ఆ బండతో మాట్లాడుము మరియు అది ఆయన యొక్క నీళ్ళనిచ్చును
VGR COUNT-194 కృతజ్ఞతలు, సహోదరుడా, మీరు కూర్చొనవచ్చును. చాలా సేపటి నుండి మిమ్ములను నిలబెట్టి పాటలు పాడించినందులకు క్షమించండి, కాని ఇప్పుడే చాలా సంవత్సరాల నుండి చూడని ఒక నా పాత స్నేహితుని కలుసుకున్నాను, ఇక్కడే బయట, సహోదరుడు నోయల్ జోన్స్ మేము ఇద్దరము కలసి దిగువ ఆర్కాన్సాస్ వేటకు వెళ్ళేవారము. మీరు వినే ఉంటారు నేను దానిని గురించి చాలా సార్లు మాట్లాడాను. అతనికి బల్లి వంటి కళ్ళు ఉండేవి, దాని సహాయము వలన అతను ఉడుతలను కాల్చేవాడు నేను మాత్రము వాటిని చూడను కూడా చూడలేకపోయేవాడిని. అయితే, అతనిని ఇప్పుడే గుర్తుపట్టడం జరిగింది. అతను కొద్దిగా మారాడు మరియు అతను ఇప్పుడు తాతాగారు అయ్యారు. కానీ అతనిని చూడటం నాకు చాల సంతోషంగా ఉంది.
ఎవరో నాతో చెప్పారు, నా ఫీల్డ్ సెక్రటరీలో ఒకరు, అది ఈ రాత్రి ఇక్కడ ఇంకొక నా స్నేహితుడున్నాడని, ఒక పాత స్నేహితుడు, సహోదరుడు మొరిసన్ దరిదాపుగా శాన్ ఫ్రాన్సిస్కో చుట్టు ప్రక్కల నుండి వచ్చారు. సహోదరుడు మొరిసన్ గాని నిలబడగలిగితే నేను ఆశ్చర్యపోతాను, లేక చేతిని పైకెత్తి పట్టుకున్నా లేక కొద్దిగా ఎక్కడైనా నేను... మొరిస్, సహోదరుడా. దీవించును గాక. నేను నిజంగా చెబుతున్నాను మిమ్మల్ని మళ్ళీ చూసినందుకు సంతోషంగా ఉంది. దేవుడు నిన్ను దీవించును గాక. ఓహ్, ఒక పాత బైబిలు టీచరు. నాకు గుర్తున్నది. నీతో పాటు ఆ సహోదరి కూడా ఉన్నారా? అవును, మంచిది, నాకు చాలా సంతోషంగా. ఉంది మిమ్మల్ని చూసినందుకు ప్రభువు మిమ్మల్ని దీవించును.
వారు చాలా చాలా సంవత్సరాల క్రితం పశ్చిమ తీరముకి మొదటి సారి వచ్చినప్పుడు మొట్ట మొదటగా నాకు మద్దతు (sponsor) చేసినవారిలో కొందరు. ఓ, ఇది ఇంటికి తిరిగివచ్చు వారములా యున్నది. అద్భుతం.
2
మంచిది, మనము మన సహోదరుడును మరియు సహోదరిని ఇంకా సహోదురుడు జోన్స్, సహోదరి జోన్స్ను కలిగి ఉన్నాము. మరియు వారిని నేను చాలా సంవత్సరాల నుండి గుర్తు౦చుకున్నాను. కానీ అతను ఇంకా గుర్తుపెట్టుకున్నాడని నేననుకోను. అతను వెనుకకు తిరిగి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నేను దాదాపు ఎనిమిది పగళ్ళు మరియు రాత్రులు వేదిక మీద ఉన్నానని అతను నన్ను అడిగాడు. “సహోదరుడా బ్రెన్హాం, నీవు కొంచం వేటాడుటకు ఇష్టపడవా?”
నేనన్నాను, “ఓ, దాన్ని నేను ప్రేమిస్తాను.”
అతడన్నాడు, “మంచిది, నేను నిన్ను వేటకు తీసుకుని వెళ్తాను.”
ఇంకా సహోదరుడు జాన్సన్ మరియు నేను అతని దగ్గర ఒక పాత 97 తుపాకీ ఉంది. మీకు తెలుసు నేను దేనిని గురించి మాట్లాడుతున్నానో. ఇప్పటి వరకు తయారు చేసిన వాటిలోకెల్లా ఉత్తమమైనది. మరియు తరువాత... అతనికి మరియొక పాత తుపాకీ ఉన్నది అది వేరొక దగ్గర నుండి ఋణముగా తీసుకున్నది. అది ఒకానొక పురాతనమైనది. మీకు తెలుసా, ఒక పాత - ఒక పాత తుపాకీ, అది ఒక సింగల్ బారెల్ దానిని కాల్చిన ప్రతీసారి, అది తెరుచుదానిని కొడుతుంది. మనతో పాటు ఒక కర్రని తీసుకొని వెళ్ళవలసి వస్తుంది. ఆ గట్టి డొప్పని కొట్టి బయటకు తీయుటకు ఇంకా నోయల్ నాతో అన్నారు, అతను ఇలా అన్నారు “ఇప్పుడు, సహోదరుడా బ్రెన్హాం, ఈ తుపాకీ నీవు తీసుకో”
నేనన్నాను, “లేదు, నేను నిన్ను ఏ రోజైనా దీనితోనే ఓడిస్తాను.”
అతడన్నాడు, “నేను చెబుతున్నాను, నీవు తుపాకీ తీసుకొనుట మంచిది.”
తరువాత వారు కుక్కను వదిలి వేస్తారు, ఇంకా అతను చెట్టెక్కిన 15 ఉడతల వెంట పరుగెత్తాడు, మరియు అతను అరుస్తున్నాడు. అతనున్న చోటికి మేము పరుగెత్తటం ప్రారంభించాము, అతను ఈలాగన్నాడు “ఇప్పుడు నీకు ఉడతలు కావాలంటే, ఇది నీకు చివరి అవకాశం, నీవు ఈ తుపాకీ తీసుకొవటం మంచిది.”
నేనన్నాను, “ముందుకు కదులుతూనే ఉండు.”
మంచిది అతని దగ్గర మూడు ఉడతలు ఎగురుతున్నాయి. నేను నా జీవితంలో అంత కాల్చుటను ఎక్కువ మొత్తములో చూడలేదు, ఉడతలు ప్రతిచోట పడిపోతున్నాయి. మరియు నేను ఒకసారి కాల్చాను. ఇంకా ఆ పాత తుపాకీ నన్ను క్రింద పడేటట్టు చేస్తుంది. నేను గుండుని బయటకు కొట్టటానికి ప్రయత్నిస్తున్నాను.
3
కొద్ది రోజుల తరువాత సహోదరుడు జాన్సన్ని తీసుకెళ్ళాము. మరియు (అతను వారి యొక్క మామయ్య) ఇంకా మేము నడుచుకుంటూ దిగువన గల కాలువను దాటుకుంటూ ఆర్కాన్సాస్కి వెళ్ళాము. మరియు అతను. అయితే అతని దగ్గర ఒక జత బూట్లున్నాయి. అదరిలోకి సహోదరుడు నోయల్ ఎత్తైనవాడు, పొడవుగా లావుగా వుంటాడు. మరియు ఆయన నన్ను తీసుకొని, ఆయనకు వీపు మీద నన్ను ఎక్కించుకొని చిన్న నీటి కాలువ దాటించాడు. ఆయన మరలా వెనుకకు వచ్చి సహూదరుడు జాన్సన్ని తీసుకొని వస్తుండగా, అతను తక్కువ ఎత్తుతో పొట్టిగా, లావుగా వుంటాడు, ఇంకా నేను అతనిని ఆటపట్టించడం మొదలు పెట్టాను. మరియు నోయల్ నవ్వసాగాడు మరియు సహూదరుడు జాన్సన్ని సరిగ్గా నీటి మధ్యలో పడవేశాడు.
ఓ దేవుడు దీవించును, సహోదరుడు జాన్సన్. అతను అప్పుడే నాతో చెప్పారు అతను చాలా అనారోగ్యంగా ఉన్నాడని. కాబట్టి, గొప్ప దేవుడు అతనికి సహాయం చేయాలని నేను ప్రార్థించాను. అతను వాళ్ళ మావయ్య గారు.
4
ఓ, నేను మీకు చెబుతాను, నేను ఎక్కడైతే సంచరించానో, వాటిలో మంచివైన కొన్ని పాత హృదయాలు ఆర్కాన్సాస్ పాత నీలి రంగు చొక్కాల క్రింద ఇంకా కొట్టుకుంటూనే వున్నాయి. మీరు కాదా....? ఇక్కడ ఎంతమంది ఆర్కీస్ (ఆర్కాన్సాస్ ఊరి వారు) వున్నారు మీ చేతులు చూపండి. మంచిది, కాలిఫోర్నియా బయట అంతా ఓకీస్ మరియు ఆర్కీస్, వాళ్ళు నాకు చెబుతారు. మంచిది, అది మంచిదై ఉండవచ్చు. ఒక్లహామా మరియు ఆర్కాన్సాస్ ఇద్దరు మంచివారై ఉండవచ్చు. నిజాయితీగా, ప్రతి ఒక్క చోట మీరు దేవుని మనుషులను వెదకవచ్చును, వారు మంచివారై ఉన్నారు. అదే ఖచ్చితంగా నిజము, ప్రతి ఒక్క చోట.
5
ఈ రోజు ఉదయము మనకు చాలా మంచి కూడిక ఉండెను. ఒక మంచి సహవాసం గల ఫుల్ గాస్పెల్ బిజినెస్ మెన్స్ అల్పాహారపు విందు. నేనక్కడికి కొద్దిగా ఆలస్యంగా వెళ్ళాను, కానీ ప్రభువు యొక్క కొన్ని దీవెనలను నేను అనుభవించాను. పరిశుద్ధాత్మ క్రిందికి వచ్చి మమ్ములను దీవించడం వలన నేను “సహవాసానికి దేవుడు ఏర్పరిచిన మార్గము,” అనే అంశం మీద మాట్లాడాను. మరియు దేవుడు ఏ విధంగా ఆయన కుమారుని రక్తం ద్వారా మనల్ని చూస్తున్నాడు మరియు మన ఎర్రని పాపాలు తెల్లని మంచువలె అవుతున్నాయి.
ఇప్పుడు, రేపు రాత్రికి, ఎవరైతే ఆరాధనను మధ్యాహ్నం నుండి రాత్రి అయ్యేంత వరకు మార్చిన వారికి ధన్యవాదములు, ఎందుకంటే దాని కొరకు నేను ప్రార్ధి౦చుట జరిగింది. ఇప్పుడు, మనము సంఘమునకు దూరముగా కూడికలు ఏర్పాటు చేసుకోనక్కర లేదు. మనము ఈ మధ్యాహ్నపు కూడిక వలె ఏర్పడటానికి ప్రయత్నిద్దాం, కాబట్టి అందరు వారి వారి స్వంత సంఘ ఆరాధనకు వెళ్ళవచ్చును. కానీ రేపు మధ్యాహ్నం అత్యంత వేడి కలిగివుంటుంది. మరియు మనము చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ఇతర సంఘ పరిచారకులు కూడా వారి వారి సంఘాలతో ఈ కూడికకు రానైయున్నారు.
6
ఇప్పుడు, సందర్శకులు ఇక్కడున్నారు, ఉదయాన ఇక్కడ ఈ లోయలో వున్న చాలా సంఘాలలో మంచి సంఘమును చూడగానే దానికి హాజరు అవ్వండి. మీరు ఎంచుకున్న సంఘానికి సంఘ పెద్దలు, వారిని వారు ఎక్కడి నుండి వచ్చారో అని పరిచయం చేసుకొన్నారని నేను అనుకుంటున్నాను. ఈ ఉదయాన వాటిలోని కొన్ని సంఘములకు హజరవ్వండి. తరువాత వారికి సహాయం చేయండి, ఎందుకంటే వారు వారి ఆరాధనలను రద్దు చేసుకుంటున్నారు, రేపు రాత్రికి వారిలో చాలా మంది, ఇక్కడ ఈ ఆరాధనకి హాజరు అవుటకు.
దేవుడు మిమ్ములను దివించును గాక సహోదరులారా, అది చాలా గొప్ప విషయం. అది ఒక మేలైన సహాయం, నేను దానిని అభినందిస్తాను. ఇవి నిజంగా ఎటువంటి సంగతులంటే, అది ఒక మనిషి హృదయాన్ని మరలా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లుగా తయారు చేస్తుంది, మనము సహవాసాన్ని కలిగి ఉండాలి. అక్కడ ఆత్మలు రక్షించబడతాయని నేను నమ్ముతాను, అది మీ సంఘాలకి సమృద్ధి కలుగచేస్తుంది. నీ హృదయంలో ఏ కోరిక కలిగి ఉన్నప్పటికీ, అది నీకు దేవుడు దయ చేయును గాక, మీరు మరియు మీ యొక్క మంచి ప్రజలు ఈ ఉజ్జీవం కలిగిన ఎండ వేడి రాత్రులలో మాకు మేలైన సహాయం చేయండి.
7
రేపు మధ్యాహ్నం మన గురి... నేను ప్రమాణం చేస్తున్నాను, కూడికకు హాజరు అయ్యే వారందరు ప్రార్థన కార్డును కలిగివుంటారు. మనకు కొన్ని వివేచనా కలిగిన రాత్రులున్నాయి. మనము కార్డు తీసుకోవడానికి ప్రయత్నిద్దాం తరువాత ప్రతి ఒక్కరు హాజరగుటకు, దాని కొరకు ప్రార్ధనా కార్డు కావలెను. మీరు దానిని కలిగివున్నారా, మరియు నేను కార్డు కలిగిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరు వారి కొరకు ప్రార్థనలో ఉండాలి. నేను దానిని ఖచ్చితంగా చేస్తాను. దానిని మనము ఈ రాత్రికి మరియు రేపు మధ్యాహ్నము లేక రేపు రాత్రికి చేయటానికి ప్రయత్నిద్దాము. ప్రార్థనా కార్డులు ఆరాధనకు ఒక గంట ముందుగా బయట ఇవ్వబడతాయి. ఆరాధన 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైతే కార్డులు 6 గంటల 30 నిమిషాలకు కార్డులు కావలసిన వారందరూ 6 గంటల 30 నిమిషములకు వచ్చి తీసుకొనవచ్చును.
మేము అలా చేయుటకు కారణమేమంటే, అది వారు రావటానికి ఒక మంచి అవకాశం, అది వారు ఎంత త్వరగా అంటే అంత త్వరగా కార్డును పొందుటకు. కానీ మేము కొద్ది సమయం మాత్రమే ఇస్తాము, ఎందుకంటే మాకు ఇతరుల ఆరాధనలకు భంగం కలిగించాలనే ఉద్దేశ్యము లేదు.
8
ఫీల్డ్ సెక్రటరీ, సహోదరుడు గోడ్, సహోదరుడు మెర్సియర్, ఇంకా వారు నాకు ఇప్పుడే చెప్పివున్నారు, తప్పకుండా, రేపు పుస్తకాలు మరియు టేపులు తీసుకొనుటకు చాలా ఆలస్యం అవ్వవచ్చును. మనము ఆదివారము నాడు వాటిని అమ్మకుండా వుండటమనేది ఒక అలవాటుగా చేసుకొని ఉన్నాము. ప్రత్యేకించి టేపులు మరియు పుస్తకాలు ఇంకా వారు ఏది కలిగి ఉంటే అది.
ఇప్పుడు, అవి నాకు సంబంధించినవి కావు. అవి నావి కావు, దాని వలన నాకు ఏ విధమైన ధనం రాదు. నాకు నా సంఘం నుండి జీతం వస్తుంది. ఒక వారమునకు 100 డాలర్లు [కార్ల శబ్దము పక్కనే వినబడుచున్నది]. కావున మనము ఆ విధంగా పరకలోకపు రహదారికి చేరగాలిగినట్లయితే ఆలాగు, మనము ఏమి చేయకుండానే ఉన్నామా? అక్కడ జరుగుతున్న జలోపి రేసుల (పాత కారు పందాలు) మాదిరి. కాని, వారు నన్ను (ఆ కార్ల శబ్దముతో) ము౦చి వేస్తారు అని నేను నమ్ముట లేదు, వారు చేస్తారన్న నమ్మకం నాకు లేదు. మనము దానికంటే ఎక్కువ గట్టిగా అరవ గలము. కేవలం కొద్ది అరుపులకే యెరికో గోడలు కూలిపోయినట్లయితే, ఎందుకు, ఇప్పుడు ఆ చిన్న భాగము మనల్ని గాయపరచదు, గాయం చేసిందా? బహుశా తరువాత వాటి ముక్కలు క్రింద పడివుంటాయి.
9
కావున మనము రేపటి రాత్రి కొరకు ఎదురుచుస్తున్నాము, అది రాత్రి అవ్వాలని ఎదురుచూస్తున్నాము. మరి ఇప్పుడు, నేను చెప్పినట్లుగా, నా సంఘం నుండి నాకు జీతం వచ్చుచున్నది. ఒక వారమునకు 100 డాలర్లు మిగతా ధనం చాలా రకాల కూటముల ద్వారా వచ్చినదంతా, ఫౌండేషన్ కి వెళుతుంది; తరువాత అదంతా ఒక ప్రక్కగా ఉంచబడుతుంది కావున అది ఎప్పటికీ నాది కాదు, లేక అది వేరొకరిది కాదు, అది పూర్తిగా విదేశాలలోని వాక్య పరిచర్య (మిషనరీ) నిమిత్తం వాడబడుతుంది. నేను కావలసినంత డబ్బు గానీ సమకూర్చగలిగితే, దానితో నేను వెళ్ళగలుగుతాను, నేను వెళ్ళి అన్యజనులకు బోధిస్తాను, యేసుక్రీస్తు ఎవరో కూడా తెలియని మరియు మా యొక్క కూటములలో అక్కడ మేము చాలా అద్భుతమైన గొప్ప కార్యాలు చూశాము, మా యొక్క గొప్ప అవసరత.
దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్లో, ఒక్క వేదిక పిలుపుకు 30,000 మంది ముసుగులు ధరించే వారు యేసుక్రీస్తుని తమ స్వంత రక్షకుడిగా అంగీకరించడం నేను చూశాను, ముప్పది వేల మంది. ముంబాయి, భారత దేశంలో, మహమ్మదీయులు ఇంకా వారు, ఇది చెప్పుటకు చాలా కష్టం, సంఖ్య చెప్పుటకు చాలదు. ఆ నగరంలో కూటమికి హాజరు అయినవారి సంఖ్య ఊహించినట్లయితే, ఐదు-వందల-వేలమంది (5 లక్షలు). వారిని ఉంచుటకు మా దగ్గర ఏ మాత్రము స్థలము లేకుండా పోయెను. చాలా మంది వెళ్ళిపోవలసి వచ్చింది ఎందుకంటే మేము వారికి కావలసినంత స్థలమును చూపించలేకపోయాము. త్వరలోనే తిరిగి న్యూఢిల్లీ వెళ్ళాలని అనుకుంటున్నాము, అక్కడ రాష్ట్రపతి మాకు యాంపిధియేటర్ని ఇస్తే మేము దానిలో వేల మందిని ఉంచగలము, ఒక బహిరంగ యాంపిధియేటర్, విశాలంగా చుట్టు పరుచుకున్న పర్వతాలు మేము అక్కడ చాలా అధ్బుతాలు జరుగుతాయని అనుకుంటున్నాము.
