గ్రుడ్డి బర్తిమయి

గ్రుడ్డి బర్తిమయి

VGR COUNT-355 దేవుడు మిమ్ములను దీవించును గాక. మీరు కూర్చోన వచ్చును. అనేకులు ప్రార్థన కొరకు మనవులను పంపించారు. మేము దానిని ఎంతగానో ప్రశంసిస్తున్నాము. ఎందుకనగా వారు పౌలు వస్త్రములకు చేతిగుడ్డలను వారికి తాకించినప్పుడు, ప్రజల నుండి అపవిత్రాత్మలు విడిచిపోయాయి. ప్రజలు రోగముల నుండి వ్యాధుల నుండి స్వస్థతలు పొందారు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది. దేవుడు ఇప్పటికీ దేవుడైయున్నాడు. పరిశుద్ధ పౌలు కాలములో ఆయన ఎలాంటి శక్తి కలిగియున్నాడో, నేటి దినములలో కూడా అదే శక్తిని కలిగియున్నాడు. ఆయన మారలేదు.

అనేకులు ఇప్పుడు ఆ వస్త్రములను తీసికొని, వాటిని నూనెతో అభిషేకించి తమ ప్రియులకు పంపించుచున్నారు. అది చాలా మంచిది. దేవుడు ఆశీర్వదించు ఏ కార్యమైనా నాకిష్టమే, మీకు కాదా? కాని లేఖనముల ప్రకారం చూచినట్లయితే, పౌలు వాటిని అభిషేకించలేదు. వారు అతని శరీరము మీద నుండి ఆ వస్త్రములు తీసుకొన్నారు. అపో. కా., “అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లయినను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దయ్యములు కూడా వదలిపోయెను. మనకు తెలుసు పరిశుద్ధుడైన పౌలు.... మనము పరిశుధ పౌలు కాదు, కాని ఆయన ఇంకా యేసే. అయితే, పౌలు కాలములో ఆయన ఎలాంటి యేసుగా ఉన్నాడో, నేటి కాలములో కూడా ఆయన అదే యేసుగా ఉన్నాడు. తన సేవకుని మీద ప్రజలు కలిగియున్న విశ్వాసమును ఆయన గౌరవించి, మీ విషయంలో కూడా ఆయన అదే కార్యము జరిగించును, ప్రజలు ఆ ప్రార్ధనా వస్త్రములు ఇతరులకు పంపినప్పుడు గొప్ప అద్భుతములు జరుగుట గూర్చి నేను విన్నాను. ప్రతివారము వేలాదిమందికి ప్రపంచవ్యాప్తముగా వాటిని పంపించుచున్నాను.

2

మరియు ఒక సంగతి నాకు గుర్తున్నది. మేము దక్షిణాఫ్రికాలో ఒక పెద్ద విమానాశ్రయంలోని మైదానములో గొప్ప సభలు జరిగించాము. వారు దానిలో సభలు జరిగించుటకు అవకాశము ఇచ్చారు. అది కేప్-టౌన్, అక్కడ చాలా విస్తారంగా ప్రజలు వచ్చారు. వారందరికీ వసతి కల్పించుటకు తగిన భవనములు లేవు. మేము ఆ మైదానములో ఏర్పాటు చేశాము. అక్కడ వారు చాలా సంచులలో ప్రార్థనా మనవులు కలిగిన ఉత్తరములు వచ్చారు. వారు ఎన్ని బస్తాల ఉత్తరాలు తీసుకు వచ్చారో నాకు జ్ఞాపకము లేదు. నేను ఆ ఉత్తరముల కొరకు ప్రార్ధించాను. వారిలో ఒక విలేఖరి నాతో ఈ విధంగా చెప్పాడు. “సహోదరుడు బ్రెన్హా౦, చాలా మూఢనమ్మకాలు కలిగిన వ్యక్తి ఆయన రోగులకు పంపు ఉత్తరముల కొరకు ప్రార్థన చేయుచున్నాడు.” మంచిది, అది లేఖనములు మనకిచ్చిన ఆజ్ఞ అని ఆ సహోదరుడు గుర్తించలేదు; మనము వాటి కొరకు ప్రార్ధించాలి.

3

మరియొక చిన్న సంఘటన, ఎందుకనగా ఈ రాత్రి మనము ప్రధానంగా ఈ ఆరాధనను రోగుల కొరకు ప్రార్థించుట కొరకు కేటాయించాము. కొంతకాలము క్రితము, ఒక సాక్ష్యమును గూర్చి నేను చదువుచున్నాను. జర్మనీలో ఒక స్త్రీ, పదిహేడు సంవత్సరములుగా నడువలేక చక్రాల కుర్చీకి పరిమితం అయినది

మరియు మేము వాటిని పంపిణీ చేయుచున్నప్పుడు, వారికి చిన్న వస్త్రపు ముక్కలను పంపుచున్నాము. ప్రారంభంలో నేను చేతి రుమాళ్ళను పంపేవాడిని, కాని ఇప్పుడు వేలాదిమందికి పంపవలసియున్నది. ఒక్కొక్కటి పదిహేను లేక ఇరవై సెంట్లు ఖర్చు అవుతున్నది. కాబట్టి ఆ విధంగా పంపలేము. కాబట్టి, వందల గజముల పొడవున్న రిబ్బన్లు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి వాటన్నిటి కొరకు ప్రార్ధించేవాడిని. మీకు ఒకటి అవసరమయ్యి వుంటే నా కార్యాలయమునకు వ్రాయండి. వారు మీకు దానిని పంపుదురు. మీకు ఒక చిన్న ఉత్తరం పంపించబడును. రాత్రి ఘడియలలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరు లేచి గొలుసుకట్టుగా రోగుల కొరకు ప్రార్ధిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథము మనము ఒకరి పాపములను ఒకరితో ఒప్పుకొని, ఒకరి కొరకు ప్రార్థించాలని చెప్పినది. కాబట్టి దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా మనమందరము కలిసి ప్రార్ధిస్తున్నాము.

4

కాబట్టి ఈ స్త్రీ కూడా ఆ ప్రార్ధనా వస్త్రము పొందుకొనినది. అందులో సాధ్యమైతే మీ సంఘ కాపరిని పిలిపించండి. ఆయన మీ కొరకు ప్రార్ధించిన తరువాత ఆ రిబ్బను మీ శరీరము మీద పెట్టండి. ఒకవేళ మీకు అందుబాటులో సంఘ కాపరి లేనట్లయితే ఒక మంచి క్రైస్తవ విశ్వాసిని పిలిపించండి. ఒకవేళ మీరు ఏదైనా పాపం చేసినట్లైతే, లేక కీడు చేసినట్లయితే, లేక ఎవరి గూర్చియైన చెడ్డగా మాట్లాడినట్లయితే, మీకు తెలిసి ఏదైనా హాని కలిగించినట్లయితే - ముందు వెళ్ళి దానిని సరిచేసుకొనిన తర్వాత ఆ వస్త్రము ధరించండి. అప్పుడు దేవుడు స్వస్థపరిచాడని విశ్వసించండి. దానిని నీ లోదస్తులలో గుండెకు దగ్గరగా పెట్టండి.

మరియు ఉదయం తొమ్మిది గంటలకు, మధ్యాహ్నం పన్నెండు గంటలకు, సాయంకాలం మూడు గంటలకు ప్రపంచవ్యాప్తంగా రోగుల కొరకు ప్రార్ధిస్తారు. ఉదయం రెండు గంటలకు ప్రజలు లేచి ప్రపంచవ్యాప్తంగా పదిలక్షలు లేక ఐదులక్షలు లేక ఇరవైలక్షల మంది ఒకే సమయంలో ఒకరికొకరు ఒకరు ప్రార్ధించినప్పుడు, ఖచ్చితంగా ఏదో జరగవలసియున్నది. దానిని ఆలకించవలసిన బాధ్యత దేవుడు కలిగియున్నాడు.

మరియు అప్పుడు...

5

కాబట్టి దానిని బట్టి వారు. ఆ జర్మని స్త్రీ..... అది చాలా మంచిది. ఆ స్త్రీ ఈ విధంగా చెప్పినది, “ఆ చిన్న చేతి రుమాలును నా మీద పెట్టుకొన్నాను. నా పొరుగున ఉన్న స్త్రీ నాతో పాటు ప్రార్థన చేయుటకు వచ్చినది. నా పాపములన్నియు నేను ఒప్పుకున్నాను. మరలా ప్రభువుతో నడుస్తూ ఆయనను మహిమపరిచే అవకాశం ఇమ్మని ప్రార్థించాను.” ఇది అంతా అయిన తరువాత ఆ చిన్న రిబ్బను లోదుస్తులలో పెట్టుకొని ఈ విధముగా చెప్పినది, “సరే, అపవాది ఇంతవరకూ నన్ను నీవు బంధించియుంచావు.” ఆమె చక్రాల కుర్చి నుండి లేచి నడవడం ప్రారంభించినది. అది అంత సామాన్యమైనది.

నీవు సామాన్యంగా ఉన్నట్లయితే. ఈ రోజు క్రైస్తవులు లేక మానవులతో సమస్య ఏమిటంటే మనము దేవుని చాలా దూరంగా పెట్టి చాలా క్లిష్టమైన సంగతిగా మారుస్తున్నాము. అది సామాన్యత.

6

ప్రతి రాత్రి కొంతమంది ఇండియన్లు ఇక్కడ కూర్చొని వుండడం నేను చూస్తున్నాను. ఈ రాత్రి వారు ఇక్కడ లేరని అనుకొనుచున్నాను. కాని, కొందరు ఇండియన్ బాలురు పాటలు పాడారని ఎవరో నాతో చెప్పారు. కాబట్టి వారు ఇక్కడి నుండి వెళ్ళకముందు నేను వారి పాటలు వినాలని ఆశిస్తున్నాను; కాని ఏదేమైనా...

నేను మొదటిసారి ఇండియన్లకు ప్రసంగించిన సంగతి జ్ఞాపకమునకు వచ్చుచున్నది. ఆరిజోనాలోని శాన్-కార్లోస్ దగ్గర అపాచీలో ప్రసంగించాను. ఆ ఇండియన్ చాలా వృద్దుడు. ఒక ఉదయం చేపలు పట్టుటకు వెళ్ళినప్పుడు నాకు ఆ సంగతి తెలిసింది. ఎరగా అతడు దేనిని ఉపయోగిస్తున్నాడని నేను అడిగాను.

“కేవలము ఎర” అని అతడు చెప్పాడు. అది ఏమిటో అతడు నాకు చెప్పలేదు.

“అయ్యా, వందనాలు” అని చెప్పాను. అతడు ఖచ్చితంగా జాలరి. కాబట్టి నేను... అది అధ్భుతముగా ఉన్నది.

7

ఫోనిక్స్ లో జరిగిన పెద్ద గుడారపు సభలలో నా కుమారుడు ప్రార్థనా కార్డులను ఇచ్చుచున్న సంగతి నాకు జ్ఞాపకం వున్నది. మరియు ప్రార్థనా వరుసలో ప్రజల తల నొప్పి, పంటి నొప్పితో వస్తున్నారు. మరియు కాన్సరుతో మరణ స్థితిలో వున్నవారు అక్కడ కూర్చొని యున్నారు, మరియు నేను చెప్పాను, “బిల్లీ, ఆ విధంగా చేయవద్దు. నీవు ప్రజలను వారి సమస్య ఏమిటో అడుగు.” సాధారణంగా, అతడు ప్రార్ధనా కార్డులన్నిటిని కలిపివేసి, కావలసిన వారికి వాటిని ఇచ్చాను. కాబట్టి అతడితో నేను చెప్పాను, “ఆ విధంగా చేయవద్దు. నీవు ప్రజలను అడుగు, అక్కడ చాలా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుచున్న ప్రజలు వుండగా — కేవలము తల నొప్పి, పంటి నొప్పితో బాధపడుచున్నవారు ప్రార్థనా కార్డులు కలిగి వుంటున్నారు. మరియొక ప్రక్క కాన్సరుతో వున్నవారు ప్రార్థనల కొరకు కనిపెట్టుచున్నారు.” కాబట్టి నీవు ఆ విధంగా చేయవద్దు. “వారి సమస్య ఏమిటో అడుగు.”

8

కాబట్టి బిల్లి ఆ రాత్రి కూటము దగ్గరకు వెళ్ళినప్పుడు, అతడు ఆ కార్డులన్నిటిని కలిపివేసి పట్టుకున్నాడు. మరియు అతడు ఈ విధంగా చెప్పాడు, “ఇప్పుడు, మీలో ప్రతి ఒక్కరూ మీ సమస్యలేమిటో చెప్పాలి. కాన్సరుతో ప్రజలు మరణిస్తూ వున్నప్పుడు పంటి నొప్పి, తల నొప్పి కలిగిన వారికి ప్రార్థన కార్డులు ఇవ్వవద్దని నాన్నగారు చెప్పారు.

“కాబట్టి ఆ వృద్ధ నాయకుడు. అతడు ఎప్పటివలెనే నేలమీద కూర్చొని యున్నాడు. అతడు తన టోపి పట్టుకొనియున్నాడు. అతడు లేచి అక్కడికి వచ్చాడు. బిల్లి ప్రార్థనా కార్డులు పంచి పెట్టుచుండగా, అవి అంతకంతకు తగ్గిపోవడం అతడు చూసాడు. అతడు అతని భుజం మీద తట్టి తన చేతిని చాపాడు.

మరియు అతడు అడిగాడు, “ఈ రోగమేమిటో నాకు చెప్పాలని నాన్నగారు చెప్పియున్నారు. నీవు రోగివా? నీ అనారోగ్యం ఏమిటి?”

“నేను రోగిని” అని అతడు చెప్పాడు.

కాబట్టి అతడు చెప్పాడు, “మంచిది, వెళ్ళి అక్కడ కూర్చొనండి.”

9

అతడు, అక్కడికి వెళ్ళి కార్డులు మరలా ఇవ్వడం ప్రారంభించాడు. ఆ కార్డులు మరింతగా పలచబడిపోవడం ఆ నాయకుడు గమనించాడు. అతడు మరలా వచ్చి వీపు మీద తట్టాడు.

అతడు, “నాయకుడా, నీ సమస్య ఏమిటి?” అని అడిగాడు.

“నేను రోగిని” అని అతడు చెప్పాడు.

“సరే, ఒక్క నిమిషము ఆగుము,” అని అతడు చెప్పాడు. కాబట్టి అతడు చెప్పాడు, “ఎవరైనా క్యాన్సరు లేక మరేదైనా తీవ్రమైన అనారోగ్యముతో బాధపడుచున్నట్లయితే వారు తీసికొనండి అని చెప్పాడు....” తర్వాత అలాటివారికి కార్డులు ఇచ్చాడు.

చివరికి రెండు లేక మూడు మాత్రమే కార్డులు మిగిలియుండుటను ఆ నాయకుడు చూశాడు. అతడు పరుగెత్తి వచ్చి బిల్లీని లాగాడు. అతడు చెప్పాడు, “నేను అనారోగ్యముతో ఉన్నాను.”

బిల్లీ చెప్పాడు, “ఈ కార్డు తీసికొని దాని మీద 'నేను రోగిని' అని వ్రాయుము. వెళ్ళి అక్కడ కూర్చొనుము.” ఆ రాత్రి ప్రార్థనా వరుసలో ఆ వ్యక్తిని కలుసుకొన్నాను, నేను అతడిని, “నాయకుడా, నీవు దేవుని విశ్వసించుచున్నావా?” అని ప్రశ్నించాను.

“అవును” అని అతడు చెప్పాడు.

“దేవుడు నిన్ను స్వస్థపరచిన తర్వాత, నీవు మంచి వ్యక్తిగా జీవిస్తావా?” అని అతడిని ప్రశ్నించాను.

“అవును” అని అతడు చెప్పాడు. నేను అడిగిన ప్రతిదానికి అతడు “అవును” అని చెప్పుచున్నాడు. తర్వాత నాకు తెలిసినదేమంటే అతనికి రెండు లేక మూడు ఇంగ్లీషు పదముల కంటే ఎక్కువ తెలియవు. సరే, అది మంచిదే.

10

మేము ఆ సంరక్షణా కేంద్రమునకు వెళ్ళాము. శాన్-కార్లోస్ సంరక్షణ కేంద్రములోని ప్రజలు కొందరు ఇక్కడ ఉండవచ్చును. ప్రార్ధన కొరకు వేలాదిమంది ప్రజలు కూడుకొన్నారు. మరియు ఆ ఇండియన్లు... వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగవలసియున్నది... నేను వారితో మాట్లాడుచున్నప్పుడు నేను వారి దయను పొందవలసియున్నది...

నేను ఏ దేశము కోసము, ఏ ప్రజల కోసమైనా చింతించినట్లయితే, నేను చింతించేది ఆ ఇండియన్ల కొరకే. అది నిజము. వారు మన నుంచి కఠినమైన, గ్రుడ్డి బర్తమయి మురికి లావాదేవీలు పొందియున్నారు. అది ఖచ్చితంగా సత్యము. అమెరికా జెండా మీద ఏమైనా మరకలు ఉన్నట్లయితే, అది వారు ఇండియన్ల పట్ల క్రూరంగా వ్యవహరించుట వలన కలిగినవి. అతడి యొక్క గొర్రెలన్నియూ తీసివేసి, చాలా పేద గ్రామములలో వారిని పెట్టి, నెలకు పది డాలర్లు ఇచ్చుట అనేది సరియైన పనికాదు. లేదయ్యా. నిజమునకు ఇది అతడి దేశము. దేవుడు దీనిని అతడికి ఇచ్చాడు; మనము దానిని అతడి నుండి తీసుకొన్నాము. అది ఖచ్చితంగా సత్యము.

11

కాబట్టి అక్కడ నివసించే పేద ప్రజలను గూర్చి నేను ఎల్లప్పుడూ బాధపడతాను, ఎల్లప్పుడూ వారికి ప్రార్థనలు చేయాలని ఆశిస్తాను.

కాబట్టి త్రాగుబోతు, మరియు క్షయ కలిగిన స్త్రీని ప్రభువు స్వస్థపరచినట్లయితే, నేను సంరక్షణా కేంద్రము వరకు వెళ్తానని ఫోనిక్స్ లో ప్రభువునకు వాగ్దానము చేశాను. వారిద్దరూ తాము స్వస్థత పొందినట్లుగా ధృవపత్రములు తెచ్చారు. కాబట్టి నేను ఆ సంరక్షణా ప్రాంతానికి వెళ్ళాను. ఆ రాత్రి నేను అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ వారి చిన్న ఆలయ ద్వారము ముందు నిలువబడ్డాను. అక్కడ ఒక స్త్రీ... (బహుశా అసెంబ్లీస్ సహోదరులలో ఎవరైనా...) సహోదరి మార్షల్, ఆ సహోదరి ఆ ప్రాంతములో మిషనరీగా పనిచేయుచున్నది. మరియు నేను అక్కడ నిలువబడి వారికి దేవుని వాక్యమును బోధించాను. అక్కడ చుట్టూ వేలాదిమంది ప్రజలు యున్నారు. మరియు వారు.... వారందరూ గొంగళ్ళు మరియు వారి సాంప్రదాయ దుస్తులు ధరించి, ఆరాధనలో నిలువబడుట చూచుటకు ఎంతో అందముగా యున్నది.

సాధారణము నేను బలిపీఠము పిలుపు ఇచ్చినప్పుడు, అక్కడ తొక్కిసలాట జరుగుతుంది, కాని...

12

నేను చెప్పాను, “ఇప్పుడు ప్రార్ధన సహాయం కోరువారందరూ....” నీవు వారి భాష మాట్లాడలేవు, .... మరియు ఆ దినములలో మేము ప్రార్ధనా కార్డుల ఇచ్చేవారము కాదు. కాబట్టి నేను చెప్పాను, “ప్రార్థన సహాయం కోరువారందరూ నిలువబడండి.” అక్కడ ఎవ్వరూ నిలువబడలేదు. ఇది వింతగా యున్నదని నేను తలంచాను. అది నన్ను కొంచెం ఆశ్చర్యపరచినది. ఎవ్వరూ నిలువబడలేదు. మంచిది, నేను నా అనువాదకుడు వైపు చూచి, “నేను చెప్పినదే చెప్పావా?” అని అడిగాను.

“ప్రతి మాట చెప్పాను,” అని అతడు అనెను.

నేను చెప్పాను, “నన్ను మరలా చెప్పమంటావా?” స్వస్థత కొరకు నా చేత ప్రార్థనలు చేయించుకోవాలని కోరినవారందరూ లేచి నిలువబడండి.“ ఎవ్వరూ నిలబడలేదు.

కాబట్టి సహోదరి మార్షల్ వెనుక నుండి ఒక ఇండియన్ స్త్రీని తీసుకు వచ్చినది. అపాచి ప్రజలు గొప్పవారు, ఎత్తుగా దృఢంగా ఉంటారు. ఒక స్త్రీ బయటకు వచ్చినది. నేను ఒక్క క్షణం ఆమె వైపు చూశాను. మరియు నేను చెప్పాను, “ఈ స్త్రీ అనారోగ్యముతో ఉన్నది, ఆమె సుఖవ్యాధితో బాధపడుతుంది, కాని దానికి కారణం ఆమె అనైతిక ప్రవర్తన కాదు. ఎందుకనగా ఆమె జీవనశైలి వలన ఆ రోగము కలిగినది.”

ఈ సంగతి ఇతనికి ఎలా తెలిసింది, అన్నట్లుగా ఆ స్త్రీ నా వైపు చూచినది.

13

నేను ఆమె కొరకు ప్రార్థన చేశాను. మరికొంచెం సేపట్లో ఒక వ్యక్తి వచ్చాడు, అతడు కంట్లో శుక్లములతో బాధపడుచున్నాడు. తర్వాత ఒక చిన్న బాలిక వచ్చినది, ఆమె తన చిన్న తలను వంచియున్నది. మరియు నేను, “మంచిది, నిన్ను నేను చూడవచ్చునా?”

“లేదు!” నేను ఏమి చెప్పానో కూడా ఆమెకు అర్థం కాలేదు.

“ప్రభువు, దానిని బయలు పరచును” అని చెప్పాను. అప్పుడు ఆమెకు జ్వరం కలుగుట వలన ఆమె రెండు చెవులు పనిచేయుట లేదు. రెండు చెవులలో చెవుడు వచ్చినది. ఆమెకు చెవుడు మాత్రమే కాదు గాని ఆమె మూగది కూడా, ఆమె మాట్లాడలేదు, ఆమె వినలేదు. ఆ చిన్నపిల్లను నా చేతులతో ఎత్తుకొన్నాను. నేను ప్రార్ధించాను, “ప్రభువా, దయతో మీరు, ప్రభువా, మేము అద్భుతముల కొరకు ప్రార్జించుట లేదు. మేము వాటి కొరకు అడుగుట లేదు, కాని ప్రభువా, మీరు అద్భుతములు జరిగించినట్లయితే, అది వారికి సహాయపడును. తృణీకరించబడిన ఈ పేద ప్రజల మీద మీ కనికరము చూపండి.” ఆ చిన్నబిడ్డ కొరకు ప్రార్ధించిన తర్వాత, ఆ బిడ్డను క్రిందకు దించాను. “నావైపు చూడుము అని చెప్పాను.” ఆమె అలా పైకి చూచింది. “ఆమె వినగలుగుచున్నది, బహుశా ఆమె ఇంకా చక్కగా మాట్లాడగలుగుతుంది.”

ఆ చిన్నబిడ్డతో నిలబడియున్న తల్లి చెప్పినది, “ఆమె చక్కగా మాట్లాడుతుంది.” ఆమె ఏమి చెప్పుచున్నదో నాకు అర్థం కాలేదు.

14

తర్వాత కన్నులు వెనక్కి తిరిగిన బాలుడు వచ్చాడు. కన్నులు వెనక్కి తిరిగిన బిడ్డను దేవుడు వెనక్కి తీసివేయుటను నేను జీవితములో ఎన్నడూ చూడలేదు. ఎందుకో నేను ఊహించగలను, నేను యువకుడిగా ఉన్నప్పుడే నా భార్యను, బిడ్డను పోగొట్టుకొనిన సంగతి మీకు తెలుసు. ఆ చిన్నబిడ్డ ఎంతగానో ప్రయాసపడినది, చివరికి ఆమె కన్నులు వెనక్కి తిరిగిపోయాయి, ఆమె అలా చేస్తూ ప్రాణం విడిచినది. కన్నులు వెనక్కి తిరిగిన బిడ్డను చూసి నేను తట్టుకోలేను. దానికొరకు చేసిన ప్రార్థనలు దేవుడు ఎల్లప్పుడూ ఆలకిస్తాడు.

మరియు ఈ ఇండియన్ బాలుడి కన్నులు వెనక్కి తిరిగియున్నప్పుడు, ఆ బిడ్డను నా చేతులలోనికి తీసికొని ప్రార్థించాను. దేవుడు కార్యము చేశాడని నాకు తెలుసు. నేను చెప్పాను, “నేను ఈ చిన్న బాలుడిని ఈ వైపునకు త్రిప్పకముందు, ఈ బాలుడి కన్నులు బాగుపడినట్లయితే, నేను ఒక అబద్ద ప్రవక్తను.” ఆ బాలుడిని వెనక్కి త్రిప్పి చూపిన తర్వాత, ప్రార్థనా వరుసను గూర్చి చెప్పాము. అప్పుడు ప్రజలు కిక్కిరిసిపోయారు.

అప్పుడు నేను అనువాదకుని వైపు తిరిగి, “మొదటిసారి, అది నటన, నకిలీ అని భావించారు. కాని ఇప్పుడు అది సత్యము అని చూశారు,” అని చెప్పాను.

15

తరువాత సహోదరి మార్షల్ లోపలి నుండి తీసుకు వచ్చిన పెద్ద వయస్సు స్త్రీ... ఆ వృద్ద స్త్రీ... ఇక్కడ ఎవరైనా ఇండియన్లు ఉన్నట్లయితే, నేను పేదలను తృణీకరిస్తున్నాను అని భావించవద్దు. బహుశా నేను చూసిన వారిలో ఆమెనే బహు పేదరాలు కావచ్చును. ఆమెకు చేతికర్రలు కొనే స్తోమత లేక రెండు కట్టెలకు గుడ్డలు చుట్టి వాటిని వాడుచున్నది. మరియు ఆమెకు కీళ్ళవాతము ఉన్నది. ఒక కర్రను ఈ విధంగా, మరొక కర్రను ఇంకో విధంగా పట్టుకొనినది. ఇండియన్లలో తలలో తోలుతో జడలు అల్లే సాంప్రదాయమున్నది. ఆమె చిన్న కన్నులు తీక్షణముగా నన్ను చూస్తున్నాయి. ఆమె కన్నులు చిన్న నీటి గుంటలు వలె కన్పిస్తున్నాయి, ఆమె కన్నుల చుట్టూ చెంపల మీద ముడతలు పడియున్నాయి.

ఆమె నన్ను ఇలా చూచినది, “ఓ, దేవా, ఆమె ఎవరికో తల్లి, ఆమె చేతులు ఖచ్చితంగా ఎంతోమంది చిన్న పిల్లలను ఆడించియుంటాయి, బహుశా ఆమె తన జీవితములో సరియైన పోషణ లేదేమో,” అని అనుకున్నాను.

16

నీవు ప్రజల కొరకు ప్రార్థించాలంటే నీవు వారి అనుభూతులలో ప్రవేశించాలి.

