యెజెబెలు మతము
1 మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచుండగా, ఒక్క క్షణము ఆలాగునే మనము నిలబడియుందాము. మన తలలను వంచుదాము.
దయగల పరిశుద్ధమైన తండ్రీ, దేవా, నీవు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడవని మేము ఎంతో సంతోషించుచున్నాము. నీవు మాకు చేసిన కార్యములను బట్టి నీకు వందనములు. మేము మా హృదయము నుండి, దానిని సరిగ్గా వ్యక్త పర్చలేము, అదేమనగా మేము ఇబ్బందిలోయుండగా నీవు ఎలా మమ్మును తప్పించియున్నావో, నిన్ను నమ్ముటకు మరియు నీయందు విశ్వాసముంచుటకు, సంవత్సరముల గుండా మేము నేర్చుకొనియున్నాము.
ప్రభువా, ఈ మధ్యాహ్నము ఈ ప్రజలపై నీ దీవెనలు క్రుమ్మరించమని నేను ప్రార్థిస్తాను. ఈ కూడిక ముగించబడినపుడు, మా మధ్యలో ఒక్క బలహీనమైన వ్యక్తి ఉండకుండును గాక. ఇక్కడ దేవునితో సరిగ్గాలేని ఒక వ్యక్తియున్నట్లైతే, యేసును సమాధిలో నుండి లేపిన శక్తి, వారి మర్త్య శరీరములను, వారి ఆత్మలను నీవు బ్రతికించి, ప్రభువా, నీ వైపు త్రిప్పును గాక. ప్రభువా దానిని దయచేయుము. పరిశుద్ధాత్మ లేని ఈ గొప్ప దినమును వారు ఎన్నడూ మర్చిపోకుందురు గాక, కారణము, దేవుడు తన ఆత్మను వారిపై క్రుమ్మరించు దినముగా, ఈ దినముయుండును గాక. ప్రభువా, దానిని దయచేయము. మా పాపములను క్షమించుము.
మా దయగల, ప్రశస్త స్నేహితుడు సుల్లివాన్ ను దీవించుమని మేము ప్రార్థన చేస్తున్నాము, ప్రజల కొరకు ఆయన తలంపులను బట్టి, వారికి సహాయము చేయుటకు, వారికి ఇచ్చుటకు ప్రయత్నము చేయు ప్రతి అవకాశమును బట్టి, నీవు సుల్లివాన్ ను దీవించాలని ప్రార్థిస్తాను.
ఈ దేశమంతట, ప్రతి చోటయున్న సేవకులను దీవించుము. ప్రభువా, వారికి అత్యధికముగా సమృద్ధిగా దయచేయుము. వారు వేదికపై ధైర్యముగా నిలబడి, దేవుని వాక్యమును ప్రకటించుదురు గాక, ఏలయనగా ఈ ప్రపంచ చరిత్ర యొక్క ముగింపు ఘడియలలో మేము జీవించుచున్నాము. ఈ సమయములో, నీ మంచితనము మాపై కమ్మును గాక, మేము యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
దయచేసి కూర్చొనండి.
దీనిని బట్టి ప్రజలైన మీకు, దేవునికి నేను ఎంతో కృతజ్ఞుడను. సోదరుడు సుల్లివాన్ దానిని తనపై వేసుకొన్నాడు. మీరు చూడండి, దానిని చేయుట సోదరుడు సుల్లివాన్ కు సబబే, కాబట్టి దాని కొరకు సిద్ధపడుటకు మనము నియమించబడ్డాము. నీ దయను బట్టి నీకు వందనములు.
2 ఇప్పుడు, ప్రేమ కానుకను బట్టి, మీరు దానిని చేయవలసిన పనిలేదు. లేదు, అది అవసరము కాదు. చూడండి, వారు హోటల్ ఖర్చులు, ఆహారపు ఖర్చులు, మేము కలిగియున్న దానంతటికి ఖర్చులు చెల్లించారు, సరిగా అవసరమైనది అంత వరకే. అయితే చాలా దయగా వందనములు, అది సేవకుల సహాయము కొరకు. మరియు ప్రజలను దేవుని యొద్దకు తెచ్చుటకు వెళుతుంది. దాని ద్వారా ఒక్క సిగరెట్, ఏ విస్కీ, తప్పైనది ఏదియు కొనబడదు. అది సరియైన కార్యము కొరకు వెళుతుంది. మీరు ఈ సేవ కొరకు ఇచ్చిన ప్రతి డాలరు, లేక పెన్నీ, లేక నికెల్ పది వేల సార్లు విస్తరించబడి, మీ ఖాతాలో తిరిగి వేయబడుతుందని నేను దేవునికి ప్రార్థన చేస్తాను.
3 ఇప్పుడు, ఈ భవనములో కూర్చొనుటకు మరియు ఈ కూటములను జరిగించుటకు, ఈ భవనమును మనము వాడుకొనుటకు ఇచ్చిన యునైటైడ్ స్టేట్స్ ఆర్మీకి నేను ధన్యవాదములు చెప్పుచున్నాను. నిశ్చయముగా నా హృదయమంతటితో నేను వారికి ధన్యవాదములు చెప్పుచున్నాను.
4 నేను ఎరిగియున్నట్లుగా, సమస్తమునకు సక్రమముగా చెల్లించబడుతుందని సోదరుడు సుల్లివాన్ చెప్పియున్నాడు. సమస్తము పట్ల శ్రద్ధ వహించుటకు తప్ప, ఒక్క పైసా అప్పుతో, మేము ఎన్నడూ ఒక పట్టణము విడిచిపెట్టి యుండలేదు. మేము సరిగ్గా అదిగాక దేనిని నమ్మము. నీవు తప్పక ఎవరికి అచ్చియుండరాదు, నీవు తప్పక తిన్నగా, ఏ వ్యత్యాసము లేకుండాయుండాలి. నీవు ఎవరికైనా అప్పుయున్నట్లైతే, వెళ్ళి వారిని ముఖాముఖిగా కలుసుకొని, నీవు వారికి బాకీయున్నావని చెప్పు, నీకు కొంచెము సమయము కావాలని దానిని చెల్లిస్తానని చెప్పు. చూడండి? అది ఎల్లప్పుడు శ్రేష్ఠమైనది. యథార్థముగా నిందారహితుడుగాయుండుట, అది క్రైస్తవ్యమునకు ఒక మంచి గురుతైయున్నది.
5 నీవు దేనిని గూర్చి మాట్లాడుచున్నావో, సరిగ్గా దానినే నీవు జీవించాలి. నీవు నీకై నీవుగా దానిని జీవించకపోయినట్లైతే, దానిని మరొకరు జీవించాలని నీవు ఎలా ఎదురు చూస్తావు, నీవు చూడు. కాబట్టి మీరు మనుష్యలందరి చేత చదువబడే వ్రాయబడిన పత్రికలైయున్నారు, కాబట్టి ఎల్లప్పుడు యథార్థముగా, సరిగ్గా నమ్మకముగా యుండండి. అది దేనిని ఎంత తీవ్రముగా గాయపర్చినప్పటికి లెక్క కాదు, ఎలాగైనా సత్యమునే చెప్పండి, ఏలయనగా ప్రతిసారి ఎల్లప్పుడు ఆ విధముగానే నీవు చెప్పాలి. నీవు ఒక అబద్ధమును చెప్పినట్లైతే, నీవు దాని చుట్టూ ఒక పది లక్షల మైళ్ళు వెళ్ళవలసియుంటుంది, మరియు ఇంకనూ నీవు తిరిగి ఆ అబద్దము దగ్గరకే రావలసియున్నది. నీవు సరిగ్గా ఒక భయంకరమైన కార్యమును చేశావు. సరిగ్గా యథార్థముగా యుండండి, నీవు ఎల్లప్పుడు నీవు దానిని ఆ విధముగానే చెప్పాలి, కారణము అది సత్యమైయున్నది.
6 బైబిలుతో అది ఆ విధముగానేయున్నది. సరిగ్గా బైబిలు చెప్పినట్లుగానే దానిని చెప్పండి, దానితో రాజీపడవద్దు, తిన్నగా అది అక్కడ వ్రాయబడియున్నట్లుగానే చెప్పండి, నీవు నీ వ్రేలిని దాని వైపు చూపెట్టవచ్చు, ఆ విధముగానే నీవు సాతానును ఓడిస్తావు. సాతానుడు యేసుతో ఇలా చెప్పాడు, “నీవు దేవుని కుమారుడవైయున్నట్లైతే, నీవు ఒక అద్భుతము చేయుటను మమ్మును చూడనియ్యు. నీవు ‘అద్భుతములు చేసేవాడివని’ వారు చెప్పారు. ఈ రాళ్ళును రొట్టెలుగా చెయ్యి, మేము దానిని చూస్తాము, నీవు ఆకలితోయున్నావు.”
7 ఆయన అన్నాడు, “అయితే అది ఈలాగు వ్రాయబడియున్నది, మనిషి రొట్టె వలన మాత్రమే జీవించడు.” చూడండి? ఆయన తండ్రి యొక్క వాక్యమును తీసుకొని, తిన్నగా వాడి సొంత ఆధారముల పై సాతానును ఓడించాడు. కాబట్టి నీవు కూడా దానినే చేయవచ్చును, దేవుని యొక్క వాక్యముతో వాడి సొంత ఆధారములపై సాతానును ఓడించుము.
8 నేను ఎల్లప్పుడు సోదరుడు సుల్లివాన్ కు కృతజ్ఞుడనైయున్నాను. ఈ ఉచ్ఛరణను మన్నించండి. వారు ఆ విధముగా సోదరుడు సుల్లివాన్ ను చేసినపుడు, సరిగ్గా అతడు ఆ నమూనాను త్రోసివేశాడు. అక్కడ అతని వంటివారు ఎవరును లేరు. సోదరుడు సుల్లివాన్ ను గూర్చి నాకు జ్ఞాపకము చేసిన ఒకే వ్యక్తి అక్కడయున్నాడు, ఆయనే E. హౌవర్డ్ కాడిల్. అతడు ఎన్నడైనా అతనిని ఎరిగియున్నాడో లేదో నాకు తెలియదు. సోదరుడు కాడిల్, సోదరుడు సుల్లివాన్ వలె ఒక పల్లెటూరి కుర్రవాడు. అతని జేబులలో చేతులను ఎంతగా అతుక్కొనేటట్లు పెడతాడంటే, చివరకు అతని కాళ్ళు క్రిందికి వ్రేలాడుతాయి, అతడు తన తలతో ప్రక్కగా తిరిగి మాట్లాడతాడు, అతడే E. హౌవర్డ్ కాడిల్. ఒక స్నేహితుడిగా మరియు సువార్తలో ఒక సోదరుడిగా సోదరుడు సుల్లివాన్ ను కలిగియుండుట, నాకు ఎంతో సంతోషము. అక్కడయున్న ఆయన చిన్న సంఘమును, ఆయన ప్రశస్తమైన భార్యను, ఆయన ప్రియులను, దేవుడు దీవించాలని నేను ప్రార్థిస్తాను.
9 ఇక్కడయున్న ఇతర సేవకులైన మీరు, మీకు మరియు మీ సంఘమునకు, సంపూర్ణ సువార్త సేవకులకు లేఖనములోని చిన్న సాంకేతిక విషయముల మీద మనము ఒకరితో ఒకరము సమ్మతించకపోవచ్చు, కొన్ని విషయముల మీద నేను నా భార్యతో విభేదిస్తాను. అది దేని మీదో నీకు తెలుసా? ఆమెకు ఆపిల్ బూరెలు ఇష్టము, నాకు చెర్రీ బూరెలు ఇష్టము, కాబట్టి మేము ఒకరితో ఒకరము విభేదిస్తాము. నా దానితో నేను ఏమి చేస్తానో మీకు చెపుతాను; ఒక చక్కని వేడి చెర్రీ బూరె ముక్క నాకు ఇష్టము (ఇప్పుడే నేను దానిని తట్టుకొనగలను), నేను దాని మీద వెన్నను పోస్తాను, మరియు దానిపైన బెల్లపు మడ్డిని పోస్తాను; సోదరుడా, నీవు అప్పుడు తినుటకు యోగ్యమైన దానిని కలిగియున్నావు! నా భార్యకు అదంటే భయము. ఆ ఆహారము నుండి వచ్చే కాలరీల శక్తిని బట్టి ఆమె భయపడుతుంది. అదంటే ఆమెకు ఇష్టము, కాని స్త్రీలు ఎలాయుంటారో మీకు తెలుసు, వారు భయపడతారు. వాళ్ళు ఎంతో సన్నగా యుండాలనుకొంటారు, నీవు ఒక పిన్నుతో వారిని గ్రుచ్చగలవు, మరియు ఎముక వరకు కోయగలవు, అయినను వారు తగ్గిపోవాలనుకొంటారు. అది వారి యొక్క స్వభావమైయున్నదని నేను భావిస్తాను. కానీ అది నాకు ఇష్టము. ఇప్పుడు, దాని మీద మనము విభేదిస్తాము, మిగిలిన సంగతులు బాగుగానేయున్నాయి. కానీ, మీరు చూడండి సోదరులారా, ముఖ్యమైన విషయము ఏమనగా చెర్రీ వంటకమును తినుటయే, అదే ముఖ్యమైన సంగతి.
10 పరిశుద్ధాత్మ బాప్తిస్మము మీద, క్రీస్తు యొక్క రాకడ మీద, బైబిలు యొక్క గొప్ప మూల సిద్ధాంతముల సువార్త సిద్ధాంతములపై, మనము చేతిలో చేయి వేసి, నిశ్చయముగా, మూల సిద్ధాంతములుగా ఏకీభవిస్తాము. ఒక సంఘశాఖా అడ్డములు లేకుండా, మనలను ఏదీ అభ్యంతర పరచకుండా, ఒక ఐక్య సోదరులముగా, ఏకముగా, ఒక గొప్ప సైన్యముగా కల్వరివైపు కదము తొక్కుచున్నాము.
11 నేను ఎన్నడైనా ఏ విధముగానైనా మీకు సహాయ పడగలిగినట్లైతే. నేను ఎంతో సంతోషముగా దానిని చేస్తాను. మీరును నాకు ఆ విషయాన్నే చెప్పాలని నా నిశ్చయత. మీరును నాకు సహాయముగా యుండవచ్చు, ఆ ఒకే కార్యాన్ని మీరు చేయగలరు, అదే నా కొరకు ప్రార్థన చేయుట, అదే నేను ఎరిగియున్నది, అదేమనగా దేవుడు ఎన్నడూ నన్ను తప్పులోనికి వెళ్ళనియ్యడు. తప్పుగా వెళ్ళాలని నా హృదయములో లేదు, నేను సరియైన దానిని చేయగోరుచున్నాను, ఏది సరియైనదో దానినే నేను చేయగోరుచున్నాను. కారణము ఒకసారి జాక్ మూర్ చెప్పియున్నట్లుగా, నేను గ్రహించేదేమంటే, అతడన్నాడు, “బ్రాన్హాం సోదరుడా, నీ అనుభవము అంతటిని బట్టి తీర్పు దినమున నేను నీ బూటులలో కూడా నిలబడలేను, ఏలయనగా దేవుడు నీ నుండి గొప్ప జవాబును కోరతాడు,” “కారణము ఆయన నీ చేతులలోనికి కోట్ల ప్రజలను ఉంచాడు,” అని అన్నాడు.
12 ఇప్పుడు, ఆ ప్రజల కొరకు నేను అక్కడ నిలబడి జవాబు చెప్పబోవుచున్నానని ఎరిగియున్నట్లైతే, అప్పుడు ఏ రకమైన సువార్తను నేను తప్పక భోదించాలి? నా చేతులలో ఆయన రక్తము ద్వారా కొన్న దానిని పట్టుకొన్నప్పుడు, నేను ఎంత యథార్థముగాయుండాలి? ఏ సందేహపు ఛాయలేకుండా, ఆయన నాకు ఒక వరమిచ్చాడు, మరియు అది దేవుని నుండి రావలసియున్నదని, తెలివిగా ఆలోచించే ఏ మనిషికైనా తెలుసు. దానితో, ఒక నిర్ణీతమైన గుంపు దానిని చెప్పిన కారణమును బట్టి, ఎవరినో నేను తప్పు మార్గములోనికి నడిపించినట్లైతే, తీర్పు దినమున నేను దాని కొరకు చెల్లించబడునట్లు దేవుడు చేస్తాడు.
13 కానీ ఈ మధ్యనే నేను ఆ దర్శనమును చూసినపుడు, ప్రజలు కేకలు వేయటను నేను విన్నాను…నిన్న రాత్రి ఆ చిన్న పుస్తకాన్ని మీరు పొందియున్నారా? ది బిజినెస్ మెన్స్ వాయిస్. అది బాగుంది. దర్శనములో…పూర్తి వివరములతో ఎప్పుడైనా దానిని అచ్చువేయాలి; దానిలోని అంతా అది కాదు. కాని దానిలో, దానిని చూస్తూ, నేను అక్కడ నిలబడియున్నాను, ఇక్కడే నేను సరిగ్గా నిలబడియున్నట్లుగా. నేను నా పడక మీద పండుకొని నా వైపు చూచుకొనుచున్నాను, నా భార్యను గమనిస్తున్నాను, ఇంకనూ నిలబడి నా వైపు చూచుకొనుచున్నాను, నేను దానిని చెప్పినపుడు, ప్రజలు చుట్టూ అక్కడ నిలబడియున్నారు, “పౌలు కూడా ఆయన బోధించిన సువార్తను బట్టి తీర్పు తీర్చబడతాడా?”
14 “అవును,” అని వారన్నారు.
15 నేనన్నాను, “సరిగ్గా పౌలు బోధించిన సువార్తనే నేనును బోధించియున్నాను.”
16 మరియు లక్షల మంది కేకలు వేశారు, “మేము దానిపైనే విశ్రమిస్తున్నాము!”
17 నేను అక్కడకు దాటినపుడు, ఆ విధముగానే అదియుండాలని నేను కోరుచున్నాను, చూడండి. సరిగ్గా పౌలు చెప్పినట్లుగా. ఆ విధముగానే ఆ విధానములోనే నేను దానిని కోరుచున్నాను. దానికి ఏదీ కలపను, దాని నుండి ఏదియు తీసివేయను. సరిగ్గా బైబిలు చెప్పినట్లుగా, ఆ మార్గములోనే అది ముందుకు వెళుతూవుండాలని నేను కోరుకొంటాను, మీరు చూడండి. నిజానికి నీవు దానిని ఆ రీతిగా యుంచినపుడు, ప్రతి వైపున సంఘశాఖలు దానికి వ్యతిరేకముగా అడ్డుకట్టను పైకి లేపుతాయి.
18 తరువాత, అనేకసార్లు, నా సోదరులకు నేను వ్యతిరేకముగాయున్నానని సోదరులు అనుకొంటారు. సరిగ్గా ఏది సత్యమో ఆయన ఎరిగియున్నంత వరకు, దేవుడు దాని నుండి భిన్నముగా ఎరుగును. చూడండి? అది సోదరులకు వ్యతిరేకము కాదు, ఆ క్రమమే మనము సోదరులుగా యుండకుండా చేయుచున్నది. మనము సోదరులుగా యుండకుండా మనలను దూరముగా యుంచేది, దేవుని వాక్యము కాదు గాని, అది మనము ప్రవేశించియున్న క్రమమే సోదరులుగా యుండకుండా మనలను దూరముగా యుంచుచున్నది. అది సత్యము. కాబట్టి మనము ఎక్కడ నిలబడాలి? వాక్యముపై నిలబడండి, మరియు దాని మీద (అది నిజము), దేవుడు మనుషులందరిని దాని యొద్దకు ఆకర్షిస్తాడు. దానిని ఎన్నడూ సంస్థగా చేయవద్దు, శాఖగా చేయవద్దు, దేవుని ద్వారా దానిని ముందుకు ఉంచండి, తిన్నగా ముందుకు కదులుచూనేయుండండి; అంతమును గమనిస్తూ, గట్టిగా పట్టుకొనియుండండి, దానిలో మిగిలిన దానినంతా దేవుడు తీసుకొని వస్తాడు.
19 మీరు నా కొరకు ఎన్నో కార్యములను చేసియున్నారు, నేను దానిని మెచ్చుకొంటాను. ఇప్పుడు, ఒక ప్రార్థనా వస్త్రమును గాని ఇంకా ఏదైనా గాని, మీకు ఇచ్చుటకు నేను సహాయపడతాను. కాని సిద్ధాంతమును అడుగవద్దు, ఏలయనగా అది చేయుట నాకు ఇష్టము లేదు. వివాహము మరియు పరిత్యాగమును గూర్చి అనేకమంది నాకు ప్రశ్నలను వ్రాస్తున్నారు, అది సంఘములో ఒక చిక్కుముడియైయున్నది. నేను ఎల్లప్పుడు, “నీ సంఘకాపరిని అడగండి,” అని నేను చెపుతూ వారికి సూచిస్తాను.
20 ప్రజలు నాకు ఉత్తరము వ్రాస్తూ, “దీని సంగతి ఏమిటి? దాని సంగతి ఏమిటి?” అని అంటారు. నేను ఆ ఉత్తరాన్ని వెనుకకు సూచిస్తూ, ఆ చిన్న విషయములపై మీ కాపరిని సంప్రదించండి, మీకు అది దొరుకుతుంది అని అంటాను, కారణము, ఎంతైనను ఆయన మీ కాపరియైయున్నాడు. మిమ్మును కాయుటకు ఆయనయే దేవుడు పంపిన వ్యక్తియైయున్నాడు. మనము దానిపై సమ్మతించకపోవచ్చు, అప్పుడు అది మీ సంఘములో ఒక గందరగోళమునకు కారణమవుతుంది. మాకు అది ఇష్టము లేదు. వద్దు! వద్దు! మనము పాప భూయిష్టమైన కార్యములను, బైబిలులో లేని వాటిని మాని, తిన్నగా దేవుని వైపుకు ముందుకు సాగుదాము. చూడండి? మీరు అలాంటి సంఘర్షణలకు కారణమైతే, అది సంఘమును కలవరపర్చుతుంది. కాబట్టి, వివాహము మరియు పరిత్యాగమును గూర్చి, మరియు ఇలాటి విషయములను మరియు వారి విషయములను గూర్చి, మీ సంఘకాపరి చెప్పుటయే నాకు ఇష్టము, ఆ పని ఆయననే చెయ్యనివ్వండి. ఆయన కూడా దేవుని సేవకుడైయున్నాడు, దానిని చేయుటకు ఆయన సన్నద్ధుడైయున్నాడు.
