విల్లియమ్ బ్రెన్హాం యొక్క దర్శనములు

విల్లియమ్ బ్రెన్హాం యొక్క దర్శనములు

VGR COUNT-119 ఈ టేపు దేవుని యొక్క రాజ్యము కొరకు చేయబడుచున్నది, దీనిని చేతిప్రతిగా చేయుటకు నేను సహోదరుడు లీవైల్ కి ఇచ్చుచున్నాను. సహోదరుడు వైల్ ఇక్కడ సహోదరుడు మెర్సియర్ యొక్క సన్నిధిలో, గతములో వచ్చిన కొన్ని దర్శనములను ఇమ్మని అడిగాడు. అయినా, దర్శనములు,.. ఇప్పుడు, నేను గుర్తించుకొనదగిన సంగతులలో మొదటిదేదనగా, దర్శనములు వచ్చుట. దర్శనములు అన్ని వేళలా వచ్చియున్నవి, అయితే సహోదరుడా వైల్, మీరు నేను మార్పునొందినప్పటి నుండి దాని యందు ఆసక్తి కలిగియున్నారు అని నేను అనుకొనుచున్నాను.

2

మంచిది, నాకు గుర్తున్నది. ఇక్కడ జెఫర్సనవిల్లోని వాట్-స్ట్రీట్ దగ్గర, డాక్టర్ రాయ్ డేవిస్ చేత, బాప్టిస్టు సంఘములో, నేను సంఘములో ప్రతిష్ఠ చేయబడితిని. అప్పుడు ఆ సంఘము అక్కడే ఉండెడిది. నాకు గుర్తున్నది, కొద్ది వారముకే... నేను చెప్పెదను, నా అభిషేకము అయిన కొద్ది దినములలోనే, ఆసుపత్రిలో పడియున్న ఒక ముసలివాని గురించిన దర్శనమును చూచాను, అతడు వాడిపోయి ఉన్నాడు. అతడు నల్లజాతీయుడు. అతను వెంటనే స్వస్థతనొంది యున్నాడు, అంతమట్టుకు, అది చాలా గంధరగోళమునకు కలిగించినది. మరియు అతడు మంచము మీద నుండి లేచి, నడిచి వెళ్ళిపోయెను. మరియు రెండు రోజులు, రెండు రోజులు తరువాత, న్యూ-ఆల్బెనీలోని, నీరు, గ్యాస్ మరియు కరెంటు బిల్లుల రుసుము చెల్లించని సర్వీసులను నేను నిలిపివేసితిని. మరియు అది... నేను ఎప్పుడూ ఒక పాత గృహమును కనుగొని, ఎవరూ నివసించని దానిలోనికి వెళ్ళి, మీకు తెలుసు, నేను వెళ్ళి ప్రార్థించెదను. నేను ఎంతో ఆనందముతో నిండిపోయాను.

3

మరియు ఇప్పుటికీ జీవించియున్న, శ్రీ జానీ పాట్స్ కి చెప్పడం నాకు గుర్తున్నది. అతని మార్గము ముగిసినది. అతడు డెబ్బై లేదా ఎనభై సంవత్సరములకు దగ్గరగా ఉన్నాడని నేను అనుకొనుచున్నాను. అతడు ఒక పాత మీటరు రీడింగ్ వృత్తి చేయువాడు. మరియు అప్పుడు వారు అతనిని మీటరు రీడింగ్ చేయు పని నుండి తీసివేసి, అతడిని బల్లయొద్ద కూర్చొని, గుమ్మము లోపలకు ప్రవేశించిన వెంటనే, ఫిర్యాదులు, సర్వీసు కాల్స్ మరియు అటువంటివి తీసుకొనువానిగా నియమించెను. మరియు ప్రభువు నాకు ఏమి చూపించెనో దానిని నేను అతడికి చెప్పుచున్నాను. మరియు అతడు ఎప్పుడైనా ఒక్కసారి, సాధారణమైన మనిషి పట్టుకొనలేని కొన్ని పాడైన మీటర్లను పైకి తీసేవాడు. మరియు దీనిలో అతడు ఒక వ్యక్తికి చెప్పుచున్నాడు, దానిని నేను పత్రికలో చూచియుంటిని. ఆ రోజులలో, చిన్న సందులలో ఉన్న చెత్త మరియు చెదారమును తీయుటకు వారు రెండు గుర్రములచే నడుపబడే ఒక పాత వాహనమును కలిగియుండెడివారు.

అక్కడ శ్రీ. ఎడ్వర్డ్ జే. మిర్రిల్ అను పేరు గల ఒక వృద్ధ నల్లజాతీయుడు ఉండెడివాడు. అతడు న్యూ-ఆల్బెనీలోని, క్లార్క్ స్ట్రీట్లో గల వెయ్యి-ఇరవైయవ (1020) ఇంటి నెంబరు నందు నివసించుచున్నాడు. మరియు అతడు ఇద్దరు తెల్ల జాతీయులచే గ్రుద్దబడెను - ఒక తెల్లరంగు బాలిక మరియు బాలుడు కారులో వెళ్ళుచున్నారు. మరియు అతను కారు మీద నియంత్రణను కోల్పోయి, మరియు అతడిని కారు యొక్క చక్రములోనికి నలుగగొట్టెను, మరియు దాదాపుగా అది అతడి శరీరములోని ప్రతీ ఎముకను విరుగగొట్టెను. మరియు వారు... ప్రత్యేకించి అతని యొక్క రోమ్ము భాగము ద్వారా, అతని వెనుక భాగము కొట్టబడి దాని స్థానము నుండి కదిలించబడినది. మరియు అతడిని ఆసుపత్రిలో పెట్టెను, చాలా విచారము!

4

మరియు శ్రీ. పాట్స్, అక్కడ న్యూ-ఆల్బెనీలోని ఆసుపత్రి గుండా వెళ్ళుచున్నప్పుడు, ప్రభువు నాతో సంధించుచున్న విధానము అతడికి చెప్పబడెను. మరియు అతని కొరకు ప్రార్థించుటకు, రమ్మని నా కొరకు అతడు పంపించేను. మరియు వెనువెంటనే, “ఈ దర్శనములో నేను చూచిన వ్యక్తి అతడే,” అని నేను అనుకొన్నాను. కనుక వెళ్ళుటకు నేను కొంచెము భయపడ్డాను, ఎందుకనగా ఆ విధముగా వెళ్ళుట అనేది అదే మొదటిది సారి. మీరు చూశారా, ఒక చిన్న ఫ్రెంచ్ బాలుడు. జార్జి డీ ఆర్క్ అను పేరు కలిగిన అతడిని ఈ మధ్యే క్రీస్తునొద్దకు నడిపించాను. మరియు మేము వెళ్ళాము. మరియు నేను చెప్పాను, “ఇప్పుడు, సహోదరుడా జార్జ్, నాకు సంభవించుచున్న ఈ సంగతులను, నీవు గుర్తించుకొనవలెనని నేను కోరుకొనుచున్నాను. నేను వారిని అర్థము చేసుకొనలేకపోవుచున్నాను, కాని నీవు గుర్తించుకొనుము, ఈ మనుష్యుడు స్వస్థపడనైయున్నాడు. మరియు అతడు స్వస్థపరచబడినప్పుడు, అక్కడ... ఆ మంచమునకు అవతల వైపున ఇద్దరు తెల్లవాళ్ళు వచ్చి నిలబడేంత వరకు నేను అతడికి ప్రార్ధించలేను, ఎందుకనగా ఏ విధముగా నాకు చూపించబడినదో ఆ విధముగానే నేను చేయవలెను.”

5

మరియు నేను ఆసుపత్రిలోనికి వెళ్ళి మిస్టర్. మెర్రిల్ గూర్చి అడిగాను. మరియు నేను అక్కడకు వెళ్ళాను, మరియు అతడికి చాలా అనారోగ్యముగా ఉన్నదని మరియు అతడు కదలలేని స్థితిలో యున్నాడు అని అతని భార్య నాకు చెప్పినది, ఎందుకనగా ఈ ఎముకలలో కొన్ని అతడి ఊపిరితిత్తుల ప్రక్కనే ఉన్నవని ఆ ఏక్స్-రే చూపించినది. మరియు ఒకవేళ అతడు కదిలినట్లయితే, ఎందుకు, అవి (ఎముకలు), అతడి ఊపిరితిత్తులలోనికి చొచ్చుకొనిపోయి రక్తము కారుట వలన అతడు చనిపోవును. మరియు అతడి పరిస్థితి చాలా దారుణముగా ఉన్నది, మరియు అతడి గొంతు నుండి కొద్దిగా రక్తము కారుచున్నది, మరియు అలాగున, ఎందుకనగా అతడి నోరు చుట్టూ రక్తస్రావమవుచున్నది. అతడు అక్కడ రెండు దినముల నుండి పడియున్నాడు. మరియు ఆ సమయమున, ఆ వ్యక్తి సుమారు అరవై-అయిదు సంవత్సరముల వయస్సు కలిగియున్నాడు, బహుశా అరవై లేదా అరవై-అయిదు అని నేననుకొనుచున్నాను. పెద్ద వయస్సు కలిగిన మనిషి, అతడి మీసాలు పొడవుగా నెరిసియున్నవి. మరియు అతడి జుట్టు నెరసినది.

6

మరియు నేను లోపలికి వెళ్ళి, ఈ వ్యక్తితో ప్రభువు నుండి నేను చూచిన దర్శనమును చెప్పాను. మరియు అతడిని గ్రుద్దిన ఆ యవ్వనస్తులు లోపలికి వచ్చారు. మరియు అతడి గూర్చి ప్రార్థించుటకు నేను మోకాళ్ళు వేసాను, మరియు అకస్మాత్తుగా ఈ మనుష్యుడు అరచుచూ, “నేను స్వస్థత పొందుకున్నాను,” అని చెప్పుచున్నాడు, మరియు గంతులు వేస్తున్నాడు. అతడి భార్య, అతడిని మంచము మీద ఉంచుటకు ప్రయత్నించుచున్నది... మరియు అక్కడ పర్యవేక్షించుచున్న వారిలో ఒకరు వచ్చి, అతనిని మంచము మీద ఉంచుటకు ప్రయత్నించుచున్నారు. మరియు అతడు మంచము మీద నుండి దూకెను, అది చాలా ఉత్సాహమునకు కారణమైనది.

7

మరియు నేను వెళ్ళినప్పుడు... సహోదరుడు జార్జితో నేను చెప్పాను... మరియు సహోదరీలలో ఒకరు (అది ఒక కేథలిక్ ఆసుపత్రి) లోపలికి వచ్చి, మరియు నేను అక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పినది, కనుక... అతడు ఉత్సాహపడుచున్నాడు, ఎందుకనగా అతడికి నూట-నాలుగు డిగ్రీలు జ్వరము ఉన్నది. మరియు వింతైన సంగతి ఏమిటంటే, అతడిని వారు యధాస్థానములో ఉంచినప్పుడు; మరియు కొంత మంది డాక్టరులు తిరిగి అతడిని మంచము మీదకు వెళ్ళునట్లుగా చేసెను, ఎందుకనగా అతడు తన బట్టలను తొడుగుకొనుచున్నాడు. మరియు వారు అతడి జ్వరమును చూచినప్పుడు, అతనికి జ్వరము లేదు.

