కల్వరి పై ఆ రోజు
1నెవిల్ సోదరుడా, నీకు వందనములు. [సహోదరుడు నెవిల్ చెప్పుచున్నాడు, “దేవుడు నిన్ను దీవించును గాక!”—సంపా.] దేవుడు నిన్ను దీవించును గాక, నెవిల్ సోదరుడా. నీకు చాలా వందనములు.
2 స్నేహితులారా, మంచి శుభోదయము. దేవుని యొక్క వాక్యమును బోధించుట, మరియు రోగుల కొరకు ప్రార్థించుట ద్వారా, ఈ ఉదయమున ఆలయములో తిరిగి, ప్రభువును సేవించుట, ఒక భాగ్యమైయున్నది. ఈ దినమును బట్టి నేను ఎంతో కృతజ్ఞుడనైయున్నాను.
3 నేను లోనికి వస్తుండగా ఆశ్చర్యపడ్డాను. ఒక సోదరుడు నడుచుకొంటూ వచ్చి అన్నాడు, “నేను స్వస్థపడిన ఆ యోగ్యుడైన కుష్టురోగివలెయుండను.” అది సోదరుడు రిట్. నేను అతని కొరకు ప్రార్థించాను, మరియు ప్రభువు అతనిని సంపూర్ణముగా స్వస్థపరిచాడు. అతడు ఏడ్చుకొంటూ పైకి వచ్చి, నాతో కరచాలనము చేసి, అతడు స్వస్థపడినందుకు ప్రభువుకు కృతజ్ఞతను తెలుపగోరాడు. అతడు మూల్యముగా తిరిగి కృతజ్ఞతలిచ్చాడు. అదంతయూ సమాప్తమైనది. అతడు పరిపూర్ణముగా ఆరోగ్యముగాయున్నాడు. ఆ సాక్ష్యములను బట్టి మనము కృతజ్ఞులమైయున్నాము.
4 చార్లీ, నీవు మరియు జఫ్రీస్, మీకు ఇష్టమైనట్లైతే, పైకి వచ్చి, ఇక్కడయున్న కుర్చీలలో కూర్చొనవచ్చు. మీకు ఎంతో స్వాగతము, కాబట్టి మీరు నిలబడవలసిన పని లేదు. ఆ ఇతర సోదరుడు, సోదరుడు ఉడ్, ఈ పైకి రండి. ఇక్కడ ఈ బల్లల మీద కొన్ని ఖాలీలుయున్నాయి, కాబట్టి మీరు నిలబడవలసిన పనిలేదు. ఇక్కడ కొన్ని ఖాళీలున్నాయని, నేను నమ్ముతాను, అవును, మీకు మిక్కిలి స్వాగతము, వచ్చి ఈ స్థలములు తీసుకోండి.
5 మనకు ఎంతో సంతోషము…ఒక సారి అది ఇలా చెప్పబడింది, “వారు నాతో అన్నప్పుడు, నాకు ఎంతో సంతోషము…” సోదరుడా ప్రభువు నిన్ను దీవించును గాక. [ఒక సహోదరుడు చెప్పుచున్నాడు, బోధకునికి ఎల్లప్పుడు దగ్గరగా ఉండుటకు ఇష్టపడెదను—సంపా.] వందనములు. వందనములు, మీకు వందనములు. “దేవుని గృహములోనికి వెళ్ళదమని వారు నాకు చెప్పినప్పుడు, నాకు సంతోషము.” ప్రభువు యొక్క గృహములోనికి వెళ్ళుట, అది క్రైస్తవుని యొక్క ధన్యత, మరియు సంతోషమైయున్నది.
6 ఈ ఉదయమున, అనేకమంది స్నేహితులను చుట్టూ చూస్తూయుండగా, నేను ఎంతగానో సంతోష భరితుడనయ్యాను. ఒహీయో నుండి వచ్చి, సహోదరుడు మరియు సహోదరి డాచ్ ను చూచుటకు నేను సంతోషిస్తాను. ఆ వెనుక మార్గమంతటి గుండా, ఒహాయో నుండి వచ్చిన సోదరుడు మరియు సహోదరి ఆర్మ స్ట్రాంగ్ ఆ వెనుక చూస్తాను. మీ అందరిని ప్రభువు దీవించును గాక. ఓ, చుట్టూ చూస్తూయుండగా, మీరు ఎందరినో చూస్తారు. వారందరి పేర్లను పిలుచుట కష్టము. ఈ ఉదయమున కెంటక్కీ నుండి వచ్చిన, సహోదరి హూవర్ ను లోన చూచుట ఎంతో సంతోషము. చార్లీ, నెల్లీ, మరియు జఫ్రీ అతని కుటుంబము, పట్టణము బయట నుండి అనేకులు లోనికి వచ్చియున్నారు.
7 కాబట్టి ఈ ఉదయమున ప్రభువులో గొప్ప సమయము కొరకు మనము ఎదురు చూస్తున్నాము, దేవుడు మనలను మార్గములో కలుసుకొని, మన ఆత్మలను దీవించి, మనకు అవసరమైన వాటిని పరిచర్య చేస్తాడని మనము ఎదురుచూస్తున్నాము.
8 ఈ స్థలములో చుట్టూ నేను చూస్తూయుండగా, ఇక్కడయున్న నా స్నేహితులు పేర్లన్నిటిని పిలిచినట్లైతే, వివిధమైన వారిని గూర్చి చెపుతూ, నేను ఉదయమంతా తీసుకొనవలసియుంటుంది. సంఘమునకు తిరిగి వెళ్ళి, ప్రజలందరిని చూచుట, వారిని కలుసుకొనుట, నాకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.
9 మనము ఎంతో మెచ్చుకొనుచున్న ఆ దీవెనల చుట్టే, దేవుని యొక్క సింహాసనము చుట్టూ, ఆ నిత్యమైన సహవాసములో మనము ఏకమైనపుడు, నిత్యత్వపు గొప్ప సమయము కొరకు, మనము అక్కడ కలుసుకొన్నప్పుడు, మనము పరలోకము వెళ్ళినపుడు అది ఎలాయుంటుందో? అక్కడ మనము ఎన్నడూ అలసిపోవుట లేకుండా, పరిశుద్ధాత్మను మన మీద కలిగిన వారమై, ఆయన యొక్క పోలికలో మరియు ఆయన యొక్క రూపములోనికి తయారుచేయబడిన వారమై, నిత్యమంతటా ఆయనను సేవిస్తూ, ఆయనను ఆరాధిస్తాము.
10 కొంచెము, ఆలోచించండి. నీవు చేయుటకు ఇష్టపడగోరేది, అక్కడ నీవు ఆలోచించ గోరేది ఏమియు లేదు, కాని ఏమిటి, అప్పుడప్పుడు నీవు దానిని చేయుటకు అలసిపోతావు. చార్లీ, మనకు ఇష్టమై చేయగోరు దేనికంటెయైనా, నీకు మరియు నాకు ఉడుతలను వేటాడుట ఎక్కువ ఇష్టము, కానీ, ఆలాగు చేయుటలో, నీవు అలసిపోతావు.
11 ఒక నడిచే యాత్ర నాకు ఇష్టము, పర్వతముల మీదికి నడుచుకొంటూ యాత్రచేయుట, కాని నేను అలసిపోతాను, కొన్ని సార్లు నీవు మరేదో చేయాలనుకొంటావు.
12 కారు నడుపుట నాకు ఇష్టము. కొన్నిసార్లు నేను ఒక విధముగా అలసిపోయి, పాతగిలిపోయి, మరియు నరములు తెగిపోయినట్లుగా యుంటుంది. నేను నా కారులోనే కొంచెము ఎగిరి బయటకు తీసుకొని, స్టీరింగ్ వీల్ను పట్టుకొని, “నేను వారిలో ఒకడనైయున్నానని,” పాడుకొంటూ రోడ్డు మీద వెళుతూయుంటాను. ఆ వీల్ ను గట్టిగా పట్టుకొని, వంగిపోయి నా ఆహారమును తింటూ, కేకలు వేస్తాను. మంచిది, కొద్ది సేపటి తరువాత, నేను అలసిపోతాను, తరువాత ఇంటికి తిరిగి వెళ్ళి, ఇంకా ఏదైనా ప్రారంభిస్తాను.
13 కాని ఆ క్రొత్త రాజ్యములో మనము ఆయనను ఆరాధించుటకు వెళ్ళినపుడు, అక్కడ ఎన్నడూ ఒక అలసిపోయిన క్షణముయుండదు, ఎల్లప్పుడు దీవెనగా, ముందుకు, ఇంకా ముందుకు వెళతాము. కాని, అప్పుడు ప్రయాణపు మార్గములో మనము మారిపోతాము. మనము ఇప్పుడున్నట్లుగా అప్పుడు యుండము. మనము భిన్నముగా యుంటాము, ఇప్పుడుయున్న జీవులకంటె భిన్నముగా యుంటాము. కాబట్టి, మనము సంతోషముగాయుంటాము.
14 నేను కొంచెము ఆలోచన చేయుచుంటిని. నేను ఎన్నడైనా దీనిని ఎత్తిచూపించానో లేదో నాకు నాకు తెలియదు. సోదరుడు చార్లీ, కొద్దికాలము క్రితము, నేను కెంటక్కీలో అతనితోయున్నాను, అతడన్నాడు, “బ్రాన్హాం సోదరుడా, వెయ్యేండ్ల పాలనలో, నీవు మరియు నేను ఉడుతలను వేటాడతామంటావా?”
నేనన్నాను, “చార్లీ, నేను అలా అనుకోను.”
15 నేనన్నాను, “మంచిది, మనకు అది ఎంతో ఇష్టము.” “వెయ్యేండ్ల పాలనలో మనము అక్కడకు వెళ్ళినపుడు, మనము అది చేస్తామని నీవంటావా?”
నేనన్నాను, “లేదు, వెయ్యేండ్ల పాలనలో ఏమియు చంపబడదు.”
అతడన్నాడు, “మంచిది, మనకు అది ఇష్టము.”
16 నేనన్నాను, “చార్లీ, ఒకప్పుడు నీవు పందివైయున్నవని నేను నిన్ను ఒప్పించగలిగినట్లైతే. మరియు ఇప్పుడు నీవు ఉన్నతమైన జీవిగా, ఒక మనిషిగా లేపబడ్డావు? నీవు మరలా ఎన్నడైనా తిరిగి, ఒక పందియొక్క సుఖభోగములను అనుభవిస్తావా?”
అతడన్నాడు, “లేదు.”
17 నేనన్నాను, “చూడు, నీవు పందికంటె ఉన్నతమైనవాడవు, ఇప్పుడు, నీవు ఒక మనిషివైయున్నావు, నీవు ఇంకెంత మాత్రము ఒక పందిగాయుండుటకు ఇష్టపడవు.” నేనన్నాను, “ఇప్పుడు, నీవు దానిని పదివేలసార్లు హెచ్చించు, ఇక్కడ నుండి నీవు యుండబోవు స్థితిలోనికి మారినపుడు, ఆలాగున నీవు ఉండబోవుచున్నావు. నీవు ఎన్నడూ తిరిగి ఒక మనిషిగా మారుటకు ఇష్టపడవు.”
18 అది నిజము. అది ఒక రకముగా వేరుగాయుంటుంది. దాని యొక్క తలంపులను బట్టి నాకు ఎంతో సంతోషము, ఎందుకనగా, ఒక రోజున నేను ఉన్నతమైన స్థితికి ఎగురుతాను.
19 బాగున్నది, ఇప్పుడు, ప్రభువు చిత్తమైన యెడల, వచ్చే ఆదివారము…నా మంచి స్నేహితునితో వ్యోమింగ్ వెళ్ళుటకు సిద్ధపడతాను; లేక నా మంచి స్నేహితుడు, సోదరుడు మైనర్ ఆర్గన్ బ్రైట్, సోదరుడు క్లాట్ సన్ మోర్, క్రిష్టియన్ బిజినెస్ మెన్ తో, ఐడహా లోనికి వెళతాను.
20 ఇప్పుడు వచ్చేవారము తరువాత వారము, 7వ తారీఖున నేను టెక్సాస్ లోని డల్లాస్ లో, వాయిస్ ఆఫ్ హీలింగ్ కన్వెన్ష్సన్ నొద్దయుండాలి. మరియు నేను మాట్లేడే రాత్రి, 7వ తారీఖు రాత్రియైయున్నది. తరువాత నేను తిరిగివచ్చి, ఐడహాలోనికి వెళ్ళి, ఆర్గాన్ బ్రైట్ తో, క్రిష్టియన్ బిజినెస్ మెన్ యొద్దయుంటాను. మేము వెళ్ళకముందు, బహుశ ఒక రాత్రి మినియోషిలిన్ లో యుంటాను. తరువాత ఒక క్రిష్టియన్ బిజినెస్ మెన్స్ బ్రేక్ ఫాస్ట్ నొద్దయుంటాను.
21 ప్రభువు చిత్తమైన యెడల, అది అనుమతించబడినట్లైతే, అది ప్రభువు చిత్తమైనట్లైతే, వచ్చే ఆదివారము ఉదయమున, నేను ఆలయములోయుంటాను, మరియు గాలిలోని సుడిగాలి, అను అంశమును, ప్రభువు చిత్తమైన యెడల, మాట్లాడగోరుచున్నాను. వారమంతయూ, అది నా హృదయములోయున్నట్లుగా కనపడింది.
22 మొన్నటి ఉదయమున, ఎంతో పెందలకడ, దరిదాపుగా ఉదయమున 4 గంటల సమయములో, నేను మేల్కొన్నాను మరియు ఈ తలంపు నాకు వచ్చింది, “కల్వరిలో ఆ దినము.” మరియు దాని గురించి నేను ఈ ఉదయకాల సమయములో మాట్లాడుటకు కోరుచున్నాను: కల్వరిలో ఆ దినము.
23 ఇప్పుడు పఠనము కొరకు, మన బైబిళ్ళులోని లేఖనము వైపుకు చూద్దాము, పరిశుద్ధ మత్తయి సువార్త, 27వ అధ్యాయము. మన పూర్వపు వృత్తాంతములను పొందుకొనుట, 27వ వచనముతో ప్రారంభించి, లేఖనములో ఒక భాగాన్ని చదువుదాము, అప్పుడు తిన్నగా మనము ప్రారంభము చేద్దాము. బోధించు కూటము తరువాత, అప్పుడు మనము రోగుల కొరకు ప్రార్థన చేయబోవుచున్నాము.
24 ఓ, గతసారి ఇక్కడయున్నప్పటి నుండి, నా క్రొత్త రకపు పరిచర్యను, నమూనా చేయుచూ, అది వెనుకకు వచ్చుచున్నది. నేను ఒక ధీర్ఘకాలములో కలిగియున్న సాక్ష్యముల కంటె, ఆ కూటము నుండి నాకు ఎక్కువ సాక్ష్యములు వచ్చుచున్నవి.
25 అక్కడ దానిని గూర్చి ఒకటున్నది, అదేమనగా నీవు తప్పక ఆ వ్యక్తిని తాకవలసియున్నది, అక్కడ ఎంత సహజాతీతమైనది చూపబడినప్పటికి లెక్క కాదు. చూడు, స్వస్థత వ్యక్తిగతమైన విశ్వాసముపై యుంచబడింది. ఇప్పుడు, ఆ వ్యక్తి విశ్వాసమును కలిగియున్నట్లైతే…
26 “పలానా-పలానా కార్యములు జరుగుతాయని, పరిశుద్ధాత్ముడు శ్రోతల మీదుగా వెళ్ళుటను వారు చూస్తారు. అదేమనగా, నీ పేరు పలానా-పలానాయైయున్నది. నీవు పలానా-పలానా స్థలము నుండి వచ్చియున్నావు. మరియు నీవు పలానా విషయము చేసియున్నావు. మరియు అది ఈలాగున ఉండబోవుచున్నది.” అదంతయూ సరిగ్గా ఆ విధముగానే జరుగుట చూస్తారు!
27 ఇంకనూ, అక్కడ కూర్చొన్న వ్యక్తి “అది దేవుడైయున్నాడని. నేను నా యొక్క స్వస్థతను అంగీకరించియున్నానని,” తప్పక పైకి చూసి చెప్పవలసియున్నది.
28 కాని, దానికి బదులుగా, “నా మీద చేతులను యుంచి ప్రార్థనచేయండి, అప్పుడు నేను స్వస్థపడగలను,” ఆ వ్యక్తి అంటాడు. అయితే దానిని నమ్ముటకు కారణము, ఆ విధముగా ఇక్కడ అమెరికాలో నేర్పబడింది. అది నిశ్చయముగా లేఖనానుసారమైయున్నది.
29 అయితే, ఇప్పుడు మనము కనుగొనునది ఏమనగా, ఆఫ్రికా మరియు వివిధమైన స్థలములలో, సరిగ్గా అలాటిది ఏదో జరగనివ్వండి, శ్రోతలందరూ ఒకేసారి ఆ స్థలమునకు చేరుకొని, వారి స్వస్థతను స్వీకరిస్తారు, కారణమేమనగా వారికి ఏమియు నేర్పబడియుండలేదు. చూడండి? కనీసము స్వస్థతను గూర్చి వారికి నేర్పబడలేదు. మరియు అప్పుడు వారు దానిని చూసినపుడు, అక్కడ ఒక జీవించుచున్న దేవుడుయున్నాడని వారు తెలుసుకొంటారు. “మరియు ఆయన జీవిస్తున్నట్లైతే, ఆయన మహోన్నతుడు, ఆయన స్వస్థపర్చుతాడు.” అది అంతే, కారణము ఆయన స్వస్థపర్చువాడైయున్నాడని, ఆయన ప్రజలను స్వస్థపర్చుతాడని ఆధారము, పునాదులు ఇది వరకే వేయబడియున్నవి. అలాగైతే ఆయన సంఘము ద్వారా ఆయన సన్నిధి పని చేస్తున్నట్లైతే, అప్పుడు వారంటారు, “మాకు కావలసినదంతా అదియే, అది దానిని పరిష్కరిస్తుంది.”
30 అయితే “రోగుల మీద చేతులను యుంచుట,” మొదలగు విషయములు మనకు నేర్పబడ్డాయి. ఆ కారణమును బట్టియే, అమెరికాలో అది అంత మంచిగా పనిచేయుట లేదు.
31 ఇప్పుడు గుర్తుంచుకోండి, వచ్చే ఆదివారము ఉదయము, ప్రభువు చిత్తమైన యెడల, సోదరుడు నెవిల్ దానిని ప్రకటిస్తాడు,…అదే గాలిలోని సుడిగాలి.
32 ఇప్పుడు, లేఖనములను తీయుటకు, మీకు కొంచెము సమయము ఇచ్చుచున్నాను, మత్తయి 27వ అధ్యాయము. 27వ వచనము నుండి చదువుటను ప్రారంభిద్దాము, పరిశుద్ధ మత్తయి సువార్త. ఇప్పుడు చదువుటను జాగ్రత్తగా వినండి.
అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొనిపోయి, ఆయన యొద్ద సైనికులనందరిని సమకూర్చిరి.
వారు ఆయన వస్త్రములను తీసివేసి, ఆయనకు ఎఱ్ఱని అంగీ తొడిగించి,
ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడిచేతిలో నుంచి, ఆయన యెదుట మోకాళ్ళూని- యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి.
ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసివేసి దానితో ఆయన తలమీద కొట్టిరి.
…ఆయనను అపహసించిన తరువాత, ఆయన మీదనున్న ఆ అంగీని తీసవేసి, ఆయన వస్త్రములాయనకు తొడిగించి, సిలువవేయుటకు ఆయనను తీసుకొనిపోయిరి.
వారు వెళ్ళుచుండగా కురేనియుడైన సీమోనను ఒకడు కనపడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి.
వారు కపాల స్థలమను అర్ధమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి,
చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచిచూసి త్రాగనొల్లకపోయెను.
వారు ఆయనను సిలువవేసిన పిమ్మట, చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి; అని ప్రవక్త ద్వారా పలుకబడినది నెరవేరునట్లుగా, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు.
…అంతట వారక్కడ కూర్చొండి ఆయనకు కావలియుండిరి;
-ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగాయుంచిరి.
మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువవేయబడిరి.
ఆ మార్గమును వెళ్ళుచుండిన వారు తలలూపుచూ
దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనము; నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి.
ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడా ఆయనను అపహసించుచు,
వీడు ఇతరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువమీద నుండి దిగినయెడల వాని నమ్ముదుము.
వాడు దేవునియందు విశ్వాసముంచెను; నేను దేవుని కుమారుడనని చెప్పెను, గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.
ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలును అలాగే ఆయనను నిందించిరి.
మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను.
ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు- ఏలీ, ఏలీ, లామా సబక్తానీ బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము?