21 ఆ గాయపడిన మనిషిని, మంచి సమరయుడు కనుగొన్నప్పుడు, గుర్తున్నదా? ఆయన అతనిని ఒక పూట కూళ్ళ సత్రమునకు తెచ్చాడు (అదే సంఘము), ఆ మనిషికి రెండు దేనారములను ఇచ్చాడు, మరియు ఇంకా అతనికి ఎక్కువ అవసరమైనట్లైతే, అతడు తిరిగి వచ్చినపుడు చెల్లిస్తానని చెప్పాడు. కాబట్టి, అతడు రెండు దేనారములను కలిగియున్నాడు, అతడు ఒక దైవజనుడైయున్నట్లైతే, నీకు వైద్యము చేసి పైకి లేపగలడు. అతడు దేవుని యొక్క వాక్యముపై నిలబడే దేవుని యొక్క సేవకుడైయున్నట్లైతే, దేవుడు అతనికి ఏమి ఇస్తాడో దానిని అతడు కలిగియున్నాడు; ఆత్మ మరియు వాక్యము. అది నిజమేనా? మనము ఎలా ఆరాధించాలి? ఆత్మతో మరియు సత్యముతో, మరియు వాక్యము సత్యమైయున్నది. అది నిజమేనా?
22 ఇప్పుడు, ఎంతో దయతో మరొకసారి మీకు వందనములు. ఇప్పుడు, నేను ఎంతగానో అలసిపోయాను, ఈ మధ్యాహ్నము బాగా అలసిపోయాను, నేను జీవించినంత కాలము నేను మరొకసారి ఎన్నడూ హోటల్ లో ఉండుటకు ఇష్టపడను, రాత్రంతా పెద్ద త్రాగుబోతుల విందులు, తలుపులు బాదటం, కేకలు వేయటం మరియు స్త్రీలు…ఓ! నేను రాత్రంతా కూర్చొనియున్నాను. అంత మట్టుకే. కాబట్టి మరొక హోటల్ గదిని తీసుకొనే ఉద్దేశ్యము నాకు ఎన్నడూ లేదు. నేను ఒక బస చేయు సత్రానికి వెళతాను. నేను నా ట్రక్కును తీసుకొని వెళ్ళి, ఆ ప్రకారము నేల మీద ఎక్కడో నిద్రపోగలను. నేను దానిని పొందబోవుచున్నాను, నేను నిద్రపోయే సంచిని, ఒక గుడారమును నాకు ఇవ్వండి, నేను ఎక్కడో ఒంటరిగా నెమ్మదిగాయుండగలను. అది నిజము.
23 ఈ దేశము ఎంతో పాప భూయిష్టముగా మారింది. ఆశ్చర్యము కాదు! అది తేనె పట్టు వలె అల్లుకుపోయింది, మరియు మొదలు వరకు క్రుళ్ళిపోయింది. మీ రాష్ట్రములోనే, తిన్నగా పైన మరొక స్థలములో ఆలాగు జరిగింది, ఈ రాష్ట్రమే కాదు, ప్రతిచోట. తిన్నగా ఇక్కడే కొన్ని సంవత్సరముల క్రితము, ఒక పెద్ద పట్టణములో, నేను ఒక కూటములోయున్నాను. ఆ రాత్రి ఒక మత సంబంధమైన గుంపు, ఒక సనాతన సంఘము, ఒక యవ్వనస్థుల సమావేశమును కలిగియుండెను. నేను ఆఫ్రికా దేశములోని వొడో తో, మాంత్రిక విద్య నభ్యసించు వారి మధ్యయున్నాను, కాని అలాంటి దానిని నేను ఎన్నడూ వినలేదు…తరువాత రోజు ఉదయమున, (నేను ఖచ్చితముగా చెప్పలేను, ఎందుకంటే మనము మిశ్రమ శ్రోతలుగాయున్నాము)…వాళ్ళు నేల మీద పండుకొని, అవినీతి కార్యములను చేసియున్నారు, అంతటా సారాయి సీసాలు పడియున్నాయి. ఆ యవ్వన పిల్లలు, బాలురు మరియు బాలికలు ఏకముగా కలసి రాత్రంతా ఒకే గదిలోయున్నారు. తరువాత రోజు ఉదయమున, వారి “పరిశుద్ధ తండ్రి” బయట కూర్చొని యుండగా, వారు ఆయన ముందుకు వచ్చి ఆ విధంగా నమస్కరిస్తున్నారు. యేసుక్రీస్తు నామము క్రింద.
24 నేను పిచ్చివాడనయ్యానా? నాతోయున్న ఇబ్బంది ఏమిటి? ఆ విషయములను నేను అసలు తట్టుకొనలేను. దానిని చూసినపుడు ఏదో నన్ను ముక్కలుగా కదిలించి వేస్తుంది. అది నా ప్రభువైన యేసునకు ప్రాతినిద్యం వహించుటయేనా? అవినీతి కార్యములను చేస్తున్న ఒక త్రాగుడు అవినీతి గుంపును…ఆ యవ్వన పురుషులు, యవ్వన స్త్రీలపై వాడియున్నారు. సీసాలతో, మురికి సంచులతో నేలమీద పరుండియున్నారు, ఓ, అయ్యో! మంచితనము! అది క్రైస్తవ్యము అని నీవు పిలుస్తావా? ఆశ్చర్యము లేదు, ప్రపంచము పాప భూయిష్టమైన స్థితిలోయున్నది. బాగుంది. ఒక పాపి దాని వైపు చూసినపుడు, అతడేమి చేస్తాడు? వారిలో వేలమంది.
25 ఆ యవ్వన బాలికలు ఎంత బాగా త్రాగారంటే, వారు కనీసము నిలబడలేకపోయారు, మరియు రాత్రంతా ఆ కుర్రవాళ్ళతో గదిలోయున్నారు, నీవు ఎన్నడూ నీ జీవితములో వినని భయంకరమైన మురికి మాటలు. నేను నా దిండులను ఈ విధముగా నా తలక్రిందయుంచుకొని, నిద్రించుటకు ప్రయత్నించాను. ఆ నేల మీద త్రాగి, వాళ్ళు పైకి క్రిందికి ఎగురుతున్నారు, మత భక్తా!
26 ఇప్పుడు, ఈ పాపిష్ఠి ప్రజలు అలా చేస్తారని నాకు తెలుసు, ఇప్పుడు తమ్మును తాము ఆటగాళ్ళమని, అక్కడ బౌలింగ్ ఆటలో బయటవున్నారు. నా పిల్లలలో ఒకరు అలాటి బౌలింగ్ ఆటను ప్రారంభిస్తే, నేను నా దేశములో నుండే అతనిని తరిమి వేస్తాను. అది ఆట అని పిలుస్తారా, అది ఆట కాదు, నీవు సరిగాయుండాలనుకొంటే, దేవునితో సరికమ్ము. నిజము.
27 బైబిలులోనుండి కొన్ని మాటలను నేను చదవాలనుకొనుచున్నాను. దీనిని నేను ఒక అంశముగా పిలుస్తాను, అది మొదటి రాజులు 17వ అధ్యాయము, 1వ వచనము.
…ఎవని సన్నిధిని నేను నిలబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక, ఈ సంవత్సరములలో వర్షమైనను మంచైనను పడదని ప్రకటించెను.
మొదటి రాజులు, 1వ అధ్యాయము…17వ అధ్యాయము, 1వ వచనము.
28 ఏ సమయములోనైనా మీకు ప్రార్థనా వస్త్రమును పంపగలిగినట్లైతే, మీకు పంపిస్తాను, నాకు వ్రాయండి; ఇక్కడ నా కార్యదర్శి, హాజరైయున్నాడు, సోదరుడు మగీర్. మానుండి ఎన్నడైనా ఎంతమంది ప్రార్థనా వస్త్రమును పొందియున్నారో, మీ చేతులను చూడనివ్వండి. సోదరుడు జిమ్, లేచి నిలబడండి, నిన్ను, నీ భార్యను నేను చూడాలనుకొనుచున్నాను. ఇక్కడే నా కార్యదర్శి మరియు అతని భార్యయున్నారు, వాటిని పంపేది, పని చేసేవాళ్ళు వారే. ఆ బాలుడు మరియు బాలికయే, మీకు కూటముల నుండి ప్రార్థనా వస్త్రములను పంపేది. ఇద్దరూ సమర్పించుకొన్న క్రైస్తవులు. మీరు నన్ను పిలిచినపుడు, ఫోను మీద వినే ఆ చిన్న తీయని స్వరము, ఇక్కడ కూర్చొని యున్న అతని భార్యదే. ఆమె తల్లి మరియు తండ్రి ఈ రోజున మనతోయున్నారు; అంతా చుట్టూ, ప్రియమైనవారు. ఇక్కడయున్న నా ఫీల్డ్ సెక్రటరీ, శ్రీ. మెర్సియర్ సోదరుడు లియో మెర్సియర్, అతడు ఇక్కడ ఎక్కడోయున్నాడు, మరియు సోదరుడు జెనె గోడ్. ఏ సమయములోనైనా, మీకు ఒక ప్రార్థనా వస్త్రమును పంపిస్తాము, మరియు మీ కొరకు ఏదైనా చేస్తాము, ఫోనులో మీ కొరకు ప్రార్థన చేస్తాము. మేము చేయగలిగినది ఏదైనను మీ కొరకు చేస్తాము.
29 ఈ వింతగా కనబడుచున్న మనిషి, తన చేతిలో ఒక కర్రను కలిగియున్నాడు, అతని అడుగులు చక్కగా వేస్తూయున్నాడు, అతని కన్నులు దేవుని యొక్క మహిమతో తళుక్కుమనుచున్నవి, వెంట్రుకలతోయున్న పాత గొర్రె చర్మము అతని చుట్టూ చుట్టబడియున్నది, అతడు సమరయ వీధిగుండా దృఢముగా అడుగులు వేసుకొంటూ నడుస్తూ వస్తున్నాడు. అతని వైపు చూచుటకు, అతడు అంత ఎక్కువైన వాడు ఏమీ కాదు, కాని అతడు ఆ గొప్ప ఇశ్రాయేలు దేశమునకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును కలిగియున్నాడు. అవును, అతడే తిష్బీయుడైన ఏలీయా, యెహోవా యొక్క ప్రవక్త, అతని వైపు చూచుటకు అతడు అంత ఎక్కువైనవాడు కాదు, కాని అతడు ప్రభువు యొక్క వాక్యమును కలిగియున్నాడు.
30 అతడు రాజు ముందు నిలబడుటకు భయపడలేదు, కారణము అతడు రాజకంటె గొప్ప వాని సన్నిధిలో నిలబడియున్నాడు, అతడు యెహోవా యొక్క సన్నిధిలో యుండియున్నాడు. అందుచేతన, అతడు ఎక్కడ నిలబడియున్నాడో అతడు ఎరిగియుండెను. అతడు రాజు ముందుకు నడిచి వెళ్ళునపుడు, అతడు నత్తిగా మాట్లాడలేదు, గొణగలేదు, అతడు ఏమి మాట్లాడుచున్నాడో, దానిని ఎరిగియుండెను. “ఇశ్రాయేలీయుల దేవుడైన ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అని రాజుతో మాట్లాడగలిగెను, ‘నేను ఆజ్ఞాపించు వరకు వర్షము గాని మంచు చుక్క గాని పడదు.’” “నేను ఆజ్ఞాపించు వరకు అని, ఎందుకు అతడు చెప్పాడు. నా మాట ప్రకారము”? కారణము అతడు ప్రభువు యొక్క వాక్యమును కలిగియుండెను, అతడు ప్రవక్తయైయున్నాడు, మరియు ప్రభువు యొక్క వాక్యమును ప్రవక్త కలిగియున్నాడు.
31 ఇశ్రాయేలు మరియు అమెరికా మధ్యయున్న సమాంతరమైన విషయము ఇప్పుడు ఒక తాకుతున్నదైయున్నది. వాటిలో రెండూ గొప్ప దేశములైయున్నవి. ఆ రెండు దేశములు ఆ విధముగానే స్థాపించబడినవి, మరియు ప్రజలు మతపరమైన హింసను బట్టి ఇక్కడకు వచ్చారు.
32 ఫరో చేత ఇశ్రాయేలు హింసించబడి, నాలుగు వందలయేండ్లు దాస్యములోయుండియున్నది, సజీవుడైన నిజమైన దేవుని ఆరాధించే ఆధిక్యత వారికి దూరము చేయబడింది, మరియు వారు బానిసులుగా మారారు. ఆయన బైబిలులో, లేక ఆయన వాక్యములో, ఆయన ప్రవక్తల ద్వారా, వారికి ఒక దేశమును ఇస్తానని ఆయన వాగ్దానము చేశాడు. మరియు వారు ఆ దేశములోనికి వచ్చి, ఆ దేశమును ఆక్రమించుకొన్న వారిని వెనుకకు తరిమి వేసి, వారి స్వాస్థమును స్వాధీనపర్చుకొంటారు, ఏలయనగా దానిని చేయుటలో దేవుని ఒక ఉద్దేశ్యమున్నది.
33 ఆ ప్రకారమే మన ఈ గొప్ప దేశమున్నది. మనము ఇక్కడకు వచ్చి, ప్లైమవుత్ బండపై, మత స్వేచ్ఛపై ఈ దేశము స్థాపించబడింది, కారణమేమనగా మన పితరులు అధునాతన యెజెబెలు క్రమము ద్వారా, రోమా హింసనుండి పారిపోయి, ఇక్కడకు వచ్చి, అబద్ధపు యెజెబెలు క్రమము క్రింద గొప్ప హింసలకు, హతసాక్షులకు నిలబడ్డాము. బైబిలు ప్రకారము, ప్రకటన 13వ అధ్యాయము ప్రకారము, దేవుడు వారికి ఒక నీటి ఊటను ఒక స్థలమును వాగ్దానము చేశాడు, ఏలయనగా ఆ స్త్రీ అరణ్యమునకు కొనిపోబడగా, అక్కడ ఆమె ఒక కాలము, కాలము, ఒక అర్ధ కాలము వరకు పోషించబడింది. ఈ దేశములోనికి వచ్చుటకు (ఈ స్త్రీకి) దేవుడు అమెరికాకు లేక సంఘమునకు వాగ్దానము చేశాడు.
34 ప్రకటన 13వ అధ్యాయమును నీవు గమనించావా? మిగిలిన ఇతర క్రూరమృగములన్నియు సముద్రము నుండి పైకి వచ్చినవి, అనగా నీరు; ప్రకటన 17:17 లో చెప్పబడింది, “నీవు చూసిన జలములు ప్రజలును, జన సమూహములను, జనములను సూచించుచున్నవి.” మిగిలిన ఇతర క్రూరమృగములన్నీ నీళ్ళలో నుండి, ప్రజలలో నుండి జన సమూహములలో నుండి వచ్చియున్నవి. కాని అమెరికా సంయుక్త రాష్ట్రములు వచ్చినపుడు, “అక్కడ ప్రజలు లేని భూమి నుండి అది వచ్చియున్నది.” గుర్తుంచుకోండి, అది పైకి వచ్చినపుడు, అది ఒక చిన్న గొర్రెపిల్ల వలె కనబడింది.
35 ఇప్పుడు, ఆ గొర్రె పిల్లకు రెండు కొమ్ములున్నవి, అది పౌర సంబంధమైన, మత సంబంధమైన శక్తులు. కాని అవి ఐక్యమైనపుడు, గుర్తుంచుకోండి, తరువాత అది అతని ముందు చేసినట్లుగా ఘటసర్పము వలె మాట్లాడింది; మరియు ఘట సర్పము రోముయైయున్నది.
36 ఆమె ఆ బిడ్డను కనిన వెంటనే, ఆ స్త్రీ ముందు ఆ బిడ్డను మ్రింగివేయుటకు, నిలబడియుండెను, అదే ఎఱ్ఱని ఘటసర్పము…ఆ బిడ్డను కన్న వెంటనే మ్రింగివేయుటకు ఇశ్రాయేలు ముందు నిలబడి, మరియు రెండు సంవత్సరములలోపు చిన్న బాలురనందరిని చంపివేయమని, ఒక హింసను పంపినది ఎవరు? “రోము, ఘటసర్పము, ఆమె బిడ్డను కనిన వెంటనే మ్రింగివేయవలెనని, ఆ స్త్రీ ముందు నిలబడింది.”
37 తరువాత, మనము కనుగొనేదేమంటే, ఈ దేశము ఒక స్వేచ్ఛా దేశముగా పైకి వచ్చింది, ఒక గొర్రె పిల్లను కలిగియున్నది, దాని భావము దేవుని గొర్రెపిల్ల. కాని, కొంచెము తరువాత, మనము కలిగియున్న అదే క్రమము, ఘట సర్పము వలె మాట్లాడి, ఘటసర్పము దాని యెదుట కలిగియున్న శక్తినంతటిని ప్రదర్శించింది.
38 అది ఒక దానికి ఒకటి పరిపూర్ణముగా, సమాంతరముగాయున్నది. గుర్తుంచుకోండి, ఇశ్రాయేలు పైకి వచ్చి, ఆ దేశమును స్వతంత్రించుకొన్న దేశ నివాసులందరిని వెనుకకు తరిమివేసి, జన్మభూమిని, పాలస్తీనాను తీసుకొన్నది. మనమును ఇక్కడకు వచ్చి, ఇండియన్లను వెనుకకు తరిమి వేసి, వారి నుండి ఈ దేశమును స్వాధీనము చేసుకొన్నాము. దాని పట్ల దేవునికి ఒక ఉద్దేశ్యమున్నది. ఒక చిన్న కట్టువలెయున్న ప్రజలు, స్వేచ్ఛను మరియు మత స్వేచ్ఛను ఆశించిన ప్రజలు, దేవుని సేవించగోరే ప్రజలతో దేవుడు ఏమి చేయబోవుచున్నాడో, ప్రపంచమునకు చూపగోరుచుండెను.
39 వారు ఇశ్రాయేలుకు ఏమి చేశారు? ప్రపంచములోనే అత్యంత బలమైన దేశముగా ఆయన ఇశ్రాయేలును తయారు చేశాడు, దేవుని యొక్క చిత్తములో నుండి బయటకు వెళ్ళునంత వరకు, ఆమె ఆ రీతిగా నిలిచియున్నది. అమెరికాతో ఆయన ఏమి చేశాడు? ఆమె దేవుని యొక్క చిత్తము నుండి బయటకు వెళ్ళునంత వరకు దేవుడు ఆమెను ప్రపంచములోనే అత్యంత బలమైన దేశముగా తయారు చేశాడు. ఒక దానికి ఒకటి సమాంతరముగా, ఖచ్చితముగా.
40 ఇశ్రాయేలు తన దేశములోనికి వచ్చినపుడు, వారు గొప్ప ప్రజలైయుండిరి, కారణమేమనగా వారు గొప్ప నాయకత్వమును కలిగియుండిరి. దావీదు, సొలొమోను రాజువంటి, దేవునికి భయపడిన మనుషులు వారిపైయుండిరి. ప్రపంచమంతా వారికి భయపడింది, యుద్ధములు లేవు, ఇబ్బందులు లేవు, మరియు దేవుని యొక్క శక్తి క్రింద జీవించే ఆధిక్యతలను వారు కలిగియుండిరి, చివరకు ఎరిగిన ప్రపంచమంతటి నుండి ప్రజలు వారిని చూచుటకు వచ్చిరి. దేవుడు వారికి వివేచన వరమును ఇచ్చెను, అది సొలొమోను మీద ఉన్నది. మరియు షేబా దేశపు రాణి, సహారా ఎడారి గుండా ఆ వైపు నుండి ఈ వైపు వరకు మార్గమంతటి గుండా ప్రయాణము చేసి (మూడు నెలలు పట్టింది) సొలొమోను జ్ఞానమును వినుటకు వచ్చింది. సొలొమోను ఆత్మలను వివేచించగలడని ఆమె చూసినపుడు, మరియు ఆమె యొక్క హృదయ రహస్యములను వివేచించినపుడు, ఆమె అన్నది, “నేను నీ గురించి వినినదంతయూ సత్యమే, కాని అది గాక ఎంతోయున్నది.” అది దేవుడైయున్నాడని ఆమె ఒప్పించబడెను.
41 మరియు అమెరికా, ఇక్కడకు మత స్వాతంత్ర్యము కొరకు వచ్చిన మన పితరులను ఆధారము చేసుకొని…వారి దినాలలో మనము భక్తి కలిగిన నాయకులను కలిగియున్నాము: జార్జ్ వాషింగ్ టన్, అబ్రహామ్ లింకన్, వీరు ప్రఖ్యాత గాంచిన వారు మరియు దేవుని మనుషులు, ఆ దినాలలో అమెరికా అమెరికాగానే ఉన్నది.
42 జార్జి వాషింగ్ టన్, వేలీ పోర్జ్ వద్ద, అతడు డెలావేర్ నదిని దాటకముందు, రాత్రంతా ప్రార్థించాడు, చివరకు నడుము లోతు వరకు అతడు మంచులో తడిసిపోయాడు. తరువాత రోజు ఉదయమున అమెరికా వారు దాటుచుండగా, అమెరికా సైన్యములో దరిదాపుగా ఇరవై శాతం వారికే ధరించుటకు బూట్లువుండెను. కాని వారు ఒక నియమమును కలిగియుండిరి, వారు దేని కొరకో పోరాడవలసియుండిరి. ఏది వచ్చినా వెళ్ళినా వారు లెక్క చెయ్యలేదు. (వ్యవసాయదారులు లోనికి వచ్చి, నాగలిని ఆపి, ఎద్దును విప్పి, తుపాకీ తీసుకొని, అతడు ఎరిగిన స్వేచ్ఛ కొరకు పోరాడుటకు వెళ్ళెను.) నేననుకొంటాను, తరువాత రోజు అతని టోపీ మరియు కోటు గుండా నాలుగు లేక ఐదు తుపాకీ గుళ్ళు రంధ్రములు పడినవి, కాని ఎన్నడూ అవి అతనిని తాకలేదు (మస్కట్ బుల్లెట్లు).
