మరచిపోబడిన ధన్యత

మరచిపోబడిన ధన్యత

VGR COUNT-176 1మన జీవమైన, ప్రభువైన యేసుకు, మా హృదయపు లోతులలో నుండి వందనములు తెలియజేస్తున్నాము. మరియు ఆయనలో మనము ఏ తప్పిదమును కనుగొనలేము. కానీ మనము ఆయన యొక్క జీవితములోనికి చూసినప్పుడు, మరియు మన జీవితమును ఆయన జీవితముతో పరీక్షించినప్పుడు మనలో మనము తప్పిదము కనుగొనెదము. నీవు మమ్ములను క్షమించమని మేము ప్రార్ధిస్తూ ఉన్నాము.

నీవు మమ్ములను కలుసుకొనెదవని ఈ రాత్రి మేము అడుగుచున్నాము. ఎక్కడైతే ఇద్దరు లేక మరి ఎక్కువ కూడెదరో, నీవు వారి మధ్యన ఉండెదవని, నీవు వాగ్దానము చేసియున్నావు. మరియు ఒకవేళ మేము దేనినైనా అడిగితే, అది మాకు అనుగ్రహించబడును.

తండ్రీ, మా ఉద్దేశ్యము, మరియు మా అభిప్రాయము ఈ రాత్రి, మరియు మా హృదయ వాంఛ, అది క్రీస్తు మహిమపరచబడుట చూడాలని. కనుక ఈ రాత్రి మా ప్రయత్నములన్నీ అవి కొనసాగించబడినప్పుడు, జనులను సజీవుడైన దేవునిలో సజీవమైన విశ్వాసమునకు, అది దేవుడు మృతుడు కాదు కానీ నిరంతరము సజీవుడైయున్నాడు అను దానిలోనికి తీసుకొని వచ్చుటే మా ప్రార్ధన.

తండ్రీ, మేము ప్రార్ధించుచున్నాము, యేసుక్రీస్తు ద్వారా, నీ సన్నిధితో, ఈ రాత్రి మా ప్రాణములను కలయబెట్టెదవని, ఆయన యొక్క నామములో మేము అడుగుచూ ఉన్నాము. ఆమెన్. మీరు కూర్చొనవచ్చును.

2కేవలము కొంచెము ఆలస్యము మరియు కొంచెము నీరసము. క్రిస్మస్ నుండి ఏదీ విడువకుండా నేను వెళ్ళుచున్నాను, కనుక నేను బాగుగా అలసిపోయాను. విదేశాల నుండి తిరిగి వచ్చిన సహోదరుడు జోసఫ్ బోజ్ ను ఈ రాత్రి ఇక్కడ చూచుట నాకు చాలా సంతోషముగా యున్నది, కొంత కాలము నుండి ఆయనను చూడాలని నేను చూస్తూ ఉన్నాను.

మరియు మన ప్రశస్తమైన సహోదరుడు మరియు స్నేహితుడైన, సహోదరుడు టామీ హిక్స్, ఈ రాత్రి లేదా రేపు ఉదయము, కుడికకు హాజరవుటకు కెనడా వెళ్ళుచున్నాడని ఈ రాత్రి చెప్పుటకు క్షమించండి. నేను బాగుగా అలసిపోయాను కనుక నాకు బదులుగా ఈ రాత్రి ప్రసంగించుటకు లేక ప్రార్ధనా వరుసను కలిగియుండుటకు నేను అతడిని తీసుకొని వచ్చుటకు ప్రయత్నించాను. మరియు ఆయన నా వెన్నుతట్టి మరియు చెప్పాడు, "తరువాత సారి, తరువాత సారి." మరియు అతడు నాకు ఎల్లప్పుడూ అదే చెప్పును.

3మరియు నాకు తెలుసు సహోదరుడు టామీ హిక్స్ … నేను కలిగి… నేను అతడితో కలిగియున్న దినములు, మరియు సమయములు, మరియు సహవాసము, సజీవుడైన దేవునికి ఒక సేవకునిగా, టామీ హిక్స్ యందు నేను ఒక గొప్ప నమ్మకమును కలిగియున్నాను.

సహోదరుడు టామీ హిక్స్ కు పరిశుద్దాత్మ యొక్క నడిపింపునకు వ్యతిరేకముగా ఎవరైనా ఏదైనా చెప్పగలరని నేను నమ్మను, అది గొప్ప కార్యము, ఎందుకనగా ఆయన కేవలము ఒక… ఒక రోజు ఆయన… అర్జెంటీనాకు వెళ్ళుటకు ఆయన వర్తమానమును మీరు విన్నారు. మరియు ఆయన వెళ్ళుటకు కనీసము ఆయన దగ్గర ధనము కూడా లేదు, కానీ దేవుడు ఆయనను పంపించియున్నాడు, మరియు, ఓ, ఆ కూడికను గూర్చి మీకు తెలుసు. మరియు దేవుని కొరకు అంతగా లోబడిన ఒక వ్యక్తి.

మీకు తెలుసు, నీవు ఏ భాగమునైతే దేవునికి లోబరచియున్నావో దానిని మాత్రమే ఆయన వాడుకొనగలడు. మీరు చూడండి, నేను చెప్పినట్లుగా, నేను నమ్ముచున్నాము, ఒక రోజు, ఎక్కడో (నేను వివిధ స్థలములలో, మరియు ఉదయములు, మరియు మధ్యాహ్న కూడికలు, మరియు ఎన్నో) ఎక్కువగా మాట్లాడియున్నాను.

JUDG 16:4

 

4కానీ నేను ఇది చెప్పాను: నీవు దేనినైతే లోబరచియున్నావో దేవుడు దానిని మాత్రమే వాడుకొనును, సమ్సోను వలె.

సమ్సోను తన హృదయమును దేవునికి లోబరచలేకపోయెను. అతడు దానిని దెలిలాకు ఇచ్చియుండెను. కానీ అతడు తన బలమును దేవునికి ఇచ్చెను, మరియు దేవుడు కేవలము అతడి బలమును మాత్రమే ఉపయోగించుకొనగలిగెను, అంతే. కాని ఒకవేళ ఒక వ్యక్తి తనకుతాను సంపూర్ణముగా దేవునికి సమర్పించుకొనగలిగిన ఎడల, ఇప్పుడు, అంతే.

ఒకవేళ నీ శరీరమును నీవు సమర్పించగలిగితే, దేవుడు నీ శరీరమును ఉపయోగించుకొనును. ఒకవేళ నీవు నీ మనస్సును సమర్పించగలిగితే, నీ హృదయమును, అది ఏదైనా, నీవు వాడుకొనుటకు దేనినైతే దేవునికి ఇచ్చియున్నావో, దానినే ఆయన వాడుకొనును. ఆ విధముగా లోబరచుకొన్న వారినెవరినైనా కనుగొనుటకు ఆయన వెదకుచున్నాడు.

సహోదరుడు టామీ, దేవుడు నీతో ఉండును గాక, ఒక గొప్ప గొప్ప విజయము నీకిచ్చును గాక. మేము నీ కొరకు, అక్కడ నీ కూడికల కొరకు ప్రార్థించెదము. మరియు కొద్ది దినములలో నేను కూడా కెనడాలో ఉండెదను. కానీ మరియొక చివరన, కనుక .. మరియు నీకు గొప్ప విజయము మరియు సురక్షితమైన ప్రయాణము నిచ్చును గాక వందనములు. మరియు సాహో, టామీ నీకు కూడా.

MATT 11:6

 

5ఈ ఉదయకాలమున మేము ఒక గొప్ప సమయమును కలిగియున్నాము, ఈ ఉదయమున దేవుని యొక్క బల్ల చుట్టూ సహవాసములో - ఎక్కడైతే మేము ఆశీర్వాదమును అడిగి మరియు సేవకుల యొక్క అల్పాహార విందును కలిగియున్నామో, అక్కడ ఈ పట్టణము యొక్క సేవకుల సమూహమును కలుసుకొనే భాగ్యమును నేను మొదటిసారి కలిగియున్నాను. మరియు ఖచ్చితముగా నేను కొంత మంది గొప్ప వ్యక్తులను, గొప్ప హృదయములు కలిగిన క్రీస్తు యొక్క గొప్ప సేవకులను, దేవుని కొరకు సమీపించేవారిని నేను కనుగొన్నాను.

మరియు ఇక్కడ చికాగోలో, అందరూ కలసి ఒక గొప్ప కూడికను

కలిగియుండెదము, ఒక సమయము, అందరునూ కలసి ఒక పూర్తి స్థలము కలిగిన దగ్గరకు మీరు చేరి, మరియు ఒక పెద్ద సహవాస కూడికను కలిగియుండెదమని నేను నమ్ముచున్నాను.

ఇప్పుడు, అక్కడ… గత సాయంకాలము, మేము రోగుల కొరకు ప్రార్ధించుచున్నాము. మరియు ఆదివారము మధ్యాహ్నము, నేను అబ్రహము మరియు అతని తరువాత అతడి సంతతి అనే అంశముపై ప్రసంగించాను. గత రాత్రి చరిత్రలో ప్రపంచాన్ని కుదిపి వేసిన ఒక గొప్ప తాజా వార్త అనే అంశముపై ప్రసంగించాను.

MATT 5:21•

MATT 11:6

 

6మరియు ఈ రాత్రి ఒకవేళ మీరు లేఖనములను త్రిప్పినట్లైన, మత్తయి సువార్త 11వ అధ్యాయము మరియు 6వ వచనమునకు మీరు త్రిప్పిన, నేను ఈ మాటలను చదివెదను:

మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు.

ఇప్పుడు ఈ అంశమును నేను, "మరచిపోబడిన ధన్యత" అని పిలచుచున్నాను. మనందరము ధన్యతలను గూర్చి ఎరిగియున్నాము. మత్తయి గ్రంధము 5వ అధ్యాయములో, కేవలము ప్రారంభమునకు కొద్దిగా ముందు లేక ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు, ఆయన ప్రజలను తీసుకొని మరియు పర్వతము పైకి వెళ్ళినప్పుడు యేసు ధన్యతలను గూర్చి బోధించెను. ఆయన వారికి నాయకుడాయెను.

మరియు ఆయన పైకి వెళ్ళి ధన్యతలను గూర్చి బోధించెను. మరియు ప్రారంభించి: "వారు చెప్పినది మీరు విన్నారు, ఆ పాతకాలపు వారు, కానీ నేను మీకు చెప్పెదను," మరియు అటువంటివి.

7ఇప్పుడు, యేసు ఒక పరిపూర్ణ మాదిరి… లేక మోషె యేసుకు సాదృశ్యముగా ఉన్నాడు. మోషె యేసుకు మొదట మాదిరిగా ఉన్నాడు.

మోషె ఒక ప్రవక్త, అతడు ధర్మశాస్త్రమును ఇచ్చువాడు. అతడు అరణ్యములో ఉన్న ఆ జనులపై రాజు వలె ఉన్నాడు, ఇశ్రాయేలు మరియు అతడు ప్రవక్తగా జన్మించాడు. అతడు ఫరో యొద్ద నుండి దాగుకొన్నాడు. యేసు రోమా సామ్రాజ్యము వద్ద దాగుకొన్నట్లుగా మరియు అతడు… అతడి పరిచర్య మరియు జీవితము ఆ విధమైన మాదిరిలో కొనసాగినది మరియు మోషె, ఇశ్రాయేలు యొక్క పిల్లలను అరణ్యములోనికి తీసుకొని వచ్చిన తరువాత, అతడు పర్వతము పైకి వెళ్ళి మరియు ఆజ్ఞలను పొందుకొన్నాడు, క్రిందకి దిగివచ్చి మరియు ఆజ్ఞలను బోధించడం ప్రారంభించాడు.

MATT 5:3,8-12•

MATT 11:6•

LUKE 7:23

 

8మరియు యేసు, ఆయన తన శక్తిలోనికి వచ్చినప్పుడు, ఆయన పర్వతము పైకి వెళ్ళి మరియు కూర్చొని మరియు జనులకు బోధించడం ప్రారంభించెను, "హృదయశుద్ధి గలవారు ధన్యులు: వారు దేవుని చూచెదరు. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు: పరలోక రాజ్యము వారిది. జనులు మిమ్మును నిందించి, హింసించి, మరియు మిమ్మును అపహాస్యము మరియు మొదలుగునవి; ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలనూ హింసించిరి. సంతోషించి, ఆనందించుడి, ఎందుకనగా పరలోకమందు మీ ఫలము అధికమగును."

ఖచ్చితముగా ఆయన మోషెను పోలియున్నాడు… లేక మోషె యొక్క మాదిరే ఆయన యొక్క మాదిరిగా ఉన్నది. మరియు మనము మోషె ఏమైయున్నాడు, మరియు యేసు ఏమైయున్నాడు అనే మాదిరిలను బాగుగా ఎరిగియున్నాము, ధన్యతలను బోధించుట.

కానీ ఈ ధన్యత 11వ అధ్యాయము 6వ వచనములో ఉన్నది. మరియు ఒకవేళ మీరు దీనిని గమనించకపోతే, మీరు దానిపైన చదువుకొనిపోయి మరియు దానిని పొందుకొనరు. అది ఇతర మాటల మధ్య చీల్చబడెను, కానీ అది ఒక ధన్యత.

MATT 11:6,10•

LUKE 3:20•

LUKE 7:23,27

 

9మరియు ఆయన చెప్పెను, "మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు," చూశారా. "హృదయశుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, ధన్యులు… ధన్యులు…"

మరియు ఇక్కడ మళ్ళీ ఈ ధన్యతను ఆయన విడిచిపెట్టియున్నాడు, చూశారా. ధన్యులు… మరియు, "నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు." ఓ, ఆ దినములలో అవి గొప్ప సమయములు.

ఇప్పుడు, ఇది ప్రారంభించడానికి కారణమేమైయున్నదో మనము కనుగొనియున్నాము, అది ఈ గొప్ప క్రొత్త నిబంధన ఏలియా అయిన బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్య తర్వాత, మరియు అతడి కొరకే వర్తమానము పంపించబడెను. మరియు అతడి యొక్క పరిచర్యను బట్టే యోహాను చెరసాలలో ఉంచబడెను.

మరియు ఓ, యోహాను ఎంత కఠినమైనవాడు. మరియు అతడు నిజముగా, సత్యముగా యేసు "నాకు ముందుగా వెళ్ళును" అని చెప్పిన వర్తమానికుడు. మరియు అతడు ప్రకృతి మనుష్యుడు. మరియు ఏ విధముగానైనా వారు అతడిని పట్టుకొనినప్పుడు, అతని ఆత్మ ద్వారా అభిషేకించబడిన పరిపూర్ణమైన ఏలియా వలె ఉండును. అతడు క్రొత్త నిబంధన యొక్క అభిషేకించబడిన ఏలియా.

MATT 3:4•

MATT 14:4

 

10యెజెబెలు, దుర్నీతి గల స్త్రీలు జీవించిన దానిని ఏ విధముగా ఏలియా - అటువంటి మనుష్యుడు ఇష్టపడలేదో; మరియు యోహాను, కూడా అదే. మరియు ఏలియా అరణ్యములో నివసించెను; యోహాను అంతే. ఏలియా చేసినట్లుగానే, యోహాను కూడా ఒంటరిగా నిలబడెను. మరియు అరణ్యము నుండి వచ్చిన ఆ గొప్ప కఠినుడైన మనుష్యుడు.

మరియు వారు అతడిని ఒక పాత మట్టితో కూడి చెమ్మగానున్న చెరసాలలో వేసియున్నారు. అరణ్యముతో స్వేచ్చగా విహరించే ఒక వ్యక్తి. మిడుతలను భుజించేవాడు, తేనె, మరియు అడవి ప్రయాణము, మరియు అక్కడ అతడు దేనిని తినునో దానిని చంపుకొని లేక అతడికి ఏది కావలయునో దానిని అడవిలో నుండి తీసుకొనువానికి, యోహనుకు అది ఒక భయంకరమైన అనుభవముగా ఉండియుండును.

మరియు ఇప్పుడు, అతడు ఒక చిన్న పాత, బూజుపట్టిన మురికి చెరసాలలో, బహుశా, ఎక్కడో చీకటి గోతిలో వేయబడెను — ఎందుకనగా ఆ యొక్క భార్య అయిన యెజబెలు… హేరోదియ అతనిని అక్కడ పడవేసెను ఎందుకనగా అతడు రాజైన హేరోదుతో నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యను ఉంచుకొని, మరియు ఆమెతో జీవించుట తప్పు అని చెప్పెను. ఆ విధముగా చేయుట అతడికి న్యాయము కాదు.

