ప్రకటన 4వ అధ్యాయము #1

ప్రకటన 4వ అధ్యాయము #1

vgr count -200 1…నాకు సంబంధించి. చాలా మంది అటువంటి ఉద్దేశ్యము కలిగివుంటారని నేను అనుకుంటాను. ఇది కొద్దిగా బాగున్నది, అక్కడ, ఆ చివరి వరుసలో ఒక యవ్వన సహోదరి ఉన్నది. అటువంటి సంగతిని నేను తప్పక అభినందిస్తాను. మరియు మనమిప్పుడు నూతన సంవత్సరపు రాత్రిలోకి ప్రవేశిస్తున్నాము, ఇంకా ఏదైనా మరింత బాగుగా మీరు పాడగలరని నేను అనుకోవట్లేదు, ఈ రాత్రికి తగినట్లుగా మరేదైనా ఉన్నదా.

మంచి సంవత్సరమును మనము ప్రారంభిస్తున్నట్లుగా ఉన్నది, మంచిది, బయట మంచుకురుస్తు జారుతున్నట్లుగా ఉన్నది, సంవత్సరములో ఈ సమయంలో వాతావరణం ఇండియానాలో బహు కష్టంగా వుంటుంది. అయితే ఇక్కడ నేను చూస్తున్నా మీరు జార్జియా నుండి వచ్చినవారు, ఓహియో పైన కూడా. ఇప్పుడు సహోదరుడు డచ్, మీకు, సహోదరి డచ్ కి అది ఏమిటనేది తెలుసును, అదే విధంగా ఓహియో ఉన్నది. ఇంకా - మనము వెళ్ళబోతున్న ఆ దేశం అక్కడ అటువంటివి ఏమి ఉండవు, చూశారా, అదియే కార్యమైయున్నది.

PHIL 3:13,14

 

2ఇది నూతన సంవత్సరపు రాత్రి. మరియు మీరందరూ ఒక దానిని వ్రాసుకొని మరియు ఈ నూతన సంవత్సరమున దానిని వాగ్దానము చేయబోతున్నారు, రేపటి తరువాత రోజున వాటన్నిటినీ మీరతారు. అయితే మీకు తెలుసా, ప్రతి సంవత్సరము మీరొక నూతన పేజీని త్రిప్పుతారు, మరియు ఆ మరుసటి ఉదయాన్నే దాన్ని వెనుకకు త్రిప్పతారు, మళ్ళీ దానినే చేస్తారు.

కానీ నేను చెప్పాలనుకుంటున్న ఒక సంగతి ఉన్నది, అదేమిటంటే, అపొస్థలుడైన పౌలు అన్నట్ల, "గతములో జరిగినవాటిని మరిచిపోండి, నేను చేసిన ప్రతి ఒక్క తప్పులను మరియు కార్యాలను మరచిపోయి, క్రీస్తు యొక్క ఉన్నత పిలుపు యొక్క గుర్తు వైపు పయనిస్తున్నాను." మరియు నా జీవితంలో గడచిన భాగము, గడచిన సంవత్సరములో నేను చేసిన పొరపాట్లకు ఆ విధమైన పశ్చాతాపం మాత్రమే కలిగియున్నాను, మరియు ఆయన ఉన్నతమైన పిలుపు యొక్క గరుతు క్రొరకు వినయమంతటితో ఆయన కృప కొరకు అడుగుతున్నాను. మన అందరి యొక్క సాక్ష్యము ఆ విధముగా యున్నదని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, మనమందరము ఆలాగున అనుభూతిని చెందవలసియున్నది.

3క్షమించండి, ప్రజలు ఇంకనూ రాలేకపోయారు. కనుక ఇది ఒక చెడ్డ రాత్రివలె ఉన్నది, మరియు నేను సహోదరుడు నెవిల్ ను పిలిచాను, అతను ఇక్కడకు రాగలడా లేదా అన్న సంగతి కూడా నాకు తెలియదు. మరియు సహోదరుడా స్మేగ్స్ ఇక్కడకు రండి, మరియు అతను కెంటకీ దిగువ భాగము నుండి వచ్చాడు, అక్కడ మూడు అడుగులు లేదా అంతకన్నా క్రిందకి ఉంటుంది. కావున… లేక "దాదాపు ఈలాగు ఉండవచ్చును," అని అతను అన్నాడు. కావున అతడు ఒక రైతుతో కొంత సరిచేయుటకు రెండు సార్లు ప్రయత్ని౦చెను, మరియు అతడిని ట్రాక్టర్ తో అక్కడ నిలిపియుంచేను. "మంచిది, ఒకవేళ అది కేవలం రెండు లేక మూడు అంగుళాలైతే, అది అలాగే ఉన్నంత కాలము దానిని గురించి మేము చింతించము, అని నేను అనుకొన్నాను. కానీ ఆ మార్గములు నడుపుటకు వీలుగా ఉన్నాయి, ఇంకా ప్రతివారు దాని మీద వెళుతున్నారు."

4ఇప్పుడు, ఈ రాత్రి విభిన్నమైనవారు లోపలికి వచ్చిన రకరకాల సేవకుల నుండి వినే రాత్రిగా ఉన్నది, వారు బహశా వివిధ రకాలైన భాగాలను నుండి ఈ రాత్రి ఇక్కడకు వచ్చియున్నారు. వారు అర్ధరాత్రి అయ్యేంత వరకు ఉండవచ్చును. ఒకవేళ నూతన సంవత్సరము వస్తున్న౦దున, మరియు ఆ పాతదైనది వెళ్ళుట వారు కూర్చొని గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా సహజంగా వారు వేదిక దగ్గరకు పిలవబడి మరియు ప్రార్థన చేసి - వారి వాగ్దానాలను దేవునికి తెలియజేస్తారు మరియు వారి-వారి వాగ్దానాలను క్రొత్తవిగా చేసుకుంటారు.

నేను సహోదరుడు నెవిల్ కు చెప్పాను. అతడు రాగలడేమో అని నేను అతనిని పిలిచాను - అతను గానీ రానట్లయితే, నేను తీసుకొనగలిన ఉత్తమమైన దానిని తీసుకొనుటకు ప్రయత్నిస్తాను. ఒకవేళ ఆ తరువాత రేపు ఉదయములోపు అతను ఇక్కడకు రాలేకపోతే, ఎందుకు, అతడు ఇక్కడ లేనందున దానిని నేను ఇంకా కొనసాగిస్తాను. కేవలం ఒక 15 నిముషాల వర్తమానము కొరకు లేక అటువంటిదాని కోసము ఆలోచిస్తున్నాను, మరియు నేను ఈ రాత్రి దాని కొరకు ప్రయత్నించబోవుచున్నాను అని అతనితో చెప్పాను. ఇంకా మంచిది, ఇక్కడ వివిధమైన ఇతర సేవకులు కూర్చొని వేచి చూచుటను మనము చూస్తున్నాము.

కాబట్టి నేను ప్రకటన గ్రంథమును ప్రారంభించి కొనసాగించాలని అనుకుంటున్నాను, దాని దగ్గరకు వచ్చి ఇప్పుడే ప్రారంభించుదాము, ఇప్పుడు 4వ అధ్యాయము తెరచి, ప్రారంభించుకుందాము. ఒకవేళ ఇప్పుడు దీనిని సమయం లోపల ముంగించలేకపోతే, మనము మరొకసారి దీనిని కొనసాగించుదాము. తరువాత మనము వెళ్ళగలిగినంత వరకు 5వ మరియు 6వ దానిలో వెళుదాం, ఇంకా మనము ఎంత వెళ్ళగలమో, దానిలోనికి వెళ్ళుటకు ప్రభువు మనకు సహాయం చేయును.

5మనము ప్రారంభించకముందే, నేను చెప్పాలనుకుంటున్నాను, అక్కడ ఆ చోట కొద్దిసేపటి క్రితం సహోదరుడు డ్రమండ్ థామ్స్ మరియు అతని భార్య దర్శించుట జరిగింది. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నవారు ఆమె యొక్క తల్లి, తండ్రి. వారు ఈ మధ్యనే ఆఫ్రికా నుండి వచ్చారు. అక్కడనే వారు గొప్ప ఆత్మలను రక్షించు కూటములను మరియు, దైవీక స్వస్థతల కూటములను జరిగించారు. ఈ చిన్న స్త్రీ వారిని తీసుకువచ్చింది. వారి అమ్మమ్మ గారి స్థలము నుండి అని నేను నమ్ముతాను, మరొక దినమున, చెరసాల యందు సేవను కలిగియున్నారు, పాపులు ప్రభువు దగ్గరకు వస్తున్నారు, మరియు ప్రతీది కూడా. అది ఒక ఎంత అద్భుతంగా దేవుడు ఆ యవ్వన జంటను ఉపయోగించుకుంటున్నాడు. వారిప్పుడు అమెరికాలో కొద్దికాలము సువార్త భోధించుటకు వచ్చారు.

మీ కాపరులలో ఎవరైనా… సహోదరుడు డ్రమండ్. డ్రమండ్ కు నేను వ్రాయాలనుకుంటున్నాను, నేను ఆ పేరును అంతా కలిపివేస్తుంటాను. ఎందుకని అతను ఒక మంచి ఇంగ్లీషు పేరుని తీసుకొని దానిని మరచి పోకూడదు? అతనికి ఒక సంఖ్యను ఇవ్వండి, మీరేమంటారు, ఎందుకనగా నేను దానిని పలుకలేను, లేదు. మనలో సగము మంది కూడా దానిని పలుకలేరు అని నేను అనుకుంటున్నాను. "డ్రమంన్ట్" ఈ పేరుని ఈ విధంగా ఉచ్చరించుట మీకు సరియైన పద్ధతని నేననుకుంటున్నాను, సహోదరి ఛార్లెట్. మీలో ఎవరైనా వారిని కలిగియుండాలని కోరుతున్నారా, వారు మీ సంఘములో భోదించుటను మీరు వినాలని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

6ఆ స్త్రీ, ఆ సహోదరి ఛార్లెట్, ఆమె ఒక చిన్న బాలిక, ఆఫ్రికాలో వారికి కలిగిన అనుభవాన్ని కొద్దిసేపటి క్రితం ఆ సహోదరి తన సాక్ష్యమును మీడాకు చెప్పినది, మరియు నేను చెపుతున్నాను అది… బిల్లీ, అది మళ్ళీ పాత కాలములను మరలా తీసుకుని వచ్చినది, ఆఫ్రికా వాసులు మాట్లాడినట్లుగా వుంటుంది, కాబట్టి ఇక్కడ ఉన్న యుద్ధమే అక్కడ కూడా ఉన్నది.

మీలో ఎవరైనా సహోదరుడు డ్రమంన్స్ మరియు సహోదరి ఛార్లెట్ని మీ సంఘములో జరుగబోయే కూటమి కొరకు కలిగియుంటారా, మీరు కోరుకున్నట్లయితే, మెల్రోజ్ 7-3945 వద్ద సహోదరుడు టోనీ జాబెల్ని పిలువవచ్చును. మీలోని కొంతమంది సేవకులు, ఒకవేళ మీరు దానిని వ్రాసుకోవాలని అనుకున్నట్లయితే, నేను నిశ్చయంగా సహోదరుడుని పిలువమని సిఫారస్ చేస్తాను… ఎందుకనగా అతను ఒక మంచి ప్రసంగీకుడు, యదార్ధమైన బాలుడు, అది ప్రారంభించుటకై నిజముగా ఒక ప్రారంభం కావలసియున్నది, అతను భయము తెలియనివాడు, మంచి బాలుడు, నేను అతనిని ఎక్కువగా ఇష్టపడతాను. ఇప్పుడు గుర్తుంచుకొనండి, మెల్రోజ్ 7-3945.

నేను ఈ చిన్న కార్డుని ఇక్కడ వదిలి వెళుతున్నాను. అది వారియొక్క కార్డు. ఒకవేళ ఎక్కడైతే మీరు ఇప్పుడు మీరు నంబరును తీసుకోలేని స్థితిలో ఉన్నట్లయితే, మంచిది, లేక వివిధ ఆరాధనల మధ్య ఖాళీ సమయములలో మీరు ఈ రాత్రి దానిని తీసుకొనవచ్చును. వారి నంబరుని తీసుకొని మీ సంఘములలో కూటముల కొరకు అవసరమైనట్లయితే మీరు వారిని పిలువవచ్చును, లేక మీలో ఎవరైనా వారిని కావాలనుకున్నట్లయితే, ఎందుకనగా వారు కేవలం అమెరికా అంతా సువార్త చేస్తున్నారు.

అక్కడ ఏదో ఉన్నట్లుగా లేదా? ఆఫ్రికా నుండి మిషనరీలను ఇక్కడ అమెరికాకు పంపవలసియున్నది! ఇక్కడ ఉన్న ఈ స్థలములో వారు అవసరమైయున్నారు, అక్కడ కన్నా ఇక్కడ ఇంకా పాడయిపోయినది.

7కాబట్టి ప్రభువు మీ కొరకు మరొక సంవత్సరమును దయచేసినందుకు ఎంతమంది సంతోషంగా, ఆనందంగా ఉన్నారు? మార్గం చివరికి వచ్చేశాము ఇదిగో మనం ఇక్కడ ఉన్నాము. మనం అందరం చేసిన పాపములకు మరియు మనం చేసిన తప్పిదములు దేవుడు క్షమించుట కొరకు ప్రార్థన చేయండి.

ఇప్పుడు, ప్రారంభించే ముందు ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. నేను కోరుకుంటున్నాను, మీలో ప్రతి ఒక్కరికి, విజయవంతమైన, మరియు దీవెనకరమైన, ఆరోగ్యకరమైన నూతన సంవత్సరముగా ఉండవలెనని నేను మీ గూర్చి కోరుకుంటున్నాను. దేవుడు మీతో ఉండును గాక. మీరు భౌతికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా మరియు వస్తుపరంగా ఎదగాలని ఆశిస్తున్నాను. దేవుడు మీ కొరకు తీసుకొని రావలసిన ప్రతి కార్యము మీ మీద ఉంచాలని, ఆయన ఆ విధముగా మీకు చేయాలని నేను ప్రార్ధిస్తున్నాను.

8ఇప్పుడు, నేనొక నూతన సంవత్సరమును నా అంతట నేనుగా ఎదుర్కొన బోతున్నాను, భవిష్యత్తులో ఏమి జరగనైయున్నదో దేవునికి మాత్రమే తెలుసు. ఇక్కడనే మనము నిర్ణయాలు తీసుకోవలసియున్నది. మనము మనకు కావలసిన సరంజామా అంతా తీసుకున్నాము, సహోదరుడు జిమ్ అక్కడ ఉన్నాడు, అంతర్జాతీయ ఆహ్వానాల కొరకు మరియు ప్రపంచవ్యాప్తంగా కార్యాల కొరకు ఇప్పుడు అతను సిద్ధమౌతున్నాడు. దేవుడు మనలను ఎక్కడకు నడిపిస్తాడోనని చూచుటకు. నేను ప్రతిఒక్కరిని అభ్యర్థిస్తున్నాను - మీ హృదయము అంతటితో చేయు ప్రార్ధనలో దేవుడు నన్ను ఎల్లప్పుడు తప్పు నడిపింపులోకి వెళ్ళకుండునట్లుగా ప్రార్థన చేయండి. అది ఏదైయున్నప్పటికి ఖచ్చితంగా నిజాయితీగా ఉండి ఎన్నడు తప్పు నడిపింపులోకి వెళ్ళకూడదని నా కోరిక.

ఇప్పుడు నాకు మంచి సంవత్సరమును నేను కలిగియున్నాను.

9మరియు, అనేకసార్లు, ప్రజలు అపార్థం చేసుకుంటారు. వారు ఇలా అన్నప్పుడు, "సహోదరుడా బ్రెన్హాం, నీవు ఇతర సేవకులు చేస్తున్నట్లుగా, నీవు వెళ్ళాలనుకున్న ప్రదేశాలకు నీవు వెళ్ళడం లేదు, మరియు వారంతా వెళుతున్నారు." నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను, అది పరిశుద్ధ గ్రంధం నుండి మరియు మన ప్రభువు నుండి ఒక పాఠము నేర్చుకున్నాను, అదేమిటంటే యేసు ప్రదర్శనకారుడు కాదు. ఆయనకు అది కొదువగా ఉన్నది, ఆయన ప్రదర్శించే తత్వమును కలిగిలేడు. చూశారా, ఆయన ఎప్పటికీ ప్రదర్శనకారుడుగా లేదు. మరియు ఆయన శిష్యులు ప్రదర్శనకారులని నేను నమ్ముటలేదు. వారు ఎన్నడూ ఆ విధంగా వారికొరకు ప్రదర్శన చేసుకొనలేదు.

ఈ దినాన అక్కడనే మనము మనయొక్క పడవను తప్పిపోయాము అని నేననుకుంటాను. (బహుశా ఇది నా సొంత ఆలోచన అవ్వవచ్చును), మనము ఎప్పుడైతే ప్రతి ఒక్కదాని గురించి పెద్ద శబ్దము చేస్తామో, మీకు తెలుసా, ఎందుకు నేను అనుకుంటాను అది దేనిని పోలివుంటుంది అంటే అది ఒక పవిత్రమైన దాని కంటే ఒక ప్రదర్శన వలే ఎక్కువగా కనబడుతుంది.

10ప్రభువు యొక్క రాకడలో ఎవరు ఆయనను నిజంగా అంగీకరించారో మీరు గమనించారా? వారిలో సీమోను, అతని గురించి ఎవరునూ ఎన్నడూనూ వినలేదు కానీ అతను ప్రభువు కొరకు ఎదురుచూస్తున్నాడు; దేవాలయంలో గ్రుడ్డిదైన అన్నా, అరణ్యములోని బాప్తిస్మము ఇచ్చు యోహాను. మరియు వారు…

తొమ్మిది సంవత్సరములప్పుడు యోహాను అరణ్యములోనికి వెళ్ళాడు, ఆ అరణ్యములో, అతనికి 30 సంవత్సరములు వచ్చేవరకు మరలా కనిపించలేదు. అలాంటి వ్యక్తులు, ఎవరు రహస్యంగా విశ్వసించితిరో మరియు దీనంగా జీవించి, వారే ప్రభువు యొక్క రాకడ కొరకు ఎదురుచూచిరి. వారు ఎన్నడూ కూటములు పెట్టుకొని పెద్ద శబ్దములు చేయలేదు, మరియు పెద్ద సూచనలు పెట్టుకొని (ఆ ఘడియ, ఆ సమయం) మరియు తిరిగి ప్రసారము చేయుట, మరియు ప్రతీదీ ఎన్నడునూ చేయలేదు. ఆ విధానములో చేయలని అనుకుంటున్నవారికి అదంతయూ మంచిదే కానీ, నాకు మాత్రము, అవి అన్నీ క్రీస్తుని పోలి ఉన్నట్లుగా అనిపించుటలేదు.

JOHN 2:4

 

11నాకు తెలిసి ఆయన సహోదరులు, ఆయనతో ఈ విధముగా అన్నారు, "నీవు ఈ కార్యాలు, అద్భుతాలు చేశావు కదా, ఇక్కడ నుండి నీవు ఎందుకని యెరుషలేముకి ఎక్కిపోవు? మేమంతా పస్కా పండుగకు ఎక్కిపోతున్నాము, ప్రధాన యాజకుడైన కయిపని మరియు వారందరిని పిలిచి, అవి అన్నిటినీ వారికి తెలియనిమ్ము వారందరి ముందు ఆ విధముగా చేయుము, అప్పుడు వారు నీ క్రియలను చూడవచ్చును. మరియు ఇప్పుడు చూడండి. నీవు కొంతమంది చేపలపట్టువారి గుంపుతో కలసి నది దిగువ దగర, ఆ తక్కువ తరగతి ప్రజలతో వెర్రిపనులను చేస్తున్నావు. లోకము వాటిని చూచునట్లు నీవు ఎందుకని వాటిని ఇక్కడ చూపకూడదు?" చూశారా?

యేసు ఇలా అనెను, " మీ ఘడియ ఎల్లప్పుడూ మీ వద్దే ఉన్నది, నా ఘడియ ఇంకా రాలేదు."

PS 114:4•

ISA 40:3,4•

ISA 55:12•

MATT 3:2

 

12యోహాను ఒకసారి… బాప్తిస్మము ఇచ్చు యోహాను, ఆ లేఖనాలు యోహాను రాక గురించి చెప్పినవి, మరియు చెప్పెను ఎప్పుడైతే ఆయన వచ్చియున్నాడో, అది… ఎందుకు, అతను పుట్టుటకు 712 సంవత్సరముల ముందే "అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము" అని యెషయా చెప్పెను. మరియు ఇలా చెప్పెను, "అన్నీ పర్వతాలు గొర్రెపిల్లలవలె గంతులు వేస్తాయి, అన్నీ ఆకులు తమ చేతులతో చప్పట్లు కొడతాయి, ఎగువ ప్రదేశాలు దిగువ ప్రదేశాలుగా, మరియు దిగువ ప్రదేశాలు ఎగువ ప్రదేశాలుగా చేయబడతాయి" అవి అటువంటి ప్రచనములైయున్నవి!

