సజీవ దేవుని నిజ సంఘము యొక్క అయిదు ఖచ్చిత గుర్తింపులు
VGR COUNT-199 నెవిల్ సోదరుడా, వందనములు, ప్రభువు నిన్ను దీవించును. ఈ రాత్రి ఇక్కడుండుట నిశ్చయంగా ఒక భాగ్యమే. ఈలాగుండునట్లు దేవుడు అనుమతించినందుకు నేనెంతో వందనములు చెల్లించుచున్నాను. కెమెరాలంటే నాకు కొద్దిగా సిగ్గు. నేను ఇష్టపడతాను..... ముందుకు కొనసాగండి, మీరు తీసికొనండి, పరవాలేదు. వాటిని నేను గమనించుచుందును. వాటిని గూర్చి నేను గ్రహిమ్పుకలిగియున్నాను.... మరియు పరవాలేదు. అది పరవాలేదు. ఇప్పుడు, చాలా వేడిగా యున్నది. ప్రభువు యొద్ద నుండి మనము రెండు అద్భుతమగు వర్తమానములు పొందియున్నాము.
2
మరియు ఇప్పుడు నేను అనుకున్నాను, ఈ రాత్రి చాలా దూరము నుండి కారు నడుపుకొని వచ్చిన నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. కొందరు బహు దూరములోని కెంటాకీ నుండి వచ్చియున్నారు. సహో వెల్చ్ ఇవాన్సు మరియు అతని కుటుంబమును చూడండి. వారు జార్ధియాలోని టిఫ్టన్ నుండి వచ్చి యున్నారు. కాలిఫోర్నియో నుండి వచ్చిన వారిని ఇచ్చట నేను కలిసికొన్నాను. ఈ చిన్న స్థలములో ప్రభువును సేవించుటకై జర్మనీ, ఇంకా ఇతర దేశముల నుండి జనులు వచ్చిరి. సహోదరి నెల్లీ కాక్స్ను నేను చూచుచున్నాను. వారి అత్త, తదితరులు ఇచ్చటున్నారని తలంచుచున్నాను. ఈ రాత్రి మరల అనేక మైళ్ళు ప్రయాణించి కెంటాకీ, జార్జియా, టెన్నీసీ, ఒహియో మొదలగు ప్రదేశములకు నా స్నేహితులు వెళ్ళవలసియున్నారు. ఇక్కడున్న ఒక సోదరుడు టెడ్ డడ్లి ఆరిజోనాలోని ఫినిక్సు నుండి వచ్చెను. ఇంకా అంత దూరము నుండి వచ్చిన వారు చాలామంది యున్నారు గాని వారందరి పేరు చెప్పలేను. వారు ఈ రోజు ఇచ్చటికి వచ్చి యున్నారు. వచ్చిన వారిలో తొంబది శాతం మంది మీద కనీసం నా చేతులయినా కలుపుట వీలుకాలేదు. షికాగో నుండి వచ్చిన నా స్నేహితులు కనబడుచున్నారు. ఈ పట్టణమునకు చెందని వారెందరో చేతులెత్తండి. జనులలో తొంబది శాతం మంది బయటి వారే.
ఇప్పుడు, దేశములోని వివిధ ప్రాంతములలోని సంఘముల నుండి స్నేహితులు వచ్చియున్నారు.
3
ఈ ఉదయకాలం చాలాసేపు ప్రసంగించాను. ఒంటి గంట వరకు రోగుల కొరకు ప్రార్ధి౦చాను. నా గొంతు బొంగురుపోయినది. కొద్దిసేపు నేను ప్రసంగించవలెను. రెండవ గేరులో వెళ్ళినట్లుగా బోధించెదను.
సహో, లీవైల్ అచ్చటున్నాడు. అతనితో కరచాలనము చేశాను, నా సహచరులలో అతడు ఒకరు. బాప్టిస్టు సంఘము, ఓహియో.
బెన్ సోదరుడా నీవేనా? (బెన్ సహోరడు “ఆమేన్” అనెను - సంపా) ఇంకా నీవు “ఆమేన్” చెప్పుట నేను వినలేదు. ఇందాకే నిన్ను గుర్తించియుండెడి వాడిని. సహో, బెన్ అందరికి తెలియును. అతడు ఈ పట్టణమునకు చెందినవాడు కాడు. నాకు తెలియదు. బెన్ సోదరుడా, నీవెచ్చట నుండి వచ్చావు? (ఇండియానాలోని నార్త్ బోర్డెన్ నుండి వచ్చాను సోదరుడా! - సంపా) బోర్డెన్ ఇండియానా,
4
మిలో ప్రతిఒక్కరిని చూచుట నాకు చాలా సంతోషము. ఇప్పుడు మిమ్మును ఎక్కువ సేపు ఉంచను. ఎందుకనగా మీరు చాలా మైళ్ళు మరల కారు నడుపుకొని వెళ్ళవలసియున్నారు. ఈ రాత్రి మీ ప్రతి ఒక్కరిని నా ఇంటికి తీసికొని వెళ్ళవలెననియున్నది. నిజంగానే ఇది చెప్పుచున్నాను. దాదాపు మూడు గంటలకు నేను వెళ్ళిపోవలెను. ఉదయం మూడు మరియు నాలుగు గంటల మధ్య నేను బయలుదేరుదును. మిమ్మును తోడు తీసికొని వెళ్ళవలెనని యున్నది. ఆర్కస్సాస్ నుండి వచ్చిన నా స్నేహితుడు. అతని భార్య కనబడుచున్నారు. ఒక రాత్రి ప్రభువు నాకు అతని గూర్చి అన్ని సంగతులు చెప్పెను. అవునా? ఆ వ్యక్తి మీరేనని తలంచుచున్నాను. చుట్టూ చూడగా క్రొత్త మరియు పాత స్నేహితులు. కావున నా హృదయ తలంపులు దేవునికి తెలియును. మిమ్మును నాతో కూడా ఇంటికి తీసికొని వెళ్ళవలెననిపించుచున్నది. మీతో కూర్చొని చక్కగా ముచ్చటించవలెనని యున్నది. కాని ఒక దినమున అలాగు చేయుదుము. “ఆలస్యమయి పోయినది. పిల్లలను తీసికొని రావలెనో, ఎవరో జబ్బుగా యున్నారు,” అని చెప్పవలసిన అవసరముండదు. ఆ గొప్ప దినమున అవన్నియూ సమాప్తమగును. చాలాసార్లు మనము కలిసికొందుమని నేను ఆశిస్తున్నాను.
5
ఇప్పుడు, అది నా యొక్క ఉద్దేశ్యము. నా దిశను కనుగొనుటకు, ఇప్పుడు నేను ప్రభువు యొద్ద కనిపెట్టుచున్నాను. ఇప్పుడు, మంగళవారము నాడు నాకు ప్రార్థన చాలా అవసరము, నా జీవితములో ఎన్నడూ అంత ప్రార్థనావసరము కలిగియుండలేదు. మీరందరూ నా కొరకు ప్రార్ధి౦చవలెనని కోరుచున్నాను. మీ ప్రార్థనలు నాకు అవసరము. తప్పకుండా మిరు నా కొరకు ప్రార్థించండి. మంగళవారము నాడు గాలి ఎటు తిరుగునో తెలియదు, కాని అది నా జీవితములో చాలా ప్రాముఖ్యమైన సంగతి. సంఘమునకు, క్రీస్తు పనికి అది చాలా ప్రాముఖ్యము. కావున నా కొరకు తప్పకుండా ప్రార్థించుట మరువవద్దు.
6
ఎటు వెళ్ళవలెనో, ఏమి చేయవలెనో నేను తెలిసికొనవలసియున్నది. నేను ప్రభువు సన్నిధిలో ఎదురుచూచుచున్నాను. ఆ సమయములో నేను ఈ ఆలయములోనే యుందును. బోధించుచూ, రోగులకు ప్రార్ధి౦చుచూ ఇక్కడే సమయమును గడుపుదును. ప్రభుత్వము ఆ పని యెడల ఒక దినమున ఇచ్చట మనమొక ఆలయమును నిర్మింపవలెను. అందరూ కూర్చొనుటకు సరిపడు చక్కని ఆలయమును నిర్మించవలెను. ప్రధాన నడవ. బాల్కనీ మొదలగునవి యుండవలెను. చాలా చక్కని ఆలయమును నిర్మించవలెను. ఎయిర్ కండిషన్ చేయవలెను. అప్పుడు జనులు చక్కగా కూర్చోగలరు. వర్తమానములను వినగలరు. వారందుకు అనుమతి ఇయ్యవలెను. వారేమి ఆపరని తలంచుచున్నాము. మా కొరకు ప్రార్థించండి.
7
ఈ ఉదయము నేను వాగ్దానము చేసిన అంశమునే ఈ రాత్రి సమీపించబోవుచున్నాము. ప్రభుని చిత్తమయితే దానిని గూర్చి చెప్పెదను. ఇది దాదాపు పఠనము వలె యుండును. ఎందుకనగా స్వరము బాగోలేదు. ఈ రాత్రి నేను మాట్లాడబోవు అంశము: “సజీవ దేవుని నిజసంఘము యొక్క అయిదు ఖచ్చిత గుర్తింపులు” నిజసంఘము యొక్క ఐయిదు ఖచ్చితమగు ప్రత్యక్షతలు లేదా గుర్తింపులు, నిజసంఘమునకు చెందినవి.
8
ఈ మహా గొప్ప అంశమును మనము సమీపించు ముందుగా ప్రార్థన చేసికొందము. మన సంఘ కాపరియగు సహో నెవిల్ను ఇక్కడికి వచ్చి చెప్పుకొననైయున్న దేవుని వాక్యము కొరకు ప్రార్థించమని అడుగుచున్నాను. మనము త్రిప్పుచుండగా, మనమందరమూ, పరిశుద్ధ మత్తయి, పదహారవ అధ్యయము, పదుఎనిమిది వచనము. ప్రరంభి౦చుటకు 16, మరియు 18, సహోదరుడు నెవిల్ ఆదరణ ప్రర్ధన కోరకు వచ్చుచుండెను.
[సహోదరుడు నెవిల్ ప్రార్ధనలో నడిపించుచుండెను.] ఆమెన్. (కావలిసినంత శబ్దము పెట్టబడి ఉన్నది. అది మొత్తము. మైకు బాగా ఉందా?) మీరు బాగా వినగలుగుతున్నారా. వెనకాల ఉన్నవారు, మీరు వినగలుగుచున్నారా? మంచిది.
9
ఇప్పుడు మత్తయి సువార్త 16 వ అధ్యాయము, 17 వచనము మరియు 18 వచనము చదువుదము.
అందుకు యేసు - సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనే కాని నరులు నీకు బయలుపరచలేదు.
మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.
దేవుడు తన వాక్యమును ఆశీర్వదించును గాక!
10
“సంఘము” అను మాట ఈ రాత్రి నేను మాట్లాడుటకు ఎన్నుకొనిన అంశములలో ఒకటి ఇదే. సంఘమనగా ఏమిటి? దానినెవరు స్థాపించిరి? దాని యొక్క వర్తమానమేమిటి? దానిలో మనము ఏవిధంగా సభ్యులము కాగలము? దానిలో సభ్యులము కాకుండా మనం పరలోకము వెళ్ళగలమా? ఈ ఒక్కొక్క దానిని గూర్చి మాట్లాడుకొనవలెనన్నచో కొన్ని గంటలు పట్టును. ముందుకు, వెనుకకు చూడవలెను. కాని నేను కొన్ని మూల సూత్రములను చెప్పగోరుచున్నాను. నిజమైన సంఘము ఏమిటో చూపించగోరుచున్నాను. మీరు బైబిలును తీయుడి.
11
మొదటగా సంఘము అను మాటను చూద్దాం. అనగా ''బయటకు పిలువబడిన వారు“ అర్థము. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నంత కాలము దేవుని సంఘముగా పిలువబడలేదు. వారు దేవుని ప్రజలైయుండిరి. దేవుడు వారిని ఐగుప్తు నుండి బయటకు పిలచినప్పుడు, వారు దేవుని సంఘమయిరి. ఎందుకనగా వారు బయటకు పిలువబడిరి. ఈ నాటికిని అది ఆ విధంగానే నిలచియున్నది. సంఘము అను మాటకు ”బయటకు పిలువబడిన వారని“ అర్థము, వారు బయటకు పిలువబడిరి, ప్రత్యేకించబడిరి, వేరు చేయబడిరి.
12
ఇప్పుడు, పాత నిబంధనలో తెలయబడిన సంఘమును “దేవుని రాజ్యము” అని పిలచిరి. దేవుని రాజ్యము. దీనిని నేను బైబిలు వృత్తాంతము నుండి సంగ్రహించియున్నాను. పాత నిబంధనలో దేవుని సంఘమును “దేవుని రాజ్యము” అనిరి. ఇంకో విధంగా చెప్పవలెనన్నచో దేవుడు ఒక రాజు, సంఘము ఆయన అధికారములో ఉన్నది. పాత నిబంధనలో దానిని దేవుని రాజ్యమనిరి.
క్రొత్త నిబంధనలో దానిని “మెస్సీయా సామ్రాజ్యము,”(Messianic Empire) అనిరి. ఓ, మెస్సియా అంటే నాకు ఇష్టము! ఇంకా వేరేవిధముగా మెస్సియా రాజ్యము, ఎక్కడైతే మెస్సీయా దానిని పరిపాలించి ఏలును. ఏ శాఖాభేదములు లేవు, మెస్సియా ఆయన రాజ్యమును ఏలును. అది అద్భుతమైన ఆలోచన కాదా? మెస్సీయా రాజ్యము. కావున, సంఘమనునది ఒక సంస్థ కాదు, సంఘమనగా మానవ గుంపు కాదు. సంఘమనగా మరియొక రాజ్యములో సేవ చేయుటకు లోకములో నుండి బయటకు పిలువబడిన దేవుని ప్రజలు.
13
ఇది తగిన విధముగా చెప్పబడును. కొన్ని నెలల క్రితం నేను, నా భార్య ఒక షాపింగ్ సెంటర్కు వెళ్ళాము. ఒక వింత సంగతి చూచాం, చిన్న లంగా ధరించిన ఒక స్త్రీ వీధిలో చూచాము. మీరు ఇది నమ్మరు. కాని ఇది నిజంగా చూచిన విషయం. అప్పుడు నా భార్య నాతో అన్నది, “మంచిది, అక్కడ వైపు చూడు.”
నేను అన్నాను, “ఆమె తప్పక క్రైస్తవురాలై యుండును. ఎందుకనగా చాలా వేరుగా కనబడుచున్నది.” అది సిగ్గుచేటు.
అప్పుడు ఈ ప్రశ్న ఎదురయినది. “బిల్, మనం క్రైస్తవులము. మనకు ఒక విశ్వాసమున్నది. మనం స్త్రీలను అలాంటి దుస్తులు ధరించకుండా ఎందుకు అడ్డగించుచున్నాము? ఇతర సంఘముల వారు ఎందుకని అలాగు ప్రవర్తించుచున్నారు? వారు అటువంటి సిగ్గులేని దుస్తులను ధరించుచున్నారు. ఏమిటిది? వారు నీతి హీనులని చెప్పలేమా?”
“అది నిజము. నేనెవరికీ తీర్పు తీర్చలేను. కాని వారిని చూడు. వారి ఫలములను బట్టి వారిని ఎరుగుదుము. వారు నిజంగా నేరమును చేసియుండక పోవచ్చును. కాని వారి మీద ఒక ఆత్మయున్నది. అది వారిని దుర్నీతి వైపుకు నడిపించుచున్నది,” అని చెప్పాను.
14
ఇప్పుడు, యేసు ఇట్లు చెప్పెను, “ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఆమెతో తన హృదయమందు వ్యభిచరించిన వాడగును.” ఇప్పుడు, వ్యభిచరించినందుకు ఆ పాపిని ప్రశ్నించినప్పుడు అవతలి వ్యక్తి ఎవరని చెప్పును? తన్ను తాను సిగ్గు లేకుండా చూపించుకొనిన స్త్రీలు. నీవు పుష్పమంత పవిత్రురాలుగా యుండవచ్చును. నీ శీలము చాలా మంచిదే కావచ్చును. కాని నిన్నునీవు అసభ్య రీతిగా పురుషుని యెదుట కనుపరచుకొంటివి గనుక, నీవు వ్యభిచరించకపోయినా, అమాయకురాలివైనా, అవతలి వ్యక్తి చెడ్డగా ఆలోచించుటకు నీవే కారకురాలివి గనుక నీదే తప్పు, నీవే ఆ వ్యభిచార దోషమునకు కారకురాలివని యేసు చెప్పెను. వ్యభిచారిణి ఎన్నడూ పరలోకములో ప్రవేశించనేరదు.
15
కాని, నేను ప్రపంచ పర్యటన చేయుచున్నప్పుడు ప్రతి దేశమునకు దాని దాని స్వంత ఆత్మ ఉండుట చూచాను. దేశములన్నియూ అపవాది అధీనములోనే యున్నవి. ప్రభుత్వములన్నియూ అపవాది ద్వారానే నడుపబడుచున్నవని బైబిలు చెప్పుచున్నది. వారు పోరాడుదురు, యుద్దములు చేయుదురు, యేసు వచ్చు వరకు అది కొనసాగును. అప్పుడాయన యుద్దము లేని రాజ్యమును స్థాపించును. భూలోక రాజ్యములన్నియూ తనవేనని సాతాను చెప్పెను. తనకిష్టమయిన రీతిలో వాటిని వాడుకొనును, యేసు క్రీస్తు ముఖము మీద ఆ మాట చెప్పెను. వారందరూ సాతాను సాధనములు. అవి సాతాను రాజ్యములు. సాతాను యేసుతో ఇట్లనెను, “నీవు నాకు మొక్కి, నన్ను ఆరాధించిన యెడల వాటినన్నింటినీ నీకిచ్చెదను.”
వెయ్యేండ్ల పాలనలో ఆయన వాటన్నింటికినీ వారసుడగునని తెలియును, కావున ఆయన అనెను “సాతానా, ఇక్కడి నుండి పొమ్ము.” ఆయనకు తెలుసు దేవుడు అన్ని రాజ్యములు ఆయనకు యిచ్చునని, అవన్నియు ఆయనవగును, మరియు అవన్నియూ ఒకే రాజ్యమగును.
16
మీరు జర్మనీకి వెళ్ళినపుడు, జర్మను ఆత్మను మీరు కనుగొందురు. మీరు ఇంగ్లాండుకు వెళ్ళండి, మీరు ఇంగ్లీషు ఆత్మను కనుగొందురు. మీరు స్వీడనుకు వెళ్ళండి, స్వీడను ఆత్మను కనుగొందురు. మీరు ఫ్రాన్సుకు వెళ్ళండి, ఫ్రెంచి ఆత్మను కనుగొందురు. మీరు అమెరికాకు రండి, ఆమెరికను ఆత్మను కనుగొందురు.
నేను కొంత కాలం క్రిందట రోమ్ లోని సాన్ అంజిలో యొద్ద ఆగాను. కాటకో౦బ్(catacomb - పూర్వపు రోమనులచే నిర్మించబడిన ఒక రకపు భూగర్భ స్మశానవాటిక)ను చూడగోరాను. నేను ఆశ్చర్యపోయాను, అస్సమతి చూపుతూ, ఒక ఆమెరికనుగా దాని ముందు నిలబడి సిగ్గుపడ్డాను. ఆ గేటు మీద ఇలా వ్రాయబడియున్నది: “ఆమెరికను స్త్రీలారా, మీరు లోనికి వెళ్ళుముందు దయచేసి బట్టలు ధరించుడి, మృతులను గౌరవించండి.” ఎప్పుడైతే దేశము దిగజారిపోయిందో, అది భయంకరము. మీరు చూడండి, ఎందుకనగా....
17
ఒకసారి నేను ఒక స్త్రీని “నీవు క్రైస్తవురాలవా?” అనడిగాను.
“నేను అమెరికనును, కాబట్టి అంతే గదా?” అన్నదామె. దానికి దీనికి ఏమి సంబంధము లేదు.