10
అక్కడ దూరంగా ఉన్న ఆ ప్రజలకి ఏమియు తెలియదు, నల్లని చిన్న పిల్లలు అలా నిలబడివుంటారు, వారు వారి జీవితంలో ఒక్కసారి కూడా స్నానం చేసివుండరు, వారికి ఏది కుడి చేయ్యో ఏది ఎడమ చేయ్యో కూడా తెలియదు, వారి చెంపల మీద నుండి జారుతున్న చిన్న కన్నీటి ధారతో నిలబడివుంటారు, వారిని దేవుడు ఏ విధంగా ప్రేమించాడో దానిని గురించి ఒక్క సారైన వినుటకు. ఏప్పుడైతే నీవు అది చేస్తావో, నా స్నేహితుడా.... నాకు తెలుసు ఇక్కడ ఇంటి దగ్గర మనము మన సంఘాలకు సహాయం చేస్తాము. అది ఖచ్చితంగా మంచిదే. కానీ ఇక్కడ మనకు ప్రతి రోడ్డు మలుపులో ఒక పెద్ద చర్చిని కలిగివున్నాము, పెద్దవైన మంచి శిఖర కట్టడాలు కలిగివున్నాము, ఇంకా అన్నియు కలిగివున్నాము, మరియు చాలా పేదవారిగా ఉ౦డిపోయారు, యేసుక్రీస్తు మీ పిల్లలు మరియు నా పిల్లల కొరకు ఎలాగైతే చనిపోయారో వారి కొరకు కూడా అదే విధంగా క్రీస్తు చనిపోయారు. ఆయన ఆకలిగొని ఉన్నాడు. మన పిల్లలు ఏ విధంగా ఆకలిగొని ఉన్నారో ఆ విధంగానే, ఇంకా మనము అన్నీ కలిగివుండుట అనేది అది సమంజసం కాదు, చివరికి అందములో కూడా, అక్కడ ఒక్కసారి కూడా దేవుని సువార్త వినని పేదవారు అనేక మంది ఉన్నారు. దానిని తీసుకొనుట మన భాద్యత అని నేననుకుంటున్నాను. మీరది చేయకపోతే, మీరు ఇచ్చే కానుకలను ప్రేమతో నాకు అందివ్వండి అది....
11
మీకు ఆ సంగతి తెలియాలి అని నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు ఖర్చులు గాని సరిపోకపోతే, ప్రేమ పూర్వక కానుకను నేను తీసుకోను మరియు ఖర్చులు అనేవి సరిపోకపోతే, నేను నా ఖర్చుల కొరకు కొన్నిసార్లు డబ్బు ఇవ్వవలసి మరియు తీసుకొనవలసి వస్తుంది. మనము చెల్లించవలసిన ఒక్క పెన్నీ (పైసా) యైనా గానీ చెల్లించకుండా నగరం దాటి బయటకు పోలేము అది నా సాక్ష్యం, మరియు ఎక్కడైనా స్థలములో అది చెల్లించకుండా వుంటే, అదే గనుక అయితే తప్పకుండా నేను నా యింటికి వచ్చి నా గుడారంలో తిరిగి కాపరిగానే ఉండే సమయం వచ్చినట్లే.
నేను నా జీవితంలో ఒక్క కానుక కూడా తీసుకోలేదు. నేనేప్పుడూ దేవుని మీదే ఆధారపడియున్నాను. నేను ఎప్పుడూ నా కూటములలో విశ్వాసుల నుంచి డబ్బు యాచించుట, మరియు లాగుకొనుట చేయలేదు. ప్రజలు దేవుడిని ప్రేమించగలిగితే, పేద ప్రజలు, వారు తప్పకుండా వారు తప్పకుండా ఇవ్వగలిగిన సహకారం ఇస్తారు. ఒకవేళ వారు గానీ చేయలేక పోతే, తరువాత నేనే - నేను మరో విధంగా నా స్నేహితులలో ఎవరో ఒకరి నుండి అప్పుగా తీసుకొని దానిని చెల్లిస్తాను.
ఇంక తరువాత, నేను అది గానీ పూర్తిగా చెల్లించబడితే, అప్పుడు స్వేచ్చగా, నేను ప్రేమపూర్వక కానుకను తీసుకుంటాను. నేను దానిని కనీసం చూడను కూడా చూడను. నా సెక్రటరీ దానిని తీసుకుంటారు, మరియు అది దానికొరకు నియమింపబడిన, బ్యాంకులో వెయ్యబడుతుంది, అది బ్రెన్హాం టాబర్నికల్, న్యూ-అల్బాని, ఇండియానా, అనే పేరు క్రింద బ్యాంకులో వెయ్యబడుతుంది. అక్కడ ఆ డబ్బు వేరే దేనికిని వాడబడదు, కానీ దేవుని యొక్క రాజ్యానికి, నేను వెళ్ళి సువార్త ప్రకటించే విదేశియ కార్యక్రమాలకు దాని ద్వారా సహాయం చేయబడుతుంది. తరువాత నేనేప్పుడైతే ఇక వెళ్ళుటకు సరిపడినంత సమకుర్చబడుతుందో, అప్పుడు నేను బయలుదేరి వెళతాను.
ఈ సమయంలో, ఇక్కడ వున్న వారందరికి అది ఏమిటి అనేది తెలియజేయబడును అని నేను నమ్ముచున్నాను.
12
ఇక్కడ మేము కలిగివున్న ఈ పుస్తకములు, సహూదరుడు, గోర్డాన్ లిండ్సేకి సంబంధించినవి. అవి ఆయనవి. వాటిని ఆయన వ్రాసియున్నారు. వాటిని ఆయన అమ్ము దానికన్నా మేము 40 శాతం తక్కువకు మరలా అమ్ముకునే వారికన్నా తక్కువకు కొన్నాము. ఇక్కడ ఉన్న ఈ బాలురకి ఈ పుస్తకాలు అమ్ముట వలన కొంత చెల్లించబడుతుంది. వారు ఆ పుస్తకాలు తీసుకొని వచ్చినందుకు వారికి రవాణా సౌకర్యాల కొరకు చెల్లించబడుతుంది. వాటిలో చాలా పోయినవి. వాటిలో చాలా ఎక్కడో ఇవ్వబడినవి. మేము వాటి మీద ఎల్లప్పుడూ నష్టపడివున్నాము. గుడారము (టాబర్నికల్) కొరకు బాలురు టేపులను అమ్ముతారు. ఇప్పుడు ఈ టేపులు కాపీరైటు హక్కు కలిగివున్నాయి. మరియు అవి అత్యంత మంచి నాణ్యమైన టేపులను పొందుకోవలసియున్నది, ఆ పుస్తకములలాగ. అవి గాని మీకు సంతృప్తి కలిగించనట్లైతే తిరిగి వెనుకకు పంపండి, మీ డబ్బు తిరిగి పొందండి. చూడండి? మేము. ఇంకా పుస్తకములను - టేపులను నిజానికి చాలా తక్కువకు అమ్ముచున్నాము. రికార్డులు మరియు ఏదైనా మీరు కొన్నట్లైతే అవి నావి కావు, అది వేరొకరికి సంబంధించినది అవుతుంది. ఇవి మేము కేవలం కూడికలలో ఉంచియున్నాము. మరియు అవి మీకు సహాయపడవని అని నేను అనుకుంటే, లేక ఒక ఉద్దేశానికి సహాయపడకపోతే, అదే గనుక జరిగితే నేను వాటిని ఇక్కడ అమ్మటానికి అనుమతిని ఇచ్చేవాడిని కాదు.
ఇంక నేను వాటి ద్వారా వెదకుచున్నాను, చూడండి వాటి రేటు విషయంలో ఏదైనా తేడా ఉన్నట్లయితే, మిగతా వారి ధరలతో వీటిని పోల్చుకొనండి. ఏదైనా అధికంగా ధర ఉన్నట్లు మీకు అగుపించినట్లయితే, అక్కడనే దానిని నేను ఇప్పుడే ఆపివేస్తాను. అవును, అయ్యా నేను అది కలిగిలేను కానీ ఈ రాత్రి మీకు పుస్తకాలు కావలెనంటే లేదా అన్నింటికంటే ముందుగా, “నా జీవితగాధ,” “ఒక ప్రవక్త ఆఫ్రికాను దర్శించుట,” వర్తమానములు, “పక్షిరాజా తన గూడుని రేపునట్లు,” “నీవు కాన్సర్ వ్యాధికి భయపడతావా,” వేరే ఇతరవాటివలె, “యేసు క్రీస్తు నిన్న నేడు, రేపు ఏకరీతిగావుండెను”,“పరలోకము నుండి వచ్చిన దర్శనానికి ఎన్నడూ నేను అవిధేయునిగా ఉండలేదు.” ఆ పుస్తకాలలోనివి కొన్ని మీకు అవి కావాలంటే, మరియు రికార్డులు, టేపులు, మీరు దానిలో నుండి మీకు కావలసినదానిని ఎంచుకొనవచ్చును, ఈ భవనము చివరలో ఇక్కడే ఎక్కడో జీన్ (సహూదరుడు) ఆయన ఎక్కడ? వెనుక అన్నింటికన్నా వెనకాల? అక్కడ పుస్తకాలకు తగ్గింపు ధర ఉంది, నేను ఊహించుచున్నాను, వెనుకాల ఉన్న ఆ పుస్తకాలు ఈ రాత్రికి మాత్రమే మీరు పొందగలరు, రేపటి దినాన మేము వాటిని అమ్మకమునకు ఉంచము.
13
ఈ సమయంలో, మీరు అందరు వింటున్నారా మంచిది, అంతా వెనుకన ఉన్నవాళ్ళు? అన్నిటికన్నా వెనుక ఉన్నవారు. ఓ, అది మంచిది. ఇంజనీరుని దానిని ఇవ్వనివ్వుము ఆ శక్తి అంతా మీలో మార్పురాకుండా ఉంచులాగున.
ఇప్పుడు, మీరు ఆయన్ను మీ హృదయమంతటితో ప్రేమించుచున్నారా? ఓ, అది చాలా మంచిది, నేను ఈ రాత్రి ప్రారంభించుటకు నిజమైన విశ్వాసముతో ఉన్నానని అనుభూతి చెందుచున్నాను.
14
[టేపు మీద ఖాళీ ఉన్నది - సంపాదకుడు]. మనము సంఖ్యాకాండములో నుండి చదువగోరుచున్నాను. మీలో ఎవరు దీనిని క్రిందకు....
తరువాత ఇశ్రాయేలు వారు వచ్చారు, సర్వసమాజము, నేను అరణ్యముకు రాగా, మొదటి నెలలో మరియు ఆ సమాజము కాదేషులో నిదించసాగిరి, మరియు. (ఒక్క నిమిషము ఆగండి, నాకు దొరికింది నేను. ఆగండి.) మొదటి నెల, ఆ ప్రజలు కాదేషులో దిగిరి, అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను.
ఆ సమాజమునకు నీళ్ళు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి.
జనులు మోషేతో వాదించుచు. మా సహోదరులు యెహూవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన యెడల ఎంతో మేలు అయితే మేమును మా పశువులును ఇక్కడ చనిపోయినట్లు ఈ అరణ్యములోనికి యెహూవా సమాజమును మీరేల తెచ్చిరి?
ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్ళే లేవనిరి.
అప్పుడు మోషే అహరోనులు సమజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహూవా మహిమ వారికి కనపడెను.
అంతట యెహూవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను.
నీవు నీ కర్రను తీసుకొని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల యెదుట ఆ బండతో మాట్లాడుము అవి నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్ళను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము.
చదువబడిన ఆయన వాక్యమును దేవుడు దీవించును గాక, మరియు ఇప్పుడు, నేను దానిలో నుండి ఒక అంశమును తీసుకొనగోరుచున్నాను. సహోదరుడు నోయల్ని ఎప్పుడైతే చూసానో అప్పుడు ఒక పాత గ్రంథం నా మొదడులో పడింది, అది ఒక వర్తమానము, అది నేను చాలా చాలా సంవత్సరాల క్రితం మాట్లాడాను. దాదాపుగా చాల వరకు మరచిపోయి ఉండవచ్చు. నేను ఒక పరిస్థితిని ఉపయోగించుకుంటున్నాను, కానీ చెప్పగలను ఖచ్చితంగా నేను దానితో వెళితే పరిశుద్ధాత్మ దానిని నాకు బయలుపరుస్తుంది. ఈ రాత్రికి నేను తీసుకునే అంశం, “ఆ బండతో మాట్లాడుము మరియు అది నీళ్ళనిచ్చును, ఆయన నీళ్ళనిచ్చును.” మీరు గమనించండి, “అది ఆయన యొక్క నీళ్ళనిచ్చును,” అది ఆయన యొక్క నీళ్ళనిచ్చును.
15
ఇది ఖచ్చితంగా వేడిమిగల ఉదయం అయివున్నది. ప్రతి ఒక్కరు అంతా గందరగోళంగా మరియు చికాకుగా ఉన్నారు ఎందుకంటే రాత్రి అంతా పశువుల అరుపులు, మరియు ఆ పిల్లల యొక్క ఏడుపులు, మరియు జనాలు ప్రాముఖ్యము లేని విషయం గురించి వాదులాడుకున్నారు మరియు గొడవపడియున్నారు.
పాపం మోషే, అది అతనికి ఒక భయంకరమైన సమయం మీరు చూడండి, ఆయన ఐగుప్తులోకి దిగి వచ్చి మరియు ఇశ్రాయేలు సంతతిని అక్కడి నుండి దేవుని వాగ్దానం ప్రకారం బయటకు తీసుకొని రావాలి, మరియు వారిని వాగ్దాన భూమి వరకు ఆయన నాయకత్వం వహించాలి. పాలు-తేనెలు ప్రవహించే దేశానికి, దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వారిని కాపాడాలి మరియు వారికివ్వబడిన అద్భుతమైన పాలు-తేనెలు ప్రవహించే ప్రదేశం చేరేవరకు వారికి కావలసినవి అన్నీ అవసరం ఉన్నవాటిని ఆయన వారికి సమకూర్చాలి.
మోషే దేవుని చేత పిలువబడిన ఒక సేవకుడు, అభిషేకించబడిన ప్రవక్త. ఆయన పైన అగ్నిస్తంభం యున్నది, ఆయనను అనుసరిస్తుంది. ఆయన చేత పలుకబడిన మాటలు మరియు చేస్తున్న సూచక క్రియలు మరియు అద్భుతాలు ఋజువు చేస్తుంది. ఆయన మార్గములో నుండి వాగ్దాన భూమికి ఇశ్రాయేలు సంతతితో, అది చాలా ఖచ్చితంగా వ్యతిరేక పద్ధతిలో, లేక పద్ధతి, లేకపోతే, ఆ ప్రయాణపు దినమున మనము మనకివ్వబడిన వాగ్దాన భూమికి మధ్యదారిలో ఉన్నాం. మనము గొప్ప పరిశుద్ధాత్మ నడిపింపులో నడువబడుతున్నాము. వారు చాలా సహజంగా నడిపింపబడినట్లుగా, మనము అధ్యాత్మిక నడిపింపులో ఆ గొప్ప వాగ్దానం చేయబడిన భూమిని దేవుడు ప్రయాణం చేసిన ప్రకారం మనకు ఇస్తాడు. దేవుడు వారికి కావలసినవి అన్నీ వారికి అమరుస్తానని ప్రమాణం చేసియున్నాడు. కానీ వారి యొక్క శరీరానుసారమైన మనస్సు వారిని దేవుని యొక్క చిత్తము నుండి తొలగిపోవునట్లు చేసి వారిని ఎడారి యొక్క దారికి నడిపించినది.
16
అది ఈ రోజుకి చాలా ఎక్కువైయున్నది.
ఆ సంగతినే ఈ రోజు చాలా సంఘాలు కలిగియున్నాయి. వారు శరీరానుసారమైన ఆలోచనను తీసుకొనియున్నారు. తెలివైన దారి మరియు ఆలోచనాపూర్వకమైన ఆ దారిని వదిలి వేసారు. దేవుని దగ్గర నుండి అమర్చబడిన వాటిని, స్వస్థత యొక్క దీవెనలు మరియు శక్తి మరియు పరిశుద్ధాత్మ యొక్క బాప్తీస్మము, మరియు వారు ఎడారి యొక్క దారిని ఎంచుకొన్నారు. కాబట్టి, మనకు వాదనలున్నాయి. చికాకులున్నాయి, బాధలున్నాయి, ఫిర్యాదులున్నాయి కానీ వారు ఇప్పటికి వాటిని దారిలో జ్ఞాపకం చేసుకుంటాము. కానీ ఇంకా మార్గములో ఉన్నవారికి, దేవుని మహిమతో ఉండుట అనేది మాట్లాడలేని ఆనందమైన మరియు నిండైన మహిమతో ఉండుట, ఆయన యొక్క అగ్ని స్తంభమును వారు వారి పైన కలిగియున్నారు. శక్తితో, సంతోషముతో, సూచక క్రియతో మరియు అద్భుతములు కలిగియున్నారు. నిజముగా పుట్టిన సంఘం ఎలా వాగ్దాన భూమిలోనికి కదులుతుంది. అది నిత్యత్వము యొక్క వాగ్దానము, నిత్యత్వముతో ప్రవహించే ప్రదేశం, అక్కడ అనారోగ్యమన్నదే ఉండదు, చావు, దుఃఖము, లేక హాని చేయుట అనేది లేదు.
17
ఇప్పుడు, కానీ ఎప్పుడైతే వారి మధ్యలోకి శరీరానుసారమైన ఆలోచనలు వస్తున్నాయా, అది చివరికి వారిని అసలు దారినుండి తప్పించి ఎడారి వైపు నడిపిస్తుంది. వారు ఎప్పుడైతే ముందుకు వెళ్ళుటలో విఫలమౌతారో వారు నాశనకరమైన తప్పులు చేస్తారు. వారు వారి యొక్క ప్రయాణంలో వున్నారు, చాలా ఎక్కువ మైళ్ళ దూరంలో లేదు. కొద్ది రోజులలోనే వారు దానిని చేరుకుంటారు ఆ రెండు మిలియనుల ప్రజలు అసలైన దారిలోనే ఉండి ఉన్నట్లయితే ఎడారిలో నుండి తప్పింపబడతారు.
కానీ వారు ఎప్పుడైతే కాదేషు-బర్నియా అను స్థలమునకు వచ్చారో..... ఒకప్పుడు కాదేషు-బర్నియా, నాకు చెప్పబడింది, అక్కడ గొప్ప తీర్పు సింహాసనం ఉంది. అది చెబుతుంది ఆ గొప్ప ఉట లేదా బావి ఉంది, చాలా చిన్న బావులు, అది ఒక విధమైన పరిపూర్ణ మాదిరి సంఘముగా ఉన్నది. సంఘమే తీర్పు సింహాసనం; పరలోకం దేవుని యొక్క గొప్ప తీర్పు సింహాసనం, మరియు చిన్న బావులు అన్ని చిన్న సంఘాలకు ప్రతీకలుగా ఉన్నాయి. మరియు తీర్పు అనేది దేవుని యొక్క నివాసమునుండే ప్రారంభమౌతుంది. చూడండి? తీర్పు అక్కడే ప్రారంభమౌతున్నది.
అందువలనే... చాలా ఫిర్యాదులు ఎందుకో నాకు తెలియదు నేను చాలా కఠినంగా మరియు మనుషులను సరిదిద్దుటకు మరియు వారి జీవన విధానము గురించి, వారు ఏ విధంగా వస్త్రాలను ధరిస్తున్నారో, ఇంకా నాకు చెప్పండి నేను నా పరిచర్యని బాధ పెడుతున్నానా; తీర్పు సింహాసనం దేవుని గృహమైయున్నది. అది నిజము. అది ఇక్కడే ప్రారంభము కావలసినది, సరిగ్గా ఇక్కడే ఎక్కడైతే న్యాయము మరియు నిజాయితీ, మరియు దేవుని తీర్పు వేధికపై(pulpit) నుండి వచ్చును.
