అబ్రాహాము యొక్క నిర్ధారించబడిన నిబంధన

అబ్రాహాము యొక్క నిర్ధారించబడిన నిబంధన

vgr count -246 1మరలా దేవుని గృహములో యుండుట మంచిగా యున్నది, ఈ స్థలము ఆ ఉద్దేశ్యమునే నిర్వర్తించుచున్నది. మరలా ఈ రాత్రి పరిచర్యచేయు ఈ అవకాశమును బట్టి నేనెంతో కృతజ్ఞుడను. గతరాత్రి ఒక అత్యధికమైన, సమృద్ధియైన గొప్ప సమయమును మనము కలిగియుంటిమి ఎలాగైనా నేను చేసియున్నాను. ఒక సగము రాత్రంతయూ నేను నిద్రపోలేనంతగా ప్రభువు తన దీవెనలను నాపై క్రుమ్మరించాడు.

మరియు తరువాత ఆయన. ఎవరో నాకు వ్రాసిన ఒక ఉత్తరములోని ఒక వ్యాసమును నేను చదువుచుంటిని, వార్తా పత్రికలోని ఒక చిన్న భాగమును అతడు నాకు పంపియుండెను, మరియు ప్రభువు దానిమీద నాకొక ప్రాముక్యమైన తలంపును నాకు ఇచ్చెను ఆయన ఇష్టపడినట్లైతే, రేపు మధ్యాహ్నము కూడికలోనే తిన్నగా దానిని వ్యక్తపరుచుదును, రేపు మధ్యాహన్నము కూడికలో దాని మీద బోధిస్తాను.

ఇప్పుడు మనము… మనము మధ్యహాన్నపు కూడికను కలిగియుండుటకు కారణమేమనగా… ఇప్పుడు, సహోదరుడు సులివాన్ తన ప్రజలతో ఇక్కడయున్న మీతో సహవాసము చేయుటకు నన్నాహ్వానించి యున్నాడు. మరియు అతడు మొత్తము అది తన సంఘముతో యుండకుండా, ఈ ఆర్మొరీ ఆడిటోరియంను తెరచియున్నాడు, అది ఒక నిజమైన మర్యాదగల మనిషి చేయు పని అని నేను నమ్ముతాను, ఆ విధంగా మీరు ఆలోచించారా? నిజమైన సోదరత్వంతో.

2మరొక విషయాన్ని మనము తీర్మానించియున్నాము, అదేమనగా ఆదివారం రాత్రి కూడిక లేకుండుట మంచిదని మేము తలంచియున్నాము, ఆ విధంగా మీరు మీ యొక్క క్రమమైన ఆరాధనలను ఏ ఒక్కటి కూడా పోగొట్టుకోకుండా యుంటారు. మీరు ఆదివారపు బడి మరియు ఆదివారం రాత్రి కూడికను కలిగియుండవచ్చును. మరియు వివిధ సంఘములకు చెందిన సభ్యులైన మీరు, దానిని మీ సంఘ కాపరికి మీరు వ్యక్తపరచండి, ఆయన కూటములో లేనట్లైతే, ఆ కారణమును బట్టియే మనము దానిని చేస్తాము, క్రీస్తు యొక్క పనిని ఇక్కడ ఆటంకపరచు ప్రయత్నము మనం చేయము. క్రీస్తు యొక్క పనికి సహాయపడుటలో ప్రయత్నించుటకే మనమిక్కడ యున్నాము. అందరం సహకారంతో ప్రతీ మోతాదులో సహాయపడుటకు మనము చేయకలిగినదంతయు చేయుటకు ప్రయత్నించుచున్నాము.

మరియు సహోదరుడు సులివాన్ చెప్పుటకు బదులుగా, "ఇక్కడ మంచిది, మేము దానిని మా సంఘములోనే కలిగియుంటాము," ఎందుకని అతడు ఆడిటోరియంలోనే పెట్టాడు, ఆ రీతిగా ప్రతియొక్కరు దానిని చూడగలరు అది ఒక స్వార్ధపూరిత ఉద్దేశ్యము కాదు. మరియు అప్పుడు , ఆదివారం రాత్రి కూడికను కలిగియుండుటకు బదులుగా, మనము దానిని ఆదివారం మధ్యాహ్నమునకు చేశాము, అది ఆదివారం రాత్రికంటే ఎల్లప్పుడూ ఆదివారం మధ్యాహన్నము అతి చిన్న గుంపుగా యుంటుంది. అయితే మనము ఇక్కడ డబ్బు కొరకు లేము. ఇక్కడ ఎంతమంది ప్రజలను ఆకర్షించగలమో చూచుటకు మనమిక్కడ లేము; మనమిక్కడ ప్రతి యొక్కరికి సహాయపడుటకు, దేవుని రాజ్యము కొరకు మన భాగమును అందించుటలో ప్రయత్నం చేయుటకు మనమిక్కడ యున్నాము. ఆ కారణము కొరకే మనమిక్కడ యున్నాము.

3ఇప్పుడు ఈ మాట రికార్డు చేయబడదు, మరియు సహోదరుడు సులివాన్ కు ఈ విషయం తెలియదు కానీ నాకు ఇది తెలుసు, అయితే ఈ సమయం వరకు నేనెరుగుదును, ఆయన ఈ కూడిక కొరకు నిధుల కొరత కొంత కలిగియున్నాడు. ఇప్పుడు రేపు మధ్యాహన్నము ప్రేమ కానుక తీయబడదు, అది కూటము ఖర్చుల కొరకైన కానుకగా వుంటుంది. మనము కూటములు ఖర్చులన్నియు రేపు మధ్యాహన్నము చెల్లించబడనియెడల, నేను వెంటనే సంఘమునకు టెలిగ్రాం పంపిస్తాను. మరియు ఈ పట్టణమును విడువక మునుపే ఆ కూటము కొరకైన ఖర్చుల మొత్తమును చెల్లించివేస్తాము ఏమియు వెనుక విడువబడదు, ఏ అప్పులను మనము వెనుకకు విడువము. మనము అలా చేయము. రేపు మధ్యాహన్నము ప్రేమ కానుకలో మన ఖర్చులకు తగినంత మనకు రాదు. మీరు నాకు బదులుగా ప్రభువైన యేసు కొరకు ఒక ప్రేమ కానుక వేయండి, ఆ రీతిగా అది అప్పులు చెల్లించుటకు వెళుతుంది.

ఇప్పుడు, సహోదరుడు సులివాన్ దానిని తనకై తానుగా చెల్లించబోవుచున్నాడు, అయితే అతడు దానిని చేయబోవుట లేదు. లేదు. నేను ఆయనను ఆలాగు చేయనివ్వను. లేదు, మనము దానిని మనకైమనము చేయబోవుచున్నాము. మరైతే, కూడికలు ముగించుటకు సరిపడనట్లయితే, అప్పుడు నేను కనుగొని, పని పూర్తిచేయటకు, మరియు మేము దానిని మా సంఘము - జెఫెర్సన్ విల్ నుండి పంపిస్తాము. ప్రతియొక్కటి చెల్లించబడుటకు — కుర్చీలు, ఆడిటోరియం, ప్రచారము. చెల్లించవలసినది ఏమి ఉన్నా, మేము దానిని చెల్లించివేస్తాము. చెల్లించబడుటకు చూస్తాము. సహోదరుడు సులివాన్ మరియు ప్రజలకు దానికి మించి మరి ఏమి ఉండదు.

ఇప్పుడు, మీరు చేసినట్లయితే, మీరు చేయాలని…. ఒకవేళ మీ సంఘ కాపరి ఇక్కడ లేనట్లయితే, సంఘమును రేపు మధ్యాహ్నం ఆహ్వానించినట్లయితే. అది ఒక ప్రవచన వర్తమానమైయుండును, నేను అనుకోనుచున్నాను… అది ఈ రోజు వ్యాసం చదివిన తరువాత, పరిశుద్ధాత్మ నా హృదయముపై పెట్టెను అని నాకు అనిపించుచున్నది. నేను ఆ వర్తమానమును రేపు ఇవ్వవలసియున్నది.

4మరియు ఇప్పుడు, ఆ తరువాత నేను కలిగియున్న పరిచర్య - నాకు తెలిసినంతవరకు అది ఈస్టర్ ఆదివారము, అక్కడ బాప్తిస్మము కార్యక్రమము ఉండును, మరియు మొదలుగునది. తరువాత మేము ఇల్లినాయిలోని, బ్లూమింగ్టన్ కు వెళ్ళుదము.

సహోదరుడు సులివాన్, నాకు సాధ్యమైతే, తరువాతి వారము నన్ను రెండు రోజులకు ఆహ్వానించెను. సహోదరులారా, అది చేయుటకు నేను చాలా అలసిపోయియున్నాను. నా గొంతు పోయినది. నేను కేవలము… క్రిస్మస్ నుండి నేను పరిచర్యలో ఉన్నాను, చూచారా, మరియు నేను నిజముగా, నిజముగా అలసియున్నాను; మరియు ఈ మూడు, నాలుగు, లేక అయిదు రోజులు, అది ఏమైయున్నా.

మరియు అది చేయుటకు నేను ఇంట్లో ఉండలేను. నేను మరెక్కడికైనా వెళ్ళి మరి విశ్రాంతి తీసుకోవాలి, ఎందుకనగా నాకు ఆదివారము నుండి ఆదివారము వరకు నేను కలిగియున్నాను, మరియు తరువాత అక్కడ నిండి చికాగో, ఆదివారము నుండి ఆదివారము వరకు. మరియు తరువాత అక్కడ నుండి గ్రాండ్ ప్రరైరి, బ్రిటిష్ కొలంబియా… లేక అల్బెర్టా, మరి అక్కడ నుండి డాసన్ క్రీక్, బ్రిటిష్ కొలంబియా, మరియు బహుశా ఫోర్ట్ సెయింట్. జాన్, మరియు ఇంకా ముందుకు మరియు క్రిందకు మియామీ, ఫ్లోరిడాకు.

బహుశా అక్కడ నుండి వాషింగ్టన్ డి.సి.కు వెళ్ళతాము. ఈ వేసవిలో ప్రభువు చిత్తమైనయెడల, ఒక పెద్ద గుడారపు కూటము వుంటుంది. అక్కడయున్న వ్యాపారస్తులు వారు ఎంతో ప్రేమతో మొన్నటి రాత్రి మాకు ఒక కబురు పెట్టారు. మేము రిచ్మండ్ లో యున్నప్పుడు, వారు వాషింగ్టన్ డి.సి.లోని వ్యాపారస్తులు. అక్కడ ఒక్క రాత్రి మన కూడిక కొరకు వారు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం నాకు పంపియన్నారు. అది కాంగ్రెసు హాల్లో వుంటుందని నేను నమ్ముచున్నాను, లేక వాషింగ్టన్ లోని ఏదో ఒక హాలుయై యుంటుంది, మళ్ళీ తిరిగి వచ్చి ఒక పెద్ద గుడారపు కూటమును జరిగించమని వారు కోరియున్నారు.

వారు పొందగలిగినట్లైతే, రిచ్మండ్ లోని ఖర్చులను వారు భరిస్తామని వారు చెప్పియున్నారు, ఎందుచేత, దాన్ని గురించి వారు ఏమియు చెప్పలేదు, వారు క్రైస్తవ వ్యాపారులైయున్నందున అది తమకై తాము చెల్లిస్తారు. ఇప్పుడు అది నిజముగా ఎదురుచూచుచున్నది. అయితే ప్రభువు లోనికి వచ్చియున్నాడు, మరియు మేము సమస్త ఖర్చులను చెల్లించియున్నాము, రిచ్మండ్ నుండి మేమంతా చక్కగా బయటకు వెళ్ళియున్నాము. కాబట్టి నేను బహుశా అక్కడకు వెళ్ళుచున్నాను, ఒక కూడిక కొరకు కాదు, కేవలము అలాటి సమయములలో మనతో నిలబడిన ప్రశస్తమైన సహోదరులతో సహవాసం చేయుటకు కేవలం వెళ్ళుదును.

5ఇప్పుడు, రేపు మధ్యాహ్నపు కూటమును నిశ్చయంగా జ్ఞాపకం చేసుకొనండి. అది ఆరంభమౌతుంది, సహోదరుడు సులివాన్ ఇదివరకే దానిని చెప్పియున్నాడని నేను ఊహిస్తాను. అది రెండు గంటలకు మరియు ఆ విధంగా చెప్పాడు, ఆ సమయమునకు, మనము వెళ్ళగలము లేక వెళ్ళలేకపోవచ్చును. గత రాత్రి కొన్ని ప్రార్థనా కార్డులను వారు ఇచ్చియున్నారని నేను నమ్ముచున్నాను, బిల్లీ నాకు చెప్పియున్నాడని నేను నమ్ముతాను, గతరాత్రి వారు "A" నంబరు గల ప్రార్థనా కార్డులను వారు ఇచ్చియున్నారు, మరియు నేను వారిని ప్రార్ధించుట కొరకు పిలుచుటలో ఎంతో ఆలస్యమైనది. నేను చేయగలిగినట్లైతే, ఈ రాత్రి నేను వారిని పిలుచుట కొరకు ప్రయత్నిస్తాను. నేను పిలువని యెడల, నేను వారిని రేపు పిలుస్తాను. మరియు ఆయనను రేపు రమ్మని నేను కోరతాను,

మరియు మధ్యాహ్నం మేము పైకి, పైకి మేము పరుగెత్తుతుంటాము కొంచెం తరువాత మేము చేయవలసియుంటే చేస్తాము. మేము నాలుగు గంటలకు లోనికి వెళ్ళతాము మరియు అయిదు గంటల వరకు కొనసాగుతాము, మేము ప్రతి ఒక్కరి కొరకు ప్రార్ధిస్తాము మరియు తరువాత వారు… మీ యొద్ద ఎవరైనా వ్యాధిగ్రస్తులున్నట్లైతే, నేను వారి కొరకు ప్రార్ధించవలెనని మీరు కోరినట్లైతే, నేను ఒక చాలా వింతైన ఒక అనుభూతిని కొన్ని కార్యముల పట్ల కలిగియున్నాను, కాబట్టి మీరు వారిని రేపు కలిగియుండవచ్చును. మరియు కాబట్టి కొంచెం సమయం తర్వాత, మీరు నా గూర్చి ఇక ఎంత మాత్రము వినరు. కాబట్టి మీ ప్రియుల కొరకు నేను ప్రార్ధించవలెనని మీరు కోరినట్లైతే, అప్పుడు మీరు వారిని రేపు మధ్యాహన్నంలోనికి తీసుకొని రండి. మరియు అప్పుడు వారికి ప్రార్థనా కార్డును ఇద్దాము.

వారు రెండు గంటకు ప్రారంభించినట్లైతే, మీరు కనీసం ఒకటిన్నరకు గాని, ఒకటి నలభై-ఐదుకు గానీ ఇక్కడ వుండుట మంచిది, సహోదరుడు లియో, జెనే మరియు బిల్లీని నేను కలిగియున్నాను. మరియు వారు ఇక్కడకు వచ్చి ప్రజలకు ప్రార్థనా కార్డులను ఇస్తారు, మీలో ఎవ్వరికైననూ ప్రార్థనా కార్డును ఇస్తారు. మేము వారితో పనిచేయు క్రమమును మీరు ఎరిగియున్నారా, రేపు దరిదాపుగా వారికి ప్రార్ధనా కార్డులను ఇస్తాము, కారణము ఎంతమంది వ్యాధిగ్రస్తుల కొరకు మేము ప్రార్ధించవలసియున్నదో - మేము కొంచెం చూచుటకు ప్రయత్నం చేయగోరుచున్నాము.

6ఇప్పుడు, ఏదైనా మనము కొంచెం ముందుకు వెళ్ళుటకు ముందు మన యొక్క గొప్ప రాజ యజమానియైన ప్రభువైన యేసుతో మనం మాట్లాడుదాము, ఆయనయందే మరియు ఆయన అద్భుతమైన కృపయందే మన అనంతమైన విశ్వాసమును మనం కలిగియుందాము. మీతో ఎంతమంది ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకొనబడవలెనని కోరుచున్నారు, కొంచెము మీ చేతిని పైకి ఎత్తుట ద్వారా దానిని తెలియజేయండి. మనము తలలు వంచియుండగా, నా ప్రజలారా ప్రభువు మిమ్మును దీవించును గాక.

మా మిక్కిలి పరిశుద్ధమైన నీతిగల దేవా, మా తండ్రీ, ఈ రాత్రి దీనమైన హృదయములతో మరియు ఆత్మలలో నీ వర్తమానమును స్వీకరించుటకు ఇష్టపడుచూ సిద్ధపడి ఈ రాత్రి నీ సన్నిధిలోనికి మేము వచ్చియున్నాము.

ప్రభువా, అబ్రాహాము మరియు ఆయన తరువాత ఆయన పిల్లల మీద ఈ అధ్యాయమును ముగించుటకు మమ్ములను అభిషేకించమని మిమ్ములను కోరుచున్నాను. రాత్రి వర్తమానమును, వర్తమానికుని, మరియు స్వీకరించువానిని దీవించుమని నేను ప్రార్థన చేయుచున్నాను. నీవే మహిమను పొందుము.

మరియు నీ చిత్తమైనయెడల రోగుల కొరకు ప్రార్ధించెదము, అక్కడ అత్యధికమైన సమృద్ధియైన ఆనందము మరియు శక్తి మా మధ్య ఉండును గాక. రక్షించబడని వారిని రక్షించండి; స్వస్థత పొందని వారిని స్వస్థపరచండి. నీ శక్తి కొరకు మరియు దీవెన కొరకు వెదుకుచున్న వారిని, నీ పరిశుద్దాత్మతో నింపుము. మా అందరికీ కృప అనుగ్రహించుము, కారణం మేము దానిని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

2KGS 2:11•

REV 19:11

 

7బాలురు ఇక్కడ ఒక చిన్న పుస్తకమును బయటకు ఇస్తున్నారని నేను నమ్ముచున్నాను. వారు పిలువబడినారని నా ఆలోచిన. ఓ, అవును వారు "క్రిష్టియన్ బిజినెస్ మెన్స్ వాయిస్." మీలో ఎంతమంది దానిని పొందియున్నారు? అది మంచిది, మీరు దానిని పొందనియెడల, ఈ రాత్రే దానిని పొందండి.

జెనే, బాలురను ద్వారముల యొద్దకు వెళ్ళమని ఎవరికైనా చెప్పమని నేను కోరుచున్నాను, నాకు ఆశ్చర్యంగా వున్నది, వారు ఎటు వెళ్ళిననూ వారు వాటిని ఎంత వెలకు అమ్ముచున్నారు? అవి పది సెంట్లా? మీరు దానిని పొందనియెడల, ఎలాగైనా దానిని తీసుకోండి. నేను దాని కొరకు వెల చెల్లిస్తాను, చూడండి. ఈ సాక్ష్యమును, దర్శనములను మీరు చదువవలెనని నేను కోరుచున్నాను.

ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరు ఒక ప్రతిని పొందవలెనని నేను కోరుచున్నాను మీరు పొందలేనట్లైతే, ఎలాగైనా మీరు దానిని నాకు వెలకట్టండి. మరియు ఈ రాత్రి ప్రతి ఒక్కరు ఒక ప్రతిని నిశ్చయంగా పొందండి. అవి "వాయిస్ ఆఫ్ క్రిష్టియన్ బిజినెస్ మెన్" పత్రికలై యున్నవి. మరియు ఈ మధ్యనే ప్రభువు నాకిచ్చిన దర్శనమును వారు దానిలో వ్రాసియున్నారు, అది నా హృదయమును ఎంతో మండించుచున్నది. వారు అన్నిటిని ఇక్కడ కలిగియుండలేదు.

సహోదరుడు టామీ హిక్స్, లేదా టామీ… నేను ఆ ఎడిటర్ యొక్క పేరును ఆలోచించలేకపోవుచున్నాను. నికోల్స్. నీకు వందనములు సహోదరుడా జెనే. సహోదరుడు టామీ నికోల్స్ దానిని వ్రాసియున్నాడు, కానీ అతడు అక్కడ ఉన్న అన్నింటినీ అతడు ఉంచలేదు, కానీ…

నేను నా కుక్కను చూచుటకు గూర్చి మరియు నా గుర్రము నా యొద్దకు వచ్చుటను గూర్చి అతడు ఎన్నడూ వాటిని అక్కడ యుంచలేదు. అతడు దానిని అక్కడ వుంచాడని నేను అనుకొనను, చూడండి. ఆ రాజ్యంలో జంతువులు వుండుటను గూర్చి ప్రజలు ఆలోచించినప్పుడు, అది వారిమద్య ప్రశ్నించబడుతుందని నేననుకుంటాను. అయితే అవి అక్కడయున్నవి.

ఏలియాను తీసుకొచ్చిన గుర్రములు ఎక్కడ నుండి వచ్చినవి? యేసు పరలోకపు సేనలతో స్వారీ చేయుచు వచ్చుచున్న ఆ గుర్రములు ఎక్కడ వున్నవి? చూడండి. తోడేలు మరియు గొర్రెపిల్ల కలసి ఎక్కడ భుజింపబోవుచున్నవి? చూడండి. నిశ్చయముగా, మీరు దానిని ఆలోచించండి… మనకు కేవలము మన పెంపుడు ఆలోచనలను కలిగియున్నాము, మరియు అది అతకనియెడల అప్పుడు మనము దానిలో చేయునది ఏమియులేదు. అది కేవలము ఇబ్బంది అయి యున్నది. కాని, ఏమైనను, అది పరవాలేదు. తగినంతగా అవి అక్కడయున్నవి.

EPH 3:20

 

8మరియు క్రింద భాగంలో మీరు గమనించినట్లైతే అదివున్నది… ఆ చిన్న అదనముగా చేర్చిన మధ్యపేజీ అడుగుభాగమున, ఒక మృతుడు లేపబడుటను గూర్చి మీరు చదివియున్నారా? ఇప్పుడు గుర్తుంచుకోండి, మీరు దేనినైనా ప్రచురించుటకు ముందు మీరు దానిని సత్యమని ఋజువు చేయవలసియున్నది. కాబట్టి డాక్టర్ల యొద్ద నుండి, మేయర్ల యొద్ద నుండి మనము వారి యొక్క వాంగ్మూలపు పత్రమును కలిగియున్నాము. అదేమనగా, డాక్టరు - వారు చనిపోయియున్నారని ఉచ్చరించియున్నాడు. మరియు ఎనిమిది లేక పది గంటల తరువాత వారు ప్రార్ధన ద్వారా తిరిగి బ్రతికించబడినారని వారు ఒప్పుకొన్నారు. కాబట్టి అది ఒక లిఖిత పూర్వకమైన వాంగ్మూలమైయున్నది. ఈ పుస్తకము వివిధమైన భాషలలోనికి అనువదించబడి, ప్రపంచమంతా వెళుతుంది. అది క్రైస్తవ ప్రజల మధ్య ఉన్న "రీడర్స్ డైజస్ట్" వలె యున్నది. మరియు నీవు వాటిని గూర్చి చెప్పినప్పుడు, అవి సత్యమని అధికారపూర్వకంగా ఋజువు చేయబడవలసియున్నది, నీవు ఒక….

కాబట్టి మూడు సంవత్సరాల క్రితం మెక్సికో పట్టణంలో అతడు దానిని వ్రాయుటకు ముందే వారు దానిని ఋజువు చేయవలసియుండిరి, నేను అక్కడయున్నప్పుడే ఆ చిన్న స్పానిష్ స్త్రీ ఆ ఉదయము తొమ్మిది గంటలకు మృతి చెందిన తన బిడ్డను ప్రభువు తిరిగి లేపాడు, మరియు ఆ చిన్న బిడ్డ దుప్పటి కాళ్ళతో తన్నుచుండెను.

ఇంచుమించు ముప్పైవేల మంది ప్రజలు ఒకరి మీద ఒకరు ఆనుకొని ఆ ఉదయము నుండి ఆ దినమంతయు వర్షంలో సువార్త వినుటకు నిలబడియుండిరి. కాబట్టి ప్రజలు ఆ విధముగా… ప్రజలు ఆ విధముగా ఏకముగా కూడి వచ్చి నమ్ముచూ, వారి హృదయములు దేవుని ముందు తగ్గించుకొనుచూ మరియు నమ్మినప్పుడు, దేవుడు ఆలాటి ప్రజల కొరకు అత్యధికమైన సమృద్ధితో కార్యములను చేస్తాడు.

9ఇప్పుడు, గత రాత్రి నేను చదివిన అదే లేఖనమును తిరిగి నేను చదువుగోరుచున్నాను, కారణము ఆ అంశమును నేను ముగించగోరుచున్నాను. మరియు ఈ రాత్రి మనము ఇక్కడ ఎక్కువ సేపు వేచియుండము. ఇప్పుడు వున్న సందర్శకులైన మీరు, సహోదరుడు సులివాన్ సంఘ కాపరిగా పనిచేయుచున్న సంపూర్ణ సువార్త ఆలయము ఎక్కడ వున్నదో మీకు తెలుసా? మంచిది. రేపు ఉదయమున వెళ్ళుటకు అది ఒక మంచి స్థలమై యున్నది. మీతో ఎవరైనా ఈ ఇతర సంపూర్ణ సువార్త ఆలయములకు ఈ చుట్టూ మీరు దగ్గరలో యున్నారా? మీరు వెళ్ళి దేవుని వాక్యమును వినుటకు అది ఒక మంచి స్థలమైయున్నది. కావున ఇప్పుడు ఆదివారపుబడి ఎక్కడైనా హాజరుకండి. కేవలము నిలిచి, మరియు మీకు ఇవ్వబడిన పనిని నిర్వర్తించండి.

GEN 22:14

 

10మరియు ఇప్పుడు నేను ఆదికాండం 22వ అధ్యాయము 14వ వచనము నుండి చదువుచున్నాని నమ్ముచున్నాను:

"అబ్రాహాము ఆ చోటికి యెహోవా-యీరే అను పేరు పెట్టెను. అందుచేత "యెహోవా పర్వతము మీద చూచుకొనును" అని నేటి వరకు చెప్పబడును."

నేను ఈ లేఖనమును చదివిన కారణమేమనగా, నేను చెప్పినది ఏదైనా ప్రభావం చూపనియెడల, నిశ్చయంగా ఆయన చెప్పినది ఏదైనా ప్రభావం చూపును. నా మాట ఒక మనుష్యుని యొక్క మాటయై యున్నది. అది తప్పిపోతుంది. దేవుని యొక్క మాట ఆయన స్వంత మాటయైయున్నది, మరియు ఆయన ఎన్నడూ తప్పిపోడు. "యెహావా-యీరే" అనగా, భావము "యెహోవా ఒక బలియర్పణను తనకొరకు తాను సమకూర్చుకొనెను."

ఇప్పుడు, గతరాత్రి… దాని మీద గతరాత్రి పాఠము మీరు ఆనందించియున్నారా? నా కుమారుడు, బిల్లీ, కట్టడం యొక్క వెనుక భాగములో యున్నాడు (ఆ వెనుక అతడు బాగా వినగలడో లేదో చూచుటకు వెనుకకు వెళ్ళియున్నాడు,) అతడు అన్నాడు ఆ వెనుక చాలా అస్పష్టంగా వినబడుచున్నదని చెప్పాడు, వెనుక మీరు బాగుగా వినలేరు, మీకు తెలుసా. కాబట్టి ఆ కారణంచేత బోధించుటకు బదులుగా కొంచెంసేపు వాక్యమును గూర్చి దయగా నేను మాట్లాడాలని నేను తలంచియున్నాను, బహుశా మీరు కొంచెం బాగుగా వినగలరు.