సహో, బోస్వర్త్ ఒక రాత్రి ఇట్లు ప్రశ్నించెను. “సోదరీ, నీవు క్రైస్తవురాలవా?”
“నీకు అర్థమగునట్లు చెప్పెదను, వినుము. ప్రతి రాత్రి నేను ఒక క్రొవ్వొత్తిని వెలిగించుదును,” అన్నది. దానికి క్రైస్తవ్యముతో ఏమీ సంబంధము లేదు. క్రొవ్వత్తిని కాల్చితే ఏమిటి అటువంటి కార్యములకు క్రైస్తవ్యములో చోటు లేదు. దేవుని యొక్క సంఘము అటువంటి వానితో నిర్మాణము కాలేదు.
18
ఆ స్త్రీలను అలాగు చేయవలెనని ఎన్నడూ మేము బలవంతము చేయలేదు. త్రాగవద్దనియు ప్రమాణము చేయవద్దనియు మేమెన్నడూ మగవారిని బలవంతము చేయలేదు. మేము సువార్తను ప్రకటించుచున్నాము. బైబిలు యొక్క మాదిరిని చూపించుచున్నాము. పెంతెకోస్తు విశ్వాసమును. పరిశుద్ధ విశ్వాసమును కలిగియున్నామని చెప్పుకొనుచున్న చాలామంది హృదయములలో అది లేనేలేదు. పైకి చెప్పుకొందురు. చాలామంది స్త్రీలును అదే చేయుచున్నారు. వారాలాగు చేయవలెనని మేము చెప్పినందు వలన కాదు. మాదిరిని మేము ఇచ్చుచున్నాము. బైబిలు చెప్పుచున్న దానిని చెప్పుము. వారు పరలోక సంబంధమగు ఆత్మతో జన్మించిన యెడల వారి ఆత్మ అమెరికా దేశపు వశము కాదు, జర్మనీ దేశపు వశము కాదు, అది పరలోకసంబంధమయినది అగును. అది దేవుని రాజ్యము.... ఎందుకనగా మనము మరియొక రాజ్యములో యున్నాము. అది దేవుని రాజ్యము, అక్కడ సభ్యత, పరిశుద్ధత, అధికారము నివసించును.
19
మన రాజు పట్ల మనకు శ్రద్ధ గలదు. ఆయనతో మనకు పరిచయమున్నది. ఆయనకు మనము మోరపెట్టెదము. మనకు మధ్యవర్తులు అవసరము లేదు. రాజుకును మనకును మధ్య ఏ దళారి అక్కర లేదు. యేసు క్రీస్తను ఒక నరుడున్నాడు. కావున మనం ఒక రాజ్యములో జీవించుచున్నాము. బైబిలు యొక్క పరిభాషలో దానిని “మెస్సీయా రాజ్యము అందురు,” మెస్సీయా పరిపాలించును. ఆయన ప్రతి జీవిని ఏలును, తన ప్రజల యొక్క జీవితములను అధికరముతో పరిపాలించును, వారు బయటకు పిలువబడిన వారు, ప్రతి జీవిత నడక నుండి వెలుపలకు వచ్చిరి. వారిని ఒక గుంపుగా పోగు చేయుచున్నాడు, దానిని “తన సంఘము” లేదా “తన కొరకు బయటకు పిలువబడిన వారు,” అని పిలుచుచున్నాడు. అది ఆశ్చర్యమగు సంగతి కాదా?
20
ఇప్పుడు, ఇశ్రాయేలీయులు దేవుని “ప్రజలు” (అపోస్తలుల కార్యములు 7:38 లో దానిని కనుగొందుము. వ్రాసికోవచ్చును) ఆ తరువాత వారు దేవుని “సంఘముగా” పిలువబడిరి. ఎందుకనగా దేవునితో మాత్రమే వారు నడువవలెనని వారిని దేవుడు ఐగుప్తులో నుండి బయటకు పిలచెను. లోకములో నుండియు, ఇతర సంఘములలో నుండియు, ఇతర మతములలో నుండియు వారిని పిలచెను.
ఈనాడు దేవుని సంఘము కూడా అలాగే యున్నది. లోకములో యున్న ప్రతిదానిలో నుండి బయటకు పిలువబడెను, ప్రతి మత, తెగ నుండి పిలువబడిరి. ప్రతి మతశాఖనుండియు బయటకు పిలువబడిరి. ప్రతి మతసంస్థ నుండియు బయటకు పిలువబడిరి. దేవునితో వారు నడువవలెను. బిషప్పు ద్వారా పరిపాలించబడుట కాదు. క్రీస్తు ద్వారా పరిపాలించబడుదురు. మొస్సీయా రాజ్యములో మనము జీవించెదము. క్రీస్తే రాజు, కేవలము క్రీస్తు మాత్రమే.
21
ఇప్పుడు, ఈ మెస్సీయా రాజ్యమునకు శిరస్సు క్రీస్తే, క్రీస్తు శిరస్సుగా ఉన్న రాజ్యమును మీరు సంస్థగా మార్చలేరు. క్రీస్తు శిరస్సుగానున్న రాజ్యమును మీరు శాఖగా చేయజాలరు, ఎందుకనగా క్రీస్తే రాజు, క్రీస్తు పరిపాలించు దానిని మానవ జ్ఞానమును ఆధారము చేసికొని ఒక సంస్థను తయారు చేయజాలవు. దేవుని యొక్క రాజ్యమును సంస్థగా మార్చుటకు ప్రయత్నించు ఏ సహవాసమైనా, ఏ ప్రజలైనా, ఏ గుంపు వారయినా రాజుకు విరోధులగుదురు. వారు రాజుకు విరోధముగా వెళ్ళుచున్నారు గనుక అది రాజద్రోహమగును. రాజుకు విరోధి అనగా అంత్య క్రిస్తే యగును. ఇది చాలా కరకు మాట. నాకు ఇంకొద్ది స్వరమున్నచో దానిని తేటగా చేయుదును. అది క్రీస్తు విరోధి. మీరు కొద్ది నిమిషములు నాతో గడిపినచో దానిని నేను రుజువు చేయుదును. క్రీస్తు విరోధి ఆత్మ మనుష్యులను సంస్థలలోనికి పిలచును. పలు సంస్థలు తయారు చేసి ప్రజలను త్రిప్పుచుండును. అదెన్నడూ దేవుని చిత్తము కాదు. సంస్థలను నేను గట్టిగా ఎదిరించుచున్నాను గనుక ప్రజలకు నేను నచ్చుట లేదు. నేను అందులో ఉన్న ప్రజలను నిందించుట లేదు గాని “మనమే ఆ ప్రజలము” అని వారిలో ఆధిపత్యం చేయుచున్న వారిలోని ఆత్మను.
22
దేవుని ప్రజలు బయటకు పిలువబడిన ప్రజలు. వారు ప్రతి శాఖలోను ఉన్నారని నేను నమ్ముచున్నాను. వారు కాతలిక్కులు కావచ్చు. వారు ప్రొటస్టెంటు కావచ్చు. వారు యూదులు కావచ్చు. వారు మరే విధమగు సంఘము వారయినా కావచ్చు. కాని నిజమయిన సంఘము, మర్మయుక్తముగా యున్న యేసుక్రీస్తు శరీరమే.
మర్మముగానున్న క్రీస్తు శరీరమును నీవు సంస్థగా చేయలేవు. క్రీస్తు నొద్దకు వచ్చు ప్రతి వ్యక్తి, ఆయన యొక్క మర్మమైయున్న శరీరములోనికి వచ్చుచున్నాడు. (లోకములో నుండి క్రీస్తు లోనికి వచ్చుచున్నాడు) ఈ సంఘము లోనికి నీవు వచ్చినప్పుడు ఈ శరీరములోనికి బాప్తిస్మము పొందుచున్నావు. మీరిది గ్రహించారా? మెతడిస్టు కాదు, బాప్టిస్టు కాదు, పెంతెకోస్తు కాదు, నాజరీన్ కాదు, పిలిగ్రీం హోలీనెస్ కాదు, కాతలిక్కు కాదు. యేసు క్రీస్తు యొక్క శరీరము. మరి కొన్ని ప్రశ్నలకు జవాబిచ్చు సమయములో దీనిని మరింత లోతుగా చూద్దాం. దాని యొక్క లోతయిన భాగములోనికి మనం వెళ్ళుచున్నాం. సంఘమనగా క్రీస్తు యొక్క శరీరమే.
23
ఇప్పుడు, ఆయన దానిని చాలా ఉపమానములలో, భార్య మరియు భర్తకు పోల్చెను. సంఘమును ఆయన “వధువు” అని పిలచెను. పెండ్లి కుమార్తె మరియు పెండ్లి కుమారుడు ఇద్దరు కారు గాని ఏకమై యున్నారు. ఆమె అతని శరీరములో శరీరము, ఎముకలో ఎముకయు అయియున్నది. స్త్రీ పురుషులను క్రీస్తు యొక్క మర్మమగు శరీరమునకు పోల్చబడెను. పరిశుద్దాత్మ ద్వారా వారు ఆయన శరీరములో సంపూర్ణ భాగముగా అగుచున్నారు. వారు పరిశుద్దాత్మతో నింపబడుదురు. క్రీస్తులో నుండి దేవుడు ఆత్మను బయటకు తీసి ఆయన శరీరమును తిరిగి లేపెను. దానిని ఆయన సింహాసనము మిద కూర్చోబెట్టెను. పరిశుద్దాత్మను తిరిగి పంపెను. క్రీస్తు యొక్క మర్మయుక్తమైన శరీరము తయారు అగుచున్నది, ప్రభువు యొక్క రాకడలో పెండ్లి విందునందు ఆ శరీరము ఏకమవును. దానిని ఎవరూ సంస్థగా మార్చలేరు. అది ఒక మర్మము.
24
యేసు నికోదేముతో ఇట్లనెను, “గాలి తన కిష్టమైన చోటుకు విసరును. అది ఎక్కడ నుండి వచ్చుచున్నదో, ఎచ్చటికి పోవుచున్నదో నీవెరుగవు: ఆత్మ మూలముగా పుట్టిన ప్రతివాడు అలాగే యుండును.” దానిని నీవు అర్థము చేసికొనలేవు. అది ఎచట నుండో వచ్చును. అది మెతడిస్టు కాదు, బాప్టిస్టు కాదు, పెంతెకోస్తు కాదు, మరే ఇతర సంస్థ కాదు. అది ఒక జన్మ దేవుని రాజ్యములో పుట్టుట.
దానిని సంస్థగా చేయవలెనని ప్రయత్నించ వద్దు. అలాగయితే క్రీస్తు విరోధివగుదువు. క్రీస్తు బోధించిన దానికి విరోధముగా నీవు మరేది బోధించినా క్రీస్తు విరోధివగుదువు.
25
అయితే అసలు ఈ సంస్థ ఎచ్చట ఆరంభమాయెను? యేసు ఈ భూమి మిద ఉండగా ఏ సంఘమును సంస్థగా మార్చలేదు. రాబోవు సంఘము గూర్చి ఆయన చెప్పెను. ఆయన ఏ సంఘమునూ ఎన్నడు సంస్థగా మార్చలేదు. చివరి అపోస్తలుడు చనిపోయిన కొన్ని వందల సంవత్సరముల తరువాత మాత్రమే సంఘము సంస్థగా మారుట జరిగినది. ఈ భూమి మిద మొదటిగా సంస్థ అయిన సంఘము రోమను కాతలిక్కు సంఘమే. నా వద్ద జోసెఫస్ వ్రాసిన ప్రి నైసియన్ ఫాదర్స్, పాక్స్ప్రెస్ బుక్ ఆఫ్ మార్టయిర్స్ అను గ్రంధములు, పెంబర్ వ్రాసిన ఎర్లీ ఏజస్, ఇంకా అనేక ప్రాచీన గ్రంధములు ఉన్నవి. రోమను కాతలిక్కు సంఘము సంస్థగా మారుటకు ముందు మరే ఇతర సంస్థయు ఉండలేదని చరిత్ర పుటలలో మిరు చూడగలరు. అది ఒక సంస్థగా మారి యుండెను. అది దేవునికి విరోధి.
ఇప్పుడు, ఈ విషయమును మీతో నేను చెప్పగోరుచున్నాను. అటువంటిది మరలా రానున్న యెడల, అటువంటి గొప్ప క్రీస్తు విరోధి రానున్న యెడల దేవునికి ముందుగానే తెలియదా? ఎందుకనగా ఆయన తెలియదా? అది అటువంటి భయంకర విషయము గనుక ఆయన ముందుగానే దానిని గూర్చి తన సంఘమును హెచ్చరించడా? నేనెందుకు దానిని గూర్చి అంత గట్టిగా చెప్పుచున్నానో మీరు గ్రహింతురని నమ్ముచున్నాను. సంస్టలలో యున్న ప్రజలను కాదు గాని సంస్థలను, వాటి విశిష్టతను ఎదిరించుచున్నాను. ఈ సంస్థలన్నియునూ, ఏ ఒక్కటి తీసిపోకుండా క్రీస్తు విరోధ సంస్థలయి యున్నవి.
26
“ఒక్క నిమిషం ఆగు! నీవు బైబిలు తప్ప మరేదియూ బోధించవనుకొంటాను” అని నీవందువేమో.
బైబిలునే చెప్పనీయండి. బైబిలు తీసి మనం చదువుదము. ప్రకటన గ్రంధము 17వ అధ్యాయము తీయుడి. తన సంఘమునకు, అనగా బయటకు పిలువబడిన దానికి యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఇది. ప్రకటన 17. వీలయినంత త్వరగా దీనిని తీయుదము. చదువుచున్న దానిని గమనించుదము.
...ఆ ఏడు పాత్రలను పట్టుకొని యున్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచూ ఈలాగు చెప్పెను - నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహా వేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను.
ఇప్పుడు, ఇదంతయూ సూచన ప్రాయముగా యున్నది. ఎందుకనగా ఇది ముద్రింపబడిన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత. దానిని మీరెరుగుదురా? అది దాచబడిన విషయము. మానవ తెలివితేటల ద్వారా అది బయలుపడదు. కాని పరిశుద్దాత్మ ద్వారాను, ఆత్మ వరముల ద్వారాను బయలుపరచబడును. “జ్ఞానము గలవాడు మృగము యొక్క సంఖ్యను లేఖించును. జ్ఞానము కలిగిన వాడు, జ్ఞానవరము కలిగినవాడు దీనిని చేయును,” అదే ప్రత్యక్షత.
27
ఇప్పుడు, బైబిలులో స్త్రీ అనగా సంఘమునకు సాదృశ్యము అని ఎవరికైనా తెలియును. క్రీస్తు యొక్క సంఘమును “వధువు” అని పిలచెను. “కన్యకగా నిన్ను నేను క్రీస్తుకు సమర్పించియున్నాను,” అని పౌలు చెప్పెను.
ఇక్కడ మనము ఒక మహా స్త్రీ గూర్చి చదువుచున్నాము. ఈమె చెడ్డ స్త్రీ, “ఇక్కడికి రమ్ము నేను నీకు చూపించెదనని,” యోహానుతో దూత పలికెను. “విస్తారమగు జలముల మీద కూర్చునియున్న మహావేశ్యకు తీర్పు జరుగును.” ఇప్పుడు, “ఆ స్త్రీ విస్తారమగు జలముల మీద కూర్చొనియున్నది” చాలా మర్మముగా తోచుచున్నది, కాని అదంతా ఇక్కడ ఉన్నది. దానిని బైబిలు వివరించుచున్నది. ఇప్పుడు మనం 15వ అధ్యాయము తీయుదము, కావున మనము... కాదు గాని అదే అధ్యాయములోని 15వ వచనమును చూద్దాం. ఆ “జలములు” యొక్క అర్థమును చూద్దాం.
మరియు ఆయన నాతో చెప్పెను, నీవు చూచుచున్న విస్తారమగు జలముల మీద కూర్చునియున్న మహావేశ్య, వారు ప్రజలు,... జనములు,... దేశములు, మరియు భాషలు.
28
కాబట్టి ఆ స్త్రీ కూర్చొనియున్న జలములు ఏమిటో చూచాము. దేశములు, ప్రజలను, జన సమూహములను, భాషలను అది వశములో యుంచుకొనినది. వేశ్యయగు స్త్రీ అని చూచాము, స్వాభావికముగా మనము ఎవరిని అలాగున పిలచుదుము? తన భర్త పట్ల నమ్మకముగా లేని స్త్రీని వేశ్య అందుము. అలాగున ఉన్నప్పుడే వేశ్య అనబడును. తన భర్తతో నమ్మకముగా జీవించుచున్నట్లు ఆమె నటించవచ్చును, కాని అపనమ్మకముగా జీవించును. నిజమే గదా? ఇది సంఘము గూర్చి చెప్పబడినది. క్రీస్తే తన భర్త అని చెప్పుకొనుచున్నది. కాని ఆమె బోధ ఆయన సత్యమునకు విరోధముగా యున్నది. ఆమె ఒక వేశ్య. ఆమె రాజ్యమును, ప్రజలను, జనసమూహములను వశపరచుకొనియున్నది. “నీవిచ్చటికి రమ్ము ఆమెకు జరుగబోవు తీర్పును చూపించెదను.” మనకిప్పుడు దృశ్యము అర్థమయినది.
29
..భూ రాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూ నివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులయిరి.
జారత్వమనగా ఏమిటి? “అపవిత్రత, అపరిశుద్ధతగా యుండుట.” ఆమె ఒక వేశ్య. ఆమె అపవిత్రురాలు. లోకములోని ధనవంతులందరును, రాజ్యముల యొక్క రాజులును, గొప్ప వారును, జన సమూహములును ఆమెతో వ్యభిచరించిరి. ఆమె యొక్క అపవిత్రతను స్వీకరించిరి. అదెక్కడికి వచ్చుచున్నదో మీరు చూచారా? మీరు గమనించారా?
30
ఇప్పుడు, దీనిని వ్రాసినందున నేను భాద్యుడను కాను, కాని దీనిని బోధించని యెడల నేను బాధ్యుడనవుదును. ఇపుడు మనము సంఘము గూర్చి మాట్లాడుకొనుచున్నాము. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళి చూద్దాం. గమనించండి.
అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవ దూషణ నామములతో నిండుకొని. ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని...
మనము ముందుకు వెళ్ళునపుడు నన్ను ఈ గురుతులను చూపనివ్వండి. ఇప్పుడు, రక్తవర్ణము అనగా “ఎర్రని.” ఎర్రని రంగు ఒక విధంగా మంచి రంగు. ఎర్రని రంగు మరో విధంగా చెడ్డ రంగుగా యున్నది, ఎర్ర దీపం అపాయమునకు సూచన. ఎర్రని రంగు.. ఆమె రక్తవర్ణముతో అలంకరిమ్పబదినదై(ఎర్రని, వేశ్య) మృగము మీద కూర్చొని యుండినది.
మృగము ఒక “అధికారమును” బైబిలు చూపించుచున్నది. చాలామంది దైవ సేవకులు మీరు గమనించినట్లైతే అది “సరియేనని” తల ఊపుట నాకు కనిపించుచున్నది, ఎందుకనగా వారు బైబిల్ ఉపదేషకులు. మృగము అనగా “ఒక అధికారము.” మనం బైబిల్లో ఈ మృగములను ప్రకటన 13లో, మరియు దానియేలు గ్రంధములో చూతుము, నీటిలో నుండి ఒక మృగం పైకి వచ్చినది. మృగమనగా అధికారము, జనులలో నుండి లేచుచున్న అధికారము.