11మరియు యోహాను, ఏ విధమైన సాధనములను తన దగ్గర ఉంచుకొనని మనుష్యులలో ఒకని వంటివాడు. అతడు ఆ విధముగా కొనసాగనిచ్చును. అది అతడికి ఏ వ్యత్యాసమును చూపదు. ఒకవేళ అది తల తీసివేయడమా, తీసివేయడమే (అంతే), ఏలియా వలె. అతడు ఏమి చెప్పవలయునో దానితో ముందుకు కొనసాగువాడు. ఏది సరైనదో, అది సరే. ఒకవేళ అది తప్పు అయితే, అది తప్పే.

దేవా, ఈ రోజు అటువంటి వారు మాకు ఎక్కువగా కావాలి, దేవుని యొక్క వాక్యము యొక్క నిజమైన యదార్ధమైన నేరస్థాపనలపై నిలబడే మనుష్యులు. దానిని పలికి, మరియు నీ సమాధానమును పట్టుకొనకుండా, బయటకు మాట్లాడేవారు.

మరియు అప్పుడు, అక్కడ యోహానును మనము కనుగొన్నాము, ఆ చిన్న పాత బూజుపట్టిన, మురికి చెరసాలలో, బహుశా ఎప్పుడో ఒకసారి అతడికి విసురుచున్న కొన్ని మురికి రొట్టెలుతో అక్కడ వేయబడెను. బహుశా అతడు సన్నగా అయివుండి మరియు బైబిలు చదువుకొనుటకు అతడికి ఏ మార్గమును లేదు. మరియు అతడు… ఒక రచయిత ఒకసారి అతడిని గూర్చి, "అతడి పక్షిరాజు కన్నులకు పొర కమ్మెను," అని వ్రాసెను.

12ప్రవక్తలు పక్షిరాజులతో పోల్చబడ్డారని మీరు ఎరిగియున్నారు. మరియు దేవుడు తన ప్రవక్తలను పక్షిరాజులని పిలుచుచున్నాడు. అది ఎందుకనగా పక్షిరాజు ఇతర పక్షులన్నింటిలో చాలా శక్తివంతమైనది. మరియు పక్షిరాజు బాగా పైకి వెళ్ళి, ఏ ఇతర పక్షి కన్నను పైన ఎగురును. మరి ఏ ఇతర పక్షికన్నను శ్రేష్టమైన దృష్టి అది కలిగియున్నది. వారు డేగ కలిగియున్న దృష్టి గూర్చి మాట్లాడెదరు, మరియు ఆ డేగ గాలిలో ఎగురుటను గూర్చి ఎందుకు, ఒకవేళ ఒక డేగ పక్షిరాజును వెంబడించడానికి ప్రయత్నించినయెడల, అతడు గాలిలోనే ముక్కలైపోవును. అతడు ఖచ్చితముగా.

మరియు ఇప్పుడు, ఒకవేళ ఎక్కడ ఉన్నదో చూసే దూరదృష్టి దానికి లేనప్పుడు, అక్కడికి వెళ్ళుట ఆ పక్షిరాజుకు ఏమి మంచి చేయును. తిరిగి మరలా భూమిపైకి వచ్చుటా? అది ఏ విధముగాననిన, ఒకవేళ మనము ఎందుకు దుముకుచున్నామో తెలియకుండా ఉన్న ఎడల మనము ఎత్తుకు దుమికి ఏమి చేయుదుము? చూశారా?

మరియు ఒకవేళ ఒక శబ్దము (కేక) పెట్టుటకు మనము ఏమి కలిగి లేనప్పుడు, మనము ఏమి సాక్ష్యమిచ్చుచున్నాము, లేక చాలా ఎక్కువగా ఎందుకు కేకలు వేయుచున్నాము? చూశారా? మరియు అది ఇప్పుడు వ్యత్యాసమైనది, ఇప్పుడు… శబ్దము చేయుటకు ఏదైనా మీరు కలిగియున్నయెడల అప్పుడు ఆ శబ్దము బాగుండును. కానీ మొదటిగా అది వచ్చేంత వరకు వేచియుండండి, మరియు అప్పుడు మీ జీవితమంతా శబ్దముగానే ఉండును.

13కానీ ఈ పక్షిరాజు కన్నులకు పొర కమ్మియున్నదని మనము కనుగొనియున్నాము, ఎందుకనగా వారు అతడిని అతడి యొక్క నివాస స్థానమైన అడవిలో నుండి బయటకు తీసివేసి, మరియు అతడిని ఒక పాత మురికి, బూజుపట్టిన చెరశాలలో వేసియున్నారు. మరియు ఈ గొప్ప మనుష్యుడు గాలిలో ఎగరగలిగే పక్షిరాజు వంటివాడు.

ఇప్పుడు, నీవు ఎంత ఎత్తుకు ఎగరగలిగితే, అంత దూరము నీవు చూడగలవు. వారు ఈ గాలి బుడగలు అటువంటి వాటిలో ఇప్పుడు పైకెగురుచున్నారు, కనుక వారు … గాలిలో చాలా ఎత్తుకు, దానితో వారు భూమి యొక్క పూర్తి చిత్రమును, దాని యొక్క వంపులో, వారు తీయగలుగుచున్నారు.

మరియు నేను అనుకొనుచున్నాను, రష్యా కలిగియున్న ఈ క్రొత్త పరికరములో, ఒక గంట మరియు నలభై-అయిదు నిముషములలో భూమినంతా చుట్టి రావచ్చును, ఎందుకు, వారు దాని యొక్క పూర్తి భ్రమణమును చిత్రము తీయగలరు. అయితే ఎంత ఎత్తుకు నీవు చేరగలిగితే, అంత ఎక్కువ నీవు చూడగలవు.

కాబట్టి, బైబిలులో ఉన్న ప్రవక్తలు, సమాజము కన్నా ఎత్తుకు ఎగరగలిగే పక్షిరాజుల వలె వారున్నారు. మరియు "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అనునది ఏమిటో కనుగొనేవారు. అప్పుడు క్రిందకి తిరిగి వచ్చి మరియు ఆ సమాచారమును తెచ్చెడివారు, చూశారా. కాబట్టి, ప్రభువు యొక్క వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చెను. మరియు యోహాను పంజరములో పెట్టబడెను, ఎందుకు, అది ఆ పక్షిరాజు కన్నులకు పొర తీసుకొని వచ్చును.

14ఒకసారి ఒక పెద్ద పక్షిరాజు కొరకు నేను చాలా బాధపడితిని. మరియు ఒక జంతు-ప్రదర్శనశాలకు వెళ్ళటకు కేవలము అందుకే నేను తట్టుకోలేను. దీనమైనది జీవులు, వాటిని పంజరములో పెట్టబడడం చూడడానికి, సింహాలు మరియు … ఏ విధముగా జీవితమంతా అవి చెరసాలలో పెట్టబడెను.

మరియు చిన్న శారా మరియు నేను, ఒకసారి ఇక్కడ సిన్సిన్నాటి జంతు-ప్రదర్శనశాల దగ్గర, చుట్టూ తిరుగుతూ ఉన్నాము. మరియు అమ్మ మా ఆహారాన్ని సిద్ధము చేస్తూ ఉన్నది. మేము పిల్లలతో అక్కడ ఉన్నాము. వారు ఆ చిన్న బోటులో షికారు మరియు కోతులు అటువంటివి చూచుటకు ఇష్టపడుచున్నారు. కనుక అమ్మ ఆహారాన్ని సిద్ధము చేస్తూ ఉన్నప్పుడు మేము చుటూ తిరుగుచూ ఉన్నాము.

మరియు నేను ఒక కేక విన్నాను. అది ఏమిటా అని చూడడానికి నేను కొండ క్రిందకి వెళ్ళాను. మరియు వారు అప్పుడే ఒక పెద్ద పక్షిరాజును పట్టుకొని మరియు దానిని పంజరములో పెట్టియున్నారు.

15మరియు ఆ దీనమైన దానిని నేను అక్కడ చూచియున్నాను, మరియు దాని శిరస్సు అంతా అది రక్తము కార్చుచున్నది. మరియు దాని శిరస్సు మరియు రెక్కలు యొద్ద కొట్టుకొనుట ద్వారా ఈకలు అన్నీ రాలిపోయినవి.

అప్పుడు అది ఎగురుటకు, పక్షిరాజు వలె, అది అక్కడకు వచ్చుచున్నది. మరియు దాని యొక్క శిరస్సును ఆ ఉచలకు కొట్టుకొనుచున్నది, మరియు దానిని వెనుకకు ఈడ్చివేయుచున్నది, మరియు నేల మీద పడి, క్రింద ఉండి మరియు ఆ పెద్ద కళ్ళను చుట్టూ త్రిప్పుచూ, ఆ విధముగా పక్షిరాజు పైకి చూస్తూ.

మళ్ళీ తిరిగి వచ్చి మరియు అది వచ్చి తిరిగి ఆ ఊచలను తిరిగి కొట్టుకొనుచున్నది. మరియు రక్తము మరియు ఈకలు దాని నుండి రాలిపోయియున్నాయి, మరియు దాని వెనుక జారిపడి మరియు ఆ పెద్ద కళ్ళను పైకి త్రిప్పుతూ మరియు పైకి చూస్తున్నది. ఎందుకు? అది ఒక ఆకాశ సంబంధమైన పక్షి, అది ఎక్కడ ఉండవలసియున్నదో అక్కడకు చూస్తూ ఉన్నది. కానీ మానవుని యొక్క కుయుక్తితో కూడిన కొన్ని పన్నాగములు దానిని పంజరములో పెట్టివేసియున్నవి.

మరియు అది చాలా భయంకరమైన, దయనీయమైన దృశ్యము అని నేను అనుకొనియున్నాను. దానిని వదిలివేయుటకు ఒకవేళ నేను ఆ పక్షిరాజును కొనవలయుననిన నేను నా మొదటి అర్పణను తీసుకొనవలసియున్నది, నేను ఆ పక్షిరాజును కొనియుండెడివాడను. నేను అనుకొన్నాను, "ఆ దీనమైనది."

16నేను అనుకొన్నాను, "మై, ఒకవేళ అది భయంకరము కాకపోయిన ఎడల!"

అది … ఆకాశములో ఎగురు పక్షిగా ఉండుటకు అది జన్మించినది, మరియు ఇక్కడ అది మానవుల యొక్క కుయుక్తులతో అంతా బంధించబడినది. మరియు అది కేవలము తన తలను చితక్కొట్టుకొనుచున్నది. అయితే అది బంధించబడినది. "నేను ఎన్నడూ చూడనటువంటి అతి భయంకరమైన జాలి గల దృశ్యమిది," అని నేననుకొన్నాను.

అప్పుడు వెళ్ళిపోవుటకు నేను వెనుకకు తిరిగియున్నాను, మరియు నేను అనుకొన్నాను, "అవును అది ఒక భయంకరమైన దృశ్యము, కానీ దానికన్నా భయంకరమైన ఒకదానిని నేను చూచియున్నాను: దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలుగా జన్మించిన పురుషులు మరియు స్త్రీలు ఎదో ఒక పంజరము లాంటి దానిలో బంధించబడటం చూచుట, పరలోకము నందు ఒక దేవుడున్నాడని వారు పైకెత్తి చూచినప్పుడు, ఆయన ఒక గొప్ప స్వస్థపరచువాడు, మరియు ఒక గొప్ప యజమానుడు, మరియు ఒక గొప్ప రక్షకుడు అని తెలుసుకొనుటకు, మరియు ఏదో ఒక రకమైన యాజక సంబంధమైన బోనులో పెట్టబడి, అన్ని రకముల సమాజములు మరియు అటువంటి ప్రతీ దానితో వారి యొక్క బుర్రలు పగలుగొట్టుకొనుచూ, మరియు ఇక ఎన్నడూ ఆ పంజరములో నుండి బయటకు రాలేకపోవును. అది ఒక దయనీయమైన స్థితి.

వారికి ఒక గొప్ప దేవుని గూర్చి చెప్పి, మరియు వారి యొక్క ఆశలను నిర్మించి; మరియు అప్పుడు వారిలో నుండి ఆ మొత్తము కార్యమును బయటకు లాగి వేయుట. ఆయన మరణించెను, సమాధిలో పెట్టబడెను, మరియు దాని యొక్క సంగతి అంతే. ఆయన ఉండవలసిన విధముగా ఆయన లేడు. దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలుగా జన్మించిన పురుషులు మరియు స్త్రీలు ఆ విధమైన సంగతులలో బంధించబడినప్పుడ, జనులను ఆ విధముగా చూచుట, అది ఒక దయనీయమైన దృశ్యము.

17యోహాను, అతని యొక్క పక్షిరాజు కన్ను నిజముగా పొర కమ్మెను. మరియు యోహాను బాగా అలసిపోయెను. అతడు మరియు ఏలియా ఒకే గొప్ప విధముగా ఉన్నారు, ఎందుకనగా అదే ఆత్మ వారిద్దరిపై ఉన్నది. చూడండి, దేవుడు ఎన్నడూ తన ఆత్మను తీసుకొనడు; ఆయన కేవలము తన మనిషిని తీసుకొనును.

దేవుడు ఏలియాను తీసుకొనెను. ఏలియా ఆత్మను తీసుకొని మరియు ఎలీషాపై ఉంచెను. తరువాత ఎలీషాపై నుండి తీసివేసి, మరియు యోహానుపై ఉంచెను, మరియు చివరి కాలములో దానిని తిరిగి ఉంచెదనని వాగ్దానము చేసెను, చివరి కాలములో వేరొక వ్యక్తి వచ్చుట, మరొక ఏలియా — బైబిలు పాఠకులుగా మనమందరము, అది మనకు వాగ్దానము చేయబడినది అని ఎరిగియున్నాము.

ఇప్పుడు, దెయ్యము కూడా తన మనుష్యుని తీసుకొనును, కానీ ఎన్నడూ అతని ఆత్మను కాదు అని మనము తెలుసుకొనియున్నాము. మరియు అతడు మరలా అదే విధముగా వచ్చుచున్నాడు, అదే విధముగా. మరియు వారిద్దరూ కలిసి ఉన్నరని మనము కనుగొనియున్నాము.

మరియు ఏలియా మరియు యోహాను ఒకే గొప్ప వ్యక్తులుగా ఉన్నారు. వారిద్దరూ నిజముగా ఆందోళనతో బెదిరిపోయేవారు, వారిద్దరూ కూడా. దాదాపు ఒత్తిడితో కృంగిపోయారు, వారిద్దరూ కూడా. మరియు దేవునికి దగ్గరగా జీవించే మనుష్యులు చాలా మట్టుకు విచిత్రమైనవారిగా పరిగణించబడుదురు, లేక వారితో ఏదో పొరపాటు ఉన్నది అన్నట్లుగా ఉందురు. అది నిజము. వారు ఎల్లప్పుడూ ఆ విధముగానే పరిగణించబడుదురు.

ACTS 26:24,25

 

18పౌలు (ఈ ఉదయము, సేవక సమూహముతో నేను మాట్లాడుచున్నప్పుడు), అగ్రిప్ప అతడికి చెప్పెను, లేక ఫేస్తు చెప్పెను, "ఎక్కువ జ్ఞానము నిన్ను పిచ్చివానిగా, లేక వెర్రివానిగా తయారు చేసినది.

అతడు చెప్పాడు, "నేను పిచ్చివాడిని కాను; నేను వెర్రివాడిని కాను. నేను నియంత్రణలోనే ఉన్నాను, చూశారా. నేను సరిగానే ఉన్నాను."

మరియు వారు ఆరోపించెదరు… విలియం కౌపర్ అని నేను నమ్ముచున్నాను, లండనులోని అతడి సమాధి దగ్గర నేను నిలబడ్డాను. మరియు అతడు ఆ ప్రఖ్యాత గీతమును వ్రాసెను: "రక్తముతో నింపబడిన ఒక ఊట ఉన్నది, అది ఇమ్మానుయేలు రక్త నాళములో నుండి తీయబడినది, పాపులందరూ ఎక్కడైతే దానిలో మునుగుతారో, వారి యొక్క పాపములన్నీ పోవును."

