ప్రశ్నలు మరియు జవాబులు

ప్రశ్నలు మరియు జవాబులు

vgr count-512 1చాలా వాటిని నేను చెప్పవలసియున్నాను, కాని నేను నా కంకార్డేన్సును తెచ్చియున్నాను. ఇక్కడ కూర్చొనియున్న లియోకు గాని, లేదా నాకు దగ్గరగా కూర్చొనియున్న మరెవరికయినా గాని దీనిని ఇచ్చి నాకు సహాయము చేయమని కోరుదును. దానిని మనము కనుగొందము.

అక్కడ ఒకామె కూర్చొనియున్నది. ఆమె యొక్క భర్త ఎవరు? నీ యొద్దనే నీ భార్య కూడా కూర్చొనవలెనని నీవు కోరినయెడల కూర్చొన వీలున్నది. సోదరులకు మాత్రమే కాదు, సోదరీలకు కూడా చెప్పుచున్నాను. మీకు తెలియును. అది సమ్మతమేనా? మీరిద్దరు ఒకే చోట కూర్చొన వచ్చును. డాక్, ఆ బయట వేడిగా యున్నదా? మంచిది. కాని ఆమె కాస్త ఒంటరిగా యున్నట్లున్నది.

ఇందులో ఏమియు లేదు… నేను కొన్నిసార్లు "మగవారు అని ప్రస్తావించుటకు ఒక కారణమున్నది. కొన్ని సమయములలో మగవారు మగవారినే ప్రశ్నించుచుందురు. అక్కడ స్త్రీలు కూడా ఉందురు. మామూలుగా ఆలయములో స్థానికంగా దేనికయినా గాని జవాబు చెప్పబడును., ఎందుకనగా ఇది ఎక్కువగా సేవకులకు సంబంధించినది, వారి యొక్క విధి, వారు చేయవలసినది ఇదే.

2ఇది టేపులలో రికార్డింగ్ అగుచున్నదని నేను నమ్ముచున్నాను. నాకు ఖచ్చితంగా తెలియదు. గోడ్ సోదరుడా, ఆ రికార్డింగు ఎక్కడ జరుగుచున్నది? మంచిది. సోదరులారా, అసలయిన దానిని తెలిసికొనుట కొరకే దీనిని మనము చేయుచున్నాము. మనుష్యుల మనస్సులలో ఏమున్నదో కనుగొందము, మన విషయములను చూచుదము…

మనందరం తప్పక ఒక్కటే పలుకవలెను. ఉదాహరణకు ఎవరైనా వచ్చి ఏదయినా చెప్పిరనుకొందము… వారు ఇక్కడున్న ఒక సోదరుని ఆలయమునకు వెళ్ళుదురనుకొనండి. (నీ మొదటి పేరు ఏమిటి సోదరుడా? విలర్డ్. ఇక్కడిప్పుడు ఇద్దరు విలర్డ్ లున్నారు. వివరంగా చెప్పవలసి యున్నాను. నీ చివరి పేరు ఏమిటి? క్రీస్. సహోదరుడు క్రీస్ యొక్క సంఘము. సహోదరుడు క్రీస్ ఒక సంగతిని చెప్పును. ఆ తరువాత వారు సెల్లర్స్-బర్గ్ నుండి సహోదరుడు రడెల్ యొద్దకు వచ్చెదరు. సహోదరుడు రడెల్ వారు చెప్పిన దానిని అంగీకరించడు. వారు ఆ తరువాత సహోదరుడు జూనీ యొద్దకు వెళ్ళెదరు. అతడు మరో విధంగా చెప్పును. తరువాత ఆలయము నొద్దకు వచ్చెదరు. ఇప్పుడింకా వ్యత్యాసము కనబడును. చూచారా? జనులను గందరగోళములో ఇది ముంచును.

3"ఓ నీవు చెప్పేది నేను నమ్మను. నిజంగా నీవు పరిశుద్ధాత్మను పొందవలసియున్నావు. అది అవసరమని నేననుకొనను," అని మరొకరు వచ్చి చెప్పెదరు. సహోదరుడు క్రీస్ ఆ విధంగా చెప్పిన ఉదాహరణకు తలంచుదము. ఆ తరువాత మీరు సహోదరుడు రడెల్ యొద్దకు వచ్చెదరు. అతడేమో, "అది చాలా అవసరము," అని చెప్పును. ఆ తరువాత జూనీ యొద్దకు వెళ్ళుదువు, అతడేమో ఏదయినా ఒక్కటే అనును, చూచారా. జెఫర్సన్ విల్ లో యున్న సేవకులందరూ (ఈ సమాజములో) ఒక చోట కూడనియెడల, ఆ సంగతిని గూర్చి విచారించవలెనని నేను కోరుచున్నాను.

4ఇక్కడే చాలాసార్లు డీకనులు మరియు ట్రస్టీలు తమ విధిని శాయశక్తులా నిర్వహించవలెను. సంఘ కోశాధికారి మరియు పర్యవేక్షణాధికారి ఈ రాత్రి ఇక్కడ నాకు కనబడుచున్నారు. వారి యొక్క విధి ఏమిటో మనము తెలిసికొనియున్నాము. ఎవరయినా గాని ప్రశ్నలు వేయుచుందురు. ఎక్కడయినా ఇది జరుగును. ఎక్కడ ప్రశ్నలడిగినా గాని అక్కడే జవాబు చెప్పవలెను. అవి చాలా సామాన్య ప్రశ్నలు. ట్రస్టీల యొక్క విధులు గూర్చి ప్రశ్నించెదరు. అవి వారు చేయు కార్యక్రమములు. ఆ బోర్డు మీద ఇప్పుడవి యున్నవని నేను తలంచుచున్నాను. ట్రస్టీల యొక్క విధులు, వారు చేయవలసిన పనులు గూర్చి యున్నది. కాని నేను ఆలోచించాను బహుశ…

5ఒకటి ఇక్కడికి చేరియున్నది. అది చాలా చక్కగా యున్నదని నేను తలంచుచున్నాను. ప్రభుని చిత్తమయితే, దానిని మరి కొద్దిసేపటి తరువాత చూచెదము. జవాబు ఇచ్చెదను. ఒక ప్రత్యేకమగు సంక్లిష్ట సమయములో డీకన్ ఏమి చేయవలెను? ఒక ప్రత్యేకమగు సందర్భము వచ్చినప్పుడు డీకన్ ఏమి చేయవలెను? అతడు ఏ విధంగా ప్రవర్తింపవలెను? చూచారా? లేక ఒక ట్రస్టీ ఏమి చేయవలెను? సంక్లిష్ట సమయములో ఒక సంఘకాపరి ఏమి చేయవలెను? మామూలు కార్య సరళి మనకు తెలియును, కాని ఒక అసాధరణమైనది జరిగినప్పుడు వారెట్లు ప్రవర్తించవలసియున్నారు?

ఎటు వైపు ఒరగవలెనో మనకు తెలియదు. ఇది ఒక సైన్యమునకు శిక్షణ ఇచ్చినట్లుగా యున్నది. ప్రతి వారికి వారి వారి స్థానములు తెలియును. ఇట్టి గుంపుగా ఉన్న మనము ఇచ్చట అర్థరాత్రి వరకు యుండ వచ్చును. కాని అది అవసరమని నేను తలంచుట లేదు. దానికి మనం జవాబిచ్చెదము. ఇప్పుడు నేను కోరుచున్నాను ప్రతి…

6పేర్లు ఏమీ లేవు. కొందరయితే పేర్లు వ్రాసిరి కాని జనుల యొక్క పేర్లు నేను చదవను. నేను ప్రశ్నను మాత్రమే చదివెదను. పేర్లు వ్రాయబడినవి ఇక్కడ రెండున్నవి. ఆగండి, మరొక్కటి నాకు కనబడవచ్చును. ముసలివాడగు డాక్టర్ ఇంగిల్మన్ వ్రాసినదని నేనెరుగుదును. 426 దక్షిణ వింగ్ కు నేను ఫోన్ చేశాను. ముసలి డాక్టర్ అచటనే యుండేవాడు. మేము జార్జి టవున్ యొద్ద ఉండినప్పుడు ఈయన స్వస్థత పొందెను. చాలా కాలము సృహ లేక పరుండెను. సరే. మనం చదవబడిన మొదటి ప్రశ్న యొద్దకు వచ్చుదము.

ఇప్పుడు దయచేసి మనందరం ఒక్క నిమిషం లేచి నిలబడుదము.

7మా పరలోకపు తండ్రి, ఒక మానవ గుంపుగా ఇక్కడ మేము కూడుకొనియున్నాము. మేము నిన్ను ప్రేమించు క్రైస్తవులము. నీ యందు విశ్వసించుచున్నాము. నీ సేవ కొరకు మేము మా జీవితములను, పనులను సమర్పించుకొనియున్నాము. ఇక్కడ సేవకులున్నారు, యువకులున్నారు, మధ్య వయస్కులున్నారు. వారికి సంఘములున్నవి. వారు దేవునికి లెక్క చెప్పవలసిన వారు. ఇక్కడ డీకన్ లున్నారు. వివిధ సంఘములలో వారు తమ బాధ్యతలను నిర్వహించుచున్నారు. ట్రస్టీలు వారి విధులను నిర్వర్తించవలసి యున్నారు. వారికి బాధ్యతలున్నవి. సంఘ కాపరులు, సువార్తికులు వారి విధులు నిర్వహించవలెను. ప్రభువా, అందుకొరకే ఇక్కడికి మేము వచ్చి యున్నాము. అందరమూ వాక్యములో ఉన్నదానినే చెప్పవలసి యున్నాము. ఆ ప్రకారముగానే చేయవలసి యున్నాము. మేమందరమూ ఒకే విధంగా మాట్లాడవలెను.

తండ్రి, ఇటువంటి గుంపులో కొందరు సోదరుల మధ్య చిన్న అభిప్రాయ భేదములుండ వచ్చును. కొన్ని సంగతుల గూర్చి వేర్వేరు విధంగా తలంచవచ్చును. అసలు సత్యము ఏమిటో కనుగొనుట కొరకే కొందరు ఇక్కడికి వచ్చియున్నారు. మేము అసమర్థులమని మాకు తెలియును. ఇక్కడున్న కొందరు సోదరులను పిలచి ఈ ప్రశ్నలకు జవాబు లిమ్మని కోరినచో, బహుశా నా కంటే వారే మెరుగ్గా సమాధానము లిచ్చెదరు.

కాని మేము నీ ప్రత్యక్షత మీద ఆనుకొని యున్నాము. వాక్యము ద్వారాను, నీ ఆత్మ ద్వారాను దానిని నీవే మాకు బయలుపరచుము. ప్రతి ప్రశ్నకు మేము జవాబు పొందునట్లు చేయుము. జవాబులతో మా హృదయములను నింపుము. నీ సేవ కొరకు మరి సమర్ధులమై పని చేయు శక్తితో మమ్మును నింపి పంపించుము. ఇప్పటికన్న మరి ఎక్కువగా నీ సేవను చేయునట్లు సహాయము చేయుము. తండ్రి, ఆ ఉద్దేశ్యముతోనే ఇచ్చటికి మేము చేరియున్నాము. ఇప్పుడు దానిని అనుగ్రహించుము.

తండ్రి, మేము నీ కొరకు ఎదురు చూచుచుండగా, మా ప్రశ్నలకు జవాబులు దయచేయుము. మా మనస్సులలో ఎట్టి చిక్కులకు తావీయ వద్దు. జవాబు పూర్తిగా వచ్చు వరకు మేము ప్రశ్నతోనే నిలచియుండునట్లు చేయుము. ఆత్మ ద్వారా మమ్మును సంతృప్తిపరచుము. ఆయన సన్నిధి బట్టి మేము ఏకగ్రీవముగా సమ్మతించియున్నాము. దీనిని యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.

ISA 1:18

 

8ప్రారంభములో ఒక లేఖనమును ఎత్తి చూపెదను. ప్రవక్తయగు యెషయా ఇట్లు చెప్పెను: "రండి … మన వివాదము తీర్చుకొందమని యెహోవా సెలవిచ్చుచున్నాడు." ఈ రాత్రి అందుకొరకే మనం ఇచ్చటున్నామని నేను తలంచుచున్నాను. వివాదము తీర్చుకొందము. వివాదములను పరిష్కరించుకొందము. సంఖ్య ప్రకారముగా నేను ఈ వ్రాయబడినవాటిని ఏరుకొందును. సహోదరుడు ఉడ్ జవాబులు గల కవరు పట్టుకొనియున్నాడు. నా ప్రియు సోదరులారా, నా శాయశక్తులా ప్రయత్నించి నేను ఈ జవాబులు ఇచ్చుచున్నానని మీరు గ్రహించవలెను. నాకు అర్థమయిన విధానములో నా శాయశక్తులా.

9ఈ జవాబులు తప్పులు లేనివని ఖండితంగా చెప్పలేను. కాని లేఖనము తప్పులేనిది. అయితే ఈ జవాబులు నాకు తెలిసినంత వరకు లేఖనమునకు సరిపడునవిగా యున్నవి. ఇది మీకు తేటగా అర్థమగునని తలంచుచున్నాను. ఇప్పుడు టేపును ఇక్కడ ఉంచవలసి యున్నాము. దానిని కోరుకొను వారెవరైనా గాని పొందగలరు. లేఖనములు తప్పు కాలేవు, కాని నా జవాబులు తప్పు కావచ్చును. కావున ప్రతి ఒక్కరూ దీనిని అర్థము చేసికొనగలరని తలంచుచున్నాను. అది తప్పు కావచ్చునని నేను చెప్పితిని గనుక మీరెప్పుడైనా నన్ను ప్రశ్నించు హక్కున్నది.

ఆ ప్రశ్న మరియొకటి కావచ్చును… మీ ప్రశ్న కాకపోవచ్చును. అది మరియొకరి ప్రశ్న అయినా గాని నీవు దానిని గూర్చి ఆలోచించి యుండక పోవచ్చును, కానీ ఇక్కడ మేము సహాయము చేయుటకు ప్రయత్నించుచున్నాము. అందుకే అందరం ఇక్కడకు చేరి యున్నాము, ఎందుకనగా ఇవి చివరి దినములు, ఇవి చెడ్డ దినములు, మనము శిక్షణను పొందవలెను, పాఠములు నేర్చుకొనవలెను.

10సహోదరుడు స్ట్రయికర్, ఒక సైనికుడు; సహోదరుడు గోర్ ఆ వెనుక యున్నాడు, అతడు సైనికుడే; బహుశా సహోదరుడు రడెల్ ఇచటున్నాడు, అతడును సైనికుడే; సహోదరుడు బీలర్ యున్నాడు; సైనిక జీవితమును గడిపిన వారు చాలా మంది యున్నారు; మీరందరూ కూర్చొని ఆలోచించండి, మీకు ముందుగానే యుద్ధ తంత్రములు తెలియును, శత్రువును గూర్చి ముందుగానే తెలియును, అందువలననే వానిని మీరు రంగములో ఎదుర్కొనగలరు.

నేను ముష్టి విద్య చేసేవాడిని. నాతో పోరాడు వాని గూర్చి నాకు ముందే తెలియును. అతడేటువంటి దెబ్బను ఉపయోగించునో నాకు తెలియును. అది పై దెబ్బయో, ఎడమ గుద్దుయో, కుడి చేతి నరకుయో, కుడి ఎడమల కలయికచే కొట్టు దెబ్బయో, అతడెంత బలశాలియో, అతడి కాలి వాటము ఎటువంటిదో, అతడు కన్నులనెట్లు ఉపయోగించునో, ఏ మూల నుండి అతడు వచ్చునో మొదలగు తంత్రములన్నియూ నాకు ముందే తెలియును. ఆ వ్యక్తి ముందెట్లు పోరాడెనో శిక్షకులకు తెలియును. కావున వారు నా ఎదుట ఆ వ్యక్తి వలె పోరాడువానిని ఉంచి శిక్షణ ఇచ్చెదరు. అతడేమి చేయునో నాకు ముందుగానే తెలియునట్లు చేయుదురు.

ఈ రాత్రి అందుకొరకే మనం ఇచ్చటకు చేరియున్నాము. శత్రువునెట్లు దెబ్బతీయవలెనో మనకు తెలియును. వాని యొక్క తంత్రములు మనకు తెలియును. వానిని కదలనీయకుండా దెబ్బ కొట్టుట ఎట్లో తెలిసికొనుటకే ఈ రాత్రి మనము ఇక్కడ కూడికొనియున్నాము, ఎందుకనగా శత్రువు మనలను ప్రతి చోట ఎదుర్కొనుచున్నది.

11సహోదరుడు రాబర్సన్ ఆ వెనుకనే యుండుట నేను చూచానని అనుకొనుచున్నాను. సైనికుడనగా ఏమిటో అతనికి నిశ్చయంగా తెలియవలసి యున్నది. అతనికి నిజంగా అట్టి సమయము ఎదురయినది! ఇక్కడ ఎంతమంది సైనికులున్నారో చూడగోరుచున్నాను. సైన్యములో ఎందరు పని చేసిరో తెలిసికొనగోరుచున్నాను, ఇటు చూడండి. సైనికుల గుంపు ఇచ్చటున్నది. అయితే మీకిది తెలియును. దానిని మీరు అధ్యయనం చేసిరి గదా? సహోదరుడు రాయ్, సహోదరుడు బీలర్, ఇంకా చాలామంది యోధులున్నారు. ముందు శత్రువు గూర్చి అధ్యయనం చేయవలెను. వాడేమి చేయబోవుచున్నాడు? వాని యొక్క కదలిక ఎటు వైపు? ఆ తరువాత అతని నెట్లు ఎదుర్కొందుమో తెలియును. శత్రువు యొక్క కదలిక గూర్చి అధ్యయనము చేయుట కొరకే మనం ఇచ్చటకు చేరియున్నాము. వానినెట్లు ఎదుర్కోవలెనో తెలిసికొందుము. వానిని జయించు విధానము మనకు తెలియును.

12గుర్తుంచుకొనండి, సోదరులారా, దీనిని మీతో చెప్పుచున్నాను. వరములను ఆధారము చేసికొని ఈ చిన్న సంఘమును ప్రారంభించుట జరిగినది, చూడండి. సంఘములోనికి వరములు వచ్చును. కానీ వరములు ఉండవచ్చును, లేకపోవచ్చును… నేను మీతో చెప్పునది వినుడి. వరము ఎల్లప్పుడూ శత్రువును ఓడించదు గాని వాక్యము దానిని ఓడించును. వాక్యము ఎక్కడయినా గాని వానిని ఎదుర్కొనగలదు.

యేసు ఈ భూమి మీద ఉండగా దానిని రుజువు చేసెను. ఆయన శరీరమందు ప్రత్యక్షమయిన దేవుడు. కాని ఆయన ఎన్నడూ తన యొక్క గొప్ప వరములను శత్రువును ఓడించుటకు వాడలేదు. దానిని మత్తయిలో చూచెదము. అది మత్తయి 2 లేదా 3వ అధ్యాయములో యున్నదని తలంచుచున్నాను. కాదు, 2వ అధ్యాయములోనే యున్నది. ఆయన శత్రువును ఎదుర్కొనెను. వాక్యములో, "ఈలాగున వ్రాయబడియున్నది," అను అంశము మీదనే ఆయన శత్రువును ఎదుర్కొనెను.

శత్రువు కూడా, "ఈలాగున వ్రాయబడియున్నది," అని చెప్పెను.

"ఈలాగున కూడా వ్రాయబడియున్నది," అని ఆయన చెప్పెను. చివరగా ఆయన శత్రువును దెబ్బతీసెను. ఇచ్చట మనము అందుకొరకే కూడియున్నాము. దేవుడు మనకిచ్చిన సాధనములతోనే శత్రువును ఎదుర్కొనుచున్నాము, దానితోనే ఆయన ఎదిరించమని చెప్పెను.

2PET 1:10

 

13ఇప్పుడు, నా యొద్ద నాలుగు ప్రశ్నలున్నవి. ఇది ఒక కాగితము మీద వ్రాయబడెను. నేను వాటిని లెక్కించాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, పది. దీనిని ముగించిన వెంటనే మిగిలిన వాటిని తీసికొందును. ఈలాగు చెప్పుచున్నది:

ప్రశ్న: "బ్రెన్హాం సోదరుడా, ఈ ప్రశ్నలు క్రమము ననుసరించనిచో వీనిని తీసివేయుము. అందుకు నేనేమీ అభ్యంతరపడను. అది ప్రభువు యొక్క హస్తము కాదని నాకు అప్పుడు గ్రహింపు కలుగును." మొదటి ప్రశ్న: "బ్రెన్హాం సోదరుడా, నేను మరల సేవలోనికి రావలెనని నీవు చెప్పినది విన్నాను. దానిని నేను ఎంతో ఆలోచించాను; కానీ దానిని గూర్చి ఆయన తన వాక్కు ద్వారా ఖచితంగా మాట్లాడవలెనని ఎదురుచూచాను. నూతనముగా ఏమియూ రాలేదు, అంతము చాలా సమీపముగా యున్నదని నేనెరుగుదును. ఇంకా ప్రభువైన యేసు నాతో మాట్లాడునని నేను ఎదురు చూడవలెనా? లేక నాతో నీవు చెప్పినది చాలునని ఆయన పలుకుచున్నాడా? ఎందుకనగా నీవు ఈ దినమునకు నిర్ణయింపబడిన దేవుని ప్రతినిధివని ఎరుగుదును."

దీనికి నేను నా జవాబును వ్రాసియున్నాను. దేవుడు ఈ సోదరుని పిలచుచున్నాడు. జీవితములో ఒక పిలుపున్నది. ఒక గొప్ప సంగతిని మనము అంశముగా తీసికొని దాని మీద రాత్రంతయూ ప్రసంగించ వచ్చును. ఆ సంగతి ఏదనగా పిలుపు. "నీ పిలుపును మరియు ఎన్నికను నిశ్చయము చేసికొనుము," చూడండి. మనము పిలుపును గూర్చి ఎటూ తేల్చుకోలేని స్థితిలో యుండరాదు. నీవు తప్పక పిలువబడవలెను, లేనియెడల ఓడిపోయెదవు. మనము ఒక యుద్ధమును చేయుచున్నాము, చూచారా. సోదరుడా, నీ పిలుపు విషయములో నీవు నిశ్చయత కలిగియుండినయెడల, నీవు దేవుని యొక్క పనిని చేయగలవు.

శత్రువు నీ మీద గొప్ప పన్నాగమును ఉంచగలదు. నీవు పిలువబడినా గాని శత్రువు నీతో పిలువబడలేదని చెప్పును. ఆ విధంగా నిన్ను ఆలోచింపజేయును. నీకు పిలుపు లేదని చెప్పుచుండును; లేదా పిలువబడకుండానే పిలువబడితివని చెప్పును. మొత్తం మీద అటో ఇటో నిన్ను అయోమయములో ఉంచును. దానిని నీవు గమనించ వలసియున్నావు.

14చేయవలసిన విధానమును చూడండి. ఇది సలహా మాత్రమే. నేనిది ఒక్కటే సలహాగా చెప్పగలను, చూచారా. నీ పిలుపు దేవుని నుండి స్వయముగా వచ్చినట్లు నీవు గ్రహించవలెను. నీ ఉద్దేశ్యములను, గమ్యములను పరీక్షించుకొనుము, చూచారా. నా భావము మీరు గ్రహించియుందురు. మీరే ఉద్దేశ్యముతో బోధించుచున్నారు? నీ మామూలు పనికంటే ఇది తేలికయినదని భావించుచున్నావా? అలాగు నీవనుకొనుచున్నచో, అది పిలుపు కాదు. కాబట్టి దానిని విడిచిపెట్టుము.

దేవుని యొక్క పిలుపు నీకున్నచో, నీ హృదయము మండుచుండును. దానిని గూర్చి నీవు దీవారాత్రులు విశ్రాంతి తీసికొనక శ్రమించెదవు. దాని నుండి నీవు దూరముగా పోజాలవు. అది నిన్ను నిరంతరము నలుపుచుండును.

15నీవు వేరే అభిప్రాయము కలిగి బోధించుచున్నయెడల, నీవు ఇట్లు తలంచుచుందువు, "నాకు మంచి ఉద్యోగము దొరికినది. సువార్తికునిగా లేదా సంఘ కాపరిగా నేను జయము పొందుదును. మంచి జీతమిచ్చుచున్నారు. చక్కని ఇల్లు ఏర్పాటు చేసిరి. నేను పలు ప్రాంతములకు వెళ్ళుచున్నాను. హాయిగా జీవించుచున్నాను. ఈ పని చాలా బాగున్నది." చూడు, అసలు నీ ప్రారంభ ఉద్దేశ్యమే తప్పు. అది సరియైనది కాదు, చూచారా. ఆ విషయములో నీవు తప్పు చేసియున్నావు.

కొందరు ఇట్లు తలంచుచుందురు, "నేను ప్రజలలో గొప్ప పేరు సంపాదించుకొందును." చూడండి, నీవు పెద్ద ప్రమాదము యొక్క అంచులో యున్నావు. ఇది నిజము, చూడు.

కాని నీ ఉద్దేశ్యము ఇట్లుండవలెను, "బిస్కెట్టు ముక్కలు తిని, ఏటి లోని నీళ్ళు త్రాగి అయినా గాని నేను సువార్తను బోధించెదను. దేనిని లెక్క చేయను. చావైనా సరే నేను సువార్తను బోధించెదను." నిన్ను ఏదో బలవంత పెట్టుచున్నది. చూచావా? దేవుడు నిన్ను కదిలించుచున్నాడు గనుక ఎక్కడికయినా నీవు వెళ్ళెదవు. దేవుడు తన్ను తాను నీకు బయలుపరచుకొనెను. దేవుడు నిన్ను విశ్రమింపనీయడు.

దేవునిచే పిలువబడిన మనుష్యుడు సాధారణంగా ఎన్నడూ కూర్చొనియుండలేడు. దానిని గూర్చి నీవెన్నడయినా ఆలోచించావా?

16ఈ మధ్యనే ప్రశస్త సోదరులు కొందరు నన్ను ఇట్లు ప్రశ్నించిరి, "బ్రెన్హాం సోదరుడా, మేము దారిలోనికి వచ్చియున్నాము. ప్రభువును కనుగొని పరిశుద్ధాత్మను పొందియున్నాము. ఇక మేము సేవ చేయుట కొరకు వరములను వెదుకవలెనా?"

"ఎన్నడూ ఆ పని చేయవద్దు," అన్నాను. చూచారా? అటువంటివి చేయమని జనులకెన్నడూ సలహా ఇయ్యవద్దు, ఎందుకనగా ఎవరయితే ఆ విధంగా చేయవలెననుకొందురో వారు దానిని చేయజాలరు.

అట్టివాటి కొరకు ఆశించక పారిపోవుచున్న వానిని దేవుడుపయోగించుకొనును, చూచారా. దాని నుండి దూరమగుటకు అతడు ప్రయత్నించును. అటువంటి వాటిని పొందకుండా యుండవలెననుకొను వ్యక్తిని దేవుడు ఉపయోగించుకొనును. పారిపోవ ప్రయత్నించు వారిని.

కాని వాటిని ఎలాగయినా సరే సాధించవలెననుకొను వ్యక్తి ప్రగల్భములను పలుకుచున్నట్లుగా వారు మొదట గ్రహించెదరు. నీవీలాగున చెప్పెదవు, "ప్రభువా, పర్వతములను కదిలించు శక్తిని నాకిమ్ము. నీవు నన్ను పర్వతములను కదపగలుగునట్లు చేసినచో నీ కొరకు నేను ఏదయినా చేయగలను." అతడసలు ఏమియూ చేయలేడు. అతడు తనను తానే సరియైన వైఖరిలోనికి కదుపుకోజాలడు, చూడండి, కావున దేవుని కొరకు ఎన్నడును అతడు కొండలను పెకిలించజాలడు.

GAL 1:16-18•

HEB 12:1

 

17ఉదాహరణకు పౌలును చూడండి. పౌలు తన పిలుపును దూరము చేసికొన్నాడని మీరు చెప్పగలరా? ఓ, సోదరుడా! దానినతడు చేయజాలడు. అది అతనిలో దివారాత్రులు మంట పుట్టించుచున్నది. చివరికతడు తన సంఘమును విడిచిపెట్టెను. సమస్తము అతడు త్యజించెను. ఆసియాలోనికి వెళ్ళియున్నాడని నేను నమ్ముచున్నాను. అది నిజమేనా? అక్కడ మూడు సంవత్సరములుండెను, లేఖనములను చదువుచుండెను. అవి సరిగా యున్నవో లేదో చూచుచుండెను. నిజంగా దేవుడు తనను పిలచెనో లేదో చూచుకొనుచుండెను.

సోదరుడా, దేవుడు కనుక నిన్ను పిలచుచున్నయెడల, అది నీ హృదయమును త్రవ్వుచుండును, అప్పుడు నేను చెప్పుదును, "సుళువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును ప్రక్కకు పెట్టుము." చూచారా? కాని అది నిన్ను త్రవ్వకున్నచో, నేను దాని గూర్చి అసలు పట్టించుకొనను. దాని చోటుకు దానిని రానిమ్ము.

18ఈ సోదరుడు ఇక్కడ చెప్పిన దానిని చూడండి:

ప్రశ్న: "బ్రెన్హాం సోదరుడా… అతడితో చెప్పమని దేవుడు నాతో మాట్లాడునని నీవనుకొందువా…?"

దేవుడు సూటిగా అతనితోనే మాట్లాడునని నేను నమ్ముచున్నాను. మనము గొప్పవారమని కాదు గాని ఆయన మనతో మాట్లాడును, ఆయన మనతో మాట్లాడును. చూడండి, ఆయన మనతో మాట్లాడును.

ఆయన నాతో చెప్పినయెడల, ఆ సోదరుడు ఇట్లనును, "ఆయన బ్రెన్హాం సోదరునికి చెప్పెను గనుక దేవునికి స్తోత్రము!"

చూడు, నీకు పిలుపును దయచేయువాడు సహోదరుడు, బ్రెన్హాం కాడు. ప్రభువైన యేసు నీకు పిలుపును ఇచ్చును, చూచారా. ప్రభువైన యేసు నీకు పిలుపును ఇచ్చినయెడల, ఆయనే నీతో మాట్లాడును, చూడండి. నేను నీ చెవులకు వినబడునట్లు మాట్లాడ వచ్చును, కానీ క్రీస్తు నిన్ను సేవకు పిలిచినప్పుడు అది నీ హృదయమునకు వినబడును, చూచారా. అది లంగరు వేయబడవలసిన చోటు అదే, దాని నుండి నీవు దూరము కాజాలవు.

ఇప్పుడు రెండవ ప్రశ్న చూద్దాం…

ఇంకా ఆ విషయములో మీకేదయినా ప్రశ్న యుండ వచ్చును, చూడండి. ఒకని యొక్క పిలుపు అతని హృదయమునకే తెలియును. దేవుని యొద్ద నుండి రావలసి యున్నది. ఈ ప్రశ్నను వ్రాసిన సోదరుడెవరో నాకు తెలియును. చూడండి, అతనిని నేనెరుగుదును. ప్రశస్తమగు, ప్రియమగు చక్కని సోదరుడు. అతనికి నిజంగా దేవుని యొక్క పిలుపు ఉన్నదని నేను నమ్ముచున్నాను. అయితే నా మాటను బట్టి అతడు దానిని చేయుట కాదు (ఆ కారణము చేతనే ఈ విధంగా నేను జవాబు ఇచ్చాను), "ఫలాని సోదరుడు సేవలోనికి వెళ్ళవచ్చునని నేను చెప్పుట కాదు," చూచారా.

19"సహోదరుడు బ్రెన్హాం సేవలోనికి వెళ్ళమని నాతో చెప్పెను గనుక నేను వెళ్ళానని," నీవందువు. సహోదరుడు బ్రెన్హాంకు ఏదో జరిగితే? నేను చనిపోవచ్చును, లేదా దూరమైపోవచ్చును. అంతటితో నీ పిలుపు ముగియును. సోదరుడా, యేసు నిన్ను పిలచినయెడల, నిత్యత్వము నిలచినంత కాలము దానిని నీవు కొనసాగించెదవు, చూచారా. నీవెక్కడ నిలబడియున్నావో నీకు తెలియును.

ఇప్పుడు రెండవది… ఇది చివరి దినమని ఎరుగుదుమని సోదరుడు చేసిన దానిని నేను ప్రశంసించుచున్నాను. ఆ సోదరుడు మనము చివరి దినములలో యున్నట్లుగా గ్రహించిన దానిని బట్టి ఎంతో నేను ఆనందించుచున్నాను. అతని హృదయ యధార్థతను చూడండి, క్రీస్తు కొరకు ఏదో చేయవలెనని కోరుచున్నాడు.

20తరువాత ప్రశ్న:

"మన ప్రస్తుత ప్రభువు నన్ను ఆయన కొరకు ఏదయినా చిన్న పని చేయమని కోరుచున్నయెడల, నేను సేవచేసిన సమాజము యొద్దకు మరల వెళ్ళవలెనా? (క్షమించండి. చిన్న తప్పున్నది), వారికి సత్యము చెప్పువలెనని ప్రయత్నించుచున్నాడు. వారి పట్ల ఎంతో భారము కలిగియున్నాడు."

వద్దు, సోదరుడా! అదే సమాజము యొద్దకు తిరిగి వెళ్ళవలసిన అవసరము లేదని తలంచుచున్నాను. ప్రియ సోదరుడా, ప్రభువు నిన్ను పిలచినప్పుడు ఒకప్పటి సమాజము యొద్దకు మరల నిన్ను వెళ్ళమనక పోవచ్చును. బహుశా కొన్ని నేర్పును. ఇప్పుడు నీవు వేరయిన వాటిని నేర్చుకొందువు. ఒకప్పుడు నీవు తెలిసికొనిన వాటికి భిన్నమైన వాటిని నేర్చుకొందువు. ప్రభువు, నిన్ను నిజంగా పిలచినప్పుడు, ఆయన నిన్ను ఎక్కడికయినా పంపవచ్చును, చూచారా. ఒక ప్రత్యేకమగు తెగ యొద్దకు మాత్రమే వెళ్ళవలసియుండవు.

అక్కడ నీవుండినప్పుడు యధార్థముగా ఉంటివి. ఈ ప్రశ్నలను వ్రాసిన సోదరుని నేనెరుగుదును. బహు లోతయిన యధార్థతతో, ఒక నిజమగు క్రైస్తవునిగా నీవు శాయశక్తులా పని చేసియున్నావు. నీకు చేతనయిన దానిని చేశావు. దేవుడు కోరునదంతయూ అదే, చూచారా. దేవుడు ఆ సమాజము నొద్దకు తిరిగి పిలచినయెడల, మంచిదే. ఆయన అలాగు చెప్పనిచో, ఆయన ఎక్కడికి పంపునో అచ్చటికి వెళ్ళుము. ఇంకేదయినా ప్రశ్న యున్నదా?

21మూడవ ప్రశ్న :

క్రీస్తు యొక్క శరీరములో తనకున్న సరియైన స్థానమును ఒక వ్యక్తి ఎట్లు తెలిసికొనగలడు?

అది మంచి ప్రశ్న, చాలా మంచిది. ఈ రాత్రి మనలో చాలా మంది మధ్య ఆ ప్రశ్న యున్నది. నిజంగా నీకెట్లు తెలియును? క్రీస్తులో తనకు గల స్థానము గూర్చి లేదా క్రీస్తు కొరకు తాను నెరవేరవలసిన భాగము గూర్చి ఈ సోదరుడు తెలిసికొన గోరుచున్నాడు.

ఉదాహరణకు చెప్పెదరు, సోదరుడా, నీకు అత్యుత్తమమగు జవాబును ఇచ్చెను. క్రీస్తు నందు నీకున్న స్థానమేమిటో పరిశుద్ధాత్మ ద్వారా నీకు బయలుపరచబడినది. అది పరిశుద్ధాత్మ కాదో, అవునో నీవు తెలిసికొనవలెను. నీవు చేయుచున్న పనిని ఆయన దీవించుచున్న యెడల అది ఆయనే అని నీవు కనుగొందువు.

22కొంత కాలం క్రిందట ఒకరు నాతో ఇట్లనిరి, "ప్రభువు నన్ను బోధించుటకు పిలచెను."

"అయితే బోధించుము," అన్నాను, చూచారా.

నిజంగా అది అంతేనని నేను తలంచుచున్నాను. సాతాను ఆ విధంగా ఒకరిని మభ్యపెట్టును, అలాగు చేయుట వానికి ఇష్టము. అప్పుడు ప్రపంచమంతా అతనిని వ్రేలు పెట్టి చూపును. తమకు భాషలు మాట్లాడు వరమున్నదనియు, భాషలకర్థము చెప్పు వరమున్నదనియు, దైవిక స్వస్థత చేయగల వరమున్నదనియు కొందరు తలంచెదరు. కొన్నిసార్లు ఆ విషయములలో పొరబడెదరు, చూడండి. కొన్నిసార్లు వాటిని కలిగి యుండియు పొందలేదని తలంచుచుందురు. కావున ఇది చాలా యుక్తిగా యున్నది.

23సోదరులారా, ఎల్లప్పుడూ ఈలాగున చేయుడి. ఒక పనిని చేయవలసి యున్నట్లుగా నీవెప్పుడు తలంచుచుందువో, మొదట దానిని గూర్చి లేఖనమేమి చెప్పుచున్నదో కనుగొనుము - వాక్యములో అది ఉన్నదేమో కనుగొనుము. ఒక్క చోట వ్రాయబడి యుండుట కాదు, కాని బైబిలంతటిలో దానిని గూర్చి వ్రాయబడిన వచనములను చూడుము. నీ స్థానమేమిటో తెలిసికొనుము. నీవు సువార్తికునివైనచో, సంఘ కాపరి వైనచో, బోధకుని వైనచో, ప్రవక్త వైనచో, లేదా ఎందుకొరకు దేవుడు నిన్ను పిలచెనో అందులోనే యుండుము, చూచారా. నీకు భాషలు మాట్లాడు వరముండ వచ్చును, భాషలకర్థము చెప్పు వరము నీవు కలిగి యుండవచ్చును, సంఘములో తొమ్మిది రకములగు వరములున్నవి, వాటిలో ఏదో ఒకటి నీకుండి యుండ వచ్చును, సంఘములో నాలుగు రకములగు బాధ్యతలున్నవి, ఏ స్థానమైనా, దేవుడు పిలచెనో లేదో మొదట చూచుకొనుము.

మామూలుగా నేనీలాగు తలంచుచుందును. నేను ఒక వ్యక్తి యొక్క స్వభావమును పరీక్షించి అతనిలో ఏ వరమున్నదో గమనించుచుందును. దేవుడు తాను సృజించిన వ్యక్తితో తాను సృజించిన విధంగానే పని చేయును, చూచారా. ఆయన ఒక సృష్టి చేయును…

24అతని యొక్క జీవన విధానము అతడు చెప్పుకొనుచున్న పిలుపునకు వేరుగా ఉండినయెడల, అది సరయిన పిలుపు కాదని నీవు గ్రహించగలవు. సంఘ కాపరిగా పిలువబడినవాడు దానికి తగిన విధంగానే ప్రవర్తించవలెను. సంఘకాపరి స్థిరబుద్ధి గలవాడై యుండవలెను, చూచారా.

"దేవుడు ఓ ఉపదేశకునిగా యుండుటకు నన్ను పిలచెనని నీవు చెప్పువచ్చును." అతడు వాక్యమును ఎలాగు చెప్పుచున్నాడో గమనించుము, చూచారా. అతడు గందరగోళములో యుండి అయోమయముగా ప్రవర్తించుచున్నయెడల, నీవు దానిని గ్రహించగలవు, చూచారా.

నీ స్థానము ఏమిటో నీకు బాగుగా తెలియుచుండును. దానిని నీవు చేయగలవో లేదో నీకే తెలియును.

25దేవుడు నన్ను సువార్తికునిగా యుండుటకు పిలచినయెడల, నేను సంఘకాపరిగా యుండజాలను. ఇక్కడే యుండుట బాగుండనని నేను తలంచాను. ప్రభువు నన్ను పిలచెను. చివరకు జనులందరూ కలిసి వెళ్ళిరి. ఈ రాత్రి ఇక్కడ ఒక్కరు కూడా మిగిలి యుండలేదు. వారు మొరపెట్టి, 1717 స్ప్రింగ్ వీధికి వచ్చిరి. ఇక్కడున్న శ్రీమతి. హాకిన్స్ నన్ను కలిసిని ఇట్లు చెప్పినది (నిరాశా సమయములో ఏడ్చు చుండెను, పొరుగునున్న వారొకరు చిక్కుడు కాయలు వండగా మేమందరము వచ్చి దానిని భుజించాము), ఆమె ఇట్లనినది, "నీవు ఆలయం నిర్మించెదనన్నప్పుడు మా పిల్లలను భోజనమునకు పంపుదును," చూచారా?

నేను సువార్తికునిగా పిలువబడితిని. ఇక్కడే మూలరాయి వేశాము, ఈ రాత్రి దీనిని మీరు బ్రద్దలు కొట్టి చూచినయెడల, నా బైబిలులోని ఒక పేజీని మీరు కనుగొందురు. ఆయన నన్ను సువార్తికునిగా ఉండమని పిలచెను, చూచారా. నేను సంఘ కాపరిగా రాణించలేదు. రాణించను కూడా, ఎందుకనగా నాకు సహనము లేదు మరియు సంఘ కాపరికి అదే కావలెను, చూచారా. నేను సంఘ కాపరిగా యుండుటకు ప్రయత్నించినయెడల, చాలా దూరంగా నా పిలుపును త్రోసివేసినట్లే. సువార్తికునిగా నేనుండవలెను.

నా భావమును గమనించారా? ప్రభువు నిన్ను పిలచిన విధానమును నీవు చూడగలవు. ఆ శరీరములో నీ స్థానమేమిటో గ్రహించగలవు. ఏదయినా ప్రశ్న యున్నదా?

JOHN 6:44

 

26ప్రశ్న: "పరిశుద్ధాత్మతో నింపబడిన వారందరూ ఎప్పుడో ఒకప్పుడు భాషలతో మాట్లాడుదురా?"

అది మొదటి ప్రశ్న, దీనిని నాలుగవ ప్రశ్నగా ఇచ్చట నేను కేటాయించాను గాని మొదట దీనిని చెప్పెదను, చూడండి.

"పరిశుద్ధాత్మను పొందిన వారందరూ ఎప్పుడో ఒకప్పుడు భాషలలో మాట్లాడేదరా? వారందరి కంటే మరీ ఎక్కువగా నేను భాషలతో మాట్లాడెదనని పౌలు చెప్పెను."

నాలుగవ ప్రశ్న: "పరిశుద్ధాత్మతో నింపబడిన వారందరూ ఎప్పుడో ఒకప్పుడు భాషలతో మాట్లాడుదురా?"

సోదరుడా, ఇది చాలా లోతయిన ప్రశ్న. ఇప్పుడు, దీనికొరకు మరికొన్ని జవాబులను నేను కలిగియుందును.

పరిశుద్ధాత్మలో ఒక భాగమే నీతీకరణము. దేవుడు నిన్ను పిలువ వలెను, లేనిచో మరెన్నడూ నీవు పిలువబడవు. నీకు నీవుగా ఏమియూ చేయజాలవు. "నా తండ్రి మొదటగా ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాజాలడు." అది నిజమేనా? కావున నీతీకరణములో ఒక భాగముగా పరిశుద్ధాత్మ యున్నది.

