చిరి.
చెప్పిరి, “మెస్సీయను చూచుటకు మేము వచ్చితిమి.”
అవునయ్యా.
48
అంజూరపు చెట్లు చిగురించుటకు ప్రారంభించినప్పుడు వసంత కాలము సమీపముగా యున్నదని అర్థము. ఆ ఆరు కొనల నక్షత్రము గల దావీదు యొక్క పతాకముతో అది ఒక దేశముగా ఇప్పుడు యున్నది. ప్రపంచములోకెల్ల ప్రాచీనమైన పతాకము ఇరువది ఐదు వందల సంవత్సరములకు పిదప మరల మొదటిసారిగా ఎగుర వేయబడి యున్నది. అది నిజము. యెరూషలేమునకు తన యొక్క స్వంత ధనము, స్వంత ద్రవ్యము, స్వంత నియమ నిబంధనలు, స్వంత ప్రభుత్వమును కలిగియున్నది. అది మరల ఒక దేశముగానున్నది. యేసు చెప్పెను, ఆ అంజూరపు చెట్టు చిగురించుటకు ప్రారంభించినప్పుడు, దేవుని రాజ్యము సమీపముగా ద్వారము యొద్దనే యున్నదని తెలసుకొనుడి.
వారు వీటిని చూచినప్పుడు - ఈ పరిశుద్ధ గ్రంథములను. మన యొద్దనున్న వాల్ స్త్రీచ్ యూదులవలె వారు కాదు. వారు అచ్చట నమ్ముకొనియున్నారు. మరియు వారిని విమానముల యొద్దకు తీసికొని వచ్చినప్పుడు వారు దానిలోనికి ఎక్కుటకు కూడా సంశయించిరి. వారు దానిని గురించి భయపడిరి. వారు ఆ విధమైన దానిని ఎన్నడూ చూడలేదు. టి.డబ్యు.ఎ. (TWA) మీరు దానిని “లుక్ పత్రిక” (Look Magazine)లో చూచియుండెదరు. ఆ వృద్ధుడైన రబ్బీ అచ్చట నుండి చెప్పును, “గురుంచుకొనుడి, మనము మన మాతృ దేశమునకు పిలువబడినప్పుడు, మనము పక్షిరాజు రెక్కలపై కొసపోబడెదమని ప్రవక్త మనకు చెప్పెను.” హల్లేలూయా! విసుడి. “పక్షిరాజు రెక్కలపై కొనిపోబడెదము.”
మరి వారు అచ్చట వారి మాతృ దేశములో యున్నారు. వారు అచ్చటకి మరల తిరిగి వచ్చుచున్నారు. వారు ఈ చిన్న పరిశుద్ధ గ్రంథమును తీసికొని మరి నూతన నిబంధనను చదువుటకు ప్రారంభించిరి. యూదుడు వెనుక నుండి ముందుకు చదివెదరని మీరెరుగుదురా! మరియు వారు దానిని చదివిన తరువాత, వారు అడిగిరి, “ఈ యేసు గనుక మెస్సీయయైన యెడల..” వారు ఈ దినమున ఎచ్చట యున్నారో మీకు చూపించెదరు. “ఈ యేసు గనుక మెస్సీయయైన యెడల, ఆయన ఒక ప్రవక్తగా నుండవలెను. ఆయన గనుక మృతులలో నుండి లేచియున్న యెడల ఆయన ఒక ప్రవక్త సూచనను చేయుట మమ్ములను చూడనిమ్ము మరప్పుడు మేము ఆయనను నమ్మెదము.” ఆమేన్. ఓమై, అది నిజమే!
అన్యజనులైన మీరు మెలకువగా నుండుడి, కాలము అతి సమీపముగానున్నది, దేవుడు అన్యజనుల నుండి యూదుల ప్రక్కకు తన కృప త్రిప్పును. మరి అన్యజనులైన మీ దేవుడు లేకుండా ముద్రింపబడి, కృప లేకుండా - వేరేది కాదు కాని అణు పొడిగా (atomic fodder) ఉండెదరు. కావున, మీకు సమయమున్నప్పుడే, అవకాశమున్నప్పుడే దేవునితో మిమ్ములను మీరు చక్కదిద్దుకోండి. ఇప్పుడే మీరు దేవునియందు చక్కదిద్దుకోండి.
49
గమనించుడి, యేసు యూదుల యొద్దకు వచ్చినప్పుడు, ఆయన ఆ మెస్సీయ యొక్క సూచనను చేసి చూపించెను, వారికి ఆయన ప్రవక్తయుని చూపించెను. మరియు వారు ఆయనను ఒక సోదె చెప్పువాడనియు, బయెల్జెబూబు, ఒక దయ్యము అని పిలిచిరి.
మరటు పిదప అక్కడ కొంతమంది ఇతర జనులు ఒక మెస్సీయ కొరకు ఎదురు చూచుచుండిరి. పరిశుద్ధ గ్రంథము ప్రకారము మూడు సంతతులు మాత్రమే భూమిపై యున్నవని ఎందరెరుగుదురు? షేము, హాము, యాపెతుయను వారి వంశములు, అది యూదులు, అన్యజనులు, మరియు సమరయ్యులు (సగము యూదుడు సగము అన్యజనుడు) మరియు ఈ సమరయ్యులు ఒక మెస్సీయ రావలయునని ఎదురుచూచుచుండిరి.
50
యేసు ఆ దారి గుండా వెళ్ళి అచ్చట కూర్చుండెను మరియు ఒక స్త్రీ బయటికి వచ్చెను. మరియు “నాకు దాహమునకిమ్ము,” అని ఆయన అడిగెను.
ఆమె చెప్పెను, “యూదులైన మీకు ఇది పద్ధతి కాదు. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.”
ఆయన చెప్పెను, “అయితే, నీవు మాటలాడుచున్నదెవరితోయని నీవు గనుక ఎరిగినయెడల, నీవు నన్ను దాహమునకిమ్మని అడుగుదువు, సంభాషణ ఆ విధముగా కొనసాగి చివరికి ఆయన చెప్పెను, ”పోయి నీ పెనిమిటిని ఇచ్చటికి తీసికొని రమ్ము.“
ఆమె చెప్పెను, “నాకు పెనిమిటి లేడు.”
ఆయన చెప్పెను, “నీవు చెప్పిన మాట సరియే, నీకు ఐదుగురు పెనిమిట్లు౦డిరి, ఇప్పుడున్న వాడు నీ పెనిమిటి కాడు.”
ఆమె చెప్పెను, “అయ్యా” అమెరికా సంయుక్త రాష్ట్రములలోనున్న మూడులో రెండు వంతుల ప్రసంగికుల కంటె ఆ వ్యభిచార స్త్రీ దేవుడిని గురించి క్షుణముగా ఎరిగియున్నది. అది నిజము. ఆమె చెప్పెను, “నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మేము (సమరయులమైన మేము) మెస్సీయ వచ్చినప్పుడు ఆయన వారికి సూచనలు చేయునని మేము ఎరిగి యున్నాము ఆయన మాకు సమస్త విషయములను చెప్పెను. కాని నీవెవరవు?
యేసు చెప్పెను, “నీతో మాటలాడుచున్న నేనే ఆయనను.”
మరి ఆమె ఊరిలోనికి వెళ్ళి మరి “మీరు వచ్చి నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన మెస్సీయ కదూ? అని చెప్పెను, మీరు దానిని గ్రహించగలుగుచున్నారా? ఆ మెస్సీయ ఈయనే కదూ. అది నిజము.
