ప్రకటన, 4వ అధ్యాయము #2
vgr count -318 ఈ ఉదయము లోపలికి తిరిగి వచ్చినందుకు సంతోషముగా ఉన్నది. ఇప్పుడు, కేవలం ఈ మంచు ఎలా ఉన్నదో అని నేను ఆలోచిస్తున్నాను, మరియు మేము కొలరాడోలో ఉన్నట్లయితే, ఈ మంచు చాలా మృదువుగాను మరియు మెత్తగాను ఉంటుంది, మరియు సుమారుగా 40 (-40, వాతావరణం) డిగ్రీలకన్నా తక్కువగా ఉంటుంది. మీరు అలాగు ఊదితే [బ్రదర్ బ్రెన్హాం దానిని వివరిస్తున్నారు.] మరియు అది నేరుగా ధూళిలోకి వెళ్ళిపోతుంది. మరియు అది శీతాకాలం అంతయు అలాగే ఉంటుంది. కాని ఇప్పుడు, ఇక్కడ ఉన్నట్లుగా, దీనిలో, రెండు ప్రాంతాల మధ్యలోని దానివలె ఉన్నది, తరువాత అది నిజముగా చాలా తడిగాను మరియు పాడైనదిగాను మరియు చెడుగాను ఉన్నది, అది చూచుటకు ఆ విధముగా ఉంటుంది, ఆరిజోనాలో నేను దానిపైనుండి ఎగిరి వెళ్ళిపోవాలని ఆశిస్తాను, వేసవి కాలము వచ్చేంత వరకు ఎదురుచూసి అప్పుడు తిరిగి వస్తాము.
అందుచేతనే మాకు జలుబులు మరియు ఇప్పుడు క్రిములు మరియు అన్ని నేల మీద పడివుంటాయి, మరియు అది గడ్డకట్టునట్లుగా చేస్తుంది, అటు తరువాత ఆ మంచుగడ్డలు కరుగుతాయి, మరియు గడ్డకడతాయి, తరువాత కరుగుతాయి. మరియు అది పైకి వచ్చినప్పుడు మేము ఊపిరి ద్వారా దాన్ని మన లోపలికి పీలుస్తాము. అందుచేత, గొంతు గరగరలాడుట, తల నొప్పులు, మరియు నొప్పులు, బాధలు. మరియు మై, మై, ఎటువంటి సమయమది, ఎటువంటి ప్రాంతమది!
కాని ఆ నది అవతల ఒక దేశమున్నది,
దానిని వారు నిరంతరము మధురమైనదని పిలుస్తారు,
మరియు దానిని మనము కేవలం విశ్వాసపు ఆజ్ఞ ద్వారా చేరుకోగలము,
అక్కడ మరణమనేదే లేకుండా నివసించుటకు,
ఒకరి తరువాత ఒకరము ఆ ద్వారమును పొందుకుంటాము,
ఒక దినమున వారు నీ కోసము, నా కోసం ఆ సువర్థ గంటలు మ్రోగిస్తారు.
తరువాత మనం అక్కడకి వెళ్ళి అక్కడే ఉంటాము, అలా ఉండమా? ఆ దినము కొరకే మనం ఎదురు చూస్తున్నాము.
2ఇప్పుడు, గత రాత్రి నేను నిశ్చయంగా సహోదరుల ద్వారా వినిన ఆ అద్భుతమైన వర్తమానములనుబట్టి మరియు ఆ కార్యములనుబట్టి ఆనందించాను. పాట్ టైలర్ ఎక్కడున్నాడు, ఈ ఉదయం అతను ఇక్కడున్నాడా? పాట్, ఓహ్, భూసంబంధంగా జీవితానికి రెండితలు పెద్దదిగా నీవక్కడ కూర్చుండుట నేను చూడలేదు. మరియు నేను నీవక్కడ కూర్చుండుట చూడలేదు. నేను మొదటిసారిగా పాట్ మాట్లాడుట విన్నాను. నిశ్చయంగా నేను దాన్ని ఆనందించాను, ఖచ్చితముగా మనమందరం ఆనందించాము.
ఆ తరువాత ఇక్కడ ఆ చిన్న సహోదరుడు వర్తమానమును గూర్చి మండుచున్న సాక్ష్యమును ఇచ్చియున్నాడు, అది నిజముగా మర తుపాకీ (మెషీన్ గన్) నుండి కాల్చునప్పుడు వచ్చు శబ్దమువలె ఉన్నది. మరో సహోదరుడు, ఓహాయో నుండి వచ్చాడు, నేను అతడిని కలుసుకున్నాను. ఈ ఉదయం అతడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడా? అతడు చాలా వేగంగా మాట్లాడుట గురించి బ్రదర్ నెవిల్ ఫిర్యాదును కలిగియున్నాడు.
తరువాత, బ్రదర్ జె.టి. పార్నెల్; మరియు వారెన్నడూ బ్రదర్ బీలర్ చెప్పినది పొందుకోలేదని నేను అనుకుంటున్నాను. మరియు బ్రదర్ పార్నెల్ ఇక్కడ ఉన్నారా? బ్రదర్ పార్నెల్ మరియు బ్రదర్ బీలర్, నాకు ఖచ్చితముగా తెలియదు, నేను బ్రదర్ బీలర్ని చూశానని అనుకుంటున్నాను.
3ఈ వెలుగులు, ఇది ఒక… వారెప్పుడైనా నూతన టాబెర్నికల్ ను కట్టినప్పుడు, వారు వ్యత్యాసముగా నిర్దేశిస్తారని నేను ఆశిస్తున్నాను, ఒక చిన్న వ్యత్యాసము. ఇది మన మొదటి టాబెర్నికల్, ప్రయోగాత్మకమైనది. మరియు మనము నూతనమైనదాన్ని ఎప్పుడు పొందుకుంటాము, ఎందుకు, మనకు ఇప్పుడున్నదానికన్నా వ్యత్యాసమైనది కావాలి, నీవు దాన్ని చూడలేవు.
ఒక టాబెర్నికల్ ఇలా క్రిందకు వంగినట్లుగా నిర్మించుటను నేను ఇష్టపడతాను, వినుటకు వచ్చినవారు. ప్రతి సమయములోనూ మీరు వినుటకు వచ్చిన వారిని నేరుగా చూడవచ్చును. ఆ తరువాత ప్రత్యేకంగా వివేచనాత్మకమైన కూటములలో, నీవు చుట్టూ వెళ్లవచ్చును. చూశారా, ముందుకు మరియు వెనుకకు వారిని ఇలాగు పట్టుకొనవచ్చును. ఆ తరువాత ఇంటి ముందు బయట కూర్చొనుటకు ఒక చిన్న ప్రదేశము (బాల్కనీ) ఉన్నట్లయితే, అది బాగుంటుంది.
4బ్రదర్ లిటిల్ ఫీల్డ్ (బిల్లీ ఇక్కడ ఉన్నట్లయితే) గత రాత్రి నన్ను పిలిచియున్నాడు మరియు నేను సమర్పించిన ఆ టాబెర్నికల్ యొక్క వివరములు నాకు పంపియన్నాడు, ఆ ఇంటి నమూనాను తయారు చేయువారు (ఆర్కిటెక్టులు)… బ్రదర్ ఉడ్, దాని నమూనా తయారు చేయించుటకు అతడికి ఇచ్చిన ఖర్చు 500ల డాలర్లు, మరియు అతడు ఆ తయారీలో వాడు ప్రతియొక్క పదార్ధములను మరియు వాటి యొక్క వెలను, ఉపయోగించు ప్రతి దాని యొక్క వెల యొక్క వివరములను పంపియున్నాడు. మరియు అతడు దాన్ని మాకు పంపియన్నాడు, మరియు రావాలని అనుకున్నాడు, మరియు ఇలా అన్నాడు, అతడే లంబర్ ప్రజల దగ్గరకు వెళ్ళి చూసి మరియు అతడు అనుకున్నట్లుగా వారు దాన్ని కత్తిరించగలరో లేదో తెలుసుకుంటాను అన్నాడు. అది అందమైన టాబెర్నికల్, చాలా పెద్దది కాదు, కాని అది ఎంతో అందమైన నిర్మాణము.
కావున నేనతనికి చెప్పాను, నేనన్నాను, "దాన్ని నీవు బిల్లీకి ఎప్పుడైతే పంపుతావో, వెంటనే దాన్ని ధర్మకర్తలకు (ట్రస్టీలకు) మరియు డీకన్లకు ఇస్తాను మరియు అది ఎంతమాత్రం మాకు సరిపోతుందో మేము దాన్ని చూస్తాము, వారు భవనమును ప్రారంభించుటకు వారెంత కలిగియున్నారో దాన్ని చూసుకుంటాము."
అతడన్నాడు, "మీరు చేయు ఆ సమయములో వాటన్నిటిని గురించి వివరించుటకు నేను వస్తున్నాను, మీతో పాటుగా నేను కూడా ఉంటాను." మరియు బ్రదర్ లిటిల్ ఫీల్డ్ కృపతో నిండిన వ్యక్తి, కృపగలిగిన వాడు, అది మంచిది.
5ఇప్పుడు, నూతన సంవత్సరము ప్రారంభపు అనుభూతిలోకి మీరందరూ వచ్చియున్నారా? ఆమేన్. నూతన సంవత్సరములోకి వెళ్ళండి. ప్రభువును సేవించుకునేందుకు మనము దాన్ని ప్రారంభించుకుందాం. గడిచిన సంవత్సరము కొరకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలని ఈ ఉదయం ఎంతమంది అనుకుంటున్నారు. మరియు దానియంతటి ఉద్దేశ్యమేమంటే, గతించినవి మరచిపొమ్మని ఆయనను అడుగుటయే? కావున మనము మంచము మీద నుండి మేల్కొనగానే అక్కడనే దాన్ని చేశాము, మరియు ఆ తరువాత బల్ల దగ్గరకు వస్తున్నప్పుడు మరియు ఒక చిన్న కుటుంబమునకు సహజముగా అదియే ఒక వేదిక, మరియు వారు ఆ బల్ల చుట్టూ కూడుకుని ప్రార్ధిస్తారు.
కాబట్టి రాత్రియందు నిద్రించుటకు ముందుగా ప్రార్ధించుటనేది మనము ఎల్లప్పుడూ ఒక అలవాటుగా చేసుకున్నాము. నేను మొదటిసారిగా మారినప్పటి నుండి నాకు ఆ అలవాటున్నది. నేను ఉదయముననే లేచి, మరియు అది నేను నడుచుటకు చాలా చీకటిగానూ మరియు చాలా మంచువంటి పొగతో నిండియుంటుంది. నేను ఎక్కడకు వెళుతున్నానో నాకు తెలియదు. కాని కేవలం నేను ఆయనను నా చేతిని తీసుకొని దినమంతా నన్ను నడిపింపుము అని అడిగినట్లయితే…
6అయితే నాకు జ్ఞాపకమున్నది, తిన్నగా ఈ వీధిలోనే, నేను ఒక యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు, మరియు బిల్లీ పౌలుకు 3 లేక 4 సంవత్సరములుండవచ్చును, మరియు మేము ఈ వీధిలోనే నివసించేవారము, మరియు ఒక రాత్రి బిల్లీ త్రాగుటకు నీళ్ళు కావాలని అడిగాడు, మరియు వంటగదిలో నీళ్ళు అయిపోయినవి, నీటిని తోడేది మరియు బక్కెటు అక్కడున్నది. మరియు నేనన్నాను. ఓ, నేను చాలా అలసిపోయాను, నేను ఆ దినమంతా కష్టించి పని చేశాను మరియు సగం రాత్రంతా ప్రసంగించాను. మరియు అతడన్నాడు, "డాడీ, నాకు త్రాగుటకు నీళ్ళు కావాలి."
మరియు నేనన్నాను, "బిల్లీ, అక్కడ వంటగదిలోని చిన్నబల్ల మీద ఉన్నది అక్కడకు వెళ్ళు." నేనన్నాను…
అతడు పైకి లేచాడు, మరియు తన కన్నులను రుద్దుకున్నాడు, మరియు అటువైపు చూశాడు. అతడన్నాడు,"డాడీ, అక్కడకు వెళ్ళుటకు నేను భయపడుచున్నాను." చూశారా.
మరియు నేనన్నాను, "అయితే మంచిది." నేన్నాను, "హనీ కేవలం పరుగెత్తుము, మరియు వెళ్ళి నీటిని తెచ్చుకొనుము. డాడీ చాలా అలసిపోయాడు." ఆ కిటికీ నుండి కేవలం కొద్ది దూరమే ఉన్నది.
మరియు అతడన్నాడు, "కాని డాడీ, అక్కడకు వెళ్ళుటకు నేను భయపడుచున్నాను." చూశారా?
7మంచిది, ఆ చిన్నవానితో పాటు నేను కూడా లేచాను. మరియు నా చేతిని పట్టుకొని మరియు అక్కడకు చేరుకున్నాడు, మరియు అది మంచి కార్యమైయున్నది, మేము నాలుగు లేక అయిదు అడుగులు నడిచేలోపలే మీడా నేల మీద అతికించిన రగ్గును తగులుకున్నాడు, మరియు అది లినోలియమ్ యొక్క చిన్న భాగము, మరియు అది ఎలా ఉంటుందనేది మీకు తెలుసా, మరియు అతడు దాన్ని చాలా తొందరలో చేశాడు, కాని నా చేతిలో అతని చేయున్నది, మరియు అతడు నా చేతిని గట్టిగా నొక్కి పట్టుకున్నాడు.
ఆ తరువాత నేనక్కడ కొద్దిసేపు నిలబడ్డాను, మరియు నేనాలోచించాను, "దేవా, అది నిజము," చూశారా. "నీవు నా చేయి పట్టుకొనకుండా నేను ఒక్క అడుగు కూడా వేయలేను, ఎందుకనగా నేనెప్పుడు తొట్రుపడతానో నాకు తెలియదు," చూశారా. "మరియు నేను, నీవు ఉన్నతమైనవాడివని అనుభూతిని చెందినంత కాలము, శక్తివంతమైన చేయి నన్ను పట్టుకుంటుంది, నీవు నన్ను ఆయా సమయాలలో పట్టుకున్నావని నాకు తెలుసు."
8కావున నేను, నా చేతిని ఆయనలో ఉంచుట అనే అలవాటును చేసుకొనుటకు ప్రయత్నం చేస్తున్నాను. మరియు కొన్నిసార్లు నేను చేసిన కార్యములు నా దృష్టిలో నాకే వింతగా అనిపిస్తుంటాయి, ఆ కార్యాలు మానవుని ఆలోచనకు అసహజమైనవిగా కనిపిస్తాయి, కాని మనము వాటిని ఒంటరిగా ఉండుటకు అనుమతిని ఇచ్చినట్లయితే, చేయుటకు కేవలం అది మాత్రమే మంచి కార్యమైయున్నదని నేను కనుగొన్నాను.
మీకు తెలుసా, ఇక్కడ కనపడని కార్యములు, నిన్ను దేవుడు వారిలోకి నడిపించినట్లయితే, వారిక్కడే ఎక్కడో ఉంటారు, మీరు చూశారా? ఎందుకనగా ఎలాగు నడిపించాలో ఆయనకు తెలుసు. కావున ఆయన కృపే మనకు చాలుననేది కనిపిస్తున్నది. మరియు మనకు కావలసిన భద్రత అంతా ఆయనలోనే ఉన్నది, అప్పుడు ప్రతి ఒక్కదాన్ని ఆయన ప్రక్కనే పడవేయుము మరియు దేవుని యొక్క మార్పులేని చేతిని పట్టుకొనుము.
9మనకు ఇక్కడ ఒక పాటను పాడే అలవాటున్నది, చాలాకాలము నుండి ఆ పాటను పాడుట నేను వినలేదు. ఇప్పుడు, నేను పాడలేను మరియు అక్కడ… అక్కడ మనతో ఏ అపరిచితుడు ఉంటాడని నేను అనుకోవటంలేదు. కావున, అందుచేతనే నేను ఈ చిన్నపాటలను ప్రయత్నిస్తుంటాను, మీకు తెలుసా, ఎందుకనగా నేను దాన్ని ప్రేమిస్తాను. మరియు జీన్, నీవు దీన్ని టేపులో ఉంచి ప్రజలలోకి అనుమతిని ఇచ్చినట్లయితే. ఇక్కడ ఒక చిన్న పాటను పాడతాను.
సమయము త్వరగా మారుతూ నిండిపోవుచున్నది.
కదిలంచబడకుండా భూమిమీద ఏదీలేదు
కదిలించబడనిదే నిలిచియుంటుంది.
మీ ఆశలను నిత్యమైన దాని మీద కట్టుకొనుము.
మారని దేవుని చేతిని పట్టుకొనుము!
మీలో ఎంతమంది ఆ పాటను విన్నారు? ఓ, నేను దాన్ని ప్రేమిస్తాను, మీరలాగు చేయుటలేదా? దానిలో మరో వచనమును ప్రయత్నము చేద్దాం.
మారని దేవుని చేతిని పట్టుకొనుము!
మారని దేవుని చేతిని పట్టుకొనుము!
మీ ఆశలను నిత్యమైన దాని మీద కట్టుకొనుము,
మారని దేవుని చేతిని పట్టుకొనుము!
మరో వచనమును ప్రయత్నిద్దాం.
మన ప్రయాణం పూర్తయినప్పుడు,
మనము దేవుని యొద్ద సత్యమును కలిగియుండాలి,
మహిమలో నీ గృహము స్పష్టముగా మరియు వెలుగుతో ఉండును,
పైకెత్తబడిన నీ ఆత్మ దాన్ని చూస్తుంది!
మారని దేవుని చేతిని పట్టుకొనుము!
మారని దేవుని చేతిని పట్టుకొనుము!
మీ ఆశలను నిత్యమైన దాని మీద కట్టుకొనుము,
మారని దేవుని చేతిని పట్టుకొనుము!
ప్రార్థన కొరకు ఒక్క నిముషము లేచి నిలబడుదాం, మీ చిత్తమైతే, మన చేతులలో ఒకదానిని దేవుని కొరకు పైకెత్తునప్పుడు మరియు దాన్ని మరలా పాడుదాం.
మారని దేవుని చేతిని పట్టుకొనుము!
మారని దేవుని చేతిని పట్టుకొనుము!
మీ ఆశలను నిత్యమైన దాని మీద కట్టుకొనుము,
మారని దేవుని చేతిని పట్టుకొనుము!
ఈ లోకములో గొప్పదైనది వృధాయే,
అది త్వరగా పడిపోతుంది,
మీ ఆశలను నిత్యమైన దాని మీద కట్టుకొనుము,
అవి ఎన్నడూ గతించిపోవు!
10పరలోకపు తండ్రీ, మేము నిలబడియుండగా, ఓ, ప్రభువా, ఆ పాత పాటలను పాడుటను నేను ప్రేమిస్తాను, అవి మా హృదయాల్లో అడుగున లోతైన భాగములలోకి వెళతాయి మరియు అవి సజీవ దేవుడవైన నీకు మా యొక్క ప్రేమను తెలియచేస్తాయి. ప్రభువా, ఈ ఉదయం మేము చేతులెత్తి ఉండగా, ఇది ఒక చిన్న జ్ఞాపకముగా యున్నది "ప్రభువా, మా చేతులను పట్టుకొనుము."
నేను బిల్లీ పౌలు గురించి మాట్లాడుతున్నాను, అతను నా చేతిని ఎలా పట్టుకున్నాడో, నేను అతని పట్టుకొనక పోయినట్లయితే అతడు పడిపోయుండేవాడు. మరియు ఓ దేవా, నీవు మా చేతిని పట్టుకొనక పోయినట్లయితే మేము ఎన్నోసార్లు పడిపోయేవారము. అతని గురించి ఆలోచిస్తుంటే, తల్లి లేకుండా, ఒక చిన్న బాలుడు. మరియు అది ఏలా… జీవితంలో లోతుగా, అతడు ఎంచుకున్న మార్గములు, అతడిని ఎప్పుడో చంపియుండేవి, కాని అక్కడ ఒక గొప్ప హస్తమున్నది నేను చేరుకోలేని చోట ఆ హస్తము చేరుకుని మరియు తన చేతిని పట్టుకున్నది. ఇప్పుడు, దాన్ని బట్టి మేమెంతో ఘనమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.
ప్రభువా, తెలిసికొనుటనేది చాలా సంతోషముగా ఉన్నది, ఈ శరీరము నుండి ప్రాణం వేరైనప్పుడు చెందే అనుభూతి, అక్కడకు మనము చేరుకునేటప్పటికే ఆ హస్తము అక్కడ ఉంటుంది మరియు మనలను పట్టుకుని, ఆ నది అవతల వరకు మనకు మార్గదర్శిగా ఉంటుంది. ఈ కార్యములనుబట్టి మేము నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ నమ్మకము, ఈ సంతోషకరమైన నమ్మకమును మేము కలిగియున్నాము, ప్రాణమును నడిపించువాడు, ఈ ప్రయాణమంతటిలో మేము అవతలవరకు నడుస్తున్నప్పుడు అది మమ్ములను సరిచేస్తుంది లేక నీటిలోని ప్రయాణించు జీవమును ధృఢపరుస్తుంది.
తండ్రీ, మేము ప్రార్థన చేస్తున్నాం, ఒక కవి చెప్పినట్లు "ఒంటరిగా, మరియు ఒక చిక్కుకుపోయిన సహోదరుడు, మనము ధృఢముగా (త్రిప్పబడియుండుటను,) ఉండుటను చూస్తున్నాడు, దాన్ని చూస్తూ, హృదయాన్ని తిరిగి తీసుకుంటాడు, లేక ధైర్యమును తీసుకొని మరియు మరలా మరియు మరలా ప్రయత్నము చేస్తాడు," దేవునికి ఎంత అవసరమున్నదో తెలుసు, ఒకవేళ మనము తొట్రుపడుట లేక పడిపోవుట జరిగినట్లయితే, మనకు సహాయం చేయుటకు ఆయన యొక్క గొప్ప హస్తము అక్కడ ఉంటుంది, ఆయన కృప చాలును.
11ఇప్పుడు, దేవా మేము ప్రార్ధన చేస్తున్నాము, ఈ నూతన సంవత్సర ఉదయమును ఈ గీతములతో ప్రారంభించుకుంటాము, మరియు పాడుట, మరియు సంతోషించుట, మరియు ఈ జీవిత ప్రయాణమంతా దేవుడే మార్గదర్శిగా ఉంటాడని తెలుసుకుంటాము మరియు మరణమనే నదికి అవతల ఉన్న వాగ్దాన దేశము చేరుకునేంత వరకు ఆయన మార్గదర్శిగా ఉంటాడు. ఈ ఉదయకాలము మా కన్నులు పొంగి పారుతున్న యోర్దానుకు అవతల ఉన్న ఎదుగుచున్నపొలముల ఎక్కడైతే ఆ పచ్చని పొలములు ఎదుగుతున్నాయో అటు వైపు చూస్తున్నాయి. మరియు దేవా, మేము ప్రార్థన చేస్తున్నాము, మా ప్రాణములు ఆ దర్శనాన్ని పట్టుకొని మరియు ఎన్నడూ దాన్ని వదలకుండా ఉండాలని మేము ప్రార్ధిస్తున్నాము. వృద్దుడైన ఆ ఎలీషా వలె ఒక దినాన మేము కూడా దిగువున పాయను (నది నుండి వెళ్ళు పెద్ద కాలువ-అనువాదకుడు) దాటవలసి వచ్చినప్పుడు, దేవుని యొక్క వస్త్రముతో ఆ మృత్యువు యొక్క పాయను కొట్టి దానిలో నుండి ఎటువంటి భయము లేకుండా నడుచుకుంటూ దాన్ని దాటుకొని వచ్చునట్లుగా మాకు దయచేయమని ప్రార్ధిస్తున్నాము, ప్రభువా.
ఓ దేవా! నీ వాక్యమును సమీపిస్తున్నాము మాకు సహాయము చేయుము. ఈ వాక్యములను నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించమని నేను ప్రార్ధిస్తున్నాను. ఒక ఉపదేశకుడైనంత మాత్రమున సరిపోదు. మేము వారికి భోదించుటకు నిస్సందేహముగా సరిపోయినవారము కాము. ఆ గొప్ప భోదకుడైన ఉపదేశకుడు వచ్చి మా హృదయాలలోని ఆయన యొక్క నివాస స్థలమును తీసుకొనుటయే మాకు తెలిసిన ఒకే ఒక మార్గము, మరియు ఒక ప్రత్యేకమైన విధానములో మా మనసులు మరియు మా ఆలోచనలు నిండిపోవునంత వరకు మాకు ఆయన లేఖనములను మాకు అనువదించనీయము. మేము దాని మీద మాత్రమే ధృఢముగా ఆధారపడుచున్నాము.
PS 51:5
12దాన్ని గురించి ఆలోచించుము దేవా, ఓ, ఒక తండ్రి ఆ విధముగా జీవించుటనేది ఎంత అద్భుతముగా ఉంటుంది, అది నిత్యత్వము యొక్క పుట్టుక నుండి ఆలాగునే ఉన్నది, అక్కడ నుండి ఒక భూసంబంధిగా క్రిందకు దిగివచ్చి మరియు మాకు సహాయము చేసెను, మరియు ఆయన వాక్యమును తీసుకొని వచ్చి మరియు మా నోటిలోకి దాన్ని అందించి మరియు హృదయములలోనికి మరియు చెవుల ద్వారా దాన్ని విని మరియు జీవించుటకు, మేము ఏమి చేయుటకు వీలులేకుండా మా యొద్దకు వచ్చుచున్న శాపమునుండి మమ్ములను విమోచించుటకు, తండ్రీ, ఎందుకనగా మానవాళి దాన్ని చేసియున్నది. మరియు మేము ఆ మొదటి జంట యొక్క సంతతిమి, మరియు రూపింపక ముందే మేము పాపములో జన్మించియున్నాము. కాని, జీవము కలిగిన ఆ దేవునికి మాత్రమే తెలుసు మేము ఏమియు చేయలేమని, కాని దాని నుండి తప్పించుకొనుటకును మరియు వచ్చుటకును మార్గము ఏర్పరచబడియున్నది. తండ్రి గృహమునకు వచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము.
13ఇక్కడున్న ఈ సంఘమును దీవించమని మేము ప్రార్ధిస్తున్నాము, సహోదరుడు నెవిల్ ను, మా ధైర్యశాలియైన కాపరిని, నీ దీనసేవకుడిని దీవించమని ప్రార్ధిస్తున్నాము. మా డీకన్ లను మరియు మా ధర్మకర్తలను దీవించమని ప్రార్ధిస్తున్నాము, వారు కలిగియున్న సంవత్సరములలో గొప్ప సంవత్సరమును వారికి దయచేయమని ప్రార్ధిస్తున్నాము, ప్రభువా. వారికి దీర్ఘాయుష్షును ఇవ్వుము. ప్రభువా, వారిని బలపరచుము. వారు నీ సేవకులు. వారిక్తి ఇవ్వుబడిన విధిలో వారు ఎల్లప్పుడు ధైర్యశాలులుగా ఉందురు గాక.
సంఘమును దీవించుము, సభ్యులను దీవించుము, దేవా! ఈ గృహములోపలికి వచ్చు నీ ప్రియమైన బిడ్డలను దీవించుము. దేవా! వీరిలోని ప్రతి ప్రాణము ఈ గృహము యొక్క ప్రారంభమును దాటుటను పొందుకొవాలని ఆశిస్తున్నాము. ప్రభువా! మేము నీకే ఆరోపిస్తున్నాము. సేవకులు వాక్యము తీసుకొని వచ్చునప్పుడు పరిశుద్ధాత్మచేత సులభముగా మరియు వాస్తవముగా ఉండు విధముగా మాకు సహాయము చేయండి. అది వారిని నీవలె ఉండునట్లుగా చేస్తుంది, ప్రభువా, దాన్ని దయచేయుము. లోపలికి వచ్చు రోగులను మరియు బాధితులను స్వస్థపరచుము. మరియు ప్రపంచములో ఉన్న దేవుని యొక్క గృహములన్నిటికి దాన్ని దయచేయుము.
చివరగా, ప్రభువా, మేము ముగించబడినప్పుడు, మేము నీలోనికి ప్రవేశిస్తాము, దేవుని యొక్క స్వాగతపు బల్ల దగ్గర కూర్చుంటాము, మరియు నిత్యమైన కాలముతో భుజిస్తు మరియు కలసి జీవిస్తాము. అప్పటి వరకు, మాకు మంచి ఆరోగ్యమును, మరియు బలమును, సంతోషమును, ఆనందమును, శక్తిని, మరియు కొద్దిగా, మరియు మమ్ములను నడిపించుటకు పరిశుద్ధాత్మ యొక్క దీవెనలను మాకు దయచేయుము. యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్!
14ఈ ఉదయకాలమున ఆ మంచి సంగీతమును నేను మెచ్చుకొనుచున్నాను. మరియు నేను సరియైన సమయములోనే వచ్చియున్నాను, నా మంచి స్నేహితుడైన బ్రదర్ స్కాగ్స్ తో మాట్లాడుతున్నాను, మరియు బ్రదర్ జీన్ వెనుక ఉన్నాడు, మరియు మరొక సహోదరుడు ద్వారము దగ్గర ఉన్నాడు, దానిలో నేను కొద్ది భాగమునే వినియున్నాను, కాని అది నిక్షిప్తము చేయబడిన దాని నుండి చాలా అందముగా వస్తున్నది.
15మీ అందరూ ప్రకటనను గూర్చి ఎలా సంతోషిస్తున్నారు? అంతా మంచిదేనా? వెనుక అక్కడ ఉన్న నా చిన్న బాలిక సారావలె అందరు ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను, అది నా మటుకైతే "విప్లవములుగా" మారిపోయింది. అది కేవలం విప్లవములు ఇంకా పైకి మరియు ఇంకా పైకి వెళుతున్నది. మీకు తెలుసా, మనము ఇప్పటి నుండి మార్చి మరియు ఏప్రియల్ వరకు కలిగియున్నాము, ఇక్కడ వెనుక ఉన్న ప్రాంతములో పగటి సమయములో వచ్చి ఒక పెద్ద కాగితము మీదంతా ఆ దృశ్యములను చిత్రించుము, మరియు వాటిని కిటికీకి కట్టు చాపల వలె క్రిందకు మరియు పైకి ఎత్తుము, మీకు తెలుసా…
ఆ విధముగా నేను ఎల్లప్పుడూ కలగనేవాడిని ఏదో సమయములో ఎక్కడో ఒక గొప్ప టాబెర్నికల్ ను నేను కలిగియుండి మరియు ఈ చార్టు క్రిందకు రావలెను; ఈ వేదిక అంత పెద్దదిగా అది క్రిందకు వచ్చునట్లు, మరియు ప్రత్యక్షతలకై మరియు ప్రభువు నాకు ఇచ్చిన అనువాదము చేయుటను, మరియు ఒక పాయింటర్ ను తీసుకొని ప్రారంభము నుండి మొదలుకొని మరియు ఈ దిగువన ఉన్న కాలముల వరకు తీసుకొనివచ్చునట్లు. తరువాత మనము వాటి ద్వారా వెళ్ళి, ఇలాగు ఒకసారి ఒక దానిని పైకెత్తునట్లు, మరొకసారి దాన్ని క్రిందకు దించునట్లు మరియు దానిమీద ప్రారంభించి, మరియు దాని ద్వారా ఉపదేశించునట్లు. ఓ, అది ఒక చిన్న పరలోకం మాదిరిగా ఉండును. అది ఆలాగు ఉండదా? కేవలం శీతాకాలమంతా ఆ విధముగా ఉండుట; ప్రభువుతో కేవలం ఆలాగు కూర్చుని యుండుట.
ఆయనతో ఒంటరిగా ఉండుట చాలా మంచిదిగా ఉంటుంది. మీకు తెలుసా, మేము ఒక పాటను పాడేవారము, "నా ప్రభువా, నాకున్న సమయమంతా క్రీస్తుతో ఒంటరిగా ఉండుటకు నేను ఇష్టపడతాను, నాకున్న సమస్యలన్ని ఒంటరిగానే చెపుతాను." చూచారా. అది ఆ విధముగా మాత్రమే పొందుకోగలము. వారు దాన్ని పాడేవారు. రాయ్ డేవిస్ ఒక చిన్న పాటను పాడేవారు, "ఇచ్చివేయుము మరియు యేసుతో ప్రార్థించుము." సమస్తమూ చూపిస్తుంది. యేసుక్రీస్తు యొక్క వరుసలో ప్రతియొక్కటి వెనుకకు పడిపోవుటను నీవు ఎల్లప్పుడు చూడగలవు, అది ఆ విధముగా లేదా?
16ఇప్పుడు, గత ఎనిమిది దినముల కూడికలలో మనము సంఘ కాలముల మీద మాట్లాడుకొనియున్నాము. గత రాత్రి ప్రకటన 4వ అధ్యాయము 2వ వచనమును మనము చేరుకున్నామని నేను అనుకుంటున్నాను. మరియు దాన్ని పొందుకొనుటకు గత రాత్రి మీరందరూ ఇక్కడనే ఉండాలని నేను అనుకుంటున్నాను. మరియు కాబట్టి నేను… ఈ ఉదయము నేను దిగువకు వచ్చి ఒకటి లేక రెండు వచనములు తీసుకున్నట్లయితే, మరియు లేక ప్రభువు నడిపింపు ఎంత వరకు ఉంటే అంతవరకు, నాకు తెలియదు. ఇక్కడ నేను 6 లేక 7వ వచనము వరకు పొందుకొనియున్నాను, లేఖనములలోని వివిధ భాగములలో నేను ఎక్కడకు వెళతానో వాటిని నేను కేవలం చిన్నచిన్న సందర్భములను బయటకు లాగి, వేటిని నేను నిన్నటి దినమున చదివియన్నానో, వాటిని ఇక్కడ దిగువన వ్రాసుకున్నాను.
REV 4:1-3
17మరియు ఇప్పుడు మనము వాటిని కనుగొంటాము… గతరాత్రి వాటిని మనము వదిలి వేశాము, నేను నమ్ముచున్నాను, 2వ వచనములో 8వ వచనము ప్రారంభములో, అది ఉన్నదని నేను అనుకుంటున్నాను. మరియు మనము దేనిని వదిలివేశామంటే, "బూరధ్వని వంటి స్వరము." (అది నిజము కాదా?) స్వరము యొక్క శబ్దము. నన్ను దానినంతటిని చదవనీయుము, కావున ఇప్పుడు మనము వెనుకకు వెళ్ళగలము:
"ఈ సంగతులు జరిగిన తరువాత్ర నేను చూడగా, మరియు అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని. ఆ స్వరము, ఇక్కడికి ఎక్కిరమ్మ; మరియు ఇకమీదట జరుగవలసిన వాటిని నీకు కనుపరచెదననెను.
వెంటనే నేను ఆత్మవశుడనైతిని: అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడియుండెను. మరియు ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడైయుండెను.
ఆసీనుడైనవాడు, ధృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతమువలె ప్రకాశించు వర్షధనస్సు సింహాసనమును ఆవరించియుండెను."
REV 4:6
18ఇప్పుడు, ఈ అందమైనది, ఓ, అందమైన పాఠము! మరియు ఈ ఉదయము, నేను వచ్చుటకు ముందుగా, నేను ముందుగా 6వ వచనముకు వస్తున్నాను, నేను అనుకున్నాను, "ఓ, మై, నేను దాన్ని దాటి వెళ్ళలేను, ఎందుకనగా ఈ 6వ వచనములో ఉన్నదాన్ని ప్రజలందరూ జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను, మనము ఈ జీవుల యొద్దకు వెళ్ళుటకు ముందు."