18
ఇప్పుడు, వారు ఎప్పుడైతే అక్కడకు వచ్చారో, వారు నివాసాలు ఏర్పరచుకున్నారు. వారికి దేవుడు మంచివాడిగా ఉన్నాడు. ఐగుప్తులో నుండి వచ్చేటప్పుడు ఆయన అనేకమైన అద్భుతాలను మరియు సూచక క్రియలను వారికి చూపించియున్నాడు. వారి ప్రయాణంలో ఆయన వారికి సమస్తము సమకూర్చియున్నాడు కానీ వారు ఇంకా వాగ్దాన భూమికి దాదాపుగా కనుచూపుమేరలో ఉన్నారు. కొద్ది సమయం తరువాత వారు వెళ్ళిపోయారు. మరియు వారు ఆ స్థలమునకు వచ్చిన తరువాత ప్రతి గోత్రములో నుండి మోషే ఒక్కొక్కరిని కానాను దేశములోకి గూఢచర్యానికి పంపియున్నాడు.
మనమందరము ఈ కధను చాలా బాగుగా ఎరిగియున్నాము. వారు ఏ విధంగా వచ్చారు వారిలో ఇద్దరు, యెరికో వరకు, మరియు వారిని ఆ యొక్క వేశ్య వారిని దాచేనో. వారు ఎప్పుడైతే ఆ భూమిలోకి ప్రవేశించారో ఆ వాగ్దానం నిజమైనదని.
వారు అంతా వెదకి చూసి తెలుసుకొనుటకు వారు తిరిగి వెనుకకు వచ్చునప్పుడు, వారిలో ఇద్దరు ద్రాక్ష గుత్తులను మూట కట్టుకుని ఒక ద్రాక్ష మూటగా తీసుకొని వచ్చారు. నేను తరచుగా ఆలోచిస్తాను, ఒక ప్రదేశంగాని శాపగ్రస్తమైతే ఆ రకమైన ద్రాక్ష గుత్తులను పెరుగునట్లుగా చేస్తుందా, అది ఏమై ఉంటుంది ఆ శాపం తీసివేయబడిందా? ఎటువంటి అమోఘమైన ద్రాక్ష గుత్తులు అవి. ఓ, మై, నేను వాటిలో కొన్నిటని ముందుగానే ఒకసారి రుచి చూశాను. నేనిక్కడ ప్రసంగించియుంటిని, ఎక్కువ రోజులు కాలేదు, నేను ఈ ఉదయం ఆలోచిస్తుండగా, నేను ప్రసంగించుచున్నప్పుడు, నాకు చాలా లాలాజలము వచ్చెను, మీకు తెలుసా, కానీ నేను వాటిలో నా వెనుకకు తీసుకొని రాబడిన కొన్ని ద్రాక్షలను తింటున్నాను, ఇటువంటివి నాకు కొద్దిగా నోటిలో నీళ్ళు వచ్చునట్లుగా చేస్తుంది. మీకు తెలుసా, గుర్రం గడ్డిని ఏ విధంగా నములుతుందో అలాగున.
19
అటు తరువాత ఎప్పుడు మనము వారు వెనుకకు వచ్చిన తరువాత, వారు ఈ గొప్ప ద్రాక్ష గుత్తులను తెచ్చారు. వారందరూ కలసి దేవుని ఎదుట ఒక సమూహంగా ఏర్పడ్డారు. వారు ఒక వార్తని తీసుకొనివచ్చారు, “ఓ, దేవుడు చెప్పినది నిజము, ఆ ప్రదేశంలో పాలు-తేనెలు ప్రవహిస్తున్నాయి, అది చాలా మంచి స్థలమైయున్నది, అది విత్తనము యొక్క స్థలమైయున్నది. అది దేనినైనా మొలకెత్తించగలదు. ఓ, అది ఒక అద్భుతమైన ప్రదేశం, మనకు అక్కడ చాలా నీరు మరియు నదులు మరియు వ్యవసాయం ఉన్నవి. ఇంకా అన్నీ కలిసి ఆ దేశాన్ని గొప్పగా తయారు చేయగలవు.”
“కానీ ఓ, ఆ అమ్మోరీయులు, మరియు హిత్తియులు ఇంకా ఆ మిగిలిన అందరు అక్కడ ఉన్నారు. వారిలో కొందరు ఆజానుబాహులు. వారి ముందర మేము చిన్న పురుగులవలె ఉన్నాము. మరియు వారు ఆ మాటలు చెబుతుండగానే, ఓహ్ ఇశ్రాయేలు సంతతి బలము వదిలివేసింది. వారు గట్టిగా అరుచుట మరియు ఏడ్చుట ప్రారంభించారు - వారు ఐగుప్తును వదిలి వచ్చినవారు. ఈ అన్ని కార్యాలు మరియు అది వారిని ఆక్రమించుకున్నది. కానీ అక్కడ ఇద్దరున్నారు. అక్కడ ఉన్న ఆ పన్నెండు మందిలో వారిద్దరు విశ్వాసమును కలిగివున్నారు. మిగిలిన వారు ఈ విధంగా చెప్పారు. ”మనము దానిని సాధించలేము. మనము ఇక్కడ నుండి ఇక ముందుకు వెళ్ళలేము.“ అటువంటి వారిని ఎదుర్కొనుట మనకు అసాధ్యము.”
కానీ కాలేబు మరియు యెహూషువా ఇలా అన్నారు, “మనము దానిని సాధించుటకు వారికన్నా ఎక్కువ సమర్ధులమైయున్నాము.”
అది ఎందుకు? మిగిలినవారు, తెలివైనవారి సమూహం, వారిని ఆజానుబాహులులాగా ఉన్నారని అంటున్నారు. కానీ కాలేబు మరియు యెహూషువా దేవుని చేత ఇవ్వబడిన వాగ్దానమును చూస్తున్నారు. ఇప్పుడు, నీవు దేనినైతే చూస్తున్నావో దాని మీదనే అది అంతా ఆధారపడియున్నది.
20
అక్కడ ఈ రాత్రి కూర్చున్నవారిలో కొందరు రాత్రి లేక రెండు రాత్రుల ముందు చక్రాల కుర్చీలలో తీసుకొని రాబడియున్నారు, ఇప్పుడు వారు లేచి నడుస్తూ చుట్టూ తిరుగుచున్నారు. అది నీవు దేనినైతే చూస్తున్నావో అంతా దాని మీద ఆధారపడియున్నది. నీవు నీ శ్రమలను చూస్తుంటే, నీవు ఎప్పటికీ వాటిని దాటి ముందుకు వెళ్ళలేవు కానీ నీవు దేవుడు చేసిన వాగ్దానము వైపు చూస్తున్నట్లైతే, దేవుని వాక్యములో చెప్పబడిన వాగ్దానపు మాటలోని ప్రతి ఒక్క రక్షణకరమైన దీవెనలను పొందుకొనే హక్కు నీదే ఉంటుంది. అది నిజము.
ప్రతి క్రైస్తవుడు ఎల్లప్పుడు అదృశ్యమైన వాటినే చూస్తాడు. దేవుని యొక్క ప్రతి ఒక్క రక్షణకరమైన దీవెనలు అదృశ్యమైనవే. అది క్రైస్తవుడి యొక్క సంపూర్ణ రక్షణ కవచము ఇదే, ప్రేమ, సంతోషం, విశ్వాసం, క్షమాగుణం, మంచితనం, విధేయత, మృదుత్వం, సహన౦. ఇవి అన్నియూ ఒక విశ్వాసి యొక్క హృదయంలో కార్యాలు జరిపే అదృశ్యమైన బలగాలు. ఆమేన్! అది మంచిదైయున్నది. కనబడని వాటిని మనము చూస్తున్నాము. మనము అబ్రహాము సంతానమైతే, మనము చూచుట ద్వారా నడువము. మనము విశ్వాసము ద్వారా నడుస్తాము; అబ్రహాము విశ్వాసము ద్వారా నడిచెను మరియు లేనివాటిని ఉన్నావాటిగా పిలిచెను - ఎందుకనగా దేవుడే చెప్పియున్నాడు.
21
ఇప్పుడు, యెహోషువాకి దానిని గురించి తెలియదు వారు ఏ విధంగా ఆ నగరాన్ని పొందగలరనేది. కాలేబుకి దానిని గురించి తెలసుకొనే మార్గమే లేదు. కానీ వారు దానిని ఏ విధంగా విశ్వసించారో చూడండి. కారణమేమంటే దేవుడు సెలవిచ్చాడు, “నేను మీకు ఈ భూమిని ఇచ్చియున్నాను. నా దగ్గర ఒక దూత ఉన్నది ఆ దూత మీకు ముందుగా వెళుతుంది. కానీ అతనితో వినయంగా వుండండి ఆయనను దూషించ వద్దు. ఎందుకంటే నా నామము ఆయనలో ఉంది. మీ పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకొనడు. ఆయన మిమ్ములను మండుచున్న స్థలములను దాటిస్తాడు. అతను మీ కష్టాలు తీరుస్తాడు, అతను మీకు కార్యములు చేస్తాడు. కానీ గుర్తు౦చుకొనండి, అతనిని మీరు అనుసరించండి. అతను మీరు వాగ్దాన భూమికి వెళ్ళుటకు నాయకత్వం వహిస్తాడు. కానీ అతనిని దూషించ వద్దు, అతనిని త్రోసివేయ వద్దు. ఆయనను నమ్మండి.”
ఇప్పుడు, తరువాత మేము గుర్తించాము, ప్రయాణంలో యెహోషువా మండుచున్న అగ్ని స్తంభము౦దు గొప్ప దేవుడు నివసించటాన్ని చూసి కనుగొన్నాడు, ఆయన అన్ని రకాలైన అద్భుతాలు చేశాడు. తను మరియు కాలేబు దానిని చూశారు, మరియు దేవుడు తన మాటను నెరవేరుస్తాడని వారికి నమ్మకం ఉంది. దేవుడిని చూడండి, ఐగుప్తులో ఏం చెప్పారో “నేను మీకు ఆ భూమిని ఇచ్చాను, ఇప్పుడే వెళ్ళి దానిని పొందుకోండి.”
22
దేవుడు బలహీనమైన ప్రతి ఒక్కరికి దైవత్వపు స్వస్థతనిచ్చాడు, మీలో ప్రతి ఒక్కరికి, మన తప్పిదముల కొరకు యేసు గాయముల పాలయ్యేను, ఆయన పొందిన గాయపు గుర్తుల వలన మనము స్వస్థత పొందుకున్నాము. అది మీరు కలిగియున్నారు. కానీ నీవు ప్రతి ఒక్క అంగుళాన్నా స్వతంత్రించుకొనుటకు యుద్ధం చేయవలసియున్నది. “పాదము మోపు ప్రయాణించిన, ప్రతి చోటు,” యెహోషువాతో దేవుడు చెప్పెను, “అది మీకు ఇచ్చివేశాను.” పాద ముద్రలు అంటే స్వతంత్రించుకొనుట అని అర్ధము. ఈ రాత్రి మనము లోపలికి వెళదాం! ఆమెన్. మనము లోపలకి వెళదాం! పాద ముద్రలు స్వతంత్రించుకొనుటయే. దేవుని ద్వారా మనకు ఇవ్వబడిన ప్రతి యొక్క అంగుళమును మనము తీసుకొందాము. మీరు పరిశుద్ధాత్మ యొక్క బాప్తీస్మము ఇంకా పొందుకోలేదా, పేతురు అంటున్నాడు, “ఈ వాగ్దానము మీకును, మీ సంతానమునకు, మీ దూరస్తులందరికి, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచినవారందరికిని చెందును.” పాద ముద్రలే స్వతంత్రించుకొనుట. వెళ్ళి దానిని పొందుకొనండి. అది మనదైయున్నది.
యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరమూ ఒకే రీతిగా ఉన్నాడు, దానిని స్వతంత్రించుకొనండి. “నేను చేయు కార్యములు, మీరునూ చేయదురు,” మనము దానిని స్వతంత్రించుకోందుము! అది దేవుని వాగ్దానము. మీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూడవద్దు. అది ఎంత కష్టమైనది అని చూడవద్దు. ఆ భూమిని మీరు స్వతింత్రించుకొనండి.
మనము ఒక కూటమి కలిగి ఉంటాము, ఈ రోజు ఉదయము కూటము మాదిరి అక్కడ మనము కూటమిని కలిగి ఉంటాము, మరియు పరిశుద్ధాత్మ ఆ స్థలము మీద కుమ్మరించబడుతుంది. జనములు కేకలు వేస్తారు, అరుపులు అరుస్తారు. దేవుని స్తుతిస్తారు, మరియు తరువాత ఎవరో ఒకరు వచ్చి ఈ విధంగా చెబుతారు. “సహోదరుడా బ్రెన్హాం, నా కొరక ప్రార్ధన చేయుము.”
నేను అతని మీద నా చేతులుంచి ప్రార్థన చేసి, ఇలా అన్నాను, “ఇప్పుడు వెళ్ళి నమ్ముము.”
ఇప్పుడు, అది ఏమైయున్నది, అది చాలా సులభంగా దేవుని యొక్క శక్తిని పొందుకున్న అనుభవం కలుగవచ్చును, నీవు నమ్మినట్లయితేనే దానిని చూడగలవు. కానీ తరువాత అది ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చి కనబడతుందో, నీవు ఆ కార్యాన్ని పొందుకొనుటను దానిని గుర్తెరిగి ఉండగలవా? సహోదరుడా, అదే అసలు విషయం, మనము దాన్ని పొందుకోవాలంటే దాన్ని కలిగియు౦డాలి, మనము దాన్ని పొందుకోవాలంటే తీసుకోవాలి, అది మనదే, కానీ నీవు ప్రతి అంగుళం కొరకు పోరాడాలి.
23
యొహోషువా దేశములోని ఈ మొదలు నుండి ఆ చివరి వరకు భూమిలోని ప్రతి ఒక్క అంగుళం కొరకు పోరాడాడు. కానీ అతని దగ్గర దేవుని యొక్క వాగ్ధానము ఉన్నది. దేవుడు చెప్పెను, “నేను అది నీకు ఇస్తున్నాను.” ఆమేన్. అక్కడ ఆజానుబాహులున్నా అక్కడ అవిశ్వాసులున్నా అక్కడ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించేవారున్నా అక్కడ గుర్తింపు పొందిన చర్చిలున్నా, అది ఏమి తేడా చూపించగలుగుతుంది? దేవుడు వాగ్దానం ఇచ్చియున్నాడు. దానిని తీసుకొనుము. అది మనదే. అది మనకు సంబంధిచినది, అది మన స్వంతమైయున్నది. వెళ్ళి దానిని పొందుకుందాం.
భయపడవద్దు, వెనకడుగువేసి “మంచిది, నేను అద్భుతాలు జరుగు రోజులు గతించిపోయాయి. ఓ, నాకు తెలియదు.” అది చేయ వద్దు. అలా చేయుటవలన నీవు అబ్రహాము యొక్క సంతానము అనబడవు. అది ఎంత దూరమైనా గానీ కనిపిస్తున్న వాగ్దానమును జారిపోకుండా గట్టిగా పట్టుకో. మంచిది, ఆ విధంగా 25 సంవత్సరాలు జరిగింది. కానీ అబ్రహాము బలహీనమయ్యేకొద్దీ, అతను ప్రతిసారీ బలాన్ని పొందుకుంటున్నాడు. అది అతనికి తెలుసు అన్ని కాలములలోకి అది ఒక గొప్ప అద్భుతమని. మరియు మనము ఒక రాత్రి ప్రార్థన చేస్తే, మరుసటి ఉదయం మనకు కడుపులో ఒక ఇబ్బంది ఉంటుంది. మనమంటాము “బహుశా నేను నా స్వస్థతను నిజంగా పొందుకోలేదు ఆ వరుసలోనికి మరలా వెళ్ళాలి.”
ఓ, నిన్ను నీవు అబ్రహాము సంతానమని అనుకుంటున్నావా? హల్లెలూయా దేవుడు వాగ్దానము చేసివుంటే, దేవుడు వాగ్దానము ఇచ్చివుంటే, నీవు దానిని విశ్వసించాలి. నేను లెక్క చేయను దానిని ఏది ఆక్రమించినా, అది మీది. సాతానుడు నేల మీద నిలబడియున్న ప్రతి అంగుళం కోసం పోరాడు, దానిని దాటుకొని వెళ్ళి పొందుకో, వాక్యమనే ఖడ్గాన్ని తీసుకొని వెళ్ళు. దేవుని యొక్క వాగ్దానము నిజమైనది. దానిని ఏదియు ఆపలేదు, అవి దేవుని యొక్క వాగ్దానములు. ఆయన ఇశ్రాయేలు సంతతికి ఏ విధంగా వాగ్దానమిచ్చాడో మనకు ఆ విధంగానే ఇస్తాడు. పెంతెకోస్తు చర్చి కాదేషు-బర్నెయా రావలసియున్నది. మనము సమర్దులమా? మనము చేయగలమా? “యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు.” మనము అక్కడకు వెళ్ళి దేవుని వాగ్దానమును పట్టుకొని “ఇదియే ఆ నిజం. నేను గెలుచుకున్నాను, నేను పొందుకున్నాను, ఇది నాది; ఇది దేవుడు నాకు ఇచ్చినది, చెబుదామా!”
“నీవు దానిని ఎలా చేయబోవుచున్నావు?”
“నాకు తెలియదు, అది నాకు సంబంధించిన పని కాదు.”
24
నేను ఒకసారి ఏలియా గురించి ప్రసంగిచుచున్నప్పుడు ఆరాధన అయిన తరువాత ఒకాయన నాతో ఇలా అన్నారు “ఇప్పుడు, బోధకుడా, ఒక్క నిముషము ఆగండి, నేను నమ్ముతాను మీరు మిగిలినవారికన్నా తెలివైనవారని కానీ సహజంగా కాకులు ఏలియా కొరకు చేపలను మరియు రొట్టెలను తెచ్చినవని నమ్ముతాను.”
నేనన్నాను, “నేను కూడా నమ్ముతాను, దానిలోని ప్రతి ఒక్క మాటను. చేప కాల్చబడి మరియు రొట్టె వండబడియున్నది.”
అతడు అడిగాడు, “నీవు ఎలాగు... ఎక్కడ.... అయితే నాకు చెప్పు, నా స్నేహితుడా [అతను యొహూవా సాక్షి],” అతను అడిగాడు, “అయితే చెప్పు, నా స్నేహితుడా, ఎక్కడ నుండి ఆ కాకులు కాల్చిన చేపను మరియు వండిన రొట్టెను తీసుకొచ్చినవి?”
నేను చెప్పాను, “అది నన్నడగలసిన ప్రశ్న కాదు. ఏలియా కూడా ఇటువంటి ప్రశ్న అడగలేదు. అతనికి తెలిసిన సంగతి ఏమంటే అతనికి ఆకలి వేసినప్పుడు అతను తినుటకు, అతనికి రొట్టె మరియు చేపలు తీసుకొని రావటానికి కాకులు ఏర్పరచబడ్డాయి మరియు దానిని అతను తిన్నాడు.” నేను చెప్పాను, “పరిశుద్ధాత్మ యొక్క బాప్తీస్మము కూడా ఖచ్చితంగా అటువంటిదే. అది ఎక్కడ నుండి వస్తున్నదో నేను నీకు చెప్పలేను, అది ఎలా అక్కడికి చేరుకుంటుందో నేను చెప్పలేను; నాకు తెలుసు వస్తుంది మరియు నేను దానిని కలిగియున్నాను. అది మాత్రమే నేను పట్టించుకుంటాను.”
దేవుని స్వస్థతలు ఎలా పని చేస్తాయో నేను నీకు చెప్పలేను. ఒక నల్లని ఆవు పచ్చని గడ్డిని తిని తెల్లని పాలను ఎలా ఇస్తుందో నేను నీకు చెప్పలేను. కానీ నేను దానిని ఎలాగో తాగుతాను. దానికి సంబంధించిన సూత్రమును కనుగొనుటకు నేను ప్రయత్నించలేదు. నాకు తెలియదు ఏ కారణం చేత పరిశుద్ధాత్మ ఒక కూటమిలో క్రుమ్మరింపబడి అక్కడి ప్రజలు భాషలలో మాట్లాడుట మరియు ప్రవచించుట చేస్తారో, వికలాంగులు చక్రాల కుర్చీలలో నుండి దూకుట, మరియు రోగులు స్వస్థతపరచబడతారు. నేనది నీకు చెప్పలేను నాకు తెలిసిన ఒకే సంగతి, దేవుడు దానిని వాగ్దానముగా ఇచ్చాడు మరియు అది మన స్వంతం. దానిని తీసుకో మరియు దానితో వెళ్ళుము.