27ఒక లూథరన్ డీన్ కు ఒకసారి జొన్న పొలము గూర్చి వివరించాను. ఒకడు వెళ్ళి జొన్న విత్తనములను నాటెను. ఆ మరుసటి రోజున వెళ్ళి చూచెను గాని ఏమియూ కనబడలేదు. ఆ తరువాత కొద్ది రోజులకు అతడు పచ్చని చిగురులను చూచెను. "నా జొన్న పొలమును బట్టి దేవునికి స్తోత్రములు," అని చెప్పెను. "అతనికి జొన్న పొలమున్నదా?" అని నేనడిగాను.

"భవిష్యత్తులో" అని ఆ లూథరను డీన్ చెప్పెను.

నేను చెప్పను. "అది నిజమే. భవిష్యత్తులో అతుడు కలిగియుండును. మీ లూథరనులు కూడా అలాగే యున్నారని చెప్పాను. నెమ్మది నెమ్మదిగా చివరలు ఎదిగెను. కాండము బయటకు వచ్చెను. అదే మెతడిస్టు. పంటలో రెండవ దశను మనము చూచెదము. (అది నిజమని నేననుకొనుచున్నాను. వ్యవసాయము చేయు సోదరులున్నారు.) కాండము, ఆకు దేనికది గొప్పగా చెప్పుకొనదు. ఒకదానికొకటి అవసరమై యున్నది. పుప్పొడి రాలిపోవును. మరల ఆకు బయలుదేరును, ఆకు రావలసి యున్నది. ఆ తరువాత వెన్ను వచ్చును. అదే పెంతెకోస్తు, వరముల పునరుద్ధరణ, మరల పూర్వ స్థాయికి వచ్చినది. వెన్ను బయటకు వచ్చినది. కాండము అక్కర లేదని ఆకు. ఆకు అవసరము లేదని కాండము అనవు."

28ఆ బీజ దళములో యుండిన జీవమే పలు దశలుగా మారి గింజగా మారినది. కాండములోను, పుప్పొడిలోను ఉన్నదే గింజగా మారుటకు దోహద పడినది. కావున భాషలతో మాట్లాడుచున్న పరిశుద్ధాత్మయనగా ఏమిటి? అది మరింత ముందుకు పోయిన నీతీకరణ, చూచారా. పెంతెకొస్తు సంఘమనగా ఏమిటి? ముందుకు వెళ్ళిన లూథరన్, చూచారా.

ఇప్పుడు ముందుకు వెళ్ళుట వచ్చియున్నది. అయితే ప్రశ్న ఇది, "నేను అప్పటి వలెనె నిలచియుండవలెనా?" వద్దు. వద్దు, గింజ పరిపక్వమైనది, చూచారా. గింజతోనే ముందు ప్రారంభము. గింజ అనగా వాక్యము. దానితోనే ప్రారంభము. దాని వలన నీతీకరణ వచ్చును. శుద్ధీకరణను పొందువరకు నీతీకరణలోనే నిలచియుండుము. పరిశుద్ధాత్మను పొందువరకు శుద్ధీకరణలోనే నిలచియుండుము.

29నీవు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఏమి జరుగును? ఇంకా ప్రశ్న యున్నది. కాదా? సరే చూడండి. భాషలతో మాట్లాడుట అనగా ఏమిటి?

భాషలతో మాట్లాడుట అనగా పరిశుద్ధాత్మ యొక్క ఒక బాప్తిస్మము తప్ప మరేమియూ కాదు. అది నిన్ను నీతిమంతునిగా తీర్చి శుద్ధీకరించెను. అది నింపుదల నిచ్చును. ఈ ప్రశ్న నాకు కావలెను. ఈ ప్రశ్నను ఇతడడుగునని నాకెన్నడూ తెలియదు. దేవునికి తెలియును.

ఇక్కడ చాలా వేడిగా యున్నచో, ఆ తలుపు తెరవుడి. నిద్ర మత్తు వచ్చినచో నిలబడుడి, ఎందుకనగా దీనిని జాగ్రత్తగా వినవలెను. నిజంగానే కొద్దిగా వేడిగా యున్నది కాబట్టి మీకు నిద్ర రావచ్చును.

30ఇప్పుడు, దీనిని గమనించండి: నీతీకరణ, శుద్ధీకరణ, మరియు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము.

ఇప్పుడు ఇటువైపు చూడండి. దీనిని నేనుదహరించెదను. నేను ఒక పాపిని. నేను ఇటు వైపు నడచుచున్నాను. కొంత కాలము తరువాత ఎవరో నాతో మాట్లాడిరి. దేవుడు తప్ప మరెవరూ నన్ను మార్చజాలరు. అది నిజమేనా? నేను ఇటు వైపు తిరిగాను. నేను వెనుదిరుగుటయే నీతీకరణ అందును. అది నిజమే గదా? ఇప్పుడు నేను క్రీస్తునే గురిగా పెట్టుకొని నడిచి వెళ్ళుచున్నాను.

మంచిగా జీవించుటకు ఒక దారిని నేను ఎంచుకొన్నాను. నేను నీతిమంతునిగా తీర్చబడియున్నాను. ఆయనతో మాట్లాడగల స్థాయికి నేను చేరుకొనియున్నాను. ఇంకా నన్ను బట్టి నాకు సిగ్గు కలుగుచున్నది. ఇంకా నేను కొన్ని చేయరాని పనులు చేయుచున్నాను. నాకు ఎత్తు పల్లములు ఎప్పుడూ తప్పుట లేదు. కాని వాటన్నిటిలో నుండి నన్ను శుద్ధీకరించమని ఆయనను అడుగుచున్నాను. నిజంగా ఆయనతో నేను మాట్లాడగలను, నడువగలను, చూచారా. మంచిది, ఇది శుద్ధీకరణ స్థాయి. అది నన్ను ఏమి చేసినది? సరిదిద్దినది, చూచారా.

31ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ యొద్దకు వెళ్ళుచున్నాను, చూచారా. ఇక్కడికి నేను వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందియున్నాను. అది నిజమేనా? పరిశుద్ధాత్మ ఏమి చేయును? అది నాకు శక్తిని ఇచ్చును, బోధకునిగా నుండుటకు శక్తినిచ్చును, గాయకునిగా ఉండగల శక్తినిచ్చును, భాషలతో మాట్లాడగల శక్తిని ఇచ్చును, భాషలకర్దము చెప్పగల శక్తిని ఇచ్చును. అది పూర్తి శక్తియై యున్నది, ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుని శక్తియైయున్నది. నన్ను మళ్ళించినది దేవుని శక్తియైయున్నది. నన్ను శుద్ధీకరించినది దేవుని శక్తియైయున్నది. నన్ను నింపినది దేవుని శక్తియై యున్నది.

32ఒక ప్రత్యేక సమయములో ఇక్కడ నేను నిలబడి ఒక విషయము గూర్చి చెప్పవలెనని ప్రయత్నించుచుండగా, దేవుని యొక్క శక్తి నా మీదికి దిగి వచ్చెను. నేను ఏమి మాట్లాడలేకపోయాను, చూచారా. నేను నత్తిగా ముచ్చటించాను. "సోదరులారా" అని చెప్పబోయాను.

ఇక్కడది ఈ విధంగా యున్నది. ఈ విధంగా దానిని నేను వివరించెదను. మీరు నిశ్చయముగా దీనిని గుర్తించవలెనని సోదరులకు దీనిని నేను చెప్పుచున్నాను. "సోదరుడా, నీవెట్లున్నావు?" చూడండి. ఇంకా నేను దోషిగానే యున్నాను. "మీలో ఒకడిని అయినందుకు న్యాయంగా నేను సంతోషించుచున్నాను. నాకు ఎంతో సంతోషముగా యున్నది, మీరు చూచారా." మరి కొంత సేపటికి ఏమగును? మీరు నా వైపు చూచుచున్నారని నాకు తెలియును. ఇంకా నేను అలాగే చేయుచున్నానని నాకు తెలియును. లోకము యొక్క అపవిత్రతను ఇంకా నేను విడిచిపెట్టలేదు గాని, సోదరుని వలె నటించుచూ ఉండవచ్చును.

ఆ తరువాత కొంతసేపటికి నేను శుద్ధి పొందుదును. ఇప్పుడు ఏదో జరిగినది. నేను శుద్ధీకరించబడి యున్నాను. నీ ముఖంలోనికి నేను సూటిగా చూడగలను. నేను మీలో ఒకనిగా ఉందును, చూచారా. "మంచిది, సోదరులారా, దేవునికి స్తోత్రము! ఈ పరిశుద్ధాత్మ గుంపులో ఉన్నందుకు సంతోషించుచున్నాను. పరిశుద్ధులగు సోదరుల మధ్య ఉండుటకు నేను సంతోషించుచున్నాను." ఎందువలన? మీరు నా వైపు వేలు పెట్టి చూపించలేరు. నేను శుద్ధీకరించబడియున్నాను. దేవుడు నన్ను సేవలో ఉపయోగించుకొననై యున్నాడు. అవునయ్యా!

"బ్రెన్హాం సోదరుడా, నీవు నీతిమంతునిగా తీర్చబడినావా?"

"అవును! ఒకప్పుడు మీ వైపు సూటిగా నేను చూడలేకపోయాను. సోదరుడా, ఇప్పుడు నీ కళ్ళలోనికి చూడగలను."

33చూడండి, మనము ఇక్కడ ఉన్నాము. ఈ మరియొకటి ఏమిటి? పరిశుద్ధపరచబడి, సేవ కొరకు ఒక చోట పెట్టబడినది. ఇది సేవలోనికి వచ్చుచున్నది. శుద్ధీకరణ అను మాటను గ్రీకులో చూడండి. దానికి గ్రీకులో చాలా అర్థములున్నవి. "పరిశుద్ధపరచబడి సేవ కొరకు ఒక చోట పెట్టబడినదని అర్థము. పాత్రను శుద్ధి చేసిరి, బలిపీఠము యొద్ద పెట్టిరి మరియు సేవ కొరకు ఉపయోగించబడును. అయితే సేవలో యుండుట అనగా నింపబడిన పాత్రగా ఉండుటయే.

నేను ఇక్కడ నుండి సేవలోనికి వచ్చుచున్నాను. నన్ను త్రిప్పినవాడు దేవుడే, ఆయన చెప్పుచున్నాడు, "నా మాట వినుము! నా మాట వినుము! నా మాట వినుము!"

నా భావమును మీరు గ్రహించారా? చూచారా? [సహోదరుడు బ్రెన్హాం, భాషలలో మాట్లాడుటను వివరించుచున్నారు] చూచారా, మీరు నింపబడి… అంతే. అక్కడే మీరున్నారు, భాషలతో మాట్లాడుట అనగా అదే.

MATT 7:20•

GAL 5:22,23

 

34ఇప్పుడు నేను దీనిని నమ్ముచున్నాను: భాషలు మాట్లాడుటయే పరిశుద్ధాత్మకు రుజువు అనుటను నేను నమ్ముట లేదు. అది సూచన కాదు! ఎందుకనగా మాంత్రికులు, దయ్యము పట్టినవారు, పాముల నాడించువారు, భూత వైద్యులు, భాషలతో మాట్లాడుటను నేను చూచియున్నాను. అది కేవలము దేవుని నుండి వచ్చినదని చెప్పలేము. నీవును భాషలతో మాట్లాడ వచ్చును. కాని గుర్తుంచుకొనండి, పరిశుద్ధాత్మ భాషలలో మాట్లాడగలదు మరియు దానిని అపవాదియు అనుకరించగలదు.

నీవు పరిశుద్ధాత్మను కలిగి యున్నావనుటకు రుజువు నీవు జీవించుచున్న జీవితమే, "వారి ఫలములను బట్టి మీరు వారిని తెలిసికొందురు." భాషలతో మాట్లాడుట ఆత్మ యొక్క ఫలము కాదు. (వాక్యములో ఎక్కడా లేదు) అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము, సాత్వికము, సహనము. చూడండి, అది ఆత్మ ఫలము. ఫలమును చూచి నీవు అది ఏ చెట్టుయో చెప్పగల, చూచారా. అదే…

బోధకుల వైపు, డీకన్ ల వైపు, ట్రస్టీల వైపు, సువార్తీకుల వైపు జనులు చూచుచున్నారు. వీధిలో నిలబడి దినమంతా నీవు భాషలలో మాట్లాడ వచ్చును, వారెన్నడూ నిన్ను నమ్మరు. కాని నీవు మాట్లాడుతున్న ప్రకారముగా జీవించినప్పుడు, ఆ మాధుర్యమును చూపించినప్పుడు, నీలో నున్న చేదు వేరులన్నియూ తెగిపోవును, నీలో ఏదో ఉన్నదని జనులు గ్రహించెదరు.

35భాషలతో మాట్లాడుట… దీనిని నేను తప్పక నమ్ముదును. దేవుని యొక్క బలిపీఠము క్రిందికి వచ్చి, ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తి ఏదో ఒక సమయములో భాషలతో మాట్లాడును. కానీ అసలు దేవుని గూర్చి ఏమి ఎరుగని వారు చాలా మంది భాషలలో మాట్లాడుటను నేను చూచాను, చూచారా. వారికసలు ఆయనను గూర్చి తెలియనే తెలియదు, అయినా గాని వారు భాషలు మాట్లాడుచున్నారు. ఆ వరములలో దేనినయినా గాని అనుకరణ చేయవచ్చును, చూడండి.

అంతరంగమందు ఏ ఆత్మ యున్నదో ఆత్మ యొక్క ఫలము నిరూపించును. యేసుక్రీస్తు యొక్క జీవమునకు మీరే సాక్షులు. యాపిలు చెట్టులో గాని, పీచ్ చెట్టు రసమున్న యెడల, అది బహు స్వయముగా పీచ్ పండ్లు కాయును. అది నిజము, చూడండి, ఎందుకనగా దాని లోపట ఆ జీవమున్నది.

36అదే, ఇక్కడ కూడా వర్తించును. దీనిని మీరందరూ అర్థము చేసికొనగలరు. మనందరికీ ఇది తెలియును. ఆత్మ నింపుదల గల వ్యక్తి బాప్తిస్మము ద్వారా క్రీస్తు లోనికి వచ్చును. భాషలతో మాట్లాడుట బాప్తిస్మము యొక్క సూచన కాదు, చూచారా.

అపవాది యొక్క శక్తి ద్వారా నీవు బాప్తిస్మము పొంద వచ్చును. అపవాది యొక్క మోసపుచ్పు ఆత్మ ద్వారా నీవు భాషలతో మాట్లాడ వచ్చును. దానిని మనం ఎన్నిసార్లు చూడలేదు? నేను దానిని ఎన్నోసార్లు చూచాను. వారు మానవ కపాలములో నుండి రక్తమును త్రాగుచూ భాషలలో మాట్లాడుటను నేనెరుగుదును. ఎడారిలో నేను పాములచే నాట్యమాడించు వారిని చూచాను. వారు పెద్ద పామును మెడలో చుట్టుకొని భాషలతో మాట్లాడుట నేను చూచాను. మాంత్రికులు అలాగుందురు. వారు భాషలలో మాట్లాడి దానికి అర్థము చెప్పెదరు.

వారి యొక్క మాంత్రిక సమూహములను నేను చూచాను. వారు పెన్సిలును క్రింద పడవేసి, క్రిందనే ఉన్న పుస్తకము మీద దానంతట అదే పెన్సిలు వ్రాయునట్లుగా చేయుదురు. ఆ పెన్సిలు కదలి వెళ్ళి, చక్కగా వ్రాయుచుండును. వారు ఒక నాటకమును దాని ద్వారా వేయించెదరు. దాని పేరు "గడ్డము గీసి తల కత్తిరించుట." అన్యభాషలలో వారు దానిచే వ్రాయించెదరు. దానికి మాంత్రికుడు అనువాదము చేయును. నిజంగా జరిగిన సంగతులను చెప్పును. దానిని నేను స్వయంగా చూచాను, చూచారా.

MATT 7:20•

1COR 13:8,10

 

37పౌలు ఇట్లు చెప్పెను. "భాషలైనను నిలచిపోవును. ప్రవచనములు తప్పిపోవును. వరములన్నియూ త్వరలోనే గతించిపోవును. (ఈ ప్రశ్నను తరువాత చూచెదము.) పరిపూర్ణమైనది వచ్చినప్పుడు అపరిపూర్ణమైనది తొలగిపోవును," చూచారా సోదరులారా, మనకు పరిపూర్ణమైనది కావలెను, చూచారా. మనము చాలా నకిలీ సంగతులను చూచాము మరియు దానికి మనం తప్పు అర్థం చెప్పుకొన్నాము.

భాషలతో మాట్లాడుతున్నందున ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందియున్నాడని తలంచవద్దు, చూచారా. కాని వారికి పరిశుద్ధాత్మ యున్నదని మీరు నమ్ముచున్నారు, ఎందుకనగా కొన్ని ఫలములను వారు ఫలించుచున్నారు. యేసు ఇట్లు చెప్పెను, "వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు," చూచారా. ఇది నిజము, వారి ఫలములవలన.

38కాని నన్ను దాని నుండి దూరముగా పోనీయకండి, ఎందుకనగా దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమానమును నేను ఆగౌరవించదలంచుకోలేదు, చూచారా. ఆత్మ నింపుదల కలిగిన ఒక పురుషుడు లేదా స్త్రీ, లేదా బిడ్డ, దేవుని యొక్క బలిపీఠము క్రింద జీవించునని నేను నమ్ముచున్నాను. వారు అన్యభాషలతో మాట్లాడువరకు వేచియుండనక్కర లేదు, చూచారా. ఎవరయినా గాని అందుకు అర్హులని నమ్ముచున్నాను.

నీవు పరిశుద్ధాత్మను పొందియుండవచ్చును, కాని దానిని పొందినప్పుడు నీవు భాషలతో మాట్లాడి యుండకపోవచ్చును, చూచారా. దేవుని ఎదుట నీవు నిరంతరము నిలచియున్న యెడల బాప్తిస్మము వెంబడి బాప్తిస్మము నిన్ను ముంచెత్తును. ఏదో జరుగబోవుచున్నది, చూచారా. ఒక దినమున నిండుగా దానిని నీవు పొందెదవు, నీవప్పుడు మరేమియూ మాట్లాడజాలవు; చూడు, నీవు ఒకటి చెప్పవలెనని ప్రయత్నించెదవు. కాని దానిని చెప్పులేవు. అది నీ నోట నుండి రాదు. ప్రజలు దీనిని గమనించి ముందుకు సాగిపోయినయెడల పరిశుద్ధాత్మ వారి హృదయమును తెరచి వారి ద్వారా దేవుడే మాట్లాడినట్లు చేయును.

ISA 28:11

 

39బైబిలు ఇట్లు చెప్పెను, "నత్తివారి పెదవుల చేతను, అన్యభాషతోను ఈ జనులతో మాట్లాడుదును." యెషయా 28:18 చూడండి. "నత్తివారి పెదవుల చేతను, అన్యభాషతోను ఈ జనులతో మాట్లాడుదును."

''నత్తి" అనగా ఏమిటి? స్పష్టముగా మాట్లాడలేని వారు. [సహోదరుడు బ్రెన్హాం, నత్తివారివలె అనుకరణ చేయుచున్నారు.] మీరు నత్తిగా మాట్లాడుటకు ప్రయత్నించండి - చూడండి, పరిశుద్ధాత్మ ఎంతో నిండుగా యున్నది. నేను జాక్సన్ ను పిలువగోరుదును, "సహోదరుడా జా-జాక్- జా-జా-జాక్సన్," అని పిలచుచుందును. నీవు చెప్పవలెనని ప్రయత్నించుచుందువు గాని చెప్పజాలవు. చూచారా, ఎంతగానో పరిశుద్ధాత్మతో నింపబడినది.

MATT 7:20

 

40సోదరులను అడుగగోరుచున్నాను, నీవు ఏమి మాట్లాడలేని విధంగా పరిశుద్ధాత్మ నిన్ను కదిలించుట నీకెప్పుడయినా జరిగినదా? కొద్దిసేపు నెమ్మదిగా కూర్చోందువు. కూర్చొని ఏడ్చేదవు గదా? నీకు ఆవిధంగా జరిగినదా? అదే పరిశుద్ధాత్మ. మనుష్యులు చాలాసార్లు మాట్లాడకపోవుటకు కారణమున్నది. పరిశుద్ధాత్మకు ఎట్లు లోబడవలెనో వారికి తెలియదు. వారు మరి దేనికొరకో చూచెదరు, కాని అది వారి యొద్దనే యున్నది, చూచారా. అదే కారణమును బట్టే వారు…

కొందరయితే స్వయంగా ఉద్రేకమును కల్పించుకొందురు. ఏ అర్ధమూ లేని కొన్ని మాటలూ చెప్పెదరు, అయినా వారు పరిశుద్ధాత్మను పొందలేదు, భాషలు మాట్లాడిరి గనుక పొందితిమని చెప్పెదరు. "వారి ఫలములవలన వారిని మీరు తెలిసికొరదురు," చూచారా.

41ఏదయినా ప్రశ్న యున్నదా? [సహోదరుడు జూనియర్ జాక్సన్ "బ్రెన్హాం సోదరుడా?" అని పిలచెను.] అవును, సోదరుడా! [ఆ ప్రశ్న అడిగినందుకు నేను సంతోషించుచున్నాను. ఎవరో ఆశ్చర్యపడుతున్నారని నిస్సందేహముగా చెప్పగలను. నేను తప్పు సంగతిని అంగీకరించియుండవచ్చు లేదా బోధించి యుండవచ్చును, కాని మీరు చెప్పిన దానినే నేను నమ్మి యున్నాను."] వందనములు జాక్సన్ సోదరుడా! ["ఎన్నో సార్లు నేను భాషలలో మాట్లాడియుండవచ్చును, కాని నా జీవితము బైబిలు చెప్పిన దానికి అనుగుణంగా లేనియెడల, నేను ఆ వీధిలోని ఏ కుక్క కంటెను మేలైనవాడిని కాను."] అది నిజము. [నేను బాప్తిస్మము పొందిన ఆరు నెలల తరువాత మాత్రమే అన్యభాషలో మాట్లాడాను."] జాక్సన్ సోదరుడా, నాకు కూడా అదే అనుభవమున్నది.

42నా షెడ్డులో నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందాను, చూచారా. దాదాపు సంవత్సరం నేను భాషలతో మాట్లాడాను. ఆ తరువాత ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరములకు ఒక ఆలయములో నేను బోధించుచున్నాను, నేను ఈ వేదిక మీద నిలబడి యున్నాను…

నేనప్పుడు యువకుడను, ఇప్పుడున్నంత ముసలిగా లేను, చాలా చక్కగా ఇటూ అటూ తిరుగుచున్నాను, చాలా ఆవేశంగా బోధించేవాడిని. నేను నిలబడి అక్కడ బోధించుచుంటిని. ఒక బల్ల మీదికి ఎగిరాను. అది ఒక బాప్టిస్టు సంఘము. మిల్టవున్ బాప్టిస్టు చర్చి. బల్లల మధ్యకు నడిచిపోయాను. నాకున్న బలమంతటితో బోధించసాగాను. నేను బోధించుట ముగించగానే ఎదో నన్ను మోసికొనిపోయినది. చాలా మాటలు చెప్పెను. నాలుగు లేక అయిదు లేక ఆరు మాటలను తెలియని భాషలో పలికెను. నేనేమి చేయుచున్నానో నాకు తెలియులోగానే, ఒక స్వరమిట్లు చెప్పగా విన్నాను, "అలసిన భూమిలో బండ, తుఫాను కాలములో ఆశ్రయము," చూచారా.

43ఆ తరువాత ఒక రోజున రైలు రోడ్డు మీదుగా వచ్చుచున్నాను. పట్టాల మీద నుండి నడిచి వచ్చుచున్నాను. అది స్కాట్స్ బర్గకు ఈవలి దరి. నేను పట్టాలు పరీక్షించుకొంటూ వచ్చుచున్నాను. గాలి బలంగా వీచు చున్నది. పట్టాలు మంచుతో కప్పబడి యున్నవి. నేను దాటి పోవుచున్నాను. ముప్పది-మూడు వేలు నడిచి వచ్చాను; మరియొక వైపు ఇరవై-ఆరుగురు వెళ్ళిరి. ఆ విధంగా మేము పట్టాలు కాయుచున్నాము. నేను పాట పాడుకొంటూ పట్టాల మీదుగా వచ్చుచున్నాను. ఎప్పుడూ నేను పాడుచుందును. ఆ యా స్థలములకు వెళ్ళి ప్రార్థించేవాడిని. నేను పాడుకొంటూ వెళ్ళుచున్నాను. అకస్మాత్తుగా నేను భాషలలో మాట్లాడసాగాను. చూడండి, నేనేమి చేయుచున్నానో నాకే తెలియదు.

భాషలలో మాట్లాడుట అంత అకస్మాత్తుగా జరుగుచుండును. ఆ వ్యక్తికి తానేమి చేయుచున్నది తెలియదు. వారేమి చెప్పుచున్నారు వారికి తెలియదు. వానికర్థము చెప్పుట కూడా ఆ విధంగానే ఉండును. వారేమి చెప్పబోవుచున్నారో వారికే తెలియదు. వారేమి ఆలోచించకుండానే దానిని పలుకుదురు, ఎందుకనగా అది దైవ సంబంధమైనది. చూడండి, దానిని సహజ రీతిగా మీరు చూచినంత కాలము దానిని మీరు గ్రహించలేరు. నీవు సహజమైన దానినే గ్రహించగలవు. కాని అది నిన్ను పట్టుకొని, నిన్ను వశపరచుకొని నీ ద్వారా క్రియ జరిగించును, చూచారా.

1COR 14:27,28

 

44[సహోదరుడు నెవిల్ ఇట్లు చెప్పుచున్నాడు - "బ్రెన్హాం సోదరుడా, ఇక్కడ నేను ఒక సంగతి చెప్పవచ్చునా?"] నిశ్చయంగా, నీవు చెప్పవచ్చును నెవిల్ సోదరుడా. [భాషలు క్రమ రీతిలో యున్నప్పుడే సేవకు ఉపయోగపడును. దానిని ఒక వ్యక్తి అదుపులో పెట్టుకోవలెను గదా? ఉద్దేశించకుండానే అలాగు నీవు పలుకుదువు వరము కలిగియున్న వ్యక్తి దానిని అదుపులో ఉంచుకోవలసియున్నాడు."] అతడు తన్ను తాను ఆధీనములో యుంచుకొనును. ["చాలినంత ఎరుక కలిగి యుండవలెను. భాషలతో మాట్లాడుతున్నట్లుగా తెలిసికోవలెను."] అవును, అది నిజము. ["లేనియెడల అసలు క్రమములో అతడు లేనట్లే!] దానిని అతడు అనుభవించును, చూచారా. బైబిలు అలాగు చెప్పుచున్నది, "భాషలలో మాట్లాడు వ్యక్తి యున్నాగాని, దానికర్థము చెప్పు వ్యక్తి లేనియెడల, అతడు మౌనముగా ఉండవలెను." అవును.

45ఉదాహరణకు చూడండి, ఇక్కడ నేను నిలబడియున్నాను, ఎవరైనా… నీవు కేకవేయుటకు సిద్ధంగా యున్నావు, నీవు కేక వేయుటకు ప్రారంభించినప్పుడు దేవుని యొక్కశక్తి నీ మీదికి దిగి వచ్చుటను నీవెన్నడయినా గమనించావా? ఎందరికిది తెలియును? మనందరము ఎరుగుదుము, చూచారా. మీరక్కడ కూర్చొని యుందురు. అది వచ్చుటను మీరు అనుభవించెదరు. దానిని మీరు ఆర్పివేయు సమయములు కూడా ఉండును. దానిని మీరు నిలిపియుంచెదరు, చూడండి, అది సరి కాదు.

అమెరికా దేశాధ్యక్షునితో మీరు మాట్లాడుతున్నప్పుడు ఎట్లు అనుభూతి పొందెదరు? లేదా నిలబడి మీరు ఈ పట్టణ మేయరుతో సంభాషించుచున్నారనుకొనండి, లేదా అట్టి మరొకరితో మాట్లాడుచున్నారనుకొనండి. వీధిలో కొందరు మనుష్యులతో మాట్లాడుచున్నారనుకొనండి. అకస్మాత్తుగా మీరు గంతులు వేయుచూ, "హల్లెలూయా! మహిమ!" అని గట్టిగా కేకలు వేయవలెననిపించును. అన్నింటినీ తన్నుకొని పోతూ వీధిలో ఆ విధంగా పరుగిడుచుందువు. నీకు పిచ్చి పట్టినదని వారనుకొందరు, చూచారా. అతనికి పిచ్చి పట్టినదని వారనుకొందురు.

46చూచారా, అంతకంటి నీవు మిన్నగా ఏమియూ చేయలేవు. అది నిన్ను లోతుగా త్రవ్వుచుండును. దానిని నీవు దాచి యుంచలేవు. అది నిన్ను ముక్కలుగా చీల్చును, కాని అటువంటి సమయములోనే నీవు నెమ్మదిగా యుండవలెను, చూచారా.

కొంతకాలం క్రిందట కోర్టు హాలులో అలాగే జరిగినది. కొందరు పెంతెకోస్తు వారు కూడియుండిరి. చాలా గట్టిగా కేకలు వేయుచుండిరి. వారు నిశ్చయంగా చట్టమును గౌరవించుదురు. అది సరియే. కానీ ఆ న్యాయాధిపతి వారికి ఎదో చెప్పుచుండగా, వారు భాషలతో మాట్లాడుచుండిరి. ఈలాగు ప్రతిసారి జరిగినది, చూచారా. ఆ న్యాయాధిపతి ఇట్లనెను, "ఆ పిచ్చివారిని ఇక్కడ నుండి బయటకు పంపేయండి." చూచారా.

47ఆ భాషలకు అర్థము చెప్పువారుండినయెడల న్యాయాధిపతి దానిని గ్రహించియుండును, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అని న్యాయాధిపతికి చెప్పవలెను. (ఫలాని-ఫలాని సంగతి నిజమని చెప్పవలెను, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు!") గడచిన రాత్రి ఒక వేశ్యతో ఉండి వచ్చిన న్యాయాధికారి ఏమి న్యాయము తీర్చగలడని అడిగియుందురు. ఆమె పేరు సాలీ జోన్స్. ఆమె ఫలాని చోట అనగా 44 వరుసలో ఉంటున్నది. నీవు నాకేమి తీర్పు తీర్చగలవని అడిగియుండును. అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడయి యున్నది. దానిని వారు కాదనలేరు, అనినచో చనిపోయెదరు. ఓ, సోదరుడా! ఇక్కడే ఒక తేడా కనబడును.

నీవు నిలబడి మాట్లాడుచుండగా, అతడు నీతో ఇట్లనును, "మీరు పశువుల వంటివారు." చూచారా? ఎప్పుడు మాట్లాడవలెనో, ఎప్పుడు మౌనంగా ఉండవలెనో మీకు తెలియును, చూచారా. ఇప్పుడు నన్ను సూటిగా చూడండి. నా భావమును మీరు గమనించి యుందురు, చూచారా. అవును. నిశ్చయంగా…

48ఆ ప్రశ్న ఇప్పుడిచ్చట యున్నది. దీనిని ఈ విధంగా పట్టుకొని యుండుటకు కారణమున్నది, మనకును ఇదే పరిస్థితి యున్నది, "వారు మౌనముగా ఉండవలసి యున్నారా?" ఆ కారణము చేతనే నేను మీకు జవాబు చెప్పలేదు. మీరు చెప్పేదానికన్న ఎక్కువ నేను చెప్పజాలను. కాని ఇప్పుడు జవాబు చెప్పవలసిన సమయము వచ్చియున్నది. ఈ ప్రశ్న యొద్దకు కూడా వచ్చుదము. ఈ ప్రశ్నకు కూడా జవాబు చెప్పెదను, కాని పూర్వ గాధను ప్రస్తావించెదను. ఆ ప్రశ్నను అందరూ అర్థము చేసికొన్నారా?

ప్రశ్న: [సహోదరుడు ఫ్రెడ్ అడుగుచున్నాడు, "బ్రెన్హాం సోదరుడా?"] అవును. ఫ్రెడ్ సోదరుడా. [అత్మ యందు మాట్లాడు వ్యక్తి తన వాక్ శక్తిని బట్టి మాట్లాడునా? (ఇంగ్లీషు వాడయితే ఇంగ్లీషు మాట్లాడగలడు) ఆత్మ యొక్క వాక్ శక్తి బట్టి మాట్లాడునా?]

నిశ్చయంగా. చూడండి, పరిశుద్ధాత్మ ప్రతి భాషను మాట్లాడును, చూచారా. పెంతెకోస్తు దినమున ప్రతి భాషవారు కూడి యుండిరి. ఇంగ్లీషులో మాట్లాడుట అన్నారు. ఫ్రెడ్ సోదరుడా, ఇది నాకు ఎల్లప్పుడూ తెలియును. నేను బోధించు ప్రసంగము మీద ఆత్మాభిషేకమున్నప్పుడు, ఆత్మ నాకు వాక్ శక్తిని అనుగ్రహించును, చూచారా. ఇంగ్లీషు తెలియని వానికి ఇది ఒక అన్యభాషగా యుండును. అయితే…

ACTS 2:7,8

 

49అన్యభాష అనగా "తెలియని" భాష అని కాదు. పెంతెకోస్తు దినమున వారన్నది వినండి. వారినందరినీ పాపులుగా ఎంచిరి, "వీరందరూ మన స్వభాషలోనే మాట్లాడుచున్నారు. ఈ గలిలయవారు మన స్వంత భాషను మాట్లాడుచున్నారు. తెలియని భాష అనునది లేదు. ఆ పెంతెకొస్తు యొద్ద అందరూ తెలిసికొనిరి. ఇప్పుడు చూడండి, అది లేఖన సహితము కాదు కదా? అది తెలియని భాష కాదు. "వారు ప్రతి ఒక్కరు మన స్వంత భాషలోనే మాట్లాడుచున్నారు కారా?" అనడిగిరి. అది అందరికీ తెలిసినది." చూచారా. మరేదయినా దానిపై ప్రశ్న యున్నదా? "వారందరూ మన స్వంత భాషలోనే మాట్లాడుచున్నారు." చూచారా?

ACTS 2:4,8

 

50[ఒక సహోదరుడు చెప్పుచున్నాడు, "మానవ బలహీనతను బట్టి అక్కడ చిన్న తప్పు దొర్లినది, మరియు జనులు నమ్ముటకు నిరాకరించి యున్నారు; 'ఏమయినా గాని నేను నమ్మనని చెప్పెదరు, అపోస్తలుల కార్యములు 2:4 ప్రకారమే'" అని చెప్పుదురు.] అపోస్తలుల కార్యములు 2:4 ప్రకారమే, అయితే వారు తప్పకుండా తెలియని భాష మాట్లాడురు. ["కాదు, ఒక భాషలో] విను జనులు గ్రహించునట్లుగా వారు మాట్లాడవలసియున్నారు, చూచారా, ఎందుకనగా "ప్రతి ఒక్కరు వారి వారి భాషలో వినిరి."

పరిశుద్ధాత్మను పొందవలెనని ఇక్కడ ఒక సోదరుడు ఆశించుచున్నాడు, ఆయన ఉడ్ సోదరుడు. అది నిజమేనా ఉడ్ సోదరుడా? నిన్ను బయటకు పిలువ తలంచలేదు. ఇక్కడున్న మనమందరం సోదరులము. దీనిని చెప్పగోరుచున్నాను. అతడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందగోరుచున్నాడు. సహోదరుడు బాంక్స్ సరయిన విధంగా అచ్చట పరిశుద్ధాత్మను పొందియున్నాడు. బైబిలు ప్రకారముగా పొందియున్నాడు. అతడు లేచి నిలబడి ఇంగ్లీషులో చెప్పును, "దేవుని కుమారుడగు యేసుక్రీస్తు లేచెను." అగ్ని వంటి ప్రవచనముతో అతడు దానిని పలుకును. "ఆయన లేచియున్నాడని నాకు తెలియును, ఎందుకనగా ఇప్పుడే ఆయన నా హృదయములోనికి వచ్చి యున్నాడు. ఆయన దేవుని కుమారుడు! నా పాపములు గతించినవి, నాకు ఒకటి జరిగినది," చూచారా. అక్కడే మీరున్నారు.

"వారందరూ మన భాషలో మాట్లాడుతున్నారు కారా?"

51మన ఇండియానా జనులు కెంటాకీ జనుల కన్న వేరయిన భాషను మాట్లాడితే ఎట్లుండును? సహోదరుడు బాంక్స్ ఒక కెంటకీయన్. అప్పుడు వారు వేరే భాష మాట్లాడేవారు. అతడు ఇండియానో భాష మాట్లాడలేడని మనకు తెలియును. అయితే అతడు లేచి ఇండియానా భాషతో మాట్లాడితే అతనికి రాని భాష మాట్లాడెనని మనకు తెలియును, చూచారా. అతడు ఇండియానా భాషను మాట్లాడుట మనము విందుము. తాను కెంటికీ భాషను మాట్లాడుచున్నానని అతడు తలంచును. అతడిట్లు సాక్ష్యమిచ్చుచున్నాడు, "దేవునికి మహిమ! యేసు మృతులలో నుండి లేచెను. హల్లెలూయా!" దీనినతడు ఇండియానా భాషలో పలుకుటను మనము విందుము.

పెంతెకోస్తు దినమున అలాగే జరిగినది, చూచారా. "ఏలాగు ప్రతివారు మన భాషలోనే…?" "వారందరూ గలిలయులు కారా?" కెంటికీ వారి వలెనె యున్నారు. "ఇండియానా, ఒహాయో, ఇల్లినాయ్, మానే, మసాచుసెట్స్, కాలిఫోర్నియాల వారమైన మనము, వారు మాట్లాడినది మనము మన మాతృ భాషలోనే దానిని ఎలాగు వినుచున్నాము?" అర్థమయినదా? చూడండి, అది ప్రేరణ. చూచారా, వినువారికి అది ఒక ప్రేరణను కలిగించినది. అది వారికి ప్రేరణ.

52దాని యొక్క భావమును గ్రహించండి. అది యేసుక్రీస్తు పునరుత్థానము యొక్క సాక్ష్యము. చూచారా, అది సత్యము. దేవుడు నీలో ఆ జీవితమును జీవించనియెడల నీవు దాని గూర్చి ఎంతగా సాక్ష్యమిచ్చినా లాభము లేదు. నీవది పొందలేదని భావము, చూచారా. అది నిజము.

ఇప్పుడు మరియొక ప్రశ్న యున్నదా? [సహోదరుడు రాయ్ రాబర్సన్ చెప్పుచున్నాడు, "బ్రెన్హాం సోదరుడా, ఆ స్పానిష్ బాలికకు ప్రార్థన వరుసలో అది జరుగుట మేము చూచియున్నాము.] చాలా మంచిది, రాయ్ సోదరుడా. ఇప్పుడు నేను బ్యూమవుంట్ కు వెళ్ళుచున్నాను. అది బ్యూమవుంటేనా? అవునయ్యా.

ప్రార్థన వరుస ఆగిపోయినది. ఒక చిన్న స్పానిష్ బాలిక వేదిక మీదికి వచ్చినది. నేను బయటకు వెళ్ళిపోవుచున్నాను, యధార్థంగా చెప్పుచున్నాను, అవునా? హవర్డు నన్ను బయటకు తీసికొని వెళ్ళుచున్నాడు. ఎవరో ఏడ్చుట నాకు వినబడుచున్నది. ఆమె ఒక చిన్న స్పానిస్ బాలిక. పదిహేను లేదా పదహారు సంవత్సరాలుండును… చిన్న బాలిక. నేను చూచాను, నేను ఇంకా ముందుకు కొనసాగించినయెడల, ఆ తరువాత ప్రార్థన కార్డు ఆమేదే అగును. ఒక పెద్ద కుప్పగా అక్కడ యున్నది. ఆమెది ఆ తరువాత ప్రార్థన కార్డు. ఆమెను నేను తీసికొని రమ్మన్నాను. వారేమెను తీసికొని వచ్చిరి. నేను మరొక కూటమునకు వెళ్ళుచున్నాను. ఆమెను తీసికొని రమ్మని చెప్పాను.

కావున, ఆమెను కనుగొనుటకు నేను వచ్చాను, ఆమెతో ఈ విధంగా నేను మాట్లాడాను, "ఇప్పుడు నీవు నమ్ముదువా!" నీ వ్యాధి గూర్చి ఇప్పుడు యేసు నాతో చెప్పినయెడల, నీవు నమ్ముదువా? ఆయన నిన్ను బాగుచేయును. ఆమె తన తలను దించుకొనెను. ఆమె ఒకవేళ చెవిటిదో, మూగదో అనుకొన్నాను, చూచారా.

53నేను మరలా ఆమెను చూచాను. ఆమె ఇంగ్లీషు మాట్లాడలేదని గమనించాను. కావున ఒక అనువాదకుని వారు తీసికొని వచ్చిరి. "నీవు నమ్ముచున్నావా," అని నేనడిగాను. ఆమె సైగ చేసినది. ఆమె అనువాదకుని ద్వారా అర్థము చేసికోనినది. చూచారా?

నేను వెనుదిరిగి ఒక దర్శనం చూచాను. ఒక పాతకాలపు పొయ్యి యొద్ద ఆమె కూర్చొనియున్నది. ఒక పెద్ద కాగు కనబడుచున్నది. దాని నిండా పసుపు రంగు వెన్నులున్నవి. సహోదరుడు రాయ్ నది గుర్తున్నదా? ఆ గింజలను బాగుగా ఉడికించిన యెడల దాని అర్థము ఏమిటో చెప్పాను. ఆమె భయంకర వ్యాధికి గురగునని అర్థము. ఆమె తల్లి ఆమెను మంచము మీద పరుండబెట్టినది. మూర్చ రోగము ఆమెకు ఉన్నది. ఆమెకది దీర్ఘకాలము నుండి యున్నది.

ఆమె అప్పుడు ఈ మాటలు విని ఆనువాదకుని వైపు తిరిగినది. తన స్వంత భాషలో ఇట్లు చెప్పినది, "అతడు స్పానిష్ మాట్లాడలేడని నేను తలంచాను."

ఆమె నా వైపు తిరిగి ఇట్లు ప్రశ్నించినది, "నీకు స్పానిష్ రాదు గదా!"

"రాదు," అన్నాను. మేము రికార్డరుల వైపు చూచాము. రికార్డులను ఆపు చేశాము. అది ఖచ్చితమైన ఇంగ్లీషు భాష.

ACTS 2:8

 

54అప్పుడు అనువాదకుడు ఇట్లు చెప్పెను, "అయితే ఆయన ఏమి చెప్పెనో నాకు చెప్పుము." చూడండి, అతడు అనువాదకుడు. "అతడు ఏమి చెప్పెను," అని అడిగెను. అవే మాటలు తిరిగి ఆమె చెప్పినది, మరియు అతడు మరల చెప్పెను.

