ప్రకటన, ఐదవ అధ్యాము #1 (చిదుక కొట్టబడిన సర్పము)
VGR COUNT-179 1నెవిల్ సోదరుడా, వందనములు. నా సోదరుడా, ప్రభువు నిన్ను దీవించును.
స్నేహితులారా, శుభోదయము. ఈ ఉదయమున చాలా సంతోషముగా యున్నది. ఇది మహాభాగ్యము. ఆలయమునొద్దకు తిరిగి వచ్చుట ఎంతో గొప్ప సంగతియని చెప్పుదును. ప్రభువు యొక్క వాక్యముతో సహవాసము చేసి, ఉదయము ఆరాధించుట కొరకు ఈ సమయము ఏర్పాటు చేయనైయున్నాము. ఒకసారి ఒకరు ఇట్లు పలికిరి, "యెహోవా మందిర మునకు వెళ్ళు వారు నాతో చెప్పినప్పుడు సంతోషించితిని." నా మంచి ప్రశస్త స్నేహితునితో, అనగా నెవిల్ సోదరునితో తిరిగి కలిసికొనుట నాకు బాగున్నది.
2కొద్దిగా చల్లదనము లేదు. ఆ వెనుక కొద్దిగా వేడిగా యున్నది. మీరు మీ చేతులలో విసన కర్రలు ఉపయోగించుట నాకు కనబడుచున్నది. మోటారు ఉపయోగించినచో మనకు పంఖాలు తిరుగును. మీరు విసరుకొనవచ్చును. ఇంకా కొన్ని విసన కర్రలిచ్చటున్నవని తలంచుచున్నాను. కొందరు తమ పాటల పుస్తకములను ఉపయోగించుచున్నారు. భవిష్యత్తులో వేడిగా నుండు దినములలో ఆరాధనలనెట్లు పెట్టవలెనా అని తలంచుచున్నాము. ఆ విషయములను ఆలోచించియే ఈ రోజు ఇక్కడికి వచ్చియున్నాము. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తము మాత్రమే మనకు సరయిన ఆశ్రయము.
3సంఘము యొక్క మంచి నివేదికను విని నాకు చాలా సంతోషము కలిగినది. అదెట్లు వర్థిల్లుచున్నదో, ప్రభువుతో ఎట్లు నడచుచున్నదో, ప్రభువు ఆత్మీయ వరములను మీకెట్లు అనుగ్రహించుచున్నాడో వినుచున్నాను. మీ యదార్థ హృదయములను బట్టి నిశ్చయముగా దేవునికి వందనములు చెల్లించుచున్నాను. ఆయన అట్టివారితోనే మాట్లాడును. సూటిగానున్న ఇరుకు త్రోవలో ఆయన మిమ్మును తీసికొనిక వెళ్ళునని నేను నమ్ముచున్నాను. మీరు దాని నుండి కుడికి గాని, ఎడమకు గాని తొలగరాదు.
4సహోదరుడు కొల్విన్ మరియు అతని కుమార్తెకు నేను వందనములు చెల్లించుచున్నాను. "పరలోకములో కన్నీరు లేదు" అను పాటను ఇక్కడ వారు కొద్ది క్షణముల క్రితం పాడియున్నారు. అది చక్కని పాట. దానిని నిశ్చయంగా నేను అభినందించుచున్నాను.
సహోదరుడు నెవిల్ మరియు నేను అతనిని, అనగా కొల్విన్ సోదరుడు పరిచయమున్నది, చాలా సంవత్సరముల క్రితమే ఎరుగుదుము. ఈ పాత సువార్త గీతములను అతడు పాడుచుండును. పిల్లలను ప్రభువు యొక్క మార్గములో పెంచుచున్నాడు. అది నా హృదయమును ఎంతో తెప్పరిల్ల చేయుచున్నది. ఇంకా దేవునిని ప్రేమించువారు, ఆయన కొరకు పనిచేయు వారు ఉన్నారని తెలిసికొనినప్పుడు నాకు ఎంతో ఆనందము కలుగుచున్నది. కతజ్ఞతలు దేవునికి చెల్లించుచున్నాను.
5నేను వెళ్ళినప్పటి నుండి ఇప్పటికి చాలా మంది విశ్వాసములోనికి బాప్తిస్మము పొందియున్నారని నేను విన్నాను. అందును గూర్చి ఎంతో సంతోషించుచున్నాను. నా మంచి స్నేహితుడగు ఎల్మర్ గాబ్ హార్టును నేను వెనుక చూచుచున్నాను. అతడు ఈ మధ్యనే విశ్వాసములోనికి బాప్తిస్మము పొందియున్నాడని నాకు అర్థమయినది. నిశ్చయంగా దానినిబట్టి వందనములు చెల్లించుచున్నాడని నాకు అర్థమయినది. నిశ్చయంగా దానినిబట్టి వందనములు చెల్లించుచున్నాను. కెంటాకీలో వేటాడు మా జత వారందరూ దేవుని యొద్దకు వచ్చుట ప్రారంభమైనదని నాకనిపించుచున్నది. ఇది నిజము కాదా?
అతడచ్చటికి వెళ్ళిన సంగతులు నాకు ఇంకా గుర్తున్నవి. (వెనుక గదిలో రాడ్నీ వినుచున్నాడని నాకు తెలియును. ఇంకా అతడు వెనుకనే యుంటే వినును. నా ముందరే చార్లీ యున్నాడు) మా అందరికిని ఉడుతలంటే ఇష్టము. వారికి దొరికిన యెడల కొద్దిగా ఎక్కువగానే వాటిని తీసికొని వెళ్ళవలెనని కోరుదురు. కాని వారికిష్టము లేని దానిని గూర్చి నేను మాట్లాడగోరుచున్నాను. మొత్తం ఆ గుంపు వారందరూ మార్పు పొందిన తరువాత మేము మరియొక ప్రాంతమునకు కదిలిపోయి అక్కడ పనిచేయుదుమని ఊహించుచున్నాను. అది బాగుండును.
6నేను కొన్ని సార్లు సేవకునగా మీరు నడిచిన త్రోవలను చూచుచుందును. ఆ క్రియలను చూచి ఆశ్చర్యపడుచుందును. మీరు విత్తనములను చల్లుచున్నారు.
మీలో చాలామందికి అమెరికాలోని జానీ యాపిల్ సీడ్ తెలియును. అలాంటి పనిలో నిపుణుడగు వ్యక్తి స్వీడన్‌లో కూడా యున్నాడు. అతడు పూల విత్తములను చల్లెను. ఆ కారణము చేతనే ఇప్పుడు స్వీడన్‌లో అంత అందమగు పూలున్నవని అందురు. ఎందుకనగా ప్రతి స్థలములోను పూల విత్తనములు చల్లబడి యున్నవి. విత్తనములు ఏ స్థలములో పెరుగునని వారెరుగుదురో ఆ ప్రతి స్థలమందును చల్లిరి. అతనికిక పూలంటే ఇష్టము గనుక అతడు ప్రతిచోటను ఆ విత్తనమును చల్లెను. అతడు గతించిపోయెను గాని అతని పూలు ఇంకనూ సజీవముగా యున్నవి.
మన వెనుకన ఎడబాటులున్నవి,
కాలమను ఇసుక పైన పాద ముద్రలున్నవి;
బహుశా ఆ పాద ముద్రలు మరొకరివి కావచ్చును,
జీవితపు ప్రవాహము మీద పయనించారు,
ఓడ బ్రద్ధలై ఒంటరిగా నిలచిన సోదరుడా,
వీటిని చూచి నిబ్బరముతెచ్చుకొనుము.
మనము చేసిన కార్యముల వలన ఇతరులు లాభము పొందుటను చూడగోరుదుము. అది మనందరికిని ఇష్టము.
7నేను కొన్ని రోజుల క్రితం కూర్చొని ఈ పట్టణములోని నా స్నేహితుడగు డాక్టర్ సామ్ అడైర్‌తో ముచ్చటించుచున్నాను. "బిల్, నీవెట్లున్నావు?" అనడిగాడు.
"చాలా బాగున్నాను డాక్టర." అన్నాను. "మరి నీవెట్లున్నావ్?" అనడిగాను.
"ఓ! చాలా మంది రోగులువచ్చుచున్నారు." "ఈ మధ్యాహ్నము పదిహేను మందికి పరీక్ష చేశాను" అన్నాడు.
"పరీక్షలు చేసి వారికి ఏదీలేదని చెప్పితే చాలు. వారు బాగుందురు." అన్నారు. మేము మా బాల్యపు సంగతులు గుర్తుచేసికొన్నాము. మా ఇద్దరికిని ఏబది సంవత్సరములు వచ్చి యున్నవి. "ఇంక నేనెంతకాలముందునో నాకు తెలియదు డాక్టర్ అన్నాను."
"అది నిజమే బిల్" అన్నాడు.
"కాని ఇన్ని సంవత్సరములు, అనగా ముప్పది ఒక్క సంవత్సరములు సేవ చేశాను. ఆయన వచ్చు ఘడియ కొరకు నేను నా హృదయమును సిద్ధపరచుకొనియున్నాను. కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చినా పరవాలేదు" అన్నాను.
"అది నిజము" అన్నాడు.
"ఇతరుల కొరకు జీవించుటయే నాకు మహదానందము" అని నేనన్నాను.
8"అదే నిజమయిన జీవితము. అప్పుడే జీవితము సార్థకమగును. నీ కొరకు నీవు ఏదో సాధించినపుడు కాదు. నీవు ఇతరలు కొరకు ఏదయినా చేసినపుడే జీవితము సార్థకమగును" అని అతడు పలికెను.
చూడండి. మీరు నిజంగా ఆలాగు జీవించవలెను. ఆ విధంగా ఎన్నడూ చేయని వారు మన మధ్య ఎవరైనా జీవించుచున్నయెడల, ఇతరుల కొరకు జీవించుటకు ప్రయత్నించండి. ఒకసారి ప్రయత్నించండి. మీ జీవితములో ఎంత ఆనందము కలుగునో చూడండి. నీవు ఇతరుల కొరకు జీవించగల అవకాశముండియూ జీవించనియెడల నీ జీవితము వలన ఇతరులకు ఏమీ ప్రయోజనముండదు. ఐశ్వర్యము కన్న అది గొప్ప దీవెనయని గ్రహించెదవు. నీ ఆలోచనకు అది అందదు. ఇతరుల జీవిత భారములను నీవు పంచుకొనవలెను. జీవితమే ఒక భాగము. నీవు వారి భారమును తేలిక చేయగలవు. ఒక్కసారి దానిని నీవు ప్రయత్నించితేనే గాని అందులో ఉన్న ఆనందమును ఎరుగవు. మరొకరి కొరకు ఏదయినా చేయుము.
9ప్రభువు కొరకు ముప్పది ఒక్క సంవత్సరములు నేను పని చేశాను. (త్వరలోనే ముగియును) ప్రతి మనిషియు తన చివరి పనిని గూర్చి, చివరి ఘడియ గూర్చి తలంచును. గత మార్గమును ఒకసారి తిరిగి చూచును. ఏమి నెరవేర్చెనో చూచును. చేసిన దానిని గూర్చి తలంచును. నీవేమైనా చేశావా? నేను ఇపుడు మీతో చెప్పిన ప్రకారము ఇతరుల కొరకు నీవు చేసినదే లెక్కలోనికి వచ్చును.
