నేను మోషేకు తోడైయుండినట్లు, నీకును తోడైయుందును
VGR COUNT-277 ....రాత్రి మంచి నిద్ర తరువాత, తిరిగి మరలా ఈ ఉదయ కాలమున అందరూ సేదతీరగలుగుచున్నాము. దానిని మనమందరమూ కలిగియున్నామని ఆశిస్తున్నాను. నేను గదిలో నిలువబడి బిల్లీ పాల్ చేసిన 25 సెంట్ల సహాయాన్ని గూర్చి ఆలోచిస్తున్నాను. ప్రాంకీ వెబర్ ఇక్కడ నా పొరుగువాడు, నేను అతడు కలసి స్కూల్ కి వెళ్ళాము. నాకు 21 లేదా 22 ఏళ్ళు. అప్పటికే అతనికి 25 ఏళ్ళు. అతడు 25 సెంట్ల డబ్బు సహాయం ఇచ్చేటప్పుడే ఆయన నా ప్రియమిత్రుడు. ప్రాంకీ చావుకు దగ్గరయ్యాడు! చాలా వృద్దుడు 25 సంవత్సరాలు వచ్చేసరికి నేనేమి చేయుదునో అని ఆలోచించేవాడిని. మరి ఇప్పుడు నా కుమారునికి 25 సంవత్సరాలు వచ్చేశాయి.
కాలము ఎవరి కోసము ఆగదని, వేగంగా పరుగిడుచున్నదని ఇది కేవలం సూచించుచున్నది. మనమెంత మాత్రమునూ పనిచేయలేని కాలము వచ్చుచున్నది, కావున వెలుగుండగానే మనము పని చేయుచుండవలెను. లాంగ్-ఫెలో రాసిన జీవపు కీర్తనను నేనెల్లప్పుడూ ఇష్టపడతాను. ఆయన చెప్పినట్లు “కాలమనే ఎడబాటు వచ్చినప్పుడు మన వెనుక ఇసుకలో అనేక అడుగుజాడలను వదిలి వెళ్తాయి.” మనలో ప్రతిఒక్కరూ చేయగల్గిన అలాంటి అనేక అడుగుజాడలను తప్పక చేయాలి. ఒక్క రోజును కూడా వృధా చేయకుండా, ప్రతిరోజును లెక్కించుచూ ఆయనకు మహిమకరముగా మనముండాలి.
2
కొన్ని రాత్రుల క్రితమో రెండు వారముల క్రితమో ఇది జరిగినది. దేవుడు దర్శనములిస్తాడని ఇక్కడ వున్న మనకందరికి ఖచ్చితంగా తెలుసు. నేను కెంటకీలో ఉన్నప్పుడు నాకు ఒక అసాధారణమైన దర్శనము కలిగినదని నాతో ఉన్నవారితో చెప్పితిని, “ఏదో ఒకటి సంభవించుటకు నిశ్చయంగా స్థిరపరచబడుచున్నది.”
ఉదయం మూడు గంటల సమయంలో, గదిలో నా ఎదుట నిలువబడియున్న మనిషి, మన ప్రియమైన నల్లజాతి సహోదర, సహోదరిలు కలిగియున్న రంగును కలిగియుండక, మురికైన చీకటి రంగును కలిగియున్నాడు; ఈ మనిషి పూర్తిగా వేరుగా ఉన్నాడు. ఆయన శరీరం ముడతలు పడిన ఇనుపమయమై ఉన్నది. గొప్ప బిగుతైన చేతులతో నన్ను పట్టుకొనుటకు వచ్చుచున్నాడు. నా చేతులలో చిన్న బ్లేడు సహాయంగా ఉన్నది. అది నన్ను రక్షించలేదు. ఎలాగో ప్రభువే వచ్చి ఆ భయంకరమైన వ్యక్తి నుండి తప్పించుకోవడానికి సహాయం చేశారు. ఆయన ఇనుపమయమై ఉన్నారు. ఆయన తన చేతిని పైకెత్తుచున్నప్పుడు, ఆయన శరీరంలోని ముడతలు, ఇనుము ముందుకు వెనకకు కదులుతున్నట్లుగా నేను చూడగలిగితిని. జంతు చర్మాన్నో లేక తాబేలు పై కవచాన్నో పోలిన ఆ వ్యక్తి యొక్క భయంకరమైన శరీరాన్ని వేగవంతమైన, శక్తివంతమైన పిస్తోలు గుండు కూడా చీల్చివేయలేదు. ఆయన నన్ను వెంబడిస్తున్నాడు. అది ఏమైయున్నదో దాని భావమేమైయున్నదో నాకు బాగా తెలియును.
3
కాని, అప్పుడు గత మంగళవారం ఉదయం షుమారు మూడు గంటలకు మరియొక సంగతి జరిగెను. నేను ఇంటియొద్ద ఉంటిని. గదిలో నా ఎదుట నిలువబడిన వ్యక్తి దైవికమైన వ్యక్తియై ఉండి, నాకు అర్ధము కాని కొన్ని మాటలు పలికెను. మరియు ఆయన నిర్ణయించిన కాలము సమీపించినది. ఆయన మాటలను నేను బాగా వినలేకపోయినప్పటికీ ఆయన ఒక దైవికమైన వ్యక్తి. “ఇంకా ఏడు రోజుల్లో నీవు మోషే వలే నిలబడెదవు,” లేక “మోషేవలే ఉందువు,” లేక “కొంత మోషేకు సంబంధించినట్లుగా,” అని ఆయన చెప్పాడు. ఈ రోజుకి ఇంకొక్క రోజు మిగిలియున్నది. అది ఆరోవ రోజైయుండెను. అది ఏమగునో నాకు తెలియదు. అది ఏమైనప్పటికీ ఆయన పనిచేయునని నాకు తెలియును. “నీవు నిలబడెదవు,” లేక “నిలబడవలసి ఉంది,” లేక “అలా ఉండవలసివుంది,” లేదా అది “కొంత మోషేకు సంబంధించినది.” నేను ఎప్పుడూ దానిని గూర్చి ఎక్కువగా ఆలోచించలేదు. నా కుటుంబములో, నా కిష్టమైన వారికి ఈ దైవికమైన విషయం చెప్పాను. కాని ఆయన మనిషి వలే మాట్లాడారు.
ప్రభువా నన్ను మోషేని ఎన్నుకోనిమ్ము అను నా గత సాయంకాలపు పాఠాన్ని గమనించాను. ఈ ఉదయకాలమున మోషే మరియు ఆయన వారసుడు. ఈ ఉదయకాలము నేను చెప్పబోవుచున్న లేఖనము మోషే మరియు యెహోషువాకు సంబంధించినది. యెహోషువ మొదటి అధ్యాయానికి సంబంధించిన లేఖనము ఎప్పటికినీ చాలా ప్రాముఖ్యమైనది. ఎన్నడూ నా జీవితములో దీనిని బోధించలేదు; ఈ ఉదయం దానిని బోధింప ప్రయత్నిస్తాను.
4
కాని షుమారు రెండు సంవత్సరాల క్రితము నేనున్న గదిలో నా వద్దకు బైబిల్ దిగి వచ్చి నిలబడుట చూచితిని. మరియు పైనుండి ఒక చేయి దిగి వచ్చి, బైబిల్ పేజీలను తెరచి త్రిప్పుతూ మెల్లగా యెహోషువ మొదటి అధ్యాయం 1 నుండి 9 వచనాల వద్ద ఆగినది. అది నా కొరకైన దేవుని చిత్తమని భావించి దానిని గూర్చి మాట్లాడుటకు ఈ గడియ సమీపించు వరకు నేను వేచియుంటిని.
ఇప్పుడు సాయంకాలపు ఆరాధనను మరిచిపోకండి. ఏ పని పెట్టుకొనక రాగలిగిన వారందరూ రాగలరు. మీ సంఘములకు మీ అవసరత కలిగియున్నట్లయితే, తప్పక అక్కడికి వెళ్లమని మేము సిఫారసు చేస్తాము.
ఈ ఉదయకాలపు సందేశానంతరము వెంటనే మనము రోగుల కొరకు ప్రార్ధించబోవుచున్నాము. ఆ తదుపరి బాప్తిస్మముల కార్యక్రమము గలదని నేను భావిస్తున్నాను.
ఈ రాత్రి దేవుని చిత్తమైతే, నేను సంఘము యొక్క లేఖనార్దమైన ఐదు ఖచ్చితమైన పోలికలు మరియు క్రొత్త నిబంధన సంఘముతో మనకు గల సంబంధము అనే పాఠాన్ని బోధించాలనుకుంటున్నాను. మరియు ఆరాధనలు ప్రారంభమగును. 7:30 గంటలకు పాటల ఆరాధన 8 గంటలకు వేదిక ఎక్కి దేవుని చిత్తమైనచో, 9:30గంటల వరకు బోధిస్తాను.
5
ఈ రోజు నాకివ్వబడిన ఆజ్ఞకు సంబంధించిన మాటలలో ఏవీ సంభవింపక మానవని నేను నమ్ముచున్నాను. మనము పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూచుచున్నందున ప్రతి విషయాన్ని ప్రక్కనబెట్టి ఆలోచించుట మంచిది.
ఈ అద్భుతమైన కృపా వాక్యాన్ని సమీపించేముందు నా మంచి మిత్రుడు, జతపనివాడైన డాక్టర్. లీవేల్ గారు లేచి నిలబడి ప్రార్ధనలో నడిపించాలని కోరుతున్నాను. [సహోదరుడు లీవేల్ ప్రార్ధన చేయుచున్నారు.] చక్కని ప్రోత్సాహకరమైన ప్రార్ధన కొరకు సహోదరుడు లీవేల్ గారికి ధన్యవాదములు.
6
ఇప్పుడు మనం లేఖనాలను చూద్దాం. అనేకులు హాలు లోపల, గోడల చుట్టూ, ఇంకా అనేక చోట్ల నిలబడి ఉన్నారు. ఎంతో మాట్లాడవలసి ఉంది. సూర్యోదయంతో మనం మరోక క్రొత్త రోజును ఎదుర్కొంటున్నామని భావిస్తున్నాము. మనము సిద్దపడుచుండగా, ఈ రోజు ఉదయం యెహోషువ గ్రంధము, మొదటి అధ్యాయం, మొదటి 9 వచనాల లేఖనభాగాన్ని చదువుదాము.
ఈ టేపు రికార్డు చేయబడి, ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు పంపించబడుచున్నది. ఎవరి విషయమై దేవుడు తన కృప అనుగ్రహించెనో, వారికి ఈ సందేశములు అందించుటకు వారి దృష్టిలో పాత్రుడను, ఎందుకనగా మీరు సత్యమును తెలుసుకొనునట్లు భవిష్యత్తులో మీ సంఘములను, మీ సువార్త కూటాలలోకి వచ్చి నేను మాట్లాడాలని, ఈ ఉదయకాలమున మీకు తెలియజేస్తున్నాను. ముందున్న సమయములో ప్రభువు చేసిన దానిని, సత్యమును అప్పుడు మీరు తెలుసికొనగలరు. మరియు యేసు చెప్పిన విధంగా సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును.
7
యెహోషువ మొదటి అధ్యాయం నుండి చదువుదాము:
యెహోవా సేవకుడైన మోషే మృతినొందిన తరువాత, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువాకు ఈలాగు సెలవిచ్చెను.
నా సేవకుడైన మోషే మృతినొందెను. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను.
అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానదియైన యూఫ్రటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహా సముద్రము వరకును మీకు సరిహద్దు.
నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును. నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుందును: నిన్ను విడువను, నిన్ను ఎడబాయను.
నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు.
అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగా నుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతిమార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికి గాని యెడమకు గాని తొలగకూడదు.
ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు భోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ద్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.
నేను నీకాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.
8
5వ వచనము అనగా మధ్య వచనములో: “నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందును,” అని వ్రాయబడియున్నది. కొన్ని క్షణాలు అలా ఆగి దాని మీద మీరు దృష్టి కేంద్రీకరించునట్లు అది మన పాఠ్యభాగమై యున్నది.
గత సాయంకాలం ఇశ్రాయేలీయుల సంతతివారిలో ఐగుప్తు నుండి కాదేషు వరకు ఉన్న దూరమంతా ప్రయాణించితిమి. ఓ, అది ఎంత గొప్ప పాఠమో! మనము స్వభావికమైన సంఘాన్ని ఆత్మ సంబంధమైన సంఘంగా పోల్చినప్పుడు అది ఎంత గొప్ప విషయమో. అన్యజనులను తన నామఘనత కొరకు ఆయన పిలుచుచున్నప్పుడు నేడున్నటువంటి సంఘమును స్వభావికమైన ఇశ్రాయేలీయుల సంఘముగా వ్యవహరించుచున్నారు. ఆయన వారితో (ఇశ్రాయేలీయులతో) స్వభావికమైనదిగా వ్యవహరించినట్లు, అన్యజనులతో ఆత్మీయముగా, ఆత్మసంబంధంగా వ్యవహరించుచున్నాడు. ఇవి కేవలం ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నవి. దేవుడు వారికి, వారికొరకు చేసినదంతా, జవాబుగా వారు చేసినదంతా మనకు మాదిరిగా ఉంచబడింది. మరియు ఇప్పటి వరకు మనము చూచినట్లు వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పబడినది. ఏ విధముగా ఆ స్వభావికమైనది దానిలో వారు ఒకటి లేదా రెండు విజయములు సాధించినప్పుడు, వారిలో కొందరు ఉల్లసించుటకు, చప్పట్లు కొట్టుటకు, నృత్యం చేయుట తద్వారా దేవుని మహిమ పరుచుటకు స్థిరపడిపోయారు. అదే ఇప్పటి సంఘము చేసినది మరియు మరియొక సంగతి ఆరంభించుటకు నలభై సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చినది.
9
ఆ గొప్ప దేవుని సేవకుడైన మోషేను గూర్చి మనము ఆలోచించినప్పుడు ఎప్పుడు ఎలాగు దేవుడు జన్మింపచేయాలో చేసి, అతడు జన్మించినప్పుడే తన పనికి ఎంచుకొనెనని తెలుస్తుంది. ఆయన జీవితం జీవించుటకు చాలా కష్టతరముగా ఉండెను, ఎందుకనగా ఒక మానవునిగా ఆయనొక విధంగా జీవించాలని కోరుకున్నప్పుడు, దేవుని ఆత్మ అతడిని మరోక మార్గంలో నడిపించును. ఆయన తీసికొనబోవు నిర్ణయం ఎంతో బుద్ధిహీనంగా కనబడుచున్నది. ఈ లోక రాజ్య సింహాసనానికి వారసుడుగా ఉండవలసి ఉండి, మరియొక వైపు వెలివేయబడిన వాడిగా లేక దేశదిమ్మరిగా ఉన్నప్పుడు అది మానసికంగా బుద్దిహీనమైన విషయంగా కనబడుచున్నది.
కాని ఇక్కడ ఒక గొప్ప పాఠాన్ని కనుగొంటాము, ఆత్మానుసారులైన మనుష్యులు ఈ లోకానికి వెర్రివారు, ఎందుకనగా వారు మరొక రాజ్యసంబంధులు, వేరొక మార్గములో నడిపించబడి, ఆత్మచే నడిపించబడినవారు. దేవా, అది నేనైయుండనిమ్ము, మరియు మీరందరూ, మనమందరము ఆత్మ నడిపింపును వెంబడించుదుము గాక; ఏది ఏమైననూ, దేవుని వాగ్ధానము వైపు చూస్తూ, అది నెరవేరుట కొరకు కనిపెట్టుదుము గాక.
10
అదే పని మోషే చేసెను. మోషే చదివిన లేఖనాన్నే ఫరో కూడా చదివాడు, ఫరో మాత్రం దానిని మరొక విధముగా చూశాడు. ఫరో చూసిన ప్రజలనే మోషే కూడా చూసాడు. ఫరో వారిని బానిసలుగా, మట్టి పనివారుగా చూసాడు; మోషే వారిని పిలవబడినవారిగా మరియు ఏర్పరచిన వారిగా చూసాడు.
జీవముగల దేవుని సంఘమును నేను కూడా అలాగే చూడగోరుచున్నాను. సంఘమును మూఢభక్తుల సమూహముగానో లేదా వెలివేయబడిన వారిగానో గాక, వారు దేవుడు ఏర్పరచుకున్న వారుగా భావించి ఈ గొప్ప సంఘము కొరకు, ఈ గొప్ప కారణము కొరకు నా జీవితాన్ని మోషేవలె తనకుతాను జీవితాన్ని సమర్పించుకొనినట్లు - నా జీవితాన్ని ఇస్తున్నాను.
ఇప్పుడు మనము మోషేను పిలవబడిన వ్యక్తిగా కనుగొంటాము. ఆయనకు ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు, తన ఉత్తమమైన కొన్ని ఆలోచనల మార్గము ద్వారా ప్రయత్నించి, ఆయన ఆజ్ఞాపించినది తప్పిపోయాడు.
కాబట్టి మరలా అది మనకు ఏమి బోధిస్తుందంటే, మనము లేదా ఒక మనుష్యుడు ఉత్తమమైనవిగా భావించే ఆలోచనలను తీసికోలేము. దేవుడు చెప్పిన దానినే ఉత్తమమైనదిగా స్వీకరించాలి. కాబట్టి దేవుని వాక్యమును దేవుడు చెప్పిన మార్గములో అన్నివేళలా అనుసరించడము ఉత్తమమైనది.
11
తాను విఫలమైనప్పుడు, మరియు మనం గమనించినట్లైతే తన తప్పిదంతో మోషే, ఫరో సముఖము నుండి అరణ్యమునకు పారిపోయి, అక్కడ యిత్రో కుమార్తెయైన సిప్పోరాను వివాహమాడెను. వివాహానంతరం ఆమె మోషేకు గెరోమును కనెను. అప్పుడు ఆయన నెమ్మదిగా, శాంతియుక్తముగా గెర్రెల వ్యాపారములో స్థిరపడ్డాడు.
కాని ఒక రోజున దేవుడు తన ప్రజల మొరను వినెను. దేవుడు తన ప్రజలతో చేసికొనిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను. అది మాత్రమే గాక తాను పిలిచి ఏర్పరచుకొనిన సేవకుని, ఆ సేవకునితో తన నిబంధనను జ్ఞాపకం చేసికొనెను. మరియు దేవుడు ఎప్పుడూ తన నిబంధననుగాని, తన అభీష్టాన్నిగాని, తనకు సంబంధించిన మరిదేనినైననూ మార్చువాడు కాడు. తన వాగ్దానాలను ఎల్లప్పుడూ నెరవేర్చును. మోషే దేవుని విషయమై విఫలమైనప్పటికిని, తప్పు చేసినప్పటికి అయినా దేవుడు తన నిబంధనను కలిగియుండెను. దేవుడు ఒక పని నిమిత్తము ఒక మనిషిని పిలిచినప్పుడు అతడు దానిని తప్పక చేయాలి, కేవలం దానినే చేయాలి.
12
ఒకరు కొన్ని రోజులు క్రితం నన్ను అడిగారు, “మనము మన పరిచర్య నిమిత్తం ఏదైనా ఒక ఆత్మవరము కొరకు వెదకాలా?” అని ఆ మెథడిస్టు సహోదరుడు ఆ మధ్యనే పరిశుద్ధాత్మను పొందాడు.
నేను చెప్పాను, “అలా వద్దు. నీవు అలా ప్రయత్నించినప్పుడు దేవుడు నిన్ను వాడుకొనడు,” అని చెప్పాను. “మనం చేయవలసినదల్లా క్రైస్తవుడుగా ముందుకు వెళ్ళడమే. దేవుడు నిన్ను పిలిచినట్లైతే, నీవు ఏ స్థానమునకు చెందినావో, ఖచ్చితముగా ఆ స్థానములో ఉంచుతాడు.”
సాధారణముగా, ఎవరైతే దేవుని వద్ద నుండి తామే ఏమైనను పొందుకొనవలెనని వారు వెదికినట్లయితే, దేవుడు వారికి ఏమైనను ఇచ్చినట్లయితే అది గంజి పెట్టిన బిగుతైన చొక్కావలె, కొంచెం ఎక్కువగానో, తక్కువగానే ఉంటుంది. సాధారణంగా, దేవుడు పిలిచినవారు దేవుని నుండి పారిపోవుటకు ప్రయత్నించువారుగా ఉంటారు. ఏది ఏమైనా మోషే మరియు పౌలు మరియు ఇతరమైన వారు ఆ పిలుపు నుండి దూరంగా పారిపోవుటకు ప్రయత్నించారు.
13
కాని ఇక్కడ మనము కనుగొంటాము, మోషే తనకివ్వబడిన అన్ని విషయాలలో విఫలమైనప్పటికిని దేవుడు ఇంకా తన చేతిని మోషేకు తోడుగా ఉంచారు. ఆయనను దేవుడు పిలిచి వెళ్ళి తనకు సేవ చేయాలని, ఆజ్ఞలకు విధేయుడుగా ఉండాలని చెప్పెను. మరియు దేవుడు, “నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందును,” అని యెహోషువతో చెప్పినప్పుడు - యెహోషువాకు ఆ మాటలు గొప్ప ఆదరణగా ఉండెను.
నేను ప్రయత్నిస్తూ విఫలమవుతున్నప్పటికిని దేవుడు నన్ను వదిలిపెట్టడు. ఏదైనను చేయుటకు అతిగా భయపడువారి మీద నేను ఎక్కువగా నమ్మకాన్ని ఉంచను. ప్రయత్నించుటకు అతిగా బద్దకించుటకంటే, ప్రయత్నించి విఫలమగుటను నేను చూడగోరుదును.
14
ఒకసారి ఇలా చెప్పబడింది, బల్లార్డ్ ఫ్లోర్ కంపెనీతో పని చేయుటకు ఒక మనుష్యుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆయన సంతకం చేయు సమయంలో చేతివ్రాత చెరిపెడి ఎరేజర్ అతని పెన్సిల్ చివరన లేదు. అప్పుడు బల్లార్డ్ అతనితో, “ఒక ఎరేజర్ తెచ్చుకోవచ్చు కదా?” అని అనగా.
ఆయన, “నేను పొరపాటు చేయను,” అని చెప్పాడు.
అప్పుడు బల్లార్డ్ అతనితో, “నేను మా పనికి నిన్ను ఉపయోగించలేము. ఎందుకనగా నీవు పొరపాటు చేస్తే.... నీవు పొరపాట్లు చేయకపోతే, నీవసలు ఏ పని చేయలేవు, నీవేమీ చేయలేవు.” అది నిజము.
దేవుడు నీవు చేసే పొరపాట్లకు నిన్ను బాధ్యుడుగా చేయడు. నీవు ఉద్దేశ్యపూర్వకంగా చేసిన పాపానికి నిన్ను బాధ్యుడుగా చేస్తారు. “మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినయెడల, బలి ఇంకనూ ఉండదు.” కాని ఒక మనిషి ఏదైనా చేయాలని ప్రయత్నించినప్పుడు, తప్పులు చేస్తాడు, విఫలం అవుతాడు. అతడు పొరపాట్లు చేస్తాడు. కాని ఆయన నిజమైన దైవికమైన పిలుపు కలిగి ఉంటే, ఆయన హృదయంలో దేవుడు ఉంటే, ఆయన తిరిగి లేస్తాడు.
15
అనేక సంవత్సరముల నుండి ఈ సంఘానికి వచ్చేవారు ఈ ఉదయం కూడా వారు ఇక్కడే ఉన్నారని అనుకుంటాను. ఒక చిన్న వ్యక్తి మరియు అతని భార్య, వారు నాకు చాలా సంతోషాన్నిచ్చే పాట పాడేవారు. వారి పాట ఇలా:
ప్రభువా, నన్ను క్షమించుము, మరలా ఒక్కసారి ప్రయత్నించనిమ్ము,
నీవు నావడవైనట్లైతే, నేను నీవాడనై యుందును;
నేను పడిపోయిననూ, విఫలమైననూ, తిరిగి లేచి మరలా ప్రయత్నించనిమ్ము,
ప్రభువా, నన్ను క్షమించుము, మరలా ఒక్కసారి ప్రయత్నించనిమ్ము.
నేను దానిని ఇష్టపడతాను, ఏ మంచి సైనికుడైననూ గాయపరచబడుటకు, బాధననుభవించుటకు అర్హుడు. అతడింకనూ సైనికునిగా ఉన్నట్లైతే, ఆ ఉద్దేశ్యము ఉన్నప్పుడు, పోరాడుటకు ఏమైన మిగిలినట్లైతే, అతను తిరిగి లేచి మరలా ప్రయత్నించును. ఏ మంచి సిలువ సైనికుడైననూ అదే విధముగా చేస్తాడు.
16
మరియు యెహోషువ సైన్యానికి నూతన నాయకుడు. మోషే చనిపోయిన తర్వాత మోషే యొక్క వైఫల్యాలలోనూ దేవుడతనికి తోడైయుండుట చూచి బాధ్యతలు చేపట్టాడు.
మోషే ఏమి చేసినప్పటికీ ఆయన పనిని బట్టి దేవుడు ఆయనను గౌరవించాడు. ఆయన ఒక ప్రవక్త. ప్రవక్తలందరికినీ పైవాడు. ఇశ్రాయేలీయులకున్న ఏ ప్రవక్త కన్నా కూడా ఈయన గొప్పవాడు. మోషే సోదరి అతడు కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసికొనుటను బట్టి పరిహసించగా, దేవుడు వారిని పిలిపించి, “మీరు దేవునికి భయపడరా? మీలో ఆత్మ సంబంధిగాని, లేక ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసికొనునట్లు అతనితో మాట్లాడుదును. నా సేవకడైన మోషే అట్టివాడు కాదు. నేను దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడుదును.”
దైవజనులను తూలనాడడం సరియైనది కాదు. ఆ విధంగా చేసినప్పుడు నీవు దేవుని గాయపరచినవాడవగుదువు. దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చెను, అతని వైఫల్యాలు లెక్కలోనికి రావు. దేవుడాయన హృదయమెరియుండెను.
17
ఒకమారు తనకెక్కువ పని భారముండెనని మోషే దేవునికి పిర్యాదు చేసెను. అప్పుడు దేవుడు ఆ ఆత్మలో పాలు అతని యొద్ద నుండి తీసికొని వారిలో 70 మందికి పంచెను. ఆత్మ యొక్క పరిమాణము మొదట్లో ఉన్నట్లుగానే మార్పేమియూ లేదు. కాని ఎక్కువ మంది పనివారు దానిలో పాలు పొందిరి.
దేవుడు తన చిత్తమును బట్టి తన ఆత్మ అంతటినీ ఒక్క మనుష్యునికే దయచేయును లేదా తనకిష్టమైనచో వేల మందికి దానిని విభాగించును దయచేయును. ఒకసారి తన ఆత్మయావత్తును క్రీస్తు అను మనుష్యునిపై ఉంచెను; ఆయన ఇప్పుడు దానిని ప్రతీచోట ఉన్నట్టి సంఘములపై ఉండుటకు విభాగించెను. ఆయన తన ఆజ్ఞను నెరవేర్చుచున్నాడు.