ఆమె తన స్వంత భాషలో నేను మాట్లాడినట్లు వినినది. అది ఆమె మాతృ భాషగా వినబడినది, కాని నేను మాట్లాడినది ఇంగ్లీషు. ఆమెకది స్పానిష్ గా వినబడినది. "మనందరము మన మన స్వంత భాషలలో మాట్లాడుట వినలేదా?" ఆ బిడ్డ బాగయినది. చూడండి, అంతే. అది దేవుని యొక్క ఆశ్చర్య కార్యము.

ప్రశ్న: [ఒక సోదరుడిట్లు అడుగుచున్నాడు - "పరిశుద్ధాత్మ యున్న పాత్రను… అది కేవలము పాత్రయేనా, దానిని నింపువాడు ఆయన కోరినది నింపునా?"]

ఆయన కోరినది ఏదయినా, అది నిజమే. అక్షరాలా నిజము. అది దేనితో నింపబడినదో గమనించండి. అప్పుడు నీవు పరిశుద్ధాత్మతో నింపబడి యున్నావో లేదో నీకే తెలియును, చూచారా. అది దేనితో నింపబడి యున్నదో గమనించండి. అది అపవిత్రమైన వాటితో నింపబడిన యెడల, అది దేవుని పాత్ర కాదు. కాని అది పవిత్రమైన వాటితో నింపబడిన యెడల, అది దేవుని పాత్రయని గ్రహించగలము. నా భావమును మీరు గమనించారా? [సోదరుడిట్లు చెప్పుచున్నాడు, "ఆ పాత్ర వాడబడు కాలములు కొన్ని యున్నవి. అది వాడబడు కాలములో దానిని గూర్చి తెలిసికొనరు?"] అవును. నిశ్చయంగా! [సహోదరుడు ఒక సాక్ష్యమునిచ్చుచున్నాడు.] అది అక్షరాలా నిజము. నిశ్చయము, దానిని మన మందరమూ చూచెదము. దానిని నేను చాలాసార్లు చూచాను. అవునయ్యా. ఆ సంగతులు మనకు చిరపరిచితములని తెలియును.

1COR 14:18

 

55ప్రశ్న: అది నాలుగవదని నేను తలంచుచున్నాను: "పరిశుద్ధాత్మతో నింపబడిన వారందరూ ఎప్పుడో ఒకప్పుడు భాషలతో మాట్లాడుదురా? మీ అందరికంటే మరి ఎక్కువగా నేను భాషలతో మాట్లాడుదునని పౌలు చెప్పెను."

ఇప్పుడు సోదరుని ప్రశ్నను పూర్తి చేయుటకు ఆలోచించుచున్నాను:

"మీ అందరికంటే మరి ఎక్కువగా నేను భాషలతో మాట్లాడుదునని పౌలు చెప్పెను."

"పౌలు చాలా జ్ఞానము గలవాడు. అతనికి అనేక భాషలు తెలియును, చూడండి. అతనిని నేరస్తునిగా భావించి విచారణలో పెట్టినప్పుడు, అతడు చాలా భాషలలో మాట్లాడెను. అవి జనులకు తెలియని భాషలు, కాని అది దైవావేశము వలన కాదు. అది నేర్చుకొనిన బాషలు, మీరు చూచారా.

56ఆత్మ నింపుదల కలిగి దేవుని యొక్క బలిపీఠము క్రింద జీవించుచున్న వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు నిస్సందేహముగా భాషలతో మాట్లాడు అనుభవమును కలిగియుండును, ఎందుకనగా అది పౌలు యొక్క వివరణ ప్రకారము అన్నింటికన్న తక్కువయైనది మరియు అల్పమైనది. మీరు దానిని వరుస క్రమములో చూచినయెడల వరములన్నింటిలో చివరిది, భాషలతో మాట్లాడుట మిక్కిలి అల్ప వరము.

మొదట మీరు బాప్తిస్మము పొందవలెను… ఇక్కడున్న మీ ప్రతి ఒక్కరికి వరములున్నవి. నేను బయట యున్నాను. ఒకే ద్వారము గుండా ఒకే ఆత్మను పొందుచున్నాము. ఈ గది లోనికి ఒక్క ద్వారము గుండానే ప్రవేశించగలము. అది నిజమేనా? ఆ వైపు నుండి నేను రాలేను. ఈ వైపు నుండి రాలేను. ఆ వెనుక వైపు నుండి రాలేను, చూచారా. ఇక్కడికి నేనెట్లు రాగలను? రాబర్సన్ సోదరుని ద్వారానా? కాదండీ! లియో సోదరుని ద్వారానా? అతనికి భాషలు మాట్లాడు వరమున్నది గాని, లియో ద్వారా నేను రాగలనా? కాదండీ! నేనెట్లు రాగలను? ఒకే ద్వారము గుండా, ఒకే ఆత్మ ద్వారా రాగలను. కేవలము భాషలే ఆత్మ కాదు. చూచారా? "ఒకే ఆత్మ ద్వారా నేను ఈ శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాను.

57ఇది ఆత్మ, మీరందరూ వరములు. మీరు దేవునికి స్తోత్రము చెప్ప వచ్చును. నేనూ అలాగే చెప్పెదను. అక్కడ ఉడ్ సోదరుడున్నాడు. అతడు అద్భుతములు చేయును. చూచారా? నేను అద్భుతములు జరిగించానని చెప్పుకొందును. నేను అద్భుతములు జరిగించి యున్నాను గనుక పరిశుద్ధాత్మను పొందియున్నానని చెప్పుకోవచ్చును. మనందరము ఒక్క "అద్భుతము ద్వారా శరిరములోనికి బాప్తిస్మము పొందలేదు.

ఆ తరువాత జూనీ సోదరుని యొద్దకు వెళ్ళండి. అతనికి జ్ఞాన వరమున్నది. నాకు బైబిలు జ్ఞానమున్నదని అతడు చెప్పుకొన వచ్చును. అందువలన నాకు పరిశుద్ధాత్మ యున్నట్లుగా నాకు తెలియునని చెప్ప వచ్చును. కాని అది ప్రవేశ ద్వారము కాదు.

మంచిది లియో సోదరుని ద్వారా కాదు. చూచారా? వుడ్ సోదరుని ద్వారా కాదు. జూనీ సోదరుని ద్వారా కాదు. చూచారా? ఎవరి ద్వారాను కాదు. ["ఆత్మ" ద్వారా అని జనులు చెప్పుచున్నారు.] మంచిది. ఈ శరీరము లోనికి నేను బాప్తిస్మము పొందియున్నాను. ఇప్పుడు నేను అందులో యున్నాను. తండ్రి నన్ను ఎక్కడ వాడుకొనబోవుచున్నాడు? చూచారా! ద్వారమునకు చాలా దగ్గరగా లియో కూర్చొని యుండుట జరిగి యుండవచ్చును. మొదటిగా జరుగునది ఇదేనని నిస్సందేహముగా చెప్ప వచ్చును. కాకపోవచ్చును కూడా. నేను ఆత్మలో ఎంతో ఐశ్వర్యవంతుడ్ని కావచ్చును. దేవుడు అందరిని దాటిపోయి సహోదరుడు వుడ్ ను ఉపయోగించుకొన వచ్చును. అందువలన నాకు పరిశుద్ధాత్మ లేదని మీరనలేరు, ఎందుకనగా నేను ఈ బాప్తిస్మపు శరీరములో యున్నాను. కాని నన్ను దేవుడు ఈలాగు చెప్పుకొనుటకు తీసికొని రాలేదు. "దేవునికి స్తోత్రము. నేనిప్పుడు కూర్చొందును. హాయిగా యుందును. నేను పరమునకు వెళ్ళెదను." నా భావము గ్రహించారా?

నేను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళెదను. నా భావమును గ్రహించారా? నేను ఒక అత్యున్నత స్థాయి నుండి మరొక స్థాయికి రావచ్చును, లేదా నేను మధ్యలో మరెక్కడికయినా వెళ్ళవచ్చును. కాని ఏదయినా జరుగును. కాని ఒకటి జరుగును. అది ఏమిటి? నేను శరీరములో యున్నానని ఆత్మ బాప్తిస్మము చూపించుచున్నది. "ఒకే ఆత్మ ద్వారా." ఇక్కడున్న సోదరులకు అది అర్థమయినదా? మంచిది. అవునా?

1COR 14:32

 

58ప్రశ్న: ఆరాధనా సమయములో భాషలు మరియు ప్రవచనములు

ఉపయోగించు క్రమము ఏమిటి? (ఆరాధనా కాలములో అసలు దానిని వాడరాదా?) దేవుని స్తుతించుటకు, (కాదు) అంతా సంఘ క్షేమాభివృద్ధి కొరకా? ప్రవక్తల యొక్క ఆత్మ ప్రవక్తల స్వాధీనములో యున్నదని బైబిలు చెప్పుచున్నది.

ఆత్మ సంబంధముగా భాషలలో మాట్లాడుట మరియు ప్రవచనము సంఘ క్షేమాభివృద్ధి కొరకు. కాని దానికి స్వంత ఆరాధన కావలెను. చూచారా? అంతే గాని అది కూటమునకు అల్లరిపరచుటకు కానే కాదు. చూచారా? అది ఎన్నడూ కూటమును అభ్యంతరపరచుటకు కాదు.

ఇప్పుడు చూడండి, "ప్రవక్తల యొక్క ఆత్మలు." ఇప్పుడు మనకు మరియొక ప్రశ్న యున్నది. ఒక్క నిమిషము దానిని చూద్దాం. చూడండి. వరములను వాడుట గూర్చి, వరములకు జవాబులు ఇచ్చుట గూర్చి సరయిన విధానము ఉన్నది, చూడండి. ఈ మొదటి దానిలో దీనిని నేను మీకు చెప్పియున్నాను, చూచారా. అది అయిదవది:

"ఆరాధన సమయములలో దేవుని మహిమపరచుటకు భాషలను మరియు ప్రవచనములను ఉపయోగించ వచ్చునా?"

చూడండి, దేవుని యొక్క సేవకుడు అభిషేకించబడిన వాడయినచో సంఘమును క్రమములో యుంచి సరయిన రీతిలో నడిపించును. క్రమములో యుంచుట గూర్చి ఎట్లు మాట్లాడియున్నానో మిలో చాలా మందికి తెలియును. ఈ వరములు ముందుగానే సూచింపబడినవి. ప్రభుని చిత్తమయితే, ఈ ఆలయములో ఆ విధంగానే చేయుదుము. ఇప్పుడు నేను గమనించుచున్నాను. ఒక సంగతిని నేను చూచుచున్నాను. సహోదరుడు నెవిల్, ఇతర సోదరులను ఇక్కడ క్రమములో నేను విడిచి పెట్టాను. మీలో చాలామంది యువ సోదరులున్నారు.

59ఈ మార్గములో నేను ఒక ముసలి యోధునిగా మీ అందరికి కనబడుచున్నాను. ఇందులో నేను ముప్పుది-ఒక్క సంవత్సరముల నుండి యున్నాను. ఇక్కడున్న రాయిని ముప్పది సంవత్సరాల క్రితం నేను వేశాను. ఎదుర్కొన వలసియున్న ప్రతి దానిని నేను ఎదుర్కొని యున్నాను. ఆ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మీకు కూడా అది అర్థమగును. దానిని నీవు తెలిసికొనుట మాత్రమే కాదు గాని దానిని దేవుడు బలపరచవలెను. దాని గుండా నీవు బయలు వెళ్ళవలసి యున్నావు.

దీనిని చేయుటకు అతి జయకరమగు మార్గమున్నది. నీవు ఒక ప్రత్యేక కూటమును ఏర్పరచ వచ్చును. I కొరింథీ 14లో వారదే చేసిరని నేను నమ్ముచున్నాను - కూర్చొనియున్న వానికి ఒకటి ప్రత్యక్షమైనప్పుడు ప్రక్కనున్న వాడు మౌనముగా యుండ వలయును. అది వరముల కొరకు ఒక ప్రత్యేక కూటమని నేను నమ్ముచున్నాను. అది మంచిదే. వారు ఒక ప్రత్యేక కూటమును ఏర్పరచు కొనగోరినప్పుడు వరములు గల జనులందరూ ఒక్కసారి కూడుకొందురు. వారమునకొక్కసారి అలాగు చేయుదురు. వారికి వరములున్నవి. అలాగున ఆలయములోనికి వచ్చెదరు. అది మంచిదే. ఆ కూటమును వారు ఏర్పాటు చేయుదురు. అందులో బోధ ఉండదు. అది ఆత్మ వరముల కొరకు మాత్రమే.

60అది బయటి వారికి గానీ, అన్యులకు గాని ఉద్దేశించినది కాదు. వారు వచ్చి కూర్చోందురు, ఒకరు భాషలతో మాట్లాడుటను వారు విని నవ్వుచుందురు.

పాటలు ఇంకా ఇతర కార్యక్రమములు ఏవి అని అడుగుచుందురు. చూచారా?

కానీ ఈ భాషలలో మాట్లాడువారు చాలామంది ఇక్కడ సువార్త నందు పసి పిల్లలుగా యున్నారు. భాషలకర్థము మొదలగునవి, చూచారా. వారిని అభ్యంతరపరచవద్దు. వారిని ఆ వరములో ఎదుగనీయుడి. సాతాను ఒక దానిలోనికి ఎట్లు చొరబడునో మీరు గమనించండి. యోధులమగు మనము దానిని చూతుము. దానిని మనము గ్రహించగలము. దానిని మనము గుర్తించగలము.

61ఇక్కడ కొంత కాలము క్రితం ఒక సేవకుడు నా యొద్దకు వచ్చి నన్ను ఇంటికి రమ్మని ఆహ్వానించెను. చాలా ప్రస్తమగు నా సోదరుడు. ఇప్పుడిచ్చట కూర్చొని యున్నాడు. ఇక్కడతడు కూర్చొనియున్నందున అలాగున నేను చెప్పుట లేదు. మీరందరూ ప్రశస్తమగు సోదరులే. అలాగు నేను తలంచని యెడల మొదట మన వధ్య ఉన్న విషయములను సరిదిద్దుకొన వలెనని నేను కోరుకొందును, చూచారా. అది మంచిది. గమనించారా? మీ అందరిని నేను ప్రేమించుచున్నాను. సహనపు ఆత్మను కలిగి దానిని నేను వినగోరుచున్నాను. బైబిలులో అలాగున్నది. చూడండి, మీకు సహాయము చేయుదును.

ఈ సోదరుడు తన ఇంటికి నన్ను కొనిపోయెను. తరువాత ఒక స్త్రీ యొద్దకు తీసికొని వెళ్ళెను. ఆమె ఒక పొరపాటులో ఉన్నది. నేను ఆ స్త్రీని ఎన్నడూ చూడలేదు గాని, ఆమె టేపులు విన్నాను. ఆమె భాషలకు అర్థము చెప్పును. మీరు వెంటనే ఆమె సంగతిని గ్రహించగలరు.

62ఒక రోజున మరియొక సేవకునితో ఈ సంగతి చెప్పాను. అప్పుడు మేము ఉడుతలను వేటాడుటకు వెళ్ళియున్నాము. ఆ ఇద్దరు సేవకులు ఇప్పుడిచ్చటనే యున్నారు. అదెట్లు మళ్ళినదో వారికి తెలియును, చూడండి. కాస్త గమనించండి.

వరముల విషయములో సేవకులగు మీరు ఎవరినయినా క్రమపరచగోరినప్పుడు వాక్యమును తీసికొని వారిని క్రమపరచుడి. వారు అభ్యంతరపడుదురు, గుర్తుంచుకొనండి, అది దేవుని ఆత్మ కాదు, ఎందుకనగా దేవుని ఆత్మ దేవుని వాక్యము విషయములో అభ్యంతరపడదు. ఆయన తన వాక్యము యొద్దకు వచ్చును, చూచారా. ఆయన ఎల్లప్పుడూ దానికి ఇష్టపడును. నిజమగు దేవుని పరిశుద్ధుడు గూర్చి యొద్దకే పరుగిడగోరును.

నేను సరిదిద్దబడవలెనని కోరుకొనుచున్నాను. నేను పొరపాటు చేయుచున్నయెడల ఆ విషయములను పరిశుద్ధాత్మ సరిచేయవలెనని కోరుచున్నాను. మరే ప్రత్యామ్నాయము నాకు అక్కర లేదు. నిజమయినది నాకు కావలెను గాని మరొకటి కాదు. నన్ను మరేదీ లోబరుచుకొనకుండు గాక, చూచారా, క్రీస్తునకు నిందను కలిగించుటకు బదులుగా ఆ విధంగానే నేనుండగోరుచున్నాను.

63వాక్యమును తప్పు మరి దేనిని నేను బోధించగోరుట లేదు. ఇంకేమియూ చెప్పను …

నేను ఏదయినా తప్పును బోధించుట ఒక క్రైస్తవ సోదరుడు చూచినయెడల, నన్ను ఆ కూటానంతరము ప్రక్కకు పిలచినయెడల ఎంతో సంతోషించెదను. ఇట్లు నాతో చెప్పువలెను, "బ్రెన్హాం సోదరుడా, నేను నీ గది యొద్దకు వచ్చి మాట్లాడగోరుచున్నాడు. నీవు ఈ విషయములో తప్పు చేయుచున్నావు," చూచారా. నిశ్చయంగా నేను ఆ సోదరుని ప్రశంసించెదను, ఎందుకనగా నేను సరిదిద్దబడవలెనని కోరుచున్నాను. అది నాకు కావలెను.

మనందరము సరిదిద్దబడవలెనని కోరుకొనవలెను. అందుకొరకే ఈ విషయములను మనం చెప్పుకొనుచున్నాము. వాక్యము నొద్దకు రావలెను, చూడండి, వాక్యమే అందరిని ఏకముగా కట్టవలెను.

64భాషలలో మాట్లాడుట గూర్చి కొద్ది సేపు మనం చెప్పుకొందము. చూడండి. దానిని అలాగే కొంతకాలం జరుగనీయమని నేను మీకు సలహా ఇచ్చుచున్నాను. సేవకులకు, సంఘ కాపరులకు చెప్పుచున్నాను. ఈ పసి పిల్లలు ఇంకొద్దిగా పెద్దవారగు వరకు ఈలాగే కొనసాగనీయుడి. ఒకవేళ ఆ వ్యక్తిని అపవాది గనుక మోసము చేయుచున్నచో, ఎప్పుడో ఒకప్పుడు అది బయటపడక తప్పదు. మనం మరీ ఖచ్చితమైనట్లు చెప్పలేము.

దీనిని మీరు ప్రారంభించు ముందుగా కొంత జ్ఞానాత్మను సంపాదించుకొనవలెను. ఆత్మలను వివేచించవలెను. చూచి గమనించవలెను. ఎక్కడో చిన్న పొరపాటు ఉన్నట్లుగా ఎవరైన గమనించుటయే వివేచన. పసి పిల్లలుగా కొంత కాలముందురు. చూచారా? వివేచన తప్పుగా నున్నప్పుడు దానిని నీవు సరి చేయవలెను. అది దేవునికి సంబంధించినదయితే దేవుని వాక్యముతో సరిదిద్దబడుటకు సంతోషించును, చూచారా.

65ఉదాహరణకు చూడండి, మనం భాషలలో మాట్లాడాము అని నేనందును. వరముల గల జనులున్నారు. లియో లేచి భాషలలో మాట్లాడును. ఇక్కడ మన సోదరుడు విలర్డ్ దానికి అర్థము చెప్పును. మంచిది. సహోదరుడు వీలర్స్, సహోదరుడు జూనీ, సహోదరుడు విలర్డ్ కాలిన్స్లు వివేచన చేయువారని నేనందును. చూడండి. చిన్న పరిశుద్దుల కూడికవలె ఇది యుండును. వరముల కూటము, లియో మాట్లాడగా దానికి విలర్డ్ భావము చెప్పెను. అతడిట్లు పలికెనను కొనుదము, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, బుధవారం రాత్రికి ఒకామె ఇక్కడికి వచ్చును. ఆమె ఉద్రిక్తత కలుగజేయును. ఆమె మతి-స్థిమితములేనిది గనుక ఆమెను గద్దించ వద్దని బ్రెన్హాం సోదరునితో చెప్పుము. ఆమెను ఒక మూలకు తీసికొని వెళ్ళమని చెప్పుము, ఎందుకనగా ఆమె ఒకసారి ఒక మూలన దుర్మార్గపు కార్యము చేసినది." చూడండి. అది బాగున్నది. కదా! మంచిది.

66కానీ మొదటి సంగతి మీరు తెలిసికొనండి. పాత లేఖనములో ప్రవక్త గాని మరొకరు గాని ఏమి చెప్పినా దానిని మొదటగా ఊరీము, తుమ్మీము ద్వారా పరీక్ష చేసెడివారు. అది వాక్యము యొద్దకు వెళ్ళెడిది. ఆ దీపము వెలగని యెడల వారు దానిని లెక్కలోనికి తీసికొనెడి వారు కారు, చూడండి.

మొదటి సంగతి, దానిని వాక్యము నొద్దకు తీసికొని వెళ్ళవలెను. ఈ వ్యక్తి భాషలలో మాట్లాడినది బాగానే యున్నది. ఇతడు దానికి అర్థము చెప్పినది బాగానే యున్నది. కాని మొదట ఇద్దరు లేదా ముగ్గురు న్యాయాధిపతులు న్యాయ విమర్శ చేయవలెనని వాక్యము చెప్పెను. దానినే ఊరీము మరియు తుమ్మీము యొద్దకు తీసికొని వెళ్ళవలెను.

అది ప్రభువు యొద్ద నుండి వచ్చినదని మొదట వీలర్డ్ కాలిన్స్ చెప్పును. అది ప్రభువు నుండి వచ్చినదేనని జూనీ పలుకును. ముగ్గురిలో ఇద్దరు అలాగు పలికిరి. మంచిది, దానిని ఒక కాగితం మీద వ్రాయండి. ఈ ఆలయంలోనే దానిని పలికిరి. అది జరుగుటకు ముందుగానే జనులు దానిని చదివెదరు. వారిట్లందురు, "సోదరుడా, అది దేవునికి చెందినది. చూడు! అది దేవుని కార్యము!"

కాని చెప్పబడిన విధంగా అది జరగని యెడల ఎట్లుండును? చూచారా? (ఇక్కడ మరియొక విషయమును మనం చూడనై యున్నాము. అనువాదములు మరియు వర్తమానములు అన్నియూ ప్రవచనమగునా?) ఒక్క నిమిషం ఆగండి. అది జరుగని యెడల ఎట్లుండును? లియో అబద్ధపు ఆత్మ ద్వారా మాట్లాడెను. మరియొకరు అబద్దపు అర్థమును చెప్పిరి. ఇంకొకరు అబద్ధపు తీర్పు నిచ్చిరి. మీరప్పుడు దానిని మీలో నుండి తొలగించవలెను. అది మాకు వద్దు. అది తప్పు. దానిని విడిచి పెట్టుడి. అది అపవాది పని, చూచారా. [టేపు మీద ఖాళీ యున్నది.]

నేను బోధకుని కాదు గానీ అర్థము చెప్పు వ్యక్తిని అనును. ప్రభువా, నేను బోధకుని కాను గాని భావము చెప్పువాడిని అని అనుచుందురు. చూడండి. సహోదరుడు లియో అయితే, నేను భాషల వరము గల వ్యక్తినే గానీ బోధకుని కానని చెప్పుకొని ఆ విషయములో అపవాది నన్ను మభ్యపరచెనని పలుకును. ప్రభువా, అది నాలో నుండి తీసివేయమని అడుగవలెను. నీవిట్లు పలుకవలెను, "ప్రభువా, నీవు నాకు వివేచనాత్మను అనుగ్రహించావు. దానిని నీవు చాలా పర్యాయములు రుజువు చేయుట నేను చూచాను. తండ్రి, ఇప్పుడెందుకిట్లు జరిగినది? నన్ను శుద్ధి చేయము! ఏదో జరిగినది!" అప్పుడు నీవు నిజమైన దానిని పొందెదవు.

1COR 14:30,31

 

67చూడండి, అది క్రమబద్ధమగు పరిశుద్ధుల కూటము. బైబిలులో యున్నది అదేనని నేను తలంచుచున్నాను, ఎందుకనగా పౌలు ఇట్లనెను, "ఒకరు ప్రవచించుచుండగా, కుర్చొనియున్న మరొక వ్యక్తికి ఇంకొక సంగతి బయలుపరచబడినప్పుడు. మొదటి వ్యక్తి ముగించు వరకు ఇతడు మౌనముగా యుండవలెను. ఆ తరువాత ఇతడు మాట్లాడవలెను. ఆ తరువాత మరొకరు ప్రవచించవచ్చును. అది క్రమముగా జరుగు కూటములో కాదని మీరెరుగుదురు. అందరికి…

అది దేవుని నుండి వచ్చినదని స్వయముగా తెలిసి యుండవలెను, ఎందుకనగా అది దేవుని వలన కలుగనిదయినచో అది వెర్రితనమే. అది నెరవేరనియెడల దేవుని సంబంధమైనది కాదు. కావున సోదరులారా, మన ఆలయములలో దానిని అమలు పరచవలెను. అప్పుడు గట్టి సంఘము మనకు ఏర్పడును. అప్పుడు ఎవరునూ పలుక కూడనిది పలుకక, చేయరాని దానిని చేయకయుందురు.

68నేను జనుల ఎదుట నిలబడియున్నాను. దాని వైపు చూడండి! ఒక్క తప్పు ఆ విషయములో చేసిన యెడల ఎట్లుండును? చూచారా? ఎందుకనగా ఆయన యందు నేను విశ్వాసముంచి యున్నాను, చూచారా. ఆయనను నేను నమ్మియున్నాను. ఎవరో ఇట్లనిరి, "బ్రెన్హాం సోదరుడా, నీవు తప్పు చేయుటకు భయపడుదువు." కాదు. తప్పుకు భయపడుట కాదు. ఆయనను నమ్మియున్నాను. ఆయనే నా రక్షణ. దీనిని చేయుటకు నేను నిర్ణయింపబడియున్నాను గనుక అక్కడే నిలచి యుందును.

ఒక పనిని చేయుటకు దేవుడు నిన్ను నియమించిన యెడల, ఆయనే నీకు రక్షణగా యుండును. చూడు, నిన్ను ఆయన సంరక్షించును. ఆయన నిన్ను పంపిన యెడల నీ మాటను ఆయన బలపరచును. అప్పుడు నీవు ఒక రాయబారిగా ఉందువు. భాషల వరము కలిగిన రాయబారిగా నీవుందువు. అర్థము చెప్పు వరము కలిగిన రాయబారిగా యుందువు. వివేచన వరము కలిగిన రాయబారిగా నీవుండెదవు. మీరు ముగ్గురు అలాగుందురు. నా భావమును గమనించారా? అప్పుడు నీకేమి లభించును? ఒక బలమగు సంఘము దొరకును. అప్పుడు నీవు మరి దేనికని భయపడక, నిన్నటి వలె నిలబడి యుందువు.

69ఇక్కడ నేను ఒక కూటములో యున్నాను. ఇంగ్లాండు నుండి వచ్చిన ఒక ఇంగ్లీషు బాలుడు ఆత్మహత్య చేసికొనుటకు ప్రయత్నించుచుండెను. సహోదరుడు బాంక్స్ వచ్చి ఇట్లు చెప్పెను, "అతడు నాలుగు లేక అయిదు రోజుల నుండి అక్కడే యున్నాడు." నాకు చాలా పనులుండెను, కాని ఆ బాలుడు ఆత్మహత్య ప్రయత్నములో యున్నాడు గనుక వెళ్ళవలసి వచ్చెను." అక్కడున్న వాటర్-వ్యూ హెటల్ వారు ఆ బాలుని పరిస్థితి గూర్చి నాకు చెప్పిరి.

గదిలోనికి వెళ్ళి ఆ బాలుని కొరకు ప్రార్థించాను. నేను బయటకు వచ్చి ఇట్లు చెప్పాను, "బాంక్స్ సోదరుడా, ఎన్నడూ నేను ఈ వ్యక్తిని చూడలేదు, అతడి గురించి నేను ఏమియు ఎరుగను, కాని అతని యొద్దకు వెళ్ళక ముందే అతని సమస్య ఏమిటో నేను చెప్పెదను. అది సరేనా బాంక్స్ సోదరుడా? అక్కడికి మేము వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మ దిగి వచ్చి అతని గూర్చి సవివరముగా మాకు తెలియచేసెను. అతని గత జీవితము గూర్చి చెప్పెను. అతడు దాదాపుగా పడిపోయెను."

70"బ్రెన్హాం సోదరుడా, అటువంటి వ్యక్తి విషయములో ఏదయినా తప్పు చెప్పుట జరుగునేమోనని భయపడుదువా?" వేదిక మీద చూడండి. ఒక వ్యక్తి తన భార్య పట్ల అపనమ్మకముగా జీవించి మరొక స్త్రీ ద్వారా బిడ్డను కనెనని చెప్పాను. అలాగు తప్పు చెప్పినచో, నిన్ను వారు జైలులో వేయుదురు. నీవు చెప్పినది తప్పక సరియైయుండవలెను! చూచారా? చూచారా? అది దేవుని నుండి వచ్చినదయితే నీవు భయపడకుము. అది దేవుని వలన వచ్చినది కాదని నీకు తెలిసినప్పుడు, నీవు నెమ్మదిగా యుండుము. దేవుని వలన దానిని తెలిసికొనుము. అది నిజమేనా? నీవు ఖచ్చితముగా తెలిసికొని ముందుకు సాగుము.

సోదరుడా, ఇది కఠినమగు బోధ, కాని మీరు నా సోదరులు. మీరు యువకులుగా సేవలోనికి వచ్చియున్నాను, నేను ఒక ముసలివాడిని, నా అవసాన కాలము సమీపించినది, చూచారా. కావున ఆ విషయములో మీరు సరిగా యుండుడి.

71గదిలో నుండి బయటకు వచ్చుచున్నాను. ఆ తరువాత నేను దీనిని గ్రహించవచ్చును. దానిలో కొంత భాగమును ఇప్పుడు నేను చెప్పెదను. నిన్న సహోదరుడు బాంక్స్ మరియు నేను చాలా పనిలో యున్నాము. (ఓ, మై) చాలా శ్రమపడ్డాను. ఈ కూటము గూర్చి నేనేమి చేసితినో మీతో చెప్పుచున్నాను. లియో, జీనీ, ఇంకా కొందరితో కలిసి అక్కడికి వెళ్ళుచున్నాము. మేము అడవి పందుల వేట కొరకు వెళ్ళుచున్నాము.

ఆరిజోనాలో అడవి పందుల వేటాడు సమయము, అయిదు రోజులే ఉన్నది. మా కూటములు అయిపోయిన పిదప వెళ్ళాము. మేము ఒక రోజు కొరకు ఫీనిక్స బయలుదేరాము. మేము ఆయిదు దినములు వేచియుండ వలసి వచ్చెను. ఎక్కడో ఒక చోట కూటమును నాలుగు రోజుల తదుపరి ఏర్పాటు చేయుదురని తెలిసినది. మేము సరిగ్గా ఆరిజోనాలోనే యుండవలసి వచ్చెను. అదే సమయములో అడవి పందులను వేటాడు సమయము వచ్చినది.

నేను వేట కొరకు నా చిన్న రైఫిల్ ను సిద్ధపరచుకొన్నాను, అది సరిగానే యున్నట్లు గమనించాను. నాతో కూడా బాంక్స్ వచ్చుచుండెను. మేము ద్వారము దగ్గరికి వచ్చి బయటకు బయలుదేరాము. ఒక మనిషి ఆ సూచన పై నుండి నడిచి వచ్చుట చూచాము. "సహోదరుడు బ్రెన్హాం గూర్చి దయచేసి అడుగవద్దు," అని అతడనెను.

72చూచారా, కారణమును చూడండి… రోగుల కొరకు ఇది కాదు. బాంక్స్ మా ఇంటి ప్రక్కనే జీవించుచుండెను. రోగలయిన పిల్లలను తీసికొని దివా రాత్రులు జనులు వచ్చుచుండిరి. అటువంటి మనిషిని ఎన్నడూ మేము త్రోసివేయము.

నన్ను, లియోను, జిమ్ ను, ఇంకా ఇతరులను ఆ చిన్న ఇంటిలో నుండి బయటకు పిలిచారు. ఒక వ్యాధిగల బిడ్డను తీసికొని ఒకరు వచ్చిరి. అది కాన్సరు వ్యాధి. మేము సమస్తమూ ప్రక్కకు పెట్టి వారి కొరకు వచ్చాము.

73గత రాత్రి నన్ను ఒక వైద్యశాల గదిలోనికి పిలిచారు. అక్కడికి నన్ను పిలిచిన మనిషి నన్ను బయటకు రానీయలేదు, చూడండి. ఎవరో చాలా ఆసక్తి చూపించారు. అది మంచిదే. ఎలాగయినా నేను వెళ్ళవలెను, చూచారా, ఎందుకనగా వెళ్ళవలసిన విధి నాకున్నది, చూడండి, ఒకరికి సహాయపడవలసి యున్నాను.

అయితే ఆ గురుతు అందుకొరకు ఇయ్యబడలేదు. సహోదరుడు బాంక్స్ కు ఇది తెలియును. ఆ ఇంటిలో కొంత సేపు నేను ఆగాను. మేము కారులోనికి అడుగుపెట్టు ముందుగా ఒక వ్యక్తి వచ్చి సహోదరుడు బాంక్స్ ను పట్టుకొని విడువలేదు. నన్ను కూడా ఆ వెంటనే అతడు పట్టుకొనెను. మేము తుపాకీని పట్టుకొని కారులోనికి ఎక్కు ముందుగా, ఒక వ్యక్తి నడిచి లోనికి వచ్చెను. అతడు వచ్చెను.

అతనిని నేను బయటకు వెళ్ళమని చెప్పవలెననుకొన్నాను. ఆ గురుతు యొద్ద సంఖ్యను పిలువగోరాను. (బట్లర్ 2-1519) మేము త్వరగా వెళ్ళవలెనని చెప్పాను.

"మీరు తొందరలో యున్నారనుకొనుచున్నాను," అన్నాను.

"నా పేరు…" అన్నాను.

నేను మొదట నడచుచున్నప్పుడు అతడు "మీరు బాగున్నారా?" అని ప్రశ్నించెను. నేనెవరినో అతనికి తెలియదని నాకు గురుతే.

"నా పేరు బ్రెన్హాం," అన్నాను.

"బ్రెన్హాం సోదరుడవు నీవేనా?" అన్నాడు.

"నేనే," అన్నాను.

"నిన్ను కలిసికొనవలెననుకొన్నాను బ్రెన్హాం సోదరుడా, కాని నీవు వెళ్ళుటకు సిద్ధముగా యున్నావు," అన్నాడు.

"అవునండీ," అన్నాను.

"మీరు తొందరలో యున్నారని నాకు తెలియును," అన్నాడు.

"వెంటనే వెళ్ళిపోవలెనండీ," అన్నాను.

"కొద్ది నిమిషములు నేను మీతో మాట్లాడగోరుచున్నాను," అన్నాడు.

అతనికి నేను చెప్పగోరుచున్నాను… కాని పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పసాగెను, "అతనిని నీ గదిలోనికి తీసికొని పొమ్ము, నీవతనికి సహాయము చేయుము." అందువలన అంతా మారిపోయినది. తుపాకీని ప్రక్కకు పెట్టాను. దేవుని పని ముందు మిగిలిన వన్నియూ తదుపరి. చూచారా?

"నీవు నాతో రమ్ము, సహోదరుడు ఉడ్ తో తరువాత వెళ్ళెదను," అని చెప్పాను.

"బ్రెన్హాం సోదరుడా, ఇది నా ఆత్మ విషయము," అన్నాడు.

"సరే, రమ్ము," అన్నాను.

ఇంటిలోనికి వచ్చాను. మిడా నన్ను పిలచి, "ఇంకా వెళ్ళలేదా?'' అనడిగినది.

"లేదు, ఒకరు నన్ను దర్శించ వచ్చిరి. పిల్లలను మరొక గదిలో యుంచుము," అని చెప్పాను. అతనిని నేను చిన్న గుహ వంట గదిలోనికి తీసికొని వెళ్ళాను, అక్కడ కూర్చొన్నాము.

ఆ వ్యక్తి గత రాత్రి ఆలయములో ఉండెను. అవును, కదా, బాంక్స్? గత రాత్రి అతడు రావలెనని తలంచెను.

74అతడెవరో మొదట పరిశుద్ధాత్మ అతనికి చెప్పసాగెను. అతడేమి చేసెనో చెప్పెను. అతని జీవితములో ఏమి జరిగెనో చెప్పెను. అతని గూర్చి సమస్తమూ చక్కగా తెలియ చేసెను. అందుకు బాంక్స్ సాక్షి, అతడు నోరు తెరచి రెండు మాటలు తప్ప మరేమి పలుకలేదు. పరిశుద్ధాత్మ మరల ఇట్లు పలికెను, "నీవు దేశ దిమ్మరివి. నీవు మాడిసన్ లో జీవించుచున్నావు. ఇప్పుడు నీవు ఇండియానాలోని, ఇవన్స్-విల్ లో నుండి వచ్చియున్నావు. నీవు అచ్చట ఒక బైబిలు స్కూలులో యున్నావు. అది ఒక తప్పు బోధను బోధించు స్కూలు. కొద్ది నిమిషముల క్రితమే నీవు లూయిస్-విల్ కు వచ్చితివి. ఇక్కడికి వచ్చి నన్ను కలిసికొనుమని నీకు ఒక వ్యక్తి చెప్పెను. నీవు సరి యగుదువని చెప్పెను - నీవు అతడు కలిసి భోజనము చేశారు - ఇది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అని చెప్పాను.

ఆ వ్యక్తి కూర్చొని రెప్పలార్చుచూ నా వైపు చూచుచుండెను, "అవునయ్యా!" అని చెప్పెను.

"నీవు ఆశర్యపడితివి కదా?" అన్నాను.

"అవును," అన్నాడు.

"నీవు పరిశుద్ధాత్మను నమ్ముచున్నావా?" అనడిగాను. "నమ్మగోరుచున్నాను," అన్నాడు.

"నీవు దేనిని గూర్చి ఆలోచించుచున్నావో దానిని తెలియచేయవలెనని నీవు కోరుచున్నావు కదా!" అనడిగాను.

"అవును! సోదరుడా! అది సత్యము," అన్నాడు.

"నీ ఆలోచనలు మార్చుకో," అన్నాను.

"అవును. నిజమే," అన్నాడు.

"నీవు దీనిని గూర్చి ఆలోచించుచున్నావు," అన్నాను.

"అదీ నిజము! అది సరియే," అన్నాడు.

నేనిట్లు చెప్పాను, "నీకు దర్శనమవసరము లేదు, నీవు సరి అయితే చాలును." నేను ఒక సంగతి గూర్చి మాత్రం నీకు చెప్పరాదని నీవు కోరుకొనుచున్నావని చెప్పాను. అది నీవే గనుక ఇష్టపడవు, ఎందుకనగా అది ఒక చెడ్డ సంగతి. చాలా భయంకరమైనది. అందువలన నీవు దానిని దాయగోరుచున్నావని అతనికి చెప్పాను. ప్రజల గూర్చి దేవుడు నాకు చూపించనిచో ఏదియూ నేను చెప్పను. "సరే, నీవు ఏమి తలంచవు గదా?" అని అడిగాను.

"ఏమీ అనుకొనను," అన్నాడు.

"నీ దారిన నడువుము," అన్నాను.

JOHN 8:28•

JOHN 12:50

 

75మేము పది నిమిషములలో అక్కడ ఉన్నాము. అవును గదా బాంక్స్ సోదరుడా? ఏడు లేదా పది నిమిషముల పాటు ఉన్నాము. తిరిగి దారిన నడచి వచ్చాను. అతడు, నేను, బాంక్స్, నా చిన్న కుమారుడు జో, అందరం కలిసి ఆ దారిన వచ్చాము. వస్తూండగా అతడు నా వైపు తిరిగి, "అయ్యా! ఒక ప్రశ్న మిమ్ము అడుగగోరుచున్నాను," అన్నాడు.

"అలాగే," అన్నాను.

"నేను గందరగోళములో యున్నాను. నా గూర్చి ఇది నీకెట్లు తెలియును?" అనడిగాడు. అక్కడ బాంక్స్ కూర్చొని యుండెను.

"నీవు ఎన్నడయినా నా దర్శనముల గూర్చి, నా సేవ గూర్చి విన్నావా? " అనడిగాను.

"గంట క్రితం వరకు మీ పేరే నాకు తెలియదు. లూయిస్ విల్లో ఒకరు నన్ను ఇచ్చటికి వెళ్ళమని చెప్పిరి. నేను వంతెన మీద నుండి నడిచి వచ్చాను," అని చెప్పాడు. అది నిజమేనా బాక్స్? "నీ పేరు ఎన్నడూ నేనెరుగను. నీవెవరవో నాకు తెలియదు," అని అతడు చెప్పెను.

"నా సేవలో ఇది దేవుని వరము. ఆయన ఈలాగున నన్ను పంపెను," అని నేను చెప్పాను.

"ఇప్పుడు నాలో నున్న సమస్తమూ తొలగిపోయినది. దేవుడు నీ ద్వారా నాతో మాట్లాడెను" అని చెప్పెను. చూచారా? ఇప్పుడు అతడు సరి అయినట్లు చెప్పెను.

"సరిగా చెప్పావు," అన్నాను.

అతడు ఇట్లు చెప్పెను, "ఒకసారి నేను యేసు తన శిష్యులతో మాట్లాడుట గూర్చి చదివాను, అనగా ప్రజలతో మాట్లాడెను, ఆయన తన శిష్యులతో మాట్లాడి వారి ఆలోచనలను బయట పెట్టెను. వారి ఆలోచనలను ఆయన గ్రహించెను. తన తండ్రి తన ద్వారా మాట్లాడుతున్నట్లు ఆయన చెప్పెను."

"అది నిజమే," అన్నాను.

అతడు ఇట్లనెను, "తండ్రి, నీ ద్వారా ఇప్పుడు నాతో మాట్లాడెను. ఈ విషయములను నాకు చెప్పెను. నీవు చెప్పినది సత్యము గనుక నాకు విశ్వాసము కలిగినది.

"చెప్పినది సత్యమేనా?" అనడిగాను,

"అవును, దేవుడు మాత్రమే అలాగు చెప్పగలడు," అనెను.

76నేనిట్లు చెప్పాను, "సోదరుడా, ఇప్పుడు నీవు దాని గూర్చి మరి ఎక్కువగా తెలిసికొందువు. (నేను మరియు బాంక్స్ మాట్లాడి యున్నాము) పది సంవత్సరముల నుండి కూటమునకు వచ్చుచున్న వారికి కూడా అలాగు జరుగలేదు." కాని ఇతనిని చూడండి. అలాగు జరుగనై యున్నది.

"ఆత్మతో కూడిన భాషలు (క్రమముగా) మరియు ప్రవచనములు ఆరాధనా సమయములో ఉపయోగించ వచ్చునా?"