51
ఇప్పుడు ఆయన ఆ సూచనను యూదులకు కన్నుల ముందే చేసెను. ఆయన సమరయుల కన్నుల ముందే దానిని చేసెను, అయితే అన్యజనుల కన్నుల ముందు దానిని చేయలేదు. మనము మన వెనుక చెక్క బొమ్మలను పెట్టుకొనియున్న ఆంగ్లో సాక్సెన్, మరియు మనము విగ్రహములను ఆరాధించుచుంటిమి, రోమీయులవలె మొదలగు వారివలె యుంటిమి. ఆయన వారికి ఆ సూచనను చేయలేదు. మరియు ఆయన దానిని చెప్పెను. పునరుత్తాన సూచనయైన, ఆ యోనా సూచనను ఈ అంత్య దినముల యందు ఒక మూర్ఖత్వపు మరియు వ్యభిచార సంతతి పొందును.
ఇప్పుడు ఇంకా యేసు వారితో చెప్పెను, “సాదొమ దినములలో వలె మనుష్య కుమారుని రాకడ దినముల యందు ఉండును. ఏ విధమైన ఒక సూచనను సొదొమ పొందును! అదే విధమైన సూచనను, దూత తన వెనుక భాగమును త్రిప్పుకొనెను. (నీ జనులందరు అచ్చట యున్నారా, బిల్లీ? అందరూ? మంచిది.) ఆయన చెప్పెను...
52
ఇచ్చట ప్రార్థనా అట్టలేని ఎందరు మీకు దేవుడు స్వస్థత అనుగ్రహించవలెనని మీలో ఎందరు ఆశించుచున్నారో వారందరూ మీ చేతులు పైకెత్తుడి చెప్పండి, దేవుడు నన్ను స్వస్థపరచవలయునని ఆశించుచున్నాను.“ ఇప్పుడు, ఇంకను ప్రార్థనా అట్టలుయున్నవారు ఉన్నయెడల వరుసలో వచ్చి నిలబడండి. ఇప్పుడు, లేనియెడల, ఎందుకని మీరు, ఎట్లైనను మిమ్ములను మేము పట్టుకోనేదము. మీకు లేకున్నా... మీరు కాదు... మీరు కనుగొనవలెనని నేను ఆశించుచున్నాను... ఈ రాత్రి నేను చెప్పినది గనుక మీరు అంగీకరించగలిగిన యెడల, ఆ ఆరవ ఇంద్రియము. మీ హృదయమంతటితో నమ్ముడి.
ఇప్పుడు, మీలో అనేకులు ఈ చేతి రుమాళ్ళను పైకి పంపిరి. అవి మీకిచ్చుటకు గాను నేను ప్రతిదానిపైనను ప్రార్థించుచున్నాను. ఇప్పుడు గనుక దానిని వదిలి వేసిన యెడల, జెఫర్సన్విల్, ఇండియానాకు వ్రాయుడి. నేను మీకు ఒకటి పంపించెదను. చూశారా? తపాల ద్వారా మీకు పంపించెదను. మీరు మీ చేతి రుమాళ్ళను గనుక పోగొట్టుకొనిన యెడల నాకు వ్రాయుడి. మీరు దానికి ఏ మాత్రము డబ్బును చెల్లించనక్కరలేదు. ఊరక వ్రాయుడి మరి మేము... కొన్ని సమయములలో జనులు కొంత డబ్బును పంపెదరు, ఏలయనగా మేము వందల కొలది డాలర్లు ఒక వారమునకు స్టాంప్లు కొనుటకు ఖర్చు చేయుచున్నాము, మరి ఆ చేతి రుమాళ్ళను ప్రపంచము అంతటా పంపించుచున్నాము మరి అవి పొందిన వారి యొద్ద నుండి అనేక అద్భుతములు మరియు ఆశ్చర్య కార్యములు సంభవించినట్లు వారి యొద్ద నుండి ప్రత్యుత్తరము వచ్చుచున్నది. ఏలయనగా నేను వారి యొద్దకు వెళ్ళుట కంటే ఇది వారికి త్వరగా అందుచున్నది. అయితే ఇప్పుడు చూడుడి.
53
నూటికి తొంబది-ఐదు శాతము జనులు. జెఫర్సన్విల్ నుండి కొంత మంది జనులను నేను కలిగియున్నాను. అయితే వారిని నేను ప్రార్థనా వరుసలో చూచుట లేదు. మరియు వారు గనుక యున్నయెడల మొల్లగా ఆ వరుస నుండి బయటికి రావలయునని నేను వారిని అడుగుచున్నాను (అది సరి) ఏలయనగా, వారిని నేను జెఫర్సన్విల్లో చూచెదను. ఈ వరుస మళ్ళి వచ్చి కలుసుకోలేని ఇచ్చటనున్న వారికి మాత్రమే.
ఇప్పుడు, ఇచ్చట ఒక స్త్రీ నిలుచుకొని యున్నది. నేను గనుక ఆ స్త్రీని స్వస్థపరచగలిగి మరియు నేను గనుక దానిని చేయనియెడల నేను వంచకుడిని, ఈ ప్రసంగ వేదిక వెనుక నేను నిలుచుటకు నేను అర్హత లేనివాడను, సహోదరుడు సుల్లివన్, నేను గనుక ఆమెను స్వస్థపరచగలిగినయెడల. అయితే నేను ఆమెను స్వస్థపరచలేను. ఆమె గనుక వ్యాధితోనున్న యెడల, ఆమె ఇది వరకే స్వస్థత నొందియున్నది. ఆమెలో ఏ వ్యాధి నున్నదో, అది ఏమిటనేది నేనెరుగను. అయితే ఆమె గనుక వ్యాధితోనున్న యెడల, యేసు ఆమెను ఆయన కల్వరిలో చనిపోయినప్పుడు స్వస్థపరచి యున్నాడు. దానికొరకై నిత్య తీర్పును చేసెను. మన అతిక్రమ క్రియలనుబట్టి ఆయన గాయపరచబడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అది నిజమేనా?
54
ఇప్పుడు, చక్రాల కుర్చీలలో త్రోసికొని వచ్చిన ఈ జనులు నేను మిమ్ములను చూడాలని ఆశించుచున్నాను. గత రాత్రి చక్రాల కుర్చీలోయున్న ఒక స్త్రీ, మంచము లేక ఏదో కార్యము, పరిశుద్ధాత్మ ఆమెను పిలిచి మరి దాని నుండి ఆమెను పైకి లేపెను. ఇప్పుడు, చక్రాల కుర్చీలలోయున్న మీరు అనేక సమయములలో మీరు ఈ విధముగా చెప్పుటకు ప్రారంభించెదరు, “ఓ, నా పరిస్థితి చాలా ఘోరముగా నున్నది, ఏ ఆశా లేదు.” మీరు ఆ విధముగా నమ్మునంత కాలము మీ ఆరవ ఇంద్రియము మృతతుల్యమై యుండును. మీ యొక్క ఆరవ ఇంద్రియము గనుక ఈ రాత్రి సజీవముగా యున్నయెడల, మీరు బాధనొందుచున్న చివరి ఘడియ ఇదే. మీరు దాని నుండి బయటికి వచ్చి మరి స్వస్థతనొంది ఇంటికి వెళ్ళుడి.
ఇచ్చట నిలుచుకొనియున్న ఆ పురుషుని మరియు స్త్రీని (నలుపు రంగు సహోదరుడు మరియు సహోదరి) వారి యొక్క చిన్న బాలునితో నిలుచుకొని యున్నారు. మీరు ఈ రాత్రి నమ్ముచున్నారా? నీవు విశ్వాసము కలిగియుండుము నా సహోదరుడా, నీవు విశ్వాసము కలిగియుండుము సహోదరి. విశ్వాసమనగా ఏమిటని తెలియని చాలా చిన్నవారు ఇక్కడ యున్నారు వారు చిన్న బిడ్డలు; మీ బిడ్డను దేవుడు స్వస్థపరచునని మీరు నమ్ముడి. ఇచ్చట తన చిన్న బాలునితో స్త్రీ నిలుచుకొనియున్నది. నీవు విశ్వాసము కలిగియుండుము.