ఆ దినము యొక్క సేవకులు ఏమి తలంచారని మీరు అనుకుంటున్నారు. వారు దీనిని పైకెత్తినప్పుడు, వారు ఖచ్చితముగా ఇలాగు అని ఉండవచ్చును, "మై! ఆ గొప్ప ప్రవక్త వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరికి అతను తెలియును. దేవుడు ఆకాశపు కప్పును (కానోపీస్) వెనుకకు జరిపి, పరలోకపు నడచు మార్గములను క్రిందికి విప్పును, ఒక అగ్ని రధం క్రిందకు దిగును, ఒక దూతల పరివారము ఆయనకు గౌరవముగా భూమి వరకు వస్తుంది."

అతను వచ్చినప్పుడు, అతను ఒక అస్పష్ట-ముఖము కలిగిన ప్రసంగీకుడు కొద్దిగా గొర్రె చర్మం కప్పుకుని ఉండేవాడు, చర్మపు ముక్కను నడుముకు పట్టీగా కట్టుకునేవాడు. బహుశా 3 లేక 4 నెలల వరకు స్నానము చేయనివాడు. అక్కడ ఉన్న అరణ్యములో నుండి బయటకు వచ్చి మోకాలి లోతు వరకు బురదలో నిలబడి, "పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది కనుక మారుమనస్సు పొందండి!" అని ప్రసంగించుచుండెను. ఎలాంటి నగరాలకు అతను ఎన్నడునూ వెళ్ళలేదు. ఎవరైనా అతని మాట వినాలనుకున్నట్లైతే, అతనిని కావలనుకునేవారు ఆ యోర్దాను నది వద్దకే వచ్చేవారు. అతను ఏం చేశాడు? అతను దేశమును వణికించాడు, అతను ప్రపంచాన్ని వణికించాడు.

1COR 1:21

 

13ఆ ప్రజలపైన వణికింపు అనేది జరుగుతున్నప్పుడు వారికి దానిని గురించి ఏమియు తెలియదు. ఎప్పుడైతే యేసు వచ్చాడో, ఆయనెప్పుడూ తనంతట తానుగా ఉన్నత వ్యక్తుల మధ్యన స్థానమును ఆశించలేదు. ఆయనే తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఎవరైతే ఆయన కోసము ఎదురుచూస్తున్నారో - వారి కోసం వచ్చెను, అదిగో అక్కడనే వణికింపు అనేది వచ్చింది. ఈ దినాన అదే ఆయన చేస్తున్నది. దేవుడు ఎవరినైతే పిలిచాడో వారి దగ్గరకు పరిశుద్ధాత్మ వస్తుంది. ఎన్నుకోబడిన వారి మధ్య గొప్ప కదిలింపు వస్తుంది, గొప్ప శక్తివంతమైన కార్యాము జరుగుచున్నది, కానీ ప్రపంచానికి వాటి గురించి ఏమియు తెలియదు.

అందమైన పెద్దవాటి గురించి, మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రసారమయ్యేవి, టెలివిజనులు, లక్షల రూపాయల వెలగల భవనాలు, మరియు అవన్నీయూ, మరియు అవి అన్నీ గొప్పవి అని తలుస్తున్నారు. అవి అన్నీ దేవుని దృష్టికి వెర్రితనము. దేవుడు పెద్ద కార్యములను చూడడు. మానవుడు వేటినైతే "వెర్రితనము" అని పిలుస్తాడో, వాటిని దేవుడు "గొప్పవి" అని పిలుస్తాడు, మానవుడు వేటినైతే "గొప్పవని" పిలుస్తాడో, దేవుడు వాటిని ''వెర్రితనము" అని పిలుస్తాడు. " వెర్రితనము కలిగిన ప్రసంగాల ద్వారా తప్పిపోయిన వారిని రక్షించుటయే ఆయనకు సంతోషం కలిగిస్తుంది."

14ఇప్పుడు, యోహాను… వారు ఏమి చెప్పియుండవచ్చని మీరు తలుస్తున్నారు? "అక్కడొక మూఢభక్తి కలిగిన ముసలి వాడున్నాడు, పాత అస్పష్ట-ముఖమువలే ఉండువాడు, గొర్రె చర్మము చుట్టుకొని అరణ్యము నుండి బయటకు వచ్చినవాడు. మరియు, ఎందుకు, యోర్దాను నది ప్రక్క కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా, అతను బురదలో నిలబడి యున్నాడు, దానిని అక్కడ బయటకు మోసుకొనిపోతున్నాడు. ఆ కార్యము గురించి ఎవరు విన్నారు?"

యేసు వచ్చినప్పుడు: "ఒక మెస్సీయా, అక్కడ ఒక పశువుల పాకలోని ఒక గడ్డి మోపులో, మరియు చుట్టూ పశువులు సంచరించు స్థలములో జన్మించెను? మరియు మీ ఉద్దేశ్యము ఒక తల్లితో… అక్రమముగా, ఆయన తండ్రిగా… ఆ తల్లి వారి వివాహమునకు ముందుగానే తల్లియైనది. ఎందుకు? ఆయన పవిత్ర వివాహ బంధమునకు వెలుపటనే జన్మించాడు. మరియు ఆయన? ఓ, మై! చూశారా? కాని అది గొప్పదైయున్నది, వారికి అది తెలియదు, చూశారా. వారికది తెలియదు.

మరియు ఈ దినాన ఉన్న సువార్త — గొప్పది! ఆ సువార్త ముందెన్నడూ లేనంతగా వణికింప చేస్తుంది, కానీ అది శేషమైన వారిని వణికింప చేస్తున్నది. అది నిజము, వారిని సిద్ధపడునట్లుగా చేస్తుంది.

MATT 10:5,6,14,15•

MARK 6:11•

LUKE 10:10-12•

JOHN 1:11

 

15ఆయన తన స్వకీయుల దగ్గరకు వచ్చాడు, ఆయనను తన స్వకీయులే అంగీకరించలేదు. ఆయన శిష్యులకు ఇలా చెప్పెను, "అన్యజనుల యొక్క మార్గములలోకి వెళ్ళవద్దు, కానీ ఇశ్రాయేలియులలో తప్పిపోయిన గొర్రెల వద్దకు వెళ్ళుడి, మరియు మీరు వెళ్ళనప్పుడు, మిమ్ములను చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొన్నట్లే - మీరు పట్టణములోకి వెళ్ళినప్పుడు, వారు మిమ్ములను చేర్చుకొననట్లయితే, మీ పాదములకున్న ధూళిని దులిపి అక్కడ నుండి వెళ్ళుడి. నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, తీర్పు దినాన ఆ పట్టణపు గతి కంటే సొదొమ మరియు గొమొర్ర గతి ఓర్వతగినదై యుండును."

ఆ మనుష్యులను నిరాకరించిన ఆ పట్టణములలో ప్రతి ఒక్కటి ఈ దినాన బూడిదలో పడియున్నవి. వారిని అంగీకరించిన ప్రతి ఒక్కటీ ఇంకనూ ఈ ఘడియలో ఒక శిఖరమువలే నిలిచేవున్నవి. అది నిజము, చూశారా. ఆయనకు జవాబు ఇచ్చుటకు ఎక్కువ సమయం పట్టవచ్చును, కానీ దేవుడు జవాబిస్తాడు. చింతించవద్దు. నేను దాని పైన ప్రారంభించబోవట్లేదు. నేను ఎప్పుడూ ప్రత్యక్షతలోకి వెళ్ళాలని ఆశించలేదు. ఓ!

ఓ! నేను ఆయనను చూడాలనుకున్నాను, ఆయన ముఖమును చూడాలని,

అక్కడ ఆయన యొక్క రక్షించు కృపను నిరంతరం పాడుము;

ఆ మహిమా వీధులలో నన్ను గొంతెత్తి పాడనీయము;

ఎప్పుడైతే ప్రతి ఒక్కదానిని దాటిపోయి, మరియు చివరికి గృహమును చేరుకుంటానో,

శాశ్వతమైన ఆనందంలోకి వెళ్ళుదును.

MARK 11:25

 

16నేను దానిని ఇష్టపడతాను. ఒక్క నిముషము మనము మన శిరస్సులను వంచుదము. ఇది చేయటకు ముందు మీరు నిలబడుటకు ఇష్టపడతారా?నేను అనుకుంటున్నాను… పరిశుద్ధ గ్రంథం చెపుతుంది, "మీరు ప్రార్ధించుచూ నిలబడినప్పుడు, క్షమించండి." మీలో ఎంతమంది ప్రార్ధనా అవసరత కలిగియున్నారో తెలియుటకు మీ చేతులను పైకెత్తగలరా? గుర్తుంచుకోండి, దేవుడు దీనిని చూస్తాడు, ఆయనకు దీనంతటి గురించి తెలుసు.

17మా పరలోకపు తండ్రీ, ప్రభువైన యేసు నామము ద్వారా మేము నీ దైవీక పవిత్రతను సమీపించుచున్నాము, మనుష్యుల మధ్యలో ఇవ్వబడిన ఆ నామము చాలును, పరలోకములో మరియు భూలోకములోని ఉన్న కుటుంబాలకు ఇవ్వబడిన నామమే యేసు.

మరియు మేము ప్రార్ధించుచున్నాము, ప్రభువా, మా కృతజ్ఞతా వందనాలు అందుకొనుము, మొదట, ప్రారంభించుటకు, కనుమరుగౌతున్న ఈ సంవత్సరమున దీని గురించి ఈ రాత్రి మేము మీకు ఆరాధనలో ఇచ్చుచున్నాము, స్తుతులను ఇచ్చుచున్నాము, నీ వాక్యమును పఠించుచున్నాము మరియు "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అంటే ఏమిటి అనేది తెలుసుకో బోవుచున్నాము. మీకు కృతజ్ఞతలను తెలియచేయుటకు కాగితం మీద ఎన్ని సంగతులను మేము పెట్టగలము! చిన్నదైనది, మరియు ఇరుకైయున్నదానిని నుండి తప్పించుకొని ఈ సంవత్సరమును మేము కలిగియున్నాము, ఎక్కడైతే సాతాను అణిచివేసి మా ప్రాణములను తీసివేయలనుకున్నాడో, కానీ నీవు మాలో అది జరుగనీయలేదు. కాబట్టి మేము ఇంకనూ కొనసాగించుచున్నాము. ప్రభువా, మేము కేవలం నిన్ను మహిమపరచుటకు మరియు ఘనపరచుటకే ఈ భూమి మీద జన్మించామని మేము విశ్వసిస్తున్నాము.

మరియు మేము ప్రార్ధించుచున్నాము, తండ్రీ, మా ప్రతియొక్క అతిక్రమమును క్షమించమని మరియు ఈ ప్రయాణమంతటిలో మేము చేసిన ప్రతి తప్పును క్షమించండి. ఈ రాత్రి మనము ఒప్పుకుంటున్న మన తప్పులను మనము మరచిపోవుదము. ప్రభువైన యేసు నామములో, వాటిని మరుపు అను సముద్రములో సమాధి చేయుదుము, వాటిని మరెన్నడూ తిరిగి త్రవ్వవద్దు, కానీ ఇప్పుడు క్రీస్తు యేసు అనే పరిపూర్ణ మనిషి యొక్క ముద్రవైపు నడుపుము.

తండ్రీ మాకు ఈ రాత్రి వాటిని దయచేయుము.

MATT 6:19,20

 

18మీ సేవకుడు మాట్లాడుతుండగా, వారిలో ప్రతి ఒక్కరనీ, నీవు జీవపు ఆత్మతో అభిషేకించుము, మరియు ముందెన్నడూ వారు ప్రసంగించని రీతిలో వారు ప్రసంగించి మరియు ఈ రాత్రి సంఘములోకి వర్తమానములను తీసుకొని రమ్ము.

ఈ చిన్న పైకప్పు క్రింద మేమందరమూ కూడియున్నాము, మేము మీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము ప్రభువా. వేడియైన మంట ప్రక్కన మేము కూర్చున్నందుకు మరియు మా తలపై కప్పు ఉన్నందుకు నీకు వందనస్తులమై యున్నాము. మాకు కావసినదంతయూ అదియే. మా సంపద ఈ లోకమునకు సంబంధించినది కాదు, అది రాబోయే లోకమునకు సంబంధించినదై యున్నది. దేవా, అక్కడైతే దొంగలు విరగగొట్టి దొంగతనం చేయలేరని మేము విశ్వాసము కలిగియున్నాము మరియు చిమ్మట వాటిని పాడుచేయలేవు, మా సంపద నిత్యజీవము కోసమై యున్నది. తండ్రీ, మేము మా జీవితాలలోని దినములను ఆనందకరముగా గడుపుటకు మాకు అనుమతి ఇవ్వమని ప్రార్ధన చేస్తున్నాము.

మమ్మును నీ సేవకు తగినవారిగా చేయుము, మాలోనుండి దుష్టత్వము అంతయూ తీసివేయుము, ప్రభువా. గడిచిన కాలములో, బహుశా ఇతరులను బాధపెట్టాలనే ఆలోచన కలిగే వేరులు మరియు మా జీవితాలలోని చేదుకరమైన వాటిని తీసివేయము, అట్లైన మేము నీ ముందర దీనత్వముతో మరియు మధురమైనవారిగా ఉండవచ్చును. ప్రభువా, మాకది దయచేయుము. మేము ముందెన్నడూ పొందనటువంటి గొప్ప సంవత్సరముగా ఈ రాబోవు సంవత్సరమును ఉంచుము. దానిని దయచేయుము. నీ వర్తమానముల కొరకు ఈ రాత్రి మేము ఎదురు చూచుచుండగా, మాకు నీ వాక్యమును అందించుము. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. కూర్చొనవచ్చును.

19ఇప్పుడు, అక్కడ ఆ గడియారము తిరుగుతుండటం చూస్తే నాకు ఒక విధమైన కష్టముగా వుంటుంది, మరియు నేను నా సహోదరులను ఎక్కువ సేపు ఎదురు చూచుటలో ఉంచను, కాబట్టి నేను వీలయినంత త్వరగానే ఈ భాగమును ముగిస్తాను. మరియు, బహుశా, ఒకవేళ మనము ముగించలేకపోతే, దేవుని చిత్తమైతే రేపటి ఉదయాన దీనినే కొనసాగించుటకు ప్రయత్నము చేద్దాం. మరియు తరువాత ఒకవేళ సహోదరుడు నెవిల్ క్రిందకి దిగి రానట్లయితే, లేక ఏది జరిగిననూ, మంచిది, తరువాత నేను ప్రయత్నిస్తాను, దేవుని చిత్తమైతే, ఇక్కడ అదివారపుబడి ఆరాధనలో దీనిని కొనసాగిస్తాను.

20ఇప్పుడు, ఇప్పుడు మీరు మరచిపోవద్దు:

ప్రార్థన, ప్రార్థన, అదే ఏకైక మార్గము

…ఉన్నత స్థలములు చేరుటకు;

ప్రార్థన, ప్రార్ధన, విశ్వాసపు ప్రార్ధన

అది దేవుని ఆశీర్వాదములను క్రిందకి తీసుకొనివచ్చును.

మీరు ఎల్లప్పుడూ చేయుటకు అదియే ఏకైక మార్గము. మనమందరమూ కలసి దానిని పాడుదాము. ఇప్పుడు అదే నూతన సంవత్సరమైయున్నది! మనకు చాలా సమయమున్నది.

ప్రార్థన, ప్రార్థన, అదే ఏకైక మార్గము

ఉన్నత స్థలములు చేరుటకు;

ప్రార్థన, ప్రార్ధన, విశ్వాసపు ప్రార్ధన

అది దేవుని ఆశీర్వాదములను క్రిందకి తీసుకొనివచ్చును.

కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్ధన దేవుని ఆశీర్వాదములను క్రిందకి తీసుకొనివచ్చును, తిరిగి ప్రార్థనను కొనసాగించుదాము. కావున మనము దేవుని రాజ్యములో గడచిన సంవత్సరములో లేని క్రొత్త ముఖములు ఇప్పుడు కలిగియున్నందుకు సంతోషంగా ఉన్నాము. మరియు నేను అన్ని సమయాలలో కేవలం ప్రార్థనను అధికంగా మరింత అధికముగా చేస్తూనే ఉంటాను. అవతల ప్రక్కన ఏమి ఉన్నదో దాని గురించి ఇంకనూ సగభాగము కూడా చెప్పలేదు.

21ఇప్పుడు, మనము ప్రకటన 4వ అధ్యాయమునకు పరిశుద్ధ గ్రంథమును త్రిప్పుదాము.

ఏవరికైనా బైబిలు అవసరమున్నదా? మీలో ఎవరైన మమ్ములను అనుసరించాలనుకుంటే ఇక్కడ పైన కొన్ని బైబిల్స్ ఉంచబడ్డాయి. అంతా మంచిది, మీలోని ద్వారపాలకులు ఒకరు ముందుకు వచ్చి ఇప్పుడు, మనము కట్టబడిన చాలా బైబిల్స్ ను కలిగియున్నాము. ట్రస్టీలలో ఒకరుగానీ, ద్వారపాలకులు లేక మరెవరైనా, ఇప్పుడే ఇక్కడకు పైకి రండి. సహోదరా జాబెల్, మరొకరు కూడా ముందుకు రండి. ఒకవేళ మీరు రెండువైపులా తీసుకోవాలి అనుకున్నట్లయితే, చర్చి మధ్యలో నడువుటకు ఉన్న దారికి ఇరు ప్రక్కల ఉన్న వారికి అందజేయండి. మరియు మీలో ఎవరికైనా ఒక బైబిల్ కావాలనుకుంటే మాతోపాటుగా అనుసరించాలి అనుకుంటే, ఎందుకు, మీరు వాటిని తీసుకొని కావలసినవారికి ఇవ్వండి.

22మరియు ఇప్పుడు మీరు ప్రకటన 4వ అధ్యాయము త్రిప్పవలెనని మేము కోరుచున్నాము. మరియు, ఇప్పుడు, ఒకవేళ మీరు వెనుక కూర్చీలలో కూర్చొని ఉంటే ముందుకు ఇక్కడకు జరిగి రావలనుకుంటే, ఈ రాత్రి మనకు పైకి కదులుటకు చాలా విశాలమైన గది ఉన్నది, మరియు దానితో మీరు సౌకర్యముగా ఉండండి, మరియు మనము పాఠములోకి వెళదాం, మరియు దానిని చదువుటకు నాకు సహాయం చేయండి మరియు మనము అందరమూ కలసి కూడుకొని దాన్ని ధ్యానించుదాం. ఇక్కడ పైన కూర్చీలు ఉన్నవి. మరియు ఒక జంట వచ్చుట నేను చూస్తున్నాను. ఇదిగో ఇక్కడ రెండు కుర్చీలు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఒకరు కూర్చొనుటకు సరిగ్గా ఇక్కడే ఉన్నది. సరిగ్గా ఇక్కడ వెనుకే ఉన్నది, ఇటు ప్రక్కన సీట్ల ఉన్నవి. ఫ్యాన్స్ అన్నీచోట్ల ఒకే మాదిరిగా ఉన్నాయి.

ఏడు సంఘకాలముల మీద ఎనిమిది దినములు జరిగిన పాఠమును ఎంతమంది సంతోషించారు? మీకు వందనములు. అది నన్ను సంతోషపడునట్లు చేస్తుంది, ఎందుకనగా వాటిలో నుండి నేను నిజముగా గొప్ప ఆశీర్వాదము నా వరకు నేను పొందుకున్నాను.

REV 3:20

 

23ఇప్పుడు, ఈ రాత్రి 4వ అధ్యాయముతో యోహాను లవొదికయ సంఘకాలముతో మాట్లాడుతున్నాడు, ఇప్పటికి దీనిని మనము వదిలి వేస్తున్నాము. మరియు ఈ లవొదికయ సంఘకాలములో, మిగిలిన అన్నీ సంఘకాలాలలోకి ఈ సంఘకాలము అత్యంత గందరగోళమైనది.