చంద్రునికి మనకు మధ్య దూరం ఎంత ఉన్నది, ఒక అణువులో ఎన్ని పరమాణువులు ఉన్నవి. అవి అన్నీ వారి యొక్క పనులు కావు. కానీ వారికి తెలిసిన ఒకే ఒక్క విషయం, దేవుడు దానిని వాగ్దానము చేశాడు, వారు దాన్ని పొందుకున్నారు మరియు దానితో వారు సంతోషిస్తున్నారు. ఆమేన్.
25
వారు ఎప్పుడైతే తీర్పు సింహాసనపు దగ్గరికి వచ్చి మరియు ఆ మంచి భూమి యొక్క ఋజువును తిరిగి తీసుకొనివచ్చారో, అక్కడే వారు వారి యొక్క పొరపాటు చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అక్కడ చాలా సంవత్సరాల క్రితం ప్రజలు ఎవరైతే అన్నీ షరతులను దాటి వెళ్ళగలిగారో, వెళ్ళి ఆ భూమిని స్వతంత్రించుకొని దానికి సంబంధించిన సాక్ష్యాన్ని వారు పొందుకుని తిరిగి వచ్చారు, “ఆ నదికి ఆవల ఆ భూమి ఉన్నది.” ఆమెన్! నేను దాని కొరకు ఆనందిస్తున్నాను.
ఇప్పుడు, వారు నాశనకరమైన తప్పులను వారు చేశారు మోషేకు వ్యతిరేకంగా గొణుగుకొనుట మరియు దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఇంకా దేవునికి వ్యతిరేకంగా, అదే వారిని ప్రక్కదారి పట్టించింది. మరియు గుర్తుంచుకొనండి, గొణిగిన వానిలో ఏ ఒక్కరూ ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళలేకపోయారు. యేసుక్రీస్తు భూమి మీద నివసించిన దినాలలో ఈ విధంగా చెప్పారు “మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను, ప్రతిఒక్కరునూ చనిపోయిరి. (మంచిది) కానీ దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే! పరలోకమునుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును.” ఓ, నేను దానిని ఇష్టపడతాను, మరణములో నుండి జీవములోనికి వచ్చుట. క్రీస్తుయేసులోకి ఒక క్రొత్త జీవిగా మారటానికి.
26
శరీరానుసారమైన ఆలోచన వారి యొక్క అధ్యాత్మిక సరఫరాని కత్తిరించివేసింది. శరీరానుసారమైన ఆలోచన వారి సంతోషాన్ని కత్తిరించివేసింది. ఓ, వారందరూ గొణుగుట మరియు వాదన ప్రారంభించారు, వారిని తీసుకొనివెళ్ళి ఎడారిలో వదిలివేశారు. ఏదైనా నేను వ్యతిరేకిస్తాను అంటే అది కేవలం ఎడారిని మాత్రమే. అది వేడిగా వుంటుంది, అక్కడ ఎవరూ ఎక్కువ కాలము నివసించలేరు, ఎడారిలో నీకు దొరుకు ప్రతిదాని మీద అతికించే కాగితము అంటించి వుంటుంది. ప్రతి విధమైన పాత చిన్న వైన్ సీసాల మీద అతికించే కాగితము ఉంటుంది. అది ఎందుకో మీకు తెలుసా? అది ఎందుకంటే అక్కడ నీరు లేదు కాబట్టి. ఇప్పుడు, ఆ చిన్న మొక్క నా దేశంలో గాని మొలిచినట్లయితే, లేక వర్షం దాని మీద కురిసే దేశంలో గాని ఉంటే, ఆ చిన్న అతికించే కాగితము తీసివేయబడుతుంది, మరియు, మంచి నీరు ఉన్న స్థలములో దానిని ఉంచినట్లయితే అది ఒక చక్కని ఆకుగా మారుతుంది.
ప్రస్తుతం సంఘములలో జరుగుతున్నది అదియే, వాదనకు కారణమదే, మరియు గొడవలకు, మరియు వేడిమికి, అందుకనే వారిని నామ-మాత్రపు క్రైస్తవులు అంటున్నారు, ఎందుకంటే వారు దేవుని యొక్క వాగ్దాన భూమిని వదలి ప్రక్క దారిలోకి వెళ్ళిపోయారు. ఆ ప్రవాహం ఆది నుండి ఎప్పుడూ ఎండిపోయి వుండలేదు. ఆ బండ నీరు లేక ఎడారి వంటి స్థలములో వున్నది. వారు ఎండినవారుగా అయిపోయారు ఇంకా శరీరానుసారమైన ఆలోచన కలిగినవారుగా ఉన్నారు. వారు ఆ మాట మీద అతుక్కునిపోయి ఇలా అంటారు “అద్భుతాలు జరిగిన ఆ దినములు అయిపోయినవి. వారు ఒక పరిశుద్ధ గుండ్రాళ్ళ సమూహము. అటువంటి నిజమైనది ఇంక లేదు.”
ఓ, వారిని ఒక్కసారి నీటిలోనికి రానివ్వండి. అది వారిలోని మృదుత్వము మరియు తియ్యని, మరియు, విధేయతను వరిలో నుండి తిసుకోనివస్తుంది. వారిని నీవు ఎప్పుడైతే నీళ్ళలోకి తీసుకోని వస్తావో వారిలోన ఏదో జరుగుతుంది. అది ఎందుకో నాకు తెలియదు, కానీ అది అలాగు జరుగుతుంది. ఓ, శరీరానుసారమైది వారిలో నుండి కత్తిరించబడినది.
27
చూడుము, వారేమి చేసియున్నారో, వారు దేవదూతల ఆహారం తినుటకు ఆ ఐగుప్తు యొక్క అల్లం కుండలను అక్కడే వదిలివేశారు అయిననూ ఇంకా ఫిర్యాదులు చేస్తున్నారు. మీరు దానిని గురించి ఆలోచిస్తారా? అవును, మనము దానిని చూస్తున్నాము.
వారు కూడా, వారు ఐగుప్తులోని త్రాగే బురద నీటిని వదిలి పరిశుద్ధ బండ నుండి వచ్చు నీటిని త్రాగుటకు వచ్చారు, ఇంకనూ వారు దానిని గురించి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. వారు గొప్పలు చెప్పుకునే ఐగుప్తు వైద్యులను వదిలిపెట్టారు, ఎవరైతే గొప్పవారని గోప్పలు చెప్పుకున్నారో, ఆ గొప్పలు చెప్పుకునే వైద్యులతో ఉండుటకు.... చివరికి వారి యొక్క వస్త్రములు మీద ఎంత మాత్రము చిరుగులు ఏర్పడలేదు, వారు ఆ అరణ్యంలో నుండి వస్తుండగా వారిలో ఏ ఒక్కరూ జబ్బు బారిన పడలేదు, అయిననూ వారు ఫిర్యాదులు చేస్తున్నారు. మరియు వారు వదిలివేశారు.... సూచకక్రియలు వెంబడించు విశ్వాస ప్రజలతో ఉండుటకు, వారు అద్భుతాలు అయిపోయాయి అనే ప్రజలని కూడా వదిలివేశారు.
ఇప్పుడు ఈ దినము ఆ రోజులాంటిది కాదా? నీవు ఆ పాత చలి కోటులో నుండి బయటకు రమ్ము పరిశుద్ధాత్మని పొందుకో, మరియు దేవుడు నిన్ను మంచితనంతో నింపుతాడు. మరియు నీవు ఎన్నటికీ ఎండిపోని దానిని నుండి వచ్చిన ఆ జీవజలములను త్రాగుచున్నావు. వారందరూ చేయు కార్యములు అక్కడే ఉన్నవి. సంతోషము అనేది మాట్లాడలేనిది ఇంకా మహిమతో నిండియున్నది; ఆ తరువాత నీవు ఫిర్యాదు చేయటానికి వెళ్ళుము. కేవలం అదే కార్యము. మొదటి సంగతి నీకు తెలుసా, నీవు దారి తప్పించబడి ఎడారిలోనికి తీసుకొని వెళ్ళబడ్డావు. ఆ విధంగా దేవుడు చేస్తాడా అది ఏ విధమైన మార్గమంటే అది. ఆ దేవుడు దానిని ఆ విధంగా చేయడు. ప్రజలు వారంతట వారే ఆ విధంగా చేసుకుంటారు. వారి స్వంత శరీరానుసారమైన ఆలోచన వారిని ఆ విధంగా చేస్తుంది.
28
వారు ఐగుప్తులో ఉండగానే 10 శక్తివంతమైన అద్భుతాలు జరుగుట చూచి యున్నారు, ఈగలు, మిడతలు, అగ్ని మృత్యు-దూత, అన్నింటిని వారు ఐగుప్తులోనే చూశారు. ఇంకనూ శరీరానుసారమైన ఆలోచనలు కలవారైయున్నారు.
ఆ తరువాత వారు ఎర్రని సముద్రమును చూశారు. ఆ సముద్రం వారి కొరకు రెండగా పాయలుగా చీలిపోయి దాని విధిని అది నిర్వర్తించింది. ఆ తరువాత వారు కవాతుగా ఆ దారిలో నడిచి వెళ్ళారు. బయటకు వచ్చారు, అక్కడ వారికాన్నా ముందుగా అగ్నిస్తంభం ఉంది, ఆ సముద్రంలో వారు కవాతుగా నడిచి వెళ్ళారు. ఆ తరువాత వారు అక్కడికి చేరుకునేటప్పటికి, కర్తవ్య వరుస మధ్యలో వారొక అడ్డంకిని తొలగింపవలసి వచ్చెను. మరియు మొదట నీకు తెలుసా, వారిని భయము బంధించి వేసినది, మరియు వారికి ఏమి చేయాలో తెలియదు.
నేటి ప్రజలు కూడా ఆ విధంగానే ఉన్నారు, వారు సరైన కర్తవ్య మార్గములోనే వెళ్ళుచున్నప్పుడు వారికి భయం ఎదురైతే. వినండి, సహోదరుడా, నన్ను ఇది చెప్పనివ్వండి, నీవు వెలుగులో గానీ నడూస్తువుంటే, దేవునితో సహవాసం కలిగివుంటే, ఆయన యొక్క ప్రజలతో ఉంటే, ఇంకా పరిశుద్ధాత్మ మీ పైన ఉంటుంది, నీ దారి మధ్యలో నీకు అడ్డంకి ఎదురైనా, నీవు ఆగవద్దు, ముందుకి వెళుతూనే ఉండు. అది ఒక గొప్ప అనుభవం, అది ఏమిటంటే దేవుని చూడటం. ఎప్పుడైతే నేను దానిని దాటి వెళ్ళలేకుండా వున్నానో, దాని క్రిందకి వెళ్ళాను. దాని చుట్టూ తిరిగాను, లేక ఏదో విధంగా, దేవుడు నాకు మార్గము తెరిచాడు మరియు నేను దానిగుండా వెళ్ళాను, ఏదో రకంగా, ఇంకొకటి దానిగుండా వెళ్ళుటకు ఆయన కృప మనకు చాలును.
29
ఇప్పుడు, వారు అక్కడికి వచ్చి మరియు ఆ ఎర్రని సముద్రము తెరువబడుట చూచారు, మరియు అది ఎంతో గొప్ప కార్యమైయున్నది. వారు ఇంకేవిధంగా గొణుగగలరు? ఆ అద్భుతాలు చూచిన తరువాత వారు ఏ విధంగా ఫిరాద్యులు చేయగలరు? మనము ఈ రోజు ఏమి చూశామో వాటిని చూసిన తరువాత ఏమని ఫిర్యాదులు చేయగలము? గొప్ప ఉజ్జీవాలు, స్వస్థతా కూటములు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ క్రిందకు దిగుట, స్వయంగా కళ్ళతో చూచుట. దేవుని యొక్క వాక్యాన్ని బైబిలు చెబుతుంది, యేసే వాక్యమైయున్నాడు. “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని దేవుని యోద్ధ ఉండెను. మరియు వాక్యము దేవుడై ఉండెను మరియు ఆ వాక్యము శరీరధారియై మన మధ్యలో నివసించెను.” ఆయనే శిలువధారి అయ్యాడు, ఆయన స్వంత, తనకు తానె. దేవుడు భూమిని సృజించి, భూమిగా మారి భూమిలో నివసించాడు. దేవుడు, ఎవరైతే శరీరాన్ని తయారు చేసాడో, ఆయనే శరీరంగా మారి మరియు శరీరంలో నివసించాడు.
ఓ, అది తప్పకుండా ప్రజలను ఆకర్షించుతుంది. దేవుడు కానీ కోరుకొని ఉంటే దేవదూతలందరితో వందనాన్ని అందుకుంటూ పరలోకము నుండి రాగలడు. దేవుడు క్రిందికి రావాలనుకుంటే, ఒక పూర్తి సంపూర్ణ మానవునిగా, ఇరు ప్రక్కలా దేవదూతలతో, పరలోకం యొక్క బూరధ్వనితో పరలోకపు వీధులలో నుండి క్రిందకు దిగివస్తాడు. ఆయన ఆ విధంగా చేయగలడు. ఆయన సంపూర్ణ మానవునిగా రావలసి యున్నది. కానీ ఆయన చిన్న శిశువుగా రావటాన్ని కోరుకున్నాడు. ఆయన ఒక గొప్ప భవంతిలో పుట్టవలసియున్నది. ఆయన కోరుకుంటే పరలోకమును సృష్టించుకునేవాడు. కానీ చివరికి ఆయన పడుకోవటానికి మంచం కూడా లేకుండా రావటాన్ని ఎన్నుకున్నాడు. ఆయన ఒక పశువుల పాకకు వెళ్ళాడు, పశువుల తొట్టిలో, మరియు ఆ పశువుల తొట్టిలో పుట్టుటకు ఎంచుకున్నాడు ఇది తప్పకుండా ఆకర్షించుతుంది.
యెహోవా చిన్న శిశువులాగా ఏడుస్తున్నాడు. యెహోవా ఒక చిన్న పిల్లవానిగా ఆడుతున్నాడు. యెహోవా చెమటను చిందించి పనిచేస్తున్నాడు ఒక మనిషిలాగా. ఓ, అది ఒక గొప్ప రహస్యం అయివున్నది. అది ప్రజలకు ఒక అమోఘమైన సూచక క్రియగా ఉన్నది. ప్రతి ఒక్కరూ సూచక క్రియలు కావాలని కోరుకుంటారు, అది ఇప్పటి వరకు దేవుడు చేసిన సూచక క్రియలన్నింటిలోకి అత్యంత ఘనమైన సూచక క్రియ, ఎప్పుడైతే దేవుడు మానవ శరీరంగా మారి మానవుల మధ్యలో నివసించెనో. అత్యంత గొప్ప సూచక క్రియ ఖచ్చితంగా అది మనుషులను ఆకర్షిస్తుంది.
కానీ వారి శరీరానుసారమైనవారు, “ఓ, అవును, నేను అనుకోనుచున్నాను అది పరవాలేదు.” ఓ, మరింత అధికంగా అలాగే కానివ్వు, అది దేవుని యొక్క ఖచ్చితమైన పనితనం, ఆయనని తయారు చేసుకొనుట, శిలువ వేయించుకొనుట, ఒక గుడారమును తయారు చేయుంచుకొనుట ఆయన గుడారములో నివసించుట, మన మధ్య ఆయనను విశాలపరచుకొని మనలాగ నివసించుట. ఆమేన్. దేవుడు, అది ఇక్కడే ఉన్నది, కానీ ఇది మన ఏకాగ్రతని ఆకర్షించలేదు. సంఘం శరీరానుసారమైన ఆలోచన కలిగి మరియు ప్రక్కదారిని పొందుకుంటున్నాయి, దానిని దాటి వెళ్ళిపోతున్నాయి, ఈ గొప్ప కార్యాలకు దూరంగా వెళ్ళిపోవుచున్నవి.
30
ఇప్పుడు, మనము దానిని కనుగోన్నాము, వారు ఈ అద్భుతాలన్నీ ఎప్పుడో చూసివున్నారు. వారితో పాటు వారేమి కలిగి ఉన్నారో చూడుము: వారి దగ్గర కొట్టబడిన బండ వున్నది, దానిని ద్వారా వారు పానము చేగలరు. వారి దగ్గర స్వస్థతల కొరకు ఒక ఇత్తడి సర్పమున్నది. ఓ, మై వారు దేవుని వాక్యము కలిగిన ఒక ప్రవర్తను కలిగియున్నారు. ఆ ప్రవక్త పైన అగ్నిస్తంభం వారికి మార్గమును నిర్దేశిస్తుంది మరియు ఆ అగ్నిస్తంభం ఒక్కసారి కూడా ఎన్నడూ విఫలం చెందలేదు. మహిమ. ఓ, నేను అరుచునట్లుగా అనుభూతిని చెందుచున్నాను.
చూడండి, అది ఎన్నడు విఫలం చెందలేదు. దేవుడు ఎన్నడూ విఫలం అవ్వడు. ఆయన ఎన్నడూ విఫలం అవ్వలేదు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన ఇప్పటికీ దేవుడు ఆ కొట్టబడిన బండ, ఆ ఇత్తడి సర్పము, ఒక ప్రవక్త, ఒక క్షమాగుణం, ఒక త్యాగము. సంపూర్ణ కృప వారికి అంతకు మునుపే ఇవ్వబడ్డాయి. ఆ కార్యాలు అన్నీ దేవుడు చేసిన తరువాత, వారు ఈ రోజు ఉన్న ప్రజలలాగే వున్నారు. చుట్టూ పిల్లలు చేరియున్నారు. దేవునికి పిల్లలు అవసరం లేదు; యువకులు మరియు యువతలు దేవునికి కావాలి!
నేను పాత స్నేహితుడు రాబిన్సన్ యొక్క సాక్ష్యాన్ని ఇష్టపడతాను. ఆయన చెప్పారు, “ప్రభువా, నాకు చెట్లు ప్రమాణమ౦త వెన్నెముకని ఇవ్వు. నా ఆత్మ చివరలో చాలా ఎక్కువ జ్ఞానాన్ని ఉంచుము. నా నోటిలో చివరి దంతం ఊడిపోయేంత వరకు సాతానుతో యుద్ధము చేయనిమ్ము, ఆ తరువాత నేను చనిపోయేంత వరకు వాడి మీద జిగురుని పూయుము.”
మనకు కావలసినదే అదే ధైర్యము, పక్షి మెడ దగ్గర ఉన్న ఎముక కాదు, కానీ ఒక వెన్నెముక. ఒక నిజమైన ఆత్మతో నింపబడిన హృదయం, పరిశుద్ధాత్మతో నింపబడినది. యేసుక్రీస్తు రక్తముతో పవిత్రపరచబడినది. జీవంతో ఉండి జీవమిస్తున్నది. దేవుని మార్గములో నడుస్తున్నది. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నది. ఆయన యొక్క వాగ్దానము ప్రకారం ప్రతి ఒక్క దానిని పొందుకున్నది! హల్లేలూయ.
31
ఓ, నాకు తెలుసు నేను వేర్రివానిగా నటిస్తాను, కానీ నేను పొందినట్లుగా మీరు అనుభూతి పొందితే మీరు కూడా నాలాగే చేస్తారు. అంతా మంచిది. ఎందుకంటే అది మంచిది. ఎవరో చెప్పారు, “బాలుడా, నీవు నీ మదిని కోల్పోయావు.” నేను కోల్పోయి యుండవచ్చు, ఒకవేళ నేను కోల్పోయి ఉంటె నన్ను ఒంటరిగా వదిలివేయండి. నేను ఆ విధముగా ఉండుంట కంటే నేను ఈ విధముగా చాల సంతోశంముగా ఉంటాను, కావున నన్ను వదిలివేయండి.