19ఆ వ్యక్తి ఎంతగా ప్రేరేపించబడెననగా… అతడు ఒక త్రాడును తీసికొని మరియు ఉరి వేసుకొనుటకు ప్రయత్నించాడు, ఆ త్రాడు తెగిపోయినది. అతడు ఆత్మహత్య చేసుకొనుటకు ఒక నది దగ్గరకు వెళ్ళుటకు ప్రయత్నించాడు; మరియు ఎంతో పొగమంచు కప్పబడి ఉండడం వలన ఆ కారు నడిపేవాడు, ఆ నదిని కనుగొనలేకపోయాడు. మరియు అది కేవలము ఆ ప్రేరేపణ ఒక వ్యక్తిని ఏ విధముగా పట్టుకొని, అతడిని లాగుకొనిపోవును అన్న దానిని చూపిస్తున్నది. అప్పుడు అతడు దానిలో నుండి బయటికి వచ్చినప్పుడు…

సైఫను ఫోస్టర్ వలె, అతడు ఈ దేశమునకు గొప్ప జానపద గీతములను ఇచ్చెను: "ఓల్డ్-బ్లాక్-జో," "డాన్-ద-సువాన్నీ-రివర్," "ఓల్డ్-కెంటకీ-హోమ్." అతడు ప్రేరేపణ పొందుకొన్న ప్రతీసారి మరియు పాట వ్రాసినప్పుడు, అతడు త్రాగుతూ ఉండేవాడు. చివరికి, అతడు ప్రేరేపణ నుండి దిగువకు జారినప్పుడు లేదా బయటకు వచ్చినప్పుడు, అతడు ఒక సేవకుడిని పిలిచి, మరియు ఒక రేజర్ బ్లేడును తీసుకొని ఆత్మహత్య చేసుకొనెను.

1KGS 19:9•

JON 1:17•

JON 4:8

 

20మరియు ప్రవక్తయైన యోనా గూర్చి నేను తలంచాను, దేవుడు అతడిని ప్రేరేపించుచున్నాడు, ఆ కాలమునకు ఎగురగల గొప్ప పక్షిరాజు అతడే. దేవుడు అతడిని మిక్కిలిగా ప్రేరేపించగా, అతడు క్రిందకి వెళ్ళి, మూడు పగలు మరియు రాత్రులు తిమింగళ గర్భములో పెట్టబడెను; ఒడ్డునకు నడుచుకొని వచ్చి మరియు ఒక వర్తమానమిచ్చెను, అది వారి పశువులపై కూడా గోనెపట్ట ధరించే అంతగా ఆ జనులను చేసినది. మరియు ఆత్మ అతడిని విడచిపెట్టినప్పుడు, అతడు కొండ పైకి వెళ్ళి, మరియు కూర్చొని అతడు చనిపోయేటందుకు దేవున్ని అడిగియున్నాడు. అది నిజము.

ఈ గొప్ప ఏలియాను మనము కనుగొన్నాము, యోహను అతడికి మాదిరి, ఆ కాలమునకు గొప్ప పక్షిరాజు, శక్తిగల, కఠినమైనవాడు, గొప్ప అడవి మనిషి — అడవిలో ఒక గుహలో నివసించాడు. మరియు అతడు బయటకు వచ్చి, జనుల మధ్యలోనికి దూసుకొని వచ్చియున్నాడు. ఇశ్రాయేలు జనాంగము ఎరుగనటువంటి స్థలముల పైకి దేవుడు అతడిని తీసుకొని వెళ్ళియున్నాడు. మరియు వర్తమానమును ప్రకటించి మరియు, "అది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అని చెప్పి, మరియు తిరిగి అరణ్యములోనికి వేగముగా దూసుకు వెళ్ళిపోయాడు.

1KGS 17:1

 

21ఆ గొప్ప పక్షిరాజును కనుగొనుము, అతడు అక్కడికి దూసుకొని వచ్చినప్పుడు మరియు ఆ రాజుతో చెప్పెను, "నా మాట ప్రకారము గాక, ఆకాశము నుండి కనీసము ఒక్క మంచు బిందువైననూ కురవదు." అక్కడికి నడుచుకొని వెళ్ళిపోయెను.

ఆ రోజు ఆ సమరయ మార్గములో అతడు నడుచుకొని వెళ్ళినప్పుడు, అతడి చేతిలో ఆ కర్రతో, ఆ గొర్రె చర్మపు ముక్కను అతడి చుట్టూ చుట్టుకొని ఆ బట్టతల మెరుస్తూ, చెంపలపై జుటు క్రిందకు వ్రేలాడుచూ, ఆ యొక్క అడుగులు ఎంత నిదానముగా వేయగలిగితే అంత నిదానముగా, ఆ సమరయ మార్గము గుండా నడుచుకొని వస్తూ…

అయితే అతడు ఎవరి సన్నిధిలో ఉన్నాడో అతడు ఎరిగియున్నాడు. ఆహబు ఏమి చెప్పనైయున్నాడు అన్న దానిగూర్చి అతడు భయపడుట లేదు, ఎందుకనగా అతడు ఆహబు కన్నా ఎవరో గొప్పవాని యొక్క సన్నిధిలో ఉన్నాడు. అతడు సన్నిధిలో ఉన్నాడు, మరియు అతడు "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడును" కలిగియున్నాడు. ఆ ముసలి కన్నులు, ఆ ముడతలతో కప్పబడిన చర్మముతో తిన్నగా ఆకాశము పైకి చూస్తూ ఉన్నాడు. అతడు స్థిరముగా నడుస్తూ ఉన్నాడు, ఎందుకనగా అతడు "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" ను కలిగియున్నాడని అతడు ఎరిగియున్నాడు.

1KGS 18:24

 

22ఓ, అతడు ఒక పక్షిరాజు.

ఆ పర్వతము పైకి వెళ్ళి మరియు అది ఎండిపోయేటంత వరకు ఆ ఏటిలోని నీళ్ళు త్రాగుచూ, మరియు అక్కడికి తిరిగి వెళ్ళి మరియు ఒక కూడికను ఏర్పాటు చేసియున్నాడు. దేవుడు అతడికి ఒక దర్శనమిచ్చినప్పుడు, మరియు ఆ పర్వతము పైకి వెళ్ళి "దేవుడెవరో ఇప్పుడు రుజువు చేద్దాం. దేవుడెవరో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఎన్నడైనా ఆయన దేవుడైయుంటే, అయన ఇంకను దేవుడే," అని చెప్పాడు. అది నిజము. ఓ, ఆ పక్షిరాజులను నేను ఇష్టపడెదను. అవునండీ. అక్కడికి వెళ్లి మరియు చెప్పాడు, "ఒకవేళ అతడు… దేవున్ని రుజువు చేద్దాం."

మరియు అతడు చెప్పాడు… దేవుడు అతడకి దర్శనములో చెప్పినట్లుగా ఆ విధముగానే పిలిచియున్నాడు. అతడు చెప్పెను, "మీరొక ఎద్దును తీసుకొనండి, మరియు నేనొక ఎద్దును తీసుకొనెదను; మరియు మీరు బయలును పిలవండి మరియు నేను దేవున్ని పిలిచెదను. మరియు ఎవరైతే అగ్ని ద్వారా జవాబిచ్చెదరో, అతడే దేవుడైయున్నాడు."

1KGS 18:26-28•

1KGS 19:2,5

 

23మరియు అతని గూర్చి అతడు నిశ్చయతను కలిగియున్నప్పుడు, అతడి దర్శనమును గూర్చి సరైన నిశ్చయతను కలిగియుండెను. వారు ఉదయకాలమంతా బయలును పిలుస్తూ మరియు తమకుతాము కోసుకొనుచూ, మరియు అరచుచూ, మరియు గెంతుతూ, ఆయన చుట్టూ నడుస్తూ. మరియు చెప్పాడు, "అరవండి, బహుశా మీరు మరికొంచెం ఎక్కువగా కేకలు వేయవలసియున్నది. బహుశా అతడు పనిచేయుచున్నాడేమో లేక బహుశా అతడు కునుకు తీయుచున్నాడేమో." ఓ, అతడు ఎక్కడ నిలబడియున్నాడో అతడు ఎరిగియున్నాడు. అవును.

అయితే అతడు దేవుడిని రుజువు చేసిన తరువాత, అతడి పక్షిరాజు కన్నులకు పొర ఏర్పడినది. మరియు అతడిని చంపెదనని ఎప్పుడైతే యెజెబెలు భయపెట్టినదో, అతడు అరణ్యములోనికి పారిపోయెను. ఒక బదరీ వృక్షము క్రింద సేదదీరుతున్న తన సేవకుని దేవుడు కనుగొనెను, పరిగెడుతూ, దేవుడు దేవుడే అని రుజువు చేసిన తరువాత — ఆందోళన, నిరుత్సాహము. మీరు ఆ పరిధిలలోనికి వెళ్ళినప్పుడు, అది మానవ హృదయమునకు ఏదో చేయును. మీరు క్రిందకి వచ్చినప్పుడు…

దానిని మీరు వివరించలేరు. అది మిమ్ములను ఎక్కడికో తీసుకొని వెళ్ళును. దానిని గూర్చి మాట్లాడడానికి ప్రయత్నించవలసిన అవసరము లేదు. దర్శనములు మరియు అటువంటివి మిమ్ములను ముక్కలుగా చేయును. మీరు ఇతరులకు చెప్పలేరు. వారు దానిని అర్ధము చేసుకొనలేరు. వారు ఎన్నడూ అక్కడ లేరు, కాబట్టి వారు దానిని ఎలా తెలుసుకొనెదరు? కనుక అది వారిని ముక్కలుగా చీల్చివేయును.

1KGS 17:1•

1KGS 18:37-40•

1KGS 19:5

 

24దేవుడు తన సేవకుని పోషించుట యందు మరియు అతడిని బలపరచుట యందు చాలా దయ కలిగియుండెను… మరియు బయట ఆ బదరీ వృక్షము క్రింద.

అయితే యెహోవాపై అతడు అటువంటి నమ్మకమును పొందుకొన్న తరువాత, చాలా ఖచ్చితముగా, అతడు రాజు ఎదుటకు నడుచుకొని వెళ్ళునంతగా, మరియు చెప్పాడు, "నా మాటను బట్టి, ఒక్క మంచు బిందువైననూ రాలదు," రాజు యొక్క అంతఃపురము లోనికి దూసుకొని వెళ్ళియున్నాడు. అభిషేకముతో.

అప్పుడు ఏమి చేయవలెనన్నదాని గూర్చి అతడు ఒక దర్శనము కలిగియుండెను. అప్పుడు అతడు తిన్నగా అక్కడకు వెళ్లి, ఆ పర్వతము పైకి మరియు ఆకాశము నుండి అగ్నిని క్రిందకి దింపెను, ఆయనే దేవుడని రుజువు చేయుచూ, ఆ దినముననే ఆకాశము నుండి వర్షమును క్రిందకి పిలిచెను, మరియు అప్పుడే నాలుగు వందల మందిని చంపెను — యూజకులు, అన్య యూజకులు, వారి యొక్క తలలు నరికివేసెను, మరియు ఎప్పుడైతే ఆ దర్శనము విడిచిపెట్టినదో అప్పుడు పరిగెత్తెను.

1KGS 19:4,18

 

25ఆందోళనగా, అక్కడ కూర్చొని, చెప్పెను, "నేను మిగిలిన నా తండ్రులైన ఇతరుల కన్నా ఎక్కువ కాదు. నేను ఇతర ప్రవక్తల కన్నా ఎక్కువ కాదు. ప్రభువా, ఇప్పుడు, నా ప్రాణమును తీసివేయుము. నేను ఒక్కడిని మాత్రమే మిగిలియున్నాను. నేను ఒక్కడిని మాత్రమే సరైన సువార్తను ప్రసంగిస్తున్నాను, కనుక నా ప్రాణమును తీసివేయుము. నన్ను వెళ్ళనిమ్ము." అందుచేతనే అటువంటి కలవరముతో వారందరి ముఖములు ఎర్రబారినవి.

అయితే దేవుడు చెప్పెను, "లేదు, నేను ఇంకా బయలుకు మోకాళ్ళూనని ఏడు వేల మందిని కలిగియున్నాను," చూశారా. చెప్పెను, ఏలియా, అంతయూ మంచిదే. నీవు ఒక గొప్ప కార్యము చేయుచున్నావు, అయితే నేను ఇంకా ఒక వేరే గుంపును కలిగియున్నాను, చూచారా, అది నీవు ఇంకనూ ఎరుగవు."

"అయితే నా ప్రాణము తీసికొనుము. నేను నా పితరుల కన్నా ఎక్కువ కాదు, నా ముందున్న ప్రవక్తలు. నన్ను చనిపోనిమ్ము."

26ఇక్కడ యోహాను, పూర్తిగా అతడివలె ఉన్నాడు, ఇక్కడ చెరసాలలో వేయబడి, జనులను కూడగట్టుచున్నాడు — అతడు యోర్దాను ఒడ్డున నిలబడిన తరువాత, అరణ్యములో నుండి బయటకు వచ్చెను, అతడు జన్మించడానికి మూడు నెలల ముందు తల్లి గర్భములో ఉన్నప్పుడే పరిశుద్దాత్మను పొందుకొన్నవాడు. ఖచ్చితముగా పొందుకొనెను. ఎలా? యేసుక్రీస్తు యొక్క నామమును మొదటిసారిగా విన్నప్పుడు.

మరియ అక్కడికి వచ్చి మరియు ఆమె ఇంకా… ఆమె ఎటువంటి అనుభూతి కలిగియుండలేదు. కేవలము ఆ దూత ఆమెను కమ్ముకొనెను. పరిశుద్దాత్మ ఆమెకు చెప్పియుండెను. ఆమె యూదయకు వెళ్ళెను. మరియు ఆమె ఎలిసబెతుతో తాను తల్లి కాబోవుచున్నానని చెప్పెను. "దేవుడు నన్ను కమ్ముకొనెను, మరియు నేను ఒక కుమారుని కలిగి యుండబోవుచున్నాను." మరియు నేను అతడిని "యేసు అను పేరుతో పిలచెదను అని చెప్పెను."

మరియు చిన్న యోహానుకు అప్పటికే ఆరు నెలలు. ఎలిసబెతు గర్భము ధరించియున్నది. మరియు ఇప్పటి వరకు ఆమె ఆ జీవమును అనుభూతి చెందలేదు.

LUKE 1:41

 

27మరియు ఆమె ఆ విధముగా నిలబడి, మరియు ముఖమును చూచుచున్నది, మరియు జరుగబోవు దాని గూర్చి పరిశుద్దాత్మ చెప్పినది మరియ ఆమెకు చెప్పుచున్నది, మరియు ఆమె తనకు జరిగిన అనుభవమును గూర్చి చెప్పెను, (ఒక వృద్ధురాలిగా, గర్భము ధరించెను), మరియు ఏ విధముగా తన భర్త మూగవానిగా మొత్తబడెను.

మరియు అక్కడ నిలబడియుండగా, ఆమె చెప్పెను, "నేను ఒక కుమారుని పొండుబోవుచున్నాను, మరియు అతనికి యేసు అని పేరు పెట్టుదును." మరియు ఆ ప్రశస్తమైన మహిమకరమైన యేసు అను నామము మొదటిసారి మానవ పెదవులపై పలికిన వెంటనే, తన తల్లి గర్భములో పడియున్న ఒక చిన్న మృత-శిశువు, గెంతులు వేసి, మరియు జీవములోనికి వచ్చెను, మరియు తల్లి గర్భములోనే పరిశుద్దాత్మను పొందుకొనెను.

"నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే, నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను," అని చెప్పబడినది. మరియు అతడు తల్లి గర్భములోనే పరిశుద్దాత్మ-పూర్ణుడు అని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది.

దేవుని ద్వారా పిలువబడిన ఒక వ్యక్తి తొమ్మిది సంవత్సరముల వయసులో అరణ్యములోనికి వెళ్ళిపోయి, చదువు లేదు, అరణ్యములోనికి కొనిపోబడియున్నాడు మరియు అతడు ఒక అడవి మనిషి.

MATT 3:7,12•

LUKE 3:7,17

 

28ముప్పది సంవత్సరములో వయస్సులో, అరణ్యములో నుండి బయటకు వచ్చి రాబోవుచున్న మెస్సియా యొక్క వర్తమానము బోధించుచుండెను, అతడు రాజ్యములను వణికించెను.