18
ఇప్పుడు యెహోషువ, క్రొత్త యోధుడైయున్నాడు. వాగ్దాన దేశములో ప్రవేశించుటకు ఇద్దరు మాత్రమే మిగిలియున్నారు. వారు యెహోషువ మరియు కాలేబు. మోషేలాంటి గొప్ప నాయకుని స్థానములో సైన్యమును నడిపించుటకు యెహోషువ నూతన సైన్యాధిపతిగా ఉన్నాడు. అది చిన్న పని కాదు.
ఒక సేవకుని గూర్చి ఈ రోజు నేనాలోచించినప్పుడు క్రీస్తు నడచిన మార్గములో నడుచుటకు అతడు దేవునిచే పిలవబడ్డాడు - ఎంత గొప్ప ఆజ్ఞ, ఎంత గొప్ప పిలుపు. కాని దేవునిచే పిలువబడిన ప్రతి ఒక్కరు అదే స్థానములో నిలుచుండవలెను అని ఆజ్ఞను పొందియున్నారు. “మార్గము చివరి వరకు నేను నీతోనూ, నీలోను ఉందును.” ఆయన ఎక్కడ ఉండెనో అక్కడ నిలుచుటకు ప్రతి సేవకుడు పిలువబడియున్నాడు: “నేను చేయు క్రియలు మీరును చేయుదురు.” దేవునిచే నియమింపబడిన ప్రతి సేవకుడు, యేసుక్రీస్తు మార్గములో నిలచుటకు మరియు యేసు నెరవేర్చిన విధులను నెరవేర్చుటకు అజ్ఞాపింపబడియున్నాడు. అది ఖచ్చితమైన ఆజ్ఞ!
19
ఆ ఉదయ కాలమున యెహోషువ అక్కడ నిలబడి ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుచున్నప్పుడు యెహోషువ ఎలాగుండెనో, దేవుడాయనతో నేను నిన్ను ఓడిపోనివ్వను. నేను మోషేకు తోడైయుండినట్లు, నీకును తోడైయుందును, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేడు, నేను నాశనము చేసి మ్రింగివేయుదును. నేను మార్గమును సరాళము చేయుదును, నిబ్బరముగలిగి ధైర్యముగా ఉండుము. దిగులు పడకుము, జడియకుము. భయపడకుము. నేను నీతో ఉన్నాను! నేను మిమ్ములను దృష్టి యుంచెదను.“ ఈ నూతన వ్యక్తి అయిన యెహోషువాకి ఎంత గొప్ప ఆజ్ఞ ఇవ్వబడెను.
వెళ్ళగలిగిన అనేక గొప్ప మాదిరులు మనకు కలవు, కాని మనము వాటిలో కొన్నింటిని దాటి వెళ్ళుదుము. (దానిని గత రాత్రి చూచాము), సీనాయి వద్ద మోషే కోరినట్లు సంఘము దాని యొక్క సంఘకాలములో వేదాంత విద్యను కోరుకొనినది. మోషే చేసిన తప్పిదమును బట్టి వాగ్దాన దేశములోనికి ఇశ్రాయేలీయులను నడిపించుటకు మోషే అనుమతించబడలేదు.
20
సంఘ సంస్థ మరియు మతశాఖలు విఫలమయ్యెను. అవి సంఘమును నడిపించలేవు! దేవుడు తన శక్తిని బట్టి ఒక సంస్థాగతము కాని సమాజమును ఏర్పరచి, సంఘమును వాగ్దాన దేశములోనికి నడిపించును. తమ సొంత వేదాంత, తమ సొంత ఆలోచనలు చొప్పున బోధించుచూ సంఘ సంస్థలు, మతశాఖలు దానిని గందరగోళం చేశాయి. దేవుడు తన పరిశుద్ధాత్మను బట్టి ఎలాంటి మత శాఖా బంధకములకు తావీయ్యక యెహోషువ అను ఒకని లేపి, సంఘమును వాగ్దాన దేశములోనికి నడిపించును. దాని మీద అధికారం తీసుకొనును.
ధర్మశాస్త్రము ఇచ్చినవాడగు మోషే విఫలుడాయెను. యెహోషువ కృపను బట్టి పిలువబడి, సంఘమును నడిపించెను.
21
యెహోషువ తనకివ్వబడిన ఈ ఆజ్ఞను ఎరిగినవాడై, అది తన చేతికి అప్పగించబడినదని తెలిసికొనినవాడై, తనకు అప్పగించిన బాధ్యత విషయమై విఫలము కాకూడదని తెలుసుకొని, దేవునియెదుట సాత్వికముగా నడుచుకొనెను. యెహోషువ ప్రజలను పిలిచి సమకూర్చినప్పుడు, దేవుడు తనకిచ్చిన ఆజ్ఞను వారికి విన్నవించగా మోషేను వెంబడించినది, నిన్నునూ వెంబడించుట మేము కనుగొన్నట్లైతే, మోషేను అనుసరించునట్లు నిన్ను మేము అనుసరించెదము. అధైర్యపడక బలముగా ఉండుమని చెప్పిరి.
క్రొత్తగా జన్మించిన ప్రతి వ్యక్తిలో నేడుండవలసినది అదే. వెంబడించమని మనము కోరబడినట్లయితే, అప్పుడు విశ్వాసికుండవలసిన ఆ సూచనలను అనుసరించవలసి ఉన్నది. యేసు చెప్పెను, “నేను చేయు క్రియలను మీరు కూడా చేతురు.”
ఈ ఉదయం మీతో ముందుగానే చెప్పియున్నాను, మీ అంతరంగిక హృదయం తెరచియుండునట్లు చూచుకొనమని, ఎందుకనగా నేను చెప్పు విషయాలను మీరు గ్రహించగలరని నమ్ముచున్నాను. ఈ ఉదయ కాలమున వివిధ రకాల మత సంస్థలవారు, సంఘ శాఖలు, క్యాథలిక్, ప్రొటెస్టెంట్ అలాంటివారు కలసివున్నా, ఆత్మతో నింపబడిన వారికే సహజముగా ఇవి బయలుపర్చబడును.
22
ఇప్పుడు, యెహోషువ ఈ ఆజ్ఞను గైకొనవలిసియున్నది. ప్రజలు “దేవుడు మోషేకు తోడైయుండునట్లు, నీతో కూడా ఉండాలని ఇంతవరకు మమ్ములను నడిపించిన ఆత్మ ఇకనూ నడిపించునని చెప్పిరి.”
ఆత్మ ప్రజల మధ్య పని చేయుటను గూర్చి సంఘము ఈ ఉదయకాలమున పరిశీలించవలసి ఉండెను. ఏ ఆత్మ క్రీస్తును మృతుల నుండి లేపెనో, ఆ ఆత్మ గలిగిన సంఘములో నీవుండుటకు ఆ పని చేయవలసియున్నది. ఆ ఆత్మనే దేవుడు అంత్యదినములలో లేపియున్నాడు. ఆజ్ఞలు, ఆశీర్వాద వాగ్దానాలు కలిగిన మరియొక దేశమునకు తన ప్రజలను నడిపించెను. “ఈ వాగ్దానము మీకునూ, మీ సంతానముకును.” ఎక్కడో ఒక చోట ఉండినట్లు, ఎవరో అక్కడ ఉండినట్లు ఆ ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమును ఎలాగు వెదికిరో, నేడు సంఘము కూడా అలాగున చేయవలసియున్నది. ఎక్కడో ఒక దేశముండెనని, ఎక్కడో ఒక శక్తి ఉండెనని, ఎందుకనగా అక్కడ ఇతరులుండిరని మనకు తెలియును. ఆ దేశము నది ఆవలి ఒడ్డున ఉన్నదని మనమెరిగి, ఈ ఉదయకాలమున ఆ వాగ్దాన దేశములో ప్రవేశించుటకు మనము ముందుకు కొనసాగుచుంటిమి.
ఆ దేశము అక్కడ ఉండెనని యెహోషువ ఎరిగెను. మరలా వచ్చి మనకు సాక్ష్యమిచ్చునట్లు ఆయన మొదట వెళ్ళి దానిని కనుగొనెను.
దేవుడు పిలిచిన సేవకులు వ్యర్థమైన సిద్ధాంతాలతో పొద్దుపుచ్చుడానికి కాదు గాని, మనము వెళ్ళనైయున్న దేశాన్ని దర్శించి దైవిక ప్రేమ యొక్క రుజువు, యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన వాగ్దాన దేశము నదికి ఆవలియున్నదని సంఘమునకు తెలియజేయుటకు పిలిచెను.
23
ఇప్పుడు, గతరాత్రి “యొర్దాను వద్దకు వెళ్ళుట” అనే విషయాన్ని బోధించియున్నాను. మనము నది వద్దకు వెళ్ళినప్పుడు అది మనలను విభజించును. వేరుపరచును. ఆవలి వైపున, ఏదో ఒకటి నీకు జరిగెను.
ఇప్పుడు, యెహోషువ దీనినంతటినీ తెలిసినవాడై ఆజ్ఞ గొప్పదని ఎరిగి, నిశ్చయిత పొందినవాడై నిర్భయంగా ఉండెను. చూపించబడిన సరియైన మార్గములో ఉన్నంత వరకు, మనము చెప్పుకొనునట్లు కరకుతనమును ఆతను కలిగి ఉండెను. తనను ఏదైతే వెనుకకు లాగుతున్నదో ఆ ఒక్క కొండను అతను పగలగొట్టాలి, అయితే ఆతను సరియైన మార్గములో కొనిపోబడెను.
కావున జీవముగల దేవుని సంఘము విశ్వాసముతో సరియైన మార్గము వైపు ఉన్నట్లయితే, కరకుగా, నిర్భయంగా ఉండగలదు. ఆయన చెప్పెను, “మోషేకు తోడైయుండినట్లు, నీకును తోడైయుందును.” నేను నిన్ను పడిపోనివ్వను. నిన్ను విడువను. ఆయన ఎన్నడూ మోషేను పడిపోనివ్వలేదు, ఎడబాయలేదు. ఆయన యెహోషువాను పడిపోనివ్వలేదు, ఆయన మనలనూ పడిపోనివ్వడు! ఆయన మనతో ఉండును.
24
మనము యెహోషువ ఆజ్ఞను పొంది, ఆ దేశములో గుండా వారిని నడిపించే బాధ్యతను కలిగియుండి మరియొక దేశమునకు వెళ్ళవలసి ఉన్నదని కనుగొనెదము. ఆయన రాజ్యమును స్థాపించి, దానిని వారి మధ్య స్వాస్థ్యములుగా విభాగించవలసి ఉన్నది. మోషే చేసినదాని కన్నా యెహోషువ మరి ఎక్కువగా చేయవలసియున్నది. తనకివ్వబడిన ఆజ్ఞ మోషే చేసిన దానికంటే బ్రహ్మాండమైనదని యెహోషువ ఎరిగెను.
మరియొక కార్యమేమనగా, అతను వారి సహోదరులు ఎక్కడైతే రక్తం కార్చుట చవిచూశారో అదే సరిహద్దుల గుండా వారిని నడిపించవలసి ఉండెను. ఆయన వారిని జయించవలసి యుండెను. ముందుగా ఆయన వారిని నిమ్మళపరచి, కవాతు చేయుంచుచుండెను.
ఈ కాలములో సంఘ శాఖా తత్వాన్ని బాగా ఎరిగి, రుచిచూచిన పెంతెకోస్తు వారిని కూడా ఈ రోజు అలానే నిమ్మళపరచాలి. కాని అది చాలా కష్టము.
25
కొన్ని సంవత్సరముల క్రితము వారు నాతో చెప్పిరి, “రండి బ్రదర్ బ్రెన్హాం, [పరిచర్య ప్రారంభమైన సమయములో], మేము ఒక సంస్థను స్థాపించి మీకొక స్మారకాన్ని నిర్మిస్తామనిరి.” నేను నా కొరకు స్మారకాల కొరకు ఎదురుచూడడం లేదు! క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నానని చెప్పాను!
“కడవరి వర్షము,” అనే ఒక చిన్న దైవారాధన గుంపుగా వారు ఏర్పడి కాలిఫోర్నియాలో నుండి కెనడా దేశానికి వెళ్ళిపోయారు. కాని అది పడిపోయినది. అది కొనసాగలేక పోయిందనుకోండి. ఎందుకని? వారికి తీసినదల్లా... ఆ విషయాల్లో నుండి వచ్చి ఏదో కొంత మాత్రమే వారు పొందుకున్నారు. కాని దేనినైతే పొందుకోవాలో దాని వారు చేయవలసియున్నది.
సహోదరుడా, సజీవుడైన నిజదేవుని సంఘమునకు నిర్దిష్టమైన ఆకారము, సిద్ధాంతములు ఏమీ ఉండవు. ప్రతి వ్యక్తి హృదయములో ఉండేటటువంటి దేవుని శక్తిచే అది నడిపించబడుతుంది. నీ సహోదరులను దాటి వెళ్ళుము. వారితో వాదములు చేయవద్దు. వారి కన్నా మనము ప్రాముఖ్యమైనవారము. వారితో అనవసర వాదనలు చేయవద్దు; అలా వారిని దాటి వెళ్ళండి.
26
ఇక్కడ జరిగిన ఒక గొప్ప సంగతిని మీరు గమనించవలసినదిగా కోరుతున్నాను. గత రాత్రి ఏశావు, మోయాబు ప్రస్తావన జరిగింది. వారిలో అనేకులు వాస్తవముగా సరిహద్దు విశ్వాసులై ఉన్నారు. వారు సరిహద్దులోనే నిలిచియున్నారు.
నేను ఇక్కడితో ఆపేముందు ఒక్క నిమిషములో చెప్పవలసినది చెప్తాను. అనేకులు వాగ్దాన దేశాన్ని వేయి సంవత్సరాల పరిపాలనతో పోలుస్తారు. కాని అలా కాదు. వాగ్దాన దేశము యుద్దములు చంపుకోవడాలను కలిగియున్నది. కాని వేయ్యేండ్ల పరిపాలనలో యుద్ధాలు, హత్యలు ఉండవు. ఆ యుద్ధభూమి పరిశుద్ధాత్మను సూచిస్తుంది.
నీతీకరణతో వారు ఐగుప్తును విడిచిరి. వారి ప్రయాణములో మూడు దశలున్నవి. నీతీకరణము క్రింద, వాక్యమును నమ్మినవారు ఐగుప్తును విడిచిరి. తమకు తామే ఐగుప్తు వారి నుండి వేరై బయటకు వచ్చిరి. వారు రక్తము యొక్క శుద్ధీకరణలో ఎర్ర సముద్రమును దాటిరి మరియు వెనుక వున్న వాటిని అనగా దయ్యం ద్వారా కలిగిన అన్ని రకాల మానవ కోర్కెలను సంహరించిరి - అది ప్రయాణము యొక్క రెండవ దశ. కాని మూడవ దశలో వారు యొర్దానును దాటి వాగ్దాన దేశములో ప్రవేశించి, వారికుంచబడిన స్వాస్థ్యమును పొందుటయై ఉన్నది. దేవుడు వారిని ఐగుప్తులో దీవించినప్పటికీ వారి స్వాస్థ్యము ఐగుప్తు దేశములో ఎన్నటికిని లేదు.
27
నీతీకరణను నమ్మే లూథరన్లు అయిన మీరు, దేవుడు పిలిచినట్లైతే నీవు చెప్పుకొనునట్లు నీ స్వాస్థ్యము అక్కడ ఉంచబడలేదు. నీవు కేవలము ఒక లూథరన్ గా ఉన్నట్లైతే నిన్ను అది అంతకంటే ఎదగనీయదు.
మెథడిస్టు వారలారా, నాజరీనులారా, మరియు ఫిలిగ్రీమ్-హోలీనెస్ వారలారా, మరియు చర్చ్-ఆఫ్-గాడ్ వారలారా, శుద్దీకరణను నమ్మేవారలారా, మీలో అపవిత్రతను చంపగోరువారలారా, చెడు సంపూర్తిగా తీసివేయ మనస్సు గల వారులారా, మీరు నది ఆవలి ఒడ్డుకు చెందినవారు.
కాని స్త్రీలారా, పురుషులారా మీలో ఉన్నదేదో ఒకటి మిమ్ములను, అల అలను బయటకు పిలిచినట్లుగా, ఇంకా యొర్దాను దాటి, నది ఆవలి ఒడ్డుకు దాటవలసియున్నది.
ఇలా చెప్పబడింది, “మీరు మీ సహోదరులకు సమీపంగా వెళుతున్నారు. వారు సరిహద్దుకు సమీపంగా ఉన్నారు. మీరు మీ సహోదరులను దాటి వెళ్ళుచున్నారు. వారు సరిహద్దుకు సమీపముగా ఉన్నారు. వారిని దాటి వెళ్ళినప్పుడు వారితో ఏమయూ మాటలాడవద్దు. ఈ పర్వతమును ఏశావుకు ఇచ్చియున్నాను. ఈ దేశమును మోయాబుకు ఇచ్చియున్నాను. వారిని మీవలే మార్చుటకు తొందర కలిగించి, ప్రయత్నించవద్దు. మెల్లగా అలా దాటి వెళ్ళుడి. మీరెక్కడికి వెళ్ళవలెనో మీకు తెలియును. వారి అలవాట్లను తీసికోవద్దు.”
28
మోయాబు బిలాము అను పేరు కలిగిన ఒక అబద్ద ప్రవక్తను కలిగి యున్నది. బిలాము వారికి పెద్దగా ఉండి వారి సహోదరులందరిని ఒక సమాజముగా ఐక్యపరుచుటకు ప్రయత్నించుచున్నాడు, ఎందుకనగా వారు సహోదరులు వారు నిజముగా సహోదరులై ఉండలేదు. వారు సగము సహోదరులు, నిజమైన సహోదరులు కాదు.
“అతనితో విభేదించకు; అతనిని ఒంటరిగా వదిలి అలా ముందుకు వెళ్ళు. అతని దేశములో నుండి ప్రయాణించవలసి వస్తే మీరు పొందుకున్నవాటికి వెల చెల్లించండి. ఆ విధంగా ఉండుటకు అతను ముందుగా నియమించబడెను. దేవుడు మోయాబును ఇశ్రాయేలీయులతో జతపర్చగోరినట్లైతే, జతపరచి ఉండేవాడు. ఆయన ముందుగా నిర్ణయించినట్లైతే, ఏశావును ఇశ్రాయేలుతో కలసి వెళ్ళుటకు, ఏశావు ఎప్పుడో దుమికి వచ్చి ఇశ్రాయేలీయులతో వెళ్ళేవాడు. కాని దేవుడు ఏశావుకు నదికి మరియొక వైపు స్వాస్థ్యమును ఇచ్చెను.
29
కాబట్టి లూథరన్ వారందరూ, బాప్టిస్ట్ వారందరూ, ప్రెస్బిటేరియన్ వారందరు, నాజరీను, ఫిలిగ్రీము-హోలినెస్ వరందరూ దానిని చూడాలని నీవెందుకు ప్రయత్నించుచున్నావు? వారిని ఖండించవద్దు. వారిలో ఉన్నదంతా అదే. వారికి తెలిసినదల్లా అంతమట్టుకే.
కాని విశ్వసించుచున్న నీకు (ఓ దేవా), తెలిసిన నీకు, ఏదో పొందిన నీకు నీలో మరింతగా లోతునకు నిన్ను పిలుచుచున్నది. ఆ లోతంతటిలోనూ నీవు సంతృప్తి పొందినట్లైతే, అక్కడే నిలిచియుండుము. కాని నాకు మరియు నా కుటుంబానికి ఆయన చూపించిన దానికన్నా ఇంకా ఏదో ఉంది. నదికి ఆవలి వైపు ఎక్కడో ఒక దేశము ఉన్నది. ఇంకా లోతైన పిలుపులో నుండి లోతైనది ఏదో ఉంది. నేను వేదాంత విద్యచే సంతృప్తిపరచబడలేను. మంచి సంఘమును బట్టి నేను తృప్తిపరచబడలేను. ఒక మంచి సువార్త కూటమును బట్టి నేను సంతృప్తిపడలేను. ఒక చిన్న స్వస్థతా కూటమును బట్టి సంతృప్తి పరచబడలేను. అంతకు మించినదేదో ఆవలి నుండి పిలుచుచున్నది!
30
కాబట్టి వారిని అలా ఒంటరిగా ఉండనివ్వండి. మీరు వెళ్తూ ఉండండి. వారితో వాదించవద్దు. కాని మనము మరియొక దేశమునకు వెళ్ళుచున్నాము. మీతో వచ్చుటకు వారు ముందుగా నిర్ణయించబడలేదు. వారు మీతో నడవరు. సమ్మతించకుండా ఇద్దరు కలసి ఎలా నడువగలరు? కాని దేవుని ప్రేమించువారికి, దేవునిచే పిలువబడిన వారికి వారు చెబుతారు, “దేవుడు మాకు ఈ సంఘాన్నిచ్చాడు. దేవుడు మాకు ఇది చేశాడు,” అని.
అది సరియే దేవుడు చెప్పెను, “నేను ఏశావునకు ఈ పర్వతాన్ని ఇచ్చియున్నాను. ఆయనను తాకవద్దు. నేను మీ కొరకు మరొక ప్రత్యేకమైన దానిని ఉంచాను. నది దాటుము!” ఆమేన్.
సహోదరులారా, నా సంఘము నది ఆవలి ఒడ్డునకు చేరునట్లు, ఇంకా ఆవలి వైపుకు వెళ్ళునట్లు చూచుటయే నా కోరికయై ఉన్నది. నీలో ఏదైనా ఉన్నట్లైతే, మొదట ఆయన పిలుపుకు స్పందించడం, ఆ పిలుపునకు స్పందించేది ఏదో ఒకటి మీలో ఉండాలి. పండుకొనిన గొర్రెను లేపినంత మాత్రాన చాలదు. ఏదో ఒక పని చేసినంతనే సరిపోదు. సంఘములో చేరి పుస్తకములో నీ పేరు నమోదు చేసినంతనే సరిపోదు; ఎందుకనగా అదిగో ఆ దూరముగా ఉన్న కొండల సమూహమును, తర్వాత మరియొక కొండల సమూహమును దాటి యొర్దాను నది అంతటిని దాటి దేవుని చేతిలో పడేంతవరకు ఎంతో దూరముగా లోతైన దానినుండి లోతునకు నడిపించు పిలుపైయున్నది.
31
యెహోషువాకు ఈ ఆజ్ఞ చాలా గొప్పదని తెలుసు. అక్కడ మీరు గమనించారా! ఆయన యొర్దాను నది దాటనారంభించినప్పుడు, ఆయన తనకిచ్చిన ఆజ్ఞను గుర్తుచేసుకొనియున్నాడు. “ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు.” మరియొక మాటలో, “ఓ యెహోషువ, ఏ గోత్రపువారు ఏమి చెప్పినను, ఏ పెద్ద ఏమి మాట్లాడిననూ నేను లెక్కచేయను. నీవు ఈ వాక్యముతోనే నిలిచియుండవలెను. అప్పుడే నీవు నీ మార్గములందు వర్ధిల్లుదువు. వారెన్ని పెద్ద పనులు చేసినా, చిన్న పనులు చేసినా, ఎన్ని సంస్థలను ఏర్పరచినా, ఇదిగో యెహోషువ! నీవు వాక్యముతో నిలిచియుండు. [ఓ మై!] వాక్యముతో నిలిచియుండు. ఈ వాక్యముతో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింప తప్పిపోకూడదు...” దీనిని మళ్ళీ చదువుదాము.
అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్త పడి, బహు ధైర్యముగా నుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు, నీవు దానినుండి కుడికి గాని యెడమకు గాని తొలగకూడదు.
32
అయితే వాక్యము, “ఏదైనా ఫలాన కార్యము చేయమనినప్పుడు,” దానిని చేయుము! సంస్థ ఏమి చెప్పినను నేను లెక్క చేయును, ఏది ఏమైనను దానిని చేయుము! అలాంటి యెహోషువ కొరకు దేవుడు చూస్తున్నాడు. ఒక్క అంగుళమైనా, లేశమైనా తప్పిపోవదు. వాక్యముతోనే నిలిచియుండుము.
నీవు వర్ధిల్లునట్లు కుడికి గాని, ఎడమకు గాని తొలగిపోవద్దు.
ఓ, మీరు పెద్ద సంఘాల్ని కట్టినప్పుడో, ఆ శాఖకు పది వేల మంది చేరినప్పుడో మీరు వర్ధిల్లినట్లు భావించుతారు. అది అభివృద్ది కాదు. అది ఆయన వాగ్దానానికి ఒక్క అడుగు కూడా నిన్ను దగ్గరకు తీసుకుని వెళ్ళలేదు. మనకు మరి ఎక్కువగా కావలసినది, దేవుని నుండి, పరిశుద్ధాత్మ నుండియే!
నీవు వెళ్ళు చోటెల్లా నీవు వర్ధిల్లునట్లు ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు; దివారాత్రము దానిని ధ్యానించుము.
నీవు ఏదైనా ఒక పనిని చేయ తలపెట్టినప్పుడు దాని విషయమైన దేవుని వాక్యమేమి చెప్పునోనని ఆలోచించుచున్నావా? నీ కోరికలు వాక్యానుసారమైనవా? బైబిలుకు సంబంధించిన దానినే బోధించుచున్నావా? మీరు కేవలం ఈ రోజు అనేకులవలే ఉండి, చాలా మంది, “మనష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచున్నారు కారా?”
33
ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీ చేతినుండైననూ, నీ నోటినుండైననూ తప్పిపోకూడదు.
“నీ నోటినుండైననూ,” అంటే నీవేమి మాట్లాడుచున్నావు. ఏదో చదివి వెళ్ళడము కాదు, దానినే మాట్లాడు, దాని ప్రకారము జీవించు, దానినే బోధించు.
దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు పరిశీలనగా జాగ్రత్త పడాలి. దివారాత్రములు దానిని ధ్యానించి.
ఈ రోజుకు సంబంధించిన యెహోషువ ఏమి చేయబోవుచున్నాడో చూడండి? ఆత్మ సంబంధమైన సంఘపు యెహోషువ ఏమి చేయబోవుచున్నాడో చూడండి? ప్రకృతి సంబంధమైన సంఘము ఏ యెహోషువాను కలిగియున్నదో, ఆత్మ సంబంధమైన సంఘము కూడా దానినే కలిగియుండాలి.
“ఒకడు తిరిగి జన్మించితేనే తప్ప, దేవుని రాజ్యములో చూడలేడని,” బైబిలు చెప్పినప్పుడు - ఆత్మ సంబంధమైన యెహోషువ, “ఆమెన్” చెప్తాడు.
“యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని,” బైబిలు చెప్పినప్పుడు - ఆత్మ సంబంధమైన యెహోషువ కూడా అలాగే, “ఆయన ఏకరీతిగా ఉన్నాడు,” అని చెప్పును.
బైబిల్ ఈలాగు చెప్పినట్లయితే, ఆ గ్రంథము, ఆ వాక్యము చెప్పుచున్నది, “యెరూషలేములో నిలచియుండుడి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు నాకు సాక్షులైయుందురు,” ఆత్మ సంబంధమైన యెహోషువ కూడా అలాగే చెప్తాడు.
34
పేతురు ఆ పెంతెకోస్తు దినమున “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు,” అని చెప్పబడినప్పుడు - ఆత్మ సంబంధమైన యెహోషువ ఏ మాత్రమునూ లేశమైనా విభేదింపక, సరిగా వాక్యము చెప్పినట్లే చేయును.
“మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మనివానికి శిక్ష విధింపబడును. నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు, క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను - అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు - వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను,” అని మార్కు 16 చెప్పినట్లైతే, ఆత్మ సంబంధమైన యెహోషువ కూడా దానినే చెప్పును. ఆ విధానములో వర్ధిల్లుటకు దానిని దివారాత్రులు ధ్యానించును.
35
అక్కడేమి జరిగినదో మీరు గమనించాలని నేను కోరుచున్నాను. యెహోషువ మొదటిసారిగా ఇశ్రాయేలీయులను సమావేశపరచి, మాట్లాడుతున్నప్పుడు ఆయనే నిజమైన యెహోషువ అని నిరూపించవలసియున్నది. ఇశ్రాయేలీయులు దాన్ని తెలిసికొనవలసి వచ్చింది.
సందేహము లేదు, ఆ మత పెద్దలు విభిన్న ఆలోచన కలిగివుండవచ్చు. వారు, “మనం వసంత కాలము వరకో, వేసవి కాలము వరకో ఇక్కడే గుడారము వేసుకొని నివసించినట్లైతే, యొర్దాను నది ఎండిపోతుంది,” చెప్పి ఉండవచ్చు.
మరియు దేవుడు కొన్ని విపరీతమైన బుద్దిహీన సంగతులను ఆత్మీయ యెహోషువ ముందు వేసినట్లుగా కనిపించుచున్నది.
ఆయన నిజమైన యెహోషువ ఔనో, కాదో పరీక్షించుటకు, ఏప్రిల్ మాసములో యొర్దాను నది దాని పరిమాణము మూడు, నాలుగు వంతులు ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడికి తీసుకొచ్చాడు.
ప్రతి దానిలో వ్యతిరేకత జరిగినా, ప్రతి ఒక్కరూ వర్దిల్లినా, తప్పులు చేయువారు వర్దిల్లినా, పైకి భక్తిగల వారివలే ఉండి, దాని శక్తిని ఆశ్రయించనివారు, వర్దిల్లి, నీకు వెన్ను చూపినా. అయితే నీ వెక్కడ నిలబడియున్నావో దానిని యెరిగినట్లయితే, నీవు నిలబడతావు! ప్రపంచమంతా నిన్ను క్రిందకు లాగినా, దానిని లక్ష్యము చేయక నీవలాగే నిలబడతావు. వాక్యము నుండి నీవెంతమాత్రము వేరు కావు.
36
ఆ యొర్దాను పరిమాణము మూడు నాలుగు రెట్లు అధికంగా, వేగంగా, భయంకరంగా, మురికిగా ప్రవహిస్తుంది. కాని యెహోషువ “మనము మూడు రోజుల్లో నదిని దాటి వెళ్తామని, దేవుడు చెప్పాడు గనుక వెళ్తున్నామని చెప్పాడు.”
అప్పుడా మత పెద్ద ఇలా చెబుతారు, “ఇదిగో యెహోషువ ఒక్క నిమిషం ఆలోచించు. మనము చదువుకున్న వ్యక్తులం. చురుకైన వారు మనలో అనేకులు ఐగుప్తు నుండి వచ్చిన ఇంజనీర్లు. మనకు ఈ పనులు ఎలా చేయాలో తెలుసు, కాబట్టి మనము ప్రవాహము ఆగిపోయే వరకు వేచి ఉందాము. అప్పుడు మనం దానిలో నడవవచ్చు. అది సులువైనది కాదా?”
“మీ ఆలోచనలను నేను లక్ష్యపెట్టను. దేవుడు చెప్పాడు మూడు రోజుల్లో అక్కడికి వెళ్తాము. మరియు వెళ్ళుదుము, వెళ్తాము. మూడు రోజుల్లో.”
యెహోషువ చేసిన దానిని గమనించండి. ఆయన మొదటి స్థానములో దేనినుంచాడు? ఒక మత పెద్దనా? లేదండి. ఆయన దేవుని వాక్యాన్ని ఉంచాడు. యెహోషువ యాజకులతో, “నిబంధనా మందసమును తీసుకుని దానికి దూరముగా ఉండి దానిని వెంబడించుడి. దానిని మీరు నడిపించుటకు ప్రయత్నించకండి; అదే మిమ్ములను నడిపించనీయండి.”
37
అదే ఈ రోజు సమస్యయై ఉన్నది. మనము దేవుని వాక్యానికి ముందుగా నడవడానికి ప్రయత్నిస్తున్నాము. మరియు దగ్గరి త్రోవ తీసుకుని వాక్యము దానికి అనుకూలంగా ఉండునట్లు చేస్తున్నాము. ఈ రోజు మనము ఆయన వాక్యాన్ని అనుసరించవలసి ఉన్నది. మీ హృదయాలు దీవించబడాలి, ఈ రోజు మనము చేయవలసినది ఏమనగా, వాక్యాన్ని వెంబడించాలి!
వాక్యము ఆ మార్గమును నడిపించెను. అది యొర్దానుకు వచ్చినప్పుడు వారు వెళ్ళునట్లు దానిని తెరిచెను. ఆయన మొదట అంకములో ప్రధాన కార్యములను ముందు ఉంచెను. దానికి అతడు ఒక కారణమును కలిగియుండెను. ఈ వాక్యముతో నిలిచి యుండండి. వాక్యమునే కార్యము చేయనీయండి,“ అని దేవుడు అతనికి ఆజ్ఞాపించెను గనుక, ఆ కారణమును కలిగియుండెను. మందసమును ముందుంచమని దేవుడు ఆజ్ఞాపించెను గనుక, ప్రతి యుద్దములో వారు ఆలాగున ముందుకెళ్ళారు.
నిబంధనా మందసము ముందు వెళ్ళిన తర్వాత ఏమి వెళ్ళెను? పాటలు, వాయిద్యములు వాయించువారు యుద్దమునకు ముందు నడిచెను. హల్లెలూయా!
అదే ఈ రోజు మనకు అవసరమైనది, ఈ ఉదయకాల సమయంలో గాయకులు వాయిద్య పరికరములతో ఆనందించుచుండిరి. వాక్యాన్ని ముందుంచి చదువుడి. అప్పుడు యుద్దము ఆరంభమగును. మనము విజయం పొందుటకు, కేవలము విజయము పొందుటకే బద్దులమైయున్నాము. దానితో సరిగా ఉండి సరియైన దిశలో ఉండుము. ఆపద సమయంలో అది నిన్ను కాపాడును.
38
ఆయన నదిని దాటునప్పుడు ఒక మంచి ఆలోచన చేసెను. నదిని దాటక మునుపు ఆ దేశమును పరిశీలించుటకు ఇద్దరు వేగులవారిని పంపెను. మోషే అయితే ఒక గుంపుగా వేగులవారిని పంపించెను. కాని వారందరూ గందరగోళ స్థితిలో తిరిగి వచ్చిరి. ఈ కొత్త పరిచర్యను గమనించుడి. ఆయన అలాగు చేయలేదు. యెహోషువాకు తెలుసు 1500 విభిన్నమైన ఆలోచనలు వచ్చినప్పుడు, 1500 తికమకలు కూడా కలుగునని. కాని ఆయన “ఆ దేశమునకు వెళ్ళి, వేగు చూడుడి,” అని ఇద్దర్ని పంపెను.
మనము ఏదైనా ఒక కార్యములోనికి దిగినప్పుడు మనమేమి కోల్పోకూడదని నా ఉద్దేశ్యము. “మీరు వెళ్ళినప్పుడు, ఆ దేశమును చూసి, ఆ వాగ్దానములు నిజమో, కావో అని, అది ఎలాంటి దేశమో, దానిలోనికి ఎలా ప్రవేశించాలో తెలుసుకొని రమ్ము,” అని ఆయన చెప్పాడు. వారు దాటి వెళ్ళారు. వారి పేర్లు కూడా పేర్కొనబడలేదు. కాని వారు ఆ స్థలములోనికి వెళ్ళినప్పుడు, యెరికోకు వెళ్ళారు, అక్కడ ఏమి జరిగినది? ఒక చెడ్డ పేరు కలిగిన వేశ్య గృహములోనికి వెళ్ళిరి.
39
నేనిక్కడ ఒక చిత్రీకరణ చేయదలిచాను. అది సరి కాదేమో, కాని దానిని బట్టి కొన్ని విషయాలు తెలపాలి. రాహాబును గూర్చిన చరిత్ర మనకు లేదు. ఆమె ఒక వేశ్యయై ఉండెనని మనకు తెలియును. ఆమె నిజముగా పేద గృహములో పెంచబడి, క్రమముగా అపఖ్యాతి కలిగిన స్త్రీగా మారినదని భావిద్దాము. ఆమె ఒక అందమైన, యవ్వన స్త్రీ. అవిటి వారైన తల్లిదండ్రులను పోషించుటకు వీధులలోనికి వెళ్ళినప్పుడు ఆమెకు ఏ పని దొరకక పోవడము వలన, శరీరాన్ని అమ్ముకోవడము ఆమెకు నైతికముగా అనిపించింది. అయితే నేనూహించగలను ప్రతిసారీ ఆమెకది తప్పని తెలియును. ఆమెలో ఉన్నది ఏదో ఆమెకు తెలియజేస్తుంది. “ఆ విధంగా చేయుట సరియైనది కాదు” అని. ఆమెకు తెలుసు అది సరికాదని.
ఒక రోజున కార్యములు జరిగించగలిగిన దేవుడున్నాడని విని యున్నది. ఆమె హృదయము వణక సాగెను. ఆ గొప్ప మార్పులో ఆమె ఒక దూతను కనుగొనగా, ఆ దూత జరగబోవు సంగతిని ఆమెకు తెలియజేసెను. ఆమె ఏమి చెప్పెను? ఇప్పుడు, యెహోషువ వద్ద సూచనలు ఉండెను. మోషే వద్ద ఏ సూచనలు ఉండెనో, ఖచ్చితంగా అవే సూచనలు యెహోషువ వద్ద ఉండెను. కాబట్టి మనము పరిశీలించినప్పుడు రాహాబు, యెహోషువ యొక్క సూచనలను చూడగోరలేదు, గాని కేవలం వాటిని గూర్చి వినెను.
ఒక విధమైన సంఘపు మాదిరి, ఆ విధమైన నిజ సంఘము వ్యభిచారంలోకి దూరంగా నెట్టివేయబడింది. నేను ఈ రోజు మెథడిస్టును, రేపు బాప్టిస్టు వాడను, ఆ తర్వాత రోజు ప్రెస్బిటేరియన్ను.“ అలా వ్యభిచారంలోనికి లాగబడెను.
40
కాని అనుకొనని రీతిగా ఒక చిన్న బోధకుడు పట్టణములో ప్రవేశించి “సజీవుడైన దేవుడొకడున్నాడు. ఆయన నిన్న, నేడునూ ఉండేవాడు. ఆయన శక్తి ఎప్పటికీ ఒక్కలాగే ఉండును. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏమి చేసెనో, ఇప్పుడునూ అవే చేయును.” ఇప్పుడునూ ఆయన ప్రతినిధులు ఆ మార్గము లోనే ఉన్నారు.
ఇప్పుడు, రాహాబను వేశ్య, వేశ్యగానే తెలుసు, ఈ రోజు ఆమె ఒక విశ్వాసికి మాదిరి, ఒక నిజ విశ్వాసురాలు. “యెహోషువ సూచక క్రియలు చేయగలడని ఇప్పుడు నేను విన్నాను, ఎందుకనగా ఆయన మోషే వారసుడు. నేను ఆ సూచక క్రియలను చూడాలనుకుంటున్నాను. ఆ సూచక క్రియలను నేను చూసినట్లైతే నమ్ముతాను,” అని రాహాబు అనలేదు. మంచిది, ఖచ్చితంగా ఆయన ఆమెకు సూచక్రియలేమీ చూపనక్కర లేదు, ఎందుకనగా ఏది ఏమైనను దానిని ఆమె నమ్మినది. ఆమె తోమా కాదు. ఆమె దానిని నమ్మెను.
41
ఇప్పుడు మోషే వద్ద సూచక క్రియలు ఉండినప్పుడు ఆయన వెళ్ళి తన సూచక క్రియలు ప్రదర్శించెను. అయితే వారిని వాగ్దాన దేశములోనికి ప్రవేశింపజేసేది సూచక క్రియలు కాదు. ఈ సూచక క్రియలు ఆజ్ఞకు రుజువులై ఉన్నవి.
మరియు రాహాబు ఏమీ చూడకుండా నమ్మెను! ఆమె చెప్పింది “మేమందరమూ వణకుచున్నామని.”
ఆశ్చర్యమేమీ లేదు, నీకొదేము ఇలా చెప్పెను, “బోధకుడా, నీవు దేవుని యొద్దనుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము, దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేదని ఆయనతో చెప్పెను.”
ఈ రోజు ప్రపంచానికి అది తెలుసు! “మనము పెంతెకోస్తు దినానికి తిరిగి వెళ్ళాలి” అని బిల్లీగ్రహాం పిలుపునిచ్చారు. “మనము తిరిగి ప్రవక్తల యొద్దకు, భాషలు మాట్లాడే వారి యొద్దకు, భాషలకు అర్దము చెప్పే వారి వద్దకు, దైవిక స్వస్థతవద్దకు, మన సంఘాలలో స్వస్థపరిచే వారి వద్దకు, దేవుని ఆత్మకు సరియైన ప్రాధాన్యత ఇస్తూ వెళ్ళాలి,” అని సంఘముల మండలి పిలుపునిచ్చింది. దేవుడు తన పిలుపును పిలుస్తున్నాడు, ప్రజలు దేవుని యందు భయభక్తులు కలిగి, “మా గుండెలు పూర్తిగా మాలో కరిగిపోవుచున్నవి.”
42
ఇప్పుడు, ఆమె యెహోషువ తన చేతితోనో, కర్రతోనో ఒక సూచక క్రియ చేయుట చూడనవసరము లేదు. ఆమె నమ్మి, ఇలా అన్నది, “నేను విన్నాను, మరియు విశ్వసించాను, నేనిప్పుడు ఆయన కృప కొరకు అడుగుతున్నాను. [ఓ ఇప్పుడు ఎలాంటి పాఠాన్ని మనం ఉంచగలము!] నేనిప్పుడు నా కొరకు, మరియు నా కుటుంబము కొరకు కృపను అడుగుచున్నాను.”
రోములో ఫిలిప్పీయుడైన చెరసాల అధిపతి ఆ రాత్రి తన కత్తి లాగి తనకు తాను హాని చేసుకొనబోవుచుండగా, అప్పుడు పౌలు, “నీవు ఏ హానియు చేసికొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను.”
“అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను?” అని అడిగెను.
అందుకు వారు, “ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము; అప్పుడు నీవును నీయింటివారును రక్షణ పొందుదురని చెప్పెను.”
ఎందుకు? “నీవును నీ ఇంటివారునూ,” నిశ్చయంగా. నీ ఇంటివారూ నీతో కూడా రక్షింపబడుదురు. ఎందుకని? రక్షింపబడుటకు తగినంత విశ్వాసము నీకున్నట్లైతే, నీ కుటుంబము కూడా రక్షింపబడగలిగినంత విశ్వాసమును కలిగియుండగలవు. అవును, “నీవును, నీ ఇంటివారును!”
43
రాహాబును గమనించండి. “నాపై జాలి చూపండి. నన్ను కాపాడండి. ఈ అవిశ్వాసులతో కూడా చనిపోవడం, నాకిష్టము లేదు. జంతువువలె చావాలని నేను కోరుటలేదు. దేవుని చేతిలో మరణించాలని కోరుతున్నాను. నేను మీ దేవుని నమ్ముతున్నాను, ఎందుకనగా ఆయన భూమ్యాకాశములకు దేవుడు దృశ్యమైన కార్యములను ఆయన చేయును. ఆయన కార్యములను నిజము చేయువాడు. ఆయన చేయుచుండగా నేను చూడలేదు గానీ, ఎలాగైననూ నేను నమ్ముచున్నాను,” అని చెప్పెను. చూస్తున్నారా? ఆమె యెహోషువాను ఎన్నడూ చూడలేదు. కేవలం యెహోషువ గురించి విన్నది. ఆమె దేవుని ఎన్నడూ చూడలేదు, ఆయన ఏ విధమైన కార్యములు చేయునో ఎన్నడూ చూడలేదు. ఆమె కేవలం విన్నది. ఇతరులైతే చూశారు గాని, ఈమె విని విశ్వసించింది. అప్పుడు అన్నది, “నాకు సహాయము కావాలి, నా తల్లిదండ్రులు ఇద్దరూ ముసలివారు, మరియు అవిటివారు. నాకు సోదరులూ ఉన్నారు. నాకు వారి కొరకునూ విశ్వాసం కావాలి.”
మరియు వేగులవాడైన, బోధకుడు ఇలా చెప్పాడు, “అవును, ఆయన ఈ మార్గమునే వచ్చుచున్నాడు. మేము ఈ దేశముమును తీసుకొనబోవుచున్నాము. నీ వారిని రక్షించుకొనవలెను అంటే వారిని ఇంట్లోనే ఉండనియ్యాలి. [హల్లెలూయా!] నీవు దీనిని నమ్ముచునట్లైతే, వెళ్ళి వారిని ఇంట్లోనికి తీసుకుని రమ్ము. వారు వీధులలో ఉన్నట్లైన మేము బాధ్యులము కాదు. వారిని ఇంటిలోనికి తెచ్చినటైతే మేము బాధ్యులము, [హల్లెలూయ, ఎక్కడైతే ఆ ఎర్రని దారము కిటికీలో నుండి వ్రేలాడుతుందో.] వారిని ఇంట్లోనే ఉంచినట్లైతే అప్పుడు మేము బాధ్యులము.”
44
ఓ, సహోదరులారా, ఎప్పుడైనా సమయమనేది ఉంటే, ఏమైనప్పటికి మన గృహములోని ప్రియులను ఈ రోజే విశ్వాస గృహములో ఉంచవలసిన వారము. కంపించబోయే మునుపే వారిని లోనికి తీసుకొని రండి. మన తల్లిదండ్రులు, సహోదర సహోదరిలు కేవలము ఆ గృహములోనే సురక్షితులు, ఎందుకనగా మరలా దేవుని శక్తి దేశాన్ని కంపించబోవుచున్నది. అదే. మరియు కేవలము విశ్వాస గృహమునకు చేరిన వారే రక్షించబడుదురు.
ఇప్పుడు, అతడు చెప్పెను, “మీరు ఆ గృహములో లేనట్లైతే, మీ నాశనమునకు నేను బాధ్యుడను కాను.” ఆమె తనను, తన కుటుంబాన్ని వారు నాశనము చేయకుండునట్లు వారిచే వాగ్దానము చేయించుకున్నది. ఆ వేగులవాడు చెప్పాడు, “వారిని ఇంటిలో ఉంచినట్లైన వారు సురక్షితులే.” అప్పుడు ఆమె ఆ స్థలము నుండి వెళ్ళనివ్వగా, వారు వెళ్ళిపోయిరి.
45
ఈ గొప్ప వేశ్యయైన, రాహాబు విశ్వాసిగా మారెను. నేను ఆమె చరిత్రను గైకొని ఎంతోకాలము కాలేదు. ఆమెను పరిగణలోకి తీసుకొని మరియు విశ్వాసములోనికి రప్పించబడి, (దేవునియందు ఆమె యొక్క విశ్వాసము బట్టి ఆమె ఇశ్రాయేలీయురాలుగా మార్చబడింది.) ఇశ్రాయేలీయుల సైన్యములోని ఒక అధికారిని ఆమె పెళ్ళి చేసికొనినది. దేవుడు ఆమెకు ఏమి చేశాడో గమనించండి. వారు బెత్లహేము వెళ్ళారు, మరియు వారికి కుమారుడు కలిగాడు, అతనికి బోయజు అని పేరు పెట్టారు. ఆ తర్వాత బోయజు రూతును వివాహమాడి యెషయిని కన్నాడు, యెషయి నుండి దావీదు; దావీదు నుండి యేసుక్రీస్తు వచ్చారు. హల్లెలూయా!
ఎందుకు? “వినుట వలన విశ్వాసం కలుగును.” దేవుని నుండి వినుట వలన, ఆయనే భూమ్యాకాశములకు దేవుడు మరియు ఆయనను నమ్మండి.“ ఏమి నమ్మాలి? యెహోషువ అను మనుష్యునికి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను విశ్వసించాలి.
46
మోషే ఏలాగు విశ్వసించెనో, అలాగే యెహోషువ తనకిచ్చిన ఆజ్ఞను బట్టి దేవుని నమ్మెను. మోషే వలన కొన్ని తప్పిదములు జరిగి, అనేక సార్లు విఫలమైన గాని, ఆయన విజయోత్సాహము వైపు పయనించి చివరకు బండపై మరణించెను. దూతలు ఆయనను మోసుకొనిపోయిరి.
దేవా, నన్ను కూడా అలానే వెళ్ళనీయుడి. మీరిచ్చిన ఆజ్ఞను నేను మరణించేంత వరకు చేపట్టునట్లు సహాయం చేయండి. అక్కడ నా ప్రక్కన ఆ బండ ఉంచబడుట నేను చూస్తాను.
యెహోషువ తన ఆజ్ఞను నెరవేర్చుచున్నాడు. ఆయన చేసినప్పటికి.... దేవుడు దానిని పవిత్రముగా చేసెను, ఎందుకనగా సత్యవాక్యమందు నిలిచియున్నాడు.
ఇప్పుడు, యెహోషువ ఆజ్ఞను పొందియున్నాడని రాహాబుకు తెలియును. ఈ విషయమును మరువక, హృదయములో పదిలపరచుకో. యెహోషువ ఆజ్ఞను కలిగియున్నాడు. ఏమీ చూడక ముందే రాహాబు దానిని గుర్తించింది. ఆమెకు తెలుసు, యెహోషువాకి దేవుడు ఆ దేశమును స్వాధీనపరుచుకొనే శక్తి ఇచ్చాడని. ఆమె కృపను కోరగా, దేవుడు ఆమెకు కృపను అనుగ్రహించాడు. యెహోషువ ఆ దేశమునకు వచ్చినప్పుడు, ఆమెను కాపాడినారనే విషయం మనకు తెలుసు.
47
యెహోషువ కలిగియున్న మరియొక గొప్ప బాధ్యత ఏమనగా, ఆ దేశమును జనుల మధ్య విభాగించడము.
ఇప్పుడు జ్ఞాపకముంచుకో, దేవుని వాక్యమును కలిగి ఉన్నందున “ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు.” “నేను మోషేకు తోడైయుండినట్లు, సరియైన మార్గములో పయనించుము. నేను మోషేకు తోడైయుండినట్లు, నీకును తోడైయుందును. నిన్ను విడువను. నీవు నన్ను విడిచిననూ, నేను నిన్ను ఓడిపోనివ్వను. కాని నీవు నన్ను విడిచినట్లైతే, నా కృప నీకు చాలును. నేను నిన్ను భరించి, తిరిగి నిన్ను మార్గములో పెట్టెదను. కేవలం మార్గమందు పయనించు. నా వాక్యమందు నిలిచియున్నంత వరకూ నేను నీ యెడల జాగ్రత్త కలిగి కాపాడెదను.”
48
ఆయన ఇప్పుడు దేశమును విభజించవలసి ఉన్నది, మరియు పన్నెండు గోత్రముల వారికి దానిని పంచవలసియున్నది. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు మరియు తగాదాలు వస్తే పరిస్థితి ఏమిటి? ఎఫ్రాయిము గోత్రము కన్నా గాదు గోత్రమునకు ఎక్కువ అభిమానము చూపితే పరిస్థితి ఏమిటి? యూదా గోత్రము కన్నా యోసేపు వారిని ఎక్కువగా ప్రేమిస్తే? కాని ఆయన అలా చేయలేదు. ఆత్మ తనకు బయలుపరచిన వాక్య ప్రకారము దానిని విభజించాడు. ఆయన గోత్రమును బట్టి విభజించాడు. మరియు గమనించండి, ఆయన వివేచనా జ్ఞానమును బట్టి, దేవుని బయలుపాటును బట్టి చేసాడు. దేవుని ఆత్మ యొక్క వివేచనను బట్టి అలాగు చేసాడు.
హెబ్రీ తల్లులలో ప్రతి ఒక్కరూ, తమ బిడ్డలకు జన్మనిస్తున్నప్పుడు, పేర్లతో వారిని పిలిచేవారు మరియు ప్రతి ఒక్కరి పేరుకు, ఒక అర్ధమున్నది.
కవలలో ఒకరిగా జన్మించిన యాకోబును, ఆమె పేరు పెట్టి “మోసగాడు,” యాకోబుగా పిలిచెను. కాని అతను జయించగల శక్తిని పొందినప్పుడు, మరియు దేవదూతతో పెనుగులాడినప్పుడు, అతని పేరు యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చబడెను. “యువరాజు.”
పేరు అనేది మన జీవితములో ఏదో విధంగా ముడిపడి ఉంది. పేతురు అనే చేపలు పట్టుకొనే వాడు జయించినప్పుడు, యేసుక్రీస్తు అతని విశ్వాసమును బట్టి నీ పేరు సీమోను; కాని నేను నిన్ను పేతురు అని పిలవబోవుచున్నాను, అనగా “చిన్న బండ” అని అర్ధము. అది నిన్ను మార్చును. నీ జీవిత మార్పునకు, జీవితములో ఒక స్థానమునకు, నీ పేరుకు ఏదో విధముగా ముడిపడి ఉంటుంది.
49
మరియు ఈ గొప్ప సంగతులు సంభవించుచున్నప్పుడు ఆ హెబ్రీ తల్లులలో ప్రతి ఒక్కరూ, వారి ప్రసవ వేదనలలో, ఉదాహరణకు రూబేను అని పిలిచినప్పుడు, సరిగ్గా ఆ తల్లి చెప్పినట్లు - ఆ పేరు అతన్ని పాలస్తీనా దేశములో తన స్థానములో అతన్ని స్థాపించినది నేను అన్ని విషయములను ఇక్కడ వ్రాసుకొని యుండలేదు, కాని రూబేను అంటే “గొర్రెల కాపరి,” గాదు అంటే “పశువుల కాపరి,” ఎఫ్రాయిము అనగా “రైతు.”
ఇప్పుడు, యెహోషువ, క్రొత్త నాయకుడు, ఆత్మ వివేచను బట్టి దేశమును సరిగా విభజించి, ఎవరి స్థానములలో వారిని ఉంచెను.