నేను నా మార్గాంతమునకు వచ్చినపుడు ఎట్లుందునో అని తలంచుచుందును. ఆ సమయము ఎపుడో మనకు తెలియదు. మనమెవరమును ఎరుగము. కాబట్టి నేను జీవితములో దాటివచ్చిన త్రోవవైపు ఒక్కసారి వెనుకకు తిరిగి చూచుచున్నాను. ఎన్నో విధములగు కొండలు, ముండ్ల పొదలు, రాళ్ళు, కరకు స్థలములు, మెత్తని మైదానములు దాటి వచ్చాను. ఆ యా సమయములలో నేనేమి చేశానో గుర్తుచేసికొందును. ఏదో ఒక దినమున నా ఆఖరి ఘడియ వచ్చును. అపుడు మీరందరూ దానిని చూచెదరు. మనందరము దీనిని ఎదుర్కొనవలెను. అది చాలా నిశ్చయము. ఆ సమయము వచ్చినపుడు మనము ప్రతి ఒక్కరము దానిని చూచెదము.
10ఈ సందర్భములో నాకు ఒక సంగతిని చెప్పవలెననిపించుచున్నది. దీనిని చెప్పుట బహు ఆవశ్యము. ఏదో చెప్పవలెనని నాకు నడిపింపు కలుగుచున్నది. అది నా హృదయాంత రంగము పిండి చేయుచున్నది. నేనిది బలవంతముగా చెప్పుచున్నాను. ఇది నాకు తెలియును. ప్రపంచము దీనిని వినును. నేను ఒక కారణము చేత సేవను విడిచిపెట్టి యున్నాను. విడిచి పెట్టవలసి వచ్చినందుకు చింతించుచున్నాను. బహుశా మీలో చాలామంది దానిని వినియున్నారు. నేను కార్యాలయమును మూసివేయుచున్నాను. బయట స్థలములకు వెళ్ళుట లేదు.
ప్రభువు నన్ను ఎచ్చటికి నడిపించునో నాకు తెలియదు. నాకు అది సాధ్యము కాదు. ఆయన నా పట్ల ఏమి చేయునో తెలియదు. కాని నేను మార్గాంతమున ఎదుర్కొనవలసియున్న దానిని గూర్చి ఆలోచించుచున్నాను. ఈ జీవిత ప్రయాణములో నేను ఎన్నో తప్పులు చేశాను. నా హృదయ పూర్తిగా క్షమాపణ కోరుచున్నాను. నేను మావుడను గనుక బలహీనుడను. నేను చెప్పరాని మాటలు, చేయరాని కార్యములు చేసియుందును. కాని మానవమాత్రుడను గనుక బలహీనునిగా యున్నాను. మనందరికి అట్టి సమయములు వచ్చును.
MATT 11:28•
MATT 25:21,23•
LUKE 19:17
11ఈ యాత్ర చివరలో మన ప్రభువైన యేసు యొక్క మాటలు వినగోరుచున్నాను. అదే నా హృదయ వాంఛ. నా "నమ్మకమగు మంచి దాసుడా అని ఆయన చెప్పవలెను." "నా యొద్దకు రమ్ము" అని ఆయన నాతో చెప్పుట వినగోరుచున్నానని ఇంతకు ముందు మీతో చాలాసార్లు చెప్పాను. కాని ఇపుడు నేనిది వినగోరుచున్నాను. మంచి "దాసుడా, నా యొద్దకు రమ్ము" అను స్వరమును నేను ప్రత్యక్షంగా వినలేదు. కాని ఆలాగున బైబిలులోవ్రాయబడి యున్నది. కాని ఇప్పుడు నేను వినగోరుచున్నది ఇది: "భళా, మంచి దాసుడా!"
నా ప్రభువును, రక్షకుడును అగు యేసుక్రీస్తు నిజమగు దాసునిగా యుండగోరాను. చిరకాలము అదేనేను కోరితిని. అదే నా హృదయ కోరిక. నా సాక్షము శుభ్రముగాను, మచ్చలేనిదిగాను ఉండవలెనని కోరుచున్నాను. ఆలాగే నిలబడితిని. నా తప్పులన్నింటిలోను ఆలాగే నిలచాను. నా పూర్ణ హృదయముతో ఆయనను ఇంకను ప్రేమించుచున్నాను. ఈ ఉదయమున నా పూర్ణ హృదయముతో అది చేయుచున్నాను.
ఆ కారణము చేతనే నేను సేవను బలవంతముగా విడిచిపెట్టవలసివచ్చుచున్నది. ప్రజల మధ్య ఒక కలకలము లేచినందున నేనిది చేయవలసివచ్చినది. నన్ను సేవకునిగా లేదా సోదరునిగా పిలచుచున్నారు. కాని కొందరు యేసుక్రీస్తనుచున్నారు. ఆలాగయితే నేను క్రీస్తు విరోధిగా ముద్రింపబడుదును. నేను అంత్య క్రీస్తుగా నా దేవునిని కలిసికొనుట కంటె ఈ సేవను మానుకొనుటయే నాకు మేలు. ఆలాగు నేను దేవుని సన్నిధిలో జీవించవలెను.
12కొన్ని సంవత్సరాల క్రితం నేనిది విని ఇది సరసోక్తి అనుకొన్నాను. ఒక జంటను నేను కలిసికొన్నాను. వారు మన సహవాసములోనే యున్నారు. (ఈ ఉదయము వారిరువురిలో ఏ ఒక్కరూ ఇచ్చట కనబడుట లేదు) ఒకసారి నేను చేపలు వేటాడు సమయములో వారు వచ్చిరి. వారిట్లు అడిగిరి, బ్రెన్‌హాం సోదరుడా, నీవు అభిషేకించబడిన క్రీస్తువు కావా?
నేను వారిద్దరిని కౌగలించుకొని ఇట్లన్నాను, "సోదరులారా, నేను క్రీస్తుకు నిజమైన దాసునిగా ఉండగోరుచున్నాను. మీరు అటువంటి మాట మాట్లాడరాదు. మరల ఎన్నడైనా ఆ మాట గాని మీరు పలికిన యెడల నేను నిర్మలమగు మనస్సాక్షితో సేవను త్యజించిపోవుదును. నేను నడిపించలేక పోయిన ఆత్మ విషయములో అపుడు మీరే బాధ్యులగుదురు. ఎందుకనగా మీరాలాగు తలంచుట వల్లనే నేను సేవ విడిచానని గుర్తుంచుకొనండి." అంతటితో ఆ సమస్య ముగిసిందని అనుకొన్నాను.
13ఆ తరువాత మరి కొన్నిసార్లు నేను ఆ మాటను విన్నాను. కాని అది తప్పు. ఒక రోజు కెనడాలో ఒక సోదరుడు తన జేబులోయున్న చిన్న చీటిని తీసి చూపించెను. అందులో ఇట్లున్నది, "విలియం బ్రెన్‌హాం మా ప్రభువు." విలియం బ్రెన్‌హాం నామములో బాప్తిస్మమిచ్చుచున్నారు. నా విరోధి ఆ పని చేయుచున్న యెడల నేను దానిని ఏదో విమర్శగా భావించి యుందును. కాని ఒక ప్రశస్తమగు, ప్రియమగు సోదరుడు వచ్చి తన పాపములను ఒప్పుకొని తప్పులను క్షమించమని అడుగుచున్నాడు. నేను యేసుక్రీస్తునని నమ్మి ఒప్పుకొనుచున్నాడు.
నాకు ఇంటికి ఉత్తరములువచ్చియున్నవి. షికాగో మరియు ఇతర స్థలముల నుండి ఫోనులు వచ్చి యున్నవి. దానిని నేను నమ్ముచున్నానో లేదో అని అడిగిరి.
గత కొద్ది దినములలో ఎన్నో రకముల ఉత్తరములు వచ్చి యున్నవి. ఆయా స్థలముల నుండి ఫోనులు వచ్చి యున్నవి. నేను క్రీస్తునని చెప్పుచున్నారు. సోదరులారా, అది చాలా భయంకరము, అవమానము. అపవాది యొక్క భక్తిహీనపు అబద్ధము! చూచారా? నేను మీ సోదరుడని గ్రహించుడి. మీరా విధంగా పలికినచో నేను సేవను విడిచిపోవలసి వచ్చును. ఇటువంటి పరిస్థితులు వచ్చినపుడు క్రీస్తును ప్రేమించువారెవరయినా గాని పారిపోక తప్పదు.
LUKE 3:15,16
14ఈ మధ్య నేను ప్రభువు యొద్దకు వెళ్ళాను. దీనిని మొదట నేను విని ఒక సంవత్సరం అయినది. నేను ప్రభువు యొద్దకు వెళ్ళాను. ఆయన నాకు లేఖనమును చూపించెను. యోహాను బోధించుచుండెను. అప్పటికి అనేక సంవత్సరముల నుండి వారికి భూమి మీద ప్రవక్త లేడు. వారందరూ ఇతనిని చూచి ఆశ్చర్యపడిరి. యోహానును మెస్సీయా అని పొరబడిరి. వారు యోహాను యొద్దకు వెళ్ళి అడుగగా అతడు తాను కాననెను. దానిని మీరు లూకా 3వ అధ్యాయము 15వ వచనములో చదువగలరు. అంతా నెమ్మదియగును గనుక ఊరకుండుడని చెప్పాను.
కాని ఇది ఇంత వరకు వచ్చినది గనుక ఏదో ఇక చేయక తప్పదు. ఆ నది యొద్ద ప్రభుని దూత ప్రత్యక్షమైనది. దర్శనమును చూచాను. ఈ సంఘమునకు, లేదా ఈ ప్రపంచమునకు ఇదే చివరి వర్తమానము కావచ్చు. ప్రభువు యొక్క దూత చెప్పిన దాని ప్రకారము ఆ సంగతులన్నియును సత్యము.
ప్రజలు నన్ను ప్రవక్తగా పిలచినా గాని నేను చాలాసార్లు మౌనంగా నిలబడ్డాను. ఎందుకనగా ఇంగ్లీషు భాషలో ప్రవక్త అనగా బోధకుడు లేదా ప్రవచించువాడు లేదా వాక్యమును ముందుగా బోధించువాడు అని అర్థము. అందువలననే మీరాలాగు పిలచినా నేనేమియూ అనలేదు. కాని ఇప్పుడు నన్ను అభిషేకించబడిన క్రీస్తు అనుచున్నారు. అది నేను భరించరానిది. నేను తట్టుకొనలేను.
15కెనడాలో కూటములు ముగించుకొని వచ్చుచుంటిని. ఎస్కిమోలు లేదా ఇండియనులు నివసించు స్థలములలో నుండి వచ్చుచున్నాను. వారి మధ్యన నేనున్నాను.
ఇటువంటి సంగతి విని నా మనస్సు బ్రద్ధలైపోయినది. నేను చాలా కాలం క్రితమే వేట పర్యటనను ఏర్పరచుకొన్నాను. కాని ఇది విని ఇక వెళ్ళ లేక పోయాను. నాకు వేటలో ప్రమాదము సంభవించునని భయపడ్డాను. నా భావమును మీరు గ్రహించి యుందురు. నేను అంతగా వణకి పోయాను. ఇక్కడ నేను నిలబడుటకు సిగ్గువేసినది. నేను దీనిని సహించజాలను. ముప్పది ఒక్క సంవత్సరాల సేవ అపవాది యొక్క గోతిలోనికి పోయినట్లుగా భావించాను. నేను వెళ్ళిపోయిన తరువాత వారేమందురు? ఖచ్చితంగా వారిట్లే చెప్పెదరు. ప్రజల మీద నా యొక్క ప్రభావమును చూడండి. నన్ను ప్రజలు అంత్యక్రీస్తని పిలచెదరు. దానిని నేను తట్టుకోలేను.