ఇప్పుడు, ఈ దర్శనములు చూచిన వారు, అది జరగడం చూచిన వారు, లేదా దాని గురించి తెలిసిన వారు, అనేక మంది జనులు ఈ రోజు నివసించుచున్నారు. మరియు నేను బయటకి వెళ్ళి, మెట్ల మీద నిలబడి, మరియు సహోదరుడు జార్జితో ఇలా చెప్పాను, “ఇప్పుడు, నీవు గమనించుము. అతడు ఒక గోధుమ రంగు కోటు మరియు తగిలించుకొనే టోపి ధరించును. ఈ రోజు మెట్ల గుండా మరి కొద్ది నిమిషములలో అతడు నడుచుకొంటూ వెళ్ళును.” మరియు అతడు వాస్తవముగా చేసెను. అతడు ఖచ్చితముగా బయటకు వచ్చి, క్రిందకు నడుచుకొని వెళ్ళెను.

8

మరియు దాని తరువాత ఒక రాత్రి, ప్రభువు నాకు మరలా ప్రత్యక్షమాయెను, ఒక ఉదయము, దినము ప్రారంభమున, ఒక స్త్రీ ఘోరమైన అవిటి తనముతో యున్నది. మరియు ఆమె స్వస్థపడనైయున్నదని నాకు చూపించెను. కనుక నేను చెప్పాను, “మంచిది, ఆమె ఎక్కడనున్నదో బహుశా నేను కనుగొందును.”

మరియు నేను క్రిందకి వెళ్ళి మరియు కారిపోవుచున్న నీటిని ఆపివేసితిని. అది న్యూ-ఆల్బెనీలోని ఎనిమిదవ వీధి అని నేను నమ్ముచున్నాను. అక్కడ రెండంతస్థుల గృహము ఉన్నది మరియు నేను రెండు వైపులా ఆపివేసియున్నానని నేను బయపడ్డాను. ఒక వైపు, జనులు బయటకు వెళ్ళిపోయారు మరియొక వైపు, జనులు అక్కడనే ఉన్నారు. కనుక జనులతో నింపబడియున్న వైపునకు నేను వెళ్ళాను. మరియు నేను తలుపు తట్టాను. మరియు వారు నిజముగా పేద ప్రజలు, మరియు చాలా ఆకర్షనీయముగా యున్న ఒక యువతి ద్వారము నొద్దకు వచ్చినది, కాస్త పేద వస్త్రములు ధరించినది. మరియు “మీకేమి కావలయును?” అని ఆమె అడిగినది.

నేను చెప్పాను, “ఆ నీరు ఆపివేయబడినదో లేదో చూచుటకు, నీవు ప్రయత్నించగలవా?”

మరియు ఆమె “సరేనయ్యా,” అని చెప్పినది. ఆమె వెళ్ళిపోయినది. ఆమె “లేదు, నీరు ఇంకనూ వచ్చుచూనే ఉన్నది” అని చెప్పినది.

నేను “వందనములు,” అని చెప్పాను.

మరియు ఆమె తల్లి మంచము మీద పడియున్నది. ఆమె పేరు శ్రీమతి. మేరిడెల్ ఓహనియన్, మరియు ఆమె అర్మేనీయురాలు. ఆమె కుమారుడు న్యూ-ఆల్బెనీ బేస్ ఫుట్ బాల్ టీమ్లో ఫుల్ బ్యాక్ స్థానములో ఆడతాడని నేను నమ్ముచున్నాను. మరియు ఆమె, ఆమే యొక్క కుమార్తె, ఉన్నత పాఠశాలలో చదువుచున్నది. ఆమె పేరు డొరొతి. మరియు ఆమె చెప్పెను... డొరొతి నాతో చెప్పెను, “ఇక్కడ ఆసుపత్రిలో, నిన్నటి దినమున, స్వస్థత చేసిన దేవుని యొక్క మనిషివి నీవే కదా? నా తల్లి నీతో మాట్లాడాలని ఇష్టపడుచున్నది.”

9

నేను లోపలికి వెళ్ళాను మరియు ఆమె నాతో చెప్పినది, ఆమె అవిటితనముతో, మంచము పట్టినది. ఆమే పదిహేడు సంవత్సరములుగా, ఈ బాలిక జన్మించినప్పటి నుండి, మంచము మీద అవిటితనముతో పడియున్నది. మరియు ఇప్పుడు ఆ బాలిక వయస్సు పదిహేడు సంవత్సరములు. మరియు నేను ఆమెతో చెప్పాను... ఆమె చెప్పినది, “ఆ వ్యక్తిని స్వస్థపరచిన ఆ దేవుని మనిషివి నీవేనా?”

నేను చెప్పాను, “లేదమ్మా, నేను స్వస్థపరచువాడను కాను. నేను కేవలము కేవలము వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తాను, మరియు నాతో మాట్లాడిన దాని చేత నాకు ఒక విషయను చూపించబడినది.” దానిని ఏ విధముగా పిలువవలెనో నాకు తెలియదు, ఒక దర్శనము, లేక ఏమిటి; ఇప్పటికీ, అది ఏమిటో నాకు తెలియదు. నేను కేవలము ఒక బాలుడను, మరియు ఒంటరివాడను మరియు ప్రతిది, కావున అక్కడ ఒక...

10

ఆమె కొరకు ప్రార్థించమని ఈ స్త్రీ నన్ను అడిగినది, మరియు నేను ఆమెతో చెప్పాను, “మొదటిగా, నన్ను ప్రార్థింపనిమ్ము, మరియు అప్పుడు ఒకవేళ దేవుడు వెనుకకు రమ్మని నాకు చూపించినట్లయితే...” మరియు అప్పుడు నేను ప్రార్ధించుటకు వెళ్ళినప్పుడు, సహోదరుడు జార్జి కూడా నాతో ఉన్నాడు. నేను చెప్పాను, “నేను ప్రార్థించాలి అని, నీతో నేను చెప్పిన స్త్రీ ఆమెయే. నాకు తెలియును ఆ స్త్రీ ఆమెయే. నాతో రా. మరియు ప్రార్ధించడానికి మేము అక్కడికి వెళ్ళాము.

మరియు ఈ చిన్న పదిహేడేళ్ళ బాలిక... అవును, నేను ఒక యవ్వన బాలుడను, మరియు ఆరు, ఎనిమిది సంవత్సరములు, లేదా సుమారుగా అంత వయస్సు కలిగిన ఒక సహోదరుడు ఆమెకు ఉన్నాడు. ఆ గృహములో ఒక క్రిస్మస్ చెట్టు నిలబెట్టబడినది, (అది క్రిస్మస్ ముగిసిన వెంటనే జరిగిన కార్యము.) మరియు వారు నన్ను చూచి నవ్వుటకు, ఆ క్రిస్మస్ చెట్టు వెనుక దాగుకొనిరి. వారి యొక్క తల్లిని బాగుపరచుటకు.

11

“దేవుడు ఆమెను (బాలిక యొక్క తల్లిని) స్వస్థపరచనైయున్నాడు,” అని నేను ఆమెతో చెప్పాను.

మరియు నేను... సహోదరుడు జార్జి మరియు నేను ప్రార్ధించుటకు (మోకాళ్ళపై) క్రిందకు వంగాము. మరియు నేను ప్రార్థించుట ఆరంభించగానే, మంచిది, నేను చూచిన ఆ దూత (మీరు దానిని ఆ చిత్రములో చూచారు), ఆ మంచముపై వేళాడుట నేను చూచాను. మంచిది, నేను అక్కడకు వెళ్ళి, ఆమె యొక్క చేతిని పట్టుకొన్నాను; మరియు నేను చెప్పాను, “శ్రీమతి. ఓహనీయన్...” ఇప్పుడు, ఆమె మరియు ఆమె భర్త, కుటుంబముతో కలిసి న్యూ-ఆల్బెనీలో నివసించుచున్నారు. మరియు నేను చెప్పాను, “శ్రీమతి. ఓహనియన్, ప్రభువైన యేసు నన్ను పంపెను, మరియు నీ కొరకు ప్రార్థించమని మరియు నీవు బాగుపడనై యున్నావని, నేను ఇక్కడకు వచ్చేముందు నాకు చెప్పెను. యేసు నామములో, నీ కాళ్ళ మీద నిలబడి స్వస్థతనొందుము.”

ఆమె తన కాళ్ళను తన క్రిందకు లాగుకొని. ఆమె - తన హృదయము పైన తన యొక్క ఆర్మేనియన్ బైబిల్ తో, అలా మంచము ప్రక్కన తిరుగుటకు ప్రారంభించినది. మరియు ఆమె అలా చేసినప్పుడు, ఆమె... అప్పుడు సాతాను నాతో మాట్లాడి, “నీవు ఆమెను అలా నేలను తాకునట్లు చేయుము, అంత ఎత్తైన మంచము పైనుండి ఆమె తన మెడను విరుగగొట్టుకొనును,” అని చెప్పాడు. ఒక్క క్షణం నేను భయపడ్డాను (అదేమిటి అనునది అప్పుడు నేనెరుగను) నాకు చెప్పినదంతయూ ఎల్లప్పుడూ సరియే. కనుక ఏది ఏమైనా నేను ముందుకు వెళ్ళాను. ఆమెను మంచము దిగి రానిమ్ము. మరియు దేవుడే నాకు సాక్షి, ఆమె ప్రారంభించగానే, మంచము పైనుండి దూకగానే, రెండు కాళ్ళు తిన్నగా వచ్చినవి. ఆమె కుమార్తె గట్టిగా అరచినది, తన జుట్టును లాగుకొనుచూ, మరియు ఆమె అరవగలిగినంత గట్టిగా అరచుచూ, వీధిలోనికి పరిగెత్తినది. అన్నిచోట్ల నుండి ఇరుగుపొరుగు వారు వచ్చియున్నారు. మరియు అదిగో ఆమె, పదిహేడు సంవత్సరములలో మొట్టమొదటి సారిగా, ఆ గదిలో నడుచుచూ దేవుడిని స్తుతించుచున్నది. వెంటనే, దాని నుండి తప్పించుకొనుటకు, నేను అక్కడ నుండి వెళ్ళిపోయాను.

తరువాత, నేను ఈ యవ్వన బాలికతో పరిచయము పెంచుకొని, మరియు ఆమెతో వెళ్ళాను. అయినప్పటికి, ఇది వ్రాయబడవలసినది కాదు, కాని నేను ఆ యవ్వన బాలికతో వెళ్లితిని.

12

తరువాత ఎక్కువ కాలము కాదు, కొన్ని వారములకు ఒక సాయంత్రము, నేను నా తల్లి ఇంటిలో ఉన్నాను. ఆ రోజు నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నా ప్రార్ధనలో ఒక విజయము వచ్చు వరకు కేవలము నేను ఆపలేకపోయాను. మరియు నేను అలాగే ఉండిపోదామని నేను అనుకొన్నాను. మీకు తెలియును, పండుకొనుటకు (నిద్రించుటకు) వెళ్ళాను. ఆ సమయములో నేను ఇంటి దగ్గరనే ఉన్నాను. కనుక ప్రార్ధించుటకు, గదిలోనికి వెళ్ళాను. మరియు నేను రమారమి ఉదయ కాలమున ఒంటి గంటకు అని ఊహిస్తున్నాను. మరియు నేను ప్రార్థించాను, మరియు, ఒక్కసారిగా నేను చూచాను. మరియు అమ్మ, ఆమె తన బట్టలను తీసుకొని, వాటినన్నింటిని ఒక కుర్చీ మీద వేసినది, మీకు తెలియును మేము నిజముగా పేదవారము.

