కాలమను తెరకు ఆవల
vgr count-107 1మరియు మీ యొక్క ప్రార్థనలకు జవాబు ఇవ్వబడినది అని ఇక్కడ నేను ప్రకటించగోరుచున్నాను. ఇటువంటి కూటమును చాలా సంవత్సరముల క్రితము నేను నా పరిచర్యను మొదట ప్రారంభించినప్పుడు మనము కలిగియున్నాము… నేను ఎన్నడూ… మనము కనీసము జనులను కూర్చండబెట్టలేకుండా ఉండేవారము, మరియు అనుకూలమైన స్థలమును కల్పించి, వారిని వారి స్థలములలో నింపుటకు మూడో గంట అయ్యేది. వారు ద్వారములను మూసివేసి మరియు వారిని లోనికి అనుమతించే వారు కాదు. ఏడు అయ్యే వరకు మేము అక్కడ వుండేవారము కాదు, చూశారా. ప్రతి చోట నుండి వేలకొలది వచ్చుచున్నారు, కేవలము…
గతించిన కూటములో నేను ఆఖరి అయిదు రాత్రులు తీసుకొని, వాక్యము చుట్టూ కట్టి, వాక్యము యొక్క శక్తి ఏమిటో తెలుసుకొనుట మొదలు పెట్టాను. చూశారా, ఏలయనగా వాక్యము దేవుడైయున్నాడు, చుశారా. "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు వాక్యము దేవుడై యుండెను… మరియు ఆ వాక్యము శరీరధారియై మనమధ్య నివసించెను."
HEB 4:12
2ఇప్పుడు, దేవుని యొక్క వాక్యము రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండును అని హెబ్రీయులు 4 చెప్పుచున్నది. చూశారా, దేవుని యొక్క వాక్యము వాడిగలదై, ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క ఆలోచనలను తలంపులను శోధించుచున్నది, చూచారా. అంటే అదే… దేవుని యొక్క వాక్యము.
అయితే ఎక్కడయినా మనకు మనము… విశ్రాంతి తీసుకొనుటకు ఏదయినా ఒక వరము ఉన్నయెడల — అది క్రీస్తు, ఆయనే వాక్యము — అది మనలోనికి వచ్చి మరియు మనస్సు యొక్క ఆలోచనలు శోధించుచున్నది, మీరు చూచుచున్నట్లుగా. ఎంత అద్భుతము!
మరియు తరువాత, నాలుగు రాత్రులుగా ఆ వాక్యమును ఆ విధముగా చుట్టూ కట్టుచూ, జనులను నిశ్శబ్దముగాను, విశ్రాంతిగాను ఉండేలా చూస్తున్నట్లుగా నేను అనుభూతి చెందుచున్నాను. మరియు పరిశుద్దాత్మ ఆ జనులను పిలిచి మరియు ఆ జనసమూహములో క్రియలను చేయుచున్నది.
3మరియు తరువాత ఆ చివరి సాయంకాలమున, చివరి ఆదివారపు మధ్యాహ్నము, అమెరికాలో ఎన్నడూ చూడనటువంటి ఒక గొప్ప స్వస్థతా వరుసలను నేను చూచియున్నాను, చూచారా. వారందరూ… నేను బిల్లిని వంద కార్డులతో, మరియు జీన్ ను వంద కార్డులతో, మరియు లియోను వంద కార్డులతో, మరియు రోయ్ ను వంద కార్డులతో, దాదాపుగా ఐదు-వందల కార్డులు ఇచ్చుటకు క్రిందకు పంపించితిని.
మరియు అప్పుడు, వాక్యము పట్టుకొనుటను వారు చూచిన తరువాత, మరియు అది ఏమి చేయును — అప్పుడు తిన్నగా వాక్యము మీద నిలువబడి, ఇప్పుడు — వారిని వేదిక మీదకు తీసుకురండి. మరియు పురుషులు మరియు స్త్రీలు వారి యొక్క చేతి కర్రలు మరి అటువంటివి దూరముగా పారవేయుట నేను చూచియుంటిని, మరియు కనీసము వారు వేదిక యొద్దకు రాక మునుపే స్వస్థత పొందుకొనిరి, కేవలము చూచుటకు…
చూడండి, దేవుని యొక్క వాక్యము అక్కడ నుండి బయటకు వెళ్ళి మరియు వారి యొక్క హృదయములలో వారి హృదయమంతటితో దానిని వారు నమ్మునంతవరకు, ఆ నాలుగు వర్తమానములు (లేదా ఐదు) వర్తమానములలో సేదతీరియున్నది.
అయితే కేవలము వారు చేయవలసిన ఒకే ఒక కార్యము ఏమనగా, ఒక రకమైన చిన్న సంబంధము కలిగి యుండవలసియున్నది, చూచారా, ఏదో ఒకటి లేదా మరొకటి, మరియు అది నిజత్వమైయున్నది.
మరియు వారు ఆ వేదికను తాకినంతలోనే, వారు వేదికపైకి వెళ్ళక మునుపే, అక్కడనే, వెంటనే వారు స్వస్థపరచబడిరి.
4నేను నమ్ముచున్నాను సహోదరుడా… ఇక్కడ, మీరందరు సహోదరుడు ఎడ్ హూపర్ ను ఎరిగియున్నారు, మీరు ఎరిగిలేరా? అక్కడ క్రింద ఆర్కాన్సాస్ నుండి వచ్చిన మీరు? అతను నా ప్రారంభ పరిచర్య యొక్క ఆరంభ భాగములలో అతడు నాతోనే ఉండియున్నాడు. అతను "ఇది పురాతనకాలము యొక్క పరిచర్య వలె కనిపించుచున్నది," అని చెప్పెను. అతను "సంవత్సరముల క్రితము వారు ఉపయోగించే మార్గము వలె యున్నది," అని చెప్పెను.
అక్కడ కణుతులు కలిగియున్నా ప్రజలు ఉన్నారు… అది… ఆలాగు, తిరిగి వచ్చినట్లుగా యున్నది. గ్రుడ్డి, చెవుడు, మూగ, అన్ని రకములైన కార్యములను మన యొక్క ప్రభువు చేసియున్నారు. ఎన్నడూ జనులను తాకనవసరము లేదు, వాక్యము బయలు వెడలి దానిని చేసియున్నది.
అప్పుడు ప్రభువు నాకు ఒక వర్తమానమును ఇచ్చియున్నారు, అది ఎప్పుడయినా అవకాశము వచ్చినట్లయితే, నేను వెనుకకు తిరిగి వచ్చినప్పుడు, ఇక్కడ సంఘములో నేను దానిని మాట్లాడుటకు ఇష్టపడుచున్నాను. ఇప్పుడు నేను తీరిక లేకుండా యున్నాను. నేను మరలా రేపు వెళ్ళవలెను… ఈ బాలిక వచ్చును అని ఎదురు చూచుచున్నాను. మరియు కనీసము నేను నా సూటుకేసు ఇంటిలో పెట్టకమునుపే, అక్కడ మరొకరు ఉండిరి,
చాలా కాలము నుండి, కనీసము నేను సరిగా కూర్చొనలేదు, చూచారా. ఇక్కడ ఉన్నప్పటి నుండి, కనీసము నేను నా కుటుంబముతో సరిగా మాట్లాడలేదు. చూచారా. మరియు ఇది నిజముగా శ్రమవలె యున్నది. మరియు ప్రభువు నాకు సహాయము చేయలాగున మీ అందరి అనుదిన ప్రార్ధనలు నా కొరకు కూడా కోరుచున్నాను.
5ఇప్పుడు….
చూడండి, ఇక్కడ మన యొక్క సహోదరుడు ఈ మంచము మీద, వాస్తవముగా వ్యాధితో పడియున్నాడు. మరియు మనము కొద్దిసేపటిలో లూయిస్ విల్ వెళ్ళుటకు మనకొరకు ఎవరో ఒకరు వచ్చుచున్నారు. ఆ మంచి యవ్వన స్త్రీ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకొనుమని నేను కోరుచున్నాను, ఆమెకు పద్దెనిమిది సంవత్సరముల వయస్సు కూడా లేదు. ఆమె కవలలో ఒకతే మరియు ఆ క్రైస్తవ బాలిక, బడిలో యున్నది.
మరియు మిగిలిన బాలికలు ఆమె గురించి మాట్లాడుకొనుచున్నారు, మీకు తెలుసా — ఆ ఇద్దరు బాలికలు — ఏ విధంగా ఉండేవారో… జీవితములో ఏ భాగమును వారు కోల్పోయారో మరియు మిగతా బాలికలవలె వారు ఎలా జీవించాలో వారికి చెప్పండి మరియు ఒక బాలిక మాత్రము కేవలము దానిని దాటగలిగినది. వేరొక బాలిక అస్పష్టమైన స్థితిలో యున్నది, మరియు దాని గురించి ఆమె నిజముగా బాదపడినది, మరియు కేవలము అలా దూరముగా వెళ్ళుచున్నది, ముందుకు వేగముగా వెళ్ళుచున్నది, మరియు దాని గురించి చింతపడుచున్నది. మరియు చివరిగా ఆమెకు పిచ్చి పట్టినది, ఆమె పిచ్చాసుపత్రిలో వార్డులో యున్నది. రేపు వారు ఆమెను మోడిసన్ (సంస్థ)కు పంపుటకు ప్రయత్నించుచున్నారు, ఆ సంస్థకు వెళ్ళుట కొరకు ఆమె యొక్క తల్లిదండ్రులు కొద్దిసేపటిలో ఇండియానా లోని క్రేన్డాల్ నుండి వచ్చుచున్నారు.
6ఇప్పుడు, ఆ బాలిక… ఆ బాలికలో ఎటువంటి శరీరసంబందమైన బలహీనత లేదు. ఏమీ లేదు. శారీరకముగా ఆమె పరిపూర్ణ ఆరోగ్యముతో ఉన్నది. కానీ దానిని వివరించుట చాలా కష్టము,
మరియు నిజముగా దానిని వివరించజాలము.
మంచిది, అది ఏమిటి, ఆమె ఆత్మ అస్థిరమైన స్థితిలో తిరుగుచున్నది, చూశారా. ఇప్పుడు, మిరు ఆమె యొక్క ఆత్మను పట్టుకొనవలసియున్నది, మరియు దాని స్థానములోనికి తిరిగి తీసుకుని రావలసియున్నది… చూశారా, అక్కడ… ఇక్కడ కొన్ని వారముల క్రితము, ఏ విధముగా మానవ దేహము పనిచేయుచున్నది, నీవు శరీరములోనికి ప్రవేశించుటకు ఐదు ఇంద్రియములు అక్కడ ఎలా వున్నవి అను దాని గురించి మనము మాట్లాడుకున్నాము. మరప్పుడు మనము దానిని — ఐదు ద్వారములు (శాలలు) అని పిలచెదము, ఐదు ద్వారములు — మనస్సు (వివేకము), తలంపు (భ్రమ) మరటువంటి దాని ద్వారా మనము ప్రాణములోనికి ప్రవేశించెదము… మరప్పుడు, నీవు ఆత్మలోనికి ప్రవేశించినప్పుడు, అక్కడ ఒకే ఒక్క ద్వారము మాత్రమే ఉండును, మరియు స్వచిత్తము ద్వారా, అది ఆధారముగా యున్నది, ఆ విధముగానే మనిషి సృజించబడెను.
7మీరు దానిని పొందుకొనవచ్చు, లేదా కేవలము మీరు దానిని వదిలివేయవచ్చు. మీరు క్రీస్తును రక్షకునిగా అంగీకరించవచ్చు, లేదా ఆయనను అలా వెళ్ళనివ్వ౦డి.