నేను తుపాకీ మీద పడి అడవిలో చనిపోవుటకైనా సిద్ధమే గాని ఇది భరించలేను. కాని నా చిన్న జోసెఫ్ గూర్చి ఆలోచించాను. అతనిని నేను పెంచవలెను. నాకు వేటాడవలసిన అవసరము లేదు. అందుకే నేను అడవులను విడిచి ఇంటికి వచ్చాను.
ఎనిమిది లేదా పది దినముల నుండి నేను అల్లకల్లోలంగా ఉన్నాను. నాకు మతి చలించినదని భయము కలిగినది. ఎవరూ నా యొద్దకు రావద్దని చెప్పాను. ఒంటరిగా నేను ఉన్నాను. అటువంటి స్థితిలో నేనున్నాను. నరముల బలహీనత ఏర్పడినది. అంతా అయోమయమే. చిందర వందరైపోయాను.
16నాకు ఆశ్చర్యము కలిగియున్నది. నాకు విరోధులయిన వారు ఆలాగన్నచో నేను పట్టించుకొనను. నేను నవ్వి ఊరుకొందును. కాని నా ప్రశస్త సోదరులు, సోదరీలు ఆలాగనుచుండగా నాకెంతో వేదన కలుగుచున్నది. ప్రభూ, నేనిది భరించలేనని చెప్పాను. దానిని నేను దేవుని చేతులకే అప్పగించాను. ఇంకేమి చేయవలెనో తోచలేదు.
కొన్ని రాత్రుల క్రితం ప్రభువు నన్ను దర్శించెను. ఒక ప్రశస్తమగు శిశువును చూచాను. అదే సమయములో పసుపుగాను, నల్లగాను ఉన్న ఒక సర్పము నాతో ఏది చెప్పినది. అది నా కాలును కరిచినది. కాని నాలో రక్తము ఎక్కువగా యున్నందున నాకేమీ ప్రమాదము జరుగలేదు. నేను క్రిందికి చూచాను. ముందు నన్ను కరచిన చోటనే అది మరల కరచినది. నేను వెంటనే తుపాకీతీసి దానిని చంపాను. అది సరిగ్గా మధ్యలో కాటు వేసినది.
నేను తుపాకీ తీసి దాని తలను కాల్చివేయవలెనని తలంచాను. కాని ఆయన నాతో దానిని చంపవద్దు గాని నీ ప్రక్కనున్న కర్రను తీసికొనుమని చెప్పెను. నేను ఆ కర్రను పట్టుకొనుటకు వెనుకకు తిరుగగా అది అక్కడున్న చిన్న నీటి మడుగులోనికి దొర్లుకొంటూ పోయినది.
"ఇది ఇక ఏమీ హాని చేయజాలదులే" అని తలంచాను. సోదరులు కూడా అదే రీతిగా భావించియుందురని నేను గ్రహించుచున్నాను." "అది చావు దెబ్బతిన్నది గనుక చనిపోవునని తలంచాను."
17ఇక్కడున్న వారిని చాలా మందిని నేనడిగాను. చాలామంది ఇదే ప్రశ్నతో ఈ ఆలయమునొద్దకు వచ్చి నన్ను, నెవిల్ సోదరుని ప్రశ్నించుచున్నారు. సోదర సోదరీలారా, నేను క్రీస్తు యొక్క దాసునిగా ఉండవలెనని మీ యెదుట ప్రయత్నించలేదా? నేను మీ సోదరునిగా యుండుటకు ప్రయత్నించలేదా?
ఏది ఏమైనా గాని జనులు ప్రశస్తమైన వారే గాని వారిపై ఒక ఆత్మ పనిచేయుచున్నది. చాలా మంది ఇది నన్ను అడిగారు. అది ఒక ఆత్మ. కాని ఈ రోజున అది చావు దెబ్బతిని వెంటనే చనిపోవునని నేను తలంచుచున్నాను. అపుడు నేను తిరిగి సేవలోనికి తిరిగి వచ్చుదును. అంతవరకు మీరందరూ నా కొరకు ప్రార్థించవలెనని కోరుచున్నాను. ఏమి చేయవలెనో నాకు తోచుట లేదు. నా కొరకు ప్రార్థించవలెనని కోరుచున్నాను. ఏమి చేయవలెనో నాకు తోచుట లేదు. నా స్థలమును అమ్మకానికి పెట్టాను. నేనిది తట్టుకొనలేను. ఇంకా నేనిక్కడ ఉండలేను. నేను పూర్తిగా పిచ్చివానినయిపోవుదును. నా కొరకు మీరు ప్రార్థించవలెనని అడుగుచున్నాను.
గుర్తుంచుకొనండి. మీరు నన్ను క్రీస్తు దాసునిగా విశ్వసించుచున్నారు. గుర్తుంచుకొనండి. వారు లెవనెత్తిన ఈ మాట పూర్తిగా అబద్దము. అది తప్పు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అది తప్పు. దానితో నాకేమి సంబంధము లేదు. నేను మీ సోదరుడను. మన శిరములు వంచుదము.
18పరమ తండ్రీ, నా శరీరము కంపిచుచున్నది. నా చేతులు ముడుచుకుపోవుచున్నవి. నా బొటన వ్రేళ్ళు నా చెప్పులలో కుదించుకు పోవుచున్నవి. ఓ దేవా, కృపచూపుము. ప్రభువా, ఇందుకొరకేనా నేను ఇంత కాలం పని చేసినది? ప్రభువా, నీవు నా పట్లను, అందరిపట్లను కృప చూపమని అడుగుచున్నాను. ఆ ప్రశస్తమగు ప్రజలు తమ తప్పును చూడకలుగునట్లు కృప చూపుము. వారు నా హృదయము బ్రద్ధలు చేసిరి. నాదే కాదు. రక్షకుని హృదయమును ముక్కలు చేసిరి. మా పరమ తండ్రీ, మా తప్పులను క్షమించుమని ప్రార్థించుచున్నాను. క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము ఇపుడు మమ్మును శుద్ధీకరించును గాక! మా క్రైస్తవ ప్రేమ మరియు సహవాసము గట్టిగా బంధింపడు గాక! మా ఐక్యతను ఆశీర్వదించుము.
దేవా, మా సోదరులను, సోదరీలను సమీపించిన శత్రువు చావు దెబ్బతిని ఇక బ్రదుకకుండునట్లుగా చేయుము. ప్రభువా, దానిని చంపుము. తండ్రీ నీవు ఆలాగు చేసినపుడే నేను మరల సేవలోనికి వచ్చెదను. ప్రభువా, అంతవరకు నేను హృదయము పగిలిన నీ దాసునిగా నుండి కనిపెట్టి ఎదురుచూచెదను. దేవా, ఇది నా శక్తికి మించిన కార్యము. ప్రభువా, కన్నీటితోను, వేదనతోను నేను దీనిని ఆపుటకు ఎంతో ప్రయత్నించాను. వారికి నచ్చ చెప్పాను. (నీవు నా హృదయము నెరుగుదువు) ఇంక నేను ఏమీ చేయలేను. తండ్రీ, ఈ వేదిక మీద నుండి నేను దీనిని నీ చేతికి అప్పగించుచున్నాను. ఎన్నో సంవత్సరముల పాటు నేను ఈ వేదిక మీద నుండి బోధించాను. నేను దీనిని నీ చేతికి అప్పగించుచున్నాను.
తండ్రీ, నీవు దీనిని నీ స్వంత దైమ మార్గములో చూడుము. ఇదంతయూ సద్దుమణిగిన తరువాత నేనీ దాసుడు తిరిగి నీ పనిలోనికి వచ్చును. ప్రభువా, అంత వరకు నేను నీ మాట వినుటకు వేచి యుందును.
ఇపుడు నీవు మమ్మును ఆశీర్వదించుము. ఈ రోజు మాకు గొప్ప కూటము నను గ్రహించుము. నేను ఈ లోకమునకు దీనిని బహిరంగముగా తెలియపరచాను. మేము కేవలము ఇందు కొరకే ఇచ్చటికి రాలేదు. తండ్రీ, నేను నిన్ను ప్రేమించుచున్నాననియు, నీ పక్షముగా నిలబడియున్నాననియు వారు తెలిసికొనవలెను. అదే నా కోరిక. ప్రభువా, ఒక వేళ నేను వెడలిపోవవలసియున్నచో, శుద్ధ హృదయముతో నన్ను వెడలిపోనిమ్ము. నేను నిన్ను నమ్మి, నీ యందు విశ్వాసముంచితినను మంచి సాక్షము నాకిమ్ము. తండ్రీ, దయచేయుము. నిన్ను నేను స్తుతించెదను. యుగాయుగములు నీకు మహిమ చెల్లించెదము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
19ఇపుడు మనము బైబిలులోని లేఖనమును చూద్దాం. ఈ ఉదయమున అది మంచిదని నేననుకొన్నాను. నెవిల్ సోదరుడు మరో విధంగా భావించని యెడల కొద్ది నిమిషముల కొనసాగించెదను.
మరల నేను ఈ మాటను ఒక్కసారి కూడా మీ యొద్ద నుండి వినగోరుట లేదు. ప్రార్థన చేసి ఆ విషయమునకు అంతము కలుగజేయండి. చూచారా? నాకిపుడు ఏబది రెండు సంవత్సరములు. దేవుడింకా నన్ను బ్రదుకనిచ్చినచో మరి కొద్ది సంవత్సరములు జీవించెదను. నాకియ్యబడిన సమయములోని ప్రతి ఘడియను క్రీస్తు కొరకేక ఖర్చు చేయగోరుచున్నాను. కావున గుర్తుంచుకొనండి. నేను ఈ బాధను తట్టుకొనలేక నిష్కమించుచున్నాను.
20ఇపుడు ప్రకటన గ్రంథములోని 4వ అధ్యాయమును చదువుదము. ఒక రోజున కొంత చదివి దీనిని విడిచిపెట్టియున్నాము. ప్రకటన 4వ అధ్యాయము. చివరి వచన భాగమును చదువుదము. ఎందరికి ప్రకటన ఇష్టము? అద్భుతము! 5వఅధ్యాయము నొద్ద మనము విడిచి పెట్టుదము. అవునా? 4వఅధ్యాయములోని నాలుగు జీవులను చూచియున్నాము. ఇపుడు వాక్యమును సమీపించుచున్నాము. గతంలోని వాటిని మరచిపోవుదము.
PHIL 3:14
21తండ్రియగు దేవా, ఇపుడు ఉద్రిక్తతలోయున్న నాకు సహాయము చేయుము. గతములో జరిగిన దానిని మరచిపోయి ఇపుడు వాక్యమును సమీపించుచున్నాము. ఉన్నత పిలుపునందుకొని గురి యొద్దకు పరుగిడుచున్నాము. క్రీస్తు దాసునిగా యుండుటకు ఉన్నత పిలుపును పొందియున్నాము. ఈ ఉదయమున మాకు వాక్యమును ఇచ్చి మా ఆకలిగల ఆత్మలను పోషించుము. ఏలయనగా మేము ఎదురుచూచుచున్నాము. ప్రభువా, పరిశుద్ధాత్మ యొక్క ప్రశస్త అభిషేకము కొరకు కనిపెట్టుచున్నాము. ప్రభువా, మా మధ్యకు రమ్ము. మా పాపములను, అపరాధములను క్షమించి నీ దాసులుగా నిలబెట్టుకొనుము. యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
REV 1:1,8•
REV 22:16
22సంఘ కాలములను మనము చూచియున్నాము. అవి చివరి ఏడు సంఘ కాలములు. కొందరు ఈ సంఘ కాలములను గూర్చి వ్రాయుటకు ప్రయత్నించుచున్నారు. ఇపుడు మనము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయమును చూద్దాం. ఇది ఏమిటి? యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత. ప్రకటనను లాటిన్‌లో అపోకలిప్స్ అందురు దాని అర్థము బయలుపరచబడుట, ముసుగు తీయుట, చూపించుట, బయట పెట్టుట అని అర్థము. భూత, భవిష్యత్, వర్తమాన కాలములలో యున్న యేసుక్రీస్తు ప్రత్యక్షతను బయటకు చూపించుటయే. ఆయన దావీదు యొక్క వేరు మరియు చిగురు అయియున్నాడు.