అక్కడ నిలిచియున్న వారిలో కొందరామాట విని-ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి.
వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొనిపోయి, స్పంజీ తీసుకొని చిరకాలో ముంచి, రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను.
తక్కినవారు ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి.
యేసు మరలా బిగ్గరగా కేక వేసి-ప్రాణము విడిచెను.
అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రిందికి రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్ధలాయెను;
సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేకమంది పరిశుద్ధుల శరీరములు లేచెను.
వారు సమాధులలో నుండి బయటకు వచ్చి, ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి.
శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలియున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని, చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి.
33 ఒక్క క్షణము ప్రార్థన కొరకు మన తలలను వంచుదాము.
34 ప్రభువా, నీవు దేవుడవైయున్నావని మాకు తెలుసు. నీ పరిశుద్ధమైన, పవిత్రమైన వాక్యము చదివిన తరువాత, మేము ఇంకనూ నీ స్వభావము మారలేదని మేము చూడగలము. నీవు ఎల్లప్పుడు దేవుడవైయున్నావు. యేసు ఏ సహాయమును పొందబోవునట్లుగా అది కనబడుటలేదు, ఆయన దుర్మార్గుల చేతులకు అప్పగించబడి, ముక్కలుగా కోయబడి, ఉమ్మివేయబడి, అపహాసింపబడి, రక్తము కారుచూ, చనిపోవుచూ సిలువ మీద వ్రేలాడుచున్నాడు. ఏ సహాయము, ఎక్కడ నుండి వచ్చినట్లు కనబడలేదు. చివరకు ఆయన, ఆయనే స్వయముగా, “నా దేవా, నాదేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి?” అని మొఱ్ఱ పెట్టాడు.
35 కానీ, ఏది పనిచేయనపుడు, నీవు ఆ క్షణములో పని చేశావు. మేము తెలుసుకొనుటకు ఇవ్వబడినదేమనగా, ప్రభువా, మేము కలిగియున్న ఏ నదులనైనను మేము దాటలేనపుడు, మేము దానిగుండా వెళ్ళలేని ఏ పర్వతములనైనా మేము కలిగియున్నప్పుడు, ఇతరులు చేయలేని కార్యములు చేయుటలో దేవుడు నేర్పరియైనవాడు.
36 నీవు పనిలో నేర్పరియైనవాడవు, ఏలయనగా కల్వరిలో ఆ దినమునకు కారణమేమిటో నీవు ఎరిగియున్నావు. నీవు అనంతుడవైన దేవుడవైయుండి, ఈ గడియ తప్పక రావలెనని ఎరిగియున్నావు. కాని అది నెరవేరినపుడు, అప్పుడు నీవు దేవుడవైయున్నావని నీవు చూపుకొన్నావు. యజమాని ఎవరైయున్నారో నీవు చూపుకొన్నావు. నీవు భూమిని వణకించావు, భూమిలో నిద్రించిన పరిశుద్ధులు బయటకు వచ్చారు. నీవు దేవుడవైయున్నావని చూపుచూ, రాత్రి చీకటి వలె సూర్యుని నల్లగా, రాత్రిగా చేశావు. నీవు దేవుడవైయున్నావు. అయితే ఎంతో సమయము నీవు నిశ్శబ్దముగాయున్నావు.
37 దీని నుండి మనము, ఈ ముగింపును తీసుకొందాము, అదేమనగా, మనము ఆత్మలో నడుస్తున్నంత కాలము, దేవుని హస్తము చేత నడిపించబడినంత వరకు, ఏది తప్పుగా కనపడినప్పటికి లెక్క కాదు, ఇంకను మనము కల్వరిని ఎదుర్కొనుచున్నాము; సరియైన గడియలో, సరియైన సమయములో దేవుడు మాట్లాడతాడు.
38 ఇప్పుడు, తండ్రివైన దేవా, మా పాపములను బట్టి మరియు మా అతిక్రమములను బట్టి, మేము క్షమాపణ అడుగుచున్నాము. పావురము, గొర్రెపిల్లను నడిపినట్లుగా, మమ్ములను నడుపుము. మాకు ఏది సంభవించినప్పటికి, దీనిని ఎరిగినవారమై, అది అంతయూ సక్రమముగానేయుంటుందని, దేవుడు అన్ని కార్యములను చక్కగా చేస్తాడని, మేము దీనులుగాయుందుము గాక.
39 ఈ రోజు ఈ కూడికలో మాతోయుండుము. రక్షణను వెదుకుచూ, రక్షించబడే, స్థితిలోయున్న వారిని రక్షించుము. అలాటిది వెదుకు వారిని నిత్యజీవముతో నింపుము. స్వస్థతను వెదుకుచూ, రోగులను మరియు బాధింపబడుచున్న వారిని, స్వస్థపర్చుమని, మేము ప్రార్థించుచున్నాము. దానిని బట్టి మేము నిన్ను స్తుతిస్తాము. మా రక్షకుడైన, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.
40 ఇప్పుడు, ఈ ఉదయమున మాట్లాడుచుండగా, కల్వరిలో ఆ దినము, అను ఎన్నుకొనబడిన అంశము మీద మాట్లాడుటకు, మేము మీ దృష్టిని పిలుచుచున్నాము.
41 అది ఈ ఋతువునకు బయటయున్నట్లుగా కనబడుతుంది; అది తప్పక మంచి శుక్రవారమునయుండాలి. కాని కల్వరి తప్పక ప్రతిరోజు జ్ఞాపకము చేసికొనబడాలి. మనము దానిని గూర్చి ఎంతో వినియున్నాము, దానిని గూర్చి ఎంతో చదివియున్నాము. కాలము యొక్క ఆరంభము నుండి ఉపదేశకులు దాని మీద ఉపదేశించియున్నారు. యుగముల గుండా గాయకులు నాలుగు వేల సంవత్సరముల క్రితము అది ఎన్నడైనా సంభవించకముందు, గాయకులు దానిని గూర్చి పాడియున్నారు. మరియు ఈ దినము యొక్క ప్రవక్తలు అది ఎక్కడ సంభవించియున్నదో, వెనుకకు వ్రేలు చూపియున్నారు. అది ఎలాటి ఒక ముఖ్యమైన దినమైయున్నదో! అది దేవుడు ఎన్నడైనా భూమి మీదకు ఉదయింపనిచ్చిన దినములన్నిటిలో అది, అత్యంత ప్రాముఖ్యమైన దినమైయున్నది.
42 కల్వరి, అది మానవాళికి ఎంతో ప్రాముఖ్యమైయున్నట్లైతే, మనము వెనుకకు వెళ్ళి, అది మనకు ఏ భావమునిస్తుందో, పరీక్షించుట, అది మంచిదైయున్నదని నేను తలస్తాను. కారణము, మనము జీవించుచున్న, ఈ ఆలస్యపు గడియలో, దానిని గూర్చి నేర్చుకొనుటకు, ప్రతి ప్రాముఖ్యతను మనము వెతుకుతున్నామని, నా నిశ్చయత. మనము కనుగొనగలిగినదంతయూ, అది మనకు ఏమైయున్నదో చూచుటకు, దేవుడు మనకు ఏమి చేసియున్నాడో, మరియు మనకు ఏమి వాగ్దానము చేశాడో చూచుటకు, దానిని గూర్చి నేర్చుకొనుటకు మనము ఇక్కడయున్నాము. దాని కొరకే మనము సంఘమునకు వస్తాము. ఆ కారణమును బట్టియే ఉపదేశకుడు ఉపదేశిస్తాడు, ప్రేరేపణను వెతుకుట కొరకు, అందుకొరకే అతడు లేఖనాన్ని చదివి, ధ్యానిస్తాడు, కారణమేమనగా, అతడు దేవుని యొక్క ప్రజలకు ప్రజా సేవకుడు. దేవుడు తన ప్రజలకు ఏమి చెప్పవలసియున్నదో, వారికి ఏదైనా సహాయపడుటకు, దేనినో కనుగొనుట కొరకు అతడు ప్రయత్నము చేయుచున్నాడు. బహుశ, పాపములను బట్టి వారిని ఖండించుట కొరకు కావచ్చు, వారు తమ పాపములను విడిచిపెట్టి, ప్రభువును సేవించుటకు, పైకిలేచుట కొరకు, అయితే వారిని పైకి లేపుట కొరకు అది సహాయపడుతుంది. సేవకులు తప్పక ఈ విషయములను వెతకాలి.
43 ఈ దినము, ఎంతో ప్రాముఖ్యమైయున్నందున, అత్యంత గొప్ప దినములలో, ఒక గొప్ప దినమైనందున, ఆ దినమనగా మనకు భావమేమిటో, మూడు విషయముల వైపు చూద్దాము. మనము వందల విషయములను తీసుకోవచ్చు. కాని ఈ ఉదయమున, కల్వరి అనగా మనకు భావము ఏమైయున్నదో, కొన్ని క్షణముల పాటు, మూడు భిన్నమైన, ముఖ్యమైన సంగతులను, నేను ఎన్నుకొన్నాను. ఇక్కడ హాజరైన ప్రతి పాపిని అది ఖండిస్తుందని, ప్రతి పరిశుద్ధుని అతని పాదములపై మోకరించునట్లు చేస్తుందని నేను ప్రార్థిస్తాను; ప్రతి రోగి యొక్క విశ్వాసమును, స్వస్థపడి నడిచి వెళ్ళిపోవునట్లు చేస్తుంది; ప్రతి పాపి రక్షించబడతాడు; ప్రతి వెనుకకు జారిపోయిన వ్యక్తి, తనకై తాను సిగ్గుపడి, తిరిగి వస్తాడు; ప్రతి పరిశుద్ధుడు సంతోషిస్తాడు, మరియు నూతన నిరీక్షణతో, క్రొత్త పట్టును తీసుకొంటాడు.
44 మనకు మరియు ప్రపంచమునకు, కల్వరి యొక్క ప్రాముఖ్యమైన భావము ఏమనగా, ఒకేసారి అది శాశ్వతముగా, పాపము యొక్క ప్రశ్నను పరిష్కరించియున్నది. పాపమును బట్టి మనిషి దోషిగా కనబడ్డాడు. మరియు పాపము యొక్క జరిమానా, ఏ మనిషియూ చెల్లించలేనిదైయున్నది. ఆ జరిమానా ఎంత గొప్పదనగా, చివరకు ఆ జరిమానాను ఎవరునూ చెల్లించలేకపోయారు. దేవుడు దానిని ఆ మార్గములో నిర్ధేశించియున్నాడని, నేను నిజముగా నమ్ముతాను, ఆ ప్రకారము, ఆయనే స్వయముగా, దానిని చేయగలడు. మనమందరము పాపములో పుట్టి, అతిక్రమములో రూపుదిద్దబడి, అబద్ధములాడుచు లోకములోనికి వచ్చాము. అందుచేతన, మనలో అక్కడ యోగ్యులైనవారు ఎవరునూ లేరు. లేక, భూమి మీద యోగ్యుడైన వానిని వారు కనుగొనలేకపోయారు.
45 పాపము భూమి మీద ప్రారంభము కాలేదు. పాపము పరలోకములో ప్రారంభమైనది. లూసిఫర్, దయ్యము వాడు ఎన్నడైనా భూమిని తాకకముందు, వాడి అవిధేయతను బట్టి ఒక దోషిగా తీర్పు చేయబడిన జీవియైయున్నాడు. పాపము పరలోకములో ప్రారంభమైనది, ఆయన మనుషులను యుంచియున్నట్లుగానే, దూతలను కూడా అదే ఆధారముపైయుంచియున్నాడు; జ్ఞానము, జ్ఞానమునిచ్చు వృక్షము, జీవ వృక్షము, మంచి చెడ్డల తెలివినచ్చు వృక్షము, అక్కడ మనిషి తన యొక్క ఎంపికను తీసుకొనగలడు. అతని ఎంపికను చేయవలసి వచ్చినపుడు, లూసిఫర్ కు ప్రాధాన్యత ఇవ్వబడింది, దేవుడు కలిగియున్న దాని కంటె శ్రేష్టమైన దానిని ఏదో వాడు కోరుకొన్నాడు. అదే ఇబ్బందిని ప్రారంభించింది.
46 అక్కడ పాపము కొరకు ఒక అవసరమున్నది. ఆ అవసరము మరణమైయున్నది, జరిమానా మరణమైయున్నది. అదేమనగా, మనముదాని యొక్క గొప్ప వివరణలోనికి వెళ్ళగలము, కాని కారణమేమనగా, అక్కడ ఒకే మరణమున్నది. ఒకే జీవమున్నది. నిత్యజీవమును కలిగిన మనిషి ఎన్నడూ చనిపోడు. మరియు పాపముచేయు ఆత్మ, సంపూర్ణముగా నాశనము చేయబడుతుందని, నేను నమ్ముతాను, కారణము బైబిలు చెప్పింది, “పాపము చేయు ఆత్మ, నిశ్చయముగా మరణిస్తుంది.” మనిషి కాదు; “పాపము చేయు ఆత్మ.” కాబట్టి, సాతాను తప్పక చనిపోవాలి, అది నిశ్చయముగా చనిపోవాలి. సంపూర్ణముగా నాశనము చేయబడవలసియున్నది. సాతాను రక్షించబడుతుందని, చెప్పే సార్వత్రికవాదులతో, నేను ఎలా విభేదిస్తానో! వాడు పాపము చేశాడు మరియు వాడు పాపమునకు మూల కర్తయైయున్నాడు. వాడి ఆత్మ పాపము చేసింది, వాడు ఒక ఆత్మయైయున్నాడు. ఆ ఆత్మ, దానిలో ఏమియు మిగల్చబడకుండా, సంపూర్ణముగా నాశనము చేయబడాలి.
47 ఆ వెనుక, ప్రారంభములో పాపము భూమిని తాకినపుడు, ఒక నల్లటి దుప్పటి వలె, ఆకాశముల నుండి పడుతున్నట్లుగా, అది భూమిని నిజముగా పక్షవాతమునకు గురి చేసింది. అది భూమి మీదయున్న ప్రతి జీవిని, దేవుని యొక్క సృష్టి అంతటిని, బానిసత్వములోనికి విసిరివేసింది. మనిషి మరణము క్రింద, రోగము క్రింద ఇబ్బంది క్రింద, దు:ఖముల క్రింద బానిసత్వములోయున్నాడు. ప్రకృతి అంతయూ దానితో పడిపోయింది. భూమిని పక్షవాతపు రోగిగా చేసింది, అది పాపము అను ఒక మత్తుమందుయైయున్నది. అప్పుడు మనము, నిరీక్షణలేని వారముగా అక్కడ కూర్చొన్నాము, ’కారణము భూమి మీదయున్న ప్రతి జీవి, దాని వశమైయున్నది. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దాని వశమైయున్నారు.
48 కాబట్టి, అది పాపము లేని, ఏదో ఒక స్థలము నుండి రావలసియున్నది. అది భూమి మీద నుండి రాలేదు. మనలో ఒకరు మరొకరిని విమోచించలేరు వేరొకరి నుండి రావలసియున్నది.
49 అందుచేత, మనిషి తాను దేవుని నుండి వేరైపోయాడని గ్రహించినపుడు, అతడు ఒక తిరుగులాడేవాడయ్యాడు. వారు ఏడ్చారు. వారు మొఱ్ఱపెట్టారు. వారు శ్రమించారు. వారు ఎడారుల గుండా, పర్వతముల గుండా తిరుగులాడారు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడో ఆ పట్టణము కొరకు వెతికారు. కారణము, అతడు ఎన్నడైనా దేవుని యొక్క సముఖములోనికి తిరిగి వెళ్ళినట్లైతే, అతడు దానిని గూర్చి ఆయనతో మాట్లాడగలడని, ఎరిగియుండెను. కాని అక్కడ వెనుకకు వెళ్ళే మార్గము లేకుండెను. అతడు తప్పిపోయియుండెను. ఏ వైపునకు తిరగాలో అతడు ఎరుగకయుండెను, కాబట్టి అతడు, తిరుగులాడుచూ, ఎక్కడో దానిని కనుగొనుట కొరకు, ఆ స్థలమునకు తిరిగి వెళ్ళుటకు బయలు వెళ్ళాడు. అతని యొక్క అంతరంగములో ఏదో, అతడు ఒక పరిపూర్ణమైన స్థలము నుండి వచ్చాడని, అతనికి చెప్పింది. ఈ ఉదయమున, ఆ పరిపూర్ణతను వెదకని వారు, ఈ దృశ్యమైన శ్రోతలలో గాని, ఈ టేపును వినుచున్న శ్రోతలలో గాని, లేక ఇది ప్రపంచములోనికి ఎక్కడకు వెళ్ళినా, ఎక్కడైననూ, ఇక్కడైనను, ఆ పరిపూర్ణతను వెతకని వారు ఒక్కరూ కూడా ఎక్కడాయుండరు.
50 నీ బిల్లులు చెల్లించబడ్డాయని, నీవు అనుకొంటావు, “అది దానిని పరిష్కరించింది.” నీ బిల్లులు చెల్లించబడిన తరువాత, అప్పుడు ఎవరో నీ కుంటుంబములో జబ్బుపడ్డారు. ఆ జబ్బు నయమయినపుడు, అప్పుడు నీవు ఎక్కువ బిల్లులు చెల్లించాలి. మొదటి సంగతి నీకు తెలుసా, నీ వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి, అప్పుడు నీవు తిరిగి యవ్వనస్థుడిగా మారాలనుకొంటావు. ఆ పాపపు అలను బట్టి, ఎడతెగకుండా, ఎల్ల వేళలా అక్కడ ఏదోయున్నది. కాని నీ హృదయములో, నీవు దాని కొరకు వెదుకుచున్నందున, అది చూపునది ఏమనగా, అక్కడ ఎక్కడో ఒక పరిపూర్ణతయున్నదని అది చూపుతుంది. ఎక్కడో, అక్కడ ఏదోయున్నది.
51 ఆ కారణమును బట్టియే, ఈ దినము, ఆ పాపి ఇంకనూ తిరుగులాడుచున్నాడు. పేరు ప్రఖ్యాతులు కలిగియుండుట కొరకు, ఒక యవ్వన బాలిక తన జడలను కత్తిరించి వేస్తుంది; అందముగా కనపడుటకు ముఖమునకు రంగులు వేస్తుంది; ఆమె యొక్క రూపమును కనపరుచుట కొరకు, బట్టలు ధరిస్తుంది. కారణమేమనగా, ఆమె కనుగొనుటకు ప్రయత్నించేది దానిని మాత్రమే, ఎక్కడి నుండో ఏదో తిరిగి వచ్చుట కొరకు ఆమె ప్రయత్నము చేయుచున్నది, పురుషులు ఆమెను చూసి ఈల వేయునట్లు, ఆమెను చూసి చేతులు ఊపునట్లు, ఆమెతో పరిహాసము చేయుటకు కారణమగుచున్నది. యవ్వనస్థుడు, స్త్రీ పట్ల అదే కార్యము చేస్తాడు, అతడు తన్ను తాను ఆమె కొరకు, ఆకర్షణీయముగాయుండుటకు ప్రయత్నము చేస్తాడు. పొరుగువారు ఒక గృహమును నిర్మించి, మరియు ఒక నిర్ణీతమైన స్థితిలో దానిని ఏర్పాటు చేస్తారు, ఎందుకంటే, వారి పొరుగు వారి గృహము కంటె, వారి గృహము కంటె వారి గృహము కొంచెము బాగా కనపడటానికి, ఆలాగు చేస్తారు. ఎల్లవేళలా మనము దేని కొరకో వెతుకుచున్నాము, ఏదో కొంచెము దానికంటె పైగా, దేనినో ఉంచుచున్నాము. ఒక యవ్వనస్థురాలు, ఆమె కంటె మరి ఎక్కువ పేరు ప్రఖ్యాతులను కలిగియున్న, యవ్వనస్థురాలి కొరకు వెదుకుతుంది. ఒక పొరుగువాడు, అతని పొరుగువానికంటె, ఒక శ్రేష్ఠమైన గృహమును కనుగొంటాడు. ఒక స్త్రీ, ఆమె కంటె, ఒక నిర్ణీతమైన విధానములో, వస్త్రధారణ చేసిన మరొక స్త్రీని కనుగొంటుంది.