ఆమె అక్కడ నిలబడియున్నది. ఆమె నా వైపు చూస్తున్నది. ఆమె నవ్వడం ప్రారంభించినది. నేను ఇంకా ప్రార్ధన చేయలేదు. ఏమియూ చేయలేదు. ఆమె రెండు చేతులలో చేతి కర్రలున్నాయి. ఆమె వాటిని నా చేతికిచ్చి చక్కగా ఇతరుల వలె నడుచుకుంటూ వెళ్ళిపోయినది. అంత సామాన్యంగా, చూశారా. ఇప్పుడు మనము దానిని క్లిష్టముగా మార్చుటకు ప్రయత్నిస్తున్నాము.

దానిని గూర్చి నేను మరియొక విషయమును చెప్పవచ్చునా...? ఉదయము మూడు గంటల వరకు నేను ఆ ప్రార్ధనా వరుసలో ఉన్నాను, మరియు నేను చెప్పాను, “నేను వారందరి కొరకు ప్రార్ధిస్తాను,” ఎందుకనగా మరుసటి దినము నేను వెళ్ళిపోవాలి. మరియు నేను గమనించినది ఏమనగా వారందరూ తడిచియున్నారు. “వారందరూ ఎందుకు తడిచియున్నారు,” అని నేను వారిని అడిగాను.

వారు చెప్పారు, “మంచిది, తమ బంధువులను, ప్రియమైన వారిని తీసికొని వచ్చుటకు వారు అటవి ప్రాంతంలోనికి వెళ్ళారు. వారు పదిమైళ్ళ దూరంలో ఉన్న రోడ్డు మీద మీరు నడిచివెళ్ళకుండా, తమ వారిని భుజముల మీద పెట్టుకొని నదికి అడ్డముగా పడి నీళ్ళలో నడుచుకుంటూ వచ్చారు.”

17

అక్కడకు ప్రజలు అన్ని వైపుల నుండి వచ్చారు. ఒక చెక్కకు రెండు కర్రలు కట్టి దాని మీద ఒక వ్యక్తి పడుకోబెట్టి ఇద్దరు బలమైన వ్యక్తులు మోసికొని వచ్చారు. తల నెరిసిన ఒక వృద్ధుడు ముడుచుకొని దాని మీద పడుకొనియున్నాడు. అతని పెదవులు నీలంగా ఉన్నాయి. అతడు తడిచిపోయి చలికి వణకుచున్నాడు. నేను అడిగాను, “నీవు ఇంగ్లీషు మాట్లాడతావా?”

“కొద్దిగా,” అని చెప్పాడు.

నేను అడిగాను, “నీవు తడిచిపోవుట వలన ఊపిరితిత్తులు సమస్య వస్తుందని నీవు తలంచలేదా?” అతడు ఏమి చెప్పాడో వినాలనుకొన్నాను, నేను అతడి విశ్వాసము పరీక్షించుచున్నాను.

అతడు చెప్పాడు, “యేసుక్రీస్తు నా గూర్చి శ్రద్ధ కలిగియున్నాడు. నా తండ్రిని తీసుకు వచ్చాను.”

“నీ తండ్రి సమస్య ఏమిటి?” అని అడిగాను.

“అతడు రోగి.” అతడు వణికిపోవుచున్నాడు, అతనికి కండరముల సమస్య ఉన్నట్లుగా ఉన్నది. మరియు ఆ వృద్దుడు అక్కడ పడియున్నాడు.

“అతడు ఇంగ్లీషు మాట్లాడతాడా?” అని అడిగాను.

“లేదు.”

నేను చెప్పాను, “ఫర్వాలేదు, అతడిని ఇక్కడకు తీసికొని రండి.” వారు అతడని ముందుకు తెచ్చారు; అక్కడ ఒక వ్యక్తి అతని తమ్మడి వలె ఉన్నారు. ప్రభువు నిన్ను దీవించు గాక అని చెప్పాను. నేను ప్రార్ధించాను. “ప్రభువా, నిస్సహాయ స్థితిలో ఉన్నపేదవానికి సహాయం చేయండి. అతడిని ఇక్కడకు తీసికొని వచ్చిన అతడి కుమారుడి విశ్వాసమును గౌరవించండి.” సరే, మంచిది.

అతడిని తీసుకు వెళ్ళండి, మరియు నేను... మరియు ఒక్క క్షణములో ఎవరో అరుస్తూ కేకలు వేయుటను విన్నాను. నేను చుట్టూ చూశాను. ఆ వృద్దుడు ఆ చెక్కను భుజము మీద పెట్టుకొని నడుస్తూ ప్రజలు వైపు చేతులు ఊపుచూ అరుస్తున్నాడు.

అనేకమార్లు పాలిపోయిన ముఖము కలిగినను, చూశారా, మనము అక్కడ కూర్చొని, “నా కొరకు మరలా ప్రార్ధించండి. నేను మరలా ఆ ప్రార్ధనా వరుసలో నిలబడతాను.” ఓ, మై. వారు కేవలము విశ్వసించారు. అంతే, పిల్లల వంటి విశ్వాసము. మనము కూడా ఆ విధంగా ప్రవర్తించాలి, చూశారా. కేవలము నమ్ముము. అది క్లిష్టమైనది కాదు.

18

గత సంవత్సరము మెక్సికో పట్టణములో జనరల్ వాల్డెన్, సహోదరులతో అనేకులు జనరల్ వాల్డెన్ ను ఎరుగుదురు. అతడు మెక్సికో సైన్యములో ప్రఖ్యాతిగాంచిన జనరల్ మెక్సికో పట్టణములో రోగుల కొరకు ప్రార్ధన చేయుటకు మెక్సికో సైన్యము ద్వారా ఆహ్వానించబడిన మొట్టమొదటి ప్రొటెస్టంటుగా నాకు అవకాశము కలిగినది. జనరల్ వాల్డెన్ ద్వారా నాకు ఆహ్వానము ఇవ్వబడినది, సంపూర్ణ సువార్త పనివారల సమావేశములో అతడిని కలుసుకొన్నారు. “మరలా వచ్చుటకు ప్రయత్నం చేయండి” అని కరచాలనము చేస్తూ చెప్పాడు.

మాకు అక్కడ కేవలము మూడు రాత్రులు మాత్రమే ఉన్నాయి. మేము బుల్-రింగ్ ప్రాంతమునకు వెళ్ళాము, కాని అది మాకు లభ్యం కాలేదు, తర్వాత వారు పెద్ద క్రీడా మైదానమును తీసుకొన్నారు. మరియు అక్కడ ఆ ప్రజలు... వారు క్రీస్తు కొరకు ఎంతో ఆకలిగొనియున్నారు. వారు అక్కడకు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చారు, అక్కడ నిలువబడుటకు కూడా స్థలము లేదు. రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా నేను అక్కడికి వెళ్ళలేదు. పొలములో గొర్రెలు నిలువబడియున్నట్లుగా వారు ఒకరి మీద ఒకరు ఆనుకొని నిలువబడియున్నారు.

19

మరియు రెండవ రాత్రి వర్షము కుండపోతగా కురిసింది, ఆ ప్రజలు వర్షములోనే నిలువబడియున్నారు. ఆ మెక్సికో ప్రజలు ఆ విధంగా నిలువబడియుండగా, వారి ఎదురుగా ఒక అద్భుతము జరిగినది.

అక్కడ ఒక వృద్దుడు వేదిక మీదకు వచ్చాడు, మరియు ఆ మెక్సికో ఆర్థిక స్థితి చాలా అసమంజసంగా యున్నది. వారిది పేద దేశం. ఇటుక పనిచేయు వ్యక్తి రోజుకు ఎనిమిది పిసోస్లు సంపాదిస్తాడు. ఒక జత చెప్పులు కొనాలంటే అతడు నాలుగు రోజులు పని చేయాలి. మెక్సికో ఆర్థిక స్థితి ఆ విధంగా ఉన్నది. అయినను వారు ఆ బలిపీఠము పై ఒక క్యాండిల్ వెలిగించుటకు యాబై సెంట్లు చెల్లించవలసియున్నది.

20

గ్రుడ్డివాడిన ఒక వృద్ధుడు వచ్చాడు. నా తండ్రి నివసించియున్నట్లయితే ఉండే వయస్సులో అతడు ఉన్నాడు. అతనికి చెప్పులు కూడా లేవు. ఆ వృద్దుడి కాళ్ళు మురికి పట్టియున్నాయి. అతని ఫ్యాంటు చిరిగిపోయియున్నది, మురికిగా యున్న వస్త్రము ధరించి యున్నాడు. అతడు పాత టోపీ ధరించాడు, చిరుగులు దారంతో కుట్టాడు. అతడు దగ్గరికి వస్తున్నాడు. వరుసలో తర్వాత వ్యక్తి. కాబట్టి వారు “తర్వాత” అని పిలిచారు.

(అసెంబ్లీ-ఆఫ్-గాడ్ సువార్తికులలో ఒకరైన సువార్తికిడు) ఎస్పినోసా, (కాలిఫోర్నియా నుండి వచ్చిన సహో! ఎస్పినోసాను మీలో అనేకులు ఎరుగుదురు) అతడు నాకు అనువాదము చేయుచున్నాడు. తర్వాత వ్యక్తి అతనే అని చెప్పాడు, అతడు తన జేబులో చేతిని పెట్టి ఒక చిన్న జపమాలను తీసికొని చెప్పడం ప్రారంభించాడు. నేను చెప్పాను, “అది అవసరము లేదు.” అతడు ముందుకు వచ్చాడు, నేను అతడిని చూశాను. ఓ, ఆ వ్యక్తి ఏమనుకొనును. వృద్దుడు, పేదవాడు, బహుశా తన జీవితములో ఒక్కసారి కూడా చక్కటి భోజనము చేసియుండకపోవచ్చును. అతని కాళ్ళకు చెప్పులు కూడా లేవు. నేను అక్కడ చక్కటి సూటు ధరించి, చక్కటి బూట్లతో నిలబడియున్నాను. నా పాదమును అతడి పాదము దగ్గర పెట్టాను, నా కొలతలు అతడికి సరిపోవునేమో అని చూచుటకు, నా బూట్ల అక్కడనే అతడికి ఇచ్చియుండేవానిని, మరియు అతడి భుజములు నా భుజముల కుంటే వెడల్పుగా ఉన్నాయి. నా కోటు అతడికి సరిపోదు. మరియు అతడు గ్రుడ్డితనము కలిగియున్నాడు.

21

నా చేతులు ఆ వృద్దుని భుజముల మీద పెట్టాను, “ఓ, దేవా, కనికరించండి,” అని ప్రార్థన చేశాను.

ఒక్కసారిగా, “దేవునికి మహిమ” అనే కేకను విన్నాను. అతడు వేదిక మీద పైకి క్రిందకు గంతులు వేయుచున్నాడు. నీవలె మరియు నా వలెనే పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాడు. అతడు అద్భుతమైన సమయమును కలిగియున్నాడు.

మరుసటి రాత్రి, ఆ వేదిక ఈ గదియంత పొడవుగా ఉన్నది, ఆ వేదిక మీద పాత కోటుకు, శాలువాలు, అంత ఎత్తుగా కుప్పగా పోశారు. వాటి కొరకు ప్రార్థన చేయుటకు వాటిని తెచ్చారు. అవి ఎవరివో వారు ఎలా తెలుసుకుంటారో నాకు తెలియదు. మరియు వర్షము కురుస్తున్నది, ఆ బహిరంగ మైదానములో వారు నడుస్తూ ఉండిపోయారు.

మరియు బిల్లీ నా దగ్గరకు వచ్చి, “నాన్నగారు, అక్కడ ఒక తల్లి చనిపోయిన తన బిడ్డను తీసికొని వచ్చినది, ఆ బిడ్డ ఉదయం మరణించెను. ఆమెను ఆపుటకు ఎంత ప్రయత్నించినా ప్రయోజనము లేదు. ఆమె ఆ మృత-శిశువును పట్టుకొని ఆ కార్యకర్తల మీదుగా ఎక్కుచూ, వారి భుజముల మీద నడుసూ వస్తుంది. ఆమెను మూడు లేక నాలుగుమార్లు వేదిక దగ్గర నుండి దూరముగా తీసికొని వెళ్ళాము. మేము ఏమి చేయలేకపోయాము. మీరు వచ్చి ఆమెను చూడాలని చెప్పాడు.”

22

సహోదరుడు జాక్మూర్ ఎంతమందికి తెలుసు? ఫ్రీవ్-పోర్ట్, లూసియానాలోని సహోదరుడు జాక్మూర్? మీలో అనేకులు ఎరుగుదురని నేను నమ్ముచున్నాను. మంచిది, అతడు నాతో ఉన్నాడు. మరియు నేను, “సహోదరుడు జాక్, నీవు అక్కడికి వెళ్ళి, ఆ స్త్రీ కొరకు ప్రార్ధన చేయుము. బహుశా అది ఆమెకు ఆదరణ కలిగిస్తుంది. నేను ఆమెను ఇక్కడకు తీసుకొని రాలేను, ఏలయనగా ఆమె దగ్గర ప్రార్ధనా కార్డు లేదు, ఎందుకనగా ప్రార్ధనా కార్డులు కలిగిన వారికి అది సమంజసంగా అన్పించదు. ప్రార్ధనా వరుసలో వచ్చే ప్రాధాన్యత వారికున్నది. వారు ఉదయము నుండి ఇక్కడ నిలువబడి ప్రార్ధనా కార్డులు పొందియున్నారు” అని చెప్పాను. కాబట్టి ఆ స్త్రీని చూచుటకు సహోదరుడు జాక్ బయలుదేరాడు.

మరియు నేను ప్రజల వైపునకు చూశాను, మరియు ఒక దర్శనములో ఒక చిన్న బిడ్డను చూశాను, అతడు తన చేతులతో చప్పట్లు కొట్టుచున్నాడు, మెక్సికో బాలుడు. నేను వెనక్కి తిరిగాను. నేను ఈ విధంగా తలంచాను, “మంచిది, బహుశా నేను అక్కడికి వెళ్ళుట మంచిది.” “ఆమెను ఇక్కడికి తీసికొని రండి” అని వారికి చెప్పాను.

23

కాబట్టి వారు విడిపోయి దారి ఇచ్చారు. ఇరవై సంవత్సరముల ఒక అందమైన స్త్రీ వచ్చినది, ఆమె దగ్గర ఒక చిన్న దుప్పటి ఈ విధంగా యున్నది. ఆ దుప్పటిలో ఒక చిన్నబిడ్డ యుండెను. ఆమె మోకాళ్ళ మీద కూర్చొని “తండ్రి” అని అరచుట ప్రారంభించినది. అది మీకు తెలుసు. మరియు నేను చెప్పాను, “సహోదరీ, లేచి నిలువబడుము.” నా చేతులు ఆ చిన్న బిడ్డ మీద పెట్టాను. నేను స్పానిష్ భాష మాట్లాడలేను, ఆ చిన్నబిడ్డ మీద నా చేతులు పెట్టాను. ఈ బైబిల్ యొక్క గ్రంథకర్త, మరియు పరలోకమందున్న దేవుడు, ఇది సత్యము అని ఎరుగును. నా చేతులు ఆ బిడ్డ మీద పెట్టగానే మొదటిగా ఏమి జరిగినదో మీకు తెలుసా, ఒక చిన్న కదలిక, ఆ బిడ్డ కదలుచూ ఏడ్చెను.

మరియు నేను చెప్పాను, “ఇప్పుడు, దీనిని గూర్చి ఏమియూ చెప్పవద్దు. ఆ బిడ్డ ఉదయమున చనిపోయాడు అని వైద్యుడు మరణ-ధృవీకరణ పత్రము మీద సంతకము పెట్టేవరకు దీనిని గూర్చి ఏ వారాపత్రికలోను ప్రచురించవద్దు.” చూశారా, ఉదయము తొమ్మిది గంటల నుండి రాత్రి పదిగంటల వరకు ఆ బిడ్డ చనిపోయియున్నాడు. మరియు ఆ బిడ్డ ఉదయం తొమ్మిది గంటలకు మరణించినట్లుగా ఆ వైద్యుడు ధృవీకరిస్తూ సంతకం చేశాడు, మరియు రాత్రి పదిగంటలకు, తొమ్మిదన్నర, పదిగంటల మధ్యలో ఆ రోజు ఆ బిడ్డ జీవించుచున్నాడు, కేవలము సామాన్యమైన విశ్వాసము. ఆ బిడ్డ స్వస్థత కొరకు నేను చేసినది ఏమియూ లేదు.

నిజమే దర్శనము కలిగినది; అయితే ఒక్కసారి ఆదర్శనము దానిని గూర్చి మాట్లాడినప్పుడు, దానిని త్రిప్పివేయగలిగినది ఏమియూ లేదు. అది ఎల్లప్పుడూ పరిపూర్ణమైనది. అది ఎల్లప్పుడూ పరిపూర్ణమైనది.

24

రోగుల కొరకు ప్రార్ధించునప్పుడు... ఈ రాత్రి మనము రోగుల కొరకు ప్రార్ధన చేయునప్పుడు, ప్రభువు మన దగ్గరకు వచ్చి ఆ దర్శనములను అనుగ్రహించు గాక. ఒకవేళ ఆయన ఆ విధంగా చేసినట్లయితే, గుర్తు౦చుకొనండి దర్శనములు ప్రజలను స్వస్థపరచవు. వాక్యము సత్యము అనుదానికి దర్శనము ఋజువు పరచుట మాత్రమే.

“ప్రవక్త” అనే మాటకు అర్ధము ఎంతమందికి తెలుసు? మీకు ఖచ్చితముగా తెలుసు. “ప్రవక్త” అనగా “ముందు చెప్పువాడు, ముందుగా తెలియపరచువాడు.” ఆ వ్యక్తి దేవుని వాక్యమును ఖచ్చితముగా వ్యాఖ్యానిస్తున్నాడు అని దేవుడు ఇచ్చిన దైవికమైన సూచన ఇది. ఏలయనగా దేవుని వాక్యము యొక్క సరియైన వ్యాఖ్యానం కలిగియున్నాడనుటకు అది ఋజువు.

నిర్గమ 4:8

25

చూశారా, సూచన ఒక స్వరము కలిగియున్నది. మోషేతో దేవుడు చేతిలో ఒక సూచక క్రియ మరియు కర్రతో ఒక సూచక క్రియ చేయమని చెప్పాడు, ఆయన చెప్పాడు, “వారు మొదటి సూచక క్రియ యొక్క స్వరమును విననట్లయితే, వారు రెండవ సూచక క్రియ యొక్క స్వరమును వింటారు.”

ప్రతి సూచక క్రియ ఒక స్వరమును కలిగియున్నది. మరియు దేవుని స్వరము మనతో మాట్లాడుచున్నది. మరియు ఆయన ఆ కార్యమును చేసినప్పుడు దేవుని కుమారుడు మిమ్ములను స్వస్థపరచుటకు ఇక్కడున్నాడని మీలో ప్రతి ఒక్కరూ హృదయపూర్వకముగా ఆయనను విశ్వసించాలని కోరుచున్నాను. మరియు మీరు గుర్తుంచుకొనండి, ఆయన మాట్లాడుచున్నప్పుడు, ఆయన మాట్లాడును, అవి నా మాటలు కాదు.

26

రెండు రాత్రులు చాలా ఎక్కువగా ప్రసంగించాను; నేను చెప్పినవాటికి క్షమాపణలు చెప్పును, ఏలయనగా స్నేహితులారా, అవి సత్యములు. నేను సంఘము యెడల రోషము కలిగియున్నాను, మరియు ఈ రాత్రి ఈ మనుష్యుల మాటలు వినుటకు... నేను పురుషులను ఎక్కువగా గుంపులలో ఉంచుచున్నాను. నిజమైన విశ్వాసులు, ఒక సహోదరుడు కొద్ది నిముషముల క్రితము ఇక్కడకు వచ్చుచున్నప్పుడు నన్ను కౌగలించుకొని, “గతరాత్రి వర్తమానమును ఎంతగానో ప్రశంసిస్తున్నాము” అని చెప్పాడు.

“అది చాలా కఠినముగా ఉన్నది” అని చెప్పాను.

అతడు చెప్పాడు, “కాని ముందుకు సాగిపోవుటకు అది మమ్ములను ప్రేరేపించినది.”

అలాటి వ్యక్తుల మీద నాకు నమ్మకమున్నది. అవునయ్యా. ఒకవేళ నేను తెలివైనవాడనని చూపుటకు ఆ విధంగా చెప్పినట్లయితే అది తప్పు, నేను బలిపీఠము దగ్గరికి వెళ్ళి. దేవునితో సరిచేసుకోవాలి. స్నేహితులారా! ఒకవేళ అది సత్యమైనట్లయితే, దేవుడు చెప్పినదానితో మనలను సరిచూచుకోవాలి. అది నిజము. దేవుడు ఎరుగును.

27

ఈ వారములో ఒక రాత్రి ఒక నెల క్రితం నాకు సంభవించిన ఒక సంఘటనను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అప్పుడు జరిగిన దానిని మీరు అర్థం చేసుకొంటారు. అది దర్శనమో మరియొకటో నాకు తెలియదు. అల్పాహార సమయములో దానిని గూర్చి సహోదరులకు చెప్పాను. దానిని వేదిక మీద చెప్పవచ్చునో లేదో కమిటీ సభ్యులను గాని చైర్మన్ ను గాని అడగాలని కోరుచున్నాను. నాకు కలిగిన ఆ దర్శనం గూర్చి చెప్పాలి.

మరియు ప్రజలను నేను ప్రేమిస్తున్నాను. ప్రజలను నేను ప్రేమిస్తున్నాను. నేను ఎల్లప్పుడూ వారితో జీవించాలని ఆశిస్తున్నాను. నిత్యత్వములో వారితో కలసి జీవించాలని నేను ఆశిస్తున్నాను. ఈ మధ్యకాలములో పట్టణములో చనిపోయిన బాలికను గూర్చినట్లు ఆ దినమున వినుటకంటే, ఇప్పుడే మిమ్ములను కొంచెం కదిలించుట మంచిది.

28

అక్కడ ఒక బాలిక ఆలయమునకు వస్తుండేది. ఆమె పాతకాలపు పద్ధతులు అవలంబించేది. కాబట్టి ఆ పాతకాలపు పద్ధతులు, వేషధారణను బట్టి ఆ బాలికను ఎగతాళి చేస్తుండేవారు. ఆ బాలికను ఇంకొక ఆమె నాతోపాటు నాట్యమునకు రమ్ము అని పిలిచినది. అందుకు టాబెర్నికల్ కు వచ్చే బాలిక, “మేము నాట్యములకు వెళ్ళమని చెప్పినది.”

“మీ సంఘ కాపరి, బ్రెన్హా౦, సంకుచితమైన మనస్సు కలిగినవాడు. అతడు మత మూర్ఖుడు, ముళ్లువలె ఉండకపోతే, నీవు మరింత స్వేచ్చగా ఉండేదానవు” అని చెప్పినది.

అందుకామె ఈ విధంగా జవాబిచ్చినది. “సహోదరుడు బ్రెన్హా౦ ఒప్పుకోలును బట్టి నేను ఈ విధంగా చేయుట లేదు. కాని యేసుక్రీస్తు నా స్వంత హృదయంలో కలిగించిన ఒప్పుదలను బట్టి, ఈ విధంగా చేస్తున్నాను.” దేవుడు ఆ బాలికను దీవించును గాక, ఆ బాలికతో ఆ విధంగా చెప్పిన ఆమె ఒక సండేస్కూలు ఉపాధ్యాయురాలు.

శ్రీ. పెర్మిన్స్ ఆ పట్టణములో ఒక అంత్యక్రియలకు ఏర్పాటు చేయు పని చేయుచున్నాడు. ఈ మాట చెప్పిన ఆమె ఆరు నెలల తర్వాత రోగియై మరణించినది. అది ఏమిటి వారికి తెలియదు. అది ఒక సుఖరోగము. శ్రీ. పెర్మిన్ ఆమె శరీరములోనికి శవాలను భద్రము చేయు రసాయనములను ఎక్కించుచుండగా, ఏదో కారుచున్నట్లుగా అది వాసన వచ్చినది. ఆది ఏమిటో అని అతడు చూడగా ఆమె శరీరము అంతా ఆ సుఖవ్యాధి వలన రంధ్రములు పడిపోయినది. అది నిజము. ఇతరులను ఎగతాళి చేయుటకు, వారిని మూర్ఖులు అని పిలుచుటకు ఎక్కువ సమయం ఉన్నది.

29

ఆమె మరణించినప్పుడు... అది పర్వాలేదనుకొంటే, నేను సాక్ష్యము చెప్తాను. ఆమె చనిపోయే సమయములో, ఆమె సండే స్కూలు తరగతిలోని పిల్లలందరిని లోపలికి తీసుకువచ్చాను. ఆమె గృహమును అనగా, పరలోకమునకు వెళ్ళుటను చూచుటకు వారు వచ్చారు. కాని ఆమె చాలా చాలా, చాలా లోక సంబంధి. ఆమె మరణించుటకు సిద్దమైన సమయములో అంతా బాగానే యున్నదని తలంచినది. మీకు తెలుసు, “ఒకని మార్గము వాని దృష్టికి యదార్ధముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును.” అవును, ఈ బాలిక మరణమునకు సమీపించినప్పుడు. ....

ఆమె సంఘ కాపరి. సిగరెట్లు త్రాగుతాడు, చాలా పొడవైన కడ్డిలో పెట్టుకొని పిలుస్తాడు. మరియు మడచిన (బోధకులు దరించు) కాలర్ ధరిస్తాడు. అతడు ఆ విధంగా ధరించాలనుకుంటే ఫర్వాలేదు. ఒకవేళ అతడు ఆ రీతిగా ధరించాలని కోరినట్లయితే, కాని అతడు సువార్తను బోధించినట్లయితే, యేసు మిగిలిన వారికంటే తాను ప్రత్యేకమైనవాడను అని చూపుటకు యేసు ఎన్నడూ ప్రయత్నించలేదు. ఆయన సామాన్య మానవుల వలెనే వస్త్రములు ధరించాడు. సామాన్య జనుల మధ్య సంచరించాడు. ఆయన మనుష్యులు మధ్యలో మనుష్యుడు. కాబట్టి వస్త్రధారణ మరియు అన్ని విషయములలో ఆయనే మనకు మాదిరి. మనము ఆ విధంగా వస్త్రములు ధరించనవసరం లేదు. మనము ధరించే వస్త్రములు కంటే మన జీవితములే మనము ఎవరమో తెలియపరుస్తుంది.

30

కాబట్టి అప్పుడు.. ఆయనను అగౌరవపరచుట కాదు.

కాని ఆ కాపరి హాలులో నిలువబడియున్నాడు, ఆమె చనిపోవుటకు సిద్దముగా ఉన్నది. మరణం ఆమెను తాకినప్పుడు, దేవదూతలు వచ్చుటను చూచుటకు బదులుగా ఆమె, “అయ్యో, దేవా, నేను నశించిపోయాను” అని అరచినది.

మరియు వారు సంఘ కాపరిని పిలిచారు, మరియు ఆమె అరచినది. అతడు చెప్పాడు, “ఇదిగో, ఇదిగో, ఇదిగో, నీకు అంతా బాగానే యున్నది. నీవు సంఘ సభ్యురాలివి.”

ఆమె చెప్పినది, “నీవు మనుష్యులను మోసగించువాడవు! దానికి కారణము నీవే. నేను నరకమనకు వెళ్ళుచున్నాను, దానికి కారణము నీవే.” ఆమె ఆ ఆలయము దగ్గర మాట్లాడిన ఆ బాలికను శ్రీమతి హ్యూమ్స్ ని పిలిపించినది, కాని సమయానికి ఆమెను అక్కడికి తీసుకురాలేకపోయారు. ఆమె మరణించినది. కాని సేవకుడు ఆమెకు మతి భ్రమించినది కాబట్టి ఆమెకు మత్తు మందు ఇచ్చుటకు వైద్యుడిని పిలిపించాడు; కాని ఆ వైద్యుడు రాకముందే ఆ సేవకుడి గూర్చి వ్యతిరేకముగా అనేకమైన చెడు సంగతులు చెప్పి మరణించినది.