REV 5:1-7
23ఇపుడు నాలుగవ అధ్యాయము. సంఘ కాలములను చూచిన తరువాత యోహాను పరమునకు కొనిపోబడెను. (కొద్దిగా ఆ వెనుక గాథను చూద్దాం.)
5వ అధ్యాయములోని కొన్ని వచనములను చదివినచో బాగుండును. ఆ వెనుక గాథను మనం చూద్దాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి యున్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై యుండు వాని కుడిచేత చూచితిని.
మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని.
అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తిలేకపోయెను.
ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెడును కనబడనందున నేను బహు ఏడ్చుచుండగా-
ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము. ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను.
మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి యుండుట చూచితిని. దానికి ఏడు కొమ్ములును, ఏడు కన్నులును ఉండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.
ఆయన వచ్చి సింహాసనము నందు ఆసీనుడై యుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసికొనెను.
అవి మొదటి ఏడు వచనములు.
REV 1:10•
REV 3:16•
REV 19:11,14
24ఇపుడు ప్రకటన 3వ అధ్యాయములో సంఘకాలాంతమును మనము కనుగొందుము. లవొదికయ కాలముతో అంతమయినది. అది నులివెచ్చని సంఘ కాలము. అది జరిగిన వెంటనే యోహాను ఆత్మవశుడై పరమునకు కొనిపోబడుటను చూచెదము. అతడు భూత, భవిష్యత్, వర్తమాన సంగతులను చూచెను. ప్రకటన గ్రంథము 19వఅధ్యాయము వరకు మనము అసలు సంఘమును చూడుము. ఆ తరువాత అది తన ప్రభువుతో కూడా తిరిగివచ్చును. రక్తములో కడుగబడి మహిమ నొందును.
JOHN 21:20-23
25చివరి భాగములో యోహాను ఎక్కడున్నాడో చూద్దాం. గత వర్తమానములో దానిని మనం కనుగొన్నాము. ఆ పూర్వగాధను కొంత చూద్దాం. నిన్న నేను దానిని క్లుప్తముగా చూచాను. దానిని గూర్చి కొంత నేను మాట్లాడాను. యోహాను పరమునకు కొనిపోబడి కొన్ని సంగతులను చూచెను. ఆయన నాకు ఒక ప్రత్యక్షతననుగ్రహించును నేను చూచాను. ఆయన పునరుత్తానము తరువాత చాలామంది ఆయనతో కూడా ఉండిరి. నీ రొమ్మున ఆనుకొనియున్నక ఇతనికి (యోహానుకు) ఏమి సంభవించునని వారు ప్రశ్నించిరి.
"నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమయితే మీకేమి?" అని ఆయనడిగెను.
అపుడు ఒక బోధ బయలువెళ్ళినది. ఎంత తేలికగా అది ప్రారంభమగునో చూచారా? యేసు వచ్చు వరకూ, లేదా ఆయన రెండవ రాకడ వరకూ యోహాను మరణించడని వారు సిద్ధాంతము పుట్టించిరి.
యేసు ఎన్నడూ ఆ విధంగా పలకలేదు. "నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమయితే మీకేమి?" అని ఆయన ప్రశ్నించెను.
అతడు పరలోకమునకు ఆరోహణుడగుటను మనము చూతుము. ప్రభువు రాకడ వరకు జరుగబోవు సంగతులనన్నింటినీ అతడు చూచెను. జరుగబోవు వాటినన్నింటినీ చూచెను. యోహాను దాదాపు తొంబది సంవత్సరములు జీవించి చనిపోయెను. స్వాభావిక మరణమును పొందెను. (అపొస్తలులతో ఇతడొక్కడే ఆలాగు చనిపోయెను) పత్మసు ద్వీపములో నుండి పరవాసిగా నుండిన తరువాత ఇది జరిగెను.
26ఒక గొప్ప సంగతి యున్నది. (వారు నల్లబల్లను క్రిందికి దించివేసిరను కొనుచున్నాను) ఈ ప్రముఖ సంగతిని చెప్పుముందుగా దీనిని నేను నొక్కి చెప్పగోరుచున్నాను. ఓ! ఇది అద్భుతము! ఇది చాలా అద్భుతమగు అధ్యాయము.
ఆ తరువాత అధ్యాయము ఈ ముద్రలను విప్పుటతో ఆరంభమవును. ఈ సంగతిని మనము దాటిపోయి బైబిలులోని ఆ యా చోట్లకు వెళ్ళవలెను. ఆ ముద్రలు విప్పబడినపుడు వాటిలోని మర్మములను మనము చూచెదము. అవి చాలా మహిమకరములు. ఆత్మ సంబంధమగు విటమినులు (spiritual vitamins) సమద్ధిగా యున్నవి.
27కొన్ని ప్రాముఖ్యమగు విషయములను నేను మీ ఎదుటికి తీసికొని రావలెనని కోరుచున్నాను. జీవులను చూచాము. (4వ అధ్యాయము చివర) యోహాను ఆ నిబంధన మందసమును చూచి గమనించెను. ఇశ్రాయేలీయులు సాగిపోవుచుండగా వాటినెట్లు ఏర్పాటు చేసిరో గమనించారా? జీవులను అక్కడ చూచాము. ఈ జీవులు దేవదూతలు కావని గ్రహించాము. మనుష్యులు కారు, అవి కెరూబులు. పాత నిబంధనలోని మందసములోని వీటిని మనము కనుగొందుము. క్రొత్త నిబంధనలో వీటి చూతుము. మరల ప్రభువు వచ్చినపుడు వీటిని కనుగొందుము. కెరూబులు కృపా సింహాసనమును కావలకాయుచున్నవి.
పాప పరిహారము పొందిన వ్యక్తి తప్ప మరెవరును ఆ కరుణాపీఠమును సమీపించజాలరు. అదొక్కటే మార్గము. రక్తము ప్రోక్షింపబడును. అది కరుణా పీఠము. కాని ఆ రక్తము ప్రోక్షించబడిన తరువాత అది తీసివేయబడిన యెడల అది తీర్పు సింహాసనమగును.
GEN 2:17
28దేవుని తీర్పులను ఎవరు తాళగలరు? మనము కృప కొరకు మాత్రమే చూడవలెను. తీర్పు కొరకు కాదు. ఆయన యొక్క నీతి, న్యాయములను మనము సమీపించజాలము. ఎందుకనగా ఆయన న్యాయవంతుడు. ఆయన తన మాటను నిలబెట్టుకొనును. తన మాటను ఆయన తప్పుడు. నీవు దానిని తిను దినమున నిశ్చయముగా మరణించెదవు అని చెప్పెను. ఆయన న్యాయమును ఎవరు తాళగలరు? నాకు ఆయన న్యాయ విమర్శలో నిలబడు ధైర్యము లేదు. ఆయన కృప కొరకే నేను మొరపెట్టెదను. దేవుని కృపయే నాకు కావలెను. కరుణా పీఠము మీద రక్తము ప్రోక్షించబడినది.
ఆలయమును శుద్ధీకరించు కాలము ఒకటి రానైయున్నది. ఆ కరుణా పీఠము మీద నుండి రక్తము తొలగిపోయిన వెంటనే తీర్పు ప్రారంభమగును.
ఇపుడు ఆ సమయమును మనము సమీపించుచున్నాము. ఈ కాలములో దానిని మనము ఎదుర్కొనుచున్నాము. పరిశుద్ధాలయమును పవిత్రపరచెదరు. భూమి మీదికి తీర్పు రాబోవుచున్నది. చూచారా? రక్తము అక్కడున్నంత కాలము దేవుడు భూమిని నాశనము చేయడు. రక్తము అక్కడునంత కాలము దేవుని ఎదుట పాపిగా ఎవరూ ఉండరు. అందరూ మంచివారే. ఎందుకనగా అందరికొరకును అచ్చట ఒక పరిహారమున్నది. కాని నీవు ఆ పరిహారమును స్వీకరించుటలో ఆయన విఫలమయినచో నీవు పాపి వగుదువు. నీవు ఆ కృపను దాటి పోయెదవు. ఆయన సన్నిధిలో నిలబడలేవు. నీకు నీవే తీర్పుతీర్చుకొందువు. కాని ఆలయము శుద్ధీకరింపబడు కాలము వచ్చుచున్నది. కరుణా పీఠము మీద నుండి రక్తము పోవును. అపుడు దేవుని ఉగ్రత భూమి మీదికి దిగును. దేవుడు మన పట్ల కృప చూపును గాక! ఆ దినము మనము దేవుని కృపను పొందని వారముగా ఉండకుందుము గాక!
NUM 1:53•
NUM 2:3,10,18,25
29నేను ఆత్మ సంబంధముగా దీనిని అన్వయించగోరుచున్నాను. నా చేతితో దానిని గీయుదును. ఇశ్రాయేలీయులు దిగిన పాళెమునకు నాలుగు మూలలున్నవి. వారు మందసమును మధ్యలో యుంచిరి. గుడారమునకు నలువైపుల ఇశ్రాయేలీయులలోని నాలుగు గోత్రములవారుండిరి. మూడు నాలుగులు పన్నెండు. ప్రతి గోత్రమునకు ఇక ప్రధాని యున్నాడు.
అందులో ఒకడు రూబేను. అతడెప్పుడూ దక్షిణంగానే ఉండెడివాడు. అతడు ఆ గోత్ర ప్రధాని. ఎఫ్రాయీము పశ్చిమమున ఉండెను. అతనికి మూడు గోత్రములు సహకరించెను. అది ఎద్దు. తూర్పున యూదా ఉండెను. అది సింహము. ఉత్తరమున దాను ఉన్నాడు. అది పక్షిరాజు. ఇపుడు గమనించండి. వారిని మీరు గుర్తుంచుకొన్నారా? మీకు వారందరూ బాగా గుర్తుందురు. వారి పటములు గీసి చూపించాము. పక్షిరాజు, ఎద్దు, మనిషి , మరియు సింహము.
NUM 2:3•
1KGS 2:4•
REV 5:5
30ఇపుడు గమనించండి. యూదా తూర్పు ద్వారమును కావలి కాయుచున్నాడు. యూదా గోత్రము యొక్క సింహము క్రీస్తే. తూర్పు మేఘములలో నుండి అతడు దిగి వచ్చును. ఆ ద్వారము గుండా ప్రవేశించును. యూదా గోత్రపు తూర్పు ద్వారము నుండి ఆయన వచ్చును. యూదా గోత్రపు సింహము ఆయనే.