ఈ లవొదికయ సంఘకాల చివరభాగములో అత్యంత దయనీయమైన కార్యమును మనము కనుగొన్నాము, యేసు తన స్వంత సంఘము బయట నిలబడియున్నాడు ఆయన ఆ విధముగా బయటకు పంపించబడి యున్నాడు, ద్వారమును తట్టుచున్నాడు, తిరిగి లోపలికి వచ్చుటకు ప్రయత్నించుచున్నాడు. అది పాపకరమైనది కాదా? నేను ఇప్పటి వరకు చదివిన లేఖన భాగాలలో అదే అత్యంత దయనీయమైన ఒక లేఖన భాగము. యేసు, తన స్వంత ద్వారము బయట ఉండెను, ఆయన స్వంత సంఘము ఆయనను బయటకు పంపి వేసినది, ఆయన వారిని రక్షించాలనే ఒకే ఒక ఉద్దేశ్యముతో లోపలికి రావాలని ప్రయత్నిస్తున్నాడు. "ఏ మనుష్యుడైనా ద్వారము తెరిచి, [తిరిగి నన్ను నా స్వంత గృహములోనికి రానివ్వుము], నేను అతనితో, అతను నాతో కలసి భోజనము చేయుదము, అది బాధాకరమైనది కాదా?" పరలోకపు దేవుడిని ఆయన యొక్క స్వంత సంఘమే వారి యొక్క ఆచారాలు మరియు సంస్థాగతమైన సంఘముగా మరియు వారు చేయు మార్గమే ఆయనను బయటకు పంపివేసినది వారి యొక్క ఆచారాలనే వారు అంగీకరించారు - అదే ఆయనను సంఘము నుండి బయటకు పంపినది.

24ఆ కార్యము యేసును శిలువ వేసిన దినముకు మాదిరిగానే ఉన్నది. మరియు ఒక హంతకుడైన బరబ్బాను అంగీకరించి మరియు అది యేసుని శిలువ వేసినట్లున్నది, ఒక హంతకుడు, అని రుజువు పరచబడినవాడిని, వారి మధ్యలోనే ఉన్న ఆ హంతకుడిని విడుదల చేసిరి, మరియు అంగీకరించారు, మరియు యేసుక్రీస్తును త్రోసివేసిరి, వారికి జీవాన్ని ఇవ్వగలిగినవాడు కేవలం ఆయనొక్కడు మాత్రమే.

మరియు అటువంటి కార్యములనే ప్రతియొక్క సంఘశాఖ కలిగియున్నది, మరియు ఈ దినాన ఆ పెంతికోస్తు సంఘశాఖ కూడా పొందుకొన్నది. అవి సంస్థాగతమైన సంఘముగా మారిన వెంటనే ఆ సంఘశాఖలు చనిపోవుట వారు చూశారు. అవి ఎప్పుడైతే సంఘశాఖగా మారినవో వాటికి చరిత్ర యొక్క పేజీలలో ఎన్నడూ కూడా వారు చేసినది ఏదీ ఉండదు, అవి వెంటనే చనిపోయినవి. వారు ఎప్పుడైతే సంఘశాఖగా మారియన్నారో అప్పటి నుండి, అన్ని సూచక క్రియలు, అద్భుతాలు, వరములు మరియు ప్రతీదియూ వారిని వదిలి వెళ్ళి పోయాయి. మరియు వారు ప్రభువైన యేసు వారికి జీవానిచ్చేవాడని అంగీకరించడానికి బదులుగా, వారు తిరిగి నేరుగా వెనుకకు వెళ్ళి బరబ్బాను వారి మధ్యలోనే మరలా వదిలి వేసిరి. అది ఏదో భయంకరమైన కార్యము కాదా? దేవుడిని ఆయన స్వంత సంఘము నుండి బయటకు పంపివేయబడుటలో ఆశ్చర్యము లేదు. మరియు చివరి సంఘకాలములో నిలబడి తట్టుచు, తిరిగి లోపలికి వచ్చుటకు ప్రయత్నించుటలో కూడా ఏమి ఆశ్చర్యము లేదు.

25ఇప్పుడు, మనము ప్రకటన గ్రంథము మూడు భాగములుగా విభజించబడి యున్నదని కనుగొన్నాము, మొదటి భాగము, మొదటి మూడు అధ్యాయములు, సంఘమునకు సంబంధించినది, వర్తమానము, దూత… సంఘమునకు దూతలు. మరియు… 3వ అధ్యాయము నుండి ఆమె అదృశ్యమై, తిరిగి 19వ అధ్యాయము వరకు కనపడదు, 19వ అధ్యాయములో తిరిగి వస్తుంది, ఈ మధ్య కాలములో, దేవుడు యూదులతో సంభాషిస్తున్నాడు. తరువాత, అప్పటి నుండి, అది గొప్ప యెరుషలేము పట్టణము వచ్చుటకు, మరియు ముద్రించబడని ఇశ్రాయేలియుల ప్రజలకు, మధ్య కాలమైయుండును, మరియు మొదలగునవి చివరి సమయములో జరుగనైయున్నవి.

REV 1:9

 

26ఇప్పుడు, ఈ రాత్రి మనము వదిలివేయుచున్నాము. దీని తరువాత వెంటనే, యోహాను చూశాడు. ఆ పత్మాసు ద్వీపం మీద సముద్ర తీరము నుండి పత్మాసు ద్వీపం ఎంత దూరం ఉన్నదో ఎంతమందికి జ్ఞాపకం ఉన్నది? అక్కడి నుండి ఎంత దూరమున్నది? తీరము నుండి సుమారుగా 30 మైళ్ళు, అది నిజము, పత్మాసు ద్వీపమునకు చుట్టూ కొలత ఎంత దూరము? దాని యొక్క భౌగోళికం మీకు గుర్తున్నదా? దాని చుట్టుకొలత సుమారుగా 15 మైళ్ళు, రోమనులు దీనిని శిక్షాకేంద్రముగా వాడియుండిరి, ఖైదీలను దీనిలో వేసేవారు. మరియు యోహాను అందులో ఎందుకని వేయబడ్డాడు? అతను ఏమి చేశాడని? అతను ఏదైనా దొంగిలించాడా? లేదు. మంచిది, అతను ప్రజలను గందరగోళ పరుస్తూ మరియు ఏదైనా దయ్యపు కార్యాలు చేసిన కారణముచేత అతనిని అందులో పడవేశారా? లేదు. అతను ఏ కారణముచేత అందులో వేయబడ్డాడు? కారణము, దేవుని యొక్క వాక్యము కొరకు మరియు ఆయన సాక్ష్యము కొరకు, సువార్తని ప్రకటిస్తున్నందుకు.

27ఒక క్రైస్తవునికి మేలు కాని కార్యము ఏదైనా జరుగునా? లేదు, లేదు. ఎందుచేత దేవుడు అతనిని ఒంటరిగా ఆ ద్వీపములోనే ఉంచ వలసివచ్చినది? మనకు ఈ ప్రకటన గ్రంథమును ఇచ్చుటకే చూశారా, దేవుడు ఆయన కోరినప్పుడు సాతాను కళ్ళ మీద నుండి ఊలుని ఏ సమయములోనైనా లాగగలడు, ఆయన చేయలేడా? ఆయన చాలా సునాయసముగా చేయగలడు. నేను ఆయన్ను ప్రేమిస్తాను, ఎందుకనగా…

నేను తెలివైనవాడిగా ఉండాల్సిన అవసరం లేదు, చూశారా. నేను ఒకవేళ తెలివైన వాడినైతే, దీనినంతటి గురించి బహుశా నేను మరచిపోవచ్చును, ఎందుకనగా ఆయన కంటే జ్ఞానము కలిగిన వారెవ్వరూ లేరని నాకు తెలుసు. అందుచేత నేను కేవలం… నేను ఏమి కలిగియున్నానో అదంతయూ నేను ఆయనకు సమర్పించుకున్నాను మరియు ఆయన ఏది చేయమంటే అది చేస్తాను. అది చాలును. కొన్నిసార్లు నేను ఆలోచించు విధానమునకు అది వ్యతిరేకముగా ఉంటుంది. కానీ నాకు తెలుసు, దానికి ఆయన నాయకత్వము వహిస్తున్నట్లయితే, ఆయన తెలివైనవారు. ఆయన ఏమి చేస్తాడో ఆయనకు తెలుసు; నాకు తెలియదు. కేవలం నేను ఆయనను చేయనిస్తాను. (మీరు చూశారా?), మరియు తరువాత అదంతయూ మంచిదై ఉంటుంది. చూశారా? నేను కేవలం ఆయనను చేయనిస్తాను. అంతే, సహోదరుడా నెవిల్ అవును, అయ్యా, నేను దానిని కేవలం ఆయనను చేయనిస్తాను, చూశారా. ఆయన ఏమి చేయుచున్నాడో ఆయన ఒక్కడికే తెలుసు. నాకు తెలియదు, చూశారా. కాబట్టి నేను చాలా గొప్పవైన పెద్ద అందమైన కార్యాలు మరియు అటువంటి కార్యాలు కలిగియుండాలని ప్రయత్నము చేయుట లేదు, మరియు కేవలం నన్ను నేను తగ్గించుకుని ఇలాగు అందును "తండ్రీ, నీకు ఏ సమయంలో కావలసియున్ననూ, ఇదుగో నేను ఇక్కడే ఉన్నాను." కాబట్టి నువ్వు ఆ మాదిరిగా మంచిదానిలో వెళ్ళినట్లయితే మరియు ప్రతిసారి అందులోనుండి మంచిదే బయటకు వస్తుంది.

REV 3:22

 

28కాబట్టి యోహాను … మరియు యోహాను ఆ ద్వీపములోకి వెళ్ళక పోయున్నట్లయితే, ఒకవేళ అక్కడ యోహాను ఈ గ్రంథమును కలిగి యుండకపోతే, మనము ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథమును కలిగియుండే వాళ్ళము కాము. అది దేవుడు మనకు ప్రకటన గ్రంథమును ఇచ్చుటకు ఏర్పరచిన మార్గము. ఆయన అక్కడ దూరముగా ఉన్నాడు, నేను అనుకుంటున్నాను, సుమారుగా మూడు సంవత్సరములు, మరియు ఈ ప్రకటన గ్రంథమును రాశాడు.

ఇప్పుడు, తరవాత ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములోని 22వ వాక్యము చివర "ఆత్మ సంఘములతో చెప్పుచున్న మూట చెవిగలవాడు వినునుగాక? అనే స్వాగతం దగ్గర మనం అతనిని వదిలివేద్దాము.

REV 4:1

 

29ఇప్పుడు, 4వ అధ్యాయమును ప్రారంభించుదాము:

ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా మరియు అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని, ఆ మాటలాడినవాడు ఇక్కడకి ఎక్కిరమ్ము ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెదననెను.

మనము ఇందులో వాక్యము వెంబడి వాక్యమును తీసుకొనబోవుచున్నాము. మరియు ఇక్కడ అనేకమైన లేఖనాలను నేను వ్రాసుకొనియున్నాను, వాటిలోనిది ఒకటి ఈ పుస్తకము, మరియు దీని లోపలికి మనము ఎంత వెళతామో అనేది నాకు తెలియదు. ప్రభువే మనల్ని నడిపించును గాక!

ఇప్పుడు, గమనించండి. వాక్యమేమంటే ఈ సంగతులు జరిగిన తరువాత (సంఘకాలములు ముగిసిన తరువాత) మరియు ఇదంతయూ దాని తరువాతనే, దీనంతటికీ సంబంధమున్నది, భూమి పైనుండి సంఘము ఎత్తబడిన తరువాత జరుగనున్నవి. చూశారా, ఎత్తబాటు జరిగిన తరువాత, ఇప్పుడు తిరిగి వెనుకకు వెళ్ళి ఇశ్రాయేలియులను ఎంచుకొనినట్లుగా వుండును. సంఘకాలము ముగిసిన తరువాత, సంఘ కాలములు ముగిసిన తరువాత, మరియు వారు. ఆమె తన పెండ్లి కుమారుడితో ప్రకటన 19వ అధ్యాయములో తిరిగి వచ్చువరకు సంఘము మరెప్పుడు కనపడలేదు. వివాహామహోత్సవమునకై దేవునికి వందనములు!

REV 19:7

 

30దానిని మనము చదువుదాము. మనము ఈ లేఖనమును చదివి ముందుకు వెళ్ళుటకు ఇష్టపడుతున్నారా? మంచిది. ప్రకటన 19 అధ్యాయమునకు త్రిప్పండి. మంచిది, అయ్యా, ప్రకటన 19. ప్రకటన 19:7వ వచనము వద్ద నుండి ప్రారంభించుదాము, ఇది సంఘము తిరిగి ఎప్పుడు కనిపిస్తుందో తెలియచేస్తుంది. 19వ అధ్యాయములో కనుపించు వరకు మరెప్పుడూ కనపడలేదు.

గనుక మనము సంతోషపడి, ఉత్సహించి, ఆయనను మహిమపరచెదము, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనియున్నది.

ఓ, నేను ఆ సంగతి మీద అర్ధరాత్రి వరకు ప్రసంగించినా సగభాగము కూడ పూర్తవ్వదు. చూడండి, "ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొని యున్నది. "

31(ఆ గడిచిన దినమున ఛార్లె, నెల్లీ, మరియు రాడ్ని మరియు మీరందరూ, కేవలం మనము అక్కడ క్రింద, దేనిగురించి మాట్లాడుకున్నామో, చూశారా.) ఎలీషా, ఏలియా మీద దుప్పటిని విసిరినప్పుడు లేక ఏలియా, ఎలీషా మీద దుప్పటిని ఉంచినప్పుడు, అతను వెనుకకు వచ్చి మరియు తిరిగి దానిని తీసుకొని, ఆయన మీద ఉంచుకొని మరియు దానితో ఆయన యోర్దాను దాటే వరకు నడచి వచ్చాడు, మరియు కొండపైకి వెళ్ళాడు, మరియు రథములో పైకెళ్ళాడు, దుప్పటిని క్రిందకు వదిలేశాడు. ఎప్పుడైనా క్రైస్తవుడు మొదటగా రక్షింపబడితే, అతని ముఖము క్రీస్తు వైపు తిరుగుతుంది, తరువాత తను చేయుటకు తనంతట తాను కొంత కలిగి యుంటాడు. అతను చేయవలసిన, మరుసటి కార్యము, అపవిత్రమైన అలవాట్ల నుండి తనను తాను పవిత్ర పరచుకోవటం, ఆమె తనంతట తాను సిద్ధపడుటకై ప్రతియొక్క భారమును ప్రక్కన పెట్టుట. వధువు తనను తాను సిద్ధ పరచుకొనుట!

32నాకు ఒక చిన్న కథ జ్ఞాపకం వస్తున్నది. దీనిలో మనము ముందుకు వెళ్ళబోయే ముందు నేను దీనిని మీకు తప్పక చెప్పాలని అనుకుంటున్నాను. కొంతకాలము క్రితం, ఇక్కడ పడమర వైపు చాలా సంవత్సరాల క్రితం, ఆర్మర్ (మాంసమును ప్యాకింగ్ చేసే సంస్థ) మరియు స్విఫ్ట్ ప్యాకింగ్ సంస్థ వారు ఏ విధముగా చేస్తారంటే, వారు అక్కడికి వచ్చి పశువులను కొంటారు మరియు పశుశాలలను కొంటారు. వారు చాలా ఎక్కువ ధనమును కలిగి యుంటారు, మరియు వారు చిన్న చిన్న పశుశాలలు అన్నీటిని కొంటుంటారు, లక్షల ఎకరాల పశుశాలలు వారు కలిగి యుంటారు, ఈ పెద్దవైనవి, మంచివైన వాటిని వారు హెర్ఫోర్డు పశువులను విభాగాలుగా నడుపుతుంటారు. మరియు పశువులను, పశుగ్రాసమును ఒకచోట నుండి మరియొక చోటుకి తీసుకుని వెళ్ళుటకు, వారు స్వంతవైన రైలు మార్గాలు కలిగి యుంటారు.

ఆర్మరు మరియు స్విఫ్ట్ పెద్ద పశుశాలను కలిగియున్నారు, ఒక దినమున వారు తమ దగ్గర పనులను పర్యవేక్షించే అధికారిని కలిగియున్నారు, అతను ఆ పశుశాలలో పనిని పర్యవేక్షించే అధికారియైయున్నాడు, ఆయన నలుగురు లేక ఐదుగురు కుమార్తెలను కలిగియున్నాడు. మరియు వారు ఆ ఆర్మరు సోదరులలో ఒకడైన పెద్ద సహోదరుడను కనుగొన్నారు — లేక సహోదరులు కాదు, కానీ కుమారులు, వారు ఆ పశుశాలను దర్శించాలని అనుకున్నారు. మరియు అతను ఒక యవ్వన ఒంటరి మనుష్యుడు. ఈ స్త్రీలందరునూ అతను వచ్చీ రాగానే తమ చేష్టలతో అతనిని ఖచ్చితంగా తమ వశం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి దానికొరకు సిద్ధపడుతున్నారు మరియు రానైయున్నదాని కొరకు ప్రతియొక్క దానిని సిద్ధపరస్తున్నారు.

33అతను అక్కడకు వచ్చినప్పుడు, అతనిని వారు కలువబోవుచున్నారు. వారు ఆ పాత పొలిమేర దినమున, అంచున శృంగారించబడిన కురచ దుస్తులు ధరించుకొని, అవి వారి ప్రతి యొక్క తుంటి భాగము మీద 44 ఉన్నది, మీకు తెలుసా, వారు తలల వెనుక భాగములో టోపీలను ధరించియున్నారు. మరియు వారు అందరిలాంటి సాధారణమైన పాశ్చాత దేశస్తుల వలె వెళుతున్నారు, వారిలోని ప్రతి యొక్క స్త్రీ వెళ్ళి అతనిని స్వంతం చేసుకోవాలని వారిలో ఒకరైనా సరే ఈ అబ్బాయిని స్వంతం చేసుకోవాలనుకున్నారు.

వారికి వరుసకు తల్లి మరియు తండ్రి చనిపోయిన ఒక చిన్న సహోదరి ఉన్నది. ఆమె వారికి వరుసకు సహోదరి (కజిన్), ఆమె అక్కడ వారందరికి ఒక బానిసగా ఉన్నది. అక్కడ మురికి పనిని ఆమెయే చేయవలసియున్నది, వంట పాత్రలను కడుగుట మరియు ప్రతియొక్కటి. మరియు ఆమెకు మంచి వస్త్రములు లేవు, ఆమె చేతిని…

34కాబట్టి ఆ అబ్బాయి రావలసిన సమయము వచ్చినప్పుడు, వారందరూ వారి యొక్క గుర్రపు బండిలో స్టేషనుకు వెళ్ళి అతనిని తీసుకొని రావటానికి బయలుదేరారు. వారు తుపాకులతో కాల్చుకుంటూ, గుర్రాలు సకిలిస్తున్నాయి, మరియు ప్రతియొక్కటి కలిగి వెళ్ళారు. వారు అతనిని పశువులశాలకు తీసుకొని వచ్చారు. మరియు వారు ఆ రాత్రి ఒక పెద్ద పండుగ వాతావరణం కలిగియున్నారు, వారు చలికాలములో నివాసం ఉండే ఒక స్థలము వద్దకు వచ్చారు, దాని లోపలకు ఎవరూ వచ్చుటకు వీలులేకుండా కంచె వేయబడినది, మరియు వారు ఆ రాత్రంతా ఆడారు మరియు పాడారు. అతను అక్కడ రెండు లేక మూడు దినాలు ఉండెను.

35ఆ చిన్న సహోదరి…

ఇప్పుడు, నేను దీనిని మరొకదానితో పోలుస్తాను. మన సహోదరిలు అందరూ వస్త్రాలు ధరించుకున్నారు, పెద్ద శిఖరము కలిగిన మరియు మంచివైన సంఘాలు, ఒకవేళ పెంతెకోస్తువారికి మురికి పేరుగాని ఇవ్వవలసి వస్తే, మరియు ఏదైనా తప్పుగాని జరిగినట్లయితే, వారు కూడా తప్పు కార్యక్రమాలు చేశారు, కాని అవి ఎప్పుడూ వినియుండలేదు, మీరు చూశారా. వారు ఒక రకమైన సంప్రదాయమైనవారు, కాబట్టి వారు దానిని గురించి ఏమియు వినియుండరు. కానీ ఒక పెంతెకోస్తు కాపరిగాని తప్పు చేసినట్లయితే, మరియు సహోదరుడా, నేను మీకు చెపుతున్నాను, వారు దానిని ప్రతియొక్క వార్తాపత్రికలో పెడతారు. అవును, అయ్యా. ఎవరో ఒక పెంతెకోస్తు సహోదరుడు ఒక పిల్లవాని కొరకు ప్రార్ధన చేస్తే మరతను చనిపోతే, దేశములోని ప్రతియొక్క వార్తా పత్రిక దానిని మోసుకొని వెళుతుంది. "దైవీక స్వస్థత అనునది ఒక మూఢభక్తి."