మరియు పరిసయ్యల యొక్క సిద్దాంతములను బట్టి అతడు భయపడలేదు. "గడ్డిలోని సర్పములారా, అబ్రాహము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. సర్పసంతానమూ, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు?" అని చెప్పెను. ఓ, మై, అతడు కరుకైనవాడు.

"తన చేతిలో ఒక చేటను కలిగియున్న ఒక మెస్సియాను గూర్చి నేను మీకు చెప్పుచున్నాను." ఆమెన్. "ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రపరచును. ఆయన తన గోధుములను కొట్టులోనికి తీసుకొని వెళ్ళును, మరియు ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును," అని చెప్పెను. అతడేమి మాట్లాడుచున్నాడో అతడు ఎరిగియున్నాడు.

MATT 3:16,17•

MARK 1:10,11•

LUKE 3:22•

JOHN 1:33

 

29ఇప్పుడు, అయితే చివరికి ఈ మెస్సియా వచ్చినప్పుడు, చివరగా మెస్సియా వచ్చినప్పుడు, మరియు ఆయనకు బాప్తిస్మము ఇచ్చు గౌరవమును యోహాను కలిగియుండెను, ఆయన ఖచ్చితముగా వచ్చెను. అన్ని సూచనలు సరిగ్గా ఉన్నవి. ఆయన మెస్సియా యొక్క సూచనను చూపించెను, మరియు ఆయనే మెస్సియా అని యోహానుకు తెలుసు.

"అదిగో మెస్సియా. దానిలో ఎటువంటి సందేహము లేదు." యోహను చెప్పెను, "నేను ఆ అగ్నిస్తంభమును పావురము వలె వెలుగు ఆయన పైకి దిగివచ్చుట చూచితిని, ఆ అగ్ని స్తంభములో నుండి ఒక స్వరము, నేను నివసించుటకు ఇష్టపడుచున్న 'ఈయనే నా ప్రియ కుమారుడు'" అని పలికెను.

అది మెస్సియా అని అతడు ఎరిగియున్నాడు. యోహాను చెప్పెను, "నేను ఆయనను ఎరుగను, అయితే అరణ్యములో ఉన్న ఆయన, నీళ్ళతో బాప్తిస్మమివ్వమని నాతో చెప్పియున్నాడు. "ఎవరి పైన ఆత్మ దిగి వచ్చి మరియు నిలచియుండునో, ఆయనే పరిశుద్దాత్మ మరియు అగ్నితోను బాప్తిస్మమిచ్చువాడు" అని చెప్పెను. మరియు ఈయనే ఆయనని ఖచ్చితముగా నేను ఎరిగియున్నాను." కనుక అతడు దానిని బ్రద్దలుకొట్టెను.

30అయితే శ్రమ వచ్చినప్పుడు… యేసు వచ్చి మెస్సియాను చూపించెను… తానే మెస్సియా అని; కానీ అప్పుడే ఏదో తప్పు జరిగినది. తన చేతిలోని చేటతో, పొట్టును కాల్చివేయబోవుచున్న మెస్సియాను యోహాను పరిచయం చేసెను.

కానీ అతడు యేసు యొక్క కార్యములను కనుగొనినప్పుడు — ఆయన సాత్వికుడు మరియు నెమ్మదస్తుడు. కనుక అది అతడిని కలవరమునకు గురిచేసినది. ఏమి చెప్పవలెనో అతడికి తెలియలేదు. "ఇప్పుడు, ఇక్కడ ఎక్కడో తప్పు జరిగినదని," అతడు తలంచాడు. అతడు ఒక తప్పు సంగతిని నమ్మినట్లుగా అనిపించినది. అది సరైన రీతిలో పనిచేస్తునట్లు అనిపించలేదు.

మరియు చాలాసార్లు మనము కూడా ఆ విధముగానే, కార్యములన్నీ సరిగా జరుగుట లేదు అని తలంచెదము. కానీ అవి సరిగానే జరుగుచున్నవి. ఆయన ఇక్కడే ఉన్నాడని మనము ఎరిగియున్నంత వరకూ, అది ఎటువంటి వ్యత్యాసమును చేయును? అది సరిగానే జరుగుచున్నది. బహుశా అది ఏ విధముగా క్రియ చేయవలెనని మనము తలంచుచున్నామో, ఆ ప్రకారముగా జరుగుతూ ఉండకపోవచ్చు; కానీ దేవుడు ఏ విధముగా క్రియ జరగాలని కోరుచున్నాడో, ఆ ప్రకారముగానే క్రియ చేయుచున్నది.

MATT 3:10,12•

LUKE 3:9,17

 

31మీరు చెప్పవచ్చు, "మంచిది …"

యోహను, "మంచిది, ఇప్పుడు, తన చేతిలో చేటను కలిగియున్న మెస్సియాను నేను పరిచయం చేశాను, మరియు ఆయన కళ్లమును శుభ్రపరచబోవుచున్నాడు, మరియు తన గోధుమలను కొట్టులోనికి తీసుకొనును. మరియు నేను వారికి చెప్పాను గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది. మరియు ఆయన పొట్టునంతా తీసుకొని కాల్చి వేయును.

మరియు ఆ విధమైన ఒక గొప్ప బలిష్ణుడైన వ్యక్తిగా ఉండుటకు బదులు, ఆయన మిక్కిలి సాత్వికముతోను మరియు దీనత్వముతోను వచ్చియున్నాడు, మరియు ఆయన ఇక్కడ ఉన్నాడు, ఎక్కడో ఏదో తప్పు జరిగియుండవచ్చును" అని తలంచెను. "సందేహము లేదు, కానీ ఎక్కడో ఏదో తప్పు జరిగినది." అది సరైనది కాదు అని అతడు తలంచాడు.

మనలో చాలా మందికి జరుగునట్లుగా, అతడు కూడా దిగులుపడెను. మనము కూడా సరైనవి కాదు అని తలంచు సంగతులు జరుగున్నప్పుడు, మనము నిరుత్సాహపడెదము. కలతచెందవద్దు. అంతా సరియగును.

ఆ దెయ్యము అతడిని అక్కడే పట్టుకొన్నది. దెయ్యము అనుకొన్నది, "ఇప్పుడు, అతడిని చెరసాలలో పెట్టియున్నాను. నేను అతడిని చెరసాలలో వేసియున్నాను, కాబట్టి అతడిని అక్కడ పట్టుకొన్నప్పుడే నేను అతడిని లొంగదీసెదను. దేవుడు ఇప్పుడు అతడిని వాడుకొనుట లేదు. నేను అతడిని చెరసాలలో పెట్టియున్నాను, కనుక నేను చేయగలిగినంతగా అతడిపై అన్ని రకముల ముసుగులు వేసెదను. నేను అతడిని పూర్తిగా బంధించాను. నేను ఆ పక్షిరాజును పంజరములో బంధించాను. కనుక అతడు ఎన్నడూ సువార్తను బోధించనట్లుగా అతడు తలచే విధముగా నేను చేసెదను."

32అతడు చాలా మందికి ఆ విధముగానే చేయును, మరియు చాలా మంది మంచి వ్యక్తులు ఈ రోజు అదే స్థితిలో ఉన్నారు. అది ఖచ్చితముగా నిజము. అది సరిగా క్రియ చేయుట లేదు అని మనము తలంచెదము, కానీ అది సరిగానే క్రియ చేయుచున్నది. అంతయూ సరిగానే యున్నది.

ఇక్కడ క్రితము రోజు, ఒక చిన్న… చాలా మంది జనులు లోపలికి రావడము నేను చూశాను, వారు చెప్పుచున్నారు, "మంచిది, సహోదరుడా బ్రెన్హాం, నేను ప్రార్ధించబడితిని. నిజముగా నాలో ఏ మార్పు జరుగలేదు. మంచిది, ఏదో తప్పు జరిగినది." లేదు, అటువంటిది లేదు. వ్యవస్థతో ఎటువంటి తప్పు లేదు. దేవునితో ఎటువంటి తప్పు లేదు. బైబిలుతో ఎటువంటి తప్పు లేదు. పరిశుద్దాత్మతో ఎటువంటి తప్పు లేదు. సంగతి ఏమనగా, నీతోనే ఏదో తప్పు ఉన్నది.

33సమస్తమూ సరిగానే జరుగుచున్నది. అది కేవలము యోహాను మాత్రమే. అది కూడా.

కావున, సియోను పట్టణము నుండి నిన్నటి దినమున ఒక స్త్రీ వచ్చియున్నది (ఆమె ఇప్పుడు ఇక్కడే ఉండవచ్చు), ఒక నెల క్రితము. ఆ చిన్న స్త్రీ, ఆమె చిన్న భర్త — అందమైన దంపతులు, మరియు వారు నా స్థలమునకు వచ్చియున్నారు. సియోనులో సిమ్సెస్, మరియు అటువంటి నా మంచి మిత్రులు కొందరితో కలిసి వారు అక్కడికి వచ్చియున్నారు. మరియు నాకు తెలిసినంత వరకూ వారందరూ ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉండవచ్చు.

మరియు ఆమెకొక చిన్న బిడ్డ ఉన్నది. మరియు ఆ బిడ్డ యొక్క పాదము ఈ విధముగా వ్రేలాడుచూ మరియు పాదము క్రింద పెట్టలేకున్నదని నేను తలంచుచున్నాను. మరియు ఆమె కేవలము ఈ విధముగా చెప్పినది, "ఒకవేళ నేను సహోదరుడు బ్రెన్హాం ఆ బిడ్డపై చేతులు వేయడం మాత్రము చూడగలిగిన, ఆ పాదము క్రిందకి వచ్చును." ఎందుకు, ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు ధరించుటకు బూట్లు మరియు అవన్నీ ఆమె తీసుకొని వచ్చెను. అవునయ్యా.

1COR 11:26

 

34కనుక గుడారము యొద్ద నేను ప్రార్ధించుచుండగా… లేక ప్రసంగించుచుండగా. మరియు నేను అక్కడికి వెళ్ళినప్పుడు, ఇల్లినాయిస్ లోని బూమింగ్టన్ లో వేరొక కూడిక కొరకు మార్గమును ఏర్పాటు చేయుటకు నేను ప్రయత్నించుచున్నాను.

మరియు అప్పుడు, మొదటి సంగతి మీకు తెలుసా, నేను వేదికను విడిచిపెట్టబోవుచుండగా… పాదశుద్ధి కొరకు వెళ్ళబోవుచున్నాము అని నేను నమ్ముచున్నాను. మనము… మనము పాదశుద్ధిని నమ్మెదము. బైబిలు అది మనకు బోధించుచున్నది అని నేను నమ్ముచున్నాను. మరియు ఆయన వచ్చేంత వరకూ దానిని మనము చేయవలసియున్నది. కనుకనే ఆయన చెప్పిన ప్రతీ మాటను మనము నెరవేర్చ ప్రయత్నించుచున్నాము — మరియు ఇప్పటికి ముప్పది సంవత్సరముల నుండి ఎల్లప్పుడూ మనము దానిని ఈ సంఘములో ఆచరించుచున్నాము.

పాదశుద్ధి కొరకు మనము లోపలికి వెళ్ళుచున్నాము, మరియు నా కుమారుడు వచ్చి, "నాన్నా అక్కడ సియోనులో నుండి కొంత మంది జనులు వచ్చియున్నారు" అని చెప్పాడు, "ఈ రోజు రాత్రి రోగుల కొరకు ప్రార్ధన ఉండునని వారు ఎదురుచూస్తూ ఉన్నారు" అని అన్నాడు. "వారొక చిన్న బిడ్డను కలిగియున్నారు; ఆ స్త్రీ నమ్ముచున్నది, ఒకవేళ నీవు గనుక ఆ బిడ్డ కొరకు ప్రార్ధించినట్లయిన, ఆ చిన్న కాలు బాగవును. ఆమె కాలు కొంచెము అవిటిగా ఉన్నది" అని చెప్పాడు.

నేను చెప్పాను, "ఇక్కడకు తీసుకొని రండి." మరియు ఆ చిన్నఅందమైన తల్లి, ఆమె పైకి వచ్చినది.

మరియు ఆమె చెప్పినది, " నా బిడ్డ, సహోదరుడా బ్రెన్హాం… మేము నమ్మియున్నాము, నా భర్త మరియు నేను, నీవు ఈ బిడ్డపై నీ

చేతులుంచినప్పుడు, ఆ కాలు తిన్నగా రాబోవుచున్నది. అది సరిచేయబడును."

"ప్రభువు యొద్ద నుండి నేను ఒక దర్శనమును పొందుటను నీవు కోరుచున్నావా?" అని నేను అడిగాను.

ఆమె చెప్పినది, "లేదయ్యా. కేవలము నీ చేతులు ఆమెపై ఉంచుము."

నేను చెప్పాను, "మంచిది, దానిని నేను చేస్తాను." నా చేతులు ఆ బిడ్డపై ఉంచి, దాని కొరకు ప్రార్ధన చేసి, గదిలోనికి వెళ్ళియున్నాను."

35మరియు మరుసటి రోజు నేను నా ఆఫీసులో ఉన్నాను. నేను అక్కడ కూర్చొని మరియు కొన్ని కాల్స్ మాట్లాడుతూ మరియు ఆఫీసు యొద్ద కొంత పని నేను చేస్తూ ఉన్నప్పుడు, ఒక కారు వచ్చి మరియు దానిలో నుండి ఆ చిన్న స్త్రీ మరియు ఆమె భర్త దిగియున్నారు. ఇదిగో వారు వచ్చియున్నారు.

చెప్పారు, "సహోదరుడా బ్రెన్హాం," చెప్పారు, "ఏదో పొరపాటు జరిగినది."

మరియు నేను చెప్పాను, "ఓ, మీ భావమేమిటి?"

"ఎందుకు," ఆమె చెప్పినది, "ఆ బిడ్డ కాలు ఇంకా సరి అవ్వలేదు."

మరియు నేను చెప్పాను, "మంచిది, దానికి దీనితో ఏమి జరుగవలెను?"

మరియు ఆమె చెప్పెను, "మంచిది, సహోదరుడా బ్రెన్హాం, నేను నమ్మియున్నాను. ఒకవేళ నీవు గనుక నా బిడ్డపై చేయ వేసినయెడల దేవుడు ఆమెను స్వస్థపరచునని నేను నమ్మియున్నాను," చెప్పెను, "నేను దానిని నమ్మియున్నాను." మరియు చెప్పెను, "ఎక్కడో ఏదో పొరపాటు జరిగినది." "బహుశా, దాని కొరకు నీవు ఒక దర్శనమును కలిగి యుండుట మంచిది" అని ఆమె చెప్పెను.

నేను చెప్పాను, "లేదు, ఏమీ పొరపాటు జరుగలేదు. ఒక్క సంగతి కూడా తప్పు లేదు. కేవలము ఆ తప్పైన సంగతి నీవే అయివున్నావు చూశారా." నేను చెప్పాను, "నీవు కేవలము దానిని నమ్ముము."

36సహో, బ్రెన్హాం, ఒక్క సంగతి నేను అడుగుతాను, నా బిడ్డ వికలాంగురాలుగా ఉండడము దేవుని యొక్క చిత్తమని నీవు అనుకొనుచున్నావా?" అని ఆమె అడిగెను.

నేను చెప్పాను, "అది దేవుని యొక్క చిత్తమని నేను నమ్మట లేదు."

ఆమె చెప్పెను, "నీవు చెప్పవలసినదంతయూ అదే అని నా కోరిక."

అక్కడ నుండి ఆమె వెళ్ళి పోయియున్నది. మరియు కొద్ది దినముల తరువాత వారు ఫోన్ చేసియున్నారు; మరియు ఇప్పుడు, ఆ బిడ్డ యొక్క కాలు సాధారణ స్థితికి వచ్చియున్నది — క్రిందకి వచ్చినది. చూడండి, మనము కలవరము చెందెదము. అదంతే. ప్రతీది సరిగానే నడుచుచున్నది. ప్రతీది సమయమును బట్టే జరుగుచున్నది.

37కనుక దెయ్యము ఈ ప్రజలను నమ్మునట్లుగా లేక నమ్మకుండా చేయుటకు ప్రయత్నించుచున్నదని ఇక్కడ మనము కనుగొనుచున్నాము.