ఈ విధముగా దానిని ఉపయోగించవలెను. దానిని అప్పుడు ఆరాధనలో చెప్పవచ్చును. కానీ ఈసారికి, అనగా ప్రస్తుత సమయమునకు వారిని మాట్లాడనీయండి. అది చేతులు దాటిపోయినచో మంచిది కాదు. దానిని మీరు గమనించవలెను. కొన్నిసార్లు అది దేవుని నుండి వచ్చును. చిన్న పిల్లలను పోలి యుండును. చిన్న వారు నడచుటకు ప్రయత్నించుదురు. నాలుగు లేదా అయిదు సార్లు పడిపోవుదురు. నేను ఈ ఆలయమునకు వచ్చినప్పటి నుండియూ దీనిని చూచుచున్నాను. అలాగే దానిని వదిలి యున్నాను, చూచారా. కానీ మీరయితే నన్ను ఇట్లు ప్రశ్నించెదరు, "బ్రెన్హాం సోదరుడా, నీవెందుకు సరిదిద్దవు?" కాదు, కాదు.

ఆ వెనుక నున్న బిల్లి పాల్ మొదట నడక నేర్చుకొనినప్పుడు క్రింద పడి మరల లేచుచుండెడివాడు. అడుగులు వేసే కంటే ఎక్కువసార్లు క్రింద పడేవాడు. ఎట్లు నడువవలెనో అతనికి తెలియదు. కాని అతనికి నడిచే వరమున్నదని నేనెరుగుదును, చూచారా. కొంత కాలం అలాగే నడవనిచ్చాను. అయితే ఇప్పుడు అతని పెద్ద పాదములు తొట్రిల్లినచో నేను చెప్పెదను. నా భావమును మీరు గమనించారా? చూడండి. దేనినో చూచుకొంటూ తడబడినప్పుడు, పడిపోయినప్పుడు నేను చెప్పెదను, "అబ్బాయీ, నీ కాళ్ళు దగ్గర పెట్టుకొని నడువు. నీవు ఎందుకు పడిపోవుచున్నావు?" అందును. చూచారా? అదియే తేడా. మీరు గమనించండి.

1COR 14:32

 

77కొంత కాలము పాటు వారిని తొట్రిల్లనీయండి, జారనీయండి. నీవు వారిని సరిదిద్దవలసిన సమయములో వారు నీ మాటకు లోబడనప్పుడు వారు దేవుని సంబంధులు కారని నీవు తెలిసికొందువు, ఎందుకనగా దేవుని యొక్క ఆత్మ వశపరచబడును. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో యుండునను వాక్యమును మీరు మరువ వద్దు, చూచారా. అది నిజము.

ప్రశ్న: [సహోదరుడు స్ట్రయికర్ ఇట్లు చెప్పుచున్నాడు, "బ్రెన్హాం సోదరుడా, నాకు ఒక జవాబు కావలెను."] మంచిది, సోదరుడా, ["చాలాసార్లు నేను ఆరాధనలో కూర్చొనియుండగా భాషలలో మాట్లాడుచూ, దాని కర్థము చెప్పుచున్న వారిని చూచాను. చాలాసార్లు దానిని నేను ఇష్టపడలేదు. ఇంటికి వెళుతూ ఆ విషయములో నేను పశ్చత్తాప పడినట్లు భావించేవాడిని. అది దేవుని నుండి రానందున నాకావిధంగా అనిపించినదా లేక అది క్రమము తప్పినందున ఆ విధంగా అనిపించినదా?"]

సోదరుడా, ఆ రెండింటిలో ఏదో ఒక కారణమై యుండ వచ్చును, చూచారా. ఇతడు విలియం బ్రెన్హాం. వాక్యము లోనికి వెళ్ళు వరకు నేను నేనే, చూడండి. సహోదరుడు స్ట్రయికర్ కు ఈలాగు చెప్పుచున్నాను, ఆ రెండింటిలో ఏదో ఒక కారణమై ఉండి యుండును. అది క్రమము తప్పి యుండవచ్చును; నీవు పొరబడి యుండవచ్చును; లేదా మాట్లాడే వ్యక్తి పొరపాటు చేసి యుండవచ్చును; లేక ఆ వర్తమానము తప్పు అయి యుండవచ్చును; లేదా మరేదో నిన్ను ఆ రీతిగా చేసి యుండవచ్చును.

MATT 5:45•

HEB 6:7,8

 

78ఇక్కడ స్ట్రయికర్ సోదరునికి చిన్న సహాయము నేను చేయవలెను, చూచారా. భావనలను బట్టి ఎన్నడును మనం తీర్పు చేయరాదు. దాని యొక్క గుణలక్షణములను బట్టి తీర్పు చేయవలెను. ఫలములను బట్టి దానిని మనము అంచనా వేయవలెను. చూడండి.

నీవు కొన్నిసార్లు అనుభూతి పొందుచుందువు. ఒక విధమగు భావనలు కలుగుచుండును. నాకు కూడా అలాగే జరుగుచుండును. నేను చాలా తేలికగా కదిలిపోవ నారంభించుదును, మీరెరుగుదురు. కాని ఏమియూ నేను చెప్పను. అదేమిటో నాకే తెలియదు. అదేమిటో నేను తెలిసికొను వరకు దానిని గూర్చి నేను మాట్లాడను.

చాలామంది జనులు ఇట్లనుచుందురు, "సోదరుడా, నాకు పరిశుద్ధాత్మ ఉన్నదని తెలియును. హల్లెలూయా! దేవునికి స్తోత్రము!" అయినా గాని వారికి పరిశుద్ధాత్మ లేదు. వారు భాషలతో మాట్లా వచ్చును. ఏదేదో చేయ వచ్చును. ఆత్మలో కేకలు వేయుచూ నాట్యమాడ వచ్చును, అయినా గాని పరిశుద్ధాత్మను పొందరు. ఎందుకనగా నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షము కురియుచున్నది. భావోద్రేకము బట్టి కాదు గాని ఫలములను బట్టి గ్రహించవలెను.

ఆ విషయములో నా దర్శనమును మీరు జ్ఞాపకము చేసికొనుడి. హెబ్రీ 6 చూడండి. భూమిని తడుపుటకు వర్షము తరచుగా కురియుచుండును. సేద్యమునకు అది అవసరము, కాని గచ్చపొదలు, ముండ్ల తుప్పలు కూడా పెరుగుచుండును. వాటిని తరువాత పీకి వేసి అగ్నిలో కాల్చి వేయుదురు.

79నన్ను క్షమించండి, కొద్దిగా గాలిని రానిచ్చెదను, మీరందరూ చాలా అలసిపోయి నిద్రకు చేరువలో యున్నారని నాకు తెలియును. కాస్త ఆగండి, కొద్దిగా త్వరగా నేను ఈ విషయములను చెప్పవలెను, లేనియెడల ఇక చెప్పజాలను. ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నవి. చూద్దాం.

గోధుమలు నిండుగా ఎదిగిన ఒక చేను ఉన్నది. ఆ పొలములో పిచ్చి విత్తనములు కొన్ని పడినవి. వాటిని కలుపు మొక్కలందుము. అప్పుడు నీటి ఎద్దడి వచ్చినదనుకొనండి. గోధుమ మొక్కలతో పాటు సమానంగా కలుపు మొక్కలు కూడా నీటి కొరకు తృష్ణగొనవా? గోధుమ మొక్కల మీద ఒక రకమగు వర్షము, కలుపు మొక్కల మీద మరో రకమగు వర్షము కురియదు కదా? అవును గదా? రెండింటి మీదను ఒకే రకమగు వర్షము కురియును. ఇది నిజమేనా? క్రైస్తవుని మీద, వేషధారి మీద ఒకే రకమగు ఆత్మ కుమ్మరింపబడును. కాని వారి "ఫలములను" బట్టి వారెట్టివారో తెలిసికొందుము. సోదరుడా, ఈ విషయము అర్ధమైనదా?

GAL 5:22,23

 

80దాని యొక్క ఫలమే పరిశుద్ధాత్మ యొక్క రుజువై యున్నది. అది ఆత్మ యొక్క ఫలము. నీవు ఏదేదో చెప్పుకొన వచ్చును. నీవు కాండము కావచ్చును, కలుపు మొక్కలు కావచ్చు. కాని నీలో ఏ విధమగు జీవమున్నది? దాని లోపలి జీవమును బట్టియే ఫలములు బయటకు కనబడును. అది ముండ్ల పొదల జీవమయితే బయటకు కలహములు, జగడములు, వాదములు వచ్చును. నా భావమును గ్రహించారా? తిరుగుబాటు చేయు స్వభావము ఆత్మ యొక్క ఫలములు కాదు. అయితే ఆత్మ ఫలమేమనగా సాత్వికము, ఆశానిగ్రహము, మంచితనము మొదలగునవి. చూచారా?

అతడిట్లు చెప్పవచ్చును, "నీ కంటే నేను గట్టిగా అరచెదను. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నా మీదికి దిగినది." అది అక్షరాలా నిజమే కావచ్చును, కాని అతడు జీవించుచున్న జీవితము అతడు చెప్పుకొనుచున్న దానికి అనుగుణముగా లేదు, చూచారా. అతడు ఒక కలుపు యొక్క ప్రారంభములోనే అతడు ఒక పిచ్చి మొక్క.

ఇప్పుడు, మనం పెద్ద ప్రశ్న యొద్దకు వచ్చాము. ఇది ఏర్పరచుకొనుటకు గూర్చిన ప్రశ్న. దానిని మీరు అర్థము చేసికొందురు. అలాగు మీరుండ వలసియున్నారు.

వారి ప్రారంభమే కలుపు మొక్క; అతని ప్రారంభమే గోధుమ గింజ. ఇప్పుడు నీటికి కరువు వచ్చినది. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షము కురిసెను. దానిని మీరు గమనించారా?

MATT 7:22,23•

JOHN 10:4,27

 

81ప్రశ్న: [ఒక సోదరుడు ఇట్లడుగుచున్నాడు, "బోధకుని యొక్క ఫలములెట్లుండును? వాక్యమును బోధించునప్పుడు…"]

బోధకుడు నిలబడి ప్రధాన దూత వలె వాక్యమును బోధించుచుండ వచ్చును. బైబిలు యొక్క మర్మములను అర్థము చేసికొన వచ్చును. మంచి సంఘ కాపరిగా ఉండవచ్చును. ప్రజలను దర్శించి, పరామర్శించుచుండ వచ్చును, అయినా నశింప వచ్చును, చూచారా. సోదరుడా, అతని ఫలము అతని గూర్చి తెలియచేయును, చూచారా. అతడు ఎంత మంచిగా ఉన్నా, ఎంత గొప్పవాడయినా అతని జీవితములో పరిశద్ధాత్మ లేనిచో ఫలితము శూన్యము.

యేసు ఇట్లు చెప్పెను, "ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? (బోధించుట కూడా) నీ నామములో అద్భుతములు చేయలేదా?" అని అడుగుదురు. అందుకాయన, "అక్రమము చేయు వారలారా, నా యొద్ద నుండి తొలగిపోవుడు. మిమ్మును ఎన్నడూ నేనెరుగను," అని వారితో చెప్పును. వారు భాషలతో మాట్లాడిరి. అద్భుతములు చేసిరి. భావమును తెలియ చేసిరి. దేవుని యొక్క మర్మములను గ్రహించిరి. మరెన్నో సంగతులు తెలిసికొనిరి. నా భావమును గ్రహించారా?

ప్రశ్న: [సహోదరుడు టేలర్ అడుగుచున్నాడు, "ఒక వ్యక్తి తప్పు వర్తమానమును అందించునప్పుడు ఏమి చేయవలెను?" అతడు తాను బోధించుచున్నది సరియేనని తలంచును గాని అది తప్పు."]

ఆ వ్యక్తి యధార్థవంతుడే కావచ్చును, ఇక్కడ కూర్చోని యున్న ఈ సోదరుని వలె యుండి యుండును. ఆ విధంగానే విషయములను మరల తెలిసికొని యుండ వచ్చును. ఆ వ్యక్తి దేవుని చేత ఏర్పరచుకోబడిన వ్యక్తి అయినచో, అతని యొద్దకు ఎప్పుడు సత్యము వచ్చినా గాని దానినతడు గుర్తించును. "నా గొర్రెలు నా స్వరమును వినును," అనెను. టేలర్ సోదరుడా, నా భావమును గ్రహించారా! నీవు దీని గురించి మాట్లాడుతున్నావు గదా? అవునా?

82ఇప్పుడు ఉదాహరణకు చూడండి, సహోదరుడు క్రాస్ ఒక బాప్టిస్టు బోధకుడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము గూర్చి ఎన్నడునూ అతనికి తెలియదు. ఈ సంగతు లేమియూ అతనికి తెలియవు, ఆత్మ వరములు తెలియవు. కాని అతడు మంచి నమ్మకమగు బాప్టిస్టు బోధకుడు, చూచారా. కాని ఇది మొదటిసారిగా అతని ఎదుటికి వచ్చెను. దేవుని యొక్క ప్రతి బిడ్డ ఏ కాలములోని వాడయినా గాని అది అతని ఎదుటికి వచ్చినప్పుడు గుర్తించక మానడు. దేవుని యొక్క చిత్తము జరుగు వరకు రాజ్యము రాదు. అది నిజము. ఒక్కరు కూడా నశించరని మీరు తెలిసికొనవలెను. ఆ విధానము మారదు.

సముద్రములోనికి వలను విసిరి లాగుచున్న వ్యక్తిని పరలోక రాజ్యము పోలియున్నది. అందులో అన్ని రకములు పడినవి. అతడు చేపలను ఉంచి మిగతా నత్తలను, పీతలను విసిరి వేసెను. వాటిని మరల నీటిలోనికి వదిలెను. బహుశా ఒక్క చేపయే దొరికి యుండును. కానీ అతడు మాత్రము వలతో లాగుచునే యుండును. ఇప్పుడు నా భావము గ్రహించారా?

కాని ఆ చేప ఆది నుండియు చేపగానే ఉండెను. అది యజమాని ఉపయోగము కొరకు తీసికొని రాబడెను. ఇంకా తేటగాను, పరిశుభ్రముగాను ఉన్న చెరువులో దానిని విడిచి పెట్టిరి. ఈ కప్పుల చెరువులో నుండి దానిని బయటకు తీసిరి, దాని యొక్క నాచు మొత్తం కడిగి వేయబడినది. నా భావమును గ్రహించారా? టేలర్ సోదరుడా, నా అర్థమును గ్రహించుము. నీవు నీ సంగతిని బట్టి అర్థము చేసికొనుము.

83సరే, ఇప్పుడు చూద్దాం:

ప్రశ్న: "ఎప్పుడు, ఏ విధంగా ప్రవర్తించవలెనో అతడు ఎరిగియుండి, ఆత్మను ఆధీనములో ఉంచుకొనుట ఎల్ల వేళలా జరుగునా?"

అవును. పరిశుద్ధాత్మ అదుపులో యుంచును. అది నిన్ను అదుపులో యుంచును. నీవు దానిని స్వాధీనములో యుంచుకొందువు. వాక్యమునకు విరోధమైన దానిని దేనిని నిన్ను అది చేయనియ్యదు. ఆత్మ ఎన్నడునూ అమర్యాదగా ప్రవర్తించదు. ఇది నిజము.

అది అయిపోయినది. ఇప్పుడు మరొక దానిని చూద్దాం. ఎక్కడున్నాయో గమనించండి.

దానికి ఒక ఆధారమున్నదని తలంచుచున్నాను. ఇంక దీనిని గూర్చి ఏదయినా ప్రశ్న యున్నదా? అందరూ దానిని అర్థము చేసికొనిరి గదా! ఇప్పుడు దాని నెట్లు నమ్మవలెనో మీకు అర్థమయినది.

1JN 2:19

 

84["నాకు ఒక ప్రశ్న యున్నది," అని ఒక సోదరుడు పలికెను.] చెప్పండి. దీనిని గూర్చినదేనా? చెప్పండి. ["అవును, దానికి సంబంధించినదే, కాని నేను కొద్దిగా సంశయించాను."] ఏమీ సందేహించవద్దు, ["ప్రసంగించుచున్న వ్యక్తిని గూర్చి మీరు చెప్పియున్నారు; క్రీస్తు అందించిన వర్తమానమును అతడు బోధించనియెడల, అతని సేవలో ఏది జరిగినా గాని అది వ్యర్థమే గదా? అతడు సత్యమును ఎరిగియుండియు దానిని నిరాకరించిన యెడల ఏమి జరుగును?"] అతడు నశించినవాడగును. ఒక్క నిమిషము నన్ను మన్నించండి. ["ముందు నిర్ణయమునకు సంబంధించి లేదా అతడు ఈ లోకములోనికి జగత్తుపునాది నుండి అభిషేకించబడి వచ్చుట గూర్చి అడుగుచున్నారా?"] మంచిది. మంచిది, చూచారా. ["అతడు ఆ విధంగా యుండరాదు."] ప్రారంభము నుండియే అతడు అలాగున యుండరాదు, చూడండి. "వారు మనవారు కానందువలన మనలో నుండి బయటకు వెళ్ళిపోయిరి."

HEB 6:4,6•

HEB 10:29,31

 

85ఉదాహరణగా ఇటువంటి దాసినే హెబ్రీయులకు 6 లో చూడగలరు. ప్రజలు ఆ వాక్యమును ఎంతగానో తప్పుగా వక్రీకరించెదరు. అది "అసాధ్యము" అని వారు తలంచెదరు. అక్కడ ఇట్లున్నది, "ఒకసారి వెలిగించబడి, పరిశుద్ధాత్మలో పాలుపొంది, వెనుకకుపోయిన వారిని నూతన పరచుట అసాధ్యము." చూడండి, దానిని వారు గ్రహించలేదు… ఆయన చెప్పినది చూడండి, "ఒకసారి వెలిగించబడి, పరిశుద్ధాత్మలో పాలు పొందిన వారు, తాము వెనుకకు జారియున్నామని ఎరిగియుండియు మారుమనస్సు పొందనియెడల, అట్టివారు నూతనపరచబడుట అసాధ్యము. వారు దేవుని కుమారుని మరల క్రొత్తగా సిలువ వేయుచున్నారు. ఆయనను బహిరంగముగా అవమానపరచుచున్నారు. ఆయన దేని ద్వారా సిలువ వేయబడెనో ఆ రక్త నిబంధనను వారు అపవిత్రమైనదిగా ఎంచుచున్నారు. కృప యొక్క కార్యమును వారు త్రోసివేయుచున్నారు."

నాకయితే అది ప్రత్యక్షత అయియున్నది. నిశ్చయముగా. అది అపోస్తలుల కార్యములు 2:38 వలెను మరియు మత్తయి 28:19 వలెను యున్నది. దానిని మీరు గ్రహించవలసియున్నారు.

ఇక్కడ కూడా అదే విషయమున్నది, చూడండి. అతడు హెబ్రీయులతో మాట్లాడుతున్నాడు, చూచారా. ఇంకా ఆ అధ్యాయమంతయూ చదవండి. జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరమని దిగువగా వ్రాయబడినది. ఆ సరిహద్దు-విశ్వాసి వంటి మనిషి ఇక్కడ ఒకడున్నాడు. అతనిని గూర్చియే ఇది వ్రాయబడినది. నా మనస్సులో చక్కని ఉదాహరణను నేను చూచాను.

86దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి బయటకు పిలచెను. వారందరూ బయటకు వచ్చిరి. ప్రతి ఒక్కరు విమోచించబడిరి. ఎర్ర సముద్రమును దాటిరి. అరణ్యములోనికి వచ్చిరి. అది నిజమేనా? వారు సిద్ధపడిరి. మోషే యొక్క వర్తమానమును వినిరి. ముందుకు సాగిపోయిరి. (నీతీకరణ) వారు తిరిగి తిరిగి మరల మొదటికే వచ్చిరి.

వారు ఎర్ర సముద్రము నొద్దకు వచ్చిరి (రక్తము) ఎర్ర సముద్రమును దాటిరి. వారి వెనుక ఎందరో యోధులు చచ్చి పడి యుండిరి. అప్పటికి వారు వాగ్దాన దేశమునకు మూడు రోజుల దూరములో యుండిరి, చూచారా. నలుబది మైళ్ళ కన్న తక్కువ దూరములో యుండిరి, చూడండి. రెండు రోజులు ప్రయాణము చేసినచో వారు మంచి దేశములో యుండగలరు.

ఇక కొద్ది రోజుల తరువాత వ్యాపారస్తుల కూటములో నేను బోధించ ఉద్దేశించినది అదే. ఈ కొండ యొద్ద నిలచి యుండుడి. కాని ఆయన వారిని నలుబది సంవత్సరములు అక్కడే ఉంచెను, ఎందునగా వారు…

NUM 13:33

 

87వారు ఇక్కడి వరకు వచ్చి వెనుకకు చూచిరి (శుద్ధీకరణ), "ఓ హల్లెలూయా! దేవునికి స్తోత్రము! దేవునికి మహిమ! ఒకప్పుడు నన్ను బాధించిన ఆ పాతది అక్కడ చనిపోయినది. ఒకప్పుడు నేను త్రాగిన సిగరెట్లు పోయినవి. ఒకప్పుడు నేను త్రాగిన మద్యము పోయినది. యేసుక్రీస్తు యొక్క రక్తము అను ఎర్ర సముద్రములో అది మునిగినది. ఓ, దేవునికి మహిమ! హల్లెలూయా!"

వారు ప్రతి ఒక్కరు ఇప్పుడు కానానును స్వతంత్రించుకొనుటకు యోర్థానును దాటి యున్నారు. ప్రతి గోత్రములో నుండి ఒక ప్రతినిధిని అతడు ఏర్పరచుకొనెను. అది నిజమే గదా? వారిని అతడు ఆవలికి పంపెను. వారిలో కొందరు ఇట్లనిరి, "మేము అందుకు సరిపోము, వారి ప్రక్కన మేము మిడుతల వలె కనబడుచున్నాము!" చూచారా?

88"పరిశుద్ధాత్మను గూర్చి, ఇంకా ఆయా సంగతులు గూర్చి నేను చెప్పుటకు ఎట్టి సంఘము కావలెను? నేను అలాగు బోధించుచున్నందున ఎవరూ కూర్చొని యుండరు. నా మెతడిస్టు జనులు లేచి వెళ్ళిపోవుదురు. నా బాప్టిస్టు జనులు, నా ప్రెస్పిటేరియను జనులు లేచి పోయెదరు." వారిని పోతే పోనీయండి. వారి పుట్టుకయే మేకలు. మీరు గొర్రెలు కావలెను, చూచారా. మీరు మేకల కాపరులు కారు. మీరు గొర్రెల కాపరులు. గొర్రెలను కాయవలసిన వారు మేకలను కాసినచో ఏమి లాభము? చూచారా? మీరు ఇచ్చటున్నారు, చూడండి. నేను ఎల్లప్పుడూ దీనిని చెప్పుచుందును. సత్యమును సంఘమును బోధించవలసి వచ్చినప్పుడు నాకు నాలుగు స్తంభములే మిగులును. ఇక్కడికి రండి.

అతడు ఏమి చేసెనో ఇప్పుడు మీరు చూడండి. వారు వెనుకకు వచ్చిరి. యెహోషువా మరియు కాలేబులు మాత్రమే మిగిలిరి. రెండు శాతము మాత్రమే. పన్నెండు మందిలో ఇద్దరు మాత్రమే వేరుగా నుండిరి. పండ్రెండు మందిలోను ఇద్దరు దానిని నమ్మిరి. వారు వాగ్దాన దేశములోనికి వెళ్ళిరి. ఇంత కంటే మంచి స్థలము లేదనిరి.

యెహోషువా, మరియు కాలేబులు వాక్యమును నమ్మిరి. దేవుడు దానిని తమకిచ్చెనని వారు నమ్మిరి.

వారు దాటిపోయిరి, వారు ఒక పెద్ద ద్రాక్షాగెలను మోసికొని వచ్చిరి. వారు దానిని మోసికొని వచ్చి ఇట్లనిరి, "అయ్యలారా, రండి! ఇది అద్భుతమయిన స్థలము. దీనిని ఒక్క దానిని అని చూడండి." అవి ఎంతో పెద్ద ద్రాక్షాపండ్లు.

HEB 6:4

 

89ఆ జనులందరు దానిని చూచిరి గాని అందుకు మనక శక్తి చాలదనిరి. వారు వెనుకంజ వేసి ఇట్లనిరి, "సోదరులారా, ఈ మోషే మనలను ఈ అరణ్యములోనికి తీసికొని వచ్చెను. మనం ఇక్కడున్నాము. మన సేవ నాశనమయి పోయినది. అటువంటి పనిని మనం చేయజాలము."

వెనుకకు పోయిరి, చూడండి. "ఒకసారి వారు వెలిగించబడి…" విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిరి, శుద్ధీకరించబడిరి. చూడండి, వారు ఈ రెండవ బలిపీఠమును దాటి వచ్చిరి. వాగ్దాన దేశమును చూచిరి. వారు ఒకప్పుడు వెలిగించబడిన వారు, పరలోకపు వరములను రుచి చూచిరి." చూడండి, ఒకప్పుడు వారు దానిని రుచి చూచిరి. వారు దానిని తిరిగి తిసుకొని వచ్చిరి. అది నిజమని మనకు తెలియును. దానిని మనం వాస్తవంగా చూచుచున్నాము. పరలోకపు వరములను వారు రుచి చూచి యున్నారు, లేదా వానిలో పాలు పొందిరి. పరిశుద్ధాత్మలో వారు పాలి భాగస్థులయిరి.

"అది మంచిదే. ఆ మనిషిని చూడండి. ఒకప్పుడు అతడు గ్రుడ్డివాడని నేనెరుగుదును, కాని అతడు ఇప్పుడు చూచుచున్నాడు. ఏమి జరిగియున్నది? చదువులేని ఇతడు ఇంత అగ్నితో ఎట్లు నిలబడగలుగుచున్నాడు? లోకము అతనిని చూచి వణకుచున్నది ఏల?" అనుచున్నారు. మీరు చూచారా?

JOHN 10:4•

HEB 6:1,3,6•

HEB 10:29

 

90ఆ తరువాత పడిపోయెను, అట్టివారు నూతనపరచబడవలెను. మరల మారుమనస్సు పొందవలెను. ఇప్పుడు బోధించుచున్న దానికి బదులుగా మారుమనస్సును బోధించవలెను. మృతమగు క్రియలను పునాదిని మరల వేయక మారుమనస్సును బోధించవలెను. దేవుని చిత్తమును బట్టి ఒకలాగు మనము చేయగలము.

మనము వెళ్ళి మరల ఈ పునాదిని వేయవలెను. మరల మారుమనస్సును బోధించవలెను. "నేను తప్పు చేశాను. రక్తపు నిబంధనను నేను చులకనగా ఎంచియున్నాను. దాని ద్వారా శుద్ధీకరించబడిన నేను దానిని, "అపవిత్రమైనది" గా ఎంచియున్నాను. కృప యొక్క కార్యమును తృణీకరించితిని," అని పలికినచో చాలును. అంతయూ సమాప్తమగును. సోదరుడా, దానికి అంతము కలుగును, చూచారా.

ఇప్పుడు చూడండి, ఏర్పాటు కాబడిన బిడ్డ అలాగు చేయుట అసాధ్యము. "నా గొర్రెలు నా స్వరమును వినుము." వారు కానానుకు వెళ్ళుదురు, చూచారా. "నా గొర్రెలు నా స్వరమును వినును."

ప్రశ్న: [ఒక సోదరుడు అడుగుచున్నాడు - "వారు కూడా అపోస్తలుల కార్యములు 2:38ని నమ్మవలసి యున్నారు గదా?"]

వాక్యములోని ప్రతి భాగమును మనము తీసికొనవలెను. పూర్తి వాక్యమును తీసికొనవలెను. సోదరుడా, అది అక్షరాలా నిజము.

91ప్రశ్న: "రెండు రకముల బైబిలు భాషలున్నవా? వ్యక్తిగతముగా ప్రార్థించుకొను సమయమందు మాట్లాడు భాషకును, భావము అవసరమగు సంఘములో మాట్లాడు భాషకును మధ్య ఏమైనా తేడా యున్నదా? పెంతెకోస్తు దినమున మాట్లాడిన భాషలను ఆయా దేశముల ప్రజలు అర్థము చేసికొనిరి; కాని I కొరింథీయులకు 14:2లో దేవునితో మాట్లాడు అన్యభాషలని యున్నది. అది మానవులతో మాట్లాడునది కాదని అర్థమిచుచున్నది. I కొరింథీయులకు 13:1 దానిని చూపించుచున్నది. మనుష్యుల భాషలతోను, దేవదూతల భాషలతోను అని యున్నది. (అది కోరింథీయులకు 13 అనుకొనుచున్నాను).

ఓ, అవును. చూచారా? సోదరుడా, నీ ప్రశ్నకు నీవే జవాబును ఇచ్చుకొన్నావు. చూడండి :

"రెండు వేర్వేరు భాషలున్నవా? (చాలా రకముల భాషలున్నవి, చూచారా.) బైబిలులో రెండు వేర్వేరు భాషలున్నవా? రెండు విభిన్న భాషలు ఉన్నావా?"

పెంతెకొస్తు దినమున ఆకాశము క్రింద నున్న ప్రతి జనాంగము తమ తమ భాషను విసిరి, చూచారా. మంచిది.

"వ్యక్తిగత ప్రార్థన చేసికొను సమయములో మాట్లాడు భాషకును, భావము చెప్పవలసిన అవసరమున్న సంఘములో మాట్లాడు భాషకును మధ్య ఏమయినా తేడా యున్నదా?" అవును.

1COR 13:1•

1COR 14:4,5,19

 

92మీరు ఇంత క్రితం ప్రస్తావించిన కొరింథీయులకు పత్రికలో పౌలు దీనిని గూర్చి చెప్పెను, "మనుష్యుల భాషలతోను, దేవదూతల భాషలతోను," అని చెప్పెను. ఒకడు తన కొరకును, దేవుని కొరకును దేవదూతల భాషను మాట్లాడును. కాని అతడు ఒక ప్రత్యేక భాషను మాట్లాడునప్పుడు దానికి సంఘములో అర్థము చెప్పవలెను. అది సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు. "అన్యభాషతో మాట్లాడువాడు తనకు క్షేమాభివృద్ధిని కలుగజేసికొనుచున్నాడు; కాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయుచున్నాడు. కావున అతడు ఇట్లు చెప్పెను, "నేను అర్థముకాని పదివేల మాటలు పలుకుట కంటే, అర్థమగు అయిదు మాటలు పలుకుటకు ఇష్టపడుచున్నాను. అన్యభాష మాట్లాడినప్పుడు దానికి అర్థము చెప్పు వారుండవలెను." ప్రవచనము పలుకుట వలన సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగును. నా భావమును గ్రహించారా?

GEN 3:4•

1COR 13:1

 

93రెండు రకముల భాషలున్నవి. మనుష్యుల భాష, దేవదూతల భాష, చూచారా. పౌలు ఇట్లు పలికెను, "మనుష్యుల భాషతోను, దేవదూతలభాషతోను నేను మాట్లాడినను." చూడండి, మనుష్యులు, దేవదూతలు. రెండు రకములగు భాషలు.

పెంతెకోస్తు జనులు, భాషలనే సూచనగా తీసికొను ప్రజలు ఇందువలననే ఇట్లు చెప్పుచున్నారు, "బ్రెన్హాం సోదరుడా, నీవు కలగలుపుగా చెప్పుచున్నావు."

"మీరు దానిని అపోస్తలుల కార్యములు 2:4 ప్రకారముగా పొందియున్నచో మీరు మాట్లాడగా వినుచున్న వారందరూ దానిని తమ తమ స్వభాషలోనే వినవలెను గదా?" అనడిగాను.

"కాదు! కాదు!" అన్నాడు.

"అవును. నిశ్చయంగా" అన్నాను.

"బ్రెన్హాం సోదరుడా, నీవు ఈ విషయం తేల్చి చెప్పలేక పోవుచున్నాను. దేవదూతల భాష ఉన్నదని చెప్పియున్నావు. అనగా పరిశుద్ధాత్మ దేవ దూత దిగి వచ్చి నీతో మాట్లాడును," అన్నాడు.

అది చక్కగానే వినబడుచున్నది. అది నిజమున్నట్లుగానే తోచుచున్నది, కాని అది పూర్తిగా నిజము కాదు. "నీవు నిశ్చయముగా చావవని," అవ్వతో సాతాను పలికెను. అది చాలా వరకు నిజమే గాని పూర్తిగా సత్యము మాత్రము కాదు.

ఇప్పుడు, మనుష్యుల భాష, దేవదూతల భాష యున్నది.

ACTS 2:4,8

 

94అది లేఖనముతో ఎట్లు ఏకీభవించదో మనం చూద్దాం, చూడండి. అది సహకరించదు. లేఖనముతో ఏకీభవించదని నేనన్న మాటను మన్నించండి. అనగా దానితో సహకరించదని నా భావము. లేఖనమును అనుసరించదు. లేఖనమునకు సరిపడదు.

మానవుడు దేవదూతల భాషతో మాట్లాడుతున్నాడని చెప్పెను. అది పరిశుద్ధాత్మ భాష అని అతడు పలికెను. మీరు, నేను, మనము పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఏమయినది?

"దానిని నీవెక్కడ పొందితివి?" అని నేనడుగ వచ్చును.

అతడు ఖచ్చితంగా ఆ స్థలమును చెప్పెను. ఆ ఘడియ, ఆ నిమిషము చెప్పెను. అతడు చెప్పిన దానిని గూర్చి నేనేమియూ సందేహంచలేదు, చూచారా. నేనతనికి తీర్పరిని కాను. అవునా? "అక్కడ నేను మాట్లాడాను" అని చెప్పెను. ఖచ్చితంగా ఆ స్థలమును ఎరిగియుండెను. అక్కడ అది జరిగెనని చెప్పెను.

"దానిని నేను నమ్ముచున్నాను. చూడు. కాని అది మాత్రం నీవు పరిశుద్ధాత్మను పొందినట్లు సూచన కాదు," అని చెప్పాను.

"అవును. అదే సూచన!" అన్నాడతడు.

"కాదు," అన్నాను.

"సోదరుడా, చూడు! ఒక సంగతి నీకు చెప్పెదను," అన్నాడు.

నేనిట్లు చెప్పాను, "ఇండియానా-పోలిస్ లో యున్న ఆలయములో నీవు దీనిని పొందుకొన్నట్లుగా చెప్పావు. నీవు భాషలో మాట్లాడినప్పుడు నీ చుట్టూ యున్న జనులు నీవు ఇంగ్లీషును మాట్లాడుచున్నట్లుగా చెప్పిరా? నీవు దేవుని యొక్క శక్తిని గూర్చి, పునరుత్థానము ఇంకా ఆయా విషయముల గూర్చి మాట్లాడినట్లుగా వారు వినిరా?"

"ఎందుకు లేదు! నేను భాషలో మాట్లాడాను," అన్నాడు.

నేనిట్లు పలికాను, "అపొస్తలుల కార్యములు 2:4 ప్రకారము నీవు మాట్లాడనే మాట్లాడలేదు, ఎందుకనగా ఒక్క పదము కూడా అర్థము కానిది లేదు. ప్రతి ఒక్కరు వారి వారి స్వభాషలోనే దానిని వినిరి."

95అందుకతడు ఇట్లనెను, "ఓ, బ్రెన్హాం సోదరుడా, నీవు తికమక పడుచున్నావు. చూడు, దేవదూతల భాష యున్నది. నీవు పరిశుద్ధాత్మను పొందినప్పుడు భాషలతో మాట్లాడుదువు. దానికి ఎవరూ అర్థము చెప్పునవసరము లేదు. అది పరిశుద్ధాత్మ మాట్లాడుటయై యున్నది, చూచావా. ఆ తరువాత భాషా వరమున్నది, దానికి అర్థము చెప్పవలెను."

అందుకు నేనిట్లు పలికాను, "ఇప్పుడు నీవు బండిని గుర్రము ముందుకు తీసుకొని వచ్చావు. పెంతెకోస్తు దినమున వారు బండిని ముందుకు తీసికొని వచ్చిరి. వారు పరిశుద్ధాత్మను పొందక ముందే, అన్యభాషలు అందరికీ అర్థమగునట్లు పలికిరి."

96రెండు రకముల భాషలున్నవి. దేవదూతల భాషలు, ఒక వ్యక్తి తన స్వంత ప్రార్థనలో దేవునితో మాట్లాడుచుండును. దేవదూతల భాషలో దేవునితో మాట్లాడును. ఒక సంగతిని ఈ సందర్భములో నేను చెప్పవలసి యున్నాను గాని సమయము చాలదు. మీకు గుర్తుండి యుండును. ఒకామె అక్కడి ఆడిటోరియం లోనికి వచ్చినది. అక్కడికి జాయోన్ నుండి డాక్టర్ అలెగ్జాండర్ డోవీ వచ్చెను. అక్కడ నేనున్న సంగతి గుర్తున్నదా? బిల్లీ అక్కడికి వచ్చి నన్ను మరో కూటమునకు కొనిపోవలెనని తలంచెను, కానీ అతనిని నేను వెళ్ళమని చెప్పాను.

"ఇక్కడ కొందరున్నారు గదా? నీవెందుకు కేకలు వేయుట?" అని బిల్లీ పలికెను.

"కాదు. నీవు వెళ్ళుము, ఈ రాత్రికి సహోదరుడు బాక్స్టర్ ను మాట్లాడమని చెప్పు," అన్నాను.

నేను నేల మీద పరుండి ఇట్లు ప్రార్థించాను, "ప్రభువా, నా పని ఏమిటి?"

అకస్మాత్తుగా ఎవరో తలుపు యొద్దకు వచ్చిన అలికిడి వినబడినది. అన్యభాషలలో మాట్లాడుతున్నాడు. అది జర్మను భాష. నేను ప్రార్థన ఆపి విన్నాను. అతని భాషను నేను నిలబడి విన్నాను. "ఇది ఎవరయినా అర్థము చేసికొందురా!" అని ప్రశ్నించుకొన్నాను. ఎందుకనగా అతనిని నేను ఎరుగుదును. పట్టణమునకు అయిదు మైళ్ళ దూరములో ఒక హెటల్ ను అతడు నడుపుచున్నాడు. అది ఒక చిన్న పట్టణము, కాని చాలామంది జనులు చుట్టు ప్రక్కల యున్నారు. అది చాలా వింత. అతడు గుక్క త్రిప్పుకోకుండా మాట్లాడుతున్నాడు."

అది అసలు అర్థము చేసికొనుటకు వీలగుట లేదు. అయితే ఆ గొడవ నాకెందుకులే అనుకొన్నాను. నేను మౌనంగా యున్నాను. చాలా నిశ్శబ్దంగా నిలబడి పోయాను. కొంత సేపటికి అతడు మాట్లాడుట చాలించెను. నేను ఒక పెద్ద గోడను దూకి ప్రశాంత వాతావరణములోనికి వెళ్ళినట్లయినది.

97నేను బయటకు వెళ్ళి చూచాను, బిల్లీ గేటు దగ్గర నుండి వెళ్ళుచూ అతనిని ఒక్క నిమిషం ఆగమని కేకవేయుచుండెను.

అతడు కొద్దిగా పానీయము త్రాగి మరల లోనికి వచ్చి, నాతో ఇట్లనెను, "నాన్నా, ఇదేమిటి?"

"ఒక్క నిమిషం ఆగు. నేను కూడా నీతో వచ్చెదను,'' అని చెప్పాను.

నేను బహు వేగంగా నా ముఖం కడుగుకొన్నాను. "అతడు ఏమయింది?" అనడిగాడు. అతనికి నా కూటము గూర్చి బాగుగా తెలియును గనుక ఎక్కువగా మాట్లాడకుండా ఏమిటి సంగతి అని మాత్రం ప్రశ్నించాడు.

"ఏమి లేదు. ఏమి లేదులే. కూటమునకు పద," అన్నాను.

మేము కూటమునకు వెళ్ళిపోయాము. సహోదరుడు బాక్స్టర్ అచ్చట కూర్చొని, "నా ఆత్మకును, రక్షకునికి మధ్య ఏమియూ లేదు," అను పాటను వేయుచున్నాడు. అతడు తటాలున లేచి, "మీరు రారనుకొనుచున్నాను," అని చెప్పాను.

"ష్!" అని అన్నాను. వెళ్ళి మరియు ప్రసంగించుట ప్రారంభించాను.

98అయితే నేను ప్రసంగించవలసి వచ్చెను. నేను బోధించుట ముగించే సమయం వచ్చినది. ఎవరో ఆ భవనం వెనుక భాగమును తీసికొనగోరిరి. అది చాలా పెద్ద ఆడిటోరియం. ఆ వెనుకకు ఒక మైకును ఏర్పాటు చేసిరి. అక్కడ ఒకామె బల్లల మధ్య అటు ఇటు తిరుగుచుండెను. తన శక్తి అంతటితో అరచుచున్నది.

చివరకు తెలిసినది ఏమనగా ఆమెకు క్షయ వ్యాధి యున్నది. రెండు పట్టణములను విడిచి ఆమె వచ్చినది. సెంట్-పాల్ అంబులెన్సులో వారామెను ఎక్కించి తీసికొని వచ్చుటకు భయపడిరి, ఎందుకనగా కుదుపుకు ఆమె ఊపిరితిత్తులు బ్రద్దలగునని తలంచిరి. ఆమె ఊపిరి తిత్తులు తేనెపట్టు వలె సున్నితంగా ఉన్నది గనుక ఆ తిత్తులు పగిలినచో ఆమె చనిపోవుట తధ్యమని వైద్యులు చెప్పిరి. కొందరు విశ్వాసులు ఒక పాత '38 చెవర్లెట్ కారును తీసికొని, ఆమెను వెనుక సీటులో కూర్చోబెట్టి ఆమెను తీసికొని వచ్చిరి. చిన్న చిన్న గతుకులకు ఆమె తట్టుకొన లేక రక్తమును కక్కుచుండెను. ఆమె రక్తమును ఉమ్మివేయుచుండెను. ఆమె ముక్కు నుండి రక్తము కారుచుండెను., ఆమె రాను రాను బలహీనమైపోయినది. ఆమె కారులో చనిపోనిష్టపడలేదు. కావున ఆమె కారును ఆపి గడ్డి బీడులో దిగి పోయినది.

వారామెను బయటకు దించి, అందరూ చుట్టూ నిలబడి ఆమెకు ప్రార్థించసాగిరి. అకస్మాత్తుగా ఆమెను ఏదో తాకినది. ఆమె పైకి లేచి నిలబడినది. ఆమె సంచరించుచూ రోడ్డు మీద గట్టిగా అరచినది. శాయశక్తులా కేకలు వేసినది. ఇప్పుడామె ఆలయము యొద్దకు వచ్చినది. ఆ బల్లల మధ్య అటు ఇటు తిరుగుచున్నది.

"సోదరీ, అది ఏ సమయములో జరిగినది?" అని నేనడిగాను. పరిశుద్ధాత్మ నాతో ఏ సమయములో మాట్లాడేనో, సరిగ్గా అదే సమయములో అది జరిగినది. అదేమిటి? వరము.

99ఒక జంతువును ప్రార్థన కొరకు వచ్చినది. అది ఆ ద్వారము యొద్ద నిలబడియున్నది. అది ఒక జ్ఞానము లేని జంతువు, అది ఒక ఆత్మ కాదు. కుడి ఎడమలు ఎరుగదు. దానికి ఆత్మ లేదు. ప్రాణమున్నది, కాని దానికి ఆత్మ లేదు.

