సంఘము కృపకు బదులుగా ధర్మశాస్త్రమును ఎన్నుకొనుట
1ఈ రాత్రి ఇక్కడ యుండుట మరియు విశ్వాసులతో సహవాసము చేయుట మరియు మన సోదరుడైన సంఘ కాపరి బ్రదర్ సులివాన్, ప్రశస్త సోదరునితో సహవాసము చేయుట నాకు ఎంతో సంతోషము.
వివిధమైన సేవకులు, వివిధమైన స్థలముల నుండి, దీనమంతయూ దారు నన్ను పిలుస్తునే యున్నారు, ఎక్కడికైనను మరొక కూటమునకు విడిచి వెళ్ళాలని వారు కోరుచున్నారు. కాని క్రిస్మస్ నుండి నేను ఆగలేదు, మరియు నేను ఎంతగానో అలసటచెందుచున్నాను. ఆరు లేక ఏడు దినముల విశ్రాంతి నాకు కలదని ప్రతి ఒక్కరికి తెలియును, కాబట్టి తప్పక నేను దానిని పొందవలసియున్నది, దరిదాపుగా నా పని అయిపోయినట్లైనది.
మీకు తెలుసు, మనము ఒక కూటమును విడిచిపెట్టియున్నాము, అక్కడ ఒక రాత్రిలో కొద్ది సమయములో ముప్పై దర్శనములు వచ్చియున్నవి. దాని భావము ఏమిటో ఎవరికీ ఎన్నడూ తెలియదు. అది… అది నాతో మరియు దేవునితో ఒక రహస్యమైయున్నది, అది సమాధి వరకు వెళుతుంది. వారు కేవలము… మీరు… దానిని వివరించే ఏ మార్గమును లేదు. నీవు దానిని కేవలము చేయలేవు. మరియు ఎవరికి తెలియదు.
కొంచెము దానిని గూర్చి ఆలోచన చేయండి. యేసు పొందిన ఒక దర్శనము నుండి ఆయన చెప్పెను, "నేను బలహీనుడనైనానని నేను గ్రహించుచున్నాను. ఒక స్త్రీ ఆయనను ముట్టియున్నది. ఇప్పుడు, అది… అప్పుడు ఒక పాపి గూర్చి కృప ద్వారా రక్షణ పొందిన వ్యక్తిని గూర్చి ఎలా వుంటుంది. దానిని చేసినది కేవలము ఒక్కటే… "వీటికంటే మరి ఎక్కువ వాటిని మీరు చేస్తారు," అది ఒక వాగ్దానమైయున్నది, "ఏలయనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను."
2అక్కడ నా కోడలు వున్నది. ఈ గత దీర్ఘమైన 8 వారముల కూటముల ప్రయాణమును బట్టి, ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె మూడు లేక నాలుగు రోజులు విశ్రాంతి కొరకు ఆమె పడకకు వెళ్ళినది, ఆమె దరిదాపుగా చనిపోవుచున్నట్లుగా చెప్పినది.
మంచిది, కుర్రవాళ్ళు, వారందరూ చుట్టూ కేవలము కూలబడిపోయారు. నేను ఇంటికి వచ్చి నా సూటుకేసులు సగము బయటకు తీయక ముందే, ఇక్కడ మరలా నేను వెళ్ళిపోవుచున్నాను, వెళ్ళిపోవుచున్నాను, వెళ్ళిపోవుచున్నాను, పగలంతా, రాత్రంతా ప్రయాణము చేయుచున్నాను, మరియు వెళ్ళుటయే, వెళ్ళుటయే, వెళ్ళుటయే, పగలంతా రాత్రంతా వెళ్ళుటయే. కేవలము ముందుకు వెళ్ళుచున్నాను, ఇంకా ముందుకు, ముందుకు, మరియు ముందుకు.
నేనన్నాను, "మంచిది, అలా చుట్టూ ప్రయాణము చేయుట అది ఖఠినమని మీరు తలస్తారు, కూటములలో సరిగ్గా నిలబడటం, మరలా క్రిందికి రావటం, కూటములలో కూర్చొవటం, దానిని అనుభవించటం, ఇంటికి వెళ్ళటం, నిద్రకు వెళ్ళటం, మరలా తరువాత రోజు సగమంతా నిద్రపోవటం, మీరు కోరినట్లైతే, మేల్కొనటం, మరలా తరువాత కూటమునకు వెళ్ళటం. తరువాత మీరు అలసిపోతారు." ఆ కూటములలో ఒక కూటమును గూర్చి భాధ్యతను మీరు మీ భుజముల మీద వేసుకోవటం మరియు, నీవు దాని కొరకు భాధ్యుడవని ఎరగటం, చూచారా, ప్రతిదానికి జవాబు చెప్పటం.
తరువాత బోధించటం, అప్పుడు ఎనిమిది గంటల ఖఠినమైన పనితో ఇరవై నిమిషముల పలుకుబడితో కూడిన మాటలు మాట్లాడటం, కాబట్టి సైన్సు చెపుతుంది, నీ శరీరానికి కొన్నిసార్లు నేను ఒకటిన్నర గంటలు లేక రెండు గంటలు మాట్లాడతాను. మరియు అదియు గాక ఒక్క దర్శనము, మూడు రోజులు ప్రసంగము చేసిన దానికంటే ఎక్కువగా నిన్ను చీల్చి వేస్తాయి, చూచారా. అప్పుడు ఒక్క రాత్రిలో అలాంటి దర్శనములు ముప్పయి యైతే… చూడండి, చూడండి. అక్కడ మార్గము లేదు… అది కేవలము అది ఒక అద్భుతమై యున్నది, దానికై అది ఒక అతి విశేషమైన అద్భుతము, అదే దేవుడు నన్ను బ్రతుక నియ్యటం. మరియు నీ కొరకే ఆయన దానిని చేయును.
3మీలో ఎంత మంది రేమండ్ రిచ్చీ, బ్రదర్ రేమండ్ రిచ్చీ గూర్చి విన్నారు? లేదు. మొన్న రాత్రి లాస్-ఏంజల్స్ లో, అతడు నా ప్రక్కనే మోకరించి ప్రార్ధించాడు. మీకు రిచ్చీ తెలుసా, బ్రదర్ రిచ్చీ… మీకు అది తెలుసా? చాలా బలహీనముగా వున్నాడు, అది అతనిని విపత్తులలోనికి నెట్టినది. అతడు తరువాత దానివలెనే దానిని కేవలము చేయగలనని అనుకొన్నాడు, కాబట్టి అతడు వెళ్ళిపోయాడు, సువార్త పొలములను తీసుకొని తిరిగి వచ్చాడు, మరియు ఒక ఉజ్జీవాన్ని తీసుకొన్నాడు, అతని పని అయిపోయినది. మరియు నరముల బలహీనత అతనిని మొత్తినది, ఓ, భయంకరమగు స్థితి… అతడు ఎంతో చక్కని చిన్న సోదరుడు.
అతడు లోనికి వచ్చాడు, అతడు నన్ను చూచిన వెంటనే నాతో మాట్లాడుటకు ప్రయత్నము చేశాడు. అతడు మోకరించి అతడు చెప్పిన దానిని గుర్తించుటకు ప్రయత్నము చేశాడు. అతడన్నాడు, "బ్రదర్ బ్రెన్హాం, అలా వెళుతూ యుండవద్దు." చెప్పెను, వెళుతూ యుండవద్దు, ఈ దినములలో ఒక దినమున నీవు నా వలె యుంటావు. దానిని చేయవద్దు." కాని మన ఆసక్తి బహుశ మన జ్ఞానమును మండిస్తుంది, కాబట్టి ఎలాగైనా అది పరవాలేదు అని ప్రభువును నమ్ముచూ మనము ముందుకు వెళుతూ వుండాలి.
4కాబట్టి ఈ రాత్రి ఇక్కడ నా స్నేహితులైన కొందరిని చూచుట నాకు సంతోషము. నా వ్యక్తిగత కార్యదర్శి, సహోదరుడు మాగుర్ మరియు అతని భార్య, తండ్రి, మరియు తల్లి కెనడా, సస్కాటచివాన్, మరియు వారిని లోపల కలిగి యుండుటకు నాకు ఎంతో సంతోషము. కెంటకి నుండి వచ్చిన నా యిద్దరు సహోదరులు, నేను ఎన్నడూ వారి పేర్లను ఆలోచించలేక పోవుచున్నాను. వారు… నిజానికి మీరు అర్కాన్-సాస్ నుండి వచ్చిన వారని నేను నమ్ముదును, మీరు కాదా, సోదరులారా? మరియు కూటములకు వచ్చుచుండగా… నా సోదరుడైన డాచ్ ని నేను చూచియున్నాను, లేక డాచ్, ఒహాయో నుండి వచ్చిన సహోదరుడు డాచ్ లేక డాక్టర్ డాచ్ అచ్చట కూర్చొని యున్నాడు మరియు అతని వెనుకనే అతని ప్రియమైన భార్య కూర్చొని యున్నది.
మీ అందరిని మరియు రోడ్డు వెంబడి వివిధమైన వారిని ఈ రాత్రి చూచుట నాకు ఎంతో సంతోషము. బ్రదర్ చార్లీ, రోడీ, రోగర్, బ్రదర్ సాల్మన్ ను గుర్తించుచున్నాను. నేను గ్రహించుచున్నాను [టేపు మీద ఖాళీ యున్నది] ఈ రాత్రి కొందరు, ఈ మధ్యాహాన్నమున బిల్లీ నాకు చెప్పుచున్నాడు. ఆ ఎండగా యున్న జార్జియా నుండి అతడు ఇక్కడ యుండుట ఎంతో సంతోషము. వారిలో కొందరు చెప్పారు, "ఎలా దాని వెంబడి మీరు వెళ్ళుచున్నారు?" "గడ్డ కట్టిపోవుచున్నది," అన్నారు… బ్రదర్ వెల్స్ నీవు ఎక్కడ యున్నావు? నేను నిన్ను గుర్తించలేను, కొంచెము చిన్నగా… ఎందుకు, ఇక్కడే క్రింద నా ముందే కూర్చొనియున్నాడు. మరియు సహోదరి ఇవాన్స్. అవును, ఇక్కడ చూడండి, జార్జియా నుండి తరువాత ఒక గుంపు యున్నది. అది మంచిది, మీ అందరిని లోపల కలిగియుండుట సంతోషము.
2TIM 3:12
5ఇప్పుడు, మనలను ఇక్కడకు ఆహ్వానించినందులకు బ్రదర్ సులివాన్ ను ప్రభువు ఎల్లప్పుడును దీవించును. అతడు దేవుని క్రింద తన మీద ఈ కూటములకు పూచీ తీసుకొని యున్నాడు… నేను తెలుసుకొన్నట్లుగా, త్వరలోనే అతడు మిమ్ములను విడిచి, దూరముగా వెళ్ళబోవుచున్నాడు. మరియు మీరు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవబోవుచున్నారు. కారణము ఈ మనిషి జనసమూహము ముందు తన్ను తాను అతుక్కొని ఇలాటి దానికి పూచీ వహించటం, చూడండి, అతడు మిమ్ములను ప్రేమించుచున్నాడని అది చూపుచున్నది, ప్రజల కొరకు అతడు ఏదో చేయాలని ప్రయత్నము చేయుచున్నాడు, లేనిచో అతడు దానిని చేయడు. అది నిజము. ఒక నిజమైన యధార్ధమైన దేవుని సేవకుడు, నిజమైన వాడు… నా హృదయమంతటితో నేను బ్రదర్ సులివాను అభినందించుచున్నాను.
ఒక మనిషి, అతడు ఎన్నడైనా వెలగలిగివాడు ఎప్పుడు అవుతాడు అనగా, ఒంటరిగా నిలబడగలిగినప్పుడే, అతడు మరియు దేవుడు ఒంటరిగా. అదే ఆ మనిషి. యెరికో మార్గములో ఇద్దరకు మాత్రమే సరిగ్గా స్థలము యున్నది, ఇంకా ఎక్కువ లేదు మరియు తక్కువ లేదు, కేవలము యేసు మరియు నీవు, అంతవరకే. కాబట్టి ఆ రీతిగానే ఈ ఇరుకు మార్గములో మనము నడువవలసియున్నది. ప్రతి మనిషి ఎన్నడైనా దేవుని కొరకు ఏదైనా చేసినవాడు అదే మార్గములో నడిచియున్నారు. అది నిజము. విమర్శించబడ్డారు, విడువబడ్డారు, బయటకు నెట్టివేయబడ్డారు, యుగము అన్నింటిగుండా, అన్ని కాలములలో, అదే రీతిగా శ్రమపడియున్నారు. కాబట్టి మనము సరిగ్గా వారివలె యున్నాము, అదే విషయము. మనము దాని కొరకు ఒంటరిగా నిలబడవలసియున్నది. కాని ఎన్నడూ ఒంటరిగా లేవు; ఆయన ఎల్లప్పుడు అక్కడ యున్నాడు.
6ఈ ఆయుధశాలను కలిగియున్నవారు, మనము కలిగియుండునట్లుగా ఈ ఆయుధశాలను కూడా మనకు ఇచ్చినందుకు నేను వారిని మెచ్చుకొనుచున్నాను. వారు ఎక్కడైనా యున్నట్లైతే వారు నా స్వరమును వినవచ్చును. మీ యొక్క దయను బట్టి నిశ్చయముగా నేను మిమ్ములను మెచ్చుకొనుచున్నాను. ప్రభువు ఎల్లప్పుడు మిమ్ములను దీవించును. అది ఒక… ఇప్పుడు, అమెరికా దేశము యొక్క సైన్యము కొరకు, దేవుడు వారిని సమృద్ధిగా దీవించి వారికి సహాయము చేయవలెనని మనము తప్పక ప్రార్ధించుదము.
మనము ఒక భధ్రతా ప్రణాళికపై యున్నామని నేను మీకు చెప్పుదును, ఇతర దేశములను అనుక్షిపణి పందెములో ఓడించుటకు మన దేశము ప్రయత్నించుచున్నదని మనకు తెలుసు. నా సోదరులారా, మనము తప్పక ఒకే పందెములో పరుగెత్తవలసి యున్నది. ఆ పందేమే ఉయ్యాల నుండి మరణము వరకు, కల్వరిలో మనము ముఖముతో, అదే పందేమై యున్నది. మన భద్రత కల్వరిలో యున్నది. వారి ముఖములను వంచి ప్రార్ధన చేయుచు దేవునికి ప్రతిష్టించబడిన అమెరికా దేశపు ప్రతి సైనికుని నాకివ్వండి, అప్పుడు అణు క్షిపణులన్నింటిని మనము పేల్చివేసి ఆమెను ముందుకు వెళ్ళనియ్యవచ్చును. అది సత్యము. మనము ఎంతో సురక్షితముగా భద్రపర్చబడియుంటాము మరియు ఆకాశము క్రిందయున్న ప్రతి దేశము మనలను చూచి భయపడుతుంది.
అది సొలోమోను దినములలో జరిగినట్లువలె, పోయినసారి నేను ఇక్కడ దాని మీద బోధించినానని నేను నమ్ముచున్నాను. దక్షిణ దేశపు రాణి… ఎలా ఆ దినములలో ఇశ్రాయేలుకు ఏ ఇబ్బందులు లేకుండెనో, అందరూ వారికి భయపడేవారు. వారు దేవుని యందు నమ్మిక యుంచినారు.
7(నా మాటలను మీరు బాగుగా వినగలుగుచున్నారని నేను నమ్ముట లేదు, అక్కడ దాని మీద గంతు వేసినట్లుందా? అక్కడ బయట మీరు బాగుగానే వినగలుగుచున్నారా, ఆ వెనుక? శబ్దము పైకి ఎగిరినట్లు ధ్వనించుచున్నదని నేననుకొన్నాను. దీనిని నేను మార్చుకొనగలనేమో మనము చూద్దాము. అది బాగున్నదా? వెనుకనున్న వారు బాగా వినగలుగుచున్నారా? ఎవరునూ కదలవద్దు. ఇక్కడ మీరు బాగుగా వినగలుగుచున్నారా? నేను నా వేదికను ఇరుగగొట్టానని నమ్ముదును. అది ఎలా వుంది? అది బాగున్నది. మంచిది, దానిని అక్కడనే యుంచుటకు మనము ప్రయత్నము చేద్దాము.)
1COR 2:4
8ఇప్పుడు, త్వరగా మనము వాక్యము నొద్దకు వెళదాము. సహోదరుడు సులివాన్ యొక్క సంఘములో గత రాత్రి మిమ్ములను నేను ఎక్కువ సేపు నిలిపియుంచాను, కాని మనము…ధ్వనులపై ప్రభువు ఏమి ఇచ్చియున్నాడో, దానిని బట్టి నేను ఎంతగానో ఆనందించితిని, "స్పష్టము కాని ధ్వనులు." ఈ దినమున యున్న ఎన్నో స్పష్టముకాని ధ్వనులను గూర్చి మనము వివరించుటకు ప్రయత్నము చేశాము. మరియు అప్పుడు, స్పష్టము కాని ధ్వనులన్నిటిగుండా మనము వెళ్ళిన తరువాత, అప్పుడు ఒక స్పష్టమైన ధ్వనిని మనము తెచ్చియున్నాము. (సోదరుడా, జీన్, నీకు వందనములు, బహుశ కొంచెము అది మనకు సహాయపడుతుంది. మంచిది.)
ఈ దినము యొక్క స్పష్టమైన ధ్వనుల మీద. మరియు ఒకే ఒక ధ్వని స్పష్టమైనదని మనము కనుగొన్నాము. అది సువార్త యొక్క ధ్వని. మరియు సువార్త మాటతోనే గాక శక్తి ద్వారా మరియు పరిశుద్ధాత్మ యొక్క బయలుపాటు ద్వారా ఎలా వచ్చియున్నదో, పెంతెకొస్తు దినమున వచ్చిన ఆ శబ్దము బలముగా వీచు సుడిగాలి వలేయున్నది, అది నిశ్చయముగా ఆ జీవము వచ్చెను, ఏలయనగా అది ఆత్మసంబంధమైన జీవము.
9నేను వెనక్కు జరిగి యున్నట్లైతే మీరు నా మాట వినగలుగుతారా? దానిని వనక్కు వుంచుతారా? మంచిది. పాల్ రాడర్ యొక్క ఉద్దేశ్యములలో కొన్నింటిని నేను తీసుకొనుటకు ప్రయత్నము చేస్తాను. మీలో ఎంత మంది పౌలును చూశారు? నేను పౌలును చూచి నవ్వాను. అతడు తన ప్యాంటులను ఎల్లప్పుడు పైకి మడుచుకొంటూ, ఈ రీతిగా, వెనుకకు వెళుతూ యుంటాడు. తరువాత అతనికి తన అంశము అందినప్పుడు వేదిక నొద్దకు పరుగెత్తగలిగినంత వేగముగా పరుగెత్తుకొంటూ వచ్చి, తన రెండు చేతులను పైకి ఎత్తుతాడు. ఆ విధముగా మైక్రోఫోను నుండి వెనుకకు దూరముగా వెళ్ళిపోతాడు.
అవును, సహోదరుడు మరియు సహోదరి కోలిన్స్ వెనుక జన సమూహములో కూర్చొనియున్నట్లు నేను చూశాను. మెధడిస్టు బోధకులకు దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తాడని కొందరు నమ్మరు, అక్కడ ఒకరు కూర్చొని యున్నారు, ఆయన అతనికి పరిశుద్ధాత్మ బాప్తిస్మము నిచ్చెను, అతడే ఒక మెథడిస్టు బోధకుడు, కెంటకీ మెథడిస్టు బోధకుడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందియున్నాడు, ఇప్పుడు అతడు దేవుని యొక్క దీన సేవకుడు.
కాబట్టి పరిశుద్ధాత్మ దానిని కోరిన ఎవరికైనను అది ఇవ్వబడుతుందని మేము సంతోషించుచున్నాము. "ఎవరైనను దేవుని యొక్క షరతుల నొద్దకు ఇష్టపూర్వకముగా వచ్చి పరశుద్దాత్మను పొందవచ్చును. అది మెథడిస్టులకు, బాప్టిస్టులకు, పెస్బిటేరియన్లకు, లూథరన్ వారికి, కాథలిక్ వారికి, యూదులకు, ప్రొటెస్టెంటులకు, పసుపు రంగువారికి, నల్లవారికి, తెల్లవారికి, గోధుమ రంగు వారికి మరియు వింతగా వున్నవారికి, మన అందరకు కలిసి పరిశుద్ధాత్మ అందరి కొరకై యున్నది.
10ఇప్పుడు, నేను తల వంచాలనుకొనుచున్నాను… మనము ప్రార్ధన చేయుచుండగా, మీరు కొన్ని క్షణములు మీ తలలను వంచినట్లైతే, మీ తలలు వంచియుండగా ప్రార్ధనకు ముందు, మీరు ఏదైనా ప్రత్యేకమైన మనవిని కలిగియున్నట్లైతే, మీ చేతులను దేవునికి ఎత్తుట ద్వారా మీరు దానిని తెలియచేయండి. మీ హృదయములో మీ మనవిని పట్టుకొని యుండండి. దేవుడు మిమ్మును దీవించును. దేవుడు మీ ప్రతీ ఒక్కరి మనవిని అనుగ్రహించును గాక.
JOHN 14:13,14•
JOHN 15:16•
COL 3:17
11మా పరలోకపు తండ్రీ, నీ కృపా సింహాసనమును మేము సమీపించుచున్నాము, నీ యొక్క న్యాయపీఠము కాదు, ప్రభువా, దానిని మేము తట్టుకొనలేము. మేము న్యాయము కొరకు అడుగుటలేదు, అలాగైతే మేము నశించిపోతాము, కాని మేము కృప కొరకు అడుగుచున్నాము. మరియు మేము వస్తున్నాము కారణము మీరు మమ్ములను రమ్మని ఆజ్ఞాపించారు, మేము సందేహించకుండా, ప్రభువైన యేసు నామములో మేము అడిగినప్పుడు, మరియు మేము ధైర్యముగా నిన్ను సమీపించినప్పుడు, మేము అడిగిన దానిని మేము పొందుదుమనే వాగ్దానమును మేము కలిగియున్నాము. ఏలయనగా అది వ్రాయబడియున్నది, "మాటచేతనేగాని, క్రియచేతనేగాని మీరు ఏది చేచినను ప్రభువైన యేసు నామమున చేయుడి" ఆయన తానే స్వయముగా చెప్పాడు, భూమి మీదయుండగా, "నా నామములో మీరు తండ్రిని ఏమి అడిగినను, నేను దానిని చేస్తాను."
మరియు మనము అడిగిన దానిని మనము పొందుదుమని నిశ్చయత మనకున్నది, కారణము మన హృదయంలో ఉన్న దానంతటితో దానిని నమ్ముచూ విశ్వాసముతో వచ్చుచున్నాము, మరియు యేసు నామములో కృప, కనికరము, ధైర్యము ఈ రాత్రి మనలను చుట్టియుండాలని మరియు మనము కోరినట్లుగా నీ ఆత్మ యొక్క గొప్ప భాగమును మా హృదయము లలోనికి ఇత్తురని అడుగుచున్నాము.
తమ చేతులను ఎత్తిన వారికీ విశ్వాసమును దయచేయుము, మరియు నేను వారిలో ఒకడనైయున్నాను, ఏలయనగా మా హృదయములోని మనవులతో, మా మనవులను మీరు దయచేయుదురని, మా హృదయములన్నింటితో మేము నమ్ముచున్నాము. ఏలయనగా ఈ కూటమును మమ్ములను మేము నీకు అర్పించుకొంటూ, మీరు చూచు రీతిలో మాతో కార్యము చేయుము. మేము వాక్యమును సమీపిస్తూ దానిని బోధిస్తూయుండగా, పరిశుద్ధాత్మ వచ్చి వాక్యమును అభిషేకించి మా అందరి హృదయములలో నాటునట్లు చేయుము, ఏలయనగా మేము యేసు నామములో అడుగుచున్నాము. ఆమెన్.
DEUT 2:3
12ఇప్పుడు, సాధారణముగా లేఖనములను వ్రాసుకొను మీరు, మీరందరూ అంశము కొరకు ద్వితియోపదేశకాండము 2 అధ్యాయము 3వ వచనమునకు మీరు తిరుగవలెనని నేను కోరుచున్నాను.
ఈ కొండ మీద మీరు దీర్ఘకాలము ఉండియున్నారు: మిమ్మును ఉత్తరము వైపునకు త్రిప్పుతాను.
నేను పాత నిబంధన నుండి ఉపదేశము చేయాలని కోరుచున్నాను, ఏలయనగా పాతనిబంధన క్రొత్తనిబంధనకు ఒక మాదిరియై యున్నది. ఈ అతి గంభీరమైన, పవిత్రమైన అంశమును ఈ రాత్రి — ఆయన వాక్యమంతయు గంభీరమైనది మరియు పవిత్రమైనది — జరిగిపోయిన దినములలో మరియు ఇప్పుడు జరుగుచున్న దినములలోని పాత మరియు క్రొత్త నిబంధలనకు ఒక సమాంతరమును నేను ఏర్పర్చబోవుచున్నాను.
EXOD 15:20
13వారు పాటలు పాడుచూ యుండగా, కేకలు వేయుచుండగా మరియు ఆత్మలో నాట్యమాడుచు ఎర్ర సముద్రమునకు అవతలివైపున వుండగా, ఎవరైనా వారికి ఇలా చెప్పియుంటే, వారు వాగ్దాన భూమికి నలభై సంవత్సరముల దూరములో యున్నారని చెప్పియుంటే, ఇశ్రాయేలు దానిని కొంచెమే నమ్మియుండేది. వారు ఎన్నడూ దానిని నమ్మియుండేవారు కాదు. ఎవరైనా ఇలా చెప్పియుంటే, "ఇప్పుడే మీరు శ్రమ నుండి మరియు హింస నుండియు బయటకు వచ్చియున్నారు. దేవుడు మిమ్ములను విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించాడు." మరియు కొన్ని రోజుల కంటే ఎక్కువ దూరము వారికి ప్రయాణము లేదు, కాని ఇంకనూ వారి అవిశ్వాసము వారిని నలభై సంవత్సరముల వరకు వారిని అరణ్యములో ఉంచినది. మన తండ్రులు అదే స్థలమునకు నలభై సంవత్సరముల క్రితము వచ్చియున్నారు, లేక కొంచెము ఎక్కువ, అదే పరిస్థితి నెలకొనియున్నది.
ఇశ్రాయేలు గొప్ప ఉజ్జీవమును కలిగియుండిరి. మరియు వాగ్దాన భూమికి వెళ్ళే దారిలో వారు యున్నారు, వారిని తీసుకొనివెళతానని దేవుడు పితరుడైన అబ్రాహాముతో ఒట్టు పెట్టుకొనియున్నాడు. దేవుని వాగ్దానములతో, వారిపై దేవుని దీవెనలతో, వారు వాగ్దాన భూమికి వెళ్ళుచుండిరి, విడుదల ఘడియ సమీపించినది, దేవుడు తాను చేయుదునని వాగ్దానము చేసిన అన్నిటిని చేసియున్నాడు. వారు ఆ దేశము యొక్క మార్గములో యున్నారు.
అది కొన్ని మైళ్ళ దూరము కంటే ఎక్కువ లేదు. మాప్ మీద మీరు దానిని కొలవండి. నేను నాకై నేనుగా అయిదు రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఆ దూరమును నేను నడువగలను, ఎర్ర సముద్రము నుండి వారు యోర్దానునది దాటి పాలస్తీనాలోనికి ప్రవేశించుటకు అయిదు రోజులలో నడువచ్చును. ఒక చిన్న ప్రయాణము మాత్రమే, అయినను, వారి యొక్క అవిశ్వాసమును బట్టి, అది వారిని నలభై సంవత్సరములు అరణ్యములో యుంచినది.
GEN 17:2
14ఇప్పుడు, అది ఒక గంభీరమైన సంగతి, మనము తప్పక దానిని ఒక క్షణము ఆలోచించాలి. వారి ముందు మారా నీళ్ళు వున్నవని వారు కొద్దిగానే నమ్మిరి, లేక పాపము యొక్క అరణ్యము, లేక సీనాయి పర్వతము, లేక కాదేషు-బర్నేయా, అక్కడే వారు పూర్తిగా దేవుని పట్ల విఫలమైపోయారు. కాదేషు బర్నేయా నుండి వారు దాటుటకు పదకొండు దినములే వున్నవి.
వారు దానిని నమ్మలేకపోయారు, ఏలయనగా ఇది వరకే ఎన్నో గొప్ప కార్యములు జరుగుట వారు చూశారు. వారు దేవుని చిత్తములో వున్నారన్న నిశ్చయత వారికున్నది. సరిగ్గా కొన్ని సంవత్సరముల క్రితము మన తండ్రులవలే వారు అలా యుండియున్నారు, కాని వారు అక్కడే ప్రాణహానికరమైన తమ గొప్ప పొరపాటును చేసియున్నారు.
ఎన్నడైనా ఇశ్రాయేలు చేసిన గొప్ప పొరపాటు అది వారు కృపను విడిచిపెట్టి ధర్మశాస్త్రమును అంగీకరించుటయే. నిర్గమకాండము 19వ అధ్యాయములో అది అతి గొప్ప పొరపాటు చేసినది, ఇశ్రాయేలు చేసిన ప్రాణహానికరమైన పొరపాట్లలో ఒకటి.
దేవుడు అబ్రాహాముతో చేసియున్న నిబంధన సంపూర్ణముగా కృపతో కూడినదైయున్నది. కాని కృప వారికి ఒక విమోచకుని, ఒక ప్రవక్తను, ఒక బలిఅర్పణ గొర్రెపిల్లను సిద్దపర్చినది. వారు ఎన్నడైనా కలిగియుండని అతి గొప్ప ఉజ్జీవమును అది వారికి సిద్దపర్చినది. అయినను, వారు దానితో తృప్తి చెందలేదు. దేనిని గూర్చియో వాదించుటను వారు కోరుచున్నారు. వారు ఒక స్థలమును కోరుకొనిరి, అక్కడ వారు దానిలోనికి ఏదో చేయవలసి వచ్చింది.
GAL 3:29
15అది ఈ రోజున ఆ రీతిగానే యున్నది. నలభై సంవత్సరముల క్రితము మన తండ్రులలో అది ఆ రీతిగానే యున్నది, మన పెంతికోస్తు తండ్రులు. కృప వారికీ ఉజ్జీవము నిచ్చినది, మరియు లోకములో నుండి, మరియు వారున్న గందరగోళములో నుండి, వారి నామకార్ధ సంఘ శాఖల నుండి, సంస్థల నుండి బయటకు తెచ్చినది, మరియు వారు ఎన్నడైనా కలిగియుండని అతి గొప్ప ఉజ్జీవమునకు వారిని తెచ్చినది, పరిశుద్ధాత్మను వారిపై కృమ్మరించినది. ఆత్మతో వారిని నింపినది. వారు పాటలు పాడుచు, ఆత్మలో నాట్యమాడుచూ, ఒక అద్భుతమైన సమయమును కలిగియుండిరి. ఈ సంవత్సరములన్నింటి గుండా పూర్తి వాగ్దానము నుండి వారు దూరముగా యున్నారని వారు కొంచెమే ఎరిగియుండిరి.
కాని అది సహజమైన ఇశ్రాయేలుతో యున్నట్లుగా, ఆత్మసంబంధమైన ఇశ్రాయేలుతో కూడా అది ఆ రీతిగానే యున్నది. మనము ఇశ్రాయేలీయులమై యున్నాము కారణము మనము అబ్రాహాము యొక్క సంతానమై యున్నాము. శరీరానుసారముగా వున్నవారు ఇశ్రాయేలు కాదు కాని ఆత్మసంబంధమైనవాడే. "మనము క్రీస్తు నందు మృతిచెందిన వారమై అబ్రాహాము యొక్క సంతానమై యుండీ వాగ్దానము ప్రకారము అబ్రాహాముతో వారసులమై యున్నాము." అబ్రాహాము ఒక యూదుడు కాదు, కల్దీయుల దేశములో యున్న ఊరు అను పట్టణమునకు చెందిన ఒక అన్యుడై యున్నాడు. అతడు సంపూర్ణముగా ఒక అన్యుడు.
MATT 3:9•
LUKE 3:8
16ఇప్పుడు గమనించండి. వారందరూ ఈ మార్గములో యున్నారు కారణము దేవుడు వారికి దేనిని సిద్దపరిచాడో దానిని వారు అంగీకరించుటకు నిరాకరించారు, మరియు వారు దానికి ఏదో కలపాలని కోరుకున్నారు. అక్కడే మనము ఎల్లప్పుడును మన పొరపాట్లను చేస్తాము, ఎప్పుడంటే దేవుడు చేసియున్న దానికి మరియు దేవుడు చెప్పిన దానికి ఏదో కలుపుట ద్వారా దానిని ఒంటరిగా విడవండి.
రెండువేల సంవత్సరముల నుండి వారు ప్రభువు యొక్క ప్రార్ధనకు ఒక్క మాట కలిపి దానిని ఇంకా బాగుగా చేయాలని, లేక ఒక మాటను తీసివేసి దానిని ఇంకా బాగుగా చేయాలని వారు ప్రయత్నము చేయుచున్నారు. మీరు దానిని చేయలేరు, ఎందుకనగా ఆయన మాట్లాడినప్పుడు అది పరిపూర్ణమై యున్నది. మరియు నీవు దానికి ఏదైనా ఎక్కువ కలిపి పరిపూర్ణముగా చేయాలనుకొంటే, నీవు క్రమమునకు బయట యుంటావు. దేవుడు ఏది చేసినను అది పరిపూర్ణమై యున్నది.
మన సహాయము ఆయనకు అవసరమని మనము ఆలోచించుటకు ప్రయత్నించినప్పుడు… ఆయనకు మన సహాయము అవసరము లేదు. ఆయన దేవుడై యున్నాడు. నీవంటావు, "మంచిది, వాక్యమును బోధించుటకు ఆయన మనుషులను వాడుకొనును."
యోహాను చెప్పినట్లుగానే, "దేవుడు ఈ రాళ్ళ ద్వారా అబ్రాహామునకు పిల్లలను కలుగజేయగలడు." ఆయనకు మన సహాయము అవసరము లేదు. ఆయన సృష్టికర్తయై యున్నాడు, ఆయన కోరినది ఆయన చేయగలడు, ఎందుకనగా ఆయన దేవుడు.
17ఇప్పుడు, ఈ విషయములన్నియు మనము కనుగొంటాము. వారికి పస్కా గొర్రెపిల్ల సిద్దపర్చబడినది. వారి ప్రయాణము కొరకు దేవుడు పరలోకము నుండి మన్నాను దేవుడు వారికి సిద్దపర్చాడు. వారికి దాహమైనప్పుడు బండ నుండి నీళ్ళను, వారు రోగులైనప్పుడు వారి స్వస్థత కొరకు ఇత్తడి సర్పమును ఆయన వారికి సిద్దపర్చెను. అయినను, అవన్నియు కలిగి, వారు ధర్మశాస్త్రమును కలిగియుండవలెనని కోరిరి. వారు వేదాంత సంబంధమైన అనుభవమును కోరుకొనిరి, ఆ రీతిగా వాదించుటకు దేనినో కలిగియుండి, సంస్థగా మారి తమ్మును తాము ముక్కలు చేసుకోవాలనుకొన్నారు.
నలుబది సంవత్సరముల క్రితము పెంతెకొస్తు తండ్రులకు ఆ విధమైన కార్యమే జరిగియున్నది. దేవుడు కాలిఫోర్నియాలో ఒక మనిషిని పిలిచియున్నాడు, అతడు ఒక నీగ్రో, ఒక మెల్లకన్ను కలిగినవాడు; పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క అనుభవమును దేవుడు అతనికి ఇచ్చెను. అక్కడ నుండి అజూస వీధి ఏర్పడినది, పాత అజూస వీధి సువార్త. అక్కడ నుండి అది వ్యాపించి చివరకు దేశమంతటిని అది తుడిచి వేసెను. ఒక దేశము నుండి మరొక దేశానికి, దేశము తరువాత దేశమునకు చివరకు పెంతికోస్తు ఉజ్జీవము ప్రతిచోట మండుచుండెను.
ఎలాటి దీవెనను కృప ద్వారా దేవుడు సిద్దపరచెను. వారిలో అనేకులు వారి సొంత పేరును వ్రాయలేరు. వారిలో కొందరు చింపిరి బట్టలతో సంఘమునకు వచ్చేవారు. రైలు పట్టాల త్రోవ వెంబడివారు నడుస్తూ తమ చేతుల నిండా మొక్కజొన్న ఏరుకొని పట్టాల మీదనే వాటిని కొట్టి, చిన్న తల్లులు, తమ పిల్లలను పోషించేవారు తద్వారా తమ భర్తలు సువార్తను బోధించగలిగేవారు.
వారు సంచారము చేసేవారు, వారు ఎగతాళి చేయబడేవారు, వెక్కిరించబడేవారు, పరిశుద్ద గుండ్రాళ్ళు అని పిలువబడేవారు, రాత్రంతయూ జైలులో గడిపేవారు, రోజు తరువాత రోజు. వారిలో కొందరుని వారు పిచ్చివారని, వారిని పిచ్చి ఆసుపత్రిలో వేసేవారు. ఈ దేశము ఎన్నడైనా ఎరిగిన అతి గొప్ప ఉజ్జీవములను దేవుడు వారికి సిద్దపర్చెను. అది ఎప్పుడైయుండెనో నేను లెక్క చేయను, పెంతెకొస్తు ఉజ్జీవము లాటి ఉజ్జీవము ఎన్నడూ యుండి యుండలేదు. నిజము.
వెస్లీ ఎన్నడూ దానిని పొందలేదు, వారిలో ఎవ్వరూ దానిని పొందలేదు, స్పర్జన్, కాల్విన్, నాక్స్, గొప్ప సంస్కర్తలు, పెంతికొస్తు ఉజ్జీవము లాంటి ఉజ్జీవమును వారు ఎన్నడూ పొందలేదు. పెంతికొస్తు దినమున పరిశుద్ధాత్మ క్రుమ్మరించబడినప్పటి నుండి అది భూమిని తాకిన అతి గొప్ప సంగతై యున్నది. అలాంటిది లేదు… ఇప్పుడే వారు గతసంవత్సరము ఎక్కువ మంది మార్పుచెందిన వారిని వారు కలిగియున్నారు. దరిదాపుగా మిగిలిన సంఘములన్నిటిని కలిపిన దానికంటే ఎక్కువ మార్పుచెందిన వారిని పెంతెకొస్తు సంఘమే కలిగియున్నది. ఈ మధ్యనే బిల్లీ గ్రాహం దాని గూర్చి మాట్లాడటం మీరు విన్నాను, మీరు దానిని కాదనలేరు.
18ఎక్కడ మనము మన తప్పును చేసియున్నాము? ఇశ్రాయేలు చేసినట్లుగా, పరిశుద్ధాత్మ దారిలో వెళుతూ మనలను నడిపించినట్లుగా, మనము దారి వెంబడి వెళ్ళలేకపోవుచున్నాము. అవిశ్వాసము లోనికి వచ్చుటకు కారణము ఏమననగా మనము దేనినో కలిపియున్నాము.
ప్రభువు వారిని నడుపుచున్న మార్గములో ఇశ్రాయేలు ముందుకు వెళ్ళి వెంబడించినట్లైతే, వారు రెండు వారములలోనే వాగ్దాన భూమికి చేరి యుండేవారు. కాని వారు దేనికో దానిని ప్రత్యామ్నాయము చేసిరి. పెంతెకొస్తు సంఘము ఆత్మలో, దేవుడు నిర్దేశించిన మార్గములో ముందుకు వెళ్ళుటకు కదిలియుంటే, మరియు ఆయన దానిలో యున్నాడని ఇదివరకే రుజువు చేసియున్నాడు, మనము వెయ్యేండ్ల పాలనలో జీవించియుండేవారము.
MATT 15:13•
1COR 10:11
19కాని వారు వెనుకవారు చేసిన అదే కార్యమును చేశారు, బైబిలు కొరింథీయులకు వ్రాసిన పత్రికలో చెప్పినట్లుగా, ఆ సంగతులు మనకు మాదిరులై యున్నవి. వారికి ఏమి జరిగియున్నదో మనకును అదే జరుగును. మొదటి సంగతికి ఏమి జరిగియున్నది? ఆత్మచేత నడిపించబడు ఒక విశ్వాసుల గుంపులో మనము ఉండలేకపోయాము, మనము ఏదో ఒక పేరును మన మీద అతికించవలసి యుండెను. ఒక సంస్థను చేయాలని మనము కోరియున్నాము. కాబట్టి వారు ఒక రూపమేర్పర్చుకొనిరి…
మరియు ఏది దానిని చేసినది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను బిరుదులకు బదులుగా యేసు నామములో బాప్తిస్మమును పొందవలెనని ఎవరో ఒక ప్రత్యక్షతను పొందిరి. తరువాత దానికి బదులుగా ఏమి జరిగినది? అప్పుడు ఆ పాత జనరల్ కౌన్సిల్, అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ గా మారవలసి వచ్చెను. యేసు నామముతో ఏమి జరిగినది? ప్రపంచ పెంతెకొస్తు అసెంబ్లీ అని, పెంతెకొస్తు అసెంబ్లీ-ఆఫ్-జీసస్-క్రైస్ట్ అను సంస్థలుగా తమ్మును తాము చేసికొనిరి: ఒకరు గుర్రము మీద వస్తున్నాడని, మరొకరు మేఘము మీద వస్తున్నాడని నమ్ముచున్నారు. అక్కడే నీవు నీ తప్పులను చేయుచున్నావు. అక్కడే మీరు నాశనమగునంతగా పాపము చేయుచున్నారు. మీరు దానిని ఎందుకు ఒంటరిగా విడువకూడదు?
యేసు అను ఆ నామము, మరియు చిన్న చిన్న సంగతులు మీరు కలిగియున్నవి, ఇంకా అలాంటివి సరి కాదు, దేవుడన్నాడు… యేసు చెప్పెను, "నా పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగించబడును." అది దేవునిది కానియెడల అది శూన్యమవుతుంది. అది దేవునిదియైన యెడల, ఎవరు దానిని ఆపబోవుచున్నారు? అది అంతే. దానిని ఒంటరిగా విడవండి. దేవునినే ఏలువానిగా వుండనియ్యండి.
కాని మనము సంస్థగా చేయుచున్నాము, ఇప్పుడు మన మధ్య, ఏకత్వము, ద్విత్వము, త్రిత్వము, (ఓ, మై!); సంస్థలుగా తెగిపోయినవి, ఒకరితో ఒకరము వాదములాడుచున్నాము. చిన్న గుంపులు, "మేమే అతిపెద్ద గుంపు అని, మేము అల్ప-సంఖ్యాకులమని, మేము అధిక-సంఖ్యాకులమని, మేము ఇది, మేము అది అని అనుచున్నారు, మాకు శ్రేష్ఠమైనది వున్నది, మా దగ్గర ఎక్కువ డబ్బు యున్నది, మా దగ్గర ఎక్కువ మంది మిషనరీలున్నారు, మాకు ఏదో వున్నది…" ఓ,మై!
మనము విభజించబడలేదు! మనము తప్పక విభజింపబడరాదు. మనమంతా ఒకే శరీరమైయున్నాము — ఒకే నిరీక్షణ మరియు
సిద్దాంతము, ప్రేమలో ఒక్కటిగా యున్నాము, ఒకే ఆత్మ. "ముందుకు యుద్ధమునకు పోవుచున్న క్రైస్తవులు కధము తొక్కుతున్నారు." మనముందు ఒకే సంగతితో: ఒక సంస్థ కాదు, "కాని యేసు సిలువ, మన ముందు వెళ్ళుచున్నది."
JAS 2:1
20మనిషి తన భాగమును కలుపుటకు ఇష్టపడునట్లుగా అది ఎల్లప్పుడు యుండియున్నది, వారు ఆలోచించునది తప్పక చేయలను కొంటారు. ఒక దేశముగా ఇశ్రాయేలు ఒక రాజును కోరుకొన్నప్పుడు అదే జరిగియున్నది. దేవుడే వారి రాజైయున్నాడు, దేవుడు ఎల్లప్పుడును తన ప్రజలకు సర్వములో సర్వముగా ఉండగోరియున్నాడు. కాని మనిషి దానిలో తమ్మును తాము దేనిగానో చేయాలని కోరుకొనుచున్నారు.
ఏలయనగా మాకు జిల్లా మతనాయకులు పుండవలెను, పి.హెచ్.డి. గలవారు మాకు వుండవలెను, మిగిలిన ఈ గొప్ప బిరుదులు మాకు ఉండవలసి యున్నది, మమ్ములను ఒక గొప్ప వ్యక్తిగా ప్రజలు పైకి చూడాలి, మిగిలిన సోదరులు అంటారు, "మంచిది, వారు వాదించి గుద్దులాడుకొని, ఉడకబెట్టుకొనునట్లు మరియు వారి టోపీలోనికి ఒక ఈకెను పొందుటకు మూలలను కత్తిరించుకోవాలనుకొంటారు," అని మనము దానిని పిలుస్తాము. ఎందుకు, అది అవమానమైయున్నది. అది అవిశ్వాసమును తెస్తుంది.
బైబిలు చెప్పినది, "ఒకరిపట్ల ఒకరు మర్యాదను కలిగి ఉండనప్పుడు, నీవు ఎలా విశ్వాసమును కలిగియుండగలవు," అలాంటి కార్యములు ఉన్నప్పుడు. జిల్లా పెద్ద దానిలో యున్నాడని నీవు చెప్పుటకు ప్రయత్నిస్తూ, నీవు దానిని ఎలా చేయగలవు. "బిషప్ దానిలో యున్నాడు, మనము ఆయన మాట వినవలసి యున్నది. ఒక అధికారి దానిలో యున్నాడు, మనము ఆయన మాట వినవలసియున్నది." నీ సంస్థలో ఏదో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండుటకు ప్రయత్నము చేయుచున్నారు. నీవు దానిని చేయలేవు, మరియు అప్పుడు దేవునిలో విశ్వాసమును కలిగియుండలేవు. నీవు తప్పక అన్నిటిని అమ్ముకొన్నప్పుడు అప్పుడు దేవుని యందు విశ్వాసమును కలిగియుంటావు.
అదే పెంతెకొస్తు యొక్క ఆరంభమైయున్నది. అదే నిన్ను పెంతికోస్తుగా చేసినది. "సంఘము," అను మాటకు భావము "బయటకు పిలువబడినది." ఇశ్రాయేలు బయటకు పిలువబడినది, పెంతెకొస్తు బయటకు పిలువబడినది మరియు వేరు చేయబడినది. ఇశ్రాయేలు దేవుని సంఘమై యుండెను. అది పిలువబడినప్పుడు మరియు వేరు చేయబడినపుడు, పెంతెకొస్తు సంఘమై యుండెను.
అయితే మీరు ఏమి చేశారు? మిగిలిన ప్రజలందరి వలె మీరు ప్రవర్తించారు. వారు చేయు కార్యములనే మీరును చేశారు. మీరు వారివలె యుండగోరారు.
1SAM 8:5•
1SAM 12:12
21ఇశ్రాయేలు ఒక రాజును కోరుకొన్నప్పుడు, మంచివాడైన వృద్ద సమూయేలు, ప్రవక్త, వారిని పిలిచి చెప్పెను, "వినండి, నేను మీకు ఒకటి చెప్పగోరుచున్నాను." మరొక మాటలో ఇలా చెప్పెను: "మీరు ఫిలిష్తియుల వలె ఉండగోరవద్దు, లోకములోని ఇతర దేశములవలె మీరు ఉండవద్దు. వారు వారి రాజులను కలిగియున్నారు, కాని మీకు ఒకే రాజున్నాడు, ఆయనే యెహోవా."
నిజమైన ఏ ప్రవక్తయైనా దానిని చెపుతాడు, దేనిలోనికో మిమ్ములను అతడు మెలివేయడు, మిమ్ములను తిరిగి యెహోవా మీద ఉంచుతాడు, ఆయనే మిమ్ములను నడుపనియ్యండి, ఆయనే మీకు మార్గదర్శిగా యుండనియ్యండి, మంచిది, ఎలాగైనా వారు ఇతర దేశముల వలె ఉండగోరారు. వృద్ధుడైన సమూయేలు నిలబడి, అతడన్నాడు, "దేవుడే మీ రాజైయున్నాడు."
దేవుడే మన రాజైయున్నాడు. లోకసంబంధమైన కార్యముల మాదిరి చొప్పున ఉండుటకు ప్రయత్నము చేయవద్దు, ఇతర దేశములవలె. వారు కోరినట్లైతే వారిని ముందుకు వెళ్ళనివ్వండి. మిగిలిన జనులు వారి పెద్ద మాదిరిలో ఇమిడినట్లు, బిషప్పులు మరియు ఉబ్బిన చదువుకున్న బోధకులు, మరియు ఈ రకమైన హాలీవుడ్ చెత్తనంతా వారిని కలిగియుండనియ్యండి. కాని అది దేవుని పిల్లలకు కాదు. పరిశుద్ధాత్మయే మన మార్గదర్శి, ఆయనే మన ఆత్మసంబంధమైన నాయకుడు. మీకు ఈ కార్యములు అవసరము లేదు. వారికి వారు కావాలి, వారిని వారు కలిగియుండనియ్యండి. మీరు కాదు — అది మీకు సరిపోదు.
22ఇప్పుడు, ఏమి జరిగియున్నదో మనము గమనిస్తాము. సమూయేలు ఇశ్రాయేలీయులతో చెప్పెను, "మీకు ప్రవక్తగా యుండుటకు దేవుడు నన్ను పంపాడు," అని చెప్పెను. నేను ఎన్నడైనా ప్రభువు యొక్క నామములో నెరవేరని దానిని మీకు ఎన్నడైనా చెప్పియున్నానా?" దానిని ఆలోచించండి. మరియు అతడన్నాడు, "మీ డబ్బు కొరకు ఎన్నడైనా నేను బిక్షమెత్తానా? ఎన్నడైనా మీ దగ్గర నుండి నేను డబ్బు తీసుకొన్నానా?"
ఇప్పుడే ఆరిజోనాలో యున్న ఒక సోదరుని నుండి నాకు ఉత్తరము వచ్చినది, అక్కడ ఒక నిర్ణీతమైన గొప్ప నాయకుడు ఒక కూటమును పెట్టియున్నాడు, ఒక చిన్న సంఘము నుండి వచ్చినవారు, ఈ కూటములో కూర్చొన్నవారికంటే వారు ఎక్కువ మంది అక్కడ లేరు, అది ఆ సంఘమునకు ఆరువేల డాలర్లు ఖర్చుయైనది, (బోర్డులో యున్న ఈ వ్యక్తి) ఈ వ్యక్తిని పిలిచాడు. అది రేడియోలో ప్రసారము చేయుటకు పదివేల డాలర్లు ఖర్చుయైనది. సోదరుడా, దానిని ఆలోచిస్తే, సువార్త పొలములో ఆరువేల డాలర్లు ఎంతో డబ్బు, అక్కడ సోదరులు వారి కాళ్ళకు చెప్పులు లేకుండా సువార్తను బోధిస్తూయున్నారని నాకు తెలుసు.
మనమయితే మిలియన్ల డాలర్లను గొప్ప పెద్ద కట్టడాలపై ఖర్చు చేయుచున్నాము. ఏదో ఒక నిర్ణీతమైన వ్యక్తిని గూర్చి నేను మాట్లాడుటలేదు, మొత్తము విషయము మీద నేను మాట్లాడుచున్నాను. ఈ మధ్య నేను చూశాను, అక్కడ ఒక గొప్ప సంస్థ అరవై లక్షల డాలర్లను, నేను నమ్ముచున్నాను, ఒక ఆఫీసు కట్టడము కొరకు మూడు నుండి ఆరు మిలియన్ల డాలర్లను వెచ్చించుచున్నారు, మరియు సేవకులు సువార్త పొలములో ఆకలితో పనిచేయుచున్నారు. మరియు యేసు త్వరగా వచ్చుచున్నాడని మనము బోధించుచున్నాము.
దాని నుండి ఏ విధమైన అర్ధమును మీరు చూపుతారు, ప్రజలారా? నేను సరిగ్గా… నేను బుద్ధి యొక్క అంతమునకు వస్తాను, నాకు అది ఏమి అర్ధమగుటలేదు. మీ జీవితము, నీవు నిజముగా నీ హృదయములో ఏమి ఆలోచించుచున్నావో, నీవు జీవించునదే చెపుతుంది. యేసు చెప్పెను, "మీరు ఒక దానిని చెప్పి మరొకదానిని చేసినట్లైతే…" ఆయన చెప్పెను, "వేషధారులారా, మీ హృదయము దేనినో ఆలోచిస్తున్నప్పుడు, మీరు మీ నోటితో మంచి సంగతులను ఎలా మాట్లాడగలరు." మీ మాటల కంటే మీ చర్యలు బిగ్గరగా మాట్లాడతాయి. యేసు వచ్చుచున్నాడని నమ్ముచూ మరియు ఎందుకు ఈ కార్యములను మనము నమ్ముచున్నాము? ఆ కార్యములకు మనకు ఎంతమాత్రము సమయము లేదు.
23సమూయేలు చెప్పెను, "ఇప్పుడు, నేను ప్రభువు నామములో ఎన్నడైనా ఏదైనా నెరవేరని దానిని మీకు నేను చెప్పానా?"
"లేదు," అని వారన్నారు, "నీవు మాకు చెప్పిన ప్రతిది నెరవేరినది."
"నేను ఎన్నడైనా మీ డబ్బు తీసుకొన్నానా, నాకు చెప్పండి. మరియు చెప్పెను, "ఇప్పుడు, మీరు లోకములోని మిగిలిన వారివలె ప్రవర్తించినట్లైతే, మీరు ఒక రాజును లోనికి తెచ్చినట్లైతే, యెహోవాకు మారుగా దేనినో మీరు ప్రత్యామ్నాయముగా తీసుకొనుచున్నారు…"
"మంచిది," వారన్నారు, "నీవు చూడు, ఇది ఒక రాజుగా వుంటుంది, మేము మిగిలిన వారందరివలె యుంటాము. ఎందుకనగా అది బాగుగా పనిచేస్తుంది. మేము మాట్లాడే ఒక మనిషిని మేము కలిగియుంటాము, అతడు మమ్ములను ఓదార్చుతాడు, మాకున్న ఈ భిన్నమైన వాటన్నింటి గురించి మేము తిరిగి అతనితో మాట్లాడగలము." ఓ, సోదరుడా, నీవు తగినంతగా ఆత్మసంబంధివైయున్నట్లైతే, దేవుడు తిరిగి నీతో మాట్లాడును.
24క్రొత్తజన్మ అను అంశమునే వారు దాటిపోవాలని ప్రయత్నిస్తారు. అదే జరుగుతుంది. ఇప్పుడు, ప్రజలు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును గూర్చి, ఈ క్రొత్త జన్మను గూర్చి ముందుకు ఆలోచించలేరు. సహజమైన పుట్టుక లేకుండా నీవు ఎన్నడైనా ఇక్కడకు ఉనికిలోనికి ఎలా వచ్చావు? నేను దానిని చేయలేదు. నీవు ఉనికిలోనికి వచ్చుటకు మరియు సహజమైన పుట్టుక లేకుండా నీవు నడుస్తూయున్నావని ఎరుగుటకు నీకు అక్కడ ఏ మార్గమును లేదు. అది నిజమేనా? మంచిది, అదే ఆత్మసంబంధమైన దానిలో యున్నది. నీవు తిరిగి జన్మించినట్లైతే, నీకు దానిని గూర్చి కేవలము ఏమియు నీకు తెలియదు.
"నాకు అక్కడ ఒక పనియున్నదని," చేపుతూ ఒక గుంపు ప్రజలను నేను అద్దెకి తీసుకొనబోవుచున్నానన్న మనిషిని మీరు ఎలా తీసుకోగలరు. ఆ మనిషి, తాను పరుగెత్తవలసినంత వేగముగా పరుగెత్తుచూ, సమాధుల దొడ్డికి పరుగెత్తుచున్నాడు.
"అయ్యా, మీరు ఎక్కడకు వెళ్ళుచున్నారు?"
"ఓ, నాకు అక్కడ ఒక పెద్ద యోచన వున్నది, అక్కడ కొందరు ప్రజలను సహాయమునకు తీసుకొనుటకు నేను వెళ్ళుచున్నాను."
"కొందరు ప్రజలు ఎందుకు?"
"నాకు సహాయమునకు."
"నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు?"
"సమాధుల దొడ్డుకు. ఓ, ఆ స్థలమంతటా నేసు పేర్లను చూశాను."
ఇది అదేయై యున్నది. కేవలము పేర్లు. అదే మనముయై యున్నాము, ఒక గుంపు పెంతికోస్తు పేర్లను మనము కలిగియున్నాము. అది నిజము. దానిలో జీవముతో యున్నది ఏదో మనకు కావలసియున్నది. సమాధుల దొడ్డిలో నీకు జీవము దొరకదు. నీకు తెలుసు నీకు దొరకదు. మీరు రాత్రి అంతయు మరియు పగలు అంతయు వారికి బోధించవచ్చు — కదిలించుటకు అక్కడ ఏమియు లేదు.
25సువార్త పనిచేస్తూ, వీధులలోనికి వెళ్ళి సాక్ష్యమిస్తూ, దేవుని కొరకు ఏదో చేస్తూ, ప్రభువు వచ్చుచున్నాడని ప్రజలకు చెప్పినప్పుడు ఎన్నడూ నీపని పూర్తికాదు. వారు చనిపోయియున్నప్పుడు, నీవు దానిని ఎలా చేయగలవు?
నీవు తప్పక జీవము వున్న చోటికి ఎక్కడికో వెళ్ళవలసియున్నది. ఒక మనిషి తప్పక తిరిగి జన్మించవలసియున్నది. సంఘము తప్పక క్రీస్తు యొక్క మూల సిద్ధాంతముల యొద్దకు తిరిగి రావలసియున్నది, తిరిగి క్రొత్త జన్మ నొద్దకు, తిరిగి పరిశుద్ధాత్మ నొద్దకు, తిరిగి రాత్రంతా జరుగు కూటములకు, దేవుని కొరకు మండుచున్న స్థలము నొద్దకు రావలసియున్నది.
నీవంటావు, "మంచిది, నేను దీనికి చెందినవాడను, నేను దానికి చెందినవాడను."
నీవు ఒక క్రైస్తవునివా? "అవును, నేను ఫలానా-ఫలానా దానికి చెందినవాడను." అది లోకసంబంధముగా తయారుకాబడిన సంగతి, మాటను అది నిర్వర్తించినంత బాగుగా యున్నది. కాని నేను ఇక్కడ ఒక ముఖ్య విషయమును చెప్పుటకు ప్రయత్నించగోరుచున్నాను, సోదరులారా, ఒక్క నిమిషము కొంచెము కూర్చొండి. మీలో కొందరు మంచి చతురస్రపు ఆధారము కలిగిన సంఘ శాఖ సోదరులారా, మీరు పెనుగులాడుచూ బొబ్బరింతలు పెట్టవద్దు, కారణము మీరు మంచి సోదరులని నేను ఎరిగియున్నాను.
ఆ చిన్న బాలుడు ఉన్నట్లువలె, అతడు తన శాండ్-విచ్ ను తినుటకు వచ్చాడు, మరియు అతడు దానిని తినుచున్నాడు, ఒక ముసలి పిల్లి వచ్చి అతని చుట్టూ మ్యావ్-మ్యావ్ అని అరచుచున్నది అని అతడన్నాడు. అది తన తోకను నేల మీద పెట్టియున్నది, దాని మీద కొంత బరువును పెట్టియున్నది. ఆ ముసలి పిల్లి బొబ్బరించుచున్నది, మరియు అతని తల్లి అన్నది, "జూనియర్, నీవు ఆ పిల్లి తోకను లాగుట ఆపనిచో నేను బయటకు వచ్చి నీ దవడల మీద చరుస్తాను." అతడన్నాడు, "అమ్మా నేను దాని తోకను లాగుటలేదు, దానిపై బరువును కొంచెము పెట్టియున్నాను. అతడు బొబ్బరించుచున్నాడు. అతడు లాగుకొనుచున్నాడు." అది నిజము.
MATT 15:13
26ఇప్పుడు గమనించండి. ఓ, సువార్త మీద ఒక చిన్న బరువు… మనము ఏమి చేయగోరుచున్నామంటే అది ఎక్కడకు చెందినదో దానిని అక్కడయుంచుటయే దాని యొక్క మొదటి సంస్థను తయారుచేసినప్పుడే, సంఘము దాని యొక్క ప్రాణాంతకమైన తప్పును చేసినది. మీరు ఏమి చేశారు?
మీరు అంటారు, "మంచిది, వారు కారణములను తయారుచేయుట ప్రారంభించారు." మంచిది, నీవు దేవుని యందు నిజమైన విశ్వాసివైయున్నట్లైతే, దేవుడు మనకు వాగ్దానము చేసియున్నాడు, అదేమనగా ఆయన దానిని నాటని యెడల, అది ఎలాగైనా ఎన్నడూ ఎటూ వెళ్ళదు. దానిని ఒంటరిగా విడవండి, అది దాని యొక్క అంతమునకు వస్తుంది. "నా పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగించబడును." ఖచ్చితముగా సత్యము. కాని వారు కేవలము దానిని చేయవలసియున్నది.
EXOD 18:20•
EXOD 19:8
27ఇప్పుడు, ఇశ్రాయేలుకు దీవెనలన్నియు వచ్చిన తరువాత, అయినను వారు నిర్గమ 19 కోరిరి. ధర్మశాస్త్రమును కలిగియుండగోరిరని మనము గమనిస్తాము. వారికై వారు చేసుకొనే దేనినో వారు కోరుకొనియున్నారు, వారు పాటించే ఏవో సబ్బాతు దినములు, లేక వారు చేసే చట్టములు లేక వారికైవారు చేసుకొనే మరొక దానిని వారు తమలోనికి తెచ్చియున్నారు. మరియు నీకైనీవు నిన్ను రక్షించుకొనుటకు ఒక్క కార్యమును చేయగలిగినట్లైతే, అప్పుడు దానిలోయున్న ఒక్క అణువు కూడా కృప కాదు.
నిన్ను రక్షించుటకు దేవుడు చూపిన కృపను గౌరవిస్తూ నీవు చేయునదే ధర్మశాస్త్రమై యున్నది. నేను తరుచుగా చెప్పియున్నట్టుగా, నా భార్య నాకు విడాకులను ఇస్తుందని భయము చేత నేను ఇతర స్త్రీల చుట్టూ పరుగెత్తను. నా భార్యను నేను ప్రేమించుచున్న కారణమును బట్టియే నేను ఇతర స్త్రీల వైపు పరుగెత్తను. అది అంతే.
మీరు అలా పరుగెత్తాలని నేను నమ్మను. కాని నా యొక్క వివాహ ప్రమాణము, అనే చట్టము దానిని పాటించుట లేదు. అది నా ప్రేమయై యున్నది. మరియు ఆ కారణమును బట్టి నేను దేవుని ప్రేమిస్తాను. ఆయన నన్ను నరకమునకు పంపునని భయము చేత కాదు, ఆయన దానిని చేయునని నేను నమ్మను. కాని నేను ఆయనకు ఎంతో ప్రేమిస్తునందువలన నేను దానిని చేయను. దానిని నాతో చేయించుటకు నాలో అక్కడ ఏమియు లేదు. నేను ఆయనను ఎంతో ప్రేమిస్తాను, దేనికొరకు నేను ఆయనను గాయపర్చను. నిశ్చయముగా, నేను ఆయనను ప్రేమిస్తాను.
28స్త్రీ మరియు పురుషులు ఆ స్థానమునకు వచ్చినప్పుడు… "మంచిది, నేను తప్పక నిజముగా ఈ రాత్రి ఈ మంచి ఆట చూచుటకు ఇంటి దగ్గర నిలిచియుండాలి. కాని నేను మీకు చెపుతాను, నేను సంఘమును వెళ్ళినట్లైతే, నేను వెనుక జారినవాడనని వారు తలుస్తారు." నీవు అక్కడ కూర్చొని ఎలాగైనా నిద్రపోతావు. నీవు ఇంటి యొద్దనే యుండి, దేనినో చూస్తూ ఎక్కువ ఆనందిస్తావు. అయితే నీ సంతోషము ప్రభువుగా మారినప్పుడు, మరియు ప్రభువే నీ సంతోషమైనప్పుడు, నీవు సంఘమునకు దూరముగా వుండవు, అప్పుడు ఎక్కడికో నీవు వెళ్ళుచున్నావు.
ఈ రాత్రి యున్న స్థితిలో కంటే, నలభై సంవత్సరముల క్రితము ప్రభువైన యేసు రాక కొరకు సంఘము ఇంకా ఎక్కువ మంచి స్థితిలో యున్నది. వారు దేవునికి సమీపముగా యున్నారు. వారి మధ్యలో ఎక్కువగా దేవుని వారు కలిగియున్నారు. ఈ రాత్రి వారు కలిగియున్నదాని కంటే ఎక్కువగా ఆత్మను వారు అప్పుడు కలిగియున్నారు.
ACTS 5:32•
1COR 13:2
29ఏది దానిని చేసినది? కారణము మనలను మనము వేరుచేసుకొన్నాము, దానికై అది ఒకొక చిన్న గుంపుగా మారినది. మీరు బయటకు వెళ్ళి, ఇతర వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, "మంచిది ఆ పాత మగడేగ అక్కడయున్నది, ఇదే అక్కడ యున్నది. వారికి అది లేదు; మేము దానిని కలిగియున్నాము." మరియు సిద్ధాంతములోని మీ చిన్న చిన్న బేధములు మరియు మొదలగునవి. మరియు దేవుడు దాని పట్ల అంత శ్రద్ధ చూపడు. [బ్రదర్ బ్రెన్హాం తన వ్రేలితో చిటిక వేయుచున్నాడు.]
మనము ప్రేమ లేనివారమైతే, ఎలాగైనా అది ఏ మేలును చేస్తుంది? "నేను మర్మములన్నింటిని ఎరిగియున్నను, మరియు దేవుని మర్మములన్నియు ఎరిగియున్నను, కొండను కదిలించగల విశ్వాసము నాకున్నను, మరియు నా ఆస్తి అంతయూ పేదలకు ఇచ్చినను మరియు నా శరీరమును బలి అర్పణముగా కాల్చబడుటకు ఇచ్చినను, ప్రేమ లేనియెడల, నేను వట్టివాడను," అని పౌలు అన్నాడు. 1 కొరింథీ 13 అధ్యాయములో.
చూడు, నిన్ను నీవు వేరుచేసుకొనుట ప్రారంభించినప్పుడు, నీవు అసలైన దానినే పోగొట్టుకొనుచున్నావు, విశ్వాసము లేనట్లుగా కనబడుచున్నది. మనలను మనము వేరుచేసికొనుట ప్రారంభించినప్పుడు… "మేము ఈ గుంపు, మేము దీనికి చెందినవారము, మేము వారితో చేసేది ఏమియు లేదు.
మరియు అదంతా పరిశుద్ధాత్మయై యున్నది. ఆ గుంపులలో ప్రతి ఒక్కరు భాషలతో మాట్లాడుచున్నారు. ఆ గుంపులలో ప్రతి ఒక్కరు వారి మధ్య మంచిని మరియు చెడును కలిగియున్నారు, సరిగ్గా మొదటి గుంపు చేసినట్లుగానే. మరియు వారు ఎల్లప్పుడు దానిని చేస్తారు. తనకు విధేయులైన వారికి దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చును. కాబట్టి ఎవరు ఆయనకు లోబడ్డారు? ఆయన యందు విశ్వాసముంచి దానిని అంగీకరించినవాడు, అతడే ఆయనకు లోబడినవాడై యున్నాడు, చూచారా.
EXOD 19:8
30అయితే దానిలో మనకై మనము చేయటకు మనము ఏదో కలిగియుండాలని. మెథడిస్టులవలె, ప్రెస్బిటేరియన్లవలే, బాప్టిస్టులవలె, కాథలికల వలె మనము ఉండగోరుచున్నాము. ఒక సంస్థను మనము చేయాలనుకొనుచున్నామ.
ఆ విషయములోనే మార్టిన్ లూథర్ తప్పిపోయాడు… మార్టిన్ లూథర్ కాదు. దానిని అతడు ప్రారంభించలేదు. జాన్ వెస్లీ దానిని ప్రారంభించలేదు. వారి తరవాత వచ్చిన గుంపులు దానిని ప్రారంభించినవి. అది నిజము. వారు దానిని ప్రారంభించలేదు. లేదండి, వారు దానిని శుద్దముగా వుంచారు. కాని వారు వెళ్ళిపోయిన తరువాత, వారిలో తరువాత వరుసవారు దానిని సంస్థగా చేయుట ఆరంభించారు.
సరిగ్గా ఆదిలో ఉన్న రీతిగానే అది ఉండెను. మొదటి గుంపు అది దేవుడై యున్నాడని, మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము అని గ్రహించారు, మరియు వారు దానితో నిలిచియున్నారు. కాని రెండవ గుంపు ముందుకు వచ్చినప్పుడు, "మంచిది, మనము తప్పక దీనిని చేయవలసి యున్నది, మనము తప్పక వారి నుండి మనలను మనము వేరుచేసుకొనవలసియున్నది. వారికి విశ్వాసమున్నట్లుగా కనబడుటలేదు, మరియు మేము దానిని కలిగియున్నాము. దూరముగా బయటకు లాగి మేము మా గుంపును ఇక్కడ తయారు చేస్తాము." అప్పుడు అది ఒక నాయకుని అక్కడకు వెళ్ళునట్లు చేస్తుంది, మరియు దీనిని దూరముగా బయటకు లాగుతాము. ఇది ఇక్కడయున్న దానిని దూరముగా లాగుతుంది, ఇక్కడ యున్నట్లుగా, చూచారా.
ఖచ్చితముగా ఇశ్రాయేలు చేసినది అదియే. వారు కోరుకొన్నారు… నిర్గమా 19 అధ్యాయము. వారు ఒక ధర్మశాస్త్రమును కోరుకొన్నారు. వారికైవారు చేయుటకు వారు దేనినో కోరుకొని యున్నారు. దానిలోనికి ఏదో చేయుటకు వారు దేనినో కలిగియుండవలసి యుండిరి. వారు పెద్ద వ్యక్తులను తయారు చేయవలసియుండిరి; వారికైవారు చేయు కొన్ని క్రియలను కలిగియుండవలెననుకొనిరి.
NUM 18:24•
HEB 7:5
31దేవుడు క్రియలను సిద్ధపర్చును. నీవు కృపలో కేవలము నడిచినట్లైతే, ఇప్పుడు కలిగియున్న స్త్రీలతో, సహా సమాజము మరియు ఈ ఇతర బుద్దిహీనమైన సంఘమునకు కలుపబడినవాటన్నింటికంటే, నీవు ఎక్కువ క్రియలో యుంటావు. బోధకునికి చెల్లించుటకుగాను వారు ఏర్పరుచుకొనే సూప్ సప్పర్స్ (విలాస విందులు) — లేఖనము నుండి ఎన్నడైనా అలాంటి దానిని మీరు తీసుకొనగలరా? దశమ భాగములు బోధకునికి చెల్లించండి. ప్రజల యొక్క దశమ భాగముల ద్వారా అతడు జీవించవలసియున్నది.
కాని దేనినో చేయుటకు మనము పొందవలసి వచ్చినది. మన భాగమును మనము దానిలో పొందవలెనను కొనుచున్నాము. అప్పుడు వారు దానిని చేయలేకపోయినట్లైతే, మరొక సమాజము దానిని చేస్తుంది. దేవుని యొక్క విధానమే సరియై యున్నది. దశమ భాగములు మరియు కానుకలు లేవీకి వెళ్ళును, అతనే సేవకుడైయున్నాడు. ప్రతి ఒక్కరు వారి దశమ భాగమును చెల్లించనియెడల, మీరు విలాసవిందులు జరుపనవసరము లేదు. చూడండి, మీరు దశమ భాగములను వదిలివేసి మరొక దానిని దత్తత చేసుకొన్నారు. అది పాత నిబంధన వివాదము అని మీరు అంటారు. మీరు దానిని నాకు రుజువు చేయమని కోరుతాను. అది నిజము దేవుని వాక్యము ద్వారా నీవు దానిని చేయలేవు, అది క్రొత్త నిబంధన క్రమము కూడా. దేవుడు ఒక క్రమమును చేసినప్పుడు, అది ఎన్నడూ మార్పు చెందదు. అది ఆ విధానములోనో నిలిచియుండవలసి యున్నది.
2COR 5:17
32రక్తము వలె. ఎవరో చెప్పారు, "మంచిది, మనము… నేను మీకు చెపుతాను, మనము దీనిని దానిని చేస్తాము, మరియు మనము ఆచారములను కలిగియున్నాము, మరియు మనము క్రీస్తుకు ప్రజలను చదివించాలనుకొనుచున్నాము, మనము వారిని క్రీస్తుకు శాఖగా చేయాలని ప్రయత్నము చేయుచున్నాము." మనము కేవలము గాలిలో పోట్లాడుచున్నాము, అది మంచిది కాదు. క్రీస్తులోనికి ఒకే ఒక మార్గమున్నది, అది రక్తము ద్వారా. దానితోనే దేవుని ప్రణాళిక ప్రారంభమైనది, మరియు ఆయన మారలేడు. మనము రక్తము ద్వారా క్రీస్తులోనికి వస్తాము.
మనము రక్తమును అంగీకరించిన తరువాత రక్తము యొక్క రసాయనము మన పాపములను తీసివేసి మరియు అతిక్రమము నుండి మనలను కడుగుతుంది, అప్పుడు మనము రక్తములో యున్న ఆత్మను పొందుతాము, అదే పరిశుద్ధాత్మ అయి యున్నది, అది తిరిగి మన మీదకు వచ్చి మనలను దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా చేస్తుంది. అది నిజము. అప్పుడు మీరు క్రీస్తులో నూతన సృష్టియై యున్నారు. అప్పుడు ఆదియందు వారు కలిగియున్న అదే అనుభవాన్ని మీరు కలిగియుంటారు. అదే రకమైన జీవితమును మీరు జీవిస్తారు, మరియు ఆదియందు వారు చేసిన అవే కార్యములను మీరు చేస్తారు, అవును.
నిర్గమకాండము 19.
NUM 13:23,33•
REV 22:17
33తరువాత బైబిలు చెప్పియున్నది… సీనాయి పర్వతము నుండి కాదేషు వరకు అది 14 దినముల ప్రయాణమై యున్నది. పదకొండు దినముల తరువాత మూల సిద్ధాంతములకు వ్యతిరేఖమైన బోధను వారు స్వీకరించిరి. వారి కార్యములను వారు చేయాలనుకొన్నారు, ఆరీతిగా వారు ఎన్నడైనా చేయని గొప్ప తప్పిదమును వారు చేసిరి. కాదేషు నొద్ద అక్కడే వారు దేవుని వాక్యమును అనుమానించిరి. ఆ సమయము నుండి మూల సిద్ధాంతములకు వ్యతిరేకముగా వారు మారు వరకు, దేవునితో వారు వరుసలో వారు వెంబడించిరి, తరువాత వారు దానిని చేసినప్పుడు, దేవుని వాక్యము సత్యము అని నమ్ముటలో తప్పిపోయి ప్రాణాంతకమైన పొరపాటును వారు చేసిరి.
వారు వారి సంస్థలను తీసుకొనిరి, పన్నెండు గోత్రముల వారు వారి వారి ప్రతినిధులను ఆదేశమును వేగిచూచుటకు పంపిరి. వెళ్ళిన వారిలో ఇద్దరు మాత్రమే రుజువును వెనుకకు తెచ్చిరి. అది మంచి దేశమైయున్నదని వారు ఒక గురువును తెచ్చిరి. ఈ ద్రాక్షల గుత్తులను యెహోషువ మరియు కాలేబులు వారి భుజముల మీద వాస్తవానికి వాటిని మోసితెచ్చిరి. ప్రతి ఒక్కరు దానిని రుచి చూచి ఇలా అన్నారు, "ఓ, మై! అవి ఎంతో బాగున్నాయి. అద్భుతముగా వున్నాయి."
కాని వారు సంఘము ముందుకు వచ్చినప్పుడు, వారన్నారు, "వ్యతిరేఖత ఎంతో గొప్పగా యున్నది. మనము కేవలము ఏమియు చేయలేము. దానిని మనము ప్రయత్నించవలసిన అవసరము లేదు. ఎందుకు, ఆ గొప్ప బిషప్పులు మరియు డాక్టర్స్-ఆఫ్-డివినిటీల ముందు, అదిగో ఆ చదువుకున్న పెద్ద రాక్షసుల ముందు మనము మిడతల వలె యున్నాము. అక్కడ ఒకే విషయమున్నది, మన రెండు సంవత్సరముల స్కూలు చదువు, మన చిన్న గ్రామరు స్కూలు చదువును ఎన్నడైన డాక్టర్ పి.హెచ్.డీ., ఎల్.ఎల్.డి., ఎస్.క్యూ.టి, తో ఎలా పోల్చగలము? ఈ మిగిలిన వాటన్నిటితో, ఈ గొప్ప వ్యక్తులతో దానిని ఎన్నడైనా మనము ఎలా చేయగలము?"
అది అది కాదు! దేవుడు ఆ దేశమును మనకు వాగ్దానము చేసియున్నాడు. విద్య, దానితో చేయునది ఏమియు లేదు.
ACTS 3:2
34దేవుడు పరిశుద్ధాత్మను వాగ్దానము చేసియున్నాడు, "ఇచ్చయించువానిని, అతడిని రానిమ్ము." కాఫీ గింజలకు మరియు చీల్చబడిన చిక్కుడు గింజలకు మధ్య తేడా నీకు తెలియదు. ఏ తేడా అది చేస్తుంది? మీరు మీ యొక్క ఆ, ఆ లు చెప్పలేకపోయినట్లైతే, ఒక అనుభవమును నీవు పొందియున్నంత కాలము, అది ఏ బేధము చేస్తుంది.
పేతురు మరియు యోహానులు శృంగారమనే దేవాలయము నొద్ద యున్నప్పుడు, ఆ కుంటివాడైన మనిషిని వారు నడిపించిరి, అతడిని నడుచునట్లు చేశారు, తల్లి గర్భము నుండి అతడు కుంటివాడై యుండెను… వారు విద్య లేని పామరులని బైబిలు చెప్పినది, కాని ఇంకనూ వారు యేసుతో యున్నవారని వారు గుర్తించిరి. ఒక నిజమైన పెంతెకొస్తు యొక్క అర్హత అదే.
నీవు ఎన్ని డిగ్రీలు కలిగియున్నావన్నది కాదు, ఎంత డిగ్రీని నీవు పుచ్చుకొన్నావన్నది కాదు. అది ఒక బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కావచ్చు లేక పి.హెచ్.డి లేక ఎల్.ఎల్.డి. కావచ్చు, అది ఏమై యున్నప్పటికి, అది దానితో చేయునది ఏమియూ లేదు. నీవు యేసుక్రీస్తుతో యుండి యున్నావని ప్రజలను ఎరగనిమ్ము. నీ వెనుక ఏదో నీ ఆత్మలో మండుచున్నదని ప్రజలను ఎరుగనిమ్ము! అదే పెంతెకొస్తుయై యున్నది.
కొన్నిసార్లు సంఘము పొందుచున్న మార్గమును నేనే చూస్తాను. ఒక పెంతెకొస్తునగుటకు నేను బాప్టిస్టును విడిచిపెట్టాను. వారు దేనినో కలిగియున్నారనే కారణముతో నేను దానిని విడిచిపెట్టాను. కాని నేను అక్కడకు వెళ్ళినప్పుడు, అది బాప్టిస్టు బిగువుగా సంస్థాగతము చేయబడినట్లుగా హీనముగా పెంతెకొస్తు కూడా యున్నది. అది నిజము.
NUM 13:27
35ఇప్పుడు, మనము బయటకు వచ్చి చుట్టూ చూస్తాము, చుట్టూ చూచినప్పుడు, వేదాంతము నుండి పూర్తి అవిశ్వాసమునకు, వారు ధర్మశాస్త్రమును కలిగియున్నప్పటి నుండి వారు చివరగా పూర్తి అవిశ్వాసములోనికి వెళ్ళువరకు. పదకొండు దినముల ప్రయాణమైయున్నదని మనము చూస్తాము. రుజువు కలిగిన ఇద్దరు ఇక్కడే తిరిగి వస్తారు.
నలుబది సంవత్సరముల క్రితము, అవతల ఒక దేశమున్నదని వారు ఒక మంచి రుజువును తెచ్చియున్నారు, ఏలయనగా వారు భాషలు మాట్లాడు రుజువును కలిగియుండిరి. కాని సోదరుడా, అది మాత్రమే రుజువు కాదు. అయితే దానిలో మంచి ద్రాక్షలు యుండుట మాత్రమే కాదు, అది పాలు తేనెలు ప్రవహిస్తూ అన్నిటిని కలిగియున్నది.
కాని వారు కేవలము ద్రాక్షలతోనే తృప్తి పడి మరియు చెప్పెను, "అది అంతయూ అదేనని, నేను ఊహిస్తాను." పెంతెకొస్తు సంఘము చేసియున్నది అదియే. అపోస్తలుల కార్యములు 2:4, అపోస్తలుల కార్యములు 2:4, నిజమైన ద్రాక్షల నుండి కారు ద్రాక్షల వరకు, పుల్లటి ద్రాక్షలు పొందువరకు మీరు అనేకమైన ద్రాక్షలను పొందియుండిరి. అపోస్తలుల కార్యములు 2:4, అపోస్తలుల కార్యములు 2:4, చివరకు మీరు 2/4 బోధకులుగా (అది నిజము) మారు వరకు సంస్థ చుట్టూ పీల్చియున్నారు.
ఒక విషయము, నాకు చెల్లించవద్దు. నేను బైబిలును బోధించుటకు స్వతంత్రుడనైయున్నాను. మరియు దేవుడు నన్ను బ్రతుకనిచ్చినంత కాలము, నేను తిన్నగా తప్పుకు వ్యతిరేఖముగా ఒక సాక్షిగా నిలబడియుంటాను. ఎక్కడ అనేది నేను లెక్క చేయను…
DEUT 34:5
36సంస్థ గురించి ఏమి తప్పు లేదు. సంస్థ ఫరవాలేదు. ధర్మశాస్త్రము సరియే. అది దాని ఉద్దేశ్యమును నెరవేర్చినది. అది నిజమైయున్నది. కాని ధర్మశాస్త్రము వారి కొరకు ఏమియు చేయలేదు, అది వారికి ఏ కృపను ఇవ్వలేదు. ధర్మశాస్త్రము వారిని వాగ్దాన భూమికి తీసుకొని వెళ్ళలేదు. లేదండి. ధర్మశాస్త్రము ఆగిపోయినది. యెహోషువ వారిని అవతలకు తీసుకొని వెళ్ళెను; మరియు ధర్మశాస్త్రము నిచ్చిన మోషే చనిపోయెను.
మరియు ఆ రీతిగానే సంఘ సంస్థ చనిపోబోవుచున్నది. మరియు కృప, దేవుని శక్తి మరియు పరిశుద్ధాత్మ తిరిగి సంఘమును ఎత్తబడుటలోనికి వాగ్దాన భూమికి తీసుకొని వెళ్ళును. అవును. అది దాని ఉద్దేశ్యమును నెరవేర్చినది, కాని దేవుడు కోరుచున్నది అది కాదు. ధర్మశాస్త్రము చనిపోయినది; ఆగిపోవలసి వచ్చెను. మోషే ధర్మశాస్త్రమునిచ్చినవాడు చనిపోయెను. యెహోషువ, వాగ్దానమును నమ్మిన వ్యక్తి, అతడు ముందుకు ఇంకా ముందుకు వెళ్ళెను.
HEB 6:4-6
37ఇప్పుడు గమనించండి, వారందరూ అన్నారు, "ఓ, మనము దానిని చేయలేము. అది ఏమి చేస్తుంది? "అది మన స్వాస్థ్యమును చెరుపుతుంది." మీ మెథడిస్టులు తలంచినది అదియే. మీరు సరిహద్దు వరకు నడిచి పైగా చూచినప్పుడు బాప్టిస్టులైన మీరు తలంచినది అదియే. మీరు అన్నారు, "నేను దానిని చేయలేను. నేను నీకు చెపుతాను, వారు దానిని చేసినట్లైతే, మెథడిస్టు సంస్థ వారు నన్ను బయటకు నెట్టి వేస్తుంది." "నా బాప్టిస్టు సంస్థ నన్ను బయటకు నెట్టి వేస్తుంది." "నా మెథడిస్టు నన్ను బయటకు నెట్టి వేస్తుంది." "నా ప్రెస్పిటేరియన్ సంస్థ నన్ను బయటకు నెట్టివేస్తుంది." "నేను భాషలతో మాట్లాడుచూ వేదిక మీద నిలబడినట్లైతే, మరియు సంఘములో ఎవరైనా భాషలతో మాట్లాడుట నేను చూచి, వారిని క్రిందికి తోసివేయనట్లైతే, వారు నన్ను సంస్థలో నుండి బయటకు నెట్టి వేస్తారు." నీవు అక్కడే యున్నావు - అదే సంగతి.
దాని యొక్క ప్రతిఫలమును నన్ను మీకు చెప్పనివ్వండి. హెబ్రీ 6వ అధ్యాయమును చూడండి. మరియు హెబ్రీ 10వ అధ్యాయమును వచనములతో కలిపి పోల్చండి: "ఏలయనగా ఒకసారి మనము వెలిగించబడి, పరిశుద్ధాత్మలో పాలు పొంది, రాబోవు యుగసంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత [చూచారా, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును పొందిన తరువాత దానిని త్రోసివేసినట్లైతే] మారుమనస్సు పొందునట్లు అట్టివారిని నూతనపర్చుట అసాధ్యము; వారు తమ విషయములో దేవుని కుమారుని సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపర్చుచున్నారు.
1COR 12:13•
HEB 6:4
38అది ఇక్కడ యున్నది. ఒక మనిషి బోధకుడిగా పిలువబడ్డాడు. అవునండి, ప్రభువు అతడిని పిలచుచున్నాడు. మంచిది, సరే. అతడు వచ్చి తన పాపముల కొరకు పచ్చాత్తాప పడతాడు; నీతిమంతుడుగా తీర్చబడతాడు. అతడు ఒక మంచి విశ్వాసిగా మారతాడు.
ఇప్పుడు, అతడు తరువాత చేసే కార్యము… అతడు ఇంకనూ పొగత్రాగుతాడు, అతడు ఇంకనూ శరీరాశను కలిగియుంటాడు. అతడు లోకసంబంధమైన ప్రజలను గమనిస్తాడు, లోకసంబంధమైన స్త్రీలను గమనిస్తాడు, మరియు అతడు - తన హృదయములో వాటికొరకు ఆశపడతాడు. అది సరికాదని అతనికి తెలుసు. అలా అతడు ఒక బోధకునిగా మారలేడు. కాబట్టి అతడు దేవుని యొద్దకు వెళ్ళి అతనిని శుద్ధి చేయమని అడుగుతాడు. తరువాత అతడు రెండవ మెట్టు మీద యున్నాడు. అతనిలో నుండి అది తీసివేయబడుతుంది.
ఇప్పుడు అతడు వాగ్దాన భూమిని పైగా చూస్తాడు, సరిహద్దు, అతడు ఒక స్థలమునకు వచ్చి, అతడు ఇంకా ముందుకు వెళ్ళలేడు, అతడు యొర్దానును తప్పక దాటవలసి యున్నది, లేక వెనుక మిగలియుండుట, (అంతే), చూచారా.
… మనము పాలు పొంది, వెలిగించబడి మరియు సత్యము యొక్క జ్ఞానమును పొందియున్నాము. మరియు క్రీస్తే సత్యమై యున్నాడు. మనము క్రీస్తులోనికి ఎలా రాగలము? సంస్థ ద్వారానా? కరచాలనము చేయుట ద్వారానా? సంఘ శాఖ ద్వారానా? నీటి బాప్తిస్మము ద్వారానా? లేదండి. ఒకే ఆత్మ ద్వారా మన మందరము ఒకే శరీరములోనికి బాప్తిస్మమును పొందియున్నాము. మేథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్, లూథరన్, ఏకత్వము, ద్విత్వము, పంచత్వము, నీవు ఏమైయున్నప్పటికి, ఒకే ఆత్మ ద్వారా మనము ఆ శరీరములోనికి బాప్తిస్మమును పొందియున్నాము.
39కాని ఒకసారి… జ్ఞానమును పొందిన తరువాత, అతడు ఇక్కడకు వచ్చి పైకి చూసి, అతడన్నాడు. "అవును. ఓ, అది అద్భుతముగా యున్నది. నేను దానిని పొందినట్లైతే, నా సంఘ శాఖ నన్ను బయటకు గెంటి వేస్తుంది. నేను దానిని చేయలేను, ఎందుకనగా వారు దానిని నమ్మరు. నా ప్రజలను దానిని చేయనివ్వను. నా సంఘములో నేను దానిని బోధించినట్లైతే, వారికి ఏమవుతుంది? జిల్లా ప్రెస్బీటర్లు మా యొద్దకు ఏకముగా వచ్చి, మీరు దానిని అనుమతించినట్లైతే, మీరు సంస్థ నుండి వెళ్ళిపోతారు. ఫలానా-ఫలానా వ్యక్తులు ఇక్కడయున్నట్లైతే మేము నిన్ను సహవాసము నుండి బహిష్కరిస్తాము."
ఓ దేవా, అలాంటి శుభాకాంక్షలతో తాము బోధకుడు, తప్పక అతడు కల్వరి యొద్దకు వెళ్ళవలసియున్నది. అతనితో ఏదో పొరపాటు. యున్నది. అది దేవుని వాక్యమై యున్నదని ఒప్పించబడి, మరియు నిజమైన దానిమీద నిలబడుటకు తగినంత నిజమైన పరిశుద్ధాత్మ లేకపోవుట! హల్లెలూయ!
ఒక పురుషుడు స్త్రీని గౌరవించును, ఆమె బొగ్గు అంత నల్లగా యున్ననూ, ఆమెను అతడు చూచినప్పుడు ఒక స్త్రీగా ఆమెను చూస్తాడు, ఆమె ఒక స్త్రీకి సంబంధించిన హోదాలో ఆమె నిలబడుతుంది. ఒక నిజమైన పురుషుడు, ఆమె ముందు తన టోపీని తీసివేయును (అది నిజము), కారణము ఆమె సరియైన నియమమునకు నిలబడినది. అది ఖచ్చితము. ఆమె బయటకు వెళ్ళినప్పుడు ఎంత మురికిగా యున్నను. ఈ హాలీవుడ్ రాణులలో ఒకరికంటే, లేక అది ఏమైయున్నప్పటికి, అతడు తనను గూర్చి నిజమైన మనిషిని కలిగియుంటే, అతడు ఆమె పట్ల వెయ్యి రెట్లు గౌరవమును కలిగియుండును. అది నిజము.
MARK 16:20•
HEB 6:4-6•
REV 3:20
40ఆ రీతిగానే దేవుడు ఒక మనిషిని కనుగొన్నప్పుడు, ఆయన తగినంత నమ్మకమును అతనిపై యుంచి, ఆయన వాక్యమును అతనికి బయలుపరుచును, అతడు బైబిలు ఒప్పుదలపై నిలబడి ఇలా అంటాడు, "దానిని నాకు రుజువు చేయండి." అది సత్యము. అప్పుడు నీవు దేవుని వాక్యమును తీసుకొంటావు, అది వ్రాయబడినట్లుగా ప్రతి వాక్యమును తీసుకొని మరియు అది వ్రాయబడినట్లుగానే దానిని తీసుకొని బోధిస్తావు. దేవుడు తిన్నగా దాని వెనుకకు వచ్చి, ఆయన చేస్తానని చెప్పినట్లుగా, సూచనలతో మరియు అద్భుతములతో మొదట రుజవు చేస్తాడు.
ఒక రుజువు మీద ఆగిపోవుట కాదు, అక్కడ ఎన్నో రుజువులున్నవి. అక్కడ ఇండ్లున్నాయి, స్థలములున్నాయి, అక్కడ తోటలున్నాయి, పాలు మరియు తేనెలున్నాయి, మంచి ఆహారమున్నది, మరియు ఎన్నో కార్యములున్నాయి, కొండల మీద నుండి నీరు ప్రవహించుచున్నది. సమస్తము చక్కగా అక్కడ యున్నది, ఒక గుత్తు ద్రాక్షలు మాత్రమే కాదు.
కాని అక్కడే మనము ఆగిపోతాము. "దేవుని దీవెన, నేను పరిశుద్ధాత్మను పొందియున్నాను, భాషలతో మాట్లాడు రుజువును నేను కలిగియున్నాను." అది మంచిదే. ఎవరో అవతలికి వెళ్ళినట్లు చూపుతుంది. కాని నీవు ఎందుకు సరిహద్దు నొద్ద నిలబడియున్నావు? చూచారా, పరిశుద్ధాత్మలో పాలివారై, రాబోవు లోకము యొక్క శక్తిని రుచి చూచియున్నారు, చూడండి వారు తిరిగి మెథడిస్టును గాడిలోనికి వెళ్ళిపోయారు, బాప్టిస్టులు అదే చేశారు, ప్రెస్బిటేరియన్లు అదే చేశారు.
దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు ఆయనను బాహాటముగా అవమానపర్చుచున్నారు. మరియు లవొదొకియ సంఘ కాలములో ఆయన పెంతకొస్తు సంఘమునకు బయటయుండి లోనికి వచ్చుటకు ప్రయత్నించుచున్నాడు. "ఆయనను బాహాటముగా అవమానపర్చుచున్నారు." ఓ దేవా, కనికరము చూపుము! సోదరుడా, ఈ విషయముల మీద మీరు నాతో సమ్మతించకపోయినట్లైతే, లేఖనములను పరిశీలించండి. మనము జీవించు దినమును కనుగొనండి. అది ఎక్కడ యున్నదో చూడండి.
41ప్రేరేపణతో చెప్పబడిన ఒక విషయమును నేను కలిగియున్నాను. ఇప్పుడు నేను దానిని చదువను, కాని అది ఇక్కడ యున్నది. (డిమాస్ షకారియన్ దానిని వ్రాతపూర్వకముగా కలిగియున్నాడు), ఒక మనిషి ద్వారా, ఒక హాలీవుడ్ మనిషి, నాతో చేతులు కలుపుటకు పైకివచ్చి, ఫ్రెంచి భాషలో మాట్లాడుటకు ఆరంభించాడు, మరియు ఐక్యరాజ్య సమితిలోని తర్జుమాదారుడు ఒక ఫ్రెంచి స్త్రీ ద్వారా దానికి తర్జుమాను ఇచ్చియున్నాడు. చెప్పెను, "నీవు కఠినమైన మార్గమును ఎన్నుకొన్నందున… కాని అది నా మార్గమై యున్నది. ప్రజలు నీ గూర్చి ఏమి చెపుతారోనని నీవు భయపడవద్దు, ఏలయనగా నేను నీకు తోడుగాయున్నాను, నేను నీతో యుంటాను, మరియు నేను దానిని అధికముగా సమృద్ధిగా నెరవేర్చుతాను.
ఇక్కడే వ్రాసి సంతకము చేసిన దానిని నేను కలిగియున్నాను. మరియు డిమాస్ షకారియన్ దానిని కోర్టులో దస్తావేజులుగా ముద్రవేచి స్థిరపర్చుచున్నాడు. మరియు ఆ మనిషి, ఒక బాప్టిస్టువాడై యున్నాడు, దానిని గూర్చి ఏమియు అతనికి తెలియదు, కాని నేను అక్కడ నిలబడి పెంతికోస్తు ప్రజల కన్నులను గ్రుడ్డిగా చేయుచున్న దానిని నిషేదించుచున్నాను — సంఘముల లోనికి వచ్చిన హాలీవుడ్, హాలీవుడ్ సువార్తీకరణ.
42ఒక వ్యక్తి కొన్ని సంచికవర్లను పంచి ఇలా చెప్పెను, "దీనిలో 25 డాలర్లు వేయండి మరియు నేను మీ కొరకు ప్రార్ధన చేస్తాను." మీరు అలా వేయని యెడల మీ పంటలు పాడైపోతాయి చెప్పెను - దీనిలో ఇంత కానుకను వేయండి. దానిని చేసినప్పుడు పెంతెకొస్తు డబ్బు కొరకై యున్నది?
ఎందుకు, సోదరుడా, బైబిలు కాలములలో వారికి కలిగిన దానిని అమ్మి సంఘమునకు పంచి పెట్టారు.
మరియు ఈ దినమున నీవు కాడిలాక్ కార్లు సముదాయమును తప్పక కలగియుంటేనేగాని నీవు ఆత్మసంబంధివి కాదు. అది ఒక పాపము, అది ఒక అవమానము. వారు అక్కడ కలిగియున్న దానికంటే మంచి సంఘమును కట్టలేమా అని చూచుటకు ప్రయత్నము చేయుచున్నాము; ప్రెస్బిటేరియన్లు, మెథడిస్టు వారికంటే మంచి సంఘమును కలిగియుండాలని చూస్తున్నారు, మరియు యేసు త్వరగా వచ్చుచున్నాడని మనము చెప్పుచున్నాము. వారు నీ ముఖము మీదనే నవ్వుతారు. అది నిజము.
ఈ దినమున మనకు కావలసినది మంచి సంఘము కాదు, నీవు అలాంటి ఒక పనిని కలిగియున్నట్లైతే నీవు ఆగిపోవుట మంచిది. రాజీపడుట కంటే - తల దాచుకొనుటకు నీకు స్థలము లేకుండా సువార్తను ప్రకటిస్తూ, ఈ సింధూర వృక్షముల క్రింద లేక ఈ దేవదారు వృక్షముల క్రింద నీవు వుండుట మంచిది.
MATT 24:37•
LUKE 17:26
43మనము భయంకరమైన స్థితిలో యున్నాము, సంఘమే స్వయముగా అది ఏమి చేసినది? కారణము మనలను మనము వేరుచేసుకున్నాము. ఒకరు దీనికి, మరొకరు దానికి వేరైపోయారు, మనము గొప్ప సంస్థల మనస్సులో సమస్తముతో నిండిపోయాము. ఒక మాదిరిలో, వారు అప్పుడు ఏమి చేసియున్నారో, మీకు ఖచ్చితముగా చూపించుచున్నాను. మరియు మనము ముందుకు వెళ్ళి వెయ్యేండ్ల పాలనలో యుండి యుండేవారము.
యేసుక్రీస్తు యొక్క రాకడ పూర్వపు బాకియై యున్నది. నేను బైబిలు ద్వారా దానిని రుజువు చేస్తాను. బైబిలు చెప్పినది… యేసుక్రీస్తు స్వయముగా చెప్పాడు, "నోవహు దినములలో జరిగినట్లు…" ఎవ్వరూ నశించకూడదని దేవుడు దీర్ఘశాంతముగలవాడై; దీర్ఘశాంతముగలవాడై, కనిపెట్టుచుండెను, ఉగ్రతను ఆపుచుండెను; కనిపెట్టుచుండెను, చూడండి, ఎవరైనా రక్షించబడతారని, కనిపెట్టుచుండెను, కనిపెట్టుచుండెను, కనిపెట్టుచుండెను.
"నోవహు దినములలో జరుగునట్లు, మనుష్యకుమారుని రాకడలోనూ జరుగును." దేవుని యొక్క దీర్ఘశాంతము ఆయన సంఘమును సరియైన స్థితిలోనికి తెచ్చుటకు కనిపెట్టుచుండెను. ఏమిటది? ఏమిటది? సరియైన స్థితిలోనికి వచ్చుటకు బదులుగా, మనము ఎల్లప్పుడు దూరముగా వెళ్ళిపోవుచున్నాము. మనము తప్పక వెయ్యేండ్ల పాలనలో యుండి యుండవలసియున్నది. మనము తప్పక దేవుని కొరకు ఏమి చేస్తూ యుండి యుండవలసియున్నది. మనమును తప్పక నలుబది సంవత్సరములు వెళ్ళవలసియున్నది. కాని ఇప్పుడు, వారు చేసిన అదే తప్పును మనము చేసియున్నాము. వారు నలుబది సంవత్సరములకు కాదేషుకు వచ్చారు మరియు వారి అవిశ్వాసమును బట్టి దేవుడు వారిని వెనుకకు త్రిప్పివేసెను.
అది ఏమైయున్నది? సంస్థ. ప్రజలు ఎదురు చూస్తున్నది అదియే. అది ఏమి జరుగును? ఇప్పుడు, మీరంటారు, "ఏ సంస్థ?" మీరందరూ, మిమ్మును మీరు వేరు చేసుకొనండి. నీవంటావు, "నేను ఫలానా అసెంబ్లీలో యుండి ఇంకనూ ఆత్మసంబంధిగా యుంటాను? నిశ్చయముగా. "నేను ఏకత్వపు వాడిగాయుండి, ఇంకనూ ఆత్మసంబంధిగా యుంటాను." నిశ్చయముగా, నీవు కాథలిక్ వైనను దేవుడు నీకు పరిశుద్ధాత్మను ఇచ్చును. నీవు ఏమైయున్నప్పటికి లెక్క కాదు, పరిశుద్ధాత్మ యొక్క జన్మ ద్వారా నీవు ఒక దేవుని బిడ్డగా యున్నంత వరకు, నీవు దేవుని బిడ్డవైయున్నావు. అప్పుడు…
JOHN 13:35
44గుర్తుంచుకో, ఆ ఇతర సోదరుడు కూడా ఏదో దుప్పటి కొరకు లాగుచున్నాడు. ఆ దుప్పటి మీ ఇద్దరికి సరిపోవునంత పెద్దది. దేవుడు దానిని ఆరీతిగా చేసియున్నాడు. దానినంతయూ నీవే లాగుకొని, కప్పుకొని "నేను గడ్డకట్టునంతగా మరణమగుచున్నాను," అని చెప్పవద్దు. నీకు చలిగా యున్నట్లైతే, నన్ను నీకు సహాయపడనిమ్ము.
ఒక పడిపోయిన సహోదరునికి నీవు సహాయపడని స్థలమునకు వచ్చినప్పుడు… అతడు పడిపోయినాడనీ నీవు తలుస్తావు. ఏదో ఒక మార్గములో నీవు అతనికి సహాయపడుము. ఖాళీలలో నిలబడుము. ప్రేమతో ఆ ఖాళీని నింపుము. దేవుని యొక్క సంఘమును ఏకముగా యుంచు సిమెంట్ అదియే, సహోదరుల మధ్య దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రేమ.
నీవు అసెంబ్లీన్ కు చెందినవాడవైనప్పుడు,దీనిని బట్టి మీరు నా శిష్యులని మనుషులందరూ తెలుసుకొంటారా? నీవు ఏకత్వమని, నీవు దేవుని యొక్క సంఘమని, పిలువబడినందున మీరు నా శిష్యులైయున్నారని మనుషులందరూ తెలుసుకొంటారా? "మీరు ఒకరి కొకరు ప్రేమను కలిగియుండుటను బట్టి మీరు నా శిష్యులై యున్నారని మనుష్యులందరూ తెలుసుకొంటారు." అప్పుడు మనము తెలుసుకొంటాము.
మనము క్రైస్తవులమైయున్నామని అప్పుడు లోకము తెలుసుకొంటుంది. మనము ఒకరి పట్ల ఒకరము ప్రేమను కలిగియున్నప్పుడు, అప్పుడు మనము సహోదరులము మరియు సహోదరులమని లోకము తెలుసుకొంటుంది. అదే క్రైస్తవ్యమునకు గురుతైయున్నది, అదే ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగియుండుట. మనము దానిని పొందినప్పుడు, అప్పుడు దేవుడు మన మధ్య పని చేయుట ఆరంభించి మరియు పాలు, తేనె, గొప్ప కార్యములను తెచ్చును. ఎందుకు, దేవుని ప్రణాళిక ఏమైయున్నదో మనము కనుగొని మరియు దానిలో ప్రవేశించుట మంచిదైయున్నది.
NUM 14:29•
HEB 6:4,5
45ఇప్పుడు, మనము దానిని గమనిస్తాము, సరిహద్దు విశ్వాసులు? వారు ఏమి చేస్తారు. "ఒకసారి వెలిగించబడిన తరువాత, పరిశుద్ధాత్మలో పాలుపొంది, రాబోవు యుగశక్తుల ప్రభావమును రుచిచూచిన తరువాత, మరియు సత్యము యొక్క అనుభవజ్ఞానమును పొందిన తరువాత, నడిచి వెళ్ళి ఆ దేశమును చూచి, "మంచిది, నేను దానిని చేయలేను," అని చెప్పి వెనుకకు వెళ్ళిపోవుట. ఆ దినమున ఖచ్చితముగా సరిహద్దు విశ్వాసులు చేసియున్నది అదియే. మరియు వారు ఏమి చేశారు? ప్రతి ఒక్కరు అరణ్యములో చనిపోయారు.
మనము ఫలానా ఫలానాయై యున్నామని దేవుడు మనకు భాధ్యుడని మనము తలంచినట్లైతే… (మొథడిస్టువారు దానిలోనికి చేయునది ఏమియు లేదు, బాప్టిస్టువారు దానిలోనికి చేయునది ఏమియు లేదు, ఏకత్వపువారు దానిలోనికి చేయునది ఏమియు లేదు, అసెంబ్లీస్ వారు దానిలోనికి చేయునది ఏమియు లేదు), అంటే, మనము తప్పుయై యున్నాము.
46నీ సంస్థను గమనించవద్దు. ఆత్మ నడుపు విధానమును గమనించుము. మరియు ఆత్మ నిన్ను నడిపించుచున్నట్లైతే, అది ఎన్నడూ వాక్యమునకు విరుద్దముగా నిన్ను నడిపించదు. అది వాక్యములో నిలిచియున్నంత వరకు, అది ఎన్నడూ దానికై అది అసాధారణముగా తప్పుగా ప్రవర్తించదు.
దేవుడు ఏమి చేసియున్నాడు? అరణ్యములో వారిని నలభై సంవత్సరములు ఆయన విడిచిపెట్టాడు. ఆయన ఖచ్చితముగా పెంతెకొస్తు చేసినది అదియే. భాషలతో మాట్లాడు ప్రారంభ సూచనను మనము కలిగియున్నాము. ఓ, "మేము దైవిక స్వస్థతను కలిగియున్నామని," చెప్పాము. వారునూ అది చేశారు. వారు ఇత్తడి సర్పమును కలిగియుండిరి, వారు చీల్చబడిన బండను కలిగియుండిరి.
ఓ, "బ్రదర్ బ్రెన్హాం , మీకు నన్ను చెప్పనియ్యండి, మేము ఏకత్వపువారము, మేము అసెంబ్లీ వారము, మేము ఫలానా ఫలానా, మేము కేకలు వేసియున్నాము, మేము ఆత్మలో నాట్యమాడి యున్నాము." ఓ, నిశ్చయముగా, వారు కూడా అది చేసియున్నారు. కాని వాగ్దాన భూమికి బయట వారు నలభై సంవత్సరములు యున్నారు.
వారు ఏమి చేసియున్నారో ఎన్నడైనా మీరు తలంచారా? ఓ, దేవుడు వారిని దీవించాడు, ఆయన దీవించలేదా? ఆయన దీవించియున్నాడని చెప్పాడు. వారు మంచి పంటలను పండించారు, వారు మంచి కుటుంబములను కలిగియున్నారు, వారు అక్కడ నిలచియున్నారు, మరియు వారు అక్కడ దీవించబడ్డారు మరియు వృద్ధిచెందాడు. ఏమిటి, పెంతికోస్తు వారైన మనలో కొందరు… వారిలో కొందరు, ఏమిటి, మనము లక్షల డాలర్ల విలువైన వాటిని కలిగియున్నాము — అనేకమంది. నిశ్చయముగా, మనలను దేవుడు వృద్ధి చేశాడు.
ACTS 4:35
47నేను ఈ మధ్యనే ఒక కూటములో నిలబడియున్నాను. ఇక్కడ ఇప్పుడు కూర్చొనియున్న సోదరుడైన బ్రదర్ ఫ్రెడ్ సాత్మన్, ఒక రాత్రి నేను కింగ్స్టన్, జమైకాలో యుండగా అతడు హాజరై యుండెను, సంపూర్ణ సువార్త వ్యాపారులతో ఉంటిని, ప్రజలకు నా వర్తమానమును తేవాలని, నేను వారితోనే వెళ్ళుచుంటిని…
ఈ సంస్థ యొక్క వ్యాపారస్థుల ద్వారా, మంచిది, సంఘము యొక్క వ్యాపారస్థులు కూటమునకు వచ్చును. అది దానిని తెస్తుంది… మంచిది, ఆ సంఘ కాపరి లోనికి రాడు, అది ఒక విధముగా అతనిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆ విధానములో నేను లోపల పని చేయుచు, నా సోదరులుగా, నా సోదరులుగా చూచు ఆ ప్రజలకు వర్తమానమును తెచ్చుటకు ప్రయత్నము చేయుచున్నాను.
అప్పుడు, ఏమి జరిగింది? నేను ఒక విధముగా దానికి వ్యతిరేఖముగా బోధించాను. మరియు ఈ నిర్ణీతమైన నాయకుడు పైకి లేచి, అతడన్నాడు, "బ్రదర్ బ్రెన్హాం, నేను మీకు చెపుతాను…"
నేనన్నాను, వ్యాపారస్థులైన మీ సంగతి ఏమిటి? మీరు ఏమి చేస్తున్నారు? ఈ రాత్రి ఆ ఆ వ్యాపారస్థుల కూటము నొద్ద మీరు వున్నారు, మీరు ఆ జమైకా వారికందరికి సాక్ష్యమిచ్చినదంతయూ, ఆ మూలన నేను ఒక చిన్న వ్యాపారమును కలిగియున్నాను, అది ఏ మాత్రము వృద్ధిచెందుట లేదు. హల్లెలూయ, నేను పరిశుద్ధాత్మను కలిగియున్నాను. దేవుడు నాకు కాడిలాక్ కారులను ఇచ్చియున్నాడు, గొప్ప పెద్ద కారులను నాకు ఇచ్చియున్నాడు, ఇటువంటి గొప్పవాటిని ఇచ్చియున్నాడు… మరియు ఆయన నాకు కొత్త గృహమును ఇచ్చియున్నాడు. వీటన్నింటిని ఆయన నాకు ఇచ్చియున్నాడు."
ఆ మనుష్యులు ఆ వస్తువులను కలిగియున్నారు. అది వారికి వినుట ఇష్టము లేదు. అది పెంతెకొస్తునకు వ్యతిరేఖమైయున్నది. పెంతకొస్తువారు, తమకు కలిగియున్న వాటన్నిటిని అమ్మి, పేద వారి మధ్య పంచిపెట్టారు, మరియు ఏమియు లేకుండా ముందుకు వెళ్ళారు. వారు యేసుతో మాత్రమే బయటకు వెళ్ళారు. అది నిజము.
48ఈ నాయకుడు ఆ రాత్రి నిలబడి, అతడన్నాడు, "కాని బ్రదర్ బ్రెన్హాం, ఇప్పుడే నేను ఒక విషయాన్ని చెప్పాలనుకొంటాను." అతడన్నాడు, "అప్పుడే పెంతెకొస్తువారు, వారి ఇండ్లను అమ్మి పేదవారికి ఇచ్చినప్పుడు, వారు ఎన్నడైనా చేయని అతి గొప్ప పొరపాటు చేశారు."
వారి ఇండ్లను అమ్మమని నేను ఎవరికి చెప్పుట లేదు. కేవలము క్రీస్తును వెంబడించుమని నేను మిమ్మును అడుగుచున్నాను. నేను మీకు చెప్పుచున్నాను… నేను కేవలము లేఖనమును ఉదహరించుచున్నాను.
మరియు అప్పుడు అతడు "మంచిది…." అనెను.
నేను అన్నాను, "మంచిది, సోదరుడా, వారు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డారు."
అతడన్నాడు, "మంచిది, వారు పొరపాటు చేశారు."
నేనన్నాను, "పరిశుద్ధాత్మ ఒక మనిషిని తప్పు చేయుటకు నడిపిస్తుందని నీవు నాకు చెప్పగోరుచున్నావా?"
అతడన్నాడు, "అది రుజువు చేసినది. నేను లేఖనము ద్వారా నేను నీకు దానిని రుజువు చేస్తాను."
నేనన్నాను, "నీ పాదముల మీద నిలబడి రుజువు చేయుము." "ఇప్పుడే…" అని నేనన్నాను.
అతడన్నాడు, "ఇక్కడే నీవు వున్నావు: సంఘము మీదికి హింస చెలరేగిన వెంటనే ఆ ప్రజలు తలదాచుకొనుటకు ఏ స్థలము లేదు. వారు వారి ఇండ్లను అమ్మి పేదవారికి ఆ డబ్బు ఇచ్చారు. వారు కేవలము ఇటు అటు తిరుగులాడారు."
నేనన్నాను, "ఖచ్చితముగా దేవుడు వారిని చేయమన్నది వారు చేశారు. మరియు వర్తమానము దేశమంతయు విస్తరించినది. వారు గృహమును కలిగియుంటే వారు తిరిగి దాని యొద్దకు వెళ్ళేవారు. కాని వారు వెళ్ళుటకు ఏ స్థలమును లేదు. అందుచేత, వారు ఇటు అటు తిరుగులాడుచు వర్తమానమును వ్యాపింపజేసిరి. అదే దేవుడు వారు ఖచ్చితముగా చేయమని కోరినది.
ప్రజలు ఆ మార్గమును తీసుకొనుటకు ఏమాత్రమును ఇష్టపడరు. వారికి అది ఇష్టము లేదు. ఓ, లేదండి. అమెరికా వారైన మనము ఈకతలతో కప్పబడి బలిసియున్నాము. మరియు మనము ముడుచుకొని హాయిగా క్రిందపడుకొనియున్నాము. కనీసము మనము కూర్చుని దానిని వినము. మనము కేవలము పైకి లేచి ఇంటికి వెళ్ళిపోతాము. నిశ్చయముగా, అది నిజము. అది వారికి అవసరము లేదు.
EZEK 9:4•
MATT 24:37•
LUKE 17:26
49దానిని గూర్చి ఆలోచించండి… చివరి దినములలో పరిశుద్ధాత్మ ఎవరిని ముద్రించబోవుచున్నాడో మీకు గుర్తున్నదా? బైబిలు ఏమి చెప్పినదో మీకు తెలుసా? "యెరుషలేములో జరిగిన హేయకృత్యములను బట్టి మొర్రపెట్టుచు నిట్టూర్పులు విడుచువారు." యెహెజ్కేలు 9వ అధ్యాయము.
కావున, నేను మీలో కొందరిని అడుగగోరుచున్నాను: ఈ పట్టణములోని ఎవరి గూర్చియైన, లేక మీరు వచ్చిన పట్టణము నుండి ఎవరి గూర్చియైనా, పట్టణములోని హేయకృత్యములను గూర్చి మొర్రపెట్టువారు మరియు నిట్టూర్పులు విడుచువారు, ఈ రాత్రి ఎంత మంది యున్నారో, ఎంత మంది మీ చేతులను ఎత్తగలరు? మీ చేతులను ఎత్తండి. నాకు చెప్పండి. "నా పట్టణములో ఐదు మందిని నేను వ్రేలుపెట్టి చూపగలను." "నేను ఇద్దరు ప్రజలను వేలుపెట్టి చూపగలను, లేక నేను ఒక వ్యక్తిని వ్రేలు పెట్టి చూపగలను." మీరు చేయలేనియెడల, మీ చేతులను క్రిందకు దించండి.
అక్కడ ఒక చెయ్యి కూడా ఎత్తబడలేదు. అక్కడే మీరున్నారు. "నోవహు దినములలో జరిగియున్నట్లు మనుష్యకుమారుని రాకడలోనూ జరుగును." నా భావము ఏమిటో మీరు చూచారా? మనము ఆసక్తిని కోల్పోయియున్నాము. పెంతెకొస్తు సంఘము దానియొక్క అసలైన స్థితికి తిరిగి వెనుకకు రావలసియున్నది.
ROM 8:14•
1COR 2:2
50మనము ఏమి చేసియున్నాము? మనము బాగుగా బలిసిపోయి, మెత్తని ఉన్నితో యున్నాము, కూర్చోని యున్నాము, మరియు దానిని వెళ్ళనిచ్చుచున్నాము, లోకము వలె వస్త్రధారణ చేయుచున్నాము, లోకము వలె ప్రవర్తించుచున్నాము, లోకసంబంధమైన విలాసములకు వెళ్ళుచున్నాము, లోకము చేయు కార్యములను చేయుచున్నాము, మన సంస్థను, సంఘ శాఖలను కలిగియున్నాము, వాటితో పోటీపడుచున్నాము, మన సంఘ కట్టడములను సమస్తమును కలిగియున్నాము, బోధ చేయుచున్నాము. ఓ, "అవును, హల్లెలూయ."
డేవిడ్ డూప్లెస్ చెప్పినట్లుగా, "ఆ మనుమళ్ళు, దేవుని పిల్లలు కాదు మరియు దేవునికి మనుమళ్ళు లేరు." దేవుడు ఒక తాత కాదు. ఆయన తండ్రియైయున్నాడు. సత్యము!
మరియు మనము ఏమి చేయుచున్నాము? మన పిల్లలను లోనికి తెచ్చి, వారిని హాజరు పట్టీలో ఉంచియున్నాము, మరియు అక్కడయున్న పాపి, అతడు పెంతెకొస్తు సంఘములో చేరతాడు, మరియు అంటాడు, "ఓ, అద్భుతముగా లేదా, అతడు పెంతెకొస్తువాడుగా వస్తాడు." ఒక మనువడు.
ఒక నిజమైన దేవుని యొక్క కుమారుడు అగ్నితో ఉంటాడు! అతడు ఏ దాడి చేయడు. అతడు అక్కడ నిలబడి క్రీస్తును మరియు ఆయనను సిలువ వేయబడి ఉండుట తప్ప మరి దేనిని ఎరుగడు. దేవుడు తప్ప మరి ఏదియు అతనిని పట్టుకుని వుండదు. అతడు ఆత్మచేత నడిపించబడతాడు. అతనిని ఏదియు బాధపెట్టదు. అది ఎక్కడకు వెళ్ళినా అతడు ఆత్మను వెంబడించును. యెహెజ్కేలు గ్రంథములో వున్న సజీవమైన ఆ జీవుల వలే ఆ చక్రములు ఎక్కడకు వెళ్ళునో ఆ సజీవమైన జీవులు దానిని వెంబడించును. ఇప్పుడు గమనించండి, సజీవమైన జీవులు, మృతమైన జీవులు కాదు; సజీవమైన జీవులు.
NUM 14:29
51ఒక్క నిమిషము గమనించండి. వారు అక్కడ నివాసము చేసిరి, వారు భార్యలను వివాహము చేసికొనిరి, వారు పిల్లలను పెంచిరి, వారు మంచి పంటలను కలిగియుండిరి, వారు ఆశీర్వదించబడియుండిరి. అవును. మరియు వారు గొప్ప సమయమును కలిగియుండిరి. వారు అక్కడ లోపల వుండిరి. వారు అక్కడ లోపల ఎంతకాలము నిలిచియుండిరి? బైబిలు చెప్పియున్నది, పాత యుద్ధ యోధులు చనిపోవు వరకు (అది నిజము) — వారందరూ చెప్పారు, "దేవునికి మహిమ, మేము అసెంబ్లీలవారమై యున్నాము." "మంచిది, దేవునికి మహిమ, మేము ఫలానా, ఫలానా అయి యున్నాము." "దేవా, మేము ఏకత్వపు వారమైయున్నాము, హల్లెలూయ, మిగిలిన వారు తప్పైయున్నారు." మంచిది, ముందుకు వెళ్ళండి.
వారు ఏమి చేశారు? వారు అక్కడ చనిపోవు వరకు వారి యొక్క సిద్ధాంతములతో వాదిస్తూనే నిలిచియున్నారు. మరియు ఇప్పుడు జరిగియున్నది అదియే. వారు చనిపోయారు! వారు సంస్థలో చనిపోయారు.
దీన్ని పిలుచుటకు ఏ వేదాంత పండితుడినైనా తెస్తాను. ఒక చరిత్రకారుడు… నేను ఎరిగియున్న ఇద్దరు మంచి వారు ఇక్కడే కూర్చొని యున్నారు, ఈ దేశం ఉన్నట్లుగా, వారును మంచివారు. నేను ఏ చరిత్రకారునినైనా దానిని నాకు చెప్పమని అడుగుతాను… ఉజ్జివములో దేవుడు కదలాడిన ప్రతిసారి, సహజాతీతమైన సూచనలు వెంబడించెను. ఆయన కదలాడినప్పుడు సహజాతీతమైనది వెంబడించకపోవుట ఎప్పుడైనా జరిగెనా? ఒక సంస్థగా, శాఖగా మారినప్పుడు అది చనిపోవడం తప్ప అది ఎన్నడైనా తిరిగి లేచియున్నదా? ఎన్నడైనా ఒక సంస్థ దాని యొక్క ప్రారంభమునకు తిరిగి లేచియున్నదేమో నాకు చూపండి. అది సంస్థగా మారిన వెంటనే అది చనిపోయినది. పెంతెకొస్తువారు ఆలాగుననే చేసారు.
పాత యుద్ధ యోధులైన అక్కడున్న మీరు, ఇలా చెప్పగోరుదురు, "హల్లెలూయ! ఆ పాత కొత్త జాబితాతో మేము చేయునది ఏదియు లేదు. దేవునికి మహిమ. అది ప్రవచనం ద్వారా మనకు ఇవ్వబడినది. హల్లెలూయ! అసెంబ్లీల వారితోనూ లేక ఏకత్వము వారితోనూ, మరి ఎవ్వరితోనూ మేము చేసేది ఏమియు లేదు. హల్లెలూయ! మేము భిన్నమైన వారమైయున్నాము." వారు చనిపోయియున్నారు! అది ఏ దాడి చేయుట కాదు. మరియు వారు చనిపోయియున్నారు! కొట్టివేయబడినట్లుగా ముద్ర వేయబడియున్నారు. ఆయన అక్కడ నిలచియున్నాడు మరియు మార్గమంతటి గుండా వారు చనిపోవు వరకు నిలచి చనిపోనిచ్చెను.
ACTS 2:4
52అది ఏమైయుండెను? ఒక దినమున వారి మధ్య నుండి ఒకడు వచ్చి ఇలా చెప్పెను, "వ్రాయబడినది అంతా ఇది కాదు." వారు ఏమి చేశారు? తిన్నగా ఆ వెనుక రాత్రి ఆ పాత నేలలపై, ఆ పర్వతము చుట్టూ మరియు చుట్టూ, తిన్నగా దానిచుట్టూ; చుట్టూ, తిన్నగా ఆ పాత దాని చుట్టూనే ఉన్నారు. అపోస్తలుల కార్యములు 2:4, అపోస్తలుల కార్యములు 2:4, అపోస్తలుల కార్యములు 2:4, అపోస్తలుల కార్యములు 2:4. "హల్లేలూయ! పరిశుద్ధాత్మను పొందుతాము, ఆత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది భాషలతో మాట్లాడుతాము. దేవునికి మహిమ. ఈ చివరి దినములలో దేవుడు పిలిచిన ఆ చివరివానిగా యుండునట్లు నా కొరకు ప్రార్ధించండి, అపోస్తలుల కార్యములు 2:4. సంతోషము నేను పరిశుద్ధాత్మను పొందాను, భాషలతో మాట్లాడుతున్నాను." అది నిజము. అది మంచిది. అయితే నీ ముందు ఒక వాగ్దాన దేశమున్నప్పుడు నీవు ఎందుకు అదే పాత కొండ మీద ప్రయాణం చేయుచున్నావు?
"దేవుడు స్తుతించబడును గాక, నేను అసెంబ్లీలలో చేరియున్నాను. నేను ఏకత్వంలో చేరియున్నాను. నేను దీనిలో చేరియున్నాను. నేను దానిలో చేరియున్నాను." అదే పాత విషయము మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియనులు, కాథలిక్కులు, లూథరన్లు, మరియు మిగిలిన వారందరూ చేసినట్లుగా వారు వారి మార్గములలో చనిపోయారు! వారు చనిపోయారు! అది కఠినమైనది, నాకు తెలుసు సోదరుడా. అది ఆముదమును తీసుకున్నట్లు వలెనే యున్నది, కాని అది నీకు మేలు చేస్తుంది. అది నిజము.
ఈ దినమున సంఘమునకు అవసరమైనది ఏదనగా ఒక మంచ సువార్త యొక్క మందు మోతాదు, నీలో నుండి లోకమును, మురికిని, సోమరితనమును బయటకు తీసివేయును. ఈ దినమున మనకు అవసరమైనది ఏమనగా, తిరిగి పరశుద్ధాత్మ యొక్క శక్తి, ఆత్మ చేత నడపబడుట.
53అది ఏమైయుండెను? అది ఈ దినమున పెంతెకొస్తు సంఘము యొక్క ఒక నీడ మరియు ఒక మాదిరియై యున్నది. నలుబది సంవత్సరముల తర్వాత ఇక్కడ మనలను మనము ఇంకను అపోస్తలుల కార్యములు 2:4 లో కనుగొంటాము. దేవుడు మరొకదానితో తప్పక వస్తాడు, ఆయన యొక్క మరికొన్ని దీవెనలతో, మరియు వారంటారు, "దేవునికి మహిమ, మేము దానిని కలిగియుండలేదు. హల్లెలూయ! అపోస్తలుల కార్యములు 2:4 ను మేము నమ్ముతాము. ఇక్కడ, మా పితరులు దీనిని సంస్థగా చేశారు. వారు దీని యొద్దకు పైకి రాకపోతే, దేవుడు స్తుతింపబడును గాక, మేము దానితో సహకరించబోము."
నీవు దౌర్బాగ్యుడవై, చెడిపోయిన వాడవు, వెనుకకు జారిపోయినవాడవు… సంగతి ఏమిటి? దిక్కుమాలినవాడు. నీవు దేవునిని ఎలా వెంబడించగలవు. ఆత్మ ఎక్కడకు వెళ్ళునో దానితో నీవు ఎలా వెళ్ళగలవు? నీ యొక్క సిద్దాంతమును ఒక కామాతో నీవు ముగించినట్లైతే, నీ సంస్థ బాగుంటుంది. "మేము దీనిని నమ్ముతాము, అదనముగా దేవుడు దానికి దేనిని కలుపగలడు." అయితే నీవు దానిని ఒక ఫుల్-స్టాప్ తో ముగించుచున్నావు. "మేము దీనిని నమ్ముతాము, మరియు నీవు నీ కాలి వ్రేలితో దానికి గురుతు వేస్తావు, లేక అది అంతే అని అంటావు."
లూథరు చెప్పియున్నది అదియే. వెస్లీ చేసియున్నది అదియే. జాన్ స్మిత్ చేసియున్నది అదియే. అలెగ్జాండర్ కాంప్-బెల్ చేసియున్నది అదియే. వారందరూ చేసియున్నది అదియే. మరియు పెంతెకొస్తువారు చేసియున్నది అదియే. నీవు అక్కడే యున్నావు, నీ మార్గముల మీద నలుబది సంవత్సరములు చనిపోయియున్నావు. మరియు దేవుని ఆశీర్వాదముల సంపూర్ణత యొక్క వాగ్దాన భూమి నీ ముందు తిన్నగా ముగించబడియున్నది.
DEUT 2:3•
JOHN 14:12
54ఏమి సంభవించినది?
ఒక దినమున చిన్న వృద్ధ యెహోషువ, అతడు దేవుని యొక్క ప్రతి మాటను నమ్మి ఇలా చెప్పెను. అది నిజమై యున్నది. అతడన్నాడు, "అదంతయూ సత్యమైయున్నది. దేవుడు మన పట్ల శ్రద్ధవహించి తన వాగ్దానమును నిలబెట్టియున్నాడు, ఆయన చెప్పెను, మనము బయట అక్కడ యుండగా మనకు అవసరమైనవాటిని ఆయన సరఫరా చేస్తానని చెప్పెను. అయితే అదంతయూ అదే కాదు. అక్కడ ఒక వాగ్దాన భూమి యుంచబడియున్నది. మనము దానిలోనికి వెళ్ళుదాము. ఈ కొండ మీద మీరు నలుబది సంవత్సరములు యున్నారు. ఇప్పుడు తిరగండి, ఉత్తరం వైపు తిరిగి మరియు పైకి వెళ్ళి దానిని అవతలికి దాటండి." ఆమేన్.
పెంతెకొస్తు సంఘము దాని యొక్క సంస్థ నిర్ణయములో అది వుండిపోయి నలుబది సంవత్సరములు ఉండినది. మీరెంతో దీర్ఘకాలము అక్కడ వుండియున్నారు, సోదరుడా. కాబట్టి మనము లేచి ఉత్తరమునకు వెళ్ళి, యోర్దాను నది దాటి వాగ్దాన భూమి యొద్దకు వెళదాము; "నేను చేయు కార్యములు, మీరును చేస్తారు," అని దేవుడు దానిని వాగ్ధానము చేసాడు. ఆయన వాగ్దానం చేసిన దీవెనలు మరియు సమస్తము మన కొరకే. గ్రంథములోని ప్రతి వాగ్దానము మీదే అయియున్నది. అయితే మీరు చేయవలసినది ఏమనగా? మొదటగా యోర్దాను నొద్దకు రమ్ము, మరియు మీ సిద్ధాంతములకు, సంస్థలకు మరణించవలసియున్నది. అవతలకు దాటవలెను.
55గుర్తుంచుకోండి, ఆయన చెప్పెను, "ఇప్పుడు మీరు ప్రయాణం చేయుచుండగా సరిహద్దు విశ్వాసులతో బాటు మీరు పైకి వెళ్ళుచున్నారు." ఇపుడు, "ఏశావులను తాకవద్దు," అని చెప్పెను. (ఇప్పుడు ఏశావు యొక్క శేయీరు పర్వతము.) చెప్పెను, "అతనిని మీరు ముట్టవద్దు." "నేను అతనికి అది ఇచ్చితిని. మీరు దానిని ప్రక్కగా వెళ్ళినట్లైతే, మీరు దేనినైనా భుజించినట్లైతే దాని కొరకు అతనికి చెల్లించండి, మీరు ఏమైన నీరు త్రాగినట్లైతే, దాని నిమిత్తము అతనికి చెల్లించండి. సరిహద్దు విశ్వాసిని మీరు ముట్టవద్దు, కారణము నేను మిమ్ములను దానిలో దీవించను." చూడండి. "ఎంతమాత్రము అతనిని కొట్టవద్దు, కేవలం నెమ్మదిగా మీరు అతనిని దాటిపోండి."
ఇపుడు మెథడిస్టువారు మరియు బాప్టిస్టువారు అక్కడ సరిహద్దు నొద్ద జీవించుచున్నట్లైతే… ఎన్నడైనా వచ్చిన ప్రతి ఉజ్జీవము కవలలను ఉత్పత్తి చేసినది. అది ఎక్కడ యుండినప్పటికి నేను దాన్ని లెక్క చేయను, అది కవలలను ఉత్పత్తి చేయును. వారిలో ఒకటి… అది సరిగ్గా - సరిగ్గా ఏశావు మరియు యాకోబుల వలె వున్నది — వారిద్దరూ ఇస్సాకు యొక్క కుమారులుగా వారు ప్రాతినిధ్యం వహించారు.
REV 3:16
56ఏశావు ఒక లోకము యొక్క మనిషియై యున్నాడు. అతడు ఒక భక్తిగల మనిషియై యుండెను, అతని తండ్రికి కావలసిన వాటి పట్ల శ్రద్ద వహించెను. మరియు వాటిని సిద్దపరచెను, అతడు ఒక మంచి వ్యక్తియై యున్నాడు. అయితే యాకోబు వివేచనను కలిగియుండెను. జ్యేష్ఠత్వపు హక్కే అతనికి సర్వమై యున్నదని అతడు ఎరిగెను. దానిని అతడు ఎలా పొందవలసి వచ్చినా, అది ఏ బేధమును చేయలేదు, కాబట్టి అతడు దానిని పొందెను. అది ఈ దినమున ఆత్మ సంబంధమైన మనిషియై యున్నాడు.
అక్కడే ఏశావు వున్నాడు, తిన్నగా సరిహద్దు నొద్ద అతని స్వాస్థ్యమును కలిగియున్నాడు. మరియు దేవుడు యాకోబుతో చెప్పియున్నాడు నీవు అతనిని దాటి వెళ్ళుచుండగా, "ఏశావుతో నీవు వెర్రివాడవు కావద్దు. అతని యొక్క సంస్థలలో దేనిలోనూ చేరవద్దు. ఇక్కడ యున్న ఇలాటి కార్యములు ఏవియు చేయవద్దు. ఇప్పుడు నలుబది సంవత్సరములు ఇక్కడ మీకై మీరు ఏమి చేసియున్నారో మీరు చూసియున్నారు. ఇక్కడ మీరు మరొక నలుబది సంవత్సరములు నిలువగోరుచున్నారా?" చెప్పెను.
సోదరులైన మీరు మీ యొక్క సంఘశాఖ యొక్క అల్లరిలో, మీ యొక్క సోదరునితో వివాదమాడుతూ మరొక నలుబది సంవత్సరములు గడుపగోరుచున్నారా? మనము లేచి అవతలికి వెళదాము. మనము వాగ్దాన భూమికి వెళదాము, అక్కడ గ్రంథములోని ప్రతి వాగ్దానము మీకు చెందినదే. "యొర్దాను," అనగా భావము "మరణము." నీవు అవతలకు దాటుటకు ముందు నీవు తప్పక నీ స్వార్ధమునకు చనిపోవలసియున్నది.
ప్రజలు ఒక నులివెచ్చని స్థితిలో జీవిస్తారు. బైబిలు ఆరీతిగా చెప్పినది… బయట అక్కడ పర్వతము మీదనున్న ప్రజలు, వారు దీవించబడ్డారు. వారు వృద్ధి చెందారు. మంచిది, వారికి తినుటకు సమృద్ధిగా యున్నది. పరలోకము నుండి మన్నా పడియున్నది. అది మంచిదై యున్నది. అయితే వారు ఇంకనూ వాగ్దానమునకు బయట యున్నారు.
సరిగ్గా లవొదకయ సంఘమువలె, పెంతికోస్తు సంఘ యుగము వారు దీవెనలను కలగియున్నారు. అయితే దేవుడు వారితో పొత్తు పెట్టుకొనలేదు, ఆయన వారిని వాగ్దాన భూమికి తీసుకొని వెళ్ళలేదు, కారణము వారు వెళ్ళు స్థితిలో లేకుండిరి, చివరకు వారు వారి యొక్క సిద్ధాంతములలో చనిపోయియున్నారని గ్రహింపు వచ్చు స్థలమునకు వచ్చిరి. అప్పుడు దేవుడు వారిని అవతలకు తీసుకొని వెళ్ళెను.
JOHN 14:12
57ఇప్పుడు, ఏశావు పర్వతమును అతడు దాటుతుండగా, సంస్థను దాటుచుండగా, అతడు ఏమి చేసియున్నాడు? ఇప్పుడు, అక్కడ మోయాబు యుండినది. నిశ్చయముగా, మోయాబు ఒక సంస్థయై యున్నది. చెప్పెను, "మీరు ఈ భూభాగముగుండా దాటి వెళ్ళునప్పుడు, అతనితో ఒక్కమాట చెప్పవద్దు, నేను దానిని అతనికి ఇచ్చాను."
ఇప్పుడు ఆయన మెథడిస్టు వారికి వారి యొక్క స్థానమును ఇచ్చియున్నాడు. ఆయన బాప్టిస్టువారికి వారి స్థానమును ఇచ్చియున్నాడు. ఆయన పెంతెకొస్తు శాఖకు వారి స్థానమును ఇచ్చియున్నాడు, వారితో ఒక్కమాట చెప్పవద్దు. మీరు తిన్నగా దాని మీదుగా దాటివెళుతూ, "సోదరుడా, ఎలావున్నావు? ఎలాయున్నావు?" అని చెప్పండి.
"కాని యాకోబు, మేము మా యొక్క యొర్దాను దారిలో యున్నాము (ఆమేన్), యొర్దాను మార్గములో యున్నాము.
"మంచిది, ఇప్పుడు ఏమి వినాలి…" అని వారు చెపితే. మంచిది, వారు ఏమి చెప్పినను ఏ భేధమును చేయదు.
"సోదరుడా, వందనములు, దేవుడు నీతో యుండును గాక సోదరుడా," అని చెప్పండి. కేవలము నిమ్మళముగా దాటివెళ్ళండి. ఏమి చెప్పవద్దు. అయితే పైకి యొర్దాను ముందుకు సాగండి, కారణము మేము వాగ్దాన భూమిని తీసుకొనబోవుచున్నాము, అది మాకు ఇవ్వబడినది, దేవుని శక్తి యొక్క సంపూర్ణత.
యేసు చెప్పెను, "నేను చేయు క్రియలు, మీరును చేస్తారు."
GEN 32:3
58అతి గొప్ప స్వస్థతలు మరియు అలాంటి దర్శనములు, గొప్ప శక్తి గల కార్యములు జరుగుటలేదని ప్రజలు ఆశ్చర్యపడుటకు ప్రయత్నిస్తారు. దేవుడు సంఘమును పైకి తీసుకొని వెళ్ళగోరుచున్నారు, మరియు మనము క్రిందే ఈ పర్వతములో ఇక్కడ చుట్టూ చుట్టూ తిరగుచున్నాము. ఏ రకమైన పర్వతము? ఒక సంస్థాగతమైన పర్వతము.
"ఓ, ఒక్క క్షణము ఆగండి, బ్రదర్ బ్రెన్హాం, మీకు అర్ధమయినదా…" "ఓ, లేదు, నేను కాదు. శేయీరు పర్వతము, అది ఏశావుకు చెందిన ఒక పర్వతము, అతని గొప్ప సంస్థ.
మరియు ఇశ్రాయేలు తమ్మును తాము ఒక పర్వతముగా ఏర్పరుచుకొనిరి. వారు కూడా ఒక పర్వతము మీద యున్నారు. కాని ఒక దినమున దేవుడు చెప్పెను, "ఈ పర్వతమును విడువండి. ఇదిగో పైగా యున్న పల్లములకు నేను మిమ్మును తీసుకొని వెళ్ళబోవుచున్నాను. ఈ పాత రాతి కొండల మీద మీకు ఏమియు దొరకదు. ఏ మంచి మీరు చేయలేరు, అదిగో పైగా వెళ్ళండి, అక్కడ నేను మిమ్ములను పాలు మరియు తేనెతో ఆశ్వీర్వదిస్తాను, మీలో దేవుని యొక్క మంచి విషయాలను కుమ్మరిస్తాను మరియు మిమ్మును స్థిరపర్చుతాను.
అదే ఈ రాత్రి సంఘమునకు అవసరమైయున్నవి, అదే ఈ పర్వతమును విడిచి ఉత్తరమునకు తిరుగుట. ఈ నులివెచ్చని సంబంధమైన స్థితిని విడిచిపెడదాము. అసెంబ్లీ సోదరులైన మీరు, ఏకత్వపు సోదరులైన మీరు, చర్చ్-ఆఫ్-గాడ్ సోదరులైన మీరు, సోదరులైన మీరందరూ, మనము ఇక్కడ, ఎంతో దీర్ఘకాలము నుండి యుండియుండలేదా?
మన భేధములను మనము విడిచిపెడదాము. మన హృదయములను మనము ఒక్కటిగా చేర్చుదాము, మన చేతులను ఒక్కటిగా చేర్చుదాము, మన ప్రయాసలను ఒక్కటిగా చేర్చుదాము, మన ఉద్దేశ్యములను ఒక్కటిగా చేర్చుదాము, మన తలంపులను ఒక్కటిగా చేర్చుదాము, యోర్ధానుపైకి ముందుకు వెళదాము, మరియు ఈ కార్యములకు సిలువ వేయబడదాము మరియు ఎక్కడ దేవుడు మనతో నడుస్తానని మరియు మనలను దీవిస్తానని మరియు అధికమైన సమృద్దిని ఇస్తానని వాగ్దానము చేసియున్నాడో, ఆ వాగ్దాన దేశములోనికి మనము అవతలకు దాటి వెళదాము.
59మీరు దేవుని యొక్క మాధిరులను మరియు ఛాయలను విచ్చిన్నము చేయలేరు. దానినే ఇశ్రాయేలు సహజముగా చేసియున్నది. దానినే వారు ఆత్మసంబంధముగా చేసియున్నారు. ఆ సంగతులు ఇశ్రాయేలుకు సంభవించియున్నవని మనము గ్రహిస్తాము. ఇప్పుడు, వారు అప్పుడు చేసియున్నట్లుగా అవి ఈ దినమున సంఘమునకు సంభవించి యున్నవి. సోదరులారా, మనము ఇప్పుడు ఇంచుమించు మార్గము యొక్క అంతములో యున్నాము. ఏదో సంభవించుటకు అది సమయమైయున్నది. నేను యొర్దానును దాటి, అవతలకు వాగ్దాన భూమిలోనికి వెళ్ళగోరుచున్నాను, మీరు కోరుటలేదా? అక్కడ మనము చూడగలము…
మనము మంచి కార్యములను చూసియున్నాము. దేవుడు మనకు మంచిగా యుండియున్నాడు, మనము ఫిర్యాదు చేయుట లేదు, నేను ఇక్కడ నీతో బయట యున్నాను. నేను ఈ కార్యములతో ఇక్కడ మీతో బయట యున్నాను. కాని, సోదరులారా, మనము మనలను ఏకముగా ఉంచుకొని అవతలకు వెళదాము. మనము తప్పక అవతలకు వెళ్ళాలి!
ఆ గొప్ప యెహోషువ, దేవుని నుండి వాగ్దానమును పొందిన పరిశుద్ధాత్మ, మనలను నడిపించుటకు క్రిందికి వచ్చును, అతడు దానిని ఎన్నడూ అనుమానించలేదు. యెహోషువ దానిని ఎన్నడూ అనుమతించలేదు, అతడు దేవుని యొక్క సైన్యాధిపతియై యుండెను. అది ఖచ్చితముగా సత్యము, అతడు దేవుని యొక్క సైన్యాధిపతియైయుండెను. మరియు ఆయనే పిల్లలను నడిపియుండెను. మరియు అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సైన్యాధిపతి, ఆ ప్రధాన అధిపతి - యెహోషువ పైకి వచ్చినప్పుడు యెరికో ద్వారముల నొద్ద నిలబడెను. అదే ప్రధాన అధిపతి, మన సైన్యాధిపతి, మనలను వాగ్దాన భూమిలోనికి నడుపవలసియుండెను, మరియు ఆయన ఒక్కడు మాత్రమే దానిని చేయగలడు.
మన సంస్థలు దానిని చేయలేదు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. దానిని క్రింద గుర్తుపెట్టుకొనండి. మీ గ్రంథములో దానిని ఉంచండి మరియు అది నిజమో లేక కాదో చూడండి. ఏ సంస్థయు ఎన్నడూ నిన్ను అవతలకు తీసుకొని వెళ్ళలేదు. తిన్నగా పర్వతము మీదనే అది నిన్ను యుంచుతుంది. కాని పరిశుద్ధాత్మ నిన్ను వాగ్దాన భూమికి తీసుకొని వెళుతుంది.
60ఓ, మీరు ఆయనను ప్రేమించారా? మీరు ఆయనను నమ్మరా? మీరు ఆయనను సేవించుటకు ఇష్టపడరా? ఓ, నేను దానిని ఎరిగియున్నట్లైతే, అదే నా హృదయము యొక్క ఉద్దేశ్యములైయున్నది. ప్రభువా, యేసును నన్ను చూడనిమ్ము. ఆయనను మాత్రమే నన్ను చూడనిమ్ము.
నేను బయటకు వెళ్ళి, అక్కడయున్న ప్రతి అసెంబ్లీ సోదరుని నన్ను తేనిమ్ము. నేను బయటకు వెళ్ళి, ఏకత్వపు సహోదరులను తేనిమ్ము. నేను బయటకు వెళ్ళి, చర్చి-ఆఫ్-గాడ్ వారిని తేనిమ్ము. నేను బయటకు వెళ్ళి, ఆ ఇతర సోదరులందరినీ తేనిమ్ము. వారు ఎవరైయున్నను, "సోదరులారా, సోదరులారా, ఈ పర్వతమును విడిచిపెడదాము," అని చెప్పనివ్వండి. అసెంబ్లీస్-ఆఫ్-గాడ్, ముందుకు రండి. చర్చి-ఆఫ్-గాడ్, ముందుకు రండి. ఏకత్వపు వారలైన మీరు, ద్విత్వపు వారలైన తమరు, మరియు మీరు ఏమైయున్నను ముందుకు రండి. మన హృదయములను ఏకముగా యుంచుదాము. యుద్ధము చేయు దినములు సమాప్తమైనవి. మనము కానాను వైపునకు సాగిపోదాము. హల్లెలూయ!
యొర్దాను యొక్క తుఫానుతోయున్న ఒడ్డుల మీద నేను నిలబడతాను
(ఈ రాత్రి విశ్వాసము ద్వారా),
మరియు కానాను యొక్క చక్కని అందమైన భూముల మీద,
ఎంతో ఆశిస్తూ నా కంటిని ఉంచుతాను,
అక్కడే నా స్వాస్థ్యములు ఉన్నవి.
ఓ, ఎవరు వచ్చి నాతో వెళతారు?
నేను వాగ్దాన భూమికి కట్టుబడి యున్నాను.
అది నా జీవితములో సర్వమును తీసుకొన్ననూ, సర్వము [స్పష్టతలేని మాటలు] ప్రతిదానిని, నేను వాగ్దాన భూమికి కట్టబడి యున్నాను, మీరు వెళ్ళగోరుచున్నారా? ఒక్క క్షణము, మనము మన పాదముల మీద నిలబడుదాము.
యొర్దాను యొక్క తుఫానులతో యున్న ఒడ్డున నేను నిలబడతాను,
మరియు ఎంతో ఆశిస్తూ నా కంటిని ఉంచుతాను,
కానాను యొక్క చక్కని అందమైన భూములకు,
అక్కడే నా స్వాస్థ్యము ఉన్నది.
(మీరు పాడుచుండగా, మీ చేతులను పైకెత్తండి.)
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళుతున్నాను,
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళుతున్నాను,
ఓ, ఎవరు వచ్చి నాతో వెళతారు?
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళుచున్నాను,
ఆ వెడల్పుగా విస్తరించిన మైదానములు
ఒక నిత్యమైన దినముగా ప్రకాశించును,
అక్కడ కుమారుడైన దేవుడు నిత్యము ఏలును.
మరియు రాత్రిని దూరముగా పారద్రోలును.
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళుచున్నాను,
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళుచున్నాను;
ఓ, ఎవరు వచ్చి నాతో వెళతారు?
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళుచున్నాను.
61ఏదియు మనలను నడుపుట మనకు ఇష్టము లేదు. కుమారుడైన దేవుడు శాస్వతముగా పాలించును మరియు ఇతర అసహనములను దూరముగా పారద్రోలును. ఓ, మనము ఆయనను కలుసుకొనగోరుదుము. మీరు ఆయనను చూడగోరుటలేదా? ఇప్పుడు, ఏకత్వపువారైన మీరు, ద్విత్వపువారు, త్రిత్వపువారు, మెథడిస్టులు, బాప్టిస్టులు, అసెంబ్లీలు, మరియు మీరందరూ, మనము పాడుచుండగా ఒకరితో ఒకరము కరచాలనము చేయుదుము, ఒకరితో ఒకరము కరచాలనము చేసి మరియు "సోదరుడా, దేవుడు నిన్ను దీవించును, నేను వాగ్దాన భూమికి వెళ్ళు నా దారిలో నేను యున్నాను," అని చెప్పండి.
నేను వాగ్దాన భూమికి (చుట్టూ తిరిగి
కరచాలనము చేయండి),
బయలుదేరి వెళ్ళుచున్నాను,
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళుచున్నాను,
ఓ, ఎవరు వచ్చి నాతో వెళతారు?
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళుతున్నాను.
62ఓ, అది నీకు మంచి అనుభూతిని కలిగించుటలేదా? మీకు నన్ను చూపించనియ్యండి. మూడు లేక నాలుగు వారముల క్రితము నేను ఒక ప్రఖ్యాతిగాంచిన సంఘ శాఖలలో యుంటిని, ఏమి జరిగియున్నది? నేను ఒక వేదిక పిలుపును ఇచ్చియున్నాను. నాలుగు లేక ఐదుగురు పాపులు వేదిక చుట్టూ వచ్చారు. నేను దానిని చేసి అన్నాను, "మీలో ఎవరైనా వచ్చి, ఈ ప్రజల కొరకు ప్రార్ధన చేస్తారా?" అది ఒక పెంతెకొస్తు సంఘము. ఎవ్వరును రాలేదు.
నేనన్నాను, "పరిశుద్ధులైన మీలో కొందరు దయతో వచ్చి ప్రార్ధన చేయండి?" నేను తట్టుకొనలేకపోయాను. నేనన్నాను, "పరిశుద్దులైన మీలో కొందరు దయతో వచ్చి ప్రార్ధన చేస్తారా?" ఏమిటో మీకు తెలుసా? ముందుకు వచ్చుటకు నేను వారిని ఒప్పింపలేకపోయాను. ఓ, సోదరుడా, నలుబది సంవత్సరముల క్రితము వారిలో ఒకరు వేదిక యొద్దకు వచ్చుటకు ప్రారంభించలేదు, వారు అక్కడకు వెళ్ళకముందు వారాచుట్టూ యాబై మంది అక్కడ యుంటారు. వారి హృదయములు అగ్నితో మండేవి, చూశారా.
మీరు బాప్టిస్టు వారిని గూర్చి మాట్లాడండి. నేను కెంటకీ రాష్ట్రములోని, ఆ వెనుక పాత మిషనరీ బాప్టిస్టు సంఘము నొద్దకు మిమ్ములను తీసుకొని వెళతా, ఉత్తరమున యున్న బాప్టిస్టులైన మీవలె వారు చల్లగా మరియు నామకార్ధముగా లేరు, వారు వేదికనొద్దకు వెళ్ళి, వారు దాని గుండా వచ్చు వరకు ఒకరినొకరు వీపులను కొడతారు. అక్కడవారు దేనినో పొందుతారు. అవునండి.
63మరియు ఈ మధ్యనే నేను అక్కడ అలంకరణనొద్ద యున్నాను… అక్కడే మా నాయినమ్మ మరియు వారందరూ సమాధి చేయబడ్డారు, మరియు నేను దేవుని రాకడను గూర్చి బోధించుచుంటిని, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చి. ఆ వృద్ద స్త్రీలు పాత సూర్యుని వంటి టోపీలను కట్టుకొని కేకలు వేయుచున్నారు. ఆ పైన యున్న కొండలలో వారు, అక్కడ ముప్పై మైళ్ళ దూరములో నీకు ఒక కారు కూడా దొరకదు. ఆ వెనుక కొండలలో ఆ వృద్ధ ప్రజలందరూ, స్త్రీలు కేకలు వేయుచున్నారు. నేల మీద పైకి క్రిందికి ఎగురుతూ దేవునిని స్తుతించుచున్నారు.
మరియు అక్కడ ఒక పెద్ద పాత కుర్రవాడు యున్నాడు. నేను ఒక వేదిక పిలుపును ఇచ్చియున్నాను. నేనన్నాను, "అక్కడ నా వృద్ధ నాయనమ్మ నా చేతులలో దేవుని స్తుతిస్తూ చనిపోయి, సమాధిలో యున్నది." నేనన్నాను, "అక్కడ నా వృద్ద చిన్నమ్మ, తాను మరణించు సమయములో నా బుగ్గల మీద ముద్దు పెట్టుకొని, ఆమె అన్నది, "బిల్లీ, అదిగో, ఆ నది అవతల నేను నిన్ను కలుసుకొంటాను." నేను అన్నాను, "ఆమె అక్కడ ఆ పునరుత్థాన ఉదయము కొరకు కనిపెడుతూ పడియున్నది. హల్లేలూయ!" నేనన్నాను, "ఇక్కడ ఎవరైనా పాపులు ఉన్నట్లైతే, లోనికి రండి. యేసు మిమ్ములను ఆహ్వానించుచున్నాడు."
ఒక దీన బాలుడు ఒక టోపీ పెట్టుకొని, దాని చివరను ఈ రీతిగా చప్పరిస్తూ నిలబడియున్నాడు. అతడు తన తలను క్రిందకు వంచి, "దేవా, పాపినైన నన్ను కనికరించుము," అని చెప్పెను. అతడు కనీసము అక్కడ వేదికనొద్దకు రాకముందే, ఆ పాత తల్లులు ఇరువది మంది అతని చుట్టూ చేరి యుండిరి. ఇరవై లేక ముప్పై మంది వేదిక చుట్టూ పరుగెత్తుకొని వచ్చిరి, పాపులందరూ అక్కడకు పరుగెత్తుచున్నారు.
మరియు మేము మా రాత్రి భోజనమును పదకొండు గంటకు తినవలసి యున్నది, కాని తరువాత రోజు మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతములో మేము మా భోజనమును తినియున్నాము, ఏడ్చుకోంటూ, కేకలు వేయుచూ, దేవుని స్తుతించుచూ, మరియు పైకి క్రిందికి ఎగురుకొంటూ అడవులలో కేకలు వేయుచూ — దేవునిని స్తుతించుచున్నాము. పెంతికొస్తు గూర్చి మాట్లాడండి! అది మిషనరీ బాప్టిస్టు సంఘములో అయి యుండెను.
ACTS 26:24
64మరియు నేను ఇక్కడ తిన్నగా ఒక పెంతెకొస్తు సంఘములో యున్నాను, మరియు పాపులు వారి హృదయములను వేదిక చుట్టూ కుమ్మరించుచున్నారు, మరియు ఒక క్రీస్తు యొక్క దాసుడుగా, ఎవరైనను వచ్చి ఆ చుట్టూ వారితో మోకరించవలెనని కనీసము నేను ఎవరికి ఒప్పింపలేకపోయాను. అయ్యో!
నేను నా మతిని కోల్పోయానా? నాలో ఏదైనా పొరపాటు యున్నదా? నేను నా భార్యను అడిగాను, నేనన్నాను, "హనీ, సంగతి ఏమిటో నాకు చెప్పు." నేను సహోదరుడు మూర్ ను అడిగాను, "నేను వెర్రివాడనయ్యానా? ఇది వాక్యమేనా…? సంగతి ఏమిటి? అగ్రిప్ప పౌలుకు చెప్పినట్లుగా, నన్ను పిచ్చివాడిగా చేయవద్దు, అధికముగా నేర్చుకొని యున్నానా?"
నేనన్నాను, "లేదండి! ఎవరో దాని కొరకు తప్పక నిలబడవలసియున్నది."
65ఈ మధ్యనే ఒక గొప్ప పేరుగాంచిన సేవకుడు నాతో చెప్పెను, "బ్రదర్ బ్రెన్హాం, నేను నిన్ను ఒక దైవజనుడిగా నమ్ముతాను." అయితే నన్ను నీ మీద చేతులుంచి నీ కొరకు ప్రార్ధన చేయనిమ్ము. నీవు ప్రజలను ఎక్కువగా విమర్శించుచున్నావు."
నేనన్నాను, "సోదరుడా, అది సత్యమని నీవు నమ్ముతావా?"
అతడన్నాడు, "లేదు, అయితే అది నీ పని కాదు." అతడన్నాడు, "నీ పని రోగుల కొరకు ప్రార్ధన చేయుటయే."
నేనన్నాను, "బుద్ధిహీనత! లేదండి. దేవుడు కేవలము బాలునికి మరియు చేపలు రొట్టెలు కొరకు వరములను ఇయ్యడు. లేదండి! విడుదలను ప్రకటించుటకు మరియు సువార్తను మాట్లాడుటకు ఆయన నీకు వరములను ఇచ్చును. "నేను దానిని చేయనియెడల, ఎవరు చేస్తారు?" నేనన్నాను, "నీవు చేయలేవు, ఎందుకనగా నీకు మద్దతు ఇచ్చుటకు ఎంతో మంది నీకు ఉన్నారు. బైబిలు మరియు నేను బోధించు పరిశుద్ధాత్మ తప్ప నాకు మద్దతు ఇచ్చుటకు నా వద్ద ఏదియు లేదు." హల్లెలూయ! దేవునికి మహిమ!
ఒక పెంతెకొస్తుగా యుండుటకు నేను సంతోషిస్తాను. నేను పెంతికొస్తువాడనై యున్నానని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను కోరుదును. నేను పరిశుద్ధాత్మను పొందియున్నాను. పెంతెకొస్తు సంస్థను కాదు; అది నాకు దూరముగా వున్నది. అనుభవము ద్వారా నేను ఒక పెంతెకొస్తును. యేసుక్రీస్తు నా రక్షకుడై యున్నాడు. నేను ఆయనను ప్రేమిస్తాను. నాలో ఏమియూ లేదు.
66ఒక గొప్ప సంస్థ యొక్క ఒక గొప్ప మనిషి నాతో ఇలా చెప్పాడు, "బ్రదర్, బ్రెన్హాం , నీవు కొన్ని విషయముల మీద రాజీపడినట్లైతే, ప్రపంచములోని ముఖ్యమైన నాడీ కేంద్రములకు నిన్ను విమానములో తీసుకు వెళ్ళి మరియు నిన్ను బోధించనిస్తాము, కేవలము నీవు మాతో వచ్చి మరియు మాతో చేరినట్లైతే."
నేనన్నాను, "డాక్టరు డిగ్రీతో గౌరవము మరియు హోదా కలిగియున్న ఒక మనిషి, ఒక దేవుని యొక్క సేవకుని, ఆయన యొక్క మాట మీద రాజీపడమని అడుగుటా. నీకు సిగ్గుగా లేదా." నేనన్నాను, "నేను తప్పైయున్నట్లయితే, అప్పుడు నీవు లేఖనమును తీసుకొని, నేను ఎక్కడ తప్పైయున్నానో నాకు చూపించు.'' నేనన్నాను, "దేవా… సోదరుడా, అలాంటి దానిని నీవు ఎలా చేయగలవు?"
అతడు తన తలను వంచెను, అతడన్నాడు, "నీవు ఒక దైవజనుడవని నేను నమ్ముతాను, నా భార్య ఎన్నో సంవత్సరముల క్రితము చనిపోయినది, ఆమె నేను ఎన్నడైనా చూచిన ఒక భయంకరమైన కాన్సర్ రోగి." చెప్పెను, "నీవు ఆమెతో మాట్లాడావు, మరియు పరిశుద్ధాత్మ ద్వారా ఆ రీతిగా నీవు ఆమె పేరును పిలిచియున్నావు." చెప్పెను, "నేను నమ్ముతాను, మరియు…"
నేనన్నాను, "అలాగైతే నన్ను రాజీపడమని నీవు అడుగుతావా? అది నా నరాల్లో లేదు. లేదండి! నేను వేదిక మీద చనిపోయినను వాక్యముతో నిలబడియుంటాను." నీ నివాస స్థలమును పెల్లగించినను, నీ తోలు వలిచినను లెక్క కాదు, ఎలాగైనా అక్కడ నిలబడి యుండుము, ఆ మార్గములోనే మన తండ్రులు వాక్యము మీద నిలబడి యున్నారు.
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళుచున్నాను,
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళుచున్నాను,
ఓ, ఎవరు వచ్చి నాతో వెళతారు?
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళుచున్నాను,
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళుచున్నాను,
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళుతున్నాను,
ఓ, ఎవరు నాతో వచ్చి నాతో వెళతారు ?
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళుచున్నాను.
67నిశ్శబ్దములో నేను ఆశ్చర్యపడతాను, సంగీతము ఆడుచున్నది, సహోదరీ, నీవు కోరినట్లైతే, "నేను వాగ్దాన భూమికి కట్టబడియున్నాను." నేను దేనిని గూర్చి మాట్లాడుచున్నానో దానిని గూర్చి ఏమియు ఎరుగని ఒక పాపి ఇక్కడ యున్నాడా, కాని ఇంకనూ అది సత్యమైయున్నదని, యేసుక్రీస్తు దేవుని కుమారుడై యున్నారని, దేవుని యొక్క కోపము ఆయన మీద కుమ్మరించబడి, ఆయన కల్వరిలో నీ యొక్క స్థానమును తీసుకొని ఒక పాపి యొక్క మరణమును మరణించాడని నీవు నమ్ముచున్నట్లైతే? నీ మరణమును ఆయన కల్వరిలో మరణించాడు, మరియు ఆయనలో మాత్రమే నీవు రక్షణ పొందగలవు, మరియు నీవు ఇంకనూ దానిని చేయలేకపోయినట్లైతే, నేను నిన్ను ఈ వేదిక యొద్దకు ఆహ్వానిస్తాను, ఇక్కడకు వచ్చి క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడుము.
నీవు ఒక సంఘ సభ్యుడవైయున్నట్లైతే, నీ సంస్థను గూర్చి తప్ప నీవు ఏమియు ఎరుగకపోయినట్లైతే, అది పెంతెకొస్తుయై యున్నను, అది మెథడిస్టు అయి యున్నను, బాప్టిస్టు, కాథలిక్, యూద మతము, ఆర్థోడాక్స్, గ్రీకు, నీవు ఏమైయున్నప్పటికి, మరియు నీ సంస్థ తప్ప నీకు ఏమియు తెలియనట్లైతే, నీవు ఎన్నడూ ఒక దానిని కలుసుకోనపోయినట్లైతే, అదే క్రొత్త జన్మ నిన్ను మార్చియున్నది, నిన్ను సజీవముగా చేసినది, లోక కార్యములతో నిన్ను రాజీపడకుండా చేసినది. లోకముతో నీవు ఏమియు చేయగోరుట లేదు, నీవు దానితో చేయగోరునది ఏమియు లేదు. నీవు దానికి చనిపోయియున్నావు, మరియు నీవు క్రీస్తులో సజీవముగా యుండగోరినట్లైతే, నీవు ఆ అనుభవమును ఇంకనూ పొందక పోయినట్లైతే, మరలా మేము పాడుచుండగా, నీవు ఇక్కడ వేదికనొద్దకు వస్తావా?
68నీవు పరిశుద్ధాత్మ లేకుండా యున్నట్లైతే మరియు నీవు పరిశుద్ధాత్మను పొందగోరుచున్నట్లైతే, మరలా మేము పాడుచుండగా, నీవు వేదిక నొద్దకు వచ్చి ఇక్కడ నిలబడతావా? యాత్రికులైన మీరందరూ విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృప ద్వారా, వాగ్దాన భూమి వైపునకు వెళ్ళుటకు మాతో చేరగోరినట్లైతే, ఇప్పుడు నాతో పాడండి. మంచిది.
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళ్ళుచున్నాను
(రమ్మని నేను మిమ్ములను ఆహ్వానిస్తాను,
నేను చేయగలిగినది అంత మట్టుకే.),
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళ్ళుచున్నాను;
(సోదరుడా, దేవుడు నిన్ను దీవించును.)
ఓ, ఎవరు వచ్చి నాతో వెళతారు?