31
కానీ ప్రకటన 13ను మీరు గమనించారా, అమెరికా దేశము లేచుట చూపించబడినది, ఈ ఒక్క మృగము మాత్రమే జలములలో నుండి బయటకు రాలేదు. అది భూమిలో నుండి బయటకు వచ్చినదని చెప్పబడెను. అక్కడ జనులు లేరు. అది ఈ ఒక క్రొత్త రాజ్యము. అది గొర్రెపిల్ల వలె కనబడెను, కొంతసేపటి తరువాత అది మృగము వలె మాట్లాడెను. అదే ఈ దేశము. ఇది రావలసియున్నది. ఒక దినమున వారు తప్పు చేసిన కాని వానిని ఎన్నుకొందురు. యోసేపును ఎరుగని ఒక ఫరోను వారు లేపుదురు. వారింతక ముందే ఆ ప్రయత్నము చేసిరి. ఈసారి వారు విఫలమయినచో మరోసారి దానిని చేయుదురు. కాని చివరకు అది జరుగునని బైబిలు చెప్పుచున్నది. నేను రాజకీయవేత్తను కాను. కాని ఇరు పక్షముల వారు చెడ్డవారే. నేను నా వోటును యేసు క్రీస్తుకే వేయుచున్నాను. ఆయన యందు మాత్రమే నాకు ఆసక్తి యున్నది. పిల్లలకు స్వాతంత్రయము కావలెనని మీరు ఎదురుచూచుచున్నారు. అయితే మీ కళ్ళద్దములు తుడుచుకొని చూచుట మంచిది. అదెంత సమీపముగా యున్నదో నాకు తెలియదు. ప్రార్థించండి! మంచిది.
32
[కలిగియున్నది ఏమిటి?] అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలును, పది కొమ్ములును గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని [సంఘము] చూచితిని.
“ఏడు తలలు.” ఇంకా చదివితే తెలియును. ఆ మృగమునకు ఏడు తలలున్నవి. అది ఏడు కొండల మీద గల పట్టణము. ఏడు కొండల మీద నిర్మించబడినది. స్త్రీ అనగా సంఘము, ఆ వేశ్య ప్రపంచ రాజ్యములన్నింటిని వశపరచుకొనును. ఇది వార్తా పత్రిక చదివినంత తేటగా యున్నది. చూచారా? నిశ్చయంగా
33
ఇప్పుడు....
ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణముల వస్త్రము ధరించుకొనిన [స్త్రీ అనగా సంఘము, ధనికురాలు] బంగారముతోను, రత్నములతోను, ముత్యములతోను అలకరింపబడినదై.
వారిలో ఏ ఒక్కరయినా ఆదాయపు పన్ను ఎన్నడయినా చెల్లించారేమో నాకు చేప్పండి. దేనికయినా వారు పన్ను చెల్లించారేమో చెప్ప౦డి. వారు తమ కిష్టమొచ్చిన కార్యములను చేయుదురు. అయినా గాని దేవుని బిడ్డలు అందులో యున్నారు, నిశ్చయంగా వారున్నారు.
అంతా ఒకటే.... కుండ వెళ్ళి కొప్పెరను నల్లగా ఉన్నావు అని ఎక్కిరించజాలదు. చాలాసార్లు ప్రొటస్టెంటు వారిట్లందురు. “కాతలిక్కులు వారిని చంపిరి, వీరిని చంపిరి.” జోసెఫ్ స్మిత్ను ఎవరు చంపారు? అతనితో నేను ఎకీభవించను. కాని ఈ అమెరికా దేశములో నా వలె అతనికి తనకిష్టమయిన దానిని బోధించుకొను హక్కున్నది. మొతడిస్టు సంఘము జోసెఫ్ స్మిత్ను హత్య చేసినది. సాల్ట్ లేక్ సిటీ యొద్దకు మీరు వచ్చినప్పుడు పెద్ద వ్రాత చూచుదురు, “మెతడిస్టు వారలారా, మార్మన్ పురుగులను కంట చూడండి!” మెతడిస్తు సంఘము జోసెఫ్ స్మిత్ను కాల్చి చంపెను. ప్రొటస్టెంటులే! కావున కాతలిక్కు వారిని గూర్చి అరవకండి. కొద్ది నిమిషములు చూడండి, బైబిలు కూడా అదే చెప్పుచున్నది.
34
రత్నములతోను, ముత్యములతోను అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోను, తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని యుండెను. [అవి దాని సిద్దాంతముల భూ రాజులు దానిని త్రాగుచుండిరి].
సహో జాగర్స్ యొక్క విటమిను బిళ్ళలను నమ్మిన వారున్నారు. ఒక పురుషుని పెండ్లి చేసికొని ముప్పది సంవత్సరముల పాటు కాపురము చేసి, ఎందరో పిల్లలను కనిన స్త్రీ మీద ఇతని జలము చల్లగానే కన్యక అయిపోవునని చెప్పెను. ఆ పరిశుద్ధ జలము వలన అది అగునని నమ్మువారెవరైనా యందురా? ఒకవేళ దానిని నమ్మగలిగినచో దేనినయినా నమ్మగలరు. భూరాజులు అటువంటి పనిని చేసిరి. అందువలన వారు శాంతియుత ధోరణిలో జీవించగలరు. నీవు చెడిపోతివని నీ హృదయాంతరంగములో నీవెరుగుదువు. నిన్ను శుద్ధి చేయుటకు యేసు క్రీస్తు రక్తము నీకు కావలెను. కాని ఇపుడు గ్రహించండి. అది మొదటి సంస్థాగత సంఘము. బైబిలులో చూడగలము.
35
దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడి యుండెను - మర్మము, వేశ్యలకును, భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లియైన మహాబబులోను.
ఇప్పుడు గమనించండి. మనందరమూ అంగీకరించుదుము. రోమన్ వారి యొక్క స్వంత గ్రంధములు. కాతలిక్కుల స్వంత గ్రంధములే దానిని అంగీకరించును. “ఫాక్ట్స్ఫా ఆఫ్ ఆవర్ ఫెయిత్” అను పుస్తకము నా యోద్ధ కలదు. అది మత గురువులకు మాత్రమే చెందును. నా ద్వారా ప్రభువు యొద్దకు నడిపించబడిన ఒక కాతలిక్కు దానిని నాకు ఇచ్చెను. వారి కుమారుడు కాతలిక్కు యాజకుడు. వారు ఆ పుస్తకమును తిరిగి ఇచ్చి వేయమని అడిగిరి కాని నేను దానిని రుజువుగా దాచి యున్నాను. నేను చెప్పుచున్న దానిని గూర్చి ముందు నేను యెరిగియుండవలెను. నేను ఏదయినా చెప్పినప్పుడు తప్పక నాకది తెలిసియుండవలెను. దేవుడు నన్ను దానికి బాధ్యునిగా ఎంచును.
36
గుర్తుంచుకొనండి, ఆమెను “మర్మమైయున్న బబులోను” అని పిలచెను. (అది కాతలిక్కు సంఘమని మనమెరుగుదుము). ఆమె వేశ్యలకు తల్లియని గమనించండి. వేశ్య అనగా ఏమిటి? ఈ సంస్థలన్నియూ ఎందులో నుండి వచ్చినవి? వారి తల్లిలో నుండియే వారు వచ్చిరి. అది క్రీస్తు విరోధి. ఇది సత్యము. అది క్రీస్తు విరోధి అయినచో మన సంస్థల సంగతి ఏమిటి? తల్లి, పిల్లలు ఒక్కటే. వ్యభిచరించుచూ, జారత్వము చేయుచూ, మానవ తెలివితేటల వలన పుట్టిన అబద్ద విషయములను అంగీకరించుచున్నారు. బైబిలు చెప్పినట్లే యున్నది, “హితబోధకు బదులుగా మానవ ఆజ్ఞలను బోధించుచున్నారు.” దానినే ఈనాడు మనం సంఘం అని పిలచుచున్నాము, అది దేవుని రాజ్యమునకు విరోధి.
37
పాత నిబంధనలో వలె యున్నది. దేవుడే ఇశ్రాయేలు వారి మీద రాజుగా ఉండగోరెను. ఇంకా అది సంఘము కాలేదు. ఆయనే దాని రాజు. వారికి ప్రవక్తయగు సమూయేలు ఉండెను. మంచివాడు. కాని వారు ఇతరుల వలె, అనగా పొరుగునున్న ఫిలిస్తీయుల వారి వలె రాజు కావలెనని కోరుకొనిరి.
ప్రొటస్టెంటు జనుల సంగతి ఇది. వారు కేవలం మంచిగా యుంటే చాలదు. నలుబది సంవత్సరాల క్రితం వారి మీదికి పరిశుద్దాత్మ దిగి వచ్చెను. శక్తి ప్రచురము కొనసాగినది, వారు నాట్యమాడ సాగిరి, కేకలు వేయసాగిరి, చప్పట్లు కొట్టసాగిరి, భాషలతో మాట్లాడసాగిరి. అంతటితో వారు ఊరుకొనలేదు, దానిని వారు సంస్థగా మార్చ సాగిరి. ఆ తరువాత ఒకదానిని రూపొందించిరి. దానిని సాధారణ పాలక సంస్థ అనిరి. ఆ తరువాత ఇంకొకరు యేసు క్రీస్తు నామ విషయములో మరి చిన్న వెలుగుతో వచ్చి వారు దానిని క్రొత్త ధోరణి అనిరి, మిగిలిన వారిని తిరస్కరించిరి. వారు తమ కొరకు ఒక సంస్థను తయారు చేసికొనిరి. దానిని పి. ఏ. ఆఫ్. జె.సి అనిరి. అనగా పెంతెకోస్తు అసెంబ్లీ ఆఫ్ జీజస్ క్రైస్ట్, వారి మధ్య చిన్న సంఘర్షణ మొదలయినది. ఆయన రాకడ గూర్చి భేదాభిప్రాయములు వచ్చినది. ఆయన తెల్ల గుర్రము మీద వచ్చునని కొందరు. మరో విధంగా వచ్చునని కొందరు వాదించుకొనిరి. అందువలన వేర్వేరు సంస్థలను ఏర్పరచుకొనిరి. పి.ఏ. ఆఫ్. డబ్యు అని దానిని పిలచిరి. ఆ తరువాత వారు మరల ప్రవచనము ద్వారా విడిపోయి మరో సంస్థను స్థాపించిరి. ఎన్నిసార్లు సంస్థలు ఏర్పడినా అది దేవుని చిత్తమునకు విరోధమే. అది క్రీస్తు విరోధి ఆత్మ!
38
దేవుని సంఘము స్వతంత్రముగా యున్నది. దేవుని యొక్క సంఘమునకు ఏ హద్దులూ లేవు. ఎందుకనగా సముద్రము నుండి సముద్రమునకు దేవుని సంఘము వ్యాపించియున్నది. భూమి మీద యున్న ప్రతి మనిషి ఆయనకే చెందును. అతడు కాతలిక్కు అయినా, ప్రొటస్టెంటు అయినా, మరెవరయినా గాని దేవుడు యద్ధార్ద హృదయులను వెదకుచున్నాడు. మనము ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా, నమ్మిక వలననే రక్షింపబడియున్నాము. అదే సంఘము. చూడండి, సంఘమనగా ఒక సంస్థ కాదు.
“సంస్థను” మిరు చూచిన ప్రతిసారి అది “క్రీస్తువిరోధి” అని గుర్తుంచుకొనండి అది దానిపై వ్రాయబడియున్నది. అది బైబిలులోనే యున్నది. బహు తేటగా చదువగలరు. సంస్థలకు చెందిన నా ప్రశస్త్ర స్నేహితులు చాలామంది ఇచ్చట కూర్చొనియున్నారు. మీరు క్రీస్తు విరోధులని నేను అనుట లేదు. అలాగని మిమ్మును పిలువను. కాని ఆ మొత్తం సంగతి వెనుక అపవాది యున్నట్లు అర్థమగుచున్నది. నీవు ఏదో అయిపోయినట్లు నటించకపోతే వారు నిన్ను ప్రసంగించనీయరు. అపవాది వంకరతనము కలుగచేసినది. దేశములు కూడా ఆ విధంగానే యున్నవి. దేశమునకు చెందని వానిగా నీవుండలేదు. ఎక్కడో ఒక చోట నీ దేశముండును. నీవు అమెరికనువో, జర్మనువో, మరో దేశస్తునివో అగుదువు. ఇవన్నియూ చాలా అడ్డదిడ్డముగా యున్నవి.
39
అయితే, నిజంగా తిరిగి జన్మించిన క్రైస్తవుడు, లోకము యొక్క దృష్టిలో దేశ దిమ్మరిగా లేదా పరదేశిగా కనిపించును. కాని దేవుని దృష్టిలో అతడు ప్రశస్తమయిన వాడు. హెబ్రీ 11వ అధ్యాయము లోనికి వెళ్ళుటకు సమయమున్నచో బాగుండేది. ఆ విశ్వాస వీరులను చూడండి... అబ్రహాము తన్ను ఒక యాత్రికుని గాను, పరదేశిగాను చెప్పుకొనెను. ఈ లోకము తన గృహము కాని ఏ పట్టణమునకు దేవుడు శిల్ఫియు, నిర్మాణుకుడనై యున్నాడో ఆ పట్టణము కొరకు ఎదురుచూచుచున్నట్లుగా చెప్పెను. క్రీస్తునందు చనిపోయిన మనము అబ్రహాము సంతానమై యున్నాము. వాగ్దానము ద్వారా అతనితో సహవారసులమై యున్నాము. అందువలన మనం ఏమగుచున్నాము? యాత్రికులమును, పరదేశులమును అగుచున్నాము.
40
ఇశ్రాయేలు ఇగుప్తు నుండి బయటకు వచ్చినది. అక్కడ మోయాబున్నది. అది గొప్ప సంస్థగా మారిన దేశము. ఏశావు కూడ అచ్చట ఉన్నాడు. అది పెద్ద సంస్థాపక దేశము. ఇక్కడ ఇశ్రాయేలు ఉన్నది. శాఖలు లేకుండా అది వచ్చుచున్నది. వారివురును మూలధారముగా వాక్యములోనే యున్నారు. గుర్తు౦చుకొనండి, ఇశ్రాయేలు వారివలెనె బిలాము కూడా ఏడు బలిపీఠముల మీద బలి అర్పించెను. దేవుని వాక్య ప్రకారమే చేసెను. ఏడు పవిత్ర జంతువులను అర్పించెను. ఏడు పొట్టేళ్ళు రాబోవుచున్న వానిని చూపించుచున్నవి. మూల సూత్ర రీత్యా వారిరువురూ సరిగానేయున్నారు. మూల సిద్దాంతం ఒక్కటే. కాని బిలాము దేనిని చూడలేకపోయెనో గమనించండి. ఇశ్రాయేలు వారి మధ్యగల మహోన్నతుని వారు చూడలేకపోయిరి. అది శాఖలు లేని గుంపు. వారికి సుస్థిర దేశము లేదు. అటు ఇటు తిరుగుచున్నారు. కాని వారెక్కడికో వెళ్ళు దారిలో యున్నారు.
ఈనాడు సజీవ దేవుని యొక్క సంఘము అలాగే యున్నది. అది సంస్థగా లేదు. లోకరీత్యా మాట్లాడుట లేదు. సంస్థ ముడి దానికి లేదు. కాని యేసు క్రీస్తు యొక్క శక్తి మరియు ఆత్మ కలిగి యుండి ప్రేమ అనుబంధములో యున్నది.
41
మెతడిస్టువారు మరియు బాప్టిస్టువారు ఒకరు వీపును మరొకరు తట్టుచూ “నా ప్రశస్త్ర సోదరుడా?” అనుచున్నారు. ఎందుకనగా సమ్మతించకపోతే కలిసి నడువలేమని గ్రహించియున్నారు.
“నీవు క్రైస్తవుడవా?” అని అడిగితే?
“నేను బాప్టిస్ట్ను?” అందువు. అసలు ఆ ప్రశ్నకు అది జవాబు కానే కాదు.
“నేను క్రైస్తవుడనా? లేక పెంతకోస్తునా?” ప్రశ్నకు అది జవాబు కాదు.
నీవు క్రైస్తవుడనైనచో నీవు తిరిగి జన్మించిన సృష్టివి. దేవుని యొక్క మర్మమైయున్న రాజ్యములో నీవున్నావు. ఈ లోకము యొక్క సంగతుల మీద నీ కన్నులుండవు. పైనున్న వాటి మీద నీ కన్నులుండును. నీవు సంఘములో యున్నట్లు అదే రుజువు. అదియే సంఘము, అది ఒక సంస్థ కాదు. ఎన్నడూ ఒక సంస్థగా ఉండదు. నా మాట నమోదు చేసికొనండి. సజీవమగు దేవుని యొక్క సంఘము ఏ ప్రత్యేక గుంపూ కాదు. అది సంస్థ కాదు. అది ఒక మర్మమగు శరీరముగా ఉండవలసి యున్నది. అది పరిశుద్దాత్మ కొద్దిగా సమయము తీసికొని మరి కొద్ది ముందుకు వెళ్ళి చూద్దాం.
42
సంఘము యొక్క అర్థమును మీరిపుడు చూచారా? సంఘమనగా బయటకు పిలువబడినదని భావము. వారు బయటకు పిలువబడిన జనులై యుండి మెస్సయ్య రాజ్యములో ఆ రాజు ద్వారా పరిపాలించబడుదురు. అది అద్భుతము కాదా? దానిని నేను ప్రేమించుచున్నాను. ఆ రాజ్యము మెస్సీయా సామ్రాజ్యము. మెస్సీయా రాజ్యమని ఒక రచయిత వ్రాసెను. “సజీవుడయిన దేవుని యొక్క సంఘము ఎన్నడూ సంస్థగా మారదని కూడా ఆ రచయిత వ్రాసెను. సంస్థ అనునది ఒక బూటకపు అనుకరణ.”
43
అబద్ధ సిద్దాంతములన్నియునూ అలాగే వచ్చి యున్నవి. నిజమయిన దానికి అవి అనుకరణలు, హేయము అనునది ఆ స్త్రీ పట్టుకొనియున్న పాత్రలో యున్నది అది ఆమె యొక్క అపవిత్రత. ఇప్పుడు మీరు చూడండి. పెంతెకోస్తు వారు కాతలిక్కు వారికి ఏమియు భిన్నమైన వారు కారు. పిలిగ్రీం హోలీనెస్ వారు, నాజరీనులు, బాప్టిస్ట్, మెతడిస్ట్ అందరూ ఒక్కలాంటి వారే. కాని ఆ శాఖల యొక్క సంఘములన్నింటిలోను దేవుని పిల్లలున్నారు. వారు ఈ మర్మయుక్తమగు సంఘమునకు చెందియున్నారు. వారు ఆ దేశము కొరకు ఎదురుచూచుచున్నారు. వారి హృదయము అందులోనికి ఆకర్షించబడును. అందుకు ఒక కార్యము జరుగుబోవుచున్నది.
ఈ రాత్రి నేను చాలా సంతోషముగా యున్నాను. తూర్పు, పడమరల నుండి, ఉత్తర దక్షిణముల నుండి వారు వచ్చెదరు. తమ్మును తాము వేరు చేసికొనిరి ఆరాధించిరి, ప్రభువు యొక్క రాకడ కొరకు ఎదురు చూచుచున్నారు. చివరి దినములలో అది అలాగు జరుగునని బైబిలు చెప్పుచున్నది. ఇది అక్షలారా నిజం. నిజమగు దేవుని వాక్యమును వెదకుచూ వారు తూర్పు పడమర, ఉత్తర దక్షిణముల నుండి వచ్చుదురు. ఆహారము మరియు నీరు కొరకు కరవు కాదు గాని దేవుని యొక్క వాక్యము కొరకు కరవు అని బైబిలు చెప్పుచున్నది.
వారు వచ్చి “నిన్ను చేరమని కోరుదురు. ఇందులో చేరండి. అందులో చేరండి అందురు.” దేవుని రాజ్యములో చేరుట అనునది లేదు. నీవు చేరకలిగినది ఏమియూ లేదు. సంఘము లోనికి జన్మించుట అనునది ఒక అనుభవము. అందులో చేరుట కాదు. దానిని గూర్చి మరింత వివరముగా చెప్పెదను. ఇక్కడి మరికొన్ని లేఖనములు వ్రాసియుంచాను.