50
ఈ రోజు యెహోషువ మనకు అవసరమైయున్నాడు అనుటకు ఒక అందమైన మాదిరిగా ఉన్నది. మనము వాగ్దాన భూమిలోకి ప్రవేశించాక, సమస్య ఏమిటంటే, ఎఫ్రాయిమువలె గాదు గొర్రెలు కాయవలెనని, ఒకడు మరొకనిలా ఇంకొక పని చేయాలని ప్రతిఒక్కరూ ఒకేలా ఉండాలని కోరుకుంటున్నారు. ఒక మనిషికి దేవుడు స్వస్థతా వరము ఇస్తే, ప్రతి ఒక్కరూ అదే వరమును కోరుకుంటారు. ఎఫ్రాయము మరియు గాదు, మరియు అందరూ కలిసి ఒకటే కోరుకుంటున్నారు. కాని మనము మన స్థానాలు బట్టి విభాగించబడ్డాము. అందరికీ జ్ఞానమనే వరము ఉండదు. అందరూ ప్రవచించరు. అందరూ భాషలలో మాట్లాడరు. అందరూ ప్రవక్తలు కారు. “కాని దేవుడు సంఘములలో కొందరిని ప్రవచించుటకు, కొందరిని భాషలలో మాట్లాడుటకు నియమించెను.” మనమందరినీ భాషలలో మాట్లాడాలని కోరుకుంటాము. ఇది ఎంత గందరగోళమో గమనించండి? అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళలేరు. ఎందుకు, కొద్ది సమయం తర్వాత ఫిలిషీయులు వచ్చి ఆక్రమిస్తారు. నిశ్చయముగా. కాని ఆత్మను బట్టి ప్రతి ఒక్కరూ నాయకులచే వేరు చేయబడి సంఘములో ఆయా స్థానాల్లో ఉంచబడతారు. అప్పుడు ఆ స్థానాల్లో ఉండి, భూమి మీద వెలుగొందుతారు. దేవా, మాకొక్క యెహోషువాను ఇవ్వండి. దేవా, వాక్యమునందలి ఆజ్ఞను పట్టుకొనే యెహోషువాను తిరిగి మాకివ్వండి.
ఆ విధానములో దేవుడు ఆయనకు ఉపదేశించెను, “ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకుండునట్లు, జాగ్రత్తపడి దివారాత్రము దాని ధ్యానించుము,” ఆయన ముందర ఈ ఆజ్ఞ ఉండెను.
51
ఆ గొప్ప నాయకుడై యెహోషువ, సంఘములో ఎప్పుడైనా, ఏదైనా పొరపాటు జరిగితే తప్ప ఏ యుద్ధములోనూ ఓడిపోలేదు. అప్పుడు ఆకాను బంగారు కమ్మిని తీసుకొన్నప్పుడు, అది యెహోషువ యొక్క పొరపాటు కాదు. అది విశ్వాస సంబంధమైనది. అతడు బబులోను షీనారు వస్త్రమును, బంగారు కమ్మిని గుడారములో నుండి దొంగిలించెను. మరియు ఆయన దానిని దొంగిలించినప్పుడు, అది యుద్ధమంతటినీ ఆటంకపరిచింది.
ఒక సహోదరుడు బాధపడినయెడల, అందరు సహోదరులునూ బాధపడుదురు. దేవుడు ఈ రోజులలో వచ్చినప్పుడు, ఆయన ముడత, మచ్చ, కళంకము లేని సంఘము కొరకు వచ్చును. ఆత్మచేత నింపబడిన సంఘము యొద్దకు ఆయన వచ్చుచున్నాడు, వారు ఏకముగా కూడి నడుచులాగున, వారి హృదయములను దేవుని దైవిక ప్రేమ ఏకముగా ఐక్యపరుచుచున్నది.
52
ఈ గందరగోళంలో యుద్ధము గెలవాల్సి యున్నది. ఎవరు సరియైన వారు, మెథడిస్టా? బాప్టిస్టా? పెంతెకోస్తువారా? ప్రెస్బిటేరియనువారా? నాజరీనువారా?, లేదా ఫిలిగ్రీమ్-హోలీనెస్ వారా? బౌద్ద మతము ఇంకా ఇతర మతాలు కాక, మొత్తం 969 సంఘ శాఖలున్నవి. మనమెక్కడ ఉన్నాము? ఎక్కడో పొరపాటు జరిగింది. గుడారములో ఎక్కడో ఆ బంగారు కమ్మి ఉన్నది. యెహోషువ వచ్చి చీట్లు వేస్తాడు.
ఏలియా కర్మేలు పర్వతము పై మాట్లాడినట్లు, ఈ ఉదయం నన్నూ మాట్లాడ నీయుడి, “దేవుడు దేవుడే అయినట్లైతే, ఆయనే దేవుడని సమాధానమీయనీయండి.” ఒకవేళ బాప్టిస్టు శాఖయే సరియైతే, యేసుక్రీస్తు చేసిన సూచక క్రియలు చేయగలరేమో చూద్దాము. ఒకవేళ నాజరీనులు సరియైన వారైనచో, ఆయన చేసినవి ఉత్పత్తి చేస్తారు. పెంతెకోస్తు వారు నిజమైతే, ఆయన చేసిన వాటిని చేయాలి. అప్పుడు మనము తెలుసుకుంటాము.
53
యెహోషువ శిష్యులు ఆయనతో, “దేవుడు మోషేతో చేసినట్లుగా, నీతో పని చేసినంత కాలము నిన్ను వెంబడిస్తాము,” అని చెప్పిరి.
మరియు యేసుక్రీస్తు శిష్యులు కూడా అలాగే చెప్పవలసియున్నది, “యేసుక్రీస్తు యొక్క సూచక క్రియలు మీతో పనియేయుట మేము చూచినప్పుడు, అప్పుడు మీతో కూడా పనిచేయుదుము.” మేము దానిని చేయుదుము. అలాగే మనమూ చేయాలి, సంఘము కూడా అలానే చెప్పాలి. అది క్రైస్తవ సంఘ వైఖరియై ఉన్నది. అప్పుడు మీరు వరములు, సూచక క్రియలు, వాటిని చేయు వారిని క్రమ పద్ధతిలో ఉంచవచ్చు. ఒకడు స్వస్థతా వరము కలిగిన వాడైనట్లయితే, భాషలు మాట్లాడువానితో వానికేమి పాలులేదు. భాషలు మాట్లాడు వరముగల వానికి, ప్రవచనావరము గల వానితో పాలులేదు. చూశారా, ఈ పరిచర్యలో వివిధ దశలున్నవి.
54
దేవుడు నాకొక ఆజ్ఞను ఇచ్చినప్పుడు, ఒక ఉద్దేశ్యంతో కొనసాగింపునకు అన్ని విషయములలో దానిపై ఆధారపడి యున్నాను. “వరములు మరియు పిలుపులు మారుమనస్సు లేకుండా ఇవ్వబడును.” ఒక వ్యక్తి తనకు తాను ఏమీ చేసికొనలేడు. నీవేమైయున్నావో అది, దేవుని కృపయై ఉన్నావు. మనకు మనముగా చేసుకునే మార్గము లేనేలేదు. యేసు చెప్పెను, “మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?” చింతించుట వలన ఎవరు తన్ను తాను పెద్దవాని గాను, చిన్న వాని గాను చేసికొనగలడు? మీరేమి చేయలేరు.
దేవుడు ఆజ్ఞను ఇచ్చినప్పుడు, నేనిలా ప్రశ్నించి, ఇలా అన్నాను, “నేను తగినవాడను కాను, లేదా చాలినవాడను కాను. నాకు చదువు లేదు. నేను ఈ పని చేయజాలను.”
ఆయన అగ్నిస్తంభము రూపములో ఆ నది వద్ద ప్రత్యక్షమై మాటలాడినప్పుడు, అక్కడున్న వారిలో అనేకులు ఈ ఉదయకాలమున ఇంకనూ సజీవులుగా ఉన్నారు. “క్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందుగా బాప్తిస్మమిచ్చు యోహాను పంపబడినట్లు, ఆయన యొక్క రెండవ రాకడకు ముందుగా నీ వర్తమానము ఉండును,” అని చెప్పెను.
55
అది ఏమి జరిగినదో చూడండి,. ఆ వెలుగు అక్కడ వ్రేలాడుతున్నది. ఈ వెలుగును గూర్చి పేపరులో ముద్రించబడి, అమెరికా దేశమంతటా పయనించి, అనేక దేశాలలోనికి వెళ్ళినది.
డాక్టర్. లీ వెయిల్, అప్పుడు కెనడా దేశములో ఉండిరి. కెనడా పత్రికలో దాన్ని గూర్చి ప్రచురించబడినప్పుడు, అది ఆయన గుర్తుచేసికున్నారని నేను నమ్ముచున్నాను. లీ వెయిల్ గారు, కెనడా పత్రికలో అలాగు జరగలేదా? “స్థానిక సంఘ సేవకుడు, బాప్తిస్మమిచ్చుచున్నప్పుడు ఆయన తలపై ఒక రహస్య కాంతి కనబడింది.”
ప్రజలు దాన్ని చూసి, “ఇది మానసికమైనది,” అన్నారు.
కాని ఒక రోజున దేవుడు అవిశ్వాసుల నోళ్ళు మూయించాలనుకున్నాడు, ఎందుకనగా అది వాక్యముతో నిలిచినది. ఇశ్రాయేలు వారిని నడిపించిన అదే అగ్నిస్తంభము, నడిపించునట్లు నేడునూ ఆత్మ సంబంధమైన సంఘమును నడిపించుచున్నది, ఇప్పుడూ అదే విధమైన నడిపింపుతో ఆయన తిరిగి ప్రత్యక్షమయ్యాడు. వారు దాని చిత్రాలను విమర్శకులు, పరిశీలించు వారి ముందు పెట్టారు. అలాగే ఇప్పుడు ఇక్కడ వ్రేలాడుచున్నది. అద్భుతమైన సత్యము, అదే కార్యములు చేస్తుంది, భౌతికంగా అక్కడ వారిని నడిపించినట్లు, వాక్యముతో నిలిచియున్నట్లు ఈ రోజు ప్రజలను ఆత్మీయముగా నడిపిస్తుంది.
ఇప్పుడు మీరు చెప్పిరి, “ఆజ్ఞ ఏమైయుండెను?” ఇప్పుడు జ్ఞాపకముంచుకొనండి, దేవుడు ఎన్నడు తన ఆజ్ఞ నుండి తొలగిపోడు.
56
దానిని మీ కొరకు ఈ మార్గంలో, గీయవలెనని అనుకుంటున్నాను, దానిని ఇక్కడ ఇలాగు తీసుకుందాము. ఇక్కడ ఒక చిన్న సూచన ఉన్నది, అదియే ఆజ్ఞ. ఇక్కడ ఒక మూలన, ఒక చిన్న సిలువ గుర్తు, మరియొక మూలన ఒక బైబిల్, కాని ఇక్కడ రెండింటి మధ్య వ్రాయబడినది. అదియే ఆజ్ఞ.
నేను దేవుని ఎదుట, ఎన్నిక చేయబడిన దూతల ఎదుట, యేసుక్రీస్తు సమక్షములో, నేను ఆజ్ఞాపించుచున్నాను, “రోగుల కొరకు ప్రార్ధించుము.” ప్రశ్న ఏమనగా, “దానిని చేయుటకు శక్తి చాలదు?”
“దీని నిమిత్తమే నీవు జన్మించితివి, నీ ప్రత్యేకమయిన జననానికి, జీవితానికి ముఖ్య విశేషమేమనగా, అది రోగుల కొరకు ప్రార్ధించుటయైయున్నది. ప్రజలు నిన్ను నమ్మునట్లుగా నీవు చేయగలిగినట్లయితే, మరియు ప్రార్థించునప్పుడు నీవు యదార్థముగా ఉండినట్లయితే, క్యాన్సర్ తో సహ నీ ప్రార్థన యెదుట ఏదీ నిలిచియుండలేదు. ఇది ఎందరు ప్రపంచమంతటా ఎన్ని సంవత్సరములుగా, ఎన్నిసార్లు చదివియున్నారు?
57
అప్పుడు నేను అన్నాను, “నేను దీనిని చేయలేను, ఎందుకనగా నేను చాలినవాడను కాను. వారు నన్ను నమ్మరు — నేను పేదవాడిని, నాకు విద్యలేదు.” నేను ఆ విధంగా ప్రశ్నించియుంటిని.
ఆయన చెప్పెను, “తన కివ్వబడిన ఆజ్ఞను, రుజువు చేయుటకు గాను మోషేకు రెండు సూచనలు ఇవ్వబడినవి, [నీవు చేస్తావని కాదు] ... నీకునూ రెండు సూచనలు ఇవ్వబడినవి. అందులో ఒకటి నీ చేతి ద్వారాను, మరియొకటి వారి హృదయ రహస్యాలను, మరియు వారి మనస్సులోని ఆలోచనలు తెలుసుకొనుట ద్వారాను. మరియు ఈ రెండు సూచనల ద్వారా వారు నిన్ను నమ్మెదరు.” ఇప్పుడు గుర్తుంచుకొనండి. వినండి. వీటి ద్వారా నీవు ఓడిపోవు. ఆ సూచన, ఆజ్ఞ కాదు! ఆ సూచన కేవలము ఆజ్ఞను సూచించును.
నీవు ఆ రోడ్డు మీదకు వెళ్ళి మరియు ఒక ఈ సూచన బోర్డును చూస్తావు, “జెఫర్సన్-విల్ ఇంకా ఐదు మైళ్ళు ఉన్నది.” అది జెఫర్సన్-విల్ కాదు. నీవు సరియైన మార్గములో ఉన్నావని తెలియజేసే సూచన అది.
58
మోషే అక్కడకు దిగి వెళ్ళినప్పుడు, ఆయన కర్రతో మరియు చేతితో చేసే సూచనలు కలిగియున్నాడు. మోషేతో ఉన్న ఈ సూచన, అది ఆజ్ఞ ఎంత మాత్రమూ కాదు. ఇశ్రాయేలీయులు - “ఐగుప్తీయులారా, మిగిలిన ఇశ్రాయేలీయులారా ఇక్కడకి రండి, అందరూ చూడండి. కర్రతో ఒక తమాషా చేయగల ఒక మనిషిని సంపాదించాము. ఏది ఏమైనా నీవు చూడు. మేము సంపాదించిన మనిషి కర్రను తీసికొని దానిలో నుండి పామును రప్పించగలడని, అని చెప్పినట్లయితే ఎలా ఉంటుంది?” అది కేవలం సూచన పలక మాత్రమే. అది ఆజ్ఞ కాదు. వారు సూచన పలక కొరకు ఎదురు చూడటము లేదు. (దేవా, మాకు సహాయము చేయుము.) వారు తమ విడుదల కొరకు ఎదురుచూస్తున్నారు!
మరియు ఈ పేద, రోగ, అవిటి ప్రపంచము సూచనల వైపు చూస్తూ, విడుదల కొరకు ఎదురు చూచుచున్నది. దేవా, కరుణించుము. సూచన అనేది అది ఏదో కాదు గానీ, కేవలము సూచన ఆజ్ఞను నిరూపించునట్టిది. అక్కడ నూతన పరిచర్య ఉన్నది. ఇది కేవలము నాకు బయలుపరచబడింది. రోగుల కొరకు ప్రార్ధించుము, ప్రజలు నిన్ను నమ్మునట్లు చేయుము. దేవుడు దానిని ఎన్నటికీ విడువడు. నేను ఘోరముగా విఫలమైనప్పటికినీ, ఏది ఏమి జరిగినప్పటికినీ, అది ఆయన ఆజ్ఞయై ఉన్నది. నేను ఈ సూచనలను వదిలి ఎన్నటికీ ముందుకు వెళ్ళలేదు. అది దేవుని చిత్తము కాదు, ఎలాగైననూ, దేవుడు దానిని దీవించాడు. కాని నేను ఈ కొండను విడుచుటకు సిద్దముగా ఉన్నాను. నాకు కావలసినదల్లా యొర్దానును దాటి, ఆజ్ఞను మోసుకొని వెళ్ళుటయే. “ప్రజలు నిన్ను నమ్మేలా చేయి.”
నేను చెప్పాను, “వారు నన్ను నమ్మరు.”
“అప్పుడు రెండు సూచనలు చేర్చబడినవి.”
59
ఇప్పుడు ఉన్న సమస్య ఏమనగా, మనము ఈ సూచనను చూస్తూ ఉన్నాము.
“ఓ, బ్రెన్హాం సహోదరుడా, ఆయనపై నీ చేయి ఉంచు.”
“ఓ, ఏమి జరుగుతుందో నీవు చూడవలెను. ఆయనపై అభిషేకము ఉన్నప్పుడు, ఆయన ముందు నిలబడినట్లైతే, ఆయన నీ హృదయంలో ఏమున్నదో అంతా చెబుతాడు.” అది సత్యము.
ఒక రోజున ఇక్కడ ఉన్న హాస్పిటల్ లోనికి వెళ్ళాను. వైద్యులు ఆ స్త్రీ యొక్క సమస్య ఏమిటో కనుగొనలేకపోయారు. ఆ వైద్యులు ఆ గదిని విడిచి వెళ్ళినప్పుడు, ఆమె నడిచి వెనకకు వెళ్ళి, ఆమె పడక దగ్గర నిలబడి, నాతో “ఏమిటి, నాలో ఏ సమస్య ఉన్నదో వారు కనుగొనలేకపోవుచున్నారు, బ్రెన్హాం సహోదరుడా, నీవు నాకు చెప్పగలవు!”
నేను చెప్పాను, “నీవు నన్ను నమ్మినట్లైతే, నేను చెప్పగలను.”
ఆమె, “నేను నమ్ముచున్నాను,” అని చెప్పింది.
మరియు పరిశుద్ధాత్మ, “నీ సమస్య ఖచ్చితముగా ఫలానా, ఫలానా అని కావాలంటే పరీక్షించుకో,” అని చెప్పింది. ఆమె జునీ కాష్ సంఘమునకు చెందినది.
60
మరియొక స్త్రీ, “నా వెన్నెముకలోని సమస్య, దాని లోపాన్ని వారు కనిపెట్టలేక పోయారు.”
నేనన్నాను, “నేను ఆయన ప్రవక్తనని నీవు నమ్ముచున్నావా?”
ఆమె చెప్పింది, “నేను నమ్ముచున్నాను.”
నేను చెప్పాను, “చాలా కాలం క్రితం, జూన్ నెల ప్రారంభములో ఇది జరిగింది... వెన్నెముక స్థానం తప్పినట్లుగా భావించి, వారు ఆపరేషన్ చేయడానికి ప్రయత్నించారు, కాని అది నరానికి సంబంధించిన సమస్య. మాక్ స్పాడిన్ మార్కెట్లో నీవు పనిచేసేటప్పుడు, నీవు బరువు ఎత్తే సమయములో అలా జరిగింది.
ఆమె చెప్పింది, “అది జరిగినట్టు నాకు గుర్తు, కాని ఇప్పుడు మరలా నాకు గుర్తొచ్చింది.”
అది ఆమెను స్వస్థపరచలేదు. అది కేవలము ఆజ్ఞను సూచిస్తుంది. సూచన పలక మీద ఆధారపడటము మానివేయి, మనము పట్టణానికి వెళదాము. ఈ కొండ నుండి దాటి వెళ్ళి; పట్టణానికి వెళదాము. యొర్దాను దాటుదాము!
61
నేను పొరపాటు చేసియున్నాను. తప్పు చేశాను. అందువలనే నేను ఇలాంటి ప్రసంగములపై ఆధారపడి ఉన్నాను. ఎందుకనగా, ఆయన చెప్పెను, “మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందును,” అని పైనుండి దిగివచ్చిన ఆ చేయి అదే లేఖనాలను చూయించింది. ఈ ఆజ్ఞ ఏమిటా అని చాలా కాలము నేను ఆలోచించాను, ఎందుకనగా ఆ ఆజ్ఞ ఏమైయున్నదో నాకు తెలియలేదు. అంతకన్నా ఏదో సహజాతీతమైన దాని కొరకు ఎదురు చూచాను. దేవుడు ఆయన ఆజ్ఞ నుండి దూరము కాజాలడు. దేవుడే ఆ ఆజ్ఞను ఇచ్చాడు, అది అలాగే ఉండవలెను.
కాని పెంతెకోస్తు వారందరికీ సూచనలంటేనే ఇష్టము, వారు చూడాలని కోరుకుంటారు. బైబిల్ చెప్పెను, “వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియనడుగుచున్నారు.” కాని నాకివ్వబడిన ఆజ్ఞ ఏమి చెప్తుందంటే, “రోగుల కొరకు ప్రార్ధించు.” వేలవేల కొలది మందికి నేను ప్రార్ధించలేకపోయాను, ఎందుకనగా వారు సూచనలను కోరుచున్నారు. అలానే వారు కోరుకున్నారు.
62
ఒకానొక రోజు నేను పరిచర్య చేస్తూ, గదిలోనికి వచ్చాను. ఒక వ్యక్తి వేదిక మీదకు వచ్చి, “సహోదరుడా బ్రెన్హాం, ఒక్క నిమిషం ఆగండి. నా పరిస్థితి విచిత్రమైనది. నా సమస్యయేదో తెలుసుకోవాలని అనుకుంటున్నాను.”
నేను, “వైద్యులు నిన్ను పరీక్షించగలరు,” అని చెప్పాను.
“ఓ, నాకు అలా వద్దు, నా పరిస్థితి విచిత్రమైనది, నా సమస్యను నేను ఇప్పుడే తెలుసుకోవాలి.”
నేను, “సహోదరుడా, ఆ విధముగా చేయడం నాకు ఇష్టము లేదు. ముందుకు సాగి, మరియు మొదటి సంగతి నీకు తెలుసా, పరిశుద్ధాత్మ....” అని అన్నాను.
“అది సరియైనది! దేవునికి స్తోత్రము!” అని చెప్పాడు.
“మిగిలిన మీరందరూ, ఇప్పుడు రండి, నేను మీ కొరకు ప్రార్థిస్తాను,” అని అన్నాను.
నేనలా చెప్పినప్పుడు, మరి యొక వ్యక్తి ఏమన్నాడో తెలుసా? “ఆయన వలె నా సమస్య ఇంకా ముఖ్యమైనది. అలాంటి ఆరు లేక ఏడు సమస్యలు చూసి ముగించాను; అవి నిజానికి నన్ను చంపేలా ఉంది.
నాకెందుకిలా జరుగుతుందని, నేనెప్పుడూ ఆశ్చర్యపడుతుంటాను? నేనేదైనా పొరపాటు చేయుటవలనా. సూచన కేవలము ఆజ్ఞను సూచిస్తుంది, అది ఆజ్ఞ కాదు. ఈ సూచన ప్రపంచమంతటా గోడలకు వ్రేలాడుచున్నది. మరియు అన్ని భాషలు మాట్లాడే వారికి, ఆఫ్రికా, ఇండియా, ఆసియా, యూరప్, మరియు ప్రపంచమంతటికీ, వేలవేల కొలది, లక్షలాది ప్రజలకు ఈ సూచనల గురించి తెలుసు. నేను ఈ పర్వతాన్ని వదిలి వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాను. నేను ఈ యొర్దాను దాటవలెనని కోరుచున్నాను. ఇంకా చాలా ముందుకు, నా విశ్వాసము బాగా వృద్ధి అయ్యేలా, ప్రార్థించినప్పుడు వారు స్వస్థపడేలా, అలాంటి ప్రదేశానికి నేను వెళతాను.
63
గమనించండి. దేవుడు దానిని మరల ఇప్పుడు, ప్రజల యొక్క ఒడిలో ఉంచుతున్నాడు: “నీవు రోగుల కొరకు ప్రార్థన చేయుటకు జన్మించియున్నావు. వారిని నీవు నమ్మునట్లు చేసినయెడల...”
నేను చెప్పాను, “వారు నమ్మరు.”
ఆయన, “నేను నీకు రెండు సూచనలు ఇచ్చుచున్నాను, మరియు వాటిని బట్టి నిన్ను నమ్మెదరు.” గమనించు, ఈ సూచనలు, తర్వాత ఆజ్ఞకు బదులుగా సూచన పలక నిమిత్తం వారు వెంబడించెదరు. “వారు, నీవు రోగుల కొరకు ప్రార్థించుటకు పంపబడితివని నమ్ముదురు.”
ప్రజలు ప్రార్థించబడుటకు వరుసలో వచ్చినప్పుడు, అది ఖచ్చితమైన గమ్యమును తాకిన వెంటనే... వారు ఆ గమ్యమును తాకునంత వరకు నేను చేయగలిగినది ఏమియు లేదు. మరియు వారు చేసినప్పుడు, అప్పుడు నేను చెప్పుదును, “నేను నీకు ఇచ్చెదను.....”
64
హట్టీ రైట్, ఆమె ఈ ఉదయకాలము ఇక్కడే కూర్చొనియుండుట నేను గమనించాను. మేము ఆ ఉడుతలను చూచినప్పుడు, నమ్మిన మొదటి స్త్రీ ఆమె. మరియు దానిని గూర్చిన ఆజ్ఞను ఎరిగియున్నది, మరియు దేవుడు ఏడు సార్లు నేరుగా వాటిని సృష్టించెను. నేనన్నాను, “ఆయన ఆజ్ఞను నెరవేర్చుటకు, అబ్రాహాముకు పొట్టేలును సృష్టించిన అదే దేవుడు, నాకు కావాలని కోరుకున్న, ఉడుతను సృష్టించిన దేవుడు ఆయనే.”
ఆ హట్టీ రైట్, బిల్డింగ్ వెనక కూర్చొని ఉంది. ఆమె ఈ ప్రపంచానికి సంబంధించిన ఎన్నో విషయాలన్నిటి గూర్చి, ఆలోచిస్తూ నమ్మకాన్ని కలిగియున్నది. “సహోదరుడా బ్రెన్హాం, అది సత్యము తప్ప మరొకటి కాదు!” అని ఆమె నాతో అన్నది. ఆమె ఏదో ఊరికే అనలేదు గాని, దేవుడు ఆమె హృదయముతో మాట్లాడెను.
నేనన్నాను, “హట్టి, నీకేమి కావాలో అడుగు. నేను నీకు ఇస్తాను.”
ఆమె అన్నది, “నేనేమి అడగాలి?”
నేను, “నీ ముసలివారైన తల్లిదండ్రులు ఇద్దరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. నీకు ఒక అవిటి సహోదరి ఉంది.” ఆమె ఇంకా ఆ కుర్చీలోనే కూర్చొని ఉన్నది. “నీవు ఆమె కొరకు అడగవచ్చు. నీ తల్లిదండ్రుల గూర్చి అడగవచ్చు. నీవు చాలా పేదరాలివి. నీ దగ్గర డబ్బు లేవు. నీకేమి కావాలో అడుగు.”
ఆమె అన్నది, “బాగుంది, కాని నేనేమి అడగాలో నాకు తెలియడము లేదు.” “నాకు కేవలము ఏమి తెలియదు.” ఆమె “నాకున్న గొప్ప ఆశ ఏమిటంటే, నా ఇద్దరు కుమారులు రక్షణ పొందాలని,” అన్నది.
నేనన్నాను, “నీ ఇరువురు కుమారులకు నేను, యేసుక్రీస్తు యొక్క నామము ఇచ్చుచున్నాను.” మరియు వారిద్దరూ మార్చబడి, ప్రభువైన యేసును ప్రేమించిరి. ఆయన నామములో బాప్తిస్మము పొంది, తమ పూర్ణహృదయముతో అనుదినము దేవుని సేవించుచుండిరి.
65
ఎడ్ డాల్టన్, ఇక్కడే ఎక్కడో ఒక చోట కూర్చొనియున్నారు. ఆయన కూడా తన కుమారులను గూర్చి అలాంటి ఆశనే కలిగి ఉన్నాడు.