ఈ చక్రాల కుర్చీల చుట్టూ నిలుచుకొనియున్న మీరందరూ, ఆ జనుల కొరకు మీరు విశ్వాసము కలిగి యుండవలయునని నేను మిమ్ములను కోరుచున్నాను. మరియు ఇంకొద్ది దినములలో చనిపోవుటకు సిద్ధమగుచూ గుండె జబ్బుతో బాధపడుచున్న అచ్చటయున్న మీరు, కాన్సరు, ఏదైనను చేయకపోతే మీరు చనిపోయెదరు. ఇచ్చటనున్న జనులు వికలాంగులై సాధారణ జీవితమును జీవించెదరు. అయితే మీరు గనుక ఇప్పుడే దేవుని పట్టుకొనని యెడల మీరు చనిపోయెదరు. అవునయ్యా. అయితే నీవు దేవుని పట్టుకొని మరి “దేవా, నేను నా ఆరవ ఇంద్రియమును ప్రయోగించుచున్నాను; నేను నమ్ముచున్నాను. మరియు నీవు నన్ను స్వస్థపరచబోవుచున్నావని నేను నమ్ముచున్నాను,” అని చెప్పుము. మరటు పిదప దేవుడు దానిని చేయును. దానిని మీరు నమ్ముట లేదా? నీ హృదయమంతటితో నమ్ముము.
55
ఇప్పుడు, నేను వివేచనా వరుసను ఉపయోగింపబోవుట లేదు. ఆ యాభై మందిని ఇచ్చట వరుసలో పిలుచుట లేదు. నేను దానిని చేయలేను. అయితే నేను ప్రార్ధింపబోవుచున్నాను. ఇప్పుడు దేవుడు గనుక ఇంకా దేవుడై యున్నయెడల, దేవుడు గనుక ఇంకా దేవునిగా యున్నయెడల, అట్లైన ఆయన సమస్త కార్యములను చేయును ఆయన మార్గమున.
విశ్వాసము యొక్క శ్రేష్టమైన ఆకృతి ఏది? అచ్చట ఒక రోమీయుడు యుండెను. ఒక యూదుడు చెప్పెను, “వచ్చి నీ చేతులను నా కుమార్తెపై యుంచుము; ఆమె స్వస్థత నొందును.”
రోమీయుడు చెప్పెను, “నేను అర్హత లేనివాడను, మాట మాత్రము సెలవిమ్ము” అన్యజనులు చేయవలసిన కార్యము అదే. విదేశముల యందు మరి పలువిధములైన కూటములలో వారు ఒక అతీతమైన కార్యమును చూచెదరు, జనులందరూ విశ్వాసముతో నింపబడి బయటికి నడచి వెళ్ళెదరు. చూశారా? వారు దానిని నమ్ముచున్నారు. అయితే ఇచ్చట ఇది కఠినముగా యున్నది.
ఇప్పుడు మీరు పెంతెకొస్తు జనులు. మీరు ఒకవేళ మెథడిస్తుగా యుండ వచ్చును, అయితే మీరు గనుక పరిశుద్ధాత్మను కలిగియున్న యెడల మీరు పెంతెకొస్తు. ఇప్పుడు మీరు గనుక ఆరవ ఇంద్రియమును కలిగియుండి అది జీవింపచేయుటకు సిద్ధముగా యున్నయెడల, దానిని మనము చేసెదము.
56
ఇప్పుడు ఇచ్చటయున్న స్త్రీ లేక ఇచ్చటయున్న ఎవరో యొకరు, నాకు ఆ స్త్రీని గురించి తెలియదు. మనము ఒకరికొకరము అపరిచితులమని నేను ఊహించుచున్నాను. ఇప్పుడిచ్చట ఒక స్త్రీ, ఆమెను నా జీవితములో నేను ఎన్నడూ చూచి ఎరుగను. ఆమె చెప్పెను, ఆమెకు నేను తెలియదు మరి ఆమె నాకు తెలియదు సరి, నేనెట్లు తెలిసికొనగలను మరియు ఆమె ఇప్పుడే ఇచ్చటికి వచ్చెను. మరియు అట్టలు కలుపబడెను, మరియు ఎవరికో ఒక అట్ట ఇవ్వబడెను మరి ఆమె దానిని తీసికొనెను మరిచ్చట ఆమె యున్నది. వేదికపై ఉన్న వారిలో ఆమెయే మొదటి స్త్రీ.
మరియు నేనిచ్చట ఆమెతో మాటలాడు అదే సమయమున బయట అచ్చటనున్న మీరు దానిని నమ్ముచున్నారు మరియు ఆయన అదే కార్యమును మీకు చేయడాయని చూడుడి? కూటములోలేని ఒక వ్యక్తికి అది జరిగియుండవచ్చును. అది సత్యమనుటకు నిర్ధారణ. దేవుడు మోషేతో “ఈ వరమును తీసికొని అచ్చటికి వెళ్ళుము మరి నీ చేతులు ఎట్లు కుష్టు వ్యాధి నుండి స్వస్థతనొందినదో చూపించుము,” అని చెప్పెను. అతను ఒకసారి దానిని చేసెను మరి ఇశ్రాయేలందరూ వాగ్దాన భూమికి అతడిని వెంబండించిరి. చూశారా? అతను ఇశ్రాయేలీయుని చూచు ప్రతి సమయమున, “నా చేతిని చూడుము, కుష్టు వ్యాధి అని చెప్పలేదు. చూశారా? అది స్వస్థతనొందియున్నది.” లేదు, లేదు. అతను ఒకసారి దానిని చేసెను; దానిని వారందరూ నమ్మిరి. మనము చేయవలసిన విధానము అదియే. దానిని చూడుడి, దానిని నమ్ముడి.
57
ఇప్పుడు ఇచ్చట నా చేయి యున్నది. నాకు తెలిసినంతవరకూ నేను నా జీవితములో ఈమెను చూడలేదు. నేను గనుక చూచియున్న యెడల నాకు ఆమెను గురించి తెలియదు. ఆమె నాకు పూర్తిగా ఒక అన్యురాలు. అయితే ఆమె ఇచ్చట దేనికొరకు నిలుచుకొనియున్నదో లేక ఆమె ఏ కార్యము చేసియున్నదో, లేక ఆమె ఏమి చేయవలయునని యున్నదో దానికి ప్రణాళిక వేయుచున్నదో లేక నాకు తెలియని ఆమె ఎరిగియున్న కార్యమును గనుక పరిశుద్ధాత్మ వచ్చి నాకు చెప్పిన యెడల, అది బావి యొద్ద ఆ స్త్రీతో మాటలాడిన యేసు అదే యేసు అని ఒక నిర్ధారణగా యున్నది. ఒకప్పుడు పితృత్వములో ఒక అగ్నిస్తంభములో నుండి, కుమారత్వములో కుమారునిగా ఒక శరీరధారియై మరిప్పుడు శుద్దీకరణగా మీలో నాలో పరిశుద్ధాత్మగా నుండుచు, రక్తము ద్వారా మన శరీరములలో జీవించుచున్న ఆయనే ఆ మెస్సీయయని ఈ అన్యజనుల సంతతికి నిరూపణయై యున్నది. పరిశుద్ధాత్మ మనలో నివసించుచున్నది: నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలు చేయును. తండ్రి ఏమి చేయునో కుమారుడు ఏమి చూచునో మరి దానిని తప్ప కుమారుడు దేనిని చేయడు.“ మీరు దానిని నమ్ముచున్నారా?