ఇక్కడ జీవులకు విభిన్నమైన నిర్వచనములు ఇచ్చారు, అసలై నదాని వైపు చూద్దాం, ఒకటి ఒక విధమైన జీవి, మరియు మిగిలిన 4 జీవులు మరో విధమైన జీవులు. అందులో ఒక జీవి గ్రీసులోని అడవిలో నివసించే ఒక జంతువు వలె ఉన్నది. మరొకదాన్ని కింగ్ జేమ్సులో సరిగా తర్జుమా చేయలేదు, అది మృగము కాదు, అది జీవించే జీవి, మరియు ఏలాగు ఆ జీవులు, వారు ఎవరు… అది మానవుడు కాదు, లేక దూత కాదు. కావున అది "జీవించే జీవులు." మరియు ఎలా వాటికి నాలుగు ముఖములు ఉన్నాయి మరియు నాలుగు… ఓ, మై, మనము దాన్ని సువార్తలో తీసుకొని రాగలము, మరియు దాన్ని వెనుకకు తీసుకొని వచ్చి దాని స్థానములో పరిపూర్ణముగా ఇక్కడే పెడదాము.
మరియు, జ్ఞాపకముంచుకోండి, 4 అనేది భూసంభందమైన సంఖ్య, గమనించారా. మరియు అక్కడే అందమైన పాఠమున్నది, మరియు కావున మనము దానిలో లోతుకు వెళ్ళటం లేదని నేను నిశ్చయముగా చెప్పగలను, నేను… బహుశా మనము వెళ్ళవచ్చు. కాని అది చాలా అద్భుతముగా ఉంటుంది.
REV 1:12,13•
REV 4:1
19అయితే, ప్రభువు చిత్తమైతే, అప్పుడు మనము దాని చుట్టూ ఉన్నట్లయితే, బహుశా వచ్చే ఆదివారము మనము దాన్ని తిరిగి ప్రయత్నిద్దాం. లోతుగా ప్రయత్నిద్దాం, మనము వెళ్ళుటకు ముందుగానే 4వ అధ్యాయమును ముగించుకోగలిగినట్లయితే దాన్ని ప్రయత్నిద్దాం. నిర్దిష్టంగా మనం మొదట ఎక్కడ ప్రారంభించాలి అనేది ఇంకా మనకు తెలియదు.
ఇప్పుడు, ఈ సంగతులు జరిగిన తరువాత అనే దాన్ని మనము కనుగొందాము. "తరువాత…" అనే దానికి "సంఘకాలములు జరిగిన తరువాత," అని అర్ధము.
అప్పుడు యోహాను పైకి ఎక్కిరమ్ము అని ఆజ్ఞాపించబడ్డాడు, "పైకి ఎక్కిరమ్ము," దాని అర్ధము "పైకి ఇక్కడి రమ్ము." ఆయన సంఘకాలముల సమయములో ప్రపంచములో ఏమి జరగనైయున్నదో అతడికి చూపించియున్నాడు. సంఘకాలములు ముగిసిన తరువాత, మనము కనుగొంటాము యోహాను నిజమైన ప్రతివిశ్వాసికి మాదిరిగా క్రీస్తు చేత పైకి రమ్మని ఆజ్ఞాపించబడ్డాడు. అది నిజమేనా? "పైకి రమ్ము" అని ఆజ్ఞాపించబడ్డాడు.
మరియు అతడితో మాటలాడిన ఆ స్వరము బూరధ్వని వంటి స్వరమని మనము కనుగొంటాము, స్పష్టముగా, నిశ్చయముగా, మరియు అది అతడితో భూమి మీద మాటలాడిన స్వరమే. గమనించారా, ఆయన ఏడు దీపస్తంభముల మధ్యలో ఉన్నప్పుడు, ఆయన మట్లాడుతున్నాడు… లేక ఆయన నుండి మాటలు వస్తున్నాయి. ఓ, నేను దాన్ని ఇష్టపడుతున్నాను, "దీపస్తంభముల నుండి మాట్లాడుట." గమనించారా, ఆయన దీపస్తంభముల మధ్యలో ఉన్నాడు, అక్కడ నుండి ఆయన యొక్క సంఘముతో మాట్లడుచున్నాడు. సంఘకాలములు ముగిసినప్పుడు, ఆయన భూమిపై నుండి వెళ్ళిపోయాడు మరియు పరలోకములోకి వెళ్ళియున్నాడు మరియు విమోచించబడిన వారిని తనతో పిలుచుచున్నాడు. ఓ, అది అందముగా లేదా? ఓ, అది నా హృదయమును గంతులు వేయునట్లుగా చేస్తున్నది.
20మరియు జ్ఞాపకముంచుకొనండి, మనము ఈ సంగతులను తీసుకొని వచ్చునప్పుడు, యవ్వనప్రాయములో మారినవారు సహోదరి ఆనా వలె, మరియు ఆనా, లేక మరియు ఆమె భర్తవలె, మరియు రాడ్ని మరియు అతడి భార్య, మరియు ఛార్లీ మరియు వారు, ఈ సంగతులను వారు అర్థము చేసుకొనుటకు, మరియు ప్రభువులోకి వచ్చిన మీలోని అనేకమంది యవ్వనస్తులకు, ఆ వరుస ఇంకా ఎంతో దూరము వెళ్ళలేదు, కేవలం ఆయనను రుచిచూడండి మరియు ఆయన మంచివాడు మరియు ప్రియమైన వాడు…
ఇప్పుడు, దీన్ని గమనించండి, మనము మాటలాడుచున్న ఈ సంగతులు, మీ విశ్వాసమును నిలకడగా ఉంచటానికి ప్రయత్నము చేస్తున్నాము, అది ఏమిటంటే దేవుడు ఏదైనా చెపితే అది జరుగవలసియున్నది. అది విఫలం కాదు. ఏది ఏమైనా.. అది కొన్నివేల మైళ్ళ దూరమున్నట్లుగా కనిపించినా మరియు అది ఎన్నడు జరుగదు అని అనిపించినా, కాని దేవుడు దాన్ని కదిలించి మరియు దాన్ని జరుగునట్లుగా చేస్తాడు. మరియు ఆయన నిన్ను పరీక్షించుటకు దాన్ని చేస్తాడు.
GEN 12:1•
GEN 15:4•
GEN 17:4,5•
GEN 21:1-3•
GEN 22:2•
ROM 4:19
21అబ్రాహాముతో ఆయన ఏమి చెప్పెనో చూడుము. "ఆ పర్వతము మీదకి నీ కుమారుడిని తీసుకు వెళ్ళి మరియు బలిగా అర్పించుము." అతడు 25 సంవత్సరములు ఎదురు చూచిన తరువాత, మరియు ఆయన ఇలా అనెను, "ఆ పర్వతము మీదకి నీ కుమారుడిని తీసుకు వెళ్ళి మరియు బలిగా అర్పించుము." ఎలా…? నేను రాజ్యములకు నిన్ను తండ్రినిగా చేస్తాను. నూరు సంవత్సరములవాడైన అబ్రాహాము, అతడి భార్యకు తొంభై సంవత్సరములు; మరియు వారికి ఉన్న ఏకైక కుమారుడు… అబ్రాహాముకు అప్పుడు సుమారుగా 115 సంవత్సరములు ఉండవచ్చును.
కావున అతడు ఇలా అనెను, "అతడు ఏమి చేయబోవుచున్నాడు? అది ఎలా జరుగుతుంది? నేనైతే, ముదుసలివాడిని, నేనెంతో ముదుసలివాడిని, మరియు 25 సంవత్సరములు ఎదురు చూశాను. నీవు వాగ్దానమును నాకు 75 సంవత్సరములప్పుడు ఇచ్చావు, మరియు ఇప్పుడు నేను నూరు సంవత్సరములవాడను. మరియు శారాకు అప్పుడు 65 ఇప్పుడు 90 సంవత్సరములు. ఎలా? మాకు ఈ కుమారుడు కలిగియున్న తరువాత… మరియు నీవు నాకు 25 సంవత్సరముల క్రితం నాకు 75 సంవత్సరములు ఉన్నప్పుడు చెప్పియున్నావు, నేను కుమారుడుని కలిగి శారాతో ఈ సంవత్సరములన్ని గడుపుతానని చెప్పియున్నావు, నేను బిడ్డలను కనలేనివాడను మరియు ఆమెకు స్త్రీత్వము ఉడిగి పోయినది. అప్పుడు ఎలా? ఆమెను మరియు నన్ను ఇంకనూ బిడ్డలను కనలేని వారిగానే ఉంచావు, మరియు నీవు వచ్చి ఈ కుమారుడను ఇచ్చావు. మరియు మేము అతడిని 15 సంవత్సరములు పెంచి పెద్దవానిగా చేశాము, మరియు ఈ కుమారుడి ద్వారా నీవు అన్యజనములలో మరియు ప్రపంచములోని ప్రతి రాజ్యములలో ఆశీర్వదించబడతావు అని నీవు చెప్పియున్నావు, మరియు అన్యజనములకు కూడా నన్ను తండ్రిగా చేస్తానన్నావు, ప్రభువా! రాబోవు తరములకు నన్ను తండ్రిగా చేస్తానన్నావు. ఈ కుమారుడి ద్వారా ఆకాశము క్రిందనున్న రాజ్యములకు నీవు నన్ను తండ్రిగా చేస్తానన్నవు. మరియు ఈ కుమారుడి ద్వారా విమోచకుడు వస్తాడన్నావు, మరియు ఆ విమోచకుని ద్వారా మానవాళిని విమోచిస్తాను అన్నావు. ప్రభువా, దాన్ని నీవు ఏలాగు చేయగలవు?"
అది అబ్రాహాము యొక్క ఆలోచన కాదు, అది అబ్రాహాము యొక్క ప్రశ్న కాదు, విధేయత, "నీవు దీన్ని ఎలాగు చేస్తావు?" అని అడుగలేదు.
"అది నాకు సంబంధములేనిది. నీవు దాన్ని చెప్పియున్నావు, కావున నీ మాట సరియైనదని నాకు తెలుసు. నీవు నీ మాటను నా కొరకు నిలబెట్టుకున్నట్లయితే మరియు నేనెప్పుడు 75 సంవత్సరములవానిగా ఉన్నప్పుడు చూపితివి, ఎప్పుడైతే నీవు నన్ను పిలిచానని చెప్పావో, నీవు వేరుపడి మరియు నీవు ఎరుగని దేశమునకు ప్రయాణము అగుము…"
"నేను ఆ దేశములో 25 సంవత్సరములు ఉన్నాను; ఒక ముసలి మనుష్యుడు, నా భార్య, ఆమె బాలికగా ఉన్నప్పటి నుండి నేను, ఆమెతో జీవిస్తున్నాను." (ఆమె ఒక విధముగా అతడికి సహోదరి). "ఆ తరువాత ఈ కాలమంతా, మరియు నీవు వాగ్దానము చేసిన ఈ కుమారుడిని నాకు ఇచ్చియున్నావు, నేను మరణించి ఒకరి నుండి అతడిని పొందుకున్నాను. మరియు అతడిని చంపమని చెప్పినట్లయితే, నీవు మరణము నుండి అతడిని తిరిగి లేవనెత్తగలవు." ఓ, మై! అది ఆ విధముగా ఉండవలసియున్నది, అది అంతే. మరియు అతడు దాన్ని చేశాడు.
22మరియు అతడు సంపూర్ణతతో దేవుడికి విధేయుడిగా ఉన్న కొలది, ఇస్సాకు ముఖము మీద నుండి జుట్టును లాగి, తన స్వంత కుమారుడిని చంపుటకు ఆయుధమును లాగాడు, తనకు కలిగిన ఏకైక కుమారుడు… దేవుడు మనకు ఒక మాదిరిని చూపిస్తున్నాడు. ఆయన ఎందుకొరకు దాన్ని చేస్తున్నాడు? ఆయన దాన్ని చేయకూడదు. కాని ఆయన నీతోను మరియు నాతోను అలాగే చేశాడు, భయంకరమైన ఈ చీకటి దినములలో ఎక్కడైతే మనుష్యుల హృదయాలు సాతానుతో నిండియున్నాయో అక్కడ మనము ఈ కార్యముల వైపు చూడవలసియున్నది, దేవుడు తన వాగ్దానమును నెరవేర్చుతాడని మనము తెలుసుకోవాలి. అది ఎంతో తక్కువదిగా నీకు కనిపించినప్పటికి పరవాలేదు, అది ఎంత అసాధ్యమైనదిగా ఉన్నప్పటికి పరవాలేదు, దేవుడు ఇంకనూ దేవుడే మరియు ఆయన చేసిన ప్రతి వాగ్దానమును ఆయన నెరవేరుస్తాడు.
GEN 22:2
23అందుచేతనే నేను, మీతో చెప్పుటకు ప్రయత్నించేది ఏమనగా స్వస్థతా అరాధనలో మనము నిలబడియున్నప్పుడు. నీవు ఇక్కడ నిలబడి ఇలా చెప్పుము, "నేను బలహీనుడను." ఎటువంటి సందేహము లేదు, నీవు బలహీనుడవే. కాని దేవుడు తన వాగ్దానమును నెరవేరుస్తాడు. అప్పుడు ఆయన క్రిందకు దిగివస్తాడు. ఇప్పుడు, గమనించుము. ఆయన ఒక ప్రాయశ్చిత్తమును ఇక్కడ ఉంచాడు అది ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన చేయునది అదియే. ఇప్పుడు, ఆయన నిన్ను అడుగునది ఒక్కటే, అది ఏమిటంటే నీవు దాన్ని విశ్వసిస్తావా, అబ్రాహాము మాదిరిగా దాన్ని నీవు పట్టుకొనుము.
"మంచిది, నేను మరొక్క దినము మాత్రమే జీవిస్తానని వైద్యులు చెప్పారు."
నేను దాన్ని పట్టించుకొనను. అది మంచిదే, అది అందరు మనుష్యులకు తెలుసు, అతడికి తెలిసిన అత్యుత్తమమైనది అదియే. పైన అక్కడ ఆ బాలుణ్ణి పడుకోబెట్టిన తరువాత అబ్రాహాము తన కుమారుడను తిరిగి ఎలా పొందుకోగలడు, మరియు దేవుని వాక్యము అతడితో ఇలాగు చెప్పెను, "వెళ్ళి బాలుడిని బలిగా ఇవ్వు." అతడు దాన్ని ఎలా చేయగలడు? అక్కడ ప్రశ్న అది కాదు. దేవుడు దాన్ని చెయ్యి అని చేపెను, మరియు అది దానిని స్థిరపరచును.
"వైద్యుడు, నాకు బాగవ్వదని చెప్పిన తరువాత నేను ఎలా బాగవ్వగలను?" అది నేను అడుగవలసిన ప్రశ్న కాదు; అది దేవుని వాక్యము. మరియు అది నీకు బయలుపరుస్తున్న కొలది నీవు బాగవుతావు, తరువాత నీవు బాగుపడతావని నీవు జ్ఞాపకముంచుకో. దాని నుండి నిన్ను ఏదియూ దూరముగా ఉంచలేదు. అది నిజము, చూచారా.
GEN 22:12,13
24కావున అబ్రాహాము పూర్తి వినయముతో ఉన్నప్పుడు… అతడు దాన్ని ఎలాగు చేస్తాడు? చివరి క్షణములు, చివరి 5 నిముషములు వచ్చాయి, చివరి 3 నిముషములు వచ్చాయి, చివరి 2 నిముషములు వచ్చాయి, చివరి నిముషము వచ్చింది, చివరి 30 క్షణములు, చివరి క్షణము వచ్చింది, ఆ బాలుడి ప్రాణం తీయుటకు ఆ చేయి పైకెత్తబడినప్పుడు, దేవుడు ఇలా అనెను, "అక్కడనే ఆగుము, అక్కడే ఆగుము. మీరు నిజంగా నన్ను నమ్మియన్నారని నేను గమనిస్తున్నాను. ఇప్పుడు, అబ్రాహామా, రాబోవు దినములలో బ్రెన్హాం టబర్నికల్ లో చూపుటకు నేను దీన్ని చేసియున్నాను, గమనించారా, ఏమి జరుగుతున్నది… అది వారు నన్ను తప్పక నమ్మవలసియున్నది. వారు నన్ను దేనియందు సందేహించరాదు. నన్ను నమ్ముము!"
మరియు సరియైన సమయములో, అతడు… అక్కడ ఒక బలియున్నది, ఆయన ఎన్నడు దాన్ని వృధా చెందనివ్వలేదు. లేదు, ఆయన ఎన్నడూ దాన్ని వృధా చేయలేదు, అటు తరువాత ఒక గొర్రెపిల్ల వధించబడింది, ఆ అడవిలో ఒక చిన్న పొదలో తన కొమ్ములు చిక్కుకొని అది అక్కడున్నది. మరియు మనము దానిగుండా ఎన్నిసార్లు వెళ్ళియుంటాము. అక్కడకి ఆ గొర్రెపిల్ల ఎలాగు వచ్చింది? ఎలా, ఆ భయంకరమైన అడవి జంతువులను దాటుకొని అక్కడకు అది ఎలా వచ్చింది? నాగరికతకు దూరముగా 100 మైళ్ళు అది ఎలా వచ్చింది, సింహాలు, తోడేళ్ళు, నక్కలు మరియు అన్ని రకములైన భయంకరమైన జంతువులను దాటుకొని అది అక్కడకు ఎలా వచ్చింది, నీరుగాని లేక గడ్డిగాని లేని పర్వతములోని ఆ శిఖర భాగమునకు అది ఎలా వచ్చింది, ఇంతకి అది అక్కడ ఏం చేస్తున్నది? దేవుడే దాన్ని సృష్టించి, అక్కడకు పెట్టెను.
25మరియు మనం జీవిస్తున్న ఈ దినములలో అతడిని మనము చూచుటకు!
ఇప్పుడు, ఈ ఉదయం నేను వ్యక్తిగతమైన చాలా సంగతులను చెప్పవలసియున్నది, నేను ఏదైతే చెప్పాలనుకున్నానో వాటిని చెప్పవలసియున్నది. అందుచేతనే నేను ఈ విధముగా వెనుకకు తీసుకొనివస్తున్నాను, నేను ప్రారంభించుటకు ముందే ఇవన్నీ చెప్పవలసియున్నది. ఇవన్నీయు మీకు వ్యక్తిగతమైనవిగా వినపడవచ్చును. మీరు అర్ధము చేసుకోవలసినది ఏమిటనగా, అవి వ్యక్తిగతమైనవి కావు. వాటిని మీకు ఒక ఉదాహరణగా ఇచ్చి మీ విశ్వాసము హృదయపూర్వకముగా క్రీస్తులోని విశ్వాసమందు విశ్రాంతి పొందటానికే వాటిని తీసుకొనివచ్చినది; ఆయన వాగ్దానము మీద విశ్రాంతి తీసుకోవచ్చును, ఎందుకనగా దేవుడు తన వాగ్దానము ఎంత పరిపూర్ణముగా నెరవేర్చాలో అదే విధముగా నెరవేరుస్తాడు, ఇప్పుడు మనకు చూపిస్తున్నది అదే.
GEN 6:17•
GEN 22:14
26మరియు అదే యెహోవా-యీరేని చూడండి, అలాగునే అబ్రాహాము ఆయనను పిలిచియున్నాడు, హెబ్రి భాషలో దానికి అర్థమేమనగా, "దేవుడే తనకు తానే బలి అర్పణను సిద్ధం చేసుకుంటాడు." దేవుడు దాన్ని చేయగలడు. ఆయన తనకు తానే మార్గమును ఏర్పరుచుకున్నాడు. ఆయన చెప్పినట్లయితే… నోవాహుతో ఆయన చెప్పెను…
నీవు చెప్పవచ్చును, "మంచిది, అది కేవలం అబ్రాహాముతో మత్రమే." లేదు. ఆయన కాలములన్నీటిలో చెపుతూనే ఉన్నాడు, మరియు ఆయన ఇంకనూ చెప్పుచున్నాడు.
ఈ ఉదయము మనతో చెప్పుచున్న మాదిరిగానే, ఆయన ఆ దినములలో నోవాహుతో ఇలా చెప్పెను, "వర్షము పడబోవుచున్నది." ఎందుకు, అప్పుడు ఎన్నడూ ఆకాశములో మేఘము అనేదే లేదు. దేవుడు ఎక్కడైతే నేలను తడిపియున్నాడో అక్కడనే పెద్ద నీటి ప్రవాహమున్నది, ఒక చిన్న నీటి గుంట ఎక్కడో ఉన్నది. అక్కడున్న పెద్ద నీటి ప్రవాహము అదియే.
ఇప్పుడు, ప్రజలు అంటున్నారు, "ప్రపంచములోకి పైనుండి క్రిందకు నీరు ఏ విధముగా వస్తుంది? వేడిగాయుండే సూర్యుడున్న ఆ పై ప్రాంతములో నీరు ఎక్కడున్నదో నాకు చూపించుము.
"పైన అక్కడ ఏమైనా ఉన్నదా… దేవుడు ఓడను తయారుచేయమని చెప్పినట్లయితే, అది రాబోవుచున్నదనియే, నా పని ఏమిటంటే ఓడను తయారుచేసి మరియు సిద్ధపడుటయే, ఎందుకనగా అది రాబోతున్నది. ఆయన యెహోవా-యీరే, ఆయనే ఆ పైన నీటిని ఏర్పరచగలడు."
27మరియు ఆయన చేసిన ఒకే ఒక కార్యమేదనగా ప్రజలను మూర్ఖులుగా, మతిలేని వారిగాను, సైన్సు చెప్పిన విధముగా ఉండునట్లుగా అనుమతిని ఇచ్చాడు, ఆయనకు అనుకున్నది ఏదో అది దగ్గరికి వచ్చునట్లుగా ఆయన చేస్తాడు. దేవుడు లోకమును ఎన్నడూ నాశనము చేయలేదు, మనుష్యుడు లోకమును నాశనము చేశాడు. దేవుడు దేనినీ నాశనము చేయలేదు, ప్రతిదానిని దేవుడు జాగ్రత్త చేశాడు. మనుష్యుడు తన జ్ఞానము చేత తనే నాశనము అయ్యాడు, మొదట, ఏధేను తోటలో అతడు చేసినది ఆ విధముగానే.
కావున కొంతమంది మూఢభక్తి గలవారు కొంత అణుశక్తి వంటిదాన్ని వారు కలిగియున్నారు. వారు దాన్ని కలిగియున్నారు. అప్పుడు వారు దానితో పనిని చేసియున్నారు, ఎందుకనగా వారు దానితోనే ఆ కార్యములు చేసియున్నారు మరియు మనము ఇంకనూ ఏమియు నేర్చుకొనలేదు. మనము అంత ముందుకు వెళ్ళిపోయుండలేదు. బహుశా ఇంకా 3 లేక 4 సంవత్సరములు లేక ఎక్కువగా, ముందుగానే దాన్ని మనము చేయగలము,
వారు చేసినదాన్ని చేయుటకు.
వారు పిరమిడ్లను నిర్మించియున్నారు మరియు స్పినిక్ష్ మరియు మొదలైనవి నిర్మించియున్నారు. మనము దాన్ని ఎన్నడూ చేయలేదు. మనము దాన్ని తిరిగి ఉత్పత్తి చేయలేదు, దాన్ని మనము చేయుటకు మార్గమే లేదు, కేవలం మనము అణుశక్తిని మాత్రము పొందుకున్నాము. గ్యాస్ ఆధారిత శక్తి, విద్యుత్ శక్తి, రాళ్ళలో నుండి ఏ ఒక్క దాన్ని పైకెత్తలేము; దాన్ని నేలమీద నుండి కదల్చలేము. మరియు వాటిలో కొన్ని పట్టణమంత ఎత్తుంటాయి, గాలిలోకి ఎత్తుగా ఉంటాయి, మరియు వేల టన్నుల బరువుంటుంది. వారు వాటిని ఎలాగు పైకెత్తగలిగారు? గమనించండి, వారికి తెలుసు.
MATT 24:37•
LUKE 17:26
28మరియు వారు దాన్ని వదిలేశారు, ఎవరో అణుబాంబులలో ఒకదాన్ని దృశ్యములోకి వెనుకటి దినములలో వదిలేశారు, కారణమేమంటే, "నోవాహు దినములలో జరిగినట్లుగా…" అలా ఉన్నట్లుగా, ఆ నాగరికత వలె, ఆ విధమైన తెలివిని కలిగినవారు. "నోవాహు దినములలో జరిగినట్లుగా, ఇప్పుడు కూడా, మనుష్యకుమారుని రాకడలో జరుగును." అది ఏమనగా, అదే పునారావృతమగుట! గమనించారా?
ఎక్కువ కాలం అయ్యుండకపోవచ్చును, మెక్సికోలో దిగువున ఇక్కడ దిగువన యాంటిడిలువియన్ వరదలు వచ్చుటకు ముందు వారు నీటికి సంబంధించిన పనులలో ఆధునికమైన పద్ధతులలో త్రవ్వియున్నారు. మీరు దాన్ని వార్తాపత్రికలలో చూశారు. మనకు ఇప్పుడున్నట్లుగా అది ఆధునికమైన నీటికి సంబంధించిన పనియైయున్నది, అది నేలకు చాలా అడుగున మునుగుతుంది, ఏదో అణు సంబంధించినది ఏదో దాన్ని కప్పుతుంది. అది పైకి విస్పోటనం చెంది మరియు మీదుగా అలాగు వెళుతుంది. గమనించారా.
GEN 5:24•
MATT 24:37•
LUKE 17:26
29ఇప్పుడు, "నోవాహు దినములలో జరిగినట్లుగా, (తెలివైన మనుష్యులు, తెలివైన మనుష్యులు వారి యొక్క అణుశక్తులు మరియు సమస్తము, పిరమిడ్లు మరియు సిన్క్స్ మొదలైనవి కట్టగలరు), "ఆ దినములలో జరిగినట్లుగా, ఇప్పుడు కూడా అలాగే జరుగును." కాని ఈ దినములలో పనులు కత్తిరించబడి చిన్నవిగా చేయబడినవి, ఎందుకనగా ఎత్తబడే ప్రజలు బయటకు తీయబడాలి. హనోకు మాదిరిగా, ప్రజలు పైకి తీసుకొనిపోబడాలి. ఈ ఉదయము మనము అటువంటి తరగతిలో ఉన్నాము, జలప్రళయములో నోవాహు కొనిపోయినట్లుగా ప్రజలు కూడా తీసుకొనిపోబడాలి.
కాని గుర్తుంచుకొనుము, ముందుగా… దీన్ని మరచిపోవద్దు! ఒక్క వర్షపు చినుకు కూడా పడకముందే, ఆకాశములో ఒక్క కార్యము కూడా జరుగక ముందే, నోవాహు ఓడను పూర్తి చేయకముందే, హనోకు గృహమునకు కొనిపోబడ్డాడు. హనోకు మరణము లేకుండా ఎత్తబడ్డాడు, ఒకదినమున నడుచుట ప్రారంభించాడు, మరియు అతడు - గురుత్వాకర్షణ శక్తి అతడి మీద తన శక్తిని కోల్పోయింది, మరియు అతడు తన పాదము కొద్దిగా ఎత్తులో ఉండుట కనుగొన్నాడు, మరియు మరొక పాదము ఇంకొంచెం ఎత్తులో ఉండుట గమనించాడు, మరియు మరొక అడుగు ఇంకొంచెం ఎత్తులో ఉండుట గమనించాడు. మరియు మొదటి విషయము మీకు తెలుసా, అతడు ఇలా అన్నాడు, "లోకమా, నీకు వీడ్కోలు," కేవలం అలా నడుచుకుంటూ మహిమలోకి వెళ్ళిపోయాడు.
మరియు నోవాహు చుట్టూ చూసినప్పుడు, ఎక్కడనూ హనోకును కనుగొనలేకపోయాడు, అతడు చుట్టూ చూశాడు, మరియు హానోకు ఎక్కడకు వెళ్ళాడో అతడికి తెలియలేదు, అప్పుడు అతడు ఇలా అన్నాడు, "ఇప్పుడే ఓడను నిర్మించవలసియున్నది, ఇదే ఆ సమయము," గమనించారా. మరియు తనకు ఇవ్వబడిన దాన్ని మోయుటకు ఓడ పని నిమిత్తమై వెళ్ళాడు.
30ఇక్కడ కూడా అదే మాదిరిగా తన స్థానమును నేరుగా తీసుకుంటుంది. సంఘము ఆకాశములోకి తీసుకొనబడుతుంది, మరియు పునరుత్థానం చెందబోవువారికి యోహాను సాదృశ్యముగా పైకెత్తబడ్డాడు, మనము గతరాత్రి కొనిపోబడినట్లుగా, మరియు ఇదే స్వరము తనను ఇంతకు ముందు భూమిమీద ఆజ్ఞాపించినదని అతడు కనుగొన్నాడు, అదే స్వరము తనను పైకి ఎక్కిరమ్ము అని ఆజ్ఞాపించెను.
ఓ, ప్రతి క్రైస్తవుడు! ఛార్లీ, అదే స్వరము, ఒక దినమున కెంటకీలోని దిగువున నిన్ను ఆజ్ఞాపించినది, వెనుకకు తిరుగుము, అదే స్వరము నిన్ను "పైకి ఎక్కిరమ్ము," అని ఆజ్ఞాపిస్తుంది. బ్రదర్ ఇవాన్స్, నీవు దాన్నిబట్టి సంతోషముగా ఉన్నావా? ఆ స్వరము చెప్పుచున్నది, "వెనుకకు తిరుగుము," అదే స్వరము చెప్పుచున్నది, "పైకి ఎక్కిరమ్ము." ఓ, మై! అక్కడ, ఎటువంటి ఆజ్ఞలు, ఎంతటి వాస్తవికముగా, స్పష్టముగా, వ్యత్యాసమైన బూరధ్వనివలె, "వెనుకకు తిరుగుము, నాకు సేవచేయుము. నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడకి పైకి రమ్ము."
MATT 17:3•
MARK 9:4,30•
JOHN 21:22,23
31అక్కడ మనము చూస్తున్నాము, మరణించినవారికి ప్రతినిధిగా ఉన్నారు. మరణించిన పరిశుద్ధులు లేచిరి, మోషే దానికి ప్రతినిధిగా ఉన్నాడు; ఏలియా, చివరి దినమున ఎత్తబడిన తన సమూహముతో నిలబడి ఉన్నాడు. అందరు ప్రభువైన యేసు ముందు! యోహాను, దాన్ని బయలుపరచాడు… తను మరణించుటలేదని యేసు వారితో చెప్పాడు; తన రాకడవచ్చు వరకు అతడు జీవిస్తున్నట్లయితే, అది వారికి ఏమి? అనెను. మరియు శిష్యులు దానిని ఆ విధముగా ప్రచురము చేసిరి.
ఓ, నేను వాస్తవముగా ఉన్నానని ఆశిస్తున్నాను, సంఘమా ఇప్పుడు నిజమైన లోతులోనికి కొద్దిసేపు వెళ్దాం. ప్రతి యొక్కరికి తెలుసు, మరియు ప్రతి యొక్కరు దేవునితో వ్యక్తిగతమైన జీవితమును జీవిస్తున్నారు. ఇది ఒక వ్యక్తిగతమైన విషయము, నీవు మాటలాడుటకు కూడా వీలులేని (ధైర్యములేని) స్థలములలోనికి ఆత్మ యొక్క కార్యములు నిన్ను తీసుకొనిపోవుచున్నది.
నేను గుర్తించాను ఇది నా చిన్న స్వంత, వినయమైన సేవ, చాలాసార్లు నేను ఏదో చెప్పాను మరియు ఎందుకని చెప్పానో నాకు తెలియదు, మరియు అది సరియైనదిగా కనిపించదు. కాని ఇంకనూ ఎవరో ఏదో చెప్పాల్సియున్నది, కాని మరియు అది రావలసియున్నంత పరిపూర్ణముగానే వచ్చినదని నేను గమనిస్తున్నాను. దేవుడు దాన్ని జరుగునట్లుగా చేసెను. ఎప్పుడైతే నేను ఏదైనా చెప్పాలని అనుకుంటానో, నేను చెపుతాను, "మంచిది, ఇప్పుడు, ఒక్క నిముషము ఆగుము. ఆ వ్యక్తి, ఫలానా ఫలానా, ఇప్పుడు ఇక్కడ ఇది జరుగుతుంది అక్కడ అది ఆ విధముగా జరుగుతుంది." మంచిది, నిజముగా, ఎందుకు అలా దాన్ని చెప్పానో నాకు తెలియదు. మరియు మొదటి విషయము మీకు తెలుసా, అది ఆ విధముగానే ఉంటుంది. దేవుడే దాన్ని చేశాడు!
JOHN 21:22,23
32ఇప్పుడు, ఎప్పుడైతే ఈ శిష్యులు ఇలా అన్నారో, "ఓ, ఈ మనుష్యుడు మరణించడని యేసు అన్నాడు," యేసు ఎన్నడు అలా అనలేదు.
యేసు ఇలా అనెను, "నేను వచ్చు వరకు అతడున్నట్లయితే అది నీకేమి?
కాని ఈ శిష్యులు దాన్ని ఒక పుకారుగా చేశారు, తరువాత యేసు క్రిందకు వచ్చినప్పుడు, మరియు యోహానును తీసుకొనెను, మరియు అతడిని పైకి తీసుకెళ్ళెను మరియు జరుగబోవు దానిని అంతటిని ముందుగానే చూపించాడు, ప్రభువు యొక్క రాకడను ముందుగానే చూపించాడు. సంఘమును యోహాను చూశాడు, సంఘకాలముల యొక్క అంతమును అతడు చూశాడు. యూదుల అంతమును అతడు చూశాడు. రెండవ రాకడను అతడు చూశాడు. ప్రతియొక్క క్రమమును అతడు చూశాడు.
మరియు దేవుడు ఏమి చేయనున్నాడో చూడుము: అతడిని 24 గంటలు గ్రీజులో కాల్చారు దాన్ని బట్టి వారు అతడు దైవికముగా ఉన్నాడని వారిని చూడనిచ్చాడు, ఆ దైవికమైన ఆత్మ శరీరమును అభిషేకించినది (బయట ఉన్నదాన్ని ప్రాణమునకు అంటియున్నది, లేక మీరు దాన్ని ఏమని పిలుస్తారో, మానవుని శరీరము), 24 గంటలు గ్రీజులో కాల్చినా, దైవత్వము చేత అతడి మీద చిన్న మచ్చ కూడా లేదు. ఒక మనిషి నుండి పరిశుద్ధాత్మను బయటకు తెచ్చి కాల్చుటకు ప్రయత్నము చేయుట, నీవు దాన్ని చేయలేవు. తరువాత అతడిని పత్మాసు ద్వీపములో పడేశారు, మరియు అతడు ఒక పుస్తకమును వ్రాశాడు, మరియు తిరిగి వచ్చి ఏడు సంవత్సరములు ప్రసంగించాడు.
33తప్పనిసరిగా, ఇప్పుడు, అతడు ఒక చెడ్డపేరును తీసుకోవలసి వచ్చింది, "అతడు జరుగబోవునది ముందుగానే చెప్పువాడు, అతడొక మంత్రగాడు." యోహానును మంత్ర గాడు అన్నారని మీలో ఎంతమందికి తెలుసు? నిశ్చయముగా, యేసును కూడా అన్నారు. గమనించండి. చూడండి, ఈ లోకమునకు ఈ కార్యముల గురించి ఏదియు తెలియదు. "అతడు మనస్సులను చదువువాడు," గమనించారా. వారెమన్నారంటే అతడు ఎంతటి మంత్రగాడంటే అతడు గ్రీజును కూడా మంత్రించాడు, ఆ గ్రీజు కూడా అతడిని కాల్చలేకపోయింది, ఎందుకనగా అతడు ఆ గ్రీజును మంత్రించాడన్నారు, ఎందుకనగా వారి కాథలిక్కు ఆలోచనలను అతడు అంగీకరించనందువలన అలా అన్నారు. అంతయు అదే.
అతడు దేవునికి ఒక వినయమైన సేవకుడు, దిగువున అతడు దాచియున్న ఒక చిన్న సేవను కలిగియున్నాడు. అతడు ఆ పాత పెద్ద సంగతులను అతడు భరించలేకపోయేవాడు, మరియు కావున దేవుడు అతడిని దాచెను మరియు జాగ్రత్త చేసెను. పరిశుద్ధులైన మార్టిన్ మరియు ఐరేనియస్లను చేసిన మాదిరిగా చేసెను, మరియు అన్ని కాలములలో అలాగే చేసెను. మరియు అదే కార్యమును ఆయన నేడును చేస్తున్నాడు, క్రిందకు దిగి రాబోవుచున్నాడు.