నేను ఈ నగరములో నడుస్తు౦డగా, ఒక మనిషి నాతో ఇలా అనుట నేను విన్నాను.... ఒక మనిషి వీధీగుండా వచ్చెను, ఆయన రొమ్ముల మీద ఒక గురుతు ఉన్నది, ఈ విధంగా పట్టుకొని ఒక స్థలములో, అది చెప్పెను “నేను క్రీస్తు కొరకు ఒక వెర్రివాడిని.” మరియు ఆయన వెనుక, అతను దాటి వెళ్ళిపోయిన తరువాత, వెనుతిరిగి చూస్తే, మరియు చెప్పెను. “నీవు ఎవరి కొరకు వెర్రివాడివి?” కాబట్టి నేనిప్పుడు ఆశ్చర్యపడుతున్నాను.
నేను క్రీస్తు కొరకు వెర్రివాడిని అవ్వాలి, ఆయనను తెలుసుకొనుటకు, దీనిని తెలుసుకొనుటకు, ఆయన పునరుత్తానపు శక్తిని నేనెరుగుదును. ఏదో ఒక రోజు ఎప్పుడైతే నన్ను మృత్యువు తీసుకువెళుతుందో, దూరాననున్న ఆ చివరి పెద్ద నీటి కాలువ, నా గుండె ప్రతి నిమిషం ఆ నీటి కాలువవైపు వెళ్ళుటకు ఎప్పుడూ ఇష్టపడుతుంది. కానీ ఎప్పుడైతే నేను దాని దగ్గరకు వచ్చానో నేను ఒక పిరికివానిగా రావాలని కోరుకోవట౦ లేదు. నేనక్కడికి నడవాలనుకున్నాను. నా అంతట నేనుగా ఆయన నిజాయితీ అనే త్రాళ్ళతో చుట్టబడాలనుకుంటాను. దీనిని తెలుసుకొనుటకు, ఆయన పునరుత్తానపు శక్తిని నేనెరుగుదును. ఆయన ఎప్పుడైతే పిలుస్తాడో అప్పుడు నేను మరణించిన వారి నుండి బయటకు వస్తాను. గడిచిపోయిన ఆ పాత సంగతులన్నీ వదిలివేసి, ఆ గొప్ప పిలుపు వైపుకి నేను లాగబడతాను. మహిమ!
అవును, అయ్యా,
32
సహోదరుడా, ఆ పాతకాలపు పెంతెకోస్తు దినాలు దూరపు అడవులలో ఆ పాపములను-నాశనము చేయు ఉజ్జీవము కాలిఫోర్నియాని, మరియు అన్ని రాష్ట్రాలు మరియు ఈ దేశము అంతట, దేవుని యొక్క శక్తిని తిరిగి చర్చిలోకి మరలా తీసుకొని రావాలి! మనము కాదేషుకి వచ్చాము, తీర్పు సింహాసనం. ఈ అన్ని సంగతులు, ఇంకా వాదనలు, ఇంకా ఫిర్యాదు చేస్తునే ఉన్నారు. ప్రవక్త మీద అగ్ని స్థంభము, ఆయన మాటలు నిశ్చయమై యున్నవి, కొట్టబడిన బండ, ఇత్తడి సర్పము, అద్భుతాలు మరియు సూచక క్రియలు, దాని నుంచే వారు చేశారు, అయినా వారు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. “అః, ఓ,” కేవలము... అల్లము బదులు దేవదూతల ఆహారం తింటూనే వారు ఇంకా అల్లం కుండ దగ్గరే తిరిగి వెళ్ళాలనుకుంటున్నారు. వారు కనాను దేశములోకి వెళ్ళుటకు సిద్ధంగా లేరని అది చూపిస్తుంది. అది నిజము.
33
మీకు తెలుసా, ఎవరో ఒకసారి ఈ విధంగా చెప్పారు. నేను ప్రసంగిస్తున్నాను, అక్కడ ఒక స్త్రీ ఏడుస్తూ ఉన్నది, మరియు ఆమె తన చేతులు పట్టుకొని ఏడుస్తూవున్నది, దేవుని స్తుతిస్తుంది. అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నది. ఆ స్త్రీ పరిశుద్ధాత్మతో నింపబడింది. ఒక అయస్కాంతము వేరే దేనినైనా ఎలా ఆకర్షించగలదు అది ఆకర్షింపబడకపోతే? నిజము. వేరే సంఘానికి చెందిన ఒక పురుషుడు అక్కడ ఉన్నాడు. అతను నా స్నేహితుడు. అతను బయట నిలబడి ఉన్నాడు, అతను అన్నాడు, “బిల్లీ, ఆ స్త్రీ లేచి ఏడుపు ప్రారంభించే ముందు నేను నీ ప్రసంగాన్ని అస్వాదింస్తున్నాను.” ఇంకా అన్నాడు, “ఆమె అలా ప్రవర్తిస్తుంటే నీవు ఏ విధంగా ప్రసంగించగలుగుచున్నావు?”
నేను చెప్పాను, “ఆ ఒక్కసారే నేను ప్రసంగించగలను, ఎప్పుడైతే చర్చిని పరిశుద్ధాత్మ వశపరచుకొనుటను నేను చూస్తానో, వర్తమానంతో పట్టబడినదో అప్పుడు మాత్రమే.”
అతను అన్నాడు “అది నా వెన్నులో వణకులాగా వచ్చి వీపులోకి పరుగెత్తింది.”
నేను చెప్పాను, “ఎప్పుడైనా నీకు పరలోకానికి వెళ్ళే అదృష్టంగానీ దక్కితే? నీవు చావుతో గడ్డకట్టిపోతావు, ఎందుకంటే అక్కడ వారు ఏడుస్తారు మరియు అరుస్తారు మరియు రాత్రి పగలు దేవుని స్తుతిస్తారు. దేవదూతలు వెనుక మరియు ముందుగా ఎగురుతూ, ఆరుస్తూ ”పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రభునకు చెందును గాక, పరిశుద్ధుడు....“
ఇప్పుడు నేను మీకు ఒక సంగతి ఇప్పుడే చెప్పనివ్వండి, నా సహోదరుడా. ఇప్పటి వరకు నీవు ఎన్నడూ నివసించని నిశ్శబ్ద ప్రపంచంలో నీవు నివసిస్తున్నావు. ఆమేన్! నీవు నరకానికి వెళితే, అక్కడ అందరూ ఏడుపు, కన్నీళ్ళతో, మరియు పళ్ళు కొరుకుట ఉంటుంది. నీవు పరలోకానికి వెళితే, అక్కడ హల్లెలూయలు మరియు దేవునికి స్తుతులు మరియు దివారాత్రులు అది ఎప్పటికీ. ఇది ఇప్పటి వరకు నీవు ఎన్నడూ నివసించని నిశ్శబ్ద ప్రదేశం. అవును.
34
ఓ, దేవుడు ఏ విధంగా సంఘాన్ని ఆశీర్వాదిస్తాడు. వారు ఆ కార్యాలు అన్నీ చూసికూడా శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఒక కొత్త సంగతి జరుగగానే ఎంత త్వరగా ఆ అద్భుతమైన కార్యాలు మరచిపోతారు. ఎప్పుడైతే క్రొత్త శ్రమ వస్తుందో, వారు చూసినవన్నీ వారు మరిచిపోతారు.
మనము కూడా అలాగే చేస్తాము. మనకు ఒక కూడిక ఉంది. దేవుని యొక్క శక్తి కుమ్మరింపబడుతుంది. అక్కడ అద్భుత కార్యాలు మరియు సూచకక్రియలు చోటుచేసుకుంటాయి. తరువాత దానితోపాటే సాతాను కూడా వచ్చి నిన్ను ఏదో ఒకదానితో కొడుతుంది. నీవు మరచిపోతావు, అది పరలోకము యొక్క దేవుడే నిన్ను అరచునట్లు చేస్తాడు, నీవు దేవునికి స్తుతించులాగున. నిన్ను అగ్ని కణంలో నుండి బయటకు తీసుకొనివచ్చిన పరలోకపు దేవుడిని నీవు మరచిపోతావు, నిన్ను గుంటలో నుండి త్రవ్విన పరలోకపు దేవుడిని నీవు మరచిపోతావు, నీవు త్రవ్వబడిన రాతినుండి. ఆయన్ను మరచిపోవుట సులభం.
నన్ను మీకు చెప్పనివ్వండి, నా సహోదరుడా, ఈ రాత్రికి మనకు ఉక్కు వంటి మనస్సాక్షి కలిగిన వ్యక్తి, పరిశుద్ధాత్మ శక్తితో నిలబడువాడు కావలి. నీకేమి వస్తుంది లేక ఏమి పోతుందో లెక్కలేదు, ఆయన ఇంకను ఆ వాగ్దాన భూమిలో ఆ విజయపు జెండాను ఉపుచూ ఉన్నాడు. ఈ రాత్రి మనకు ఆ రకమైన సంఘము కావాలి. ఆ సంఘము స్వచ్చమైనది. అది యేసు రక్తం వలన పవిత్రపరచబడియున్నది. పరిశుద్ధాత్మ ద్వారా అది కడుగబడింది. అద్భుతాలు మరియు సూచక క్రియలతో, వారు వెళ్ళుదారిలోని గుడారము నుండి రాజు యొక్క కేక, వారి దారిలో, ముందుకు నడుస్తూ. అవును, అయ్యా. ఇవన్నీయూ, వీటన్నిటి బదులు వారు ఈ శరీరానుసారమైన క్రియలు చేసియున్నపటికి, ఎడారి అంత, ఆ ప్రదేశాములో..... ఈ రాత్రి చాలా చర్చిలు ఆ విధంగానే ఉన్నాయి, చాలా పెంతెకోస్తు సంఘాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే బరువైన శ్రమలు వస్తాయో, ప్రజలు ఈ విధంగా ఏడ్చుట ప్రారంభిస్తారు, “ఓ, మేము దేవునికి, మేము ఐగుప్తులోనే మరణించేవారము కదా?”
35
ఇప్పుడు ఏమయ్యింది? దేవుడు మోషేను మరియు అహరోనును ఆయన దగ్గరకు పిలిచెను, వారిని షేకిన మహిమలోకి పిలిచి వారి దీవించెను.
ఆ ప్రవక్తతో దేవుడు చెప్పెను, “వెళ్ళు బండతో మాట్లాడుము.” ఆమేన్. వారి పాపాల మద్యలోనే.
దేవుడే గనుక మన మీద తీర్పుని ఉంచాలనుకుంటే, మనలో ఏ ఒక్కరూ ఫిర్యాదులు చేయలేరు. మనమందరము నరకానికి వెళ్ళుటకు అర్హత కలిగినవారము. మనకు కలిగే స్వస్థతలకు మనము ఎంత మాత్రము అర్హులము కాము. మనకున్న రక్షణకు మనము పాత్రులము కాము, కానీ వాటన్నిటి మద్యలోనే, అదే దేవుడు వారి పాపాలన్నిటినీ క్షమించాడు మరియు వారి అన్నీ అనుమానాలను తీర్చాడు, ఆయన ఇంకా చెపుతూనే ఉన్నాడు, “బండతో మాట్లాడుము, మరియు ఇది నీకు నీళ్ళిచ్చును.” ఆమేన్. అది మంచిదైయున్నది.
ఏది ఏమి జరిగినా ఇప్పటికీ, ఇంకా “బండతో మాట్లాడుము.” వారి పాపములో, ఇప్పటికీ బండతో మాట్లాడుము. సంఘములన్నీ ఎప్పుడైతే కఠినమైన మరియు స్వంత అభిరుచి మరియు నులివెచ్చగా అవుతాయో ఆ రోజు, ఒకరు అంటూరు, “నేను ఇది.” మరియు వేరొకరు, “నేను అది.” ఒకరు ఇది, అది, మరొకటి. దీనితో దానితో వారు ఏమియు చేయలేరు. వాటి అన్నింటి మధ్యలో దేవుడున్నాడు, ఇంకనూ ఆయన యొక్క పరిశుద్ధాత్మను పంపుచున్నాడు, అయిననూ ఆయన యొక్క శక్తిని పంపుతున్నాడు, అయిననూ బలహీనులను స్వస్థపరుస్తున్నాడు, ఇప్పటికీ ప్రజల మద్య నివసిస్తూ మెస్సియా యొక్క సూచన చూపిస్తున్నాడు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. శరీరానుసారమైన గొడవలు మరియు కార్యాల మధ్యనే.
36
వారిని చూడండి. వారిలో చాలామంది చెబుతారు, “మంచిది, ఇప్పుడు, నీవు చేయగలినది ఇంతేనా - మేమందరము ఎడారిలోని గుడారములో ఉన్నాము, మేము ప్రతి ఒక్క నేలను త్రవ్వి ఉన్నాము, మేము ప్రతి ఒక్క నీటి గుంటను, ప్రతి ఒక్క బావిని త్రవ్వి ఉన్నాము. ఇంక అక్కడెక్కడా నీళ్ళు లేవు.”
అత్యంత ఎక్కువగా నీరు ఇంకిపోయిన ఎడారిలాంటి స్థలములోని ఆ కొండ మీద ఉంచబడిన ఆ పురాతన బండరాయి ఉన్నది, “వెళ్ళుము ఆ బండతో మాట్లాడుము.” దేవుడు ఏవిధంగా చేస్తాడో చూడండి! అది శరీరానుసారమైన ఆలోచనగలవారిని గందరగోళంలో పడవేసింది. వారికి దాని గురించి ఏమి చేయాలో తెలియలేదు.
ఇప్పుడు, ఆ ఎడారి మొత్తంలోకి నీరు దొరకనిది (driest place) ఆ రాయి దగ్గరే. ఏ ఒక్కరికైనా ఆ సంగతి తెలుసు. మంచిది, అక్కడ లేకపోతే. వారికి ఆ పాత్ర నీటి గుంటలలోనే నీరు దొరకకపోతే, ఇక ఆ బండలో వారికి నీరు ఏలా దొరుకుతుంది?
వారు వారి గొప్ప సంఘములలో దైవికస్వస్థతని ఈ నామములో వెదకలేదు. “ఏదైనా దైవికస్వస్థతని కలిగియుంటే, అది మనము చెందియున్న ఈ గొప్ప సంఘము అయి యుంటుంది.” లేక “అది మనము చెందియున్న ఈ గొప్ప సంఘము అయి యుంటుంది, ఆ పాత నీటి ఊట.” ఇప్పుడు నీవు దానిని ఎలా కనుగోనబోవుచున్నావు, నీవు ఆ కొండపైకి వెళ్ళి ఆ బండతో మాట్లాడుము, ఎక్కడైతే నీరు లేదో దానితోనే అది ప్రారంభమౌతుంది. కానీ దాని విషయము, అది కనబడిన విధముగా లేదు, అది దేవుడిని ఆయన వాక్యమును బట్టి తీసుకొనుట! ఏమైనాగాని దానితో మాట్లాడుము!
ఒకవేళ డాక్టరు నీ వైపు తిరిగి తలవంచి ఈ విధంగా చెప్తే, “ఆ కాన్సరు వ్యాధి నీ ప్రాణాలను తీయబోతుంది.” అది ఏ విధంగా వుంటుంది ఎవరైనా ఒక మనిషి చేతులను నీ పైన ఉంచుట?
అది ఏ విధంగా కనిపిస్తుంది, అది ఏ వ్యత్యాసము చూపదు, అది వైద్యశాస్త్రమునకు ఎంత బుద్ధిహీనముగా కనిపిస్తుంది. దేవుడు చెప్పాడు, “వారు రోగులపై వారి చేతులను ఉంచినప్పుడు, వారు స్వస్థత పొందుకుంటారు!” అది ఏ విధంగా కనిపి౦చినా.
37
నీ భావము ఈలాంటి దినాలలో, మనకు అన్ని రకముల సంస్కృతులు మరియు అన్ని... అన్నీ రకాల సంస్కృతులు.... నేను ఎప్పుడూ సంస్కృతి గురించే ఆలోచిస్తుంటాను, అవును అది ఒక గొప్ప విషయము, హూ-హూహ్. నా అభిప్రాయంలో సంస్కృతి అంటే ఒక మనిషి ఒక కుందేలుని చంపుటకు కూడా చాలినంత ధైర్యాన్ని పొందుకోలేడు, కానీ దానిని వేరొకరు చంపినట్లయితే దానిని కడుపు నిండుగా తినుట. ఇప్పుడు, అది. ఓ మై! మనకు కావలిసింది సంస్కృతి కాదు. మనకు కావలిసింది మనలో సజీవ దేవుని వాక్యము ద్వారా మనలో విశ్వాసమును బయటకు తెచ్చుటకు పరిశుద్ధాత్మ కావలెను. అది ఖచ్చితంగా నిజము!
ఈ విద్య యొక్క గొప్ప దినాన, ఈ విజ్ఞాన శాస్త్రము యొక్క గొప్ప దినాన, అది దేవునికి ఏమి సంబంధం? ఎందుకు, వారు ఆ విజ్ఞాన శాస్త్రము ఒకసారి గొప్ప గోపురమును నేరుగా పరలోకమును చేరేందుకు నిర్మించగలిగినందుకా; మరియు దేవుడు కూర్చొని వారి అజ్ఞానాన్ని చూసి నవ్వుచున్నాడు. ఆయన ఒక కార్యమును చేసెను, ఆయన చిన్న భాషల కదలికలను క్రిందకు పంపి మరియు ఆ కార్యమునంతటిని గందరగోళంలో పడవేశాడు. ఓ, దేవుడు తనకు ఏమి కావాలనుకుంటాడో అదే చేస్తాడు, ఆయన చేయలేడా? ఓ, ఆయన దేవుడు, ఆయన ఎల్లప్పుడూ దేవుడే. నిస్సందేహంగా.
38
గమనించండి, ఇక్కడ ఏమి జరిగిందో. ఇప్పుడు, వాటన్నిటి మద్య దేవుడు మోషేకి మరియు అహరోనుకి చెప్పిన దానిని ఎప్పుడైతే మనము గమనిస్తామో, “వెళ్ళు బండతో మాట్లాడుము, మరియు అది ఆయన నీళ్ళిచ్చును,” ఎంత వెర్రితనం, వారి శరీరానుసారమైన మనస్సులు.
“మంచిది, మీరు నాకివ్వగలిగిన అత్యంత ఉత్తమమైనది అదే అయితే, దానిని ఒంటరిగానే వదిలివేయ౦డి.”
ఏలిషా వలె, ఒక దినము ఎప్పుడైతే అతను ప్రార్థనకు వెళ్ళాడో, మరియు అతని పనివాడిని పైకి పంపించాడు మేఘానికి సంబంధించిన సూచన ఏదైనా ఉన్నదేమోనని చూచుటకు అతను ఏడవసారి వెళ్ళి, తిరిగి వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పాడు, “ఓ, అవును అక్కడొక చిన్న మేఘం దాదాపు మనిషి చేయ్యంత పరిమాణములో పడమర వైపు పైన ఉన్నది.” అతను చెప్పాడు, “వర్షపు తొట్టెను తెరువుము, గొప్ప వర్షం రాబోతున్న శబ్దం నేను విన్నాను.”