58
ఇప్పుడు చక్రాల కుర్చీలలోనున్న మిమ్ములను నేను అడగాలని ఆశించుచున్నాను. ఇప్పుడు నేను గనుక ఈ స్త్రీని స్వస్థపరచగలిగిన యెడల నేను దానిని చేయగలను. నేను గనుక నిన్ను స్వస్థపరచగలిగిన యెడల దానిని నేను చేసెదను. నేను చేయలేను. అయితే ప్రభువైన దేవుడు (ఆమె నాకు సన్నిహితురాలు గనుక) ఆ స్త్రీని గురించి ప్రభువైన దేవుడు ఏదైనను నాకు చెప్పినయెడల (అది సరియా కాదా యనుటకు ఆమెయే తీర్పరి) ఆమెకు తెలియును నాకు తెలియదని, దానిని చేయుటకు ఇచ్చట ఒక అతీతమైన శక్తి కావలయునని మీకు తెలియును. అది నిజమేనా? దానిని ఆయన చేసెదనని వాగ్దానము చేసెను, ఆయన వాగ్దాసము ప్రకారమైన దేవుని కుమారుడని నీవు దానిని నమ్ముచున్నావా? దానిని ఇచ్చట నీవు పూర్తిగా నమ్ముచున్నావా? నీ యొక్క స్వస్థతను నీవు అంగీకరించి మరి దానిని నీ పూర్ణ హృదయముతో నమ్మెదవా? నీవు గనుక దానిని నిజముగా నమ్మి విశ్వసించినయెడల ఈ ఒక్క సంఘటన దానిని స్థిరపరచును. ఆమేన్. అది ఖచ్చితముగా సత్యము. నీవు గనుక ఆ ఒక్క కార్యమును నమ్మిన యెడల. అది నిశ్చయముగా సత్యము.
మంచిది. ఇప్పుడు, నేను ఈ మైక్రోఫోనుకు ముందు నిలుచుకొనబోవుచున్నాను, ఏలయనగా దర్శనములు వచ్చినప్పుడు, నేను ఎంత నెమ్మదిగా మాటలాడబోవుచున్నానో లేక ఎంత శబ్దముగా మాటలాడబోవుచున్నానో నాకు తెలియదు. నాకు తెలియని మిమ్ములను గురించిన కార్యము గనుక పరిశుద్ధాత్మ నాకు బయలుపరచిన యెడల వారు వారి స్వస్థతను పొందెదరని నేను జనులకు వాగ్దానము చేసితిని. ఇప్పుడు అది... ఆయన దానిని చేసినప్పుడు అది మీకు ఉత్సాహమునిచ్చి మరి మీకు విశ్వాసము కలుగు లాగున అది చేయనా? అది ఆయన మీకు చేసియున్నాడా? అది చేయనా? నిశ్చయముగా అది చేయును.
59
ఇప్పుడు, ఇప్పుడు బావి యొద్ద స్త్రీతో మన ప్రభువు మాటలాడినట్లుగా నేనిప్పుడు నీతో మాటలాడుచున్నాను. చూశారా? ఆమెను మొదట ఆయన ఆ స్త్రీ దృష్టిని ఆకర్షించెను, ఏలయనగా ఆమెయే మొదటి స్త్రీ (చూశారా?) మరియు ఆ విధముగానే నేను కూడా చేయునట్లుగా. చూశారా? నీవు ఒక మానవ జాతికి సంబంధించిన దానవు. నీవు ఒక ఆత్మను కలిగియున్నావు, నీవు ఒక ప్రాణము కలిగియున్నావు. నేనొక మానవుడిని, ఒక ఆత్మ మరియు ఒక ప్రాణము కలదు (soul) నీవు ఒక క్రైస్తవురాలివని నేనెరుగుదును. ఏలయనగా, నీవు ఒక క్రైస్తవురాలివని నీ యొక్క ఆత్మ నాకు సాక్ష్యమిచ్చుచున్నది. అది నిజము. చూశారా? దానిని ఆహ్వానించాలని అది ఆశించుచున్నది. మీరు గనుక ఆ విధముగా లేకున్న యెడల అది త్రోసుకొని పోయుండును.
మీరెప్పుడైనను ఈ విధమైన కూటములలో కలుసుకొని మరి ఈ విధమైన కార్యములను చూచితిరా? అవి సంభవించుటను మీరు చూచిరి. మీరెప్పుడైనను పాపులు వచ్చినప్పుడు వారి నుండి ఆ కార్యములు బయటికి త్రోసుకొని వచ్చుటను మీరు గమనించి యున్నారా. నేను మీకు చెప్పుచున్నాను, అదిప్పుడే, “నీవు ఒక పాపివి. నీవు ఫలానా - ఫలానా కార్యమును చేసియున్నావు. నీవు ఫలనా మరియు ఫలానా కార్యమును చేసియున్నావు?” చూశారా?
60
ఇప్పుడు మీరు గనుక మీ హృదయమంతటితో మీలో ఉన్న సమస్తముతో నమ్మినయెడల, మీ యొక్క బాధ లేదా ఏదైతే మిమ్మల్ని ఇబ్బందిపరచుచున్నదో దానిని దేవుడు నాకు చెప్పగలడు. అప్పుడు మీరు దానిని పొందగలరు. మరియు అది వారిని నమ్మునట్లుగా చేయును. వారు నమ్ముచున్నారని ఆ వికలాంగులు చెప్పిరి. వ్యాధిగ్రస్తులు, గుండె సమస్యతో నుండువారు, మరియు ఆ విధముగా బాధపడువారు నమ్ముచున్నామని చెప్పిరి. కావున ప్రతి యొక్కరు నమ్ముచున్నారు మరియు అచ్చట వరుసలోయున్న వారందరును నమ్ముచున్నారు. అయితే ప్రార్ధనా వరుసను అమలుపరచుటతో ఏ ప్రయోజనము లేదు. ప్రతి యొక్కరును నిజముగా ఆ ఆరవ ఇంద్రియమును ఉపయోగించవలెను, మరియు ఆ విధముగా నమ్ముచు మరి, “దేవునికి స్తోత్రములు, ఆయన నన్ను స్వస్థపరచెను,” అని చెప్పుచున్నారు. మరి ఆ విధముగానే ప్రతి యొక్కరి వైఖరి ఇతరుల పట్ల యున్నది. ఇచ్చటికి ఆకర్షింపబడిన వారిలో మీరు కూడా ఒకరుగా యున్నారు. అక్కడ ఎందరో, ఎందరో అందరూ అచ్చట యున్నారు. బహుశా పరిశుద్ధాత్మ జనులలోనికి కొద్దిసేపైన పిదప వెళ్ళవచ్చును. ఆయన ఏమి చేయునో నాకు తెలియదు. అప్పుడు నేను నిజముగా చాలా బలహీనమైన పిదప, నా కుమారుడో లేక వారిలో ఎవరైనా, జెనీ లేక వారిలో ఎవరో యొకరు వారు నా ప్రక్కలో తాకెదరు. నాకు తెలియును ఇది. నేను అప్పుడు ముగించుకొనవలయును (చూశారా?), ఏలయనగా నాకు తెలియదు. అనేక దర్శనములను చూస్తూ యుండిన పిదప అసలు నీవు ఎక్కడ వున్నావనేదే నీవెరుగవు, అప్పుడు కనబడు ప్రతీదీ ఒక దర్శనముగా యున్నట్లుగానే నీకు అనిపించును. చూశారా? యేసు చెప్పెను, “నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను దీనికన్నను అధికమైన కార్యములు మీరు చేసెదరు,” ఆయన చూచిన కార్యములు...