కనుక ఆ దెయ్యము ఆయనే మెస్సియా అని యోహాను నమ్మకుండా చేయుటకు ప్రయత్నించుచున్నది. కాబట్టి అతడు తన యొక్క ఇద్దరు శిష్యులను కలిపి మరియు అతడు వారిని బయటకు పంపియున్నాడు, "ఇప్పుడు, ఆయన ఎక్కడ ప్రసంగించినా గానీ మీరు వెళ్ళి కనుగొనండి. మరియు మీరు కనుగొనినప్పుడు, మీరు వెళ్ళి ఆయనను అడగండి, 'నేనేమైనా తప్పు చేసియున్నానా?' [మీరు దానిని ఊహించగలరా?]"

EPH 2:8

 

38"నేను ఏమైనా పొరబడియున్నానా? నిజముగా ఆయన ఆ వ్యక్తేనా? ఆ సూచన సరైనది అని నాకు తెలుసు. మెస్సియా యొక్క సూచనను నేను చూచాను. అది సరైనది అని నాకు తెలుసు. కానీ ఈ సాత్వికము మరియు తగ్గింపు, మరియు, ఇవన్నీ, నాకు అర్ధము కావట్లేదు. నేను దానిని ఊహించలేకున్నాను. దాని యొక్క కొనలు (చివర) కలుసుకొనునట్లు నేను చేయలేకున్నాను."

ఆ కొనలు కలుసుకొనునట్లు నీవు చేయకూడదు. ఒకవేళ ఆ మొత్తము సంగతి నేను చెప్పినట్లైన, మరియు మొత్తము మీరు ఎరిగియుండిన, మరియు మొత్తము నేను ఎరిగియుండిన, ఇక అది ఎన్నడూ విశ్వాసము కాదు. నేను పరిపూర్ణముగా వివరించగలిగినదేదైనా ఇక ఎన్నడూ విశ్వాసము కాదు. విశ్వాసము ద్వారా మీరు రక్షింపబడియున్నారు, విశ్వాసము ద్వారా మీరు స్వస్థత పొందుకొనియున్నారు. మీరు కేవలము దానిని నమ్మండి. మీరు దానిని వివరించలేరు; మీరు కేవలము దానిని నమ్మండి.

MATT 11:3•

LUKE 7:19

 

39కనుక ఆయన చెప్పెను, "నీవు వెళ్ళి, మరియు యోహనుని అడుగు… లేక, ఆయనను అడుగు ఒకవేళ మనము ఇంకొకరిని గూర్చి చూడవలెనేమో అని. అది నా విశ్వాసమును, నా నమ్మకమును మరియు నా యొక్క…? అతనిపై ఆ మెస్సియా గుర్తును నేను చూచియున్నాను. మరియు నేనేదైనా పొరబడియున్నానా? నేను దైనినైనా కలిపానా? మరియు ఇప్పుడు, ఏదైనా పొరపాటు జరిగినదా?"

ఇప్పుడు, ఈ గొప్ప ప్రవక్త వర్తమానముతో ఈ శిష్యులు యేసు యొద్దకు వచ్చినప్పుడు, యేసు ఎన్నడూ వారికి ఈ విధముగా చెప్పలేదు, "ఇప్పుడు, నేను ఏమి చేస్తానో, "ఇప్పుడు మీకు చెప్పెదను. యోహానునకు ఇచ్చుటకు కొంత సాహిత్యమును నేను తిరిగి పంపెదను. 'చెరసాలలో ఏ విధముగా ఆనందముగా ఉండాలి.'" లేదు. ఆయన ఎన్నడూ ఆ విధముగా చెప్పలేదు.

ఆయన ఈ విధముగా చెప్పలేదు, "సహనముపై ఒక పుస్తకమును నేను నీకు ఇచ్చెదను. మరియు చెరసాలలో ఉన్నప్పుడు ఏ విధముగా సహనముగా ఉండాలో నీవు వెళ్ళి యోహానుకు చెప్పుము. అది మంచి విషయము. అతడు చెరసాలలో ఉన్నట్లయితే… అతడిని చెరసాలలో చూడటము నాకు ఇష్టము లేదు, కానీ అతడు ఏ విధముగా ఆనందముగా ఉండాలో నేను చెప్పెదను."

MATT 11:5,6•

LUKE 7:22,23

 

40లేదు. ఆయన ఎన్నడూ ఆ విధముగా చెప్పలేదు.

ఆయన ఏమి చెప్పియున్నాడో మీకు తెలుసా? ఆయన చెప్పెను, "ఈ మధ్యాహ్న కూడిక కొరకు కొంచెము వేచి యుండండి. కొంచెము వేచియుండండి. దాని తరువాత మీరు వెళ్ళవచ్చు. కొంచెము ఈ మధ్యాహ్న కూడికను గమనించుడి."

మరియు యేసు కూడిక ఏర్పాటు చేసిన తరువాత, అక్కడ కూర్చొని యున్న యోహాను యొక్క శిష్యులను నేను ఊహించగలను, ఆయన చేయుచున్న ప్రతీ కదలికను గమనించుచున్నారు, ఎందుకనగా ఆ మెస్సియా ఎవరనేది యోహాను వారికి నేర్పించియున్నాడు, మరియు ఇది ఏమిటో వారికి చెప్పియున్నాడు. మరియు వీరే అతడి శిష్యులు, మరియు ఏమి జరిగియున్నది అనే దానిని వారు చూడడం ప్రారంభించారు.

కనుక అప్పుడు ఆ కూడిక ముగించబడిన తరువాత, అప్పుడు ఆ ఇద్దరు శిష్యులు యోహనును కలుసుకొనుటకు తిరిగి వెళ్ళినప్పుడు, ఆయన చెప్పెను, "మీరు వెళ్ళి, యోహానుకు చెప్పుడి, కుంటివారు నడుచుచున్నారు, గ్రుడ్డివారు చూచుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మరియు కూడికకు వచ్చిన వారందూ బీదలే. బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.

మరియు యోహానుకు చెప్పుడి భయపడవద్దని; వ్యత్యాసముగా ఏమి ఆలోచించవద్దని (అభ్యంతరపడవద్దని); నేను చెప్పిన సమయానికే ఇక్కడ ఉన్నాను. ప్రతీది సరిగానే పరిగెడుచున్నది. ప్రతీది సరిగానే ఉన్నది. నేను ఖచ్చితమైన సమయానికి ఇక్కడ ఉన్నాను. వెళ్ళి ఒక స్వస్థతా కూడిక జరుగుచున్నదని అతడికి చెప్పుము. బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. దేవుని యొక్క శక్తి వారి మధ్యలో కదలాడుచున్నది. నేను ప్రణాళిక ప్రకారము (చెప్పిన సమయానికి) వచ్చియున్నాను. దేనికిని మీ ఏకాగ్రతను చూపవద్దు. నేను నియమించబడిన సమయము ప్రకారము ఇక్కడ ఉన్నాను.

MATT 11:6•

LUKE 7:23

 

41ఓ, మై! మరియు "నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. ఇప్పుడు, అభ్యంతరపడవద్దు."

ఈ భూమిపైన నివసించిన మరే ఇతర మనుష్యుల కన్నా యేసుని గూర్చే ఎక్కువ మంది ప్రజలు అభ్యంతరపడియున్నారని నేను నమ్ముచున్నాను. వారు చాలా త్వరగా అభ్యంతరపడెదరు. యేసు ఇప్పుడు, ఈ స్థానభ్రంశము చెందిన (వేరే స్థానములో పెట్టబడిన) ధన్యతలో, అక్కడకు మెల్లగా చేరుకొనెను కనుక ఈ రాత్రి మనము దానిని పొందుకొనెదము. ఎందుకు, ఆయన చెప్పెను, "నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. అభ్యంతరపడవద్దు. ఏమి జరిగినప్పటికీ, నేను … ప్రతీది సమయము ప్రకారమే జరుగుచూ ఉన్నది. కనుక మీరు ముందుకు వెళ్ళి మరియు దానిని నమ్మండి. అంతే చాలును. అంతయూ సరిగానే ఉన్నది. కేవలము ముందుకు వెళ్ళి మరియు దానిని నమ్మండి."

మీకు తెలుసా, అక్కడ యేసు దాని కొరకు యోహానును నిందించలేదు. ఆయన ఈ విధముగా చెప్పలేదు, "మంచిది, నా అపొస్తలుడా, నీ గూర్చి నేను సిగ్గుపడుచున్నాను. నా ప్రవక్తను గూర్చి నేను సిగ్గుపడుచున్నాను." లేదు, ఆయన ఎన్నడూ ఆ విధముగా చెప్పలేదు.

"నీవు ప్రసంగించుటకు వచ్చినప్పుడు, దీనిని గూర్చి ఈ లోకము ఏమి చెప్పబోవుచున్నది, 'ఓ, ఎంత గొప్ప మెస్సియా! ఎంత గొప్ప మెస్సియా! మరియు అప్పుడు ఒకవేళ నేనే మెస్సియాని అని నీవు అడుగుటకు పంపించితివా?" అని ఆయన చెప్పలేదు. ఆయన ఎన్నడూ అతడిని గద్దించలేదు.

MATT 11:3,7-11•

LUKE 7:19,24-28

 

42కానీ ఎప్పుడైతే యోహాను తను యేసుకు చెప్పదగిన ఒక నీచమైన సంగతిని చెప్పియున్నాడో, యోహాను తన గూర్చి చెప్పని ఒక శ్రేష్టమైన సంగతిని చెప్పియున్నాడు. అవును. యోహాను చెప్పెను, "వెళ్ళి చూడుము. ఒకవేళ ఆయనే అతడు అని."

మరియు వారు వెళ్ళిపోయిన తరువాత, యేసు వారితో చెప్పెను… యోహాను యొక్క శిష్యులు వెళ్ళిపోయిన తరువాత, ఆయన చెప్పెను, "అరణ్యములో మీరేమి చూడవెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యుని చూడ వెళ్ళితిరా…" మీకు తెలుసా, దాని కొరకు అతడు హాలీవుడ్ నుండి చాలా దూరముగా ఉండెను.

కనుక ఆయన చెప్పెను, "సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యుని చూచుటకు వెళ్ళితిరా?" చెప్పెను, "వారు రాజగృహములలో నుందురు." ఆయన చెప్పెను, "మీరేమి చూడ వెళ్ళితిరి? ఏ సంఘశాఖ అయినా దానికి కావలసిన విధముగా ఊదగలిగిన రెల్లునా?" ఓ, లేదు. ఖచ్చితముగా కాదు.

"కనుక మీరు ఏమి చూడవెళ్ళితిరి? ఒక ప్రవక్తనా?" చెప్పెను, "అవును. మీరు ప్రవక్తను చూడ వెళ్ళితిరా, మరియు ఒక గొప్ప… ఆయన ప్రవక్త కన్నా గొప్పవాడు. ఇతడే ఆ ఏలియా. ప్రవక్త ద్వారా, 'నాకు ముందుగా నేను నా దూతను పంపుచున్నాను'" అని చెప్పబడినవాడు ఇతడే. చెప్పెను, "స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను."

43ఆయన ఎన్నడూ అతడిని నిందించలేదు. ఆయనకు తెలుసు అతడు ఏలీయా యొక్క ఆత్మ ద్వారా అభిషేకించబడియున్నాడని. మరియు ఆ ఆత్మ అతడిపై ఉన్నది. చేసినది అదే ప్రతీది క్రమములో నడుచుచున్నదని ఆయనకు తెలుసు; ప్రతీది సమయము ప్రకారము నడుచుచున్నది.

యోహాను, ఎందుకు అతడు ప్రవక్తలందరిలో గొప్పవాడు? ఇప్పుడు, ఒకవేళ మీరు ఆత్మీయమైన వారైతే, మీరు ఒక దానిని పట్టుకొనెదరు. ఎందుకు అతడు గొప్పవాడు? మిగిలిన ఇతర ప్రవక్తలందరూ మెస్సియాను గూర్చి పలికియున్నారు; అయితే యోహాను ఆయనను పరిచయం చేసెను. ఆయనను పరిచయం చేసినది అతడే. కనుక అంత్యకాలములో కూడా ఆ విధముగా ఉండును. ప్రతీది సమయము ప్రకారము పరిగెత్తుచున్నది. అభ్యంతరపడవద్దు. కేవలము నమ్ముము.

ఈ రోజున సంఘములు ఆయన యందు అభ్యంతరపడుచున్నవి. సంఘములు అభ్యంతరపడెను. ప్రజలు అభ్యంతరపడెను. వారందరూ విసుగుచెందియున్నారు. ఏమి ఆలోచించవలెనో వారికి తెలియదు. మానసిక శాస్త్రము, మరేదో… లేదు, అభ్యంతరపడవద్దు.

ZECH 14:7•

MATT 11:6•

LUKE 7:23

 

44గత ఆదివారము మన వర్తమానము, దేవుడు అబ్రహాముకు మరియు అతడి తరువాత అతడి సంతానమునకు ఏమి చేసెనో మీకు చూపించుటకు ప్రయత్నించెను. మరియు ప్రతీ కూడలిలోనూ ఆయన అబ్రహామును తీసుకొనెను, ఆయన అతడి సంతానమును తీసుకొనుటను మనము కనుగొన్నాము. నీతీకరణ ద్వారా, శుద్దీకరణ ద్వారా, పరిశుద్దాత్మ యొక్క బాప్తిస్మము ద్వారా, కుమారుడిని స్థానమందుంచుట ద్వారా, మరియు అప్పుడు దేవుడు మానవ శరీరములో వచ్చెను, శారా గుడారము వైపు తన వీపును త్రిప్పి, మరియు ఆమె హృదయములో ఏమి తలంచుచున్నదో చెప్పెను.

భయపడవద్దు; ఆయన సమయానుసారమే వచ్చియున్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన యందు అభ్యంతరపడవద్దు. "నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు." ఒకవేళ ఈ రాత్రి మాట్లాడుటకు ఆయన ఇక్కడ ఉంటే, ఆయన అదే విషయమును చెప్పును. ఆయన సమయము ప్రకారమే ఉన్నాడు.

ప్రవక్త చెప్పియున్నాడు, ఒక కాలముండును అది పగలు కాదు రాత్రి కాదు. అయితే సాయంకాలమున వెలుగు కలుగును. ఆయన సమయము ప్రకారమే ఉన్నాడు.

ZECH 14:7•

JOHN 4:25

 

45ఆయన నీతికరణ ద్వారా వచ్చాడు (లూథర్ కాలము), శుద్దీకరణ, (వెస్లీ కాలము), పెంతుకొస్తు కాలము, సంఘములో ఆయన వరములు తీసుకొని వచ్చెను. మరియు ఇప్పుడు, యేసు ఆయన వచ్చునని చెప్పినట్లుగా మన యొక్క శరీరములో మనకు ప్రత్యక్షమాయెను.

ఆయన యందు అభ్యంతరపడవద్దు. ఆయన ఖచ్చితమైన సమయానికే ఉన్నాడు. "యోహాను, ఆ చెరసాల నుండి బయటకు రా! దాని యందు నమ్మిక లేని ఆ సంస్ధ నుండి బయటకు వచ్చేయి. నీ కళ్ళ వెనుక ఉన్న ఈకలను లాగి వేయుము. నీవు నమ్మగలిగినట్లయితే నీవొక స్వేచ్చాజీవి. ఆయన సమయము ప్రకారమే ఉన్నాడు. సాయంకాలమున వెలుగు కలుగును. ఆమెన్. సాయంకాలపు వెలుగులు ప్రకాశిస్తున్నవి.

ఆయన ఎవరు? అదే యేసు. తూర్పున ఉదయించిన అదే సూర్యుడు, పశ్చిమమున అస్తమించును. తూర్పు దేశపు ప్రజలపై దేవుని కుమారుడు లేచియున్నాడు. సమరయులకు మరియు యూదులకు ఆయన మెస్సియా అని రుజువు చేసుకొనుటకు ఆయన ఏమి చేసెను? మోషే పలికియున్న ప్రవక్త ఆయనే అని, ఒక సూచనను వారికి చూపించెను.

ZECH 14:7•

JOHN 4:26,29

 

46సమరయ స్త్రీ కూడా అదే సంగతిని సాక్ష్యమిచ్చెను, "మాకు తెలుసు మెస్సియా వచ్చినప్పుడు, ఆయన ఈ విషయములను బయలుపరచును" అని చెప్పెను. అయితే నీవెవరు?"

ఆయన చెప్పెను, "నేనే ఆయనను."