నేను చూశాను, ఏదో తెల్లనిది నా దగ్గరకు వచ్చుచున్నది. మరియు నేను ఆ కుర్చీలోని బట్టలను చూస్తున్నానని నేను తలంచాను, కానీ అది ప్రభువు యొక్క దూత - మేఘమువలె యున్నది, మీకు తెలియును.

13

మరియు అది నేను ఎక్కడ ఉన్నానో అక్కడకి వచ్చినది. మరియు ఒక గదిలో నేను నిలబడియున్నాను, చిన్న ఇల్లు, మేము దానిని ఒక చిన్న తుపాకీ గృహము అని పిలిచెదము; చిన్న తిన్నని గృహము, దానిలో రెండు గదులు ఉన్నవి. మరియు అది ఆ గోడలకు ఎర్రని రంగు కలిగియున్నది, మీరు చూశారా. నా కుడి ప్రక్కన ఒక చిన్న ఇనుప మంచము ఉన్నది. ఒక నల్ల జుట్టు కలిగిన స్త్రీ అక్కడ నిలబడి - ఒక గది -అలా వంటగదిలోనికి వెళ్ళినది. ఆమె ఆ వంటగది తలుపునకు జారబడి (ఆనుకొని), ఏడ్చుచున్నది. అక్కడ ఒక తండ్రి నా ప్రక్కగా నిలబడి, మరియు నా దగ్గరకు ఒక బిడ్డను తీసుకొని వచ్చాడు, ఆ చిన్న రొమ్ముపైన ఏదో వ్రేలాడుచున్నట్లున్నది. మరియు ఒక విషయము, అతడి ఎడమ కాలు చుట్టూ గాయపడి, ఆ చిన్న శరీరభాగముపై ఉన్నంత వరకు ఉండినట్లుగా ఉన్నది. మరియు ఆ కుడికాలు, అదే విధముగా చుట్టుకొనబడి యున్నది. దాని శరీరము చుట్టూ, రెండు చేతులు కూడా చుట్టుకొనబడి యున్నవి. మరియు ఆ చిన్న శరీరము మెడ వరకు త్రిప్పబడి మరియు చుట్టుకొనబడియున్నది. మరియు “దీని అర్ధము ఏమిటీ?” అని నేను ఆశ్చర్యపడ్డాను.

మరియు నేను చూశాను, నాకు ఎడమ ప్రక్కగా కూర్చొనియున్న ఒక వృద్ధ స్త్రీ, తన యొక్క కళ్ళద్దాలను తీసివేసి, మరియు అద్దాల మీదనున్న దేనినో లేదా కన్నీళ్ళతో తుడుచుకొనుచున్నది. నా కుడి ప్రక్కన, ఒక ఎర్రని సోఫాలాంటి దానిపై, అది ఆ కుర్చీకు సరిజోడైనటువంటిది, తెల్లని మరియు ఉంగరాల జుట్టు కలిగిన ఒక యవ్వన బాలుడు, కిటికీలో నుండి బయటకు చూచుచూ దానిపై కూర్చొని ఉన్నాడు. మరియు నా కుడిప్రక్కన నిలబడియున్న, మరియు అక్కడ నిలబడిన... ఆ ప్రభువు యొక్క దూతను నేను చూశాను. మరియు ఆయన, “ఈ బిడ్డ బ్రతుకగలదా?” అని నాతో చెప్పెను.

మరియు నేను చెప్పాను, “అయ్యా, నాకు తెలియదు.”

ఆయన చెప్పాడు, “దాని మీద నీ చేతులుంచుము, ఆమె బ్రతుకును.”

మరియు నేను చేశాను; మరియు తండ్రి యొక్క చేతులలో నుండి, పైనుండి ఆ పాప క్రిందకి దూకినది. మరియు చిన్న కుడి కాలు వంకర నుండి యథాస్థితికి - మరియు కుడివైపు వంకర నుండి యథాస్థితికి - కుడి చేయి వంకర నుండి యథాస్థితికి వచ్చినది. ఆమె ఇంకొక అడుగు వేసినది. మరియు అటువైపు యథాస్థితికి వచ్చినది. ఇంకొక అడుగువేసినది, మరియొక వైపు వంకర నుండి యథాస్థితికి వచ్చినది. శరీరము యొక్క మధ్య భాగము వంకర నుండి యథాస్థితికి వచ్చినది. అతడు తన చిన్న చేతులను నాపై పెట్టియున్నాడు. మరియు “సహోదరుడా బ్రెన్హా౦, నేను పరిపూర్ణముగా బాగు అయ్యాను,'' అని చెప్పెను. ఆ చిన్న బాలిక మొత్తమంతా లేదా ధరించేటంత వరకూ, అంతా నీలపురంగు కార్డ్రే వస్త్రమును ధరించినది. మరియు అతడు గోధుమరంగు జుట్టు మరియు చాలా చిన్న నోరును కలిగియున్నాడు.

14

మరియు అప్పుడు, ప్రభువు యొక్క దూత నన్ను ఎక్కడికో తీసుకొని వెళ్ళుచున్నదని నాతో చెప్పెను, మరియు నేను కొనిపోబడ్డాను. మరియు ఆయన నన్ను ఒక పాతబడిన శ్మశానవాటిక దగ్గర కూర్చొనబెట్టి, మరియు సంఘము దగ్గరలో ఉన్న సమాధి పలకపైయున్న సంఖ్యలను నాకు చూపించెను. మరియు ఆయన చెప్పెను, “ఇది నిన్ను నడిపించే స్థలమైయున్నది.”

ఆయన నన్ను మరొక చోటికి తీసుకొనిపోయేను మరియు అక్కడ... చూచుటకు ఒక చిన్న పట్టణముగా కనిపించుచున్నది, దానిలో రెండు దుకాణములు కలవు. మరియు అందులో ఒక దాని ముందు భాగము పసుపు రంగులో ఉన్నది. గోడల మీద పసుపు రంగు అంచులు ఉన్నవి. మరియు నేను అక్కడికి నడిచాను, లేదా అక్కడ నిలబడ్డాను, మరియు అక్కడ నుండి, ఒక నీలపురంగు కార్డ్రే చలికోటు ధరించి, లేదా ఒక నీలపురంగు జీన్స్ చలికోటు మరియు మొత్తము కప్పెడి నీలపు రంగు దుస్తులు, ఒక పసుపురంగు కార్డ్రే టోపి ధరించియున్న ఒక ముసలి వ్యక్తి బయటకు వచ్చుచున్నాడు. అతడు ఒక పెద్ద, తెల్లని మీసాలు కలిగియున్నాడు. ఆయన, “అతడు నీకు దారి చూపించును,” అని చెప్పెను.

మరియొక సారి నేనక్కడకు వచ్చినప్పుడు (ఇంకొక చోటికి), నేను చూశాను... బాగా ధృడముగా ఉన్న యవ్వన స్త్రీని వెంబడించుచూ, నేను ఒక గదిలోనికి నడిచి వెళ్ళుచున్నాను. మరియు నేను ద్వారము లోపలికి ప్రవేశించినప్పుడు, గోడ మీద ఉన్న కాగితములోని బొమ్మలు ఎరుపు రంగులో ఉన్నవి. ద్వారము పైభాగమున ఒక సూచిక ఉన్నది, “దేవుడు మా గృహమును దీవించును గాక.” అక్కడ ఒక పెద్ద పాత ఇత్తడి పలకల మంచము నా కుడి ప్రక్కగా ఉన్నది. మరియు ఎడమ ప్రక్కగా ఒక పొయ్యి ఉన్నది. మరియు ఒక మూలగా, సుమారు పదిహేను సంవత్సరముల వయస్సు కలిగిన ఒక బాలిక పడియున్నది. మరియు ఆమెకు పోలియో లేదా మరేదో, అది ఆమె యొక్క కుడికాలును పైకి లాగి వేసినది. ఆమె యొక్క కాళ్ళు వంకరలు తిరిగి, క్రిందకు లాగివేయబడినవి. మరియు ఆమె ఒక బాలుని వలె కనిపించుచున్నది. కేవలము ఆమెకు ఒక బాలికవలె జుట్టు మాత్రము ఉన్నది. మరియు ఆమెకు ఒక బాలికవలె హృదయాకారపు పెదవులు ఉన్నవి. మరియు ఆయన నాతో చెప్పాడు, “ఆ బాలిక నడవగలదా?”

మరియు నేను చెప్పాను, “అయ్యా, నాకు తెలియదు.”

ఆయన చెప్పాడు, “వెళ్ళి, ఆమె కడుపు పైన నీ చేతులుంచుము.”

అప్పుడు ఖచ్ఛితముగా అతడు బాలుడే అని నేననుకొన్నాను, ఎందుకనగా ఆయన నా చేతులను ఆమె కడుపుపై ఉంచమనెను. ఆయన నాకు చెప్పిన విధముగా నేను చేశాను. మరియు ఎవరో, “ప్రభువుకు స్తోత్రము” అని చెప్పుట నేను వినియున్నాను. మరియు నేను పైకి చూశాను. నేను అలా చేసినప్పుడు, ఆ బాలిక పైకి లేచినది. మరియు ఆమె పైకి లేచినప్పుడు, ఆమె ధరించిన ఆ పైజామా, ఆమె యొక్క పైజామా కాలుపై వరకు వచ్చినది, అప్పుడు ఒక బాలిక మోకాలు వలే ఒక గుండ్రని మోకాలు కనపడినది మరియు బాలుని మోకాలు వలె గట్టి చిప్ప వంటి మోకాలు. మరియు ఆమె ఒక బాలిక అని నేను కనుగొన్నాను. మరియు ఆమే పైజామా ధరించి, ఆమె తల దువ్వుకొనుచూ, నా యొద్దకు నడిచి రావడం ప్రారంభించినది. ఆమె సొగసైన తలను దువ్వుకొనుచున్నది. ఈ రోజు, ఆ బాలిక షాలేములో నివసించుచున్నది, వివాహము కాబడినది, మరియు ముగ్గురు లేక నలుగురు పిల్లలను కలిగియున్నది. మరియు ఆమె యొక్క తల్లిదండ్రులు కూడా ఇంకా ఉన్నారు.

15

కనుక నేను వచ్చాను, మరి ఎవరో, “సహోదరుడా బ్రెన్హాం లేక సహోదరుడా బిల్... ఓ, సహోదరుడా బిల్!” అని పిలవడం నేను వినుచున్నాను. మరియు నా తల్లి నన్ను పిలచుచున్నది. మరియు నేను అనుకొన్నాను, “ ఒక వైపు, నేను ఒకటి వింటాను...” మీకు తెలుసా, ఆ దర్శనము నుండి బయటకు వచ్చుట కొంచెము కష్టమైనది.