నేను చూడగా, సుమారుగా ఎనిమిది లేక తొమ్మిది వందల మంది, బహుశా వెయ్యి మంది ప్రజలు ఒక కూటములో వేదిక నుండి వెళ్ళారు, ఒకరి తరువాత ఒకరుగా మొదటిగా నీవు తెలిసికోవలసిది, ఈ కూడికలో, నేను వెళ్ళి ప్రార్థించెదను, తప్పకుండా వారు బాగుపడెదరు. లుకేమియాతో బాధపడుతున్న ఒక చిన్న బాలిక ఇక్కడ ఉన్నది, ఆమె సమస్య ఏమిటో నాకు ఖచ్చితంగా తెలుసు. ఎవ్వరూ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. కాని ఆ బాలిక అక్కడికి వచ్చినప్పుడు, “చిన్ని తల్లీ, నీ హృదయ కోరికను నీకిచ్చెదను. నీవు లుకేమియాతో బాధపడుచున్నావు. నేను నీకు ప్రభువైన యేసు నామములో స్వస్థతను అనుగ్రహిస్తున్నాను,” అని నేనన్నాను. నేను ప్రేక్షకులవైపు తిరిగి ఇలా అన్నాను, “నేను మీకు సవాలు విసురుతున్నాను, వైద్యుల వద్దకు తీసుకెళ్ళి ఆ బాలికను పరీక్షించుకొనుడి మరియు లుకేమియాకి సంబంధించిన ఒక్క లక్షణమైనా ఉందేమో పరిశీలించుకొనుడి.” ఎందుకని? రాహాబను వేశ్యవలే, ఆ బాలిక కూడా విన్నది. ఆమె తన పూర్ణహృదయముతో విశ్వసించెను. దేవుడు అప్పుడు తన పరిశుద్ధాత్మ ద్వారా, “అది ఆమెయే,” అని తెలియజేసెను. వందలకొలది ప్రజలు ఈ వేదికను దాటి వెళ్ళారు, కాని వారెవ్వరూ ఏ మేలు పొందుకోలేదు. నేను కేవలము వారి కొరకు ప్రార్ధించాను.
66
ప్రజల విషయములో ఆ ఆజ్ఞ ఇవ్వబడెను, “నీవు నమ్మినట్లైతే,” అనేది. అదే కావలసి అసలైనది. సూచన ఇవ్వబడినది. ఇప్పుడు నీవు నమ్మినట్లైన, దేవుడు నన్ను రోగుల కొరకు ప్రార్ధించుటకు, ఈ లోకమునకు పంపియున్నాడని మీరు నమ్మినట్లైతే, మీ విశ్వాసమును బట్టి మీ కొరకు నేను ప్రార్థించెదను. అలా జరుగుటకు అదియే మార్గము.
దేవుడు తన ఆజ్ఞ నుండి ఎన్నటికీ దూరం కాజాలడు. గత 14 సంవత్సరాల నుండి, వేలకొలది మందిని వివేచనా జ్ఞానముతో, నేను అనుకొనుచున్నాను, పది వేలకొలది సార్లు, లక్షల కేసులు, ప్రపంచము మొత్తము, తిరిగి చూశాను. నేనొక్క విషయం మిమ్ములను అడుగుచున్నాను, ఎప్పుడైనా ఒక్కరి విషయములోనైనా నేను తప్పిపోయానా? లేదండి. సూచనలే విఫలం కాకపోతే, ఆజ్ఞ ఎంత మాత్రమూ విఫలము కాదు. సూచన అనేది చిన్నదే అయినా, సూచన పట్టణమును సూచస్తున్నట్లయితే, ఆ పట్టనము అక్కడ ఉందని చెప్పుటలో ఆ సూచన విఫలము కానట్లయితే, నీవు అక్కడికి వచ్చినప్పుడు - ఆ పట్టణము ఎంతో నిశ్చయముగా ఉంటుంది! అక్కడ ఆజ్ఞ ఉన్నది.
67
ఇప్పుడు, నా పరిచర్య మారుచున్నది. అది ఇప్పటికే మారియున్నది. అక్కడ ఇంకనూ వివేచనా జ్ఞానమున్నది. నాకింకనూ దేవుడు తెలియజేయునది, వారికి తెలియజేయాలని కోరుకుంటున్నారు. కాని అప్పటి వరకు, ఆయన ఆజ్ఞాపించినట్లు నేను రోగులపై చేతులుంచి, ప్రార్ధించెదను. నేను దీని కొరకు చాలా కాలము నుండి ఎదురు చూస్తున్నాను, కాని ఇప్పుడు మనము వాగ్దాన దేశమును స్వతంత్రించుటకు, సిద్దముగా ఉన్నామని నేను నమ్ముచున్నాను. మరియు అక్కడ కొంత మంది రాహాబులు, ఇంకా కొంత మంది విశ్వాసులు తమ పూర్ణహృదయముతో నమ్మి వేచియున్నారు.
మీరు అర్థము చేసుకొనుచున్నారా? అర్థము చేసుకున్నవారు ఒకసారి మీ చేతులను పైకెత్తండి. అది ఖచ్చితముగా లేఖనానుసారమైనదని ఎందరు విశ్వసిస్తునారు? ఇది ఖచ్చితముగా ఆయనేమి చెప్పెనో అదే. ఇది ఆజ్ఞ; అవన్నీ ఆజ్ఞను సూచించుచున్న సూచనలు.
68
ఈ యొక్క వేదికపై నుండి నేను మాట్లాడిన ఏ ఒక్కసారియైనా, ఒక్క మాటయైనా విఫలమైనదేమో చెప్పమని మీకు నేను సవాలు విసురుతున్నాను. ఈ టేపులు ప్రపంచమంతాను, మరి ఎక్కడికి వెళ్ళిననూ ఎవరైనా చెప్పండి, లేదా ఏ దర్శనమైనా, మరి ఏదైననూ అన్ని ఖచ్చితంగా ఆయన చెప్పినవే, చెప్పాను. ప్రతి యొక్క వ్యక్తి గురించి, వారి సమస్యల గురించి, వారు ఎక్కడనుండి వచ్చారో దాని గూర్చి, వారు చేసిన కార్యముల గురించి, అన్నిటిని గూర్చి, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచ్చున్నాడు” అని చెప్పినప్పుడు, ఆ మార్గములోనే స్వస్థత కలిగింది. ఒకటి మీకు తెలిస్తే, దాని గూర్చి నాకు తెలియ చేయండి. ఆ టేపు వద్దకు వెళ్ళి వెతుకుతాను. ఈ 12 సంవత్సరాల లేదా 14 సంవత్సరాల కాలములో అదెన్నడూ విఫలము కాలేదు, ఎందుకనగా ఆ సూచనలు దేవుని నుండి ఇవ్వబడినవి. కావున విఫలము కాదు.
మరియు దేవుడు సూచన ఇవ్వక ముందే, ఆయన ఆజ్ఞను ఇచ్చెను. ఈ ఆజ్ఞను సూచించుటకు ముందుగానే, సూచన ముందుండాలి. ఒక సూచనా స్తంభము ఉంచబడుటకు ముందుగా, ఆ సూచన ఏ పట్టణమును సూచించుటకు పెట్టబడతుందో ఆ పట్టణము అక్కడ ఉండి ఉండాలి. నీ పూర్ణహృదయముతో దానిని విశ్వసించినయెడల, నీవు దానిని పొందుదువు. “విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును.”
69
ఇప్పుడు, నాకు నేనుగా, ఎక్కువగా సూచనలపై ఆధారపడి ఉన్నాను. “ప్రభువా, నేను ఏ విధంగా, ఏమి చేయాలో నాకు తెలియదు గనుక నేను వారికి ప్రార్థన చేయక ముందు దానిని నాకు చూపించు.” ఇది ఎంత క్రూరమైనది. నన్ను క్షమించమని ఈ సంఘమును అడుగుచున్నాను. ఈ టేపు వినుచున్నవారలారా, ప్రపంచంలోని సంఘస్తులారా నన్ను క్షమించండి. నేను తప్పు చేసియున్నాను. నేను అనుకున్న సరియైన విధములో, దానిని తీసుకొని వెళ్ళలేకపోయాను. ఆయన ఆజ్ఞ మొదటి నుండి అలాగు లేదు. అది ఆజ్ఞను సూచించు, సూచన అయి ఉన్నది. ప్రతిచోట రోగుల కొరకు ప్రార్థించవలసియున్నది.
ఇప్పుడు, చూడండి, ఇది జరగాలని, దేవుడు ఆజ్ఞాపించాడని మీరు నమ్మినట్లైతే, అది తిరిగి మరలా జనుల ఒడిలో ఉన్నది. అది ఇక్కడ దేవుని వాక్యములో ఉన్నది, ఆ ఆజ్ఞ, అది ఖచ్చితంగా వాక్యముతో ఉన్నది. నేను చెప్పు...
70
ఇక్కడ నా వ్రేలితో, ఒక విల్లును, ఒక వర్షపు ధనుస్సును గీయుచున్నాను. అది దేవుడు ప్రజలతో చేసుకొనిన నిబంధనయై ఉన్నది. నీటితో ఇంకెప్పుడూ మరలా మిమ్ములను నాశనము చేయనని ఆయన ప్రజలతో నిబంధన చేసెను. ఆయన అపొస్తులు ప్రతి ఒక్కరితోనూ నిబంధన చేసియున్నాడు. ఆయన ప్రవక్తతో నిబంధన చేసియున్నాడు.
చాలా కాలం క్రితం, ఒక 15 లేదా 14, 15 సంవత్సరాల క్రితం బహుశా మే 7, 1937న, దేవుడు నాతో ఒక నిబంధనను చేసియున్నాడు, “రోగుల కొరకు ప్రార్ధించుటకు నీవు ఈ లోకములో జన్మించితివి, నీ యందు విశ్వాసముంచునట్లు నీవు వారిని చేయగలిగినట్లయితే.” నా హృదయము ఎల్లప్పుడూ ప్రజల కొరకు తపించుచున్నది. “నీ యందు విశ్వాసముంచునట్లు ఈ ప్రజలను చేసినయెడల, యదార్థతతో నీవు ప్రార్థించినప్పుడు, నీ ప్రార్థన ముందు ఏదియూ నిలబడజాలదు.”
నేను ఈ విధముగా సిగ్గుతో మరియు యదార్థతతో తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎవరైనా విశ్వాసమును కలిగి ఉండవలిసి వస్తే, అది ముందుగా నాకే. ఆయన నాకు చేసినది గనుక మీరు చూసినట్లతే, ఎక్కడో మురికి గుంటలో పడియున్న నా చెత్త జీవితాన్ని ఆయన ఏమి చేసియున్నాడు; చూడండి, నేను నిలవబడి ఏదైనా చెప్పినప్పుడు, దేవుడు అక్కడకు వచ్చి దానిని సత్యమని రుజువుపరచును.
71
చాలా సంవత్సరాల క్రితం, నేను మీకు చెప్పాను, ఒక పొద నుండి దేవదూత నా యొద్దకు వచ్చెను. అప్పుడు నాకు 3 సంవత్సరాలు మాత్రమే, ఒక వెలుగు, సుడిగాలిగా వచ్చి గిరగిరా తిరుగుతూ, ఆ పొదలో నాతో ఇలా చెప్పింది, “ఎన్నడునూ నీవు పొగ త్రాగవద్దు, మద్యం సేవించవదు, ఇంకా అలాంటివేమీ చేయవద్దు.” నేను పెద్దవాడనయినప్పుడు నేను చేయుటకు ఒక పని ఉంచబడినది. నీకు సందేహము కలగవచ్చు, కాని సందేహించే హక్కులేదు.
ఆ నది వద్దకు ఆయన దిగినప్పుడు, అది ఆయనే అని తానే నిరూపించాడు. ప్రస్తుతము, ఈ ఉదయ కాలమున ఇక్కడ కూర్చొన్న వారిలో చాలామంది ఆ నది వద్ద నిలబడియున్నారు. అది సత్యమని మీలో చాలామందికి తెలుసు.
ఆయన నాకు ఆజ్ఞను ఇచ్చినప్పుడు, మీలో చాలా మందికి జ్ఞాపకము ఉండి ఉంటుంది. ఆయన చెప్పెను, “వెళ్ళు, ఈ పరిచర్యను లోకమంతటికిని తీసుకొని వెళ్ళు, ఒక ఉజ్జీవము ప్రారంభమవుతుంది.” ఇంతక మునుపు ఎన్నడూ లేనటువంటి ఉజ్జీవమది. ఇప్పటికే ఆ ఉజ్జీవము ప్రపంచమంతా కొనసాగుచున్నది, గొప్ప స్వస్థతా కూటములు లోకమంతటనూ జరుగుతున్నవి.
72
వ్యక్తిగతముగా చూస్తే, నేను ఒక చిన్న ఎలుక లాంటివాడను. ఇక్కడే కూర్చొనియున్న నా తల్లిని, లేదా చనిపోయిన నా తండ్రి భూస్థాపిత కార్యక్రమ ప్రసంగం ఈ వేదిక నుండే ప్రసంగించబడినది, ఆయనను అవమానపరుచుటకు ఈ మాటలు చెప్పుటలేదు. నేనొక భయంకరమైన కుటుంబము నుండి వచ్చానని మీకు తెలుసు. నావారెవ్వరూ క్రైస్తవులు కారు. నా తండ్రి త్రాగుబోతు. దేవుడు ఒక త్రాగుబోతు కుమారుడుని తీసుకొని, ఆయన నన్ను రక్తముతో కడిగాడు. పట్టణమునకు వెళ్ళి నేనెవరితోనైనా మాట్లాడవలెనని ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మాత్రమే నాతో మాట్లాడేవాడు, నాతో మాట్లాడుటకు ఎవరూ ఉండరు గనుక, నాతో ఎవరూ మాట్లాడేవారు కాదు. ఎవరితోనైనా నేను వెళ్ళి మాట్లాడాలని వెళ్తే, నాతో ఎవరూ మాట్లాడరు, ఎందుకనగా నేనొక త్రాగుబోతువాని కుమారుడుని. ఇక్కడ ఉన్న నా స్వంత సంఘము వారికి, చాలా మందికి తెలుసు ఇది సత్యమని. ఒక జంతువో ఒక అలాంటి చులకనైన పేరు నాకున్నది. ఒకసారి ఇది పట్టణములో ఒక వ్యక్తితో చెప్పబడినది, అతడు మా ఇంటికి వచ్చి ఇలా అన్నాడు, “అంతటి హీనమైన చెత్తతో ఎలా సహవాసము చేయదవు?” ఓ, దేవా! యేసుక్రీస్తు రక్తము తప్ప చేయుటకు నాకేమున్నది, నాకు విద్య లేదు, రూపము లేదు, నాకేమియూ లేదు.
73
ఇటీవలే నేను నా భార్యతో చెప్పాను, “ఎవరూ నాతో మాట్లాడనటువంటి ఆ సమయాన్ని గూర్చి ఆలోచించు, మరియు నేను ప్రజలను ప్రేమించినప్పటికినీ, వారు నా మాటలు వినేవారు కాదు.”
పుస్తకం చవడము, స్కూల్ కి వెళ్ళడము నాకు జ్ఞాపకమున్నది... ఓ నేనెంత కృతజ్ఞుడని, నేను నా పిల్లలకు పుస్తకములను, మరియు మిగతా అవసరమైనవి కొన్నాను, పిల్లలను స్కూల్ కి కూడా పంపాను. నాకైతే స్కూల్ కి వెళ్ళేటప్పుడు మేజోళ్ళు లేవు, వెంట్రుకలు మెడపై వ్రేలాడుచుండేవి. దుస్తులుండేవి కావు. ఒక చిన్న పాత కోటు, దాని కింద చొక్కా కూడా ఉండేది కాదు. రాసుకోవడానికి పెన్సిల్, కాగితమైనా ఉండేది కాదు. ఒక కాగితమును, చిన్న పెన్సిల్ ను అరువు తెచ్చుకొనవలసి వచ్చేది, ఎందుకనగా ఆ నల్లబోర్డు మీద వ్రాయబడినవాటిని కాగితము పై రాసుకోవడానికి.
74
ఒక రోజు, నేనొక పుస్తకము చదివిన విషయం జ్ఞాపకమొస్తుంది, అబ్రాహాం లింకన్ న్యూ-ఓర్లీన్స్ లో పడవ దిగినాడని నేను నమ్ముచున్నాను. అక్కడ ఒక పచ్చిక మైదానం మీద నిలబడి, చిన్న పాదాలు కలిగిన కొంతమంది నీగ్రో బాలురను, రాత్రంతా కట్టివేయబడిన ముసలి ఆవును, ఆ నేల అంతా మంచుతో కప్పబడి ఉండుట చూసాను. ఆయన చూస్తూండగా, ఆ పిల్లలు నిలబడి “నీకు బూట్లు ఉన్నవి, నాకు బూట్లు ఉన్నవి, మరియు దేవుని పిల్లలందరికీ బూట్లున్నవి,” అని పాట పాడుచున్నారు.
ఆయన ఆ పడవ దిగినప్పుడు, ఆ ఎద్దుల దొడ్డిలో ఒక దృఢమైన, ఎత్తైన నల్ల జాతీయుడు అక్కడ ఉన్నాడు. అతని భార్య తన చిన్న బాలున్ని చంకనెత్తుకొని ఏడుస్తూ ఉంది. వారు అతని వలె ఉన్న ధృఢకాయులైన స్త్రీలతో కలుపుట ద్వారా దృఢమైన బానిసలను పునరుత్పత్తి చేయుటకు అతన్ని వేలం వేయుచున్నారు.
లింకన్ గారు, ఆయన చేతులను ఈ విధంగా గట్టిగా పట్టి, పిడికిలి బిగించి రెండు పిడిక్లిను కొట్టాడు. “అది తప్పు!” అని గట్టిగా చెప్పాడు. మరియు “నా జీవితము మొత్తం పణంగా పెట్టి అయినా, ఏదో ఒక రోజు నేను దాన్ని తిప్పికొడతాను!” అన్నాడు. అది ఆయన జీవితాన్ని తీసుకుంది, కాని ఆయన దానిని త్రిప్పి కొట్టి, అంతమొందించారు!
75
నేను అన్నాను, “త్రాగుడు అనేది చెడు అలవాటై ఉన్నది, ఇది తప్పు, ఏదో ఒక రోజు, నేను దీనిని త్రిప్పికొడతానని.” నాకున్న పేరుతో నేను దానిని ఎలా ఎదిరించగలను? నాతో ఎవ్వరూ మాట్లాడరు. ఆ కారణము బట్టే నాకివ్వబడిన ఆజ్ఞను నేను ప్రశ్నించాను. ఎవ్వరూ, ఎక్కడా నన్ను పట్టించుకోలేదు, కేవలం ఇక్కడున్న నా ప్రజలు తప్ప.
దేవుని యొక్క కృపను బట్టి, నేను నా ఇంటిని విడిచిపెట్టవలసి వచ్చింది. ఈ ప్రపంచమంతటి నుండి ప్రజల పిలుపును బట్టి, అక్కడ నేను ఉండలేకపోయాను. బలవంతులు, సార్వభౌములు, రాజులు, గొప్పవారు, వ్యాపారులు, మంత్రులు మరియు అన్ని రకాల వారు ప్రతి రాత్రి, పగలు, తర్వాత రాత్రి, పగలు అన్నివేళలా పిలుచుచూనే ఉన్నారు. దానిని చేసినది ఏమిటి? నా ప్రాణములో ఉన్న యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి. అబ్రాహాం లింకన్ గారి రక్తము నల్లవారిని, తెల్లవారి నుండి ఏలాగు బంధ విముక్తులుగా చేసెనో, అలాగే యేసుక్రీస్తు యొక్క రక్తము నన్ను పాపసంకెళ్ళ నుండి విడుదల కలుగజేసెను. జంతు నామము కన్నా చులకనగా ఉన్న నా నామమును, ఆయన కృపను బట్టి, యేసుక్రీస్తు యొక్క నామము నాకు పెట్టబడినది.
76
ఈ ఉదయ కాలమందు, నేను యొర్దాను వెళ్ళుటకు సిద్దముగా ఉన్నాను. నాకివ్వబడిన ఆజ్ఞకు బద్ధుడనైయున్నాను. నేను ప్రజలను ప్రేమించుచున్నాను. వారిని పోషించుచున్నాను. ఆయన దర్శనము వెంబడి దర్శనముతో నన్ను కలుసుకొనగా వాటిని మీతో పంచుకొనుటకు నాకు సమయము లేదని మీకు తెలుసు. ఆ పుస్తకముల వెనుకన నేనిలాగు వ్రాసియుంచాను. “నీవు అనేక జనములను ఎక్కువగా పోషించవలసి యున్నది, నన్ను అనుసరించుటకు నీవు నాతో ఒంటరిగా నడువవలసి ఉన్నది. నువ్వు ఆ సూచనల పై మరీ ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నావు.”
దీని యొక్క ముగింపు ఏమిటో నాకు తెలియదు, కాని ఆ గడియ వచ్చే యున్నది. ఆ గడియ వచ్చినప్పుడు, యెహోషువ వద్దకు ఆ చేయి దిగి వచ్చి, “నేను మోషేతో ఉంటిని. నేను నీతో కూడా ఉందును.” ఈ ఉదయ కాలమందు నేను దానిని చూస్తానని నమ్ముచున్నాను. ఈ రోజు మొదలుకొని, ఆయన ఆజ్ఞను బట్టి సేవించెదను. ఆయన నాకు సూచనలు, లేక దర్శనములు చూపగోరినట్లయితే, ఆయన నాకు వాటిని చూపగలరు. ఆయన ఆ విధంగా చేయనట్లైతే, నేను ప్రజల ముందు వారి విశ్వాసమును బట్టి వారికేదైనా చేయుటకు నేను ఎంతమాత్రమూ నిలబడలేను. నేను రోగుల కొరకు ప్రార్ధించి, వారిని దేవునికి అప్పగించి పంపెదను. వారు ఆజ్ఞను నమ్మినట్లయిన దేవుడు వారి పట్ల యదార్థముగా ఉండును. ఆయన మోషేకు చేసిన విధముగా, యెహోషువాకు చేసిన విధముగానే నాకునూ చేసెను.
77
నా దీన ప్రార్ధన ఏమనగా, “దేవా, నన్ను క్షమించుము. నేను లేపబడి మరలా ప్రయత్నించు విధముగా నాకు సహాయము చేయండి. పాపమనునది లేకుండా విడిపించబడిన దేవుని గొప్ప రక్షించబడిన సంఘము ఎక్కడున్నదో అక్కడికి యొర్దానును దాటించి, ఆ వాగ్దాన భూమిలోనికి నడిపించుటకు, నేను ప్రజలను నడిపించి, వాక్యమునందు స్థిరపరచనియ్యండి. గొప్ప వేల చెల్లించి కొనబడిన దేవుని సంఘము ఇక ఎంత మాత్రము పాపము చేయకుండునట్లు రక్షింపబడుదురు గాక.” దానిని నమ్మి, మరియు జీవించు! దానిని నమ్ముము, మరియు స్వస్థతనొందుము! ప్రభుని నామములో నేను నీతో మాట్లాడుచున్నాను. మనము ప్రార్ధించుకొనెదము.
78
ప్రభువైన దేవా, భూమ్యాకాశములకు సృష్టికర్త, నిత్యజీవ ప్రధాతా, శ్రేష్ఠమైన ప్రతి వరమును ఇచ్చువాడా, మొదటిగా మీ కృపను మీ దాసునిపై వచ్చును గాక. ప్రభువా, ప్రజలు నాపై కలుగజేసిన ఒత్తిడిని బట్టి, దైవికమైన దానిని దుర్వినియోగపరిచి నీ యెదుట దోషము చేసితిని. ఈ ఘడియ నుండి నన్ను నీ ఆత్మతో మార్చమని నీకు ప్రార్థిస్తున్నాను. ప్రభువైన దేవా, నా పూర్ణహృదయముతో విశ్వసిస్తున్నాను. నా అపనమ్మకము నుండి నాకు సహాయము చేయుము.
స్త్రీ, పురుషులు ప్రార్ధన చేయించుకొనుటకు వచ్చుచుండగా, నాలో ఊపిరి మరియు జీవము ఉన్నంత వరకూ అలాగు చేయుదును. తండ్రీ, నేను వారి కొరకు ప్రార్ధించుచుండగా, వారిని విశ్వసించులాగున చేయండి. మీరు నాకిచ్చిన ఈ ఆజ్ఞను ఈ ప్రపంచమంతా ప్రకటించనీయము. ఎక్కడైతే సూచనా స్తంభముమున్నదో, ఆ మేకులు కొట్టబడిన ఒకానొక ప్రదేశమునకు వెళ్ళినప్పుడు, అది కేవలం ఆజ్ఞను సూచించునట్టిదే అని వారిని తెలుసుకోనీయండి. వారు విశ్వాసమును కలిగియుందురు గాక.
79
ప్రభువా, నేనింకనూ ఒక వ్యక్తి బాగుపడుటను గూర్చి చెప్పడానికి, లేదా సూచన లేక మరేదో ఒకటి, కొన్ని విషయాలు తెలియజేయడానికి సూచనల మీద ఆధారపడను. నా శత్రువును కలుసుకొనుటకు, నా యొక్క హృదయమందు, విశ్వాసముతో వెళ్ళెదను. యేసుక్రీస్తు యొక్క రక్తమునకు వ్యతిరేకంగా ఉన్నవాడిని నేను సవాలు చేసెదను. ఆ క్రీస్తు యొక్క రక్తమును బట్టి వాడు నిలబడలేదు.
ఇప్పుడు ఇవన్నీ సరియైనవి అయినట్లయితే, నిరూపింపబడినవైతే, ప్రభువా, నేను ప్రార్ధించినప్పుడు నీవు వారిని స్వస్థపరిచెదవు. అది నీ వాక్యము మరియు నీ వాగ్దానమై యున్నది. ఇలా చేయాలని నా కోరిక. నా అపనమ్మకమును బట్టి నాకు సహాయం చేయండి.
నా అవిధేయతను బట్టి నా పాపములను క్షమించు ప్రభువా, ఇంకేమి చేయాలో నాకు తెలియలేదు; ప్రభువా, నేను చేసినట్లయితే, అది నాకు బయలు పరచబడలేదు మరియు స్పష్టపరచబడలేదు. ఇప్పుడు నేను ఎక్కడ నిలబడియున్నానో నాకు తెలియును. నాకివ్వబడిన ఆజ్ఞ నాకు తెలియును. ఈ వాక్యమును దివారాత్రములు, నా నోటి నుండి వెళ్ళనీయక, కట్టుబడి ఉండెదను. నేనెల్లప్పుడూ వాక్యముతోనే నిలిచియుందును, ప్రభువా, నిలిచియుందును, ప్రజలకు తెలియజేతును. అది దేవుని వాక్యము కానట్లయితే, దాని యందు నేను సందేహించెదను. కాని దేవుని వాక్యమును దాటి నేనేమియు బోధించను, ఇంకేమియూ చేయను.
