నిజమైన ఈష్టరు ముద్ర

నిజమైన ఈష్టరు ముద్ర

vgr count -176 1ఈ ఉదాయన అతి ఉత్తమమైన కూడికను మనము కలిగియుంటిమి, వేకువ సూర్యోదయ కూడిక, ఈ ఉదయకాలపు ఈష్టరు కూడిక మీద సోదరుడు నెవిల్ అతి అసాధారణమైన వర్తమానమును ఇచ్చియున్నాడు.

మరియు ఇప్పుడు బయట నిలబడివుండుట అది చాలా కష్టముగా ఉన్నదని నాకు తెలియును. ఇక్కడ మనము కూర్చొని ఉన్న స్థలము యొక్క సామర్ధ్యము చాలా చిన్నది. వెనుక ఉన్న బాప్తిస్మపు తొట్టి దగ్గర దానిని తెరచి ప్రజలను ఉంచగలమా అని వారు నన్ను అడిగారు, "నేను అన్నాను అది వారికి మంచి స్థలమైయున్నది," అది వారికి ఒక చాలా మంచిస్థలమై యున్నది. ఇప్పుడు కొన్ని క్షణములలో వారు ఆ తెరలను వారు క్రిందికి లాగి దానిని చేయబోవుచున్నారు. అప్పుడు వారు దాని అంచు చుట్టూ నిలబడబోవుచున్నారు. వారు ఎలా నిలబడుతారో లేదో నాకు తెలియదు, అది పూర్తిగా నీళ్ళతో ఉండుటను నేను చూస్తాను, కాబట్టి వారు ఆ బోర్డుకి దగ్గరలో చక్కగా నిలబడవలసి ఉన్నది. అయితే ఇప్పుడు దానిలో కొంత వరకు వారు దానిని సిద్ధపరచుటకు చూస్తాను. కాబట్టి బహుశా కొన్ని క్షణాలలో వారు దానిని పైకి తెరుస్తారు.

2ఇప్పుడు, ఈష్టరు మన అందరికి ఒక గొప్ప దినమైయున్నది మనము ఈష్టరును ఎంతగానో ప్రేమిస్తాము. మరియు ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి మిమ్మలను దీర్ఘకాలము మేము ఇక్కడ ఉంచబోవుటకు ప్రయత్నించుట లేదు.

అయితే ఒకటి రెండు ప్రకటనలను నేను చేయగోరుచున్నాను, ఈ టౌను బయటి నుండి వచ్చిన ప్రజలు తెలుసుకోవలసినది ఏమనగా మన కూటములు వచ్చే ఆదివారము నుండి ప్రారంభం అవుతాయి. అక్కడ ఇల్లినోయిస్, బూమింగ్-టన్ లో మొథడిస్ట్ కాలేజ్ మైదానముల వద్ద వారు దానిని ప్రారంభిస్తారు. మరియు వారు అలా ఆదివారము నుండి ఆదివారము వరకు కూటములు జరుపుతూ కొనసాగుతారు. తరువాత అక్కడ సేవకుల అల్పాహార విందు ఉంటుంది. తరువాత ఒక ఉదయమున నేను ఆ కాలేజ్ వద్ద ఒక యవ్వనస్థుల గుంపుతో మాట్లాడవలసి యున్నది… ఆ తరువాత అక్కడ అల్పాహార విందు ఉన్నదని నాకు తెలుసు.

3అప్పుడు ఆదివారము తరువాత వెను వెంటనే. అది 23వ తారీఖు నుండి చివరి ఆదివారము వరకు లేక అది ఏమైయున్నది? (సోదరుడా అక్కడే ఒక చీటి ఉంచబడియున్నదని సోదరుడు నెవిల్ చెప్పుచున్నారు - ఎడిటర్) ఓ, అవును. సరే, అప్పుడు అది ఇది వరకే బయటకు ఇవ్వబడినది, దానిని గూర్చి వారికి తెలుసు. ["నేను దానిని ప్రకటించియున్నాను."] అవునండి, అది చక్కగా, మంచిగా ఉన్నది. చికాగోలో గత రాత్రి లెన్టెక్ ఆడిటోరియమును వారు పొందలేకపోయి వున్నారని నాకు అర్థమయ్యింది. కాబట్టి అది లెన్టెకో నుండి కొన్ని నిమిషములు ప్రయాణం కలిగిన మరొక ఆడిటోరియమై ఉన్నది. అక్కడ మరొక ఆడిటోరియం ఉన్నదని నేను గ్రహించి యున్నాను. అక్కడ కూడిక ఎక్కడ జరగబోవుచున్నదో బహుశ కొన్ని సూచనలను అక్కడ వారు మీ కొరకు ఉంచబోవుచున్నారు.

తరువాత మేము బ్రిటిషు కొలంబియా వెళతాము. మరియు దాని తరువాత జూలై 1వ నుండి 4వ వరకు ప్లారిడాలోని, మియామిలో ఉంటాము.

4కాబట్టి అది రానున్నట్లయితే అది పెద్ద గుడారపు కూటముగా ఉండబోవుచున్నదని నేను ఆశ్చర్యపోతాను. ఆ కూటము కొరకు ముఖ్య పట్టణమైన వాషింగ్టన్ డి.సి. నొద్ద వున్న వారందరు నిజముగా అక్కడ ఉండవలెనని నేను కోరుచున్నాను: అది నా యొక్క మొదటి గుడారపు కూటముగా నుంటుంది. మీకు తెలుసా, ఆ చిన్న స్థలములో ఆ కూటము నొద్ద ఆయన కలుసుకుంటాడని ప్రభువు నాకు వాగ్దానం చేసియున్నాడు. మరియు ఇప్పుడే వారు దానిని గూర్చి ప్రణాళిక వేయుచున్నారు, ఆ కూడిక జరిగించుటకు మేము అక్కడ మాట్లాడుటకు ఒక గుడారమును వేయుటయా లేక ఒక కన్వెన్సన్ హాలును తీసుకొనుటయా అను విషయము మీద వారు మిమ్మలను మరియు అక్కడ వ్యాపారస్తులను పిలిచి చెప్పియున్నారు. "పెద్ద గుడారము, అని అతడు చెప్పిన వెంటనే బహుశ కూటము ఎక్కడ ఉండబోవుచున్నదో, అది ఒక విధముగా ముఖ్య పట్టణము నొద్ద కూడా చేయవలసియున్నది. కాబట్టి అది ఎంతో, ఎంతో చక్కగా ఉన్నది. కాబట్టి దానిని గూర్చి మనము చూస్తాము, మరియు అప్పుడు కొంచెం సమయం తరువాత పరిశుద్ధాత్ముడు మమ్ములను నడిపించుటను మీకు చెప్పుతాము.

MATT 19:14•

MARK 10:14•

LUKE 18:16

 

5ఇప్పుడు బయట పట్టణం నుండి ప్రతిష్టించబడుటకు తీసుకొనబడిన కొంత మంది చిన్నపిల్లలను వారు కలిగియున్నారని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు ఇది. చాలా మంది వారిని చిలకరిస్తారు, ఆవిధంగా చేస్తారు, అది పరిపూర్ణంగా సరియే. దాని మీద నాకు ఏమియు వ్యతిరేఖత లేదు. ఏమైనప్పటికి చిన్న పిల్లలను లేక పెద్దవారిని చిలకరించుట అనేది లేఖనాను సారమైనది కాదు. చిలకరించుట అనేది కేవలం ఒక సంఘ ఆచారసంబంధమైన కేథలిక్ సంఘము మొదటిగా దత్తత చేసుకున్న విషయమై యున్నది, మరియు తరువాత క్రిందకు ప్రొటెస్టెంట్ వారికి అది అప్పగించబడియున్నది. అయితే పెద్దవారిని గాని లేక చిన్నవారినిగాని చిలకరించుట అనునది అక్కడ లేఖనానుసారమైనది కాదు. ఆ కారణమును బట్టి మనము ఉండవలసిన అంతా సరిగ్గా, దగ్గరగా, లేఖనముతోనే తిన్నగా మనము నిలిచి ఉండవలసియున్నది.

బైబిల్లో వారు చిన్న పిల్లలను ప్రభువు నొద్దకు తెచ్చియున్నారు, ఆయన వారిని పైకెత్తుకొని తన చేతుల్లోకి తీసుకుని వారిని ఆశీర్వదించి ఇలా అన్నారు, "చిన్న పిల్లలను నా యొద్దకు రాకుండా ఆటంకపరచకుడి." ఇప్పుడు ప్రభువు యొక్క ఆజ్ఞలను ఆ మార్గములోనే వెంబడిస్తు, దానినే చేయుటకు మనము ఇప్పుడు ప్రయత్నించుచున్నాము. మరియు ఇప్పుడు సంఘ పెద్దలను ఇక్కడకు తోడుకొని వచ్చి వారి చుట్టు నిలబడి చిన్నపిల్లలను ప్రభువునకు ప్రతిష్టించుచున్నాము.

"వారిని లోనికి తెండి అను పాటను మన పియానో వాయించు వ్యక్తి దానిని వాయించితే బాగుంటుంది. మంచిది తల్లులు ఆ చిన్న బిడ్డలతో ముందుకు వచ్చి ముందు నిలబడండి. సోదరుడు నెవిల్ మరియు కొందరు పెద్దలు నాతో నిలబడుటకు ఇష్టపడినట్లయితే చిన్నపిల్లలను మనము ప్రభువునకు ప్రతిష్టిద్దాము.

వారిని లోనికి తెండి, వారిని లోనికి తెండి,

పాపపు పొలములలో నుండి వారిని లోనికి తెండి;

వారిని లోనికి తెండి, వారిని లోనికి తెండి,

చిన్న వారిని యేసు నొద్దకు తెండి.

6ఇప్పుడు ఈ విధముగా తల్లులు వారి చిన్నపిల్లలను ప్రభువుకు ప్రతిష్ఠ చేయుచున్నారు. మరియు ఈ ఈష్టరు ఉదయమున ఒక బాప్తిస్మము లేక ఒక ప్రతిష్ఠ ఆరాధన ఎలాంటి ఒక అద్భుతమైన సంగతో, ఈ పునరుత్థాన మరియు పెందలకడ సమయంలో ఇది ఎలాంటి అద్భుతమైన సంగతియే. మిగిలిన వారు దానిని ప్రారంభించుచుండగా దానిని మనము ప్రారంభిద్దాం.

వారిని లోనికి తెండి, వారిని లోనికి తెండి,

పాపపు పొలములోనుండి వారిని లోనికి తెండి;

వారిని లోనికి తెండి, వారిని లోనికి తెండి,

చిన్నవారిని యేసునొద్దకు తెండి.

7ఇప్పుడు స్నేహితులారా ప్రతి చిన్న బిడ్డ ఈ లోకములో ఎంత చక్కగా ఉన్నాడు అది నాకు తెలుసు. దాన్ని గూర్చి ఏమైన చెప్పుటకంటే దాన్ని గూర్చి నాకు బాగా తెలుసు. అది మంచిది. మరియు అలాంటి భావననే మీరు తప్పక కలిగియుండవలసియున్నది. వారిని పెంచవలసినది బాధ్యతతో.

వారు దేవుని చేత మీకు ఇవ్వబడిన చిన్న సంపదలై యున్నారు. నేను ఎల్లప్పుడు ఒక విధమైన సామెత తల్లలతో చెప్పుచూ ఉంటాను. మనకు తెలుసు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు (గ్రంధంలో) వ్రాయబడినాయి. అయితే అక్కడ వ్రాయబడని అయిదవ సువార్త వున్నది, అదే తల్లి ఆమె మత్తయి, మార్కు లూకా, యోహాను యొద్దకు తెచ్చినపుడు వారు ఉపదేశము వారిని పట్టుకుంటుంది. కాబట్టి దేవుని రాజ్యం కొరకు ఈ పిల్లలను పెంచవలసిన భాధ్యత, తల్లలు మరియు తండ్రులైన మీపై పెట్టబడినది. మరియు అదియే మీ హృదయ వాంఛయైవున్నదని నా నమ్మకం.

8ప్రార్ధనలో మనము వారిని దేవునికి ఎత్తిపట్టుకొని మీ చిన్న బిడ్డలను క్రీస్తుకు ప్రతిష్టిద్దాము. నేను మరియు పెద్దలు ముందుకు వస్తాము. మీరు కేవలము వారి పేరును మాకు ఇవ్వండి. ఇప్పుడు ఒక విధముగా ఈ కార్యము చేయునపుడు, నా భార్య నా మీద కొంచెము అసూయపడుతుందని నాకు తెలుసు.

లీసా అన్ మిశ్చెల్. ఒ! లీసా అన్ మిశ్చెల్ ప్రతిఒక్కరి హృదయంలో ఒకనిధిగా ఉంటుంది. మనము తలలు వంచుదుము, పరలోకపు తండ్రీ, నీ సేవకులముగా, ప్రభువైన యేసు నామములో ఈ చిన్న అన్ మిశ్చెల్ ను నీకు ఎత్తి పట్టుచున్నాము. దేవుని రాజ్యము కొరకు ఆమె జీవితమును ప్రతిష్టించుచూ నీదని చెప్పుచున్నాము. ఆమె ఎదిగి దేవుని రాజ్యము కొరకు ఒక అద్భుతమైన వ్యక్తిగా జీవించును గాక. దీనిని మేము చేయుచున్నాము, ఏలయనగా ప్రభువు ద్వారా మేము ఆజ్ఞాపించబడియున్నాము, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. (ప్రభువు మిమ్మను దీవించును.)

MATT 19:14•

MARK 10:14•

LUKE 18:16

 

9హెచ్.ఎ…. ఇ.జె. జూనియర్, ఎ.జె. జూనియర్, అతడు ఒక చిన్న కునుకు తీయుచుండగా, కాబట్టి మన తలలు వంచుదాము. మా పరలోకపు తండ్రీ, ఈ చిన్నవాడిని మేము నీకు ఎత్తిపట్టుచున్నాము, యేసు రాకడ ఆలశ్యమైనట్లైతే, అతని నుండి ఒక గొప్ప దేవుని సేవకుని మీరు తయారుచేయమని మేము ప్రార్ధన చేయుచున్నాము. తల్లి అతనిని నీకిచ్చుచున్నది. మరియు ప్రభువైన యేసు నామములో నీకు బహుమానముగా అతనిని ఇచ్చుచున్నాము, అతనిని మరియు అతని గృహమును దీవించుము. మనము యేసు క్రీస్తుకు అతనిని ప్రతిష్టించుచుండగా, దేవుని మహిమ కొరకు అతడు పెంచబడును గాక. ఆమెన్.

సహోదరి, ప్రభువు నిన్ను దీవించును గాక. ఆ పనిలో నేను ఒక విధముగా జాగ్రత్తగాయంటాను, ఏలయనగా నేను వారిని గాయపర్చుతానేమోనని నేను ఎల్లప్పుడు భయపడతాను.

10ఇప్పుడు, నన్ను తీసుకోనివ్వండి. ఇది చిన్న బిడ్డ! పేరు ఏమిటి? దెబోరా మైయర్స్. చిన్న దెబోరా మైయర్స్. ఈ ఉదయమున ఆమె ప్రకాశమానమైన కన్నులను కలిగియున్నది. మన తలలను వంచుదాము. పరలోకపు తండ్రీ, ఈ చిన్న దెబోరా మైయర్స్ ను మేము నీ యొద్దకు తెచ్చుచున్నాము. తల్లి మరియు ఆమె తండ్రి బహుమానముగా వారిని ఇక్కడ హాజరుపర్చుచుండగా, ప్రభువుకు మేము ఆమెను ప్రతిష్టించుచుండగా, ఆ బిడ్డపై మీ దీవెనలను ఉంచండి, మరియు మన ప్రభువైన యేసునకు జ్ఞాపక చిహ్నంగా, ఆయన చిన్నవారిని గూర్చి ఇలా అన్నాడు. "చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి, ఈ చిన్న దెబోరా జీవితమును నీ సేవ కొరకు ఇచ్చుచున్నాము, యేసుక్రీస్తు నామములో. ఆమెన్.

11ఇప్పుడు, ఈ ఇతర చిన్నపిల్లలు ఎవరు? అయ్యా, మంచిది. ఇప్పుడు ఈ చిన్నబిడ్డ, శారా రూతు, చిన్న శారా రూతు వీలర్. వీలన్… వీలర్. మా పరలోకపు తండ్రి, ఇప్పుడు ప్రతిష్టించబడుటకు మా చేతులలోనికి ఇవ్వబడియున్న ఈ చిన్న ప్రియమైన బిడ్డను మేము నీకిచ్చుచున్నాము. మరియు మేము మా శరీరములను మరియు మా హృదయములను వంచి నిలబడి, నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము, మరియు నీ సేవకొరకైన జీవితముగా, ఆమె జీవితమును దీవించుమని ప్రార్ధన చేయుచున్నాము. యేసుక్రీస్తు నామములో మేము ఆమెను నీకు ఇచ్చుచున్నాము. ఆమెన్.

12దేవుడు నిన్ను దీవించును. అది అంతయూ సమాప్తమై యున్నది. "ఏమైనా యున్నదా," అని చెప్పి వెనుకకు చూచియున్నట్లుగా నాకు యున్నది. అక్కడ ఒక తియ్యని చిన్న బాలిక యున్నది. ఇప్పుడు, నీ పేరు ఏమిటి? మీకా అంగ్రెన్ ఎంత తియ్యని పాప ఈ పాప. నీవు ఎలాయున్నావు? ఆమె సమృద్ధిగా యున్నది. ఇక్కడ ఏమి జరగుచున్నదో ఆమె తెలిసికొనగోరుచున్నది. మన తలలను వంచుదాము. మా పరలోకపు తండ్రీ, ఈ ఈష్టరు ఉదయమున చిన్న బిడ్డలను నీ యొద్దకు తెస్తూ, ఈ ప్రియమైన చిన్నబిడ్డను మేము నీకు ఇచ్చుచున్నాము. ప్రభువైన యేసు సేవకు ఈమెను మేము ప్రతిష్టించుచున్నాము. ప్రభువు యొక్క రాకడ వరకు దీర్ఘకాలము జీవించుటకు అది సాధ్యమైతే ఆమెకు సహాయం చేయుము. మరియు ఆమెను యేసు క్రీస్తు నామములో నీకు మేము ప్రతిష్టించుచుండగా, ఆమె నీకు ఒక పరిచర్య చేయు దానిగా తయారు చేయుము. ఆమెన్

13అతని పేరు ఏమిటి? ఓ, మెలి౦దా, చిన్న మెలిందా అంగ్రెన్. వారు ఈ విధముగా నిన్ను చూడగోరుచున్నారు. మెలిందా నీవు-నీవు చక్కగా యున్నావు. మై, మన తలలను వంచుదాము. తండ్రివైన దేవా, ఈ చిన్న పాపను మేము నీకు ఇచ్చుచున్నాము, ప్రభువైన యేసు క్రీస్తు నామములో. ఆమె జీవితమును నీ కొరకు సేవ చేయు జీవితముగా, ఆమె జీవితమును మేము మీకు ప్రతిష్ఠ చేయుచున్నాము. ప్రభువా, ఆమె జీవితమును కాపాడి, ఆమె దేనిని చేయుటకు జన్మించి యున్నదో, నీకు సేవచేయు ఒక పనికత్తెలలో ఒకతెగా ఆమెను చేసుకొమ్మని మేము నీకు ప్రార్ధన చేయుచున్నాము. యేసు క్రీస్తులో మేము ఆమెను నీకు ఇచ్చుచూ నీకు ప్రతిష్టించుచున్నాము. ఆమెన్.

14ఈ చక్కని చిన్న బాలికలందరూ. మనము ఇప్పుడు చూద్దాము… ఇది, ఓ, ఇక్కడ, ఈ బిడ్డయే. నీవు ఎలా యున్నావు? ఈ ఉదయమున నీవు ఎలాయున్నావు? ఇప్పుడు ఆమె పేరు ఏమిటి? జేన్. జమీ లైన్ డాల్టన్. మా పరలోకపు తండ్రీ, ఈ తియ్యని చిన్న బాలికను మేము నీ యొద్దకు తెచ్చుచున్నాము, మరియు మీరు ఆమెను దీవించమని ప్రార్ధన చేయుచున్నాము. ప్రభువా, ఈ చిన్నపిల్లల యొక్క గృహములను దీవించమని మేము నిన్ను అడుగుచున్నాము. వారు దేవుని యొక్క భయభక్తులలో పెంచబడి నీకు ఒక సేవచేయుటకు వారు పెంచబడుదురు గాక. దేవునికి మేము ఆమెను ఇచ్చుచుండగా, ఈ చిన్న ప్రియమైన దానిని మేము నీకు ఇచ్చుచున్నాము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమెన్. (మీ చిన్న బిడ్డ ఎవరు…?.)

15నీవు ఎలా యున్నావు? మంచిది, ఇప్పుడు, మీరు దరిదాపుగా నన్ను ఆపివేసియున్నారు. మీరు ఆపలేదా? మై, మై, ఆమె పేరు ఏమిటి? థెరిస్సా లేబర్ట్ ఇటు చూడు, థెరిస్సా. ఆమె ఒక చిన్న చక్కనిది కాదా? వీరందరూ చక్కని బిడ్డలైయున్నారు. మా పరలోకపు తండ్రి, ఆమెను ప్రేమించిన ప్రియలు ఆమెను మాకు హాజరుపర్చినందున, ఈ చక్కని చిన్న బాలికను మేము నీకు ఇచ్చుచున్నాము. మేము ఈ బిడ్డను నీకొరకు పట్టుకొనియుండగా, దేవుని యొక్క సేవకొరకు ఆమె జీవితమును మేము సమర్పించుచున్నాము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఆమెను దేవుని సేవకు మేము ప్రతిష్టించుచున్నాము. ఆమెన్.

16సహోదరీ, ప్రభువు మిమ్మలను దీవించును గాక, మనము ప్రార్ధన చేయుచుండగా, ప్రభువు మీ చిన్నవారిని దీవించునుగాక.

చిన్న నీలిరంగు కన్నులు, మరియు గోధుమరంగులో యున్నపిల్లలు. ఆమె పేరు ఏమిటి? సింతియా, చిన్న సింతియా. ఇటు చూడు, చింతియా, ఆ చక్కని చిన్న కన్నులు. మా పరలోకపు తండ్రి, ఈ ఉదయమున ఈ చిన్న బాలికను మేము నీకు ఇచ్చుచున్నాము. ఆమె దీర్ఘకాలము జీవించును గాక. మరియు ఆమె నీ పనికత్తిగా యుండును గాక. ఈ ప్రియలు ఆమెను ప్రతిష్ఠ చేయుటకు నా చేతులలో యుంచి యున్నారు, నేను పెద్దల ముందుకు ఆమెను తెచ్చుచున్నాను, మరియు దేవుని సేవ కొరకు ఆమెను ప్రతిష్ఠ చేయుచూ, ఆమెను దేవుని ముందుకు తెచ్చుచున్నాను, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమెన్.

17ఇప్పుడు, ఇది కూడా ఒక చిన్న బిడ్డయైయున్నాడు. ఇప్పుడు, మెడా, నీవు తప్పక ఇక్కడకు వచ్చి ఆ బిడ్డను పట్టుకొనవలసియున్నది. నేను ఆ చిన్నబిడ్డలను పడవేస్తానని నేను ఎల్లప్పుడు భయపడతాను. జేమ్స్ జేమ్స్ బ్లిస్. అతడు ఒక బలిష్టుడైన బలముగా చూచుచున్న ఒక చిన్న బిడ్డ, అతడు అలా లేడా? అది అంతే. మా పరలోకపు తండ్రీ, ఈ చిన్న జేమ్స్ ను మేము నీకు ఇచ్చుచున్నాము. బైబిలులో నుండి అతని పేరు వచ్చియున్నట్లుగా అతడు ఉండును గాక, సందేహము లేదు, అతడు ప్రభువు యొక్క సేవలో సలహా ఇచ్చుటలో జ్ఞానమును కనపరచియున్నాడు. నీవు అతనిని దీవించుమని, నీ కొరకు సేవ చేయు జీవితమునిమ్మని ప్రార్ధన చేయుచున్నాను. అతని గృహమును దీవించుము, మరియు అతడు దేవుని యొక్క భయభక్తులలో పెంచబడును గాక, మేము దేవుని సేవకు అతనిని ప్రతిష్టించుచుండగా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను, ఆమెన్.

18ఈ చిన్న పాప యొక్క పేరు ఏమిటి? హనీ, ప్రియమైనదానా, ఇక్కడకు రమ్మ టేమీ బ్రౌన్. ఓ, చిన్న టేమీ బ్రౌన్. ఆమె తల్లి మరియు తండ్రి ఈ ఉదయమున బాప్తిస్మమును పొందియున్నారు. మరొక చక్కని చిన్న బాలిక. మన తలలను వంచుదాము. నీ యొద్దకు ఈ చిన్నబిడ్డను మేము తెచ్చుచున్నాము. తల్లులు తమ బిడ్డలను నీ యొద్దకు తెచ్చినపుడు, అది ఒక రకముగా ఈ రీతిగా యుంటుందని నేను ఊహిస్తాను, నీవు నీ భూసంబంధమైన ప్రయాణములో యున్నప్పుడు. ప్రభువా, ఆమెను నీకు మేము ప్రతిష్టించుచున్నాను. నేను తెలుసుకొన్నట్లుగా, ఆమె తండ్రి మరియు తల్లి ఈ ఉదయమును ప్రభువైన యేసు ప్రశస్తమైన నామములో బాప్తిస్మమును పొందియున్నారు. అప్పుడు ఆమె గృహము సరిగా యుంటుంది. యేసుక్రీస్తు నామములో, ఆమె పరిచర్య జీవితమును ఆయన సేవ కొరకు దేవునికి ప్రతిష్టించుచుండగా ఆమెను దీవించుము. ఆమెన్.

19మీకు వందనములు. ఓ, వేచియుండండి. నన్ను మన్నించండి. నేను దీనిని చూడలేదు. నీవు ఎలావున్నావు? మంచిది, ఎలాంటి చక్కని మనిషి? నేను సహాయపడగలనా? మీరు? మంచిది. పేరు ఏమిటి? డానీ జాన్సన్. డానీ విలయం జాన్సన్. ఓ, మై, ఒక బోధకుని వలె సహితము అతడు కనబడుచున్నాడు, అతడు కనబడుట లేదా? పరలోకపు తండ్రీ, ఈ చిన్నపిల్లవాడిని మేము నీయొద్దకు తెచ్చుచున్నాము. బహుశ ఇదంతా ఏమిటో ఎరుగుటకు అతడు ఎంతో చిన్నవాడైయున్నాడు. అయితే పరలోకములో అక్కడ ఒక దేవుడు యున్నాడు మరియు ఆయన దీనిని చూచుచూ ఎరిగియున్నాడు. ప్రభువా, తల్లి అతడిని మా చేతులలో ఉంచియుండగా, అతడిని మేము నీకు ఇచ్చుచున్నాము. విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు నామములో మేము వచ్చుచున్నాము, మరియు దేవుని కృపకు ఒక బహుమానముగా అతనిని గూర్చి మేము చెప్పుచూ, యేసుక్రీస్తు నామములో అతనిని దేవునికి ప్రతిష్టించుచున్నాము. ఆమెన్. ప్రియమైనవాడా, నిన్ను దీవించుచున్నాను.

20మనము తీసుకొన్నామా… లేదు. ఎలాంటి చక్కని బాలిక ఇక్కడకు వచ్చుచున్నది. ఎంతో చక్కని దుస్తులను, చిన్న టోపీని నీవు ధరించియున్నావు. ఎట్లర్? ఎడ్లర్ ఎలెన్ గైల్ ఎడ్లర్ ఎలాంటి చక్కని చిన్న బాలిక. మా పరలోకపు తండ్రి, ఈ లోకములోనికి వచ్చిన, ఈ ఇంటి యొక్క సంపదయైన ఈ చిన్న బాలికను నేను నీకు ఎత్తి పట్టుచున్నాను. మేము జీవించుచున్న ఈ దుష్ట ఘడియను ఎరిగినవారై, నీ సేవార్థమై ఆమెను ప్రతిష్టించుటకు ఆమె ప్రియలు ఆమెను ముందుకు తెచ్చియున్నారు. దేవునికి ఒక బహుమానముగా ఆ చిన్నబిడ్డ జీవితమును మేము చెప్పుచున్నాము. యేసుక్రీస్తు నామములో దేవుని సేవకు మేము ఆమెను ప్రతిష్టించుచున్నాము, దేవుని కుమారుని నామములో, ఆమెన్. ప్రియమైనదానా, నిన్ను దీవించుచున్నాను.