44
ఇప్పుడు మనం రెండవ ఆలోచన యొద్దకు వెళ్ళుదము. దానినంతటినీ తెలిసికొనుటకు ప్రయత్నించుదము. ఈ మర్మయుక్తమగు శరీరమును ఎవరు స్థాపించిరి. దీనినెవరు ప్రారంభించిరి? యేసు క్రీస్తే, ఆయనే ఈ మర్మమగు శరీరమునకు శిరస్సు, దాని పైన ఆయనే రాజు. ఆయన తన స్వంత రాజ్యములో తన ఇష్టమును నెరవేర్చుచున్నాడు. బిషప్పు యొక్క అధికారము కాదు. చర్చి బోర్డు యొక్క నియంత్రణ కాదు. ఆయన రాజు, తన స్వంత రాజ్యములో మెస్సీయా పరిపాలన చేయుచున్నాడు. అదెప్పుడు ప్రారంభమాయెను? పెంతెకోస్తు యొద్ద పెంతెకోస్తు సంస్థ కాదు. పెంతెకోస్తు అనుభవము. అది నీలోనే ప్రారంభమగును. దాని యొక్క రాకను గూర్చి ఆయన చెప్పెను. అది జరుగునని ఆయన చెప్పెను. దాని యొక్క అవిర్భావమును ఆయన తెలియచేసెను.
45
మనమిప్పుడు లూకా సువార్త 24 వ అధ్యాయము 49 వచనము చూద్దాం. విూలో ఎవరయినా దీనిని వ్రాసికొనవచ్చును. లూకా 24:49. ఆయన చెప్పిన దానిని చూద్దాం.
ఇదిగో, నేను నా తండ్రి వాగ్దానము చేసిన దానిని మీ మీదికి పంపుచున్నాను. యోరుషలేము పట్టణములోనే మీరు పైనుండి శక్తిని పొందువరకు కనిపెట్టి యుండుడి.
ఇప్పుడు, రాబోవుచున్న సంఘము గూర్చి, రాబోవుచున్న రాజ్యము గూర్చి ఆయన వాగ్దానము చేసెను. ఇపుడు అపోస్తలుల కార్యములు 1 వ అధ్యాయము 8 వచనము చూద్దాం. ఆయన మత్తయి 16:18లో కూడా చెప్పెను గుర్తు౦చుకొనండి. ఈ బండ మీద ఆయన తన సంఘమును నిర్మించును. దాని యెదుట పాతాళలోక ద్వారములు నిలువజాలవు. మనము మరియొక అంశములోనికి వెళ్ళు ముందుగా ఈ విషయములను కొన్ని నిమిషములు చూద్దాం, మనము వేరే అంశము వెళ్ళు ముందు. అపోస్తలుల కార్యములు 1 మరియు 8:
పరిశుద్దాత్మ మీ మీదికి వచ్చిన తరువాత మీరు శక్తిని పొందెదరు. యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతమంతటిలోను మీరు నాకు సాక్షులై యుందురు.
రాబోవు రాజ్యము గూర్చి సాక్షులుగా యుందురు, ఆయన పునరుత్థానమునకు సాక్షులుగా యుందురు, ఆయన శక్తికి సాక్షులుగా యుందురు, ఆయన సజీవుడైనాడనుటకు సాక్షులుగా యుందురు. “మీరు నాకు సాక్షులు. ఇప్పుడు అపోస్తలుల కార్యములు 1:8.”
46
ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1 వ అధ్యాయము 22 వచనములో కూడా మనము కనుగొందుము. మీరు వ్రాసికొనండి. వ్రాసికొనవలసినది చాలా యున్నది. మీరిది నిశ్చయముగా ఎరుగునట్లు వ్రాసికొనండి. ఎఫెసీ పత్రిక 1 వ అధ్యాయము 22 వచనము.
మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి [ఆయన క్రీస్తు], సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.
ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది.
ఈ సంఘమును ఎవరు స్థాపించిరి? యేసు క్రీస్తు ఏ బిషప్పు కాదు. ఏ గుంపు నాయకుడు కాదు. ఏ మానవ కల్పిత అధికారము కాదు, కాని యేసు క్రీస్తు దీనిని గూర్చి చెప్పెను. ఆయన రాజ్యము శక్తితో వచ్చుచున్నదని చెప్పెను. మత్తయి 16 వ అధ్యాయము. “దేవుని రాజ్యము శక్తితో కూడా దిగి వచ్చు వరకు ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు మరణమును చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” ఆ తరువాత కొద్ది దినములకు ఆయన సిలువ మరణమును పొందెను. పరిశుద్దాత్మ దిగి వచ్చెను. “దేవుని రాజ్యము చూచు వరకు ఇచ్చట నిలబడియున్న వారిలో కొందరు మరణమును చూడరు.”
47
“నీవు మరల రాజ్యమును సమకూర్చుదువా? అని యూదులు ఆయనను అడిగిరి.
“సమయములను కాని, ఋతువులను కాని తెలిసికొను పని మీది కాదు. తండ్రి తన మనస్సులో యున్న దాని ప్రకారము చేయును. కాని మీరు శక్తిని పొందుదురు” అని ఆయన చెప్పెను. అపోస్తలుల కార్యములు 1 అధ్యాయము. “పరిశుద్దాత్మ మీ మీదికి వచ్చిన తరువాత మీరు శక్తిని పొందుదురు.” నీవు బిషప్పుగా పదవిని పొందిన తరువాత లేక బోధకునిగా పిలుపు పొందిన తరువాత, నీవు పోపుగా నియమింపబడిన తరువాత, నీవు మత గురువుగా గుర్తింపబడిన తరువాత శక్తిని పొందెదవని ఆయన చెప్పలేదు. “మీ మీదికి పరిశుద్దాత్మ వచ్చిన తరువాత మీరు శక్తిని పొందెదరు.” ఆ సాక్ష్యము కొరకు దేవుడు చూచుచున్నాడు. పరిశుద్దాత్మ వచ్చిన తరువాత సాక్షిగా ఉండెదవు. నేను బిషప్పునని సాక్ష్యము కాదు. నేను బోధకుడనని సాక్ష్యము కాదు. అయితే దేనికి సాక్ష్యము? పునరుత్థానుడైన రాజుకు సాక్షి, అది సజీవ దేవుని యొక్క నిజసంఘము. మంచిది.
48
కొలస్సి 1:17 మరియు 18 లో కూడా చూచెదము. కొద్దిసేపు దానిని మనం చదువుదము. కొలస్సీ 1:17 మరియు 18వ వచనము.
ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆదియైయుండి మృతులలో నుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.
ఈ సంఘమునకు శిరస్సు ఎవరు? యేసు క్రీస్తు. అది ఏ రాజ్యము? మెస్సీయా రాజ్యము, అది సంఘము. సంస్థ కాదు. సంఘమనగా క్రీస్తు యొక్క అదృశ్య శరీరము. దానికి క్రీస్తే శిరస్సు, అది నాకు ఇష్టము. ఆత్మ ద్వారా నడచి రాజుకు లోబడుదము. లోకమునకు వెర్రివారిగా కనిపించుదము. దేవుని దృష్టిలో ప్రశస్తమయినవారము. ఆత్మలో నడచెదము. ఇతరులు అపార్థము చేసికొందురు, నవ్వుదురు, హేళన చేయుదురు. “యేసు క్రీస్తు నందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు.” వారు మీకు ముందున్న ప్రవక్తలను హింసించిరి. భవనము యొక్క యజమానుని వారు బయల్జెబూబు అని పిలచిరి. ఆయన శిష్యులను ఇంకెంత ఫెూరముగా పిలచుదురో గదా? కాని మీరు ఆత్మ యందు నడచుకొనుచున్నారు. లోక విషయములను మీరు విసర్జించియున్నారు. ఏ బంధకములు మీకు లేవు. “కుమారుడు ఎవరిని స్వతంత్రులనుగా చేసెనో వారు నిజముగానే స్వతంత్రులు,” ఆమేన్. అది సజీవ దేవుని యొక్క సంఘము. ఆయనే దానిని స్థాపించెను.
49
ఇప్పుడు, మనము సాక్ష్యములను చూచుచున్నాము. అపొస్తలుల కార్యములు 1 మరియు 8లో ఆయనిట్లు చెప్పెను. “పరిశుద్దాత్మ మీ మీదికి వచ్చిన తరువాత మీరు శక్తినొందెదరు మీరు నా సాక్షులుగానుందురు.”
సంఘమనగా ఏమిటి? క్రీస్తు యొక్క అదృశ్య శరీరము. దానినెవరు స్థాపించిరి? ప్రభువైన యేసు స్వయంగా స్థాపించెను. అది రోమ్ యొద్ద స్థాపించబడ లేదు. ఇంగ్లాండులో జాన్ వెస్లీ ద్వారా అది స్థాపించబడలేదు. కాల్విన్ ద్వారా అది స్థాపించబడలేదు. అమెరికాలో జాన్ స్మిత్ ద్వారా అది (బాప్టిస్తు) స్థాపించబడలేదు. పెంతెకోస్తు వారి ద్వారా కాలిఫోల్నియోలో అది స్థాపించబడలేదు. అది యేసు క్రీస్తు ద్వారా స్తాపించబడెను మెస్సీయా రాజ్యమునకు ఆయనే రాజు, ఆయన ద్వారానే అది స్థాపించబడెను. ఆయనే రాజు, ఆయన రాజుగా ఉండగోరుచున్నాడు. ఆయన మనలను పరిపాలించ గోరుచున్నాడు. ఆయన ప్రభువుగా ఉండగోరుచున్నాడు.
50
ఆయనను ప్రజలు లోనికి పిలచి, చెప్పుదురు, “నేను ఆయనను రక్షకునిగా ఉండనిచ్చేదను,” కాని ఆయనను ప్రభువుగా వారు అంగీకరించరు. ప్రభువనగా “యజమాని, ఏలువాడు.” “ప్రభువా, నా హృదయములోనికి రమ్ము, నన్ను పాతాళము నుండి రక్షింపుము, కాని ఏమి చేయవలెనో మాత్రం చెప్పవద్దు,” అందురు. అది ప్రజల వైఖరి. ఆ కారణము చేతనే... బైబిలు ఈ ప్రకారము చెప్పుచున్నది, “బల్లలన్నియూ వాంతులతో నిండిపోయినవి.” మీకు వాంతి అనగా ఏమిటో తెలియునా? “కుక్క తన వాంతికి తిరిగినట్లు.” మొదటగా ఈ సంస్థలు పనిచేయనప్పుడు మరియు దేవుడు వారిని వాంతి చేసెను, వాటి యొద్దకు మరలా మీరు వెళ్ళండి, మీకు మరలా వారు మీకు వాంతి కలుగచేయుదురు. ఆయన చెప్పెను, “నీవు వెచ్చగానైనను, చల్లగానైనను ఉండిన మేలు. నీవు అలాగుండక నులివెచ్చనిగా యున్నావు గనుక, నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను.” నీవు దేవునికి వాంతి రప్పించుచున్నావు. నీవు ఆయన కడుపులో జబ్బు కలుగజేయుట వలన, మరియు మనలను ఆయన వాంతి చేయుచున్నాడు.
51
పడిపోయిన సంస్థ మరల ఎన్నడయినా లేచెనేమో నాకు చెప్పండి. అదెన్నడయినా జరిగినదేమో చరిత్రలో నాకు చూపించండి. ఒక వ్యక్తి లేచి సేవ చేయును, దేవుడతనిని దీవించును. మొదటి విషయము ఏమగునో మీకు తెలుసా? తాను దానిని చుట్టూ త్రిప్పి ఆ తరువాత అతడు జనులను సమకూర్చుకొని దానిలో నుండి ఒక సంస్థను రుపొంది౦చుకొనును, అక్కడితో అది చచ్చును. చరిత్రను చూడండి మరియు మరెన్నడయినా తిరిగి లేచెనేమో, నిరూపించండి. ఏ ఒక్కటియూ లేవలేదు. ఎందుకనగా అది క్రీస్తు విరోధి ఆత్మ అది జనులలో పని చేయును.
52
మోషేతో నుండిన వారు స్వయంగా ఏదో చేయవలెనని కోరిరి. “ప్రభువా ఈ సంవత్సరం మాకు చాలా మంది సభ్యులున్నారు.” ఎంతమంది సభ్యులుంటే నీకు ఏమి లాభము? సంఘసభ్యుల కొరకు మనము చూచుట లేదు. క్రీస్తు శరీరములోని అవయవముల కొరకు మనం ఎదురుచూచుచున్నాము. దేవుని రాజ్యములో జన్మించిన వారు కావలెను. “మానవేచ్చల వలన జన్మించిన వారు కారు గాని, దేవుని చిత్తమును బట్టి పుట్టిన వారు,” శరీరేచ్చవలన గాని, మానవ జ్ఞానము వలన గాని పుట్టిన వారు కారు.
పౌలు ఇట్లు పలికెను, “నేను ఎన్నడూ మీ మధ్యకు మానవ జ్ఞానముతో రాలేదు. దేవుని యొక్క ఆత్మతోను, ఆయన పునరుత్థాన శక్తితోను వచ్చియున్నాను. మానవుని యొక్క జ్ఞానమును గాని, చమత్కార మాటలను గాని మీ విశ్వాసము ఆధారము చేసికొనకుండా ఉండవలెనని యేసు క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తితో వచ్చియున్నాను.” అందుకొరకే ఆయన వచ్చెను. మనము కూడా అదే చేయునట్లు దేవుడు సహాయము చేయును గాక!
53
ఇప్పుడు, ప్రతి దాని గూర్చి మరీ ఎక్కువ సమయం గడుపుట నాకు ఇష్టము లేదు. ఈ సంఘము యొక్క వర్తమానము ఏమిటో కనుగొందము. ఈ సంఘము దేనిని బోధించవలెను? దాని యొక్క వర్తమానమేమిటి? ఈ సంఘముకు బోధించుకు మొదటి వర్తమానము నాకు తలంపులోనికి వచ్చుచున్నది (అదృశ్య శరీరము), మారుమనస్సు గూర్చి. ఒక నిమిషము పాటు లూకా 24 మరల చూద్దాం. మొదటగా సంఘము చేయవలసినది మారుమనస్సు పొందవలసియున్నది, అది మరుమనస్సును బోధించును. ఇప్పుడు, ఇది చివరి అధ్యాయములో యేసు వెళ్ళిపోవుచున్నాడు, భూమి మీద నుండి అదృశ్యుడగును. లూకా 24: 46. 46 వచనము నుండి మరలా చదువుదాం.
ఆయన వారితో చెప్పెను, క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు, వ్రాయబడియున్నది:
ఆయన పేరట మారు మనస్సును, పాప క్షమాపణయు యెరుషలేము మొదలుకొని ఆయన నామము అన్ని రాజ్యములలో ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. (దీనిని మీరు లోతుగా గ్రహించవలెను. “పాప క్షమాపణ” గూర్చి ఒక్క నిమిషములో తెలిసికొందుము.)... మారు మనస్సు మరియు పాప క్షమాపణ
ఈ సంగతులకు మీరే సాక్షులు.
54
[టేపు మీద ఖాళీ యున్నది — సంపా] ఆయన “శ్రమపడెనని” లేఖనములు చెప్పుచున్నవి. ఆయనను గూర్చి ప్రవక్తలు పలికిరి. బైబిల్ అ౦తయూ ఆయన గూర్చియే మాట్లాడుచున్నది. ఆయనతోనే అది ఇమిడి యున్నది. ఏమి బోధించవలెనో ఆయనకు నిశ్చయంగా తెలియును. ఏమి చేయవలెనో ఆయనకు తెలియును. యెరూషలేము మొదలుకొని అన్ని దేశములలో ఆయన పేరట మారు మనస్సును, పాప క్షమాపణయు ప్రకటింపబడును. ఇప్పుడు, సంస్థ అనునది రోమ్లో ప్రారంభమాయెను; సంఘ సంస్థ అనునది రోమ్లో ప్రారంభమైనది, మార్టిన్ లూథర్ కొరకు జర్మనీ లోనికి వచ్చినది, వెస్లీ కొరకు ఇంగ్లాండునకు, జాన్ స్మిత్ కొరకు అమెరికా దేశమునకు, పెంతెకోస్తు కొరకు కాలిఫోర్నియాకు. కాని సంఘము యెరూషలేములోనే ప్రారంభమాయెను! మారుమనస్సు పొంది, పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందుట యెరూషలేములోనే ఆరంభమాయెను. అది అక్కడ ప్రారంభమై మొత్తం ప్రపంచమునకు వ్యాపించును. అది బోధించబడవలెను. కాని చాలా కొద్దిగానే యండినది. అదే వర్తమానము. సంఘము యొక్క సందేశము అదే. దానిని బోధించుచున్న సంఘమును నాకు చూపించండి. అదెక్కడున్నదో నాకు చెప్పండి. మీరు దానిని కనుగొనలేరు.
55
ఇప్పుడు, యేసే రాజు (రెండవ వర్తమానము). యేసే రాజు మరియు సదాకాలము జీవించుచున్నాడు. మత్తయి 28:20 యేసే రాజు మరియు సదాకాలము జీవించుచున్నాడు, సంఘము దానినే బోధించవలెను. మత్తయి 28:20:
నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి: ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. (అవునా?)
హెబ్రి 13:8. “యేసు క్రీస్తు నిన్న, నేడు నిరంతరము ఏకరీతిగా యున్నాడు.” అది సంఘము యొక్క వర్తమానము: ఆయన క్రియలను చేయవలెను, ఆయన పునరుత్థానమును నిరూపించవలెను, మరియు ఆయనకు సాక్షులుగా యుండవలెను. ఇప్పుడు అపోస్తలుల కార్యములు 5:32, వారి యొద్ద అది యున్నదో లేదో మనము చూడగలము. మనము అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 32 వచనము.
మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్దాత్మయు ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి. (ఆయనకు సాక్ష్యమున్నది)
56
యోహాను 14:12. సంఘము ఏమి చేయవలెనో ఆయన బోధించెను. యోహాను 14వ అధ్యాయము 12 వచనము. దానిని మనం చదివిన యెడల తెలియును. యోహాను 14:12, కావున మనము చాదివేదము, దానిని అధికారికము చేయుదము. మంచిది.
నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలను నా యందు విశ్వాసముంచు వాడును చేయును; వాటి కంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
సంఘము యొక్క వర్తమానము అదే. “యేసు క్రీస్తు నిన్న, నేడు నిరంతరము ఏకరీతిగా యున్నాడు.” మృతులలో నుండి తిరిగి లేచి యున్నాడు. నిన్న, నేడు నిరంతరము ఏకరీతిగా యున్నాడు. అదే క్రియలను చేయుచున్నాడు. యేసు చేసిన క్రియలే చేయుచున్నాడు. అదే సంఘము యొక్క వర్తమానము. దానిని సంఘము బోధించకుండిన యెడల అది మరేదో అబద్ద వేదాంతమును బోధించుచున్నదన్న మాట. కాని యేసు బోధించమని ఆజ్ఞాపించినది ఇదే.
57
మరింకేమున్నది? ఈ ప్రజలను మనం ఏమనుకోవలెను? విశ్వాసులమని చెప్పుకొనుచున్నారు. ఆయన విశ్వాసులకు, తన సంఘమునకు ఇచ్చిన చివరి ఆజ్ఞ మనము గమనించవలెను. మార్కు 16 వ అధ్యాయము తీయుము. ఆయన తన చివరి వర్తమానమును సంఘమున కిచ్చెను. ఆయనాజ్ఞను మనం వెంబడించుచున్నామో లేదో చూద్దాం. మార్కు 16 వ అధ్యాయము 14 వచన ప్రారంభము నుండి చదువుదము:
వారు భోజనమునకు కూర్చొని యుండగా ఆయన ఆ పదునొకండు మందికి ప్రత్యక్షమాయెను. [ఆయన పునరుత్థానము తరువాత]
ఇక్కడ వినండి. ఆయన సంఘమునకు ఇచ్చిన చివరి ఆజ్ఞ. చివరి ఆజ్ఞ. మనము విశ్వాసులమో కాదో, ఈ సంఘములో మనం ఉన్నామో లేదో చూచుకుందాం.
పిమ్మట పదునొకండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠీన్యము నిమిత్తము వారిని గద్దించెను.