మంచిది, అయితే వైద్యులు విఫలం చెందిన ప్రతి ఒక్క కేసుని పత్రికలలో ఎందుకని ఉంచుటలేదు? "ఆడ బాతుకి ఎమి పెడతామో మగ బాతుకి అదే పెట్టాలి, చూశారా. వారు ఆ విధముగా చేసినట్లయితే, చనిపోయిన వారి అందరి గురించి వారికి పత్రికలలో వ్రాయుటకు తగినంత స్థలముండదు. ఒకవేళ నేను శ్మశానవాటికలోకి వెళ్ళి ఈ విధముగా అన్నట్లయితే, "దైవీక స్వస్థత క్రింద చనిపోయినవారు లేచి నిలబడండి." తరువాత "వైద్యుల ద్వారా చనిపోయినవారు నిలబడండి" అన్నట్లయితే దైవీక స్వస్థత క్రింద చనిపోయిన వారు ఒక్కరు ఉన్నట్లయితే, వైద్యం వలన చనిపోయిన వారు పదిలక్షల కన్నా ఎక్కుమంది ఉంటారు. మరియు అది ఖచ్చితంగా వాస్తవము. కాబట్టి వారు ఒకరిని విమర్శించాలని అనుకున్నప్పుడు, ఇతరులను కూడా విమర్శించాలి. అది నిజము. కానీ వారు సంవత్సరములో లక్షలమందిని మందుల ద్వారా మరియు ఆపరేషన్ల ద్వారా చంపుతున్నారు, మీరు దానిని గురించి ఎన్నడూ ఒక్కమాట కూడా విని ఉండరు, చూశారా.

36కాబట్టి ఈ చిన్న అమ్మాయి, చాలా కష్టతరమైన పనులన్నీ చేయవలసి యుండేది. ఎప్పుడు, అందంతయూ, అతను… ఒక రాత్రి భోజనం అయిన తరువాత, మరియు వారు నాట్యమాడుతుండగా, మీకు తెలుసా, ఈ అమ్మాయిలలోని ప్రతిఒక్కరు అతనిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. మరియు ఆ పేద చిన్న అమ్మాయి, పాతవి చిరుగులు గల పాత చిన్న వస్త్రాలను ధరించియున్నది. మరియు ఒక రాత్రి భోజనం ముగిసిన తరువాత ఆమె భోజనశాలలో కూర్చొని ఉన్నది మరియు ఆమె వంట పాత్రలను కడిగింది, ఆమె వెనుక పెరటి భాగములో పాత్రలు కడిగిన నీళ్ళను బయట పారబోయుటకు పరుగెత్తుతున్నది. ఆమె కంచె వేసియున్న ఆ స్థలము దగ్గరకు వచ్చి తిరిగి చూచినప్పుడు, అతను అక్కడ నిలబడి యున్నాడు, ఆ కంచెకు ఆనుకొని, ఇలా అనెను, "హలో."

ఆమె ఎంతో బిడియ పడింది, ఎందుకనగా అతను పర్యవేక్షించే అధికారి యొక్క కుమారుడు కాబట్టి, అతను పశుశాల యొక్క యజమాని కుమారుడు కాబట్టి, ఆమె తన వస్త్రముల మీద ఉన్న చిరుగులు కనపడకుండా ఆ పాత్రను క్రిందకు దించింది. ఆమె చెప్పులు లేని తన పాదములను వెనక్కి తీసుకొనుట ప్రారంభించినది, ఈ విధంగా వెనుకకు తిరిగి చూస్తున్నది.

మరియు అతను నడుచుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు, ఇలా అన్నాడు "నా గూర్చి నీవు భయపడవద్దు." "నేను నీకు ఒక విషయం చెప్పగోరుచున్నాను" అన్నాడు. అతను ఇలా అన్నాడు, "నేను ఇక్కడికి వచ్చుటలో ఒక ఉద్దేశ్యమున్నది, నేను ఒక భార్యను కనుగొనుటకు వచ్చాను." మరియు ఇలా అన్నాడు, "నేను ప్రతి ఒక్కచోటా వెదికాను." ఇంకా ఇలా అన్నాడు, "నేను వెనుక నగరములో ఉన్న ఏ ఒక్క స్త్రీని నేను పెండ్లి చేసుకోగోరుటలేదు, నేను కోరుకున్నది ఏమిటంటే ఒక నిజమైన భార్యను కావాలనుకున్నాను." మరియు ఇలా అన్నాడు, "వారందరిని చూసిన తరువాత, నీవు ఇక్కడే ఉన్నావని గమనించాను. మరియు కొంతమంది ద్వారా నీవు వీరికి వరుసకు సహోదరివని నేను తెలుసుకున్నాను."

ఆమె అన్నది, "అయ్యా, అది నిజమే"

అతను ఇలా అన్నాడు, "నేను నిన్ను ఒకటి అడగగోరుచున్నాను, నీవు నన్ను పెండ్లి చేసుకుంటావా?"

ఎందుకు, ఆమె ఏం చేయాలో తెలియటం లేదు. ఆమెకు చాలా గందరగోళంగా ఉన్నది, ఆ వ్యక్తికి ఏలాగు జవాబు ఇవ్వవలెనో ఆమెకు తెలియటం లేదు.

37ఓ, ఆమె ఏ విధంగా అనుభూతిని చెందినదో నేను ఊహించుతున్నాను, మీరు ఊహించుట లేదా? ఒకప్పుడు ఒక పాపిగా నేను ఉన్నప్పుడు, ఒక తాగుబ్రోతు కుమారునిగా నాకు ఏ మంచియు లేదు, యేసుక్రీస్తు ఇలా అనెను, "నిన్ను నా కొరకు ఏర్పరచుకున్నాను." నాలాంటి ఒక వ్యక్తి యొద్దకు ఆయన ఎన్నడైననూ ఎలాగు రాగలడు? "నేను నీకు పరలోకంలో ఒక గృహమును ఇస్తాను" అని ఆయన ఎన్నడైననూ నాతో ఎలాగు అనగలడు? "నేను నిన్ను రక్షిస్తాను?" అని ఆయన ఎన్నడైననూ నాతో ఎలాగు అనగలడు? నా అంత ఒక నీచునితో ఆయన ఎన్నడైనా అనగలడా? కానీ ఆయన నాతో అనెను!

38ఆమె ఇలా అన్నది, "అయ్యా నేను అర్హురాలిని కాను. నేను నీవంటి వ్యక్తికి తగినటువంటి భార్యను కాలేను?" ఇలా అన్నది, "ఎందుకనగా మీరు గొప్ప కార్యాలు చేసేవారు. మరియు నాకు వాటి గురించి ఏమియు తెలియదు, నేను పేదదానిని."

అతను ఇలా అన్నాడు, "కానీ నీవు నా యొక్క ఎంపిక."

యేసు ఆ విధముగా నీతో చెప్పుటనేది హాయిగా ఉండదా. ఒక క్రైస్తవుడిగా అగుటకు నీవు అర్హత లేనివాడివి అని నీకు తెలియును. నీవు నీయంతటగా ఎన్నడూ ఏమియూ చేయలేవు, కానీ కేవలం ఆయన నిన్ను ఎన్నుకొనెను. అది ఆయన మంచితనము, నిన్ను ఆయన ఎన్నుకొనుట అనేది ఆయన యొక్క కరుణైయున్నది. నీవు ఆయనను ఎన్నుకొనలేదు, మీకు తెలుసా; ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, అది నిజము.

ఆమె ఇలా అన్నది, "నేను…"

అతను ఇలా అన్నాడు, "నీవు నీ వస్త్రాలను చూడవద్దు, నేను నీ వస్త్రాలను చూడను, నీవు ఏమైయున్నావో దానిని నేను చూస్తాను." ఇలా అన్నాడు, "నన్ను నీవు పెండ్లి చేసుకుంటావా?" మరియు చివరికి వారిద్దరి మధ్యలో ఒక ఒప్పందము చేయబడినది. అతను ఇలా అన్నాడు, "ఈ దినము నుండి ఒక సంవత్సరమునకు, నేను తిరిగి వస్తాను. నీవు సిద్ధముగా ఉండుము. పెండ్లి వస్త్రాలను ధరించి యుండుము, నేను తిరిగి వచ్చి ఇదిగో ఇక్కడే ఈ ప్రదేశములలోనే నిన్ను పెండ్లి చేసుకుంటాను. మరియు నేను నిన్ను చికాగో నుండి బయటకు తీసుకొని వెత్తాను, అక్కడ నీవు నివసించుటకు ఒక గొప్ప భవనమును కలిగియుంటావు. ఈ వంట పాత్రలు కడుగుకొనుట అనేదే ఇంక ఉండదు, మరియు ఆ తరువాత ఇటువంటి కార్యములుండవు."

39అప్పుడు ఆ సహోదరిలు, లేక తోబుట్టువులు, దీనిని గురించి విని ఇలా అన్నారు, "చిన్న పేద, అజ్ఞానపు బుద్ధిహీనురాలివి అయిన నీవు! ఎందుకు, అతను నీతో మాట్లడినదాని ఉద్దేశ్యము అదికాదని నీకు తెలియదా!"

ఈ దినమున వారంటున్నది ఖచ్చితముగా ఆ విధముగానే లేదా? "ఏ విధముగా కొంతమంది పరిశుద్ధ గుండ్రాళ్ళ గుంపు కొంతమంది వ్యక్తులు వారు తమ పేరును కూడా వ్రాయలేనివారు, వారేవిధముగా సంఘముగా ఉన్నారు? ఏ విధముగా ఒక గుంపు ఆ విధముగా ఎన్నడైననూ ఉండగలదు?" కానీ అది మంచిదే, మనము ఎప్పుడైతే ప్రధానము చేయబడ్డామో మరియు మన పాపమును తీసివేయబడుటకై, మన హృదయమునందు యేసుక్రీస్తు యొక్క పెట్టుకున్న వివాహపు ముద్దుని అనుభూతి చెందామో, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడని మనతో ఏదో చెపుతున్నది, ఇది వరలో లోకములోకి వచ్చిన మాదిరిగా ఒక దినాన ఆయన ఖచ్చితంగా తిరిగివస్తాడు.

40సంవత్సరమంతా ఆమె పనిచేసి, బానిసగా శ్రమపడి, కొద్ది మొత్తమైన 75 సెంట్లను ఆమె పొదుపు చేసుకున్నది, ఆమెకు వారు ఎంతైతే రోజూ వేతనముగా ఇస్తారో అది మరియు ఆమె ఆ ధనముతో పెండ్లి వస్త్రాలను కొనుట కొరకు మరియు ప్రతియొక్కదానిని సిద్ధపరచుటకై పొదుపు చేసుకున్నది. ఓ, సిద్ధపడుటయే ఆమె యొక్క సమస్త ఆలోచనలైయున్నవి మరియు ఆమె తనను తాను సిద్ధపరుచుకున్నది. ఆమె తనయొక్క పెండ్లి వస్త్రాలను కొనుక్కున్నది, అది చూచి ఆమె తోబుట్టువులు నవ్వుకుని ఎగతాళి చేశారు.

చివరకు ఆ దినము వచ్చినది. ఆమె తనకు తానుగా తన పెండ్లి వస్త్రములను ధరించుకొని వున్నది, అంతా సిద్ధపడి మరియు శుభ్రపరచుకున్నది. ఆమె తోబుట్టువులు ఆమె చుట్టూ చేరి తమ తలలు వంచి ఇలా అన్నారు, "మంచిది, ఓ చిన్న తెలివి తక్కువ దానా," ఎందుకు, అతని ఉద్దేశ్యము అదికాదని నీకు తెలియును, అతను నీలాంటి స్త్రీని వివాహము చేసుకుంటానని అతను చెప్పినది కాదు." అయిననూ, ఏది ఏమైననూ, ఆమె తనను తాను సిద్ధ పరుచుకున్నది.

41ఆ రోజు సాయంకాల సమయమందు, వారు ఆమె యొద్దకు వచ్చి ఆమెను ఎగతాళి చేయుచూ నవ్వుచున్నారు. ఏది ఏమైననూ ఆమె సరిగ్గా ద్వారము దగ్గర నిలబడి ఎదురుచూచుచున్నది. మరియు కావున వారు అన్నారు, "అతను ఏ సమయానికి ఇక్కడకు వస్తానని చెప్పాడు?"

ఇలా అన్నది, "అతను చెప్పలేదు." కానీ," అన్నది, "నాకు ప్రధానపు ఉంగరము అతడు నాకు ఇచ్చిన రాత్రి నాకు చెప్పాడు, అతను అన్నాడు… అతను నాకు చెప్పాడు "దాదాపు ఇప్పటి నుండి ఒక సంవత్సరమునకు జరుగును." కాబట్టి నాకు ఇంకా ఒక గంట సమయము మిగిలి ఉన్నది." ఆమేన్. కేవలం ఎదురుచూచుచుండెను. "నాకు ఇంకా ఒక గంట సమయము మిగిలి ఉన్నది." ఇంకా ముప్పై నిముషములు సమయము మిగిలి ఉన్నది. ఇంకా 10 నిముషములు సమయము మిగిలి ఉన్నది." మరియు వారు నవ్వి మరియు ఆమెను ఆట పట్టిస్తున్నారు, మరియు ఆమెను నానా రకాలుగా పిలుస్తున్నారు.

కానీ చివరకు, కష్టతరమైన ఆ ఘడియలో, గుర్రాలు వచ్చుట మరియు చక్రాల క్రింద నలుగుతున్న ఇసుక యొక్క శబ్దమును వారు విన్నారు. ఆ చిన్న పెండ్లికుమార్తె తనను తాను సిద్ధపరచుకొనుట చూడటం అనేది ఎటువంటి కార్యము, ఆమె ద్వారము నుండి బయటకు దూకింది, మరియు గులాబీ రంగు లతలు కలిగిన వాటి గుండా బయటకు వెళ్ళినది, ఆమె ప్రేమించిన వ్యక్తి యొక్క బాహువులలోకి ఎగిరింది, ఆమెకు కాబోయే వరుడు; ఆమెను ఈ విధముగా పైకెత్తియున్నాడు, మరియు పెండ్లి చేసుకొని వెళ్ళిపోయారు.

42సహోదరుడా, ఈ రోజులలో ఎవరైతే ఆట పట్టించుచూ "పరిశుద్ద - గుండ్రాళ్ళు మరియు పెంతెకోస్తులు," మరియు అలాంటి కార్యాలతో పిలుచుచున్నారో. మనకు ఇంకనూ కొద్ది సమయమున్నదని మనము ఎదురు చూస్తున్నాము. వారంటారు, "ఆ, వారిలో ఎల్లప్పుడునూ ఎటువంటి మార్పులేదు." చింతించవద్దు, మనకు ఇంకనూ కొద్ది సమయమున్నది. మరియు ఆయన మనకు వాగ్దానము చేసిన సమయానికి, ఆయన ఇక్కడ ఉంటాడు. మరియు ఇంకొన్ని దినములలో మనము ఎగిరి అలా వెళ్ళిపోతాము. కేవలం సిద్ధపడి ఉండండి." పెండ్లి వస్త్రములను ధరించుకొని యుండండి! ప్రతి ఒక్క క్రూరత్వమును మీ హృదయము నుండి తీసివేయండి. ప్రతి ఒక్క దానిని…

REV 19:7-9

 

43వినండి ఇక్కడ ఈ లేఖనమును ఏ విధముగా చెప్పుచున్నదో:

గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదము, గొరెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనియున్నది. [గ్రహించారా?]

మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను, అవి తెల్లనివి మరియు శుభ్రమైనవి, అవి పరిశుద్దుల నీతి క్రియలు. [దేవునికి మహిమ కలుగును గాక!]

మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను - గొర్రెపిల్ల రాత్రి పెండ్లివిందుకు పిలువబడినవారు ధన్యులని వ్రాయము, మరియు ఈ మాటలు దేవుని యధార్థమైన మాటలని నాతో చెప్పెను.

కాబట్టి ఈ దినములలో ఒక దినము ఆకాశములో ఒక కూటము జరుగనైయున్నది, అది మధురమైనది, మధురాతి మధురమైయున్నది. మీరు కేవలం సిద్ధపడి ఉండండి. మిమ్ములను మీరు సిద్ధపరుచుకొనండి. దుష్ట ఆలోచనల నుండి మీ హృదయమును కడిగివేసుకొనండి. దేవునియందు విశ్వాసము కలిగియుండండి, "నీవు తప్పు చేశావని" ఎంతమంది అంటున్నా, నిన్ను చూసి ఎంతమంది ఎగతాళి చేస్తున్నా, చూచుటకు ఎంతో చీకటిగా ఉన్నప్పటికీ, దానిని నీవు పట్టించుకొనవద్దు. నిజాయితీగా పరిశుద్దముగా జీవించుము మరియు దేవుని కొరకు జీవించుము. కేవలం ముందుకు కదులుతూనే ఉండండి. ఆ ఘడియ రానైయున్నది!

JOHN 10:7•

REV 3:8•

REV 4:1

 

44కావున, మీరు చూశారా, ఇప్పుడు ఆమె తిరిగి ప్రకటన 19వ అధ్యాయములో కనపడుచున్నది:

ఈ సంగతులు జరిగిన తరువాత [సంఘకాలములు జరిగిన తరువాత అతను చూశాడు]… ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో ఒక తలుపు…

ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకొనండి, యోహాను ఇంకనూ పత్మాసు ద్వీపములోనే ఉన్నాడు. సంఘకాలములన్నీ జరిగినది చూచిన తరువాత:

..నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను:…

ఒక ద్వారము." ద్వారమంటే ఏమిటి? ప్రకటన 3:8. ప్రకటనలో, 3వ అధ్యయము మరియు 8వ వచనము, "నీ క్రియలు నేనెరుగుదును: ఇదిగో, తలుపు నీయెదుట తీసియుంచియున్నాను - దానిని ఎవడును వేయనేరడు." ఆయనే ద్వారము! ద్వారము. క్రీస్తే ఆ ద్వారము. ఆయన అంటున్నాడు, పరిశుద్ధ యోహాను సువార్త 10లో, "గొర్రెలు పోవు ద్వారమును నేనే."

మరియు ఆ పురాతన దేశములో, ఒక కాపరి తన గొర్రెలను ఏ విధముగా నడిపిస్తాడో మీరు గమనించగలరు. అన్నీటిని అతను లెక్కించిన తరువాత, అన్నీ లోపలనే ఉన్నాయని చూచిన తరువాత అప్పుడు ద్వారము యొద్దనే పడుకుంటాడు. ఆయనను లేపకుండా తోడేలు లోపలికి రాలేదు, లేక ఆయన మీద నుండి తప్ప మరే విధముగానైనా గానీ ఆయన గొర్రెలు బయటకు రాలేవు. ఓ, గొర్రెల కాపరి ద్వారము దగ్గర పడుకొనుట వలన ఆ గొర్రెలు ఎంతగా భద్రముగా ఉన్నాయని భావిస్తాయి.

పాత నిబంధనలో, నోవాహు ఓడ యొక్క ద్వారము దగ్గర నిలబడ్డాడు, ఓ, వినండి, ఏదో చెప్పుటకు సిద్ధముగా ఉన్నాడు. అతను ద్వారములో నిలబడి తనను చూసి నవ్వే ప్రజలకు మారుమనస్సు మరియు నీతిని గురించి భోధిస్తున్నాడు. మరియు అదే ద్వారము దగ్గర అతను నిలబడియున్నాడు, ఏ మనిషి ఆ ఒక్క ద్వారము ద్వారా తప్ప మరి దేనివలన ఆ ఓడ లోపలికి రాలేడు. ఆ ఓడ లోపలకు వెళ్ళుటకు ఒక్క ద్వారమే ఉన్నది.

REV 4:1

 

45అక్కడ కేవలం ఒకే ఒక మార్గమున్నది! మంచిది, సహోదరుడా. క్రీస్తు శరీరములోకి వెళ్ళుటకు కేవలం ఒక్క మార్గము మాత్రమే యున్నది. జీవం గల దేవుని సంఘానికి కేవలం ఒకే ఒక్క ద్వారమున్నది, మరియు యేసే ఆ ద్వారము. "నేనే ఆ ద్వారమును. నేనే మార్గమును, ఆ ద్వారము దగ్గరకు పోవు మార్గమిదే. గొర్రెలు పోవు ద్వారమును నేనే."

ఆయన ఈ సంఘకాలమునకు ఈ విధంగా చెప్పెను, "నేను తెరువబడిన ఒక ద్వారమును మీ ముందుంచాను." ఆయన దానిని మెతడిస్టు సంఘకాలమునకు చెప్పెను, దానిని నుండి వారు తొలగిపోయారు, వారు వెళ్ళి సంస్థలో కలిశారు. "కానీ నేను మీకు తెరువబడిన ఒక ద్వారమును ఉంచాను." ఇప్పుడు, వారు శుద్దీకరణము పొందుకున్న తరువాత, ఆయన చెప్పెను, "నేను తెరువబడిన ద్వారము ఉంచాను…" అదే పరిశుద్ధాత్మయై యున్నాడు. "మనమందరమూ ఒకే ఆత్మ చేత నింపబడినవారము [ఎలా?] క్రీస్తు యొక్క ఒకే శరీరములోకి బాప్తిస్మము పొందినవారము," ఆయన క్రీస్తు. ఆయన ఈ వర్తమానమును మెథడ్డిస్టు సంఘము ముందర ఉంచాడు మరియు వారు దాని నుండి వేరొక వైపు మళ్ళారు. వారు శుద్దీకరణ వరకు వచ్చారు మరియు పరిశుద్ధాత్మను తిరస్కరించారు. అది జ్ఞాపకం ఉన్నదా? అది తెరువబడిన ద్వారము.