ఈ ఉదయము వర్తమానములో దానికి మనము చూచెదము. ఇంకా ఆయన యూదా గోత్రపు సింహముగాను, దావీదు యొక్క చిగురు గాను, వేరుగాను యున్నాడు. దావీదు నిత్య రాజు.వెయ్యేండ్ల పరిపాలనలో దావీదు సింహాసనము మీద క్రీస్తు కూర్చొనును. ఆయన నిత్య రాజు. దావీదులో ఒక తప్పిదమునూ లేదు. హల్లెలూయా! దావీదు ఒక్కసారి కూడా తప్పిపోలేదు. ఆలాగున దేవుడు వాగ్ధానము చేసెను. దావీదు ఒక్కసారి కూడా విఫలుడవలేదు.
"ఈ రోజు ఆ యూదా న్యాయాధిపతులు ఎక్కడున్నారని?" మీరు ప్రశ్నించవచ్చును.
ఆయన యొక్క సంతానమింకాయున్నది. శరీరరీత్యా క్రీస్తు ఆయన కుమారుడు. దావీదు ఎల్లపుడూ సింహాసనాసీనుడైయున్నాడని బైబిలు చెప్పుచున్నది. అది నిజము. క్రీస్తే ఆ యూదా గోత్రపు సింహము. అందులో నుండియే దావీదు వచ్చెను.
31కరుణా పీఠమును కావలికాయువారున్నట్లు మనము చూడగలము. వారు కరుణా పీఠమును కాయుచుండిరి. ఏదీ దానిని ముట్టజాలదు. గోత్రముల వారిని దాటితే గాని ఆ కరుణా పీఠము యొద్దకు ఎవరూ రాజాలరు. ఆ కరుణా పీఠమునకు హాని జరుగకుండా చూచుటకు ఇశ్రాయేలీయులున్నారు. వారు అందుకొరకు తమ ప్రాణములను కూడా అర్పించ సిద్ధమవుదురు. అది పాత నిబంధన క్రమమని మనకు తెలియును. దాని కొరకు ప్రతి ఇశ్రాయేలీయుడు తమ జీవితములను అర్పించుటకు ముందున్నారు.
క్రొత్త నిబంధన క్రమములో కూడా దానినే మనము చూచెదము. కరుణా పీఠమునకు కావలి వారున్నారు. ఓ! మీరు దానిని గ్రహించగలరనుకొనుచున్నాను. కరుణా పీఠమునకు ఇంకా కావలి యున్నది. ఇంకా కావలివారున్నారు. ఆ కావలి వారుర మత్తయి, మార్కు, లూకా, యోహానులు, అపోస్తలుల కార్యముల గ్రంథమునకు కావలి కాయుచున్నవి. అపోస్తలుల మధ్య పరిశుద్ధాత్మ కార్యములు బయటపడినవి. అవి క్రొత్త నిబంధనలోని కార్యములు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను వ్రాసిన వార కరుణాపీఠమును కావలికాయు చున్నవారే. ఈనాడు పరిశుద్ధాత్మను వారు చూపించుచున్నారు. మత్తయి, మార్కు , లూకా, యోహాను సువార్తలలోని ప్రతి లేఖనము ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నిజ సువార్తను, పరిశుద్ధాత్మ యొక్క కార్యమును బలపరచును.
ISA 7:14•
MATT 1:18,21-23•
MATT 28:19•
ACTS 2:38
32దానిని మనము దాటిపోయిన యెడల ఇక మనమెట్టి వారమో చెప్పనక్కర లేదు. నిజమయిన వర్తమానమును పరిశుద్ధాత్మ బలపరచును. అపోస్తలుల కార్యములు 2:38లో మనము ఇట్లు చూచెదము, "మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను."
ఈనాడు వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామమును ఉపయోగించి బాప్తిస్మమిచ్చుచున్నారు. అందుకు లేఖనాధారము లేదు. దానికి వెనుక గాధ లేదు. దానిని కావలికాయునది ఏమీ లేదు. మత్తయి దానిని చెప్పెననవచ్చును. దానికి మత్తయి కావలికాసెనందురు. మత్తయి 28 చూడమందురు. 1:18లో ఇట్లు చెప్పెను:
…యేసు క్రీస్తు జన్మవిధమెట్లనగా ఆయన తల్లియైన మరియ యోసేపుకు ప్రధానము చేయబడిన తరువాత, వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను.
ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను.
అతడు ఈ సంగలను గూర్చి ఆలోచించుచుండగా ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యేసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది.
పరిశుద్ధాత్మ మరియు తండ్రియగు దేవుడు ఒకే వ్యక్తి కావలెను లేదా ఆయనకు ఇద్దరు తండ్రులున్నారా? చూచారా? మీరు గమనించండి.
ఆమె యొక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.
దేవుడు మనకు తోడై యుండునుగనుక ఆయన ఇమ్మానుయేలనబడెను. ఆయనే దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు ఒకే పేరున్నది. (యేసు క్రీస్తు) తప్పు చేయకుండా ఆ గవినిని కావలికాయును.
33కొద్ది రోజుల క్రితం షికాగోలో జరిగిన సంగతి చెప్పెదను. షికాగో సేవకుల సమాఖ్య ముందు జరిగెను. పరిద్ధాత్మనన్ను రాత్రియందు లేపి ఇట్లనెను, "కిటికీ ప్రక్క నిలబడు." "సేవకుల గుంపు వారు నీకు అల్పాహారము ఇవ్వబోవుచున్నారు" గాని "నీవు జాగ్రత్తగా ఉండవలెను. ఎందుకనగా వారు దీనిని గూర్చి నీతో వాదించుదురని" ఆయన చెప్పెను.
"ప్రభువా, నీకు వందనములని చెప్పాను. అదెక్కడ జరుగునో ఆయన నాకు చూపించెను.
నేను వెళ్ళి కొందరు సేవకులకు ఇది చెప్పాను. సహోదరులు కారల్ సన్, టామీ హిక్స్‌లకు చెప్పాను. మీరు ముందు సిద్ధపరచిన స్థలములో కాక మరోచోట ఇది జరుగునని చెప్పాను. డాక్టర్ మియాడ్ ఎట్లు కూర్చొని యుండునో చెప్పాను. ఒక వర్ణ సోదరుడు ఎట్లు వచ్చునో, ఏ విధముగా కూర్చొనునో అంతయూ చెప్పాను.
34నీవెందుకు ఆ గందరగోళములోనికి వెళ్ళుచున్నావని నా కుమారుడు ప్రశ్నించెను.
"నేను వాదమునకు వెళ్ళుట లేదు గాని పరిశుద్ధాత్మ అభిషేకముతో వెళ్ళుచున్నానని చెప్పాను. దేవుని వాక్యము ఆ కరుణాపీఠమును కాయుచున్నది. ఆయనక్కడుండును."
మేమచ్చటికి వెళ్ళాము. వారు అసలు నన్ను ఏదయినా అడిగే తరుణము రాక ముందే పరిశుద్ధాత్మ నాతో, "ఇదే నీవు చెప్పవలసిన సమయమనెను."
అంతట వారితో ఇట్లన్నాను, "మీరిక్కడ ఎందుకున్నారో నాకు తెలియును." "సహో॥ హిక్స్ మరియు సహో॥కార్ల్‌సన్ ఈ క్రైస్తవ సమాఖ్యకు అధిపతులు." "నిన్న గాక మొన్న పరిశుద్ధాత్మ నాకు అక్షరాలా ఈలాగు చెప్పలేదా? మీకు ఆ చోటు దొరకదు. వేరొక చోట సమావేశమగు దురని చెప్పాను." "ఆ ఉదయము నేను ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చొందురని చెప్పానో ఆలాగే కూర్చొని యున్నారు." "యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము గూర్చి మీరు నాతో వాదించవలెనని వచ్చారు."
35పరిశుద్ధాత్మ దేవుని వాక్యమును తీసికొని దానిని బయలుపరచి, దానికి అర్థము చెప్పును. అది ఒక త్రిత్వవాదుల గుంపు. వారందరూ ఆ బల్ల క్రింద నుండి ఒకరితో ఒకరు కరచాలనము చేయుచుండిరి. వారి బుగ్గల మీద నుండి కన్నీరు కారుచుండెను. యేసు క్రీస్తునామములో బాప్తిస్మము పొందుటకు డెబ్బది రెండు మంది అచ్చటకు వచ్చిరి.
కరుణా పీఠమునకు కావలివారున్నారు. పరిశుద్ధాత్మ కరుణా పీఠమును కావలికాయుచున్నది. మనము ఖచ్చితంగా చెప్పవలెను. అక్కడ గొప్ప బోధకులు కూర్చొనియున్నారు. మత్తయి మార్కు, లూకా, యోహానులు క్రొత్త నిబంధనకు కావలివారుగా ఉన్నారు. వారందులోని ప్రతి కార్యమును బలపరచుచున్నారు.
ఈ ఉదయకాలపు వర్తమాన మొదటి భాగములో అదే నేను చెప్పాను. సువార్తను సంరక్షించువారున్నారు. చూచారా? సువార్తను ఏది కావలికాయునో, చూడండి. దానిని అచ్చటనే యుంచండి.
36పాత నిబంధనలోని వారు కరుణాపీఠమును కావలికాయుట చూచాము. మత్తయి, మార్కు , లూకా, యోహాను మొదలగు వారు. కరుణా పీఠమును సంరక్షించుటకు యూదా గోత్రపు సింహము తన ప్రాణమును కూడా పెట్టినది. ఆయన యొక్క స్వరక్తము ప్రోక్షించబడినది. ఈ దినము ఆయన మహా జయశాలిగా అక్కడ నిలబడి యున్నాడు. ఒక దినమున ఆయన తూర్పు నుండి దిగివచ్చును. మనమాయనను చూతుము.
REV 5:1
37మనము త్వరపడుదము. ఎందుకనగా బాప్తిస్మపు కార్యక్రమమున్నది. ఈ ఏడు ముద్రల గ్రంథము ఏమిటి? ఎంతో గొప్పది! దానిని గూర్చి ఎట్లు చెప్పబడినదో మీరు గమనించారా? ఆ గ్రంథమునకు వెనుక ఏడు ముద్రలున్నవి. ఇపుడు దేవుడు మనకు సహాయము చేసి ధైర్యము ననుగ్రహించుగాక? దానిని నేడో, రేపో మీకు నేను తెలియజేయుదును. చూడండి. ఇది వాక్యములో వ్రాయబడలేదు. వాక్యము యొక్క వెనుక ముద్రించబడినది. ఆ గ్రంథము ఈ ఏడు ముద్రల ద్వారా ముద్రించబడినది. ప్రకటన గ్రంథం మొత్తంలో అది అతి గొప్ప అధ్యాయములలో ఒక్కటిగా యున్నది. చూడండి:
మరియు లోపటను వెలపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై యుండు వాని కుడి చేత చూచితిని (ఈ ఉదయము దానిని మనం చదివాము. ఏడు ముద్రలతో అది ముద్రించబడినది. అవి దేవుని మర్మములు)
EPH 1:1-3
38అది ఏమిటి? ఇపుడు గమనించండి. ముగించబడిన ఒక పనిని ముద్ర చూపించును. దానిని పరీక్షించి, నిరూపించి ఆ తరువాత ముద్రించుదురు. మనకు మన రక్షణ సంచకరువు ఇయ్యబడినది. పరిశుద్ధాత్మ ద్వార ముద్రించబడినాము. అదే మన రక్షణ యొక్క సంచకరువు.