ఆమె పట్టణములోనికి పరుగెత్తుకొని వెళ్ళి మరియు చెప్పెను, "ఈయన మెస్సియా కాడా? ఆ మనుష్యుడు నాలో ఉన్న తప్పును చెప్పియున్నాడు, నేను చేసినవన్నియు. ఈయన మెస్సియా కాడా?" మరియు ప్రజలు దానిని నమ్మియున్నారు.

ఆయన దానిని సమరయులకు మరియు యూదులకు చేసియున్నాడు, కాని అన్యులకు కాదు. అన్యులకు సువార్త వెళ్ళక మునుపే ఆయన అప్పటికే మహిమపరచబడి మరియు మహిమలో ఉండెను. కానీ సాయంకాలమున వెలుగు కలుగును.

సంఘము ఏమి చేయును? కాథలిజములోనికి వెళ్ళిపోయి, సంఘమును స్థాపించెను. అప్పుడు లూథర్ విత్తనము కొరకు నీతీకరణ ద్వారా లాగెను, అప్పుడు లూథర్ నుండి వెస్లీ వచ్చెను, శుద్దీకరణ. తరువాత పెంతుకొస్తువారు… మరియు వారు సంస్థగా మారిరి. మరియు అలా, అలా, అలా వారి యొక్క వ్యవస్థలలోనికి మరియు అలా.

ఇప్పుడు అంత్యదినములలో మనము ప్రవేశించియున్నాము. అది ఏమిటి?

MATT 11:6•

LUKE 7:23

 

47కానీ సాయంకాలపు సమయములో, వాగ్దాన కుమారుడిని పొందుకోవడానికి అబ్రహాము శారాల యొక్క శరీరము మార్పు చెందడానికి ముందు, ఆయన వచ్చెను, వారితో కూర్చొనెను, వారితో మాట్లాడెను, మరియు వారి ముందు ఒక సూచనను చేసెను. మరియు యేసు దానిని సూచించెను.

మనము వెనుకలేము. లూథర్ ఏమి చెప్పెను అనుదాని కొరకు వెనుకకు తిరిగి చూడవద్దు, వెస్లీ ఏమి చెప్పెను. యేసు ఏమి చెప్పెనో చూడుము. మరియు ఇప్పుడు మనమెక్కడ ఉన్నామనే సూచనను చూడుము. ఎవరో ఏదో చెప్పారన్న దానిని గూర్చి వెనుకకు తిరిగి చూడవద్దు; ఆయన ఏమి చెప్పెనో చూడుము. దానిని చెప్పినది ఆయనే. ఏ సూర్యుడైతే తూర్పున ఉదయించునో అదే సూర్యుడు పశ్చిమమున అస్తమించును. ఒక నిరాశాజనకమైన రోజు ఉన్నది. అది ఖచ్చితముగా ఉన్నది — సంఘములలో చేరుట మరియు సంస్థలను తయారు చేయుట మరియు అటువంటివి చూచుటకు కావలసినంత వెలుగు.

అయితే ఆ నిజమైన శక్తి మరియు దేవుని సన్నిధి యొక్క ప్రత్యక్షతలు చాలా చాలా సంవత్సరములు మరియు సంవత్సరముల నుండి కనబడుట లేదు. మనము దానిని అనుభూతి చెందాము, మరియు అది ఇక్కడ ఉన్నదని మనకు తెలుసు. మరియు దానితో వరములు పనిచేయుటను మనము చూచియున్నాము. అయితే మన మధ్యలోనికి ఆయన దృశ్యునిగా వచ్చుటను మనము చూచినప్పుడు, యాజమానుని యొక్క అంగీ అంచునకు వెళ్ళి మరియు దానిని తాకునంత శక్తి ఆయన సంఘములో ఉండును; తిరిగి ఆయన శక్తిని ఇక్కడకు తీసుకొని వచ్చి, మరియు తన జనుల ద్వారా మాట్లాడి మరియు ప్రత్యక్షపరచుకొనుచూ… ఆయనను దేవునిగా చేయుచుండెను, మనతో ఉన్న దేవుడు. ఓ, అవును.

యోహాను, దేవుడు ఈ రాత్రి ఆ చెరసాల ద్వారములను తెరచి మరియు నిన్ను బయటకు విడువును గాక. "నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు." మనస్సులు చదువుట కాదు, లేక ఒక మానసిక శాస్త్రము; ఎవరైతే త్వరలో రాబోవుచున్నాడో, ఆ పునరుద్దానుడైన క్రీస్తు యొక్క శక్తి.

మనము ప్రార్ధి౦చుకొందాము.

JOHN 5:19•

JOHN 14:12

 

48ప్రియదేవా, సాయంకాలపు వెలుగులు ప్రకాశిస్తుండగా, అది చాలా మంది కన్నులను (దృష్టి) పోగొట్టుచున్నది. కానీ ఇతరులు లోపలికి నడుచుటకు దానిని ఉపయోగించుకొనుచున్నారు. నేను ప్రార్ధిస్తున్నాను, దేవా, అది ఈ రాత్రి, నీవు ఈ సాయంకాలపు ప్రజలకు మరియొక్కసారి ఆ సాయంకాలపు వెలుగులను ఇచ్చెదవు గాక, మరియు వారు నీ పునరుద్దానపు శక్తిని చూచెదరు గాక, ఎందుకనగా నీకు నీవే చెప్పియున్నావు, "నేను చేయు క్రియలు మీరునూ చేసెదరు," మరియు నీవు ఏమి క్రియలు చేసియున్నావన్న దాని గూర్చి మేము ఆశ్చర్యపడుచున్నాము.

అప్పుడు యోహాను 5వ అధ్యాయము మరియు 19వ వచనములో మేము కనుగొనియున్నాము, "తండ్రి మొదటిగా దానిని చేయుట నేను చూచునంత వరకూ నేనేమియూ చేయను," అని నీవు చెప్పియున్నావు. అప్పుడు నీవు దానిని వాగ్దానము చేశావు. అది సత్యమని మేమెరుగుదుము.

ఇప్పుడు, మరొక్కసారి, ప్రభువా, మరియు అప్పుడు అది పరిపూర్ణమగును. మరియు ఒకవేళ చాలా మంది యోహానులు ఈ రోజు చెరసాలలో బంధింపబడిననూ, మంచి పురుషులు మరియు స్త్రీలు, వారి యొక్క రక్షకునిగా నిన్ను ఎరిగినవారు, మరియు వారు ఆశ్చర్యపడుచున్నారు, ఓ దేవా, నీవు సమయము ప్రకారము వచ్చియున్నావని వారు చూచెదరు గాక, నీవు ఖచ్చితముగా సమయము ప్రకారము ఉన్నావు. యేసు నామములో మేము అడుగుచున్నాము, అనుగ్రహించుము. ఆమెన్.

49ఇప్పుడు, మా బలిపీఠపు పిలుపును మేము కలిగియుండే ముందు, ఈ రాత్రి నేను కొంచెము ఆలస్యమయ్యాను, మరియు నేను అనుకొనుచున్నాను గత రాత్రి నేను ప్రసంగించాను… నేను ఈ రాత్రి ఖచ్చితముగా దానిని చేసియున్నానని బిల్లీకి చెప్పబోవుచున్నాను. నేను గంటన్నర కన్నా తక్కువ సమయము బోధించలేనని అతడు నాకు చెప్పియున్నాడు. అయితే ప్రభువు యొక్క సహాయముతో, ఆ సమయాన్ని కచ్చితముగా నేను పొందుకొన్నాను.

ఇప్పుడు, నిన్నటి దినమున మనము ప్రార్ధనా కార్డులు ఇచ్చియున్నామని నేను నమ్ముచున్నాను. ఈ రోజు ఏమైనా ఇచ్చియున్నాడా? లేక అవి ఏమైయున్నాయి? 1 నుండి 100, అతడు నిన్న ఇచ్చియున్నాడని నేను నమ్ముచున్నాను, అవును కదా? అది ఏమిటి? 'ఏ' లు? మంచిది. మనము ఎక్కడ ప్రారంభిద్దాము? మనము నిన్నటి దినమున 1 నుండి ప్రారంభించాము, మనము ప్రారంభించామా? 1? మంచిది, వాటి వెనుక నుండి మనము ప్రారంభించెదము. తీసుకొనెదము … ప్రారంభించెదము, గూర్చి ఇక్కడ కేవలము కొద్ది మంది, ఎందుకనగా మన సమయములు … 80 నుండి ప్రారంభించెదము. [టేపులో విరామం].

JOHN 14:12•

HEB 13:8

 

50ఇంతకు ముందు ఒక్క కూడికకు కూడా హజరు కానివారు ఎంత మంది? మీ చేతులు ఎత్తండి. అదిగో అక్కడ చూడండి, కూడికలో సగము మంది. ఒకవేళ యేసుక్రీస్తు… యేసుక్రీస్తు రోగులను ఇప్పటికే స్వస్థపరచియున్నాడని, నశించిన వారిని ఇప్పటికే రక్షించియున్నాడని ఎంత మందికి తెలుసు? ఇప్పుడు, ఆయన మిమ్ములను రక్షించలేడు లేక స్వస్థపరచలేడు. ఆయన కేవలము మీకు చెప్పును, ఆయన ఇప్పటికే దానిని చేసియున్నాడని, మరియు నీవు దానిని నమ్మవలసియున్నది.

అయితే ఆయన వాగ్దానము చేసియున్నాడు, ఆయన చేసిన కార్యములు మనమునూ చేసెదమని, మరియు ప్రత్యేకించి ఈ సాయంకాలపు సమయములో ఎంత మంది అది ఎరిగి అది సత్యమని నమ్ముచున్నారు?

"ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని" అది చెప్పుట లేదా? ఆయన ఖచ్చితముగా నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మంచిది. ఒకవేళ ఆయన ఆ విధముగా ఉంటే, ఆయన అదే విధముగా చేయును గాక.

51ఇప్పుడు, ప్రార్ధనా వరుసలో ఉన్న మీరందరూ, అక్కడ నిలబడ్డవారు, నాకు క్రొత్తగా ఉన్నవారు, నాకు మీ గురించి ఏమి తెలియదని ఎరిగియున్న వారు, మీ చేతులు పైకెత్తండి, ఎరిగియున్న వారందరూ, ప్రతీ ఒక్కరూ. అంతా సరియే, అక్కడ ఉన్న అందరూ, ప్రార్ధనా కార్డు లేని ప్రజలైన మీరు, మరియు స్వస్థపడగోరుచున్న మీరు, మరియు మీ గురించి నాకు ఏమీ తెలియదని మీరు ఎరిగియున్నారు, మీ చేతులు పైకెత్తండి, ప్రజలంతా.

భవనములో ఉన్న ప్రతీ వ్యక్తి మీ గూర్చి నాకు ఏమీ తెలియదని ఎరిగియున్నవారు, మీ చేతులు పైకెత్తండి, ప్రతీచోటా నాకు తెలిసిన ఒక్క వ్యక్తిని కూడా నేను చూచుట లేదని నేను అనుకొనుచున్నాను. ఒకవేళ నేను తప్పు కాకపోతే, ఈయన ఆర్కాన్సాస్ నుండి వచ్చిన ఒక ప్రసంగీకుడు, ఇక్కడ కూర్చొని యున్నాడని నేను నమ్ముచున్నాను. ఈ వెలుగులు, మీరు చూడండి, నేను అతడిని సరిగా చూడలేకున్నాను, కానీ ఆయన ఆర్కాన్సాస్ నుండి వచ్చిన ఒక ప్రసంగీకుడని నేను తలంచుచున్నాను.

MATT 9:20,21•

MARK 5:25-31•

LUKE 8:43,44•

LUKE 8:45

 

52ఒకసారి ఒక స్త్రీ ప్రార్ధనా వరుసలోనికి వచ్చియున్నదని ఎంత మందికి తెలుసు? ఒక స్త్రీ వచ్చియున్నది. ఆమె తన హృదయములో అనుకొన్నది, "ఒకవేళ నేను ఆ మనుష్యుని యొక్క వస్త్రపు అ౦గీ అంచును తాకగలిగిన చాలును, నేను బాగుపడెదను." ఆమె రక్తస్రావముతో బాధపడుచున్నది. మీకు జ్ఞాపకమున్నదా? మరియు ఆమె ఆ గుంపును దాటుకొని, మరియు ఆమె తాకినది… ఆ విధముగా.

ఇప్పుడు, నీవు ఎన్నడూ దానిని అనుభూతి చెందలేదు. మరియు నీకు తెలుసా, సహో. టామీ, పాలస్తీనా వారు ధరించే పెద్ద పొడుగాటి వస్త్రము. లోపలి వస్త్రముపై, దుమ్మును బట్టి వారు ఆ పై వస్త్రమును ధరించెదరు. ఆ పైవస్త్రము దానిని పట్టుకొనును.

ఇప్పుడు, ఒకవేళ ఆమె ఆ పై వస్త్రము అంచును తాకినది, ఆ ప్రజల మధ్యలోనికి తిరిగి వెళ్ళి పోయినది, మరియు యేసు చెప్పెను, "నన్ను ఎవరు తాకెను?" ఇప్పుడు, అది దేవుని కుమారుడు. "నన్ను ఎవరు తాకెను?"

MATT 9:22•

MARK 5:30,34•

LUKE 8:46,48

 

53మరియు పేతురు ఆయనను గద్దించెను, "మంచిది, అందరూ.. ఎందుకు, నీలో ఏదో తప్పు ఉన్నదని ప్రజలు అనుకొనెదరు. ఎందుకు, వారు… ప్రతీ ఒక్కరూ నిన్ను తాకుచున్నారు. నీకు తెలుసు, "హలో అక్కడ రెవరెండ్, నీవు ఎలా ఉన్నావు?" మరియు అటువంటివి, "రబ్బీ," నీకు తెలుసు.

ఆయన చెప్పెను, "కానీ నేను బలహీనుడను అయ్యానని నేను గ్రహించుచున్నాను." ప్రభావము అనగా, బలము అని ఎంతమందికి తెలుసు? ఖచ్చితముగా, "నాలో నుండి బలము బయటకు పోయినది. ఎవరో నన్ను తాకారు." మరియు ఆయన వెనుదిరిగి, అది ఎక్కడ ఉన్నదో ఆయన కనుగొనేంత వరకూ, ఆ సమూహము వైపు చూస్తూ ఉన్నాడు. మరియు ఆయన చెప్పెను - ఆమె రక్తస్రావపు సమస్య ఆగిపోయెను అని ఆమెకు చెప్పెను, ఎందుకనగా ఆమె విశ్వాసమే ఆమెను రక్షించెను. అది సత్యమా? మంచిది ఇప్పుడు, ఆయన ఈ రాత్రి …

సేవక సహోదరులైన మీరు, ఈ ఉదయ కాలమున దీనితో భోజనము చేసిన మనము…

MATT 28:20•

JOHN 14:12,19•

HEB 4:15•

HEB 13:8

 

54ఈ సహోదరుడు ఇక్కడ, ఒక బాప్టిస్టు స్కూల్లో అతడు పొందుకొన్న అనేక డిగ్రీలు గూర్చి వారు మాట్లాడుచున్న ఆ సహోదరుడు, ఇతడే అని నేను నమ్ముచున్నాను — డాక్టరు మరియు పి.హెచ్.డి. మరియు అవన్నియూ ఏమిటో నాకు తెలియదు. దానిని గూర్చి అతడు చెప్పుచున్నాడు. కానీ క్రీస్తును ఎరిగియుండుటకు పౌలు అన్నీ మర్చిపోయినట్లుగా అతడు చేయవలసియుండెను. కనుక …

అప్పుడు, అయితే ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడని, మన బలహీనతల యందు సహానుభవము కలవాడని హెబ్రీయులలోని లేఖనము మనకు బోధించుచున్నది. అది సరియే. అది ఆ విధముగా అని ఎంత మందికి తెలుసు?

మంచిది, అప్పుడు ఒకవేళ ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్న ఎడల, మరి మీరు ఆయనను తాకినప్పుడు ఆయన ఏ విధముగా స్పందించును, చూశారా? ఆయన అదే విధముగా స్పందించును, ఆయన చేయడా? "కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; అయితే మీరు నన్ను చూతురు, ఏలయనగా యుగసమాప్తి వరకు నేను మీతోను, మీలోను ఉందును. నేను చేయు క్రియలు మీరును చేయుదురు." అది నిజమేనా?

మరియు అది అన్యజనుల యొద్దకు వచ్చునని ఆయన వాగ్దానము చేసెను, లూధరు కాలము గుండా కాదు, వెస్లీ కాలము; కానీ అంత్యకాలమున అది జరుగును. ఇప్పుడు, మీరు చూచుట లేదా? ఆయన సమయము ప్రకారమే ఉన్నాడు. మరియు గుర్తించుకొనండి, ఇది ప్రపంచమంతటి చుట్టూ వెళ్ళియున్నది. కనుక మనము అంతమున ఉన్నాము. ఎటువంటి సందేహము లేదు. సందేహము లేదు.

అయితే మీరు ఆయన వస్త్రమును తాకండి.

55ఇప్పుడు, "సహో, బ్రెన్హాం, అది ఏమిటి?" అది నేను కాదు. మరియు ఒకవేళ మీరు దానిని చేయకపోతే, అది నాకు ఒక సంగతిని కూడా చేయదు. నేను వెళ్ళినంతగా అది మీరు వెళ్ళవలసియున్నది. ఆయనను తాకునది అది మీ విశ్వాసముగా ఉండవలసియున్నది, అప్పుడు ఆయన నా ద్వారా మాటలాడును. నన్ను ఆయనకు లోబరచుకొనుట ఒక వరమైయున్నది, కేవలము నా కళ్ళను ఆయనకు ఇచ్చుట, నా మనస్సు, నా నాలుక, నాకు నేను.

మీలో ఎవరినీ నేను ఎరుగను, కానీ అక్కడ నుండి మాట్లాడునది ఆయనే, చూశారా? దానిని చేయునది ఆయనే. కనుక, అది నేను కాదు. కనుక దానిని చేయుటకు అది ఏమి కారణమైనది? నేను నిన్ను ఎరుగను. నీవు చెప్పవచ్చును, "… నా గూర్చా సహో. బ్రెన్హాం?" నాకు తెలియదు.

"…నా గురించా?" నాకు తెలియదు. అయితే ఆయనకు తెలుసు. కనుక నీవు ఆయనను తాకుము, అప్పుడు ఆయన నన్ను తిరిగి

ఉపయోగించుకొనును.

కనుక చూడండి, అది మీరు మరియు నేను కలిపి, ఆయన యొక్క సేవకులుగా, మరియు ఆయన తన ప్రజలకు ఆయనే తెలియపరచుకొనును, అది ఆయన ఖచ్చితమైన సమయమునకు ఉన్నాడని. ఆయన సమయము ప్రకారము ఉన్నాడు, అంతే ఖచ్చితముగా, అంత్యకాలమునకు కేవలము కొంత ముందు, సాయంకాలపు వెలుగులు ప్రకాశించినప్పుడు.

56ఇప్పుడు, ఒకవేళ ఆయన దానిని చేసిన ఎడల, ఎంతమంది ఆయనను ప్రేమించెదరు మరియు ఆయనను నమ్మెదరు మరియు ఆయనను అంగీకరించెదరు? దేవుడు నిన్ను దీవించును.

ఇప్పుడు, పరలోకపు తండ్రీ, మిగిలినది నీ హస్తములలో ఉన్నది. నన్నునేను మరియు ఈ ప్రేక్షకులను నీకు సమర్పిస్తున్నాను. తండ్రీ, కేవలము ఒక్క కేసు రుజువు చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో, అది జరుగును గాక. ఆమెన్.

ఇప్పుడు, నిజమైన గౌరవము కలిగి ఉండండి, ఇంక పైకి లేవవద్దు. స్థిరముగా కూర్చొనండి. కొద్ది క్షణములు నిజమైన గౌరవముతో ఉండండి.

ఇప్పుడు, ఆయన నుండి వచ్చిన ఒక్క మాట నేను యాబై, వంద జీవితకాలములు జీవించిన జీవితములో చెప్పిన దాని కన్నా ఎక్కువ — కేవలము ఆయన నుండి ఒక్క మాట.

57ఇప్పుడు, ప్రార్ధనా కార్డు లేకుండా అక్కడున్నవారు లేక మీరు ఎక్కడున్నా, లేక నీ స్థితి ఏ విధముగా ఉన్నా మీరు కేవలము చెప్పుడి, "ఓ గొప్ప ప్రధాన యాజకుడా, నేను నిన్ను తాకనిమ్ము. మరియు సహో, బ్రెన్హాం నన్ను ఎరుగడు. మరియు అప్పుడు, అతడిని నీవు నా వైపు త్రిప్పుము, మరియు నేను ఏమి ప్రార్ధించుచున్నానో, అతడు నాతో చెప్పులాగున చేయుము. నాతో ఏ తప్పు ఉన్నదో అతడు నాతో చెప్పును గాక, అతడు నన్ను ఎరుగడు, లేక నేను ఆలోచించుచున్నదేదో, లేక చేయుచున్నది, లేక అది ఏమైనా గాని. అతడు నాతో చెప్పునట్లు చేయుము. నేను నిన్ను నమ్మెదను, ఎందుకనగా బైబిలు చెప్పుచున్నది ఆయన చేయు విధానము అదే."

ఆ విధముగానే ఆయన చేసియున్నాడు. ఆ విధముగానే ఆయన చేయును. మరియు స్నేహితులారా, మీరు చూడండి, ఒకవేళ ఒక్కసారే యేసును ఆ విధముగా బలహీనముగా చేసినట్లయితే, ఒక పాపినైన నన్ను అది ఏ విధముగా చేస్తుంది? అక్కడ ఆ గవిని దగ్గర మనము కలుసుకొనేంత వరకూ మీకు తెలియదు, అది ఎంత వెల అని. కానీ అది… నేను ఫిర్యాదు చేయడం లేదు. నేను దేవునికి వందనములు చెల్లిస్తున్నాను, మీరు చూశారా, కనుక అప్పుడు మీరు అర్ధము చేసుకొనెదరు.

58మంచిది, రాబోవుచున్న దినములు, మరియు వారు ప్రార్ధనా కార్డులు ఇచ్చెదరు, మరియు అప్పటి నుండి… వారమంతయూ నేను ఆ ప్రార్ధనా కార్డులను తీసుకొని, కొన్ని ఇక్కడ నుండి తీసుకొని మరియు కొన్ని అక్కడ నుండి, మరియు ఇక్కడ క్రింద, కనుక అవి ఉండవు… ప్రతీ ఒక్కరూ ప్రార్ధనా కార్డు నెం 1 కొరకు పోటీపడరు. చూశారా. కావున వారు…

మరియు అప్పుడు ఆ బాలుడు, వాటిని అతడు ఇవ్వడానికి ముందు, అతడు క్రిందకి వచ్చి మరియు ప్రేక్షకుల ముందు నిలబడతాడు, మరియు ఈ కార్డులను కలిపివేసి, వాటన్నిటిని పూర్తిగా కలిపివేస్తాడు. అతడు ఆ విధముగా చేయుట మీరు చూచియున్నారని నేను ఊహించుచున్నాను. అంతా సరియే.

అప్పుడు అతడు క్రిందకి వెళతాడు, ఒకవేళ మీకు ఒకటి కావలసినట్లయితే, అతడు ఒక దానిని మీకు ఇస్తాడు. అప్పుడు ఆ బాలుడు, "మంచిది ఇప్పుడు, నేను ఆమెకు నెంబరు ఒకటిని ఇచ్చాను," అని చెప్పలేడు. అతడికి కూడా తెలియదు. అతడు ఆ విధముగా ఇస్తూ పోతాడు. కలిపివేసి, నీకు ఇస్తాడు… అతడు నీకు 10 ఇచ్చియుండవచ్చు మరియు నీకు ప్రక్కనే ఉన్నవానికి, 95.

కనుక అప్పుడు, ఎక్కడో ఆ వారమంతటిలో, నేను ఉంచి. నేను 20 నుండి 30 వరకూ పిలిచెదను లేక 50 నుండి 90, లేక 90 నుండి వెనుకకు 20, లేక ఎక్కడో ఆ విధముగా, ఆ ప్రభువు నా హృదయము పై ఎక్కడ పెట్టునో అక్కడ, ఎందుకనగా ఆ విధానము, అప్పుడే ఎందుకు, ఆ పరిశుద్దాత్మ ఎక్కడ పిలువమని నడిపించునో అక్కడ.

JOHN 4:19,25

 

59ఆ నడిపింపు ఈ రాత్రి జరుగుచుండగా, ఈ స్త్రీ రంగుజాతి స్త్రీ, నేనొక తెల్లవాడిని. నేను నీకొక క్రొత్తవాడినేనా? మనము ఒకరికొకరము ఎరుగము. ఇదే మనము మొదటిసారి కలుసుకొనుట. ఇప్పుడు చూశారా.

ఇప్పుడు, ఒకవేళ పరిశుద్దాత్మ ఇంకనూ అదే క్రీస్తులో ఉన్న పరిశుద్దాత్మగా ఉన్న ఎడల, ఈ రాత్రి మనలో ఉన్నది, ఒకవేళ అదే ఆత్మ అయితే, అప్పుడు అది అదే కార్యమును చేయును. ఒకవేళ ఇది సత్యమైతే, ఆ పరిశుద్దాత్మ అప్పుడు అది అదే పరిశుద్దాత్మ కార్యమును చేయును. అదే యేసు యొక్క కార్యమును చేయును. మరియు ఆ విధముగా, ఆయన అక్కడ ఆ గతములో ఏమైయున్నాడో, మీరు ఖచ్చితముగా తెలుసుకొనగలరు. ఆయన ఇప్పుడు ఏమైయున్నాడో మీరు తెలుసుకొనగలరు.

కనుక యోహాను 4వ అధ్యాయమును తీసెదము. అక్కడ ఒక… ఆయన ఒక యూదుడుగా ఉండి, ఒక సమరయ స్త్రీని కలుసుకొనెను, మరియు ఆమె ఆత్మను సంధించుటకు ఆమెతో ఆయన కొద్ది నిముషములు మాట్లాడెను. అప్పుడు ఆమె యొక్క సమస్య ఎక్కడ ఉన్నదో ఆయన ఆమెకు చెప్పెను. మరియు ఆమె చెప్పెను, "అయ్యా, నీవొక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మాకు తెలుసు, ఆ మెస్సియా వచ్చినప్పుడు, ఆయన ఈ విషయములను మాకు తెలియజేయును."

JOHN 4:26,29,39

 

60మరియు దానిని ఆమె ఆయనకు చెప్పెను…

మరియు ఆయన చెప్పెను, "నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను."

మరియు ఆమె పట్టణములోనికి పరుగెత్తి వెళ్ళి, "రండి, నేను చేసిన సంగతులు నాకు తెలియజెప్పిన ఆ వ్యక్తిని చూడండి. అదే ఆ మెస్సియ్యా, ఈయన కాడా?" మరియు ప్రజలందరూ నమ్మిరి, మరియు ప్రతీ ఒక్కరూ…

యేసు దానినే (అదే కార్యమును) మరొక వ్యక్తికి చేయలేదు. కానీ పట్టణమంతా దానిని నమ్మొను. ఆయన ఎవ్వరినీ స్వస్థపరచలేదు, కేవలము అక్కడికి వెళ్ళియున్నాడు, తనకుతాను ప్రకటించుకొన్నాడు. ఆ స్త్రీ యొక్క సాక్ష్యమును బట్టి ఆ పట్టణము అంతయూ ఆయనను నమ్మియున్నదని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది.

ఇప్పుడు, ఒకవేళ నిన్నటి యేసు అయితే, మరియు ఒక ఆఫ్రికన్ బాలిక మరియు ఒక ఆంగ్లో-సాక్సన్ వ్యక్తి ఇక్కడ నిలబడియున్నారు — మరియు ఆయన వచ్చి అదే కార్యము చేయగలిగిన ఎడల, మరియు ఒకవేళ మీరు దేనికొరకు ఇక్కడ ఉన్నారో, అది ఏదో ఆయన నాకు బయలు పరచినట్లయితే, మీరు చేసినదేదో, లేక అటువంటిదేదైనా, అది సత్యమో కాదో అప్పుడు మీరు తెలుసుకొనెదరు. ఖచ్చితముగా మీరు తెలుసుకొనెదరు.

61మరియు అప్పుడు ఒకవేళ ఏమి జరిగినదో ఆయన మీకు చెప్పగలిగిన ఎడల, ఖచ్చితముగా ఏమి జరుగబోతున్నదో కూడా అయన మీకు చెప్పగలడు. మీరు దానిని నమ్ముచున్నారా? ఇక్కడ ఉన్న రంగు జాతి వారందరికీ, తెల్లవారికి కూడా, మరియు మరింకెక్కువ ఏదైనా, మీ హృదయమంతటితో మీరు దానిని నమ్మెదరా? అది సరియే.

ఇప్పుడు, ఒకవేళ మీలో ఎవరైనా ఇది సత్యమని నమ్మనట్లయితే, మరియు అది మానసిక శాస్త్రము అని మీరు నమ్ముచున్నారు, (నాకు ఎటువంటి పి.హెచ్.డిలు లేవు), మీరు ఇక్కడకు వచ్చి మరియు మీకు మీరుగా చేయండి. నేను మీ కొరకు ఎదురు చూచుచున్నాను. ఒకవేళ మీరు వచ్చుటకు భయపడినట్లయితే, దానిని అంగీకరించండి, లేక దానిని గూర్చి నిమ్మళముగా ఉండుము.

నేను దానిని ఎందుకు చెప్పాననగా, దానిని చేయుటకు నేను నడిపించబడ్డాను. దానిని గూర్చి ఏదో జరుగుతున్నది, దానిని గూర్చి నాకు తెలుసు.

ఇక్కడ కూడా ఏదో జరుగుతున్నదని మీరు ఎరిగియున్నారు. నీ ఇబ్బందులలో ఒక బలహీనత నరాలకు సంబంధించిన, నిజముగా తీవ్రమైన ఆందోళన.

62అక్కడ అది వచ్చెను, "దానిని అతడు ఊహించెను." నేను చెప్పగలను, "అక్కడ ఎవరో నరాల బలహీనతతో బాధపడుచున్నారు… ప్రభువు ఏదో చెప్పియున్నాడు." కానీ ఆ ఎవరో ఎవరు? ఆ ఎవరో తనే అయి యున్నది. నిలబడుము… ఇప్పుడు ఆమె ఒక చక్కని ఆత్మ కలిగియున్నది. ఒకవేళ ఇది అవునో కాదో మనము చూచెదము.

ఆందోళన. నీకు నీ భుజముతో కూడా సమస్య ఉన్నది. అది నిజమేనా. నీకు గుండె సమస్య కూడా ఉన్నది. అది నిజమేనా? నీ హృదయముపై భారమున్నది. అది నిజమేనా? అది ఒక బాలుని గూర్చి. అతడు ఒక సంస్థ ఆసుపత్రిలో ఉన్నాడు. నీవు అతడిని గూర్చి ప్రార్ధిస్తున్నావు. నీవు ఎవరో నీకు చెప్పుమని నన్ను కోరుచున్నావు? శ్రీమతి రిచర్డ్సన్. వెళ్ళి నమ్ముము.

63అది నాకు ఏమి చేయునో మీకు ఎన్నడునూ తెలియదు. అది ఆ జీవమును చంపివేయును. ఇప్పుడు, నిజమైన గౌరవముతో ప్రతీ ఒక్కరూ.

అయ్యా, మీరు ఎలా ఉన్నారు? మేము ఒకరికొకరు క్రొత్తవారమా? క్రొత్తవారము. అయితే యేసు మమ్ములనిద్దరినీ ఎరిగియున్నాడు మరియు మమ్ములనిద్దరినీ పోషించాడు. ఒకవేళ దేవుడు మీరు ఇక్కడ ఎందుకు నిలబడియున్నారో అది నేను తెలుసుకొనునట్లు చేసినట్లయితే … కనుక దానిని గూర్చి నేను మరింత వివరణలోనికి వెళ్ళనవసరము లేదు. చూశారా, ఒక పూర్తి… అక్కడ ఒక పూర్తి వరుస నిలుబడుటను నేను కలిగియున్నాను, మరియు మిగిలినవారు అక్కడ ప్రార్ధించుచున్నారు. చూడండి అది నాకు ఏమి చేయునో. అయితే ఒకవేళ ఆయన ఇప్పుడు మీ గూర్చి నాకు ఏదైనా చెప్పినట్లయితే, మీరు నమ్ముతారా?