సహోదరీ, సహోదరుడా, నేను బోధించిన వారిలో ఒకరు కూడా నా ఎదుట నిలువబడి ఆ విధంగా చెప్పుట నాకిష్టము లేదు. కొన్నిసార్లు నేను నిజముగా కఠినముగా ప్రవర్తించవలసి వస్తుంది. సమయము వచ్చిననప్పుడు దేవుని ఎదుట పవిత్రముగా సరిగా కనబడుటకు ఆ విధంగా ప్రవర్తించడమే మంచిది.

31

ఇప్పుడు ఆయన వాక్యమును తెరచుటకు ముందుగా మనము తలలు వంచి ప్రార్ధన చేద్దాము.

అత్యంత కృప గలిగిన మా పరిశుద్ధమైన తండ్రీ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆయన రక్తప్రోక్షణలో మీ కృపా సింహాసనమున సమీపించుచున్నాము. ఆ రక్తము లేనట్లయితే మేమందరమూ శిక్షించబడుదుము మరియు నిన్ను సమీపించే అవకాశము మాకెన్నడూ లభించేది కాదు, కాని ఆయన వలన మేము ఈ ధన్యతను పొందియున్నాము. “నా నామమున తండ్రిని మీరు ఏది అడిగినను, ఆయన దానిని మీకనుగ్రహించును.” కావున తండ్రీ, ఈ రాత్రి మా పాపములను మరియు అతిక్రమములను క్షమించమని మిమ్మును వేడుకొనుచున్నాము. మా చెడ్డ కార్యములను మరియు మా చెడు తలంపులను మీరు క్షమించండి.

32

ప్రభువా, నీ దైవిక చిత్తమైతే మరికొద్దిసేపట్లో రోగులైన నీ పిల్లల కొరకు ప్రార్థనలు చేయబోవుచున్నాము. ప్రజల విశ్వాసము వాక్యపు పునాది మీద నిలుచునట్లుగా మేము కొద్ది సమయములో ఒక అంశము మీద ప్రసంగించబోవుచున్నాము. ప్రజలు నిత్యమైన వాక్యము పునాది మీద వారి విశ్వాసము నిలిచియుండాలి. ఈ మధ్యాహ్నం నేను తీసికొనిన అంశమునకు సంబంధించిన ప్రేరేపణను ప్రభువా, నాకు అనుగ్రహించండి. పరిశుద్దాత్మ ఆ వాక్యమును తీసికొని ప్రతి ఒక్కరి హృదయంలో దానిని సరైన స్థానములో పెట్టును గాక, ప్రభువా, మా అవసరతలు మీరు ఎరిగియున్నారు. ప్రభువా, ఆ సువార్త విత్తనమును మా హృదయంలో నాటండి. ఆ విత్తనము ఎదిగి రక్షణ, ఆదరణ, స్వస్థత అనుగ్రహించుచు వృక్షాలుగా ఎదుగును గాక.

దేవా, ఇక్కడ పెట్టబడియున్న చేతిరుమాళ్ళు పరిశుద్దుడైన పౌలు వలెనే వాటి మీద నా చేతులు పెట్టుచున్నాను. అతడు ఆ పరిచర్యను లేఖనముల నుండి పొందియున్నాడని నేను నమ్ముచున్నాను. ఎలీషా ఆ కర్రను గెహజీకి ఇచ్చి, “వెళ్ళి దీనిని ఆ బిడ్డ మీద పెట్టుము,” అని చెప్పాడు. ఎందుకనగా తాను పట్టుకొనినదంతయూ ఆశీర్వదించబడినదని అతడు ఎరిగియున్నాడు. ఆ కర్ర ఆశీర్వదించబడినదని అతడు ఎరిగియున్నాడు, ఏలయనగా పరిశుద్దాత్మ అతని మీదకు వచ్చినప్పుడు, ఆ కర్ర అతని చేతిలో యున్నది. దానిని ద్వారా ఆ స్త్రీ విశ్వసించినది. పరిశుద్ద పౌలు ఆ లేఖనముల నుండి దానిని పొందాడని నేను విశ్వసించుచున్నాను.

33

ఇప్పుడు, ఈ చేతి రుమాళ్ళు (నిస్సందేహముగా) రోగులైన పిల్లలు, తండ్రులు, తల్లులు, తమ ప్రియులు, రోగగ్రస్తమైన గృహములు, గ్రుడ్డితనముతో చేతికర్రతో గదిలో తడుములాడే గ్రుడ్డి తండ్రులకు ప్రతినిధిగా ఉన్నాయి. వారు మరలా సూర్యకాంతిని, చెట్లను, నీటిని చూడాలనుకొనుచున్నారు, కాని శత్రువు వారి కన్నులను శుక్లములతో కప్పివేశాడు. ఒక తల్లి అనారోగ్యముతో బాధపడుచున్నది, ఒక చిన్న బిడ్డ జ్వరముతో బాధపడుచూ ఈ చేతిరుమాళ్ళు తిరిగి పొందుటకు నిరీక్షిస్తున్నారు. ఓ, దేవా, నా ప్రార్ధన నా మొర్రను ఆలకించండి.

ప్రభువా, లేఖనములలో అది వ్రాయబడియున్నది. ఒకసారి ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమునకు ప్రయాణిస్తున్నప్పుడు, మార్గములో వారికి ఎర్రసముద్రము ఎదురయ్యింది. మరియు ఒక రచయిత ఈ విధంగా చెప్పాడు, అగ్నిస్తంభము నుండి దేవుడు కోపముతో చూడగానే ఎర్ర సముద్రము భయపడిపోయి వెనక్కి తిరిగిపోయినది. మరియు ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశములోనికి నడిచివెళ్ళారు. పరలోకమందున్న తండ్రీ, నీవు అగ్నిస్తంభము నుండి చూచుట మాత్రమే గాక, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా చూస్తున్నావు. ఈ చిన్న ఆనవాళ్ళు రోగుల దగ్గరికి పంపబడినప్పుడు, నీవు యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా వారిని చూడండి. ఆయన కల్వరిలో మాకోసం మరణించాడని, మా అతిక్రమముల నిమిత్తము ఆయన గాయములు పొందాడని మరియు ఆయన పొందిన దెబ్బల వలన మేము స్వస్థత పొందామని మేము ఎరిగియున్నాము. మరియు శత్రువు భయపడి వెనక్కి వెళ్ళును గాక, మరియు లేఖనములలో చెప్పబడిన ఆరోగ్యవంతమైన దేశములోనికి ఈ రోగులు ప్రవేశించుదురు గాక, “వీటన్నింటిలో నీవు ఆరోగ్యముతో వర్ధిల్లాలని కోరుచున్నాను.” ప్రభువా, దీనిని అనుగ్రహించండి. ప్రతి ఒక్క రోగము నీ ప్రజలను విడిచిపోవును గాక. అందు నిమిత్తమే ఈ గొప్ప సంఘమంతయూ నాతో కలిసి ప్రార్ధించి, వీటిని ప్రభువైన యేసుక్రీస్తు నామములో పంపుచున్నాము. ఆమేన్.

34

ఈ ఆరాధన ముగించబడిన వెంటనే, మీరు వచ్చి వీటిని తీసికొని వెళ్ళండి. మీరు ఒక ప్రార్ధనా వస్త్రము కోరినట్లయితే, మీరు ఇక్కడ మీ చేతిరుమాలు పెట్టియుండనట్లయితే నాకు ఉత్తరము వ్రాయండి. అంతా ఉచితమే. మేము దేనికొరకు డబ్బులు వసూలు చేయుట లేదు. ఏ సమయములో అయినా సరే, నాకు ఉత్తరము వ్రాయండి. జెఫర్సన్ విల్, ఇండియానా, మేము మీకు ఒకటి పంపుదము. ఒకవేళ దానిని మీరు ఉపయోగించినట్లయితే, మీ పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయములో పెట్టండి; మరియు మీ ఇంటిలో ఎవరైనా రోగి అయినట్లయితే, మీరు విశ్వసించినట్లయితే. మీరు ఆ చిన్న చేతిరుమాలు తీసికొని వారి మీద పెట్టండి. దేవుడు వారిని స్వస్థపరచునని మేము విశ్వసించుచున్నాము. ఒకవేళ మనకు తగిన సమయము ఉన్నట్లయితే, దానిని గూర్చి అనేక సాక్ష్యములు వినిపించెదము; కాని ఇప్పుడు మనకు సమయము లేదు.

35

ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథమును తెరుద్దాము. లేఖనములను వ్రాసుకొనుచున్న వారు, లూకా సువార్త 18వ అధ్యాయము, 37 మరియు 38 వచనములు చదువుదాము. దాని నుండి ఒక చిన్న అంశము తీసుకొంటాను. మీరు లేఖనములు తీయుచుండగా, బహుశా రేపు రాత్రి మరియు తర్వాత (మనకు తెలియదు, పరిశుద్దాత్మ నడిపింపు ప్రకారము). మేము రోగుల కొరకు ప్రార్ధిస్తామని నమ్ముచున్నాను. మరియు ప్రతి రాత్రి కూడా ఎంతమంది రోగులకు వీలయితే అంతమందికి ప్రార్థనలు చేస్తాము. ప్రజలు ప్రార్ధనా కార్డుల కొరకు వచ్చినదానిని బట్టి చేద్దాము.

మేము వారందరినీ ఒక వరుసులో నిలువబెట్టుటకు వారికి ప్రార్థనా కార్డులు ఇచ్చుచున్నాము, చూశారా. బహుశా ఈ రాత్రి ఇక్కడ ఒక వెయ్యిమంది ఉన్నట్లయితే, బహుశా వారిలో ఒక ఐదువందలమంది ప్రార్ధన చేయించుకోవాలని కోరతారు. కాబట్టి వారందరినీ ఒకేసారి ఇక్కడకు తీసుకొని రాలేము. అది మనకు తెలుసు. మరియు, ఒక వరుసలో వివేచించునప్పుడు, చాలా చాలా కొద్దిమందికి మాత్రమే కుదురుతుంది, ఎందుకనగా అది నిన్ను చంపివేయనంతగా చేస్తుంది. లేఖనముల ప్రకారము ఎందరు దానిని అర్ధము చేసుకొన్నారు. ఖచ్చితంగా మీరు గ్రహించారు, చూశారా. కాబట్టి... అప్పుడు మనము ఎక్కువమందిని తీసికొనిరాలేము, కాని ప్రతి రాత్రి, ఎంత వీలయితే అంతమందిని తీసికొని వస్తాము. మంచిది.

వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి.

అప్పుడు వాడు యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను.

36

అది నిజముగా చల్లటి ఉదయము. ఆయన అలసిపోయాడు. ఆయనరాత్రంతా మెలుకువ ఉన్నాడు. బహుశా ఆయన రాత్రంతా దర్శనములను చూచి ఉదయం ఆలస్యంగా లేచియుండవచ్చును. మరియు ఆ దినములలో అనేకమంది యూచకులుండేవారు. వారు మార్గము ప్రక్కలలో కూర్చొనియుండేవారు. ఆ మార్గములో ప్రజలు వస్తూ పోతూ యుండేవారు, వ్యాపారులు తమ పనులకు వెళ్తుండేవారు, వారు ఆవిధంగా వెళ్తున్నప్పుడు బహుశా వారికి భిక్షము వేసేవారు. అతడు మొదటి భిక్షగాడిని కలిసినప్పుడు, అతడికి ధర్మము చేసేవాడు, అది ఆ ఒక రోజుకు సరిపోయేది. అతడు అంతకుమించి ఇవ్వగిలిగినది ఏదియూ లేదు. కాబట్టి అనేకులు ఆ విధంగా ఆయూ స్థలములలో కూర్చొని వచ్చేపోయేవారు ఇచ్చే భిక్షము కనిపెట్టుచూ ఉ౦డేవారు. మరియు ఒకవేళ వారు దానిని తప్పిపోయినట్లయితే, వారు రోజంతా పస్తు ఉండవలసి వస్తుంది. అనేకసార్లు వారి దగ్గర ఇచ్చుటకు చిన్నవి ఉంటాయి, వారు చిన్న ఇంద్రజాలములు ఉపయోగిస్తారు. ఈ మధ్యకాలములో నేను భారతదేశము వెళ్ళాను. వారిలో ప్రతి ఒక్కరూ ఒక నల్ల త్రాచు పామును కలిగియున్నారు. లేక చిన్న కోతి లేక వారిని ఆకర్షించగలిగే జీవిని కలిగియుండేవారు. దానితో వారు యాత్రికులను ఆకర్షించుదురు.

37

బహుశా అది శీతాకాలము, చల్లటి ఉదయము కావచ్చును, చల్లగా ఉన్నది, పునరుద్దానమునకు (ఈస్టర్) సమీపముగా యున్నది, అతడు చిరిగిపోయిన బట్టలు ధరించియున్నాడు. అతడు ఆలస్యముగా వచ్చాడు, అతడు యెరికో గవిని వద్ద కూర్చునేవాడు. అతడి పేరు బర్తిమయి. మరియు అతడికి వివాహమయి ఒక చిన్న కుమార్తెను కలిగియున్నాడు. అతడు రాత్రంతా మెలకువగా ఉండుట వలన, అతడికి నిద్ర సరిపోలేదు, అతడు ఆలస్యంగా రావడం వలన బిక్షమెత్తే సమయమును తప్పిపోయాడు. ఆ పట్టణము వెలుపల నివసించే వ్యాపారస్తులలో అనేకమంది అప్పటికే పట్టణములోనికి వెళ్ళిపోయారు. అప్పటికే సమయం చాలా గడచినది.

కాబట్టి ఆ చిత్రమును ఈ విధంగా ఊహిస్తున్నాను, ఆ పట్టణపు ఉత్తరపు గవిని యోరూషలేమునకు దారితీస్తుంది. యెరికో పట్టణపు ఉత్తరము వైపు గవిని, యెహాషువ మరియు యాజకులు బూరలు ఊదినప్పుడు ప్రజలు కేకలు వేసిన సమయములో యెరికో గోడలు కూలినప్పుడు, అప్పుడు కూలిన పాతరాళ్ళు ఇంకా అక్కడే పడియున్నాయి.

38

మనము ఊహించుదాము, బర్తిమయి బహుశా ఈ గుండ్రని రాళ్ళలో ఒక రాయి మీద కూర్చొనియున్నాడు. ఆ మార్గము యోర్దాను వైపు వెళ్ళును.

అతడు అక్కడ కూర్చొనియుండగా, అతడు ఖచ్చితంగా, “ఇప్పుడు తినటానికి ఏమీ దొరకనట్లయితే, ఈ రాత్రికి నా కుటుంబం పస్తుండాలి, ఎందుకనగా నేను చాలా ఆలస్యంగా వచ్చాను. నేను సమయానికి రాలేకపోయాను. వ్యాపారులందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఈ రోజు నాకు ఏమియూ దొరకదు. కాని నేను ఏమియూ చేయలేను; నేను ఇక్కడకు చేరేసరికి పూర్తిగా అలసిపోయాను” అని తలస్తూ యుండవచ్చును, మరియు అతడు అక్కడ కూర్చొనియున్నాడు. బహుశా అతడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉండవచ్చునని తలంచుదాము. “ఓ, ఒకవేళ నేను గనుక. ఆ కల గనుక నిజమైనట్లయితే, నేను మరలా చక్కగా చూడగలను. నేను అనేక సంవత్సరముల నుండి గ్రుడ్డివాడిగా ఉన్నాను. ఒకవేళ మునుపటివలె నేను చక్కగా చూడగలిగితే!”

39

అప్పుడు అతని మనస్సు బాల్యదినముల వైపు మళ్ళీయుండవచ్చును. బహుశా ఆ శీతాకాలములో అతడు ఆటలు ఆడియుండవచ్చును. యోర్దాను ఒడ్డున చక్కటి పుష్పాలు ఏ విధంగా ఉండేవి. అది ఎంత చక్కటి అందమైన దృశ్యం. అతడి బాల్యదినములలో ఆ కొండల పైకి క్రిందకు ఏ విధంగా తిరిగేవాడు, మిగిలిన చిన్న పిల్లలతో ఏ విధంగా ఆడేవాడో అతడు గుర్తుకు తెచ్చుకున్నాడు.

తర్వాత యూదురలైన ప్రియమైన అతని తల్లి మధ్యాహ్న సమయంలో అతడిని భోజనమునకు పిలిచేది. అతడు భోజనము చేసిన తర్వాత, ఆమె బయట వసారాలో కూర్చొని, అతడిని ఒడిలో కూర్చొనబెట్టుకొని, అతని కన్నుల మీద పడే అతడి జుట్టును మృదువుగా వెనక్కి నెట్టేది. ఆమె అతడిని చూస్తూ పరవశించేది, అతడు ఆమె ఎంత చక్కగా ఉన్నదో చూసేవాడు. మరియు ఆమె చెప్పేది, “బర్తమయి, నీ యొక్క చిన్న కన్నులు పైనున్న ఆకాశము వలె చక్కగా నీలము రంగులో ఉన్నాయి.” ఓ, అతడు దానిని గూర్చి ఆలోచిస్తున్నాడు, “ఆ గతించిపోయిన దినములలో నేను మరలా జీవించగలిగితే, నేను పువ్వులను చూస్తూ, ఆ సీతాకోక చిలుకలను తరుముచూ, ఆ పక్షులను చూస్తూ, వాటి చప్పుళ్ళు వింటూ, నా ప్రియమైన తల్లిని చూస్తూ౦డేవాడిని, కాని అయ్యో! ఆ ముసలితనం వచ్చి, శరీరం అంతా ముడతలు పడిపోయి చివరకు మరణించినది. ఆమెను చాలా సంవత్సరముల క్రితము పాతిపెట్టాము. ఇప్పుడు నేను వృద్ధుడిగా, పేదరికముతో మొత్తబడి, గ్రుడ్డివాడిగా భిక్షమెత్తుకొనుచున్నాను.

40

మరియు అతడు నిద్రించక ముందు తల్లి చెప్పే కథలను బటి ఎంతగానో ఆనందించేవాడు. తర్వాత ఆమె అతడిని ఊపుచూ నిద్రపుచ్చేది మరియు ఒక కథను అతడు బాగా ఇష్టపడేవాడు. అది ఎలిషా ఆ చిన్న బాలుడిని బ్రతికించుట. దానిని గూర్చి నేను కొంచెంసేపటి క్రితమే చెప్పాను. ఆమె ఆ కథను అతడికి ఈ విధంగా చెప్పేది, “బర్తిమయి, ఒక గొప్ప ఘనురాలు జీవించేది. ఆమె షునేమీయురాలు. ఆమె షునేములో జీవించేది. మరియు ఆమె దేవుని సేవకుడైన ఎలీషాను విశ్వసించినది. అతడు గొప్ప ప్రవక్త. అతడు తరచుగా ఆమె ఇంటికి వచ్చేవాడు.” అతడు దానిని జ్ఞాపకము చేసుకొన్నాడు. 'మరియు ఆమె ఒక రోజు తన భర్తతో, మన దగ్గరకు వచ్చుచున్న ఇతడు పరిశుద్దుడు అని గ్రహిస్తున్నాము. అతడు గొప్ప వ్యక్తి, ఏలయనగా దేవుడు అతని ద్వారా గొప్ప సూచక క్రియలు, అద్భుతములు జరిగిస్తున్నాడు. కాబట్టి అతని కొరకు మన ఇంటిపైన ఒక గది నిర్మించి అతనికి మేలు చేయాలని మనవి చేస్తున్నాను. అతడు ఇక్కడకు వచ్చినప్పుడు, అందులో విశ్రాంతి తీసుకొంటాడు.'“

41

ఆమె బర్తిమయితో ఈ విధంగా చెప్పుటను నేను ఊహిస్తున్నాను, “చూడు బర్తిమయి, మనము ప్రజలందరితో మంచిగా ప్రవర్తించాలి. మనము ఏ ఒక్కరికీ కీడు చేయకూడదు. ప్రత్యేకముగా దేవుని మందిరమును మనము గౌరవించాలి.” కాబట్టి ఆ స్త్రీ, వారిని దర్శించే వ్యక్తి దేవుని యొక్క మహాప్రవక్తయని ఆమె గుర్తించినది. కాబట్టి ఆమె భర్త ఆ మాటకు సమ్మతించాడు. ఎలీషా మరియు అతని పనివాడైన గేహజీ మరియొకసారి వారిని దర్శించినప్పుడు, పైన వారికొరకు ఒక చక్కటి గది సిద్ధపరచబడియున్నది. చిన్న మంచము, నీటి పాత్ర, బల్ల అతని విశ్రాంతి కొరకు ఏర్పరచబడ్డాయి. సెలవు దినములు, అమావాస్య దినములలో అతడు కర్మేలు పర్వతము దగ్గర ఉపవాసము చేయుటకు వెళ్ళే మార్గములో ఈ గృహమున్నది. అతడు ప్రజలతో మాట్లాడుటకు, బోధించుటకు ముందుగా, ఆ పర్వతము దగ్గర ఉపవాస ప్రార్ధనలు చేసేవాడు.

42

ఎలీషా వచ్చినప్పుడు, ఆ దయ గలిగిన స్త్రీ చేసిన కార్యములను చూసినప్పుడు, అతడు గేహజీని పంపి, “ఆమెకు మనము ఏ సహాయం చేయాలి? అని ఆమెను అడుగుము. నేను సైన్యాధిపతికి చాలా సన్నిహితమైన స్నేహితుడను మరియు అవసరము అయితే రాజుతో సహితం మాట్లాడగలను. ఆమె పక్షముగా ఏ విషయమైనా మాట్లాడాలా?” అని అడగమన్నాడు. ఎలీషా ఆమెను ఈ విధముగా ప్రశ్నించినప్పుడు, “లేదు, నేను నా స్వజనులతో నివసించుచున్నాను,” అని ఆమె జవాబిచ్చినది. ఆమె బహుధనవంతురాలు, వారికి కొదువ ఏమియూ లేదు. ఆమె కేవలము దయ గలిగిన హృదయముతో మాత్రమే చేసినది.

దేవుని కొరకు నీవు ఏదైనా చేసినప్పుడు, నీవు అదే మనస్సుతో చేయవలసియున్నది. నీవు మంచి హృదయముతో దానిని చేయుము. నీవు ఏదైనా ఇచ్చినప్పుడు, నీ హృదయాంతరంగము నుండి ఇమ్ము. నీవు ఆ విధంగా ఇవ్వలేకపోతే, నీవు దానిని చేయవద్దు, ఏలయనగా అది దేవునిని ఘనపరచదు. నీ హృదయాంతరంగము నుండి కేవలము మంచితనముతో చేయుము.

43

“మంచిది, ఆ పనివాడు తిరిగి వచ్చి ప్రవక్తతో ఆ సంగతి తెలియపరచినప్పుడు, ”మంచిది. ఆమెకు ఏ అవసరం లేదు. ఆమెకు అంతా మంచిగానే యున్నది. కాని మీకు ఒక సంగతి చెప్పాలి; ఆమెకు కొంచెం వయస్సు ఎక్కువ, మరియు ఆమె భర్త వృద్దుడు. మరియు వారికి సంతానము లేదు“ అని చెప్పాడు,

ప్రవక్త ఒక దర్శనము చూశాడనుటలో ఎట్టి సందేహము లేదు, ఏలయనగా ప్రవక్త దర్శనము ద్వారా కాకుండా దేవుని కొరకు అట్టి కార్యమును ఎన్నడూ చేయలేడు. అది నిజము. దానిని గుర్తుంచుకొనండి, లేఖనములలో ఎక్కడైనా చూడండి, ముందుగా దేవుడు వారికి చెప్తాడు. మనుష్యుడు తనకిష్టము వచ్చినట్లుగా చేయలేడు. అతడు దేవుని సేవకుడు. మరియు యేసుక్రీస్తు కూడా, “తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, అదే కానీ కుమారుడు తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును అలాగే చేయును” అని చెప్పారు. యోహాను 5:19. తండ్రి మొదటిగా ఆయనకు చూపించకుండా దేవుని కుమారుడే ఏ కార్యమును చేయనట్లయితే, దేవుడు మొదటిగా మనకు చూపించకుండా మనము ఎలా చేయగలము? కాబట్టి, మనము ఏమి చేస్తున్నామో తెలియకుండానే మనము కొన్నిసార్లు ధైర్యంగా ఆ కార్యములలోనికి దూకుతాము; కాని దేవుడు దర్శనము ఇచ్చి, ఏమి చేస్తున్నాడో ఖచ్చితముగా చూపించి మాట్లాడినట్లయితే, అది కేవలము మనము నటించవలసిన నాటకము మాత్రమే. అంతే, ఎందుకనగా దేవుడు దానిని నెరవేర్చును. ఆయన ముందే దానిని చెప్పాడు. కాబట్టి, ఆయన దానిని నెరవేర్చును.

44

కాబట్టి అతడు చెప్పాడు, “వెళ్ళి ఘానేమీయురాలిని పిలువుము.” ఆమె వచ్చి ద్వారము వద్ద నిలబడినది. మరియు అతడు, మరుసటి యేట ఈ రుతువున నీ కౌగిట కుమారుడుండుడని ఆమెతో చెప్పెను.

“ఇప్పుడు, 'నేను వృద్దురాలిని, అని ఆమె చెప్పినది. కాని ఎలీషా చెప్పిన మాట, అతడు చెప్పినట్లుగానే నెరవేరినది. కొన్ని నెలలు తర్వాత ఆమె ఒక చక్కటి కుమారుని కని అతడిని కౌగలించుకొనినది.'”

ఆ చిన్న బర్తిమయి కన్నులను చూస్తున్నాము, “అమ్మా, ఆమె ఆ బాలుడిని నీవు నన్ను ప్రేమించినట్లే ప్రేమించినదా?” అని ప్రశ్నించాడు.

“అవును, నేను నిన్ను ప్రేమించినట్లే ప్రేమించినది. అతడు చాలా అందమైనవాడు. అతడు ప్రపంచములో అందరి కంటే అందమైనవాడని ఆమె తలంచినది. నేను కూడా నిన్ను అదే రీతిగా భావిస్తున్నాను. తల్లలందరూ పిల్లలను గూర్చి ఆ రీతిగానే తలంచుదురు. ఆ చిన్నబాలుడు కొంచెం పెరిగిన తర్వాత సుమారుగా పది లేక పండ్రెండు సంవత్సరముల వయస్సు వచ్చిన తర్వాత ఒక రోజున అతడు తండ్రితో కలసి పొలములోనికి వెళ్ళాడు. అతడు చాలా ధనవంతుడు. అది శీతాకాలము. కాబట్టి అతడు తండ్రితో కలసి పొలములోనికి వెళ్ళాడు. బహుశా ఆ చిన్నపిల్లవాడికి వడదెబ్బ తగిలియుండవచ్చునని నేను భావిస్తున్నాను. ”అయ్యో, నా తల, అయ్యో నా తల“ అని బిగ్గరగా ఏడ్చాడు. అది మధ్యాహ్న సమయము. పనివారిలో ఒకడు ఆ బాలుడిని ఇంటికి తీసికొని వచ్చి తల్లి ఒడిలో పెట్టాడు. ఆ చిన్నవాని పరిస్థితి మరింత అధ్వాన్నముగా మారినది. అతడు మరింత రోగిగా మారాడు. చివరకు అతడు మరణించాడు.”