21ఇక్కడ ఒక చిన్న బాల బోధకుడు యున్నాడు, వారిలో కొందరున్నారు. వారు కవలలా? 5 గురు మరియు 8 మంది. ఈ బిడ్డ పేరు ఏమిటి? జానీ, రిచ్మండ్, వర్జీనియాలోని రిచ్మండ్ మన మధ్య ప్రభువు హాజరైయుండగా మనము ఒక ఇంటర్వూను కలిగియున్నాము, నీ ముఖము నాకు గుర్తున్నది. నీ ముఖమును నేనెరుగుదును, నాకు గుర్తున్నది, మరియు నీవు ఎవరైయున్నది, నేను గుర్తుపట్టలేకపోవుచున్నాను. మంచిది. సరే, సరైన గృహములోనికి ఆయన వస్తాడని మనకు తెలుసు. అతని పేరు జాన్. జానీ. మా పరలోకపుతండ్రీ, ఈ చిన్న బాలుడైన జానీని మేము నీ యొద్దకు తెచ్చుచున్నాము. మరియు మా చేతులను మేము అతనిపై యుంచుచున్నాము. కారణము నీవు దానిని ఆ విధముగానే చేసియున్నావు. నీవు వారిపై చేతులను ఉంచియున్నావు. మరియు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో అతనిని మేము దీవిస్తూ అతని జీవితమును దేవుని యొక్క కృపకు ఒక బహుమానముగా, దేవుని యొక్క సేవకు మేము ప్రతిష్టించుచున్నాము. ఆమెన్. చిన్న బాలుడా, నిన్ను దీవించుచున్నాను.

1SAM 1:9-11,23•

1SAM 3:20

 

22లూయిస్. ఈ బాలుడు లూయిస్, పరలోకపు తండ్రీ, లూయిస్ అను ఈ చిన్న బాలుని మేము నీ యొద్దకు తెచ్చుచున్నాము. దేవుని యొక్క ఇంటిలోనికి ఆయన సేవకు ప్రతిష్టించుటకు తండ్రి అతనిని ముందుకు తెచ్చుచున్నాడు. గడచిన దినములను మేము తలపోయుచుండగా, హన్నా దేవుని ఆలయములోనికి వెళ్ళి ప్రార్ధనచేసియున్నది, మరియు దేవుడు ఆమెకు ఒక బాలుని ఇచ్చియున్నాడు. మరియు ఆమె ఆ బాలుని తిరిగి తీసుకొనివచ్చి దేవునికి ఇచ్చియున్నది. ఈ దినమున ఈ ప్రజలు దానినే చూచు చున్నారు, వారి యొక్క చిన్నవారిని, వారి చిన్న సంపదలను లోనికి తెచ్చి ప్రతిష్టించుచున్నారు. మరియు ప్రవక్త వారిని తీసుకొనియున్నాడు. తండ్రి, ఆ బిడ్డ పెంచబడిన తరువాత, ఒక ప్రవక్త అయ్యాడు. ఇప్పుడు, యేసుక్రీస్తు నామములో సర్వశక్తిగల దేవుని సేవకు ఈ ఉదయమున ఈ చిన్న లూయిస్ ను ప్రతిష్ఠ చేయుచున్నాము. కుమారుడా, దేవుడు నిన్ను దీవించును.

నిశ్చయముగా ఈ ఉదయమున వర్జీనియాలోని రిచ్మండ్ నుండి వచ్చిన మిమ్మలను చూచుట చాలా మంచిగా యున్నది. దేవుడు మిమ్మను దీవించునుగాక.

23ఇప్పుడు మనము చూద్దాము, అదేనా? మంచిది. ఓ, అది ఆ చిన్న పిల్లలు. నీకు తెలియదు. మనము ఈ ఉదయమున అనేక మంది మిషనరీలను మరియు భోధకులను ప్రతిష్టించియున్నాము, మనకు తెలియదు. అది అంతయూ సర్వశక్తిగల దేవుని హస్తములలో యున్నది.

ఈ రాత్రికి ఆలయములో కూటమును నేను ప్రకటన చేయుచున్నాను. ప్రభు రాత్రి భోజనము వుంటుంది. మరియు మీరు మా యొక్క ప్రభురాత్రి భోజనమునకు ఎన్నడునూ హాజరు కానటైతే, మేము పాదములు కడుగుటను కూడా ఆచరిస్తాము.

24ఇప్పుడు, నేను ప్రార్ధన చేయుట కొరకు ఇక్కడ కొన్ని చేతి రుమాళ్ళు ఉంచబడియున్నవి. ఒకటి మన ఆలయములోని మన సోదరుడు గ్రిమ్స్-లీకి చెందియున్నది. ఇవి అన్నియు ఎవరివో నాకు తెలియదు. మేము వందల కొలదిగా వందల చేతి రుమాళ్ళను మేము ప్రపంచమంతటా బయటకు పంపుచున్నాము. మరియు ఇప్పుడు, నేను రోగుల కొరకు ప్రార్థన చేయుట ప్రారంభించిన తరువాత, నేను వాటి కొరకు ప్రార్ధన చేస్తాను.

ఈష్టరు వర్తమానమును కొంచెం కొనసాగింపుగా మొదటగా నేను కొంచెం మాట్లాడ గోరుచున్నాను. మరియు ఇప్పుడు, దేవుని వాక్యమును సమీపించుటకు ముందు ప్రార్ధన ద్వారా ఆయనను మనం సమీపిద్దాము.

MATT 28:6,7

 

25మా పరలోకపు తండ్రి, ఈ ఉదయమున, ఈ మహిమకరమైన ఉదయమును బట్టి మన హృదయములలో మనం కృతజ్ఞతను కలిగి యుందాము. మరియు వాటన్నిటి కంటే పైగా దీనికి ప్రాతినిధ్యం వహించుచున్న మన మతము యొక్క ముద్రించబడిన మరియు పునరుత్థానమును బట్టి, 2000 సంవత్సరముల క్రింతం యేసుక్రీస్తు మృతులలో నుండి లేచి, శాశ్వతముగా తన సంఘమునకు సజీవునిగా తన్నుతాను ప్రాతినిధ్యం వహించుకొనుటను బట్టి, తన్నుతాను హాజరుపరుచుకొనుటను బట్టి మేము నీకెంతో కృతజ్ఞలమైయున్నాము. 2000 సంవత్సరముల తర్వాత మనం ఇంకను పునరుత్థానుడైన క్రీస్తు యొక్క శిష్యులతో సహవాసము చేసి ఆనందించుటకు మనమెంతగానో సంతోషించుచున్నాము.

ఈ ఉదయమున ఈ భవనంలో రక్షించబడని ప్రతి వ్యక్తి సహితము ఆయనను వారి యొక్క స్వరక్షకుడిగా అంగీకరించే వరకు ఆయన సన్నిధి యొక్క స్పర్శ ఈ కట్టడంలో ఎంతగానో ఉండవలెనని మేము ప్రార్ధించుచున్నాము. మరియు ఆయన యొక్క ఆత్మతో నింపబడని వారందరి పట్ల పరిశుద్ధాత్మడు తన యొక్క ముగింపు పనిని చేయుటకు అది ఈ దినమైయుండును గాక, ఆయన రోగులను బాగుచేసిన తన గొప్ప ప్రాయశ్చిత్త బలితో ప్రజలకు ఎంతో దగ్గరగా ఆయన రావలెనని ప్రార్ధించుచున్నాము. మరియు ప్రభువా, అవిశ్వాసంపై విశ్వాసము ఆధిపత్యం వహించి తద్వారా రోగులు పీడించబడుచున్న వారు, స్వస్థపడి, శుద్ధినొంది ఇక్కడ నుండి వెళ్ళదురుగాక.

JOHN 17:17•

EPH 6:13-17

 

26ప్రభువా, ఇప్పుడు, నీ పునరుత్థాన వాక్యమును వివరించుచున్న వానిని దీవించమని మేమడుగుచున్నాము. దేవా, ప్రతీచోట ఉన్న నీసేవకులందర్నీ, నీ పిల్లలందర్నీ ఈ దేశమంతటిలో ఉన్న పరిచారకులందరినీ, ప్రపంచమంతటిలోని సేవకులను దీవించుము.

ప్రభువైన యేసు త్వరగా రమ్మ, ఏలయనగా గాలిలో మేఘములు తేలియాడుచున్నవి, ప్రభువా, మరియు అక్కడ పైకి వెళ్ళుచున్న ఒక గొప్ప కార్యమున్నదని మాకు తెలుసు. నీ ప్రజల యొక్క నడుము కట్టండి. ఓ, వారు సత్యమను వాక్య ఖడ్గమును తీసుకొని, సర్వాంగ కవచమును ధరించి శిరస్రాణమును పెట్టుకొని, సువార్తతో తమ్మును తాము కదము తొక్కు బూట్లను ధరింపజేసుకొని, మరియు వీటన్నిటికి పైగా విశ్వాసమను కవచమును ధరించి ముందుకు సాగిపోవుదురు గాక.

ప్రభువా దాన్ని దయచేయుము, ఏలయనగా యుద్ధ మేఘాలు క్రిందికి వ్రేలాడుచున్నవి. ఈ రోజు ఇప్పుడు మమ్ము దీవించుము, ఏలయనగా మేమెరిగినంత వరకు అతి త్వరగా మేము యేసుని చూస్తాము. ఆ ఘడియ వచ్చినప్పుడు మేము సిద్ధమై వెళ్ళిపోవాలని ప్రార్ధన చేయుచున్నాము. ఈ ఉదయకాలపు కూటములో ఒకేసారి శాశ్వతముగా దాన్ని పరిష్కరించుము, మరియు దాన్ని ముగించుము, మా హృదయములను మేము సిద్ధపరచు కొందుము గాక, యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుము. నీ వాక్యము సత్యమైయున్నది. ఆమెన్

27ఇప్పుడు లేఖనములో నాతో పాటు చదువగోరు మీరు లూకా 24 అధ్యాయంనకు త్రిప్పండి. ప్రభువు చిత్తమైనయెడల కొన్ని నిముషములు నేను మాట్లాడుట కొరకు దాని యొక్క వెనుకటి వృత్తాంతాన్ని ఆధారం చేసుకొనుటకు ఇక్కడొక దీర్ఘమైన లేఖన భాగాన్ని నేను చదువగోరుచున్నాను. మరియు ఇప్పుడు, అది వేడిగా యున్నటైతే లేక అది ఏమైనా మీరు కోరినది మీరు చేయవచ్చును, మరియు సాధ్యమైనంత త్వరగా తక్కువ సమయములో మిమ్మలను మీరు సౌకర్యవంతమైన రీతిలో ఉంచుకోండి.

LUKE 24:36-53•

1COR 2:4•

1THS 1:5

 

28మేము దీన్ని చెప్పగోరుచున్నాము, అదేమనగా ఇక్కడకు వచ్చుటలో మీ యొక్క యదార్ధతను మేము నిశ్చయంగా మెచ్చుకొనుచున్నాము. మరియు అది వెళ్ళినపుడు. సువార్త దాని యొక్క ఆకర్షణను కోల్పోయినదని చెప్పుటకు ప్రయత్నించుచుండగా — ఇక్కడికైతే ప్రజలు దేశమంతటి నుండి, తరలి వచ్చి ప్రభువు యొక్క సేవలో ఇక్కడ కూడికలో వారి కాళ్ళ చేతులు నొప్పిగా ఉన్ననూ వారు నిలబడి ఉన్నారు, అది ఇంకనూ ఏమి చూపించిచున్నదనగా దేవుడు ఒక ప్రజను కలిగియున్నాడనే, వారు ఇంకనూ దేవుని చూడాలనే తపనను వారు హృదయంలో కలిగియున్నారని అది సూచించుచున్నది. ఇంకను మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తవలెనే కేవలం అదే సామాన్యతలో ఇప్పుడునూ సువార్త ఉన్నది. సువార్త వాక్యములో మాత్రమే గాక, అది దాని యొక్క శక్తితో మరియు పరిశుద్ధాత్మ యొక్క ప్రదర్శనతో యున్నది, లూకా సువార్త 24వ అధ్యాయము లోని 36వ వచనం నుండి మనము చదువుచుండగా ఆయన ఈ కార్యములను మనకు దయచేయునుగాక.

వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవుగాకని వారితో అనెను.

అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి.

అప్పుడాయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పట్టనేల?

నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి; నాకున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను,

అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైన ఆహారము కలదా అని వారి నడిగెను.

వారు కాల్చిన చేప ముక్కను మరియు తేనేను ఆయన కిచ్చిరి.

ఆయన దానిని తీసుకుని వారి యెదుట భుజించెను.

అంతట ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంధములలోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను.

అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సు తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణము ప్రకటించబడుననియు వ్రాయబడియున్నది.

ఈ సంగతులకు మీరే సాక్షులు.

ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను.

ఆయన బేతనియ వరకు వారిని తీసికొనిపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను.

వారిని ఆశీర్వదించుచుండగా, ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను.

వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి యెడతెగక దేవాలయములో ఉండి దేవుని సోత్రము చేయుచుండిరి. ఆమేన్.

29ఇప్పుడు ఒక అంశముగా నేను దానిని తప్పక పిలువ గోరి దాన్ని తీసుకొనగోరినటైతే అది, "నిజమైన ఈస్టర్ ముద్ర."

ఒక వారం క్రితం జార్జిటౌన్ లోకి వెళుతూ నేను మార్గంలో యుండగా (న్యూ ఆల్బనీ క్రిందయున్న ఒక చిన్న పట్టణం) ఒక వారం క్రితం ఇలాటి అంశంను నేను ఎలా తలంచియున్నానో, అక్కడ కొందరు బాలురు వీధిలో నిలబడి ఈస్టర్ ముద్రల కొరకు కానుకలను పట్టుచున్నారు. మరియు అప్పుడు నేను ఈష్టరు ముద్రను గూర్చి తలంచుట ప్రారంభించాను. నేననుకున్నాను, "ఈస్టర్ ముద్ర అనగా ఏమిటి? నిశ్చయంగా, ఒక ఈస్టర్ ముద్ర కొరకు ఈ బాలురు కానుకలు పట్టుచున్న దానికంటే ఈ భావము ఎక్కువైయున్నది." నేను ఇలా తలంచాను, "అలాంటి ముద్రలతో వారి యొద్ద నుండి వారి కొరకు తీసుకున్న కానుకలతో వారు ఏమి చేస్తారు?" ఈ ముద్రలను వారి ఉత్తరాల మీద అంటించియున్నారనుకోండి, అది వారి కొరకు ఒక స్వేచ్చార్పణయైయున్నది. అది హాస్పటల్లో క్షయవ్యాధితో బాధపడుచున్న వారి కొరకు, మరియు వారి జీవితాలు ముగించబడు వరకు హాస్పటల్లో వారి విశ్రాంతి కొరకు మరియు తదితరములైన వాటి కొరకు ఆ డబ్బు వెళుతుంది.

మరియు నేనుకున్నాను, "నిశ్చయంగా ఈష్టరు దానికంటే ఎంతో ఎక్కువైనది, ఒక ఈస్టరు ముద్ర, అది ఒక వ్యక్తిని హాస్పటల్ గదిలో విశ్రాంతిగా ఉంచుట కంటే కూడ ఎక్కువైనది." అలాంటి కార్యము చాలా మంచిదే, నేను దానికేమియు వ్యతిరేఖిని కాను, దాన్ని బట్టి దేవుడు వారిని దీవించును గాక, అది ఒక అద్భుతమైన కార్యమై యున్నది. అయితే ఇంకను, క్రైస్తవ వారసత్వమును మరియు క్రైస్తవ సంఘమునకు అది వారు భావించు ఈష్టర్ కంటే అది తప్పక ఇంకా కొంచెం ముందుకు వెళ్ళవలసియున్నది, అదే ఈష్టర్ ముద్ర. ఎలా ఒక చిన్న ఇలాంటి ఒక పోస్టేజి స్టాంపు దాని (ఈష్టరు) స్థానమును తీసుకొనగలదు? అది ఈష్టరు స్థానమును తీసుకొనలేదు.

కాబట్టి దాన్ని గూర్చి నేను ఆలోచించుట ప్రారంభించాను, "ఈష్టరు ముద్ర అనగా ఏమైయున్నది?" మరియు ఆ కారణమును బట్టియే ఈ ఉదయమున ఈస్టర్ ముద్రను గూర్చి నేను మాట్లాడాలనే ఆలోచనను కలిగియున్నాను.

30ఇప్పుడు బైబిల్ అంతటిగుండా ఈస్టర్-ని కలిగియున్నాము. అవి బైబిల్ ఎంత ప్రాచీనమైయున్నదో అవియు అంత ప్రాచీనమై యున్నవని మనం కనుగొంటాము, ఆ వెనుక ఏదేను తోటనుండి దాన్ని మనం కనుగొంటాము. తరువాత బైబిల్లో దేన్నైనా మనం ఎక్కడైనా కనుగొన్నా అది వెనుకకు ఆదికాండమునకు వెళుతుంది. అది అంతయు ఆదికాండములో ప్రారంభమై యున్నది.

అప్పుడు నేను దాన్ని గూర్చి ఆలోచన చేయుచుంటిని. ఈష్టరు ముద్రగా నా మనస్సులో నేను కలిగియున్నది ఏమిటి? అలాగయితే అది ఎందుచేత తిరస్కరించబడినదని నేనాశ్చర్యపడుచున్నాను, మరియు ప్రజలు ఎందుకు దాన్ని తిరస్కరిస్తారు, ఎందుకు అది అంత నేరారోపణగా యుంటుంది? అలాగైతే నేను ఆలోచించియున్నాను అది ఎల్లప్పుడు నేరారోపణ చేయబడలేదు, మరియు అందరు దాన్ని నేరారోపణ చేయుట లేదు.

అయితే దేవుడు ఎంతగా ఒక మార్గమును సిద్ధపర్చాడంటే ఒక ఒత్తిడితో ఒక తీర్మానమును చేయుటకు మనిషి స్థానములో ఉంచబడి యున్నాడు. తీర్మానం చేయకుండా మానవుడు భూమిమీద జీవించలేడు. అతనికే దేవుడు ఆ విషయమును వదిలివేసియున్నాడు. అతడు తప్పక ఏదో ఒక నిర్ణయమును చేయవలసి యున్నది. మరియు అక్కడ నీ చదువును గూర్చి తీర్మానమును చేయవలసిన సమయం ఉంటుంది. నీవు ఎవరిని వివాహం చేసుకోవాలనే విషయంలో నీవు నీ తీర్మానమును చేయవలసి యున్నది, వివిధములైన కార్యములను గూర్చి నీవు తీర్మానమును చేయవలసియున్నది.

GEN 4:3,4•

MATT 24:24•

MARK 13:22

 

31అయితే ఏదేను తోటలో, అక్కడ ఇద్దరు మాత్రమే బాలురు ఉన్నారు, తీర్మానము చేయుటకు గాను ఒక తీర్మానము చేయుటకు అతడిపై ఒత్తిడి చేయబడినది. అతడు లోపల ఏమైయున్నాడో చూపబడుటకుగాను, అతడు ఏమైయున్నాడో, అతని నిజమైన రంగును చూపుటకు అది జరిగించబడినదని నేను తలుస్తాను. ఇప్పుడు కయ్యీను మరియు హేబేలు మధ్యలో ఒక తీర్మానము చేయు ఒత్తిడి తేబడుతూ ఒక సమయం వచ్చినది, ఏలయనగా ఆరాధించు సమయం వచ్చియుండెను మరియు ప్రతి బాలుడు దేవున్ని ఆరాధించుటకు ఒక మార్గమును కలిగియుండిరి.

మీరు గమనించినట్లైతే తప్పు ఒప్పుల మధ్య అక్కడ సరిగ్గా ఒక చిన్న ఊపిరి పీల్చునంత బేధమున్నది. మరియు ఈ చివరి దినమున అది ఎలా ఉండునని ప్రవచించబడి యున్నదంటే, అది నిజమైన దానికి దగ్గరగా ఉండునట్లుగా ప్రవచించబడినది. సాధ్యమైతే ఏర్పర్చబడ్డవారు సహితము మోసపోవునంతగా, తప్పు మరియు ఒప్పుల మధ్య బేధముంటుంది.

GEN 4:3,5

 

32ఇప్పుడు, ఈ పిల్లలలో వారు వారి యొక్క బలిపీఠముల నొద్దకు వచ్చి ఆరాధన చేశారు… ఇప్పుడు అలాగైతే ఈ ఉదయమున ఎన్ని సంఘములలో ఎన్ని బలిపీఠముల మీద చక్కని పుష్పములుంచబడినవో నేను తలంచుచున్నాను. అది బాగానే ఉన్నది. దాని మీద నాకు ఏ వ్యతిరేఖత లేదు. అయితే అది ఆరాధనకు దరిదాపుగా ముంగింపుగా కనబడుచున్నది. అదియే బలిపీఠముల మీద పుష్పములుంచుట, లేక ఒక చక్కని సంఘము, లేక ఒక చక్కని అలంకరణలు, లేక అలాంటిది మరేదైనా, దానిని అది ముగించుచున్నట్లుగా కనబడుచున్నది.

అది కయీనుతో కూడా ఆ విధంగానే ఉండెను, కారణము అతడు తన పొలములోని ఫలములను తెచ్చి దేవున్ని ఆరాధించియున్నాడు, మరియు అది తిరస్కరించబడినది. కారణము ఆయన యొద్దకు వచ్చుటకు సరైన మరియు ఖచ్చితమైన దేవుడు నిర్దేశించిన మార్గంలో అతడు వచ్చి యుండలేదు. అయితే అతడు తన అర్పణను అర్పించియున్నాడు, మరియు సమస్తము మతపరంగా తన సోదరుడు చేసినట్లే చేశాడు, అయితే అతడు తిరస్కరించబడ్డాడు. అతడు ఆత్మసంబంధమైన వైపున తిరస్కరించబడిన కారణమును బట్టి, అది అతనిలో ఒక అసూయ లేచుటకు కారణమైనది, ఏలయనగా అతడు దురాశాపరుడైయుండెను.

ROM 5:12,17,18

 

33అది మనిషిలో ఉన్నదై యున్నది, అతడు ఏమైయున్నాడో దానికి అతను సహాయపడలేడు, అతడు ఆ స్థితిలో పుట్టియున్నాడు. పరలోకంలో ఒక పాపిగా మానవుడు ప్రాతినిధ్యం వహించియున్నాడు, ఒక పాపిగా, నేను దాన్ని గూర్చి కొద్దికాలం క్రితం మాట్లాడుచుంటిని, మరియు ఒకరు ఇలా అన్నారు, "అలాగైతే అది న్యాయము కాదు. ఒక మనిషి యొక్క అవిధేయత ద్వారా నేను ప్రాతినిధ్యం వహించబడినపుడు అలాగైతే నాకు కూడా ఒక అవకాశం లేదు."

నేనన్నాను, "అది నిజమే, కారణము నీవు ఒక పాపిగా పుట్టి యున్నావు. అయితే నీవు ప్రాతినిద్యం వహించబడి యున్నావు. నీ ప్రాతినిధ్యం ద్వారా నీవు దోషిగా తీర్పుచేయబడతావు." మంచిది, అలాగైతే అది చాలా క్రూరంగా కనబడుతుంది, అయితే దానిని మరొక వైపునకు త్రిప్పుదాం, అప్పుడు మనము-మనము ప్రాతినిధ్యం ద్వారా నిత్యజీవమునకు నిర్దేశించబడియున్నాము. ఒకరు ఒకరి ద్వారా మరణమునకు మనం ప్రాతినిధ్యం వహించబడియున్నాము. మరొకరి ద్వారా నిత్యజీవమునకు మనం ప్రాతినిధ్యం వహిచంబడియున్నాము. కాబట్టి అది మరలా మనలను ముందుకు, సింహాసనము నొద్ద ఉంచుతుంది. ప్రతి మనిషి మనము నిర్గమం చేయు స్థానమునకు తిన్నగా అదే స్థానమునకు తిరిగి వెనుకకు వస్తాడు.

34అయితే ఆ దురాశ ఎల్లప్పుడు ఉండియున్నది — తప్పు మరియు ఒప్పు, తప్పు ఒప్పును జయించుటకు ప్రయత్నించుచున్నది. అది ఏదేనులో ప్రారంభమై యున్నది, మరియు అది యుగములన్నిటి గుండా వచ్చియున్నది. చివరకు అది దేశ రాజకీయాలలో ప్రవేశించునంతగా క్రిందకు వచ్చియున్నది. అది సంఘ వ్యవహారాల్లోకి వచ్చియున్నది. అది గృహ జీవితములోనికి వచ్చి యున్నది. అది దురాశ, ఏలుబడిచేయుటకు లేక నాశనం చేయుటకు అధికారం చేయుటకు మరియు అధికారం నుండి కూలద్రోయుటకు ప్రయత్నం చేయుచున్నది. మరియు అది ప్రతీచోట పనిచేయుటకు మనం చూస్తాము. మరియు అది ఎల్లప్పుడు పనిచేసియున్నది. అదే, (దురాశ) అదే మితి మీరి పరిపాలించుట లేక మితి మీరి పరుగెత్తుట చేయుచున్నది.

35పాత నిబంధన గుండా క్రింది వరకు దేవుడు, ప్రవక్తల కాలములో, ఆ వెనుక. నేనిక్కడ వ్రాసియుంచుకున్న అనేకమైనవి ఇక్కడ ఉన్నాయి. వాటి యొద్దకు వెళ్ళటకు నాకు సమయం లేదు, అయితే ప్రాచీన ప్రవక్తల దినములలో, సమస్తము మధ్యలో ఆయన ఏదేను తోటలో చేసినట్లుగానే దేవుని నిజమైన స్వరము మరియు దేవుని నిజమైన ఆరాధన తప్పుగా ఎంచబడినది, మరియు అట్టివాటిని బయటకు పంపి చంపివేసినది. ఏదేను తోటలో దేవుని యొక్క స్వరము దురాశ ద్వారా అసూయ ద్వారా నిశ్శబ్దం చేయబడినది. అప్పటి నుండి సంఘములో అది ఆవిధంగానే ఉండియున్నది, దేవుని యొక్క నిజమైన స్వరమును నిశ్శబ్దం చేయుటకు ప్రయత్నించుచున్నది.

36అయితే మీరు గమనించినట్టైతే, మరణం ద్వారా హేబేలు యొక్క స్వరం నిశ్శబ్దమైన వెంటనే, అతని స్థానమును తీసుకొనుటకు దేవుడు షేతును లేపెను. అది ఒక ముందు ఈష్టరు తప్ప మరేమియు కాదు, ఒక ముందటి పునఃపునరుత్థానము లేక పునరుత్థానము వచ్చువరకు అదొక మార్పిడియైయున్నది. పాత నిబంధనగుండా క్రింద వరకు అది వెళ్ళుటను మనం కనుగొంటాము. అది కొద్దికాలం పాటు వెళ్ళినది. ప్రవక్తలు, దేవుడు తన స్వరమును ప్రవక్తలలో సజీవముగా ఉంచాడు. వారు దేవుని వాక్యమును మాట్లాడియుండిరి మరియు రాళ్ళతో కొట్టబడి యుండిరి. మరియు ఒకరిని రాళ్ళతో కొట్టి అతనిని త్రోసి వేసిన వెంటనే దేవుడు మరొకరిని లేపెను. మరియు వారతనిని రాళ్ళతో కొట్టి దూరంగా విసిరివేసినపుడు దేవుడు మరొక ప్రవక్తను లేపెను. దేవుడు ఎల్లప్పుడు ఆయన సాక్ష్యమును నిలబెట్టు కొనెను. యుగములన్నిటి గుండా ఏదేను మొదలుకొని ప్రజల ముందు ఆయన స్వరమును సజీవంగా కాపాడెను.

GEN 4:7,15,16

 

37మరియు ఇప్పుడు అతడు చేసిన దానిని కయీను గుర్తించిన వెంటనే, ఆ సంధర్భంలో అతడు దేవుని సన్నిధి నుండి బయటకి వెళ్ళిపోయెను. మరియు దేవుడు అతనిపై ఒక గురుతు వేయుట ద్వారా అతన్ని ముద్రించెను, అతడు బయటకు వెళ్ళిపోయెను, బైబిల్ చెప్పియున్నది ఏదేనుతోట నుండి, తోట యొక్క గవినుల నుండి, తూర్పున ఉన్న ఏదేను నుండి అతడు వెళ్ళిపోయెను. అతడు ముద్ర వేయబడి, ఒక గురుతు వేయబడి దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయెను.

