అబ్రాహాము యొక్క కృపా నిబంధన
vgr count-233 1సహోదరుడా, సులివాన్ నీకు వందనములు. స్నేహితులారా శుభ సాయంకాలము. మన గొప్పరాజు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సేవలో మరలా ఈ రాత్రి ఇక్కడ యుండుటకు సంతోషముగా యున్నది, ఈ రోజు ఆయన మీకు ఎంతో మంచిగాయుండి యున్నాడని, మరియు మిమ్ములను దీవించియున్నాడని నమ్ముచున్నాను. మరియు ఈ రాత్రి మనము చేయుదానికంటె లేక ఆలోచించు వాటన్నిటికంటె సమృద్ధియైన అమితమైన దానికొరకు మనము ఈ రాత్రి ఎదురుచూస్తూయున్నాము.
ఈ రాత్రి ఇక్కడ యుండుట ఒక విధముగా మంచిగా యున్నది. నా భార్య దానిని గూర్చి ఇంటి దగ్గర ఇలా చెపుతుంది, అక్కడ మంచు కురుస్తు యుంటుంది, అందుచేత నేను ఓహయోలోనే నిలిచి యుంటానని నేను తలంచుదును. నాకు విశ్రమించుటకు కొన్ని దినములున్నవి (అని నేను నిరీక్షిస్తున్నాను), నేను విశ్రమించ గలిగినట్లైతే. నేను కేవలము ఇంటికి వెళ్ళి మరలా దానిని విడిచిపెడతాను, ఏలయనగా ఎక్కడైనా అదియున్నదానికంటె ఇంటియొద్ద మరిఎక్కువగా మంచు కురియుచున్నది. ఇంటి యొద్ద కాబట్టి నేను నిజముగా నేను అలసిపోయాను.
క్రిస్మస్ నుండి నేను ప్రయాణము చేయుచునేయున్నాను. ఏడు సంఘయుగముల మీద ఆలయములో రెండు వారములు తీసుకొనియున్నాను. ఆ స్థలమును విడిచి లూసియానాలోని ష్రివ్పోర్ట్ కు వెళ్ళాను, అక్కడ నుండి ఆర్లింగ్టన్, టెక్సాస్ కు వెళ్ళియున్నాను… లేక, మన్నించండి, భ్యూమంట్, టెక్సాస్కు; అరిజోనాలోని టుసాస్కు; లాంగ్బీచ్, విసాలియా, కాలిఫోర్నియా; టులేర్, కాలిఫోర్నియా; మా ప్రయాణము తరువాత తిరిగి వర్జీనియాలోని, రిచ్మండ్కు; మరియు తరువాత ఇక్కడకు.
2మరియు అది భౌతికముగా మాట్లాడుచున్నప్పుడు, నా పని సరిగ్గా అయిపోయినది. కాని… బయట నేను బలముగా ధ్యానిస్తాను, కాని లోపల దాని గురించి కొంత ఆందోళన చెందుతాను. కేవలము అలసిపోయి, దానిగురించి సరిగా ఆలోచించలేను. కాని మనము ఆయనను సేవించుటకు ప్రయత్నించుచుండగా, దేవుడు మన ప్రయాసలను దీవించును. ప్రభువు మిమ్ములను దీవించును.
అది మిమ్ములను గడ్డకట్టునట్లు చేయదని నా నమ్మకము, అయితే నాకు సంతోషము వారు దానిని ఆపివేసియున్నారు, కారణము అది కొంచెము… అది ఎంతో శబ్దముగా యున్నది. ఇప్పుడు మీరు నా మాటను బాగా వినగలరా? అది మంచిది. ఎవరైనా కొన్ని మేకులను తెచ్చి ఈ రోజు దానిని మాకు సిద్ధము చేయండి. అలా చేస్తారని నా నమ్మకము. గత రాత్రి అది క్రిందికి పడబోవుచున్నదని నేను భయపడ్డాను, ఒక విధముగా ఇక్కడ కొంచెము దానికి ఆధారమును నేను క్రింద పెట్టియున్నాను.
3ఇప్పుడు, మనము ఈ రాత్రి ప్రభువును సమీపించబోవుచున్నాము, (ఆయన వాక్యమును), ఇంకా, ఒక ప్రవచనాత్మకమైన అంశము మీద, నేను ఆలోచించియున్నాను మరియు ఈ దినములలో మాట్లాడినది. అయితే ఈ రాత్రి కొంచెము భిన్నముగా ఒక ఆధారము మీద దానిని సమీపించగోరుచున్నాను, కారణము…
ఈ రోజు మీలో అనేకులు నన్ను పిలిచి వెనుకయున్నవారు వినలేకపోయారని చెప్పియున్నారు, ఒక విధమైన గల గల మని శబ్దము, ఎగయునట్లుగా, మీరు మాటలను బాగుగా వినలేదని చెప్పారు, అది అవసరమైన భాగమైయున్నది, అదే వాక్యమును పొందుట, కారణము వాక్యమే అన్నిటికంటె లెక్కకు వస్తుంది. లెక్కించబడునది దేవుని వాక్యమై యున్నది.
HEB 10:26
4గత రాత్రి అనేకమంది సోదరుల ద్వారా నేను అపార్ధముగా ఎంచబడలేదని నా నమ్మకము.
మీరు చూడండి, మనము దేవుని సమీపిస్తున్నట్లైతే, మనము ఆయన వాక్యము యొక్క ఆహ్వానము మీదికి రావలసియున్నది. మనము తప్పక ఆ వాక్యమునకు నమ్మకముగా యుండవలసియున్నది. మరియు మీరు ఏది చేసినా లేక ఏది చెప్పినా, లేక దేనిని భోధించినా, అది నీ హృదయము యొక్క నిజమైన ఆలోచనకు భిన్నముగా యున్నట్లైతే, నీవు విశ్వాసమును కలిగియుండలేవు, కారణము నీవు చేయుచున్నది నీవు ఎరుగుదువు. నీవు ఖచ్చితముగా సరిగా లేవు. నీవు ఖచ్చితముగా నీవు సరి అని ఆలోచించుదానిని మరియు సరిగ్గా అది సత్యమని నీవు ఎరిగిన దానిని నీవు తప్పక చేయవలసియున్నది. నీవు అది చేయని యెడల నీకైనీవు విశ్వాసమును కలిగియుండలేవు.
మరియు నీ వర్తమానము ఎన్నడూ ప్రజల యొద్దకు చేరదు, ఏలయనగా అది అభిషేకించబడదు, ఏలయనగా ఇక్కడ అది ఈ చిన్న గుసగుసమని శబ్దము చేయుచున్నది, మరియు నీవు ఇక్కడ చెప్పబోవుచున్నదానికంటె, ఏదో వేరైన దానిని నీవు ఆలోచించుచున్నావు. అది పనిచేయదు. నీవు నిజముగా యధార్ధముగా యుండవలసియున్నది.
HEB 10:26•
JUDE 1:5
5మరియు హెబ్రి 10వ అధ్యాయము నేను నిన్న రాత్రి సూచించుచుంటిని, చూశారా, "కారణము మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును పొందిన తరువాత [చూశారా] పాపమునకు బలి ఇకను ఉండదు."
మనము ఇక్కడ దేనిని ఉంచబోవుచున్నాము (ఈ రాత్రి మీరు నా స్వరమును, ఈ రాత్రి బాగుగా మీరు వినగలిగినట్లైతే), చూడండి, ఆ ప్రజలు (ఇశ్రాయేలు) ఒక వాగ్దానమును కలిగియుండిరి. (ఇప్పుడు మీరందరునూ నా మాటను బాగుగా వినగలుగుచున్నారా? నా స్వరమును వినగలుగుచున్నవారు మీ చేతులను ఎత్తండి, మంచిది.) వాగ్దానభూమి దేవుని చేత ఆ ప్రజలకు వాగ్దానము చేయబడినది. అయితే వారు వాగ్దానమును తీసుకొను స్థలమునకు వచ్చినప్పుడు, వారు సందేహించిరి. మరియు వారు తరువాత వెనుకకు వెళ్ళి ఆ వాగ్దానమును సందేహించిన వారందరూ అరణ్యములో చనిపోయిరి. అది సత్యమేనా? నేను చూడగలుగునట్లు మీ చేతిని ఎత్తండి. ప్రతి ఒక్కరూ చనిపోయిరి. దానిని నమ్మిన యొహాషువ మరియు కాలేబులు మాత్రమే అక్కడ యుండిరి; మరియు ఇద్దరు మాత్రమే. ఆ పూర్తి ప్రజలైన 25 లక్షల మంది దేశములోనికి తప్పక వెళ్ళవలసియుండిరి — కారణము వారు దానిని నమ్మిరి.
EXOD 19:8
6ఇప్పుడు, నేను దానిని మాదిరితో పోల్చుచూయుండగా, పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఒక మాదిరియై యున్నది. ఈ దినమున, సహజమైన ఇశ్రాయేలు చేసిన అదే పొరపాటును ఆత్మసంబంధమైన ఇశ్రాయేలు చూచినది. మరియు వారు నిజమైన స్థలమునకు వచ్చినప్పుడు… అక్కడ వేదాంత పాఠశాలో వారు ఉత్తిర్ణులైరి, ఖచ్చితముగా వారు చేసినట్లుగా, నిర్గమ 19. వారు దానిని అంగీకరించలేకపోయిరి. వారు దానిని అంగీకరిస్తే, సంస్థ వారిని నరుకుతుంది.
చక్కని మనుషులైన సేవకులు ఈ దినమున నా ముందుయున్నారు, అసెంబ్లీస్-ఆఫ్-గాడ్, నన్ను బలపరిచే గొప్పవారిలో ఒకరు. చర్చ్-ఆఫ్-గాడ్ దానిని బలపర్చుతుంది, నలుమూలలు దానిని బలపర్చతుంది, ఏకత్వము వారు దానిని బలపర్చుతారు, ద్విత్వము వారు దానిని బలపర్చుతారు, యునైటెడ్ పెంతికొస్తువారు దానిని బలపర్చుతారు, పెంతికొస్తు హాలీనెస్ వారు దానిని బలపర్చతారు. మరియు భూమి మీద చక్కని క్రైస్తవ సేవకులలోని కొందరు సంస్థలలో యున్నారు. నేను ఆ సోదరులతో ఏ దాడి చేయను. వారు నా సోదరులు మరియు దేవుని సేవకులై యున్నారు.
అయితే ఆ క్రమము — మనుషులు కాదు, ప్రజలు కాదు — కాని ఆ సంఘ శాఖాక్రమములు, వారిని చుట్టూ చుట్టివేసి, ఇతర సోదరుల నుండి వారిని వేరుచేయుచున్నది. వారు దానిని చేయలేరు, వారు ఏ క్రమము క్రింద యున్నారో, ఆ క్రమము వారిని దానిని చేయనియ్యదు. సోదరులారా, దానికే నేను వ్యతిరేకినైయున్నాను. మీరు నన్ను తప్పుగా అర్ధము చేసుకొనుట నాకు ఇష్టము లేదు.
అది దేవుని యొక్క సత్యమై యున్నదని నాకు తెలుసు, మరియు అది చనిపోవలసియున్నదని నాకు తెలుసు. ప్రతి మాదిరి, ప్రతి చాయ, మరియు లేఖనము సహితము దానికై దానిని ఋజువు చేయును.
7అందుచేత, అసెంబ్లీస్ లో యున్న సోదరులను, మరియు ఇతర సంఘములలో యున్న సోదరులను నేను ప్రేమిస్తాను, ఏకత్వము వారిని, ద్విత్వము వారిని. వారు ఏ సంస్థకు చెందియున్నారన్న దానిని బటి, నేను ఎన్నడూ వారి మధ్య భేధమును చూపలేదు. వారు తిరిగి-జన్మించి మరియు పరిశుద్ధాత్మతో నింపబడియున్నంత వరకు వారు నా సోదరులైయున్నారు. మరియు నేను తిన్నగా ఎడములో నిలబడుటకు ప్రయత్నించి మరియు అన్నాను, "మీరు నా సోదరులైయున్నారు."
8ఈ రాత్రి ఇలాటి కూటమునకు ఈ పట్టణములో, ఒక మనిషి నా పట్ల భాధ్యత వహించినాడు, ఆయనే బ్రదర్ సులివాన్. నాకు తెలిసినంత వరకు, అది సత్యమై యున్నది. సంఘములన్నియు, మనమందరము తప్పక ఏకముగా యుండవలసియున్నప్పుడు!
ఈ రాత్రి ఇక్కడ వేదికనొద్ద కేవలము నేను మీ సోదరుడనై యున్నానని, చటాక్వాలో నేను మీ సోదరుడిగా యున్నట్లుగానే ఇక్కడను యున్నాను. నేను అదే వ్యక్తినైయున్నాను. నేను మార్పుచెందలేదు. నేను సరిగ్గా అదే వర్తమానమును కలిగియున్నాను, నిజమేనా? మీరు నాకు ఎన్నడైనా ఏదియు చేయనప్పటికి, నేను అంతే మిమ్మును ప్రేమిస్తాను. అది మీ పట్ల నన్ను తప్పు భావనకు గురిచేయదు. అది అలా చేసినట్లైతే, నేను కూడా తప్పైయున్నాను.
మరియు నేను ఇక్కడ లేచి [స్పష్టతలేని మాట] వట్టి పెద్ద మాటలు మాట్లాడినట్లైతే, మరియు పాపమును నిజముగా వదిలిపెట్టినట్లైతే, అవిశ్వాసమును మరియు ఆ కార్యములను నరుకు వరుసనొద్ద వదలిపెట్టినట్లైతే, మరియు కేవలము భిన్నముగాయన్నట్లైతే, నేను ఈ పవిత్రమైన స్థలమునకు పనికిరాని అంశమునైయున్నాను. లేఖనానుసారముగా తప్పులోయున్న ఒక వ్యక్తి కంటె, నేను అతిహీనమైయున్నాను, కారణము నాకై నేను ఒక తప్పులోయుండి ఏదో భిన్నమైన దానిని చూపుటకు లేక చేయుటకు ప్రయత్నము చేయుచున్నాను. నేను దానిని దైవిక ఒప్పుదల నుండి చేయనట్లైతే, సహోదర ప్రేమను నా హృదయములో కలిగి నేను చేయనట్లైతే, నేను తప్పైయున్నాను.
నా సోదరులారా, ఆ విధానములోనే నేను దానిని చేసాను. అనారోగ్యముతో యున్న ప్రజలను, దయ్యపు శక్తులతోయున్న వారిని తప్పక ఎదుర్కొనవలసియున్నది. నేను ఏదైనా విషయములో వ్యతిరేఖముగా యున్నట్లైతే, అప్పుడు నేను ఎలా విశ్వాసమును కలిగియుండగలను, మరియు అది నేను నిజముగా నమ్ముట లేదు, "అవును, అది బాగానేయున్నది, అలాగే ముందుకు సాగండి," అని చెప్పుటకు ప్రయత్నము చేయుచున్నట్లయితే, నేను దానిని చేయలేను. అది కేవలము నేను తయారు చేసుకొనుట కాదు. నేను ఆ మార్గములో తయారు కాబడి యుండలేదు. పరిశుద్ధాత్మ ఆ విధానములో యుండుటకు నన్ను అనుమతించదు. నేను సరిగ్గా ఏమైయున్నానో నేను తప్పక ఆ రీతిగా యుండవలసియున్నది, మరియు ప్రతిఒక్కరు ఆ విధానములో నన్ను ఎరుగుదురు, మరియు ఆ విధానములోనే నేను ప్రతి ఒక్కరిని ఎరుగగోరుదును, నీవు సరిగ్గా ఏమైయున్నావు, నీకైనీవు సరిగా ఏమైయున్నావో అలా యు౦డుము.
9కాంగ్రెస్ వాడైన అప్షా ఒకప్పుడు చెప్పినట్లుగా… మీకు అతడు గుర్తున్నాడా? అతడు 70 సంవత్సరాలు… 66 సంవత్సరాల నుండి కుంటివాడైయుండి నా కూటములలో స్వస్థపడియున్నాడు. అతడన్నాడు, "నీవు ఏమి కాదో అదియైయున్నట్లుగా చెప్పుకొనులేవు. అది నిజం. చురుకైన క్రైస్తవులు దానిని నేర్చుకొంటారు, దానికి దూరముగా ఉంటావు. అక్రమసారాయిని అమ్ము అంగడి ఎక్కువగా సంఘమును గాయపర్చదు. లేదు. అది సంఘములో యున్న ఆ మనిషే, అతడు ఏది కాదో అదియైయున్నట్లుగా చెప్పుకొనువాడు. అది అదేయైయున్నది. ఆ వ్యక్త్యియే. అది సత్యము.
10ఇప్పుడు. ఆ విధముగా నిన్నటి సాయంత్రము నుండి క్షుణ్ణముగా మీరు గ్రహించగలరు, వారి వెనుక దేవుని యొక్క వాగ్దానమును కలిగి, వారు ముఖాముఖిగా దానితో వారు పైకి నడిచినప్పుడు, అది ఈ కార్యములన్నియు వారికొరకే… మరియు వారు దానిని నమ్ముటలో తప్పిపోయారు; మరియు వారు తిరిగి వెనుకకు వెళ్ళగోరి, వారు ఇదివరకు ఉండియున్న పాత కార్యములను ప్రారంభించగోరిరి, మరియు వారిలో ప్రతి ఒక్కరూ చనిపోవువరకు తిన్నగా వారు అరణ్యములో తిరుగులాడునట్లు దేవుడు వారిని అనుమతించెను.
HEB 10:2,26•
1JN 3:9
11హెబ్రియులు (ఇప్పుడు గమనించండి), హెబ్రి 10వ అధ్యాయము చెప్పినది, "మనము బుద్ధిపూర్వకముగా పాపము చేసినట్లైతే…" ఇప్పుడు, పాపమనగా ఏమిటి, సోదరులారా? అవిశ్వాసము. "నమ్మని వానికి ఇదివరకే తీర్పు తీర్చబడినది." నీవు వ్యభిచరిస్తావు. ఎందుచేత? కారణము నీవు ఒక అవిశ్వాసియైయున్నావు. నీవు దొంగిలిస్తావు, నీవు అబద్దమాడతావు, నీవు మోసగిస్తావు. ఎందుచేత? కారణము నీవు ఒక అవిశ్వాసియైయున్నావు. అది నిజము, ఒక నిజమైన యదార్ధమైన విశ్వాసి దానిని చేయడు, చూడండి. అతడు దానిని చేయడు, కారణము పరిశుద్ధాత్మ అతనిలో యున్నది. కనీసము అతడు ఒక తప్పు చేయుట సంభవించినా….. బైబిలు ఇంకా చెప్పియున్నది, "ఆరాధికుడు, ఒక్కసారి శుద్ధి చేయబడిన తరువాత, పాపము యొక్క జ్ఞప్తి ఇక ఎంత మాత్రము యుండదు."
"దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు." అతడు ఒక అవిశ్వాసి కాదు, అతడు ఒక విశ్వాసియైయున్నాడు. దేవుని ఆత్మ నీలో నిలిచియుండుటచేత నీవు పాపము చేయజాలవు. నీవు ఒకే సమయములో ఒక విశ్వాసిగాను మరియు ఒక అవిశ్వాసిగాను యుండజాలవు. నీవు ఒక విశ్వాసిగా అన్నాయైయుంటావు లేక ఒక విశ్వాసిని కాకుండా యుంటావు.
ఇప్పుడు లేఖనమును వినండి. ఒక పురుషుడు లేక స్త్రీ గాని బైబిలు యొక్క సత్యమును ఎదుర్కొన్నప్పుడు, లేఖనానుసారమైన సిద్దాంతమునకు ఎదురుగా వచ్చినప్పుడు. సేవకులారా, మీరు ఎవరై యున్ననూ, దేవుని యొక్క ప్రేమతో నేను మీకు దీనిని చెపుతాను, మరియు మీరు దానిని చూడండి, మరియు అది సత్యమై యున్నదని తెలుసుకోండి, మరియు దానినుండి వెనుకకు తిరగినట్లైతే, "ఆ పాపమునకు బలి ఇక యుండదు, కాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. మోషే యొక్క ధర్మశాస్త్రమును నిరాకరించినవానికి…"
HEB 10:28,29
12వారు ఆ చిన్న గొర్రెపిల్లను అర్పించినప్పుడు, ఆ చిన్న గొర్రెపిల్లను తీసుకొని, దాని గొంతును పట్టుకొని, దాని తలను పట్టుకొని అది వణుకుచూ చనిపోవుటను అతడు స్పర్శించును, రక్తము పళ్ళెము వెళ్ళును, మరియు ప్రార్ధనగా పోయబడును. బలిఅర్పణ యొక్క ఇత్తడి బలిపీఠము మీదకి మరియు తీర్పు మీదికి పైకి వెళ్ళిపోతుంది. తీర్పు బలిపీఠము (ఇత్తడి దైవిక తీర్పును మాట్లాడుతుంది)… మరియు ఆ చిన్న గొర్రెపిల్ల, చివరిగా అది తన్నుకొనుట ఆగిన తరువాత, ఆరాధికుడు, అక్కడ నిలబడియున్నాడు, అది అతని యొక్క పాపమే దానిని చేసియున్నదని అతడు గ్రహించాడు. అది తప్పక అతడై యుండి యుండవలసియున్నది, అయితే గొర్రెపిల్ల అతని స్థానమును తీసుకొని యున్నది.
ఇప్పుడు, గొర్రెపిల్ల, జంతువు యొక్క బలి అర్పణ, ఎన్నడూ ఆ మనిషిని రక్షించలేదు, కారణము ఆ రక్తములో జీవము జంతువు యొక్క జీవమైయున్నది. అది ఎన్నడూ ఆరాధికుని మీదికి తిరిగిరాలేదు. అందుచేత పాపము కేవలము కప్పబడినది. అసలైన దేవుని యొక్క గొర్రెపిల్ల వచ్చువరకు అది కనిపెట్టవలసియుండెను. అది ఒక విశ్వాస కార్యమైయుండెను.
ఒక నిజమైన గొర్రెపిల్ల వచ్చుచున్నాడని అది చూపుచుండెను. అయితే తరువాత, అతడు అదే నేరమును తిరిగి అప్పుడు చేసియున్నాడు, ఆవరణములో శుద్దీకరణకు ముందు, అతడు రెండవసారి వ్యభిచరించినట్లుగా అతని మీద సాక్ష్యమీయబడినది, ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల నోట అది అతడు చేయుట ఋజువు చేయబడిన తరువాత, అతడు ఏకీకరణము లేకుండా రాళ్ళతో కొట్టబడెను. అతడు ఒక భోధకుడైనా లెక్క కాదు, అతడు ఒక పట్టణము యొక్క మేయర్ అయినా, అతడు ఎవరై యున్నప్పటికి, అతడు ఏ కనికరము లేకుండా చంపబడతాడు. హెబ్రి. 10వ అధ్యా! దాని వైపు చూద్దాము. ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యము క్రింద ఏ కనికరము లేకుండా చంపబడతాడు.
ఎంత ఎక్కువైన దండన, ఉదాహరణకు మీరు. (ఇప్పుడు గమనించండి. అయినను). యోగ్యమైన. (ఒక సేవకుడైయుండి, అతడు ఎవరైయున్ననూ, పరిశుద్ధాత్మను కలిగియున్నానని చెప్పుకొనుచున్నాడు), అతడు దేవుని కుమారుని కాళ్ళతో త్రోక్కుచున్నాడు, మరియు క్రీస్తు యొక్క రక్తమును అపవిత్రముగా ఎంచుచున్నాడు.
మరి ఎంత ఎక్కువ శిక్ష నీ యొక్క చేతులను ప్రభువైన యేసు యొక్క పాదముల మీద ఉంచినప్పుడు, మరియు నీ కొరకు ఆయన చనిపోతూ పొందిన నొప్పులను నీవు స్పర్శించుచూ, మరియు నీ స్వరక్షకునిగా నీవు ఆయనను ఒప్పుకొంటూ, అక్కడయున్నది అది జంతుజీవము కాదు, లేక అది ఒక మనుష్యుని యొక్క జీవము కాదు, అది దేవుని యొక్క జీవమైయున్నది. మరియు ఆయనలోయున్న ఆ ఆత్మ నీ మీదికి తిరిగి వస్తుంది, మరియు ఒక దేవుని కుమారునిగా నిన్ను చేస్తుంది.
మరియు ఈ సత్యములను ముఖాముఖిగా నీవు ఎదుర్కొనుటకు నడిచియున్నట్లైతే, చూడండి… మనము బుద్ధిపూర్వకముగా ఏ లేఖనాను సారమైన విషయమైనా లేక అది ఏమైయున్ననూ, మన బుద్ధిపూర్వకముగా అవిశ్వాసపడినట్లైతే…
వారు ఏమని చెప్పారు? "మేము దానిని తీసుకొనలేము. మాకు వారు ఎంతో ఉన్నత దేహులుగా యున్నారు. మేము తీసుకొనలేము.
"నేను నా సంస్థ నుండి అడుగు బయటకు వేసినట్లైతే… నేను దానిని అంగీకరించినట్లైతే, వారు నన్ను త్రోసివేస్తారు. నేను వెళ్ళుటకు ఏ స్థలమును యుండదు. ఎవరునూ నన్ను బలపర్చరు."
HEB 10:26
13బైబిలును ఎవరు వ్రాశారు? మీ సంస్థా? వాక్యము పట్ల ఎవరు బాధ్యత వహించవలసియున్నారు? దేవుడే ఆయన వాక్యము పట్ల భాద్యత వహించవలసియున్నాడు. తన సొంత వాక్యము పట్ల దేవుడే శ్రద్ధ వహించును. దేవుడే నిన్ను బలపర్చును. ఏ మనిషియైనా ఎన్నడైనా తన జీవితములో ఎక్కువ వెల పెట్టినట్లైతే, అతడే దేవునితో ఒంటరిగా నిలిచిన మనిషై యున్నాడు. నీవు ఎన్నడైనా నిలబడగోరినట్లైతే, అదే మార్గములో నీవు నిలబడవలసియున్నది.
ఇప్పుడు, నీవు పైకి నడిచి వెళ్ళు అంటావు. ఇక్కడ యున్నట్లుగా… నీవు ఒక మెథడిష్టుగా యున్నప్పుడు నీవు పైకి నడిచి వెళ్ళు అంటావు, పెంతికొస్తు దినమున పరిశుద్ధాత్మ… మరియు నీవు దానిని చూస్తావు, అది సత్యమై యున్నది, ఎలా దేవుని యొక్క శక్తి ఆ ప్రజల మీద క్రుమ్మరించబడినదో. మరియు నీవంటావు, "అది సత్యము అని నాకు తెలుసు. నేను దానిని అంగికరించినట్లయితే, వారు నన్ను సంఘ శాఖ నుండి తెసివేస్తారు." వారు అది చేస్తారు. వారు తప్పక చేస్తారు.
నీవు తప్పక ఎంపికను చేయవలసియున్నది. అది సత్యమని నీవు ఎరుగుదువు. ఇప్పుడు చూడండి, అతడు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును పొందిన తరువాత, అతడు బుద్ధిపూర్వకముగా దానిని నమ్ముటలేదు — అవిశ్వాసము, సత్యము నుండి ప్రక్కకు వెళ్ళుట — ఆ అవిశ్వాసమునకు అక్కడ బలి అర్పణ లేదు. నీ పని ముగించబడినది మరియు సదాకాలము వరకు నీవు తుడిచివేయబడ్డావు. అది నిజము.
మరియు ఒక పెంతికొస్తు అదే స్థలమునకు పైకి నడిచి. వారు పెంతికొస్తువారైయున్నారు. దేవుడు వాగ్దానము చేసిన ప్రతి దీవెన, ఆ భూమిని తీసుకొనుటకు దేవుని వాగ్దానమును వారు కలిగియున్నారు. దేవుడు దానిని వారికి ఇచ్చెను, కాని వ్యతిరేఖత ఎంతో గొప్పగా యున్నందున, వారు యదార్ధతను ఎదుర్కొనుటకు బదులుగా వారు వెనుకకు తిరిగి, 40 సంవత్సరాలు అరణ్యములో జీవించిరి.
HEB 10:26
14హెబ్రి 10 అధ్యాయములో దానిని గూర్చియే అక్కడ పౌలు మాట్లాడుచున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైనదా? ఇప్పుడు, నా సోదరులారా, అది లేఖనమైయున్నది.
మరియు ఒక మనిషి సత్యము పైన తన వీపును త్రిప్పినప్పుడు, అది సత్యమని అతడు చూచిన తరువాత, మరియు బుద్ధిపూర్వకముగా దానినుండి దూరముగా వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు అతడు దేవునితో ఒక ముగించబడిన ఉత్పత్తియై యున్నాడు. అది నిజము. "కారణము అక్కడ పాపమునకు బలి ఇక ఎంతమాత్రము ఉండదు, కాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియునికను ఉండును."
కారణము మోషే ధర్మశాస్త్రము క్రింద, ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల క్రింద వారు చనిపోయినప్పుడు, ఆ విధమైన గొర్రెపిల్ల మీద, తన సంస్థ యొక్క కారణమును బట్టి లేక తన తల్లిని బట్టి లేక తన తండ్రిని బట్టి లేక దేనికైనా బట్టి, దేవునితో అతడు వెళ్ళుటను దూరపర్చినప్పుడు, ఆసత్యము నుండి ఆ వ్యక్తి దూరముగా నడచి వెళ్ళినప్పుడు, మరి ఎంత ఎక్కువగా నిత్యమైన ఎడబాటు అతనికి వస్తుంది. మీరు దానిని గ్రహిస్తారని నా నమ్మకము.
నేను మిమ్ములను గాయపర్చినట్లైతే, అది నా భావము కాదు. అది సత్యము అని నేను ఎరిగిన దానిని, సత్యమును నేను మీకు హాజరుపర్చుచున్నాను. సోదరులారా, నేను దానిని ఎదుర్కొనవలసియున్నది, మరియు దాని భావమేమిటో నాకు తెలుసు. మరియు నేను దానిని ఎదుర్కొన్నాను. నేను మరణమగునంతగా ఆకలితో అలమటిస్తానని, మరియు నేను ఒక వెలివేయబడిన వాడనవుతానని, మరియు ప్రతిదీ దయ్యము నాకు చెప్పింది. నా సంఘ కాపరి అన్నాడు, "నీకు ఒక పరిశుద్ద గుండ్రాయి అవుతానని, నీ మనస్సును నీవు పోగొట్టుకొంటావని, మరియు నీవు పిచ్చి ఆసుపత్రిలో నీవు వుంటావని" అన్నాడు. కాని అది దేవుని వాక్యమై యున్నది! మరియు నేను దానిని పూర్తిచేసియున్నాను మరియు దానిని స్వీకరించియున్నాను, మరియు నేను దానిని గూర్చి ఎన్నడూ చింతపడలేదు; అయితే దేవునికి వందనములు పరిశుద్ధాత్మ దాని యొద్దకు నన్ను నడిపినది, మరియు అప్పటినుండి నేను దానితో ఒంటరిగా నిలబడియున్నాను. మనము ప్రార్థన చేద్దాము.
HEB 12:1
15మా పరలోకపు తండ్రి, ఈ బైబిలులో వ్రాయబడిన ప్రతి కృపగల మాట కొరకు నీకు వందనములు. ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘమువలె ఆవరించి యున్నందున. 25 లక్షలమంది ప్రజలు అవిశ్వాసపు అరణ్యములో నశించిపోయిరి. మరియు నమ్మియుండిన ఇద్దరు మాత్రమే అవతలకు వెళ్ళుటకు అనుమతించబడిరి.
తండ్రియైన దేవా, దానిని చూచునట్లు మాకు సహాయము చేయమని, మరియు దాని భావమేమై యున్నదో చూడనిమ్మని నేను నీకు ప్రార్ధన చేయుచున్నాను. నీ వాక్యము పట్ల మేము అవిశ్వాసులము కాకుందుము గాక, అయితే మేము వాక్యమును వినువారము మాత్రమేయైయుండక, వాక్య ప్రకారము మమ్మును జీవించువారముగా మేము ఉందుము గాక. ప్రభువా, దానిని దయచేయుము.
నా సోదరుల యొద్దకు నేను నడిపించబడి వచ్చిన ఈ చిన్న కూటము నుండి మరియు ఈ చక్కని పట్టణములో ఇక్కడయున్న చక్కని ప్రజల నుండి. మరియు నీవు నా హృదయములో యుంచిన వర్తమానముతో నేను ఇక్కడకు వస్తాను. ప్రభువా, ఇప్పుడు నేను విత్తనమును మాత్రమే నాటుతాను. నీవే దానిని వృద్ధిచేయువాడవుగా యుండవలసియున్నావు.
మరియు పరిశుద్ధాత్మ ఈ విత్తనములకు నీరుకట్టి, సోదరుల మధ్య ఈ సమాజము మధ్య ఈ పట్టణములోయున్న సంస్థల మధ్య అది ఒక ఐక్యతను తెచ్చునని నేను ప్రార్ధన చేయుదును, వారు చివరకు… సువార్త వెలుగును అది ప్రపంచమంతట పంపును గాక. తండ్రీ, దానిని దయచేయుము. మనము ముందుకు వెళ్ళుచుండగా, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విశ్వాసములో నీ యొక్క వాక్యములోనికి అభివృద్ధిచెందుచుండగా, ఇప్పుడు ఈ రాత్రి మాకు సహాయము చేయుము. ఆమెన్.
GEN 22:14
16నేను దాని మీద బోధించియున్న ఒక చిన్న అంశము ఇక్కడ నా యొద్ద యున్నది. అయితే ఈ రాత్రి,నేను దానిని ప్రవచనాత్మకమైన విధానములో తీసుకొనగోరుచున్నాను. ఆది 22:14 లో కనుగొన్నాను. నేను ప్రారంభించగోరుచున్నాను:
అబ్రాహాము ఆ చోటికి యెహోవా-యీరే అను పేరు పెట్టెను: అందుచేత - యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటివరకు చెప్పబడును.
"యెహోవా-యీరే, యెహోవా పర్వతము మీద తన కొరకు ఒక అర్పణను చూచుకొనెను." ఇప్పుడు ఇది అబ్రాహాము యొక్క జీవితముపై యున్నది, ఆయన మన అందరికి తండ్రియైయున్నాడు. మనము అబ్రాహాము యొక్క సంతానముగా యుండవలసియున్నదని లేనియెడల మనము ఎన్నడూ పరలోకమునకు వెళ్ళలేమని ఇప్పుడు మనలో ఎంత మందికి తెలుసు. మనము తప్పక అబ్రాహాము యొక్క సంతానమై యుండాలి. మనము అబ్రాహాము యొక్క సంతానముగా మారుటకు అది సాధ్యమై యున్నది? ఎలా? ఎన్నడైనా అబ్రాహాము యొక్క సంతానముగా మారుటకు ప్రపంచములో ఒకే ఒక మార్గమున్నది: అది పరిశుద్ధాత్మను స్వీకరించుట.
17ఇప్పుడు, మనము కాలిఫోర్నియాలో, మృగపు ముద్ర మరియు దేవుని యొక్క ముద్ర మీద ముందు వెనుకకు మరియు ముందు వెనుకకు దానిగుండా వెళ్ళియున్నాము. నీవు ఎన్నడైనా అబ్రాహాము యొక్క సంతానముగా మారుటకు ఒకే ఒక మార్గమును కలిగియున్నావు, కారణము అది మనకు అబ్రాహాము యొక్క విశ్వాసమును ఇస్తుంది. మరియు అబ్రాహాము సున్నతిలో యున్నప్పుడు, ధర్మశాస్త్రము క్రిందయున్నప్పుడు ఈ వాగ్దానమును అతడు ఎన్నడూ పొందలేదు, కాని అతడు కృప క్రింద యున్నప్పుడు, ఎన్నడైనా సున్నతి జారీ చేయబడకముందు, దానిని అతడు పొందెను. అందుచేత, ప్రవేశించు అర్హత మీద మనము చేయగలుగునది ఏదీలేదు, అది దేవుని కృపయే మనకు దానిని ఇచ్చును. విశ్వాసము ద్వారా అబ్రాహాము దేవుని నమ్మెను, మరియు అది అతనికి నీతిగా ఎంచబడెను. ధర్మశాస్త్రమునే మానవుడు కోరియన్నాడు, దేవుడు దానిని కోరలేదు.
ఇప్పుడు, మనము అబ్రాహామును గూర్చి ప్రారంభించేద్దాము. ఇక్కడయున్న ఎవరైనను. వారు ప్రార్ధనా కార్డులను బయటకు ఇచ్చియున్నారా… నేను అతనిని అడుగుటకు మర్చిపోయూను, మరియు. అక్కడ ప్రార్ధన… బిల్లీ ఎక్కడయున్నాడు? ప్రార్థనా కార్డులు బయటకు ఇవ్వబడియున్నవా? అవును, ఇవ్వబడినవి, ప్రార్థనా కార్డులు బయటకు ఇవ్వబడినవి, అలాగే, మంచిది, అప్పుడు మనము ఈ చిన్న కూటము యొక్క అంతములో రోగుల కొరకు ప్రార్థన చేయుదము.
18ఇప్పుడు, మనము అబ్రాహాముతో ప్రారంభిద్దాము, మరియు ఏమైయున్నాడో, మరియు మనము ఎలా ఆయన యొక్క సంతానమవుతామో మనము కనుగొందాము. మనము ఏమి చేయుచున్నామో మనము ఎరిగియున్నట్లైతే, అది మననుండి భయమునంతటిని తీసివేస్తుంది.
మీరు బయటకు వెళ్ళి ఎలా దానిని పట్టుకోవాలి… మర్యాదగలవారైన మీరు, ఇక్కడయున్న యవ్వనస్తులు, మీరు వీధిలోనికి బయటకు వెళ్ళి ఒక స్త్రీని తీసుకొని, మీరు బయటకు వెళ్ళి కేవలము ఆమె ఒక స్త్రీయైయున్నందున, ఆమెను మీరు పెండ్లి చేసుకొంటారా? మీ ఆలోచనను గూర్చి నాకు ఎక్కువ తలంపు లేదు. అయితే చూడండి, నాకు నిశ్చయత వున్నది, మొదటగా నీవు ఆమెను గూర్చి తప్పక కొంత ఎరుగవలసియున్నది, ఆమె ఏ స్థలము నుండి వచ్చియున్నది, ఆమె యొక్క గుణశీలము అదే మార్గములో, అదే విధానములో ఆమె భర్తతో ఒక స్త్రీ యుంటుంది. మీరు తప్పక ఆ విషయములను గూర్చి ఆలోచించవలసియున్నది, కారణము అది నీ జీవితకాలము యొక్క భాగస్వామియైయున్నది.
మరియు ఇది దేవునితో మన నిత్యజీవమైయున్నది, లేనియెడల దేవుని నుండి శాశ్వతముగా వేరై నామరూపములు లేకుండా పాతాళములో నాశనమవ్వాలి. అది ఒకటియైనా లేక మరొకటియైనాయై యుండాలి. కాబట్టి లేఖనము యొక్క ఆధారము మీద మనము దానిని సమీపించగోరుచున్నాము, మరియు మనము ఎక్కడ యున్నామో తెలసుకోవాలి, మరియు అప్పుడు నీవు దానిని ఎరుగు విశ్వాసమును కలిగియుంటావు. నీవు ఎటు వెళ్ళుచున్నావో నీవు చూడగలిగినట్లైతే, అప్పుడు నీవు వెళ్ళుటకు విశ్వాసమును కలిగియుంటావు. అయితే నీవు ఎటు వెళ్ళుచున్నావో నీవు చూడలేకపోయినట్లైతే, కేవలము చీకటిలో నీవు తడబడుచున్నట్లైతే, నీవు ఏమిచేయుచున్నావో నీవు ఎరుగవు.
19కాబట్టి అబ్రాహాము, ఎక్కడ మనము ఆయనను గూర్చి మొదట చదివాము… (మీరు లేఖనములను గుర్తుపెట్టుకొనుచున్నారు, మీలో అనేకమందిని నేను చూసాను. మరియు నేను దీనిని మర్యాదగా చెపుతాను: నేను గతరాత్రి మరియు ఈ రాత్రి, ఒక నిర్ణీతమైన స్త్రీని గమనించాను. నేను ఆమెను అభినంధి౦చాను. ఆమె ఆ బైబిలును చదువుతుంది. నేను లేఖనముల వైపుకు తిరిగి ప్రతిచోటకు, ఆమె తిన్నగా దాని యొద్దకు వెళుతుంది. అది నాకు ఇష్టము. దానిని ఆ రీతిగానే బలపర్చాలి! అప్పుడు, "యెహోవా ఈలాగు సెలవిచ్చియున్నాడని," నీవు ఎరుగుదువు.
ఎవరో నన్ను పిలిచి ఇలా అన్నారు, "బ్రదర్ బ్రెన్హాం, నీవు భోధించిన సమస్తమూ, నా బైబిలు పుటలలో వ్రాయబడియుండి నేను కనుగొనినది తప్పు, ఒక్క సంగతి కూడా నీవు గత పది సంవత్సరములలో బైబిల్ లో లేని దానిని ఎన్నడూ బోధించలేదు. అందుచేతనే నేను దానిని ఇష్టపడతాను, చూడండి. అది నిజము. మరియు అన్నాడు, "టేపు చేయబడిన నీ వర్తమానములను నేను విన్నాను. వాటిలో కొన్ని విమర్శింపబడినవి." మరియు చెప్పెను, "విమర్శకుల యొద్దకు నేను నడిచివెళ్ళి, బైబిలులో మీకు దానిని నన్ను చూపనివ్వండి," అని అన్నాను, చూడండి. అది నిజము. అది మంచిది, చూడండి. అది పరిశుద్ధాత్మయై యున్నది. అది బైబిలులో యున్నది, మరియు అది సత్యము.
GEN 11:30•
GEN 12:2,4•
GEN 20:12
20ఇప్పుడు, అబ్రాహామును మనము 12వ అధ్యాయములో తీసుకొంటాము. ఇప్పుడు, ఆ అధ్యాయముతో నన్ను మీరు వెంబడిస్తారా. దేవుడు అబ్రాహాముకు చేశాడు. అతడు కేవలము ఒక సామాన్య మనిషియైయున్నాడు. ప్రారంభము నుండి ఒక పెద్ద మనిషియై యున్నాడు, 75 సంవత్సరాల వయస్సుగలవాడు. కాబట్టి సోదరులారా, నీకు 50 సంవత్సరాలున్నప్పుడు దేవునితో ప్రారంభించుటకు నీవు ఎంతో వృద్దుడవని తలంచినప్పుడు, లేక 60 సంవత్సరాలలో, ఎందుచేత, నీవు వృద్దుడవు కాదు. అబ్రహము 75 సంవత్సరాల వయస్సుగలవాడై యుండెను. అతడు వివాహమాడిన, అతని యొక్క సగము సహోదరియైన శారాకు, ఆ సమయములో 65 సంవత్సరాలు. మరియు వారు ఫలించనివారుగా యున్నారు. వారికి పిల్లలు లేరు.
దేవుడు అబ్రాహాముతో అన్నాడు, "నేను నిన్ను గొప్ప జనముగా మరియు జనములకు తండ్రిగా చేయబోవుచున్నాను," మరియు అతనికి ఒక నిబంధనను ఇచ్చెను. ఇప్పుడు, మొదటి స్థలములో మీరు గమనించవలసినదేమనగా, ఆ నిబంధన అబ్రాహాముకు మాత్రమే కాకుండా, అబ్రాహాములో అతని తరువాత అతని సంతానముకు కూడా చేయబడినది. ఇప్పుడు, దానిని మనము ఏకముగా కలిపి చెపుదాము. ఇప్పుడు, మనము ఒక స్వస్థతా కూటము కొరకు సిద్ధపడుచున్నాము, చూడండి. "అబ్రాహాముకు, మరియు అతని తరువాత అతని సంతానమునకు," చూడండి.
ఇప్పుడు, దేవుడు అబ్రాహాముకు ఏమిచేసియున్నాడో, అతని తరువాత అతని సంతానమునకును ఆయన చేయును. ఇప్పుడు, బైబిలు ద్వారా నేను మీకు దానిని ఋజువు చేయబోవుచున్నాను. మరియు నిశ్చయముగా గత రాత్రిని నీకు అది పరిష్కరించును, చూడండి. గమనించండి!అతనికి… అబ్రాహాము (నా కుడి ప్రక్కన) మరియు అతని తరువాత అతని సంతానమునకు (ఇక్కడ).
GEN 12:2
21నేను రెండు పుస్తకములను తీసుకొనబోవుచున్నాను, మరియు నేను వాటిని ఈ రీతిగా పైకి ఉంచబోవుచున్నాను, కావున ఆ రీతిగా మీరు చూస్తారు: ఇది అబ్రాహాముయై యున్నాడు; ఇది అతని తరువాత సంతానమైయున్నది. అబ్రాహాము మరియు అతని తరువాత సంతానము. దేవుడు… ఆయన అబ్రాహామునకు ఏమి చేశాడో, అబ్రాహాముకు మరియు అతని తరువాత సంతానమునకు అని ఆయన ప్రమాణము చేసియున్నాడు. (ఇప్పుడు, దగ్గరగా వినండి, దీనిని తప్పిపోవద్దు), నీవు లోకములోని కార్యములకు చనిపోయియున్నట్లైతే, మరియు పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తులో సజీవముగా చేయబడియున్నట్లైతే నీవు ఎవరి సంతానమైయున్నావు. ఏలయనగా క్రీస్తులో మృతి చెందిన మనము, అబ్రాహాము యొక్క సంతానమును మనము తీసుకొన్నవారమై, వాగ్దానము ప్రకారము, ఆయనతో వారసులమై యున్నాము. అది బైబిల్.
ఇప్పుడు, ఆదికాండము 12 అధ్యాయములో ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను మీరు గమనించారా? ఆ నిబంధన, "అబ్రహామా, నీవు ఒక నిర్ణీతమైన కార్యమును చేసినయెడల, నేను ఒక నిర్ణీతమైన కార్యమును నీకు చేస్తాను," అని కాదు. ఆ నిబంధన మొత్తానికి కృపయై యున్నది. "నీవు దానిని చేసినట్లైతే," అని కాదు. దేవుడు అబ్రాహాముతో అన్నాడు, "నేను చేసియున్నాను." "నీవు ఒక నిర్ణీతమైన కార్యమును చేసినట్లైతే" అని కాదు."
EXOD 19:5•
GAL 3:16•
HEB 6:13
22దేవుడు ఆదాముతో ఒక నిబంధనను చేసెను. ఆదాము దానిని విచ్చిన్నము చేసెను. ఆయన మానవునితో నిబంధనను చేసిన ప్రతిసారి (నిర్గమ 19, ఆయన ఒక నిబంధన చేసెను) … అతడు దానిని విచ్చిన్నము చేసెను. అయితే దేవుడు తన యొక్క సంకల్పములో నియమముల ద్వారా కాదు, మనిషితో నిబంధనలు చేయుట ద్వారా కాదు, కాని తనకై తానుగా నిబంధనలు చేయుట ద్వారా, ఆయన మనిషిని రక్షించాలని సంకల్పించి యున్నాడు, కారణము అది ఆయన కుమారుడై యున్నాడు.
కాబట్టి ఆయన… ఆయన ఈ నిబంధన చేయుట మాత్రమే కాదు, కాని దాని ద్వారా ప్రమాణము చేసియున్నాడు. మరియు ఒక మనిషి ప్రమాణము చేసినప్పుడు, అతనికంటె మరి ఎక్కువ గొప్ప వ్యక్తి పేరట ప్రమాణము చేయును, మరియు ఆయనకంటె ఎక్కువ గొప్పవాడు ఎవరును లేరు, కాబట్టి బైబిలు చెప్పియున్నది, ఆయన తన తోడని తనకుతానుగా, దానిని నెరవేర్చుటకు ప్రమాణము చేసియున్నాడు.
ఇప్పుడు దానిని గూర్చి ఆలోచించండి. నీవంటావు, "మంచిది, నేను కేవలము అబ్రాహాము యొక్క దీవెనను కలిగియున్నట్లైతే, అబ్రాహాము కలిగియున్న అదే వాగ్దానమును నేను కలిగియున్నట్లైతే…" నీవు కలిగి యున్నావు, నీవు క్రీస్తు బీజము కలిగియున్నట్లైతే, క్రీస్తు నీలో యున్నాడు. నీవు క్రీస్తులో మృతిచెందియున్నట్లైతే, నీవు పరిశుద్ధాత్మను పొందియుయున్నట్లైతే; నీవు అబ్రాహాము యొక్క సంతానమైయున్నావు, కారణము క్రీస్తు అబ్రాహాము యొక్క సంతానమై యున్నాడు. మీరు దానిని చూసారా? అది మన లోపల పనిచేయుటను ఉంచుతుంది, దేవుని యందు విశ్వాసము.
ROM 3:4•
HEB 6:4-6
23ఇప్పుడు, అబ్రాహాము యొక్క సంతానముగా యుండుటకు నీవు ఎన్నడూ దేవుని వాగ్దానము నుండి వెనుకకు వెళ్ళవు. నీవు ఎల్లప్పుడు దేవుని యొక్క వాగ్దానములను పాటిస్తావు. ఏది ఎలా యున్నను నీకు లెక్క కాదు, అది సత్యముగా నీవు దానిని వెళ్ళనిస్తావు. అదే అబ్రాహాము చేసియున్నది. ఎవరు ఏమి అన్నను లెక్క కాదు, ఎవరు ఏమి చెప్పినా, అది ఏమియు కాదు, దేవుడు ఆ రీతిగా చెప్పియున్నాడు, మరియు అది దానిని స్థిరపరచును. అబ్రాహాము యొక్క సంతానము ఆ రీతిగానే యుంటుంది.
చూడండి, ఇప్పుడు మీరు అబ్రాహాము యొక్క సంతానమై యున్నారు. దేవుని మాటయే సత్యము, ప్రతి మనిషి యొక్క మాట అబద్దముగా ఉండనిమ్ము దేవుని యొక్క వాక్యము! కాబట్టి అందుచేత, మీరు చూడండి. మీరు దాని యొద్దకు వచ్చినట్లైతే, అబ్రాహాము యొక్క సంతానమని చెప్పుకొని మరియు దానినుండి ప్రక్కకు తొలగినట్లైతే, అది అసాధ్యము, నీవు దేవుని నుండి నిన్నునీవు ప్రక్కకు త్రిప్పకొన్నప్పుడు, అవిశ్వాసమునకు అక్కడ ఇక ఎంత మాత్రమును బలి అర్పణ లేదు. నీవు ముగి౦చబడ్డావు, చూచారా.
GEN 11:31
24ఇప్పుడు, ఆయన దానిని అబ్రాహాముకు చేసియున్నాడు, "అబ్రహామా, నీవు ఒక ప్రత్యేకమైన కార్యము చేసినట్లైతే, నేను నీ నుండి ఒక గొప్ప దేశమును చేసి, మరియు నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను," అని కాదు. ఆయన అన్నాడు, "నేను దానిని చేసియున్నాను." గుర్తుంచుకోండి, వాగ్దానము మొత్తముగా కలిపి కృపయైయున్నది, మరియు దానిలో ఏ మాత్రము ఏ నియమము మిళితము కాలేదు. "నీవు ఇలా చేసినట్లైతే," అనునది ఏ మాత్రము లేదు; అది సంపూర్ణముగా అబ్రాహాము పట్ల దేవుని యొక్క ఎన్నికయై యున్నది. ఇప్పుడు, వీటిలోని కొన్నిటితో కనీసము నీవు సమ్మతించకపోయినను, ప్రార్థనాపూర్వకమైన లెక్కింపును కొంచెము దానికి ఇద్దాము.
ఇప్పుడు మీరు చూడండి, అది నీవు ఏదో చేసినది కాదు, నీ కోర్కెలు ఏమైయున్నవో అది కాదు. అది అబ్రాహాము యొక్క కోర్కెయై యుండలేదు, అతడు ఒక అన్యుడై యుండెను. అతడు బాబేలు గోపురము నుండి దిగువకు వచ్చి యున్నాడు. షీనారు లోయ దిగువన మరియు కల్దీయుల ఊరు అను పట్టణము నుండి అతడు వచ్చియున్నాడు. మరియు అతడు ఒక సామాన్యమైన మనిషియై యుండెను మరియు అబ్రాహాము ఏమియు చేసియుండలేదు, కనీసము అతని కోర్కెలు అవి కావు… కాని దేవుడు, తన కృప ద్వారా మరియు ఎన్నిక ద్వారా అబ్రాహామును ఎన్నుకొనెను. ఆ విధముగానే ఆయన నిన్ను ఎన్నుకొని యున్నాడు. నీవు ఏమియు చేసియుండలేదు. అది ఆయన చేసినదే. ఇప్పుడు గుర్తుంచుకోండి, "అబ్రాహామునకు మరియు అతని సంతానమునకు…
MATT 24:24•
MARK 13:22•
ROM 9:11,13
25నీవు ఒక సేవకుడవైనావని లేక ఒక క్రైస్తవుడవైనావని నీవు ఆలోచిస్తావు, కారణము ప్రజలు నీ గూర్చి మంచిగా మాట్లాడతారు లేక నీవు సంఘములో చేరియన్నావు లేక సమాజములో నిలిచియుంటావు, లేక ఇది పట్టణములో అతిపెద్ద సంఘమై యున్నది, నీవు కేవలము నిన్నునీవు వెర్రివానిగా చేసికొనుచున్నావు. అంతవరకే అది క్రైస్తవ్యమునకు వచ్చినప్పుడు నీవు ఒక దౌర్భాగ్యుడవై యున్నావు. దేవుడు ఎన్నిక ద్వారా ఎన్నుకొనును.