మరియు జీవము, మరణములు గల ఆ వృక్షము చెంత నీవు ఇంకను ఉండియున్నావు. ప్రతీ మనుష్యుడు ఆ వృక్షము ముందర పెట్టబడియున్నారు, లేదా ఒకరిని అక్కడ ఉంచి, మరియు తరువాత తప్పొప్పులను ఎంచుకొనుటకు ఇంకొకరికి సమానమైన అవకాశమును ఇవ్వనిచో, దేవుడు అనీతిమంతుడు అగును. మరియు మనలో యున్న ప్రతీ ఒక్కరు ఆ అవకాశము కలిగియున్నారు. ఇంకా దానిలో, ఆ ఆత్మ… మనము స్వస్థపరచబడగలము, లేదా మనము స్వస్థపరచబడలేము. ఇప్పుడు, ఎందుకంటే అక్కడ లేకుండా ఉండుటవలన… దేవునికి సంబంధించినంత వరకు మనము స్వస్థపరచబడలేదు అని కాదు. మనము స్వస్థపరచబడ్డాము, ఏలయనగా, నిబంధన షరతులులేనిది, మరియు ఆయన మన యొక్క స్వస్థతను ఇప్పటికే కొనియున్నాడు. అందుచేత, మన యొక్క స్వస్థత మనకొరకు ఉన్నది. అది మనది. ఇప్పుడు, మనము దీనిని నమ్ముటకు ఈ ద్వారమును తీసుకొందుమా, లేక ఆ ద్వారమును నమ్మకుండుటకు తీసుకొందుమా.
8ఇప్పుడు, దేవుని యొక్క సన్నిధిలోనికి మనము నడచి వెళ్ళుటకు ఆ ఒక్క మార్గము మాత్రమే ఉన్నది. ఇప్పుడు, అందమైన, ఈ బిడ్డ తన తల్లికి ప్రియమైనది — నేను నాకు ప్రియమైన వారిలో ఒకరిగా ఉండేడిది. నిజమైన ఖండితమైన నాజరీను గృహము నుండి కాలము నకు ఆవల బయటకు వచ్చిన, మధురమైన చిన్న బాలిక, ఆమె ఒక మంచి చిన్న స్త్రీ అయి ఉన్నది. మరియు ఆమె ఒక ప్రియమైన భర్తను కలిగియున్నది. ఆమెను వివాహమాడిన ఆ బాలుడు, ఒక మంచి వ్యక్తి, నేను అతడిని కూడా ఎరిగి యున్నాను. మరియు ఆమె కేవలము ఒక చిన్న… వారు ఆ పిల్లలను ప్రభువును సేవించుట కొరకు పెంచియున్నారు, మరియు వారిని పాఠశాలలో వేసియున్నారు, మరియు వారు నిజముగా క్రీస్తులో పునాది వేయబడిరి, తప్పయిన కార్యములు చేయుట కొరకు కాదు. కానీ అక్కడ అది జరిగినది, ఊరకనే ఉన్న సమయములో. కేవలము కొన్ని క్షణముల క్రితము చూచినట్లుగా, ఖచ్చితముగా. వెనుక ఆ చిన్న బాలుడు కూడా అదే కలిగియుండుట నేను రెప్ప వేయకుండా చూచాను. మరియు అక్కడ… ఒక రోజు రాత్రి సహోదరుడు రైట్స్ మరియు ఓర్విల్లి దగ్గరకు మేము వెళ్ళాము, కేవలము పూర్తి విశ్రాంతిలో ఉన్నాము. మీకు తెలుసు, అతడు నన్ను ఇంటి నుండి బయటకు తరుముటకు ప్రయత్నించినప్పుడు, నేను మరియు ఓర్విల్లి చాలా మంచి స్నేహితులము, చూచుటకు నేను అతని తండ్రి వలె ఉంటాను. నేను అతని తల్లి దండ్రులకు వివాహము చేసాను. మరియు అతను, "ఇక్కడి నుండి వెళ్ళు, ఇక్కడ నుండి వెళ్ళు, ఇక్కడి నుండి వెళ్ళు, అని పైకి ఎగిరి గట్టిగా అరిచాడు." చూచారా.
9ఇప్పుడు మేము అక్కడ చేయవలసినదేమనగా, ఆత్మ యొక్క వరుసలోనికి వెళ్ళి మరియు ఆ బాలుని ఆత్మను పట్టుకొనవలసియున్నది, చూచారా. అతని యొక్క చిన్న హృదయమునకు చాలా భాద కలిగినది, మరియు అతను యవ్వనస్తుడు, మరియు అతను చాలా చూచెను. మరియు అతను ఎక్కడ ఉండవలసియున్నదో సరిగ్గా అతడిని తిరిగి అదే స్థానములోనికి తీసుకొని వచ్చెను, మీరు చూచారా. కొన్ని దినములలో అతను బాగపడెను.
ఇప్పుడు దీనిపై నీవు చేయవలసినది, అదే కార్యము. నేను దానిని చూచాను, మరియు ఇది సత్యము అని నేను ఎరిగియుంటిని. కానీ ఇప్పుడు, కేవలము… నేను ఇప్పుడు మీరందరు ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను, ఈ చిన్నబాలికను, ఆమె ఎక్కడ ఉన్నదో ఆమె ఎరుగని స్థితి నుండి, ఆమె యొక్క స్థానమునకు తిరిగి తీసుకు వచ్చుటకు దేవుడు నాకు సహాయము చేయును గాక, మరియు ఆ ద్వారము విశ్వాసము ద్వారా వచ్చును. చూచారా, ఆమె కొరకు ఆమె విశ్వాసమును కలిగి ఉండనేరదు. ఆమె ఎక్కడ ఉన్నదో, ఆమె ఎరుగదు లేదా ఏదయిననూ, చూచారా. ఇక్కడ మనయొక్క విశ్వాసముపై ఆధారపడియుండవలెను.
10మరియు ఇప్పుడు దీనిలో, క్రీస్తు పునరుద్దారణ యొక్క శక్తితో మనకు ఆయన అవకాశమును ఇచ్చుచున్నారు, నేవు ఎక్కడైతే…. ఒక విధముగా దేవుని యొక్క వాక్యము పాపిలోనికి చొచ్చుకుపోవును, మరియు ఇది బయలువెడలుచున్న వాక్యభోదకు ఆవల వెళ్ళవలసియున్నది. ఆ కారణము చేతనే, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్ధి౦చుటకు మునుపు ఈ ఉదయకాలమున నేను కొద్దిగా మాట్లాడగోరుచున్నాను.
కొద్ది కాలం క్రితం, ఆవలి వైపుకు చూచుటను గురించి ప్రభువు నాకు ఇచ్చిన దర్శనము మీకు గుర్తున్నదా? మీకు తెలుసు, ఆ ఉదయకాలమున ఆవలి వైపుకు చూచుటను గురించి నేను సాక్ష్యమిచ్చుచున్నప్పుడు, మీకు గుర్తున్నదా? మంచిది, అది సత్యమైయున్నది. మరియు సంపూర్ణ సువార్త వ్యాపారవేత్తల "స్వరము" (Voice) అనే పత్రిక ఆ వ్యాసమును ముద్రించినది, మరియు ఇక్కడ ఆ పేపరు వెనుక భాగాన ఆ చిత్రమును వేసియున్నారు. మరియు ఇక్కడ ఈ క్రింద భాగములో చిన్నగా బలవంతముగా చేర్చారు, ఇక్కడ, ఈ పరిచర్యను గురించి క్రింద చిన్న భాగములో వ్రాసియున్నారు.
ఇది చాలా విభిన్న భాషలలో ముద్రించబడుచున్న అంతర్జాతీయ పత్రిక, మరియు ఆ దర్శనమును గురించి ఆ మొదటి పేజిని వారు ప్రత్యేకించియున్నారు, చూచారా.
11మరియు ఇక్కడ వాటిని నేను కలిగియున్నాను, మరియు మీరు కూడా ఒకటి తీసుకొనవలెనని మరియు దానిని పొందుకొని, చదువవలెనని నేను ఆశించుచున్నాను. ఇప్పుడు, ఈ ఉదయకాలమున, మీరు సహోదరులారా, ఎంత మంది క్రిందన ఉన్నారో నేను ఎరుగను. అయితే ఒక దానిని మీరు తప్పిపోయిన యెడల, కార్యాలయమునకు వెళ్ళండి, కార్యాలయము యొద్దవారు వాటిని కలిగియున్నారు, మరియు వాటిలో కొన్ని మనము కలిగయుండుటకు ఇవ్వబడినవి. అది "ముందుకు కొనసాగుము," చూచారా, నా హృదయములో ఉన్నదంతా అదే. నేను వినగలుగుచున్నదంతా, "ముందుకు కొనసాగుము," ఆ నదికి ఆవల, ఒక శ్రేష్టమైన భూమి ఉన్నది, మరియు మనందరమూ ఆ భూమిని పొందుటకు ముందుకు కొనసాగెము.
ఇప్పుడు, సహోదరుడు స్టిక్కర్, సహోదరి స్టిక్కర్ యొక్క చిన్నబిడ్డ ప్రతిష్ఠ కొరకై వారు ఇక్కడకు వచ్చియున్నారని నేను తలంచుచున్నాను. సోదరి స్టిక్కర్ ఇప్పుడు, ఎంత మంది ప్రతిష్ఠ కొరకు ఉన్నారు? ఆరుగురు చిన్నపిల్లలు. అది అందమైన చిన్న కుటుంబము.
12మరియు ఈ మధ్యనే ఆఫ్రికాలో వారు మన యొక్క మిషనరీలుగా యున్నారు, తిరిగి వచ్చియున్నారు. మరియు వారి యొక్క పిల్లలంతా అందమైన చిన్నవారు, మరియు ఈ ఉదయకాలమున, ప్రతిష్ఠ కూటమునకు, వారు వారిని పైకి తీసుకొని వచ్చుచుండగా, ఈ బిడ్డను కూడా నేను చూచియున్నాను.
టెడ్డి ఎక్కడ? టెడ్డీ ఒక్క నిమిషం పియానో దగ్గరకు, ఇక్కడకు రాగలవా? కుమారుడా, మనము చిన్న పాటను మన యొక్క పాటను కలిగియుందాము. మీకు తెలియును, "వారిని లోనికి తీసుకునిరండి" అనే చిన్న పాటను మనము పాడుదము అని నేను నమ్ముచున్నాను. అది సరియేనా? పాపపు మైదానముల నుండి వారిని లోనికి తీసుకునిరండి.
మరియు అది… మనము దీనిని వాయించుటకు కారణమేమనగా, తల్లిదండ్రులుగా, మనము కలిగియున్నంతటిలో మనము, కేవలము ప్రతిష్ఠ కొరకు వారిని తీసుకొని వచ్చెదము. మనము వారిని ప్రభువు కొరకు ప్రతిష్ఠ చేయదము, మరియు వారు పసిబాలురుగా ఉండగనే, పాపపు మార్గములో వారు తప్పిపోకుండునట్లు, వారిని లోనికి తీసుకొని వచ్చెదము. "వారిని లోనికి తీసుకొనిరండి," మనమందరమూ కేవలము… టెడ్డీ, నీకది తెలియునా? అయితే దానిలో ఒక వచనమును పాడెదము.
వారిని లోనికి తీసుకొని రండి, వారిని లోనికి తీసుకొని రండి,
పాపపు మైదానములలో నుండి వారిని లోనికి తీసుకొనిరండి;
వారిని తీసుకొనిరండి [వేరొకరు ఎవరయినా ఉన్నచో, ఎందుకు? ఇప్పుడే తీసుకొనిరండి], వారిని తీసుకొనిరండి
చిన్నవారిని యేసు నొద్దకు తీసుకొనిరండి.
వారిని లోనికి తీసుకొనిరండి, వారిని లోనికి తీసుకొనిరండి,
పాపపు మైదానములలో నుండి వారిని లోనికి తీసుకొనిరండి;
వారిని లోనికి తీసుకొనిరండి, వారిని లోనికి తీసుకొనిరండి.
సంచరించువారిని యేసు యొద్దకు తీసుకొనిరండి.
MATT 19:14•
MARK 10:14•
LUKE 18:16
13సహోదరుడా స్టిక్కర్ మరియు సహోదరీ స్టికర్, "వారిని లోనికి తీసుకొనిరండి," అనే పాట యొక్క భావమేమిటో, మీరు ఎరిగియున్నారని నేను గ్రహించియున్నాను. మీ హృదయములో ఉన్న మండుచున్న కోరిక, తప్పిపోయిన వారిని యేసు నొద్దకు తీసుకొని వచ్చుటకు ప్రయత్నించుచున్నది. మీ యొక్క చిన్న పిల్ల, అది ప్రతిష్ఠ చేయబడుటకు మునుపే అది చనిపోయినచో, లేదా ఇంకేమిటి, ఏ విధముగానైననూ అది రక్షించబడినది, ఎందుకనగా యేసుక్రీస్తు యొక్క రక్తము కల్వరి యొద్ద దానిని చేసినది. అయితే ఆయన యొక్క గొప్ప భూసంబంధమైన ప్రయాణము యొక్క సంస్మరణలో, చిన్నవారిపై ఆయన తన చేతులను వేసినప్పుడు, ఆయన "నా యొద్దకు వచ్చుచున్నవారిని ఆటంకపరచకుడి," అని చెప్పెను. అందుకొరకే, ఈ ఉదయకాలమున మీరు బిడ్డను తీసుకొనివచ్చియున్నారు. మరియు ఆ బిడ్డ కొరకు దేవునికి అతని జీవితమును ప్రతిష్ఠించుటకు మేము విశ్వాస ప్రార్థనను ప్రార్థించులాగున, మాలో ఒక నమ్మికను ఉంచండి.
14ఆమె పేరేమిటి? మార్లిన్ మగ్ద. మార్లిన్ మగ్ద స్టిక్కర్. ఆమె వయస్సెంత? పదమూడు నెలలు, ఆఫ్రికాలో జన్మించినది. అది సరియేనా? మంచిది, ఒక వేళ రేపు అన్నది ఉన్నట్లయితే, ఈ చిన్న బిడ్డ ఆమె ఎక్కడయితే జన్మించినదో, అక్కడ ఒక మిషనరీగా ఉండును గాక. మరియు ఒక అందమైన చిన్నబిడ్డ.
నీవు రాగలిగినచో, సహోదరుడా నెవిల్? మార్లిన్. ఓ, మై! ఈ చిన్నవారిని ఎల్లప్పుడూ నేను ఇష్టపడెదను. ఇది ఒక అందమైన చిన్నబిడ్డ కాదా? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఇప్పుడు మనందరము తలలు వంచుదము.
మా పరలోకపు తండ్రీ, మేము ఈ చిన్న మార్లిన్ మగ్ద స్టిక్కర్ ను, నీ యొద్దకు తీసుకొని వచ్చాము, ఆ యొక్క యుద్దపు బూరలు గట్టిగా మ్రోగుచున్నపుడు, ఈ అందమైన చిన్నబిడ్డ ఆ మిషనరీ మైదానములలో జన్మించియున్నది. మీరు ఈ బిడ్డను ఆశీర్వదించుమని నేను ప్రార్థించుచున్నాను. పరిశుద్ధ గ్రంథములో, చిన్నవారి మీయొద్దకు తీసుకొని వచ్చిరి. ఆ చిన్నవారి గురించి మీరు చెప్పియున్నారు, మీరు వారిపై మీ చేతులను పెట్టి, ఆశీర్వదించి యున్నారు. మరియు, "నా యొద్దకు వచ్చుచున్న ఆ చిన్న వారిని ఆటంకపరచకుడి, దేవుని యొక్క రాజ్యము అటువంటి వారిదే," అని చెప్పియున్నారు.
15ఈ రోజు, తల్లిదండ్రులు వారిని మా యొక్క హస్తములలో పెట్టియున్నారు. మేము, విశ్వాసము చేత దూరాన ఉన్న మెట్లు ఎక్కి విశ్వాసము చేత మీ యొక్క హస్తములలో పెట్టుచున్నాము. ఆమె యొక్క జీవితమును దీవించండి. ప్రభువా, ఆమెకు దీర్గాయుషును దయచేయండి, ప్రభువా. ఆమె దేవుని యొక్క బిడ్డగా యుండును గాక. ఆమె యొక్క జీవితమంతయూ ఆమె మీకు సేవచేయును గాక, ఆమె యొక్క ప్రతీ నరము క్రీస్తు యొక్క సేవకునిగా కాలమును తెరకు ఆవల ఉండును గాక. దయచేయుము, తండ్రి.
ఆమె యొక్క తల్లిదండ్రులను, మరియు ఆమె యొక్క చిన్న సహోదరీ సహోదరులను దీవించండి. వారు కూడా ఎదుగుదురు గాక, మరియు దేవుని యొక్క పరిచర్యకు ఒక కృపగల కుటుంబముగా ఉందురు గాక. తండ్రీ, ఒక బలమైన సేవకురాలిగా ఉండుట కొరకు, యేసుక్రీస్తు నామములో మీకు, ఈ చిన్న మార్లిన్ మగ్దను, మేము ఇచ్చుచున్నాము. ఆమెను, ఆమె తండ్రిని, ఆమె తల్లిని మరియు ఆమె ప్రేమించు వారిని, దీవించండి, మీ యొక్క సేవలో వారు ఆనందమైన జీవితమును జీవించుదురు గాక. యేసు నామములో, ఆమేన్.
ఆమె ప్రియమైన ఒక చిన్న స్త్రీ. టెడ్డి బాలుడా, వందనములు. నేను చిన్నపిల్లలను ప్రేమించెదను, మీరు ప్రేమించరా?
16ప్రభువు నాకు ఇచ్చిన దర్శనమును ఎంత మంది వినలేదు? విననివారు, మీ చేతులను పైకి ఎత్తండి. సహోదరుడా నెవిల్, అక్కడ మీ యొక్క చిన్న పుస్తకమును మీరు కలిగియున్నారా? బహుశా, ఇక్కడే, ఒకటి లేదా రెండు క్షణములలో వారి కొరకు మీరు దానిని చదువండి, నేను దానిని నమ్ముచున్నాను… మికిష్టమయినచో ఇక్కడే.
17[సహోదరుడు నెవిల్ చదువుచున్నారు] "క్రిందటి ఉదయకాలమున నేను నా పడక మీద పండుకొనియున్నాను. నేను నిద్ర నుండి అప్పుడే మేల్కొన్నాను, మరియు నేను నా చేతులను నా తల క్రింద పెట్టుకున్నాను, మరియు తలగడపై నా తలను పెట్టి సేదతీరుచున్నాను. అప్పుడు ఆవల వైపు ఏ విధముగా ఉండును అని నేను ఆశ్చర్యపడటం ఆరంభించాను.
"నేను నా జీవితకాలములో సగానికంటే ఎక్కువగా జీవించాను (నా జనుల జీవించినంత కాలము నేను జీవించినట్లయితే) అని నేను గ్రహించాను. ఈ జీవమును విడుచుటకు మునుపు, నేను ప్రభువు కొరకు ఎక్కువ పని చేయగోరుచున్నాను.
ఒక స్వరము చెప్పగా నేను వినియున్నాను, "నీవు కేవలము ప్రారంభములో యున్నావు, పోరాటము చేయుము, సాగిపో."
నేను ఈ మాటలలను గూర్చి ఆలోచించుచుండగా, ఈ మాటలను వినియున్నాను అని నేను ఊహించుకున్నాను అని నేను అనుకోనుచుండగా. మరలా ఆ స్వరము, "పోరాటము కొనసాగించుము. ముందుకు వెళ్ళుచూనే ఉండుము, ముందుకు వెళ్ళుచూనే ఉండుము," అని చెప్పెను.
18ఇంకనూ నమ్మిక యుంచుటలేదు, సాధ్యమైనంత వరకు నాకు నేనుగా ఆ మాటలను పలికియున్నాను అని నేను తలంచితిని. నా పెదవులను నా పళ్ళ మధ్యలో పట్టియున్నాను, మరియు నా చేతిని నా నోటిపై ఉంచి, మరియు విన్నాను.
ఆ స్వరము మరలా మాట్లాడినది: "కేవలము ముందుకు కొనసాగుము. ఆ మార్గము యొక్క చివరన ఏమి యున్నది అని నీవు ఎరిగియున్నచో…"
ఆ పాత ప్రాముఖ్యమైన పాటయొక్క వచనములు మరియు సంగీతమును నేను వినుట తటస్థించినది. "నేను ఇంటి మీద బెంగపెట్టుకున్నాను మరియు నీలముగా అయ్యాను, మరియు నేను యేసును చూడదలచుచున్నాను. ఆ రేవు గంటల సమతాళమును వినుటకు నేను ఇష్టపడుచున్నాను. అది నా మార్గమును కాంతివంతము చేసినది, మరియు అన్ని భయములను పారదోలినది. ప్రభువా కాలమను తెరకు వెనుక దానిని నన్ను చూడనిమ్ము."
అప్పుడు ఆ స్వరము, "తెరకు ఆవల యున్న దానిని నీవు చూడగోరుచున్నావా?" అని అడిగినది.
నేను, "అది నాకు ఎంతో సహాయము చేయును," అని జవాబిచ్చాను.
19ఏమి జరిగినది, నేను చెప్పలేను. నేను నా శరీరములో యున్నానో, లేదొ నేను పరవశములో యున్నానో ఎరుగను. నేను చూచిన దర్శనములన్నిటిలోను వింతగా యున్నది. నేను తీసుకొని వెళ్ళబడిన ఆ స్థలమును నేను చూడగలుగుచున్నాను, మరియు అక్కడ నా పడక మీద నేను జారబడి పండుకుని యుండుటను నేను చూడగలుగుచున్నాను. "ఇది ఒక వింతైన విషయము," అని నేను అన్నాను.
అక్కడ చాలా మంది జనులు ఉన్నారు మరియు వారు పరుగెత్తుకొని నా దగ్గరకు వచ్చారు, ఏడ్చుచున్నారు. "ఓ, మా ప్రశస్త సహోదరుడా?" మొదట ఒక యవ్వన స్త్రీ వచ్చినది, దాదాపుగా ఆమె ఇరువది సంవత్సరముల ప్రాయములో యున్నది. మరియు వారు నన్ను కౌగిలించుకొన్నారు, వారన్నారు, "మా ప్రశస్త సహోదరుడా." యవ్వన పురుషత్వము యొక్క ప్రకాశములో యవ్వనులు, చీకటి రాత్రి యందు మెరుయుచున్న నక్షత్రముల వలె ఉన్న కళ్ళతో, ముత్యముల వంటి తెల్లని పళ్ళతో, "మా ప్రశస్త సహోదరుడా," అనుచూ నన్ను కౌగిలించుకున్నారు.
20అప్పుడు నేను దానిని గమనించితిని, నేను కూడా, తిరిగి యవ్వనముగా మారాను. అక్కడ నన్నునేను చూచుకున్నాను, మరియు తిరిగాను, పడక మీద నా చేతులు నా తలక్రింద పెట్టుకొని పండుకొనియున్ననా పాత శరీరమును వెనుకకు తిరిగి చూచాను. "నేను దీనిని అర్థము చేసుకోలేకపోవుచున్నాను," అని నేను అన్నాను.
నేను ఎక్కడయితే ఉన్నానో అని ఆ స్థలమును అర్థము చేసుకునే ప్రయత్నము చేయుటకు నేను ఆరంభించినప్పుడు, అక్కడ నిన్నగాని మరియు నేడుగాని లేదు అని నేను గ్రహించుట ఆరంభించాను. ఎవ్వరూ అలసిపోవుట కనపడలేదు. నేను ఎన్నడూ చూడనటువంటి అత్యంత అందమైన యవ్వన స్త్రీల యొక్క గొప్ప సమూహము, వారి చేతులను నా చుట్టూ వేసిరి. నేను కనుగొనియున్నాను, అక్కడ గొప్ప ప్రేమ నన్ను మంచివేసినది, మరియు ఈ మానవ స్వభావములో యున్న శరీర ఆకర్షణ లేదు.
ఈ యవ్వన స్త్రీలు అందరూ వారి యొక్క తల వెంట్రుకలు వారి నడుము దిగువ భాగము వరకు కలిగియుండుట నేను గమనించితిని. మరీయు వారి స్కర్టులు వారి యొక్క పాదాళ్ళ వరకు ఉన్నవి.
21దీని తరువాత, హోప్, నా మొదటి భార్య నన్ను కౌగిలించుకున్నది మరియు "నా ప్రశస్త సహోదరుడా," అని అన్నది. అప్పుడు ఇంకొక యవ్వన స్త్రీ నన్ను కౌగిలించుకున్నది, మరియు హోప్ తిరిగి, ఆ యవ్వన స్త్రీని కౌగిలించుకొనినది.
"నేను దీనిని అర్ధము చేసుకోలేకపోవుచున్నాను, ఇది సంపూర్ణముగా మన యొక్క మానవ ప్రేమకు వ్యత్యాసముగా ఉన్నది. ఆ పడక మీద యున్న నా పాత శరీరములోనికి నేను తిరిగి వెల్లగోరుట లేదు," అని అన్నాను.
అప్పుడు ఒక స్వరము నాతో ఇలా పలికినది, నీవు పరిశుద్ధాత్మ ఏమైయున్నదో అని నీవు భోదించినది ఇదే. ఇది పరిపూర్ణమైన ప్రేమ. అది లేకుండా ఇక్కడకు ఏదియు ప్రవేశించనెరదు.
22తరువాత నేను పైకి తీసుకొనబడి మరియు ఒక ఉన్నత స్థలములో
కూర్చుండబెట్టబడితిని. నా చుట్టూ గొప్ప యవ్వనములో యున్న స్త్రీ, పురుషుల సమూహము ఉన్నది. వారు ఆనందముతో కేకలు వేయుచున్నారు, "ఓ, మా యొక్క ప్రశస్త సహోదరుడా, ఇక్కడ నిన్ను చూచుటను బట్టి మేము చాలా సంతోషించుచున్నాము."
నేను అనుకున్నాను, "నేను కలగనుట లేదు, ఏలయనగా, నేను ఈ ప్రజలను చూడగలుగుచున్నాను, మరియు నా శరీరము వెనుక పడక మీద పడియుండుటను నేను చూడగలుగుచున్నాను."
ఒక స్వరము నాతో ఇలా పలికినది: "ప్రవక్తలు వారి జనులతో సమకూర్చబడెదరు అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినది అని మీకు తెలియునా?"
నేను "అవును, లేఖనములలో నేను దానిని గుర్తుచేసుకున్నాను. అయితే వారు ఇంత మంది బ్రన్హాంలు మాత్రము కాదు," అని చెప్పాను.
23ఆ స్వరము, "వీరు బ్రన్హాంలు కారు. వీరందరూ నీ ద్వారా మార్పుచెందినవారు, వారందరిని నీవు ప్రభువు యొద్దకు నడిపించితివి. చాలా అందముగా, యవ్వనముగా ఉన్నారు అని నీవు అనుకొనుచున్న ఈ స్త్రీలలో కొంతమందిని, నీవు ప్రభువు యొద్దకు నడిపించినప్పటికి, తొంబది ఏళ్ళ కంటే ఎక్కువ వయస్సు కలిగియుండిరి. "నా ప్రశస్త సహోదరుడా" అని వారు కేకలు వేయుటలో ఆశ్చర్యము లేదు," అని బదులిచ్చినది.
అప్పుడు సమూహమంతయూ కలసి కేకవేసిరి, "నీవు గనుక ఈ సువార్తతో బయలు వెడలియుండనట్లయితే, మేము ఇక్కడ ఉండెడివారము కాదు."
"ఓ, యేసు ఎక్కడ? నేను ఆయనను చూడగోరుచున్నాను" అని నేను అడిగితిని.
ఆ ప్రజలు ఇలా జవాబిచ్చిరి, "ఆయన ఇంకొంచెము పైన ఉన్నారు. ఒక రోజు ఆయన నీ యొద్దకు వచ్చును. నీవు ఒక నాయకునిగా పంపబడితివి, మరియు దేవుడు వచ్చినప్పుడు, నీ బోధానుసారముగా ఆయన నిన్ను తీర్పు తీర్చును."
"పౌలు మరియు పేతురు కూడా ఈ తీర్పులో నిలవబడవలసియున్నదా?" అని నేను అడిగితిని.
"అవును," అని జవాబు వచ్చినది.
24నేను చెప్పాను, "వారు ఏదైతే బోధించారో దానినే నేను బోధించితిని. నేను దాని నుండి ఈ ప్రక్కగాని, ఆ ప్రక్కగాని మళ్ళించలేదు. ఎక్కడయితే వారు యేసు నామములో బాప్తిస్మము ఇచ్చారో, నేను కూడా అదే చేసాను. ఎలాగయితే వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మము గురించి బోధించారో, నేను కూడా అలానే చేసాను. వారేదయితే బోధించారో, నేను కూడా అదే బోధించాను."
మేము దానిని ఎరిగి యవ్నాము," అని ప్రజలు కేకలు వేసిరి. "ఏదో సమయములో నీతో కలసి తిరిగి మేము భూమి మీదకు వెల్లెదమని మేము ఎరిగియున్నాము. యేసు వచ్చి మరియు నీవు మాకు బోధించిన వాక్యముల ద్వారానే నిన్ను తీర్పు తీర్చును. అప్పుడు, నీవు మమ్ములను ఆయనకు బ్రహుకరించెదవు మరియు మనమందరమూ కలసి తిరిగి భూమి మీదకు, సదాకాలము జీవించుటకు వెళ్ళెదము.
"ఇప్పుడు నేను తిరిగి వెనుకకు, భూమి మీదకు వెళ్ళవలయునా?" అని నేను అడిగితిని.
"అవును, అయితే ముందుకు కొనసాగుము," అని వారు బదులిచ్చిరి.
25ఆ అందమైన, ఆనందకరమైన స్థలము నుండి నేను కదులుట ఆరంభించగానే, నా కన్నులు ఎంత వరకయితే చూడగలుగుచున్నవో అంత వరకు, ప్రజలు నా వైపుకు వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకొనుచూ, "నా ప్రశస్త సహోదరుడా," అని కేకలేయుచున్నారు.
అకస్మాత్తుగా, నేను మరలా తిరిగి పడక మీద ఉన్నాను. నేను, "ఓ దేవా, నాకు సహాయము చేయుము. ఎన్నడూ వాక్యముతో నన్ను రాజీపడనీయకుము. నన్ను తిన్నగా వాక్యముతో ఉండనీయము. ప్రభువా, మిగతా వారు ఏమి చేసినా నాకు అనవసరము. ఆ అందమైన, ఆనంద స్థలములోనికి కొనసాగునట్లు నన్ను ఉండనీయము."
నా జీవితములో ఎన్నడూ లేన౦తగా, ఆ స్థలములోనికి ప్రవేశించుటకు పరిపూర్ణమైన ప్రేమ కావలసియున్నదని నేనెంతగానొ ఒప్పింపబడియున్నాను. అక్కడ ఎటువంటి స్వార్థము, అలసట, వ్యాధి, ముసలితనము, మరణము లేదు; కేవలము మహోన్నతమైన అందము మరియు ఆనందము మాత్రమే ఉన్నవి. హల్లెలూయా! నీవు ఏమి చేసిననూ, నీవు పరిపూర్ణమైన ప్రేమను పొందుకొనినంత వరకు సమస్తమును ప్రక్కన పెట్టుము. ప్రతి ఒక్కరిని ప్రేమించగల చోటికి వెళ్ళుము, ప్రతి శత్రువును సహితము. సమతలమైనది కదులుచున్ననూ, మెరుపులు మెరుస్తున్ననూ, లేదా శత్రువు యొక్క తుపాకీలు నీపై గురి పెట్టబడిననూ ఈ విషయాలు లెక్కకు రావు. పరిపూర్ణమైన ప్రేమను పొందుకొనుము.
నీవు గనుక రక్షింపబడనిచో, ఇప్పుడే యేసుక్రీస్తును నీ స్వంత రక్షకునిగా స్వీకరించుము. నీవు గనుక నీటిలో బాప్తిస్మము పొందుకొనట్లైతే, ఇప్పుడే పొందుకొనుము. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము గనుక నీవు పొందుకొనట్లైతే, ఇప్పుడే దానిని పొందుకొనుము. ఆ పరిపూర్ణ ప్రేమలోనికి కొనసాగి వెళ్ళుము, అది నిన్ను ఒక అందమైన, ఆనందకరమైన, కాలము అను తెరకు ఆవలయున్న స్థలమునకు నిన్ను తీసుకొని వెళ్ళును."
26దానిని మీలో కొంత మంది చదివియుంటారని నేను అనుకొనుచున్నాను. మరియు మీరు గనుక ఆ చిన్న పుస్తకమును కలిగియుండనిచో, ఎందుకు, మీరు దానిని కలిగియుండండి. అప్పుడు ఆ పేజీలోని అడుగుభాగములో, అక్కడ పరిచర్య గురించి ఒక చిన్న దానిని అతడు జొప్పించియున్నాడు. మిరు దానిని గ్రహించారో లేదో నాకు తెలియదు — అడుగుభాగమున, దానిని మీరు చదివిన తరువాత, అడుగుభాగములో, ఒక చిన్నది జొప్పించియున్నారు.
ఇప్పుడు, ఆకాశము క్రింద ఉన్న ప్రతీ భాషలోను చాలా దగ్గరకు వెళ్ళును, మీరు చూచారా, ప్రపంచమంతటా అది చదువబడుటకు వెళ్ళును.
27ఇప్పుడు, ఏమిటి…? మీరు చెప్పెదరు, "సహోదరుడా బ్రన్హాం, మీరు వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుటకు మునుపు, మీరు ఏమి చెప్పెదరు?" దీని వలన ఇది జరిగినది: మన ప్రయత్నములు నిష్ఫలము కాలేదని మీరు ఎరుగవలసియున్నది, చూచారా. మనము ప్రేమ మరియు విశ్వాసము అను మార్గము ద్వారా దేవుని సంధించవలసియున్నది. ఆ మార్గమునకు విశ్వాసము మనలను తీసుకొని వెళ్ళును. అందులోనికి తీసుకొని వెళ్ళునది ప్రేమయే. (నన్ను క్షమించండి.)
ఇప్పుడు [టేపులో ఖాళి స్థలమున్నది] ఇప్పుడు, దేవుడు చేయునని నీవు అనుకొనుచున్నావా (ఇప్పుడు నీ విశ్వాసము ఆ ప్రదేశమునకు వెళ్ళునంతవరకు) … నీవు దాని ఆలోచించుచున్నావా… ఇప్పుడు నీవు ఏమి అనుకొందువు? ఈ గుడారములో మరియు ఇక్కడ ఈ గుంపు ప్రజలందరూ వారి యొక్క ప్రయత్నములన్నిటిని దేవుని యొక్క రాజ్యము కొరకు పెట్టినట్లయితే…?