61
ఇప్పుడు, ఆమె గురించిన విషయమేమిటని నేను చూచుచున్నాను. ఆమె ప్రార్థన కొరకు ఇచ్చటికి వచ్చియున్నది, ఒక చిన్న పుండు కొరకు ఆ ప్రార్థన. మరియు ఆ పుండు చేతిపైన, అది నిజమేనా? అట్లేకదూ. ఇప్పుడు, నీవు నమ్ముచున్నావా? ఇప్పుడు ఆ పుండు నాకు మరుగుపరచబడి యున్నది. అయితే దేవునికి మరుగపరచబడ లేదు. అది ఏ చేతిలోయని నేను మీకు చెప్పగలను. అది సరి. అది నిజమేనా? అది గనుక నిజమైన యెడల మీ చేతిని పైకెత్తుడి.
ఇప్పుడు మీ హృదయమంతటితో మీరు నమ్మెదరా? ఇప్పుడు, ఆ ఆరవ ఇంద్రియము నీకు ఏదైనను చేయుచున్నదా? లేక నీవు గ్రుడ్డిగా మరి, “మంచిది, అది చాలా బాగున్నది,” యని చెప్పుచున్నావా, చూశారా? లేక ఆ ఆరవ ఇంద్రియము నిజముగా క్రియ చేయుటకు ప్రారంభించియున్నదా, చెప్పుము, “దేవునికి స్తోత్రము, ఆ వ్యక్తిని నేనెరుగుదును. ఆ స్త్రీని నేనెరుగను. ఇప్పుడు యేసుక్రీస్తు మాత్రము ఆమెను ఎరిగియున్నాడు. మరియు ఆయన దానిని చేసెదనని వాగ్దానము చేసియున్నాడు.” నీవు గనుక దానిని నమ్మగలిగిన యెడల దాని అర్థము నీవు స్వస్థత నొందినట్లే.“
62
“ఆమెకు ఉన్న వ్యాధిని ఒకవేళ నీవు ఏదో ఊహించి చెప్పుచున్నావు,” అని మీరు చెప్పవచ్చు. నేను దానిని ఊహించలేను. అది ఊహ కాదు. బహుశా. నేను మీకు ఇంకొక విషయాన్ని చెప్పెదను. నీవిచ్చటి నుండి రాలేదు. నీవు లీమా నుండి వచ్చితివి. అది నిజము. నీవు ఎవరివో దేవుడు నాకు తెలుపగలడని నీవు నమ్ముచున్నావా? యవ్వనస్తురాలివైన వైట్, శ్రీమతి వైట్, అది నిజము. దేవుడు ఇప్పుడు నిన్ను స్వస్థపరచును, మరి ఇంటికి వెళ్ళుము, నీ హృదయమంతటితో దానిని నమ్ముము.
ఇప్పుడు మీలోనున్న ప్రతి యొక్కరూ నమ్ముచున్నారా? దేవునియందు విశ్వాసముంచుడి. మీరు నమ్మినయెడల, విశ్వాసించిన వారికి సమస్తమును సాధ్యము. మీరు గనుక నమ్మినయెడల, లేక నీవు ఒక కుర్చీలో కూర్చొని యున్నప్పుడు నీవు స్వస్థత నొందినావని నేను మీకు చెప్పినయెడల, నీవు నన్ను నమ్మెదవా? అట్లైనయెడల నీ దారిన ముందుకు సాగిపో, ఏలయనగా నీవు నమ్ముచున్నావు. దేవునియందు విశ్వాసముంచుము.
ఇప్పుడు, నేను గనుక నీపై చేతులుంచి మరి, “సాతాను ఈ బాలుని వదిలి పొమ్ము” యని చెప్పిన యెడల దానిని నీవు నమ్మెదవా? నీవు స్వస్థత నొందెదవా? ఇచ్చటికి రమ్ము సాతాను యేసు నామమున ఈ బాలుని వదిలి పొమ్ము ఆమేన్. ఇప్పుడు నమ్ముచు వెళ్ళుము. విశ్వాసము కలిగియుండుము.
నేను నా చేతులను మీ పైనుంచి మరి, “సాతానా అతని నుండి పొమ్ము” యని చెప్పిన ఏమి, దానిని నీవు నమ్మెదవా? సాతానా, యేసు నామమున అతనిని వదిలి పొమ్ము ఆమేన్. దేవుడు నిన్ను ఆశీర్వదించును, నమ్ముచు వెళ్ళుము.
63
మీకు లోపమేమిటని నేను గనుక మీతో చెప్పుటవలన మీకు అది ప్రయోజనకరమా లేక మీపై నేను చేతులుంచవలయునని మీరు కోరుచున్నారా? మీకు లోపమేమిటని నాకు చెప్పునది ఎవరు? అది మీ వెనుక యున్నది. అది నిజమే. అది నిజమేనా? అట్లైన ఇంటికి వెళ్ళి మరి యేసు నామమున స్వస్థత నొందుము. అది మంచిది.
నీ సంగతి ఏమిటి? నీవెవరివో నేనెరుగుదునని నేను నమ్ముచున్నాను. అది నిజము. నేను నీపై నా చేతుల నుంచి మరి, “సాతానా, నా సహోదరుని విడిచి వెళ్ళమని యేసు నామమున చెప్పుచున్నాను. ఆమేన్.” సహోదరుడా ఇప్పుడు నమ్ముము, నీ హృదయమంతటితో నమ్ముము.
64
మీలో ప్రతి యొక్కరు నమ్ముచున్నారా? సరి, వినుడి, ఇక్కడే నేను దీనిని గ్రహించలేకపోవుచున్నాను. చూశారా? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మరి ఎట్లు ఆ విషయములన్నింటిని బయలుపరచుచున్నది. ఆ జనులలో లోపమేమిటని ఆయన నాకు చెప్పుచున్నాడు. నేను గనుక ఒక్క నిమిషము నిలిచిన యెడల, అయితే మిగిలిన వారు వరుసలోనికి రాలేరు. వివేచించుట జరిగిన పిదప అది సంభవించుటను మీరు చూచుటయు, స్వస్థతను పొందునట్లుగా చేతులు వారి మీదుంచగా, జనులు చాలినంత విశ్వాసముతో ముందుకు కొనసాగిపోవుచూ వెళ్ళుటను దేవుడు చేయుచుండగా వాటిని చూచుటకు మనకు ఎంతో గొప్ప భాగ్యముగా ఉన్నది కదూ? పరిశుద్ధాత్మ ద్వారా మనము ఏదో వినోదాన్ని తిలకించుచు ఆ అమెరికన్ల వలె మనము ఉండాలని ఆశించుచున్నారా?
ఇచ్చటికి రమ్ము నేను మిమ్ములను ఎరుగను. అయితే మనము ఒకరికొకరము అన్యులము. అది నిజమేనా? నన్ను మీరెరుగుదురు. కాని నేను నిన్నెరుగను. అయితే దేవుడు మన యిద్దరిని ఎరిగియున్నాడు. నీ యొక్క బాధ ఏమిటని దేవుడు నాకు గనుక చెప్పినయెడల, నీవు నన్ను ఆయన ప్రవక్తయుని నమ్మొదవా? నీ హృదయమంతటితో? అది మంచిది. గుండె బాధ, అది ఖచ్చితముగా నిజమే. నీవు నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? నీవు స్వస్థత నొందెదవని నీవు నమ్ముచున్నావా? నీవు దీనికొరకై ఎంతో దూరము నుండి వచ్చితివి, నిజమే కదూ? కాలిఫోర్నియో నుండి వచ్చితివి. అది నిజమే. నీవు నీ భార్యను కూడా తీసుకొని వచ్చితివి కదూ? ఆమె కూడా స్వస్థతను పొందుకోవాలని ఆశించుచున్నది. ఒక ప్రార్థనా అట్టను పొందలేకపోయారు. అయితే ఆమె నడుములో ఏదో లోపమున్నది. అది పడిపోవుట వలన ఏర్పడినది. అది నిజమే? ఇంటికి వెళ్ళుము; మీరిరువురును స్వస్థత నొందబోవుచున్నారు. నమ్ముచు వెళ్ళుము.