మరియు నేను చెప్పాను, “అమ్మా, నీకు ఏమి కావాలి?” ఆమె పడుకొని ఉన్న ప్రక్క గదిలో ఉన్నది.

ఆమె చెప్పెను, “నీ తలుపును ఎవరో తట్టుచున్నారు.”

“సహోదరుడా బిల్,” నేను దానిని విన్నాను. మరియు నేను తలుపు తీసాను. ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. అతడి పేరు జాన్ ఎమిల్. అతడు ఇప్పుడు ఫ్లోరిడాలోని, మియామిలో నివసించుచున్నాడు. మరియు అతడు చెప్పాడు, “సహోదరుడా బిల్, నీవు నన్ను గుర్తుపట్టలేదా?”

నేను చెప్పాను, “లేదు, నాకు గుర్తులేదని నమ్ముచున్నాను.”

చెప్పాడు, “నీవు నాకు మరియు నా కుటుంబానికి బాప్తిస్మమిచ్చావు, కాని నేను ఒక తప్పుడు మార్గాన్ని తీసుకొన్నాను,” అని చెప్పాడు. “నేను ఇక్కడ కొంత సేపటి క్రితము, ఒక మనుష్యుడిని చంపాను. నా పిడి చేతితో అతడిని కొట్టి, మరియు దెబ్బలాటలో అతడి మెడ విరిచాను,” అని అతడు చెప్పాడు. “నేను కలిగియున్న చిన్న బాలురలలో ఒకనిని పోగొట్టుకున్నాను, పెద్దవాడిని.” మరియు చెప్పాడు, “ఆ చిన్నవాడు ఇంటిదగ్గర పడి ఉన్నాడు, ఇప్పుడు చనిపోవుచున్నాడు.” మరియు చెప్పాడు, “ఇక్కడ నగరానికి చెందిన వైద్యుడు ఇప్పుడే వెళ్ళిపోయాడు, అతడు చెప్పాడు, ఈ పిల్లవానికి రెండింతల న్యూమోనియా (ఊపిరితిత్తుల వ్యాధి) ఉన్నది. మరియు అతడు చాలా కష్టముగా ఊపిరిని తీసుకొనుచున్నాడు.” మరియు చెప్పాడు, “నేను కేవలము... నీవు నా హృదయము మీదికి రమ్ము, మరియు నీవు వచ్చి దానితో ప్రార్ధించినచో అది ఒక అద్భుతము.” మరియు చెప్పాడు, “ఇప్పుడు నీకు తెలిసినట్లుగా, నేను గ్రాహం స్నెల్లింగ్ కు సోదరుడను.” గ్రాహం స్నెల్లింగ్, ఇప్పుడు రెవరెండ్ గ్రాహం స్నెల్లింగ్, అప్పటికీ అతడు సేవకుడు కాలేదు. ఒక చక్కని క్రైస్తవ బాలుడు. అతడు చెప్పాడు, “అతడు నా సోదరుడు. నేను అతడిని తీసుకొని రావడానికి వెళ్ళుచున్నాను.” ఈ నగరములో అతడు అరమైలు దూరములో నివసించుచున్నాడు, “నేను అతడిని తీసుకొని రావడానికి వెళ్ళుచున్నాను. మరియు నీవు వస్తావా?” అని అడిగాడు.

16

నేను “అవును, శ్రీ. ఎమిల్, వెంటనే నా బట్టలు వేసుకుంటాను,” అని చెప్పాను.

మరియు అతడు, “నేను నా కారును తీసుకొని, మరియు నిన్ను తీసుకొని వెళ్ళుదును,” అని చెప్పాడు.

నేను “సరే మంచిది,” అని చెప్పాను.

“నేను గ్రాహంను తీసుకొని వచ్చినప్పటికి, మీరందరూ ఆ బాలుని కొరకు ప్రార్థించవలెనని నేను కోరుచున్నాను,” అని చెప్పాడు.

మరియు “సరే, మంచిది,” అని నేను చెప్పాను.

కనుక నేను సిద్దపడుటకు వెళ్ళాను, మరియు అమ్మ, “ఏమిటి సంగతి?” అని అడిగినది.

నేను “స్వస్థత పొందుట కొరకు ఒక చిన్న బిడ్డ అక్కడ ఉన్నది,” అని చెప్పాను.

మరియు ఆమె “స్వస్థపడినదా?” అని అడిగినది.

మరియు నేను “అవునమ్మా” అని చెప్పాను. మరియు నేను, “నేను తిరిగి వచ్చినప్పుడు, నేను దాని గూర్చి నీకు మరింత చెప్పెదను,” అని చెప్పాను.

కనుక కొద్ది నిముషములలో, అతడు తలుపు తట్టాడు, మరియు సహోదరుడు గ్రాహం అతడితో ఉన్నాడు. మేము అక్కడకు వెళ్ళుచున్నాము, అది ఇప్పుడు బోట్-యార్డ్ గా మనమందరము ఎరుగుదము, అప్పుడు అది పాత హోవార్డ్ షిప్ యార్డ్. నేను చెప్పాను, “శ్రీ. ఎమిల్, నీవు... ఇప్పుడు నీవు ఎక్కడ నివసించుచున్నావు?” అని అడిగాను.

అతడు చెప్పాడు, “యుటికా పై భాగములో.”

నేను అడిగాను, “నీవు ఒక చిన్న, అనగా మనము ”తుపాకీ గృహము“ అని పిలిచెడి దానిలో నివసించుచున్నావా? చిన్న రెండు గదులు.” “అవునయ్యా.”

“కొండ మీద ఉండును.”

అతడు చెప్పాడు, “అవునయ్యా.”

నేను చెప్పాను, “నీ గృహము యొక్క కలప (చెక్క, చెట్టు కాండము నుండి అనగా చెట్టు మధ్యభాగము) తయారు చేయబడినది, మరియు అది ఎరుపు రంగు వేయబడినది.

అతడు చెప్పాడు, “అది సరియే.”

17

నేను చెప్పాను, “ఆ చిన్న బిడ్డ ఒక ఇనుప మంచము పైన పరుండియ మరియు కేవలము అతడికి ఇంటిలో ఒక జత నీలము రంగు కార్డ్రే బట్టలు మాత్రమే ఉన్నవి.”

“అవి అతడు వేసుకొని ఉన్నాడు” అని చెప్పాడు.

మరియు నేను చెప్పాను, “మరియు ఆ బాలుడు ఒక చిన్నవాడు, సుమారు మూడు సంవత్సరముల వయస్సు, మరియు అతడికి ఒక చిన్న మూతి, చిన్న సన్నని పెదవులు ఉన్నవి. మరియు అతడు కొంచెము గోధుమ రంగు జుట్టు కలిగి ఉన్నాడు”,

అతడు చెప్పాడు, “అది సత్యము.”

నేను చెప్పాను, “శ్రీమతి. ఎమిల్ ఒక నలుపు రంగు జుట్టు కలిగిన స్త్రీ మరియు ఈ గదిలో ఒక ఎర్రని సోఫా మరియు ఒక ఎర్రని కుర్చీకలదు.”

అతడు చెప్పెను, “సహోదరుడా బ్రెన్హాం, అక్కడనే యున్నావా?”

అతడు “కొద్దిసేపటి క్రితం,” అని చెప్పాడు.

“కొద్ది సేపటి క్రితమా?” అని అతడు అడిగాడు.

నేను చెప్పాను, “అవును.”

“ఎందుకు,” అతడు చెప్పాడు, “నేను ఎన్నడూ నిన్ను చూడలేదు.”

నేను చెప్పాను, “లేదు, అది ఆత్మీయముగా ఉన్నది.” నేను చెప్పాను, “శ్రీ. ఎమిల్, నేను చెప్పినది నీవు వినియున్నావు, ఒక వేళ నేను నీకు బాప్తిస్మము ఇచ్చినట్లయితే, నాకు జరిగిన ఆ విషయములతో... అవి జరుగుటకు ముందే ఆ సంగతులను నేను చూస్తాను.”

అతడు చెప్పాడు, “అవును, సహోదరుడా బ్రెన్హాం , అటువంటిది ఏదైన నీకు జరుగుచున్నదా?”

నేను “అవును మరియు శ్రీ. ఎమిల్, ఇప్పటి వరకు నాకు ఏదైతే (ఎవరైతే) చెప్పినదో అది నాకు ఎన్నడూ అబద్దము చెప్పలేదు. నేను అక్కడికి వెళ్ళగానే, నీ బిడ్డ స్వస్థత పొందుకొనును,” అని చెప్పాను.

మరియు అతడు తన కారును ఆపివేసెను, కారుకు అడ్డుగా నిలబడి,

“దేవా, నాయందు దయచూపుము. ఓ, ప్రభువా, నన్ను తిరిగి తీసుకొనుము, చూశారా. మరియు ఒక వేళ నీవు నా బిడ్డ జీవమును తిరిగి ఇచ్చిన యెడల, నా జీవిత దినములన్నియు నీ కొరకు జీవించెదనని నేను నీకు ప్రమాణము చేయుచున్నాను,” అని చెప్పెను. మరియు అక్కడ అతడు తన హృదయమును క్రీస్తునకు ఇచ్చెను.

18

మేము ఇంటిలోనికి వెళ్ళాము, అందరూ అతనియందు ఆత్రుత కలిగియున్నారు, క్రీస్తు కొరకు ఒక ఆత్మను తిరిగి తీసుకొని వచ్చుట.

మేము ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, అక్కడ ప్రతీది ఎక్కడ ఉండవలేనో అక్కడే ఉండియున్నవి, కేవలము ఆ ముసలావిడ మాత్రమే అక్కడ లేదు. ఎంతో ప్రేరేపించబడినది. నేను చెప్పాను, “ఆ బిడ్డను నా యొద్దకు తీసుకొని రండి.” మరియు ఆ బిడ్డ కష్టముగా జీవించుచున్నది. చూశారా, ఆ తిరుగుచున్నట్లుగా కనబడుచున్నది, ఆ బిడ్డలో నుండి బయటకు పోవుచున్న ప్రాణము. అది ఒక చిన్న గొంతు, దానిని వినుట చాలా కష్టముగా యున్నది. మరియు నేను చెప్పాను, “ఆ బిడ్డను నా దగ్గరకు తీసుకొని రండి.” ఆ దర్శనము నేరవేరుట కొరకు ఎదురు చూచుట లేదు.

19

సహోదరుడు, వైల్, ఒక వేళ ఈ అట్ట ఇక్కడ పడియుండవలసియున్న యెడల, అది అక్కడ పడియున్నంత వరకూ నేను ఒక్క మాట కూడా చెప్పలేను, చూశారా. అది నాకు చూపించబడిన విధముగానే ఉండవలయును.