ఒక్క నిమిషం వెనక్కు వెళ్ళుదం. ఇక్కడ ఒక లేఖనమున్నది. నేను చాలా వ్రాసి యుంచాను. కాని వాటినన్నింటినీ చెప్పే సమయం లేదు. కాని ఒక క్షణం ఎఫేసీ పత్రిక చూద్దాం. ఎఫేసీ 1వ అధ్యాయము చూద్దాం. మీరు నిజ భావమును గ్రహించగలరు.
దేవునిచిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో నున్న పరిశుద్దులును …
గుర్తుంచుకొనండి. ఎఫెసులో ఉన్న వారిని ఉద్ధేశించి ఇది వ్రాసెను. ఎఫెసులో ఉన్నవారు క్రీస్తుకు నమ్మకస్థులు. పౌలు వారికి బోధించి వారిని పెంచెను. సువార్తతో వారిని పోషించెను.
ఎఫెసులోనున్న పరిశుద్ధులును, విశ్వాసులను.
అనగా వారు ముందే క్రీస్తులో యుండిరి. మనమెట్లు క్రీస్తులోనికి వెళ్ళగలము? "ఒకే ఆత్మ ద్వారా మనమందరము ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము," అదే క్రీస్తు శరీరము.
EPH 1:4,5,12,13
39మన తండ్రియైన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక! మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడు గాక! ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
ఇపుడు దానిని గూర్చి ఆలోచించండి. సమస్త పరలోక కృపతోను, ఆశీర్వచనముతోనున మనలను ఆయన దీవించెను. క్రీస్తు యేసునందు మనము సమకూడి యున్నాము. విశ్వాసులముగా ఏర్పరచబడిన సంఘముగా, బయటకు పిలువబడిన వారిమిగా ప్రత్యేకించబడినాము. ఆయన తన పరిశుద్దాత్మ ద్వారా మనలను ముద్రించెను. మన కొరకు భవిష్యత్తులో దాచి యుంచిన సంగతులన్నింటినీ ఇపుడాయన బయలుపరచుచున్నాడు. మనము ఏడు ముద్రలను చూద్దాం.
ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించి తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైనదయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్థోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ఏర్పరచుకొనెను.
ఎంత అందమగు ఆలోచన!
EPH 1:13,14
40ఒక్కనిమిషము చదువుదము. ముఖ్యంగా 12, 13, 14 వ వచనములు చదువుదము.
మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి.
ఆయన యందు స్వాస్థముగా ఏర్పరచెను. మీరును సత్య వాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసముంచి వాగ్థానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి.
"మీరు విశ్వాసముంచిన తరువాత." ఓ నా బాప్తిస్టు సోదరుడా, అది కాదని ఎట్లనగలవు? నమ్మినపుడే బాప్తిస్మము పొందితినని నీవు చెప్పుచున్నావు గదా? "నమ్మిన తరువాతనే నీవు వాగ్ధానము చేయబడిన పరిశుద్ధాత్మతో ముద్రింపబడెదవు." గ్రహించుము.
దేవుని మహిమకు కీర్తికలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్త్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
EPH 1:5
41దేవుడు సమాప్తము చేసిన దానిని ముద్ర చూపించుచున్నదని మనము గ్రహించాము. అది ముందే స్థిరపరచబడినది. ఆది నుండియే ప్రతి విశ్వాసిని దేవుడు వాగ్ధానముతో ముద్రించెను. ఎందుకనగా జగత్తు పునాది వేయబడకముందే మనలను ఆయన దత్తపుత్రులనుగా నిర్ణయించెను. ప్రపంచము అప్పటికి ఇంకా ప్రారంభముకాలేదు. అది మనకెంతో గొప్ప నిరీక్షణనిచ్చును. నిలకడగాను, నిశ్చలముగాను మన ఆత్మను లంగరు వేయగలము. మన ఆత్మ ఆటుపోటులకు గురి కాదు. క్రీస్తులో లంగరు వేయబడును. అది నిశ్చయమగు నిరీక్షణ. మనలను యేసుక్రీస్తు ద్వారా దత్తపుత్రులనుగా జగత్తు పునాది వేయబడక మునుపే ముందుగా నిర్ణయించెను. ఓ! అద్భుతము! దేవుడు ముగించిన ఈ కార్యమంటే నాకు చాలా ఇష్టము.
ROM 8:30•
EPH 1:5
42మీకు మరియొక లేఖనము చూపించెదను. "ఆయన ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని పిలచెను. ఆయన ఎవరిని పిలచెనో వారిని నీతిమంతులనుగా తీర్చెను." ఎవరిని నీతిమంతులనుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఆదిలోనే దేవుడు తన యొక్క అనంతమగు మనస్సులో తన సంఘమును ముందుగా చూచి దానిని ముందుగా నిర్ణయించెను. యేసుక్రీస్తు ద్వారా దత్త పుత్రులనుగా చేసెను. కాలాంత మందు ఆయన వారికి నిత్య జీవమిచ్చును. ఎంత చక్కని సంగతి! నెవిల్ సోదరుడా, ఇది నాకు ఎంతో బాగున్నది. యేసు రక్తము ద్వారా దత్తత.
EPH 1:14•
EPH 4:30
43ఇంకా ముందుకు గమనించుదము. మనము గొర్రెపిల్లతో కూడా ముందుగా నిర్ణయింపబడితిమి. పరిశుద్ధాత్మయే మన ముద్ర. సంచకరువు అనగా ఇంకా ముందు చాలా రానున్నదని అర్థము. దాని యొక్క సంచకరువును మాత్రమే ఇపుడు మనము కలిగి యున్నాము. సంచకరువనగా బయానా చెల్లించుట. (ఎంత చక్కగా ఉన్నది!) బయానా వలన అది నిలబడి యుండును. దానికి భద్రత యుండును. అది లంగరు వేయబడును. ఎవరూ దానిని తాకజాలరు. అది మన దత్తతకు సంచకరువు. ఆమేన్. ఇపుడు పరిశుద్ధాత్మయే మనకు దేవుని యొక్క సంచకరువుగా హృదయములలో నిలచి యున్నది. (ముద్రించబడె) దత్త పుత్రులు ఎదురుచూచుచున్నారు. వారు దేవుని కుమారులు మరియు కుమార్తెలు!
ROM 8:22,23
44వెంటనే మరియొక లేఖనమును మనము తీయుదము. దీనిని ఇక్కడ వ్రాసియుంచాను. రోమా 8:22 అది చక్కగాయున్నది. నిన్న చదివాను. వాటిలో కొన్ని లేఖనములను ఇక్కడ వ్రాసి యుంచాను.
సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని యెరుగుదుము.
అంతేకాదు. ఆత్మ యొక్క ప్రథమ ఫలములనొందిన మనము కూడా స్వీకత పుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచూ మనలో మనము మూలుగుచున్నాము.
ఓ! మీరు దానిని చూచారా? సృష్టి యావత్తు మూలుగుచున్నది అని పౌలు చెప్పెను. సమస్తము మూలుగుచున్నది. ఆ చెట్లు ఏ విధంగా పోరాడుచున్నవో చూడండి. ఆ పూలు బ్రదుకుట కొరకు ఎట్లు సతమతమవుచున్నవో చూడండి. మంచు వాటిని ముక్కలు చేయుచున్నది. దేవునికి మహిమ గీతములు పాడు కొమ్మలు ఆ చెట్టు మీద ఎట్లు శ్రమపడుచున్నవో చూడండి. చూచారా? సర్వ సృష్టి , ప్రతి జంతువు, ప్రతి పక్షి , తన శత్రువు నుండి పారిపోవుటకు త్వరపడుచూ మూలుగుచున్నవి. దూరంగా పోవలెనని కోరుచున్నవి. మనము కూడా వాటితో పాటు మూలుగుచూ, మన శరీర విమోచన కొరకు ఎదురుచూచుచున్నామని పౌలు చెప్పెను.
ROM 8:15
45ఎన్నో సంవత్సరముల నుండి అవి ఎదురుచూచుచున్నవి. మన స్వాస్థమునకు సంచకరువు ఇపుడు దొరికి యున్నది మనమేమి కలిగి యున్నాము? దేవుని యొక్క రుజువు మనలో జీవించుచున్నది. దేవుడు మనతో కూడా ఉన్నాడను రుజువు కలిగియున్నాము. దేవుడు మనలను విడిచిపెట్టలేదను రుజువు మనము కలిగియున్నాము. మనము ఆయన వారము. ఆయన మనవాడు. ఎందుకనగా ఇపుడు మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మకు నివాసముగా యున్నాము. (మన శరీరములు) అబ్బా, తండ్రీ అని మొరపెట్టుచున్నాము. దానిని దూరము చేయునది మరేదియూ లేదు. మనము క్రీస్తులో లంగరు వేయబడితిమి.
చెట్లకు అది లేదు. ప్రకృతికి అది లేదు. అయినా గాని మనము వాటితో కూడా మూలుగుచున్నాము. ఎందుకనగా దత్తపుత్రత్వమును ఇంకా పూర్తిగా మనము పొందుకొనలేదు. అయితే దాని యొక్క సంచకరువు మనకున్నది. పరిశుద్ధాత్మను మనము పొందియున్నాము. అది మన సంపూర్ణ దత్తత మరియు పూర్తి రక్షణ యొక్క సంచకరువుగా యున్నది. ఓ! ఎంత బాగున్నది! అది నాకు ఇష్టము.
ఇపుడు మన సంచకరువు మనకున్నది. పూర్ణ దత్తత కొరకు మన ఆత్మలు మూలుగుచున్నది. లోకము యొక్క సంగతుల నుండి మనము విమోచనపొంది దేవుని యొక్క కుమారులముగా, కుమార్తెలముగా యున్నాము. ఎటువంటి ప్రజలముగా మనముంచవలెను? దానిని గూర్చి ఆలోచన చేయండి!
PHIL 3:21•
COL 3:4•
1JN 3:2
46సంపూర్ణ దత్తత కొరకు మనము ఎదురుచూచుచున్నాము. ఎపుడిది జరుగును? మొదటి పునరుత్థానములో, అపుడు మన శరీరములు మారిపోవును. ఈలాగున ఉండవు. ఆయన యొక్క మహిమ శరీరమును పోలిన శరీరమును కలిగి యుందుము. ఏలయనగా ఆయనను ఉన్న రీతిగా చూచెదము. మనము ఆయన వలె యుందుము. ఆయన ప్రత్యక్షమైనపుడు మనమును ఆయన పోలికలో ప్రత్యక్షమగుదుము. ఆయన వంటి శరీరమును మనము కలిగియుందుము. అది మహిమన్విత శరీరము. సమస్త శోధనలు, పోరాటములు, జీవిత శ్రమలు తొలగిపోవును. ఆ చిన్న పొగమంచు విడిపోవును. మరెన్నడును అది రాదు.
ఈ భూ సంబంధమగు ఆలయములలో ఇపుడు మనము మూలుగుచున్నాము. సంపూర్ణ రక్షణ కొరకు ఎదురుచూచుచున్నాము. మంటి ఆలయములలో మనమొక స్వరమును వినుచున్నాము. మనము ఎంతో ఎత్తుకు ఎదిగియున్నామని చెప్పబడినది. ఆమేన్. నా మాట గ్రహించారా? డాచ్ సోదరుడా, మన కొరకు బయానా చెల్లించబడినది. అదే సంచకరువు. ఒకప్పుడు మనము లోకపు సంగతులను ప్రేమించాము. ఒకప్పుడు మనం పాపము చేశాము. లోక కార్యముల యందు ఇష్టత చూపాము. దేవునిని లెక్క చేయలేదు. ఆయనకు దూరస్థులమై యుంటిమి. దేవుడు లేనివారముగా, క్రీస్తు లేని వారముగా, లోకములో యుంటిమి. ఇపుడు దేవుడు తన పరిశుద్ధాత్మను పంపి, దాని ద్వారా మనలను లేపెను. వీటన్నిటి నుండి దూరమైతిమి. ఇపుడు మనము సంచకరువును కలిగి యున్నాము. మనము మరణములో నుండి జీవములోనికి దాటి యున్నామని ఎరుగుదుము. ఆమేన్.