45

ఇప్పుడు, మీరు దీనిని గమనించాలని కోరుచున్నాను. దేవుడు ఒక వ్యక్తితో వ్యవహరించుట ప్రారంభించినప్పుడు, కొన్నిసార్లు వారు తాము ఏమి చేస్తున్నారో వారికి తెలియకుండానే కొన్ని కార్యములు జరిగిస్తారు. ఆమె ఆ చిన్నపిల్లవాడిని తీసుకొని వెళ్ళి ప్రవక్త మంచము మీద పరుండబెట్టినది. ఆమె ఎలాంటి స్థలములో పరుండబెట్టినది, ఆమె ఆ ప్రవక్త కొరకు నిర్మించిన ఆ గదిలోని ప్రవక్త మంచము మీద పరుండబెట్టినది. ఆమె పనివానితో, “ఒక కంచరగాడిదను సిద్ధము చేయుము. నీవు త్వరపడి దానిని తోలుము. నేను నీకు ఆజ్ఞాపించేవరకు ఆగవద్దు,” అని ఆజ్ఞాపించినది.

ఆమె భర్త, “కర్మేలు పర్వతము దగ్గరకు వెళ్ళవద్దు. ఇది అమావాస్య కాదు, విశ్రాంతి దినము కాదు. అక్కడ ప్రవక్త ఉండడు” అని చెప్పాడు. ఆ తల్లి హృదయము తన బిడ్డ కొరకు అలమటిస్తుంది. ఆమె చాలా విచారముతో యున్నది, కృంగిపోయినది. ఆమె గనుక ప్రవక్త దగ్గరకి వెళ్ళినట్లయితే, ఆ బిడ్డను దేవుడు ఎందుకు తీసుకొన్నాడో తెలుస్తుందని ఆమె ఎరిగియుండెను. ఒకవేళ ఆమెకు కుమారుడు కలుగునని ప్రవకకు తెలియపరచినప్పుడు, ఆమెకు కుమారుడు జన్మించాడు, కాబట్టి, దేవుడు ఆ కుమారుని మరలా వెనక్కి ఎందుకు తీసుకొన్నాడో కూడా చెప్పగలడు. ఆమె చెప్పినది, “అంతా బాగున్నది. ముందుకు వెళ్ళుము.”

46

మరియు పనివాడు కర్మేలు పర్వతము దగ్గరకు వెళ్ళాడు, ప్రవక్త అక్కడ ఉన్నాడు. అతడు గుహద్వారము దగ్గర నిలువబడి బయటకు చూస్తున్నాడు. మరియు అతడు చెప్పాడు, “ఇక్కడకు షునేమీయురాలు వచ్చినది.” ఆమె కలవరపడుచున్నది, కాని ప్రభువు దానిని నాకు దాచియుంచేను. ఆమె సమస్య ఏమిటి ప్రభువు నాకు చెప్పలేదు.“

మీరు చూశారా, దేవుడు అన్ని విషయములను తన సేవకులకు చెప్పడు. ఆయన ఏ విషయములను వారికి తెలియపర్చాలని కోరుకుంటాడో, ఆ విషయాలను మాత్రమే బయలుపరుస్తాడు, చూశారా. అది దేవుని చిత్తము. ఇక్కడ గొప్ప దైవజనుడు ఉన్నాడు, కాని ఆమె సమస్య ఏమిటో అతడికి తెలియదు.

కాబట్టి అతడు గేహజీతో చెప్పాడు, “నీవు పరుగెత్తి వెళ్ళి ఆమెను కలుసుకొనుము. మరియు అందరూ సుఖముగా ఉన్నారా?” అని అడుగుము.

మరియు అతడు అడిగాడు, “నీవు క్షేమముగా, సుఖముగా ఉన్నావా? నీ పెనిమిటి సుఖముగా ఉన్నాడా? నీ కుమారుడు సుఖముగా ఉన్నాడా?”

ఆ స్త్రీని చూడండి: “అందరూ సుఖముగా ఉన్నారు.” నేను దానిని ఇష్టపడుచున్నాను. ఎందుకు? ఆమె బిడ్డ శవముగా పడియున్నాడు, ఆమె భర్త పెరటిలో అటూ ఇటూ తిరుగుచూ చేతులు మెలి త్రిప్పుచూ ఏడుస్తున్నాడు, కాని “అందరూ సుఖముగా ఉన్నారు.” నేను దానిని ఇష్టపడుచున్నాను.

47

దేవుని అభిషేకము తనపైన కలిగియున్న ప్రవక్త సముఖములోనికి వెళ్ళాలని ఆమె యొక్క సంకల్పము. ఏమి చేయాలో ప్రవక్తకు తెలుసు అని ఆమె ఎరుగును. ఆమె విషయములో “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును” అతడు కలిగియున్నాడని ఆమెకు తెలుసు. అందుకే, “అందరూ సుఖముగా ఉన్నారు.” ఒకవేళ దేవుడు ఆ బిడ్డను తీసికొనినట్లయితే, సరే మంచిది, ఎందుకనగా అది దేవుని ప్రణాళిక. “దేవుడు ఇచ్చెను, దేవుడు తీసికొనెను, యెహోవా నామమునకు సోత్రములు కలుగును గాక,” చూశారా. కాని “ఎందుకు?” అని ఆమె తెలుసుకోవాలనుకున్నది. ఒకవేళ ఆమె ఏమైనా తప్పు చేసిందా?

మరియు ఆమె ఎలీషా పాదముల యొద్దకు పరిగెత్తి వెళ్ళి అతడి పాదముల మీద పడిపోయినది. కాబట్టి తన యజమానుని పాదముల మీద ఒక స్త్రీ పడుట కొద్దిగా అనుచితముగా భావించి, ఆమెను అక్కడిని తీసివేయుటకు గేహజీ ప్రయత్నించాడు. కాబట్టి, అప్పుడామె ఆమె బిడ్డ మరణమును గూర్చి తెలియపరచినది.

ఇప్పుడు, అతడు గేహజీతో ఈ విధంగా చెప్పాడు, “నీవు నా దండమును తీసికొని పోయి, వెళ్ళి ఆ బాలుడి మీద పెట్టుము. ఎవరైనను నీకు ఎదురుపడినయెడల వారికి నమస్కరింపవద్దు. ఎవరైనను నీకు నమస్కరించినయెడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. కేవలము నీ మనస్సంతటిని ఆ దండమును తీసికొని వెళ్ళి, ఆ బాలుడి మీద పెట్టుట యందే నిలుపుము.” నేను దానిని ఇష్టపడుచున్నాను. మనము సమయమును వ్యర్థపరచుటకు కుదరదు, వర్తమానము చాలా అత్యవసరము, ప్రజలు చనిపోవుచున్నారు. మనము ముందుకు వెళ్ళెదము.

48

అతడు ఆ దండమును తీసికొని బయలుదేరాడు.

దాని వలన తన కార్యము నెరవేరుతుందని ఆ స్త్రీ విశ్వసించినట్లయితే, ఆ కార్యము జరిగియుండేదని నేను విశ్వసించుచున్నాను. కాని ఆమె విశ్వాసము ఆ దండము పైన లేదు; ఆమె విశ్వాసము ప్రవక్త మీద యున్నది. కాబట్టి ఆమె చెప్పినది, “యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచి వెళ్ళను. నేను నీ దగ్గరనే నిలిచియుందును.”

ఓ, నేను దానిని ఇష్టపడుచున్నాను. దానిని పట్టుకొనియుండుము. దేనికొరకైనా నీవు దేవుని పట్టుకొనినట్లయితే, నీ పట్టును వదులుచేయవద్దు. అది నిజము. ఆయనను స్వస్థపరచువానిగా నీవు యేసును పట్టుకొనినట్లయితే, ఏ దయ్యము గాని, ఏ కార్యము గాని దాని నుండి వెనక్కి వెళ్ళినట్లుగా చేసే అవకాశము ఇవ్వవద్దు. దానిని పట్టుకొనియుండుము! నేను దానితోనే నిలిచియుందును, అక్కడే యుండుము. “యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నా బిడ్డను గూర్చి తెలుసుకొనే వరకు నేను నిన్ను విడిచివెళ్ళను.” మంచిది, ఎలీషా ఆమెను విడిపించుకోలేక పోయాడు.

కాబట్టి నీవు కూడా యేసుతో అదే విధంగా ప్రవర్తించాలి. నీవు ఆయన హస్తములు పట్టుకొని యుండుము, అక్కడనే నిలిచియుండుము. రాత్రింబగళ్ళు మొర్రపెట్టుము. మరియు అదే మార్గము. అవునయ్యా, దానిని విడిచిపెట్టవద్దు. దానినుండి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయవద్దు. దానిని నీవు విశ్వసించినట్లయితే, అక్కడే నిలిచియుండుము. ప్రభువు దగ్గర కృప దొరుకును. దానితో నిలిచియుండుము.

49

అందుకే మరియ, మార్త అనుకొనుచున్నాను, యేసును కలుసుకొనుటకు వెళ్ళినది. ఆమెకు తెలుసు... ఆమె ఘానేమీయురాలి కుమారుడిని గూర్చిన కథ చదివినది. ఆమె సరియైన విధానములో అక్కడికి చేరినప్పుడు ఆమె విన్నపము అంగీకరించబడుతుందని ఎరిగియుండెను. అది తరువాత కార్యము. ప్రజలు తప్పు మార్గములో దేవుడిని చేరుకొనుచున్నారు. నీవు సరియైన మార్గములో రావలసియున్నది.

కొంచెం కాలము క్రితము, రాజు కొరకు ప్రార్ధించే గౌరవము నాకు దక్కినది. వారు నా ఫ్యాంటు పట్టీలు తీసివేశారు. రాజునకు ప్రార్ధించునప్పుడు, అక్కడి నుండి వెనక్కి వచ్చు సమయములో నా వీపు చూపకూడదని చెప్పారు. ఎన్నడూ రాజునకు నీ వీపు చూపవద్దు. అది చాలా మంచి కార్యము. అట్లయితే, రాజుల రాజునకు నీ వీపు చూపవద్దు, చూశారా. అది సమీపించుట, ఒక ప్రత్యేకమైన విధానములో సమీపించుట.

50

న్యాయస్థానములో, న్యాయాధిపతి ఆసీనుడైయున్నప్పుడు, నీ వెనుక ఏదైనా ఉన్నట్లు తెలిసినట్లయితే, “న్యాయాధిపతి గారు, ఒక్క నిమిషం; నేను మీతో ఒక్క నిమిషము మాట్లాడాలి” అని చెప్పినట్లయితే, వారు నిన్ను గద్దిస్తారు. న్యాయాధిపతిని సమీపించుటకు ఒక పద్ధతి యున్నది. నీవు ఆ మార్గములోనే సమీపించాలి.

నీవు దేవుని సమీపించుటకు కూడా ఒక మార్గమున్నది. ఒకవేళ నీవు దేవుని వరమును సమీపించినట్లయితే, నీవు సరియైన మార్గములో సమీపించాలి. లేనట్లయితే నీవు సమీపించినప్పుడు నీకేమియు దొరకదు. యేసు వచ్చినప్పుడు మార్త ఆ రీతిగానే చేసినది. ఆమె సరియైన మార్గంలో సమీపించినది. ఈ ఘానేమీయురాలు సరియైన మార్గములో సమీపించినది. భారమైన హృదయముతో దేవుని కొరకు ఆశ కలిగి సమీపించినది. ఆమె దానిని పట్టుకొనియున్నది.

మరియు ఎలీషా చెప్పాడు, “మంచిది, నేను నా నడుము కట్టుకొందును,” మరియు అతడు ఆమెతో కలిసి బయలుదేరాడు. అతడు అక్కడికి చేరినప్పుడు తిరుగు ప్రయాణంలో ఉన్న గేహజిని కలుసుకొన్నాడు.

అతడు, “ఆ బాలుడి మీద ఆ దండమును పెట్టాను, అయిననూ ఆ బాలుడిలో జీవము రాలేదు” అని చెప్పాడు.

నిజమునకు ఆ స్త్రీ దానిని విశ్వసించలేదు. ఒకవేళ ఆమె దానిని విశ్వసించినట్లయితే, అది సంభవించి యుండేది, కాని ఆమె ప్రవక్తను కోరినది. ఆమెకు ఆ దండమును గూర్చి తెలియదు. ఎలీషా దానిమీద విశ్వాసముంచాడు, కాని ఆ స్త్రీ ప్రవక్త మీద విశ్వాసముంచినది.

51

కాబట్టి ఎలీషా ఆ గది దగ్గరకు వచ్చినప్పుడు. మీరు దానిని గమనించాలి అని కోరుచున్నాను. ప్రార్థన చేయలేదు. ఎలీషా అక్కడికి వెళ్ళాడు. మీరు పరిస్థితి గూర్చి మాట్లాడుచున్నాము! ఆ ఇంటి ఆవరణములో ప్రజలున్నారు, అందరూ కన్నీరు కారుస్తూ బిగ్గరగా ఏడుస్తున్నారు. తండ్రి పూర్తిగా నిరాశలో ఉన్నాడు. అందరూ ఏడ్చుచున్నారు. ఆ చిన్న బాలుడు ప్రవక్త మంచము మీద పడుకొనియున్నాడు. మధ్యాహ్నం అతడు మరణించాడు, మరియు ఎలీషా గదిలో ప్రవేశించి, ఆ గదిలో అటూ ఇటూ తిరిగాడు అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. అతడు ఏమి చేస్తున్నాడు? అభిషేకము కొరకు ఎదురుచూస్తున్నాడు. ఆమేన్. ముందుకు, వెనక్కి నడుస్తున్నాడు. ఓ, మై! అభిషేకము కొరకు ఎదురుచూస్తున్నాడు. కొంచెంసేపటి తర్వాత, పరిశుద్దాత్మ అభిషేకము అతడి మీదకు వచ్చినది. అతడు ఆ బాలుడి మీద పరుండినాడు, తన పెదవులను ఆ బాలుడి పెదవుల మీద పెట్టాడు, తన ముక్కు అతడి ముక్కు మీద, తన నొసలు బాలుడు నొసటి మీద పెట్టి పరుండినాడు. ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. అతడు దిగి మరలా నడిచెను. ఓ, మై! నేను దానిని ఇష్టపడుచున్నాను. మరలా అతని మీదకు అభిషేకము వచ్చువరకు అటూ ఇటూ నడిచాడు. మరలా అతడి మీదకు అభిషేకము వచ్చినప్పుడు, అతడు ఆ బాలుడి మీద మరలా పడుకొన్నాడు, అతడి పెదవులు ఆ బాలుడి పెదవుల మీద, అతడి ముక్కు ఆ బాలుడి ముక్కు మీద పెట్టాడు. మొదటిగా ఏమి జరిగినదో మీకు తెలుసా, ఆ బిడ్డ ఏడుమారులు తుమ్మాడు. అతడికి ప్రాణం మరలా వచ్చినది. ఆమేన్.

52

ఓ, ఆ చిన్న బర్తిమయి ఆ కథను ఎంతగానో ఇష్టపడ్డాడు. నేను కూడా దానిని ఎంతగానో పేమించుదును. ఓ, అతడు ఈ విధంగా ఆలోచించాడు, “మీకు తెలుసా? ఆ గొప్ప ప్రవక్తయైన ఏలియా ఎత్తబడిన అతని ఆత్మ రెండు పాళ్ళు ఎలీషా పైకి వచ్చెను. ఏలియా గొప్ప ప్రవక్త.” మరియు ఆ సమయమునకు, అతడు ఈ విధంగా తలంచాడు, “చాలా సంవత్సరముల క్రితము, నేను ప్రక్కన కూర్చొన్న ఈ మార్గము మీదనే గొప్ప ప్రవక్తలైన ఏలియా మరియూ ఎలీషాలు చేయి చేయీ కలిపి నడుస్తూ వెళ్ళారు, వారు యోర్దాను నది దగ్గరకు నడచివెళ్ళారు. వారు దానిని రెండు పాయలు చేసారు.” ఆమెన్. చలిగాలి వీచినది, అతడు ఆ పాత కోటును మరింత పైకి లాగాడు. మీకు తెలుసా, బహుశా సూర్యుడు మరియొక వైపుగా అస్తమిస్తున్నాడు. అతడు ఆలోచిస్తున్నాడు.

“కొన్ని వందల సంవత్సరముల క్రితము, ఏలియా మరియు ఎలీషాలు చేతులు కలుపుకొన్న ఈ గుండ్రని రాళ్ళ ప్రక్కనున్న బాటలో నడచివెళ్ళారు. ఏలియా ఆ దుప్పటి తీసి యోర్దానును కొట్టాడు. యోర్దాను రెండుగా చీలినది. ఏలిషా ఆ దుప్పటి తీసికొని దానిని కొట్టినప్పుడు, అది రెండుగా చీలినది, అప్పుడతడు తిరిగి వచ్చాడు.”

53

ఓ, ఈ సమయములో బర్తిమయి బిగ్గరగా తనలో తాను మాట్లాడుటను నేను వినుచున్నాను. “ఓ, ఒకవేళ నేను ఆ సమయంలో అక్కడ కూర్చొనియుంటే, ఒకవేళ ఆ సమయంలో నేను అక్కడ కూర్చొనియుంటే, నేను వీధులలో పరుగెత్తుచూ, 'ఓ, గొప్ప దేవుని ప్రవక్తలారా, నా కొరకు ప్రార్ధించండి. దేవుడు నాకు చూపును ఇవ్వాలని ప్రార్ధించండి,' అని కేకలు వేసేవాడిని. వారు నా మీద చేతులుంచేవారు, నేను మరలా చూస్తాననే నా కల నిజం అయ్యేది. నా కనుదృష్టి మరలా ఇవ్వబడేది. కాని, అయ్యో, దేవాలయములోని మా యాజకులు అద్భుతములు జరిగే దినములు గతించిపోయాయి అని చెప్పారు.”

54

ఓ, అద్భుతములు జరిగే దినములు ఎప్పుడు గతించిపోతాయో? ఏ దినమున అయితే అద్భుతములు గతించిపోతాయో, ఆ దినమున దేవుడు గతించిపోతాడు, ఎందుకనగా దేవుడు అద్భుతములు జరిగించువాడు. ఖచ్చితముగా, అద్భుతములు జరుగు దినములు ఎన్నడూ గతించవు, ఎన్నడూ గతించలేవు. కాని వారు అద్భుతములు జరుగు దినములు గతించిపోయాయి అని చెప్పుచున్నారు.

అదే సమయములో, వీధిలో చిన్న అలికిడి అతడు విన్నాడు. అతడు విన్నాడు. “బహుశా, అది చిన్న కంచర గాడిద కావచ్చును. దానికి ముందుగా ఎవరో పాదరక్షలతో నడుస్తున్నారు. ”బహుశా ఒక ధనవంతుడు కావచ్చును, ఏలయనగా అతడు కంచరగాడిద మీద వస్తున్నాడు.“

55

కాబట్టి అతడు తాను కూర్చొనియున్న బండ మీద నుండి లేచాడు. అతడు అడిగాడు, “అయ్యా, నాకు సహాయం చెయ్యండి. నా పేరు బర్తిమయి. నేను గ్రుడ్డివాడిని. నాకు ఇంటి దగ్గర ఒక చిన్న కుమార్తె మరియు భార్య ఉన్నారు. అయ్యా, దయచేసి నాకు సహాయం చేయండి. ఈ ఉదయం నేను చాలా ఆలస్యంగా వచ్చాను.”

మరియు దాసుడు ఆగి, “యజమానుడా,” అని అన్నాడు.

మరియు ఆ వ్యక్తి ఈ విధంగా చెప్పడం జరిగినది, “ఓ, భిక్షగాడా, నా మార్గం నుండి తొలగిపొమ్ము, నేను యాజకుడను. నేను అక్కడున్న సేవకుల సమావేశమునకు వెళ్ళుచున్నాను. ఈ దేశములోనికి మాతమూఢుడైన ప్రవక్త వచ్చి, నేను దర్శనములు చూస్తున్నాను. మరియు రోగులను స్వస్థపరుస్తానని చెప్పుకొనుచున్నాడు. అతడు గలలియ నుండి వచ్చిన ప్రవక్త. అలాంటి బుద్ధిహీనత యెరికో చుట్టుప్రక్కల వ్యాపించకుండా అడ్డుకొనుటకు ఆ సేవకుల సమావేశమునకు వెళ్ళుచున్నాను. నా దారికి అడ్డు తొలగుము. నేను ప్రయాణములో ఉన్నాను. నేను దైవజనుడను! [అతని వైఖరి చూడండి] నా మార్గంలో అడ్డు తొలుగు.”

బర్తిమయి వెనక్కి తిరిగి వచ్చి తన రాతి మీద కూర్చొన్నాడు. సూర్యాస్తమయ సమయం, కొంచెం చీకటి కమ్ముచున్నది. అతడు రాయి మీద కూర్చొని తన వస్త్రమును చుట్టూ కప్పుకొనుచున్నాడు.

56

“ఓ, నా బాల్యదినముల గూర్చి ఆలోచించుట ఎంత అందముగా ఉన్నది. అప్పుడు అమ్మా.... ఓ, అవును. అది నాకు జ్ఞాపకము వస్తుంది. గొప్ప యెహోవా దేవుడు తన ప్రజలను వాగ్దాన దేశములోనికి ఎలా నడిపించాడో చెప్పినది. ఆకాశము నుండి వారికి ఆహారమును కురిపించి వారిని ఎలా పోషించాడో, ఆ గొప్ప కార్యములను గూర్చి చెప్పినది. గొప్ప గాలితో పూరేళ్ళను ఎలా రప్పించాడో, ఆయన బండ నుండి నీటిని రప్పించాడు. ఓ, ఆ గొప్ప యెహోవాకు ఏమి జరిగినది?

“కానీ అద్భుతములు జరుగు దినములు గతించిపోయాయి, అని యాజకులు చెప్పుచున్నారు. కాబట్టి, దానిని గూర్చి నేను ఏమీ చేయలేను. ఓ, ఒకవేళ నేను ఆ దినములలో జీవించియున్నట్లయితే, యెహోవా నిజముగా సజీవుడిగా యున్న దినమున నేను జీవించియున్నట్లయితే, ఆయన భూమి మీద తన ప్రజలతో జీవించిన కాలములో నేను ఉన్నట్లయితే, కాని అవన్నియూ గతించిపోయాయి అని వారు చెప్పుచున్నారు. దానిని గూర్చి నేను చేయగలిగినది ఏమియూ లేదు.”

అతడు అక్కడ కూర్చొనియున్నప్పుడు, దానిని గూర్చి ఆలోచిస్తున్నాడు. “అవును, గొప్ప వీరుడైన యెహోషువ నాకు జ్ఞాపకం వస్తున్నాడు. నా తల్లి గారు, ఈ విధంగా చెప్పేది. ”హనీ, ఆ పట్టణము ప్రాకారము దగ్గర, మోషే స్థానములో వచ్చిన యెహోషువ అక్కడ నిలువబడియున్నాడు.“ ఇప్పుడు పరిశుద్దాత్మకు సాదృశ్యము. చూడండి, మోషే ఆ పిల్లలను వాగ్దాన దేశములోనికి నడిపించలేదు. అతని ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వబడినది, కాని అతడు వారిని వాగ్దాన దేశములోనికి ప్రవేశపెట్టలేదు. యెహోషువా వారిని లోపలికి ప్రవేశపెట్టాడు, చూశారా. ఇప్పుడు వారిని ఆవలికి తీసుకువెళ్ళేది పరిశుద్దాత్మ. క్రీస్తు మార్గమును సిద్ధపరచెను, ప్రణాళికను, ధర్మశాస్త్రమును అనుగ్రహించెను; కాని పరిశుద్దాత్మ సంఘమును వాగ్దాన దేశములోనికి, ఎత్తబడుటలోనికి తీసుకొని వెళ్ళును. పరిశుద్దాత్మ ద్వారా ఎత్తబడును.

57

మోషే ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేయుట చూసిన యెహోషువ ఆ నది ఒడ్డున నిలువబడియున్నాడు. అతడు అక్కడ నిలువబడియున్నాడు, అది ఏప్రిల్ నెల అని అతడి తల్లి చెప్పినది. యూదయలోను కొండల మీద నున్న మంచు అంతా కరిగిపోవుట వలన యోర్దాను నిండుగా ప్రవహిస్తుంది. కాని గొప్ప యోధుడైన యెహోషువ అవతల ఒడ్డున నిలువబడియున్నాడు, అతడు దేవుని చూశాడు. ప్రజలు ఆ నదిని దాటుటకు తమ్మును తాము పరిశుద్ధపరచుకొని సిద్ధంగా ఉండాలని దేవుడు అతడికి చెప్పాడు, ఎందుకనగా ఆయన యోర్దాను పాయలు చేయబోవుచున్నాడు. ఆ గొప్ప యోధుడైన యెహోషువా, ముందుగా దేవుడిని పెట్టాడు. ముందుగా యాజకులను, నిబంధన మందసమును పెట్టాడు.

అది నిజమైన పాఠము. దానిని గూర్చి కొంచెంసేపు ధ్యానించాలని నేను కోరుచున్నాను. నీవు దేనినైనా చూడాలనుకుంటే ముందు దేవుడిని పెట్టుము. ఒకవేళ వైద్యుడు తాను చేయగలిగినదంతా తాను చేశాను అని చెప్పినట్లయితే, అతడు నిజాయితీగా చెప్పాడు. ఒకవేళ అతడు చేయగలిగినదంతా అయిపోయినట్లయితే, ఇప్పుడు దేవునిని పెట్టుము. అక్కడ దేవుని పెట్టుము. నిన్ను స్వస్థపరచువానిగా దేవునిని పెట్టి అప్పుడు ఏమి జరుగుతుందో చూడుము. వైద్యుడు పరిమితులు కలవాడు. దేవుని శక్తికి పరిమితి లేదు. వైద్యుడు ఏదైనా చేయగలడు. అతడు తాను చూచిన దానిని బట్టి, తన అనుభూతిని బట్టి ఆ రెండు జ్ఞానేంద్రియాల మీద ఆధారపడి పనిచేస్తాడు. దేవుడు సమస్తము చేయగలడు. ఆయన అనంతమైన శక్తి కలిగినవాడు. ఆయన మాట పలుకగానే, అది జరుగుతుంది. మొదట ఆయనను పెట్టుము.

58

తర్వాత వారు యోర్దాను దగ్గరికి వెళ్ళారు. అది రెండుగా చీలినది. అతడు తలంచాడు, “నీకు తెలుసా, నేను ఇప్పుడు కూర్చొనియున్న రాయి, దేవుని శక్తి ఆ ప్రాకారమును కదలించివేసినప్పుడు, ఆ ప్రాకారము బ్రద్దలైనది. ఇప్పుడు నేను కూర్చొన్న రాయి దేవుని శక్తికి గోడనుండి క్రింద పడినది. ప్రజలు కేకలు వేయుచూ దేవునిని స్తుతించినప్పుడు, యెరికో గోడలు కూలిపోయాయి.” [కొద్ది కేకలు కొన్నిసార్లు సహాయం చేస్తాయని నేను విశ్వాసించుచున్నాను ఖచ్చితంగా.] ఆ బూరలు ఊదినప్పుడు ప్రజలు కేకలు వేశారు. ప్రాకారపు గోడలు కూలిపోయాయి. మరియు దానిని గూర్చి ఆలోచించినప్పుడు...