క్రీస్తులోకి నీవు ఎలా వెళ్ళగలవు? ఒకే ఆత్మచేత, పరిశుద్ధాత్మ, అది క్రీస్తు యొక్క ఆత్మయైయున్నది. కరచాలనము (షేక్ హ్యాండ్) ఇచ్చుట ద్వారా మనము లోపలికి ప్రవేశించలేదు, చిలకరింపు ద్వారా ప్రవేశించలేదు, కానీ ఒక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారానే మనమందరమూ ఒకే శరీరములోకి ప్రవేశించి మరియు ఆ శరీరము యొక్క భాగములుగా పాలిభాగస్తులమయ్యాము. ఒక్కే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము ద్వారా ఆ ద్వారములోకి ప్రవేశించగలము.

46ద్వారము పరలోకములో ఉన్నది. ఆ ద్వారము, అతను పైకి చూసినప్పుడు అతను ప్రభువైన యేసుని చూశాడు. దీని తరువాత భాగమును గమనించండి, ప్రభువైన యేసే ఆ ద్వారము

… నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడియుండెను, మరియు నేను మొదట వినిన… బూరధ్వని వంటి స్వరము…

ఇప్పుడు, దృశ్యము మారుతున్నది. యోహాను పత్మాసులో గమనిస్తున్నాడు, మరియు ఇప్పుడు అతను పైకి చూస్తున్నాడు. ఎందుకు? అతను ఇక్కడ భూమి మీద కొన్ని జరుగబోయే వాటిని చూశాడు (ఈ సంఘకాలములను), అన్ని సంఘకాలములు, మరియు అటు తరువాత అతను సంఘకాలముల మధ్యలో ఉండి చూశాడు, అటు తరువాత సంఘకాలములు ముగిసినవి, అతను ఒక స్వరమును విన్నాడు. మరియు అతను పైకి పరలోకము వైపు చూసినప్పుడు అక్కడ తెరువబడిన ఒక ద్వారమును చూశాడు, మరియు మొదట వినిన స్వరము బూరధ్వనివలె ఉన్నది. మంచిది, పత్మాసు నుండి దృశ్యము పరలోకమునకు మారినది.

REV 1:10,13

 

47ఆ స్వరము ఏడు సువర్ణ దీపస్తంభముల మధ్యలో సంచరించిన అదే స్వరమై ఉన్నది, అదే స్వరము, ఆ స్వరములో ఎటువంటి మార్పులేదు. కానీ అతను మొదటిసారి విన్నప్పుడు ఆ స్వరము, ఎక్కడ ఉన్నది? మొదటి సంఘ కాలములో, మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉన్నది? అతని వెనుక. "ప్రభువు దినమందు నేను ఆత్మవశుడనైయుండగా," ప్రకటన 1:10వ వచనము, "ఆత్మవశుడనైయుండగా." మీరు వ్రాసుకొనగోరినట్లయితే: దానిని మీరు ప్రకటన 1:10 మరియు 13, "ప్రభువు దినమందు ఆత్మవశుడనై యుండగా, బూరధ్వని వంటి గొప్ప స్వరము మరియు విస్తారమైన జలముల శబ్దమును నా వెనుక వింటిని. మరియు చూడాలని నేను వెనుకకు తిరుగగా, యేడు సువర్ణ దీపస్తంభముల మధ్యలో ఒకడు నిలబడియుండుట నేను చూచితిని."

"ఇప్పుడు, ఆయన యేడు సువర్ణ దీపస్తంభముల యొక్క రహస్యమంతా చూపించిన తరువాత (యేడు నక్షత్రములను పట్టుకొని ఉండుట, మరియు తెల్లని వెంట్రుకలు కలిగిన తలకట్టును (విగ్) పెట్టుకొని, మొదలగునవి మరియు పాదములు ఇత్తడి వలే, కన్నులు అగ్ని వలె, ఆ గురుతులు), తరువాత అదే స్వరము, గమనించండి, పరలోకము నుండి మాట్లడుట అతను విన్నాడు. మరియు అతను పైకి చూసినప్పుడు ఒక ద్వారము తెరచియుండుట చూశాడు. ఓ, పరలోకమునకు ఒక తెరవబడిన ద్వారము! నీవు లోపలికి ఎలా వెళ్ళగలవు? క్రీస్తు యేసు ద్వారా, ఆ ఒక్కటే ద్వారము — ఆ ఒక్కటే మార్గము, మరే దారి లేదు.

JOHN 10:1

 

48"ఏ మనుష్యుడైనా ఆ మార్గము కాకుండా వేరే మార్గములో వచ్చినట్లయితే, అతను దొంగ మరియు దోచుకోవడానికి వచ్చినట్లే." ఆ ఉపమానములో చెప్పబడినట్లు ఎవరైతే పెండ్లి వస్త్రాలు ధరించుకోకుండా పైకి ఎక్కి పెండ్లి విందుకు వస్తారో, వాడు నేరస్తుడిగా కనుగొనబడి మరియు వాడిని కట్టివేసి వెలుపల చీకటిలోకి త్రోసివేస్తారు. పెండ్లి విందుకు వచ్చుటకు కేవలం ఒకే ఒక్క మార్గమున్నది. కొద్దికాలము క్రితం నేను దాని మీద ప్రసంగించానని నేను నమ్ముతున్నాను.

ఎప్పుడైతే పెండ్లికుమారుడు… పురాతన దేశంలో ఎప్పుడైతే పురుషుడు వివాహము చేసుకోబోతున్నాడో, అతనే స్వయంగా ఆహ్వానము అందించాలి. అతనే స్వయంగా పొడవైన వస్త్రముతో అలంకరించాలి. అక్కడ అతను ఈ వ్యక్తిని కలుసుకున్నప్పుడు అతను ఒక విందు బల్ల దగ్గర ఉన్నాడు. ఎంతమందికి ఆ ఉపమానము జ్ఞాపకమున్నది? ఖచ్చితంగా, మీరు పరిశుద్ధ గ్రంథము చదివితే మరియు ఆయన పెండ్లి వస్త్రములు ధరించుకొని ఒక మనుష్యుడను భోజనపు బల్ల దగ్గర కనుగొన్నాడు.

JOHN 6:37,44

 

49అదేమిటి? పెండ్లికుమారుడు ద్వారము దగ్గర నిలబడును మరియు ప్రతి ఒక్కరూ ఆహ్వానం కలిగి వస్తున్నారు. "నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఏ మనుష్యుడును రాలేడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరు, లేక ఆహ్వానించబడిన వారు, నా దగ్గరకు వస్తారు." ఇక్కడ వారు వచ్చి పెండ్లికుమారుడి దగ్గర వారు ఆహ్వానమును తీసుకుంటారు, అందుచేత ప్రతి ఒక్కరూ ఒకే విధముగా కనబడతారు. అది ఆ పాత-కాలపు పరిశుద్ధాత్మ మతము, ఆ ఒక్క విషయం మంచిదైయున్నది, అది వారందరిని ఒక్కలాగున కనబడునట్లుగా చేయుచున్నది. వారు ధనికులైనా లేక పేదలైనా, బానిసలైనా లేక స్వతంత్రులైనా, నలుపైనా లేక తెలుపైనా, పురుషుడైనా లేక స్త్రీయైనా, వారందరు క్రీస్తు యేసునందు ఏకమై యున్నారు.

పెండ్లి కుమారుడు ద్వారము దగ్గర నిలబడి మరియు ఆహ్వానించబడిన వారిని స్వాగతిస్తున్నాడు, అతని చుట్టూ పొడవైన వస్త్రమును ధరింపజేశాడు, కాబట్టి ధనికులు మరియు పేదవారు అందరూ ఒకే విధముగా కనబడుచున్నారు. దేవుని యొక్క రాజ్యములో ఆ విధముగా ఉంటుంది. అక్కడ పెద్దవారు మరియు చిన్నవారు అనే వ్యత్యాసముండదు. వారందరూ ఒకే వ్యక్తిగా వున్నారు, అందరు క్రీస్తునందు ఏకమై యున్నారు.

MATT 22:12•

MATT 22:13

 

50ఇప్పుడు, పెండ్లి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు పెండ్లి వస్త్రాలు లేక ఒక వ్యక్తి అక్కడ కూర్చుని యుండుట కనుగొన్నప్పుడు, నీవు ఏమి ఆలోచిస్తావు? చెప్పెను, "స్నేహితుడా నీవు లోపలికి ఎలా వచ్చావు?" మరియు అతను మౌనముగా నిలబడి ఉన్నాడు, దానిని బట్టి అతను ద్వారము ద్వారా కాకుండా మరో ప్రక్క మార్గములో వచ్చాడని తెలియజేస్తుంది. అతను ఒక కిటికి ద్వారా వచ్చాడు, అతను ఒక వెనుక ద్వారము ద్వారా వచ్చాడు. మరియు ఆయన అతడిని స్నేహితుడా అని పిలిచాడు, అది అతను సంఘ సభ్యుడని తెలియజేస్తుంది, "స్నేహితుడా, పెండ్లి వస్త్రాలు లేకుండా లోపల ఇక్కడకి నీవు ఎలా రాగలిగావు?

ఇప్పుడు, స్వయంగా యేసే దీనిని చెప్పెను, మరియు దాసుడిని పిలిచి, ఇలా అన్నాడు, "ఇతని కాళ్ళు మరియు చేతులు బంధించుము." ఎక్కడైతే ఏడ్పులు, కేకలు మరియు పళ్ళు కొరుకుట జరుగునో ఆ వెలుపలి చీకటిలోకి అతను త్రోసివేయబడెను. అవి క్రీస్తు యొక్క స్వంత మాటలు. మంచిది. అతను త్రోసివేయబడెను, ఎందుకనగా అతను పెండ్లి వస్త్రములు లేకుండా, ద్వారము కాక మరొక మార్గములో నుండి అతను లోపలికి వచ్చాడని అది నిరూపించబడినది. అతను ద్వారము ద్వారా వచ్చినట్లయితే, అతను ఒక పెండ్లి వస్త్రాలను పొందుకొనియుండేవాడు.

51ఓ, దీనిని వినండి. ఒకవేళ పరిశుద్ధాత్మ యొక్క బాప్తీస్మమే పెండ్లి వస్త్రముగా ఉన్నట్లయితే, మనము మరొక మార్గములో అక్కడికి వెళ్ళి ఎలా ప్రాతినిధ్యము చేయగలము? మొదటి సంఘకాలము, క్రీస్తు యేసు అనే ద్వారము గుండా వచ్చినట్లయితే, యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము పొందుము, పరిశుద్ధ బాప్తీస్మమును పొందుకొనుము, పెండ్లి వస్త్రములను ధరించుకొనుము, మరొక మార్గములో మనము ఎలా వెళ్ళగలము? నీవు మెతడిస్టుల ద్వారా, బాప్టిస్టుల ద్వారా, లేక పెంతెకోస్తుల ద్వారా, లేక మరే సంఘ శాఖ ద్వారాయైనా గానీ వచ్చినట్లయితే, నీవు కట్టివేయబడి వెలుపటి చీకటిలోకి త్రోసివేయబడతావు. నీవు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రావలయును, ఆయనే మార్గము, ద్వారము, సత్యము, జీవము. ఆమేన్!

52మంచిది, అదే స్వరము, ప్రకటన 21… లేక ప్రకటన 1:10 మరియు 13. మరియు మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను, అతనితో మాట్లాడుతున్న స్వరము స్పష్టమైన బూరధ్వనిలాగా ఉండుట అతను విని యున్నాడు. మీకు తెలుసా, ఒక బూర ఎలాంటి శబ్దమును ఇస్తుందో, అది ఒక పదునైన శబ్దమును ఇస్తుంది. బూరధ్వనికి పరిశుద్ధ గ్రంథములో ఏమని అర్ధమున్నది? యుద్ధము. పరిశుద్ధ గ్రంథ కాలములో ఏ సమయములోనైనా ఒక బూరధ్వని ఊదబడినట్లయితే, అది ఒక యుద్ధమునకు అర్థము ఇచ్చుచున్నది, లేక ప్రత్యక్షత, లేక మరేదో అక్కడ జరుగనైయున్నదని అర్ధము.

REV 4:1

 

53ఇప్పుడు, సంఘకాలములు ముగిసిన తరువాత, మరియు ప్రతియొక్కటి సిద్ధమగుతున్నది, సిద్ధమగుచున్నదని 4వ అధ్యాయము ఇక్కడ తెలియచేయున్నది, సంఘకాలము ముగిసినది. ఆయన భూమిని విడిచిపెట్టెను, మీరు చూశారా. జ్ఞాపకం చేసుకొనుడి, అతనితో మాట్లాడిన ఆ స్వరము, అతని వెనుక ఉన్నది, యేడు సువర్ణ దీపస్తంభముల మధ్యలో, ఆ కార్యము ముగించబడింది. మరియు ఇప్పుడు అదే స్వరము పరలోక రాజ్యములో మాట్లాడుచున్నది. అది ఏమిటి? ఆయన తన ప్రజలకు విమోచన కల్పించాడు. ఆయన యొక్క భూసంబంధమైన క్రియ ముగిసినది, మరియు ఆయన మహిమలో ఉన్నాడు, యోహానును పిలుస్తున్నాడు, "పైకి ఎక్కి రమ్ము." ఆమేన్. అది నన్ను ఈ నుతన సంవత్సరమునకు ముందుగానే పెద్దగా అరిచేటట్లుగా చేస్తున్నది. ఓ, మై, అక్కడే మీరున్నారు, చూశారా, సిద్ధముగా ఉన్నది, "పైకి ఇక్కడికి ఎక్కి రమ్ము!"యుద్ధము!

గొప్ప యుద్ధమునకు ఇది సమయమైయున్నది, దేవుని వర్తమానమును త్రోసివేసిన ప్రజలు, యేడు సంఘముల యొక్క వర్తమానీకుడు, పరిశుద్ధాత్మను తిరస్కరించినవారు. ఆయన కృప యొక్క ఈ వర్తమానమును ఎవరైతే త్రోసివేశారో వారికి ఇక ఏమి మిగలలేదు, కానీ తీర్పు మాత్రము సిద్ధముగా ఉన్నది. ఓ, ఇప్పుడు ఆయన భూమి మీద తెగుళ్ళను కుమ్మరించుటకు సిద్ధము చేయుచున్నాడు. "పైకి ఎక్కి రమ్ము మరియు జరుగనైయున్న సంగతులను నేను నీకు చూపిస్తాను. క్రీస్తుని తిరిస్కరించిన వారు, దేవుడు లేడనే పాపులు, ఇదిగో నేను వారి మీద నా కోపాగ్నిని కుమ్మరిస్తాను."

1COR 15:31•

GAL 2:20

 

54మీరు ఆ సందర్భము గమనించండి. ఓ, ఈ రాత్రి మీరు దానిని గురించి ఎల్లవేళలా మరింత ఎక్కువ లోతుగా తెలుసుకుంటారు. ఇక్కడ మనము ప్రతిదియూ పొందుకొనము, మనము ఒక చోట నుండి మరొక చోటకి ఉదహరించుచూ ఉండవలెను. ఆ చివరి బూర ధ్వనించినప్పుడు భయంకరమైన కార్యము వారికి ఏ విధముగా జరుగనైయున్నది, మరియు చివరి యుద్ధము జరిగినప్పుడు, చివరి వర్తమానము ప్రసంగించినప్పుడు, చివరి పాట పాడినప్పుడు, మరియు మనము క్రీస్తు యొక్క తీర్పు సింహాసమనము ముందు నిలబడి ఉంటాము. నీవక్కడ ఈ విధముగా అడుగబడతావు, "ఎందుకని నీవు దానిని పొందుకోలేదు? నేను నీకు ఇచ్చిన జీవంతో నీవేమి చేశావు?" నీవు కారణము కొరకు అడుగబడతావు, తరువాత ఏమిటి?

నేను ఆ పాట పాడుట మీరు విన్నారా, లేక దానిని ప్రయత్నిద్దామా:

తరువాత ఏమిటి? తరువాత ఏమిటి?

ఆ గొప్ప గ్రంథము తెరచినప్పుడు, తరువాత ఏమిటి?

వారు వర్తమానము తిరస్కరించినప్పుడు

నీవు కారణము కొరకు అడుగబడతావు, తరువాత ఏమిటి?

ఈ గ్రంథములో వ్రాయబడినంత నిశ్చయంగా నీవు అక్కడకు వెళ్ళి నిలబడవలసి యున్నది, నీవు అడుగబడతావు. అక్కడకు వెళ్ళి నిలబడి మరియు కారణము చెప్పవలసి యున్నది. ఓ, అది మనకు చెల్లిస్తుంది, నా సహోదరుడా, సహోదరీ, అది మనలను దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలుగా తగినటువంటి వారిగా దినములోని ప్రతియొక్క ఘడియలో మనలని మనము పరీక్షించుకోమని చెపుతుంది. పౌలు చెప్పెను, "నేను దిన దినము మరణిస్తున్నాను. అయిననూ జీవిచునది నేను కాదు, కానీ క్రీస్తు నాలో జీవించుచున్నాడు," చూశారా. పరీక్షించుకోవలసియున్నది, ఎందుకనగా నీవు ఏ ఘడియలో పిలువబడి ఉన్నత స్థలములో జవాబు చెప్పవలసి యున్నదో నీకు తెలియదు.

REV 4:1

 

55ఇప్పుడు, "బూర యొక్క స్వరమును విన్నాను." మంచిది. యోహాను ఏమి చెప్పెనో గమనించండి. ఆయన ఇక్కడ చెప్పెను, మొదటి వచనము చివరన, అధ్యాయము [4].

…మొదటి స్వరము … నాతో మాట్లాడిన స్వరము బూరధ్వనిలాగున్నది; మరియు చెప్పెను, పైకి ఎక్కి రమ్ము [ఇక్కడి ఎక్కి రమ్ము! నేను నీకు భూమి మీద సంఘ కాలములను చూపించాను. ఇప్పుడు నీవు ఎక్కి రమ్ము. ఇక్కడ పైన జరుగనైయున్న సంగతులను నేను నీకు చూపిస్తాను.]…

చూశారా, అప్పటికి క్రీస్తు భూమిని వదిలివెళ్ళాడు. ఆయన మహిమలోకి కొనిపోడ్డాడు. సంఘకాలము ముగిసినది, ఆయన ఆత్మ యొక్క కార్యము ముగిసినదని తెలియజేస్తుంది. మరియు ఆయన మహిమలోకి కొనిపోడ్డాడు, మరియు యోహానుని పైకి ఎక్కి రమ్ము అని పిలచుచుండెను. మరియు ఆయన అతనికి ఆ తరువాత జరుగనైయున్న సంగతులను చూపించెను. "పైకి ఎక్కి రమ్ము…"

MATT 11:28•

REV 4:2

 

56ఇప్పుడు, మనము గమనించుదాము యోహాను, 2వ [4వ] అధ్యాయము— 2వ వచనము, గమనించుము, త్వరగా, యోహాను దీనిని జతచేశాడు:

మరియు త్వరగా… [ఆమేన్!]

ఓ, ఒకవేళ నేను హాస్యముగా ప్రవర్తించుచున్నట్లయితే, నేను కేవలము మంచి అనుభూతి చెందుచున్నాను. యోహాను జత చేశాడు:

…వెంటనే నేను ఆత్మవశుడనై:

దేవుని స్వరము మీతో మాట్లాడుట విన్నప్పుడు, ఏదో జరుగును. ఆమేన్! ఓ, మీకు ఆ విధముగా జరిగినదా? నాకు 31 సంవత్సరముల క్రితం జరిగినది, మరియు అప్పటి నుండి నేను అంతకుముందువలే లేను. ఓ, ఆయన చెప్పెను, "నా దగ్గరకు రమ్ము, భారము మోయుచున్ను సమస్త జనులారా. నేను నీకు విశ్రాంతిని ఇస్తాను." అది నన్ను మార్చివేసినది.

REV 4:2

 

57యోహాను ఇలా అన్నాడు:

…వెంటనే నేను ఆత్మవశుడనై: [ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఓ!] నేను ఆత్మవశుడనై యుండగా: మరియు అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి యుండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై యుండెను.