58
కొందరాయనను చూచిరి. దానిని గూర్చి వారితరులకు చెప్పవలెనని ప్రయత్నించిరి, దానిని వారు నమ్మలేదు. ఈనాడు కూడా ఆ విధంగానే యున్నది. ఆయన సజీవుడని మనకు తెలియును. ఆయనాత్మ మనలో యుండి సాక్ష్యమిచ్చుచున్నది. జన సమూహముల మధ్య వేలాది జనుల మధ్య ఆయన శక్తి సంచరించుట మనము చూచుచున్నాము. వారి ఆలోచనలను, హృదయములను ఆయన వెలికి తెచ్చుచున్నాడు. ఆయన ఇక్కడ ఉండినప్పుడు ఆ విధంగా చేసెను. బైబిలు దానిని గూర్చి చెప్పెను. “దేవుని వాక్యము.” ఆయనే దేవుని వాక్యము. “ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే శరీరధారియై మన మధ్య నివసించెను.” “దేవుని యొక్క వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదియై మూలుగుల లోనికిని దూరుచూ హృదయాలోచనలను, ఉద్దేశ్యములను పరిశోధించుచున్నది.” క్రీస్తు, “నేను చేయు క్రియలను మీరును చేయుదురు.” ఆయన చేయుచున్న దానిని చూడుము. దానిని ఆయన చేయుట ఎందరు చూచిరి? నిశ్చయంగా ఆయనది చేయుట మనకు తెలియును? ఆయనిక్కడ జీవించుచున్నాడు. ఆయన మన హృదయములలో యున్నాడు.
59
వారు దానిని నమ్మరు. అప్పుడు వారెట్లు నమ్మలేదో, ఇప్పుడు వీరును నమ్ముట లేదు. ఆయన చనిపోయెనని వారు నమ్మిరి. ఇక అంతే అనుకొనిరి. మనకు కొన్ని చరిత్ర సంగతులున్నవి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేచి ఒక సంఘమును స్థాపించి, ఒక నియమావళిని వ్రాసెనని చెప్పెదరు. దానిని పట్టుకొని కొందరున్నారు. అది అసత్యము! ఇది నిజము. అందులో ఏమి నిజము లేదు. దానిని చెప్పిన మనిషి ఎంతో సత్యవంతుడని మీరనవచ్చును. కాని దేవుడు తన సంఘమును ఆ విధంగా అదుపులో యుంచుకొనడు. ఆయన ఆ విధంగా ఎన్నడునూ చేయగోరడు.
60
వారు ఒక రాజు కావలెనని కోరిరి. సమూయేలు వారిని పిలచి ఇట్లడిగెను, “ఒక సంగతి మిమ్మును అడుగుచున్నాను. ఎన్నడైనా నేను అబద్దము చెప్పానా? మీ డబ్బును ఎన్నడైనా నేను అడిగానా? యెహోవా నామము పేరట నేను చెప్పినది ఎన్నడైనా జరుగకుండా పోయేనా? మీకు రాజు కావలెనని దేవుడు ఉద్దేశించుట లేదు. ఆయనే మీకు రాజుగా ఉండగోరుచున్నాడు.”
“ఓ సమూయేలూ, నిశ్చయంగా, నీవు చెప్పినది నిజమే. నీవు మంచి ప్రవక్తవు నీవు మాకు సత్యము తప్ప మరేమియూ చెప్పలేదు. నీవు ఎన్నడూ మా డబ్బును అడగలేదు. అవన్నీ నిజమే గాని మేము అ పొరుగువారి వలె ఉండగోరుచున్నాము ఏమైనా గాని మాకొక రాజు కావలెను,” అన్నారు.
సమూయేలు ఇట్లనెను, “ఇందువలన మీకు గుండెపోటు వచ్చును మరియు మీరు శ్రమ నొందెదరు. మీ కుమారులను, కుమార్తెలను అతడు బాధించును. అతడు తాను చేయు కార్యముల ద్వారా వారిని అపవిత్రపరచును. మరియు ఆయన చేసెను! అయినా గాని వారికి రాజు కావలెననిరి.
61
ఈనాడు కూడా వారదే విధంగా చేయుచున్నారు. మనకు ఏదో ఒక పేరు కావలెనని కోరుకొనుచున్నాము. ప్రజలు మనలను ప్రశ్నించినప్పుడు మనం మెథడిస్టులమనో, బాప్టిస్టులమనో చెప్పుకొనవలెనని కోరుచున్నాము. క్రైస్తవులమని చెప్పుకొనండి. అది చాలును. “క్రీస్తును పోలి” యుండండి. ఆయన మృతులలో నుండి లేచినాడన్నా వారు విశ్వసించలేదు.
మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఆయన చెప్పెను. [ఆ గొప్ప ఆజ్ఞను గమనించండి]. ఎంత వరకు వెళ్ళవలెను (“సర్వలోకమునకు” అని జనులు చెప్పిరి - సంపా.) ఓ, యెరూషలేము వరకే అనుకోకండి, సర్వసృష్టికి, సువార్తను ప్రకటించుడి....
62
సువార్త అనగా ఏమిటో ఎందరికి తెలియును? వాక్యము కాదు. పౌలు చెప్పెను, “సువార్త మనకు వాక్యములోనే అందించబడుట లేదు గాని పరిశుద్దాత్మ యొక్క శక్తి మరియు ప్రత్యక్షతల ద్వారాను వచ్చుచున్నది.” సువార్త అనగా “వాక్యమును పనిచేయునట్లు చేయు దేవుని శక్తి.” అది చెప్పిన దానిని చేయును. సర్వలోకమునకు సువార్తను బోధించుడి. తెల్ల వారికి లేదా పసుపు రంగు వారికి, లేదా గోధుమ రంగు వారికి, లేదా నల్లవారికి మాత్రమే బోధించుట కాదు. “సర్వసృష్టికి” ఆమేన్!
ప్రతి సృష్టికి బోధించవలెను! దాని భావమును మీరు నమ్ముచున్నారా? ఒక దినమున ఎద్దును దేవుడు గద్దించుట నేను చూడగలను. కందిరీగలను ఆయన కుట్టవద్దని చెప్పుట నేనూహించగలను. చనిపోయి రాత్రంతా పడియున్న జీవిని ఆయన లేపుట చూడగలము. సర్వసృష్టికి! నీవు అడిగిన ప్రతి దాని మీదను సువార్త పని చేయును.
నీవు అనవచ్చు “బ్రెన్హాం సోదరుడా? అది తప్పు.” అది తప్పు కాదు!
63
ఒక చెట్టుతో యేసు ఇట్లనెను. “నీవు శపించబడినావు, ఇక మీదట నీ ఫలమును ఎవరునూ తినరు.” ఆ చెట్టుకు సువార్త ప్రకటించబడెను. ఆమేన్! ఇప్పుడు నాకు ఆవేశము కలుగుచున్నది. ప్రతి సృష్టికి బోధించవలెను! ఆమేన్. దేనికి బోధించవలెను? సర్వసృష్టికి! ఓ, ఒకవేళ ఈ సంగతులు చెప్పుకొనుటకు సమయమున్నచో బాగుండును. ఇప్పుడు:
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించుబడును (ఓ! నేను బాప్తిస్మము పొందియున్నాను అని చెప్పవచ్చును. మంచిదే) నమ్మి బాప్తిస్మము పొందినవారు రక్షించుబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును.
“నేను విశ్వాసిని గనుక సంతోషించుచున్నాను,” అని నీవందువు ఒక్క నిమిషము ఆగుము.
ఈ మాటలను కలుపుచున్న పదమును గ్రహించుము. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. (మీరు సూచక క్రియలను నమ్మరేమో, అవి యేసు స్వంత మాటలు, ఆయనతోనే వాది౦చుడి.) ఈ సూచక క్రియలు. (“ఒకవేళ, కొన్నిసార్లు అవి పనిచేస్తాయి.” కాదు.) నమ్మువారి వలన ఈ సూచక క్రియలు వెంబడి౦చును:
నీవు నమ్ముదువో లేదో లేక నీ సంస్థ నమ్మునో నమ్మదో అది వేరే సంగతి, వారు నమ్ముచున్నామని చెప్పవచ్చును. “నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును,” అని యేసు చెప్పెను. వారా గురుతులను తిరస్కరించుచున్నారు.
...నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. (ఎంత వరకు?) నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు;...
64
దైవిక స్వస్థతను నమ్మనివారున్నారు. నమ్మని సంఘములున్నవి. (ఇది టేపగుచున్నదని మీరెరుగుదురు. నేను కేవలము మీకే ఇది చెప్పుట లేదు. మరెవరో దీనిని విందురు) దేవుని యందు, దేవుని ఆజ్ఞల యందు విశ్వాసమున్నదని చెప్పుకొనుచున్నారు. సువార్తను ప్రకటించవలసిన ఆజ్ఞ మీ సంఘమునకు ఉన్నది. దీనికి ప్రధానంగా అవసరమైనది దైవిక స్వస్థతయే. యేసు తన శిష్యులను బయటకు పంపినప్పుడు వారితో చెప్పిన మొదటి మాట ఏమిటి? మత్తయి 10:1. “రోగులను బాగు చేయుడి. దయ్యములను వెళ్ళగొట్టుడి.” ఆయన తన సంఘమునకు చివరగా చెప్పినది ఏమిటి? “రోగులను స్వస్థపరచుడి. దయ్యములను వెళ్ళగొట్టుడి.” అల్పా మరియు ఓమేగా, బెన్యామీను మరియు రూబేను, మొదటి వాడు మరియు కడపటి వాడు, భూత, భవిష్యత్, వర్తమాన కాలములలో యున్నవాడు, వేకువ చుక్క, దావీదు యొక్క వేరు మరియు చిగురు. హల్లెలూయా! అది ఆయనే. “నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నా నామమున వారు దయ్యములను వెళ్ళగొటుదురు.” యెరూషలేములో మాత్రమేనా? “సర్వ లోకములో, సర్వసృష్టికి” అదే బైబిలు కదా? అలాగే చెప్పెను అదే సంఘము యొక్క వర్తమానము. సర్వలోకము, సర్వసృష్టి అందరికి సువార్త నమ్మిన వారందరి వలన ఈ సూచన క్రియలు కనబడును.
65
నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. వారు క్రొత్త భాషలు మాట్లాడుదురు;
నాజరీను వారు వారిని “భాషల గుంపు?” అని హేళన చేసెదరు. మీరు వారిని సంఘములో కూర్చోనియ్యరు. ఎంత ఘోరము? మీరు పరలోకమునకు వెళ్ళినప్పుడు ఏమి చేయుదురు? యేసు చనిపోయినప్పుడు క్రొత్త భాష మాట్లాడెను. ఆయన మరియొక భాషలో మాట్లాడెనని వారు నిశ్చయంగా చెప్పుకొనిరి. ఆయన హెబ్రీ భాష మాట్లాడెనా? కాదు. అది హెబ్రీ రచన కాదు. ఆయన పరలోక భాష మాట్లాడెను.
66
బండ మీద హేబేలు తన గొర్రెపిల్లను అర్పించెను. ఆ చిన్న గొర్రెపిల్ల చనిపోవుచుండెను. దాని మెడ మీద నరికెను. ఏదెను తోటలోనే ఇది క్రీస్తుకు మాదిరిగా యున్నది. ఆ చిన్న గొర్రెపిల్ల, వేరే భాషలో కొట్టుకొంటూ అరచుచున్నది. చనిపోవుచున్నది. అది ఒక మాదిరి. తన స్వంత రక్తముతోనే తన ఉన్ని తడిసిపోయినది. దేవుని కుమారుడు కల్వరి మీద వ్రేలాడుటకు ఇది సూచనగా ఉన్నది. మన పాపముల వలన ఆయన ముక్కలాయెను. చనిపోతూ మరియొక భాషలో మాట్లాడెను. “నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి?”
67
అది సంఘము యొక్క వర్తమానము “నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. వారు క్రొత్త భాషలు మాట్లాడెదురు,” అదే ఆయన చెప్పెను. అదే సంఘము యొక్క వర్తమానము. సంఘము దానిని చేయవలెనని ఆయన ఆజ్ఞాపించెను. దయ్యములను వెళ్ళగొట్టవలెను.
....వారు క్రొత్త భాషలు మాట్లాడుదురు.
వారు పాములను ఎత్తి పట్టుకొందురు. విషకరమైనది ఏదైనా త్రాగిననూ అది వారికి హాని చేయదు. వారు రోగులు మీద చేతులుంచినప్పుడు బాగవుదురు.
అది సంఘము యొక్క ఆజ్ఞ. అదే నిజమైన విశ్వాసపు సంఘము. మెతడిస్తు, బాప్టిస్తు, ప్రెస్బిటేరియను, కాతలిక్కు, లూధరన్, నాజరీన్, ఫిలిగ్రీం హోలీనెస్, మొదలగు శాఖలలో దీనిని బోధించరు. వారు దీనిని నిరాకరించెదరు. ఎందువలన? వారిది సంస్థ వారిది చేయలేరు. దానిని నమ్ము సభ్యులు అందులో చాలా మంది యున్నారు గాని వారు నోరు కదపజాలరు. ఎందుకనగా ఏమన్నా అంటే బహిష్కరింపబడుదురు. అది క్రీస్తు విరోధి ఆత్మ వారిని సంస్థగా మార్చి యున్నది. సజీవ దేవుని యొక్క సంఘము స్వేచ్చగా జన్మించినది. దానికి ఏ శాఖయు అక్కర లేదు. వారు మెస్సీయా రాజ్యము యొక్క రాజును వెంబడించెదరు. మానవుల మాటలను వారు అనుసరించవలసిన పనిలేదు. వారు స్వతంత్రులుగా పుట్టి యున్నారు. కుమారుని ద్వారా స్వతంత్రులై యున్నారు. వారిని ఆయన నిశ్చయంగా స్వతంత్రులుగా చేసియున్నాడు. ఈ సూచక క్రియలు వారిని వెంబడించును.
68
ఈ సువార్త బోధించబడును!
దానిని ఎవరు బోధించెదరు? పామరులను దేవుడు వాడుకొన సమర్దుడు, దేవుడు రాళ్ళను లేపి బోధ చేయించుకోగలడు. దేవుడు తన ఇష్టమైన దానిని చేయగలడు. ఆయన దేవుడు! ఆ విధంగానే ఆయన చేయును. ఆయన వచ్చినప్పుడు కయపను పిలువలేదు. జాలరులను, పసుల కాపరులను, చదువు లేని పామరులను ఆయన తీసికొనెను. పేతురు మరియు యోహానులు విద్యలేని పామరులని వారు గుర్తించినట్లు బైబిలులో యున్నది. కాని ఆయన వారికి పరలోక రాజ్యమును ఇయ్యగలిగెను. వారి ద్వారా పరలోక రాజ్యపు పని చేయించుకోనగలిగెను. జ్ఞానులను, గొప్పవారిని, ఆయన గ్రుడ్డివారినిగా చేసి ఆయన వారి మనుస్సులను బంధించెను. “వారు విద్య లేని పామరులని ఎరిగియుండిరి, కాని వారు యేసుతో కూడా ఉండినట్లు గుర్తించిరి.” ఎందువలన? వారి మీద ఆయన ఆత్మ ఉండెను. ఆయనవలెనె వీరు ప్రవర్తించుచుండిరి. ఆయన చేసిన కార్యములనే వీరు చేయుచుండిరి. కావున ఆయన జరుగునని చెప్పినట్లే జరుగును. మెస్సీయా రాజ్యము. ఈ విషయములను బట్టి నేనెంతో సంతోషించుచున్నాను. “నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును.” నిశ్చయంగా ఈ సూచక క్రియలు కనబడును.
69
ఈ సంఘము బోధించు వర్తమానము దైవిక స్వస్థత, సంఘ వర్తమానము. మత్తయి 10 చెప్పాను. ఆయన తన సంఘమును బయటకు పంపెను. మత్తయి 10:1 యొద్దకు మనం వెళ్ళుదము. దీనికి ప్రారంభించిన తన సంఘమును అభిషేకించినప్పుడు యేసు ఏమి చెప్పెనో చూద్దాం.
అంతట ఆయన తన పండ్రెండు మంది శిష్యులను పిలచి అపవిత్రాత్మల మీద అధికారము అనుగ్రహించెను. వాటిని వెళ్ళగొట్టుటకును, సమస్త విధములగు రోగములను మరియు బలహీనతలను స్వస్థపరచుటకును ఆయన వారికి అధికారమను అనుగ్రహించెను.
తన సంఘమునకు ఇచ్చిన మొదటి ఆజ్ఞ.
70
“మీరు సర్వలోకములోనికి వెళ్ళి, సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును,” అని ఆయన చివరి ఆజ్ఞ ఇచ్చెను. దానిని సవివరముగా చెప్పెదను. మీరు సర్వలోకములోనికి, ప్రతి దేశములోనికి వెళ్ళి, పరిశుద్దాత్మ యొక్క శక్తిని ప్రచురపరచుడి. దీనియందు నమ్మిక యుంచి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. దీనిని త్రోసివేయు వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు కనబడును. వారు రోగుల మీద చేతులుంచగా బాగవుదురు. వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. వారు క్రొత్త భాషలు మాట్లాడుదురు. కనబడవలసిన సూచక క్రియలు ఇవే. చివరి వచనములో ఇట్లున్నది, “వారు తిరిగి వచ్చిరి. ప్రభువు వారితో కూడా యుండి పని చేయుచుండెను. వెంబడించుచున్న సూచక క్రియలను బట్టి వాక్యము స్థిరపరచబడుచుండెను.” మొదటి సంఘము ఆ విధంగానే యుండినది.
71
యేసు చెప్పిన దానిని వినుడి. “నేను ద్రాక్షావల్లిని, మీరు తీగెలు”. ఒక్క కొమ్మ ఫలమును ఇచ్చి మిగిలిన కొమ్మలు ఊరుకొనవు. అన్ని కొమ్మలు ఒకే విధంగా ఫలించును. అన్ని కొమ్మలూ ఒకే రకమగు ఫలమును ఇచ్చును.
ఓ, “బ్రెన్హాం సోదరుడా, మరి ఈ సంఘములన్నీ ఏమిటని మీరడుగ వచ్చును.” అవి అంటు కట్టబడిన ద్రాక్షావళ్ళులు, నారింజ చెట్టుకు నీవు అంటు కట్టగలవు. నారింజ చెట్టునకు నిమ్మ కొమ్మను అంటు కట్టిన యెడల అది ఎదుగును. అలాగే మీరు అంటుకట్టబడి యున్నారు. ఈ సంస్థలన్నీ మానవులు అంటుకట్టినవే. నిమ్మ చెట్టు ఎప్పుడూ అలాగే యుండును. సంఘ నామములో దానిని అంటు కట్టినందున అది ఎదుగుచున్నది. కాని ఒక సంగతి చెప్పుచున్నాను. ఆ చెట్టు ఎన్నడయినా మరో కొమ్మను వేసినచో అది తప్పక నారింజ కాయలనే కాయును. ఎపుడయినా గాని దేవుని శక్తి మరో సంఘములోనికి వచ్చినట్లయితే అది మరియొక పెంతెకోస్తు అగును. దాని వెనుక మరియొక అపోస్తలుల కార్యముల గ్రంధము వ్రాయబడును. ఎందుకనగా అది దేవుని సంఘము.
72
“నేను ద్రాక్షావల్లిని, మిరు తీగెలు. మీ యంతట మీరు ఫలించలేరు. నేను నా శక్తిని ఆ కొమ్మలోనికి పంపించుచున్నాను,” అని యేసు చెప్పెను. అదెటువంటి ఫలమును కాయును? “నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును.”
రెండవ సంఘము లేచుచున్నది, క్రీస్తు యొక్క అదృశ్య శరీరము అదే సూచనను ఇచ్చును. “ఇక కొంచెము కాలమైన తరువాత లోకము నన్ను చూడనేరదు. అయినను మీరు నన్ను చూచెదరు. ఎందుకనగా నేను మీలోను, మీతోను ప్రతి కొమ్మలోను యుగసమాప్తి వరకునుయుందును.” యేసు క్రీస్తు నిన్న, నేడు నిరంతరము ఏకరీతిగా యున్నాడు. అది సజీవ దేవుని యొక్క సంఘము ఆయనకు ఆ విధమగు సాక్ష్యము యున్నది.