ఎలాంటి అద్భుతమైన విషయము, ఆ కయీను, అసూయను బట్టి, అతని సోదరుడు వచ్చిన సరియైన అదే మార్గం గుండా దేవునితో సమాధానపడుటకు ఇష్టపడనందున. దేవుడు కయీనుతో అన్నాడు, "నీవు హేబేలు వలె ఆరాధించినట్లైతే, నీవును చక్కగా చేస్తావు."

అయితే కయీను ఇంకా ఎక్కువగా ఇలా అన్నాడు, "ఇదిగో నేను ప్రోగుచేసినవన్నీ ఇక్కడ ఉంచాను, ఇవే నేను కలిగియున్నది, నేనిచ్చేవి ఇవియే. నీవు వీటిని తీసుకుంటే తీసుకో లేకపోతే విడిచిపెట్టు, ఏదో ఒకటి నీకు ఇష్టమైనది చేయుము, నీకు నచ్చింది చేయుము."

ఇప్పుడు, సంఘ జీవితములో, బయటి జీవితములో కూడా ప్రజలు అదేవిధమైన వైఖరిని కలిగియున్నారు. అదే వారంటారు, "నేను సంఘమునకు వెళతాను. నేను సంఘమునకు సహాయం చేస్తాను, నేను ఇది చేస్తాను. దేవుడు దాన్ని అంగీకరించకపోయినా… నేను చేయగలిగే శ్రేష్టమైనది అదియే," చూడండి. అయితే ఇంకనూ దేవుడు కోరునది అది కాదు. దేవుడు దానిని కోరుట లేదు.

38దేవుడు ఒక సిద్ధపర్చబడిన మార్గమును కోరుచున్నాడు. ఆయన ఒక సిద్ధపర్చబడిన మార్గమును కలిగియున్నాడు. మరియు ఆయన సిద్ధ పర్చినదానినే నీవు అంగీకరించవలెనని ఆయన కోరుచున్నాడు, చూడండి. ఆయన ఏమి చేయాలో ఏమిచేయకూడదో చెప్పుటకు మన సహాయం ఏమి దేవునికి అవసరం లేదు. మన కొరకు ఆయన మార్గమును సిద్ధపర్చి యున్నాడు. మరియు మనము తప్పక చేయవలసిన కార్యములు మరియు వాటిని మనము ఎలా చేయాలో, ఏమి చేయాలో మన కొరకు ఆయన మార్గమును సిద్ధపర్చి యున్నాడు. మనము ఆ మార్గము గుండా రాకూడదు. అయితే మనుష్యులు, యుగములన్నిటి గుండా క్రింద వరకు దాన్ని చేయుట సంభవించుటను కనుగొంటాము. అయితే దేవుడు తన ప్రవక్తల ద్వారా ఆయన స్వరమును, యుగములన్నిటిగుండా ఆయన వచ్చుచుండగా సజీవము చేశాడు.

MATT 26:15

 

39ఈ దినమున మనము దానిని కనుగొంటాము.

మరియు రాజకీయములలో మనము దానిని కనుగొంటాము, మనము జీవించుచున్న ఈ దినమున సహితం ప్రజలు ఏ రీతిగా రాజకీయములకు తమ జ్యేష్టత్వపు హక్కును ఎలా అమ్మివేసుకున్నారో మనము దానిని కనుగొంటాము, రాజకీయములను గూర్చి నేను మీకు తప్పక కొంత చెప్పవలసియున్నది. మిడిల్ టౌన్ లోని, ఓహియోలో, ఒక వారం క్రితం ఒక ఆదివారమున యెజెబెలు మరియు ఆహాబును గూర్చి నేను మాట్లాడిన టేపును మీలో ఎవరూ పొందియుండలేదా, మీరు ఏదో ఒక సమయంలో దాన్ని వినాలని నేను కోరుచున్నాను. ఎలా ఆ చిన్న దేశము దురాశను బట్టి మరియు కొంచెం ఎక్కువ డాలర్ల కొరకు మరియు ప్రజల మధ్య పేరు గాంచిన ఒక ఆశయం కొరకు, యూదా 2000 సంవత్సరముల క్రితం 30 వెండి నాణెములకు క్రీస్తును అమ్మివేసినట్లుగా, వారు పరిపూర్ణంగా నేడు కూడా క్రీస్తును వారికి చాలినంతగా అమ్మివేస్తున్నారు. ఓ, ఈ దేశములో ఈ దినమున ఈ ప్రజల మధ్య ఈ అమోఘమైన పరిస్థితిని గూర్చి ఆలోచించినటైతే..ఎన్నో సంవత్సరముల క్రితం సంగతిని మనం ఆలోచించి నటైతే అలాంటి కార్యమును వారు ఎన్నడునూ చేసియుండలేదు. అయితే ఈ దినమున వారు ఎంతో దురాశ గలవారై ఎక్కువ డబ్బును సంపాదించుటకు ప్రయత్నించుచున్నారు, సుళువైన సమయములను కల్గియుండుటకు ప్రయత్నిస్తున్నారు, అంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు.

ఇప్పుడు అది నిజానికి క్రైస్తవ్యము కాదు.

40ఒక క్రైస్తవుడు సులువైన కార్యముల కొరకు అడుగడు. మనం అలాంటి వారము కాదు… క్రైస్తవ ప్రజల మధ్యలో అక్కడ ఎన్నో వాగ్దానములు చేయబడియున్నవి. అనేక మంది సేవకులు అబద్ధమైన వాటినే ప్రజలకు వాగ్దానం చేయుచున్నారు: "మీరు క్రీస్తులోనికి వచ్చినటైతే, మీ ఇబ్బందులన్నియు పరిష్కరించబడతాయి." నేను మీకు చెప్పుచున్నాను, మీరు క్రీస్తులోనికి వచ్చినప్పుడే మీకు ఇబ్బందులన్నియు ప్రారంభమవుతాయి. అప్పుడే నీవు నీ యొక్క యూనిఫాంను ధరించి, నీ తుపాకిని ధరించి, మరియు యుద్ధ భూమిలో ప్రవేశిస్తావు. క్రైస్తవుని యొక్క మార్గం విశ్రాంతి తీసుకునే ఒక పూలపాన్పు కాదు. చివరికి మరణం ద్వారా ఆత్మ స్వేచ్ఛగా విడుదల పొందువరకు అది నీవు ప్రారంభించబడిన ఘడియ నుండే ఒక యుద్ధమైయున్నది. నీవు ఒక విహారయాత్రలో లేవు. నీవు యుద్ధభూమిలో ఉన్నావు. కాబట్టి మనకు వాగ్దానము చేయబడిన కార్యములున్నవి.

41కొన్నిసార్లు నాకిది చెప్పాలనిపిస్తుంది (అయితే దాన్ని చెప్పడం నాకసహ్యము, అయితే నా హృదయం నుండి నా భావమును చెప్పుచున్నాను), ఆ అతీతమైన ఎంతో నటించే మతమును గూర్చి విన్నప్పుడు నేనెంతో బాధపడతాను. ఈ దినమున ప్రతిదీ ఒక అతీతమైన నటించే కార్యముగా మారియున్నది. అది ఒక అతీతమైన నటించే మనిషియైయున్నాడు. వ్యోమగాముల ద్వారా టెలివిజన్ దానిని తెరచియున్నది, అది ఒక అతీతమైన నటించు వెర్రీతనమై యున్నది. ఓ, ఈ దినమున దైవీక స్వస్థతలోనికి సహితము నటించు అతీతమైన స్వస్థతలను వారు చేయుచున్నారు. ఇప్పుడు, దేవుడు అలాంటి కార్యములను ఎన్నడూ కలిగియుండడు.

అనేక సార్లు వరము కలిగిన మనుష్యులు వేదిక మీదికి మనుష్యులను తెచ్చి, సందేహం లేదు, వారు సువార్తను అపార్ధం చేసుకొని వారికి నూనె రాసి ప్రార్ధన చేసి, ఏదో సంభవించు వరకు వారిని కుదుపుచూ అక్కడే నిలబడతారు, వారు బాగుపడతారు. బహుశా ఆ వ్యక్తి పాపంలో జీవించువాడై యుండవచ్చు, వారు బయటకు వెళ్ళగానే అది తిన్నగా వారి మీదికి అది తిరిగిరావడం వారు చూస్తారు. బహుశా వారు ఆ సమయంలో ఒక ఉద్రేకంలో ఉంటారు. వారు ప్రోగుచేసుకున్న దేవుని యొక్క విశ్వాసం వారిని బాగుచేస్తుంది, అయితే వారు మరల అవిశ్వాసపు వ్యక్తుల మధ్యకు వెళ్ళగానే అది వారి మీదికి తిరిగివస్తుంది. అది ప్రతిసారీ అలానే జరుగుతుంది.

42ఈ దినమున మనకు అవసరమైనది ఏమనగా దైవీక స్వస్థత, అదే క్రీస్తు కొరకు ఒక ఖచ్చితమైన నిర్ణయమును చేయుట. అది సత్యము.

ఈ మధ్యనే జర్మనీలోని లూధరన్ అసోసియేషన్ నుండి నాకు పంపబడిన ఒక ఉత్తరమును నేను చదువుచుంటిని, అక్కడొక సోదరుడు వారి మధ్య నిలిచియుండి, లూధరన్ సంఘము మరియు పెంతెకొస్తు సంఘముల సహకారం ద్వారా జర్మనీలో ఒక స్వస్థతా కూటమును అతడు కలిగియున్నాడు. మరియు ఆ ఉత్తరం యొక్క నకలుతో ఇలా వ్రాయబడి యున్నది. అతడన్నాడు, "నీవు దైవీక స్వస్థతను గూర్చి బోధించుము, మరియు వారు చేయవల్సిందంతయూ నీ మీద చేతులుంచటయే, వారు ఒక అనుభూతి చెంది స్వస్టపడతారు," అని అతడన్నాడు. నేను నిశ్చయంగా అతనితో విభేదిస్తాను. అతడన్నాడు, "అలాగైతే ఆ చిన్న దెబోరా స్టాడ్క్లివ్ అక్కడ చనిపోయిన సంగతేమిటి? ఒక పరిపూర్ణమైన ఆరోగ్యకరమైన బిడ్డగా యున్నది, మరియు తర్వాత కొన్ని గంటలకే చనిపోయి అక్కడ ఉంచబడి యున్నది. మీరందరూ అక్కడకు వెళ్ళి ప్రార్ధించియున్నారు, ఆమెను కుదిలించారు, స్వస్థత కొరకు ఆమెకు నూనె రాసి ప్రార్ధించి మిరు సమస్తము చేశారు, అయితే అక్కడ జీవము లేదు. ఆ బిడ్డ అక్కడ ఉంచబడియున్నది." "అప్పుడు వారు సహోదరుడు బ్రెన్హాంకు టెలిగ్రామ్ ఇచ్చామని చెప్పారు. దేవుని నుండి ఒక ఖచ్చితమైన మంచి నిర్ణయం వచ్చు వరకు అతడు ఏమియు మాట్లాడలేదు, తర్వాత ప్రభువైన యేసు నామంలో వాక్యమును పలుకుటకు వచ్చాడు," అని వ్రాశాడు.

ACTS 2:38

 

43ఇప్పుడు మనకు కావలసినది అదియే — దేవుని నుండి ఒక ఖచ్చితమైన నిర్ణయం, అందుచేతనే మనం తప్పక రావలసియున్నది… అందుచేతనే యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిస్మం ఇస్తాము. అది దేవుని వాక్యంలో నుండి ఒక ఖచ్చితమైన నిర్ణయమైయున్నది. ఆ కారణమును బట్టియే మనం చేయు కార్యములతో మనం నిలబడియున్నాము. కారణం అది దేవుని యొక్క ఆదేశాలు మరియు సువార్త అది ఏ రీతిగా వ్రాయబడినదో ఆ రీతిగానే మనం తప్పక దానితో నిలబడవలసియున్నది. అంగీకరించినా లేక అసహ్యించుకున్నా, ఏమి సంభవించినా లెక్క కాదు. అది దానితో చేయునది ఒక్కటి కూడా లేదు. దేవునికి ఖచ్చితమైన నిర్ణయములు కావాలి.

నీవు ఆరంభం నుండియే నీవు తప్పు అని తెలుసు కొనినపుడు నీవు దానిని ఎలా చేయగలవు? అలాంటప్పుడు నీవు దేవుని నుండి ఒక ఖచ్చితమైన నిర్ణయమును కలిగియుండలేవు. నీ హృదయం ఆయనతో సరిగా లేకుండా ఆయనకు సేవ చేయకుండా నీవు ఉన్నావని నీవు తెలుసుకొనినప్పుడు నీవు వచ్చి దైవీక స్వస్థతను ఎలా అడుగగలవు. చూడు నీవు తిరిగి వెళ్ళి లోకములోని కార్యములను చేస్తావు. ఆ రీతిగా ఎన్నడూ నీవు స్వస్థతను పొందలేవు, చూడండి నీవు తప్పక ప్రతిష్టించబడిన జీవితముతో మరియు హృదయంతో దేవుని ముందుకు శుద్ధముగా రావాలి, మరియు అప్పుడు దేవుడు నిన్ను బాగు చేస్తాడు. మరియు అప్పుడు అది చివరి వరకు ఉంటుంది, కారణము నీ విశ్వాసం లంగరు వేయబడియున్నది.

HEB 11:10

 

44ఇప్పుడు అది లోపల ఉన్నది. ఆ దురాశను సంఘములో, రాజకీయాలలో, ఒక దేశము యొక్క దేశీయ రాజకీయాలలో వాటన్నిటి గుండా మనం చూడగలం.. ఆఫ్రికా దేశంలో ఏమి సంభవించుచున్నదో క్రిందకు చూడండి. చూడండి, దురాశ కారణమును బట్టి ఆఫ్రికాలో ఏమి సంభవించి యున్నదో చూడండి, అక్కడ మాత్రమే కాదు, అయితే ప్రపంచమంతట ప్రతీ చోట, కారణము మనిషి ఏదో ఒకడిగా ఉండాలని కోరుచున్నాడు. ఈ భూమ్మీద తిన్నగా ఇదియే కలిగియున్నారు, లేనిచో వారు ఆ మార్గములో జీవిస్తారు. నేను లోకమంతటిని కలిగియున్నా, నేను ఒక దౌర్భాగ్యుడనే. దేవుడు దేనికి శిల్చి నిర్మాణకుడో, ఆ పట్టణం కొరకు నేను ఎదురుచూచుచున్నాను. అక్కడికే మన సంపదలను మనం కూర్చుకొనుచున్నాము.

JOHN 8:44•

1JN 3:12

 

45ఆ ఉద్దేశ్యము కయీను కుమారులు, లేక సాతాను యొక్క కుమారులు. వారు సాతాను యొక్క కుమారులై యున్నారు, ఎలాయనగా కయ్యీను సాతాను యొక్క కుమారుడై యున్నాడు. కాబట్టి అందుచేత, ఈ దినమున కయ్యీను కుమారులు. మరియు నీవంటావు, "బ్రెన్హాం సోదరుడా అది ఖచ్చితంగానా?

యోహాను 8:44

అవును, నేను ఖచ్చితంగా, నేను దాని మీద సరియైన దృక్పధంతో ఉన్నాను, కారణము వినండి. యేసు ఈ భూమ్మీద ఉన్నప్పుడు ఆయన ఆనాటి మత నాయకులతో గట్టిగా నొక్కి చెప్పాడు, "మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు." అయినను వారు భక్తిగలవారుగా ఉండిరి, వారు నీతిగా ఉండిరి, వారు పండితులైయున్నారు, గొప్ప కట్టడములను గొప్ప ఆలయములను వారు కలిగియున్నారు, వారు గొప్ప స్కాలర్షిప్లను, యాజకత్వమును, మరియు ఆదేశములను మరియు అలాంటి వాటిని కలిగియుండిరి; అయితే క్రీస్తు ఎవరు అని గుర్తించుటలో వారు తప్పిపోయారు. వారు దినమును గుర్తించుటలో తప్పిపోయారు.

JOHN 18:38

 

46వారు అప్పుడు చేసియున్నట్లుగానే, ఇప్పుడును ఖచ్చితంగా అదే రీతిగా చేస్తారు. మనము జీవించుచున్న దినమును మరియు దేవుడు చేయుచున్న కార్యములను గుర్తించుటలో వారు తప్పిపోయిరి. ఇప్పుడు ఆ కారణమును బట్టి మనం చూడగలం. ఆ మతనాయకులైతే. ఇప్పుడు అది అక్కడ ఉన్నది. ఆ దినమున ఉన్న మతనాయకులు దెయ్యము యొక్క పిల్లలని పిలువడినట్లైతే, అప్పుడు మనం తెలుసుకొనగలము అదేమనగా ఆదిలో తన సహోదరుని హింసించి అతన్ని చంపుటకు కయీనును ప్రేరేపించినది ఆ దెయ్యమే. మరల వారి ద్వారా అదే కార్యము సంభవించియున్నది, వారు యేసును హింసించి చంపియుండిరి. ఏదేను తోటలో ఒక నిర్ణయం చేయుటకు వారు ఎలా ఒత్తిడి చేయబడ్డారో సరిగ్గా వారును ఒక నిర్ణయం చేయుటకు ఒత్తిడి చేయబడ్డారు. ఒక నిర్ణయం చేయుటకు వారు ఒత్తిడి చేయబడ్డారు. "సరే, దీని విషయం ఏమిటి?" కయీను కుమారులు, సాతాను యొక్క కుమారులు.

MATT 4:8,9•

LUKE 4:5,6

 

47నీవంటావు, "అది దేశములకు వెళుతుందా?" సాతాను యేసును కొండ శిఖరం మీదికి తీసుకుని వెళ్ళి శోధించి నపుడు, వాడు ఈ లోక రాజ్యాలన్నిటిని ఆయనకు చూపించాడు. ఇప్పుడు ఉన్నవి మరియు ఉండబోవునవీ అవియే, అవే ఈ లోక రాజ్యములన్నీ మరియు వాడన్నాడు, "ఇవన్నియు నావి మరియు నేను కోరినట్లు నా ఇష్టము వచ్చినట్లు చేస్తాను. వారు పోట్లాడు కొనేటట్లు నేను చేస్తాను. ఇదీ లేక అదీ వారు ఏదైనా చేసేటట్లు నేను చేస్తాను." ఈ లోక రాజ్యములన్నియు నావి అని వాడు చెప్పాడు, ఆ రీతిగా మనం చూడగలము, ఈ దురాశ మరియు స్వార్థం ఎలా రాజకీయాల్లోకి వచ్చియున్నదో, చూచారా. అలాగైతే మనం చూడగలము, అది సంఘములో మరియు సంఘ నాయకుల్లో ఉన్నది, దురాశ మరియు స్వార్ధం సంఘములోకి వచ్చినది.

LUKE 23:4,14•

JOHN 19:4,6

 

48ఇప్పుడు ఏదేను తోటలో ప్రారంభమైన ఆ పాత దురాశను గమనించండి, అది చెడ్డ ముద్రను ఒకరి మీద మరియు మరొకరి మీద మంచి ముద్రను ఉంచి తిన్నగా మన ప్రభువైన యేసు కాలము వరకు వచ్చి యున్నది. ఆయన భూమ్మీద ఉన్నప్పుడు న్యాయసభ అని పిలువబడు ఒక న్యాయపు పరీక్ష ఆయనకు ఇవ్వబడినది. అది ఎలాంటి అన్యాయపు వెక్కిరింతగా ఉన్నది. ఒక్క నేరము కూడా ఆయనను వ్యతిరేఖంగా వారు కనుగొన లేకపోయారు. అది రాజకీయము వైపుగా చూస్తే, ఆయనకు వ్యతిరేకంగా దేనినీ వారు కనుగొనలేకపోయారు. అది ఎంతమట్టుకు అనగా, పిలాతే స్వయంగా ఇలా అన్నాడు, "ఆయనలో ఏ నేరము నాకు కనబడుటలేదు."

MATT 27:20,21•

LUKE 23:18•

JOHN 18:40

 

49మరియు తర్వాత సంఘము వస్తుంది. ఇప్పుడు వారు ఒక తీర్మానము చేయబడుటకు ఒత్తిడి చేయబడ్డారు. రాజకీయలోకము ఆయనను స్వతంత్రునిగా చేసిన తర్వాత — ఇప్పుడు సంఘములోని ఆత్మతో సహకరించుటకు ఆ ఆత్మ రాజకీయాలలో ఉన్నది — సాతాను తన యుద్ధములో ఓడిపోయినట్లుగా ఇది చూపుచున్నది, అయితే వాడు ఇంకను ఒక దానిని నిధిగా కలిగియున్నాడు, వాడిప్పుడు తిన్నగా సంఘములోనికి తిరిగి పడ్డాడు. మరియు వారు ఆయనను సిలువ వేశారు, కారణము ఒక తీర్మానం చేయుటకు ఒత్తిడి వారు చేయబడ్డారు. మరియు వారన్నారు, "యేసుకు బదులుగా మాకు బరబ్బాను ఇవ్వండి." చూడండి దానిని వారు ఎలా చేశారో?

MATT 27:24

 

50ఈ దినమున తిన్నగా అది మన కన్నుల ముందు ఉంచబడియున్నది, అదే కార్యము, ఎల్లప్పుడును యుండి యున్నది, ఎల్లప్పుడును యుంటుంది, ఒక తీర్మానము చేయుటకు ఒత్తిడి చేయబడుట. ఇప్పుడు, తీర్మానము వారు ఒత్తిడిచేసినపుడు, పిలాతు యేసును సంఘమునకు విడుదలచేసినపుడు, సంఘమే ఆయనను సిలువ వేయుటకు అప్పగించినదని అతడు తన హృదయములో ఎరిగియుండెను. మరియు ఆయనను తిరిగి సంఘమునకు అప్పగించినటైతే, అప్పుడు సంఘము ఆయనను సిలువ వేస్తుంది. కాబట్టి, పిలాతు మన్నించబడలేదు. అతడు నీరు తీసుకొని క్రీస్తు యొక్క రక్తమును అతని చేతుల మీద నుండి కడిగి వేయాలని ప్రయత్నించియున్నాడు, అయితే అతడు దానిని చేయలేడు.

51ఆ సమయము నుండి, స్వీడన్లో లేక స్విజ్జర్లాండ్లో, అక్కడే పిలాతు తన ముగింపు సంవత్సరములను కలుసుకొన్నాడు, అతని మనస్సు భ్రమించినది, అతడు పిచ్చివాడయ్యాడు, ఒక నీటి గుంటలో తన్నుతాను ముంచుకొని చనిపోయినాడు. దాన్ని గూర్చి అక్కడొక కథ ఇలా చెప్పబడింది, "మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ కోనేరు అడుగు నుండి నీలిరంగు నీళ్ళ పైకి ఉబుకుతూ ఉంటాయి. ప్రపంచ నలుమూలల నుండి దాన్ని గమనించడానికి అక్కడికి ప్రోగవుచూ వుంటారు. మరియు 3 గంటల సమయంలో ఆ నీలిరంగు నీలపు వర్ణపుగల నీరు ఎక్కడో అడుగు నుండి పైకి వచ్చి పైనున్న నీళ్ళను కదిలించి మళ్ళీ తిరిగి క్రిందికి వెళ్ళిపోతాయి; అది చూపనదేమనగా, ఏ మనిషి యొక్క చేతులపై నున్న క్రీస్తు రక్తమును ఏ నీరు కడుగలేదు." అతడు దోషియై యున్నాడు.

మరియు నీ చేతులపై క్రీస్తు ఎన్నడైనా యుంచిన ప్రతీ మనిషిని, అక్కడ నుండి ఏదియు కడిగి తీసివేయలేదు. అక్కడ చేయవలసిన కార్యము ఒక్కటి మాత్రమే యున్నది, దాన్ని అంగీకరించి నమ్ముటయే.

52సాతాను పిల్లలు, కయీను పిల్లలు దేవుని కుమారులను హింసించి వారిని మరణమునకు అప్పగించారు. అదే వారు హేబేలునకు చేసినది. దానినే వారు యేసుకు కూడా చేశారు, ప్రవక్తలకును వారు అదే చేసియున్నారు, మరల తిరిగి వారు చేయునది అదియే. దానిని చేయుటకు ద్వారం తెరువబడగానే వారు దానిని చేస్తారు.

గుర్తుంచుకోండి, మనమొక విధముగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకొని వెఱ్రి వారమయ్యాము, మరియు ప్రజలు సువార్త యొక్క మార్గం నుండి మరియు చరిత్ర నుండి ఏమి సంభవించనైయున్నదో తెలుసుకొనక ప్రక్కకు వచ్చేసియున్నారు, మరియు ఇక్కడే తిన్నగా మనదేశంలోనే దాన్ని మరల మనం ఎదుర్కొన్నాము, దాన్ని గూర్చి మనం చేయునది అక్కడేమియు లేదు. అయితే అప్పుడు నీవంటావు, "బ్రెన్హాం సోదరుడా దానికి వ్యతిరేకంగా మాట్లాడుటలో నీ ఉద్దేశ్యం ఏమైయున్నది?" దానికంటే నేనెంత మాత్రము పాపమును ఆపలేను; అయితే పాపమునకు వ్యతిరేకంగా నా స్వరమును ఉంచుతాను. ఖచ్చితంగా ఇప్పుడు పాపమునకు వ్యతిరేకంగా, తప్పు కార్యములకు వ్యతిరేకంగా దానినే నేనిపుడు చేయుచున్నాను. మనము తప్పు చేసియున్నాము, మరియు ఖచ్చితంగా మనము దేనిని విత్తుతామో దాన్నే కోయుదుము.

53మిడిల్టౌన్ నుండి, వారు ఒక వాదనను కలిగియున్నారు, వారు ఒక యాజకుడిని, ఒక బాప్తిస్టు బోధకుడిని, మరియు ఒక ప్రెస్బిటేరియన్ బోధకుడిని ఏకం చేసి పాఠశాల యొక్క నిధులను గూర్చి చర్చించారు. మరియు ప్రొటెస్టెంట్ వారు చెల్లించినట్లే, కాథలిక్ వారు కూడా పన్నులు చెల్లించారని యాజకుడు (కాథలిక్ మత గురువు - తెలుగు తర్జుమా దారుడు) ఒప్పుకున్నాడు. మరియు నిధులు తప్పక రెండు వైపుల వారికీ ఇవ్వాలి, యాజకుడన్నాడు, "మనము తప్పక ఒక కాథలిక్ స్కూల్ని ఏర్పాటు చేయడానికే నిధులివ్వాలి." ఓ, నిశ్చయంగా, చిన్నపిల్లలుగా యున్నప్పుడే వారిని కాథలిక్ వారు తీసుకొనుచున్నారు. ఓ, అది ఎలాంటి కార్యము!

54మరియు ప్రజలు రాజకీయ కారణమును బట్టి అక్కడ కూర్చొని ఎలా దాన్ని లోనికి తెచ్చారో చూడండి? అది ఎలాగో నాకు అర్థమగుట లేదు. అయితే ఈ ఈష్టరు ఉదయమున తిన్నగా మనము ఇక్కడ యున్నాము. మనము ఈ దేశములోకి ప్రవేశించి అమెరికా వారంగా మారుటకు అసలైన కారణం ఏమనగా యెజెబేలు మత క్రమమునకు వ్యతిరేఖంగా మత స్వేచ్ఛ కొరకే మనం ఇక్కడకు వచ్చియున్నాము, మరలా ఇప్పుడు మనం తిన్నగా తిరిగి వైట్ హౌస్లో వేదిక మీద దాన్నే ఎన్నుకొనుచున్నాము. దేని నుండి మనం స్వతంత్రులంగా ఉండాలని బయటకి వచ్చామో తిరిగి దానినే మనం ఎన్నుకొనుచున్నాము. ఓ, అది ఒక ఘోరమైన పరిస్థితిలో ఇప్పుడు మనం జీవించుచున్నాము (మీకు అది తెలుసు), ఆత్మసంబంధమైన సంఘముగా — ఏలయనగా అది తనను అమ్మివేసుకొనినది.