చూశారా, ఇప్పుడు యోహాను భూమిని వదిలి వెళ్ళాడు. భూమి మీద క్రీస్తు పరిశుద్ధాత్మ రూపమును విడిచి, తిరిగి మరలా శరీరములోకి వచ్చాడు. ఈ దినమున ఆ శరీరము ఒక బలియర్పణగా, జ్ఞాపకార్ధముగా అక్కడ కూర్చొని ఉన్నది. ఇక్కడ ఈ అధ్యాయములో మనము దానిలోపలకి వెళుతున్నాం. కానీ, మనలో నివసించుటకై క్రీస్తు యొక్క ఆత్మ తిరిగి సంఘములోకి వచ్చి నివసించుచున్నది.

58ఇప్పుడు, ఆ తరువాత వెంటనే ఆయన ఇక్కడ తన కాలము యొక్క పని ముగింపును ఆయన చూపించుచున్నాడు. ఆయన పైకి పరలోకమునకు వెళ్ళి ఇలా అనెను, "నేను నీకు దీని తరువాత జరుగనైయున్న సంగతులను చూపిస్తాను, సంఘకాలములు ముగిసిన తరువాత." ఆయన ఇలా అనెను, "యోహాను, ఇక భూమి మీద నేను నీతో మాట్లాడను, ఎందుకనగా నేను దానిని వదిలివేశాను, నేను పైకి వచ్చియున్నాను. నీవును నా దగ్గరకు పైకి రమ్ము. [ఆమేన్!] మరియు నేను నీకు దీని తరువాత జరుగనైయున్న సంగతులను చూపిస్తాను." ఓ, మై! ఓ! దర్శనములో పైకెత్తబడ్డాడు, మహిమలోకి కొనిపోబడ్డాడు.

ఆయన అనుభవం పౌలు అనుభవము మాదిరియైయుండవచ్చును. II కొరింథీయులు 12:2 మరియు 4, మీరు దానిని వ్రాసుకోవాలనుకున్నట్లయితే II కొరింథీయులు… 2 నుండి 4. ఒక దినమున పౌలు కూడా దర్శనములోనికి పైకి కొనిపోబడ్డాడు. అది మీకు తెలియునా? మరియు అతను చూసిన కార్యాలు 14 సంవత్సరములు వరకు మాట్లాడుటకు కూడా ఆవశ్యకత లేదు, ఎన్నడునూ వాటిని గూర్చి చెప్పియండలేదు, చూశారా. కానీ వారి మధ్యలో ఉన్న వ్యత్యాసమును వినండి.

పౌలు ఏమి చూశాడో, దానిని గూర్చి మాట్లాడుటకు నిషేధించబడ్డాడు, లేక ప్రజలకు దానిని గూర్చి తెలియజేయటకు నిషేధించబడ్డాడు. ఓ, మై! అతను దానిని అలా చేయగలడని నేను నమ్మడంలేదు. ఎందుకు, ఒక దినమున నేనొక చిన్న ప్రయాణములో కొనిపోడ్డాను, నేను దానిని దాటి వెళ్ళలేదు మరియు దానిని నేను మరచిపోలేను. చూశారా, అతను చూసిన సంగతులను గురించి అతను మాట్లాడలేకపోయాడు. అతనికి మాట్లాడుటకు మాటలు లేవని నేను ఊహించగలను. అతను మూడవ ఆకాశమునకు కొనిపోబడెను, చూశారా, పైకి మూడవ ఆకాశములోకి కొనిపోబడెను.

REV 1:2,3

 

59ఎంత భేదమున్నది, యోహాను కొనిపోబడినప్పుడు యేసుని చూశాడు. ఆయన ఇలా అనెను "నీవు చూచుచున్న సంగతులను గ్రంథములో వ్రాయము మరియు తిరిగి ఇచ్చివేయుము, తిరిగి సంఘములకు పంపివేయుము." పౌలు మాట్లాడుటకు నిషేధించబడ్డాడు, మరియు యోహానైతే గ్రంథములో కూడా వ్రాసి యుంచుటకు అడుగబడినాడు కావున దాని ద్వారా అది కాలములన్నిటిలో నుండి వెళ్ళుటకు వ్రాయమని అడగబడినాడు. ఓ, మై! అదిప్పుడు బయలు పరచబడింది, ఈ చివరి దినములలో అది బయలుపరచబడుతుంది. అతని దినములో అది బయలు పరచబడలేదు; మనము వెళుచున్నకొలదీ, ఇప్పుడు అది బయలు పరచబడుచున్నది.

60ఓ, గమనించుము, యోహాను, సంఘకాలములు ముగిసిన వెంటనే పైకి కొనిపోబడెను అతను ఎత్తబడే సంఘమునకు సాదృశ్యముగా ఉన్నాడు. సంఘకాలములు ముగిసిన వెంటనే, ఈ లవొదికయ సంఘకాలము ముగిసిన వెంటనే, తరువాత ఎత్తబాటు వస్తుంది. యోహాను వలే సంఘము ఎత్తబడి, దేవుని సన్నిధిలోనికి కొనిపోబడుతుంది. ఓ, మై! అది నా ఆత్మ చుట్టూ తిరుగుచున్నది — పైకి కొనిపోబడుట, సంఘము యొక్క ఎత్తబాటు. మరియు అది చెప్పెను… ఈ స్థలములో… సంఘకాలము యొక్క ముగింపులో ప్రకటన గ్రంథము వ్రాయబడినది, చూశారా.

61ఇప్పుడు, నేను ఇక్కడ ఒక చిన్న దానిని మీకు నివృత్తి చేయాలి అనుకుంటున్నాను అది క్రైస్తవుల మధ్య చాలా కాలము నుండి ఒక పాతది వ్రేలాడుతున్నది. మరియు ఈ దినాన నేను ధ్యానించుచున్నప్పుడు ఈ విధముగా తలంచాను, లేఖనాలను వ్రాస్తున్నప్పుడు, పేర్లు మరియు వివిధ రంగులు మరియు కార్యాల గురించి వెదుకుతున్నప్పుడు, మనము కొద్దిసేపటిలో వాటి దగ్గరకు వెళ్ళబోవుచున్నాము, మరియు వర్షధనస్సులు, మరియు గురుతులు, మరియు మొదలగునవి…

కాబట్టి నేను వెనుకకు వెళ్ళి వాటిని చూపించుటకు, ఈ లేఖన భాగాలను ఇక్కడ వ్రాస్తున్నప్పుడు… ఆలాగు చేయుచున్నప్పుడు. ఎనుకనగా, వాడుకగా, ఒకవేళ ఇటువంటి వాటి మీద నేను మాట్లాడవలసివస్తే, అది భేధమైనదిగా ఉంటుంది — దానిని నేను హృదయము ద్వారా తెలసుకోవాలని ప్రయత్నిస్తాను. కానీ ఈ విధముగా, మీరు కొద్ది సమయాన్నే కలిగి ఉన్నప్పుడు, దానికి సంబంధించిన దానిని మీకు చెప్పుటను నేను ఇష్టపడతాను, ఎందుకనగా అది లేఖనాలు అన్నింటిలోకి ముందుకు మరియు వెనుకకు వెళ్ళి వస్తుంది.

MATT 16:13-20

 

62ఇప్పుడు, మత్తయి 16:13లో, మనము కనుగొనగలము, మీరు లేఖనాలను వ్రాసుకున్నట్లయితే, మత్తయి… మీరు దానిని త్రిప్పాలనుకుంటే, మంచిది, మత్తయి 16:13. ఇది… ఓ, మనము వెనుకకు వెళ్ళి మరియు దానిని చదువుదాము, మరియు అది మనకు నిశ్చయముగా ఉన్నదని తెలుస్తుంది. మత్తయి 16వ అధ్యాయము మరియు 13వ వచనము. మనము చదువుచుండగా. 16:13. "పేతురు వచ్చినప్పుడు…" లేక…

యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనుష్యకుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా?

వారు - కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.

అందుకాయన - మీరైతే నేను ఎవడని చెపుకొనుచున్నారని వారిని అడిగెను.

అందుకు సీమోను పేతురు - నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.

అందుకు యేసు - సీమోను బర్-యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనే కాని నరులు నీకు బయలుపరచలేదు.

మరియు నీవు పేతురువు ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.

పరలోకరాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను: నీవు భూలోకములో దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును. భూలోకములో దేనిని విప్పుదువో అది పరలోకములో విప్పబడునని అతనితో చెప్పెను.

అటుపిమ్మట తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.

MATT 16:28

 

63ఇప్పుడు దగ్గరగా వినండి. మంచిది. "ఆ సమయము ప్రారంభం అయినప్పుడు… అప్పటి నుండి ప్రారంభమైనది ఆయన…" నేను మీకు మరొకటి ఇవ్వాలనుకుంటున్నాను, మీరు దానిని దిగువన చదవగలరు. నేను ఇక్కడ 28వ వచనమును తీసుకున్నాను, ఎందుకనగా మీరు మిగిలిన దానిని గృహములకు వెళ్ళిన తరువాత చదువ వచ్చును.

ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.

ఓ, దానిని గురించి ఆలోచించండి. "…ఇక్కడ నిలబడినవారిలో కొందరు, ఇక్కడ నిలబడినవారిలో కొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణమును రుచి చూడరు," ఎంత గొప్ప వాఖ్యానమది! విమర్శకులు దానిని తీసుకొని, ఆయనకు ఎంత మాత్రము మాటలు పలుకుట చేతకాదని చూపించుటకు ఇష్టపడుచున్నారు, చూశారా. దానిని పట్టుకునుటకు ఏ విధముగా ఆయన కోరుచున్నాడో, అది నెరవేర్పు జరిగిననూ, దానిని గురించి వారికేమియూ తెలియబడలేదు, చుశారా. మంచిది.

MATT 16:17,18

 

64పేతురు బండ ఒప్పుకోలు తరువాత, మనకు తెలుసు ఆయన ఒప్పుకోలు ఏమిటనేది…. ఆయన తన సంఘమును అదే బండ మీద కట్టుదును అన్నాడు, రోమను క్యాథలిక్కులు చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు ఒక చిన్న రాయియైన పేతురు మీద కాదు. కానీ పేతురు ప్రత్యక్షత యొక్క ఒప్పుకోలు మీద, అదియే సంఘమైయున్నది. దేవుడే దానిని బయలుపరుస్తాడు, ఈ మనుష్యులు యొక్క ఒప్పుకోలు మీద కాదు, ఎందుకనగా అతను వెనుకకు జారిపోయాడు; ఆయన దేవుని కుమారుడైయున్నాడనే ఒప్పుకోలు పైన కాదు, ఎందుకనగా ఆయన దేవుని కుమారుడని వారికి తెలుసు. పేతురు అప్పుడే దానిని చెప్పియున్నాడు. కానీ అది ఏమైయున్నది, ఆయన దేవుని కుమారుడైయున్నాడన్నది పరలోకము నుండి బయలు పరచబడిన ప్రత్యక్షతైయున్నది. ఇలా చెప్పెను, "రక్త మాంసములు నీకు ఈ సంగతి బయలుపరచలేదు, కానీ పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరచెను. మరియు ఈ బండ మీద (ఆ బండ యొక్క ఒప్పుకోలు), నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువజాలవు."

MATT 16:28•

MATT 16:28

 

65మనము సమయము దాటి వెళ్ళిపోతున్నామని అనుకోవటంలేదు మనము త్వరపడదాము, మనము సరిగ్గా దీని లోపలికి వెళదాము. మరియు అది ఏ విధముగా మానవుడిలో ప్రవహిస్తున్నదో చూద్దాము. మనము దాని లోపలికి వెళ్ళగలిగినట్లయితే, అది ఒక అందమైన కథ. మంచిది. అవును, బండ యొక్క ఒప్పుదల, పేతురు ఏమైయున్నాడు… ఆయన పేతురు యొక్క ఒప్పుదల మీద సంఘమును కట్టుదును అన్నాడు. ఆయన చెప్పెను, "ఇక్కడ నిలబడినవారిలో కొందరు, దేవుని కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణమును రుచి చూడరు."

ఇప్పుడు, గుర్తుంచుకొనండి, ఆయన ఇలా అన్నారు "కొందరు." అది ఒకరి కన్నా ఎక్కువే, కాదా? "కొందరు" అంటే చాలాయై యుండవచ్చును, "ఒకటి కన్నా ఎక్కువ." కాని ఇప్పుడు చూడండి, ఆయన శిష్యులందరూ అక్కడ నిలుచుని ఉన్నారు, మరియు ఆయన వారిలో ప్రతిఒక్కరిని అడుగుచున్నాడు, "దీని గురించి మీరేమనుకుంటున్నారు? మరియు మీరు దానిని గురించి ఏమని అనుకుంటున్నారు?" కానీ ఆయన ఇలా చెప్పెను, "ఇక్కడ ఉన్న మీలో కొందరు, ఇక్కడ నిలబడిన కొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చు వరకు మరణమును రుచి చూడరని చెప్పుచున్నాను." ఓ, మై! ఎంత గొప్ప మాటలవి! ఆలోచించండి, రెండువేల సంవత్సరముల క్రితం ఆ మాటలు చెప్పబడ్డాయి.

MATT 17:1

 

66దేవుని వాక్యము తప్పిపోవునా? ఆయన పలికిన ప్రతి మాట నెరవేరును.

ఇప్పుడు, మనము కోరుకున్నట్లయితే.., తరువాత ఉన్న మత్తయి సువార్త 17వ అధ్యాయము వైపునకు వెళదాము. కొద్ది దినముల తరువాత, ఆయన తీసుకుని వెళ్ళినప్పుడు, ఆయన పేతురు, యాకోబు, యోహానుని కొండపైకి తీసుకొని వెళ్ళాడు, సాక్షులుగా ఉండుట కొరకు — పేతురు, యాకోబు, యోహాను. వారు దేవుని యొక్క రాజ్యమును శక్తితో వచ్చుట చూశారు, రాబోవు దేవుని యొక్క రాజ్యమును ముందుగానే ప్రదర్శించబడుట (రిహార్సల్) చూశారు. ఆమేన్, ఓ, రావలిసియున్న దేవుని యొక్క రాజ్యమును ముందుగా ప్రదర్శించబడుట (రిహార్సల్) చూచుటకై వారు తీసుకొని రాబడ్డారు. వెయ్యేండ్ల పాలన గూర్చి ప్రకటించుట. వారు దానిని ముందుగానే ప్రదర్శించబడుటను (రిహార్సల్) చూశారు.

67కొద్దికాలం క్రితం, ఒక సేవకుల గుంపు, అందులో ఓరల్ రాబర్ట్ కూడా ఒకరు. సెసిల్ బి. డిమిల్లే, అతను ఈ పది ఆజ్ఞలు వ్రాసినప్పుడు, అతను సహోదరుడు షకర్యాన్, సహోదరుడు రాబర్ట్స్, దేశములోని చాలామంది ప్రసంగీకులను పిలిచెను, ఏ ప్రసంగీకుడైనా రావచ్చును, మరియు వారు ఆ చలన చిత్రమును విడుదల చేయుటకు ముందుగానే స్టూడియోలోనికి వచ్చుటకు వారిని ఆహ్వానించెను, మరియు బయట చూపబడక మునుపే దాని యొక్క ప్రదర్శనను (రిహార్సల్) తిలకించుటకు వారికి అనుమతించెను, ఒక టికెట్టు యొక్క ధర 25 డాలర్లుగా వారు చెల్లింపమని అడుగబోవుతున్నారు. కానీ వారు ముందుగానే ఆ ప్రదర్శనను (రిహార్సల్) తిలకించారు, వారు దానిపైన విమర్శలను, వారియొక్క అభిప్రాయమును మరియు మొదలగునవి తీసుకొనివచ్చుట కొరకు అనుమతించారు. ప్రజలు చూసే దానికన్నా ముందరగానే వారు దానిని చూచారు.

MATT 16:28

 

68యేసు చెప్పెను, "మీలో ఇక్కడ నిలబడిన వారిలో కొందరు [ఆమేన్!] దేవుని యొక్క రాజ్యమును శక్తితో వచ్చుట చూచువరకు మరణమును రుచి చూడరు," లేక, "మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూసే వరకు," లేక, "మనుష్యకుమారుడు తన రాజ్యములో వచ్చుట చూచు వరకు." కొద్ది దినముల తరువాత, ఆయన పేతురు, యాకోబు, యోహానుని ఎతైన కొండపైకి తీసుకొని వెళ్ళాడు, మరియు అక్కడ ఆయన వారి యెదుట రూపాంతరమును పొందెను. సూర్యుని వెలుగు కూడా ఆయన ధరించిన వస్త్రములంత తెల్లగావుండదు. మనము ఎన్నోసార్లు దాన్ని ఉపమానములో చూచియున్నాము, దానిని మనము పరిశుద్ధ గ్రంథమంతటిలో చూడవచ్చును!

COL 3:3

 

69మీరు లేఖనములలో ఒక భాగమును తీసుకుని, దానిని పరిశుద్ధ గ్రంథము అంతటితో కలిపి కట్టివేయవచ్చును. (అవును, అయ్యా!); ఎక్కడనూ చిన్న రంధ్రము కూడా ఉండదు! అది అంతయూ దేవుని శక్తితో అతికించినట్లుగా ఉండును. దానిని సాతాను నలిపివేయాలని ఉన్ననూ నలపలేడు. అది మంచిది. ఎవరైతే దేవుని రాజ్యమును గురించి విశ్వసించి సాక్షమిచ్చారో, ఆ పరిశుద్ధ ప్రజలలోకి అతను రావాలని ఉన్ననూ రాలేడు. ఆయన ప్రతి ఒక్క లేఖనమును తీసుకొని పరిశుద్ధాత్మ శక్తితో అతికించియున్నాడు; రక్తములో దాన్ని కడిగియున్నాడు. దానిలోనికి లోకము ప్రవేశించలేదు; దాని లోపలికి అపవాది ప్రవేశించలేదు. వారు మృతిపొందితిరి. వారి యొక్క జీవము పరిశుద్ధాత్మ చేత దేవుని యొక్క ముద్ర ద్వారా క్రీస్తులో దాచబడియున్నది. ఏ విధముగా వారిని అపవాది బాధించగలడు? ఇప్పుడు ఈ పరిస్థితిలో వారు అక్కడ యున్నారు.

MATT 16:28

 

70ఇక్కడ ఈ స్థలములో తరువాత ఆయన వచ్చుటను చూశాడు, లేక ముందుగా ఆయన రాకడను ప్రదర్శించుటను చూశాడు.

మరియు అతను చూచిన మొదటి కార్యమును ఏమిటి? మొదటి విషయంగా రాకడలో మోషేను అతను చూశాడు. అది చనిపోయిన పరిశుద్దులు తిరిగి పునరుత్తానము పొందుకోబోవు వారికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏలియా కూడా అక్కడ నిలబడియున్నాడు. ఓ, అక్కడ ఏమి జరగనైయున్నదో మీరు ఇక్కడ గమనించాలని నేను కోరుకుంటున్నాను. అక్కడ మొదట మోషే ఉన్నాడు, అది అంతయూ నిద్రించుచున్న ఆరు సంఘకాలముల వారైయున్నారు. ఆరు సంఘకాలములైయున్నవి. అది మాత్రమే కాదు, ఏలియా కూడా అక్కడ ఉన్నాడు, రూపాంతరపరచబడి ఎత్తబడే చివరి దినముల యొక్క వర్తమానీకుడు తన గుంపుతో అక్కడ ఉన్నాడు. (ఆమేన్!) ఇప్పుడు, భవిష్యత్తులో రాకడ కొరకు ఎదురుచూస్తున్నాము.

వారందరు ఏమి…? అంతా ఆయనతో వారందరూ సమకూర్చబడ్డారు. ఓ, మై, అది ఏమైయున్నది? పేతురు, యాకోబు మరియు యోహానుకు ఆయన చేసిన వాగ్దానమును నెరవేర్చినాడు — అది సత్యము — ఎందుకనగా ఆయన చెప్పెను, "ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు, మనుష్యుకుమారుడు తన రాజ్యములో వచ్చుట చూచువరకు మరణమును రుచి చూడరని చెప్పుచున్నాను." మరియు వారు దానిని ముందుగానే (రిహార్సల్) తిలకించారు. అప్పుడు దీని తరువాత, పునరుత్తానము తరువాత…

JOHN 21:22

 

71నేను మీ ముందు మరొక సంగతిని తీసుకొని వచ్చుటకు ఇష్టపడుతున్నాను, పరిశుద్ధ యోహాను 21:20లో, యేసు మరణించి పాతి పెట్టబడిన తరువాత, కొంత మంది విమర్శకులు ఆ దినములలోనే దీనిని ప్రారంభించారు. మనమిప్పుడు ఆ పాఠ్యా౦శములోనే ఉన్నాము, దానిని మనము శుభ్రపరచుదాము. పరిశుద్ధ యోహాను 21:20లో, యేసు తన శిష్యులను కలుసుకొనెను, మంటపైన కాల్చబడిన చేపను మరియు రొట్టెను వారిని భుజించుటకు ఇచ్చాడు. మరియు వారు నది ఒడ్డునకు వెళ్ళినప్పుడు, ఆయన రొమ్మును ఆనుకున్న యోహానును గురించి, పేతురు ఒక ప్రశ్నను అడిగాడు, "ఇతని సంగతి ఏమగును? యేసు యోహానును ప్రేమించెను. యోహాను ప్రేమకు సాదృశ్యము. మరియు అతను ఈలాగు అడిగెను,"ఇతని సంగతి ఏమగును? ఇతని స్థానము ఏమగును? ఇతని భవిష్యత్తు ఏమగును?"