అవును, నీవు ప్రార్ధించాలని కోరుచున్న సంగతులలో ఒకటి నీ కళ్ళను గూర్చి. ఎందుకనగా నీవు కళ్ళద్దాలు తొడుగుకొని యున్నావు; ఎవరైనా దానిని చూడగలరు. ఆ మనుష్యునితో ఉన్నది అంతా అదొక్కటే కాదు. మరేదో ఉన్నది, ఎందుకనగా అతడిపై మరణము కొరకు ఒక నీడ ఆవరించియున్నది. అతడి కళ్ళు దానిని చేయలేవు.

టి.బి. (క్షయ) దాని కొరకు నీవు ఒక శస్త్రచికిత్సను చేయించుకొనియున్నావు; విజయవంతము కాలేదు — అది చేయబడవలసిన విధముగా చేయబడలేదు. అది నిజమేనా? అది సరి కాబోవుచున్నదని, ఇప్పుడు నీవు నమ్ముచున్నావా? నీ హృదయమంతటితో నమ్మము.

ఆయన దేవుని కుమారుడని మరియు నిన్ను స్వస్థపరచియున్నాడని నీవు నమ్మెదవా? నీవు నమ్మెదవా? అప్పుడు, "ప్రభువా, వందనములు" అని చెప్పుచూ సాగిపొమ్మ, ఆ అల్సరు బాగవును.

64నేను నిన్ను ఎరుగను. మనము ఒకరికొకరము క్రొత్తవారము. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నీవు నమ్ముచున్నావా? ఒక వరమును ఇచ్చుటకు మరియు ఈ లేఖనమును ఉత్పత్తి చేయుటకు ఈ చివరి దినములలో సంఘమునకు ఒక వర్తమానికునిగా ఆయన నన్ను పంపించియున్నాడని నీవు నమ్ముచున్నావా… ఎందుకనగా అది నేను అని కాదు. ఎందుకనగా ఆయన పొందుకొనుటకు కాదు… ఆయన బహుశా… సాధారణముగా ఏమి ఎరుగని ఒకనిని తీసుకొని, అప్పుడు తనకుతానుగా ఆయన చూపించుకొనును, చూశారా.

నేను మాటలాడుచున్న ఈ సంగతులు లేఖనము ద్వారా సత్యమని మీరు నమ్ముచున్నారా? ఆమె పూర్తిగా బాధతో నిండియున్నట్లుగా ఉన్నది, ఆ కారణమును బట్టే నేను ఆమెతో ఒక్క క్షణం మాట్లాడుచున్నాను. అవును. అదే. మొదటి సంగతి నీ కొరకే. నీవు ఒక శస్త్ర చికిత్సను చేయించుకున్నావు, మరియు అది ఒక స్త్రీ, స్త్రీ-సమస్య వలన లోపల ఉన్న అవయవము తీసివేయబడ్డాయి. కానీ అది తిరగబెట్టినది.

అది ఏదో చేసినది. ఇప్పుడు, ఒక్క క్షణం. అది… అది పగిలిపోయినది. అది పగిలినది మరియు నీవు తిరిగి వెళ్ళవలసియున్నది. వెనుకకు వెళ్ళిపోవాలి.

65అయితే నిజముగా నీ బాధ అది కాదు. నీ బాధ ఒక బిడ్డను గూర్చి. అది నీ బిడ్డీ మరియు దానికి ఏదో వ్యాధి ఉన్నది, లేక ఏదో తప్పు ఉన్నది. క్షయ. మరియు ఇప్పుడు అది ఏదో బలహీనమైన వాటిని కలిగియున్నది. అది నిజము. నిన్ను బాధించుచున్న మరొక దానిని నీవు కలిగియున్నావు, మరియు అది ఒక చెవి సమస్య. అది నిజము. నీ పేరు శ్రీమతి. స్మిత్. నీవు వెళ్ళి, నీ పూర్ణహృదయముతో విశ్వసించుము… నీవు నమ్ముచున్నావా? విశ్వాసము కలిగియుండు, కేవలము విశ్వాసము కలిగి ఉండు. నమ్ముము.

అమ్మా, ఎలా ఉన్నావు? మనము ఒకరికొకరము క్రొత్తవారము. నేను నిన్ను ఎరుగను. నాకు తెలిసినంత వరకు, నా జీవితములో ఎన్నడూ నేను నిన్ను చూడలేదు. మరియు ఇక్కడే మనము మొదటిసారి కలుసుకొనుచున్నాము. ఒకవేళ నేను నీ కొరకు ఏదైనా చేయగలిగియుండి మరియు దానిని చేయకపోతే, అప్పుడు నేను ఒక చెడ్డ వ్యక్తిని. నేను కాదు… నేను ఒక సేవకునిగా ఈ బలిపీఠము వెనుక నిలువబడకూడదు.

66మరియు నీకు నేను సహాయము చేయలేను.

మరియు ఒకవేళ ఆయన తనకుతానుగా ఇక్కడ నిలబడినట్లయితే, మరియు నాకు ఆయన ఇచ్చిన ఈ దుస్తులు ధరించి, నీ కొరకు దానిని చేసినది మెస్సియ్యా ఆయనేనని ఆయన మాత్రమే రుజువు చేయును. అయితే నీ కొరకు దానిని చేసినది ఆయనేనని నీవు విశ్వాసము కలిగియుండవలసియున్నది, లేక అది ఏ విధముగానైనా కార్యము చేయదు. అది నిజమే కదా? అయితే ఒకవేళ ఆయన ఇక్కడ నిలబడి మరియు నీకేదైనా చెప్పినట్లయితే — నీ సమస్య ఏమిటో, లేక నీవు ఏమి చేశావో, నీవు ఏమి చేయలేదో, లేక దానిని గూర్చి ఏదో, అప్పుడు దానిని నమ్ముటకు నీవు విశ్వాసము కలిగియుందువు, నీవు కలిగియుందువా?

అది ఇప్పుడు ఈ ప్రేక్షకుల యొక్క విశ్వాసము పెంపొందించునా? నీవు నాకు కనుమరుగవుచున్నావు.

మంచిది, నీవు ఒక యాక్సిడెంట్ కు గురి అయ్యావు. అది నీ తలను బాధించుచున్నది. మరియు అప్పుడు నీ ఎడమ ప్రక్కన బాధను కలిగియున్నావు. అది నిజము. ఉపద్రవాలు, కనుక చాలా సంగతులు తప్పుగా ఉన్నవి. అది నిజము. ఒకవేళ నీవు ఎవరో దేవుడు నాకు చెప్పిన ఎడల, అది నీకు సహాయము చేయునా? శ్రీమతి టెర్రీ. దేవుడు నిన్ను దీవించును గాక. ఇప్పుడు నీ పూర్ణహృదయముతో నీవు నమ్మెదవా?

67ఆయన గుండె సమస్యను స్వస్థపరచును, ఆయన చేయడా? ఆయన చేయునని నీవు నమ్ముచున్నావా? "వందనములు, ప్రియ దేవా," అని చెప్పుచూ, కేవలము ముందుకు సాగిపొమ్ము. ఆయన కీళ్ళ రోగమును స్వస్థపరచి మరియు ప్రజలను బాగుపరచునని నీవు నమ్మెదవా? మంచిది. నీ పూర్ణహృదయముతో దానిని నమ్ముము. దేవుడు నిన్ను దీవించును గాక. ఒక స్త్రీ సమస్య, మరియు గుండె సమస్య. ఆయన నిన్ను బాగుపరచునని నీవు నమ్ముచున్నావా? మంచిది. నీ మార్గములో సంతోషి౦చుచూ, స్తోత్ర గీతము పాడుచూ వెళ్ళుము.

ఈ రక్తహీనత స్థితిని కలిగియుండుటకు నీవు చాలా యవ్వనముగా ఉన్నావు, కానీ ఆయన రక్తమార్పిడి చేయగలడని నీవు నమ్ముచున్నావా? వెళ్ళి, చెప్పుము, "ప్రభువా, వందనములు." నమ్ముచూ, వెళ్ళుము. సైనస్. ఓ, దానిని ఆయన స్వస్థపరచునని నీవు నమ్ముచున్నావా? కేవలము చెప్పుచూ వెళ్ళుము, "ప్రభువైన యేసు, వందనములు."

68ఆ కణితి కొరకు నీవు శస్త్రచికిత్స చేయించుకొనవలసియున్నది. దేవుడు దానితో నిన్ను స్వస్థపరచునని నీవు నమ్మెదవా? మంచిది. సంతోషి౦చుచూ నీ మార్గమున తిన్నగా "ప్రభువా, వందనములు," అని చెప్పుచు వెళ్ళుము. రమ్మ. రమ్ము, అమ్మా. ఆయన నరాల బలహీనతను స్వస్థపరచునని నీవు నమ్మెదవా? మంచిది. నీ మార్గమున సంతోషి౦చుచూ "ప్రభువా, వందనములు," అని చెప్పుచూ వెళ్ళుము.

ఒకవేళ నేను నీకు ఏమీ చెప్పకపోతే ఏమిటి? ఏమైననూ నీవు నన్ను నమ్మెదవా? యేసు నామములో, ఆమె స్వస్థత నొందును గాక. నమ్ముచూ, వెళ్ళుము.

69రమ్ము.

ఒక్క క్షణము, ఒక్క క్షణము. ఎక్కడో ఏదో జరిగినది. అక్కడ వెళ్ళుచున్న ఆ ప్రజలు ప్రార్ధనా వరుసలో ఉన్నారా, వెనుక అక్కడ వెళ్ళుచున్నవారు? ఓ, అవును. అది ఏమైయున్నది…

మిస్టర్, ఇక్కడ వరుసలో కూర్చొన్నవాడు, ఇక్కడ కూర్చొని నా వైపు చూస్తూన్నవాడు, నీవు ప్రొస్టేట్ సమస్యతో బాధపడుచున్నావు. అవునయ్యా. అక్కడ కూర్చొన్నవాడు, అవునయ్యా. అవును. నీవొక ప్రార్ధనా కార్డును కలిగియున్నావా? నీవు ప్రార్ధనా కార్డును కలిగిలేవు, కలిగి యున్నావా? అది నీకు అవసరము లేదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను. ఇక్కడ ఉన్న ఆ రెండో స్త్రీ నీ భార్య. అది నిజము. మీరు ఒక గృహములో కలిసియుండుట నేను చూచాను, మరియు ఆమె కాలేయపు సమస్యతో బాధపడుచున్నది. అది నిజము. ఒకవేళ అది నిజమైతే, నీ చేయి పైకెత్తుము. ఇంటికి వెళ్ళుము. యేసుక్రీస్తు నిన్ను బాగుపరచును.

70అక్కడ నీకు ప్రక్కగా కూర్చొని ఉన్న ఆ స్త్రీ, ఆమె యొక్క నాలుకతో ఏదో సమస్యను కలిగి ఉన్నది. అమ్మా, నీవు నమ్ముచున్నావా? ఒకవేళ అది నిజమైతే, నీ చేయి పైకెత్తుము. మంచిది. ఇంటికి వెళ్ళుము.

అక్కడ చివరన కూర్చొన్న నీవు, నీ గూర్చి ఏమిటి? అది అక్కడ నీ పైన ఉన్నది, ఇప్పుడు. మూత్రాశయపు సమస్య ఉన్నది. మంచిది. మంచిది. నీవు నమ్ముచున్నావా, అయితే సరే, ఇంటికి వెళ్ళీ మరియు బాగవుము. నీవు దానిని అంగీకరించెదవా? వారు ఏమి తాకియున్నారు?

ఇక్కడ కూర్చొన్న ఒక వ్యక్తి ఏడ్వడం ప్రారంభించాడు, ఇక్కడ వెనుక కూర్చొన్న వ్యక్తి, ఈ వ్యక్తి, ఇది ఆ యవ్వనస్తుడు. ఇప్పుడు, ఆ వ్యక్తి, అతడిని నా జీవితములో ఎన్నడూ చూడలేదు. కానీ వినుము, కుమారుడా, నీవు ఉదర సంబంధమైన సమస్యను కలిగియున్నావు. అది నిజము. అయితే నీవు ప్రార్ధిస్తున్నావు. ఆత్మ నీ పైకి వచ్చునట్లు… నిజముగా అద్భుతమైన అనుభూతి.

71ఒకవేళ నేను నీకు క్రొత్తవాడినైతే, ఈ విధముగా నీ చేయి ఊపుము. నేను నిన్ను ఎరుగను. అకవేళ అదే నీ సమస్య అయితే, నీ చేయి ఊపుము. మంచిది. నీవు స్వస్థపరచబడ్డావు. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును.

అక్కడ వెనుక కూర్చొని ఉన్న స్త్రీ, మూర్ఛ వ్యాధితో బాధపడుచున్నది. దేవుడు నిన్ను స్వస్థపరచి, నిన్ను బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? నీవు దానిని నమ్ముచున్నావా? ఒకవేళ నీ స్వస్థతను నీవు అంగీకరించినట్లయితే, ఆ బలహీనతలు నిన్ను విడిచిపోవును మరియు వాటిని నీవు ఎన్నడూ కలిగియుండవు. దానిని నమ్ముము.

ఇక్కడ కూర్చొని నను చూస్తున్న ఆ చిన్న స్త్రీ, ఆమె యొక్క చేయి ఈ విధముగా పైకెత్తి ఉన్నది. ఆమెకు మడమ దగ్గర ఏదో సమస్య ఉన్నది. దేవుడు నిన్ను బాగుచేయును అని నీవు నమ్ముచున్నావా? మంచిది. నీ స్వస్థతను నీవు పొందుకొనగలవు.

2KGS 7:4

 

72తన చేయి పైకెత్తి ఇక్కడ నిలబడియున్న ఈ స్త్రీ, ఆ పాత కణితిపై శస్త్రచికిత్సకు నీవు సిద్ధముగా ఉన్నావు. అయితే దేవుడు దానిని బయటకు తీసివేసి మరియు నిన్ను బాగుచేయును. నీవు దానిని నమ్ముచున్నావా? వెళ్ళి, దానిని నమ్ముము.

ఈ దయకలిగిన స్త్రీ, ఇక్కడ ఆమె తలకు చుట్టూ ఒక తెల్లని వస్త్రముతో, రంగుజాతి స్త్రీ, మూత్రాశయపు సమస్య దేవుడు నిన్ను స్వస్థపరచును అని నీవు నమ్మెదవా? చక్రాల కుర్చీలో ఉన్న నీ సంగతి ఏమిటి? నేను ఆయన ప్రవక్తనని నీవు నమ్ముచున్నావా? అక్కడ కూర్చొని నీవు చనిపోతావు. జీవించుటకు నీవు ఒక్క అవకాశమును కలిగియున్నావు. సమరయ గవిని దగ్గర కూర్చొన్న కుష్టువారి వలె సహోదరీ.

నేను నిన్ను స్వస్థపరచలేను, సహోదరి. నేను స్వస్థపరచువాడను కాను. అయితే ఆ సమరయులు, వారు చెప్పారు, "ఒకవేళ మేము ఇక్కడ కూర్చొంటే, మేము చనిపోతాము; ఒకవేళ మేము పట్టణములోనికి వెళ్ళినా, మేము చనిపోతాము. కనుక మేము కలిగియున్న ఒకే ఒక్క అవకాశము, శత్రువు యొక్క శిబిరములోనికి వెళ్ళుటే. ఒకవేళ వారు మమ్మును చంపితే, ఏ విధముగానైనా మేము చనిపోవబోవుచున్నాము. కానీ ఒకవేళ వారు మమ్ములను రక్షించినట్లయితే, మేము జీవించియుంటాము." కొన్ని లక్షలలో వారు ఒక్క అవకాశమును మాత్రమే కలిగియున్నారు.

నీవు అటువంటి ఒక అవకాశమును కలిగిలేవు. ఒక నిజముగా ప్రేమించే దేవుని గృహములోనికి ఈ రాత్రి నీవు ఆహ్వానించబడ్డావు. ఇప్పుడే నీ కాళ్ళపై నిలబడుము. మనము లేచి మరియు ప్రభువైన యేసుక్రీసుపై నమ్మకముంచెదము. పైకి లేవండి. ఒకవేళ మీరు ఆయనను నమ్మినట్లయితే, మీ కాళ్ళపై లేచి నిలబడుము. యేసుక్రీస్తు యొక్క నామములో, నీ స్వస్థతను అంగీకరించుము. ఆమెన్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...