73
ఇప్పుడు, అలాగే సంఘము బాప్తిస్మము గూర్చి కూడా విధిగా బోధించవలెను. బాప్తిస్మము తప్పనిసరి. అది ఒక ఆజ్ఞ. మార్కు 16లోనిది. యేసు చెప్పినది విన్నాము. “నమ్మి బాప్తిస్మము పొందిన వాడు,” మొదట నమ్మవలెను. ఆ తరువాత నీ పాపముల క్షమాపణ కొరకు బాప్తిస్మము పొందవలెను. అప్పుడు నీవు పరిశుద్దాత్మ అను వరము పొందుదువు.
పరిశుద్దాత్మను గూర్చి సంఘము బోధించవలసియున్నది. లూకా 24:49 లో యేసు చెప్పెను. దానికి బహు దగ్గరలో మనం ఉన్నాం, కావున 49 వచనం చూద్దాం, 46 మరియు 47 వచనములు చూచాము. 49 వచనము చూద్దాము:
ఇదిగో, నా తండ్రి యొక్క వాగ్దానమును మీ మీదికి పంపుచున్నాను పై నుండి శక్తిని పొందువరకు మీరు యెరూషలేములో కనిపెట్టియుండుడి.
ఆ గుంపులో యేసుతో కూడా మూడున్నర సంవత్సరములు నడిచినవారున్నారు. వారు సువార్తను బోధించగలరు, కాని వారు కూడా పరిశుద్దాత్మ కొరకు కనిపెట్టవలసివచ్చెను. ఈనాడు సంఘము కూడా దానినే చేయవలెను. పరిశుద్దాత్మ కొరకు కనిపెట్టవలెను!
74
కొంతకాలం క్రిందట ఒక కాతలిక్కు స్త్రీతో నేను మాట్లాడుచుంటిని, ఓరెగాన్లో జరిగినది. “నీవు బోధించుచున్న చోట ఉన్న ఆ బుద్ధిలేని జనులు, కేకలు వేయుచూ గోలచేయు జనులు పరలోకములో యుందురని, పరలోకములో ఏలుబడి చేయుదురని నీవనుకొనుచున్నావా?” అనడిగినది.
నేను చెప్పాను, అవును, అమ్మగారు.“
“మేమటువంటిది నమ్మము,” అన్నదామె.
“ఎందుకనగా నీవు దేవుని వాక్యము నమ్మవు గదా?” అన్నాను.
“మా కొరకు మరియ విజ్ఞాపన చేయును? ”అన్నది.
“అది పూర్తిగా అన్యత్వము,” అన్నాను.
ఆమె దేవత కాదు, ఆమె ఒక స్త్రీ, “దేవునికి తల్లి?” అన్నది. దేవునికి తల్లి ఎట్లు౦డును? “దేవుని తల్లియగు మరియా, నీవు ధన్యురాలవు” అందురు. దేవునికి తల్లి యుండునా? ఆమె దేవుని కుమారుడగు యేసు క్రీస్తును కనినది. ఏ స్త్రీయు సృష్టికర్త కాదు. పురుషుని విత్తనమును ఆమె మోయును. మగవాడు సృష్టికర్త కాడు. జీవమును దేవుడు సృజించును. పిల్లలను కనుటకు దేవుడేర్పరచిన ఒక కార్యక్రమమిది. ఆమె దేవునికి తల్లి కాదు. దేవునికి తల్లి యుండదు. ఎందుకనగా ఆయనకు ఆది గాని అంతము గాని లేదు. ఆయన నిత్యుడు. ఆమె దేవునికి తల్లిగా యుండదు.
75
“ఆ ధన్యురాలగు కన్యక నీకు దేవత వలె కనిపించుచున్నది. కాని ఆమె. నీవు గత రాత్రి చూచిన ఆ ప్రజల వలె పరిశుద్దాత్మను పొందనంత వరకు పరలోకములో ప్రవేశించుటకు అర్హురాలు కాదు,” అని చెప్పాను.
“'అది సరి కాదు,” అన్నదామె.
నేనిట్లు అడిగాను, “బైబిలును గాని, పత్రికలను గాని కాతలిక్కు చర్చి వ్రాసినదని నీవనుచున్నావా? వారు కాతలిక్కులని నీవు చెప్పుచున్నావు,” దానిని నేను ఖండించుచున్నాను. చివరి అపోస్తలుడు చనిపోయిన మూడు వందల సంవత్సరముల వరకు అసలు కాతలిక్కు చర్చి అనునదే లేదు. ఆ తరువాతనే నైసియన్ కౌన్సిల్ వచ్చినది. నీవు చరిత్రలో ఎక్కడయినా నాకు చూపించు. నీ మత గ్రంధము కాదు. ఎందుకనగా అది చరిత్రతో సరిపడదు. అటువంటిది అసలు లేనే లేదు. ఆ మేడ గదిలోనికి వెళ్ళి పరిశుద్దాత్మను పొందిన నూట ఇరవై మందిలో యేసు తల్లియగు మరియు కూడా ఉన్నది. ఆమె కూడా ఆ మెట్టు ఎక్కవలసి వచ్చెను. వారు త్రాగిన వారి వలె ఇతరులకు కనబడిరి. ఇతర భాషలతో మాట్లాడిరి. త్రాగిన వారి వలె ప్రవర్తించిరి. అలాగని బైబిలు చెప్పుచున్నది. ఈ వచనము చదువుమని నేను వ్రేలు పెట్టి చూపించాను.
“నేను దానిని చదువను. ఎందుకనగా దానిని మేము చదువ రాదు,” అన్నదామె.
76
“నీవు యధార్థపరురాలవు కావు,” అని అన్నాను. ఇక్కడ కన్య మరియ పరిశుద్దాత్మను పొందియున్నది. భాషలలో మాట్లాడియున్నది. మత్తురాలు వలె కనిపించినది. నీవు పరలోకమునకు వెళ్ళినచో ఆమెతో సహవసించలేవు. ఎందుకనగా ఆమె పరిశుద్దాత్మను పొందియున్నది. ఆమె, అనగా యేసు క్రీస్తు తల్లియగు మరియు దానిని పొందవలసిన అవసరములో యుండగా మరి నీ కది ఎంత అవసరముగా యున్నది!“
“అటువంటి దానిని పొంది పరలోకము వెళ్ళవలసి యున్నచో అసలు నేను పరలోకమే వెళ్ళను,” అన్నదామె.
“అయితే నీవేమియా చింతపడనక్కర లేదు. నీవు ఏలాగూ వెళ్ళవు. వారందరూ స్తుతించుదురు. నీవు దానిని ఇష్టపడవు గదా?” అన్నాను. అది కచ్చితముగా దేవుని ఆత్మ.
77
“పరిశుద్దాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులైయుందురు.” ఇపుడు మనం ఏమి చెప్పుకొనుచున్నాము? ఏమిటది? దానినెవరు స్థాపించిరి? దాని యొక్క వర్తమానమేమిటి? త్వరపడుదము. ఇంకొంచెం ముందుకు వెళ్ళుదము.
నాలుగవ సంగతి, “దానిలో మనం ఎట్లు సభ్యులము కాగలము?” అందులో ఎట్లు చేరగలము? అదేమిటో మనం చూచాము. దీనిలో ఎట్లు మనం చేరగలము? అందులో నీవు చేరలేవు అది నీ వలన కాదు, దానిలో నీవు జన్మించవలెను. నేను ఏబయి-ఒక్క సంవత్సరాల నుండి బ్రెన్హాంగా పుట్టాను. నీవు దేవుని కుమారునిగా జన్మించి యున్నావు. దేవుని కుమార్తెగా జన్మించి యున్నావు.
78
యోహాను సువార్త 3 వ అధ్యాయము ఒకసారి చూద్దాం. దానిని గూర్చి ఇక్కడ దేవుడేమి చెప్పెనో చూద్దాం. ఈ సంఘము లోనికి నీవెట్లు ప్రవేశించగలవు? దేవుడు నీకు ఎట్టి స్థానములు అందించుచున్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 8 వచనములు.
యూదుల అధికారియైన నీకోదేమను పరిసయ్యుడొకడు ఉండెను.
అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి - బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడతనికి తోడై యుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను.
అందుకు యేసు, అతనితో - ఒకడు క్రొత్తగా జన్మించితేనేగాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
79
అందులోనికి మనమెట్లు ప్రవేశించగలము? అందులోనికి జన్మించవలెను.
ఆ ప్రశ్నను మరి కొంత ముందుకు చదువుదము, అందుకు నీకోదేము - ముసలి వాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భముందు జన్మించగలడా? అని ఆయనను అడుగుగా. చూచారా, అతడు ఒక బోధకుడు, గొప్పవాడు, ఒక యాజకుడు, వయస్సులో పెద్దవాడు, జీవితమంతా బైబిలు చదివినవాడు. కాని శరీరసంబంధముగా ఆలోచించెను. (ఈనాడు మనకు గల కొందరు వేదాంత పండితుల వలెనె ఇతడు కనిపించుట లేదా?)
యేసు ఇట్లనెను - ఒకడు నీటి మూలముగాను, (అందులో ఎట్లు ప్రవేశించగలము?) నీటి మూలముగా మరియు ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
80
“అందులో చేరగలమా?” అందులో చేరుటకు వీలులేదు. అందులో నీవు తిరిగి జన్మించవలెను. “వచ్చి చేరండి” కాదు. “వచ్చి జన్మించండి.”
శరీరమూలముగా జన్మించినది శరీరమను, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది
మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.
గాలి తనకిష్టమైన చోటను విసరును. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే యున్నాడనెను.
చూడండి, అందులో మీరు చేర్చలేరు. ఇది మర్మమయిన విషయము. క్రీస్తు యొక్క అదృశ్య శరీరములోనికి నీవు జన్మించుచున్నావు. అలాగే నీవందులో ప్రవేశించగలవు.
81
1 కొరింధీ 12వ అధ్యాయము. ఇంకొద్ది ముందుకు వెళ్ళుదం. మరికొన్ని సంగతులు చూద్దాం. వీలయినంత వరకు నేను వాటిని చెప్పగోరుచున్నాను. వేడిగా యున్నదని నాకు తెలియును. కాని ఒక్క నిమిషం, తీసికొందును. “కరచాలనము ద్వారా, లేదా ప్రమాణము ద్వారా వారు ఆ గొప్ప పరిశుద్ద రోమను సంఘములో చేరుదురు. కరచాలనము చేసి నీ పేరును గ్రంధములో వ్రాయుదురు. దీనిని గూర్చి మీరు ఓల్డ్ లేడీస్ బర్త్ డే ఆల్మనాక్ లో చదువుదురు, గాని దేవుని బైబిలులో చదువరు. అవును!
ఏలయనగా ఒకే ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి [క్రీస్తు యొక్క శరీరము] బాప్తిస్మము పొందియున్నాము. మనము యూదులమైనా, అన్యులమైనా, దాసులమైనా, స్వతంత్రులమైనా ఒకే ఆత్మలోనిది పానము చేయవలెనని దేవుడు నిర్ణయించెను. మనమే యేసు క్రీస్తు యొక్క శరీరము
మెతడిస్ట్ ఆత్మ కాదు, బాప్టిస్ట్ ఆత్మ కాదు, పెంతెకోస్తు ఆత్మ కాదు, కానీ ఒక్క పరిశుద్ధాత్మ వలన!
పరిశుద్దాత్మ రక్తముతో నింపబడిన ఈ ప్రవాహము లోనికి
మనమందరమును బాప్తిస్మము పొందియున్నాము.
ఇమ్మానుయేలు నరములలో నుండి ప్రవహించియున్నది,
ఆ ప్రవాహములో మునిగిన పాపులందరూ,
తమ పాపపు డాగులను పోగొట్టుకొందురు.
చనిపోవుచున్న దొంగ దానిని చూచి ఆనందించెను
ఆ దినమున అతనికి అది ప్రవాహము;
అతని వలె నేనును చెడిపోతిని,
నా పాపములన్నీ అది శుద్ధి చేసెను.
82
ఒక్కటే శరీరము! ఆ శరీరములోనికి మనం ఏలాగు రాగలము? అందులో ఎట్లు ప్రవేశించగలము? ఒకే ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము. ఆ శరీరములో యున్నప్పుడు ఉచితమగు పునరుత్థాన హామీ యున్నది. “మనందరి దోషమును దేవుడు ఆయన మీద మోపెను.” కరచాలనము ద్వారా కాదు. సంఘము యొక్క ఉత్తరము ద్వారా కాదు. పరిశుద్దాత్మ ద్వారానే, యూదుడని, అన్యుడని, నల్లవాడని, తెల్లవాడని భేదము లేదు. అందరూ ఒకే ఆత్మ ద్వారా ఆ శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నారు. అది ఆయన యొక్క స్వంత నిబంధన రక్తము. ఆ రక్తమును చూచినప్పుడు మిమ్మును దాటిపోవుదునని ఆయన చెప్పెను. మరణము నుండి విడిపించబడిరి. బాధ నుండి విమోచింపబడిరి. పాపము నుండి విడిపించబడిరి. దేవుని మూలముగా జన్మించిన వాడు పాపము చేయడు. చేయజాలడు. “ఎందుకనగా దేవుని యొక్క బీజము అతనిలో నిలచియున్నది.” పాపమిక లేదు! “మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై యుండుడి,” యేసు అలాగు చెప్పెను.
నీవెట్లు పరిపూర్ణుడవు కాగలవు? నీ వలన కాదు. నీవు పాపములో జన్మించితివి. కాని నీ పాపములను మోయువానిగా నీవెప్పుడయితే క్రీస్తును అంగీకరించావో, ఆయనను విశ్వాసముతో స్వీకరించావో, ఆయన నిన్ను రక్షించెనని నమ్మావో, నీ స్థానములో ఆయన చనిపోయి నీ పాపములను పరిహరించెనని నమ్మావో అప్పుడు దేవుడు నిన్ను అంగీకరించి, ఆ శరీరములోనికి నీకు బాప్తిస్మమిచ్చును. నీవిక పాపమును చూడలేవు. నా కొరకు బలిపీఠము మీద అర్పణ యుండగా నేనెట్లు పాపినవుదును?
83
నాకిష్టమొచ్చినంత వేగముగా నేను వెళ్ళ వచ్చునని పట్టణాధికారులు నాకు అధికారమిచ్చినప్పుడు, పోలీసు నన్ను అరెస్టు చేయగలడా? నన్ను అరెస్టు చేయలేరు. “రెవరెండు బ్రెన్హాం, నీవు రోగులకు ప్రార్థించుటకై వెళ్ళుచున్నావు. కావున నీకిష్టమొచ్చిన వేగంలో వెళ్ళుము. ఎక్కడా వేగము తగ్గనక్కరలేదు,” అని పట్టణమేయరు నాతో చెప్పెననుకొందాం. దానిని గూర్చి ఒక పత్రము నాకు ఇచ్చును. కావున ఏ పోలీసు వ్యక్తి నన్ను అరెస్టు చేయలేడు. ఎందుకనగా మేయరుకు నా యందు నమ్మకమున్నది. అత్యవసర పరిస్థితి అయితేనే గాని నేనది ఉపయోగించుకొననని అతనికి తెలియును.
దేవుడు నన్ను అంగీకరించి, నాకు పరిశుద్దాత్మతో బాప్తిస్మమిచ్చెను. ఇష్టపూర్వకంగా నేను పాపము చేయనను నమ్మకము ఆయనకున్నది. ఆమేన్! నేను ఇష్టపూర్వకంగా పాపం చేయను. కాబట్టి ఆయన కుమారుడు నాకు బలిని ఇచ్చెను. నేను నీతిమంతునిగా తీర్చబడినంత కాలము పాపిగా ఎంచబడను. ఆయన తన శరీరములోనికి నన్ను స్వీకరించెను. ఆయనతో కూడా నేను విమోచింపబడితిని. నేను చేసిన దానిని బట్టి కాదు. ఆయన నా కొరకు చేసిన దానిని బట్టి విమోచింపబడితిని. అదే సువార్త!
84
ఎఫెసి 4:30, “దేవుని యొక్క పరిశుద్దాత్మను దుఃఖపరచకుడి. విమోచనా దినము వరకు మీరు దాని చేత ముద్రింపబడితిరి.”
కొంత కాలం క్రిందట ఒక పేరొందిన బాప్టిస్తు బోధకుడు నాతో ఇట్లనెను, “బ్రెన్హాం సోదరుడా, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని యందు నమ్మిక యుంచుట కన్న అధికమైన దానిని మరేమి అతడు చేయగలడు? మనము కూడా నమ్మినప్పుడే పరిశుద్దాత్మను పొందియున్నాము.”
“నీవు తప్పు చెప్పుచున్నావు. నీది యదార్థముగా తప్పు అపోస్తలుల కార్యముల 19 వ అధ్యాయములో పౌలు ఆ బాప్టిస్తులకు చెప్పినది. వినుము. వారికి మంచి సంఘ కాపరియున్నాడు. మార్పు పొందిన ఒక న్యాయాధికారి, ”నమ్మినప్పటి నుండి మీరు పరిశుద్దాత్మను పొందియున్నారా?“
“అసలు తర్జుమాలో ఆ విధంగా లేదు?” అన్నాడు.
“ఆ విధంగానే యున్నది. నా యొద్ద ఎంఫటిక్ డయాగ్లాట్ యున్నది. గ్రీకు లోను, హెబ్రీలోను, ప్రతి తర్జుమాలోను అలాగే యున్నది,” అని నేను చెప్పాను. మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్దాత్మను పొందితిరా? అబ్రహాము నమ్మిన మాట నిజమే. కాని అతని విశ్వాసము అంగీకరించబడినట్లుగా దేవుడొక సూచనను ఇచ్చెను. అదే సున్నతి ముద్ర. ఇది నిజము. అతనిని ఆయన అంగీకరించెను. అందుకు ఒక సూచనను ఆయన యిచ్చెను.
నీవు నమ్ముచున్నావని చెప్పుకొంటూ, ఇంకా పరిశుద్దాత్మను పొందని యెడల ఇంకా దేవుని ముద్ర నీకు లేదు. అంటే ఇంకా నీ యందు ఆయనకు నమ్మకము కుదరలేదు. నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుడు నిన్ను పరిశుద్దాత్మతో ముద్రించును. అది నీ విమోచన దినము వరకుండును. అదే సంఘము యొక్క వర్తమానము. ఆమేన్!
85
ఇంకొద్ది ముందుగా చూద్దాం. మంచిది. ఇప్పుడు, 1 కొరింధీ 12 మరియు 13. “ఒకే ఆత్మ ద్వారా మనందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము.”
ఈ విధంగా మనం ప్రవేశించియున్నాము. సంఘము యొక్క ఆవిర్భావమును మనం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో చూడగలము. పెంతెకోస్తు దినము తరువాత సంఘమునకు మొదటి వర్తమానము బోధించబడినది. వారందరూ పరిశుద్దాత్మతో నింపబడిరి. మరియు అపోస్తలులందరూ పరిశుద్దాత్మతో నింపబడిరి. వేరే భాషలు మాట్లాడిరి. త్రాగిరి వారి వలె ప్రవర్తించుచుండిరి. స్త్రీలు చాలా గొప్ప ఉత్తేజముతో యుండిరి. వారు గొప్ప ఉజ్జీవముతో నిండినవారై దేవుని సుత్తించుచుండిరి. పరిశుద్దాత్మ యొక్క ప్రభావము వలన వారు తడబడుచుండిరి. అది ఆదివారమో, సోమవారమో వారికి అక్కర లేదు. అది మహా గొప్ప సమయము, దేవునిని స్తుతించుచుండిరి. ఎందుకు, “వీరు క్రొత్త మద్యమును త్రాగియున్నారు,” అని మహా మేధావులు అనెను.