ఏమిటది? ఎందుకు, ఎందుకు, వారి శరీరానుసారమైన మనస్సు దానిని త్వరగా పట్టుకొని మరియు ఇలాగ అంటుంది, “మంచిది, మీరు నాకివ్వగలిగిన అత్యంత ఉత్తమమైనది అదే అయితే, నీవు చేయగలిగినది అంతయు ఇదే అయితే —-”
39
ఓ, సహోదరుడా, ఈ రాత్రికి మన మధ్య ఇంకా ఎన్ని అధికమైన సూచక క్రియలు జీవముగల దేవుని నుండి మనము కలిగియుండాలి. ఎలా మనము కలిగి... మనము మరణము నుండి జీవంలోకి చేరియన్నాము. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము మన పైకి వచ్చియున్నది. యేసు మనలను స్వస్థపరుస్తాడు. యేసు మనలను రక్షిస్తాడు. యేసు పరిశుద్ధాత్మతో నింపుచున్నాడు. యేసు క్రిందికి వచ్చి అద్భుతాలను చూపిస్తాడు. మన హృదయాలను వివేచిస్తాడు, సూచక క్రియలను చేస్తాడు, అగ్నిస్తంభము, ఫోటో తీయబడింది, అది ఇక్కడే ఉన్నది. యేసు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు!
యేసు ఇలా చెప్పెను, ఆయనను ఈ విధంగా అడిగినప్పుడు, “నీకు ఏబది సంవత్సరాలు కూడా లేవు. నీవు అబ్రహామును చూశానని చెబుతున్నావు?” ఆయన ఇలా చెప్పారు, “నేను అబ్రహాము కన్నా ముందున్న వాడిని.” మరియు ఈ అరణ్యములో మోషేను నడిపించిన ఆ అగ్నిస్తంభం నేనే. ఆయన భూమి మీద నివసించినప్పుడు, ఆయన చెప్పెను, “నేను దేవుని దగ్గర నుండి వచ్చితిని మరియు నేను దేవుని దగ్గరకే వెళతాను. కొద్దికాలము తరువాత ప్రపంచం నన్ను చూడదు, అయినప్పటికీ మీరు నన్ను చూస్తారు, [”నేను“ అది ఒక సర్వనామము] నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, యుగాంతము వరకు.” సరి.
40
మరియు ఆయన చనిపోయినప్పుడు, సమాధిలో ఉంచబడి, పునరుత్తానము చెందెను, కొద్ది వారముల తరువాత, సౌలు దమస్కు మార్గములో ఉన్నప్పుడు ఇశ్రాయేలు సంతతికి నాయకత్వం వహించినది అదే గొప్ప అగ్నిస్తంభం ఆయన ముందు ప్రత్యక్షమై, ఆయన కనులు తెరిచేను, ఆయన ఇలా చెప్పెను, “సౌలా, సౌలా నన్నెందులకు హింసించుచున్నావు?”
సౌలు అడిగెను, “నీవెవరివి, ప్రభువా?”
ఆయన ఇలా చెప్పెను, “నేను యేసుని మరియు మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము.”
ఏమిటది? ఆయన దేవుని దగ్గర నుండి వచ్చాడు. శరీరంలో నివసించాడు. దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళాడు. అదే అగ్నిస్తంభం, అదే పరిశుద్ధాత్మ ఈ రాత్రి మనము కలిగియున్నాము, అదే కార్యాలు చేస్తు, అదే సూచక క్రియలు, ప్రతి ఒక్కటీ అదే విధంగా, ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని అవి నిరూపించుచున్నాయి! ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగుని ముట్టగలదు, ఓ, మనుష్యుని గురించి చెప్పబడును ఆయన ఎవరని, ఆయన ఏమి చేశాడో, వాటి నుండి బయటకు ఏ విధంగా తీసుకొని వచ్చారని - ఆయన ప్రజల మధ్య నివసిచు ఆ జీవముగల దేవుడి శక్తివలన. ఆమేన్! అంతా మంచిది! “కేవలం బండతో మాట్లాడుము.”
41
ఆ బండతో మాట్లాడిన కొంత మందిని చూద్దాం. దానిని ఏది ఆక్రమించుకొన్నదో కనుగొందాం. ఆ బండతో మొట్టమొదట మాట్లాడిన మనిషి కొద్దిగా వేదాంతముతో కట్టబడియున్నాడు. ఆయన కొన్ని అంజూరపు ఆకులను కచ్చడలు చేసుకున్నాడు, అతనే ఆదాము. అతను అనుకున్నాడు ఆ పని అన్నీటికన్నా మంచిదిగా ఎంచుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవునితో ముఖాముఖిగా కనబడాల్సి వచ్చిందో, తను దిగంబరుడిగా ఉన్నాడని కనుగొన్నాడు. అతను ఏమి చేశాడు? అతను ఆ బండతో మాట్లాడాడు, ఆ రాయి అతడికి తప్పించుకొనుటకు ఒక మార్గము చూపించింది - ఏధేనులో ఉన్న ఆ బండ.
అక్కడ నోవాహు ఉన్నాడు, ఇతను దేవుడిని ప్రటించినవారిలో ఇంకొకడు, ప్రజలు పట్టించుకొనక అతనిని చూసి నవ్వుకున్నారు. ఒక దినాన అతడు ఆ బండతో మాట్లాడాడు, ఆ బండ అతడిని ఓడలోకి తీసుకొని వెళ్ళినది. ఆ తుఫాను మీద ప్రయాణం చేయునట్లు చేసింది. పాపయుక్తమైన ప్రపంచాన్ని ముంచివేసింది. అవును అయ్యా. నోవాహు.
42
ఇంకొక మనిషి పేరు దానియేలు, ఈయన ఒకసారి సింహాల గృహలో ఉన్నాడు. ఆయన బబులోనులో, తనలో తాను ఇలా అనుకున్నాడు తను ఎంత మాత్రము రాజు యొక్క మాంసముతో తనను తాను మాలిన్యము చేసుకొనుటకు తలవంచేది లేదు. ఆ ప్రజల మధ్య నివసించాల్సి వచ్చినను, ఆయనకు ఈ ప్రపంచంతో ఏ పాలుపోంపూ లేదు. కాని ఆయన తనను తానూ మాలిన్యపరచుకొనుటకు సిద్ధముగా లేడు, తన హృదయంలో దానిని చేయకూడదు అని నిశ్చయించుకొనెను. మరియు ఆయన ఆ క్రమమును బట్టి నడచుచుండెను అందుకు, ఒక దినాన రాజు ఆయనను సింహపు గుహలో పారవేసెను, కానీ అతడు ఆ బండతో మాట్లాడాడు, ఆ అగ్ని స్థంభం క్రిందకు వచ్చి ఆ రాత్రంతయు సింహాలు దానియేలు దగ్గరకు రాకుండా ఉంచెను, ఎందుకనగా అతను గుహలో త్రోయబడుటకు ముందే ఆ బండతో మాట్లాడాడు.
అక్కడ నెబుకద్నెజరు ప్రతిమకు నమస్కరించని హెబ్రియుల పిల్లలు ఉన్నారు, మరియు వారు అగ్ని ఉంచబడిన అగ్నిగుండములోకి త్రోయబడ్డారు. మరియు వారు ఆ బండతో మాట్లాడారు ఇంకా ఆ అగ్నిగుండంలో వారితో పాటు నాలుగవ వ్యక్తి వున్నాడు. యుగముల యొక్క బండ. హల్లెలూయా! దావీదు ఇలా అన్నాడు, “ఒకవేళ నేను పాతాళమందు పండుకోనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని ఎగిరి వెళ్ళిపోతే.... ”
43
హాగరుని గమనించండి. ఆమె ఇల్లు వదిలి బయటకు రావలసి వచ్చింది. ఆమెకు ఇష్మాయేలు అనే ఒక చిన్న పాలు తాగే పసి బాలుడు ఉన్నాడు. ఆమె ఒక ఎడారిలాంటి ప్రాంతములోకి వెళ్ళినది, వారికి వెళ్ళుటకు వేరే స్థలము లేదు. ఆమె దగ్గర ఉన్న నీరంతా అయిపోయింది. ఆమె ఏమి చేయగలదు? ఆమెకు ఆ పిల్లవాడు చనిపోవుట చూడటము ఇష్టము లేదు, కాబట్టి ఆమె ఆ పిల్లవానిని తీసుకొని పొద క్రింద పడుకోబెట్టి, వెళ్ళి ఆమె మోకాళ్ళ మీద కూర్చుని, ఆ బండతో మాట్లాడింది. ఆ రాయి దానిలో నుండి నీటిని ప్రసరింపచేసినది మరియు ఆ పిల్లవాడు రక్షించబడ్డాడు. ఈ దినమువరకు, బర్షేబ ఇంకా ఆ ప్రవాహం దగ్గర అక్కడ వుంది. “దేవుడు నన్ను చూశాడు.” ఆమె చనిపోవుచున్న తన కుమారుని కొరకు ఆ బండతో మాట్లాడింది.
ఆ బండతో ఈ రాత్రి నీవు మాట్లాడగలవా? ఆయనతో నీవు మాట్లాడగలిగే సహవాసం కలిగియున్నావా? దానిని గురించి నీకు ఏమైనా తెలుసా?
44
యొహోషువా, యోర్దాను నది దాటి కొద్ది దూరం వచ్చాక ఆ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు, ప్రజలందరిని ఆపి ఇలా చెప్పాడు, “మనము దానిని స్వాధీనపరచుకొనగలము.”
దేవుడు చెప్పెను, “యెహోషువా, దానంతటి గురించి తెలిసినవాడివి నీవొక్కడివే. ఇప్పటి నుండి నీవు ఈ సంతతికి నాయకత్వము వహించులాగ నేను నీకు అనుమతిని ఇస్తున్నాను.”
అతను తన మొట్ట మొదటి కూడికను ఏర్పాటు చేశాడు, అతడు యొరికో గోడల ఎదురుకి చేరుకున్నాడు, అతను దాని చుట్టూ తిరిగాడు, మరియు ఇలా అన్నాడు, “ఇప్పుడు, నేను దీనిని ఎలా దాటగలను? వారందరిని నేను ఎలా ఈ గోడలపైకి ఎక్కించగలను? వారు దాని పైన అంతా రాళ్ళు మరియు చాలా రకాల వాటిని పరిచియున్నారు. వారి బాణాలు మరియు ఇతరాలు ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నాయి. మనము ఇక్కడ దాదాపుగా నిరాయుధులుగా ఉన్నాము, మనకు దారిలో ప్రయాణమునకు కావలసిన వస్తువులే తీసుకొని వచ్చాము. మరియు మనము అక్కడనే ఉన్నాము. నేను దీనిని ఏ విధంగా చేయగలను?
మరియు కొద్ది సేపటి తరువాత అతడు కత్తి దూసి పట్టుకొనియున్న ఒక మనుష్యుడును చూశాడు. అతను అడిగాడు, “నీవెవరివి? నీవు మా శత్రువువా? లేక మాలో ఒకరివా?”
ఆయన ఇలా చెప్పారు, “లేదు, నేను దేవుని యొక్క సైన్యాధిపతిని.” మరియు యొహోషువా ఆ బండతో మాట్లాడాడు. మరియు ఒక పెద్ద కేక బయటకు వచ్చింది. ఆ గోడలు కూలిపడ్డాయి, కారణం అతను ఆ బండతో మాట్లాడుటయే.
45
చాలా వందల సంవత్సరాల తరువాత, కూలిపోయిన ఆ గోడల రాళ్ళ మీద ఒక ముసలివాడైన గుడ్డి బిక్షగాడు కూర్చొనియున్నాడు. ఓ, మై, ఆ బండతో మాట్లాడుట అనేది సంఘమునకు బయటే జరిగింది, అక్కడ అటువంటి సంఘటన ఏది జరుగలేదు. కానీ అతను అక్కడ గుడ్డివాడిగా కుర్చోనియున్నాడు, ఆలోచిస్తూ “ఆ మార్గమున” - ఆ దారిలోనే ఏలియా మరియు ఎలీషా చేతిలో చెయ్యి వేసుకొని, యోర్దాను వచ్చారని ఎరిగినప్పుడు. యొహోషువా అంతకు ముందే ఆ గొప్ప దేవుని యొక్క సైన్యాధిపతితో మాట్లాడియున్నాడు. ఆయన ఇలా చెప్పాడు, “ఓ, నేను గానీ ఆ రోజుల్లో ఉండి వుంటే నేను కూడా ఆయనతో మాట్లాడి వుండేవాడిని.”
ఆ సమయంలో శబ్దం రావటం ప్రారంభమైంది, మీకు తెలుసా, సహజంగా ఎక్కడ దేవుడుంటాడో అక్కడ చాలా శబ్దం ఉంటుంది. అది ఎందుకు అనేది నాకు తెలియదు, కానీ దేవుడెక్కడి వస్తే అక్కడ శబ్దం ఉంటుంది.
ఇక్కడ దేవుని యొక్క అదే సైన్యాధిపతి వచ్చాడు. ప్రజలు ఆ గుడ్డివానిని అరువవద్దని గద్దిస్తున్నారు; కానీ, అతను ఆ బండతో మాట్లాడాడు, మరియు ఆ బండ అతనికి పోయిన అతని చూపును తిరిగి ఇచ్చింది. వారు అతని నోరు ముయి౦చుటకు ప్రయత్ని౦చారు. వారు అతని యొక్క శాంతిని పట్టుకొనుటకు ప్రయత్నించారు, కూర్చొని వణుకుతు, అతని చిన్న ముసలి పాదాలు ఎండలో పడవేయబడి ఉన్నాయి, మరియు చిన్న ముసలి కృశి౦చుకుపోయిన చేతులు మరియు అతని పాత చిరిగిపోయిన పాత కోటు; కానీ అతను ఆ కోటుని తీసి ఒక చివర నుండి మరొక చివరికి విసిరేశాడు, లేచి వెళ్ళాడు. ఎందుకొరకు? అతను ఆ బండతో మాట్లాడుటకు సిద్ధమయ్యాడు, మరియు ఆ బండ అతనికి కంటి చూపునిచ్చింది. హల్లెలూయ!
అది ఈ రాత్రి ఇక్కడ వున్న ప్రతి ఒక్క గుడ్డివానికి ఒక హెచ్చరిక, నీవు ఆత్మీయంగా గుడ్డివాడవైనా లేక శారీరకంగా గుడ్డివాడవైనా, ఆ బండతో మాట్లాడుము. ఆయన కంటి చూపునిచ్చు బండగా వున్నాడు, ఆమేన్! ఆ బండతో మాట్లాడుము. అవును అయ్యా. ఆ గుడ్డి మనుష్యుడు.
46
ఒక్క స్త్రీ ఉండెను, నీళ్ళు తెచ్చుటకు ఒక్కసారి బావి యొద్దకు వెళ్ళెను. ఆమె జీవితము బహు చెడ్డ రూపములో ఉండెను, ఆమె ఒక వేశ్యయైయున్నది. గోడకు అనుకోని ఎదురుగా ఒక మనిషి కూర్చుని ఉండుట ఆమె చూసింది, మరియు ఆయన ఎవరు అనునది ఆమెకు తెలియదు. కొద్దిసేపటి తరువాత ఆయన ఇలా అడిగారు, “స్త్రీ నాకు త్రాగుటకు నీరు ఇమ్ము.” ఆమెలోని లోపం ఏమిటి అని కనుగునేంత వరకు ఆయన ఆమెతో మాట్లాడారు. ఆయన ఇలా చెప్పారు, “వెళ్ళి నీ భర్తను తీసుకొని రమ్ము.”
ఆమె ఇలా అన్నది, “నాకెవరూ లేరు.”
“ఎందుకు,” ఆయన ఇలా చెప్పారు, “అది నిజమే. నీకు ఐదుగురు భర్తలున్నారు; ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాదు.”
ఆమె, “అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మాకు తెలుసు ఒక రోజు మా దగ్గరికి ఆ బండ వస్తుంది. దాని పేరు మెస్సీయ్యా ఆయనే ఈ విధంగా చెబుతారు,” అన్నది.
ఆయన ఇలా అన్నారు, “నీతో మాట్లాడుచున్న నేనే, ఆయనను.”
ఆ స్త్రీ నీటి కుండను క్రింద పడేసింది, ఆమె అందమైన పెద్ద కళ్ళు మెరుస్తున్నాయి, ఆమె నగరంలోకి వెళ్ళి ఆమె మాట్లాడింది ఆ బండతోనని తెలియచెప్పుట నేను చూడగలుగుచున్నాను. హల్లెలూయ! మరియు ఆమె నీటిని కనుగొన్నది, ఆమె మరెన్నడూ నీటి కొరకు ఆ బావి దగ్గరకు రాలేదు. ఓహ్, ఆమె ఆ బండతో మాట్లాడింది.
47
చిన్న మార్త ఒకసారి ఆమె సహోదరుడు చనిపోయాడు మరియు సమాధి చేయబడెను, సమాధిలో నాలుగు దినములయ్యింది, అప్పటికే క్రుళ్ళిపోయెను, అతని శరీరాన్ని చిన్న చిన్న పురుగులు తినుచుండెను. మరియు నగరంలో ఏదో జరుగుతుంది అని ఆమె విన్నది, అదేమిటంటే యేసు వచ్చాడని. ఆయన ఎక్కడ వున్నాడో అక్కడికి ఆమె వెళ్ళింది, ఆమె ఆయన ముందు నేల మీద పడి ఇలా చెప్పెను, “ప్రభువా, నీవు ఇక్కడ ఉన్నట్లయితే, నా సహోదరుడు చనిపోయివుండేవాడు కాదు, కానీ ఇప్పటికైనా, ప్రభువా, నీవు దేవుడిని ఏదైనా అడిగితే, దానిని దేవుడు నీకు ఇస్తాడు.”
ఆయన అనెను, “నీ సహోదరుడు తిరిగి లేస్తాడు.”
ఎందుకు? ఆమె ఆ బండతో మాట్లాడింది, ఆమేన్, మరియు పాడయిపోయిన దానిని నుండి మరణము నుండి వెనుకకు తెచ్చాడు, మరణాన్ని గద్దించి తిరిగి జీవాన్ని ఇచ్చాడు. నాలుగు దినాల క్రితం పాతిపెట్టబడిన ఒక మనిషి, అతని కాళ్ళ మీద నిలబడి, తిరిగి జీవిస్తున్నాడు, ఎందువలన ఆమె ఆ బండతో మాట్లాడింది.
ఒక రాత్రి శిష్యులు అందరూ సముద్రము మధ్యలో ఉన్నారు, అన్నీ ఆశలు పోయెను, మరియు అక్కడ ఏమి జరిగింది? వారు ఏదో చూశారు, అది ఒక ఆత్మ వారి దగ్గరకు వచ్చుట వారు చూశారు. మరియు అది ఆ బండ అని వారు కనుగొన్నారు. మరియు వారు ఆ బండతో మాట్లాడారు. వారిలో కొత్త ఆశలు వచ్చాయి, వారు వెళ్ళిపోయారు. వారంతా రక్షించబడ్డారు ఎందువలనంటే వారు ఆ బండతో మాట్లాడారు.
48
యాయిరు, ఒక చిన్న కాపరి. అతని కుమార్తె చనిపోయింది, అన్నీ అశలు పోయాయి. అతను నేరుగా ఏదో ఆలోచించుట జరిగింది, అతని భార్య అతనిని చూసి పరుగెత్తి వెళ్ళి ఆయన టోపీని తీసుకోని, “యాయిరు, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు?”
వైద్యుడు ఆ ఇంటిని వదిలి వెళ్ళుచున్నాడు, ఆమె మరణాన్ని ధృవీకరించాడు, ఆమె హృదయం ఆగిపోయెను. ఆమెలో శ్వాస క్రియ లేదు, చాలా రోజుల నుండి ఆమె అనారోగ్యంతో ఉండెను, ఇప్పుడు ఆమె వెళ్ళిపోయెను. ఆమె అడిగింది, “ఇప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు?” ఎందుకొరకు నీవు టోపీని పెట్టుకున్నావు?“
“నేను ఇప్పుడే ఒక ఆలోచన కలిగియున్నాను, నేను వెళ్ళి ఆ బండతో మాట్లాడుతాను.”
మరియు ఆ బండ అతని కుమార్తెలోనికి తిరిగి జీవాన్ని ఇచ్చింది. హల్లెలూయా! అదే మన దేవుడు.