1COR 3:19
34ఇప్పుడు, దీన్ని ఎన్నడూ మరచిపోవద్దు, దేవుడు గొప్పవైన కుదుపులను వాగ్దానము చేసియున్నాడు మరియు గొప్పవి మరియు బలిష్టమైన కార్యములను వాగ్దానము చేసియున్నాడు. ఇప్పుడు, మీరు రాస్తున్న మీ నోటు పుస్తకములలో దీన్ని వ్రాసుకోండి ,గమనించారా, మనుష్యుడు ఏదైతే బలిష్టమైనవి మరియు గొప్పవి అంటాడో, వాటిని దేవుడు వెర్రివి అంటాడు. మరియు మనుష్యుడు వేటిని వెర్రివి అంటాడో, వాటిని దేవుడు ఘనమైనవి అంటాడు. దాన్ని మరచిపోవద్దు, గమనించారా, దాన్ని మరచిపోవద్దు. రాబోవు సంవత్సరములలో అది మీకు సహాయము చేస్తుంది, ఎందుకనగా మనము ఎల్లప్పుడూ ఘనమైనవాటి కోసమే ఎదురు చూస్తుంటాము.
మరియు మనము ఎల్లప్పుడూ ఘనమైనవాటినే పొందుకున్నాము, కాని లోకము యొక్క ప్రజలకు దాని గురించి తెలియదు. నోవాహు దినములలో వారికి అది తెలిసినదా. యోహాను దినములలో అది వారికి తెలిసినదా, అపోస్తలుల దినములలో అది వారికి తెలిసినదా, ఐరేనియస్ దినములలో అది వారికి తెలిసినదా. ఆ దినములలో ఏ దినముల వారికైనా అది తెలిసినదా; వారికి ఎన్నడు అది తెలియదు.
MATT 23:29-31
35చివరకి జోనా-ఆఫ్-ఆర్క్, ఆమె ఒక చిన్న పరిశుద్ధురాలు. ఆమె ఒక చిన్న బాలికే గాని మరేదియు కాదు, ఆమెతో దేవుడు దర్శనములలో మాటలాడేవాడు, మరియు ఆమెతో దూత మాట్లాడేవాడు. క్యాథలిక్ సంఘము ఏమన్నదో మీకు తెలుసా? "ఆమె ఒక మాంత్రికురాలు." మరియు ఆమెను ఒక చెక్కమీద ఉంచి మరియు మరణించే వరకు కాల్చారు, క్యాథలిక్కు యాజకులు దాన్నిచేసియున్నారు. ఆమెను చంపియున్నారు. ఆమెను ఒక మంత్రగత్తె అని ఆమెకు మరణశిక్ష అని తీర్పు తీర్చారు. మరియు జోనా-ఆఫ్-ఆర్క్ ఒక మంత్రగత్తెగా మరణించింది. రెండువందల సంవత్సరముల తరువాత, ఆమె మంత్రగత్తె కాదని వారు కనుగొన్నారు, ఆమె క్రీస్తుకు ఒక శిష్యురాలు.
వారు పరిశుద్ధులందరికి అదే విధముగా చేశారు. యేసు ఇలా అనెను, "మీరు కాని, మీ తండ్రులు కాని వేధించనివారెవ్వరు? మీలో ప్రవక్తలను వ్యతిరేకించనివారు ఎవరు? సున్నం కొట్టిన సమాధుల్లారా," అనెను "మీరు వెళ్ళి మరియు ప్రవక్తల సమాధుల మీద అలంకరిస్తారు. మరియు వారిని సమాధిలో పెట్టిన వారిలో మొదటివారు మీరే. హమ్, మై, మై! ఆయన వారి మీద ఎటువంటి విసుర్లు విసరలేదు. ఆయన కేవలము వారితో చెప్పెను.
MATT 3:7,9•
LUKE 3:7,8
36యోహాను "సర్ప సంతానమా," అన్నాడు, "రాబోవు ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధిని నేర్పినవాడు ఎవడు? అబ్రాహాము, మా తండ్రియని మీరు చెప్పవద్దు."
"మేము ఒక ప్రత్యేకమైన పెద్ద సంస్థకు చెందినవారము."
"నీవు క్రైస్తవుడివా?"
"ఓ, నేను ఒక మెథడిస్టును."
"నేను ప్రెస్బెటేరియన్."
"నేను పెంతెకోస్తును."
అదంతయు కాదు. మంచు, ఎండతో ఏమి చేస్తుంది, గమనించారా. దానితో చేయగలినది ఏదియు లేదు. నీవు క్రైస్తవుడవైనట్లయితే, నీవు తిరిగి-జన్మించిన దేవుని సేవకుడివి.
37ఇప్పుడు, ఇప్పుడు, యోహాను వచ్చినప్పుడు, గత రాత్రి మనము కలిగియున్నట్లుగా, ఇప్పుడు, జ్ఞాపకముంచుకోండి, నీవు దీని కొరకే వచ్చినట్లయితే - ఆ సందర్భము యొక్క సంగతి, అప్పుడు నేను మీకు చెప్పాను. జ్ఞాపకముంచుకోండి, ఎన్నడు లేనటువంటి కఠినమైన కుదుపునకు ప్రపంచము ఇప్పుడే గురవ్వబోతున్నది, సంఘ ప్రపంచము గురవ్వబోతున్నది.
ఇప్పుడు, జ్ఞాపకము చేసుకోండి, యోహాను దినములలో సందేహము లేదు, యేసు దినములలో, అక్కడ వారి దినములలో వారికి గొప్ప పండుగలు ఉన్నాయి మరియు గొప్ప ప్రవక్తలున్నారు, గొప్ప తెలివైన మనుష్యులున్నారు. వేవేల కొలది ప్రజలను వారు ఆకర్షించగలరు. ఒకవేళ కయప ఒక కూటమిని పెట్టాలనుకుని కలసి రండి అని పిలుపును ఇచ్చినట్లయితే ఎలా ఉంటుంది? అతడు యెరుషలేమంతా తీసుకొని రాగలడు, అతడు ఇశ్రాయేలు వారినందరిని కలిపి, చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరిని తీసుకొనిరాగలడు. మరొకరు ఇలా అన్నారు, "ఓ, ఇప్పుడు కయప నిర్దిష్టమైన సంగతులు చెప్పినట్లయితే, అవి చాలా గొప్పవైనట్లే."
"ఓ, నీవు లేఖనములను నమ్ముచున్నావా, రబ్బీ, రెవరెండ్, డాక్టర్, బిషప్? నీవు లేఖనములను నమ్ముచున్నావా?"
"తప్పకుండా, నేను లేఖనములను నమ్ముచున్నాను, నేను గుర్తించబడిన పండితుడను."
PS 114:4•
ISA 40:3,4•
ISA 55:12•
MAL 4:5•
MATT 11:10•
LUKE 11:17
38"అంతా మంచిది. ఇప్పుడు, పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది ఏమిటంటే ఒక సమయము వస్తుంది అప్పుడు… పర్వతములన్ని చిన్న పిల్లల వలె గంతులు వేస్తాయి, అన్ని ఆకులు తమ చేతులతో చప్పట్లు కొడతాయి, మరియు ఎగువ స్థలములు దిగువకు సరిచేయబడతాయి మరియు దిగువ స్థలములు పైకి తీసుకొని రాబడి ఎత్తుగా చేయబడతాయి. మరియు అది అడవిలో కేక వేయుచున్న ఒకని స్వరము ద్వారా సరిచేయబడతాయి. నీవు దాన్ని నమ్ముతావా, రబ్బీ, రెవరెండ్, డాక్టర్, పాస్టర్?"
"ఖచ్చితముగా, నేను దాన్ని నమ్ముచున్నాను."
"అది ఎలా జరుగుతుంది?"
ఓ, ఒక దినాన దేవుడు ఒక బలిష్టమైన మనుష్యుడను భూమి మీదకు పంపుతాడు. ఓ, అతడు గొప్పవాడు. అతడు అడవిలో కేకవేయు ఒకని శబ్దము, లేక అతడు మెస్సీయకు ముందుగా వచ్చువాడు. మరియు అతడు వచ్చునప్పుడు, నా మనస్సులో ఎటువంటి ఆలోచనా ఉండదు కాని పరలోకము నుండి క్రిందకు నేరుగా దేవాలయములోకి వచ్చును. అతడు క్రిందకు నేరుగా దేవాలయములోకి వచ్చి మరియు ఇలా అంటాడు, "ఇప్పుడు, మనము రోమీయులనందరిని తీసుకొని మరియు కొట్టి మరణమునకు అప్పగించుదాం. అంతే. రోమీయులనందరిని మనము కొట్టబోవుచున్నాము. మరియు అతడు ఇలా చెప్పబోవుచున్నాడు, "మెస్సీయా, క్రిందకు దిగుము, మరియు మెస్సీయా క్రిందకు దిగి రాబోవుచున్నాడు, మరియు మనయొక్క పొడవైన బల్లెములను మరియు కత్తులను మరియు పొడవైన బల్లెములను వ్యవసాయ పనిముట్లుగా చేసుకుందాం మరియు ఆ తరువాత యుద్ధములనేవే ఉండవు." హు-హూహ్, అది వారి యొక్క అనువాదము.
PS 114:4•
ISA 40:4•
ISA 55:12•
MATT 3:4•
MARK 1:6
39కాని అది వచ్చినప్పుడు ఏమి జరిగింది? ఏది స్థానమును తీసుకున్నది? పరలోకమును చూపెట్టేదే లేదు. ఎందుకు, వారు ఎన్నడూ చూడలేదు. అదంతా ఒక్కటే కాని వారు దాన్ని చూడలేదు. వారు దాన్ని చూడలేదు, గమనించారా. చిన్నపిల్లలవలె పర్వతములు ఎప్పుడు గంతులు వేశాయి? ఎప్పుడు ఉన్నత స్థలములు దిగువ స్థలములుగా మారాయి? మరియు ఎప్పుడు దిగువ స్థలములు ఎగువ స్థలములుగా మారాయి? ఒకానొక ముదుసలి ముఖము కలిగిన ప్రసంగికుడు అడవిలో నుండి నడుచుకుంటూ బయటకు వచ్చాడు మరియు చివరికి అతడికి అ, ఆలు కూడా తెలియదు. చరిత్ర ప్రకారం అతడు అడవికి వెళ్ళినప్పుడు అతనికి 9 సంవత్సరముల వయస్సున్నది. అతనికి 30 సంవత్సరముల వయసు వరకు ఎన్నడు తిరిగి కనపడలేదు. అతడు అడవి తేనె మరియు మిడతలు చేత జీవించాడు.
మిడతలు అనగా గొల్లభామలు పొడవైన గొల్లభామలు. అవి అన్ని సమయాల్లో తింటుంటాయి. మంచిది, అవి చెడ్డవని తలంచవద్దు, వాటిని మీరు ఇక్కడనే కొనవచ్చును, ఎందుకనగా మీరు కావాలని అనుకున్నట్లయితే మీరు వాటిని ఇక్కడనే ఉన్న సూపర్ మార్కెట్లో కొనవచ్చును, బంబుల్-బీ, తేనెటీగలు, మిడతలు, రాటిల్ స్నేక్, మీకు ఏది కావలన్నా కొనవచ్చును, గమనించారా.
MATT 3:4,7•
MARK 1:6•
LUKE 3:7
40అతడు మిడతలు మరియు అడవితేనె చేత జీవించాడు. ఎటువంటి ఆహారమది! కాని అతడు దేవుని శక్తి చేత దాచబడ్డాడు. మెడచుట్టూ కాలర్ కలిగిన వస్త్రములను అతడు ఎన్నడు ధరించలేదు, గతరాత్రి ఎవరో చెప్పినట్లుగా, బ్రదర్ పార్నెల్ లేక వారిలో ఎవరో చెప్పారు. అతడు వేలాడుతున్న కోటును ధరించుకొనలేదు, మరియు అటువంటిది ఏదియు ధరించుకోలేదు. ఒక పెద్ద, గొర్రె చర్మమును చుట్టుకొని, అడవిలో నుండి బయటకు వచ్చాడు. నేను గతంలో చెప్పినట్లుగా, బహుశా… మనము ప్రతిదినము స్నానము చేస్తాము, అతను ఆ అడవిలో ఉన్నప్పుడు మరియు దాదాపుగా మూడు లేక నాలుగు నెలలకు ఒకసారి కూడా ఎన్నడు స్నానము చేయడు. నాకు తెలియదు. అతడు చూచుటకు అంతగా బాగుండడు.
అతడు పుల్పిట్ ను కలిగిలేడు. అతడు పెద్ద నగరములకు వెళ్ళి మరియు పెద్ద కూటములను కలిగిలేడు. యోర్దాను యొక్క నది ఒడ్డున అతడు నిలబడియున్నాడు, అతడి మోకాళ్ల వరకు బురద ఉన్నది, మరియు ఇలా అంటున్నాడు, "సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుటకు మీకు బుద్ధిని నేర్పినవాడు ఎవడు?" అవును, అప్పుడు ఉన్నత స్థలములు దిగువగా మార్చబడ్డాయి, మరియు దిగువ స్థలములు ఉన్నత స్థలములుగా మార్చబడ్డాయి. అవునయ్యా.
REV 3:20
41తరువాత, మొదటి సంగతి మీకు తెలుసా, మెస్సీయా దూతలతోను మరియు మిగిలిన సంగతులతోనూ వస్తాడని వారు ఎదురు చూస్తున్నారు, మరియు అక్కడనే బయట ఉన్న గుడారము దగ్గర క్రిందకు వచ్చి అక్కడే ఉంటాడని మరియు ఆయన వస్తాడని వారు దేవాలయము నిర్మించారు, మనము ఈ దినమున దేశమంతా నిర్మించినట్లుగా గొప్పవైన పెద్ద భవనములు మొదలైనవి, గమనించారా. మరియు ఆయన ఎప్పుడు వచ్చాడు? తమ ఆరాధన కొరకు ఏర్పరచుకున్న సమాజ మందిరములను, వారి ప్రతియొక్క సంస్థలను తప్పించాడు, మరియు క్రిందకు నేరుగా పశువుల తొట్టిలోనికి వచ్చాడు. వాటిలోకి రమ్మని ఆయనను వారు బలవంతము చేశారు.
ఈ దినమున ఉన్నది అదియే. ఆయనను వాటిలోకి రమ్మని బలవంతము చేశారు, వాటిని చేయుటకు బలవంతము చేశారు, అంతర్గత మతశాఖగా ఉండాలని బలవంతము చేశారు, ఎందుకనగా ఆయన వర్తమానము మతశాఖలకు సహకారిగా ఉండుట లేదు. ఆయన వర్తమానము ఈ దినము, తన సేవకులకు ప్రసంగించాడు, అది అంతర్గత మతశాఖ, ఎందుకనగా మతశాఖలు ఆయనను త్రోసివేశాయి. పరిశుద్ధ గ్రంథము ఆ విధముగా చెప్పియున్నది. ఆయన బయట ఉన్నాడు, తట్టుచున్నాడు, లోపలకి వచ్చుటకు ప్రయత్నము చేస్తున్నాడు, గమనించారా, తన స్వంత సంఘములోకి వచ్చుటకు ప్రయత్నము చేయుచున్నాడు. అది అక్కడ అలా ఉన్నది. చూశారా, ఈ దినమున కూడా అదే మాదిరిగా ఉన్నది.
MATT 7:23
42కావున జ్ఞాపకముంచుకోండి, మనుష్యులకు ఏది పెద్దదిగా కనిపిస్తుందో, అది దేవుని ముందు చిన్నదిగా కనిపిస్తుంది. ఇప్పుడు, ఆ కారణము చేతనే మీరు చాలా పువ్వులను కలిగిలేరు. మరియు దేవుడు తిరిగి వచ్చినప్పుడు, యేసు మరలా వచ్చినప్పుడు, మీరు ఆశ్చర్యపోతారు, చిన్న దారిలో ఉన్న ఆ చిన్న శుభ్రము చేయు స్త్రీ మాదిరిగా మీరు కూడా ఆశ్చర్యపోతారు, ఆ వ్యక్తి ఏదియు అనడు, తన రహస్యములను తనలోనే ఉంచుకుంటాడు మరియు నడుచుకుంటూ దేవుని ముందుకు వినయంగా వస్తాడు. మీరు ఆశ్చర్యపోతారు. అది ఖచ్చితముగా.
తీర్పుల మీద నేను ప్రసంగించి ఎక్కువ కాలం అవ్వలేదనుకుంటాను, "తీర్పు వద్ద ఆశ్చర్యములు." మద్యమును దొంగతనముగా అమ్మువాడు అక్కడ ఉండుట చూసినప్పుడు ఎటువంటి ఆశ్చర్యము కలుగదు, అతను వెళతాడని అతడికి తెలుసు. ఖచ్చితముగా, అబద్దమాడువాడిని అక్కడ చూసినప్పుడు, వ్యభిచారము చేసినవాడిని అక్కడ చూసినప్పుడు, ప్రతియొక్కటి అక్కడ ఉంటుంది, వాటిని చూసి ఎటువంటి ఆశ్యర్యము చెందవద్దు… కాని అక్కడ ఆశ్చర్యమున్నది, మరియు నిరాశ ఉన్నది, అవును ఎవరైతే మేము వెళతాము అనుకున్నారో, మరియు వారు క్రిందకు దించబడతారు. అప్పుడు వారు ఇలా అంటారు, "మంచిది, ఒక్క నిముషము ఆగుము, నా తల్లి ఈ సంఘమునకు సంబంధించినది, నా తండ్రి ఈ సంఘమునకు సంబంధించినవాడు, నా తాతగారు మరియు నా అమ్మమ్మ ఈ సంఘమునకు చెందివారు. నా జీవితమంతా ఆ సంఘములో సభ్యునిగా ఉన్నాను."
"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును."
MATT 11:25•
LUKE 2:26•
LUKE 10:21
43వృద్దుడైన సుమెయోను ఉన్న ఆ దినములలోకి చూడుము, ఎవరికి తెలియని వ్యక్తి, ఎటువంటి గుర్తింపు లేని వ్యక్తి, అతడి గురించి పరిశుద్ధ గ్రంథములో ఏమియు లేదు. కాని, పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, "పరిశుద్ధాత్మ చేత అతడికి బయలు పరచబడింది (అక్కడనే అతడున్నాడు, నీవును అక్కడే ఉన్నావు.) ప్రభువైన క్రీస్తును చూచేంతవరకు అతడు మరణించడు.
బాప్తిస్మమిచ్చు యోహాను ఎవరో చూడుము, ఒక రకమైన వింతగా ఉండు వ్యక్తి, అరణ్యములో నివసించువాడు. అది అతడికి బయలుపరచబడింది. అతడు ముందుకు వచ్చి ఈ వర్తమానమును ప్రసంగిస్తున్నాడు. దాన్ని చూడుము.
చిన్న అన్నా ఎవరు?
నజరేతు పట్టణము (జఫర్సన్విల్ వలె ఉంటుంది) యొక్క దిగువన ఉండే చిన్న కన్యకయైన మరియ, అక్కడనే పాపము మరియు సమస్తము పొర్లి పారుతుంటాయి, కాని ఆమె తనను తాను పరిశుద్ధముగా ఉంచుకున్నది, ఎందుకనగా ఆమెకు తెలుసు ఒక దినాన మెస్సీయా వస్తాడని, గమనించారా.
యోసేపు, ఒక వడ్రంగివాడు, తన భార్యను కోల్పోయాడు మరియు ఈ చిన్న బాలిక అతడికి ప్రధానం చేయబడింది. మరియు దాని ద్వారా పరిశుద్ధాత్మ అక్కడకు రావలసియుండెను. మరియు అప్పుడు లోకమంతా చుట్టూ చేరి మరియు చెడ్డ పేర్లు పెడుతుంది, "పరిశుద్ధ గుండ్రాళ్ళు, పెంతెకోస్తువాడు," అను పేర్లు పెడుతుంది, గమనించారా. "ఎందుకు, ఆ బాలుడు పరిశుద్ధ వివాహమునకు వెలుపల జన్మించాడు." గమనించారా, వారు దాన్ని నమ్మియన్నారు, మరియు చూచుటకు అది అలాగునే ఉన్నది. కాని జ్ఞానుల కన్నులను మరియు తెలివైనవారి కన్నులను గ్రుడ్డివి అగునట్లుగా దేవుడు చేసియున్నాడు, మరియు వారు నేర్చుకున్నట్లుగా పిల్లలకు కూడా బయలుపరచారు.
REV 4:1,2
44కొద్దిసేపటి తరువాత నేను తాకబోవు అంశానికి సరిపోయినంత నేపద్య సంగతులు తెలిశాయని నేను ఆశిస్తున్నాను. నేను మీకు చూపించబోవుచున్నాను. మీరు ఈ నూనెను గమనించారా? ఇప్పుడు, నేను మీకు ఏమి చెప్పియున్నాను, నేపద్య సంగతులు, చూచుటకు అతడు మనుష్యుడు కాదు, అది దేవుడైయున్నాడు, దాన్ని నేను మీకు ముఖ్యమైనదిగా చూపిస్తున్నాను. మంచిది.
ఇప్పుడు, "పైకి ఎక్కి రమ్ము." అది స్వరమైయున్నది. మరియు తెరవబడియున్నప్పుడు అతడు ఆ బూరధ్వనిని వినియున్నాడు, మరియు తరువాత యోహాను ఆత్మవశుడైనాడు, ఆత్మవశుడై, మరియు అతడు ఆత్మను పొందుకున్నప్పటి నుండి సంగతులను చూచుట ప్రారంభించాడు. నీవును ఆత్మను పొందుకున్నప్పటి నుండి సంగతులను చూచుట ప్రారంభిస్తావు. మొదటగా నీవు ఆత్మను పొందుకోవలసియున్నది. అది నిజము కాదా?
45ఇప్పుడు, నీవు ఒక బాల్ ఆటకు వెళ్లినట్లయితే ఏం జరుగుతుంది, మరియు నీవంటావు, "ఖచ్చితముగా నేను బేస్బాల్ ఆటను ప్రేమిస్తాను." హు, హుహ్, మరియు నీవు మొదటి వరుసలో కూర్చున్నావు, నేరుగా బాక్స్ సీటులోనే కూర్చున్నావు, మరియు నీవు యాంకీస్ లేక బుల్డాగ్స్ ని (ఆ ఆటలు ఆడే జట్ల పేర్లు- అనువాదకుడు) చూస్తున్నావు. వారు ఎవరైనప్పటికి, వారు ఆడుచున్నారు. మరియు వారంతా అక్కడ చాలా పెద్ద ఆటను కలిగియున్నారు.
మరియు నీకు సంబంధించిన జట్టు ఓడిపోవుటకు సిద్ధముగా ఉన్నది, మరియు అకస్మాత్తుగా ఒక అధునికమైన బేబ్ రుత్ తన బ్యాటు ఈ విధముగా ఊపుచూ మరియు ఇలా అన్నాడు, "దూరముగా ఉన్న ఆ స్థలమును గమనిస్తున్నావా?" బేస్లో ముగ్గురు ఉన్నారు. వామ్మీ! కంటికి కనపడనంత వేగముగా అతడు తన బ్యాటును ఊపెను, తన తల మీద ఉన్న టోపిని తీశాడు మరియు తన అభిమానులు కూడా, మొదటి బేస్ దగ్గరకు నడిచాడు మరియు చుట్టూ చూశాడు, అందరు రెండవ బేస్ దగ్గరకు వెళుతున్నారు, రెండవ బేస్ వ్యక్తితో కరచాలనము చేస్తున్నారు, నడుస్తు, నడుస్తు తిరిగి హోమ్ దగ్గరకు వచ్చారు, తన (తలను) వంచాడు. ఎందుకు, మై, మై!, అరుపులు, గంతులు, దొర్లుచున్నారు, "హుర్రా!" అని పెద్దగా శబ్దాలు. ఎందుకు, వారు…
46వారు ఆ విధముగా తీసుకొని వెళ్ళుటను నేను చూసియున్నాను. ఆ పురాతనమైన స్ట్రా-కేడి టోపి మీకు గుర్తున్నదా? మరియు ఒక వ్యక్తి హోమ్ రన్ చేస్తునప్పుడు, నేను ఒక దినమున బేస్బాల్ ఆటకు వెళ్ళాను. మరియు ఈ వ్యక్తి స్ట్రా టోపిని పెట్టుకొని నా ముందు కూర్చున్నాడు, అతడు చాలా ఉత్సుకతను కలిగియున్నాడు, అతడు తన టోపిని తీశాడు, క్రిందకు లాగాడు, పై భాగమును బయటకు పెట్టి కాలరు చుట్టూ పెట్టియున్నాడు. ఎందుకు, అతడు చాలా గొప్ప సమయమును కలిగియున్నాడు. తను చాలా వెనుకగా ఉన్నాడు, అందుకని అతడు ఏమి చేస్తున్నాడో అతనికి తెలియదు, కేవలం కొట్టుచున్నాడు మరియు హుర్రా అని అరుస్తున్నాడు మరియు కేకలు వేస్తున్నాడు మరియు ఎగురుచున్నాడు. మంచిది, ఇప్పుడు, నేను ఏమి ఆలోచిస్తున్నానో మీకు తెలుసా, అతడు ఖచ్చితముగా కలిగియుండెను. అతను బేస్బాల్ ను ప్రేమించాడు. అతడు బేస్బాల్ కు బానిస, ఒక సిగరెటికి బానిస వలె, లేక ఒక విస్కీకి బానిస.
నేను యేసుకి బానిసను (వ్యసనపరుడను) అవును. నేను దాన్ని ప్రేమిస్తున్నాను. నేను… నీవు గాని యేసుకు బానిస అయినట్లయితే, నీవు గమనించావా, ఒక బానిసగా అయిన తరువాత ఏదో…
ఆ వ్యక్తి ఇలా చెప్పుటను మీరు ఊహించగలరా, "ఓ, ఖచ్చితముగా, నేను బేస్బాల్ ఆటకు బానిసను." మరియు అతడు జట్టు ఓడిపోవుటకు సిద్ధముగా ఉన్నది, మరియు వారు ఆ విధముగా గెలిచి వచ్చుటను అతడు చూస్తున్నాడు, అతడు చుట్టూ చూసి మరియు, అవును, అన్నీ సక్రమముగానే జరిగాయి. చెప్పు, అతడు బేస్బాల్ ఆటను ప్రేమిస్తున్నాడు? ఓ, అతడు ఇంకేదో…
నీవనవచ్చు, "ఎందుకు, నీవు దాన్ని ఇష్టపడవు కదా, మరి నీవు? నీలో ఏదో లోపమున్నది."
ప్రతి మంచి బేస్బాల్ ఆటకు బానిసలైనవారు ఇలా అంటారు, "నీలో ఏం లోపమున్నది? ఇతనిలో ఏదో లోపమున్నది. అక్కడ కూర్చున్న అతడిని చూడుము."
ఇప్పుడు ఇద్దరిని మరియు ఇద్దరిని కలుపుము, గమనించుము. ఓ, యేసుకు నీవు బానిసగా (వ్యసనపరునిగా లేక వెర్రివానిగా) మారినప్పుడు, మరియు పరిశుద్ధాత్మ నిన్ను ఆ వాక్యములో ముంచుతున్నట్లుగా నీవు భావిస్తావు, అప్పుడు ఏదో అరుపు బయటకు వస్తుంది. ఓ, నిన్నునీవు దాటి వెళ్లిపోతావు!
47ఈ వ్యక్తి నన్ను క్షమిస్తాడని నేను ఆశిస్తున్నాను, ఇక్కడ దగ్గరగా కూర్చున్న వ్యక్తి ఒక పెద్ద, పొడవైన, నల్లనివాడు ఇక్కడ కూర్చునియున్నాడు, ఒక దినమున అతడు బయట వరండాలో నిలబడియున్నాడు, మరియు ఎవరికో ఏదో సహాయము కావాలని ఎవరో అన్నారు, మీకు తెలుసా, ఆ విధముగా అతడికి ఆశ్వీరాదముగా ఉన్నది. మరియు ఆ దీనుడైన బాలుడు భయంకరమైన సమయములో ఉన్నాడు, అతడి భార్య వెళ్ళిపోయినదని నాకు తెలుసు మరియు విడాకుల కోసము ఆమె కోర్టులో కేసు వేసినది, ఎందుకనగా అతడు ప్రభువైన యేసును ప్రేమిస్తున్నాడని. అది నిజము, మరియు ఎవరో యేసును గురించి ఏదో అన్నారు, మీకు తెలుసా, అతడు అటువంటి బానిసలుగా (వ్యసనపరునిగా లేక వెర్రివానిగా) అయినవారిలో ఒకడు.
మరియు అతడు యుద్ధములో ఉన్నాడు అన్ని పైకి పేల్చబడ్డాయి, మరియు ప్రతియొక్కటి, ఆ బాలుడు, నేను అతడి కొరకు చింతిస్తున్నాను. పిల్లలతో మరియు భార్యతో గృహమునకు వచ్చాడు. తరువాత అతడు ఆయనకే సేవ చేస్తానని ప్రభువుకు వాగ్దానము చేశాడు, మరియు దేవుడు అతడిని దీవించుట ప్రారంభిస్తుండగా, మరియు అతడు దేవునితో సరిగానే ఉన్నాడు, అతడి భార్య వెనుతిరిగి మరియు విడాకుల కొరకై అతడి మీద కేసు వేసినది మరియు అతడిని విడిచి వెళ్ళిపోయింది. అతడు అలాగునే చలిలో కూర్చుని ఉండగానే వదిలివేసింది. కాని అతడు ఇంకనూ దేవునికి బానిసయే.
మరియు ఒక రాత్రి అతడు ఇక్కడ నిలబడియుండగా మరియు ఎవరో యేసును గూర్చి ఏదో అన్నారు, ఏదో, ఆయన ఎంత గొప్పవాడు! అని అటువంటిది ఏదో అన్నారు, అతడు అన్నాడు, "ఓ, మహిమా!" తన చేతులు పైకెత్తి బిగ్గరగా అరిచాడు, మరియు అతడు పిడికిలి బిగించి గోడను ఈ విధముగా గుద్దుచున్నాడు. అతడు ఏం చేస్తున్నాడో అతడికి తెలియదు. అతడి పిడికిలి గోడను తాకుచున్నది. ఇలా అంటున్నాడు, "బ్రదర్ బిల్, దానికి నేను వెల చెల్లిస్తాను." బ్రదర్ ఉడ్ క్రిందకు వచ్చారని నేను అనుకుంటున్నాను మరియు విరిగిన ముక్కలను పైన పెడుతున్నారు, మరొక ముక్కను పైన పెడుతున్నారు. బ్రదర్ బెన్, మేము దాని గురించి ఏమి చింతించము. నీవు వెర్రివానిగా (క్రీస్తుకు - అనువాదకుడు) ఉండుటను బట్టి మేము సంతోషిస్తున్నాము. గమనించారా.
MATT 5:6•
LUKE 6:21•
REV 4:2
48ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీతో ఏదో చేయుచున్నప్పుడు, నీవు కదలకుండా ఆలాగునే కూర్చోలేవు, అక్కడ ఏదో బుడగల మాదిరిగా ఉంటుంది. ఆమేన్. ఏదో నిన్ను పట్టుకుంటుంది, క్రీస్తు కొరకు నిన్ను ఒక వెర్రివానిగా చేస్తుంది. ప్రభువును నీవు ప్రేమించినప్పుడు, నీవు దేనినో చేరుకున్నప్పుడు, పట్టుకున్నప్పుడు, ఆకలిగొంటావు మరియు దాహం కలిగియుంటావు, యేసు ఇలా అనెను, "వారు దీవించబడినవారు, వారు నింపబడుదురు."
దీవించబడినవారు కూడా దాహమును కలిగియున్నారు, నీవు దాన్ని పొందుకున్ననూ లేక పొందుకోకపోయిననూ, మీలో ఎంతమందికి దేవుడు అధికంగా కావాలి? అంతా మంచిది, మీకు దేవుడు అధికంగా కావాలా అనుటకు కారణమేమంటే, దాని కొరకు ఇప్పుడే దీవించబడ్డారు. మీరు దాన్ని పొందుకొనక పోయిననూ, ఇంకనూ మీరు దీవించబడినవారే. "దీవించబడినవారు ఆకలితోనూ మరియు దాహముతోను ఉంటారు." నీవు ఆకలిగొనుటకు మరియు దప్పిగొనుటకును దీవించబడ్డావు. ఎందుకనగా నీవు దాన్ని కావాలని కోరుకున్నావు, నీవు దీవించబడ్డావు. కారణమేమంటే చాలామంది ప్రజలు దాన్ని కావాలని కోరుకొనుటలేదు.
వేరొక దినమున నా వర్తమనమును జ్ఞాపకమున్నదా? గమనించారా, బుద్ధిహీనుని వలె, అతడు బహుమతి బాక్సును ఉంచుకొని బహుమతిని విసిరివేశాడు. గమనించారా? బాక్సును తీసుకొనవద్దు; బహుమతిని తీసుకొనుము.
REV 4:2
49మంచిది.
"ఇప్పుడు, వెనువెంటనే… ఆత్మలో, మరియు ఆగుము, ఒక సింహాసనము… పరలోకములో వేసియున్నది, మరియు ఒకడు ఆ సింహాసనమందు ఆసీనడైయున్నాడు."
ఇప్పుడు, గమనించుము, కొద్ది సేపటి తరువాత, లేక మనము గత రాత్రి దాన్ని పొందుకున్నాము, నేను నమ్ముచున్నాను, ఆ సింహాసనము మీద… మొదట ఆ సింహాసనము మీద ఏదియు లేదని మనము కనుగొన్నాము, మరియు ఇప్పుడు ఆ సింహాసనము మీద ఎవరో ఉన్నారు, కావున అది మనకు ఏమి తెలియచేస్తున్నదంటే, యేసు తన సంఘముతో పైకి మహిమలోకి వచ్చాడని తెలియచేస్తున్నది. మరియు ఆయన సింహాసనము మీద కూర్చున్నాడు, "సింహాసనము మీద ఆసీనుడైయున్నాడు." అది సంఘకాలములు ముగిసిన తరువాత. ఇప్పుడు. ఇప్పుడు, దాని తరువాత ఏం జరిగిందో కొద్దిసేపటిలో తెలుసుకుంటాము.
ఇప్పుడు, నీవనవచ్చు, "మంచిది, ఈ దినము ఆయన సింహాసనము ఎక్కడ ఉన్నది?" ఇప్పుడు, బ్రదర్ నెవిల్, అది నేను నీ దగ్గరకు పంపియున్నయెడల, నీవు నన్ను కొద్దిసేపటి తరువాత అడుగుము, ఈ దినమున ఆయన సింహాసనము ఎక్కడ ఉన్నది. నేను దాన్ని క్రిందకు తీసుకొని రాగలిగినంత దూరములో ఉన్నదని నేను అనుకుంటున్నాను. "ఆయన, ఇప్పుడు తన సింహాసనము మీద లేనట్లయితే ఆయన సింహాసనము ఇప్పుడు ఎక్కడున్నది?" ఇప్పుడు ఆయన తన సింహాసనము మీద లేడు. లేదయ్యా.
REV 4:3
50అంతా మంచిది, ఇప్పుడు:
"ఆసీనుడైనవాడు, ధృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు వర్ష ధనస్సు సింహాసనమును ఆవరించియుండెను."
ఇప్పుడు, 3వ వచనము తీసుకొని ప్రారంభించుదాం, మరియు ఆసీనుడైనవాడు దృష్టికి సూర్యకాంతమువలె ఉన్నాడు. మరొక మాటలలో, మీరు ఆయనను చూసినప్పుడు, ఆయన ఎంతో అద్భుతముగా, ఎంతో అందముగా! ఓ, నేను ఆయనను చూడాలనుకుంటున్నాను. మీరు చూడాలనుకోవటంలేదా?