65
ఇప్పుడు, ఇప్పుడు, అది అదే విషయం చెప్పబడుచున్నది.... అయితే నీవు గనుక నమ్మిన యెడల, సమస్తమును సాధ్యము. సహోదరి నీవు నమ్ముచున్నావా? నీపై చేతులుంచగా నీవు స్వస్థత నొందెదవని నీవు నమ్ముచున్నావా? అట్లైన రమ్ము. ప్రభువైన యేసు నామమున స్త్రీని స్వస్థపరచుము. అది మంచిది.
స్త్రీ రమ్ము ఇప్పుడు చూశారా? ఇప్పుడు, ఎందుకు? ఆ వ్యక్తి ఏ విధముగా స్వస్థత నొందియున్నాడో ఆ స్త్రీ కూడా ఆ విధముగానే స్వస్థతనొందియున్నది. మనము చెప్పలేమా, “ఆమెను స్వస్థపరచినందులకు దేవునికి స్తోత్రములు?” చూశారా?
66
ఇప్పుడిచ్చట, మీకు తెలియునా, నీకు ఏ లోపమున్నదో నేనెరుగుదునని నీవెరుగుదువా? నేనెరిగిన విధముగానే మీరు కూడా దానిని ఎరుగుదురు. దానిని దేవుడు నాకు బయలుపరచునని మీరెరుగుదురు. ఇప్పుడు నేను మీకు చెప్పిన యెడల అది మీకు సహాయపడునా? అది మీ నరముల బలహీనత, అది ఖచ్చితముగా వాస్తవము. మీ హృదయమంతటితో నమ్ముడి, యేసు క్రీస్తు నామమున వెళ్ళి స్వస్థత నొందుడి. విశ్వాసము కలిగియుండుడి,
నీ పూర్ణ హృదయముతో నీవు నమ్ముచున్నావా సహోదరీ? యేసు క్రీస్తు నామమున వెళ్ళి మరి స్వస్థత నొందుము.
నీ పూర్ణ హృదయముతో నీవు నమ్ముచున్నావా సహోదరీ? యేసు క్రీస్తు నామమున వెళ్ళి మరి స్వస్థత నొందుము.
ఇప్పుడు దేవుడు దానిని చేయమని చెప్పిన విధముగా ఖచ్చితముగా ఆ విధముగానే, అది నిజమేనా? ఈ సూచనలు నమ్మినవారిని వెంబండించును.
యేసు క్రీస్తు నామమున వెళ్ళి మరి స్వస్థతనొందుము. ఆమేన్.
ఆమె కొరకు నీవు నమ్మెదవా? యేసు క్రీస్తు నామమున దయ్యము ఆ బిడ్డను వదిలి పోనిమ్ము. ఆమేన్. ఇప్పుడు వెళ్ళి, మరి స్వస్థత నొందుము.
కడుపు సమస్య నుండి విడుదల పొంది నీ సాయంకాలపు ఆహారమును నీవు భుజించాలని ఆశించుచున్నావా? వెళ్ళి భుజించి మరి యేసు నామమున స్వస్థత నొందుము. నీ పూర్ణహృదయముతో నీవు నమ్ముచున్నావా? చూశారా?
67
ముందుకు సాగిపొమ్ము.... ఆ ఆరవ ఇంద్రియమును పొందుము: ఆ ప్రాచీన ఐదు ఇంద్రియములను మార్గము నుండి తొలగించుము. నమ్ముము.
నీవెట్లున్నావు. నేను నీకు అవును లేక కాదని చెప్పినను నీవు ఎట్లైనను నమ్మెదవు, హు? ఎట్లైనను నీవు నమ్మెదవు. అది మంచిది. నీ భుజములకు మధ్యన యుండు నీ వెన్నెముకలో నుండు ఆ చిన్న తిత్తి వలన బాధపడుచున్నావు, వెళ్ళి నమ్మి మరి స్వస్థతనొందుము. నీవు నమ్ముచున్నావా? యేసు క్రీస్తు నామమున. ఆమేన్. విశ్వాసము కలిగియుండుము.
రమ్ము సహోదరుడా, నీవు నమ్ముచున్నావా? యేసు నామమున అతను స్వస్థత నొందును గాక,
రమ్ము, నీవు నమ్ముచున్నావా, సహోదరుడా? యేసు క్రీస్తు నామమున నా చేతులను నీపై నుంచుచున్నాను; నీవు స్వస్థత నొందెదవు. ఆమేన్. ఇప్పుడు నమ్ముము.
అయ్యా, నీవు నమ్ముచున్నావా? యేసు క్రీస్తు నామమున స్వస్థతనొందుము. ఆమేన్. దానిని గనుక నీవు నమ్మినయెడల యేసు దానిని నీ కొరకు చేయును.
యేసు క్రీస్తు నామమున స్వస్థత నొందుము. ఆ విధముగానే సహోదరులారా, అదియే అది. దానిని చేయవలసిన విధానము అదియే.
యేసు క్రీస్తు నామమున వెళ్ళి మరి స్వస్థత నొందుము. ఆమేన్.
రమ్ము సహోదరీ. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఆ విధమైన అద్భుతములు చేయుటకు యున్నయెడల, ఖచ్చితముగా నేను ఆయన ద్వారా అభిషేకింపబడి యున్నానని నీవు నమ్మెదవు, నీవు నమ్మవా? అట్లైనయెడల యేసు క్రీస్తు నామమున వెళ్ళి మరి స్వస్థత నొందుము. ఆమేన్.
నీవు నమ్ముచున్నావా, సహోదరుడా? యేసుక్రీస్తు నామమున, పోయి మరి స్వస్థత నొందుము.
68
“మీరు సమ్మిన యెడల, సమస్తమును సాధ్యమగును.”
ఈమె నా తదుపరి వ్యాధిగ్రసురాలు? సరి. నీ పూర్ణ హృదయముతో నీవు నమ్ముచున్నావా సహోదరీ? అదియే అది. ఆమేన్. ఆమె నిజముగానే దానిని పొందినది. నేను గమనించుచుంటిని, ఆమెకు పైగా ఒక నీడ యుండెను మరి అది దూరముగా వెళ్ళిపోయిన పిదప దానికి ఏమి సంభవించినదాయని నేను ఆశ్చర్యపడుచుంటిని, మరలా చూచితిని, ఇప్పుడు అది వెళ్ళిపోయినది. ఏలయనగా, ఆమె దానిని నమ్మెను. చూశారా? అదియే సంగతి.
నాకు నివు తెలియదు. నీవు నన్ను ఎరుగవు. మనము ఒకరికొకరము అన్యులము. అయితే దేవుడికి నీవెవరివో తెలుసు, మరియు నీవు గనుక నమ్మినయెడల నేను నీకు సహాయపడుటకు ఇక్కడ యున్నానని ఆయనకు తెలియును. దానిని నీవు నమ్ముచున్నావా?
ఒక్క నిమిషమాగుము, ఏదో విషయము జనులలో సంభవించెను, ఎక్కడో, ఎక్కడో, అదియే అది; అక్కడ నమ్ముటకు ప్రారంభించిరి. సరి, నీ వెనుక భాగమున నున్న బాధలన్నియును. అది సరియే. నీకు వెన్నెముక సమస్య గలదు. యవ్వనస్తురాలివైన ఫిన్హోఫెర్, ఇంటికి వెళ్ళి మరి స్వస్థత నొందుము.
69
రమ్ము, మీ పూర్ణ హృదయముతో నమ్ముచు రమ్ము అయ్యా, మీరు నమ్ముచున్నారా? యేసు క్రీస్తు నామమున వెళ్ళి మరి స్వస్థత నొందుము.