49
నీకు జీవం కావాల౦టే, ఆ బండతో మాట్లాడుము. నీకు సంతోషం కావాలనుకుంటే, ఆ బండతో మాట్లాడుము. నీకు స్వస్థత కావాలనుకుంటే, ఆ బండతో మాట్లాడుము. నీకు పరిశుద్ధాత్మ కావాలనుకుంటే, ఆ బండతో మాట్లాడుము. నీకు ఏ అవసరతలున్నా, ఆ బండతో మాట్లాడుము మరియు ఆయన నీకు నీళ్ళిచ్చును. నీవు దానిని నమ్ముచున్నావా?
ఈ రాత్రి సంఘానికి కావలసినదేమంటే తిరిగి ఆ బండతో మాట్లాడే సహవాసం కలిగివుండుటయే. యుగముల బండ, యేసుక్రీస్తు, దేవుని యొక్క కొట్టబడిన బండ. అది దేవుని యొక్క బండ. అది దేవుని యొక్క రక్షణయై ఉన్నది. ఈ రాత్రికి ఇంకను మన అజ్ఞయైయున్నది: మనం ఏదైనా అవసరతలో ఉన్నట్లైతే, ఆ బండతో మాట్లాడవలెను, ఆ బండకి పెట్టబడిన నామాన్ని ఉపయోగించుకో, మరియు దేవుడు ఆ బండలో నుండి నీళ్ళనిచ్చును! మహిమ!
నేనిప్పుప్పుడు 100 మైళ్ళు పరుగెత్తగలనని అనుకుంటున్నాను. ఎందుకు? ఓ, సహూదరుడా, కొట్టబడిన ఆ బండ ఇప్పుడు ఇక్కడ ఉన్నది. దానిని ఇకపై కొట్టవద్దు, కేవలం దానితో మాట్లాడండి. కేవలం ఆ బండతో మాట్లాడుము, మరియు అది నీళ్ళిచ్చును. నీవు దానిని నమ్మగలవా? అయితే మనము తలలు వంచి ఆయనతో మాట్లడేదము. నీకు ఏ అవసరత ఉన్ననూ, ఆ బండతో మాట్లాడి ఆయన నీకు నీళ్ళిస్తాడేమో చూడుము.
50
ఓ, దేవా, కనికరం కలిగివుండుము. ఆ ఎండిపోయిన ప్రదేశంలో పరిశుద్ద బండ నీవేయని, తుఫానులో నీవే మాకు ఆశ్రయము అని మేము ఎరిగియున్నాము. ఆశ్చర్యము లేదు యేసు ఇలా చెప్పెను, “వీరు ఊరకుండినయెడల, వెంటనే ఈ రాళ్ళు కేకలు వేయును.” ఆ బండలు.
యోహాను అనెను, “దేవుడు ఈ రాళ్ళవలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడు.”
దేవా, మేము ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పగలము మేము మీతో మాట్లాడగలమని. మేము మాటల ద్వారా మీతో సహవాసం కలిగినందుకు మీకు కృతజ్ఞతలు. యేసు క్రీస్తు యొక్క రక్తము మమ్మును ఈ స్థితిలో ఉంచింది. నేను ప్రార్ధిస్తున్నాను, తండ్రి ఇక్కడ ఉన్నవారి యొక్క ప్రతి పాపమును మీరు క్షమించండి. ఈ రాత్రికి మమ్ములనందరిని కలిపి తీసుకొని వెళ్ళండి తండ్రి, మా పాపాలను క్షమించండి, మా రోగములను స్వస్థపరచండి. పరలోక ప్రభువైన దేవుడు ఆయన శక్తిని చూపును గాక మరియు ఆయన యొక్క మహిమను ఈ ప్రజల మీద కుమ్మరించును గాక.
51
మనము తలలు వంచియుండగా, ఇంకనూ ఇక్కడ ఆయనను తెలియనివారు ఎవరైనా ఉన్నట్లయితే మరియు మీరు ఆయనను మీ రక్షకునిగా మాట్లాడుటకు ఇష్టపడతారా. నీ చేయిని పైకి ఎత్తి, చూపుము? చెప్పండి, “ప్రభువైన దేవా, నా మీద కనికరము కలిగివుండుము మరియు నాకు నిత్యజీవనమును ఇవ్వుము.” మీరు మీ చేతిని ఎత్తుతారా? దేవుడు మిమ్ములను దీవించును గాక, అయ్యా. దేవుడు మిమ్ములను దీవించును గాక, స్త్రీ. అక్కడ ఇంకెవరైనా ఉన్నారా? ఇంకొకరు ఎవరైనా? అక్కడ వెనుక ఉన్న సహూదరిని దేవుడు దీవించును గాక. మరొకరు? చెప్పండి, “నేను ఆ బండతో మాట్లాడుటకు ఇష్టపడతాను, సహూదరుడా బ్రెన్హాం. నీకు ఆయన తెలుసా?”
అవును, ఆయన నాకు తెలుసు. ఆయనతో నేను సహవాసం కలిగివున్నాను. ఆయన నా స్నేహితుడు. ఆయన నా రక్షకుడు. 31 సంవత్సరాల క్రితం నేను ఆయనతో మాట్లాడాను. ఆయన నా పాపాలన్నిటిని క్షమించాడు. నా వ్యాధులన్నింటిని స్వస్థపరిచాడు. నాకు సమాధానము మరియు సంతృప్తిని ఆయన ఇచ్చుచున్నాడు. నేను మీకొరకు ఆయనతో మాట్లాడాలనుకుంటున్నారా, మీరు కూడా ఆయన గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా?
మీలో ఎవరైనా చేతులెత్తి, చెప్పండి, “సహోదరుడా బ్రన్హాం, నేను ఆయన ఎరుగాలనుకుంటున్నాను,” కేవలం నీ చేతిని పైకెత్తుము, చెప్పుము, “సహోదరుడా బ్రన్హాం, నా కొరకు ప్రార్థన చేయుము.” నేను దానిని తప్పకుండా చేస్తాను.
ప్రభువు నిన్ను దీవించును గాక! మనము ముగించే ముందు ఇంకెవరైనా ఉన్నారా? అయ్యా, ఆ వెనుక ఉన్న మిమ్మును దేవుడు దీవించును గాక. అది మంచిది. అది నిజమైన విశ్వాసం. అయ్యా, దేవుడు దీవించును గాక, నా ఎడమ ప్రక్కన. దేవుడు దీవించును గాక, ఆ వెనుకాల ఉన్న చిన్నవాడిని, ఆ చిన్న పిల్లవాడిని. దేవుడు నీతో ఉండును గాక, కుమారుడా, నీలో నుండి మంచి ప్రసంగీకుడు రావలసియున్నది.
ఎవరైనా ఇలా చెప్పేవారు ఉన్నారా, “నేను ఆ బండతో మాట్లాడుటకు ఇష్టపడుచున్నాను?” మంచిది, ఏ ఒక్కరూ లేరా? దేవుడు ఆ వెనుక ఉన్నవారిని దీవించును గాక. ఇప్పుడే మీ చేతులు చూచాను. ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని నేను కొద్దిసేపు వేచియున్నాను.
52
ఇప్పుడు దీని గురించి ఆలోచించు. నీవు ఎడారిలో ఉన్నావా? నీవు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఉన్నావా? నిజమైన కొట్టబడిన దారిలో నుండి నీవు తప్పిపోయి ఉన్నావా? ఆ బండతో ఎందుకు మాట్లాడకూడదు? ఆయన నీకు నీళ్ళనిచ్చును. ఆ చేతి కర్రతో కొట్టబడిన బండయే మోషే తీర్పు కర్ర. దేవుని యొక్క ఆ తీర్పు కర్ర వలనే ఆ బండలో చిన్న చీలిక ఏర్పడింది. ఒక దినాన అదే బండలో నుండే వారు తేనె కనుగొన్నారు. ఓ, మై!
దేవుని తీర్పు యేసుక్రీస్తును కొట్టెను. ఆయనే మన రక్షణ బండయైయున్నాడు. ఈ ఉదయము మనము చెప్పిన విధముగా, ఆయన ప్రక్కవైపు చీలికయున్నది, ఆ బండలో తేనెయున్నది. వారు ఆహారాన్ని కనుగొంటారు, ఆ తుఫాను సమయంలో నీవు ఆశ్రయాన్ని పొండుకుంటావు. నీ శరీరానికి స్వస్థతను కనుగొంటావు.
ఇక్కడ కూర్చున్న ఈ యౌవ్వన స్త్రీని దేవుడు దీవించును గాక, నీకు ఏదైతే అవసరత కలిగి ఉన్నావో దానిని వెదకు. అది ఆ బండలో ఉన్నది. ఇప్పుడు నీ హృదయమంతటితో నీవు నమ్మినట్లయితే. మంచిది, నేను అక్కడ మీ చేతిని మరల కలిగియున్నాను. నేను కేవలం వేచియున్నాను, పరిశుద్ధాత్మ ఏమి తెలియజేస్తుందో అని ఎదురుచూస్తున్నాను. మంచిది. నీవు దానిని నమ్మినట్లయితే. మంచిది.
53
మా పరలోకపు తండ్రీ, నీవు వారి చేతులను చూడుము. వారు నీతో మాట్లాడాలనుకుంటున్నారు. ప్రభువా, నేను వారిని నీ సన్నిధికి తీసుకొని వచ్చాను. ఇదే ఆ రాత్రి అవ్వును గాక దేవా; రేపు అంటే చాలా ఆలస్యం అవ్వవచ్చు. అక్కడ మేము లేకపోవచ్చును, మేము ఎవ్వరము రేపు ఇక్కడ ఉండకపోవచ్చును. ప్రపంచాన్ని పేల్చివేసి ఆ గొప్ప ఘటన ఇంకా ప్రారంభం అవ్వలేదని మనకు ఎలా తెలుస్తుంది. మనకు ఎలా తెలుసు ఆ మిస్సైలు ఇంకా ఎక్కడో ప్రాయోగించబడి మరియు అది కాల్పులు ప్రారంభానికి కారణము కావచ్చు. ఎప్పుడైతే ఆ సమయం ప్రారంభమవుతుందో, సంఘము మహిమ అను తన మార్గములోకి వస్తుంది. ఓ, దేవా, ఇది తీసుకొని మరియు యోర్దాను దాటుకొని, యోర్దాను మృత్యువు దాటి, మరియు మహిమలోకి మేము వెళ్ళుదుము.
ఈ రాత్రి వీరందరు నీ సన్నిధిని తెలుసుకొనునట్లు చేయుము, తండ్రీ. అదే మారని ప్రభువుకు వారు చేతులను ఎత్తివున్నారని వారందరికి తెలియజేయుము. ఆయన మారనివాడు. ప్రజలు మారతారు, కాలము మారుతుంది, కానీ దేవుడు మారనివాడు.
54
[టేపు మీద ఖాళా ఉన్నది]... ఇక్కడ పైకి రండి, మరియు పరిచారకులలో ఒకరు ఇక్కడ, సహూదరుడు.... కొన్నిసార్లు ఈ స్వస్థతా ఆరాధనలలో, నేను చాలా బలహీనమవుతాను, చివరికి నేను ఎక్కడ నిలబడ్డానో నేను చూడలేను, మరియు నా కుమారుడు, లేక లియో, లేక జీనే, లేక వారిలో కొందరు నా దగ్గరకి వచ్చి మరియు నన్ను తట్టి నన్ను బయటికి తీసుకువెళతారు. అది ఎందుకు అలా జరుగుతుందంటే ఆ దర్శనాలు నన్ను బలహీనునిగా చేస్తాయి, నేను కొద్దిగా కూడా ఇక్కడ నిలబడలేదు. చూడండి? అదే కారణం నేను అనుకుంటున్నాను ఇది చాలా సరిపోయినటువంటిది.... మరియు నేను మిమ్ములను నమ్ముతున్నాను, సహూదరుడా, నీవు సహూదరీ, నీ చేయి ఎత్తిన నీవు, దేవుడు తెలియని మీకు, అది మీ యొక్క రక్షణయై యున్నది. దేవుడు నన్ను మునుపే రక్షించాడు, కానీ నేను మీరు రక్షణ పొందేంత వరకు సంతృప్తి చెందను. మీరు కూడా వెళ్ళాలి నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అక్కడ వుండాలనుకుంటున్నాను.
55
ఇప్పుడు, దేవుడు చేయకపోతే.... దేవుడు ఈ కార్యాలు చేయకపోతే కేవలం.... నేను రాత్రి ఇక్కడ నిలబడగలిగితే ఇలా చెబుతాను, “దేశాధ్యక్షుడు ఎవరౌతారనేది నేను చెబుతాను,” మరియు ఖచ్చితంగా చెబుతాను, అది ఆ విధంగానే జరుగుతుంది.“ ఎందుకు, కొంతకాలం తరువాత మీరు అంటారు ”సహోదరుడా బ్రెన్హాం, ఒక గొప్ప ప్రవక్త, నిజమే, దేశాధ్యక్షుడు ఎవరు అవుతారోనని ఆయన ఖచ్చితంగా చెప్పారు.“ కానీ ఏమిటో మీకు తెలుసా? అది ఏం మంచిని చేస్తుంది? చూశారా? అది ఏ మాత్రము దేవునిని మహిమ పరచదు. అది నన్ను మహిమ పరుస్తుంది. చూశారా? కాబట్టి దేవుడు అటువంటి కార్యాములను చేయడు దేవుడు దానిని చేయ్యడు.
ఆయన కేవలం ఆయన మహిమ కొరకే చేస్తాడు. ఆయన ప్రవక్తని ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళుటకు అనుమతిస్తాడంటే ఈ ప్రవక్త దానిని గురించి తనలో తాను కొన్ని సార్లు ఆలోచించుకొని వుంటాడు. ఎలాగంటే దావీదు 22వ కీర్తనలో ఏడ్చినట్లుగా, “నా దేవా, నా దేవా, నీవు ఎందులకు నా చేయి విడిచితివి?” అటు వంటి మాటలనే యేసు సిలువ మీద పలికెను. అది ఏమై యున్నది? యేసు యొక్క ఆత్మ అతనిలో ఉండి అతనితో అలాగు పలికించినది. ఆయన క్రీస్తు యొక్క మాటలను పలికాడు.
యెషయాను చుడండి, ఆయన ఎలా అన్నాడు మరియు ఆయనే అని ఎలా ఆలోచించాడు, ఆ మెస్సీయా అతనిలో ఉన్నాడు కాబట్టే అన్నాడు, దావీదును చూడండి ఆ కొండ పైకి వెళుతున్నప్పుడు, వెనుక ఉన్న యెరుషలేము వైపు తిరిగి, త్రోసివేయబడిన రాజై ఏడ్చాడు. దాని తరువాత కొన్ని వందల సంవత్సరాలకు దావీదు కుమారుడు ఒక త్రోసివేయబడిన రాజవలె కొండెక్కాడు. వెనుకకు తిరిగి యెరుషలేముని చూసి ఏడ్చుచూ, “యెరుషలేమా, యెరుషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరొల్లకపోతిరి.” దానిని గురించి ఆలోచించు. ఇప్పుడు, అదే దేవుని యొక్క ఆత్మ.
ఇప్పుడు, దేవుడు తన ప్రవక్తలను తన మహిమ కొరకు ఉపయోగించుకుంటాడు. నీవు దానిని నమ్ముచున్నావా?
56
ఇప్పుడు, ఈ రాత్రి ఇక్కడున్న వరుసలో, నేను స్వస్థతపరచువాడిని అనుకోవుటలేదు, నేను స్వస్థపరచువాడిని కాదు. దేవుడే స్వస్థపరుచువాడు. అదంతా దేవుడే నీ కొరకు చేస్తాడు, ఆయన ముందుగానే చేసియున్నాడు. ఇప్పుడు నీవు వెంటనే చేయవలసిన పని ఏమిటంటే ఆయన ఏమైతే చేశాడో దానిని నీవు విశ్వాసంతో నీవు అంగీకరించుటయే. ఆయన నీకు ఆ వాగ్దానము ఇచ్చెను, నీవు లోపలికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు.
ఇప్పుడు, ఎంత మంది నమ్ముతున్నారు యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని? కృతజ్ఞతలు. ఎంత మందికి తెలుసు ఆయనే ప్రధాన యాజకుడని ఇప్పుడే ఆ అనుభూతి ద్వారా మన అ బలహీనతలని తాకుతుందని?
నీవు ఆయనను తాకావని నీకు ఏ విధంగా తెలుస్తుంది, నీవు ఆయనను తాకినట్లయితే? మంచిది, ఆయన. ఆ ప్రధాన యాజకుడు ఎలా స్పందించును? ఆయన నిన్న చేసిన విధంగానే చేశాడా. అది నిజమా? ఆయన అదే విధంగా ఉన్నాడు. నీవు ఎక్కడైతే వున్నావో అక్కడి నుండే ఆయనను తాకాలనుకున్నట్లైతే, ఆయన వస్త్రపు చెంగును తాకాలనుకుంటే, తరువాత ఆయన ఆ విధంగానే ఉన్నట్లయితే నిన్న నేడు, నిరంతరం, ఆయన పరిశుద్ధాత్మ చేత వెనుకకు తిరిగి మరియు ఆయన వస్త్రపు చెంగును తాకిన ఆ స్త్రీకి ఆయన చేసిన కార్యమునే మీకును చేస్తాడు. అది నిజమేనా? ఆమె ఎవరో కనుగోనేంత వరకు ఆమెను వెదికాడు. ఆయనను ముట్టుటకు అక్కడ గొప్ప జన సమూహమున్నది. కానీ వినుటకు వచ్చిన వారిలో ఆమెను కనుగోనేంత వరకు ఆమె కొరకు వెదికాడు, ఆయన ఇలా చెప్పారు, “గొప్ప విశ్వాసం నిన్ను రక్షించింది.” నీ రక్తస్రావ సమస్య తీరిపోయింది.
చూడండి? ఇది ఆయనకు తెలుసు. ఇప్పుడు, అది ఏమి చేసియున్నది. ఆమె ఆ ప్రధాన యాజకుడిని తాకినది. ఈ రాత్రికి మీరునూ అదే కార్యము చేయవచ్చును. ఆయన అదే ప్రధాన యాజకుడైతే, ఇది ఆ అగ్నిస్తంభమే అయితే, ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ చిత్రపటం అదే అయితే, నేను కొన్నిసార్లు వారిని ఇక్కడనే పడుకోబెడతాను. కానీ ప్రభువు యొక్క దూత యొక్క ఆ దృశ్యపటం, ఆ దూత గనుక ప్రభువు దూత అయితే, ఆయన అవే కార్యాలను తిరిగి చేస్తాడు.
ఆయన గాని నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా వున్నవాడైతే, అది అతనికి జీవితాన్ని ఇస్తుంది.
57
చెప్పండి, ఎంత మంది మనము దేవుని సన్నిధిలో ఉన్నామని అనుభూతి చెందుతున్నారు? ఇక్కడ ఈ వేదిక మీద నన్ను ముక్కలుగా చేస్తుంది. అది మంచిది, స్నేహితులారా. నేను చేయలేను కనీసము... నేను నమ్ముతాను మనకు చివరకు ఒక ప్రార్థనా వరుస కూడా లేదని మీలో ఎంతమంది విశ్వసిస్తారు. దేవుడు మిమ్మును బయటకు పిలుస్తాడని, నీవెవరైనప్పటికీ మరియు ఏదో ప్రార్థన వరుస లేకుండానే? నీ హృదయమంతటితో నీవు నమ్మినట్లయితే, దేవుడు చేస్తాడు.