చూడండి, ఇలాటి ఆయుధాగారములు, చదునైన కట్టడములు, ఇలాటి కూటముల కొరకు తయారు చేయబడలేదు, అవి బాస్కెట్ బాల్ ఆటల కొరకు మరియు తర్ఫీదు కొరకు యున్నవి. సీలింగ్ సరిగా వేయబడలేదు, ధ్వనులు చాలా హీనముగా యున్నవి. కాని అమెరికా దేశము యొక్క సైన్యము కొరకు మనము కృతజ్ఞలమైయున్నాము, కారణము ఈ రాత్రి ఈ స్థలములోనికి వచ్చి మన మీద ఒక నివాసమును కలిగియుండే ఆధిక్యతను మనము కలిగియున్నాము, ఎంతో దయతో వారికి మనము కృతజ్ఞతను ఇచ్చుచున్నాము. ప్రభువు వారిని ఎల్లప్పుడు దీవించును గాక.

11ఇప్పుడు, గతరాత్రి మనము అబ్రాహామును మరియు ఆయన ఆయన సంతానమును మనము తీసుకొన్నాము. ఓ, ఎలాటి దీవెనను మనము తప్పక చూపవలసియున్నది. మరియు నాకైతే, దేవుడు ఏమి వాగ్దానము చేసియున్నాడో మరియు తరువాత ఆయన ఏమి చేసియున్నాడో నీవు చూసినప్పుడు, ఎవరైనా ఏ విధముగానైనా ఒక్క అనుమానపు అవకాశమును ఎలా కలిగియుండగలరు. అది కేవలము బైబిలు చదువుటవలె యున్నది, ఏదో జరుగుతుందని అది ముందుగా చెప్పినప్పుడు, తరువాత నీవు చరిత్రను తీసుకొని మరియు అది ఎక్కడ సంభవించియున్నదో చూడుము.

ఇప్పుడు, దేవుడు అబ్రాహాము మీద మరియు అతని తరువాత సంతానము మీద ఈ దీవెనను దీవిస్తానని దేవుడు చెప్పియున్నాడు. మరియు అతని ప్రతిదశలో దేవుడు ఆయనను ఖచ్చితముగా దర్శించినట్లు మనము కనుగొంటాము, ఆయన అబ్రాహాము యొక్క సంతానమునకు అతని తరువాత అదే కార్యమును చేసియున్నాడు.

1COR 10:11

 

12తరువాత నిన్న రాత్రి మనలను ఎక్కడ కనుగొన్నాము, సోదరులారా? మార్గము యొక్క చిట్టచివరిలో మనలను మనము కనుగొన్నాము, తిన్నగా ఆఖరి విషయము నొద్ద, మరియు సంఘము తన యొక్క చివరి సూచనను అందుకొనుచున్నది.

మరియు తరువాత దానినంతయూ దీవించుటకు, గతరాత్రి ఆయన మన మధ్యకు వచ్చియున్నాడు, మరియు జనసమూహముగుండా వెళ్ళియున్నాడు, మరియు సొదొమ నొద్ద చేసిన అదే కార్యమును చేసియున్నాడు. ఇక జారిపోవుట ఎక్కడ వుంటుంది? మనము ఎక్కడ తప్పులో యుంటాము?

మరియు ఆ రాత్రికి ముందు, మనము (ఇశ్రాయేలును) సంఘమును అరణ్యము నొద్ద ఖచ్చితముగా తీసుకొని చూపించియున్నాము. 1 కొరింధీ 10వ అధ్యాయములో మనము కనుగొంటాము, మనకు మాధిరులుగా ఉండుట కొరకే ఈ కార్యములన్నియు ఇశ్రాయేలుకు సంభవంచియున్నవని అది చెప్పినది. ఆయన సహజముగా ఏమి చేసియున్నాడో, ఆత్మ సంబంధముగా ఆయన ఇప్పుడు చేయుచున్నాడు.

REV 12:1

 

13బైబిలులోని ప్రకటన 12 అధ్యాయములో యున్న స్త్రీని మీరు గమనించండి, ప్రకటన 12 అధ్యాయములో, సూర్యుని ధరించిన స్త్రీ తన పాదముల క్రింద చంద్రుని కలిగియున్నది, అది ధర్మశాస్త్రము వెలిసిపోవుటను చూపుచున్నది. సూర్యుడు ఉదయించిన వెంటనే, చంద్రుడు క్రిందికి దిగిపోతాడు. చంద్రుడు సూర్యునికి భార్యవలె యున్నాడు. ఓ, ఆ విధమైన బైబిలు పఠనమును నేను ప్రేమిస్తాను. చూడండి, సూర్యుడు మరియు చంద్రుడు, క్రీస్తు మరియు ఆయన సంఘమునకు మాదిరిగా యున్నారు. సూర్యుడు అస్తమించగానే, కనుమరుగుకాగానే, అది క్రింద లేదు కాని అది లోకము నుండి మరుగుగాయున్నది. అది లేని సమయములో అది తిరిగి తన వెలుగును చంద్రుని మీద ప్రతిబింబిస్తుంది.

కాబట్టి ఆయన మహిమలోనికి వెళ్ళినప్పుడు దానినే క్రీస్తు చేసియున్నాడు. ఆయన తిరిగి వచ్చువరకు తన వెలుగును తిరిగి సంఘము మీద ప్రతిబింబిస్తాడు. ఓ, మై, ఆ సూర్యుని గురించి ఆలోచించుట, మీరు కోరినట్లయితే… వెలుగును చూపుటకు దానియొక్క జీవమును చంద్రుని మీద ప్రతిబింబించుచున్నది.

LUKE 21:25,26•

2TIM 3:4,5

 

14చంద్రుడు కూడా దానికై అది కావలికాయు కుక్కవలే యున్నది. దేవుడు సముద్రము యొక్క సరిహద్దులను నియమించి మరియు దానిని కాయుటకు చంద్రుని ఉంచియున్నాడు. మరియు సముద్రము, అది ఎంత కోపముతో ఒడులకు ఎగిరినప్పటికి, అది భూమి మీదనున్న సమస్తమును నాశనము చేయునట్లుగా ఉన్నది, ఏలయనగా అది ఒకసారి నాశనము చేసియున్నది, మీకు తెలుసా. మరియు పాపము కుప్పగా వేయబడుటను చూచుట. అలలు, ఆ పెద్ద అలలు ఒడ్డులకు ఎదురుగా కొట్టుచుండును.

మరియు గుర్తుంచుకొనండి, అంత్యదినములలో సముద్రము యొక్క అలలు ఉప్పెనవలె పైకి లేచునని ముందుగా చెప్పబడినది, సముద్రతరంగముల ఘోష, మనుషుల యొక్క హృదయములు కలవరపడుట, భీతి, శ్రమ, దేశములు కలవరపడుట. అది అంత్యకాలములోని సూచనలుగా ఉంటాయి. మార్గము వెంబడి క్రిందకు వాటన్నింటి గుండా మనము వెళ్ళియున్నాము.

ఇప్పుడు, మనము ఇక్కడ ఉన్నాము, తిన్నగా అబ్రాహాము యొక్క పిల్లలకు చివరి సూచన పైకి వచ్చియున్నాము, మరియు అబ్రాహాము యొక్క కాలములో సరిగ్గా యున్నట్లుగా, వర్తమానికుల యొక్క పేర్లు సహితములోనికి తేబడినవి. ఎక్కడ ఏ తప్పు, లేదని చూపుతుంది. బైబిలు: "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," మరియు అప్పుడు సంఘము మృతమైనదిగా కూర్చొనియున్నది. బంతి ఆటలు, పట్టణము యొక్క ఆకర్షణలు, మరియు లోక కార్యములు సంఘమునకు ఎరచూపి ఆకర్షించుచున్నవి.

వారు "మూర్ఖులు, గర్వాంధులు దేవునికంటే సుఖానుభావము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె" అని బైబిల్ చెప్పెను. హోటల్ గదులలో తప్పత్రాగువారు, కనీసము నీవక్కడ నిద్రపోలేవు. వారు ఆదివారముబడి ఉపాధ్యాయులు, సంఘమునకు వెళ్ళే ప్రజలు, సంఘసభ్యులు, ఒక చిన్న పాపాత్మకమైన అమెరికా తమాషాను వారు కలిగియుంటారు. ఓ, ఈ పాత లోకము ఒక ఉదయమున ఒక ఇంటి నుండి తప్పత్రాగి తూలుచూ ఉన్న ఒక మనిషి వలె ఉన్నది.

EZEK 9:4

 

15ఈ సూచనలన్నియు ఆ రీతిగా సొదొమా దినములవలే ప్రారంభమైనప్పుడు ఏమి జరుగును? అర్థనగ్నముగాయున్న స్త్రీలు, పురుషులు హోటల్ గదులుగుండా త్రాగి, ఒకరి వెంబడి ఒకరు పరుగులు తీయుట. అది ఎక్కడో కాదు, అది ఇక్కడే యున్నది. మరియు తరువాత ఏమి జరిగినది? దేవుడన్నాడు, "ఈ సంఘటనలన్నియు సత్యమా కాదా అని కనుగొనుటకు నేను దిగివచ్చియున్నాను."

"ప్రభువైన యేసు, రమ్ము," అని నిజమైన పిల్లలు మొర్రపెట్టుచున్నారు. బహుశా ఒక పట్టణములో ఒకరు. గతరాత్రి మనము అడుగుచుండగా, పరిశుద్దాత్మ బైబిల్ మనకు చెప్పియున్నట్లుగా, కేవలము పట్టణములో "ముద్రించబడినవారు మాత్రమే పట్టణములోని హేయ కృత్యములపట్ల మూలుగులిడుచూ మొర్రపెట్టుచున్నారు." వారు ఎక్కడ ముద్రించబడతారు? ప్రజలు ముద్రించబడుట ఎక్కడ?

మనము మోసపోకుండా ఉందుము గాక. మనము సరిగా ఉందాము.

16ఒకసారి ఆ వృద్ధ డార్కి చెప్పియున్నట్లుగా, "నేను ప్రభువుతో చెప్పియున్నాను మరల ఇప్పుడు దానినే తిరిగి నేనాయనతో మాట్లాడగోరుచున్నాను, కారణము ఆ నది యొద్ద ఏ విధమైన ఇబ్బంది నాకిష్టంలేదు." నీవు ఏ ఘడియలో ఆ నది యొద్దకు వచ్చుచున్నావో మరొక 15 నిమిషములలో నీవు ఆ నది యొద్ద ఉండవచ్చు. ఈ పగటి వెలుగునకు ముందే బహుశ నీవక్కడ ఉంచవచ్చు, కాని అక్కడ నిశ్చయముగా అక్కడ ఒక సంగతియున్నది: నీవు దానియొద్దకు వచ్చుచున్నావు. కాబట్టి నీవు ఇప్పుడు నిశ్చయించుకొనుట మంచిది.

దేవుడు ఈ కార్యములను బహిరంగ ప్రదర్శనల కొరకు, ఏదో ఒక ఆట కొరకు దేవుడు వాటిని చేయడు. ఆయన మహిమ కొరకు, ఆయన గౌరవము కొరకు ఆయన దీన్ని చేస్తాడు, ఏలయనగా ఆయన దానిని చేయుదునని వాగ్దానము చేసియున్నాడు. అందుచేత మనము దానిని తేలికగా తీసుకొనక; గౌరవముగా, చాలా జాగ్రత్తగా, మరియు దీనముగా తీసుకొందాము. "ఇమ్మానుయేలు యొక్క రక్తనాళముల నుండి తీయబడిన రక్తముతో నింపబడిన ఊట యొద్దకు వద్దాము." మీ పాపములను మరియు అవిశ్వాసమును ఒప్పుకొనండి. ఒక పాపివైన నీపై దేవుడు కనికరమును చూపి, క్రీస్తు నిమిత్తము నిన్ను రక్షించమని దేవుని అడగండి.

JOHN 8:44

 

17కొన్నిసార్లు ప్రజలు సంఘమునకు వెళ్ళి, వారు ఇలా అంటారు, "నేను అది అడుగవలసిన పనిలేదు. నేను ఇదివరకే అడిగియున్నారు…" ఓ, స్నేహితుడా, నీ జీవితమును పరీక్షించుకొనుము! నీ విశ్వాసము వాక్యముతో ఎలా నమోదు చేయబడినదో చూడుము.

గుర్తుంచుకొనండి, ఆ పరిసయ్యులు వారికి రక్షణ అవసరమని వారు తలంచలేదు. వారు ప్రతిష్టించబడిన మనుషులు, వారు పరిశుద్ధముగా ఉండియున్నారు, వారు సేవకులైయున్నారు. వారి తండ్రులు సేవకులైయున్నరు, వారి తాతలు, వారి ముత్తాతలు వారి ముత్తాతలు వారందరు సేవకులైయున్నారు. వారు ఎలాంటి జీవితము జీవించియుండిరనగా, వారికి వ్యతిరేఖముగా ఒక చిన్న పొరపాటున్నట్లైతే దానిని బట్టి వారు రాళ్ళతో కొట్టి చంపబడతారు. లేఖనములను ఎరిగియున్నారు! పరిపూర్ణముగా వాటిని ఎరిగియున్నారు. యేసు చెప్పెను, "మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు."

MARK 3:22

 

18దేవునిని గమనించండి. ఆయన వారికి మెస్సియా యొక్క సూచనను వారికి చూపించుచుండెను మరియు వారు దానిని నమ్మలేదు. "ఆయన ఒక బయల్జేబూబ్ అని, ఒక జాతకము చెప్పువాడని" వారు అన్నారు. వారు చురుకైనవారుగా మరియు చదువుకొన్నవారుగా ఉన్నారు, మరియు ప్రత్యేకించబడిన జీవితములను వారు జీవించుచుండిరి, ఇంకను వారు పాపులైయున్నారు. ఎందుచేత? వారు వ్యభిచరించలేదు, వారు సిగరెట్లు కాల్చలేదు, వారు త్రాగలేదు, వారు డాన్సులకు వెళ్ళలేదు, వారు పేకాట ఆడలేదు. అయితే వారు అవిశ్వసి౦చిరి! ఆ కారణమునుబట్టియే వారు పాపులైయున్నారు.

ఆ కారణముబట్టియే ఈ దినమున నేను పెంతికొస్తు వారిని గురిపెట్టి కొట్టుచున్నాను. నీవు ఆత్మతో ఎంతగా నాట్యమాడినా మరియు భాషలతో మాట్లాడినా… నేను దాన్ని నమ్ముతాను; ఒక ఎండిపోయిన ఆవుతోలుపై నీవు బఠాణీలను క్రుమ్మరించినట్లుగా, భాషలతో మాట్లాడినా గానీ, నీవు ఇంకనూ నశించినవాడవే! నిజము నీవు దాన్ని పొందలేదు.

మాంత్రికులు భాషలలో మాట్లాడుట, ఆత్మలో నాట్యము చేయుట, ఒక మానవ పుర్రెలో నుండి రక్తము త్రాగుట, దెయ్యమును పిలుచుట, ఆత్మలో నాట్యము చేయుచు భాషలలో మాట్లాడుట, మరియు వారు అరవగలిగినంత బిగ్గరగా అరచుట నేను చూచియున్నాను. నిశ్చయముగా. నీవు దానిని బట్టి వెళ్ళలేవు.

MATT 24:37•

LUKE 17:26

 

19నీవు ఇంకను దేవుని వాక్యమును అవిశ్వసించినట్లయితే, అది వ్రాయబడియున్న విధముగా — నీవొక అవిశ్వాసివైయున్నావు, ఒక పాపివి. దేవుడు క్రిందకు దిగివచ్చి ఆయన యొక్క వాక్యమును నెరవేర్చును, మరియు దాన్ని ప్రత్యక్షపరచి — అక్కడ ఎవరును దానికి వ్యతిరేకముగా నిలువకుండా దానిని అక్షరము వెంబడి అక్షరమును చూపును. దేవుడు తనకుతానే దానికొరకు నిలబడును. అప్పుడు వారు ఏదో ఆచార కారణమును బట్టి దూరముగా నడచి వెళ్ళతారు. ఆశ్చర్యములేదు మనము దుర్భర స్థితిలో ఉన్నాము.

అయితే నీవు దానిని ఆపగలవా? మొన్నటి దినమున ఎవరో నాతో అన్నారు, "నీవు దానిని ఆపగలవా?"

నేనన్నాను, "లేదండి."

అతడన్నాడు, "మంచిది, నీవు ఎందుకు మౌనముగా వుండవు?"

నేనన్నాను, "నేను ఎలా మౌనముగా ఉండగలను? నేను తీర్పు నొద్దకు వచ్చుచున్నాను. మరియు నా స్వరము అక్కడ రికార్డు మీద యున్నది మరియు అది ఈ తరమునంతయూ విచారించును. నేను మౌనముగా యుండలేను. నేను మౌనముగా యున్నట్లైతే, నాకు శ్రమ.

నేనన్నాను, "నీవు పాపము చేయుటను నమ్ముతావా?"

"లేదు," అని అతడన్నాడు.

నేనన్నాను, "మంచిది, నీవు ఎందుకు దానికి విరోధముగా బోధచేయుచున్నావు? ప్రపంచము గందరగోళములోనికి వెళ్ళబోవుచున్నదని నీవు ఎరిగియున్నట్లైతే, నీవు ఇంకనూ ఎందుకు బోధచేయుచున్నావు? దానికి వ్యతిరేఖముగా మనము తప్పక ఒక స్వరమును ఇవ్వవలసియున్నది! తప్పక చేయవలసియున్నది. సత్యము తప్పక తెలియపరచబడవలెను."

దేవుడు నీతిమంతుడైయున్నాడు. ఆయన తన హెచ్చరికను ఇచ్చును. వారులోనికి వచ్చుటలేదని తెలిసి కూడా నోవహు ఎందుకు ద్వారమునొద్ద నిలబడి బోధచేయుచుండెను? తన ఇంటివారి రక్షణ కొరకు అతడు ఓడను సిద్ధపరచుకొనెను. అది అదే అయి యున్నది. కాని అతడు అదేరీతిగా తిన్నగా వర్తమానమును ఇవ్వవలసియుండెను. దేవుడు నీతిమంతుడైయున్నాడు. వారులోనికి రారని దేవుడు ఎరిగియుండెను. ఈ చివరి దినములలో ఈ చివరి తరమును ఆయన సరిగ్గా ఎరిగియున్నట్లుగా, నోవహు దినములలో సరిగా ఎనిమిది ఆత్మలు రక్షించబడునని ఆయన ఖచ్చితముగా ఎరిగియుండెను. ఎవరు ఇష్టపడతారో మరియు ఎవరు ఇష్టపడరో ఆయన ఎరిగియుండెను. అయితే దానిని ఆయన ఎరిగియుండెను. ఆ కారణమును బట్టియే ఆయన చెప్పియున్నాడు, "నోవహు దినములలో జరిగియున్నట్లుగా, మనుష్యకుమారుని రాకడలోనూ జరుగును," చూచారా.

మనము అయోగ్యమైన కాలములో జీవించుచున్నామని మనము ఎరిగియున్నాము, కాని మనము కర్తవ్యము… నీ హృదయము మొర్రపెడుతుంది. నీవు నెమ్మదిగా ఉండలేవు; నీవు తప్పక దానిని చెప్పవలసియున్నది.

MAL 4:5•

REV 11:4,6

 

20ఇప్పుడు. అతని సంతానమునకు చూపుచూ, ఆయన అబ్రాహామును ఏమి చేసియున్నాడో గమనించండి. అప్పుడు మీరు ఒక గ్రహింపును కలిగి యుంటారు. ఈ కార్యములు పెద్ద నాడీ కేంద్రములకు వెళ్ళవు. ఇక్కడయున్న ప్రజలు… నేను కలుసుకొనే ప్రజలలో అధిక సంఖ్యాకులు, ఏదో ఒక గొప్ప ప్రపంచవ్యాప్తముగా తుడిచిపెట్టు ఒక ఉజ్జీవము కొరకు ఎదురుచూస్తున్న వారే. అది ఇదివరకే జరిగిపోయినది. మనము అంతములో యున్నాము. మీరు గొప్ప సూచక క్రియలు మరియు అద్భుతముల కొరకు ఎదురు చూస్తున్నారు? కారణము ఏమనగా, వారికి బైబిలు తెలియనందునే. ప్రకటన 11వ అధ్యాయములోని ఇద్దరు ప్రవక్తలు సూర్యుని మూసివేయబోవుచున్నారు. ఏలీయా మరియు… లేక మోషే మరియు ఏలీయాలు. అది అన్యుల సంఘము వెళ్ళిపోవుట ముగించబడిన తరువాత జరుగును. అది నిజము.

చూడండి, అది యూదులకు, దేవుడు మరలా యూదుల వైపుకు తిరిగినప్పుడు. ఈ సంఘ కాలము, ప్రకటన 1 నుండి 3వ అధ్యాయము వరకు చదవండి, అప్పుడు మీరు దానిని తెలుసుకొంటారు. ఆయన సంఘ కాలమునకు ఏమి ఇచ్చుచున్నాడో కొంచెము చూడండి, అదే వారిని బయటకు పిలచుట, చివరి సూచన ఏమనగా, రంగము మీద ఏలీయా యొక్క అతి తీవ్రమైన ఆగ్రహము, చివరిలో అంత్యకాలము. మరియు మనకు అది తెలుసు, ఆయన చెప్పిన సమస్తము నేరుగా ఆయన చెప్పిన విధానములోనే యుంటుంది.

GEN 15:6•

ROM 4:3•

JAS 2:23

 

21ఇప్పుడు, మనము కనుగొనునది ఏమనగా, ఆదికాండము 3వ … లేక ఆదికాండము 12వ అధ్యాయములో ఆయన అతనిని పిలిచియున్నాడు, మరియు విశ్వాసము ద్వారా నీతిమంతునిగా తీర్చియున్నాడు, కారణము అబ్రాహాము దేవుని నమ్మియున్నాడు. అది నిజమేనా?

ఇప్పుడు, నేను దానిని చెప్పను… మీ మధ్య మరలా తిరిగి నేను దానిని ఉదహరించగోరుటలేదు, అయితే మీరు చూడండి, బైబిలులోని సమస్తము మూడులో ప్రయాణిస్తుంది — ఒక మూడు, ఒకటిని చేస్తుంది. ఇప్పుడు, బైబిలులో ఉన్నట్లుగా, అది ఇక్కడ వ్రాయబడినది….

మీకు తెలుసా, దేవుడు మూడు బైబిల్ లను వ్రాసియున్నాడు. మీరు దానిని నమ్ముతారా? ఆయన ఒకటి ఆకాశములో వ్రాసియున్నాడు, ఓకటి పిరమిడ్లో వ్రాసియున్నాడు, మరొకటి కాగితము మీద వ్రాసియున్నాడు. పిరమిడ్ నుండి వారు ఔజా బోర్డును (Ouija board) తయారు చేస్తారు. వారు రాశి చక్రము నుండి ఔజా బోర్డును తయారు చేస్తారు. వారు బైబిలు నుండి ఔజా బోర్డును తయారు చేస్తారు. కాని వారు దాని సత్యమును ఆటంకపరచలేరు. వాటి సత్యములు ఖచ్చితముగా ఒకే మాదిరిగా యున్నవి.

22ఇప్పుడు, మీరు రాశి చక్రములో గమనించియున్నట్లైతే, రాశి చక్రములో మొదటి రూపము ఏమిటి? అది కన్యక. రాశి చక్రములోని చివరి రూపము ఏమిటి? సింహము. క్రీస్తు యొక్క మొదటి రాకడ మరియు రెండవ రాకడ. ఆయన మొదట కన్యక ద్వారా వస్తాడు; తరువాత, యూదా గోత్రపు సింహముగా వస్తాడు. అప్పుడు అడ్డముగా యున్న చేపలు, అది ఇప్పుడు మనము యున్న కాన్సర్ యుగము, సరిగ్గా ఆ సమయమునకు ముందుగా సంభవించునది.

మనము పిరమిడ్ ను గమనిస్తాము. అది ఈ రీతిగా నిర్మించబడినది. అయితే మీరు గమనించండి, తలరాయి ఎన్నడూ పిరమిడ్ మీద ఉంచబడలేదు. మీరు ఎన్నడైనా దానిని తలంచియున్నారా? మీరు మీ జేబులో ఒక డాలరు నోటును కలిగి యున్నారా? అది ఏమి చెపుతుందో చూడండి: గొప్ప ముద్ర, పిరమిడ్ మరియు దానిపైన చూడండి, రాయి, తలరాయి. ఎన్నడూ కనుగొనబడలేదు. ఎందుచేత? తలరాయి తిరస్కరించబడినది — క్రీస్తు.

23లూధర్ కాలమువైపు చూడండి, నీతీకరణము. ఇక్కడ సమృద్ధిగా స్థలమున్నది. నీవు కేవలము క్రీస్తును ఒప్పుకొన్నట్లైతే, నీ తల నరికివేయబడుతుంది. నీవు విగ్రహారాధన నుండి బయటకు వచ్చినప్పుడు, నీ తల తీసివేయబడుతుంది. నీవు క్రైస్తవుడవని (లూధర్) చెప్పిన సాక్ష్యమును బట్టే నీకు తీర్పు తీర్చబడుతుంది. అప్పుడు అది ఏమి చేసినది? అది అల్ప-సంఖ్యకు పోగై వచ్చుచున్నది, అతి దగ్గరగా వస్తున్నది. దాని తరువాత ఏమిటి? శుద్దీకరణము. అప్పుడు నీవు ఒక పిచ్చివానిగా పిలవబడ్డావు, పరిశుద్ధ గుండ్రాయి, లేక మరేదోగా పిలువబడ్డారు. అది వెస్లీ యొక్క యుగమైయున్నది. ఆ తరువాత ఏమి జరిగినది? తరువాత పెంతేకొస్తు వచ్చినది, పరిశుద్దాత్మ యొక్క బాప్తిస్మము, మరియు ఇంకనూ సంఘము అతి చిన్నగా, అల్ప-సంఖ్యలోనికి వచ్చియున్నది.

మరియు ఇప్పుడు, అది ఇంక ముందుకు వెళుతూ, ఎలాటి పరిపూర్ణమైన స్థానమునకు వెళ్ళచున్నదంటే, చివరకు ముగింపులో — తలరాయి వచ్చినప్పుడు, అది ఎంతో పరిపూర్ణంగా అమర్చబడును… సంఘము ఎంత పరిపూర్ణమైన స్థితిలో ఉండుననగా, చివరకు క్రీస్తు వచ్చినప్పుడు - ఆయన తిన్నగా దానిలోనికి అమర్చబడతాడు. అది నిజము.

కాబట్టి మీరు చూడండి, కేవలము భాషలతో మాట్లాడుట మరియు ఆత్మలో నాట్యము చేయుట, అది ఇంకను క్రింద మార్గములో యున్నది. సంఘము…

మరియు గుర్తుంచుకోండి, (నీవు ఎన్నడైనా ఐగుప్తులోని పిరమిడ్లు దగ్గర అడుగుభాగమున వెళ్ళినట్లయితే), ఆ రాళ్ళు, గాలిలో అవి ఒకదానిపై ఒకటి ఉంచబడినవి, అవి వందల కొలది టన్నుల బరువైనది, మరియు ఎంతో పరిపూర్ణముగా ఒకదానితో ఒకటి జతచేయబడినవి, చివరకు నీవు కనీసము ఒక రేజరు బ్లేడును కూడ వాటి మధ్యలో ఉంచలేవు. ఒక పరిపూర్ణమైన స్థితిలోనికి సానపెట్టబడినవి, చివరకు సిమెంటు లేకుండానే అవి పరిపూర్ణముగా అమర్చబడినవి.