అది ఏమిటి? పరిశుద్ధాత్మ విజ్ఞాపనలను చేయును. దేవుడు భూమి మీదికి ఒక వరమును పంపెను. పరిశుద్ధాత్మ ఆలస్యము చేయజాలదు. ఆయన నన్ను ఆధీనపరచుకొని మాట్లాడసాగెను. ఆయనే విజ్ఞాపనలను చేయును. మేము సమయమును పరీక్షించాము. అది సరిగ్గా అదే సమయము. ఒక్క నిమిషము కూడా తేడా లేదు. వారామెను గడ్డి మీద కూర్చోబెట్టిరి, ఎందుకనగా ఆమె చనిపోవుచున్నది. కనుక ఆమె ఏ సమయములో చనిపోయినదో చెప్పుటకు వారు సమయమును గుర్తుపెట్టుకొనిరి. అది సరిగ్గా పరిశుద్ధాత్మ నా మీదికి దిగి వచ్చి విజ్ఞాపనలు చేయించిన సమయము. ఆ మూలుగులను ఎవరూ అర్థము చేసికొనలేరు. అందుకు మాటలు లేవు. అది పరిశుద్ధాత్మ మాట్లాడుట.

దానిని నేను తెలిసికొనవలసిన పని లేదు. చూడండి, నేను తెలిసికొన లేదు. అది బహుశా ఆమె దూత కావచ్చును. దానిని మనం కొద్ది నిమిషములలో చూచెదము. అది అక్కడికి వచ్చి ఆ వర్తమానమును అందించెను, చూడండి.

అది నిజము. రెండు వేర్వేరు భాషలున్నవి, అందులో ఒకటి…

100ఏదయినా ప్రశ్న యున్నదా? మంచిది, దేవుడు చెప్పిన దానిని వినుటకు ప్రయత్నించుచున్నారు, చూడండి. సహోదరుడు స్ట్రయికర్ గూర్చి వివరించాను. ఆత్మయే మాట్లాడును. దానిని గూర్చి మనం ఏమి తలంచరాదు. దానిని అర్థము చేసికొనుటకు ప్రయత్నించరాదు. నిన్ను నీవు ఆత్మకు అప్పగించుకొనుము, చూచారా. "నీవేమి చెప్పుచున్నావు? నీవు నాతో మాట్లాడుచున్నావా?" అని నీవడుగనవసరము లేదు.

101ప్రశ్న: "వేదిక యొద్ద ఇతరుల కొరకు ప్రార్థించునప్పుడు ఒక వ్యక్తి భాషలతో మాట్లాడుట తగునా?

[టేపు మీద ఖాళీ యున్నది.] ఇక్కడ నేను ఏమి వ్రాశానో చూడనీయండి. చూడవలసి యున్నాను. దానికి అర్థము చెప్పువారు లేనిచో మౌనముగా యుండవలెను. I కొరింథీయులకు 14వ అధ్యాయము 28వ వచనము. బైబిలు మీ దగ్గరున్నదా? [ఒక సోదరుడు ఆ వచనమును చదువుచున్నాడు.] "ఆ భాషకు అర్థము చెప్పువారు సంఘములో లేనియెడల అతడు మౌనముగా యుండవలెను."

మంచిది. సంఘములో ఏ సమయమునందయినా గానీ అనువాదము చేయు వ్యక్తి లేనియెడల, మౌనముగా యుండవలెను. అర్థము చెప్పువారు లేనప్పుడు మాట్లాడరాదు.

102చాలాసార్లు జనులు వేదిక యొద్దకు వెళ్ళుచుందురు. ఈ మధ్యనే ఒక జత సేవకుడు వేదిక యొద్దకు వచ్చెను. అతడు వచ్చి మరొకరి వీపు తట్టి పలుకరించెను. అంతట వారు భాషలతో మాట్లాడనారంభించిరి. అందరికీ చూపించవలెననునట్లు మాట్లాడిరి. అది కృత్రిమంగా పరిశుద్ధాత్మను దించుట అని చెప్పవచ్చును (ప్రయత్నము చేయుట). అలాగు చేయవద్దు, చూచారా. ఆ ఒక్క వ్యక్తినే మాట్లాడనీయండి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారిని చేతులు పైకెత్తనీయుడి, చూచారా. ఇది తప్పు. వారు సంఘములో మౌనముగా యుండవలెను, చూడండి.

103["బ్రెన్హాం సోదరుడా?" అని ఒక సహోదరుడు పిలచెను.]

"ఏమిటి సోదరుడా?"

["ఒక వ్యక్తి ఆరాధనలో యున్నాడనుకొందము. సాధారణంగా వర్తమానం అందించిన తరువాత ఆరాధన ముగించెదము. ఒకవేళ ఆ వ్యక్తికి వరమున్నచో దేవదూతల భాషకును, ఇతర భాషకును మధ్యగల భేదమును చెప్ప గలడా?"]

దానిని పరీక్షించుదము. [టేపు మీద ఖాళి యున్నది.] అది వచ్చుచున్నప్పుడు గమనించండి. దానిని కాగితం మీద వ్రాయండి. నా బల్ల మీద దాని నుంచండి, చూచారా. దానిని నేను ఈ విధంగా చదువుదును. కానీ నేను ఆ గదిలోనికి నడిచి వెళ్ళినప్పుడు, సోదరుడా, అంతా జరిగిపోయినది.

104వారిక్కడికి వచ్చు ముందుగానే ఆ వెనుక నిలబడి యుండిరి. అందరూ ఎంతో మౌనముగా యుండిరి. ఐరిన్ సోదరి అచ్చట ఉండెను. "సిలువ యొద్ద" అను పాటను ఆమె వాయించుచుండెను. కావలి వారు అటు ఇటు తిరుగుచుండిరి. వారు మాట్లాడుతున్న వారిని మాట్లాడరాదని హెచ్చరించుదురు. చూచారా! వారు ఎంతో మర్యాదగా కూర్చొని యుందురు. "అయ్యలారా, ఇది ప్రభుని మందిరము. మీరాలాగు చేయరాదు. మీరు ప్రభుని మందిరములో సరిగా ప్రవర్తించవలెను అందురు."

స్త్రీలు, పురుషులు తమ కోట్లు అక్కడ తగిలించెదరు. వాటిని కొందరు చూచుచుందురు. తలుపు తెరచిన వెంటనే వారు వాటిని అందించెదరు. వారు ఆలయమునకు క్రమముగా ఉంచెదరు. అందరికీ సీట్లు దొరకునట్లు వారు చూచెదరు.

105నేను గదిలో యుండి ప్రార్థించుచున్నాను. అది మధ్యాహ్నము రెండు లేదా మూడు గంటలగును. ఎవరూ నన్ను తొందరపరచలేదు. అక్కడికి నేను నా వర్తమానంలో వెళ్ళాను.

ఇంక ఒక క్షణములో ప్రారంభమగును. పాటలను నడిపించు వ్యక్తి ఒక పాటను ప్రారంభించెను. ఫలాని నెంబరు పాట పాడుదమని చెప్పెను, "సిలువ యొద్ద నా రక్షకుడు మరణించెను," అను పాట వలెనే అది యున్నది. రెండు ప్రత్యేకమగు పాటలు పాడిరి. మేము పాటల కొరకు ఎన్నడూ ఎక్కువ సయమము వెచ్చించము. వాక్యము కొరకే సమయమిచ్చుదుము. వారు పాటలు పాడెదరు. ఈ క్రమబధమగు పాటలనే పాడుదురు. ప్రజలు ముఖ్యంగా వాక్యము కొరకు వచ్చుదురు. ఇది దిద్దుబాటు చేయు గృహము.

106సహోదరుడు జార్జి, సహోదరుడు జార్జి డిఆర్క్ వంటి సహచరులు కొందరున్నారు. వారు వచ్చి ప్రార్థించుదురు. ఆ తరువాత ఒక ప్రత్యేక కీర్తన పాడుదుము. అది ఒక్కరే పాడవచ్చును. ఆ తరువాత ఒకరు వచ్చి నన్ను సమయమైనదని రమ్మందురు. అంతా సరిగా యున్నచో నేను తాజా అభిషేకమును పొంది బోధించుటకు వచ్చెదను, చూచారా.

ఆ వారము వారికి ఇక్కడే ఆలయములో ఒక కూటము ఉండినది. అది వారి స్వంత కూటము. ఆ రాత్రి జరుగు కూటము ప్రారంభమవక ముందే దీనిని ఏర్పాటు చేసిరి. అక్కడికి నేను వచ్చాను. ఈలాగు చెప్పాను, "వచ్చే వారం ఈ ప్రాంతము మీదికి ఒక రకమగు తుఫాను రాబోవుచున్నది." దానిని ఇక్కడ వ్రాసి యుంచాను. అటువంటిది సంభవింపబోవుచున్నదని తెలియపరిచాను. "అది వ్రాయబడినది. భాషలలో పలుకబడి దానికి అర్థము చెప్పబడినది. ఈ ఆలయములోని సోదరులు ఇద్దరు దానికి భావమును చెప్పిరి. ఇద్దరు సాక్షులు. వారి సంతకములు ఇక్కడ యున్నవి. ఇది నమోదు చేయబడినది. అది దేవుని నుండి కలిగియున్నది." అది నా మొదటి భాగము.

1COR 14:32

 

107ఆ తరువాత ఇట్లు చెప్పాను, "సరే, మనం ఇందుకొరకు సిద్ధపడుదము. అందరూ ప్రార్థనలో యుండండి. ఇప్పుడు ఒక ప్రత్యేక విన్నపము ఉన్నది. అందరూ ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థించుదం." అందరం నిలబడి ప్రార్థించాము. సూటిగా వాక్యము యొద్దకు వచ్చితిమి.

ఆరాధన ముగిసిన వెంటనే వేదిక యొద్దకు పిలచితిమి, చూచారా. జనులను వేదిక యొద్దకు రప్పించుటకు మేము గట్టిగా ప్రయత్నములు చేయుదుము. ఆ వేదిక పిలుపు ఆయిపోయిన తరువాత నేను వీలును బట్టి రోగులకు ప్రార్థన చేయుదును.

ఆ విధముగా జరుగుచుండును. ఆరాధన మొత్తం క్రమముగా జరుగును, ఎందుకనగా ప్రవక్తల యొక్క ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో యున్నవి.

108దానిని గూర్చియే నేను ఆలోచించుచున్నాను. ఒక రాత్రి నేను చూచిన దర్శనము గూర్చి చెప్పినది గుర్తున్నదనుకొనుచున్నాము. దేవదూత నా యొద్దకు నడిచి వచ్చినది. నేను ఆ గదిలో ఆలోచించుచూ కూర్చొని యున్నాను. చాలా రాత్రి అయినది. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఎట్లుండును? వెలుగును నేను చూచాను. అప్పుడు నేను కూర్చొని యున్న చోటికి ఆయన నడిచి వచ్చుట చూచాను. అక్కడే ఆయన నాకాజ్ఞాపించెను. ఈ కూటములను చూచాను.

ఇప్పుడు, వర్తమానము ఇచ్చు వ్యక్తిని గూర్చి మీరు ప్రశ్నించారు. "వర్తమానము ఇచ్చుచున్న వ్యక్తికి అది దేవదూత అని తెలుసా లేక తెలియదా?" అని మీరడిగిరి.

[ఒక సోదరుడు ప్రశ్నించుచున్నాడు, "దేవదూతల భాష యున్నదని నీవు చెప్పియున్నావు…"] [టేపు మీద ఖాళీ యున్నది.]

అతనికి అర్థమగునని నేననుకొనుచున్నాను. ఆ విధంగానే దానిని మనం తెలిసికొనియున్నాము. మనము ఉండవలసిన రీతిగా మనం ఉన్నచో చాలును. కూటములకు ఏ విధమగు అవాంతరము కలుగదు.

109చూడండి, ఆ ప్రతి ఒక్కరికి సేవ యున్నది. నీవు భాషలతో మాట్లాడుదువు. అతడు దానికి అర్థము చెప్పును. అతడు వేరే పని చేయును. మరియొకరు ప్రవచించెదరు. మీరు ప్రసంగీకులు కాకపోవచ్చును. సంఘములో సభ్యులై యున్నారు, కాని మీ పని మీకున్నది. ఒక పనిని మీరు చేయవలసి యున్నారు. దేవుని యొక్క రాజ్యమునకు సహాయము చేయవలెనని మీరు ప్రయత్నించుచున్నారు. దాని కొరకు ఏదో చేయుదురు. ఆ విధముగా మీ సోదరులందరూ కలిసియుందురు. ఆ కారణము చేతనే సంఘ కాపరులమగు మేము ఈ విధంగా కలిసికొనుచున్నాము. మాకు ఒక సారూప్యమున్నది. మా సోదరులందరూ కలిసి లేఖనమును ధ్యానించెదరు, భాషలలో మాట్లాడెదరు, దానికి అర్థము చెప్పెదరు, సందేశమును ఇచ్చెదరు.

110కూటమునకు హాజరయిన వారు తమ వరములను గూర్చి గ్రహింపు కలిగియండవలెను. భాషలు మాట్లాడు వరము గల ఒక వ్యక్తి కూటమునకు వచ్చినప్పుడు భాషలకర్థము చెప్పు వ్యక్తి లేనియెడల అతడు తన్ను స్వాధీనములో ఉంచుకొనవలెను.

[ఒక సోదరుడు అడుగుచున్నాడు, శరీరమునకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు వీరు ఉపయోగపడుదురని మీరందరురా? కాని సంఘ కాపరులు, ఉపదేశకులు, మొదలగు వారు శరీరమునకు పరిపూర్ణత కలుగజేయుదురు గదా?"]

అవును, సంపూర్ణత కలుగజేయుట కొరకే అది యున్నది, చూచారా. ఇవన్నియూ పరిపూర్ణతను కలుగజేయును. సంఘమును పరిపూర్ణతలోనికి నడిపించుటకు ఆత్మ ఇయ్యబడినదని నేను నమ్ముచున్నాను.

111మాట్లాడు జనులు ఆత్మ నింపుదల గలవారని నిస్సందేహముగా చెప్పుచున్నాను. ఇక్కడున్న ఒకరు కూటములో మాట్లాడుచున్నారనుకొందము. అర్థము చెప్పువారు అచ్చటున్నారు, అయినా ఎవరూ అర్థము చెప్పలేదనుకొనండి, ఎదో తప్పున్నది. అందుకు అర్థము చెప్పువాడు బాధ్యుడు కాడు. మాట్లాడుతున్న వాడు ఎట్లు ఆత్మావేశము ద్వారా మాట్లాడుతున్నాడో, అర్థము చెప్పువాడును అలాగే చెప్పును. ఒకనికి నిజముగా అన్యభాషల వరము ఉండి యుండవచ్చును, కాని అతనికి ఒక భాష మాట్లాడు వరము లేకపోవచ్చును.

అపుడతడు చేయవలసిన పని ఏమనగా భాషను ఉపయోగించ వలెను. అయితే దానినతడు సక్రమంగా వినియోగించనిచో అతని ప్రారంభమే తప్పు. ఆ వ్యక్తి నీ భాషలకు అర్థము చెప్పుట లేదని నీవనుకోవద్దు. అతనికి అది చేత కాదు. అతనికి తప్పు ఉద్దేశ్యమున్నది, అతని అభిప్రాయమే వేరు, చూచారా.

1COR 14:4

 

112కాని అతడు దీనుడై మృదువుగా ఈలాగు పలికిన బాగుండును, "ప్రభువు ఈ కూటములో నన్ను వాడుకొనలేదు. ఆయన నా ఆత్మను దీవించెను. ఆయన నాకు క్షేమాభివృద్ధి కలుగజేసెను. నేను భాషలతో మాట్లాడినప్పుడు ఆయనకు దగ్గరగా ఉన్నానని నాకు తెలియును. నేను యాపిలు తోటలో నడిచెదను. దేవుని యొక్క శక్తి నా మీదికి దిగును. నేను అన్యభాషలతో మాట్లాడనారంభించెదను. నేను నూతనత్వము పొందుదును." "ఓ ప్రభువా, నీవు నాతో మాట్లాడుచున్నావు. భాషలతో మాట్లాడుట ద్వారా నీవు నన్ను వరుసలో యుంచుచున్నావు, ప్రభువా, ఈ రోజు నేనతనితో మాట్లాడవలసినదే. ప్రభువా, ఇందును బట్టి నన్ను క్షమించుము. నేను చేయరాని దానిని చేసి నీ ఆజ్ఞ మీరితిని. తండ్రి, దయచేసి నన్ను క్షమించుము." ప్రత్యక్షంగా భాషలతో మాట్లాడుట జరుగును. అప్పుపు నీకు మరల నూతనత్వము కలుగును.

అది మంచిదే. నీ వరమును ఆలయములో వాడుటకే కాదు. అది నీకు క్షేమాభివృద్ధి కలుగజేయును. "అన్యభాషలో మాట్లాడువాడు (తెలియని భాష) తనకు క్షేమాభివృద్ధి కలుగజేసికొనుచున్నాడు," చూచారా. అర్థము చెప్పువారు లేనప్పుడు ఈలాగు చేయుట యుక్తము. నా భావము గ్రహించారా? అతడు తన్ను తాను ఎరుగలేడు గాని, తప్పు చేసినప్పుడు గ్రహించగలుగును.

దానిని మీరు అలాగే కొనసాగనీయవలెను, చూడండి. దానిని వేరు చేయు వరకు మీరు అది మాత్రమే చేయవలెను. ఆ కారణమునే నేను తలంచుచున్నాను.

1COR 14:5

 

113ప్రశ్న: "I కొరింథీయులకు 14:5 ను వివరించుము."

వెంటనే ఎవరయినా తీయగలరా? మీలో ఎవరయినా దానిని తీసి యుంచారా. [టేపు ఖాళీ యున్నది.] ఒక సోదరుడు I కొరింథీయులకు 14:5 ను చదువుచున్నాడు.]

మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనే గానీ వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు.

మంచిది. "మీరందరూ భాషలతో మాట్లాడవలెనని నేను కోరుచున్నాను." పౌలు సంఘముతో చెప్పుచున్నాడు. మన సంఘము వలెనే అది యున్నది. పౌలు యొక్క కొన్ని సంఘములు చాలా చిన్నవి. వానిలో మనకున్నంత మంది సభ్యులు కూడా లేరు. పది లేదా పండ్రెండు మంది ఉన్న సంఘమున్నది, చూచారా. వారందరూ భాషలలో మాట్లాడవలెనని కోరుచున్నాడు. అది మీకు ఆశ్చర్యము కలిగించుచున్నదా?

అపోస్తలుల కార్యములు 19లో చూడండి. ఆ సంఘములో ఒక డజను మంది ఉన్నట్లు కనిపించును, చూచారా. చాలా చిన్నది. ఎల్లప్పుడూ తక్కువ సంఖ్యలోనే ఉన్నది. అందులో ఒక డజను మంది స్త్రీలు, పురుషులు ఉన్నట్లుగా కనిపించును.

1COR 14:5

 

114ఇక్కడ చూడండి, వారందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుకొనునట్లు చెప్పెను. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడవలెను. అందరూ భాషలతో మాట్లాడవలెను, కానీ మరీ విశేషముగా వారు ప్రవచించవలెనని కోరుచున్నాను. అర్థము చెప్పువారు లేని యెడల, భాషలతో మాట్లాడరాదు.

అందులో ఎట్లు చదివారు? దానిని గ్రహించారా? మరల మనం చదువుదం, ఇప్పుడు వినండి.

[ఒక సోదరుడు I కొరింథీయులకు 14:15 ను చదువ నారంభించెను. "మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నాను."] ఒక నిమిషం ఆగండి, మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నాను. ["మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను."] మీరందరూ ప్రవచింప వలెనని మరి విశేషముగా కోరుచున్నాను. ["భాషలతో మాట్లాడువాని కంటే ప్రవచించు వాడే శ్రేష్ఠుడు] ఒక్క నిమిషం ఆగండి. ప్రవచించు వాని కన్న గొప్ప వారెవరు? అక్కడే మీరు నన్ను ఆగమని కోరుచున్నారా? ["నేనడిగినది వేరే సంగతి అని ఒక సోదరుడు చెప్పెను."] చూచారా? అవును.

ఉదాహరణకు మన మధ్య ఈ రాత్రి ఇద్దరు విద్యలేని వారున్నారని తలంచుదము. దీనిని గూర్చి వారికి ఏమియూ తెలియదు. మనందరం కూటమును ఆరంభించాము. మీరు భాషలతో మాట్లాడనారంభించారు. అందరూ భాషలతో మాట్లాడుచున్నారు. ప్రతి ఒక్కరూ భాషలతో మాట్లాడుతున్నారు. అంతటా భాషలే వినబడుచున్నవి. ఎట్లుండును? ఆ చదువులేనివారు వీరిని చూచి పిచ్చివారను కొందురు. చూచారా? కానీ ఒకరు ప్రవచించినయెడల, వారు అర్థము చేసికొందురు. ఆ చెప్పినది వారికి తెలియును.

115ఇప్పుడు, ఇంకా ముందుకు చదవండి. [సోదరుడు మిగిలినది చదివెను.] చూడండి. భాషకు అర్థము చెప్పువారుంటే తప్ప అని యున్నది. భావము చెప్పువారు లేనప్పుడు, భాషలలో మాట్లాడువాని కంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ఇంకా ముందుకు చూడండి. ["సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయునట్లుగా…"] చూడండి, సంఘము క్షేమాభివృద్ధి పొందును.

ఇంకో రీతిగా అర్థము చేసికొందము, ఈ రాత్రి మన మధ్య చాలామంది చదువులేనివారు ఉన్నారనుకొందము. మనము ఈ కూటమును ఏర్పరచుకొన్నాము. ఇక్కడున్న మనమందరము ప్రభువును గూర్చి తెలిసికొనవలెనని వచ్చియున్నాము. అయితే వచ్చిన వారందరూ భాషలతో మాట్లాడుతున్నారనుకొందము. ఎవరూ ఏమి చెప్పలేదు; అందరూ భాషలతో మాట్లాడుతున్నారు. అది మంచిదే. "మీరందరూ భాషలలో మాట్లాడవలెనని కోరుచున్నాను," అని పౌలు చెప్పెను.

కాని మీలో ఒకరు లేచి నిలబడి, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని ప్రవచించెననుకొనండి. మన మధ్య కూర్చొనియున్న కొత్త వ్యక్తిని గూర్చి ఆ ప్రవచనము వచ్చెననుకొందము. "అతని పేరు జాన్ డో, అతడు ఫలాని స్థలము నుండి వచ్చెను. అతడు తన భార్యను నలుగురు పిల్లలను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చెను. అతడు ఒక సహాయము కొరకు ఈ రాత్రి ఈ కూటమునకు వచ్చెను. ఈ రోజు అతడు మెంఫిస్ లో ఒక వైద్యుని కలిసికొనెను, టెన్నీస్ నుండి వచ్చెను. అతని ఊపిరితిత్తులకు కాన్సరున్నదని వైద్యుడు చెప్పెను. అతడు చనిపోవుచున్నాడు."

1COR 14:23-25

 

116మీరందరూ భాషలతో మాట్లాడుతుండగా మా మధ్యకు ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మిమ్ములనందరినీ చూచి పిచ్చివారనుకొనును. కాని మీలో ఒకరు ప్రవచించి అతని హృదయములోని రహస్యమును బయటకు తెచ్చినప్పుడు, అప్పుడతడు సాష్టాంగపడి నిజంగా దేవుడు మీతో యున్నాడని పలుకును, చూడండి.

ఇప్పుడు చూడండి. మీరు భాషలతో మాట్లాడుతున్నారు. దానికి ఒకరు అర్థము చెప్పుచున్నారు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పును. మీలో ఒక వ్యక్తి భార్యను విడిచిపెట్టి యున్నాడు. ఆ వ్యక్తి మన మధ్య కూర్చొనియున్నాడు. ఈ రోజున నాష్ విల్లో యున్నాడు, లేదా మెంఫిస్ లో లేక మరో పట్టణంలో ఉండెను. అతనికి ఊపిరితిత్తుల కాన్సరున్నది. నీవిక్కడికి రమ్ము. నీ పేరు జాన్-డో, లేదా ఫలాని పేరు అని చెప్పితే ఎట్లుండును?

117"అర్థము చెప్పువారుంటేనే మాట్లాడవలెను." చూడండి, అతడు క్షేమాభివృద్ధి కలుగజేయుచున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి బయటకు వెళ్ళి ఏమి చెప్పునో చూడండి, "ఒక సంగతి చెప్పుచున్నాను వినండి. ఆ జనులకు దేవుడు తోడైయున్నాడు. నిశ్చయంగా! ఆ జనులకు నేనెవరినో తెలియనే తెలియదు."

కావున మనకు ప్రవచన వరము కావలెను, దానికి తోడుగా భాషలలో మాట్లాడుటయు కావలెను. కాని భాషలతో మాట్లాడునప్పుడు తప్పక అర్థము చెప్పువారు కావలెను. దానికి అర్థము చెప్పినప్పుడు అదే ప్రవచనమగును, చూచారా. అదే ప్రవచనము. ఇక్కడ ఒక ప్రశ్న యున్నది, వీలయినంత త్వరగా దానిని వివరించెదను. [టేపు మీద ఖాళీ యున్నది.]

MATT 18:10•

2COR 5:1

 

118ప్రశ్న: "మత్తయి 18:10." [ఒక సోదరుడు మత్తయి 18:10 ని చదువుచున్నాడు."]

ఈ చిన్న వారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖము ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను.

మంచిది. సోదరుని పేరు లేదు, ఎవరయిన సరే గాని వ్రాసిన వారితో చెప్పుచున్నాను.

నీవు దానిని రెండు విధములుగా తీసికొన వచ్చును. కాని నేను భావము గూర్చి ఆలోచించుచున్నాను. దీనిని వివరించుమని నీవు నన్ను అడిగినచో నేను దానిని వివరించియుందును.

ఎవరయినా సరే, II కొరింథీయులకు 5:1 తీయుడి. అందులో ఇట్లు చెప్పబడెను, "భూసంబంధమగు శరీరము శిథిలమైపోయినను…" అదేమిటో మీరెరుగుదురు. "ఈ భూమి మీద గుడారము శిథిలమైపోవునప్పుడు మరియొకటి కాచుకొని సిద్ధముగా యున్నది."

MATT 18:10•

MATT 19:13•

MARK 10:13

 

119మత్తయి 18:10 లో మీరు గమనించియుందురు. ఆయన చిన్న పిల్లలను చేర్చుకొనుట గూర్చి మాట్లాడుచున్నాడు. వారు చిన్నవారు, మూడు లేదా నాలుగు సంవత్సరముల వయస్సు వారు. వారిని ఎత్తుకొనెను. వారు పిల్లలను ఆయన యొద్దకు తెచ్చిరి. పిల్లలు అనగా మరీ పసివారు కారు గాని పిల్లలు, చూచారా. వారు ఇంకా బాధ్యతను తెలిసికొనని వారు.

వారిని తృణీకరించరాదని ఆయన చెప్పెను. దానికి నిజమగు అర్థము ఏమనగా వారిని సరిగా పరామర్శించవలెననియే. మీరు ఎన్నడూ ఆ బిడ్డలను తృణకరించకూడదు. వారు పిల్లలు. వారికి తెలియదు, చూచారా.

ఇప్పుడు ఆయన చెప్పినది గమనించండి, "వారి దూతలు ఎల్లప్పుడు పరలోకమందున్న నా తండ్రి ముఖమును చూచుచుండును." మీరు చూచారా? ఇంకో మాటలో చెప్పవలెనన్న, వారి దూతలనగా వారి వర్తమానికులు, వారి శరీరములు దైవ శరీరములు. వారు చనిపోయినచో అలాగే మారుదురు. ఎల్లప్పుడూ పరలోక మందున్న తండ్రి ముఖమును చూచుచున్నారు, చూచారా.

ACTS 12:5-9,12•

2COR 5:1

 

120"ఈ భూమి మీద మన గుడారము శిథిలమై పోయినచో మరియొకటి సిద్దముగా కనిపెట్టుచున్నది." అది నిజమేనా? అది ఒక శరీరము. ఇటు చూడండి. నాకు సమయమున్నచో పూర్తిగా చెప్పి యుందును. నాకు సమయము చాలదు. కాని టేపు మీద ఉండునట్లుగా దీనిని చెప్పుచున్నాను, ఏలాగయినా దానిని మీరు గ్రహించెదరు.

చూడండి, ఒక రాత్రి పేతురు చెరసాలలో యుండెను. జాన్ మార్క్ ఇంటి యొద్ద వారికి ప్రార్థన కూటముండెను. యెహోవా యొక్క దూత లోనికి వచ్చెను - అది అగ్నిస్తంభము, వెలుగు వచ్చినది - ఆ వెలుగు వచ్చుటను పేతురు చూచి తాను కలగనుచున్నానేమో అనుకొనెను. అది వెలుగు అని బైబిలు చెప్పుచున్నది, చూచారా. అదే మనతో కూడా యున్నాడని నేను నమ్ముచున్నాను. ఆయన దిగి వచ్చెను. అదే సమస్యలో మనమును ఉన్నాము. బహుశా అదే జరుగవచ్చును, చూచారా. "నాతో కూడా రమ్ము," అని అక్కడ ఆయన చెప్పెను.

కనుక పేతురు తాను కలగనుచున్నానని తలంచి ఆ కల యొక్క భావమును చూడగోరెను. కావున అతడు రక్షకభటుల ప్రక్కగా నడిచిపోయెను. ఆ తలుపు దానికదే తెరచుకొనగా ఆశ్చర్యపడెను. తరువాత తలుపు యొద్దకు వెళ్ళగా, అది కూడా ఆ విధంగా తెరచుకొనెను. పట్టణపు గవునుల గుండా వెళ్ళెను. అవి కూడా వాటికవి తెరచుకొనెను. ఇంకా అతడు తాను తాను కలగనుచున్నాననియే తలంచెను. అప్పుడతడు వెలుపట నిలబడి ఇట్లనుకొనెను, "ఇప్పుడు నేను విముక్తి పొందాను. జాన్ మార్క్ ఇంటికి వెళ్ళి కొద్దిగా సహవాసము చేయుదును."

ACTS 12:13-16•

2COR 5:1

 

121వారక్కడ ఇట్లు ప్రార్థించుచుండిరి, "ఓ ప్రభువా, నీ దేవదూతను పంపి పేతురును విడిపించుము."

అదే సమయములో ఒక సంగతి జరిగినది. [సహోదరుడు బ్రెన్హాం తట్టుచున్నారు.] ఒక చిన్నది తలుపు యొద్దకు వచ్చి ఇట్లు అడిగినది, "ఎవరక్కడ?" గడియను తీసి చూడగా పేతురు అక్కడ నిలబడియున్నాడు. కావున ఆమె లోనికి వచ్చి, "పేతురు వచ్చెను గనుక ప్రార్థన ఆపమని చెప్పెను."

అతడు చెప్పెను, "ఓ, తెరువుము!" చెప్పెను, "నీవు…" చూచారా?

[సహోదరుడు బ్రెన్హాం మరల తట్టుచున్నారు.] "తలుపు తెరవండి! నేను లోనికి రావలెను," చూడండి.

"ఈ పేతురు తలుపు యొద్ద ఉన్నాడని మరల చెప్పెను."

అతని తలను ఈ పాటికే నరికి యుందురు గనుక అది అతని దేవదూత అయి యిండుననిరి, చూడండి. (అది అతని పరలోక గుడారము, దానిని ముందే అతడు పొందుకొనెను; ఈ భూలోక గుడారము శిథిలమైపోయినది, ఎందుకనగా అతని రాక కొరకు పరలోకమందు మరియొకటి ఎదురు చూచుచున్నది.)

ఆవలకు దాటిపోయిననట్లుగా ఒక రోజున నేను దర్శనములో చూచాను. "ఈ భూలోక గుడారము శిథిలమై పోయినా మరియొకటి మనకున్నది."

ఈ చిన్నవారు పాపము చేయలేదు, చూచారా?

GEN 2:7•

1COR 15:40•

2COR 5:1

 

122ఒక శిశువు తల్లి గర్భములో రూపొందుచుండును, చూచారా. కాని మొదట అది ఒక ప్రాణము. ఓ ప్రాణము శరీరమును ధరించుకొనుచుండును. ఒక చిన్న జీవ కణము శరీరమును ధరించుకొనును. గర్భములోనికి అది పడిన వెంటనే కండరముగా మారి కదలుచుండును. దానిని మనం ఎరుగుదుము. అవి కణములు. మీరు గుర్రపు వెంట్రుకను తీసికొని నీటిలో వేయండి. అది అటు ఇటు కదలుచుండును. దానిని నీవు అంటుకొనగా అది గంతులు వేయును. శిశువు కూడా ఆ విధంగానే యున్నది.

ఈ లోకములోనికి వచ్చిన వెంటనే అది ఊపిరి పీల్చుకొనును. అది మొదటి ఊపిరి. అది జీవించు ప్రాణియగును, చూచారా. ఆత్మను కలిగియుండును. భూలోక సంబంధమగు శరీరము ఈ లోకము లోనికి జన్మించుచుండగా ఒక దైవ సంబంధమగు శరీరము అనగా ఆత్మ సంబంధమగు శరీరము కూడా దానితో పాటు ఎదుగుచుండును. ఈ ప్రకృతి సంబంధమగు శరీరము రాలిపోయిన వెంటనే దాని కొరకు ఒక పరలోక గుడారము ఎదురు చూచుచున్నది.

ఈ భూలోక సంబంధమగు గుడారము శిధిలమై పోయిన వెంటనే దాని కొరకు ఒక పరలోక గుడారము సిద్ధము చేయబడి యున్నది. ఒక శిశువు శరీరమందు భూలోకములోనికి వచ్చిన వెనువెంటనే దానిని చేర్చుకొనుటకు ఒక ఆత్మ సంబంధమగు శరీరము కాచుకొని యున్నది. ప్రకృతి సంబంధమగు శరీరము శిథిలమైపోయిన వెంటనే, ఆవల ఒక ఆత్మ సంబంధమగు శరీరము ఎదురు చూచుచున్నది, చూచారా. దానిని మనము "ధియోఫనీ" అని పిలచుదుము. దైవసంబంధమగు శరీరము.

123[ఒక సోదరుడు అడుగుచున్నాడు, "ఈ శరీరము తాత్కాలికమైనది. ఈ శరీరమునకు పునరుత్థానమున్నదా?] అవును, చూచారా. పునరుత్థానము వరకు ఆ స్థితిలోనే మనము జీవించవలసి యున్నామా?" ఇది నిజము, చూచారా.

నరపుత్రులకు ఇంకా అది బయలుపడలేదు. నేను ఎరుగుదును. నేను దానిని చూచాను, చూచారా. అది ఏ విధమగు శరీరమో నాకు తెలియదు గాని మీ శరీరమును లేదా మీ అవయములను తాకినట్లుగానే దానిని కూడా నేను తాక గలిగియున్నాను. ఇది టేపు మీద యున్నది. నేను చనిపోయిన తరువాత ఎన్నో సంవత్సరముల పాటు మీరు దీనిని విందురు. అవునా? అది ఏమైనా గాని ఆ జనులను నేను పట్టుకొని యున్నాను. మీరెంత వాస్తవముగా యున్నారో వారును అంతే వాస్తవముగా యున్నారు. అయినా గాని వారు తినరు, త్రాగరు. అక్కడ నిన్న అనునది గాని, రేపు అనునది గాని లేదు, చూడండి. అది నిత్యత్వము.

MATT 18:10•

2COR 5:1

 

124ఎప్పుడైతే గుడారము… వారు ఆ శరీరములో అక్కడ జీవించుదురు. వారు మరల భూమి మీదికి వచ్చిరి. ఆ విధమగు వారి శరీరము అమర్త్యతను ధరించినది. భూమి మీద ధూళి సమకూర్చబడి థియోఫనీగా మార్చబడినది. వారు మరల మానవులయిరి. ఏదేను తోటలో వారు తినినట్లుగానే తిందురు, చూచారా. "ఈ భూమి మీద మన గుడారము శిథిలమై పోయినా, మరియొకటి మన కొరకు సిద్ధముగా ఎదురు చూచుచున్నది."

కావున ఈ చిన్నవారికి పాపము లేదు, వారికి దేవదూతలున్నారు. అవి వారి "శరీరములు." (పేతురు ఆనాడు ధరించినది అదే) అది ఎదురుచూచుచున్నది. పరలోకమందున్న తండ్రి ముఖమును చూచున్నారు. అదెల్లప్పుడూ ఆయన ఎదుట ఉన్నది. వారది ఎరుగుదురు.

JOHN 20:17,27

 

125[ఒక సోదరుడు అడుగుచున్నాడు, "యేసు తన మొదటి పునరుత్థానముతో చెప్పిన ఒక భాగము కొద్దిగా కష్టముగా యున్నది. నన్ను ముట్టుకొనవద్దు. ఇంకా నేను ఎక్కిపోలేదు." తోమా ఉండిన గదిలోనికి ఆయన వచ్చెను. అప్పుడాయన అతనితో, నీవు వచ్చి నా ప్రక్కలో నీ చేతిని ఉంచుము అనెను."] అది నిజము. ఇంకా ఆయన ఎక్కిపోలేదు. ["ఆ రెండింటికీ మధ్య ఉన్న తేడా గమనించండి - వారిని ఆయన ముట్టుకొన వద్దని చెప్పెను. అయితే తోమా యొద్దకు వచ్చి ముట్టుకొనమని చెప్పెను."] చూడండి. ఆయన ఇంకా ఎక్కి పోలేదు. ["ఏలయనగా ఇంకా నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు."]

చూడండి, అది నిజమే. ఆయనను అంటుకొన రాదు, పునరుత్థానుడాయెను. భూమిలో నుండి ఆయన రావలసి వచ్చెను. చూడండి. ఆయన భూమిలో నుండి వచ్చి మానవుల మధ్య నడిచెను. కాని ఇంకా ఆయన ఎక్కిపోలేదు. నన్ను ముట్టుకొనరాదని ఆయన మరియతోను అనెను.

"రబూనీ," అన్నదామె.

"ఇంకా నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. కాని నేను నా దేవుని యొద్దకును, మీ దేవుని యొద్దకును, నా తండ్రి యొద్దకును, మీ తండ్రి యొద్దకును ఎక్కి పోవుదును," అని ఆయన చెప్పెను.

ఆ రాత్రి ఆయన దేవుని సముఖమునకు ఎక్కి పోయేను. ఆయన మృతులలో నుండి తిరిగి లేచెను. దేవుని యొద్దకు ఎక్కి పోయెను. ఆయన తిరిగి వచ్చెను. తన ప్రక్కను అంటుకొనమని ఆయన తోమాను ఆహ్వానించెను. చూడండి, ఆయన దేవుని సముఖమునకు ఎక్కిపోయెను. ఇది సరియే.

1COR 14:1

 

126ప్రశ్న: ఇప్పుడు, "I కొరింథీయులకు 14లో నుండి అడిగిరి, 'ప్రేమను వెంటాడుము, ఆత్మ సంబంధమగు వరములను ఉపేక్షించుము. మరి ఎక్కువగా ప్రవచనమును కోరుకొనుము.'"

వెబ్స్టర్ లో (డిక్షనరీ) ఇట్లున్నది, "ప్రవచించుము: జరుగబోవు సంగతులను చెప్పుము, ముఖ్యముగా దైవిక ఆవేశము ద్వారా పలుకుము." ఆ విధముగా వెబ్స్టర్లో చెప్పడెను, సోదరుడు అడిగినది అదే. "భవిష్యత్తులో జరుగబోవు విషయములను చెప్పని వర్తమానమును ప్రవచనము అందుమా?"

అనరాదు. ప్రవచనమనగా "ముందు జరుగనైయున్న సంగతులు చెప్పుట." చూచారా? మంచిది.

1COR 14:27,40

 

127ప్రశ్న: ఇప్పుడు, "I కొరింథీయులకు 14:27. వర్తమానములన్నింటికి అర్థము చెప్పువలెనని నేను భావించుచున్నాను. ఒక ఆరాధనలో భాషలలోని వర్తమానములు మూడు కంటే ఎక్కువ ఉండరాదని నేను భావించుచున్నాను."

అది లేఖనము. దానిని నేను ఇక్కడ వ్రాసియుంచాను. ఆ విషయము మనకు పరిచయమే. దానిని ఎరుగుదుము. మూడు వర్తమానముల కంటే మించరాదు. అది I కొరింథీయులకు 14లో కూడా యున్నది, చూచారా. అది నిజము. "మూడు వర్తమానములు. సోదరులారా, మీ కూటములలో దానిని మీరు చూచియున్నారు. ఇప్పుడు దానిని మీరు చూచుచున్నారు. చాలామంది జనులు వర్తమానము చెప్పవలెనని తొందరపడుచున్నారు. అయితే వారికి పరిశుద్ధాత్మ లేదని చెప్పరాదు.

కానీ చూడండి, పౌలు కొరింథీ సంఘమును క్రమములో యుంచవలెను అక్కడికి వెళ్ళెను. మనందరను దానిని ఎరుగుదుము, తెలియదా? అతడు దానిని క్రమములో ఉంచవలసియున్నాడు. "సమస్తమును మర్యాదగాను క్రమముగాగాను జరుగనియ్యుడి," అనెను.

1COR 14:26

 

128పౌలు అక్కడికి వెళ్ళుటను మీరు గమనించండి. అతనికి కొరింథీ సంఘముతో ఎప్పుడూ సమస్యగానే యుండెను. మరెన్నడూ ఏ విధంగా అతడిట్లు పలుకలేదు. ఎఫెసు సంఘము గూర్చి ఎన్నడూ అతడిట్లు పలుకలేదు. అతడు వారికి నిత్య భద్రతను గూర్చి బోధించగలడు. కొరింథీ సంఘములో ఎన్నడూ ఈ నిత్య భద్రత గూర్చి చెప్పబడలేదు. వీరు ఎల్లప్పుడూ పసివారుగానే యుండిరి. ఒకరికి భాషలున్నవి, మరొకరికి పాటలున్నవి. అది నిజమే గదా? చూచారా? మీ సంఘములను కూడా అలాగే క్రమములో ఉంచుడి.

మార్టిన్ లూథర్ ను చూడండి. అతడు పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మాట్లాడెను. అతడు తన దినచర్య పుస్తకములో ఇట్లు వ్రాసెను, "నేను భాషలతో మాట్లాడాను, కాని నేను నా జనులకు దానిని బోధించినయెడల వారు దాతను తెచ్చుకొనుటకు బదులుగా దానము తెచ్చుకొనుటకే ఎక్కువ పాటు పడెదరు." చూడండి, వారు వరమునే ఎక్కువగా పొందనాశించెదరు గాని ఆయనను పొందుటకు ప్రయత్నించరు.

జనులు ఆ విధంగానే యున్నారు. వారిని భాషలతో మాట్లాడనిచ్చినచో వారెంతో ఉబ్బిపోయి గంతులు వేయుదురు. అది దేవునికి సంబంధించినది కానిచో, చల్లారి పోవును.