80
ప్రభువా, ఇదే నేలపై నేను తిరుగుతూ, నేను ఎంతో అలసిపోవుచున్నాను. గత రాత్రి చెప్పినట్లు, అరణ్యములో నలుబది సంవత్సరాలు, అటు ఇటు తిరుగులాడుచు. అది దేవుని దీవెన, అవును, గొర్రెలను, పిల్లలను పెంచడము, ఇంకా ఎన్నో, మరియు ఆ మందలను, గొర్రెలను ఇంకా ఎన్నింటినో దేవా, నీవు వారిని దీవించితివి. కాని ఒక రోజు, “ఈ కొండపై మీరు చాలా సంవత్సరాలు ఉన్నారు. ఓ, ఉత్తరం వైపున ఉన్న యొర్దాను వద్దకు వెళ్ళు,” అని చెప్పితివి.
దేవా, ఈ ఉదయ కాలమందు నేను ప్రారంభిస్తున్నాను. నేను ఈ సూచనలను వదిలి వేయుచున్నాను, ఎందుకనగా అది మరింత శ్రేష్ఠమైన దేశమును సూచిస్తుంది. నేను తడబడవచ్చు. నేను అమాలేకీయుల గుండా వెళ్ళవలసి ఉండవచ్చు. హిత్తీయులు లేదా కనానీయుల గుండా వెళ్ళవలసి రావచ్చు. నన్ను విమర్శించే నా స్వంత వారి మధ్యలో నుండి వెళ్ళవచ్చు, ప్రభువా, నేను కేవలము వెళుతూనే ఉంటాను. నాకు తెలుసు, అక్కడ ఎంతో దూరాన ఒక దేశమున్నదని. ఎక్కడో ఒక చోట, కొన్ని పరిస్థితుల మధ్య, ఎక్కడ మా ప్రార్థనలకు మీరు సమాధానమిస్తారో, మేమడిగిన ప్రతీదీ మాకు అనుగ్రహిస్తారో, ఏ ప్రార్తన యెదుట క్యాన్సర్ కూడా నిలబడలేదో అక్కడికి మేము వెళ్ళుచున్నాము. అది సత్యమని నేనెరుగుదును. నేను నమ్మి, ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నాను. ఈ ఉదయ కాలమున మీ సేవ కొరకు యేసుక్రీస్తు నామములో నన్నునేను మీకు అప్పగించుచున్నాను. ఆమేన్.
81
కేవలము నమ్ముము, కేవలము నమ్ముము,
నమ్మువానికి సమస్తము సాధ్యము, కేవలము నమ్ముము;
కేవలము నమ్ముము, కేవలము నమ్ముము,
నమ్మువానికి సమస్తము సాధ్యము,
నమ్మువానికి సమస్తము సాధ్యము.
ఇప్పుడు, టేపులో రికార్డింగు ఆపివేయబడుచున్నది, ఎందుకనగా ఇవి ప్రపంచమంతా వెళ్ళును. అది నా హృదయములోనిది, సంఘమా, మీరు అర్ధముచేసుకున్నారా?
దేవుడు ఒక విషయం చెప్పి, దానిని మరలా మార్చడు. ఆయన మాటలు తప్పిపోనివి. ఆయన వాగ్దానములు అన్ని సమయముల యందు సత్యమైయున్నవి. నేను ఈ గడియ కొరకే ఎదురు చూచుచున్నాను. చూచారా, విశ్వాసముతో కూడిన ప్రార్ధన, అది స్వస్థపరచును, సూచన వలన కాదు. “నమ్ముట నీవలనైతే,” యేసు చెప్పెను, “నేను చేస్తాను, నేను చేస్తాను, నీవు నమ్మినట్లైతే.” ఇప్పుడు దేవుడు నాకు ప్రార్ధించే శక్తిని అనుగ్రహింనట్లయితే, నీ యొక్క విశ్వాసము మీదగా, అది ఆ వాగ్దానము సత్యమని రుజువు చేయుచున్నది. దీనిని మీరు నమ్ముచున్నారా? నేనేమైతే అడిగానో, నేనేమి పొందుకోవాలో, అది నీ యొక్క విశ్వాసమును బట్టియే. “నీయందు విశ్వాసముంచునట్లు ఈ ప్రజలను చేసినయెడల, యధార్ధతతో నీవు ప్రార్ధించినప్పుడు, నీ ప్రార్ధన ముందు ఏదియూ నిలబడజాలదు.”
82
సహోదరుడా, సహోదరి నేను నిజాయితీగా ఉండాలంటే, అది ఇప్పుడే. నా అన్ని పొరపాట్ల తరువాత, నేను కోరునది... గతంలో నేను ఆ వర్తమానములు తీసుకొని రావడానికి గల కారణం, ఆ దేవుడు కృప చూపించుట ద్వారానే. మోషే లాంటి గొప్ప వ్యక్తి పొరపాటులు చేశాడు. తరువాత యెహోషువ వచ్చి, ఆయన కూడా ఆ విధంగానే చేశాడు. కాని దేవుడు అన్నాడు, “నేను మోషేకు తోడై యుండినట్లు, నీకును తోడైయుందును.”
ఇప్పుడు దేవుని వైపు చూడండి, రెండు సంవత్సరముల క్రితం, అదే లేఖనాలను నా యెడల సత్యమని సూచించాడు. “నేను మోషేకు తోడైయుండినట్లు, నీకును తోడైయుందును. నేను నీ పొరపాట్ల వైపు చూడను.” ఆయనకు తెలుసు ఆ ఘడియ వచ్చియున్నదని. అది వచ్చియే ఉన్నది. చూడండి, తిరిగి వచ్చియున్నది, కారణం దేవుడు దాని నుండి ఎన్నడునూ దూరం కాజాలడు.
“విశ్వాసమును బట్టి నీవు రక్షించబడితివి.” ఎంత మందికి ఆ విషయం తెలుసు? ఎంత మంది మంచి వారు మీ కొరకు ప్రార్ధించుచున్నారు, ఎంత మంది మంచి బోధకులు మీ కొరకు బోధిస్తున్నారు, రక్షణ కొరకు మీ వ్యక్తిగత విశ్వాసమును మీరు కలిగియుండవలసియున్నది. ఇది నిజము కాదా? అది నీ వ్యక్తిగత.... నీవెన్ని మంచి ప్రసంగాలు విన్నావన్నది కాదు, నీవెంత మంచి సంఘాలకు చెందియున్నావో నేను లెక్కచేయను. నీ స్వంత విశ్వాసమే నిన్ను రక్షించును. నీవు ఎంత గట్టిగా రోదించినా, ఎంతగా యాచించినా, ఎంతగా ఆత్మలో అరిచినా, ఎంతగా నాట్యమాడినా, నీ విశ్వాసమును బట్టియే నీవు రక్షించబడెదవు. అది నిజమేనా? నీవు స్వస్థపరచబడటానికి అదియే మార్గము.
83
దేవుడు ఒక మనిషికి తన సందేశం ఇచ్చినట్లైతే, ఒక బోధకుడు రక్షణ సందేశం ఇచ్చినట్లయితే, నీవు అది సత్యమని గ్రహిస్తావు, దేవుడు తన వాక్యము ద్వారా అది సత్యమని నిరూపిస్తాడు; వాక్యము ద్వారా గాని దేవదూత ద్వారా కాని దేవుడు రుజువు పరచుచున్న స్వస్థతా వరాన్ని, గూర్చిన సత్యాన్ని నీవు ఎంతో ఎక్కువగా నమ్మాలి. ఆ రెండిటిని, ఈ రెండు ఖచ్చితమైన సూచనలతో సూచిస్తున్నాయి, ఎంతగా నీవు నమ్మవలసియున్నది. చూచారా, ఎప్పటి వరకు......
దానిని చేయుట ఖచ్చితముగా పరిపూర్ణమయిన దేవుని చిత్తము కాదని చూపుటకు, ఆ సూచన ఎల్లప్పుడు నన్ను బలహీనపరచెను. అది ఎంత మందికి తెలియును? వెనుకాల ఉన్న నా భార్యను అడగండి. ఆమె మీకు చెప్పగలదు. ఆమె మాత్రమే - అందరికంటే ఎక్కువ భారమును ఆమె తిసుకొనును - ఆమె నాతో పరిగెత్తవలసియున్నది. మీరు ఎక్కడ ఉన్నారో, ఎందుకు నడుస్తున్నారో, ఏ విధంగా ఉన్నారో మీకు తెలియదు, మరియు ఇది, మరియు నీవు [స్పష్టతలేని మాటలు]. ఏదో కొంత దూరం రోడ్డు మీదకు వెళ్ళడము, మరియు ఆగిపోవడము.
84
ఇప్పుడు, ఈ చివరి కూటము నుండి, ఆ వరుసలోని ప్రజలను నేను తీసుకొంటిని. మనము రెండు లేక మూడు రాత్రులు, ప్రార్ధనా కార్డులను ఇవ్వకుంటిమి. మీరెంతో సమూహముగా కూడి రాగా వాటిని ఇవ్వవలసి వచ్చెను. కొన్నిసార్లు నేను అలా నిలబడి 50 నుండి 75 మందికి ప్రార్ధించి పూర్తి చేసేవాడిని. ప్రతి రాత్రి, ప్రతి కూటములోనూ, ఒకేసారి ఇంచుమించు 40 లేదా 50 మందిని గూర్చిన వివేచనను దేవుడు ఇచ్చును. అది నిజము కాదా, జీన్, లియో, మీరంతా ఉన్నారు కదా, ఆ కూడికలో? అది ఖచ్చితంగా నిజము! మరియు అది ఏమి చేయుచున్నది? అది నన్ను విడిచిన తరువాత, ఇంటికి తిరిగి వెళ్ళుచున్నప్పుడు, రహదారిలో ఉండగా నేను అప్పుడు ఎక్కడ ఉన్నానో, మరిచిపోయేవవాడిని, ఎక్కడ నుంచి వచ్చినానో తెలుసుకొనగోరేవాడిని.
దేవుడు ఒక మనిషికి అలా చేయగలడా, అని నీవు మాతో చెప్పాలనుకున్నావా? కాదండీ. అది ఒక మనుష్యుడు ఆజ్ఞకు బదులుగా సూచనను తనకు తానుగా తీసుకొనుట్లైయున్నది. ఆ వాషింగ్టన్ లోనో, లేక మరి ఎక్కడనో రోడ్డు ప్రక్కన చిన్న పాత చెట్టు క్రింద ఆగాను. “ప్రభువా, అది నీవే అయితే నన్ను తిరిగి మంచిగా చేసి, ఏది సత్యమో తెలుసుకొనుటకు సహాయం చేయండి, ఒక్కసారి ప్రజలలోకి నేరుగా నీ ఆజ్ఞను తిన్నగా తీసుకొని వెళ్ళనివ్వండి,” అని చెప్పాను.
85
ఇప్పుడే నేను దానిని పొందాను. ఒక రోజు ఉదయ కాలమున, కెంటకీలోని ఒక పర్వతము ప్రక్కన, నేను కూర్చొన్నప్పుడు దానిని నాకు బయలుపరిచాడు. మరియు అది ఇదే. అది ఇదే. నేనిప్పుడు ప్రభువైన యేసు నామములో వెళ్తున్నాను. అంతే.
దీనిని నమ్మండి, మరియు దాని ప్రకారం జీవించండి. నమ్మండి, మరియు బాగుపడుము! నేనెవర్నీ విశ్వసింప చేయలేను. నీ అంతట నీవే దానిని విశ్వసించాలి. నేను నీకు సత్యాన్ని తెలియజేశాను. దేవుడు పన్నెండు సంవత్సరాల నుండి సూదీర్ఘముగా అది సత్యమని, తన వాక్యము ద్వారానూ, దూత ద్వారానూ, సూచనలు మరియు మహాత్కార్యాల ద్వారానూ, నిరూపించుచున్నాడు. వారిప్పుడు విశ్వసించనట్లైతే, ఎన్నటికీ విశ్వసించలేరు. అది నిజమేనా? కాని నేను అలసిపోయి ఆ పర్వతము మీద ఉన్నప్పుడు, ఆ ఘడియ వచ్చియున్నది. నేను యొర్దానుకు ఎక్కి వెళ్ళాలని అనుకున్నాను. పూర్తి వాగ్దానముల లోనికి ప్రవేశించాలనుకున్నాను. సూచనల వైపు గాని, దేవుడు బయలుపరిచిన మరే కార్యము వైపు, సూచిక క్రియల వైపు కాని చూడకుండా, నాకు నేనుగా విశ్వాసాన్ని కలిగి ఉండాలనుకున్నాను. నేను ఆ కల్వరి వైపు చూసి, “ప్రభువైన దేవా, విశ్వాసమును బట్టి వచ్చాను, నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో వచ్చియున్నాను,” అని చెప్పాలని కోరాను.
86
ఇప్పుడు ఈ ఉదయ కాలమందు ఎవరికొరకో ప్రార్ధించవలసి యున్నది. నేను మీ శరీరములోని వ్యాధి, బాధలను తెలుసుకోవడానికి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వచ్చియున్నాను. దేవుడు నాలో నుండి ప్రాణమును తీసివేయునంతవరకు దానిని చేయుదును. ఆయన జ్ఞానము, వివేకము ఇచ్చునంత వరకు నేను ప్రార్థిస్తూనే ఉంటాను. నేను ప్రార్థించినప్పుడు, నీ విశ్వాసములో వెనుతీయక ఉండినయెడల, నీవు స్వస్థపరచబడెదవు. దానిని స్థిరపరుచుకొనుము. నీవు విశ్వసించనియెడల రాకూడదు, ఎందుకనగా నిన్ను నీవే బాధపరచుకొనెదవు.
ఇప్పుడు ఈ సందేశము టేపు చేయబడి, ఇక్కడ ఉన్నది. ఇప్పటి నుండి దేవుడు నాకు ఇచ్చేంతవరకు.... ప్రత్యేకముగా దానిని చేయుమని చెప్పేంత వరకు వివేచనలు ఏమాత్రము చేయను. “వెళ్ళి, ఆ వ్యక్తికి ఫలానా కార్యము తెలియజేయి,” అని చెప్తే, నేను వెళ్ళి చెప్తాను. ఆయన, “ఈ కార్యము చేయి,” అని చెబితే, దానిని నేను చేస్తాను.
కాని ఇక్కడ నిలబడియున్నవారంతా, “ఇప్పుడు నావైపు చూడండి. నీ పూర్ణహృదయముతో నీవు విశ్వసించినట్లైతే. అవును. ఇది ఫలానా-ఫలానా, నీవు జాన్ డోవి, నీవు ఫలానా-ఫలానా నుండి వచ్చావు, నీకు ఎప్పటి నుండో క్యాన్సర్ ఉన్నది. నీవు బాగుపడటానికి ఫలానా కార్యము చేయమని డాక్టర్ చెప్పాడు. నీవు వెళ్ళి ఆ పని చేశావు, నీవు బాగుపడటానికి మరలా ఆ పని తిరిగి చేయాలి. మంచిది, సహోదరుడా డో, నీవు విశ్వసించు ఆ పని చేయి.” “ఇప్పుడు, సహోదరి నీవు ఫలానా-ఫలానా, నీవు ఫలానా-ఫలానా నుండి వచ్చావు.” “నీవు ఫలానా-ఫలానా నుండి వచ్చావు.” అప్పుడు నేను ఏమి చేయాలో తెలియక తికమక పడతాను, చాలా కఠినమైనది. మరియు మొదటిగా నీవు తెలుసుకొనవలసిన కార్యమేదనా, ఇక్కడ ఇంకొకటి ఉన్నది. నేనెవరిని చూడవలసి ఉన్నదో వారిని చూస్తాను. తరువాత కూటము నుండి వెళ్ళిపోయాక “నేనెక్కడున్నాను?” అనిపిస్తుంది. అలాంటివి ఇక వద్దు.
87
నేను ఆయన సేవకుడిగా, ప్రభువైన యేసు నామములో వచ్చుచున్నాను. నేను నీకు చెప్పిన సత్యాన్ని, ఈ సమయంలో దేవుడు నీకు నిరూపించక పోయినట్లైతే, నేను నీకు సత్యాన్ని చెప్పి యున్నప్పటికీ, నీవెన్నటికీ దానిని నమ్మవు. ఆమేన్. అది నిజము. అది సత్యము. మీలో ఎంత మందికి ప్రార్థనలు కావలెనో మీ చేతులు ఎత్తండి? సరే మంచిది.
ఇప్పుడు నాకు టెడ్డీ కావాలి. ఆయన ఈ కట్టడములో ఇంకనూ ఉన్నాడా? [ఎవరో ఒకరు, “లేదు, ఆయన వెళ్ళిపోయాడు,” అని చెప్పారు.] ఆయన వెళ్ళిపోవలసియుండెను. “కేవలము నమ్ముము,” అను పాటను నా కొరకు వాయించగలిగిన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? లేక ఆ పాటను టేపు పైన కలిగియున్నారా? ఇక్కడ ఎవరైనా మా కొరకు “కేవలము నమ్ముము,” అను పాటను పియానో వాయించువారుంటే ముందుకు రండి - పురుషులైననూ లేక స్త్రీలైననూ ఫరవాలేదు, మిమ్ములను బట్టి సంతోషిస్తాము. మంచిది, ప్రియ సహోదరీ, నీవు కోరినట్లయితే, నీవు నెమ్మదిగా వాయించుచుండగా.
88
ఇప్పుడు ప్రార్ధనా కార్డులను మీకివ్వడము లేదు. ఎప్పుడైతే మనం ఈ విధంగా చిన్న కూడికను కలిగి ఉంటామో, అప్పుడు మనకు ఆ కార్డులు అవసరము లేదు. ఎప్పుడైతే మనము పెద్ద కూడికలను, అనగా ఐదు వందల మంది అంతకన్నా ఎక్కువ మంది కొరకు ప్రార్థించినప్పుడు, వాటినివ్వాలి, ఎందుకనగా అప్పుడు చాలా మంది ఉంటారు, చూచారా.
ఇది దేవుని చిత్తమని మీలో ఎంతమందికి తెలుసు? ఓ, నేను సరిగానే చేసానని ఏదో నాకు భావనను కలిగించింది. అది నా హృదయయములో నుండి బయటకు వెళ్ళింది. ఏదో ఒక పొరపాటు ఉన్నదని తెలిసి పన్నెండు సంవత్సరాల నుండి అలాగే ఉంది. సహోదరుడా లీ, ఇప్పుడు అది అక్కడ నుండి బయటకు వచ్చినదని నాకు తెలుసు. నేను దానిని చెప్పియున్నాను, అది టేపు అయినది. మరియు అది ఇపుడు నా హృదయము వెలుపల ఉన్నది.
89
జ్ఞాపకముంచుకో, నీ వ్యక్తిగత విశ్వాసమును బట్టియే నీవు రక్షించబడెదవు. నీ వ్యక్తిగత విస్వాసమును బట్టియే నీవు స్వస్థపరచబడెదవు. ఇది బైబిల్లో నుండునని మీరు నమ్ముచున్నారా? అది దేవుని వాక్యము! నీవు ఏ సంఘానికి వెళ్ళినా ఆ సంఘ కాపరి, దైవజనుడని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్మనట్లైతే, నీవు దానిని విడిచిపెట్టుము. ఎవరైతే దైవజనుడో, అతని వద్దకు నీవు వెళ్ళాలి. అతనిని నీవు విశ్వసించినట్లైతే, అప్పుడు అతను నీకు సత్యమును బోధించుచున్నాడని విశ్వసించి, దానిని అంగీకరించు. క్రీస్తునందలి నీ సొంత, వ్యక్తిగత విశ్వాసమే నిన్ను రక్షించును. నీ పాస్టరు ఎంత మంచివాడైనా, నీ తల్లి ఎంత మంచి భక్తురాలైనా, దేవుని వాక్యము ఎంత నిజమైనదైనా, నీవు ఎంత ఏడ్చినా, ఎంత ప్రార్ధించినా, నీ విశ్వాసమే నిన్ను రక్షించును. విశ్వాసము ద్వారానే నీవు రక్షించబడెదవు.
ఇప్పటికీ అదే సూత్రం వర్తిస్తుంది. ఏది ఏమైనా... ఈ చివరి దినాలలో దీనిని పంపెదనని దేవుని వాక్యము చెప్పుచున్నది. ఇప్పుడు, రెండు నేరుగా ఉన్న ప్రసంగాలను నేను తీసుకున్నాను. ప్రకృతి సంభంధమైన ఇశ్రాయేలీయులు, ఆత్మసంబంధమైన ఇశ్రాయేలీయులు. మనలను ఆ దేశములోనికి నడిపించుటకు ఈ దినము యొక్క యెహోషువ అయిన పరిశుద్ధాత్మ కొరకు, మనము ఎదురు చూస్తున్నాము. ఆయన ఆత్మయై ఉన్నందున, ఎవరి ద్వారా నైనా ఆయన మాట్లాడవలసి ఉన్నది. ఆయన ఏమి చెప్పుచున్నాడో, దానినే నేను మీకు చెప్పుచున్నాను. ఇప్పుడు నీవు విశ్వసించి, మరియు స్వస్థత పొందుము.
90
ఇప్పుడు వరుసలో వీరిని, ఈ వైపు ఉంచండి. డాక్, నీవు అక్కడకు వెళ్ళుము. బిల్లీ పాల్? బిల్లీ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడకు వచ్చి సహాయం చేయి, డాక్ నీవు కోరినట్లయితే, నీవు కూడా.
ఇప్పుడు మీరంతా ఒక క్రమంగా ప్రార్థించుకొనుటకు వచ్చుచున్నారు. గుర్తుంచుకోండి, మీరు పూర్ణహృదయముతో విశ్వసించకపోయిన యెడల, అది మీపైనే పడును. అది సత్యము. దానిని తప్పక విశ్వసించాలి. ముఖ్యంగా రోగముతో ఉన్నవారు, గుర్తుంచుకోవాలి. దేవుడు తన గ్రంథములో చెప్పియున్నాడు, తన వర్తమానికుడి ద్వారా దానిని పంపియున్నాడు, తన దూత ద్వారా నిరూపించియున్నాడు. ఇప్పుడు నీవు దాన్ని తప్పక విశ్వసించాలి.
ఇప్పుడు ప్రార్థన చేయించుకోవాలి అనుకొనే వారికి, బైబిల్ ఏమని చెప్పెను, “రోగుల మీద చేతులు ఉంచినప్పుడు, వారు బాగుపడెదరు.” అది సత్యము. మరియు దానిని పూర్ణహృదయముతో విశ్వసించవలసి యున్నది. అప్పుడు దేవుడు నీకు స్వస్థతను అనుగ్రహించును.
91
ఇపుడు అక్కడ నుండి, ఆ వెనుక నుండి ఇక్కడికి రండి. ఈ ప్రక్కనున్న వారిని, తరువాత ఆ ప్రక్కనున్న వారిని రానివ్వండి. అలాగే సరిగ్గా ఆ వెనుకకు రండి. ఆ ప్రక్కనున్న వారిని ఇక్కడ, కుడి చేయివైపున నిలబడనియ్యండి. ఏమంటున్నారు? [సహోదరుడు బ్రెన్హాంతో ఎవరో మాట్లాడుచున్నారు.] నేను ఇప్పుడు ఇక్కడికి దిగుచున్నాను. అవునండీ, వారికి ప్రార్థించుటకు ఇక్కడికి దిగుచున్నాను.
ఇప్పుడు నేను ఈ ఉత్తరములు మరియు చేతిరుమాళ్ళ కొరకు ప్రార్ధించియున్నాను. మీలో కొందరు, అనేకులు వెళ్ళవలసి యున్నది. మరిచిపోవద్దు, ఈ రాత్రి కాలమందు, నిజ సంఘము యొక్క దైవిక రుజువు, అనుదానిపై కూటము ఉన్నది, చూచారా?
92
ఇప్పుడు మీ కొరకు ప్రార్థించబోవుచున్నాను. మీరు సంపూర్ణ స్వస్థత పొందెదమని రూఢీగా నమ్ముచున్నారా? మీరు నమ్మనట్లయితే, రావద్దు. నమ్మినట్లయితే, రావటము మీ యొక్క విధి.
నేను స్వస్థపరచువాడను కాను, కాని నాకు స్వస్థపరచు వరమున్నది. అది సాక్ష్యము ద్వారా రుజువైనది. అది సత్యమని నిరూపించబడినది. చూచారా, చాలా కాలము క్రితం నేను వెనుకకు చూసినట్లైతే, అప్పుడు హాస్పిటల్ కి వెళ్ళేవాడిని. నేను కేవలము స్థానికుడైన, స్థానిక బాప్టిస్టు బోధకుడను, ఆ హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు, అక్కడ ఒక చాలా పెద్ద వయసు గల ఒక నర్సు ఉండేవారు. హోవార్డ్ పార్క్ లో ఆమె నివసించేది. ఆమె ఇప్పటికీ, ఆ హాస్పిటల్ లో పని చేస్తుందో లేదో నాకు తెలియదు. అప్పుడు ఆమె రోగులతో తరచుగా, “మీరు బాగుపడబోతున్నారు, బాగుపడబోతున్నారు,” అని చెప్పేది. “ఎందుకనగా, ఆ చిన్న బాప్టిస్టు బోధకుడు వచ్చి మీ కొరకు ప్రార్థిస్తారు,” అని అనేవారు. చూచారా, అది కేవలము... అలా మొదలైనది. అది ఆ విధముగా ఉండేది. అలా స్థానికముగా మొదలై, ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది.
93
నేను నేర్చుకొనుటకు, దేవుడు నాకు ఈ సూచనలను అనుగ్రహించాడు. సహోదరుడు నెవిల్ వలెనో, లేక డాక్టర్ వేల్ వలెనో, ఇంకెవరి వలెనో నాకు విద్యను ఇచ్చినటైతే, నేనిప్పుడు దీనిని కలిగి ఉండేవాడను కాను. అయితే విద్యలో పొందని వాటిని నేను నేర్చుకొనుటకు అవి నాకు అవసరము. నేను సూచనలను కలిగియుండవలసియున్నది. ఈ సూచనలు అనేవి విద్య వల్లే ప్రభావవంతమైనవి, నిరూపించబడినవి. అయితే చూడు, నీకు మంచి విద్యార్హత లేకపోతే, దేవుడు మరొక విధముగా విద్యార్హతను నీకు అనుహించ సమర్ధుడు.
ఇప్పుడు, నీకు విశ్వాసము మరియు నమ్మిక ఉన్నది. మీరు నిలబడి ఉన్నచోటనే, దేవునికి ప్రమాణము చేయవలెనని కోరుచున్నాను. ఎందుకనగా, మీలో ప్రతి ఒక్కరూ ప్రతి అనుమానపు చాయను పక్కన వదిలివేయాలి. ప్రార్థించుకొనుటకు మీరు వరుసలో వచ్చుచున్నప్పుడు, నేను మీ కొరకు ప్రార్ధిస్తాను. నేను మిమ్మును ఇక్కడ నుండి బయటకు నడచి వెళ్ళాలని కోరుతున్నాను. నీవు గనుక ఎటువంటి ఫలితాలను పొందలేదంటే, యేసు ఎన్నడూ ఈ విధంగా అడగడు, “దీనిని నీవు చూచావా? దీనిని మీరు అనుభవించారా?” “నీవు దీనిని విశ్వసించావా? నీవు దీనిని విశ్వసించావా? నీవు నమ్మినట్లయితే....” అని పలికాడు.