ఇక్కడ చాలా మంది వారి యొక్క పిల్లలను దేవుని యొక్క రాజ్యము కొరకు ఇచ్చియున్నారు. ఇక్కడ చాలా మంది దేవుని యొక్క రాజ్యము కొరకు వస్త్రములు లేకుండా వెళ్ళిరి. ఇక్కడ చాలా మంది దేవుని రాజ్యము కొరకు ఇక్కడ ఉన్నఈ గుడారమునకు వారి కాళ్ళకు చెప్పులు లేకుండా నడచి వచ్చిరి (అది నిజము) మరియు తుఫానుల గుండా ప్రయాణించి వచ్చిరి.
28నీవు ఉహించగలవా ఒక చిత్రకారుడు ఒక గొప్ప చిత్రమును, అద్భుతముగా ఉండునట్లు అందముగా చిత్రీకరించి, తరువాత దానిని అతడు చింపివేసినచొ? అప్పుడు ఆ చిత్రకారునిలో ఏదో ఒక పొరపాటు యున్నది. నీవు ఉహించగలవా ఒక స్వరకర్త ఒక పాటను అద్భుతముగా కూర్పు చేసిన తరువాత, దానిని అతడు చింపివేసినచో? ఆ స్వరకర్తలో ఏదో ఒక పొరపాటు యున్నది, చూచారా?
దేవునిలో ఎటువంటి తప్పిదము లేదు. దూరముగా పారవేయుటకు మరియు ఈ విధముగా చింపివేయుటకు దేవుడు ఏదియూ చేయలేదు. ఇది ఆయన రాజ్యము కొరకు చేయబడినది. ఇది ఆయన మహిమ కొరకు చేయబడినది. ఈ పాటలోను మరియు ఈ చిత్రములోను మనలో ఉన్న ప్రతి ఒక్కరము ఒక భాగమును పోషించియున్నాము. మనము దేవుని రాజ్యములో భాగములను, మరియు అది, మనము ఈ స్థలములో దేనికి సంబంధించి యున్నామో అక్కడ మనము గ్రహించినంతవరకు, మన యొక్క భాగములను మనము పోషించుదము మరియు తరువాత అక్కడ, ఆ స్థలములోనే నిలచి యుండుము. మనకు తెలిసిన ఒక స్థలము: అది ప్రేమలో యున్నది, ఏలయనగా ఆ చిత్రమును చేయుచున్నది .
29ఇప్పుడు, నీవు ఇటువంటి దర్శనములను మరియు అటువంటి వాటిని చూచినప్పుడు, ఆవలి వైపు ఏమి యున్నదో అర్ధము చేసుకొనుట, చాలా కఠినమైన కార్యము. నేను తెలుసుకోవాలని కోరుచున్నాను. పాతకాలములో ప్రవక్తలు, వారు ఏ విధంగా ఈ దర్శనములను మరియు అటువంటి వాటిని చూచారు అనేది చెప్పుటకై, ఆ వ్యక్తి అక్కడ క్రిందన చిన్న విషయమును జోడించాడు. మరియు ఈ రోజులలో ఆవల ఏ విధంగా ఉన్నదో, మనము దానిని అర్ధము చేసుకొనజాలము. అయితే అది ఏమిటి అనేది చూచేందుకు, ప్రభువు దానిలోనికి మనలను చూచునట్లు, దేవుడు మనలను అనుమతించెను.
ఇప్పుడు, స్నేహితులారా, నేను నిద్రపోలేదు. మరియు కేవలము మీకు మరియు నాకు, ఇక్కడ ఉన్న సంఘమునకు కేవలము మన మధ్యలో ఈ విషయము చెప్పుచున్నాను. నేను దర్శనములో లేను. దర్శనము అనగా ఏమిటో నాకు తెలియును. ఇక్కడ కొన్ని… క్రిందటి వారము, రాత్రి వేళలో దాదాపుగా ముప్పైసార్లు (దర్శనములు చూచుట) జరిగినది. నీ మీద ఉన్న భారమును నీవు ఊహించగలవు. నిశ్చయముగా నిన్ను బలహీనునిగా చేయును.
30అటువంటి కూటమునకు నీవు వెళ్ళినట్లయితే ఏమిటి, కేవలము ఒక బాధ్యత, ఆ కూటము సరిగా జరిగినదా లేదా అనేది నీ మీదనే యున్నది, కేవలము ఒక బాధ్యత. నీవు ప్రతీ పరిచారుకునికి, ప్రతీ ప్రశ్నకు, ప్రతీ దానికి జవాబు చెప్పవలయును, ఆ కూటము సరిగా జరుగుచున్నదా లేదా అని. ఆ బాధ్యత కేవలము నీ ఒక్కడి మీదనే ఉంచబడినది. అది నిన్ను ఏమి చేయునో చూడు. నా సహాయకులు కొందరు ఉన్నారు — వారు కేవలము పుస్తకములు అమ్ముచూ, మరటువంటివి చేయుచున్నారు, అది చాలా బలహీనముగా చేయుచున్నది, వారు గృహమునకు వెళ్ళవలసియున్నది, చూచారా, విశ్రాంతి తీసుకోవాలి. ఆ రాత్రి వారు సంఘమునకు రాలేకపోయినట్లైతే. మై! ఓ, అది భయంకరముగా యుండును.
సుందరమైన చిన్న క్రైస్తవ బాలిక అయిన నా మేనకోడలు, లోయ్సి వలె, కేవలము ఎనిమిది వారములు లేదా ఏడు వారములు నిరంతరముగా కూటమునకు వెళ్ళుచూ ఉండెను, ఒక రోజు లేదా రెండు రోజులు పడక మీద పండుకొనును, చూచారా, ఎటువంటి బాధ్యత లేకుండా. కొన్ని ప్రార్థనా కార్డులను పంచుటకు బిల్లి బయటకు తీసెను, మరియు ఆమె వాటిని ముక్కలుగా చి౦పివేసెను.
అయితే, చూచారా, బరువు అంతయూ (బాధ్యత) నా మీదనే యుండును. నా కొరకు ప్రర్ధించమని నేను మీ మీద ఆధారపడియున్నాను, చూచారా. ఇది కాకుండా, వారు ఇరువది నిమిషములు అభిషేకముతో (ఆత్మ ప్రేరణతో) బోధించుట అనునది ఎనిమిది గంటలు కఠినమైన పని చేయుటతో సమపోల్చిరి. ఒక రాత్రి నేను రెండు లేదా మూడు గంటలు బోధించెదను, కొన్నిసార్లు రోజుకు మూడు సార్లు బోధించెదను, చూచారా.
MATT 9:20•
MARK 5:27,30•
LUKE 8:44,46
31మరప్పుడు ఒక దర్శనము గురించి ఏమిటి? ఒక దర్శనము మన ప్రభువైన యేసును బలహీనునిగా చేసినది. అది సరియే. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగును తాకెను, అది ఆయనను బలహినుని చేసినది. మంచిది, దేవుని కుమారుడైన ఆయనను, ఒక దర్శనము ఆయనను బలహీనునిగా చేసినచో, కృప చేత రక్షించబడిన పాపినైన నా పరిస్థితి ఏమిటి? ఒక రాత్రిలో ముప్పై దర్శనములు ఏమి చేయును?
చూచారా, మనము ఒకసారి ఆగి ఆలోచించినట్లయితే, ఏ మనిషికైనా అది అసాధ్యము, ఒక మనుష్య శరీరము దానిని తాలజాలదు. ఎక్కడయినా ఒక పిచ్చాసుపత్రిలో నేను నా తలను గోడలకు కొట్టుకొనుచూ ఉండవలసినది, చూచారా. అది నీవు భరించలేనటు వంటి ఒక బలహీనత… ఇది లోపట ఉండు బలహీనత, చూచారా, అది నిన్ను చంపివేయును. ఇప్పుడు, అయితే ఇప్పుడు నీవు దేనికొరకు కొనసాగెదవు?
నేను ఇది చెప్పవచ్చును. సహోదరుడు మరియు సహోదరి కాక్స్ ను, రాడ్నీను, అతని భార్య నేను మరియు సహోదరిని మరియు ఆ వెనుక యున్న క్రొత్తగా మారిన వారిని నేను చూస్తున్నాను. ఎక్కడో ఆవల అక్కడ ఒక స్థలమున్నది, నీవు నీ మనస్సులు దాని గురించి ఆలోచించి దాని చిత్రమును నీవు చుచినట్లైతే, అది గొప్ప మహిమకరమైన విషయము. దానికొరకు మనము తీసుకొనుచున్న ప్రతి యొక్క భారమునకు అది యోగ్యత కలిగియున్నది, చూచారా.
32ఇప్పుడు, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుటకు ముందు, ఇది నేను చెప్పవచ్చును: చిన్నబిడ్డ జన్మించుటకు మునుపు…? దానిని తీసుకుందాం. ఒక చిన్నబిడ్డ ఈ తొమ్మిది నెలలు తల్లి యొక్క గర్భములో నివసించెను, మరియు ఆ చిన్నబిడ్డ ఆలోచించ వచ్చును, అది చెప్పవచ్చును, "ఏమిటో నీకు తెలుసా? నేను జన్మించబోవుచున్నాను అని వారు నాకు చెప్పుచున్నారు. మంచిది, అక్కడ నేనేమి చేయుదును. నేను జీవించుచున్న ఈ స్థలము తప్ప నాకు ఏమియూ తెలియదు. లోపటి నుండి శక్తిని నా కొరకు పొందుకున్నాను, మరియు అక్కడ నేను ఎలా జీవించగలను?
"అక్కడ ఒక సూర్యుడు ప్రకాశించును అని వారు నాకు చెప్పారు. అక్కడ ఉన్న ప్రజలు చుట్టూ నడిచెదరు అని వారు నాకు చెప్పారు, మరియు కేవలము ఇక్కడ యున్న ఈ స్థలము తప్ప నాకు ఏమియూ తెలియదు. మరియు నా తల్లి గర్భములో నాకు తెలిసినదంతా ఇదే. ఇక్కడికే, నేను లోపటికి తీసుకొని రాబడితిని, ఇక్కడ గర్భములో నేను ఎరిగినదంతా ఇదే మరియు, అక్కడ కావలసినంత స్థలము యున్నది అని వారు నాకు చెప్పుచున్నారు."
ఎందుకు, ఆ చిన్న బిడ్డ జన్మించుటకు మరణమగునంతగా భయపడెను. అది సరియేనా? అది మరణమగునంతగా భయపడును, ఏలయనగా దాని గురించి ఏమియూ తెలియని ఒక స్థలమునకు అది రాబోవుచున్నది. ఎక్కడైతే అది జీవించబోవుచున్నదో, అది సర్వశ్రేష్టమైనది, మిలియన్ రెట్లు సర్వశ్రేష్టమైనది. అదంతయూ ఏమిటో దానికి తెలియదు. అది చెప్పవచ్చును, "నేను ఏమి చేయబోవుచున్నాను?" జన్మించుటకై అది మరణమగునంతగా భయపడుచున్నది.
అయితే ఇక్కడ జీవించుచున్న మనము… ఎందుకు, మనము కూడా, ఒకానొకసారి వెనుక అక్కడ ఉన్నాము. ఏమి చేసిననూ మనము అక్కడకు తిరిగి వెళ్ళజాలము. మనము మరలా తిరిగి వెనుకకు తల్లి గర్భములో వెళ్ళవలెనని కోరుకొనము, చూచారా. లేదండి. మనము దానిని చేయుటకు ఇష్టపడము.