ఆ విధానములోనే సంఘము ఉండబోవుచున్నది, ఎంతగానో సానపెట్టబడినది — వాక్యము సంఘమును సానపెట్టుచున్నది — చివరకు క్రీస్తు సంఘమును తీసుకొని వెళ్ళుటకు వచ్చినప్పుడు, సంఘము యొక్క పరిచర్య దాని పైకి కొనిపోయి, మరియు లూధర్, వెస్లీ మరియు పెంతికొస్తు వారందరిని దానితో కూడా వెళ్ళుటకు కొనిపోవును. అది నిజము, సంఘమును పైకి కొనిపోవుటకు.

GEN 17:1,5•

MATT 17:2•

MARK 9:2,3•

LUKE 9:29

 

24ఇప్పుడు, ఆయన అబ్రాహాము యొక్క సంతానమునాకు ఏమి చేసియున్నాడో మనము నీతీకరణములో కనుగొన్నాము. అది లూథర్ తో ప్రారంభమైనది. శుద్దీకరణము, 15వ అధ్యాయము, రక్తము ద్వారా ఆయన నిబంధన రూఢిపరచునప్పుడు; 17వ అధ్యాయములో ఆయన పరిశుద్ధాత్మను ఇచ్చియున్నాడు, అదే పెంతికొస్తు యుగము.

కారణము మీరు చూడండి, ఆ ఇతర అంశాలన్నియు సంఘము ఆయన నుండి పొందిన వాటికి కొంత బయటనున్నవి - అబ్రాహాము ఆయన నుండి పొందిన వాటినుండి. అయితే ఆయన, "నేను ఎల్ షద్దాయిను [స్థనము]," అని చెప్పినప్పుడు, దేవుని యొక్క స్థనము నుండి తన బలమును పొందవలసినదిగా ఆయన అబ్రాహామును ఆహ్వానించుచున్నాడు, దేవుని యొక్క జీవమును తనలోనికి లాగు కొనుట — అది దేవుని యొక్క జీవమును రుచి చూసినప్పుడు, పరిశుద్దాత్మ బాప్తిస్మమును అది దానికై అది లాగుకొనినప్పుడు, అప్పుడే సంఘము పరిశుద్దాత్మను పొందియున్నది.

తరువాత ఆయన ఏమి చేసియున్నాడు? అదే తలంపును మనము నిన్న రాత్రి సరిగ్గా లేఖనానుసారముగా మనము ఋజువు చేసియున్నాము, దేవుడు తన సొంత చట్టములను తిరస్కరించలేడు. ఆ కారణమును బట్టియే, ఆది మత్తయి 17 ఆయన తన సొంత కుమారుని తీసుకొని, ఆయనను రూపాంతర కొండమీదకు తీసుకొని వెళ్ళి, తన చట్టము చెప్పియున్నట్లుగా, ఆయనను తగిన స్థానములో యుంచెను.

ఆయన దానిని చేసెను. మరియు తరువాత, ఆయన దానిని చేసినప్పుడు, ఆయన తన సొంత చట్టము లను వెంబడించినట్లు మనము కనుగొంటాము, మరియు ఇక్కడ అబ్రాహామును ఆయన అదే విధానములో తీసుకొన్నాడు. ఆయన దానిని చేసెను. మీరంటారు, "సహోదరుడా బ్రెన్హాం, దానిని మీద మీకు నిశ్చయత యున్నదా?"

4వ మరియు 5వ వచనములు. అవునండి. చూడండి, ఆయన తన పేరులోని భాగమును అబ్రాహామునకు ఇచ్చినప్పుడు, ఆయన చెక్కు మీద తగిన స్థానములో ఆయన పేరును ఉంచెను, ఆయన మారనివాడుగా యుండియున్నట్లు. ఆయన ఎలోహిం అయి యున్నాడు. అబ్రాహాము, చూడండి, తన సొంత పేరులోని ఒక భాగమును ఆయన అబ్రాహామునకు ఇచ్చెను. ఇక్కడ ఒక గొప్ప ప్రత్యక్షత, మరియు మీరు గ్రహించండి, దానికంటె ముందుకు నేను పరుగెత్తగలను, అయితే సంఘము, అది బలమైన ఆహారమును తప్పక తీసుకొనవలసియుండగా, అది ఇంకనూ పాలు త్రాగుచున్నది. అది నిజము.

కాబట్టి ఆయన తన సొంత పేరును అబ్రాహామునకు ఇచ్చియున్నాడు. మరియు తరువాత ఆయన దానిని చేసినప్పుడు, ఆ పేరును అతనికి ఇచ్చిన తరువాత ఆయన చేసిన తరువాత కార్యము, దానిని తన పేరుపై ఉంచియున్నాడు, అప్పుడు ఆయన ఏమి చేసియున్నాడు?

ఆయన అతనికి ఒక సూచన ఇచ్చియున్నాడు, అదేమనగా అతని చుట్టూ యున్న పాపమును నాశనము చేయుటకు ఆయన సిద్ధపడినాడు మరియు అతడు కనిపెట్టియుండిన వాగ్దాన కుమారుని స్వీకరించుటకు అతని దేహమును తగిన స్థానములోనికి తెచ్చియున్నాడు. ఖచ్చితముగా దానినే ఆయన సంఘమునకు చేసియున్నాడు.

GEN 18:13,15•

JOHN 1:42,45-49

 

25ఆయన అబ్రాహామునకు ఇచ్చిన చివరి సూచన ఏమైయున్నది? ఆయన తన వీపును గుడారమువైపునకు త్రిప్పి మరియు శారా లోపల గుడారములో ఏమి చేయుచున్నదో, ఏమి ఆలోచించుచున్నదో, ఆయన చెప్పి యున్నాడు.

మరియు యేసు, అబ్రాహాము యొక్క నిజమైన సంతానము, అసలైన నిజప్రవక్త, దైవ-ప్రవక్త, ఆయన భూమిమీదకు వచ్చినపుడు యూదులతో ముగిసూ, ఆయన అదే సూచనను ప్రత్యక్తపరచియున్నాడు (దానిని ఆలోచించండి!) — ఆయన భూమి మీదకు వచ్చినపుడు, ఆయన ఏమి చేసియున్నాడు? ఆయన సీమోనుతో అన్నాడు, "నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడవు," తన పేరును కూడా వ్రాయలేని వ్యక్తి. మరియు సీమోను తన తండ్రి యొక్క ఉపదేశమును బట్టి త్వరగా ఆయనను గుర్తించెను, మెస్సీయా అలాటి ఒక సూచనను కలిగియుంటాడు, ఆయనను అతడు గుర్తించి మరియు ఆయనను స్వీకరించెను.

ఫిలిప్పు, అది చూసిన వెంటనే నతానియేలు నొద్దకు పరుగెత్తాడు, మరియు నత్రానియేలు అతనితో ఒడ్డునకు వచ్చి, యేసు యున్న స్థలమునకు పరుగెత్తెను, మరియు యేసు అతనివైపు చూసి చెప్పెను, "ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటములేదు."

అతడన్నాడు, "రబ్బీ, నీవు నన్ను ఎప్పుడు ఎరిగియున్నావు?"

ఆయనన్నాడు, "ఫిలిప్పు నిన్ను పిలువకముందే, నీవు ఆ చెట్టు క్రింద యున్నప్పుడే, నేను నిన్ను చూశాను."

మరియు నిజమైన, ఎన్నుకొనబడిన, ముందుగా నిర్ణయించబడిన ఆ యొక్క దేవుని యొక్క కుమారుడు ఏమన్నాడు? "రబ్బీ, నీవు దేవుని కుమారుడవు. ఇశ్రాయేలు యొక్క రాజువు."

ఆయనన్నాడు, "నీవు ధన్యుడవు."

MATT 16:9•

JOHN 4:7

 

26తరువాత ఆయన సమరయలోని ఒక స్త్రీ యొద్దకు వెళ్ళాడు, ఏలయనగా సమరయులు ఎదురుచూస్తున్నారు… మీకు తెలుసా, వారు మెస్సీయా కొరకు ఎదురుచూస్తున్నారు. మెస్సీయా కొరకు ఎవరు ఎదురుచూసినా, ఆయన వస్తాడు. ఈ రాత్రి నీవు ఆయన కొరకు ఎదురు చూస్తున్నట్లైతే, ఆయన నిన్ను కలుసుకొంటాడు. అయితే నీవు ఆయన కొరకు ఎదురుచూడనట్లైతే, ఆయన కూడా నీ కొరకు ఎదురుచూడడు. నీవు ఆయన కొరకు ఎదురుచూడనట్లైతే, ఆయన ఎన్నడూ నీ యొద్దకు రాడు. అయితే సమరయులు ఆయన కొరకు ఎదురుచూచుచుండిరి.

ఇప్పుడు, భూమిమీద మూడు జాతుల ప్రజలు మాత్రమే యున్నారు, షేము, హాము, మరియు యాపెతు ప్రజలు; యూదుల, అన్యులు, మరియు సమరయులు. పూర్తి సంతతి దాని నుండి వస్తుంది.

ACTS 8:5,12,17

 

27ఇప్పుడు, దానిని ఋజువు చేయుటకు తాళపుచెవులతో యున్న పేతురును గమనించండి — పేతురు దేవుని రాజ్యము యొక్క తాళపుచెవుతో. దేవుడు అతనికి తాళపుచెవులను ఇచ్చియున్నాడని ఎంతమంది నమ్ముతారు? యేసు ఇచ్చాడు. ఆయన నిశ్చయముగా ఇచ్చాడు.

వాటిని అతడు ఎప్పుడు వాడెను? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో యూదులకు వాడాడు. తరువాత తిన్నగా సమరయుల యొద్దకు వెళ్ళాడు, ఫిలిప్పు వెళ్ళినవారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును ఇచ్చియున్నప్పటికీ, వారు ఇంకను పరిశుద్దాత్మను పొందియుండలేదు, ఏలయనగా పేతురు తాళపు చెవిని కలిగియున్నాడు. అతడు వచ్చి వారి మీద చేతులను ఉంచినపుడు వారు పరిశుద్దాత్మను పొందిరి.

మరియు తరువాత…. తరువాత తరము, తరువాత తరగతి వారు ఎవరో ఊహించండి? అన్యులు. అతడు వెళ్ళి అన్యులకు సువార్తను తెరచెను. మరియు దానినుండి, ఇక ఎంతమాత్రము సీమోను పేతురు యొక్క తాళపుచెవులు అవసరము లేదు, అది ఇదివరకే ప్రపంచమంతటికి తెరువబడినది.

MATT 12:34•

MATT 23:33•

JOHN 4:7,9,10,16-19,25-29,39•

JOHN 10:37

 

28ఇప్పుడు, అన్యులు మెస్సీయా కొరకు ఎదురుచూచుటలేదు, కాని యూదులు మరియు సమరయులు ఎదురుచూచుచుండిరి. ఆయన తననుతాను ఎలా ప్రకటించాడు? సొదొమలో చేసిన అదే కార్యమును ఆయన అక్కడచేసి యున్నాడు.

ఆయన సమరయులకు ఏమి చేశాడు? ఆ స్త్రీ బయటకు వచ్చినపుడు, ఆ స్త్రీ ఒక వేశ్య బావినొద్దకు వచ్చినది, ఆమె వ్యభిచారములో జీవించుచున్న ఒక స్త్రీ. ఆమె ఆరుగురు భర్తలను కలిగి యుండెను, అయిదుగురు భర్తలను ఇదివరకే ఆమె కలిగియుండినది, మరియు ఆయన, "ఓ స్త్రీ, నాకు దహమునకిమ్ము," అని ఆమెనడిగెను.

మరియు ఆమె అన్నది, "అది ఆచారము కాదు. ఒక వేరు పరుచుట మా మధ్యయున్నది. నీవు ఒక యూదుడవు, మరియు నేను ఒక సమరయురాలిని. నీవు అలాటి కార్యము నన్ను అడుగరాదు. ఒకరితో ఒకరికి సంబంధములు లేవు.

ఆయన అన్నాడు, "కాని నీవెవరితో మాట్లాడుచున్నావో అది ఎరిగియున్నట్లైతే, నీవు ఆయనను దాహమునకు అడుగుదువు."

ఆయన ఆమె యొక్క ఆత్మను స్పర్శించువరకు సంభాషణ ముందుకు కొనసాగినది, అప్పుడాయన ఆమెకు ఏమి అవసరమో కనుకొని, ఇలా అన్నాడు, "నీవు వెళ్ళి, నీ భర్తను తీసుకొని ఇక్కడకు రమ్ము," అని ఆయన అన్నాడు.

ఆమె అన్నది, "నాకు ఏ భర్తయు లేడు."

ఆయన అన్నాడు, "నీవు సత్యము చెప్పితివి, ఏలయనగా నీకు అయిదుగురు భర్తలున్నారు, మరియు ఇప్పుడు నీతో జీవించుచున్న వ్యక్తి - నీ భర్త కాడు."

ఆమె అన్నది, "అయ్యా. [ఈ స్త్రీ యొక్క మాట వినండి. ఇప్పుడు, ఈమె ఒక సమరయురాలు.] అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను," అని అన్నది. ఇప్పుడు మెస్సీయా వచ్చినప్పుడు, ఈ కార్యములు తెలుపును" అని మాకు తెలుసు. అది మెస్సీయా యొక్క గుర్తుగా యుండవలసియున్నది.

అందుకు యేసు, "నీతో మాట్లాడుచున్నవాడను నేనే," అనెను.

మరియు ఆమె ఏమి చేసియున్నది? ఆమె తన కుండను అక్కడ వదలిపెట్టి, పట్టణములోనికి పరుగెత్తుకొని వెళ్ళినది. మరియు ఇలా అన్నది, "రండీ నేను చేసిన కార్యములన్నియు చెప్పిన మనిషిని చూడండి, ఈయనే మెస్సీయా కాడా?"

మరియు ఆ పట్టణములోని మనుషులు యేసును మెస్సీయాగా నమ్మియన్నారని బైబిలు చెప్పినది, ఏలయనగా ఆమె చేసిన కార్యము లన్నిటిని స్త్రీతో చెప్పియుండెను.

ఇప్పుడు ఆయన ఒక్కసారి, అన్యులకు ఆ కార్యమును చేసినట్టుగా చూపించండి. ఆయన అన్యులకు ఎన్నడు చేయలేదు. అయితే యేసు చెప్పెను… ఎప్పుడైతే అన్యుల… లేక పరిసయ్యులు మరియు ఆ దినము యొక్క బోధకులు, ఆయన దురాత్మతో కార్యములను చేయుచున్నాడని చెప్పిరి, ఆయన యొక్క సువార్త సత్యము కాదన్నారు, ఏలయనగా ఆయన వారి సంఘములను, వారి యొక్క సంస్థలను చీల్చివేయుచుండెను, వారిని సర్పముల యొక్క సంతానమని, వారు నక్కలని మరియు ఆయన ఊహించు పేర్లతో వారిని పిలిచెను. ఆయన నిజముగా వారిని రెండుగా చీల్చి తెరచుచుండెను.

అయితే ఇంకను, ఆయనన్నాడు, "నేను నా తండ్రి కార్యములను చేయనియెడల, మీరు నన్ను నమ్మకుడి. కానీ నేను నా తండ్రి కార్యములను చేసినట్లైతే, అప్పుడు ఆ కార్యములను నమ్ముడి."

ఏ మనిషి విషయములోనైనా అది సత్యమైయున్నది. దేవుడు తన పరిచర్యను బలపరచకపోయినట్లయితే, అది దేవుని యొక్క పరిచర్య కాదు.

JOHN 4:29,39

 

29ఇప్పుడు గమనించండి.

"వచ్చి ఈ మనిషిని చూడండి," అని ఈ స్త్రీ అన్నది. సమరయులు దానిని విశ్వసించిరి, ఆయన దానిని మరొకసారి ఎన్నడు చేయలేదు. ఆయన కేవలము ఆ ఒక్కసారే దానిని చేసియున్నాడు. కాని ఆ స్త్రీ యేసు చెప్పిన దానిని ఆ మనుషులకు చెప్పినది. రెండవ చేతిమీదగా, ఆ స్త్రీ ద్వారా ఆ పట్టణమంతయు యేసుని నమ్మినది, ఏలయనగా ఆ ఒక్క సూచక క్రియను బట్టి.

అమెరికాకు ఏమి సంభవించబోవునో అని నేను ఆశ్చర్యపడుచున్నాను? తీర్పు దినమున ఆ వేశ్య నిలబడి, కోట్ల మంది సంఘసభ్యులను వారు దోషులని తీర్పులో వారిపై నేరము మోపుతుంది, కారణము ఒక్కసారి కాదు - అలా వేలకొలది సార్లు పదివేలకొలది సార్లుగా ఈ దేశమంతటి గుండా అది సంభవించియున్నది. (ఆ విధమైన వివేచన — తెలుగు తర్జుమాదారుడు), ప్రపంచమంతటా సంభవించియున్నది, శాస్త్రీయముగా పరీక్షించబడినది, వెళ్ళవలసియున్న ప్రతి విమర్శకుని గుండా అది వెళ్ళియున్నది, మరియు ఇంకనూ నూటికి-నూరుపాళ్ళు శుద్ధమైనదిగా బయటకు వచ్చినది: పరిశుద్దాత్మ, వాక్యము దానిని బలపరచుచున్నది. ఆ దినమున మనము ఎక్కడ నిలబడబోవుచున్నాము, సోదరులారా? దానిని గురించి కేవలము ఆలోచించండి. బహుశా రేపు ఉదయమునకు ముందే జరుగవచ్చు. మనము అంతములో యున్నాము. దానిని గూర్చి రేపు నేను ఎక్కువ తీసుకోనివస్తాను.

30గమనించండి. ఆయన అతడిని స్థానములో ఉంచాడు, ఆయన ఏమైయున్నాడో అతనికి సూచనను ఇచ్చెను, ఆయన సర్వశక్తిగల దేవుడై యున్నాడు అని గుర్తుంచుకొనండి. అది మానవుడు కాదు. అది కేవలం అక్కడ ఉన్న మానవ శరీరమైయున్నది, ఒక క్షణములో అది అదృశ్యమైపోతుంది. అయితే అది దేవుడైయున్నాడు, వేరుచేయబడిన సంఘమునకు, బయటకు పిలువబడినవారికి, ఎన్నుకొనబడిన వారికి ఆయన తన్ను తాను తెలియపరుచుకొనుచున్నాడు. గుర్తుంచుకోండి, అది ఒక సంస్థాగతమైన టౌనుతో కాదు, ఒక పట్టణముతో కాదు; అయితే అరణ్యములో తిరుగులాడుచున్న ఒక చిన్న గుంపుతో అది జరిగినది, వారే తిరస్కరించబడిన ప్రభువు యొక్క గుంపుతో నిలబడినవారు.

ఎప్పటివలె, దేవుడు ఈ కార్యములన్నింటిని నుండి దూరంగా దేవుడు తన పిల్లలను అరణ్యమునకు పిలవవలసియున్నది. అతనిని పిలిచి ఆ గుర్తును అతనికి చూపించి ముందుకు సాగెను. అబ్రాహాము దానిని నమ్మియుండెను. మరియు వెంటనే అతడు మార్పుచెందెను. ఆ దూత దృశ్యము మీద నుండి వెళ్ళిపోగానే, అబ్రాహాము మార్పుచెందిన ఒక దేహమును కలిగియుండెను, మరియు సిద్దపరచబడెను. మరియు వాగ్దానము చేయబడిన కుమారుడు వచ్చెను.

GEN 18:11•

GEN 20:1-3•

1COR 15:52•

1THS 4:17

 

31ఈ దినముల్లో ఒక దినమున… మీరు విను ఈ పాతకాలపు సువార్త ఈ దినముల్లో ఒక దినమున నిశబ్దమవుతుంది. మరియు సంఘము మహిమపరచబడిన ఒక శరీరమును పొందుతుంది. పైకి వెళ్ళి ఆయనను మధ్యాకాశములో కలుసుకొనుటకు గాను నీవు ఆ విధమైన శరీరమును కలిగియుండవలసియున్నది. ఈ రకమైన దేహముతో మనము పైకి వెళ్ళితిమి. కాబట్టి ఆ ఎదురుచూచుచున్నవారు, ఆ వినుచున్నవారు, హెచ్చరికను పాటించుచున్నవారు, వారే ఒక రెప్పపాటులో మార్పుచెంది మధ్యాకాశములో ప్రభువును కలుసుకొనుటకు ఏకముగా పైకి కొనిపోబడుదురు — మనము క్రైస్తవలమని గుర్తించినప్పటి నుండి ఎదురుచూస్తున్న దేవుని కుమారుడు, మనము దాని కొరకు ఎదురుచూస్తున్నాము.

గుర్తు౦చుకోండి, దానిని గత రాత్రి మనము రుజువు చేశాము, అతడు ఎలా గెరారుకు వెళ్ళియున్నాడో; ఒక 100 సంవత్సరాల వయస్సు గల స్త్రీయైన ఆ శారా ఎలా… సాధారణముగా దాని మీద నాకు రెండు ఉత్తరములు వచ్చియున్నవి, "మంచిది, వారు దీర్ఘకాలము జీవించియున్నారని," వారు అనుచున్నారు.

అయితే మీరు ఆదికాండం 18వ అధ్యాయమును 17వ అధ్యాయమును కూడా మీరు గమనించవలెనని కోరుచున్నాను. వారు బహుగా వయస్సు మళ్ళీన వారని బైబిలు చెబుతుంది. వృద్దులు, వంగిపోయినవారు, భుజములు వంగిపోయినవారు మరియు వారక్కడిగి వెళ్ళినప్పుడు, అబీమెలెకు అను రాజు ఫిలిష్తియులలోని అందమైన స్త్రీలలో తన కొరకు ఒక మధురమైన ప్రియురాలి కొరకు ఎదురుచూచుచుండెను, అయినను అతడు ఈ వృద్దురాలు, నిజమైన వృద్దురాలు, అమ్మమ్మ, పెద్ద అమ్మమ్మతో ప్రేమలో పడెను, మరియు ఆమెను తనకు భార్యగా యుండుటకు తీసుకొనెను. అయితే దేవుడు ఆమెను కాపాడెను.

GEN 18:12•

1PET 3:6

 

32సహొదరీ, ఇక్కడ ఒక విషయమును మీరు గుర్తించాలని నేను కోరుదును. ఆ అందమైన శారా అబ్రాహామును ఎంత వరకు ప్రేమించియున్నదనగా, చివరకు ఆమె అతనిని నా ప్రభువా అని పిలిచెను, అదే పౌలు అంతములో చెప్పియున్నాడు, "మీరు సత్యమునకు విధేయులైయున్నంత వరకు మీరు ఆమెకు పిల్లలైయుందురు."

శ్రీమతి. లోతు అలంకరించుకొన్నట్లుగా, ఆ దినము యొక్క నవనాగరిక దుస్తులను శారా ధరింపలేదు. ఆమె (శ్రీమతి లోతు) దరిదాపుగా అక్కడయున్న మహిళా సంఘములన్నిటికి నాయకురాలుగా యున్నది. ఆమె యొక్క భర్త ఆ పట్టణపు మేయరై యున్నాడు. కాబట్టి నేననుకొంటాను వారి యొక్క పెద్ద సంఘములో, ఒక ఉదయమున గుడిగంటలు మ్రోగినప్పుడు వారు అందరూ అక్కడకు వెళ్ళియున్నారు, నేననుకొంటాను… ఆమె చక్కని అందరికి తెలిసిన స్త్రీయై అక్కడ యున్నది. దానిని విడిచిపెట్టుట ఆమెకు ఇష్టము లేదు. ఆమె ప్రాపంచిక విషయాలలో ఆసక్తి కలిగినది.

33ఆ విధముగానే ఈ దినమున యున్న ప్రజలు ప్రభువైన యేసు యొక్క రాకడను గూర్చి వినుట వారికి ఇష్టము లేదు. ఎందుచేత, ఇది నేను అలోచించు అత్యంత మహిమకరమైన కార్యమైయున్నది, ఇప్పుడే ఆయన ఆకాశములను చీల్చనైయున్నాడు! మనము దాని యొద్దకు వెళదాము!

ఈ వృద్దాప్యముతో ఎండిపోయిన, ముడుతలు పడిన, ముసలితనముతో కీచుమని శబ్దముచేయు, సంపూర్ణముగా క్రుళ్ళిపోవు ఈ దేహము, మట్టి పురుగులు తినివేయుట తప్ప ఏమియులేదు. దానిలోని ఈ దేవుని ప్రేమించు ఆత్మను తీసుకొని, ఒక సరికొత్త 21 సంవత్సరాల వయస్సుగల విలియం బ్రెన్హాంతో ఐక్యము చేస్తుంది, ఆ దేహము ఎన్నడూ ముసలిది కాదు, ఎన్నడూ, ఎన్నడూ గుండెపోటు రాదు, ఎన్నడూ చనిపోదు, ఎన్నడూ రోగగ్రస్తము కాదు; అన్ని యుగములగుండా ఎన్నుకొనబడినవారితో, నిత్యత్వము అంతటిగుండా జీవిస్తుంది? ఎందుకు, నేను దానికంటె మరి ఏ గొప్ప దానిని నేను తలంచలేను.

ఆకారణమును బట్టియే ఇక్కడయున్న సాక్ష్యమును, ఈ చిన్న కార్యమును మీరు చదువవలెనని నేను కోరుచున్నాను. నేను దానిని చూశాను, అది సత్యమని నాకు తెలుసు. నేను అక్కడయున్న ప్రజలతో కరచాలనము చేశాను. నేను ఎరిగియున్న వారితో, నేను అక్కడ నిలబడి, నన్నునేను చూచుకొన్నాను, అదే సమయములో నా మంచము మీదయున్నాను, మరియు ఇక్కడ నిలబడియున్నాను. అది ఎంతో ఎక్కువ దూరములో లేదు. మనము ఎక్కువ దూరము వెళ్ళనవసరము లేదు, ఏలయనగా నేను ఈ వేదిక మీద నిలబడి యున్నంత యధార్ధముగా సరిగ్గా నేను ఇక్కడ నిలబడియున్నాను. మరియు నేను తలంచాను, "ఇప్పుడు ఇక్కడ… నేను అక్కడ నిలబడియున్నాను, మరియు అదే సమయములో నేను ఇక్కడ కూడా ఎలా నిలబడియుండగలను?" ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నట్టుగానే. మరియు అక్కడ ప్రజలున్నారు, వారిలో ప్రతి ఒక్కరు సౌందర్యముగా యున్నారు.

నేను ఆ స్త్రీలను చూడగలను.

MATT 10:25•

2TIM 3:12

 

34నేను స్త్రీలతో ఒక రకమైన కఠినంగా యుండియున్నాను, కాని క్రైస్తవ స్త్రీలారా, అది మీరని నా భావము కాదు. నా భావము వారెవరనగా, తాము క్రైస్తవులమని చెప్పుకొని క్రైస్తవులుగా ఉండని వారు. చూచారా, యొజబెలువలె యుండగోరువారు (కాదయ్యా), లోకకార్యముల వెంబడి వెళ్ళువారు. నేను నిశ్చయముగా వారిని భరించవలసియున్నాను. మరియు నేను దానిని చేయవలసియున్నాను. నేను అది చేయకుండా ఉండలేను. అయితే ఒక మంచిది ప్రకాశించుట కొరకుగాను, నీవు ఒక చెడ్డ దానిని కలిగియుండవలసియున్నావు. పగటి వెలుగును మెచ్చుకొనుటకుగాను నీవు రాత్రిని కలిగియుండవలసియున్నది. సరియైన దానిని నీవు మెచ్చుకొనుటకుగాను, నీవు తప్పైన దానిని కలిగియుండవలసియున్నావు. అన్నియూ దేవుని యొక్క మంచితనము కొరకు, ఆయన మహిమ కొరకు ఏకముగా పనిచేయుచున్నది.