52 అది మనలోయున్న ఏదో, దేనికొరకో అది వెదుకుచున్నది, మరియు అది చూపునదేమనగా, మనము తప్పిపోయాము. ఆ తృప్తినిచ్చే దాని యొద్దకు, మనలను తిరిగి తెచ్చునది ఏదో, దాని కొరకు మనము కనుగొనాలి, అదే అక్కడయున్న ఆకలిని నింపుతుంది, అయితే దానిని మనము కనుగొనలేనట్లుగా, అది కనపడుతుంది. యుగముల గుండా, మానవాళి దాని కొరకు ప్రయత్నించారు. దాని కొరకు వారు ఏడ్చారు. వారు విలపించారు. వారు దానిని ఎలా చెయ్యాలో, వారు ఎరిగియున్న సమస్తమును చేశారు, కాని ఇంకనూ, వారు లోకముగుండా తిరుగులాడుచూ, దానిని కనుగొనలేకపోయారు.
53 చివరగా, ఒక రోజు, అదే కల్వరిలో ఆ రోజు, ఒకరు మహిమ నుండి క్రిందకు దిగివచ్చారు. ఒకరు, యేసుక్రీస్తను పేరు గల, దేవుని కుమారుడు, మహిమనుండి వచ్చియున్నాడు, మరియు కల్వరి నిర్మించబడింది. ఆ దినమునే, ఆ వెల చెల్లించబడింది, మరియు పాపము యొక్క ప్రశ్న శాశ్వతముగా పరిష్కరించబడింది. మరియు మనము ఆకలిగొంటూ, దప్పిగొంటున్న దాని కొరకు, ఇది ద్వారమును తెరిచింది. అది తృప్తినిచ్చు ఒక స్థలమును తెచ్చింది. ఎన్నడైనా కల్వరిని దర్శించిన, ఏ మనిషియైనా అక్కడ, అది యుండినట్లుగా చూసి, ఎన్నడూ ఇక అదే రీతిగాయుండడు. అతడు ఆ స్థలమును చేరుకోగానే, అతడు ఎన్నడైనా ఆశించినది, లేక అతడు ఎదురు చూసినది, అక్కడ కలుసుకొన్నది.
54 అది ఎంత ప్రాముఖ్యమైన దినమనగా, అది ఎంత ప్రాముఖ్యమైక కార్యమనగా, అది ప్రపంచమును కదిలించి వేసింది. అది ఇది వరకు ఎన్నడూ కదిలించనంతగా, ప్రపంచమును కదిలించివేసింది. యేసు కల్వరిలో చనిపోయినపుడు, అది పాపపు ప్రశ్నను చెల్లించి వేసింది, ఈ పాప ప్రపంచము నల్లగా మారిపోయింది. మధ్యాహ్నము సూర్యుడు అస్తమించాడు, అది అమిత శక్తిపాతంతో దద్ధరిల్లిపోయింది. బండలు కదిలిపోయినవి, పర్వతములు బ్రద్ధలైనవి, మరియు సమాధులు బ్రద్ధలై, చనిపోయిన వారు తిరిగి లేచారు.
55 అది ఏమి చేసింది? కల్వరిలో, దేవుడు దానిని సున్నాగా చేశాడు. సాతానుగా పిలవబడిన, జంతువును, శాశ్వతముగా ఆయన గాయపర్చాడు. ఇప్పుడు, అప్పటి నుండి, వాడు మరి ఎక్కువ విషపూరితముగాయున్నాడు, ఎందుకంటే అది మానవాళికి వెలుగును తెచ్చింది. ఎవరికైనా తెలుసు ఒక గాయపర్చబడిన జంతువు, బహు విషపూరితముగా, దాని నడుముతో చుట్టూ ప్రాకుతుంది. ఇప్పుడు, కల్వరిలో సాతాను పడగొట్టబడింది. భూమి దానిని ఋజువుచేసింది.
56 ఎన్నడైనా చెల్లించబడిన అతి గొప్ప వెల, ఒక్కడే దానిని చెల్లించగలిగాడు, కల్వరి నుండి దిగివచ్చి దానిని చేశాడు. అక్కడే గొప్పవెల చెల్లించబడింది. అదే విషయములలో ఒకటైయున్నది, దేవుడు దానిని కోరియున్నాడు. ఏ మనిషియు యోగ్యుడు కాదు. దేవుడే స్వయముగా దిగివచ్చి, మానవుడుగా మారి, మానవ ఆశల క్రింద, ఒక మానవ జీవితమును జీవించి, మరియు కల్వరిలో సిలువవేయబడ్డాడు. అక్కడ, ఆయన దానిని చేయలేడని, ఆయన దానిగుండా వెళ్ళలేడని సాతానుడు తలంచాడు, ఆయన గెత్సెమనె గుండా వెళ్ళాడు, ఎన్నడైనా ఏ మనిషియైన నిలబడిన శోధనకు ఆయన నిలబడ్డాడు. మనుషులందరివలె ఆయన దాని గుండా వెళ్ళాడు, కాని ఆయన వెలను చెల్లించాడు.
57 అదే భూమిని నల్లగా చేసింది. అది శస్త్ర చికిత్స కొరకు ఇచ్చు మత్తుమందువలెయున్నది. ఒక వైద్యుడు మనిషికి మత్తుమందును ఇచ్చినపుడు, అతడు దానిని చేయకముందు, అతనిని పడగొట్టివేస్తాడు. దేవుడు సంఘమునకు శస్త్ర చికిత్స చేసినపుడు, ప్రపంచము మత్తులోనికి వెళ్ళింది, ప్రకృతి చుట్టూ గిరకలు వేసింది. ఆశ్చర్యము లేదు! దేవుడు మానవ శరీరములో చనిపోవుచుండెను. ఆ గడియ కొరకే ప్రపంచము ఎదురుచూసింది, ఇంకా వారిలో అనేకమందికి అది తెలియదు.
58 ఈ రోజున అదియున్నట్లుగా, అనేక మంది ఆ కార్యముల కొరకు ఎదురు చూశారు, మరియు ఇంకనూ, వారు వాటిని గుర్తించలేదు. బయటకు వెళ్ళే దారిని వారు గ్రహించరు, వారు ఇంకను, వారు బయటకు వెళ్ళే దారినే చూసుకొంటూ, లోక కార్యములను మరియు లోక కోర్కెలను వెదుకుటకు ప్రయత్నము చేస్తున్నారు.
59 అక్కడ ఆ దినమునకు ఎన్నో ముందు ఛాయలు, ప్రకటనలు తెలిపే కొయ్యలు, ఎన్నో దానిని వ్రేలు చూపియున్నవి. గొఱ్ఱె ద్వారా, ఎద్దు ద్వారా, గువ్వ ద్వారా, ఇవన్నియూ ముందు ఛాయగా చూపబడియున్నవి, కాని ఇంకనూ అది దానిని బ్రద్ధలు చేయలేకపోయింది. అక్కడ సాతాను భూమిపై కలిగియున్న పట్టును, ఆ మరణపు పట్టును అది బ్రద్ధలు చేయలేకపోయింది.
60 భూమి మీద పైకి క్రిందకు, వాడు నడిచిన అవే బండలు, మండుచున్న అగ్ని గంధకములు! ఆ తేజో నక్షత్రము లూసిఫర్ యైయున్నాడు, అది మండుచున్న అగ్ని పర్వతముగాయున్నప్పుడు, వాడు భూమి మీద నడిచాడు. యేసు కల్వరిలో చనిపోయినపుడు, భూమిలో నుండి పంపులవలె పైకి వచ్చి, అగ్ని పర్వతపు బండలే చల్లబడిపోయినవి.
61 వెల చెల్లించబడింది, మరియు సాతాను యొక్క దాస్యము విరుగగొట్టబడింది. అతడు ఏ దారి కొరకు వెనుకకు చూచుచున్నాడో, దేవుడు దానిని మనిషి హస్తములలో పెట్టినాడు. అతడు ఇక ఎంత మాత్రము ఏడ్వవలసిన పనిలేదు. పాపము, రోగము యొక్క వెన్నెముక, కల్వరిలో సాతాను వెన్నెముక విరుగగొట్టబడింది, గ్రుద్ధబడింది! మరియు అది భూమి మీదయున్న ప్రతి మర్త్యుని, పాప క్షమాపణతో, తిరిగి దేవుని యొక్క సన్నిధిలోనికి తెస్తుంది. హల్లెలూయ! మన పాపములు క్షమించబడినవి. ఇక ఎంతమాత్రము, దేవుని నుండి దూరముగా మనలను పాపముతో నల్లగా సాతాను చేయలేడు.
62 అక్కడ ఒక రాజ మార్గము తయారుచేయబడింది. అక్కడ ఒక టెలిఫోను ఉంచబడియున్నది. అక్కడ మహిమకు ఒక దారియున్నది, ప్రతి వ్యక్తిని ఆ దారికి అందుబాటులోనికి తెస్తుంది. ఒక మనిషి సంపూర్ణముగా పాపముతోయుంటే, అది కేంద్రమునకు అతనిని కలుపుతుంది. ఆ పాపమును బట్టి అతడు క్షమించబడవచ్చును. అంత మాత్రమే కాదు, కాని ఆ పాపమునకు చెల్లింపు జరిగింది. ఓ! “నేను యోగ్యడును కాదని,” నీవు చెప్పవలసిన పనిలేదు. నిశ్చయముగా, నీవు కాదు, నీవు ఎన్నడూ కాలేవు. కాని ఒక యోగ్యుడు నీ స్థానమును తీసుకొన్నాడు. నీవు విడుదల పొందావు. నీవు ఇక ఎంతమాత్రము తిరుగులాడవలసిన పనిలేదు. భూమి మీద ఒక సుఖమును వెదికే వ్యక్తిగా, నీవుయుండవలసిన పనిలేదు.
ఏలయనగా అక్కడ ఒక ఊట రక్తముతో నింపబడియున్నది,
ఇమ్మానుయేలు యొక్క రక్త నాళముల నుండి,
అక్కడ ఆ ప్రవాహము క్రింద పాపులు ముంచబడి,
వారి యొక్క దోషపు మరకలన్నిటిని పోగొట్టుకొంటారు.
63 నీవు తప్పిపోవలసిన పనిలేదు, అక్కడ ఒక రాజమార్గమున్నది, ఒక మార్గము, మరియు అది పరిశుద్ధమైన మార్గమని పిలువబడింది. అపవిత్రులు దాని మీద నడవరాదు. కారణము, అతడు మొదట ఊట గుండా వస్తాడు, మరియు అప్పుడు అతడు రాజ మార్గములో ప్రవేశిస్తాడు.
64 సాతాను యొక్క శక్తులను ఆయన విరుగగొట్టెను. మరణ భయముతో, అతడు మరణించినపుడు మరణము అతనిని ఏమి చేస్తుందో, అని భయపడుచు, భూమి మీద, బంధీ గృహములోయున్న ప్రతీ మనిషికి, ఆయన పాతాళము యొక్క బంధీ గృహ ద్వారములను తెరచెను. కల్వరిలో, ప్రతీ బంధీ స్వతంత్రుడుగా వెళ్ళునట్లు, ఆయన ఆ బంధీ గృహముల ద్వారములను తెరచెను. ఇక ఎంతమాత్రము నీవు, పాపము ద్వారా, చింపివేయబడవలసిన పనిలేదు. నీవు ఇక ఎంత మాత్రము నీ అవయవములను, పాపమునకు, త్రాగుడునకు, పొగత్రాగుటకు, జూదమునకు, అబద్ధములు చెప్పుటకు లోపరచవలసిన పనిలేదు. నీవు యధార్ధవంతుడవుగా, నీతిమంతుడిగా మరియు న్యాయవంతుడిగా యుండవచ్చు. దానిని గూర్చి సాతాను ఏమియు చేయలేడు, నీవు ఒక దారిని పట్టుకొన్నావు, అది యుగముల బండలో లంగరు వేయబడిన ఒక జీవపు నాడి దాని నుండి ఏదియు నిన్ను కదిలించలేదు. ఏ గాలులు దాని నుండి నిన్ను కదిలించలేదు. ఏ గాలులు దాని నుండి నిన్ను కదిలించలేవు. ఏదియు అక్కడ లేదు, దానికై అది, మరణముతో సహా, ఏదియు క్రీస్తుయేసులోని దేవుడు ప్రేమ నుండి నిన్ను వేరుచేయలేదు. అదే కల్వరి యొక్క భావము.
65 దాస్యములోయున్న మనుషులు స్వతంత్రులుగా చేయబడ్డారు. ఒకప్పుడు మరణ భీతి క్రిందయున్న మనుషులు, ఇక ఎంతమాత్రము మరణమునకు భయపడవలసిన పనిలేదు. ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తున్న మనిషి, దాని శిల్పి మరియు నిర్మాణకుడు దేవుడే, అతడు ఆ రాజ మార్గములో అడుగుపెట్టి, అతని ముఖమును పరలోకము వైపు ఉంచుతాడు, ఎందుకంటె అతడు స్వతంత్రుడయ్యాడు. హల్లెలూయ! అతడు విమోచించబడ్డాడు. అతడు ఇక ఎంతమాత్రము తిరుగులాడవలసిన పనిలేదు, ఏలయనగా నీవు సరియో లేక కాదో, తెలుసుకొనే ఒక మార్గము అక్కడయున్నది. దేవుడు మనకు జీవమునిస్తాడు. మన పాపములు క్షమించబడినవి. కల్వరిలో ఆ దినమున వెల చెల్లించబడింది. దానినంతా మనము చూసినపుడు, కవి ఈ విధముగా వ్రాయుటలో ఆశ్చర్యము లేదు:
బండలు కరిగిపోవుచు, ఆకాశములు చీకటి పడుచుండగా
నా రక్షకుడు తలవాల్చి, చనిపోయాడు.
తెర తెరవబడుట ద్వారా, మార్గము బయలుపర్చబడింది
పరలోకపు ఆనందములకు, అంతములేని దినమునకు.
66 దేశమంతటి గుండా, ఒక పట్టణమును వెదుకుచూ, అబ్రాహాము ఇక ఎంత మాత్రము తిరుగులాడనవసరము లేదు. అతడు రక్షించబడగలడా లేక లేదా అని, ఒక పాపి ఇంక ఎంతమాత్రము తిరుగులాడనవసరము లేదు. ఒక రోగి, అతడు స్వస్థపడగలడా లేక లేదా అని అతడు తిరుగులాడనవసరము లేదు. ఆ దినమున కల్వరిలో, తెర తెరువబడినపుడు, అది సంపూర్ణ విజయమునకు ద్వారమును బయలుపర్చింది. ఈ కార్యములన్నిటిపై, విజయోత్సవముగా జీవించుటకు, దేవా మాకు పరిశుద్ధాత్మ శక్తులనిమ్ము; కేవలము దానిని నమ్మమని మమ్మును అడుగుచున్నావు. అది కల్వరిలో ఆ దినమున సంభవించియున్నది. అలాటి ఒక దినము అక్కడ ఎన్నడును లేదు. అలాటి దినము ఎన్నడూ అక్కడయుండదు. అది ఇక ఎంత మాత్రమును అవసరము లేదు. వెల చెల్లించబడియున్నది, మరియు మనము విమోచించబడ్డాము. దేవునికి కృతజ్ఞతలు! మనము విమోచించబడ్డాము. అక్కడ నీవు ఎంత మాత్రము తిరుగులాడనవసరము లేదు. దానిని గూర్చి ఎంత మాత్రము ఊహాగానములు లేవు. అది అంతయూ తీసివేయబడింది. ముసుగును తెరలాగి వేసింది, మరియు మనము రాజ మార్గము మీద ఉంచబడ్డాము, ఇక ఎంతమాత్రము తిరిగులాడుట కాదు, కాని నమ్మి తిన్నగా ముందుకు నడిచి వెళ్ళవచ్చును. దేవుని సన్నిధిలోనికే మనము తిన్నగా నడిచి వెళతాము.
67 వారు ఆ పట్టణమును వెదుకుచుండగా, వారు మరొక చోట నుండి వచ్చియున్నారని, అబ్రాహాము ఎరిగియుండెను, మరియు ఇతరులు ఎరిగియుండిరి. ఏదో సంభవించియున్నది. వారు పక్ష రోగివలె మొత్తబడిన భూమి మీద జీవించుచుండిరి. భూకంపములు వచ్చినవి. తుఫానులు వస్తాయి. యుద్ధములు మరియ చంపుకొనుట! తోడేలు గొర్రెపిల్లపై పడి దానిని తినివేయుట, సింహము, ఎద్దును తినివేయుట, అది సరియైనదిగా కనబడుట లేదు. అక్కడ ఏదో తప్పుయున్నది. అక్కడ ఏదో పొరపాటుయున్నదని అతడు ఎరిగియుండెను. మనుషులు, సోదరుడు సోదరుని చంపుట; తండ్రి కుమారుని చంపుట, కుమారుడు తండ్రిని చంపుట. అక్కడ ఏదో పొరపాటుయున్నది. అతడు ముసలివాడగుచున్నాడు. అతడు చనిపోవుచున్నాడు. అతడు వాడిపోవుచున్నాడు. వ్యాధి అతనిపైయున్నది. అతడు బానిసత్వములోయున్నాడు. చెట్లు పెరుగుతాయి, కాని అవి అనైతికముగా వుండవు. అవి చనిపోతాయి. పర్వతములు మార్పు చెందుతాయి. సముద్రములు ఎండిపోతాయి. నీళ్ళు తప్పిపోతాయి. అక్కడ ఏదో తప్పుయున్నది. అతడు ఒక పట్టణము కొరకు వెదికాడు, ఆ పట్టణములో అది ఇక ఎంతమాత్రము సంభవించదు. దానిని చక్కగా తయారుచేసిన వాని సముఖములోనికి, తాను ఎన్నడైనా వెళ్ళగలిగినట్లైతే, అతడు దానిని గూర్చి ఆయనతో మాట్లాడగలడు.
68 ఓ, పాపి ఈ ఉదయమున, నీవు దారిని కలిగియున్నావని తెలుసుకొనుట, ఎలాటి ఒక ఆధిక్యతగాయున్నది. కల్వరిలో ఆ దినము దారిని తెరచియున్నది. ఏలయనగా ఆ పితరులందరూ వేటాడిన దాని కొరకు, వెదికిన దాని కొరకు, కల్వరి నీకు దానిని, ఉచితముగా ఇచ్చియున్నది. నీవు ఎలా దానిని క్రిందకు త్రోసివేయగలవు? దానికి ప్రత్యాహ్నయముగా ఏదో లోక సంబంధమైన సుఖములను తీసకొని, నీవు దానిని ఎలా త్రోసివేయగలవు? దానిని ఎందుకు అంగీకరించకూడదు? తెర తెరవబడుట, ఏ రకమైన పాపము అతని మీద లేకుండా, ఒక మనిషిని తిరిగి దేవుని యొక్క సముఖములోనికి తెస్తుంది. అతడు వెదుకుచున్న దాని కొరకు, అతని ముందు దారిని ఏర్పరచుతుంది; పరలోకము, మహిమ, సమాధానము, నిత్యజీవము, సమస్తమూ తిన్నగా అతనిముందుయున్నది.
69 ఆ దినము-సాతాను యొక్క శక్తికి మరణపు గుద్దుయైయున్నది. అది సమస్తమును అంతము చేసింది.
70 అక్కడ నేను ఆయనను చూడగలను; దాని నుండి వచ్చిన మొదటి ఛాయయే, ఏదెను గొర్రెపిల్ల ఆయనేయైయున్నాడు.
71 విశ్వాసమును బట్టి, హేబేలు, కయీను కంటె శ్రేష్ఠమైన బలిని దేవునికి అర్పించెను, అతడు తప్పక గొర్రెపిల్ల మెడచుట్టూ, ద్రాక్షా తీగెను చుట్టి, బండ యొద్దకు దానిన ఈడ్చుకొని వచ్చెను. కోయుట కొరకు, ఒక రాతిని తీసుకొని, దాని తలను వెనుకకు లాగి, అది చనిపోవు వరకు, నరికి కోసివేసేను. దాని సొంత రక్తములో, దాని బొచ్చంతయూ తడిసిపోయెను. అతడు దాని రక్తములో పొర్లాడెను. అది ఒక ఛాయయైయున్నది.
72 కాని కల్వరిలో ఆ దినమున, ఈ భూ సంబంధమైన గొఱ్ఱెపిల్ల అక్కడ లేదు, అది దేవుని యొక్క గొఱ్ఱెపిల్ల చనిపోవుచూ, ఆయన సొంత రక్తములో పొర్లాడుచుండెను. ఆయన చీల్చబడ్డాడు, నరకబడ్డాడు, కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, నేలకు కొట్టబడ్డాడు, ముఖము మీద కొట్టబడ్డాడు, లోకము చేత సమస్తమూ చేయబడ్డాడు, మరియు రక్తము, ఆయన చెంపల మీదుగా కారుచున్నది.
73 హేబేలు యొక్క గొఱ్ఱెపిల్ల చనిపోయినపుడు, అది చనిపోయింది, ఆదాము గ్రహించలేని భాషలో అది మాట్లాడుచుండెను. అది అరుచుచుండెను.