కనుక నేను చెప్పాను, “బిడ్డను నా యొద్దకు తీసుకొని రండి.” మరియు ఆ తండ్రి, బిడ్డను నా యొద్దకు తీసుకొని వచ్చాడు, మరియు దాని కొరకు నేను ప్రార్ధించాను, మరియు అది ఇంకా ఎక్కువైనది. కనుక నేను అనుకొన్నాను, “ఇప్పుడు, నిజముగా అది తన ఊపిరిని కోల్పోయినది, మరియు దానిలో ఊపిరి పోయుటకు, వారు పోరాడి మరియు కుదపవలసి వచ్చినది. ”ఇప్పుడు, ఏదో తప్పిదము జరిగినది“ అని నేను అనుకొన్నాను. మరియు ”ఆ ముసలావిడ ఎక్కడ ఉన్నది?“ అని నేను తలంచుట జరిగినది. ఆమె ఇంకా అక్కడ లేదు. కనుక వారు బిడ్డను తీసుకొని, క్రింద పరుండబెట్టిరి. ఆమె ముక్కులో నుండి ఆహారమును ఇచ్చుచున్నారు, ప్రతీది, మరియు ఏడ్చుచున్నారు. తల్లి పిచ్చిపట్టినట్లుగా అరచుచున్నది, మరియు అంతా, అయితే ఆ బిడ్డ అతి కష్టము మీద ఊపిరి తీసుకోనుచున్నది. నేను అనుకొన్నాను, ”మంచిది, నా బుద్దిహీనత ద్వారా, నేను దేవుని యొక్క దర్శనమును వ్యర్ధపరచాను, ఎందుకనగా అతిగా ఉత్తేజితుడనై నేను దాని కొరకు ఎన్నడూ ఎదురుచూడలేదు.“

20

దీని ద్వారా, సహోదరుడా వైల్, నీవు చూడవచ్చు, నేను ఎందుకు ఎదురుచూచెదనో. ఎవరు నాకు చెప్పినా నేను పట్టించుకొనను, నా సహోదరునిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సహోదరుడా, ఏదో నాకు చెప్పి చేయించుటకు, ఎన్నడూ ప్రయత్నించవద్దు, నేను దేవుని యొక్క చిత్తమును కలిగియున్నానని నేను అనుభూతి చెందినప్పుడు, చూశారా. ఆ ఇతర మార్గము ఎంత మంచిదిగా అనిపించినప్పటికీ అవసరము లేదు, నేను ఆయన కొరకు ఎదురుచూచుదును, చూడండి. మరియు కనుక ఇక్కడే ఒక పాఠమును నేను నేర్చుకున్నాను. చాలా, చాలా, చాలా సంవత్సరముల క్రితము మరియు ఆయన చెప్పినట్లు ఖచ్చితముగా చేయుట, మరియు అది చేయుటకు సిద్దముగా ఉన్నదని ఆయన చెప్పునంత వరకూ చేయవద్దు.

21

ఊపిరి కొరకు ఆ బిడ్డ పోరాడుచున్నది. ఇప్పుడు, నేను ఏమి చేసానో వారికి చెప్పలేను, కాని నేను ఎదురుచూచుచూ ఉండవలెను. నేను అనుకొన్నాను, “బహుశా కృప దానిని అధిగమించును (జయించును) మరియు ఆయన నన్ను క్షమించును.” మంచిది, నేను వెళ్ళి, కూర్చొన్నాను. ఉదయము వరకూ ఆ బిడ్డ జీవము కొరకు వారు పోరాడి ప్రొద్దు పొడుచుచున్నప్పుడు, ఆ బిడ్డ ఏక్షణానైనా వెళ్ళిపోవచ్చునని వారు అనుకొన్నారు.

మంచిది, నేను అక్కడ కూర్చొన్నాను, మరియు వారు నన్ను అడుగుట ప్రారంభించిరి, “సహోదరుడా బ్రెన్హాం, మేము ఏమి చేయవలెను?” లేక “బ్రదర్ బిల్” అని వారు నన్ను పిలచిరి, నేను ఏమి చేయవలెను?

నేను చెప్పాను, “నాకు తెలియదు,” చూశారా.

తల క్రిందకు దించుకొని, నేను అక్కడ కూర్చొన్నాను. “ప్రభువా, నన్ను క్షమించుము,” అని చెప్పాను.

మంచిది, మరియు అప్పుడు ప్రొద్దు వెలుగు వచ్చినది. సహోదరుడు గ్రాహం స్నెల్లింగ్ పనికి వెళ్ళవలసియున్నది. కనుక శ్రీ. ఎమిల్ అతడిని తీసుకొని వెళ్ళవలయును, మరియు నాకు తెలుసు, నేను కూడా గృహమును విడువవలయును. మరియు, ఇంకా, సహోదరుడు గ్రాహం అక్కడ కూర్చొండవలసియున్నది, ఎందుకనగా మీకు తెలిసినంత వరకు అతడు మెరిసెడి ఉంగరాల జుట్టును కలిగియున్నాడు. ఈ సోఫాపై అతడు కూర్చోండవలసియున్నది. కనుక సహోదరుడు గ్రాహం ఎక్కడ కూర్చొండవలయునో నేను అక్కడ కూర్చొనియున్నాను, కాని ఆ వృద్ద స్త్రీ అక్కడ లేదు మరియు ఆ స్థలములో ఎటువంటి వృద్ద స్త్రీ లేదు. కనుక నేను అక్కడ కూర్చొన్నాను. మరియు కనుక శ్రీ. ఎమిల్ తన యొక్క కోటును ధరించాడు. అప్పుడు నాకు తెలియును, ఒకవేళ సహోదరుడు గ్రాహం వెళ్ళినచో, అతడు ఎప్పుడు తిరిగి వచ్చునో చెప్పటము కష్టము, చూశారా. మరియు అప్పుడు నాకు తెలియును... ఒకవేళ ఆ స్త్రీ వచ్చినచో, అప్పుడు సహోదరుడు గ్రాహం అక్కడ ఉండరు. కనుక ఎటువంటి పరిస్థితిలో నేను ఉన్నానో మీరు చూడండి.

కనుక సహోదరుడు ఎమిల్ చెప్పాడు, “సహోదరుడా బ్రెన్హాం, నీవు ఇంటికి వెళ్ళ గోరుచున్నావా...” లేదా “సహోదరుడా బిల్, నీవు గృహమునకు వెళ్ళగోరుచున్నావా? నేను నిన్ను ఇంటికి తీసుకెళ్ళగోరుచున్నావా?”

నేను చెప్పాను, “లేదయ్యా. నీకు అభ్యంతరము లేకపోతే, నేను ఎదురుచూచెదను.”

కేవలము ఆ బిడ్డ మరియు ఆ తల్లి, నేను అక్కడ ఆ ఇంట్లో ఉండుటను నేను ఇష్టపడుట లేదు, ఎందుకనగా వారు యవ్వనులు. అతడు, ఇరవై-అయిదు సంవత్సరముల వయస్సు కలిగియున్నాడు, అని నేను అనుకొనుచున్నాను. మరియు నేను కూడా అదే వయస్సు కలిగియున్నాను. నేను చెప్పాను, “లేదు, ఒకవేళ నీకు అభ్యంతరము లేకపోతే, నేను ఎదురుచూచెదను.”

అతడు చెప్పాడు, “అది సరే, సహోదరుడా బిల్.”

కనుక తల్లి నేల మీద నడుచుచున్నది మరియు.. నీకు తెలియును, ఏడ్చుచూ మరియు ప్రతీది. మరియు ఆ బిడ్డ పరిస్థితి చాలా దారుణముగా ఉన్నది. చూశారా? ఏక్షణమైనా అన్నట్లు కనపడుచున్నది. ఏదో రకముగా ఊపిరిని పట్టుకొనుటకు ప్రయత్నించుట, “ఉహ్ ఉహ్.” అంతే, అతడి ఊపిరి, అందులోనే ఉన్నది మరియు ఏమి లేదు.

22

మీరు చూశారా, ఆ రోజులలో పెన్సిలిన్ మరియు అటువంటివి లేవు. కనుక వారు వాటి మీద ప్లాస్టర్లు అటువంటివి పెట్టుచున్నారు, మరియు కాని అలాంటివి ఆ చిన్న బిడ్డ చాలా దినముల నుండి కలిగియున్నది. మరియు అది పోయినది, చూశారా... లేదా పోవుచున్నది.

అప్పుడు నేను అక్కడ కూర్చొన్నాను, నేను అనుకున్నాను, “మై, ఒకవేళ గ్రాహం వెళ్ళిపోతే...”

గ్రాహం తన కోటును తొడుగుకున్నాడు, మరియు అతడు ద్వారము బయటకు వెళ్ళనారంభించెను. మరియు అతడు తన భార్యతో చెప్పాడు, అతడు చెప్పాడు, “ఇప్పుడు, మేము ఒక క్షణములో, తిరిగి వచ్చెదము.”

నేను అనుకున్నాను, “ఓ దేవా, అప్పుడు ఆ దర్శనము కొరకు ఎదురుచూచుచూ రోజంతయూ మరియు తిరిగి బహుశా రాత్రంతయూ, నేను ఇక్కడ ఉండవలయును, చూశారా, నేను ఏమి చేయగలను?”

మరియు నేను కిటికి బయటకు చూచాను, మరియు ఇంటి చుట్టూ తిరిగి, ఆ బిడ్డ యొక్క అమమ్మ వచ్చుచున్నది. అది ఒక బామ్మ (వృద్ధ స్త్రీ) అని నేను తరువాత తెలుసుకొన్నాను. మరియు ఆమె కళ్ళద్దాలు పెట్టుకొని ఉన్నది. “ఇది అదే అని నేను అనుకొన్నాను. ప్రభువా, ఒకవేళ గ్రాహం ద్వారము వెలుపలికి వెళ్ళకపోయిన ఎడల.” కనుక ఆమె ఎల్లప్పుడు ముందటి ద్వారము నొద్దకే వచ్చును, కాని, ఏదో విధముగా అప్పటికి, వారికి కనీసము తెలియదు. కాని ఆమె వెనుక ద్వారము నొద్దకు వెళ్ళినది, వంట గదిలోనికి వచ్చినది. మరియు ఆమె, ఆ చిన్న పాత ఇంటిలో వంటగదిలోనికి నడిచినది మరియు ఆమె తలుపునొద్దకు వచ్చినప్పుడు, ఆమె కూతురు అక్కడకు పరుగెత్తి మరియు ఆమెను ముద్దాడినది, ఎందుకనగా ఆమె కూతురు యొక్క తల్లి మీకు తెలియును, మరియు ఆమెను ముద్దాడినది. మరియు సహోదరుడు గ్రాహం.

అప్పుడు ఆమె, “బిడ్డ బాగానే ఉన్నదా?” అని అడిగినది.

ఆమె చెప్పెను, “అమ్మా, ఆమె చనిపోవుచున్నది.” మరియు ఆమె అలా అరవడం ప్రారంభించినది, మరియు ఆమె తల్లి ఏడ్చుచున్నది.

23

అప్పుడు నేను అనుకొన్నాను, “ఒకవేళ గ్రాహం బయటకు వెళ్ళకపోయినచో, ఇది పనిచేయును...” మరియు నేను పైకి లేచాను, మరియు నేను ఏమి చెప్పలేకపోయాను. మీరు చూశారా, కేవలము వేచి యుండుడి. మరియు గ్రాహం అటూ ఇటూ నడిచెను. నేను పైకి లేచాను కనుక అతడు కూర్చొనవచ్చును. అతని యొక్క దూరపు బంధువు, మీరు చుశారా, కనుక అతడు కూడా ఏడ్వడం ప్రారంభించాడు. మరియు అతడు ఎక్కడ కూర్చొనవలసియున్నాడో ఆ సోఫాపైనే కూర్చొండెను.