43 దేవుని మనుషులు, ఈ దేశమును స్థాపించారు, గొప్ప మనుషులు! ఆశ్చర్యము లేదు, వారు ఈలాగు వ్రాశారు:
మన దేశము దీర్ఘకాలము ప్రకాశముగా ఉండాలి,
పవిత్రమైన స్వేచ్ఛా వెలుగుతో;
నీ బలము ద్వారా మమ్మును కాపాడుము,
గొప్ప దేవా, మా రాజా!
44 కొంతకాలము క్రితము, ఇండియానాలోని కారిడాన్ వద్ద, నేను ఒక వృద్ధునితో మాట్లాడాను. ముఖ్య పట్టణము కారిడాన్ లో యుండగా, అతడు నాకు చెప్పాడు, అతడు ఒక ఎద్దు బండి మీద ఎలా గవర్నర్ ప్రసంగమును వినుటకు వెళ్ళాడో నాకు చెప్పాడు. అతడు మరియు గవర్నర్ వారిద్దరు మాత్రమే రెండు ముక్కలుగాయున్న ఒక సూటును వేసుకొన్నవారు. అతడన్నాడు, అతడు గొర్రెలను పెంచి వాటి ఉన్నిని కత్తిరించి, ఉన్నిని కడిగినప్పుడు, అతని సహోదరీలు అతనికి ప్యాంటు మీద వేసుకొనుటకు, ఒక కోటును వాడికి తయారు చేసిరి. అక్కడ కూర్చొనియున్న వృద్ధుడు, అప్పుడు అతనికి ఎనభై ఐదు లేక తొంభై సంవత్సరముల కలిగినవాడు, అతడు తన గడ్డమును, ఈ రీతిగా లాగి అన్నాడు, “బిల్లీ, ‘అమెరికీ,’ ‘అమెరికీగా’ యున్నప్పుడు సంగతి.”
45 నేను ఆ వృద్దుని వైపు చూసి ఇలా అనుకొన్నాను, “కుర్రవాడా, నీవు…ఈ యవ్వనస్తులు అనేకమంది దానిని నమ్మరు, కాని నీవు సత్యమును చెప్పుచున్నావు.”
46 ఈ దైవభక్తి నేపద్యము తరువాత ఇశ్రాయేలుకు ఏమి జరిగింది? వారు నిర్లక్ష్యముగా మారిపోయారు. వారు ఏ స్థానమునకు వచ్చియున్నారనగా, సరే, ఏది ముందుకు వెళ్ళిందో వారు లెక్క చెయ్యలేదు. మనము కలిగియున్నట్లుగా, వారు మత రూపమును కలిగియున్నప్పటికి, దేవునిని ఆరాధించుటలో వారు మందగిలిపోవుట ఆరంభమైనది. వారు భక్తిగల వారి వలె కనబడుచున్నారు. కాని వారి ప్రజలతో స్వేచ్ఛగా నడుచుట ప్రారంభించారు, మరియు వివిధమైన విరోధమైన సిద్ధాంతములను వారి సంఘములోనికి తెచ్చుట ఆరంభించారు. బాలీము యొక్క ఆరాధనలోనికి ప్రాకింది. ఇశ్రాయేలు సుఖభోగాసక్తితో, పిచ్చివారుగా, త్రాగుబోతులుగా, అలాటి కార్యాలు చేస్తూ, చివరగా దేవునిని ఎరుగని ఒక నాయకుడిని లోనికి తెచ్చారు; అతడే ఆహాబు, తన తండ్రి తరువాత విజయము పొందినవాడు. అతని తండ్రి ఒక భక్తిహీనుడు, ధనవంతుడు, కాని ఒక భక్తిహీనుడు. ఎన్నడైనా అతని ముందున్న ఏ ఒక్కరైనా చేసినవాటి కంటె, ఎక్కువ పాపములను అతడు చేశాడు. కానీ ఇశ్రాయేలు, వారి త్రాగుబోతు మైకములో, అలాటి మనిషిని వారిపై అధిపతిగా, అతనిని సింహాసమెక్కించారు. అది పరవాలేదు అని వారనుకొన్నారు. సరిగ్గా ఈ రోజున అనేకమంది అమెరికా వారు చేసినట్లుగా, “ఓ, అతడు మంచి రాజకీయ నాయకుడు, కాబట్టి దాని వలన ఏమీ తేడా లేదు? అది ఏ భేదమును చెయ్యదు, కారణమేమనగా అతడు ఒక మంచి రాజకీయ నాయకుడు.”
47 అనేకమంది అమెరికా వాసులు, వారిలో అనేకమంది, ఒక అమెరికనుగా, వారి జన్మ హక్కును అమ్మి వేసుకొన్నారు, వారు ఈలాగు అంటారు, “ప్రభుత్వము నుండి కొన్ని అధికమైన డాలర్లు పొంది జీవిస్తూయున్నంత కాలము, అది ఏ భేదము చేస్తుంది?” వారు తమ పొట్టను, దురాశల కొరకు, పాప లోకపు ఆశల కొరకు అమ్మి వేసుకొన్నారు మరియు మనము దేని కొరకు ప్లైమవుత్ బండపై దిగియున్నామో, దానినే వారు మర్చిపోయారు. వారు తన వారసత్వ సంపదను మర్చిపోయి, సుఖానుసక్తులైన పిచ్చి గుంపులకు వెళ్ళి, తమ్మును తాము అమ్మివేసుకొన్నారు. ఇశ్రాయేలు దినములలో జరిగియున్నట్లుగా. ఆ ప్రకారమే అది జరుగుచున్నది, అమెరికా అదే దారిని తీసుకొన్నది, తిన్నగా క్రిందకు అదే దారి, సుఖము!
48 కొద్ది కాలము తరువాత, ప్రభుత్వము పాపమును అనుమతించింది: “నీవు సమాజ మందిరమును కలిగియున్నంత కాలము, అది ఏ భేదమును చేస్తుంది?” అదే ఖచ్చితముగా అమెరికా చేసింది. మనలను మనము ఏకముగా సంస్థగా చేసుకొని చిన్న చిన్న గుంపులుగా, మరి ఎక్కువ పాప భూయిష్టముగా, ఇంకా ఎక్కువ పాప భూయిష్టముగా, ఇంకా ఎక్కువ పాప భూయిష్టముగా మారియున్నాము. మనము ఇక్కడకు ఎందుకు దిగియున్నామో, ఆ మూల సిద్ధాంతముల కొరకు మనము నిలిచియుంటే బాగుండేది! అప్పుడు జరిగియున్నట్లుగా సరిగ్గా పాపము సంఘములలోనికి ప్రాకుట ఆరంభమైంది. స్త్రీలు తమ జుట్టును కత్తిరించి, పొట్టి బట్టలు ధరించుట ప్రారంభించారు, ప్రతి సంవత్సరము వారు కత్తిరిస్తున్నారు…పురుషులు ఇది, అది, మరొకటి చేయటం పేకాటలు ఆడటం, సంఘములో బంకో ఆటలు ఆడటం ప్రారంభించారు, ఎంత లోకస్థులవలె యుండాలో అంత లోకస్థులుగా యున్నారు, సుఖభోగముతో పిచ్చి పట్టినవారై, త్రాగుబోతులుగా మైకములో పడ్డారు.
49 సేవకులు వేదాంత పాఠశాలల నుండి పట్టా పొందుచున్నారు, మరియు వారి బిషప్పు ఈలాగు అంటున్నాడు, “పిల్లలారా, మీకు ఇష్టమైన దానిని బోధించండి, నాకు తెలిసినంత వరకు పందొమ్మిది వందల సంవత్సరముల క్రితమే, యేసు క్రీస్తు యొక్క రక్తము ఎండిపోయింది.” చివరకు సంఘము ఒక సంస్థగా, ఒక లాడ్జింగ్ గా మారిపోయింది. ఈ మధ్యాహ్నమును మీరు ఎన్నడూ మర్చిపోవద్దు! ఒక లాడ్జింగ్ గా మారారు, లోకము లోనికి ప్రాకుట ఆరంభమైనది, ఆహాబు కాలములో సేవకులు రాజీపడినట్లుగా, వారు రాజీపడుట ప్రారంభించారు. పాప భూయిష్టముగా, సారము వరకు క్రుళ్ళిపోయింది. మరియు ఇంకా ముందుకు, ఇంకా ముందుకు ఎంత కఠినముగా అది ముందుకు వెళ్ళాలో అంత కఠినముగా ముందుకు వెళ్ళింది.
50 ప్రవక్త వెంబడి ప్రవక్తను వారి యొద్దకు పంపుతూ, ప్రజలను ఆయన సున్నితమైన కనికరములతో బ్రతిమిలాడినప్పటికి, వారు దాని పైకి వారి వీపులను త్రిప్పరి. వారికి వారి సొంత మార్గము కావాలి, వారు ఇశ్రాయేలీయులైయుండిరి, వారు స్వతంత్రులు, వారు ఒక గొప్ప దేశమైయున్నారు. వారి పితరులు (దావీదు మరియు సొలొమోను) పలానా-పలానా కార్యములు చేశారు, వారు కోరుకొన్న దానిని వారు చేయగలిగిరి. ఖచ్చితముగా, ఇప్పుడు మనము ఏ ఆధారముపై మనలను మనము ఆధారము చేసికొన్నామో సరిగ్గా అదే కార్యము. వాషింగ్ టన్, మన పితరులు దేని కొరకు నిలబడియున్నారో, కాని సోదరుడా దానికి మనము పది లక్షల మైళ్ళ దూరములోయున్నాము; మన సంఘములు, దానికి పదిలక్షల మైళ్ళ దూరములోయున్నవి.
51 ఈ రోజునయున్న మెథడిస్టు సంఘము, ఇది వరకుయున్న మెథడిస్టు సంఘమును చూడండి! ఈరోజునయున్న పెంతెకొస్తు, ఇదివరకు యున్న పెంతెకొస్తు చూడండి! ఈ రోజున యున్న బాప్టిస్టు, ఇదివరకు యున్న బాప్టిస్టును చూడండి! మనకు సమయమున్నట్లైతే, వెనుకకు వెళ్ళి జాన్ స్మిత్, మరియు అనేకమంది ఆదిమ సంస్కర్తలను చూడవచ్చు. అతడు చనిపోకముందు జార్జ్ స్మిత్ అన్నాడు, “ఒక నాశనకరమైన విషయమేమనగా మెథడిస్టు స్త్రీలు, వారి వ్రేళ్ళపై బంగారు ఉంగరములను ధరించుట ప్రారంభించారు.” మెథడిస్టులు! జుట్టు కత్తిరించుకొన్న స్త్రీలను ముఖమునకు రంగులు వేసుకొన్న స్త్రీలను, పొట్టి బట్టలు ధరించిన స్త్రీలను చూసి అతడు ఈ రోజున ఏమంటాడు? అది పాపమును బట్టి!
52 దేవుడు అమెరికా లో ఏమి జరిగించాడు? ఉజ్జీవము వెంబడి ఉజ్జీవాన్ని, ఉజ్జీవము వెంబడి ఉజ్జీవాన్ని పంపాడు. సేవకులు వాక్యమును బోధించియున్నారు, ప్రజలను దేవుని యొద్దకు తిరిగి పిలుచుటకు ప్రయత్నించారు. వారు ఏమి చేశారు? ఇశ్రాయేలు చేసిన దానినే చేశారు, దానిని త్రోసివేశారు! వారిని ఎగతాళి చేశారు! “పరిశుద్ధ-రోలర్లు” అని వారిని పిలిచారు! వారిని జైల్లో పడవేశారు.
53 నా సహోదరీలలో ఒకరు లేక నా సహోదరులలో ఒకరు, ఈ రోజున ఈ సంఘములో నుండి, గత రాత్రియున్నట్లుగా అదే హోటల్ లో నిలబడి, ఆ గదిలో వారి చేతులను ఎత్తి దేవునిని స్తుతించినట్లైతే దానిని బట్టి ఈ రోజు వారు జైలులో యుండేవారు. కాని ఒక త్రాగుబోతులు, భ్రమించిన మూర్ఖులు, “అపవిత్రమైన-రోలర్లు” వంటివారు, రాత్రంతా కేకలు వేయవచ్చు; రాత్రంతా త్రాగవచ్చు, స్త్రీల బట్టలను వారి నుండి గుంజివేసి శపించుకొనవచ్చు, కనీసము దానిని గూర్చి ఒక్క మాట వారు చెప్పరు. ఆశ్చర్యము లేదు, దేవుని హస్తము క్రింద మనము తీర్పునకు విధించబడియున్నాము!
54 గమనించండి, ఇంకా ముందుకు దేవుడు సేవకులను పంపి, ఆయన వాక్యమును రుజువు చేస్తూ, అద్భుతములను సూచక క్రియలను చేసియున్నాడు. ఎక్కువమంది అధునాతన సేవకులు ఆ కార్యమునంతా త్రోసివేసి, ప్రతి ఉజ్జీవాన్ని ఎగతాళి చేశారు. ఎంతో పేరుగాంచిన క్రీస్తు సంఘము వంటివారు, “అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి” అని అన్నారు. ఆ దేవుని యొక్క చిన్న శేషము నుండి దానిని మూసివేయుటకు వారి శాయశక్తులా ప్రయత్నించారు. అది ఇశ్రాయేలులో యుండినట్లుగా, ఈ రోజున ఆ ప్రకారముగానేయున్నది. అనేకసార్లు దేవుడు సంఘశాఖలలో నుండి మరియు సంస్థలలో నుండి, ఆయన ప్రజలను బయటకు తీసి, వారితో మాట్లాడటానికి అరణ్యమునకు తీసుకొని వెళ్ళాడు. దానిని గురించి నీవు కలతపడవద్దు, ఆయన ఒక శేషమును కలిగియుండబోవుచున్నాడు. అప్పుడు ఆయన చేశాడు, ఇప్పుడును ఆయన చేస్తాడు. ఇంకా ముందుకు, ఇంకా ముందుకు, పాపము గుండా వెళ్ళి ఆ కార్యముల గుండా పోరాడి మునిగిపోయారు. ఎందుచేత? వారి నాయకత్వము, దానిని అక్కడ ఆపటానికి ఏమీ లేదు.
55 బాగుంది, యథార్థముగా, నాకు తెలుసు అనేక దేశములు, ఇక్కడ మనము అమెరికాలో చేసినట్లుగా వీధులలో వస్త్రధారణ చేసినట్లైతే, వారిని వాళ్ళు జైలులో పెడతారు. నేను రోమ్ లోని సెయింట్ అంజెలోకి వెళ్ళినపుడు (ఇప్పుడు ఆలోచిస్తే, అది దాని కంటె ఎంతో హీనముగావున్నది), సెయింట్ అంజెలో సమాధినొద్ద వారు ఒక సూచనను ఉంచారు, “అమెరికా స్త్రీలకు: ‘దయచేసి బట్టలు వేసుకొని మృతులను గౌరవించండి.’”
56 ఎన్నడైనా ఏదైనా నిన్ను రోగిగా చేసినట్లైతే, పేరుగాంచిన అమెరికా వాసులు లోనికి వచ్చుటను చూచుటయే. ఒక రోజున నేను లాసెన్ లో కూర్చొనియున్నాను, సోదరుడు ఆర్గాన్ బ్రైట్ మరియు నేను ఒక మాంసపు ముక్కను తినుచు, ఆనందించుచుంటిమి. తరువాత రోజు, మేము తిరిగి వెళ్ళాము, కారణమేమనగా ఆ మాంసము తినుటకు ఎంతో బాగున్నది. అక్కడ నాకు కొంత నీరు అవసరమైంది, కాని వారు అక్కడ సారాయి తప్ప దేనినీ వడ్డించరు. నేను నీళ్ళు తెచ్చుకొనేవాడిని. ఎల్లవేళలా నా సొంత చేతులలో నేను ఒక జగ్గు నీటిని మోయవలసి వచ్చేది, ఏలయనగా వారు బల్ల నొద్ద నీకు నీళ్ళును వడ్డించరు. తరువాత నేను లోనికి వెళ్ళాను “మిస్ అమెరికా,” ఒక చిన్న మురికి, ముడివంటి ముక్క కలిగిన, పది సెంట్లతో చాలినంత ఆభరణములను ఆ విధంగా కలిగిన కుక్క వచ్చు వరకు అంతా బాగానేయున్నది, ఒక సిగరెట్టును ఈ విధంగా చివరిలో పట్టుకొని, ఆమె కాని దానిని తగిలించుకొని వచ్చి కూర్చొన్నది; మరియు ఆ కుక్కను టేబుల్ పై ఉంచింది, మురికి, మురికి కార్యము.
57 ఒక కుక్క గురించి దేవుడు మాట్లాడినది, అది హేయమైనది. కనీసము దాని యొక్క దశమ భాగము సహితము దేవుని గృహములో చెల్లించకూడదు. “అది వేశ్యవలెయున్నది, ఒక వేశ్య యొక్క దశమభాగము,” అని బైబిలు చెప్పింది. ఇంకనూ నీవు అక్కడేయున్నావు. వారు కుటుంబ నియంత్రణ చేసి, దరిదాపుగా ఆ పాత కుక్క కొరకు, ఒక వెయ్యి డాలర్లు చెల్లిస్తారు; మరియు దానిని చుట్టూ త్రిప్పుచూ ఒక చిన్న బిడ్డ ప్రేమను దానికి చూపిస్తారు, ఆ ప్రకారము ఆమె రాత్రంతయూ బయట పరుగెత్తుతుంది, మరియు కుటుంబ నియంత్రణను పాటిస్తుంది.
58 విచ్ఛిన్నమైపోవుట తప్ప, ఏమి కనిపెట్టుచున్నది! మీరు ఎన్నడూ మరలా నా స్వరమును వినలేరు, కాని దీనిని గుర్తుంచుకోవాలని నేను కోరుచున్నాను; మనము అంతములోయున్నాము!
59 అక్కడ, ఏమి సంభవించిందో మనము కనుగొంటాము, ఏమి జరిగింది, చివరగా, ఆ గొప్ప ఘడియ వచ్చింది; ఆహాబు ఎన్నుకొనబడ్డాడు తరువాత అతడు యెజెబెలును వివాహము చేసికొన్నాడు; ఆ కృళ్ళిపోయిన పాత స్త్రీ ఇశ్రాయేలునంతా విగ్రహారాధనలోనికి నడిపించింది. అలాటి కార్యము ఎన్నడైనా వారి దేశములో అనుమతించబడుటకు ముందు వారు తప్పక వెనుకకు జారిన స్థితిలోయుండియున్నారు. ప్రజలు ప్రజల కొరకు చట్టములను చేశారు, మనము దానినే చేసియున్నాము!
60 ఒక సమయములో అమెరికా దానిని అనుమతించలేదు…ఆ పాత వేశ్యను కలిగియుండుట కంటె వారికి బాగా తెలుసు, ఆ పాత వేశ్య హత సాక్షుల రక్తమును త్రాగింది, వారిని చంపింది. ఆ కారణమును బట్టియే వారు స్వేచ్ఛ కొరకు ఇక్కడకు పారిపోయి వచ్చారు. వారు అలాటి దానిని ఎంత మాత్రము ఉంచరు. అది చూపునదేమనగా అలాటి దానిని ఎన్నుకొనుటకు మనము వెనుకకు జారిన స్థితిలోయున్నాము, మొత్తము దేశము. ఓ, నిజానికి మీలో కొంత మంది స్క్వేర్ బాక్ డెమెక్రేట్స్, దీనిని ఆలోచిస్తారు, “ఓ, అతడు ఒక మంచి రాజకీయ నాయకుడవుతాడు.” అది తర్కములకు సరిగానే శరీర మనస్సుకు ధ్వనించవచ్చు. కాని దేవుని వాక్యమునకు, ఆత్మ సంబంధమైన మనస్సుకు, అది అర్ధమియ్యదు. నిశ్చయముగా అది అర్ధమియ్యదు, బయట కొన్ని అధికమైన డాలర్లు, కొన్ని పన్నులు లేక అలాటి చురుకైనది.
61 మనము ఒక కఠినమైన సమయమును కలిగియున్నాము, మన మిషనరీలు ఈ రోజున సువార్త పొలములోయున్నారు, ఏలయనగా మనము ఒక కాథలిక్ దేశముగా లెక్కించబడ్డాము. ఎందుకనగా, నిశ్చయముగా, రష్యా ఒక కమ్యూనిస్టు నాయకుని కలిగియున్నందున, అది కమ్యూనిస్టు దేశముగా లెక్కించబడింది. ఎర్ర చైనా దేశము, కమ్యూనిస్టు దేశముగా లెక్కించబడింది, కారణము వారు ఒక కమ్యూనిస్టు నాయకుడిని కలిగియున్నారు. మనము ఒక కాథలిక్ దేశమైయున్నాము, కారణము మనము ఒక కాథలిక్ నాయకుడిని కలిగియున్నాము.
62 ఆహాబు సింహాసనము మీదికి వచ్చినపుడు…నీవంటావు, “అతడు సింహాసనము మీదయున్నాడు.” అది నిజమే, కాని యెజెబెలు ఆ సింహాసనము వెనుక శిరస్సైయున్నది. ఆమెయే నడిపించు వ్యక్తి. చూడండి, ఎలా ఆమె ఆ దేశము యొక్క చట్టములను చుట్టూ అటు ఇటు త్రిప్పి, ఆమె సొంత లాభము కొరకు, దురాశ కొరకు, ఆహాబు దానిని చేయునట్లు చేసింది, ఏలయనగా ఆమె అతనితో వివాహము గావించబడింది. మరియు ఈ దినమున మన నాయకునితో యున్నది అదియే. అతడు మంచి వ్యక్తి కాదని నేను చెప్పను, కాని అతని వెనుక ఏమున్నదో చూడండి; వేశ్య; అమెరికా నిర్మించబడిన నియమములపై, (అమెరికాగా యుండుటకు) ఆమెను మనము నడిపించుచున్నాము. కాని మన సొంత స్వేచ్ఛా ఎంపిక ద్వారా, అలాటి కార్యాన్ని మనము ఎన్నుకొన్నాము.