94
ఇప్పుడు, నేను చాలా కాలము నుండి దీనిని గమనించాను. నేను ప్రజల కొరకు ప్రార్థిస్తాను, కాని కొంతమంది ఏమీ పొందుకోరు, ఆ వివేచన చేయున వలన ఏమియు కలుగదు, వారు ఇక్కడ నుండి బయటకు వెళ్ళి, “హు! నేనేమి పొందుకొనలేదు, ఆయన నాకేమి చెప్పలేదు,” అని చెప్పడం గమనించాను. సాధారణంగా ఆ వ్యక్తి కూడా ఏమి పొందుకోలేడు.
కాని కొందరు ఆ ప్రార్ధనా వరుసలో నుండియే, “ప్రభువా, నీకు ధన్యవాదములు, నేను దీనిని నమ్ముచున్నాను,” కాని వారి నుండే నేను ఇలా విన్నాను. “సహోదరుడా బ్రెన్హాం, నీకు తెలుసు కదా, నేను చాలా రోజుల నుండి వస్తున్నాను కాని, ఏ మార్పు లేదు,” అని చెబుతారు. [బహుశా రెండు, మూడు వారములు లేదా ఇంకా ఎక్కువ అవ్వొచ్చు.] అయితే ఒక్కసారిగా ఎప్పుడైతే అది నన్ను విడిచి వెళ్లిపోవుట అనుభూతి చెందుతానో,“ అప్పుడు అది ఖచ్చితంగా వెళ్ళిపోవును, చూచారా.
నీవు విశ్వసించుచున్నానని చెప్పవచ్చు. కూటమునకు హాజరయ్యే వారిలో మూడు తరగతులు ప్రజలుంటారు. వారెవరనగా, అవిశ్వాసులు, నటించు-విశ్వాసులు, మరియు విశ్వాసులు. కొంతమంది విశ్వసించునట్లుగానే పైకి కనపరచుకుంటారు: “ఓ, అవును, నేను విశ్వసించుచున్నాను,” అంటారు. కాని వారు విశ్వసించరు. నీవు దీనిని నమ్మినట్లయితే... ఇపుడు ఈ ప్రశ్న మిమ్మును అడగగోరుచున్నాను. నీవు విశ్వసించినట్లయితే, స్వస్థపడకుండా ఉండుట నీకు అసాధ్యము. దానిని మరల చెప్పనివ్వండి. నీవు ఇది విశ్వసించినట్లయితే, స్వస్థపడకుండా ఉండుట నీకు పూర్తిగా అసాధ్యము.
95
మొదటిగా, దేవుని వాక్యము ఆజ్ఞను ఇచ్చును. నీవు దీనిని నమ్ముచున్నావా? దేవుని వాక్యము మొదట అలాగు చెప్పినది. అది అన్నింటికన్నా ఉన్నతమైనది. రెండవదిగా, ప్రభువు దూత దానిని నిరూపించాడు, సూచనలు దానిని నిరూపించాయి. అది నిజమేనా? ఇప్పుడు, ఎక్కడైనా ఏ ఒక్కటి విఫలము కాలేదు.
దేవుని వాక్యములో ఒక్కటి కూడా తప్పిపోవడం లేదు, “నేను ఒకసారి వారిని స్వస్థపరచి, ఇప్పుడు వారి యొద్ద నుండి దానిని తీసివేస్తాను,” అని వాక్యములో ఎక్కడ ఉన్నదో ఎవరూ చూపించలేరు. సంఘము రోగుల కొరకు ప్రార్థించవలెనని యేసు ఎక్కడ చెప్పెనో, నేను మీకు చూపించెదను. మరియు విశ్వాస సహితమైన ప్రార్ధన రోగిని రక్షించును. అది అలా ఏ మాత్రమూ జరగదని ఆయన ఎక్కడ చెప్పెనో బైబిల్లో నీవు చెప్పుము. నీవు నాకు బైబిల్ లో చూపించుము, చూచారా.
ఆయన కడవరి దినములలో ఈ సంగతులు జరిగించెదనని, లేపెదనని చెప్పియున్నాడు. ఏమి జరగనైయున్నదో చూడండి. ఆయన తన వాక్యమునకు బద్దుడు. ఇప్పుడు, ఆయన ఆజ్ఞను నాకు ఇచ్చియున్నాడు అని మీకు నేను చెప్పియున్నాను. ఇప్పుడు, లోకము దానిని ఎరుగును, విజ్ఞాన శాస్త్రము దానిని ఎరుగును, ప్రభువు యొక్క దూత దానిని నిరూపించెను, మరియు ఫలితములు కూడా ఇది సత్యమని నిరూపించాయి.
96
మనము రోగ ప్రపంచంలో జీవించుచున్నాము. ఎందరికో ప్రార్థించవలసి ఉన్నది. నిశ్చయముగా దాని ప్రక్కన మరియొక మార్గము ఉన్నదని నేను అనుకుంటున్నాను...
ఒకసారి సహోదరుడు మూర్ ఈ విధంగా నాతో అన్నారు... అక్కడ ఒక చిన్న పేద అవిటి బాలిక, పాకుకుంటూ భవనము పైకి వచ్చుచున్నది. ఆ పేద బాలిక నేనున్న చోటకి వచ్చి, నిలబడటానికి ప్రయత్నిస్తున్నది. నేను క్రిందికి చూసాను. ఆ బాలిక ఏడ్వసాగింది. వారు ఆమెను లైనులో తీసుకురాలేక పోయారు. ఆమె యొద్ద ప్రార్ధనా కార్డు లేదు. ఆ రాత్రే ఆ బాలికకు చివరి రాత్రి అని, ఆమెను వరుసలో తీసుకొని వచ్చుటకు సహోదరుడు మూర్ మరియు ఇతరులు సహాయము చేశారు.
మరుసటి రోజు మేము కూర్చొని ఆ విషయాన్ని మాట్లాడుకున్నాము. “సహోదరుడా బ్రెన్హాం, ఆ విషయం నా హృదయాన్ని కలచి వేసిందని మూర్ గారు బాధపడ్డారు.”
నేనన్నాను, “నిన్ను బాధపరిచిందా? అది నాకేమి చేసియున్నదని నీవను కొనుచున్నావు?”
చూచారా, ఒక చిన్న అవిటి బాలిక. నన్ను చాలా గాయపరిచింది. మరియు పది సంవత్సరాల క్రితం చిన్న అవిటి బాలిక ఇల్లినాయిలో నల్లని తల, గోధుమ రంగు కన్నులు కలిగి, ప్రాకుతూ నేను నిలబడి ఉన్న స్థలము వద్దకు వచ్చుచున్నది. అక్కడున్న ద్వారపాలకులు ఆమెను తిరిగి కుర్చీలో కూర్చోపెట్టుటకు సాయపడవలసి వచ్చింది. అక్కడికి వచ్చుటకు తన కుర్చీ నుండి ప్రాకుతుంది. ఎందుకు? నీవు అనేకులను కేవలం తీసుకొని రాగలవు. నేను కొందరిని తీసివేసి, ప్రార్ధనా కార్డు లేని ఆమెను తీసుకుని వచ్చినట్లైతే, మిగతా కొందరిని బాధపరిచినవాడిని కాగలను, చూచారా. అది నిజము, ఆ విధంగా చేయలేను. నేనన్నాను, “నిశ్చయముగా దాని ప్రక్కన మరియొక మార్గము ఉన్నది.” నాకు ఇప్పుడు తెలిసినది, అప్పుడు తెలిసియుంటే బాగుండేది అని నేను ఆశించుచున్నాను. కార్యములు వ్యత్యాసముగా ఉండేవి. అది ఖచ్చితముగా వ్యత్యాసముగా ఉండేవి.
97
మీలో ప్రతి ఒక్కరూ స్వస్థపరచబడక పోవడానికి కారణం మీలో విశ్వాసం లేకపోవడమే.
ఇప్పుడు మన తలలు వంచుదాం.
మా పరలోకపు తండ్రీ, మా పరలోకపు తండ్రీ, గ్రుడ్డివారు, అవిటివారు, రోగ గ్రస్తులు నిలిచున్నారు, క్యాన్సర్, పుండ్లు, కణుతులతో చనిపోవుచున్నవారు ఉన్నారు. ప్రభువా, వారందరూ వరుసలో నిలబడియున్నారు. ఇప్పుడు నేను మీ వాక్యమును బోధించియున్నాను. మరియు మీరు గత 12 సంవత్సరాల నుండి ప్రపంచమంతా దానిని దృడపరచుచున్నారు. నేను మిమ్ములను క్షమించమని అడుగుచున్నాను. నాకు తెలుసు, అది ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదు; నేను సరిగానే చేస్తున్నాని తలంచి దానిని చేశాను. ప్రభువా, ఇప్పుడు నేను మీ వద్దకు దీనుడనై వస్తున్నాను. నేను ప్రార్ధన చేయు వారందరికి, స్వస్థత అనుగ్రహించమని, నా ప్రార్థనను దీవించమని అడుగుచున్నాను. వారి విశ్వాసమును దీవించండి. ప్రభువా, మా అవిశ్వాసమును బట్టి సహాయం చేయండి.
ఈ ఉదయకాలమున, ప్రతి ఒక్కరూ ఈ దర్శనాన్ని పట్టుకొందురు గాక. వారు దేనిని పోగొట్టుకొనకూడదు, కాని వారు దానిని లేఖనపూర్వకముగా చూచెదురు గాక. మరియు ప్రారంభములో ప్రభువు యొక్క దూత, “మోషే వలే రెండు వరములు...” ఇవ్వబడ్డాయని చెప్పిన దాని గురించి ఆలోచించండి. మరియు రెండు సంవత్సరాల క్రితం, ఒక చేయి పైనుండి క్రిందకి దిగి వచ్చి, బబులోనులో గోడ మీద, చేయి ఏ విధంగా రాసియున్నదో, ఆ విధంగా బైబిల్ లోని ఈ లేఖనాలలోని, “నేను మోషేకు తోడైయుండినట్లు, నీకును తోడైయుందును,” అను ఈ అధ్యాయమును, నాకు చూపించెను. మరియు, తండ్రి, ఈ ఉదయ కాలమున దానిని వెలుగులోనికి తెచ్చెను. ప్రభువా, దీని కొరకు మీకు కృతజ్ఞతలు. నా తప్పిదమును క్షమించండి.
ఇప్పుడు మేము ప్రార్ధనా కూటములోనికి, వెలుతుండగా, దేవుని శక్తి వరుసలో వచ్చు ప్రతి వానిని స్వస్థపరుచును గాక! ఎలాంటి ప్రత్యేకమైన అభిషేకమును గాని, ప్రత్యేకమైన మరి దేనిని అడుగక, నేను కేవలము ఒక సేవకునిలా వెళ్ళుచున్నాను. నేను మీ ఆజ్ఞను, యేసుక్రీస్తు నామములో నెరవేర్చవలెనని నేనెరుగుదును.
98
ఇప్పుడు, సహోదరుడు నెవిల్ నీవు ఇక్కడ నిలబడియున్నావా. ఇప్పుడు, ఈ యొక్క వరముతో, నూనెతో అభిషేకించుట లేదు, చూచారా. ఆయన ఏమి చెప్పియున్నారో, నేను కేవలము దానినే చేయబోవుచున్నాను. “ప్రజలు నిన్ను నమ్మేలా చేయుము, మరియు యదార్థముగా ఉండు,” అని ఆజ్ఞ చెప్పింది. మీరు నమ్ముచున్నారా? మరియు నేను యదార్థవంతుడనే. ఏదో ఒకటి జరగవలసి ఉన్నది!
సహోదరుడు నెవిల్, పాటలు నడిపించబోవుచున్నారు. నేను రోగుల కొరకు ప్రార్ధన చేయుచున్నప్పుడు, మీరు మెల్లగా ప్రార్ధించండి. [సహోదరుడు నెవిల్ “కేవలము నమ్ముము,” అనే పాట ఆరంభించారు.]
99
ప్రభువైన యేసూ, కిడ్నీలో రాళ్ళున్న ఈ స్త్రీ పై నేను చేతులు ఉంచి, యేసుక్రీస్తు నామములో వాటిని గద్దించుచున్నాను. ఆమె వెళ్లి, స్వస్థతను పొందును గాక. ఆమెన్. ఎదో జరిగినది.
మీ సమస్య ఏమిటి?
ప్రభువా, ప్రొస్టేట్ సమస్య ఉన్న ఈ సహోదరునిపై చేతులుంచుచున్నాను. దయ్యపు శక్తిని యేసుక్రీస్తు నామములో గద్దించుచున్నాను. ఆమేన్. స్వస్థత పొందుదువు గాక. నమ్ముము.
ప్రభువా, వాచిన కాళ్ళు గల ఈ నా సహోదరిపై చేతులు ఉంచి, ఆ వాపును యేసుక్రీస్తు నామములో గద్దించుచున్నాను. ఆమేన్. మనము చెప్పియున్నట్లుగానే నమ్మికతో వెళ్ళు సహోదరి.
ప్రభువా, గుండె సమస్య, మరియు ఇతర సమస్యలు ఉన్న ఈ సహోదరి పై చేతులు ఉంచి, నాకివ్వబడిన ఆజ్ఞను బట్టి యేసు నామములో గద్దించుచున్నాను.
ప్రభువా, మందగించుచున్న చూపు మరియు గుండె సమస్య నా సహోదరిపైన నా చేతులుంచి, నా కివ్వబడిన ఆజ్ఞను బట్టి యేసు నామములో గద్దించుచున్నాను. ఆమేన్. అది నయమవుతుంది. అది పరవాలేదు. ఆమెన్. నేను నా పూర్ణహృదయముతో విశ్వసిస్తున్నాను.
100
[టేపుపై విరామము ఉన్నది.] అది నిజము, నీవు వెళ్ళవలసిన సమయమైనట్లయిన, ఏదో ఒక మార్గమున వెళ్ళవలెను. అది సరియైనది. కాని, దానికి ముందు సందేహింపక, యదార్థముగా ఉన్నట్లైతే నీవు బాగుపడెదవు. అదే ఖచ్చితమైనది.
లాజరు మృతుల నుండి లేపబడెను. ఆయన మరలా చనిపోయెను. దేవుడు తన మాట చొప్పున చేయునని నిరూపించుటకే లాజరు చనిపోయి తిరిగి లేచెను. “మరియా, నీవు దీనిని నమ్ముచున్నావా? నేనే పునరుత్థానమును, జీవమునై ఉన్నాను. చనిపోయిన వారిని లేపుటకునూ ఆజ్ఞను కలిగి ఉన్నాను. నీవు దీనిని నమ్ముచున్నావా.” అని అన్నాడు.
ఆమె చెప్పెను, “అవును ప్రభువా, నీవు ఈ లోకమునకు వచ్చిన దేవుని కుమారుడవని నేనెరుగుదును.”
ఆయనిలా అన్నాడు, “అతన్ని ఎక్కడ పాతిపెట్టితిరి?” చూచారా?
అతడు మరలా చనిపోయెను. కాని తాను పునరుత్థానమును, జీవమును అని నిరూపించుటకే అతనిని తిరిగి లేపెను.
చూచారా, దేవుడు ఆయా పనులు చేయును, మరియు ప్రతి ఒక్కటి దైవక్రమములో ఉన్నది. ప్రతి ఒక్కటి పరిపూర్ణమైన క్రమములో ఉన్నదని తెలియజేయుటకు సంతోషించుచున్నాను. నీవు నమ్మినట్లైతే, నీవు అడుగు ప్రతీది ఇవ్వబడును. అదలా ఉండవలసి ఉన్నది.
101
మంచిది, ఈ వరుస అంతటినీ ముగించుచుండగా అలా ప్రార్థిస్తూ ఉండండి. దేవుడు మిమ్ములను దీవించును గాక...
ప్రభువైన యేసూ, వాక్యాన్ని భోదిస్తూ ఉండగా, ఆ సహోదరి నిలబడి వింటూ అనారోగ్యంతో ఉన్నది. ప్రభువా, వారందరిలో నుండి సందేహ సంబంధమైన మందగొండితనము తొలగిపోవును గాక! వారు లేచి అటు ఇటు తిరుగులాడక, ఆ పాత పర్వతాన్ని వదిలి యొర్దాను వైపు వెళ్ళుదురు గాక! ప్రభువా, దయచేయండి. ఈ నా సహోదరి, ఈ గడియలోనే దేవుడు స్వస్థపరచుననే మార్గములో నమ్మకముతో పయనించును గాక! యేసుక్రీస్తు నామములో. ఉత్సహించుచూ నీ మార్గములో వెళ్ళుము. దేవుడు మిమ్ములను దీవించును గాక!
ప్రభువైన యేసూ, ఆమె హృదయ కోరిక చొప్పున ఆమెకు, ఆమె కుమార్తెకు, ఆమె కుటుంబానికి దయచేయుము. యేసు నామములో ఇది పొందుకోవాలని ప్రార్ధిస్తున్నాను. నేను విశ్వసించి, నాకిచ్చిన ఆజ్ఞను బట్టి ఆమెపై చేతులు ఉంచుతున్నాను. నేను మిమ్మును విశ్వసించకపోతే, ఆమె పై చేతులుంచను. నీవు చేయవు అని నేననుకుంటే ఆమె కొరకు నేను ప్రార్ధన చేయను. కాని దేవా, నేను నమ్ముచున్నాను, ఆమె కూడా నమ్ముచున్నది. మేము ఇరువురము కలిసి దానిని మేము పొందుకుంటున్నామని విశ్వసించుచున్నాము. ఆమేన్.
102
దేవుడు నిన్ను దీవించును గాక, ప్యాట్. ప్రభువా, ఆయన తన ప్రశస్తమైన పిల్లలు రక్షించబడవలెనని కోరుచున్నాడు. వినికిడి మందగించినది, కంటిలో శుక్లము వచ్చుచున్నదని వైద్యుడు చెప్పాడు. ఆయన దేవునికి మహిమకరంగా జీవించగోరుచున్నాడు. నేను దీనిని ఆ సహోదరుడు కొరకు అడుగుచున్నాను, దయచేసి ఇవ్వండి. యేసు నామములో ప్రార్ధనను సమర్పిస్తున్నాను. ఆమేన్.
సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. సందేహింపకుము. నీవు అడిగిన దాని విషయమై విశ్వాసముంచుము.
ప్రభువా, ఇక్కడ ఉన్న ఈ పేద దీనురాలు, వాహనము లేదా ఏదో ప్రమాదము జరిగిన తన కుమారుని కొరకు నిలబడియున్నది. ప్రభువా అది అతనిని గాయపరచినది. మరియు అతను చర్మ మార్పిడి కొరకు వెళ్ళుచున్నాడు. ఈమె, ఆయన శరీరము మరియు రక్షణ కొరకు ప్రార్ధించుచున్నది. ఆమె తన ప్రియుల కొరకు ప్రార్ధించుచున్నది. ప్రభువా, ఆమె తన స్వంత నరాల బలహీనత గురించి అడుగుచున్నది, ప్రభువా, కన్నీరు కార్చుచున్నది. ప్రభువా, ఆమె యొక్క హృదయ కోరిక చొప్పున చేయుము. ఆమె బలహీనతలు తీసివేసి, బాగుపరుచుము. విశ్వాసముతో కూడిన ఈ ప్రార్ధనను, యేసు నామములో ఆమె కొరకు మీ ముందుంచుచున్నాను. ఆమేన్. సహోదరీ, దేవుడు మిమ్ములను దీవించును గాక! ప్రభువు నామములో వెళ్ళుము. దేవుడు మిమ్ములను దీవించును.
103
ప్రభువా, తనకిష్టమైన వారి రక్షణ కొరకు అడుగుచున్నది. యేసు నామములో ఆమె అడుగు దానిని దయ చేయుదురు గాక! ఆమేన్.
సహోదరీ, నమ్మిక ఉంచుము. నీవు పొందుకున్నట్లయితే, అది నీదవుతుంది. నీవు విశ్వసించినట్లైతే, అది నీ వద్దకు వచ్చును.
సహోదరుడా, ఎడ్గర్ టైలర్, నీవెలా ఉన్నావు? దేవుడు నీ హృదయమును దీవించును గాక! మంచిది ఫినిక్స్, ఆరిజోనా నుండి వచ్చావు. ఆ ప్రాంతమంతటిలో చాల వేడిగా ఉందా?
ఆ స్త్రీ, నా కూడికలో స్వస్థపరచబడినది. ఆమె ఎక్కడ నుండి వచ్చినది? అమ్మా, ఫినిక్స్ నుండియా? నీవు ఫినిక్స్ లో నివసించుదానివి కాదు. కూడిక కొరకు ఫీనిక్స్ కు వచ్చినావు.
ఎడ్, దేవుని నుండి నీకేమి కావాలని కోరుచున్నావు? ఉబ్బసం నీ నుండి తొలగించబడును. దేవుడు నిన్ను దీవించును గాక, సహోదరుడా.
ప్రియమైన దేవా, ప్రజల యొక్క భారమును బట్టి ఈ ప్రశస్త సహోదరుడు మాకు సహాయకరముగా ఉన్నాడు. ఈ దినమున అతనికి సహాయము చేయుమని నేను ప్రార్థిస్తున్నాను. వర్తమానము వినుటకు, వరుసలో నిలబడి ప్రార్థించబడుటకు, ఫీనిక్స్, ఆరిజోనా సుదూరము నుండి వచ్చియున్నాడు. అతనిని ప్రోత్సహించుము. ప్రభువా, ఇది గొప్ప త్యాగముగా కనిపించుచున్నది. అవును, అది త్యాగమే.
కాని దక్షిణ దేశపు రాణి ఒంటిపై ఎక్కి సొలోమోను యొక్క జ్ఞానాన్ని వినుటకు సహారా ఎడారిలో మూడు నెలలు ప్రయాణించింది. మరియు ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలోమోను కంటే గొప్పవాడు, పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు.
ప్రభువా, ఆయన శరీరము యొక్క అస్వస్థతను బాగుచేయమని ప్రార్ధిస్తున్నాను. ఆయన హృదయ వాంచనను దయచేయుము. ఆయనకై నియమించిన మార్గములో ఆయనను పయనించనీయుడి. దేవుని యొక్క మంచితనము ఆయనపై ఉండును గాక. ఈ నా సహోదరుని దీవించమని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్.
ఎడ్, నీవు తిరిగి వెళ్ళునప్పుడు పొందుకొని వెళ్ళుము. అది నీది. దానిని నీకిచ్చుచున్నాను. వెళ్ళు మరియు దానిని పొందుకొనుము.
104
సహోదరుడా, జార్జి, దాదాపుగా ప్రతి ఒక్కరూ జార్జి రైట్ ను ఎరుగుదురు. ఆయన ఇటీవలే చనిపోయే స్థితికి చేరిన విషయం మీలో ఎంత మందికి తెలుసు? డాక్టర్లందరూ ఆయనను చూసారు. గుండె వద్ద రక్తం గడ్డకట్టుట వలన, ఆయన శరీరము ఉబ్బిపోయింది. అనేక డాక్టర్లు ఆయనకేమీ చేయలేకపోయారు. ఆయన కొరకు ప్రార్థించుటకు నేను వెళ్ళాను. కొంత సేపటి వరకు సహోదరుడు ఫంక్ ఇక్కడే కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో ఈయన కూడా అక్కడ ఉన్నారని నమ్ముచున్నాను. నేను అక్కడ, ఒక కొండ క్రింద కూర్చొని, వేటకు వెళ్ళుచున్నవాని వలే ప్రవర్తించుచున్నాను.
నేను ఇక్కడ ఉన్న సంఘానికి, జరుగుతున్న ఎన్నో సంగతులను చెప్పవలెనని ఉన్నాను. అనేకసార్లు నేను వేటాడుతున్నానని మీరు అనుకొనుచున్నారు. నేను వేటాడుటలేదు. ప్రజలు నన్ను వెంబడించకుండా అదొక కారణం, నేను ఒంటరిగా దేవునితో గడుపుటకు అక్కడకు వెళ్ళవలసి ఉన్నది. స్నేహితులారా, నేను అన్నివేళలా వేటాడుటలేదు. నేను వేటాడుతున్నాను, కాని అలాంటి వేట కాదు.
కుందేలును వేటాడువాని వలె నేను కొండపై కూర్చొన్నాను. ఇంటి చుట్టూనూ, వెనుక తిరుగుచూ చేతులు జోడించి పదే పదే ప్రార్ధిస్తున్నాను. చనిపోవుచున్నాను! ఒకరాత్రి పరిశుద్ధాత్మ నాతో మాట్లాడెను, “స్వస్థత నిజమైనది కాదని నమ్మే సంఘము నుండి ఒక వ్యక్తి వచ్చును.”
ఒక పరిచారకుడు ఇటీవలే ఆయన ఇంటికి వచ్చి, నాతో వాదనకు ప్రయత్నించాడు. ఇక్కడ మీలో అనేకులు ఆ రోజు రాత్రి నాతో ఉన్నారు. అక్కడ చూడండి, ఆ మనిషి దాదాపుగా తన మతిని కోల్పోయాడు. చివరకు ఆయన ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుటకు ప్రయత్నం చేస్తున్నాడు. [“అతను కలిగియున్న వారిలో నేను మంచి స్నేహితుడనని, రైట్ సహోదరుడు చెప్పుచున్నాడు.”] దానిని గూర్చి ఆలోచించండి.
105
ఒక మనిషి నాతో వాదించడానికి అక్కడ నిలబడి, “మొదటిగా నేను నీకు ఒకటి చెప్తున్నాను, నీవు దయ్యానికి చెందినవాడవు.”
నేనన్నాను, “నేను నిన్ను క్షమిస్తున్నాను, ఎందుకనగా నీవేమి మాట్లాడుచున్నావో నీవెరుగవు.”
కాబట్టి, అప్పుడు అతను వెనుకకు తిరిగి, “నీవు క్రీస్తు యొక్క ఆత్మను పొందియున్నావని నాకు తెలుసు,” అని అన్నాడు.
అప్పుడు నేనన్నాను, “కొన్ని క్షణాల క్రితం నేను ఒక దయ్యాన్ని, ఇప్పుడు నేను క్రీస్తుకు సంబంధించినవాడనని అంటున్నావు. అందులో ఏది? కాబట్టి ఇప్పుడు.... భయంకరమైన సంగతులు జరిగెను.
ఈ మనిషి మరణశయ్యపై ఉన్నాడు, మరియు అతనివైపు నవ్వుతూ, “వెళ్ళు, ఆ స్వస్థపరచు సేవకుడిని తీసుకొని రా,” అని అన్నాడు.
ఎక్కడైతే ఒక స్త్రీ క్యాన్సర్ నుండి స్వస్థత పొందినదో అక్కడ, కెంటకీలోని, లెక్సింగ్టన్ లో ఉంటిని. ప్రభువు దర్శనమిచ్చి తాను ఉదయం ఐదు గంటలకు వస్తున్నట్లు చూపించారు. ఆయన నాకు దర్శనములో, “నీవు సహోదరుడు జార్జి రైట్ చేతిని కరచాలనం చేస్తావు. గుడారము నుండి బయటకు వచ్చి, నీ చేతిని కూడా కరచాలనం చేస్తావు. మరియు, దానిని అతను ఎగతాళిగా తీసుకుని, అతని సమాధిని అతనే త్రవ్వుకుంటాడు.” అది నాకు తెలియదు, అతను సమాధులు త్రవ్వువాడు అని నాకు తెలియదు.