నీవు కూడా చెప్తావా, “మంచిది, నేను కూడా అక్కడికి వెళ్ళి, ఆ రాళ్ళలో ఒకదాని మీద కూర్చోవాలని ఆశిస్తున్నాను.” నీవు కూర్చొనియున్న అదే కుర్చీ, దేవుని వాక్యము నెరవేర్చబడుటయై యున్నది. నీవు నడచుచున్న ఈ భూమి దేవుని వాక్యము నెరవేర్చబడుటయైయున్నది. ఈ భూమి మీద ధూళి దేవుని వాక్యము. ఆమేన్. ఓ, మై. ఈ భవనము దేవుని వాక్యము. ఈ బల్ల దేవుని వాక్యము. దేవుడు దీనిని సృష్టించాడు. ఆయన తన స్వంత వాక్యముతో దానిని సృష్టించాడు. దానిని తయారు చేయుటకు మూలపదార్థం ఏమియూ లేదు. “కలుగును గాక” అని ఆయన పలికినప్పుడు, ఆయన తన వాక్యమునందు ఆయన విశ్వాసముంచాడు. ఆ ప్రపంచము ఉనికిలోనికి వచ్చినది. ఓ, మై. ఏ దశలోనైనా దానిమీద నా ఆత్మ ఆనుకొని, అది సత్యము అని ఒప్పుకొంటాను. అవునయ్యా, ఆయన “కలుగును గాక,” అని పలుకగానే, అది కలిగినది, ఏలయనగా ఆయన దేవుడు. ఆయన తన స్వంత వాక్యమును నెరవేర్చాడు. ఆయన ఇంకనూ తన స్వంత వాక్యమును నెరవేర్చును. ఆయన ఎల్లప్పుడూ ఆ విధంగా చేశాడు, మరియు ఎల్లప్పుడూ చేస్తాడు. ఆయన తన వాక్యముతో నిలువబడును. దేవుడు ఏది వాగ్దానము చేశాడో, దానిని ఆయన నెరవేర్చును.

59

అబ్రహాము పరదేశములో యాత్రికుడిగా సంచరిస్తూ, మరింత వృద్దుడయ్యాడు. డెబ్బై-ఐదు సంవత్సరముల వయస్సులో దేవుడు అతడిని పిలిచాడు. ఆ వయస్సు కలిగిన వృద్దుడు మరియు వృద్ధురాలు వైద్యుడి దగ్గరికి వెళ్ళి, “వైద్యుడా, మేము కుమారుని కనబోవుచున్నాము, ఆసుపత్రిలో మాకు ఏర్పాట్లు చేయండి,” అని చెప్పుటను ఊహించగలమా?

“పాపం వృద్దులు, వీళ్ళకు మతిపోయింది” అని చెప్పవచ్చును.

ప్రతి ఒక్క నిజమైన విశ్వాసి గూర్చి లోకము అదే రీతిగా తలస్తుంది. “అవును, వారిలో ఏదో తప్పున్నది అని తలస్తుంది.” అవును, ఏదో తప్పు జరిగినది, నీవు మరణము నుండి జీవములోనికి దాటియున్నావు. నీవు లోకకార్యముల నుండి దాటిపోయి, దేవుని కార్యములను విశ్వసించుచున్నావు. క్రైస్తవుడు కంటికి కనిపించే దానిని చూడడు. అతడు అదృశ్యమైన దానిని చూచును. అతడు కనబడని దానిని చూచును. నీవెంతమాత్రము ఇక నీ కన్నులతో చూడవు, నీవు హృదయముతో చూస్తావు. అది నిజము. నీవు కళ్ళతో చూస్తావు, నీ హృదయంతో గ్రహిస్తావు. అది నిజము. మీరు గ్రహించారా. చూచుట అనగా గ్రహించుట. నీవు దానిని సరైన కార్యాలను చూచి, “దానిని నేను చూచుట లేదు” అని చెప్పినట్లయితే. నీవు దానిని గ్రహించలేదు అని అర్ధము. దాని యొక్క నిజమైన భావము అదియే.

60

అబ్రహాము బయటకు వెళ్ళి, చెప్పాడు, “శారా, మనము కుమారుని కనబోవుచున్నాము. ఇప్పుడు మనము బయటకు వెళ్ళి, చిన్న సీసాలు, పిన్నులు, చిన్నపిలలకు కావలసిన వస్తువులు కొందాము.” మొదటి నెల గతించినది.

“అబ్రహాము, ఏ తేడా లేదు.” చూశారా, అప్పటికే ఆమె స్త్రీ ధర్మము నిలిచిపోయినది. ఆమె చెప్పినది, “ఏ తేడా లేదు.” రెండవ నెల గతించిపోయినది. “ఏమి తేడా లేదు, అబ్రహామా, ఎప్పుడూ ఉన్నట్లే ఉన్నది.”

“హల్లెలుయ! ఏ విధంగా అయినా మనము బిడ్డను కనబోవుచున్నాము.”

“నీకు ఎలా తెలుసు?”

దేవుడు ఆ విధంగా చెప్పాడు, అది స్థిరపరచబడింది.“ ఒక సంవత్సరం గతించినది. ”శారా, ఏదైనా మార్పున్నదా?“

“లేదు, ఏ మార్పు లేదు.”

“దేవునికి మహిమ! గత సంవత్సరములో జరిగియున్న దానికంటే ఈ సంవత్సరము జరిగితేనే అది గొప్ప అద్భుతం అవుతుంది. ఇంకొక సంవత్సరం వృద్దులైరి. నాకు డెబ్బై-ఆరు సంవత్సరములు, నీకు అరవై-ఆరు సంవత్సరములు. హల్లెలూయ! ఒక సంవత్సరము ముందుకంటే ఇప్పుడు జరిగితేనే అది గొప్ప అద్భుతము అవుతుంది.”

“ఇంకా ఏ తేడా లేదా?”

“ఏ తేడా లేదు.”

పది సంవత్సరములు గతించిపోయాయి, “ఇంకా తేడా లేదు.”

“దేవునికి స్తోత్రం, ఏదేమైనా మనము పొందుకొంటాము.”

61

మనము అబ్రహాము యొక్క కుమార్తెలు మరియు కుమారులుగా ఉండవలసియున్నది. మనము అబ్రహాము సంతానము. ఒకవేళ మనము ప్రార్ధన చేసిన రెండు నిమిషములలో జరుగకపోయినట్లయితే, “ఓ, దానిని నేను పొందలేదు,” అని చెప్తాము. అబ్రహాము కుమారుడు మరియు కుమార్తెగా అది నీవు చెప్పు కుంటిసాకులు. అబ్రహాము... అతడు బలహీనుడగుటకు బదులుగా, అతడు మరింగా బలము పొందాడని బైబిల్ చెప్పుచున్నది. విశ్వాసములో మరింత బలము పొందాడు. అతడికి వంద సంవత్సరములు వచ్చినప్పుడు, అతడు ఇంకనూ దేవుని స్తుతించాడు. అతడు దానిని పొందుకొనబోవుచున్నాడు, మరియు అతడు పొందాడు. వారు ఆ బిడ్డను పొందారు, ఏలయనగా అది దేవుని వాగ్దానము. దేవునిని ఆయన వాక్యమును బట్టి విశ్వసించాలి. దేవుడు చెప్పినది ఏదైనా సరే, ఎంత కాలమైనా సరే, అది నెరవేరుతుంది. దేవుడు ఆ విధంగా చెప్పాడు మరియు నీవు దానిని పట్టుకొనియుండుము. అంతే. కేవలము దానితో నిలిచియుండుము; అది నెరవేరుతుంది.

62

బర్తిమయి అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాడు. “ఓ, ఈ రాయి ఆ ప్రాకారములో ఉన్నప్పుడు, ప్రజలు కేకలు వేయుట వలన దేవుని శక్తితో అది క్రింద పడినట్లయితే, అది ఎంత అద్భుతమైన కార్యము. అది గొప్ప అద్భుత కార్యము. ఒకవేళ యెహోషువ, యోర్దానును దాటిన కాలములో నేను జీవించియుంటే, నేను యెహోషువ దగ్గరికి పరుగెత్తి వెళ్ళి యెహోషువా, గొప్ప దేవుని యోధుడా, నీవు దైవజనుడవని నేను ఎరుగుదును. దేవుడు నిన్ను పిలిచాడు. నీవు గొప్ప వ్యక్తివి. యెహోషువా, నా కన్నుల నిమిత్తము ప్రార్ధించుము. నీవు నా కన్నుల కొరకు ప్రార్ధించినట్లయితే, నేను మరలా చూస్తానని నాకు తెలుసు.

అయ్యో, “కాని అద్భుతములు జరుగు దినములు గతించిపోయాయి,” అని సంఘము చెప్పినది. “ఇక అవి జరుగవు. దేవుడు ఇక ఎన్నడూ స్వస్థపరచడు. ఆయన ఇక అద్భుతములు చేయడు. ఆయన కేవలము దేవుడు. మనము చక్కటి విద్యను అభ్యసించి, ప్రజలతో ఎలా మాట్లాడాలో తెలిసికొని, ”ఆమెన్“, అని అందముగా చెప్పుచూ, మంచి సేవకులుగా ఉంటే చాలని దేవుడు కోరుచున్నాడు. చక్కటి మానవ జ్ఞానం కలిగియుండాలి.”

ఈ దినమున కూడా అదే విధముగా యున్నది. అది కొంచెం కూడా మారలేదు. మీకు తెలుసు, దయ్యము తన మనుష్యులను తీసికొనును, కాని అతడి ఆత్మను ఎన్నడూ తీసికొనలేడు. మరియు దేవుడు తన మనుష్యులను తీసికొనును, కాని తన ఆత్మను ఎన్నడూ తీసికొనడు. కాబట్టి ఇంకనూ మనుష్యులలో అదే రీతిగా యుద్ధము జరుగుచున్నది. ఏశావు, యాకోబు వలె చాలా భక్తిపరుడు, అయినప్పటికీ సహజాతీతమైన కార్యములను విశ్వసించుట లేదు. కాని సహజాతీతమైనది వచ్చినప్పుడు, అది కార్యములను మార్చివేస్తుంది. దేవుడు తానే ప్రజల మధ్యకు దిగి వచ్చి, ఆయన తాను దేవుడనైయున్నానని ఋజువు చేయును. ఆయన యెహోవా అని ఋజువు చేయును.

63

ఇవతలి వైపునకు వచ్చి తర్వాత ఒక రోజు యెహోషువ ఆ ప్రాకారము చుట్టూ తిరుగుచూ, ఆ గోడలు ఎత్తు, మందమును, అవి ఎంత గొప్పవో గమనిస్తున్నాడు. అతడు ఒక మనుష్యుడిని చూశాడు. ఆ మనుష్యుడు దూసిన ఖడ్గముతో నిలువబడి యెహోషువను చూస్తున్నాడు. యెహోషువ తన కత్తి దూసి, ఆ వ్యక్తి వైపు నడుస్తున్నాడు. యెహోషువ అతడిని, “నీవు మా పక్షమా? లేక శత్రువు పక్షమా?” అని ప్రశ్నించాడు.

ఖడ్గము దూసి నిలబడిన వ్యక్తి, “లేదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నాను” అని చెప్పెను. ఆ గొప్ప యెహోషువా తన ఖడ్గమును క్రింద పడవేశాడు. తన శిరస్రాణమును తీసివేశాడు, తన కవచమును క్రింద పెట్టి, ఆ మనుష్యుని పాదముల దగ్గర సాష్టంగపడ్డాడు. యెహోవా సైన్యములకు అధిపతి. ఓ, మై. “నేను యెహోవా సేనాధిపతిని.”

64

గ్రుడ్డి బర్తిమయి, ఖచ్చితంగా ఈ విధంగా చెప్పియుండవచ్చును. “ఓ, ఆలోచించుము! ఇప్పుడు నేను కూర్చొనియున్న స్థలమునకు వంద గజములు దూరములోనే అతడు నిలబడ్డాడు. నేను ఆ కాలములో జీవించియున్నట్లయితే, నేను సైన్యముల అధిపతి దగ్గరికి పరుగెత్తి వెళ్ళి, 'ఓ, యెహోవా సైన్యములకు అధిపతీ, నా చూపు పునరుద్ధరించుము, నేను నా కుటుంబ పోషణ కొరకు కష్టించి పనిచేస్తాను.' మరియు సైన్యములకు అధిపతి, నా చూపును పునరుద్ధరించేవాడు. కాని, అయ్యో, వారు అద్భుతములు జరుగు దినములు గతించిపోయాయి అని చెప్పుచున్నారు.”

అతడికి కొంచెం కూడా తెలియదు — అతడిని కొంచెం కూడా తెలియదు! — వంద గజముల కంటే తక్కువ దూరములో, ప్రభువు నామములో ఆ అధిపతి మరలా నిలబడియున్నాడు. ఆయన ఆ మార్గములో ప్రయాణిస్తున్నాడు. ఇప్పుడు, నేను దానిని గూర్చి ఆలోచిస్తున్నాను. మంచముల మీద కుర్చీలలో ఉన్న ఈ ప్రజలు, గుండె జబ్బులతో ఉన్నవారు మరియు నీ అనారోగ్యం ఏదయినా సరే, ఒకవేళ అది క్యాన్సరు అయినా సరే, అదే సైన్యములకు అధిపతి ఈ రాత్రి పరిశుద్దాత్మ రూపములో ఇక్కడ ఉన్నాడు. ఒకవేళ నీవు కన్నులు తెరచి చూచినట్లయితే, నీ గ్రహింప తెరువబడినట్లయితే, ఆయన మనమధ్యనున్నాడని మీరు గ్రహించగలరు.

65

గమనించండి, మొదటిగా ఏమి జరిగినదో మీకు తెలుసా, అతడు ఒక గందరగోళమును విన్నాడు. మీకు తెలుసా, అక్కడ ఒక వింత ఉన్నది, ఎక్కడ యేసును మీరు చూస్తారో, మీకు అక్కడ ఎల్లప్పుడూ గొప్ప శబ్దమును మీరు వింటారు. అది అలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు, మరియు అది ఎన్నడూ మారలేదు. ఇప్పటికీ ఆయన ఉన్న చోటును మీరు గొప్ప శబ్దము వింటారు. ఒక్కసారి వారిని మౌనముగా ఉంచుటకు వారు ప్రయత్నించారు. ఆయన చెప్పాడు, “ఒకవేళ వారు నెమ్మదిగా ఉన్నట్లయితే, ఆ రాళ్ళు కేకలు వేస్తాయి.” ఆ కేకల గూర్చి ఏదో యున్నది. అతడు ఆ చప్పుడు సమీపించుట విన్నాడు. వారిలో కొందరు “హోసన్నా! హోసన్నా! ప్రభువు నామములో వచ్చువానికి స్తోత్రములు,” అని పాటలు పాడుచున్నారు. మిగిలిన వారు ఎగతాళి చేయుచున్నారు, హేళన చేస్తున్నారు. ఆ గవిని ద్వారా వారు వచ్చుచున్నారు.

అక్కడికి ముప్పై సంవత్సరములలో ఉన్న యువకుడు వస్తున్నాడు, యెరూషలేము వైపునకు ఆయన నడుస్తున్నాడు, ఈ లోకము యొక్క పాపభారములు ఆయన మీద మోపబడినది. అతడు యెహోవా సైన్యములకు అధిపతి. అతడే యెహోషువతో ఉన్నవాడు, అరణ్యములో మోషేతో ఉన్నవాడు. అతడే ఏలియాతో ఉండి, ఆ చనిపోయిన బాలుడిని బ్రతికించాడు. అదే సైన్యాధిపతి యెహోషువతో ఉన్నాడు. అదే సైన్యాధిపతి, ఈ రాత్రి ఇక్కడున్నాడు. ఆయన ఎల్లప్పుడూ మార్పులేని యెహోవా దేవుడు. ఆయన మారనివాడు. అతడు యెహోవా సైన్యముల అధిపతి.

66

ఆయన ఇక్కడ నడుస్తున్నాడు. “హే, నీవు ఒక అద్భుతము మాకు చూపించుము, మా ఎదుట ఒక అద్భుతము జరిగించి చూపుము. మేము దానిని చూడాలి. నీవు అద్భుతములు చేస్తావని విన్నాము” అని ప్రజలు అరుచుటను నేను వినగలగుచున్నాను. ప్రజలు ఆ విధంగా చెప్పుట వినినప్పుడు, వారి ఎలాటి ఆత్మ కలిగియున్నారో మీరు ఎరుగుదురు: అది దయ్యము ఆత్మ. యేసును చూడండి, సాతానుడు ఆయనను అరణ్యములోనికి తీసుకొని వెళ్ళి, “నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుము. నీకు ఆకలిగా ఉన్నది మరియు నీకు తినుటకు ఏదైనా కావాలి. కాబట్టి నీవు దేవుని కుమారునివైతే, ఈ రాళ్ళను రొట్టెలుగా చేయుము. నీవు ఒకవేళ నీవు ఆ విధంగా చేసినట్లయితే, నిన్ను నేను విశ్వసిస్తాను” అని చెప్పాడు.

సాతానుడి మాటలను యేసు లక్ష్యపెట్టలేదు. ఏ దైవజనుడు కూడా సాతానుడి మాటలు లక్ష్యపెట్టడు. యేసు చెప్పాడు, “మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, అని వ్రాయబడియున్నది.”

67

వారు ఆయనను రోమా న్యాయస్థానములోనికి తీసికొని వచ్చినప్పుడు, వారు ఆయన ముఖము మీద వస్త్రము వేసి, వారు ఒక కర్రను తీసికొని ఆయన తల మీద కొట్టారు. “నీవు ప్రవక్తవని, ప్రజలు చేసిన కార్యములను నీవు చెప్పగలవు అని వారు చెప్పుచున్నారు. ఇప్పుడు నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము, అప్పుడు మేము నమ్ముతాము” అని హేళన చేశారు. ఆయన దానిని చేయగలడు. అలా అయితే ఆయన సాతానుడిని లక్ష్యపెట్టినట్లు, ఆయన అలా చేయడు. ఆయన అక్కడ నోరు తెరువలేదు. వారు ఆయన ముఖము మీద వస్త్రము చుట్టి, “నీవు ప్రవక్తవైతే, నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము, అప్పుడు మేము నిన్ను నమ్ముతాము,” అని చెప్పారు.

ఈ రోజు కూడా ప్రజలలో అదే దయ్యము నివసించుచుండెను. వారు ఈ విధంగా అడుగుచున్నారు. “ఒకవేళ దేవుడు ఉన్నట్లయితే, ఆయన స్వస్థపరచువాడైతే. ఒకవేళ ఈ వ్యక్తికి దైవిక స్వస్థతా వరము ఉన్నట్లయితే, వెళ్ళి అక్కడున్న వ్యక్తిని స్వస్థపరచండి; దానిని మాకు చూపించండి, అప్పుడు నేను విశ్వసించుదును. దానిని నాకు చూపించుము.” సంఘములు అలాటి ప్రచారం చేస్తున్న సంగతి మీరు ఎరుగుదురు. గుర్తుంచుకొనండి, అది అదే ఆత్మ.

68

ఆ యాజకులు చెప్పారు, “నీవు నిజముగా దేవుని కుమారుడవైతే, సిలువ మీద నుండి దిగి రమ్ము, నీ చేతులను విడిపించుకొని క్రిందకు రమ్ము, అప్పుడు నిన్ను విశ్వసిస్తాము.”

ఆయన తాను కోరుకొన్నట్లయితే, ఆ విధంగా చేయగలడు. వారు ఆయనను అన్నింటికంటే ఘనపరిచారని మీకు తెలుసు. అతడు ఇతరులను రక్షించాడు, ఇప్పుడు తన్నుతాను రక్షించుకోలేకపోయాడు అని ప్రధాన యాజకుడైన కయప చెప్పాడు. అది ఘనత. ఒకవేళ ఆయన ఇతరులను రక్షించి, ఒకవేళ ఆయన తన్నుతాను రక్షించుకున్నట్లయితే, ఆయన ఇతరులను రక్షించలేడు. కాబట్టి ఇతరులను రక్షించుటకు ఆయన తన్నుతాను అప్పగించుకొన్నాడు, చూచారా. మనలను రక్షించుటకు, ఆయన తన్నుతాను అప్పగించుకొనెను. ఆయన తన్నుతాను రక్షించుకొనియుండేవాడు.

బిల్లీ సండే చెప్పినట్లుగా, కొద్ది కాలము క్రితము నేను అతడి పుస్తకములు చదివాను, అతడు ఈ విధంగా చెప్పాడు, “ప్రతి చెట్టు దేవదూతలు నిలువబడి, నీ చేతిని సిలువ మీద నుండి తీసి మాలో ఒకరివైపు చూపుము చాలు, మేము ఇక్కడి దృశ్యమునంతటినీ మార్చివేస్తాము, అని అరిచారు.” ఆయన ఆ విధంగా చేయగలడు. కాని ఒకవేళ ఆ విధంగా ఆయన చేసియుంటే, ఈ రోజున మనము ఎక్కడ ఉండేవారము? కాని ముఖము మీద ఉమ్మితో ఆయన అక్కడ వ్రేలాడినాడు. చేతులలో మేకులతో తలమీద ముళ్ళు, రక్తము కన్నీటితో మిళితం అయిపోయినది, ఆయన మనలను ప్రేమించాడు; ఆ విధంగా అక్రమకారులలో ఒకడిగా మరణించాడు, ఆ విధంగా ఆయన మరణించి, మనకు రక్షించబడే అవకాశమును, రోగుల కొరకు ప్రార్ధించే అవకాశమును ఇచ్చాడు. ఆయన మన కొరకు మరణించి మనకు అవకాశమును ఇచ్చారు. ఆయన మనకొరకు అది చేసెను.

69

ఇక్కడ యెహోవా సైన్యములకు అధిపతి వచ్చుచున్నాడు. అంతకు ముందు అతనితో యాజకుడు చెప్పిన మాటలు అతని చెవులలో విన్పించుచున్నాయి. “నా మార్గమునకు అడ్డు తొలగు. ఆ స్వస్థతా సభలు ఈ పట్టణములో జరుపుటకు వీలు లేదు. అతడు గలిలయ నుండి వచ్చిన ప్రవక్త, అతడు అక్రమ సంతానం, అతడు ఎన్నడూ మా వేదాంత కళాశాలలో చేరలేదు. అతడికి మా వేదాంత కళాశాలల గూర్చి ఏ మాత్రం తెలియదు. అతడు మా మతశాఖకు చెందినవాడు కాదు. అతడి గూర్చి మాకు తెలియదు. మేము దానిని ఆపివేస్తాము. దానితో మాకేమి సంబంధము లేదు. అది నాకు ఖచ్చితంగా తెలుసు.”

అదే యాజకుడు ఈ విధంగా చెప్పుటను మనము వినగలము, “నీవు లాజరను బ్రతికించావని మేము వినియున్నాము. అక్కడ మా సమాధుల తోట పూర్తిగా నిండిపోయినది, అక్కడికి వచ్చి వారందరినీ తిరిగి బ్రతికించుము. ఆ పర్వతము దగ్గరికి రమ్ము, అనేక వందల సంవత్సరములు నుంచి మేము అక్కడ పాతిపెట్టుచున్నాము. అక్కడకు వచ్చి, వారిలో ఒకరిని బ్రతికించుము, మేము నిన్ను విశ్వసిస్తాము.”

70

కాని మీకు అది ఏమిటో తెలుసా? ఆయన వాటిని ఏ మాత్రం లక్ష్యపెట్టలేదు. బలి అర్పణంగా అర్పించబడుటకు ఆయన యెరూషలేములోనికి ప్రయాణం అవుచున్నాడు. ఈ లోకభారమంతయూ ఆయన ప్రశస్తమైన ఆత్మ మీద మోపబడింది. సిలువ వేయబడుటకు ఆయన యెరూషలేమునకు వెళ్ళుచున్నాడు. ఎవరైతే ఆయనను ఎగతాళి చేయుచున్నారో, వారి నిమిత్తము ఆయన సిలువవేయబడుటకు వెళ్ళుచున్నారు. వారు ఆయన మీద గ్రుడ్లను మరియు కుళ్ళిన పండ్లను విసురుచూ - ఆయన్ని ఎగతాళి చేస్తున్నారు. వారు ఆయన్ని పట్టణం నుండి వెళ్ళగొట్టుచున్నారు, కాని ఆయన దానిని ఏ మాత్రము లక్ష్యపెట్టలేదు. ఆయన తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు.

బర్తిమయి కొంచెం గాభరాపడ్డాడు. “అది ఏమిటి? ఏమయ్యింది? ఈ శబ్దము ఏమిటి?” అని అడిగాడు.

వారిలో ఎవరో, “భిక్షగాడా వారికి అడ్డు తొలగు” అని అన్నారు.

మరొకరు ఏదో అన్నారు, మరియు చివరికి... బహుశా ఎవరో ప్రశస్తమైన స్త్రీ అని భావిస్తున్నాను. ఆ వృద్దుడిని రాతి మీద నుండి త్రోసివేశారు... అయ్యా ఏమైనా దెబ్బ తగిలినదా? అని ఆమె అడిగినది.

“లేదమ్మా, నాకేమి దెబ్బ తగలలేదు, కాని నాకు అర్థం కావడం లేదు — ఈ శబ్దం అంతా ఏమిటి?”

ఆమె చెప్పినది, “గలిలయలోని ప్రవక్త నజరేయుడైన యేసు, ఈ మార్గము వెళ్ళుచున్నాడు.”

“చాలా మంచిది అమ్మా.”

71

ఆమె ఖచ్చితముగా యేసుక్రీస్తు శిష్యురాలైయున్నది, ఎందుకనగా యేసును వెంబడించువారు ఎల్లప్పుడూ ఇతరుల విషయంలో దయ కలిగియుంటారు. ఎవరైనా ఇతరులకు సహాయం చేయుటకు ప్రయత్నిస్తారు. యేసును వెంబడించువారందరూ అదే విధంగా ప్రవర్తిస్తారు. ఎవరైనా ముసలివారు రోడ్డు దాటుటకు ఇబ్బంది పడుచున్నట్లయితే, యేసు శిష్యుడు అదే రీతిగా నిలబడడు గాని, వెళ్ళి వారికి సహాయం చేస్తారు. ఎవరైనా వృద్దులు కిరాణా సామాన్లు తీసికొని వెళ్ళుటకు ఇబ్బంది పడితే, యేసు శిష్యులు వాటిని ఇంటికి చేర్చుటకు సహాయం చేస్తారు. ఎవరైనా అవసరతలో ఉన్నవారు కన్పిస్తే, వారికి సహాయం చేస్తారు. యేసు శిష్యులు ఆ విధంగా చేస్తారు. వారు ఎల్లప్పుడూ దయ గలిగి, సున్నిత హృదయముతో ఇతరులయెడల జాలి కలిగియుంటారు.

72

అప్పుడు యేసును వెంబడించే ఆమె చెప్పినది, “ఎందుకయ్యా, ప్రవక్తలను గూర్చి నీకు తెలియదా?”

అతడు చెప్పాడు, “మంచిది, నేను ఇక్కడ కూర్చొని ప్రవక్తలు చేసిన కార్యముల గూర్చి తలంచుచున్నాను. నా తల్లి నాకు ప్రవక్తలను గూర్చి అనేక విషయాలు బోధించినది.”

“అయితే , మెస్సీయా రావలసియున్నదని నీకు తెలిసియుండాలి.”

“ఓ, అవును, అవును. మెస్సీయా వస్తాడని మనకు తెలుసు, ఏలయనగా దేవుడైన యెహోవా తనవంటి ఒక ప్రవక్తను లేపునని మోషే ప్రవచించాడు. ఆయన మాటను వినని ప్రతివాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఆయన ఒక గొప్ప ప్రవక్తగా వస్తాడు.” ఆమె చెప్పినది,

“మంచిది, అయ్యా, ఈయనే ఆ ప్రవక్త. ఎందుకనగా, ఆయన ప్రజలను చూచి, వారి తలంపులను, ఆలోచనలను ఆయన వివేచించును. వారి హృదయాంతరంగములోని విషయములను ఆయన వారికి చెప్పుచున్నాడు. వారు చేసిన కార్యములను, చేయబోయే కార్యములను ఆయన చెప్పుచున్నాడు. ప్రతిసారి అవి ఖచ్చితంగా సత్యమే.”

“ఓ, అంటే ఇప్పుడు వస్తున్నది ఆయనేనా?”

“అవును, ఆయనే ఇప్పుడు వెళ్ళుచున్నాడు.”