63 ఇప్పుడు మీరు చూడండి, నా స్వరము అతి త్వరలో ఆపబడబోవుచున్నది. కాని ఎవరో దానిని తెలుసుకొనబోవుచున్నారు! అవును! ఎందుచేత? ప్రకటన 2:20 లో ఆమె తన్ను తాను ఒక “ప్రవక్త్రి,” గా పిలుచుకొంది. పాపపు అల ద్వారా ఏమి సంభవిస్తుందో గమనించండి. అది సారము వరకు వెళ్ళుటను మీరు గమనించండి. అధునాతనమైన, భక్తిహీనమైన కార్యములు సంఘములో సంభవించుటను మీరు గమనించండి. “చివరగా, అక్కడ ఒక హింస వస్తుంది,” బైబిలు ఆ రీతిగా చెప్పింది, అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు! నిశ్చయముగా! అది అక్కడయుంటుంది.
64 తరువాత ఏమి సంభవించబోవుచున్నది? అప్పుడు జరిగినట్లుగా, ఆ ప్రకారమే అది ఇప్పుడును జరుగుతుంది. దాని వెనుకయున్న శక్తి ఆమెయే, ఆమెయే దానిని నియంత్రణ చేసింది. ప్రకటన 17 లేక 18 వ అధ్యాయము చదవండి, అక్కడ యెజెబెలు ఏమి చేసిందో మీరు చూస్తారు; ఆమె ఆహాబును ఎలా తీసుకొనియున్నదో, మరియు అతడు దానిని గురించి ఏమియు చెప్పలేకపోయాడు, కారణము అది అతని భార్యయైయున్నది. అప్పుడు దేశము దేనిపై నిర్మించబడిందో చూడండి, ఒక అన్యురాలైన భార్యతో వెనుకకు జారియున్న ఇశ్రాయేలీయుడు (అతని వెనుకయున్నది) ఒక బాలీము యొక్క ఆరాధికురాలు. ఆమె ఏమి చేసింది? చివరిగా ఆమె దానిని ఎంత చక్కగా, ఎంత అధునాతనముగా తయారు చేసియున్నదనగా, ప్రజలు దానిని ఎంతో సుళువుగా తీసుకొన్నారు, చివరకు పూర్తి సంఘము, బోధకులు అందరూ దానికి పడిపోయారు. ఏలీయా చెప్పలేదా, “ప్రభువా, నేనొక్కడినే మిగిలియున్నానని”? మరియు ఇది అప్పుడు ఏలాగున్నదో, అలాగే నేటికి అది సమాంతరంగాయున్నది.
65 ఏదైనా చెప్పటానికి అందరూ భయపడ్డారు. అది ఈ రోజునకూడా ఆలాగునే లేదా? వాళ్ళు ఏదైనా చెప్పటానికి భయపడ్డారు. కాబట్టి మనము కనుగొనునదేమనగా, వారు స్వేచ్ఛగా, త్రాగుతూ, సుఖము కొరకు ఆరాటపడే పిచ్చోళ్ళుగా చిందర వందరగా సమస్తమునూ చేస్తూ, ఈ రోజున యున్నట్లుగా ముందుకు సాగారు. యెజెబెలు ఆ లేఖనములను క్రిందికి పైకి మెలి త్రిప్పింది…లేక చట్టములను, యెజెబెలుగా మెలి త్రిప్పింది. గుర్తుంచుకోండి, యెజెబెలు తన్ను తాను ఒక “ప్రవక్త్రిగా,” పిలుచుకొన్నది, ప్రజలను జయించుటకు “ఆమె మాత్రమే భూమి మీద దేవుని యొక్క స్వరమైయున్నదని,” చెప్పుకొన్నది. లోకము వలె నిశ్చయముగా. శరీర మనస్సు గల వారిని నమ్మునట్లు చేసింది.
66 “ఒక స్త్రీ యొక్క ఆరాధన, అమెరికా దేశములో వస్తుంది, అది మరియగా యుంటుంది.” నేను ముప్పై…1931 లో దానిని చూశాను. ఏడు సంఘటనలు సంభవించియున్నవి. ఇక్కడే అవి నేను 1931 లో పేపరు మీద వ్రాసుకొన్నవి వున్నవి. నేను ఎలా చెప్పానంటే, “ఈ అధ్యక్షుడు, ఫ్రాంక్ లిన్ డి. రూజ్ వెల్ట్, ఎలా ప్రపంచము యుద్ధము చేయుటకు కారణమవుతాడో చెప్పాను.” ఇంకనూ ఆ యుద్ధము ఆర్ధిక మాంద్యము కాలములో వచ్చియుండలేదు. నేనన్నాను, “మరొక విషయము…” నా తల్లి ఒక క్లిష్టమైన ప్రజాస్వామ్య డెమోక్రటిక్ యైయున్నది, నేను దానిని చెప్పినపుడు, ఆమె నా వైపు కఠినముగా చూడకపోయినట్లైతే. నేనన్నాను, “అతడు ఒక రిపబ్లికన్ యైనా, ఒక సోషలిస్టుయైనా, లేక అతడు ఏమైయున్నప్పటికీ నేను లెక్క చెయ్యను, అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” నేనన్నాను, “దీనిని చేయుట ద్వారా స్త్రీలు ఓటు వేయటానికి వాళ్ళు అనుమతిని ఇస్తున్నారు. మరియు వారు దానిని చేసినపుడు, ఎన్నడైనా ఈ దేశము చేయని అతి గొప్ప అవమానకరమైన దానిని చేసింది.” నేనన్నాను, “ఒక రోజున వారు దానిని చెల్లించవలసియున్నది.” గతించిన ఎన్నికలకు వారు దానిని చేశారు. అదే అతనిని ఎన్నిక చేసింది, స్త్రీలు.
67 దక్షిణాదిలోయున్న, నల్ల జాతి ప్రజలైన మీరు, ఎలా ఓటు వేశారు! నీవంటావు, “వేదిక మీద దానిని చెప్పే పని నీది కాదు.” ఓ, అవును, అది నా పని, అది దేవుని యొక్క వాక్యమైయున్నది! మిమ్మును స్వతంత్రులుగా చేసిన అబ్రహాము లింకన్ యొక్క మరకలు, ఆ మ్యూజియంలో ఒక స్త్రీ వస్త్రములపైవున్నవి, మీరు మీ యొక్క జన్మ హక్కును అమ్ముకొంటారు. మీకు సిగ్గులేదా.
68 ప్రజలైన మీరు రాజకీయముల కొరకు నీవు ఒక మంచి డెమొక్రేట్ యైయున్నందున, అలాటి దానికి ఓటు వేశారు, ఈ దేశమును నడుపునట్లు, వేశ్య చేతికి ఇచ్చి, మీ జన్మహక్కులైన క్రైస్తవ్యమును మరియు అమెరికా కరణను అమ్మివేసుకొన్నారు, మనము ఏమైయున్నామో, అదే మనలను తయారు చేసింది. చూడండి, ఎలా ఆమె లోనికి ప్రాకి వచ్చుచున్నదో? ఎంతో సుళువుగా, ఇప్పటికి ఆమె సింహాసనము మీదయున్నది. నిశ్చమయుగా! వైట్ హౌస్ సింహాసనము.
69 గమనించండి, ఇంతక మునుపే…మొన్నటి దినమున కాథలిక్ పాఠశాలలను గూర్చి, ప్రొటెస్టెంట్ పాఠశాలలను గూర్చి మీరు చూసియున్నారా? కాథలిక్ పాఠశాలలను బలపరచండి, ప్రొటెస్టెంట్ పాఠశాలలను కాదు అని వారన్నారు. చూడండి? ఓ, సోదరుడా, ఇప్పుడు ఎలాటి సరుకు ముందుకు వచ్చుచున్నదో మీరు గమనించండి. గమనించండి. వారు చేసియున్నట్లుగా, ఏమి సంభవించిందో చూడండి. ఈ పాపమంతా లోపలకు కుప్పగా మారుచున్నది. మరియు ఈ దేశము ఏ స్థానమునకు వచ్చియున్నదనగా. తూలుచున్న స్థితిలోనికి వచ్చాము.
70 కొన్ని సంవత్సరముల క్రితము, పెంతెకొస్తు మొదటగా బ్రద్ధలైనపుడు, ఎ.వన్.స్మిత్ నడుపుచుండగా, అది కొన్ని సంవత్సరముల క్రితము, ఈ దేశమును రక్షించింది. అప్పుడు అమెరికా బాగుగా ఎరిగియున్నది. కాని పెంతెకొస్తువారు ఎంత లోకస్థులుగా మారిపోయారంటే, అది తిన్నగా లోకములోనికి వెళ్ళిపోయి, రాజకీయములకు తన జన్మ హక్కును అమ్మి వేసుకొన్నది, బైబిలుకు దూరముగాయున్న రాజకీయములు, ఓ, అయ్యో!
71 ఇప్పుడు, ఒక్క నిమిషము, ఇది ఎలా బయటకు వస్తుందో గమనించండి. ఇప్పుడు, వాళ్ళు ఏమి చేశారో, ఎలాటి కార్యములను వారు చేశారో, అది దానికి ఖచ్చితముగా సమాంతరముగాయున్నది, ప్రతిచోట పాపము. యెజెబెలు లోనికి వచ్చి, ప్రజలందరికి మాంత్రిక విద్య చేసింది. గమనించండి, చివరగా, ఆమె బాలీముకు పెద్ద ఆరాధనా ప్రతిమలను నిర్మించటం ప్రారంభించింది. అది నిజమేనా? బాలీము యొక్క యాజకులు ప్రతిచోట నుండి గుంపులుగా వచ్చి, ఆ స్థలమునకు వచ్చి బాలీము ఆరాధనలో ఆ దేశమును కాలుష్యము చేయుట ప్రారంభించారు.
72 వాళ్ళు ఎలా చేశారో చూడండి, వాళ్ళు ఎలా కలుపు మొక్కలుగా లోనికి వచ్చారో చూడండి. వాళ్ళు చేసిన కార్యములను బట్టి, ఈ రోజున వాళ్ళు ఎక్కడయున్నారో చూడండి. కాథలిజమ్ ఎలా మ్రింగివేయుచున్నదో, ఎలా మ్రింగివేయుచున్నదో, ఎలా మ్రింగివేయుచున్నదో చూడండి; దీనిని విచ్ఛిన్నము చేయుచూ, లోనికి వివాహము చేసికొనుచున్నారు, సరిగ్గా వాళ్ళు ఏమి చేస్తారని దానియేలు చెప్పాడో దానినే వాళ్ళు చేస్తున్నారు. ఇనుము, మట్టి కలవదు, కాని వారి విత్తనములను ఒకరితో ఒకరు కలుపుచున్నారు, విచ్ఛిన్నము చేస్తున్నారు. ఆమె యొక్క పిల్లలను కాథలిక్ పిల్లలుగా పెంచుటకు, ప్రతి ప్రొటెస్టెంటు బాలిక, కాథలిక్ కుర్రవాన్ని వివాహము చేసుకొనుచున్నది. అంతా ఆలాగునేయున్నది, వివాహము చేసుకొనుట, వివాహమునకు ఇచ్చుట, చివరకు అది ఏ స్థానమునకు వచ్చినదనగా, పూర్తి అమెరికా దేశము అంతా పురుగులు పట్టింది.
73 మిషనరీలుగా మేము ఏమి చేయబోవుచున్నాము, అదిగో బయటకు వెళ్ళి దక్షిణ అమెరికాను మరియు ప్రపంచమంతటా అన్ని భాగములకు వెళ్ళి వాటిని విడిపించాలనుకొనుచున్నాము. టామీ ఆస్ బర్న్ మరియు ఇతరులు, అన్యత్వము నుండి బయటకు తెచ్చినపుడు, మా నాయకుని మేము ఎన్నుకొన్నామని, తిన్నగా వారి వ్రేలును వెనుకకు చూపించటం, అదే కార్యము, ఓ దేవా. ఈ ప్రపంచమునకు ఏమి సంభవించబోవుచున్నది? అది తప్పక ఇక్కడయున్న ప్రతి వ్యక్తిని కదిలించాలి. ఎలా మనము జవాబు చెప్పబోవుచున్నాము? మిషనరీలు ఏమి చెప్పబోవుచున్నారు, “మీరు ఇక్కడకు వచ్చి, దీని నుండి మమ్ములను విడిపించారు, అయితే మీ సొంత ప్రజలే సింహాసనము మీద, మీ ఆఫీసులో దానిని యుంచియున్నారు,” అని అంటారు. మనము ఏలాగు…
74 అది ఆలాగునయుండుట, పరిపూర్ణముగా, మొత్తము మీద, అది రాజ్యాంగ విరుద్ధమైనది కాదేమో, చరిత్ర పుటలను వెనుకకు త్రిప్పి చూడండి. కొన్ని సంవత్సరముల క్రితము వారు దానిని చేసి యుండలేదు, చూడండి, మనము మన యొక్క క్రైస్తవ హక్కులను రాజకీయములకు అమ్ముకొన్నాము, ఆ విధముగానే దయ్యము తన్నుతాను లోనికి అల్లుకొనుట ప్రారంభమైనది. ఆహాబు, యెజెబెలుకు నామమాత్రపు శిరస్సు తప్ప ఇంకేమియూ కాదు. అదంతయూ ఆ విధముగానే యుంటుంది, సరిగ్గా ఒక నామమాత్రపు శిరస్సు. అతడు తనకై తానుగా దానిని చేయలేడు, కాని అతని వెనుకయున్న క్రమము, అతనిని దానిలోనికి నెట్టుతుంది. ఖచ్చితముగా సత్యము. క్రైస్తవుడుగా, నీ మనస్సాక్షిని గిల్లుకో, నీకై నీవు మేల్కొనుము. అది నీవు ఆలోచించే దానికంటె ఆలస్యమైపోతుంది. ఇప్పుడు మనమున్న పరిస్థితి, అప్పుడు వారున్న పరిస్థితి, మరియు ఎలా వారు ఓడిపోవటానికి నడిపించబడ్డారో.
75 ఆ గొప్ప ప్రేమ గల దేవుని హృదయము ఆయన తన మిషనరీలను చూస్తూయుండగా మొర్ర పెట్టియుంటుంది, ఆయన వారిని ఒక మాదిరిగా చేశాడు, ప్రతిచోట నుండి దేశములన్నియు వారి యొద్దకు వస్తున్నవి, కారణమేమనగా వారు ఐక్యతగాయుండుట చూస్తూ దేవుడు వారిని దీవించియున్నాడు. ఆత్మీయముగా వారు దేవునిని సేవించియున్నారు. అప్పుడు దానిని ఆలోచించినపుడు, వారు సరియైన దానిని చేయాలని, వారు తిరిగి వారి యొక్క మొదటి ప్రేమకు రావాలని, మరియు సరియైన దానిని చేయాలని, ఆయన ఎదురు చూశాడు, కాని వారు ఎడతెగకుండా, ఇంకా దూరముగా, ఇంకా దూరముగా, ఇంకా దూరముగా వారు దేవుని నుండి వెళ్ళిపోయారు, చివరకు ఆఖరుగా యెజెబెలులోనికి వచ్చియున్నది. దానినే ఖచ్చితముగా మనము చేశాము, క్రీస్తు యొక్క నియమముల నుండి తొలగిపోయియున్నాము. దేశమంతటి గుండా దేవుడు సేవకులను పంపినపుడు, (పిలిగ్రిమ్ హోలీనెస్, నజరేనులు, పెంతెకొస్తువారు) వారు పరిశుద్ధతను బోధించారు, “తిరిగి దేవుని యొద్దకు రండి! తిరిగి దేవుని యొద్దకు రండి!”
76 నిజముగా పాతకాలపు స్థాపించబడిన సంఘములను చూసి, వారు నవ్వి ఎగతాళి చేశారు. వారు ఒక అధునాతన విశ్వాసుల గుంపు, “అది దయ్యానిది అని అన్నారు,” ఎందుకంటే వారు మనుషులు చేయుచున్న సమస్తమును ఖండించారు. వాళ్ళు ఏమి చేశారు? సంఘము, మరియు అధిక సంఖ్యకులు దానిని వినుటకు ప్రారంభించారు. మొదటి విషయము నీకు తెలుసా, “కాథలిక్ స్త్రీలు ఈ రకమైన వాటిని ధరించనట్లైతే, ప్రొటెస్టెంటు వారును దానిని చేశారు. కాథలిక్ సంఘం దీనిని చేసినట్లైతే, ప్రొటెస్టెంటు వారు కూడా దానిని చేస్తారు. మెథడిస్టు వారు దానిని చేసినపుడు, బాప్టిస్టు వారి సంగతి ఏమిటి? బాప్టిస్టు వారు చేసినపుడు, పెంతెకొస్తు వారి సంగతి ఏమిటి?”
77 చూడండి, అదే మానవ ఖచ్చితమైన క్రమము, నిన్ను లోపలకు తీసుకొని వెళ్ళేది. ఆ కారణము బట్టియే, నేను దానికి వ్యతిరేకినైయున్నాను, ఎందుకనగా దేవుని వాక్యము దానికి వ్యతిరేకమైయున్నది. మానవ కల్పితమైన క్రమములు; దేవుడు దానికి వ్యతిరేకియైయున్నాడు. ఆయన వాక్యము దానికి వ్యతిరేకముగాయున్నది. ఆయన ప్రవక్తలు దానికి వ్యతిరేకముగా యున్నారు, ఆయన నిజమైన సేవకులు దానికి వ్యతిరేకముగా యున్నారు, దేవుని ఆత్మ ద్వారా జన్మించిన వారందరూ దానికి వ్యతిరేకముగాయున్నారు.
78 చూడండి, ఎలా ఇశ్రాయేలు, ఆ పోటుతో కొట్టుకొనిపోయిందో, చివరగా ఆఖరకు యెజెబెలు లోనికి వచ్చింది. అమెరికా ఎలా మారిపోయిందో చూడండి, లోక సంబంధమైన పోటుతో కొట్టుకొని పోయింది, చివరగా ఆఖరకు యెజెబెలు సింహాసనాన్ని తీసుకొన్నది. అది నిజము. ఇప్పుడు, నిజానికి యెజెబెలు ఈజిప్టు సింహాసనము లేక ఇశ్రాయేలు సింహాసనము మీద లేదు, కాని సింహాసనము వెనుక ఆమె ముఖ్యమైన శిరస్సుయైయున్నది. కాథలిక్ ఆచారాధిపత్యము అమెరికా సింహాసనము పై లేదు, కాని దాని వెనుకయున్న క్రమము ఆమెయేయైయున్నది, కారణము అతడు ఆమెను వివాహము చేసుకొన్నాడు. మరియు బైబిలు చెప్పింది, ఈ దేశములో, వారు “క్రూరమృగమునకు ఒక ప్రతిమ వంటి దానిని” చేస్తారు.
79 ఓ, సోదరుడా, సోదరీ, విషయమేమిటి? మంచిది, అది ఏమిటో నాకు తెలుసు. బైబిలు చెప్పింది, వారు ఈ లవొదికయ యుగమును పొందుతారు, అక్కడే మనము ఇప్పుడున్నాము. ఇప్పుడు నీవు నన్ను ద్వేషించవచ్చు, కాని ఒక రోజున, సత్యము ఏమైయున్నదో నీవు తెలుసుకొన్నప్పుడు, నీవు నన్ను ద్వేషించవు. నీవు సమ్మతించకుండా, పైకి లేచి ఈ కట్టడములో నుండి అడుగులు బయటకు వేయవచ్చు, అది నీ యొక్క విద్యా హీనతను చూపుతుంది. కానీ ఒక రోజున నీవు గ్రహిస్తావు. ఒక రోజున అది సత్యమైయున్నదని నీవు ఆలస్యముగా తెలుసుకొంటావు! ప్రభువు నామములో నేను దానిని మాట్లాడుచున్నాను! నన్ను నేను పైకి గురిగా చేసుకొంటాను, చివరగా అది నన్ను సమాధికి నడుపుతుంది. దేవుడు నాకు సహాయము చేసినట్లైతే, నేను చనిపోవు వరకు ఒక సాక్షిగా యుండబోవుచున్నాను. అది నిజము.
80 ఇక్కడ ఈ స్థితిలో ఈ రోజున మనముయున్నాము, దానిలో అంతయూ ఆ రీతిగా వెళ్ళుచున్నది. ఇశ్రాయేలు, యెజెబెలు యొక్క నామకార్ధ శిరస్సుయైన ఆహాబు ఎలా చేశాడో, కారణము అతడు ఆమెకు వివాహము గావించబడ్డాడు. అమెరికా, మన నాయకుడు ఒక ధనవంతుడని నీకు తెలుసా? మీలో ఎంతమందికి తెలుసు? ఒక కోటీశ్వరుడు. ఎవరో నాకు చెప్పారు. ఒక మేగజైన్ లో లేక రేడియో లోనో లేక టెలివిజన్ లో లేక దేనిలోనో, జాక్ బెన్నీ, లేక ఎర్నీ ఫోర్డ్, అది అతడేయైయున్నాడు. ఎవరో దానిని చెప్పారు, “అతని సొంతము కాని రెండు రాష్ట్రములను పొందుటకు అతని తండ్రి సహాయము చేశాడు.” దానిలో మిగిలిన దానిని కూడా పొందబోవుచున్నాడు. అతడు దానిని ఎలా పొందాడు? ఆ డబ్బు ఎలా వచ్చింది? విస్కీ మరియు సారాయి రవాణా ద్వారా అందుకే అతడు విస్కీ అలాటి వాటిపై పన్నును తీసివేశాడు. అదే అతనిని ధనవంతునిగా చేసింది. ఏదైతే మన దేశమును పాడుచేసిందో, ఏదైతే మన ప్రజల మనస్సులను మురిగిపోవునట్లు చేసిందో, ఏదైతే మన బాలురను త్రాగుబోతులుగా చేసిందో, మరియు మన బాలికలను వేశ్యలుగా మార్చిందో, దాని నుండి వచ్చిన డబ్బే అతనిని ధనవంతుడిగా చేసింది.