ఆధునిక సంఘములు మొత్తం సంగతిని కలగలుపు చేసి యున్నారు, కాని మనం అలాగు చేయుము. అది దేవుని వరమని మనం నమ్ముచున్నాము. దేవుని ఆత్మ ద్వారా దానిని మనం ఉంచగలము. రాయ్ సోదరుడా, దాని సంగతి ఏమిటి? అది నిజము. అవును, సంఘములో ఉంచండి; అది సంఘమునకు చెందును. భాషలతో మాట్లాడు వరము దానికి చెందును, చూడండి. దేవుని సంఘములో అది యుండును.

1COR 14:13,27

 

129ఇక్కడ అతని యొక్క ప్రశ్న ఏమిటో ఖచ్చితంగా చూద్దాం. ఇట్లు అడిగెను:

"వర్తమానములన్నియూ అనువదించబడవలెనని నేను నమ్ముచున్నాను. అది నిజము. మూడు మాత్రమే చాలును.

అది నిజము, చూడండి, ఉదాహరణకు చెప్పెదను, మీరు ఒక కూటమును ఏర్పరచి యున్నారు. మనం ఇచ్చట కూర్చొని యున్నాము. ఒక వ్యక్తి ఆ సమూహములో తనలో తాను భాషలలో మాట్లాడుకొనుచుండగా ఇతరులకు ఏమీ ప్రయోజనము? మనందరమూ గలిబిలి యగుదుము. అతడేమి చేయుచున్నాడో తెలియదు, చూచారా. ముగ్గురు చాలును… హాలిన్ వలె చేయవలెను. అతడు భాషలలో మాట్లాడును. అక్కడ భావము చెప్పు వ్యక్తి కూడా ఉండవలెను.

నీ భాషకు నీవే అర్థము చెప్పితే వేరే సంగతి గాని లేనియెడల అర్థము చెప్పు వ్యక్తి కావలెను. "భాషలతో మాట్లాడువాడు దానికి అర్థము చెప్పు శక్తి కొరకు కూడా ప్రార్థించవలెను." అతడు తన స్వంత భాషను అనువదించుకొనగలడు. అది మరియొకడు చేయుట ఎంత భావ్యమో అతడు చేయుటయు అంతే భావ్యము. భాషలతో మాట్లాడునప్పుడు తప్పక అర్థము చెప్పువాడుండవలెను. కొందరు గుంపుగా భాషలతో మాట్లాడుచున్నారనుకొందము. అక్కడ అర్థము చెప్పువాడు లేడు, అప్పుడు నీవు చెప్పుచున్న దానికి నీవే అర్థము చెప్పుకలుగునట్లు ప్రార్థించుము.

1COR 14:3

 

130దానిని బట్టి నీవు గర్వించవద్దు, ఎందుకనగా దాని వలన నీకు నీవు క్షేమాభివృద్ధి కలుగజేసికొనుచున్నావు, చూడండి. కాని దేవుని నీవు ఘనపరచునట్లు గాను, సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునట్లుగాను నీవు మాట్లాడుము. సోదరుడా, అది ఒక పెద్ద కారణము కొరకే అయితే పరవాలేదు. ఈ వరములు దేవుని మహిమ పరచుటకును, సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును ఇయ్యబడినవి. అందువలన ప్రజలు దేవుని యొద్దకు వచ్చెదరు. దేవుడు మనతో యున్నాడని వారు తెలిసికొందురు. ఆయన చనిపోయిన దేవుడు కాడు; ఆయన మన మధ్య సజీవుడై కార్యములు జరిగించుచున్నాడు, చూచారా.

దానిని మనము బహు జాగ్రత్తగా గమనించవలెను. అపవాది దానిని బహుగా ద్వేషించును. నిజమయిన వరములను అది అసహ్యించుకొనును. వరములు బలహీనమైనవి గనుక వాటిని ఉపయోగించుకొని, వాడు తన పనిని జరిగించుకొనును. ప్రతి వరమును వాడు అనుకరించ గలడు.

1COR 12:10•

1COR 14:27

 

131ప్రవచన వరమునకును, ప్రవక్తకును మధ్య నున్న తేడాను గమనించండి. మిలియను మైళ్ళ తేడా యున్నది. ప్రవచన వరము గల వ్యక్తి సంఘము ఎదుట ప్రవచించినప్పుడు దానిని వివేచించు వారు అందులో ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నప్పుడు అది నిజమయితే, వారు నిజమని స్థిరపరచుదురు. ఇది నిజము. కాని ప్రవక్త అలాగుండడు, చూచారా. ప్రవక్త అనునది ఒక కార్యాలయము. ప్రవచన వరము ఒక బహుమానము. "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అనుదానితో ప్రవక్త జన్మించును. సోదరుడా, అతడిలాగే ముందుకు కొనసాగును. దానిలో ఏమి సందేహము లేదు. అది ప్రవక్త పని. కాని ప్రవచన వరము ఒక కానుక, చూడండి. ఒకటి దేవుని యొక్క కార్యాలయమై యున్నది; మరియొకటి దేవుని వరమైయున్నది, చూచారా. అదే భేదము.

132వర్తమానములు ఎట్లుండునో ఉదాహరణగా చెప్పెదను. ఈ రాత్రి సహోదరుడు జూనీ అర్థము చెప్పుచున్నాడనుకొందము. అతడు అర్థము చెప్పువాడని మనకు తెలియును. సహోదరుడు నెవిల్ కూడా అర్థము చెప్పును. భాషలకు భావము తెలియచేయును. మనమెరుగుదుము. ఈ రాత్రి ఇక్కడ మనము కూర్చొని యున్నాము. దేవుని ఆత్మ మాట్లాడనారంభించెననుకొందము. ఆరాధన ఇక కొన్ని నిమిషములలో ప్రారంభమగుననుకొందము. ఆరాధనకు ముందు మనము కలిసికొని యున్నాము. దానిని ఇక్కడ మన క్రమానుసారముగానే నేనుంచెదను.

మొదటి సంగతి తెలిసికొనండి. రడెల్ సోదరుడు లేచి భాషలతో మాట్లాడును. ఒక్క నిమిషం ఆగండి, చూచారా. జూని లేచి "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఫలాని కార్యము జరుగబోవు చున్నది," అని చెప్పుననుకొనండి. దానిని కొందరు వ్రాయుదురు. చెప్పినదంతయూ వ్రాయుదురు. అతడు మాట్లాడుచుండగా మనం త్వరత్వరగా వ్రాయుదుము. దానిని నీవు అంగీకరించనిచో ఆ కాగితమును చింపి వేయుట మంచిది. కానీ దానిని నీవు స్వీకరించినప్పుడు ఇద్దరు దానిని బలపరచవలెను. దానిని వారు వ్రాసెదరు. దాని మీద వారు సంతకము చేసెదరు, చూచారా. అది మా సంఘము కొరకు, మా లాభము కొరకే ఇదంతా చెప్పుచున్నాను, చూడండి. ప్రారంభములో వారాలాగు చేసిరో లేదో నాకు తెలియదు.

1COR 14:27

 

133మొదటి సంగతి ఏమనగా హాలిన్ తటాలున లేచి భాషలతో మాట్లాడును. అదే వర్తమానమును అనువదించు వ్యక్తియు చెప్పవచ్చును. ఒక ప్రత్యేకమగు జరుగబోవు సంగతిని వారు చెప్పవచ్చును, ఒక ప్రవచనము; ఒకటి జరుగబోవుచున్నదని పలుకును, లేదా నీవు తప్పక చేయవలసిన దానిని చెప్పును. ఆ వెనుకనే యున్న సహోదరుడు రాబర్సన్ భాషలలో మాట్లాడును. మంచిది. వర్తమానము ఒక్కటే కావచ్చును. అదే అర్థమును చెప్పవచ్చును, లేదా మూడు వర్తమానములు రావచ్చును.

దేవుడు ఒకే రాత్రి యందు ఏబది వర్తమానములను ఇయ్యడు. అది మనకు తెలియును, వాటిని మీరు గ్రహించలేరు. సంఘ క్షేమాభి వృద్ధికి ఏది అవసరమో దానినే ఇచ్చును. దానికి భిన్నముగా ఉన్నదానిని నేను అనుమతించను, ఎందుకనగా ముగ్గురి ద్వారా అది స్థిరపరచబడును, చూచారా.

1COR 14:27

 

134ముగ్గురు మాట్లాడవచ్చును, "వాటిని వ్రాయండి, వేదిక మీద వాటి నుంచండి," అని చెప్పుదును. అప్పుడు రేపు రాత్రికి మరల మనం కలిసికొందుము. ఇప్పటికిని, రేపు రాత్రికి మధ్య ఏదయినా జరిగినయెడల, దేవుడు ఈ వర్తమానములలో ఒక దాని యందు చెప్పియుండును. నా భావము గ్రహించారా? ముగ్గురు మాట్లాడవలెను. వెబ్స్టర్ చెప్పిన దానిని తలంచుచున్నాను.

ప్రశ్న: "భవిష్యత్తును గూర్చి చెప్పని వర్తమానమును ప్రవచనమని అనగలమా?"

కాదు. అది ప్రవచనమయితే జరుగబోవుచున్న దానిని గూర్చి ముందుగానే చెప్పును. అది నిజము గనుక నెరవేరును.

135మిగతా వాటి యొద్దకు వచ్చు ముందుగా ఈ చివరిది చూద్దాం.

ప్రశ్న: (ఈ ప్రశ్నను టైపు చేసిరి గాని తుడిచిపెట్టినట్లుగా అయిపోయినది.) "బ్రెన్హాం సోదరుడా, ఈ ప్రశ్నలలో దేనికయినా గాని నీకు జవాబిచ్చుటకు నడిపింపు లేనిచో ప్రక్కన పెట్టుము. అందుకు నేను బాధపడను. లేఖనము ప్రకారము డీకన్ యొక్క పూర్తి విధులు ఏమిటి?"

వారు ఆ బయట ఉన్నారని నేను నమ్ముచున్నాను. మన సంఘ డీకన్ లలో ఒకరు దీనిని అడిగిరని నేనెరుగుదును. వారికి ఒక క్రమమున్నది. మనము ఇంకా ఎక్కువ ప్రతులు అచ్చు వేయించి మన డీకన్ లందరికిని ఇయ్యవలెను. కాని ఇంకా అవి అచ్పు రాలేదు. జీన్, దాని ప్రతి ఒక్కటయినా యున్నదా? లియో సోదరుడు గాని మరెవరయినా గాని వెళ్ళి, ఆరు లేదా ఎనిమిది ప్రతులను తెచ్చి మన డీకన్ లకు ఇయ్యండి. వారి విధులు గూర్చి అది చెప్పును. లేఖనానుసారముగా డీకన్ ఏమి చేయవలెనో చూడండి.

136ప్రశ్న: "క్రమము తప్పి వచ్చిన భాషను లేదా వర్తమానమును మనం ఎట్లు సరి చేయవలెను?"

అత్యవసర పరిస్థితిలో చేయవలసిన దానిని గూర్చి అడిగిరి. దీనినెవరు అడిగిరో గాని మంచిది. చాలా చక్కని ప్రశ్న. రబ్బరు గ్లోవ్స్ తో దానిని నీవు సరిదిద్ద వలెను.

ఇక్కడి మన సమాజములోనికి ఒకరు వచ్చి, క్రమము ననుసరింపక భాషను గాని, వర్తమానమును గాని ఇచ్చిరనుకొనండి. వారు నేల మీద గాని యున్నచో వారిని సరిదిద్దుట పెద కష్టమైన పని కానే కాదు, చూచారా. వారు క్రమము తప్పినట్లుగా ఎరుగుదురు. వారు ఆరాధనను నాశనము చేయ వచ్చును, చూచారా. అలాగు కాని జరిగిన యెడల, డీకన్ లు వెళ్ళి, వారిని నిమ్మళపరచవలెను. అదియే మంచిది, చూచారా. వేదిక మీద ఉన్న ప్రవక్తకు వీరే రక్షకభటులు. నీవే వారిని కాపాడవలెను. మీరందరూ రక్షణ వలయముగా ఉన్నారు.

మనది కాని ఆలయములో అది జరిగినప్పుడు వారు ఆ విషయములో శిక్షణ లేనివారని గ్రహించవలెను, చూడండి. అందులో వారికి తర్ఫీదు లేదు. ఇక్కడ మనం అదే చేయవలెనని ప్రయత్నించుచున్నాము. ఏమి చేయవలెనో మనకు తెలియును. మన జనలుకు ఎట్లు తర్ఫీదు ఇయ్యవలెనో మన మెరుగుదుము. అది మన ఆలయము కానియెడల వారి గూర్చి ఏమి చేయవలెనో మనకు తెలియదు.

137ఉదాహరణకు చూడండి, బిల్లీకి ఇది గుర్తుండును - కాలిఫోర్నియా లోని, కోస్టా మిసాలో ఇది జరిగినది. వేదిక పిలుపును ఇచ్చుటకు నేను సిద్ధపడిన ప్రతీసారి ఒకామె బల్లల మధ్య అటూ ఇటూ గంతులు వేయుచూ, భాషలతో మాట్లాడుచుండెను. ఆమె వేదిక పిలుపును నిజంగా ముక్కలు చేసినది. నేనిక వెళ్ళిపోవలసి వచ్చెను. ఆత్మ ఎంతగా దుఃఖించెనో మీరు చూడండి. క్రమముగా జరిగినచో దేవుని ఆత్మ దుఃఖపడదు. [టేపు మీద ఖాళీ యున్నది.]

ఆమె అందుకు సిద్ధమగు ముందుగా ఆమెను నేను గమనించాను. క్రమముగా లేని వారిని ఏ బోధకుడైనా గమనించుట తథ్యము. ఈ స్త్రీ వెనుక ఉన్నది. ఆమె బిల్లీతో మాట్లాడినది. ఆ రాత్రి నేనెప్పుడు వచ్చెదనో బిల్లీ ఆమెకు చెప్పెను. "నాన్నగారూ! ఆ స్త్రీ రెండు రాత్రుల నుండి వేదిక ఆహ్వానములను భంగము చేయుచున్నది," అన్నాడు.

"అవును."

"ఆమె బయట కూర్చొని యున్నది," అని చెప్పెను. ఇట్లు పలికినది, "బిల్లీ, దేవునికి మహిమ! ఈ రాత్రి మరియొక్క వర్తమానం నాకున్నది!"

చూడండి, ఆమెను నేను సమూహంలోనే గమనించాను. వేలాది మంది జనులచటున్నారు. డానీ మార్టిన్ స్వస్థత గూర్చి రీడర్స్ డైజస్టు పత్రిక వారు వ్రాసిన సందర్భం అదే. డానీ మార్టిన్ అద్భుతము అని వ్రాసెను. ఆమెను నేను గమనించాను. నా వేదిక పిలుపును ఇవ్వబోవు ముందుగా జరిగినది.

ఆమె నిస్సందేహముగా మంచి స్త్రీ, కాని శిక్షణ లేదు. ఆమె చుట్టూ చూచినది; జుట్టు ముడివేసికొనినది. ఆమె జుట్టు కత్తిరించుకొనినది, చూడండి. ఆమె అసెంబ్లీస్ కు చెందినది. వారందుకు అనుమతించెదరు. ఆమె తన జుట్టు దువ్వుకొనుచున్నది. ఆమె క్రిందికి వంగి తన మేజోళ్ళు లాగుకొన్నది. ఆ విధంగా సిద్ధపడుచున్నది.

నేను వేదిక పిలుపు ఇవ్వబోవుచున్నాను. నేనిట్లు పలికాను, "ఎంతమంది ఈ సమయములో ముందుకు వచ్చి ప్రభువైన యేసుకు తమ హృదయములను ఇయ్యగోరుచున్నారు?"

ROM 3:4•

1COR 11:16•

1COR 14:32,37,38•

GAL 1:8

 

138ఆమె ఒక్కసారి గంతు వేసినది. "కూర్చో" అన్నాను. ఆమె ప్రారంభించినది. "కూర్చో" అన్నాను. చూచారా? ఆ విధంగా ఆమెను ఆపాను. నా మాట విననట్లుగా ఆమె ప్రవర్తించినది. మరల నేను బిగ్గరగా అరిచాను. అప్పుడు ఆమె వినినది, ఎందుకనగా నేను మైక్రోఫోనులో గట్టిగా అరచినందున ఆ పెద్ద భవనం దద్దరిల్లినది. ఆమె కూర్చొన్నది.

ఇట్లు పలికాను, "ఎంతమంది ఈ వేదిక యొద్దకు వచ్చి తమ హృదయములను దేవునికి ఇచ్చెదరు?" నేను కూటము ముందుకు కొనసాగించాను, చూడండి.

ఆ రాత్రి నేను ట్రక్కును తీసినప్పుడు చాలామంది చుట్టూ చేరిరి. ఆడవారి గుంపు అది. కోడిపిల్లలు అరచినట్లుగా ఉన్నది. "నీవు పరిశుద్ధాత్మను దూషించావు అన్నారు!"

"నిజమా?" అనడిగాను. "వాక్యమును ప్రకటించుచున్న పరిశుద్ధాత్మను నేనెట్లు దూషించగలను?" చూడండి?

"దేవుని యొద్ద నుండి నాకు సూటిగా వర్తమానము వచ్చెను," అన్నదామె.

"కాని, సోదరీ, నీవు సమయాన్ని సరిగా పాటించలేదు," అన్నాను.

"అది దేవుని నుండి కలుగలేదని అందురా?" అన్నది.

"అమ్మా! నేనాలాగనను. నేను అది నమ్ముచున్నాను. నీ మేలు కొరకే ఇది నేను చెప్పుచున్నాను. నేను దీనిని నమ్ముచున్నాను. నీవు మంచి స్త్రీవి. కాని క్రమము తప్పియున్నావు," అని చెప్పాను.

ఆమె యొక్క సంఘ కాపరి అక్కడ నిలబడి యున్నాడు. ఆయనే ఆమె యొక్క సంఘ కాపరి అని నాకు తెలియును. చూడండి. "నీవు శరీర సంబంధివయినా అయి యుండాలి, లేక లేఖనములను తెలియని వ్యక్తివయినా అయి యుండాలి, ఎందుకనగా నీ సంఘకాపరి నీకు సరిగా శిక్షణ ఇవ్వలేదు. ఆయన కొద్దిసేపు మా యొద్దకు వచ్చి లేఖనముల గూర్చి మాట్లాడాలి. నీవు క్రమము తప్పి యున్నావు, అది తప్పు. ఈ రెండు రాత్రులు అనేక ఆత్మలు నశించుటకు నీవు కారణమైతివి. ఈ రాత్రి కూడా నీవు ఆ ప్రకారమే చేసి యుందువు," అన్నాను.

"బ్రెన్హాం సోదరుడా, క్షమించమని కోరుచున్నాను," అన్నాడతడు. "మీ భావము ఏమిటి?" అనడిగాను.

"మీరు ముగించిన తరువాత ఆమె అ వర్తమానమిచ్చుట ఆమెకు హక్కు ఉన్నది," అన్నాడు.

"నేను వేదిక మీద యున్నాను, ప్రవక్తల యొక్క ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో యున్నవి. ఇంకా నేను బలిపీఠము దిగనే లేదు," అన్నాను.

"మంచిది…" అన్నాడు.

"ఇంకా నా వర్తమానము ముగియలేదు. నేను వేదిక పిలుపును ఇచ్చుచున్నాను. నేను నా వలను విసరి యున్నాను. ఇప్పుడు దానిని లాగుచున్నాను. దానిని గల్లంతు చేయునట్లు ముళ్ళ తీగె విసరుట మంచిది కాదు. నేను నా వలను లాగుచున్నాను. ఆనేక ఆత్మలు రాకుండా ఆమె ఆటంకపరచినది. బోధించుట వలన ఏమి లాభము? పాపులు పిలుపునకు లోబడి రాకుండా చేసినది," అన్నాను.

"ఆమె వర్తమానము నీ వర్తమానము కన్న చివరిది. ఆమె వర్తమానము సూటిగా దేవుని యొద్ద నుండి వచ్చినది," అన్నాడు.

అప్పుడు నేనిట్లు చెప్పాను, "ఎవడైనను తాను ఆత్మ సంబంధినని గాని, ప్రవక్తనని గాని తలంచినయెడల, నేను చెప్పునది ప్రభువు వలన పొందిన ఆజ్ఞ అని గ్రహింపవలెను. అతడు అజ్ఞాని అయితే అజ్ఞానిగానే యుండవలెను. మీకు గానీ, దేవుని సంఘమునకు గాని అటువంటి ఆచారము లేదని తెలిసికొనవలెను." పౌలు చెప్పిన దానినే చెప్పాను.

నేను చెప్పాను, "అయ్యా! ఇందులో కొత్తది ఏమియూ లేదు. ప్రతి మానవుని మాట అబద్ధమే గాని దేవుడు మాత్రమే సత్యవంతుడని యేసు చెప్పెను. పరలోకము నుండి వేరొక దూత దిగి వచ్చి ఈ సువార్తను గాక మరియొక సువార్తను ప్రకటించినయెడల శాపగ్రస్తుడవును గాకని పౌలు చెప్పెను. కాబట్టి మీరు గీతను పూర్తిగా దాటి యున్నారు."

"మీది ఎటువంటి సంఘము? అది నిజంగా పెద్ద గందరగోళపు గుంపు," అని అన్నాను. "మీరు జనులను ఆ విధంగా నడిపించిన యెడల వేదిక పిలుపులను ఎట్లు ఇయ్యగలరు? ఆమెకు పరిచర్య యున్నది. అందరికీ ఏదో ఒక పరిచర్య యున్నది. కాని మీ సేవకు ఒక సమయ మున్నది, చూచారా, దానిని అనుసరించవలెను అని చెప్పాను."

139కావున అది నిజము. అటువంటిది మన సంఘములలో జరిగినచో ఎట్లుండును? మన సోదరీలలో, లేదా సోదరులలో ఒకరు మధ్యలో అలాగున భాషలతో మాట్లాడినచో డీకన్ లు వచ్చి వారిని నివారించుదురు. టేపులో ఏమి చెప్పబడినదో చూచి చెప్పెదరు, లేదా నిశ్చయమముగా సంఘ కాపరి మీతో మాట్లాడును. వారి యొద్దకు వెళ్ళి ఎంతో చక్కగా మాట్లాడి నచ్చచెప్పెదరు, చూచారా.

వారందరూ క్రమము తప్పి మా సంఘ కాపరిని అల్లరి చేయుచున్నచో లేదా సంఘ కాపరికి అడ్డము వచ్చుచున్నచో డీకన్ లగు మీరు వచ్చి, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పెదరు. వారిని ఆపమని మా సంఘ కాపరి మాకు సైగ చేయును, ఎందుకనగా వారు కూటమును ఆటంకపరచుచూ, ఆత్మను అల్లరిపాలు చేయుచున్నారు.

140సంఘ కాపరి ఆగి, మర్యాదగా తల దించి ఏమియు మాట్లాడనియెడల ఎట్లుండును, చూచారా. ఏమియూ మాట్లాడవద్దు; సంఘ కాపరి ఆలాగు చేయునపుడు. అయితే సంఘ కాపరిని మీరు గమనించండి. నీ వైపు ఆపుమని ఆ విధంగా అతడు సైగ చేసినయెడల, ఆ తరువాత క్రైస్తవ ప్రేమతో నడిచి వెళ్లి, "నా సోదరి, సోదరుడా, (ఎవరైనా) నీవు క్రమమును తప్పియున్నావు, ఎందుకనగా నీవు ప్రవక్తను ఆటంకపరచుచున్నావు. ఆయన దేవుని నుండి వర్తమానమును పొందెను. అతని వర్తమానము ముగించిన పిదప మిగిలిన దానిని మనము కొనసాగించుదము," అని చెప్పును. చూడండి, అతనిని అది ఆటంకపరచినది.

ఎవరయినా క్రమము తప్పిన యెడల, సంఘ కాపరి మర్యాదతో పిలచి అతనిని ఒక్క నిమిషము ఆగమని చెప్పును. వారు మరల వెంటనే ప్రారంభించెదరు. మీరు గమనించండి, అందులో నూటికి తొంబది శాతం మంది వాక్యమునే చాలాసేపు వల్లించెదరు. అర్థములు చెప్పువారిని గమనించండి. అది రెండు వైపులా శరీరము పనిచేయుటని చెప్పవచ్చును. దాని యొక్క భావము ఏమిటో మీకే తెలియును, చూచారా. మంచిది.

141ప్రశ్న: "అర్థము చెప్పకుండా భాషలలో ఒక్క వర్తమానము కంటే ఎక్కువను అనుమతించ వచ్చునా?"

అనుమతించ రాదు. వారు ఒకరి తరువాత ఒకరు రావలెను, చూచారా. ఒకరు మాట్లాడిన పిదప అర్థము చెప్పవలెను. నీవు ఆగనియెడల, అర్థము చెప్పువానికి తానేమి చేయుచున్నాడో అర్థము కాదు. ఒకేసారి ఇద్దరు లేదా ముగ్గురు వర్తమానమందించిన యెడల, అర్థము చెప్పువాడు గందరగోళములో పడిపోవును. దేవుడు అల్లరికి కర్త కాడు. కావున ఒకరు మాట్లాడవలెను. మరియొకరు అర్థము చెప్పవలెను, చూచారా. మూడు వర్తమానములను ఇయ్యనీయుడి గాని ఒకటి అయిన పిదప దానికి అర్థము చెప్పువలెను. అలాగు ప్రతి వర్తమానమును అనువదించవలెను.

142ఉదాహరణకు చూడండి. రడెల్ సోదరుడు మాట్లాడినప్పుడు, నెవిల్ సోదరుడు దాని భావమును చెప్పును. ఫ్రెడ్ సోదరుడు మౌనముగా ఉండును. అర్థము మాత్రము చెప్పవలెను. మొదట దానిని వివేచింపవలెను. అది దేవుని నుండి వచినదో, కాదో ముందు గమనించవలెను, చూచారా. మంచిది.

రడెల్ సోదరుడు, బీలర్ సోదరుడు, నెవిల్ సోదరుడు ఒకేసారి మాట్లాడినయెడల, వరుసగా వచ్చిన ఆ మూడు వర్తమానములకు ఎట్లు అర్థము చెప్పవలెనో తెలియక అనువాదకుడు అయోమయ స్థితిలో యుండును. ఏమి చేయవలెనో అతనికి ఎట్లు తెలియును? చూచారా? ఒక్కరే మాట్లాడవలెను. నీ వర్తమానం అందించి నీవు మౌనముగా ఉండవలెను. వేచియుండుము. నీ ప్రక్కన కూర్చొనియున్నవానికి మరో సంగతి బయలుపడనిమ్ము. ఆ తరువాత అతడు నెమ్మదిగా కూర్చొన వలెను, చూచారా, ఆ తరువాత అర్థము చెప్పవలెను.

ఆ విధముగా జరుగుచున్నప్పుడు దానిని వ్రాయవలెను. వివేచన ఏమి చెప్పునో చూడవలెను. అది దేవుని నుండి వచ్చినదని వారు చెప్పినచో చాలును. అందులో వర్తమానముండును. దానిని వ్రాసికొనండి. ఆ తరువాత ఒక్క నిమిషం ఆగండి. ఆత్మ అతని మీద సంచరించనారంభించగా అతడు మాట్లాడ మొదలు పెట్టును. ఆ తరువాత అర్థము చెప్పువాడు ఒక్క నిమిషం ఆగి పరిశుద్ధాత్మ ఏమి చెప్పబోవుచున్నదో వినును. అప్పుడతడు ఆ వర్తమానముతో వచ్చును, చూడండి. దానిని అతడు వ్రాయును. ఆ విధముగా ముగ్గురు ఏక భావముతో పని చేయవలెను.

143ప్రశ్న: "బ్రెన్హాం సోదరుడా, నీవు ఈ సంఘ కాలమునకు దేవుని చేత పంపబడిన వర్తమానికునివని మేమెరుగుదుము. యేసును వెంబడించిన సూచక క్రియలే నిన్నును వెంబడించుట మేము చూచుచున్నాము. నిన్ను మరీ ఎక్కువగా ఎరిగినవారు నీవే మెస్సీయావనుచున్నారు. దేవుడైన క్రీస్తుతో నీకు గల సంబంధమును వివరించేదవా?"

సోదరులారా, అది నిజమేనని నాకు తెలియును. చూడండి, ఆ విషయము గూర్చి ఇక్కడ నేను ఒకటి వ్రాసియున్నాను. చాలాసార్లు అపార్థము చేసికొందురు. మీరు నాతో పాటు లూకా సువార్త 3వ అధ్యాయము 15వ వచనమును తీయండి. ఎవరూ లేరు గనుక నేను తలుపును మూయను. సోదరులారా, ఈ విషయము మీతో చెప్పెదను. ఇది అంతటా వినిపించుచున్నది. కానీ నేను మీతో చెప్పునది వినుడి, అది ఆ విధముగానే జరగలసియున్నది. ఆ విధానము మారదు. అది ఆ విధముగా లేనియెడల, నేను నా వర్తమానము విషయములో మారుమనస్సు పొందవలసి యుండును.

144సోదరులారా, వినండి. క్రీస్తు యెదుట మీకు ఆనబెట్టి చెప్పుచున్నాను. ఈ విషయములో మీ వంతు మీరు మౌనము వహించండి. మీరు ఆత్మ సంబంధులయితే అర్థము చేసికొందురు. ఆయన నది యొద్ద మొదటగా చెప్పిన సంగతిని మీరెరుగురా? ఆయన చెప్పిన దానిని మరచిపోయారా? "క్రీస్తు యొక్క మొదటి రాకడను గూర్చి వెల్లడి చేయుటకు బాప్తిస్మమిచ్పు యోహానును పంపినట్లుగా, రెండవ రాకడ యొక్క వర్తమానమును వెల్లడి చేయుటకు నిన్ను పంపుచున్నాను." క్రీస్తు యొక్క రెండవ రాకడకు సిద్ధము చేయునది ఈ వర్తమానము. ప్రభువు యొక్క దూత అదే చెప్పెను.

ఇప్పుడు గమనించండి. బాప్తిస్మమిచ్చు యోహానును పంపినట్లుగా అన్నమాట మీరందరూ వినిరి. పుస్తకములలో మీరు దానిని చదివారు. నిలబడియున్న జనులు దానిని వినిరి. ఆ దూత వర్తమానము వినిపించగా అందరూ విన్నారు. "క్రీస్తు యొక్క మొదటి రాకడను ప్రచురము చేయుటకు బాప్తిస్మమిచ్చు యోహానును పంపినట్లుగా, క్రీస్తు యొక్క రెండవ రాకడను ప్రచురము చేయుటకు నిన్ను పంపుచున్నాను." అదే ఈ వర్తమానము.

145మీరు గమనించండి, ఆ బయట ఉన్న నక్షత్రము క్రింద చిన్న విల్లీ నా పేరును వ్రాసెను. ఆ కారణము చేతనే దానిని మీకు అందజేశాను. నేను యధార్దముగా ఉండగోరుచున్నాను. ఆ వర్తమానికునితో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఇది నిజము. ఆయన సంఘములో ఒక భాగముగా ఉండుటకు నేను పంపబడియుండ వచ్చును. ఆ వర్తమానమును కట్టుటలో సహాయపడవలెను. మార్గము సరాళము చేయువాడు తగిన కాలములో వచ్చును.

ఈ దినము యొక్క వర్తమానమును నేను కలిగియున్నానని నమ్ముచున్నాను. ఈ దినము యొక్క వెలుగు ఇదేనని నేను నమ్ముచున్నాను. రాబోవుచున్న కాలమును అది చూపించుచున్నదని నేను నమ్ముచున్నాను. అక్కడ ఆయన చెప్పిన వర్తమానమును నేను నమ్ముచున్నాను, "నీవు కలిగియున్న ఆ వర్తమానము…" ఆ వెనుక లేచి యున్న నక్షత్రమును మీరు చూడండి.

146ఇక్కడ నా సమయము ఖర్చగుచున్నదని నాకు తెలియును. ఇంకా చాలా చక్కని ప్రశ్నలున్నవి. ఇప్పుడు పది దాటినది. మీరు ఇంటికి వెళ్ళగోరుచున్నారని నాకు తెలియును, చూచారా. ఇది వినండి. ఒక విషయమును మీకు చూపించెదను. ఇంకా కొద్ది నిమిషముల అదనపు సమయం నాకిచ్చెదరా! మంచిది, మంచిది.

చూడండి. ఒక సంగతి చెప్పెదను. సోదరులగు మీరు దీనిని మీ మధ్యనే ఉంచుకొనవలెను, చూచారా. ఇది మీ మధ్య ఉండవలెను. ఈ విషయమును నేను సరిదిద్దవలెను, ఎందుకనగా మీరే నా సంఘ కాపరులు. చూడండి, దీనిని నేను చేయవలసియున్నాను. మీరు ఈ వర్తమానములో నాతో కూడా పని చేయుచున్న సోదరులు, చూచారా.

147నా మట్టుకు నేను ఒక మానవుడను. మీ కంటే చాలా అల్పుడను. మీలో చాలామంది మంచి క్రైస్తవ గృహముల నుండి వచ్చి యున్నారు. నేను అందరిలోను ప్రధానుడనగు పాపిని. ఈ సంగతిని ఒకసారి మీతో నేను చెప్పియున్నాను. అతి నీచమగు జీవితమును జీవించియున్నాను. అవిశ్వాసిగా, సందేహపరునిగా జీవించాను.

కానీ నా బాల్యము నుండి నాకు దేవుడున్నాడని తెలియును. నా జీవితములో ఏదో జరిగియున్నదని నేనెరుగదును. నా సోదరులారా, ఇది ప్రశ్నించదగనిది. అయితే దీనిని చెప్పనివ్వండి, ఒక వర్తమానము రానైయున్నది, ఒక వర్తమానికుడు రాబోవుచున్నాడు. ఆ వచ్చువాడు మానవుడే అయితే నా వెనుకనే వచ్చును, చూచారా. కాని నేను బోధించుచున్న ఈ వర్తమానము నిజమైన వర్తమానము. ఈ దినము యొక్క వర్తమానము. ఇది చివరి వర్తమానము.

సోదరులారా, నేనేమి చేయుచున్నానో మీరు చూచుచున్నారు గదా? నేనున్న స్థలములోనే మీ అందరినీ ఉంచుచున్నాను, ఎందుకనగా మీరును నా వంటి వారే. మీరును ఈ వర్తమానమునకు వర్తమానికులై యున్నారు.

148ఇటు చూడండి, ఒక ఉదాహరణ యున్నది. ఉదాహరణ ద్వారా దీనిని బాగుగా చెప్పగలనని తలంచుచున్నాను. ఒక క్షణము పాటు ఈ తలుపును సగం మూయుదును. ఇది యేసు అనుకొనండి. అది యేసు, దీనిని నేను గెత్సెమనే అందును. దీనిని సంఘము ఎదుట నేను చెప్పలేదు. ఇప్పుడు గుర్తుంచుకొనండి, జ్ఞానమును వెదకుచున్న వ్యక్తిని ఏ రకమగు వెలుగు (నక్షత్రము) నడిపించుచున్నది, "నీ యొక్క పరిపూర్ణ వెలుగునకు నన్ను నడిపించుము."

ఇక్కడ ఒక నిమిషము ఆగి చెప్పెదను. విల్లీ అక్కడ దానిని చేసెను. అది నిజమేనండి. అది సరేనని చెప్పుదము.

సోదరులారా, నేనిది చెప్పలేను. అది గర్వపు మాటగును. దానిని నేను నమ్మినా గాని ఆ మాట చెప్పను, చూచారా. మరియొకరిని ఆ మాట చెప్పనీయుడి.

DEUT 18:18•

JOHN 1:21,23

 

149కాని ఇక్కడ నన్ను కొందరు ప్రశ్నించిరి. జరిగిన కొన్ని సంఘటనలను గూర్చి సాక్ష్యమిచ్చిరి. నేను వేదిక మీదికి ఎక్కి కూటము నందు జరిగిన కొన్ని సంగతులను గూర్చి సాక్ష్యమియ్యను. దీనిని నిర్వహించువారే, మరొకరో దానిని చెప్పెదరు. అలాగు నేను చేయుటకు ఇష్టపడను.

[ఒక సోదరుడు చెప్పుచున్నాడు - "వారు యోహాను యొద్దకు వచ్చి, నీవు క్రీస్తువా అని కూడా అడిగిరి."] ఆ విషయమునే మీకు నేను వివరించ ప్రయత్నించుచున్నాను. [నీవు ప్రవక్తవా?"] దానిని అతడు తిరస్కరించెను. [అతడు ఏదియూ చెప్పలేదు. నేను అరణ్యములో కేకవేయువాడను అని చెప్పెను."] "అరణ్యములో కేక వేయు ఒక స్వరము." అతడు తన స్థానమును వదలలేదు.

[మరో సోదరుడు అడుగుచున్నాడు, "ఆ ప్రవక్తవు నీవేనా" అని వారతని అడుగగా అతడు కాదనెను.] మోషే ద్వారా ఒక ప్రవక్త పలుకబడెను. అతడే ప్రవక్త, చూచారా. అతడేమై యున్నాడో అతనికి తెలియును. ఆ విషయమును వారికతడు చెప్పెను గాని గ్రహించలేదు. అరణ్యములోని ఒక స్వరము. తాను అదేనని చెప్పెను, చూచారా.

MATT 17:7-11•

MARK 1:7•

LUKE 3:16•

LUKE 7:24-26,28•

JOHN 1:27

 

150ముందుకు వెళ్ళండి. [ఒక సోదరుడు అడుగుచున్నాడు, "యోహాను వెనుక క్రీస్తు వచ్చినప్పుడు వారాయన యొద్దకు ఆయన యందు విశ్వాసముంచిరి. మెస్సీయా కంటే ముందుగా ఏలీయా వచ్చునని ఆయన వారికి బోధించెను. మీరాయనను చేర్చుకొనవలెనని ఆయన చెప్పెను."] అది అతడే. అది నిజము. "నేను ఏమియూ కాను. నేను ఏమియూ కాను! ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను యోగ్యుడను కాను," అని యోహాను చెప్పుచునే యుండెను.

కాని యేసు తన్ను గూర్చి చెప్పుకొనినప్పుడు ఏమి జరిగెను? "మీరెవరిని చూచుటకు వెళ్ళిరి? గాలికి కదలుచున్న రెల్లును చూడ వెళ్ళితిరా? ఎవరిని చూడ వెళ్ళితిరి? చక్కని వస్త్రములు ధరించి విలాసల జీవితము గడుపుచున్న వానిని చూడ వెళ్ళితిరా? అట్టివారు రాజ భవనములలో యున్నారు. అయితే మీరు ప్రవక్తను చూడ వెళ్ళితిరా? అవును. ప్రవక్త కంటి గొప్పవాడు ఇచ్చటున్నాడు," అని ఆయన చెప్పెను. ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు. ఆయన నిబంధన యొక్క వర్తమానికుడు. ఆయన అదే అయి యుండెను. ఆయన ప్రవక్త కంటే అధికుడు. "ఈ సమయము వరకు స్త్రీలు కనినవారిలో ఇతని కంటే గొప్పవాడు లేడు," అని ఆయన చెప్పెను. చూచారా.

ఆయన నిబంధన దూతయై యుండెను. "అది ఈయనే" అని పరిచయము చేసినది అతడే. మిగిలిన ప్రవక్తలందరూ ఆయన గూర్చి పలికిరి గాని యోహానయితే "అది ఈయనే" అని చెప్పెను, చూచారా.

MATT 2:2

 

151ఇప్పుడు గమనించండి. జ్ఞానులు ఒక నక్షత్రమును వెంబడించిరి. దానిని చాలా చిన్నదగు రీతిలో నేను తీసికొందును. జ్ఞానులు, నక్షత్రమును వెంబడించిరి. "యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు?" అని ప్రశ్నించిరి. మీరు ఆ పాట విని యుందురు, "మేము తూర్పున ఆయన నక్షత్రము చూచి, ఆయనను ఆరాధించ వచ్చితిమి." దానిని మీరు విని యుందురు. వాక్యములో చదివారు. మంచిది.

పశ్చిమానికి నడుపుచున్నది, ఇంకా నడిపించుచున్నది.

నీ పరిపూర్ణ వెలుగు యొద్దకు మమ్ము నడిపించుము.

పరిపూర్ణమగు వెలుగు నొద్దకు ఆ నక్షత్రము నడిపించుచున్నది, ఎందుకనగా వెలుగును ప్రతిబింబింపచేయునదే నక్షత్రము. ఒక దినమున దానినే మనము బయట చూచియున్నాము, చూచారా. దానిని ఆదివారమునాడు ఎందరు చూచారు? దాని గురించి బోధించుట అప్పుడే ముగించాను. షెకీనా మహిమ ఆ నక్షత్రములో ప్రతిబింబించెను. నక్షత్రము దానిని ప్రతిబింబించును. ప్రభువు యొక్క దూత ఈ వేదిక మీద నిలబడియుండి దానిని ప్రతిబింబింప చేసెను. షెకీనా మహిమండి వచ్చెను. ఏమి మార్పు లేదు. ఖచ్చితంగా అదే. ఈ నిజమయిన దానిని చూడండి. అది ప్రతిబింబించుచున్నది. ఆ వైపు అలాగే యున్నది, చూచారా.

MATT 2:2

 

152ఇప్పుడు దీనిని గమనించండి. ఆ నక్షత్రము తూర్పున లేచినది. అది నిజమేనా. అది గొప్ప నక్షత్రము. మంచిదే. యేసు రాకడ సమయములో నిజంగా భూసంబంధమగు నక్షత్రము ఎవరు? యోహాను. వారిని సంపూర్ణ వెలుగు నొద్దకు నడిపించిన వాడాయనే. అది నిజమేనా? యేసు మొదట ప్రత్యక్షమైనప్పుడు, అది తూర్పున యుండెను. చాలా చిన్న నక్షత్రములు ఆకాశ విశాలములో యున్నవి. వాటన్నిటిని దాటి సాయంకాల నక్షత్రము మీదికి అది వచ్చును.

సాయంకాల నక్షత్రము సాయంకాలమున ప్రకాశించును. ఉదయ నక్షత్రము ఉదయమున ప్రకాశించును. ఆ రెండునూ ఒకే పరిమాణము గల నక్షత్రములు. ఒకే రకమగు తారలు. రెండింటినీ కలిపి చూడండి. నక్షత్రము మెస్సీయా కాదు; అతడు మెస్సీయాను ప్రతిబింబించుచున్నాడు.

153నక్షత్రము తన స్వంత వెలుగును ప్రతిబింబించదు. సూర్యుని యొక్క వెలుగును నక్షత్రము ప్రతిబింబించును. అది నిజమేనా? [ఒక సోదరుడు, "కాదు," అని చెప్పెను.] [ఒక విధంగా చంద్రుడు అలాగున్నది; కాని నక్షత్రములు స్వయం ప్రకాశకములు."] అవును. చంద్రుడు నిజంగా నా భావము అది. చంద్రుడు వెలుగును ప్రతిబింబించును. నక్షత్రము వెలుగును ప్రకాశింప చేయుచున్నది గనుక ఆ వెలుగు దేవుని యొద్ద నుండి వచ్చును. అవును గదా? [ఒక సోదరుడు "సూర్యుడు" అని చెప్పెను.] దానికదే సూర్యుడు. [ఆ సూర్యులు మన సూర్యునికి చాలా దూరంలో యున్నవి.] పెద్ద సూర్యునిలో నుండి ఆ సూర్యులు వచ్చినట్లు మనకు చెప్పెదరు. సూర్యుడు ఈ పుంజములను విసరును. అవి మండుచున్నవి. సూర్యుని వలె వేడిమిని వెదజల్లుచున్నవి. కాబట్టి అవి మనకు చిన్న సూర్యుని వంటివి. అది నిజమేనా? చిన్న వెలుగులు. [వాటిలో చాలా వరకు మన సూర్యని కంటేను పెద్దవి] మనము మన గురించి మాట్లాడుకొనుచున్నాము. మంచిది.