రమ్ము ఇప్పుడు ఏమి లోపమని నేను మీకు చెప్పినను లేక చెప్పకున్నను లేక వేరేమైనను, నీవెట్లన్నను నమ్మెదవా? అట్లైన నీకు స్త్రీల వ్యాధి గలదు. ఆ స్త్రీల వ్యాధి నిన్ను వదిలియున్నది, ముందుకు సాగిపొమ్ము అవును, నేను ఎట్లైనను చెప్పియున్నాను. అది మంచిది.
నీ యొక్క సరముల బలహీనత సుండి దేవుడు నిన్ను స్వస్థపరచునని నీవు నమ్ముచున్నావా? అది మంచిది. వెళ్ళి మరి యేసు నామమున స్వస్థత నొందుము; నీ పూర్ణ హృదయముతో నమ్ముము.
నీ కడుపు సమస్య నుండి విముక్తి పొందవలయునని యున్నావా? అది సరి. వెళ్ళి మరి నీ రాత్రి భోజనమును తీసికొని మరి ప్రభువైన యేసు నామమున స్వస్థత నొందుము.
నీ పూర్ణ హృదయముతో నీవు నమ్ముచున్నావా? అది సరి. సహోదరీ, నీవు నమ్ముచున్నావా? యేసు క్రీస్తు నామమున వెళ్ళి మరి స్వస్థత నొందుము. సరి.
ఈ చిన్న బాలుడు ఈ బాధ నుండి విడుదల నొందునని నమ్ముచున్నావా? ఈ కార్యమును చేసిన ఆ దయ్యమును నేను శపించుచున్నాను మరియు యేసు క్రీస్తు నామమున అతను స్వస్థత నొందును గాక. ఆమేన్. అతనిని ఇప్పుడు తీసుకొని వెళ్ళు సందేహింప వద్దు. నీవు గనుక నమ్మినయెడల అతనికి ఏమి సంభవించునని గమనించుము.
నీ పూర్ణ హృదయముతో నీవు నమ్ముచున్నావా? యేసు క్రీస్తు నామమున అతను స్వస్థత నొందనిమ్ము.
70
ఇచ్చటి నుండి స్వస్థత వచ్చుచున్నది. ఒక విధముగా సన్నగా ఒక చిన్న స్త్రీ బ్రౌన్ రంగు టోపీ వేసికొని వెనుక అచ్చట కూర్చొనియున్నది. ఆమె క్షయవ్యాధి (TB)తో బాధపడుచున్నది. అది సరి, సహోదరి. నేను మిమ్మల్ని ఎరుగను అలాగే మీరు కూడా నన్నెరుగరు. అవును, నీవు నన్నెరుగుదువు. నీవు ఒకప్పుడు నా కూటములో స్వస్థత నొందితివి; అది ఫోర్ట్ వేన్, ఇండియానాలో నేను చూచితిని, హల్లేలూయా! అది అదియే. నీకున్న లోపమేమిటని దేవుడు నాకు చెప్పునని నీవు నమ్ముచున్నావా? నీకు ఒక కణితి యున్నది, మరియు దేవుడు నిన్ను స్వస్థపరచెనని నీవు నమ్ముచున్నావా, ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లేలూయా!
నీవు నమ్మవలయునని నేను సవాలు చేయుచున్నాను. అనేకులు నమ్ముచున్నారు. దేవుని యందు విశ్వాసముంచుము. సహోదరీ, నీవు నమ్ముచున్నావా? యేసు నామములో వెళ్ళి మరి దేవుని మహిమార్థమై స్వస్థత నొందుము.
నీవు నమ్ముచున్నావా, సహోదరుడా? యేసుకీస్తు నామములో, వెళ్ళి మరి స్వస్థత నొందుము.
నీవు నమ్ముచున్నావా, సహోదరుడా? యేసు క్రీస్తు నామములో, వెళ్ళి మరి స్వస్థత నొందుము.
నీవు నమ్ముచున్నావా, సహోదరీ? యేసు నామములో, వెళ్ళి మరి స్వస్థత నొందుము.
నీవు నమ్ముచున్నావా, సహోదరుడా? యేసు నామములో, వెళ్ళి మరి స్వస్థత నొందుము.
ఆ చిన్న బిడ్డ కొరకు నీవు నమ్ముచున్నావా? ఇప్పుడు, చూడుము, అది పుట్టుకతో వచ్చినదని నేనెరుగుదును, అయితే దానితో ఏమి పనిలేదు. దయ్యము ఏ సమయములో ఏమి చేసినను దేవుడు దానిని తీసివేయగలడు. దానిని నీవు నమ్ముచున్నావా? ఈ బిడ్డకు దానిని చేసిన దయ్యమును నేను శపించుచున్నాను. యేసు క్రీస్తు నామమున ఈ బిడ్డ స్వస్థత నొందనిమ్మ. ఆమేన్.
71
నీవు నమ్ముచున్నావా, సహోదరీ? యేసు క్రీస్తు నామమున, వెళ్ళి మరి స్వస్థత నొందుము.
సహోదరీ నీవు నమ్ముచున్నావా? యేసు నామమున, వెళ్ళి మరి స్వస్థత నొందుము.
సహోదరీ, నీవు నమ్ముచున్నావా? (ప్రార్థనా వరుసలో ఇది చివరిదా?) అది మంచిది, ఒక్క నిమిషము నా వైపు చూడుము. నీవు నీ పూర్ణ హృదయముతో నమ్ముచున్నావా? నీకున్న ఇబ్బంది ఏమిటని దేవుడు నాకు చెప్పినయెడల నీవు దానిని నమ్మెదవా? ఒక కార్యము, నీ కన్ను చాలా విపరీతముగా యున్నది. అది నిజము. ముఖ్యమైన విషయము అసలు అది కాదు. నీకు ఒక కణితి గలదు. కడుపులో ఒక కణితి గలదు. నీవు ఇచ్చటి నుండి రాలేదు. ఇల్లినోయిస్కు తిరిగి వెళ్ళి మరి స్వస్థత నొందుము. యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచెను.
నీవు గనుక నమ్మిన యెడల, సమస్తమును సాధ్యము. దానిని నీవు నమ్ముచున్నావా?
72
అచ్చట వెనుక కూర్చొనియున్న వ్యక్తి గుండెలో రంధ్రము గల ఒక చిన్న బిడ్డను తీసికొని వచ్చియున్నాడు. నీవు టేన్నీస్సీలో ఉన్న చట్టానూగా నుండి వచ్చితివి. శ్రీ కిర్ క్లేన్, ఇంటికి వెళ్ళి మరి నమ్ముము. ఆ బిడ్డకు ఆ గుండెలో గల అస్వస్థత నుండి స్వస్థతనొందును. యేసు క్రీస్తు దానిని స్వస్థపరచి యున్నాడు. హల్లేలూయా! అది మన దేవుని యొక్క శక్తి, దేవుని యందు విశ్వాసముంచుము.
అక్కడ కూర్చొనియున్న ఇంకొక స్త్రీ టేన్నీస్సీలోనున్న మొమ్ఫిస్ నుండి ఈ దారిన వచ్చియున్నది, తన యొక్క తప్పిపోయిన కుమార్తె కొరకు ప్రార్థించుచున్నది. దేవుని యందు విశ్వాసముంచుము.