యేసు వారితో ఈ విధముగా చెప్పెను, "నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? అదేమిటి?"

శిష్యులు ఒక పొరపాటును చేశారు. వారు చెప్పారు అది యేసు చెప్పెనని అది అతను రాకడ వరకు జీవిస్తాడని.

కాని యేసు ఎప్పుడునూ ఏ పొరపాటును చేయలేదు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో, 4వ అధ్యాయములో, క్రీస్తు తన మాటను నిలబెట్టుకున్నాడు. ఆయన యోహానుని పైకి పరలోకమునకు కొనిపోయి, సమస్తమును ముందుగానే (రిహార్సల్) చూపించెను. మహిమ! అతను దానిని ముందుగానే (ప్రివ్యూ) చూశాడు. అతను దానిని భూమి మీద జీవించుచుండగానే చూశాడు మరియు అన్ని సంఘకాలాలు నెరవేర్పు జరుగుట చూశాడు, ప్రభువు యొక్క రాకడ వరకు చూశాడు, ప్రకటన గ్రంథం అంతయూ చూశాడు. ఓ, మై!

JOHN 21:22•

REV 4:1

 

72ఆయన యొక్క తప్పిపోని వాగ్దానములో చూశారా? ఇప్పుడు, మీ… యాకోబు, యోహాను, మిగతా వారిలో ఏ ఒక్కరు… పౌలుకు చూచుటకు, చెప్పుటకు కూడా అనుమతి లేదు. ఏమియు లేదు.

ఆయన చెప్పెను, "నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి?"

వారు చెప్పారు, ఆయన కేవలం యోహానుని ఎంచుకున్నాడు, అతనిని పైకి కొనిపోయాడు, అతను మరణించుటకు ముందే అతనికి సమస్తమును చూపించియున్నాడు, ఆ క్రియ జరుగు కాలమంతా అతను జీవించినట్లుగా, అది ఏమైయున్నదో దానిని చూపించియున్నాడు. (సహోదరుడా ప్యాట్, అది అద్భుతము కాదా?) ఓ, చూశారా, అతడిని పైకి కొనిపోయాడు. ఎందుకు, ఇదిగో ఇక్కడ ఉన్నది 4వ అధ్యాయములో 2వ వచనము దానిని ఋజువు చేస్తున్నది. "జరిగిన సంగతులను, జరుగుచున్నవి, మరియు రాబోవు వాటిని చూపించాడు." ఆయన అతనికి సంఘకాలమును చూపించాడు, యూదులు వచ్చుటను, తెగుళ్ళను కుమ్మరించుటను, ఎత్తబాటును, మరలా రాకడను, మరియు వెయ్యేండ్ల పాలన, మరియు ఆయన రక్షించిన వారి యొక్క నిత్యత్వపు గృహము, అతను ఆ సంగతులు జరుగు కాలమంతా నివసించియున్నట్లుగా, అతను అది అంతయూ జరుగుట చూచెను. చూశారా.

ఆయన అతనిని పైకి తీసుకొని పోయి, అక్కడ ఆయన త్రిప్పి చలనచిత్రమును అతనికి చూపించాడు, ఆ సంగతులన్నీటిని ముందుగానే (రిహార్సల్) అతనిని చూడనిచ్చాడు. (ఓ, మై!)

JOHN 21:22

 

73అతను పైకి కొనిపోబడెను, ప్రకటన 4:2లో ఆయన వాగ్దానమును నెరవేర్చాడు. అతను మరణించుటకు ముందుగానే ఆత్మలో పైకి కొనిపోబడి అతను జీవించినట్లుగానే ఆ కార్యములు అన్నీటినీ చూశాడు. అతను వాటన్నిటిని ముందుగానే ప్రదర్శించబడుట (రిహార్సల్) చూశాడు. అలా అతను దర్శనములో ఖచ్చితముగా జరుగనైయున్న సంగతులను చూశాడు మరియు అప్పటి కాలము నుండి భూమి మీద ఏమి జరుగనైయున్నదో ప్రభువైన యేసు రాకడ వరకు అన్నీటిని చూశాడు, అవి అన్నీయు అతనికి దర్శనములో చూపించబడినవి.

తరువాత ఆ శిష్యులు … లేక వారిలో ఏ ఒక్కరూ ఆయన ఆ కాలములోనే వస్తాడని ఎన్నడూ చెప్పలేదు. ఆయన చెప్పెను, "అది నీకేమి… లేక నేను వచ్చువరకు అతను ఉంటే?" తరువాత ఆయన అతనిని పైకి కొనిపోయాడు మరియు ఏమి జరుగబోవుచున్నదో వాటిని అతనికి ముందుగానే (రిహార్సల్) చూపించాడు. ఓ, నేను దాన్ని ప్రేమించుచున్నాను. ఓ, మై!

REV 4:1,2

 

74ఇప్పుడు గమనించండి, అది ఏమైయున్నదో మనం చూద్దాం:

మరియు వెంటనే నేను అత్మవశుడనై, పరలోకములో ఒక సింహాసనము వేయబడియుండెను, మరియు దానియందు ఒకడు ఆసీనుడైయుండెను, ఆ సింహాసనమందు.

అక్కడ ఉన్న ఒక స్వరము అతనిని పిలిచినది. ఓ, ఆ స్వరము! ఓ, అతని వెనుకయున్న ఆ స్వరము. నేను దానినుండి దూరముగా వెళ్ళలేను, తరువాత అతను అక్కడ చుట్టూ చూశాడు, ఆయన అతనికి సంఘకాలములన్నీటిని చూపించాడు, ఎందుకనగా ఏడు సువర్ణ దీపస్తంభాల మధ్య, అనగా, ఆయన సంఘకాలములలో నిలబడియున్నాడు, తరువాత అతను అదే స్వరమును సంఘకాలములు ముగిసిన తరువాత విన్నాడు, ఆ స్వరము భూమిని విడిచి, పైకి పోయినది. అతను మహిమలోకి కొనిపోబడిన తరువాత, అతను అదే స్వరమును విన్నాడు, "ఇక్కడకు పైకి ఎక్కి రమ్ము! నేను నీకు దీని తరువాత జరుగబోవు సంగతులను చూపించెదను." ఓ, మై!

1THS 4:16,17

 

75ఆ స్వరము!

ఆ స్వరము గురించి ఒక నిముషము మాట్లాడుకుందాము. ఇక్కడ నేను కొన్ని లేఖన భాగములను వ్రాసుకొనియున్నాను. I థెస్సలొనీకయులకు 4 కు వెళదాము, ఇక్కడ స్వరము ఏమి చెపుతున్నదో వినండి. ఓ, మనకందరకు తెలుసు అది ఏమి చెప్పబోతున్నదో, దానిని చదువుటకు ముందుగానే, మనకు అది తెలియదా? ఏమి జరుగనైయున్నదో మనకు తెలుసు, "దేవుని యొక్క బూర శబ్దముతోనూ, క్రీస్తునందు మృతులైనవారు లేతురు." అది సత్యమేనా? మీలో ఎవరు దానిని వ్రాసుకొనుచున్నారు, I థెస్సలొనీకయులు 4:16 మరియు 17, "ఆ స్వరము." ఆ స్వరము క్రీస్తు యొక్క స్వరము. (అది సత్యమేనా?) ఆ స్వరము క్రీస్తు యొక్క స్వరము!

…ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను, క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు:

…ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము.

JOHN 11:43

 

76అదే స్వరము యోహానుని "పైకి రమ్ము" అని ఆజ్ఞాపించినది, అదే స్వరము యోహానుతో "పైకి రమ్ము" అని చెప్పినది, అదే స్వరము ఒక దినాన సంఘమునకు ఆజ్ఞాపించును. (ఆమేన్!), సంఘమునకు ఆజ్ఞాపించును.

యోహానుని కూడా అదే స్వరము పైకి రమ్మని చెప్పెను, అదే స్వరము మృతుడైన లాజరుని సమాధినుండి బయటకు రమ్మని చెప్పినది, ప్రధాన దూత యొక్క అదే స్వరము. ప్రధాన దూత యొక్క స్వరమే క్రీస్తు, "ప్రధాన దూత యొక్క స్వరము," చూశారా. ఓ, క్రీస్తు యొక్క బూర స్వరము యోహానుతో "పైకి రమ్ము" అని చెప్పినది, అదే స్వరము లాజరుని ఆజ్ఞాపించినది. లాజరు సమాధి దగ్గర మీరు గమనించారా, ఆయన గొప్ప స్వరముతో మాట్లాడినాడు. ("లాజరు, బయటకు రమ్ము") ఇలా అనలేదు: "లాజరు, బయటకు రమ్ము!" అతనిని సమాధి నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించాడు.

అతను "ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను" అని సమాధానమిచ్చాడు. మరియు అతను చనిపోయిన తరువాత అతని శరీరము క్రుళ్ళిపోయిన తరువాత అతను మృతులలో నుండి బయటకు వచ్చాడు.

1THS 4:16•

REV 4:1

 

77అదే స్వరము యోహానుతో చెప్పెను, "ఇక్కడికి పైకి రమ్ము. నేను నీకు నిర్ణయించబడి తరువాత జరుగబోవు కొన్ని సంగతులను చూపించెదను."

క్రీస్తునందుండి మృతులైనవారు లేచినప్పుడు అదే స్వరము శబ్దము చేయును. "బూర"… ఆ బూర! బూర అంటే ఏమిటి? అతనిని పైకి రమ్మని ఆజ్ఞాపించిన మరియు శబ్దము చేసినదే క్రీస్తు యొక్క స్వరము, అతను బూర శబ్దము వంటి ఆ స్వరమును వినెను మరియు, "పైకి ఎక్కి రమ్ము!" అని చెప్పెను. చూశారా, పునరుత్తానము ఏ విధంగా ఉంటుందో? అది ఒక చిన్న కదలిక, అది రెప్పపాటు కాలములో జరుగును. ఆ స్పష్టమైన శబ్దపు స్వరము మరియు ఆయన సంఘమునకు ఆజ్ఞాపిస్తాడు (మహిమ!), "దానిలో నుండి బయటకు రమ్ము!" అని పిలుస్తాడు ఆ గొప్ప ఆజ్ఞాపించు స్వరము, దేవా, ఆ దినాన అది వినుటకు నాకు సహాయము చేయుము.

1COR 15:22•

PHIL 3:10•

1THS 4:16,17

 

78నేను తరచుగా చెపునట్లు, నాకు తెలుసు రాడ్నీ మర్త్యమైనవాడిగా, నాకు తెలుసు, నా ముందర పెద్ద నల్లని ద్వారము ఉంచబడింది, అది మృత్యువుగా పిలువబడుతున్నది. నా గుండె కొట్టుకుంటున్న ప్రతిసారి, నేను ఆ ద్వారమునకు గుండె ఒక్కసారి కొట్టుకునేంత దూరములో ఉన్నాను. ఈ దినాలలో నేను దానిలోకి వెళ్ళవలసి యున్నది. కానీ నేను దాని లోపలికి బాధపడుతూ మరియు పెద్దగా అరుచుకుంటూ పిరికివాడిగా వెళ్ళాలని లేదు, నేను అక్కడికి ఏ విధముగా వెళ్ళాలని అనుకుంటున్నానో, నా అంతట నేనుగా ఆయన యొక్క నీతి వస్త్రాలలో చుట్టబడి, మరియు దీన్ని తెలుసుకొని, ఆయన యొక్క పునరుత్తానపు శక్తిలో నేను ఆయనను తెలుసుకొని ఉన్నానని నేను దీనిని ఎరిగియున్నాను. అది ఒక రోజు ఆయన నన్ను పిలిచినప్పుడు, నేను మృతులలో నుండి బయటకు వచ్చెదను, ఆయన నన్ను పైన కనిపించవలసినదని ఆజ్ఞాపించినప్పుడు, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను, క్రీస్తునందుండి మృతులైనవారు లేచినప్పుడు.

ఒకవేళ నేను జీవించి ఉన్నట్లయితే, రెప్పపాటు కాలములో, వెంటనే నేను మార్పు చెందుతాను, ప్రభువును ఆకాశమండలములో కలుసుకొనుటకు మిగిలినవారితో కలిసి నేను పైకి వెళతాను. ఆ బూర స్వరము, శబ్దము, స్పష్టముగా, గొప్పగా ఉన్నది. ఓ, అది ఆ మాదిరిగానే ఉంటుంది, ఆయన రాకడలో అది ఆ విధముగానే ఉంటుంది.

JOHN 11:43•

REV 4:1

 

79దానిని గురించి స్పష్టము కాని శబ్దము ఏమియు లేదు. "పైకి ఎక్కి రమ్ము!" అని యోహాను ఆ స్వరమును విన్నప్పుడు, దానిలో ఎలాంటి అస్పష్టత అతనికి లేదు. మరియు అతను పైకి వచ్చెను. ఆమేన్.

లాజరు మృతుడిగా సమాధిలో ఉన్నప్పుడు, అతని ఆత్మ నాలుగు దినములు ప్రయాణములో ఎక్కడో ఉన్నది. అది ఎక్కడ ఉన్నదో నాకు తెలియదు, మనలో ఎవరికి అది తెలియదని అనుకుంటున్నాను. అది ఏమైయున్నప్పటికి, అది ఏ కొద్ది భేధమును కలుగజేయలేదు. సమాధిలో ఉండి, పురుగులు చేత శరీరం తినివేయబడి, వాసన వస్తున్న ఒక మనిషిని ఆయన బయటకు రమ్మని ఆజ్ఞాపించాడు. స్పష్టమైన బూరధ్వని గలిగిన ఆ స్వరము ఇలా అన్నది, "లాజరు, బయటకు రమ్ము!" అక్కడ ఆ మనుష్యుడున్నాడు, చనిపోయి మరియ క్రుళ్ళిపోయి, తనంతటగా తాను కదిలి నడుచుకుంటూ సమాధి నుండి బయటకు వచ్చాడు. దానిలో అస్పష్టమైనది ఏది లేదు, ఏదైనా ఉన్నదా, సహోదరులారా? దానిలో అస్పష్టమైనది ఏది లేదు!

ACTS 2:38•

ACTS 2:38•

HEB 13:8

 

80"పాపి, మారుమనస్సు పొందుము, నేను నీకు నిత్యజీవమును ఇస్తాను" అని ఒక స్పష్టమైన స్వరము యొక్క శబ్దము ఇలా చెప్పినప్పుడు అటువంటి కార్యమునే మనము ఈ రాత్రి కలిగియున్నాము. మీలో ప్రతి ఒక్కరూ మారుమనస్సు పొందుము, మరియు పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్టిస్మము పొందుము, మరియు మీరు పరిశుద్ధాత్మ యొక్క వరమును పొందుదురు. అది ఒక ఆజ్ఞయైయున్నది. దానిని గూర్చిన అస్పష్టత ఏది లేదు.

అది నిజమని చెప్పుటకు నేనే ఒక సాక్షినైయున్నాను. ఇంకా సాక్షులున్నారు, ప్రపంచమంతా ఈ దినాన లక్షమంది సాక్షులున్నారు, అది సత్యమేనని చెప్పు సాక్షము. పరిశుద్ధ గ్రంథము వచ్చిన తరువాత, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రతి ఒక్క మాట బూరయై యున్నది. ప్రతి ఒక్క మాట యొక్క శబ్దము ఒక బూరయై యున్నది, అది ఒక సువార్త బూరయైయున్నది. మరియు అది శబ్దము చేసినప్పుడు అది సత్యమైయున్నది.

అది ఇలా చెప్పినప్పుడు, "యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు," దానిలో ఏది అస్పష్టమైనది లేదు. అవును, అయ్యా. ఆయన అలాగే ఉన్నాడు.

JOHN 5:24•

JOHN 6:54•

JOHN 11:25,26

 

81"మారుమనస్సు పొంది, మరియు యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము పొందుము, మరియు మీరు పరిశుద్ధాత్మ యొక్క వరమును పొందుదురు." దానిని గూర్చి ఎటువంటి అస్పష్టత లేదు.

"నా మాటలు విని మరియు నన్ను పంపిన వానియందు విశ్వాసముంచు వాడు నిత్యజీవము కలవాడు. నాయందు విశ్వాసముంచినవాడు చనిపోయినను మరలా బ్రదుకును. బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నీవు నమ్ముచున్నావా?" "అతడు బ్రదుకును" దాని గూర్చి అస్పష్టమైనది ఏమి లేదు. "నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు, మరియు అంత్యదినమున నేను వానిని లేపుదును." దానిలో అస్పష్టమైనది ఏది లేదు, ఏమి లేదు. అది స్పష్టమైన శబ్దము.

ఓ, అది నాకు తెలుసు. ఒక దినమున ఆ స్వరమును నా పేద ఐరీష్ హృదయము విన్నది, నేను, ఒక చిన్న పాత పాపిని. ఎప్పుడైనా అది నాకు ఎలా సంభవించినది? కానీ అది ఒక స్పష్టమైన ధ్వని అని నేను విశ్వసించాను, నేను దాన్ని అంగీకరించాను, అది సత్యమని నేను ఒక సాక్షమై యున్నాను.

ఒక దినాన ఆయన మరలా ఆజ్ఞాపించుతాడు, మనము ఈ ప్రపంచములో నుండి బయటకు వెళతాము. కారణము, ఆ బూరని గూర్చిన అస్పష్టత ఉండదు. అవును, అయ్యా. అవును, అయ్యా, ఏ అస్పష్టమైన శబ్దము ఏ సమయములో నైనా. ఈ దినాన ఆయన మనలను పిలచినప్పుడు ఆ విధముగానే శబ్దము చేయును. ఆయన ఏదైనా చెప్పునప్పుడు ఎలా శబ్దము వచ్చునో, ఇదియూ అలాగే వచ్చును.

REV 4:2•

REV 22:11

 

82ఇప్పుడు, మనము తిరిగి వాక్యము దగ్గరకు వద్దాము:

…మరియు అదిగో, పరలోక మందు సింహాసనము వేయబడెను. [2వ వాక్యము], మరియు ఒకడు దానియందు ఆసీనుడైయుండెను.

గమనించుము, "సింహాసనము" ఆయన సింహాసనమందు ఆసీనుడై యుండెను. ఇప్పుడు భూమి మీద ఆయన ఇంకెప్పుడు దీపస్తంభముల మధ్య ఉండడు. ఎత్తబాటు రావలసియున్నది. ఆయన తన సింహాసనము మీద ఆసీనుడై మహిమలో ఉన్నాడు, నేను మీరు దానిని ముందుగానే గ్రహించాలని ఆశిస్తున్నా. మనము తిరిగి దాన్ని 5వ అధ్యాయములోనూ కనుగొనగలము, అది కరుణాపీఠము కాదు. అది ఇంకెప్పుడూ కరుణాపీఠము కాలేదు, అది తీర్పు సింహాసనమైయున్నది. అది కృపా సింహాసనము కాదు. అది తీర్పు సింహాసనమై యున్నది, ఎందుకనగా అగ్ని మెరుపులు, ఉరుములు దాని నుండి వస్తున్నవి. కరుణ అన్నది ఇంక లేనేలేదు, ముగిసిపోయినది, సంఘకాలము సమాప్తమైనది. "అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము; నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము; పరిశుద్దుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము." — అది ఇంకెన్నడూ కరుణాపీఠముగా ఉందనేరదు.

1PET 4:18

 

83ఈ రాత్రి, ఆ సింహాసనము మీద రక్తము ఉంచబడింది మరియు కరుణను ఆపేక్షించు ప్రతి పాపికి అది కరుణాపీఠముగా ఉన్నది. కానీ ఆ దినాన, అది కరుణాపీఠముగా ఉండదు, అక్కడ ఆ తీర్పు సింహాసనమందు కోపోద్రిక్తుడైన దేవుడు ఆసీనుడైయున్నాడు. "ఎక్కడ… నీతిమంతుడు రక్షించబడుటయే దుర్లభం అయితే, పాపి మరియు దేవుడు లేడనేవాడు ఎలా రక్షించబడతాడు?" ఆయన తన మహిమకరమైన మేఘములలోకి వచ్చినప్పుడు కూడా, పర్వతాలు దాగుకొనుటకు స్థలములను వెదుగుకొనుటకు ప్రయత్నిస్తాయి. అప్పుడు మనమెక్కడ నిలబడబోవుచున్నాము?