నేను అనుకొన్నాను, “ఇప్పుడు, ఒకవేళ ఆ వృద్ద స్త్రీ ఇటువైపుగా వచ్చి మరియు ఈ ఎర్రని కుర్చీపై కూర్చొన్న ఎడల...” మరియు శ్రీ. ఎమిల్ ఎక్కడైతే తన కోటును ధరించి, నిలబడి మరియు బయటకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాడో, ఆ తలుపు యొద్దకు నేను తిరిగి వెళ్ళాను. నిజముగా అది చల్లని వాతవరణము (దట్టమైన చలి). మరియు నేను అనుకొన్నాను... మరియు వృద్ధ స్త్రీ ఈ కుర్చీలో కూర్చొనియున్నది. మరియు గ్రాహం కూర్చొన్నాడు, మరియు తన తలను క్రిందకు వంచాడు, మరియు ఆ బిడ్డ యొక్క తల్లి ఆమె యొక్క చేతిని తలుపు పై ఉంచి ఏడ్వడం ప్రారంభించినది, ఖచ్చితముగా ఆ దర్శనములో అలానే ఉన్నది. మరియు వృద్ధ స్త్రీ కూర్చొన్నది. మరియు దానిపై కన్నీళ్ళు ఉండుటకు బదులుగా, మంచులో నుండి వచ్చినందువలన ఆమె అద్దాల నిండా పొగమంచు పట్టినది. మరియు ఆమె తన యొక్క చిన్న సూటుకేసు దగ్గరకు వెళ్ళి మరియు ఒక చిన్న చేతి రుమాలును బయటకు తీసి, (లేక ఒక చిన్న గుడ్డ వంటిది దానిని) మరియు ఆ కళ్ళద్దాలను తుడవడం ప్రారంభించినది. సహోదరుడా, అదే అది.

నేను శ్రీ. ఎమిల్తో చెప్పాను, నేను చెప్పాను, “శ్రీ. ఎమిల్, క్రీస్తు యొక్క సేవకునిగా నాపై ఇంకా నీకు నమ్మకమున్నదా?”

అతడు చెప్పాడు, “సహోదరుడా బ్రెన్హాం, నిశ్చయముగా నేను కలిగియున్నాను.”

నేను చెప్పాను, “నేను నీకు ఇప్పుడు చెప్పగలను. కొంతసేపటి క్రితము నేను ఒక దర్శనము గూర్చి ముందుగా మాట్లాడాను, కనుకనే అది జరుగలేదు. ఒక వేళ ఇంకా నీకు నాపై నమ్మకము ఉన్న ఎడల, వెళ్ళి నీ బిడ్డను తీసుకొని రమ్ము.” ఓ, మై. అప్పుడు, ఇది సరైనది అని నేను చూశాను. నీవు చూడుము. “వెళ్ళి, నీ బిడ్డను తీసుకొని రమ్ము.”

అతడు చెప్పాడు, “సహోదరుడా బిల్, నీవు నన్ను ఏమి చేయమని చెప్పినా నేను చేస్తాను. దానిని చేయుటకు నేను భయపడను.” ఎందుకనగా, వారు దానిని పైకి లేపారు, అది ఇప్పుడే వెళ్ళిపోయినది. ఊపిరి అంతా ఆమెను విడిచిపోయినది. ఆ చిన్న బిడ్డను నా యొద్దకు తీసుకొనివచ్చాడు, వెళ్ళి, ఆమెను అతని చేతులలోనికి తీసుకొని, నా యొద్దకు తీసుకొని వచ్చి, మరియు అక్కడ నిలబడెను.

నా చేయి ఆమెపై ఉంచి, చెప్పాను, “ప్రభువా, నీ సేవకుని యొక్క బుద్దిహీనతను క్షమించుము,” చూశారా. “నేను నీ దర్శనమును దాటి మాట్లాడాను, కాని ఇప్పుడు నీవు భూమ్యాకాశములకు దేవుడవని తెలియబడనిమ్ము.”

అంతకు మించి ఏమి చెప్పలేదు, ఆ చిన్న బిడ్డ రెండు చేతులు తన తండ్రిపై వేసి, కేకలేస్తు ఏడ్వడం ప్రారంభించినది. “డాడీ, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను,” అని చెప్పినది, చూశారా.

నేను చెప్పాను, “శ్రీ. ఎమిల్, ఆ చిన్న బిడ్డను ఒంటరిగా ఉండనిమ్ము. దానిని (ఆమేను) విడిచి వెళ్ళుటకు దానికి మూడు దినములు పట్టును, ఏలయనగా అది మూడు దశలలో విప్పబడినది.”

24

నేను ఇంటికి వెళ్ళిపోయాను. దానిని గూర్చి నేను నా సంఘములో చెప్పాను. నేను, “నేను తిరిగి వెళ్ళుచున్నాను,” అని చెప్పాను. అది సోమవారము. “సంఘము ముందు, బుధవారము రాత్రికి, నేను అక్కడకు వెళ్ళుచున్నాను,” అని నేను చెప్పాను. వారు పేదవారు, మరియు మేము వారికి తీసుకొని వెళ్ళుటకై, మేము ఒక సంచిలో వంట సరుకులు సర్దుకున్నాము. కనుక నేను చెప్పాను, “మీరందరూ వెళ్ళాలని నేను కోరుచున్నాను. మరియు నేను అక్కడికి వెళ్ళినప్పుడు, మరియు మీరు ఇంటి చుట్టూ ఉండండి, మరియు ఆ ఇల్లు ఎక్కడైతే ఉందో ఆ స్థలమునకు నేను వచ్చినప్పుడు మీరు గమనించండి, చూశారా? ఆ చిన్న బిడ్డ, చాక్లెట్ మిల్క్ లేదా ఏదో దానిని త్రాగుటవలన వచ్చిన ఒక చిన్న మీసముతో ఆ నేల మీద నుండి అలా రానియెడల, చూశారా, అతని చేతులు వేసి, మరియు ఈ మాటలు చెప్పెసు, సహోదరుడా బిల్, నేను సంపూర్తిగా స్వస్థపడ్డాను. ఈ చిన్న మూడు సంవత్సరముల వయస్సు గల బిడ్డ. ”ఒకవేళ అలా జరుగుతుందో లేదో మీరు గమనించి చూడండి.“

25

ఇప్పుడు నా భార్య, మిడా, మాకు వివాహం కాబడుటకు మునుపు, ఆమె ఆ గుంపులో ఉన్నది. మరియు ఒక ట్రక్కు నిండా జనులు వెళ్ళి, ఆ ఇంటి చుట్టూ నిలబడిరి, చూడండి, ఆ రాత్రి ఇంటి దగ్గరకు నడిపించుకొని వచ్చిన పాత పబ్లిక్ సర్వీస్ కంపెని యొక్క ట్రక్కుతో నేను వచ్చినప్పుడు, (నాకు సొంతగా ఏ కారు లేదు) వెనుక నిండా తారు మరియు వస్తువులు ఉన్నవి. ఆ రోజంతయూ నేను లాగుతూ మరియు సరిచేయుచున్నాను, మీకు తెలియును. ముందుకు తీసుకొని వెళ్ళి, ఆపివేసెను. వరండా పైకి వెళ్ళి, తలుపును తట్టెను. మరియు ఆ చిన్న పాత నేలపై వారు ఎటువంటి రగ్గులను కలిగి లేరు, మరియు ఆ తల్లి అటువైపుగా ఆ వరండాలోనికి వచ్చి, చెప్పెను, “ఎందుకు, అది సహోదరుడు బిల్ కదా?” ఆ విధముగా, ఆ సమయమున ఏమి జరుగునో చూచెదమని జనులు కిటికీల గుండా చూచుచున్నారు.

మరియు మూలన, ఈ చిన్న బాలుడు ఆడుకొనుచున్నాడు, మూడవ దినమున. నేను ఆపివేశాను, ఒక్క మాట కూడా పలుకలేదు, మరియు నేలపై ఇష్టము వచ్చినట్లు దొర్లుకుంటూ వచ్చి, నాపై అతడి రెండు చేతులు వేసెను. దానితో... చాక్లెట్ మిల్క్ త్రాగుచూ, అతడి చిన్న మీసము అక్కడ ఆ విధముగా, చాక్లెట్ మిల్క్ ద్వారా వచ్చినది. అతడి చేతులు నాపై వేసి చెప్పెను, “సహోదరుడా బిల్, నేను పూర్తిగా బాగుపడ్డాను.”

26

ఆ రాత్రి, సంఘము యొద్ద నేను దానిని చెప్పాను. నేను చెప్పాను, “ఎంతో అవసరత కలిగిన ఒక అవిటి బాలిక ఎక్కడో ఉన్నది.” నేను చెప్పాను, “సంఘమా, ఈ సంగతులు ఏమీటో నాకు తెలియదు. నేను మీకు చెప్పలేను.”

మరియు నేను పబ్లిక్ సర్వీస్లో పనిచేయుచున్నాను. మరియు ఒక రోజు, నాకు జ్ఞాపకమున్నది, ఒక వారము తర్వాత, బయటకు వెళ్ళుటకు నేను భవనమును విడుచుట ప్రారంభించాను. శ్రీ. హెర్చ్ స్కాట్, ఇప్పుడు ఇక్కడే ఈ నగరములో నివసించుచున్నారు, (అతడు నాపై అధికారి) మరియు అతడు చెప్పెను... నేను క్రిందకు రావటం ఆరంభించాను. మరియు అతడు చెప్పెను, “బిల్లీ.”

“చెప్పండి” అని నేను చెప్పాను.

“నీవు విడిచి వెళ్ళుటకు ముందుగా, ఇక్కడ నీ కొరకు ఒక ఉత్తరము నేను కలిగియున్నాను,” అని చెప్పెను.

నేను “సరే, హెర్బ్, ఒక నిమిషములో దానిని నేను తీసుకుంటాను,” అని అన్నాను. మరియు కనుక నా వేరొక పనిని చేయుటకు నేను అక్కడకు వెళ్ళాను. నేను పరిశీలించుచున్నాను. కనుక నా వేరొక పనిని ముగించుటకు నేను వెళ్ళాను. మరియు నేను దానిని చేసినప్పుడు, నాకు ఆ లేఖ జ్ఞాపకమునకు వచ్చినది, నేను వెళ్ళి మరియు దానిని తెచ్చాను, దానిని తెరిచాను. మరియు చెప్పెను, “ప్రియమైన శ్రీ. బ్రెన్హాం,” చూడుము, “నా పేరు నెయిల్, నేను శ్రీమతి. హెరాల్డ్ నెయిల్. మేము దక్షిణ బోస్టాన్లో నివసించేదము,” అని చెప్పెను. “మేము విశ్వాసమును బట్టి మెథడిస్టులము. మరియు మీరు వ్రాసిన ”యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు,“ అనే కరపత్రికను నేను చదువుట జరిగినది. మరియు క్రితము రాత్రి, మా గృహములో మేము ఒక ప్రార్థన కూడికను కలిగియున్నాము, మరియు రోగుల కొరకు ప్రార్ధించుటలో, మీరు విజయమును కలిగియున్నారని మేము వినియున్నాము.” మరియు చెప్పెను, “నేను, పదిహేను సంవత్సరముల వయస్సు గల, ఒక రోగపీడితమైన కుమార్తెను కలిగియున్నాను, ఆమె రోగముతో బాధపడుచూ మంచముపై పడియున్నదని” చెప్పెను. మరియు ఏ విధముగానైనా, మీరు వచ్చి ఈ బాలికకు ప్రార్థించవలయునన్న దానిని, నేను నా మనస్సులో నుండి తీసివేయలేకపోయాను. దయచేసి మీరు దానిని చేయుదురా? వినయముతో, శ్రీమతి. హెరాల్డ్ నెయిల్, దక్షిణ బోస్టాన్, ఇండియానా.“

నేను చెప్పాను, “మీకు తెలియునా, అదే ఆ బాలిక. అదిగో ఆమే.”