106
నేను సహోదరి రైట్ ని పిలిచాను. ఆమె ఇక్కడే ఎక్కడో కూర్చొనియుండి యుంటారు. సహోదరి రైట్ ని పిలిచాను. నేను, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును కలిగియున్నాను,” అన్నాను. మంచిది. నేను అప్పుడు వరుసగా దర్శనములు చూశాను. నేను ఎవరికైనా, ఏమైనా చెబితే అది ఆ విధంగానే జరిగింది. “సహోదరుడా జార్టీ రైట్ గారు, తనను ఎగతాళి చేసినవాని సమాధిని త్రవ్వుతారు. ఆయన గుడారానికి వస్తారు, ఆయన చేతిని కరచాలనం చేస్తావు.” మరియు ఆ గడ్డ కట్టిన రక్తం సహోదరుడు జార్జిను విడిచింది.
ఒక నెల లేదా రెండు నెలల తర్వాత నేను మళ్ళీ వచ్చాను. మరియు ఆయన ఎల్లప్పుడూ, స్థిరముగా ఎల్లప్పుడూ ఈ మార్గము గుండా వస్తాడు. కాని ఆ ఉదయమున అయన ఈ మార్గమున వచ్చెను. జనులు ఉన్నారు, నేనన్నాను, “చూడండి, చూడండి, చూడండి! ఆయన ఇలా వచ్చాడు. ఇక్కడ, ఖచ్చితముగా ఆయనెలా చెప్పాడో అలాగే.”
ఆయన ఈ రోజు ఇప్పుడు మనతో ఉన్నారు. అది [సహోదరుడు రైట్ అంటున్నారు, “తొమ్మిది సంవత్సరాలు”] తొమ్మిది సంవత్సరాల క్రితం. [“నాకున్న తొమ్మిది రక్తపు గడ్డలు పోయినాయి,” అన్నారు.] తొమ్మిది సంవత్సరాల క్రితం, తొమ్మిది రక్తపు గడ్డలు!
107
అదే విధంగా నేను విన్నాను, సహోదరి హికర్సన్...... సహోదరుడా హికర్సన్ ఇక్కడ ఉన్నారా? సరే, ఇప్పుడు ఆమెకు నయమైనది, అది మంచిది. తనకు కూడా కాళ్ళలో అనేక రక్తపు గడ్డలు ఉండేవి.
ఇప్పుడు ఆయనకు చేతిలో కీళ్ళ వాతమున్నది.
నా నూతన పరిచర్య ఎవరి విషయంలో పని చేసిందో, ఇప్పుడు నేను ఎవరి విషయమై సాక్ష్యము ఇచ్చానో, అతని కుమార్తె సహోదరి హట్టీ రైట్ ఇక్కడే కూర్చొని ఉన్నది. మంచిది, సహోదరి హట్టీ రైట్. నీ బాలురు మీతో ఉంటే బాగుంటుంది, వారు నీతో ఉన్నారా? [“వెనక ఉన్నారని సహోదరి హట్టీ రైట్ చెప్తుంది.”]
బాలురు ఎక్కడ ఉన్నారు? వారిద్దరూ అక్కడే వెనుక వైపున నిలబడి ఉన్నారు. ఆ ఇద్దరినీ తన తల్లి తీసుకొని వచ్చిందా? మీరెక్కడున్నారో గుర్తుపట్టుటకు మీ చేతులు ఎత్తండి? మంచిది, అక్కడ వెనుక వైపున నిలబడి ఉన్నారు. అది అద్భుతము కాదా, ఓర్విల్? నిశ్చయముగా అద్భుతమే మంచిది.
108
మంచిది.
సహోదరుడు జార్జ్. [సహోదరుడు రైట్ చెప్తున్నారు, “సహోదరుడా బిల్, నీవు నన్ను ఎరుగుదువు, నేనది నమ్ముచున్నాను.”] నీవు నమ్ముచున్నావని నాకు తెలుసు. నాకు తెలుసు, చాలా సార్లు నీ గదిలో రాత్రిపూట పండుకొని కిటికీలోంచి చూస్తూ ఆ పాత మాకింగ్ పక్షి పాటలు వింటూ ఉండేవాడిని. ఒక రోజున మేము జార్జ్ రైట్ గారి దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది. అప్పటివరకు దేవుడు మాతో ఉన్నాడు. తరువాత కూడా ఉన్నాడని నాకు తెలుసు. గాఢాంధకారపు లోయలో సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాతో కూడా ఉన్నావు.“ ఆ వృద్ధులు, యవ్వనస్తులుగా మారిన ఆ దర్శనము నేను చూసి ఎంతో కాలము కాలేదు. అలాగున ఒక రోజు మిమ్మును చూసెదను.
మా పరలోకపు తండ్రి, ఈ సహోదరుని హృదయ వాంఛను దయ చేయండి. ఈ కీళ్ళ వాతమును స్వస్థపరచండి. ఆయన ముసలివాడు అగుచున్నాడు. తండ్రి, అతనికి సహాయం చేయవలెనని ప్రార్థిస్తున్నాను. సహోదరి రైట్ గారికి, చిన్న ఎడిత్ కి మరియు వారి కుటుంబానికి సహాయం చేయండి. తండ్రి, సహోదరి హట్టీ, ఆమె పిల్లలు, వారి ప్రియమైన వారందరికీ మీరు తోడైయుండండి. ఈ విన్నపాన్ని అంగీకరించండి. యేసు నామములో దీనిని నేను అడుగుచున్నాను. ఆమేన్.
[సహోదరుడు జార్జ్ రైట్ అంటున్నారు, “నాకిప్పుడు 79 సంవత్సరాలు.”] 79 సంవత్సరాలు. దేవుడు మిమ్ములను దీవించును గాక! సహోదరుడా రైట్, మరియు అలాంటి రోజులను ఎన్నో ఇచ్చును గాక. ప్రభువుకు స్తోత్రములు.
109
సహోదరుడు డాల్టన్. మై, మై! నాకు ప్రశస్తమైన సహోదరుడు ఇక్కడున్నాడు. ఏమి జరిగినదో నేను మీకు చెప్తాను. నాకు బాగా వివరించడానికి సమయం లేదు. ఆయన భార్యకు తెలుసు. “ఆయన చనిపోవుచున్నాడు,” అని చెప్పింది సహోదరీ, గుండె పోటుతోనా? ఆమెకు దేవుడు ఇవ్వక ముందే దాని భావము వచ్చింది. ఆయనకు గుండెపోటు రాగానే, ఆమె అలాగే ఆయన ముందు నిలబడి చెప్పింది, “నేను ధిక్కరిస్తున్నానని,” ఆమె చేయవలసిన విధమును దేవుడు ముందుగా ఆమెకు కల ద్వారా తెలియజేశారు. డాక్టర్లు ఆయన చనిపోతారని అనుకున్నారు, కాని ఆయన నేడు మన మధ్య సజీవముగా ఉన్నాడు.
ప్రభువైన యేసు, చాలా దూరం ప్రయాణించి మా ప్రశస్త సహోదరుడు, ఈ ఉదయం ఈ కూటమునకు వచ్చాడు. ఈ సహోదరునికి తుంటి దగ్గర సమస్యగా ఉన్నది. ప్రభువా, మోటారు వాహనాలలోని భాగాలు అరిగిపోయిన విధంగానే, అతని పరిస్థితి ఉన్నది. కాని ప్రభువా ఆయనకు బలముగా ఉండుము. మీ యొక్క బలము ద్వారా ఆయన బలహీనతను బలపరచుము. ఈ ప్రశస్త సహోదరునికి ఇప్పుడే స్వస్థత దయచేయండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో దీవించుచున్నాను. ఆమేన్.
దేవుడు నిన్ను దీవించును గాక, సహోదరుడా డాల్టన్. అది అలా జరుగుతుంది.
110
మంచిది, సహోదరి, ప్రభువు నీ కొరకు ఏమి చేయాలని కోరుకుంటున్నావు? [ఆ సహోదరి, సహోదరుడు బ్రెన్హాంతో మాట్లాడుతున్నది.] ఎందుకని సహోదరీ డార్టీ? ఈమె బెట్టీయేనా? [“అవును నేనే.”] బెట్టీ ఎందుకు? దేవుడు నీ హృదయమును దీవించును గాక! ఈ గుడారములో బెట్టి డార్టీ ని గూర్చి తెలియని వారెవరున్నారు? నా పాత పరిచర్య మొదటిగా పనిచేసింది ఈ చిన్న బిడ్డ పైనే. మీలో ఎంతమందికి గుర్తున్నది?
బెట్టీ వాత ఈడ్పులు జబ్బు కలిగియున్నది. ఆమె కలిగియున్న ఆ రోగముతో ఆమె కనీసం ఒక మనిషిలాగా కూడా ఉండలేక పోయింది. ఏ డాక్టర్ కూడా ఆమెకు ఏమి చేయలేకపోయాడు.
ఈ సంఘము డబ్బు సమకూర్చగా నేను సెయింట్ లూయిసకు వెళ్లాను, మరియు వేరొకరి ఓవర్ కోటు అరువు తీసుకెళ్లాను. నేను ఆ చిన్న బాలికకు ప్రార్థించుటకు అక్కడకు వెళ్ళు నిమిత్తము వారు పదకొండు డాలర్లు సమకూర్చారు. ఇక్కడ కూర్చున్న ఈ చిన్న బాలిక వలె ఆమె అప్పుడు చిన్న బాలిక మాత్రమే. (సహోదరుడు డార్టీ ఇక్కడ ఉన్నారా? ఆయన ఇక్కడ లేడు.) ప్రార్ధించాము, ప్రార్థించాము మరియు చాలా ప్రార్థించాము. నేను ఎక్కడికీ వెళ్ళలేకపోయాను. చివరిగా సహోదరుడు డార్టీ కారులో కూర్చొని వారేమి చేయవలెనో దాని కొరకు ఒక దర్శనము చూశాను.
ఆయన దర్శనములో ఎలా చెప్పారో, ఆమె కూడా అలానే చేసింది. ఆ సమయంలో ఆమె ఆలోచనలకు కొంచెం వ్యతిరేకం అనుకుంటాను. ఆమె సరిగ్గా ప్రభువు చెప్పిన మార్గములోనే సరిగా చేసింది. బెట్టీ స్వస్థపరచబడింది. మొదటి సారి నేను చూసినప్పుడు, “డార్టీ యొక్క తాత ఆ మంచమునకు చివరిన ఉన్నాడు. సహోదరుడు డార్టీ మరొక ప్రక్కన. వారు చిన్న గుడ్డ ముక్కను తీసుకొని ఆ పాప యొక్క ముఖమును, మరియు చేతులను కడగనిచ్చేవారు.” నేను ప్రార్థించాను. “పరలోకములో ఉన్న తండ్రి నీ నామమును బట్టి పరిశుద్ధ పరచబడును గాక!”
111
బెట్టీ ఇప్పుడు శుక్లాల వ్యాధితో బాధపడుతుంది. ఆమె కొరకు కొంత సమయం చెటక్యా వద్ద భవనం వెనకాల ప్రార్థించేవాడిని.
ప్రియమైన బెట్టి, మనం ఇప్పుడు నిజమైన ముగింపుకు వద్దాము. నేను నీ చేతులు పట్టుకుంటాను. చాలా కాలము నుండి గ్రుడ్డితనము ఉన్నదా? [బెట్టి డార్టీ “లేదు” అని చెప్తుంది.] నీవు కేవలము పగటి కాంతిని, చీకటిని చూడగలవు. ఇప్పుడు నీ వయసు ఎంత బెట్టీ? [“ఇరవై-రెండు.”] ఇరవై-రెండా. అప్పుడు ఆమె వయసు ఏడు లేక ఎనిమిది సంవత్సరాలు. సహోదరి డార్టీ నీవు చాలా కష్టపెట్టబడ్డావు. దేవుడి నీ కొరకు ఏదైనా ప్రత్యేకమైన కార్యము చేస్తాడని నేనెల్లప్పుడూ నమ్ముతాను. నేను నమ్ముచున్నాను, నీవు ఈ మార్గములోనే ఉన్నావు, అందుకే నీకు ఇలా జరిగినది. నేననుకుంటున్నాను, శత్రువు ఈ చెడ్డ పని చేశాడని.
ఇప్పుడు, బెట్టి నీకది తెలుసు. నాకు గనుక శక్తి ఉంటే ఆ శుక్లాలను తొలగించేవాడిని. నేను చేసేవాడను. [సహోదరి బెట్టీ డార్టీ, “అవును” అన్నది.] నాకు ఆ శక్తి లేదు.
కాని బెట్టి, మొదటిసారి నీకు చెప్పినట్లుగా అది సత్యము. క్రీస్తునందు సహోదరి, సహోదరులుగా నీవు, నేను ఇక్కడ కూర్చున్నట్లుగా, సహోదరుడు డార్టీ, నీ ప్రశస్తమైన తండ్రి, నాకు చాలా మధురమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని నేను ఇంతవరకు కలిగి ఉండలేదు. నీ ప్రియమైన తల్లి ఇక్కడ ఉన్నది. మీ ఇంటిలో నివసిస్తున్నప్పుడు మీరు తినే ఆహారాన్ని, ఇంకా అనేకమైన వాటిని నాతో పంచుకున్నారు. నీవు కూడా అలానే నా సహోదరిలా ఉండేదానవు, ఇక్కడ వెనుక వైపు కూర్చొని ఉన్న డెలోరస్ లో ఉన్నంత యదార్థత కంటే ఎక్కువైనది లేదు.
112
ఇప్పుడు బెట్టి, దేవుడు దీనిని వాగ్దానం చేసియున్నాడు. దాని మొత్తాన్ని నేను పొందుకోవాలి. నీ తండ్రి ఒక సేవకుడై ఉన్నాడు. నీవు రోగుల కొరకు ప్రార్ధించే కుటుంబములో పెంచబడ్డావు. బహుశా, నీవు కూడా అనేకుల కొరకు ప్రార్థించియుండవచ్చు. అది అటు ఇటు తిరుగుతూ ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళడము లాంటిది. మనము దాని యొక్క విలువని కోల్పోయాము. నేనేమి చెప్తున్నానో నీకు అర్ధమైనదా?
ఓ, నీవు చాలా అందమైన అమ్మాయివి, బెట్టి. నీ కళ్లు ఈ విధముగా మారటము చూడగా, చాలా సిగ్గుకరంగా ఉన్నది, మిడా ఇంకా భవనము లోపలే ఉందా? నా భార్య నిన్ను చూడాలని అంటుంది. మిడా అంటుంది, “నేను బెట్టీని చూడాలనుకుంటున్నాను. ఆమె చాలా అందమైన అమ్మాయి.” బెట్టీ, నీవొక అందమైన, చిన్న అమ్మాయివి. నీవెప్పుడూ చాలా మంచిదానివి.
ఇప్పుడు, నీ జీవితములో వైఫల్యాలు ఏమైనా ఉన్నాయా, బెట్టీ? ఇప్పుడు వైద్యులు నీ భౌతిక దేహాన్ని చూచినట్లుగా, నేను నీ ప్రాణమును చూడగోరుచున్నాను. బెట్టి, ఎక్కడైనా దేవుని విషయములో విఫలమయ్యావా? అలా జరిగినట్లయితే, దానిని ఆయనకు తెలుపుము, “ప్రభువా, దానిని మరలా చేయనిచ్చినట్లయితే, దానిని నేను చక్కగా చేస్తాను.”
113
[సహోదరి బెట్టీ డార్టీ సహోదరుడు బ్రెన్హాంతో మాట్లాడుచున్నది.]
అది విచిత్రమైన సంగతి. దానిని ఈ రీతిగా ఆలోచన చేద్దాం. బెట్టీ డార్టీ, ఈ కూడికలో ఉంటుందని భావించలేదు. కాని నాకు కలిగిన వేరొక వివేచనలో మొదటిది బెట్టీని గూర్చినది. ఈ కూడికలో కూడా తిరిగి మొదటిగా ఇది జరిగినది.
నేను దేనిని గూర్చి మాట్లాడుతున్నానో ఆమెకు తెలుసు. ఆమె వరుసలో నిలబడి ఉన్నది గనుక, మరలా వివేచనా ప్రారంభించదలచుకోలేదు. ఏమి జరిగినదో ఇప్పటికే ఆమె చెప్పినది. ఆమె బయట -సెయింట్ లూయిస్ యొద్ద నేనున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడింది. యవ్వనములో చిన్నపిల్లగా ఉన్నప్పుడు చేయకూడని పనులు కొన్ని చేసియుండవచ్చు, కాని ఎవరు చేయలేదు? ఎవరు చేయలేదు? ఆయన కృప కానట్లైతే, అందరమూ నశించిపోతాము. నీ తప్పును ఒప్పుకొనినట్లయితే, నీ పాపములను కేవలము దేవుడు నిన్ను క్షమిస్తాడు.
114
నా విశ్వాసాన్ని నేను పెంచుచున్నాను. ప్రభువా, ఈ బాలికను నీ వద్దకు తెచ్చుచున్నాను. నేను నా చేతులను ఈమె కళ్ళపై ఉంచి, శుక్లాలను నేను గద్దిస్తున్నాను, బెట్టి తిరిగి చూస్తుందని నేను నమ్ముచున్నాను. విశ్వాసము నాపై ఉండగా ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను. జీవము గల దేవుని శక్తి, దైవిక శక్తి బెట్టీ యొక్క చూపును మరల ఇచ్చును గాక. నేడో, రేపో, లేక మరెప్పుడైననూ ఆ కాంతివంతమైన కన్నులు నన్ను చూచి, “సహోదరుడా బ్రెన్హాం, నా జీవితములో ఎన్నడూ చూడలేనంత స్పష్టముగా ఇప్పుడు చూడగలుగుతున్నానని,” ఎక్కడైననూ నాతో చెప్పునప్పుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమున నా సహోదరితో మరల కరచాలనము చేయుదును గాక...
[స్పష్టతలేని మాటలు], నీవు నమ్ముచున్నావా? సహోదరి డార్టీ? అయితే అది అలాగే జరుగును గాక!
ప్రభువా, ఆమె ఇక్కడ వుండగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఆమె హృదయ వాంచ చొప్పున చేయుము. ఏ శక్తి అయితే మొదటిసారి బెట్టీని స్వస్థపరచిందో, అదే శక్తితో ఈ రెండవసారి ముట్టండి. యేసు నామములో మా సహోదరిని ఆ శక్తి స్వస్థపరుచును గాక. ఆమేన్.
115
సహోదరుడా... [ఒక సహోదరుడు బ్రెన్హాం గారితో మాట్లాడుతున్నారు] మన సహోదరుడు రక్షింపబడాలని కోరుకుంటున్నాడు. నీవు యేసుక్రీస్తును నీ స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా? ఆయన నీ కొరకు చనిపోయి, తిరిగి లేచాడని నమ్ముచున్నావా? నీవిప్పుడు ఆయనను నీ స్వంత రక్షకునిగా అంగీకరించుచున్నావా?
ఇప్పుడు పాపానికి సంబంధించిన ప్రతీ ప్రశ్న యేసుక్రీస్తు నామములో ఆయన మనస్సాక్షి నుండి తొలగిపోవును గాక! ఇప్పుడు మన సహోదరుడు. [స్పష్టతలేని మాటలు], ఇప్పటి నుండి, యేసుక్రీస్తు నామములో అతని జీవితము ఇప్పుడు క్రైస్తవ జీవితము.
ప్రజల వైపు చూసి ఇలా చెప్పు, “నేను యేసును నా స్వంత రక్షకునిగా అంగీకరింస్తున్నాను.” ఆ సహోదరుడు చాలా సంతోషిస్తున్నాడు, ఎందుకనగా ఆయన పాపములు యేసుక్రీస్తు రక్తంలో కడగబడినవి. అది మనకిష్టము. ఆమేన్. అది రెండింతల స్వస్థత లాంటిది, ఆయన పొందిన దెబ్బల చేత. [టేపుపై విరామము ఉన్నది.] ప్రభువా, ఈమెకు రక్షణ యొక్క నిశ్చయతను ఇవ్వుము. [స్పష్టతలేని మాటలు]. ప్రభువైన యేసు నామములో నీవు దానిని నమ్ముము. విశ్వాసముతో వెళ్ళుము. సందేహించవద్దు.
116
నాకు తెలిసిన విషయములకన్నా, నా సందేశము ద్వారా ఈ ఉదయ కాలమున నేను ఎక్కువగా సాధించాను. ఈ ఐదు సంవత్సరాలలో నేను సాధించిన దాని కన్నా నేను ఎక్కువగా ఆయన ఆజ్ఞనే అనుసరించాను, ఎందుకనగా ఆయన చిత్తము యొక్క ముఖ్య ఉద్దేశ్యము నేను దానిలో కనుగొన్నాను.
ఇప్పుడు, ఒక పరిచర్య నుండి మరొక పరిచర్యకు మారడము నాకు కష్టంగా తోచుచున్నది. అయితే, అది పరిచర్యను మార్చుట కాదు, గతంలోని పరిచర్యను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళుట. అది అసలైన ఆజ్ఞ. మిగిలినవి అన్నీ దానిపై కట్టబడుచున్నవి. ఇప్పుడు సమయము వచ్చియున్నది.
నా పూర్ణహృదయముతో, ప్రతి ఒక్కరూ స్వస్థత పొందాలని ప్రార్థించి, వారు బాగుపడెదరని విశ్వసిస్తున్నాను. మరియు మనము ఎన్నో ఆధారాలు కలిగియున్నాము. దృఢమైన రుజువులతో తిరిగి బైబిల్ జీవించుచున్నదని, సంవత్సరము వెంబడి సంవత్సరము ప్రతి ఒక్కటి దేవుడు మనకు చూపించుటను బట్టి ఏ విధంగా అది విఫలము కాగలదు? అది ఎంత మాత్రము విఫలము కానేరదు.
117
అది పడిపోవునట్లు చేయుటకు ఒకే ఒక మార్గము, నీవు నమ్మకుండుటయే. యేసు ప్రభువు, తనకుతానుగా వచ్చి ఇక్కడ నిలబడి నీకు ప్రార్ధన చేసిననూ, ఈ ఉదయకాలము మనము కలిగియున్న అవే కార్యముల ద్వారా వెళ్ళినప్పటికీ నీవు నమ్మకపోయినట్లైతే, ఏమియూ జరగదు, లేదా నీ విశ్వాస పరిమాణము కంటే ఎక్కువ జరగదు. అదే సమానమైన విశ్వాస పరిమాణము కలిగి నీవు నమ్మినట్లయితే, ఏమి జరుగునో అది తప్ప, అంతకంటే ఎక్కువ జరగదు. ఎందుకనగా నేను కేవలము ఆయన ప్రతినిధిని మాత్రమే. నీవలెనే నేను కూడా పాపినే, ఆయన కృప ద్వారా నేను రక్షింపబడ్డాను. కేవలము మానవ మాతృడను. ఎక్కడో ఒక చోట దేవుడు ద్వారమును తెరవవలసి ఉన్నది. అది ఆయన వాక్యము ద్వారా రుజువు చేశారు. తన పరిచర్య ద్వారా దానిని నిరూపించారు. ప్రభువు యొక్క దూత ద్వారా దానిని నిరూపించారు. అది ఇదే. ఇప్పుడు విశ్వసించుట మన పైన ఆధారపడి యున్నది.
ఇప్పుడు జ్ఞాపకముంచుకొనుడి, ఒక చిన్న పిల్లవాని వలె. ఏదైనా ఒక బాధ ఉన్నట్లయితే, అది ఇక ఉండదు. వ్యాధి అయితే, ఇకనూ అది అక్కడ ఉండదు. అడగబడుచున్న దానికి విరోధముగా ఏ చిన్న రోగ లక్షణమైనా ఉన్ననూ, దానిని లక్ష్యపెట్టనక్కర లేదు. దేవుని వద్దకు వచ్చు ప్రతి కుమారుడును పరిశోధించబడాలి. మనకు విశ్వాసము ఉన్నదో, లేదో తెలిసికొనుటకు మనము పరిశోధించబడ్డాము. మీలో ప్రతి ఒక్కరికి పోరాటములు, సమస్యలు కలుగును, కాని జ్ఞాపకముంచుకొనుడి మనం ముందుకు కొనసాగిపోతున్నాము.
118
దేవుడు మిమ్ములను దీవించును గాక. నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను. మరియు నేను దేవుని సహాయమును బట్టి ఆయన సేవకుడిగా ఇంకా అనేక సంవత్సరములు ఆయనను సేవించాలని నా ప్రార్ధన. నా కొరకు ప్రార్ధించండి.
ఇప్పుడు జ్ఞాపకముంచుకొనుడి: “ఈ రాత్రికి నిజమైన జీవముగల దేవుని సంఘము యొక్క తప్పిపోని ఐదు ఖచ్చితమైన రుజువులు అనే పాఠము ఉంటుంది.” అప్పటి వరకు, ఒక్కక్షణం లేచి మీ కాళ్ళపై నిలబడండి.
ఓ, బాప్తిస్మ కార్యక్రమము ఉన్నదా? [ఉన్నదని విశ్వసిస్తున్నాను, సాధ్యమైతే ఉంటుందని సహోదరుడు నెవిల్ చెప్పుచున్నారు.] ఓ, బాప్తిస్మ కార్యక్రమము - బాప్తిస్మము కొరకు ప్రజలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? బాప్తిస్మము కొరకు ఎవరైనా ఉంటే, చేతులెత్తండి. ఒకరు, ఇద్దరు, ముగ్గురు... అవును. నేను చాలా, చాలా విచారిస్తున్నాను, సేహితులారా
ఇప్పుడు వెళ్ళదలచిన వారిని నేను పంపిస్తాను. సిద్దపడి మిగిలిన వారు బాప్తిస్మము కొరకు ఉండండి. కొద్ది సమయంలో మనకు బాప్తీస్మ కార్యక్రమం ఉంటుంది.
119
తండ్రియైన దేవా, వెళ్ళదలచిన వారిని మీ ఆశీర్వాదములతో, దీవెనలలో పంపండి. మీ కృపను వారిపై ఉంచండి. కొండ నుండి బయలుదేరి ముందుకు వెళ్ళుటకు ఈ ఉదయ కాలము సాధించిన దానంతటి నిమిత్తము మీకు స్తోత్రములు. మేము పరలోక రాజ్యములో ప్రవేశించేవరకు, ప్రతి ఎత్తులో కూడా నడవగలుగుటకు మాకు సహాయం చేయండి. ఇప్పుడు మాతో ఉండండి. ఎవరైతే తమ పాపక్షమాపణ నిమిత్తం బాప్తీస్మము తీసుకొనుచున్నారో, వారి పాపములను క్షమించండి. యేసుక్రీస్తు నామములో ఇవన్నీ మాకు దయచేయబడును గాక.
ఈ రాత్రికి మరలా మనము కలుద్దాం. ఈ రాత్రికి మీ యొక్క శక్తి మరియు దీవెనలు మాపై ఉండును గాక. ఈ రాత్రి ఒక గొప్ప రాత్రిగా ఉండును గాక. తికమకలో ఉన్నవారు, ఈ రాత్రి తిన్నగా చేయబడుదురు గాక. తండ్రీ, దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్.
మంచిది, మేము బాప్తిస్మము కొరకు సిద్దపడుచుండగా, మీకిష్టమైతే మీరు మీ సీట్లలో కూర్చొనవచ్చును.