81 అదే విషయము, ఆ పాత యెజెబెలు క్రమము, మన ప్రజలను హింసించినది అదే, అదే వారిని బయటకు ఈడ్చింది (రోమనిజమ్ లో) వారిని కాల్చింది, వారిని ముక్కలుగా లాగింది, మరియు వారికి సమస్తమును చేసింది, అదే హతసాక్షుల రక్తము (బైబిలు చెప్పింది) ఆమెలోయున్నది! అక్కడే వారు ఏకముగా వివాహమయ్యారు. మరియు అమెరికా వారమైన మనము తిన్నగా ముందుకు తడబడు, “ఓ, బాగుంది, మనకు కొన్ని అధికమైన డాలర్లు లభించాయి, మరియు మనము గొప్ప సమయమును కలిగియున్నాము. మిగిలిన దేశములన్నిటి కంటె మంచి స్థితిలోయున్నాము.” కాని, సోదరుడా, నీవు ఒక్క నిమిషము ఆగు.
82 తరువాత కొన్ని నిమిషముల పాటు, దానిని అక్షరము తరువాత అక్షరాన్ని మనము తీసుకొని, ఏమి సంభవించిందో చూద్దాము.
83 బోధకులు తిన్నగా మార్గము గుండా వెళుతూ, వారితో రుద్దకొంటూ తిన్నగా వారితో, వారి వ్యవస్థతో ముందుకు వెళ్ళారు. మొత్తము ఇశ్రాయేలు వ్యవస్థ అంతా తిన్నగా యెజెబెలుతో వెళ్ళిపోయింది. వారు ఒక పై రూపమును కలిగియుండిరి, అవును. ఈ చివరి దినములలో, “పైకి భక్తిగా కనబడు రూపమును,” వారు కలిగియుంటారని బైబిలు చెప్పుటలేదా? ప్రవచనములన్నియూ నెరవేరియున్నవి, సోదరుడా, మనము అంతములోయున్నాము! తరువాత సంగతి ప్రభువు యొక్క రాకడ మరియు సంఘము రూపాంతరము చెందుట.
84 ప్రజలను ఆకర్షించుటకు ప్రతి గురుతును, అద్భుతమును పంపాడు, ఆయన చేయగలిగిన సమస్తము చేశాడు, కాని వారు తిన్నగా ముందుకు దానిలోనికి వెళ్ళిపోయారు. ఇక్కడయున్న ఈ నగరాన్ని చూడండి. ఈ చుట్టూయున్న వందలకొలది, వేలకొలదిగా యున్న పెంతెకొస్తు వారిని చూడండి; సత్యము కొరకు నిలబడియున్నందున, ఈ మధ్యాహ్నమున వారు ఎక్కడయున్నారో చూడండి? కారణమేమంటే ఆ కూటములకు సహకరించవద్దని ఎవరో వారికి చెప్పారు. దరిద్రుడా, బాహాటముగా…దేవుడు నీకు కనికరము చూపును గాక, ఆ ఒక్కటి మాత్రమే చెప్పగలను. క్రైస్తవులైన మీకు దానికంటే ఎంతమాత్రము వెన్ను ఎముక లేదు, మీరు వెన్ను ఎముకకు బదులుగా మెత్తటి ఎముకను కలిగియున్నారు. నిజము! మనకు అవసరమైనది ఏమనగా “దానిలో పన్నులు కలిగిన సువార్తను బోధించండి,” అదే దానిని ముక్కలుగా నరుకుతుంది మిగిలిన వారందరి వలె మీరు వెళ్ళిపోయారు, అప్పుడు మేము ఎందుకు కేకలు వేయుచున్నామో అని మీరు ఆశ్చర్యపడుచున్నారు. అలాగైతే, మీరు చూడండి, నీవు “చల్లటి భుజమును” పొందుతావు. అది ఆలాగునయుంటుందని నేను ఎదురు చూశాను. నేను ఎదురు చూడాలి.
85 ఇదంతయూ ఇశ్రాయేలులో కొనసాగింది, చివరగా, ఒక దినమున, అరణ్యములో నుండి అడుగులు వేసుకొంటూ బయటకు వస్తున్నాడు, ఒక వృద్ధుడైన తెల్లని వెంట్రుకలు కలిగిన వ్యక్తి, అతడే తిష్బీయుడైన ఏలీయా. అతడు ఏ సంస్థలలో నుండి రాలేదు, కాని అతడు అరణ్యములోనుండి వస్తున్నాడు అతడు వారితో చేసేది ఏమీ లేదు, అతడు యెహోవా యొక్క ప్రవక్తయైయున్నాడు. సోదరుడా, అతడు యెజెబెలు రాజ్యమును మరిలో దానిలో సమస్తమును అతడు కదిలించివేశాడు. వారతనిని ద్వేషించారు. అతనికి ఏ సహకారము లేదు. అది నేను మీకు హామీ ఇస్తున్నాను. లేదని బైబిలు చెపుతుంది, నిశ్చయముగా. ముఖములకు రంగులు వేసుకొన్న యెజెబెలులను అతడు “కాల్చివేశాడని,” నేను అనుకొంటాను. యెహాను వలె అతడు చెట్టు వేరున గొడ్డలిని ఉంచాడు, పేళ్ళు అవి ఎక్కడ పడతాయో అక్కడ పడనివ్వండి, కాని అతడు ఆమెను అక్కడయుంచాడు. వారు తప్పు అని చూపిస్తూ అతడు ఆ దేశమును కదిలించి వేశాడు, సజీవుడైన నిజమైన దేవుని యొద్దకు తిరిగి రావాలని, యెజెబెలు ఆరాధనకు బదులుగా తిరిగి వాక్యము నొద్దకు రావాలని, పిలుచుటకు ప్రయత్నము చేశాడు.
86 వాళ్ళు ఏమి చేశారు? వారు అతనిని స్వీకరించారా? వారు అతనిని ద్వేషించారు, కాని అతని వాక్యము ఒకే విధముగా ముందుకు వెళ్ళింది, ఎందుకంటె అతడు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును కలిగియున్నాడు! దేవుడు అతనితో పని చేశాడు, అతడు చెప్పిన విషయములు నెరవేరుచున్నవని, అతడు అభిషేకించబడిన ప్రవక్త అని వారికి చూపించాడు. అతడు చేసినదంతా అతడు దేవుని యొక్క ప్రవక్త అని రుజువు చేశాడు. కాని ఇంకనూ వారు దానిని నమ్మలేదు, ఏలయనగా, వారి ఆట స్థలములను అతడు చించి వేశాడు. వారు తప్పు అని వారికి చెప్పాడు. ఆహాబు ఒక కూలివాడైయున్నాడు. నిజము! నీవు గమనించావా, వారు అతనిని నమ్మలేదు, కాని అతడు ఒకేలాగా బోధించాడు. బోధకులలో ఎవరూ అతనితో సమ్మతించలేదు, అతడన్నాడు, “నేను ఒక్కడనే మిగిలియున్నాను, ప్రభువా. వారి వైపు చూడండి, వారిలో ఎవరూ అతనితో సహకరించరు.” కాని అతడు చేయవలసిన పనియున్నది, మరియు అతడు దానిని చేశాడు. అతడు ప్రభువు యొక్క మాటను కలిగియున్నాడు, అదే యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు! మరియు అతడు ఆ దేశముపై దాడి చేశాడు, అతడు సంఘముపై దాడి చేశాడు, అక్కడయున్న సమస్తముపై అతడు దాడి చేశాడు, దేవుడు అతనితోయున్నాడు!
87 ఈ చివరి దినములలో నాకు వాగ్దానము చేయబడినదేమనగా, ఆయన ఈ దేశమునకు కూడా తిరిగి వస్తాడు. మత్తయి 17వ అధ్యాయములో వారు యేసును అడిగినపుడు, నాకు తెలుసు, “‘ఏలీయా’ గురించి శాస్త్రులు ఎందుకు ఆలాగు చెపుతున్నారు…?”
88 ఆయన ఏమి చెప్పాడో గమనించండి, “ఏలీయా తప్పక ముందు రావలెనను మాట నిజమే,” అది భవిష్యత్ కాలమైయున్నది. కాని అప్పుడు యోహాను గూర్చి ఆయన ఉదహరణను ఇచ్చాడు. యోహాను మలాకీ 4వ అధ్యాయము కాదు. యోహాను మలాకీ 3వ అధ్యాయము, “ఇదిగో, నీకు ముందుగా మార్గమును సిద్ధపర్చుటకు నా దూతను పంపుచున్నాను.”
89 మలాకీ 4వ అధ్యాయములో, ఆయన అన్నాడు, “ఆ గొప్ప మరియు భయంకరమైన యెహోవా దినము రాకమునుపు, భూమి అంతయు చెత్త వలె కాలిపోవును, ఆ దినమునకు ముందు, నేను ఏలీయాను పంపుతాను.”
90 అది యోహానుయైయున్నాడు, కారణమేమనగా యోహాను వచ్చినపుడు ప్రభువు ఎన్నడూ భూమిని కాల్చలేదు. నీవు గమనించినట్లైతే, చివరి అధ్యాయములో, చివరి వచనములో, ఆయన అన్నాడు, “మరియు అతడు…” (గమనించండి: అతడు మాట్లాడుచున్నాడు) “…అతడు తండ్రుల హృదయములను పిల్లల వైపు, మరియు పిల్లల హృదయములను తండ్రుల వైపునకు త్రిప్పును.”
91 ఇప్పుడు గమనించండి! మొదటిగా యోహాను వచ్చినపుడు, మొదటి ఏలీయా, అతడు ఏమి చేశాడు? అతడు వచ్చి ఒక వర్తమానమును తెచ్చాడు, ఆ పాత కఠినమైన హృదయము గల సాంప్రదాయ సంఘమును, యవ్వన సంఘ విశ్వాసమునకు త్రిప్పాడు, పిల్లలు. కాని తరువాత ఏలీయా వచ్చినపుడు, అంత్యకాలములో, అతడు తిరిగి పిల్లల హృదయములను పెంతెకొస్తు తండ్రుల విశ్వాసమునకు త్రిప్పును. ఆ భేదమును చూశారా? ఈ దినమున పేరుగాంచిన వారిలో ఒకరుగా అతడు యుండడు, అతడు తిన్నగా అపొస్తలుల కార్యము 2 లోనికి వెళ్ళి, తిన్నగా అక్కడ నుండి ప్రారంభిస్తాడు. కల్తీలేని శుద్ధమైన సువార్తను అతడు బోధిస్తాడు, పెంతెకొస్తు దినమున చెప్పిన సంగతులనే అతడు చెప్పాడు, కారణమేమనగా అతడు పెంతెకొస్తు దినమున ఏమి చెప్పాడో, అది మిగిలిన లేఖనముల గుండా రుజువు చేయబడింది. ఏలీయా వచ్చినపుడు, యోహాను వలె చెడ్డ స్త్రీలను ద్వేషిస్తాడు. వారుయున్నట్లుగా అతడు అరణ్యమును ప్రేమించువాడైయున్నాడు. అతడు ఎవ్వరిని విడువడు. అతడు రావటము కొరకు మనము ఎదురు చూస్తున్నాము. అతడు వస్తాడు, అతడు వస్తాడని దేవుడు చెప్పాడు. అతడు ఇక్కడయుంటాడు!
92 ఏదైనా, ఈ రోజున మనము కలిగియున్న వర్తమానమే ఆయన రెండవ రాకడను సూచిస్తుందని, నేను నమ్ముతాను. అవునండి! అతడు దారిలోయున్నాడు, ఇది వరకే జన్మించియున్నాడు. ఏలీయా వలె, అరణ్యములో నుండి దాడి చేసుకొంటూ బయటకు వస్తూ, ఎక్కడో అతడు తన్ను తాను తెలియపర్చుకొంటాడు. అతడు అపొస్తలుల కార్యము 2వ అధ్యాయమును బోధిస్తాడు. అతడు పాత పెంతెకొస్తు తండ్రుల విశ్వాసమును, ఈ పిల్లలకు పునరుద్ధరిస్తాడు. అతడు తిన్నగా అపొస్తలుల కార్యములోనికి, అపొస్తలుల కార్యము 2:38 లో నుండి క్రింద వరకు వెళతాడు. అతడు నిజమైన, కల్తీలేని సువార్తను తెస్తాడు. యెజెబెలుతో గాని ఆమె యొక్క వ్యవస్థతో గాని అతడు చేయునది ఏమియు లేదు. అతడు ఒక దేవుని యొక్క సేవకుడైయున్నాడు, నిశ్చయముగాయుంటాడు. అతడు వస్తాడని బైబిలు చెప్పింది. అతడు ప్రవచించి అతని వర్తమానమును ఈ యెజెబెలు ముఖము ముందు బ్రద్ధలు గొడతాడు, ప్రారంభములో సరిగ్గా ఇశ్రాయేలు చేసినట్లుగా, వారు అతనిని ద్వేషిస్తారు. వారు అతనితో సహకరించరు. లేదు. లేదు. అతడు వస్తాడు! దేవుడు దానిని వాగ్దానము చేశాడు, మరియు అతడు రంగము మీదకి వస్తాడు. అతడు దానిని చేస్తాడని వ్రాయబడియున్నట్లుగా, అతడు ఎన్నుకొనబడిన సంఘమునకు బోధిస్తాడు. లోక కార్యములను, తిని త్రాగి మత్తెక్కిత్రుళ్ళే లోక కార్యములను, క్రిందికి కుదిలించి వేసి, దానిని ఉడకబెట్టే, ఆ ఎన్నకొనబడిన సంఘమును, ఏకముగా, ఒక ప్రజగా తీసుకొని వస్తాడు.
93 “అది నా సంఘశాఖ,” అని నీవంటావు, సోదరుడా, నీవు తప్పైయున్నావు! ఒకే ఒక క్రమముగా యోహాను, ఒకే మనిషిని పరిచయము చేయటానికి వచ్చాడు: యేసుక్రీస్తు. మరియు ఏలీయా ఒక వ్యవస్థ కాదు, అది ఒక మనిషిగావుంటాడు, యేసు ఆ విధముగా చెప్పాడు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన ఒకే మనిషిగా అది యుంటుంది. అతడు ముగ్గురు లేక నలుగురు దేవుళ్ళను అతడు పరిచయము చేయడు, అతడు ఒకే దేవుని పరిచయము చేస్తాడు; ప్రభువైన యేసుక్రీస్తు, కారణము ఏమనగా అతని యొక్క వర్తమానము, పిల్లల యొక్క విశ్వాసమును పెంతెకొస్తు తండ్రుల వైపు కదిలిస్తుంది.
94 నీకు గుర్తున్నదా, సోదరుడా, నేను కల్మషముగా ఈ విషయములను చెప్పినట్లైతే, నేను బలిపీఠము నొద్ద యుండవలసిన అవసరమున్నది. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును!” నేను మీకు చెప్పుచున్నాను. నేను మీకు చెప్పిన దానిని సత్యము అని దేవుడు రుజువు చేయకపోయినట్లైతే, దేశమంతటా, ప్రపంచమంతటా, అప్పుడు తప్పు ఎక్కడయుందో నాకు చెప్పండి. నేను మీకు సత్యమును చెప్పుచున్నాను! త్వరగా, దేవుని యొద్దకు తిరిగి రండి! ఆ వ్యవస్థల నుండి బయటకు రండి, కారణమేమనగా ప్రకటన గ్రంథములో రోమన్ కాథలిక్ ఆచారాధిపత్యము ఒక “వేశ్యయని” బైబిలు చెప్పింది, మరియు ఆమె “వేశ్యలకు తల్లియైయున్నది,” అది ఏమైయున్నది? సంఘము, వ్యవస్థలు.
95 ఎక్కడ నుండి మెథడిస్టు సంఘము, లూథరన్ సంఘము వచ్చియున్నది? మెథడిస్టు, బాప్టిస్టు, ఈ సంస్థలన్నీ ఎక్కడ నుండి వచ్చినవి? దేవుడు ఎన్నడూ ఒక సంఘమును సంస్థగా చేయలేదు. “యేసు సంఘమును సంస్థగా చేశాడని,” వారు వెనుక అక్కడ దానిని ప్రారంభించారని, కాథలిక్ సంఘము చెప్పియున్నది. నాకు దాని మీద చరిత్రలో ఒక పత్రము కావాలి, లేక బైబిలులో ఒక పేజి నాకు కావాలి. అక్కడ ఎన్నడూ మూడువందల ఆరు సంవత్సరముల వరకు ఒక సంస్థ లేదు, కాని చివరి అపొస్తలుడు చనిపోయిన తరువాత, వారు నైసీన్ కౌన్సిల్ ను ఏర్పరచిరి, ఒక సంస్థను తయారు చేశారు. లూథర్ బయటకు వచ్చినపుడు, అతడు ఒక గొప్ప మనిషి…అతడు ఒక గొప్ప దైవజనుడైయున్నాడు, కాని అతడు వెళ్ళిపోగానే, ఆ చిన్న చిన్న గుంపుల ప్రజలు, మరొక సంస్థను తయారు చేశారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు బయటకు వెళ్ళి, జాన్ వెస్లీ మీదకు వెళ్ళియున్నాడు, అతడు ఎన్నడూ దేనిని సంస్థగా చేయలేదు, కాని అతడు వెళ్ళిపోయిన తరువాత, అప్పుడు వారు సంస్థగా మారారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు పెంతెకొస్తు వారి మీదకు వచ్చాడు, మరియు వారు మెథడిస్టు నుండి బయటకు వెళ్ళారు. ఏమి జరిగింది? తరువాత వారు సంస్థగా మారారు.
96 కాని అక్కడ ఒకే మనిషి క్రమము, ప్రవచనమును నెరవేర్చటానికి, దేవుని యొక్క శక్తితో, ఏలీయా అభిషేకముతో ముందుకు వచ్చింది. హల్లెలూయ! ఆయన దానిని కదిలిస్తాడు. గుర్తుంచుకోండి, అతడు వారికి ప్రవచించాడు, మరియు ప్రవచించాడు, అన్ని సంగతులను వారికి చెప్పాడు, దేవుడు అతనితో పని చేశాడు. కాని అతని చివరి వర్తమానము ఆ దినము యొక్క వైట్ హౌస్ మీద దాడి చేసింది. యోహాను వచ్చినపుడు, అతని చివరి వర్తమానము ఆ దినము యొక్క వైట్ హౌస్ మీద దాడి చేసింది, దేవుని యొక్క సముఖములో బయట గడిచిన తరువాత, ఆ ఉదయమున అతడు అక్కడకు నడిచి వెళ్ళాడు, అతని మీద అంతటా ముసలి వెంట్రుకలతోయున్నాడు, మీసాలు ఎగురుచున్నవి, ఆ చిన్న నేత్రములు దేవుని యొక్క మహిమతో తళుక్కు తళుక్కుమనుచున్నవి. ఆ చిన్న కర్రను చేతిలో కలిగిన వాడై, అతని పాదము అవి యుండవలసినంత స్థిరముగాయున్నవి. అతడు ఏమి చేస్తున్నాడు? అతడు సమరయ నుండి తిన్నగా క్రిందికి నడుస్తూ, వైట్ హౌస్ లోనికి వెళ్ళి, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు!” అని చెప్పుచున్నాడు, దేనికీ భయపడుట లేదు. సంఘములు అతనిని త్రోసివేసియున్నవి, ప్రజలు అతనిని త్రోసివేసియున్నారు, కాబట్టి ఇప్పుడు వైట్ హౌస్ మీద అతడు చివరి దాడిని చేయుచున్నాడు.
97 అప్పుడు దాని తరువాత ఏమి సంభవించింది? వినండి! ఆ దాడి తరువాత, అతని స్వరము నెమ్మదిగా మారింది, ఎవరును ఎంత మాత్రము అతనిని గూర్చి వినలేదు. దేవుడు అతనిని రంగము మీద నుండి పిలిచాడు, ఆయన అన్నాడు, “ఏలీయా, ఇశ్రాయేలీయులందరికి, నీవు నీ వర్తమానమును తెలియపర్చియున్నావు, అది వారికి తెలుసు. ఇప్పుడు అరణ్యములోనికి వచ్చియున్నాడు, వారి నుండి దూరముగా వెళ్ళు, నిన్ను నీవు వేరు చేసుకో, ’ఏలయనగా నేను ఒక కార్యమును చేయబోవుచున్నాను. నా వర్తమానమును త్రోసివేయుట అంటే ఏమిటో నేను వారికి చూపబోవుచున్నాను.” ఏది లోనికి వచ్చింది? యుద్ధము, కరువు, ఆకలితో బాధపడటం.
98 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, “ఏమి రాబోవుచున్నదో గమనించండి! ఏది వెంబడించబోవుచున్నదో గమనించండి! అక్కడ కరువు వున్నది, అక్కడ కరువు వుంటుంది!” ఓ, బహుశ రొట్టె కొరకు కాదు, కాని దేవుని యొక్క వాక్యమును మరియు ఆయన సత్యమును వినకపోవుటను గూర్చిన కరువు. సంఘములన్నియు, వ్యవస్థిత సమాజములో కలసి బ్రతుకుట ప్రారంభించి, సరిగ్గా తిన్నగా తిన్నగా దానిలోనికి వెళ్ళిపోతుంది, సరిగ్గా వారు ఇది వరకు దానితో మ్రింగి వేయబడినట్లుగా యుంటుంది.