51ఒక దినము. నాకు జ్ఞాపకమున్నది సహోదరి కాడిల్, సహోదరి హోవార్డ్ కాడిల్, మీలో చాలామందికి ఆమె జ్ఞాపకమున్నదని నేను అనుకుంటున్నాను. నేను అక్కడ వీధిలో ఉన్నాను, మరియు ఇప్పుడు ఇక్కడ కూర్చున నా భార్య జ్ఞాపకము చేసుకుంటుంది. ఆమె చలితో గదిలో ఉన్నది. మరియు నేను పైకి లేచాను, మరియు ఒక పాతదైన మంకీ స్టవ్ అక్కడున్నది. ఒక పైపు నుండి వచ్చు ఓవెన్లో మేము రొట్టెను వండుకున్నాము. అక్కడ చాలా చలిగా ఉన్నది, మరియు గాలి ఎక్కువగా వీస్తున్నది, శీతాకాల సమయము, నేలమీద మంచున్నది, మరియు గాలి దిగువన ఉన్న పొగ గొట్టము గుండా వీచుచున్నది, మరియు నా జీవితమును రక్షించుకొనుటకు నేను అక్కడకు వెళ్ళి దాన్ని వెలిగించుటకు వెళ్ళలేక పోవుచున్నాను. మరియు నేను దానిలో కొద్ది భాగమును చీల్చాను. మరియు నేను కొన్ని లోపల వేసాను; మరల గాలి వీస్తున్నది. బిల్లీ చల్లగా ఉన్నాడు, మరియు ఆమె కూడా చల్లగా వున్నది, నేను మంటను వేయుటకు ప్రయత్నము చేస్తున్నాను.
ఆ తరువాత నేను రేడియోను పెట్టుట జరిగింది, (మరియు నేను వెచ్చగా అగుటకు అయిదు నిముషములకు ముందు.); రమ్ము, మరియు సహోదరి కాడిల్ పాడుచున్నది, "నేను ఆ దేశమును చేరినప్పుడు, కొద్ది దూరములో ఉండే భాగమును, నేను యేసును చూడాలనుకుంటున్నాను. మీకు అలా లేదా?" ఓ, నా నేల మీద మధ్యలో నేను కూర్చునియున్నాను మరియు అక్కడే కూర్చుని ఏడ్చుట ప్రారంభించాను. దిగువున ఆమె ఎలా పాడుచున్నదో మీకు తెలుసా, నిజమైన మాధుర్యమైన మాకింగ్ పక్షి యొక్క స్వరము వంటి స్వరము ఆమెది. దూరాన ఉన్న ఆ సరిహద్దును నేను దాటినప్పుడు, నేను ఆమె స్వరము వినాలని అనుకుంటున్నాను, ఇలా అనెను, "నేను యేసును చూడాలని అనుకుంటున్నాను. మీకు అలా లేదా?"
నేను అనుకుంటున్నాను, "ఓ దేవా! అవును, ఒక దినాన నేను ఆయన్ను చూడాలని అనుకుంటున్నాను. పువ్వులన్నీ పరచబడినప్పుడు, నేను యేసును చూడాలని అనుకుంటున్నాను; ఆయన తన సింహాసనము మీద కూర్చున్నప్పుడు చూచుట, ఆయన అందము, ఆయన యొక్క అద్భుతము! ఓ, యోహాను చూసిన చోట నేను నిలబడాలని కోరుకుంటున్నాను, కావున కేవలం నేను నిలబడి ఆయన వైపు చూడాలని అనుకుంటున్నాను.
52కొంతకాలం క్రితం, దిగువున… బానిసత్వపు కాలములో, ఈ ఉదయం ఇక్కడ ఉన్న రంగు సహోదరుల తరుపున నేను దీన్ని చెపుతున్నాను. అక్కడ ఒక ముదుసలి నల్లని రంగు వ్యక్తి ఉన్నాడు, అతడు అలవాటుగా వెళ్ళు ఒక చిన్న ప్రదేశమున్నది అక్కడకి వెళ్ళాడు. మరియు దిగువ కెంటకీలో కూడా అటువంటివి చేస్తుంటారు, పాటలను వారు కలిగియుంటారు.
బహశా మామా కాక్స్ మరియు వారికి జ్ఞాపకముండవచ్చును వారు అలాగు వెళ్ళి పాటలను పాడుతుంటారు, మీకు తెలుసా, ఇంటింటికి వెళ్ళుట మరియు వారు ఆర్గాన్ను వాయిస్తారు. యవ్వన పిల్లలు మరియు అందరు పాడతారు. యుటికాలోని ఎగువ ప్రాంతములో ఆ విధముగా చేస్తుంటారు మరియు పల్లెటూరు ప్రాంతములో అటువంటివి చేస్తుంటారు. ఇప్పుడు, వారు ఒక క్వార్టరు విస్కీ తీసుకుంటారు, ఒక రాక్-అండ్-రోల్ విందులకు వెళతారు, కాని తరువాత వారు గీతాలు పాడతారు.
53ఈ పాత-కాలపు గీతాలను వారు పాడతారు, అక్కడ ఒక పాతకాలపు రంగు సహోదరుడు రక్షించబడ్డాడు. మరియు ప్రభువు అతడిని ప్రసంగించమని పిలిచాడు, మరియు ఆ తరువాత దినము అతడు వెళ్ళి తన పని చేయు ప్రాంతములో ఉన్న బానిసలతో చెప్పుచున్నాడు. అతడు ఇలా చెప్పుచున్నాడు, "గత రాత్రి ప్రభువు నన్ను రక్షించాడు మరియు సహోదరులకు భోధించమని నన్ను పిలిచాడు."
మరియు చివరకు ఆ వార్త తను పనిచేయు శాల యజమాని యొద్దకు చేరినది, లేక ఆ మొక్కలు నాటు స్థలము యొక్క యజమానికి చేరినది. అతడు ఇతనిని లోపలికి పిలిచి ఇలా అన్నాడు, "సాంబో, నీవు ఇక్కడకి లోపలికి రావాలని నేను కోరుకుంటున్నాను, నా కార్యాలమునకు పైకి రమ్ము."
"అలాగే, అయ్యా," అన్నాడు.
పైకి నడుచుకుంటూ కార్యలయముకు వెళ్ళాడు. అతడన్నాడు, "బానిసల మధ్యలో నీవు తిరుగుతున్నావని విన్నాను ఏమిటది, బయట ఉన్నవారి మధ్యలో తిరుగుతున్నావు, నా చేతులు, నా బానిసలు, ప్రభువు నిన్ను స్వతంత్రుడను చేసాడా?"
అవును, అయ్యా," ఇంకా ఇలా అన్నాడు, "యజమానీ, నేను నీ బానిసను, నేను నీ ధనము చేత కొనబడ్డాను, కాని.." ఇలా అన్నాడు, "కాని, గతరాత్రి దేవుడు నన్ను స్వతంత్రుడిగా చేసిన విధానము, నన్ను పాపపు జీవితము నుండి యేసు స్వతంత్రుడిగా చేశాడు మరియు అవమానకరమైన జీవితం నుండి స్వతంత్రుడిగా చేశాడు, మరియు మరణము నుండి నన్ను స్వతంత్రుడిగా చేశాడు. ఆయన నన్ను స్వతంత్రుడిగా చేశాడు."
అతడన్నాడు, "సాంబో, నీ ఉద్దేశ్యము అదేనా?"
సాంబో, "నా ఉద్దేశ్యము అదే."
54అతడన్నాడు,"నీవు ఇక్కడున్న ఈ ప్రాంతములోని నీ ప్రజలకు నీవు ప్రసంగించబోవుచున్నావని నేను విన్నాను."
చెప్పెను, "అవును, అయ్యా" నేను చేయవలసినది అదియే, ఈ సువార్తని నా ప్రజలకు చెప్పాలి."
అతడన్నాడు, "సాంబో, నిజముగా నీ ఉద్దేశ్యము అదియేనా?"
చెప్పెను, "నిజముగా నా ఉద్దేశ్యము అదే."
అతడు ఇలా అన్నాడు, "రా, నాతో పాటు దిగువన కోర్టుకు రమ్ము, నేను కూడా నీకు స్వాతంత్ర్యమును ఇవ్వాలనుకుంటున్నాను. నీవు నా నుండి స్వతంత్రుడవు, మరియు ఏ బానిస నుండియైనా నీవు ఇక మీదట స్వతంత్రుడవు. నేను నిన్ను కొనియున్నాను, నీవు నా సొత్తు, మరియు నేను నిన్ను స్వతంత్రుడిగా చేస్తున్నాను కాబట్టి నీ ప్రజలకు నీవు సువార్తను భోదించవచ్చును." అతడు క్రిందకు వెళ్ళాడు మరియు అందరికి తెలియునట్లుగా ప్రకటించు విడుదలకు సంబంధించిన పత్రము మీద సంతకం చేశాడు, మరియు అతడు స్వతంత్రుడయ్యాడు. అతడు ఇక ఎన్నడు బానిసగా అమ్మబడడు. అతడు సువార్తను ప్రకటించుటకు స్వతంత్రుడుగా అయ్యాడు.
55తన సహూదరులు మధ్య అతడు చాలా సంవత్సరములు భోదించాడు. తన సేవలో అనేకమంది తెల్లని ప్రజలు మారారు. ఒక దినమున ఈ ముసలి వ్యక్తి మరణించే సమయం వచ్చింది. అతడు 30 లేక 40 సంవత్సరములు లేక ఇంకా ఎక్కువగా ప్రకటించాడు. మరియు అతడు మరణించు సమయమప్పుడు, అతడు గదిలో పడుకోబెట్టబడియున్నాడు, మరియు తన యొక్క తెల్లని సహోదరులు అనేక మంది అక్కడ గదిలో అతడి చుట్టూ ఉన్నారు మరియు అతడు రెండు లేక మూడు గంటలలో మరణిస్తాడని వారు అనుకుంటున్నారు. తరువాత చివరికి అతనికి మెలుకువ వచ్చింది మరియు గదిలో చుట్టూ చూస్తున్నాడు, ఇలా అన్నాడు…
"సాంబో, నీవు ఎక్కడ ఉన్నావు?"
అతడు అన్నాడు, "ఓ, నేను తిరిగి ఇక్కడకే వచ్చానా? నేను తిరిగి వచ్చానా?"
అతడన్నాడు, "సాంబో, ఏమిటి సంగతి?"
సాంబో, "ఓ, నేను దాన్ని దాటి వేరే ప్రదేశానికి వెళ్ళాను."
అతడన్నాడు, "దాని గురించి మాకు చెప్పుము."
అతడు, "మంచిది, నేను అప్పుడే ఆయన సన్నిధికి వచ్చాను." మరియు ఇలా చెప్పాడు, "నేను అక్కడ నిలబడియున్నప్పుడు," ఇంకా ఇలా అన్నాడు, "అక్కడ ఒక దూత మేల్కొలిపి, ఇలా అనెను. నీ పేరు సాంబో, ఫలనా-ఫలానా?"
అతడు, "అవును, అయ్యా, అదే నా పేరు."
అతడన్నాడు, "లోపలికి రమ్ము."
"లోపలకు నడిచి, మరియు ఆయన అక్కడ కూర్చుని యుండుటను నేను చూశాను."
అతడన్నాడు, "సాంబో, ఇప్పుడు ఇక్కడకు రమ్ము. ఆయనను నీవు చూచిన తరువాత నీవు బయటకు ఇక్కడకు రావాలని నేను కోరుకుంటున్నాను, మేము నీకు నీ వస్త్రాలను ఇవ్వాలనుకుంటున్నాము, మేము నీకు నీ ముక్కోణపు సంగీత వాయిద్యమును ఇవ్వాలనుకుంటున్నాము, మేము నీకు నీ కిరీటము ఇవ్వాలనుకుంటున్నాము."
అతడు ఇలా అన్నాడు, "వస్త్రాల గురించి, ముక్కోణపు సంగీత వాద్యముల గురించి, కిరీటాల గురించి నాతో మాటలాడవద్దు."
అతడన్నాడు, "కాని నీవు నీ బహుమతిని గెలుచుకున్నావు, మేము నీకు నీ బహుమతిని ఇవ్వాలని అనుకుంటున్నాము."
అతడు, "బహుమతుల గురించి నాతో మాటలాడవద్దు." "నన్ను ఇక్కడే నిలబడి మరియు ఆయనను ఒక్క వెయ్యి సంవత్సరములు చూడనిమ్ము, అదే నాకు బహుమతి," అన్నాడు.
మనమందరము ఆ విధముగా అనుభూతిని చెందవలసియున్నది. కేవలం నిలబడి నన్ను ఆయన్ను చూడనిమ్ము. ఓ, ఇప్పుడు నేను వ్యత్యాసమైన శరీరమును కలిగియుంటాను, నీలోని ప్రతి అణువు కేవలం ఆయనను చూడనిమ్ము.
MATT 17:12•
MARK 9:2•
LUKE 9:28,29•
REV 1:8,17•
REV 4:3
56అక్కడే నిలబడి యోహాను మరియు ఆయన సింహాసనము మీద ఆసీనుడైయుండుట చూశాడు, మరియు ఆయన దృష్టికి సూర్యకాంత పద్మరాగముల వలె యున్నాడు. ఇప్పుడు, సమస్తమూ మరియు పరిశుద్ధ గ్రంథములోని ప్రతి వాక్యమునకు అర్ధమున్నది. ఇప్పుడు, "సూర్యకాంతము మరియు పద్మరాగము."
ఇప్పుడు, మీరు గుర్తించినట్లయితే, ఇది మిగిలిన లేఖనముతో పోల్చుచున్నది. లేఖనములలోని వెనుకటి భాగములో, ఆయనే ఆల్ఫా, ఓమెగా. ఆయనే ఆరంభము మరియు ఆయనే అంతము. ఆయనే మొదటివాడు మరియు ఆయనే కడపటివాడు. ఆయనే తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మడు. అంతా ఆయనే, మరియు అన్ని ఆయనలోనే చుట్టబడ్డాయి. మత్తయి 17 దాన్ని మనకు చూపిస్తుంది, పర్వతము మీద రూపాంతరము చెందినప్పుడు, అందరూ ఆయనలోనే కలుసుకున్నారు.
57ఇప్పుడు, "సూర్యకాంతము" అనేది ఒక రాయి, మరియు "పద్మరాగమనేది" ఒక రాయి. (ఇప్పుడు, వాటియొక్క రంగుల గురించి కొద్దిసేపటిలో తెలుసుకుంటాం.) ఇప్పుడు, ప్రతియొక్క గోత్ర పెద్ద జన్మించినప్పుడు, అవును, ప్రతి వ్యక్తి ఒక జన్మరాయిని కలిగియున్నాడని మీరు గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. నేను, ఏప్రియల్ నెలలో జన్మించాను - వజ్రం. మరియు వివిధ నెలలు వివిధ రకములైన రాళ్ళ ప్రతిబింబిస్తాయి. మంచిది, గోత్ర పెద్దలకు కూడా అదే విధముగా ఉన్నది. ప్రతి సమయములో గోత్ర పెద్ద జన్మించినప్పుడు, అతడు ఒక జన్మరాయిని కలిగియున్నాడు.
మరియు కొద్దిసేపు ఇక్కడే ఆగుదాం. వారియొక్క హెబ్రీయుల తల్లలు… స్నేహితురాలా, దైవికమైన వాక్యమును నన్ను మీకు చూపనీయండి, అప్పుడు మీ యొక్క విశ్వాసము దేవుని యొక్క వాక్యములో ఒక నిర్దిష్టమైన రీతిలో పెరుగుతుంది. ప్రతి సమయములో హెబ్రీయుల తల్లలు, వారు శ్రామికులుగా ఉన్నప్పుడు, శ్రమ యొక్క నెప్పులలో ఈ బిడ్డలు జన్మించునప్పుడు ఆమె పలుకు మొదటి మాటలే బిడ్డకు పేరుగా పెడతారు (తన ద్వారా పుట్టబోవు బిడ్డకు) అతడి పేరు, మరియు ప్రభువు రాకడలో అతడు ఎక్కడ ఉంటాడో, ఆ పాలస్తీనాలో అతని స్థానము. ఈ తల్లి యొక్క ప్రసవ నెప్పులు వలె, "ఎఫ్రాయిము" అర్ధము "సముద్రము చేత," అని. గమనించారా? మరియు ఎఫ్రాయిమును ఇచ్చినది సముద్రము. మరియు చెప్పుము, "యూదా" అర్ధము ఏమిటి. ఆ పదము యొక్క అర్ధము నాకు తెలియదు, కాని దాన్ని నేను తీసుకొనగలను.
ఇప్పుడు, గమనించుము, అందుకనే నాకు సమయము సరిపోదు, ఈ చిన్న సంగతులు, ఆ సంగతులను పైకి తీసుకొనుటకు సమయము సరిపోదు. కాని వెనుకకు వెళ్ళి, మరియు యూదా, (యూదా అంటే అర్థమేమైనా), అతని స్థానము ఇశ్రాయేలియుల సంతానములో మధ్యలో ఉంచబడినది, అని అర్ధము.
GEN 49:22
58ఆదికాండము 48 మరియు 49లో నుండి తీసుకొనుము, అక్కడ మీరు యాకోబును కనుగొనగలరు, అతడు మరణించునప్పుడు, తన కర్రను ఆనుకొని, గ్రుడ్డివాడైయుండి, తన కుమారుల స్థితిని గూర్చి లోకము యొక్క అంతము సమయములో వారు ఎక్కడ ఉంటారో దాని గూర్చి చెప్పాడు, మరియు వారు భౌతికంగా అప్పటి నుండి వారు తమ స్వంత దేశమునకు వెళ్ళు వరకు అక్కడే ఉన్నారు.
యేసేపుతో ఇలా అన్నాడు, "యేసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును." అతడు అక్కడి వెళ్ళాడు. చెప్పెను, "నీవు ప్రభువైన దేవుని యందు నమ్మకము ఉంచావు. నీవు నీ యొక్క శాఖలను ప్రభువులో బలముగా (అమెరికా, గమనించారా) ఉంచుకొందువు. కాని, ఒక దినమున ఆ ద్రాక్షరసము గోడ దగ్గరకు తిరిగి వస్తుంది. మరియు అది అక్కడే ఉన్నది, ఇప్పుడును అక్కడే ఉన్నది. మూడు వేల సంవత్సరములు క్రితమే అతడు చెప్పినది చాలా దగ్గరగా ఖచ్చితముగా ఉన్నది, నేరుగా వెనుకకు తిరుగుదాం.
ఎఫ్రాయిముతో చెప్పెను, అతడు తన పాదములను నూనెలో ముంచుతాడు, మరియు ఎఫ్రాయిము ఎక్కడైతే నూనె బావులు ఉన్నాయో, అక్కడే నివసిస్తున్నాడు. ఖచితముగా అదే — ఆ ప్రజల యొక్క వాక్యము. ఆ మర్త్యుల మీద ఏమున్నది? దేవుడు వారి నరములను తీసుకొని మరియు వారిలో ఆయన వాటిని కదల్చియున్నాడు!
59రోమ్ చక్రవర్తి వారిని చెదరగొట్టినప్పటివలె యున్నది, ఇతరులు వారిని చెదరగొట్టినప్పుడు, వారు హిట్లరు చేత వ్యతిరేకించబడినప్పుడు, వారి నరములలో వేవేల సార్లు బుడగలను పంపినప్పుడు మరియు వారు మరణించారు, మీరు వారి శరీరములు ఎముకలతో… మరియు వారి పిల్లలతో గోడలకు వ్రేలాడుతూ ఉండుట చూడగలరు మరియు తీసుకొని మరియు వారి ఎముకల నుండి ఎరువులను తయారు చేశారు. అక్కడ వాటిని బయటకు తీసి మరియు వాటిని కొట్టి, వాటిని పెద్ద గుంటలో వేశారు.
తరువాత బయటకు వచ్చి… బయటకు వచ్చు సమయములో ప్రారంభించి, వారు ఇలా పాడేవారు, "మెస్సీయా వస్తాడు మరియు మరోసారి మేము ద్రాక్షా రసము త్రాగుతాము." వారు క్రిందకు దిగి చనిపోతు ఉన్నప్పుడు, ఆ యూదులు — వారి చుట్టూ నడుస్తున్నారు, మరో కొన్ని దెబ్బలకే మరియు వారి హృదయాలు పోతాయి — మరియు వారు దిగువకు వెళుతున్న కొలదీ, పాడుచున్నారు, "మేము త్వరలో మెస్సీయాను చూస్తాము." ఓ, మై! వారి ఎముకల నుండి ఎరువులను తయారు చేసారు.
ఇక్కడ ఉన్న సైనికులలో చాలా మందికి అది తెలుసు, మీరు దాన్ని చూశారు. వారిని కాల్చిన ఆ ప్రాంతములో నేను నిలబడ్డాను మరియు అక్కడున్న సమస్తము, హిట్లరు మరియు వారు. మరియు రష్యాను మరియు స్టాలిన్ను చూడుము. మరియు వారును అదే కార్యమును చేశారు. అది నిజము. కాని, ఆ యూదుడు, అక్కడ విషయమేమిటి? అతడు తన స్వదేశమునకు బలవంతముగా పంపబడ్డాడు. అక్కడనే వారు నిలబడ్డారు.
నేను ఆ గొప్ప లఘు చిత్రమును కలిగియున్నాను, "మధ్యరాత్రికి 3 నిముషముల ముందు." యూదులు తిరిగి వస్తున్నప్పుడు, వారు ఇలా అడుగబడ్డారు, "స్వదేశములో చనిపోవుటకా, ఎందుకని మీరు తిరిగి వెనుకకు వస్తున్నారు?"
వారు ఇలా అన్నారు, "మేము మెస్సీయాను చూచుటకు వస్తున్నాము." ఆమేన్. ఉమ్! మనము అంత్యకాలములో ఉన్నాము.
EXOD 28:15-21•
LEV 8:8•
NUM 27:21
60ఆ పిల్లలలో ప్రతి బాలుడు జన్మించునప్పుడు, వారు ఒక జన్మరాయిని కలిగియున్నారు. మరియు ఎప్పుడైతే అహరోను, ఆ పిల్లలందరి మీద ప్రధానయాజకుడిగా ఉన్నాడో, అతడికి ఛాతి మీద ఒక పలక ఉన్నది, అతని అంగీ మీద… అందుచేతనే నేను కొద్దిసేపు అక్కడనే ఆగాలని కోరుకుంటున్నాను, 6వ వచనముకు వెళ్ళుటకు ముందుగా, ఎందుకనగా అది పాత నిబంధన యొక్క ప్రతి సూచనను అక్కడకే తీసుకొని వస్తుంది. ప్రతియొక్కటి. అన్ని ఉపకరణములు మరియు పాత నిబంధనలోని సమస్తము పరలోకములోని దానికి మాదిరిగా ఉన్నది, మాదిరి తిరిగి మానవుని దగ్గరకు వచ్చినది.
మరియు ఇక్కడ అహరోను ఛాతి మీద పలక, అతడే ప్రధానయాజకుడు. గమనించుము, ఒకొక్క తెగకు సంబంధించిన జన్మరాయి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఆ జన్మరాళ్లలో ఒకటి, అతడి రాయిని అక్కడ ఉంచాడు, అది ఎఫ్రాయిము యొక్క తెగ, మనష్షే యొక్క తెగ, గాదు యొక్క తెగ, బెన్యామీను యొక్క తెగ, అన్ని అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మరియు అందుచేతనే…
అప్పుడు వారు ఆ జన్మరాళ్ళను తీసుకున్నారు, అవి అందమైన రత్నాలు, మరియు వాటిని అక్కడ ఈ విధముగా వ్రేలాడదీశారు. మరియు ఒక ప్రవక్త ప్రవచించినట్లయితే, మరియు అవి కాంతులీనుట వారు చూసినట్లయితే, వారు అతడిని ఈ ఉరీము తుమ్మీము క్రిందకు తీసుకొని వస్తారు మరియు అప్పుడు అతడిని ప్రవచించమని అంటారు, అక్కడ పవిత్రమైన వెలుగు వచ్చినట్లయితే మరియు అది ఈ రాళ్ళను ఆ వెలుగు వెలిగించుట ప్రారంభిస్తుంది, అది దేవుడు తిరిగి మాట్లడుటయే. అది ఆ తెగ అంతటికి చెందినది, వారందరికి, ప్రతి యొక్క తెగకు చెందినది.
REV 4:3•
REV 21:10,11
61ఇప్పుడు, వీటి మీద, ఆ మొదటి రాయి… మొదటిది, మొదటి బిడ్డ ఎవరో ఎంత మందికి తెలుసు? ఆ పేరు ఏమిటి? రూబేను. మంచిది. చివరివాడు ఎవరు? బెన్యామీను. అది సరియే. రూబేను యొక్క జన్మరాయి సూర్యకాంతము. బెన్యామీను యొక్క జన్మరాయి పద్మరాగము. ఆయన దృష్టికి రూబేను మరియు బెన్యామీను వలె ఉండాలి, మొదటిది మరియు కడపటిది, అతడే, మరియు రావలసియున్నది. ఆయనే ఆల్ఫా (ఎ) గ్రీకు అక్షరము, ఓమేగా (జెడ్) గ్రీకు అక్షరము. ఆయనే ఆది, అంతము. ఆయన బెన్యామీను నుండి రూబేను, రూబేను నుండి బెన్యామీను. ఓ, మై! ఆయన అక్కడే ఉండెను, "దృష్టికి పద్మరాగము వలె మరియు సూర్యకాంతము వలె ఉన్నాడు."
ఆయన ఈ సింహాసనము మీద ఆసీనుడైయున్నాడు.
REV 21:10,11•
REV 21:23
62ఆయన ఎలాగు తన మహిమలో ఆసీనుడైయున్నాడో చూడాలని మీరంతా ఇష్టపడుతున్నారా? ప్రకటన 21:10కి త్రిప్పుదాం, త్వరగా, మరియు ఆయనను ఇక్కడ ఒకసారి చూద్దాం. మంచిది, 21:10 నుండి 11.
"మరియు ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతము మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను.
దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది… పద్మరాగము వలె, స్పటికము వలె స్పష్టముగా;"
"దాని యందలి వెలుగు." వెలుగు! ఆ వెలుగు ఎవరు? "మరియు ఆ పట్టణమునకు సూర్యుని అవసరము లేదు, ఎందుకనగా గొర్రెపిల్లయే అక్కడ వెలుగైయున్నది."
SONG 2:1•
REV 1:8,17•
REV 22:16
63సూర్యకాంతము, పద్మరాగము రాయి.
దేవుని యొక్క మహిమ యేసు క్రీస్తే, యేసుక్రీస్తు యొక్క మహిమ తన సంఘమే. మరియు ఆయనే మొదటివాడు. ఆయన ఏమైయున్నాడు? కాలమునకు ఆయనే ఆదియైయున్నాడు. ఆయనే కాలమునకు అంతమైయున్నాడు. ఆయనే గోత్ర పెద్దలలో మొదటివాడు, గోత్ర పెద్దలలో ఆయనే కడపటివాడు. ఆయనే సంఘము అది దానిలోనే… ఎఫెసు సంఘములో ఉన్న ఆత్మ ఆయనే. లవోదికయా సంఘములో ఉన్న ఆత్మ ఆయనే.
ఆయనే ఆది మరియు ఆయనే అంతము, A నుండి Z, ఆది, అంతము: ఉన్నవాడు ఆయనే మరియు వచ్చువాడు ఆయనే, దావీదు వేరు మరియు చిగురు ఆయనే, వేకువ చుక్క ఆయనే, లోయలోని పద్మము ఆయనే, షారోను పుష్పము ఆయనే! ఓ, ఆయనకు పరిశుద్ధ గ్రంథములో నాలుగు వందలకన్నా ఎక్కువ పేర్లు ఇవ్వబడ్డాయి. కేవలం దాని గురించి ఆలోచించుము, ఆయనేమైయున్నాడు! మరియు ఇంకనూ తగ్గింపు కలిగిన ప్రభువైన యేసు దేవుని మహిమకై పశువుల తొట్టిలో జన్మించాడు.
ఏదైననూ అది వినయమే, దాన్ని గమనించుము, కారణమేమంటే అది నిజము. ఏదైనా పెద్దదైనట్లయితే అది పేలిపోవుటకు సిద్ధముగా ఉన్న చొక్కా, కావున దానికై ఎటువంటి శ్రద్ధ ఇవ్వకుము, గమనించారా. అది బలమైన గాలితో కూడుకున్నది మరియు దానిని ఏదియు చేయలేదు. మంచిది.
EZEK 1:1-4•
REV 4:3
64ఇప్పుడు, దృష్టికి ఆయన నూర్యకాంత పద్మరాగములను పోలినవాడునైయున్నాడు. వెనుకకు తిరుగుదాం. మనకు కొద్ది సమయమున్నది, మనము కలిగిలేమా? మనకు ఇంకనూ 40 నిముషముల సమయమున్నది. గమనించుదాం. యెహెజ్కేలు 1కి మనము తిరుగుదాం. పాత నిబంధనలోని యెహెజ్కేలుకు వెళదాం, మరియు యెహెజ్కేలు కూడా చూసిన దాన్ని మనము చదువుదాం, మరియు ఇప్పుడు ఈ మూడు లేఖనములు పోల్చుదాం మరియు అప్పుడు మనము ఎక్కడ ఉన్నామో చూద్దాం.
యెహెజ్కేలు 1వ అధ్యాయము. మంచిది, ఇప్పుడు కొద్దిసేపు దాన్ని చదువుదాం. నేను మొదటి ఐదు వచనములను చదువుతున్నాను, మరియు అప్పుడు మనము చదువుదాం, నేను 26 నుండి 28 వరకు గుర్తుపెట్టుకునియున్నాను. కాని, ప్రవక్తయైన యెహెజ్కేలు 1వ అధ్యాయములో మొదటి ఐదు వచనాలు చదువుదాం. మంచిది:
"ముప్పదియవ సంవత్సరము నాలుగవ నెల అయిదవ దినమున నేను కెబారు. (అది సరియేనా, కెబారు? కె-బ—ర్, కెబారు) నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని, ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను.
యెహోయాకీను చెరపట్టబడిన అయిదవ సంవత్సరము ఆ నెలలో అయిదవ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహూవా వాక్కు బూజీ కుమారుడనును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షముకాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను.
నేను చూడగా ఉత్తర దిక్కునుండి తుఫాను వచ్చుచుండెను…"
EZEK 1:4,5•
HEB 13:8•
1JN 1:7•
REV 4:3
65ఈ ప్రవక్తను ఇక్కడ గమనించండి, క్రీస్తు రాకడకు 595 సంవత్సరాల ముందు, అతడి యొక్క దర్శనము యోహాను యొక్క దర్శనముతో ఎలాగు పోలికైయున్నదో గమనించండి!
"… ఉత్తర దిక్కునుండి ఒక తుపాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును ఒక గోళమువలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనపడెను, కాంతి దానిచుట్టూ ఆవరించి యుండెను. ఆ అగ్నిలోనుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజివంటి దొకటి కనపడెను.
దానిలోనుండి నాలుగు జీవుల రూపములుగల యొకటి కనపడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది."
ఈ నాలుగు జీవుల రూపములుగల దానిపైన యున్నదేవుని యొక్క ఆత్మ యొక్క వర్ణమును గమనించుము, అపరంజి వంటిది. అపరంజి అంటే పసుపుతో కూడిన పచ్చని రంగు, ఇప్పుడు, గమనించుము. పసుపుతో కూడిన పచ్చనిరంగు, అపరంజి. ఓహ్, ఆయన నిన్న… ఏకరీతిగా ఉన్నాడు. యెహెజ్కేలు దర్శనము మధ్యలో ఆయన తనను తాను యెహెజ్కేలుకు బయలుపరచుకున్నాడు. అతడు చూచిన ఈ వెలుగు ఆ నాలుగు జీవుల పైన పసుపుతో కూడిన పచ్చనిరంగులో ఉన్నది. ఆయన యోహాను దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన మరకతము యొక్క రంగులో కనిపించాడు అది కూడా పసుపుతో కూడిన పచ్చిని రంగు. ఇప్పుడు ఆయన ప్రత్యక్షతను మనకు అందించువాని (యోహాను - అనువాదకుడు) దగ్గరకు పసుపుతో కూడిన పచ్చని రంగులో వస్తున్నాడు. ఆ వెలుగు, పసుపుతో కూడిన పచ్చని రంగులోనే ఆయన మన దగ్గరకు వస్తున్నాడు. ఆయనే వెలుగు, ఆ వెలుగులో నడువుము.
EZEK 1:26,27
66ఇప్పుడు 26వ వచనమునకు వెళదాం, అప్పుడు మనము 28వ వచనము చదువగలము. 26వ వచనము, "మరియు వాటి పైన…" ఓ, మీరు ఇంటికి వెళ్ళిన తరువాత, మీరు దీన్ని గుర్తుపెట్టుకొని మరియు దానిలోని ప్రతి భాగమును చదవాలని కోరుకుంటున్నాను. సమయాన్ని కాపాడుకోవటానికి:
"వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనమువంటి దొకటి కనబడెను, మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడైయుండెను."
ఆయనే మనుష్యకుమారుడు, గమనించారా, క్రీస్తు. ఇప్పుడు, ఆయన ఎలా ఉన్నాడో గమనించుము. ఆయన ఇక్కడ ఎలా కనిపిస్తున్నాడు:
"మరియు నేను అపరంజి యొక్క రంగులను చూశాను (గమనించుము, మనుష్యకుమారుని చుట్టూ), దాని చుట్టును లోపలను తేజస్సు కనబడెను, దాని చుట్టును లోపలను ఉండెను, దానిలో తన నడుము నుండి మీదకి ఉన్న మాదిరిగా…"
EZEK 1:27,28
67మరియు మీ స్వంత హృదయమలతో, ఆత్మీయంగా, అర్ధము చేసుకొని, వినండి. యేసు నామములో మీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఇది మీ యొద్దనే ఉంచుకొనండి. అయితే ఇది ఎంత దీవెనకరముగా ఉంటుందో జ్ఞాపకముంచుకోండి.
తిరిగి 27వ వచనము ప్రారంభించుదాం. ప్రతియొక్కరు వినండి! ఇప్పుడు వాస్తవికముగా అర్ధము చేసుకొనండి!
"మరియు అపరంజి యొక్క వర్ణమును చూశాను. (అది పసుపుతో కూడిన పచ్చని రంగు). దాని చుట్టూ అగ్నివంటిది కనపడెను… అది (అపరంజి-పచ్చని రంగు చుట్టూ అగ్నియున్నది). ఇప్పుడు, నడుము మొదలుకుని మీదికి, (తన నడుము నుండి పైకి), మరియు నడుము నుండి క్రిందకు… దిగువకు, అగ్నిస్వరూపము నాకు కనబడెను, మరియు దాని చుట్టూ తేజోమయముగా కనబడెను (చుట్టూ అగ్ని).
వర్షకాలమున కనబడు వర్షధనస్సు యొక్క తేజస్సువలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా, నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినపడెను."
EZEK 1:27
68గమనించుము! మీరు సిద్ధముగా ఉన్నారా? వినండి! దీన్ని మీ యొద్ద ఉండనీయండి, కేవలం జ్ఞాపకముంచుకోండి, మీరు తెలుసుకోండి. (జిన్, ఈ టేపును నీవు ఆపవచ్చును.) వినండి! (లేదు, నేను దాన్ని అక్కడే ఆపలేను, అయితే పరవాలేదు. నా ఉద్దేశ్యము టేపును ఉంచుకొనుము, ఇది కేవలం సంఘము వరకే నియంత్రించండి.) దీన్ని గమనించుము. ఇప్పుడు, ప్రభువు యొక్క వెలుగు యొక్క రంగు ఏమిటో మీకు తెలిసినది, మరియు ప్రభువు యొక్క వెలుగు ప్రభువుని వెంబడిస్తుంది, మరియు అది ప్రభువు యొక్క వెలుగు అపరంజి — పసుపుతో కూడిన పచ్చని రంగు. అదే రంగు కలిగిన వెలుగు నేడు మనతో కూడా ఉన్నది, శాస్త్రవేత్తలు ఈ చిత్రమును(ఫోటో)ను తీశారు, పసుపుతో కూడిన పచ్చని రంగు, అపరంజి.