“మంచిది, ఈ ప్రజలు ఎందుకు కేకలు వేస్తూ, అరుస్తూ ఆయనను ఎగతాళి చేస్తున్నారు”?

“ఎందుకనగా వారు ఆయనను ఎరుగలేదు, కాని మేము ఆయనను ఎరుగుదుము, ఎందుకనగా మేము విశ్వాసులము. మేము ఆయనను ఎరుగుదుము. మేము అనుదినము ఆయనను వెంబడిస్తున్నాము. ఆయన చేసిన అద్భుతములను మేము చూశాము, మరియు ఈయనే మెస్సీయా అని మేము ఒప్పించబడ్డాము.

“ఎందుకు, కొద్దికాలం క్రిందట బావి దగ్గర ఆయన ఒక స్త్రీతో మాట్లాడుటను నేను చూశాను.” ఆయన చెప్పాడు, “వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రమ్ము.” ఆమె నాకు పెనిమిటి లేడని చెప్పినది. నీవు చెప్పినది సరియే, నీకు అయిదుగురున్నారు మరియు ఇప్పుడు నీతో జీవించుచున్నవాడు - నీ భర్త కాడు. ఆమె ఆయనతో, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఎందుకనగా మెస్సీయా వచ్చినప్పుడు, ఆయన ఈ కార్యముల గూర్చి చెప్పునని సమరయులమైన మేము ఎరిగియున్నాము. అప్పుడాయన, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పాడు. ఆమె పట్టణములోనికి పరుగెత్తి, వెళ్ళి, నేను చేసినవన్నియూ నాతో చెప్పిన వానిని వచ్చి చూడుడి, ఈయన మెస్సీయా కాడా? మరియు సమరయ పట్టణము అంతా మార్పు పొందినది.“

“నీ ఉద్దేశ్యము. మంచిది, ఒకవేళ ఆయన మెస్సీయా అయితే, ఆయన దావీదు కుమారుడు.”

“అవును, అది నిజము, ఆయన దావీదు కుమారుడు!”

అతడు గట్టిగా అరిచాడు, “దావీదు కుమారుడా, నన్ను కరుణించుము!”

73

ఇప్పుడు అతడి కల నెరవేరే సమయం వచ్చినది.

మంచము మీద పడియున్న సహోదరీ, బహుశా నీది కూడా నెరవేరే సమయం వచ్చినది. మరలా ఆరోగ్యం పొందాలనే నీ కల నెరవేరుతుంది. చక్రాల కుర్చీలోని నీవు, క్యాన్సర్ తినివేసిన నీవు, మరలా సంఘమునకు వెళ్ళి ప్రభువుతో నీ నిబంధన నూతనపరచుకోవాలనే నీ కల ఇప్పుడు నెరవేరబోవుచున్నది. యెహోవా సైన్యాధిపతి కొద్దిసేపటిలో ఇక్కడకు రాబోవుచున్నాడు. ఆయన ఇక్కడున్నాడని నేను నమ్ముచున్నాను.

“దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. నన్ను కరుణించుము!” ఓ, అక్షరాలా ఆయన ఆ మాటలు వినలేకపోయాడు. ఆయన రోడ్డు మీద నడుస్తున్నాడు, ఆయన చుట్టూ వందలాదిమంది ప్రజలు ఉన్నారు, తలా ఒక మాట మాట్లాడుచున్నారు. అతడు తన పాత పై వస్త్రములను పారవేసి బిగ్గరగా అరుస్తున్నాడు, “ఓ, యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణించు!”

బహుశా అతడు ఈ విధంగా ఒక చిన్న పని చేశాడని అనుకొందాము. (అతడు అలా చేశాడని నాకు తెలియదు.) బహుశా అతడు హృదయంలో ఈ విధంగా తలంచాడని ఊహిస్తున్నాను, “ఒకవేళ ఆయన దావీదు కుమారుడైతే, నేను ఇక్కడే నిలువబడి యోహోవాకు మొర్ర పెడతాను. యెహోవా ఆయనతో మాట్లాడును.” అది నిజము. “యెహోవాయే ఆయనను ఆపగలడు, ఎందుకనగా ఆయనకు నా స్థితి తెలుసు. ఆయనను చూడాలని ఎంతోకాలంగా ఇక్కడ కూర్చొనియున్నాను.”

74

నీవు దేవునిని నీ సమీపముగా తీసికొని రావాలంటే, నీవు ఆ విధంగా చేయవలసి యున్నది. ఆయనను గూర్చి ఆలోచించుము, ఆయనను గూర్చి మాట్లాడుము. యేసును ఎల్లప్పుడూ నీ ముందు పెట్టుకొనుము. ఈ లోక కార్యములను గూర్చి మాట్లాడవద్దు. యేసును గూర్చి మాట్లాడుము. నీవు ఆ విధంగా చేయవలసియున్నది. ప్రజలు నిన్ను తమాషాగా చూడవచ్చు, కాని అది పర్వాలేదు; నీ సంభాషణ ఆయనను గూర్చి మాత్రమేగా ఉండాలి.

నేను ఇక్కడ ఒక నిమిషం ఆగాలనుకొంటున్నాను. నా కుమారుడు బిల్లీ. అతడు ఇక్కడ ఎక్కడో ఉన్నాడు. మూడు లేక నాలుగు సంవత్సరములు క్రితము మేము ఒక కూటములో ఉన్నాము. వారు ఏదో ఒక రకమైన సంగీతమును వాయించుచున్నారు. ఆరాధన ముగించిన తర్వాత (వుడ్రివర్, ఇల్లినాయిస్ వద్ద), మేము ఆహారమును తీసికొనుటకు వెళ్ళాము. వారు ఏదో పాటను పెట్టారు, అది ఏమిటో నాకు తెలియదు. “నాన్నా ఆ పాట అందముగా లేదా?” అని అడిగాడు.

“ఏ పాట,” అని అడిగాను. ఆ పాటలు పాడే టేపు రికార్డర్లు నాకు ఇష్టం లేదు. వాటిని మీరు ఏ పేర్లతో పిలుస్తారో నాకు తెలియదు. నేను భోజనశాలకు వెళ్ళినప్పుడు వాటిని నడిపే వ్యక్తులలో, “అమ్మా, ఇవిగో రెండు డాలర్లు, (నేను కుటుంబముతో వచ్చాను), మేము భోజనం ముగించి వెళ్ళేవరకు ఆ మురికి పాటలు ఆపండి,” అని చెప్పాను. అప్పుడు ఆమె ఆ కరెంటు వైరు తీసివేయును.

75

ఈ రాక్-అండ్-రోల్ మరియు ఆ త్రాగుబోతు నృత్యాలు అవి అసభ్యకరమైనవి. అవి నాకు నరముల బలహీనత కలిగిస్తాయి. నేనే సరిగా ఆహారము తినలేము. వాటిని నేను పట్టించుకోను, నేను చిన్న మీటను కలిగియున్నాను, నేను దేవుని గూర్చి ఆలోచిస్తూ ఉండగలను. నేను వాటిని ఏ మాత్రము వినను. మరియు కొంచెం కాలము తర్వాత (అప్పటికి అతడు అవివాహితుడు) ఎవరైనా అందమైన యువతి కన్పిస్తే, “నాన్నా ఆమె జుట్టు అందముగా లేదా?” అని అడిగేవాడు.

“ఎవరు?” అని అడిగేవాడిని.

అతడు, “నాన్నా నీవు పూర్తిగా దేవుడు మరియు బైబిల్ గూర్చి మాత్రమే ఆలోచిస్తావా?” అని ప్రశ్నించేవాడు.

నేను చెప్పేవాడిని, “ప్రియుడా, నీ యొక్క మంచి అభినందనలకు వందనములు. నేను ఎల్లవేళలా నా మనస్సును ఆయన మీదనే నిలిపినట్లయితే, నాకు కావలసినదంతా అదియే!

76

“ఆయన అక్కడ నిలబడియున్నాడు, నేను ఆయన్ని గూర్చి ఆలోచిస్తున్నాను, ఇప్పుడు ఆయన నాకు సమీపముగా ఉన్నాడు. కాని ఆయనకు నాకు మధ్య చాలామంది ప్రజలు ఉన్నారు. నాకేమి చేయాలో తెలియుట లేదు. ఓ, యెహోవా దేవా, ఆయన నీ సేవకుడు, ఆయన నీ కుమారుడు. నీవు సంతోషించు నీ సేవకుడు. నా ఆత్మను ఆయనయందు ఉంచుదును. అతడు అన్యజనులయందు న్యాయము తీర్చును. ఆయన నీ సేవకుడు. ఓ, దేవా, నజరేయుడైన యేసు, నాతో మాట్లాడనిమ్ము!”

అదే సమయమునకు, ఆయన నిలిచాడు. ఓ, మై. ఆయన ఆగిపోయాడు. ఆగి వెనక్కి తిరిగాడు. ఆయన భౌతికముగా అతడి కేకలు వినలేదు. ఆయన అతడికి చాలా దూరములో ఉన్నాడు. ఒకవేళ మీరెప్పుడైనా యెరికో వెళ్ళినట్లయితే, ఆ సంఘటన జరిగిన స్థలమును చూడండి. అంత పెద్ద జనసమూహములో ఆయన అతడి కేకలు వినలేదు. అయితే ఆయన నీ కేకలు వినవలసిన అవసరము లేదు; ఆయనను ఆపేది నీ విశ్వాసము.

77

రక్తస్రావముతో బాధపడుచూ ఆ జనసమూహములో వస్తున్న ఆ స్త్రీని చూడండి. నేను ఆయన వస్త్రము చెంగును ముట్టిన చాలు, నేను స్వస్థపడతాను అని ఆమె చెప్పినది. ఆయన వస్త్రము చెంగును ముట్టేవరకు ఆమె ఆ గుంపులో చొచ్చుకుపోయినది. పాలస్తీనా దేశములో వస్త్రములు వదులుగా వ్రేలాడుతుంటాయి. అది అంగీ, క్రింద మరియొక వస్త్రము ఉంటుంది. మీరు భౌతికముగా నా జేబును మట్టినట్లయితే అది నాకు తెలియదు. మరియు పెద్దగా వదులుగా ఉన్న అంగీ సంగతేమిటి? ఆయన ఆమెను భౌతికముగా గ్రహించలేదు. “నన్ను ముట్టినది ఎవరు?” అని ఆయన అడిగాడు. ఆయన చుట్టూ చూశాడు.

పేతురు ఆయనను గద్దించాడు, “అందరూ నీ మీద పడుచున్నారు. నీవు నన్ను ఎవరో ముట్టారని ఎలా చెప్పుచున్నావు?” అని అడిగాడు.

“లేదు ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావము వెడలిపోయినది” అని ఆయన చెప్పాడు. ఆయన చుట్టూ చూశాడు, ఆయన జనసమూహమును పరికించాడు. ఆ సమూహములోని ఆ చిన్న స్త్రీని కనుగొన్నాడు. ఆయన ఆమె రక్తస్రావము కలిగియున్నది, ఆమె విశ్వాసము ఆమెను స్వస్థతపరచినది అని చెప్పాడు.

78

ఇప్పుడు అదే దేవుడు అక్కడ ఉన్నాడు, ఆయన ఎరిగియున్నాడు.... అదే యేసు ఆ మార్గములో వెళ్ళుచుండగా, గ్రుడ్డి బర్తిమయి ఆయనను చేరలేకపోయాడు. ఆయన అతడికి చాలా దూరములో ఉన్నాడు. కాని అతడి విశ్వాసము యేసును ఆపివేసినది. చూడండి! ఆయన లోకపాపములను మోయుచున్నాడు. ప్రతి వ్యక్తి యొక్క మరణము ఆయన మీద మోపబడినది. అంతమునందు జరిగిన ప్రతి పాపము, జరుగబోయే ప్రతిపాపమును ఆయన మీద మోపబడినది. రోగులను స్వస్థతపరచుము, చనిపోయిన వారిని బ్రతికించుము అని జనసమూహము ఆయనను హేళన చేయుచుండగా, ఆయన వారి మధ్య నుండి కల్వరికి ఆయన ప్రయాణిస్తున్నాడు; కానీ ఆ గ్రుడ్డి భిక్షకుడి యొక్క విశ్వాసము ప్రయాణములో ఉన్న ఆయనను ఆపివేసినది. సాధ్యమైతే, “యేసు నిలిచెను” అనే అంశము మీద ఒక రాత్రి ప్రసంగించాలని ఆశిస్తున్నాను. అలా ఎన్నిమార్లు జరిగినదో చూడండి. యేసు అక్కడ నిలిచి చుట్టూ చూశాడు. “అతడిని ఇక్కడికి తీసుకొని రండి. నేను నీకేమి చేయగోరుచున్నావు?” అని చెప్పాడు.

ఓ, నేను అతడిని చూస్తున్నాను. నీవు ఆయన దృష్టిలో పడ్డానని నీవు ఎరిగినప్పుడు. వారు చెప్పారు, “ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు.”

79

అతడు తన పై వస్త్రమును పారవేశాడు. అతడిని గమనించండి. అతడు తిరిగి వచ్చినప్పుడు దానిని తీసికొనునట్లుగా దానిని చక్కగా ఒక స్థలములో పెట్టలేదు. అతడు యేసును కలుసుకొన్నట్లయితే, అతడు తిరిగి వచ్చినప్పుడు తాను చూడగలను అని ఎరిగియున్నాడు. కాబట్టి అతడు ఆ విధంగా చేశాడు. అదే మార్లము, అది యేసును కలిసి ఆయనతో మాట్లాడినట్లయితే, ఖచ్చితముగా అది భిన్నంగా ఉంటుంది. కాబట్టి అప్పటి నుండి అతడు చూడగలడు. కాబట్టి అతడు తన పై వస్త్రమును విసిరివేశాడు. దూరముగా పారవేసి అతడు వెళ్ళాడు!

“నేను నీకేమి చేయగోరుచున్నావు?” అని ఆయన ప్రశ్నించాడు.

ఆయన అతడికి ఆకాశము ఎంత అందముగా ఉన్నదో అని దానిగురించి ఏమీ మాట్లాడలేదు, కాని అతడు ఒక అవసరత కలిగియున్నాడు. “నేను చూపు పొందగోరుచున్నాను, నేను మరలా చూచునట్లు నాకు దృష్టి అనుగ్రహించుము.”

యేసు చెప్పాడు, “నీవు చూపు పొందుము. నీ విశ్వాసము నిన్ను రక్షించెను” — ఆయనను ఆపివేసిన విశ్వాసము. మరియు ఈ రాత్రి మన విశ్వాసము ఆయనను నిలిపినట్లయితే, ఒకవేళ మన విశ్వాసము ఈ రాత్రి ఆయనను మన మధ్యకు తీసికొని వచ్చినట్లయితే, మనము స్వస్థత పొందుతాము, మనకు అవసరమైనవి మనం పొందుతాము.

80

ముగింపులో ఒక చిన్న కథ. నేను ఒక చిన్న కాల్పనిక కథను విన్నాను. (అది కాల్పనికమైనది; బహుశా అది నిజమైనది కావచ్చును, అది నాకు తెలియదు). అది బర్తిమయిని గూర్చిన ఒక చిన్న కథ. అది ప్రవక్తల జీవిత కథలు, అందులో నేను బర్తిమయి గూర్చి ఒక వ్యాసం చదివాను. బర్తిమయి బాలుడిగా యున్నప్పటి ఉండి గ్రుడ్డివాడని చెప్పారు. మరియు మీకు తెలుసు, ఆ దినములలో, ఒక వ్యక్తి గ్రుడ్డివాడైనప్పుడు. వారిని నడిపించే కుక్కలను ఏమని పిలుస్తారో నేను మరచిపోయాను. ఒక రకమైన తర్ఫీదు పొందిన కుక్కలు గ్రుడ్డివారిని నడిపిస్తాయి, వాటిని “చూచు కన్నులు” కుక్క అని పిలుస్తారు. ఆ రోజులలో కుక్క బదులుగా, వారు నడిపించబడుటకు గొర్రెను ఉపయోగించేవారు, మరియు బర్తిమయి ఒక గొర్రెపిల్లను కలిగియున్నాడు, మరియు అతడి దగ్గర రెండు పావురములు ఉన్నవి.

మరియు ఒక రాత్రి. అతడు ఒక్క చిన్న కుమార్తెను కలిగియున్నాడు, మరియు ఒక రాత్రి ఆ బాలిక జబ్బు పడినది.

81

మరియు అతడు ప్రార్ధించాడు, మరియు అతడు చెప్పాడు, “ప్రభువా, నా చిన్న కుమార్తెను నీవు స్వస్థపరచినట్లయితే, రేపు ఉదయం నా రెండు పావురములను బలి ఇస్తాను.” మరియు అతడు ప్రార్ధించాడు, “ప్రభువా, నీవు ఆమెను స్వస్థపరచినట్లయితే, రేపు ఆలయమునకు నా రెండు పావురములను తీసికొని వెళ్ళి, ఆ రెంటిని నీకు బలి అర్పిస్తాను.” మరియు ఆ చిన్న పిల్ల జ్వరము తగ్గిపోయి, స్వస్థపడినది.

అది జరిగిన కొన్ని వారములకు, అతడి భార్య జబ్బుపడినది. వైద్యుడు ఆమె కొరకు చేయగలిగినది ఏమియూ లేదని చెప్పాడు. అతడు తనకు తెలిసినదంతయూ చేశాడు. అతడు గోడను తడుములాడుచూ ఇంటి వెలుపలికి వెళ్ళి నిలువబడ్డాడు. మరియు అతడు ఆ విధంగా చెప్పాడు, “ఓ, యెహోవా దేవా, నీవు నా భార్యను బ్రతికించినట్లయితే, నేను వాగ్దానం చేయుచున్నాను.... నీకు అర్పించుటకు నా దగ్గర ఏమియూ లేదు, కాబట్టి నా గొర్రెపిల్లను అర్పిస్తాను,” అతడిని దారిలో నడిపించేది.

82

కాబట్టి మరుసటి ఉదయమునకు అతని భార్య బాగుపడినది. కాబట్టి అతడు తన గొర్రెపిల్లను తీసికొని దానిని బలి ఇచ్చుటకు బయలుదేరాడు.

అతడు ప్రధాన యాజకుడిని కలుసుకొన్నాడు. ఆయన అతడిని, బర్తిమయి ఉదయకాలమున ఎక్కడికి వెళ్ళుచున్నావు.

అతడు చెప్పాడు, “దేవుని యొక్క ప్రధాన యాజకుడా, నా గొర్రెపిల్లను బలిగా అర్పించుటకు దేవాలయమునకు వెళ్ళుచున్నాను. నేను ప్రార్ధించినపుడు, నా భార్య స్వస్థపడినది. మరియు నా గొర్రెపిల్లను అర్పిస్తానని యెహోవా దేవునికి నేను వాగ్దానము చేశాను.”

అప్పుడు ప్రధాన యాజకుడు తన డబ్బు సంచిలో చేతిని పెట్టి కొంత డబ్బు తీసి అతనితో, “బర్తిమయి నీవు ఆ గొర్రెపిల్లను అర్పించవద్దు. నేను నీకు డబ్బు ఇస్తాను, నీవు వెళ్ళి అమ్మువారి దగ్గర వేరొక గొర్రెపిల్లను కొనుము,” అని చెప్పాడు,

అప్పుడతడు, “ఓ ప్రధాన యాజకుడా, నీ దయను బట్టి చాలా వందనములు. నేను దేవునికి ఎన్నడూ ఒక గొర్రెపిల్లను అర్పిస్తానని వాగ్దానము చేయలేదు; నేను ఈ గొర్రెపిల్లను అర్పిస్తానని వాగ్దానము చేశాను.”

స్నేహితుడా, ఈ రోజు అది చాలా పెద్ద సమస్యగా యున్నది. ఈష్టరు పండుగ దినమున మనము వేదికను కలువ పూలతో నింపివేస్తాము. ఆ బలిపీఠము కలువ పూల కొరకు నిర్మించబడలేదు, ఆ బలిపీఠము నీ కొరకు నిర్మించబడినది, చూశారా. కాని మనకు బదులుగా మన స్థానములో మరొకదానిని తీసికొని వస్తున్నాము. మనం ఆ విధంగా చేయకూడదు. క్రీస్తు మన స్థానమును వహించాడు.

83

అతడు చెప్పాడు, “నేను ఆయనకు ఒక గొర్రెపిల్లను వాగ్దానము చేయలేదు. ఆయనకు నేను ఈ గొర్రెపిల్లను వాగ్దానము చేశాను.”

మరియు ఆ ప్రధాన యాజకుడు చెప్పాడు, “బర్తిమయి, నీవు ఆ గొర్రెపిల్లను అర్పించకూడదు, ఆ గొర్రెపిల్ల నీ కన్నులు. నీవు ఆ గొర్రెపిల్లను అర్పించవద్దు.”

“అతడు చెప్పాడు, ”ఓ, దేవుని ప్రధాన యాజకుడా, అది నిజమే. కాని నేను దేవునికి ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చినట్లయితే, ఈ గ్రుడ్డి బర్తిమయి కొరకు దేవుడే ఒక గొర్రెపిల్లను అనుగ్రహిస్తాడు.“ ఆ చలికాలపు ఉదయము దేవుడు అతడి కొరకు ఏర్పరచిన గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల గ్రుడ్డి బర్తిమయి కన్నుల కొరకు ఏర్పరచబడినది. ”చూపు పొందుము“ అని ఆయన చెప్పిన వెంటనే అతడు నిలువబడి, తన చేతులు చూశాడు. ”ఓ, నేను దానిని పొందుతానని ఆయన నాకు చెప్పాడు. నాకు చూపు మరలా వస్తుందని ఆయన చెప్పాడు! జన సమూహము ఆ మార్గములో వెళ్ళుచున్నది. మరికొద్దిసేపటి తర్వాత అతడు నీడను చూశాడు. అతడు చెప్పాడు, “ఓ, అది జరిగింది, నేను నా వ్రేళ్ళను చూస్తున్నాను.” అతడు దేవునిని మహిమపరచుచూ ఆ మార్గములో వెళ్ళాడు. ఖచ్చితముగా, దేవుడు గ్రుడ్డి బర్తిమయి కన్నుల నిమిత్తము గొర్రెపిల్లను అనుగ్రహించాడు.

84

సహోదరీ, అదే గొర్రెపిల్ల నీ కొరకు అనుగ్రహించబడినది, సహోదరీ; నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు ఇచ్చయించు వారి కొరకు, మన కన్నుల కొరకు దేవుడు గొర్రెపిల్ల అనుగ్రహించాడు. మన ఆత్మీయమైన కన్నులు తెరువబడి, మన మధ్యన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడని మనము చూచుటకు ఆయన మన కొరకు గొర్రెపిల్లను అనుగ్రహించాడు. ఆయన ఈ రాత్రి దానిని అనుగ్రహంచాలని నా ప్రార్ధన.

మా పరలోకపు తండ్రీ, ఈ పరిశుద్ధ గ్రంథములోని కథలను బట్టి నీకు వందనములు. అవి మాకెంతో ప్రశస్తమైనవి. అవి మాకు జీవమైయున్నందున వాటిని మేము ప్రేమిస్తున్నాము. గతకాలములో నీవు ఎలా ఉన్నావో మేము చూస్తున్నాము. నీవు నిన్న ఏ రీతిగా ఉన్నావో, నేడును, రేపును, నిరంతరము అదే రీతిగా ఉన్నావు. పరిశుద్దుడైన దేవా, భూమ్యాకాశముల సృష్టికరా, ఈ రాత్రి మరలా పరిశుద్దాత్మను పంపించండి. యేసు చెప్పెను, “పరిశుద్దాత్ముడు వచ్చినప్పుడు, నేను చెప్పిన వాటిలో నుండి తీసికొని మీకు గ్రహింపజేయును. ఆయన మీకు రాబోవు కార్యములను చూపును. ఆయన సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన నా గూర్చి సాక్ష్యమిచ్చును.” అది సత్యము అని మనము ఎరుగుదుము.

85

యేసు ఈ భూమి మీద యున్నప్పుడు ఏ కార్యములను జరిగించెనో, నేటి దినమున ఈ ప్రజల మధ్య అదే కార్యములను జరిగించాలని ప్రార్ధిస్తున్నాను. వారు దానిని గ్రహించుదురు గాక, ప్రతి ఒక్కరి కన్నులు తెరువబడును గాక, వారిలో అనేకులు నమ్మకమైన చక్కటి క్రైస్తవులు. వారు నిన్ను ప్రేమిస్తున్నారు. వారు తమ హృదయమంతటితో నిన్ను ప్రేమిస్తున్నారు. నీవు చెప్పిన రీతిగానే ఖచ్చితంగా అదే విధంగా ఈ కార్యములు జరుగుతాయని వారు గుర్తించునట్లుగా, వారి ఆత్మీయమైన కన్నులను తెరవండి. ప్రభువా, అది మీరిచ్చిన వాగ్దానము. ఈ రాత్రి మా మధ్య సజీవుడైన దేవుని హస్తమును చూచుదము గాక. అప్పుడు ప్రజలందరి కన్నులు తెరువబడును, అప్పుడు మేమందరము స్వస్థతను, రక్షణను పొందుదము.

86

ఈ రాత్రి ఆలయము మూయబడిన తర్వాత ఎమ్మాయి మార్గమున నడిచిన వారి వలే మేము ఇక్కడి నుండి మా గృహములకు వెళ్ళుదము గాక. మీరు మరణించి, పాతిపెట్టబడి, తిరిగి లేచిన తర్వాత, ఆ దినమంతా వారితో నడిచావు గాని వారు నిన్ను గుర్తించలేదు. కాని ఆ సాయంకాలము వారితో ఏకాంతముగా ఆ గదిలోనికి వెళ్ళినప్పుడు, సిలువ వేయబడక ముందు నీవు చేసిన కార్యమును నీవు మరలా చేశావు. నీవు మరణించి ఎంతో కాలము కాలేదు, నీవు మరణము నుండి తిరిగి లేచావని వారు ఎరిగారు, ఏలయనగా ఏ మానవుడు నీవు చేసిన విధంగా చేయలేదు. వారు ఇంటికి సంతోషముగా పరుగెత్తుచూ, “ఆయన మార్గములో మనతో మాట్లాడుచుండినప్పుడు, మన హృదయములు మండలేదా?” అని చెప్పుకొనిరి.

అదే కార్యమును మరలా ఈ రాత్రి మా మధ్యను జరిగించండి. ప్రభువా, మా మధ్యకు తిరిగి రండి. మా శరీరములను మీ స్వాధీనములోనికి తీసికొనండి. ఆ బలహీనమైన శరీరమును తీసికొనండి. నీ చిత్త ప్రకారము ఉపయోగించండి. తండ్రీ, వారిని ఉపయోగించకుండా మీరు నన్ను ఉపయోగించలేరు. కాబట్టి రోగుల శరీములను ఉపయోగించుకొనండి. ఈ రాత్రి మా ప్రాణాత్మలను మీ మహిమ ఘనతల నిమిత్తము వాడుకొనండి, దానిని చూచి ఇతరులు స్వస్థత పొందుదురు గాక, యెహోవా సేనాధిపతియైన యేసుక్రీసు నామములో మేము ప్రార్ధన చేయుచున్నాము. ఆమేన్

87

ఒకవేళ స్వస్థపరచే మార్గము నాకు సాధ్యమైతే, ఇక్కడ మంచము మీద ఉన్న స్త్రీ లేచి నడుచునట్లు నేను చేయగలిగితే, అది జరగాలని నేను ఒక పావలా తీసుకొని దానిని నా ముక్కుతో త్రోసుకుంటూ ఈ పట్టణం అంతా త్రిప్పుతాను. ఒకవేళ అక్కడ పడియున్నది, నా సహోదరీ, నా తల్లి లేక నా భార్య అయినట్లయితే? మరియు క్యాన్సరు లేక గుండెజబ్బుతో బాధపడుచున్న నీవు, నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి, నా కుమారుడు, నా కుమార్తె అయితే? మై! కాని నేను దానిని చేయాలని ఆశిస్తున్నాను, కాని అది నాకు సాధ్యం కాదు. ఒకవేళ యేసు ఇప్పుడు ఆయన నాకిచ్చిన ఈ కోటు ధరించి నిలచియున్ననూ, ఆయన కూడా చేయలేడు. ఆయన దానిని ఇంతకు ముందే చేసియున్నాడు. రక్షణ మరియు విమోచనా ఆశీర్వాదములను ఆయన ఎప్పుడో కొనియున్నాడని ఎందరు విశ్వసించుచున్నారు? అయితే ఆయన ఇక్కడ ఉ౦డినట్లయితే, ఆయన నీకేమి చేస్తాడు? ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన ఏ విధంగా చేశాడో - ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తాడు. ఆయన సజీవుడని నీవు చూడగలుగునట్లు ఆయన ఏదైనా కార్యము చేస్తాడు.