99 ఏలీయా ఏమి చేశాడు? దాచబడిన నీటి ఊటను అతడు కనుగొన్నాడు, ఆ పర్వతము పైన, జీవజలమును కనుగొన్నాడు, దేవుని యొక్క శక్తి క్రింద అతడు కూర్చొనియుండగా, దైవిక ప్రత్యక్షతలు వచ్చుచున్నవి. ప్రత్యక్షతలు, మిగిలిన వారందరు ఆకలితో బాధపడుచుండగా, ఒక చిన్న దాచబడిన ఊటగాయున్నవి. దేవుడు తన దాసులను (ఆ కాకులను) దీవించును గాక, అతడు ప్రజల నుండి దూరముగా ఏకాంతముగాయుండగా, కాకులు తినుటకు అతనికి ఆహారమును తెచ్చుచున్నవి. వారు అక్కడ ఉజ్జీవము కొరకు ఆకలితో ఆకలితో బాధపడుచున్నారు, ఆలాగున అదంతయు ముందుకు కొనసాగుచున్నది. [టేపు మీద ఖాళీగాయున్నది—సంపా.] “ఎంత మాత్రము ఇక ఉజ్జీవములను గూర్చి వినుట లేదు…మన సంస్థలను బ్రద్ధలు చేస్తూ చుట్టూ తిరుగుతున్న ఆ పాత పిడి ఎక్కడయుంది? ఇప్పుడు అతడు ఎక్కడయున్నాడు?” వారికి తెలియదు. అతడు దేవునితో దూరముగా వెళ్ళిపోయాడు, ఒక ఏకాంత స్థలమునకు వెళ్ళాడు, అక్కడ వారు ఆయన స్వరమును వినరు. అప్పుడు వారు చూడటం ప్రారంభించారు.
100 దేవుడు ఒక వర్తమానమును ముందుకు పంపి, ప్రజలకు చెప్పినప్పుడు, వారు దానిని స్వీకరించనప్పుడు, అప్పుడు ఆయన తన సేవకులను వెనక్కు తీసుకొని, ఆయన తెగుళ్ళును వారికి పంపును: కరువు, మరణము (ఆత్మ సంబంధముగా మాట్లాడుచున్నాను, భౌతికముగా కూడా). సోదరుడా, ఒక మాంద్యము కొరకు నీవు కనిపెట్టు, నీవు కొంచెము కనిపెట్టు, దేవుని వాక్యమును వినుటకు దీర్ఘముగా కనిపెడతారు. బైబిలు ఆ రీతిగా చెప్పియున్నది! “చివరి దినములలో అక్కడ ఒక కరువు యుంటుందని,” ప్రవక్త చెప్పాడు, “అది నీళ్ళ కొరకు, రొట్టె కొరకు కాదు, కాని నిజమైన దేవుని వాక్యమును వినకపోవుట అను కరువు.” అయితే ఆ స్వరము, అరణ్యములో ఎక్కడో దాచబడి నిమ్మళము చేయబడుతుంది.
101 ఆయన కాకులను నియమించియున్నాడు, ఆయన పరిచారకులు. ఆ పక్షులను దేవుడు దీవించును గాక. ఆయన పరిచారకులు, ఏలీయా యొక్క స్వరమును సంఘము నుండి అతడు ఏకాంతముగాయున్న సమయములోనే సజీవముగా ఉంచియున్నవి. ఉదయమున మరియు సాయంకాలమున, కాకులు అతనికి రొట్టెను మాంసమును తెచ్చెను, మరియు మిగిలిన వారందరూ ఏ విధమైన ఆత్మ సంబంధమైన ఆహారము మరియు నీరు లేకుండాయుండగా, అతడు ఆ చిన్న నీటి ఊట నుండి త్రాగెను.
102 తరువాత ఒక రోజున, పాపము దాని యొక్క సుంకమును తీసుకొన్న తరువాత, దేవుడు తన ప్రజలను మోకాళ్ళ మీదకు తెచ్చెను…యెజెబెలు సమస్తమును తీసికొనెను, ఆమె సమస్తమును తుడిచి వేసెను, మరియు ఆమె మరలా దానిని చేస్తుంది! అని దేవుని పరిశుద్ధ బైబిలు సెలవిచ్చుచున్నది, “ఆమె మరలా దానిని చేస్తుంది.” బొమ్మ వంటి శిరస్సు వెనుక ఇప్పుడు ఆమె తిన్నగా సింహాసనము మీదయున్నది, ఆమె కోరినది ఏదైనను అటు ఇటు మార్చుచున్నది, ఎవ్వరూ ఆమెను ఆపబోవుట లేదు. నిశ్చయముగా, ఎవ్వరూ ఆమెను ఆపబోవుట లేదు, కారణమేమనగా మత వృత్తములలో దొరకని వాటిని, వారు కత్తిరిస్తున్నారు, దానినంతా రాజకీయముల లోనికి కత్తిరించుచున్నారు, మరియు అక్కడ వారు దానిని చేసియున్నారు. అదే వారు ఖచ్చితముగా చేసియున్నది. రాజకీయముగా అక్కడ ఒక వెలివేత యుంటుంది, నేను ఇక్కడ నిలబడియున్నంత ఖచ్చితముగా బైబిలు చెప్పినట్లుగా తిరిగి మృగపు ముద్రలోనికి వెళుతుంది, చూడండి.
103 మనకు ఆలస్యమగుచున్నదని నాకు తెలుసు, నేను త్వరపడతాను. దేవుడు నన్ను అనుమతించినట్లైతే, నేను తప్పక ఈ చివరి మాటను తేవాలి.
104 గమనించండి! దేవుడు అతనిని కదిలించు వరకు ఏలీయా అక్కడ నిలబడియున్నాడు. అతనికి ఉజ్జీవములు లేవు. అతడు దేనికీ వ్యతిరేకముగా బోధించలేదు. ఆ బయట అరణ్యములో అతడు కేవలము దేవునితో నిలబడియున్నాడు, కారణము అతడు ఒక అడవి మనిషి. అతడు అరణ్యములో పెంచబడిన వ్యక్తి. ఆ ప్రకారమే యోహాను కూడా అరణ్యములో పెంచబడ్డాడు.
105 అతడు దేవునితో ఒంటరిగా అరణ్యములోనికి వెళ్ళాడు, అతడు తన వర్తమానమును ఇచ్చిన తరువాత, సంఘము నుండి దూరముగా తోసివేయబడ్డాడు. మరియు సంఘము దానిని క్రిందికి త్రోసివేసింది, దానిని క్రొందికి తోసివేసింది. చివరిగా సంస్థలన్నియూ ఏమియూ చేయలేకపోయినవి, కాబట్టి అతడు బయటకు కదలవలసి వచ్చింది. దేవుడు అతనిని రంగము మీద నుండి పిలిచి, బయట అరణ్యమునకు తీసుకొని వెళ్ళాడు, “ఇక్కడకు రమ్ము, వారు ఇక ఎంత మాత్రమును వినరు. ముందుకు రా, అప్పుడు నేను నా తీర్పును వారి మీద విసిరి వేస్తాను.” ఓ, అవును, ఈ దినములలో ఒక దినమున అతడు ఇక్కడయుంటాడు, నీవు గమనించు.
106 అప్పుడు, అతని ప్రవచన దినములు గడచిన తరువాత, ఏమి జరిగింది? సంఘము నశించింది, యెజెబెలు యొక్క గొప్ప భయము, ఆమె వారందరిని తన వారిగా తీసుకొంది, వారందరిని నొక్కివేసింది, వారిని ఆమెలోనికి తీసుకొని, మరియు వనములను నిర్మించి, సమస్తమూ చేసింది.
107 కాని, ఒక దినమున, మరలా దేవుడు అతనిని బయటకు పిలిచాడు! అతడు ఇక్కడ బయటకు వచ్చాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నా మీద కోపపడవద్దు. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు!” ను నేను చెప్పుచున్నాను. అతడు బయటకు వచ్చినపుడు దేవుడు ఏమి చేశాడు? ఆయన అతనిని ఒక విధవరాలి యొద్దకు పంపాడు. ఒకప్పుడు, తన శిరస్సుపై ఆమె మానవ శక్తిని కలిగియుండెను, కాని మరణము ఆమెను స్వతంత్రురాలిగా చేసింది, ఆ ప్రకారము ఆమె ప్రవక్త మాటలను నమ్మగలదు. నీవు దానిని గమనించావా. ఆమె భర్తను కలిగియుండెను, మరియు ఇక్కడయున్న పాఠశాలలలోనికి. ఇటు, అటు అతడు ఆమెను నడిపించెను. కాని ఈ గొప్ప కరువు కాలములో, అతడు మ్రింగి వేయబడ్డాడు, మరణము అతనిని తీసుకొన్నది. ఆమె ఇక ఎంత మాత్రము ఏ సంస్థతో ముడివేయబడలేదు, కాబట్టి ప్రభువు యొక్క మాటను వినుటకు ఆమె సిద్ధముగాయున్నది. స్త్రీ అనగా భావము సంఘము; విధవరాలు, ఆమె భర్త అనగా (సంస్థ) చనిపోయాడు, మరియు కేవలము ఆమె జీవించుట కొరకు ఆలోచించుచుండెను. దేవుడన్నాడు, “ఇప్పుడు ఆమె యొద్దకు వెళ్లు, ఆమె నీ మాట వింటుంది, నేను ఆమెకు ఆజ్ఞాపించియున్నాను.”
108 ఓ, కొన్నిసార్లు మనము ఏమనుకొంటామంటే, అక్కడయున్న చిన్న గుంపైన మీరు ఎంతో నమ్మకముగాయున్నారు, మరియు కలిగియుండుట కొరకు, మీరు చేయగలిగిన సమస్తమును చేస్తారు, నీ హృదయము సరిగ్గాయున్నదని, వారును సరిగ్గాయుండాలని, మీరు కఠినమైన సమయమును కలిగియున్నారని, మీరు ప్రజలకు చూపెట్టుటకు ప్రయత్నము చేయుచున్నారు. కానీ, గుర్తుంచుకోండి, దేవుడు ఆయన నేత్రములను మీ మీద ఉంచియున్నాడు! మీరు ఆయనను ప్రేమిస్తారు, మీరు ఆయనను ప్రేమిస్తారని నాకు తెలుసు, మీరు ఇక్కడ కూర్చొనియుండలేరు, మరియు అలాటి కార్యమునకు మీరు హాజరు కారు. దేవుడు ఆయన నేత్రములను మీ మీద ఉంచియున్నాడు. అవును!
109 అతడు చనిపోయినపుడు, ఆమె భర్త, ఆమె సంస్థ చనిపోయింది, కాబట్టి ఇప్పుడు ఆమె ప్రవక్త యొక్క మాట వినుటకు సిద్ధముగావున్నది. కాబట్టి ప్రవక్త గుమ్మము నొద్దకు వచ్చి కొంచెము నీళ్ళు అడిగాడు, ఆమె తేవటానికి వెళ్ళింది. అప్పుడతడన్నాడు, “నాకు ఒక చిన్న అప్పము తెమ్ము.”
110 ఆమె అతని వైపు తిరిగి, “యెహోవా జీవము తోడు, నా దగ్గర ఏమీ లేదు, చాలినంత కొంచెము తప్ప.”
111 ఇప్పుడు, ఆమె కలిగియున్న కొంచెమునే అతడు తీసుకొనుటకు వచ్చినట్లుగా అది కనబడుచున్నది, కాని అటుది ఇటు, ఇటుది అటుగా మారింది. దేవుని యొక్క వాక్యమును బలపర్చుటకు, ఆమెకు కలిగిన దానిని ఇచ్చుటకు ఆమె ఇష్టపడినపుడు, దేవుడు ఆమెను పోషించాడు. నీవు కలిగిన ఏ ఆత్మతో నీవు ఇచ్చుటకు ఇష్టపడతావో, వాక్యమును బలపర్చుటకు ఏ ఆత్మను దేవుడు నీకు ఇస్తాడో, అప్పుడు దానితోనే దేవుడు నిన్ను సజీవముగాయుంచుతాడు. హల్లెలూయ! ఓ, దేవునికి మహిమ! సంఘమా, నీవు దానిని చేయగలవా? నేను మతితప్పిన వాడిగాయున్నానని మీరు అనుకొంటారా, నేను మతితప్పిన వాడిని కాదు. కాని నీవు దేనిని కలిగియున్నావో ఎంత కొంచెముతో నీవు దేవునియందు విశ్వాసముంచావో, నీవు ఏ విశ్వాసమును కలిగియున్నావో, వాక్యముపై దానిని ఉంచుము సంస్థ మీద కాదు! దేవుని యొక్క వాక్యముపై దానిని యుంచుము, ఆయన నిన్ను సజీవముగా ఉంచుతాడు.
112 అప్పుడు, ఆమె సిద్ధముగాయున్నది, ఏలయనగా ఇంతకుముందు ఆమె దానిని చేయలేకపోయింది, కారణమేమనగా వారు ఆమెను చేయనివ్వరు. కాని ఇప్పుడు ఆమె సిద్ధమైనది. ఆమె దానిని స్వీకరించుతుందా? దేవుడు, ఆమె మార్గములోనికి ప్రవక్తను పంపాడు. ఆమె అతని మాటను స్వీకరించుతుందా? ఈ ప్రవక్తను ఆమె స్వీకరిస్తుందా? అవును, ఆమె స్వీకరించింది. అతడు ఆమెతో అన్నాడు, “ఇప్పుడు నీవు ఎంత చిన్న జీవమును కలిగియున్నావో, ఇక్కడ ఉంచు, మొదట దానిని నా యొద్దకు తెమ్ము.” మరియు ఏమి సంభవించింది? మిగిలిన ప్రపంచము ఆకలితో నశిస్తూ, చనిపోతూయుండగా, ఆమె మరియు ఆమె పిల్లలు, ఆమె ఇంటివారు, ఒక రోజులో మూడు మంచి భోజనములు చేయుచుండిరి, అది వాక్యముపై దైవిక ప్రత్యక్షత, స్నేహితులారా, మీరు దానిని చూస్తారని నా నిరీక్షణ.
113 ముందుకు ఏమి కొనసాగింది? కరువు ముగియు వరకు అతడు అక్కడ నిలిచియుండెను, అతనిని నమ్మి మరియు అతనిని స్వీకరించిన, ఈ స్త్రీతో (ఈ సంఘముతో) అతడు జీవించెను. ప్రభువు యొక్క మాట ద్వారా, ఆమెను అతడు సజీవముగా యుంచెను (సంఘమును సజీవముగా ఉంచెను) కారణమేమనగా “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,” అని అతడు చెప్పాడు.
114 ఇప్పుడు, మిగిలిన కథ అంతటిలోనికి వెళ్ళుటకు మనకు సమయము లేదు, నీకు తెలుసా, అతడు ఎలా బయలు తో మమ్మురమునకు రావలసియుండెనో, ఈ దినములలో ఒక దినమున, అతడు దానిని చేస్తాడు, నీవు కలతపడవద్దు. ఆ అరణ్యము నుండి అతడు అడుగులు వేస్తూ వస్తూయుండగా, నీవు గమనించు ఏమి సంభవిస్తుందో.
115 ఏమి జరిగింది? మంచి, వృద్ధుడైన ఏలీయా ప్రవక్త, ఒక నిజమైన దేవుని సేవకుడు, తన మార్గము యొక్క అంతమునకు వచ్చియున్నాడు, ఒక రోజున, దేవుడు అతనితో అన్నాడు, “ఏలీయా, నీవు ఇప్పుడు చాలినంత దీర్ఘముగా బోధించావు. నీవు దానిలో తగినంతగా కలిగియుండు వరకు, యెజెబెలుతో ఆమె రంగులతో, సమస్తముతో పోరాడినావు.” “ఇప్పుడు యోర్దాను దగ్గరకు రా!” అన్నాడు. ఇక్కడ అతడు యోర్దాను దగ్గరకు వెళ్ళుచున్నాడు. అదిగో అక్కడ పాత బురద వాగులు, చల్లగా, ఐసు నీరుగా వస్తున్నవి, ప్రతి మనిషి దానిని ఎదుర్కొనవలసినట్లుగా: యోర్దాను, మరణము.
116 కాని ఈ గొప్ప దేవుని యొక్క సేవకుడు, యోర్దాను యొద్దకు నడిచినపుడు, అతని కుమారుడు అతని ప్రక్కన నడుస్తున్నాడు, సువార్త కుమారుడు,…ఓ, అవును, అతడు అతని యొక్క కుమారుడు, “నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలు వారికి రథములు రౌతులు నీవే అని కేకలు వేసెను.” అతడు మరియు అతని కుమారుడు చేతిలో చేయివేసి, యోర్దాను యొద్దకు నడిచారు, అతడు తన తండ్రి ఆ ఉదయమున వెళ్ళిపోవుటను గమనిస్తున్నాడు.
117 అతడు యోర్దాను నది యొద్దకు వెళ్ళినపుడు, తన భుజముల మీద నుండి శక్తి యొక్క వస్త్రమును అందుకొని, “మరణమా, నీవు నాకు ఏమియు చేయలేవు,” అన్నాడు. అతడు యోర్దాను నదిని కొట్టాడు, “దూరముగా వెళ్ళు, ఈ ఉదయమున నేను దాటబోవుచున్నాను,” అన్నాడు. ఏమి సంభవించింది? అది వెనుకకు వెళ్ళి పౌడరు వలె ఎండిపోయింది. వృద్ధ ప్రవక్త ఏమి చేస్తున్నాడు? అతడు యోర్దాను అంతటా చూస్తున్నాడు, అక్కడ గుర్రములతో ఒక రథము కనిపెట్టుచున్నదని అతడు ఎరిగియుండెను. అతడు గృహమునకు వెళ్ళుచుండెను, అతని యొక్క పని ముగించబడింది. సువార్తలోని అతని కుమారుడు, అతని స్థానమును తీసుకొనుచుండెను.
118 పశ్చిమ తీరము నుండి నేను మొన్నటి దినము గృహమునకు వచ్చుచుంటిని. ఇది నా మనస్సులోనికి వచ్చియున్నది. నేను రేడియోను త్రిప్పియున్నాను (నాకై నేనుగా ఇరవై నాలుగు వందల మైళ్ళు, మూడు రోజులు కారును నడుపవలసియున్నది). నేను రేడియోను త్రిప్పి…డెల్ రియో టెక్సాస్ స్టేషన్ నుండి ఆత్మ సంబంధమైన కార్య క్రమములను వినుచుంటిని. ఒక నల్లజాతి వృద్ధ మనిషిని గూర్చి అక్కడ ఒక మనిషి మాట్లాడుచుండెను. మరియు అతడు చనిపోవుటకు సిద్ధమైయున్నాడు, అతడు ఆ నది యొద్దకు రావలసియుండెను, అతడన్నాడు, “ఆ బంగారు వీధుల గుండా నడుచుటకు, నేను ఆ బంగారు చెప్పులను ధరించబోవుచున్నాను.” ఈ వృద్ధుడైన నీగ్రో తన జీవిత కాలమంతయూ బోధించియున్నాడు అతనికియున్న ఒకే ఆదరణ, అతడు తలంచేది ఏమనగా, అతడు కలిగియున్న పాత తంతి వాయిద్యము గోడకు వ్రేలాడదీయబడియున్నది. అతడు పత్తి బేళ్ళపై బయట కూర్చొని దానిమీద పాటలు వాయించేవాడు, ఆ పాత తంతి వాయిద్యములోనే అతడు తన సేవ నుండి విశ్రమించియున్నాడు, అతడు ఆ విధముగానే అలసట తీర్చుకొనేవాడు. అతడన్నాడు, అతడు ఎల్లప్పుడు తోలే, తోక వెంట్రుకలు కత్తిరించబడిన గుర్రము అక్కడ రధముతో కట్టబడియున్నది. నేను వాటిని గూర్చి ఆలోచించుచుంటిని, అతడన్నాడు, “ఆ బంగారు వీధుల గుండా, నేను వేసుకొని నడవబోయే బంగారు చెప్పులు అక్కడయున్నవి.”
119 అతడు పాడుట ముగించిన తరువాత, నేను రేడియోను ఆపివేశాను. వెళ్ళుతూ, నడిపే చక్రమును పట్టుకొనియున్నాను, “ఓ, అది నిజము. నేనును తప్పక అక్కడకు రావలసియున్నది. నాకు ఏది ఆదరణ ఇస్తుంది. అరణ్యములో ఏది నాకు ఆదరణ ఇస్తుంది?” నా యొద్ద ఒక పాత తుపాకీయున్నది, దాని పేరు…ఆకురాలు కాలములోనే నేను దానితో వేటాడతాను, అది 270, 721 మోడల్, రీమింగ్ టన్. ఒక సోదరుడు, కొన్ని సంవత్సరముల క్రితము కాలిఫోర్నియాలో నాకు ఇచ్చాడు. అది ఎలాటి ఆదరణయైయున్నది, కారణమేమనగా, అది ఒక మంచి వేటాడే తుపాకీ, అది అరణ్యములో నా ఆదరణ.
120 అప్పుడు నా దర్శనమును గూర్చి నేను ఆలోచించాను. నేను అక్కడకు వెళ్ళి నా ప్రజలందరిని చూసినపుడు, మారు పేరుగల నా జత గుర్రం యొక్క శబ్దము ఏదో విన్నాను, నా చిన్న ప్రిన్స్ అక్కడకు వచ్చుచున్నది (అదే నేను జీను కట్టి స్వారీ చేసే గుర్రము) వాడు నా భుజముపై తన తలను ఆనించాడు. నేననుకొన్నాను, “అవును, ఈ ఉదయములలో ఒక ఉదయమున, నేనును యోర్దాను నది దగ్గరకు వస్తాను.” మరియు నా పాత తుపాకీ గోడ మీద వ్రేలాడుచున్నది. గత ఆకురాలు కాలము నుండి నేను దానిని క్రిందికి దించియుండలేదు. “నేను స్వారీ చేసే ఆ చిన్న జీను గుర్రము, నేను ఆ నది యొద్దకు వచ్చు ఉదయమున, నా రధమునకు తగిలిస్తాడు.” అది ఆ నది యొద్ద అక్కడ నిలబడియుంటుంది. దేవుడు అతనిని పంపిస్తాడు. మొన్న రాత్రి నేను అతనిని చూసియున్నాను. ఈ ఉదయములలో ఒక ఉదయమున, అతడు నా రధమునకు తగిలించబడతాడు. మేఘముల గుండా పైకి ఎక్కుతూ నేను వెళ్ళిపోతాను.
మనము ప్రార్థన చేసుకొందాము.