33మరియు స్నేహితులారా, మనము చనిపోవుచున్నప్పుడు అది ఆ విధముగానే ఉండును. ఓ దేవా! చూచారా, నీవు ఒక స్థలములోనికి జన్మించనైయున్నావు. ఇది వరకు నీవు అక్కడ ఉండియుండ లేదు. అది ఎంత గొప్పది అనేది, నీవు అర్ధము చేసుకొనజాలవు. అక్కడ అది ఎలా ఉండబోవుచున్నది? నేను. నేను గుర్తించులాగున చేయునది ఒకే ఒక కార్యము, అది జీవము యొక్క చిన్న తాకిడి — ఆ ఆత్మ తల్లి గర్భములో ఉన్న బిడ్డలోనికి వచ్చుట వలె ఉన్నది.
చూచారా, ఆవల ఉన్న ఆ గొప్ప స్థలము అది ఏమిటి అని మనము అర్ధము చేసుకొనుటకు ఉన్న ఒకే ఒక మార్గము అదియే. అక్కడ వ్యాధి లేదు, విచారము లేదు, మరణము లేదు, వృద్ధాప్యము లేదు, ఏది ఏమి లేదు. ఓ, మై! ఎందుకు, నీవు ఒక్కసారి అక్కడికి వెళ్ళినట్లయితే, ఇటువంటి స్థలమునకు మరలా తిరిగి వచ్చుటకు నీవు ఎన్నడూ ఇష్టపడవు, ఒక బిడ్డ తన తల్లి గర్భము లోనికి మరలా వెళ్ళుటకు ఏ మాత్రమూ ఇష్టపడదు, చూచారా.
తెర ఆవల అది చాలా గొప్పగా యున్నది, చూచారా, ఆ వైపు. మనము దానిని అర్థము చేసుకొనలేము. నిశ్చయముగా చేసుకొనలేము. మనము అర్థము చేసుకొనలేము. ఎందుకు, అది ఎలా…? ఆ చిన్న బిడ్డ తలంపునకు అది ఎలా మించి యున్నదో. అదే విధంగా, అక్కడ ఏ విధంగా ఉన్నది అని అర్ధము చేసుకొనుటకు అది మన తలంపునకు అందకుండా ఉన్నది, చూచారా, ఏలయనగా మనము భూమి యొక్క గర్భములో ఉన్నాము, ఒకానొక సమయములో మనము ఒక నూతన ప్రపంచములోనికి, ఒక నూతన రాజ్యములోనికి జన్మించుటకు సిద్ధముగా ఉన్నాము.
1COR 2:9
34ఆ విధముగానే ఆ దర్శనములు మరియు అలాంటి విషయముల గురించి నేను అనుకుంటున్నాను, లేదా నేను ఆవలి వైపునకు దాటి వెళ్ళినప్పుడు, ఆ రోజు నాకేధైతే జరిగినదో మరియు అది ఏమిటో అని చూచిన తరువాత ఇక్కడకు తిరిగి వచ్చితిని. ఒక పసిబిడ్డవలె ఉండి, మరియు ఏమిటి అనే జ్ఞానం కలిగి ఉండి, చుట్టూ తిరుగుట ఎలా మహిమకరముగా యున్నదో, మరియు ఆ చెట్లు వికసి౦చుట, ఆ పక్షులు పాడుచుండుట, సూర్యుడు ప్రకాశించుట, మరియు ఇటువంటి ఒక జీవితమును చూచిన తరువాత ఆ గర్భములోనికి నిర్భందించబడుట. మీరు ఊహించగలరా? ఎందుకు, నీవు తిరిగి వెనుకకు వెళ్ళుటను ఏ మాత్రమూ నీవు కోరుకొనవు.
మంచిది అయితే, "ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు," అని లేఖనము చెప్పినప్పుడు, మనము మన యొక్క ఆలోచనను, ప్రక్కన ఉంచి లేదా అక్కడ ఏమిటి ఉన్నది అనే దాని గురించి ఆలోచించుటకు ప్రయత్నము చేయుదము, చూచారా. కాబట్టి ఆవల వైపున ఇది మహిమకరముగా యున్నది అని మనము ఎరిగి యున్నాము. ఒకానొక రోజు మరణము — మరణము అని మనము పిలుచునది — మనకు నూతన జన్మను ఇచ్చును, తరువాత ఆవలవైపున ఉన్న వేరొక ప్రపంచములోనికి మనము వెళ్ళెదము.
35సహోదరుడా జార్జ్, అక్కడ మీరు ముసలివానిగా మరియు వికలా౦గునిగా ఉండవు. మరియు సహోదరుడు మరియు సహోదరి స్పెన్సర్, మరియు మనలాంటి వయస్సు మీద పడిన వారు మరికొందరు మరి అటువంటివారు, అక్కడ మనము నిరంతము యవ్వనముగా ఉండెదము. ఈ ముసలితనము.. శరీరమను ఈ వస్త్రమును నేను విడిచెదను, మరియు లేచెదను, మరియు ఎన్నటికీ నశించని బహుమతిని స్వాధీనము చేసుకొందును, మరియు గాలిలో పయనించునపుడు, "వీడ్కోలు, వీడ్కోలు, మధురమైన ప్రార్ధనా ఘడియ," అని కేకలు వేయుదును. ఇప్పుడు అంతా ముగించబడినది. రాత్రులు దీర్ఘ ప్రార్థనలు ఇక ఉండవు, ఇక ఉండవు… కేవలము అక్కడ యున్న ఆ యవ్వన, సంతోషకరమైన వయస్సులోనికి ప్రవేశించెదము, అది కేవలము ఒక సంవత్సరమునకో లేదా ఏబది సంవత్సరములకో లేదా ఒక మిలియను కాదు — మనము వందల బిలియనుల సంవత్సరములు అక్కడ ఉన్నప్పుడు, మనము ఇంకనూ మొదలు పెట్టనట్లుగానే ఉండును. అది సత్యము.
కావున ఎందుకు మనము ఈ ఉదయవేళలో ఆనందముగా ఉండకూడదు? మనమెందుకు సంతోషముగా ఉండకూడదు? దేవుడు మనకు దయచేసిన ప్రతీ గొప్ప కార్యము గురించి మనము ఎందుకు ప్రయోజనము పొందకూడదు?
ISA 53:5•
1PET 2:24
36ఇక్కడ దైవిక స్వస్థతయున్నది. యేసు ఎందుకొరకు గాయపరచబడెను? పటమును చింపివేసి మరి అటువంటి కార్యము ఏదీ లేదు అని చెప్పెదవా? అక్కడ క్రింద ఆయన తన శరీరమును గాయపరచుకున్నాడు… ప్రక్కటెముకలు బయటకు కనబడుచున్నవి, తన గాయముల చేత, మనము స్వస్థపరచబడితిమి. మనము ఈ ఉదయకాలమున ఆ పటమును చింపివేయవద్దు. దానిని అంగీకరించి, కౌగిలించుకొనెదము.
సహోదరులారా, ఇప్పుడు ప్రార్థించబడు మీలో ప్రతీ ఒక్కరు, మీరు గనుక బలిపీఠము చుట్టూ నిలుచుండినచో… కొన్ని క్షణముల క్రితం, భాషలు మరియు అనువాదము ద్వారా ఈ వర్తమానము బయలు వెడలినప్పుడు, మేము రోగుల మీద చేతులుంచెదము మరియు దేవుని యొక్క బలమైన కార్యములను చూడండి. ఇప్పుడు, మన యొక్క సహోదరుడు, ఆ మంచముపై పడియున్న సహోదరుడా, నీవు నిలబడవలసిన అవసరములేదు. మేమే నీ యొద్దకు వచ్చెదము.
అయితే ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఈ బలిపీఠము చుట్టూ నిలుచుండి ప్రార్ధి౦చబడవలయును అని ఇష్టపడినయెడల, నేను మరియు సహోదరుడు రోగులపై చేతులుంచినప్పుడు, ఇప్పుడే తక్షణమే మీరు రండి. మరియు గుర్తుంచుకొనండి, ఆ పటమును కౌగిలించుకొనుడి, ఆయన గాయముల ద్వారా మనము స్వస్థపరచబడితిమి.
"ప్రభువా, ఇది నాకు అర్ధము కాలేదు."
నిశ్చయముగా నీకు అర్ధము కాలేదు. నీవు ఇంకనూ భూమి యొక్క గర్భములోనే యున్నావు. అయితే ఆయన ఆ సన్నాహములన్నిటిని సిద్దపరచియున్నాడు, మరియు ఆయన తీసుకొనలేదు…
37ఆయన ఎందుకు గాయపరచబడెను? కేవలము ఆ పటమును (చిత్రమను) చింపివేయుటకా లేదా ఆ పాటను చింపివేసి, దానిని అవతలికి పారవేయుటకా? లేదండీ. మనము స్వస్థతనొందుటకై ఆయన కొట్టబడి, గాయపరచబడి, మరియు రక్తము కార్చెను. మరియు ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థతనొందితిమి.
ఇప్పుడు, మీరు వచ్చుచున్నప్పుడు, ప్రార్థన కొరకు బలిపీఠము చుట్టూ కూడియున్నారు… ఇప్పుడు, ఇక్కడ చాలా గొప్ప ఉన్నతమైన ఆమెరికా సువార్త పరిచర్యలో వారు ఇది చేయవలెను, అది చేయవలెను అని చెప్పెదరు. నా స్నేహితుడా, ఇక్కడ ఒక విషయములో నీతో నేను నిజాయితీగా ఉండాలని కోరుచున్నాను. దేవుడు స్వస్థపరచు విధానము ఆయనకు మనము చేసే పరిచర్య మీద ఆధారపడి ఉంటుంది, చూచారా. అది ఆయనకు చేసిన పరిచర్య మీద ఆధారపడి ఉంటుంది. మేము స్వస్థపరచబడిన తరువాత మేము ఆయనను సేవించెదము అను దాని మీద ఆధారపడి, మన యొక్క స్వస్థతను మనము తప్పనిసరిగా అంగీకరించవలెను.
JAS 5:16
38ఇప్పుడు, పరిశుద్ధ గ్రంథములో, "మీరు స్వస్థపరచబడులాగున, ఒకరికొరకు ఒకరు ప్రార్థించుడి, ఒకరితో ఒకరు మీ తప్పిదములను ఒప్పుకొనుడి," అని చెప్పబడియున్నది, చూడండి. ఇది మీరు దేవుడిని సేవించు విధానముపై ఆధారపడియున్నది. బహుశా, ఇక్కడ ఉన్న మీలో చాలా మంది, చనిపోవు స్థితిలో యున్నారు, మరియు ఏదో ఒకటి జరుగనట్లయితే మిరు తప్పనిసరిగా చనిపోవలెను. అప్పుడు మీ యొక్క హృదయములో, నేను కోరుచున్నాను…
ఇప్పుడు, మేము మిమ్ములను నూనెతో అభిషేకించవచ్చును. మేము మీ కొరకు ప్రార్ధించవచ్చును, మీ పాస్టరు, మరియు నేను విశ్వాస ప్రార్థనను ప్రార్థించెదము, చేయగలిగినదంతయు చేయుదము. అయితే మీకు మీరుగా క్రీస్తుతో సహవాసములోనికి ప్రవేశించనంత వరకు అది ఏ మంచి చేయదు, చూచారా. "నేను, ప్రభువు," అనే ఆ సహవాసమునకు మీరు రావలసియున్నది.
ఇప్పుడే అక్కడికి ఒక యవ్వన స్త్రీ నడచుకుంటూ వచ్చుట నేను చూచాను. ఆమె కొంతసేపటి క్రితం ఏదో ఒక కణితి వంటి దానితో లేదా కణితి రోగముతో ఇక్కడకు వచ్చినది. మరియు విశ్వాస మూలముగా ఆమె ఒక మెతడిస్టు. ఆమె అది సరియేనని నేను నమ్ముచున్నాను, సహోదరీ, అది సరియే కదా? మరియు ఆమెకు ఒక ప్రక్కన ఒక పెద్ద కణితి యున్నది. మరియు ఇప్పుడు అక్కడ ఆమె స్వస్థపరచబడి నిలిచియున్నది.
39ఇక్కడ సహోదరి వీవర్ నిలువబడియుండుట నేను చూచుచున్నాను, నా జీవితమంతటిలో నేను చూచిన క్యాన్సర్ కేసులలో ఇది భయంకరమైనది. మరియు నేను ఆమెను అడిగిన మొదటి విషయము, నీ పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు యొక్క నామములో బాప్తిస్మము పొందుకొనెదా అని. ఇక్కడ ఈ నీటిలోనికి నేను ఆమెను తీసుకొనివచ్చినప్పుడు, నేను పట్టుకొనవలసివచ్చినది, ఆమె చాలా సన్నగా యున్నది, ఆమె యొక్క చేతులు చాలా సన్నగా ఉన్నవి. మరియు ఆమె యేసుక్రీస్తు యొక్క నామములో బాప్తిస్మము పొందినది, మరియు అది సుమారుగా పది సంవత్సరముల క్రితం, అంతే కదా, సహోదరీ? పదహారు సంవత్సరముల క్రితం. పదహారు సంవత్సరము కాపాడబడిన జీవితము, ఎందుకనగా చాలా ప్రసిద్ధి చెందిన వైద్యులు ఇక్కడ చుట్టూ ఉన్నప్పుడు, ఆమె విధేయతలోనికి వచ్చుటకు ఇష్టపడినది.
ఎందుకు, ఆమె యొక్క సొంత వైద్యుడు నాకు చెప్పియున్నాడు. నేను ఆయనకు చెప్పితిని, "ఆమె స్వస్థపరచబడినది."
REV 22:17
40"ఓ, కొద్ది వారములలో ఆమె కాన్సర్ తో చనిపోవును. దాని గురించి చింతించవద్దు. ఆమె వెళ్ళిపోవును. ఇంకా కొన్ని వారములలో, ఆమె వెళ్ళిపోవును," అని చెప్పెను. మరియు ఇప్పటికే అతడు ఆమె కేవలము ఒక దినమే జీవించును అని చెప్పెను, మరియు ఈ రోజు ఆమె ఇక్కడ పదహారు సంవత్సరముల తరువాత బలిపీఠము యోద్ధ నిలువబడియున్నది. నేను ఇంకేమి చెప్పగలను, మరలా, మరలా మరియు మరలా.
ఇప్పుడు, దేవుడు కేవలము ఆయన పిల్లలలో ఒకరికే దానిని చేసి, మరియు వేరొక పిల్లలకు దానిని చేయకుండా ఉండడు. ఆయన తన పిల్లలందరి కొరకు దానిని చేయును. ఇచ్చయించు వానిని, రానిమ్ము. ఆయన యొద్దకు మీరు ఆహ్వానితులు. ఇప్పుడు, విశ్వాసముతో కూడిన ప్రార్ధన రోగిని స్వస్థపరచును. దానిని పరిశుద్ధ గ్రంథము చెప్పినది.
ఇప్పుడు… మీరు ఏమి చేయవలెనని నేను కోరుచున్నాననగా, మీ తప్పిదములను దేవుని యొద్ద ఒప్పుకొనుడి, మరియు చెప్పండి, "ప్రభువా, నన్ను స్వస్థపరచుము." మీరు ఇంతవరకు మార్పు చెందనియెడల, మీ యొక్క హృదయములను క్రీస్తుకు ఇవ్వండి. మరియు మిరు ఇంతవరకు యేసుక్రీస్తు నామములో నీటిలో బాప్తిస్మము పొందనియెడల, అక్కడ నీటి కొలను సిద్దముగా యున్నది.
41ఆ విధి చివరన నివసించుచున్న ఈ చిన్న స్త్రీ, ఆ నాస్తికురాలు దాని చేత మార్పునొందియున్నాది — ఆమె పడియున్నది… టిబీ చేత చనిపోవుచున్న ఆమెను వారు సిల్వర్ క్రెస్ట్ నుండి తన గృహమునకు పంపివేసిరి. మరియు నేను అక్కడకు
వెళ్ళినప్పుడు మరియు ప్రభువు నాకు ఒక దర్శనమును ఇచ్చెను, "ఆమె స్వస్థపరచబడనై యున్నది," అని చెప్పెను. ఆయన మరుసటి ఉదయకాలమున అక్కడ నన్ను కలుసుకొనిరి, ఆండ్రూస్ గారు, "ఆ స్త్రీ మీద అలాంటి ఒక తప్పుడు నిరీక్షణ కలిగియున్నావు" అని గట్టిగా అరచి నాకు చెప్పెను.
"ఆండ్రూస్ గారు, ఇది ఒక తప్పుడు నిరీక్షణ కాదు. ఆ స్త్రీ ఒక క్రైస్తవరాలు, మరియు ఆమె వలన అయినప్పుడు, ఆమె బాప్తిస్మము తీసుకొనబోవుచున్నది," అని నేను చెప్పాను
మరియు అతడు చెప్పెను, "ఆమె చనిపోవుచున్నది." "సిల్వర్ క్రస్ట్ నుండి ఎలా ఆమె గృహమునకు పంపబడినది," అని చెప్పెను.
నేను చెప్పాను, "అయ్యా, మీరు ఏమి చూస్తున్నారు, వైద్యుడు ఏమి చెప్పుచున్నాడో అను దాని వైపు మీరు చూచుచున్నారు. నేను దేవుడు ఏమి చెప్పుచున్నాడో అనే దాని వైపు చూచుచున్నాను," చూచారా. వైద్యుడు ఏమి చెప్పుచున్నాడో అను దానివైపు నీవు చూచినట్లయితే, నీవు నిశ్చయముగా చనిపోయెదవు, అయితే దేవుడు ఏమి చెప్పుచున్నాడు అనే దానివైపు నీవు చూడవలసియున్నది. ఎవరి మాట నీవు తీసుకొనెదవు?
ROM 4:3,22
42అతడు వంద సంవత్సరముల వయస్సు కలిగియుండి, తొంబది యేళ్ళ వయస్సు గల తన భార్య ఒక బిడ్డను కననైయున్నది అని అబ్రహాము వైద్యుని అభిప్రాయము తీసుకున్నట్లయితే, ఏమగును? అప్పుడు అతడు ఏమి చేయును? చూచారా?
ఎందుకు, బహుశా వైద్యుడు "ఆ మనిషి పిచ్చివాడు," అని చెప్పి యుండవచ్చును. అయితే, దేవుడు అతనికి నీతిగా ఎంచెను, ఎందుకనగా అతడు దేవుని నమ్మెను. చూడండి.
మరియు ఆ స్త్రీ జీవించెను. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుకొనుటను ఆమె నిర్లక్ష్యపరచెను, ఎందుకనగా, ఆమె ఒక రకమైన మెతడిస్టు లేక ప్రెస్బిటేరియన్ అని నేను అనుకొనుచున్నాను. ఆమె ఇంకనూ ఇంకనూ రోగస్తురాలాయెను, మరియు ఆమె వచ్చి అక్కడ నివసించుచున్న గ్రేస్ వెబర్ను కనుగొనినది, అతడు అక్కడ నివసించెను… ఆమె కూమార్తె నివిసించుచుండెను. ఇక్కడకు వచ్చి నూట నాలుగు డిగ్రీల జ్వరముతో, ఆమె భుజములనిండా చిదిగిన గడ్డల వ్యాధితో, జ్వరముతో యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందెను. మరియు యేసుక్రీస్తు యొక్క నామములో ఇక్కడనే బాప్తిస్మము పొందుకున్నది. మరియు ఆమె మన నుండి ప్రక్క వీధిలో నివసించుచుండెను — బహుశా ఇప్పుడు ఇక్కడనే కూర్చొనియున్నాది. కొద్ది నిముషముల క్రితం ఆమెను కనుగొనుటకు చుట్టూ చూచాను.
43విధేయత, మీరు చూడండి. ఇది కేవలము చుట్టూ వెళ్ళుట కాదు… కొంత మంది మన యొక్క సహోదరులతో నేను విభేదించుచున్నాను. కేవలము దాని మీద, దీని మీద మరియు ఆ విధమైన ఇంకొక దాని మీద చేతులు ఉంచి, మరియు ఒక రకమైన అత్యద్భుత విశ్వాసము దానిని చేయును అని చెప్పెదరు. ఇది అది కాదు. నిజమైన, ధృఢమైన, బైబిల్ యొక్క, పరిశుద్ధాత్మ, విశ్వాసమును నీవు కలిగియుండవలయును. నీవు అది కలిగి లేనియెడల, అది కొనసాగదు. అది కొనసాగలేక పోవుచున్నది.
ఆ కారణం చేతనే, ఆయన ఇప్పటి వరకు నాకు సహాయము చేసిన దానిని బట్టి నేను ప్రభువునకు కృతజ్ఞతలు చెప్పవలయును. జరిగియున్న స్వస్థతలు అన్నియూ నిజమైనవి, ఎందుకనగా అవి అన్నియూ నిజముగా "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అన్న దానిపై కట్టబడెను. అందువలన అవి నిలిచియుండును.
ఇప్పుడు ఆ చిన్న ఆదివారపు పాఠశాల… నేను కేవలము ఒక్క నిమిషము వేచియున్నాను, వారు వారి యొక్క స్థానములను తీసుకొనువరకు నీతో మాట్లాడుచున్నాను, కావున ఇప్పుడు మనము నిశ్శబ్దముగా ఉండవలయును. మనము కేవలము రెండు నిముషములు కలిగియున్నాము, మనము ప్రార్థించుట ప్రారంభించెదము.
44మీలో ప్రతి ఒక్కరు మీ యొక్క తప్పిదములను దేవుని యొద్ద ఒప్పుకొని, మరియు మీరు ఆయనను సేవించెదరని దేవునికి ప్రమాణము చేయుడి, మీరు చేయగలిగినదంతయూ చేయవలెనని నేను కోరుచున్నాను. మరియు, పాస్టర్ గారు మరియు నేను వచ్చి మీపై చేతులు వేసి ప్రార్థించెదము, మరియు మీరు నమ్మినయెడల నిశ్చయముగా మీరు స్వస్థపరచబడెదరు.
ఎలా ఆ చేతి కర్రలపై ఉన్న జనులు మరియు మూగ, చెవుడు మరియు గ్రుడ్డివారు, గత ఆదివారపు మధ్యాహ్నము కేవలము ఆ వేదిక మీదకు నడిచి వెళ్ళి, వారి యొక్క చేతి కర్రలు విసిరివేసి వేదిక వరకు నడచిరి మరియు కళ్ళు తెరువబడెను. ఆ విధముగా జరిగెనని, మీకు తెలియునా? వారిలో వందల మంది, వందల సార్లు — నేను చాలా బలహీనముగునంత వరకు, కేవలము నిలబడి వారు దాటి వెళ్ళుచుండగా, నేను దాదాపుగా ఈ స్థలము నుండి సర్దుకొని రావలసివచ్చెను, చూచారా. ఒక వరుస ఇక్కడ నుండి జెఫర్సన్ విల్ ఉన్నత పాఠశాల వరకు అదే వరుస తీరియున్నది. వరుసలో రండి, మరియు ఒకవేళ వారిలో ఒకరు దాటి వెళ్ళినచో, నాకు తెలియదు, అయితే స్వస్థపరచబడినది, ఏలయనగా వారు నిజమైన, స్వచ్ఛమైన క్రైస్తవ విశ్వాసము మరియు నమ్మిక మూలముగా వచ్చియున్నారు. అది జరుగవలసియున్నది.