55విశ్వసనీయమైన హేబేలును చంపినట్లుగానే వారు ఆయనను మరణమునకు అప్పగించి చంపివేశారు. ఎందుకు, హేబేలు చంపబడ్డాడు? మనిషిని పాపం నుండి విమోచించుటక అది ఏమి తీసుకుంటుందో, దేవునికి అంగీకారమైనదేదో, ఆ బయల్పాటును అతడు తన హృదయంలో కలిగి యున్నందువలనే. ఆ కారణమును బట్టియే వారు యేసును మరణమునకు అప్పగించారు, ఏలయనగా పాపమును దేవుడు శుద్దీకరించుటకు అది ఏమి తీసుకుంటుందో, ఆ ప్రత్యక్షతను ఆయన కలిగియుండుటను బట్టి. ఆ కారణమును బట్టియే ఈ దినమున వారు సజీవమైన దేవుని సంఘములకు వ్యతిరేఖముగా యున్నారు, కారణం అది పాపమునకు విరుగుడును బోధించుచున్నది, అది ప్రజలను భిన్నముగా ప్రవర్తించునట్లు, భిన్నంగా నడుచునట్లు తయారు చేయుచున్నది.

56మరియు ఈ దినమున మనం జీవించుచున్న సంఘములోనికి దానిని తెచ్చినట్లైతే, మన పెంతెకొస్తు గుంపులలో, వారు ఏది చేయకుండా ఉండేందుకు స్వతంత్రులైయున్నారో తిరిగి అదే కార్యము కొరకు మరల వెనుకకు వెళ్ళిపోయారు. అక్కడ ఏదో తప్పున్నదని అది చూపుచున్నది. పాపమునకు ఒక విరుగుడు! అది చాలా సుళువుగా లోనికి వస్తుంది. అది చిన్నగా లోనికి జారుతుంది, బాగున్నది, నిజమైన పెంతెకొస్తు మతము యొక్క మారు వేషము క్రింద అది ఉన్నది. అయితే అది అదే రకమైన వస్తువును ఉత్పత్తి చేయనియెడల, ఆవిధమైన సరుకులను అది ఉత్పత్తి చేయనియెడల, అక్కడ దానిలో ఏదో ఎక్కడో తప్పున్నది. ఒక గుమ్మడికాయ పుచ్చకాయను ఎలా ఉత్పత్తి చేస్తుంది? అది దానిని చేయలేదు. ఒక ద్రాక్షావళి ఏరీతిగా బేరిపండ్లను ఉత్పత్తి చేయగలదు? అది దాన్ని చేయలేదు. ఒకవేళ అది బేరిపండ్లను ఉత్పత్తి చేసినట్లైతే, బేరిపండు యొక్క చెట్టు జీవమే ఆ ద్రాక్షావళిలో ఉన్నట్టు.

ఈ దినమున మనం యెరిగినది అదియే. ఒక సంఘము అది ఎంతగా సజీవమైన దేవుని సంఘమని తనక తాను చెప్పుకొన్నప్పటికీ లెక్క కాదు, పాతకాలపు రక్షణ ద్వారా అది దేవునిని ఉత్పత్తి చేయకపోయినట్లైతే, నిజమైన దేవుని రక్షణకు ప్రజలను తిరిగి తేకపోయినట్లైతే, అది దేవుడు వారి మధ్య జీవించుచున్నాడని చూపుతుంది, అప్పుడు అది తప్పు అయి యున్నది. అది అది కాదు - క్రీస్తు అది ఏమి చేస్తుందని చెప్పాడో, ఆ జీవమును అది ఉత్పత్తి చేయనియెడల, అది అది కాదు.

57క్రీస్తు కల్వరిలో చనిపోయినాడు. ఆయన కల్వరి పైకి ఎలా వెళ్ళియున్నాడు. ఈ మధ్యనే నేనొక చిన్న పుస్తకమును చదువుచుంటిని, అది ఒక విధమైన ఒక పరిశోధనతో కూడినది, మరియు ఆ పరిశోధనలో ఒక అంత్యంత విశేషమైన ఒక సంగతిని నేను కనుగొన్నాను. నేను కూర్చొని యున్నాను మరియు ఆ పుస్తకమును క్రిందపెట్టాను. మరియు నా చేతులను పైకెత్తి దేవునిని స్తుతించి, నిలబడి చుట్టూ కొంచెం నడచి కూర్చొని దాన్ని మరలా చదివాను. నేననుకొన్నాను, "ఓ, అది అలాగా, యేసు సిలువ వేయబడిన అదే కొండ మీద, యేసు సిలువవేయబడిన అదే కొండ మీద ఆదాము సమాధి చేయబడ్డాడు, ఆదాము చనిపోయిన స్థలంలోనే ఆయన సమాధి చేయబడ్డాడు. ఆదాము గోల్గోతలోనే చనిపోయెను, మరియు గొల్గోతలోనే సమాధిచేయబడ్డాడా?" మరియు నేను ఇలా తలంచాను, "ఎలాంటి సరియైన సంగతి అది సరియో లేక కాదో."

MATT 27:66

 

58అది సరియేనని మనం చెబుదాం. అప్పుడు మొదటి ఆదాం చనిపోయి సమాధిచేయబడ్డాడు, మరియు ఇంకను అక్కడ ధూళిలో యున్నాడు, ఏలయనగా అతడు లోకమునకు మరియు పాపం చేసిన ప్రజలకు అతడు ప్రాతినిధ్యం వహించియున్నాడు. అయితే రెండవ ఆదాము, పరలోకపు దేవుడైయున్నందున, ఆయన గొల్గొతలో చనిపోయినపుడు ఆయన్ని అక్కడ పట్టుకుని ఉండుటకు తగినంత భూమి లేదు. ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు, మరియు సదాకాలము సజీవునిగా యున్నాడు. అయితే పాపపు సమస్య పరిష్కరించబడినది. కల్వరిలో పాపపు సమస్యను దేవుడు పరిష్కరించియున్నాడు, అక్కడే బాకీ చెల్లించబడినది. రెండవ ఆదాము చనిపోయినపుడు, మానవాళి యొక్క పాపపు ఋణమును చెల్లించెను.

లోకము ఆయనను సమాధిలో ఉంచినది, మరియు ఆయన్ను సమాధిలో ఉంచి ముద్రవేసినది.

59వారు ఈ దినమున దానినే చేస్తారు. ఈ దినమున అదే కార్యము చేయుటకు వారు ప్రయత్నించుచున్నారు. వారు దీన్ని తప్పిపోవుట నాకిష్టం లేదు. లోకము కాలమంతటి గుండా — లోకము బహు అధ్వాన్నంగా మారుచున్నది — క్రీస్తును తిరిగి సమాధిలో ఉంచుటకు ప్రయత్నించుచున్నది, కాలము యొక్క దినములలో నడిచినవాడు, రోగులను బాగుచేయుటకు, దెయ్యములను వెళ్ళగొట్టుటకు, శక్తిని ఇచ్చిన దేవునిని, చరిత్రలో ఉన్న ఒక దేవునిగా చేయుటకు వారు ప్రయత్నిస్తున్నారు. అయితే వారు ఏమి చేశారు? కయీను వలె, అతడు హేబేలును వదిలించుకున్నాను, అని అతడు తలంచినట్లుగా, ఆయనను గూర్చి కూడా వారు ఆయన్ను వదిలించుకున్నాము, అని తలంచిన వెంటనే, ఒక సమాధిలో ఆయనకు ముద్రవేసి ఆయనను సమాధిలో ఉంచారు.

60ఈ రోజున కూడా వారు క్రీస్తును సమాధిలో ఉంచుటకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఓ, ఒక ఈష్టరు ఉదయము ఏమి చేసియున్నదో, ఒక ఈస్టరు ఉదయము వారి వేదాంతము నంతయు నాశనం చేసియున్నది. మరియు ఒక ప్రజకు, ఇక్కడ ఒక సంఘమునకు ఈష్టరు ఉదయము వచ్చినపుడు, 1900 సంవత్సరముల తర్వాత అది వారి వేదాంతమును నాశనం చేసినది. ఆయన చనిపోలేదు; ఆయన యుగయుగములు సజీవుడై యున్నాడు! వారు ఆయనను ఏ సమాధిలోనూ ఉంచలేరు. నీవు ఆయనను ఒక మెథడిస్టు సమాధిలో, ఒక బాప్తిస్ట్ సామాధిలో, ఒక ప్రెస్బిటేరియన్ సమాధిలో, లేక నీవు కోరిన దేనిలోనైనా నీవు ఆయన్ను ఉంచగలవు. అయితే ఆ సమాధిలో నుండి తిరిగి ఆయన లేచియున్నాడు, మరియు ఈ దినమున ఆయన సజీవుడైయున్నాడు! నేనొక బాప్తిస్ట్ సమాధిని కలిగియుంటిని, మరియు నీవొక మెథడిస్టు సమాధిని కలిగియున్నావు, అయితే ఒక దినమున — చరిత్రలో ఉన్న దేవుని నుండి జీవించుచున్న వానిగా, ఇప్పుడును ఉన్న దేవునిగా, యుగయుగములు సజీవునిగా యేసు అక్కడ నుండి లేచి యున్నాడు.

MATT 27:66•

JOHN 2:19,21

 

61ఈష్టరు ఉదయమున ఏదో సంభవించినది. అది ఒక ముద్రయై యుండెను, ఒక తృప్తిచెందిన ముద్ర వారు ఆయనను తీసుకుని సమాధిలో ఉంచినపుడు, ఒక రోమా ముద్రను దానిపై ఉంచారు… అయితే ఆ ఘడియ పైకి లేచినపుడు, ఆ ఘడియ వచ్చినపుడు, కొద్ది సమయము ఆయన అక్కడ నిలిచియున్నాడు, అది నిజము. మూడు పగళ్ళ మరియు మూడు రాత్రుళ్ళు ఆయన అక్కడ నిలిచియున్నాడు. అయితే లేఖనం చెప్పినట్లుగా నిర్ణయించబడిన సమయాన (హల్లెలూయ!), ఆ సమయమునకు ఆయన చెప్పినట్లుగా, "ఈ ఆలయాన్ని (దేహం) పాడుచేయండి మరియు మూడవ దినాన దాన్ని నేను పైకి లేపుతాను," అప్పుడు ఆ లేఖనమును ఏదియు ఆపలేదు. అది తప్పక నెరవేరవలసియున్నది. ఆ ముద్ర విప్పబడియున్నది, ఆయన తిరిగి లేచాడు. అదే యేసు, తిరిగి శాశ్వతముగా సజీవుడయ్యాడు.

ZECH 14:6,7•

JOHN 14:12

 

621900 సంత్సరములపాటు, లేక నేనంటాను 1400 లేక 1500 సంత్సరముల పాటు సంఘములు ఆయనకు ముద్ర వేసియున్నవి. అయితే ఆయన అన్నాడు, "అంత్యదినములలో అది నెరవేరుతుందని ప్రభువు చెప్పియున్నాడు." అక్కడ దాన్ని ఏదియు ఆపబోవుట లేదు! అది "సాయం కాలపు సమయమున వెలుగు కలుగును." "నేను చేయు కార్యములు మీరును చేయుదురు." "ఆస్తమయ కాలమున వెలుతురు కలుగును." నీవు ఎన్ని ముద్రలు దాని మీద ఉంచినప్పటికీ నేను లెక్కచేయను. దేవుడు ప్రతీ ముద్రను చీల్చి వేస్తాడు. సమాధి మీద ముద్రను ఆయన చీల్చివేశాడు, పాతాళపు ముద్రను ఆయన చీల్చివేశాడు, మరణం యొక్క ముద్రను ఆయన చీల్చివేశాడు, సమాధి యొక్క ముద్రను ఆయన చీల్చి వేశాడు. మరియు మరణం పై, సమాధి పై, పాతాళం పై విజయోత్సాహంతో శాశ్వతంగా ఆయన తిరిగి లేచియున్నాడు. మరియు మానవ కల్పితమైన అక్కడున్న ప్రతిదీ చూపునదేమనగా, ఆయన దేవుడై యున్నాడనియు, ప్రజల నుండి ఎంత మాత్రము దూరంగా ఉండునట్లు ఆయనకు ముద్రవేయ లేరని అది చూపుచున్నది. సదా కాలము ఆయన దేవుడైయున్నాడు. ఆయనను ఏదియూ ఆపజాలదు, సమాధి తగినంత లోతుగా త్రవ్వబడజాలదు, పాతాళం తగినంత వేడి కాజాలదు. ఓ, ఏదియు ఆయన్ను ఆపజాలదు.

ఆ గొప్ప క్రిస్మస్ ముద్రతో ప్రతీ ముద్రను ఆయన చీల్చి వేసియున్నాడు, లేక క్రిస్మస్ ముద్ర కాదు, అయితే ఈష్టరు ముద్రతో ప్రతీ ముద్రను ఆయన చీల్చి వేసియున్నాడు. మరియు ఆయన అన్నాడు, "నేను ధరించిన అదే ముద్రను మీరును ధరిస్తారు, కారణము, నేను ధరించిన ఈ ముద్ర, మీరు ముద్రించినపుడు అవే కార్యములను మీకు చేస్తుంది. ఏలయనగా నా యందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలను అతడును చేస్తాడు; వాటి కంటే మరి గొప్పవియు చేస్తాడు, ఏలయనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను."

నీవు దానిని ఎలా క్రిందయు౦చగలవు? నీవు ఏమి చేయబోవుచున్నావు? ప్రజలు దాని గూర్చి ఏమి చేయగలరు? నీవు తప్పక దాన్ని గూర్చి నీవు ఏమి చేస్తావో, నీ తీర్మానం ఏమిటో, దాన్ని గూర్చి ఒక తీర్మానం చేయుటకు నీవు ఒత్తిడి చేయబడ్డావు. అది కచ్చితముగా నిజము.

63ఇప్పుడు ఆయనను కనుగొంటాము ఏ ముద్రయు ఆయన్ను అపలేక పోయినది, ఆయన పైకి వచ్చాడు. దేవుడు సమాధి ముద్రను చీల్చియున్నాడు, మరణము యొక్క ముద్రను చీల్చియున్నాడు, పాతాళం యొక్క ముద్రను చీల్చియున్నాడు, సమాధి యొక్క ముద్రను చీల్చియున్నాడు, మరియు జయోత్సాహంతో ఆయన పైకి లేచి యున్నాడు. దానిని ఏది చేసినది అది చేసినది ఆయన లోపల ఉన్న గొప్ప ముద్ర. వారు శరీరమును నాశనం చేశారు, కానీ ఆ ముద్రను వారు ఎన్నడూ నాశనం చేయలేక పోయారు. [టేపు మీద ఖాళీ ఉన్నది.]

… ఒక ప్రవక్త నాశనం చేయబడినపుడు, అక్కడ మరొక ప్రవక్త లేపబడెను. వారు నాశనం చేస్తూనే ఉన్నారు, అయితే నాశనం చేయలేని ఒక దానిని దేవుడు వారి కిచ్చియున్నాడు. అదే సహజాతీత మైన ఆత్మ అది దానికై అది పరిశుద్ధాత్మయే మరియు అది తప్పిపోనిదీ, నాశనం కానిదైయున్నది. అది నాశనం చేయబడజాలదు! అది ఇంకా ఇంకా ఇంకా ముందుకు జీవిస్తూనే యుంటుంది. మరియు ఆయన జీవించుచున్నందున మనమును ఆయనతో జీవిస్తాము, కారణము, ప్రభువైన యేసుక్రీస్తు శరీరంలోనికి మనం ముద్రించబడియున్నాము. మార్గము లేదు, అది ఎన్నడూ నాశనం చేయబడే మార్గం లేదు, అది నశించదు, కానీ నిత్యజీవాన్ని కలిగియున్నది. ఆమెన్. దేవుడు గొప్ప ముద్రలను చీల్చువాడైయున్నాడు!

EXOD 30:10•

NUM 17:8•

HEB 9:3,4,7

 

64నిర్గమకాండంలో ఆయన తెరచిన మరొక ముద్రను గూర్చి నేనిక్కడ మాట్లాడగోరుచున్నాను. అయితే లేఖనం యొద్దకు వెళ్ళటకు నాకు సమయంలేదు, కానీ ఆయన… అది నిర్గమకాండంలో ఉన్నది. మనిషి పాపం చేసి దేవుని యొక్క సన్నిధి నుండి తన్ను తాను వేరు చేసుకున్నప్పుడు, అతడు దేవున్ని ఆరాధించడానికి వచ్చాడు. అప్పుడు అక్కడ పరిశుద్ధ స్థలమునకు మరియు అతిపరిశుద్ధ స్థలమునకు మధ్యలో ఒక తెర ఉండెను. అతిపరిశుద్ధ స్థలములో షెఖీనా మహిమ యుండెను. లోనికి వెళ్ళటకు వారికి అనుమతి లేదు. కనీసం దానిని చూచుటకు సహితం వారికి అనుమతి లేదు. మరియు ఆ లోనికి వెళ్ళే మనిషి సంవత్సరానికి ఒకసారి అభిషేకించబడినవాడై, సరిగ్గా దుస్తులు ధరించి, తన మీద రక్తమును ఉంచుకుని తన చేతిలో రక్తాన్ని ఉంచుకొని, ఒక చిన్న గిన్నెలో కరుణా పీఠమును చిలకరించుటకు ఒక గిన్నెలో రక్తాన్ని ఉంచుకుంటాడు. అక్కడ షెఖీనా మహిమ ఎంత ఉన్నతంగా ఉందంటే, చివరకు ఒక సంవత్సరం అతడు తన చేతి కర్రను లోపల మరచిపోయి కర్ర లేకుండా బయటకు వచ్చినపుడు, (దానిని కనుగొనలేదు, లోపల వదిలిపెట్టి వచ్చెను). అయితే అతడు మరల సంవత్సరమునకు వెళ్ళినపుడు, ఆ కర్రకు ఇది వరకే జీవం వచ్చియుండెను, ఆ కర్రంతయు చిగిర్చి బాదము పువ్వులతో నిండియుండెను, కారణం అది షెఖీనా మహిమ యొక్క సన్నిధిలో ఉంచబడెను. అయితే అక్కడ ఒక తెర వీటి మధ్య వ్రేలాడుచుండెను, ఏలయనగా పాపము అక్కడ ప్రజలపై యుండెను.

LUKE 23:31•

1PET 4:18

 

65అయితే, ఓ, సహోదరుడా ఆ దినమున అది యేసుక్రీస్తు రక్తముతో చిలకరించబడినపుడు దేవుని యొక్క ఆత్మ ముద్రను పైనుండి క్రిందకు చించి వేసి మనిషిని వెనుకకు తెచ్చెను. దేవుని యొక్క సన్నిధి నుండి అది మనిషిని దూరంగా ఉంచితే, ఆయన అతనిని షెఖీనా మహిమకు, దేవుని సన్నిధిలోనికి అతన్ని తిరిగి తెచ్చెను. అది ఆయన…

మరణం ద్వారా జీవమైయున్నది… యేసు అన్నాడు, "వారు పచ్చి మానుకే ఇది చేసినపుడు ఎండిన దానికేమి చేస్తారు?" దానిని వారు ఆయనకు చేసినపుడు ఆయన జీవంతో ఉన్న పచ్చని చెట్టుయై ఉన్నాడు, పాత చచ్చిన జీవంలేని చెట్టు అలాగైతే ఎలా ఉంటుంది, చూడండి, ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడినపుడు? దానిని పాత నామకార్థపు చెట్టు దాన్ని ఎలా తట్టుకోగలదు. పచ్చని చెట్టు, అది పచ్చని చెట్టు యై ఉండి సహితం నశించినది, దానిని పాతాళమునకు పంపినది? పాపపు అవిధేయతను బట్టి దేవుని ఉగ్రత కుమ్మరించబడినది, అది పచ్చని చెట్టును పాతాళమునకు పంపినది, అది దేవుని ఉగ్రత ఎండిన చెట్టును తాకినపుడు, అది దానికేమి చేస్తుంది? "నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే మరి భక్తిహీనుడు మరియు పాపి ఎక్కడ నిలబడతాడు?" బాగా యెరిగిన వ్యక్తి దాన్నెరిగియు ఆ మార్గాన్ని తిరస్కరించినపుడు, ఆ వ్యక్తికి అది బయలుపర్చబడినది, అయితే ఇంకనూ అతడు దేవుని యొక్క మార్గములో నడుచుటకు నిరాకరిస్తే, ఆ మనిషికి ఏమి సంభవిస్తుంది. అది ఎలా ఉండబోవుచున్నది.

అవును, షెఖీనా మహిమ నుండి మనలను దూరం చేసిన ముద్రను ఆయన చీల్చియున్నాడు, కారణం పాపం దాన్ని ముగించినది.

GEN 3:24•

HEB 10:4

 

66మరియు ఇప్పుడు, ముద్ర ఒక ముగించబడిన కార్యమునకు సూచనగా ఉన్నది. ఒక ముద్ర అనగా మనకు తెలుసు… మీరొక బాక్సు కారును ముద్ర వేయుచున్నట్లు గానే, మంచిది, వారు ఆ పనినంతా లోపల ఉంచారు, మరియు సమస్తమును లోపల ఉంచారు. మరియు అప్పుడు అది దాని యొక్క గమ్యమునకు ముద్రించబడినది. ఏ ముద్ర యైనా ఒక ముగించబడిన కార్యమైయున్నది. మీరు ఒక దస్తావేజును వ్రాసినపుడు, తర్వాత ముగింపులో ముద్ర వేయబడుంది. అది ముగించబడు వరకు ఎన్నడూ అది ముద్రించబడదు.

ఇప్పుడు, మేకల యొక్క రక్తము, మరియు ఎడ్ల రక్తము, అలాంటివి పాపమును తీసివేయలేక పోయినవి. అయితే ఇది కల్వరిలో ముగించబడినపుడు అది పాపమును తీసివేసినది.

67ఇప్పుడు గమనించండి. ఏదేను తోటలో జీవవృక్షము నొద్దకు ప్రజలు తిరిగి వెళ్ళకుండా ఆ చెట్టుకు కాపలాగా ఎల్లప్పుడు ఒక ఖడ్గము దూయుచున్న దూతను ఒక ముద్రగా దేవుడక్కడ ఉంచియున్నాడు. మరియు అతడు తన ఆరాధనను చేసినపుడు ఆయన క్రిందికి దిగివచ్చాడు… ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆ చెట్టు దగ్గర ఎవరున్నారు? ఆ చెట్టు ఎవరైయున్నారు? అది యేసు అయి యున్నాడు.

నీ తల్లి మరణము యొక్క చెట్టు అయి యున్నది, ఆమె నిన్ను ఇక్కడకు సహజమైన జీవంతో తెచ్చినది. అయితే క్రీస్తు ఆత్మ సంబంధమైన జీవం ద్వారా జన్మను తెచ్చియున్నాడు. స్త్రీ ద్వారా జీవించు వారందరు, చనిపోవుదురు; పురుషుని ద్వారా పుట్టినవారందరూ, జీవిస్తారు. స్త్రీ ద్వారా వచ్చిన వారందరూ సహజమైనవారు; పురుషుని ద్వారా వచ్చిన వారందరూ ఆత్మ సంబంధమైనవారు. ఇక్కడున్న పురుషుడు కాదు; క్రీస్తు యేసు అను మనిషి ద్వారా.

1COR 12:13•

EPH 4:30

 

68మరియు ఈ వృక్షాన్ని గమనించండి, అది కావలి కాయబడినది. అది తిరిగి వెనుకకు రాదు, ఏలయనగా అక్కడ పాపమును తీసివేయుటకు సరైన అర్పణ లేదు. కాబట్టి అందుచేత వారు ఆరాధించడానికి వచ్చినపుడు షెఖీనా మహిమ వారి నుండి ముద్రించబడి వెనుక ఉన్నది. అది ఏదెను తోట మొదలుకొని వారి నుండి ముద్రవేయబడినది.

అయితే పెంతెకొస్తు దినము వచ్చినపుడు, సహోదరుడా యేసు అక్కడ కల్వరిలో ఆ పనిని ముగించినపుడు, ఆయన మనిషిని బయటకు ముద్ర వేయలేదు, ఆయన తనతో మనిషి లోపల తన్ను తాను ముద్రించుకొని యుండెను, మరియు ఇప్పుడు మనము షెఖీనా మహిమ యొక్క సన్నిధిలో ముద్రించబడి మరియు మూయబడినాము. మనము లోనికి ముద్రవేయబడుట మాత్రమే కాదు, అయితే నిత్యత్వంగా మనం ముద్రవేయబడినాము. ఆమెన్! ఓ, అదే నాకు ఇష్టము, ఇప్పుడు లోపల ముద్ర వేయబడినది. అదే నీ యొక్క నిజమైన ఈష్టరు ముద్ర, "ఒకే ఆత్మ ద్వారా మనందరం ఒకే శరీరంలోనికి ముద్రించబడియున్నాము."

నీవంటావు, "పరిశుద్ధాత్మ ఒక ముద్రయేనా?"

ఎఫెసీ 4:30 చెప్పియున్నది, "దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃకపర్చకుడి దాని ద్వారా మీరు విమోచనా దినము వరకు ముద్రించబడియున్నారు." అదే సరియైన, నిజమైన ఈష్టరు ముద్ర అయి యున్నది, నీ పాప రుణము చెల్లించబడిన దినము, దేవుడు నిన్ను అంగీకరించి యున్నాడనియు, మరియు పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తులోనికి నీవు ముద్రించబడి యున్నావనియు అది చూపుచున్నది. పాపం ముగించబడినది. నిత్యమైన ముద్ర ముగించబడి యున్నది.

ROM 8:29,30•

1COR 12:13•

EPH 2:6

 

69ఇప్పుడు, ఈ దినమున మనం పునరుత్థానము చెందియున్నాము. దేవుని కార్యముల మీద అలాంటి సమయమును మనము ఎందుకు కలిగియున్నాము? కారణం మనం పునరుత్థానము చెందియున్నాము. "ఆయన ఎవరిని ముందుగా యెరిగెనో ఆయన వారిని పిలిచెను, ఆయన ఎవరిని పిలిచెనో వారిని నీతి మంతులుగా తీర్చెను, ఎవరిని నీతి మంతులుగా తీర్చెనో వారిని ఆయన మహిమపరిచెను." అప్పుడు మనం పునరుత్థానము చెందియున్నాము, లోపలి నుండి బయటకు మనం పునరుత్థానము చెందియున్నాము, బయట నుండి లోపలికి కాదు. ఓ, నీవు గమనించావా, ఈ విధంగా బయటకు ముద్ర వేయబడుటకు కాదు; కానీ లోనికి ముద్రించబడుట. ఓ, మై, సంఘము దానిని చూడగలిగినట్లైతే! చూడండి, మనము బయటకు ముద్ర వేయబడలేదు; మనం లోనికి ముద్రించబడియున్నాము. ఆ దినములలో పాపము దేవుని ముందు హేయముగా ఉండెను, అక్కడ దాన్ని తీసివేయుటకు సరైనది లేకుండెను, మనము దాన్నుండి దూరంగా ముద్రించబడినాము. ఇప్పుడు అది రెండుగా చీల్చబడినపుడు మన కొరకు ఒక పాప పరిహారం జరిగించబడి ముద్ర తెరవబడినపుడు, మనము లోపల బాప్తిస్మము పొంది మరియు లోపల ముద్రవేయబడినాము.

మనము పునరుత్థానము చెందియున్నాము. ఇప్పుడు మనము పునరుత్థానము చెందియున్నాము. ఇదివరకే మనం పునరుత్థానము చెందియున్నాము నీకు ఎలా తెలుసు, బైబిల్ ఆరీతిగా చెప్పియున్నది. ఆమేన్. ఇప్పుడు మనం పునరుత్థానము చెందియున్నాము. ఇప్పుడు ఆత్మ సంబంధమైన పునరుత్థానములో మనం ఆయనతో లేచియున్నాము. "బ్రతికింపబడుట" అను మాట యొక్క భావము ఏమిటి? "బ్రతికింపబడుట" అనగా భావము "పునరుత్థానము చెందుట." అది నిజము. ఇప్పుడే ఇదివరకే మనం పునరుత్థానము చెందియున్నాము. క్రీస్తు యేసులో పరలోకపు స్థలములలో ఏకముగా కూర్చుని ఈష్టరు ముద్రను అనుభవించుచున్నాము. ఆమెన్. అదే దేవుని యొక్క నిజమైన ఈష్టరు ముద్ర. మనము ఎలా ఉన్నాము? ఒకే ఆత్మ ద్వారా శరీరంలోనికి మనం బాప్తిస్మం పొందియున్నాము, మరియు శాశ్వతంగా ముద్రించబడియున్నాము. ఇప్పుడు మనం ఆత్మసంబంధంగా లేపబడి యున్నాము. దేని నుండి మనం లేపబడియున్నాము? ఒక పాపపు జీవితం నుండి, ఒకప్పుడు మనం పాపులమైయున్నాము మరియు లోక కార్యములను ప్రేమించియున్నాము.