121 ఓ, ఆ బంగారు వీధులలో నడుస్తూయుండగా, దేవుని యొక్క శక్తిని నేను అనుభవించబోవుచున్నాను! అవును, ఇప్పుడు ఆ పాత తుపాకీ గోడ మీద వ్రేలాడుచున్నది, అప్పుడు దాని ఉపయోగము ఏమీయుండదు. నా రధము వస్తున్నట్లైతే, నేను దర్శనములో చూసిన నా చిన్న జీను కట్టే గుర్రము, ఆ ఉదయమున నా రధమునకు కట్టబడి, ఆ నది దగ్గర నిలబడియుంటుంది. అతడు అక్కడ యుంటాడని నా నిరీక్షణ. నేను కొనిపోబడగోరుచున్నాను. ప్రతి ఒక్కరూ, సంఘము కూడా పైకి వెళ్ళాలని నేను కోరతాను.
122 నీవు యోర్దాను నొద్దకు ఎప్పుడు వస్తున్నావో తెలుసుకోనగోరుచున్నావా? ఈ లోక సంబంధమైన భక్తిహీనమైన వ్యవస్థలను విసర్జించి, యేసు క్రీస్తును నీ సొంత రక్షకుడిగా స్వీకరిస్తావా? నీవు ఒక క్రైస్తవుడవు కానట్లైతే, నీ చేతిని ఎత్తి, చెప్పు, “బ్రాన్హాం సోదరుడా, నా కొరకు ప్రార్థించుము. నేను యోర్దాను యొద్దకు వచ్చినపుడు…”? దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. “నేను యోర్దాను యొద్దకు వచ్చినపుడు, నా మీదయున్న పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నేను తీసుకొని, ఆ చల్లని నీళ్ళను కొట్టి, దాని గుండా నడుస్తాను.”
123 పరిశుద్ధాత్ముడు నీ యొక్క స్థితిని నాకు చెప్పుచున్నాడని ఎరిగినవాడవై, అలాటి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము క్రింద మాట్లాడుచుండగా, కూర్చొని నీ చేతిని ఎత్తకుండా ఎలాయుండగలవు? అరణ్య ప్రయాణము కొరకు అది సమయమైయున్నదని, అది చూపుతుంది మనము ప్రార్థించకముందు అక్కడ ఒకరెవరైనాయున్నారా, మరొకరు? ఇద్దరు అక్కడ చేతులను ఎత్తియున్నారు; ముగ్గురు, కుమారుడా, దేవుడు నిన్ను దీవించును గాక.
124 మా పరలోకపు తండ్రీ! ముగ్గురు; అది అద్భుతము, ప్రభువా, వారు సరిగ్గా ఆ దినమున యున్నట్లైతే, ఆ రోజు వారు ఉంటారని నేను ప్రార్థిస్తున్నాను, ప్రభువా. వారు వారి చేతులను ఎత్తియున్నారు, కారణమేమనగా ఈ లోక సంబంధమైన వ్యవస్థలు చనిపోవుచున్నవని వారు ఒప్పించబడ్డారు, మరియు దేవునియొక్క వాక్య స్వరములు వినుట, త్వరలోనే కఠినముగాయుంటుంది, సంఘము నుండి దేవుడు దానిని తీసి వేస్తాడు. కేక, పెండ్లి కుమారుని యొక్క కేక త్వరలో వెళ్ళిపోతుంది, మరియు యెజెబెలు క్రమము దానికి ఊపిరి సలపకుండా చేస్తుంది. దాచబడిన ఊటవలె ఏలీయా, కరువు కాలము గుండా భద్రపర్చబడాలి. దేవా, వారికి పరిశుద్ధాత్మను దయచేయుము, వారి హృదయములను సంతోషముతో సమాధానముతో నింపుము. ఇప్పటి నుండి శాశ్వతముగా, వారు నీ కొరకు జీవించునట్లు వారి మనస్సులను నీ వాక్యముపైయుంచుము, తండ్రీ వారిని దీవించుము. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వారు నీవారైయున్నారు.
మన తలలను వంచియుండగా:
125 తమ చేతులను ఎత్తి క్రీస్తును అంగీకరించుగోరువారు, ఒక్క క్షణము నేను వ్యక్తిగతముగా మీ కొరకు ప్రార్థించుచుండగా, మీ పాదములపై నిలబడగలరా? మీ పాదములపై నిలబడండి.
126 ఓ దేవా, నేను తప్పిపోయానా? చేతులను ఎత్తిన ముగ్గురు సహితము, వారు చేసిన దానినే పాదములపై నిలబడి, అంగీకరించు ఒప్పుదలను కలిగి లేకున్నారు. ప్రభువైన యేసు, దాని సమస్తమును నీ చేతులను అప్పగిస్తాను. నేను నీ వాక్యమును బోధించియున్నాను, మరియు ఏ మాత్రము రాజీపడలేదు. ఇప్పుడు, తండ్రీ, ఇంటిని వారికి అప్పగిస్తాను. సంఘముతో మరియు నీ సేవకునితో ఏది అనుకూలమో దానిని మీరు చెయ్యండి, అది అంతయూ నీ చేతులలోయున్నది.
127 తండ్రీ, తప్పిపోయిన వారిని రక్షించమని, ఆకలిగొన్న హృదయములను మేలుతో తృప్తి పర్చుము, దప్పిగొనుచున్న వారికి నిత్యజీవమును దయచేయుమని నేను ప్రార్థన చేస్తాను, వర్తమానమును ప్రకటించుటకు నీ యొక్క సేవకులను లేపుము, రోగులు మరియు పీడించబడుచున్న వారికి స్వస్థతను ఇమ్ము, నీకు మహిమ తెచ్చుకొమ్ము, ఏలయనగా నీ వాక్యముతో నన్ను నేను అప్పగించుకొంటాను. నా చేతిలో, నా హృదయములో, నా మనస్సులో నీ విధులను వ్రాయుము, మన ప్రభువైన యేసు నామము ద్వారా, ఆమేన్.
దినము యొక్క అంతములో నేను నది యొద్దకు వచ్చినప్పుడు,
నేను దానిని పాడను.
నా స్నేహితులందరూ వెళ్ళిపోయినట్లుగా కనబడుతుంది;
నాకు మార్గమును చూపుటకు ఎవరో అక్కడయుంటారు,
నేను ఒంటిరిగా యోర్దానును దాటనవసరము లేదు.
128 బిల్లీ, ప్రార్థనా కార్డులను ఇచ్చియున్నావా? నాకు భారముగా యున్నది. ఈ రోజున బయటకు ఏమిచ్చావు? బి? నీవు ఎ నంబరు కూడా బయటకు ఇచ్చావు, నీవు ఇవ్వలేదా? మంచిది, వాళ్ళను పిలవండి. మొదటగా బి, నెంబరు, ప్రార్థనా కార్డు బి, నెంబరు ఒకటి. మేము నీ యొక్క రోగము కొరకు ప్రార్థించబోవుచున్నాము. బి, నంబరు ఒకటి, ఎవరు దానిని కలిగియున్నారు? ప్రార్థనా కార్డు బి, నంబరు ఒకటి, ఎవరో ఆ వెనుక చివరలో, ఓ స్త్రీ, ఇక్కడ పైకి రమ్ము. బి, నెంబరు రెండు, నీ చేతిని ఎత్తుము. ఆ స్త్రీ? నంబరు మూడు, బి, నంబరు మూడు దయతో నీ చేతిని ఎత్తగలవా? ఆ ప్రకారము నీవు ఎక్కడయున్నావో చూడగలను. మూడు? నంబరు నాలుగు, బి, నెంబరు నాలుగు, బి, నెంబరు ఐదు. దయతో నీ చేతిని ఎత్తగలవా? బి, నంబరు ఐదు. ఆ మనిషి. మంచిది. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు, పదమూడు, పద్నాలుగు, పదిహేను. బాగుంది, ఇక్కడ బి కార్డు గలవారు, ఎలాగైనా, నిలబడండి. కొంచెము…
అది…[టేపు మీద ఖాళీగాయున్నది—సంపా.]…ప్రపంచము అంతటిలోనికి వెళ్ళియున్నది. పొలములో యున్న ప్రతి మిషనరీ, వాళ్ళు ఎక్కడయున్నారు.
129 బి ప్రార్థనా కార్డులున్న వారందరు, నిలబడి, మీ నంబర్ల ప్రకారము మీ స్థానమును తీసుకోండి.
ఇప్పుడు, తరువాత వారు ఎవరు? ఎ, ఒకటి, ప్రార్థనా కార్డును ఎవరు కలిగియున్నారు? ఎ, ఒకటి, అది ఎక్కడయున్నది? నిశ్చయముగా అది ఇక్కడయున్నది. ఎ, ఒకటి? వారు రెండు లేక మూడు రోజుల నుండి ఇస్తున్నారు, కాబట్టి వాళ్ళు అక్కడ యుండకపోవచ్చు. ఎ, కార్డు గల వారందరూ, ఇక్కడ మీరు వరుస కట్టండి తిన్నగా ఆ గోడకు ఎదురుగా, మర్యాదగా వెళ్ళండి.
130 ప్రార్థనా వరుసను ప్రారంభించక ముందు, ప్రార్థనా కార్డులు లేని వారితో నేను మాట్లాడతాను.
131 ఇప్పుడు, మీ ప్రార్థనా కార్డును చేతులలో పట్టుకొనియుండండి, ఆలాగున మీ ప్రార్థనా కార్డులను బాలురు స్వీకరిస్తారు. మీరు కనిపెట్టుచున్నారు, మీరు సాయంత్రము పెందలకడ వచ్చి, మీ ప్రార్థనా కార్డును తీసుకోండి, ప్రార్థనా వరుసలోనికి వచ్చుటకు నీకు హక్కుయున్నది. మీ కొరకు ప్రార్థిస్తానని నేను మీకు వాగ్దానము చేశాను. నా వాగ్దానమును నిలబెట్టుకొనుటకు నేను ప్రయత్నము చేస్తాను, దేవుడు నాకు సహాయము చేస్తున్నాడు.
132 అది నీ చిన్న బిడ్డయా? చాలా అందమైన చిన్న మనిషి. దయతో నన్ను క్షమించండి. ఇక్కడయున్న ఈ స్త్రీ, ఒక నిజమైన అమెరికన్ కు ఒక మంచి మాదిరిగాయున్నది. ఆమె చిన్న బిడ్డ, చిన్న చారల జాకెట్, మాపే బట్టలు కలిగియున్నది. ఈ యవ్వన స్త్రీ, పొడవైన వెంట్రుకలతో, చక్కగా వస్త్రములు ధరించుకొన్నది. దేవుడు ఆమెను, ఆమె ఇంటిని, ఆమె భర్తను, ఆమె ప్రియులను దీవించును గాక. “క్రైస్తవ్యముతో” అది నిజమైన, అసలైన యు.యస్.ఏ; దానిపైన వ్రాయబడియున్నది. మన దేశము దీర్ఘకాలము ఆ రీతిగాయుండును గాక! ఓ చిన్న స్త్రీ, దానిని చెప్పినందుకు నన్ను క్షమించుము, ఆ ప్రకారము క్రైస్తవురాలుగా కనబడుతుందని నేను ఏమి ఆలోచిస్తానో, ప్రజలు దానిని చూడగలరు; ముఖమునకు రంగులు లేవు. సరుకు ఏమిటి, కేవలము ఒక స్త్రీయైయున్నది.
133 సోదరుడు సుల్లివాన్, దేవుడు నిన్ను దీవించును గాక.
134 నీకు ఇష్టమైతే, ఒక గొప్ప వైద్యుడు.
గొప్ప వైద్యుడు ఇప్పుడు దగ్గరగాయున్నాడు,
జాలిపడు యేసు.
135 నీవు ఆయనయందు విశ్వాసముంచుతావా? ఆయన గొప్ప వైద్యుడని నీవు నమ్ముతావా? ఇప్పుడు ఒక్క క్షణము మర్యాదగా యుండండి. ఇంకా, మనకు కొద్ది సమయమున్నది, కొంచెము క్లుప్తముగా నేను వర్తమానమును కత్తిరించాను. అయినను, దాని భావము ఏమిటో, మీరు పొందారని నేను ఆశిస్తాను. సరిగ్గా మీ హృదయమంతటితో నమ్మండి. వారందరు వరుస కట్టినపుడు, ప్రజలను పైకి వరుస కట్టుటకు ఆ వెనుక ఎవరోయున్నారు. అలాగేనా? ఏమంటారు? ఇప్పుడు ప్రార్థనా కార్డులు గల వారందరూ నిలబడియున్నారు.
136 ప్రార్థనా కార్డులు లేని వారు కూడా, ఆ బయట నమ్ముచున్నారా? మీరు విశ్వాసమును కలిగియున్నట్లైతే, దేవుడు మిమ్మును పిలుస్తాడు. ఇప్పుడు, ప్రార్థనా కార్డులు కలిగిన వారందరూ వరుసలోయున్నారు.
137 బాధ పడుచున్న కాలుతో, ఆ వెనుక కూర్చొనియున్న చిన్న బాలిక, దేవుడు నిన్ను బాగు చేస్తాడని నమ్ముచున్నావా? నీవు నమ్మినట్లైతే, విశ్వాసమును కలిగియుండుము, దేవుడు నీకు దానిని దయచేయును.
138 రోగియైన నీ తండ్రి బాగుపడతాడా అని అనుకొనుచున్నావు? నీవు నమ్ముతావా, నీవు దానిని పొందవచ్చును.
139 ఆ బయట, నరముల బలహీనతతోయున్న నీ మేనల్లుడు కొరకు ప్రార్థించుచున్న, నీ సంగతి ఏమిటి? దేవుడు అతనిని బాగుచేస్తాడని తలంచుచున్నావా? అక్కడ కూర్చొన స్త్రీ, నీవు నమ్మినట్లైతే, నీవు దానిని పొందవచ్చును.
140 మీరందరూ నమ్ముచున్నారా?
141 ఇక్కడయున్న నా సోదరులు, సువార్త బోధకులు, సంపూర్ణ సువార్త బోధకులు లేక వారు ఏమైనప్పటికి, దైవిక స్వస్థతయందు ఎంతమంది నమ్మికయుంచారు? మీ చేతులను ఎత్తండి? ఇక్కడకు వచ్చి నేను ఈ ప్రజలకు ప్రార్థన చేయుటకు నాకు సహాయము చేయమని మిమ్మును కోరుచున్నాను, ఆ ప్రకారము ప్రజలకు నేను ప్రార్థన చేయుట మాత్రమే కాదు గాని, మీరును ప్రార్థన చేయగలరని ప్రజలు చూస్తారు. ఇక్కడకు వచ్చి వేదిక మీద నాతో నిలబడండి. తిన్నగా నిలబడండి. మీకు వందనములు. తిన్నగా ముందుకు రండి, సోదరులారా, రండి.
142 ఏమంటారు? [“మేము రెండు వరుసలు ఏర్పరచవచ్చా?” అని ఎవరో అడుగుతున్నారు—సంపా.] అవును, మీరు చేయవచ్చు. ఇక్కడే తిన్నగా రెండు వరుసలను ఏర్పరచండి, అది బాగుంటుంది. అది బాగుంది. సోదరుడా, ఇప్పుడు మరొక వైపు త్రిప్పుము. ఈ మార్గము వైపు త్రిప్పుము. నేను తిన్నగా ప్రజలను ఇటు గుండా తీసుకొని రాబోవుచున్నాను, ఇప్పుడు మీలో కొందరు, ఇటు వైపుకు రండి, మీరు కోరినట్లైతే, ఇక్కడే, ఈ చుట్టూ నిలబడండి. అంతవరకే.
143 ఇప్పుడు, శ్రోతలకు, ఈ చక్కని మనుషులను మీరు చూస్తారు? వారు ఇక్కడ తిన్నగా నిలబడే మనుషులైయున్నారు, నేను బోధించుచున్న, అదే సువార్త కొరకు వారు నిలబడతారు. చూడండి? వాళ్ళు ఇక్కడకు వచ్చారు, కారణమేమనగా, వారు దానియందు విశ్వాసముంచారు. ఇప్పుడు ఈ వేదిక మీద యుండి తమ్మును తాము కనపర్చుకొనుచు, బలముగా బోధిస్తూ, కఠినముగా నిలబడియున్న, మీ కాపరిని గూర్చి తప్పక మీరు గర్వపడాలి. ఈ మనుషులు ప్రత్యక్షత కలవారు, నేను ప్రజలకు వ్యతిరేకము కాదని వారికి తెలుసు, కొన్నిసార్లు మనము ఆ వ్యవస్థలలో ముడివేయబడతాము, ఆ వ్యవస్థలకే మనము వ్యతిరేకముగాయున్నాము; మనుషులకు కాదు, దేవుని యొక్క సేవకుడు.
144 ఇప్పుడు, ప్రతి ఒక్కరికి మనము వివేచనను కలిగియున్నట్లైతే, నేను ఇక్కడ ఎంతసేపు యుంటానని మీరనుకొంటారు? నేను కూలిపోయాను…ఐదు, ఆరు, పదిమంది; కొంచెము ఎక్కువ, బహుశ సగము, ఆ వరుసలో పావుమంది తరువాత, నా పని ముగించబడుతుంది. మిగిలిన వారికి ప్రార్థన చేయబడదు. మనము దానిని చేయలేము. నీవు దానిని కలిగియుండవలసిన పనిలేదు. నీ ఇబ్బంది ఏమిటో నీకు తెలుసు. నీవు ఏమి చేశావో నీకు తెలుసు, ఇప్పుడు నీ పాపములను ఒప్పుకొనుము. ఇక్కడయున్న ఎవరైనా, రవ్వంత అనుమానము హృదయములో కలిగియున్నా, దానిని బయటకు తీసివేసి, నిన్ను క్షమించమని దేవునిని అడుగుము. నీవు దేవునితో సరిగ్గా లేకపోయినట్లైతే, నిన్ను క్షమించమని దేవునితో చెప్పు. ఆలాగు చేయని యెడల, నీవు దేవునితో సరిగ్గా లేవు. అప్పుడు ఈ వరుస గుండా వచ్చుట, నీకు రవ్వంత మేలుచేయదు. నీవు నీ సమయమును వృధా చేసుకొనుచున్నావు. అది నిజము. అప్పుడు, అది నిజమేనా, సోదరులారా? [సహోదరులు “ఆమేన్” అని చెప్పుచున్నారు —సంపా.] అది నిజము.
145 ఇటు చూడండి. ఇక్కడ సోదరుడు కిడ్ నిలబడియున్నాడు. ఒకటి లేక రెండు సంవత్సరముల క్రితము, అతని యొద్దకు వెళ్ళుటకు నా కారు టైర్లను చీల్చివేసినట్లైంది. అతడు కాన్సర్ వ్యాధితో చనిపోవుచున్నాడు, ఆ రోజు చనిపోవబోవుచున్నాడు. ఆయన భార్య నాతో చెప్పింది, “త్వరపడండి!” “అతడు ఇప్పుడు చనిపోవుచున్నాడు,” అన్నది. నేను అక్కడకు వెళ్ళే సరికి, ప్రభువు ఆయనను స్వస్థపర్చాడు. అతడు ఇంకనూ ఇక్కడ నిలబడియున్నాడు. అతడు చాలా బరువును, సమస్తమును పొందియున్నాడు. ఒక మాజి ప్రముఖుడు, ఆ వెనుక, నీకు తెలుసా. ఆ రకమైన మనిషిని గూర్చే నేను మాట్లాడుచున్నాను, ఎన్నో సంవత్సరముల క్రితము అతడు బోధించియున్నాడు, ఆ వాక్యము పై తిన్నగా వుంచబడ్డాడు, మరియు ప్రజలు అతనిని చూసి నవ్వారు. అతడు మరియు అతని భార్య రైలు బాటల గుండా నడిచారు, కొండలలో, బొగ్గు గనులలో నడిచి సమస్తమూ చేశారు, తరిమి వేయబడ్డారు, జైలులో వేయబడ్డారు, సమస్తము గుండా వారు వెళ్ళియున్నారు. ఆ రకమైన మనిషే బహుమానమును గెలుచుటకు పోరాడేవాడు.
146 ఇప్పుడు, సోదరులారా, నేను మీతో చెపుతాను, వివేచనా ఆత్మ బహుశా మీకు ఉండకపోవచ్చు. అది అంత అవసరము కాదు, చూడండి. మొదటి విషయము, నీవు వాక్యపు మనిషివైయున్నావు. నీవు ఎంతో శ్రేష్ఠమైనవాడవు, ఎందరో బోధకులు మరియు నాకంటె, కారణమేమనగా, నేను తగినంతగా బోధకుడను కాదు, కాని మీరు అభిషేకించబడ్డారు, సువార్తను బోధించుటకు పిలువబడిన ఏ మనిషియైనా రోగులను స్వస్థపర్చుటకు పిలవబడ్డాడు; సాధారణ ఆజ్ఞలు ఏవనగా: “మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందువాడు, రక్షించబడును, నమ్మవానికి శిక్ష విధించబడును. నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. వారు రోగుల మీద చేతులుంచినపుడు,” “వారు స్వస్థతనొందుదురు.” నీవు ఒక సేవకుడిగా పిలువబడినపుడు, రోగుల కొరకు ప్రార్థించుటకు కూడా నీవు పిలువబడ్డావు.
147 నేను దీనిని చేయుచున్న కారణమేమనగా, స్వస్థతా కూటమునకు వస్తున్న ఎవరో ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఓరల్ రాబర్ట్స్, టామీ హిక్స్, టామీ ఆస్ బర్న్, అలాటి ఎవరి కొరకో శ్రోతలు కనిపెట్టవలసిన పనిలేదని, ఈ శ్రోతలు తెలుసుకొంటారు. మీరు దైవజనులైయున్నారనే విషయము వారు చూడాలని నేను కోరతాను. చూడండి? నీవు ఒక మనిషివైయున్నావు…నేను గాని లేక మరి ఎవరైనా గాని చేతులుంచునట్లుగా, అంతే హక్కును మీరు కలిగియున్నారు. అన్నీ తరువాత, సోదరులారా, సేవకులుగా మీ అందరకు తెలుసు, అది వారి యొక్క సొంత విశ్వాసమే ఆ పనిని చేస్తుంది. అది నిజమేనా? మనము కేవలము వారి కొరకు ప్రార్థన చేస్తాము.