నేను ఇంటికి వెళ్ళి, నా తల్లితో చెప్పాను, దానిని గూర్చి వారికి చెప్పాను. “అదే ఆ బాలిక” అని నేను చెప్పాను.

27

మరియు అప్పుడు ఆ రాత్రి, సంఘము నొద్ద, నేను సంఘముతో చెప్పాను. నేను చెప్పాను, “ఇదిగో అదే ఆ స్థలము.” నేను చెప్పాను, ఎవరికైనా దక్షిణ బోస్టాన్ ఎక్కడుందో తెలియునా?“

మరియు సహోదరుడు జార్జి రైట్, (మీరందరు అతనితో పరిచయము కలిగియున్నారు), అతడు చెప్పాడు, “సహోదరుడా బ్రెన్హాం, అది దక్షిణమున, క్రింద ఉందని నేను అనుకొనుచున్నాను.”

కనుక ఆ తరువాత రోజు, నా యొక్క ఇద్దరు మిత్రులు, మరియు ఇప్పుడున్న నా భార్య, మరియు టెక్సాస్ నుండి వచ్చిన ఆ వ్యక్తి మరియు అతని భార్య. వారి పేర్లు బ్రేస్, ఎడ్ బ్రేస్. అతడు మిల్ టౌన్ లో క్రింద ఇక్కడ నివసించుచున్నాడు. అతడు ఒక వ్యవసాయదారుడు. అతడు పశ్చిమాన ఉన్న ఒక వ్యవసాయదారుడు. మరియు సంఘమునకు దగ్గరగా ఉండుట కొరకు అతడు ఇక్కడకు వచ్చెను. మరియు అతడి భార్య కొరకు నేను ప్రార్థించాను, మరియు ఆమే క్షయవ్యాధి నుండి స్వస్థపడెను. మరియు ఇది జరుగుట అతడు చూడగోరుచున్నాడు.

నేను చెప్పాను, “నీవు నాతో రా, మరియు ఒకవేళ అది ఈ విధముగా జరిగినట్లయితే, చూడుము.”

కనుక ఆ స్త్రీ ఎన్నడూ ఒక దర్శనమును చూడలేదు, శ్రీమతి. బ్రేస్. కనుక నా భార్య నాతో వచ్చెను. మరియు అప్పటి (పాతవాడైన) పెద్ద అయిన సహోదరుడు జిమ్ వైస్హర్ట్, అక్కడనున్న సంఘము మీకు గుర్తున్నదా? ఆతడు దానిని చూడగోరెను. అప్పుడు నేనొక చిన్న పాత వాహనమును కలిగియున్నాను, మరియు నేను వాటన్నిటిని దాని మీద వేశాను. మరియు మేము న్యూ-ఆల్బెనీకు, క్రిందకు వెళ్ళితిమి, మరియు నేను ఈ సూచికను కనుగొంటిని. మరియు అది దక్షిణ బోస్టాన్ కాదని నేను కనుగొంటిని, అది న్యూ-బోస్టాన్. కనుక అప్పుడు ఎక్కడికి వెళ్ళవలయునో నాకు తెలియదు. కనుక నేను వెనుకకు జెఫర్సన్ విల్ కు వచ్చి, మరియు ఎవరినో అడిగితిని. మరియు ఎవరో తపాల ఆఫీసుకు వెళ్ళిరి, వారు చెప్పారు, “దక్షిణ బోస్టాన్ హెన్రీవిల్ కు పైన ఉన్నది.”

కనుక నేను హెన్రీవిల్ కు వెళ్ళాను, మరియు నేను అక్కడ అడిగితిని, మరియు వారు చెప్పారు, “ఈ రోడ్డుపై ఆగుము. అది పదిహేను మైళ్ళ దూరము, ఇక్కడ ఉన్న ఈ చిన్న దిబ్బల (ఎత్తు ప్రదేశాలు). దగ్గర, ”నీవు ఒక చిన్న స్థలము కనుగొనెదవు. జాగ్రత్తగా ఉండవలెను, నీవు దానిని తప్పిపోదువు,“ ఎందుకనగా అడి ఒక చిన్న దుకాణము, మరియు ఆ దుకాణములోనే తపాల ఆఫీసు ఉన్నది, ప్రతీది, అందులోనే ఉన్నది.” దక్షిణ బోస్టాన్, ఈ దిబ్బలలో ఉన్నది“ అని చెప్పెను. మీరు చూడండి. ఆ చిన్న దిబ్బలు పదిహేడు వేల ఎకరములు (మొత్తము ప్రదేశములు) ఉన్నవి, మరియు ఇది ఆ వెనుక, అక్కడ కొండలపై ఉన్నవి.

28

కనుక మేము దాని వెంబడి నడిపించుకుంటూ వెళ్ళాము, మరియు ఐదు లేదా ఆరు మైళ్ళు కారు నడిపిస్తూ వెళ్ళిన తరువాత ఒక్కసారే, నాకు నిజముగా ఏదో క్రొత్తగా అనిపించినది. నిజముగా నేను ఏదో క్రొత్త అనుభూతిని పొందాను. నేను చెప్పాను, “నాకు తెలియదు.”

వారు చెప్పారు, “ఏమిటి సంగతి?”

నేను చెప్పాను, “నాతో మాట్లాడుతున్న ఆయన ఇప్పుడు నాతో మాట్లాడగోరుచున్నాడు అని నమ్ముచున్నాను. కనుక నేను కారును విడిచి వెళ్ళుదను.”

కనుక నేను కారు నుండి బయటకు వచ్చాను, మరియు మీకు తెలుసా, ఆ చిన్న పాత వాహనములో (కారు), ఆ స్త్రీ, మరొక స్త్రీ కాళ్ళపై కూర్చొన్నది. మరియు సమస్తము... మరియు నేను కారు నుండి బయటకు వచ్చి మరియు కారు వెనుక వైపునకు వెళ్ళాను. మరియు నా తలను క్రిందకు వంచి, ఆ కారు వెనుక, బంపరుపై నా కాలు పెట్టాను. నేను చెప్పాను, “పరలోకపు తండ్రి. నీ సేవకుడు ఏమి తెలుసుకొనవలెనని నీవు కోరుచున్నావు?” మరియు నేను ప్రార్ధించాను, ఏమియూ జరుగలేదు. కొద్ది నిముషములు నేను వేచియున్నాను, మరియు నేను తలంచాను... “మంచిది, సాధారణముగా ఎక్కడైతే అలాంటి గుంపు ఉంటుందో, అక్కడకు నాకు నేనుగా వెళ్ళుదను, కనుక నేను కొన్ని నిముషములు వేచియున్నాను.

29

అక్కడ చూచినప్పుడు, నేను దానికి ఆకర్షింపబడుట జరిగినది. నేను ఆలోచించుట ప్రారంభించాను, “మంచిది, ఇక్కడ చూడుము, ఇక్కడ ఆ పాత ఆలయము ఉన్నది.” మరియు ఒక వేళ నీవు ఎన్నడైనా, అది బంకర్ హిల్ చర్చి. మరియు నేను ప్రక్కగా ఉన్న బంకర్ హిల్ క్రైస్తవ సంఘమును చూశాను, మరియు ఆ చర్చి ఎదుటనే సమాధి చేయబడిన వారి పేర్లతో రాళ్ళు ఉన్నవి మరియు నేను అక్కడకు వెళ్ళాను.

“మీ అందరికీ ఆ లేఖలు వచ్చినవి,” అని నేను చెప్పాను. నా జీవితములో ఇంతకు ముందెన్నడూ నేను ఆ దేశములో లేను. నా జీవితములో, ఎప్పుడూ, అక్కడ లేను అని నేను చెప్పాను. మరియు “మీరు ఆ పేర్లు మరియు సంఖ్యలు పట్టుకొని ఇక్కడకు రండి, ఇక్కడ ఉన్న ఈ సమాధి రాయిపై ఉన్నది. అదేనా కాదా అని చూడండి,” అని నేను చెప్పాను. మరియు అక్కడ ఖచ్చితముగా అలాగే ఉన్నది. నేను చెప్పాను, “అవును, మనమిప్పుడు సరైన మార్గములోనే ఉన్నాము.” నేను చెప్పాను, “అది ప్రభువు యొక్క దూత, చూడండి, నేను దాని ప్రక్కగానే వెళ్ళాను, మరియు దానిని ఎరుగలేదు. ఓ, అతడు. పరిపూర్ణుడు. మరియు మేము అలా వెళ్ళుచూ ఉన్నాము.

నేరుగా నేను ఒక మనిషిని కలిసాను, మరియు “అయ్యా, దక్షిణ బోస్టాన్ ఎక్కడ ఉన్నదో నాకు చెప్పెదవా?” అని అడిగాను.

అతడు చెప్పాడు, “నీవు కుడివైపుకు తిరిగి మరియు ఎడమకు వెళ్ళుము,” మీకు తెలియునా, అదే విధముగా వెళ్ళుము.

30

మరియు మేము ఆ విధముగానే వెళ్ళుచూ పోతిమి.

కొంత సేపటి తరువాత, మేము ఒకచోటికి వచ్చాము... నేను గమనించాను, నేను ఒక చిన్న స్థలమునకు వచ్చాను. మరియు అది ఒక చిన్న గ్రామము వలె ఉన్నది. మరియు నేను చూసాను, “అదే, అదే, అక్కడే,” అని చెప్పాను. “అదిగో, అక్కడ, అదిగో అక్కడ ఆ పసుపురంగు దుకాణము,” అని చెప్పాను. ఇప్పుడు, మీరు గమనించండి, నీలపు రంగు పొడవాటి దుస్తులు ధరించి ఒక తెల్లని కార్డ్రే... లేదా పసుపురంగు కార్డ్రే టోపీ ధరించి తెల్లని మీసాలు కలిగిన ఒక వ్యక్తి అక్కడ నుండి బయటకు రానైయున్నాడు. మరియు ఎక్కడికి వెళ్ళాలో నాకు చెప్పును. ఒకవేళ అది కాకపోతే (అలా జరుగకపోతే), నేను ఒక పెద్ద కధలు చెప్పేవాడిని,“ అని చెప్పాను.

మరియు అందుకే, వారందరూ ఎదురుచూచుచున్నారు. మరియు నేను ఆ స్థలము ముందుకు కారు నడిపించాను, మరియు నేను ముందుకు నడిపించిన వెంటనే, నీలపురంగు పొడవాటి దుస్తులు ధరించి మరియు పసుపు రంగు కార్డ్రే టోపి ధరించి మరియు తెల్లని మీసాలు కలిగిన వ్యక్తి బయటకు వచ్చాడు. మరియు అది ఆ విధముగా జరుగుట చూచినప్పుడు, శ్రీమతి. బ్రేస్ కారులోనే మూర్ఛపోయినది.