రోమా 9వ అధ్యాయము, 8వ అధ్యాయము చెప్పింది, దేవుని యొక్క ఎన్నిక నిశ్చయముగా నిలబడుతుంది. ఏశావు మరియు యాకోబు, పిల్లలింకనూ పుట్టకముందే, కనీసము వారు ఏమి చేయబోవుచున్నారో ఒక మార్గమును కలిగియుండక ముందే, దేవుడన్నాడు, "నేను ఏశావును ద్వేషించితిని మరియు యాకోబును ప్రేమించితిని. కారణము ప్రపంచము ఎన్నడైనా పుట్టకముందే వారు ఏమైయుండిరో దేవుడు ఎరిగియుండెను.
ప్రపంచము ఎన్నడైనా ఉనికిలోనికి రాకముందే దేవుడు నిన్ను క్రీస్తులో ఎన్నుకొనెను. బైబిలు ఆ రీతిగా చెప్పియున్నది. నీ పేరును గొర్రెపిల్ల యొక్క జీవగ్రంధము మీద ఉంచెను. నీవు వేదికనొద్దకు వచ్చినప్పుడు కాదు, కాని జగత్తు పునాదికి ముందే ఆయన దానిని చేసెను. బైబిలు ఆ రీతిగా చెప్పినది.
1JN 2:2•
REV 13:8
26చివరి దినములలో క్రీస్తు విరోధి, ఎంతో భక్తిపరుడుగా యుంటాడు, పెంతికొస్తువారు సహితము, సాధ్యమైతే ఏర్పర్చబడ్డవారిని సహితము మోసపుచ్చుటకై.
గత రాత్రి బిల్లీ గ్రహం తన వర్తమానములో ఇలా అన్నాడు, "ఎన్నుకొనబడిన వారిని సంపూర్ణముగా మోసగించువరకు సాతాను గర్జించుచూ తిరుగుచున్నది."
నేను తలంచాను, "ఓ, ఓ, బిల్లీ, అక్కడ నీవు పొరపాటు చేసియున్నావు." హ-హ, నీవు ఎన్నుకొనబడిన వారిని మోసగించలేవు, కారణము వారు క్రీస్తులో భద్రముగా యున్నారు.
ఈ క్రీస్తు-విరోధి ఏర్పర్చబడ్డ వారిని సహితము మోసపుచ్చునంతగా ఎంతో దగ్గరగా యుంటాడని బైబిలు చెప్పినది, మరియు దానినే వాడు అంత్యదినములలో చేయును, ఇప్పుడు వాడు ఎంతో దగ్గరగా యున్నాడు, వాడు దానిని చేయును. మరియు (ప్రకటన గ్రంధమును నేను ఎత్తి చూపుచున్నాను), జగత్తు పునాదికి ముందు నుండి ఎవరెవరి పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంధములో వ్రాయబడియుండలేదో, ఆ భూనివాసులందరిని వాడు మోసము చేయును అని ఆయన చెప్పాడు. అది అబ్రాహాము యొక్క సంతానమై యున్నది. దేవుని యొక్క ఎన్నిక. నీ ఎన్నిక కాదు; దేవుని యొక్క ఎన్నిక; దేవుడు నిన్ను ఎన్నుకొన్నాడు; నీవు ఎన్నడూ దేవుని ఎన్నుకొనలేదు. దేవుడు నిన్ను ఎన్నుకొన్నాడు, మరియు ఆయన నీ పేరును గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో యుంచియున్నాడు.
ఎప్పుడు గొర్రేపిల్ల వధించబడినది? 2000 సంవత్సరాల క్రితము కల్వరిలోనా? దేవుని యొక్క దృష్టిలో కాదు. ఆయన జగదుత్పత్తికి ముందే ఆయన వధించబడిన గొర్రెపిల్లయై యున్నాడు. సాతాను ఏమి చేసియున్నాడో దేవుడు చూచినప్పుడు. ఆయన ప్రణాళిక పొందుపరచబడినది, మరియు ఆయన తన కుమారుని పంపునని మరియు ఆయన మన పాపముల కొరకు ప్రాయచిత్తముగా యుండునని ఆయన ఎరిగియుండెను. మరియు యెహోవా యొక్క మనసులో జయించి ఆయన బిడ్డలను భద్రపర్చుటకు, ఆయన తన సొంత మనస్సులో గొర్రెపిల్లను వధించెను, జగత్తుపునాదికి ముందే నీ పేరును విమోచించబడినదిగా గ్రంధములో యుంచెను. మహిమ! అదే ఆయన చేసియున్నాడు. దేవుడు దానిని చేసెను. అప్పుడు మనము దేనికొరకు భయపడతాము? లేదు, "నీవు కోరినట్లైతే;" "నేను కలిగియున్నాను."
ISA 53:5•
MATT 13:47•
JOHN 6:37
27అప్పుడు దైవిక స్వస్థతలో మీరంటారు, "బ్రదర్ బ్రెన్హాం, దేవుడు నన్ను స్వస్థపర్చుతాడా?" నీవు అబ్రాహాము యొక్క సంతానమైనట్లయితే, ఆయన నిన్ను స్వస్థపర్చియున్నాడు.
"సహోదరుడు రాబర్ట్ చేయు విధానములో మీరు నా మీద చేతులను యుంచుతారా?" అది దానితో చేయునది ఏమియులేదు. కేవలము ఒక తాకు విషయమైయున్నది. ఒకప్పుడు ఆ మనిషి యొక్క సొంత ప్రసంగములో అతడు అన్నాడు, "నీ వెనుకయున్ననీ సీటు వెనుక భాగముపై నీ చేతిని యుంచుము." ఇప్పుడు, ఆ సీటులో ఏ విధమైన స్వస్థతయు లేదు, చూడండి. నీవు ఇదివరకే విమోచించబడియున్నావని, ముగించబడిన కార్యములో అది నీ విశ్వాసమై యున్నది. మన అతిక్రమముల కొరకు ఆయన గాయపర్చబడెను, ఆయన పొందిన దెబ్బల వలన మీరు స్వస్థత నొందియున్నారు.
"బ్రదర్ బ్రెన్హాం, ఈ రాత్రి నేను స్వస్థపడతానా?" నీవు ఇదివరకే స్వస్థతనొందియున్నావు.
దేవుడు పరిశుద్ధాత్మను పంపియున్నాడు. మీ యొక్క సంఘ కాపరులను పంపియున్నాడు, మరియు వారు వాక్యమును భోధించువారు, మీరు వినియున్నారు. మరియు భాషల వరములను, భాషలకు అర్ధము చెప్పుటను, మరియు ప్రవక్తలను, ప్రవచనాత్మకమైన వరములను, మరియు ఆ స్థానమునకు మిమ్మును ఆకర్షించ ప్రయత్నించుటకు సమస్తమును పంపియున్నాడు.
సంఘ కాపరి నిన్ను స్వస్థపర్చలేడు. భాషలతో మాట్లాడుట నిన్ను బాగుచేయదు. భాషలకు అర్ధము చెప్పుట నిన్ను బాగుచేయదు. ప్రవక్త నిన్ను స్వస్థపర్చలేడు. ఇతర వరములు నిన్ను స్వస్థపర్చలేవు. అది నిజమైన వరమైయున్నట్లైతే, అది నీవు ఎక్కడ స్వస్థతపొందియున్నావో ఆ స్థలమును అది నిన్ను వ్రేలుపెట్టి చూపుతుంది — నీవు అబ్రాహాము యొక్క సంతానమైయున్నావు, మరియు నీవు ఇదివరకే రక్షించబడి మరియు స్వస్థతనొంది యున్నావు.
మరియు ఆ కారణమును బట్టియే పరిశుద్ధాత్మ నీ హృదయమును తట్టుచున్నది. "తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు." అది నిజము. ఇప్పుడు, ఆ కారణమును బట్టియే మేము సువార్తను ప్రకటిస్తాము. ఆ కారణమును బట్టియే ఈ ప్రయాసలను నేను ముందుకు ఉంచాతాను. ఇతర సేవకులు అందుకే వారి ప్రయాసలను ముందుకు ఉంచుచున్నారు. ఆ పెద్ద వలను విసిరుటకు ప్రయత్నించుచున్నారు, వాటిని లోనికి లాగి, ఏది ఏమైయున్నదో చూస్తారు. నాకు తెలియదు. ఇతర సేవకులకు అది తెలియదు. మేము కేవలము వలతో చేపలను పట్టుచున్నాము.
MATT 13:47•
JOHN 10:27•
JOHN 14:26•
2PET 2:22
28"దేవుని యొక్క రాజ్యము - వల యొద్దకు వెళ్ళిన ఒక జాలరిని పోలియున్నది. అతడు ఒక వలను తీసుకొని సముద్రములోనికి వెళ్ళి ఆ వలను దానిలో విసిరెను. అతడు వలను దరికి లాగినప్పుడు, దానిలో అతడు కప్పలను, తాబేళ్ళను, పాములను, సాలెపురుగులను, మరియు చేపలను కలిగియుండెను." ఏమి జరిగియున్నదో గమనించండి. సువార్త యొక్క ప్రభావము అనేకులను పట్టుకొన్నది. మరియు సరిగ్గా మొదటి వారము తరువాత, పాత సర్పము ఇలా అన్నది, "ఇప్పుడు, చూడండి, నా పొగాకును, నా చీట్ల పేకలను, మరియు ఈ ఇతర కార్యములన్నిటిని వదులుకొనవలసినట్లైతే." తిన్నగా అది ఆ నీటిలోనికే వెళ్ళిపోతుంది.
శ్రీమతి. నీటి సాలెపురుగు అక్కడ కూర్చొని, మరియు చుట్టూ చూసి, ఆమె అంటుంది, "హ, నేను నా క్లబ్బులను కలిగి యుండరాదని, నీ భావమా, ఈ కార్యములను అక్కడ చేయుటకు, నా ముఖము మీద రంగును తీసివేయాలా, నా వెంట్రుకలను ఎదుగనియ్యాలా, మరియు నా పొట్టి బట్టలను తీసివేయాలా, మరియు. హ" ప్లాప్! ప్లాప్! ప్లాప్!" — పంది తన బురదకు తిరిగినట్లు, కుక్క తన వాంతికి తిరిగినట్లుంది.
ఇప్పుడు, ఆమె ఏమైయున్నది? ఆమె వలలో పెట్టబడింది, వేదిక యొద్దకు తేబడింది; మరియు అతడు కూడా. కాని అది ప్రారంభము నుండియే ఒక సర్పము. అది ఆరంభము నుండియే ఒక సాలెపురుగు. వల దానితో చేయునది ఏమియులేదు. అది కేవలము దానిని పైకి లాగింది. మరియు చేప ప్రారంభము నుండియే అది ఒక చేప, చూడండి. అది ఖచ్చితముగా సత్యము. "నా గొర్రెలు, నా స్వరమును వినును," చూచారా.
ఓ, వారిలో కొందరు చదువుకొన్నవారు, మరియు ఉండవలసినంతగా చురుకైనవారు. అది దానితో చేయునది ఏమియూ లేదు. అది దీనత్వము మరియు పరిశుద్ధాత్మయై యున్నది, మార్గదర్శిగా యుండి నడిపించుచున్నది. మరియు ఆ బైబిలు నుండి ఒక్క మాట కూడా ప్రక్కకు నడిపించదు. ఆయన తిన్నగా నిన్ను ఆ బైబిలు యొక్క క్రమములోనికి నడిపించును, అవునయ్యా, తిన్నగా బైబిలుతో వుంచును.
MATT 1:18•
JOHN 14:12•
HEB 13:8
29నీవు ఒక లేఖనమును చూసినప్పుడు, నీవు ఇక్కడ చూస్తావు, మరియు ఇక్కడ, మరియు ఇక్కడ, మరియు ఇక్కడ మరియు నీవు నీ సంఘ కాపరిని దానిని గూర్చి అడుగుతావు, మరియు అతడంటాడు, "హ, అది మరొక దినమునకు చెందినది," నీవు దేవుని బిడ్డయైయున్నట్లైతే నీవు దానిని నమ్మవు. లేదండి.
"యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని, అది చెప్పినప్పుడు." "నేను చేయు క్రియలు మీరును చేయుదురు." ఆయన ఏమైయున్నాడో మీరు చూడండి. ఇక్కడ వాగ్దానమును చూడండి సంఘ కాపరి అంటాడు, "హ, అది బుద్ధిహీనత. అక్కడ ఏదియు దానిని చేయదు," అంటాడు. మీరు దానిని నమ్మరు; కారణము నీవు సాలెపురుగువు కాదు, లేక సర్పము కాదు — నీవు ఒక చేపవై యున్నావు, చూచారా.
అది అక్కడ యున్నది. నీవు మేకవు కాదు, లేక పందివి కావు. నీవు ఒక గొర్రెపిల్లవై యున్నావు. మరియు పావురము ఒక గొర్రెపిల్ల మీద తప్ప దేని మీదను వెలుగదు. అవి ఒకే స్వభావము కలవైయున్నవి. అతి గొప్ప సంగతి… ఒకసారి నేను ఇక్కడ ఆ వర్తమానమును భోధించియున్నానని నేను నమ్ముతాను. గొర్రెపిల్ల మరియు పావురము అది ఎన్నడైనా ప్రభువు యొద్ద నుండి నాకు ఇవ్వబడిన అతి గొప్ప వర్తమానమై యున్నది. దేవుడు తన్నుతాను ప్రాతినిధ్యము వహించుకొన్నప్పుడు, ఒక పక్షిగా పక్షులన్నిటిలోకల్లా అతి సాత్వికమైనది, అదే పావురము.
దేవుడు మరియు పరిశుద్ధాత్మ మారని అదే వ్యక్తియై యున్నాడు. అది ఆలాగు కానియెడల, యేసు ఇద్దరు తండ్రులను కలిగియున్నాడు, మరియు మత్తయి 1;18 చెప్పింది, "ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను." ఆయన దుర్భీజుడైన పిల్లవాడు కాదు. ఆయన సంపూర్ణగాముగా దేవునివలన పుట్టినవాడై యుండెను, కాబట్టి ఆయన దేవుని కుమారుడై యుండెను. అది నిజము.
EXOD 19:13•
JOHN 14:20•
EPH 4:30
30కాబట్టి ఆయన పరలోకము నుండి దిగివస్తున్నప్పుడు, మరొక ముగ్గురు వ్యక్తులు అక్కడ నిలువబడి మాట్లాడుకొంటూ లేరు — కాని పరిశుద్ధాత్మ పావురము వలె వారు చూశారు. అదే ఆత్మయైయున్నాడు, మూడవ వ్యక్తి మాట్లాడుట కాదు; ముగ్గురు దేవుళ్ళు కాదు. కాని అదే దేవుని యొక్క మూడు కార్యాలయములు: తండ్రియైన దేవుడు, అగ్నిస్థంభములో, కుమారుడైన దేవుడుగా మానవశరీరములో, నీలోయున్న పరిశుద్ధాత్మ దేవుడు, అదే దేవుడు.
యేసు అన్నాడు, "నేను తండ్రియందును, తండ్రి నాయందును, నేను మీయందును మరియు మీరు నాయందును యున్నారని ఆ దినమున మీరు తెలుసుకొందురు," — దేవుడు, ఏథెను తోటలో ఆయన సృజించిన ఆయన జీవులలో తిరిగి సహవాసము చేయుటకు ప్రయత్నించుచున్నాడు.
ఆయన తన సొంత చట్టములను అతిక్రమించడు. మనిషి పాపభూయిష్ణుడు! ఆయన సీనాయి పర్వతము మీదికి దిగినప్పుడు, ఎవరైనను ఆ కొండను తాకినట్లైతే, తప్పక అతడు బాణముతో ఈ వైపునుండి ఆ వైపు వరకు గ్రుచ్చబడవలెను. అయితే ఆయన శరీరధారిగా మారినప్పుడు, మనము ఆయనను తాకగలిగాము, ఇప్పుడు ఆయన మనలో ఒక భాగమైనాడు, మనలను నడుపుటకు, మనకు మార్గదర్శిగా యుండుటకు, మరలా మనతో సహవాసము చేయుటకు, చూడండి. ఆయన మనలో ఒక భాగమైనాడు. ఓ, మై! మై! అది ఎంత అంతరాత్మకు భాధాకరమైనది మరియు సంస్కారము లేనిది, ప్రజలు దేవుని వాక్యమును తీసుకొని దానిని తయారు చేసుకొంటారు.
మరియు తరువాత, ఎవరైనా కొంచెము వెలుగును దానిమీద పొందినప్పుడు, మరియు ఇటు వైపు పరుగెత్తి మరియు సంస్థాగతమైన మరియు ఒక సంస్థను చేసి ప్రక్క వ్యక్తితో వాదిస్తాడు. మన అందరి కొరకు అక్కడ స్థలమున్నదని నీవు సరిగ్గా ఎందుకు చెప్పకూడదు? మనమందరము సీయోను వైపుకు సాగిపోదాము. మనము విభజింపబడిన వారము కాదు! మనము క్రైస్తవులమై యున్నాము; మెథడిష్టు, బాప్టిష్టు, ప్రెస్బిటేరియన్, లూధరన్, పెంతికొస్తు, ఏకత్వము, ద్విత్వము, త్రిత్వము, అసెంబ్లీలు, దేవుని సంఘము, అందరూ మనము విభజించబడలేదు. మనము క్రైస్తవులమైయున్నాము.
మన వ్యక్తిగత రక్షకునిగా క్రీస్తును మనము స్వీకరించినప్పుడు, మరియు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, మనము దేవుని యొక్క ముద్ర వేయబడిన ఉత్పత్తియై యున్నాము.
ROM 4:22
31ఎఫెసి 4:30, "పరిశుద్ధాత్మను దుఃఖపర్చకుడి, మీరు ముద్రవేయబడి యున్నారు…" నిన్ను ఎవరైనా వెర్రివారుగా చేయువరకా? మంచిది, రెండు లేక మూడు సంవత్సరాల వరకా? నీవు దేవునికి ఒక్కసారి అవిధేయుడవు అగువరకా? లేదు. మీరు దానిని ఆ పాత స్త్రీల పుట్టిన రోజు పంచాగములో కనుగొంటారు, కాని దానిని దేవుని యొక్క వాక్యములో మీరు కనుగొనరు. "దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపర్చకుడి, మీరు దానిచేత విమోచనా దినము వరకు ముద్రించబడియున్నారు."
నిత్యత్వము యొక్క గమ్యము దేవుని చేత తీర్మానము చేయబడినది, మరియు అప్పుడు నీవు దానిలో ముద్రించబడినావు. ఆ రీతిగానే ఆయన అబ్రాహామునకు చేసెను. అబ్రాహాము ఆయనను నమ్మెను మరియు అతడు అది అతనికి నీతిగా యెంచబడెను. అప్పుడు ఆయన ఒక నిర్ధారణగా సున్నతి యొక్క ముద్రను ఆయన అతనికి ఇచ్చెను. "మరియు నేను దానిని చేసియున్నాను! నీవు నా సొత్తైయున్నావు." ఆమెన్. అది అంతే. ఇప్పుడు, ఆదికాండము 12వ అధ్యాయము, "నీవు దానిని చేసినట్లైతే," అని కాదు;" "నేను చేసియున్నాను."
GEN 15:2
32ఇప్పుడు, మనము ఆదికాండము 15వ అధ్యాయమునకు వెళదాము. అక్కడే దేవుడు అబ్రాహామునకు నిబంధనను రూఢిచేయుచున్నాడు. ఇప్పుడు దగ్గరగా వినండి. ఆయన నిబంధనను రూడిచేసియున్నాడు, లేక ఆదికాండము 15 అద్యాయములో అబ్రాహాముతో కాంట్రాక్టును సంతకము చేసియున్నాడు.
ఇప్పుడు, "ప్రభువా నీవు నాకు ఏమి ఇస్తావు, నేను సంతతి లేనివాడనై యున్నాను," అని అబ్రాహాము చెప్పుటను మనము కనుగొంటాము. అతడు ఒక వృద్దుడు కాబోవుచున్నాడు. ఇది ఎన్నో సంవత్సరములకు పూర్వము. అతడన్నాడు, "నేను సంతానములేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలియజరే నా యింటికి ఆస్తి కర్తయగును గదా. నీవు నాకు ఏమి ఇచ్చిననేమి?"
మరియు దేవుడు అతనితో మూడేండ్ల ఆడు మేకను, మూడేండ్ల పెయ్యను, మరియు అతని అర్పణలను తీసుకొనమని అన్నాడు, మరియు మూడేండ్ల గొర్రెపొట్టేలును తీసుకొని, మరియు అక్కడకు వెళ్ళి ఆ అర్పణలను సగమునకు ఖండములుగా ఛేదించి తెరువుము, మరియు ఒక పావురమును ఒక గువ్వను తీసుకొనెను. మీరు నా మాట వినగలరా? "ఆమెన్" చెప్పండి. మంచిది. దీనిని మీరు వినాలని నేను కోరుచున్నాను.
33ఇప్పుడు, ఆయన ఈ నిబంధనను అబ్రాహాముకు రూఢి చేయబోవుచున్నాడు, లేక అబ్రాహాముతో కాంట్రాక్టు మీద సంతకము చేయబోవుచున్నాడు. ఆయన ఇదివరకే అతనికి చెప్పియున్నాడు, "నేను దానిని నీకు ఇస్తాను." అది ఒక వాగ్దానమై యున్నది. ఇప్పుడు, ఆయన సంతకము చేయబోవుచున్నాడు, మరియు దానిని ఎలా చేయబోవుచున్నాడో ఋజువు చేస్తాడు.
కాబట్టి ఈ కార్యములన్నింటిని చేసియున్నాడు, మరియు అతడు బలి అర్పణలను కనిపెట్టెను, సూర్యుడు అస్తమించువరకు ఆకాశ పక్షులు బలి అర్పణలు మీద వ్రాలకుండా త్రోలివేసెను. అవి వ్రాలలేదు… బలి అర్పణ క్రుళ్ళిపోగూడదు, మీకు తెలుసా. కాబట్టి సూర్యుడు అస్తమించు వరకు ఆకాశ పక్షులు వాటిమీద వ్రాలకుండా అతడు తోలివేసెను.
మరియు సూర్యుడు అస్తమించినప్పుడు (ఇప్పుడు వినండి), కటిక చీకటి మధ్య ఘాడమైన నిద్ర అబ్రాహాము మీదికి వచ్చెను. మీకు అది గుర్తున్నదా? అది ప్రతి మనిషికి సంభవించు మరణమును చూపుచున్నది. మరియు అతని ముందు పొగ రాజుచున్న కొలిమి వంటి పొయ్యి యుండెను. ప్రతి పాపి పాతాళమునకు వెళ్ళుటకు తగియున్నాడు. అయితే దానికి పైగా ఒక తెల్లని వెలుగు వెళ్ళెను. చూడండి, ప్రతి మనిషి వేరుచేయబడు మరణమును మరణించును, మరియు పాతాళమే అతని యొక్క దుర్భర పరిస్థితి. అయితే దానికి దూరముగా ఒక తెల్లని చిన్న వెలుగు వెళ్ళెను.
వాటిని గమనించండి. అవి ఆ బలి అర్పణల మధ్యలో వెళ్ళెను, ఆడు మేక పెయ్యి, పొట్టేలు మధ్యలో వెళ్ళెను. ఆయన ఏమి చేయుచుండెనో దానిని అబ్రాహామునకు రుజువు చేస్తూ, ఆయన తీసుకొని వాటి మధ్య వెళ్ళెను.
34ఇప్పుడు, ఇక్కడైనా లేక మరి ఎక్కడైనా ప్రతిసేవకుడు దానిని ఒప్పుకొనును. డాక్టర్ స్కాఫీల్డు ఇక్కడ దానిని ఒప్పుకొంటాడు. అది దేవుడు అబ్రాహాముతో నిబంధనను రూఢి చేసియున్నాడని మిగిలిన గొప్ప సేవకులందరూ ఎరుగుదురు.
"ఇప్పుడు, ఆయన ఏమి చేయుచుండెను, బ్రదర్ బ్రెన్హాం?" దీనిని మీరు నిబంధనను రూఢి చేయుట అని అంటాము. ఆయన ఏమి చేయుచుండెను?" ఆయన ఏమి చేశాడో ఇక్కడ ఉన్నది. ఆయన అతనితో ఏమి చేయబోవుచున్నాడో ఆయన అతనికి ఋజువు చేయుచుండెను.
ఇప్పుడు, మనము ఒకరితో ఒకరము నిబంధన చేసుకొన్నప్పుడు లేక ఒకరితో ఒకరము కాంట్రాక్టు వ్రాసుకొన్నప్పుడు మనము ఏమి చేస్తాము? సాధారణముగా, మనము బయటకు వెళ్ళి కలసి ఒక శాండ్విచ్ తిని, ఒక కప్పు కాఫీ త్రాగి లేక అలాంటిది చేసి, మరియు అప్పుడు, అది అంతయూ పూర్తియైన తరువాత, మరియు మనము ఒకరి చేతులను ఒకరము పట్టుకొని, "కరచలనము చెయ్యి, కుర్రాడా," అని అంటాము. మంచిది. నేను సమ్మతిస్తాను. నేను ఒక నిర్ణీతమైన దానిని పొందుతాను."
నేను ఒక నిబంధనను చేసియున్నట్లైతే… ఒక సోదరునితో ఒకరు, నా సోదరుడైన జెనే గోడ్ ఇక్కడ కూర్చొనియున్నాడు, నేనన్నాను, "బ్రదర్ జెనె, మంగళవారము ఒక నిర్నీతమైన కబురును అందించడానికి నేను నీతో కెంటక్కీకి వస్తాను."
"అలాగే, బ్రదర్ బ్రెన్హాం, ఇక్కడ దానిని ఉంచండి."
చూడండి, అది ఒక నిబంధనమై యున్నది. ఈ ఇద్దరు ఆర్కాన్సాస్ నుండి వచ్చిన సోదరులు ఇక్కడ కూర్చొని యున్నట్లైతే, నేను చెప్పినట్లైతే… వారు నన్ను తిరిగి ఆర్కాన్సాస్ రమ్మని గతకొన్ని సంవత్సరముల నుండి బ్రతిమాలుచున్నారు. నేను వారిని ఇక్కడకు పిలిచి, "సోదరులారా…" అని చెప్పినట్లైతే. కనీసము మీ పేర్లు నాకు తెలియదు, అయితే నేను వారితో ఇలా చెప్పినట్లైతే, "నేను మీతో ఒక నిబంధన చేస్తాను, నేను వచ్చే వారము ఆర్కాన్సాస్కు వస్తానని వాగ్దానము చేయుచున్నాను." "బ్రదర్ బ్రెన్హాం వందనములు," అది ఒక ఒప్పందమై యున్నది, ఒక నిబందన. ఆ విదముగానే ఒక కరచాలనముతో మనము దానిని నిర్ణయిస్తాము. అది నిజము కాదంటారా?
MATT 5:13
35ఇప్పుడు, జపాన్లో వారు ఒకరితోనొకరు వారి నిబంధనను ఎలా చేస్తారో మీకు తెలుసా? వారు మాట్లాడుకొంటారు, మరియు తరువాత చిన్న పట్టెడు ఉప్పును తీసుకొని ఒకరి మీద ఒకరు చల్లుకొంటారు. ఆ ఉప్పులో జీవమున్నది, మీరు చూడండి. అది తాకుతుంది, పట్టుకొని యుంటుంది. ఉప్పు నిలువ చేస్తుంది. మరియు ఆ రీతిగా వారు ఒకరి మీద ఒకరు ఉప్పును చల్లుకొంటారు.
యేసు అన్నాడు, "మీరు లోకమునకు ఉప్పయైయున్నారు," చూడండి. మరియు వారు ఒకరితో ఒకరు ఒక నిబంధనను చేయునప్పుడు, వారు ఒకరి మీద ఒకరు ఉప్పును చల్లుకొంటారు. దాని భావము ఆ నిబంధనను తప్పక పాటించవలెను. ఉప్పు వారిని ఏకముగా పట్టుకొంటుంది, దానిని చెడిపోకుండా కాపాడుతుంది. "ఏదియు వారి యొక్క కాంట్రాక్టును పాడుచేయలేదు. అది ఒక నిబంధనయైయున్నది."
మన కరచాలనము, అది సహవాసము. "మా యొక్క సహవాసపు ఆధారము మీద మేము సమ్మతిస్తాము, మేము ఒకరి పట్ల ఒకరము నిబంధనను పాటిస్తాము. ఉప్పు మా యొక్క నిబంధనను కాపాడుతుంది, కారణము అది పాడవదు లేక చెరుపు చేయబడదు. మా నిబంధన ఎల్లప్పుడును పాటించబడుతుంది.
36అయితే అబ్రాహాము యొక్క దినములలో అది వేరుగా యుండెను. ఇప్పుడు, ఆ దినములలో వారు ఒక నిబంధనను చేసినప్పుడు, వారు ఒక బలి అర్పణను చంపి, దానిని రెండుగా చీల్చి, వాటి మధ్య వారు నడుస్తారు.
అప్పుడు వారికి పేపరు లేదు. పేపరు సరిగా ఈ మధ్యకాలములోనే కొన్ని సంవత్సరముల క్రితము, కందిరీగలు చెట్టు యొక్క మెత్తటి పదార్ధము నుండి వాటి గూళ్ళను నిర్మించుకొనుచుండగా కనుగొన్నారు. అయితే వారికి పేపరు లేదు. అయితే వారు కలిగియున్నది… వారు గొర్రె పొట్టేలు చర్మము మీద, వ్రాయుటకు అనుకూలముగా బాగుచేచిన చర్మముల మీద వారి వ్రాతలన్నింటిని వారు ఉంచేవారు. వారు ఆ చర్మమును పదును చేసి, అప్పుడు మాటను గీచేవారు, మరియు తయారు చేసేవారు…
మరియు వారి వ్రాతలను దాని మీద వ్రాసేవారు. ప్రాచీన కాలములో వ్రాయబడిన వ్రాతలన్నియు తోలు మీదగాని లేక రాతి మీదగానీ వ్రాసేవారు.
కాబట్టి వారు దానిని ఒక రాతి మీదగాని లేక తోలుమీద గాని తీసుకొనేవారు, మరియు వారు ఈ నిబంధనను ఒకరితో ఒకరు చేసేవారు. అప్పుడు వారు ఈ బలి అర్పణల మధ్యలో నడుస్తారు, చనిపోయిన ఈ జీవుల యొక్క రెండు ఖండముల మధ్యలో, మరియు అప్పుడు వారు దానిని రెండుగా చీల్చుతారు, లేక రెండుగా చింపుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును పొంది మరియు ప్రమాణమును చేస్తారు. "మా మధ్య ఈ నిబంధనను మేము విచ్చిన్నము చేసినట్లైతే, మా యొక్క దేహములును ఈ బలి అర్పణలవలె యుంటాయి, అది దాని కొరకు నిలబడుతుంది." నా భావమును మీరు చూశారా?
ఇప్పుడు, దేవుడు ఏమి చేయుచుండెను? ఆయన ఇంకను చేయని దానిని భవిష్యత్తులో అబ్రాహాము యొక్క సంతానమునకు ఏమి చేయబోవుచుండెనో ఆయన అబ్రాహామునకు చూపుచుండెను. ఓ, సోదరుడా! అతడు ఇంకనూ దానిని పొందలేదు, అయితే అతడు వాగ్దానమును కలిగియుండెను, మరియు అది జరిగిపోయినంత మంచిది. ఆమెన్!
EXOD 15:26•
PS 103:3
37"నా హస్తము చచ్చుబడిపోయినది," అనుకొందాము. "నేను అబ్రాహాము యొక్క సంతానమునైయున్నాను. ఇక ఎంతమాత్రము నేను నా చేతిని ఆ రీతిగా చూడను. అది జరిగిపోయినంత మంచిది, దేవుడు నాకు దానిని వాగ్దానము చేశాడు. అది సమాప్తమైనది. నా హస్తము ఏమైయున్నదో నేను చూడను; అది దేవుడు ఏమి చెపుతాడో అదేయై యున్నది." అది నిజమైన అబ్రాహాము యొక్క సంతానము.
"నీవు బాగుపడే ఏ అవకాశము లేదని" డాక్టరు అంటాడు. ప్రభువా, దాని సంగతి ఏమిటి?"
తండ్రి తిరిగి నీ హృదయముతో ఇలా మాట్లాడుతాడు, "నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే."
"ఓ, వైద్యుడా, నీవు ఒక చక్కని మనిషివి, అయితే అది సమాప్తమైనది, నేను స్వస్థపడియున్నాను. దేవుడు చెప్పాడు." అది నిజము. అది అబ్రాహాము యొక్క సంతానము. "దేవుడు ఆ రీతిగా చెప్పియున్నాడు. నేను స్వస్థపడియున్నాను." అవునండి.
"నీవు ఇంకనూ తినగలవా?"
"అది ఏ భేధమును చెయ్యదు. నేను ఎలాగైనను స్వస్థపడియున్నాను," చూడండి.
ఆ వాగ్దానము నెరవేరుటకు అబ్రాహాము 25 సంవత్సరాలు కనిపెట్టెను — కాలమంతటి గుండా ఇంకా బలవంతుడగుచుండెను. మనము ప్రార్ధనా వరుసలోనికి వస్తాము మరియు ప్రార్ధించబడతాము, "మంచిది, నేను ఇంకనూ నొప్పులను కలిగియున్నాను. నా పరిస్థితి ఇంకనూ చెడ్డగా యున్నదని అంటాము. నేను ఇక ఎంతమాత్రము నడువలేను." అబ్రాహాము యొక్క సంతానము! దానికి వ్యతిరేఖముగాయున్న దేనికైనా అబ్రాహాము యొక్క సంతానము నిరాకరిస్తుంది, అది నీకు బయలుపర్చబడినట్లైతే.
ఇప్పుడు, నా జీవితములో ఎన్నడూ నేను ఒక వ్యక్తిని స్వస్థపర్చలేదు. మరియు ఆలాగుననే ఓరల్ రాబర్ట్, లేక టామీ హిక్స్, లేక ఎవరైనను, లేక ప్రపంచములో ఎవరైనను ఎన్నడూ ఒక మనిషిని స్వస్థపర్చలేదు. మీరు చూచినట్లైతే, మనిషిని మీరు ఏదో గొప్పగా చేయుచున్నారు. "ఓ, సోదరుడా ఫలానా-ఫలానా వ్యక్తి నా మీద చేతులను యుంచినాడు. అయ్యో! వణుకు నా గుండా ప్రవహిస్తాయి." అది కేవలము ఒక అనుభూతి. అంతవరకే. నీవు అనుభూతి ద్వారా స్వస్థతనొందలేదు. నీవు విశ్వాసము ద్వారా స్వస్థత నొందియున్నావు. నీవు దేనినీ స్పర్శించవలసిన పనిలేదు. అది ఒక అనుభూతి అయితే తప్ప, నీవు దేనినీ స్పర్శించవలసిన పనిలేదు. నీవు నమ్ముము.
"నీవు దానిని స్పర్శించుచున్నావా, నీవు దానిని స్పర్శించుచున్నావా?" అని యేసు ఎన్నడూ చెప్పలేదు. దాని కొరకు ఒక్క లేఖనమును నాకు చూపించండి. ఆయన అన్నాడు, "నీవు దానిని నమ్ముచున్నావా?" అదే విశ్వాసము. దేవుడు ఆరీతిగా చెప్పెను. "నేను అబ్రాహాము యొక్క సంతానమైయున్నాను. నేను దేవుని నమ్మియన్నాను. అది దానిని స్థిరపరచును.
JAS 5:16
38కాబట్టి చూడండి, అది నీ పట్టణమునకు వచ్చు ఎవరో ఒక గొప్ప భోధకుడు కాదు. మిగిలిన ఏ ఇతర వ్యక్తి వలే, నీ సంఘ కాపరియూ అదే అధికారమును కలిగియున్నాడు. నీ పొరుగువాడు, నీ క్రైస్తవ సహోదరి, నీ క్రైస్తవ సోదరుడు, అందరూ, ఎవరైననూ నీ కొరకు ప్రార్థించు హక్కును కలిగియున్నారు. బైబిలు చెప్పియున్నది, "మీ పొరపాటులను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మరియు ఒకరికొకరు ప్రార్ధన చేయుడి." అది నిజము. మనందరమూ.
అయితే మనము ఎవరో ఒక మనిషిని ఒక గొప్ప పెద్దవానిగా చేసి, మనకు వారు ఒక ప్రళాణికను భరించుటకు ఒక లక్ష డాలర్లు ఖర్చవుతుంది. అది నిన్ను స్వస్థపర్చదు. అది దేవుని యందలి నీ సొంత విశ్వాసమే ఆ స్వస్థతను జరిగిస్తుంది. ఆయన ఇక్కడ ఏమి చెప్పాడో మీరు కొంచెము చదివినట్లైతే, ఆయన నీతో సరిగ్గా ఒక నిబంధనను వ్రాసియున్నాడు. ఆయన దానిని రూఢి చేయుచూ నీకు పరిశుద్ధాత్మను ఇచ్చును. ఓ, మై! అది అంతే, చూడండి.
ఆ కారణమును బట్టియే, "బ్రదర్ బ్రెన్హాం, నా మీద చేతులను ఉంచాడు. దేవునికి మహిమ!" అని చెప్పుటకు ప్రయత్నము చేయు మనుషుల మీద నా చేతులను ఉంచను. దానితో బ్రదర్ బ్రెన్హా౦ చేయునది ఏదియూ లేదు. నా మీద నీవు చేతులను ఉంచవద్దు, లేక నేను నీ మీద చేతులను ఉంచను. నీవు విశ్వాసముతో ఆయన మీద చేతులను ఉంచుము, మరియు దానిని నమ్ముము. అది అక్కడే యున్నది. నీ కొరకు ప్రార్థన చేయుమని నీ సంఘ కాపరిని అడుగుము. ప్రార్ధన పరిస్థితులను మార్చును. అది ఏమి చేస్తుంది? అది నిన్ను స్వస్థపర్చదు; ఇది వరకు ఏమి జరిగియున్నదో దానిని వ్యక్తపర్చుటకు అది నీకు విశ్వాసము నిచ్చును, నీ స్వస్థత. నీవు దానిని గ్రహించావా?
GAL 3:28•
REV 22:17
39ఇప్పుడు, ఆయన అబ్రాహాముకు ఏమి చెప్పుచుండెను? "అబ్రహామా, నేను ఈ విధముగా నేను నిబంధనను తీసుకొనబోవుచున్నాను." మరియు ఆయన అబ్రాహామును తీసుకొని ఆయన యేసుతో, అబ్రాహాము యొక్క సంతానము ఏమి చేయబోవుచుండెనో అతనికి చూపెను; ఏలయనగా అబ్రాహాము ద్వారా ఇస్సాకు వచ్చెను, ఇస్సాకు ద్వారా క్రీస్తు వచ్చెను. క్రీస్తు ద్వారా, అత్యున్నతమైన బలి అర్పణ చేయబడినది. మరియు ఈ ఇతరులందరూ సహజమైన సంతానమైయున్నారు. ఇశ్రాయేలు, ఇశ్రాయేలు, ఇశ్రాయేలు, ఇశ్రాయేలు; కాని క్రీస్తు ద్వారా యూదునికైనా లేక అన్యునికైనా — గ్రీస్తు దేశస్థుడైనా, దాసుడైనా లేక స్వతంత్రుడైనా, పురుషుడైనా లేక స్త్రీ అయినా — అందరికీ తెర తెరువబడినది. అందరూ షకీనా మహిమలోనికి వెళ్ళవచ్చును. ఇదివరకు అది యూదుల కొరకు మాత్రమే. కాని ఇప్పుడు అది "ఇచ్చయించు ప్రతివానికై యున్నది, ఇచ్చయించు వానిని రానిమ్ము." ఇచ్చయించువానిని రానిమ్ము.
ఆ సంతానమును గూర్చియే దేవుడు మాట్లాడుచుండెను. ఆయన ఆ సంతానముతో ఏమి చేశాడు? ఆయన అతనిని (క్రీస్తును) కల్వరికి తీసుకొనెను. ఆయన ఆయనను రెండుగా విభజించెను. ఆయన తీర్పు క్రింద చనిపోయెను, దేవుని యొక్క దైవిక తీర్పు క్రైస్తవులముగా మన అందరికి అది తెలుసు. ఆయన ఏమి చేశాడు? ఆయన లేచియున్నాడు, ఆయన శరీరము నుండి ఆత్మను చీల్చెను. ఆయన ప్రాణము, ఆయన జీవము ఆయన శరీరముల నుండి వెడలిపోయెను. నీరు, రక్తము మరియు ఆత్మ ఆయన శరీము నుండి బయటకు వచ్చెను. మరియు మూడవ దినమున దేవుడు ఆయన శరీరమును లేపెను మరియు దానిని పరలోకములో ఆయన కుడి పార్శ్వమున ఉంచెను, మరియు ఆ శరీరము నుండి ఆత్మను తిరిగి ఆయన యొద్దకు పంపెను.
JOHN 14:12•
ROM 8:11
40అప్పుడు, ఆయన ఏమి చేయుచుండెనో మీరు చూడండి? ఒక సంఘ శాఖ… నీవు దానిమీద ఆధారపడినట్లైతే, నీవు తప్పిపోయావు. అక్కడ ఒక్కటి మాత్రమే ఎన్నడైనా యున్నది.
ఆ కాంట్రాక్టులు ఏకముగా కలసి వచ్చినప్పుడు, అవి చింపబడిన విధానములో అవి ఒకదానితో ఒకటి, ప్రతిమాట మరియు చింపబడిన ప్రతి ముక్క పొందికగా యుండవలసియున్నది. చింపబడిన గొర్రె చర్మమైనా లేక రాయియైనా తిన్నగా ఏకముగా కలసి ఒకదానితో ఒకటి పొందికగా యుండవలసియున్నది. దానికి ప్రత్యామ్నాయముగా ఏదియు చేయలేదు. దానిని రూఢి చేయుచు అది ఖచ్చితముగా సరిగ్గా యుండవలసియున్నది. వారు మరొక ముక్కను తెచ్చి దానితో కలుపుటకు చూచినా, అది దానిలో పొసగదు. అది ఇదివరకు ఉండిన విధముగానే ఖచ్చితముగా కలియవలసియున్నది.
మరియు సంఘము విమోచించబడి ఆయన యొక్క పునరుద్దాన శక్తితో పైకి లేచినప్పుడు… మనము క్రీస్తు యొక్క వధువైయున్నాము. నేను దానిని గౌరవముగా చెప్పుచున్నాను, మనము ఆయన యొక్క వధువైయున్నామని నిరీక్షించుచున్నాను, విశ్వాసము ద్వారా మనము ఆయన యొక్క వధువై యున్నామని నమ్ముచున్నాము. కాంట్రాక్టులోని ఇతర భాగము అది భూమి మీద యున్నప్పుడు యుండినట్లుగా, యేసుక్రీస్తు యొక్క వధువు దానిలో అదే ఆత్మను ఆమె కలిగియుండవలసియున్నది. నా భావమును మీరు చూచారా? దేవుడు దానిని రూఢి చేసియున్నాడు.
అప్పుడు క్రీస్తులో యున్న అదే జీవము ఆయన సంఘములో యుంటుంది, మరియు సంఘము యేసు చేసిన అవే కార్యములను సంఘము చేయుచుండును. "నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలను చేయును."
అప్పుడు, ఒక అవిశ్వాసి దేవుని యొక్క కార్యములను చూసి బెల్జబుబు, మనసులను చదువుట" అని ఎలా పిలువగలడు? ప్రభువు యొక్క కార్యమును చూడండి, ఎలా…? ఓ, చురుకైన, చదువుకొన్నవారు, నిశ్చయముగా; అయితే వారు దేవుని యొక్క కార్యముల నుండి లక్షల మైళ్ళ దూరములో యున్నారు, చూడండి.
GEN 15:18
41ఆయన ఆది కాండము 15 అధ్యాయములో ఈ నిబంధనను రూఢి చేసెను. ఇప్పుడు మీలో ప్రతి ఒక్కరు, దానిని అక్కడ చూస్తారు? ఆది కాండము 15 అధ్యాయములో ఆయన వాక్యమును రూఢి చేసెను. మరియు గుర్తుంచుకోండి, ఇప్పుడు వినండి, అతడు సంపూర్ణముగా దేవునికి విధేయుడగు వరకు గుర్తుంచుకోండి, ఇప్పుడు వినండి, అతడు సంపూర్ణముగా దేవునికి విధేయుడగు వరకు ఆయన ఎన్నడూ అనికి రూఢి చేయలేదు. నీ సమస్తమును సంపూర్ణముగా లోపర్చువరకు, ఆయన నీకు దానిని రూఢి చేయడు. ఇప్పుడు, దీనిని మీ మనస్సులో యుంచుకోవాలని నేను కోరుదును. మన చిన్న అమిష్ సోదరి, లేక డన్కర్డ్, మెనొనైట్, అది ఏమైన్నప్పటికి, మీరు దానిని పొందుచున్నారని నేను నమ్ముతాను.
GEN 17:1
42ఇప్పుడు, ఆయన వాక్యమును రూఢి చేసియున్నాడు.
ఇప్పుడు మరలా మనము దానిలోనికి వెళదాము… ఓ, మనము ఇక్కడ సరిగా గంటలకొలది వేచియుండవచ్చు, అయితే మనకు సమయము లేదు. ఇప్పుడు మనము ఆది కాండము 17 అధ్యాయమునకు వెళదాము (మంచిది) ఆయన అతనికి బలమనిచ్చినప్పుడు.
ఇప్పుడు ఆది కాండము 17 అధ్యాయములో 1వ వచనము, దేవుడు అబ్రాహామునకు సర్వశక్తిగల దేవుడిగా ప్రత్యక్షమైనాడు. అబ్రాహాముకు అప్పుడు వయస్సు 99 సంవత్సరాలు. శారాకు వయస్సు 89 సంవత్సరాలు, మరియు అతనికి 75 సంవత్సరాలు మరియు శారాకు 65 సంవత్సరాల వయస్సు నుండి వారు ఈ వాగ్దానము కొరకు కనిపెట్టుచుండిరి, దేవుడు దానిని చేయబోవుచున్నాడని, వారు సమయమంతటిలో ఎక్కువ బలముగా మారుచుండిరి — వారు నమ్మిన దాని నుండి వారు ఎన్నడూ ప్రక్కకు కదలలేదు. అదే మార్గము.
ఇప్పుడు, దేవుడు దానిని చూచుటను అతడు చూసియున్నాడు. అతడు దానిని పట్టుకొనుటకు తీర్మానించియున్నాడు. ఓ, ప్రభువు నామమము ధన్యమవును గాక. దేవుడు నీ హృదయమును చూచునప్పుడు, ఆయన నీకు దేనికైనా చూపినప్పుడు, మరియు దానిని గూర్చి ఎవరు ఏమి చెప్పినను లెక్క కాదు, అది ఆయన వాక్యమైయున్నది మరియు నీవు దానితో నిలిచియుండుము — సత్యమును మర్చిపోయి దానినుండి బుద్ధిపూర్వకముగా ప్రక్కకు తొలగవద్దు. "దేవుడు ఆ రీతిగా చెప్పియున్నాడు…"
GEN 17:1•
JOHN 1:1,14•
JOHN 4:24
43దేవుడు ఆత్మయైయున్నాడు. ఆయన తన ప్రజలను ఆత్మలోను మరియు సత్యములోనూ నడిపించును, మరియు ఆయన వాక్యము సత్యమైయున్నది, మరియు యేసు వాక్యమై యున్నాడు. "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద యుండెను, మరియు వాక్యము దేవుడై యుండెను. మరియు వాక్యము శరీరధారియై మన మధ్య నివసి౦చెను."
ఇప్పుడు, ఆయన అతనికి అక్కడ సర్వశక్తిగల దేవుడుగా ప్రత్యక్షమాయెను. హెబ్రీ మాట నుండి "ఎల్ షద్ధాయ్," అనగా భావము "షద్" అనగా భాషలో భావము "స్థనము." ఇప్పుడు ఆయన "స్థనముగల దేవుడు," అయితే "షద్ధాయ్", అనగా భావము అది బహువచనము "స్థనములు గల దేవుడు," నేను స్థనములు గల దేవుడనై యున్నాను, బలమునిచ్చువాడను, సమృద్ధిగలవాడను, జీవమునిచ్చువాడను."
44మరొక మాటలో, ఆయన అబ్రాహాముకు 99 సంవత్సరాల వయస్సులో ప్రత్యక్షమాయెను, మరియు అబ్రాహాము ఇక ఎంతమాత్రము మనిషిగా లేడు (మానవ షరతులతో మాట్లాడుచున్నప్పుడు), ఒక చిన్నని, చిన్న పాలిచ్చు బిడ్డను కలిగియుండుటయా, అది చూచుటకు వింతగా యుండును. అతని యొక్క పురుషత్యము గతించిపోయినది, మరియు శారా యొక్క గర్భము మృతమైయుండెను. కాని ఆయన అన్నాడు, "నేను ఎల్ షద్ధాయ్ ను. నేను స్థనములు కలిగిన, తల్లియైన దేవుడను."
చిన్న బిడ్డను చూడండి, అతడు రోగిగా చిరచిరలాడుచున్నాడు. అతని యొక్క బలము గతించినది. అతని పని ముగించబడినది, అతడు వట్టిగా బయట ఉంచబడ్డాడు. అతడు ఎంతో రోగిగా యున్నాడు, మరియు అతని చర్మమంతయూ ఈ రీతిగా చూపబడి ఒలువబడినట్లుగా యున్నది. ఇండియా దేశములోని చిన్న పిల్లలను చూడండి.
అది ఎంతో దయనీయమైన దృశ్యము. వారి చిన్న పొట్ట ఆకలితో ఉబ్బిపోయియుంటుంది, ఆ చిన్న తల్లి అక్కడ చనిపోతూ పరుండియున్నది. ఆమె చిన్న బిడ్డ యొక్క చిగుళ్ళు, అతని యొక్క పెదవుల గుండా వాటిని మీరు చూచునట్లుగా కనబడుచున్నవి, మాంసమంతయూ హరించిపోయినది. వారి యొక్క చిన్న పుర్రె, అది ఏకముగా కలిసి ఎక్కడకు వెళుతుంది, అది అక్కడ ఉంచబడుటను మీరు చూస్తారు, అది ఇక ఎంత మాత్రము ఏడ్వలేదు, అది ఎంతో ఆకలితో యున్నది. తల్లి, తన బిడ్డను అందుకొంటుంది. "దానిని తీసుకొంటుంది." మంచిది, మీరు దీనిని తీసుకొన్నట్లైతే, ఇక్కడ ఉంచబడిన వేలమందిని వైపు చూడండి.
MARK 16:15,17
45మరియు పెంతికొస్తువారమైన మనము లక్షల డాలర్లతో కట్టడములను కట్టుచున్నాము. ఓ, నిశ్చయముగా, చూడండి, మనము నిజమైన క్రైస్తవులము." దానిలో నన్ను నేను చూచుకొనలేను. లేదు. వారిని పోషించుటకు దానిని బయటకు పోగుచేయండి.
ఇప్పుడు, అది ఎవరో నాకు చెప్పిన విషయము కాదు; అది నాకై నేను ఎరిగిన సంగతి. నేను అక్కడయుండియున్నాను. ప్రజలు నాకు ఇచ్చిన ప్రేమ కానుకలు… నేను వాటితో ఏమి చేశాను? నేను అక్కడకు వెళ్ళి వారు భుజించుటకు వారికి ఆహారమును పెట్టాను, మరియు యేసును గూర్చి వారికి చెప్పాను.
అది ఖచ్చితముగా, ఏమియు లేదు. ఇక్కడ మనకు ఏమియు లేదు. యేసు, త్వరగా వచ్చుచున్నాడని నేను నమ్ముచున్నాను. ఇలాటి పెద్ద కార్యములకు, ఇక్కడ ఈ విధమైన కార్యములకు నాకు సమయము లేదు. చనిపోవుచున్నవారికి వర్తమానమును ఇద్దాము. దానిని చేయుటకే మన విషయములో ఆయన కనిపెట్టుచున్నాడు. అదే వర్తమానము, "వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి." "వెళ్ళి సంస్థలను చేయుట కాదు, సంఘ శాఖలను నిర్మించుట కాదు, మరియు పెద్ద కట్టడములను, అలాటి వాటిని కట్టుట, కాదు." అది ఫరవాలేదు. దానిని గూర్చి నాకు ఏమియు వ్యతిరేఖత లేదు; కాని యేసు చెప్పినది అది కాదు.
"వెళ్ళి సంస్థలను చేయండి. వెళ్ళి పెద్ద సంఘములను, వెళ్ళి పెద్ద కట్టడములను కట్టండి," అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఆయన అన్నాడు, "సువార్తను భోదించండి." సువార్త అనగా ఏమిటి? పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ప్రదర్శించుటయే. ఇప్పుడు, రెండు పదములను కలుపు మాటను గమనించండి, "మరియు" అనే ఒక పదము రెండు వచనములను ఏకముగా కలుపుతుంది. "నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును".
మీరు కేవలము మాటను మాత్రమే తీసుకొనలేరు. దానిని సూచనలను వెంబడించినట్లు దానిని బలపర్చి దానిని నీవు తప్పక తీసుకొనవలసియున్నది. అన్యులకు విద్యను నేర్పుట కాదు; వెళ్ళి సువార్తను ప్రకటించుము, వారి యెదుట దేవుని యొక్క శక్తిని ప్రదర్శించండి. అయితే మనము ఇతర కార్యములకు చేశాము. అక్కడ నా భావమును మీరు చూచారా?
GEN 17:1•
ISA 53:5•
ROM 3:4
46ఇప్పుడు, చిన్నబిడ్డ… పొట్ట ఉబ్చిన చిన్న బిడ్డవలె అబ్రాహాము ఇక్కడయున్నాడు. అన్ని ఆశలు పోయినవి. అయితే, "నేను ఎల్ షద్ధాయ్ ని. కేవలము నా రొమ్ముపై ఆనుకొని, మరలా నీవు శక్తిని పొందునట్లు పాలు త్రాగుము."
ఓ, అబ్రాహాము సంతానమా! అదే ఆయన నీకు చేయుచున్నాడు. ఇది ఆయన వాగ్దానమైయున్నది. దానికి మోసముగా యున్నదేనినో తీసుకొనవద్దు, వాగ్దానమునే తీసుకొనండి. దానిని గూర్చి ఎవరో ఏదో చెప్పే దానిని తీసుకొనవద్దు. ఎంత సత్యమైన మరియు ఎంత అది శాస్త్రీయముగా ఋజువు చేయబడిననూ, ప్రతిమనిషి యొక్క మాట అబద్దము, దేవుని మాట సత్యముగా ఉండనియ్యండి.
దేవుని యొక్క రొమ్ముపై తిన్నగా పైకి నిలబడండి. స్థనములు కలిగిన, క్రొత్త మరియు పాత నిబంధన. "మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపర్చబడెను, ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత నొ౦దితిమి. ఆ స్థనమునకు బయట ద్వారమును నీవు కలిగియున్నట్లైతే, అప్పుడు ఆయన నిన్ను స్వస్థపర్చియున్నాడు. అప్పుడు దానిని గట్టిగా పట్టుకోండి. బయట ద్వారమనగా ఏమిటి? "ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత నొందితిమి." అదే అబ్రాహాము యొక్క సంతానమైయున్నది.
ACTS 2:38,39•
2COR 5:17
47మీరంటారు, "నేను పరిశుద్ధాత్మను కలిగిలేను." ఆయన మన అతిక్రమముల కొరకు గాయపర్చబడెను. "మారుమనస్సు, బాప్తిస్మము మరియు మీరు పరిశుద్ధాత్మ అనువరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులకు మరియు ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికి చెందును." ఎవరైతే నమ్ముతారో వారికి స్థనము తెరుబడియున్నది, నీవు వ్యాధిగ్రస్తుడవై అవసరతలోయున్నట్లైతే.
"నీవు ఫలానా - ఫలానా దానిని చేసినట్లైతే, నేను దానిని చేస్తానని," కాదు. దానికి ఇది వరకే వెల చెల్లించబడియున్నది. సరియైన ఆహారముతో పోషించు సరఫరా, ఇదివరకే సరియైన ఆహారముతో పోషించు సరఫరాకు వెల చెల్లించబడినది. యేసు దాని కొరకు వెలను చెల్లించెను. నేను స్థనములను కలిగిన దేవుడును. ఇచ్చయించువారు ఎవరైనను రండి. మెథడిష్టు, బాప్టిష్టు, ప్రెస్బిటేరియన్, మరియు అందరూ, నా రొమ్ముపై ఆనుకొనండి. నా పిల్లలకు నేను స్థనములను కలిగిన దేవుడను. అబ్రాహాము యొక్క సంతానము." నా భావమును మీరు గమనించారా?
మరియు చిన్న బిడ్డ… ఆయన స్థనములను కలిగిన దేవుడు మాత్రమే కాదు, ఆయన తృప్తిపర్చువాడైయున్నాడు. చిన్నబిడ్డ తన తల్లియొక్క స్థనమును పట్టుకొంటుంది. (ఒక కలగలుపు జనసమూహమునకు అది మరి ఎక్కువ తేటగా లేదని నేను నమ్మదును); కాని ఆ చిన్న బిడ్డ తన తల్లి యొక్క స్థనమును పట్టుకొని తన తల్లి నుండి ఆ బిడ్డ తన బలమును పొందుట మాత్రమే గాక, పాలు త్రాగుచుండగా - ఆ బిడ్డ తృప్తి చెందును. అది అతని యొక్క తల్లియై యున్నదని అతనికి తెలుసు. హల్లెలూయ!
మరియు ఒక స్త్రీ గాని లేక ఒక పురుషుడు గాని దేవుని యొక్క రొమ్ముపై ఆధారపడినప్పుడు. "అది నా తండ్రియైయున్నాడు, ఆయనే భూమ్యాకాశములను సృజించినవాడు. ఆయన నన్ను చేసియున్నాడు; ఆయన నన్ను ఒక నూతన సృష్టిగా చేసెను. కాలబద్దుడైన ఒక జీవిగా ఆయన నన్ను చేసిన తరువాత, ఇప్పుడు ఆయన నన్ను ఒక నిత్యత్వపు సృష్టిగా చేయును. ఆయనే మనకు వాగ్దానమును ఇచ్చినవాడైయున్నాడు. నేను తృప్తి చెందియున్నాను. నాకు కడుపు నొప్పిగాయున్నా, నాకు తల నొప్పిగా యున్నా, నా చేతులు ఈ విధముగా యున్నా, నాకు లెక్క లేదు. ఏ విధముగా యున్నా, నేను తృప్తి చెందియున్నాను. నేను సర్వశక్తిగల దేవుని యొక్క వాగ్దానముల నుండి నేను బలమును పొందుచున్నాను. అది ఆయన యొక్క వాగ్ధానము." దానికై ఆయనకు కృతజ్ఞతలు. ఆమెన్! శక్తినిచ్చువాడు.
ISA 53:5
48[ఖాలీ స్థలము] … నీవు చనిపోవబోవుచున్నావు." "ఓ, చనిపోవుట నాకిష్టము లేదు. చనిపోవుట నాకు ఇష్టములేదు. ఓ, చనిపోవుచూ ఏడ్చుట నాకు ఇష్టములేదు." మొదటి సంగతి నీకు తెలుసా, ఒక మెల్లని చిన్న స్వరము ఒక ప్రసంగము ద్వారా, వాక్యమును చదువుట ద్వారా, ఎక్కడో ప్రార్ధనలో వినబడుతుంది, "నేను నిన్ను స్వస్థపర్చువాడను. నేను ఎల్ షద్ధాయ్ ను."
"ఓ…?"
"నీతి అతిక్రమ క్రియలను బట్టి నేను గాయపర్చబడ్డాను, నేను పొందిన దెబ్బల ద్వారా నీవు స్వస్థతనొంది యున్నావు."
"మంచిది, నేను ఏమి కలిగియు౦దును…"
"ఏమియూ లేదు, ఏమియులేదు. అది ఇదివరకే… నీవు చేయవలసిన కార్యమంతా, దానిని అంగీకరించుటయే."
"మంచిది, నేను తిరిగి ప్రవేశించి. ఒకవేళ ఏకత్వమున వదిలి మరియు అసెంబ్లీలలో చేరాలా, లేక చేరుటయా, లేక అసెంబ్లీస్ ను విడిచిపెట్టి మరియు ఏకత్వములో చేరుటయా, మీరు చేయుదురా…?"
దానితో చేయునది ఏమియు లేదు. దీనితో చేయునది ఏమియులేదు. నీవు ఇదివరకే ఆయన బిడ్డవైయున్నావని ఆయన సాక్ష్యమిచ్చియున్నాడు. "నా రొమ్ము మీద అనుకొనుము, మరియు కేవలము పాలుత్రాగుచు బలము పొందుచూ యుండుము." ఓ!
"డాక్టరు వచ్చినప్పుడు, "మంచిది, డాక్టర్, నీకు తెలుసా, నేను నీకు ఒక సంగతిని చెప్పగోరుచున్నాను. నీ యొక్క శాస్త్రీయ సేవ కొరకు నేను ప్రార్థన చేయగోరుచున్నాను. నీవు నిశ్చయముగా నాకు ఎక్కువ సహాయము చేయకపోయినను, ఎంతో ఆదరణను నీవు నాకు ఇచ్చావు, కాని నీవు నీ మార్గము యొక్క అంతమునకు వచ్చినప్పుడు, నీవు చేయగలిగినది అంతవరకే."
"అవును, నీవు చనిపోవబోవుచున్నావు. నీవు తప్పక…"
"మంచిది డాక్టర్, నేను ఈ చెక్కు మీద సంతకము పెట్టి నీకు ఇస్తాను, అయితే నేను ఒక సంగతిని నీకు చెప్పగోరుచున్నాను, డాక్టర్ నేను చనిపోవబోవుటలేదు."
"నీవు ఏమిటి?"
"నేను చనిపోవబోవుటలేదు."
"నీవు చనిపోవబోవుట లేదని నీకు ఎలా తెలుసు?"
"నేను నా శక్తిని ఎల్ షద్ధాయ్ నుండి తిరిగి పొందుచున్నాను."
ఓ, వారు వెళ్ళి చెపుతారు, "వారిని ఒంటరిగా పోనివ్వండి. అది వారిని హాని చేయదు. వారిని కేవలము ఒంటరిగా వదిలివేయండి. వారు ఎలాగైనా చనిపోవబోవుచున్నారు."
"అయితే నీవు దేనిని గూర్చి మాట్లాడుచున్నావో నీకు తెలుసా. అక్కడే పడుకొని యుండి. నీకు ఎలా తెలుసు? అది ఒక వాగ్దానమై యున్నది. "అబ్రహామా, నీవు బిడ్డను కలిగియు౦డబోవుచున్నావని నీకు ఎలా తెలుసు?" "అది ఒక వాగ్దానమైయున్నది. చూచారా. ఎల్ షద్ధాయ్.
"మంచిది. నీవు ఏమి చేశావు… బాగుపడటానికి?
"ఏమీ చేయలేదు. ఏమీ చేయలేదు."
"నీవు భోధకునికి ఏమైనా డబ్బు చెల్లించావా?" నీవు అలా చేసినట్లైతే, నీవు తప్పు చేసియున్నావు. "నీవు చేశావా… నీవు ఏమి చేశావు?"
"నేను ఏమియు చేయవలసిన పనిలేదు"
"ఎందుకు?"
"అది ఇదివరకే ముగించబడినది. నేను దానిని కేవలము నమ్మియున్నాను. ఆయన నాతో మాట్లాడియున్నాడు, నన్ను పిలిచియున్నాడు, నేను ఆయన రొమ్మును స్వీకరించియున్నాను. మరియు ఇప్పుడు నేను బాగుపడ్డాను."
మీలో ఎంతమంది దానిని అనుభవించియున్నారు? ఓ, సోదరుడా. నిశ్చయముగా.
HEB 13:12
49ఇప్పుడు, మనకు చాలినంత సమయము లేదు. నేను భోధిచవలసిన రీతిగా భోధించుటకు నేను పెద్ద భోధకుడను కాను, కాని నాకు తెలిసిన దానిని గూర్చి మాట్లాడగోరుదును, చూచారా. చూడండి. ఇప్పుడు, మనము దీనిని తీసుకొందాము… ఇప్పుడు, ఆయన ఏమి చేశాడు? ఇప్పుడు. లేఖనములను పాటించుచున్న మీరు. ఇప్పుడు, నిబంధన ఎందుకు చేయబడినది? ఇప్పుడు మనము ఒక్క నిమిషములో తరువాత అధ్యాయములోనికి మనము స్థానమును మార్చబోవుచున్నాము.
ఇప్పుడు, ఆయన ఏమి చేశాడు? అబ్రాహాముతో నిబంధనను చేసెను, (దానిని మీరు నాతో చెప్పండి), అబ్రాహాము మరియు ఆయన సంతానమునకును. అబ్రాహాము యొక్క సంతానమేమిటి? వారే తిరిగి-జన్మించిన స్త్రీ మరియు పురుషులు, పరిశుద్ధాత్మతో నింపబడినవారు.
"ఓ, ఇప్పుడు, బ్రదర్ బ్రెన్హాం…." మంచిది. ఆయన తన వాగ్దానమును నిలబెట్టుకొన్నాడేమో చూద్దాము.
ఆది కాండము 12వ అధ్యాయములోని అబ్రాహాము, నీతిమంతుడిగా తీర్చబడినాడు, నీతికరణము ద్వారా, బయటకు పిలువబడెను, మరియు దేవుని వాక్యమును నమ్మియన్నాడు. అది నిజమేనా? ఆ రీతిగానే మార్టిన్ లుధర్ లో సంఘము యుండెను. అది నిజమేనా? ఆది కాండము 15వ అధ్యాయము, అతడు సంపూర్ణముగా లోబడినప్పుడు అతడు వేరగుచున్నాడు, మరియు రక్తము ద్వారా అతనికి నిబంధనను రూఢి చేసెను. హెబ్రి 13:12 మరియు 13, "కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపర్చుటకై గవిని వెలుపట శ్రమపొందెను. అది నిజమేనా?
ఆయన ఏమి పంపియున్నాడు? భూమికి ఒక వర్తమానము, ఒక వర్తమానికుడు. ఫిలడెల్ఫియా సంఘ యుగములో ఎవరుండిరి? జాన్ వెస్లీ, శుద్దీకరణమును భోధించెను. అది ఆయన రూఢి చేసినప్పుడు, పాపము నుండి వేరగుట. అతడు నీతికరణము గుండా నమ్మియుండెను, ఆది కాండము 12వ అధ్యాయము. ఆయన నిబంధనను రక్తము ద్వారా రూఢి చేసెను, గొర్రెపొట్టేలు యొక్క రక్తమును వెదజల్లెను. ఆది కాండము 15 అధ్యాయములో ఆయన సంఘమును శుద్ధి చేసెను.
GEN 17:1
50ఇప్పుడు, ఆది 17 అధ్యాయములో, ఆయన పరిశుద్ధాత్మను ఇచ్చెను. గమనించండి, "నేను ఎల్ షద్ధాయ్." గుర్తుంచుకోండి, ఇప్పుడు దేవుని నుండి అతడు ఒక దానిని అతనిలోనికి స్వీకరించబోవుచున్నాడు. ఒక దాని నుండి బలము. ఒక చిన్న బిడ్డ వలె అతడు తల్లి పాలను త్రాగుట ద్వారా తన తల్లి దేహము నుండి ఆమె సొంత బలమును అతడు పొందుతున్నాడు. ఆత్మ యొక్క బలమును వారిలోనికి, జీవమును పాలు త్రాగుటకు, సంఘమునకు పరిశుద్ధాత్మ ఇవ్వబడినది.
ఆయన సంఘమునకు పరిశుద్ధాత్మను ఇచ్చెను — బలమునిచ్చువాడు, ఆయన యొక్క సొంత బలము. తన విశ్వాసమును ఒప్పుకొన్న తన బలహీనమైన బిడ్డకు దేనికొరకైనా బలమును ఇచ్చుటకు, దేవుడు తన శక్తిని బయటకు ఇచ్చు మార్గమును ఇచ్చుచున్నాడు. ఇప్పుడు ఆయన అతని కొరకు ఏదో చేయుటకు సిద్ధమయ్యాడు.
నీతికరణము. అబ్రాహాము, నీతికరణము, ఆది 12 అధ్యాయము. అబ్రాహాము యొక్క సంతానమునకు మార్టిన్ లూధర్. శుద్దీకరణము, ఆది కాండము 15, నిబంధనను రూఢిచేయుట. అబ్రాహాము యొక్క సంతానమునకు జాన్ వెస్లీ, శుద్దీకరణము.
దేవుని నుండి ఆయన యొక్క సొంత బలమును పొందుటకు అబ్రాహాము ఒక ద్వారమును కలిగియుండెను. మీరు దానిని చూడగలరా? ఎందరు దానిని చూస్తారో, ఆమెన్ చెప్పండి. ఒక వాగ్దానము ద్వారా దేవుని యొక్క సొంత బలమును పొందుట, ఆయన దానిని పెంతికొస్తు వారికి ఇచ్చెను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సొంత జీవము తిన్నగా వారి జీవితములోనికి లాగుకొనుట. సహజముగా ఆయన అక్కడ దానిని చేసినట్లుగా, ఆయన అక్కడ ఆత్మ సంబంధముగా చేయును, చూడండి — అబ్రాహాముకు మరియు అతని తరువాత అతని సంతానమునకు. ఇప్పుడు నా భావమును గ్రహించారా? ఇప్పుడు గుర్తుంచుకోండి, సంఘము ఇంకను పురోగతి చెందుచున్నది.
51ఇప్పుడు, ఇంకా, 18 అధ్యాయములో, ఇప్పుడు ఇక్కడ కొంచెమున్నది… ఇప్పుడు, సోదరులారా, మీరు దీనితో విభేధించవచ్చును. ఇప్పుడు, మీరు, మీలో అనేకులు… ఇప్పుడు, లూధర్ నీతికరణము తప్ప మరి దేనికైనా నమ్ముతాడా అని మీరు తలంచవచ్చు? లేదండి. అది ఆయన యుగమైయున్నది. వారు పునరుద్ధానములో పైకి వస్తారని నేను నమ్ముతాను, నిశ్చయముగా, మంచిది.
శుద్దీకరణము. శుద్దీకరణమే పరిశుద్ధాత్మ బాప్తీస్మము కాదని ఒక మంచి చతురస్త్రపు బలము కలిగిన మెథడిష్టుకు నీవు చెప్పగలవా? నిశ్చయముగా నీవు చెప్పలేవు. పూర్తి శుద్దీకరణము పరిశుద్ధాత్మయై యున్నదా! అవునండి. నజరేతువారలారా, పిలిగ్రీమ్ హాలీనెస్ వారలారా, అలాటివారు, మీరు దానిని ఎలానమ్మగలరు. అవునండి. శుద్దీకరణము పరిశుద్ధాత్మయై యున్నది! అది కాదు! అది పరిశుద్ధాత్మ యొక్క కార్యములు; పరిశుద్ధాత్మ నింపుదల కాదు. కాదు, అయ్యా.
GEN 17:4,5
52దాని వెంబడి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మముతో పెంతికొస్తు వచ్చింది. ఖచ్చితముగా నిజము. అయితే ఇప్పుడు, ఒక్క నిమిషము పాటు పెంతికొస్తును మనము ఆపగోరుదుము. సంస్థాగతమైన ప్రతిది అక్కడే తిన్నగా వాటి మార్గములలో చనిపోయినవి. ఇప్పుడు, లేఖనములను వ్రాసుకొనుచున్న మీరు చూడవలెనని నేను కోరుదును, 4 మరియు 5 వచనము. నీతికరణము ద్వారా అతనిని ఆయన పిలచిన తరువాత, నిబంధన యొక్క రక్తము ద్వారా అతనిని శుద్దీకరించెను, అతనికి తన సొంత జీవము నిచ్చెను, 17వ అధ్యాయములో, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము, ఇప్పుడు ఇశ్రాయేలులో తరువాత ఏమి వస్తుంది, బైబిలు పండితులైన మీలో కొందరు చెప్పండి? ఒక కుమారుని తన స్థానములో యుంచుట.
MATT 17:1,2•
MARK 9:2,3•
LUKE 9:28,29•
GAL 4:2
53పాత నిబంధనలో ఒక కుటుంబములోనికి కుమారుడు పుట్టినప్పుడు, అతడు కుమారుడై యుండెను, అయితే ఇంకనూ అతడు వారసుడైయుండలేదు. చూడండి, ఆ కుమారుడు ఎలా ఎలా ఉంటాడో తండ్రి కూడా ఎరగలేదు, కాబట్టి ఒక నిర్ణీతమైన వయస్సునకు పెంచుటకు తండ్రి అతని మీద ఒక సంరక్షకుని ఉంచును, మరియు తరువాత కుమారుని స్థానములో ఉంచుటను అతడు ప్రత్యక్షపర్చును. మత్తయి 17వ అధ్యాయములో దేవుడు దానినే చేసెను. ఆయన పేతురును, యాకోబును, యోహానును తీసుకొని ఒక ఎతైనకొండకు వెళ్ళి (ఒకసారి నేను దానిమీద ఇక్కడ భోధించాను, "ఎతైన కొండపెన.") వారిముందు రూపాంతరమును పొందెను. ఆయన ఏమి చేయుచుండెను? ఒక కుమారుని స్థానములో యుంచుటను ఆయన చూపుచుండెను.
ఇప్పుడు గమనించండి. పాత నిబంధనలో కుమారుడు పుట్టినప్పుడు వారు దానిని కలిగియుండిరి. అతడు కుమారుడై యుండెను. అయితే అతడు దారి వెంబడి ఎలా వచ్చుచున్నాడో, అతనిని కనిపెట్టుటకు ఒక సంరక్షకుని కలిగియుండెను, మరియు అతడు తండ్రి ఎల్లప్పుడు ఒక శ్రేష్టమైన ఉపాధ్యాయుని తన కుమారునికి ఇచ్చును. ఏ తండ్రియైనను అలా చేయును. కాబట్టి సంరక్షకుడు కుమారుని కనిపెట్టును. మరియు ఆ కుమారుడు ఒక తిరగబడు వ్యక్తియైతే, అతడు ఏమీ పట్టనివాడైతే - అతడు మాట విననివాడుగా యున్నాడు… అయినను అతడు ఇంకనూ కుమారుడైయున్నాడు, కారణము అతడు జన్మించియున్నాడు. అతడు ఒక కుమారుడైయున్నాడు, కాని అతడు ఎన్నడూ ఏ స్వాస్థ్యమును ఇంకా పొందియుండలేదు.
దయతో సోదరులారా, ఇప్పుడు ఆత్మసంబంధముగా ఆలోచించండి, సహోదరీలారా. అతడు ఇంకనూ ఏ స్వాస్థ్యమును కలిగియుండలేదు, అయినను అతడు ఒక కుమారుడై యుండెను. తండ్రి అతని పట్ల శ్రద్ధ వహించెను. అదే ఆ వెనుక అక్కడ అరణ్యములోయున్న గుంపై యున్నది, చూడండి. అతడు ఒక కుమారుడైయుండెను, నిజముగా, కాని అతడు ఎన్నడూ ఏ స్వాస్థ్యమును కలిగియుండలేదు. మరియు అప్పుడు సంరక్షకుడు అతని తండ్రి యొద్దకు వచ్చినప్పుడు, "నా కుమారుడు ఎలా యున్నాడు?" అని తండ్రి అడుగుతాడు.
అప్పుడు సంరక్షకుడు దానిని గూర్చి ఎలా తప్పక సిగ్గుపడతాడో, చూడండి, "అతడు బాగుగా పనిచేయుటలేదు." చూడండి, అతడు ఒక యధార్థవంతుని, ఒక నీతిమంతుని అద్దెకు తీసుకొనియున్నాడు. అతని టోపీలో గడ్డివంటి వాడు కాదు, లేక మనము పిలుచునట్లుగా ఒక ఈక వంటివాడు కాదు. అయితే అతడు సత్యమును చెప్పుచున్నాడు. "నీ కుమారుడు బాగుగా పనిచేయుటలేదు, అని మరియు మాట వినుట లేదని సంరక్షకుడు తండ్రితో చెప్పుచున్నాడు. అతనికి నేను ఏమియూ బోధించలేను." మంచిది, అతనికి ఎన్నడూ ఏ స్వాస్థ్యము పొందదు.
GEN 11:4
54ఒకవేళ ఆయన వచ్చి ఇలా చెపితే, ఈ దినమున నేను ఆశ్చర్యపోవుచున్నాను, దేవుడు ఇక్కడ ఆయన పిల్లలకు అబ్రాహాము యొక్క సంతానమునకు అదే కార్యమును చేసెను, సంరక్షకుడు…
మన సంరక్షకుడు ఎవరు? బిషప్పా? జిల్లా ప్రేస్బిటర్? అది ఎవరు? అది పరిశుద్ధాత్మ. ఆయన ఏ తారుమారు చెప్పడు. ఏమి జరగుచున్నదో ఆయన ఖచ్చితముగా తండ్రికి చెప్పును.
ఆయన పైకి వచ్చి ఇలా చెప్పును, "నా పిల్లలు ఆ మార్గములో ఎలా యున్నారు?"
"ఓ, తండ్రి, నీ పిల్లలందరూ జుట్టు కత్తిరించుకొనియున్నారు. వారు రంగులు పూసుకొనుచున్నారు. వారు లోకస్తులవలె ప్రవర్తించుచున్నారు. పురుషులు ధరించుకొనునట్లు కనబడు వస్తములను అసభ్యకరమైన వస్త్రములను వారు ధరించుచున్నారు. వారు వాటిని పెడల్ - పుషర్స్ అని కురుచ బట్టని పిలుస్తారు. మీ స్త్రీలు, మీ కుమార్తెలు, తిన్నగా దానిలోనికి ఎక్కుచున్నారు.
"మరియు తండ్రి, చెడ్డ సంగతి ఏమనగా: నీ కుమారులు, నీ బోధకులు, దానిని అనుమతిస్తున్నారు. ఓ, అవును, నిశ్చయముగా. వారు దానిని అనుమతిస్తున్నారు (నీవు భోధించిన కార్యములన్నియు), ఎందుకనగా వారు భయపడుచున్నారు."
తండ్రి తప్పక ఎలా భావించునో! ఆయన ఏ మాత్రము వారిని ముందుకు తీసుకొనివెళ్ళలేడు. ఆయన పిల్లలైయున్నారు. ఆయన వారిపట్ల శ్రద్ధవహించవలసియున్నది. అయితే అతడు ఎలాటి ఒక భారమైన-బిడ్డ!
"మంచిది, వారు దానిని ఎందుకు చేయలేదు?"
"మంచిది, వారు తమ్మను తాము ఒకరకమైన సంస్థగా తయారు చేసుకొన్నారు. వారు బాబెలు గోపురమును నిర్మించుటకు చేసినట్లు వలె తమ్మును తాము ఏకము చేసుకొన్నారు.
"అవును," తండ్రి అంటాడు, "అది కూడా అదేరకమైన ముగింపునకు వస్తుంది."
MATT 15:6•
MARK 7:13•
LUKE 2:49•
GAL 4:2
55"వారు వారి కొరకు ఒక గోపురమును నిర్మించుకొనిరి, మరియు వారి సంస్థ అప్పుడు పూర్తి ప్రపంచమును వారి యొద్దకు ఆకర్షించగలదనుకొనిరి, అయితే వారు ఏమిచేయుచున్నారో కేవలము చూడండి."
ఓ, అది తండ్రిని నిరుత్సాహపర్చుతుంది, దానిని ఆయన తప్పక ఎలా ఇబ్బందిగా భావించునో! పరిశుద్ధాత్మ తప్పక ఆ వాక్యమును మహిమకు తీసుకొని వెళ్ళవలెనని ఎలా భావించునో, దారి వెంబడి సంఘము ఎలా వెళ్ళుచున్నదో చెప్పును. బైబిలుకు బదులుగా వారి మానవ-కల్పితమైన సిద్దాంతము ఎలాయున్నదో చూడండి. సత్యము వారికి తిన్నగా హాజరుపర్చబడినది, మరియు వారు వారి వీపులను వెనుకకు త్రిప్పి - దాని నుండి దూరముగా నడిచిపోతారు (నీవు అక్కడే యున్నావు), ఏలయనగా వారి సంస్థ దానిని విశ్వసించదు.
మరియు ఇంకనూ అది దేవుని వాక్యమై యున్నదని వారికి తెలుసు. మరియు బైబిలులో అది తప్ప మరొక ఇతర లేఖనములేదు! అది నిజముగా దేవుని వాక్యమైన యున్నయెడల అది ఆదికాండము నుండి ప్రకటన గ్రంధమువరకు యుంటుంది. అది అదే సంగతియై యున్నది.
బాప్తిస్మమునకు బదులుగా వారు చిలకరింపును అంగీకరిస్తారు. వారు మిగిలిన ఇతర కార్యములన్నింటిని చేస్తారు. అన్నిరకములైన ఆచారములను మరియు ప్రతిదానిని చేస్తారు. తండ్రి ఎలా భావిస్తాడో. ఆ కుమారునికి ఆయన ఏమియు ఇయ్యలేడు.
అయితే అతడు పైకి వచ్చి కొందరిని గూర్చి ఇలా చెప్పినట్లైతే, "అయితే కొందరు నిర్ణీతమైన వ్యక్తులున్నారు… వారు నిజముగా నీకు కుమారులైయున్నారని నేను నీకు చెప్పుచున్నాను. ఏమి సంభవించినను నేను లెక్క చేయను, నీవు చెప్పిన దాని కొరకే వారు నిలబడతారు. వారు కేవలము నీవలె ప్రవర్తిస్తారు. ఆ మనిషి ఖచ్చితముగా నీవలె ప్రవర్తిస్తాడు. నీవు చేయు దానినే అతడు చెపుతాడు.
కూలికి పెట్టుకొన్న సేవకులు ఒక ఫలానా కార్యమును చేస్తున్నట్లైతే, అతడు దానిని లెక్కచేయడు. అది అతని యొక్క తండ్రి పనియైయున్నది, నేను తప్పక నా తండ్రి పనిమీద యుండాలని, అతడు దానిని చించివేసి ఇలా అంటాడు, "నా తండ్రికి మీరు ఆలాగు చేయరాదు. దేవుని యొక్క ఆజ్ఞనలను మీరు మనుషుల యొక్క పారంపర్యాచారముగా చేసియున్నారని, నా తండ్రి చెప్పియున్నాడు. అలాటి సరుకుకు బైబిలులో ఏ లేఖనములేదు."
"ఓ, అందుచేత అతడు నా కుమారుడు. అవును. అతడు నిజముగా అబ్రాహామువలె నమ్ముచున్నాడు. అందుచేత అతడు అబ్రాహాము యొక్క సంతానమై యున్నాడు".
కాబట్టి ఇప్పుడు, తండ్రి ఏమిచేస్తాడు? ఈ కుమారుడు పరీక్షించబడిన తరువాత, అప్పుడు తండ్రి ఒక నిర్ణీతమైన దినమును తీసుకొని… ఇప్పుడు, పెంతికొస్తువారు తలంచారు, నీవు తిరిగి జన్మించిన వెంటనే, పరిశుద్ధాత్మను పొందిన తరువాత, అది అంతయూ అంతే అనుకొంటారు. నీవు సరిగ్గా అప్పడే ప్రారంభించియున్నావు. ఆయన అబ్రాహాముకు ఏమి చేసియున్నాడో గమనించుము.
అప్పుడు ఆయన ఏమి చేసియున్నాడు? తండ్రి తన కుమారుని బయటకు తోడుకొని వెళ్ళి ఒక విందును చేస్తాడు (ఇప్పుడు బైబిల్ విద్యార్ధులైన మీ అందరికీ తెలియను), ఒక విందును చేసి, తన కుమారుని ఒక ఎతైన బహిరంగ స్థలములో అతనిని కూర్చొండబెట్టి, అతనికి ఒక మంచి వస్త్రమును ధరింపచేసి, అతనిని ఆ పైన కూర్చొండబెడతాడు, మరియు అతనిని అతని స్థానములో యుంచు దత్తతయొక్క విధులను నిర్వర్తిస్తాడు. అది సత్యమని మీలో ఎంతమందికి తెలుసు? "ఆమెన్" చెప్పండి. అది బైబిలు.
GEN 17:5•
MATT 17:1,2,5•
MARK 9:2,3,7,28,29,35
56మనము వెనుకకు గలతీ పత్రిక 4వ అధ్యాయములోనికి వెళ్ళి దానిని అక్కడ తీసుకొందాము. పౌలు అక్కడ దానిని గూర్చి మాట్లాడుచున్నాడు.
ఆయన కుమారుని ఆయన అతని స్థానములో యుంచాడు. ఆయన ఏమి చేసియున్నాడు. ఆయన ఆ కుమారుని తన స్థానములో యుంచుతూ పుత్రస్వీకారం యొక్క విధిని జరిగించియున్నాడు. మరియు దాని తర్వాత దానిని తన కుమారుడు చేయబోవుటను అతను చూచును, అతడు ఆ వాగ్ధానము నేరవేర్చును, ఎవరును దానినుండి అతనిని ఆపలేరు, అతడు సరిగ్గా తన తండ్రివలె ఉన్నాడు. దానితో తిన్నగా అతడు నిలిచి ఉండబోవుచున్నాడు. కోయబడుచున్నప్పుడు ఆ చిన్న ముక్కలు ఎక్కడైనా పడనివ్వండి, అతడు ఏ లెక్క చేయడు. మరియు అతడు, "నేను ఆ కుర్రవానియందు నమ్మికయుంచుదును," అని చెప్పును." కాబట్టి అతడు దత్తతను నిర్వహించును, మరియు ఆయన ఏమి చేస్తాడు?
దత్తపుత్రత్వము నిర్వహించిన తరువాత, ఆ బిడ్డ తండ్రి రాజ్యములో కుమారునిగా పెట్టబడును. అతనికి సంపూర్ణమైన, సమానమైన హక్కులను అతనికి ఇస్తాడు. మరొక మాటలో చెప్పాలంటే, అతడు ఒక చెక్కును వ్రాసినట్లైతే అతని యొక్క సంతకం తన తండ్రి యొక్క సంతకానికి సమానమైనదిగా వుంటుంది. అపుడు అతడు దత్తత చేయబడతాడు, లేక అతని స్థానములో ఉంచబడతాడు.
రూపాంతరపు కొండ మీద దేవుడు యేసుకు దానినే చేసియున్నాడు. ఆయన ఏమి చేసియున్నాడు? ఆయన యేసును ఆవరించియున్నాడు, ఒక బహిరంగ స్థలమునకు పైకి ఆయనను తీసుకొనివెళ్ళినాడు. ముగ్గురు సాక్షులను తీసుకున్నాడు: పేతురు, యాకోబు, మరియు యోహాను. దానిని చూపుటకు పరలోకం నుండి ఇద్దరు సాక్షులను తెచ్చియున్నాడు. ముగ్గురు ఒక సాక్షమై యున్నారు. మరియు ఆయన యేసును ఆవరించినప్పుడు, ఆయన వస్త్రము తెల్లగా ఆయన ముందు మహిమపరచబడెను, దాని బలంతో ప్రకాశించు సూర్యునివలె ఆయన ప్రకాశించాడు. అది నిజమేనా?
మరియు పరలోకము నుండి ఒక స్వరం ఈలాగు చెప్పినది, "ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి." ఆమేన్. "నేను ఆయనను ఆయన స్థానములో వుంచియున్నాను. అది నా కుమారుడైయున్నాడు. అతడు ఏమి చెప్పినా నేను దానిని బలపర్చతాను. అతడు నా మూటను పాటించియున్నాడు. ఈ సంఘ శాఖలు మరియు ప్రతి దాని గుండా అతడు పోరాడి తన విశ్వాసాన్ని కాపాడుకొనియున్నాడు. అతడు ఏ తిరిగుబాటు చేయలేదు. అతడు సత్యవంతుడై యున్నాడు. అతడు ఎల్లప్పుడు నా పని మీద ఉంటాడు. ప్రజలు అతని వైపు చూచినప్పుడు, వారు నన్ను చూస్తారు. ఈయన నా కుమారుడు. ఈయన మాట వినుడి."
అది ఆయన అతనికి వాగ్దానం చేసియున్నాడా? లేదు. ఆయన ద్వారా అబ్రాహాము యొక్క సంతానము వచ్చియున్నది, అదే కార్యము ద్వారా 4వ మరియు 5వ అధ్యాయంలో దేవుడు అబ్రాహామును బయటకు తీసుకొని వెళ్ళి, అతని మీద పుత్రస్వీకారము వుంచెను. మరియు అతని పేరును అబ్రాము నుండి అబ్రాహామునకు మార్చివేసెను (మహిమ!), "ఎలోహిం" అను మాట నుండి అబ్రాహాము అను మాట వచ్చియున్నది. అది దేవుని యొక్క సొంత పేరు. దేవుని యొక్క పేరుతో అతని యొక్క పేరు సంయుక్తమై యున్నది.
దేవుడు ఎలోహిం అయి యున్నాడు. మీలో ఎంతమందికి అది తెలుసు? ఆయన గొప్ప యెహోవా, ఎలోహిం, సర్వసమృద్ధిగలవాడు, తనకై తానుగా ఉన్నవాడు, ఎలోహిం. ఆయన ఏమి చేసియున్నాడు? ఆయన తన పేరు నుండి తీసుకొని మరియు దానిని అబ్రాహాము యొక్క పేరులో వుంచెను, కారణము అతడు అబ్రాహాము అయివున్నాడు. దేవుడు అందరికీ తండ్రియై యున్నాడు, మరియు అబ్రాహాము జనములకు తండ్రియైయున్నాడు. మహిమ! ఎలోహిం, అందరికీ తండ్రి; అబ్రాహాము, జనములకు తండ్రి. సరియైన స్థానములో వుంచుచున్నాడు. మహిమ! అది ఆయన యొక్క సంఘము పరిశుద్ధాత్మను పొందిన తరువాత, వారు అన్ని పరీక్షలగుండా వెళ్ళిన తరువాత.
చూడండి, పెంతెకోస్తు దానిని తప్పిపోయెను. వారు తమ్మును తాము సంస్థగా మార్చుకుని ఇంక ఎంతమాత్రమును ముందుకు వెళ్ళలేకపోయారు. తరువాత దేవుడు ఒక నిర్ణీతమైన కార్యమును చేయునప్పుడు, "హ, హ! అని, దానికి దూరంగా వుండండి," చూడండి. "మా సంఘం దానిని బోధించదు," అని అంటారు. ముందుకు కొనసాగండి. అయితే దానినే ఆయన అబ్రాహామునకు చేసియున్నాడు, అబ్రాహామునకు మరియు అతని తరువాత అతని సంతానమునకు.
57ఇప్పుడు, మనము ఆదికాండము 18 అధ్యాయములో ఇంకా 18వ వచనములో యున్నాము. ఇప్పుడు మనము గమనిద్దాము. ఆయన అది చేసిన తరువాత అప్పుడు అతనిని తీసుకొని, అది ఆయన చేసిన రెండవ కార్యము. మొదటి కార్యము ఆయన అతనికి నీతికరణమును ఇచ్చెను. ఆదికాండము, 12; 15లో, ఆయన అతనికి శుద్దీకరణమునిచ్చెను; 18లో ఆయన అతనికి పరిశుద్ధాత్మనిచ్చెను. దాని యొక్క అంతములో… ఇప్పుడు దానిని త్వరగా గమనించండి. మిగిలిన అన్ని ఇతర కార్యములు అనేక సంవత్సరములు తీసుకొనెను. నీవు వినుచున్నావా? మీరు దానిని ప్రేమిస్తారా?
నీతికరణము నుండి శుద్దీకరణము వరకు ఈ సంవత్సరములంతటా అవి ఒకదానిపై ఒకటి పడునట్లుండెను. శుద్దీకరణము నుండి నిర్ధారించు వరకు, పరిశుద్ధాత్మ, ఎన్నో సంవత్సరములైనవి. కాని అదే అధ్యాయములో పరిశుద్ధాత్మ తరువాత ఆయన అతనిని అతని స్థానములో యుంచెను. (పెంతికొస్తుకు కేవలము 40 సంవత్సరాల వయస్సైయున్నది, మీకు తెలుసా.) ఆయన తన కుమారుని స్థానములో యుంచుట ప్రారంభించెను.
మార్టిన్ లూధర్ నీతికరణమును అందుకొనెను. సంవత్సరములు మరియు సంవత్సరములు మరియు సంవత్సరములు తరువాత సంవత్సరముల తరువాత పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము వచ్చెను, కాని పెంతికొస్తు తరువాత పరిశుద్ధాత్మ వెంటనే మిగిలినవారందరూ చేసినట్లుగా అదే కార్యమును వారు చేసిరి, అప్పుడు ఆయన తన సత్యము కొరకు నిలబడిన తన కుమారులను బయటకు లాగుటకు ఆయన ప్రారంభించెను. ఆయన ఆయన అతనికి ఒక ప్రత్యేకమైన దానిని ఇచ్చెను. ఒక నిర్ణీతమైన కార్యముతో బయటకు నిలబడిన అతనిని ఆయన హెచ్చించెను, చూశారా — అతనిని స్థానములో యుంచెను.
JOHN 5:43•
COL 3:17
58ఇప్పుడు. తరువాత అదే అధ్యాయములో అతనికి ఆయన ఒక సూచన ఇచ్చెను, పెంతికొస్తు సంఘమునకు అంత్యకాలమును గూర్చి ఒక సూచనను ఇచ్చెను. కొన్ని దినములకు ముందు అబ్రాహాము యొక్క పేరు మార్చబడిన తరువాత అప్పుడతడు ఎలోహింతో ఉంచబడినాడు, దేవునితో సంయుక్తమైయున్నాడు. ఓ! మీకు తెలుసా, ఒక పరిశుద్ధ గుండ్రాయిగా ఉండుట అది మంచిది కాదా? అతనిని స్థానములో యుంచెను… దేవునితో అతనిని సంయుక్తము చేసెను, ఆయన పేరులోని ఒక భాగమును అతనికి ఇచ్చెను.
ఆయన సంఘము ఏ రకమైన పేరును కలిగియుండును? ఆయన నామము. అది నిజమా? "నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మరియు మీరు నన్ను స్వీకరిచలేదు." యేసు యొక్క నామము. "ఒకవేళ వేరొకడు వారి నామములో వచ్చినట్లయితే [ఆయన నామము, సంస్థ యొక్క నామము], వారిని మీరు స్వీకరింతురు." అయితే ఆయన అబ్రాహాము యొక్క నామముతో కలిసియుండెను, మరియు ఆయన యొక్క సంఘము ఆయన నామమును కలిగియుండెను.
ఈ రాత్రి, ఈ ప్రపంచములో ఎందరో చక్కని స్త్రీలుయున్నారు. కాని అక్కడ ఒకే ఒక శ్రీమతి. విలియం బ్రెన్హాం యున్నది. ఆమెయే నాతో వెళ్ళునది. యేసు నామములో జీవించు ఒక్క సంఘము ఉన్నది.
"మాట ద్వారా గాని, క్రియద్వారా గాని మీరు ఏమి చేసినను, యేసు నామములో ప్రతిదానిని చేయుడి." యేసు నామములో నీవు ఒక సిగరెట్టును త్రాగగలవా? యేసు నామములో నీవు ఒక అబద్ధమును చెప్పగలవా? యేసు నామములో నీవు దొంగతనము చేయగలవా? నిశ్చయముగా చేయవు. మాట ద్వారా గాని, క్రియద్వారా గాని మనము దేనిని చేసినను, మనము సమస్తమును యేసు నామములో చేస్తాము. అది నిజము. నీవు అక్కడే యున్నావు. పుత్రస్వీకారము తరువాత ఒక పేరు సంయుక్తమైయున్నది, పుత్ర స్వీకారము తరువాత.
ఇప్పుడు, "ఒక నాశనము అక్కడ ఉండబోవుచున్నదని ఆయన చెప్పెను, సొదొమ కాలిపోవబోవుచున్నది, మరియు." (నాకు ఆలస్యమగుచున్నదని నాకు తెలుసు, కాని నేను ఇక్కడ కొంచెము ఆగి దీనిని కొన్ని నిమిషములు కొంచెము ధీర్ఘముగా చెపుతాను, చూడండి, ఏలయనగా రేపు రాత్రి నేను మరొక దానిని చెప్పగోరుదును. ఇంకా కొన్ని నిమిషములు ముందుకు మీరు నాతో సహించండి. మీరు సహిస్తారా?)
GEN 18:3•
GEN 19:2
59గమనించండి, ఆయన అతని పేరును మార్చియున్నాడు, మరియు అంతయు సమీపమై యున్నదని అప్పుడు అతనికి ఒక సూచనను ఇచ్చెను. అప్పుడు అబ్రాహాము బయటకు వెళ్ళెను, తన గుడారము యొక్క ద్వారము ముందు కూర్చొండెను, అది ఇంచుమించు మధ్యహాన్నపు సమయము, మరియు ముగ్గురు మనుషులు అతని యొద్దకు నడిచి వచ్చుటను అతడు చూసెను. మరియు వారిని గూర్చి ఏదో వింతగా యున్నట్లు అబ్రాహాము ఎరిగియుండెను. కాబట్టి అతడు బయటకు పరుగెత్తెను…
మరొక దినమున, ఆ ముగ్గురు మనుషులు "తండ్రి, కుమార, పరిశుద్ధాత్మయైయున్నారని, చూపించుచున్నది" అని ఎవరో మార్పుచెందిన యూదుడు చెప్పాడు.
బుద్ధిహీనత. ఒక అన్యుని వలె అతడు, "నా ప్రభువులారా," అని అతడు చెప్పలేదు; "నా ప్రభువా," అని అతడు చెప్పాడు. లోతు మాత్రమే ఆ ఇద్దరి దూతలను "ప్రభువులారా?" అని పిలిచాడు. ఆ దిగువన యున్న వెనుకజారిన విశ్వాసిని చూడండి, అదే తరగతికి చెందినవారు ఈ దినమున ఎక్కడ యున్నారో చూపుచున్నది, వారు దేవునిని నాలుగు లేక అయిదుగురు భిన్నమైన వ్యక్తులుగా చేయుదురు.
దేవుడు ఒకే దేవుడైయున్నాడు. నిజము. "నా ప్రభువా," అని అబ్రాహాము చెప్పియున్నాడు; "నా ప్రభువులారా," అని లోతు అన్నాడు. అక్కడ వారు ముగ్గురు యున్నారు. మరియు అబ్రాహాము వారిలో ఒకరు దేవుడని గుర్తించియున్నాడు. "నా ప్రభువా." దాని వైపు చూడండి. మరియు గుర్తుంచుకొనండి, అది అక్కడ చిన్న అచ్చు మాటలో యున్న "ప్రభువు" కాదు (Lord); అది "ఎలోహిం, నా ప్రభువా" అయి యున్నది. ఎలోహి౦, యెహోవా, గుడారము యొద్దకు నడిచివచ్చెను.
ఓ, దానిని వినండి. ప్రతి ఒక్కరూ వణుకుచున్నారు. మరియు మొదటి కార్యము నీకు తెలుసా, మొదటి కార్యము మీకు తెలుసా, వారు అక్కడ కూర్చొని ఒక సంభాషణను ప్రారంభించియున్నారు. దానిని నొక్కి చెప్పుటకు నాకు సమయముంటే బాగుంటుంది. మీరు దానిని ఆదికాండము 18వ అధ్యాయములో సరిగ్గా చదువుతారు.
GEN 19:1,11•
LUKE 17:28,30
60వారు ఎలా కూర్చొన్నారో చూడండి.
ఇప్పుడు, ఆగండి. ఆయన ఏమి చేయున్నాడు? అబ్రాహాముకు ఆయన దేనిని చూపుతున్నాడు. ఆయన ఏమి చేయబోవుచున్నాడో… అబ్రాహాము యొక్క సంతానమునకు. ఇప్పుడు, ఆయన మార్గము ఓ ఏమైయున్నాడు? అబ్రాహాము… అతడు నీతిమంతుడిగా తీర్చబడిన తరువాత, శుద్దీకరించబడ్డాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు - మాదిరులలో మరియు నీడలలో అదియున్నది - అతడు అతని స్థానములో యు౦చబడ్డాడు. అప్పుడు ఆయన వచ్చి, అంతము సమీపములోయున్నదని అతనికి ఒక సూచనను ఇచ్చుచుండెను. పాపముతో నిండిన సొదామ లోకమును నాశనము చేయుటకు ఆయన దిగివచ్చెను. అది నిజమేనా?
ఇప్పుడు గుర్తుంచుకోండి, యేసు అన్నాడు (మీరు ఆయనను నమ్ముతారా?)… యేసు అన్నాడు, "సొదొమ దినములలో అది జరిగినట్లుగా, అది మనుష్యకుమారుని రాకడలోను యుండును." ఇప్పుడు, అక్కడ… వారు నిలబడి మాట్లాడిరి. గమనించండి.
ఇద్దరు దూతలు సువార్తను భోధించుటకు సొదొమలోనికి వెళ్ళియుండిరి. అది నిజమేనా? సువార్తను భోధించుటకు ఇద్దరు దూతలు సొదొమలోనికి వెళ్ళియుండిరి. ఒక అధునాతన బిల్లీ గ్రహం పాపులకు భోధించుచున్నాడు. ఏ అద్భుతములు చేయబడలేదు. ఒక్క అధ్భుతము, వారిని గ్రుడ్డివారిగా మొత్తుట. సువార్తను భోధించుట, అవిశ్వాసిని గ్రుడ్డివానిగా చేస్తుంది.
మరియు ఆ విధముగా, వారు సువార్తను భోధించుటకు అక్కడికి వెళ్ళియుండిరి. మరియు అది వారి యొక్క సూచనయైయున్నది — సువార్తను భోధించుచున్నారు. "ఈ స్థలమును విడిచి బయటకు రండి. దేవుడు దానిని కాల్చివేయబోవుచున్నాడు." అది నిజమేనా? "అది దహించబడిబోవుచున్నది. అక్కడ నుండి బయటకు రండి." అది సువార్తికుడైన బిల్లీ గ్రహంయైయున్నాడు, వారికి భోధించుచున్నాడు.
అయితే ఎన్నుకొనబడిన సంఘముతో నిలిచియున్న ఈ వ్యక్తిని గమనించండి. అబ్రాహాముతో, అబ్రాహాము యొక్క సంతానముతో, చూడండి. ఆ దిగువన లోతు మరియు అతని గుంపు యున్నది.
61ఇప్పుడు, అక్కడ ఎల్లప్పుడును మూడు వర్గాల ప్రజలున్నారు — అవిశ్వాసి, వేషధారి, విశ్వాసి, చూడండి. ఇప్పుడు అవిశ్వాసి మరియు వేషధారి కలసి నిలబడతారు. కాని నిజమైన విశ్వాసి తన్ను తాను వేరు చేసుకొంటాడు, అతనిని ఏది సంఘముగా చేస్తుంది. మీరు నన్ను వెంబడించుచున్నారా?
ఇప్పుడు. ఆ దిగువన యున్న ఆ పెద్ద సంస్థలు మరియు అవన్నియూ ఒకరితో ఒకరు పరస్పరము ఏకీభవించి గొప్ప సమయమున కలిగియున్నారు.
62మరియు కొందరు ప్రజలు బిల్లీ గ్రహంను చూసి నవ్వుతారు. నన్ను ఇక్కడ ఒక్క నిమిషము ఆగనియ్యండి. చెప్పండి, బిల్లీ గ్రహంవలె పలుకుబడిగలిగిన వ్యక్తి, ఎందరో ప్రజలున్నారు, అది పెంతికొస్తువారు ఎందుకు కాదు? అతడు కాలేడు. బిల్లీ గ్రహం దానిలో ఒక భాగమును కలిగియున్నాడా?
అవును, ఆత్మసంబంధమైన ప్రజలైన మీరు ఇప్పుడు మేల్కొనండి. ఒక్క నిమిషము మీరు ముందుకు ఆలోచించండి. అతని పేరు ఏమిటి? గ్రహం, G-R-A-H-A-M ఇప్పుడు అది వెర్రిగా యున్నదని మీరు అనుకొంటారని నాకు తెలుసు, ఒక్క క్షణము ఆగండి. H-A-M, అబ్ర H-A-M చూడండి? అతడు మారుమనస్సు మీద ఎవ్వరును మరకపడునట్లు చేయలేరు. అతడు మారుమనస్సు వర్తమానము మీద ఎవ్వరును మరకపడునట్లు చేయలేరు. అతడు మారుమనస్సునకు తాళపుచెవిని కలిగియున్నాడు. అది నిజము. మండిపోవుచున్న ఇంటివలె అతడు దానిని భోధిస్తాడు, చూడండి. అది నిజము. దానిని చేయుటకు దేవుడు అతనిని పిలిచియున్నాడు.
అతడు ఎక్కడికి వెళ్ళుచున్నాడు? పెంతికొస్తవారి యొద్దకు కాదు; సొదొమలో కలగలుపైన సంఘ శాఖల గుంపుల యొద్దకు అతడు వెళ్ళుచున్నాడు; ముఖమునకు రంగులు పూసుకొన్న అన్ని రకముల స్త్రీ యొద్దకు కాదు, పొట్టి బట్టలతో వెళ్ళుచున్న స్త్రీలు, పాట కచేరి గాయకుల యొద్దకు, మరియు మూడు లేక నాలుగు సార్లు పెళ్ళిళ్ళు చేసికొన్న పెద్దలు, మరియు సంఘ కాపరులు అదే రీతిగా యున్నారు, బయట అన్ని రకముల బుద్దిహినతోయున్న వారి యొద్దకు వెళ్ళి భోధించుచున్నారు.
బిల్లీ! బయటకు వెళ్ళి దానిని భోధించుచున్నాడు. దానితో నిలిచియున్నాడు! అతడు ఇంకా ఏమియు చేయలేడు.
అయితే ఇప్పుడు గుర్తుంచుకోండి, అక్కడ వారిలో ఒకరు వెనుక నిలచిపోయి అబ్రాహామునకు ఒక సూచనను తెచ్చెను (అది నిజమేనా?), ఎన్నుకొనబడిన సంఘము. ప్రకాశించే పెద్ద వెలుగులు కాదు, పెద్ద పేరుగాంచిన కేంద్రములు కాదు, మరియు పెద్ద పుష్పగుచ్చములతోయున్నవి కాదు, గొప్ప ప్రణాళికలు మరియు అలాటవి కాదు. ఒక్కరు అబ్రాహాముతో వెనుక నలిచియుండరి. అది నిజమేనా? మరియు కాలము సమీపమైయున్నదని ఆయన అతనికి ఒక సూచనను ఇచ్చెను. ఆయన ఏమిచేసియున్నాడో గమనించండి. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆయన అబ్రాహాముకు చేసియున్నట్లుగా, అతని సంతానమునకు కూడా యన చేయును. గమనించండి, అది ఆ రీతిగానే యుంటుందని యేసు చెప్పుచూ దానిని నిర్ధరణ చేసియున్నాడు.
GEN 18:9,10
63ఇప్పుడు గమనించండి. ఆ దూత కూర్చొనియున్నాడు. దూత కాదు, అది దేవుడైయున్నాడు. ఆయన తన వీపును గుడారము వెనుకకు త్రిప్పియుండెను. మరియు ఆయన అన్నాడు… ఇప్పుడు, అది వింతగా లేదా "అబ్రాహాము…" సరిగ్గా కొన్ని దినముల క్రితమే అతని యొక్క పేరు మార్చబడియుండెను. ఇక్కడ ఒక క్రొత్త వ్యక్తియున్నాడు. అతని యొక్క పేరు అబ్రామునకు బదులుగా అబ్రాహాము అని ఆయనకు ఎట్లు తెలుసు. "నీ భార్య యైన శారా ఎక్కడ? శారాయి కాదు, కాని శారా. శారాయి కాదు; కాని శారా (S-A-R-A-H); శారా అనగా ఒక రాకుమార్తె యొక్క పేరు. "అబ్రహామా, నీ భారమైన శారా ఎక్కడ?"
అతనికి వివాహమైయున్నదని ఆయనకు ఎట్లు తెలుసు? అతని యొక్క పేరు అబ్రాహాముయై యున్నదని ఆయనకు ఎలా తెలుసు? అతనికి భార్య యున్నదని ఆయనకు ఎలా తెలుసు? మరియు ఆమె
యొక్క పేరు శారా అని అని ఆయనకు ఎట్లు తెలుసు.
ఇప్పుడు గమనించండి. బైబిల్ చెప్పినది, అబ్రాహాము అన్నాడు, "ఆమె మీ వెనుకనున్న గుడారములో యున్న." ఆమె అధునాతన స్త్రీల వలే ప్రతి చిన్న స్థలములోయున్న స్త్రీలవలె ఆమె లేదు. ఆశ్చర్యములేదు, పురుషుల కొరకు ఏ పనియు ఇప్పుడు లేకున్నది (అది నిజము); స్త్రీలు అతని స్థానమును తీసుకొనియున్నారు. మీకు తెలుసా, ఇది ఒక స్త్రీ యొక్క దేశమైయున్నది. అది ఒక స్త్రీ యొక్క సంఖ్యకు కలిగియున్నది. స్త్రీ యొక్క పేరు, సమస్తమూ స్త్రీయైయున్నది, మరియు ఒక స్త్రీ ఈ దేశమును నియంత్రించదు.
ఆమె గుడారములో నిలిచియున్నది. ఆమె తన్నుతాను దూరముగా యుంచుకొన్నది. వారి చుట్టూ ఒక్క క్రొత్త వ్యక్తి వచ్చియున్నాడు. అబ్రాహాము అని పిలుచుటలో ఇక్కడ ఒక కారణమున్నది. ఆయన అన్నాడు, నేను (అనగా వ్యక్తిగత సర్వనామము), నేను నీకు ఇచ్చిన వాగ్దానము ప్రకారము నేను నిన్ను దర్శించబోవుచున్నాను. నేను ఆ వాగ్దానమును నీకు ఇచ్చియున్నాను." ఆ కారణమును బట్టియే అతని పేరు అబ్రాహాముయైయున్నదని ఆయన ఎరిగియుండెను.
GEN 18:5-12
64అబ్రాహాము ఆయనకు పెయ్య మాంసమును, త్రాగుటకు ఆవు పాలను, వెన్నను మరియు జొన్న రొట్టెలను ఆయనకు ఆహారముగా ఇచ్చెను. వెన్నను. జొన్న రొట్టెను లేక రొట్టె కేకులను, తినెను, పాలను త్రాగెను. మరియు పెయ్యి మాంసమును తినెను, ఆయన శరీరధారిగాయున్న దేవుడై యున్నాడు. అది నిజము. ఇప్పుడు నీవు బైబిలుతో వాదించగోరిన యెడల, అది పెద్ద అక్షరాలలోయున్న "ప్రభువు" (L-O-R-D), ఎలోహిం కాదేమో చూడండి.
అబ్రాహాము ఆయనతో మాట్లాడబోవుచున్నాడు. అబ్రాహాము ఆయనను, "ప్రభువువైనను దేవుడని," పిలిచెను. కాబట్టి అతడు తప్పక ఎరిగియుండునని నేను ఊహిస్తాను, అతడే మాట్లాడుచుండెను. "నీవు అది నమ్మరాదని," ఎవరో అన్నారు. నేను తప్పక దానిని నమ్ముతాను, దానిలోని ప్రతిమాటను నమ్ముతాను. అది అబ్రాహాము యొక్క సంతానమునకు ఎలా వస్తుందో మీరు ఇప్పుడు కొంచెము గమనించండి.
"నీ భార్యయైన శారా ఎక్కడ యున్నది?"
"నీ వెనుక యున్న గుడారములోయున్నదని," అబ్రాహాము అన్నాడు.
ఆయన అన్నాడు, "నేను నీకిచ్చిన వాగ్దానము ప్రకారము, జీవము యొక్క కాలములో నేను నిన్ను దర్శించబోవుచున్నాను. 25 సంవత్సరాల క్రితము నేను నిన్ను నీతికరణము క్రింద పిలిచియున్నాను. నిబంధన యొక్క ఋజువును నేను నీకు ఇచ్చాను. నా సొంత ఆత్మతో నేను నిన్ను నింపియున్నాను మరియు నీకు బలము నిచ్చుటకు, నేను వాగ్దానము చేసిన దానిని నీకు ఇచ్చుటకు, ఈ స్థానము వరకు నేను నీకు బలము నిచ్చియున్నాను. మరియు ఇప్పుడు, ఈ భూమిని నేను కాల్చివేయబోవుచున్నానని నేను నీకు ఒక సూచనను ఇవ్వబోవుచున్నాను. మరియు కాలము సమీపించినది, ఏలయనగా నీ సంతానము నిన్ను వెంబడించుచున్నది, చూడండి." ఆయన అన్నాడు, "అబ్రహామా, నేను దీనిని నీకు చేయబోవుచున్నాను."
మరియు శారా, గుడారము వెనుకయుండి అన్నది. ఆమె ఎలా తనలోతాను నువ్వుకొన్నదో, తన హృదయములో చెప్పుకొనును. వినండి, సంఘమా! దీనిని చూచుటలో మీరు తప్పిపోవద్దు! లేఖనము దానికై అది మాట్లాడుచున్నది. శారా తనలో తాను నవ్వుకొనుచు ఇలా అన్నది, "అది ఎలా సాధ్యము, నేను ఇంచుమించు నూరు సంవత్సరములు వయస్సు కలిగిన వృద్దురాలను, మరియు నా భర్త (సహోదరీలారా, నన్ను క్షమించండి)… ఒక భార్యగా సంతోషముతో జీవించాను, నా భర్త యవ్వనస్తుడుగా మరియు నేను ఒక యవ్వనురాలుగా, మరొక మాటలో చెప్పాలంటే… ఎన్నో సంవత్సరముల క్రితము అది ఆగిపోయినది…" మరియు వారు వృద్దులైయున్నారు.
అన్నది, "భర్తతో నేను ఎన్నడైనా సంతోషమును ఎలా పొందగలను?" (అతనిని "ప్రభువా" అని పిలిచినది.) "అతడు కూడా వృద్దుడైయున్నాడు. అతని బలము ఉడిగిపోయినది. ఆ రీతిగా యవ్వనస్థలుగా మేము ఇక ఎంతమాత్రమును జీవించలేము. ఎలా మేము దానిని ఎన్నడైనా చేయగలమా?"
GEN 18:13•
LUKE 17:28,30
65మరియు ఆ మనిషి (శరీరధారియైన దేవుడు), తన వీపును గుడారమువైపు త్రిప్పిన మనిషి అన్నాడు, "శారా, అది ఈ విధముగా జరుగదని తన హృదయములో చెప్పుకొనుచు, శారా నవ్వనేల?" తనకై తాను లోలోపల శారా నవ్వినప్పుడు, శారా ఏమిచేయుచున్నదో మరియు ఏమి తలంచుచున్నదో ఆయన చెప్పియున్నాడు. అది నిజమంటారా? అది ఏమైయున్నది? అది నాశనమునకు ముందు సరిగ్గా కొద్దిగా.
ఆయన అబ్రాహాము యొక్క సంతానమునకు దానినే చేయుచున్నాడు, సోదరులారా, దానిని వారు గుర్తించరు. నా భావమును మీరు చూచారా? నీతికరణము, శుద్దీకరణము, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము, మరియు కుమారుని (వారసుని) అతని స్థానములో యుంచుట. దేవుడు మానవ శరీరములో, మనిషివలె తినుచు త్రాగుచూ ఆయన సంఘములో జీవించుచున్నాడు; పరిశుద్ధాత్మ దేవుడే స్వయముగా, అబ్రాహాము యొక్క కుమారులలో నివసి౦చుచున్నాడు. యేసు చెప్పిన అదే కార్యమును ప్రత్యక్షపర్చుచున్నాడు, "సొదొమ దినములలో జరిగియున్నట్లుగా మనుష్యకుమారుని రాకడలోనూ జరుగును." మీకు అర్ధమైనదా?
ROM 4:19
66ఇప్పుడు, మరొక సంగతి. అప్పుడు ఏమి జరిగింది? రాబోవుచున్న కుమారుని స్వీకరించుటకు, ఆయన ఏమిచేసియున్నాడు. అబ్రాహాముకు మరియు శారాకు కూడా ఆయన ఏదో చేయవలసియుండెను. ఆయన… సోదరీలారా, ఇప్పుడు మనము కలగలపు గుంపులో యున్నాము. మీరు నన్ను మన్నించండి. అయితే భార్యభర్తలుగా జీవించు ధర్మం ఆగిపోయినది, కాబట్టి ఆయన వారికి ఏదో చేయవలసియుండెను.
ఇప్పుడు శారా… ఆమె గర్భము ఉడిగిపోయినది అని బైబిల్ చెప్పినది, మరియు అబ్రాహాము కూడా ఒక మృతతుల్యమైన మనిషిగా యుండెను. అది నిజమేనా? ఎన్నో సంవత్సరములు అది వారితో గతించియున్నది, లైంగిక మార్గంలో ఒక భార్య భర్తలుగా వారు జీవించి ఎన్నో ఎన్నో సంవత్సరముల క్రితయమైయుండెను. ఆయన ఏమి చేసియున్నాడు? ఇప్పుడు ఆయన…. ఆయన శారాకు ఏదో ఒక కార్యము చేయవలసియుండెను, కారణము ఆమె గర్భము మృతతుల్యమైయుండెను. ఆయన ఆమె యొక్క గర్భమును ఫలించునట్లుగా చేయవలసియుండెను. అది నిజమేనా?
మంచిది, ఆ దినములలో స్త్రీలు సిగరెట్లు త్రాగెడివారు కారు, కాబట్టి వారు వారి యొక్క పాలసీసాలు… వారి బిడ్డలను ఆవుపాలతో పోషించేవారు కాదు. వారికి ఉన్న ఒకే ఒక మార్గం స్థనముల నుండి వచ్చు పాలద్వారా పిల్లలను పెంచుటయే. కాబట్టి ఒక వృద్దురాలైన ఆమె, దేవుడు ఆమె యొక్క పాలగ్రంధులను సిద్ధము చేయవలసియుండెను. అవి ఎండిపోయి యుండెను.
GEN 20:2
67మరియు నేను ముందుకు వెళ్ళుచుండగా నేను మిమ్ములను ఒకటి అడుగగోరుచున్నాను. సహోదరీలారా, నన్ను మన్నించండి. ఇలాంటి కలగలుపు జనములో; అయితే మీరు మీ వైద్యుని మాట వినండి. నేను మీ సోదరుడినైయున్నాను. ఒక నూరు సంవత్సరములు వయస్సు గలిగిన స్త్రీలు నొప్పులు పడి ఒక బిడ్డకు ఎలా జన్మనివ్వగలదు? ఒక 45 సంవత్సరాల వృద్ధ స్త్రీ ఈ దినమున నొప్పులలోనికి వెళ్ళినట్లైతే, ఆమె కొరకు అక్కడ ఊపిరి పీల్చుకొనుటకు పరికరములు సమస్తమును ఆమె కొరకు అక్కడ కలిగియుంటారు. మరియు ఇక్కడ దరిదాపు నూరు సంవత్సరాలు కలిగిన ఒక స్త్రీ ఉన్నది. ఆమెకు ఏ విధమైన కృత్రిమ శ్వాస ఏమీ అవసరంలేదు. ఆయన ఏదో చేయవలసియుండెను. ఆయన ఏమి చేసియున్నాడు?.
ఆమెను సరిగా ఒక నూతన వ్యక్తిగా తిరిగి మార్చెను. దానిని ఋజువు చేయండి? అవునండి. మూడు పదుల మైళ్ళ దూరంలో నున్న గెరారుకు ప్రయాణం చేసియుండిరి. మరియు వారు అక్కడకు వెళ్ళినప్పుడు, ఈ చిన్న వృద్ద అమ్మమ్మతో అబిమెలేకు రాజు ప్రేమలో పడెను, ఆమె అతడు ఎన్నడూ చూడని అత్యంత సౌందర్యం గలిగిన స్త్రీగా యుండెను. అబ్రాహాము తిన్నగా చేయబడ్డాడు, తిరిగి అతని వెంట్రుకలు విరిగి యుండెను; శారా అందముగా మారినది. చూడండి, వారు తిరిగి యవ్వన స్త్రీ, పురుషుల వలె ఏకముగా కలిసి జీవించునట్లు ఆయన వారిని సరిగ్గా ఒక నూతన సృష్టిగా మార్చెను. ఆయన ఏమి చేయుచుండెను? వాగ్దాన కుమారుని వారు పొందునట్లుగా ఆయన వారిని ఒక స్థితిలోనికి తేవలసియుండెను.
1COR 15:51,52•
1THS 4:16,17
68ఈ సూచన ముందుకు వెళ్ళిన తర్వాత విషయం ఏమి అయియున్నది? దేవుడు వాగ్దాన కుమారుని స్వీకరించుటకుగాను అబ్రాహాము యొక్క పిల్లలను ఒక స్థితిలోనికి తెచ్చుచూ సిద్ధపరుచుచున్నాడు. మనము ఆయనను ఎలా పొందబోవుచున్నాము. ఈ దేహములలో మనము ఆయనను పొందలేము. మనము మధ్యాకాశములో ఆయనను కలుసుకొనబోవుచున్నాము. శాశ్వతంగా దేవుడు స్తుతించబడును గాక! బూర మ్రోగుతుంది. క్రీస్తునందు మృతులు సజీవులుగా లేపబడతారు. మరియు మనము ఆయనను పొందలేము. మనము మధ్యాకాశములో కలుసుకొనుటకు పైకి వెళతాము.
ఆయన ఏమి చేయుచున్నాడు? రూపాంతరము చెందుటకు ముందు చివరి అదే సూచన, ఎత్తబడుటకు ముందు అదే చివరి సూచన. ఏలయనగా ఏ సమయంలోనైనా అతి ఉన్నతముగా అణుబాంబులు ఈ ప్రపంచమును నాశనం చేయబోవుచున్నవి. "యేసు వచ్చుచున్నాడని," అది టేపులలో కేకలు వేయుటకు ముందే, "ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలచి యుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్బాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదటి లేచెదరు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము ఒక్క క్షణములో, ఒక్క రెప్పపాటులో మార్పు చెందుదుము. ఒక వృద్ధుడు యవ్వనస్థుడిగా మారతాడు. ఒక వృద్దురాలు తిరిగి యవ్వనస్తురాలుగా మారుతుంది మరియు వాగ్దానం చేయబడి వచ్చుచున్న కుమారుని కలుసుకునే స్థితిలోనికి మనం మార్పు చేయబడతాము. ఓ, హల్లెలూయ! దేవుని యొక్క క్రమమును మనం మార్చలేము.
ఏమి జరుగుతుంది? ఆ దూత తన వీపును గుడారం వైపు త్రిప్పి అబ్రాహాముకు ఆ సూచనను చూపుచున్నట్లుగానే - ఆయన సమస్తమును నీతీకరణం, శుద్దీకరణం, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము, కుమారులను స్థానముతో వుంచుట ద్వారా క్రిందికి తెచ్చుచున్నాడు, వరములు మరియు క్రమములు బయటకు వచ్చును; మరియు అప్పుడు నాశనమునకు ముందు తన చివరి సూచనను పంపుచున్నాడు; అప్పుడు అబ్రాహాము యొక్క సంతానం మార్పు చెందుతుంది.
మనము ఈ కూటమును ముగించక ముందే అది రావచ్చు. వృద్ధ సోదరుడైన కిడ్, మరియు సహోదరి కిడ్ యుద్ధంలో అనుభవం గల వృద్దులు. ఒక్క క్షణంలో, ఈ…. ఒక యవ్వనస్తుడుగా మరియు ఒక యవ్వనస్తురాలిగా తిరిగి మారదురు. మార్పుచెందుతారు.
మనము ఎందుకు మార్పు చెందవలసియున్నది? ఈ వృద్దుడైన మనిషి తన భార్యతో లైంగిక సంబంధమును కలిగియుండుట సంపూర్ణముగా అసాధ్యము. అది ఒకే ఒక మార్గంలో జరుగవలసి యున్నది, అదేమనగా ఆమె యొక్క రూపాంతరం చెందిన దేహంగా యున్నప్పుడే అతడు పదహారు లేక పందొమ్మిది సంవత్సరముల వయస్సు నుండి ఆమెతో జీవించుచుండెను. తన యొక్క సగము సహోదరి, ఆమె యవ్వన ప్రాయంలో ఉండగానే అతడు ఆమెను వివాహమాడెను. మరియు ఆమె గొడ్రాలిగా మరియు అతడు ఉడిగిపోయియుండెను. మీరు దానిని చూచారా? కాబట్టి వారు ఒక కుమారుని పొందుటకు దేవుడు వారి యొక్క భౌతిక దేహమును మార్చవలసియుండెను.
GEN 19:26•
1COR 15:52
69ఓ, సంఘమా! మనము పైకి కొనిపోబడుటకుగాను, ఈ భౌతిక దేహమును ఆయన మార్చవలసియున్నది. ఈ విధమైన శరీరంతో మనం పైకి వెళ్ళలేము. ఒక్క క్షణములో ఒక్క రెప్పపాటులో మన దేహమును ఆయన మార్చివేయును. మనము ఏకముగా కూడి మధ్యాకాశమునకు కొనిపోబడుదుము. మధ్యాకాశంలో ప్రభువును కలుసుకొనబోవుచున్నాము. మనము ఈ రీతిగా పైకి వెళ్ళలేము. ప్రతి సూచనను మనము చూస్తాము — నీతీకరణం, శుద్దీకరణం, పరిశుద్ధాత్మతో నింపబడుట, కుమారుని యొక్క స్థానములో వుంచబడుట, చివరి సూచన ఇవ్వబడును. ఆమేన్. మీరు దానిని నమ్ముచున్నారా? ఓ, బహుశ నేను దీనిని ఇక్కడ కత్తిరిస్తాను. నేను ముందుకు వెళ్ళలేను. మనము తలలు పంచుదము.
సజీవమైన దేవుని సంఘము. దేవా, కనికరము చూపుము. ఈ పాత శబ్దపు అడ్డములను విరుగగొట్టుకుని ఆయనను కలుసుకొనవలెనని మీరు కోరుకొనరా? ఇక్కడ ఆయనను కలుసుకొనుటకు సిద్ధపడని వారెవరైనా యున్నట్లైతే, మరియు బూర మ్రోగినట్లేతే, నీవు ఇంకనూ భూమి మీద బంధింపబడియున్నావని ఎరిగినట్లైతే, ఆ గొప్ప నాశనకరమైన శ్రమలగుండా వెళ్ళవలసియున్నావని ఎరిగియున్నట్లైతే, ఓడలోనికి వెళ్ళకుడా - బయట విడువబడిన వారివలె… వారు నీళ్ళలో నశించిపోయిరి. పిల్లలు, యవ్వనులు, వారికి కృపలేకుండా పోయినది. వారందరు నీళ్ళలో మునిగిపోయిరి, మరియు వారి యొక్క శవములు నీళ్ళలో తేలుచుండగా, కాకులు, రాబందులు వాటిని తినివేసెను. ఓడలో ఉన్నవారు సురక్షితముగా నుండిరి.
నోవహు దినములలో సమస్తము పాపభూయిష్టమైనది, నాశనం చేయబడినది. సొదొమ దినములలో, సొదొమలోని సమస్తము అగ్నితో కాల్చివేయబడినది. లోతు భార్య ఉప్పు స్థంభముగా మూరినది. దౌర్భాగ్యముగా హీనపరచబడినది. కాని వాటిలో ఏదియు నోవహును తాకలేదు. వాటిలో ఏదియు అబ్రాహామును తాకలేదు. అబ్రాహాము యొక్క సంతానమును ఏదియు తాకదు.
HEB 10:26
70నేను మీకు సువార్తను తెచ్చియున్నాను. నన్ను నేను ఈ రీతిగా పిలుచుకొనలేదు, అయితే దేవుడు తన ప్రవక్తగా యుండుటకు నన్ను పిలిచియున్నాడనీ, మీరు నమ్మియన్నారని మీరే చెప్పియున్నారు. హెబ్రి భాషలో, "ప్రవక్త" అను మాటకు భావమేమిటి? వ్రాయబడిన వాక్యమునకు ఒక దైవిక అనువాదకుడు. దేవుని యొక్క వాక్యము ప్రవక్తకు, లేక దీర్ఘదర్శికి వచ్చినది. నేను మీకు సత్యమును చెప్పియున్నాను.
ఇపుడు మీరు క్రీస్తును మీ స్వరక్షునిగా, మిమ్ములను స్వస్థపరచువానిగా, మీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇచ్చువానిగా, రాబోవుచున్న రాజుగా మీరు ఆయనను స్వీకరిస్తారా? మీరు మధ్యాకాశములో ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధపడని యెడల, ఆయన ఈ రాత్రికి వచ్చినట్లైతే, మరియు మీరు సిద్ధంగా లేరని యెరిగియున్నట్లైతే, మీరు మీ యొక్క తలలు వంచియుండగా, మీ చేతులను పైకి ఎత్తి, "బ్రెన్హాం సోదరుడా, నా కొరకు ప్రార్ధించండి," అని చెప్పగలరా. "దేవా, నాపై కనికరము చూపుము. నేను సిద్ధపడలేదని నేనెరుగుదును." ఇప్పుడు అది మీ నిర్ణయమైయున్నది.
నేను కాను… ఇది బ్రతిమిలాడే సమయం కాదు. ఇది మేల్కొనే సమయమైయున్నది. మరియు ఒక పురుషునిగా లేక ఒక స్త్రీగా వుండవలెను. లేక కృపా దినములను దాటి నీ హృదయము పాపము చేసినట్లైతే అపుడు నీవు… ఏ స్థితిలో యున్నప్పటికి లెక్క కాదు, కనీసం నీవు దాన్ని ఎరుగవు. అయితే మనము జీవించుచున్న ఈ ఘడియను గ్రహించి ఏదైనా నిన్ను మేల్కొల్పినట్లైతే, మరియు నీవు ప్రార్ధనలో గుర్తుచేసుకొనవలెనని కోరుచున్నావా? మీ చేతిని పైకెత్తండి. ప్రభువు నిన్ను దీవించును, మరియు నీవు, మరియు నీవు, నీవు; నా కుడివైపునకు, నీవు నీవు, ప్రభువు నిన్ను దీవించును.
పరిశుద్ధాత్మ ఇంకను మాట్లాడుచున్నాడని అది చూపుతూ వెళ్ళుచున్నది. ఇంకను ద్వారం మూయబడియుండలేదు. అయితే ఆయన సేవకునిగా నా మాట వినండి, ఆ ఘడియ రాబోవుచున్నది, అపుడు నీవు ఎంతమాత్రమును నీ చేతులు ఎత్తలేవు. అది అనేకులను తాకుట అయిపోయినది. ఇక్కడే నాకు తెలిసిన కొందరు తిన్నగా కూర్చొనియున్నారని నేనెరుగుదును, ప్రభువు నామములో, చూచారా… వారి వైపు చూస్తుండగా, మరియు ఆ నల్లని చీకటి వారిపై యున్నది. వారు తప్పక తమ చేతులను ఎత్తవలసియున్నది, కానీ వారు దానిని చేయుటలేదు. వారు వారి యొక్క చివరి దినపు కృపను అతిక్రమించి పాపము చేసియున్నారు, సత్యము నుండి దూరముగా వెళ్ళిపోయియున్నారు. అప్పగించబడియున్నారు…
"సత్యమును గూర్చి అనుభవజ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేయువానికి, పాపమునకు బలి ఇంకనూ వుండదు; కానీ న్యాయతీర్పునకు భయముతో ఎదురుచూచుటయూ, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియునికను వుండును."
JOHN 5:24•
1COR 12:13
71పరలోకపు తండ్రీ, వారు తమ చేతులను ఎత్తియున్నారు. నీ వాక్యము చొప్పున నా శ్రేష్టమైన పనిని నేను చేసియున్నాను. నేను ఎరిగియున్నది అంతవరకే. నీవు బయలుపరచినట్లుగానే, నేను దానిని చెప్పియున్నాను. మేము దీర్ఘసమయం వేచియున్నాము. మరియు అక్కడ చాలా మంది తమ చేతులను ఎత్తియున్నారు, బహుశ ఈ కట్టడంలో ఒక డజను మంది, ఒకవేళ ఎక్కువ కావచ్చు, ఒకవేళ తక్కువ కావచ్చు. అయితే చిట్టచివరిగా వారిలో ప్రతి ఒక్కరినీ నీవు ఎదుగుదువని నేను చెప్పగలను. పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా వారితో మాట్లాడియున్నది. వారు పైకి వెళ్ళుటకు సిద్ధంగాలేరని గ్రహించియున్నారు.
పరలోకపు తండ్రీ, ఒక వ్యక్తి తగినంత యధార్ధముగా తన చేతులను ఎత్తి, తాను సిద్ధంగా లేనని సాక్ష్యమిచ్చినట్లైతే, మరియు వారు సిద్ధపడగోరుచున్నామని కోరినట్లైతే, దయగల తండ్రి - మీరు దయతో అతి త్వరలో వాగ్దాన కుమారుని కలుసుకొనుటకు ఈ రాత్రి వారి హృదయములను సరిచేయరా?
ఆయన రెండువేల సంవత్సరముల నుండి వాగ్దానం చేయబడియున్నాడు. మేము ఆయన కొరకు వేచియున్నాము, మరియు త్వరలో ఆయన వచ్చుచున్నాడు; ఏలయనగా ఆయన అబ్రాహాముకు చేసిన సమస్తమును, ఆయన సంతానమునకు ఆయన చేసియున్నాడని మేము చూస్తాము.
మేము ఆ చివరి గుర్తును మాతో ఇపుడు కలిగియున్నాము, అది నీవైయున్నావు, ఇప్పుడు దేవుడు శరీరధారిగా ప్రత్యక్షపర్చబడినాడు. ప్రభువా, వారు వారి యొక్క చేతులను ఎత్తియున్నారు.
బైబిల్ చెప్పియున్నది… నీ స్వంత కుమారుడైన యేసు చెప్పెను, "నా మాటలు విని [దేవా, నేను దానిని వారికి తెచ్చియున్నాను], మరియు నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవమును కలిగియున్నాడు, మరియు అతడు తీర్పులోనికి రాక, మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడు."
గొప్ప యెహోవా, ఎలోహిం, యేసుక్రీస్తు యొక్క నామము ద్వారా, నీ వాక్యమునకు మరియు నీ ప్రియకుమారుని యొక్క త్యాగమునకు ఆనవాళ్ళుగా పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ద్వారా నేను వారిని నీకిచ్చుచున్నాను; అయనే వాక్యమును తెచ్చి మానవ శరీరం ద్వారా దానిని ప్రజలకు ప్రత్యక్షపరుచును. వారు నీవారై యున్నారు. నీవు చూచినట్లు వారు అమర్చబడిన వారిగా చేయుము, ప్రభువా, వారు నీ చేతులలో వున్నారు.
ఇక్కడయున్న నీ సేవకులు వారిని ముందుకు నడిపిస్తారు. వారు తిన్నగా ఒక మంచి సంఘమునకు వెళ్ళి, క్రైస్తవ బాప్తిస్మమును పొందుదురు గాక. తరువాత వారు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును పొంది క్రీస్తు యొక్క శరీరములో వుంచబడుదురు గాక. యేసుక్రీస్తు యొక్క నామములో, ప్రభువా, దానిని దయచేయమని నేను అడుగుచున్నాను. ఆమేన్.
LUKE 17:28-30•
REV 3:20
72ఇప్పుడు సమయము, 5 నిమిషములు తక్కువగా 10 గంటలు అవుతుంది. నాకు ప్రార్ధనా వరుసకు సమయములేదు. ప్రభుని చిత్తమైనయెడల, నేను వారిని రేపు రాత్రికి కలిగియుందును. ఇప్పుడు నా అతిచిన్న వర్తమానమును ముగించి, నా ప్రార్ధనా వరుసను నడిపిస్తాను.
నీవు వ్యాధిగ్రస్తుడవా? నీవు అవసరతలో యున్నావా? అలాగైతే మీ చేతులను ఎత్తండి. ప్రభువు నిన్ను దీవించును గాక. నీవు రోగిగా అవసరతో యున్నట్లైతే, నేను బైబిలులో చెప్పినట్లుగా, దేవుడు అబ్రాహామునకు ఏమిచేసియున్నాడో, అక్కడ ఆయన అబ్రాహాము యొక్క కుమారునికి కూడా దానినే వాగ్దానము చేసియున్నాడు, అబ్రాహాము యొక్క కుమారులకు. మరియు ముఖ్య సంతామనమగు అబ్రాహాము యొక్క కుమారుడు వాగ్దానము చేసియున్నాడు, "సొదొమ దినములలో జరిగియున్నట్లుగా, మనుష్యుకుమారుని యొక్క రాకడలోనూ జరుగును."
అదే గురుతును దేవుడు సరిగ్గా అబ్రాహామునకు చూపియున్నాడు, అది పాపభూయిష్టలైన విశ్వాసుల యొక్క… లేక పాపభూయిష్టమైన వారియొక్క అంతమునకు సమీపమైయున్నారు, అలాగుననే ఆయన యొక్క రాకడ యొక్క దినములలోనూ యుంటుంది. అది నిజమేనా?
ఇప్పుడు. నేను సోదరుడను, ఒక మనిషిని. ఇప్పుడు, మీరు కోరియున్నట్లైతే, ఒక్క నిమిషముపాటు ఎంతో నెమ్మదిగా మీరు యుండవలెనని నేను మిమ్ములను అడుగగోరుచున్నాను. ఎంతో మర్యాదగా యుండండి. నేను మీ సోదరుడనైయున్నాను, ఒక మనిషిని. ఎన్నడైనా దేవుడు నాకు ఏమి చేసియున్నా, దానిని జరిగించుటకు, అది మీకునూ చేయవలసియున్నది.
యేసు దేవుని కుమారుడు. ఆయన భూమిమీదకు వచ్చియున్నాడు. మీరు దానిని నమ్ముతారా? మరియు ఆయన భూమిమీదకు వచ్చినప్పుడు, ఆయన ఏమి చేసియున్నాడు? అక్కడ ఆయన తన ప్రజలతో యున్న కొన్ని సమయములున్నవి, వారు ఆయనను నమ్మలేదు. వారి సంఘములు ఆయన నుండి ప్రజలను దూరముగా త్రిప్పినవి. అది నిజమేనా? దానినే వారు ఈ దినమున చేయుచున్నారు.
HEB 8:1•
HEB 13:8
73లవొదికయ సంఘ యుగములో ఆయన సంఘమునకు బయట యుండి, తలుపు తట్టుచూ, తిరిగి లోనికి వచ్చుటకు ప్రయత్నించుచున్నట్లుగా మనము ఆయనను కనుగొంటాము, చూడండి.
ఈ దినమున వారు దానినే చేసియున్నారు. "వారి యొక్క అవిశ్వాసమును బట్టి ఆయన అనేకమైన గొప్ప కార్యములను ఆయన వారి మధ్య చేయలేకపోయెను. అయితే ఆయనను ఎందరు అంగీకరించిరో, వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమిచ్చెను." అది నిజమేనా?
ఇప్పుడు, నేను మిమ్ములను ఒకటి అడుగబోవుచున్నాను. రోగులుగాయున్న మీరు, మీ తలలను వంచండి. ఇప్పుడే తిన్నగా, యేసుక్రీస్తు ప్రధానయాజకుడిగా దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చొండియున్నాడని మీలో ఎంతమందికి తెలుసు. రక్తము కారుచున్న అర్పణ, రెండుగా విభజించబడి పరిశుద్ధాత్మను క్రిందికి పంపెను. మీరు నన్ను ఆయన సేవకునిగా నమ్మియన్నట్లైతే, మీరు కోరినట్లైతే… లేదు, నేను దానిని చెప్పబోవుటలేదు. నేను ఆయన సేవకుడను, ప్రవక్త విషయమును విడిచిపెట్టండి, నేను కనీసము ఒక సేవకుడినని పిలువబడుటకు యోగ్యుడను కాను. అయితే నేను మీకు సత్యమును చెప్పియున్నానని మీరు నమ్మియున్నట్లైతే… మీరు నన్ను నమ్మవద్దు, కాని వాక్యము ఏమి చెప్పియున్నదో దానిని నమ్మండి. దేవుడు తన వాక్యమును నిలబెట్టుకొంటాడేమో చూడండి.
ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొండియున్నాడు. మరియు ఆయన మన ప్రధానయాజకుడై, మన రోగములతో మనము ఆయనను తాకవచ్చును. అది నిజమేనా? అది సత్యమేనా? బైబిలు దానిని చెపుతుంది? మంచిది, ఆయన మారనివాడైయున్నట్లైతే, (హెబ్రి 13:8), నిన్న, నేడు, నిరంతరము ఆయన ఏకరీతిగా యున్నాడు. నీవు నీ యొక్క రోగములతో ఆయనను తాకినట్లైతే, ఆయన ఎలా స్పందిస్తాడు, ఆయన ఒకేరీతిగా నిన్న, నేడు, నిరంతము యున్నట్లైతే, ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగును తాకినప్పుడు - ఆయన స్పందించినట్లుగానే, ఆయన స్పందించును. మీరు ఆయనను తాకగలరా? బైబిలు ఆ రీతిగా చెప్పియున్నది. మంచిది, ఆయన అదే రీతిగా స్పందిస్తాడు.
JOHN 15:5
74అప్పుడు గుర్తుంచుకోండి, ఆయన చెప్పాడు, "నేను ద్రాక్షావల్లిని, మీరు తీగెలు." ద్రాక్షావల్లి ఏ ఫలమును ఫలించదు; అయితే కొమ్మలు ఫలిస్తాయి, మరియు వాటి జీవమును ద్రాక్షావల్లి నుండి పొందుతాయి. అది నిజమేనా? ఇప్పుడు, ఆయన ఇక్కడ యున్నాడు. మనము కొమ్మలమైయున్నాము.
నీలో ఏదో తప్పు యున్నట్లైతే, మరియు దేవుని నుండి నీకు సహాయము అవసరమైనట్లైతే, నీవు ఈ రీతిగా ప్రార్ధన చేసి ఆయనకు చెప్పమని నిన్ను అడుగుతాను, "పరలోకపు తండ్రీ, ఆ చదువులేని ఎండిపోయిన చిన్న మనిషి ఇక్కడ కూర్చొనియున్నాడు, బట్టతలగల మనిషి, ఇప్పుడు అతనికి నేను తెలియదు. మరియు అతడు కేవలము ఒక మనిషైయున్నాడు. అయితే నీవు మారని, ఒకే రీతిగా యున్నావని, ఈ నిర్ధారణను చేసియున్నావని అతడు నాతో చెప్పుచున్నాడు…
మరియు నేను చూచు ప్రతిదీ, నేను సత్యముగా చూస్తాను. నీతికరణము, శుద్దీకరణము, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము, కుమారుని స్థానములో యుంచుట, అతనికి పేరును ఇచ్చుట, ఆ మనిషి దేవుని పేరులోని (ఎలోహిం) ఒక భాగమును తీసుకొనియున్నాడు. ఇప్పుడు మనము అవే సూచనలను చూద్దాము. మనము బిల్లీ గ్రహమును చూస్తాము, అతడు సొదొమలోనికి వెంబడించెను. అయితే ఎన్నుకొనబడిన సంఘమునకు ఒకరు వచ్చియున్నారని, ఈ మనిషి చెప్పుచున్నాడు.
ఇప్పుడు. సోదరులారా, మీరు చూడండి, అది లేఖనానుసారమేనా? అలాగైతే నమ్మండి. మరియు నేను చెప్పినది సత్యమైయున్నదని దేవుడు చెప్పియున్నట్లైతే, అప్పుడు అది సత్యమైయున్నది. మీరు ప్రార్ధించండి. నన్నునేను ఆయనకు లోపర్చుకొంటాను; మిమ్మునుమీరు లోపర్చుకోండి. పరిశుద్ధాత్మడు ఏమి చెప్పునో చూడండి.
75ఇప్పుడు, దూత తన వీపును గుడారము వైపునకు త్రిప్పియున్నాడు. ఇప్పుడు, ఇక్కడ నన్ను ఎరిగియున్నవారు, దయచేసి ప్రార్ధన చేయవద్దు. మీరు నన్ను ఎరిగియున్నట్లైతే, మీ ఇబ్బంది నాకు తెలుసునని మీరు ఎరుగుదురు, కాబట్టి మీరు ప్రార్ధించవద్దు. ఖచ్చితముగా నన్ను ఎరుగనివారు మరియు మీ గూర్చి నాకు ఏమియు తెలియదని ఎరిగియున్న వారు మాత్రమే ప్రార్థన చేయండి. ఆయన ఏమి చేస్తాడో చూడండి. ఇప్పుడు, కేవలము ప్రార్ధనలో యుండండి.
ప్రభువైన యేసు, ఈ పరిచర్య త్వరలోనే ముగింపునకు వచ్చుచున్నది. త్వరలోనే అది అంతమవుతుందని నాకు తెలుసు. అబ్రాహాము యొక్క సంతానమునకు ఎదురుచూస్తూయున్న కుమారుడు, త్వరలో వచ్చుచున్నాడని నేను నమ్ముచున్నాను. అయితే తప్పక నీ మాట నెరవేర్చబడుతుంది. ప్రభువా, నేను నీ సేవకుడినైయున్నానని లేక నీ ప్రవక్తనైయున్నానని, జన్మించి, పంపబడినవాడనై, ఈ పనికి నిర్ధారించబడియున్నాడని, అది ఎన్నుకొనబడిన సంఘమునకు ఒక సూచనయైయున్నదని, ఎన్నుకొనబడినవారికీ, పిలువబడినవారికీ, అబ్రాహాము యొక్క పిలువబడిన సంతానమునకు అంతము సమీపమైయున్నదని, మరియు నీవు దేవుడవై యున్నావని అది తప్పక తెలియబడును గాక. ప్రభువా, అది ఆరీతిగా జరుగును గాక.
అక్కడయున్న అబ్రాహాము యొక్క సంతానములో కొందరు నీ వస్త్రపు చెంగును ముట్టుదురు గాక. అలాగైతే, తండ్రి నాతో మాట్లాడుము, నేను చెప్పవలసిన మాటలను చెప్పుటకు నాతో మాట్లాడుము.
MARK 9:23
76ఇప్పుడు మీరు ప్రార్ధించండి. ఇప్పుడు నేను నా వీపును కూర్చున్న సంఘము వెనుకకు త్రిప్పియుండగా, ఈ మార్గములో వెను ఒక స్త్రీ నా ముందు కూర్పునియున్నది. ఆమె కడుపు జబ్బుతో బాధపడుచున్నది. ఆమెకు ఒక కారు యాక్సిడెంట్ కూడా అయింది. ఆమె ఇక్కడి వ్యక్తి కాదు; ఆమె కెంటక్కీ నుండి వచ్చియున్నది. ఆమె యొక్క పేరు మిస్ ఆలిసన్, ఓ మీ పాదములపై లేచి నిలబడండి, మరియు మీరు మీ స్వస్థతను స్వీకరించండి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచండి, మరియు స్వస్థతనొందండి. ఇపుడు ఓ స్త్రీ… నేను నా జీవిత్రంలో నిన్ను ఎన్నడూ చూసియుండలేదు. మనము క్రొత్తవారమైయున్నట్లైతే మీ చేతిని ఎత్తండి. ఇప్పుడే స్వస్థతనొందిన ఆ స్త్రీ, మీ చేతిని ఎత్తండి. ఆయన ఇంకనూ దేవుడై యున్నాడా?
ఇప్పుడు, మిగిలినవారిలో కొందరు అదేకార్యం చేయండి. నీ వీపును త్రిప్పుచున్నాను. తిన్నగా ఆ స్త్రీ వెనుకకు త్రిప్పుచున్నాను, ఆ స్త్రీ కూడా బాధపడుచున్నది. ఆమె మూత్రపిండముల జబ్బుతో బాధపడుచున్నది. ఆ స్త్రీ ఇంకనూ స్తూలకాయురలుగాయున్నది. శ్రీమతి బ్రౌన్, నీవు లేచి నిలబడి, నీ స్వస్థతను అంగీకరించుము. నేను నీకు ఒక క్రొత్త వ్యక్తిని కదా? మనం ఒకరికి ఒకరం క్రొత్తవారమైయున్నాము. నీగూర్చి నాకేమియూ తెలియదు. అది నిజమైయున్నట్లైతే, నీ చేతిని ఎత్తుము, నీవు ప్రార్ధన చేయుచున్నావు. దేవుడు నిన్ను దీవించును. వెళ్ళుము, స్వస్థత నొందుము. దేవుడు ఇంకనూ దేవుడై యున్నాడా? "నమ్ముట నీవలనైతే…"
ఆ క్రింది వరుసలో అక్కడ శ్రీమతి డే, నీవు నడుము నొప్పితో మరియు మూత్రపిండముల జబ్బుతో బాధపడుచున్నావు. నీవు స్వస్థతను అంగీకరించగోరుచున్నావా? నీవు కూడా దాన్ని స్వీకరించవచ్చును. ఆ స్త్రీ ఎవరో నాకు తెలియదు, నా జీవితంలో ఎన్నడూ ఆమెను చూసియుండలేదు. ఓ స్త్రీ, అది నిజమైయున్నట్లైతే, నీ చేతిని ఆడించుము. మనము ఒకరికొకరము క్రొత్తవారము. చూడండి, అదేయైయున్నది? నమ్ముట నీ యొక్క విశ్వాసమైయున్నది. "నీవు నమ్మియున్నట్లైతే, సమస్తమును సాధ్యమే." అది నిజమేనా?
77ఈ భాగములో ఇక్కడ ఉన్నవారి విషయం ఏమిటి? విశ్వాసమును కలిగియుండండి. ఒక పురుషుడు నా ముందు నిలబడియున్నాడు. అతడు హెమరాయిడ్స్ వ్యాధితో బాధపడుచున్నాడు. ఒక ఆపరేషన్ను దాని నిమిత్తం కలిగియున్నాడు. శ్రీ. డే, అది నీకేమైనా మేలు చేసినదా, నన్ను మన్నించండి. శ్రీ. షార్ట్, నీవు లేచి నిలబడి, నీ స్వస్థతను అంగీకరించుము. బైబిల్ నా ముందు ఉండగా, నా జీవితంలో ఆ మనిషిని ఎన్నడూ చూచియుండలేదు. మేము ఒకరికి ఒకరము సంపూర్ణంగా క్రొత్తవారమై యున్నాము.
శ్రీమతి బొలాండ్, ఆ వెనుకయున్న నీకు ముక్కులో కండ పెరిగియున్నది. నీ సంగతి ఏమిటి? నీవు లేచి నిలబడి, నీ స్వస్థతను స్వీకరిస్తావా? ఆమె నాకు తెలియదు, నా జీవితంలో ఎన్నడూ నేను ఆమెను చూచి యుండలేదు. నీవు నీ హృదయమంతటితో నమ్ముతావా?
మిస్ కానర్, కాలు బాధతో ఆమె బాధపడుచున్నది. ఒక ఆపరేషన్ కొరకు సిద్ధపడుచున్నది. లేచి నిలబడి, నీ స్వస్థతను స్వీకరించుము. మిస్ డిక్సన్, జారిపోయిన బ్లాడర్ తో ఆమె బాధపడుచున్నది, ఒక ఆపరేషన్ కొరకు సిద్ధపడుచున్నది. లేచి నిలబడి, నీ స్వస్థతను అంగీకరించుము. నా జీవితంలో ఎన్నడూ నేను వారిని చూచియుండలేదు, మరియు దేవుడే నా న్యాయాధిపతియై యున్నాడు.
MARK 16:17•
HEB 13:8
78సంఘమా ఇది అంత్యకాలమైయున్నది. దేవుడు అబ్రాహామును నీతీకరణ ద్వారా, శుద్దీకరణ ద్వారా, ఆత్మతో నింపుట ద్వారా, కుమారుని యొక్క స్థానంలో ఉంచుట ద్వారా పిలిచియున్నాడు, మరియు అంత్యకాలమునకు ముందు మానవుని శరీరంలో ప్రత్యక్షమవుచున్నాడు. దీనిని మీరు నమ్ముచున్నారా? కొన్ని క్షణముల క్రితము ప్రార్థనలో జ్ఞాపకము చేసికొనబడవలెనని మీలో ఎందరు చేతులెత్తియున్నారు. ఇదివరకు ఇలాటిది ఏదియూ ఎన్నడూ చూసియుండలేదు. మరియు ఇప్పుడు క్రీస్తును మీ స్వరక్షకునిగా స్వీకరించినందుకు మీరు సంతోషంగా ఉన్నారు. మీ పాదములపై లేచి నిలబడండి ఇపుడు మీలో ప్రతిఒక్కరూ లేచి నిలబడండి. మీరు సిగ్గుపడరు.
దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును, దేవుడు నిన్ను దీవించును. అది నిజము. అది నిజము. ప్రభువు నిన్ను దీవించును. ఆయన మిమ్ములను స్వస్థపర్చుటకు ఇక్కడ యున్నాడని నమ్ముచూ, మీలో ఎందరు స్వస్థపడుటకు ఇష్టపడుచున్నారు.
చూడండి, నేను ఆ ప్రజలను నేనెన్నడూ తాకియుండలేదు. అక్కడ పది లేక పన్నెండు మంది ప్రజలున్నారు, అది ఏమైయున్నప్పటికి, వారు ఈ కట్టడము గుండా వెళ్ళియున్నారు. వారిలో ఒక్కరినీ నేను తాకియుండలేదు, కానీ వారు దేనినో తాకియున్నారు.
మైక్రోఫోన్ దానిలో ఏదో మాట్లాడితే తప్ప అది మూగదైయున్నది. అలాటిది తెలుసుకొనుటకు నేనునూ మూగవాడనై యున్నాను. నాకు అది ఎలా తెలియును? దేవా… వారు దేవునిని తాకియున్నారు. దేవుడు నా ద్వారా మాట్లాడి, వారికి అవసరమైయున్న ప్రతిదానిని నా ద్వారా చెప్పియున్నాడు. అది నిజమేనా? అది ఆయనను నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడిగా చేస్తుందా? అలాగైతే మీ దేహములో స్వస్థత అవసరమైయున్నవారితో నేను మాట్లాడగోరుచున్నాను, యేసుక్రీస్తు నామంలో మీపాదాలపై లేచి నిలబడండి.
సంఘమా, స్వస్థతను కోరుచున్న వీరిని మీరు చూస్తున్నారు.
79వారి దగ్గరయున్నవారిలో ఎంతమంది విశ్వాసులై యున్నారు? మీ చేతులు పైకి ఎత్తండి. బైబిలు చెప్పియున్నది, "నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు కనబడును." మీరు వారితో లేచి నిలబడి, మీ చేతులను వారిపై యుంచండి. మీ చేతులను వారిపై యుంచండి. ఇపుడు మీరు చుట్టూ సంఘములో తిరుగుతూ యుండగా, అవసరములో యున్న వారిపై మీ చేతులను ఒకరిపై ఒకరు ఉంచండి.
ఇపుడు మీరు మీ సంఘంలో ఎలా ప్రార్ధన చేస్తారు? మీరు మీ సంఘంలో ప్రార్ధించిన విధంగానే, మీరు మీ రహస్య-గదిలో మీరు దేవునికి ప్రార్ధన చేసినట్లుగానే, నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూయుండగా, మీరు చేతులుంచిన వ్యక్తి కొరకు ప్రార్ధించండి.
మా పరలోకపు తండ్రీ, ఇది ఒక దీర్ఘమైన కూటమైయున్నది. అయితే సందేహము లేదు, ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకొనబడతారు, మనం చూస్తూ వున్నట్లుగా - మనం అంత్యకాలములోయున్నాము మనం ఇక్కడ ఒక ప్రజగా రాత్రియున్నట్లుగా, కాలం సమీపమైయున్నదని మనకు తెలుసు. ఏ దేశము, ఏ ఒక్కరు దీన్ని కాపాడలేదు… ఏ ఒక్కరును అది సంభవించకుండా ఆపలేరు. దేవుడు ఆ రీతిగా చెప్పియున్నాడు, మరియు ఆయన మాటలు సత్యమైయున్నవి, మరియు ఆయన మాట్లాడిన ప్రతిదాని యొక్క ఋజువును మనం కలిగియున్నాము.
మరియు ఇప్పుడు నీ గొప్ప ఆత్మ, ఈ కట్టడంలో యున్నది. ఏ విధమైన ఏ అనుమానపు ఛాయలేకుండా, అదే దేవుడు, అదే వర్తమానమును బోధించియున్నాడు, అదే ఆత్మ మాట్లాడియున్నది, అదే వ్యక్తి, ఆయన శరీరధారిగానున్న అదే వ్యక్తియైయున్నాడు, ఒక మనిషివలె తినుచున్నాడు - త్రాగుచున్నాడు. ఆ తరము యొక్క అంత్యకాలమునకు ముందు అబ్రాహాము ముందు కూర్పునియున్నాడు.
ప్రభువా, ఇప్పుడు ఆ రీతిగానే యున్నది. అంత్యకాలము ఇక్కడయున్నది. మరియు ఈ ప్రజలు ఆ యేసును ఎరిగియున్నారు, దేవుని కుమారుడు, అంత్యకాలమునకు ముందు అది సొదొమలో యున్నట్లుగానే. ప్రభువైన దేవా, మాకు ఒక్క అనుమానపు ఛాయలేకుండా అది ఇక్కడ యున్నది. వారు ఒకరికొకరు ఒకరు ప్రార్ధన చేయుచున్నారు, వారు విశ్వాసులై యున్నారు. వారి విశ్వాసమును ఒప్పుకొనుటకు వారు లేచి యున్నారు. వారు ఒకరిమీద ఒకరు చేతులుంచి, ఒకరికొకరు ఒకరు ప్రార్ధన చేయబోవుచున్నారు.
వ్యాధి, రోగము, బాధ, లేక పాపముతో వారిని తలక్రిందులు చేయుచున్న దయ్యమును నేను ఖ౦డించుచున్నాను, మరియు వారు స్వస్థపడకుండా అవిశ్వాసముతో వారిని దూరంగా వుంచుచున్న దయ్యమును నేను ఖండించుచున్నాను.
అవిశ్వాసపు నీడలను వెనుకకు తొలగించమని నేను దేవుడిని అడుగుచున్నాము, మరియు ఆ ఎల్ షద్ధాయ్, ఆ బలమునిచ్చువాని నుండి పరిశుద్ధాత్మ ఈ అబ్రాహాము యొక్క పిల్లలలోనికి క్రుమ్మరింపబడును గాక, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామంలో నేను దయ్యమును ఖండించుచుండగా, వారిలో ప్రతిఒక్కరిని స్వతంత్రులనుగా చేసి, వారిలో ప్రతి ఒక్కరిని స్వస్థతపరచమని కోరుచున్నాను.