86
ఇప్పుడు పరలోక రాజ్యపు తాళపు చెవులను పట్టుకొని ఇక్కడ పేతురు నిలబడియుండెను. అవి పరిశుద్దాత్మ తాళపు చెవులు. యేసు ఇట్లనెను, “నీవు పేతురువు ఈ బండ మీద నేను నా సంఘమును నిర్మించుదును. పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువజాలవు.” ఏమిటది? ఒక ఆత్మ సంబంధమగు సత్యము బయలుపరచబడినది. “రక్తమాంసములు నీకు దీనిని బయలుపరచలేదు [దీనిని నీవు సెమినరీలో నేర్చుకొనలేదు. ఏవో పుస్తకములను తీసి వాటి ద్వారా నీకిది ఎవరూ నేర్పించలేదు, కాని ఇది ప్రత్యక్షత]” ఒక ప్రత్యక్షత! “యేసు ఇట్లనెను, నీవు పేతురువు. పరలోక రాజ్యపు తాళపు చెవులను నీకిచ్చుచున్నాను: నీవు భూమి మీద దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధించబడును. నీవు భూమి మీద దేనిని విప్పుదువో ఆది పరలోకమందున విప్పబడును.” ఆయన తన మాటను నిలబెట్టుకొనును. పెంతెకోస్తు దినమున మాట్లాడినదెవరు? పేతురు, అతని యొద్ద తాళపు చెవులుండెను.
87
“వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారు,” అని వారందరూ నవ్వుచుండిరి.
పేతురు ఇట్లనెను, “ప్రొద్దు పొడిచి ఇంకా మూడవ జామైనా కాలేదు. వీరు క్రొత్త మద్యముతో నింపబడిన వారు కారు గాని ప్రవక్తయగు యోవేలు ద్వారా పలుకబడినది ఇదే. అంత్య దినములలో మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదనని యొహోవా సెలవిచ్చుచున్నాడు. మీ కుమారులు మరియు కుమార్తెలు ప్రవచించెదరు. నా దాసులు మీద దాసురాండ్ర మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను. మీ యవ్వనులు దర్శనములు చూచెదరు. మీ ముసలి వారు కలలు కందురు. పైగా ఆకాశమందు సూచక క్రియలు, క్రింద భూమి మీద మహత్కార్యములు కనబడును. ప్రభువు నామమున ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు.”
“వారిది విని తమ హృదయములో గ్రుచ్చబడిన వారైరి, పేతురుతోను కడమ అపోస్తలులతోను వారిట్లు పలికిరి, ”అయ్యలారా, సోదరులారా, రక్షించబడుటకు మేమేమి చేయవలెను?“ అది సంఘము యొక్క పరిస్థితి. ఈ అదృశ్య శరీరములోనికి ఎట్లు రావలెనో అడుగుచుండిరి.
అపోస్తలుల కార్యములో 2 వ అధ్యాయము 37 వచనము. అది ప్రారంభ ప్రసంగము. దానిని నీవు మార్చలేవు. మీరది మార్చలేరు.
వినండి.
88
నీ వైద్యుడు ఒక మందుల చీటి నీకు వ్రాసెననుకో, దానిని నీవు మందులు షాపుకు తీసికొని వెళ్ళెదవు. తెలియని వారు వ్రాసిన మందును నీవు వేసికొనవు. ఎందుకనగా అది నిన్ను చంపవచ్చును. వైద్యుడు నీకు కావలసిన దానిని వ్రాయును. ఎందుకనగా అతడు అందుకు శిక్షణ పొందియున్నాడు, కావున వ్రాయును అందులో ఎంతో విషముండును. ఆ విషమును హరించు మందును అతడు వ్రాయును, ఒక మ౦దు యొక్క చెడు ప్రభావమును మరియొకటి చంపును. ఆ వైద్యుడు వ్రాసిన విధంగా దానిని మీరు వాడని యెడల అది మిమ్మును చంపును.
89
ఆ విధంగానే దేవుడు వైద్యునివలె యున్నాడు. ఆయన ఆత్మకు వైద్యుడు. ఆయన రక్షణకు వైద్యుడు. ఆయన తన స్వంత పాండిత్యములో ప్రవీణుడు. పేతురు ఒక విద్య లేని వ్యక్తి, అతనికి సంతకమే రాదు. కాని ఆయన పరిశుద్దాత్మను ఇతనికి ఇచ్చెను. దానిని గూర్చిన బోధ వ్రాయగల పెన్సిలును ఇచ్చెను. కావున పెంతెకోస్తు దినమున అతడు ఆ వివరణను ఇచ్చెను. అతడేమి వ్రాసెనో చూద్దాం. రక్షణ కొరకు డాక్టర్ సైమన్ పీటర్ ఏమి వ్రాసి ఇచ్చెనో చూద్దాం. ఏమి వ్రాసెనో కనుగొందము.
ఇప్పుడు వారిది విని హృదయములలో గ్రుచ్చబడిన వారై పేతురును, కడమ అపోస్తలులను, సోదరులారా, అయ్యలారా, మేమేమి చేయవలెనని అడిగిరి. (చూడండి. తాళపు చెవి దొరికినది)
అప్పుడు వారితో పేతురు ఇట్లనెను మారు మనస్సు పొంది ప్రతివాడును పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్దాత్మ అను వరము పొందెదరు.
ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికిని, ప్రభువగు దేవుడు పిలచిన వారికందరికిని చెందును.
అదియే మందుల చీటి. నీవు దానికి మరేదో కలిపినచో ఆ రోగి చనిపోవును. ఈనాడు చాలామంది అదే చేయుచున్నారు. “తండ్రి కుమారుడు, పరిశుద్దాత్మ” బిరుదులు ఉపయోగించి చాలామందిని చంపుచున్నారు. తప్పు మందు ఇచ్చి ఆత్మ సంబంధముగా చంపుచున్నారు.
90
అసలు అటువంటిది లేదు. ఎవరునూ బైబిలులో “తండ్రి, కుమార పరిశుద్దాత్మ” బిరుదులలో బాప్తిస్మము పొందలేదు. కాతలిక్కు సంఘము వచ్చు వరకు అసలది లేనే లేదు. దానికి తల్లి కాతలిక్కు సంఘమే. లేఖనములను పరిశోధించుడి. చరిత్రను పరిశోధించుడి. తండ్రి, కుమార, పరిశుద్దాత్మ యొక్క బాప్తిస్మమును పొందవలెనని మొదట ఆజ్ఞ జారీ చేసినది కాతలిక్కు మత గురువే.
వారు చిలకరించిరి. కాతలిక్కు సంఘమే త్రాగుడును ప్రోత్సహించెను. వేశ్యలకు తల్లి, వేశ్య యొద్దకు వచ్చి చూడండి.
అది మత విశ్వాసములను బోధించుచున్నది. ప్రొటస్టెంటు వారికి రక్షణ లేదని చెప్పుచున్నది. కొన్నిసార్లు వారు కేతలిక్కు బోధను అనుసరించెదరు. వారు తమ బైబిలును వెంబడించరు. వారు తండ్రి, కుమార, పరిశుద్దాత్మ నామములో బాప్తిస్మమిచ్చుదురు. దానికి వాక్యమెక్కడున్నదో చెప్పలేరు. కాతలిక్కు సంఘము దీనిని ప్రారంభించెను. దానిని వారు వెంబడించుచున్నారు. “కాతలిక్కు ఆజ్ఞలను వెంబడించినప్పుడే రక్షణ అని చెప్పుచున్నారు.”
అటువంటిది ఎక్కడా లేదు! ఆ విధముగా ఎవరును ఎన్నడునూ బాప్తిస్మము పొందలేదు. బైబిలులో అసలు చిలకరింపనునది లేదు. మరే ఇతర విధానము లేదు. పాపక్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామములో నీటిలో ముంచబడుట ద్వారా బాప్తిస్మము పొందవలెను. కొద్దిసేపటి క్రితం మనం చదివాము. దాని గూర్చి తరువాత చెప్పెదనన్నాను గదా? ఆయన నామములోనే మారు మనస్సు మరియు పాపక్షమాపణ బోధింపబడును. అది కేవలము యొరూషలేములోని యూదులకేనా? యెరూషలేము మొదలుకొని సర్వలోకమునకు అది ప్రకటించబడవలెను.
91
ఇప్పుడు, డాక్టర్. సైమన్ పీటర్ వైద్యపు చిటిని వ్రాసెను.
అయితే మీరేమి వ్రాయుచున్నారు వైధ్యులారా? మీరెందుకు దానికి మరేదో కలుపుచున్నారు? దానికి మరేమియూ చేర్చరాదు. ఉన్నది ఉన్నట్టుగా దానిని తీసికొనండి అది సంఘము యొక్క విధి. ఆ విధంగానే అందులో నీవు ప్రవేశించగలవు. మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్దాత్మను పొందెదరను వాగ్దానమున్నది. అదే బైబిలు చెప్పెను.
“సంఘము లోనికి బాప్తిస్మము పొందుడి! సంఘము లోనికి బాప్తిస్మము పొందుడి!”
92
గలతీ 3:26 చదువుదము. ఇంకా మూడు విషయములు చెప్పి ముగించెదను. గలతీ 3 వ అధ్యాయములోనిది చదువుదము. నా కంటె ముందుగా దానిని తీసిన వారు చదవండి. ( ఒక సోదరి చదివినది)
ఏలయనగా మీరు క్రీస్తు యేసునందున్న విశ్వాసము చేత దేవుని పిల్లలైయున్నారు.
గలతీ 3:26 చదువుదము. ఒకవేళ నేను తప్పుగా వ్రాసుకున్నాను, అది ఒకవేళ కొలస్సి, మనము చదువుదాము కొలోస్సి... నేను ఎక్కడికి వెళ్ళుచున్నాను. కొలస్సీ 3:26 చదవండి. ఆగండి. 3:26 లేదు. గలతీ 3:26 కదా? సోదరీ, గలతీ 3:26 చదువుము. 26, 27 మరియు 28 చదువుము. మీరు జాగ్రత్తగా వినండి. (సోదరి గలతీ 3:26-28 వరకు చదివినది)
ఏలయనగా మీరు క్రీస్తు యేసునందున్న విశ్వాసము చేత దేవుని పిల్లలైయున్నారు.
క్రీస్తులో బాప్తిస్మము పొందిన వారందరూ క్రీస్తును ధరించుకొనియున్నారు.
యూదుడని గాని గ్రీకు దేసస్తుడని, దాసుడని గాని స్వతంత్రుడని గాని స్త్రీ అని పురుషుడని గాని భేదము లేదు. మీరందరూ క్రీస్తు యేసునందు ఒక్కటై యున్నారు.
ఈ శరీరములో ఎట్లు మనం ప్రవేశించగలము? అదెట్లు జరిగినది? పరిశుద్దాత్మ ద్వారా బాప్తిస్మము పొందియున్నాము. క్రీస్తు యేసు శరీరములోనికి వచ్చియున్నాము.
93
ఇప్పుడు, సంఘము యొక్క వర్తమానము మరియొకటి యున్నది. శుద్దీకరణ ద్వారా మనము ఈ సంఘములోనికి వెళ్ళుదుము. హెబ్రీ 13:12 మరియు 13. శుద్దీకరణ గూర్చి చూచెదము. “జనులను తన యొక్క స్వంత రక్తముతో శుద్దీకరి౦చుటకై పాలెము వెలుపల యేసు శ్రమ పొందెను.”
ఇప్పుడు ఎఫెసీ పత్రికను చదువుదం. దానిని మనము చదువవలేను ఎఫెసీ 5:25, చాలా త్వరగా చదువుదము. ఎఫెసీ 5 వ అధ్యాయము 25 వచనము. 5:25. ఇంకా నేను తప్పు చెప్పుచున్నాను. ఇక్కడ నేను సరిగా వ్రాయలేదు. చూద్దాం. కొద్దిసేపటి క్రితం చాలా వేగంగా దీనిని వ్రాశాను. తప్పు వ్రాశాను. తప్పు పేజీ వ్రాశాను. ఆమేన్. అవును. మంచిది.
94
హెబ్రి 12 మరియు 13. “జనులను తన స్వరక్తముతో శుద్ధి చేయునట్లుగా యేసు శిబిరము వెలుపట శ్రమ పొందెను.”
కావున, మారు మనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందుట ద్వారా మనము సంఘములోనికి వచ్చుచున్నాము. పరిశుద్దాత్మను మనం పొందుదుమను వాగ్దానమున్నది. కాబట్టి ఏ బోధకుడు దానిని మనలో నుండి తొలగించలేదు. ఏ బోధకుడు మరియొక ప్రమాణమును మనకు చేయలేడు. మెస్సీయా రాజ్యము యొక్క రాజు ద్వారా మనము దానిలో జన్మించియున్నాము. ఆమేన్.
మరియొకటి చెప్పి ఇక ముగించుకొందామా? ఇంకొన్ని నిమిషముల పాటు నాతో ఎందరుండగలరు? (జనులు “ఆమేన్” చెప్పిరి సంపా) ఇప్పుడు తొమ్మిదిన్నర అయినది. సమయము మించిపోవును.
95
“సంఘము లేకుండా మనం పరలోకము చేరగలమా?” దీనిని గూర్చి కొద్దిగా చర్చించుకొని ముగించుకొందము. ఇక్కడ ఒక డజను వాక్యములు వ్రాసియుంచాను. కాని ఒక్క సంగతి మనం గమనించవలెను. ఈ సంఘములో సభ్యునిగా యుండకుండా మీరు పరలోక రాజ్యములో ప్రవేశించజాలరు.
ఇప్పుడు, యోహాను 3 మరియు 5 లో యేసు చెప్పిన మొదటి సంగతి చూడండి: “ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశించనేరడు? (మారు మనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను. అప్పుడు ఆత్మ సంబంధముగా జన్మించెదవు.) ఆత్మ మూలముగాను, నీటి మూలముగాను జన్మించవలెను. ఒక వ్యక్తి ఈలాగు జన్మించని యెడల పరలోక రాజ్యములో ప్రవేశించనే లేడు. పరలోక రాజ్యమును కనీసము చూడలేడు. నీవు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించినప్పుడే సంఘములో యుండెదవు. నీవు నీటి మూలముగాను, ఆత్మ మూలము గాను జన్మించని యెడల నీవు సంఘములో లేవు. పరలోక రాజ్యమును చూడలేవు. ఇది మీకు అర్థమయినదా? అక్షరాలా నిజము.
96
ఇప్పుడు, “బ్రెన్హాం సోదరుడా, నేను నమ్ముచున్నాను గాని ఇంకా పరిశుద్దాత్మను పొందలేదు,” అని నీవందువు. అయితే ఇంకా నీవు నమ్ముట లేదు. నీవు కేవలము నమ్ము, మార్గములోనే యున్నావు. నీకు నిరీక్షణ యున్నది. 1 కొరింధీ 12 వ అధ్యాయములో 3 వ వచనము చదువుదము. త్వరగా దానిని చదువుదము. ఇందులో ప్రభువు మన కొరకు దాచి యుంచినది గమనించుదము. 1 కొరింధీ 12 అధ్యాయము 3 వచనము.
ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వారెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్దాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మికు తెలియచేయుచున్నాను.
97
పరిశుద్దాత్మను పొందువరకు దానిని గూర్చి నీకేమియూ తెలియదు. యేసు క్రీస్తును నీ స్వరక్షకునిగా అంగీకరించుచున్నట్లు నీవు చెప్పవచ్చును. నీవు నమ్మినప్పటి నుండియూ పరిశుద్దాత్మను పొందితివా? లేని యెడల నీవాయనను ప్రభువా అని కూడా పిలువలేవు. ఎందుకనగా నీకాయన ప్రభువు కాడు. నీకాయన ఒక చారిత్రక పురుషునిగా కనబడును. ఆయనను నీవు నమ్మవచ్చును. కాని ఆయన పరిశుద్దాత్మ ద్వారా నీ లోపలికి వచ్చినప్పుడు ఆయన నీ ప్రభువగును. పరిశుద్దాత్మ ద్వారానే తప్ప ఎవడును యేసును ప్రభువని పిలువలేడు. దేవుని యొక్క ఆత్మ మూలముగా నీవు జన్మించవలెను. పరిశుద్దాత్మ నీలోయుండును. అపుడు నీవు ఈ రాజ్యములో జన్మించెదవు. నీవు సంఘములో భాగముగా ఉందువు. మీరు బయటకు పిలువబడిన వారు. దానిని మీరు చూచారా? సరే ఇప్పుడు చూడండి.
98
జీవము లేని, గింజలో నుండి మొక్క బయటకు రాదు గదా? విత్తనములు మనం భూమిలో పాతి పెట్టుదుము. కొన్ని విత్తనములు మొలకెత్తును. మరికొన్ని మొలకెత్తవు. మొలకెత్తనిది మరల జీవించగలదా? ఏ విధముగాను మొలకెత్తదు. అందులో ఏమియూ లేదు. అది చూచుటకు అన్ని విత్తనముల వలెనె కనిపించును. రొట్టె చేయుటకు పిండిగా ఉపయోగపడును. బాహ్య రూపము అన్నింటి వలెనె యుండును. కాని అందులో జీవము లేని యెడల మరెన్నడూ తిరిగి లేవదు.
ఒక వ్యక్తి మంచివాడే కావచ్చును. మంచి సంఘ సభ్యుడై యుండీ క్రైస్తవునిగా యుండ వచ్చును. మంచి క్రైస్తవ పౌరునిగా యుండ వచ్చును. నైతికంగా సజ్జనుడయి యుండ వచ్చును. కాని దేవుని ఆత్మ మూలముగా తిరిగి జన్మించని యెడల అతడు క్షయమై పోవును. ఎందుకనగా ఆది గల ప్రతి దానికిని అంత ముండును.
99
దేవుడు మాత్రమే నిత్యుడు. మనము దేవునిలో భాగముగా యున్నాము. ఆయన జీవమును పొందియున్నాము. వారికి నా నిత్య జీవమును ఇచ్చుచున్నానని యేసు చెప్పెను. దానికి గ్రీకు పదము “జో,” అనగా “దేవుని యొక్క స్వంత జీవమని” అర్థము. నీవు ఎన్నడయినా మరల తిరిగి జన్మించవలెనన్నచో ఒక్కటే మార్గము. అది నిత్య జీవమును పొందుట ద్వారానే అది దేవుని జీవము. ఎందుకనగా నీ జీవము నశించును. కాని ఆయన జీవము మరల లేచును. ఎందుకనగా దేవుడు అనంతుడు. నీకు నిత్యజీవము కలుగును. దేవుని వలెనె నీవు కూడా మరణించవు. “నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేనతనిని లేపుదును. తిరిగి లేపుదును.” ఆయన యందున్న నిత్య జీవము అతనిని లేపును.
100
సంఘములో లేకుండా మనం పరలోకమునకు వెళ్ళగలవా? నీవు తిరిగి జన్మించు వరకు ఆ సంఘములో ప్రవేశించలేవు. తిరిగి జన్మించితేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశించలేవు. నీవు తిరిగి జన్మించినప్పుడే సంఘములో యుండెదవు. కావున ఈ సంఘములో సభ్యునిగా యుండకుండా నీవు పరలోకమునకు వెళ్ళ లేవు. అందులో నీవు జన్మించని యెడల సభ్యునిగా యుండలేవు.
మీకు కొద్దిగా వివరించెదను. నిన్ను సభ్యునిగా యుండుటకు దేవుడు పిలువని యెడల నీవెన్నడూ అందులో సభ్యునివి కాలేవు. జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను ఆయన ముందుగ నిర్ణయించెను గనుక నీవెంతగానో సంతోషించవలెను. జగత్తుకు పునాదిని వేయక ముందే ఆయన నీ పేరును గొర్రెపిల్ల జీవగ్రంధములో, సంఘ గ్రంధములో వ్రాసెను. అదియే బైబిల్. క్రీస్తు విరోధి సంస్థలు, కాతలిక్కు సంఘము ఇంకా ఆయా సంస్థలు బయలుదేరి, జగత్తు పునాది వేయబడక ముందే ఎవరి పేరు అయితే గొర్రెపిల్ల జీవగ్రంధములో వ్రాయలేదో వారందరినీ ఈ భూమి మీద మోసము చేయును. అది ఆయన స్వంత మాట. నీవు చేసిన దాని వలన కాదు గాని ఆయన చేసిన క్రియవలెనే ఇది జరిగెను.