ఇక్కడ నేను దీనిని చూపించుటకు ప్రయత్నించుచున్నాను. మామూలు పాపి ఈ అడుగున ఉండును. క్రైస్తవుడు ఇంత కంటె పైనున్నాడు. అతడు అన్నింటికీ పైన యుండును. అదే అతని యొక్క రక్షణ సంచకరువు.
47దర్శనములను గూర్చి మీరు ఆలోచించండి. ఈ విషయములో దేవుడే నా తీర్పరి. నేను నా ఉద్ధేశపూర్వకముగా ఏదీ చూడను. నేను చూచిన దానినే చెప్పెదను. ప్రజలు అట్టి సేవకు సిద్ధంగా లేరు. కావున దానిని మీరు చూడవద్దు. ఇటు వైపుకు చూడండి. నేను మరల ఎన్నడయినా ఈ పనిలోనికి వచ్చినచో సువార్తికునిగానే వచ్చెదను. కాని ఇటు చూడండి. ఈ పరలోక సంబంధమగు సంగతులను గమనించండి. ఈ పరిధులలో మీరు జీవించండి. మానవుని ఆలోచనలను అతీతంగా మీరు వెళ్ళండి. వీటన్నిటిని దాటిపోయెదరు. దాని వలన మీరు మరో చోటికి వచ్చెదరు.
EPH 1:14
48కాని ఇపుడు చూడండి. పరిశుద్ధాత్మ ద్వారా ఇపుడు మనకు మన స్వాస్థము యొక్క సంచకరువుక దొరికి యున్నవి. ఎందుకనగా మనము లోక సంగతులకు పైగా లేపబడియున్నాము. మనము లోకముతో పరుగిడుచున్ననూ, లోకము కంటె ఎత్తున జీవించుచున్నాము. ఓ నెవిల్ సోదరుడా, దేవుడు కృప చూపి సజీవ దేవుని యొక్క సంఘమునకు ఇది దయచేయును గాక!
మనము కట్టడమును సంఘమని తలంచుచుందుము. పై రూపమును చూచి ఇది చాలా అందముగా యున్నదని చెప్పుదుము. లోకము యొక్క సంగతులతో దానిని పోల్చి చూచెదము. వారి కంటె మంచి బాస్కెట్ బాల్ టీమ్ మనకున్నదనుకొందుము. ఇది, అది మనకున్నదని తలంచుచుందుము. లోకము యొక్క వైభవము మరియు మెరుపుతో దీనినెట్లు పోల్చగలము? సువార్త ఒక మెరపు కాదు. అది ఒక ప్రకాశము. మెరుపు మరియు ప్రకాశము మధ్య తేడా యున్నది. చూచారా?
49సభ్యులను మనము మార్చుకొంటూ వెళ్ళుచుందుము. దాని వలన ఏమి ప్రయోజనము? మెరిసేటట్లు మనము దానిని చేయుచున్నాము. చాలా పెద్ద కట్టడములు నిర్మించుచున్నాము. చాలా గొప్ప శిఖరములు కట్టుచున్నాము. మెతడిస్టు వారి కంటె గొప్ప దానిని, బాప్టిస్టువారి కంటె గొప్ప దానిని మనము నిర్మించవలెనని కోరుచున్నాము. మనందరము కాథలిక్కు వారితో పోటీపడుచున్నాము. బంకో గేమ్సు, పార్టీలు, విందులు, వినోదములు మొదలగునవి ఏర్పరచుచున్నాము.
ఈ సంఘము లోకముతో ఎన్నడునూ పోటీ పడజాలదు. మసొనిక్ లాడ్జితో మీ సంఘము ఎట్లు పోటీపడగలదు? వారి వినోదములకు ఎవరు సాటి రాగలరు? అది వారి పని. వారికి పోటీగానీ వేమి చేయ ప్రయత్నించవద్దు.
50కాని వారికి లేనిది ఒకటి మనము కలిగియున్నాము. మనకు యేసు ఉన్నాడు. వారికి అవసరమయితే వారే ఇచ్చటికి వచ్చెదరు. క్రీస్తులో నిలచియుండుము. మనము యేసును కలిగియున్నాము. వారిచ్చటకు రానంత వరకు యేసును పొందజాలరు. మనమచ్చటకు వెళ్ళిన యెడల యేసును పొగొట్టుకొందుము.
మెరయుటకు ప్రయత్నించవద్దు. ప్రకాశము! నీకు నీవుగా ప్రకాశించజాలవు. నీ ద్వారా అది ప్రకాశించవలెను. చూచారా?
చిన్న మిణుగుడు పురుగు తనంత తానుగా ప్రకాశించదు. దానిలో ప్రకాశించునది ఒకటి యున్నది. దాని లోపట ప్రకాశము కలిగించునది ఒకటి యున్నందున అది ప్రకాశించుచున్నది. అది ప్రకాశించక ఉండజాలదు.
పరిశుద్ధాత్మ కూడా ఆ విధంగానే యుండును. మనము వింతగాను, వేరుగాను, అందరికన్న మరేదోగాను కనబడుటకు ప్రయత్నించుట కాదు. భక్తిగల జీవితము జీవించండి. మీ ద్వారా దేవునిని జీవించనీయుడి. సువార్త కొరకు అదే మెరయును. చూచారా? మెరుపులేదా ప్రకాశత. మెరిసేదంతా నాణ్యమని తలంచరాదు. మెరిసే దానిని చూచి అందరూ ఆకర్షింపబడుదురు. కాని మెల్లగా ప్రకాశించునది చూడుడి. పరిపక్వతతో కూడిన తియ్యదనమున్నది అదే పరిశుద్ధాత్మ.
PHIL 3:21
51ఇపుడు మనము పునరుత్థానము కొరకు ఎదురు చూచుచున్నాము. మీకిపుడు అర్థమైనదా? (అర్థమైన యెడల "ఆమేన్" చెప్పండి.) సంచకరువునకు నేను భావము చెప్పాను. మనముపైకి లేపబడియున్నాము గనుక మరణములో నుండి జీవితములోనికి దాటి యున్నాము. మనకు మనము లేవనెత్తబడుట కాదు గాని లోక సంగతులకు పైగా ఎత్తబడితిమి. మనము అందరినీ ప్రేమించుచున్నాము. దేవుడు మనము ప్రేమించుచున్నాడని మనకు తెలియును. మనము మన జీవితములను గమనించుకొనవలెను. పరిశుద్ధాత్మను చూడవలెను. మనము ఈ లోక విషయములను గూర్చి పట్టించుకొనము. చూచారా? మీరు లోకమును గాని, లోక సంగతులను గాని ప్రేమించినంత కాలము దేవుని యొక్క ప్రేమ మీలో యుండదు. చూచారా? కాని మీరు దానికంటె పైగా జీవించినపుడు మీ స్వాస్థమును మీరెరుగుదురు. మీరు మీ సంపూర్ణ విమోచనను పొందు దారిలో ఉన్నారు.
మొదట మనము యేసును చూడవలెను. అంతవరకు అది రాదు. ఆయన వచ్చినపుడు మనము కూడా ఆయన వంటి శరీరమును పొందుదుము. ఆయనవలె తయారగుదుము. మంచిది.
52ఇక్కడ మనము నశించిన దానిని ఒక దానిని చూచుచున్నాము. ఎందుకనగా బైబిలు ఆలాగున చెప్పెను ఈ గ్రంథములో ఆలాగున్నది) దానిని విమోచించెను. మనము ఎందుకు విమోచించబడితిమి. నశించిపోతిమి గనుకనే. నీవు విమోచించబడుటకు ముందు పోగోట్టుకొనబడుట జరుగవలెను. ఆ తరువాతనే విమోచన కలుగును. మనలను విమోచించునది ఒకటి కావలసియున్నది. మనకు గల స్వాస్థమునంతటినీ తిరిగి విడిపించెను. దాని భావము ఏమనగా ఒకపుడు ఒక దానిని కలిగియుంటిమి గాని ఇపుడది లేదు. కాని ఈ గొర్రెపిల్ల వచ్చి దానిని విడిపించెను. చూచారా? మనము మనకున్న దానిని పోగొట్టుకొంటిమి.
GEN 2:20
53ఇపుడు గమనించండి. మనమేమి పోగోట్టుకొన్నాము? ఆదామునకు నిత్యజీవము ఇయ్యబడినది. ఆ చెట్టు ఫలమును తినినంత కాలము అతనికి నిత్యజీవముండెను. ఆదాము భూమిని స్వతంత్రించుకొనెనని మనము ఎరుగుదుము. అతడు భూమి మీద ఒక దైవము వలె యుండెను. భూమి అతనిదే. సమస్తము అతని చేతికి ఇయ్యబడినది. అతడు దానితో తన కిష్టమైన ప్రకారము చేయగలడు. దానికతడు పేరు పెట్టెను. దానిని పిలచెను. తన కిష్టమైన రీతిగా చేసెను. అతడు నిజంగా దేవుని కుమారుడు.
అయితే పడిపోయిన తరువాత ఆదాముతన హక్కును పొగొట్టుకొని స్వాస్థమును కుదువ పెట్టెను. దానిని సాతానుకు అతడు కుదువపెట్టెను. సాతాను దాని హక్కును తీసికొనెను. ఆదాము చాలా నిస్సహాయునిగా యుండెను. ఎందుకనగా తన హక్కును తిరిగి పొందజాలలేకపోయెను. తన హక్కును కోల్పోయోను. సాతానుదానిని అక్రమంగా ఆక్రమించుకొనెను. దానిని స్వతంత్రించుకొని భూమి మీద దైవముగా మారిపోయెను. ఆలాగని బైబిలు చెప్పుచున్నది. దానిని సాతాను స్వతంత్రించుకొనెను. దానిని నిజంగా చట్టరీత్యా పొందలేదు గాని ఆక్రమించుకొనెను. దానిని మీరిపుడు గమనించారా? దానిని సాతాను వశపరచుకొనినది. తన చేతిలో దాచుకొనినది. దాని చేతిలో మరణమున్నది. భూమి దాని చేతిలో యున్నది. ఈ లోకము దానికే చెందును. ప్రతి దేశము దానికే చెందును. సర్వలోకమును వాడు ఏలుచూ వశపరచుకొనుచున్నాడు. లోకములో ఉన్న సమస్తమును వశపరచుకొనుచున్నాడు. లోకములో ఉన్న సమస్తమును వశపరచుకొనుచున్నాడు. సాతాను ఆలాగున చేయుచున్నాడు.