74 ఆ దినమున కల్వరిలో దేవుని యొక్క గొఱ్ఱెపిల్ల, ఎవరునూ గ్రహించలేని భాషలో అతడు మాటలాడెను. “నా దేవా, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితవి?” అది దేవుని యొక్క గొఱ్ఱెపిల్లయైయున్నది, ముక్కలుగా నరకబడి, చీల్చివేయబడింది.
75 అతడు వాగ్దానము చేయబడిన స్త్రీ యొక్క సంతానమును చూసినపుడు, హేబేలు మనసులో కలిగియున్న గొఱ్ఱెపిల్ల ఆయనే. చేతి సహాయము లేకుండా పర్వతము నుండి తీయబడిన రాయి, దానియేలు చూసిన గొఱ్ఱెపిల్ల ఆయనే. ప్రవక్తకు ఆయన చక్రములోయున్న చక్రమైయుండెను. కల్వరిలో ఆ దినమున, వారు ముందుగా చూసినవన్నియూ, కల్వరిలో కలుసుకొన్నవి, అది గొప్ప కార్యమును లోనికి తెచ్చింది. అది సాతాను యొక్క వెన్నును విరగగొట్టింది.
76 మొదటగా, మనము తప్పక ఆ దినము యొక్క భావమేమిటో వెదకాలి. రెండవదిగా, ఇప్పుడు, తప్పక ఆ దినము మన కొరకు ఏమి చేసిందో చూడాలి, అది మన కొరకు ఏమి చేసింది, ఇప్పడు, మూడవదిగా, మనము తప్పక ఆ దినము కొరకు ఏమి చేయాలో చూడాలి. మనము తప్పక దాని కొరకు ఏమి చేయాలి.
77 మొదటగా, మనము తప్పక దానిలోనికి చూడాలి, కారణము అది ఒక గొప్ప దినమైయున్నది, అన్ని దినములలో అతి గొప్పదినమైయున్నది. పాపము యొక్క వెల పరిష్కరించబడింది. సాతాను యొక్క శక్తి విరుగగొట్టబడింది.
78 ఇప్పుడు దానికి ప్రతిగా, తప్పక మనము ఏమి చేయవలసియున్నదో చూద్దాము. ఇప్పుడు దానికి ప్రతిగా, కల్వరిలో ఆ దినమున యేసు చనిపోయినపుడు, ఆయన మన పాపముల కొరకు వెల చెల్లించుట మాత్రమే కాక, మనము ఆయనను వెంబడించగలుగునట్లు, ఇంకా ఆయన వెలను కూడా చెల్లించి, మార్గమును సిద్ధపరచెను; ఏలయనగా మనము, పడిపోయిన ఆదాములుగా మనము విమోచించబడియున్నాము. ఆదాము, ఆత్మ ద్వారా నడిపించబడినట్లగా (మొదటి ఆదాము), అతడు ప్రకృతి అంతటిపై నియంత్రణ కలిగియున్నాడు, అప్పుడు మనము (రెండవ ఆదాము), లేక ఈ భూ సంబంధమైన మనుషులమైన మనము, కల్వరిలో ఆ రోజునుండి, ఆయనను వెంబడించగలము. ఇప్పుడు, ఆయన కల్వరిలో చనిపోయినపుడు, ఆయన ఒక మార్గమును సిద్ధపరిచాడు. ఆయన ఆత్మను అప్పగించి, నీవు మరియు నేను దాని ద్వారా జీవించుట కొరకు, పరిశుద్ధాత్మను తిరిగి భూమి మీదకు పంపాడు. అదే మనకు కల్వరి యొక్క భావమైయున్నది, ఆయనను వెంబడించుటయే.
79 మొదటగా, దానిలోనికి చూడు. అది మన కొరకు ఏమి చేసిందో చూడు. ఇప్పుడు, దానిని గౌరవించుటకు, తప్పక మనము ఏమి చేయాలి? నీవు మరియు నేను తప్పక ఏమి చేయాలి?
80 ఇప్పుడు, మనమంటాము, “బాగుంది, నేను దానిని మెచ్చుకుంటాను. అది చాలా చక్కగాయున్నది.” అయితే తప్పక మనము దానిని అంగీకరించవలసియున్నది. దానిని అంగీకరించుట అనగా. ఆయన వ్యక్తిత్వమును, క్రీస్తును మన హృదయములోనికి అంగీకరించుటయే.
81 అప్పుడు, మనము పాపము నుండి స్వతంత్రులమవుతాము, కాబట్టి అక్కడ పాపపు సంకెళ్ళు ఏ మాత్రము మన మీద వ్రేలాడవు. దేవుడు, మనము ఎన్నడూ పాపము చేయనివారముగా పరిపూర్ణమైన అర్పణ, మనలను పరిపూర్ణము చేసియున్నది. ఏలయనగా, యేసు అన్నాడు, “మా పరలోకపు తండ్రి, పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగాయుండెదరు.” తరువాత, అక్కడ చేయబడవలసినది ఏమియులేదు, కాని మనము దేవుని యొక్క సన్నిధిలో పరిపూర్ణులుగా చేయబడ్డాము.
82 ఇప్పుడు, మనము గమనించకపోయినట్లైతే, మనము ఏమైయుండినామో వెనుకకు చూచుటకు ప్రయత్నించినట్లైతే, అక్కడే మన స్థానమును మనము పోగొట్టుకొంటాము మనము గతములో ఏమైయుండియున్నామో అని, మనము వెనుకకు చూస్తున్నంతవరకు, బలి అర్పణ అనగా భావము మనకు ఏమీయుండదు. ఓ, సంఘమా, మీరు దానిని చూడలేరా? [సంఘము “ఆమేన్,” చెప్పింది—ఎడి.] పనిచేయుటకు నేను ప్రయత్నముచేయను, నేను ప్రయత్నము చేయలేను,నీవును ప్రయత్నము చేయలేవు. అక్కడ ప్రయత్నము చేసే అవసరము లేదు. ఆరంభము నుండియే, నీవు ఏమి చేసియున్నావో అని చూస్తున్నంత వరకు, నీవు తప్పిపోయావు. అయితే నీవు ఏమి చేసియున్నావో చూడవద్దు.
83 కల్వరిలో ఆ దినము నీకు ఏమి చేసియున్నదో చూడుము. అది నీ వెలను చెల్లించింది. అది పాపము యొక్క ప్రశ్నను పరిష్కరించినది. “మీ పాపములు రక్తమువలె ఎర్రని వైనను; అవి హిమము వలె తెల్లబడతాయి. కెంపువలె ఎర్రనివైనను; అవి గొర్రె బొచ్చువలె తెల్లబడతాయి.” అప్పుడు నీకు పాపము లేదు. నీవు పరిపూర్ణముగా పాపము లేనివాడవైయున్నావు. నీవు ఏమి చేసినప్పటికి లెక్కకాదు, నీవు ఏమి చేస్తావో లెక్కకాదు, నీవు ఇంకనూ పాపము లేనివాడవు. నీవు యేసుక్రీస్తును నీ రక్షకుడిగా అంగీకరించియున్నంత కాలము, నీ పాపములు క్షమించబడినవి. ఏదైననూ క్షమించబడుట అనగా, “అది క్షమించబడినది మరియు మర్చిపోబడినది.”
84 అలాగైతే అది చేసేది ఏమిటి? ఆ షరతు తరువాత, ఆయనను వెంబడించుటకు, ఆయన ఆత్మను, అది నీకు ఇస్తుంది, మరియు ఆయన చేసినట్లుగా చేయుటకు, ఇతరులు దానిని ముందుకు వెంబడించునట్లుగా చేస్తుంది. నీతిమంతుడైనవాడు, పరిపూర్ణమైన మనిషి ఆయన ఒక్కడే. ఆయన తన ప్రాణమును ఇచ్చి, నీ కొరకు మాదిరిని సిద్ధపరిచాడు. ఇప్పుడు మనము తప్పక ఏమి చేయాలి?
85 ఇప్పుడు, నేను మీకు చెప్పే మొదటి విషయమేమనగా, యేసు తన కొరకు తాను ఎన్నడూ జీవించలేదు. ఆయన జీవితము ఇతరుల కొరకు ఖర్చు చేయబడింది. అది పరిపూర్ణముగా, నిత్యజీవమైయున్నది. నేను సంఘమునకు వెళ్ళి, మంచి కార్యములు చేస్తున్నానని చెప్పినపుడు, అది మంచిదే. కాని నీవు నీ జీవితమును నీ కొరకు జీవిస్తున్నప్పుడు, నీవు నిత్యజీవమును కలిగిలేవు. నిత్యజీవమనగా, ఇతరుల కొరకు జీవించుటయే. అది దేవుని యొక్క గొర్రెపిల్లలోనికి వచ్చినపుడు అది దానిని ఋజువు చేసింది. ఆయన జీవించాడు, మరియు ఆయన నిత్యజీవమును కలిగియున్నాడు, ఏలయనగా ఆయన తన కొరకు జీవించలేదు. నీవు నిత్యజీవమును స్వీకరిస్తావు, ఆ రోజు దానిని స్వీకరించుటను బట్టి, ఇక ఎంతమాత్రము నీవు నీ కొరకు జీవించవు. నీవు ఇతరుల కొరకు జీవిస్తావు.
86 ఎవరో అన్నారు, “అలాటి చెడ్డ పేర్లలో ఎవరినైనా నిన్ను పిలువనిచ్చినపుడు, నీవు ఎలాగు నిలబడగలవు?” నీవు నీ కొరకు జీవించుట లేదు. ఆ మనిషిని విమోచించగలుగునట్లుగా, నీవు ఇతరుల కొరకు జీవిస్తావు. మీరు కుమారలవుతారు. దానితో వచ్చిన చిక్కు ఏమనగా, వారు కుమారులన్న విషయమును సంఘము మర్చిపోయింది. నీవు ఒక కుమారుడవైయున్నావు. నీవు క్రీస్తు యొక్క స్థానమును తీసుకొనుచున్నావు. నీవు ఒక కుమారుడవైయున్నావు, కాబట్టి నీవు నీ కొరకు జీవించవు. ఇతరుల కొరకు జీవించుము.
87 “బాగుంది, బ్రాన్హాం సోదరుడా, నేను ఈ సోదరుని కొరకు జీవించగలను, కారణము అతడు నిశ్చయముగా ఒక మంచి మనిషి.” అది అది కాదు.
88 నిన్ను ద్వేషించుచున్న మనిషి కొరకు జీవించుము. వారు నన్ను చంపగలిగినట్లైతే, నిన్ను చంపగలిగే వ్యక్తి కొరకు జీవించుము. వారు ఆయనకు చేసియున్నది అదియే. వారు ఆయనను చంపారు, ఆయన వారిని రక్షించగలుగునట్లు, ఆయన చనిపోయాడు. అదే నిత్యజీవము. అప్పుడు, నీవు నీ రొమ్ములో దానిని కలిగి, అప్పుడు పరలోకమును ఎదుర్కొనుచున్నావు. అయితే నీ సొంత వాటిని, నీవు త్యాగము చేసి, గొర్రె ఉన్నిని ఇచ్చునట్లుగా, నీవు వాటిని వదులుకొనుచున్నావు. నీవు ముందుకు, కల్వరి వైపునకు చూస్తున్నావు.
89 ఒక స్థలములోనికి నిన్ను తెచ్చుటకు, ఇది సహాయపడుతుందని నా నిరీక్షణ. అదే ఆలయమైయున్నది, అదే ప్రజలనగా, నీవు ఏమైయున్నావో, నీ ఉద్ధేశ్యము ఏమిటో, దానినే నీవు తప్పక చేయవలసియున్నది. సంఘమనగా, ఏదో సంగీతమును వాయించుటకు, పాటలు పాడుటకు వెళ్ళుట కాదు. సంఘము దిద్దుబాటు స్థలమైయున్నది. “తీర్పు దేవుని యొక్క ఇంటినొద్ద ప్రారంభమవుతుంది.”
90 “మనము తప్పక మనలను మనము మృతులుగా, క్రీస్తులో సజీవులుగా మనలను మనము ఎంచుకోవాలి.” అప్పుడు, ఆయనను వెంబడించుటకు ఆయన సేవకు మనలను మనము త్యాగము చేసికొనుటకు, ఆయన మార్గమును సిద్ధపర్చాడు. మనము ఆయనను వెంబడించినట్లైతే, ఆయన జీవించిన జీవితమును మనము జీవిస్తాము. అది అద్భుతము.
91 యేసు దానిని గూర్చి మాట్లాడాడు, చెప్పాడు. దాని మీద కొన్ని అభిప్రాయములను, నన్ను మీకు ఇవ్వనివ్వండి. దానిని తప్పిపోవద్దు. యేసు అన్నాడు, ఆ దినమున ఆయన గొర్రెలు మరియు మేకలవలె ప్రజలను వేరు చేస్తాడు. ఆయన మేకలతో, “ఎడమవైపున నిలబడమంటాడు.” మరియు గొర్రెలను, “కుడివైపున నిలబడమంటాడు.”
92 ఆయన మేకలతో అన్నాడు, “నా నుండి తొలగిపొండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. నేను చెరసాలలోయుంటిని, మీరు నన్ను చూచుటకు రాలేదు. నేను దిగంబరిగాయుంటిని, మీరు నాకు బట్టలీయ లేదు. నేను దప్పిగొంటిని. మీరు నాకు దాహమునకివ్వలేదు. నేను రోగిగాయుంటిని, మీరు నన్ను దర్శించలేదు కాబట్టి నన్ను విడిచిపొండి.”
93 గొర్రెలతో ఆయన అన్నాడు, “నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టారు. నేను దిగంబరినైయుంటిని, మీరు నాకు బట్టలిచ్చారు. నేను రోగిగాయుంటిని, మీరు నాకు పరిచర్య చేశారు.”
94 గమనించండి. సంఘమా దీనిని గ్రహించుటలో తప్పిపోవద్దు. శాశ్వతముగా దీనిని మీరు హృదయములలో యుంచుకొనండి. అది ఎంతో స్పృహ లేకుండా జరిగించబడింది. ప్రజలు విధి నిర్వహణ వరుసగా దానిని చేయరు. నీకు ఇదో ఏదో ఇచ్చే ఒక మనిషి, అతడు దానిని తప్పక చేయవలసియున్నదని, నీకు భోజనము పెట్టే మనిషి దానిని తప్పక చేయవలసియున్నదని అనుకొంటే, అప్పుడు అతడు స్వార్ధపూరితమైన ఆలోచనను కలిగియున్నాడు. అది తప్పక నీ యొక్క సొంత జీవితమై, నీ చర్యయైయుండాలి.
95 అది ఈ గొర్రెలను ఎంతో ఆశ్చర్యపర్చుచుండగా, వారన్నారు, “ప్రభువా, నీవు ఎప్పుడు ఆకలిగొన్నావు, మేము నీకు ఎప్పుడు భోజనం పెట్టాము? నీవు ఎప్పుడు దిగంబరిగాయున్నావు, మేము ఎప్పుడు నీకు బట్టలు ఇచ్చాము? నీవు ఎప్పుడు దప్పిగొన్నావు, ఎప్పుడు మేము నీకు దాహమిచ్చాము? నీవు ఎప్పుడు రోగిగాయుండుట చూసి, ఎప్పుడు నీకు మేము పరిచర్య చేశాము?”
96 అది దానికై అది ఎంతో ప్రేమతో చేయబడింది, సరిగ్గా నీ యొక్క జీవితము వారిలో జీవించింది. దేవా, ఎంతో దానికై అది, కల్వరి మా కొరకు ఏమి చేసిందో, ప్రజలను చూడనిమ్ము.
“ప్రభువా, నీవు ఎప్పుడు ఆలాగున్నావు? అది మాకు ఎన్నడూ తెలియదు.”
97 యేసు వారి వైపు తిరిగి ఏమి చెప్పాడో చూడండి, “ఈ చిన్న వారిలో ఒకరికి మీరు చేసినందున, మీరు దానిని నాకు చేశారు.”
98 నిస్వార్ధమైన జీవితము, రెండవ తలంపు కాదు. దానిని గూర్చి ఆలోచించుట కాదు; కాని నీవు లోక కార్యములకు ఎంతగానో చనిపోయియున్నావు, మరియు క్రీస్తులో ఎంతగానో సజీవమైయున్నావు, ఎంతగానో రాజ మార్గము మీద నడుస్తున్నావు, ఆ ప్రకారము ఈ కార్యములన్నియు సరిగా వాటంతట అవే జరుగుతాయి. నీవు వాటిని కేవలము చేస్తావు. “బాగుంది, ఇప్పుడు, ప్రభువు చేస్తాడని చెప్పుట కాదు, కాని నేను దానిని చేయాలని ప్రభువు కోరుచున్నాడు.” అది అది కాదు. నీవు సరిగ్గా దానిలో భాగమైయున్నావు. ఆయన ఆత్మ నీలోయున్నది, మరియు ఆయన పనిచేసిన విధముగా నీవు పనిచేస్తావు. హ! తప్పక దానిని పొందండి.
99 “అక్కడ ఒక మనిషికి సరియైనదిగా కనబడు మార్గమున్నది, కాని దాని అంతము మరణమైయున్నది.”
100 “‘ప్రభువా, ప్రభువా,’ అని పిలుచు ప్రతివాడు దానిలో ప్రవేశించడు గాని, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు దానిలో ప్రవేశించును.” సరిగ్గా వారి హృదయము నుండి, ఇష్ట పూర్వకముగా చేయువారు.
101 ఇప్పుడు, కల్వరిలో ఆ దినమున ఆ వెల చెల్లించబడింది. ఆ ప్రకారము మనము ఆ మార్గములోయుండగలము.
102 నేను చెప్పాను, “మీకు తెలుసా, ఒకసారి విధవరాలైన జోన్స్ కు బొగ్గు అయిపోయింది, నేను వెళ్ళి ఆమె కొరకు కొంత బొగ్గును కొన్నాను. నేను మీకు చెపుతాను, ఒక సోదరునికి ఒక సూటు బట్టలు అవసరమైనది, నేను వెళ్ళి అతని కొరకు ఒక సూటు బట్టలను కొన్నాను. దేవుడు సన్నుతించబడును గాక! నేను ఒక క్రైస్తవుడనైయున్నాను.” ఓ, అయ్యో! స్వార్ధపరుడా, దీన, దరిద్రుడా, నీవు ఒక వేషధారివి.
103 “నీ యెడమ చేయి ఏమి చేస్తున్నదో, నీ కుడిచేయికి తెలియనీయవద్దు, మరియు నీ కుడిచేయి ఏమి చేస్తున్నదో, నీ యెడమ చేయికి తెలియనీయవద్దు.” ఎలాగైనా నీవు దానిని చేయు వరకు, నీకై నీవుగా ఎంతో క్రీస్తులో చనిపొమ్ము. అది నీ స్వభావమైయున్నది. అది నీ నిర్మాణమైయున్నది. ఎలాగైనను నీవు దానిని చేస్తావు. అది సరిగ్గా నీలో జీవించుచున్న జీవితమైయున్నది. నీవు సంపూర్ణముగా, ఆ ఆత్మకు లోపర్చబడియున్నావు, మరియు అది దానికై అది సరిగ్గా జీవిస్తుంది. ఓ, ఆ ధన్యమైన ఆత్మను, ఆ జీవమును నీవు స్పృశిస్తావు! పౌలన్నాడు, “జీవించువాడను నేను కాదు,” “కాని క్రీస్తే నాయందు జీవించుచున్నాడు,” సరిగ్గా ఎంతో దానికై అది జీవిస్తుంది.
104 “బాగుంది, బ్రాన్హాం సోదరుడా, మనము క్రైస్తవులమైయున్నమని నేను మీకు చెపుతాను. ఈ ప్రజలకు మనము సహాయము చేస్తాము. ప్రజలకు మనము సహాయము చేస్తాము.” ఓ అయ్యో! మీకు సిగ్గులేదా, అది క్రైస్తవ్యము కాదు.
105 క్రైస్తవ్యము దానంతట దానికై అది వెళుతుంది. అది జరిగించబడవలసియున్నది. నీవు దానంతటిని గూర్చి మర్చిపోతావు. “నేను మర్చిపోలేను.” వెళ్ళి దానిని చేయుము.