88

ఇప్పుడు, మీలో ఎందరు ఎరిగియున్నారు? దేవుని ఆత్మ, (అనగా పరిశుద్దాత్మ) ఈ అంత్యకాలములో మరలా భూమి మీదకు వచ్చునని యేసు చెప్పిన సంగతిని ఎందరు ఎరుగుదురు (ఈ వారము దాని గురించే మాట్లాడుకొనియున్నాము). ఆ ఆత్మ ఆయన చేసిన అవే కార్యములను మరలా జరిగించును. ఆ సంగతి ఎందరు ఎరుగుదురు? ఆయన అదే సూచక క్రియను చూపించును, యూదులకు చూపిన అదే సూచక క్రియలు చూపించును. ఆయన ఆ సూచక క్రియను సమరయులకు చూపించాడు; కాని అన్యజనులకు ఆయన చూపించలేదు. అది వారి దినము కాదు. అన్యజనులు కూడా మెస్సీయా కొరకు ఎదురుచూచుట లేదు. కాని ఈ రోజున మనము క్రీస్తు రెండవ రాకడ కొరకు కనిపెట్టుచున్నాము. కాబట్టి మనము ఇప్పుడు చివరి సూచక క్రియయైన మెస్సీయ సూచక క్రియను పొందవలసియున్నది.

మరియు గుర్తు౦చుకొనండి, ఆయన నోవహు గూర్చి చెప్పాడు. కాని అప్పుడు ఆయన దానిని గూర్చి చెప్పలేదు, కాని సొదొమ దినములలో ఉన్నట్టుగా అని ఆయన చెప్పాడు. నోవహు కాలములోని ప్రజల నైతికతను గూర్చి ఆయన చెప్పాడు. వారు తినుచూ, త్రాగుచూ, పెండ్లి చేసుకొనుచూ, పెండ్లికిచ్చుచూ యుండిరి. కాని “సొదొమ దినముల వలే,” ఆయన దానిని విడిచిపెట్టాడు, చూశారా. అది ప్రత్యక్షత.

89

ఆ దేవదూతలు ఏమి చేశారో మీరు గమనించండి. మనము దానిని గూర్చి మాట్లాడాము. ఈ రోజున బిల్లీగ్రాహంను చూడండి. కచ్చితముగా! నవీనకాలపు ఓరల్ రాబర్ట్స్ మరియు బిల్లీ గ్రాహం, ఆ గొప్ప సువార్తికులు ప్రపంచవ్యాప్తముగా సంచరిస్తూ బబులోనులో నుండి బయటకు రండి, సొదొమ నుండి బయటకు రండి అని వారు శాయశక్తులా పిలుస్తున్నారు. అది ఏమైనా మెరుగుపడుచున్నదా? ఇంకా చెడిపోవుచున్నది.

ఇప్పుడు, ఎన్నిక చేయబడిన సంఘమును చూడండి. ఎన్నికను నీవు విశ్వసించుచున్నావా? పరిశుద్ధ గ్రంథమును నీవు విశ్వసించుచున్నట్లయితే, నీవు దానిని ఖచ్చితముగా విశ్వసించాలి. జగత్తు పునాది వేయబడక ముందే మన పేరులు గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడ్డాయని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, చూశారా. దేవుని యొక్క ముందు జ్ఞానము ద్వారా మనము దేవుని చేత ఎన్నిక చేయబడ్డాము. ఆయన మనలను ఎన్నుకొన్నాడు. ఇప్పుడు, అయితే మనము పిలువబడ్డాము. నీవు ఎన్నిక చేయబడినందుకు దేవునికి కృతజ్ఞత కలిగియుండాలి. అందును బట్టి నేను ఎంతో కృతజ్ఞత కలిగియున్నాను. దేవుడు నన్ను పిలిచాడు, ఆయన నన్ను ఎన్నుకొనలేదు. మొదటిగా నా తండ్రి ఆకర్షించితే గాని ఎవడును నా యొద్దకు రానేరాడు. తండ్రీ నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు.“ అది నిజము. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నీ ద్వారమును తట్టుచున్నాడు. నీవు వచ్చుటకు అదియే సమయము.

మరియు, ఈ రోజు అన్యజనుల కాలము. ఈ దినమున అంత్యకాల వర్తమానము. మరియు గుర్తు౦చుకొనండి, ఆకాశము నుండి అగ్ని కురిసినప్పుడు సొదొమ నాశనం అయ్యింది.

90

కాలిఫోర్నియాలో జరుగుచున్న ర్యాలీ గూర్చి వార్తా పత్రికలలో మీరు చదివారా? వారు ఒక పార్టీ నుండి మరొక పార్టీలోనికి మారుచున్నారు, కాని నేనైతే నా ఓటును నా రక్షకుడైన యేసుక్రీస్తుకు వేస్తాను. నేను గెలుస్తాను. అది నిజము. అది సరియైనది. నా రక్షకుడిగా నేను యేసుక్రీస్తుకు ఓటు వేశాను, అంతే, చూశారా. నేను ఓటును నమ్ముచున్నాను, మీరు ఓట్లు వేయవలసియున్నది, కాని అది ప్రసంగవేదిక మీద దానిని గూర్చి మాట్లాడకూడదు. మిగిలిన చోట్ల దానిని గూర్చి మాట్లాడుము. ఇది సువార్త స్థలము. ఇది పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిజాయితీ కలిగినది. ఇది నెరవేరుతుందని నాకు తెలుసు, అంతే.

ఆయన ఇక్కడ ఉన్నప్పుడు. ఈ రాత్రి యేసు మన మధ్యకు వచ్చినప్పుడు, ప్రతి విమోచనా ఆశీర్వాదమును ఆయన నీకు ఇవ్వగలడని మీరు గుర్తుంచుకొనండి. “మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినది.” యేసు కల్వరిలో మరణించినప్పుడు, అందరూ స్వస్థత పొందారు, అందరూ రక్షణ పొందారు, కానీ నీవు రక్షణ పొందుటకు లేక స్వస్థత పొందుటకు ఆయనలో నీకు వ్యక్తిగతమైన విశ్వాసము కలిగియుండాలి.

91

ఒకవేళ యేసుక్రీస్తు ఈ రాత్రి ఇక్కడ యున్నట్లయితే, “ప్రభువైన యేసూ, నీ దగ్గరకు వచ్చి, నీ మీద చేతులుంచి నిన్ను స్వస్థపరచును” అని నీవు చెప్పావు.

ఆయన ఏమి చెప్పాడో నీకు తెలుసా? “నా కుమారుడా, నీవు నా వాక్యమును విశ్వసించుట లేదా? నీవు ఆ వాక్యమును విశ్వసించుచున్నావా? నీ అతిక్రమ క్రియలను బట్టి నేను గాయపరచబడ్డాను; నేను పొందిన దెబ్బలను బట్టి నీవు స్వస్థత పొందావు.” ఇప్పుడు, ఆయన వాక్యము మనకు చాలును. కానీ, ఒకవేళ నీవు నా మాటలను విశ్వసించనట్లయితే, నేను దానిని వదిలేస్తాను. ఒకవేళ నేను మీ యొక్క మాటలను విశ్వసించనట్లయితే, మీరు నన్ను పట్టించుకోరు. కాని దేవుడు కాదు. ఒకవేళ మీరు ఆయన వాక్యమును విశ్వసించనట్లయితే, అయినను ఆయన సంఘముకు పరిశుద్దాత్మ వరములను ఇచ్చాడు. మొదటిగా ఏమిటి? అపోస్తులులు, ప్రవక్తలు, సువార్తికులు, ఉపదేశకులు, కాపరులు - వీరందరూ స౦ఘము సంపూర్ణత పొందుటకు, ఆయనను గూర్చిన జ్ఞానమును సంఘము పొందుటకు అనుగ్రహించబడ్డారు. ఒక ఉపదేశకుడు, ఒక సంఘకాపరి, ఒక సువార్తికుడు, ఒక ప్రవక్త, వీరందరూ దానిని తెలియపరచుటకు.

92

ఈ రాత్రి ఎందరు పెంతుకొస్తు ప్రజలు ఇక్కడయున్నారు? మంచిది, మీరు భాషలతో మాట్లాడుట విశ్వసించుచున్నారు. పౌలు చెప్పాడు, “మీలో ఎవరైనా ఒకరు భాషలతో మాట్లాడుచున్నప్పుడు, భాషలకు అర్ధము చెప్పువారు లేనట్లయితే, (అది సంఘ క్షేమాభివృద్ధి కలిగించేదైయుండాలి — అర్ధము చెప్పు వ్యక్తి యుండాలి.) ఎందుకు, మీ మధ్యకు తెలియని వ్యక్తి వచ్చినప్పుడు, అది అతడికి పిచ్చితనంగా తోచును. ”ఎందుకు, వారందరూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు“ అని ప్రశ్నించును. ఒక ప్రవక్త లేచి మర్మములను బయలుపరచినయెడల, ”నిశ్చయముగా దేవుడు మీతో ఉన్నాడు“ అని చెప్పి సాగిలపడును, ఎందుకనగా అది దేవుని యొక్క చివరి సూచక క్రియ. అది నిజమని మనకు తెలుసు. ఈ రోజు మనము దానిలో నివసించుచున్నాము, ప్రభువు మిమ్మును దీవించును గాక.

93

ఇప్పుడు,నేను మరచిపోయాను. .... బిల్లీ పాల్ ఎక్కడ? అతడు... నన్ను క్షమించండి. అతడు చాలా చిన్నగా యున్నాడు, నాకు కనిపించుట లేదు. నీవు ఎన్ని ప్రార్ధనా కార్డులు ఇచ్చావు? యాభై? యాభై నుండి ప్రారంభించావా? లేక 1 నుండి 50 వరకా? సరే? మనము వారందరినీ ఒకేసారి వరుసలో నిలువబెట్టుకొనలేము. కాబట్టి మన వీలును బట్టి వరుసలో నిలువబెడదాము. సరే మంచిది, ప్రార్ధనా కార్డు సంఖ్య 1, అది ఎవరు? (అక్షరము ఏమిటి? B?) B సంఖ్య 1. [టేపులో ఖాళీ స్థలమున్నది.]

...అది నిజము కానట్లయితే, నేను అబద్ధ ప్రవక్తను, అబద్ధికుడను మరియు పరిశుద్ధ గ్రంథము తప్పు. క్రైస్తవ్యములోని దేవుడు ఆయన ఇక్కడ కలుసుకుంటాడని వాగ్దానము చేశాడు. “ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామములో కూడుకొంటారో, వారి మధ్య నేను ఉంటాను.” ఆయన తన దూతను పంపి ఈ విషయం చెప్పాడు, “నీవు భయపడవద్దు. రోగుల కొరకు ప్రార్ధన చేయుటకు నీవు పంపబడ్డావు. నీవు వారి హృదయములలోని రహస్యములను ఎరుగుదువు.”

94

ఇప్పుడు, దర్శనములు కలుగుట ప్రారంభమయ్యాయి.

నా జీవితములో నాకు మొదటిగా గుర్తున్నవి దర్శనములు. అవి ఎల్లప్పుడూ కలిగాయి. నీవు ఈ వరములతో జన్మించావు. ఈ విధమైన వరములు ఒకరి మీద ఒకరు చేతులుంచితే రావు. ఈ వరములను దేవుడే సంఘములో పెట్టాడు. సహోదరులారా, అది నిజమేనా? చూశావా, దేవుడు సంఘములో వాటిని నియమించాడు. నీవు జన్మతః వాటిని చూశారా? దేవుడు సంఘములో వాటిని నియమించాడు. నీవు జన్మతః వాటిని కలిగియున్నావు. అవి సహజమైనవి, మిగిలిన వాటి వలెనే అవి సహజమైనవి. ఇప్పుడాయన తన సన్నిధిని మన మధ్య ఉంచునని నేను విశ్వసించుచున్నాను. ఒకవేళ ఆయన తన సన్నిధి మనమధ్య ఉంచినట్లయితే, ఆయన ఆశీర్వాదములు మన మీద క్రుమ్మరించును. భయభక్తులతో నిలబడి విశ్వసించండి.

సహోదరుడా బ్రెన్హా౦, మీరు ఎందుకు నిలబడియున్నారు?“ అని మీరు అడగవచ్చును. నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. అది ఖచ్చితము. ఒకవేళ ఆయన రానట్లయితే, నేను ఏమియూ చేయలేను. కాని ఒకవేళ ఆయన నన్ను అభిషేకించినట్లయితే, అప్పుడు నేను చేయగలను.

95

ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడున్న మైక్ ను ఒకరు తయారు చేశారు. నేను కొన్నిసార్లు పలుకుతాను, కాని అది నాకు తెలియదు. నీవు ఏమి పలుకుచున్నావో నీకు తెలియదు. అది దర్శనము. ఎక్కడో జరుగుచున్న ఒక కార్యమును నీవు చూస్తున్నావు. ఒకవేళ అది తగినంత బిగ్గరగా లేనట్లయితే, ఎవరితో అయినా మాట్లాడుచుంటే. గుర్తుంచుకొనండి, ప్రభువు చిత్తమైతే మీ అందరినీ రేపు రాత్రికి చూసాను. దేవుడు మిమ్మును దీవించును గాక. మనందరము కలిసి “కేవలము నమ్ముము” అనే పాటను మృదువుగా పాడుచుండగా, ప్రభువవైన యేసుక్రీస్తు మనలను దీవించును గాక, “కేవలము నమ్ముము.”

కేవలము నమ్ముము, కేవలము నమ్ముము

సమస్త కార్యములు సాధ్యమే...

ఆయన కొండ మీద నుండి దిగి వచ్చుటను నేను చూస్తున్నాను, అక్కడ మూర్ఛ వ్యాధిగ్రస్తుడైన బాలుడు ఒకడున్నాడు. అతడు మొట్టపెట్టాడు. “ప్రభువా, నా బిడ్డను కరుణించండి. అతడు దయ్యము వలన బహుశా బాధించబడుచున్నాడు.

యేసు చెప్పాడు, “నీవు విశ్వసించినట్లయితే, నేను చేయగలను, కేవలము నమ్మము.”

...సమస్త కార్యములు సాధ్యమే....

96

ఇక్కడున్న ప్రతి ఆత్మను యేసుక్రీస్తు నామములో పరిశుద్దాత్మ స్వాధీనములోనికి తీసికొనుచున్నాను.

ఇప్పుడు, ఈ వ్యక్తియేనా? ఈ వ్యక్తి కొరకేనా ప్రార్ధన చేయవలసినది? అయ్యా, ఎలా ఉన్నారు? మన జీవితములో మొదటిసారిగా కలుసుకొన్నాము. అది నిజమేనా? సరే, మంచిది. ఇద్దరు మానవులముగా మనము కూడుకొన్నాము. నీవు ఎవరో నాకు తెలియదు. నేను ఎవరో నీకు తెలియదు. బహుశా నీవు ఇక్కడికి ఒక వ్యాధిని బట్టిగాని, నీ ప్రియలను బట్టి గాని, ఆర్థికపరమైన కారణములతో వచ్చియుండవచ్చును, నీవు ఎందు నిమిత్తము వచ్చావో నాకు తెలియదు. కుటుంబ సమస్య. అది ఏమైనప్పటికీ, దేవుడు సమస్తమును ఎరిగియున్నాడు.

నేను ఈ కార్యములు నీతో చెప్పిన తర్వాత, నీ మీద నేను చేతులుంచి, “సహోదరుడా, నేను నీ కొరకు ప్రార్ధిస్తాను” అని చెప్పవచ్చును. నీవు స్వస్థతను పొంది వెళ్తావు; లేకపోతే కొందరు సేవకులైన సహోదరులు చేయునట్లుగా నేను నీ మీద చేతులుంచి, నేను ఆ ఆత్మను గద్దించవచ్చును, ఉదాహరణకు సహోదరుడు ఓరల్ రాబర్ట్స్ వారి మీద చేతులుంచి గొప్ప విశ్వాసముతో వారి సమస్యను, రోగమును గద్దిస్తాడు. అది సహోదరుడు ఓరల్ రాబర్ట్స్ పరిచర్య, చూశారా. దేవుడు ఏ ఇద్దరు వ్యక్తులను ఒకే రీతిగా సంధించడు. నేను సహోదరుడు రాబర్ట్స్ యొక్క స్థానమును తీసికొనలేడు, అతడు నా స్థానమును తీసికొనలేడు. మా ఇద్దరికి పరిచర్యలు ఉన్నవి మరియు దేవుడు మాకు చెప్పిన విధముగా మేము చేయవలసియున్నది.

97

కాని ఒకవేళ నేను ఇక్కడకు వచ్చి ఈ విధంగా చెప్పినట్లయితే, “సరే మంచిది సహోదరుడా, మంచి, నీ మీద చేతులుంచే పరిచర్యను నేను కలిగియున్నాను.” నేను నీతో ఆ విధంగా చెప్పినట్లయితే, నీవు దానితో వెళ్ళుము. నీవు బహుశా స్వస్థత పొందుతావు. అది నిజము. కాని దానిని బట్టి నీవు కొంచెం సందేహించవచ్చును, చూశారా. “అతడు నాకు సత్యము చెప్పాడా, లేదా?” అని ఆలోచిస్తారు. గతించిన దినములలో ఉన్నట్లుగానే నేటి దినమున కూడా యేసుక్రీస్తు జీవించుకున్నట్లయితే, నీ గూర్చి ఏమి తెలియని నేను, ఆయన ఆత్మకు నన్ను అప్పగించుకొనినట్లయితే, అప్పుడు నా లోనికి ఏదైనా వచ్చి కొన్ని కార్యములను బయలుపరచినట్లయితే, బావి దగ్గరున్న స్త్రీకి చెప్పినట్లుగా, ఆయన దగ్గరికి వచ్చిన సీమోను పేతురుతో ఆయన చెప్పినట్లుగా, నీవు గతములో చేసిన కార్యమును బయలుపరచినట్లయితే, చూశారా.

నీ గూర్చి ఆయన చెప్పుట ప్రారంభించినప్పుడు, అది సత్యమో కాదో నీవు తెలుసుకుంటావు. అప్పుడు నీవు దానికి సాక్షివి, అది సత్యమా, కాదా నీవు ఎరిగియున్నావు. అప్పుడు అది ఆ విధంగా ఉన్నదా, లేదా అని సాక్ష్యం ఇస్తావు. ఆయన గతమును గూర్చి చెప్పగలిగినట్లయితే, ఆయన అప్పుడు భవిష్యత్తు గూర్చి కూడా చెప్పగలడు. ఆయన జరిగిన దానిని గూర్చి చెప్పినది సత్యమైతే అప్పుడు జరుగునని చెప్పినది కూడా సత్యమే. సంఘమా, అది నిజమేనా? అప్పుడు నీవు ఊహించవలసిన అవసరము లేదు; అది ప్రభువు యొక్క ఆత్మ.

98

ఆయన చేస్తాడని నేను చెప్పుట లేదు. ఆయన చేస్తాడని నేను విశ్వసించుచున్నాను. ఆయన ఆ విధంగా చేసినట్లయితే, సంఘము ముందే వాగ్దానము చేసినది. అది ఇక్కడే యున్నది. ఆయన దగ్గరకు వచ్చిన సీమోనుతో ఆయన చెప్పినట్లుగానే, ఇక్కడ నిలబడియున్న వ్యక్తికి ఆయన చెప్పినట్లయితే, “నీవు సీమోనువు, యోనా కుమారుడవు” లేక ఫిలిప్పు, లేక ఇతరులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన వారిని గూర్చి చెప్పినట్లుగా ఆయన చెప్పినట్లయితే, యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా యున్నాడు, అవునా? యెహోవా సైన్యముల అధిపతియైన తన సన్నిది ఇక్కడ ఉన్నది.

ఈ వ్యక్తిని గూర్చి నాకేమీ తెలియదు. ఇతడు ఆరోగ్యవంతుడుగా కన్పిస్తున్నాడు. ఇతడిలో అనారోగ్యకరమైన లక్షణములు ఏమీ కన్పించుట లేదు. బహుశా అతడు రోగి కాకపోవచ్చును. బహుశా అది మరియొకటి కావచ్చును. ప్రభువు ఎరుగును. ప్రభువు, నాకు సహాయం చేయును గాక, దేవుని పరిశుద్ధాత్మ నా దగ్గరకు వచ్చి, ఆ ద్వారా మాట్లాడినప్పుడు, అది ఆత్మ కార్యము అని ప్రజలు తెలుసుకుంటారు. వారు దానిని గూర్చి మాట్లాడినట్లుగా వారు తీర్పు పొందుదురు. దేవా, నీవే న్యాయాధిపతివి. ప్రభువా, నీ మహిమ నిమితమైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యము జరిగించండి. ప్రదర్శన కొరకు కాదు, కాని నీ మహిమ కొరకు. ఆమేన్

99

ఇంకనూ ప్రజలు నా స్వరమును వినగలుగుచున్నత్లైతే? నా ఎదుట నున్న వ్యక్తికి ఏదో సమస్య యున్నది. అతనికి పుర్రెలో ఏదో సమస్య ఉన్నది. అక్కడే సమస్య ఉన్నది. అది నిజమేనా? అది నిజమైతే, నీ చేతిని ఎత్తుము. ఇప్పుడు ఆ వ్యక్తిని గూర్చి ఎరిగిన శక్తి యున్నది. నాకు తెలియదు. నీవు, బహుశా ఏదోయున్నది. అని చెప్పావు. ఇంతకు ముందు జరిగిన కూటములో లేడు. నేను ఊహిస్తున్నానని మీరు తలంచవచ్చును, ఏ కూటములలో కూడా అది జరుగలేదు. సరే, చూద్దాం. అది ఏమిటో నాకు తెలియదు. అక్కడున్న టేపులలో ఉన్నవి. చెప్పినదంతయూ భద్రము చేయుటకు మేము టేపులు చేయుచున్నాము. దేవుడు సత్యము అని ఋజువు పరచినది తప్పా మరేమియూ చెప్పలేదు.

అవునా, అది ఇక్కడున్నది, ఆ వ్యక్తి తలలోని ఏదో సమస్యతో బాధపడుచున్నాడు. అతనికి దెబ్బ తగిలినది, ఏదో పెద్ద కలప దుంగ అతడికి తగిలినది, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,” అది నిజము, అది నిజము. నీవు ఇక్కడి నుండి రాలేదు. నీవు కాలిఫోర్నియా నుండి ఇక్కడికి కూటముల నిమితము వచ్చావు. అది నిజము. దేవుడు నిన్ను ఎరిగియున్నాడని నమ్ముచున్నావా? నిన్ను గూర్చి ఆయన నాకు చెప్పగలడా? అది నీకు సహాయపడునా? అది నీకు సహాయపడునని నమ్ముచున్నావా? సరే, మంచిది. శ్రీ. రాబిన్సన్, స్వస్థత పొంది ఇంటికి తిరిగి వెళ్ళుము. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచెను.

100

నీవు ప్రభువును విశ్వసించుచున్నావా? ఇప్పుడు ఎరిగి చూడండి. స్నేహితులారా, చూడండి, అది నేను కాదు. దేవుడు ఎరిగియున్నాడు, ఆ వ్యక్తికి చెప్పినదానిలో నాయంతట నేను ఒక్క సంగతి కూడా చెప్పలేను. అది దర్శనము. జరుగుచున్న దానిని నేను చూస్తున్నాను, చూశారా. ఇప్పుడు, అదే కార్యము. ఇదే కార్యమును యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు చేశారు మరియు అది అంత్యకాలముకు సూచక క్రియగా ఉంటుందని వాగ్దానము చేశాడు, దానిని ఇక్కడున్న వారిలో (విశ్వాసులలో) ఎందరు నమ్ముచున్నారు. ఇంతకంటే ఎక్కువగా ఏమి చెప్పగలము? ఆయన ఇక్కడున్నాడు, మీరు ఆయనను విశ్వసించండి. దానిని అది పరిష్కరిస్తుంది. ఇక్కడున్న ప్రజలందరూ లేచి నిలువబడి, “ప్రభువా కృతజ్ఞతలు ఆయన నన్ను స్వస్థపరచెను” అని చెప్పవలసియున్నది. అది నిజము, అది జరిగిపోయినది. ఆయన దానిని నిరూపించాడు.

నీవు ఏ విధంగా? నేను నా వశములో లేను; కాని దర్శనములు, నీవు వాటిని చూడాలి. మీరు గమనించండి, నేను నిన్ను చూస్తున్నాను, మరియు అదే సమయములో నిన్ను ఎక్కడో చూస్తున్నాను. నా భావము మీకు తెలుసు. దర్శనములు. నేను ఆయన ప్రవక్తను లేక సేవకుడనని నీవు విశ్వసించుచున్నావా? నీవు దానిని నమ్ముచున్నావా? మనము ఒకరికి ఒకరము అపరిచితులము. నిన్ను నేను ఎరుగను, కాని ప్రభువు నిన్ను ఎరుగును.

101

ఇది యోహాను సువార్త 4వ అధ్యాయములో జరిగిన ఒక అద్భుతమైన చిత్రమునకు సాదృశ్యముగా ఉన్నది. ఒక పురుషుడు, ఒక స్త్రీ జీవితములో మొదటిసారిగా కలుసుకున్నారు. సమరయ స్త్రీ మరియు నజరేయుడైన యేసు, మీకు ఆ కథ గుర్తున్నదా? యేసు ఏమి చేశాడు? ఆయన సమరయ గుండా వెళ్ళవలసి వచ్చినది. దేవుడాయనను అక్కడికి పంపెను. నేను క్షేమత్-ఫాల్స్ దగ్గరికి రావలసి వచ్చినది. దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు. ఒక స్త్రీ వచ్చి యేసుతో మాట్లాడుచుండెను. ఆమె ఆత్మను సంధించన౦తగా యేసు ఆమెతో మాట్లాడినాడు. ఆమె సమస్య ఏమిటో కనుగొని ఆమెకు చెప్పాడు. ఆమె చెప్పినది, నీవు ఖచ్చితముగా ప్రవక్తవు. ఏలయనగా మెస్సీయ — ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు — ఆయన వచ్చినప్పుడు, ఆయన ఈ కార్యములను మాకు తెలియపరచును.“

యేసు చెప్పాడు, “నీతో మాట్లాడుచున్న నేను ఆయనను.”