148 ఇప్పుడు, నీవంటావు, “బ్రాన్హాం సోదరుడా, నీతో పరిశుద్ధాత్ముడు యున్నాడా?” నిశ్చయముగా. అవునండి!
149 ఇక్కడ ప్రార్థనా వరుసలోయున్న శ్రోతలు…దేవుడు మిమ్మును స్వస్థపర్చబోవుచున్నాడని మీ హృదయమంతటితో నమ్మినట్లైతే, మీ చేతిని ఎత్తి, చెప్పండి, “నేను దానిని అంగీకరిస్తాను.”
150 ఇక్కడకు రండి, ఈ స్త్రీని ఇక్కడకు రానియ్యండి. నీవు ఎవరవో నాకు తెలియదు, నేను నిన్ను ఎన్నడూ చూసియుండలేదు. పరిశుద్ధాత్ముడు నాకు దానిని చెప్పినట్లైతే, ఆ ప్రకారము నా సోదరులందరూ, ఇలాటి దేవుని సన్నిధిలో వారందరూ నా చుట్టూ నిలబడియున్నారు. అంత మాత్రమే కాదు, నా సోదరులు ఇక్కడయున్నారు, నా ప్రభువు కూడా ఇక్కడయున్నాడు. అది వారి ప్రభువు కూడా. ఇప్పుడు, నీతోయున్న ఇబ్బంది ఏమిటో ఆయన నాకు చెప్పినట్లైతే, నీ బాధ ఏదైనప్పటికి, అది సత్యమో కాదో నీవే తెలుసుకొంటావు పరిశుద్ధాత్ముడు వేదిక నొద్దయుండి, వివేచనను ఇస్తున్నాడని, ఈ బయట ప్రజలు చూడాలని నేను కోరతాను, కాని అది ఎవ్వరినీ స్వస్థపర్చదు. కాని నీ గురించి ఆయన నాకు ఏదైనా చెప్పినట్లైతే, దానిని గూర్చి నాకు ఏమియు తెలియదు, బావి దగ్గరయున్న స్త్రీకి చేసినట్లుగా…అదే రకమైన విషయము కాదు, కాని ఒక పురుషుడు మరియు స్త్రీ మొదటి సారిగా ఒక్కడ కలుసుకొనుచున్నారు. యేసు, ఒక విధముగా మధ్య వయస్సు గలవాడుగాయున్నాడు, ఈ స్త్రీ బహుశ, బహుశ మీ వలె ఒక యవ్వనస్థురాలు.
151 నీవు ఇక్కడ ఎందుకు యున్నావో, నీ ఇబ్బంది ఏమిటో ఆయన నాకు చెప్పినట్లైతే, అది ఆయన పరిశుద్ధాత్మయే దానిని చేస్తుందని, నీవు నమ్ముతావా? సోదరులారా, మీరును నమ్ముతారా? అదే యేసు ఇక్కడ నిలబడియున్నాడు. శ్రోతలైన మీరును దానిని నమ్ముతారా? ప్రార్థన వరుసలోయున్న మీరు, దానినే నమ్ముతారా, ఈ మనుషులు కూడా…? వారు ఇక్కడ లేనట్లైతే, నేను వాళ్ళను ఇక్కడకు పిలవనా? ఈ రీతిగా బోధించిన తరువాత, నేను కలిగియున్న వాటిని చెపుతూ, అప్పుడు వారు అయోగ్యులని నేను పిలవగలనా? నేను దానిని చెయ్యను. నేను దేనిని గూర్చి పోరాడుతున్నానో, అప్పుడు దానినే నేను ఓడించుచున్నాను. చూడండి? వారియందు నాకు నమ్మకమున్నది. వారు దైవజనులని నేను నమ్ముతాను.
152 ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దగ్గరగాయున్నాడేమో చూడండి. నేను మీతో కొంచెము మాట్లాడుటకు ప్రయత్నము చేయుచున్నాను…నీవంటావు, “బ్రాన్హాం సోదరుడా, నీవు ఏమి చేస్తున్నావు?” దానినే యేసు ఆ స్త్రీతో చేశాడు, “నాకు దాహమునకు నీళ్ళు ఇమ్మన్నాడు,” ఒక్క నిమిషము ఆయన ఆమెతో మాట్లాడుటకు ప్రయత్నము చేస్తూ, ఆమె ఇబ్బంది ఏమిటో కనుగొంటాడు.
153 నీ ఇబ్బంది నరముల బలహీనత, దానితోనే నీవు బాధపడుచున్నావు. అది నిజమైనట్లైతే, నీ చేతిని ఎత్తుము. ఆమె నిశ్చయముగా ఆ విధముగా కనబడుట లేదు, సోదరులారా, ఆమె ఆలాగున కనబడుతుందా? ఆమె ఆలాగు కనబడుట లేదు, కాని ఆమె ఇబ్బంది అదియే. ఆమె ఎంతో కాలము నుండి ఆ రీతిగాయుండియున్నది. నీవు ఎల్లప్పుడు వాటి యొద్దకు రాకముందే నీ వంతెనలను దాటుతూయుంటావు. అది నిజము. అది నీ నిర్మాణమైయున్నది, నీవు ఆ రీతిగా తయారుచేయబడ్డావు, నరముల ఉద్రిక్తత; ఏదో సంభవించబోవుచున్నదని ఎల్లప్పుడు ఊహిస్తూయుంటావు. అది సంభవించదు. కొన్నిసార్లు దయ్యము నీతో చెపుతుంది, “దానికి అక్కడ ఏమీ లేదు, నీవు వెనక్కు జారిపోయావు, నీవు గీతను దాటావు.” నేను నీ మనస్సును చదువుట లేదు, కాని నేను ఆయన నీతో ఏమి మాట్లాడాడో తెలుసుకొనుచున్నాను, కారణము నీ మనస్సు గుండా ఏమి దాటి వెళ్ళిందో నేను చూస్తున్నాను.
154 యేసు వారి తలంపులను గ్రహించియున్నాడు. అది నిజమేనా? బాగుంది, అదే ఇప్పుడు తిన్నగా సంభవించింది. అది నిజమేనా? మీరు ఎరుగునట్లుగా, ఇక్కడ ఒక సంగతి చెపుతాను. ఇక్కడ నీవు మరొకరి కొరకు నిలబడియున్నావు. అది నిజము. అదే విషయము, నీవు చూడు, అప్పటి వరకు నీవు దానిని పట్టుకొనలేకపోయావు. ఇక్కడ నీవు దేని కొరకు నిలబడియున్నావో, ప్రభువు నాకు బయలుపర్చినట్లైతే, అది మరొకరి కోసము, ఆయన ప్రవక్తగా నీవు నన్ను నమ్ముతావా? అది నీ తల్లి కొరకు. ఆమె ఇబ్బంది ఏమిటో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముతావా? మంచిది, ఆమె గుండె జబ్బుతోవున్నది, అధిక రక్తపోటు, పిత్తాశయములో రాళ్ళు, ఇంకా ఎన్నో సమస్యలు. అది నిజము. అది కాదా? చూడండి, ఇప్పుడు, అది పరిశుద్ధాత్ముడైయున్నాడు, అది కాదా?
155 ఇప్పుడు, ఈ సోదరుల మీద నాకు ఒక విషయమున్నది. చూడండి? ఇక్కడ ఒకటియున్నది, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు నీవు నమ్ముతావా; నీవు, ఈ వరుసగుండా వెళ్ళుచుండగా నీవు నమ్ముతావా.
ఈ ప్రజల కొరకు ప్రార్థించుచుండగా మనము తలలు వంచుదాము.
156 పరలోకపు తండ్రీ, ఈ ప్రజలపై మేము ఇప్పుడు చేతులను ఉంచబోవుచున్నాము వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఇక్కడ నీ రాజ సేవకులు నిలబడియున్నారు, మరియు మేమందరము రోగులపై చేతులను ఉంచబోవుచున్నాము, కారణమేమనగా దానిని చేయమని నీవు చెప్పావు. యేసుక్రీస్తు నామములో మేము దానిని చేయబోవుచున్నాము. ప్రజలు దానిగుండా లాగుకొంటూ వచ్చుట కాదు, కాని యేసుక్రీస్తు నామములో, స్వస్థతనొందుచూ దాని గుండా వచ్చుదురు గాక. ఆమేన్!
157 ప్రభువు మిమ్మును దీవించును గాక. ఇప్పుడు తిన్నగా పైకి నడవండి.
ప్రభువైన యేసు నామములో, స్వస్థపర్చుము…ప్రభువైన యేసు నామములో, నా సోదరుని స్వస్థపర్చుము. ప్రభువైన యేసు నామములో, నా సోదరిని స్వస్థపర్చుము.
158 ఇప్పుడు, ఒక్క నిమిషము! చూడండి! [సహోదరుడు బ్రాన్హాం తన చేతులతో నాలుగు సార్లు చప్పట్లు కొట్టారు—సంపా.] సోదరుడా, సోదరీ, ఆ వివేచన సంభవించినపుడు, నీవు ఎందుకు ఆనందించావు, మరియు ఇతరుల దాని గుండా వచ్చినపుడు, అక్కడ ఏమీ జరుగలేదు? ప్రజలు దాని గుండా వెళతారు, “మంచిది, నేను వివేచనను కలిగియున్నట్లైతే, మంచిది, అప్పుడు నేను ఏమియు పొందను.” అది దానితో చేయునది ఏదియు లేదు, ఆయన ఇక్కడ ఒకే రీతిగాయున్నాడు. చూడండి?
159 నీవు ఇక్కడ దాటి వెళ్ళుచుండగా, మీ చేతులను పైకెత్తి, ఈలాగు చెపుతూ రండి, “ప్రభువైన యేసు, నీకు వందనములు. నన్ను స్వస్థపర్చేవాడిగా నిన్ను అంగీకరిస్తాను, నేను దానితోనే తిన్నగా వెళ్ళుచున్నాను. ఈ మనుషులలో ఒకరు నాకు బాప్తిస్మమును ఇవ్వబోవుచున్నారు, నేను తిన్నగా నీళ్ళ కోనేరులోనికి వెళ్ళి బాప్తిస్మము పొంది, బయటకు వచ్చి నేను పరిశుద్ధాత్మను పొందుతానని నీవు వాగ్దానము చేశావని తెలుసుకొంటాను.”
160 చూడండి, వివేచనా వరము ఇంకనూ ఇక్కడయున్నది, అది ఒకే రీతిగా ఇంకనూ ఇక్కడయున్నది. ఇక్కడ, అది ఎవరు? ఇక్కడయున్న ఈ మనిషి? నేను నీకు క్రొత్తవాడను. నేను కాదా, అయ్యా? నీవు ఎవరవో నాకు తెలియదు, నీ ఇబ్బంది ఏమిటో దేవుడు నాకు చెప్పినట్లైతే. ఆయన ప్రవక్తగా, ఆయన సేవకుడిగా నీవు నన్ను నమ్ముతావా? నీ హృదయమంతటితో నీవు నమ్ముతావా? అయ్యా, మంచిది. అయ్యా నీకు వందనములు. అది ఒక చాలా మంచి ఆత్మ, చాలా చక్కని విషయము. అదంతయూ తరువాత, నీవు మరొకరి కొరకు ఇక్కడ నిలబడియున్నావు. అది నిజము. “అది నీ మనువడు పోలీయో జబ్బు, మొన్నటి దినమున క్రొందపడి కాలు విరుగగొట్టుకొన్నాడు,” అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు! అది నిజమేనా? అది నిజము! వెళ్ళి నమ్ముము అతడు బాగుపడతాడు.
161 ఇప్పుడు, నమ్ముతూ రండి, ప్రతి ఒక్కరూ, రండి. [సహోదరుడు బ్రాన్హాం మరియు సేవకులు ప్రార్థనా వరుసలోనున్న రోగుల కొరకు ప్రార్థిస్తున్నారు—ఎడి.]…?…
మన హృదయములను క్రైస్తవ ప్రేమతో
బంధించిన బంధము దీవించబడును గాక;
ఒక సహవాసపు సంబంధము గల మనసు
ఆ పైన యున్న దాని వలెయున్నది.
తండ్రి సింహాసనము ముందు ఇక్కడ,
మన ఉత్సాహ ప్రార్థనలను క్రుమ్మరిద్దాము;
మన భయములు, మన నిరీక్షణలు, మన ఉద్దేశ్యములు ఒక్కటే,
మన సౌఖ్యములు మరియు మన జాగ్రత్త.
162 దేవుని యొక్క చిన్న కుంటి పిల్లలు, గ్రుడ్డివారు, మెలి తిరిగిన వారి ముందు మనము నిలబడియున్నాము. సువార్త సేవకులారా, మీకు తెలుసా, స్వస్థపర్చుటకు ఏ శక్తి మనకు లేదు, కాని మన గొప్ప ప్రభువైన యేసు ఈ సూచక క్రియలను పంపుచున్నాడు, మిమ్మును బంధించిన దయ్యమును ఖండించుచున్నాడు. మేము దయ్యమును ఖండిస్తున్నాము…?…గ్రుడ్డితనమును మేము గద్దిస్తున్నాము…?…
163 దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తుందని, దేవుడు వారిని పైకి లేపుతాడని, వారు మరలా బాగుపడతారని, నమ్మే విశ్వాసమును దేవుడు వారికి దయచేయును. సర్వశక్తి గల దేవా, యేసుక్రీస్తు నామములో, దానిని దయచేయుము.
164 సోదరులైన మీరు అక్కడ నుండి నడిచి వెళ్ళండి…?…
165 మిగిలిన వారందరూ ప్రార్థనలోయుండండి, సేవకులు కూడా ఇప్పుడు ప్రార్థన చేయుచుండగా, మేము ప్రార్థించి, చేతులను ఉంచుతాము.
166 పరలోకపు తండ్రి…
బయట శ్రోతలలో ప్రార్థనా కార్డు పొందని వారు, ఇప్పుడు ఒకరి మీద ఒకరు చేతులను ఉంచండి. ఒకరి మీద ఒకరు చేతులను ఉంచండి.
167 మా పరలోకపు తండ్రీ, యేసుక్రీస్తు యొక్క ధ్వజము క్రింద, ఈ కూటములను, ఈ ప్రచారమును మేము ముగించుచుండగా, ఆ అభిషేకించబడిన గొప్ప ప్రధాన యాజకుడు, ఇమ్మానుయేలు, నిలబడియున్నాడు, మృతులలో నుండి లేచియున్నాడు, సదాకాలము విజ్ఞాపనలు చేయుటకు జీవించుచున్నాడు; ఆయన గొప్ప సన్నిధి మాతోయున్నది, మన మీదయున్న ఆయన పరిశుద్ధ శక్తి, దర్శనములు చూచునట్లు, ప్రవచించునట్లు, రోగుల మీద చేతులుంచునట్లు చేస్తుంది. తప్పి పోని మాట, ఎన్నడూ నిష్ఫలముగా ఆయన యొద్దకు తిరిగి రాదు. ప్రతి దయ్యపు రోగమును, ప్రతి పాపపు శక్తి ప్రతి అవిశ్వాసమును, యేసుక్రీస్తు నామములో నేను ఖండించుచున్నాను, అది ప్రజల నుండి చెదిరిపోయి, వారు స్వస్థతనొందుదురు గాక.
168 ఏక మనస్సుతో మరియు ఏక హృదయముతో వారు ఏకముగా కూడియుండగా, ప్రభువా, ఈ సేవక సోదరులను, సంఘమంతటిని దీవించుము. ఓ, సర్వశక్తి గల దేవా, ఈ గొప్ప మిడిల్ టౌన్ ఒహియోకు, దీని తరువాత ఒక ఉజ్జీవమును పంపుము, ప్రభువా, అది ఈ ప్రక్క నుండి ఆ ప్రక్కకు ఊడ్చివేస్తూ, ఎముకలు మరియు నరములు గల చర్మము ఏకముగా వచ్చును గాక. దేవుని యొక్క శక్తి, ఒక బలమైన ఊడ్చివేయు ఐక్యమైన సంఘమును, ఒక మాదిరిగల సంఘమును దేశమంతటా దేవుని యొక్క శక్తి లేపును గాక, అదేమనగా ప్రజలు, దేవుని యొక్క శక్తిని చూచుటకు, ఈ పట్టణములోనికి వచ్చుదురు గాక. ప్రభువా, దానిని దయచేయుము. రోగులను, పీడించబడుచున్న వారిని స్వస్థపర్చుము, నశించిన వారిని రక్షించుము, నీ కొరకు మహిమను తెచ్చుకొనుము.
169 దానిని దయచేయుము, ఇక్కడయుంచబడిన చేతి రుమాళ్ళును, పొట్లముల కొరకు నేను ప్రార్థించుచున్నాను, ప్రభువా, మా మీదయున్న పరిశుద్ధాత్ముడు, ఈ కట్టడములో మమ్మును అభిషేకించుచున్నాడు, వారిలో ప్రతి ఒక్కరు బాగుపడుదురు గాక. అది బైబిలులో వ్రాయబడింది, అదేమనగా ఇశ్రాయేలు వారు విధి నిర్వహణ మార్గములోయుండగా, వారి మార్గములో వాగ్దాన భూమికి వెళ్ళుచుండగా, ఎర్ర సముద్రము వారి మార్గములోయున్నది. గ్రంథకర్తలలో ఒకరు చెప్పారు, “దేవుడు అగ్ని స్తంభము గుండా, ఎర్ర సముద్రమును చూడగా, ఎర్ర సముద్రము భయపడి వెనక్కు వెళ్ళిపోయింది, మరియు ఇశ్రాయేలు వాగ్దానము చేయబడిన వాగ్దాన భూమికి వెళ్ళిరి.”
170 అది బైబిలులో ఈలాగు వ్రాయబడింది, “నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఆరోగ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను.” ఈ చేతి రుమాళ్ళు ప్రజల దగ్గరకు వచ్చినపుడు, అక్కడ సాతానుడు వారి ముందు ఎర్ర సముద్రమును ఉంచియుండగా దేవుడు, తన సొంత కుమారుడైన, యేసుక్రీస్తు రక్తము గుండా క్రిందికి చూసి, ఇక్కడకు చేరుకొనలేని వారి ప్రతి రోగమును ఖండించును గాక; దేవుని వాక్యమునకు, దేవుని వాగ్దానమునకు, దేవుని అభిషేకమునకు, వ్యాధి భయపడి దూరముగా వెళ్ళును గాక, మరియు ప్రజలు మంచి ఆరోగ్యము, బలము యొక్క మంచి వాగ్దానములోనికి దాటి వెళ్ళుదురు గాక. ప్రభువా, దానిని దయచేయుము. నీ ప్రియ కుమారుడు, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో, మేము సమస్తమును నీకు అప్పగిస్తున్నాము. ఆమేన్.
171 శ్రోతలారా, మన అందరిని ఎరిగిన వానికి, ఈ లోకములో మనము ఆయన స్వాస్థ్యముగాయుండుటకు మనలను పైకి లేపిన వానికి, ఆయన సంఘములో, మనము తిరిగి కలుసుకొను వరకు, దేవుని యొక్క శ్రేష్ఠమైన దీవెనలు మీ అందరి మీద ఉండును గాక. మన తరువాత కూటము, మనము ఎరిగియున్నట్లుగా, ఆలయములో వుంటుంది, ఆదివారము ఉదయము, ఈస్టర్ ఆదివారము ఉదయము. తరువాత నేను ఇక్కడ నుండి ఇల్లినాయిస్ వెళ్ళుచున్నాను. మీరు దీవించబడుదురు, మీ సంఘములకు హాజరుకండి, ఈ చక్కని సంఘములకు హాజరుకండి, మీ హృదయములు ఒక్కటిగా పట్టుకొనియుండండి. దేవుని యొక్క వాక్యముపై నిలబడండి! ఆయన కొరకు జీవించండి, ఏలయనగా నాశనకరమైన విషయములు మీ ముందు ఉంచబడియున్నవి, దానిని గుర్తుంచుకోండి!
172 మనము తిరిగి కలుసుకొను వరకు, మనము నిలబడి పాడదాము:
నేను ఆయనను ప్రేమిస్తాను, నేను ఆయనను ప్రేమిస్తాను
ఎందుకనగా ఆయన మొదట నన్ను ప్రేమించాడు
నా రక్షణను కొన్నాడు
కల్వరి వృక్షము మీద.
173 ఇప్పుడు, నీ ముందు, వెనుక, నీ ప్రక్కలలో ఎవరితోనైనా కరచాలనము చెయ్యండి.
నేను ఆయనను ప్రేమిస్తాను (ఇప్పుడు ప్రతి ఒక్కరు), నేను ఆయనను ప్రేమిస్తాను
ఎందుకనగా ఆయన మొదట నన్ను ప్రేమించాడు
నా రక్షణను కొన్నాడు
కల్వరి వృక్షము మీద.
174 ఇప్పుడు, మీ చేతులను దేవునికి ఎత్తి, బాగా బిగ్గరగా, ప్రతి ఒక్కరు దానిని మ్రోగించండి.
నేను ఆయనను ప్రేమిస్తాను, నేను ఆయనను ప్రేమిస్తాను
ఎందుకనగా ఆయన మొదట నన్ను ప్రేమించాడు
నా రక్షణను కొన్నాడు
కల్వరి వృక్షము మీద.
175 ఇప్పుడు మన తలలను వంచుదాము.
మనము కలుసుకొను వరకు, మనము కలుసుకొను వరకు,
యేసు’ పాదముల నొద్ద మనము కలుసుకొను వరకు;
గుర్తుంచుకోండి, మనలో అనేకులు అప్పటి వరకు తిరిగి కలుసుకొనరు.
మనము కలుసుకొను వరకు, మనము కలుసుకొను వరకు,
మనము కలుసుకొను వరకు దేవుడు మీతోయుండును గాక.
176 ఇప్పుడు ఆలపించండి. [సహోదరుడు బ్రాన్హాం ఆలపిస్తున్నారు—సంపా.] మీ కాపరి.