ఇప్పుడు, ప్రతీ ఒక్కరు మీ తలలు వంచి మరియు వారి కొరకు ప్రార్థించుటకు నాకు సహాయము చేయండి.
45ప్రభువైన యేసు, వ్యాధితో, బాధించబడి, వేదించబడిన పిల్లలతో ఇక్కడ నిలచియున్న ఈ శ్రోతలను ఈ ఉదయకాలమున మేము మీ యొద్దకు తీసుకొని వచ్చుచున్నాము. ప్రభువా, వారిలో చాలా మంది, వారు వైద్యుని చికిత్స వలన, ఎటువంటి నిరీక్షణ లేకుండా, మరి ముఖ్యముగా ఈ వ్యక్తి ఇక్కడ ఈ మంచము మీద పడియున్నాడు. ఇది మీ యొక్క కృప లేదా అతడు కొద్ది దినములలో లోకములో నుండి బయటకు వచ్చును. మరియు చీల్చివేయుచున్న వ్యాధులతో, బాధలతో యున్నవారు మరియు గుండె పోటులతో యుండి ఎదురుచూచుచున్న వారు కొంత మంది ఇక్కడ ఈ బలిపీఠము యొద్ద నిలువబడి ఉన్నారనుటలో ఏమాత్రము సందేహము లేదు.
ఇక్కడ ఒకే ఒక్కటి ఉన్నది, తండ్రీ, ఇక్కడ ఈ శరీరం యొక్క ఐదు ఇంద్రియములు దాటి ఆవలకు వెళ్ళిన వారిని అది రక్షించగలదు, వారి యొక్క జీవితమును రక్షించుటకు వైద్యులు నమ్ముకముతో ఎటువంటి సందేహము లేకుండా ప్రయత్నించిరి. వ్యాధులు, కాన్సర్, టీబీ, గుండె సమస్య మరియు అన్ని అతుకులతో, గొట్టాలతో మరియు వస్తువులతో, మరియు క్రిమితో పోరాడే మందులతో, ప్రయత్నించిరి, శత్రుమూకలు వారి యొక్క జీవమును తీసుకొనుటకు లోనికి వచ్చెను.
మరియు ప్రభువా, నేను వ్యక్తపరచితిని, వారిపట్ల మీరు కలిగియున్న అభిప్రాయమును నేను నమ్ముచున్నాను, మరియు ఈ ఉదయకాలమున ఒక వ్యక్తి భాషలతో మాట్లాడుట నేను వినియున్నాను, మరియు ఈ రోజు ఏమి జరుగును అనే దానిపై ఆ అనువాదము ఇచ్చియున్నాడు. ప్రభువా, నిశ్చయముగా వారిలో ఎవరో ఒకరు దానిని పొందుకొనెదరు. అది సరియే. నేను నమ్ముచున్నాను.
1SAM 17:34-36
46మరియు ఇప్పుడు, పరిశుద్ధ గ్రంథములో అది వ్రాయబడియున్నది. ఆ దావీదు చిన్న గొర్రెలకాపరి అయిన పిల్లవాడు, అతని యొక్క తండ్రి గొర్రెలను ఆ ఎడారి వెనుక కాయుచున్నాడు. మరియు ఒక రోజు ఒక సింహము లోనికి వచ్చి, మరియు అతని యొక్క తండ్రి గొర్రెలలో ఒక దానిని పట్టుకొని, దానితో పరుగెత్తిపోయినది. ఆ చిన్న గొర్రెల కాపరి అయిన పిల్లవాడు విశ్వాసముతో, ఆ సింహమును ఎదుర్కొనుటకు వెళ్ళినప్పుడు అతని యొద్ద ఏమి యున్నది? అధునాతనమైన రైఫిల్ లేదా తుపాకీ లేదు. అయితే అతడు ఒక చిన్న వడిసెలను కలిగియున్నాడు మరియు అతడు ఆ సింహము వెనుక వెళ్ళియున్నాడు. అతను ఆ సింహమును చంపి మరియు ఆ గొర్రెను వెనుకకు తీసుకొనివచ్చెను.
ఒక ఎలుగుబంటి లోనికి వచ్చి, మరియు ఒక దానిని పట్టుకొనెను. అతను ఆ ఎలుగుబంటి వెనుక వెళ్ళెను, అది అతడిని భూమికి త్రోక్కియుండవచ్చును. అయితే ఆ ఎలుగుబంటి యొక్క ఆకారము గురించి, లేదా ఆ సింహము యొక్క శక్తి గురించి, లేదా అతని వేగము గురించి, లేదా వడిసెలతో అతని అసమర్ధత గురించి అతను ఆలోచించలేదు.
అయితే అతను రాజైన సౌలు ముందర నిలువబడినప్పుడు, అతను, "మీ సేవకుడు అతని తండ్రి గొర్రెలను కాయుచుండగా, ఒక సింహము లోనికి వచ్చెను మరియు ఒక దానిని తీసుకొని, బయటకు పరుగెత్తెను. మరియు నేను దాని వెనుక పరుగెత్తి, ఆ గొర్రెను వెనుకకు తెచ్చితిని," అని చెప్పెను. అతను "ఎలుగుబంటి చేయి… లేదా దాని యొక్క పంజా నుండి, లేదా సింహపు నోటి నుండి నన్ను విడిపించిన అదే దేవుడు, ఈ సున్నతి లేని ఫిలిష్తియుని కూడా, నా చేతులకు అతనిని అప్పగించగలడు," అనెను.
JAS 5:15
47ఈ కథ ఎలా కొనసాగునో మనము ఎరిగి యున్నాము — అతడు చేసెను. అతని కంటె చాలా చాలా రెట్లు పెద్దవాడైన ఆ వ్యక్తిని చంపెను, మరియు ఒక యుద్ధ వీరుడు. గొప్పరాజు, గొప్ప బలమైనవాడగు సౌలును అది ఎలా ప్రశ్నార్దకముగా చేసినది; ఎలా ఆ చిన్న బాలుడు, ఆ వడిసెల యందు, అటువంటి విశ్వాసమును కలిగి యుండగలడు. కాదు, ఆ వడిసెలయందు కాదు, కానీ దేవుని యందు.
ఇప్పుడు, ప్రభువా, ఆ బలిపీఠము చుట్టూ నిలువబడి, మరియు ఇక్కడ ఈ మంచము మీద పడియున్న, దేవుని గొర్రెపిల్లలు, చిన్న గొర్రెలు, ఆయన కొరకు అన్నట్లుగా. కాన్సర్ అని పిలువబడే సింహము చేత, టీబీ అని పిలువబడే ఎలుగుబంటి చేత, వారిని పట్టుకోనియున్న ఇతర వ్యాధులు, మరియు వారిని కుదిపివేయుచున్నవి, మరియు వారిని ముక్కలుగా చీల్చివేయుచున్నవి.
ప్రభువా, నేను విశ్వాస ప్రార్థన అని పిలువబడే ఒక చిన్న వడిసెలతో వారి వెంబడి వచ్చుచున్నాను. ఇది మరీ ఎక్కువ కాదు, అయితే ఇది ఏమి చేసెనో నాకు తెలియును. మరియు నాకు తెలియును ఆయన ఇంకనూ అదే దేవుడైయున్నాడు. మంచి ఆరోగ్యకరమైన పచ్చిక బయళ్ళ నీడలో, సమాధానము అను శాంతికరమైన జలముల చెంత, వారి ఆందోళనల నుండి దూరముగా తెచ్చుటకు, ప్రభువా, నీపై నమ్మిక కలిగియుండుటకు; ఈ ఉదయాన వారిని వెనుకకు తీసుకొనివచ్చుటకు నేను వారి వెనుక వచ్చుచున్నాను.
మరియు లోపటికి వెళ్ళుటకు మీరు ఇచ్చిన కవచముతో నేను వారి వెంబడి వెల్లెదను. "విశ్వాసముతో కూడిన ప్రార్ధన రోగిని స్వస్థపరచును, మరియు దేవుడు వారిని పెకి లేపును. ఒక వేళ వారు ఏదైనా పాపము చేసిన యెడల, అది క్షమించుబడును.
JAS 5:14,15
48తండ్రీ, ఇప్పుడు మేము శత్రువును ఎదుర్కొనుటకు, సింహమును ఎదుర్కొనుటకు, సమస్త రూపములలో ఉన్న దెయ్యమును ఎదుర్కొనుటకు వెళ్ళుచున్నాము. కాన్సర్, టి.బి, హడ్జ్ కిన్స్ వ్యాధిగా, గుండె సమస్యగా, ఇంకా ఇతర వ్యాధిగా, వాడు పిలువబడుచున్నాడు. వాడిని ఎదిరించుటకు మేము వచ్చుచున్నాము, మరలా ఈ గొర్రెపిల్లను తిరిగి దేవుని యొక్క గృహమునకు తీసుకొని వచ్చుచున్నాము.
మీరు మాకు ఇచ్చిన ఈ వడిసెలను యేసుక్రీస్తు నామములో మేము ఉపయోగించనై యున్నాము. ఇప్పుడు యేసు నామములో ఇప్పుడు మేము భక్తితో మిమ్ములను సంధించుటకు వచ్చియుండగా, తండ్రీ, మాతో ఉండండి.
మీ శిరములు వంచియుంచవలెనని నేను మిమ్ములను కోరుచున్నాను. మరియు మేము రోగులపై చేతులు ఉంచుటకు మరియు నూనెతో అభిషేకించుటకు వచ్చుచున్నాము, మరియు విశ్వాసముతో కూడిన ప్రార్థన, రోగిని స్వస్థపరచును. ఇక్కడ యున్న ప్రతీ క్రైస్తవుడు మీ యొక్క విశ్వాసమును ఈ ప్రార్ధనా వరుసలోనికి ఉంచండి.
49(ప్రార్ధనా వరుస) కేవలము నమ్ముము … ఇప్పుడు మన యొక్క శిరములను వంచి యుండగా.
కేవలము నమ్ముము, కేవలము నమ్ముము,
సమస్తమూ సాధ్యమే, కేవలము నమ్ముము.
ఓ ప్రభువా, నేను నమ్ముచున్నాను; ఓ ప్రభువా, నేను నమ్ముచున్నాను,
సమస్తమూ సాథ్యము (ఇప్పుడు మన యొక్క
చేతులను పైకి ఎత్తుదము), ప్రభువా, నేను నమ్ముచున్నాను.
ఓ ప్రభువా, నేను నమ్ముచున్నాను; ఓ ప్రభువా, నేను నమ్ముచున్నాను,
ప్రభువా, నేను నమ్ముచున్నాను; సమస్తమూ సాథ్యము.
50మా పరలోకపు తండ్రీ, పైకి లేవగలిగిన వారు, వారు అంగీకరించారనుటకు
వారి యొక్క హస్తములు పైకి ఎత్తిరి. ఈ పడకపై పడియున్న ఈ సహోదరుడు, అతడు ఆయన యొక్క స్వస్థతను అంగీకరించాను అని చూపించుటకు పైకి లేచెను. ప్రభువా, మేము నమ్ముచున్నాము, పచ్చికగల చోట్లలో, సమాధానముతో మరలా శాంతికర జలముల చెంతకు వారు మరలా నడుచుచున్నారు. యేసు నామములో దానికై మేము ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ఆమేన్. మంచిది, సహోదరుడా నెవిల్.