MATT 7:16,18,20

 

70ఇప్పుడు అనేక మంది మేము లేపబడియున్నామని చెప్పుకుంటారు, అయితే వారి జీవితం వారికి భిన్నంగా ఋజువు చేస్తుంది. నీవు ఏమైయున్నావో నీ జీవితం ఋజువు చేస్తుంది. "వారి ఫలముల ద్వారా మీరు వారిని తెలుసుకొందురు," అని యేసు చెప్పెను. ఆ కారణమును బట్టియే ఒక మనిషి భాషలతో మాట్లాడినందున అతడు పరిశుద్ధాత్మను కలిగియున్నాడని మనము ఎన్నడూ చెప్పరాదు. మనము దానిని నమ్మము. దానికి అక్కడ లేఖనం లేదు. లేదండి. మనుష్యులు భాషలతో మాట్లాడి మరల బయటకు వెళ్ళి లోకస్తుల వలె జీవిస్తారు. మరియు స్త్రీలు భాషలతో మాట్లాడి వారి వెంట్రుకలను కత్తిరించుకొని తమ ముఖములకు రంగులు పూస్తారు. హు! అది పరిశుద్ధాత్మనని నీవు చెప్పరాదు, నిజంగా నీవు చెప్పకూడదు, నిశ్చయంగా చెప్పకూడదు. నిశ్చయంగా చెప్పకూడదు. ఒక మనిషి చుట్టలు త్రాగుచూ బయటకు వెళ్ళి మరొకరి భార్యతో జీవించి అలా ముందుకు కొనసాగినపుడు అది పరిశుద్ధాత్మని మీరంటారా? లేదు, లేదు, "వారి ఫలముల ద్వారా మీరు వారిని తెలుసుకొంటారు. ఒక చెడ్డ చెట్టు మంచి ఫలములను ఫలించదు; అలాగే ఒక మంచి చెట్టు చెడ్డ ఫలములను ఫలింపదు."

EPH 1:13•

COL 3:3

 

71దేవుని నిజమైన ఈష్టరు ముద్రయైన పరిశుద్ధాత్మ ద్వారా మనం ముద్రించబడియున్నాము. క్రీస్తు యొక్క శరీరంలోనికి మనం ముద్రించబడియున్నాము, శాశ్వతంగా ముద్రించబడియున్నాము. ఏదో ఒక నిర్ణీత కాలం వరకు ముద్రవేయబడుట కాదు కానీ నిత్యత్వమంతటా ఇప్పుడు దాన్ని పొందిన వ్యక్తి మృతులలో నుండి, పాప జీవితంలో నుండి, పైకి లేచి యున్నాడు. అది ఏమై యున్నది? ఆయన ఆత్మ లేపబడి యున్నది. అతని ఆశయాలు లేపబడియున్నవి, అతని జీవము లేపబడియున్నది, అతడు ఒక నూతన సృష్టియైయున్నాడు. మనము పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి, క్రీస్తు యేసుతో పరలోకపు స్థలములలో కూర్చుని యున్నట్లుగా, ఈ ఉదయమున మనము ఈ ఉదయమున ఒకరికొరకు ఒకరు ప్రార్ధన చేయుటకు యున్నట్లుగా, ఒకరికి ఒకరు సహాయము చేయుటకు, ఒకరిని ఒకరు ప్రోత్సహించుటకు, అతడు తన తోటి రాజ్య పౌరులతో ఏకమవుతాడు.

"ఏలయనగా మీరు చనిపోతిరి, క్రీస్తు ద్వారా దేవుని యందు మీ జీవము భద్రపర్చబడి యున్నది, పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్రవేయ బడ్డారు," అని లేఖనము చెప్పియున్నది. అది లేఖనమై యున్నది. ఇప్పుడు చూడండి, మీరు ఈష్టరు ముద్ర ద్వారా ముద్రించబడియున్నారు, పునరుత్థానము యొక్క ఈష్టరు ముద్ర, ఆయన చెప్పియున్నది సత్యమని ఆయన జీవమును అది రూఢిపర్చినది. ఇప్పుడు ఒక ముగింపు చేయబడిన పనిని మనము కనుగొంటాము, అది ముగించబడిన ఒక ఉత్పత్తి అయి యున్నది. దేవుని యొక్క పునరుత్థానము ఒక ముగించబడిన ఉత్పత్తి అయి యున్నది. ఒక ముగించబడిన ఉత్పత్తికి పరిశుద్ధాత్మ ఒక దేవుని యొక్క ముద్రయైయున్నాడు.

72ఇప్పుడు, మనము క్రీస్తు నొద్దకు వస్తాము. మనము చేసే మొదటి కార్యము, ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. మనము అది చేసినపుడు, అప్పుడు తప్పు చేసియున్నామని మనము గ్రహిస్తాము. మనలను శుద్ధిచేయమని దేవునిని అడుగుతాము — అది మనలను మన పాప జీవితము నుండి శుద్ధిచేస్తుంది, మార్టిన్ లూధర్ యొక్క వర్తమానము నీతీకరణము; తరువాత శుద్దీకరణముతో వెస్లీ వచ్చాడు. మరియు అప్పుడు అంతయూ పూర్తి చేయబడినపుడు, ఆయన సంఘము సంపూర్ణము చేయబడినది, తరువాత కార్యము ఏమిటి? ఒక ముగించబడిన పని. సంఘము సంపూర్ణము చేయబడి యున్నదనుటకు, ఒక ముగింపు దానికి ముద్ర అయి యున్నది.

73పిరమిడ్ వలె యున్నది. ఒక డాలరు నోటు మీద గమనించండి. నేను దీనిని సూచించియున్నాను. నేను ఎన్నడైనా ఆలయము నొద్ద దానిని చేశానో లేదో నాకు తెలియదు. ఒక డాలరు నోటు మీద మీరు గమనించినట్లైతే, అది, "గొప్ప ముద్ర అని పిలువబడినది." ఇప్పుడు ఐగుపులో యున్న ఆ గొప్ప ముద్రను అమెరికా గుర్తించి యున్నదని మరియు దాని మరొకవైపున అమెరికా దేశపు యొక్క ముద్ర ఒక పక్షిరాజుగా యున్నదని నీవు ఎట్లు చెప్పగలవు? వారు ఎందుకు ఆ గొప్ప ముద్రను చేయునట్లుగా ఒప్పించబడ్డారు," గొప్ప ముద్రను?"

కారణమేమనగా, మీరు గమనించినట్లైతే, ఈ పిరమిడ్-కు తిన్నగా పైగా వెనుకకు, అక్కడ ఒక చిన్న రాయి యున్నది, మరియు ఆ చిన్నరాయి తలరాయైయున్నది, మరియు తలరాయి ఎన్నడూ పిరమిడ్ మీద పెట్టియుండబడలేదు. అది శిఖరము కప్పబడకుండా తెరువబడి యున్నది. మీరు ఎన్నడైనా అక్కడకు వెళ్ళి యున్నట్లైతే, దేవుని కృపను బట్టి నేను వెళ్ళియున్నాను. కాబట్టి అక్కడ పిరమిడ్ మీద శిఖరము లేదు. అది ఎందుచేత? హనోకు జలప్రళయమునకు ముందు దానిని నిర్మించియున్నాడు. అది ఒక జ్ఞాపక చిహ్నముగా యున్నది, ఆ కారణమును బట్టియే జలప్రళయము సమయములో అది ఎన్నడూ నాశనము కాలేదు. అక్కడ దానిలో ఏదియూ నాశనము కాలేదు, కారణము అది ఒక జ్ఞాపక చిహ్నముగా యున్నది.

74ఇప్పుడు మీరు గమనించినట్లైతే అది క్రింద భాగములో వెడల్పుగా ఉంటుంది, తరువాత అది చిన్న అల్ప సంఖ్యాక వర్గముగా పైకి మొనవలె వెళ్తుంది. మరియు తరువాత ఇంకొంచెము ఎక్కువగా వెడల్పు తగ్గుతూ అది తలరాయి నొద్దకు వెళ్తుంది. అది లూధర్ యొక్క యుగమైయున్నది, సంఘములో నీతికరణము, శుద్దీకరణము, తరువాత పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము. అది పైవైపునకు దాని ఆకారమునకు దిద్దుచుండగా అది లూధర్ యుగము నుండి వెస్లీ యుగమునకు తరువాత పెంతికొస్తు యుగం లోనికి వెళ్తుంది. అయితే అది పెంతుకొస్తు యుగమును విడిచిన తరువాత అది రూపు దిద్దుకొంటూ ఎలాంటి స్థానమునకు అది వెళుతుందంటే, చివరకు ఒక రేసరు బ్లేడును సైతం దానిలో దూర్చలేనంతగా ఆ రాళ్ళు సానపట్టబడినట్టుగా ఉంటాయి.

75అవి వేలకొద్ది టన్నుల బరువుంటాయి, అవి అంత ఎత్తులో ఎలా ఉంచబడ్డాయో అది ఇంకనూ మనిషికి ఒక మర్మముగా ఉన్నది. ఆ రాళ్ళ ఎంత పరిపూర్ణముగా సానపట్టబడి ఉన్నాయంటే చివరకు ఒక రేసరు బ్లేడును కూడా రెండు రాళ్ళ మధ్య నీవు ఉంచలేవు (అనగా రాయి మరొక రాయితో అతికించబడుటకు మధ్య ఖాళీ సైతము నీకు కనబడదు — తెలుగు తర్జుమాదారుడు.) అంత పరిపూర్ణముగా రాళ్ళ ఒకదానితో ఒకటి జత చేయబడినవి మరియు తలరాయి, రాళ్ళు ఒకదానితో ఒకటి పొంధికగా అమరి యున్నప్పుడు — ఒక విధంగా ఒకదానితో ఒకటి కూర్చుండి ఉన్నప్పుడు దేవుని యొక్క దూతల మార్గములో ఉన్నప్పుడు అప్పుడు తలరాయి మొన వలె వచ్చి, దానిలోకి తిన్నగా కూర్చుంటుంది. దానికి ఏ విధమైన సున్నము అవసరంలేదు. (ఒక రాయికి మధ్యలో సున్నము సహితము అవసరము లేనట్లుగా, రాళ్ళు ఒకదానిపై ఒకటి పరిపూర్ణముగా కూర్చొంటాయి. అనగా రాయికి రాయికి మధ్యలో సున్నము అవసరము లేదు — తెలుగు తర్జుమాదారుడు.)

ఇప్పుడు ఆయన సంఘమునకు దేవుడు దానినే చేయుచున్నాడు. ఆయన తన ప్రజలను సానపట్టుచున్నాడు, మరియు దాన్ని ఎంత పరిపూర్ణముగా దానిని తయారు చేయుచున్నాడనగా, తలరాయి అయిన క్రీస్తు వచ్చినప్పుడు అది కట్టడముతో ఏకముగా కూర్చుంటుంది, అప్పుడు ఆ కట్టడమునకు ఒక పునరుత్థానము వస్తుంది — మరియు సంఘముపైకి వెళ్ళిపోతుంది! తలరాయి.

2COR 12:2•

EPH 2:6

 

76ఇప్పుడు మనము క్రీస్తు యేసులో పరలోకపు స్థలములలో కూర్చుండియున్నాము. ఇప్పుడు దానిని మనము గ్రహించాము, యేసు యొక్క శరీరము పునరుత్థానములో పైకి కొనిపోబడినది. ఇప్పుడు బైబిలు మూడు ఆకాశముల గూర్చి మాట్లాడుచున్నది. అది మొదటి ఆకాశము, రెండవ ఆకాశము, మూడవ ఆకాశమని మనకు తెలుసు. పౌలు ఆ మూడవ ఆకాశములోనికి కొనిపోబడ్డాడు. మరియు వాటని గూర్చి కనీసము వివరించుట వల్ల పడదు ఇప్పుడు, లేఖనములో మొదటి ఆకాశముగా పిలువబడినదేమనగా అది మేఘములుండే ఆకాశము — మరొక మాటలో చెప్పాలంటే, మనకు దగ్గరగా వ్రేలాడుచున్న భూసంబంధమైన ముద్ర. ఇప్పుడు ఆ వాతావరణంపైగా ఆ మేఘముల పైగా ఉన్నది సంఘములోనికి వచ్చుచున్నప్పుడు అది పరలోకపు స్థలమైయున్నది. తరువాత రెండవ ఆకాశమనగా సూర్య, చంద్ర, నక్షత్రములు పరిభ్రమించే స్థలం అయితే మూడవ ఆకాశం దానికి పైగా ఉంటుంది.

77ఇప్పుడు ఒక క్షణం దీన్ని మనం ఆలోచిద్దాం… ఇప్పుడు శాస్త్రీయ పరంగా ఐన్ స్టీన్ దాన్ని రుజువు చేశారు, రెండు వస్తువులు ఒక దానితో ఒకటి ఎదురుగా వస్తున్నప్పుడు ఉదాహరణకు రెండు కార్లు రోడ్డు మీద ఒక దానికొకటి ఎదురు వచ్చుచున్నవి, అవి నిజముగా ఒక ఒక సెకనుకు ఒక బిలియన్ మైళ్ళ వేగముతో వస్తున్నట్లైతే; అవి ఒకదాని నొకటి డీ కొనకుండా, ఒక దానికొకటి ఎదురుగా దాటిపోతాయి. ఆ కార్యము చేయునది వేగమే. వేగమును బట్టి అవి ఒక దానినొకటి ఏ మాత్రము డీకొనకుండా ఒక దానికొకటి దాటిపోతాయి.

LUKE 24:42,43•

JOHN 20:19

 

78ఇప్పుడు, మళ్ళీ ఇప్పుడు, మీరు గమనించినట్లైతే… ఈ మధ్యనే నేను కాలిఫోర్నియాలోని కొండ నొద్ద నిలబడియుంటిని. మరియు ఒక 120 మిలియన్ల వెలుగు సంవత్సరముల గుండా చూడగలుగు అక్కడున్న ఒక టెలిస్కోపును నేను గమనించుచుంటిని. ఇప్పుడు ఆలోచించండి, అంతరిక్షంలో 120 మిలియన్ల వెలుగు సంవత్సరముల దూరంలో ఉన్నది, ఇప్పుడు అక్కడకు చేరుటకు ఎన్ని మైళ్ళ వేగముతో బ్రద్దలవ్వ వలసియున్నది! చూడండి?.

అయితే పరలోకము ఇంకనూ దానికి ఎన్నో బిలియన్ల, బిలియన్ల, బిలియన్ల వెలుగు సంవత్సరములకు ఆవలయున్నది, చివరకు దాని గూర్చి మనము తలంచలేము. నీవు ఎలా అక్కడికి చేరుకొనగలవు? అది ప్రయాణము ద్వారా, అది మనసులో ప్రయాణించినట్లుగా ఉంటుంది, అది ఎంతో వేగముగా ఉంటుంది. అది బహు వేగముగా ఉంటుంది. నీవు పరలోకమును గూర్చి తలంచినట్లైతే, నీవు దానిని తలంచినంత వేగముగా అక్కడుంటావు.

యేసు, ఆయన పునరుత్థానము తరువాత, తిన్నగా గోడల గుండా ద్వారముల గుండా దాటి వచ్చి వారి మధ్య నిలబడి వండిన చేపను మరియు తేనె పట్టును తిన్నాడు. హల్లెలూయ. వేగము! మన దేహములో నుండి జీవము వెడలిపోయిన వెంటనే అదిగో మనము దేవుని సన్నిధిలో ఉంటాము. మనము అంగుళములు, అడుగులు, గజములు మరియు మైళ్ళను మాత్రమే ఎరుగుదుము, మనము భూమి మీద బంధించబడిన ఈ క్రమములో ఉన్నాము, అయితే మనమీ స్థలమును విడిచినప్పుడు సోదరుడా, ఓ, మై, ఎలాంటి సమయము!

GEN 17:5

 

79గత రాత్రి మాట్లాడినట్లుగా, అబ్రహాము మరియు అతని సంతానమును గూర్చి దేవుడు ఎలా అబ్రహామునకు చూపియున్నాడో, ఎలా ఆయన అబ్రహామును ఆదికాండము 12వ అధ్యాయములో నీతిమంతుడిగా చేసియున్నాడో; ఇంకా ముందుకు వెళ్ళియిన్నట్లైతే 16వ అధ్యాయములో శుద్దీకరణము ద్వారా నిబంధనను నిర్ధారించియున్నాడు, 17వ అధ్యాయములో ఆయన స్థనముల నుండి పరిశుద్ధాత్మతో అతనికి పాలనిచ్చి పోషించాడు. మరియు తరువాత అతనిని నిర్ధారించి లేక అతనిని అతని స్థానములో ఉంచాడు ("ఆయన మాట వినుడి" అను వర్తమానం మీద నేను ప్రసంగించుటను మీరు వినియున్నారు.) ఆయన అబ్రహాముని తీసుకొని అతని పేరును అబ్రాము నుండి అబ్రహాముగా మార్చియున్నాడు, ఆయన పేరులోని ఒక భాగమును ఎలోహిమ్, h- a-m, అతనికిచ్చియున్నాడు. దాని తర్వాత మనం కనుగొంటాము, ఆయన అబ్రాహామునకు ప్రత్యక్షమైయున్నాడు.

80ఇప్పుడు అతని సంతానమునకు, ఆయన అదే విధముగా అతని సంతానమునకు చేసియున్నాడు. అబ్రహాము యొక్క సంతానము నీతీకరణము గుండా, శుద్దీకరణము గుండా, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము గుండా వచ్చినది, ఆయన నామమును ప్రత్యక్షపర్చుట, ఆయన ఎవరైయున్నారో, దానిని బయలుపర్చుట (యేసుక్రీస్తు, ఎవరు అనే ప్రత్యక్షత), ఆయన నామములో బాప్తిస్మము, అవన్నియూ ఆరీతిగా, ఆ ప్రత్యక్షత, ఆయన సంఘముతో ఆయన పేరును పంచుకొనుట, వారిని బయటకు పిలుచుట, తరువాత ఆయన ఏమి చేశాడు? తన నామమున పిలువబడిన అదే సంఘములో, యేసు నామము, ఆయన ఏమి చేశాడు? అబ్రహామునకు ఆయన ఏ రూపములో ప్రత్యక్షమయ్యాడో, ఆయన వెనుక యున్న ఆత్మను ఆయన వివేచించాడు, చూడండి. అదే నామములో ప్రత్యక్షమయ్యాడు, అదే కార్యములో, అదే రూపములో ప్రత్యక్షమయ్యాడు మనము మార్గము యొక్క అంతములో యున్నాము.

GEN 18:12,13•

ROM 4:19

 

81ఇప్పుడు ఏమి సంభవించియున్నదో గమనించండి. ఆయన దానిని చేసినపుడు, సంఘమునకు మార్పు రాకముందు, అబ్రహాము మరియు శారాకు మార్పు రాకముందు, సంఘమునకు మార్పు రాకముందు, ఆయన సంఘమునకు ఇచ్చిన చివరి సూచన అదియే. ఇప్పుడు దూత స్త్రీకి మర్మమును చెప్పినపుడు, (సంఘము… స్త్రీకి ప్రాతినిధ్యము వహించుచున్నది), ఆమె కనీసము దానిని నమ్మలేకపోయినది. ఆమె తనలో తాను నవ్వుకొన్నది.

చూడండి, ఆమెకు నూరు సంవత్సరములు. అబ్రహాము మరియు శారా భార్యా భర్తలుగా జీవించలేని స్థితిలోయున్నారు. (నా భావమును మీరు గ్రహించారా — వారిద్దరి మధ్య కుటుంబ భాంధవ్యము), బహుశ 20 సంవత్సరములకు పూర్వమే ముగిసిపోయినది. ఎందుచేత, వారు ఆ వయస్సులో వారు మృతతుల్యులుగా యున్నారు. అబ్రహాము మృతతుల్యడిగా యున్నాడు, శారా యొక్క గర్భము ఉడిగిపోయినది, అయితే ఏమి సంభవించినది? ఏమి జరిగినది? ఆమె అన్నది, "వృద్దురాలైన నేను నా యజమానితో సంబంధము కలిగియుండగలనా? అది ఆగిపోయినది. అది ఎన్నో ఎన్నో సంవత్సరముల క్రితమే ఆగిపోయిది. అది అతనికి అసాధ్యమైయున్నది. అది నాకు అసాధ్యము. నేను దానిని ఎలా చేయగలను?" ఆమె ఈలాగు తనలోతాను నవ్వుకొన్నది.

దూత అన్నాడు, "ఆమె ఎందుకు నవ్వినది? ఆమె ఎందుకు తన హృదయములో అలా ఆలోచించినది? ఆమె అది ఎందుకు చెప్పినది?" ఇప్పుడు గమనించండి, అబ్రహాము మరియు శారాలకు ఏదైనా సంభవించుటకు ముందు అది చివరి సూచనైయున్నది.

GEN 20:1,2

 

82ఇప్పుడు, ఒకసారి నేను దాని మీద భోధించియున్నాను, దేవుడు వారిని ఒక యవ్వనస్తుడుగా మరియు ఒక యవ్వనస్తురాలుగా వారిని మార్చియున్నాడు. దానిని ఋజువు చేయుటకు వారు ప్రయాణము చేసిరి, వారు ఒక చిన్న ప్రయాణమును గెరారుకు చేసియుండిరి, మరియు అబిమెలెకు అను ఫిలిష్తియుల రాజు, శారాతో ప్రేమలో పడి మరియు ఆమెను వివాహము చేసుకొనగోరెను — ఏలయనగా ఆమె తిరిగి, ఒక అందమైన యవ్వనస్తురాలుగా మారినది.

మరియు గమనించండి, ఆయన ఏదో చేయవలసియుండెను. ఆయన ఆమెను మార్చవలసియుండెను. అతనిని మరియు ఆమెను, ఆయన కేవలము ఒక యవ్వనస్తుడిగా మరియు ఒక యవ్వనస్తురాలుగా తిరిగి మార్చుట కాదు, ఆయన అది చేయలేదు… ఏలయనగా వారు అలాగైతే, అదే కార్యము వారి మధ్య నిలిచియుండేది. చూడండి, వారు వచ్చి… కారణము ఆమెకు 16 సంవత్సరముల వయస్సులో అతడు ఆమెను వివాహము చేసికొనెను, మరియు అతడు ఒక యవ్వనస్తుడిగా యుండెను, మరియు వారి జీవితమంతయు పిల్లలు లేకుండా జీవించియున్నారు. ఆయన వారిని అలా తిరిగి ఉంచినట్లైతే, సరే, తిరిగివారు అదే కార్యమును చేసియుండేవారు. అయితే ఆయన ఒక భిన్నమైన కార్యమును చేయవలసియుండెను. ఈ వాగ్దాన కుమారుని పొందగలుగునట్లు ఆయన వారిని మార్చవలసియుండెను, వారు పొందబోవు వాగ్దాన కుమారుడు. అయితే ఆయన వారి పూర్తి క్రమమును మార్చవలసియుండెను, మరియు వారు కుమారుని పొందునట్లుగా వారిని యవ్వనస్తులుగా మార్చెను.

LUKE 17:28,30•

1COR 15:51,52•

1THS 4:17

 

83దాని తరువాత ఆయన అదే కార్యమును చేయబోవుచున్నాడు. మరియు గుర్తుంచుకోండి, అబ్రహాము మరియు అతని గుంపుకు ఆ సూచన సంపూర్ణముగా ప్రత్యక్షపర్చబడిన తరువాత, అప్పుడు తరువాత వచ్చునది మార్పైయున్నది, చూడండి. ఇప్పుడు, నీతీకరణము గుండా, శుద్దీకరణ ముగుండా, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము గుండా, కుమారుని స్థానములో యుంచుట గుండా, ఆయన యొక్క అద్భుతములు మరియు సూచక క్రియలు ఆయన సన్నిధిలో యుండి హృదయములోని తలంపులు వివేచించబడుటను వాటన్నిటిని సమస్తమునూ మనము చూసియున్నాము, ఆయన చెప్పి యున్నట్లుగా, "సోదోమ దినములలో జరిగియున్నట్లుగా, మనుష్యకుమారుని రాకడలోనూ జరుగును." అవి తిన్నగా ఇప్పుడే సంభవించుటను మనము చూడగలము.

తరువాత విషయము ఏమైయున్నది? దేహము యొక్క మార్పు ఇప్పుడు, అది చూపునది ఏమనగా మనము ఒక ఎదురుచూచుచున్న కుమారుని కొరకు కనిపెట్టుచున్నాము. మహిమ! అధి నిజమేనా? ఆ దేహములలో మనము ఆయనను కలుసుకొనలేము. మనము యవ్వన స్త్రీలుగా మరియు యవ్వన పురుషులుగా తిరిగి మార్పు చెందినప్పటికిని, ఇంకనూ మనము ఆయనను కలుసుకొనలేము, ఏలయనగా మనము ఆయనను మధ్యాకాశములో కలుసుకొనవలసియున్నది. మనము యవ్వన పురుషులుగా మరియు స్త్రీలుగా మార్పు చెందుటకంటే ఎక్కువగా ఏదో అక్కడ మార్పు చెందవలసియున్నది. మనము తప్పక మార్పుచెంది మధ్యాకాశములో ఆయనను కలుసుకొనుటకు కొనిపోబడవలసియున్నది. మరియు తరువాత వచ్చునది సంఘము యొక్క ఎత్తబడుటైయున్నది మరియు బుద్ధిలేని కన్యకలు మధ్యాకాశములో కలుసుకొనుటకు మార్పైయున్నది.

1COR 12:13•

EPH 1:13•

EPH 4:30•

COL 3:3

 

84ఓ, ఈష్టరు యొక్క జ్ఞాపక చిహ్నము. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడినవారు? ఇప్పుడు, ఏదెను గవిని నొద్ద, దేవునికి దూరముగా మనిషి ముద్రించబడియున్నాడు, అయితే పెంతికొస్తునొద్ద దేవునిలోనికి అతడు శాశ్వతముగా ముద్రించబడియున్నాడు. ఇక ఎంత మాత్రము అతడు బయటకు వెళ్ళలేడు, మేలు కొరకే అతడు అక్కడ యున్నాడు. చూడండి. ఒకే ఆత్మ ద్వారా, "పరిశుద్ధాత్మ ద్వారా మనమందరము శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము." అది నిజమేనా? అప్పుడు మనము ఎంత కాలము మట్టుకు ముద్రించబడియున్నాము? మన విమోచనా దినము వరకు, అతడు ఇక ఎంత మాత్రము లోక కార్యముల కొరకు వెళ్ళడు. "ఏలయనగా మీరు మృతినొందితిరి, మరియు క్రీస్తు ద్వారా మీ జీవము దేవునిలో భద్రపరచబడియున్నది, పరిశుద్ధాత్మ ద్వారా లోనికి ముద్రించబడియున్నారు." ఓ, ఎలాంటి రమ్యమైన లేఖనము — పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తులో ముద్రించబడుట.

85తరువాత యేసు మృతులలో నుండి వారు మరలా తీర్మానము చేయుటకు వత్తిడి చేయబడ్డారు. "ఆయన లేచియున్నాడా, లేక లేవలేదా?" వారు ఏమిచేసియున్నారు? ఆయనను వెక్కిరించే పరీక్ష నొద్ద, రాజకీయము మరియు సంఘము ఏకముగా కలిసి, యేసునకు వారు దానినే చేశారు, కారణము అప్పుడు చేసియున్నట్లు గానే రాజకీయము మరియు మతము ఏకమైనది. భవిష్యత్తులోనూ సరిగ్గా వారు దానినే చేయుచున్నారు, మరియు ఇప్పుడే వారు దానిని చేయుచున్నారు, రాజకీయము మరియు మతము!

ఆహాబు ఒక చాలా మంచి కుర్రవాడు, అయితే అతడు యొజబెలుతో వివాహమైనాడు. ప్రెసిడెంట్ కెన్నడీ మంచి వాడు కాదని నేను చెప్పుట లేదు, అయితే అతడు యెజబెలు క్రమముతో వివాహమైనాడు. అది చేసి యున్నది ఆహాబు కాదు; అది నియంత్రణ చేసినది సింహాసనము వెనుక యున్న యెజబెలు అయి యున్నది. అది యొజబెలు క్రమమే ఇక్కడ నష్టమును చేయబోవుచున్నది. అతడు దానిని చేయవలసియున్నది, కారణము అతడు ఆమెతో వివాహమైనాడు. అతడు దానిని స్వీకరించవలసియున్నది, అతడు దానిని చేయవలసియున్నది, అతడు ఆమెతో వివాహమైనాడు. ఓ, మై! ప్రజలారా, లేఖనము ఏమిచేయున్నదో మీరు చూడలేరా? మనము చివరి దినములలో ఎక్కడ నిలబడియున్నామో మీరు చూడగలరా?

MARK 15:45-47•

JOHN 20:6,7

 

86ఇప్పుడు, పునరుత్థానము తరువాత ఆ మనుషులను చూడండి సంఘము ఏమి చేస్తుందో వారు ఎరిగినవారై, సంఘమునకు అప్పగించబడిన వెక్కిరింత చేయు పరీక్షను మీరు చూడండి. సైనికులు భయపడి పారిపోయినపుడు దానికి ఏమి సంభవించినది? సంఘము ఈ సైనికులను కూలికి తీసుకొని, మేము నిద్రించుచుండగా ఆయన శిష్యులు వచ్చి రాత్రివేళ ఆయనను తీసుకొనిపోయిరని చెప్పమనుచూ, వారికి కొంత డబ్బును ఇచ్చిరి. అలాగైతే నేను మిమ్మను ఒకటి అడుగగోరుదును. ఒక వేళ శిష్యులు వచ్చి రాత్రివేళ ఆయనను తీసుకొనిపోయినట్లైతే, ఆయనపై యున్న వస్తమును వారు ఎందుకు తీసుకొనిపోలేదు? వారు దొంగలైయున్నట్లైతే, వారు దొంగిలించుచున్నట్లైతే, వారు ఆయన వస్త్ర మును కూడా ఎందుకు తీసుకొనిపోలేదు? ఆయన ముఖము మీద ఉంచబడిన చేతిరుమాలు సహా ఆ సన్నపు దేహమునకు చుట్టబడిన సన్నపు నారవస్త్రము అక్కడే యుంచబడియున్నది. ఆయన వాటిలో నుండి తిన్నగా కదిలి పునరుత్థానము ద్వారా పైకి వెళ్ళిపోయాడు. ఒక్కటి కూడా ఆయనను ఆటంకపర్చలేదు, ఆయన ఉంచబడిన రీతిగా ఉంచబడియున్నాడు, ఆయన ఆలాగే యుంచబడియున్నాడు, అయితే ఆయన ఆ సన్నపు నారవస్త్రములో నుండి బయటకు వెళ్ళిపోయి యున్నాడు. ఆమెన్.

87చూడండీ, వెక్కిరింతలు చేయు ఒక పరీక్ష ఒక అబద్దపు నేరారోపణ. కారణము ఎందుకు? వారు వత్తిడి చేయబడిరి, వారు ఒక నిర్ణయము చేయుటకు వత్తిడి చేయబడిరి. మనిషి ఒక నిర్ణయమును చేయవలసియున్నది, "ఆయన మృతులలో నుండి లేచి యున్నాడని," లేక "ఆయన మృతులలో నుండి లేవలేదని," సంఘము చెప్పవలసియుండెను. ఆమెన్.

ఓ, ఇప్పుడు, దానిని మనము విందాము, మీ యొక్క ఆత్మ సంబంధమైన వినుటను గూర్చి చికిత్సను దానిలో యుంచండి. గమనించండి, అది అదే కార్యమునకు వచ్చియున్నది. మన కూటములను వెంబడించినట్లుగా, మనుషులు వెంబడించుటకు ప్రయత్నము చేయుచూ ఇలా చెప్పుచున్నారు. పేరు పొందిన సంఘములు సహితము ఇలా చెప్పుటను నేను వినియున్నాను, క్రీస్తుసంఘము "స్వస్థత పడిన వారిని ఒకరిని మాకు చూపించండి… లేక, ఒక పునరుత్థానము యొక్క రుజువును మాకు చూపించండి, మీకు ఒక వెయ్యి డాలర్లు ఇస్తామని," చెప్పుచున్నారు. నేను వైద్యులను వారి యొద్దకు తీసుకొని వెళ్ళాను, అయినా కనీసము వారు దానిని నమ్మరు. ఎందుచేత? ఒక తీర్మానము చేయునట్లుగా వారు ఒత్తిడి చేయబడ్డారు. వారు కయీనుతో, మత పద్ధతులతో తమ్మునుతాము బయటకు ముద్ర వేసికొనియున్నారు.

అయితే నిజమైన దేవుని యొక్క చిన్న సంఘము ఒక అల్ప సంఖ్యగా ఎల్లప్పుడు ఆ రీతిగా ముందుకు కదిలియున్నది, అయితే ఆమె… ఎలా ఆమె 1500 సంవత్సరములు చీకటి యుగములలో శ్రమను అనుభవించినది?

88వారంటూరు, "రోమన్ కాథలిక్ చర్చి అని…" నిశ్చయముగా, రోమన్ చర్చి మొదటగా ఒక పెంతికొస్తు సంఘమై యునది. అది పెంతికొస్తునొద్ద ఆరంభమైనది, అయితే వారు దానిని సంస్థగా చేయగోరారు. మరియు ఈ దినమున యున్న పెంతికొస్తు సంఘము మరొక రెండు వేలు సంవత్సరములు నిలబడియున్నట్లైతే, ఇప్పుడు యున్న కాథలిక్స్ కంటె వారు బహు అధ్వాన్నముగా మారతారు. వారు ప్రతిదాని నుండి ఎంతో దూరముగా వెళ్ళిపోవుచున్నారు.

"నీవు ఈ స్థలమునకు వచ్చినట్లైతే, స్త్రీలు తమ ముఖములకు రంగులు పూసుకొనుటను గూర్చి భోధిస్తావా," అని నేను ప్రశ్నించబడియున్నాను, వారు తప్పక పొట్టి దుస్తులను వేయరాదు. వీటిని ధరించరాదు? నేనన్నాను "అలాగైతే నన్ను అడుగవద్దు, లేదండి. నన్ను రమ్మని అడుగవద్దు."

"నీవు దానిని భోధించబోవుచున్నావా? దానిని గూర్చి "నీకు ఏమిపని?" అని కూడా వారన్నారు.

నేనన్నాను, "అది ప్రభువు పనియైయున్నది, మరియు నేను ప్రభువు పని మీద యున్నాను." అది ఖచ్చితంగా సత్యము. ఖచ్చితముగా! కాబట్టి నేనున్నాను కేవలము…

"దానిని గూర్చి నీవు ఏమి చేస్తావు? చెప్పుటకు ఇంకా ఇతర కార్యములులెవా?"

నేనన్నాను, "అవును, అయితే ఆ పనిని వారినే చెయ్యనియ్యండి, మరియు అప్పుడు మనము ఇతర కార్యములను గూర్చి మాట్లాడుదాము. మీరు చూడండి. చూడండి, ముందు పునాదిని వేద్దాము."

DEUT 22:5•

HEB 13:8

 

89ఈ దినమున యున్న చిక్కు అదే మీరు తప్పక క్రింద నుండి ఆరంభించక ముందే, మీరు ఒకేసారి నిచ్చెన పైకి ఎగరాలని ప్రయత్నించుచున్నారు, చూడండి. మీరు క్రింద నుండి మొదటగా ప్రారంభించండి, మిమ్మలను మీరు శుద్ధి చేసుకొని మరియు సరిగ్గా ప్రారంభించండి, మరియు అప్పుడు దానిపైకి నిర్మించవచ్చును. లేనియెడల మీరు దానిన నిర్మించలేరు, కారణము, క్రీస్తు యొక్క నియమములపై నిర్మించని ఏ పునాదియైన కూలిపోతుంది.

బైబిలు చెపుతుంది, "ఒక పురుషునికి సంబంధించిన వస్త్రములను స్త్రీ ధరించుట హేయమైన కార్యము." దేవుడు మారనివాడుగా యున్నందున, అది కూడా ఒక్క రవ్వంత మారలేదు. ఆయన నిత్యుడైయున్నాడు, ఈ దినమున యున్నట్లుగా ఆయన తలంపులు నిన్న కూడా ఒకే రీతిగా ఉన్నాయి, మరియు నిరంతరము ఒకే రీతిగా యుంటాయి. ఆయన విమోచన కూడా నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నది. మరియు ఆయన నిన్న నేడు, నిరంతరము ఒకే రీతిగా యున్నాడు. దాని చుట్టూ వెళ్ళే ఏ మార్గమును అక్కడ లేదు. ఇప్పుడు, ఒక తియ్యని పాయసమును అక్కడ తినుటయే దాని యొక్క ఋజువు, మనకు అది తెలుసు. అది నిజమేనా? అది అలా యుంటుందని దేవుడు చెప్పియున్నాడు.

MATT 12:24•

MARK 3:22•

LUKE 11:15

 

90మనిషి ఒక తీర్మానము చేయవలసినదిగా ఒత్తిడి చేయబడ్డాడు. క్రీస్తు దినములలో మొదటిగా వారు దేనిని వత్తిడి చేశారు. ఏది చేయుటకు వారు ఒత్తిడి చేయబడ్డారు? మొదటగా ఆయనను అంగీకరించుటకు వారు ఒత్తిడి చేయబడ్డారు, ఆయన ఆయన యొక్క ముద్రను, ఆయన సూచనను వారికి చూపించాడు, ఆయన మెస్సీయా యై యున్నాడు. దానిని ఎలా ఆయన చూపించాడు? బైబిలు ఖచ్చితముగా ఏమి చేస్తాడని చెప్పినదో దానిని చేయుట ద్వారా, ఆయన ఒక ప్రవక్తయైయున్నాడు, మరియు వారి మనస్సులోని తలంపులను ఆయన వివేచించియున్నాడు. వారన్నారు, "అతడు ఒక దయ్యము, బెయెల్జబూబు." వారు ఒక తీర్మానము చేయుటకు ఒత్తిడి చేయబడ్డారు. వారు దానిని ఇక ఎంత మాత్రము ఆపుకొనలేకపోయారు.

ఆలాగుననే పెంతికొస్తు సంఘము లేక బాప్తిస్ట్ సంఘము లేక ప్రెస్బిటేరియన్ సంఘము. పరిశుద్ధాత్మడు… క్రీస్తు లేచియున్నాడు, మరియు ఆయన సంఘములో యున్నాడు. వారన్నారు, "ఈ మనిషి యేసు నామములో బాప్తిస్మమును ఇచ్చుచున్నాడు. మరియు భాషలలో మాట్లాడుట, పరిశుద్ధాత్మ పొందినట్లు సూచన కాదని, నీవు భాషలతో మాట్లాడవలసిన పనిలేదని అతడు నమ్ముచున్నాడు. స్త్రీలు పొడవైన వెంట్రుకలను కలిగియుండవలెనని అతడు నమ్ముతాడు, అది దానితో చేయునది ఏమియు లేదంటారు." అలాగైతే అది ఎందుకు సత్యము అని దేవుడు ఋజువు చేయుచున్నాడు? అది ఎక్కడ యున్నదో కనుగొనండి.

MARK 16:20•

JOHN 10:37

 

91ఆయన మెస్సీయాయైయున్నాడని ఆయన వారికి చూపినపుడు ఆయన మెస్సీయాత్వమును వారు నిరాకరించి యున్నారు. వారు ఏదో ఒకటి చెప్పుటకు ఒత్తిడి చేయబడ్డారు. ఆ విధముగానే ఈ రోజున కూడా వారు దానిని త్రోసివేయుచున్నారు, మరియు దానికి సహాయపడుటలేదు, దాని నుండి వారి చేతులను కడిగివేసుకొనుచున్నారు. తీర్మానము వారిపై ఒత్తిడి చేయబడినది. అక్కడ దానికి వేరే మధ్య దారి లేదు! మనము అంత్యకాలములో యున్నాము. మనిషి దానిని అంగీకరించుటకు లేక తిరస్కరించుటకు ఒత్తిడి చేయబడ్డాడు. నీవు తప్పక దానిని అంగీకరించవలసి యున్నది లేక త్రోసి వేయవలసి యున్నది. అది అమెరికాపై ఒత్తిడి చేయబడినది. అది బ్రెన్హాం ఆలయముపై ఒత్తిడి చేయబడినది. అది పెంతికొస్తు వారిపై, మెథడిస్ట్ వారిపై ఒత్తిడి చేయబడినది, ప్రతిచోట అది ఒత్తిడి చేయబడినది. నీవు దానిని తీసుకోనైనా తీసుకోవాలి లేక విడిచిపెట్టాలి.

ఆయన సూచనలు చూపించుట ద్వారా, ఆయన పరిచర్యను బలపర్చుట ద్వారా ఆయన ఏమైయున్నాడో బుజువు చేయుట ద్వారా ఆయన ఖచ్చితముగా ఏమైయున్నాడో చూపుట ద్వారా, దేవుడు ఆయన వాక్యమును నిర్ధారించియున్నాడు. యేసు అన్నాడు, "నేను నా తండ్రి కార్యములను చేయని యెడల, నన్ను నమ్మవద్దు." అది నిజము. "అయితే నేను నా తండ్రి కార్యములను చేసినయెడల, అప్పుడు ఆ కార్యములను నమ్మండి." అక్కడే నీవు వున్నావు. చూడండి, వారు దానిలో ఏమియూ కనుగొనలేకపోయినారు, ఎందుచేతననగా అది సత్యమైయున్నది. అలాగైతే వారు దానిని ఎందుకు స్వీకరించలేదు? అది సంస్థగా యున్నందువల్ల, వారు దానిని స్వీకరించలేరు, కాబట్టి వారు ఒక నిర్ధారణను చేయుటకు ఒత్తిడి చేయబడ్డారు.

92కొన్ని దినముల క్రితము ఒహియోలో, ఒక సంవత్సరము క్రితము నన్ను బలపర్చిన అవే సంఘములు, నేను దానిపై దాడి చేయుచున్నందువల్ల, మరియు అదే తప్పుయైయున్నదని చూపచున్నది, వాటిలో ఒకటియు అక్కడ లేదు, అయితే ఒక సంఘము, బ్రదర్ బ్రెన్హాం నీకు సహకరిస్తుంది. నేనన్నాను, "నేను ఇంకనూ అవే చేతులను కలిగియున్నాను, నేను ఇంకనూ అవే కాళ్ళను కలిగియున్నాను, నేను ఇంకనూ అదే వర్తమానమును కలిగి యున్నాను, నేను ఇంకనూ అదే బ్రెన్హాంను యై యున్నాను. నాలో యున్న చిక్కు ఏమిటి?" అది నేను కాదు. పరిశుద్ధాత్మడు ఇంకనూ మాట్లాడు చున్నాడు, పరిశుద్ధాత్ముడు ఇంకనూ అవే కార్యములను చేయుచున్నాడు, ఆయన ఇంకనూ దానిని చూపుచున్నాడు. అయితే నీవు ఒత్తిడి చేయబడినావు. అది నిజము. వారు ఒత్తిడి చేయబడ్డారు. ఆ గొప్ప పరిశుద్ధాత్మడు వారి మధ్యలో క్రుమ్మరించబడుచున్నాడు, ఆయన మాటలను మాట్లాడుచున్నాడు, అప్పుడు చెప్పిన మాటలనే ఆయన చెప్పుచున్నాడు. అయినను వారు ఇంకనూ…

93మొన్నటి దినమున కాలిఫోర్నియాలో ఇక్కడ ఏమి సంభవించి యున్నదో చూడండి. నేను దానిని ఇక్కడ కనుగొనలేకపోవుచున్నానని తలుస్తాను. ఇక్కడ అది యున్నది. క్లిప్టన్ నెఫ్టీరియాలో నేను అల్పాహారమును తినుచున్నాను. అక్కడ ఒక బాప్టిస్టు సోదరుడున్నాడు… దేవునిని త్రోసివేస్తూ వారు చెడ్డ కార్యములను, ఆ చెడుగను ఎలా చేయుచున్నారో నేను సంఘములను ముక్కలుగా చీల్చి వేయుటలోనికి వెళ్ళి యున్నాను — ఈ బాప్టిస్టు సోదరుడు నా చుట్టూ వచ్చి తన చేతులను నా మీద వేసి, ప్రార్ధన చేయుటకు వచ్చియున్నాడు. మరియు అతడు ప్రార్ధన చేయుచుండగా అతడు అన్యభాషలలో మాట్లాడుటకు ప్రారంభించాడు. ఇప్పుడు, అతడు ఒక బాప్తిస్టుయైయున్నాడు, దానిని గూర్చి ఏమియు అతనికి తెలియదు. అతడు దానిని ముగించినపుడు, అతడన్నాడు…

లూసియానా నుండి వచ్చిన ఒక స్త్రీ అక్కడ నిలబడియున్నది, ఒక ఫ్రెంచి జాతీయుడు అన్నాడు, "అది తెలియని బాష కాదు, అది ఫ్రెంచ్ భాష మరియు ఇక్కడ స్విజ్జర్లాండ్ నుండి వచ్చిన లాసన్న అను మరొక స్త్రీ కూర్చొనియున్నది, ఆమె ఫ్రెంచి భాష మాట్లాడుతుంది. (నేను అక్కడకు వెళ్ళి యున్నాను), ఆమె చక్కగా అనువాదము చేసియున్నదని ఆమె చెప్పియున్నది. ఇక్కడ ఒక యవ్వనస్తుడు నడుచుకొంటూ వచ్చి యున్నాడు (నేను అతనిని ఎన్నడూ చూసియుండలేదు, ఎవరూ అతనిని ఎన్నడూ చూసియుండలేదు, అతడు ఐక్యరాజ్యసమితిలో ఫ్రెంచి భాషకు అనువాదము చేయువాడైయున్నాడు. అతడన్నాడు, "అది ఖచ్చితముగా సత్యము," అని అన్నాడు.

94మీకు తెలుసా, ఈ మనిషి ఇలా చెప్పుచున్నాడు. ఒక్క నిమిషము క్రితము నేను అతని పేరును పిలిచాను. అతని పేరు హెన్రీ, ఒక్క క్షణములో నేను అతని చివరి పేరును పిలుస్తాను, ఇక్కడ నేను వ్రాసి యుంచానని తలుస్తాను, నాకు తెలియదు. అది బిజినెస్ మెన్స్ వాయిస్లో యున్నది, అది లేనట్లైతే. అయితే అతడు… ఓ, అవును, "డానీ హెన్రీ." ఇప్పుడు, అది… ఆ చలనచిత్ర నటుడు నాకు గుర్తు రావటము లేదు. [ఎవరో అన్నారు, మెర్లిన్ మన్రో?"] లేదు. అది మెర్లిన్ కాదు. మెడా…? జేన్ రుస్సేల్, జేన్ రుస్సేల్ యొక్క మేనల్లుడు. అతడు నా యొద్దకు వచ్చి అతని చేతులను నా చుట్టూ వేసి ఇలా అన్నాడు. అతడు చెప్పిన మాటలు ఇక్కడ యున్నవి, అతడన్నాడు, "ప్రకటన గ్రంధములోనికి ఆ ప్రసంగమును ఉంచవచ్చును." అతడన్నాడు, "అది సత్యము," "బ్రెన్హాం సోదరుడా, నేను నీ కొరకు ప్రార్ధన చేయగోరుచున్నాను," అని నా చుట్టూ చేతులు వేసి అతడు ఫ్రెంచి భాషలో మాట్లాడుట ఆరంభించాడు, మరియు ఆ భాష గురించి అతనికి ఏమియు తెలియదు.

95ఇక్కడ దాని తర్జుమాయున్నది. ఒక వ్రాత ప్రతిగా అది వచ్చి యున్నది, అది చెప్పినది, "విక్టర్ డీ-డాక్స్, ఫ్రెంచి పేరు, "నేను ఒక ఫ్రెంచివాడిని." (మీరు పిలిచే), డానీ హెన్రీ అతని వర్తమానమును ఇచ్చినపుడు, బ్రదర్ బ్రెన్హాం మీద నేను అక్కడ యున్నాను, అది ఫిబ్రవరి మాసము 11వ తారీఖున 1961వ సంవత్సరము. అతడు 809, నార్త్కింగ్స్ రోడ్, లాస్ ఏంజలస్ 64లో అతడు ఉంటాడు." అతడు ఏమి వ్రాశాడో వినండి,

"నీవు ఇరుకు మార్గమును ఎన్నుకొనినందున. [ఇప్పుడు, చూడండి, దానిని నేను సరిగ్గా ఉంచుతాను, దానిలో ఒక భాగము నా యోద్ద లేదు.] నీవు ఇరుకు మార్గమును ఎన్నుకొని యున్నందున, ఖఠినమైన మార్గమును ఎన్నుకొనినందున, నీవు నీ యొక్క సొంత ఎన్నికలో నడిచావు."

EXOD 4:9•

JOSH 3:7

 

96నేను దానిని చక్కగా చేస్తాను, చూడండి. చూచారా, నీకై నీవు దానిని ఎన్నుకొనియున్నావు. మోషే కూడా తన సొంత ఎంపికను చేసి యున్నాడు, అతడు దానిని చేయవలసినపని లేదు. అలాగునే నేనును ఈ మార్గమును తీసుకోనవసరము లేదు. వారిలో కొందరు కలిగియున్నట్లుగా అదిగో, నేను పెద్ద కట్టడములను కలిగియుండే వాడిని. టెలివిజన్లో దేశమంతటా యుండేవాడిని. వారి పునాదులనే నేను చీల్చివేయుచున్నందున, నన్ను ఎవరు ఆదరిస్తారు? అయితే ఒక్క మాట, యేసుక్రీస్తు యొక్క పాదములకు తప్ప మరి ఎవరి పాదములకు నేను మొక్కవలసిన పని లేదు. అది సత్యము. అవును. బైబిలు ఏమి చెపుతుందో దానినే నేను భోధిస్తాను. వారి యొక్క సంస్థలతో నేను రాజీపడనవసరము లేదు, కారణము నేను వారికి చెందినవాడను కాను. నేను ఒక ఎంపికను చేశాను. అతడు సరిగ్గా అక్కడ చెప్పియున్నట్లుగా, "నేను మోషేకు తోడుగా యున్నట్లు, నీకును తోడుగా యుంటాను." దానిని ఋజువు చేయుటకు ఆయన మోషేకు రెండు సూచనలను ఇచ్చియున్నాడు. మరియు మోషే తన యొక్క సొంత ఎన్నికను చేసియున్నాడు. చూడండి, మోషే తన సొంత ఎన్నికను చేసియున్నాడు. కాబట్టి అది గ్రహించుటకు సుళువుగా యున్నది, చూచారా, "నీవు ఒక ఎన్నికను చేసియున్నావు."

"నీవు ఇరుకైక మార్గమును, ఖఠినమైన మార్గమును ఎన్నుకొని యున్నందున, నీవు నీ యొక్క సొంత ఎన్నికలో నడిచావు.

97ఇప్పుడు, ఇక్కడ, ఈ మనిషి, ఎలా వ్రాసియున్నాడో చూడండి. వేరే దేశపు బాషలో అతడు వ్రాయుటను మీరు చూశారు. నీవు సరియైన ఖచ్చితమైన దానిని ఎన్నుకొనియున్నావు మరియు అది నా మార్గము. దేవునికి స్తోత్రము! "అది నా మార్గము," అని ఆయన అన్నాడు.

ఈ రెప్పపాటుతో కూడిన తీర్మానమును బట్టి, పరలోకములోని ఒక గొప్ప భాగము, నీ కొరకు కాచుకొని వుంటుంది (అతడు ఎన్నడూ ఆదర్శమును గూర్చి వినియుండలేదు, మీరు చూడండి, అది సరిగ్గా… మీకు ఆ దర్శనము గుర్తున్నదా. "…పరలోకములోని ఒక గొప్ప భాగము నీ కొరకు కాచుకొనియుంటుంది. ఎలాంటి మహిమకరమైన నిర్ణయమును నీవు చేసి యున్నావు!" చూచారా.

"అది దానికై అది… [ఇప్పుడు ఇక్కడ నుండి నాకు అర్ధము కాదు.] అది దానికై అది అదే. [దాని చుట్టూ పెద్ద బ్రాకెట్లలో], దైవిక ప్రేమలో వారి యొక్క అద్భుతమైన విజయమును వచ్చునట్లు చేస్తుంది."

దాని యొక్క భావము ఏమిటో నాకు తెలియదు, "అది దానిని నెరవేర్చుతుది…" బహుశ, ఈ దినములలో ఒక దినమున, అదిగో ఆ చిన్న గుడారమునొద్ద కూర్చొనియుండగా ఆయన దానిని తెలియపర్చును.

98ఎందుచేత? దానిని మనము చేయవలసియున్నందున కాదు. అది ఒక సుళువైన మార్గము అని కాదు. నీవు ప్రఖ్యాతి చెందినవాడవు కాగలవు, ప్రతి ఒక్కరూ నీ వీపును నిమురుతారు, రేడియో ప్రసారము కొరకు లేక టెలివిజన్ ప్రసారము కొరకు ప్రతి స్థలము నుండి డబ్బు ప్రవహిస్తుంది, మరియు అలా ఉంటుంది. వారు దానిని తీసుకొని టెలివిజన్లలో ప్రసారము చేస్తానన్నారు. దేవుని యొక్క కార్యములను తీసుకోని ఆలాంటి లోకములోని అసభ్యమైన వాటి మీద బయట యుంచుట యందు నాకు నమ్మకము లేదు. ఒక కాని దానిని ఏదోలా తయారు చేసి పైకి గంతులు వేయుట యందు నాకు నమ్మకము లేదు. దేవుడు ఉంచిన మార్గము లోనే దానిని ఒంటరిగా విడవాలని నా నమ్మకము. ఆయన దేవుడై యున్నాడు, ఆయన దానితో ఏమి చేయగోరతాడో దానినే ఆయనను చేయనివ్వండి. మనము సేవకులమై యున్నాము. ప్రభువును సేవిస్తూ, సరిగ్గా ఆయన చెప్పినట్లు చేయుటయే.

MATT 12:24•

MARK 3:22•

LUKE 11:15•

JOHN 5:24•

2COR 5:17•

1JN 3:14

 

99మనిషి, వీటన్నిటి మధ్యలో తలంచాను, ఒక తీర్మానము చేయుటకు వత్తిడి చేయబడ్డాను. క్రీస్తు భూమి మీద యుండగా ఒక తీర్మానము చేయుటకు వారు వత్తిడి చేయబడ్డారు, కారణము ఆయన మెస్సీయాయై యున్నాడని వారికి ఋజువు చేశాడు. అది నిజమేనా? మరియు వారు ఒత్తిడి చేయబడ్డారు, వారు ఆయనను ఏమని పిలిచారు? "బెయిల్జేబూబు, ఒక అదృష్టజాతకము చెప్పువాడు." అప్పుడు ఆయన సూచన ద్వారా, ముద్ర ద్వారా, ఈష్టరు నొద్ద, ఆయనను మృతులలో నుండి పైకి లేపుట ద్వారా, దేవుడు దానిని ఋజువు చేసియున్నాడు. ఈ ఇతర కార్యములన్నిటి తరువాత ఆయన మృతులలో నుండి ఆయనను లేపెను.

ఇప్పుడు పరిశుద్ధాత్మను కలిగియున్నానని చెప్పుకొనుచున్న సంఘము యొక్క దాని ఋజువు యేమనగా, మీరు మరణములో నుండి జీవములోనికి దాటియున్నారు, కారణము పాతవి గతించియున్నవి, మరియు సమస్తము నీకు నూతనమైనవి. అదే పునరుత్థానము యొక్క దేవుని ఋజువైయున్నది. ఇది వరకు ఉండినట్లుగా నీవు లేవు, నీవు మార్పు చెందియున్నావు. మునుపు నీవు దేవుని వాక్యమును అనుమానించేవాడవు, దేవుని యొక్క ప్రతిమాట మాట్లాడుతుంది, అప్పుడు నీవంటావు, "ఆమెన్!" చూడండి, అక్కడ నీకు ఏదో సంభవించియున్నది. అది సరిగ్గా మొదటి రూపములోని పునరుత్థానము, లోపలయున్న ఆత్మ.

ACTS 24:14•

ACTS 26:24•

GAL 1:8,9•

HEB 13:8

 

100ఇప్పుడు, పెంతికొస్తు. పెంతికొస్తు తరువాత, ఈ ప్రజలు పరిశుద్ధాత్మను పొందినపుడు, వారు తీర్మానము చేయుటకు మరలా వత్తిడి చేయబడ్డారు, "అది దేవునిదా లేక దేవునిది కాదా?

వారు ఏమి చెప్పారు? వారు పిచ్చివారు, వారు వెర్రివారు, వారు మోసములో యున్నారు."