154అవి మనకు సూర్యుని వంటివి, వెలుగును ఇచ్చును, అవి ప్రధాన దాతలో భాగములుగా యున్నవి, చూచారా. పెద్ద సూర్యుడు మనకు పెద్ద వెలుగును ఇచ్చును, పరిపూర్ణమైన వెలుగు. చిన్న సూర్యుడు లేదా నక్షత్రములు మనకు అంతరిక్షములో కనబడును. ప్రశించుచున్న సూర్యునికి ఎంతో దూరంలో అవి ఉండ వచ్చును. అవి మనకు చిన్న వెలుగును ప్రతిబింబించుచున్నది. కాని అవి ఆ వెలుగునకు సాక్షులుగా యున్నది. అది నిజమేనా? అవి మనకు సూర్యుని వంటివి కావు గాని సూర్యుని వలె ప్రతిబింబించును. నా భావమును గమనించారా?

అందులో అతి పెద్దది కలదు. (ఉదయమున) సూర్యుని రాకను అది వెల్లడి చేయును. సూర్యోదయమును, సూర్యాస్తమయమును ఉదయ నక్షత్రము, సాయంకాల నక్షత్రము వెల్లడి చేయును. అది నిజమేనా? పెద్ద నక్షత్రములలో రెండు. తూర్పు నక్షత్రము మరియు పశ్చిమ నక్షత్రము.

155అదెక్కడున్నదో మీరు చూచారా? ఏలియా అట్టి వర్తమానికుడు. తూర్పు నక్షత్రపు రాకను గూర్చి చాటించెను. పశ్చిమ నక్షత్రము యొక్క రాకను గూర్చి చాటించువాడును అతడేనని చెప్పబడెను. ఈ దినము గతించిన తరువాత కొత్త దినము రాబోవుచున్నది. ఇప్పుడు మీరు దానిని చూచారా?

తూర్పు, భూమి మీదికి సూర్యుడు వచ్చుటకు ముందుగా ఉదయ నక్షత్రము అందుకు సాక్ష్యమిచ్చును. సూర్యుడు వచ్చుచున్నాడని చెప్పును. అది నిజమేనా? చూడండి. అది ఉదయ నక్షత్రమును తీసికొని వచ్చుచున్నది. ఉదయ నక్షత్రము మరియు సాయంకాల నక్షత్రము రెండునూ ఒకే విధమగు నక్షత్రములు. ఈ చిన్న నక్షత్రములన్నియూ మధ్యలో యున్నవి. నా భావము మీరు గ్రహించారా? వర్తమానికులు.

ZECH 14:7•

REV 1:8,18

 

156ఆయన ఆల్ఫా మరియు ఓమేగా, ఆది మరియు అంతము, ధన ధగ మెరయు ముత్యము. మరకతపు రాయి. నా భావమును గ్రహించారా? క్రీస్తు యొక్క రాకడ సమీపమయినది. చివరి దినములలో ఏలియా బోధించవలసిన వర్తమానము ఇదే. చరిత్ర పునరావృతము కాదు. ఉదయకాల నక్షత్రము, సాయంకాల నక్షత్రము నూతన దినపు రాకను చాటించును. సూర్యుని రాకను చాటించుచున్నది. సూర్యాస్తమయమగుచున్నదనగా మరో దినము రాబోవుచున్నదని అర్థము, నూతన సూర్యుడు - ఒక నూతన శకము, ఒక నూతన కాలము రాబోవుచున్నది.

ఇప్పుడు వినండి, యోహాను తన వర్తమానమును తీసికొని వచ్చెను. క్రీస్తు యొక్క మొదటి రాకను చాటించెను. ఏలియా చివరి దినమున వచ్చును. "సాయంకాలమందు వెలుగుండును," అని ప్రవక్త చెప్పెను, అనగా సంధ్యా సమయములో ఒక వెలుగుండును.

157సాయంకాలపు వెలుగు, అతి పెద్ద సాయంకాలపు వెలుగు మనకున్నది. అది సాయంకాలపు నక్షత్రము - మనకున్న గొప్ప వెలుగు. ఆ ఇతర నక్షత్రము చాటించిన వర్తమానమును అది చాటించనవసరము లేదు. అది సూర్యని చాటించును. సూర్యుని గూర్చి మాట్లాడును. ఇప్పుడు మనం సాయంకాల సమయములో యున్నాము. సాయంకాల దీపములు ఇచ్చటున్నది. ఈ యుగము అంతరించి పోయినది. నా భావమును గమనించారా? దినము గతించియున్నది, మరో దినము రానై యున్నదని చాటించుచున్నది.

పశ్చిమాన యున్నవారు వెనక్కి తిరిగి ఆ నక్షత్రమును చూచినచో అది తూర్పున కనబడును. "మేమాయన నక్షత్రమును తూర్పున చూచియున్నాము." వారు తూర్పున ఉండి పశ్చిమ దిశగా నక్షత్రమును చూచుచున్నారు. అది నిజమేనా? జ్ఞానులు తూర్పున యుండిరి. పశ్చిమ నక్షత్రము వైపు చూచుచున్నారు. నా భావమును గమనించారా? కాని పశ్చిమాన ఉన్నవారికి అది తూర్పు నక్షత్రమగును.

MAL 4:6

 

158చూడండి, నేను తరచుగా చెప్పుచుందును, "పడుట లేచుట కొరకే." ఏది సరియైనదో నీవెట్లు తెలిసికొన గలవు? మనం నిత్యత్వంలో నిలబడియున్నాము. కావున దక్షిణ ధృవము పైకి ఉండవచ్చును. ఉత్తర ధృవం క్రిందికి ఉండ వచ్చును. మనకు తెలియదు, చూచారా. పై భాగం క్రిందికి యుండ వచ్చును, చూచారా. నిత్యత్వములోనికి వెళ్ళిన తరువాత మనం దీనిని విడిచి పెట్టవచ్చును. ఒక నిత్యత్వము రాబోవుచున్నదని ఇది ప్రకటించుచున్నది. ముందుగా చాటించుచున్నది. విధానము వేరుగా ఉన్నది. సమయము వేరుగా యున్నది. అంతా కలిసిపోవును.

ఇప్పుడు మనం సాయంకాల సమయంలో ఉన్నాము. దానిని మనం నమ్ముచున్నాము. ప్రభువు యొక్క రాకడ సమీపముగా ఉన్నదని మనం నమ్ముచున్నాము. మంచిది. అది నిజమే అయితే సాయంకాలపు వెలుగు ఉండవలసి యున్నది. మలాకీ 4 ప్రకారము సాయంకాలమున వెలుగు, పిల్లల హృదయములను తండ్రుల వైపుకు త్రిప్ప వలసి యున్నది, అనగా ప్రారంభము వైపునకు తిరుగవలసియున్నారు.

కాని ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఆయన తండ్రుల హృదయములను పిల్లల వైపు త్రిప్పెను. పిల్లలనగా ఆయన తన చుట్టూ చేర్చుకొనినవారు. తండ్రుల హృదయములను ఆయన ఈ వెలుగు వైపునకు త్రిప్పువలసియుండెను (వారు ప్రాచీనమగు, సనాతన తండ్రులు) ఆ వెలుగును ఆయన చాటించుచుండెను.

MAL 4:6

 

159కానీ ఆయన మరల వచ్చునప్పుడు, మరొక రీతిగా త్రిప్పును (మీరు గమనించారా, ప్రపంచము నాశనము కాక ముందు ఆ మహా భయంకరమగు ప్రభువు యొక్క దినము…) పిల్లల హృదయములను తండ్రుల వైపునకు త్రిప్పును. ఆ సమయమున ఉదయ నక్షత్రమే సాయకాల నక్షత్రమగును. ఆమేన్.

సరిగా అర్థము చేసితినని తలంచుచున్నాను, చూచారా; ఉదయ నక్షత్రమే సాయంకాల నక్షత్రము, ఎందుకనగా అది ఒకే నక్షత్రము. మనం పశ్చిమాన ఉండి తూర్పుకు చూచుచన్నాము. వారు తూర్పున యుండి పశ్చిమానికి చూచుచున్నారు. అది ఖచ్చితంగా ఒకే నక్షత్రము. నా భావమును గమనించారా? నీవెక్కడున్నావో దాని మీద అది ఆధారపడియుండును. అది తూర్పు నక్షత్రము కావచ్చును. పశ్చిమ నక్షత్రము కావచ్చును. నా భావమును మీరు గమనించారా? మంచిది.

160అది తండ్రుల విశ్వాసమును పిల్లల యొద్దకు తెచ్చును. ఈ సమయములో అయితే పిల్లల విశ్వాసమును తండ్రుల యొద్దకు తెచ్చును. మీరు చుట్టూ తిరిగి మరల ప్రారంభమునకే వచ్చెదరు. మీరనుకొన్న దానిని మీరు చూడలేదా? నా భావమును మీరు గ్రహించారా? అన్ని సమయములలోను నక్షత్రము ఒక్కటే. అదే వర్తమానము. మరల వచ్చుచున్నది. అది దాటిపోయి యున్నది,

నీవెటు వైపు వెళ్ళుచున్నావో నీకెట్లు తెలియును? ప్రపంచము అసలు పరుగిడుటలేదని కనుగొను ఒక ఘడియ నిజముగా వచ్చునని నేను నమ్ముచున్నాను.

దానిని నా పూర్ణహృదయముతో నమ్ముచున్నాను. వారు దీనిని శాస్త్రీయంగా ఎంతో రుజువు చేయవచ్చును. ఏదేదో చెప్పవచ్చును. వారు తాము చెప్పినది నిజమనుటకు ఎన్నో రుజువులు చూపించవలసి యుందురు. సూర్యుడు ఆగెనని దేవుడు పలికెను. ప్రపంచము ఆగుటకు బదులుగా సూర్యుడు ఆగును. చూడండి, సూర్యుడు. వారు సూర్యుని గూర్చి ఏమని చెప్పుచున్నారో దానిని నేను నిజంగా నమ్ముట లేదు. చంద్రుడు పయనించునని నాకు తెలియును. సూర్యుడు కూడా పరుగిడునని నేను నమ్ముచున్నాను, చూచారా.

కాని కొందరు, "ఆయన యెహోషువా యొక్క అజ్ఞానమును చూచెనని చెప్పుచున్నారు. ప్రపంచమును ఆపెనని అందురు."

"ప్రపంచము ఎన్నడయినా ఆగుట జరిగినయెడల, అది అంతరిక్షములో తోక చుక్క దూసుకొని పోయినట్లుగా దూసికొని పోవును. అప్పుడు ఏమి జరుగునని" నేనడిగాను.

161నేను అక్కడున్న శ్రీ. ధియష్ తో మాట్లాడియున్నాను. అతడు హైస్కులులో బైబిలు టీచరు. అతడెవరో మీరెరుగుదురు, అతడు దానిని చెప్పెను. "నేను బైబిలు చెప్పిన దానిని నమ్ముచున్నాను… ప్రపంచము ఆగిపోయినది - నా భావములో సూర్యుడు ఆగెను. సూర్యుడా! నీవు నిలువుమని యెహోషువా ఆజ్ఞాపించగా, ఆ ప్రకారమే జరిగెను!

"యెహోషువా యొక్క అజ్ఞానమును దేవుడు లెక్క చేయక ప్రపంచమును ఆపెను గాని సూర్యుని కాదని," అతడు పలికెను.

"అయితే నీవు నీ జ్ఞానము ద్వారా కూడా ఆ విధంగానే చేయుచున్నావు," అన్నాను.

[ఒక సోదరుడు చెప్పుచున్నాడు, "ఎంతసేపు సూర్యుడు ఆగిపోయెనో వారు శాస్త్రీయంగా రుజువు చేయగలరని నేను తలంచుచున్నాను."] నేను దానిని కూడా విన్నాను. ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు ఇక్కడ కొద్ది కాలం క్రితం దానిని గూర్చి మాట్లాడుట విన్నాను. దానిని వారు నిరూపించగలరు. వాతావరణములో ఏదో జరిగినది. ఆకాశమందు ఏమి జరిగినదో వారికి తెలియును. ఎర్ర సముద్రము పాయలయినది. దానిని వారు నిరూపించిరి. ఎక్కడో దూరాన ఉన్న నక్షత్రములు కూడా ఆ సమయములో ఏదో చేసినవి. ఏది ఏమయినా గాని అది మనకు లోతయిన విషయము.

COL 1:19•

COL 2:9

 

162ఇది అదేనని నిరూపించుటకు, ఈ విధముగా ఈ వర్తమానమును చూడవలసియున్నది. సోదరులారా, మానవుడు దేవుడు కాడు అని మనకు తెలియును. అయినను మనిషి దేవునిగా తయారవ వచ్చును. మీ ఒక్కొక్కరూ దైవములై యున్నారు. మీరు దేవునిగా యుండుటకు సృజింపబడియున్నారు. కాని ఈ జీవితమందు కాదు, చూచారా. యేసు మనవంటి మనుష్యుడు, కాని ఆయనలో దేవుడుండెను. దేవుని యొక్క సంపూర్ణత ఆయన యందుండెను. ఒక పరిమాణము చొప్పున మనం ఆత్మను కలిగియున్నాము.

కాని ఈ వెలుగు వచ్చియున్నది. ఇది నిజమయిన వెలుగయినచో వర్తమానమును ఊది చాటించును. బాప్తిస్మమిచ్చు యోహాను దానిని ప్రకటించెను. ఆ నది యొద్ద అతడు అదే చేసెను. చూడండి, ఇది మరియొకటి ఎట్లు కాగలదు? నా వైపు చూడండి, వ్యాకరణపు బడికి కూడా నేను వెళ్ళలేదు. జరుగునని ఆయన నాతో చెప్పిన ఏ సంగతియు జరుగుకుండా పోలేదు. ఏ ఒక్కటియు ఎన్నడూ తప్పిపోలేదు. ఆయన ఏమి చేసెనో చూడండి.

ఎన్నో సంవత్సరముల క్రితమే నేను సోదరులతో చెప్పాను (మన మధ్య ఎక్కువ వయస్సు గల వారెవరో నాకు తెలియదు), కాని వారికి ఈ సంగతులు చెప్పాను. ఈ వెలుగును చూచాము. దాని రంగును చూచాము. అది నిజమని ఈ చిత్రము చూపించుచున్నది. ఇంకా ఆయా విషయములన్నియూ దానిని నిజమని నిరూపింపించుచున్నవి. అవును గదా? అది నిజమే అయితే ఆ వెలుగును గుర్తించండి.

LUKE 3:14-16

 

163[టేపు మీద ఖాళీ యున్నది.] 3వ మరియు 5వ వచనములకు పైన అది యున్నది. సోదరుడా, 14 వచనము నుండి ప్రారంభించుదము. దానినెవరు తెరచిరి? మంచిది. లూకా సువార్త 3వ అధ్యాయము 14 వచనము చూడండి. [ఒక సోదరుడు లూకా 3:14-16 వరకు చదివెను.]

సైనికులును మేమేమి చేయవలెనని అతనినడిగిరి. అందుకు అతడు - ఎవనిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీవితములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పెను.

ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తయి యుండునేమో అని అందరును యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా -

యోహాను - నేను నీళ్ళతో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నా కంటి శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పు వారునైనను విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను, అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును.

మంచిది. అది ఏమిటి? ప్రజలు అటువంటి రీతిగా మెస్సీయా ప్రత్యక్షమగునని కనిపెట్టుచుండిరి. వారు ఈ గొప్ప అభిషిక్త పరిచర్యను చూచిరి. అరణ్యములో నుండి వచ్చిన ఒక వ్యక్తి పరిచర్య చేసి మరల అరణ్యమునకు వెళ్ళిపోవుచున్నాడు. చాలామంది అతని శిష్యులు కూడా ఈయనే మెస్సీయా అనిరి. వారు ఆ విధముగా కనిపెట్టుచుండిరి, చూడండి.

రాకడకు ముందుగా చాటించబడు నిజ వర్తమానము ఇదే అయితే అది బాప్తిస్మమిచ్చు యోహాను వర్తమానమువలెనే యుండును. ఏలియా వర్తమానమువలే యుండును. అదే విధముగా దానిని మనము ఆలోచించవలెను, చూచారా. ఆ ప్రశ్నకు అదే సరయిన జవాబు అని నేను తలంచుచున్నాను. చూచారా? అదే విధముగా దానిని మనము ఆలోచించవలసియున్నాము, చూచారా.

164ప్రశ్న: [ఒక సోదరుడు అడుగుచున్నాడు, "అటువంటి ఒక వివాదములో ఇరుక్కొనిన ఏ వ్యక్తికయినా మనము సహాయము చేయవలసిన బాధ్యతను కలిగియున్నామా? లేక మనం ఏమి చేయవలెను?"] ఏమి చేయవలసినది లేదు. నీవు చేయ కలిగినది ఏమి లేదు. [ఒక భ్రష్టమనస్సు… అది భ్రష్ట మనస్సుగా మారగలదా?"] అది ఈ విధముగా యున్నచో భ్రష్టమనస్సుగా మారగలదు: వ్యక్తి గూర్చి అలాగు పలుకబడినదో అతడు తానే మెస్సీయానని సాక్ష్యము పలికినచో అతడు అబద్ద క్రీస్తు అని మనము తలంచగలము, చూచారా?

చూడండి, అతడు ఆ స్థానమును వదలనంత కాలము అంతే. వారు యోహానుతో అలాగే చెప్పిరి. అతడు వారిని గూర్చి ఏమియూ అనట్లుగా అక్కడ లేదు. వారు జనులు, చక్కని క్రైస్తవులు, యోహానును నమ్ముచున్న విశ్వాసులు.

JOHN 1:21,23

 

165వారు ఇట్లనిరి, "ఇతడు నిజముగా దేవుని యొక్క ప్రవక్త. అందులో సందేహము లేదు. నీవు ఆ ప్రవక్తవు కావా?"

"కాను," అనెను.

"నీవు మెస్సీయావు కాదా?" అని వారడిగిరి. వారు నిజంగానే ఆయన మెస్సీయా అనుకొనిరి, చూచారా.

"కాను," అని చెప్పెను.

"నీవు కావా? అయితే నీవెవరవు?"

"నేను అరణ్యములో కేక వేయుచున్న ఒక స్వరమును," అనెను.

ప్రజలు ఆ విధముగా కనిపెట్టుచుండిరని బైబిలులో వ్రాయబడినది. ఆ జనులు ఎవరు? అతని మాటను వినుచున్న వారు. ఆతని శిష్యులు, అనుచరులు, సోదరులు, చూచారా. ఇప్పుడు వారతనిని గాయపరచగోరలేదు. వారతనికి గాయపరచలేదు, అందుకు వారు ప్రయత్నము చేయనే లేదు. కానీ చూడండి, వారు నిజంగా తమ హృదయములలో ఆయనే మెస్సీయా అని తలంచిరి.

ప్రతి సందర్భములోను చరిత్ర దానంతట అది పునరావృతమగును. అది మనకు తెలియును. అది పునరావృతము కావలసి యున్నది.

HOS 11:1•

MAL 4:6•

MATT 2:15

 

166మత్తయి 3లో మీరు చూచియున్నారు. ప్రవక్తల ద్వారా పలుకబడినది నెరవేరునట్లుగా అలాగు జరిగెను. ఐగుప్తులో నుండి నా కుమారుని బయటకు పిలచితినని చెప్పెను. ఆ కుమారుడు యేసు. ఆయన గూర్చి అది పలుకబడెను, కాని ఇంకా మీరు గమనించినట్లయితే అది యాకోబుకు కూడా వర్తించును. అతడును కుమారుడే. చూచారా? దానికి బహుళార్థములున్నవి.

ఆ విషయము తలెత్తనియెడల అది భవిష్యత్తులో అయినా తలెత్తునని నేను చెప్పగలను, ఎందుకనగా ఈ వర్తమానము దేవుని నుండి వచ్చినదని నెరుగుదును. ఇదీ క్రీస్తు రాకడకు ముందుది. ఇది ఏలియా యొక్క ఆత్మ మరియు శక్తి, ఎందుకనగా అది పిల్లల హృదయములను సరి చేయును. ప్రతిది దానిని ఖచ్చితంగా బయలుపరచుచున్నది. కావున నిజమైన జనుల ద్వారా అది ఆ విధముగా రూపుదిద్దుకోవలసిన అవసరమున్నది. దానిని సంక్షేపముగా మీరు, మీ సోదరులు, మీ స్నేహితులు నమ్మవలెను.

167ఈ పట్టణములో ఒక వైద్యుడున్నాడు (అతడెవరో నేను మీకు చెప్పబోవుట లేదు, కాని నాకు స్నేహితుడు), నన్ను ఆలింగనము చేసికొనును, "బిల్లీ, నీవు దేవుని యొక్క చివరి దినపు ప్రవక్తవు," అని నేను తేలికగా చెప్పగలనని అతడు నాతో అనును. చూచారా?"

"డాక్టర్, అలాగన వద్దు," అన్నాను.

"బిల్లీ, నీవు చెప్పుచున్న సంగతులు, నీవు చేయుచున్న కార్యములు ప్రపంచములో మరెవరూ జరిగించుట నేను చూడలేదు," అని అతడు పలికెను. చూడండి, అవి అతనికి ఎంతో సహాయపడినవి. ఇంకా ఇట్లనెను, "నేను ఈ ఆలయములకు వెళ్ళుదును. ఈ బోధకులను, సంగతులను చూచుచున్నాను. నీవు వారికి వేరుగా ఉన్నావు. నీకు సరయిన చదువు లేదని కూడా నేనెరుగుదును. నీవు మానసిక శాస్త్రవేత్తవు కావు, ఎందుకనగా మానసిక శాస్త్రము వలన ఈ సంగతులు చెప్పుబడవు," అనెను.

"అది నిజమే డాక్టర్," అన్నాను.

అతనితో మాట్లాడవలసిన అవసరం లేదు, ఎందుకనగా ఈ సంగతులు కనీసం అతనికి తెలియవు. అతనితో నీవు వాదించినా మొదటి సంగతులే అతనికి తెలియవు. ఏమి చేయవలెనో అతనికి తెలియదు. కానీ అది అంతే, మీరు చూచారా.

168మా ఇంటి వరుసలోనే ఉంటున్న ఒక నల్లజాతి స్త్రీని నేను ఎరుగుదును. ఆమె నాకు తెలిసిన మరో వ్యక్తి యొద్ద పని చేయుచున్నది. అతని భార్య నన్ను పిలచి ఇట్లు చెప్పినది, "ఆమె నిన్ను పూర్తిగా దేవుని ఆరాధించినట్లు ఆరాధించుచున్నది, ఎందుకనగా ఆమె కాన్సరు వ్యాధితో మరణించుచున్నప్పుడు నీవామె పై చేతులుంచగా ఆమె బాగయినది. ఆమె, ఈ భార్యా భర్తలు, మరో డాక్టరు కలిసి దీనిని చర్చించుకొనిరి. (నేను చెప్పిన డాక్టర్ కాదు) వారందరూ కలిసి గోల్ఫ్ ఆడుచుందురు. ఆ వైద్యుడు ఆమె చనిపోవుననెను. ఆమె అతని బంధువు ఇంట్లో పని చేయును. ఆమె మరణించునని చెప్పిరి, కాని ఆమె పూర్తిగా స్వస్థత పొందెను. అసలు వైద్యునికి కాన్సరు యొక్క జాడయే కనిపించలేదు. చూడండి.

COL 1:19•

COL 2:9•

1THS 4:17

 

169నేను ఏ వెలుగులో ఆలోచించుచున్నానో ఆ వెలుగులో వారు ఆలోచించరు. మనము తీసికొనిన విధంగా వారు తీసికొనరు, చూచారా. దేవుడు మనతోను, మనలోను యుండి పని చేయుచున్నాడని వారు తలంచుదురు; ఆ వ్యక్తి దేవుడు కాడు, చూడండి. యోహాను కేవలం మనిషేనని వారికి తెలియును.

అలాగే యేసు కూడా ఒక నరుడు. యేసు ఒక మానవ మాత్రుడు. ఆయన ఒక స్త్రీకి జన్మించెను గనుక చావవలసి యుండెను. అది నిజమేనా? ఆయన ఒక నరుడు. తినెను, త్రాగెను, ఆకలిగొనెను, ఏడ్చేను, దాహము గొనెను. అన్ని విషయములలోను మానవుల వలె యుండెను. నా వంటి మనిషిగానే యుండెను. కాని దేవుని యొక్క ఆత్మ ఆయనలో నిండుగా ఉండెను, కొలత లేకుండా యుండెను. ఆయన శక్తిలో సంపూర్ణుడు.

ఏలియాకు ఆ ఆత్మలో కొంత భాగముండెను. తన సోదరుల కంటే కొద్దిగా ఎక్కువ భాగములో ఆత్మ అభిషేకమును పొందియుండవచ్చును, కాని అతనికి ఆత్మలో కొంత భాగమే ఉండెను. కాని ఈ జనులు మెస్సీయా కొరకు ఎదురు చూచుచుండిరి. వారి సోదరుల కంటే ఎక్కువ భాగము ఆయన మీద ఉండుటను వారు చూచి, "ఈయన తప్పకుండా ఆయనే అయి యుండును," అని తలంచిరి. కాని ఆయన ప్రకాశింపనారంభించినప్పుడు యోహాను యొక్క చిన్న వెలుగు వెలవెల పోవుచుండెను, చూచారా.

ఆయన వచ్చినప్పుడు ఈ చిన్న దీపములు ఆరిపోవును. మహా అభిషేకము పొందిన పరలోకపు క్రీస్తు తూర్పు నుండి పడమరకు వచ్చును.

170కాని ఇప్పుడాయన భూమి మీద ఉండడు. వెయ్యేండ్లపాలన వచ్చువరకు మెస్సీయా భూమి మీద ఉండడు, చూచారా. మనందరము మధ్యాకాశములో ప్రభువును కలిసికొనుటకు కొనిపోబడుదుము. అది సంఘమునకు జరుగును. ఇప్పుడాయాన భూమి మీదికి రాడు. ఆయన తన వధువును తీసికొని పోవును.

ఆయన ఒక నిచ్చెన వేయును. లియో, ఆ ఆట ఏమిటో చెప్పుము. ఆ వ్యక్తి ఇంటికి ప్రక్కగా నిచ్చెన వేసెను. రోమియో మరియు జూలియట్. అవును. పైకి నిచ్చెన ఎక్కించి వధువును కొనిపోయెను. ఆయన యాకోబు నిచ్చెనను దిగుచున్నాడు. "ప్రియురాలా, ఇచ్చటికి రమ్ము," అని పిలచుచున్నాడు. చూడండి, మనం ఆయనను కలిసికొనుటకు వెళ్ళుచున్నాము.

JOHN 1:20•

JOHN 13:13

 

171ప్రశ్న: [ఒక సోదరుడు అడుగుచున్నాడు, "బ్రెన్హాం సోదరుడా, ఆయితే ఇది ఆ విషయములో సరియేనా? ఈ జనులు బాప్తిస్మమిచ్చు యోహాను యొద్దకు వచ్చిరి. వారతనిని మెస్సీయా అని పిలువగోరిరి." మెస్సీయాయే దేవుడై యుండెనని యూదులు తలంచుటను గూర్చి ఒకసారి నీవు చెప్పగా విన్నాను."] ఏమనుచున్నారు? ["ఈ జనులు బాప్తిస్మమిచ్చు యోహాను యొద్దకు వచ్చి ఆయనే మెస్సీయా అని తలంచిరి. క్రీస్తనుకొనిరి. మెస్సీయా అనగా యూదుల దృష్టిలో దేవుడేనని నీవు ఒకసారి చెప్పగా విన్నాను."] అవును. అది నిజమే, "రబ్బీ."

[ఒక సోదరుడు అడుగుచున్నాడు, "తాను కానని యోహాను వారితో చెప్పి వారిని గద్దించెను. క్రీస్తు రాబోవుచున్నాడని చెప్పెను."] అది నిజము. [యేసును శిష్యులు, "ప్రభువా, అని పిలచుట నిజము కాదా?" యేసు ఆ మాటకు సమ్మతించెను. మీరు నన్ను ప్రభువని పిలచుట న్యాయమేనని ఆయన పలికెను."] అవును. ["యోహాను 13లో ఆయన వారిని శుద్ధి చేసెను."] ఆయన అందుకు సమ్మతించెను. ["ఆయన ప్రభువై యున్నాడు గనుక అందుకు సమ్మతించెను."] దానిని ఆయన అనుమతించెను. [దానిని ఆయన అంగీకరించెను.] యేసును వారు నీవు ప్రభువువా అని అడుగగా అందుకాయన అవును, నేను నీ ప్రభువును, యజమానిని అని చెప్పెను. మీరు నన్ను అలాగు పిలచుట న్యాయమేనని ఆయన చెప్పెను. [కాని అటువంటి వారు మరెవరూ లేరు] అలాగెవరూ చెప్పుకొనజాలరు.

ఎవరయినా నన్ను దేవునిగా ఎంచినచో అది తప్పు అని ప్రభువైన యేసు నామములో మీకు చెప్పుచున్నాను. నేను కృప ద్వారా రక్షించబడిన పాపిని, దేవుని యొద్ద నుండి వర్తమానము పొందితిని, చూచారా.

172ప్రశ్న: "స్థానిక సంఘము తన గూర్చి తాను స్వయంగా జాగ్రత్తవహించుకొన వచ్చునా లేక వహించుకొనరాదా? (స్వంతగా) ఇతర దేశములలోని అవసరతల గూర్చి బాధ్యత వహించు ముందుగా స్థానికంగా బాధ్యతలను నిర్వహించవలెను గదా? అది తన అవసరములను తీర్చుకొనిన తరువాత తన శక్తి సామర్థ్యములను బట్టి మిషనెరీ సేవలో సహాయపడుట లేఖనానుసారమే గదా!"

అది నిజము. ప్రేమ ఇంటి యొద్దనే ఆరంభమగును, చూడండి. ఇక్కడ మనం మన స్వంత అక్కరలు చూచుకొనుచున్నాము, ఎందుకనగా ఇది దేవుని సంఘము. మీ చిన్న సంఘము దేవుని యొక్క సంఘము. మీరు మీ సంఘ కాపరికి చెల్లించలేని స్థితిలో యున్నప్పుడు పాటల పుస్తకములు తదితర వస్తువులు సమకూర్చుకొనలేని స్థితిలో యున్నప్పుడు బయటకు పంపించే పనిని పెట్టుకొనరాదు, చూచారా. కాని మీరు మీ సంఘ కాపరికి చెల్లించిన తరువాత, అన్నియూ సమకూర్చుకొనిన తరువాత, అప్పులన్నియూ తీర్చి వేసిన తరువాత, మీరు ఎక్కడో బయట అవసరతలో నున్న సోదరునికి సహాయము చేయవచ్చును.

మీరు మా సంఘమునకు చెల్లించెదరు. నేను కూడా మిషనరీ సేవ కొరకు కొద్దిగా నిధిని పోగుచేయుచున్నాను. ప్రజలు మిషను పని కొరకు ఇవ్వగోరినయెడల ఇవ్వవచ్చును, ఎందుకనగా చాలామంది జనులు మిషనులకు డబ్బు ఇచ్చెదరు గాని తమ గృహ సంఘములకు, స్థానిక అవసరములకు సహాయపడరు. వారు మిషనులకు ఇయ్యనియెడల, దానిని మరియొక దాని కొరకు ఖర్చు చేసేదరు. చిన్న మిషను బాక్సు మన యొద్ద ఉండుట మంచిది. మేము అలాగు చేయుటకు ప్రయత్నించుచున్నాము.

LUKE 1:17

 

173ప్రశ్న: "లూకా 1:17, ఏలియా ఆత్మలో యోహాను రాక గూర్చి దయచేసి వివరించుము."

ఈ మధ్యనే మనం లూకా 1:17ను చూచాము. ఏలియా ఆత్మతో వచ్చుట గూర్చి చూచాము.

[ఒక సోదరుడు అడుగుచున్నాడు, "అవతారము గూర్చి బోధించువారు తమ సిద్ధాంతమును ఇచ్చటే ప్రారంభించారా?"] ఏమిటి? [అవతారము నందు విశ్వసించు జనులు తమ సిద్ధాంతమును ఇచ్చటనే ప్రారంభించారా?"] తప్పక అయి యుండును. ["చూడండి, వారది నమ్ముదురు."] అవును. ["ఆయన మరొక శరీరముతో వచ్చునని వారందురు."] చూడండి, ఆత్మ ఎన్నడూ చావదనునది నిజము. అది సత్యము. దేవుడు తన మనుష్యుని తీసికొనును గాని ఆత్మను కాదు. [నీవు మంచిగా ఉన్నట్లయితే మరో జన్మలో మంచి జీవిగా వచ్చెదవు అని అందురు.]

ఇండియాలో అది యున్నది. ఇటువంటి ఒక గుంపు వారిని మేము కలిసికొన్నాము. చిన్న చీమల మీద అడుగు వేయుదుమేమోనని వారు నేలను మెల్లగా తుడిచెదరు, ఎందుకనగా ఆ చీమ పూర్వజన్మలో తమ బంధువై యుండునేమోనని తలంచెదరు. చూడండి, వారు అన్యులు. అంతగా జాగ్రత్త వహించెదరు, చూచారా. అన్యత్వము. ఇది సత్యము.

1COR 12:31•

1COR 13:11-13

 

174ప్రశ్న: "పౌలు ఇట్లు చెప్పెను, శ్రేష్ఠమగు వరములను ఆపేక్షించుము. అయినా ఇంకా మేలయిన విధానమును నీకు నేను చూపించేదను. ఆ "మేలయిన విధానము" అనగా ఏమిటో వివరించుము."

ప్రేమ. I కొరింథీయులకు 13 చూడండి. సోదరుడా, I కొరింథీయులకు 13వ అధ్యాయము చూడుము. అందులోని చివరి మూడు లేదా నాలుగు వచనములు చదువు. I కొరింథీయులకు 13. ఆ అధ్యాయములోని చివరి మూడు వచనములు. [ఒక సోదరుడు I కొరింథీయులకు 13:11-13 చదివెను.]

నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవాని వలె మాటలాడితిని. పిల్లవాని వలె తలంచితిని. పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడునై పిల్లవాని చేష్టలు మానివేసితిని.

ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము. అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి యున్నాము. అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును.

కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.

ప్రేమ.

1TIM 3:10

 

175ప్రశ్న: "ఎవరూ చేయమని చెప్పకుండానే సంఘములో ఒక స్థానమును ఆక్రమించు బలహీనత గల సోదరుని ఎట్లు గద్దించవలెను?"

ఓ, మై! అతని జోలికి పోవద్దని చెప్పుచున్నాను, చూచారా.

"చేయమని చెప్పకుండానే సంఘములో ఒక స్థానమును ఆక్రమించు బలహీనత గల సోదరుని ఎట్లు ఖండించవలెను?" (అతనిని ఖండించరాదు.)

ఉదాహరణకు అతడు డీకన్ గా ఉండగోరెననుకొందము, చూచారా. అతనిని ఎవరూ ఆ పని చేయమనలేదు, ఏలాగయినా సరే డీకన్ గా ఉండవలెననుకొనెను, చూడండి. అటువంటి వ్యక్తిలో ఎక్కడో చిన్న బలహీనత యున్నదని గ్రహించవలెను. కావున ప్రేమతో అతనిని నేను ఎదుర్కొందును.

నిజంగా నీకు ఆ విషయం తెలియు వరకు అలాగు చేయవని నాకు తెలియును. నీవు ఉత్తముడనుకొనినవానిని బోర్డులో వేసికొనుము. సోదరుడా, అలాగు చేయుము. మొదట ఒక వ్యక్తిని పరీక్షించుము. సంఘ కాపరి కంటే ఎక్కువ బాధ్యత డీకన్ కున్నది. డీకన్ నిందారహితుడుగా ఉండవలెను, చూచారా.

176ప్రశ్న: "ఒక ప్రభురాత్రి భోజన ఆరాధన సమయములో ఒక వ్యక్తి ప్రార్థించుటకు బలిపీఠము నొద్దకు వచ్చెను. సంస్కాంపు పదార్థముల వెనుకను సహోదరుడు బ్రెన్హాం నిలబడియున్నాడు, బలిపీఠము యొద్ద వ్యక్తి యుండగా ఆ వ్యక్తితో కలిసి ప్రార్థించుటకు వీటిని విడిచి వెళ్ళలేనని అతడు చెప్పెను. దయతో వివరించుము."

నేను సహ పనివానిని పంపించాను, చూడు నెవిల్ సోదరుడా! అది జరిగిన రాత్రి నాకు గుర్తున్నది. నేను ఆ ప్రభు భోజన బల్లతో నిలిచి యుండవలసి యున్నాను. ఇట్లు చూడుము. దీనిని వివరించుటకు నాకు సహాయము లేదు. అడిగిన వారు ఇచ్చటనే కూర్చొని యున్నారని తలంచున్నాను. సోదరుడా వినుము. ప్రభురాత్రి భోజనము యేసుక్రీస్తు శరీరమునకు సాదృశ్యము. దానిని అన్ని సమయములందు కాపాడవలెను.

2KGS 4:29

 

177"నా దండును తీసికొని పొమ్ము," అని గేహజీతో ఎలియా చెప్పెను. (ఆ దండమును అతడు ఆశీర్వదించెను), "నీ మార్గమున పోవలెను. దారిలో ఎవరయినా మాట్లాడినచో మాట్లాడవద్దు." ఎవరయినా నీకు నమస్కారము చేసిన యెడల, ప్రతి నమస్కారము చేయవద్దు. నీవు వెళ్ళి, ఆ దండమును బిడ్డ మీద ఉంచుము." అది నిజమేనా? "ఆ దండముతోనే నిలచియుండుము." నేను అదే చేయుచున్నాను.

నాతో కలిసి పనిచేయు సంఘ కాపరి లేనియెడల నేను బోధ ముగించు వరకు ఆగుదును. అదెప్పుడో నాకు గుర్తున్నది. సహోదరుడు నెవిల్ అక్కడ నిలబడి ఉండనియెడల, బలిపీఠము నొద్ద గల వ్యక్తికి సహాయపడు వారు లేనియెడల నేను వారి స్థానములో నిలబడి యుందును. నేను అప్పుడే బోధ ముగించాను. నేను అందుకే భోజనపు బల్ల యొద్ద నిలబడి యున్నాను. వారు ప్రభురాత్రి భోజనము తీసికొనుట కొరకు సిద్ధపడుచున్నారు. నేను అప్పటికే దానిని ఇచ్చుచున్నాను. సహోదరుడు నెవిల్ ఊరకనే అచ్చట నిలబడియున్నాడు. నేను ప్రభురాత్రి భోజనమును ఇచ్చుచున్నాను. సహోదరుడు నెవిల్, అచ్చట నిలబడి యున్నాడు.

178సహోదరుడు నెవిల్ వేదిక మీద ఉండి ఇంకా బోధిచుచుండగానే వారు బలిపీఠము మీదికి వచ్చినచో ఎట్లుండును? నేను ఆ వ్యక్తితో కూడా బలిపీఠము యొద్దకు వెళ్ళి యుందును. కూటము జరుగుచుండగా, ప్రసంగించుచుండగా మధ్యలో లేచి అతడు వేదిక పైకి వెళ్ళినట్లున్నది. నా సోదరుడు ఆత్మాభిషేకముతో బోధించుచున్నాడని నేనెరుగుదును, అతడు పరిచర్య చేయుచున్నాడు. అతడు విధి నిర్వహణలో యున్నాడు. ఒక సేవకుడు తన బాధ్యత నెరవేర్చుచున్నాడు.

ఒక సేవకుడు తన విధిని నిర్వహించుచున్నప్పుడు భాషలతో మాట్లాడుట ద్వారా గాని, మరో విధంగా గాని ఆటంకపరచకూడదు. పరిశుద్ధాత్మ ఎవరితోనయినా మాట్లాడుతున్నప్పుడు వారు రక్షింపబడుటకు వేదిక మీదికి పరుగిడి వచ్చినా, సేవకుడు తన విధిని కొనసాగించవలెను. ఒక సంఘ కాపరి గాని, డీకన్ గాని, జత పనివాడు కాని, మరే ఇతర సేవకుడు గాని ఆ వ్యక్తిని వెంటనే అదుపులో పెట్టవలెను. విధి నిర్వహణలో యున్న సేవకుని తొందరపరచ రాదు.

179నేను నా విధి నిర్వహణలో బల్ల వెనుక నిలబడియున్నాను. ప్రభురాత్రి భోజనమిచున్నాను. నా జత పనివాడగు సహోదరుడు నెవిల్ నా ప్రక్కనే నిలబడియున్నాడు. ఒక వ్యక్తి వేదిక మీదికి పరుగెత్తకొని వచ్చినప్పుడు నేనిట్లన్నాను, "నెవిల్ సోదరుడా, అతని యొద్దకు వెళ్ళుము." నెవిల్ సోదరుడు అతని యొద్దకు వెళ్ళెను. ఆ కారణము చేతనే నేను వెళ్ళలేదు.

ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళుటకు ఇక్కడ ఎవరూ లేనట్లయితే నేను క్రిందికి దిగి యుండి ప్రభురాత్రి భోజనమును ఆపియుందును. ఆ ఆత్మ రక్షించబడునట్లు చూచియుందును. కాని వెళ్ళగలిగిన వారున్నందున్న నేను నా విధి నిర్వహణను మధ్యలో వదిలి వెళ్ళలేదు. నేను సంస్కారమిచ్చుచున్నాను.

ACTS 2:38

 

180ప్రశ్న: "ఒక వ్యక్తి లేఖనానుసారముగా యుండి పరిశుద్ధాత్మను పొందవలెనని వెదకుచున్నచో ఒక వ్యక్తిగత పనివాడు ఎట్లు సహాయపడవలెను?"

వాక్యమును మానక అతనికి చెప్పుచుండవలెను. చేయవలసియున్న మంచి పని అదే, వాక్యములో వెలుగున్నది. ఇట్లు చెప్పవలెను, "సోదరుడా, దీనిని యేసు వాగ్దానము చేసెను. గుర్తుంచుకొనుము, ఇది ఆయన వాగ్దానము."

అనిని గందరగోళములోను, తొందరలోను, పెట్టవద్దు. దానిని నీవు ఇచ్చు ప్రయత్నము చేయవద్దు, ఎందుకనగా నీవు దానిని ఇవ్వలేవు, చూచారా. దేవుడు దానిని అతనికి ఇచ్చును. నీవు పదే పదే వాగ్దానమును ఎత్తి చూపుము, చూచారా. వాగ్దానమును ఎత్తి చూపుచూ నీవు అక్కడ నిలబడి యుండుము. నీ సోదరుని నిమిత్తము పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేయుము. పరిశుద్ధాత్మను ఇచ్చెదనని ఆయన వాగ్దానము చేసెను.