ఎప్పుడైతే ఒక చిన్నబాలుడు, మరియు నేను మొదటిసారిగా చూసినప్పుడు, మీకు గుర్తున్నదా, పాత-కాలపు వారు ఇక్కడున్నారు. ఈ అసలైన చిత్రమును తీయుటకు ముందుగానే నేను ఎల్లప్పుడు చెప్పియున్నాను, "ఇది పసుపుతో కూడిన పచ్చనిరంగు, అదే అపరంజి. "ఇప్పుడు, ప్రభువు యొక్క ఆత్మను మీకు తెలుపుటకు…
ఆయనను చూచినప్పుడు నడుము మొదలుకుని పైకి జీవివలె తన సన్నిధిలో నిలబడెను అని అతడు చెప్పెను, నడుము మొదలుకొని పైకి అగ్నివలె, నడుము నుండి క్రిందకు వెలుగుతో కప్పబడియుండెను; మరియు చుట్టూ వర్షధనస్సువలె అనేక రంగులు కనబడెను." అది నిజమేనా?
EZEK 1:5,27•
HEB 13:8
69మీరు దీన్ని జ్ఞాపకముంచుకోవాలని నేను కోరుకుంటున్నాను, దేవుడు ఇంకనూ అదే రంగులో ఉన్నాడు, "నడుము మొదలుకొని పైకి అగ్నిగాను, అపరంజి రంగులో - ఒక చలనచిత్ర కెమెరాతో తీసినట్లుగా లేక ఒక రంగుల కెమెరాతో తీసినట్లుగా ఉన్నాడు, "నడుము మొదలుకొని పైకి అపరంజిగా, నడుము మొదలుకొని దిగువకు, మరియు చుట్టూత, వర్షము వెలిసిన తరువాత ఏర్పడే వర్షధనస్సులో ఉన్న రంగులవలె ఉన్నది." యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఇంకనూ ఆయన శక్తిలోనే ఉన్నాడు, ఈ చివరి దినములో కూడా ఇంకా ఆయన తన సంఘములోనే ఉన్నాడు.
అక్కడే మీరున్నారు. నేను కాదు, నేను కేవలం అక్కడ నిలబడియున్నాను, కాని ఈ చిత్రము తీయబడింది. మీరు దాన్ని చూడాలని నేను కోరుకుంటున్నాను, యెహెజ్కేలు ఖచ్చితముగా దేనినైతే చూశాడో అదే, అవే రంగులు, అదే విధముగా, మరియు అదే విధముగా కార్యము జరిగింది, మరియు అది ఎర్రనిరంగు విధానములో, జీవించుచున్న జీవులు. అది ఏమిటి? జీవము గలిగిన జీవులు జీవం గలిగిన సంఘమునకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి, క్రీస్తు యొక్క పునరుత్థానపు శక్తి చేత సంఘము జీవిస్తున్నది. అదే అపరంజి రంగులు నడుము మొదలుకొని పైకి, నడుము నుండి క్రిందకు కప్పియున్నాయి.
EZEK 1:28
70అక్కడ ఊహించుటనేదే లేదు, సైన్సు ఈ చిత్రమును తీసుకున్నది.
ఈ రంగులను చూడుము. ఈ ఇక్కడున్న అగ్ని యొక్క రంగులను చూడుము, గమనించారా, వర్షధనస్సు. పసుపుతో కూడిన ఈ మరకతము రంగును చూడుము. ఇప్పుడు, ఈ కెమెరాలో నేరుగా ఫోటోగ్రాఫర్ యొక్క కెమెరా, ఈ కెమెరా రంగుల (కలర్) కెమెరా, కలర్ ఫోటోలు, కోడాక్రోమ్ కలర్ (కెమెరాల కంపెనీ పేరు - అనువాదకుడు.) అపరంజి యొక్క రంగును అక్కడ చూడండి. ఒకవేళ నేను దీన్ని వెలుగులో ఉంచినట్లయితే వెనుక ఉన్న మీకు కనబడుతుంది…
ఇప్పుడు మీరు దీన్ని చూడగలగుతున్నారా? "ఒక వర్షధనస్సు వలె," వెనుక నుండి వస్తున్న ఆ గీతలను చూడుము మరియు ముందు వర్షధనస్సువలె, ప్రతియొక్కటి వ్యత్యాసము కలిగిన రంగులో ఉన్నాయి. మనము దాన్ని కొద్ది నిముషములలో పొందుకొన బోవుచున్నాము, ఆ రంగులు ఏమిటి మరియు అవి వేటిని ప్రతిబింబిస్తున్నాయి?
ఓ, అది దీనమైన నా హృదయము సంతోషముతో గంతులు వేయునట్లుగా చేస్తుంది. మరియు మనము జీవిస్తున్న ఈ దినములలో మనకు తెలియునట్లుగా, ఆ క్రీస్తు… సమస్త నేలలు క్రుంగిపోతున్నప్పుడు, మిగిలిన సమస్త నేలలు. నేను అనుకుంటున్నాను, "ఎందుకని నేను దాన్ని చెప్పకూడదు?ఎందుకని ప్రపంచమునకు నేను దాన్ని చూపించకూడదు?" ప్రపంచానికి దాన్ని చూసినా ఏమి అర్ధము కాదు. ప్రపంచము దాన్ని చూడదు, వారు ఎన్నడు దాన్ని చూడరు. కాని, సంఘము ఎన్నడు చూడనటువంటి బలిష్టమైన కుదుపును పొందుకుంటుంది!
EZEK 1:27,28
71ఆ దినములలో వారు చిత్రమును (ఫోటో) తీసుకొనుటకు అవకాశము లేదు. ఇప్పుడు వారు తీసుకొనగలరు, ఎందుకనగా యంత్ర పరిజ్ఞాన పనిముట్లు వచ్చాయి కాబట్టి, ఎవరైతే యంత్రాలను తీసుకొని దేవుని వ్యతిరేకించారో, వారే వచ్చి దేవుడు ఉన్నాడని నిరూపించారు. అది నిజము.
అపరంజి. ఇప్పుడు, నీవు జ్ఞాపకముంచుకో, ఎన్నడు నేను దాన్ని పైకెత్తలేదు, పరిశుద్ధ గ్రంథములో నుండి నేను దాన్ని చదువుతున్నాను. నేను చదువుదాన్ని గమనించండి, మరియు చూడండి, మరియు అదే ప్రభువైన దేవుడిని కలిగియుండండి, దానిలో ఏ వ్యత్యాసము లేదు. 27వ వచనమును గమనించండి:
"మరియు నేను చూశాను… అపరంజి యొక్క వర్ణము, ఆ అగ్నిలో కనబడెను…"
గమనించారా, మంటలు పైకి ఎగసిపడుతున్నట్లుగా, గమనించారా, అపరంజి రంగులు అగ్నిలో నుండి వస్తున్నాయి, ఇప్పుడు మీరు దాన్ని చూస్తున్నారా? అపరంజి, ఈ అపరంజి రంగులు అగ్ని నుండి వస్తున్నాయి. దిగువన అది ఇలాగు చెప్పుచున్నది:
"మరియు అది ఒక ధనస్సులాగా ఉన్నది… (లేక వర్షధనస్సు, వర్షము వెలిసిన దినములలో ఉన్నట్లుగా…"
వర్షధనస్సు, వర్షము వెలసిన తరువాత.
EZEK 1:27,28
72మరియు అక్కడ ఒక జీవియున్నది. యోహాను దేనికి ప్రతినిధిగా ఉన్నాడు, సంఘమంతా పైకి తీసుకొనిపోబడింది. నేను మీకు చెప్పియున్నాను. దర్శనములో ఉన్న ఒక వ్యక్తి క్రీస్తు యొక్క పూర్తి శరీరమునకు ప్రతినిధిగా ఉంటాడు, కప్పబడి యుంటాడు! ఇప్పుడు, గమనించుము:
"మరియు నేను చూశాను… అపరంజి యొక్క రంగు, అగ్నివలె కనిపిస్తుంది… దానిచుట్టూ, మరియు అలా కనిపిస్తుంది. నడుము మొదలుకొని పైకి, మరియు నడుము నుండి క్రిందకు కనపడుతుంది, అగ్నివలె కనబడుటను నేను చూశాను…"
గమనించుము, అగ్ని చిమ్ముటను చూడుము, దేనిలో నుండి? వర్షధనస్సులో నుండి, ఏడు రంగులు. ఇప్పుడు, గమనించుము, అక్కడ ఖచ్చితముగా ఏడు రంగులున్నాయి, మరియు వర్షధనస్సులో ఏడు రంగులున్నాయి.
"… మరియు అగ్నివలె కనబడుటను నేను చూశాను, మరియు దాని చుట్టూ తేజోమయమైన తేజస్సు ఆవరించియున్నది.
అది వర్షము వెలసిన తరవాత వచ్చు ధనస్సులా కనబడుచున్నది, కావున దాని చుట్టూ తేజస్సు ఆవరించియున్నది. (దేవుని సింహాసము చుట్టూ ఆవరించియున్నది, గమనించారా). ప్రభువు యొక్క మహిమ స్వరూపము అలాగు ఉంటుంది. [ఇప్పుడు ప్రభువు కాదు, ప్రభువు యొక్క మహిమ]."
ప్రభువు యొక్క మహిమ తన సంఘమును కప్పుచున్నది, ఎందుకనగా ఆయన తన సంఘములో ఉన్నాడు. ఆమేన్! ఓ, అవివేకులకు అది మూర్ఖత్వముగా అనిపించవచ్చును, కాని దాన్ని నమ్మువారికి అది ఎంత ఘనమైనదిగా కనపడుతుంది.
"వర్షకాలమున కనబడు వర్షధనస్సు యొక్క తేజస్సువలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా, నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినపడెను."
ఇప్పుడు, ఆయన దర్శనము యొక్క అర్ధాన్ని వివరించబోవుచున్నాడు, ఈ ఉదయము దానిలోకి వెళ్ళుటకు మనము సమయాన్ని కలిగిలేము.
1JN 1:5,7
73ఇప్పుడు, గమనించుము మనకు ఈ సంగతులు ఇచ్చుటకు ప్రభువు తన ఆధికమైన కరుణలో ఎలా ఉన్నాడు.
ఇప్పుడు, మరొకటి తీసుకుందాము. యోహాను మరియు యెహెజ్కేలు ఇద్దరునూ ఆయన యొక్క వెలుగు మరియు రంగుల యొక్క మర్మములో ఆయనను చూసియున్నారు, మరియు దాన్ని అపరంజి రంగు అని పిలిచారు. తరువాత యోహాను… నీవు దాన్ని ఉంచు, నీ యొక్క… లేఖనములను క్రిందకు దించుము. I యోహాను 1:5 నుండి 7. తరువాత యోహాను (అతడు పత్మాసు ద్వీపములో ఉన్నప్పుడు ఈ పుస్తకమును 8 సంవత్సరములు వ్రాశాడు), అతడు తిరిగి వచ్చినప్పుడు, అతడు తొంభైల్లో ఉన్న ఒక ముసలివాడు, I యోహాను 1:5 నుండి 7, అతడు ఇలా అన్నాడు, "దేవుడే వెలుగు."
యోహానుకు ఒక అనుభవమున్నది, అతడు ఆయనను చూశాడు మరియు ఆయనే వెలుగు అని అతడికి తెలుసు, వెలుగు, నిత్యమైన వెలుగు, కృత్రిమమైన వెలుగు కాదు, దీపము యొక్క వెలుగు కాదు, విద్యుత్ యొక్క వెలుగు కాదు, సూర్యుని యొక్క వెలుగు కాదు, కాని నిత్యమైన వెలుగు. ఓ, నేను ఆయన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను. "దేవుడే వెలుగు."
GEN 9:13-15•
REV 4:3
74గమనించుము, ఇప్పుడు మనము మరలా ప్రారంభించబోవుచున్నాము మరియు మనము ఎక్కడ ఉన్నామో గమనించండి. ఇంకా 3వ వచనములోనే ఉన్నాము, మనమక్కడ లేమా? మనం వెళ్ళి దాన్ని పొందుకొనుటలేదా? నేను ఆశిస్తున్నాను. మంచిది:
"దృష్టికి ఆయన సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరియు అక్కడ ఒక వర్షధనస్సు ఉన్నది. సింహాసనము చుట్టూ, అది చూచుటకు మరకతమును పోలియున్నది (పసుపుతో కూడినటువంటి పచ్చని రంగులో ఉన్నది.)"
ఇప్పుడు, "వర్షధనస్సు." మీరు గమనించండి అది ఒక వర్షధనస్సు. ఇప్పుడు మనము ఆదికాండమునకు వెళ్ళి దాన్ని మనము ఆదికాండము 9:18లో కనుగొందాము. మరియు ఇక్కడ మనము తిరిగి వర్షధనస్సును కనుగొనలము, మొదటగా వర్షధనస్సు కనపడుటను మనము కనుగొనగలము. ఆదికాండము 9వ అధ్యాయము, మరియు మనము 18వ వచనముతో ప్రారంభించుదాం, ఆదికాండము 9:13. మీ అందరికి ఇది ఇష్టమేనా. ఓ, నేను దీన్ని ప్రేమిస్తున్నాను. నేను దీన్ని కేవలము ఇష్టపడుటలేదు, నేను దీన్ని ప్రేమిస్తున్నాను. చూడుము:
"మేఘములో నా ధనస్సు ఉంచితిని, మరియు నిబంధనకు గురుతు. (గమనించుము.). అది నాకును భూమికిని మధ్యన నిబంధనకు గురుతుగా ఉండును. (ఏమిటి? "నాకును మరియు నోవాహుకు మధ్యనా?" లేదు. "అది నాకును మరియు భూమికిని మధ్యన.")
"మరియు భూమి పైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును:
అప్పుడు నేను నా నిబంధనను గుర్తు చేసుకుంటాను, నీకును మరియు నాకును మధ్యను ఉన్న… (ఇప్పుడు, వాటి మధ్యలోకి ఆయన తిరిగి వచ్చియున్నాడు, కాని వర్షధనస్సు నిబంధన…)"
గమనించుము, నిబంధనే నోవాహుకు జీవితం. ఆయన, అతడిని తప్పించెను. కాని దేవుడు తనతో తాను చేసుకున్న నిబంధన వర్షధనస్సు, అది ఆయన… ఇప్పుడు, ఒక్క నిముషములో దేవునితో నోవాహు నిబంధన ఏమిటో నేను మీకు చూపిస్తాను. కాని అది దేవుడు తనతో తాను చేసుకున్న స్వంత నిబంధన. ఆమేన్. ఒక వర్షధనస్సు.
GEN 9:13
75ఇప్పుడు, ఆ నిబంధనే తరువాత గురుతుగా మనము కనుగొనగలము. ఒక గురుతు. దేవుడు దాన్ని ఒక గురుతు అన్నాడా, ఆయన అలా అనలేదా? గమనించుము, "నేను నా ధనస్సును మేఘములో ఉంచుతాను." అది ప్రపంచమును నాశనము చేసిన తరువాత, నీటి చేత నాశనము చేసిన తరువాత. నోవాహు తప్ప, అన్ని శరీరములు నాశనం అయ్యాయి. "మరియు అది భూమికిని నాకును మధ్యన నిబంధనకు గురుతుగా ఉండును." "నాకును మరియు ప్రపంచమునకు," అనుటలేదు. ప్రపంచము ఒక క్రమము (కాస్మోస్), గమనించారా. కాని, "ఇది భూమికిని నాకును మధ్య."
దేవుడు ఇలా అనెను, "నేను భూమిని సృష్టించాను. మరియు దానితో నేను ఎంతో భయంకరముగా ప్రవర్తించాను, దానిని నేను తలక్రిందులుగా చేశాను మరియు దాన్ని ముక్కలుగా చేశాను. మరియు బహుశా అలా చేసియుండకూడదు." ఆయన ఇలా అనెను, "నేను చింతిస్తున్నాను. అది చాలా భయానకమైన కార్యము."
76ఇప్పుడు ఆయన కోపాన్ని కలిగి వస్తున్నట్లయితే నీవేమి అనుకుంటున్నావు? సరిగా ఉండుము, పాపియైన స్నేహితుడా.
ఓ, కనిపెట్టుము మరియు చూచుటకై ఎదురుచూడము,
ఆయన మరలా వస్తున్నాడు. (నీవు దాన్ని నమ్మచున్నావా?)
ఆయన మరలా వస్తున్నాడు. (నేను దాన్ని ప్రేమిస్తాను, నీవు అలాగు చేయుటలేదా?)
ఓ, ఆయన శత్రువులలో నీవు ఒకనిగా ఉండాలని అనుకుంటున్నావా?
నేను అలాగు ఉండాలని అనుకోవటంలేదు, మరి నీవు? లేదు అయ్యా. ఒక శత్రువుగా — లేక ఆయనకు ఒక శత్రువుగా, ఆయనతో మంచిగా ఉండుటయే ఉత్తమమైనది, కాని ఆయనకు వ్యతిరేకముగా…
ఆయనతో మచ్చలేకుండా ఉండుము, కనిపెట్టుము మరియు చూచుటకై ఎదురుచూడము,
అది చూచుటకు గొప్ప దృశ్యము.
ఆయన మరలా వస్తున్నాడు.
GEN 8:20,22•
REV 4:3
77ఇప్పుడు, ఒక నిబంధన, ఒక గురుతు ఏమిటి? ఒక గురుతు ఏమిటి? ఒక బలి అర్పణను అంగీకరించుటయే. ఇప్పుడు, ఆదికాండము 8:20 మరియు 22 తెరువుము. ఆదికాండము 8:20 మరియు 22, మంచిది, అది పేజీ మధ్యలో ఉన్నది.
"అప్పుడు నోవాహు ప్రభువుకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠము మీద దహనబలి అర్పించెను.
అప్పుడు యెహూవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి - ఇక నరులను బట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను."
మరియు ఇప్పుడు, చివరి వచనము చదువుము:
"భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును, కోతకాలమును శీతోష్ణములును … వేసవి శీతాకాలములును,… రాత్రింబగళ్ళను ఉండక మానవని. (ఒక నిబంధన.)"
అదే దాన్ని యోహాను కూడా చూశాడు: యేసు, దేవుడు ఆకాశముల చుట్టూ ఉన్న నిబంధనను అంగీకరించాడు. మరియు ఆయన చుట్టూ వర్షధనస్సు ఉన్నది, సింహసనము చుట్టూ ఉన్నది. దృష్టికి మరకతమువలె ఉన్నది, అపరంజితో కూడిన ఆకు పచ్చని వెలుగు సింహాసనము చుట్టూ ఉన్నది. దేవునికే మహిమ!
78గమనించుము! నోవాహు యొక్క… నోవాహు వర్షధనస్సు మొదటిగా ఏడురంగులను చూపించియున్నది. వర్షధనస్సులో ఏడురంగులు ఉంటాయని అందరికి తెలుసు. ఇప్పుడు, ఆ రంగులు ఏమిటి? ఎరుపు, కాషాయం. లేదు, ఎరుపు, కాషాయం, ఆకుపచ్చ నీలం, నీలిరంగు మరియు ఊదా రంగు. వర్షధనస్సులోని రంగులు అవియే.
ఇప్పుడు, ఇక్కడ మనం లోతైన సంగతిని పొందుకుంటున్నాము, మరియు వాటి కొరకు నేను ఎత్తైనవాటిని తాకవలసియున్నది, ఎందుకనగా చాలా ఆలస్యము అవుతుంది. ఇప్పుడు, జ్ఞాపకముంచుకోండి, కాషాయం … లేక, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, నీలిరంగు మరియు ఊదా రంగు.
ఇప్పుడు, మీరు గమనించినట్లయితే, యేడు. గమనించుము. యేడు వర్షధనస్సులు… యేడు రంగులు, నా ఉద్దేశ్యము, యేడు రంగులున్న వర్షధనస్సు, దాని ఉద్దేశ్యము యేడు ధనస్సులు, యేడు సంఘములు యేడు వెలుగులను ప్రతిబింబిస్తున్నాయి, ప్రతి వెలుగు ఇంకొకదాన్ని చుట్టుకునియున్నది. అది ఎరుపుతో ప్రారంభమైనది, ఎరుపు, ఎరుపు తరువాత కాషాయం వస్తుంది, అది ఎరుపును ప్రతిబింబిస్తుంది. కాషాయము తరువాత.. కాషాయము తరువాత పసుపు వస్తుంది, అది ఎరుపు మరియు కాషాయం కలయిక వలన వస్తుంది, పసుపును తయారు చేస్తుంది. తరువాత పచ్చ. పచ్చ మరియు నీలం కలిస్తే నలుపు వస్తుంది. తరువాత నిండైన నీలం, ఆ తరువాత నిండైన నీలం నుండి ఊదా రంగు వస్తుంది, అది నీలంలో భాగమైయున్నది. ఓ! హల్లెలూయా! మీరు దాన్ని చూచుటలేదా? దేవుడు, తన యేడు రంగుల వర్షధనస్సులో, తానే ఏర్పరిచిన తన నిబంధన, యేడు సంఘకాలముల నుండి ఒక నిబంధన, ఆ యేడు రంగులతో ఆయన భూమిని రక్షిస్తాడు.
REV 4:3
79ఆయన ఏమి చేయును? జ్ఞాపకముంచుకోండి, తన రంగులలో, దాన్ని ఆయన భూమితో చేశాడు. అయితే ఇప్పుడు గమనించండి. ఈ వర్షధనస్సు కేవలం, అడ్డముగా, భూమి మీద సగభాగమును మాత్రమే కప్పుచున్నది (ఒక ధనస్సులో) నోవాహు యొక్క వర్షధనస్సులోని రంగులు, భూమి మీద సగభాగం మాత్రమే కప్పుచున్నాయి. అది వృత్తములో సగభాగము, దాన్నే మీరందరు చూసేది. కాని యోహాను, ఆయనను తనయొక్క పచ్చని రంగులో చూసినప్పుడు, దేవుని యొక్క సింహాసనమును ఆయన చుట్టుకునియున్నాడు. మిగిలిన సగభాగం ఎన్నడు చెప్పబడలేదు. భూమి కేవలము ఒక సగ వృత్తమును మాత్రమే. అది కేవలం సగము మాత్రమే. అవే సంఘకాలములు.
కాని ఆయనను యోహాను అపరంజి రంగులో చూసినప్పుడు, అపరంజి రంగు, ఆయన చుట్టూ యున్నది మరియు మధ్యలో ఖాళీగా ఉండే ఒక వృత్తము (హాలో) వలె కప్పబడియున్నది. మధ్యలో ఖాళీగా ఉండే ఒక వృత్తము (హాలో). మధ్యలో ఖాళీగా ఉండే ఒక వృత్తము (హాలో) అపరంజి రంగులో ఆయన చుట్టూ ఉన్నది! గమనించారా? ఒక రంగు, మనకున్నది ఒక్కడే దేవుడు, అన్నింటి ద్వారా, మరియు అన్నింటిలో. కాని అక్కడ యేడు సంఘకాలములు ఉన్నాయి.
80ఒక పెద్ద వజ్రమును గమనించండి. గతంలో వాటిని కనుగొనేవాడిని… ఆఫ్రికా దేశములో వాటిని వీధులలో పడియుండుటను మీరు కనుగొనగలరు. మీరు దానిలో ఒక్కదాన్ని కూడా దాచుకునే ధైర్యమును చేయలేరు, ఎందుకనగా అవి ఇంకనూ కత్తిరించబడలేదు. కత్తిరించబడని ఒక్కదాన్ని మీరు తీసుకున్నట్లయితే, దాని కొరకు మీకు అప్పుడే శిక్షను విధిస్తారు, మరియు దాన్ని దాచుకున్నందుకు మీకు ఒక జీవితకాలపు శిక్షను విధించే తీర్పును ఇస్తారు. మీరు దాన్ని కనుగొన్న వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దాన్ని తిరిగి ఇచ్చేయాలి.
ఇప్పుడు, వారు ఈ వజ్రమును తీసుకొని… ఓ, అది చాలా కష్టతరమైనది. ఒక పెద్ద నలభై టన్నుల కత్తిరించుదాన్ని ఈ విధముగా నిలబడియుండుట నేను చూశాను, వారు నీలి రంగు రాయిని అక్కడ పోశారు, దాన్ని చుట్టూ కత్తిరించారు. అది ఆ రాయిని బూడిద మాదిరిగా చేసింది, కాని ఆ వజ్రమును ఏమియు చేయలేక పోయింది. ఆ 40 టన్నుల బరువుగలది పైన ఊగుతున్నది, అటువంటి గేర్లు మీద అది దొర్లుకుంటూ అలా వస్తున్నది, ఆ రాయిని అది ముక్కలుగా చేస్తున్నది, కాని వజ్రం దానిలో నుండి వెళుతున్నది, 40 టన్నుల బరువున్న దాన్ని అది కదుపుతున్నది. ఓ! అది కత్తిరించినప్పుడు మరియు జల్లించుట ద్వారా క్రిందకు వస్తుంది, జల్లెడ ద్వారా మిగతా జల్లెళ్ళకు చేరుకుంటుంది, దిగువన కడుగబడుతుంది, మరియు చివరకు చాలా దూరం ఆ బాటలో వెళుతుంది.
81ఆ గొప్ప కింబర్లీ డైమండ్ మైన్స్ యొక్క నిర్వాహకుడు నా యొద్ద దిగువన వరుసలో ఉన్న ద్వార పాలకుడు — నిజమైన వినయము కలిగినవాడు, మధురమైన సహోదరుడు.
ఆ తరువాత మూడు అడుగుల పైన నీళ్లున్నా యి, ఎక్కడైతే అది ప్రవహిస్తున్నదో, అక్కడ లేపనమును (కాస్మోలిన్) ఉంచుతారు. (అది మీకు తెలుసా… దాన్ని మీరు ఏమని పిలుస్తారు? మీడా, కాబినెట్లోని జాడీలో ఉన్నదాన్ని మనము ఏమంటాము?) శీతాకాలములో పెదవులు పగులకుండా వ్రాసుకునే ఒక లేపనం (వాజ్లిన్) మరియు మేము వాజ్లిన్ను అక్కడ ఉంచుతాము, ఒక అంగుళం లోతులో, పైనున్ను ఆ జారెడి భాగము మీద దాన్ని ఉంచుతాము.
అది క్రిందకు వస్తుంది, మరియు గమనించండి, ఆ రాయి మీదకు వస్తున్న ప్రతిసారి, అది ఆ వాజ్లిన్ మీద దొర్లుకుంటూ వస్తుంది, కాని, వజ్రం దాని పైనుండి వస్తున్నప్పుడు, అది దానికి అతుక్కుని ఉంటుంది. ఒక వజ్రంలో ఎప్పుడు తడి ఆరిపోయి ఉంటుంది మరియు అది దానికి అతుక్కుంటుంది.
వారు దాన్ని పైకి తీయుటను నేను చూశాను, వాటిలో చాలా చిన్నవాటిని కూడా తీయుట చూశాను, మరియు వాటిని కళ్ళద్దాల సహాయంతో వేరు చేస్తారు. మరియు నేను వారిని వారు దాన్ని ఎందుకొరకు అలా చేశారు అని అడిగాను? వారు వాటిని అమెరికాకు విక్టరోలా సూదులు మరియు మొదలైనవాటి కొరకు అమ్ముతారని వారు చెప్పారు. అవి పాడైపోవు, గమనించారా.
82కాని, ఆ పెద్ద వజ్రములు, ఇప్పుడు, అక్కడ వారు, కేవలం ఒక పెద్ద బంతి. కాని, ఎప్పుడైతే… వారు వాటిని తీసుకున్నారో మరియు విద్యుత్ యంత్రములను తీసుకొని మరియు వాటిని కత్తిరిస్తారు, మరియు కత్తిరించిన వజ్రమును తయారు చేస్తారు. తరువాత వారు దాన్ని కత్తిరించినప్పుడు, అది అగ్నివంటి రంగులను దాని యొక్క కారెట్ ని బట్టి ప్రతిబింబిస్తుంది, మరియు అది కూడా యేడు రంగులను ప్రతిబింబిస్తుంది.
ఓ, అది యేసు ఎలా… ఓ, మీరు చాలా ధనము కలిగియుండాలి, బహుశా మీరు కాడిలాక్స్ (విలాసవంతమైన కారు)ను కలిగియుండాలి. బహుశా నీవు ఒక పెద్ద చనిపోయిన సంఘానికి కాపరివై యుండాలి, లేక ఒక క్యాథడ్రల్, లేక అటువంటి దానికి కాపరిగా ఉండాలి. నీవు ఒక బిషప్ గానో లేక ఆర్చ్-బిషప్పుగానో ఉండాలి. కాని, ఓ, సహోదరుడా, నీవు ఆ ఆభరణమును కనుగొన్నప్పుడు, ఆ వజ్రం, దాన్ని పొందుకొనుటకు ఒక మనుష్యుడు తనకున్నసంపదనంతా అమ్మివేస్తాడు, దాని కొరకు ఇచ్చివేస్తాడు, సమస్తమును ఇచ్చివేస్తాడు.
MATT 25:9
83నిద్రిస్తున్న కనక్యను చూడండి. ఓ, ఆమె ఏం చేస్తున్నది? ఆమె తన కొరకు నూనె కొనుటకు దేనిని అమ్మవలసియున్నది. అమ్ముటకు ఆమె దగ్గర ఏమున్నది? ఆమె యొక్క పాత ఆచారములు మరియు మతశాఖలు మరియు అటువంటివి. ఆమె క్రీస్తును వెదుకుటకు ఆమెకు ఉన్నవి అన్ని అమ్మవలసియున్నది — క్రీస్తు, ఘనమైన ఆభరణము. యేసు, ఆ శరీరము [టేపు మీద ఖాళీయున్నది]…
…?… ఒకానొక ఈ చీకటి ఉదయములలో పరలోకమునకు వెళ్లు రైలు వచ్చినప్పుడు నేను వెళ్ళుటకు టికెట్టును కలిగియున్నాను. ఓ, ఎటువంటి ఆశీర్వాదము!
ఓ, ఆ ప్రవాహము ఎంతో ప్రియమైనది
అది నన్ను హిమమంత తెల్లగా చేస్తుంది,
ఇంకొక ఊట ఏది నాకు తెలియదు,
యేసు రక్తము కాక మరేది లేదు.
ప్రఖ్యాతి అక్కరలేదు, పెద్ద కార్యములు అక్కరలేదు, ఏది అవసరము లేదు, ఐశ్వర్యముతో అవసరం లేదు, దేనితో అవసరం లేదు. నాకు కేవలం ఆ ప్రియమైన ఊటనిమ్ము, అది చాలు.
నేను ఈ చేతులతో తీసుకొచ్చినది ఏదీ లేదు,
కేవలం నీ సిలువకు వేలాడుచున్నాను.
ISA 53:5•
JOHN 12:32•
1PET 2:24•
REV 5:6
84ఆ ఘనమైన ఆభరణము. ఏమిటది? అది పరిపూర్ణమైనది. దేవుడు దాన్ని పెద్ద బంపింగ్ యంత్రములలో వేసినప్పుడు దాని వయసు ముప్పై-మూడున్నర సంవత్సరములు, ఆయన దాన్ని బయటకు తీసినప్పుడు మరియు దానికి రూపం ఇచ్చుట ప్రారంభమైనది. ఆయన దాన్ని కత్తిరించాడు, ఆయన దాన్ని నలుగగొట్టాడు, ఆయన దాన్ని గాయపరిచాడు.
మన అతిక్రమముల చేత ఆయన గాయలపాలైయ్యాడు. మన పాపము కొరకు చిదుగగొట్టబడ్డాడు, మన సమాధనము కొరకు ఆయన నిందించబడ్డాడు, శిక్షించబడ్డాడు, మరియు ఆయన గాయపు గురుతుల చేత మనము స్వస్ధపడ్డాము.
ఆ పరిపూర్ణమైన మానవునికి దేవుడు ఏం చేశాడు? ప్రపంచములో ఒకే ఒక్కడు అటువంటివాడు ఉన్నాడు, ఒకే ఒక్కడు ప్రపంచములో ఉన్నాడు, మరియు అది ఆయనే. మరియు ఆయనను దేవుడు ఇక్కడే చెక్కియున్నాడు, "మరియు మన అతిక్రమముల నిమిత్తమై గాయలపాలైనాడు." ఎందుకనగా నేను ఒక పాపిని, తన యేడు సంఘకాలముల గుండా ఆ వర్షధనస్సు యొక్క వెలుగు నాపైన పడుటకు ఆయన ఆ వెలుగుకు అనుమతిని ఇచ్చాడు, నా అతిక్రమముల చేత ఆయన గాయాలపాలైనాడని నేను తెలుసుకొనుటకు ఆయన అలాగు చేసెను.
అదుగో నీ యొక్క యేడు రంగుల వర్షధనస్సు. "మన పాపము కొరకు ఆయన నలుగగొట్టబడ్డాడు, మన సమాధనము కొరకు ఆయన నిందించబడ్డాడు, శిక్షించబడ్డాడు, ఆయన గాయపు గురుతుల చేత మనము స్వస్థతను పొందుకున్నాము." ఆయన్ని దేవుడు కత్తిరించాడు, మరియు గాయపరచబడెను, మరియు నలుగగొట్టబడెను, మరియు కత్తిరించాడు, తన గాయముల చేత ఆయన ప్రతిబింబిస్తున్నాడు, పాపమును క్షమించుట, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము, మృదుత్వము.
దేవుని యొక్క యేడు ఆత్మలనేవి తిరిగి తన ప్రజలలో ప్రతిబింబించే ఆత్మ యొక్క యేడు ఫలములు. ఆయన చిదుగగొట్టబడ్డాడు, చెక్కబడ్డాడు, మరియు కత్తిరించబడ్డాడు, దేవుని యొక్క వెలుగు ఆ ఒక్కడి శరీరము ద్వారా ప్రపంచమంతటిని విమోచిస్తుంది, "నేను భూమి మీద నుండి పైకెత్తబడితే, నేను ప్రతి మనుష్యుడను నాలోనికి తీసుకుంటాను." ప్రతిబింబిస్తున్న ఆ వర్షధనస్సు రంగులను గమనించండి.
GEN 2:2,3•
REV 1:11•
REV 4:3,5
85కాని, ఇక్కడ యోహాను ఆయనను చూసినప్పుడు, అది ఏమిటి? విమోచనా దినము గతించిపోయినది. అదంతా గతించిపోయినది, కావున ఆయన తన అసలైన స్థితిలో కనిపించాడు, ఒక అపరంజి రంగులో కనిపించాడు. కేవలం సగం ప్రపంచము కాదు, అది కేవలం… సూర్యుడు ఒకే సమయములో ప్రపంచములో సగభాగమునకు మాత్రమే వెలుగును ఇవ్వగలడు, గమనించారా, అది అలాగు వెళుతుంది. కాని యోహాను ఆయనను చూసినప్పుడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలి, ఆయన అక్కడ ఆసీనుడైయున్నాడు, అపరంజి రంగులు, రెండు రంగులను కలిపినట్లయితే, నీవు అపరంజి రంగును పొందగలవు. "మరియు అపరంజి రంగు సింహాసనము చుట్టూ ఉన్నది." ఓ, మై! ఓ, నేను మీకు చెప్పుచున్నాను, అది కేవలం… మనము ముందుకు ముందుకు వెళుతున్నాము.
యేడు ఆత్మలు, యేడు రంగులు, యేడు సంఘకాలములు, యేడుగురు సేవకులు, యేడు దీపములు, ప్రతియొక్కటి యేడులో ఉన్నది. దేవుడు యేడులో పరిపూర్ణుడు. దేవుడు ఆరు దినములు పని చేసెను, యేడవ దినమున ఆయన విశ్రాంతిని తీసుకున్నాడు. ప్రపంచము ఆరువేల సంవత్సరములు తయారుచేయబడింది, మరియు ఆ యేడవ వెయ్యే, వెయ్యేండ్లపాలన.