నేను చెప్పాను, “అయ్యా, హెరాల్డ్ నెయిల్ ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పవలసినది నువ్వే.”

మరియు అతడు చెప్పాడు, “అవునయ్యా. నీవు దక్షిణము నుండి వచ్చావా?” అని అడిగాడు.

నేను చెప్పాను, “అవునయ్యా.”

అతడు చెప్పాడు, “నీవు రోడ్డుకు ఇంచుమించు అరమైలు దూరము దాటివచ్చియున్నావు. ఆ క్రింద ఎడమ వైపున మొదటి రోడ్డునకు నీవు తిరుగుము. నీవు అలానే పైకి వెళ్ళినప్పుడు, నీవు ఒక పెద్ద ఎర్రని గాదెను (దాన్యం దాచెడిది) కనుగొందువు, మరియు నీవు ఆ ఎర్రని గాదె దగ్గర మలుపు తీసుకొనుము.” “నీవు ఆ చిన్న రోడ్డు వలే ఉన్న లైనులోనికి వెళ్ళినప్పుడు, అది నీ కుడి ప్రక్కన రెండవ ఇల్లు,” అని చెప్పాడు.

నేను చెప్పాను, “సరేనయ్యా.”

అతడు చెప్పాడు, “ఎందుకు?”

నేను చెప్పాను, “అతడికి ఒక బాధితురాలైన కుమార్తె ఉన్నది. నిజమేనా?” అతడు చెప్పెను, “అవునయ్యా, అతడు కలిగియున్నాడు.”

నేను చెప్పాను, “ప్రభువు ఆమెను స్వస్థపరచనైయున్నాడు.”

మరియు ఆ ముసలివాడు ఏడ్వడం ప్రారంభించాడు. చూడండి, అతడికి ఎన్నడూ తెలియదు, కనుకనే అతడు ఆ దర్శనములో భాగస్తుడైనాడు. ఏమి జరుగుచున్నదో అతడికి తెలియదు. నేను వెనుకకు తిరిగాను. శ్రీమతి. నెయిల్ తిరిగి ఉజ్జీవింపబడడం మేము చూశాము. మరియు అక్కడికి వెళ్ళి, ఖాళీ స్థలములోనికి నడిచాము. కారులో నుండి దిగి ప్రారంభించాము. అది ఎక్కడ ఉన్నదో... ఆ స్థలమునకు, మీకు తెలుసా. మరియు స్థూలకాయురాలైన ఒక యవ్వన స్త్రీ ద్వారము నొద్దకు వచ్చినది.

నేను చెప్పాను, “అదిగో ఆమె, చూడండీ.”

కనుక ఆమె చెప్పినది, “నీవు ఎలా ఉన్నావు?”

మరియు నేను చెప్పాను, “నీవు ఎలా ఉన్నావు?''

నేను చెప్పాను, “నేను బ్రదర్ బిల్.”

“ఓ,” ఆమె చెప్పినది, “నువ్వేనని నేను అనుకొన్నాను.” ఆమె చెప్పినది, “నీకు నా ఉత్తరం అందినదా?”

నేను చెప్పాను, “అవునమ్మా, నాకు అందినది.”

ఆమె చెప్పినది, “నేను శ్రీమతి. హెరాల్డ్ నెయిల్.”

నేను చెప్పాను, “మంచిది, శ్రీమతి. నెయిల్, నిన్ను కలుసుకొనుట నాకు చాలా ఆనందముగా ఉన్నది. మరియు ఇది నీ బాలిక కొరకు ప్రార్థించుటకు నాతో వచ్చిన ఒక చిన్న గుంపు.

“సరే,” అని చెప్పినది.

నేను చెప్పాను, “ఆమె స్వస్థపడబోవుచున్నది.”

ఆమె అన్నది, “ఏమిటి?” మరియు ఆమె పెదవులు వణుకుట ప్రారంభించినవి, ఆమె ఏడ్వడం ప్రారంభించినది. నేను చెప్పాను, “అవునమ్మా.”

నాకు తెలియదు, నేను ఎన్నడూ ఆ స్త్రీ కొరకు ఆపబడలేదు. నేను నేరుగా హాలులోనికి నడుచుట ప్రారంభించాను, మరియు నాతో వచ్చిన నా గుంపు నన్ను వెంబడించినది. పెద్దదిగా పాతబడిన పల్లెటూరు ఇల్లులా ఉన్నదానిలో, హాలులో కుడివైపునకు నేను తలుపు తెరిచినప్పుడు. అక్కడ పసుపు... లేదా గోడ మీద పసుపు కాగితములు ఉన్నవి. ఎర్రని బొమ్మలు; “దేవుడు మా గృహమును దీవించును గాక” అనే సూచన యున్నది, పాత ఇత్తడి మంచము; గడ్డి పొయ్యి నాకు ఎడమ వైపున ఉన్నది. మరియు అక్కడ అటు ఇటుగా ఉన్న చిన్న పడక ఉన్నది, దాని పైన అబ్బాయిలా ఉన్న ఆ బాలిక పరుండియున్నది.

31

ఇప్పుడు ఏదో జరిగినది. నేను ఆ గదికి మూలన ఉన్నాను, నా శరీరము ఆ పడకదగ్గరకు వెళ్ళుట గమనించుచున్నాను. మరియు నా యొక్క చేతులను ఆమె మరియు నేను నా చేతులను ఆమెపై ఉంచాను, లేదా ఆమె కడుపునకు అడ్డముగా ఈ విధముగా ఉంచాను. నేను చెప్పాను, “ప్రభువా, నేను అనుకొనుచున్నాను, దేవుడు నాకు ఏమి చేయమని చెప్పెనో ఆ ఆజ్ఞ ప్రకారముగా నేను దీనిని చేయుదును.” నా చేతులు ఆమె కడుపుపై పెట్టియున్నాను. ప్రభువు ఏ విధముగా చెప్పెనో, ఖచ్చితముగా ఆ విధముగా నేను దానిని చేసినప్పుడు, శ్రీమతి. నెయిల్ నడుచుకుంటూ గదిలోనికి వచ్చి మరియు దానిని చూచెను. ఆమె క్రింద అంతస్తునకు వెళ్ళి, మళ్ళి మూర్ఛపోయేను. ఆమె ఒక రకముగా చాలా బలహీనురాలు. మరియు ఆమె మళ్ళీ నేల మీద పడి మూర్చపోయేను. మరియు సహోదరుడు నెయిల్ ఆమెకు సపర్యలు చేయుచున్నాడు. మరియు పాతవాడైయిన సహోదరుడు జిమ్ అక్కడ నిలబడి, “ప్రభువు దీవించును గాక” అని చెప్పుచున్నాడు. అతడి చేతులను దగ్గరకు పెట్టి, అతడు ఏ విధముగా చేయునో అని మీ అందరికి తెలియును. మరియు అప్పుడు నేను దానిని చూశాను, మరియు నేను దానిని చూశాను, మరియు నా చేతులు ఆమెపై పెట్టాను... లేదా, ఆమె కడుపుపై అడ్డముగా, మరియు “దేవుడు నాకు ఏది చేయమని చెప్పుచున్నాడో, ఆ ఆజ్ఞను బట్టి దీనిని నేను చేయుచున్నాను, ప్రభువా,” అని నేను చెప్పాను.

32

మరియు ఆ సమయములో, ఆమె ఏడ్వడం ప్రారంభించినది, మరియు ఆమె పైకి ఎగిరినది. మరియు అప్పుడే వారు శ్రీమతి. నేయిలను కాళ్ళపై నిలబడేలా చేసిరి; ఆమె ఆ మూర్ఛ నుండి మేల్కొన్నది. మరియు ఆ బాలిక మంచము పై నుండి గెంతినప్పుడు (ఎగిరినప్పుడు), అప్పుడే ఖచ్చితముగా ఆ దర్శనములో చూపిన విధముగా, ఆమె కాలు కుడికాలుపై పడినది, మరియు ఒక బాలునికి బదులుగా బాలికకు ఉండవలసిన గుండ్రని మోచిప్ప అక్కడ ఉన్నది. మరియు శ్రీమతి. నెయిల్ క్రిందకు వెళ్ళెను, చూడండి. ఆమె మూర్ఛపోయెను. అది ఆమె మూడవ సారి మూర్చపోవుట అయివున్నది. మరియు ఆ గదిలో, ఆ బాలిక నడుచుచున్నది. మరియు ఏడుస్తూ ఆమె యొక్క దుస్తులు మార్చుకొను గదిలోనికి వెళ్ళి, ఆమె యొక్క కిమోనో దుస్తులు ధరించి తలదువ్వుకొనుచూ, ఆమె వెనుకకు తిరిగి నడుచుకుంటు వచ్చుచున్నది. ఆమెతో... ఆ.. మరియు ఒక చేయికి (కుడి చేతికి) కూడా పక్షవాతము వచ్చినది. మరియు (స్వస్థపడిన) అ అవిటి చేతితోనే ఆమె తన జుట్టు దువ్వుకొనుచున్నది. ఆమెకు వివాహమైనది. పిల్లలు కూడా ఉన్నారు. ఆమె పేరు... ఇప్పుడు ఆమె పేరేమిటో నాకు తెలియదు, కాని నెయిల్, ఎవరైనా నీతో చెప్పవచ్చు — హెరాల్డ్ నెయిల్. మరియు ఆ దర్శనములు సత్యము!

33

ఆ విధముగా జరిగిన సంగతులను పుస్తక సంపుటాలుగా మార్చు జనుల యొద్దకు నేను తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచగలను. ఇప్పుడు, సహోదరుడా వైల్, అది సత్యము.

నేను విఫలమయ్యెదను: నేను ఒక మనిషిని. ఆరంభమునుండే నేను ఒక అపజయము కలిగినవాడను మరియు క్రీస్తు యొక్క సేవకునిగా ఉండుటకు ఒక చాలా పేద ప్రత్యామ్నాయమును (అర్హత లేనివాడను).

[సహోదరుడు బ్రెన్హాం జనుల పేర్లు పలుకుచున్నాడు]

m-e-r-r-e రెండు Lలు.

[సహోదరుడు వైల్ చెప్పుచున్నాడు, దానిగురించి నేను అనుకున్నాను...?..]

[నెయిల్ అనగా n-e-i-l] n-a-i-l.

[సహోదరుడు వైల్ చెప్పుచున్నాడు, “బ్రేస్, (b-r-a-c-e?”]

ఎడ్ బ్రేస్.

[“అవును, ఇప్పుడు వారినందరిని నేను కలిగియున్నాను అని అనుకొనుచున్నాను. ఇది గ్రాహం స్నెల్లింగ్ కదా?]

గ్రాహం , G-r-a-h-a-m, s-n-e రెండు Lలు L-i-n-g.“

[సహోదరుడు వైల్ చెప్పుచున్నాడు, “ఓ, స్నెల్లింగ్. ఇప్పుడు దానిని మనము పొందుకున్నాము...]

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...