ఓ, ఆ ప్రవాహము ప్రశస్తమైనది,

అది నన్ను హిమమంత తెల్లగా చేస్తుంది;

మరేది కనుగొనుట నాకు తెలియదు,

యేసు రక్తము తప్ప మరేదిలేదు.

84ఓ, మై, ఎటువంటి పాఠము! అస్పష్టమైన ధ్వనులేవి లేవు. ఆయన యొక్క సింహాసనము: "…మరియు ఆయన తన సింహాసనము మీద ఆసీనుడాయెను." ఆయన ఎంత మాత్రము ఇచ్చట లేడు.

ఇప్పుడు, అది మరొక కార్యము, మహా శ్రమలకు ముందుగా సంఘము పైకి కొనిపోబడునని అని ఒక ఋజువుగా యున్నది, చూశరా. ఎందుకు? ఇదిగో ఆయన మహిమలోని సింహాసనమందు యున్నాడు, సంఘము వెళ్ళిపోయింది, అటు తరువాత శ్రమలు వస్తాయి. నోవాహు దినాలలో అని నేను తరచుగా చెప్పినట్లు, నోవాహు భూమి మీద ఒక్క వర్షపు చినుకు పడక ముందే ఓడలో యున్నాడు. లోతు అగ్ని కురవకముందే సొదము బయటకు వచ్చేశాడు. మరియు సంఘము కూడా అణు విస్పోటనము జరగక ముందే మహిమలోకి వెళుతుంది. అది నిజము, అణు విస్పోటనము పడక ముందరే.

మీరనవచ్చును, "ఆ మొదటి వారి సంగతి ఏమిటి?" అది అన్యుల మీదనే కాని క్రైస్తవుల మీద కాదు.

REV 4:1

 

85ఇప్పుడు, గమనించుము. ఓ! ఆయన భూమి మీద తన క్రియలను ముగించియున్నాడు, ఆయన తన సంఘమును కొనిపోయాడు, మరియు ఇప్పుడు ఆయన తీర్పుని పంపుచున్నాడు. ఆయనను త్రోసివేసిన లోకమునకు, ఆయన తన తీర్పును పంపుచున్నాడు. ఆయన మరియు ఆయన సంఘము మహిమలోకి ప్రవేశించియున్నది.

యోహాను, అక్కడ పత్మాసు ద్వీపములో సంఘమునకు ప్రత్యక్షత ఇచ్చినవాడిగా యున్నాడు, మహిమలోకి కొనిపోబడిన సంఘమునకు ఒక సాదృశ్యముగా యున్నాడు, "ఇక్కడకి పైకి ఎక్కి రమ్ము!" చూపించెదను…

మీరనవచ్చును, "అతను సంఘమునకు సాదృశ్యముగా ఉన్నాడా?"

ఈ వాక్యమును వినుచున్న ప్రతివారికి, యోహాను అతనికి సాదృశ్యమైయున్నాడు. ఆమేన్! యోహాను యేసుక్రీస్తు రక్తమునకు ప్రతినిధిగా యున్నాడు, వాక్యమునకు సాక్ష్యముగా యున్నాడు. అతను క్రీస్తుతో వ్యక్తిగత సహవాసము కలిగియుండి, పరిశుద్ధాత్మ బాప్తీస్మముకు ఒక సాక్షిగా యున్నాడు, అతను సంఘమంతటికి సాదృశ్యముగా యున్నాడు, అది, ప్రతి పురుషడు లేక స్త్రీ, బాలుడు లేక బాలిక ఎవరైతే ఒకే విధముగా క్రీస్తును అంగీకరించి ఆయనయందు ఎల్లప్పుడూ విశ్వాసముంచారో వారందరికి సాదృశ్యముగా యున్నాడు, ఏదో ఒక దినాన ఆయన మనకు "పైకి ఎక్కిరమ్ము!" అని ఆజ్ఞాపించుతాడు. మహా శ్రమలు వచ్చుటకు ముందే కొనిపోబడుదుము. జ్ఞాపకముంచుకొనండి, శ్రమల కాలము ఇంకనూ నిర్ణయించబడలేదు.

ఈ సమయం తీర్పును తీసుకొని వచ్చు సమయముగా యున్నది. సంఘకాలము జరిగిన తరువాత ఏమి జరుగనైయున్నవో అక్కడ యోహానుకి ఇప్పుడు అవి చూపించబడినవి. చూశారా. అది ఆ విధముగా యున్నది.

REV 4:2,3

 

86ఇప్పుడు, 3వ వచనములో మరొకసారి గమనించండి లేక 2లో, "పరలోకములో ఒక సింహాసనము వేయబడియుండెను, ఒకడు దానియందు ఆసీనుడాయెను." ఇప్పుడు, అదే ఆత్మ భూమి మీద ఉన్నది, భూమిని వదిలి మహిమలోకి కొనిపోబడినది, వెళ్ళి కరుణలో ఆసీనుడాయెను… అదే యేసు ఈ రాత్రి మనతో ఉన్నాడు, మహిమలోకి వెళ్ళి మరియు సింహాసనమందు ఆసీనుడాయెను.

మరియు సింహాసనమందు ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతమువలె ప్రకాశించు వర్షధనస్సును సింహాసనమును ఆవరించియుండెను.

87నేను ముగించబోవుచున్నాను, ఎందుకనగా మిగిలిన సహోదరులు ప్రసంగించాలి. బహశా రేపటి ఉదయం ఇక్కడి నుండి దీనిని తీసుకుందాము. కాబట్టి, "దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. " ఓ, మై ఓ!

దాదాపుగా ప్రతిచోటా ప్రజలు ఉన్నారు,

ఎవరి హృదయాలైతే మండుతున్నాయో

(నీవు దానిని ప్రేమించుచున్నావా?)

… పెంతెకోస్తు దినాన వచ్చిన అగ్ని వలె,

అది వారిని కడిగి శుభ్రపరచును,

ఓ, ఇప్పుడు అది నా హృదయంలో మండుచున్నది,

ఆయన నామమునకు మహిమ కలుగును గాక!

నేను కూడా వారిలో ఒకడినై ఉన్నానని చెప్పుటకు చాలా సంతోషిస్తున్నాను.

MATT 16:28

 

88యోహాను, ప్రభువైన యేసు చేత పిలువబడి ఆజ్ఞాపించబడి యున్నాడు, ఆ వెనుక, మనుష్యకుమారుని యొక్క రాకడ చూచెదవని దేవుని చేత వాగ్దానము చేయబడ్డాడు. యేసు వారితో ఈ విధముగా చెప్పినప్పుడు పేతురు, యాకోబు, మరియు యోహాను, మరియు వారందరు అక్కడే యున్నారు మరియు ఆయన ఇలా అనెను "ఇక్కడ ఉన్న మీలో కొందరు, మనుష్యకుమారుడు వచ్చు వరకు మరణమును రుచి చూడరని చెప్పుచున్నాను." ఆయన అక్కడ "ఉన్నవారందరూ" అని చెప్పలేదు, కానీ "కొందరు" అని చెప్పెను. దాని తరువాత కొన్ని దినములకు వారు వెళ్ళారు, మరియు పునరుత్తానము యొక్క క్రమమును, ప్రభువు యొక్క రాకడను ముందుగా ప్రదర్శించబడుటను వారు చూశారు.

ఏలియా మృతులైన పరిశుద్దులకు ప్రతినిధిగా యున్నాడు… నా ఉద్దేశ్యమ మోషే, మరియు… పునరుత్తానము చెందాడు. రూపాంతర పరచబడిన గుంపుకు ఏలియా సాదృశ్యముగా యున్నాడు. కానీ జ్ఞాపకముంచుకొనండి, మోషే మొదటివాడు, అటు తరువాత ఏలియా, ఏలియా చివరి దినములకు వర్తమానీకుడుగా యున్నాడు, అతనితో పాటు అతని గుంపు పునరుత్తానములోకి వస్తారు… మంచిది, అది ఎత్తబడుటలోకి వస్తుందని నా ఉద్దేశ్యము. మోషే పునరుత్తానములోకి తీసుకొని రాబడ్డాడు, మరియు ఏలియా ఎత్తబడు సమూహములోకి తీసుకొని రాబడ్డాడు. మరియు అక్కడ వారిద్దరూ ప్రతినిధులుగా ఉన్నారు.

MATT 17:4,5

 

89కొద్దిసేపటి తరువాత వారు చూచి తరువాత గమనించి, మరియు పేతురు ఇలా అన్నాడు, "మూడు పర్ణశాలలు కట్టుదుము. కొన్నింటిని ధర్మశాస్త్రము క్రింద, కొన్నింటిని ఏలియా క్రింద, మరియు కొన్నింటిని (వాటిలో కొన్నింటిని) ఈ మార్గము క్రింద ఉంచుదాము.

కొద్దిసేపటి వరకు వారు అలా మాటలాడుచుండగానే, ఒక స్వరము ఈ విధముగా మాటలాడినది "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి." వారు చూసినప్పుడు, యేసుని మాత్రమే చూచిరి, అన్నియూ ఒక్కటిగా ఒదిగిపోయెను. ఓ, ఆయనే వెలుగైయుండెను, సత్యమైయుండెను, మార్గమైయుండెను, ద్వారమైయుండెను, వర్షధనుస్సుయై యుండెను.

90ఓ, దేవుని చిత్తమైతే, రేపటికి మనము గొప్ప పాఠమును కలిగియున్నాము. రేపు మనము తీర్పులని తీసుకుందాము, సూర్యకాంతపు రాయి, మరియు అది దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది, అది ఏ భాగమును పోషిస్తుంది. మరియు మనము పద్మరాగము రాయిని తీసుకుందాము, మరియు మనము తీసుకుందాము. మరియు వివిధ రకములైన అన్ని రాళ్ళు, మనము వీటి అన్నీంటినీ యెహెజ్కేలు ద్వారా తీసుకుందాము, తిరిగి ఆదికాండముకు వెళదాము, తిరిగి ప్రకటనకు వెళదాము, పరిశుద్ధ గ్రంథము మధ్యలోకి వద్దాము, వాటిని అన్నీటిని కలిపి ఒక్కదానిగా కడదాము, ఈ రక రకముల రాళ్ళు మరియు రంగులు, మొదలగునవి రావలసియున్నవి. తరువాత మనము వాటిని అన్నీటిని తీసుకొనివచ్చి తిరిగి నిటారుగా ఉంచినట్లయితే మరియు చూడండి అది వాస్తవము కాదా. చూశారా, అన్నీయు ఒకే రంగులో లేవా చూడండి, అదే కార్యము. మరియు అదే పరిశుద్ధాత్మ - అదే దేవుడు, అదే సూచక క్రియలు చూపించుచున్నాడు, అదే అద్భుతాలు, ఆయన వాగ్దానము చేసినవాటినే ఆయన చేస్తున్నాడు.

MATT 16:28

 

91ఆయన, పేతురు, యాకోబు మరియు యోహాను మరియు అందరూ, శిష్యులందరూ నిలబడియుండగా, ఇలా చెప్పెను, "ఇక్కడ ఉన్న మీలో కొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యములో వచ్చు వరకు మరణమును రుచి చూడరని చెప్పుచున్నాను."

యోహానుతో చెప్పెను, చెప్పెను…. పేతురు చెప్పెను, "ఇతని సంగతి ఏమగును? అతను అడిగెను, అతడికి ఏమి జరుగనైయున్నది?"

ఆయన ఈలాగు చెప్పెను "నేను వచ్చువరకు అతనుండుట నాకిష్టమైతే అది నీకేమి?" ఆయన అతడిని దానిని చూచుటకు అనుమతిని ఇచ్చియున్నాడు. మిగిలిన వారందరూ చనిపోయి కొనిపోబడ్డారు, యోహాను మాత్రము ప్రభువు యొక్క రాకడ శక్తిలో వచ్చుటను ముందుగానే ప్రదర్శించబడుట చూచుట కొరకు జీవించియున్నాడు, ఆ దృశ్యమంతా అతని కాలము నుండి తీర్పు తరువాత వరకు మరియు వేయ్యేండ్ల పాలన వచ్చువరకు చూసియున్నాడు. యోహాను దానిలో ప్రతి ఒక్కదానిని చూసియున్నాడు, వెయ్యేండ్ల పాలన ముగిసిన తరువాత, దేవుని రాజ్య కాలము ప్రారంభమగుటను చూచాడు. కాబట్టి ఆయన తన మాటను నిలబెట్టుకొనియున్నాడు, ఆయన ఆ విధముగా లేడా?

92మనము 2వ వచనముకు గురుతు పెడదాము. దేవుని చిత్తమైతే, 3వ వచనము నుండి ఉదయం ప్రారంభించుదాము.

మన తలలను వంచుదాము:

ఈ రాత్రి సంఘములో ఎంతమంది, వారికి తెలుసు, నా సహోదరుడా, నా సహోదరీ, మీరు ఒక దినాన ఆజ్ఞాపించబడతారు, మీరు సిద్ధముగా ఉన్నా లేకున్నా? మీరు తయారైనా అవ్వకున్నా, మీరు దేవుని కలుసుకొనుటకు ఆజ్ఞాపించబడతారు. ఆ బూర ధ్వనిస్తుంది, అలాగు జరిగినప్పుడు, అది నీకు తీర్పుగా ఉంటుంది, అక్కడ నీవు తిరిగి జీవించవు, బహుశా వేల సంవత్సరములు నరకములోని సాతను గోతులలో శ్రమలను అనుభవించుతావు, లేక వారు నిన్ను పైనున్న మహిమకరమైన పరిశుద్దులను కలుసుకొనుటకు ఆజ్ఞాపించుతారు.

HEB 13:8

 

93దేవుడు పేతురుకు, యాకోబుకు, మరియు యోహానుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకొనియున్న ప్రకారముగానే, ఆయన ప్రేమించి ప్రత్యక్షతను బయలుపరచిన యోహానుకు కూడా నిశ్చయంగా ఆయన తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఆ ప్రకారమే సంఘకాలముల ద్వారా ఆయన తన వాగ్దానమును నిశ్చయంగా నిలబెట్టుకొనెను. అదే ప్రకారం ఆయన ఈ చివరి దినములలో వాగ్దానము చేసినట్లుగా, ఆయన చివరి వర్షమును మరియు తిరిగి ఆయనలోని అదే ఆత్మను భూమి మీదకు నిశ్చయంగా తెచ్చును. అదే ప్రకారం సాయంత్రం సమయంలో వెలుగు వచ్చి అదే శక్తిని, అదే సూచనలు చూపించును. అదే ప్రకారం ఆయన తన దినములలో ఏ విధముగా అన్నీయూ చేసియున్నాడో ఆలాగున, ఈ చివరి దినమున ఆయన "తెరిచిన ద్వారము" దగ్గర తిరిగి ఆలాగే చేయును.

ఇప్పుడు అది ఇక్కడ ఉన్నది! ఇప్పుడది మనతో ఇక్కడ ఉన్నది, పరిశుద్ధాత్మయైన, యేసుక్రీస్తు, నిన్న, నేడు, నిరంతరము ఒకటే రీతిగా యున్నాడు. మీకు ప్రసంగముగా ఉన్నది, అది భోధగా ఉన్నది, అది మీకు ఏది తప్పు మరియు ఏది ఒప్పు అని చూసి తెలుసుకొనుటకు ప్రయత్నము చేయుటకైయున్నది. పరిశుద్ధాత్మ తనంతట తానుగా మానవ పెదవుల ద్వారా పలుకుచుండెను, మానవుల మధ్యలో క్రియ చేయుచున్నాడు, కరుణను మరియు కృపను చూపించుటకు ప్రయత్నము చేయుచున్నాడు.

ఆయనను నీవు ఇంకనూ పొందనట్లయితే, ఈ నూతన సంవత్సరపు ముందు రాత్రి దేవుని వైపు నీ చేతిని ఎత్తి ఇలా చెప్పుము, "దేవా, ప్రత్యక్షతను తెలియజేయు యోహాను మీద ఉన్న శక్తిని నేను పొందుకొనునట్లు చేయుము, నన్ను ఆజ్ఞాపించినప్పుడు నీ ముందర ఆయనలాగా నేను కూడా శాంతియుతంగా ఉండునట్లుగా అది చేయును?" నీ చేతిని ఎత్తుము. దేవుడు నిన్ను దీవించును గాక. నిన్ను దీవించును గాక. సంఘమంతటిని, నిన్ను దీవించును గాక. "నన్ను ఆజ్ఞాపించినప్పుడు జవాబిచ్చుటకు నన్ను సిద్ధపడనివ్వండి."

94మా పరలోకపు తండ్రీ, మరో 2 గంటలలో ఈ నూతన సంవత్సరపు ముందు రోజు ముగుస్తుంది, నూతన సంవత్సరము వస్తుంది. మేము ఈ సంవత్సరము ఏమి చేశామో, మేమవి చేశాము. నేను చేసిన అనేక క్రియలవల్ల నేను సిగ్గుపడుతున్నాను, ప్రభువా, వాటికి నేను పశ్చాత్తాపపడుతున్నాను.

నేను చేసిన అనేకమైన కార్యాలు నా సహోదరలలోని అనేకులకు అర్థం కావడం లేదు. బయట పొలములోనున్న అనేకమంది నా సహోదరులకు నేను అవి ఎందుకు చేశానో వారికి అర్థం కాదు. కానీ, తండ్రీ, నేను నడిపించబడి యున్నాను కనుకనే వాటిని నేను చేశాను, తండ్రీ, నేను ప్రార్ధిస్తున్నా ఆ నడిపింపుకు నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయనివాడిగా నీవు చేయుము. కానీ, ప్రభువా, నన్ను నడిపింపుము. నేను ఏది చేయవలసి యున్నదో దానిని చేయునట్లు నడిపింపుము. దేవా, నాకు సహాయము చేయుము, ఎందుకనగా నేను యదార్ధమైనవాడిగా నీ చిత్తము తెలుసుకోవాలని ఆశిస్తున్నాను, దాని ద్వారా నేను జీవాహారమును ప్రపంచములోని ప్రజలకు తీసుకొని వచ్చుటకైయున్నది (నేను ఈ సంఘమును వదిలి వెళ్ళినప్పుడు అనేక సంవత్సరముల క్రితం నీవు నాకు చూపించిన ప్రకారం). నేను ఆ గొప్ప జీవాహరపు పర్వతమును చూచినప్పుడు, తెల్లని వస్త్రాలు ధరించుకున్న పరిశుద్దులు భూమియంతట నుండి ఆ జీవాహరమును తినుటకు వచ్చుచున్నారు. ఓ దేవా, అనుమతినివ్వు… ఓ దేవా, ప్రజలకు జీవాహారమును అందించుటలో ఎప్పుడూ, ఎన్నడునూ విఫలం చెందకుండా ఉండాలని అనుమతినివ్వుము.

95ఇక్కడ ఆకలిగొని చేతులను ఎత్తిన ఈ ఆత్మలను ఇప్పుడే దీవించుము. మరెక్కువైన జీవం కొరకు వారు వెదుకుచున్నారు. ప్రభువా వారిలో ప్రతి ఒక్కరిని నీవు పరిశుద్ధాత్మతో నింపాలని నేను ప్రార్ధిస్తున్నాను, దేవా, దయచేయుము. వారికి నీ దీవెనలు ఇవ్వుము. ప్రతిచోటా ఉన్న మా సహోదరులకు సహాయము చేయుము.

తిరిగి రావాలని నిశ్చయించుకుని పరిచర్య చేయుచున్న సహోదరులను దీవించుము, ఇప్పుడు కొద్దిసేపటిలో, ఇతరులు మాట్లాడతారు. వారు ఈ రాత్రి జీవాహరమును ఇవ్వాలని మేము ప్రార్ధిస్తున్నాము, తండ్రీ, మేము శ్రద్ధగా మరియు భయముతో కూడిన గౌరవముతో ఆ స్వరమును వినునట్లు దయచేయుము.

ఈ నూతన సంవత్సర ఉదయం నూతన ఆశలను, నూతన ఆలోచనలు, నూతన ప్రత్యక్షతలను, నూతన శక్తిని, ఓ, ప్రతిఒక్కదాన్ని తెచ్చునట్లుగా మమ్ములను దీవించుము. ప్రభువా, నీ దీవెనలను మరియు వాగ్దానముల చేత మమ్ములను తిరిగి నూతన పరచుము. మా ప్రార్థనలతో మమ్ములను మేము మీ హస్తములలోనికి అప్పగించుకొనుచున్నాము. యేసుక్రీస్తు నామములో, ఆమేన్.

కృతజ్ఞతలు, నా సహోదరీ సహోదరులారా.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...