అగ్రిప్ప సహితము పొలుతో అన్నాడు, "నీవు పిచ్చివాడవు." "పిచ్చి" అనగా "వెర్రి."

మరియు పౌలు ఏమని అన్నాడు? "వెర్రితనము అని పిలువబడు మారములోనే, నేను దేవునిని ఆరాధించుచున్నాను." అతడు ఈష్టరు ముద్రను కలిగియుండెను! ఏదో సంభవించియున్నప్పుడు, అతడు అక్కడ యుండెను. ఈ ఉదయమున నా హృదయములో అతనితో చేతులు కలుపుటకు నేను సంతోషించుచున్నాను, మరియు ఇలా అంటూను, "పౌలా!"

ఎందుకు? మనము అదే వాక్యమును భోధించవలసియున్నది. ఇది వరకు (బిరిదులతో) బాప్తిస్మము పొందిన వారిని, తిరిగి యేసు నామములో బాప్తిస్మము పొందవలసినదిగా పౌలు వారికి ఆజ్ఞాపించియుండెను. అతడన్నాడు, "పరలోకము నుండి దిగివచ్చిన దూతయైనా దానికి భిన్నముగా భోధిస్తే వాడు శాపగ్రస్థుడగును గాక." అతడు దైవిక స్వస్థతను భోధించెను. పునరుత్థాన శక్తిని అతడు భోధించెను. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని అతడు భోధించాడు. దర్శనములు, దేవుని శక్తి, ఆత్మ యొక్క ప్రత్యక్షతలు అతనిని వెంబడించెను.

MARK 16:15,17

 

101నీవు అదే వర్తమానమును కలిగియుండవలసియున్నది, అదే విషయము, ఒక వేదాంతము కాదు, ఏదో సంఘ కార్యములు కాదు; కాని దేవుని యొక్క శక్తి పెంతికొస్తు అనే ముద్ర పరిశుద్ధాత్మ యొక్క ముద్ర. దేవుని యొక్క నిజమైన ఈష్టరు ముద్రయే ఒక మనిషి యొక్క యోగ్యతా నియామక పత్రాలై యున్నవి. నిజము. అది నీ యొక్క జన్మహక్కు అయి యున్నది. నీవు మరణములో నుండి జీవములోనికి దాటియున్నావని అది నీ నియామక పత్రములైయున్నవి, మరియు ప్రభువైన యేసు ద్వారా పని చేసిన అదే మార్గములో దేవుడు నీతో పనిచేయుచున్నాడు, కారణము అది నీ నియామక పత్రములై యున్నది. "నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. మీరు సర్వలోకమునకు వెళ్ళి." ఈష్టరు తరువాత, పెంతికొస్తు తరువాత, ఈష్టరు ముద్ర ఇవ్వబడిన తరువాత, పునరుత్థానము, అది ఏమై యున్నది? క్రీస్తును మృతులలో నుండి లేపిన అదే జీవము, సంఘములోనికి వచ్చి దానిని బ్రతికించి, అవే సూచనలు చేయుటకు సంఘములో జీవించుచున్నది.

102అది నీ తల మీదుగా దాటిపోదని నా నమ్మకము. నా భావము యొక్క సంతోషమును మీరు పొందకుండా, నేను మిమ్మలను ఎక్కువ సేపు ఉంచుటలేదని నా విశ్వాసము, చూడండి. అది ఖఠినమని నాకు తెలుసు. ప్రజలైన మీరు నిలబడియున్నారు. దయచేసి, కొంచెము సరిగ్గా కొన్ని నిమిషములే, మీరు ప్రయత్నము చేయగలిగినట్లైతే ప్రయత్నము చేయండి. చూడండి, స్నేహితుడా, ఈ విషయమును నీవు వినాలని నేను కోరుచున్నాను. నా హృదయములో ఏమున్నదో నీవు చూడాలని నేను కోరుచున్నాను, అదిగో ఆ చిన్న మూల రాయిని వేసినప్పటి నుండి, 31 సంవత్సరముల నుండి నాలో ఏమి యున్నదో మీరు చూడండి. చూడండి, అక్కడ సత్యమున్నది. నేను దాని కొరకు నిలబడుటకు ప్రయత్నము చేశాను. దాని నుండి అనేకమైనవి బయటకు వెళ్ళియున్నవి, అది నిజము, అది ఎల్లప్పుడును అదే మాదిరిగా యుండియున్నది.

103నేను మార్టిన్ లూధర్ గూర్చి చదువుచున్నాను, "అతడు కాథలిక్ సంఘమును వ్యతిరేకించి అలా ముందుకు సాగుట చాలా ఖఠినమైన సంగతి," అని యున్నది. అది ఒక గొప్ప కార్యమైయున్నది. అయితే ఆ గొప్ప సంగతి ఏమనగా, ఆయన ఉజ్జీవమును వెంబడించిన ఒక వెర్రితనమునకు పైగా, ఎలా తన తలను పైకి లేపి యున్నాడో అతడు సరిగ్గా బైబిలునకు నమ్మకముగా నిలబడియున్నాడు." దేవుడు చెప్పమన్నదే చెప్పుట, మరియు ఇంకేమియు చెప్పకుండా యుండుట, సరిగ్గా తిన్నగా దానితో నిలచియుండుట. తిన్నని మార్గములో నడుచుట, దేవుని యొక్క ఖచ్చితమైన తీర్మానము. దానికి బదులుగా, "దేవుడు ఈ విధానములో యుండుటకు తీర్మానిస్తే, సరిగ్గా దానితోనే నిలిచియుండుట. అది ఆయన నిర్ణయమైయున్నది." ఆమెన్. అవునండి. అవునండి.

104పెంతికొస్తు యొక్క ముద్ర యేమనగా, అతడు మరణముల్లో నుండి జీవములోనికి దాటి యున్నాడనునదియే, కారణము అతడు పెంతికొస్తు దీవెనను పొందియున్నాడు. తన కుమారునికి దేవుని యొక్క ఈష్టరు ముద్ర. ఆయన తన మొదటి కుమారుని పరిశుద్ధాత్మతో ముద్రించియున్నాడు. అది నిజమేనా? నిజము. మరియు ఆయన యొక్క మిగిలిన కుమారులందరిని పరిశుద్ధాత్మతో ఆయన ముద్రించియున్నాడు.

105ఇప్పుడు, అంత్యకాలము సమీపించుచుండగా, ఇది ముద్ర వేయుటలో ఇది సమయమై యున్నదని మనము కనుగొంటాము. ఇప్పుడు, అక్కడ ఒక స్థలమున్నది, కుమారులను గూర్చి బయటయున్న కయీను కుమారులను గూర్చి, నేను తప్పక దానిని తాకవలసి యున్నది, వారు ఒక తీర్మానము తప్పక చేయునట్లుగా వత్తిడి చేయబడుచున్నారు. చూడండి, వారు దానిని చేయుట కష్టము, కారణము, వారు దానిని చేసినట్లైతే, వారు వారి సంస్థాగతమైన హక్కులను వదులు కొనవలసియుంటుంది, చూడండి. అలాగానే పరిసయ్యులు కూడా అలాగే చేయవలసియున్నది. ఆయన మెస్సీయాయై యున్నాడని ఋజువు చేయబడినపుడు, మీకు తెలుసా, పరిసయ్యులు యేసు మీద ఒక నిర్ణయము చేశారు. మతమౌఢ్యము అను పిలువబడు మార్గములో పరిశుద్ధాత్మడు ఋజువు చేసినపుడు, అది పరిశుద్ధాత్మ అని ఋజువు చేయబడినపుడు, మనిషి తప్పక ఒక నిర్ణయమును చేయవలసియున్నది. వారు మౌనముగా యుండలేరు.

MARK 16:17

 

106మొన్న రాత్రి ఒక స్త్రీ కొరకు ప్రార్ధన చేయుచూ నేను బయట హాస్పిటల్లో యున్నాను. నేను అక్కడకు వెళ్ళినపుడు, ఎవరో "బిల్లీ," అని నన్ను పిలుచుట విన్నాను.

నేను చుట్టూ చూసియున్నాను, అది ఇక్కడ మన సోదరులలో ఒకరైయున్నారు. ఆయనే రాయ్ స్లాటర్, నాకు కొంచెము దూరములో క్రింద ఒక హాలులో అతడు నిలబడి, "నా సోదరుడు భార్య రోగిగా యున్నది, నీవు లోనికి వెళ్ళి ఆమె కొరకు ప్రార్థన చేస్తావా, బిల్లీ?

నేనన్నాను, "నిశ్చయముగా."

నేను లోనికి వెళ్ళాను. అక్కడ దరిదాపుగా 60 సంవత్సరముల వయస్సుగల మరొక స్త్రీ పడియున్నది. ఆమె కుమారుడు ఆమె ప్రక్కన యున్నట్లుగా కనబడినది. నేను వారితో కొంచెము మాట్లాడిన తరువాత నేనన్నాను, "మనము. ఒక చిన్న ప్రార్ధన మనము చేయబోవుచున్నాము."

ఆమె అన్నది, "ఆ తెరను లాగండి."

నేనన్నాను, "మంచిది," "నీవు ఒక విశ్వాసివా?"

ఆమె అన్నది "నేను ఒక మెథడిస్టును."

నేనన్నాను, "నేను నిన్ను అడిగది అది కాదు."

నేనన్నది, "నీవు ఒక విశ్వాసివా?"

ఆమె అన్నది, "నేను ఒక మెథడిస్టును. మేము మెథడిస్టులము. కొంచెము ఆ తెరను దించండి."

నేను అది చేయలేదు. ఎలాగైనా నేను ప్రార్ధన చేశాను, మరియు ఆమె కొరకు ప్రార్ధించాను, దేవుడు ఆమెను రక్షించాలని ప్రార్తించాను. అది అంతవరకే, చూడండి? నీవు ఒక క్రైస్తవుడవు కాదు, నీవు ఒక మెథడిస్టువై యున్నావు. చూడండి? నీవు-నీవు ఒక విశ్వాసివి కాదు, నీవు ఒక మెథడిస్టువై యున్నావు. నీ సొంత సాక్ష్యము దానిని చెప్పుచున్నది. కనికరము. అయ్యో బైబిలు నుండి ఎంత దూరముగా మీరు పడిపోయారు?.

విశ్వాసులు, "నమ్మిన వారి వలన ఈ సూచకక్రియలు కనబడును!"

107నీవు ఒక క్రైస్తవుడవా? "నేను ఒక మెథడిస్టును." అది నీవు ఒక క్రైస్తవుడవు కాదని చూపుచున్నది.

నీవు ఒక క్రైస్తవుడవా? "నేను ఒక క్రీస్తు సంఘపు వ్యక్తిని." అది నీవు ఒక క్రైస్తవుడవు కాదని చూపుచున్నది.

నీవు ఒక క్రైస్తవుడవు కారణము నీవు ఒక విశ్వాసివి. నీవు ఒక విశ్వాసివై యున్నట్లైతే, మార్కు 18వ అధ్యాయములో యేసు చెప్పియున్నాడు, "ఈష్టరు ముద్రను పొందినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును, యుగ సమాప్తి వరకు." అది నిజము, నీవు ఒక విశ్వాసివై యున్నావు.

108ప్రజలు ఒత్తిడి చేయబడ్డారు. ఇప్పుడును వారు వత్తిడి చేయబడ్డారు. ఇప్పుడు జరిగించబడుచున్న కార్యములను బట్టి, వారు దానిని స్వీకరించుట గాని లేక తప్పు అని నేరారోపణ చేయట గాని వారు వత్తిడి చేయబడ్డారు. అయితే వారు ఏమిచేయుచున్నారు? అది తప్పు అని నేరారోపణ చేయుచున్నారు.

పెంతికొస్తు యుగము నొద్ద అతడు చేయలేకపోయాడు, కారణము పెంతికొస్తు ఇప్పుడు తిన్నగా సంస్థగా, ఒక శాఖగా తమ్మును తాము చేసుకొనుచున్నారు. దేనిలో నుండి వారు లాగబడి బయటకు వచ్చారో, దానిలోనికే తిరిగి వెళ్ళుచున్నారు. పెంతికొస్తు బయటకు వచ్చినది. పెంతికొస్తు ఒక శాఖ కాదు; పెంతికొస్తు ఒక విశ్వాసికి వచ్చు అనుభవమైయున్నది. అయితే వారు దానిలో నుండి ఒక సంస్థను చేశారు, దానిలో నుండి బయటకు వచ్చుటకు ఎంత ఖఠినంగా పోరాడారో తిరిగి మరలా దాని లోనికే వెళ్ళుచూ, అదే కార్యము చేయుచున్నారు.

109ఈ దేశము మరియు రాజకీయము అదే కార్యము చేసినది. మత స్వేచ్ఛ కొరకు, ఆ పాత వేశ్యయైన కాథలిక్ సిద్ధా౦తము నుండి ఇక్కడకు వచ్చారు, మరియు తిరిగి అక్కడకే వెళ్ళచున్నారు, రాజకీయపు గ్రుడ్డితనము ద్వారా, వారిలో ప్రధానుడైన ఒక మనిషిని, ఒక కోటీశ్వరుని వారు ఎన్నుకొన్నారు, (విస్కీ మరియు పొగాకు వస్తువుల ద్వారా, లోక సంభందమైన సరుకు ద్వారా, అతడు ఒక కోటీశ్వరుడయ్యాడు), కాథలిక్ క్రమముతో దానిని వెనుక యుంచి, అతనిని వైట్ హౌస్ సింహాసనము మీద ఉంచారు. ఇంకనూ ఆరు నెలలు కూడా యై యుండలేదు, అది యదార్ధము అని దానిని ఋజువు చేయుచున్నది.

110పెంతెకొస్తు సంఘము సంస్థ నుండి బయటకు వచ్చి వారిని చల్లని వారనీ, నులివెచ్చని వారనీ వారి స్త్రీలను మరియు వారి పురుషులను, వారు చేసిన కార్యములను ఎత్తి చూపిరి. మరియు పెంతెకొస్తు వారు ఒక శాఖగా మారి అదే ఆత్మను తీసుకుని తిన్నగా దానిలోనికి వెనుకకు వెళ్ళి పోయిరి. ఆ విధంగా నిజమైన దేవుని సంఘము ఆమె యొక్క శక్తితో మరియు బలముతో బయటకు చూపబడుతుంది. దానిని నమ్ము నట్లు మీరు ఒత్తిడి చేయబడ్డారు. మీరు దానిని నమ్ముటకు గానీ లేక తిరస్కరించుటకు గానీ ఒత్తిడి చేయబడ్డారు. దేవునికి మహిమ! అది మీ ముందున్నది. మరియు మీరు దాన్ని కాదన లేరు. మీరు తప్పక "అవునని" గానీ, లేక "కాదు" అని గానీ తప్పక చెప్పవలసియున్నది. దాని నుండి బయటకు వచ్చే ఏ మార్గము అక్కడ లేదు, అవునండి. అవును వారు ఒత్తిడి చేయబడ్డారు. ఏ మధ్యభూమి లేదు. పూర్తి ప్రపంచము దాన్ని అంగీకరించవలసియున్నది లేక త్రోసివేయవలసియున్నది. మరియు ఆ మార్గంలోనే అది ఈ దినమున నిలబడి యున్నది.

MARK 16:15,17•

REV 2:6,15

 

111ఇప్పుడు, ఈస్టరు తర్వాత మార్కు 16లో మనం కనుగొంటాము ఆయన వారితో ఇలా చెప్పాడు, "మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి, ఈ సూచనలు వారిని వెంబడించును? మరియు మనిషి… దేవుడు అప్పుడు ఆ ప్రజలకు దానిని ఒత్తిడి చేశాడు. ఆ ప్రజలు దేనినో కలిగియున్నారని వారు చూడవలసి యుండెను. మరియు క్రీస్తు మరణించిన తర్వాత 306 సంవత్సరముల వరకు అది కొనసాగినది తర్వాత సంఘంలోకి ఏమి వచ్చినది? వారు కాథలిక్ వారైయున్నారు. అది ఖచ్చితంగా నిజము, పెంతెకొస్తు కాథలిక్లు, "కాథలిక్" అను మాటకు అర్లము "విశ్వ వ్యాప్తమైనది." పూర్తి సంఘమంతయు విశ్వవ్యాప్తమై యున్నది. మరియు వారు పెంతెకొస్తు వారై యుండిరి. తరువాత, వారు ఏం చేశారు? వారు వ్యాపారుస్తుల మధ్యకు వెళ్ళి, ఇతరులను మార్చి వారిని లోనికి తెచ్చారు. మరియు వారు పేద సమాజపు ఆలోచనలను కలిగియుండిరి.

మొదటి సంగతి. మీకు తెలుసా, బైబిల్ సంఘ యుగములను మనము బోధిస్తుయుండగా దానిని మనము కనుగొంటాము, అక్కడ ఒక సిద్ధా౦తం ఉంటుందనీ అది మొదటిగా ఒక నికోలాయితుల క్రియలుగా పిలువబడుతుందనీ, మరియు అప్పుడు చివరగా అది ఒక సిద్ధా౦తంగా మారుతుందని అది సంభవించుటకు 200 సంవత్సరముల ముందే యేసు దాన్ని గూర్చి చెప్పి యుండెను. మరియు తర్వాత అది దాన్ని చేసినపుడు ఆయన అన్నాడు, "నేను దాన్ని అసహ్యించుకొనుచున్నాను," మరియు పెంతికోస్తూ వారు ఏమి చేసియున్నారు. పెంతికొస్తు వారు పైపైకి ఎగురుచూ, మెడవంగని గుంపు వలె ఒక సంస్థగా మారి కాథలిక్ సంఘమును చేసియున్నారు, మొదట తల్లి సంస్థ.

అప్పుడు ఆ చిన్న అల్ప సంఖ్యాకవర్గము ఒక ప్రక్కకు నెట్టబడెను. మరియు అప్పటి నుండి అది ఆరీతి గానే యున్నది. 1500 సంవత్సరముల తర్వాత వారు క్రిందకు వచ్చిరి, మరియు ఆ చిన్న అల్ప సంఖ్యాకవర్గము దానిని బ్రతికించుచున్నది. ఆమెన్!

112మొన్నటి దినమున ఎవరో చెప్పియున్నారు, అతడన్నాడు, "కాధలిక్ సంఘం గూర్చి ఆలోచించండి, ఆమె ఎన్ని గొప్ప యుద్ధములను నెగ్గియున్నదో." గొప్ప యుద్ధములు? నిశ్చయంగా, చట్టమును తన ప్రక్కన పెట్టుకుని, దేశమును తన ప్రక్కన పెట్టుకుని, రాజకీయములు, ఒక ప్రక్కన పెట్టుకుని ఆమె తాళుకొనినది.

అయితే పరిశుద్ధాత్మయే తప్ప ఏమియు లేని ఆ చిన్న పెంతెకొస్తు మందను గూర్చి ఆలోచించండి, ఆమె దానిని కాపాడుచున్నది. తిన్నగా ఇక్కడే ఈ ఉదయాన ఆమె ఇంకను జీవించుచున్నదనే ఋజువున్నది, మరియు శాశ్వతంగా జీవిస్తుంది. సంస్థ కాదు, నిజమైన పెంతెకొస్తు విశ్వాసులు, నిజమైనవారు! అది నిజము.

ఇప్పుడు ఈష్టరు తర్వాత ఇది సంభవించిన తర్వాత తీర్మానం చేయుటకు వారు ఒత్తిడి చేయబడ్డారు. మనుష్యులు నిర్ణయాన్ని చేయాలి, వారు తప్పక ఇప్పుడు దాన్ని చేయాలి. (ఏన్నో వ్యాఖ్యలను నేను ఇప్పుడు చేయుచున్నాను.) అక్కడ ఏ మధ్య దారియు లేదు!

GEN 4:15,25•

1JN 3:12

 

113ఈ చివరి దినమున సాతాను యొక్క పిల్లలు ముద్రించబడతారు. ఇప్పుడు అక్కడ ఒక సమయమున్నది, బైబిల్ దాన్ని గూర్చి మాటాడినది. దేవుని యొక్క ముద్రలేని వారందరూ మృగపు యొక్క ముద్రను తీసుకున్నారు. మ్రుగపు యొక్క ముద్ర అనగా అవిశ్వాసము అని మనకు తెలుసు. మొదటిసారి. మొదటిగా మృగపు యొక్క ముద్ర ఎక్కడ ప్రారంభమైయున్నదని నీవు చెబుతావు? ఏధేను తోటలో మృగపు యొక్క ముద్ర మరియు దేవుని యొక్క ముద్రను ఏదెను తోటలో నిర్వర్తించబడినది. ఖచ్చితంగా, అది ఈష్టరు గుండా నిర్వర్తించబడినది, ఏలయనగా హేబేలు యొక్క మరణము షేతును ముందుకు తెచ్చినది. అది నిజము. గమనించండి.

కయ్యాను సాతాను యొక్క కుమారుడై యున్నాడు. అతను హవ్వను మోసగించిన జంతువు యొక్క కుమారుడు. మీరు ఏమని దానిని పిలుస్తారో మీరు కోరినట్లు పిలవండి. అతను సాతాను యొక్క కుమారుడై యున్నాడు. అతడు ఏమి చేసియున్నాడు, దేవుడు అతని మీద ఒక ముద్ర వేసి మరియు దేవుని సన్నిధి నుండి అతన్ని పంపివేశాడు. అది నిజమేనా? అతడు ఒక భార్యను పొందెను, దేవుని స్వాస్థము నుండి కాదు, అయితే నోదు దేశం నుండి అతడొక భార్యను పొందాడు అది మరొక దేశము.

114సంస్థ ఏమి చేసియున్నది? అది సంస్థగా మారినపుడు నిజమైన పెంతెకొస్తు విశ్వాసమును విడిచిపెట్టి మరియు సంస్థలో నుండి ఒక భార్యను పొందినది. అది ఖచ్చితంగా సత్యము. ఇప్పుడు ఇతడు ఏమి చేసియున్నాడు. చూడండి ఎలా-చూడండి ఎలా ఈ పెంతెకొస్తు యొక్క భార్య ప్రవర్తించుచున్నదో, ఎలా మాట్లాడుచున్నదో, ఎలాంటి కార్యములు చేయుచున్నదో గమనంచండి. ఆమె మొదట్లో దేని కొరకు నిలబడియున్నదో తిన్నగా దేని పై చుట్టూ ఆనుకొనియున్నదో, దానినే నరికివేయుటకు ఇపుడు ఆమె ప్రయత్నించుచున్నది. దాన్ని క్రిందకు నరికివేయుటకు ప్రయత్నించుచున్నది. దానికి ఊపిరాడకుండా చేయుచున్నది, కారణము అది ఆమె యొక్క ఆచారములకు వ్యతిరేఖముగా ఉన్నది. అది అక్కడ ఉన్నట్లుగా, అయితే ఆమె ఒక తీర్మానం చేయుటకు మరల ఒత్తిడి చేయబడినది. ఆమె దాన్ని తప్పక చేయవలసి యున్నది. ఆమె తప్పక దాన్ని చేయవలసియున్నది.

దేవా, నాతో నిలబడునట్లు నాకు మరియు నా సహోదరులకు సహాయం చేయుము. దేవా సహాయం చేయుము. సాహసముతో అక్కడ నిలబడుటక మాకు సహాయం చేయుము. హతసాక్షిగా రక్తం చిందించవలసి వచ్చినను అది లెక్క కాదు. నేనక్కడ నిలబడతాను. "నేను తప్పక ఏల వలెనంటే నేను తప్పక పోరాడవలసియున్నది; ప్రభువా, నా ధైర్యమును పెంచుము."

ROM 4:25•

EPH 4:30

 

115ఆయన యొక్క పరిశుద్ధాత్మ ఆయన యొక్క ప్రజల మధ్య సంచరిస్తూ మరియు అవే కార్యములను చేయుట నేను చూసినపుడు, ఆయన అదే పునరుత్థానడైన యేసుక్రీస్తు అని నాకు తెలియును. ఆమెన్. నాకు తెలిసినంతవరకు, అది దానిని సర్ది వేస్తుంది. చూడండి? ఆమెన్. రోమా 4:25లో అబ్రహామును గూర్చి మాట్లాడుచున్నప్పుడు, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులుగా తీర్చ బడుటకై లేపబడెను.

ఎఫెసి 4:30, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఈస్టర్ ముద్ర అయి యున్నది, అది మనలను నిత్యత్వమువరకు ముద్రించుచున్నది (ఆమెన్), నిత్యత్వము వరకు మనలను ముద్రించుచున్నది: దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఓ, నీవు సంతోషముగా యున్నావా? ఈష్టరును బట్టి నీవు సంతోషిస్తావా? ఈ అనుభవాన్ని బట్టి నీవు సంతోషిస్తావా? ముద్రించబడుట, ఒక రహస్య స్థలములో దేవుని మూసివేయబడుట, దైవిక కృప ద్వారా దేవునిత మూసి వేయబడుట, విమోచనా దినము వరకు ముద్రించబడుట. అదే నిజమైన, అసలైన ఈష్టరు ముద్ర అయి యున్నది.

మనకు ఎంత సమయము కలిగియున్నాము? మధ్యాహ్నము 5 నిమిషములు తక్కువ 12 గంటలైనది. నీవు నమ్ముచున్నావా? మీరందరూ నమ్ముచున్నారా? ఒక్క క్షణము మన తలలను వంచుదాము.

GEN 18:10,12

 

116మా పరలోకపు తండ్రీ, నేను చెప్పినది లెక్కకాదు, ఇంకనూ మనిషి తప్పక ఈ వాక్యమును నమ్మవలెను, కారణము అది ఇక్కడ వ్రాయ బడినది. పునరుత్థానము యొక్క ఈష్టరు ముద్రగా, మరణములో నుండి జీవములోనికి దాటియున్నామని ఎరిగినవారై నిన్ను స్వీకరించుదురు గాక, మరణము ఒకప్పుడు వారిని అక్కడ త్రోక్కియున్నది, ఇప్పుడైతే జీవము దాని స్థానమును తీసుకొన్నది. ఈ ఉదయమున నీవు ఇంకనూ అదే యేసువై యున్నావని, ఇంకనూ అద్భుతములను చేయువాడవని, ఈ సంఘమునకు ఈ ఉదయమున చూపమని నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. నేను ఇప్పిడే చెప్పియున్నట్లుగా, దానిని ఎరిగినవారమై, అది తండ్రియైన అబ్రహాముకు నిర్ధారించబడియున్నట్లుగా, ఆ దూత జనసమూహమునకు తన వీపును త్రిప్పి… లేక శారాకు ఆమె ఏమి తలంచుచున్నదో, ఆమె ఏమి చెప్పుచున్నదో చెప్పియున్నది. ఓ దేవ, మేము దానిని తిరిగి తిరిగి చూచియున్నాము. కుమారుడు అతని స్థానములో యుంచబడుటను, అతని క్రొత్త పేరు ఇవ్వబడుటను, దాని నిర్ధారణను మేము చూసియున్నాము. ప్రభువా, ఈ కార్యములు అన్నియు సంభవించుటను మేము చూసియున్నాము, మరియు మేము అంత్యకాలములో యున్నామని మేము ఎరిగి యున్నాము. ఇది ఒక ఈస్టరై యున్నది. అనేకులు నిలచియున్నారు మరియు వారి కాళ్ళు నొచ్చుచున్నవి.

ఇప్పుడు, తండ్రీ నీవు మాట్లాడియున్న తరువాత, నేను మాటాడు వాటిలో ఒక్కటి కూడా లెక్క కాదు, అది నీవు మాట్లాడిన వాటి ప్రకారము యుంటే తప్ప నేను నీ మాటలు మాట్లాడి యున్నట్లైతే తండ్రీ, ఆ వాక్యమును నీవు నిర్ధారించు దేవుడవు. మీరు దానిని దయచేయుమని ప్రార్ధన చేయుచన్నాను. ప్రభువా, నీ ఆత్మ ప్రజలలోనికి వచ్చి, ప్రజలకు దీనిని నిర్ధారించును గాక.

117ప్రతి స్థలములో మేము మా తలలను వంచియుండగా, బహుశ అక్కడ రోగులు యుండవచ్చును. సందేహము లేదు అక్కడ ప్రజల మధ్యలో రోగులు యున్నారు. ఈ టౌనుకు బయట వారు ఇక్కడ ఎంత మంది యున్నారో మీ చేతులు పైకి ఎత్తండి బయటివారు, వారు ప్రతిచో యున్నారు. మంచిది, మీతలలను పైకెత్తండి. నేను అడుగబోవుచున్నాను అట్లు మీరు వారిని చూడలరు, ఈ టౌనుకు బయటినుండి వచ్చిన వారందరూ, బయటి నుండి వచ్చినవారు, మీరు ఎవరో నాకు తెలియదు మీ చేతులను ఎత్తి, "నేను రోగిని," అని చెప్పండి. ప్రతిచోటయున్న వారు మీ చేతులను ఎత్తండి, ఆ విధముగా నేను ఒక సాధారణమైన ఉద్దేశ్యమును కలిగియుంటాను.