నేను ఒక స్త్రీ కొరకు ఎదురు చూచుచున్నాను, జనులలో నుండి నేను ఆమెను చూచుట లేదు. అయితే ఆమె ఇక్కడెక్కడో యున్నది. ఆమె ప్రార్థించుచున్నది. ఆమెను కనుగొనుటకు దేవా నాకు సహాయపడుము. విశ్వాసముతో ఉన్న ఎవరికో గుండె బాధ మరియు చక్కెర వ్యాధి యున్నది. ఆమె పేరు శ్రీమతి వెల్స్, దేవుని యుందు విశ్వాసముంచుము. ఎక్కడో నాకు తెలియదు. (ఎవ్వరో చెప్పుచున్నారు, “ఆమె ఇచ్చట యున్నది.”) అది సరి, అది సరి, సహోదరి, నీ విశ్వాసము నిన్ను రక్షించినది. అంతే కాకుండా గుండె సమస్య నీ కుటుంబములో యున్నది. నీకు ప్రార్థనా అట్ట లేదు, నీకు లేదు కదూ? ఏలయనగా నీవు. కాదు. ఏలయనగా అట్టలన్నియును అయిపోయినవి. గుండె సమస్య మీ కుటుంబములోయున్నది. నీకు గుండె సమస్యగల ఒక సహోదరుడు నీకు యున్నాడు. ఆ సహోదరుడు ఇచ్చట లేడు. ఆ సహోదరుడు మేరీలేండ్లోనున్న బల్టీమోర్లో నివసించుచున్నాడు. మరి అతను కూడా రక్షింపబడలేదు, ఏలయనగా అతనిపై ఒక నలుపు రంగు నీడ యున్నది, దానితో అతను కప్పబడియున్నాడు. అది ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
73
నీ పూర్ణ హృదయముతో నీవు నమ్ముచున్నావా? ఆ ఆరవ ఇంద్రియము నీ పై క్రియ చేయబోవుచున్నదా? మీ చేతులను ఒకరిపై ఒకరు యుంచుడి. ఆకాశమును మరియు భూమిని సృష్టించిన ఓ, దేవా, ఈ సమయమున మీ పరిశుద్ధాత్మను పంపి మరి యేసు క్రీస్తు నామమున దేవుని సన్నిధిని యున్న ప్రతి వ్యక్తిని స్వస్థపరచుము. నీవు దానిని నమ్ముచున్నావా?
ఇచ్చటయున్న వారెందరు యేసును మీ రక్షకునిగా తెలిసికొనగోరుచున్నారు? మీరు లేచి నిలువబడుడి. మీరు ఆయనకు సమీపముగా యున్నారు. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును. అది వాస్తవము. అద్భుతము!
74
ఎందరు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశించుచున్నారు? మీరు లేచి నిలువబడుడి. మీలో ప్రతి యొక్కరును పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము కోరిన యెడల లేచి నిలువబడుడి. మీరు ఎంతో సేపు ఉ౦డుట వలన మిమ్ములను ఇచ్చట కలుసు కొనుటకు వీలు కాదు, కావున మీరు ఈ గదిలో కూడుకొనిన యెడల మేము మిమ్ములను అచ్చట కలిసెదము. యేసు నామమున మీరు గనుక భయభక్తులతో వచ్చిన యెడల, మీరు పరిశుద్ధాత్మతో నింపబడెదరు, మీ పాపములన్నిటి నుండి రక్షింపబడెదరు. ఈ రాత్రి ఆ గదిలోనికి వెళ్ళుడి. ఇదియే సమయము. ఈ దారి గుండా ఆ గదిలోనికి వెళ్ళుడి, ఇచ్చట యుండి దేవుని యందు విశ్వాసముంచిన వారు, రక్షింపబడవలయునని కోరు వారు మరియు పరిశుద్ధాత్మతో నింపబడవలయునని కోరు వారు ఈ గది నుండి కదిలి వెళ్ళుడి, కావున మేము మీకు పరిచర్య చేయగలము.
జెఫర్సన్విల్ యందు యున్నవారు నా సంఘము నుండి పరిశుద్ధాత్మను ఇంకా పొందనివారు ఎవరయినా యున్నయెడల. సహోదరుడు కొలీన్స్ మరియు వారందరు ఇచ్చట యున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందిరి. ఓ, వారు పట్టణమును తల్లక్రిందులు చేసిరి. తిరిగి రమ్ము దానిని పొందుటకు మీకు ఇదియే సమయము. లోనికి వెళ్ళుడి. పరిశుద్ధాత్మను పొందు వరకు మీరు అచ్చటి నుండి బయటికి రావద్దు. పాపులందరు ఇప్పుడు రండి. లోనికి వెళ్ళి మరి రక్షణ కొరకై దేవుని వెదకుడి. అదియే మార్గము.
75
వ్యాధితోనున్న మరియు మీలో లోపమున్న ఈ దేవుని సన్నిధిలో యున్న ప్రతి పురుషుని మరియు ప్రతి స్త్రీని నేను సవాలు చేయుచున్నాను, నేను మీ కొరకు ప్రార్ధన చేయుచుండగా మీరు ప్రభువైన యేసు క్రీస్తు నామమున విశ్వాసముంచవలయునని నేను మీకు సవాలు చేయుచున్నాను. దానిని మీరు చేసెదరా? దానిని చేసెదమని ఎందరు వాగ్దానము చేసెదరు? దేవుడు గనుక ఆత్మలను వివేచింపగల శక్తిని నాకు అనుగ్రహించిన యెడల. నేను మీకు చెప్పుచున్నాను, నేను మిమ్ములను స్వస్థపరచలేను. మీరు దీనికి ముందే స్వస్థతనొందితిరి. ఆయన మీ కొరకు చనిపోయినప్పుడే యేసు మిమ్ములను స్వస్థపరచెను. ఆ ఆరవ ఇంద్రియము పనిచేయనియండి, మోద్దుబారిపో వద్దు. దానిని క్రియలోనికి దించి మరి దానిని నమ్ముడి. ఈ చక్రాల కుర్చీలలో కూర్చొనియున్న ఇచ్చటనున్న ఈ జనులైన మీ సంగతి ఏమిటి? మీరు దానిని నమ్ముచున్నారా? అట్లైన మనము మన చేతులను దేవుని వైపుకు పైకెత్తెదము.
76
ఓ ప్రభువైన దేవా, ఈ వర్తమానము వ్యర్థముగా పోనియ్యకుము. ఈ రాత్రి దేవుని యొక్క శక్తి వృథాకానియ్యకుము. అయితే పరలోకపు తండ్రీ ఇది నిజమని నమ్మే శక్తిని క్రిందికి పంపి మరి ప్రతి వ్యక్తిని స్వస్థపరచుము. కాన్సరు, గుండె జబ్బు, వికలాంగులు, లుకిమియా, మరియు ఏ విధమైన వ్యాధియైనను అవి కలిగియున్న వారి నుండి దయ్యము వారిని వదిలి పోవును గాక. దూత ద్వారా నాకు ఇవ్వబడిన వరము వలన నేను సవాలు చేయుచున్నాను, వ్యాధిగ్రస్తులను మరియు పీడింపబడిన వారిని స్వస్థపరచుట యేసుక్రీస్తు బాధల వలన పంపబడినది.
సాతానా, వారి నుండి బయటికి రమ్ము. వారి నుండి బయటికి రమ్మని నేను యేసు క్రీస్తు నామమున నీకు ఆజ్ఞాపించుచున్నాను.
ఇప్పుడు క్రీస్తును వారిని స్వస్థతపరచువానిగా అంగీకరించువారందరూ; మీకు గల లోపమేమిటో నాకు అక్కర లేదు. అది నాకు ఏ విధమైన బేధము కలుగ జేయదు; మీరు గనుక దేవుని నమ్మిన యెడల లేచి నిలువబడి మరి యేసుక్రీస్తు నామములో దానిని అంగీకరించుడి. అదియే మార్గము. ఆమేన్! దేవుడు మిమ్ములను ఆశీర్వదించును. అదియే దానిలోనున్న కార్యము! అదియే పరిపూర్ణమైనది, పరిపూర్ణము. సహోదరుడు సుల్లివన్, దేవుడు మిమ్ము ఆశీర్వదించును.