GEN 22:16•
HEB 6:13
86గమనించుము, ఒక సగము వృత్తములో, సగము కూడా ఇంకా తెలియబడలేదు. ఇప్పుడు, ఖచ్చితముగా ఈ కార్యములు దేనిని సూచిస్తున్నాయి.
ఇప్పుడు, నిర్గమకాండము 23:13లో మరియు హెబీయులకు 6:12లో, దేవుడు తనతోనే తాను నిబంధన చేసుకుంటున్నాడు మరియు తన మీద తానే ప్రమాణము చేసుకుంటున్నాడు. హెబ్రీయులకు 13 మనకు ఇలా చెప్పుచున్నది, లేక 9:13, తనకు తానే ప్రమాణము చేసుకుంటున్నాడు. అబ్రాహాము మరియు ఇస్సాకుతో మాటలాడుచున్నప్పుడు తనకన్నా గొప్పవాడు ఎవరూ లేనందున, అక్కడే ఆయన అబ్రాహాముతో ఒక నిబంధన చేసుకున్నాడు, అది ఒక నిత్యమైన నిబంధన.
ఒక నిబంధన ఎల్లప్పుడు ఒక ప్రమాణముచేత చేయబడుతుంది, కావున అక్కడ ఎవరూ లేరు… నీకన్నా గొప్పవారి మీద నీవు ప్రమాణము చేస్తావు, నీ తల్లి మీద నీవు ప్రమాణము చేస్తావు, నీ దేశము మీద నీవు ప్రమాణము చేస్తావు, నీవు దేనిమీదనో ప్రమాణము చేస్తావు, దేవుని మీద ప్రమాణము చేస్తావు. కాని, నీ కన్నా గొప్పవారు లేనప్పుడు - నీవు ప్రమాణము చేయలేవు.
మరియు అక్కడ దేవునికన్నా గొప్పవారు ఎవరూ లేరు, కావున ఆయన తన మీద తానే ప్రమాణము చేసుకున్నాడు, తన మీద తానే (ఆమేన్!), తన మీద తానే ప్రమాణము చేసుకుని ఆ నిబంధనను రూఢి పరచాడు. ఆమేన్. అబ్రాహాము యొక్క సంతతిని జాగ్రత్త చేస్తానని ప్రమాణము చేశాడు. అన్యజనులకు అబ్రాహాము యొక్క సంతానము ఏమవుతుంది? పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము, అది అబ్రాహాము యొక్క సంతానము. తన మీద తానే ప్రమాణము చేసుకున్నాడు, "నేను వారిలో ప్రతియొక్కరిని పైకి లేపుదును. నేను వారికి నిత్యజీవము ఇత్తును మరియు వారిని తిరిగి భూమి మీదకు పంపిస్తాను." ఆలోచించుటకు మనము ఏమి కలియున్నాము.
GEN 9:13,15•
GEN 22:16,17•
HEB 6:13•
REV 4:3
87కావున మనము ఆయనను ఆకుపచ్చ, అపరంజి రంగులు కలిగిన వృత్తములో చూస్తాము. ఈ ఆకుపచ్చనిది, ఆకుపచ్చ దేన్ని ప్రతిబింబిస్తుంది? జీవం, ఆకుపచ్చ ఎల్లప్పుడు పచ్చనిదే, అది ఎల్లప్పుడు ఆకుపచ్చగానే ఉంటుంది, అదే జీవం. దాని అర్థమేమిటి? దేవుడు వాగ్దానము చేసియున్నాడు, వెనుక ఆదికాండములో వాగ్దానము చేసియున్నాడు, అది ఏమిటంటే ఆయన వర్షధనస్సును ఆకాశములో ఉంచాడు, ఆయన నీటితో మరెన్నడూ ప్రపంచమును నాశనము చేయను అని.
మరియు ఆయన తన మీద తానే ప్రమాణము చేసియున్నాడు, అది ఏమిటంటే, అబ్రాహాము యొక్క సంతానమంతటిని పైకి లేపుతానన్నాడు, మరియు ఈ ప్రపంచమంతా కుదుపు కలిగిన తీర్పును కలిగియుంటుంది. ఆ తీర్పులను మనము రాబోవు పాఠములలో పొందుకుంటాము. ఈ ప్రపంచము ఎక్కడ ఎగిరిపడుతుందో లేక కాలిపోతుందో మరియు అగ్నిపర్వతముగా మారుతుందో మీకు చూపిస్తాను, మరియు ముక్కలుగా పేలిపోతుంది, మరియు ప్రతియొక్కటి తలక్రిందులుగా అవుతుంది. కాని, ఆయన దీన్ని నాశనము చేయను అని ఆయన తన మీద తానే ప్రమాణము చేసుకున్నాడు, కాని మరలా దాన్ని మెత్తనిదిగా చేశాడు మరియు వెయ్యేండ్ల పాలన కోసము ఆయన తన పిల్లలను భూమి మీద ఉంచాడు. ఓ, మై!
రాబోవు ఆ వెయ్యేండ్ల దినము కొరకు
నేను సంతోషముగా ఎదురుచూస్తున్నాను,
ఆశీర్వదింపబడిన ప్రభువు వచ్చినప్పుడు,
మరియు తన కొరకు ఎదురుచూసే వధువును తీసుకెళతాడు;
ఓ, నా హృదయం ఆశిస్తున్నది,
మధురమైన విడుదల దినముకై ఏడ్చుచున్నది,
మన రక్షకుడు భూమిమీదకు మరలా వచ్చినప్పుడు.
ఓ, మనము ఆ దినము కొరకు ఎంతో ఆశతో ఉన్నాము. గొప్ప వెయ్యేండ్ల పాలన వస్తుందని ఆయన మనకు వాగ్దానము చేశాడు. మరియు మరొక సంగతున్నది, ఆయన చుట్టబడుటకు కారణమేమంటే, ఆయన నిబంధనను నెరవేర్చే దేవుడు. ఆయన తన నిబంధనను నెరవేర్చుతాడు!
REV 4:4
88ఇప్పుడు, ఏదో విధముగా మనము తరువాత వచనముకు వెళదాం. మై, మనము మరొక్క దాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాం, మరియు మనకు కేవలం 10 లేక 15 నిముషముల మాత్రమే దాన్ని చేయుటకు ఉన్నవి. మీరు చాలా అలసిపోయారా? ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారా? మంచిది, 4వ వచనమును తీసుకుందాము:
"సింహాసనము చుట్టూ ఇరువదినాలుగు సింహాసనములుండెను, మరియు ఇరువదినాలుగు నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని, తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి."
మనము ఈ వచనము అంతటి నుండి వెళ్ళకపోవచ్చును, కాని 4వ వచనమును ప్రారంభించుదాం. ఇప్పుడు చూడండి, ఆయనను యోహాను చూచినప్పుడు, ఆ మరకతము రంగు ఆయన చుట్టూ ఉన్నది, మనము అన్ని రంగులను చూశాము, వర్షధనస్సులు, మొదలైనవి చూశాము, మరియు అవన్ని దేని గురించియైయున్నాయి. ఇప్పుడు, 4వ వచనములో, ఇక్కడ అతడు మొదటగా మాట్లాడుచున్నది ఏమనగా, 4వ వచనములో:
"మరియు సింహాసనము చుట్టూ…"
గమనించుము! ఇక్కడ ఎంతో అందమైన దృశ్యమైయున్నది. దాన్ని తప్పిపోవద్దు, "సింహాసనము."
EXOD 3:5•
EXOD 19:12,13,16,18•
REV 4:5
89మీకు తెలుసా, మోషే దగ్గరకు తిరిగి వెళదాం, మోషే (మనకు ఇప్పుడు తవ్వుటకు అంతగా సమయము లేదు, కావున కేవలం నేను చెప్పేది మీరు తీసుకోండి.) మోషే, సీనాయి పర్వతము మీద అతడికి దర్శనము ఇవ్వబడినప్పుడు…
ఇది కృపా సింహాసనము ఇక ఎన్నడు కాదనేది మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. అక్కడ రక్తము కార్చబడింది, మరియు బలి అర్పణ తిరిగి వచ్చింది, మరియు వారు దాన్ని అంగీకరించారు, మరియు కరుణాపీఠం నుండి రక్తం తీసివేయబడినది. మరియు ఇప్పుడది తీర్పు సింహాసనము, ఎందుకనగా దాని నుండి ఉరుములు మరియు మెరుపులు రావలసియుండెను. అది నిజమేనా?
జ్ఞాపకముంచుకోండి, అది సీనాయి పర్వతమువలె ఉన్నది. మోషే సీనాయి పర్వతము మీదకు వెళ్ళినప్పుడు, ఏం జరిగింది? ఉరుములు, మెరుపులు. మరియు ఒక ఆవు కాని, లేక ఒక దూడ కాని, లేక గొర్రె కాని, లేక మరేదైనా ఆ పర్వతమును తాకినట్లయితే, అది మరణిస్తుంది. పరిశుద్ధ గ్రంథము చెప్పింది, "భూమి ఎంతగానో కంపించింది చివరకు మోషే కూడా దానికి భయపడ్డాడు." మరియు మోషే… చెప్పెను, "ఇక్కడ నుండి నీ చెప్పులను తీసివేయుము, నీవు పరిశుద్ధ స్థలములో ఉన్నావు." యెహోషువా ఒక యోధుడు, (తరువాత ఆ సంతతిని తీసుకున్నాడు మరియు వారియొక్క వారసత్వపు హక్కును విభజించాడు), అది పర్వతములో సగం దూరం మాత్రమే వచ్చింది.
ఇక్కడ దేవుని యొక్క రంగులతో పైన మోషే నిలబడియున్నాడు, వెలుగుల నుండి కాంతులు వస్తున్నాయి మరియు మరకతములు అతని చుట్టూ ఉన్నాయి, ఆజ్ఞలు వ్రాస్తున్నప్పుడు వాటిని గమనిస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో నిలుచున్నాడు, ఆ స్వరము మాటలాడుచున్నది, "మోషే, ఎక్కడ ఉన్నావు? నీ చెప్పులను విడువుము, నీవు పరిశుద్ధ స్థలములో ఉన్నావు." ఇప్పుడు, అది ఒక తీర్పు సింహాసనము, విమోచించబడినవారు తప్ప మరేది అక్కడ నిలబడలేదు. పాపి దాన్ని ఏ విధముగానూ చేరుకోలేడు. ముగించబడింది. తీర్పు సింహాసనము. మంచిది.
HEB 8:5•
HEB 9:23
90ఇప్పుడు, భూమిమీద మోషే కార్యములు చేశాడు, ఆకాశములో అతడు చూసిన విధముగా గుడారపు మాదిరిని తయారు చేశాడు. అది మనకు తెలుసు, మనకు తెలియదా? మనకు తెలుసు పౌలు కూడా అదే పనిని చేసియున్నాడు. హెబ్రీయులకు 9:23, అతడు చేసిన విధముగానే మోషే చేశాడు. మరియు పౌలు తన దర్శనములో పైకి ఆకాశములోకి వెళ్ళినప్పుడు, ఘనమైన పుస్తకమైన హెబ్రీయులకు గురించి ఆలోచించియుంటాడు, మోషే చూసినదాన్ని తప్పక అతడు కూడా దర్శనములో చూసియుండాలి, ఎందుకనగా అతడు దాన్ని చెప్పియున్నాడు, అతడు అద్భుతమైన హెబ్రీయులకు వ్రాసిన పుస్తకము గురించి ఆలోచించియుండాలి. క్రైస్తత్వము అనేది పాత నిబంధనకు వ్యతిరేకముగా ఎలా ఉన్నదో హెబ్రీయులకు గ్రంథములో ఉన్నది. పౌలు, అతడు గొప్ప ఉపదేశకుడు.
ఇప్పుడు, అది ఆయన సింహాసనము. తరువాత దానిలో…
91మనం కేవలం… నేను దీనిని దాటి ముందుకు వెళ్ళబోవుచున్నాను, కాని నేను అది చేయలేను. నలుపు ఎక్కడ ఉన్నది…? నీవు నలుపును తీసుకున్నావా? డాక్, అది వెనుక ఉన్నదా? మంచిది, నేను ఇక్కడ నుండి మీకు చూపిస్తాను. ఇప్పుడు, చూడుము, మీ పెన్సిల్ మరియు పేపరు తీసుకోండి, ఇక్కడ నేను మీకు కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను.
నేను ఈ ఉదయం కూర్చున్నప్పుడు ఏదో నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు, నేను ఏం చేశానో మీకు చెబుతాను, మీరు గమనించినట్లయితే, ఈ వెనుక నేను దాన్ని చిత్రించియున్నాను. గమనించారా? ఆత్మ నాకు ఇచ్చిన విధముగా నేను దీన్ని చిత్రించియున్నాను, గమనించారా, అది ఏమైయున్నదో దానినే చిత్రించియున్నాను. కాని నేను ఇక్కడ కొద్దిగా చెప్పాలని అనుకుంటున్నాను.
ఇప్పుడు, దేవుడు, సింహాసినుడైయున్నాడు, తరువాత ఆయన తీర్పరిగా మారతాడు. అది నిజమేనా? తీర్పును తీర్పరి ఎప్పుడు చెప్పుతాడు? ఆయన తీర్పు సింహాసనముకు వచ్చినప్పుడు చెపుతాడు, ఒక సింహాసనము. ఇప్పుడు, పాత నిబంధన ఏ విధముగా తయారు చేయబడిందో నేను మీకు చెపుతాను, ఆవరణములు ఏ విధముగా ఆ సింహాసనమును చేరుకొనుటకు తయారుచేయబడ్డాయో, మరియు యోహాను ఎలా చూశాడు. ఈ ఉదయము మనం దానిలోకి వెళ్ళుటలేదు, కాని ఆ విధముగా ఆవరణములు ఆయనను చేరుకొనుట యోహాను చూశాడు, మరియు తన ఆవరణమును చేరుకొనుటకు ఏం చేయాలి. ఇప్పుడు, ఓ, నేను దీన్ని ప్రేమిస్తున్నాను.
EXOD 27:21•
NUM 19:2,13,20•
NUM 31:23
92ఇప్పుడు, పాత నిబంధనలో, ప్రజలు ఎక్కడైతే కూడుకుంటారో దాన్ని "సమాజము" అని పిలుస్తారు. మొదటగా, వారు సమాజములోకి వచ్చుటకు ముందు, వారు లోపలి వచ్చుటకు, వారు రక్తము క్రిందకు రావలయును, బయట ఆవరణములు. మొదటగా వేర్పరచు జలము యొద్దకు రావాలి, అక్కడ ఒక ఎర్రని పెయ్యని చంపి మరియు పాపపరిహార జలమును చేస్తారు. ఆ విధముగా పాపి వస్తాడు మరియు వాక్యమును వింటాడు.
ఆ గొప్ప యూదుల రబ్బీ ఆ విధముగా ప్రభువు వద్దకు వస్తాడు, టుల్సాలో నేను దాన్నిగురించి ప్రసంగించుట వినే ఉంటారు. అది టుల్సా వద్దే. ఒక్లహామాలోని, టుల్సాలో మేము ఉన్నాము. మరియు అతడు అక్కడకి వచ్చాడు, అతడు కేవలం ప్రక్కన నిలబడేవాడు, మరియు అతడు ఆరాధన తరువాత వెళ్ళిపోయాడు, అతడన్నాడు, "నాకు తెలుసు…" ప్రపంచములో ప్రఖ్యాత యేడుగురు రబ్బీలలో నేను ఒకడని అన్నాడు. మరియు అతడు అక్కడి నుండే వచ్చాడు, అతడు, "నేను ఆ క్రైస్తవులలో వ్యాపారము చేయువారు ఎవరో చూడాలని కోరుకుంటున్నాను. వారిని వారు పెంతెకోస్తులను పిలుచుకుంటారు. నేను వారి వద్దకు వెళ్ళి మరియు అక్కడ కూర్చుని మరియు వినాలని కోరుకుంటున్నాను," అన్నాడు.
NUM 19:2
93మరియు ప్రభువు, ఆ ఎర్రని పెయ్య యొక్క బలియర్పణ గురించి నన్ను మాటలాడమన్నప్పుడు, ఆరాధన తరువాత అతడు కొంతమంది సహోదరులను వెనుక కలుసుకున్నాడు, ఇలా అనెను, "నేను ఆ మనుష్యుడను కలుసుకోవాలని కోరుకుంటున్నాను. అతడికి సరియైన చదువు కూడా లేదని నాకు తెలుసు." అయితే, ఇలా అన్నాడు, " అన్ని రకములైన వ్యత్యాసమైన పద్ధతులు తెలిసిన ఒక యూదుల రబ్బీని నేను." ఇలా అన్నాడు, "అటువంటిది ఎన్నడు నా జీవితములో నేను చూడలేదు." "నేను ఎన్నడు దీన్ని చూడలేదు."
మరియు అతడొక పెంతకోస్తు రబ్బీ, పరిశుద్ధాత్మతో నిండియున్నాడు. ప్రతిచోటుకు వెళుతున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు. "పెంతెకోస్తు రబ్బీ," తనను తాను అలా పిలుచుకుంటాడు. అతడు వాషింగ్టన్ లోని, యూరీ హోటల్ కు వెళ్లాడు, వేరొక దినమున దిగువన మేము ఇద్దరము బ్రదర్ జాక్స్ దగ్గర కలిశాము, మరియు ఆ స్త్రీకి ఇతడు తెలుసు, ఆమె ఇలా అన్నది, "రబ్బీ, మేము మీ కొరకు ఒక మంచి గదిని సిద్ధం చేశాము," కాని అన్నది, "కాని అక్కడ టెలివిజన్ లేదు.
అతడన్నాడు, "దానిలోని కార్యములు నరకపు దర్శనములు." (హెల్-విజన్స్), బయటకు విసిరివేయండి! అక్కడ అది ఏ విధంగానైనా ఉండుటను నేను కోరుకోవటం లేదు, ఒకవేళ అది అక్కడ ఉన్నట్లయితే, నేను నిన్ను బయటకు త్రోసివేస్తాను."
ఆమె, "రబ్బీ!" అన్నది.
అతడన్నాడు, "నేను ఒక పెంతెకోస్తు రబ్బీని." హల్లెలూయా!
అన్నాడు, "ఇప్పుడు, బ్రదర్ బ్రెన్హాం, నీవు ఇశ్రాయేలు వెళ్ళునప్పుడు నేను కూడా నీతో వస్తాను. మనము దీన్ని మా ప్రజలకు తీసుకొని వెళదాం."
నేను అన్నాను, "ఇప్పుడు కాదు, రబ్బీ, ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదు, ఆ ఘడియ ఇంకా రాలేదు, కొద్ది కాలము ఆగుము."
EXOD 25:20•
EXOD 26:31•
EXOD 27:9
94ఇప్పుడు, ఈ పవిత్ర స్థలములను గమనించుము. ఇప్పుడు, మీరు ఆవరణములోకి వచ్చినప్పుడు, మొదటిది ఆవరణము, బయట ఉన్న ఆవరణము, బలులను అర్పించు బలిపీఠం తరువాత ఉంటుంది, ఇత్తడి బలిపీఠం. తరువాత ఇత్తడి బలిపీఠమునకు బయట ఉంటుంది, అతిపరిశుద్ధ స్థలమునకు వెళ్ళడానికి మధ్యన ఒక తెర వ్రేలాడదీయబడి యుంటుంది, అక్కడనే కరుణాపీఠమున్నది, అక్కడనే కెరూబులున్నాయి. మన తదుపరి పాఠముగా దానినే తీసుకోవాలని కోరుకుంటున్నాను, ఆ కెరూబులు కరుణాపీఠమును కప్పుచున్నాయి. ఓ, మై! మనము ఒక నెలంతా దాని మీదనే ఆగగలము, గమనించారా, ఆ కెరూబుల మీద.
EXOD 30:10•
EXOD 39:22-26•
PS 133:2
95ఇప్పుడు, ఇప్పుడు, వారు లోపలికి వెళ్ళినప్పుడు గమనించండి, సంఘము అక్కడకు వస్తుంది, యాజకులు ఇక్కడ నిలబడతారు; కాని అక్కడకు కేవలం ప్రధానయాజకుడు మాత్రమే సంవత్సరమునకు ఒక్కసారి వెళతాడు, తనతో పాటుగా రక్తమును తీసుకొని వెళ్ళును.
మరియు అతడు ఒక నిర్దిష్టమైన విధముగా వస్త్రధారణ చేసుకుంటాడు, ఒక నిర్దిష్టమైన అంగీ, దానికి ఒక గంట ఉంటుంది మరియు ఒక దానిమ్మకాయ, ఒక దాని నుండి మరో దానికి, మరియు అతడు నడుస్తున్నప్పుడు, అతడు ఒక నిర్దిష్టమైన విధానముతో నడుస్తాడు. అతడు నడుస్తున్నప్పుడు, ఇలా పాడతాడు, "పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, యెహూవా నీవే. పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, యెహూవా నీవే. ఆ గంటలు మరియు దానిమ్మకాయలు కలసి మ్రోగుతాయి, "పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా! ఎందుకు? అతడు దేవుడిని సమీపిస్తున్నాడు, నిబంధన యొక్క రక్తమును తనచేత పట్టుకొని, రక్తమును మోసుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. అభిషేకించబడిన (ఓ, మై!) నిర్దిష్టమైన పరిమళ తైలముతో.
అతడి వస్త్రములు పరిశుద్ధాత్మతో నింపబడిన చేతులతో నిర్మించబడినవి, గుర్తించబడిన చేతులే ఆ వస్త్రములను తయారుచేస్తాయి. షారోను పుష్పము, అభిషేకించబడిన తైలం, అతడి తల మీద పోయబడుతుంది, అది అతడి తల నుండి క్రిందకు గడ్డం మీదుగా క్రిందకు వస్తుంది, అది రాజతైలమైయున్నది, ఒక దానిమ్మకాయ మరియు ఒక గంట, ఒక పాపరహితమైన గొర్రెపిల్ల రక్తమును తీసుకుని, మరియు అతడు బయట ఉన్న ఆ తెరను సమీపించుటకు కూడా ధైర్యము చేయలేడు. అతడు ఎక్కడైతే నిలబడి ఉన్నాడో, అక్కడే మరణిస్తాడు. కావున అతడు వెళ్ళవలసియున్నది, ఒక నిర్దిష్టమైన విధానములో నడుస్తున్నాడు, "పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, యెహోవా నీవే. పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు (దేవుని సమీపిస్తు), యెహోవా నీవే పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు!"
EXOD 26:33•
EXOD 30:10•
MATT 27:51•
HEB 9:3,8
96మరియు అతడు అక్కడకు వెళ్లి మరియు సంవత్సరమునకు ఒక్కసారి ఆ కరుణాపీఠము దగ్గర రక్తమును అర్పించి వస్తాడు. మరియు అతడు అక్కడ ఉన్నప్పుడు, షెకీనా యొక్క మహిమను చూచుటకు అవకాశమును కలిగియుంటాడు, అగ్నిస్తంభముగా ఉన్నప్పుడు, అపరంజి యొక్క వెలుగు క్రిందకు వస్తుంది, అది ఇశ్రాయేలు ప్రజలకు నాయకత్వము వహించింది. ఆయన ఆ దేవాలయమును దట్టమైన పొగతో నింపినప్పుడు ఎవరూ దాన్ని చూడలేకపోయారు. పొగతో నింపబడిన తరువాత ప్రభువు యొక్క మహిమ క్రిందకు వచ్చింది. ఆయన తనంతట తానుగానే లోపలికి వచ్చాడు, ఆ తెర వెనుకకు వెళ్ళాడు మరియు ఆ అతిపవిత్ర స్థలములోని కరుణాపీఠము మీద నివసిస్తున్నాడు, అదియే అత్యంత పవిత్ర స్థలము, దానిని "అతిపరిశుద్ధ స్థలమని" పిలుస్తారు.
మరియు అతడు ఒక నిర్దిష్టమైన విధానములో వస్త్రములను ధరించుకుంటాడు, ఒక నిర్దిష్టమైన విధానములో నడుస్తాడు, ఒక నిర్దిష్టమైన విధానములో అభిషేకమును పొందుకున్నాడు. అక్కడకు వెళ్ళుటకు అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తియైయున్నాడు. దాన్ని బట్టి సంఘము అతడిని చూచి తప్పక అసూయపడవచ్చును. కాని యేసు మరణించినప్పుడు, ఆ దేవాలయపు తెర చిరిగిపోయింది, ప్రధానయాజకుడు మాత్రమే కాదు, ఎవరైతే ఆ షెకీనా మేఘము యొక్క అదే అభిషేకమును పొందుకుంటే మరియు ఒక పవిత్రజీవిగా నడుస్తూ, "పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, యెహోవా నీవే," మరియు దేవుని యొక్క సన్నిధిలోకి సమీపించుము, యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన ముందుకు సమీపించుము.
ఆయనను లోనికి తీసుకొనుము… "ప్రభువైన యేసూ, ఇక్కడ ఒక బలహీనుడైన మనుష్యుడున్నాడు, అతడు నా సహోదరుడు. ఇప్పుడు అతడు చనిపోవుటకు మరణశయ్య మీదున్నాడు. ప్రభువా, నేను నిన్ను సమీపిస్తున్నాను." పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, యెహోవా నీవే."
"దేని కొరకు?"
"ఒక ప్రధానయాజకుని మాదిరిగా."
"దేనికొరకు?"
"నా సహూదరునికి బదులుగా. పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, యెహోవా నీవే."
97అక్కడే నీవున్నావు! నీ అనుదిన నడక, నీ అనుదిన మాట, నీ అనుదిన ప్రవర్తన, నీ హృదయం, నీ ప్రాణము, మరియు సమస్తము, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు, యెహోవా నీవే. చేదు యొక్క ఏ వేర్లు లేవు, మరేది మిగిలిలేదు. "పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు, యెహోవా నీవే. పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు, యెహోవా నీవే," మనము మన సహోదరునికి బదులుగా సమీపిస్తున్నాము. ఎవరైనా రావచ్చును, అభిషేకించబడిన, రక్తము ఆయన ముందున్నది, రక్తము ఆయన ముందుకు వెళ్ళి, ఇలా పాడుచున్నది, "పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు, యెహోవా నీవే."
ఇప్పుడు, అది బయట ఆవరణము, పరిశుద్ధ స్థలము, మరియు అతిపరిశుద్ధ స్థలము. అది భూమిమీద దేవుని యొక్క నివాస స్థలము. గమనించుము. అది పరలోకములో ఉన్నదానికి మాదిరిగా ఉన్నది. ఇప్పుడు, మనము అదే లేఖనమునకు దగ్గరకు నేరుగా తిరిగి రాబోవుచున్నాము. ఓ, ప్రకటనలో మనము ఎంత దూరము వెళ్ళినను, మనము నేరుగా తిరిగి ఇక్కడకే వచ్చాము, గమనించారా.
EZEK 1:10•
HEB 13:8•
REV 4:5,6
98ఇప్పుడు, యోహాను… యోహాను ఎక్కడ నిలబడ్డాడు? ఆవరణములో నిలబడ్డాడు, మరికొద్దిగా మీరు చదివినట్లయితే, మీకు పూర్తి దృశ్యము తెలుస్తుంది.
"మరియు ఆ సింహాసనములో నుండి మెరుపులును… ఉరుములు… ధ్వనులు: మరియు ఆ సింహసనము ఎదుట (మనము దాన్ని పొందుకునేంతవరకు ఆగుదాం!) ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని యొక్క యేడు ఆత్మలు."
దేవుని యొక్క సింహాసనము నుండి నేరుగా దేవుని యొక్క వెలుగు సంఘములలో ప్రతిబింబిస్తుంది. ఒక సెమినరీ నుండి కాదు, ఒక బిషప్పు నుండి కాదు; కాని ఆయన పునరుత్థానపు శక్తి యొక్క ప్రత్యక్షతయైన దేవుని సింహసనము నుండి వస్తున్నది; అదే ఆయనను నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవానిగా చేస్తుంది; అక్కడ యేడు నక్షత్రములు నిలబడి ఆ వెలుగును ప్రతిబింబిస్తున్నాయి, ఆ షెకీనా వెలుగు, అతిపరిశుద్ధ స్థలము నుండి షెకీనా మహిమ నుండి వస్తున్నది. యేడు దీపముల వెలుగున్నది, ఈ యేడు దీపస్తంభములపైన ఆయన కూర్చొని, తన వెలుగును ప్రతిబింబిస్తున్నాడు, తనయొక్క పునరుత్థానపు శక్తి, తన రంగులు, నేరుగా సంఘములో ప్రతిబింబిస్తున్నాయి. ఆమేన్!
"మరియు సింహాననము ఎదుట… స్పటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను: ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను."
మరియు అతడు ముందుకు వెళ్ళగా మరియు, యెహెజ్కేలు ఏది చూశాడో దాన్నే అతడు ఈ జీవులకు చెప్పుట ప్రారంభించాడు, అవి కావలికాస్తున్నాయి, ఒకటి మనషివలె, ఒకటి సింహము వలె, మరియు ఒకటి పక్షిరాజు వలె, అది ఏమిటి? ఇప్పుడు, గమనించుము, మనము వాటిని లోపలికి తెచ్చినప్పుడు మరియు యూదా గోత్రము యొక్క సింహమును చూపించియున్నాము మరియు మిగిలిన వ్యత్యాసమైనవి అన్ని గోత్రములకు బయట ఉన్నవి, అవి నాలుగు గోడల మీద కూర్చున్నాయి, మరియు ఆ కరుణాపీఠమును కావలికాస్తున్నాయి. ఓ, ఎటువంటి చిత్రము! ఓ, నేను కేవలం… గొప్ప దినములు ముందున్నవి.
MATT 12:32•
MARK 3:28,29•
LUKE 12:10•
JOHN 5:22
99మనము వాటిని చూసినట్లుగా… ఇప్పుడు, పరలోకములో దేవుని సింహసనమున్నది. దానిని మోషే భూమిమీద మాదిరిగా కట్టియున్నాడు, అది దేవుని సింహసనము, ఎందుకనగా ఆయన యొక్క తీర్పు సింహాసనము ఇక్కడ భూమిమీద ఉన్న అతిపరిశుద్ధ స్థలమందు ప్రతిబింబిస్తున్నది. ఇశ్రాయేలు వారందరు అక్కడికి కరుణను కనుగొనుటకు వస్తారు, ఎందుకనగా దేవుడు వధించబడిన రక్తం క్రింద మాత్రమే కలుసుకుంటాడు.
ఇప్పుడు, జాగ్రత్తగా వినండి. ఒక దినమున ఆ షెకీనా మహిమ ఆ కరుణాపీఠము నుండి పైకిలేస్తుంది, మరియు అది మరో గుడారములో నివసిస్తుంది. ఆమేన్! దీనిలో, "తండ్రి ఏ మనుష్యుడను శిక్షించడు, కాని తన తీర్పంతటిని కుమారుడికి మాత్రమే తీర్చియున్నాడు." దేవుని తీర్పు సింహాసనము. "మీరు నాకు వ్యతిరేకముగా మాట్లడియున్నారు, మీరు క్షమించబడతారు," మరొకరు… మరొకరు రాబోవుచున్నారు, మరొక కరుణాపీఠము. మీరు మనుష్యకుమారునికి వ్యతిరేకముగా మాట్లడవచ్చును, మరియు నేను మిమ్మలను క్షమిస్తాను. కాని ఒక దినాన పరిశుద్ధాత్మ ప్రజల హృదయములలో నివసించుటకు వస్తాడు, తనకు వ్యతిరేకముగా ఒక్క మాట మాటలాడినా అది ఎన్నటికి క్షమింపబడదు."
100అన్నివేళలా అది మరింత కష్టతరమైనది మరియు మరింత కష్టతరమైనదిగా చేస్తున్నది, ఆ తీర్పును, ఎందుకనగా దేవుడు నిరంతరం సహనమును ధరించుకుంటున్నాడు, పాపులు ఒప్పుదల కలిగి తనయొద్దకు రావాలని ప్రయత్నము చేయుచున్నాడు. మొదట, ఆయన ఆకాశము పైన నక్షత్రములలో వెలుగుచున్నాడు, రెండవదిగా, పెకీనా వెలుగు ద్వారా భూమి మీద ఉన్నాడు. తరువాత, ఆయన వచ్చి మరియు శరీరముగా మారి మరియు మనమధ్యలో నివసించాడు, ఇంకనూ సహనమును ధరించుకొనియున్నాడు. తన రక్తము చేత మనుష్యుడను విమోచించియున్నాడు, పరిశుద్ధాత్మ రూపములో తన సంఘములోకి వచ్చియున్నాడు, మరియు దానికి వ్యతిరేకముగా మాటలాడినట్లయితే, అది ముగింపుకు వచ్చిన కార్యమే, పూర్తయినది.
ఇప్పుడు, కుదుపు ఎక్కడ నుండి వస్తుందనేని మీరు చూడగలరు. మనమందరము ఒక సమయమును కలిగియున్నాము, దాన్ని వారు అర్థంచేసుకోరు. దాని అర్ధము ఏమిటనేది ప్రజలు అర్థంచేసుకోలేరు.
101ఇప్పుడు, మొదటి సింహసనము పరలోకములో ఉన్నది, తీర్పు సింహాసమనము. రెండవది క్రీస్తులో ఉన్నది. మూడవది మానవునిలో ఉన్నది.
ఇప్పుడు, ఇక్కడ నేను వ్రాసుకున్న ఈ చిన్న సంగతిని తీసుకోనిమ్ము మనము చేయబోవుచున్నాము. నా దగ్గర నల్లబోర్డున్నదని నేను ఆశిస్తున్నాను, మరియు నేను దాన్ని మరింత సులభతరం చేయాలనుకుంటున్నాను. మనము దాన్ని తీసుకొని మరియు ఆవరణములను చిత్రించుదాం, కేవలం ఒక నిండు వృత్తములో చేద్దాం, లేక ఈ విధముగా, ఏదైనా పరవాలేదు. ఇప్పుడు, మనము తీసుకొనబోవుచున్నాము… నేను నమ్ముచున్నాను, బహుశా ఇదే ఉత్తమమైనది కావచ్చును, మనము దాన్ని తీసుకొని ఆవరణములను తయారుచేశాము.
ఇప్పుడు, ఆ మనుష్యుడు ఎవరు? మూడిటిలోను ఉండేవాడు, శరీరము, ప్రాణము మరియు ఆత్మ. ఎంతమందికి అది తెలుసు? దేవుడు సమీపించుటను గమనించుము. ఆయన హృదయం ఏమిటి? మీకు నా వర్తమానము జ్ఞాపకమున్నదా, "మానవుని హృదయాన్ని దేవుడు తన నియంత్రణా గోపురముగా ఎంచుకున్నాడు?" దెయ్యము అతడి తలను తన నియంత్రణ గోపురముగా ఎంచుకున్నది. గమనించారా? అది అతడిని కార్యములను చూచునట్లుగా చేస్తుంది, అతని కన్నుల ద్వారా చూస్తుంది. కాని ఇంకను దేవుడు అతని హృదయములో ఉండి అతడు చూడలేనని వాటిని నమ్మునట్లుగా చేస్తున్నాడు. గమనించారా? చూడండి, అతని హృదయములో దేవుడు ఉన్నాడు. మానవుని హృదయములోనే దేవుని సింహాసనమున్నది. మీరు దాన్ని పట్టుకున్నారా? మానవుడు… దేవుడు తన సింహాసనమును మానవుని హృదయములో చేశాడు.
ఇప్పుడు, గమనించుము. మానవునిలో మొదటి భాగము ఏది? మానవునిలో మొదటి భాగము శరీరము. తరువాత భాగము అతని ప్రాణము, అది అతడి ఆత్మ యొక్క ప్రవర్తన దాన్నిబట్టి అతడు ఎటువంటివాడో చెప్పవచ్చును. ఇప్పుడు, ఆయన సమీపిస్తున్నాడు. ఇప్పుడు, మానవునిలోని మూడవ భాగము అతడి ఆత్మ, మరియు అతడి ఆత్మ, అతని హృదయం మధ్యలో ఉంటుంది, మరియు హృదయములోని ఆ మధ్యలోని భాగములోకే దేవుడు తన సింహసనము కొరకు వస్తున్నాడు.