MATT 12:31,32•

LUKE 12:10

 

118ఆయన దీనిని నిలబెట్టుకొననియెడల, అక్కడ పునరుత్థానము లేదు. ఆయన తప్పక దానిని నిలబెట్టుకొన్నట్లైతే, అది పునరుత్థానము యొక్క నిశ్చయతైయున్నది. ఆయన చనిపోలేదని, ఆయన జీవించుచున్నాడని అది ఈష్టరు ముద్రను సూచించుచున్నది. అలాగైతే దానిని తప్పుగా ఖండించుట పరిశుద్ధాత్మకు వ్యతిరేఖముగా దేవదూషనైయున్నది, మరియు అది క్షమించబడరాని పాపము. ఇప్పుడు, పరిశుద్ధాత్ముడు ఈ కూటములోనికి వచ్చినట్లైతే.

నేను ప్రజలను బహుశ పైకి నిలబడదామని తలంచాను, అయితే మనము ప్రార్ధనా వరుసను కలిగియుండలేము. ఇక్కడ చూడండి, అంతా క్రిక్కిరిసిపోయి యున్నారు, ఆ వేదికల చుట్టూ చిన్న పిల్లలు ప్రతి స్థలములో యున్నారు. మనము ప్రార్ధనా వరుసను కలిగియుండలేము.

అయితే చూడండి, నేను ఒక విషయమును మిమ్మలను అడుగబోవుచున్నాను. ఆయన ఒకే స్థలములో యుంటాడా, లేక ప్రతి స్థలములో యుంటాడా? ఆయన ప్రతి స్థలములో యుంటాడు. ఇప్పుడు, నేను మిమ్మలను ఎలా ఎరుగగలను, చేతులను ఎత్తిన మీరు ఎవరో నాకు తెలియదు, ఇక్కడ మీరు క్రొత్తవారుగా యున్నారు? ఆలయములోని ఏ ఒక్కరూ ఇక్కడ నాకు అవసరములేదు. నేను మిమ్మలను తరువాత చూస్తాను, చూడండి. అయితే వారు నేను ఎరుగని టౌను బయటి నుండి వచ్చిన వారని అట్లు మీరు తెలుసుకుంటారు. అది సరియో లేక కాదో పరిశుద్ధాత్మయే మాట్లాడనిమ్ము ఆయనను మాట్లాడనియ్యండి, అప్పుడు నా మాటలు ఒకటిగా యుంటాయి. మరియు అవి దేవుని మాటలైతే, ఆ మాటను దేవుడు నిలబెట్టుకొనును.

119ఇప్పుడు గుర్తుంచుకోండి, పెంతికొస్తువారు, దేవుని యొక్క నిజమైన అసలైన విశ్వాసులు, ఎల్లప్పుడు వారు ఒక అల్పసంఖ్యాక వర్గముగా యుంటారు. మరియు వారే వెక్కిరించబడేవారు, బయటి వారిచేత నవ్వుల పాలుచేయబడువారు, మరియు వారే ఆ మార్గమును తీసుకొనుటకు ఇష్టపడేవారు. మరియు పరిశుద్ధాత్మడు.

ప్రజలారా, నేను మిమ్మలను ఒకటి అడుగగోరుచున్నాను. ఇప్పుడు, చూడండి, ఆయన జీవించుచున్న దేవుడేనా? ఆయన ఇక్కడ హాజరైయున్నాడా? ఆయన ఇక్కడ హాజరైయున్నట్లైతే, నేను ఒకటి మిమ్మలను అడుగగోరుచున్నాను. ఇప్పుడు, నేను మాట్లాడిన తరువాత, అది సత్యమై యున్నదని ఎంతమంది నమ్ముతారు? సోదరుడా బ్రెన్హాం, నేను ఇంకనూ క్రైస్తవుడను కాదు, అని చెప్పు ఎవరైనా ఇక్కడయున్నారా? నాకు ప్రార్ధన చేయండి. "వేదిక పిలుపును నేను ఇక్కడ ఇయ్యలేను," ఏలయనగా-నేను ఇవ్వలేను. కేవలము మీ చేతులను ఎత్తి "నా కొరకు ప్రార్ధన చేయండి," అని చెప్పండి, ఎవరైనా ఈ కట్టడములో యున్నారా? దేవుడు నిన్ను దీవిచును, నిన్ను నిన్ను నిన్ను దీవీంచును. అది మంచిది. మంచిది. దేవుడు నిన్ను దీవించును. చుట్టూ ప్రతిచోట మంచిది, బాగున్నది. మంచిది.

120ఇప్పుడు, ఇలాటి వర్తమానమును ఇచ్చియున్న తరువాత మీరు నన్ను పిలచి, "బ్రెన్హాం సోదరుడా, నీవు మాకు వింతైన దానిని భోధించి యున్నావు, ఆయన దేవుడై యున్నాడని, చివరి దినములలో ఆయన చూపించిన సూచన ఇదియేనని?

మొన్నటి దినమున ఒక యూదుల భోధకుడు ఇలా చెప్పియున్నాడు. నేను.. ఎర్రని పెయ్యి మీద నేను ఇచ్చిన వర్తమానము ద్వారా ఒక మనిషి ఒక సంఘము నుండి వచ్చి క్రీస్తును అంగీకరించి యున్నాడు. మరియు అతడు ఒక రబ్బీలు వంశములో (యూదులలోని బోధకులను రబ్బీలంటారు). ఎన్నో సంవత్సరములుగా పెంచబడియున్నాడు. 4 లేక 5 వందల సంవత్సరాలుగా వారు రబ్బీలుగా యున్నారు, ఆ వెనుక అందరూ రబ్బీలే. ఆ మనిషి నా వర్తమానమును ఒక కూటములో, "ఎర్రని పెయ్యను" గూర్చి విని దాని ద్వారా క్రైస్తవ్యములోనికి మారియున్నాడు. మరియు మొన్నటి దినమున ఒక సంఘములో నిలబడి, ఇలా అన్నాడు, "ఒక దేవునికి ముగ్గురు దేవుళ్ళున్నారని ఎవరైనా నమ్మినట్లైతే." అప్పటి నుండి అతడు ఒకే దేవుని గూర్చి నమ్మియన్నాడు. అతడు ఏదైనా చేయటానికి బదులుగా, వెనుకకు జారిపోయాడు.

MATT 9:20•

MARK 5:27•

LUKE 8:44•

HEB 4:15

 

121దేవా, మాట్లాడుము. ఇప్పుడు, నేను నా చేతిని ఎత్తి యున్నాను వారు నాకు తెలియదు. వారు నాకు తెలియదు. ఇప్పుడు ఆయన ఇంకనూ అదే దేవుడై యున్నట్లైతే, ఆయన అదే కార్యమును చేయడా? ఒక స్త్రీ ఆయన వస్త్రమును ముట్టియున్నది.

మీ స్త్రీలలో కొందరు మీలో కొందరు తమ చేతిని ఎత్తినవారు, ఎక్కడో ఒక స్త్రీ అని నేను నమ్ముచున్నాను. ఎక్కడ? ఆ చివరలో యున్న ఒక స్త్రీ, నీ చేతిని ఎత్తగలవా? మంచిది. నీవు, మంచిది, నేను నీకు క్రొత వాడిని కాదా? నీవు నాకు తెలియదు. మంచిది.

మన వ్యాధితో ఇంకనూ ఆయనను ముట్టగలిగే అదే ప్రధాన యాజకుడు ఆయన కాదా, చూడండి. నా జీవితములో నేను నిన్ను ఎన్నడూ చూసియుండలేదు. నీవు నాకు క్రొత్త వ్యక్తివి. నీ గూర్చి నాకు ఏమియూ తెలియదు. నీ గూర్చి దేవునికి తప్పక తెలుసు. ఇక్కడకు వచ్చిన పునరుత్థానుడైన క్రీస్తు, తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నాకు బయలు పర్చినట్లైతే, మరియు నా ఆత్మ ద్వారా ఇక్కడ తాత్కాలికమైన పునరుత్థానమును ఇచ్చియున్నాడు, ఇప్పుడు నా ఆత్మ వెళ్ళి పోవుచున్నది మరియు ఆయన ఆత్మల్లోనికి వచ్చుచున్నది, అప్పుడు ఆయన సజీవుడో కాదో మీకు తెలుస్తుంది. ఇప్పుడు, నీవు నాకు తెలియదు. అది నేను, నేను మరియు నా ఆత్మ నీవు మాకు తెలియదు. అయితే ఆయనకు నీవు తెలుసు. ఆయన పునరుత్థానుడైన క్రీస్తు అని మీకు తెలియచేయుటకు, ఇప్పుడు ఆయన నా శరీరమును అద్దెకు తీసుకొనుచున్నాడు. నేను ఎంతో సంతోషముగా నా శరీరమును ఆయనకు అప్పు ఇచ్చుచున్నాను, దాని నుండి ఆయన దేనినైనా పొందవచ్చును. ఆయనకు ఇచ్చుచున్నాను.

122ఇక్కడ నీవు ఏ అవసరత కొరకు యున్నావో, దేవుడు దానిని నాకు బయలుపర్చినట్లైతే నీవు నన్ను నమ్ముతావా? నీవు నమ్ముతావు. నీవు వాపుతో యున్న నరముల వ్యాధిని కలిగియున్నావు, అది సత్యమైన యెడల నీ చేతిని ఎత్తుము. దానికంటె ఎక్కువగా నీవు కలిగియున్నదేమనగా, హెర్నియా వ్యాధిని కూడా నీవు కలిగియున్నావు. అది నిజము. నీవు ఈ పటణము దానివి కాదు. నీవు ఒహాయోలోని లిమా నుండి వచ్చియున్నావు. నీ పేరు శ్రీమతి స్టోడార్డ్ అది నిజము. నీ భర్త నీ వెనుక కూర్చొనియున్నాడు. అది నిజము. ఆయన భాధ కూడా ఏమిటో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముచున్నావా? అతడు వెన్ను నొప్పితో భాధపడుచున్నాడు, అతడు వెన్ను నొప్పితో బాధపడుచున్నాడు. అది సత్యమైతే నీ చేతిని ఎత్తుము, అయ్యా, నీవు నమ్ముచున్నావా?

123అక్కడ మరొకరు తమ చేతులను ఎత్తియున్నారు, ఆ క్రిందిగా అక్కడయున్న ఆ స్త్రీ, మంచిది. నీవు నాకు తెలియదు. అక్కడ నీ ప్రక్కన కూర్చొన్నది నీ భర్తయై యున్నాడు. నీవు కోరుచున్నది పరిశుద్ధాత్మ బాప్తిస్మమైయున్నది. అది సత్యమైతే, నీ చేతిని ఎత్తుము. అది సత్యము. మంచిది. ప్రభువు నందు విశ్వాసముంచుము, ఏ మాత్రము సందేహపడవద్దు.

దూరము నుండి మరొకరు వచ్చుటను నేను చూస్తున్నాను. అయితే అది ఏ స్థలమునుండో నేను చెప్పగలను. అవును. అది ఇక్కడ కూర్చొన్న వ్యక్తి. ఇప్పుడు నేను ఆయనను చూసియున్నాను. అతను కూడా నాకు క్రొత్త వ్యక్తి నీవు పిత్తాశయపు వ్యాధిని, సైనుస్ వ్యాధిని కలిగియున్నావు. నీవు ఇక్కడ వాడవు కాదు. నీవు జార్జియా నుండి వచ్చావు. అది జార్జియాలోని హబ్బర్మిల్ అను ఒక స్థలము, మంచిది, ఇప్పుడు నమ్ముము, ఇంటికి వెళ్ళము స్వస్థతనొందుము.

124నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? అక్కడ తిన్నగా నీ వెనుక ఒకరు కూర్చొనియున్నారు, ఆ వెలుగు ఆ వ్యక్తి మీద నిలబడి యున్నది. కాన్సర్ వ్యాధితో బాధపడుచున్న రక్షణ పొందని, వారు ప్రేమించు ఒక వ్యక్తి కొరకు వారు ప్రార్థన చేయుచున్నారు. నమ్మండి, విశ్వాసమును కలిగియుండండి, సందేహపడవద్దు.

[బ్రదర్ బ్రెన్హాం గమనిస్తున్నాడు.] నేను గమనించుచున్నాను. చూడండి. [సోదరుడు బ్రెన్హాం గమనిస్తున్నాడు.] అది ఇక్కడ యున్నది. తలదించి ప్రార్ధన చేయుచున్న ఆ స్త్రీ ఆమె తన కాళ్ళలో, మోకాళ్ళలో వ్యాధిని కలిగియున్నది. నీవు నాకు తెలియదు, నాకు తెలుసా? మనము ఒకరికి ఒకరము క్రొత్తవారము. నీ చేతిని ఎత్తుము. నీవు వెనుకకు తిరుగుము. నీ గృహము న్యూ హేంప్ షైర్, నీవు అక్కడ నుండియే వచ్చియున్నావు. నమ్మము, ప్రభువు నిన్ను బాగుచేస్తాడు.

125ఒక స్త్రీ ఒక చిన్న బాలికతో అక్కడ కూర్చొనియున్నది, ఆమె కొరకు ప్రార్ధనచేయుచున్నది, కిడ్నీ వ్యాధితో భాధపడుచు సరిగా వెనుక అక్కడ కూర్చొనియున్నది. ఆమె కూడా జార్జియా నుండి వచ్చినది, శ్రీమతి కేసన్, నీ హృదయమంతటితో నీవు నమ్మినట్లైతే? నీవు దానిని అంగీకరిస్తావా? మంచిది, అలాగైతే ఇంటికి వెళ్ళము, స్వస్థతనొందుము, ఆ స్త్రీ ఎవరో నాకు తెలియదు, నా జీవితములో ఎన్నడూ నేను ఆమెను చూసియుండలేదు. మనము ఒకరికి ఒకరము క్రొత్త వారమై యున్నట్లైతే, నీ చేతిని ఎత్తుము. అది సత్యము.

ఇక్కడ తిన్నగా ఆ వెనుక మరొక మనిషి కూర్చొనియున్నాడు. అతడు కూడా జార్జియా నుండి వచ్చినవాడు. అతడు ఎవరో నాకు తెలియదు, నేను ఎన్నడూ అతనిని చూసియుండలేదు. బేరి పండ్లు పండించు దేశము నుండి అతడు వచ్చుటను నేను చూస్తున్నాను. నిజము. అతడు కాలేయము జబ్బును, అది నిజము, మరియు కీళ్ళ జబ్బును కలిగియున్నాడు. అతడు తిన్నగా వెనుక కుర్చీలో కూర్చొనియున్నాడు. అయ్యా నీ హృదయమంతటితో నమ్ముతావా? మంచిది, వెళ్ళుము, స్వస్థతనొందుము.

ఆ వెనుక చివరి వరుసలో నీ ప్రక్కగా, ఒక స్త్రీ కూర్చొని యున్నది. లేదు. ఆమె ఆమె కొరకు కాదు. ఆమె తన కుమారుని కొరకు ప్రార్ధన చేయుచున్నది. అది సత్యము. కుమారుడా, నీ ఇబ్బంది ఏమి దేవుడు నాకు తెలియజేయగలడని నీవు నమ్ముదువా, అమ్మా? నేను నీకు క్రొత్తవాడను, అయితే నీవు దేవునికి తెలుసు. ప్రేగుల పూతతో, మానసిక వ్యాధితో అతడు భాధపడుచున్నాడు, మరియు అతడు ఇక్కడ లేడు, ఒహాయోలోని డేటన్లో యున్నాడు. అది నిజమైతే, నీ చేతిని ఎత్తుము. ఇప్పుడు, నమ్ముము.

HEB 13:8

 

126ఆయన జీవించుచున్నాడని నీవు ఎరుగుదువా? ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడా? అక్కడ కనీసము 8 లేక 10 మంది యున్నారు, నా జీవితములో నేను ఎన్నడూ వారిని చూసియుండ లేదు. అది నిజమేనా? ఇప్పుడు, పరలోకపు దేవుడు, ఇక్కడ హాజరైయున్నవాడై వీరిని బాగుచేసి స్వస్థపరచును గాక. సరే, అది నేను కాదు, పరశుద్ధాత్మ యొక్క అభిషేకము నుండి అది వచ్చుచున్నది. మనసు యొక్క తలంపులను వివేచించగల దేవుడు, యేసుక్రీస్తుగా, నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్న దేవుడు, ముందుకు వచ్చి రోగులను స్వస్థపర్చును గాక. ఆయన ఎన్నటికిని దేవుడై యున్నాడు! అది నీవు నమ్ముతావా? ఇప్పుడు ఇక్కడ ఎంత మంది ఆయనను వారి రక్షకుడిగా, వారిని స్వస్థపరిచే వారిగా, వారికి బాప్తిస్మమిచ్చువాడిగా, మరియు వారి యొక్క రాబోవు రాజుగా ఆయనకు ఇప్పుడే అంగీకరించి నమ్ముతారు? యేసు నామములో, ఓ, హల్లెలూయ! ఏమిటి? ఈష్టరు ముద్ర తప్పిపోని సత్యమని ఋజువు చేయబడిన ఈష్టరు ముద్ర!

1COR 15:52

 

127తరువాత విషయము ఏమిటి? రాబోవు కుమారుని కలుసు కొనుటకు ఈ దేహము యొక్క మార్పు ఒక్క క్షణములో, ఒక రెప్ప పాటులో మనము మార్పు చెందుదము. మీరు కోరినట్లైతే మీ పేపరు ముద్రలన్నిటిని కలిగియుండండి; అయితే మానవ హృదయములోని నిజమైన ఈస్టరు ముద్ర పరిశుద్ధాత్మయైయున్నాడు. మీరు దానిని నమ్ముతారా? ఆయన పునరుత్థానము నందు మీరు నమ్మికయుంచుతారా? ఆయన ఎన్నటికిని సజీవుడని మీరు నమ్ముతారా? ఆయన ఇక్కడ యున్నాడని మీరు నమ్ముతారా? ఇప్పుడు మీరు ఆయనను మీ రక్షకునిగా, మిమ్మలను స్వస్థపరిచేవాడిగా, మీ దేవునిగా, మీ రాబోవు రాజుగా ఆయనను నమ్ముతారా? మీ హృదయమంతటితో నమ్మండి!

ACTS 19:11,12

 

128యేసుక్రీస్తు నామములో దేవా, ఈ చేతిరుమాళ్ళకు ప్రార్ధన చేయుచుండగా అనేక మంది వాటిని అభిషేకించుచున్నారు. వారు పౌలు దేహము నుండి తీయబడిన చేతిగుడ్డలను నడికట్టులను రోగుల మీద ఉంచినపుడు వారు స్వస్థపడ్డారు. మీరు దానిని నమ్ముతారు?

ఇప్పుడు, రోగులుగా యున్నవారు, ఎంతమంది యున్నారు? ఇప్పుడు ఆలయములోని వారు, ఈ సమాజము చుట్టూ యున్నవారు, ఈ చుట్టు ప్రక్కల యున్నవారు, ఈ చుట్టూ యున్న వారందరూ మీ చేతులను ఎత్తండి? ఆయన ఇక్కడ యున్నాడని మీరు నమ్ముతారా? ఇక్కడ పరిశుద్ధాత్మడు యున్నాడని మీరు నమ్ముతారా? ఇప్పుడు, ఆగండి, దేని కొరకైనా మీరు ఎందుకు కనిపెడతారు? ఆయన ఇక్కడ యున్నాడు. కాబట్టి ఇప్పుడు దాని మీద మనము పనిచేద్దాము! చార్లీ నీవు ఏమి తలంచు చున్నావు? ఆమెన్ హల్లెలుయ! ఓ, అది తప్పక సంభవించవలసియున్నది!

MARK 16:17

 

129నేను ఎవరినీ బాగుచేయలేను. నేను దానిని చేయలేను. వారిని బాగుచేయుటకు నాలో ఏమియులేదు. అయితే ఇప్పుడు నా మీద యున్న ఆత్మను మీరు అంగీకరించినట్లైతే, పాతాళములోయున్న ఎన్ని దయ్యాలైనా ఎంతమాత్రము మీరు దానిని అనుమానించునట్లు చెయ్యలేవు, మరియు మీరు తప్పక స్వస్థపడవలసియున్నది. నేను స్వస్థపర్చువాడను కాదు, ఆయన స్వస్థపర్చవాడై యున్నాడు. నేను దర్శనములు చూడగలను; ఆయన మాత్రమే మాట్లాడువాడు. అది నా శరీరమును ఆయన వాడుకొనుచున్నాడు.

ఇప్పుడు, అదే దేవుడు చెప్పియున్నాడు, "నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు వెంబడించును. ఇక్కడ ఎంత మంది విశ్వాసులున్నారు? నీవు విశ్వాసివని నీకు నిశ్చయతయున్నదా? సరే. ఆయన చెప్పియున్నాడు నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు వెంబడించును. వారు రోగుల మీద చేతులను ఉంచినపుడు, వారు స్వస్థతనొందుదురు" అది నిజమేనా? ఇప్పుడు ఒకరి మీద ఒకరు చేతులను ఉంచండి, మరియు మీలో ప్రతి ఒక్కరికి నన్ను ప్రార్ధన చెయ్యనియ్యండి. ఓ, దేవా, ఓ, సోదరుడా, తప్పక ఏదో సంభవించవలసియున్నది. ఏదో తప్పక సంభవించవలసియున్నది.

JOHN 8:29•

JOHN 11:25,26

 

130ఓ గొప్ప ఈష్టరు ముద్ర నీవు కుండలోయున్న లిల్లీ పుష్పానివి కాదు, నీవు లోయలో యున్న లిల్లీ పుష్పానివి (పద్మము) నిన్న ఆ బాలుని ద్వారా మాట్లాడిన నీవు, నీ మాట ద్వారా వచ్చావు. నీవు సత్యమైయున్నావని నిన్ను నీవు ప్రత్యక్షుణ్ణి ప్రభువా, నీవు సత్యమైయున్నావు. నీవు పునరుత్థానమైయున్నావు. నీవన్నావు, "పునరుత్థానమును జీవమును నేను, నాయంధు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు, ఎన్నటికీ చనిపోడు. నేనే పునరుత్థానమును మరియు జీవమునై యున్నాను."

[టేపు మీద ఖాళీయున్నది] అది పలుకబడదు, అలాగైతే మీరు ఆశ్చర్యపోతారు. అయితే మీరు వినుచుండగా, లోబడండి!

ఓ దేవా, భూమ్యాకాశములను సృజించినవాడా, ఈ ప్రజలు ఒకరి కొకరు ప్రార్ధన చేయుచున్నారు. నీవు ఆ ఈష్టరు ఉదయమున లేచినపుడు, నీవు మెస్సీయావై యున్నావని నీవు ఋజువు చేసియున్నావు. నీవు లేవకముందు నీవు మెస్సీయావై యున్నావని ఋజువు చేశావు మెస్సియ యొక్క గురుతు ద్వారా, నీలోని దేవుని యొక్క ముద్ర ద్వారా నీవు మెస్సీయావైయున్నావని ఋజువుచేశావు. ఆయన చెప్పిన దానిని వ్యక్తి చేయుట తప్ప, దేనిని చేయకుండుటకు నీవు దేవునితో ముద్ర వేయబదినావు నీవు చెప్పియున్నావు, "ఎల్లప్పుడు నా తండ్రికి ఇష్టమైన దానిని నేను చేస్తాను." అది ఆయన మాటను నెరవేర్చుతుంది. దేవునిని సంతోషపర్చుట కొరకు మనము ఆయన వాక్యము నందు విశ్వాసముంచి, ఆయన మాటను పాటించ వలసియున్నది. మరియు, అప్పుడు, తండ్రీ, అది ఈ దినమున కూడా అలా యుంటుంది. దేవుని యొక్క ప్రతి కుమారుడు, దేవుని యొక్క ప్రతికుమార్తె, దేవునిని సంతోషపర్చుటకు గాను, తప్పక వారు దేవుని వాక్యమును పాటించవలసియున్నది, ఒకరి మీద ఒకరము చేతులను ఉంచుట ద్వారా మేము నీ మాటను నెరవేర్చుచున్నాము. నేను ఈ శ్రోతల కొరకు ప్రార్ధన చేయుచున్నాను.

MARK 16:17,18•

REV 1:18

 

131మేము వాక్యము భోధించబడుట విన్న తరువాత, క్రొత్త వారు తమ తలలను పైకెత్తుట చూచిన తరువాత, ఆ గొప్ప పరిశుద్ధాత్మడు వారి మీద క్రుమ్మరించబడి వారి యొక్క హృదయాలోచనలనే బయలుపర్చి, వారు ఎవరైయున్నారో, వారు ఎక్కడ నుండి వచ్చియున్నారో, ఏమి సంభవించి యున్నదో, మరియు వాటన్నిటిని గూర్చి చెప్పిన తరువాత, వారు ఇక ఎంత మాత్రము ఎలా సందేహపడగలరు?

దేవా ఇక్కడ యున్న ఈ గొప్ప సంఘ గోడలు చుట్టూ నిలబడియున్న వారందరికి ఇది గొప్ప బహుమానమై యున్నది. వారి యొక్క కాళ్ళు, చేతులు నొప్పులు పుట్టుచున్నవి, మరియు చిన్న తల్లలు వారి యొక్క బిడ్డలతో వేచియున్నారు, తండ్రులు, వృద్దులు, మరియు అందరూ కనిపెట్టుచూ, సజీవ దేవుని యొక్క ఒక్క సూచనను చూచుటకు కనిపెట్టుచున్నారు. మరియు ఆయన రంగము మీద కదులుట చూచినపుడు, ఆయన యెహోవా అని, ఆయన యేసు అని ఋజువు చేస్తున్నప్పుడు, పునరుత్థానుడైన వాడు, "నేను సదాకాలము జీవించుచున్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపుచెవులను కలిగియున్నాను," కారణము ఆయన దాని మీద యున్న ముద్రను చీల్చివేసియున్నాడు, మరణము యొక్క ముద్రను ఆయన చీల్చివేసియున్నాడు. సమాధి యొక్క ముద్రను ఆయన చీల్చివేసియున్నాడు. పాతాళము యొక్క ముద్రను ఆయన చీల్చివేసియున్నాడు. సమాధి యొక్క ముద్రను చీల్చివేసియున్నాడు. జీవవృక్షము యొక్క ముద్రను ఆయన తెరచి, మరియు ఆయన ఆత్మ ద్వారా జీవవృక్షములోనికి బాప్తిస్మము ఇచ్చి, మనలను దేవుని కుమారులుగా మరియు దేవుని కుమార్తెలుగా చేసియున్నాడు, మరియు ఒకరి మీద ఒకరు చేతులను ఉంచమని ఆజ్ఞాపించియున్నాడు, "నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును; వారు రోగుల మీద చేతులను ఉంచినప్పుడు వారు స్వస్థతనొందుదురు." తండ్రీ, దేవా, అది అలాగు యుండవలసియున్నది.

132సువార్త యొక్క శక్తి ద్వారా, ఆయన సువార్తను భోధించుటకు నన్ను నియమించిన పరలోకపు దేవుని ద్వారా, ఈ వాక్యమును వ్రాసిన దేవుని ద్వారా, ఈ వాక్యమును ఋజువుచేయుటకు ఇక్కడ హాజరై యున్న దేవుని దూత ద్వారా, ప్రజల యందు నాకున్న విశ్వాసమునుబట్టి నేను చెప్పుచున్నాను. ఇక్కడ యున్న ప్రతి రోగి నుండి, ప్రతి భాధించబడుచున్న వ్యక్తి నుండి దయ్యము వదిలిపోవాలని, మరియు ఈష్టరు యొక్క కూటమునకు ఒక జ్ఞాపక చిహ్నముగా, వారు తిరిగి మంచి ఆరోగ్యమునకు, బలమునకు లేపబడుదురు గాక. సాతానా, బయటకు రమ్మ. నీవు ఓడిపోయినావు. 1900 సంవత్సరముల క్రితమే యేసు నిన్ను ఓడించి యున్నాడు, మరియు నీవు ఓడిపోయావు. యేసు క్రీస్తు నామములో ఈ ప్రజలలో నుండి బయటకు రమ్మ!

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...