106 క్రీస్తు సంపూర్ణముగా ఆయన జీవితమును దేవునికి సమర్పించుకొనియున్నాడు. ఆయన తన్ను తాను, ఒక ప్రజా సేవకుడిగా, ప్రజలకు ఇచ్చివేసుకొన్నాడు. ఆయన తన ప్రాణమును ఉచితముగా ఇచ్చివేసుకొన్నాడు. ఆయన దానిని చేయవలసిన పనిలేదు. ఆయన దానిని పగతో చేయలేదు. “ఇప్పుడు సోదరులారా, మీరందరు ఎంతో తప్పక నన్ను గూర్చి ఆలోచించాలి, అని ఆయన చెప్పలేదు, ఏలయనగా నేను మీ కొరకు చనిపోవుటకు వచ్చాను.” ఆయన దానిని గూర్చి ఎన్నడూ ఒక్క మాట చెప్పలేదు. ఏమైనను, ఆయన చనిపోయాడు, కారణము అది ఆయనలోయున్న దేవుడైయున్నాడు.
107 మనము ఇతరుల కొరకుచూచునట్లు చేయునది, అది నీలోయున్న దేవుడైయున్నాడు, అది నాలోయున్న దేవుడైయున్నాడు. గొర్రెలు, ఒక వైపున ఉన్నాయి.
108 వారిలో ఒకరంటారు, “బాగుంది, ప్రభువా, నేను దీనిని చేశాను. మరియు ప్రభువా, దానిని నేను చేశాను.”
109 ఆయనన్నాడు, “అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి తొలగిపొండి. కనీసము మీరు ఎవరో నాకు తెలియదు.”
110 సంఘము ఎన్నడైనా ఆ మూల సిద్ధాంతముల యొద్దకు వచ్చినట్లైతే, అది నీవు ఏదో చేయుట కొరకు ప్రయత్నించుట కాదు, నిన్ను నీవు దానిలోనికి పనిచేయుట కూడా కాదు. అది ఏదో నీలో పట్టినదైయున్నది.
111 నా పెంతెకొస్తు స్నేహితుడా, నన్ను మన్నించు. నేనును పెంతెకొస్తునే. అయితే నా పెంతికొస్తు స్నేహితులు, ఏ స్థానములోనికి వెళ్ళియున్నారనగా, ఒక కేకను తెచ్చుటకు ఎంతో వేగముగా సంగీతమును వాయిస్తూ, ఒక విధమైన బాండు మేళములను కొడుతూ, లేక చప్పట్లు కొడుతూ, లేక తంబురలను వాయిస్తున్నారు. అది కేవలము ఉద్రేకమైయున్నది. వారు యుద్ధమునకు వెళ్ళకముందు, వారు బాండు మేళములను వాయిస్తారు. వారు యుద్ధపు ఉద్రేకములోనికి ప్రజలను తెస్తారు. నేను సంగీతమును నమ్ముతాను. చప్పట్లు కొట్టుటను నేను నమ్ముతాను. అయితే ఈ కార్యాలన్నీ నేను నమ్ముతాను. అది అక్షరాల సత్యము. మనము తప్పక దానిని కలిగియుండాలి.
112 అయితే గొప్ప పనులను మనము, చేయకుండా విడిచిపెట్టియున్నాము, అదే నీ స్వార్ధ త్యాగము ద్వారా, దేవుడు నీలో జీవించుట, సరియైనదేదో దానిని నీవు నీయంతట నీవే చేస్తున్నావు, కారణమేమనగా అది సత్యమైయున్నది. దానిని గూర్చి కనీసము ఏమియు తలచకుండా, సరిగ్గా ముందుకుకొనసాగుచున్నావు. సరిగ్గా దానిని జీవిస్తున్నావు. అలాగైతే గమనించు, ఏది సంభవించుచున్నదో నీవు చూడు, నీ రాజ మార్గములోయున్నావు రాజ మార్గములో, అదే కల్వరి నీ భావమైయున్నది, ఆ దినమున అది నీ కొరకు తెరవబడింది.
113 ఇప్పుడు, నీవు గమనించు. నీవు సగము మేకగా, లేక సగము గొర్రెగా యుండలేవు. ఆ రెండూ కలవవు.
114 ఇప్పుడు అనేకమంది ఈలాగున అంటారు, “అవును, అది ఏమిటో మీకు తెలుసా? మా గుంపులో ఒక సంస్థయున్నది. మేము పేదవారికి సహాయము చేస్తాము. మేము దీనిని చేస్తాము.” అది మంచిదే, కాని దానిని గూర్చి నీవు నీ సొంత బూరను ఊదుచున్నావు. నీవు దానిని చేయరాదు.
115 “ఆ ధర్మమును నీవు రహస్యముగా చేయుము,” అని యేసన్నాడు. కేవలము దానికై అది, నీవు వెళ్ళి నీరు త్రాగుట కంటె ఎక్కువుగా, దానికై అది చేయబడుతుంది. నీవు దాహముతోయున్నావు. నీ ప్రక్క మనిషి కూడా దాహముతోయున్నాడు, అతనిని గూర్చి కూడా నీవు ఆలోచన చేస్తావు. నీ ప్రక్క మనిషి యొక్క అవసరత, నీ సొంత అవసరతను గూర్చి నీవు ఆలోచన చేసినట్లుగా, అతనిని గూర్చి కూడా నీవు ఆలోచన చేస్తావు. దాని పట్ల ఏ శ్రద్ధ చూపవద్దు. కేవలము ముందుకు జీవించుము.
ఇప్పుడు, నీవు సగము గొర్రెగా, సగము మేకగాయుండవు.
116 కాబట్టి నీవు ఈలాగు చెప్పినట్లైతే, “బాగుంది, మా సంఘము ఒక సంస్థను కలిగియున్నది. మేము పేదలకు సహాయము చేస్తాము, మేము ఇది, అది, మరొకటి చేస్తామంటారు.”
117 క్రీస్తు జీవము నీలో లేకుండా, నీవు దానిని కలిగియున్నట్లైతే, నీవు పరిపూర్ణముగా వ్యర్ధముగా దానిని చేయుచున్నావు. యేసు…పౌలు అన్నాడు, 1 కొరింథీ 13వ అధ్యాయము, “బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమలేనివాడనైతే నాకు ప్రయోజనము లేదు.”
118 ఇప్పుడు, ఇది కఠినముగా వుంది, కాని అది సత్యమైయున్నది. నీవు తప్పక ఆ యధార్థత నొద్దకు వచ్చి, కల్వరి నీకు ఏమి చేసియున్నదో గుర్తించవలసియున్నది. మనము దానివైపు చూసి, “ఓ, అవును, అది చక్కగాయున్నది,” అంటాము. అది అది కాదు. ఆ దేవుని యొక్క కుమారుడు కల్వరికి వెళ్ళవలసియున్నట్లైతే, దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు, తప్పక ఒక కల్వరికి వెళ్ళవలసియున్నది. అతడును తప్పక ఒక కల్వరిని కలిగియున్నాడు. నీవును తప్పక కల్వరిలో ఆ దినమును కలిగియుండవలసియున్నది. అది పాపము యొక్క ప్రశ్నను పరిష్కరిస్తుంది. బోధకునితో కరచాలనము చేయుట కాదు; సంఘములోనికి కరచాలనము చేసింది కాదు; సిఫారసు ఉత్తరము ద్వారా లోనికి వచ్చుట కాదు; వృత్తి ద్వారా లోనికి వచ్చుట కాదు. కాని ఒక జన్మ ద్వారా లోనికి వచ్చుటయైయున్నది. ఆయన ఎన్నడూ ఒక ఉత్తరము ఇయ్యలేదు. ఆయన ఎన్నడూ ఒక వృత్తిని ఇవ్వలేదు. ఆయన ఒక జన్మనిచ్చాడు. ఆ విధముగానే మనము లోనికి వస్తాము. తరువాత, దాని నుండి, దానికై అది, మనము క్రైస్తవ జీవితములను మనము జీవిస్తాము.
119 ఇప్పుడు, మరొక సూచన. సగము మేక, సగము గొర్రె అనునది అక్కడ వారికి లేదు. నీవు మేకవైనా లేక గొర్రెవైనాయైయుండాలి. నీవు సగము గొర్రె, సగము మేక కాదు. నీవు మేకవైనా లేక గొర్రెవైనాయైయుండాలి.
120 ఇప్పుడు, నీవు మంచి పనులు చేస్తూ, నేను లోనికి రాగలను అని అనుకొన్నట్లైతే, దానిని బట్టి, అప్పుడు అక్కడ ఒక కల్వరిలో ఆ దినము యుండేదికాదు. ధర్మశాస్త్రము దానిని సిద్ధపర్చింది, కాని కల్వరిలో ఆ దినమును తీసుకొనుటగాయుండాలంటే, దానిని లోనికి తేవాలి, మనము కేవలము సంఘ సభ్యులుగా ఉండలేము, కాని దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా మనము ఉండాలి. అదే కల్వరిలో ఆ దినమైయున్నది దాని యొక్క భావము నీకు అదేయైయున్నది, నీవు ఆలాగునయుండి, ఆయనను వెంబడించి, యేసు వలె ప్రవర్తించాలి.
121 ఇప్పుడు, ఒక నది ఒకే సారి పైకి, క్రిందకి ప్రవహించదు. నది ఒకే మార్గములో మాత్రమే ప్రవహిస్తుంది. మరియు దేవుని యొక్క ఆత్మ ఒకే మార్గములో ప్రవహిస్తుంది. అది దానితో వీటిని మిశ్రమము చెయ్యదు. ఒకే మార్గములో ప్రవహిస్తుంది.
122 ముగింపులో, యేసును గమనించండి. యేసు అన్నాడు, “నేను చేయు క్రియలు మీరును చేస్తారు, వాటి కంటె మరి ఎక్కువ చేస్తారు, ఏలయనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను.”
123 ఇక్కడయున్న సంఘమునకు, ఎంతో ఎక్కువుగా నేను ఇది చెప్పుట లేదు. మీకు అర్థమైనదా. అయితే ఈ వర్తమానములు టేపు చేయబడినవి. ప్రపంచమంతటా లక్షలమంది వీటిని వింటారు.
124 విమర్శకుని బట్టి ఇప్పుడే తిన్నగా, నేను ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వబోవుచున్నాను. నేను తరచుగా దానిని చెప్పియున్నాను. వాళ్ళన్నారు “ఎందుకు నీవు బైబిలును నమ్ముతావు? యేసు అన్నాడు, ‘నేను చేయు క్రియలు మీరును చేస్తారు, మరియు వాటికంటె మరి ఎక్కువగా చేస్తారు, ఏలయనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను.’”
125 దొర, నీవు ఎంత చెడ్డగా మారగలవు? నీ తెలివితో కూడిన వేదాంతములతో, దేనిని గూర్చియైనా నీ మానసిక ఆలోచనలో, విమోచన నుండి నీవు ఎంత దూరముగా తిరుగులాడుతావు? నా దయగల తప్పిపోయిన స్నేహితుడా, ఈ బైబిలు ఆత్మ సంబంధముగా అనువదించబడియున్నదని నీవు గ్రహించలేవా?
126 చదువుకొన్న వారి నుండి, చురుకైన వారి నుండి, తెలివిగల వారి నుండి, జ్ఞానుల నుండి, ఆయన మరుగుపరచి, నేర్చుకొనే వారు, కల్వరి నొద్ద వచ్చే వారికి బయలుపర్చినందుకు, యేసు తండ్రికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు.
127 ఇప్పుడు గమనించండి. యేసన్నాడు, ఆయన దానిని ఎలా వివరించాడో గమనించండి. “నేను చేయు క్రియలు,” ఆయన ఇప్పుడే వాటిని చేయుచున్నాడు. “ఇప్పుడు నేను చేయుచున్న క్రియలు, రోగులను స్వస్థపర్చుట, చనిపోయిన వారిని బ్రతికించుట, గ్రుడ్డివారి నేత్రములు తెరచుట, ఈ క్రియలు మీరు కూడా చేస్తారు. మీరు నాయందు విశ్వాసముంచినట్లైతే, వీటిని మీరు చేస్తారు. మీరు ఈ క్రియలను చేస్తారు. ఏలయనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నందున, వీటి కంటె మరి గొప్ప కార్యములు మీరు చేస్తారు.”
128 “కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు. అయితే మీరు నన్ను చూతురు. నేను మీలోను, మీతోను, యుగసమాప్తి పర్యాంతమందును. నేను మిమ్ములను అనాధలనుగా విడువను నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును, లోకము ఆయనను పొందనేరరు; అయినను మీరు ఆయనను ఎరుగుదురు.”
129 ఇప్పుడు గమనించండి. “ఇంకా గొప్ప” కార్యములు, ప్రార్థనా ద్వారా రోగులను స్వస్థపర్చుటకు, ప్రార్థనా ద్వారా దయ్యములను వెళ్ళగొట్టుట, సంఘములో దేవుని యొక్క శక్తిని కలిగియుండుటయే గాక, విశ్వాసులకు నిత్యజీవమును ఇచ్చుటయైయున్నది. విశ్వాసులకు నిత్యజీవమునిచ్చుటకు, పరిశుద్ధాత్ముడు సంఘము యొక్క చేతులలోనికి వచ్చుచున్నాడు. ఓ! అదే కల్వరి అనగా భావము. అది వంగిపోయిన, దిగజారిపోయిన స్త్రీ పురుషులను, ఏ స్థానమునకు ఎత్తియున్నదనగా, ప్రజలను స్వస్థపర్చుటకు మరియు నిత్యజీవమునిచ్చుటకు, వారిని దేవుని యొక్క కుమారులుగా మరియు కుమార్తెలుగా చేసియున్నది; విధేయతగల విశ్వాసులకు పరిశుద్ధాత్మను ఇస్తూ. ఒకప్పుడు అవిశ్వాసులైన వారిని, విశ్వాసులుగా తయారుచేసి, వారికి ఆత్మ సంబంధమైన నిత్యజీవమును ఇచ్చుచున్నది.
దానిని చెప్పుట ఎంత గొప్ప విషయమైయున్నది…
130 ఇక్కడ రోగముతో పడియున్న స్త్రీ. నేను విశ్వాస సహితమైన ప్రార్థన చేయగలను, మరియు ఆమె స్వస్థపడగలదు. అది ఒక గొప్ప కార్యమైయున్నది. అప్పుడు ఆయన చేసియున్నదదియే.
131 “కాని,” ఆయనన్నాడు- “వీటి కంటె మరి గొప్ప కార్యములను మీరు చేస్తారు. కొద్దికాలము అతనిని పైకి లేపుటకు, నేను మీకు శక్తిని ఇచ్చుట మాత్రమే గాక, అతనికి నిత్యజీవమును ఇచ్చుటయైయున్నది, అది నిత్యమైనది, నిరంతరముండునదైయున్నది.” దీన, దరిద్రులైన గ్రుడ్డి ప్రజలు, మీరు దానిని ఎలా తప్పిపోగలరు? “ఇంకా గొప్ప కార్యమనగా” ఏమిటో మీరు చూచుటలేదా? ఎన్నడైనా ప్రజలకు సంభవించగలిగే, అతి గొప్ప కార్యము, ప్రజలకు నిత్యజీవమునిచ్చుటయైయున్నది. నిత్యజీవమనగా ఏమిటి? ఆయన జీవించిన జీవితము, ఆయనలోయున్న జీవము, ఇతరులకు ఇచ్చుటయైయున్నది. ఒక మనిషి దానిని చేయగలడా? ఒక దేవుని కుమారుడు చేయగలడు.
132 యేసు అన్నాడు, “మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండును.”
133 ఇప్పుడు ఇక్కడే కాథలిక్ సంఘము వారు మరియు ఇతరులైన అనేకులు, వారి యొక్క పెద్ద పొరపాటును చేశారు. వారు బయటకు వెళ్ళి, “నేను నీ పాపములను క్షమించుచున్నాను,” అని చెపుతారు. అది అది కాదు.
134 బైబిలులో వారి పాపములు ఎలా క్షమించబడ్డాయి? పెంతెకొస్తు దినము, ఆ ప్రశ్నకు పేతురు జవాబు చెప్పియున్నాడు. వారన్నారు, “రక్షించబడటానికి మేము ఏమి చేయాలి? మీరందరూ కలిగియున్న దానిని, మేమును ఏలాగు పొందగలము?” అతడు మందు చీటిని అక్కడ ఉంచియున్నాడు. వారు ఏమి చేయాలో అతడు చెప్పియున్నాడు.
135 అతడన్నాడు, “మీలో ప్రతి ఒక్కరు దేవుని యెదుట మారుమనస్సు పొంది, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి.” దేని కొరకు? మీ పాపక్షమాపణ కొరకు. అక్కడే “మరి గొప్ప” కార్యములున్నవి.
136 ఈ ఉదయమున ఎంత మంది బోధకులు, మేగ్నటిక్ టేప్ పై నా వాక్యమును వినుచున్న ఎంతమంది బోధకులు, ఈ ఉదయమున కల్వరి నొద్దకు వెళ్ళుటకు ఇష్టపడుచున్నారు? మరియు దేవుడు నీ కొరకు దేవుడు అక్కడ ఏమి చేశాడో చూడుము. నీ యొక్క సంఘశాఖా మతములను విడచిపెట్టి, సువార్తను బోధించుము. హల్లెలూయ! అది ఇప్పుడు నీ వడిలోయున్నది. దానితో నీవు ఏమి చేయబోవుచున్నావు?
137 “ఏలయనగా మారుమనస్సు మరియు పాపక్షమాపణ, యెరూషలేము మొదలుకొని, ప్రపంచమంతటా ఆయన నామములో తప్పక ప్రకటించబడాలి.” హల్లెలూయ! మహిమ! అక్కడే నీవున్నావు.
138 కల్వరి నీకు ఏ భావము నిస్తుంది? ఆ దినము నీకు ఏమి చేస్తుంది? ఏదో వేదాంతముతో అది నిన్ను గట్టిగా చేస్తుందా? ఒక గట్టి చొక్కాయిగా అది నిన్ను తయారు చేస్తుందా? లేక అమ్మివేసుకొన్న ఒక క్రైస్తవుడిగా అది నిన్ను చేస్తుందా? హల్లెలూయ!
139 పాపము క్షమించబడింది! “వీటింకటె మరి గొప్ప కార్యములు మీరు చేస్తారు.” “మీరు” లు ఎవరో మీరు చూడండి, మీరు చూడరా? “దీనికంటె మరి గొప్ప కార్యములు,” యేసుక్రీస్తు నామములో పాపములను క్షమించుట.
140 కాని మతములు మరియు సంఘశాఖలు, తదితరమైన వాటి ద్వారా, అది ఒక స్థానములో నిన్ను క్రిందకు బంధించింది, మీరు ఇంకనూ లోకమును సేవించుచున్నారు. ఏ పురుషుడైనా, ఏ స్త్రీయైనా కల్వరియొద్దకు వచ్చి, ఎవరో ఏదో చెప్పిన కారణమును, ఏదో ఒక పెద్ద వ్యక్తిగా యుండుటకు ప్రయత్నిస్తారేమో, మీరు నాకు చెప్పండి. దాన యొక్క సరియైన వెలుగులో, కల్వరిలో ఆ దినము, కల్వరి యొక్క ముఖములో నీవు చూసినప్పుడు, అక్కడ నాకు చెప్పు. కల్వరిలో ఆ రోజును నీవు కలిగియుండి, ఒక గట్టి చొక్కాయిగా ఎలా బయటకు వస్తావు? ఒక తోలు బొమ్మగా ఎలా నీవు బయటకు వచ్చి, ఒక సంస్థ కొరకు మానవ కల్పితమైన సిద్ధాంతములను బోధించగలవు? అది ఎందుకు దేవుని యొక్క వాక్యమునకు నిన్ను తగ్గించదు? నీవు ఎన్నడైనా అక్కడకు వెళ్ళినట్లైతే, నీవు దీనుడివిగా బయటకు వస్తావు. యేసుక్రీస్తు, దేవుని యొక్క కుమారుడే ఉమ్మివేయబడిన ముఖముతో, కోయబడిన శరీరముతో, అవమానముతో అపకీర్తితో ఆయనే తన్ను తాను తగ్గించుకొన్నప్పుడు? వారు ఆయన వస్త్రములను చించివేసి, ప్రపంచము ముందు ఆయనను సిలువవేశారు. “అవమానమును త్రోసివేస్తూ,” నీవు కల్వరిలోనికి వెళ్ళి, ఆయన వలె అవమానము, అపకీర్తితో గాక, ఇంకా ఎలా భిన్నముగా నీవు బయటకు రాగలవు?
“ఓ,” నీవంటావు, “వారు నన్ను బయటకు తన్నుతారు.” వారిని తన్న నియ్యి.
141 కల్వరి నొద్ద నీ దినమును కలిగియుండుము, అప్పుడు దేవుడు ఆయన మార్గమును నీతో కలిగియుంటాడు. దానిని మరలా నన్ను ఉదహరింపనియ్యండి. కల్వరి నొద్ద నీ దినమును కలిగియుండుము. అప్పుడు దేవుడు ఆయన మార్గమును నీతో కలిగియుంటాడు.
ప్రార్థన చేసుకొందాము.