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వేళ్ళుచున్నాను.
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళ్ళుచున్నాను.
ఓ, ఎవరు వచ్చి నాతో వెళతారు?
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళ్ళుచున్నాను.
నేను నా తండ్రి యొక్క ముఖమును ఎప్పుడు చూస్తాను,
మరియు ఆయన రొమ్ము మీద ఎప్పుడు విశ్రాంతి పొందుతాను?
69మనము ఈ పాటను పాడుచుండగా, నేను మీకు దానిని చెప్పగోరుదును. ముప్పై-ఒక్క సంవత్సరముల క్రితము, నేను అయిదు వందల మందితో జెఫర్సన్-విల్ నొద్ద నిలబడియుంటిని, అది నా మొదటి ఉజ్జీవ కూటము:
యొర్దాను యొక్క తుఫానులతో యున్న ఒడ్డుల మీద నేను నిలబడి,
ఎంతో ఆశిస్తూ నా కంటిని ఉంచుతాను;
మరియు కానాను యొక్క చక్కని అందమైన భూముల మీద,
అక్కడే నా స్వాస్థ్యమున్నది.
అను పాటను పాడుచున్నాము. మరియు అయిదు వందల మందికి, ఒక మిషనరీ బాప్టిస్టు బోధకుడిగా, బాప్తిస్మమిచ్చుటకు బయటకు నడిచాను. 17వ వ్యక్తికి నేను బాప్తిస్మమును ఇచ్చియున్నాను, అంతా అకస్మాత్తుగా, "పైకీ చూడుము," అని ఏదో చెప్పుట నేను విన్నాను. మరియు నేను పైకి చూశాను, పరలోకము నుండి గిరగిర తిరుగుకొంటూ ఆ అగ్నిస్తంభము ఇక్కడకు వచ్చినది. తిన్నగా నేను నిలబడియున్న స్థలము పైగా నిలబడి, ఇలా చెప్పాడు, "బాప్తిస్మమిచ్చు యోహాను క్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందు పంపబడియున్నట్లుగా, నీ వర్తమానము క్రీస్తు యొక్క రెండవ రాకడను సూచిస్తుంది." బాప్టిస్టు బోధకుడు నన్ను చూచి నవ్వినప్పుడు…
అది అసోసియేటెడ్ వార్తాపత్రిక ప్రెస్ గుండా వెళ్ళినది: "ఒక సేవకుడు బాప్తిస్మమిచ్చుచుండగా, ఒక మర్మయుక్తమైన వెలుగు పైగా ప్రకాశించినది." అసోసియేటెడ్ వార్తాపత్రికల ప్రెస్ గుండా అది ప్రతిచోటకు కెనడా వరకు పైకి వెళ్ళినది. వందలమంది మరియు వేలమంది ప్రజలు దానిని చూచిరి. సోదరుడా, ఈ దినమున దానిని చూడుము.
చూడు, దాని వాగ్దానము సత్యమైయున్నది. "యొర్దాను యొక్క తుఫానులతో కూడిన ఒడ్డుల మీద నేను నిలబడతాను, మరియు ఎంతో ఆశిస్తూ నా కంటిని ఉంచుతాను." మనము ఈ అరణ్యములో దీర్ఘకాలము ఉండియున్నాము. మనము వాగ్దాన భూమి వైపునకు వెళదాము.
DEUT 34:1,4
70ఇక్కడ ఈ చుట్టూ యున్న ఒక గుంపు ప్రజలు దేవుని వెదుకుచూ, దేవుని కోరుకొనుచూ, వాగ్దాన భూమికి వెళ్ళవలెనని కోరుచూ నిలబడియున్నారు. సేవకులైన మీలో కొందరు, నశించిన ఆత్మల కొరకు మీ హృదయములలో భారమును కలిగిన సోదరులైన మీలో కొందరు వున్నట్లైతే, ఇక్కడ వారితో చుట్టూ నిలబడతారా, అని నేను ఆశ్చర్యపోతాను.
ఇంకనూ క్రీస్తును స్వీకరించాలని ఆశపడు మీరు, ఇక్కడ కూడా చుట్టూ, మీ దారిని చేరుకొని, మీరు వస్తారా? వేదిక చూట్టూ నిలబడండి. ఈ పురుషులు మరియు స్త్రీలు, బాలురు మరియు బాలికలు - క్రీస్తును తమ రక్షకునిగా స్వీకరించుటకు ఇక్కడ యున్నారు. మీరు కోరినట్లైతే… మరలా మనము పాడుచుండగా.
యొర్దాను యొక్క తుఫానుతో కూడిన ఒడ్డుల మీద నిలబడియుండగా,
ఎంతో ఆశిస్తూ నా కంటిని ఉంచుతాను;
మోషే అక్కడ నిలబడి, వాగ్దాన భూమిలో పైకి చూచెను. సంస్థ, అది దేవునిని తప్పిపోయినందున అది వెళ్ళుటకు అడ్డగించబడినది. అయితే యెహోషువ దేవోక్తులను తీసుకొని వాగ్దాన భూమిలోనికి పైకి వెళ్ళెను. దేవుని యొక్క కృప మార్గము గుండా మనలను తీసుకొని వెళుతుంది, సోదరుడా.
… యొర్దాను యొక్క తుఫానుతో కూడిన ఒడ్డున నేను నిలబడతాను,
మరియు ఎంతో ఆశిస్తూ, నా కంటిని ఉంచాతాను…
మీరు వస్తారా, యవ్వనస్తులారా, వృద్దులారా, మీరు ఎవరై యున్నప్పటికి, మాతో చేరండి?
.. కానాను యొక్క అందమైన మరియు సంతోషకరమైన భూమి,
అక్కడ నా స్వాస్థ్యములు ఉంచబడినవి.
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళ్ళుచున్నాను,
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళ్ళుచున్నాను;
ఓ, ఎవరు వచ్చి, మరియు నాతో వెళతారు?
నేను వాగ్దాన భూమికి బయలుదేరి వెళ్ళుచున్నాను.
MATT 10:32•
JOHN 5:24•
JOHN 6:37•
ROM 5:1•
ROM 15:16•
1COR 12:13
71ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషము గౌరవముగా యుండండి. ఇక్కడ యున్న ప్రజలతో నేను మాట్లాడగోరుదును. ఈ రాత్రి నా ప్రియమైన స్నేహితులు, ఈ నిర్ణయము చేయుటకు, ఒకటి మీతో మాట్లాడవలసి యున్నది. యేసు చెప్పెను, "తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. మరియు నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. నా మాటలు విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు." అక్కడ ఒకే ఒక రూపమైన నిత్యజీవమున్నది, నిత్యజీవము, అదే దేవుని యొక్క జీవము, జో (Zoe).
నీవు నీ స్థలము నుండి పైకి లేచి పైకి ఇక్కడకు నడచి వచ్చియున్నందున, అది ఒక ఆత్మను చూపిస్తుంది… ఈ సంవత్సరములన్నియూ నీవు తప్పైయున్నావు, ఏదో ఈ రాత్రి నీ ప్రక్కన నిలబడి, "నీవు తప్పు" అని చెప్పినది. అదే పరిశుద్ధాత్మయై యున్నది. "లేచి, ముందుకు రమ్ము," అన్నది, మరియు నీవు దానిని చేశావు.
"నన్ను మనుషుల యెదుట ఒప్పుకొనువానిని, నా తండ్రి యెదుటను మరియు ఆయన పరిశుద్ద దూత యెదుటను అతనిని నేను ఒప్పుకొందును." అది ఆయన వాగ్దానమై యున్నది. ఆయన దానిని వెనుకకు తీసుకొనలేడు. అది ఆయన వాగ్దానమై యున్నది. దానిని వెనుకకు తీసుకొనుట అనునది అక్కడ లేదు. ఆయన నీకిచ్చుటకు ఇక్కడ యున్నాడు… నీవు ఆయన కొరకు ఒక నిర్ణయము తీసుకొనినందున, ఆ దినమున ఆయన నీ కొరకు నిలబడతాడు. ఆయన నీ స్థానమును తీసుకొన్నాడు. ఇప్పుడు, నీవు తప్పైయున్నావని ఒప్పుకొనుటకు ఇష్టపడుచు నీవు కనికరము కొరకు ఆయన యొద్దకు వస్తావు. నీవు చేయగలుగునది అక్కడ ఏమియు లేదు, అయితే ఆయన యందు విశ్వాసముంచి నీ కొరకు దేవుడు ఏమి సిద్దపర్చియున్నాడో ఎదురు చూడుము. అదే రక్షణ.
గుర్తుంచుకో. ఆయన వాక్యమును వినుము. పరిశుద్ధ యోహాను 5:24. "నా మాట విని, నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు." ఇప్పుడు, దేవుడు నిన్ను చుట్టూ తిప్పాడు, అది పరిశుద్ధాత్మలోని ఒక భాగము నిన్ను త్రిప్పియున్నది.
పరిశుద్ధాత్మ తరువాత భాగము నిన్ను శుద్ధిచేసి మరియు నీలోని అపవిత్రత అంతయూ తీసి వేయుటయే. పరిశుద్ధాత్మ యొక్క మూడవ భాగము శరీరములోనికి నీకు బాప్తిస్మమును ఇచ్చుటయే, అప్పుడు నీవు పరిశుద్ధాత్మతో మరియు దేవుని యొక్క శక్తులతో నింపబడియున్నావు. ఆ కారణమును బట్టియే ఈ రాత్రి ఇక్కడ నీవు నిలబడియున్నావు, కారణము నీవు నీ రక్షకుడిగా క్రీస్తును స్వీకరించుటకు నీ మొదటి నిర్ణయమును తీసుకొనియున్నావు.
ఇప్పుడు, జనులను తమ తలలు వంచవలసినదిగా నేను కోరుచున్నాను.
MATT 10:32•
LUKE 9:26
72మా పరలోకపు తండ్రి, ఇక్కడ నిలబడియున్న ప్రజలు వారి యొక్క గత జీవితములను బట్టి సిగ్గుపడుచున్నారు. వారు తప్పైయున్నారని నీ స్వరమును వినిన కారణమును బట్టి మరియు నిన్ను వారి స్వరక్షకుడిగా స్వీకరించుటకు ఇక్కడకు వచ్చి నిలబడియున్నారు. వారు ఇక్కడ నీతీకరణము యొక్క దిశలో నిలబడియున్నారు. "కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.
"ప్రభువా, నేను నిన్ను నమ్ముచున్నాను. నీ మాటలు సత్యమని నేను నమ్ముచున్నాను."
ఈ రాత్రి నీ యొక్క సేవకుడిగా నేను నిలబడియుండగా, వారిలో ఒకరిగా, ఈ ప్రజల కొరకు విజ్ఞాపన చేయుచున్నాను, మరియు నీవు ఏమి చెప్పియున్నావో దానిని నీ జ్ఞాపకమునకు తెచ్చుచున్నాను. వారు ఇక్కడ యున్నారు. వారు తమ స్థలములలో నుండి పైకి లేచి, మరియు ఈ పైకి కదిలి వచ్చినారు, కారణము నీవు దేవుని కుమారుడవని వారు ఒప్పించబడియున్నారు.
మరియు నీవు వారి కొరకు చనిపోయియున్నావని, నీ క్షమించు కృపను కోరుచున్నాను. దానిని అంగీకరించకపోవుట వారికి ఒక అసంభవమై యుంటుంది. నీవు దానిని వాగ్దానము చేసియున్నావు. అది వారిదై యున్నది. వారు దానిని నమ్మియున్నారు. వారు దానికి సాక్ష్యమిచ్చుటకు వచ్చియున్నారు. మనుష్యులు ముందు వారు నన్ను గూర్చి సిగ్గుపడినట్లైతే, తండ్రి ముందు మరియు ఆయన దూతల ముందు నేను వారిని గూర్చి సిగ్గుపడతానని నీవు చెప్పియున్నావు, "అయితే మనుష్యులు ముందు నన్ను ఎవడు ఒప్పుకొంటాడో, అతనిని నా తండ్రి ముందు మరియు పరిశుద్ద దూతలముందు నేను అతనిని ఒప్పుకొంటానన్నావు."
JOHN 5:24•
JOHN 10:29•
2COR 5:17
73ప్రభువా, వారు నీవారై యున్నారు. వారు తప్పైయున్నారని వారు ఒప్పించబడ్డాడు. వారు తప్పైయున్నారని మరియు వారికి క్షమాపణ కావాలని దేవుని యొక్క వాక్యము ద్వారా సాక్ష్యమిచ్చుటకు వారు నిలబడియున్నారు. నేను వారి ఆత్మల కొరకు బ్రతిమాలుచున్నాను, ప్రభువా. తండ్రీ, నేను వారిని నీకు ఇచ్చుచున్నాను. వారు నీ వాక్యము యొక్క బహుమానములై యున్నారు మరియు అది వారి పాప జీవితమును వారు దోషులని తీర్పు చేసినది, మరియు వారు నిన్ను తమ స్వరక్షకునిగా అంగీకరించుటకు వచ్చియున్నారు.
నీ వాగ్దానమును బట్టి నేను నిన్ను బ్రతిమలాడుచున్నాను, మరియు, "నా మాటలు విని, నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు," అని నీవు చెప్పిన మాటలను నేను తిరిగి జ్ఞాపకమునకు తెచ్చుచున్నాను.
ఇప్పుడు వారు నీ వాక్యమును అంగీకరించుచున్నారు. వారు వారి పాపములను బట్టి చింతించుచున్నారు మరియు వారు దానిని ప్రదర్శించి, ఈ రాత్రి నీ కొరకు నిర్ణయము చేయుట ద్వారా దానిని ప్రత్యక్షపర్చియున్నారు. తండ్రి, వారికి పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ఇమ్మని నేను వారి కొరకు ప్రార్ధన చేయుచున్నాను. వారి ఆత్మలను శుద్ధిచేసి మరియు క్రీస్తులో వారిని నూతన సృష్టిగా చేయుము.
వారిని విమోచించుటకు వెలను చెల్లించిన, నీ ప్రియమైన దేవుని కుమారుని నామములో నేను వారిని నీకిచ్చుచున్నాను. వారు నీవారై యున్నారు, ప్రేమ కానుకలు, ఓ, దేవా. యేసు చెప్పెను, "నా తండ్రి యొక్క చేతులలో నుండి ఎవరును వారిని లాగుకొనలేరు. ఆయన కంటే గొప్పవారు ఎవరును లేరు. మరియు వారు దేవుని చేతులలో యున్నారు.
1JN 1:9
74ఇప్పుడు మనము తలలు వంచియుండగా, మరియు వేదిక నొద్దకు వచ్చినవారు, మీరు చేయగలుగునది ఒక్కటి కూడా లేదు. "నీవు దానిని స్పర్శిస్తావా," అని యేసు ఎన్నడునూ చెప్పలేదు. ఆయన చెప్పెను, "నీవు దానిని నమ్మియున్నావా?"
నీవు యుండిన పాపకరమైన స్థితిలో నీవు నిజముగా నమ్ముచున్నావా. నీవు తప్పైయున్నావని ఏదో నిన్ను ఒప్పించినది. నీకు వాగ్దానము చేయబడిన దేవుని వాక్యము యొక్క ఆధారము మీద నీవు ఇక్కడకు వస్తావు. నీవు నీ పాపములను ఒప్పుకొన్నట్లైతే, ఆయన వారిని క్షమించుటకు న్యాయవంతుడై యున్నాడు. మరియు నీవు నీ పాపములను త్యజించి మరియు నీవు నీ సొంత రక్షకుడిగా ఆయనను అంగీకరిస్తావు. మీరు కోరినట్లైతే, మీ తలలను వంచి, మీ చేతులను పైకెత్తండి. వేదిక దగ్గర యున్న ప్రతి ఒక్కరూ, ఇక్కడ నిలబడినవారు, మీ వ్యక్తిగత రక్షకుడిలా మీరు ఆయనను అంగీకరించండి. నూటికి నూరు శాతము, ప్రతి ఒక్కరూ, దేవునికి వందనములు! ఇప్పుడు మీరు క్రైస్తవులని, విశ్వాసులని, రాజ్యము యొక్క సహ పౌరులని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మును ఉచ్చరించుచున్నాను.
నా కొరకు మీరు ఒక దానిని చేయాలని నేను మిమ్మును అడుగగోరుచున్నాను. మిమ్ములను కోరుచున్నాను… "ప్రార్ధనా గది," అని పిలువబడిన ఆ చిన్న గది యొద్దకు మీరు ఈ ప్రక్క చుట్టుగా దారిని చేసుకొని, నేను మరోక పిలపునిస్తుండగా, మీరు అక్కడ యుండి క్రింద మోకరించి, "ప్రభువైన యేసు, నా ఆత్మను రక్షించినందులకు వందనములు," అని చెప్పండి. ఆ గదిలోనే అక్కడే తిన్నగా, దేవుడు అక్కడే తిన్నగా మిమ్ములను పరిశుద్ధాతో నింపునని నేను నమ్ముతాను.
సోదరులలో ఒకరు మిమ్మును నడిపిస్తూ యుండగా, తిన్నగా ఇటు వెళ్ళండి. ఇప్పుడు వారు అక్కడకు వెళ్ళుచుండగా, ఈ కార్యము కొరకు మీకు సూచనలు ఇవ్వబడతాయి, వారితో వెళ్ళండి. వారి సొంత రక్షకుడిగా ఈ ప్రజలు క్రీస్తును అంగీకరించియున్నారు.
75ఇప్పుడు, పరశుద్దాత్మను పొందగోరు మీరు, ఈ సమయములో మీరు ముందుకు వస్తారా? మేము మరొకసారి పాడబోవుచుండగా ఇప్పుడు ముందుకు నడవండి.
చెప్పండి, "బ్రదర్ బ్రెన్హాం, నేను పరిశుద్ధాత్మ కొరకు ఎన్నో సంవత్సరముగలుగా వేచియున్నాను, అయితే నేను ఎన్నడూ ఇంకనూ దానిని పొందియుండలేదు." ఇక్కడకు పైకి రండి. ఆయన సేవకుడిగా మీరు నన్ను నమ్మియున్నట్లైతే, నేను మీకు సత్యమును చెప్పుచున్నానని మీరు నమ్మియున్నట్లైతే, ఇక్కడకు రండి. నన్ను మీ కొరకు ప్రార్ధన చేయనివ్వండి. ప్రార్ధన సంగతులను మార్చును. అది నూతన సృష్టిగా చేస్తుంది. మీరు ఖచ్చితముగా యదార్ధముగా యున్నట్లైతే, ఇప్పుడు మేము పాడుచుండగా, ముందుకు రండి.
యొర్దాను యొక్క తుఫానులతో కూడిన ఒడ్డుల మీద నేను నిలబడతాను,
మరియు ఎంతో ఆసక్తిగా నాకంటిని ఉంచుతాను;
కానాను యొక్క చక్కని మరియు సంతోషకరమైన భూమికి,
అక్కడే నా స్వాస్థ్యములున్నవి.
నేను వాగ్దాన భూమికి కట్టబడియున్నాను
(పరశుద్ధాత్మ లేని వారందరిని,
క్రీస్తు యొక్క నామములో ముందుకు
రమ్మని నేను పిలుచుచున్నాను.)
ఓ, ఎవరు వచ్చి నాతో వెళతారు?
నేను వాగ్దాన భూమికి కట్టబడియున్నాను.
76మీరు యదార్ధముగా యున్నారా? ఈ కట్టడములో పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును కలిగి లేనివారందరూ వీరేనా? సోదరుడా, సోదరీ, మీరు ఎలా అలాంటి పరశుద్దాత్మ యొక్క ఒత్తిడి క్రింద, పరిశుద్ధాత్మ లేకుండా అలాంటి స్థానములో ప్రార్ధన కొరకు నిలబడకుండాయుంటారు? పరిశుద్ధాత్మను పొందుటకు, అవిశ్వాసము నుండి మీరు కనీసము స్వస్థపడకుండా, మీరు స్వస్థత కొరకు ఎలా ఎదురుచూడగలరు? నీవు ఎన్నడైనా దైవిక స్వస్థతను నీ దేహము కొరకు ఎలా పొందబోవుచున్నావు? మీరు రారా? మీరు ఆహ్వానించబడియున్నారు.
సహోదరులారా, సహోదరీలారా, క్రీస్తును ఇంతకు మునుపే అంగకరించిన సహ పౌరులారా, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును మీరు కోరుచున్నారా? మంచిది, మీలో కొందరు మంచి ప్రజలైనవారు, పరిశుద్ధాత్మ కలవారు, ఇక్కడకు వచ్చి మేము వారి కొరకు ప్రార్ధించుచుండగా, ఈ ప్రజల మీద చేతును ఉంచామని నేను మీలో కొందరిని కోరుచున్నాను. ఇప్పుడు ముందుకు రండి.
ఎవరి మీదనైనా మీ చేతులను ఉంచండి. ఆ వెనుక పరిశుద్ధాత్మను కలిగినవారు, పరిచర్య చేయు సోదరులైన మీలో కొందరు, ఈ పైకి రండి, ప్రాతినిధ్యములను వహిస్తూ ఈ ప్రజల మీద చేతులను ఉంచండి. సోదరుడా జీన్, దేవుడు నిన్ను దీవించును. తిన్నగా ముందుకు రండి, సోదరులారా. మేము ప్రార్ధిస్తూ యుండగా తిన్నగా పైకి వచ్చి ఈ ప్రజలపై చేతులను ఉంచండి. అది మంచిది. బ్రదర్ ఫ్రెడ్ ముందుకు రండి, అది మంచిది. తిన్నగా ముందుకు రండి. హల్లెలూయ!
77మా పరలోకపు తండ్రి, ఈ ప్రజలు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము కొరకు వెదుకుచున్నారు. ఈ ద్రాక్షలనుబట్టి వారు అలసిపోయారు. వారికి పాలు, తేనె అవసరము, వారు వాగ్దాన భూమికి వెళ్ళగోరుచున్నారు.
ప్రభువా, నా హృదయమంతటితో నేను నీకు ప్రార్ధన చేయుచున్నాను, యేసుక్రీస్తు నామములో వారు ఒకరి మీద ఒకరు చేతులను ఉంచియుండగా, వారికి పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ఇమ్ము. ప్రభువా, దానిని దయచేయుము. విశ్వాస సహితమైన ప్రార్ధన దీనిని చేస్తుంది, మాకు తెలుసు. యేసు నామములో దేవుని మహిమ కొరకు నీకు వారిని హాజరు పర్చుచున్నాము. ఆమేన్.
78ఆమెన్.
అది మంచిది. దైవిక స్వస్థత కావలసినవారందరూ, మీ చేతులను ఎత్తండి. స్వస్థత పొందగోరువారందరూ, మీ చేతులను ఎత్తండి, ఇప్పుడు, ఎవరైనా బయట వారి మీద చేతులను ఉంచండి. ఒకరి మీద ఒకరు చేతులుంచండి. అక్కడ వారున్నారు. ఒకరి కొరకు ఒకరు ప్రార్ధించండి. నేను వాగ్దాన భూమికి కట్టబడియున్నాను, దేవుడు చేసిన ప్రతి వాగ్దానము.
పరలోకపు తండ్రి, వీరు నీవారై యున్నారు. నేను వారిని మీకు హాజరుపరుస్తాను, ప్రభువా. రోగులను బాగుచేయండి, నీ పరిశుద్ధాత్మ కోరుచున్న వారందరికి ఇమ్ము, ప్రభువా. ప్రభువైన దేవా, ఆకాశములకు భూమికి సృష్టికర్తా, యేసు నామములో, నేను వారిని నీకిచ్చుచున్నాను.