102

మీరు గనుక ఎప్పుడైనా సమరయ వెళ్ళినట్లయితే, అక్కడ దృశ్యం ఈ విధంగానే ఉంటుంది ఇక్కడ అదే విధంగా ఆ కథ బయలుపరచబడినది. ఆమె ఇక్కడ ఉన్నది. ఆమెను నేను ఎరుగను. మేము అపరిచితులము. మేము మొదటిసారిగా కలుసుకొన్నాము. ఆ స్త్రీ ఇక్కడ ఎందుకు నిలబడినదో నాకు తెలియదు, కాని ఆమె ఎందుకు నిలబడినదని దేవుడు ఎరిగియున్నాడు. ఆయన దానిని గూర్చి పూర్తిగా ఎరిగియున్నాడు. నీ సమస్యను గూర్చి దేవుడు నాకు బయలుపరచినట్లయితే, నీ సమస్య ఏమిటో, లేక నీవు ఎందుకు ఇక్కడ నిలుచున్నావో బయలుపరిచినట్లయితే, నేను ఆయన సేవకుడను అని విశ్వసిస్తావా? ప్రేక్షకులు ఆ విధంగా నమ్ముతారా? ఇంకొకరు పురుషుడు; స్త్రీలందరూ విశ్వసించండి.

స్త్రీ జరుగుచున్నదానిని గూర్చి ఎరిగియున్నది. నాకు మరియు ఈ స్త్రీకి మధ్య వెలుగు నిలువబడియుండెను. మీలో ఎందరు దానిని చిత్రములో చూశారు? ఆ చిత్రములు ఇక్కడున్నవి. (జేన్, నీవు ఆ చిత్రములన్నింటినీ వేదిక దగ్గరకు తీసికొని వచ్చావా? నీవు ఒకటి తీసికొని రమ్ము). ఆ చిత్రమునకు కాపీరైట్ హక్కులున్నాయి, అది వాషింగ్టన్ డి.సి.లోని “రిలీజియస్-హాల్-ఆఫ్-ఆర్ట్”లో ఉన్నది. ఆ సహజాతీతమైన జీవి శాస్త్రీయంగా ఫొటో తీయబడినది. అది ప్రభుత్వం వారిచే ధృవీకరించబడినది. అది ఇక్కడ ఫొటో తీయబడినది. కాలిఫోర్నియాలోని ఆ స్థలము ఏమిటి? లేక్-పోర్ట్.

103

నీకు కొన్ని సమస్యలున్నాయి. గుండెజబ్బు, మరికొన్ని సమస్యలలో నీవు బాధపడుచున్నావు. నీవు ఈ పట్టణములో నుండి రాలేదు. నీవు మరొక పట్టణములోనుండి వచ్చావు, అది లేక్ అని పిలువబడుతుంది. నీవు లేక్-వ్యూ నుండి వచ్చావు. అది నిజము. నీవు మరొకరి కొరకు కూడా ఆసక్తి కలిగి ప్రార్ధిస్తున్నావు. అతనికి పెద్ద ప్రేగులో సమస్యయున్నది, అది ఒక కణితి వలె యున్నది. మరియు నీకు ముక్కులో కూడా ఏదో ఇబ్బంది యున్నది. అది నిజము. నీవు ఇక్కడ ఒక కుమార్తెను కలిగియున్నావు. అది నిజము. ఆమెకు చర్మసంబంధమైన వ్యాధి, ఆమెకు పాదములలో జబ్బు, అది నిజము. అది నిజమేనా? నీ భర్త రాలేకపోయాడు, అతడు కూడా రోగముతో బాధపడుచున్నాడు. పరిశుద్దాత్మ ద్వారా అతడి సమస్య ఏమిటో నేను చెప్పగలనని నమ్ముచున్నావా? మూలవ్యాధి, అది నిజము. నీవు ఎవరో నాకు దేవుడు తెలియపరచలడని నీవు నమ్ముచున్నావా? అది నీకు సహాయం చేయనా? నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పినది సత్యమని నీవు నమ్మగలవా? నీవు నమ్ముతావు. శ్రీమతి. టోట్జెల్ , నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగుపడతావు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచెను. సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక.

104

నీవు ప్రభువైన యేసును విశ్వసించుచున్నావా? అది ప్రేక్షకులలో స్థిరముగా నాటబడాలి.

అయ్యా, మీరు ఎలా ఉన్నారు? నేను ఆయన సేవకుడను అని మీరు నమ్ముచున్నావా? నీవు దానిని నీ హృదయమంతటితో విశ్వసించినట్లయితే. నీవు బలమైన వ్యక్తివి. నీవు మరొకరి కొరకు ఇక్కడ నిలువబడ్డావు. ఆ వ్యక్తి సమస్య వాపు రోగము. అది నిజము. నీవు విశ్వసించి వెళ్ళుము, అతడు బాగుపడెను. ఆమేనని. దేవునియందు విశ్వాసముంచుము. సందేహించవద్దు.

అక్కడ వెనుక కూర్చొనియున్న స్త్రీ ఆమె అనారోగ్యముతో బాధపడుచున్న చిన్నబిడ్డల యొక్క తల్లి. సహోదరీ, నీవు దేనినో తాకావు. నీవు విశ్వసించావు, అవునా? నీవు కూడా మూలవ్యాధితో బాధపడుచూ, ప్రార్ధన చేయించుకోవాలని కోరావు. ఇది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” నీ చిన్నబిడ్డలు అనారోగ్యముగా ఉన్నారు. నీకు రెండు జతల కవలలు. అది నిజము. అవునా సహోదరీ? అది నిజమైతే నీ చేతిని పైకెత్తుము. ఆమె దేనిని తాకినది? ఆమె ఎక్కడ కూర్చొనియున్నదో చూడండి. ఆమె ఏమి చేసినది? ఆమె ఎన్నడూ నన్ను ముట్టలేదు. ఆమె ఆయనను ముట్టినది. ప్రధాన యాజకుడిని ముట్టినది. ఆయన దానిని త్రిప్పగలడు. సహోదరీ, కలవరపడవద్దు. అమ్మా, నీవు స్వస్థపడ్డావు. మరియు నీ పిల్లలు బాగవుతారు. నీ విశ్వాసము నిన్ను రక్షించెను. నీవు విశ్వసించినట్లయితే, నీ విశ్వాసము నిన్ను రక్షించును.

105

అక్కడ ఒక స్త్రీ యున్నది, ఆమె కన్నులు ఈ విధంగా వాలియున్నాయి. ఆమె తన కొరకు ప్రార్ధించుచున్నది. ఆమె కీళ్ళ నొప్పులతో బాధపడుచున్నది. సహోదరీ, దేవుడు నిన్ను స్వస్థపరచును అని నీవు విశ్వసించుచున్నావా? నీవు ప్రార్థన చేస్తున్నావు. నీవు, “ప్రభువా, ఆయన నా పేరు పిలువనిమ్ము” అని ప్రార్ధిస్తున్నావు. అది నిజమైనచో, నీ చేతిని ఎత్తుము. నీవు ఆ విధంగా ప్రార్ధన చేసినట్లయితే, చేతిని ఎత్తుము. నీవు ప్రార్ధనలో చెప్పే మాటలు నాకు ఎలా తెలుసు? దేవునియందు విశ్వాసముంచుము, సందేహించవద్దు.

అయ్యా, ఎలా ఉన్నారు? మనము ఒకరికొకరము అపరిచితులము. నీవు నాకు తెలియదు, కాని ప్రభువు నిన్ను ఎరిగియున్నాడు. నిన్ను గూర్చి ఏదైనా కార్యమును ప్రభువు నాకు బయలుపరచినట్లయితే, నీ హృదయమంతటితో ఆయనను నీవు విశ్వసించుతావా? నీవు విశ్వసిస్తావు. నీవు తలలో సమస్యయున్నది. నీవు తలలోని సమస్యతో బాధపడుచున్నావు. నీవు యాంత్రిక సమస్యతో పీడించబడుచున్నావు. నీవు నీ రక్షణను గూర్చి సందేహిస్తున్నావు. నీవు సరిగా ఉన్నావో లేదో అనే విషయంలో నీవు పరిపూర్ణమైన నిశ్చయత కలిగిలేవు. అది నిజము, నీకు ఒక ప్రమాదం జరిగినది. శ్రీ. వుడ్లాండ్, నీవు దానిని నమ్ముచున్నావా? అది జరిగినది. అవునా? సరే మంచిది. వెళ్ళుము, నీవు స్వస్థపడ్డావు. దేవుడు నిన్ను దీవించును.

106

కేవలము విశ్వాసము కలిగియుండుము. నీ హృదయమంతటితో విశ్వసించుము. నీవు కేవలము విశ్వసించినట్లయితే, ఆయన నీవు మనవి చేసిన దానిని నెరవేర్చును.

నీవు నమ్ముచున్నావా? ఇప్పుడు చూడుము, దానిని గూర్చి నీవో ఏదో చేయవలసి ఉన్నదని నీవు ఎరిగియున్నావు. అది నిజమేనా? అది ఎలాంటి ఆత్మ? అది దేవుని ఆత్మ అని నీవు నమ్ముచున్నావా? ఆయన ఈ కార్యమును చేసినప్పడు, పరిసయ్యులు ఆయనను బయల్జేబాబు అని పిలిచారు. ఆయన చెప్పాడు, “ఈ పని చేసినందుకు నేను మిమ్ములను క్షమిస్తున్నాను, కాని పరిశుద్దాత్మ వచ్చినప్పుడు, మీరు ఆయనకు వ్యతిరేకముగా మాట్లాడినట్లయితే, అది ఎన్నటికీ క్షమించబడదు.” అది నిజమేనా? ఈ అద్భుతములు జరిగిన ప్రజలను అడగండి. అవి నిజమేనా అని వారిని అడగండి. అది నిజమని దేవుడు ఎరిగియున్నాడు.

107

అమ్మా, ఎలా ఉన్నావు? దయగలిగి స్త్రీ వలె యున్నది.

కేవలము చూడుము. నీవు బలహీనమైపోయావు. ఈ ప్రేక్షకులందరూ నా చుట్టూ తిరుగుచున్నట్లుగా నీకు అన్పిస్తుంది. గుర్తుంచుకొనండి, యేసు ఒక దర్శనము చూశాడు. ఒక వ్యక్తి ఆయనను ముట్టెను. ఆయన చెప్పాడు, “నాలో నుండి ప్రభావము తొలగిపోయినది” ఆ ప్రభావము ఏమిటి? “ఆయన శక్తి.”

అక్కడ కొందరు ప్రార్ధనా కార్డులు లేనివారు ప్రార్ధన చేయుచున్నారు. అక్కడున్న మీరు, మీరు దేవుని వైపు చూస్తూ, “దేవా, మేము నిన్ను విశ్వసించుచున్నాము. ఆ వ్యక్తికి నన్ను గూర్చి తెలియదు. ప్రభువా, నీవు నన్ను ముట్టినట్లయితే, నీవు నన్ను స్వస్థపరచినట్లయితే, అతడిని నాతో మాట్లాడనీయండి. నా హృదయమంతటితో నిన్ను విశ్వసించుచున్నాను” అని ప్రార్ధిస్తున్నారు. దానిని విశ్వసించమని నేను సవాలు చేయుచున్నాను. నన్ను విశ్వసించవద్దు; ఆయనను విశ్వసించండి, ఏలయనగా నేను కేవలము మానవుడను. నేను కేవలము మానవుడను. నేను ఈ మైకు వంటివాడను. మీరు మైకు మాటలు వినుట లేదు. అది నా స్వరము. మీరు వినేది నా మాటలు కావు, అవి ఆయనవి.

108

వెన్ను నొప్పితో బాధపడుచున్న వ్యక్తి అక్కడ కూర్చొనియున్నారు. యేసుక్రీసు నిన్ను స్వస్థపరచి నిన్ను పూర్తిగా బాగుచేయునని మీరు విశ్వసించుచున్నారా? అక్కడ నీ ప్రక్కన నీ భార్య కూర్చొనియున్నది. ఆమె వ్రేళ్ళకు సమస్య యున్నది. ఆమెను కూడా దేవుడు స్వస్థపరుస్తాడని నీవు విశ్వసించుచున్నావా? సహోదరీ, నీవు కూడా విశ్వసించుచున్నావా? అది నిన్ను హెచ్చరించుచున్నది కదా, సహోదరుడా? నీకు అంత విశ్వాసము ఉన్నదని నీకు తెలియదు. నీ చేతిని నీ భార్య మీద పెట్టుము. ఆమెకు ఒక విధమైన రుగ్మతలున్నాయి. అది ఆమె చేతులలో ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఒకరి హస్తములను ఒకరి మీద ఒకరు పెట్టుకొనండి. సాతానా, నిన్ను నేను గద్దించుచున్నాను. ఈ ప్రజలలో నుండి బయటకు రమ్ము, యేసక్రీస్తు నామములో వారు స్వస్థత పొందుదురు గాక. ఆమేన్.

ఇప్పుడు, పిలువబడిన ఇద్దరిలో ఎవరికైనా ప్రార్ధనా కార్డు లేదా? మీకు ప్రార్ధన కార్డు లేదా? మీకు అవసరము లేదు. సరే మంచిది. ఇప్పుడు, మీరు ఏమి కలిగియున్నారు? మీరు విశ్వాసము కలిగియున్నారు. మీరు ప్రధాన యాజకుడిని కలిగియున్నారు. నేను మిమ్ములను ఎరుగను. ఒకవేళ అది నిజమైతే మీ చేతులు ఎత్తండి. మనం అపరిచితులం. నా జీవితములో ఎన్నడూ మిమ్ములను చూడలేదు. మీరు కూడా నన్ను ఎన్నడూ చూడలేదని ఊహిస్తున్నాను, కాని మీరు విశ్వాసముతో ఆయనను ముట్టారు, దానిని బట్టి ఆయన మీకు బహుమానమిచ్చాడు. అది నిజము. ప్రజలు స్వస్థత పొందుటకు దేవునియందు విశ్వాసము ఉంచాలి. ఇప్పుడు మీరు స్వస్థత పొందారు. కలవరపడవద్దు, మీ విశ్వాసము మిమ్ములను బాగుచేసినది. యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. అది నిజము. అది సత్యము.

109

అమ్మా, నన్ను క్షమించండి. ఇప్పుడు నీకు ప్రార్థన చేయాలి. నేను ప్రేక్షకులను చూస్తున్నాను, ప్రజలు స్వస్థత పొందుటకు ప్రార్ధనా కార్డులు అవసరము లేదు. మీరు గ్రహించారా? దేవునియందు విశ్వాసము కావాలి. అది నిజము. ప్రజలు స్వస్థత పొందుటకు దేవునియందు విశ్వాసము కావాలి. మీరు విశ్వాసము కలిగి సందేహించనట్లయితే, దేవుడు మిమ్ములను స్వస్థపరచును.

అక్కడ గాయముతో కూర్చొనియున్న సహోదరుడు రాబర్ట్సన్. దానిని గూర్చి నీవు ఏమి తలంచుచున్నావు? దేవుడు నిన్ను స్వస్థపరచును అని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? సరే మంచిది, అయ్యా. నేను ఆ మనుష్యుడను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. నా జీవితంలో ఎన్నడూ చూడలేదు, కాని అతడు అక్కడ కూర్చొని ఆలోచించుచున్నాడు. అది నిజము. అయ్యా, అది నిజమేనా? నీ చేతిని ఎత్తుము. చూడండి, నీవు దేనిని గూర్చి ప్రార్ధించుచున్నావో యేసుక్రీస్తు ఎరిగియున్నాడు. కేవలము విశ్వాసము కలిగియుండుము. అది దేవుని నుండి వచ్చినదని నీ హృదయమంతటితో విశ్వసించినట్లయితే, నీ సమస్య ఏదైనా సరే తొలగిపోతుంది. నీ పేరు పిలుచునంతగా ఆయన నిన్ను ప్రేమించాడు. నీవు ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, ఆయన నీకు తిరిగి జవాబిచ్చాడు. ఆయన అద్భుతమైనవాడు కాదా?

110

ఎల్లప్పుడూ విపరీతమైన తలనొప్పితో బాధపడుచున్న వ్యక్తి వెనుక కూర్చొని యుండెను. యేసు నిన్ను స్వస్థపరుచును అని నీవు విశ్వసించుచున్నావా? నీవు విశ్వసించినట్లయితే, తలనొప్పి రోజులు గతించిపోయాయి.

మనము ఒకరినొకరము ఎరుగము. నేను నిన్ను ఎరుగను. మనము అనేక సంవత్సరముల మరియు అనేక మైళ్ళు దురమున ఉన్నాము. కాని యేసు మన ఇద్దరిని ఎరిగియున్నాడు. అది నిజము. నాకు తెలియని ఒక విషయమును ఆయన తన మహాశక్తితో బయలుపరచినట్లయితే, అది నీకు సహాయపడుతుందా? అది సహాయపడుతుంది. ఒకసారి దీనిని ప్రయత్నించుము, ఒక్కసారి పరిశుద్దాత్మ (దయతో ఎంతోసేపటి నుండి కనిపెట్టుచుండెను) ... తర్వాత మనము మిగిలిన వారి కొరకు ప్రార్థనలు చేద్దాము. నీవు ఇక్కడికి మరొకరి నిమిత్తము వచ్చావు. నీవు నరముల వ్యాధితో బాధపడువారూ మతిస్థిమితం-తప్పిన వ్యక్తి కొరకు వచ్చావు. అది నిజము. ఆ వ్యక్తి కొరకు తీసికొని వెళ్ళుటకు నీవు ఇక్కడ చేత రుమాలును పెట్టావు. అది నిజము. నీవు ఈ పట్టಣಂ నుండి రాలేదు. రోగ్ రివర్ దగ్గర గ్రాంటన్స్ పాస్ నుండి నీవు వచ్చావు. అది నిజము. నీవు గుండె జబ్బుతో బాధపడుచున్నావు. అది సత్యము. నీవు ప్రేమించుచున్న కుమార్తె ఇక్కడున్నది. ఆమె దత్తపుత్రిక, ఆమె ప్రార్ధనా వరుసలో వెనుక నిలువబడియున్నది. ఆమె గుండె జబ్బు మరియు గొంతులో కనిథితో బాధపడుచున్నది.

111

నీవు ఇక్కడకు బస్సులో వచ్చావు. నీవు తిరిగి రేపు వెళ్ళిపోతావు. ఇది మీకు ఇక్కడ చివరి రాత్రి. అది సత్యము. నీవు స్త్రీ భోధకురాలివి. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” అది సత్యము. నీవు విశ్వసించుచున్నావా? అయితే ఇంటికి వెళ్ళుము, నీవు దేనికొరకు మొర్రపెట్టావో అవి ఖచ్చితంగా పొందుకొనుము. పరలోకములోని దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. సహోదరీ వెళ్ళుము. అది ముగించబడినది. నీకు అంతా బాగవుతుంది. సందేహించవద్దు. విశ్వాసముతో వెళ్ళుము. ఆ స్త్రీ నిలబడియున్న స్థలములో నేను ఆ బాలికను చూడలేదు గాని, నా ముందు ఆమెను చూశాను.

మీరందరూ ఏక మనస్సుతో దానిని విశ్వసించుచున్నారా? మీలో ప్రతి ఒక్కరూ ప్రభువైన యేసును విశ్వసించుచున్నారా? “యిచ్చయించు వానిని రానిమ్ము.” అయ్యా, మీరు యేసుక్రీస్తును విశ్వసించినట్లయితే, కీళ్ళవాతము మిమ్ములను విడిచిపోతుంది. దానిని విశ్వసించుచున్నారా? అయితే సంతోషించుచూ వెళ్ళండి, “ప్రభువా, కృతజ్ఞతలు. మీరు నిజంగా నాకు ఎంతో మేలు చేశారు” అని చెప్పండి.

మీరు కూడా దానినే కలిగియున్నారు. మీరు ప్రోస్టేట్ సమస్య కలిగియున్నారు. మీరు దానిని గూర్చి కలవరపడుచున్నారు. నీ హృదయమంతటితో విశ్వసించినట్లయితే. మీరు నమ్ముచున్నారా? అయితే, “ప్రభువా, వందనములు. నేను స్వస్థత పొందాను” అని చెప్పుచూ సంతోషముగా వెళ్ళండి. సరే. మంచిది.

112

నీవు బలమైన యువకుడివి. నీకు గుండెజబ్బు ఉన్నది, అయితే ప్రభువు నీ గుండెజబ్బును స్వస్థపరచును అని విశ్వసించుచున్నావా? “ప్రభువైన యేసూ, వందనములు. నన్ను స్వస్థపరచినందుకు వందనములు” అని చెప్పుచు సంతోషంగా వెళ్ళుము.

సరే మంచిది. అమ్మా, ముందుకు రండి. నీ చుట్టూ చీకటి క్రమ్మినది. నిన్ను ఒక నల్లటి నీడ వెంబడిస్తున్నది, అనగా అది క్యాన్సరు. అది మరణపు చీకటి. దేవుడు నిన్ను స్వస్థపరచి బాగు చేయునని నీవు విశ్వసించుచున్నావా? నీ చేతిని ఎత్తి ఈ విధంగా చెప్పుము, “ప్రభువా, దానిని అంగీకరించుచున్నాను.” నీవు వెళ్ళి స్వస్థత పొందుము. నీ హృదయమంతటితో విశ్వసించుము.

అమ్మా, నీకిష్టమైతే ముందుకు రమ్ము, సరే, నీవు వెన్ను సమస్యతో బాధపడుచున్నావు. దేవుడు నీ వెన్నును స్వస్థపరుస్తాడని నీవు నమ్ముచున్నావా? నీవు వెళ్ళి స్వస్థత పొందుము. నీ హృదయమంతటితో విశ్వసించుము. అక్కడున్న నీవు విశ్వసించుచున్నావా?

సరే మంచిది. అయ్యా, ముందుకు రండి. నీకు ఉబ్బసముగా ఉన్నది. దేవుడు దానిని స్వస్థపరచును అని నీవు నమ్ముచున్నావా? ప్రభువా, వందనములు అని చెప్పుచూ, వెళ్ళి, స్వస్థత పొందుము.

అయ్యా, రండి. మీకు మధుమేహము. నీ మధుమేహమును ప్రభువు స్వస్థపరచును అని మీరు నమ్ముచున్నారా? వెళ్ళి బాగుపడుము. నీ సమస్యలన్నింటి విషయములో విశ్వసించుము.

నీకు వీపులో సమస్యయున్నది. నీకు దెబ్బలు తగిలాయి. నిన్ను దేవుడు స్వస్థపరచును అని మీరు నమ్ముచున్నారా? నీవు వెళ్ళుచూ స్వస్థత పొందుము. దేవునియందు విశ్వాసముంచుము.

113

అయ్యా, ఇటు రండి, ఒక్క నిమిషము. ఈ వ్యక్తి చెవిటి ఆత్మను కలిగియున్నాడని గ్రహించుచున్నాను. ఒక్క క్షణము నీ తలను వంచుము. ఓ దేవా, భూమ్యాకాశముల సృష్టికరా, నిత్యజీవమునకు మూలమైనవాడా, ప్రతియొక్క మంచి బహుమానమును అనుగ్రహించువాడా, ప్రభువా, ఈ వ్యక్తి యొక్క చెవులను తెరచి, అతడు వినగలుగునట్లు సహాయం చేయండి. అతడు వినలేడు. వినుట వలన విశ్వాసము కలుగును, (ఆయన మీద చెవిటి ఆత్మ ఉన్నది) ప్రభువా, యేసు నామములో అతని చెవులు తెరవండి. సాతానా, అతడిని విడిచిపెట్టుము. ఎంతకాలము నుండి ఈ విధంగా ఉన్నావు? చాలా కాలము నుండి? నీవు ఇప్పుడు సరిగా నా మాటలు వినగలుగుచున్నావా? సరే, మంచిది. ఇప్పుడు నా మాటలు విన్పిస్తున్నాయి? ఇప్పుడు నా మాటలు విన్పిస్తున్నాయా? [“అవును.”] “ఆమేన్” అని చెప్పుము. “నేను ప్రభువును ప్రేమిస్తున్నాను”, “ప్రభువుకు, స్తోత్రము.” [“ఆమెన్.”] ఇప్పుడే అవి వేరుపడుచున్నవి. నీవు స్వస్థపడ్డావు. నీవు ఇంతకు ముందు జరిగిన కూటములలో స్వస్థత పొందావు. ఆమేన్. అది జరిగినప్పుడు నేను చూశాను. ఆమేన్. చాలా సంవత్సరముల క్రితము ప్రభువు నిన్ను స్వస్థపరిచాడు. [స్పష్టతలేని మాటలు] దేవుడు నిన్ను దీవించును గాక. ఆయన అద్భుతమైన వాడు, కాడా? మన ప్రభువు అద్భుతమైనవాడు కాదా? ఆయన చేయని ఒక్క కార్యమును నాకు చెప్పండి.

114

నేను ఆ వ్యక్తిని దానికొరకు తీసికొనుటకు కారణమేదనగా, చెవుడు ఎలా ఉంటుందో, నాకు తెలియదు. బాంబు పేలుడు వలన అతని కర్ణభేరి దెబ్బతిన్నదని అతడు చెప్పాడు. కాబట్టి అతడికి ఏమైనా విన్పిస్తుందో లేదో నాకు తెలియదు. అతనికి చెవుడు ఉన్నదని నేను గ్రహించాను. ఒకవేళ అతడు వినలేనట్లయితే, నేను అతడి కొరకు ప్రార్ధించేవాడిని. అతడు వేరొక వరుసలో ప్రార్థన కొరకు నిలబడినప్పుడు, అతని మీద దేవుని మహిమ చూశాను. ఆ వ్యక్తి మరొక కూటములో స్వస్థత పొందాడు. ఇప్పుడు ఆ వ్యక్తి పూర్తిగా బాగయ్యాడు. అందుకే మీరు ఆయనను పట్టుకొని ఉండండి, ఆయన దానిని వినేవరకు, ఆయన దానిని నెరవేర్చేవరకు ఆయనను పట్టుకొనియుండండి. విశ్వాసంతో. అప్పుడాయన ఆలకించును. వినుట వలన విశ్వాసము కలుగును.

మీరందరూ ప్రభువైన యేసును విశ్వసించుచున్నారా? ఇప్పుడు, ఈ భవనములో సైన్యములకు అధిపతి ఉన్నాడని రూఢిగా నమ్ముచున్నారు? మీరు నమ్ముచున్నారా? ఇప్పుడు మీరు ఒకరిపైన ఒకరి హస్తములుంచండి. మనందరమూ సమాజముగా ప్రార్థన చేద్దాము. “నమ్మినవారివలన ఈ సూచక క్రియలు జరుగును” అని నమ్మిన వారందరూ ప్రార్థన చేయండి. ఇప్పుడు, మనము స్వస్థపరచలేము గాని, విశ్వసించగలము. దయచేసి విశ్వసించండి. ఆయన ఈ మార్గములో వెళ్ళుచున్నాడు.

115

యేసూ, దేవుని కుమారుడా, నన్ను కరుణించుము. దేవుని కుమారుడా, నన్ను కరుణించుము. భూమ్యాకాశముల సృష్టికర్తా, నిత్యజీవమునకు కర్తా, నీ ప్రజలను ఆశీర్వదించండి. వారు నీ నామమును స్తుతించుచున్నారు. నేను చాలా బలహీనంగా ఉన్నాను, నేను ఎక్కువసేపు నిలబడలేను. నీ ఆత్మ బహుబలముగా ఈ ప్రజల మీదకు రావాలని ప్రార్ధిస్తున్నాను. వారు లేచి, “దావీదు కుమారుడా, నన్ను కరుణించుము” అని కేకలు వేయుదురు గాక. ప్రభువా, దానిని అనుగ్రహించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుదురు గాక. సాతానా, యేసుక్రీస్తు యొక్క ప్రోక్షణ రక్తము, ఆయన శ్రమలు, పునరుద్దానమును బట్టి నిన్ను గద్దిస్తున్నాను. ఈ ప్రజల నుండి బైటకు రమ్ము యేసుక్రీస్తు నామములో ఈ ప్రజలను విడిచిపొమ్ము!

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...