142 ప్రభువా, ఓ దేవా, ఇప్పుడే మా అందరిని పైకి కల్వరి నొద్దకు తీసుకొనుము. ప్రభువా మనుషుల భయము నుండి, ఎవరు ఏమి చెపుతారో అనే భయము నుండి, మరియు స్వార్ధము నుండి మేము దూరముగా వెళ్ళనిమ్ము. ఎందుచేత సర్వ ప్రపంచము ఆయనను చూసి నవ్వింది. కాని ఆయన మరణమునకు విధేయుడుగా ఉండెను. ఆయన అపకీర్తికి విధేయుడుగాయుండెను. ప్రభుత్వము క్రింద సహితము ఆయన విధేయుడిగాయుండెను.
143 సాతానుడు ఈ భూమిని మొత్తినపుడు ఈ భూమిపై వాడు అధిపతిగాను, అధికారిగాను మారినాడని మనము గ్రహిస్తాము. మన ప్రభువు ముందు దానినేవాడు సాక్ష్యమిచ్చి, “ఈ రాజ్యములన్నీ నావి, వాటితో నేను ఇష్టము వచ్చినట్లు చేస్తాను,” అని అన్నాడు. దానిని మనము గ్రహిస్తాము, ఆ దినము నుండి ఈ దినము వరకు, ఈ ప్రపంచము, అది శాపము క్రిందయున్నది, దానిని శపించిన వాని ద్వారా అది ఏలబడుచున్నది.
కాని దేవా, ఓ దేవా, మేము శపించబడని రాజ్యమును సేవిస్తాము.
144 తండ్రివైన దేవా, అది ఎంత అద్భుతమైనది. ఈ దినమున నీవు చిత్ర ప్రపంచములో, నీవు కొన్ని గొప్ప కార్యములను చేసియున్నావు. ఈ గొప్ప చిత్రములైన పది ఆజ్ఞల వంటివి బయటకు రానిచ్చి, స్త్రీ పురుషులను చూడనిచ్చావు. అది సంఘ ద్వారమును సహితము చీకటిగా చేస్తుంది, కాని అది ఏమైయున్నదో వారిని చూడనిమ్ము. దేవుని యొక్క మార్గము ప్రపంచము చేత, నిరాకరించబడిన మార్గము. ఏలయనగా మేము దానివలె…కమ్యూనిజం క్రింద మేము రష్యాలోనికి వెళతాము.
145 మనము లోకములోయున్నాము, కాని మనము ఈ లోక సంబంధులము కాదు. మనము కల్వరి నొద్దకు వెళ్ళాము. దేవుని యొక్క రాజ్యములో ఒకరిగాయుండుటకు, మనలను మనము దేవుని రాజ్యము కొరకు సిలువవేసుకొన్నాము. లోకము ఏమి చెప్పినప్పటికి లెక్కకాదు, ప్రభువు యొక్క తృణీకరింపబడిన కొద్దిమందితో, మన మార్గమును తీసుకొంటాము. మేము ముందుకు పునరుత్థానము లోనికి వెళతాము, మరియు అది త్వరలోనే సమీపమైయున్నదనియు, చివరకు ఈ ప్రపంచమును స్వాధీనపర్చుకొను, మరొక రాజ్యములోనికి మేము పునరుత్థానము చెందుతాము. దానియేలు ముందు చూసినట్లుగా, అది ప్రపంచమునంతా చిన్న పొట్టవలె ఊడ్చివేసింది. కాని ఆ రాయి పెద్ద పర్వతముగా ఎదిగి ప్రపంచమునంతా కప్పివేసింది. ఆ రాయి వస్తుంది. ఓ, దేవా, మేము దానిలో ఒక భాగముగా ఉండగోరతాము. మమ్ములను మేము తృణీకరించుకొని, ప్రతి దినము క్రీస్తు కొరకు, సిలువనెత్తుకొని, ఇతరుల కొరకు జీవించుదుము గాక. ప్రభువా దానిని దయచేయుము.
146 ఈ ఉదయమున ఇక్కడయున్న కొద్ది మంది, తమ రక్షకునిగా నిన్ను ఎరుగని వారు, ముగింపు ప్రార్థనలో జ్ఞాపకముంచుకొనబడగోరువారు, ఈ దినమే మీకు కల్వరిగాయుండవలెనని కోరువారు, మీరు మీ చేతులనెత్తి, “బ్రాన్హాం, సోదరుడా, నా కొరకు ప్రార్థించు, అని చెపుతారా. నా రక్షకుడిగా నేను ఆయనను ఎరుగగోరుచున్నాను.” ప్రభువు నిన్ను దీవించును గాక, యవ్వనస్థుడా, ఇంకా ఎవరైనా? ఆ వెనుకయున్న నా సోదరుడా, ప్రభువు నిన్ను దీవించును గాక.
147 అక్కడ ఇంకెవరైనాయున్నారా? “నేను ఆయనను తెలుసుకోవాలని, చెపుతారా. ఇది కల్వరిలో ఆ దినముగా నాకుండాలని నేను కోరుచున్నాను. నేను రోగినై అలసిపోయాను. దానిని చేయుట కొరకే నేను జన్మించియుండగా. దాని చుట్టూ నేను అల్పముగా తిరుగుట వలన ఉపయోగమేమిటి? ఒక దేవుని యొక్క కుమారుడిగా యుండుటకు నేను జన్మించియున్నాను, మరియు ఇక్కడ నేను లోక కార్యములను పట్టుకొనియున్నాను. దేవా, ఈ రోజే నన్ను సిలువవేయబడనిమ్ము. నేను క్రీస్తు కొరకు జీవించునట్లు, మరియు ఇతరుల కొరకు జీవించునట్లుగా, ఈ రోజే నన్ను నేను, నా ఆలోచనలను సిలువ వేసుకొననిమ్ము. వారు నాకు ఏమి చేసినప్పటికి, నన్ను ఎగతాళి చేసినప్పటికి లెక్కకాదు, నన్ను దీనుడిగా, సాత్వికముగా, గొర్రెపిల్ల వలె, ఆయన నడిచినట్లుగా మార్గములో నన్ను నడవనిమ్ము. ఒక రోజున, అంత్యదినమున, ఆయన నన్ను లేపుతానని వాగ్దానము చేశాడు. ఆ దినము కొరకు నేను ఎదురు చూస్తున్నాను.” అక్కడ మరి కొన్ని చేతులు పైకి వెళతాయా? ఆ వెనుక నిన్ను, నిన్ను ప్రభువు దీవించును గాక. మంచిది. మరికొందరు…దేవుడు మిమ్ములను దీవించును గాక. మనము ప్రార్థించకముందు, మరికొందరు.
148 మా పరలోకపు తండ్రీ, పేతురు పెంతెకొస్తు దినమున బోధించినపుడు, “నమ్మిన వారందరూ సంఘమునకు చేర్చబడిరని,” అది చెప్పబడింది. వారు నిజముగా వారి హృదయమంతటితో నమ్మియున్నారని నేను నమ్ముతాను. వారు కలిగియున్నట్లైతే, అక్కడ ఒక నీటి కొలను వారి కొరకు కనిపెట్టుచున్నది. వారి పాపములు క్షమించబడవలెనని వారు కోరుచున్నారు. వారికి ఆ నామములో బాప్తిస్మమిచ్చుటకు, అక్కడ ఒకరున్నారు, ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన, ఆ నామములో మాత్రమే, మనము తప్పక రక్షణ పొందవలెను.
149 ఏలయనగా, కొన్ని క్షణముల క్రితము, నేను లేఖనమును ఉదహరించినట్లుగా, అదేమనగా, “యెరూషలేము మొదలుకొని, ప్రపంచమంతటా, మారుమనస్సు మరియు పాపక్షమాపణ, ఆయన నామములో ప్రకటించబడాలి.” మెరూషలేము నొద్ద, మారుమనస్సు మరియు పాపక్షమాపణ బోధించబడినపుడు, అపొస్తలులు వారి లేఖనమును చెప్పి వారు తప్పక “మొదట మారుమనస్సు పొంది, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందాలని చెప్పారు.” దానిని చేయుట బోధకుని యొక్క పనియైయున్నది. ఏలయనగా వారు మారుమనస్సు పొందాలి, మరియు వారి పాపక్షమాపణ కొరకు అతడు వారికి బాప్తిస్మమును ఇవ్వాలి. “ఎవరి పాపములను మీరు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలచియుండనిత్తురో, అవి వారికి నిలిచియుండును.”
150 తండ్రీ, వారు కలిగియున్నట్లుగా, ఎలా ప్రపంచము ఎన్నడైనా దాని నుండి దిగిపోయి విసుగు చెందగలదు? ఎందుకు సూక్ష్మమైన సువార్తను నమ్మదు? దానికి ప్రత్యామ్నాయముగా సహితము, వారు దానిని లోనికి తెస్తున్నారు; తప్పుడు పేర్లు, తప్పుడు బాప్తిస్మములు, తప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మములు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను బిరుదులను ఉపయోగిస్తూ, సేవకులతో కరచాలనము చేస్తున్నారు, అది ఎన్నడూ లేఖనములలో లేదు; ఒక క్రైస్తవుడు ఎక్కడా బైబిలులో దానిని బోధించలేదు, అది రోమన్ మనుషుల ద్వారా తయారుచేయబడిన ఒక చిత్రము. పాపములు క్షమించబడుట, ఎన్నడూ బిరుదులలో క్షమించబడదు, కాని యేసుక్రీస్తు నామము ద్వారా జరుగుతుంది.
151 ఇప్పుడు, తండ్రీ, అది చాలా పేరు లేనిదని మాకు తెలుసు. నీ మార్గములు ఎల్లప్పుడు ఆలాగునేయున్నవి. అయితే స్త్రీ, పురుషులు ఈ ఉదయము, ఆ దినమునకు, కల్వరినొద్ద ఆ దినమునకు వచ్చుదురు గాక. అక్కడ యేసు, తృణీకరించబడుతూ ఆ రోజు, అవమానముతో చించివేయబడి, ముక్కలుగా కోయబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు; మొత్తం ప్రపంచము ద్వారా, సంఘము ద్వారా, తప్పక ఆయనను ప్రేమించవలసిన ప్రజల ద్వారా ఎగతాళి చేయబడ్డాడు. ఇంకనూ, వాటన్నిటి మధ్యలో, ఆయన తన నోరు తెరవలేదు, మరియు ఆయనను ఎగతాళి చేయుచున్న ఆ ప్రజల కొరకు చనిపోయాడు.
152 దేవా, ఈ ఉదయమున కల్వరికి మమ్ములను తీసుకొని వెళ్ళుము. మేము వెర్రివారమని వారు చెప్పినప్పటికి, మేము లేఖనములను తప్పుగా తీసుకొన్నామని, వారు ఏమి చెప్పినప్పటికి, దేవా, అది తప్పు అని దేవుని యొక్క సన్నిధిలో నిలబడి వారు చెప్పలేరు.
బైబిలు ద్వారా వారు తమ పాపములను కప్పుకొనలేరు. బైబిలు వారి పాపములను బహిర్గతము చేస్తుంది; వారి అవిశ్వాసము; పేరు ప్రతిష్ఠలు గలవారిగాయుండుట; లోకములోని ఇతరుల వలె ప్రవర్తించుట. ఈ ఉదయమున వారిని కల్వరి నొద్దకు రానిమ్ము.
153 “యెరూషలేము మొదలుకొని మారుమనస్సు మరియు పాపక్షమాపణ, సమస్త జనములలో ఆయన నామమున ప్రకటించబడాలి, యెరూషలేము మొదలుకొని.”
ఉమ్మివేయబడుట కొరకు, ఎగతాళి చేయబడుట కొరకు, మత సంబంధమైన దేశదిమ్మరులుగా, సంఘములను చీల్చివేయువారని, వారు ఎన్ని చెప్పినప్పటికి, వారు అదే సిలువవేయబడిన అడుగును, నరకబడుట కొరకు తీసుకొందురు గాక.
ప్రభువా, ఈ ఉదయమున మేము, ప్రభువు యొక్క తృణీకరించబడిన కొద్దిమంది మార్గమును తీసుకొందుము గాక. దేవుని సేవించుటలో మా హృదయముల మంచితనము నుండి, కుడికి గాని ఎడమకు గాని తొలగక, అపొస్తలులు నడిచినట్లు మేము నడుచుదుము గాక, తండ్రీ, దానిని దయచేయుము.
154 ఇప్పుడు, ప్రార్థనా వరుసలోనికి వచ్చుచున్న రోగులను మరియు బాధింపబడుచున్న వారిని స్వస్థపర్చుము. ఇప్పుడే తిన్నగా, వారి హృదయములలో నుండి చేతులెత్తిన వారు, పశ్చాత్తాపపడుదురు గాక. ఎంతో సమయము నుండి, ఆ వెనుక నిలబడిన వారు, నీళ్ళు యొద్దకు నడిచి, బలి అర్పణయైన యేసుక్రీస్తు నామములో, వారి పాపములు తుడిచివేయబడును గాక, ఆమేన్.
సిలువనొద్ద నా రక్షకుడు చనిపోయాడు,
అక్కడ నుండియే పాపము శుద్ధిచేయబడుట కొరకు నేను మొఱ్ఱపెట్టాను;
అక్కడ రక్తము నా హృదయమునకు అన్వయించబడింది;
ఆయనకు మహిమ…
ఆయన నామమునకు మహిమ!
ఓ, ఆయన నామమునకు మహిమ!
ఓ, అక్కడ నా హృదయమునకు రక్తము అన్వయించబడింది;
ఆయన నామమునకు మహిమ!
నేను ఎంతో ఆశ్చర్యకరముగా పాపము నుండి రక్షించబడ్డాను, (ఎలా?)
యేసు ఎంతో రమ్యముగా లోలోపల జీవించును,
సిలువనొద్ద ఆయన…(ఆయన వారిలో ఒకరిగా) లోనికి వచ్చాను;
ఓ, ఆయన నామమునకు మహిమ!
ఆయన నామమునకు మహిమ!
ఆయన నామమునకు మహిమ (ప్రశస్త నామము.)
ఓ, అక్కడ…హృదయమునకు రక్తము అన్వయించబడింది;
ఆయనకు మహిమ…
155 అది సరిగ్గా ఏదో మీకు చేయలేదా? అది నిన్ను సరిగ్గా శుద్ధిచేసింది. నీలో ఒక నిరీక్షణను ఉంచింది; జీవము, నిత్యజీవము.
156 “క్రీస్తుతో సిలువ వేయబడుట అనగా,” ఏమిటి? ఇతరుల కొరకు జీవించుట. ఇతరులనగా ఎలాటి వారు? నిన్ను ద్వేషించేవారు, నిను ఇష్టపడని వారు, నిన్ను ఎగతాళి చేసేవారు: వారి కొరకు జీవించుము; వారితోయుండుము; వారిని ప్రేమించుము; “నా నామము నిమిత్తము జనులు మిమ్మును నిందించి, మీ మీద అబద్ధముగా చెడ్డమాట పలుకునపుడు, వారి కొరకు ప్రార్థించండి. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.”
157 మనకు కల్వరి అవసరమైయున్నదని, మనకు ఒక సిలువ అవసరమైయున్నదని మనము చూస్తామని, ఈ ఉదయమున వర్తమానము, బహుశ సంఘమునకు సహాయపడుతుందని నేను తలంచియున్నాను.
158 ఇప్పుడు అదంతా చేసినది ఏమిటి? అదంతయూ నీ కొరకు చెల్లించబడింది. చక్రాల కుర్చీలోయున్న సహోదరీ, వ్యాధితో మరియు పీడింపబడుచున్న ప్రజలకు; అది అంతయూ చెల్లించబడినది, నీవు చేయవలసిన ఒకే కార్యము, అది నీదైయున్నదని నమ్ముటయే; అదే మార్గములో దానిని అంగీకరించుము, మరియు నీవు స్వస్థపడతావు.
159 గుర్తుంచుకోండి: ఇప్పుడు అది ఏమైయున్నది? మీరు ప్రపంచములోనికి వెళ్ళి, సువార్తను బోధించి, రోగులను బాగుచేయవచ్చును; మరియు నిత్యజీవమివ్వవచ్చును.
అది ఇంకెంత ఎక్కువ గొప్పగాయుంటుంది; ఇక్కడ ఒక మనిషి కణితితో, కాన్సర్ తో పడియున్నాడు, అది ఏమైయున్నప్పటికి, (ఎన్నోసార్లు ఆయన తన దీవెనలను ఇచ్చుటను, స్త్రీ పురుషులను బాగు చేయుటను మనము చూసియున్నాము; లక్షల కొలదిసార్లు ప్రపంచమంతటా తప్పిపోని కేసులను మంచముల మీదనుండి, పడకలమీద నుండి వారిని తీయుట మనము చూశాము. కాన్సర్ నీడతో తినివేయబడిన ప్రజలు ఈ రోజు చక్కగా ఆరోగ్యమైన ప్రజలుగాయున్నారు. “నేను చేయు క్రియలు మీరును చేస్తారు; వీటికంటె మరి గొప్పవి చేస్తారు” : “వీటికంటె ఎక్కువ.” అది నిజము.
ఏమిటి? యేసు’ నామములో నేను వారి జీవితమును పొడిగించాను, మరికొన్ని దినములు వారి జీవితము పొడిగించబడింది.
అయితే, “వీటికంటె మరి ఎక్కువగా మీరు చేస్తారు; నా నామము ద్వారా, వారికి మీరు నిత్యజీవమునిస్తారు.” అయ్యో!
160 ఆ ప్రశస్తమైన నామమును గూర్చి నీవు ఎందుకు సిగ్గుపడతావు? ఎందుకు ప్రజలు దానిని తప్పించి దూరముగా వెనకగా ఉంచుతారు? అది దయ్యమైయున్నది. నిశ్చయముగా.
161 “యెరూషలేము మొదలుకొని, భూదిగంతముల వరకు పాపక్షమాపణ ప్రకటించబడాలి.” అక్కడే మొదటగా వర్తమానము బయటకు వెళ్ళింది. అది నిజమేనా? “మారుమనస్సు మరియు పాపక్షమాపణ, యెరూషలేము మొదలుకొని ప్రకటించబడాలి.”
162 ఇప్పుడు, మొదటిగా, ఆయన చేసినట్లు మనము చేద్దాము; రోగుల స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాము.
163 తరువాత, గొప్ప వరమును మనము కలిగియుంటాము. బాప్తిస్మము పొందగోరు వారికి, ఆ వెనుక నీరు సిద్ధముగాయున్నది, (అక్కడ పురుషుల కొరకు, స్త్రీల కొరకు వస్త్రముల సిద్ధముగాయున్నవి), నీ పాపములు కడిగివేయుటకు సిద్ధముగా నిలబడియున్నవి; ఏలయనగా గుర్తుంచుకోండి, బైబిలు ఉపదేశము ప్రకారమే మీ పాపములు కడిగివేయబడగలవు. “ఏలయనగా మనము తప్పక రక్షణ పొందుటకు, ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన నామములో మరొకటి లేదు.”
164 ఇది వరకే బాప్తిస్మము పొందిన కొందరిని పౌలు కలుసుకొన్నాడు. వారు జయము పొందినట్లుగా, కేకలు వేస్తున్నారు, “అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందారు.”
వారన్నారు, “యోహానును బట్టి.”
అతడన్నాడు, “యోహాను మారుమనస్సు నిమిత్తము బాప్తిస్మము ఇచ్చాడు.” ఇప్పుడు, దీనిని గ్రహించండి; మారుమనస్సు నిమిత్తము, పాపక్షమాపణ కొరకు కాదు. ఎంతమందికి అది అర్థమైనది? పాపక్షమాపణ కొరకు కాదు. మారుమనస్సు నిమిత్తము, వారు బాప్తిస్మమును పొందారు, మంచిదే. వారు మారుమనస్సు పొందారు: “అవునండి, నేను మారుమనస్సు పొందాను. ఆయన వచ్చుచున్నాడని నేను నమ్ముచున్నాను.” వారు మారుమనస్సు నిమిత్తము బాప్తిస్మమును పొందారు; అది చెప్పాలంటే, “ప్రభువైన యేసునందు విశ్వాసముంచుచు.”
165 వారు దీనిని విన్నప్పుడు, (బలి అర్పణ ఇది వరకే వచ్చిందని), వారు మరలా తిరిగి యేసుక్రీస్తు నామమలో బాప్తిస్మము పొందిరి. మరియు అప్పుడు అతడు వారి మీద చేతులుంచినపుడు, వారికి పరిశుద్ధాత్మ ఇయ్యబడింది; వారు భాషతో మాట్లాడి ప్రవచించిరి.