మంచిది. ఆయన దానిని చేస్తే నీవు నమ్ముతావా? ఆయనను నీవు నమ్ముతావా, ఆయనను అంగీకరిస్తావా? అంతా మంచిది. ఇక్కడ ఎంత మంది అనారోగ్యంతో ఉన్నారు, నీ చేతిని పైకి ఎత్తుము. ఎంత మందికి మీ జీవితంలో దేవుడు మిమ్ములను స్వస్థపరచాలని కోరుకుంటున్నారు. మీ చేతులను పైకి ఎత్తండి. ఇప్పుడు, మీలో ఎంతమంది నాకు అపరిచితులు, మీ గురించి నాకు ఏమి తెలియదు? మీ చేతులను పైకి ఎత్తండి. అంతా మంచిది. ఇప్పుడు మీరు ప్రార్ధించండి. ఆ ప్రధాన యాజకునికి ప్రార్థన చేయండి మరియు ఆయన వస్త్రపు చెంగును ముట్టండి, ఏమి జరిగినదో చూడండి.
ఓ, ఇది ఆయన చేసినట్లయితే - నాకు తెలియదు ఆయన చేస్తాడు. నేను నమ్ముచున్నాను ఆయన ఇది చేస్తాడని నేను నమ్ముచున్నాను. నేను అభిషేకమును నమ్ముచున్నాను, అదే అగ్ని స్థంభం ఈ రాత్రి ఇక్కడేయున్నది. నేను దానిని నమ్ముతాను. నా హృదయమంతటి నుండి దానిని నేను నమ్ముచున్నాను. ఆయన అన్నారు... ఆయన నాకు ఇలా చెప్పారు! ఆయన నాకు చెప్పారు ఇది జరుగనైవున్నదని, ఆయనను నా హృదయమంతటి నుండి నేను నమ్ముచున్నాను. ఆయనను నేను నమ్ముచున్నాను. సాతాను, నీవు బయటకు వెళ్ళు ఎందుకంటే నేను నీ యొక్క ఏ చెత్త మాటలను వినను. నేను నమ్ముతాను, యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని. ఆయన మారని దేవుడని బైబిల్ వాగ్దానం చేసెను.
ప్రజలు ఆయనను ముట్టవచ్చును.
58
ప్రభువైన దేవా, ఈ రాత్రి దానిని ఋజువు చేయుము. పరిశుద్ధాత్మ దానిని ఋజువు చేయనిమ్ము నీవు అదే ప్రభువైన యేసువని మరియు నిన్ను ముట్టవచ్చునని. దానిని దయచే యుము, ప్రభువా. నీ విధేయత గలిగిన సేవకుడిని ఉపయోగించుకొనుము. ప్రభువైన దేవా, నా ద్వారా ప్రజలతో మాట్లాడుము. నీవు గనుక నా స్వరమును వాడుకొనాలనుకున్నట్లయితే, నేనిక్కడే ఉన్నాను. ప్రభువా, అది మిగిలినవారిని ప్రోత్సహించుటకు ఉపయోగపడుతుంది. నిన్ను కొంతమందినైనా తాకనివ్వము. ప్రభువా, అందువల్ల నీవు మారని యుగముల బండవని వారు తెలుసుకుంటారు. నీవు దానితో మాట్లాడిన వెంటనే నీళ్ళనిచ్చిన ఆ బండ నీవేనని వారికి తెలుసుకోననిమ్ము; ఆ ప్రధాన యాజకుడే మా బలహీనతలను అనుభూతుల ద్వారా ముట్టనిమ్ము. మాకు దయ చేయుము, ప్రభువా, యేసుక్రీస్తు నామములో దయచేయుము.
59
కేవలం నమ్ముము, కేవలం గౌరవముగా రమ్ము మరియు విశ్వసించుము. ఇప్పుడు, నేను దాన్ని చేయలేను. అది నీ యొక్క విశ్వాసమే దానిని చేయవలసియున్నది. కేవలం వినయం మరియు విశ్వాసం కలిగివుండు, బలవంత పెట్టవద్దు. బలవంత పెట్టవద్దు, కేవలం విశ్రాంతిగా ఉండుము. చెప్పుము “అవును, ప్రభువా, నేను నిన్ను నమ్ముతాను.” ప్రభువా, నేను నీ దగ్గరికి వస్తున్నాను. ఆ మనిషికి నేను అస్సలు తెలియదు. ఆయనకు నేను ఏవిధంగా తెలుస్తాను? ఆయన నాకు పరిచయం లేని వ్యక్తియై ఉన్నాడు. ఇప్పుడు, నాకు అతను సత్యమునే చెప్తున్నాడని తెలుసు. ఎందుకంటే ఆయన చెప్పేది ఇదిగో బైబిలులో ఇక్కడ వున్నది. నాకు తెలుసు అది సత్యమని. కానీ ఇప్పుడు నీవు నీ ప్రజలను గౌరవించినట్లయితే, మా మధ్యలోకి ఒక బహుమతిని పంపుము. తరువాత, ప్రభువా, దాని ఫలములను నన్ను పొందుకోనిమ్ము. నాకు అది అవసరం లేకపోతే....“ నీకు స్వస్థత అవసరం లేకపోతే, చెప్పుము, ”ప్రభువా, ఇక్కడ ప్రార్థన చేస్తూవున్నవారిలో ఎవరినైనా ముట్టండి.“ అని చెప్పుము.
నీకు స్వస్థత అవసరం లేదనుకుంటే, దానిని వేరొకరికి ఇవ్వుము. స్వస్థత కొరకు కొద్దిమంది చేతులు పైకి ఎత్తబడ్డాయి. నాకు తెలియదు వారు ఎవరో, కానీ నీకు అది అవసరం లేకపోయినట్లయితే, నీవు అవసరతలో ఉన్న వేరొకరి కొరకు ప్రార్థన చేయుము. చెప్పుము, “నాకు తెలుసు ఇక్కడ కొంతమందికి స్వస్థత అవసరమున్నదని, పరిశుద్ధాత్మ అతనితో మాట్లాడనిమ్ము మరియు అతనిని పిలువనిమ్ము.” కేవల౦ ఆ విధంగానే నమ్మండి మరియు ఏమి జరిగినదో చూడుము.
ఓ, ఇది గొప్ప సమయము కాదా? అది ఇక్కడే వున్నది, నేను ఏమి చెప్పానన్నది ముఖ్యం కాదు. దేవుడు తన మాట మీద లేనట్లయితే, ఆయన దేవుడు కాడు. ఇప్పుడు, వేరే ఏ మతంలో కూడా అంత అర్హత కలిగినవాడు లేదు. మన యేసు చనిపోలేదు. ఆయన చనిపోయాడు, నిజమే, కానీ ఆయన తిరిగి లేచాడు. ఆయన ఎప్పటికినీ సజీవుడు. సజీవ దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి.
60
ఇక్కడ, మీకు తెలియవలసినది ఉన్నది. ఇక్కడ ఒక చిన్న స్త్రీ అదుగో అక్కడ కూర్చొని ఉన్నది, ఆమె నాకు తెలియదు, నేనేప్పుడు నా జీవితంలో ఆమెను చూడలేదు. కానీ ఆ స్త్రీ హెర్నియాతో బాధపడుతుంది. అది నిజమేనా, స్త్రీ అది నిజము కాదా? నీవనుకుంటున్న దానికన్నా నీకు విశ్వాసం ఎక్కువ, నీకు లేదా? అది నిజమైతే, నీ చేతిని పైకి ఎత్తుము, స్త్రీ, పైకి చూపించుము. దానివలన ప్రజలు చూడగలుగుతారు. అదుగో అక్కడ ఉన్నది. ఆమె ఏమి ముట్టినది? ఆ ప్రధాన... నేను ఇంకొక దానిని చెబుతాను, ఆ స్త్రీ, ఇక్కడి స్త్రీ కాదు. ఆమె వేరే నగరానికి చెందినది, యుకియా ప్రాంతము. నీ హృదయమంతటి నుండి నీవు నమ్మినట్లయితే, అది అది ఖచ్చితంగా నిజం అవుతుంది. నీవు నీ గృహానికి వెళ్ళుము మరియు బాగవుము, యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును. ఆమేన్.
ఆమె ఏమి తాకినది? ఆమెను అడగండి నేను ఆమెకు ఎప్పుడైనా తెలుసునేమోనని? నాకు ఆమె గురించి తెలిసే మార్గమే లేదు. కానీ ఇది ఏమిటి? ఆమెను చూడండి, అక్కడ ఆ స్త్రీ మీద ఇంకా వెలుగు వ్రేలాడుతున్నది మీరు దానిని చూడలేకపోతున్నారా? అక్కడే ఆ వెలుగుని చూడండి.
61
అక్కడ వేరొక స్త్రీ వెనుకకు వెళుతుంది ఆమె వెనుకాలనే, ఈ దారిలో వెనుక ప్రక్క ఆమె ఒక స్త్రీ సమస్యతో బాధపడుతుంది. మిస్ హగ్గీ, నీ హృదయమంతటితో నీవు దానిని నమ్ముతావా? అది నిజము. అది నీవు ఎవరవు, నేను నీకు ఒక పరిచయం లేనివాడను. నీవు ఆ వ్యాధితో బాధ పడుతున్నావు. అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నావు. అదే గనుక నిజమైతే, నీవు నీ చేతిని గనుక పైకి ఎత్తినట్లయితే ప్రజలందరూ చూస్తారు. అదుగో ఆమె అక్కడ వున్నది. ఆమె దేనిని తాకివున్నది? ఆమె ఆయన వస్త్రపు చెంగు అంచుని తాకివున్నది. నా వస్తాలను కాదు, ఆమె నా నుండి 30 గజాల దూరంలో వున్నది. ఆమె ఆ ప్రధాన యాజకుని వస్త్రపు చెంగు అంచుని తాకివున్నది. నీవు ఆయనను ప్రేమిస్తావా? విశ్వాసం కలిగి వుండుము. దేవునిలో నమ్మకముంచుము.
62
ఈ భాగములో ఎవరో, నమ్మండి. ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని నన్ను చూస్తున్నాడు. ఆ మనిషి తన పైన ఒక నల్లటి దురాత్మ కలిగివున్నాడు, అతనికి మూర్చ వచ్చెను. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నీవు నమ్ముతావా? నిన్ను స్వస్థపరుస్తాడని? నిన్ను ఆరోగ్యంగా చేస్తాడని? అలా మూర్చతో నీవు బాధపడుతున్నావా. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నీవు నమ్ముతావా? నీవు సమ్మతిస్తే నీ చేయిని పైకెత్తి ఈ విధంగా చెప్పు, “నేను దీనిని అంగీకరిస్తాను. ఇంటికి వెళ్ళుము. నిన్ను ఆ దురాత్మ విడిచి వెళ్ళిపోతుంది మరియు ఇంకెన్నడూ అది నిన్ను ఇబ్బంది పెట్టకుండును గాక, యేసుక్రీస్తు నామములో.”
63
ఇక్కడ, నేను ఇంకొక స్త్రీని చూస్తున్నాను. ఆమె ఇక్కడే వెనుకగా కూర్చుని ఉన్నది ఆమె థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంది. ఆమె తన తలను వంచియున్నది. ఆమె ప్రార్థన చేస్తున్నది. ఆమె ప్రార్ధన చేస్తున్నది. “ప్రభువైన యేసు, అతను నన్ను పిలుచుటకు అనుమతినివ్వు.” ఆమె ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టియున్నది. ఓ, దేవా, ఆమె దానిని తప్పిపోకుండా చూడుము. దయచేసి తప్పిపోనీకుము. ఆమె పేరు శ్రీమతి స్టెయిట్ అంతా మంచిది, నమ్మండి శ్రీమతి స్టెయిట్ మరియు ఇంటికి వెళ్ళండి మరియు స్వస్థపడండి. నీవు నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? నీవు చేస్తావా? నీ కాళ్ళ మీద నీవు నిలబడి మరియు నీవు నీ సాక్ష్యమివ్వుము. నిన్ను దేవుడు బాగు చేస్తాడని నమ్ముతున్నావని. అంతా మంచిది. నీవు నాకు పరిచయం లేనివాడివి, నీ చేయిని పైకెత్తుము. అంతా మంచిది. కానీ నీవు క్రీస్తుకి పరిచయం లేనివాడివి కావు, అయితే అదే ప్రభువైన యేసు కాకపోతే, ఏమిటనేది నాకు తెలియదు. ఆమేన్.
64
నీవు నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? నీవు నమ్మినట్లయితే. ఈ దారిలో సరిగ్గా వెనుక వున్న ఒక స్త్రీని నేను చూస్తున్నాను. ఆమె బాధపడుతుంది. ఆమె ఒక విధమైన అధైర్యపాటు ఉన్నది, ఒక మానసిక రుగ్మత. ఓ, ఆ స్త్రీ దానిని మాత్రమే పట్టుకోగలిగితే దేవా, ఆమె ఎవరో నాకు చెప్పుము, దయచేసి చేయుము. ఆమె పేరు శ్రీమతి. ఆడమ్స్. శ్రీమతి ఆడమ్స్, నీ హృదయమంతటితో నమ్ముము, మరియు యేసుక్రీస్తు నిన్ను బాగుపరచును. నీవు నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? స్వస్థతను నీవు అంగీకరిస్తున్నావా? భయపడవద్దు. నీవు భయపడినట్లయితే, నీవు ఎప్పుడూ అదే స్థితిలో ఉంటావు. ఇది ఒక మానసిక రుగ్మతా బంధనం. కానీ సంశయించవద్దు. నీ హృదయమంతటితో నమ్ముము. నీవు దానిని చేస్తావా?
అయితే నీవు లేచి నీ కాళ్ళ మీద నిలబడుము, శ్రీమతి. ఆడమ్స్ నీ కాళ్ళ మీద నీవు నిలబడు. నిలబడు, ఇక్కడే మరియు యేసుక్రీస్తు నామములో స్వస్థపడుము. దేనినైతే నీకు దూరంగా ఉంచి ఆ దురాత్మ బంధించాలని ప్రయత్నించినదో దాని నుండి నీకు విమోచన ఇస్తున్నాను. ఆ దురాత్మ నీతో అసత్యమాడుతుంది. త్వరలోనే నీకు అంతా మంచి జరుగును. ఇంటికి వెళ్ళుము మరియు నీవు ఇప్పుడే స్వస్థపడుము. దేవుడు నిన్ను దీవించును. ఆమేన్, హల్లెలూయ!
65
ఆమె వెనుక ఒక పురుషుడున్నాడు, అక్కడ ఆ చివరన కూర్చున్నాడు, గుండెలో నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. మిస్టర్, నీవు దానిని నమ్ముతావా. మిస్టర్ నీవు ప్రార్ధనా కార్డుని పొందియున్నావా? దేవుడు నిన్ను స్వస్థ పరుస్తాడని నీవు నమ్ముతావా? నీవు హృదయ రోగము కలిగి యున్నావు. అయితే నీవు స్వస్థత పొందియున్నావు. యేసుక్రీస్తు నిన్ను బాగు చేశాడు. నీవు ఆయన వస్త్రపు అంచుని ముట్టియున్నావు. వారు నీ కొరకు ప్రార్ధన చేస్తున్నారు. ఆమేన్! నీవు నమ్ముమని నేను సవాలు చేస్తున్నాను.
66
ఇక్కడ, ఇక్కడనే ఒక స్త్రీ క్రింద కూర్చొని వున్నది... సరిగ్గా ఈ దారిలోనే క్రింద. ఆమె ఒక విధమైన మొలలు (పైల్స్) వ్యాధితో బాధపడుతుంది. ఓ దేవా, నాకు చెప్పుము, నాకు తెలియనివ్యుము. శ్రీమతి. హుడెన్పాప్, మీ కాళ్ళ మీద నిలబడుము, మరియు నీ స్వస్థతని అంగీకరించుము, మరియు యేసుక్రీస్తు నామములో బాగుపడుము.
67
ఇక్కడ వినుటకు వచ్చిన వారిని “బండతో మాట్లాడమని!” నేను సవాలు చేస్తున్నా నీవు నీ హృదయమంతటితో ఆయనను నమ్ముచున్నావా? ఆయనతో మీరిప్పుడు మాట్లాడగలిగినంత సహవాసం కలిగియున్నారని మీతో ఎంత మంది నమ్ముచున్నారు? అంతా మంచిది. మీరు ఆయనతో మాట్లాడతారా? అయితే మీ చేతులను ఒకరి మీద ఒకరు ఉంచుకొనండి. మీ చేతులను ఒకరి మీద మరొకరు వేయండి. అది అలాగునే మీ గురి౦చి మీరు మరచిపోండి. బండతో మాట్లాడండి. మీ చేతులను ఒకరి మీద ఒకరు ఉంచుకొని మరియు ప్రార్ధన యొక్క వాక్యమును ఇవ్వండి. దేవుడు నిన్ను స్వస్థపరచును. పరలోకపు తండ్రి, యేసు అనే పరిశుద్ధ నామములో ప్రార్ధిస్తున్నా, పరిశుద్ధత్మను క్రిందికి పంపుము; మరియు వారు ఆ బండతో మాట్లాడును గాక, మరియు ఆ బండ స్వస్థత అనే నీళ్ళిచ్చును, మరియు బలమును, మరియు శక్తిని, సంతోషము, మరియు ప్రేమని, మరియు పాపాలను క్షమించే గుణం ఇచ్చును. ప్రభువా, దానిని ఇవ్వుము. వారిని యేసుక్రీస్తు నామములో నీకు అప్పగించుచున్నాను.
68
ఆ బండతో మాట్లాడుము, మరియు ఆ బండ దాని యొక్క స్వస్థతా శక్తులను ఇచ్చును.
నీవు బండతో మాట్లాడుచున్నావని నీవు నమ్ముచున్నావా? నీవు స్వస్థత పొందియున్నావని ప్రతి ఒక్కరు అంగీకరిస్తారా. మీ కాళ్ళ మీద నిలబడు. మీ కాళ్ళపై నిలపడండి. అది చాలు. ఆమేన్. హల్లెలూయ! ఆ బండతో మాట్లాడుము! ఈ సమయంలో, మనం చేతులను పైకి ఎత్తి ఆ బండను స్తుతించుదాము. హల్లెలూయ! దేవునికే స్తుతులు! మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము, ప్రభువైన యేసు, నీ శక్తికి, సర్వశక్తుడు, నిన్న నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు నీవే. మేము ఆ బండతో మాట్లాడియున్నాము, మరియు ఆ బండ తన నీళ్ళనిచ్చును. అదే యేసు, నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. నీ మాటలు ఎన్నడు విఫలం అవ్వవు. ప్రభువా ఈ ప్రజలు నీ వారైయున్నారు. వారు నిన్ను ప్రేమిస్తున్నారు. వారు నిన్ను స్తుతించుచున్నారు. ప్రభువా, పాపులను క్షమ అనే వేదిక (altar) దగ్గరకు వచ్చుటకు అనుమతిని ఇవ్వుము. దయచేసి ఇవ్వుము. తండ్రి, ప్రభువైన యేసు నామములో.
ఇప్పుడు, మీలో ఎంతమంది ఆయనను అంగీకరిస్తున్నారు? మీ చేతిని పైకెత్తి ఇలా చెప్పండి, “ఆయన మన మధ్యలోనే ఉన్నారని నేను నమ్ముచున్నాను.” మీ చేతులను పైకెత్తండి మరియు స్తుతించుము. స్తుతించుము. స్తుతించుము. ఎంత మహిమకరం. ఎంత అద్భుతం అది తప్ప మరొకటి చేయగలిగింది లేదు. ఇప్పుడు ఇంకేమి చెయ్యాలో నాకు తెలియడం లేదు. ఆయన దానిని ఎప్పుడో చేసియున్నాడు. ఇంక ప్రార్ధనా వరుసని పిలువవలసిన అవశ్యకత లేదు. ఆ బండ ఇక్కడనే ఉన్నది. ఆ బండ మాట్లాడుచున్నది. హల్లెలూయా! కేవలం ఆ బండని నమ్ముము, మరియు ఆ బండ దాని నీళ్ళనిచ్చును. ఆ యుగముల బండను నేను మీకు సమర్పిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో.