ఉత్తర వైపుకు తిరుగుట
1ద్వితీయోపదేశకాండము 2వఅధ్యాయము మొదటి వచనము నుండి చదవడం ప్రారంభిద్దాము. (ఎవరో చదువుచున్నారు.)
మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పోయి బహు దినములు శేయీరు మన్నెము చుట్టు తిరిగితిమి.
అంతట యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను,
మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగినకాలము చాలును; ఉత్తర దిక్కుకు తిరుగుడి.
మరియు నీవు ప్రజలతో ఇట్లనుము, శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవుచున్నారు, వారు మీకు భయపడుదురు; మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి.
వారితో కలహపడవద్దు; ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్నెము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను.
మీరు రూకలిచ్చి వారియొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారియొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును.
నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలుబది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన యెరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు, నీకేమియు తక్కువ కాదు.
అప్పుడు శేయారులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడచి, ఏలతు ఎసోన్గెబెరు అరాబా మార్గము నుండి మనము ప్రయాణము చేసితిమి. మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయాణము చేయుచుండగా..
యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను.
పూర్వకాలమున ఏమీయులనువారు ఆరు దేశములో నివసించిరి, వారు అనాకియులవలె, ఉన్నత దేహులు, బలవంతులైన బహు జనులు. వారును అనాకియులవలె రెఫాయీయులుగా ఎంచబడినవారు.
మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి. పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపువారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని తమ యెదుటనుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి.
కాబట్టి మీరు లేచి జెరెదు ఏరు దాటుడి అని యెహోవా సెలవియ్యగా జెరెదు ఏరు దాటితిమి. మనము కాదేషు బర్నేయలోనుండి బయలుదేరి జెరెదు ఏరు దాటువరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యులతరము వారందరు సేనలో నుండకుండా నశించువరకు మనము నడిచిన కాలము ముప్పది ఎనిమిది సంవత్సరములు.
అంతేకాదు, వారు నశించువరకు సేనమధ్యనుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా నుండెను.
సైనికులైన వారందరు ప్రజలలో నుండి లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను,
నేడు నీవు మోయాబునకు సరిహద్దుగా నున్న ఆరు దేశము దాటబోవుచున్నావు:
అమ్మోనీయుల మార్గమున వెళ్లునప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నియ్యను [మనము నిలబడియుండగా చదువబడిన లేఖనమును దేవుడు దీవించును గాక.]
….జలుబు. సాతాను జలుబును నాకు ఇచ్చియున్నది, గనుక మరలా నేను దానిని ఆ సాతానుకే తిరిగి ఇచ్చాను. ఆ సాతాను మరలా నాకు దానిని ఇవ్వగా, తిరిగి దానిని దానికే ఇచ్చాను. ఆ సంఘమును నేను ప్రతిష్టించేంతవరకు దానితో
అలాగే పోరాడుచూ ఉంటిని. చివరికి వాడు ఏమి చేయలేక వదిలి వెళ్ళిపోయెను. మరియు నేను వెళ్ళి సంఘమును ప్రతిష్టించితిని.
ఈ మధ్యాహాన సమయమున ఈ పెట్టె మీద నిలబడియుండగా… మా అమ్మ పాత్రలను కడుగుటకు నన్ను ఒక పెట్టెమీద నిలబెట్టుట ఆమెకు అలవాటు, ఇప్పుడు
అది మరలా ఆ జ్ఞాపకములోకి నన్ను తీసుకొని వెళ్ళినది. మంచిది. ఈ మధ్యాహాన సమయమున మనము అదే కార్యమును చేయుచున్నామని నేను నమ్ముచున్నాను.
కాబట్టి ప్రభువు దీవించును గాక!.
2కొన్ని ప్రకటనలు గలవు. ఒక దినమున హోస్టన్ అనే ఊరిలో నేను ప్రకటనలను చెప్పవలసి వచ్చెను. "వాన్ హ్యూస్ సహోదరుడి గురించి దయచేసి ప్రకటించండి…
వాన్ హ్యూస్ మరియు డబ్యు. పి. హిన్సే సహోదరులు ఫిబ్రవరి నెలనుండి మార్చి 5 వరకు అరిజోనాలోని ఫీనిక్స్ లో ఉండెదరు" అని వ్రాయబడియున్న ఒక చిన్న
కాగితమును నాకు ఇచ్చిరి. దీనిని మీ మనస్సులో ఉంచుకోండి.
రేపు రాత్రి సహోదరుడు ఓరల్ రాబర్ట్స్ ఇచ్చట మాట్లాడుచున్నాడని తలంచుచున్నాను. బహుశా, ఇదే సభాభవనంలోనే కదా? విందుశాలలోనా? ప్రసంగ వేదిక
యందు సహోదరుడు ఓరల్ నిశ్చయముగా దేవునియొక్క కళాకాండము వంటివాడు. అద్భుతమైన దైవజనుడు, ఒక విశ్వాస పురుషుడు. రేపు రాత్రి సహోదరుడు రాబర్ట్స్ ప్రసంగమును వినుటకు మీరు వచ్చుట మంచిదని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను.
పిదప, ఉదయకాలపు అల్పాహార కూటము గలదు. ఆ కూటములో పాల్గొనుటకు అనేకమంది ఇదివరకే టిక్కెట్లను పొందుకోవడం ఆ తెర వెనుక నేను చూచాను. సరే. కాబట్టి ఇలాంటి సమావేశాలలో ఉండుటకు మేమెల్లప్పుడు సంతోషించెదము.
3నేను వర్తమానమును ఇచ్చట ముగించిన వెంటనే మీకు మరొక కూటము గలదని లేదా ముగించిన వెంటనే ఏదోక కార్యమును మీరు ఏర్పాటు చేసుకొన్నారనే కార్యము నేనెరుగుదును. కాబట్టి నా మాటలను సాధ్యమైనంతవరకు తగ్గించుకొనెదను. ఒక్క కార్యమేమనగా నా గొంతు బొంగురుపోయినది. మరొకటి సమయం కొరకు
వత్తిడి గలదు. ఇప్పటికే మీరిచ్చట రెండుగంటలపైనే ఉండి అలసిపోతిరని తెలుసు.
ఇప్పుడు, రేపు లేదా వచ్చే ఆదివారము ప్రభువు చిత్తమైన యెడల (వచ్చే ఆదివారం ఫిబ్రవరి 5), వచ్చే ఆదివారం సాయంకాలం టుసాన్‌లోగల అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారి స్ధలంలో మేము రోగుల కొరకు ప్రార్ధించెదము. అది వచ్చే ఆదివారం సాయంకాలం అరిజోనాలోని టుసాన్‌లో 7. 30కి జరుగును. పిదప మేము అచ్చటనుండి పశ్చిమ తీరమున నున్న …లాస్ ఏంజిల్స్‌కి దిగువనున్న లాంగ్‌బీచ్ వరకు ప్రయాణించుచున్నాము. అది అలాగేనని నేను నమ్ముచున్నాను. దానికి తర్వాత బేకర్స్ ఫీల్డ్ అనే స్థలమందు తదుపరి కూటము గలదు. అలాగే దేవునికి చిత్తమైతే, నేను జూరిచ్‌కి వెళ్ళెదను. అదే సమయమున ఈ వ్యక్తులు కూడా అచ్చటుందురు. అంతే కాకుండా,
యెరూషలేముకు కూడా వెళ్ళెదమని నేను నమ్ముచున్నాను. ఒక్కసారి యెరూషలేముకు వెళ్ళి మన ప్రభువు ఏ స్థలమున నివసించెనో అచ్చటకు వెళ్ళాలని నేను కోరుచున్నాను.
ఇక్కడున్న అనేకమంది నామంచి స్నేహితులకు వందనములను చెప్పగోరుచున్నాను. సహోదరుడు డిక్సన్, సహోదరుడు రోడ్స్ ను నేను చూచుచున్నాను. అలాగే ఇంకానేక మంది ఇచ్చట చుట్టూ ఉన్నారు. వారి పేర్లన్నింటిని చెప్పుటకు చాలా సమయము పట్టును. ఇచ్చట నేను నిలబడియున్నప్పుడు కొద్ది నిమిషముల క్రితం చిన్న సహోదరుడు స్మిత్ వచ్చుటను నేను చూచాను. అతడు తన చేతులలో నన్ను చుట్టువేసి కౌగిలించుకొనెను. ఇదెంత అద్భుతమైన సహవాస సమయము.
EXOD 15:20•
DEUT 2:3
4ఇప్పుడు, మనము లేఖనములను చదువబోవుచుండగా, ఒక అంశమును ప్రసంగించుట కొరకు దీనిని తీసుకొనగోరుచున్నాను. ద్వితియోపదేశకాండము 2వ అధ్యాయము 3వ వచనము, దీనిని ఇలాగు పిలువవచ్చనుకుంటున్నాను. మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును: ఉత్తర దిక్కుకు తిరుగుడి. "ఉత్తరం వైపుకు తిరుగుట" అనే అంశం మీద నేను మాట్లాడగోరుచున్నాను.
ఎర్ర సముద్రమునకు అవతలి వైపుకు వెళ్ళిన ఇశ్రాయేలీయులు అచ్చట నాట్యమాడుచూ, కేకలు వేయుచూ, ఆనందించుచూ, ఆ వాగ్ధానభూమికి వెళ్ళి చేరుటకు ఇంకా కొన్ని దినములు మాత్రమేయున్న స్థితిలో అచ్చట వారు నిలబడివున్నప్పుడు, ఆ వాగ్ధాన దేశమునకు వెళ్ళి చేరుటకు ఇంకా నలుబది సంవత్సరములు పట్టుననే విషయమును ఆలోచించుటకు ఇశ్రాయేలీయులకు చాలా ఒక కష్టమైన విషయమగును. కాని అచ్చటకు వెళ్ళి చేరుటకు అన్ని సంవత్సరములు అనవసరము. కేవలము కొన్ని దినములలోనే అచ్చటకు వెళ్ళి చేరగలరు. ఒకవేళ మోటారు వాహనములో ఆ వాగ్ధాన స్థలమునకు వెళ్ళిన యెడల బహుశా గంటన్నరలో వెళ్ళవచ్చును. కాలి నడకన వెళ్ళిన మీకు రెండు, మూడు, నాలుగు దినములలో లేదా ఇంకా కొన్నిదినములలో వెళ్ళి చేరగలరు. అది చాలా సుళువు. అంత శులభముగా మీరు వాగ్ధాన దేశమునకు వెళ్ళగలరు.
ఇంచుమించు తమ వాగ్ధాన దేశము వరకు వచ్చి చేరుకున్నామని వారు తలంచిరి, కాబట్టే వారు గొప్ప సునాదముయొక్క కేకలువేయుచూ దేవుడు వారికొరకు ఏమి చేసెనో దానిని వారు చూస్తూ దేవునిని స్తుతించుచున్నారు. మరియు అదెలాగు… వారికి దేవుడు వాగ్ధానము చేసిన, సంపూర్ణమైన దేవునియొక్క వాగ్ధానమగు ఆ వాగ్ధాన దేశమునకు వెళ్ళి చేరుటకు ఇంకా నలుబది సంవత్సరముల దూరమంత ఉన్నారనే విషయమును వారిని నమ్మునట్లు చేయుటకు చాలా కష్టతరమైన విషయము.
EXOD 15:4,19
5వారికొరకు ఒక గొప్ప కార్యమును కృప సిద్దపరచెను. ఒక పస్కా గొర్రెపిల్లను వారికొరకు కృప సిద్దపరచెను. వారికొరకు ఒక ప్రవక్తను కృప సిద్దపరచెను. ఒక దూతను వారికొరకు కృప సిద్దపరచెను. వారి పాపములను పరిహరించుటకు పస్కా గొర్రెపిల్ల ఉన్నది. వారి ప్రవక్తే వారికి ఒక ఉపదేశకుడు. దూత వారిని నడిపించుటకు మార్గదర్శిగా ఉండెను. వారి కొరకు కృప సమస్తమును సిద్దపరచియుంచెను. ఇవన్నీ ఉండి కూడా వారు ధర్మశాస్త్రమును కోరుకొనిరి.
మరియు వారు ఎలాంటి ధర్మశాస్త్రమును కలిగియుండక ముందే ఈ కృప వారిని ఐగుప్తు నుండి వెలుపలికి తీసుకొని వచ్చుటకు ఒక మార్గమును సిద్దపరచెను. ఇదివరకెన్నడూ వారు పొందుకొనని ఒక మహాగొప్ప ఉజ్జీవమును ఈ కృప వారికి సిద్దపరచి ఇచ్చెను. ఈ ఉజ్జీవమున దేవునియొక్క గొప్ప శక్తులను వారు చూచునట్లుగా చేసినది. లోకమంతా అంధకారమున ఉన్నప్పుడు ఈ ఉజ్జీవమున వారు సూర్యుని యొక్క వెలుగును చూచునట్లుగా చేసినది. బానిసత్వములో ఉన్నవారిని వెలుపలికి తీసుకొని వచ్చి బానిసత్వము నుండి విముక్తి కలుగజేయుటను మరియు అమాయకపు ప్రజలను దేవునియొక్క బలమైన బాహువు విడిపించి తీసుకొని వచ్చుటను వారు ఈ ఉజ్జీవమున చూచిరి. ఈ ఉజ్జీవములోనే వారు ఎర్ర సముద్రమును దాటుకొని వచ్చుచు మరియు వారి వెనుక తమ శత్రువులందరూ ఎర్ర సముద్రమున మునిగి చనిపోవుటను వారు చూచిరి. ఇంతకంటే వేరొక దానిని వారెందుకు కావాలని కోరుకొనిరి.
6నలుబది సంవత్సరముల క్రితం మన పెంతెకోస్తు పితరులు చేసినట్లుగానే వారు కూడా అచ్చట నిలబడివున్నారు లేదా వారికంటే ఇంకా కొంచెం బాగానే చేసిరి. వారు చూచిన అదే కార్యములను మనము కూడా చూచిన తర్వాత, ఎన్నడూ పొందుకోనంత ఒక మహా గొప్ప ఉజ్జీవమును సంఘము పొందుకొనెను. ఆ మహా గొప్ప ఉజ్జీవములో దైవీక స్వస్థతను చూచిరి, బానిసత్వములోనున్న ప్రజలను విముక్తి చేసి స్వతంత్రులుగా చేసినది. అనగా తమ సంఘశాఖల యొక్క సంకెళ్ళ ద్వారా మరియు మొదలగు వాటిద్వారా బంధీలుగానున్న వారిని విముక్తి చేసి స్వతంత్రులుగా చేసినది. వారికి అవసరమైన సమస్త కార్యములను కృప సమకూర్చి ఇచ్చెను. దేవుని దూత,
ప్రవక్తలు, మహానుభావులు వారిని నడిపించునట్లు సమకూర్చి యిచ్చెను.
7అజూస వీధిలో జరిగిన కూాటములనుగూర్చి ఒక రోజు వారు చెప్పిన విషయమును విన్నాను. ఇచ్చట కాలిఫోర్నియాలో ఆ ఉజ్జీవ కూటమును వారు కలిగివున్నప్పుడు సంఘమున వారు పాటల పుస్తకములతో ప్రవేశించినప్పుడు అదొక అవమానకరమని వారు తలంచిరి. వారు ఆత్మతో నింపబడి పాడిరి. పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించిన ఉచ్చారణ ధ్వనితో వారు పాటలను పాడిరి. వారు ఆత్మలో పాడిరి. ఒక గొప్ప కాలమును వారు కలిగియండిరి. దేవుని యొక్క వాక్యములో శుద్ధీకరింపబడి తమ పాపములనుండి వేరు చేయబడాలని వారు ఎదురుచూచిరి. మరియు వారు మరణము నుండి జీవములోకి దాటియున్నారని వారెరిగిరి. నలుబది సంవత్సరముల క్రితం అచ్చట వారు ఎలాంటి ఒక అద్భుతమైన ఉజ్జీవమును కలిగియుండిరి.
కాని ఇశ్రాయేలీయులు చేసినట్లుగానే మన పితరులు కూడా ఘోరమైన తప్పును చేసిరి. ఆ ఒక్క ఘోరమైన తప్పిదము వలననే ఇశ్రాయేలీయులు మరొక నలుబది
సంవత్సరములు అరణ్యములోనే తిరుగునట్లుగా చేసెను. వారికేమి ఉన్నదో దానితో తృప్తిపడుటకు బదులుగా, వారికి దేవుడేమి చేసెనో తమ కన్నులారా దేవుని యొక్క
క్రియలను వారు చూస్తూ, వారికి కావలసిన సమస్త అవసరతలను కృపా ఫలము వారికి సిద్దపరస్తూ ఇచ్చినను… ఒక పాటల పుస్తకంకూడా వారికి అవసరం లేనంతగా
ఆ కృప వారికి కావలసిన వాటన్నింటిని సిద్ధపరచి ఇచ్చుటను మనము కనుగొన్నాము. వారి దినములలో ఆ కార్యములను నేను చూసి ఉండాలని ఆశించుచున్నాను.
8కాని వీటన్నింటిని ఇశ్రాయేలీయులు చూచిన తర్వాత కూడా, వారు భౌతిక ఇశ్రాయేలీయులు… వీరు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు. భౌతిక సంబంధమైన వాగ్ధానపు దేశమునకు దేవుడు తన ప్రజలను తీసుకువెళ్ళిన ప్రకారముగానే ఆత్మ సంబంధమైన వాగ్ధానపు దేశమునకు ఆయన తన సంఘమును తీసుకొని వెళ్ళుచున్నాడు. ఆ వాగ్ధాన దేశమునకువెళ్ళు మార్గమున వారు గొప్ప సమయమును అనుభవించుచుండిరి. వారు…వారికి కావలసిన సమస్తమును కృప వారికి సిద్దపరచి ఇచ్చినను, అయినప్పటికి వారే స్వయంగా ఏదోకటి చెయ్యాలని కోరుకొనిరి. దీనితోపాటు తాముకూడా చేయవలసిన కార్యము ఏదోకటి గలదని, దానిని దేవునికి చూపించవలెనని వారు కోరుకొనిరి.
మరియు దానినే… సంఘము ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు, అదెల్లప్పుడూ, వారు నాశనమైపోవుదురు. దేవుని పనిలో నీ చెయ్యిని పెట్టుటకు, దేవుని కార్యములో ఏదైనా కలుపడానికి లేదా దానిలోనుండి ఏదైనా తీసివేయుటకు నీవు ప్రయత్నించినా, నేను ప్రయత్నించినా లేదా ఏ మనిషైనా ప్రయత్నించినా…దేవుడు మనకేవిధముగా దానిని అనుగ్రహించెనో అలాగే మనము దానిని వదిలి వేయవలెను. ఆత్మ కదులుచు ముందుకు వెళ్ళుచున్న విధముగానే ఉజ్జీవముకూడా ముందుకు కదులుచూ సాగిపోవుటకు అనుమతించండి.
9ఈ జనులు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ప్రకారముగా వెంబడించినట్లయితే దేవుని యొక్క సంపూర్ణ వాగ్ధాన దేశమునకు వెళ్ళుటకు వారికి ఎనిమిది లేక పది దినములంత దూరమున మాత్రమే వారు ఉండిరి. ఈ దినమునున్న ఈ ప్రజలు, మన పితరులుకూడా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును వెంబడించియున్న యెడల
వారు అలాగే ముందుకు సాగుతూ ఉండియున్నయెడల ఆ సంపూర్ణమైన దేవుని వాగ్ధానమునకు కొన్ని దినములంత ప్రయాణ దూరంలోనే వారు ఉండియుందురు. కాని వారు చేసిన విధముగానే మనము కూడా ఏదోకటి చెయ్యవలసియుండెను.
నిర్గమకాండము 19లో… ఇశ్రాయేలీయులు అత్యంత ఘోరమైన తప్పిదమును చేసిరి. ఈ శ్రేష్ఠమైన కార్యములన్నింటిని మరియు ఉజ్జీవమును కృపద్వారా వారికి అనుగ్రహింపబడినను, ఆ తర్వాత కూడా వారు ధర్మశాస్త్రమును కావాలని కోరుకొనిరి. వారికి వేదాంత పాఠశాలలు ఉన్నను, తత్వశాస్త్రములో శిక్షణను యిచ్చే సేవకులు ఉన్నను, అన్ని మంచి విషయములు ఉన్నను, ఇతర ప్రజలవలె వారు కూడా ఉండాలని కోరుచూ… ఏదోక వివాదమును వారిమధ్య కలిగి ఉంటూ, ఏదోక కారణము ద్వారా మంచి సహవాసము నుండి లేదా సహోదరత్వము నుండి తెంచుకొని ఒకరికొకరు వేరుగా విడిపోవుచున్నారు. కాని "మేము దీనిని నమ్ముచున్నాము"; మరియు "మేము దానిని నమ్ముచున్నామని" చెప్పుకుంటున్నారు. దేవుడు చేయుచున్న విధానమున అది కొనసాగునట్లుగా వారు దానిని కొనసాగించిన యెడల అదంతా చక్కగానే ఉండును.
MATT 15:13
10దేవునియొక్క ప్రణాళికలో మనమెల్లప్పుడూ మన ఆలోచనలను పెట్టుటకు ప్రయత్నించెదము. అలాగే దేవుని ఆత్మలో మన ఆలోచనలను ఎక్కించినప్పుడు, మన
వేదాంత సిద్దాంతములను దేవుని ఆత్మలో ఎక్కించినప్పుడు, అది దేవుని ఆత్మను మనలో నుండి తీసివేయును. ఆ దినమున అది ఆ విధముగానే ఉండెను. వారు అచ్చట నిర్గమములో ఉండగా తమంతట తాము ఏదోక దానిని చెయ్యటకు ఆశించిరి.
తమ వివాదముల ద్వారా, తమ వ్యతిరేకమైన కార్యములను కొనసాగించుట ద్వారా, తమవద్ద నుండి దేవుని ఆత్మను తరిమివేసితిమని అప్పుడు వారు కనుగొనిరి. అదొక ఘోరమైన తప్పిదము. మన పితరులు (పెంతెకోస్తు), మనము అదే విధమైన కార్యమును చేసినప్పుడు అది ఘోరమైన తప్పిదమయ్యెను. మొదటిసారిగా అజూస వీధిలోను, ప్రపంచములోని అనేక ప్రాంతములలోను పరిశుద్ధాత్మ క్రుమ్మరింపబడినప్పుడు, ఆ పరిశుద్ధాత్మయొక్క నడిపింపుతో మనము మరియు ఈ ప్రపంచము ముందుకు సాగిపోయి ఉన్నయెడల, పరిశుద్ధాత్మ మనలను నడిపించుటకు అనుమతించి మనము అలాగే కొనసాగిపోవుచున్న యెడల, ఇప్పటికే మనము మన వాగ్ధాన దేశమున ఉండెడివారము. కాని మనము నలుబది సంవత్సరముల కంటే ఇంకా ఎక్కువగానే దానినుండి దూరమైపోయాము. వారు చేసినట్లుగానే మనము కూడా చేయుచున్నాము.
మరొక సమస్య రూపంలో సంఘములోకి ఏదోకటి ప్రవేశించును. సహోదరులను ప్రేమించుచు, చక్కని సహవాసముతో ముందుకు కొనసాగుటకు బదులుగా మనంతట మనమే సంఘసంస్థగా స్థాపించుకొనుటకు కోరుచున్నాము. ఇప్పుడు దానినెందుకు అలాగే ఒంటరిగా విడిచి పెట్టకూడదు? "పరలోకమందున్న నాతండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును". కాబట్టి మన తోటి సహోదరులను వెలుపలికి త్రోసివేయుటకు, కొన్ని సంఘశాఖల అడ్డంకులను ఉంచుటలో, దానివలన మనకు ఏం మంచి కలుగుచున్నది? ఏదోక దానిని కంచెగా మాత్రమే మనము వేసుకొనుచున్నాము.
11ఒక చిన్న కథలోని తాత్పర్యము ఇలాగు ఉన్నది… ఆత్మతో నింపబడివున్న ఒక గుంపు జనుల మధ్య మాట్లాడుటకు నేను భాగ్యమును కలిగివుండగా, ఈ ప్రసంగ వేదికనుండి ఇలాంటి కథను నేను చెప్పుట బహుశా, సముచితమైనది కాదేమోననిపించుచున్నది. కాని చెబుతాను, రెండు కోతులు ఒక చెట్టుమీద కూర్చొని ఒకదానివైపు ఒకటి చూచుకొనుచున్నవి. అవి క్రిందకు తొంగిచూచి, పేదవారైన మానవులను చూస్తూ, "మానవుల పరిస్థితి దీనమైనది కదా? వారు మననుండి వచ్చితిరని చెప్పుచున్నారు. అది తప్పు. నేను తినుచున్న కొబ్బరి కాయలను నా తోటి సహోదర కోతులు తినకూడదని నా కొబ్బరి చెట్టుకు కంచెను నేనెప్పటికీ వేయనని" చెప్పెను. అర్ధమైనదా? మానవజాతి స్వభావమే అలాంటిది. సంఘముకూడా ఎల్లప్పుడూ ఆ విధముగానే ఉన్నది.
1SAM 8:5,19,20•
1SAM 12:3,4,12
12ఒకసారి, ఇతర ప్రజలవలె తమకుకూడా ఒక రాజు కావాలెనని ఇశ్రాయేలు కోరుకొనిరి. వారికి ఒక రాజును ఏర్పరచి సమూయేలు ఇవ్వవలెనని వారు కోరిరి. సరే,
సమూయేలు వారితో, "ఇది మీకు ప్రయోజనము ఉండదు. ఎందుకనగా, దేవుడే మీకు రాజుగా ఉన్నాడు. గనుక దేవుడే మీకు రాజుగా ఉండనివ్వండి" అని చెప్పెను.
అయినప్పుటికీ వారికి రాజు కావాలనికోరిరి. ఎందుకనగా, ఇతర దేశములవలె తమకుకూడా ఒక రాజు ఉండాలనే ఉద్దేశ్యముతోనే దానిని వారు అడిగిరి. ఫిలిష్తీయుల
వలె, ఇతర రాజ్యములవలె తాము కూడా కార్యములను చేయవలెనని వారు కోరుకొనిరి. దేవుడు వారికి రాజుగా ఉండుటకు బదులుగా లోక రీతిగా తమను ఏలుటకు వారికొక రాజు కావాలని వారు కోరుకొనిరి.
సమూయేలు వారితో చెప్పెను… దేవుడు సమూయేలుకు చెప్పెను… సమూయేలు వృద్ధుడగు నమ్మకమైన ప్రవక్తగా ఉండెను. ఇశ్రాయేలీయులను సమూయేలు పిలిచి, "ప్రభువు నామమున నేను మీకు చెప్పినదేదైనా ఏది జరుగకుండా తప్పిపోయినదా? నేనెప్పుడైనా ప్రభువు నామమున చెప్పినది
ఏది జరుగకుండా తప్పిపోయెను? నేనెన్నడైనా మీవద్ద డబ్బు కావాలని బ్రతిమాలితినా? లేదా మీ నుండి ఏదైనా తీసుకోవాలని నేను ఆశించితినా?" అని అడిగెను.
"లేదు, మమ్మల్ని డబ్బు యివ్వమని నీవెప్పుడు అడుగలేదు. ప్రభువు నామమున నీవు మాతో చెప్పిన ఏదీ కూడా జరుగకుండాపోలేదు. అయినప్పుటికీ, ఎలాగైనా
మాకు ఒక రాజు కావాలని మేము కోరుచున్నాము.
13చూడండి, మానవుడు తనకుతానే ఏదోకటి చెయ్యాలని ఆశించును. తనకున్న అధికారాన్ని చూపించగోరును. తానెంత గొప్పవాడనేది చూపించుటకు ఆశించును.
లేదా తన ఎదుటివారికంటే, ఇతర ప్రజలకంటే తానెంత భిన్నంగా ఉన్నాడో చూపించుటకు కోరును. సరిగ్గా అప్పుడే దేవుడు రంగంలోనుండి వెళ్ళిపోవును. ఖచ్చితంగా.
ఇప్పుడు, ఆనాడు ఇశ్రాయేలు ఉన్నరీతిగానే, ఎప్పుడూ అలాగే ఉన్నది. అప్పుడు ఉన్నట్లుగానే ఇప్పుడూ ఉన్నది, మిశ్రమ జనాంగము అచ్చట ఉండెను. గనుక కొంతమంది ఒకటి కావాలని కోరిరి. మరొకరు మరొకటి కావాలని అడిగిరి. ఈ దినమున మనము కూడా దానినే కలిగియున్నాము. వాస్తవముగా ఎవరైతే అవతల ప్రక్కన ఉందురో వారే గెలుపును పొందుకుంటూ ఉందురు.
మన సంఘములను మనమేర్చరచుకొనినప్పుడు నైసియా ఆలోచనా సమితినందు ఆవిధముగానే జరిగినది. ఒకరేమో అది కావాలని, మరొకరు ఇది కావాలని కోరిరి. చిన్న పెంతెకోస్తు గుంపును వారు వెలుపలికి త్రోసివేసిరి. సంఘ సంస్థ అన్నింటిని అది తన వశమున వశపరచుకొనెను.
14నైసియా అలోచనా సమావేశ సమితి జరిగినపిదప నికొలాయితుల యొక్క క్రియలే ఒక సిద్దాంతముగా మారిపోయినవి. తమ స్వంత విశ్వాసమును ఏర్పరచుకొని,
దానిలో తమ స్వంత మనుషులను నియమించి, సంఘముననున్న సమస్త… "నికో," అనగా అర్థమేమిటో నేనొక దినమున చెప్పాను. దాని అర్ధమేమనగా "జయించుట
లేదా సాధించుట". "నికొలాయితులు" అనే మాటకు "సామాన్యుల (సంఘము)ను జయించుట" అని అర్ధము. మరియు ఒక్క మనిషిలో పరిశుద్ధతనంతటిని ఉంచుట. ఆ
ఒక్క మనిషి మీ పాపములను క్షమించుటను, ఆ ఒక్క మనిషి మీ కొరకు ప్రార్ధించుటను, మొదలగువాటిని వారు తీసుకొనివచ్చిరి. గనుక మీ ఇష్టప్రకారము మీరేదైనా చేసుకో
వచ్చును, కాని సంఘమునకు మీ డబ్బులు చెల్లించితే చాలు.
అది దేవుని చిత్తము కాదు. ప్రతీ ఒక్కొక్కరిలోకి మరియు చాలా సామాన్యునిలోకి కూడా దేవుని వాక్యము వచ్చును. మీరు వ్యక్తిగతమైన వారగుదురు. ఒక దేశముగానే దేవుడు ఇశ్రాయేలీయులతో వ్యవహరించును. నీవు, నేను వ్యక్తిగతమైనవారము. మన పాపముల కొరకు మనము ఒక్కొక్కరము దేవునియెదుట జవాబు చెప్పవలసియున్నది.
GEN 25:23,27
15అది మిశ్రమ జనాంగమని మనము చూచాము. సరే… ఇస్సాకు మరియు రిబ్కా యొక్క ఇద్దరు కుమారులు లోకమంతటికీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉజ్జీవమును
పొందుకునే ప్రతీసారి కవలలు జన్మిస్తారు. మనము ఉజ్జీవమును పొందుకునే ప్రతీసారి కవలలు జన్మించెదరు. అలాగే ఏశావు మరియు యాకోబు ఇరువురు కవలలు.
దానిలో ఒకరు లోక సంబంధమైన వ్యక్తి. మరొకరు ఆత్మ సంబంధమైన వాడు.
ఇప్పుడు ఏశావును మీరు చూచిన, యాకోబువలె ఏశావు కూడా మంచి వ్యక్తే, ప్రవక్తయగు వృద్ధుడగు తన తండ్రిని ఏశావు ప్రేమించుచు, శ్రద్దగా చూచుకొనెను. న్యాయముగా ఏశావు ఒక మంచి బాలుడని నేను ఊహించుచున్నాను. సరే మంచిది.
కష్టపడి పనిచేయుచు కుటుంబమునకు సహాయము చేయుచుండెను. బహుశా, యాకోబు తల్లి బిడ్డ, ఎప్పుడూ అమ్మనే పట్టుకొని తిరుగుచుండేవాడు. ఒక పిరికివాడులాంటి
వాడు. కాబట్టి ఏశావు తన తండ్రిని ప్రేమించువాడు, లోక సంబంధమైన వ్యక్తి. జేష్టత్వపు హక్కును గూర్చి అసలు పట్టించెకొనని స్వభావము గలవాడు.
16ఏదైనా ఒక కార్యము సాధించాలంటే దానిని తానెట్లు పొందుకుంటాడనే కార్యమును గురించి యాకోబుకు అనవసరము. ఎలాగైనా ఆ జేష్ట పుత్రత్వపు హక్కును
పొందుకోవాలన్న ఒకే ఒక్క కార్యమందే యాకోబు దృష్టియంతా ఉండెడిది. అందుకొరకు ఎలాగైనా…ఏది అడ్దువచ్చినా లేదా దానిని తాను ఎలా పొందుకోవాలనేదే.
ఆత్మ సంబంధమైన తిరిగి జన్మించిన సంఘములుకూడా అదే విధముగానే తన దృష్టిని ఉంచును. కాతలిక్కు సంఘము ఒక ఉజ్జీవమును పొందుకొనినప్పుడు, లూధర్ ఒక
ఉజ్జీవమును పొందుకొన్నప్పుడు, వెస్లీ ఒక ఉజ్జీవమును పొందుకొన్నప్పుడు, కాక్స్, కాల్విస్ మరియు ఈ కాలములగుండా కలిగిన ఉజ్జీవములన్నింటిలోను అవి కవలలను ఉత్పత్తి చేసినవి. అలాగే పెంతెకోస్తు వారు ఉజ్జీవమును పొందుకొనినప్పుడు అదికూడా కవలలను ఉత్పత్తి చేసెను. మోషే ఐగుప్తులో ఒక ఉజ్జీవమును పొందుకున్నప్పుడు అదికూడా కవలలను ఉత్పత్తి చేసెను. అనగా ఒక మిశ్రమ జనాంగమును ఉత్పత్తి చేసెను.
ఆ కవలలో ఒకరు -ఒకటి లోక సంబంధమైనది, అది ఈ లోకరీతిగా 'ప్రవర్తించుటకు కోరుకొనెను. లోకస్ధులవలె ఉండుటకు వారు ఆశించిరి. ఈ లోకమునకు తగిన రీతిగా ఉండునట్లు వారు తమ వర్తమానమును అమర్చుకొనిరి. కాని ఆత్మసంబంధమైన సంఘము ఈ లోకమేమి చెప్పిన దానిపై దృష్టి పెట్టదు. అది చూచుటకు ఎంతో ప్రామాణికంగా ఉన్నను, లేదా అది చూచుటకు ఎంతో అప్రమాణికంగా ఉన్నా సాధారణంగా వారు ఒక కార్యమును కలిగి ఉందురు. అదేమనగా, వారికిగల జేష్టత్వపు హక్కును గట్టిగా పట్టుకొని ఉందురు. దేవునిని గట్టిగా పట్టుకొని ఉందురు. వారెల్లప్పుడూ అదే రీతిగా ఉండెదరు. స్నేహితుల్లారా, ఇప్పటికీ వారి విధానము అట్లే ఉన్నది. తమయొక్క జేష్టత్వపు హక్కును గట్టిగా పట్టుకొని ఉండెదరు.
యాకోబు, తనను ఆడంగితనము గలవాడని లేదా పిరికివాడని పిలిచినాగాని దానిగూర్చి అతడు పట్టించుకోడు. ఎంతగా… ఏమి… దానిని అతడే విధముగా సాధించాలో, అట్లే యాకోబు దానిని సాధించెను. ఈ దినమునకూడా అది అదే విధముగానే ఉన్నది. ఆత్మ సబంధమైన ప్రజలకు ఏ విషయముకూడా ఎలాంటి బాధ కలిగించదు. అనేకసార్లు సంఘములు రాజీపడెదరు. అలాగే రాజీపడే బోధకునితో ఈ రాజీపడేవారు కరచాలము చేయుచూ పొందుకోవలసిన కార్యములను పొందుకొనెదరు.
17కొంతకాలం క్రితం, "దేవునికి ఏ మనవళ్ళు లేరు" అని డేవిడ్ డూప్లేస్సిన్ చాలా చక్కని మాట చెప్పెను. అది నిజము. మన పెంతెకోస్తు సంఘములు వారి సంఘములోకి యవ్వనస్థులను తీసుకొని వచ్చి, కుర్చీలలో కూర్చొనబెట్టి మరియు వారిని తమ సంఘసభ్యులుగా చేర్చుకొనుచున్నారు. ఆ యవ్వనస్థులు తిరిగి జన్మించకుండా మరియు పరిశుద్ధాత్మతో నింపబడకుండా తమ స్వకీయ మార్గమున వచ్చుచున్నారు.
వారిని కేవలము సంఘమునకు తీసుకొనువచ్చు కార్యమునే మనము చేయుచున్నాము. గనుక ఆ యవ్వనస్థులు దేనిని కలిగియున్నారు. వెనుక, రెండు ప్రక్కల తల వెంట్రుకలను శుభ్రంగా కత్తింరించుకొని మధ్యలో మాత్రం చదునుగా వెంట్రుకలు ఉండేలాగ తల వెంట్రుకలను కత్తిరించుకునే యవ్వనస్థుల గుంపును, వెకిలి చేష్టలను చేసే పోకిరీలను, లోకంలోని లోకస్థులవలె వీధుల వెంబడి తిరుగుచూ వుండే యవ్వనస్థులను, కురచగా చెవులవరకు వెంట్రుకలును కత్తిరించుకునే స్త్రీలు ముఖమునకు రంగులను పూసుకొని అలంకరించుకునే స్త్రీలు, మరియు లోక మర్యాదను అనుసరించువారే గలరు. ఆత్మ సంబంధమైన ధృడమైన స్ధానమున నిలబడుటకు బదులుగా లోకస్తులవలె లోకరీతిగా అనుసరించువారినే మనము కలిగియుండుట ఒక అవమానకరమైన విషయముగా ఉన్నది.
18మన గొప్ప సంఘములలో ఎన్నో గొప్పకదలికలను మనము కలిగియుంటిమి. మరియు ఇతర సంఘముల కంటే తమ సంఘములు పెద్దవిగా చేసుకోవాలని ప్రయత్నించుచు, ఇతర సంఘములను గొడ్డలితో నరికివేసి, అందుకొరకు సంఘశాఖలు మరియు సంఘసంస్థలు తీవ్రంగా పనిచేయుచున్నవి. గనుక మనము దేనిని పొందుకున్నాము? తద్వారా తిరిగి జన్మించిన దేవుని యొక్క కుమారులను ఉత్పత్తి చేయుటకు బదులుగా సంకరజాతి జనుల గుంపును మనము పొదుగుచున్నాము. అదే నిజము.
సంకర జాతి - ఇది ప్రపంచము యొక్క వినాశపు కార్యములలో ఒక కార్యముగా ఉన్నది. సంకర జాతికి చెందిన ఏదైనాగాని అది మరలా తనను తాను ఉత్పత్తి చేసుకొనలేదు. ఒక కంచర గాడిద జన్మించినప్పుడు… కంచర గాడిదగా జన్మించినది
కంచరగాడిదగా తప్ప మరేమి కాదు. అదొక కంచర గాడిదగానే జన్మించినది. అది సగము సంకర జాతికి చెందినదై యున్నది. అదొక గుఱ్ఱము మరియు కంచర గాడిద
ద్వారా జన్మించినదై యున్నది. దానియొక్క తండ్రి ఎవరో దానికి తెలియదు మరియు దాని తల్లి ఎవరో దానికి తెలియదు. అదెచ్చట నుండి వచ్చినదో లేదా ఎచ్చటకు
వెళ్ళుచున్నదో దానికి తెలియదు. అది ఏమీ తెలియని ఎంత అజ్ఞానిగా ఉండాలో అంత అజ్ఞానిగా ఉండును. ఉండవలసిన మర్యాద దానిలో ఉండదు. దానిలో మర్యాద లేనందువలన మీరేమైన దానితో చెప్పిన తన పెద్ద చెవులను నిటారుగా నిక్కుపొడుచుకొని ఉండునట్లు పెట్టి, "హవ్, హవ్" అని అరుస్తూ ఉండును.
కొన్నిసార్లు అలాంటి అనేక కంచర గాడిదల మధ్య నేను ప్రసంగించవలసి వచ్చును. దేవుని గురించి ఎరుగుట కంటే హాటన్‌టాట్‌కు ఐగుప్తు గుఱ్ఱము గురించి తెలిసిన దానికన్నా వీరు కూడా అలాంటి కట్టుకథల గురించే ఎక్కువగా ఎరుగుదురు. గనుక దేవుని గురించి ఏమైన చెబితే తమ చెవులను నిటారుగా పెట్టుకొని "అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి. అసలు అలాంటి కార్యములు ఏమి లేవు" అని వారు చెప్పెదరు. అదొక సంకర జాతికి చెందినది. అది బహుశా, పెంతెకోస్తు సంఘసంస్థకు చెందినదై ఉండవచ్చు… వేరేదైనా సంఘసంస్థకు చెందినదై ఉండవచ్చునుగాని, ఆ పురుషులు మరియు స్త్రీలు తిరిగి జన్మించినవారు కాదు….
19ఏదేమైనాగాని ఈ సంకర జాతి గుఱ్ఱమును, సంకరజాతి గుఱ్ఱమును కాదు. ఒక నిజమైన వంశావళి నుండి వచ్చిన గుఱ్ఱమునే నేను ప్రేమించెదను. అలాగే ఒక పురాతన కాలమున ఉండిన అదే అసలైన పెంతెకోస్తు అనుభవమునే నేను ఇష్టపడెదను. తామెచ్చట నుండి వచ్చారో ఎరిగినవారిని, వారు దేనిని పట్టుకొనియున్నారో
ఎరిగినవారిని, తామెచ్చటకు వెళ్ళుచున్నారో ఎరిగిన వారిని, మృధువైన, మధురమైన ఆత్మను గలవారిని, పరిశుద్ధాత్మతో నింపబడినవారిని, సహనమును మరియు మంచి
సహవాసమును గలవారిని, ఆటంకముల సరిహద్దును దాటుకొని ఏ సహోదరితోనైనను కరచాలము చేయువారిని, అతడు తన సహోదరుడని, తాము వెళ్ళే అదే రాజ్యానికి
చెందిన సహోదరుడనే భావము గలవారిని నేను ఇష్టపడెదను.
అతడు ఎలాంటి బాప్తిస్మములను తీసుకొన్నను, చిలకరింపబడిన బాప్తిస్మమైనను లేదా నీళ్ళను క్రుమ్మరించినదైనను లేదా ఏ విధమైన బాప్తిస్మమును తీసుకున్నను లేదా అతడేమి చేసినను లేదా తన తలను గిరాగిరా ఊపినను లేద పైకి మరియు క్రింతకు దూకినను లేదా అతడేమి చేసినను, ఏమైనాగాని అతడొక సహోదరుడు. అతడు పరిశుద్ధాత్మను పొందుకొనియున్నంతవరకు అతడు నీకొక సహోదరుడైయున్నాడు. ఒక నిజమైన ఆత్మ సంబంధమైన వంశావళి నుండి వచ్చినా, తిరిగి జన్మించి పెంతెకోస్తు అనుభవమును కలిగిన పురుషుడైనను మరియు స్త్రీయైనను దానిని మీరు మీ హృదయమంతటితో నమ్మండి. అది…?.. నిశ్చయముగా…?..
20ఉజ్జీవము నుండి ఉద్భవించిన ఈ కవలలు వారిలో ఒకరు వేదాంత పాఠశాల నుండి శిక్షణను పొందుకోవాలని, భౌతిక సంబంధమైన జ్ఞానమును పొందుకోవాలని కోరుకొనును. తిరిగి జన్మించాలనే కార్యమునుండి తప్పించుకొని వెళ్ళుటకు వారు
ప్రయత్నించుచున్నారు. సంఘముకూడా తిరిగి జన్మించాలనే కార్యమునుండి తప్పించుకొని వెళ్ళుటకు ప్రయత్నించుచున్నది. ఈ దినమున మనము జనులను నీటి బాప్తిస్మముద్వారా తీసుకొని వచ్చుచున్నాము. నీటి బాప్తిస్మముద్వారా వారిని సంఘములో పెట్టుచున్నాము. నీటి బాప్తిస్మముద్వారా మీరు వారిని క్రీస్తులోకి తీసుకొని రాలేరు. వారు ఆత్మద్వారా తిరిగి జన్మించవలసియున్నది. అదే నిజము.
నేను అప్పుడప్పుడు చెప్పురీతిగా, మరలా నేను చెప్పుచున్నాను. అదే విధమైన జన్మయైనా దాన్ని నేను పట్టించుకోను. ఏ జన్మయైనా అదొక అస్తవ్యస్తంగా ఉండును.
పందుల దొడ్డియైనా లేదా అదొక మొక్కజొన్నపొత్తు గుట్టయైనా లేదా గులాబీ రంగుతో అలంకరించబడిన వైద్యశాల గదియైనా, ఏదైనా అదొక అస్తవ్యస్తంగానే ఉండును. కాబట్టి నూతన జన్మ అనేది ఒక అస్తవ్యస్తమైన కార్యము. మీరు ఎన్నడూ చెయ్యాలని తలంచని కార్యములను చేయునట్లుగా చేయును. మీరు ఏడ్చునట్లుగా అది చేయును. అరచి కేకలు వేయునట్లుగా, కన్నీరు కార్చునట్లుగా నీ రెండు చేతులను
పైకి ఎత్తునట్లుగాను చేసి, నీలోనున్న అన్ని రకముల తళుకు బెళుకులన్నింటిని మసకగా మారిపోవునట్లు చేయును. మరియు అనేక రకముల కార్యములను నీవు చేయునట్లు
అది చేయును. బిర్రబిగుసుపోయినట్లుండు వారి ఎదుట, స్వీయశైలిని గలవారి ఎదుట సిగ్గు కలిగించు విధముగా వింతగా మీరు ప్రవర్తించెదరు. అయినా మీరు నూతన
జన్మ అనుభవమును కలిగియున్నంత వరకు వాటన్నింటిని నీవు పట్టించుకోవు.
21దేవుని రాజ్యమును చూచుటకు మీరు తిరిగి జన్మించవలసియున్నది. అది తిరిగి జన్మించవలసి యున్నది, నూతన జన్మవద్దకు రావలసియున్నది. కాని వారు, "మా సంఘ సంస్థలు మిగిలిన వాటికంటే ఉన్నత స్థితికి ఎదుగుచున్నవి" అని చెప్పుచు, ఇతర సహచరులను కొట్టుటకు ప్రయత్నించుచు, తమ సంస్థలో సభ్యులను చేర్చుటకొరకు తిరిగి జన్మించుటనే కార్యమును తప్పించుకొనుటకు దిగజారిపోయే స్థానమునకు వారు వచ్చిరి. అందువలన వారికి ఏ ప్రయోజనము లేదు. అసలు ఏ ప్రయోజనము లేదు!
దేవుని రాజ్యములో చేరుటనేది ప్రాముఖ్యమైన కార్యముగా ఉన్నది. ఆ ఒక్క స్థలము కొరకే మనమందరము పనిచేయుచున్నాము. నేను బాప్తిస్టు సంఘమునకు
చెందినవాడిని. అసంబ్లీస్ సంఘమునకు లేదా ఏకత్వమునకు లేదా త్రిత్వమునకు లేదా పంచత్వమునకు చెందినవారు, అదేమైనాగాని, మనమందరము ఒక్క నియమము కొరకు పనిచేయాలని కోరుచున్నాము. అది మనపరలోకపు తండ్రి కొరకు, తిరిగి నూతనముగా జన్మించిన పిల్లలమై ఆ రాజ్యములోకి చేరాలని కోరుచూ పనిచేయుటకు
ప్రయత్నించుచున్నాము. రెండు రెండ్లను గుణించిన నాలుగు అనేది ఎంత ఖచ్చితమో, అలాగే అవి పతనమైపోవుటనేది నిశ్చయము. ఎందుకనగా, అవి మానవుడు నిర్మించినవి. అవి పతనమై తీరవలెను. దేవుని యొక్క కార్యమే స్థిరముగా నిలుచును.
వారిపట్ల ఏ విరోధమైన భావము నాలో లేదు. వారు చక్కని మరియు మంచివారు. కాని మీరు అడ్డంకులను మనమధ్య ఉంచినప్పుడు మనము మన సహచరులతో సహవాసము చేయలేము. అలాంటి అడ్డు గోడలను మనమధ్య నిర్మించుకొనినప్పుడు అది చెడుకే దారితీయును. నాకు సంఘసంస్థలంటే ఇష్టముండదని వారు నాగురించి
బహిరంగంగా చెప్పుచున్నారు. సంఘసంస్థలలోనున్న ప్రజలంటే నేను ఇష్టపడెదను. కాని… "మేము దీనినే నమ్ముచున్నాము. ఇతరులగు మీరు, దానినుండి దూరంగా
ఉండండి. క్రైస్తవ వ్యాపారస్తుల గుంపుతోను, లేదా ఇతర సంస్థలగువారు ఆవిధముగా చేయుటకు ఇష్టపడేంతవరకు మేము వారితో సహకరించమని…" చెప్పకుండా, అలాంటి
అడ్డంకులను పెట్టనంతవరకు సంఘసంస్థలగు మీరు చాలా చక్కని వారగుదురు.
22వారు తమను ఒక సంఘసంస్థగా ఏర్పరచుకునేటప్పుడు, నేను వారినుండి దూరంగా తొలగిపోయెదను. ఖచ్చితముగా అదే నిజము. అలాంటి వాటియందు నాకు నమ్మకము లేదు. మనము సహోదరులుగా సహవాసమును కలిగియుండుట యందు, ఆత్మయొక్క నడిపింపునందు మాత్రమే నాకు నమ్మకము గలదు. ఖచ్చితముగా వాటియందే నేను ఇష్టపడెదను.
అదొక మిశ్రమజనాంగము. వారికొక ధర్మశాస్త్రముగలదు. వారు సీనాయి పర్వతము యొద్దకు వెళ్ళి అచ్చట ధర్మశాస్త్రమును పొందుకొనిరి. కాబట్టి వారు Ph.D, LL.D, Q.S.D లు మరియు అన్నిరకముల D'లను గల డాక్టర్ల పట్టములను వారందరికీ గలవు. కాబట్టి మొదటగా మీరు తెలుసుకోవలసిన విషయమేమనగా ఆ డాక్టర్ల పట్టములే వారికి సమస్యలను తీసుకొని వచ్చి పెట్టినవి.
DEUT 1:38•
ACTS 13:2
23ఇప్పుడు, ధర్మశాస్త్రము చేయవలసిన దాని ఉద్దేశ్యమును అది నెరవేర్చినది. ఆ దినమునకు అది బాగుగానే ఉండెను. ధర్మశాస్త్రము చేయవలసిన దానిని బాగుగానే చేసినది. దానియొక్క దినమున దాని ఉద్దేశ్యమును అది నెరవేర్చినది. ఆ విధముగానే సంఘశాఖలు కూడా చేయవలసిన కార్యమును బాగుగానే చేసెను. దాని ఉద్దేశ్యమును నెరవేర్చుటలో అది బాగుగానే చేసినది. ధర్మశాస్త్రము వారిని వాగ్ధాన దేశమునకు తీసుకొని వెళ్ళలేదు, యెహోషువా వారిని అచ్చటకు నడిపించెను. కృప; ధర్మశాస్త్రము కాదు.
అలాగే సంఘశాఖ, ఏ సంఘశాఖ కూడా దేవునియొక్క సంఘమును ఎప్పటికీ తీసుకొని వెళ్ళలేదు. దేవునియొక్క సంపూర్ణమైన దీవెనలోకి, వాగ్ధానము చేయబడిన దేశములోకి మనలను తీసుకొని వెళ్ళునది ఏదనగా, పరిశుద్ధాత్మయొక్క బాప్తిస్మము ద్వారా మన హృదయములలో చిందింపబడిన దేవుని యొక్క కృపయే అగును. నిశ్చయముగా, అదే మనలను తీసుకొని వెళ్ళును. కాని వారు ఆ కార్యములను చేసినప్పుడు వారు ఘోరమైన తప్పిదమును చేసినవారైరి.
అది చాలా చక్కగా దానియొక్క ఉద్దేశ్యము నెరవేర్చినది. కాని ఇక దానివలన ఏ ప్రయోజనము లేదనే సమయమునకు అది వచ్చెను. దేవుడు దానిని మృతిచెందునట్లు చేయుటవలన కృపద్వారా ఆయన వారిని అచ్చటకు తీసుకొని వెళ్ళెను. ఆ వాగ్ధానపు దేశమున వారి, వారి స్థానములనుబట్టి ఆయన వారిని వారి స్థానములలో అమర్చెను. కాబట్టి దేవనియొక్క కృప ప్రతీ ఒక్కొక్క సభ్యుడను, ప్రవక్తలను, బోధకులను, మరియు మొదలగువారిని వారి, వారి స్థానములలో పెట్టును.
ఒక సంఘశాఖ దానిని చేయలేదు. మీ మీద చేతులను పెట్టుటకు ప్రెస్పిటేరియన్లు గుంపు మీకు గలరు. దానిపై నీరును క్రుమ్మరించుట వలన ఏ ప్రయోజనము లేదు. "నన్ను, పౌలును మరియు బర్నబాను పిలిచిన పనికొరకు ప్రత్యేకపరచుటకు" పరిశుద్ధాత్మయే దానిని చేసెను. ఒక పురుషుడు మరియు స్త్రీ వారే స్థానమున ఉండవలెనో ఆ స్థానమున వారిని అమర్చుటకు పరిశుద్ధాత్మయే వారిని తీసుకొని ప్రత్యేకపరచి, వారిని క్రీస్తులో అమర్చవలసిన స్థానమున అమర్చును. అది నిజము.
NUM 13:17,26,33
24ఇప్పుడు, వారు అచ్చటనుండి కాదేషు బర్నేయ నుండి ప్రయాణమై వెళ్ళిరని మనము కనుగొంటిమి. కాదేషు బర్నెయ, అచ్చటే వారెన్నడూ చేయకూడని చాలా ఘోరమైన తప్పిదమును వారు చేసిరి. కాదేషు బర్నెయ యొద్దకు ఇశ్రాయేలీయులు వచ్చినప్పుడు నిజంగానే ఒక తప్పిదమును చేసిరి. సరే, వారు పన్నెండు మంది వేర్వేరు నాయకులను గలవారై, పండ్రెండు వేర్వేరు గుంపులను కలిగియుండిరి. ఆ వాగ్ధానదేశమును వేగుచూచి వచ్చుటకై వారు అచ్చటకు పంపబడిరి. అచ్చట వారికి ఏమి లభించునో దానిని చూచుటకై…ఆ దేశము యొక్క సమాచారమును ఏదైనా తెలుసుకోవాలని…వారు అచ్చటనుండి తిరిగి ఆ గుంపులోని పదిమంది, "దానిని స్వాధీనపరచుకొనుట మనకు అసాధ్యము. దానిని మనము సాధించలేము. అది మనకు మించిన కార్యము. వారి ప్రక్కన మేము చాలా చిన్నవారముగా ఉంటిమి. చూచుటకు మేము మిడతలవలె ఉంటిమి" అని చెప్పిరి.
కాని వారిలో ఇద్దరు ఆ దేశముయొక్క ఋజువును గలవారై అచ్చటెచ్చటో వారు ఉండిరి. వారు తిరిగి వచ్చినప్పుడు, ఆ దేశముయొక్క ఫలములను తీసుకొని వచ్చిరి. ఆ దేశమున ఏమున్నదో తెలుసుకొనుటకై అచ్చటనుండి వారు తిరిగి వచ్చిరి. అదొక మంచి దేశమని తెలుపుటకై అచ్చటనుండి ఋజువును వారు తీసుకొని వచ్చిరి. సరే, ఒక ఉజ్జీవమునుండి మనము పొందుకోగలిగే కార్యము అదే విధముగానే ఉండును.
అనగా రెండు భిన్నమైన దృష్టిని కలిగివుందుము. అదెట్లున్నదనగా ఒక కోడి గుడ్లను పొదుగుచున్నట్లుగా, ఆ పొదుగుచున్న దానినుండి రెండు కార్యములు ఉద్భవించును.
NUM 13:26•
1COR 14:23,25
25మొదట మీరు తెలుసుకోవలసిన విషయమేమనగా, అదొక మంచి దేశమనే ఋజువుతో యెహోషువా మరియు కాలేబు అచ్చటనుండి తిరిగి వచ్చిరి. వారు ఒక ఋజువును కలిగియుండిరి. ఒక ఋజువు. కాని అదంతా ఒక ఋజువు కాజాలదు. కేవలం ఒక్క ఋజువునే కలిగియుండెను. ఎర్ర సముద్రమును దాటుచుండగా తమ శత్రువులు ఆ సముద్రములో మునిగి చనిపోవుటను వారు కనుగొనిరి. పిదప అరణ్యముగుండా ఆ దేశమును వారు దాటుకొనివెళ్ళిరి, ఆ ఋజువునే పెంతెకోస్తువారు కూడా కలిగి ఉండిరి. అనగా తాము ఉన్నామనే ఋజువుగా పెంతెకోస్తు వారు అన్యభాషలలో మాట్లాడుటకు ప్రారంభించిరి. అచ్చట ఏదోక మంచి కార్యము గలదనే విషయమును వారెరిగియున్నారు. మనమింకనూ చేరుకొనని అన్నింటికంటే మిన్నమైన దేశము అచ్చటెచ్చటో గలదని వారికి తెలుసు. అది నిజము.
కాని అవన్నీ విషయములు కానేకాదు. మనము ఆ విషయముల పైనే స్థిరపడిపోయాము. ఆ విషయములతోనే మనము విత్తుటకు ప్రారంభించాము. నిజము. దేవుడు చెప్పెను… "మా మధ్యలోకి ఒకరు వచ్చి అన్యభాషలో మాట్లాడుచుండగా, అదే సమయమున దానినిగూర్చి ఎరుగని మరొకరు లోపలికి ప్రవేశించి, "మంచిదే, వారందరూ పిచ్చివారు" అని చెప్పును. కాని ఒకరు ప్రవచించి మరియు హృదయ రహస్యములను బయలుపరచి చెప్పినయెడల, అప్పుడు వారు సాష్టాంగముగా పడి "నిశ్చయముగా దేవుడు మీతో ఉన్నాడని చెప్పెదరని" పౌలు దానినిగూర్చి చెప్పెను.
26భాషలలో మాట్లాడుట పరిశుద్ధాత్మ యొక్క ఋజువైయున్నదంటూ దానితోనే నిలబడినప్పుడు, అవన్నీ మంచిదే. అది నిజమే. అది పరిశుద్ధాత్మ యొక్క ఋజువగును. అయినా పిదప దానిని వెంబడించుచు వచ్చే ఇతర కార్యములను గమనించి చూడండి.
కాని మనము దీనిని చేసిన వెంటనే, ఒక కొబ్బరిచెట్టు యొక్క కాయలను ఎవరూ కోసుకోనివ్వకుండా దానిచుట్టూ కంచె వేసి ఉంచినట్లుగా మనలను మనము ఒక సంఘశాఖగా చేసుకొని ఇతరులను వెలుపలనే పెట్టుచున్నాము. ఆ కారణము చేతనే ఇతరులు ఎక్కడికి వెళ్ళలేకపోవుచున్నారు. పరిశుద్ధాత్మ మనలందరినీ నడిపించుటకు అనుమతించుటకు బదులుగా మన స్వకీయ స్వార్ధపూరితమైన ఆలోచనలకే ప్రాధాన్యతను ఇచ్చుచున్నాము. మనము నలుబది సంవత్సరములుగా ఎదురుచూస్తూ ఉండినను ఏదీకూడా జరుగుట లేదు. మీరింకా అదే స్థలమునందే ఉంటూ మరియు ఇంకా అదే పాతకార్యములను చేయుచూ ఉన్నాము. ఓ, దేవా.
27ఒక ఘోరమైన తప్పిదమును వారు చేసితిరని మనము కనుగొన్నాము. ఒక గొప్ప వివాదాల గుంపును వారి మధ్యనుండి లేపిరి. పెద్ద వివాదాల గుంపునే మనము
కలిగివున్నాము. "దేవునికి స్తోత్రము, నేను అసంబ్లీస్ సంఘమునకు చెందినవాడిని. మీరు ఏకత్వమునకు చెందినవారు. మాతో కలిసి చేయుటకు మీకు ఏ సంబంధములేదు. మీరు పురాతన చర్చ్ ఆఫ్ గాడ్‌కి చెందినవారు. మేము దీనిని పొందుకొనియున్నామని"
ఒకరు చెప్పెదరు.
చర్చ్ ఆఫ్ గాడ్: "దేవునికి స్తోత్రము, ఒకప్పుడు దానిని మేము పొందుకొన్నాము. ప్రవచింపబడిన నామమును మేము కలిగి ఉన్నామని" చెప్పెదరు.
"మేము బాప్తిస్మమును పొందుకొనుట వలన దానిని మేము పొందుకున్నాము. హల్లెలూయా!"అని ఏకత్వపువారు చెప్పెదరు.
మీరు గొడవలను సృష్టించే గుంపుగాయున్నారు! "మీరు చచ్చేంతవరకు ఇంకా అచ్చటనే ఉండునట్లుగా దేవుడు మిమ్మల్ని వదిలివేయునుగాక."
ఖచ్చితముగా అది నిజము. ఆ వివాదాల గుంపు వారందరూ చనిపోయేంత వరకు వారచ్చటనే నిలిచి ఉండెదరని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. అదే ఖచ్చితముగా నిజము. వివాదాల గుంపు వారందరూ అచ్చట చనిపోయేంతవరకు వారిని దేవుడు అచ్చటనే విడిచి పెట్టెను. పరిశుద్ధ గ్రంథము అట్లే చెప్పుచున్నది. ఆ గొడవలను పెట్టేవారు, వారి సంఘ సంస్థల
యొక్క సరిహద్దులపై పోరాడుచూ,"ఆ గుంపుతో మీరెలాంటి సహవాసమును చేయవద్దు, అది రాబందుల గుంపు, అది ఫలాని, ఫలానిలాంటిది". మీ తలంపులలో అది
ఉన్నంతవరకు, ఆకలితో అలమటిస్తూ ఆ కొండమీదనే, మీరచ్చటనే చనిపోయెదరు.
MATT 24:37•
LUKE 17:26•
1PET 3:20
28నలుబది సంవత్సరములుగా వారేమి చేసిరని మీరెన్నడైనా ఆలోచించితిరా? ఆ వాగ్ధాన దేశమునకు వెళ్ళి చేరుటకు నలుబది దినములు కూడా పట్టవు. కాని
నలుబది సంవత్సరములు దేవుడు వారిని అచ్చటే ఉంచెను. చాలా కాలం క్రితంనుండి అది అట్లే ఉన్నది.
"సరే. నేను దానిని నమ్ముచున్నాను…" ప్రభువు యేసు రాకడనుగూర్చి ఎవరోకరు మాట్లాడుచుండిరి. అదింకా జరుగకుండావున్న బహు కాలపు గడువైయున్నదని నేను నమ్ముచున్నాను. అందుకు కారణము సంఘమేనని నేను నమ్ముచున్నాను. ఆ కారణము చేతనే అది బహు కాలపు గడువుగా ఉన్నది."నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని యొక్క రాకడ దినములలో జరుగునని" అలాగే యేసు చెప్పెను. నోవాహు దినములలో, ఏ ఒక్కరు నశించిపోకూడదనే ఉద్దేశ్యముతో దేవుడు దీర్ఘశాంతముతో వేచివుండెను. ఆ ఓడలోనికి ప్రజలు ప్రవేశించవలెనని ఆయన అప్పుడు వేచిఉన్నట్లుగానే నేడుకూడా సంఘము సమకూడిరావలెనని ఆయన ఎదురుచూస్తున్నాడు.
ఈ వర్తమానము అంతగా ప్రాచుర్యం చెందినదిగా ఉండదని నాకు తెలుసు. ఈ వర్తమానము ప్రజల మధ్య ప్రాచుర్యంచెందదు. కాని సహోదరుడా, "ఇది అందరూ
సమకూడి రావలసిన ఘడియయొక్క వర్తమానమగును". ఆత్మలు సమకూడి కదిలి రావలసివున్నది. మనము ఒక్కటై, దేవుని సజీవసంఘముగా ఉండవలెను. మెథడిస్టులు,
బాప్తిస్టులు, ప్రెస్టిటేరియన్లు, లూథరన్లు, ఏకత్వము, త్రిత్వము, పంచత్వమువారు, అందరూ సమకూడి ఏకమవ్వాలి. మనమందరము ఒక్క గుంపుగా ఉండాలి. తిరిగి
జన్మించుటద్వారా మనము దేవునియొక్క పిల్లలమైవున్నాము. అదే ఖచ్చితముగా నిజము.
JOHN 6:37•
ACTS 16:30,31
29"తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నాయొద్దకు వత్తురు". మరియు కొబ్బరిచెట్టు చుట్టూ చాలా ఎత్తుగా కంచెను కట్టి ఉంచినప్పుడు దాని కాయలను మీరెట్లు తాకగలరు? అట్లే మీరేవిధముగా ఆయన వద్దకు వచ్చెదరు. అర్ధమైనదా?
"మీరు దీనిని చేయవలెను, దానిని చేయవలెను". ఓహ్, చాలా మంది ప్రజలు…..
ఆ రాత్రి ఫిలిప్పీయుల పట్టణముయొక్క చెరసాల నాయకుడు, "అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను" అని అడిగినప్పుడు, మేమేమి చేయవలెను? అతడేమి చేయవలెనని మేము చెప్పెదము. "నీవు దీనిని చేయుటకు నీవు వదిలివేయవలెను". కాని దేనిని చేయుటకు తాను వదిలివేయవలెనో అతడు వారివద్ద అసలు
అడుగనే లేదు. రక్షణ పొందుటకు తానేమిచేయవలెనని అతడు అడిగెను? నిజము.
అర్ధం చేసుకోలేని మాటలను పౌలు అతనికి చెప్పలేదు గాని, "ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును, నీ యింటివారును రక్షణ పొందుదురని" పౌలు చెప్పెను. అంతవరకే చెప్పెను. దేవునియొక్క విశ్వాసమును ప్రజలలోకి తీసుకొని రండి. అప్పుడు వారేమి చేయవలెనో మరియు ఏవిధముగా ప్రవర్తించవలెనో వారెరుగుదురు. "మా వద్దకు రండి, మా సమూహములోకి వచ్చి చేరండి. వచ్చి, ఆ సమూహములోకి వెళ్ళి చేరండి అని పౌలు చెప్పలేదు. వారిని దేవునియొద్దకు మాత్రమే నడిపించవలెను. మిగిలిన విషయములన్నింటిగూర్చి దేవుడుశ్రద్ద వహించును. వారిని దేవుని రాజ్యములోకి తీసుకొని రండి.
పాత యోధులు.
30పరిశుద్ధ గ్రంథము ఏమి చెప్పెననగా, ఆ ఇద్దరు మనుష్యుల మాటలను వారు అవిశ్వాసించుట వలన… కాలేబు మరియు యెహోషువా ఆ గుంపును నిమ్మళపరచిరి.
ఇప్పుడు, పది సంవత్సరముల క్రితం వారు దానిగూర్చి తెలుసుకోవాలని కోరుచూ…పెంతెకోస్తు వారిని, పలు రకములవారిని మరియు మొదలగువారిని పరిచయము చేయుటకు కోరినప్పుడు…వారిలో ఒకరు, "సరే, మేముప్పుడు ఈపెద్ద సమూహములవద్దకు వెళ్ళెదము మరియు కార్యములు ఆవిధముగా ఉన్నవి. మరియు పరిశుద్ధాత్మ ద్వారా మేము నడిపింపబోవు చున్నాము" అని చెప్పెను. వారిలో కొంతమంది "పరిశుద్ధాత్మ మనలను నడిపించునుగాక!" అని చెప్పిరి.
సరే, కొన్ని క్రొత్త సమస్యలు మరియు అనేకవిధమైన కార్యములు లోపలికి వచ్చుచున్నవి. అవి దేవునికి చెందని విషయములైతే ఎట్లయినా అవి పతనమైపోవును. కాబట్టి ఎందుకని… వారిని ముందుకు సాగిపోవుటకు అనుమతిస్తూ, ఒకరినొకరు ప్రేమించునట్లు చేయనివ్వండి. ఒకరితో ఒకరు పోట్లాడవద్దు. మీరు ఒకరితో ఒకరు పోట్లాడుకునేంత వరకు, మీతో దెయ్యమునకు అసలు ఏ గొడవ ఉండదు. మీరు ఒకరితో ఒకరు పోట్లాడుకొనుటను దెయ్యము వెనుక కూర్చొని వేడుకగా చూస్తూ, వీరికి పరిశుద్ధాత్మగలదని చెప్పుకుంటూ ఒకరితో ఒకరకు పోట్లాడుకొనుచున్నారని పడిపడి దెయ్యము నవ్వు చుండును.
JOHN 13:35•
1COR 13:1,3
31"ఒకరినొకరు ప్రేమించుడి" అని యేసు చెప్పెను…" మీరు ఒకనియెడల ఒకరు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందరనెను". ఇందు నిమిత్తము మీరు నా శిష్యులని మనుష్యులందరును తెలిసికొందురు; అందుకొరకు మీరు ఒకరిపట్ల ఒకరు ప్రేమను కలిగి ఉండవలెను. మీరు ఒకరినొకరిని ప్రేమించునప్పుడే మీరు పరిశుద్ధాత్మను కలిగియున్నారనే దానికి ఒక గొప్ప ఋజువైయున్నదని నా మట్టుకు నేనెరుగుదును. అవునండీ. అదేగొప్ప ఆజ్ఞయైయున్నది. అదొక గొప్పసంగతి. నీవు మనుష్యుల భాషలలోను మరియు దేవదూతల భాషలలోను
మాట్లాడినను ప్రేమలేని వాడవైతే, అందువలన నీకు ఏ ప్రయోజనము లేదు.
మీరు పొందుకొనియున్న పరిశుద్ధాత్మ యొక్క ఋజువుపై దేనిని సంస్ధగా స్థాపించుకోవద్దు. సరే, ఆ ఋజువు మంచిదే, దానిని నేను కూడా నమ్మెదను. కాని ఆగండి. దానికంటే మిన్నయైనది అచ్చట గలదు (నా నల్లజాతి 'స్నేహితుల్లారా, నన్ను క్షమించండి). దక్షిణ ప్రాంతంలో నివసించుచున్న ఒక నల్లజాతి వ్యక్తి పుచ్చ కాయను తినుచున్నట్లుగా ఇది ఉన్నది. (అనగా పరిశుద్ధాత్మ యొక్క అనుభవము -తె.త.. ) ఆ పుచ్చకాయను ముక్కలు, ముక్కలుగా కోసి అతనికి యిచ్చిరి. ఇచ్చిన వాటికంటే అతడింకా ఎక్కువ పుచ్చకాయలను తినెను.
"సాంబో, ఏ విధముగా ఇది నీకు నచ్చినది?"అని అడిగిరి.
"ఇది చాలా బాగుంది, కాని అచ్చటింకా అధికముగా గలదు" అని అతడు చెప్పెను.
NUM 32:13
32ఆరాధనలో పరిశుద్ధాత్మ దిగివచ్చినప్పుడు, అదే విధముగానే నేను కూడా దేవుని యొక్క రుచిని పొందుకున్నాను. అదిబాగుండును. కాని అదింకా అధికముగా కావలెనని నేను కోరుచున్నాను. అచ్చటింకా అధికముగా గలదు. ఎందుకనగా, విమోచింపబడిన ప్రతీ ఆశీర్వాదమును ఆయన మనకొరకు వాగ్ధానము చేసెను. అవునండీ.
వారు నలుబది సంవత్సరముల పర్వతము మీదనే ఉండిరి. అలాగే మనము కూడా ఈవిధముగా, ఆవిధముగా ఒకరితో ఒకరు విభేదించుకుంటూ మన సంఘశాఖలలో నలుబది సంవత్సరములు గడిపితిమి. నలుబది సంవత్సరములు అచ్చటవారేమి చేసిరని మీరెన్నడైనా తలంచి చూచితిరా? సరే, దేవుడు నిశ్చయముగా వారితో ఉండెను. ఆయన మనతో కూడా ఉన్నాడు. వారు అచ్చట నలుబది సంవత్సరములు ఉంటూ, తమ పిల్లలను పెంచిరి. వారు మంచి పంటలను కలిగియుండిరి. దేవుడు వారిని వర్ధిల్లింపజేసెను. వారచ్చట అనేక మంచి కార్యములను చేసిరి. దేవుడు వారి రోగములను స్వస్థపరచెను మరియు వారిని దీవించెను. ఆ అరణ్య ప్రయాణమునుండి వారు వెలుపలికి వచ్చినప్పుడు వారిమధ్య ఏ ఒక్కరు కూడా బలహీనులు లేరు. కాని వివాదించుచు విభేదించి పాత గుంపులోనున్న వారందరూ అచ్చటే మరణించునంతవరకు వారు అచ్చటే ఉండునట్లుగా దేవుడు వారిని సరిగ్గా అచ్చటే విడిచిపెట్టెను.
33ఈ దినమునకూడా దేవుడు ఖచ్చితముగా దానినే చేసెను. మనముకూడా అసెంబ్లీస్ సంఘమున చేరితిమి, చర్చ్ ఆఫ్‌గాడ్ సంఘమున చేరితిమి, దీనిలో చేరితిమి
మరియు దానిలో చేరితిమి. దీనిలో, దానిలో చేరుచూ, చేరుచూ, చేరుచూ వాటిల్లోనే సరిగ్గా స్థిరపడిపోతిమి. ఓహ్, ఇచ్చటే మనము స్థిరపడిపోయేంతగా వాటిల్లోనే
ఉండి, దానిలోనే మన పిల్లలను పెంచితిమి. మరియు కాడిల్లా కార్లను కొన్నాము. వ్యాపారంలోను, సమస్త కార్యములలోను మనము వర్ధిల్లితిమి.
కాని సహోదరుడా, ఆ విధముగా నలుబది సంవత్సరములు గడిచిపోయినవి. అచ్చట కొత్త తరమువారు లేచిరి. అది నిజము. ఒక దినమున అచ్చటకూడా ఒక యెహోషువా ఉద్బవించెను. దేవునియొక్క వాక్యమును అతడు సంపూర్ణముగా విశ్వాసించెను. వాగ్ధానము యొక్క ప్రతీ చిన్న కార్యము- నిన్నుగూర్చిశ్రద్ద వహించుట మాత్రమేకాదుగాని, మీ వ్యాపారమును మరియు మెదలగు వాటన్నింటిని ఆయన మీకు ఆశీర్వదించెను. కాని వాటికంటే ప్రాముఖ్యమైన కార్యము గలదు. ఈ దినమున కూడా దేవుడు అదే కార్యమును చేసెను.
దేవుని యొక్క ప్రణాళికలో సంపూర్ణ సువార్త వ్యాపారస్దుల యొక్క సంఘము ఒక భాగముగా ఉన్నదని నేను నమ్ముచున్నాను. ఇచ్చట వారి ఎదుట నిలబడియున్నానే కారణముతో దీనిని నేను చెప్పుటలేదు. అట్లు నేను చేసినట్లైతే, నేనొక వేషదారినగుదును.
34దీనిని నేను చెప్పుచున్నందుకు ఒక కారణము గలదు. ఎందుకనగా, వారిని నడిపించుటకు వారు ఏ షరతులను పెట్టలేదు మరియు "ఈ సంఘసంస్థ" లేదా
"ఆ సంఘసంస్థ" అని చెప్పెదరు. అందరూ లోపలికి ప్రవేశించునట్లుగా తమ సరిహద్దులను ఎంత విశాలముగా చేయవలెనో అంతగా వాటిని వారు విశాలము చేసిరి. ఆ
కారణముచేతనే ఈ దినమున వారిలో నేనొక భాగముగా ఉన్నాను; ఎందుకనగా, వారు సరిగ్గా ఆ ప్రణాళికలో ఉన్నారని, అది నిజమని నేను నమ్ముచున్నాను. అసంబ్లీస్
ఆఫ్ గాడ్ కొరకు, చర్చ్ ఆఫ్ గాడ్ కొరకు, ఫోర్ స్క్వేర్ కొరకు, (PAJC) పి.ఎ.జె.సి, ( PA of W) పి.ఎ ఆఫ్ డబ్యూ, యునైటెడ్, వారెవరైనా గాని, ప్రతీ ఒక్కరు దీనిలో ప్రవేశించి, ఉచితముగా
అనుగ్రహించే దేవుని యొక్క ఊటలో నుండి ప్రవాహించి వచ్చే నీళ్ళను ఇష్టపడే వారెవరైనా త్రాగవచ్చుననే ఉద్దేశ్యముతో వారు తమ సరిహద్దులను విశాలపరచిరి.
ఒకటి, రెండు, మూడు లేదా ఎన్నో మూపులు గల ఒంటెల మీద మీరు సవారి చేసినను, లేదా గాడిద మీద సవారి చేసినను దానితో ఏ సంబంధం లేదు. లేదు. అది ఎలాంటి బేధమును కలిగించదు…?..ఈ గృహమందు, మనందరికీ ఇచ్చట ఆహారము గలదు. మనమందరం సమకూడి వచ్చినప్పుడు, అందుచేతనే నేను ఈ వ్యాపారస్ధుల సంపూర్ణ సువార్త సంఘమును వెంబడించుచూ వచ్చుచున్నాను. దీనిద్వారా అన్ని సంఘశాఖలకు చెందినవారికి ప్రసంగించుచూ, నా వర్తమానమును వారివద్దకు తీసుకొని వెళ్ళగలుగుటకు మరియు ఈ వాక్యమునే నేను విశ్వాసించుచున్నానని వారు ఎరుగునట్లుగా ఇది నాకు ఉపయోగపడుచున్నది.
MATT 26:27
35ఈ దినమునకూడా అదే కార్యము అన్నిచోట్ల కొనసాగుచున్నదని నేను నమ్ముచున్నాను. వారు దీనిలో ఒక భాగంగా ఉండవలెను. తమ సంఘశాఖల అడ్డు గోడలను
బ్రద్దలు చేసుకొని మనుష్యులందరూ సమకూడి వచ్చినప్పుడు దేవుడు ఏమి చేయుననే దానికి మీరే మంచి ఉదాహరణముగా ఉండగలరు. ఇప్పుడిచ్చటున్న మీరు చూచుచున్న ఈ మనుష్యులు, ఈ యవ్వనస్థులు, వీరు ఏ గుంపుకు చెందినవారగుదురు? ఇది ఆ పాత వివాదించు వారి కుమారులయొక్క గుంపుయని నేను నమ్ముచున్నాను.
కాని వీరు వివాదించుచు, గొడవలను సృష్టించువారు కాదు. క్రొత్త గుంపువారు వివాదిస్తూ గొడవలను సృష్టించేవారు కాదు. వివాదించు ఆ పాత గుంపు వారందరూ అచ్చటే మరణించునట్లుగా దేవుడు వారిని విడిచిపెట్టెను. ఆ పాత గుంపువారు మరణించిన పిదప, ఆయన వారి కుమారులను తీసుకొని వెళ్ళెను. మరియు వారి మధ్యనే యెహోషువా లేచి, వారిని అసంపూర్ణమైన వాగ్ధాన దేశమువద్దకు నడిపించెను.
ఈ దినమున మనము చూచుచున్నది అదేనని నేను నమ్ముచున్నాను. ఈ క్రైస్తవుల వ్యాపారస్ధుల సంస్థకూడా దానినే చేయుచున్నదని నేను నమ్ముచున్నాను. దేవుడు దీనిని శక్తివంతంగా ఉపయోగించుచున్నాడు. ఆ సంఘశాఖలు పెట్టుచున్న అడ్డుగోడలను వారు బ్రద్దలు చేయుచూ, వీరు ప్రతీఒక్కరు లోపలికి ప్రవేశించు మార్గమును కల్పించుచున్నంత వరకు దేవుడు వీరి పరిచర్యను కొనసాగించును. మీరు ఈ సంఘమునకు చెందినవారై ఉండాలని వారు మీతో చెప్పరు. మీకు ఇష్టమైన ఏ సంఘమునకైన చెందినవారుగా మీరు ఉండవచ్చును. ఆ పాత వివాదకుల స్వభావమునుండి దూరంగా తొలగిపోయి, అందరూ లోపలికి ప్రవేశించుటకు అవకాశము కల్పించుటకై, ఏ సహోదరుడైనాగాని వారిచుట్టూ మన చేతులను వేసి మనము వారిని ఆహ్వానించెదము. మెథడిస్టువారైనా, ప్రేస్బిటేరియన్ వారైనా, బాప్తిస్టువారైనా, ఏకత్వమువారైనా, త్రిత్వమువారైనా లేదా దేనికి చెందినవారైనా ఫర్వాలేదు, వారిచుట్టూ మీచేతులను వేయండి. అతడు ఒక సహోదరుడు. అతనితో పోట్లాడవద్దు. అతనిని ప్రేమించుము. ఆమేన్. ఈ వైఖరిని మనము అవలంభిచునంత వరకు, ఈ దినములలో ఏదోక దినమున దేవుడు కోతను కోయబోవుచున్నాడు. ఇప్పుడు మనము ఆయన పాదముల వద్ద పడియున్నామని నేను నమ్ముచున్నాను.
JOSH 1:11
36ఈ సంఘసంస్థయనే పర్వతము మీదనే నలుబది సంవత్సరములుగా మీరు ఉంటున్నారు. ఇచ్చటనుండి బయటకు కదిలివచ్చి ముందుకు కొనసాగిపోండి. అచ్చటే యుండి పరిచర్య చేయు సేవకులగు సహోదరుల్లారా, ఈ సంఘసంస్థయనే పర్వతము మీదనే చాలా కాలంగా ఉండిపోయామనే తలంపు అసలు మీకు రాలేదా! మనము ఒకరితో ఒకరం విభేదించుచు, పోట్లాడుకొనుచూ, భిన్నమైనవారిగా కొనసాగుచూ, ఎంతో కాలంగా మన సంఘసంస్థల సరిహద్దులను కట్టుకొనుచు, నిప్పులను రాజేయుచుండుటను మీరు ఎన్నడైనా ఆలోచించితిరా?
ఆ పర్వతమును విడిచిపట్టి వాగ్ధాన దేశము వైపుగా ముందుకు సాగిపోదాం. ఆవిధముగా మన ప్రయాణాన్ని మనము
ప్రారంభించి ఆ దేశమును స్వతంత్రించుకుందాం. "అచ్చటకు వెళ్ళి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి. వివాదించే ఆ పాతవారందరూ ఇప్పుడు లేరు. నీ ఖడ్గమును
తిరిగి నీ ఒరలో ఉంచుము. మీరు కలహపడవద్దు" అని దేవుడు వారితో చెప్పెను.
37జనులారా, వినండి. మీ పితరులుచేసిన అదే తప్పిదమును మీరు కూడా చేయవద్దు. లేదా మీ పితరులవలె మీరు కూడా ఇచ్చటే నలుబది సంవత్సరములుగా ఉన్నారు. క్రైస్తవ పురుషులు యొక్క సంఘసంస్థలు ఎచ్చట ఉన్నవో గమనించండి. (లేదా) కైస్తవ పురుషులయొక్క సంఘసంస్థలు మరియు మొదలగునవి… ?.. ఒకవేళ ఎప్పుడైనా దీనిని మీరు సంస్థగా స్థాపించి మార్చిన యెడల, ఇక దీనితోనే, ఇచ్చటే ఇంకో నలుబది సంవత్సరములు అతుక్కొనిఉండిపోయెదరు.
కాని దేవుడు తన సంఘము ముందుకు కదిలిపోవుచూ, పైకి పిలిచే సమయము ఇదేయైయున్నది. దానిని నేను నమ్ముచున్నాను. గమనించండి. "ఇప్పుడు, మీరు శేయీరు పర్వతమున వెళ్ళిన రీతిగా… అలాగే మీ సంఘశాఖల సహోదరుడగు ఏశావు అచ్చట తన నివాసమును ఏర్పరచుకొని ఉన్నాడు—ఒకమంచి ప్రేస్బిటేరియన్, మెథడిస్టు లేదా బాప్తిస్టు వారివలె.
ఇప్పుడు, సహోదరుడా అతనితో గొడవపడవద్దు, అతనిని ఇబ్బంది పెట్టవద్దు. కేవలం అతనిని దాటిపోవుచూ," సహోదరుడా, ఎలాగు ఉన్నావు?" అని మంచిగా పలకరించండి. అలాగే ముందుకు వెళ్ళిపోవుచూ ఉండండి. మీరు అతనిని కౌగిలించుకొని మరియు కరచాలముచేసి, అసలు నీవు పొందుకున్నది ఏమీ లేదని చెప్పాలని మీరు కోరుచున్నారు. అదే నిజము! దేవుడు అతనికి ఏమి అనుగ్రహించెనో దానిని మాత్రమే అతడు కలిగివున్నాడనే విషయము గుర్తుంచుకోండి; మీరు పొందుకున్న అదే ఉజ్జీవమునుండే అతడు కూడా వెలుపలికి వచ్చెను. నిజము.
DEUT 2:5
38ఆయన యెహోషువాతో చెప్పెను. "శేయీరు పర్వతము మీదగా వెళ్ళుచున్నారు. ఏలయనగా, ఏశావుకు స్వాస్థముగా శేయారు మన్నెమును నేనిచ్చియున్నాను". ఏదోమీయులకు తండ్రియగు ఏశావు కలిగివున్నది అది మాత్రమే. అతనికి తెలిసినదంతా దానినిగూర్చి మాత్రమే. ఆ విషయమును మాత్రమే అతడు ఎరిగియున్నాడు. అనగా తన సంఘశాఖను గూర్చి మాత్రమే అతనికి తెలుసు.
"మేము ఫలానా - ఫలానా, మేము.." అది మాత్రమే అతనికి తెలుసు. దానివరకే అతనికి దేవుడు యిచ్చెను. "ఆ పొలిమేర్ల గుండా దాటి వెళ్ళబోవుచున్నారు, గనుక అతనితో కలహపడవద్దు, మరియు విభేదించవద్దు. నిమ్మళముగా వారి పొలిమేర్లను దాటి వెళ్ళండి. కాని ఇచ్చటున్న యాకోబును చూడండి. యాకోబువలె ఉండే పెంతెకోస్తువారగు మీరు, మీరు నిజంగానే తిరిగి జన్మించిరి. ఆ అనుభనము మీరు పొందుకొనియున్నారు. మరి పరిశుద్ధాత్మద్వారా మీరు నడిపించబడుట వలన అతనితో మీరు కలహపడవద్దు".
కాని ఈ పెంతెకోస్తు యాకోబు అచ్చటున్న దేశములో సంపూర్ణమైన వాగ్ధానమును కలిగివున్నాడు. జరుగబోవు విషయము అదేయైయున్నది. సమస్త కార్యములలోను, సంపూర్ణమైన అత్మతోను, ప్రతీ కార్యముతో, ఆ వాగ్ధానపు దేశమున నేను నిన్ను ఉంచెదను.
39ఒక ఉదయకాలపు ఆరాధనలో నేను నిలిచివుండగా, నన్ను నేను గమనించి చూచినప్పుడు, నేను అంత పెద్ద ప్రసంగీకుడను కాను, మరి నా పరిచర్య ఒక ఆత్మసంబంధమైన పరిచర్యయని కనుగొంటిని. కాని చూడండి. అదే వరుస క్రమములోనున్న చార్లెస్ ప్రైస్, అచ్చట మరణించుచున్న దానినిగూర్చి మరియు సహోదరుడు షకారియన్ నెరవేరబోవు సంగతులను ప్రవచించి చెప్పుచున్న కార్యములనుగూర్చి వారు మాట్లాడు చున్నప్పుడు, ఓ, నా ఆత్మ నాలోనుండి పైకి లేచి, "అది ఇది, అది ఇదే, అది ఇదే. వారు దీనిని మాత్రం చూడగలిగితే, దానియొక్క కార్యము ఇదేయగును" అని చెప్పెను.
మనము పైకి వెళ్ళి, ఆ దేశమును స్వాధీనము చేసుకొనుటకు సిద్దముగా ఉన్నాము. ఆ వైద్యశాలలనుగూర్చి మరియు మొదలగు కార్యములను గూర్చి నేనేమి చెప్పానో మీరు జ్ఞాపకముంచుకోండి. వివాదించు వారి యొక్క సంతానపు వారందరూ ఏకమై కూడి వచ్చినప్పుడు మనము దానిని చేయుటకు సిద్దంగా ఉన్నాము.
ఓ, ఇచ్చటున్న సేవకులగు మీరు, ఫీనిక్స్‌లోనున్న సహోదరుల్లారా, మీ యొక్క సంఘశాఖల సరిహద్దుల గోడలను కూల్చివేయండి. పశ్చాత్తాపపడి, ఒక పెంతెకోస్తు ఉజ్జీవమును పొందుకోండి. మనమందరం దానిలో చేరగలము…?.. ఒక ఉజ్జీవము అవసరమైయున్నది, అనగా సంఘమున పరిశుద్ధాత్మ క్రుమ్మరింపబడి, అది పరిశుద్దాత్మ ద్వారా నడిపింపబడుటకు ఒక ఉజ్జీవము అవసరము. దానిని చేయుటకు దేవునికి చిత్తమైయున్నది. ముందుకు సాగిపోవుచూ, ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి.
వారిని దాటిపోండి. వారితో కలహపడవద్దు. వారు వచ్చుటకు వారికి ఇష్టము లేకపోయినా అదేం ఫర్వాలేదు. అలాగే ముందుకు సాగిపోతూ ఉండండి. అదేం ఫర్వాలేదు. "సహోదరుడా, నీవు ఎలా ఉన్నావు?", వారిని దాటివెళ్ళిపోతూ ఉండండి. అతడొక సరిహద్దు విశ్వాసి. ఆ సరిహద్దు గీతవద్దనే నిలిచిపోయి ఉండుట మాత్రమే అతడెరుగును. ఈ దినమున కూడా అనేకమంది జనులు అట్లే ఉన్నారు. "నేను దీనికి చెందినవాడిని, నేను దానికి చెందినవాడిని" అని చెప్పుకుంటూ దానితో అతుక్కొనిపోయి ఉంటూ, వారి సంఘశాఖను గూర్చి మాత్రమే వారెరుగుదురు.
40ఒకసారి ఒక స్త్రీని చూచి "నీవు క్రైస్తవురాలివా" అని నేను అడిగాను. ఆమె,"నీకు అర్ధమగునట్లు చెప్పాలంటే, ప్రతిరాత్రి నేనొక క్రొవ్వాత్తిని వెలిగించెదనని" చెప్పెను. ఇలాంటి వాటిని దేనినైన చేయుటయే క్రైస్తవత్వమని చెప్పుటకు ఆమె ప్రయత్నించెను.
ఒకవ్యక్తి ఇలాగు చెప్పుటను నేను విన్నాను. "నేనొక అమెరికా దేశస్థుడను, నిశ్చయముగా నేను అమెరికావాడినని" చెప్పెను. ఒక పందికి ప్రక్కన జీను అవసరమని చెప్పుటలో ఏ అర్ధం లేదు. ఒక పందిమీద జీను పెట్టుటలో ఏ ప్రయోజనము లేదు. దానిలో ఏ అర్ధం లేదు. ఎందుచేత? అలాగే అమెరికా అంటే క్రైస్తవత్వం అనే మాటలో అర్ధం లేదు. క్రైస్తవత్వము అనగా తిరిగి జన్మించు ఒక అనుభవమైయున్నది. అది పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమైయున్నది…?… అనగా సహవాసము, ప్రేమ మరియు సహవాసమును కలిగి యుండుటగును. పరిశుద్ధాత్మ సంఘమును తన ఆధీనంలోకి తీసుకొని గొప్ప కార్యములను చేయును. ఓ, నిశ్చయముగా. అవునండీ.
(నా చుట్టూ ఏదోకటి కదులుచుండుటను నేను అనుభూతి చెందుచున్నాను.) అదేమిటో దానినిగూర్చి నాకు తెలియదు. నేనింకా పైకి వెళ్ళలేదని నాకు ఖచ్చితముగా' తెలియదు… ఇప్పుడు ఎవరో చుట్టూవున్న పెట్టెలను కదుపుచున్నారని చెప్పెను."ఇదిగో నేను వెళ్ళుచున్నాను..?… తలలపై ఉన్నది. అవునండీ.
JOHN 14:13,14
41వాగ్ధానములను స్వతంత్రిచుకోండి. ఈ వాగ్ధానము మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరికిని అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని
చెందును. క్రైస్తవులకు, సహోదరులకు, సహోదరీలకు, ఈ దేశమున మనము ఇప్పటికే చాలా కాలంగా ఉన్నాము. ఈ పర్వతము చుట్టూ ఇచ్చటే మనము ఉండిపోయాము.
ఈ సంఘశాఖల పర్వతమందు ఇప్పటికే మనమెంతో కాలంగా ఉండిపోయాము.
అన్యభాషలను మాట్లాడుటనే ఋజువును మనము ఉపయోగించుచు ఇచ్చటనే నలుబది సంవత్సరములు ఉండిపోయాము. ఓ, దేవా! ఎరుగలేని శక్తులను మరియు ఉపయోగించబడని అపరిమితమైన వనరులు ఉన్నప్పుడు, నా నామమున మీరేమి అడిగినను దానిని నేను చేసెదను. తండ్రివద్ద నా నామమున మీరేది అడిగినను దానిని నేను చేసెదను. ఆమేన్. దైవిక స్వస్థత మరియు అన్యభాషలలో మాట్లాడుట అవన్నీ మంచిదే. అవి అవతలి వైపుయున్న భూభాగమునకు వెళ్ళి తీసుకొని వచ్చిన కొన్ని ద్రాక్షా ఫలములు వంటివిమాత్రమే. ఆ దేశమే మనది! దానిలో ఉన్నవన్నీ మనకు చెందినవగును. అచ్చటున్నవారు నీమీద అచ్చట దాడిచేయుదరని నీవు భయపడవద్దు. అతనితో మాత్రము కలిసి ముందుకు కొనసాగిపోవుడి. దానిని చేయుటకు అదే మార్గమైయున్నది. ఈబండ మీదనే మనము నలుబది సంవత్సరములు ఉండిపోయాము. దీనిని విడిచి పెట్టి ఆవాగ్ధాన దేశము వైపుగా కొనసాగిపోదాం.
42ఈ వ్యాపారస్థుల సహోదరుల హృదయములు ఏకమై ఉండునట్లు దేవుడు సహాయము చేయుననేదే నా ప్రార్ధన. అది నిజము. దేవుని సేవకులు దీనిని చేయలేకపోయిన యెడల, దీన్ని చేయుటకు ఈ వ్యాపారస్థుల సంఘసభ్యులను దేవుడు లేవనెత్తును. లేదా వారందరిని సమకూర్చి ఏకము చేయుటకు ఆయన ఏదోక విధముగా చేయును. ఎందుకనగా చేతులను ఒక స్థలమువద్దకు, తలను మరొక స్థలమునకు, కాళ్ళను వేరొక స్థలమునకు, సంఘము నడపించుటకు సాధ్యమవ్వదు. ప్రభువగు యేసుక్రీస్తు యొక్క శరీరమంతా దేవుని యొక్క మహా గొప్పసైన్యముగా నిలబడునంత వరకు, అప్పుడే మనము ఈ పర్వతమును విడిచిపెట్టి, ముందుకు సాగిపోతూ ఆ వాగ్ధానదేశము వద్దకు వెళ్ళి స్వాధీనపరచుకొనెదము. అంతవరకు నేను, ఆ ఒక్క ఉద్దేశ్యముకొరకు పొరాడే మీ సహోదరుడిగానే ఉండిపోతాను. అనగా, ఏక హృదయముతో, ఏక మనస్సుతో దేవునియొక్క సజీవ సంఘము ఏకమై ఉండుటకే నేను పొరాడెదను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక! షకారియన్ సహోదరుడా… (టేపులో ఖాళీగలదు - సంపా..)
43[టేపులో ఈ ఆరాధన యొక్క మిగిలిన భాగము వేరొక భాగముగా కనబడుచున్నది. వేరొక సహోదరుడి యొక్క మాటలతో ఇది ప్రారంభమగుచున్నది - సంపా..]
మనమెంత యదార్థముగా ఉండవలెనో అంత యదార్థముగా ఉన్నప్పటికీ నిజమైన దేవుని యొక్క శక్తి మనమధ్య ఎంత మహోన్నతమైనదిగా ఉన్నను, దానిని చూచుటకు కొన్నిసార్లు మనము విఫలమైపోతాము. గనుక మన ఆరాధన ఆ విధముగా దేవుని శక్తిని చూచునట్లుగా ఉండాలని తలంచుచున్నాను. ఇప్పుడు దర్శనము వచ్చినప్పుడు… బహుశా ఇచ్చటున్న మీలో అనేకులలో అందరూ ఆ కూటములలో ఉండి ఉండవచ్చునేమో! మరి ఏమి సంభవింపబోవుచున్నదో ఎరుగుటకై దర్శనములు
చూచుచున్నాము. మరి ఈ ఉదయమున ఇచ్చట ఈ విషయమునుగూర్చి నేను ప్రత్యేకంగా చెప్పుటకు కారణమేమనగా…మీరు గనుక ప్రభువుయొక్క సన్నిధిని
తెలుసుకోగలిగితే… ఆ వెలుగు, వారు అనేకసార్లు ఫోటోద్వారా తీసిరి. అది -అది దేవుడే. ఎందుకనగా అది అదే స్వభావమును (గుణలక్షణము) తీసుకొని వచ్చుచున్నది.
44అదొక వృక్షమువలె… ఒకసారి ఇచ్చటున్న అరిజోనాలో ఒక నారింజ వృక్షమును నేను చూచాను. ఆ వృక్షమున పలురకముల ఫలములు ఉండుటను నేను చూచాను.
అది బహుశా, ఒక నారింజ వృక్షమైనను, ఆ వృక్షమున నిమ్మకాయలు మరియు ద్రాక్షాపండ్లను ఫలించుచున్నవి. అవి ఆ వృక్షమున ఫలించుచున్నవి. కాని పరి.యోహాను
5:15న యేసు ఇట్లు చెప్పెను. యోహాను 15:5 అని నేను నమ్ముచున్నాను. "ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు". సరే, ఇప్పుడు దాని కొమ్మనుండి… లేదా… ఈ .. ద్రాక్షాచెట్టు నుండి తన మొదటి కొమ్మను తీసుకొనివచ్చినప్పుడు, ఆ కొమ్మయనే భాగము నుండి అపొస్తులుల కార్యముల గ్రంథమును అది వ్రాయును. అర్ధమైనదా? ఎట్లనగా, ఇప్పుడది అంటు కట్టబడినది… ఈ నారింజ చెట్టుకు ఇతర నారింజ జాతికి చెందిన వాటిని మీరు అంటుకట్ట వచ్చును. అది ఆ వృక్షము యొక్క జీవముతో జీవించును.
45ఈ దినమున, నేను దానినిగూర్చి అనేకసార్లు ఆలోచించి చూడగా… ఇప్పుడు సంఘసంస్థలను అవమానపరచాలనే భావముతో దీనిని నేను చెప్పుటలేదు. ఈ కాలములోనున్న వాటిని ఇక మనము ముగించవలెను. మీకు అర్ధమైనదా?.."మేము దానిని నమ్ముచున్నాము, దీనిని నమ్ముచున్నాము". మనము దానికి ముగింపు అనే బిందువును పెట్టకుండా, ఇంకా దానిని అలాగే మనము కొనసాగించిన యెడల, మేము దీనిని నమ్ముచున్నాము మరియు దానితోపాటు దేవుడు మాకు ఏమి చూపించునో
దానితోను కొనసాగుతాము" చూచారా! అది మీ సంఘసంస్థకు భిన్నముగా ఉండవచ్చును. కాని మీరు దానిని వాక్యాంశ బిందువు (comma)తో ముగించినప్పుడు, ఇకదానితో మీరు దేనిని కలుపలేరు. అలాగే ఒక ఎదుగుచుండగా, అది సంఘమైనను, ఏ సంఘసంస్థయైనను నిజంగానే క్రీస్తు యొక్క జీవముతో వర్థిల్లునని నేను తలంచుచున్నాను. దానిని నేను నమ్ముచున్నాను. ఎందుకనగా, అది ఏదోక దానితో అంటుకట్టబడియున్నది లేదా దేనితోనో ఒకదానితో అది కలుపబడియున్నది. అది సంఘములోనున్న సభ్యునికిగల అధికారమును తీసివేసుకొని, ఆ అధికారాన్ని ఒక సేవకుడిపైన లేదా ఒక బిషప్ లేదా వేరే ఎవరిపైనో పెట్టుచున్నది. అచ్చట ప్రకటన గ్రంథంలో చెప్పబడిన రీతిగా, "నికొలాయితుల యొక్క క్రియలు, "నికో" అనగా "జయించుట". సంఘములోని సభ్యులను జయించుటని అర్ధం. ఇటువంటి ఒక్క కూటముద్వారా సంఘసభ్యుల ద్వారా క్రియచేయుటకు దేవుడు ఒక అవకాశమును వారికి అనుగ్రహించుచున్నాడని నేను తలంచుచున్నాను. అర్ధమైనదా? ఒక సంఘము (సంఘ సభ్యుని) ద్వారా దేవునియొక్క శక్తి క్రియ చేయుచున్నది.
46ఇప్పుడది 1933వ సంవత్సరమున జరిగినది. అప్పటికింకా నేనొక బాప్తిస్టు సేవకుడిగానే ఉన్నాను. ఇప్పుడు నాకు యాభై-ఒకటి సంవత్సరములు, అలాంటి దర్శనములను నేను వేలకొలది చూచాను. వాటినిగూర్చి నేను చెప్పిన కూటములలో మీలో అనేకులు ఉన్నారు. నేను చెప్పిన వాటిల్లో ఎప్పుడైనా ఒక్కటైనా తప్పిపోయినదేమో ఎవరినైనా మీరు పిలిచి అడుగవచ్చును. అదెన్నడూ తప్పిపోలేదు, అది విఫలం కాదు. ఎందుకనగా, అది ఆయనైయున్నాడు.
ఇప్పుడు-ఇప్పుడు ….. సంఘమునకు ఈనాడు అదొక క్రొత్త విషయమై ఉన్నట్లుగా మనము కనుగొన్నాము. ఇచ్చట మనము దానిని చూచు విధముగా పరిశుద్ధాత్మయొక్క శక్తి క్రియచేయట ఉన్నది. (బాప్తిస్టులు, మరియు నా సహోదరులు మరియు ఇతరులు సాక్ష్యమిచ్చుట నేను విన్నాను.) ఇది సంఘమునకు క్రొత్త విషయముగా ఉండుటను మనము కనుగొన్నాము.
కాని ఇదేమిటది? ఇది ఆద్రాక్షావల్లిలో నుండి పుట్టుకొచ్చిన మరొక కొమ్మగా (తీగ) ఉన్నది. మీరు దీనిని గమనించిన అపొస్తులుల కార్యములలో పరిశుద్ధాత్మ ఏ విధముగా క్రియ చేసినదో అదే విధముగానే ఇప్పుడు అది క్రియ చేయును. ఆనాడు పరిశుద్ధాత్మ ప్రజల మధ్య ఏ విధముగా లేచి పలు రకములైన కార్యమును గూర్చిమాట్లాడెనో ఆ విధముగానే ఇప్పుడుకూడా ఆపరిశుద్దాత్మ క్రియ చేయుచున్నది.
47ఈ ఉదయమున నేను నా సంఘమునకు వెళ్ళుచుండగా, దానిని ఏ విధముగా పిలువాలో తెలియని రీతిలో నేనొక దర్శనమును చూచితిని. నేను ఈ విషయములను
చూచెదను. ప్రపంచపు యుద్దము ప్రారంభమగుటకు అనేక సంవత్సరములకు క్రితమే, "ఇప్పుడు ముస్ఫోలిని అనే పేరుగల ఒక సర్వాధికారి ఉన్నాడు. అతడు మొదటగా ఇతియోపియాపై దండయాత్ర చేసి, ఆ ఇతియోపియాపై జయించును. కాని అతడు అవమానకరమైన అంతిమ దశకు వచ్చునని" నేను చెప్పాను. వాటన్నింటిని గూర్చి
నేను ముందే చెప్పాను. వాటిల్లో ఏడు దర్శనములుగూర్చి …నేను వ్రాసివుంచిన పాత పేపరును మీరు చూచుటకు బహుశా రేపు నేను తీసుకొని వస్తాను. ఆ ఐదు దర్శనములు
ఏవిధముగా చెప్పినట్లు పరిపూర్ణంగా జరిగినవో మీకు చూపించెదను. మరి ఏడవ దర్శనము ప్రవచనముగా చెప్పబడిన విషయము… దానిలో చెప్పబడినదేమనగా, స్త్రీలకు ఓటువేయు హక్కును వారెట్లు ఇచ్చెదరో…దీనికి వ్యతిరేకంగా ఉండాలనేది నా భావము కాదు…నేను అందుకొరకే పిలువబడితిని…
(టేపులో ఖాలీ గలదు-సంపా.,).
48మనదేశము చూచుటకు రాతి బండలు బ్రద్దలగునట్లు బ్రద్దలగుటను మరియు కాలి బూడిదై పొగలు దట్టముగా లేచుచున్నట్లు కనబడుట వంటి మొదలగు అనేక కార్యములు చూచితిని. దానితర్వాత, శ్రీ రూస్ వెల్ట్ నిజంగానే అతడు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచమున యుద్దం జరుగుటకు ప్రారంభమయ్యెను. ముస్ఫోలిని చెప్పిన ప్రకారముగా తాను చేయవలసినదానిని అతడు చేసెను. మరియు మాగినోట్ లైన్ మరియు సమస్తము దర్శనములో చెప్పినరీతిగా జరిగెను. ఎన్నికలను గూర్చి చెప్పినట్లుగానే, ఇది స్త్రీలయుగం, ఇప్పుడు ఎన్నుకొనిన మన అధిపతి (రాష్ట్రపతి)ని గూర్చి మనమెరుగుదుము.
నేను… దక్షిణప్రాంతమున ఉన్నట్లుగా, ఒక దక్షిణ ప్రాంతపు
వాసిగా ఉండు, "విభజన గురించి మరియు మొదలగువాటి గురించి ఏమిటి?" అని అనేకమైనవాటిని గూర్చి వారు అడుగుచున్నారు. ఒక అమెరికా దేశస్థుడిగా…నేను
నమ్ముచున్నదేమనగా …?.. ఏమి సంభవించినను, ఏం ఫర్వాలేదు. కాబట్టి ఇప్పుడు అది మన రాష్ట్రపతిగా ఉన్నను మనము దానిని గౌరవించవలెను.
49కొన్ని దినముల క్రితం ఏదోక కార్యం నాకు బయలుపడెను. దానిగూర్చి నేను వ్రాసియుంచాను. "మొదటి నాలుగు సంవత్సరములను అతడొక నిజమైన అద్యక్షునిగా
పరిపాలన చేయునని" ఎవరో ఒకరు చెప్పిరి. (చెప్పిన ఆ గౌరవనీయుడు ఇచ్చట కూర్చొని ఉన్నాడనుకుంటున్నాను. నల్లని కళ్ళఅద్దములను ధరించుకొని ఈ ఉదయమున
అతను ఇచ్చటున్నాడు. అది అతడేనని నేను తలంచుచున్నాను). ఖచ్చితముగా నిజము.
కాని మీరు గమనించండి, మన కృపాదినమునుండి మనము దూరమై పాపము చేసితిమి. మీరు ఆలోచించు దానికంటే అది ఆలస్యమైపోయెను..?.. అర్ధమైనదా? ఆ ఘడియ చాలా సమిపముగా ఉన్నది. ఇప్పుడు ముఖస్తుతులకే ప్రాముఖ్యం ఇవ్వబడుచున్నది. ఇప్పుడు మనము చివరి కాలమునకు చాలా దగ్గరలో ఉన్నాము. ఆ విషయంలో నేను నిశ్చయంగా ఉన్నాను. ఆ విషయములో నేను ధృఢముగా ఉన్నాను…
50నా పరిచర్యను గురించి మీలో అనేకులు చక్కని అభివందనములను తెలిపిరి. మరియు అనేక విధములుగా మెచ్చుకున్నారు. అదేమైయున్నదో అదట్లే ఉండనివ్వండి.
మేము యేసుక్రీస్తు నామమున మాట్లాడుచున్నామని మీరు విశ్వసించిన యెడల అమెరికా దేశముయొక్క పని సమాప్తమైనది (finished). అవును నిజము. చేయవలసిన
కార్యములు చేయుటకు సమయమున్నయెడల దానిని ఇప్పుడే మనము చేయవలసియున్నది. సరిగ్గా ఇప్పుడే దానిని చేయవలెను. "తండ్రి నాకు అనుగ్రహించిన
వారందరు నాయొద్దకు వచ్చెదరు". మనము నిజంగానే, త్వరితంగా వలనువిసిరి కష్టపడి పనిచేయుటను ప్రారంభించవలెను.
నేను అభినందించుచున్నాను… మరొకరి సమయమును వృధా చేయకుండా ఈ ఉదయమున దీనిని చెప్పి ముగించెదను. ఇచ్చట సమయమును ఎక్కువగా తీసుకున్నందుకు, ఇందుకొరకు నన్ను క్షమించెదరా? రేపు
మధ్యాహానము మరలా నేను మాట్లాడెదనని తలంచుచున్నాను, మరియు మీరు వచ్చెదరని నేను నమ్ముచున్నాను. "ఈ పర్వతముపైన మనము నలుబది సంవత్సరములుగా ఉంటున్నాము" అనే అంశం మీద నేను మాట్లాడాలని కోరుచున్నాను.
51ప్రతీచోటా నేను కార్యములను నిర్వహించుటకు మన ప్రభువు, నా పరిచర్యలో సహాయము చేయుచూ, అనేక విధములుగా నన్ను ఉపయోగించుకొనుచున్నారని
నేను నమ్ముచున్నాను. నా పరిచర్యను డంభంగా చూపించుకొనుటకు నేనెన్నడూ ప్రయత్నించలేదు. ఈ పరిచర్యను డంభంగా ప్రదర్శించు విషయములో యేసుక్రేస్తు
అనవసరమైన విషయముగా చేసెను. కొంతకాలంక్రితం, ఎవరో ఒకరు "బ్రాన్హాం, సహోదరుడా, ప్రసిద్ధిగాంచిన ఫలానా-ఫలానావంటి వారితో కలిసి నీవు ప్రసంగించిన
చాలా బాగుంటుందని" చెప్పెను. సహోదరులుగా ఉంటూ వారు అట్లు చెప్పుచున్నారు. ఇప్పుడు, క్రీస్తుయొక్క శరీరమున నా స్థానమేదనగా, వారు ఆత్మీయస్థితిలో ఎచ్చట ఉన్నారో చూచుటకు మరియు వారియొక్క ఆత్మసంబంధమైన ముగింపును గమనించుటయే నా స్థానమైయున్నది. ఇచ్చట ఆకార్యములను గమనించవలసిన
ఉద్దేశ్యముకొరకే క్రీస్తు నన్నిచ్చట ఉంచెను. ప్రసిద్ధిగాంచిన వారని మనము పిలిచే…
గమనించండి, ఆ వ్యక్తి (నేనెవరినిగూర్చి మాట్లాడుచున్నానో, ఆ సహోదరడు ఇచ్చట కూర్చొని ఉన్నాడని నేను నమ్ముచున్నాను)… ఒక క్రైస్తవులముగా మనము గొప్ప పేరు ప్రాఖ్యాతలుగల వారముగా ఉండలేము. పైకి వెళ్ళే మార్గము క్రిందే ఉన్నది. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును.
52అనేకులు ఆలాగు చెప్పెదరు… కొంతకాలం క్రితము ఏవరో ఒకరు నన్ను పిలిచి, ఒక గొప్ప సంఘసంస్థ యొక్క చాలా పేరున్న వ్యక్తి "బాన్హాం సహోదరుడా, నీవు దీనిని మరియు దానిని గూర్చి చెప్పుటను విడిచిపెట్టిన యెడల మేము నీకు ఫలానా- ఫలానా మరియు ఫలానా - ఫలానా చేసెదము" అని చెప్పెను. దీనిని మరియు దానిని చెప్పుటను విడిచిపెట్టు? అదే నా పరిచర్యయై యున్నది. అదే నా జీవమైయున్నది. దానిద్వారా నేను వర్థిల్లుచున్నాను. ఏదోకదాని కొరకు నేనెన్నడూ దేవుని యొక్క వాక్యము విషయంలో రాజీపడలేను. ఖచ్చితంగా దానిమీదనే నేను నిలబడాలి. మనము… చెప్పెను, "…?… నీ చుట్టూ ఒక గుంపులతో, అలాంటి వ్యర్థమైనవంటివారితో నీవు ఉంటూ నిన్ను నీవు మోసము చేసుకొనుచున్నావు. వారిని విడిచిపెట్టి బయటకు రా" అని చెప్పెను. అర్ధమైనదా? తానేమి చెప్పుచున్నాడో దానిగూర్చి అతనికి తెలియదు.
దానినిగూర్చి అతను ఎరిగినట్లయితే, అనగా అదే విషయమును మన బోధకుని యొద్దకూడా చెప్పిరని… [టేపులో ఖాళీ గలదు-సంపా]. యేసుక్రీస్తు మన జీవము. ఆయన స్వంత సహోదరులే ఇట్లు చేసిరి? "ఇచ్చటకు వెళ్ళి నీకున్న శక్తితో ఒక గొప్ప అద్బుతమును చేసి చూపించుము. వారు ఉద్రేకముతో ఊగిపోయేల వారిని తాకుము"…?…
"మీ సమయము ఎల్లప్పుడును సిద్దంగానే ఉన్నది. నా సమయమింకను రాలేదు" అని ఆయన చెప్పెను. ఆయన జాలర్లతోను, విద్యలేనివారితోను, అసలు చదువటం, వ్రాయుట కూడా తెలియని పామరులతోనే కలిసి ఉండెను. చూడండి. ప్రపంచము దేనినైతే గొప్పదని చెప్పునో దానిని దేవుడు వెఱ్రితనమని చెప్పును.
53కాబట్టి, ఆ దినముననున్న మత బోధకులు యెషయా 40వ అధ్యాయములోనున్న వాక్యమునుగూర్చి ఏ విధమైన అనువాదమును ఇచ్చెదరని నేను ఆశ్చర్యపడుచున్నాను?
దేవుడు పరలోకపు వాకిళ్ళను తెరచి వసారాలను క్రిందికి దించి దేవదూతలు మేళతాళాలు వాయించుచుండగా బాప్తిస్మమిచ్చు యోహాను గొప్ప పరివారముతో క్రిందికిదిగి వచ్చునని బహుశా ప్రసంగించెదరేమో? ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును, ప్రతికొండను అణుచవలెను. మరియు కొండలు పొట్టేళ్ళవలెను
మరియు ఆకులన్నీ తమ చేతులతో చప్పట్లుకొట్టెను? (దీనిని ఇలాగు చెప్పుచున్నందుకు క్షమించండి, తప్పుడు భావముతో దీనిని చెప్పుట లేదుగాని, ఒక విషయమునుగూర్చి
తెలుపుటకే దీనిని చెప్పుచున్నాను.) అరణ్యములో నుండి అందవికారంగానున్న వృద్దుడు వెలుపలికి వచ్చి, బురదలో నిలబడి, బహుశా ఆ బురద అతడి చీలమండ వరకు
ఉండవచ్చు, ప్రతీ మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి స్నానంచేసి ఉండవచ్చు. అతని చుట్టూ గొర్రెల చర్మమును చుట్టుకొని ఉండవచ్చును. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతీ పర్వతమును, ప్రతి కొండను అణచవలెనని వాక్యము చెప్పినప్పుడు, ఒక గొప్ప వ్యక్తి వెనుక పుష్పములతో అలంకరింపబడి ఉన్నట్లుగా అతనిగూర్చి చెప్పబడలేదు. పురాతన కాలంనాటి విధానంలో చెప్పబడిన ప్రకారమే అతడున్నాడు. అలాంటి వ్యక్తులనే దేవుడు కోరుకొనును. అది నిజము. దీనులుగా ఉండండి.
54సహోదరులారా, ఇలాంటి ప్రజలమధ్య ఉండుటకే నేను ఇష్టపడెదను. కొంతసేపటి క్రితం అతడు చెప్పిన మాటలవలె, ఈ వ్యాపారవేత్తలు దీనిని… ఎందుచేత, కొన్నిసార్లు గోతులను త్రవ్వేవారు ఇలాంటి గుంపువారితో తనను తాను గుర్తుంచుకొనుటకు ఇష్టపడరు. కాని ఈపురుషులు (ఇచ్చటున్న క్రైస్తవ వ్యాపార సంఘ పురుషులు) విశ్వాసమును మరియు ఇలాంటి కూటములను ఏర్పాటు చేయుచున్న వీరిని చూస్తే, వారిలోనున్న నమ్రతను నాకు చూపించుచున్నది. దేవుడు వీరిద్వారా ఏమి చేసెనో మరియు ఈ పెంతెకోస్తు ఆశీర్వాదములను ఒప్పుకోలు చేయుచూ అది తిన్నగా క్రిందికి దిగి వచ్చును. వారు ఈ లోకమునకు గొప్పవారై యున్నారు. కాని మీరు దీనిని గమనించిన, ప్రపంచముననున్న ప్రతీ స్థలములకు వెళ్ళుచూ, తమ స్వంత డబ్బును ఖర్చు పెట్టుచూ, ఇతర సహోదరులకు ఏదోక సహాయము చేయుచు, వారిని ఈ గుంపులో చేర్చుటకు ప్రయత్నించుచున్నారు, వెలుగు ప్రకాశించునుగాక.
55ఈ ఉదయమున, నేను పాల్గొన్న కూటములన్నింటిలలో, ఈ కూటమునుగూర్చి ఇది నా అభిప్రాయమని నేను తెలుపుచున్నాను. వారు అరుచుచూ, దేవునిని స్తుతించుటను నేను విన్నాను. నేను కూడా దానిని ఇష్టపడెదను. కాని ప్రజలు అరుస్తూ, దేవుని స్తుతించినను తమ పంటి నొప్పిని స్వస్థపరచుటకు కూడా తగినంత విశ్వాసములేనివారై
ఉండుటను నేను చూచాను. అర్ధమైనదా? కాని అది దేవునియొక్క దీవెనలలో కొన్ని మాత్రమేయగును. కాని అది దేవునియొక్క శక్తితో వచ్చినప్పుడు, వారు ఆ శక్తి క్రింద
ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ…కూటములో హృదయములను వివేచించుట జరుగుచున్నప్పుడు దానిని మీరు గమనించండి. ఈ ఉదయమున, ఈ భవనములో జరుగుచున్న కార్యములను నేను గమనించి చూచుచుండగా, అందరూ భయభక్తులతో, నిశ్చబ్ధంగా ఉండి, పరిశుద్ధతతో, దేవుని యొక్క భయముతో, దేవుని వద్దకు సమీపించుచుండగా, ఒక నిజమైన పశ్చాతాపముతో మరియు అలాంటి కార్యములతో వారి ముఖముల యొక్క కవళికలు మారుటను మీరు గమనించవచ్చును.
56ఈ క్రైస్తవుల వ్యాపారస్తులయొక్క గుంపుతో అనేక సందర్భములలో, ఉదయకాల అల్పాహార విందులో పాల్గొన్నవాటన్నింటికంటే ఇదే నాకొక గొప్ప అల్పాహార
విందుగా ఉన్నది. ఈ గుంపువారితో, ఇచ్చటున్నవారికి చెందినవానిగా నేను పరిగణించబడుచున్నాను. వేరే ఏ సంఘసంస్థకు నేను చెందినవాడను కాదుగాని, ఈ ఒక్క
గుంపువారికి మాత్రమే నేను చెందినవాడనగుదును. ఈ గుంపు ప్రజలను నేను అభినందించుచున్నాను. ఎందుకనగా, ఒకే ఒక్క కారణముఉన్నది. అదేమనగా, నేను దేనికొరకు నిలచియున్నానో వారుకూడా అందుకొరకే ఉండుటవలన, మరియు ఇచ్చట కూర్చొనియున్న అసంబ్లీస్ ఆఫ్‌గాడ్ వారు, ఫోర్ స్క్వేర్, బాప్తిస్టు వారు ప్రెస్టిటేరియన్లు, ఏకత్వము వారు, ద్విత్వమువారు, త్రిత్వము వారు… యాకోబు బావిని త్రవ్వినట్లుగా దీనిని గురించి మీకు లోతుగా చెప్పాను. దీనిని సరియైన రీతిలో లేదా సరియైన పదములను పెట్టి వివరించి ప్రసంగించితినని నేను తలంచుట లేదు. కాని మీరు అర్ధంచేసుకొను విధముగా నేను దీనిని చెప్పాను.
యాకోబు మరొక బావిని త్రవ్వగా ఫిలిష్తీయులు అతడిని అచ్చటనుండి తరిమికొట్టిరి. గనుక అతడు దానికి "ద్వేషము" అని పేరు పెట్టెను అతడు మరొక బావిని త్రవ్వగా దానిని అతడు "కలహము" అని పేరు పెట్టెను. దానితర్వాత మరలా అతడు మరొక బావిని త్రవ్వగా "అందరికీ తగిన స్థలము ఉన్నది" అని దానికి పేరుపెట్టెను. కాబట్టి ఇచ్చట వీరు చేయుచున్నది ఇదేయని నేను తలంచుచున్నాను, మనందరికీ స్థలము గలదు (అవునండీ). మనము సమకూడి వచ్చుటకును, కలిసి జతకూడి వచ్చుటకు పరలోక స్థలములలో మనకందరికీ స్ధలము గలదు. అచ్చట మనకు ఈ సంఘశాఖల అడ్డుగోడలు ఉండవు. క్రీస్తులో మనమందరమూ ఏకమై ఒక్కసమూహమై వుండెదము.
57గొప్ప సంఘములు, శ్రమలను అనుభవించే ఆత్మీయ సంఘములు, యేసుక్రీస్తులో నుండి పుట్టుకొచ్చిన నిజమైన ద్రాక్షావల్లి వంటి సంఘములు, పెంతెకోస్తు గుంపులు
మాత్రము, అందరు కలిసి ఏకమై కూడి వచ్చి, సహోాదరత్వముతో ఉండుటను నేను చూడగలిగిన… వారి సంఘసంస్థలను గూర్చి నాకనవసరము. వారిని తమతోనే
ఉంచుకోవాలని కోరిన వారితోనే ఉంచుకోనివ్వండి. అదేం ఫర్వాలేదు. ఇదే చాలని అక్కడికక్కడే ఉండిపోకండి. మీ హస్తములనుచాచి మరొకరినికూడా వచ్చుటకు
ఆహ్వానించండి. అందరు కలిసి రండి. అర్ధమైనదా? అది జరుగుటను నేను చూసిన యొడల (అదెట్లో నాకు తెలిసినంతవరకు దీనిని నేను భయభక్తితో చెప్పుచున్నాను) ఈ ఉదయము అది జరుగుటకు నేను చూచినయెడల, దీనిని చెప్పుటకు నేను ఇష్టపడుచున్నాను. వృద్దుడగు సుమియోను, "ప్రభువా, ఇప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, నీ రక్షణ నేను కన్నులారా చూచితిని" అని చెప్పినట్లుగా…?… సహోదరులారా, ఆ సమయము తప్పకుండా త్వరలో వచ్చును. ఎట్లనగా,
మనము సమకూడి వచ్చుటకు నిర్భంధించబడితిమి. మీరు దానిని అట్లే గుర్తుంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక! సహోదరుడా, నీకు నా వందనములు.