166 ఆ లేఖనమును నీవు ఎలా మార్చబోవుచున్నావు? నీవు బైబిలులో ఒక స్థలములో నీ వ్రేలినియుంచి, పాపక్షమాపణ కొరకు క్రొత్త నిబంధనలో, ఎన్నడైనా యేసుక్రీస్తు నామములో తప్ప, మరే ఇతర మార్గములో బాప్తిస్మము పొందారేమో నీవు చూపించు.
167 బైబిలులో ఒక్క స్థలములో ఎన్నడైనా ఒక్క వ్యక్తి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను బిరుదులలో బాప్తిస్మము పొందియున్నాడేమో నాకు చూపించు. లేక నా బల్ల యొద్దకు చరిత్రను తీసుకు రమ్ము, ఎన్నడైనా ఎవరైనా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బిరుదులలో బాప్తిస్మ పొందియున్నారేమో నాకు చూపించు, అక్కడ మూడు వందల సంవత్సరముల తరువాత, చివరి అపొస్తలుడు చనిపోవు వరకు, కాథలిక్ సంఘము సంస్థగా మారు వరకు అది జరగలేదు.
168 ముందున్న నైసీన్ తండ్రుల చరిత్రను…చరిత్రకారులందరి యొక్క చరిత్రను, సమస్తమును తిన్నగా నా పఠన గదిలో కలిగియున్నాను; అత్యంత ప్రాచీనమైన, పవిత్రమైన ప్రపంచ చరిత్రలో అదియున్నది. తప్పిపోని ఋజువులను మాత్రమే మనము కలిగియున్నాము.
169 మా సండే విజిటర్ ను, లేక కాథలిక్ సంఘము యొక్క ప్రశ్నాత్తర గ్రంథమును చదవండి, అవి ఏమి చెపుతున్నాయో గమనించండి; “ప్రొటెస్టెంటు వారైన కొందరు రక్షించబడతారు, ఏలయనగా కాథలిక్ సిద్ధాంతమునకు వారు తలవంచుచున్నారు: కారణము వారి బైబిలు చెపుతుంది, ‘యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమివ్వండి,’ అయితే ‘యేసు నామము’ యొక్క గంభీరతను మనము తీసివేసి, ‘తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను’ ఉంచియున్నామని, వారు దానిని ఒప్పుకొంటారు.”
ఇప్పుడు, దానికి వ్యతిరేకమైన ఒక్క లేఖనాన్ని నాకు చూపించండి.
170 అక్కడే నీవున్నావు. మరియు ఇంకను లోకము దానిని నమస్కరిస్తుంది. ఎందుచేత? వారు ఎన్నడూ కల్వరి యొద్దకు వచ్చియుండలేదు. వారు ఎన్నడూ దానిని చూసియుండలేదు.
171 వాళ్ళు మిమ్మల్ని ఎగతాళిచేసి, “పరిశుద్ధ-బండ”, “యేసు మాత్రమే,” అని, వారు పిలవగలిగే పిచ్చి పేర్లన్నటితో పిలుస్తారు. వాళ్ళు నిన్ను ఏమని పిలిచినా, అది ఏ భేదము చేస్తుంది? వారు ఆయనను ఏమని పిలిచినా లెక్క చేయలేదు? ఆయన సిలువవేయబడ్డాడు. ఆయన దేవుని కొరకు జీవించాడు. దేవుని కొరకు మాత్రమే జీవించాడు. మరియు ఆయనలోయున్న అదే ఆత్మ, నీలోయున్నట్లైతే, నీవు వాటినే చేయునట్లు చేస్తుంది; ఆయన నామమును భరించుట. “మీరు ఏది చేసినను,” (బైబిలు చెపుతుంది), “మాటచేత గాని లేక క్రియ చేత గాని, తండ్రియైన దేవునిని మహిమపరుస్తూ, సమస్తమూ యేసు నామములో చేయుడి.”
172 ఆ త్రిత్వ, అన్య సిద్ధాంతమును మీరు ఎక్కడ నుండి పొందారు? మీ ప్రశ్నత్తర గ్రంథము నుండి పొందారు, బైబిలు నుండి కాదు. “త్రిత్వము,” అనే మాట ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు, మొత్తము లేఖనాలలోనే లేదు. అలాటిది అక్కడ ఏదియు లేదు. త్రిత్వ దేవుడనునది అక్కడ లేనే లేదు. ఆయన దేవుడైయున్నాడు. ఆయన మాత్రమే దేవుడు, ఒకే దేవుడు. ఆయన ఎల్లప్పుడు ఒకే దేవుడైయున్నాడు. ఆయన మూడు కార్యాలయములలో పని చేశాడు. మోషే కాలముతో ఆయన తండ్రిగా పనిచేశాడు, తరువాత కుమారుడుగా పని చేశాడు, యేసు. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా పని చేస్తున్నాడు. అయితే అది ఒకే దేవుడు. ఒకే దేవుడు. మూడు పేర్లతో కాదు. మూడు కార్యాలయముల, ఒకే పేరులో మూడు బిరుదులు: యేసుక్రీస్తు.
173 దానికి భిన్నమైనదేదైనను అన్యమతమైయున్నది; ఎవరైనను దానిని చూపించాలని నేను అడుగుతాను, అది లేనట్లైతే. అది నిజము. ఎన్నో సంవత్సరములుగా, సంవత్సరముల తరబడి, దానిని నేను చెప్పియున్నాను, ఇంకనూ, ఎవరూ దానిని పైకెత్తలేదు (చూడండి?), కారణమేమనగా అది ఆలాగున యుండలేదు. మొదటగా, నేను ఇక్కడ బైబిలును కలిగియున్నాను; మరియు అది ఖచ్చితముగా సత్యమైయున్నదని ఋజువు చేయుటకు, అక్కడ ప్రాచీనమైన చరిత్రలున్నవి. దయ్యము ఎందుకు దానిని చేస్తుంది…? బాగుంది, వారు ఆ విధానములోయుంటారని బైబిలు చెప్పింది: “నేను ఆకర్షించనిదే ఎవరు నా యొద్దకు వస్తారు?” దానిని గూర్చి నేను ఎరిగినదంతా అంతమట్టుకే. దానినే యేసు చెప్పాడు, కాబట్టి…
174 నేను దానిని చెప్పుట లేదు…నేను దానిని చెప్పినట్లైతే, ఈ విధముగా ఒక ప్రసంగమును బోధించినట్లైతే, మీ మధ్యలో నేను అతిహీనమైన వేషధారిగాయుంటాను. అది నిజము. దానిని నేను చెప్పుచున్న కారణమేమనగా, అది సత్యము మరియు జీవమైయున్నది. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన వారందరూ, క్రీస్తును ధరించుకొనియున్నారు. ఆయన నామము ద్వారా, వారు జీవమును కలిగియున్నారు.
175 మనము ఆయన నామములో ప్రార్థిస్తాము, ఆయన నామములో వెదుకుతాము, ఆయన నామములో బోధిస్తాము, ఆయన నామములో బాప్తిస్మము పొందుతాము, ఆయన నామములో జీవిస్తాము, ఆయన నామములో చనిపోతాము, ఆయన నామములో పరలోకము వెళతాము, ఆయన నామములో పునరుత్థానము చెందుతాము. “పరలోకములో కుటుంబమంతయు యేసు నామములో పేరు పెట్టబడింది.” బైబిలు ఆ రీతిగా చెప్పింది: “భూమి మీద కుటుంబమంతయూ యేసు నామములో పేరు పెట్టబడింది.” ఆయన అన్నాడు, “నేను నా…”
బాగుంది, “అది తండ్రియొక్క పేరని,” నీవంటావు.
తండ్రి పేరు కాదు, అది ఒక బిరుదైయున్నది, ఆయనన్నాడు, “నేను నా తండ్రి నామములో వచ్చాను, వారు నన్ను స్వీకరించలేదు.” ఇప్పుడు ఆయన ఏ పేరులో వచ్చాడు? హ-హా. నిశ్చయముగా, “…వారు నన్ను స్వీకరించలేదు.”
176 అక్కడే నీవున్నావు; అది సరిగ్గా, అవును, అది జ్ఞానము గల వారి నుండి తెలివిగల వారి నుండి మరుగు చేయబడింది. నిశ్చయముగా అది నిశ్చయముగా, హ-హా.
177 ప్రకటన గ్రంథములో, మొన్నటి దినమున మనము బోధించినట్లుగా: అక్కడే మొదటి వేశ్యా సంఘమున్నది, అది మొదటి సంస్థయైయున్నది; మరియు ఆమె నుండి పుట్టిన కొంతమంది కుమార్తెలున్నారు. వారు దానినే చేస్తారు, అదే అలవాటు. ఆమె అంతా బబులోనులో చుట్టివేయబడుతుంది, అదే మార్గము,…రోమన్ సంఘముతో మరియు దేశముల యొక్క ఐక్య సంఘ సమాఖ్యతో; అక్కడ ఆమెయున్నది, అంతా చుట్టివేయబడుతుంది, అంతా అదే కార్యము, అదే పడవ.
178 కాని దేవుని యొక్క సంఘము (హల్లెలూయ), అది ఒక పిలువబడిన, వేరుచేయబడిన సంఘమైయున్నది. సంఘము ఎలా నిర్మించబడింది? నీవు ఎలా దానిని తెలుసుకొంటావు? అది సత్యమైయున్నదని నీవు ఎలా తెలుసుకొంటావు? అది దేవుడు నీకు బయలుపరిచినపుడు తెలుసుకొంటావు. అవి ఆపిల్ పండ్లు కాదని, అది ఒక గొర్రెపిల్లయైయున్నదని, హేబేలు ఎలా తెలుసుకొన్నాడు? అది అతనికి బయలుపర్చబడింది: “విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను.”
179 రూపాంతరపు కొండ మీద నుండి దిగి వస్తుండగా, యేసన్నాడు, “నేను ఎవడని మనుషులు చెపుతున్నారు?”
కొందరు, “ఏలీయా” అని కొందరు “మోషే, అని చెపుతున్నారు.
అయితే ఆయనన్నాడు, “నేను మిమ్మును అడుగుచున్నాను, ‘నేను ఎవరినని మీరు చెపుతారు?’”
పేతురన్నాడు, “నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు.”
180 ఆయనన్నాడు, “నీవు ఎన్నడూ దీనిని నేర్చుకొనలేదు…” మరొక మాటలో (పెద్దగాయుండుటకు కాదు, కాని ఒక మాటను క్రిందకు దిగగొట్టటానికి, నేను దీనిని చెపుతాను): “ఏదో వేదాంత పాఠశాలలో ఎన్నడూ నీవు దానిని నేర్చుకొనలేదు; ఏదో మనిషి ఎన్నడూ నీకు దానిని నేర్పలేదు; కాని పరలోకమందున్న నా తండ్రి, నీకు దానిని బయలుపర్చాడు: అదే నేను (తండ్రి కాదు, కుమారుడు కాదు, పరిశుద్ధాత్మ కాదు, కాని నేను యేసుక్రీస్తునైయున్నాను). ఈ బండ మీద (ఏ బండ? హేబేలు వెళ్ళియున్న అదే బండ; అదే బండపై.), ఈ బండమీద, ఆత్మ సంబంధముగా బయలుపర్చబడిన దేవుని యొక్క సత్యము, దానిపై నా సంఘమును కడతాను, మరియు పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువజాలవు.” అది సత్యము. వారు ప్రయత్నిస్తారు, కాని వారు ఎన్నడూ జయించలేరు. చూడండి?
181 కాబట్టి సరిగా కల్వరికి వెళ్ళండి, సిలువ వేయబడండి, తిరిగి రండి, మరియు ప్రభువు యొక్క తృణీకరించబడిన కొద్దిమందితో ముందుకు సాగండి.
182 ప్రభువా, ఇప్పుడు, అన్ని విషయములను నీకు అప్పగించుచున్నాము. ఈ గుంపులో నుండి, ఇక్కడ ఏమున్నదో నాకు తెలియదు. ప్రభువా, నీవు నాకు దానిని బయలు పర్చితే తప్ప, దానిని నేను ఎరిగే ఆలోచనయే లేదు. ఇప్పుడు, తండ్రివైన దేవా, నీవు దానిని చేయమని నేను అడుగుట లేదు. ఇప్పుడు సరిగ్గా ప్రజల ఒడులలో నేను దానిని ఉంచియున్నాను. వారక్కడ యున్నారు. ఈ ఉదయమున ఇది ఒక నిజమైన కల్వరిగా యుండనిమ్ము; స్వీయ-చిత్తమునకు, స్వకీయ కోర్కెలకు, మరియు జీవితములోని గొప్ప సంగతులకు, ఇది ఒక నిజమైన సిలువవేయబడుటగాయుండును గాక.
183 ప్రజలు దీనులుగా, ప్రభువు యొక్క తృణీకరింపబడిన వారితో మార్గమును తీసుకొందురు గాక. వారు దీనులుగా నడుచుదురు గాక. ఈ రాజ్యములోనికి, ఈ గొప్ప దేవుని రాజ్యములోనికి, ఈ ఆత్మ సంబంధమైన శరీరములోనికి, భూమి మీదయున్న క్రీస్తు యొక్క పరలోకపు శరీరములోనికి, వారు జన్మించుదురు గాక: “ఒకే ఆత్మ ద్వారా ఒకే ఆత్మలోనికి మేము బాప్తిస్మము పొందియున్నాము.”
184 ప్రభువా, దానిని దయచేయుము. వారు నల్లవారైనా, తెల్లవారైనా, పసుపురంగువారైనా, గోధుమ రంగు గల వారైనా, వారు ఎవరైయున్నప్పటికి, మగవారైనా లేక ఆడవారైనా, దాసులైనా లేక స్వతంత్రులైనా, మేమందరము నీ యొక్క ఒకే ఆత్మలోనికి పానము చేసియున్నాము.
185 తండ్రీ, దానిని దయచేయుము…ఈ ఉదయమున వారిలో అనేకమంది గ్రహించుదురు గాక, వారి గ్రహింపును తెరువుము. అప్పుడు, అది వారికి ఒక క్రొత్తదినముగాయుంటిది; సూర్యుడు ప్రకాశిస్తాడు, మానవ కల్పితమైన మిణుగురు వెలుతురు, దూరముగా కదిలిపోయి, దేవుని యొక్క వెలుగు వారిపై ప్రకాశించి, ఈ చక్కని వెలుగును ముసుగు వేసిన, తెర చిరిగిపోవును గాక. అప్పుడు, వారు క్రీస్తు చేసినట్లుగా, ఇతరుల కొరకు జీవిస్తూ, పరిశుద్ధాత్మ యొక్క రాజమార్గములో నడుచుదురు గాక.
186 ఇప్పుడు ప్రార్థనా వరుసను మేము లోనికి తెస్తూయుండగా, మేము ఒకరికొరకు ఒకరము ప్రార్థిస్తూయుండగా, ఈ ఉదయమున నీ సేవకులను, మా అందరిని అభిషేకించుము. ఈ రోజు, ప్రార్థనా వరుసగుండా వచ్చి ప్రతి రోగిని స్వస్థపర్చుము. ఆ చిన్న మెల్లకన్ను బాలిక, ఆ చిన్న బాలుడు స్వస్థపడియున్నట్లుగా…ఆ పెద్ద స్త్రీ, మరియు సోదరుడు రిట్, అనేకమంది వ్యాధులతో, రుగ్మతులతో వచ్చియున్నారు, వారిని వైద్యులు కూడా దానిని స్వస్థపర్చలేరు; ఈ రోజున వారిక్కడయున్నారు (ఒక వారము రోజుల క్రితము), ఈ రోజు ఆరోగ్యముగా వారిక్కడయున్నారు.
187 దేవా, పురుషులు మరియు స్త్రీలు అదే విశ్వాసముతో వారి తలంపులకు, వారి ఆలోచనలకు వారి యొక్క గత వైద్యమునకు, సిలువవేయబడుటకు కల్వరి యొద్దకు వెళ్ళుచున్నామని, వారు “ప్రార్థనా వరుసగుండా దాటియున్నారు.” యేసును మృతులలో నుండి లేపిన శక్తి, వారికి జీవమిచ్చును గాక, గొప్ప విశ్వాస జీవితము.
188 మరియు దీని తరువాత వెంటనే, అనేకమంది బాప్తిస్మము కొరకు నీటి కొలను యొద్దకు వచ్చుదురు గాక. యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్?
189 ఇప్పుడు, మనము ప్రార్థనా వరుసను నడుపుటకు, మరియు బాప్తిస్మ కార్యమునకు, మనకు తప్పక 20 నిమిషములున్నవి. ఇప్పుడు మనకు ప్రార్థనా కార్డులు లేవు. మనము దాని నుండి వెళ్ళిపోయాము, మరియు మనము ప్రారంభించినపుడు, మన పెద్ద కూటములలో పనిచేసినట్లుగా చేయుటకు ప్రయత్నిద్దాము. నేను మీకు అంతా చెప్పియున్నాను, మనము దానిని బయట ఉంచాము, టేపు మీద దానిని మనము కలిగియున్నాము. నేను ఎక్కడికి వెళ్ళినను, ఆ టేపులు ముందుగా పంపబడతాయి.
190 ఈ సూచన దీవెన కొరకు మాత్రమే వ్రేలు చూపుతుంది. దాని ఉద్దేశ్యము ఏమైయున్నదనగా, “నీవు రోగి కొరకు ప్రార్థించినపుడు, ప్రజలు నిన్ను నమ్మగలుగునట్లు చేసినట్లైతే.”
నేనన్నాను, “వాళ్ళు నన్ను నమ్మరు.”
ఆయనన్నాడు, “ఈ సూచనలు నీకు ఇవ్వబడతాయి, మరియు దానిని బట్టి వారు నమ్ముతారు.” ఒక్కసారి తప్పిపోకుండా, ఈ సూచనలు పది సంవత్సరములు ప్రపంచము చుట్టూ తిరిగి, తిరిగి, కదిలియున్నవి. దానిలో ఏ మాత్రము తప్పిపోవుట లేదు. అది సత్యమని మీలో ఎందరికి తెలుసు?
191 మంచిది, నీవు సూచనను నమ్మినట్లైతే, అప్పుడు వర్తమానమును నమ్ముము. అది నిజము. అది దానిని చూపుతుంది. దేవుడు నాలో ఒక వర్తమానమును ఉంచాడు (దానిని ఎంతో పరిపూర్ణముగా ఆ రీతిగా వెళ్ళనిమ్ము, కాని ఏమిటి…) నేను దానిని మీకు తప్పుగా ఎలా చెప్పగలను? దేవుడు అది నన్ను చెయ్యనివ్వడు. లేదు, లేదు, లేదండి. నేను మీకు సత్యమును చెప్పుచున్నాను.
192 ఇప్పుడు, ప్రార్థించబడగోరు వారందరు, ఇక్కడ ఈ వరుసలో, ఈ పైకి ప్రక్కకు రండి, మీరు కోరినట్లైతే, ఇక్కడ పైన తిన్నగా వరుసకట్టండి. అప్పుడు, మనము ప్రార్థిస్తూయుండగా, ప్రజలను దానిగుండా రానివ్వండి. అప్పుడు కుర్రవాళ్ళు, ద్వార పాలకులు వారిని గమనిస్తారు; వారు ఇక్కడ వచ్చుచుండగా, చుట్టూ వెనుకనుండి, వారిని మనము తీసుకొద్దాము, దాని గుండా వారిన తీసుకొని వద్దాము. ప్రతి ఒక్కరూ ప్రార్థించబడతారు.
193 [ఎవరో సోదరుడు బ్రాన్హాంతో మాట్లాడుచున్నారు—ఎడి.] ఓ, లేదు, లేదు, నాకు తెలియదు. మంచిది, మీరు కోరిన ఏ సమయములోనైనా, పరవాలేదు. మీరు ఆమెను బయటకు తీసుకొని రావచ్చు. లేక నీవు…నేను చేయగలను…ఇప్పుడు ఆమెను బయటకు తేవొచ్చు, లేక కొంచెము సేపటి తరువాత, ఆమె కోరిన ఏ సమయములోనైనా, పరవాలేదు.
194 ఇప్పుడు, కొన్ని నిమిషములు, మనము ఉండవలసినంత నెమ్మదిగా యుందాము. ఇప్పుడు మీరందరూ ఆలోచిస్తూయుండాలని నేను కోరుచున్నాను. ఇప్పుడు, బైబిలు ఏమి చెప్పింది? “విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపర్చును.” అది సత్యమని మీలో ఎంతమందికి తెలుసు? బైబిలు చెప్పియున్నదని, మీలో ఎంతమందికి తెలుసు, “నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును, నేను చేయు క్రియులు మీరును చేస్తారు”? మరియు క్రియలు ఏమైయున్నాయి? ఆయనన్నాడు, “నేను దీనిని చేయగలనని నీవు నమ్మినట్లైతే నేను చేయగలను.” అది నిజమేనా?