EXOD 3:5•
PROV 23:7
102మీకు జ్ఞాపకమున్నదా, ఈ మధ్యనే, నాలుగు సంవత్సరముల క్రితం చికాగోలో పేపరులో వచ్చింది, ఒక పాత విశ్వాసి… ఒక పాత అవిశ్వాసి, ఎవరైనా, ఇలా అన్నారు, సోలోమోను ద్వారా దేవుడు పొరపాటు చేశాడు' ఆయన ఇలా చెప్పినప్పుడు, "మానవుడు తన హృదయముతో ఆలోచిస్తాడు." వారు ఇలా అన్నారు, "ఆలోచించుటకు సంబంధించినది ఏది హృదయములో ఉండదు. మానవుడు తన హృదయముతో ఎలా ఆలోచిస్తాడు? ఆయన ఉద్దేశ్యములో తల అని చెప్పబోయుండవచ్చును."
దేవుడు తల అనే ఉద్దేశ్యము కలిగియుంటే, ఆయన తలే అని చెప్పియుండేవాడు.
మోషేవలె, ఒకవేళ మోషే… దేవుడు ఇలా చెప్పినప్పుడు, "మోషే, నీ చెప్పులు విడువుము, నీవు పవిత్రమైన స్థలములో ఉన్నావు." అతడు ఇలా అంటే, "ఓ, మంచిది, నేను నా టోపిని తీస్తాను, అది కూడా బాగుంటుందా"? ఆయన "చెప్పులు," అన్నాడు. ఆయన "టోపి" అని అనలేదు; ఆయన "చెప్పులు" అన్నాడు.
MARK 16:17•
JOHN 3:6•
ACTS 2:38
103మరియు ఆయన ఇలా అన్నప్పుడు, "మారుమనస్సు పొందుము, మరియు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుము," ఆయన ఉద్దేశ్యము తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మ అని కాదు. ఆయన ఏమి చెప్పియున్నాడో అదే ఆయన ఉద్దేశ్యము.
"నీవు తప్పక తిరిగి జన్మించాలి," అని చెప్పినప్పుడు, ఆయన ఇలా అనలేదు, "నీకు వీలైతే జన్మించు."
ఆయన ఇలా అనెను, "నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును." ఆయన ఎన్నడు, "బహుశా అవి వెంబడించవచ్చును," అని ఆయన అనలేదు.
దానికి అర్ధమేమున్నదో ఆయన దాన్నే పలుకుతాడు. మరియు ఆయన దేవుడైయున్నాడు మరియు దాన్ని ఆయన వెనుకకు తీసుకోలేడు. ఏది పరిపూర్ణమైనదో ఆయనకు తెలుసు, కావున ఆయన దాన్ని ఆ విధముగా చేస్తాడు, మరియు ఆ విధముగా ఉండాలనే ఆయన ఉద్దేశ్యమైయున్నది, మరియు దాని దగ్గరకు నీవే రావలసియున్నది, నీ ఆలోచన దగ్గరకు ఆయన దిగి రావటం కాదు; ఆయన ఆలోచన దగ్గరకు నీవే రావాలి. అదియే వ్యత్యాసము.
104ఇప్పుడు, ఇప్పుడు, ఈ శరీరము యొక్క అమరికలో, ప్రాణము… ఇప్పుడు మీరు "ప్రాణము" అనే పదమును తీసుకున్నట్లయితే మరియు దాన్ని చూడుము, అది బైబిలు నిఘంటువులో దాన్ని గురించి చెపుతుంది లేక వెబస్టర్, వాటిలో ఏదైనా, అది "ఆత్మ యొక్క స్వభావము."
ఇప్పుడు, ఇక్కడ ఒక మనుష్యుడున్నాడు, మనము అంటాము, జాన్ డోయ్ ఇక్కడున్నాడు. అంతా మంచిది, జాన్ డోయ్, మరియు ఇక్కడ సామ్ డోయ్ ఉన్నాడు. అంతా మంచిది. ఇప్పుడు, జాన్ డోయ్ ఒక మానవుడు, శరీరము, అతడు సామ్ డోయ్ కి సహూదరుడు. ఇప్పుడు, జాన్ ఒక ఆత్మ, ప్రాణము, శరీరము మరియు సామ్ డోయ్ కూడా అదేవిధముగా, శరీరము, ప్రాణము, ఆత్మ కలిగియున్నాడు. మీరు గమనించారా? అది శరీరము, ప్రాణము, ఆత్మ.
ఇప్పుడు, ఈ మానవుడు ఒక చెడ్డవాడు, ఉద్దేశ్యము, మోసము, దొంగతనము, అబద్ధము, వ్యభిచారము చేయుట, చెడ్డదైన కార్యము ఏదైనా చేయుట. అయితే ఈ మానవుడు పూర్తిగా ప్రేమతోను, శాంతితోను, సంతోషముతోనూ నిండియున్నాడు. వారివురు ప్రాణము, శరీరము, మరియు ఆత్మను కలిగియున్నారు. మంచిది, వ్యత్యాసమెక్కడున్నది? ఈ మానవుడు వెనుకకు వెళ్ళి, ఇలా చెప్పగలడు, "మా అమ్మ నాకు జ్ఞాపకమున్నది. మేము బాలురముగా ఉన్నప్పుడు మేము చేసిన కార్యములు మాకు జ్ఞాపకమున్నాయి," వారు ఇరువురికి అలాగే ఉన్నాయి. వారు ఇరువురు ఆత్మలను కలిగియున్నారు, వారు ఇరువురు ప్రాణములు కలిగియున్నారు. వారు ఇరువురు శరీరములు కలిగియున్నారు.
కాని, ఈ మనషి యొక్క ఆత్మ ప్రవర్తన చెడ్డది, ఈ మనషి యొక్క ఆత్మ ప్రవర్తన మంచిది, గమనించారా. కాబట్టి ఆత్మ యొక్క ప్రవర్తనే మనిషి యొక్క ప్రాణము, గమనించారా. కావున ఇప్పుడు, దేవుడు దేనిలోకి రావాలనుకుంటున్నాడు? ఆత్మ మరియు మానవుని హృదయములోనికి రావాలనుకుంటున్నాడు. ఆత్మ హృదయములోనే ఉంటుంది.
105మీకు తెలుసా, మరియు సైన్సు ఇలా అన్నది (నేను దాన్నిఎన్నడు పూర్తి చేయలేదు) మనిషి తన హృదయముతో ఆలోచించలేడు. మరియు సైన్సు వెదుకుట ప్రారంభించి మనిషి హృదయములో ఒక చిన్న భాగమును కనుగొన్నారు (అది జంతువు హృదయములో లేదు, కాని, మానవుని హృదయములలోనే అది ఉన్నది), అక్కడ ఒక్క రక్త కణము కూడా లేదు, ఏదియు లేదు. వారన్నారు, "ప్రాణం లేక ఆత్మ నివసించు స్థలమైయుండచ్చును." కేవలం వాటిని ఒంటరిగా వదిలివేయుము, వారు వారియొక్క అర్ధరహితమైన స్వంత ఆలోచనలను తీసుకొని మరియు దేవుడిని నిరూపిస్తున్నారు. అది నిజము. తనను మూర్ఖులు పరీక్షించునట్లుగా దేవుడే చేస్తున్నాడు.
ఇప్పుడు, అది అక్కడే ఉన్నది, వార్త పత్రికలో పెద్ద ముఖ్యమైన వార్తగా ఉన్నది. సహోదరుడు బోజ్ యొక్క చిన్న బాలిక చెప్పింది, "బ్రదర్ బ్రెన్హాం, వేరొక దినమున నీవు ఏమి చెప్పియున్నావో నీకు జ్ఞాపకమున్నదా?" అన్నది, "చూడు, చూడు, సైన్సు దానిని ఎప్పుడో కనుగొన్నది."
నేనన్నాను, "మంచిది, దేవుడు దీవించును! సహోదరి, నాకు అది కావాలి. అది నాకు కావాలి."
ఆత్మ యొక్క స్వభావమే మానవుని ప్రాణము, మరియు మానవుని యొక్క హృదయములో ఆత్మ నివసిస్తుంది.
106ఇప్పుడు, ఇప్పుడు, బయట ఆవరణములు ఏమిటి? అది శరీరము. గమనించారా? నీవు మొదటిగా వచ్చేది అక్కడికే, శరీరము. మొదటగా నీవు దాన్ని తీసివేయవలసియున్నది. నీవు శరీరమును దాటి రావలసియున్నది. "నేను పైకి లేవలేకపోచున్నాను మరియు సంఘముకు వెళ్ళలేకపోతున్నాను, వీధులు చాలా జారిపోతున్నట్లుగా ఉన్నాయి. ఇది చాలా ఎండగా ఉన్నది. ఓ, సంఘము, నాకు తెలియదు." అదే శరీరము. అంతా మంచిది. ఇప్పుడు, నీవు దాన్ని తీసివేయవలసియున్నది మరియు దానినుండి నడువవలసియున్నది, దేవుడు దాని ద్వారా వస్తాడు.
మరోసారి ఆయన వచ్చినప్పుడు, ఆయన ప్రాణములోకి వస్తాడు, అదియే స్వభావము. "ఓ, జోనెసెస్, నా గురించి ఏమి చెప్పియుండవచ్చు? ఓ, మై! మీకు తెలుసా, నేను అటువంటిది ఏదైనా చేసినట్లయితే, నా సంఘము నన్ను బయటకు తన్నివేయును, చూచారా." కాని నీవు దానినుండి నడవ వలసియున్నది.
MATT 18:6•
MARK 9:42
107మరియు నీవు దాన్ని నుండి నడుస్తున్నప్పుడు, ఆయన నీ హృదయములోకి వస్తాడు మరియు అక్కడే ఆయన సింహసనమున్నది. ఆ పరిశుద్ధాత్మడు నీలో ఉన్నాడు.
యేసు ఇలా అనెను, "నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయుట వానికి మేలు." వారికి ఏ హాని చేయవద్దు; వారిని అడ్డగించను కూడా వద్దు, కేవలం వారిని దేనిచేతా బాధపెట్టవద్దు. దానికన్ననూ నీయంతట నీవే మునిగి చనిపోవుట నీకు మేలు, లేక వారిలో ఏ ఒక్కరినైనా అడ్డగించుటకు బదులుగా అసలు ఈ భూమిమీద జన్మించకున్నయెడల వానికి మేలు. ఆయన ఉద్దేశ్యము అదేనా? ఆయన అబద్ధం చెప్పెనా? అపోస్తలులు దాన్ని చెప్పారా? లేదు. దాన్ని యేసే చెప్పాడు, యేసు ఇలా అనెను, "నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని మీరు అభ్యంతరపరచినట్లయితే…"
MARK 16:17
108"నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును."
ఒక పెద్ద గొప్ప వ్యక్తి ఇలా అన్నాడు, "ఓ, నేను ఆయనయందు విశ్వాసముంచాను! హల్లెలూయా!"
"ఆయన వాగ్దానము చేసినట్లుగా, నీవు ఎప్పుడైనా భాషలతో మాట్లాడావా, భాషలకు అనువాదం చెప్పావా, దయ్యాలను వెళ్ళగొట్టావా, దర్శనములు, మరియు మొదలైనవి చేశావా?"
"లేదు, ఆ దినములు గతించిపోయాయి." అతడు విశ్వాసి కాదు, అతడొక నటించు-విశ్వాసి.
యేసు ఇలా అనెను, ఆయన చెప్పిన చివరి మాటలు, "ఈ లోకములో నమ్మినవారిని మరియు ప్రతి జీవిని ఈ సూచనలు వెంబడించును." అది నిజము. "నేను వచ్చు వరకు ఈ సూచనలు విశ్వాసిని వెంబడించును." ఆయన చెప్పిన చివరి మాటలు అవియే. ఎంతమందికి అది తెలుసు? పరిశుద్ధ గ్రంథము, మార్కు 16. ఇప్పుడు, చూశారా, అతడు ఒక నటించు-విశ్వాసి.
కాని, నిజంగా విశ్వసించే విశ్వాసిని మీరు కనుగొన్నప్పుడు, సూచనలు వెంబడించుట, మరియు మీరు వారి జీవితంలో వినయమును చూస్తారు, అనుకరించేవారిని కాదు, వారు ఒక క్రైస్తవుడని తెలుస్తుంది. ఒక నిజమైన, నిజాయితీకి మాదిరిగా, దాన్ని అలాగే ఉంచుము. దానియొక్క క్రియలు, వెంటనే వారితో కలువుము, వారితో కలసి నడువుము, ఎందుకనగా నీవు రాజు యొక్క ప్రధాన మార్గములో నడుస్తున్నావు.
109ఇప్పుడు, ఏం జరిగింది? దీన్ని గమనించుము. మనము ఈ అన్యజనుల సంఘము యొక్క శరీరముతో ప్రారంభించినట్లయితే బయటి ఆవరణము లూథరు కాలము. గుర్తుచేసుకోండి, వారు యూదుల మీద క్రీ.శ. 606 వరకు ఉన్నారు, తుయతైరకు వచ్చినప్పుడు, దాదాపుగా యూదులందరు మారియన్నారు. కాని యూదుల తరువాత అది అక్కడే యూదులకు మరియు అన్యజనులకు ఇద్దరికి (కాని ఎక్కువగా యూదులకు) వదిలివేయబడింది. అయితే వాస్తవముగా అన్యజనుల కాలముగుండా అది వచ్చినప్పుడు, ఈ వైపు వస్తుంది, గమనించారా, మార్టిన్ లూథర్ వస్తాడు, జాన్ వెస్లీ, మరియు మొదలైనవారు, గమనించారా. ఇప్పుడు, చీకటికాలము తరువాత ఈ చివరి మూడు చూడుము, మధ్యకాలమునకు వచ్చు వరకు మరియు దాటిపోయింది.
అది వచ్చినప్పుడు, ఈ బయటి ఆవరణములను చూడుము. గమనించుము, శరీరము, ప్రాణము, ఆత్మ - గమనించారా. ఆ బయటి ఆవరణములు: శరీరము. ఆ పరిశుద్ద స్థలము: నజరేన్, పిలిగ్రమ్-హోలినెస్, స్వతంత్ర మెథడిస్ట్, గమనించారా. మరియు తరువాత అతిపరిశుద్ధ స్థలము. తిరిగి పెంతెకోస్తులోకి, ప్రారంభమందు ఎక్కడ ప్రారంభమైనదో అక్కడకి, గమనించారా, తిరిగి ప్రారంభమునకు.
110ఇప్పుడు, మీరు దీన్ని చిత్రించినట్లయితే, ఇప్పుడు నేను అక్కడ అయిదు ద్వారములను గుర్తుపెట్టాలని అనుకుంటున్నాను, అవి శరీరములోకి వెళతాయి, అవి శరీరమును నియంత్రిస్తాయి. అది అక్కడ ఉన్నదో మీకు తెలుసా, అవి అయిదు జ్ఞానేంద్రియములు. శరీరమును ఎన్ని జ్ఞానేంద్రియములు నియంత్రిస్తాయి? ఐదు. చూపు, రుచి, స్పర్శ, వాసన, వినుట. అవి నిజమేనా? అది శరీరము, బయటి ఆవరణములు, అది శరీరము కాబట్టి నీవు వాటిమీద ఆధారపడలేవు.
తరువాత లోపలి ఆవరణములు, మనకు లోపలి ఆవరణమున్నది, అదియే తరువాత బలిపీఠం, మరియు బలిపీఠం లోపల ఉంటుంది, మరియు అది వీటితో వస్తుంది. సృహ, ఊహించుట, జ్ఞాపకములు, కోరికలు మరియు ప్రేమలు. ఈ అయిదు జ్ఞానేంద్రియములు లోపలి ఆవరణములను నియంత్రిస్తాయి. అదియే ప్రాణము. ప్రేమల యొక్క అనుభూతి, అదియే ప్రాణం, ప్రేమ మరియు మొదలైనవి. మరియు తరువాత జ్ఞానేంద్రియము ఇక్కడే ఉన్నది, జ్ఞాపకశక్తి, మరియు సృహ, మరియు కరుణ, మరియు మొదలైనవి, మరియు ఊహించు శక్తి, మీరు కూర్చొని మరియు కార్యములను ఊహించగలరు, దానితో మీరేమి చేయగలరు? దాన్ని మీరు శరీరముతో చేయలేరు, మీ జ్ఞానేంద్రియములతో మీరు ఊహించలేరు. ఇది ఒక లోపలి ఆవరణము, ఇది మీలోపల ఉంటుంది.
EXOD 30:10
111దీనికి మూడు ద్వారములు ఉన్నవి. మనము ఏం చేస్తున్నాము? ఇప్పుడు మనము దాన్ని పగలగొట్టుచున్నాము, మీరు దీన్ని తప్పిపోవద్దు. శరీరము నుండి వస్తుంది, ఆ అయిదు జ్ఞానేంద్రియములు, తరువాత, ప్రాణము, లోపలి ఆవరణములు, కాని ఇప్పుడు నీవు హృదయము దగ్గరకు వస్తున్నావు, గమనించారా. ఇప్పుడు, అక్కడే నీవున్నావు మంచి పిలిగ్రమ్-హోలినెస్ మరియు మెథడిస్ట్ లో బయట ఉన్న బలిపీఠము దగ్గరే ఆగిపోయారు. గమనించారా, మీరు ఆవరణములో ఉన్నారు — లూథరన్లు మరియు మొదలైనవారు శరీరములోనే ఉన్నారు, అయిదు జ్ఞానేంద్రియములలోనే ఉన్నారు, కన్ను ఏం చూడగలదు మరియు ఏం చేయగలదు, గమనించారా.
పిలిగ్రమ్-హోలీనెస్ కు వచ్చినట్లయితే అది ఒక స్వతంత్ర మెథడిస్తు, తరువాత ఆవరణములకు వచ్చారు మరియు పరిశుద్ధతయందు విశ్వాసముంచారు, ఎందుకనగా ఎక్కడైతే బలిఅర్పణ ఇచ్చియున్నారో దాన్ని పరిశుద్ధ స్థలము అన్నారు.
కాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధానయాజకుడు అతిపరిశుద్ధ స్థలమునకు పరిహారార్ధమునకై వెళతాడు. అక్కడ లూథరన్ కాలమున్నది, తరువాత మెథడిస్తుల కాలమున్నది, తరువాత ఈ కాలము, సంఘము వెలుగు వస్తుంది, అది మానవుని శరీరములోని అమరికవలె ఉన్నది.
MARK 8:34•
1COR 12:13
112అప్పుడు మనం దీని లోపలకు ఎలా వెళ్ళగలం? ఇప్పుడు, గుర్తుచేసుకోండి, అక్కడ ఒక తెర ఉన్నది, ఒక తెర అది పరిశుద్ధస్థలముకు మరియు అతి పరిశుద్ధస్థలముకు మధ్యన ఉంటుంది. అతిపరిశుద్ధమైన స్థలములో క్రీస్తు వచ్చి, నీ హృదయమందున్న సింహసనంలో కూర్చుంటాడు. క్రీస్తు సింహాసనంలో కూర్చున్నాడు. ఆయన నీతీకరణ ద్వారా వస్తున్నాడు (అది నిజమేనా?); శుద్దీకరణము. అప్పుడు ఒకదాని చేత (నీరు? ఒక సంఘము చేత? ఒక క్రియ చేత?)… ఒకే ఆత్మ చేత. ఇక నుండి మనమందరము ఒక శరీరములోకి బాప్తిస్మము పొందియున్నాము, అదే క్రీస్తు యొక్క శరీరము. దేనిచేత? పరిశుద్ధాత్మ చేత.
ఎవరు లోపలకి వచ్చారు? మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బెటేరియన్, పెంతెకోస్తు, ఇచ్చయించు వారు ఎవరైనా. ఆ తెర… ఆ తెర నీ హృదయమునకు అడ్డుగా ఉన్నది, ఆ తెర ఏమిటో మీకు తెలుసా? సిద్ధముగా ఉన్నారా? ఆ తెర "సొంత-ఇచ్చ," అని పిలువబడుతుంది.
ఇప్పుడు మీకు చిత్రమంతా అర్థమైనదా? బయటవున్న జ్ఞానేంద్రియములు, శరీరములో ఉన్న జ్ఞానేంద్రియములు మరియు ప్రాణమునకు ఉన్న జ్ఞానేంద్రియములు, మరియు ఆ తెర దానికి మరియు పరిశుద్ధ స్థలమునకు మధ్యన ఉన్నది, అతిపరిశుద్ధమైనది. మరియు అక్కడకు వచ్చుటకున్న ఒకే ఒక మార్గము, సొంత-ఇచ్చ! "ఎవరైనా…" ఏమిటి? ఎవరైతే కరచాలనము చేస్తారో? ఎవరైతే చుట్టుకుంటారో? ఎవరైతే సంఘములో చేరతారో? ఎవరైతే తమ ఉత్తరాలను ఇస్తారో? ఎవరైతే చేస్తారో? లేదు. "ఇచ్చయించువానిని, తెర దాటి లోనికి రానిమ్ము."
113క్రీస్తును ఈ జ్ఞానేంద్రియముల ద్వారా లోనికి అనుమతించినట్లయితే; "మంచిది, నేను బహుశా… నేను నరకమునకు వెళ్ళానుకోవటంలేదు, అది ఒక కారణము చేత నేను సంఘములో చేరుతున్నాను," అని చెప్పుదురు. మంచిది, లూథరన్లు.
"మంచిది, ఏమిటో నేను మీకు చెబుతాను, నేను జీవించినదాని కంటే వ్యత్యాసమైన జీవితాన్ని జీవించాలని నేను నమ్ముచున్నాను," బలిపీఠం దగ్గర శద్దీకరణము. మంచిది, మెథడిస్టు.
మంచిది, అయితే ఇచ్చయించువారిని, చిరిగిన ఆ తెర గుండా రానిమ్ము. ఓ, దేవునికి మహిమ కలుగును గాక! నేను వేరొక వైపున ఉన్నాను. ఆయన నామమునకు హల్లెలూయా! ఓ, మై! ఇచ్చయించువారు, తన స్వంత చిత్తమనే తెరను అతడు చింపివేయనీయము మరియు దేవుని అతడి హృదయములోనికి రానిమ్ము. మానవుని హృదయములోని తన తీర్పు సింహాసనములో క్రీస్తు ఉన్నాడు. ఏం జరుగనైయున్నది?
1COR 15:31•
GAL 2:20
114నీవనవచ్చు, "నేను చేయవలసియున్నది… మంచిది. నేను మురికి హస్యోక్తులు చెబుతాను, అదేమి నాకు తీర్పు తీర్చదు." ఎందుకు? తీర్పు తీర్చుటకు నీవేమి పొందుకోలేదు. దాన్ని బయటకు తీయుటకు అక్కడ ఎవరు లేరు. అక్కడ నీకు తీర్పు తీర్చుటకు ఎవరు లేరు.
"మంచిది, నేను నీకు చెబుతున్నాను," ఆ స్త్రీ ఇలా అనవచ్చును, "నేను కత్తిరించబడిన వెంట్రుకలను కలిగియుంటాను, అది నాకు తీర్పు తీర్చదు." ఏ ఆశ్చర్యము లేదు! గమనించారా? "లేదు, నేను కురచ దుస్తులు ధరిస్తాను, నేను దీన్ని చేస్తాను."
పురుషుడు ఇలా అనవచ్చును, "సిగరెట్ల పొగ త్రాగుటనేది నన్నేమి బాధించదు. కొద్దిగ పేకాట ఆడుట వలన మరియు డైస్ (పాచికలతో ఆడే ఒక జూదక్రీడ) ఆడితే నన్నేమి బాధించదు," మరియు వారేమి చేసినప్పటికి, "అది నన్నేమి బాధించదు." మరియు వారు ఇంకనూ సంఘమునకు సంబంధించినవారే, గమనించారా, "ఇది చేయుటవలన నన్నేమి బాధించదు." ఎందుకు? ఎందుకు? నీకు తీర్పు తీర్చుటకు అక్కడ ఏమిలేదు.
కాని, క్రీస్తు లోపలికి వచ్చినప్పుడు, నీ హృదయములో నీవు ఒక బలిపీఠమును కట్టియున్నావు, మరియు నీ పాపములు అనుదినము తీసివేయబడుచున్నాయి. ఆ గొప్ప పరిశుద్ధుడైన పౌలు ఈ విధముగా చెప్పుచున్నాడు, "అనుదినము నేను మరణిస్తున్నాను. ఇకను జీవించువాడను నేను కాను; క్రీస్తే నాయందు జీవించుచున్నాడు." అక్కడనే లోపలితెర ఉన్నది. ఓ, సహోదరీ, సహోదరుడా!
1COR 6:2•
REV 4:10•
REV 20:12
115త్వరపడుము, నాకు తెలుసు… ఓ, లేదు, నేను దాన్ని పూర్తి చేయలేను, నేను సమయాన్ని దాటిపోయాను. చూద్దాం. గమనించారా, నేను ఆ ఇరువదినలుగురు పెద్దలను తీసుకుంటున్నాను, మరియు మీ యొక్క రాత్రివిందును నుండి ఇప్పటికే నేను చాలాసేపు ఆపియున్నాను. మనము కేవలం… చూద్దాం, అది… ఇరువదినలుగురు పెద్దలను తీసుకొనమని ఎంతమంది చెపుతారు? మంచిది, కేవలం ఒక్క నిముషము. మంచిది, కేవలం ఒక్క నిముషము, "ఇరువదినలుగురు పెద్దలు," (ఇప్పుడు వారిని త్వరగా పొందుకుందాము), సింహాసనము చుట్టూ," మరియు వారు ఇరువది… సింహాసనము చుట్టూ.
ఇప్పుడు మీరు చూడండి… ఇప్పుడు సింహాసనము ఎక్కడున్నది? హృదయములో ఉన్నది. ఎవరి హృదయములో ఉన్నది? యేడు సంఘ కాలములలో ఉన్న సభ్యులలో ఉన్నది. క్రీస్తు! వారి క్రియలకు వ్యతిరేకముగా ఒక్క మాట మాటలాడినా, నీవు తీర్పు తీర్చబడతావు. తీర్పు దినమున నీవు దానికి జవాబు చెప్పవలసియుంటుంది. మరియు భూమికి ఎవరు తీర్పు తీరుస్తారు? పరిశుద్ధులు భూమికి తీర్పు తీరుస్తారు.
వేవేల కొలది ప్రజలు వచ్చువారు ఎవరని దానియేలు చూశాడు? పరిశుద్ధులు, పుస్తకములు తెరువబడ్డాయి… పాపులు. మరొక పుస్తకము తెరువబడింది, అది జీవగ్రంథము, నిద్రిస్తున్న కన్యక. ఓ, మై, మీరు దాన్ని చూచుటలేదా? నిద్రిస్తున్న సంఘము, అది పెండ్లికుమారుడి కలుసుకొనుటకు వెళ్ళింది, మరియు వారి దీపములలో నూనె అయిపోయినది; దానిలోకి ఎన్నడు ప్రవేశించలేదు, క్రీస్తుకు నియంత్రించుటకు అనుమతిని ఇవ్వలేదు కావున ఆయన అద్భుతములు చేస్తూ మరియు భాషలతో మాటలాడుచూ, మరియు అద్భుతములు చేస్తూ మరియు తన సంఘములో ఆయన జీవిస్తున్నాడని రుజువు పరచుకుంటున్నాడు.
JOHN 10:37
116ఒకవేళ యేసు భూమిమీదకు వచ్చి ఇలా చెప్పినట్లయితే ఎలా ఉంటుంది, "నేను యేసును, నేను దేవుని కుమారుడను." ఏదియూ చేయనవసరములేదు, కేవలం ఇలా చెప్పి, "నేను ఇక్కడ నుండి వెళ్ళి మరియు సంఘములో చేరతాను?" అలా చేయువాడు దేవుని కుమారుడా? ఆయనేమన్నాడు? "నేను నా తండ్రి చేయు క్రియలు చేయకున్నయెడల, నన్ను నమ్మకుడి."
ఓ, మై! మీరు గమనించారా? దేవుడు తనను తాను ప్రకటించుకుంటున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయనే యెహోవా, ఆయనను ఆయన తెలియపరచుకొనుటను ఆయన ఇష్టపడుచున్నాడు. ఓ, నేను దాన్నిబట్టి ఎంతో సంతోషిస్తున్నాను. అవునయ్యా. ఆయన తనను తాను నాకు తెలియపరుచుకున్నాడు; ఆయన నీకు కూడా తెలియపరచుకున్నాడని నాకు తెలుసు. ఇప్పుడే మారిన మీలో కొంతమంది యవ్వనస్తులు, ఇంకనూ మీరు - ఆయనను శక్తిలో తెలుసుకోవాలి మరియు పాత క్రైస్తవులు చేయు గొప్ప కార్యములు మీరు తెలుసుకోవాలి, కాని మీరు ఇప్పుడే దానిలోకి వస్తున్నారు. మీరు ఇప్పుడే రాజు యొక్క ప్రధాన మార్గములోకి వస్తున్నారు. కేవలం గమనిస్తూనే ఉండండి మరియు మీరు ఉండగలిగినంత గట్టిగా నొక్కిపెడుతూనే ఉండండి. పరుగెత్తుము, పరుగెత్తుము, మరియు నీవు పరుగెత్తగలిగినంత పరుగెత్తుము. దేనికొరకు ఆగిపోవద్దు, ముందుకు వెళుతూనే ఉండుము.
దీనురాలైన ఆ వృద్ధ సహోదరి స్నెల్లింగ్ ఇలా చెప్పుచుండేది;
నేను పరిగెత్తుతున్నాను, పరుగెత్తుతున్నాను, పరుగెత్తుతున్నాను, నేను అవతలకు చేరుకున్నాను;
పరిగెత్తుతున్నాను, పరుగెత్తుతున్నాను, పరుగెత్తుతున్నాను, నేను అవతలకు చేరుకున్నాను;
పరిగెత్తుతున్నాను, పరుగెత్తుతున్నాను, పరుగెత్తుతున్నాను, మరియు ఆగిపోలేను.
దీనమైన ఆ వృద్ద ప్రాణము. ఈ దినము ఆమె అక్కడ ఉన్నది.
REV 4:4•
REV 5:9
117మంచిది, ఇప్పుడు, మరియు అక్కడ సింహాసనములు ఉన్నాయి, అక్కడ ఇరువదినలుగురు పెద్దలున్నారు. ఇప్పుడు, అక్కడ ఎంతమందియున్నారు, ఇరువదినలుగురు? ఇరువదినలుగురు. మంచిది:
"…ఇరువదినాలుగు సింహాసనములు; మరియు ఆ సింహాసనములలో నేను చూశాను, ఇరువదినలుగురు పెద్దలు ఆసీనులై యుండుట (ఒకొకరు ఒకొక్క సింహాసనములో),… తెల్లని వస్త్రములను ధరించుకొని; మరియు వారి తలల మీద సువర్ణ కిరీటములున్నాయి."
ఇప్పుడు, "ఇరువదినలుగురు పెద్దలు." వారు దేవదూతలకు సంబంధించినవారు కాదని మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. దూతలు కలిగి ఉండరు, పరలోక సంబంధులు కిరీటములతో మరియు సింహాసనములతో ఉండరు, గమనించారా. వారెన్నడూ కలిగియుండరు, వారు దూతలు, వారెన్నడూ పైకి రారు. మీరు తరువాత గమనించినట్లయితే, వారు పాడుతున్న పాటలు, మరియు క్రియలు, వారు కాదని (దూతలు కాదని - అనువాదకుడు) రుజువు చేస్తాయి, గమనించారా. వారు విమోచనా గీతం పాడియున్నారు, కావున… దూతలు విమోచించబడాల్సిన అవసరంలేదు, గమనించారా. మంచిది. అయితే వారు విమోచించబడినవారు.
REV 5:9
118ప్రజలైన మీరు, దీన్ని పట్టుకొనుటకు తగిన సమయము లేదు, కాని మీరు దిగువన వ్రాసుకోండి. వారు విమోచించబడినవారని మీరు తెలుసుకోవాలనుకుంటే, మత్తయి 19:28 తీసుకోండి. మంచిది, 19:28, మత్తయి. ప్రకటన 3:21. ప్రకటన 20:4, ప్రకటన 2:10, I పేతురు 5:2 మరియు 4, II తిమోతీ 4:8. అవి మీకు వారు విమోచించబడినవారని తెలియజేస్తాయి. నేను ఈ ఉదయం దానిమీద వెళ్లాలని అనుకున్నాను, మీరు చూచారా.
మరియు దానిమీద వారములు వెళ్లవచ్చును, మీరు చూచారా. వారు దేవదూతలు కాదు. వారు పరలోక సంబంధులు కారు. వారు విమోచించబడినవారు, చూచారా. మీరు వారి వస్త్రములను గుర్తించండి, వారు ధరించుకున్న వస్త్ర విధానమును బట్టి, వారియొక్క స్థానమును గుర్తించవచ్చును, వారేమి కలిగియున్నారు, మీరు వారి పాటలను గుర్తించండి, వారు ఏమి పాడియున్నారు, మరియు వారు దేవదూతలు కాదని తెలుసుకోండి.
DAN 7:9,10•
REV 4:2,4
119నేను దీని వద్దకు వచ్చుటను వ్యతిరేకిస్తాను, కాని మరొక లేఖనమును చదువుదాం. మీరు చేస్తారా? మంచిది. మనము తిరిగి దానియేలు 7కు వెళదాం, కేవలం కొద్దిసేపటి కొరకు, వెనుకకు, దానియేలు 7కు, మరియు ఇక్కడ ఉన్న లేఖనమును చదువుదాం, నేను కోరుకుంటున్నాను. కావున ఈ ఉదయకాలమున మిగతా వర్తమానమంతా మీకు అర్థమగుటకు ఇది సహాయము పడుతుంది. నేను ఖచ్చితముగా చెప్పుచున్నాను, మీరు ఇది మరియు అది చదివిన తరువాత మీరు చాలామంచి అనుభూతిని పొందుతారు, దానియేలు ఏమిటో చుడండి, దానియేలు 7వ అధ్యాయము, మరియు ఇప్పుడు మనము దానియేలు 7వ అధ్యాయము, 9వ వచనము నుండి తీసుకుందాం. ఇప్పుడు, ఈ కార్యములను దగ్గర నుండి వినండి:
"ఇంక సింహాసనములు వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమమువలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను. (అది అపరంజి అగ్నివలె ఉండుట మీరు మరోసారి చూడగలరు), దాని చక్రములు అగ్నివలె ఉండెను.
అగ్నివంటి ప్రవాహము ఆయన యొద్దనుండి ప్రవహించుచుండెను. వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుష్యులు (విమోచించినవారు ) ఆయన యెదుట నిలిచిరి; తీర్పు తీర్చుటకై గ్రంథములు (గ్రంథములు, బహువచనము). తెరువబడెను."
ఇప్పుడు, గమనించుము, తీర్పు సిద్ధమైనది. చూచారా, ఇప్పుడు గమనించండి. దానియేలు, తీర్పునందు సింహాసనములు చూసినప్పుడు, అవి ఖాళీగా ఉన్నాయి, అతడు సింహాసనములు వేయుట చూశాడు, అవి పరలోకము నుండి వస్తున్నాయి, ఆ పాత్రకాలములో పరలోకము నుండి వస్తున్నాయి. కాని యోహాను దాన్ని చూసినప్పుడు, సింహాసనమును యేసు ముందుగానే ఆక్రమించుకొనియున్నాడు, మరియు గోత్ర పెద్దలకు మరియు శిష్యుల కొరకు సింహాసనములు, విమోచించబడ్డారు, ముందుగానే కూర్చునియున్నారు, గమనించారా.