101
దానిని మనం ఒక్క నిమిషం చూద్దాం. త్వరగా మనం ఎఫెసీ 1 వ అధ్యాయము తీయుదము. పౌలు చెప్పిన దానిని వినండి. ఈ సంఘముతో కలిసి అతడు సంపూర్ణత లోనికి వెళ్ళవలసియున్నాడు. పౌలు దీనిని క్రైస్తవులకు చెప్పుచున్నాడు. ఇక్కడెంత మంది క్రైస్తవులున్నారో చేతులెత్తండి మంచిది ఇది పిల్లలకు కాదు. ఇది మాంసమును తినగల వారికి మాత్రమే 1వ అధ్యాయము ఎవరినుద్దేశించి వ్రాసెనో చూడండి.
దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు (ఏ బిషప్సు అభిషేకించలేదు. ఏ సంస్థ పంపించలేదు, ఒక అపోస్తులుడు (దేవుని చిత్తము వలన పంపబడినవాడు), పరిశుద్ధుల కొరకు (వారు పరిశుద్దులు. అనగా శుద్దీకరణ పొందిన వారు) ఎఫెసులోనున్న పరిశుద్దులును క్రీస్తు యేసు నందు విశ్వాసులునైన వారికి శుభమని చెప్పి వ్రాయునది.
దీనినెవరికి వ్రాయుచున్నాడు? అప్పటికే సంఘమునందున్న వారికి. నీవు క్రీస్తులో యున్నప్పుడు ఆయన శరీరములో యున్నట్లే. అది నిజమేనా? నీవు సంఘములో సభ్యునివగుదువు.
102
కృప మీతో కుడా ఉండును గాక, మరియు సమాధానము మనయొక్క దేవుడు, మన తండ్రి, మరియు.. ప్రభువగు యేసుక్రీస్తు.
మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
దానిని ఆయన ఎట్లు చేసెను? ఆయన ఏమి చేసెను? వారు యోర్దానును చేరుకొనిరి. వారు వాగ్దాన దేశములోనికి దాటిపోయిరి. వారు క్రీస్తు యేసుతో కూడా పరలోక స్థలము యందు కూర్చోబెట్టబడిరి. పరలోక ఆశీర్వచనములతో ఆయన మనలనందరినీ దీవించెను. వాక్యమును మనకు బోధించెను. సంఘము బయటకు పిలువబడినది. వారు క్రీస్తు యేసులోనే యున్నారు. మనందరమును యేసు క్రీస్తుతో కూడా పరలోక స్థలము యందు కూర్చొని యున్నాము. క్రీస్తు యేసు నందు మనము తిరిగి జన్మించినపుడు మీరెవరికయినా బోధించగలరు. కొరింథీయులలో చాలా సమస్యలున్నవి గాని ఈ సంఘములో లేవు. అతడు వారికి గొప్ప విషయములు బోధించును.
103
మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. (నా గత రెండు వర్తమానములను గుర్తించారా?)
ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పన యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్దులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. (గతసారి చదివానా?)
“ముందుగా నిర్ణయించుకొనెను....”
మనం ఏమి చేశాము? ఏవిూ చేయలేదు. ఆయన చేసిన దానినే నేను చూచుచున్నాను. ఆయనేమి చేసెను? మనలను ఏర్పరచుకొనెను. ఆయన గ్రంధములో మన పేరు వ్రాసెను. ఆయన సంఘ గ్రంధములో వ్రాసెను. ప్రపంచమునునది అసలు లేక ముందే ఉండిన ఈ దృశ్య శరీరములో సభ్యునిగా మారుచున్నాము.
యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను.
104
సోదరుడా, నీవు ఆ సంఘములో ఉండవలసియున్నావు. ఆయన ఆ సంఘము కొరకు వచ్చుచున్నాడు. అదెటువంటి సంఘము? మచ్చ గాని, ముడత గాని లేనట్టి సంఘము అందులో మనమెట్లు ప్రవేశించగలము? క్రీస్తునందు చనిపోయి, ఆయనాత్మ ద్వారా ఆయన యొక్క అదృశ్య శరీరములోనికి బాప్తిస్మము పొందుట ద్వారా ప్రవేశించగలము. దేవుని యొక్క రక్తపు బలి అచ్చట మన కొరకు ప్రతి ఘడియ, ప్రతి దినము కాచుకొని యున్నది. ఆ సంఘము నిందారహితమైనది. మచ్చలేనిది, ముడుత లేనిది. ఆయన తనలో మనలను ఏర్పరచుకొనెను. తన గ్రంధములో మన పేరు వ్రాసెను. బైబిలు దానిని గూర్చి చెప్పెను. వధించబడిన గొర్రెపిల్ల యేసే [పందొమ్మిది వందల సంవత్సరాల క్రితమా? ఎప్పటి క్రితం?] “జగత్తు పునాదికి ముందే ఆ గొర్రెపిల్ల వధింపబడెను.”
105
బైబిలులో దేవుడు చెప్పిన దానిని ఆదికాండము 1వ అధ్యాయములో చూడగలము. ఆ హెబ్రీ భాషలో దేవుని పేరును చూడండి. ఎల్, ఎలాహ్, ఎలోహిం అని పిలచెను. అనగా ఆయన స్వయం సంభూతుడు, సర్వశక్తిగలిగిన వాడు. బలవంతుడు. ఆయనకు ముందు ఏదియూ లేదు. గాలి గాని, నక్షత్రములు గాని, తేమగాని, వాతావరణము గాని, అణువు గాని, పరమాణువు గాని, మరేదియూ ఆయన కంటె ముందుగా లేదు. ఆయన దేవుడు, అనగా నిత్యుడు. ఆయనలో ఎన్నో లక్షణములుండెను. రక్షకునిగాను, తండ్రిగాను, దేవుని గాను ఆయన ఉన్నాడు. అప్పుడు ఆయనను ఆరాధించు వారెవరూ లేరు. దేవుడు అనగా ఆరాధనకు పాత్రుడని అర్థము. ఆయనను ఆరాధించునది ఏదియూ లేదు. ఆయనలో ఆయా గుణలక్షణములుండెను. రక్షకునిగాను, స్వస్థపరచువానిగాను ఆయనకు లక్షణములుండెను. ఈ గుణములన్నింటితో ఆయన నిండియుండెను.
106
ఆయన మొదట సృజించినది ఏమిటి? మీలో కొందరు నా ఆదికాండపు గాధను విని యుందురు. మనము మానవుని చేయుదమని దేవుడనెను. ఆయన మొదట దేవదూతలను సృజించెను. ఆయనను అవి ఆరాధించెను. అప్పుడాయన దేవుడాయెను. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయదమని ఆయన పలికెను. ఏ రకమగు మనుష్యుని ఆయన చేసెను? ఆత్మ స్వరూపియగు మానవునిని, ఆ మానవుని ఆయన తయారుచేసి అతనికి అధికారమిచ్చెను. నేలమంటిలో నుండి ఆయన నరుని సృజించెను. ఆ తరువాత అతడు పడిపోయెను. అప్పుడాయన రక్షకుడాయెను. ముందు దేవుడాయెను, ఆ తరువాత రక్షకుడాయెను. పాపము వలన వ్యాధి వచ్చెను, అపుడాయన స్వస్థపరచువాడాయెను. హల్లెలూయ! ప్రపంచము నిర్మింపబడక ముందే ఇదంతయూ ఈలాగు జరుగునని ఆయనకు తెలియును. ఈ రాత్రి మనకు ఈ కూటముండునని ఆయనకు తెలియును. ఈ భూమి మీదికి రాబోవు ప్రతి రెక్కలపురుగును ఆయన ఎరుగును. అదెన్నిసార్లు తిరుగునో, ఎన్నిసార్లు అది తన రెక్కలను కొట్టుకొనునో ఆయనకు తెలియును. ఆయన అనంతుడగు దేవుడు. ఆయనకు సమస్తమూ తెలియును. ఆమేన్! నీ పేరు ఆ గ్రంధములో ఉన్నదని తెలిసికొన్నందుకు ఈ రాత్రి నీవు సంతోషించుట లేదా!?
107
“ఎంత చక్కని ఆలోచనను నేను ఆలోచించుచున్నాను, ఒక పెద్ద చారల పక్షి గూర్చి ఆలోచించుచున్నాను; దేవుని యొక్క పరిశుద్ద వాక్యములో దాని పేరు లిఖింపబడి యున్నది.” మిగిలిన పక్షులన్నియూ దాని చుట్టూ గుమికూడుచున్నవి. వాటన్నింటి చేత అది తృణీకరించబడినది. ఆ పక్షి ఏమిటి? వారు చెప్పినట్టుగా అది ఇశ్రాయేలు కాదు. అది యేసు క్రీస్తు యొక్క సంఘము. పాప పరిహరార్థ బలికి వారేమి అర్పించిరి? వారు తెల్ల గువ్వను తీసికొనిరి. దాని తలను ఖండించి. తలక్రిందులు చేయుదురు. జీవించియున్న దాని జత పక్షి మిద రక్తము పోయుదురు. ఆ తరువాత బ్రదికియున్న పక్షిని విడిచిపెట్టెదరు. చనిపోయిన పక్షి యొక్క రక్తముతో ఈ పక్షి ప్రోక్షించబడినది. అది భూమి మిద ఎగురుచుండును. అది తన రెక్కలు కొట్టుకొంటూ ఎగురుచుండగా ఆ రక్తము ప్రోక్షించబడుచుండును. ఆ రక్తము భూమి మీద చల్లబడును. “ప్రభువు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు అని కేకలు వేయును. ప్రభువు పరిశుద్దుడని చెప్పును.”
108
అది క్రీస్తుకు మాదిరిగా యున్నది. ఆ గొప్ప ఎర్రని పక్షి సంఘమే, తన రక్తమును ఆయన తన జత పక్షి మీద జల్లెను, యేసు క్రీస్తు రక్షకుడు. అది ఈనాడు ప్రపంచమును దాటి వచ్చుచున్నది. తన రెక్కలు కొట్టుకొనుచూ, “ప్రభువు పరిశుద్దుడు, పరిశుద్ధుడు, పరిశుద్దుడు” అని కేకలు వేయుచున్నది. ఆమేన్! దానిని నేను ఎరిగి యున్నందుకు ఎంతగానో ఆనందించుచున్నాను. దాని గ్రంధములో నా పేరున్నందుకు ఎంతో సంతోషించుచున్నాను. నా మంచితనము వలన అందులో వ్రాయబడలేదు. కాని దేవుని యొక్క కృపా బాహుళ్యము బట్టి వ్రాయబడి యున్నది. (నీ మంచితనము వలన అది అక్కడ ఉండదు) లోకము యొక్క పునాదులను వేయక ముందే ఆయన తన గ్రంధములో మన పేరు వ్రాసెను.
109
సంఘము యొక్క గుర్తింపు ఏమిటి? ఆమె ఎట్లు ఉండవలెను? ఆమె ఎవరు? ఆమె ఏమిటి? ఆమె బయటకు పిలువబడిన గుంపు. దానినెవరు స్థాపించిరి? యేసు క్రీస్తు, బిషప్పు కాదు, కాతలిక్కు చర్చి కాదు, మెథడిస్ట్ కాదు, లూధర్ కాదు, వెస్లీ కాదు, దానినెవరు స్థాపించిరి? యేసు క్రీస్తు, దాని యొక్క వర్తమానమేమిటి? మారు మనస్సు, నీటి బాప్తిస్మము, పరిశుద్దాత్మ బాప్తిస్మము, దైవిక స్వస్థత, రక్షణ, దానిలో మనం ఎట్లు సభ్యులము కాగలము? దానిలో జన్మించుట ద్వారానే. అది లేకుండా మనం పరలోకములో ప్రవేశించగలమా? అది అసాధ్యం క్రీస్తులో చనిపోయిన వారిని దేవుడు తనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఇంకెవరినీ కాదు. క్రీస్తునందు చనిపోయిన వారిని మాత్రమే. క్రీస్తునందు మృతి పొందిన వారి కొరకు యేసు వచ్చుచున్నాడు. ఎఫెసీ 4 వ అధ్యాయము. కాదు గలతీ 4 వ అధ్యాయమని తలంచుచున్నాను. “క్రీస్తునందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. క్రీస్తునందు మృతి పొందిన వారిని దేవుడు తనతో కూడా తీసికొని వచ్చును.”
110
కాబట్టి అది ఒక బయటకు పిలువబడిన గుంపు, ఒక అదృశ్య శరీరము. దానిని క్రీస్తు క్రమములో యుంచును. తాను చనిపోక ముందే ఆయన దాని రాకను గూర్చి ఎత్తి చెప్పెను. నేను వచ్చి ఆ రాజ్యములో రాజుగా ఉండి ఏలుదును. ఇక కొంచెము కాలమయిన తరువాత లోకము నన్ను చూడదు గాని మిరు నన్ను చూచెదరు. ఈ ప్రపంచ రాజ్యముతో మీకేమియూ సంభంధం లేదు.
ఆ కారణము చేతనే వారు అంత గందరగోళములో యున్నారు, “బబులోను” గా పిలువబడుచున్నారు. “నేను ప్రెస్బిటేరియనును, దేవునికి వందనములు, నేను మెతడిస్థును, దేవునికి వందనములు,” అని చెప్పుకొనుచున్నారు. కాని నేను క్రైస్తవుడను గనుక దేవునికి వందనములు. ఆమేన్. అంతే! నేను క్రైస్తవుడనని నాకెట్లు తెలియును? విశ్వాసి ద్వారా ఈ సూచక క్రియలు కనబడును. చూడండి. అదే మీ గుర్తింపు కార్డు.
“ఒక్క నిమిషము ఆగండి, నా సహవాసపు కార్డులో నా దగ్గర ఉంది అని నమ్ముచున్నాను.” లేదు. నా దగ్గర ఏది లేదు. నాది అక్కడ ఉంది. నేను ఒక వేళ దీనిని పొగొట్టుకొనవచ్చును; కాని ప్రపంచమనునది ప్రారంభము కాక ముందే ఆయన నాకు ఆ గుర్తింపు కార్డును ఇచ్చెను. ఆయన రాజ్యము లోనికి వచ్చు ప్రతి ఒక్కరికిని ఇచ్చును. అది పరలోకములో దాచబడియున్నది. అక్కడ రికార్డులన్నియూ చక్కగా ఉన్నవి. నేనెంతో సంతోషించుచున్నాను.
“నేను దేవునిని వెదికాను, నేను దేవునిని వెదికాను” అని ఎవరో చెప్పిరి. అది బైబిలునకు వ్యతిరేకము. నీతో దేవుడే మాట్లాడుచున్నాడు గాని, నీవు దేవుని వెదకుట లేదు. దేవుడే నిన్ను వెదకుచున్నాడు. దేవుడు ఏదేనులో “ఆదామా, నీవెచ్చట?” అని వెదకుచూ తిరిగెను గాని ఆదాము “దేవా, నీవెక్కడ?” అని అడుగుచూ తిరుగలేదు. “ఆదామా, నీవెచ్చట? అని దేవుడడిగెను?”
111
ఓ, నేనందులో సభ్యునిగా యున్నందుకు ఎంతో సంతోషించుచున్నాను. మీకు ఆనందము లేదా? నాకెంతో ఆనందము కలుగుచున్నది. ఇది గొప్ప సంఘము. మిమ్మును చాలాసేపు ఆపినందుకు చింతించుచున్నాను. కాని ఈ గొప్ప సంఘమందు మిరు నమ్మిక యుంచుచున్నారా? దాని యందు మీకు విశ్వాసమున్నదా? అది అదృశ్య శరీరమని మీరు నమ్ముచున్నారా?
కాతలిక్కు వారున్నారు. మీరు సభ్యత్వమంటే చాలుననుకొనుచున్నారు. యేసు క్రీస్తును అంగీకరించి, ఆత్మ మూలముగా జన్మించండి. బాప్టిస్తు వారు, మెథడిస్ట్ వారు, ప్రెస్బిటేరియనులు, లూధరనులు, ఇతరులు వినండి. నేను పెంతెకోస్తు వారిని మెచ్చుకొనుచున్నానని తలంచవద్దు. అన్ని సంఘములలోవలెనె పెంతెకోస్తు సంఘములో కూడా తిరుగుబాటు చేయువారున్నారు. ఇది సత్యము. వారు పేరు పెట్టుకొని చెప్పుకొంటూ తిరుగుచున్నారు. అంతే కాని చూస్తే ఏమి లేదు. ఇది నిజము. ఎందుకనగా నీవు ఆత్మ మూలముగా జన్మించినప్పుడు నూతన సృష్టివగుదువు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడనారంభించును. దేవుని ఆత్మ చేత నడిపించబడు వారందరూ దేవుని కుమారులనబడుదురు. ఏ సంస్థకు నీవు చెందియున్నావన్నది కాదు. అది ఒక చిన్న లోకక్రమము. అది గతించిపోవును. కాని క్రీస్తు యొక్క ఈ గొప్ప అదృశ్య శరీరములో నీవు సభ్యునిగా యున్నావా? లేని యెడల ఈ రాత్రే నీవు ఆయనను చేర్చుకొనుము. ఒక నిమిషము ప్రార్థనకు శిరములు వంచుదము,
112
ఇప్పుడు మనము ఆలోచించుచుండగా, ఎవరయినా గాని ఇక్కడ చేతులెత్తి ఈలాగు చెప్పగలరా? “దేవా, నా చేతిని నీ తట్టు ఎత్తియున్నాను. ఈ రాత్రి నన్ను ఆ సంఘములో సభ్యునిగా చేయుము. నాకు చెందియున్న జన్మను నాకు దయ చేయుము. ప్రభువా, నీవు నన్ను పిలిచావా? అయితే నేను ఆ సంఘ సభ్యునిగా ఉండగోరుచున్నాను. నేను ఈ భూలోక సంస్థలలో ఒకదానికి చెందియున్నాను. నాకు అనుభవము లేదు. దయ్యములను వెళ్ళగొట్టు శక్తిగాని, విశ్వాసి ఏ కార్యములు చేయునని నీవు చెప్పితివో ఆ కార్యములు చేయు శక్తి గాని నాకు లేదు. ప్రభువా, ఇంకా అది నేను పొందలేదు. ప్రభువా నీవే శక్తినిచ్చెదవనుటకు అది గురుతుగా యుండును.”
113
దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను, నిన్ను, నిన్ను, నిన్ను, చేతులెత్తిన మి యందరినీ దీవించును. దేవుడు మిమ్ము దీవించి ఈ గొప్ప సంఘములో సభ్యునిగా యుండు శక్తి ననుగ్రహించును. ఇది యేసు క్రీస్తు సంఘము. మనం ప్రార్థించుటకు ముందుగా మరెవరైనా యున్నారా? యవ్వనురాలిని దేవుడాశీర్వదించును. సోదరీ, దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. ఆ వెనుక నున్న వారి చేతులు నాకు కనబడుచున్నవి. దేవుడు మిమ్ము దీవించును. కుమారుడా, నీ చేతులు కనబడుచున్నవి. సోదరుడా, నీ చేతిని చూచి యున్నాను. చిన్నవారిని, యువతులను దేవుడు దీవించును. దేవుడు నిన్ను దీవించును. ఇంకెవరో చేతులెత్తి, ఇక్కడ కూర్చొనియున్న సోదరిని దేవుడు దీవించు గాక “నేను సభ్యునిగా ఉండగోరుచున్నాను. ఈ రాత్రి ఈ స్థలములో నుండి వెళ్ళు ముందుగా ఆయన రక్తమును నా మీద ఉంచుకొనగోరుచున్నాను. నేను బయటకు వెళ్ళినప్పుడు ఆ జీవము, ప్రభువు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు అని కేకలు వేయును. ఆ వెనుక ఉన్న కుమారుని దేవుడాశీర్వదించును. దేవుడు నీకు దీవెనలిచ్చు గాక! ఇంకెవరైనా చేతులెత్తెదరా? దేవా, నా పట్ల కృప చూపుమని మరెవరైనా చెప్పెదరా? ప్రార్థన కొరకు మీరు ఈ వేదిక యొద్దకు రాగోరుచున్నచో మేము పాట పాడుచుండగా రండి: ఇంటికి రమ్ము ఇంటికి రమ్ము అలసిన వారలారా, ఇంటికి రండి అను పాట. నీ స్థితిని గూర్చి నీకే తెలియని స్థితిలో యున్నచో నిన్ను రమ్మని ఆహ్వానించుచున్నాను.