నా ప్రశ్న ఏమైయున్నది? “వారు నన్ను నమ్మరు.”
ఆయనన్నాడు, “ఈ సూచనలు వారు నమ్మునట్లు చేస్తాయి.”
195 ఇప్పుడు, మీరు నమ్మినట్లైతే, సిద్ధపడండి-ఇది మీ యొక్క విడుదల గడియయైయున్నది. సరిగ్గా పాపము నుండి బయటపడుటకు, అది దేవుని యొక్క అదే వాగ్దానమైయున్నది.
196 ఇప్పుడు, కడుపు జబ్బుతో బాధపడుచు, న్యూ ఆల్బనీ నుండి వచ్చిన ఒక స్త్రీ మన యొద్దయున్నది. మొదటగా, మనము ఆమె కొరకు ప్రార్థించబోవుచున్నాము, ఆ ప్రకారము ఆమె తన సీటును పొందగలదు. ఇప్పుడు మెల్లగా, ప్రతి ఒక్కరూ, ఇక్కడయున్న సోదరులు నాకు సహాయము చేయాలని నేను కోరుతాను. ఒక్క క్షణము ప్రార్థన కొరకు మన తలలను వంచుదాము.
197 ఇప్పుడు, పరలోకపు తండ్రీ, ఇది నీ వాక్యమైయున్నది. దానిపై తీసుకొనే చర్యకొరకు, నేను బాధ్యుడను కాదు, కాని దానిని బోధించుటకే నేను బాధ్యుడను. దీనిని ఎరిగిన వాడనై (నేను మధ్య వయసుగలవాడనైయున్నాను, ఒక దినమున నేను నిన్ను ఎదుర్కొనవలసియున్నదని ఎరిగినవాడవై) నా హృదయము నుండి సత్యమును నేను బోధించియున్నాను. నీకు అది తెలుసు. పక్షపాతము యుండుటకు కాదు. ప్రభువా, అది ఆలాగునయున్నట్లైతే, అప్పుడు నాకు మారుమనస్సు అవసరము.
198 మేము రోగుల కొరకు ప్రార్థించుటకు వెళ్ళుచుండగా. నీవు సహాయము చేయవలెనని ప్రార్థిస్తున్నాము, మా ప్రార్థనలకు జవాబు ఇయ్యబడును గాక, నా ప్రార్థనలకు మాత్రము కాదు, ప్రభువా, ఈ సంఘ ప్రార్థనను ఈ దీనుల ప్రార్థనను వినండి…ఒక వేళ ఇక్కడ నిలబడియున్నది నా భార్యయైతే ఏమవుతుంది? ఆ చక్రాల కుర్చీలో కూర్చొన్నది, ఆమెయేయైతే ఏమవుతుంది? లేక నా సహోదరియైతే? ఓ, దేవా, ఈ ప్రజలను స్వస్థపర్చుము, ప్రభువా స్వస్థపర్చవా?
199 చూడండి, ప్రార్థనా వరుసలో నిలబడియుండగా: గుండె జబ్బుగలవారు, కాన్సర్, కణితి, అన్ని విధమైన వ్యాధులు ఇబ్బందులు గలవారు. వందల మంది వస్తున్నారు (ప్రభువా, ఇక్కడే వందలమంది విడుదల పొందియున్నారు), వారు దానిని చూశారు, వారు నమ్మారు, మరియు వారి స్వస్థతను అంగీకరించుటకు ప్రార్థనా వరుసలోనికి వస్తున్నారు. ఇప్పుడు వారు సజీవమైన రాయినొద్దకు వస్తున్నారు; నీ సేవకుని యొద్దకు కాదు, కాని నీ కుమారుడైన క్రీస్తునొద్దకు, ఆయనే సంఘమునకు నాయకుడు, ఆత్మ సంబంధమైన, మర్మయుక్తమైన వ్యక్తిగా మా మధ్యయున్నాడు. మేము వెళ్ళుచూ, ఆయన నామమును ప్రతిపాదించుచుండగా, (నీవన్నాను, “నా నామములో వారు దయ్యములను వెళ్ళగొడతారు.”), యేసు నామములో, మా ప్రార్థనలకు జవాబిస్తావని, నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.
200 ఇప్పుడు, ప్రతి ఒక్కరూ ప్రార్థనలో యుండండి. ఇప్పుడు, ఇది కూడా మీ యొక్క భాగమైయున్నది. ఇది మీ ప్రార్థనమైయున్నది.
ఏదైనా ఆమెకు సహాయపడకపోతే, ఈ స్త్రీ చనిపోతుంది.
201 మీలో ఎంతమందికి సోదరుడు స్టాడ్స్క్ లివ్ తెలుసు? సోదరుడు మరియు సహోదిరి స్టాడ్స్క్ లివ్? మొన్నటి రాత్రి జర్మనీ నుండి మూడు సార్లు నేను పిలవబడ్డాను; వారి బిడ్డ చనిపోయింది. వారడిగారు, “బ్రాన్హాం సోదరుడా, దేవుని ఆత్మ ద్వారా, నీవు చనిపోయిన వారిని లేపుటను మేము చూశాము,” (వారు హాజరై నిలబడి దానిని చూశారు. చూడండి?) “నీవు దేవుని యొక్క ప్రవక్తవని మాకు తెలుసు. కేవలము మాటను చెప్పుము.”
నేనన్నాను, “అది నా నోటిలో ఉంచబడితే తప్ప, నేను దానిని చెప్పలేను.”
“జర్మనీ రండి.” నేను తిన్నగా లేచాను. వాళ్ళు ఫోను చేశారు: “ఆరు గంటలలో నన్ను జర్మనీ తీసుకొని వెళ్ళటానికి ఒక జెట్ విమానాన్ని సిద్ధము చేశారు.” ఆ చనిపోయిన బాబుని లేపుట కొరకు, నన్ను జర్మనీ తీసుకొని వెళ్ళటానికి అది సిద్ధము చేయబడిన ఒక సైనిక జెట్ విమానము. లూయిస్ విల్ నుండి జర్మనీలోని ముచెన్ కు, ఆరు గంటలలో నన్ను తీసుకొని వెళ్ళే జెట్ విమానము.
202 నేను వెళ్ళి, నా మోకాళ్ళపై మోకరించాను, నేనన్నాను, “తండ్రీ, నేను తప్పక ఏమి చెప్పాలి? నా నోటిలో మాట్లాడుము.” ఆయన నాకు జవాబు ఇవ్వలేదు. మరలా నేను అడువులలోనికి వెళ్ళి, “తండ్రీ, నేను ఏమి చెప్పాలి? నా నోటిలో మాటలను ఉంచుము. ఆలాగు కాని యెడల, నేను వ్యర్థముగా వెళతాను.” నేను మరలా వెళ్ళి ప్రార్థించాను. ఆయన నాకు జవాబు ఇయ్యలేదు. లోనికి వచ్చి రాత్రంతా ప్రార్థించాను, “ప్రభువా, నా నోటిలో మాటలను ఉంచుము.” ఏమీ జవాబు రాలేదు.
203 మరుసటి ఉదయమున నా భార్య మేల్కొంది. ఆమె వెళ్ళిపోగానే, వాక్యము వచ్చింది, (నేను లేచి నిలబడ్డాను), ఆయనన్నాడు, “దానిని గద్దించవద్దు. అది ప్రభువు యొక్క హస్తమైయున్నది.” హ-హా.
తరువాత వెంటనే నేను ఫోను దగ్గరికి వెళ్ళాను: “నేను రాలేనని చెప్పాను. రాను, ఇది ప్రభువు యొక్క హస్తమైయున్నది. నేను అడ్డగించబడ్డాను.” ఆ గద్దింపుపై ఏ శక్తియున్నదో మీరు చూడండి? దేవుడు చెప్పాడు, “దానిని చేయవద్దు, ఏలయనగా అది దేవుని యొక్క హస్తమైయున్నది.”
204 ఇప్పుడు, మోషే ఒకసారి, ఒక దానిని చేయవద్దని అతనికి చెప్పబడింది, అతడు వెళ్ళి, ఎలాగైనా దానిని చేశాడు. మీకు గుర్తున్నదా? కాబట్టి-నేను వెళ్ళలేదు.
205 నలుగురు వేర్వేరు వ్యక్తులు, వారు చనిపోయారని వైద్యుల చేత ధృవీకరించబడిన తరువాత, ప్రార్థన తరువాత మరణము గద్దించబడిన సంగతులను, నేను మీ ముందుకు తెచ్చి చూపెడతాను. చూడండి? మనము అక్కడ నిలబడి గద్దించగలమా, దేవుడు నీకు శక్తినిచ్చినట్లైతే, దేనినైనా చేయటానికి, నీవు ఏమి చేయుచున్నావో జాగ్రత్త వహించుట మంచిది. చూడండి? నీవు జాగ్రత్తగాయుండు…ఆయనన్నాడు, “చేయవద్దు…”
206 ఇప్పుడు, గుర్తుంచుకోండి, అది ఎంతో గొప్పగా నీతో నమోదు కాకపోవచ్చు, కాని నాకైతే, అది భావమునిస్తుంది. చూడండి?
“దానిని గద్దించవద్దు.” నిజమైన తియ్యని, దయగల స్వరము, (అది దరిదాపుగా ఉదయమున ఆరున్నర గంటలకు) చెప్పింది, “దానిని గద్దించవద్దు, అది ప్రభువు యొక్క హస్తమైయున్నది.”
నేనన్నాను, “తండ్రీ, నీకు వందనములు. ప్రభువా, నీకు వందనములు, నేను దానిని చేయను.”
207 “దానిని గద్దించు, అని ఆయన చెప్పియుంటే, అది శత్రువులోనికి వచ్చింది.”
“మనము వెళదాము,” అని నేను చెప్పేవాడిని, మరియు అది జరిగియుండేది.
208 ఫిన్ లాండ్ లోని ఆ చిన్న బాలుడు చనిపోయి చితుకగొట్టబడి, ప్రతి ఎముక విరిగిపోయియుండగా, ప్రభువు అన్నాడు, అది శత్రువు యొక్క హస్తము, “దానిని గద్దించు,” అని చెప్పాడు.
209 నేనన్నాను, “మరణమా, నీవు అతనిని పట్టుకొనియుండలేవు. అతనిని తిరిగి తెమ్ము, అతనిని విడిచిపెట్టు.” అక్కడే అతడు కాళ్ళమీద నిలబడి గంతులు వేశాడు, కనీసము అతనిలో ఒక విరిగిన ఎముక లేదు. అది ప్రభువు యొక్క మాటయైయున్నది. ప్రభువు యొక్క మాట నా యొద్దకు వచ్చు వరకు, నేను ప్రభువు మాటను వాడలేను.
210 కానీ లేఖనములో, రోగుల కొరకు ప్రార్థన చేయుటకు, ప్రభువు యొక్క వాక్యము నాకు అది కారణమిచ్చినది: రోగుల కొరకు ప్రార్థించుటకు నీకు అధికారమిచ్చియున్నాను. ఇప్పుడు, “విశ్వాస సహితమైన ప్రార్థన రోగిన స్వస్థపర్చును;” మనము ప్రార్థన చేద్దాము, మీ తలలు వంచండి; మీరు వెళ్ళుచుండగా, ఆయన ఏమి చెపుతాడో చూద్దాము.
211 నీవు క్రైస్తవుడవు, కాదా? యేసు నిన్ను స్వస్థపర్చబోవుచున్నాడని, నీ హృదయమంతటితో నమ్ముతావా? నీవు కడుపు జబ్బును కలిగియున్నావు; సహోదరీ, ఎన్నో సంవత్సరాలుగా నీవు బాధపడియున్నావు. ఇప్పుడు, నీవు నమ్మినట్లైతే, నీవు బాగపడబోవుచున్నావు.
212 ఇప్పుడు, ప్రభువైన దేవా, నీవు సహాయము చేస్తేనే తప్ప, ఈ యవ్వన స్త్రీ చనిపోతుంది. ఇప్పుడు, నేను ఆమె వైపు చూస్తూ ప్రార్థిస్తాను. ఆమె చనిపోవుటకు ఏ కారణము లేదని నేను చూస్తాను.
ప్రభువా, నా ఆత్మలో నేను దానిని స్పృశిస్తాను. అది నీ యొక్క అనుమతించబడిన చిత్తము, ఇప్పుడు నేను దానిని గద్దించుచున్నాను: సాతానా, ఆ బిడ్డను విడిచిపెట్టు!
యేసుక్రీస్తు నామములో, ఆమె స్వస్థపడును గాక, ఈ సంఘమునకు వచ్చి, దేవుని మహిమ కొరకు సాక్ష్యమిచ్చును గాక. ఆమేన్.
213 ఇప్పుడు, ఓ స్త్రీ అది ఎంత సామాన్యముగాయుందో, అంతగా నీవు బాగుపడబోవుచున్నావు. సోదరుడా నీవు దానిని నమ్ముతావా?
[సహోదరుడు బ్రాన్హాం గారు మైక్రోఫోను నుండి దూరముగా వెళ్ళియున్నారు—సంపా.] నీవు ఇచ్చట స్వస్థపడగలనని నమ్ముచున్నావా?
ఇప్పుడు వెళ్ళు, ఇది వరకు తిన్నట్లుగా నీవు భుజించు…అప్పుడు నీవు బాగవుతావు.
ఇప్పుడు, నీవే ఈ లోకమునకు ఒక దెబ్బనిచ్చి, దానిని పక్ష రోగిగా చేస్తావు; అది నిన్ను పక్ష రోగిగా మొత్తింది. ఇప్పుడు పరలోకపు దేవుడు, లోకము యొక్క దెబ్బను నీ నుండి తీసివేసి, అదే నామములో నీకు పాపక్షమాపణను ఇస్తాడు, నీకు పాపక్షమాపణను ఇవ్వగలడు, నీ నుండి ఆ దెబ్బను తీసివేసి, నిన్ను బాగు చేస్తాడు.
ఆ గుండె కొట్టుకొనుటను ఆయన బాగు చేస్తాడని నీవు నమ్ముతావా? నీవు నమ్ముతావా? నీవు బాగుపడతావు…?…
214 ప్రభువైన యేసు, అలాగైతే ఈ దీన స్త్రీ తన మిగిలిన జీవితమంతటా ఈ కుర్చీలోనే తప్పకయుండి, తీసుకొనిపోబడాలి. కాని సాతాను శక్తి ఆమె నుండి తీసివేయబడాలని మేము అడుగుచున్నాము. ఆమె ఇది వరకు యున్నట్లుగా జీవించి, నడిచి, బాగుగాయుండును గాక. యేసు’ నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.
215 నీవు నమ్ముచున్నావా? అది ఒక ముగించబడిన కార్యము, అది ముగించబడింది. విషయమేమిటి? ఏ భయము లేదు…లేదు…? ఒకసారి నీవు కాన్సర్ నుండి బాగుపడ్డావు…?…విప్పుకొనుము, సమస్తమును యేసుకు ఇమ్ము.
216 ప్రభువైన యేసు, నేను ఈ స్త్రీ పై చేతులను ఉంచి, ఆమె రోగమును గద్దించుచున్నాను. ఆమె దేవుని ఆత్మ ద్వారా పుట్టిన ఒక క్రైస్తవురాలని నాకు తెలుసు. యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన నామములో, దానిని ఆమె మీద నుండి తీసివేయుచున్నాను. ఆమేన్.
217 ప్రభువైన దేవా, ఆమె ప్రశస్తమైన సోదరుని రక్షణ కొరకు యేసు’ నామములో నేను అడుగుచున్నాను. దాని మీద నిలబడండి. ఆమేన్. అది జరుగుతుంది.
218 కుమారుడా, నీ స్వస్థతను స్వీకరించుటకు నీవు సిద్ధముగాయున్నావా? అలాగే, అది ఆయన చేతిలోనికి వెళ్ళిపోయింది.
219 ప్రభువైన యేసు, నీ నుండి స్వస్థతను స్వీకరించుటకు అతడు ప్రార్థన చేయుచున్నాడు. నీ సేవకుడిగా, యేసుక్రీస్తు నామములో అతనిపై నా చేతులను ఉంచుచున్నాను…?…ఆమేన్.
ఇప్పుడు ఎవరైనా…?…ఇప్పుడు, ఆయన నామమును బట్టి మీరు పిలవండి. ఇప్పుడు, నన్ను కాదు…?…
220 తండ్రివైన దేవా, ఏకైక కుమారుడుగా, అతడు తన తల్లి రొమ్ములపై అతడు ఆనుకొనియున్నాడు, ఆమె అతనిని నిమిరింది, అతనితో ప్రార్థించింది. అతడు చిన్న బిడ్డగా ఏడుస్తూయుండగా, అతని చేతులను పట్టుకొనియున్నది. ఇప్పుడు, సాతానుడు ఆమెను పిచ్చి ఆసుపత్రిలో ఉంచాడు. దేవా, సజీవుడైన దేవుని పరిశుద్ధ సంఘమునకు అతడు వచ్చాడు, అది దేవుని ఆత్మతో జన్మించిన సంఘము, దేవుని ఆత్మలోపల నివసించుచున్న, ఆయనను తెలయపర్చుచున్న సంఘము. ఈ రోజున, ప్రార్థన ద్వారా, ఆ పిచ్చి ఆసుపత్రి నుండి మేము ఆమెకు విడుదలను ఇచ్చుచున్నాము, యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థించుచున్నాము. ఆమేన్.
ఇంటికి వెళ్ళుము, నీవు బాగుపడ్డావు.
నీ తల్లి కొరకు అడుగుచూ, వచ్చినందుకు నీకు వందనములు, అదే ఒక నిజమైన కుమారుడు.
221 ఇది నీ యొక్క విడుదల దినమైయున్నది. ప్రభువైన యేసు, ఈ యవ్వన స్త్రీ కొరకు, ఆమె భర్త రక్షణ కొరకు మరియు ఆమె గొంతు స్వస్థత కొరకు అడుగుచున్నాము. యేసుక్రీస్తు నామములో ఆమె దానిని పొందును గాక. దానికి ఎవరు చెపుతారు, “వచ్చి, దానిని నమ్మండి,” అది ఒక ముగించబడిన ఉత్పత్తియైయున్నది.
222 ప్రభువా, అది ఆమె శరీరములో నుండి, ఆమె కంటిలోనికి వచ్చుచున్నదని, ప్రభువా, వైద్యులు చెప్పియున్నారు. ఈ వేదిక మీద పరిశుద్ధమైన సంఘము ప్రార్థించుచుండగా, ఆమె విడుదల పొందుటకు వచ్చింది. యేసుక్రీస్తు నామములో ఆమె విడుదల కొరకు అడుగుచున్నాను, ఈ శాపము ఆమె దేశమును విడుచును గాక. అది ఒక ముగించబడిన కార్యము.
ఆమె కుమారుని కొరకు, ఈ చేతి రుమాలును నేను ఆశీర్వదించుచున్నాను. ఆ వినికిడి, మరియు సరియైన పరిస్థితులు అతని చెవికి తిరిగివచ్చును గాక…?…
223 ఇప్పుడు సంఘము మాట్లాడుతుంది; ఇప్పుడు సంఘము క్రీస్తు యొక్క అదృశ్య శరీరమైయున్నది. మేమంతా నీ కొరకు ప్రార్థించుచున్నాము. చూడు? మేము ఇక ఎంత మాత్రము లోకము లోని వారమని చెప్పము. మేము ఎక్కడికి వెళ్ళుచున్నామో అని తిరుగులాడుచున్నామని, మేము దానిని గూర్చి చెప్పము. మేము మార్గమును కనుగొన్నాము. మేము ఆ మార్గములోనికి పుట్టియున్నాము. మేము సజీవుడైన దేవుని యొక్క సంఘమైయున్నాము (దానిలో భాగమైయున్నాము); విధిగా, అది ప్రపంచమంతా చెదిరియున్నది. అయితే ఇది వారి యొక్క గుంపైయున్నది. ఈ రోజు, మేము ఏకముగా ఆయన నామములో వస్తున్నాము, ఆయన ఏమి చేయమని చెప్పాడో, దానినే చేయుటకు మేము వస్తున్నాము, మనము ఏకముగా వచ్చినపుడు, ఆయన బయలుపర్చనిది ఏమిటి. నేను రోగుల కొరకు ప్రార్థిస్తాను, వారిపై చేతులనుంచుతాను, “ఏలయనగా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపర్చును.”
224 నీ గుండె జబ్బు నిన్ను విడిచిపెట్టును గాక. యేసుక్రీస్తు నామములో దేవుడు నాకిచ్చిన ఆజ్ఞకు లోబడుచున్నాను…?…