క్రీస్తు కాలమునకు 500 సంవత్సరములకు ముందుగానే దానియేలు దాన్ని చూశాడు. మరియు క్రీస్తుకు తరువాత 2500 సంవత్సరములు తరువాత, మరియు రాబోతున్న కాలములో యోహాను జీవిస్తున్నాడు, మరియు జరుగబోవు దీనినంతటిని అతడు చూశాడు. ఎక్కడ, దానియేలు దాన్ని చూడలేదు, గమనించారా, అతడు కేవలం రాబోవు సమయమును చూశాడు, రాబోవు వానిని అతడు చూశాడు. కాని యోహాను ఆయనను చూసినప్పుడు, సింహాసనము నింపబడియున్నది, గమనించారా, ఆ పురాతన కాలములో సింహాసనములు వేశారు, మరియు తీర్పు సిద్ధమైనది. కాని ఆయనను యోహాను చూసినప్పుడు, పెద్దలు ఇంకనూ యోహాను సమయములో… లేక, దానియేలు సమయములో ఎన్నుకోబడలేదు, కాని వారు ఇప్పటికే అంత్యకాలములో విమోచించబడియున్నారు. ఓ! ఆయన అద్భుతమైనవాడు కాదా?
DAN 7:9,10•
REV 4:4
120దానియేలు 7. దానియేలు ఏమి చేసాడు? అతడు తీర్పును ముందుగానే చూశాడు, సింహాసనములు ఖాళీగా ఉండుట చూశాడు. గమనించారా, అవి అప్పటికి ఖాళీగానే ఉండాలి. యోహాను తన కాలములో, సంఘము ఎత్తబడిన తరువాత, అవి విమోచించబడిన పెద్దల చేత ఆక్రమించబడ్డాయి.
పెద్ద అనగా అర్థమేమిటి? మీరు "పెద్ద" అను పదమును తీసుకున్నట్లయితే, నేను దాన్ని గురించి అన్ని రకముల నిర్వచనములు వ్రాసుకొనియున్నాను, నేను వాటిని కేవలం దాటిపోవుచున్నాను. "పెద్ద" అర్ధము "ఒక పట్టణము యొక్క పెద్ద లేక ఒక తెగకు, అలాంటి దానికి. ఇప్పుడు ఈ సంఘమునకు బ్రదర్ నెవిల్ ఒక పెద్ద. అతడు ఎవరు? ఇక్కడున్న ఈ శరీరమునకు అతడు పెద్ద, గమనించారా. మరియు ఈ నగరమునకు ఉన్న మేయరు ఈ నగరమునకు ఒక పెద్ద, గమనించారా — నగరములకు పెద్ద పరిశుద్ద గ్రంథ కాలములో మీకు వెనుక జ్ఞాపకమున్నదా, పట్టణము యొక్క పెద్ద? "పెద్ద" అర్ధము "పట్టణము యొక్క పెద్ద, లేక తెగ యొక్క నాయకుడు."
MATT 19:28•
MARK 10:28•
LUKE 22:30•
REV 4:4
121ఇప్పుడు, వారు ఎంతమంది ఉన్నారు? ఇరువదినలుగురు, ఇరువదినలుగురు పెద్దలు. అది సరియైనదేనా? ఓ, మై! వారెవరు? 12 మంది అపోస్తలులు మరియు 12 మంది ఇశ్రాయేలు గోత్రాలు, 12 మంది గోత్రపెద్దలు. ఇప్పుడు మనము రాబోవు వేరొక పాఠములలో దీని గురించి లోతుగా తీసుకొనబోవుచున్నాము మరియు అది సత్యమేనని రుజువు చేయబోవుచున్నాము, కావున ఇప్పుడు మీరు దాన్ని వ్రాసుకుంటున్న దాన్నిబట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, గమనించారా. పన్నెండు మంది గోత్ర పెద్దలు మరియు ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రములు. ఇప్పుడు, గమనించుము. యేసు దాన్ని చెప్పియున్నాడు…
ఒక దినమున పేతురు అడిగియున్నాడు, ఇలా అనెను, "మేము ఏం పొందుకుంటాము? మేము మా తండ్రిని, తల్లిని, భర్తను, భార్యను, పిల్లలను, సమస్తమును విడిచిపెట్టాము, మేము సమస్తమును విడిచిపెట్టాము." పేతురు ఇలా అన్నాడు, "మేము మా భార్యలను విడిచిపెట్టాము, మేము మా పిల్లలను విడిచిపెట్టాము మేము మా తల్లిని మరియు తండ్రిని విడిచిపెట్టాము, మా గృహములు విడిచిపెట్టాము మరియు స్థలములు విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము."
ఆయన ఇలా అనెను, "నిశ్చయంగా, నిశ్చయంగా నేను నీతో చెప్పుచున్నాను, మీరు పన్నెండు సింహాసనముల మీద కుర్చుని, పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు." అక్కడే నీవున్నావు, వారు విమోచించబడినవారు, విమోచించబడిన పెద్దలు.
1SAM 16:13•
2SAM 23:16,20
122చూడు దావీదును చూడుము క్రీస్తుకు మాదిరిగా యున్నాడు, గమనించారా. దావీదు అధికారములోకి వచ్చునప్పుడు, మొదటి కార్యము, అతడు అధికారములోకి వచ్చుటకు ముందు అతడు భయంకరమైన కాలములో ఉన్నాడు. అతడి మీద అభిషేకము ఉన్నప్పటికిని, ఆ అభిషేకము అతడి మీదయున్నది. మరియు చాలామంది ప్రజలు అతడిని తిరిగుబాటుదారుడు అనుకున్నారు, వ్యత్యాసముగా ఉన్న ఒక చిన్నవాడు అనుకున్నారు, దేనినో చీల్చుటకు వచ్చాడు అనుకున్నారు. కాని కొంతమందికి అతడు కాబోయే రాజు అని తెలుసు, వారు అతడితోనే నిలిచారు. సహోదరుడా, నా ఉద్దేశ్యము అతడి నుండి నీవు వారిని వేరు చేయలేవు, ఆ విధముగా వారు నడిచారు.
ఒక దినమున అతడు ఒక పర్వతము మీద నిలబడి, క్రిందకు చూస్తూ మరియు తన స్వంత చిన్న ప్రియమైన పట్టణమును తన శత్రువులు చుట్టుముట్టుట చూశాడు. మరియు అతడు అక్కడే నిలబడి మరియు అతడు చిన్న బాలుడుగా ఉన్నప్పటి వాటిని జ్ఞాపకము చేసుకున్నాడు, అతడు తన గొర్రెలను తీసుకొని అక్కడకు వచ్చేవాడు మరియు ఆ నీటిని త్రాగేవాడు, అవి నిజమైన నీళ్ళు. (దాన్ని గురించి ఇక్కడ మనము మాట్లాడుకొని ఎక్కువ కాలము కాలేదు, "జీవము యొక్క జలము.") మరియు అతడు అక్కడే ఆలోచించుకొనుచున్నాడు, "నేను దానిలోది త్రాగాను."
అతడు తన దగ్గర ఉన్నవారిలో ఎవరినైనా ఆజ్ఞాపించగలడు. సహోదరుడా, వారిలోలో ఇద్దరు మనుష్యులు వారి కత్తులు పట్టుకొని మరియు ఫిలిష్తియలలో పదిహేను మైళ్ళ యుద్దము చేసుకుంటూ వెళ్ళారు, కుడి నుండి ఎడమకు వధించుకుంటూ, ఆ బావి నుండి నీళ్లు తెచ్చుటకు వెళ్ళారు. అతడు అధికారములోకి రాబోవుచున్నాడని వారికి తెలుసు. అవునయ్యా. ఒకసారి, వారిలో ఒకడు, ఒక గుంటలోకి దూకి మరియు సింహమును ఒక్క చేతో చంపి అతడిని రక్షించాడు. వారు యుద్ధ వీరులు. మరియు అతడు అధికారములోకి వచ్చినప్పుడు, అతడు ఏమి చేశాడో మీకు తెలుసా? అతడు వారిలో ఒకొక్కరిని ఒక నిర్దిష్టమైన పట్టణమునకు పరిపాలకుడిగా చేశాడు.
HEB 12:1,2
123అక్కడ క్రీస్తును చూడండి? "జయించువారు ప్రతియొక్కడు ఒక పట్టణమును పరిపాలించును." జయించినవారు! ఈ దినమున ఆయన అధికారములోకి వచ్చుటను మనము చూసినప్పుడు, క్రీస్తు ఈ ప్రపంచమును పరిపాలించును. జర్మనీ, మరియు అమెరికా మరియు అన్ని పడిపోవలసియున్నవి, ప్రతి దేశము పడిపోవలసియున్నది. ఈ ప్రపంచము యొక్క రాజ్యములు మన దేవుని యొక్క రాజ్యములుగా మారిపోతాయి మరియు తన క్రీస్తును, మరియు ఆయన పరిపాలిస్తాడు మరియు వారిని ఏలతాడు. అది సత్యము.
ఆయన అధికారములోకి వస్తాడని మనకు తెలుసు, కావున ఆయన చిత్తప్రకారము మనలను ఆజ్ఞాపించుటయే. ఆయనకు ప్రతినిధిగా నన్ను చిన్నదైన టిమ్బుకుట్ కు (ప్రాంతమునకు) వెళ్ళమని కోరుకుంటే అక్కడ కనీసం 50 సెంట్ల డబ్బు కూడా ఉండవు, అక్కడ ఏమి ఉండవు, లేక పేదవారైన కొద్దిమంది ప్రజలుంటారు. అది ఆయన కోరిక. ఆమేన్! నీవు అన్నీ కలిగియుండలేవు; ఆయన ఇది చేయకూడదు; ఆయన ఏం కోరుకుంటున్నాడో కేవలం అది మాత్రమే నాకు తెలియనిమ్ము. ఆమేన్. అంతే.
ఒకవేళ నేను వ్యత్యాసముగా ఉండాలని ఆయన కోరుకుంటే, వ్యత్యాసముగా ప్రవర్తిస్తాను, ఈ సహోదరిలు చేస్తున్న దానివలె మరియు అటువంటి క్రియలు, "ఒకవేళ ఒక నిర్దిష్టమైన క్రియను నేను చేయాలని ఆయన కోరుకుంటే, దేవా దీవించుము, దాన్ని చేయుట నాకు ఎంతో ఆధిక్యతైయున్నది." అక్కడే నీవున్నావు! ప్రపంచము ఏమంటున్నదో మనకు సంబందము లేదు, ఆయన అధికారములోకి రాబోవుచున్నాడని మనకు తెలుసు. ఒకవేళ ప్రతియొక్క భారమును నేను ప్రక్కన పడవేసి మరియు పాపము సులభముగా నన్ను బాధిస్తుంది, నా ముందు ఉంచబడిన పందెములో నన్ను సహనముతో పరుగెత్తనిమ్ము. విశ్వాసమునకు కర్త మరియు ముగించువాడునైయుండి, అధికారములోకి రాబోవుచున్న యేసుక్రీస్తు వైపు చూడనిమ్ము.
REV 21:12-14
124ఆ "పెద్దలు," ఇరువదినలుగురు పెద్దలు. మంచిది. ప్రకటనలో మనము దాన్ని కనుగొనగలము. ఈ ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయములో, యెరుషలేము పట్టణమునకు పన్నెండు పునాదులున్నాయని మనము కనుగొంటాము. అది సరియేనా? మరియు దానికి పన్నెండు గుమ్మాలున్నాయి, ప్రతి దిక్కునకు మూడు గుమ్మాలున్నాయి, మూడు నాలుగులు పన్నెండు అవుతుంది. ఖచ్చితముగా అదే మాదిరిగా అరణ్యములోని గుడారమున్నది, యోహాను చెప్పినది ఖచ్చితముగా అదే, మరియు మోషే దేనినైతే అక్కడ చూసియున్నాడో యోహాను పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితముగా దాన్నే చూసియున్నాడు, అదే దాన్ని పౌలు చూసియున్నాడు.
మరియు ఇప్పుడు, పన్నెండు పునాదుల మీద అపోస్తలుల పేర్లుండుటను మనము గమనిస్తాము. మరియు పన్నెండు గుమ్మముల మీద పన్నెండు గోత్ర పెద్దల పేర్లు ఉన్నాయి. దాన్ని మనము ఏలా చూడగలము మరియు ఆ పన్నెండు మంది పెద్దలు, పన్నెండు తెగలు, పన్నెండు మంది అపోస్తలులు, పన్నెండు పునాదులు, పన్నెండు గుమ్మాలు. ఓ, మై! దేవుని యొక్క సంఖ్యలను తీసుకొనుము మరియు నీవు ఎక్కడను తప్పిపోవు, అది వెంటనే నేరుగా ప్రతియొక్క చోటుకు ప్రతియొక్కసారి పరుగెత్తుంది.
ROM 9:28
125ఆ కారణముచేతనే, మీరు గమనించారా, మనకున్న ఈ ఆరు దినములలో ప్రపంచము పనిచేసినది, మరియు మనము ఇప్పుడు ఆ యేడవ దినమునకు చాలా దగ్గరలో ఉన్నాము. మొదటి రెండువేల సంవత్సరములను దేవుడు నీటితో ప్రపంచమును నాశనం చేశాడు. రెండవ రెండువేల సంవత్సరములకు క్రీస్తు వచ్చాడు. ఇది 1961, ద్వారము వద్దనే ఉన్నది, కొద్ది సమయమే ఉన్నది.
మరియు చూడు, యేసు ఇలా అనెను, "ఇప్పుడు, ఇది అంతటిని చేయనేరదు," ఆయన ఇలా అనెను, "ఎందుకనగా నేను నా పనిని చిన్నదిగా కత్తిరించుకుంటున్నాను. ఒకవేళ నేను అలాగు చేయకపోతే, శరీరములన్నీటిని అణుబాంబు నాశనము చేస్తుంది. మీరు గమనించారా? ఏర్పరచబడినవారి నిమిత్తము, నీతియావత్తు కొరకు నేను ఆ దినములు తక్కువ చేతును. సమయములో కొద్ది భాగమును తక్కువ చేతును." గమనించారా, తరువాత వేయ్యేండ్ల పాలన, గొప్ప దినము.
సంఘము ఆరువేల సంవత్సరములు పాపమునకు వ్యతిరేకముగా పని చేసియున్నది, మరియు యేడవ వెయ్యి వేయేండ్ల పాలనైయున్నది. ప్రపంచమును దేవుడు ఆరువేల సంవత్సరములు చేసిన దానివలె, మరియు తన యొక్క పనియంతటి నుండి దేవుడు యేడవ వెయ్యిలో విశ్రమించెను. మరియు సంఘము ఆరువేల సంవత్సరములు పాపము చేయగా, మరియు యేడవ వేయిలో సంఘము విశ్రమిస్తుంది.
REV 4:4•
REV 19:8
126పరిశుద్ధుల నీతిక్రియలైన తెల్లని వస్త్రములను ఆ పెద్దలు ధరించుకొనియున్నారు. "తెలుపు" అనగా "నీతిక్రియలు." మరియు ఎందుకనగా, వారు ధరించుకున్న వస్త్రములు వారు "యాజకులా లేక న్యాయాధితిపతులా" ఎవరో తెలియచేస్తున్నాయి, తెల్లని వస్త్రములు, యూజకులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు మొదలైనవారు, గమనించారా, వారు ఎవరైయున్నారో తెలుపుతుంది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నారు, ఆ ఇరువదినలుగురు పెద్దలు. వారందరు ఇరువదినలుగురు పెద్దలు. వారిలో పన్నెండు మంది ఇశ్రాయేలు పన్నెండు గోత్రముల వారు, సంఘమునకు పన్నెండు మంది అపోస్తలులు.
మరియు గొప్ప రాజు యొక్క ఆవరణములో వారు కూర్చునియున్నారు. జ్ఞాపకము చేసుకోండి, వీరు, వారు బయట కూర్చునియున్నారు. మరియు ఇదిగో వధువు మరియు క్రీస్తు తన సింహాసనము మీద కూర్చున్నారు, మరియు ఆయన భార్య ఆయన ప్రక్కన కూర్చున్నది, సంఘము. ఇరువదినలుగురు పెద్దలు. దేవాలయము యొక్క లక్షా-నలుబది-నాలుగు-వేల-మంది నపుంసకులు ఆయనకు పరిచర్య చేస్తారు. ఆయన లేచినప్పుడు, ఆయన భార్య ఆయనతో వెళుతుంది. మై! ఆ గొప్ప కాలము రాబోవుచున్నది, ఈ పాపమంతా మరియు పాపము యొక్క పోలికలు అన్నీ…
ఈ పెద్దవి అన్నీ ఉన్నతమైన భవనములు కలిగిన ఆ ప్రజలు నేటి దినమున చాలా వృద్ధి చెందియున్నారు, ధనమంతా మరియు మోహము, మరియు పాపమంతా, మరియు అందమైన స్త్రీలు మరియు పురుషులు, వారి శరీరమును తయారు చేసుకొనుటకు వారు ఏదైతే ప్రయత్నము చేస్తున్నారో, అది లేక మరొకటి, వారి ప్రాణములను నరకములోకి పంపుటకు అది దెయ్యము యొక్క కుట్రయైయున్నది, కుళ్లి మరియు మరణిస్తారు, మరియు పరుగులు వారి శరీరములను తింటాయి. మరియు మొదటి కార్యము, శరీరమును తిను పురుగులు. సమస్తము అగ్నిపర్వతము యొక్క అగ్నిలోకి త్వరలో వెళ్లబోవుచున్నది, వెనుకకు తిరిగివచ్చునది ఏది లేదు కాని, పడిపోవుటయే ఉన్నది మరియు అగ్నిపర్వతము యొక్క బూడిద.
127కాని, ఇటువంటి ఉదయాలలో ఒక ఉదయాన, స్నేహితుడా, ఈ ఉదయాలలో ఒక ఉదయము, అదంతా జరిగిన తరువాత, అది తిరిగి వికసిస్తుంది. ఆ పొలములు పైన తెల్లని లవంగముల వలె కనపడును మరియు గులాబి యొక్క పరిమళము జీవవృక్షము యొక్క పువ్వుల పరిమళములో కలసిపోతుంది, మరియు ఒక దినము ఉదయాన క్రీస్తు తిరిగి వస్తాడు. ఈ పెద్ద పక్షులు, పావురములు, చెట్ల మీద కూర్చుని మరియు పాడుచుండును, మరియు ఇంక ఎన్నడూ మరణమనేదే ఉండదు మరియు దుఃఖం అనేది ఉండదు. క్రీస్తు మరియు విమోచించబడినవారు తిరిగి భూమి మీదకు వస్తారు, ఆ ముసలి ప్రజలు కాదు, నిత్య యవ్వనస్తులు, నిత్యమైనవారు ఆయన పోలికలో నిలబడియుంటారు, సూర్యుడు మరియు నక్షత్రములు తమ వెలుగును కోల్పోతాయ.
ఆ అందమైన పట్టణమునకు నేను కట్టబడియుంటాను,
నా ప్రభువు తనవారిని సిద్ధపరిచెను;
అక్కడే అన్ని వయస్సుల వాళ్లు విమోచించబడ్డారు
తెల్లని సింహాసనము చుట్టూ "మహిమా" అని పాడుతాము.
కొన్నిసార్లు నేను పరలోకము మీద బెంగ పెట్టకుంటాను
మరియు ఆ మహిమ ఇంకనూ చూడవలసియున్నది;
రక్షకుడిని నేను చూసినప్పుడు ఎంటువంటి సంతోషమది,
సువర్ణమయమైన ఆ పట్టణములో!
నేను ఎంతకాలములో ఆయన్ను చూడగలను! ఓ, ఆయనను నేను చూడాలనుకుంటున్నాను. నేను ఆ అందమైన పట్టణముకు కట్టబడియున్నాను. దాన్ని యోహాను పత్మాసులో ఉన్నప్పుడు చూసియున్నాడు, పెండ్లి కుమార్తెవలె అది అలంకరించబడి తన భర్తకై క్రిందకు దిగివచ్చుట చూశాడు. ఒక దినమున నేను ఆ మహిమను చూడాలని కోరుకుంటున్నాను.
ఆయనను నేను చూడాలని కోరుకుంటున్నాను,
మరియు ఆయన ముఖమును చూడాలనుకుంటున్నాను,
రక్షించిన ఆయన కృపను నిరంతరం అక్కడ పాడెదను,
ఆ మహిమా వీధులలో నన్ను స్వరమెత్తి పాడనీయము,
చింతలన్ని పోయెను, చివరికి గృహమునకు, ఎల్లప్పుడు సంతోషము.
128దినము యొక్క పని, మంచులో కొద్దిగా జారుతున్నది మరియు కొద్దిగా పట్టు తప్పుతున్నది, కొద్దిగా వెచ్చగా ఉన్నది. నా భార్య మరియు మాబెల్ ముందుకు వచ్చి మరియు నా కొరకు ఆ పాత పాడతారని ఆశిస్తున్నాను. నేను పాడగలిగితే… "నేను ఆ మార్గము యొక్క అంతముకు వచ్చినప్పుడు, ఆ వీధి యొక్క పని యేదియూ కనిపించుటలేదు." అది సరియైనదే.
ఆ రాత్రి నాకు జ్ఞాపకమున్నది సువార్త పనిని చేయుటకు నేను సంఘమును విడిచిపెట్టినప్పుడు, మీరందరు కన్నీరు కార్చినప్పుడు, వారిలో ఎవరూ వెళ్ళలేదు, తక్కువలో తక్కువ, బహుశా మీలో చాలా కొద్దిమంది ఉండవచ్చును. సహోదరి మరియు సహోదరుడైన స్పెన్సర్, మరియు బహుశా ఆ పాత-కాలపు వారిలో ఒక కొద్దిమంది వెళ్ళియండవచ్చును, వారు ఇక్కడ కన్నీరు కార్చుచున్నప్పుడు. కాని పరిశుద్ధాత్మ ఈ విధముగా చెప్పినప్పుడు, "నీవు తప్పక వెళ్ళాలి…!"
129మరియు నెలలు నెలలు నేను వెళ్ళిన తరువాత నా మొదటి కూటములు నేను జ్ఞాపకముంచుకున్నాను. జోనెస్-బోరోకు మీడా వచ్చినది (బెక్కీ చాలా చిన్న పాపగా ఉన్నది), కాటన్బెల్ట్ రైలులో వచ్చినది, వారిని అక్కడకు తెచ్చుటకు అది రోజులను తీసుకున్నది. ఆ రాత్రి ఆమె వచ్చుటకు ముందు నేను అక్కడ నిలబడియున్నాను. మేము ఆడిటోరియంకు వెళ్ళుటకు ప్రయత్నము చేయుచున్నాము, ఇంకను మూడు బ్లాకులున్నాయి, పోలీసువారు వీధులను ఆ విధముగా పట్టుకొనియున్నారు. వీధులన్నీ పూర్తిగా నిండిపోయాయి. వారు నన్ను వీధుల గుండా తీసుకుని వెళ్లవలసివచ్చెను మరియు గాలి ఆ ప్రాంతములో చుట్టూ వచ్చియున్నది.
మీడా ఇలా అన్నది, "బిల్, వారు నీ ప్రసంగమును వినుటకు వచ్చారా?"
నేను ఇలా అన్నాను, "లేదు." తరువాత మేము ఇలా పాడాము:
వారు తూర్పు నుండి పడమర నుండి వచ్చారు,
వారు చాలా దూర ప్రాంతము నుండి వచ్చారు,
ఆయన యొక్క అతిథిగా భుజించుటకు, రాజుతో విందు చేయుటకు;
ఆ శరణార్దులు ఎంతగా దీవించబడినవారు!
ఆయన యొక్క పరిశుద్ధమైన ముఖమును చూస్తున్నారు
దైవిక పేమతో అది వెలుగుతున్నది;
ఆయన కృపలో భాగస్తులందరు దీవించబడతారు,
ఆయన కిరీటములోని రత్నముల వలె వెలుగుతున్నారు.
ఓ, యేసు త్వరలో రాబోవుచున్నాడు,
ఆ తరువాత మన శ్రమలు ముగించబడతాయి
ఓ, మన ప్రభువు ఈ క్షణములో వచ్చినట్లయితే, ఏమి జరుగును
ఎవరైతే పాపము నుండి స్వతంత్రులుగా అవతారో?
ఓ, వారికిది సంతోషమును ఇస్తుంది,
లేక బాధ మరియు లోతైన నిరాశ కలిగినవారికి?
మన ప్రభువు మహిమలో వస్తున్నప్పుడు,
మనము ఆయనను మధ్యాకాశములో కలుసుకుంటాము.
ఆమేన్! ఓ, నేను ఆయనను ప్రేమిస్తున్నాను! అది నీకు బాధను మరియు లోతైన నొప్పిని కలుగజేస్తుందా, లేక అది నీకు సంతోషమును ఇస్తుందా? మన ప్రభువు మహిమలో వస్తున్నప్పుడు, మనము ఆయనను మధ్యాకాశములో కలుసుకుంటాము. మన మనసులలో ఆ ఆలోచనలు కలిగియుండి, మన తలలను మనం వంచుదాం. ప్రభువు చితమైతే, నేను ఈ ఆరాధనను వేరొక సమయములో ముగిస్తాను.
130మా పరలోకపు తండ్రి, ఓ, వారు తూర్పు నుండి పడమర నుండి వచ్చారు, వారు ఎంతో దూర ప్రాంతము నుండి వచ్చారు. నేను ఆ గొప్ప ఎత్తబాటు గురించి ఆలోచిస్తున్నాను. నేను ప్రసంగించిన ఆఫ్రికాలోని ప్రజలు, ఇండియాలోని ప్రజలు మరియు ప్రపంచములోని ప్రజలు, నేను వారి ముఖములను తిరిగి మరలా ఎలా చూడగలను. వారిలో చాలామంది ఏడ్చుచున్నారు, విమానములలో వెళుచున్నారు, మరియు సరిహద్దులు దాటి వెళుచున్నారు, మరియు అరుచుచున్నారు, మరియు మొర్రపెట్టుచున్నారు. నేను ఆలోచిస్తున్నాను, ఒకసారి వారు పౌలుతో వెళ్ళినప్పుడు, మరియు వారు మోకరిల్లి ప్రార్ధిస్తున్నప్పుడు. అతడు ఇలా అన్నాడు, "మీలో ఎవరూ నాకు తెలియదు. మీలో ఉన్న అనేకులు ఇక ముందెన్నడు నా ముఖమును చూడరు."
కాని వారు తూర్పు నుండి పడమర నుండి వచ్చియున్నారు,
వారు ఎంతో దూరప్రాంతము నుండి వచ్చారు,
రాజు యొక్క అతిథిగా భుజించుటకు, ఆయనతో విందు చేయుటకు;
ఆ శరణార్దులు ఎంతగా దీవించబడినవారు!
ఆయన యొక్క పరిశుద్ధమైన ముఖమును చూస్తున్నారు
(మరకతము యొక్క మహిమలో)
దైవిక ప్రేమతో అది వెలుగుతున్నది.
అది ఒక దీపపు వెలుగు కాదు, ఒక క్రొవ్వొత్తి వెలుగు కాదు, కాని అది ఒక దైవిక వెలుగు, ఒక మహిమతో నిండిన దైవిక వెలుగు.
ఆయన కృపలో భాగస్తులందరు దీవించబడతారు,
ఆయన కిరీటములోని రత్నముల వలె వెలుగుతున్నారు.
ఓ, దేవా.
ఎప్పుడైతే ఆ మండుచున్న నిప్పు ప్రవక్తను తాకియున్నదో,
అది అతడిని ఎంతైతే పరిశుద్ధునిగా చేయగలదో, అంతగా చేసింది,
"మా కొరకు ఎవరు వెళతారు?" అని దేవుని స్వరము పలికినప్పుడు,
అప్పుడు ఆయన ఇలా జవాబిచ్చెను, "ఇదిగో నేను ఇక్కడున్నాను, నన్ను పంపుము."
ISA 6:2-7
131ఓ, ఈ ఉదయము ఆరు రెక్కలతో ఉన్న కెరూబును, నీ దూతను పంపుము, యోషయా వారిని చూచినట్లుగా, ఈ భవనములో ఎగురుచూ, "పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, ప్రభువా నీవే పరిశుద్ధుడవు." మరియు యవ్వనస్తుడైన యెషయా ప్రవక్త ఇలా అంటున్నాడు, "నేను అపవిత్రమైన పెదవులు కలిగియున్నాను, మరియు నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను, మరియు నా కన్నులు ప్రభువు యొక్క మహిమను చూస్తున్నాయి." దేవాలయము నుండి స్తంభములు తీసివేయబడ్డాయి. మరియు ఒక దూత పట్టకారుతో బలిపీఠము నుండి తీసి, మరియు మండుచున్న నిప్పును తీసుకొనెను, మరియు అతడి పెదవులకు తాకించెను, "నీ పెదవులను నేను పవిత్రపరచియున్నాను. ఇప్పుడు, నరపత్రుడా, ప్రవచించుము."
ప్రభువా, ఈ ఉదయము ఆ దూతను పంపుము, మా పెదవులను చెడు నుండి పవిత్ర పరచుము. ప్రభువా, మా హృదయములను పవిత్రపరచి, మా లోనికి రమ్ము. మా స్వంత-చిత్తమును బద్దలు చేయుము. ప్రభువా, నా చిత్తమునకు బదులుగా నీ చిత్తము నెరవేరును గాక. ఓ దేవా, నీ చిత్తము నాలో ఉండును గాక. మరియు నాకు అనుమతిని ఇవ్వము మరియు నా సంఘమునకు అనుమతిని ఇవ్వుము. మరియు నా ప్రజలు నీవారగుటకు, ఓ ప్రభువా, అనుమతిని ఇవ్వుము. మమ్ములను మేము నీకు సమర్పించుకుంటున్నాము.
132మరియు తండ్రీ, ఒక కవి ఈ విధముగా చెప్పినట్లుగా:
పాపములో వేలమందియున్నారు మరియు అవమానములో చనిపోతున్నారు;
ఆఫ్రికాలోను మరియు దిగువన ఇండియాలోను, ప్రంపంచమంతటా, నిన్ను తెలుసుకొనక మరియు నిన్ను కలుసుకొనక గంటకు వేల మంది చనిపోతున్నారు.
పాపములో వేలమందియున్నారు మరియు అవమానములో చనిపోతున్నారు;
ఇంకనూ, దేవా! దాన్ని గురించి ఆలోచించి నా ప్రాణము ముక్కలైపోచున్నది.
వారి బాధను మరియు మొరను ఆలకించుము,
త్వరపడుము, సహోదరుడా, వారి ఆశ్రయమునకై త్వరపడుము;
త్వరగా జవాబిమ్ము, "యజమాని, నేనిక్కడున్నాను."
ప్రభువా, మాకిది దయచేయుము, దీన్ని మాకు తిరిగి దయచేయుము. తండ్రి, నేను గత సంవత్సరమంతా, నేను అన్ని రకములైన పాపములను చేసియున్నాను. వారిని నీవు క్షమించమని నేను ప్రార్ధిస్తున్నాను. మరియు ఈ నూతన సంవత్సరములో, ప్రభువా వారిని తాజాగా అభిషేకించుము. అవతల పాపములో ఉన్న అవమానములో ఉన్న చనిపోచున్న వేలకొలది జనుల దగ్గరకు వెళ్ళుటకు నాకు అనుమతిని ఇవ్వుము, నీ యొక్క నిజ ప్రత్యక్షతలోనికి వారిని తీసుకొని వచ్చుటకు అనమతిని ఇవ్వుము, వారిని అభిషేకించబడిన పరిశుద్ధాత్మ దగ్గరకు తీసుకొని వచ్చుటకు అనుమతిని ఇవ్వుము, ఆ దినమున వారు తూర్పు నుండి మరియు పడమర నుండి రావచ్చును, నీ కిరీటములో రత్నముల వలె వారు మెరుస్తారు.
ప్రభువా, నాకు సహాయము చేయుము, వారియొద్దకు వెళ్ళుటకు మరియు ఫలించుటకు మరియు వారిని నేల నుండి త్రవ్వుటకు సహాయము చేయుము, వారు నివసించుచున్న భూమి యొక్క మురికి నుండి, చెడు నుండి బయటకు తెచ్చుటకు సహాయము చేయుము. మరియు వారిని పరిశుద్ధుడైన దేవుడిని చూడనిమ్ము. దానిద్వారా వారు పవిత్రపరచబడి మరియు వారు క్రైస్తవులుగా జీవిస్తారు, శుద్దీకరించబడి మరియు పరిశుద్ధులుగా నీ ముందు ఉంటారు; చెడు నుండి వారిని త్రిప్పుము, మరియు ప్రతివిధమైన లోక సంబంధమైన వినోదముల నుండి వారిని త్రిప్పుము, మరియు వారిని జీవము కలిగిన దేవుని వైపు త్రిప్పము, ఆ గొప్ప దినమున వారిని నీ రాజ్యములో గౌరవాతిధులుగా చేయుము.
MATT 6:13•
LUKE 11:4
133ప్రభువా, ఈ ఉదయకాలమున ఈ చిన్న సంఘమును శుద్దీకరించుము. ఇక్కడున్న ప్రతివారిని నీ ఆత్మతో శుద్దీకరించుము, మరియు వారి హృదయములలోకి పరిశుద్ధాత్మను రానిమ్ము. ఎవరైతే వారి హృదయమును స్వంత చిత్తముతో తెరచియున్నారో, వారిలోని ఆత్మను నూతనపరచుము, మరియు వారు నీ చిత్తమును తెలుసుకొనునట్లుగా వారి స్వంత చిత్తమును వ్యతిరేకించియున్నారు.
ప్రభువా, ఆ యవ్వనస్తులు, వారిలో అనేక మంది చిన్నవారు, నీ చేతులలో వారికి ఎలా సేవచేసియున్నావు. తల్లి తన బిడ్డలకు ఏ విధముగా జాగ్రత్త చేస్తుందో, వారి కన్నుల నుండి నీరు తుడుస్తుందో మరియు వారిని ప్రేమించింది కనుక వారికి ప్రత్యేకమైన వాటిని అందిస్తుంది. ఆ విధముగా నీవు నూతముగా జన్మించిన నీ బిడ్డలను ప్రేమించు ప్రభువా! వారు ఇంకను నడువలేనివారు, వారు మాటలు కూడా మాట్లాడలేనివారు. వారు వారి తల్లి వైపు చూచి మరియు కేవలం మొర్రపెట్టగలరు అంతే వారికి తెలిసినది. ఓ దేవా, నీ చేతులలో వారిని పట్టుకొనుము, జాగ్రత్తగా, చిన్నగొర్రె పిల్లల మాదిరిగా, మరియు వారు ఎదిగి నడచువరకు వారిని నడిపించుము. తరువాత వారిని నడిపించుము ప్రభువా, ఆరాధానా మార్గముల ద్వారా వారిని నడిపించుము. దాన్ని దయచేయుము.
మాకు వ్యతిరేకముగా అపరాధము చేసినవారిని మేము క్షమించిన ప్రకారము, మా అపరాధములు క్షమింపుము. శోధనలు తేక, దుష్టుని నుండి మమ్ములను తప్పించుము. రాజ్యము, శక్తి, మరియు మహిమ, నిరంతరం, యేసుక్రీస్తు నామములో ఆమేన్.
134దేవుడు మిమ్ములను దీవించును! నీవు నూతన సంవత్సరము ఈ కార్యము మీద ప్రారంభించుటకు ప్రభువు ఈ ఉదయం నీకు ఏదో చేసియున్నాడు అని నేను నమ్ముతున్నాను, అది నీవు యేసుక్రీస్తును ప్రేమించాలని, మరియు ఒక దినమున నీవు ఆయనను చూడాలని కోరుకుంటున్నావని మరియు ప్రేమిస్తావని, మరియు ఆయనతో జీవిస్తావని నేను నమ్ముచున్నాను. మీలో ఏ ఒక్కరూ తప్పిపోకూడదనేదే నా కోరిక, మీలో ప్రతియొక్కరు రక్షింబడి మరియు పరిశుద్ధాత్మతో నింపబడాలన్నదే నా కోరిక, మరియు ఆయన రాకడ దినము కొరకు జాగ్రత్తపడాలనేదే నా కోరిక, ఎందుకనగా అది చాలా సమీపముగా ఉన్నదని నేను నమ్ముచున్నాను.
ఇప్పుడు, నేను ఆరాధనను తిరిగి సహోదరుడు నెవిల్ కు అప్పగిస్తున్నాను.