నీవతనిని ధైర్యపరచుటకు ప్రయత్నించుము, ఎందుకనగా అతడు పరిశుద్ధాత్మను పొందవలెనని వచ్చియున్నాడు. సంఘ కాపరిని, సోదరుని సహాయమడిగియున్నాడు.

"సోదరుడా, అది వాగ్దానము. దేవుడు వాగ్దానమును చేసెను. ఆయన వాగ్దానమును నీవు నమ్ముచున్నవా? దానిని గూర్చి సందేహించరాదు. నీవు ఆ వాగ్దానమును నమ్మినయెడల పరిశుద్ధాత్మ ఏ క్షణములోనయినా నీ యొద్దకు వచ్చును. దానిని గూర్చి ఆశించుము. ఆయనకు సమస్తమును, అప్పగించుము. "ప్రభువా, నేను నీ వాగ్దానము మీద నిలబడియున్నాను," అని పలుకుము.

వాక్యమును ఎత్తి చూపుము. అదే నీ అంశముగా ఉండవలెను. పశ్చాత్తాపపడినట్లు దేవునితో చెప్పుమని అతనిని కోరుము.

"అవును."

"ప్రభువా, నేను పశ్చాత్తాపపడిన యెడల నీవు నన్ను క్షమించుదవని చెప్పియున్నావు. నేను మారుమనస్సు పొంది నా పాపముల క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెనని నీవు చెప్పియున్నావు. అప్పుడు నేను పరిశుద్ధాత్మను పొందెదను. ప్రభువా, ఇప్పుడు నేనది చేసియున్నాను. ప్రభువా, నేనాలాగు లోబడియున్నాను. ప్రభువా, నేను కనిపెట్టుచున్నాను. దానిని నీవు వాగ్దానము చేసియున్నావు," అని చెప్పవలెను.

చూడండి, అలాగున అతనిని నీవు ధైర్యపరచవలెను. వాక్యములోనే అతనిని ఉంచుము. అప్పుడు అది వచ్చును.

181ప్రశ్న: "నిత్య భద్రతను నమ్మని బోధకుడు గాని లేదా క్రైస్తవుడు గాని సరిగా యున్నాడని చెప్పగలమా?"

చూద్దాం, మీరు నేను చదివినట్లుగానే దానిని చదవండి. [ఒక సోదరుడు చదువుచున్నాడు, "నిత్య భద్రతను విశ్వసించని బోధకుడు గాని లేదా క్రైస్తవుడు గాని సరిగానే యున్నాడని భావించ వచ్చునా?."]

దానిని నేను సరిగానే చదివానని తలంచుచున్నాను.

"నిత్య భద్రత యందు విశ్వాసముంచని బోధకుడు సరిగానే ఉన్నట్లు చెప్పగలమా?"

అతనికి నిత్య భద్రత గురించి ఏమియూ తెలియనిచో పరవాలేదని నేను తలంచుచున్నాను. కాని దానిని గూర్చి ఎరిగియుండి, అది సత్యమని తెలిసియుండి, దానిని బోధించనియెడల సిగ్గుపడవలసి యున్నాడు. ఇది నిజము. ఏ క్రైస్తవుడయినా అలాగే యుండవలసి యున్నాడు. కాని దానిని బాగుగా అర్దము చేసికొనని క్రైస్తవుని సంగతి వేరు.

ప్రశ్న: [ఒక సోదరుడు అడుగుచున్నాడు, "బ్రెన్హాం సోదరుడా, అది అందరికీ తెలిసిన సిద్ధాంతము కాదు గదా? ఎన్నడూ వినని జనులకు బోధించవలెను అని భావమా?"]

కాదు. కాదు. ఇప్పుడు ఆ విషయమునే చెప్పగోరుచున్నాను. అవును.

గత ఆదివారం నేను చెప్పినది మీకు గుర్తున్నదా? నీవు బోధకునివైనచో వేదికను ఎక్కుము, లేనియెడల నీవు విన్న ప్రసంగమును జీవించుము. చూడండి, అంతకంటే ఉత్తమ మార్గము లేదు. నీవు వినిన ప్రసంగానుసారముగా జీవించుము. నీవు బోధకునివైనచో వేదికను ఎక్కుము, అనగా బోధించుము, కానియెడల నీవు వినిన ప్రసంగానుసారముగా జీవించుము. నీ జీవితమునే ఒక వేదికగా ఎంచుము, చూచారా. దానివలన ఎంతో ప్రయోజనము కలుగునని నేను నమ్ముచున్నాను. మీరనుకొనుట లేదా? చూచారా? మీరు మీ సంఘములలో అలాగున చేయుడి.

182గుర్తుంచుకొనండి, మీ సంఘ సభ్యులు కొన్నిసార్లు విషయములు వివరించుటకు, కార్యములు చేయుటకు ప్రయత్నించెదరు. అలాగు చేయవద్దని వారికి నీవు ఆదేశించుట మంచిది. ఎవరయినా ఏదయినా చేసికొనగోరినచో ఉపదేశము పొందిన వారి యొద్దకు రావలెను. అలాగు చేయవలెను.

మిమ్ములను ఎవరయినా ఇట్లు అడుగ వచ్చును, "ఇదిగో, మీ సంఘములో నిత్య భద్రతను నమ్ముదురా?"

మీరు గమనించండి. మీరు ముందెన్నడూ లేని మరింత గొప్ప గందరగోళములో ఇరుక్కొందురు. ఎప్పటి కంటేను అధమునిగా మీరు చేయుదురు. "మీరు వారితో, వచ్చి మా సంఘ కాపరితో ఆ విషయము గూర్చి మాట్లాడుడి," అని చెప్పండి. అది మంచిది. "లేనిచో మా సంఘ కాపరి దానిని నమ్ముచున్నాడని నాకు తెలియును" అని చెప్పండి. "నేను కూడా దానిని నమ్ముచున్నానని" చెప్పుము. "కాని నీవు బోధకుడను కావని," చెప్పుము. "నాకు తెలిసిన దానిని నీవు నమ్ముచున్నాను," అని చెప్పుము. "బైబిలులో నుండి అతడు వివరించుట నేను విన్నాను గనుక నమ్ముచున్నానని చెప్పుము. అందువలన నాకెట్టి సందేహము లేదని," చెప్పుము.

ఆ విషయములో సంఘ సంఘ కాపరితో మాట్లాడుట మంచిది. సంఘ కాపరి ఆ విషయమును ఖచ్చితముగా చెప్పగలిగిన స్థితిలో యుండవలెను. అందుకే దానిని తెలిసికొనుటకు బాగుగా అధ్యయనము చేయవలెను, ఎందుకనగా చాలాసార్లు వారు అందులో నిన్ను ఇరికించెదరు.

183[ఒక సోదరుడు, "బ్రెన్హాం సోదరుడా?"] క్షమించండి. ["నా ఎన్నికను నేను ఎరుగుదును. నా ఎన్నికను నిశ్చయము చేసుకొన్నాను. నీవు బోధకునివైనచో వేదికను ఎక్కుమని ఇప్పుడే గదా చెప్పియున్నావు."] అవును. అది సరియే. ["నేను బోధకుడను కాను. సువార్తికుడను."] అవును. [అందరి వేదికలు నావే."] అది నిజము. కాని ఇప్పుడు నేను శారీరక శ్రమ చేయుచున్నాను. ఇది కష్టమగు పని కాదు, కాని పని చేయుచున్నాను. నాకు వేదిక లేదు. ఈ సమయములో నేను చేయుచున్న పని ప్రభుని చిత్త ప్రకారమే చేయుచున్నాను. దీనిని చేయుమని ఆయన నాతో చెప్పెను. వాక్యము ద్వారాను, ఆత్మ యొక్క సాక్ష్యము ద్వారాను ఆయన పలికెను. నేను నమ్ముచున్నాను తరువాత వేదిక తెరువబడును."] ఇది నిశ్చయము. ["నిజమేనా?"] అది నిజము.

184సోదరుడా, నీవు వెనక్కు వెళ్ళి పాత ఆలయపు పట్టి చూచినచో ఈ సంఘమునకు నేను పదిహేడు సంవత్సరములు కాపరిగా పనిచేసినట్లు మీరు కనుగొందురు. ప్రతి రోజు బోధించాను. ప్రతి దినము పని చేశాను, చూచారా. [ఒక సోదరుడు ఇట్లు చెప్పుచున్నాడు, "నీవు పని చేయుచున్నయెడల దేవుడు నిన్ను పిలచినట్లుగా అది మంచి గురుతు."] పౌలు అలాగు చేసెను. పౌలు గుడారములను తయారు చేసెను. ["నేను ఒక విధంగా నిరుత్సాహమునకు గురి అయ్యాను, ఎందుకనగా ప్రతి బోధకుడు వేదికను కలిగియుండవలెనని చెప్పావు, కాని దేవుడు కొంత కాలము మట్టుకు ఒక పని చేయమని నన్ను పిలచినట్లు ఎరుగుదును."] నిశ్చయంగా. పౌలు వెళ్ళి గుడారములను తయారు చేసెను. కదా! ఎవరికీ భారము లేకుండా తన స్వహస్తములతో పని చేసెను. "ఇది నిశ్చయంగా నిజము. ["నేను ఆ విధంగానే యున్నాను."] చూచారా? అది నిజము. చూచారా? జాన్ వెస్లీ ఇట్లనెను, "ప్రపంచమే నా ప్రసంగ వేదిక. కాబట్టి సహోదరుడా, నీ వేదిక తెరువబడి యున్నది. సువార్తికులు ప్రపంచమంతటికీ వెళ్ళుదురు. అది నిజము కాదా? "మీరు సర్వలోకమునకు వెళ్ళుడి." మొత్తం ప్రపంచమే మా ప్రసంగ వేదిక.

1COR 14:34

 

185ప్రశ్న: "డీకన్ గాని, ట్రస్టీగాని తమ సంఘ సిద్ధాంతములోనే నిలచి యుండవలెనను శాసనమున్నదా? (అవును, అది సరియే.) వారు తమ యొక్క స్వంత వ్యక్తిగత అభిప్రాయము లేదా ప్రత్యక్షత బట్టి ఆ సంఘ బోధలో నుండి ఏదయినా తీసివేయుటకు లేదా మరేదయినా కలుపుటకు హక్కున్నదా?"

లేదు. ఒక డీకన్ లేదా ట్రస్టీ తమ సంఘ సిద్ధాంతము సంపూర్తిగా ఏకీభవించవలెను. వారి సంఘము లేఖనములను ఎట్లు అనువదించెనో, ఆ ప్రకారమే వారందులో నిలచియుండవలెను. అలాగు లేనియెడల వారు వారు తమ సంఘముతోనే పోరాడుచున్నట్లు లెక్క. వారిని వారే గాయపరచుకొనుచున్నారు, చూచారా.

ఇంకో మాటలో చెప్పెదను, నేను నా కుటుంబమును ప్రేమించుచున్నానని చెప్పి విషమును ఇచ్చాననుకోండి. ఇది కూడా ఆ విధంగానే యుండును. అలాగు మీరు చేయజాలరు.

ట్రస్టీగాని డీకన్ గాని తమ కార్యాలయమును నమ్మకముగా నిర్వర్తించవలెను. సంఘములో ఏ అధికారి అయినా గాని ఆ సంఘమునకు ప్రతినిధి అని గ్రహించలెను. సంఘమునకు ప్రాతినిధ్యము వహించును.

ఆ కారణము చేతనే నేను బాప్టిస్టు సంఘములో నుండి బయటకు వచ్చియున్నాను. చూడండి, అదే ప్రారంభము, అక్కడ నేను కొద్ది కాలమే ఉన్నాను. కొందరు స్త్రీ బోధకురాండ్రను అభిషేకించమని వారు నన్ను అడిగిరి. అది నేను చేయనని చెప్పాను. ఇక అందులో నేను నిలచి యుండలేకపోయాను.

సంఘ కాపరి నన్ను కదిపెను. "ఇదేమిటి? నీవు పెద్దవు కదా?" అనెను.

"డాక్టర్ డేవిస్, బాప్టిస్టు విశ్వాసమును నేను ఎంతో గౌరవించుచున్నాను. నాకప్పగించిన ప్రతి పని నెరవేర్పుచున్నాను. స్త్రీలను అభిషేకించుట బాప్టిస్టు సంఘ సిద్ధాంతములో యున్నదని నాకు తెలియదు. నేను చేయని పని ఇది ఒక్కటి అని చెప్పాను."

"అది ఈ సంఘము యొక్క సిద్ధాంతము అన్నాడు."

"అయ్యా! నన్ను ఈ రాత్రి క్షమించుదురా, లేక నేను వేయు కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పెదరా?" అనడిగాను.

"నీ ప్రశ్నలకు జవాబు ఇచ్చెదను. నీ పని నీవు చేయవలెను," అన్నాడు.

"అయ్యా! అది నిజమే. ఈ సంఘము చేయు ఏ పనిలోనయినా నేను పాలు పొందవలెను. నేను విధి నిర్వహణలోనే యున్నాను. స్థానిక పెద్దలలో ఒకనిగా యున్నాను," అని చెప్పాను. ఇంకా నేనిట్లు అడిగాను, "I కొరింథీయులకు 14 లేదా 15లో పౌలు ఎందుకు స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెనని చెప్పెను. వారిని మాట్లాడుటకు అనుమతించననెను."

1TIM 2:12-14

 

186"అవును. నిశ్చయంగా! దానికి నేను జవాబు ఇచ్చెదను. పౌలు ఏమి చెప్పెనో వినుము. స్త్రీలందరూ మూలన కూర్చొనియున్నారు. వారు ముచ్చట్లాడుచున్నారు. చాలాసార్లు మనవారును అలాగే యుందురు. అందుకే వారిని మాట్లాడనీయను అని పౌలు చెప్పెను," అన్నాడు. చూచారా.

అప్పుడు నేనిట్లు అడిగాను, "అయితే II తిమోతీ నాకు వివరించుము. అదే పౌలు, అదే లేఖకుడు, అదే అపోస్తలుడు ఈలాగు చెప్పెను, "స్త్రీ బోధించుటకు గాని, అధికారము చెలాయించుటకు గానీ నేను సెలవియ్యననెను. విధేయత చూపవలెను, ఏలయనగా మొదట ఆదాము సృజింపబడెను. ఆ తరువాత అవ్వ వచ్చెను. ఆదాము మోసపుచ్చబడలేదు గాని స్త్రీ, మోసపుచ్చబడెను. ఆమె మోసపరచబడినది. ఆమె ఏదో తప్పు చేయగోరినదని నేననను, కాని ఆమె ఇందులో నిజముగా మోసపుచ్చబడెను. ఆమె ఉపదేశకురాలుగా ఉండతగదు."

"ఆ వ్యక్తిగత అభిప్రాయమా?'' అనడిగాడు.

"అది లేఖనము యొక్క అభిప్రాయము. దానిని నేను చూచి యున్నాను. బైబిలు అలాగు చెప్పుచున్నది," అన్నాను.

"యువకుడా, అందును బట్టి నీ లైసెన్సును నేను తీసివేయుచున్నాను," అన్నాడు.

"డాక్టర్ డేవిస్, అది నాకు అక్కర లేదు తీసికొనుము. మిమ్మును కించపరచుట లేదు," అన్నాను. కాని ఆయన దానిని తీసికొనలేదు. అలాగే నన్ను పోనిచ్చెను. ఆ విషయములో నాతో బహిరంగ చర్చ జరుపుదునని అతడు నాతో పలికెను. మంచిది, ఏ సమయములోనయినా సరే అందుకు సిద్ధమే అన్నాను." కాని అతడు అలాగు చేయలేదు.

187ఆ తరువాత కొంత కాలమునకు ప్రభువు నాతో మాట్లాడెను, ప్రభువు యొక్క దూత వచ్చెను, దానిని అతడు హేళన చేసెను. చూడండి, అతనికి ఇట్లు నేను చెప్పాను, "డాక్టర్ డేవిస్, ఏలాగయినా నేను ఇందులో నుండి తప్పుకొనుట మంచిది, ఎందుకనగా ఇది భారముగా యున్నది. నేను అభిషేకము పొందియున్నాను. కావున ఇది నాకు భారమగును. వెంటనే ఇందులో నుండి నేను బయటకు వచ్చుటకు వచ్చుట మంచిది."

బాప్టిస్టు సిద్ధాంతమును, బాప్టిస్టు విశ్వాసమును నేను అనుసరించకుండా బాప్టిస్టు సంఘములో ఉండలేను. దానిని నమ్మకుండా ఆ సంఘములో నేనున్నయెడల అది తప్పు, చూచారా. నేను ఒక దానిని దాచి పెట్టుచున్నాను. నేను యదార్థంగా లేను. బాప్టిస్టు జనులతో ఎట్లు నేను హృదయపూర్తిగా ఉండగలను? (నా సంఘ కాపరి లేదా మరొకరు దానిని నాకు వివరించవచ్చు) వారిని నేను జీవవాక్యము గూర్చి అడిగెదను. ఆ విధంగా లేఖనములో ఎక్కడ ఉన్నదో సరిగ్గా నాకు చూపించితే చాలును. నా భావనను సంతృప్తిపరచును. అప్పుడు నేను వారు బోధించిన విధంగానే బోధించెదను, చూడండి, నేను బాప్టిస్టునవుదును.

188ఆ కారణము చేతనే నేను స్వతంత్రునిగా యున్నాను. ఆ కారణము చేతనే ఏ సంస్థకును నేను చెందలేదు, ఎందుకనగా సంస్థల యందు నేను విశ్వాసముంచుట లేదు. సంస్థకు ఎట్టి వాక్యాధారము లేదు. అందును బట్టియే ఏ సంస్థకును నేను చెందియుండలేదు. నేను చేసిన దానికి నేను అందుకే సంతృప్తిగా యున్నాను, చూచారా. అందువలననే నేను జనులను తీసికొనుటకు గాని, వారిని సభ్యులనుగా చేయుటకు గాని ఆసక్తి చూపుట లేదు, ఎందుకనగా మనము సభ్యులముగా యుండుటకే జన్మించియున్నామని నేను నమ్ముచున్నాను. మనము సజీవ దేవుని యొక్క సంఘములోనికి జన్మించియున్నాము, చూచారా.

మేము ప్రజల యొక్క పేరులను పుస్తకములలో నుండి తొలగించుట గాని, వారిని వెలివేయుట గాని చేయము. అటువంటి విధులు మావి కావని మేము నమ్ముచున్నాము. దేవుడే బహిష్కరించును, చూచారా. కానీ సంఘములో ఒక సభ్యుడు తప్పు చేసినచో వేరే విధానమున్నది.

189ఉదాహరణకు సహోదరుడు నెవిల్ లేదా సహోదరుడు జూనియర్ లేదా ఇక్కడున్న ఒక సోదరుడు, లేదా డీకన్ లలో ఒకరు, లేదా ట్రస్టీలలో ఒకరు తప్పు చేయుచున్నారనుకొనండి. అప్పుడు సంఘమంతయూ ఒక చోట చేరి ఆ సోదరుని కొరకు ప్రార్థించవలెను. అది నా నమ్మకము. ఇంకా అతడు సరికానియెడల, ఇద్దరు వ్యక్తలు అతని యొద్దకు వెళ్ళవలెను. ఆ సోదరుని సమాధానపరచవలెను. ఆ తరువాత కూడా అతడు సరికానియెడల, దానిని గూర్చి సంఘము ఎదుట చెప్పవలెను. అప్పటికిని అతడు సరికాని యెడల, అప్పుడు సంఘమంతయూ, అనగా సంఘ కాపరి మరియు పెద్దలు అందరూ కలిసి ఆ పనిని చేయవలెను. డీకన్ బోర్డుకు గానీ, ట్రస్ట్ బోర్డుకు గాని, సంఘ కాపరికి గాని ఏ సభ్యుడినయినా సంఘములో నుండి త్రోసివేయు హక్కు లేదని నమ్ముచున్నాను.

అనైతిక జీవన విధానము వలన గాని లేదా అటువంటి మరో ఇతర కారణము వలన గాని ఒక వ్యక్తికి సహవాసము నుండి తొలగించుట జరుగును, ఎందుకనగా ఆ వ్యక్తి తగడు. ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి స్త్రీలను వేధించుట గాని, లేదా అవమానపరచుట గాని, లేదా అటువంటి ఇతర కార్యములు చేయుట గాని మన దృష్టికి వచ్చినయెడల, చర్య తీసికొందుము, ఎందుకనగా అతడు బయటకు వెళ్ళి మన సహవాసము పేరు చెప్పుకొనును., చూచారా.

అతని విషయములో మనము ఏదో ఒకటి చేయుటకు ఆలోచించవలెను. ఆ వ్యక్తి అసభ్యముగా ప్రవర్తించుచూ మన స్త్రీల పట్ల అమర్యాదగా మెలగుచుండినప్పుడు, మన కుమార్తెలను అవమానపరచుచన్నప్పుడు, లేదా మన మగ పిల్లలను తన చెడ్డ నడవడితో ప్రభావితము చేసి పాడు చేయుచున్నప్పుడు మనము ఆ వ్యక్తి విషయములో తగిన చర్య తీసికొనవలెను. ఆ విషయములను తీవ్రముగా ఎంచవలెను. ఆ వ్యక్తిని సహవాసము నుండి బహిష్కరించవలెను. ప్రభురాత్రి భోజనము తీసికొనుటకు మనము అతడిని అనుమతించరాదు, ఎందుకనగా అలాగు మనము చేయరాదు. "ఎవడైనను యోగ్యముగా దీనిని భుజించినయెడల, అట్టివాడు ప్రభువు యొక్క శరీరమును బట్టియు, రక్తమును బట్టియు అపరాధియగును."

190కాని ఒక వ్యక్తి వచ్చి, "మరో వ్యక్తి ఇటువంటివాడు, అటువంటివాడు అని చెప్పినయెడల అతని గురించి ప్రార్థించవలెను."

ఒక సంగతిని ఎన్నడూ నేను మరువలేను. స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో జరిగినది. సహోదరుడు లేవి పెత్రుస్ గొప్ప దైవజనుడు. అతడు బల్ల యొద్ద కూర్చొని యున్నాడు. ఇక కొద్ది గంటలలో మేము అమెరికాకు బయలుదేరి వచ్చుచున్నాము. అక్కడ గొప్ప కూటములు జరిగియున్నది. అప్పుడు గోల్డన్ పిండ్సే ఇట్లు ప్రశ్నించెను, "ఇంత పెద్ద వ్యవస్థను పర్యవేక్షించువారెవరు?" ఆ సెంబ్లీస్-ఆఫ్-గాడ్ ను అది వందల మైళ్ళ దూరము తరిమివేసినది. కావున అంత పెద్ద దాని పర్యవేక్షకులెవరని, అడిగెను.

లేవి పెత్రుస్… పెద్ద మనిషి వంటి వాడు. అతడు ఇట్లు చెప్పెను, "యేసు."

"మీ ప్రెస్బిటర్లు ఎవరు?" అని అడిగెను.

"యేసు," అన్నాడు.

"అది సరేనని నాకు తెలియును" అన్నాడు. "మా అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ విషయములో కూడా అదే మేము నమ్ముచున్నాము. అది నిజము. కాని ఉదాహరణకు ఒక సోదరుడు దారి తప్పినప్పుడు ఆ బాధ్యతను ఎవరు తీసికొందురు?" అని అతడు ప్రశ్నించెను.

మేము అతనిని బయటకు త్రోసివేయుము," అన్నాడు.

"సరే మరేమి చేయుదురు?" అనడిగాడు.

"మేమతని కొరకు ప్రార్థించుదమము,'' అని అతడు చెప్పెను. అది చాలా మధురమగు జవాబు. అది "నాకు క్రైస్తవ్యము," వలె కనిపించెను. "ఆ వ్యక్తి కొరకు ప్రార్ధించవలెను." అంతేగాని ఎవరూ అతనిని బయటకు త్రోసివేయరు. అతని కొరకు వారు ప్రార్దిచుదురు.

191"సరే, కొందరు సోదరులు అతనితో సహవాసము చేయుటకు ఒప్పుకొందురు. మరి కొందరు సహవాసము చేయమని చెప్పెదరు. సంఘ కాపరి ఆ వ్యక్తిని త్రోసివేయవలెనని నిశ్చయించెననుకొందుము అప్పుడు మీరందరూ ఎమి చేయుదురు? సంస్థలో నుండి బయటకు త్రోసివేయుదురా?" అనడిగాడు.

"త్రోసివేయుము. అతడిని ఒంటరిగా వదిలి మరియు అతని కొరకు ప్రార్థించెదము," అని చెప్పెను. "ఒక్క ఆత్మను కూడా పోగొట్టుకొనము. అట్టి వారు ఎదో విధముగా తిరిగి వచ్చెదరు."

"కొందరు అతనిని బహిష్కరించవలెనని అందురు. మరి కొందరు అతనిని ఉంచవలెనందురు. అప్పుడేమి చేయుదురు?'' అనడిగాడు.

"అతనిని కావలెననుకొను వారు అతనిని చేర్చుకొందురు. వద్దనుకొనువారు దూరంగా యుందురు," అని చెప్పాడు.

ఆ విధముగా నిర్ణయించుకొనుట మంచిదని నేను తలంచుచున్నాను. అవునా, సోదరులారా! ఆ విధంగానే మనము సోదరులము.

192సోదరులారా, ఈ సంగతులన్నియూ మనలను కొంత వెలుగు నొద్దకు నడిపించినవని నమ్ముచున్నాను. అది జవాబు రూపములోనో మరో రూపములోనో వచ్చియున్నది. ఈ రాత్రి మన కూటమువలన లాభము చేకూరినది. కొంత సమయములో నేను వెళ్ళుటకు తలచుచున్నాను, పశ్చిమాన నాకు కూటములున్నవి. నేను దీనముగా మీ ప్రార్థనలు కోరుచున్నాను.

ఇక్కడ నేను చెప్పిన కొన్ని జవాబులు లేదా చాలా జవాబులు, లేదా అన్నీ జవాబులు సరయినవి కాకపోవచ్చును. నాకు తెలియుదు. కాని నేను నా శాయశక్తులా ఆలోచించి అవగాహన చేసికొని చెప్పియున్నాను, చూచారా, దానిని వివరించుటకు ప్రయత్నించాను. బహుశా ఈ చివరి ప్రశ్నలు ముఖ్యంగా నాకు సమయము లేనందున కుదించి చెప్పుట జరిగినది. ప్రతి సమయములోను, ప్రతి దినము మనము లేఖనములను వెదకుచున్నాము. మనము ఆలయములో అదే చేయుచున్నాము. ఒక గొప్ప విషయమును గూర్చి చెప్పవలెనన్నచో చాలా ఒత్తిడికి కూడా గురికావలసియుందుము. సంఘములో ప్రశ్నలకు జవాబులు చెప్పుట గొపు పనియే.

193మీరా విధంగా నిలచియున్నందుకు నేను సంతోషించుచున్నాను. అక్రమము గాని, అసంతృప్తి గాని, గందరగోళము గాని లేదు. ఏ ప్రశ్న విషయములోను వాదించి "ఇది, తప్పు అని చెప్పలేదు. అది తప్పు గనుక మేము అంగీకరించమని ఎవరు పలుకలేదు." సోదరులు తమ్మును తాము బలపరచుకొనుటకు వీటిని అడిగిరి. వారు తమ కవచములను మరింత గట్టిగా బిగించుకొనిరి. మరొక గట్టి ముడిని వేసికొని, అనేక పర్యాయములు ఈ విధముగా మనము కలిసికొని మన ఆయుధములను పెంపొందించుకొనవలెనని కోరుచున్నాను.

సోదరులారా, గుర్తుంచునండి, నా కవచమును కూడా బిగించుకొనవలసియున్నాను. కావున నా కొరకు దేవుని ప్రార్థించుడి, దేవుడు నాకు సహాయము చేయునట్లుగాను, నా కవచమును మరింత బిగువుగా లాగుకొనునట్లును ప్రార్ధన చేయుడి. సంగతులను చులకనగా చూడవద్దు. నేను జీవించు నా జీవితము, నేను చేయు కార్యములు మరెక్కున తగ్గింపు ఆత్మతోను, మరి ఎక్కువ ఆసక్తితోను చేయు నట్లుగా ప్రార్థించుడి. ముందెన్నడూ చేయని విధంగా నేను కార్యములు చేయుటకు హృదయమును నిలపగలుగునట్లుగా దేవుని ప్రార్థించండి. నేను కూడా మీ అందరి కొరకును ప్రార్థించెదను. దేవుడు మిమ్మును దీవించును.

194మిమ్మును ఇక్కడ చాలా సేపు ఉంచియున్నాను, ఇప్పుడు అయిదు నిమిషములు తక్కువ పదకొండు అయినది.

ఇప్పుడు, నెవిల్ సోదరుడు… దాదాపు తొమ్మిది వందల మైళ్ళ దూరం వెళ్ళవలసియున్నాను. సోమవారం ఉదయం వరకు వెళ్ళను. ఆదివారం నాడు ఆదివారపు పాఠశాలకు హాజరగుదును. మీ అతిధిగా వచ్చెదను. మీరు బోధించిన దానిని విందును. ఆదివారము నాడు చూడండి. అవునా! నెవిల్ సోదరుడా, ఇందుకు కారణమున్నది. మిమ్మును నేను ప్రేమించుచున్నాను. మీరెల్లప్పుడూ ఎంతో దయతో నాకు వేదికను ఇచ్చుచున్నారు. నేను మీకు సీనియర్ పెద్ద వంటివాడను.

కాని అలాగు ఎన్నడూ నేను తలంచలేదు, నెవిల్ సోదరుడా, మనం సోదరుని వలె యున్నాము అని నేను తలంచాను.

195సహోదరుడు రడెల్, సహోదరుడు జూనీ, ఇంకా మీరందరూ నా సోదరులు. మనందరము సహోదరులమై యున్నాము. దీనికి కారణమున్నది. నాకు గొంతు కొద్దిగా బొంగురు పోయినది. చూడండి, నాకు ఆగకుండా ఆరు వారముల పాటు పోరాడవలసిన అవసరమున్నది. ఈ కూటానంతరము ప్రారంభించవలెనని తలంచాను. అందువలన నాకు శుక్రవారము, శనివారము, ఆదివారము విశ్రాంతి దొరకును. ఆ తరువాత అక్కడి కూటములు ప్రారంభమగును.

జూనీ సోదరుడా, నేను త్వరలోనే వచ్చెదను. నేను వచ్చి మరల నిన్ను చూడగోరుచున్నాను. నిన్న నేను మా చిన్న సంఘమును దాటి వచ్చాననుకొనుచున్నాను. గ్లేనేల్లెన్ పార్కు దగ్గరగా రైలు రోడ్డు ప్రక్కన అది ఉన్నట్లుగా నా భార్య చెప్పినది. అవునా? నేనక్కడికి వచ్చి ఆ సెల్లర్స్-బర్గ్ జనులతో మాట్లాడగోరుచున్నాను. మంచిది.

196రడెల్ సోదరుడా, దేవుడు నిన్ను దీవించును. మీ యొద్దకు రాగోరుచున్నాను. చక్కని జనులు మాకున్నారు. ఈ రాత్రి మీరు అక్కడ కూర్చొని వినుచున్నారు. ముసలి పెద్ద వలె వినుచున్నావు.

సహోదరుడు బీలర్ అచ్చటున్నాడు. అతడు మన సువార్త సోదరులలో ఒకడు. ఎక్కడో ఒక చోట మీ కూటములలో నిన్ను కలిసికొందునని ఆశించుచున్నాను సోదరుడా; నిన్ను బలపరచుటకు, నిన్ను ప్రభావితము చేయుటకు ఇది చెప్పుచున్నాను. నీ గూర్చి అందరికి నేను మంచిగానే చెప్పుచుందును. ఇక్కడ సహోదరుడు స్ట్రయికర్ ఉన్నాడు. సువార్తికులలో ఉన్నాడు.

ఇక్కడ సహోదరుడు కాలిన్స్ ఉన్నాడు. ఒక దినమున పూర్తి సమయమును పని కొరకు వినియోగించునని నమ్ముచున్నాను.

యోధులగు వారు, విశ్వాస వీరులు ఇచ్చటున్నారు, నిజ విశ్వాసపు గుంపు, మీ అందరికి దేవుడు తోడుగా యుండును గాక!

197మరియు మీరు డీకన్ లు, ట్రస్టీలైన మీరు, సహోదరులు. నేను నమ్ముచున్నాను మీరు…

ఇక్కడున్న ఒక సోదరుని పేరు నాకు గుర్తుకు వచ్చుట లేదు. [సహోదరుడు కాల్డ్ వెల్ అని ఒక సహోదరుడు చెప్పెను.] కాల్డ్ వెల్. మీరు పెద్లదలో ఒకరైయున్నారు. [" సేవకులు"] సేవకులు. ["నేను ఒక సేవకునిగా యున్నాను. నేను దేవుని యొక్క సంఘమునకు చెందియున్నాను. నేను సంపూర్ణ సువార్తను ఒక్కడే ఉండి బోధించజాలను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును వారి యొద్ద ఉండి నేను బోధించజాలను. నాకు అత్యున్నత సేవా లైసెన్సు ఉన్నది. దానిని వారు నాకు ఇయ్యగోరిరి గాని దానిని నిరాకరించాను. మీరు ఆ గొప్ప వర్తమానములు బోధించుటను నేను వినినప్పటినుండియు వాటన్నిటిని నేను త్యజించి సంస్థలో నుండి బయటకు వచ్చి యున్నాను, మీలో ఒకనిగా ఉండగోరుచున్నాను."]

సోదరుడా, వందనములు. మా సహవాసములోనికి మిమ్మును ఆహ్వానించుచున్నాను. మన యోగ్యత పత్రములు పై నున్నవి. మన జీవితమే మన యోగ్యతా పత్రములను తయారు చేయును. చూడండి, అవి మన యోగ్యతా పత్రములు. నా తండ్రి యొక్క క్రియలు నేను చేయనియెడల, నాయందు విశ్వాస ముంచవద్దు," చూచారా. అది నిజము. అవే మన యోగ్యతా పత్రములు, హవర్డ్ కాడిల్ ఈలాగు చెప్పుచుండెడివాడు. "మాకు ప్రేమ తప్ప మరో చట్టము లేదు. బైబిలు తప్ప మరో గ్రంధము లేదు. క్రీస్తు తప్ప మరో విశ్వాస ప్రమాణము లేదు." ఇది నిజము. "ప్రేమ తప్ప మరో చట్టము లేదు, క్రీస్తు తప్ప మరో విశ్వాస ప్రమాణము లేదు. బైబిలు తప్ప ఇతర గ్రంధము లేదు."

198కాల్డ్ వెల్ సోదరుడా, నీవు మాతో ఉండుటను బట్టి సంతోషించుచున్నాము. "ఒక గొప్ప సంస్థలో నుండి నీవు బయటకు వచ్చియున్నావు. ఆండర్సన్ చర్చి-ఆఫ్-గాడ్ అని నేను తలంచుచున్నాను. ["క్లీవ్-లాండ్" అని సహోదరుడు కాల్డ్ వెల్ చెప్పెను.] క్లీవ్-లాండ్ చర్చి, పెంతెకోస్తు చర్చ్-ఆఫ్-గాడ్. [అక్కడ నేను సంఘ కాపరిగా ఉండేవాడిని.] ఓ, అవును. నేను అక్కడుంటిని. సహోదరుడు నెవిల్ లేదా సహోదరుడు ఉడ్ తో ఒకసారి అక్కడ నేనున్నాను.

ఒకరి యొద్ద నుండి తెచ్చిన వేట కుక్క ఒకసారి మీ చర్చి యొద్దకు వెళ్ళిపోయినది. నేను ఆ మెట్ల మీద నిలబడి మాట్లాడియున్నాను. వారు నిన్ను గురించి మాట్లాడిరి. ["నా ఆలయములో ఏమిటి?"] ఓ? ["బర్న్స్"] అది నిజము, సహోదరుడు బర్న్స్. అది నిజము. [సహోదరుడు కాల్డ్-వెల్ ఒక సంఘటనను వివరించెను.] అవును. బెర్తా. అది నిజము. ఓ, అది అద్భుతము.

199సహోదరుడు రూక్ అచ్చటుండెను. ఇప్పుడతడు సంఘ కాపరి అయ్యెను, లేదా సువార్తీకుడని తలంచుచున్నాను. అది నిజమేనా? లేక నీవే సంఘ కాపరిగా ఉన్నావా? [సహోదరుడు రూక్ సువార్తికుడని చెప్పెను.] సువార్తికుడు. రూక్ సోదరుడా, నీ మీద వ్యాఖ్యానము చేయగోరుచున్నాను. ప్రభువు కొరకు నీవు చేసిన గొప్ప కార్యములు కొన్నింటిని గూర్చి వినియున్నాను. నీవు ఇండియానా-పోలిస్ కు వెళ్ళావని విన్నాను. అక్కడ కూటములు ఏర్పరచి ఆత్మలను సంపాదించావని వినియుంటిని.

రూక్ సోదరుడా, దేవుడు నీకు తోడై యుండును గాక. నిన్ను చూచి నిశ్చయంగా సంతోషించుచున్నాను. నిన్ను నేను ఆ పాత ట్రాక్టరు మీద చూచాను. అటు తిరుగుచుండేవాడిని. మా ఆవరణను ఎరువులు వేసి సాగు చేసేవాడిని. అయితే ఇప్పుడు నీవు బయట ప్రభుని కొరకు ఏదో చేయవలెనని ప్రయత్నించుచున్నావు. ఆయన నిన్ను సేవకు పిలచినందుకు సంతోషించుచున్నాను. సోదరుడా, ఎప్పుడూ ఆయనను విడిచిపెట్టవద్దు. దేవుడు నిన్ను దీవించును. ఏ విషయములోనూ రాజీపడవద్దు; కాని మాధుర్యమగు ఆత్మతో సమస్తమును చేయుము. నీ వర్తమానము ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ యొక్క మాధుర్యముతో ఉప్పువేసినట్లుగా యుండనిమ్ము.

200స్ట్రయికర్ సోదరుడున్నాడు… [ఒక సోదరుడిట్లు అడుగుచున్నాడు, "మీ అందరి ప్రార్థనలు మాకు అవసరము. నార్త్ వెర్నన్ లో ఒక ఆలయమును ప్రారంభించవలెనని మేము ప్రయత్నములు చేయుచున్నాము.] మీరు ప్రారంభించెదరని నమ్ముచున్నాను. మీ కొరకు మేము ప్రార్థించెదము. ["ఇంత వరకూ చాలా బాగా పని చేశారు."] ఇది సత్యము.

బిల్లీ, నీవెప్పుడు సంఘ కాపరిగా పని నారంభించెదవు?

డాక్టర్ గోడ్ మరియు డాక్టర్ మెర్సియర్ ఇచ్చటున్నారు… ఒకరినొకరము ఆ విధంగానే పిలచుకొందుము. సహోదరుడు గోర్ ఒక స్థానమునకు వచ్చియున్నాడు. అతనికి నిజంగా బిరుదు ఇవ్వదగును. అతడిప్పుడు గుండ్లు నింపగలడు. లియో సోదరుడా, అతనిని ఆ విధంగానే మనం పోనిచ్చుదం. అతని "డాక్టర్" బిరుదును కొనసాగినిద్దాం.

ఆ వెనుకన డాక్టర్. బ్రెన్హాం యున్నాడు, ఆమెను చాలా బాగా చూసుకోవలసిన పని నీకున్నది, మరియు దీపములు చాలా ప్రకాశమానముగా వెలుగుచున్నవి. నీకు ఒకటి చెప్పనా, ప్రత్యేక కూటము మనకున్నప్పుడు నేను బోర్డు వారితో మాట్లాడుదును, ప్రత్యేక కూడిక మనము ఎప్పుడు కలిగియున్నా, వారు కొద్దిగా ఎక్కున చెల్లించవలెను [సహోదరుడు బ్రెన్హాం నవ్వెను], ప్రత్యేకమైన పని కొరకు నీవు చాలా తుడవ వలసియుందువు. ఇంట, బయట పని చేయవలసి యుందువు, అది నీకు సంతోషము కలిగించును.

201డాక్టర్. ఉడ్. అతనిని నేను "డాక్టర్" అని పిలిచాను. ఎందుకోనని నీవు ఆశ్చర్యపడుచున్నావు. తప్పు పేరుతో అతనిని నేను పిలచుట లేదు, మీకు తెలుసు. అతడు కర్రలను ముక్కలుగా చీల్చును. ప్రభువు అందమగు చెట్టును ఎదిగించగా, అతడు దానిని నరికి పడవేయును. దానితో ఇండ్లు నిర్మించును. ఇంకా నేను అటువంటి దానిని చూడనే లేదు, కావున అతనిని నేను "డాక్టర్" అని పిలిచాను.

టేలర్ సోదరుడా, ఇంకా నీవు ద్వారము నొద్ద నమ్మకముగా యున్నావు. మరియొకరిని నీ సీటు ఇచ్చుచుందువు. నిన్ను చూచినప్పుడు నాకు ఈ మాటలు గుర్తుకొచ్చును, "దుర్మార్గుల గుడారములలో నివసించుట కంటే యెహోవా మందిరములో కాళ్ళు తుడుచుకొను చాపగా యుండుట మేలు." నిశ్చయంగా అది నిజము.

సహోదరుడు హిడర్సన్, ఇప్పుడే నీవు దారిలోనికి వచ్చావు. ముందుకు సాగిపోవుచున్నావు. నీవు మార్గములో ప్రారంభించి ముందుకు నడిచి వచ్చుచున్నావు. నీ యధార్థతను నిశ్చయంగా నేను ప్రశంసించుచున్నాను. ప్రభువైన యేసు కొరకు నీవు చేయుచున్న దానినంతటినీ మెచ్చుకొనుచున్నాను. సదా దేవుడు నిన్ను దీవించి, నిజమగు డీకన్ గా, సోదరునిగా, చేయును గాక! నీవు అన్ని విషయములలో లోబడియున్నట్లే - నీ ఇంటి వారును లోబడియున్నారని నేను నమ్ముచున్నాను, అన్ని విషయములలోను సరిగా ఉన్నావని తలంచుచున్నాను.

202ఫ్రెడ్ సోదరుడా, నీవు మాతో కొద్ది కాలము నుండి ఉంటున్నావు. కెనడా నుండి వచ్చుచున్నావు. నిన్ను కెనెడియనుగా మేము ఏ మాత్రము భావించుట లేదు. నీవు మాతో కూడా యాత్రికుడవును, పరదేశివిని అయి యున్నావని భావించుచున్నాము. మా ట్రస్టీగా యున్నావు. నీవు, వుడ్ సోదరుడు కలిసి మీ కప్పగించబడిన పనిని నెరవేర్చుడి. సహోదరుడు రాబర్సన్, ఇంకా ఇతరులతో మంచిగా యుండడి. సహోదరుడు ఈగన్ ఈ రాత్రి ఇక్కడ లేడని తలంచుచున్నాను. రాబర్సన్ సోదరుడా, నీవు నాకు నిజమగు సహాయముగా యుంటివి. పన్ను వివాదములో జరిగిన పరిశోధనకు సహోదరుడు రాబర్సన్ ఇతరులతో కలిసి ఎంతో పనిచేసెను.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...