నీవు విహారయాత్రలో లేవు కాని యుద్ధభూమిలో యున్నావు. యుద్ధము! "రండి ఒక క్రైస్తవుడిగా యుండండి, సమస్తమూ తిన్నగా వెళుతుంది," అని ప్రతి ఒక్కరూ అంటారు. లేదండి, అది ఒక క్రైస్తవునికి కాదు. "క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశి౦చువారు హింసపొందుదురు." నీవు నవ్వబడతావు, ఎగతాళి చేయబడతావు, తన్నబడతావు, అపహాస్యము చేయబడతావు." వారు ఇంటి యజమానిని బయెల్జేబూ అని పిలచినయెడల, మరి ఎంత ఎక్కువగా ఆయన శిష్యులను వారు పిలుస్తారు?"

"నేను ప్రభువు యొక్క తృణీకరించబడిన కొద్దిమందితో నా మార్గమును తీసుకొ౦టాను. నేను యేసుతో ప్రారంభి౦చియున్నాను. ఓ, దేవా, నన్ను మార్గముగుండా తీసుకొని వెళ్ళుము. అది సత్యము. ఆ మార్గము గుండా వెళ్ళుటయే నా యొక్క ప్రత్యామ్నాయమైయున్నది.

35ఈ రాత్రి నేను ఈ పట్టణమును చూసినట్లయితే, మరియు నేను ఇక్కడ పట్టణములో చూచాను, గత మూడు నెలల నుండి నేను ఈ దేశమంతటికి గుండా ప్రయాణము చేయుచున్నాను; మరియు సంఘములు పడిపోవుటను నేను చూస్తుయున్నాను, సంఘకాపరులలోని బేధమును, మరియు బయటకు వచ్చిన ప్రజలలోని బేధములను నేను చూస్తూ యున్నాను — చేప మరియు రొట్టెలువలె కనపడుచున్నది.

మరియు మొదటి కార్యము ఏమనగా… ఒక కోత కోయు రంపమునే వారు ఎదుర్కొనుటకు తగినంత కోపమును వారు కలిగియున్నారు, మరియు బేధము, రోతగా యున్నారు. పెంతికొస్తువారే, వారు తలంచినట్లుగా తప్పక బాప్తిస్మము పొందని వ్యక్తిని నేను వేదిక మీదకు అనుమతించినందున, వారు నన్ను వలయములో నుండి బయటకు లాగాలనుకొని సేవకుల సమాఖ్య కోరినది. ఓ, అలాటి బేధములు! నేను తిన్నగా ఇక్కడ చూస్తున్నట్లైతే, నేను వదులుకొంటాను. సంఘము కంటే ముందే, దేవుడు నా పై పట్టును కలిగియున్నాడు, దానికి నేను సంతోషిస్తున్నాను. నేను దేవుని గూర్చి కనుగొన్నాను. అది నిజము. దేవుడు నిజమైనవాడని నేను కనుగొన్నాను.

MATT 10:22•

MATT 24:13•

MARK 13:13

 

36ఒకప్పుడు బాక్ట్సర్, ఎర్న్ బాక్ట్సర్ నా కూటములను జరిగించేవాడు, కెనడాలో ఒకసారి వారు ఒక కొత్త స్కెవిన్ సైకిల్ ను గెలుచుటకొరకు ఒక పోటీని పెట్టియుండిరి. ఒక అడుగు వెడల్పుయున్న ఒక బోర్డును వారు కలిగియున్నారు. గాలిలో 8 అడుగులు సైకిలును ఎత్తి పట్టుకొని వారు 50 లేక 100 అడుగులు స్వారి చేయవలసియుండెను. వారిలో ప్రతిఒక్కరూ ప్రవీణులైయున్నారు.

ఎర్నీ అన్నాడు, "నేను నా తల్లికి కావలసిన నిత్యవసర వస్తువులు తీసుకొని, నేను అక్కడకు వెళతాను, నేను వాటిని నా చేతుల క్రిందయుంచుకొని, వీధిలోని కార్లు గుండా స్వారి చేస్తాను, ఆ కార్ల చుట్టూ స్వారీ చేస్తూ నేను ఎన్నడూ నా సైకిలు హేండిల్ ను తాకలేదు." అతడన్నాడు, "నేను స్వారి చేయగలను. సైకిలు మీద కూర్చొని దాని వెనుక ఆనుకొని, అదేరీతిగా ముందుకు స్వారీ చేయగలను." "అది నాకు ఏ బేధమును" చేయలేదన్నాడు. దరిదాపుగా వారిలో అందరూ ప్రవీణులే. మరియు ఆ యొక్క స్కెవిన్ సైకిలును వారు గెలువగలమనే నిశ్చయతను వారు కలిగియున్నారు.

మరియు వారు వారి మధ్యలో ఒక ఆడవాడులాంటి ఒక కుర్రవాడిని కలిగియున్నారు. అతడు బాగా స్వారీ చేయగలవాడు కాడు. కాని అతడు గెలువబోవుచున్నాడని వారు ఎరిగి యుండిరి. అయితే వారందరిని వరుసలో యుంచి వారిని ప్రారంభించినప్పుడు, ఈ చిన్న ఆడువాడువలె కన్పించే బాలుడు తప్ప అందరూ పడిపోయారు. అతడు అంతము వరకు పరుగెత్తుకొనిపోయెను, గెలిచెను, బహుమానమును పొందెను, సైకిళ్ళను తీసుకొనెను. మిగిలినవారందరూ చుట్టూ చేరి ఇలా అన్నారు, "నీవు దానిని ఎలా చేసియున్నావో చెప్పుము."

అతడన్నాడు, "పిల్లలారా, మీ పొరపాటును మీరు ఎక్కడ చేసియున్నారో నేను మీకు చెప్పబోవుచున్నాను," అన్నాడు నేను అక్కడకు వెళ్ళకముందే దానిని గూర్చి అంతా ఆలోచన చేశాను." అది ఒక మంచి ఆలోచనయై యున్నది. "మీరు చూడండి, మీరు తిన్నగా మీ సైకిలు వైపే క్రిందికి చూస్తూ మీరందరూ మీ సైకిళ్ళను దూరప్రయాణములో యుంచుటకు ప్రయత్నించుచున్నారు. అది మిమ్ములను ఉద్రిక్తులనుగా చేసినది. మీరు తప్పక దొర్లుకుంటూ రావలసియున్నది, మీరు క్రిందపడి పోయారు. మరియు మీ పొరపాటును మీరు ఎక్కడ చేసియున్నారో నేను చూశాను." అతడన్నాడు, "నేను ఎన్నడూ ఈ క్రిందవైపు చూడలేదు; నేను కేవలము అంతమును గమనించుచూ తిన్నగా ముందుకు వెళ్ళాను." అంతే.

ఏది జరిగినా ముందుకు ముందుకు కదులుము. కేవలము ముందుకు కొనసాగుము. దాని వైపు చూడవద్దు. కేవలము గమ్యమువైపు చూస్తూ ముందుకు కొనసాగుము. అక్కడే చివరిలో నీవు దేవుని కనుగొంటావు. అక్కడే బహుమానములు ఇవ్వబడతాయి. ఇక్కడే ఆగిపోవద్దు. అంతమునకు సాగిపొమ్ము. "అంతము వరకు సహించినవాడు రక్షించబడతాడు — అది లేఖనము.

37ఇప్పుడు, మనము కనుగొంటాము దేవుడు అబ్రాహామును ఇచ్చిన నిర్ధారణ… మరియు సంస్థము ఖచ్చితముగా బయటకు త్రిప్పబడినది. ఇప్పుడు గమనించండి, ఒకే నియమమును దేవుడు సంఘమునకు ఇచ్చియున్నాడు, ఒకటి కాదు… ఆయన అబ్రాహామునకు వాగ్దానము చేసినది ఒక్క కార్యము కాదు, ఒక్క కార్యమును కూడా దేవుడు అబ్రాహామునకు చేయలేదు, అయితే ఆయన ఏమి చేసియున్నాడు. లేక సంఘమునకు ఏమి ఇచ్చియున్నాడు, ఒక్క కార్యము తప్ప, దేహము యొక్క మార్పు మరియు ఆయన దానిని చేసినప్పుడు…

ఇప్పుడు గుర్తుంచుకోండి, శారా మార్పు చెందవలసియుండెను. మీలో ఎంతమంది దానిని నమ్ముతారు? మీ చేతిని ఎత్తండి. ఆమె మార్పుచెందిన ఒక దేహమును చెందవలసియుండెను. ఆమె నూరు సంవత్సరాల వయసు కలిగియుండెను. ఎలా ఆమె ఒక బిడ్డకు జన్మను ఈయగలదు?

ROM 4:19,20

 

38అబ్రాహాము, మంచిది, బైబిలు చెప్పియున్నది - ఒక పురుషునిగా… ఎన్నో సంవత్సరముల క్రితమే అతని దేహము మృతతుల్యమైయుండెను. రోమా 4వ అధ్యాయమును చదవండి, అక్కడ ఇలా చెప్పబడినది, "మరియు అతడు విశ్వాసము నందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి అప్పటికి తన శరీరరము మృతతుల్యమైనట్టును అవిశ్వాసముల వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక - దేవున్ని స్తుతించుచూ ఆయనను మహిమపరచెను"; ముందుకు కొనసాగుచుండెను. ఇప్పుడు అతని శరీరము ఫలించనిదిగా ఉన్నది, ఉడిగి పోయినది ఒక నూరేండ్ల వయస్సు గలవాడు, లైంగికపరముగా మృతతుల్యమైనవాడు.

శారా యొక్క గర్భము కూడా మృతతుల్యమైనది, ఫలించనిదిగా ఉన్నది. పాలగ్రంధులు క్షీణించిపోయినవి, స్థనములు క్షీణించిపోయినవి, గుండెయు క్షీణించినది, ఆ నూరేళ్ళ వృద్ధురాలు ప్రసవ నొప్పులు పడగలదా. చూడండి, అక్కడ… ఆమె సంపూర్ణముగా మృతతుల్యమైనదిగా యున్నది. అప్పుడు ఆమె ఆ బిడ్డను పొందలేదు, ఆమె మార్పుచెందితేనే కాని, ఆ వాగ్దానమును పొందలేదు.

1COR 15:52•

1THS 4:17

 

39"ఇప్పుడు, బ్రెన్హాం సోదరుడా, నీవు ఏమి చెప్పుటకు ప్రయత్నించబోవుచున్నావు?" జాగ్రత్తగా వినండి. మనము ఈ విధమైన అబ్రాహాము యొక్క నిర్ధారించబడిన నిబంధన దేహములలో ఎన్నడూ వాగ్దాన కుమారుని పొందలేము, కారణము ఆయన భూమిమీదకు వచ్చుటలేదు. మనము పైకి కొనిపోబడవలసియున్నాము. మన దేహములు ఒక్క క్షణములో, ఒక్క రెప్పపాటులో మార్పుచెందవలసియున్నది, మరియు మనము ఆయనను కలుసుకొనుటకు మధ్యాకాశమునకు కొనిపోబడుదుము.

మరియు నాశనము ముందు చివరి సూచన ఇవ్వబడినది, అదే దేవుని దూత, దేవుడు మర్త్యమైన మానవ శరీరములో నివాసము చేయుచున్నాడని చూపించుచున్నాడు, మన దేహములు మార్పుచెందుటకు ముందు అదే సూచనను చూపుచున్నాడు. మరియు సంఘము పొందు చివరి సూచన అదియే. దేవుడు అబ్రాహాముకు ఒక్క కార్యముకంటె ఎక్కువ చేశాడేమో నాకు చూపించండి! అక్కడ చూపించిన సూచనకంటె మరొక సూచన చూపించాడేమో నాకు చూపండి. అది చివరి సూచనయై యున్నది. దానిని ఎరిగినవారందరూ, బైబిలును చదువువారు, "ఆమెన్," చెప్పండి. అదే ఇవ్వబడిన చివరి సూచనయై యున్నది.

సంఘమా, ప్రభువు నామములో నా మాట వినండి!

40నా విద్యను చూడండి, నేను చేయు చాలీచాలని ప్రసంగము, నా అంశమును పట్టుకొనియుండకుండా, అభిషేకించబడినవారి వలె లేక చదువుకున్న భోధకులవలె నిజముగా నేను మాట్లాడలేను. మీరు దానిని వినవద్దు! నేను మీకు ఏమి చెప్పుచున్నానో దానిని మీరు వినండి, అదే దేవుని వాక్యము. దేవుడు దాని వెనుకయున్నాడు, ఏలయనగా భోధింపబడిన వాక్యమును ఆయన ఋజువు చేసియున్నాడు. మీరు నన్ను నమ్మనియెడల.

మీరంటారు, "సరే, సహోదరుడు బ్రెన్హాం మా సంస్థకు చెందినవాడు కాడు." సరే, అప్పుడు క్రియలను నమ్మండి. సంఘ సంస్థలు వెళ్ళి, ఆ కార్యములను నమ్మమనండి. మీ సొంత సంస్థకు దానిని తీసుకొని వెళ్ళండి. వారిని నమ్మునట్లు చేయండి. నేను చేయునదానికంటే మంచి పనిని అప్పుడు మీరు చేయగలరు, లేదా దేవుడు దానిని చేయకుండా మీరు అపవచ్చును. దేవుడు తనకైతాను అది చేయలేడు.

41గమనించండి. ఆది 18వ అధ్యాయములో ఆయన ఇది చేసియున్నాడు. ఇప్పుడు, ఆది 17వ అధ్యాయములో అద్భుతము కొరకైన బలమును ఆయన అతనికి ఇచ్చెను, అతనికి పరిశుద్దాత్మను ఇచ్చెను. మరొక మాటలో, దేవుని యొక్క సొంత జీవము అతని యొక్క జీవములోనికి లాగుకొననిమ్ము. ఇప్పుడు, పరిశుద్దాత్మను పొందినప్పుడు మనము ఏమి చేస్తాము? మనము దేవుని జీవమును మనలోనికి తీసుకొంటాము. అది నిజమేనా? దేవుని యొక్క జీవమును మనతో మిశ్రమము చేస్తాము. మనము దేవుని యొక్క కుమారులమైయున్నాము, ఏలయనగా మనము దేవుని నుండి లాగుకొనుచున్నాము, ఆ పరిశుద్దాత్మ మనలను దేవుని యొక్క కుమారులనుగా చేస్తుంది. అది ఏమి చేస్తుంది? అప్పుడు మార్పు కొరకు అది మనలను సిద్ధపరుస్తుంది.

ఓ సోదరుడా, నిర్ణయించబడినది వచ్చుటకు, మార్పు చేయుటకు అది మనలను సిద్ధపరచుతుంది, ఆత్మతో నింపబడినది. కేవలము తిన్నగా ఆయన యొక్క రొమ్ముపై ఆనుకొని బలమును లాగుకొనుచుండుటయే. మనము కూడా, రెప్పపాటులో, ఈ దినములలో ఒక దినమున మార్పుచెందుతాము. నేను దానిని వాగ్దానము చేయగలను. వాగ్దాన పుత్రుడు ఆయన యొక్క మార్గములో యున్నాడు.

ఇప్పుడు గమనించండి, అది జరిగిన వెంటనే, శారా గర్భము ధరించినది, మరియు ఆమె బిడ్డను పొందుబోవుచున్నదని ఎరిగియుండెను. ఇప్పుడు, ఆమె యవ్వనస్తురాలుగా యున్నది, సౌందర్యముగా, ఒక రాజు సహితము ఆమెతో ప్రేమలో పడెను. మీకు తెలుసా, ఆమె విశేషమైన వ్యక్తిగా యుండియున్నది, లేనిచో రాజు ఆమె యొక్క ప్రేమలో పడియుండేవాడు కాదు. ఆమె ఒక అందమైన స్త్రీగా యున్నది… మరియు అతడు ఆమెను వివాహమాడగోరెను, మరియు దేవుడు ఆమెను కాపాడెను.

JER 5:21

 

42మరొక విషయమును నేను సంఘమునకు ఇవ్వగోరుచున్నాను. ఇప్పుడు, గతరాత్రి అభిషేకము నన్ను తాకినప్పుడు, మీలో కొందరు అక్కడ కూర్చొని యున్నారు, నేను అక్కడ చిన్న మంటలను అనుభూతి చెందియున్నాను. నేను దానిని గూర్చి ఆలోచించుచున్నాను. "సరే, ఫలానా వారు ఆ కార్యము చేశారు, ఫలానా వారు ఆ కార్యము చేశారు," అని చెప్పినప్పుడు, అనేక సార్లు ప్రజలు కనీసము ప్రార్ధనా వరుసలోనికే రారు, వారు పిలువబడినప్పుడు, వారు కనీసము వారి నెంబరును తీసుకొనరు. కొన్ని నిర్ణీతమైన కార్యములు చేసియున్నారని వారు పిలువబడుటకు భయపడతారు. ఇప్పుడు, తిన్నగా నేను దానిని బయటకు పేల్చివేస్తాను. మీ అందరికి అది తెలుసు. నేను దానిని నిజము చేయటకు నడిపించబడితే తప్ప, నేను దానిని ఎంతమాత్రము చేయను.

ఇప్పుడు, నీవు నీ పొరపాట్లను చేస్తావు. నీవంటావు, "సహోదరుడా బ్రెన్హాం నేను ఎన్నడైనా ఏది చేసినది లెక్క కాదు, నేను ఎన్నడూ యోగ్యుడను కాదు." అది నిజము. కాని చూడు. నీవంటావు, "సహోదరుడా బ్రెన్హాం, ఒకప్పుడు నేను ఈ వర్తమానమును నమ్మియుండలేదు." అది సత్యము. మీలో అనేకమంది నమ్మలేదని నేను ఊహిస్తాను. నాకై నేను, దానిని చేసి యుండలేను. దేవుడు దానిని నాకు బయలుపరచనిదే, నేను దానిని చేసియుండేవాడిని కాదు.

మీరు…. అది ఒక ప్రత్యక్షతయై యున్నది. పూర్తి సంఘమంతయూ ప్రత్యక్షత మీద నిర్మించబడియున్నది. ప్రత్యక్షత లేకుండా నీవు దానిని ఎన్నడూ చూడలేవు. నీవు గ్రుడ్డివాడవై యున్నావు. బైబిల్ చెప్పియున్నది, నేను నమ్ముచున్నాను, అది మత్తయి 12వ అధ్యాయమని నేను నమ్ముచున్నాను. అక్కడ యేసు అన్నాడు, "ఆయన వారి ముందు ఎన్నో అద్భుతములను చేసియున్నప్పటికి, ఇంకను వారు నమ్మలేదు, ఏలయనగా యెషయా చెప్పియన్నాడు, "వారు కన్నులుండియు చూడరు, చెవులుండియు వినరు." నిజముగా వారు చాలా పరిశుద్ధమైన ప్రజలు, వారు పరిశుద్ధతకై పేరొందినవారు. కాబట్టి పరిశుద్దతయే అంతా కాదు. పరిశుద్ధ జీవితమే అంతా కాదు. విశ్వాసమే ముఖ్యమైన విషయము.

GEN 18:12

 

43సంఘమా, ఇప్పుడు వినండి. నేను ఇక్కడ దీనిని వదలగోరుచున్నాను, ఏలయనగా దీన్ని చేయమని పరిశుద్దాత్మ నాతో చెప్పియున్నాడు అని నేను నమ్ముచున్నాను. మీరు బహుశ అక్కడ కూర్చొనియుండి, మీలో కొందరు, ఇప్పుడే తిన్నగా నాతో మీరు విభేధించుచున్నారు — మీరు ఆలాగు చేయుచున్నారు అని నాకు తెలుసు. ఇప్పుడు, మీరు కోరినట్లైతే, నేను మీ పేరును పిలువగలను. కాబట్టి అది నాకు తెలుసు. కానీ ఇంకను దానికంటే ముందుకు కూడా నేను చూడగలను, అది ఈ దినములలో ఒక దినమున మీరు దానిని నమ్మబోవుచున్నారు.

నేను దీనిని ఇక్కడ కొంచెం ఉంచగోరుచున్నాను, ఆ విధంగా మీరు దానిని గ్రహించగలరు, కాబట్టి ఒక చిన్న కృపా యొక్క గుర్తును ఇక్కడ నేను మీకివ్వగలను. మీరు మీ మనస్సును మార్చుకొనువరకు అది ఎక్కువ సమయము పట్టదు, మీలో కొందరు. అలాగే మీలో కొందరు మీ మనస్సును మార్చుకొనరు.

అయితే గుర్తుంచుకోండి, శారా మొదటిగా ఆ మనిషి మాటలు విన్నప్పుడు, ఆమె సంఘమునకు ఒక మాదిరియైయున్నది — అది ఆమె విన్నప్పుడు… అబ్రాహామునకు ఆ సూచన జరుగుట చూచినప్పుడు, ఆమె నిజానికి దానిని గూర్చి తన హృదయంలో నవ్వుకున్నది, మరియు ఆమె దానిని అనుమానించినది మరియు ఎక్కడైనా అది అలా జరుగుతుందా అని అవిశ్వాసపడింది. అది నిజమేనా? ఆ సమయంలోనే, దేవుడు ఆమె యొక్క పేరును తుడిచివేసియుండేవాడు. అది నిజమేనా? అయితే ఆయన దానిని చేయలేకపోయాడు — ఆమె అబ్రాహాములో ఒక భాగమైయున్నది. వారు ఒకటైయున్నారు.

MATT 7:16,20

 

44మరియు నీవు నిజముగా అత్యుత్సాహము చెందియుండనియెడల, ఏదో ఉద్రేకముతో కూడినది కాదు, ఏదో సంఘ సిద్దాంతం కాదు — పరిశుద్దాత్మను నిజముగా పొందియున్నట్లైతే, అపుడు నీవు క్రీస్తులో భాగమైయున్నావు, మరియు ఇంకను నీ మనస్సులో ఒక చిన్న బేధమును కలిగియున్నట్లైతే, దాన్ని బట్టి దేవుడు నిన్ను త్రోసివేయడు, ఏలయనగా ఆయన చేయలేడు. కారణము నీవు క్రీస్తులో ఒక భాగమైయున్నావు, ఆయన నిన్ను సత్యములోనికి తెచ్చును.

ఇప్పుడు నీవు ఎన్నడు… నీవు కేవలము… నీవు భాషలలో మాట్లాడియుండవచ్చు, ఆత్మలో నాట్యమాడి యుండవచ్చు, ఈ కార్యములన్నింటిని అక్కడ చేసియుండవచ్చు. మరియు నీవు పరిశుద్దాత్మను పొందియున్నావని అది భావము కాదు. ఓ, మై, మై! అది దానికి పదిలక్షల మైళ్ళలో దూరంలో ఉన్నది.

యేసు ఎన్నడూ దానిని చెప్పలేడు….. ఇప్పుడు గుర్తుంచుకోండి, పరిశుద్దాత్మ యొక్క సంపూర్ణతను నీవు పొందినప్పుడు, నీవు భాషలతో మాట్లాడతావని నేను నమ్ముతాను, నిజము. అయితే యేసు ఎన్నడు దానిని చెప్పలేదు… భాషలు మాట్లాడటమే పరిశుద్దాత్మకు ఋజువు అనే ఏ లేఖనము బైబిల్లో లేదు. అది ఉన్నట్లైతే, దానిని చూపించమని నేను కోరుచున్నాను. అలాటి లేఖనము బైబిల్లో లేదు. యేసు అన్నాడు, "మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు." మరియు ఆత్మ యొక్క ఫలమనగా, భాషలతో మాట్లాడుట కాదు. అది పరిశుద్దాత్మ యొక్క వరమైయున్నది. పరిశుద్దాత్మ వచ్చిన తర్వాత, ఈ వరములలో ఒకటి దానితో వెళుతుంది. బోధించుట, భాషలతో మాట్లాడుట, భాషలకు అర్ధం చెప్పుట, ఈ కార్యములన్నియు పరిశుద్దాత్మ యొక్క వరములైయున్నవి.

ISA 28:11•

JOHN 5:24•

ACTS 2:38•

1COR 14:21

 

45పెంతెకొస్తు దినమున వారు ఆశ్చర్యపడియుండిరి. పేతురు అన్నాడు, "మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్దాత్మ అను వరము పొందుదురు," చూచారా. అయితే ఇప్పుడు గుర్తుంచుకోండి. నేను నమ్ముతాను, అది మీరు పరిశుద్దాత్మను సంపూర్ణంగా పొందినప్పుడు మీరు… బైబిల్ చెప్పియున్నది, "… నత్తి పెదవులతోను మరియు అన్యభాషలతోను నేను ఈ ప్రజలతో మాట్లాడుదును." నత్తిపెదవులు, ఎంతో పరిపూర్ణమైన పరిశుద్దాత్మతో నింపబడియుండుట - నీ సొంత భాషలో నీవు ఏమియు చెప్పలేవు. అది నీవు పరిశుద్దాత్మతో నింపబడియున్నప్పుడు ఆలాగు జరుగును.

అయితే నీ హృదయమంతటితో నీవు దేవునిని నమ్మి, యేసును నీ స్వరక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆ పరిశుద్దాత్మ యొక్క ఒక భాగము నీవు కలిగియున్నావని నేను నమ్ముతాను; ఏలయనగా యేసు అన్నాడు, "నా మాటలు, విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు." అక్కడ కేవలము ఒకే ఒక రూపములో నిత్యజీవమున్నది. అప్పుడు నీవు కేవలము ఒక చిన్న బాలుడవైయున్నావు. తరువాత నీవు ఆత్మ యొక్క సంపూర్ణతలోనికి నడుచుట ప్రారంభిస్తావు, నీవు కృపలో ఎదుగుతావు. అప్పుడు నీవు [టేపు పై ఖాలీ.]

46వెస్లీ, మరియు ఇప్పుడు పెంతుకొస్తులోనికి, అదే కార్యము. అప్పుడు కుమారుని యొక్క స్థానములో అతనిని ఉంచుట, తరువాత చివరి వరము యొక్క సూచన, అప్పుడు శరీరము యొక్క ఎత్తబడుట, దేహము యొక్క మార్పు మరియు ఎత్తబడుట.

ఇప్పుడు వారు వెనుకకు తిరిగి వచ్చినప్పుడు, ఆమె తల్లి కాబోవుచున్నదని శారా గుర్తించి యుండెను. ఓ, ఆమె తప్పక ఎంతో సంతోషముతో యుండియున్న చిన్న స్త్రీ యైయున్నది. ఇప్పుడు నేను ఆమెను చూడగలను; ఆ నల్లని ప్రకాశించుచున్న వెంట్రుకలు, పెద్ద మృదువైన కన్నులు, చక్కని ముఖము, ఆమె అప్పుడు ఒక యవ్వన స్త్రీగా మారియుండెను, వాస్తవానికి ఆమె 20 సంవత్సరాల వయస్సులో ఉన్నట్లుగా ఉండెను. అబ్రాహాము అయితే బలముగా ఆరోగ్యముగా యవ్వనస్తుడుగా ఉండెను — నడుము వంగిపోయిన స్థితినుండి వృద్దాప్యస్థితి నుండి ఒక యవ్వనస్తుడుగా మార్పు చెందెను, అబ్రాహాము యొక్క సంతానమంతటికి ఆయన ఏమి చేయబోవుచుండెనో అక్కడ చూపుచున్నాడు. ఖచ్చితముగా.

మరియు తరువాత, మొదటి కార్యము నీకు తెలుసా, వారు యవ్వన దంపతుల వలె జీవించవచ్చును. తరువాత వారు ఈ యవ్వన బిడ్డను కనిరి. మరియు ఆ బాలుడు పన్నెండు సంవత్సరాల ప్రాయములో ఉన్నప్పుడు, దేవుడు అన్నాడు, "ఇప్పుడు, ప్రజలందరు దీనిని నిజముగా నిశ్చయించుకోండి, నేను ఏమి చేయబోవు చున్నానో నేను దానిని వారికి ఋజువు చేయబోవుచున్నాను, అబ్రాహాము యొక్క సంతానము ఎన్నడు నా మాటను అనుమానించదని చూపుతాను, అబ్రాహాము యొక్క నిజమైన సంతానము ఎన్నడు నా మాటను సందేహించదు."

47ఇప్పుడు ఇక్కడే నీవు అబ్రాహాము యొక్క సంతానమో కాదో నిజంగా నిన్నునీవు పరీక్షించుకొనుము,

"నీవు దానిని నమ్మినట్లైతే నేను నిన్ను బయటకు తన్నివేస్తాను," అని సంఘము చెప్పినప్పుడు, ఆ మాట అబ్రాహాము యొక్క సంతానమునకు ఏమికాదు, వారు దాన్ని కనీసం లెక్క చేయరు. అది కేవలం అతనిని అతని మార్గంలో తిన్నగా ఉంచుతుంది. అది కేవలం అతడిని స్వతంత్రునిగా చేస్తుంది.

అతడు ముందుకు వెళ్ళి… అతడు జనములకు తండ్రి కాబోవుచున్నాడని చూచియుండెను. ఇప్పుడు దేవుడు అన్నాడు, "ఇప్పుడు నీవు నీ కుమారుని తీసుకొని, నేను దర్శనములో నీకు చూపించబోవు, నీవు దర్శనంలో చూచబోవు ఆ పర్వతము మీదకు తీసుకొని వెళ్ళి, అక్కడ అతనిని చంపివేయుము."

48ఒక మానవ మాత్రునిగా అబ్రాహాము యొక్క మనసుగుండా ఏమి వెళ్ళియుంటుందో అక్కడ మీరూహించగలరా? "సరే, నేను ఎలా జనములకు తండ్రి కాబోవుచున్నాను? ఈ సంవత్సరములన్నిటిగుండా నేను కనిపెట్టి ఈ కుర్రవానిని పొందియున్నాను మరియు ఇప్పుడు ఈ బాలునికి 12 సంవత్సరములు అక్కడ. ఇప్పుడు ఆయన నాతో ఆ కుర్రవానిని బయటకి తీసుకొని వెళ్ళి "చంపివేయుము" అని చెప్పుచున్నాను. ఎలా…? ఈ కుర్రవాని ద్వారానే ఆయన నాకు వాగ్దానం చేసియున్నాడు… శారా ద్వారా ఈ కుర్రవానినే ఆయన నాకు వాగ్దానం చేసియున్నాడు. మరియు ఈ కుర్రవానిని నేనిక్కడ కలిగియున్నట్లైతే, అతడు జనములకు తండ్రిగా అవుతాడు. ఇప్పుడు ఆయన నన్ను బయటకు తోడుకొని వెళ్ళి, ఆ కుర్రవానిని చంపమని అనుచున్నాడు."

అప్పుడే ఆ తెలివి పనిచేయుట ప్రారంభించును. ఆయితే ఆ చిన్న ఘింకారం (Buzzer) తిరిగి తిరిగి చెబుతూ ఉన్నది. " 25 సంవత్సరాలుగా అతను ఎదురుచూచినది దేని కొరకు." ఆ చిన్నఝుకారం ఇలా అన్నది అప్పుడు కత్తి అతని గొంతుపైకి వచ్చినది. అప్పుడు అది ఒక ఒప్పుకోలును చేసినది. "మృతులలో నుండి లేచిన వానిగా నేనతనిని పొందితిని. మృతులలో నుండి అతనిని లేపుటకు దేవుడు సమర్దుడని నేను సంపూర్ణంగా ఒప్పించబడ్డాను."

అది అక్కడ మాట్లాడుచున్నప్పుడు, ఇది మూసివేయబడినది.

49నేను గతరాత్రి చెప్పియున్నట్లగా, ఏదెను తోటలో దయ్యము మనిషిలోని ఒక భాగమును ఎన్నుకొనెను, మరియు దేవుడు ఒక భాగమును ఎన్నుకొనెను. దేవుడు అతని యొక్క హృదయమును ఎన్నుకొనెను. దయ్యము అతని యొక్క తెలివితేటలను ఎన్నుకొనెను.

మరియు ఈ దినమున, ఈ దినమున యున్న సంఘము, సమస్తము మానవుని యొక్క తెలివితేటలపై ఆధారపడి యున్నది, మరియు హృదయమును గూర్చి ఎన్నడూ ఆలోచన చేయదు, చూడండి. వారు చూడగలిగే ఒకే ఒక సంగతి… "సరే, ఆ విధముగా నేను సరిగ్గా చూడలేను," అని అంటారు. ఎలాగైనా నీవు నీ కన్నులతో దానిని గ్రహించలేవు. నీవు నీ కన్నులతో చూస్తావు. నీ హృదయముతో గ్రహిస్తావు. నీవు దేనివైపు చూసినా, "నేను దానిని సరిగా చూచుటలేదు," అని అంటావు. నీవు దాని వైపు చూచుచున్నావు, అయితే నీకు అది కనబడుటలేదు. దాని భావము, నీవు దానిని గ్రహించుటలేదు. నీ గ్రహింపు నీ హృదయము నుండి వస్తుంది.

ఇప్పుడు. అతను ఇక్కడే యున్నాడు. అతడు తన మనసుతో దానిని గ్రహించలేడు. మరి ఎలా అతడు దానిని చేయబోవుచున్నాడు? అతని తెలివితేటలు దానిని అతనికి చెపుతాయి. అది అతని యొక్క తర్కమై యున్నది. అయితే బైబిలు చెప్పియున్నది, మనము తర్కములను క్రిందికి పడద్రోయుచున్నాము, మననుండి వాటిని క్రిందకు పడవేయండి.

"నేను బాగుపడడని వైద్యుడు చెప్పినప్పుడు, నేను ఎలా బాగుపడగలను…? నేను దానిని చేసియున్నాను…"

అది దానితో చేయునది ఒక్కటి కూడా లేదు.

50దానిని నిజముగా నమ్మువారు ప్రతి 500 మందిలో ఒకరు మాత్రమే నీకు దొరుకుతారు. సరిగ్గా తిన్నగా అది వారిని సర్ధివేస్తుంది మరియు ఈ ప్రపంచములో మరి ఏదియూ ఎన్నడూ వారిని మార్చలేదు.

"సరే, మనము ఏమి చేయవలసియున్నది?" ఆ వ్యక్తిని కనుగొనువరకు మనము సమస్తము గుండా నరికివేద్దాము. అది సత్యము.

ఆ ఒక్క మనిషిని కనుగొనుటకు దేవుడు భూమి అంతటా వెతుకుచున్నాడు. ఓ దేవా! నేను దానిని గూర్చి ఆలోచిస్తున్నప్పుడు, అది నా హృదయమును మండిస్తుంది. ఆయనకు లోబడు ఆ ఒక్క మనిషిని కనుగొనుటకు దేవుడు భూమి మీద వెదుకుచున్నాడు. ఆయన ఎల్లప్పుడు దానిని చేసియున్నాడు. ఆయన నోవహు దినమున యున్న కోట్లమంది ప్రజలలో ఒక్క మనిషిని ఆయన కనుగొనియున్నాడు.

ఈ దినమున సంసోను వలె అనేక మంది యున్నారు. సంసోను దేవునికి తన బలమును ఇచ్చియున్నాడు, కాని అతని హృదయమును దేవునికి ఇయ్యలేదు. దేవుడు అతని యొక్క బలమును వాడుకొన్నాడు, కాని అతని హృదయమును వాడుకొనలేదు. సంసోను ఒక విధముగా చూస్తే ఒక ఆడవారితో గడుపుటకు ఇష్టపడువాడు, మీకు తెలుసా, కాని కేవలము అతడు తన హృదయమును దేవునికి ఇవ్వలేకపోయాడు. అతడు తన హృదయమును దెలీలాకు ఇవ్వవలసియుండెను. అయితే అతడు తన బలమును దేవునికి ఇచ్చాడు. దేవుడు అతని బలమును వాడుకొన్నాడు, కాని అతని హృదయమును వాడుకొనలేదు.

51ఈ రోజున అనేకులు, దేవా… నీ తెలివితేటలను నీవు దేవునికి ఇస్తావు. నేను నీకు ఒక పెద్ద గృహమును కడతాను; ఒక సంస్థగా నేను నిన్ను చేస్తాను. నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను," అని అంటారు. ఆ కార్యమునే కయీను చేసియున్నాడని మీరు గ్రహించలేరా? అది దేవునిచేత తిరస్కరించబడినది.

కయీను తానే ఒక బలిపీఠమును నిర్మించియున్నాడు, మరియు బలిఅర్పణను సిద్ధము చేసియున్నాడు మరియు అతడన్నాడు, "అది ఇక్కడయున్నది. నేను నిన్ను ఆరాధిస్తాను. నేను నిన్ను నమ్ముతాను. అక్కడ నా యొక్క అర్పణయున్నది. అక్కడ నా బలిపీఠముయున్నది. దానిని తీసికొనుము లేక విడిచిపెట్టుము." అదే ఈ దినమున మనిషి చేయునది, మతభక్తి గల మనిషి.

ఏశావును అదే రీతిగాయున్నాడు. మరియు సంఘమును ఆ రీతిగానే యున్నది. "నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను దీనిని చేశాను" అంటారు. అది నీవు ఏమి చేశావు అనునది కాదు; అది ఆయన ఏమి చేసియున్నాడో అనునది. నీ హృదయమును ఆయనకు ఇచ్చి, మరియు ఆయనను వెంబడించుము.

GEN 22:3,5

 

52ఆయనను వెంబడించు ఒక మనిషిని కనుగొనుట కొరకు ఆయన ప్రయత్నించుచున్నాడు.

ఆయన ఒక మనిషిని కలిగియున్నాడు, అతడు అబ్రాహాము. ఆ పరిపూర్ణమైనవాడై యున్నాడు. దేవుడు ఏది చెప్పినా, అది అతనికి సరిగానే యున్నది. కాబట్టి గమనించండి. మీరు ఊహించగలరా. ఇప్పుడు…? ఆ చిన్న చక్కని నేత్రములు కలిగిన యూదుడైన ఆ 12 ఏండ్ల బాలుని ఆ పైకి తీసుకొని వెళ్ళి, అతని గొంతును కోస్తానని, తన భార్యయైన శారాకు అబ్రాహాము చెప్పలేకపోయాడు. అలాటి సంగతిని తల్లికి చెప్పుట ఒక భయంకరమైన విషయముగా యున్నది. అతడు దానిని ఆమెకు చెప్పలేక పోయాడు.

కాబట్టి మరుసటిరోజు ఉదయమున అతడు లేచి, కొన్ని కట్టెలను నరికెను. "అతడు కొన్ని కట్టెలను చీల్చెను," అనగా దాని భావము వాటిని నరుకుట. వాటిని ఒక రకమైన సంచెలో ఉంచెను, ఒక విధమైన తోలు సంచెతో ఉంచి, వాటిని గాడిదల మీద ఉంచెను. మరియు ఇద్దరు పనివారిని పిలిచెను, వారితో ఇలా అన్నాడు, "ఇస్సాకు, నీవు మరియు నేను ఆరాధనకు వెళ్ళుచున్నాము. గాడిదలను మన వెంబడి తీసుకొని వెళదాము. అమ్మా, మేము కొన్ని దినములలో తిరిగి ఇంటికి వస్తాము."

మంచిది, అతడు ముందుకు సాగెను. అతడు పర్వతము వైపు పైకి వెళ్ళెను. మరియు గుర్తుంచుకోండి, అతడు మూడు దినముల ప్రయాణము చేశాడు, అది నిజమేనా? మూడు దినములు. ఇప్పుడు, ఒక సామాన్యుడు, ఏ మనిషియైనా… మరియు అతడు యవ్వనస్తుడు, బహుశ 20 సంవత్సరాలు, లేక 25 సంవత్సరాలు. నేను పర్యవేక్షణ చేసేటప్పుడు, నేను అరణ్యములగుండా ప్రతిరోజు 32 మైళ్ళ నడిచేవాడను. మేము ఎల్లప్పుడును స్వారి చేస్తూయుండే వారము. వారి రవాణా కొరకు మనుషులందరూ ఒక గాడిద మీద స్వారిచేయుట గాని, లేక నడచుట గాని చేసేవారు. కాబట్టి నేను నడువగలను… చిట్టచివరిగా నేను చెప్పగలను, ఆ పర్వతముల మీద కనీసము అతడు రోజుకు 20 మైళ్ళ దూరము నడిచాడు.

సరే, అతడు మూడు దినములు నడచిన తరువాత, అప్పుడు కన్నులెత్తినప్పుడు, మరియు అతడు దర్శనములో చూచిన పర్వతమును దూరములో నుండి చూశాడు. అప్పుడు దాని యొద్దకు చేరుకొన్నాడు. నాగరిక ప్రపంచము నుండి అతడు ఎంత దూరములో యున్నాడో గమనించండి. నేను దీనిని ప్రేమిస్తాను. ఇది ఎంతో అందముగా యున్నది. దీనిని తప్పిపోవద్దు.

GEN 17:5•

GEN 22:5

 

53వారు పర్వతము నొద్దకు చేరినప్పుడు, ఆ గాడిదలను పట్టుకొని యున్న బాలురుతో అబ్రాహాము ఇలా అన్నాడు, "మీరు ఇక్కడనే నిలిచి యుండండి, గాడిదలను కనిపెట్టండి. ఈ బాలుడు, నేను అదిగో ఆ పైన ఆరాధన చేయుటకు వెళ్ళుచున్నాము, మరలా నేను నా బాలుడు (ఇస్సాకు) తిరిగి వస్తాము."

నీవు ఆ బాలుని చంపబోవుటకు అక్కడకు వెళ్ళబోవుచున్నావు. అబ్రహమా, నీవు ఆ మాటను ఎలా చెప్పబోవుచున్నావు? అది ఏమిటి? అది విశ్వాసమైయున్నది. అది ఎలా సంభవించబోవుచున్నదో అది ఎరుగదు, కాని అది సంభవించబోవుచున్నదని అతడు ఎరిగియుండెను. ఓ!

"బ్రెన్హాం సోదరుడా, నీవు అక్కడ వింతగా ప్రవర్తించుచున్నావు," అని నీవు అంటావు.

"సరే, బహుశ నేను అలా చేశాను. అయితే నేను ఎంతో మంచిగా యున్నాను. ఆ పాత శరీరసంబంధమైన తెలివికంటె ఈ విధముగా చేయుటలో నేను మంచి అనుభూతిని కలిగియున్నాను, కాబట్టి ఈ మార్గములోనే దానికంటె నేను ఎక్కువగా నిలిచియుంటాను.

"పిల్లలారా, గాడిదలతో మీరు ఇక్కడవేచి యుండండి. బాలుడు మరియు నేను అదిగో, ఆ పైన దేవునిని ఆరాధించుటకు వెళ్ళచున్నాము మరియు మరలా మేము తిరిగి వస్తాము."

"అబ్రహామా," అని ఒకవేళ దేవుని దూత నిలబడి అన్నట్లైతే." సరే, ఒకవేళ మరొకవైపు దయ్యము నిలబడి, "అబ్రహామా, నీవు అబద్ధమును చెప్పావు," అని అన్నట్లైతే.

"ఓ, లేదు. నాలో అక్కడ లోపల ఏదో యుండి ఇలా చెప్పుచున్నది, నేను అతనిని చంపవలసివచ్చినను, మృతులలో నుండి తిరిగి లేచినవానిగా, నేను మరలా అతనిని స్వీకరిస్తాను; దేవుడు అతనిని తిరిగి బ్రతికించి భూమి మీదకు తెస్తాడు. ఈ బాలుడు మరియు నేను తిరిగి వస్తాము. కారణము ఎందుకు? ఈ బాలుని యొక్క సంతానము ద్వారా జనములను రక్షిస్తాడని దేవుడు ఇదివరకే చెప్పియున్నాడు. మరియు ఆయన నా పేరును మార్చి, మరియు నా పేరు చివరలో "హామ్" ను ఉంచి యున్నాడు, మరియు ఈ బాలుని ద్వారా నేను జనములకు తండ్రినై యున్నాను, మరియు అక్కడ దేవుడు ఏమి చేయబోవుచున్నాడో నాకు తెలియదు, అయితే ఆయన దానిని చేయబోవుచున్నాడు."

54అయ్యో! ఓ, మై! అది అగ్నిని వేస్తుంది… నీవు నిలబడుటకు అది దేనినో నీకు ఇస్తుంది. అది ఎన్నడూ సంభవించని ఈ కాథలిక్కు వారు చెప్పే కొన్ని కల్పనా కధలైన శాంతాక్లాస్ కాదు. అది "యెహోవా దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు," యై యున్నది. ఆమెన్! "మేము ఎలా తిరిగి వెనుకకు వచ్చుచున్నామో, అది ఏ బేధమును నాకు చేయదు, ఎలాగైనా మేము తిరిగి వచ్చుచున్నాము. అంతే."

ఇప్పుడు, ఇక్కడ ఒక మనిషియున్నాడు, గ్రుడ్డివాడు చేతి కర్రతో కూర్చొనియున్నాడు, ఒకవేళ అతనితో ఇలా చెపితే. "అయ్యా, నీవు నీ దృష్టిని ఎలా పొందబోవుచున్నావు?" అయితే ఒక్కసారి దేవునిని అతనితో మాట్లాడనివ్వండి, మరియు అప్పుడు గమనించండి, ఏమి జరుగుతుందో, బహుశ ఇక్కడ ఒకరు కాన్సర్ వ్యాధితో చనిపోవుచు ఇక్కడ ఉండవచ్చు. ఆ వెనుక మరొకరు గుండె జబుతో యున్నారు, ఇప్పుడే ఒక పరీక్షను చేయించుకొన్నారు. వైద్యుడు ఇలా అన్నాడు, "నీవు బ్రతుకవు; నీవు చనిపోవబోవుచున్నావు."

ఆ చిన్న ఘింకారము ఒక్కసారి ఈల వేయ నియ్యండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నీకు దృష్టిని ఇచ్చువాడను నేనే నీ కాన్సెర్ వ్యాదిని తీసివేయువాడను నేను, నిన్ను నడిపించువాడను నేనే," అది అంతయూ సమాప్తమైనది. ఏది ఏమి చెప్పినా, సైన్సు ఏది చెప్పినా - నేను లెక్క చెయ్యను. వైద్యుడు నీ గుండెను పరీక్షించి, నీ గుండె ఇది వరకే ఆగిపోయినదని నీకు చెప్పినను. అది నీకు లెక్క కాదు. అవునండి. దానిని ఎలాగైనా ఆయన చేయబోవుచున్నాడు. ఏదియు దానిని అక్కడ ఆపలేదు. అదే విశ్వాసమైయున్నది.

55అది ఏమిటో నీకు తెలుసా? సహోదరీ, సహోదరులారా, నన్ను మన్నించండి. నేను దీనిని ఎందుకు చెప్పబోవుచున్నానో నాకు తెలియదు, అయితే దానిని చెప్పుటకు అది నన్ను అణిచివేయుచున్నది. ఏదో నాకు సంభవించుటకు సిద్ధమగుచున్నదని నాకు తెలుసు, అందుచేత నేను దానిని మీ ముందు పెట్టుచున్నాను. అది నిజము. దేవునికి మహిమ!

సహోదరులారా, ఎంతో అనుకరించే విశ్వాసమును, అమెరికా వారి యొక్క బహుగా నటించే విశ్వాసమని పిలువబడు దానిని నేను ఎంతో చూసియున్నాను, అది నా కడుపులో నన్ను రోగిగా చేయుచున్నది. సువార్తికులు ప్రార్ధనా వరుసలగుండా ప్రజలను నడిపిసూ, "ఓ, ఓ, ఓ, స్పర్శించుచున్నారా?" అని చెప్పుచున్నారు. నీవు దానిని ఎలా చేయబోవుచున్నావా?

మొన్నటి దినమున, ఒక జర్మన్ లూధరన్ సేవకుడు వ్రాసిన ఉత్తరము నాకు వచ్చినది, జర్మనీలోని ఆ సమాఖ్యకు అతడు అధిపతియై యున్నాడు, అది ఒక నిర్ణీతమైన జిల్లా, అక్కడ ఒక సువార్తికుడున్నాడు. మరియు ఇతడు ఆ సువార్తికుని దృష్టికి ఈ విషయమును తెచ్చాడు. "నీవు చేసిన ఈ కార్యము ప్రజలను డబ్బు కొరకు చేసినట్లు ఉన్నది. అమెరికావారైన మీరు ఇక్కడ నుండి దూరముగా ఉండుట మంచిది," అని అన్నాడు. అది నిజము. అది నిజము. నేను అతనితో సమ్మతించుచున్నాను.

ఈ అతీత నాటకీయత లాంటి విశ్వాసమును గురించి మీరు ఇది అంతయూ బహుగా చెప్పినట్లయితే, అక్కడయున్న డెబోరా స్తాడ్స్కైవ్ సంగతి ఏమిటి?"

56ఇప్పుడే ఆ ఉత్తరమును తిన్నగా నేను నా ఫైలులో కరిగియున్నాను, సోదరుడా, ఇక్కడ నుండి నేను ఏది చెప్పినా, నేను దానిని సమర్ధించగలను.

అతడు అన్నాడు, "మీరు కలిగియున్నట్లు మాట్లాడుచున్నది విశ్వాసము, అయితే ఎందుకు మీరు ఈ ఎగరటము మరియు గంతులు వేయటము, ఈ సమస్తమును చేస్తూ, ప్రజలు స్వస్థతనొందియున్నారని చెప్పుటకు మీరు ప్రయత్నము చేయుచున్నారు; మరియు వారు దానిని చేయనప్పుడు, వారు అది చేశారు మరియు ఇది చేశారు అని ఎందుకు చెప్పుచున్నారు? నీవు ఏ విధమైన పశ్చాత్తాపమును ఎన్నడూ తేలేదు."

"ఆ చిన్న దెబోరా స్తాడ్స్కైవ్ గురించి అతడిని పిలిచినపుడు, సహోదరుడు బ్రెన్హాం కనిపెట్టినట్లు మీరు ఎందుకు కనిపెట్టరు?" అని అతడన్నాడు. ఆయన నిర్దిష్టమైన జవాబు దేవుని నుండి వచ్చు వరకు బయట కనిపెట్టి యున్నాడు," అని అన్నాడు.

అక్కడే నీవున్నావు! "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అని నీవు వినువరకు కనిపెట్టుము. మీ జీవితములను శుభ్రపరచ౦డి; మీ అవిశ్వాసము నుండి దూరము కండి; "నేను ఒక అనుభూతిని పొందాను, నేను రక్తమును కలిగియున్నాను, నాకు ఇది యున్నది, అను బహుగా చూపించే నటనను వదలిపెట్టండి.

"ఓ, ఆశ్చర్యము లేదు, అవన్నియు మునిగిపోవుచున్నవి. అది తప్పక అవిశ్వాసము నుండి దేవుని బైబిలు యొక్క పశ్చాత్తాపమునకు రావలసియున్నది; ఏదో చప్పట్లు, ఎంతో ఉద్రేకమును పొందుట అను బహుగా చూపి౦చే నటన కాదు. పెంతికొస్తు వారి యొక్క జన్మస్థలము దానిలోనే యున్నది.

ఈ దినములలో వారిని కుదిలించి, "నీవు దానిని చెప్పు, దానిని చెప్పు, దానిని చెప్పు, దానిని చెప్పు, దానిని చెప్పు, దానిని చెప్పు," అని చివరకు వారు ఏదో తెలియని అన్యభాషలలో మాట్లాడువరకు వారితో చెప్పించుచున్నారు; లేక ఏదో ఒక గందరగోళము చెంది మీరు పరిశుద్దాత్మను కలిగియున్నారని వారితో చెప్పుచున్నారు — మరియు వారు ఎంతో అవిశ్వాసమును కలిగి, ఏ రకమైన జీవితమునైనా జీవిస్తారు, అది దయ్యపు నరకమును బయటకు విస్తరింపచేస్తుంది. బహుగా నటించే విశ్వాసము! హ!

57ఎలాగైనా, నా సంగతి ఏమిటి? నేను కేవలము సత్యమును మీకు చెప్పుచున్నాను, మీరు దానిని పట్టుకొనండి. ఏదో ఒక దినమున నేను మీకు సత్యమును చెప్పియున్నానని మీరు తెలుసుకొంటారు. నా స్వరము బహుశ నిమ్మలించవచ్చు. మాట్లాడుచున్న ఆ శరీరమును నీవు నిమ్మళింపచేయగలవు, కాని ఆ స్వరమును నీవు ఎన్నడూ నిమ్మళింపచేయలేవు. అది దేవుని నుండి వస్తుంది. వారు సైపనును రాళ్ళతో కొట్టారు, అయితే అతని వర్తమానమును వారు ఆపలేకపోయారు. అది ముందుకు సాగిపోతుంది. నేను వెళ్ళిపోయిన అనేక సంవత్సరముల తరువాత కూడా ఈ టేపు వర్తమానములు వినిపించబడతాయి. అవును.

బహుగా నటించు విశ్వాసము. స్త్రీలు ముఖములకు రంగులు వేసుకొని పొట్టిబట్టలు ధరించినవారై, అమెరికావారు వారి విశ్వాసమును ఎంతో నరముల ఉద్రిక్తత క్రింద నిర్మించుకొనుచున్నారే, ప్రార్ధనావరుసల గుండా వారిని నెట్టుచూ వారిని కుదుపుచున్నారు, "అవును, నీవు దానిని పొందియున్నావని," కేకలు వేయుచున్నారు. ఓ, బుద్ధిహీనత. మారుమనస్సు పొందండి! దేవుని యొద్దకు తిరిగి రండి. మనకు ఒక శుద్ధిచేసుకొనుట అవసరమైయున్నది! ఆమెన్.

నేను కోపముగా యున్నానని తలంచవద్దు. నేను కోపముగా లేను. నేను కోపముగా యున్నట్లైతే, ఈ వర్తమానమును ముగించక ముందే నేను ఆ దిగువ వేదిక నొద్దకు వెళ్ళి, నేను పశ్చాత్తాపపడతాను. నేను కేవలము మీకు చెప్పుచున్నాను, కారణము నా హృదయములో ఎదో మండుచున్నది. మరియు అది దేవుని వాక్యమైయున్నది.

వేదిక మొదలుకొని అట్టడుగునయున్న బేస్మెంట్ వరకు, బహుగా నటించు విశ్వాసముగుండా ఒక శుద్ధిచేయుట మీకు అవసరమై యున్నది, దేవునితో అలాటి కార్యము లేదు. దేవుని యొక్క విశ్వాసము శుద్ధమైనది, సూటిగా, కల్తి లేనిది (అది నిజము), ఏదో లోపల కదలుచూ, "నేను దానిని అంగీకరిస్తాను," అని చెప్పుము. సోదరుడా, అప్పుడు నీవు ఎక్కడయున్నావో నీవు తెలుసుకుంటావు.

MATT 8:4

 

58ఈమధ్య కాలములోనే, ఆ దిగువనయున్న కెంటకిలో సహోదరుడు సులివాన్, మాసిక వేసిన ఒక నీలిరంగు షర్టును ధరించిన ఒక వృద్ధ మనిషి మెరయుచున్న గోధుమ రంగు కన్నులు గలవాడు — నా కన్నులలోనికి చూసి ఇలా అన్నాడు, "బోధకుడా, నేను దానిని నమ్ముతాను." ఓ, సోదరుడా! అది నూటికి-నూరు-శాతము కంటె ఎక్కువ అని అన్నాడు. అతడు దానిని చేశాడు. మరియు కాన్సర్, తన ముఖము ప్రక్కన వ్రేలాడుచూ, నేలమీద జారిపడిపోయియున్నది! అతడు దానిని నమ్మియున్నాడు. విశ్వాసమునకు బదులుగా అనేకమంది నిరీక్షణను కలిగియున్నారు.

ఇప్పుడు, వార్తాపత్రికలు ఆ సంగతిని ప్రచురించియున్నవి. ఒక విలేఖరి నిలబడియుండగా, కాన్సర్ అతని ముఖము మీద నుండి దొర్లుకొంటూ క్రింద అతని కాళ్ళ మీద పడినది. దానిని వ్రాయకుండా అతడు దానిని దాచలేకపోయాడు. తానే స్వయముగా దానిని పైకి ఎత్తి పట్టుకొని ఇలా అన్నాడు.

"అది ఎక్కడను కనిపించుటలేదు," అని అన్నాడు.

యేసు అన్నాడు, "ఆ సంగతి ఎవరితోనూ చెప్పవద్దు."

ఈ దినమున ప్రజలముందు దానిని మనము ఏదో నిర్ధారించుటకు మనము ఎంతో చాటింపు వేయుచున్నాము. ఒ, నేను దానిని మూసి వేయుట మంచిది, ముందుకు వెళ్ళండి. గమనించండి.

GEN 22:6-8

 

59అయితే అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు."

అబ్రాహాము ఆ చిన్నవానిని తోడుకొని వెళ్ళాడు (గమనించండి), ఇస్సాకు వీపుపై కట్టెలను ఉంచాడు. అతని వీపు మీదనున్న కట్టె క్రీస్తుకు మాదిరిగా యున్నది. వారు కొండపైకి వెళ్ళారు, పైకి వెళ్ళారు. కలప యుండు దారి దాటి పైకి వెళ్ళారు. పైకి పెద్ద బండల మీదికి వెళ్ళారు. పైకి పెద్ద అరిగిపోయిన రాళ్ళగుట్ట మీదికి, కడిగివేయబడిన ఇసుకల మీదికి వెళ్ళారు. కొండపైకి వెళ్ళారు, అక్కడ చుట్టుకొనియున్న ముద్దలవలెయున్న పాత దాక్ష వల్లులు తప్ప మరి ఏమియు అక్కడ యుండవు, లేక రాళ్ళ తప్ప మరేమియూ ఉండవు.

అతడు తానే స్వయముగా 12 రాళ్ళను ఏకముగా దొర్లించినాడు, వాటిపై కట్టెలను పేర్చినాడు, నిప్పును తీసుకొని, బలిపీఠమును వెలిగించాడు. చిన్న ఇస్సాకు అనుమానము వచ్చి, "నా తండ్రి," అని అన్నాడు.

"నా కుమారుడా," నేను ఇక్కడనే యున్నాను.

"ఇక్కడ బలిపీఠమున్నది, ఇక్కడ కట్టెలు యున్నవి, అయితే దహనబలికి గొర్రెపిల్ల ఏది?" అని అతడన్నాడు.

"నా కుమారుడా, దేవుడు తానే తనకొరకు బలియర్పణను సమకూర్చుకొంటాడు," అని అబ్రాహాము అన్నాడు. అక్కడనే నీవున్నావు.

నేను చేయుచున్న ఒకే కార్యము, కేవలము సూచనలను వెంబడించుట; గొర్రెపిల్లను సమకూర్చుకొను కార్యము దేవునిదైయున్నది. "నేను ఎలాగు నా దృష్టిని తిరిగిపొందబోవుచున్నాను? నేను ఎలా దానిని పొందబోవుచున్నాను…?" అది ప్రశ్న కాదు. కేవలము సూచనలను పాటించుము, తప్పిపోకుండా దేవునిని నమ్ముము. దేవుడు స్వయముగా తన కొరకు గొర్రెపిల్లను బలియర్పణను సమకూర్చుకొనును.

GEN 22:10-13

 

60అప్పుడు అతడన్నాడు, "ఇస్సాకు, నీ చేతులను వెనుకకు పెట్టు. అతడు ఒక త్రాడును తీసుకొని అతని చేతులను కట్టుటకు మొదలుపెట్టాడు. అప్పుడు ఇస్సాకుకు తెలిసినది. దేవుని నిజమైన కుమారుడైన యేసువలె అతని యొక్క విధేయతను గమనించండి, మరణమునకు విధేయత, సిలువను ఎత్తుకొనెను. అతని కాళ్ళను మరియు చేతులను బంధించాడు. ఆ చిన్నవానిని అబ్రాహాము పైకెత్తి బండ మీద ఉంచాడు.

అక్కడ అతడు నిలబడి ఆ పని చేయుచుండగా, అతని యొక్క తెలివితేటలు పనిచేయుటకు ప్రయత్నించెను అని నేను ఉహించగలను, "నీవు తెరిగి ఇంటికి వెళ్ళినప్పుడు, శారాకు ఏమి జవాబును ఇయ్యబోవుచున్నావు?"

అయితే ఆ చిన్న ఘింకారము ఇలా తిరిగి చెప్పుచున్నది, "నేను యెహోవాను. నేను సమకూర్చుదును. నీవు కేవలము నన్ను వెంబడించుము."

చూడండి, రెండు కార్యములు అదే సమయములో పనిచేయుచున్నవి. నీవు దేనిని వినబోవుచున్నావు? నీవు ఇది విన్నట్లైతే, నీ పని అయిపోయినట్లే; దీనిని వినుము, నీవు వెళ్ళలేవు. నీవు తప్పక నిశ్చయతను కలిగియుండాలి. ఇది పరిపూర్ణముగా యున్నది. ఇప్పుడు, అతని ముఖము మీదయున్న వెంట్రుకలను వెనుకకు నెట్టి, అతని తలను పట్టుకొన్నాడు, మెడ ఖాళీగా యుండునట్లు తలను వెనుకకు పెట్టాడు - అతని మెడ నిమ్మళముగా యుండునట్లు అతని చిన్న చొక్కాయని వెనుకకు విప్పదీసి లాగాడు. ప్రియమైనవాడా, నీ తండ్రి కొరకు నీ తలను కొంచెము వెనుకకు ఉంచుము."

అది సుళువైనదని అనుకొంటారా? అక్కడ ఏదో ఆ దిగువన ఒక నిజమైన ప్రేమ కదులుచున్నది, అది తప్పిపోదు.

అతని తలను వెనుకకు ఉంచాడు, ఆ పెద్ద కత్తిని ఆ రీతిగా బయటకు తీశాడు (ఒక రేజరు బ్లేడువలె పదును పెట్టబడిన కత్తి), అతని తలను వెనుకకు లాగాడు, కత్తిని బయటకు తీశాడు, తన తలను దేవునివైపు పైకెత్తాడు, బాలుని పై జుట్టును అలా వెనుకకు పట్టియుంచాడు, మరియు తన చేతిని పైకి ఎత్తాడు.

ఆ సమయమునకు పరిశుద్దాత్మ అతని యొక్క చేతిని పట్టుకొన్నది. "అబ్రహామా, నీ చేతిని నిలుపుము. నీవు నన్ను ప్రేమించుచున్నావని నేను ఎరిగి యున్నాను." మరియు ఆ సమయములో ఒక పొట్టేలు అతని వెనుక అరచుచుండెను. ఒక సెకనుకు ముందు అది అక్కడ లేదు. ఆ పొట్టేలు ద్రాక్షావల్లిలో కొమ్ములు చిక్కుకొని, "బా, బా, బా," అని అరచుచుండెను. అబ్రాహాము చుట్టూ చూశాడు, వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని, ఇస్సాకును బంధించిన త్రాడుతో దానిని బంధించి, బలిపీఠము మీద అర్పించాడు.

61నేను మిమ్ములను ఒకటి అడుగగోరుచున్నాను. ఆ పొట్టేలు ఎక్కడ నుండి వచ్చియున్నది? అది నాగరికత ప్రపంచమునకు కనీసము 100 మైళ్ళ దూరములో సింహముల, చిరుతపులుల మధ్య, అడవి కుక్కల మధ్య అది యున్నది… వాటిలో ప్రతిది ఒక గొర్రెను తినివేస్తాయి. మరియు ఇంకా, అది పర్వతముపైన యున్నది, అక్కడ ఏ విధమైన ఆహారము మరియు నీరు యుండదు, మరియు అబ్రాహాము బలిపీఠము కట్టుటకు రాళ్ళను చుట్టూ వెదుకుతున్నప్పుడు అది అక్కడ లేకుండెను. అయితే ఇప్పుడు అది అక్కడయున్నది.

ఓ దేవా! యెహోవా-యీరే! ఆయన తానే తన కొరకు ఒక గొర్రెపిల్లను బలియర్పణ కొరకు సమకూర్చుకొనెను. మరియు ఈ రాత్రి ఆయన అదే యెహోవా-యీరేయై యున్నాడు. ఒక్కటి మాత్రమే అది ఇప్పుడు అబ్రాహాము యొక్క సంతానమునకై యున్నది. ఆయన ఇదివరకే గొర్రెపిల్లను సమకూర్చెను. ఇదివరకే గొర్రెపిల్ల చంపబడియున్నది, రక్తము కారుచున్న ఒక గొర్రెపిల్ల.

ఇప్పుడు, అబ్రాహాము చూచినది, ఒక దర్శనము కాదు, కారణము గొర్రెపిల్ల రక్తము కార్చినది, మరియు ఒక దర్శనము రక్తము కార్చడం చూశారా? అతడు ఒక గొర్రెపిల్లను చంపెను. దేవుడు దానిని ఉనికిలోనికి పలికియున్నాడు, మరియు ఒక్క నిమిషము సమయమునకు ముందే ఉనికిలో నుండి అబ్రాహాము దానిని తీసుకొనియున్నాడు. అది ఉనికిలోనికి వచ్చి మరలా తరువాత నిమిషములో ఉనికిలో నుండి వెళ్ళిపోయినది, కారణము దేవుడు దానికి ఒక కారణమును కలిగియున్నాడు, ఏలయనగా అతనిని పరీక్షిస్తూ దేవుడు ఒక వ్యక్తిని అక్కడకు తెచ్చియున్నాడు. అబ్రాహాము పరీక్షించబడియున్నాడని బైబిలు చెప్పినది. మరియు అబ్రాహాము యొక్క సంతానము పరీక్షించబడినది. దేవుడు ఎలా తన సేవకుని పరీక్షించుచున్నాడో మరియు ఆయన కోరినట్లు దేనికైనా ఏ మార్గములోనైనా సమకూర్చుగలడు లేక తయారు చేయగలడు, కారణము ఆయన యెహోవా-యీరేయైయున్నాడు.

62ఇప్పుడు, నీవు రోగివైయున్నట్లైతే, బాధింపబడుచున్నట్లైతే, నీలో ఏ తప్పుయున్నప్పటికి లెక్క కాదు, నీవు బాగుపడబోవుచున్నావని దేవుడు నీకు బయలుపరచియున్నట్లైతే…. నీవు ఇదివరకే స్వస్థపడియున్నావు, ఆయన సమకూర్చిన గొర్రెపిల్ల ద్వారా, మరియు వైద్యుడు నీవు బాగుపడవని చెప్పినప్పటికి లెక్క కాదు, ఆయన యెహోవా-యీరేయై యున్నాడు, నీకు కన్నులను ఇవ్వగలడు. ఆయన దానిని చేయుటను నేను చూసియున్నాను. ప్రభువు నీకు చెవులను ఇవ్వగలడు. ప్రభువు నీకు ఆరోగ్యమును ఇవ్వగలడు. దేవుడు నీకు బలమును ఇవ్వగలడు. ఆయన యెహోవా-యీరేయై యున్నాడు. ప్రభువు యొక్క సిద్దపరచబడిన అర్పణ. మరియు యేసుక్రీస్తులో, దేవుని యొక్క కుమారుడు, ఇదంతయూ నీ కొరకు కలుసుకొన్నది, అబ్రాహాము యొక్క సంతానము, అబ్రాహాము నమ్మియున్నట్లు నీవు కేవలము నమ్మినట్లైతే. నీవు దానిని చేస్తావా? అలాగైతే మన తలలను వంచుదాము.

నీవు రోగివైయున్నవా? నీకు ఆయన కావాలా? యెహోవా-యీరే ఇక్కడయున్నాడు — అన్నిటిని వాగ్దానము చేసిన అదే వ్యక్తి, అన్ని సూచనలను ఇచ్చుచున్నాడు, ఆయన వాక్యమునంతటిని నెరవేర్చుచున్నాడు, ఈ రాత్రి ఒహయోలోని మిడిల్టౌన్ ఆర్మొరీలో ఇక్కడ ఆయన యున్నాడు. నీకు ఆయన అవసరమైనట్లైతే, కేవలము నీ చేయిని పైకెత్తుము. ఇప్పుడు నేను ప్రార్దన చేయుచుండగా, నీ మనస్సులో ఆయనను ఉంచుకొనుము.

63పరలోకపు తండ్రీ, నీవు సిద్ధపరచిన బలియర్పణ నామములో, నేను అంగీకరించినవాని నామములో నేను వచ్చుచున్నాను, ఇంకా మూడు నిమిషములలో నేను చనిపోతానని ఒక ప్రత్యేక వైద్యుడు చెప్పియుండగా, ఆయన ఈ దుర్మార్గుని, క్రూరమైన, నా ఐరిష్ జాతి హృదయమును, అక్కడ పడకపై హాస్పిటల్లో పరుండియుండగా ఆయన నన్ను మార్చియున్నాడు. నేను మూడు నిమిషములు మాత్రమే జీవించవలసియుండగా, కొన్ని సంవత్సరాల క్రితము నా గుండె ఒక నిమిషమునకు 17 సార్లు మాత్రమే కొట్టుకొనుచుండెను, అయితే యెహోవా-యీరే రంగము మీదికి వచ్చెను. అప్పుడు నేను మూడు నిమిషములు మాత్రమే జీవించవలసియుండెను, ఇది 35 సంవత్సరాల క్రితము జరిగినది. అయితే యెహోవా-యీరే నాకు జీవమును ఇచ్చెను. అలాగైతే నేను ఎందుకు ఆయన కొరకు ఆ సమయమును ఖర్చుపెట్టకూడదు?

ప్రభువా, ఈ రాత్రి, సందేహము లేదు, కొందరు ఇతరులు ఇక్కడ యున్నారు, అంత చెడ్డవారు కాదు. అయితే నేను ఆ హాస్పిటల్ పడక మీద ఆయనకు ఈలాగు వాగ్దానము చేశాను, నేను ఆయన కొరకు నిలబడతానని, ఆయనను బట్టి ఎన్నడూ సిగ్గుపడనని ఆయనకు వాగ్దానము చేసియున్నాను, దానిని ఇంటి కప్పుల మీద ఎక్కి వీధి సందులలో ప్రకటిస్తానని నేను ఆయనకు వాగ్దానము చేసియున్నాను. మరియు దేవా, 31 సంవత్సరాలుగా నేను కేకలు వేసియున్నాను. ఇప్పుడు, నీ సేవకుడు వృద్ధుడగుచున్నాడు. ప్రభువా, ఈ రాత్రి ఈ ప్రజలను ఆశీర్వదించుమని నీకు ప్రార్ధన చేయుచున్నాను, మరియు ఈ సువార్త సత్యమును వారిని చూడనిమ్ము.

ఆ పాట వ్రాసిన గ్రంధకర్త చెప్పియున్నట్లుగా,

అది కృపయే నా హృదయమునకు భయమును నేర్చినది,

అది కృపయే నా కలవరమును తొలగించినది.

నేను విశ్వసించిన నాటినుండి,

ఆ కృప ఎంత ప్రశస్తమైనదిగా ప్రత్యక్షమైనది.

ఎన్నో అపాయములు, కష్టములు, మరియు ఉరులగుండా,

ఇదివరకే నేను వచ్చియున్నాను.

అది యెహోవా-యీరే ఇంత దూరము

నన్ను క్షేమముగా తెచ్చియున్నాడు,

మరియు ఆయన నన్ను ముందుకు తీసుకొని వెళ్ళును.

నేను రోగుల కొరకు ప్రార్ధన చేయుచుండగా, ఈ రాత్రి నాకు విశ్వాసము నిమ్ము ప్రభువా, నాకు సహాయము చేయుము మరియు నమ్మునట్లు ప్రజలకు విశ్వాసమును దయచేయుము. ఇప్పుడు, అక్కడ ఏమియు లేదు, ప్రభువా. ఇదివరకే నీవు ఏమి చేసియున్నావో, దానిని చేయుటకు నాలో గాని లేక మరేయితర మనిషిలో గాని ఏమియులేదని నేను వారికి తిరిగి తిరిగి చెప్పియున్నాను. వారి స్వస్థత సంపూర్ణము చేయబడినది. నీవు వారి కొరకు చనిపోయినప్పుడే, నీవు వారిని విమోచించియున్నావు. వారి అతిక్రమముల కొరకు నీవు గాయపరచబడియున్నావు.

నీవు పొందిన దెబ్బలచేత వారు స్వస్థతనొందియున్నారు. ఏదో యోగ్యత పైన లేక వారు కలిగియున్న ఏదో ఉద్రేకము మీద గాక, లేక ఏదో అనుభూతి మరేదో దానిమీద గాక, ప్రభువా, వారు నీ మీద విశ్వాసమును కలిగి యుందురు గాక. అయితే వారు తేటమైన సామాన్యమైన విశ్వాసముతో మరియు తేటమైన తీర్మానముతో నీ యొద్దకు వచ్చుదురు గాక. "ఈ రాత్రి క్రీస్తును నన్ను స్వస్థపరచువానిగా నా హృదయము నుండి నేను అంగీకరించుదును గాక," అని వారు చెప్పుదురు గాక. ఆయన నన్ను స్వస్థపరచియున్నాడని వారి హృదయము నుండి చెప్పుదురు గాక. ప్రభువా, దానిని దయ చేయుము. అప్పుడు అది అంతయూ సమాప్తమవుతుంది." తండ్రీ, దానిని దయచేయుమని యేసు నామమున కోరుచున్నాను. ఆమెన్.

64ఏ సమయమునకు మనము బయటకు వెళ్ళిపోవాలి? ఏదైనా నిర్ణీత సమయమున్నదా?

మీరందరూ కొన్ని నిమిషములు ఏకముగా మర్యాదగా యున్నట్లైతే….. ఇంకా ఏదైనా ప్రార్ధనా వరుసను మనము పిలిచియున్నామని నేను అనుకొనను, మనము పిలిచామా? ఇక్కడకు మనము వచ్చియున్నప్పటి నుండి మనము ఒక ప్రార్ధనా వరుసను కూడా పిలువలేదు. కేవలము వేదిక మీద నుండి? అది అలాగునే యుండియున్నది. "A" 1 నుండి 100 వరకు ప్రార్ధనా కార్డులు.

మీరు దానికంటె అది వేదికయొద్ద నుండి పిలువబడవలెనని కోరుదురా? ప్రార్థనా కార్డులు లేనివారు ఆ రీతిగా పిలువబడతారు, లేక కార్డులు ఉన్నవారా? అది ఫరవాలేదు. ఏ విధానములో అత్యంత విశ్వాసమును అది తెస్తే అది. మీరు కేవలము విశ్వాసమును కలిగి దానిని నమ్మండి. అనుమానించవద్దు, మరియు బహు మర్యాదగా యుండండి. నెమ్మదిగా కూర్చొనండి….

ఇప్పుడు ఇదే ఆ సమయమైయున్నది… నేను ఎంత బోధించినప్పటికి లెక్క కాదు, అది సత్యము కానియెడల, అది సత్యము కాదు. మీకు తెలుసా, దేవుడు ఎన్నడూ ఒక అబద్దమునకు సాక్ష్యము పలుకడు. కాని అది సత్యమైనట్లైతే, దేవుడు దానిని సాక్ష్యమిచ్చుటకు కట్టబడియున్నాడు.

65ఇప్పుడు, నా సోదరులారా, నా సహోదరీలారా ముందు దయతో ఇప్పుడు ఉండవలసినంత మర్యాదగా ఉండండి.

వాటిలో కొన్ని ప్రార్ధనా కార్డులను పిలుద్దాము. ఈ రాత్రి మనం వారందరు పొందనియెడల రేపు రాత్రికి వారందరికి ప్రార్థన చేద్దాము. ఆ రీతిగా వేదిక మీద ఇంచుమించు ఒక డజను ప్రార్ధన కార్డులను తీసుకుందాము, మరియు తర్వాత పరిశుద్దాత్ముడు ఆయన కిష్టమైనట్లయితే జనసమూహములో ప్రారంభం చేద్దాము, ఆ పైన చుట్టూ ఉన్న వారందరూ రోగులుగా ఉండి ప్రార్ధనా కార్డులు లేనివారు అక్కడెంత మంది ఉన్నారో మీ చేతులు ఎత్తండి. ఓ.

అలాగైతే ఎంతమంది ప్రార్ధనా కార్డులను కలిగియున్నారు, మీ చేతులు ఎత్తండి. ప్రార్థనా కార్డులు కలిగియున్నవారికంటె ప్రార్థనా కార్డులు లేనివారే ఎక్కువ మంది ఉన్నారు మరియు కొద్దిమంది మాత్రమే ప్రార్ధనా కార్డులు కలిగియున్నారు. బహుశ వారిలో కొందరు గత రాత్రి విడిచిపెట్టబడిన ప్రార్ధనా కార్డులను కలిగియున్నారు. మీరు గతరాత్రి ఏమి ఇచ్చారు 1 నుండి 50 లేక 1 నుండి 100 వరకా?

ఇప్పుడు మనము 75వ ప్రార్థనా కార్డు నుండి ప్రారంభిద్దాం. అది ఎలా ఉంటుంది? ప్రార్ధనా కార్డు నెం.75 ఇక్కడ ఉన్నదేమో చూడండి ఎవరో దాన్ని కలిగియున్నారు మీ చేతిని ఎత్తండి. లేదు. సరే, మరొక స్థలము నుండి మనం ప్రారంభిద్దాం. ఓ, నన్ను క్షమించండి మంచిది నెంబరు ఓ స్త్రీ ఈ కుడివైపునకు రాగలవా, నెం. 76 ఎవరు దాన్ని కలిగియున్నారు? 76వ కార్డు స్త్రీయై యున్నది? తిన్నగా ఇక్కడకు రండి 77, ప్రార్థనా కార్డు 77. ఆ వెనుక, 78, ఇక్కడకు రండి. 79,నన్ను దానిని చూడనివ్వండి ఆ కార్డును పైకి లేపారా? 79. తర్వాత 80, 80వ కార్డు ఎవరు కలిగియున్నారు, మేము చూడగలునట్లుగా, మీ చేతిని ఎత్తగలరా? 80.

66ఇప్పుడు, ప్రార్థనా కార్డులు మీకిచ్చుటకు ఆ కుర్రవాడు వచ్చినప్పుడు అతడు మీ ముందు నిలబడతాడు వాటన్నింటిని ముందు వెనుకకు కలిపివేస్తాడు. అది నిజమంటారా? అప్పుడు తీసుకోండి. అప్పుడు మీకతడు ప్రార్ధనా కార్డులిస్తాడు, ఎవరికి ప్రార్థనాకార్డు అవసరమైనా చూడండి, అది లెక్క కాదు. కాబట్టి మేము ఎక్కడి నుండి ప్రార్థనా కార్డులను పిలువబోవుచున్నామో అప్పటివరకు మాకు తెలియదు. ఆ కుర్రవాడు మీకు చెప్పలేడు. సరే, ఈ రాత్రి నెం 1 నుండి ప్రారంభము చేయబోవుచున్నాము. నేను మీకు నెం 1 ఇస్తాను, నెం. 2 ఇస్తాను. అతడు దాన్ని చేయలేడు చూడండి? మరియు దాన్ని అది ఋజువు చేస్తుంది, అతడు వాటన్నింటిని మీ ముందు ముందు వెనుకలకు కలగలుపు చేస్తాడు. మంచిది.

నేనెక్కడ యున్నాను. 80? 80. ప్రార్థనా కార్డు నెం. 80, 81? నేను దాన్ని పొందానా? 81?, 82? 83? అదేనా..? కాదు ఆమె తన బిడ్డ కొరకు ఆగినది. 83 నీ చేతిని ఎత్తగలవా? ఆ వెనుక వెనుకలో 84? మంచిది. 85? నేను దాన్ని చేడలేదు 85? 86? 87? అతడు పురుషుడు, 87? నేను దాన్ని చూడలేదు 87? మీ పొరుగు వారి ప్రార్థనా కార్డు చూడండి, బహుశ అతడు చెవిటివాడైయుండవచ్చు. ఓ, మంచిది. 87, 88, 88? ఈ గ్రుడ్డివ్యక్తి ఎవరు, అతని నెంబరు ఎంత? అతడు. అది అతని నెంబరు అయియున్నది, కాదా? ఇప్పుడు, ఇక్కడ? ఓ, అది మంచిది ఓ, అది మంచిది. దాన్ని పట్టుకొనియుండండి. నేను దాన్ని తీసుకుంటాను దానితోనే నిలచియుండ౦డీ? 89? 90? 91? 92? 92? నేను అది చూచుట లేదు 92? అది బహుశ అది గతరాత్రి ఇచ్చిన వాటిలో కొన్నియైయున్నవి. ఓ, నీకు తగినన్ని అక్కడ యున్నవి.

67ఇక్కడ ప్రార్ధనా వరుసలో నున్న ప్రతి ఒక్కరు ఒక్క క్షణము గమనించండి మీరు బహు మర్యాదగా ఉండవలెనని నేను కోరుచున్నాను. ఇది శనివారం రాత్రియై యున్నది, ఉదయమున సండే స్కూల్ సమయం వరకు మీరు నిద్రపోవచ్చును. ఇప్పుడు మీరు పనికి వెళ్లవలసిన పనిలేదు. కాబట్టి ఇప్పుడు కొన్ని నిమిషములు బహు మర్యాదగా ఉండండి. ఈ వర్తమానాన్ని తీసుకోండి, ఇప్పుడు ఈ వర్తమానమును మరచిపోవద్దు.

వర్తమానం తీసుకోండి ఈ ప్రార్ధనా వరుసలో ఉన్న ప్రతి ఒక్కరు నాకు కొత్తవారే. మీ గురించి నాకు ఏమియు తెలియదు, ప్రార్ధనా వరుసలోని మీరందరూ చేతులెత్తండి, అయ్యా, మంచిది. ఈ ప్రార్ధనా వరుసలోని ప్రతి ఒక్కరూ దేవుడు ఈ కార్యములను బయలుపరచినట్లైతే, మీరు యదార్థంగా ఆయనకు వాగ్దానం చేస్తారా, మీరు వాగ్దానం చేస్తారు?

ఈ ప్రార్ధనా వరుసలోకి రాకముందు నేను ప్రార్ధనా వరుసగుండా వెళ్తూ మీ ప్రతి ఒక్కరిని గూర్చి ప్రార్ధిస్తూ ఉండగా మీరు ప్రార్ధనా వరుసలోకి రాకముందు మీలో ఏదైనా పొరపాటు ఉన్నట్లైతే దాన్ని సరిదిద్దుకుంటారా? చూడండి, దాన్ని చేయండి. ఇప్పుడు.

68గుర్తుంచుకోండి, పాపము మీ మీదనే ఉన్నది: నా మీద కాదు.

ఇప్పుడు ఈ రాత్రి ఈ జనసమూహంలో ఎంతమంది దేవునిని స్వస్థపరచే వానిగా నమ్ముచున్నారు, ఆయన మిమ్మల్ని స్వస్థపరచగలడని మరియు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని మరియు ఈ రాత్రి దానికొరకు మీకు విశ్వాసమిచ్చునని మీ చేతులను ఎత్తండి. ఇప్పుడు ఆ బయటి వారు వాగ్దానం చేస్తారా. రోగులుగా ఉన్న మీరు నాకు తెలియదని ఇక్కడ మీలో ఎంతమందికి తెలుసు. మీ గూర్చి నాకేమియూ తెలియదు, అవునా, మీ చేతులెత్తండి.

ఇప్పుడు, ప్రభువైన యేసు ఖచ్చితంగా మొదటిసారిగా ఆయన భూమి మీదికి వచ్చినప్పుడు ఏమి చెప్పాడో ఖచ్చితంగా ఏమి వాగ్దానం చేసియున్నాడో, ఈ చివరి దినములలో అవి మరల సంభవిస్తాయి, ఆయన ఈ ప్రార్ధనా వరుసలో కేవలం దానిని ఒక్కసారి చేసినట్లైతే, లేక ఆ బయటి ఒకసారి చేసినట్లైతే, నేను నా చేతులను పవిత్రముగా దేవునికి ఎత్తుచు ఇక్కడేనున్న ప్రజలలో ఎవరినీ నేనెరుగనని చెప్పుచున్నాను. మరియు ఇక్కడ నేనెరిగిన వారు కొద్దిమంది యున్నారు, ఇక్కడ కూర్చున్న ఆ మనిషి ఎవరో నేను గుర్తించుటకు ప్రయత్నిస్తాను, ఇక్కడ మనిషి ఈ లేతవన్నె సూటు ధరించిన ఈ మనిషిని నేనెక్కడో చూసియున్నాము. సహోదరుడు మరియు సహోదరి క్రిడ్ నేను వారినెరుగుదును.

జెఫర్సన్విల్ నుండి వచ్చిన కొందరు స్నేహితులు నాకు తెలుసు వారెక్కడో ఆ వెనుకన్నారు, వారిలో ఒకరు మా సంఘ పెద్దలలో ఒకరు ఆయనే సహోదరుడు ఫ్రెడ్ సోత్మెన్ అతడు ఇక్కడ ఉన్నాడు. పెద్దలలో మరొకరు లేక ధర్మకర్తలలో ఒకరు లేక అతడు ఒక ధర్మకర్త, పెద్దలలో ఒకరు, ఒక మెథడిస్తు బోధకుడు ఆయనే సహోదరుడు కాలిన్స్ మొన్నటి దినమున కూడా ఆయన ఇక్కడ ఉన్నాడు ఆయన భార్య కూడా ఇక్కడ ఉన్నారు, సహోదరుడు వెల్స్ ఇవాన్స్ మరియు అతని కుటుంబం జార్జియా నుండి ఇక్కడకు వచ్చియున్నారు వారు చుట్టూ నడుపుకుని ఒక రౌండు ట్రిప్పు వేసియున్నారు, నేనంటాను అది 1400 లేక 1500 మైళ్ళ దూరం నుండి వారు ప్రతీ ఆదివారం నా ప్రసంగం వినుటకు వారు వచ్చుచున్నారు. స్నేహితులను గూర్చి మాట్లాడండి! నీ కొరకు చనిపోతారు!

సహోదరుడు టామ్ సింఫ్సన్ ఇక్కడ ఉన్నాడు మరియు అతని కుటుంబ సభ్యులలో కొందరు ఇచ్చటనున్నారని తలంచుచున్నాను. ఆయన కూడా నన్ను దర్శించే సోదరులలో ఒకరైయున్నారు మరియు సోదరుడు లియో, జెనే ఇక్కడ ఉన్నారు. ఈ కూటంలో వారు నా సహపనివారై యున్నారు. తర్వాత నాకు ఇక్కడొక స్నేహితుడున్నాడు ఆయనే సోదరుడు రోడ్ని సోదరుడు రోగర్, మరియు సోదరుడు చార్లీ వారిక్కడే ఎక్కడో ఇండియానాకు దగ్గర్లో యున్న నా వ్యక్తిగత స్నేహితులైయున్నారు, వారు ఓహియో నుండి వచ్చినవారు వారు యునైటెడ్ మరియు మెథడిస్తు సోదరులు వారు ఈ మధ్యనే రక్షించబడి పరిశుద్దాత్మను పొందియున్నారు. వారు తప్పక ఇక్కడ ఉండాలి. నిన్నటి దినమున వారు ఇక్కడ ఉన్నారు, వారిలో కొందరిని నేను ప్రైవేటు ఇంటర్వ్యూలో కలిగియున్నాను, వారు ఇక్కడ ఉన్నారు. వారు మినహా నేను ఆలోచించినంత వరకు నాకు తెలిసిన వారు ఎవరూలేరు.

సహోదరుడు డచ్ ఇక్కడ కూర్పునియున్నాడు, నేను ఆయన్నెరుగుదును. అది ఒక జర్మన్ పేరైయున్నది, నేనది చెప్పలేను. అది డాచ్ అయియున్నది, లేక డచ్ ఆ విధముగా యున్నది, ఆయన ఇక్కడ ఓహియో నుండి వచ్చిన మంచి సోదరుడు, నాకు గొప్ప దీవెనకరమైన వ్యక్తియైయున్నాడు. ఎర్రటి టై కట్టుకుని ఉన్న ఈ వ్యక్తి తిన్నగా వెనుక ఇక్కడనే కూర్చుని ఉన్నాడు. తిన్నగా క్రింద ఉన్న నీవు. నీవు నాకు తెలియదా? లేదు. మీ వెనుకనే ఉన్న మనిషి. నీవు నాకు తెలుసా? నేను తెలుసునని అనుకున్నాను. నేను ఆయన పేరును పిలువలేను, కానీ నాకు ఆయన తెలుసును.

69మరియు మొన్నటి ఉదయమున ఒక వీధిలో దిగువగా పరిశుద్దాత్ముడు నన్ను నడిపించుచున్నాడు. నేను నా ఉదయకాలపు ఆహారమును తీసుకొనుటకు నా గదిలోనికి వెళ్ళియున్నాను. నాతో ఏదో చెప్పినది "వెళ్ళవద్దు. ఆ వీధి దిగువన నడుస్తూ ఉండుము." నేను ఆ వీధి గుండా నడవడం ప్రారంభించాను మరియు నేను ఆశ్చర్యపడ్డాను, "ఎందుచేత? ఎందుచేత?" ఆ వీధి దిగువన నేను నడుస్తూనే ఉన్నాను, మరియు ఆ మూలన ఇద్దరు స్త్రీలు నడుస్తుండుట నేను చూశాను. నేను ఇంకా నడుస్తూనే యున్నాను.

నేననుకున్నాను, "తండ్రి, నీవు నన్ను ఏమి చేయమంటావు?"

"కేవలము నడుస్తూనే ఉండుము."

మరియు నేను ఆ దిగువకు వెళ్ళినప్పుడు, ఆ స్త్రీలు నా వైపు తిరిగి ఇలా అన్నారు, "అయ్యా నిత్యవసర వస్తువులు లభించే అంగడి ఎక్కడో నాకు చెప్పగలవా?"

నేనన్నాను, "లేదండి నేనిక్కడ కొత్త వ్యక్తినైయున్నాను."

మరియు వారు చుట్టూ చూసి ఇలా అన్నారు, "నీవు సహోదరుడవైన బ్రెన్హా౦వు కదా?"

నేను తలంచాను, "అడిక్కడే ఉన్నాది."

స్త్రీలలో ఒక చిన్న స్త్రీ నన్ను వ్యక్తిగతంగా చూడవలెనని ఎంతో తీవ్రంగా ప్రార్థన చేయుచున్నది. ఆమె బయటకు వెళ్ళి, ఆ మూలన వేచి యున్నది. దేవుడు ఆమెను బయటకు పంపియన్నాడు, మరియు దేవుడు నన్ను కూడా నా గది నుండి బయటకు పంపియున్నాడు. ఇప్పుడు ఆమె ఇక్కడే కూర్చుని యున్నది. ఆమె నాకు ఒక దాన్ని గూర్చి చెప్పినది మరియు దాన్ని గూర్చి నాతో వ్యక్తిగతముగా మాట్లాడవలెనని కోరియున్నది, చూడండి.

నీవు చేయగలిగే ఒక పని ఏమనగా, ఆత్మ యొక్క నడిపింపును వెంబడించుటయే. ఆయన ఇరువైపులా పనిచేస్తాడు, ఖచ్చితంగా తిన్నగా అది కలుసుకునేటట్టుగా చేస్తాడు.

70నేను జెఫర్సన్విల్ లోని ప్రజలకు తప్పకుండా చెప్పవలసి ఉన్నట్లైతే… సరే, నేను వారిని చూసియున్నట్లైతే, నేను వారిని పిలవను. అది వారు కోరుకున్నది ఏదో ఇంతే తప్ప. అట్టి దానిని ఏదో వారికి చెప్పవలసియున్నది. అయితే సాధారణంగా అది ఇతర ప్రజలతో అయి యున్నది. ఇప్పుడు మీరందరూ ప్రార్ధించి, మీ హృదయమంతటితో నమ్మండి.

ఇప్పుడు, ఒక స్త్రీ ఏమి చేసినది. ఆమె పొరపాటు ఏమైయున్నదో యేసు చెప్పియున్నాడు, మరియు ఆమె ఊరులోనికి వెళ్ళి - ఆ సంగతి చెప్పినది. మరియు ఆ పూర్తి పట్టణము దేవునిని నమ్మినది. ఆయన మెస్సీయ్యాయై ఉన్నాడని, ఒక పూర్తి ప్రాంత ప్రజలు, ఒక పూర్తి తరము నమ్మినది.

ఇప్పుడు, నేను మెస్సయ్యాను కాదు. మీకది తెలుసు! ఓ, మై! నేను కృప ద్వారా రక్షించబడిన ఒక పాపినైయున్నాను. నేను ఒక మనిషినై యున్నాను. అయితే మెస్సీయా మనుష్యులలో పనిచేస్తాడు. ఇప్పుడు, నేను మీకు చెప్పుటకు ప్రయత్నించినట్లుగా, ముగ్గురు దేవుళ్ళు లేరు. అలాంటి దాన్ని నమ్ము ఎవరైనా అతడు ఒక అన్యుడై యున్నాడు. ఒకే ఒక దేవుడున్నాడు. ఆయన మూడు కార్యాలయాల్లో నివసిస్తాడు: పితృత్వము… ఓ, ప్రజలు దాన్ని చదువుటకు ప్రయత్నించి వెర్రివారయ్యారు. ఎందుకు, అది ఎంతో సామాన్యమైనది; తండ్రియైన దేవుడు, (తండ్రి యొక్క కాలము), కుమారత్వము, పరిశుద్దాత్మ — అదే దేవుడు.

ముగ్గురు దేవుళ్ళు కాదు: ఒకరు తండ్రియని, ఒకరు కుమారుడనీ, ఒకరు పరిశుద్దాత్మయనీ మీరు అనుకుంటారా, సోదరుడా. మీరు దాన్ని నమ్ముతారా, అలాగైతే మీరు కాథలిక్కు సంఘానికి వెళ్ళుట మంచిది. ఆ స్థలమునకే నీవు చెందినవాడవు. ఖచ్చితంగా, అది అక్కడ నుండియే వచ్చియున్నది. అలాంటి ఉపదేశము బైబిల్ లో లేదు. అలాంటి కార్యము అక్కడ, లేదు. త్రిత్వం అనే మాట బైబిల్ లో కనీసం ఒక్కసారైనా ఉదహరించలేదు.

71ఇప్పుడు. అది నేను కాదు… కొందరంటారు, "యేసు మాత్రమే (Oneness)" అని నన్ను గూర్చి వారు అనుకొందురు. మీరు అక్కడ పొరబడుచున్నారు. అలాటి రకమైన ఆత్మ నా మీద లేదు. అది ఆచారసంబంధమైనది, అది భక్తిహీనమైనది… లేదండి! నేను ఏకత్వపు వాడను కాదు, ఏ మాత్రము లేదు. నేను త్రిత్వపువాడను కాదు. నేను ఒక క్రైస్తవుడనై యున్నాను. నేను దేవుని యందు విశ్వాసముంచియున్నాను.

మూడు కార్యాలయములలో ప్రత్యక్తపరచబడిన ఒకే దేవుని యందు నేను నమ్మకము౦చియున్నాను, ఇప్పుడు ఆయన కార్యాలయము నా హృదయములో ఉన్నది, నీ హృదయమములో ఉన్నది; ఎక్కడో ఉన్న మరొక దేవుడు కాదు, ఎక్కడోయున్న మరొక దేవుడు కాదు. అది ఒక అన్యుని ఆలోచన, అది ఒక అన్యత్వం. నైసీన్ కౌన్సిల్ వచ్చు వరకు దాన్ని గూర్చి కనీసం ఒక్కసారి కూడా ఆలోచించలేదు. బైబిల్ లో కనుగొనగలరా లేక చరిత్రలో కనుగొనగలరా - ఆ నైసీన్ కౌన్సిల్ వచ్చు వరకు. అది అక్కడ లేదు.

జెనె, వారిని నా యొద్దకు తీసుకొని వచ్చువాడవు నీవేనా? మంచిది, సోదరుడా. ఇప్పుడు ఇది దేవునిది కాదని ఎవరికైనా అనుమానము యున్నట్లైతే, మరియు మీరు మంచి పద్ధతిని ప్రజలకు సహాయపడుటలో కలిగియున్నట్లైతే, దైవ భయమంతటితో మరియు సహోదర గౌరవముతో చేయండి. సోదరుడు సులివాన్ తో నేను ఈ దిగువన కూర్చొంటాను. మీరు వేదిక మీదకు రండి. దానికి భిన్నముగా మీరు ఏదైనను చేయవచ్చును… లేక మీరు వచ్చి అదే కార్యమును చేయగోరినట్లైతే… మీరు దేవుని సంబంధులని, మరియు నేను దయ్యము సంబంధినని మీరు తలంచి యున్నట్లైతే, అప్పుడు నిశ్చయముగా మీరు దానిని మించి చేయవచ్చును. మీరు దేవుని సంబంధులైతే, మీరు దానిని దయ్యమును మించి చెయ్యవచ్చును. అలాగైతే రండి, ఈ స్థానమును తీసుకోండి. నేను ఆయనను కాను, అయితే ఆయన ఇక్కడ యున్నాడు. ఇప్పుడు, ఆయన నన్ను ఎంత అభిషేకించినప్పటికి లెక్క కాదు, అదే మాదిరిగా ఆయన తప్పక మిమ్ములను కూడా అభిషేకించవలసియున్నది.

GEN 3:8

 

72ఇప్పుడు, ఇక్కడ ఒక స్త్రీ నిలబడి యున్నది, నేను నా జీవితములో ఆమెను ఎన్నడూ చూసియుండలేదు. ఆమె సంపూర్ణముగా నాకు ఒక పరిచయములేని క్రొత్త వ్యక్తియై యున్నది. నేను ఆమెను ఎన్నడూ చూసియుండలేదు. ఆమె కేవమలు ఒక స్త్రీగా ఇక్కడ నిలబడియున్నది. నాకు తెలిసినంతవరకు, మేము ఒకరినొకరము ఎన్నడైనా కలుసుకొన్నది ఇదే మొదటిసారి అని నేననుకొంటాను. అది నిజమేనా? అది నిజము. ఇప్పుడు, ఇది నేను నిన్ను కలుసుకొనుట మొదటసారి అని, దానికొరకు నా చేతిని నేను ఎత్తుచున్నాను. నేను నిన్ను ఎన్నడైన కలుసుకొన్నట్లైతే… ఎక్కడోయైయున్నది, నీవు ఎవరవో నాకు తెలియదు. ఎక్కడో ఒక వీధిలో మనము ఒకరిని ఒకరు దాటియున్నాము, నీవు కుదికలో కూర్చొనియున్నావు, లేక అలాటిది ఏదోయైయున్నది. మరొక ఇతర మార్గములో నీవు నాకు తెలియదు. మరియు నేను నిన్ను ఎరుగుట అనునది, నాకు తెలియదు. మరియు నీవు నన్ను ఎరుగుట అనునది, నాకు తెలియదు. మరియు నీవు నన్న ఎరుగవు. అయితే మన యిద్దరిని ఎరిగిన ఒక వ్యక్తి యిచ్చట యున్నాడు. అది నిజము. మన యిద్దరిని ఎరిగిన ఒకరున్నారు. ఇప్పుడు, మనలను మనము మర్చిపోదాము, మరియు ఆయనను నా ద్వారా మాట్లాడనివ్వండి, మరియు…

ఇప్పుడు, నేను ఇక్కడకు వచ్చి ఇలా అంటాను, "ఓ స్త్రీ నీవు రోగివైయున్నావు, హల్లెలూయ! దేవునికి స్తోత్రము! వెళ్ళుము, స్వస్థతనొందుము. నీవు స్వస్థతనొంది యున్నావు. ముందుకు కొనసాగుము…" నీవు దానిని నమ్మగోరినట్లైతే, అది బాగుపడును. నీవు కేవలము విశ్వాసము ద్వారా స్వస్థతనొంది యున్నావు. అది మంచిది.

కాబట్టి ఇప్పుడు, నీవు దానిని అనుమానించు హక్కును కలిగియుంటావు. కాని మనము అంత్యకాలములో యున్నామని నేను చెప్పిన లేఖన ఆధారముపై మరియు మానవ శరీరములో జీవించిన అదే దేవుడు, అక్కడ తినుచూ త్రాగుచూ యున్నాడు, మరియు అనేక వందల స౦వత్స్రముల తరువాత, అదే దేవుడు, శరీరధారి అయ్యాడు, ఏలయనగా తాను పోగొట్టుకొన్న బిడ్డను విమోచించుటకు ఆయన వచ్చెను.

దేవుడు ఏదెను తోటలోనికి వచ్చినపుడు, ఆయన ఆదామును వెదుకుటకు ఒక దూతను ఎందుకు పంపలేదు? ఎందుకు, ఆయన ఒక ఆదామను వెదుకుటకు ఒక కుమారుని పంపాడు? అతడు ఆయన పొగొట్టుకొన్న కుమారుడైయున్నాడు. ఆయన తానే స్వయముగా వచ్చాడు. అందుకే యేసు శరీరధారిగా మారిన దేవుడైయున్నాడు. నిన్ను విమోచించుటకు ఆయన మానవ శరీరములోనికి వచ్చాడు. గతరాత్రి దానిని నేను ముగించినట్లైతే, ఈ రాత్రి నేను దాని మీద మాట్లాడబోవుచున్నాను. అదే రక్తసంబంధియగు విమోచకుడు, దానిని చూపించుటకు ఆయన మనిషిగా ఉండవలసియున్నాడు.

కాబట్టి ఆ రక్తముగుండా, లైంగికవాంఛ లేకుండా, ఆ కల్తి లేని, సృజించబడిన దేవుని రక్తము, దీనితో నేను ఇక్కడ యున్నాను. ఒక స్త్రీ ముందు నిలబడి నా బైబిలు మీద, దేవుడు తన వాక్యమును నిలబెట్టుకొనునని ఈ సవాలును చేయుచున్నాను. అక్కడే మనము నిలబడియున్నాము.

నీవు ఎరిగియున్న దేనినైనా దేవుడు నాకు బయలుపరచినట్లైతే, నీవు అక్కడ ఏమి కలిగియున్నాను, దానిని గూర్చి నాకు తెలియదు. అయితే ఆయన నాకు దానిని బయలుపరచినట్లైతే, అప్పుడు నీవు తెలుసుకొంటావు, మరియు సమరయులోని ఆ బావి దగ్గర స్త్రీవలె, నీవు వెళ్ళి దానిని ప్రజలకు చెప్పుము, "వచ్చి ఆ మనిషిని చూడండి [సహోదరుడు బ్రెన్హా౦ను కాదు, అయితే ఇప్పుడు ప్రభువైన యేసును] అది ఆయన సంఘములో తన్ను తాను ప్రత్యక్షపరచుకొనుచున్నాడు, 'కారణము నా జీవితములోని కార్యములను గూర్చి ఆయన నాతో చెప్పియున్నాడు.'" నీవు దానిని చేయుటకు ఇష్టపడుచున్నావా? సంఘము దానిని చేయుటకు ఇష్టపడుచున్నదా?

73నీవు నిజముగా ఇక్కడ నిలబడియున్నది నీ కొరకు కాదు. అది మరొకరి అక్కర నిమిత్తమైయున్నది. అది నిజమైన యెడల, నీ చేతిని ఎత్తుము. చూడండి, నీ హృదయములో ఏమియున్నదో ఆయనకు తెలుసు. అప్పుడు, దేవుడు, దానిని గూర్చి లేక ఆ వ్యక్తిని గూర్చి నాకు చెప్పినట్లైతే, నీవు నన్ను నమ్ముతావా? ఆ వ్యక్తి, ఇక్కడ లేడు, కాన్సర్ తో మరణించు స్థితిలో యున్నాడు, మరియు నీవు వారి కొరకు ఇక్కడ నిలబడియున్నావు. అది నిజమేనా? నీవు అక్కడ నీ చేతిలో కలిగియున్న చేతి రుమాలు, నీకు తెలుసా? దానిని వారియొద్దకు తీసుకొని వెళ్ళుము, మరియు అనుమాని౦చవద్దు. నీవు అనుమానించవద్దు. అప్పుడు నీవు అడిగిన దానిని పొందవచ్చును. దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును.

ఇప్పుడు, సంఘము నమ్ముచున్నదా? నీవు నమ్మగలిగియున్నట్లైతే. అది కదిలించును. ఇతరులకు అది ఏమియు కాదు.

MARK 16:17

 

74నీవు ఎలాయున్నావు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, నీవు ఇక్కడ ఎందుకొరకు యున్నావో, ఎవరికొరకు యున్నాచో, లేక మరి ఏదైనా, ఆయన నాకు బయలుపరచినట్లైతే, అది సత్యమో లేక కాదో అని నీవు తెలుసుకొనగలవా? నేను ఆయన యొక్క సేవకుడనైయున్నాననియు మరియు దేవుని వాక్యము మీద సత్యమును చెప్పియున్నానని నీవు నమ్ముతావా?

నీవు ఒక దిగ్బ్రాంతి కొరకు సిద్ధముగా యున్నావా? నీవు ఎంతో విషయమైనా వ్యాధితో యున్నావు, మరణపునీడ నిన్ను ఆవరించినది, అది ఒక కాన్సర్, అది నీ శరీరముగుండా ప్రవేశించిన కాన్సర్వ్ వ్యాధియై యున్నది. అది నిజమైయున్నది. ఇక్కడకు రండి. బైబిలును సిద్ధపరచిన దేవుని ఆత్మ. మన రక్షకుడు సంఘమునకు ఇచ్చిన చివరి ఆజ్ఞ, "నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు వెంబడించును." ఇప్పుడు, నన్ను ఒకటి అభిషేకించినదని నీవు ఎరిగియున్నావా, అది నిజము కాదా? అలాగైతే మంచిది. నేను నీ మీద చేతులను యుంచి, ఆ దయ్యమును గద్దించినట్లైతే, అది దేవుని యొద్ద నుండి వచ్చినదని, ఆ దేవునికే అన్నీ తెలియునని నీవు నమ్ముతావా? అప్పుడు నీవు జీవించగలవు.

సర్వశక్తిగల దేవా, భూమ్యాకాశములను సృజించినవాడా, నిత్యజీవమునకు కర్తా, ప్రతి మంచి వరము ఇచ్చువాడా, ఈ స్త్రీ మీద నా చేతులను ఉంచుచూ, సంఘము తప్పక ఏమి చేయవలెనో, మన ప్రభువుచేత ఇవ్వబడిన చివరి ఆజ్ఞ ప్రకారము, ఈ స్త్రీ పై వ్రేలాడుచున్న మరణమును నేను గద్ధించుచున్నాను, మరియు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆమెను జీవించనిమ్ము. ఆమెన్. ఇప్పుడు, నీ హృదయమంతటితో నమ్మి, నీ సాక్ష్యమును వ్రాసి నాకు ఇమ్ము.

నీవు ఎలా యున్నావు? దేవుడు ఆ ప్రేవుల వ్యాధిని కూడా స్వస్థపరచగలడని నీవు నమ్ముచున్నావా? మంచిది, అలాగైతే దాని పని ముగించబడినది. అప్పుడు నీవు దేనిని తాకియున్నావు? ఆయనను తాకియున్నావు. నీవు నాకు తెలియదు. దేవుడు నిన్ను తప్పక ఎరుగును. నేను ఆయన సేవకుడనని నీవు నమ్ముదువా? నేను కేవలము ప్రయత్నము చేయుచున్నాను… చూడు, ప్రభువు యొక్క దూత… నీవు ఎన్నడైనా నా పుస్తకమును చదివియున్నావా? ఆ రాత్రి ఆయన నన్ను దర్శించినప్పుడు ఇలా అన్నాడు, "ప్రజలు నిన్ను నమ్మగలుగునట్లు, నీవు చేసినట్లైతే…" దేనికొరకు నన్ను నమ్మాలి? నేను మీకు సత్యమును చెప్పియున్నానని. నేను బైబిలు కధను చెప్పియున్నాను, కాబట్టి అది తప్పక సత్యమై వుంటుంది.

దేవుడు నీ గూర్చి ఏదైనా నాకు బయలుపరచినట్లైతే, నీవు దానిని నమ్ముతావా. అది సత్యమా లేక కాదా అని నీవు ఎరుగవలసియున్నది. నీవు పిత్తాశయపు వ్యాధితో బాధపడుచున్నావు. అది నిజము.

MARK 9:23

 

75అది ఇక్కడకు వచ్చుచున్నది. (కేవలము… నేను ఎదురుచూసినట్లుగా.) "అతడు దానిని ఊహించాడు" అని అంటారా. నేను దానిని ఊహించలేదు. అలా ఆలోచించుటను విడిచిపెట్టండి. అది ఇప్పుడు నిన్ను నీవు సిగ్గుపడునట్లు చేస్తుంది.

ఆయన నీకు ఏమి చెప్పియున్నాడో నాకు తెలియదు. ఒక్క క్షణము, అవును, అది ఇక్కడయున్నది. అది ప్రక్కటెముకల క్రింద యున్నది. అది పిత్తాశయము. అది నిజము. అది రోగమునకు కారణమైనది. అది నిజము. అది రోగమునకు మరియు తిమ్మిరి కలుగుచేయుటకు సమస్తమునకు కారణమైనది. అది నిజము. నీవు ఇంకా ఉబ్బియన్న నరముల వ్యాధిని కలిగియున్నావు. నీవు నరముల ఉద్రిక్తతతో బాధపడుచున్నావు. నీవు అనేక ఇబ్బందులను కలిగియున్నావు అని వైద్యుడు అన్నాడు. నీ పేరు మిస్ ఆస్బర్న్. గృహమునకు వెళ్ళుము బాగుపడుము. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచును. (సిగ్గుపడాలి.) దేవుని యందు నమ్మకమును కలిగియుండుము. అనుమానించవద్దు.

"నీవు నమ్మినట్లైతే, సమస్తము సాధ్యమే."

అక్కడ కూర్చొనియున్న స్త్రీ, ఆమె వెంట్రుకలు ఊడ్చివేయబడినట్లుగా యున్నది, ఆమె నా వైపు చూచుచున్నది, ఈ స్త్రీని అది తాకినప్పుడు అక్కడ ఏదో వున్నది, ఆ స్త్రీని కూడా అది తాకియున్నది. మరియు నేను చుట్టూ చూచినప్పుడు, ఆమె పై వెలుగును చూశాను. నాకు తెలియదు. ఇప్పుడే వేదిక విడిచి వెళ్ళిన స్త్రీతో ఏమియున్నదో, అదే ఇబ్బంది ఈ స్త్రీతో కూడా యున్నది. సహోదరీ, నీవు బాధపడుచున్నావు, నీవు రోగిగా యున్నావు కదా?

అవును, ఇప్పుడు నేను అది చూశాను. నేను ఆయన ప్రవక్తనని నీవు నమ్ముదువా? నీవును పిత్తాశయపు వ్యాధిని కలిగియున్నావు. అది నిజమేనా, నీ చేతిని ఎత్తుము. మంచిది, నీవు స్వస్థపడియున్నావు. యేసుక్రీస్తు నిన్ను బాగు చేయును. నీవు నమ్ముచున్నావా?

76నేను ఆయన సేవకుడనైయున్నానని నీవు నమ్మగోరుచున్నట్లయితే, నీకు దగ్గరగా కూర్చొనియున్న నీ స్నేహితురాలిని అది తాకియున్నది. అది ఆమె కలిగియున్న రొమ్ము మీదయున్న వ్యాధిని కూడా అది బాగుచేసియున్నది. అమ్మా, నీవు దానిని నమ్ముతావా? నీవు దానిని అంగీకరిస్తావా? నీవు అంగీకరించినట్లైతే, నీ చేతిని ఎత్తుము. మంచిది. నమ్ముచూ ఇంటికి వెళ్ళుము, నీవు బాగుపడగలవు. మీరు కేవలము నమ్మమని నేను మిమ్ములను కోరుచున్నాను. అంతే.

ఆయన ఒక జనసమూహము మధ్యలో యున్నాను. ఈ చిన్న స్త్రీ ఇక్కడ కూర్చొనియున్నది, ఆమె తన హృదయమంతటితో ప్రార్ధన చేయుచున్నది. ఆమె తన కొరకు ప్రార్థన చేయుట లేదు. కాన్సర్ తో బాధపడుచున్న ఒక సహోదరి కొరకు ఆమె ప్రార్థన చేయుచున్నది. అవును. అది ఒక వింతైన అనుభూతియై యుండలేదా? మంచిది. ఇప్పుడు వెళ్ళుము, నమ్ముము. అది ముగిసిపోయినది. వింతగాయున్నది — మరొక స్త్రీ అతని ప్రక్కన కనబడుచున్నది. అక్కడ ఆమె వెనుకనే తిన్నగా, అదే కార్యము కొరకు ప్రార్ధనచేయుచున్నాది. సహోదరీ, నీవు కూడా నమ్ముతావా. నీవు అడిగినది పొందుము.

ఓ, వారు దేనిని తాకియున్నారో నాకు చెప్పండి. ఎలా… వారు నాకు 20 లేక 30 అడుగుల దూరములో యున్నారు. వారు నన్ను ఎలా తాకగలరు. వారు ఎన్నడూ నన్ను తాకలేదు. అయితే వారు తప్పక ప్రధానయాజకుని, యేసుక్రీస్తును తాకియున్నారు, వారి రోగముల బాధతో వారు ఆయనను తాకియున్నారు.

నీవు ఎవరో నాకు తెలియదు. మనము ఒకరికి ఒకరము క్రొత్తవారమై యున్నాము? ప్రభువైన యేసు నాకు దేనినైనా బయలుపరచినట్లైతే, నీవు ఆయన సన్నిధిలో యున్నావని గ్రహిస్తావా. ఒకటి తప్పుగా యున్నది. దానితో నీవు క్రిందపడి చనిపోతావు. అది నీకు తెలుసు. అది నిజము. నీవు నీ హృదయమంతటిలో నమ్మబోవుచున్నావా? నీ బాధ నీ వెన్నులో యున్నది. అది నిజము. ఒక మూత్రపిండ ము దాని దారి తప్పియున్నది. అది నిజము. నీవు స్వస్థపడబోవుచున్నావని నీవు నమ్మబోవుచున్నావా? శ్రీమతి కొమ్బ్స్, నీవు ఇంటికి వెళ్ళవచ్చును, స్వస్థతనొందుము. (ఆ ఒక్క స్త్రీ కొరకు ప్రార్ధన చేయుము… అది నీ విశ్వాసమైయున్నది.)

77నీవు ఎవరో నాకు తెలియదు. ఓ, ఒకవేళ… ఏమిటి..? ఓ, మంచిది. నీ తల్లి ఆ యొక్క పోటు నుండి బయటపడగలదని నీవు నమ్ముదువా? మంచిది, వెళ్ళుము, దానిని నమ్ముము. ఆమె బాగుపడగలదు. దేవుడు నిన్ను దీవించును.

దేవుడు కేన్సర్ బాగుచేసి నిన్ను స్వస్థపరచగలడా? మంచిది. వెళ్ళుము, నీ హృదయమంతటితో దానిని నమ్ముము, మరియు స్వస్థతనొందుము, నీవు నమ్మినట్లైతే.

రండి. ఈ జనసమూహులో 80 శాతము మంది అదే వ్యాధితో బాధపడుచున్నారు, స్త్రీ. మీకు నన్ను చూపనివ్వండి. నరముల ఉద్రిక్తత అను తెగులుతో మొత్తబడినవారందరూ, మీ చేతులను ఎత్తండి, ప్రతి ఒక్కరు. చూడండి? అదే మీ ఇబ్బందియై యున్నది. అదే మీ ఇబ్బందియై యున్నది. ఎలాగో జీవితములో ఈ సమయమునకు వచ్చియున్నారు. అయితే మీరు ఎంతోకాలముగా నరముల బలహీనతతో యున్నారు. ఇప్పుడు అది ముంగించబడినదని మీరు నమ్ముచున్నారా? ప్రభుని గూర్చి తలపోయుచూ వెళ్ళండి. "ప్రభువైన యేసు, నీకు వందనములు," అని చెప్పండి.

దేవుడు నీ నడుము నొప్పిని స్వస్థపరచగలడని మరియు బాగుచేయ గలడని నీవు నమ్మదువా? మంచిది. నీవు వెళ్ళుము, నీ హృదయమంతటితో నమ్ముము.

78నేను నీ ఇబ్బందిని చూచాను, అయితే అది ఏమైయున్నదో అది కాదు. నీవు ఎంతో నరముల బలహీనతతో యుండి, నిన్ను నీవు ఏకముగా ఉంచుకొనలేకపోవుచున్నావు. వెళ్ళుము, నమ్ముము. అది సరి అవుతుంది. అది ఇక్కడయున్న అలాటి మరొక స్త్రీ కూడా నరముల బలహీనతతో యున్నది, ఆమెకు ఇతర ఇబ్బందులు, చిక్కులు వున్నాయి, అయితే ఆమె నిజానికి నరముల బలహీనత కొరకు నన్ను ప్రార్ధన చేయమని కోరుచున్నది. అది నిజమేనా? దానిని నమ్ముము మరియు వెళ్ళుము, స్వస్థత పొందుము. నీ హృదయమంతటితో దానిని నమ్ముము.

నీవు ఎవరవో నాకు తెలియదు, నాకు తెలుసా? దేవుడు నీ యొక్క స్త్రీ సంబంధమైన వ్యాధిని స్వస్థపరచి నిన్ను బాగుచేయగలడని నీవు నమ్ముచున్నావా? అలాగైతే వెళ్ళుము, విశ్వాసమును కలిగియుండుము.

మీలో ప్రతి ఒక్కరూ, ఆ బయట అందరూ నమ్ముచున్నారా? విశ్వాసము కలిగియున్నారా? అక్కడ కూర్చొనియున్న స్త్రీ కూడా స్త్రీ సంబంధమైన వ్యాధితో బాధపడుచూ దానికొరకు ప్రార్ధన చేయుచున్నది. అది నిజము. ఓ స్త్రీ, నీ ఒడిలో ఏదో ఉంచబడియున్నది. అది నిజము, నీవే, నమ్ముము! కాదు, ఇక్కడే, నీ చేయిని ఆ వెనుకకు ఉంచిన నీవే. నీ హృదయమంతటితో నమమ్ముము, ఇంటికి వెళ్ళుము. అవునండి, స్వస్థత నొందుము. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచును.

నీవు ఏమి ఆలోచిస్తావు, అక్కడ వెనుకకు జారిన భార్య కొరకు ప్రర్దించుచున్న నీవు. ఆమె తిరిగి ఇంటికి వస్తుందని నీవు అనుకొంటావా. నీ పాదముల మీద లేచి నిలబడుము. మంచిది. యేసుక్రీస్తు నామములో నేను ఆమెను తిరిగా నీకు ఇచ్చుచున్నాను.

79సహోదరీ, వెళ్ళుము విశ్వసించుము. స్వస్థత నొందుము. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచి బాగుచేయును. ఇప్పుడు, ఆ మార్గములోనే ఒక ఉదయమున ఆమె కూడా పడక మీద నుండి బయటకు రావలసియున్నది. అది కీళ్ళనొప్పులు. అయితే దేవుడు కీళ్ళనొప్పులును బాగు చేయగలడు. ఆయన బాగుచేయలేడా? మంచిది. అయితే వెళ్ళండి, ఆయనను నమ్మండి. వెళ్ళి ఇలా చెప్పండి, "ప్రభువా నీకు వందనములు," మరియు ఆయనను నమ్మండి.

కనీసము నేను ఒక్క సంగతి కూడా చెప్పకుండాయు౦టే ఏమిటి, కేవలము నా చేతులను నీ మీద పెట్టినత్లయితే? నీవు నమ్మినయెడల నీవు స్వస్థపడతావు? అలాగైతే ముందుకు రండి. ప్రభువు మిమ్ములను దీవించును. సహోదరీ, వెళ్ళుము, యేసు నామములో దానిని స్వీకరించుము.

80ఇప్పుడు, అది మరలా ఇక్కడకు వస్తుంది, మరొక నరముల బలహీనత. అది నిజము. ఎంతమంది, అలాటివారు అక్కడయున్నారు. మీ హృదయమంతటితో, దేవుడు మీ నరముల బలహీనతను స్వస్థపరచువాడని మీ బలమంతటితో మీ చేతులను పైకెత్తండి. ఆయన ఇక్కడ ఈ స్త్రీని ఇక్కడ స్వస్థపరచినట్లైతే….

ఇప్పుడు, దాని ద్వారా… ఒక్క నిమిషము ఇక్కడకు రండి. నీవు ఇతర ఇబ్బందులను కూడా కలిగియున్నావు, నీవు కలిగిలేవా - స్త్రీ సంబంధమైన వ్యాధి. చూడండి, నేను దానిని ఎలా చెప్పగలిగాను. నిశ్చయముగా. ఇక్కడ చూడండి. నీ చేతిని నా చేతి మీద యుంచినప్పుడు… ఇక్కడ చూడండి, నా చేతిని చూచారా? ఏ యితర మనిషి హస్తమువలె అది ఎంత మామూలుగా యున్నదో చూచారా? ఇప్పుడు, ఈ హస్తమును దీని మీద యుంచండి. ఇప్పుడు, ఈ హస్తమును దీని మీద యుంచండి. ఇప్పుడు, దానివైపు చూడండి. అది ఎలా ఉబ్బుచున్నదో చూండి, ఆ చిన్న తెల్లటివి దానిమీద పరుగెత్తుచున్నవి. ఇప్పుడు, గమనించండి. మరొక హస్తమును తీసుకొని దీనిమీద యుండండి. దానిమీద అది పని చేయదు, అది పనిచేయనా? ఆ హస్తము మీది అది పనిచేయదు. మంచిది, అలాగైతే ఎందుకు దీనిమీదనే అది పనిచేస్తుంది?

అదే నాకు ఇవ్వబడిన మొదటి వరము. చూడండి, అది నీవు తాకుటయై యున్నది, నీ కుడిచేతితో నా యెడమ చేతిని తాకుట, నేను చెప్పిన దానిని నీవు నమ్ముచున్నావని, నీవు నీ విశ్వాసమును ఖరారు చేయుచున్నావు. నేను నీ యొక్క ఎడమ చేతిని తీసుకొని నా చేతిని దేవునికి ఎత్తుచున్నాను. నా ఎడమ చెయ్యి నా గుండె ప్రక్కన యున్నది, చూచారా. ఇప్పుడు, మీరు చూడండి, ఏదో జరుగుచున్నది, అక్కడ పొరపాటు ఏమిటో భౌతికముగా చూపుతుంది. అది నిజమేనా?

ఇప్పుడు, అది నిజమైనయెడల ప్రజల ముఖమును చూడండి. అది ఆమె ఇక్కడ చూస్తూయుండగా గమనించండి. నీకై నీవు నా హస్తమును చూడుము. ఇప్పుడు, ఇక్కడ నుండి నీ చేతిని తీసివేయుము. ఇప్పుడు, ఈ మరొక హస్తమును తీసుకొని, దాని మీద ఉంచుము. అది అక్కడ పనిచేయుట లేదు. నీవు ఈ చేతిని కలిగియున్నట్లు గానే, ఆ చేతిని కూడా కలిగియున్న అంతే మానవమాత్రుడవు. అలాగైతే ఇప్పుడు, అక్కడ భౌతికముగా ఒకటి కనబడుచున్నది, నీవు చూడుము, అదే అభిషేకము, అది ఒక వాగ్దానము ద్వారా.

81ఇప్పుడు, ఇక్కడకు రండి. నా చేతిని నీవు గమనించుము. ఇప్పుడు నీవు నమ్ముతావా, నీ హృదయమంతటితో నా చేతిని తిన్నగా ఇక్కడ యుంచుతాను, కావున అది నీవు చూస్తాను. అది కాదు. నీవు చూడగలవు, అది నా చేతిని నేను పట్టుకొన్న స్థానము కాదు, అది ఎక్కడయున్నది, ఆ రీతిగానే కేవలము యున్నది.

ఇప్పుడు, అది వెళ్ళిపోయినట్లైతే, ఈ మరొక చేయివలె తిరిగి మారినయెడల, అప్పుడు అది… ఏదో సంభవించినదని నీవు తెలుసుకొంటావు. నీవు తెలుసుకోవా? ఇప్పుడు, నీవు దానిని చూడగలవో లేక చూడలేవో నాకు తెలియదు, ఆమె తన చేతిని నా చేతి మీద ఉంచుచుండగా, అది వాచిపోతుంది, మరియు చిన్నగా యున్న తెల్లటివి వెళ్ళుచున్నవి, "అవి బర్ర్ర్, బర్ర్ర్ బర్ర్ర్ అని, శబ్దము చేయుచున్నవి." ఆమె దానిని గ్రహించలేదు. ఆమెకు స్త్రీ సంబంధమైన వ్యాధి యున్నదని ఆమెకు తెలుసు, అయితే అది ఏమైయున్నదో ఆమెకు తెలుసు, చూడండి. అది ఒక కణితియైయున్నది. ఇప్పుడు, అది అక్కడ యన్నది, కదులుచున్నది. ఆమెకు దానితో ఇబ్బందిని కలిగియున్నది.

ఇప్పుడు, చూడండి, నా చేతిని తీసివేస్తాను. నా చేతిని చూడండి. ఇప్పుడు, ఆమె తన మరొక చేతిని ఆ చేతి మీద యుంచండి. ఒక్క రవ్వంత బేధము లేదు, చూచారా. ఈ చెయ్యి దానిని చూపుటలేదు. ఈ చెయ్యి చూపుతుంది. ఓ స్త్రీ అది నిజమేనా. నీవు కేవలము దానివైపు చూడుము. చుచావా, చిన్న తెల్లటివి నా హస్తము మీదుగా పరుగెత్తుచున్నని, బర్ర్ర్, బర్ర్ర్, బర్ర్ర్." అది ఏమిటి? అది లోపలయున్న ఒక జీవము, అక్కడ ఉండవలసినది కాదు.

ఇప్పుడు, వైద్యుడు దానిని, "కణితి కాన్సర్," అని పిలుస్తాడు. అయితే యేసు దానిని, "ఒక దయ్యము" అని పిలిచాడు. గమనించుము, అది ఒక జీవమైయున్నది. ఆమె ఎవరు? ఆమె ఒక జీవమైయున్నది, ఎన్నో కణముల విస్తరణ, ఒక కణితి అనగా ఏమిటి? కణములు విస్తరించుటయై యున్నది. కాన్సర్ అనగా ఏమిటి? కణములు విస్తరించుటయై యున్నది. కంటి శుక్లము అనగా ఏమిటి? కణములు విస్తరించుటయై యున్నది. చూడండి, అది అక్కడయున్న ఒక జీవమైయున్నది. ఇది ఇక్కడయున్న నిత్యజీవము యొక్క అభిషేకమై యున్నది. మరియు అక్కడ మరణము అను మరొక జీవమున్నది, చూడండి. కాబట్టి అదియే బేధమై యున్నది.

MARK 16:17

 

82ఈ స్త్రీ ఒక విశ్వాసియై యున్నది. ఆమె నరముల బలహీనతతో యున్నది, ఆ స్థితిలో ఎంతోకాలముగా యున్నది, మరి విశేషముగా ఆమె నెలసరి నుండి, ఆమె తన నేత్రములలో ఒక విధమైన దృష్టిలోపమును కలిగియున్నది, ఆమె కండ్లు తిరుగుట మసకను కలిగి యున్నది. అది సుళువు, చూడుము. అయితే దాని సంగతి ఏమనగా, ఇప్పుడు గమనించి చూడుము.

ఇప్పుడు, అది వెళ్ళిపోవునట్లు నేను చేయలేను, లేక అది యుండునట్లు నేను చేయలేను. ఇప్పుడు, నా చేతిని నేను పట్టుకొని యుంటాను, అట్లు కొన్ని క్షణముల క్రితము నేను చెప్పినది సత్యమని నీవు చూడగలవు. నీవు నా మాటను వినగలవా? నా చేతిని నేను పట్టుకొనబోవుచున్నాను మరియు ఆ స్త్రీని ప్రార్ధించనిమ్ము, అది వెళ్ళిపోతుందేమో చూడండి. కేవలము ప్రార్థన చేయుము. "ప్రభువా, నాకు సహాయము చేయుము," అని చెప్పుము." ఇప్పుడు ఆమె ప్రార్ధి౦చుచున్నది, చూచారా.

ఇప్పుడు, ఆమె తన్ను తాను చూచుకొననిమ్ము. నేను నా చేతిని చూచుటలేదు. ఇంకను అది అక్కడ యున్నది, చూడండి. ఇప్పుడు, తండ్రియైన దేవా, నా ప్రార్థన వినుము, అని నేను ప్రార్థన చేస్తాను. ఆమె యొక్క విశ్వాసము చొప్పున ఆ స్త్రీకి సహాయము చేయుమని నేను నీకు ప్రార్ధన చేయుచున్నాను. ఆమెన్. కదలలేదు, కదిలిందా? ఇంకా ఉంది. ఇప్పుడే నేను కదలబోవుటలేదు. నీవు కేవలము నా చేతిని గమనించుము. ఇప్పుడు ఆయన ఏమిచెప్పియున్నాడో, అది దానిని చేయబోవుచున్నది, అది నిశ్చయముగా ఆయనయైయున్నాడు, ఇప్పుడు, ఆయన నాకు ఏమి చెప్పాడు? ఇది ఆయన వాగ్దానము చేశాడు. అది ఆమె నుండి వెళ్ళిపోవునట్లుగా నేను చేయలేను, అయితే అది వెళ్ళిపోవుట ఆమె చూసినట్లైతే… ఇప్పుడు నీవు నా చేతిని గమనించుము. నీవు నా చేతిని గమనించుము.

సర్వశక్తిగల దేవా, ఇక్కడ ఒక ప్రదర్శన చేయుట కాదు, అయితే ఈ పట్టణములో బహుశ ఇది నేను చివరిసారిగా చేయుట యైయున్నది, ప్రభువా, నిన్ను నీవు కనపరుచుకొమ్మని, నేను ప్రజలకు సత్యమును చెప్పియున్నాను, నేను నీకు ప్రార్ధన చేయుచున్నాను. వారు నా చేతిని గమనించుచున్నారు, ఈ స్త్రీ కూడా గమనించుచున్నది. అయితే నీ మాటలు ఎంతో సత్యమైయున్నవి. కొన్నిసార్లు ఒక చిన్న ఆందోళన, ఆటంక పరచినప్పుడు… అయితే ఇంకా నీ వాగ్దానములు సత్యముగానే మిగిలియన్నాయి. "నా నామములో వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు."

ఇప్పుడు నీవు దానిని వాగ్దానము చేశావు. ఆ చిన్న గదిలో నిలబడియుండగా, ఆ గ్రీన్స్ మిల్ దగ్గర, ఆ రాత్రి ఒక దూతను పంపి నీవు నాకు దానిని వాగ్దానము చేసియున్నావు.

సాతానా, ఆమెను ఇక ఎంతమాత్రము నీవు పట్టుకొని యుండలేవు. యేసుక్రీస్తు నామములో ఆమెలో నుండి బయటకు రమ్ము.

ఇప్పుడు ఆ స్త్రీయే దానికి తీర్పరి. అది వెళ్ళిపోయినది. అది వెళ్ళిపోయినది. ఓ స్త్రీ? నా చేతిని నేను ఎన్నడూ కదపలేదు. ఇప్పుడు చూడుము, అది వెళ్ళిపోయినది. నీ యొక్క మరొక చేతిని దాని మీద యుంచుము. అక్కడ కాదు, అదేనా? నీవు స్వస్థపడి యున్నావు. నా భావము ఏమిటో చూడండి?

నీవు నమ్ముచున్నావా? ఇప్పుడు, ఇక్కడయున్నవారు ఎంతమంది నమ్ముచున్నారు, మీ చేతులను ఎత్తండి.

MARK 16:15-18•

ACTS 2:38

 

83బైబిలు దానిని ప్రకటించియుండలేదా? అబ్రాహాముతో పనిచేసి యున్నట్లుగానే దేవుడు అబ్రాహాము యొక్క సంతానముతో పనిచేసి యుండలేదా? అదే దూత అబ్రాహామును కలుసుకొనలేదా. సొదొమా, నాశనము చేయబడకముందు, సరిగ్గా ఆ యుగములో ఇవి ఇక్కడ అవే కార్యములు కావా, ఈ రాత్రి ఆయన చేయుచున్నాడు? అది అదే కార్యమా? అదేనా? నీవు దానిని నమ్ముతావా? నీవు అబ్రాహాము యొక్క సంతానమా?

దేవుడు చెప్పెను, "నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు." బయట ఎందరు రోగులుగా యున్నారు? మీరు చేతులను ఎత్తండి. వారి ప్రక్కనే విశ్వాసులైన వారు ఎంతమంది కూర్చొనియున్నారు? మీ చేతులను ఒకరి మీద ఒకరు ఉంచండి. అంతే. మీ చేతులను కేవలము ఉంచండి. అతడు చేయవలసినది అంతే.

కేవలము చెప్పండి…. నీవంటావు, "మంచిది, విలియం బ్రెన్హాం, నేను బాప్తిస్మమును పొందగోరుచున్నాను." నేను నీకు బాప్తిస్మము ఇస్తాను, అంతవరకే. అప్పుడు నీవు బాప్తిస్మమును పొందావు, అది నిజమేనా? అప్పుడు నీవు క్రైస్తవుడవయ్యావు, మంచిది, అప్పుడు, నీవంటే, "మంచిది, సహోదరుడా బ్రెన్హాం, మారుమనస్సు పొంది మరియు బాప్తిస్మమును పొందుము," అదే బైబిల్ చెప్పియున్నది. "మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి… సర్వసృష్టికి. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షించబడును." అది నిజమేనా?

అలాగైతే మంచిది, నీవు నమ్మి బాప్తిస్మమును పొందినయెడల, నీవు రక్షించబడినావని బైబిలు చెప్పినది. అది నిజమేనా? బాప్తిస్మము యొక్క క్రమము ఏమిటి? వారిని నీటి క్రిందయుంచి, తిరిగి పైకి తెచ్చుట, బాప్తిస్మమై యున్నది. అలాగైతే రోగుల కొరకు క్రమము ఏమిటి? "నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. వారు రోగుల మీద చేతులను ఉంచినప్పుడు వారు స్వస్థతనొందుదురు."

"సహోదరుడు బ్రెన్హాం తన చేతులను ఉంచిన యెడల."

"సహోదరుడు బ్రెన్హాం," చేతులను ఉంచిన యెడల అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఆయన అన్నాడు, "ఎవరైనా సరే." నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నీవు ఒక విశ్వాసివై యున్నావు, అలాగే నేనును. నేను చేతులను ఉంచినట్లుగా మీరును చేతులను ఉంచుటకు అదే హక్కులను కలిగియున్నారు. మీలో ప్రతి ఒక్కరు సేవకులై యున్నారు, ఈ ఈ కాపరులు, ఎవరైననూ, దానిని చేయుటకు వారు హక్కును కలిగియున్నారు. మీరు దానిని నమ్ముతారా? అప్పుడు మీరు ఒకరిమీద ఒకరు చేతులను ఉంచమని నేను కోరుచున్నాను. మీ తలలను వంచండి. ఇప్పుడు, నీ కొరకు ప్రార్ధన చేయవద్దు. నీవు చేతులుంచిన నీ ప్రక్క వ్యక్తి కొరకు నీవు ప్రార్ధన చేయుము. కారణము వారు నీ కొరకు ప్రార్ధన చేయుచున్నారు. మీ హృదయమంతటితో దానిని నమ్ముచున్నారా, నేను ఈ వస్త్రములకు మరియు గుడ్డలకు ప్రార్ధన చేయుచుండగా, మిమ్ములను యేసుక్రీస్తుకు నేను అప్పగించుచున్నాను.

ACTS 19:12

 

84పరలోకపు తండ్రీ, ఈ చేతిగుడ్డలు, నా యొద్దకు తేబడియున్నవి, పౌలు కాలములో నమ్మియున్నట్లుగానే ఇప్పుడును ప్రజలు నమ్ముచున్నారు. పౌలు దర్శనములను చూచుట వారు చూశారు, మరియు అతడు దేవుని చేత పంపబడినవాడని వారు ఎరిగియున్నారు. ఈ ప్రజలు దానినే నమ్ముచున్నారు.

ఇప్పుడు ప్రభువా, నీవు మాకు అదే దేవుడవైయున్నావు, కారణము అబ్రాహాము అనేక జనములకు తండ్రియైయున్నాడు. మరియు వారు పౌలు దేహము నుండి తీయబడిన చేతిగుడ్డలను, నడికట్టులను రోగుల మీద ఉంచినప్పుడు బాధించబడుచున్నవారి మీద ఉంచినప్పుడు, దయ్యములు మరియు అపవిత్రాత్మలు వారి నుండి బయటకు వెళ్ళినవి, మరియు రోగములు బాగుచేయబడినవి.

ఇప్పుడు, ఈ ప్రజలను బంధించియున్న ప్రతి దయ్యమును నేను గద్దించుచున్నాను, ఈ చేతిగుడ్డలు దానికి ప్రాతినిధ్యం వహించును గాక, మరియు వారు స్వస్థత పొందుదురు గాక అని కోరుచున్నాను. మరియు ఈ ప్రజలలో, ప్రభువా, నా హృదయమంతటితో నమ్ముచున్నాను, నీ సేవకునిగా, ఈ రాత్రి ఇక్కడ కూర్చొనియున్న జనులు దేవుని యొక్క నిజమైన, ఆత్మతో నింపబడినవారు, తిరిగి-జన్మించిన స్త్రీ మరియు పురుషులైయున్నారు.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...