MATT 5:5•
2COR 4:4
54కాని మనము లోక సంబంధులముకానందుకు దేవునికి వందనములు చెల్లించుచున్నాము. చూచారా? అది గుర్తించవలెను. సంఘము వాడి వశములో లేదు. లోకమును మాత్రమే వాడు వశపరచుకొనియున్నాడు. వారు అపవాది సంబంధులని, వాడు ఈ లోకమునకు దేవుడని చెప్పుకొనుచున్నాడు. అది నిజమేనని యేసు కూడా పలికెను. వాడు ఈ లోకపు దేవుడై యుండి జనుల నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేయుచున్నాడు. వాడే ఈ లోకమునకు దేవుడు. ఆయన పరలోకపు దేవుడు. ఇపుడిది ఆయనకు స్వయంగా చెంది యుండలేదు. దీనికి ఆయన యజమాని కాడు. అది కుదువ పెట్టబడినది.
ఆదాము దీనిని, ఇందులో యున్న సమస్తమును కుదువ పెట్టెను. అసలు నిత్య జీవము మరియు భూలోక స్వాస్థము మనదే. మత్తయి 5లో యేసు చెప్పెను: "స్వాతికులు ధన్యులు వారు భూమిని స్వతంత్రించుకొందురు." చూచారా? ఇపుడది మనవశములో లేదు.
చూడండి. అది ఆదామునకు గాని అతని సంతానము వారెవరికీ గాని చెందలేదు. ఆదాము యొక్క సంతానము కూడా అంతయూ పూర్తిగా పొగొట్టుకొనెను. ఇది ఆదాము సంతానము కాదు. ఈ లోకమును ఎంత శంగారముగా మనము దిద్దుటకు ప్రయత్నించినా గాని, ఎంతో పెద్ద భవనములు నిర్మించి ఏదేదో చేయుటకు ప్రయత్నించినా గాని ఇది మాత్రము ఆదాము యొక్క సంతతికి చెందదు. ఇది ఆదాము యొక్క సంతానమునకు వెళ్ళదు. ఎందుకనగా సాతాను దీనిని చేజిక్కించుకొని లోపల పెట్టుకొని తాళము వేసికొనినది. నిజము. దానిని ఆదాము కుదువ పెట్టెను.
55చాలా సంగతులు చెప్పుకొనవచ్చును. కాని మీ యొక్క సమయమును ఎరీ ఎక్కువగా నేను తీసికొనను. ఎందుకనగా మనకు బాప్తిస్మములున్నవి. సరే.
దానినతడు ఆక్రమించుకొనియున్నాడు గాని దానికి నిజంగా హక్కుదారుడు కాడు. సాతాను దాని యజమానుడు కాడు. చట్ట సమ్మతముగా పొందిన వాడు దానిని పొగొట్టుకొనెను. దానిని విడిపించవలసిన అవసరత యున్నది. సమీపబంధువు మాత్రమే దానిని విడిపించు హక్కును కలిగియున్నాడు. యేసు క్రీస్తు యొక్క కన్య మరియ జన్మలో దీనిని చూడగలము.
LEV 25:23,24
56ఇక్కడ నేను ఒక సంగతి చెప్పగోరుచున్నాను. మొదటగా మనము పొందవలసియున్న దానిని గూర్చి పాత నిబంధనలో మనము చూడగలము. (ఇక్కడ నేను వ్రాసి యుంచాను. లేవీ కాండము 25వఅధ్యాయములో యున్నది. లేవీకాండము 25:23 నుండి 24}. అందులో మీరు విడిపించు పద్ధతులను చూడగలరు. దానిని మీరు వ్రాసికొనండి. యెహోషువా ద్వారా దేవుడు భూమిని ఇశ్రాయేలీయులకు పంచి ఇచ్చెను. ప్రతి గోత్రమునకు, ప్రతి వ్యక్తికి ఇవ్వబడెను. అతని యొక్క స్వాస్థమును అతని పిల్లలు తీసికొనిరి.
ఒక వ్యక్తి తనకున్నదంతయూ పొగొట్టుకొని దరిద్రుడయి పోయెననుకొనండి. అతని సమీప రక్త సంబంధి మాత్రమే దానిని విడిపించగలడు. కాని అది చివరకు రాక తప్పదు. కొద్ది కాలము మాత్రమే దానిని అతడు పట్టుకొని యుండును. అది తిరిగి అసలు యజమాని యొద్దకు రావలసియున్నది. అది తన తండ్రికి ఇవ్వబడినదయినచో తప్పక అతనికే తిరిగి చెందును. రక్త సంబంధియగు బంధువు దానిని విమోచించును. రుణము చెల్లించు వరకు అది వారి యొద్ద ఉండును. కాని సరయిన వ్యక్తి వచ్చి, రుణము చెల్లించినపుడు అంతా విడిపించబడును.
LEV 25:23
57ఉదాహరణకు నాకు కలిగియున్నకొంత ఆస్తిని నేన పొగొట్టుకొన్నాను. లేదా నెవిల్ సోదరునికి అమ్మివేశాననుకొనండి. అతడు యూదా గోత్రమునకు లేదా మరో గోత్రమునకు చెందినవాడనుకొనండి. లేదా ఒక అన్యునికే అమ్మివేశాననుకొనండి. అతడు దానికి హక్కుదారుడు మరియు స్వంతవాడు అగును. అతడు వచ్చిదానిని దున్ని, పంట పండించి ఇంటికి తీసికొని పోవును. నిజంగానే అది అతనిదగును. కాని ఇశ్రాయేలు చట్ట ప్రకారము కుదువ పెట్టినది అతని స్వంతముకానేరదు. లేవీ కాండము 25వ అధ్యాయములో దానిని మీరు చదువగలరు. దానిని వారు చట్టరీత్యా పొందజాలరు. దానిని వారు పట్టుకొని యుందురు. అంతే.
58మరల నార కుమారుడుర బిల్లీ వచ్చి ఆ భూమిని కొనగోరెనను కొనండి.. మంచిది, అది నెవిల్ సోదరుని యొద్దనో, మరొకరి యొద్దనో ఉన్నదనుకొండి. ఇపుడు నా రక్త సంబంధి వచ్చెను. ఇతడు నా రక్తబంధువు. కావున దానినతడు ఇచ్చివేయవలెను. వెల చెల్లించబడిన పిదప ఇక అతడు ఇచ్చివేయవలెను. ఆ భూమికి ఇరవై ఐదు వేల డాలర్లు చెల్లించమని చెప్పిన యెడల ఆ వెల చెల్లించి దానిని తిరిగి పొందును.
సహో॥ టోనీ వచ్చి, "నెవిల్ సోదరుడా, బ్రెన్‌హాం సోదరుని ఆస్తిని నేను కొందును నాకు అమ్ముము" అని చెప్పినా ఆలాగున జరుగుటకు వీలు లేదు.
"అయ్యా! నేనది అమ్మను అని నెవిల్ సోదరుడనును."
" దానిని ఎంతకు ఇచ్చెదవు?"
" ఇరవై అయిదు వేల డాలర్లు."
"నీకు నేను ముప్పది అయిదువేల డాలర్లు ఇచ్చెదను. నీకు నేను కొంత ఇచ్చెదను."
"నీకు ఏమి కావాలో నేను పట్టించుకోను. నేను అమ్ముటకు ఇష్టపడుటలేదు. నేను దానిని ఉంచుకొండును."
కాని బిల్లీపాల్ వచ్చి, నా తండ్రి ఆస్తి నాకు కావలెను. గనుక "ఇదిగో ఈ ఇరవై అయిదువేల డాలర్లు తీసికో" అనగానే దానినతడు ఇచ్చివేయవలసినదే. అది అతని హక్కు, అది చట్టము.
హల్లెలూయా! క్రైస్తవులగు మీరు దీనిని గ్రహించగలరని నమ్ముచున్నాను. మనము భూమికి ఉప్పుగా ఉన్నాము. దేవుడు దీనిని తన కుమారులకు ఇచ్చెను. సమస్త సృష్టి మీదను, సర్వ జంతువుల మీదను, ప్రతి జీవము మీదను ఆయన మనకు అధికారమిచ్చెను. కాని మన తండ్రియగు ఆదాము దీనిని కుదువ పెట్టెను. సాతాను దానిని పొందెను. కాని అది ఎవరికి దక్కును? దాని యొక్క నిజమగు యజమానియగు దేవునికే చెందును. ఆయన దానిని చేసెను. ఆమేన్!
REV 5:3,4
59దానిని విమోచించగల యోగ్యుడు లేక యోహాను బిగ్గరగా ఏడ్చెనని మనము చదువుటలో ఆశ్చర్యము లేదు. అతడు తప్పకక యోగ్యుడైయుండవలెను. యోహాను ఇట్లనెను, "ఆ గ్రంథమును తీసికొనుటకు గాని, దానిని చూచుటకు గాని, దానిని విప్పుటకు గాని దానిలోని ముద్రలను తెరచుటకు గాని భూమి మీదను, భూమి క్రిందను, ఆకాశమందును, మరెచ్చటను ఎవరూ లేనందున బిగ్గరగా ఏడ్చెను." ఏ మనిషియూ లేడు.
ఇప్పుడు, దేవదూతలను అతడు ఏమీ చిన్న పుచ్చుట లేదు. గుర్తుంచుకొనండి. ఈ భూమి దేవదూతలకు ఇవ్వబడలేదు. ఇది మానవులకు స్వాస్థము. గాబ్రియేలు నిశ్చయంగా యోగ్యుడే. మిఖాయేలు యోగ్యుడే కావచ్చు. ఇంకా యోగ్యులండి యుందురు. కాని ఏ మానవుడు యోగ్యుడు లేడని చెప్పబడినది. చూచారా? యోహాను బిగ్గరగా ఏడ్చెను.
"అతడు యోగ్యుడు కానందున ఏడ్చెనని చాలామంది వ్యాఖ్యానించెదరు" గాని అది తప్పు.
అతడు పరిశుద్ధత్మవశుడై యుండెను. అతడు ఏ పొరపాటు లేనివాడు. కావున తాను అయోగ్యుడనని ఏడ్చుట కాదు గాని ఎవరూ యోగ్యులు లేరని ఏడ్చెను.
REV 5:5,6
60అంతట ఒక పెద్ద లేదా బలమగు దేవదూత వచ్చి "ఏడ్వకుము, యూదా గోత్రపు సింహము, (ఆమేన్) దావీదు వేరు. జయించెనని చెప్పెను. ఆమేన్. జయము పొందెనని అర్థము. గ్రంథము తీసికొనుటకు అతడు యోగ్యుడు!" ఆమేన్.
గుర్తుంచుకొనండి, ఈ సమయము వరకు ఈయనను అతడు చూడనే లేదు. ఎందువలన? ఆయన సింహాసనము మీద కూర్చొనియుండెను. దేవుని సింహాసనము. ఆయన మందిరములోపట యున్నాడు. ఈ సమయము వరకూ అతనిని ఆయన చూడలేదు. సింహము వచ్చునని ఆ యోహాను ఎదురు చూచుచుండెను గాని ఒక గొర్రెపిల్ల వచ్చుటను అతడు చూచి చాలా ఆశ్చర్యము పొందెను.
REV 5:5
61సోదరులారా, చూడండి. సాత్వికము ద్వారా, మాధుర్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము జయించెదము. ఏదో గొప్ప మేధావి వలన జయించము. కాని తన్ను తాను తగ్గించుకొనిన వానిద్వారానే జయించుదుము. క్రీస్తు దాసునిని ఒక వేళ అందరూ త్రోసివేయవచ్చును. కాని అతడే జయశాలి.
"అతడు జయించెను. అతడు గ్రంథమును తీసికొని దానిలోని ముద్రలను విప్పుటకు యోగ్యుడని చెప్పెను."
ఆ ఏడు ముద్రలలో ఏమున్నదో ఈ రోజు కాదు గాని మరి కొంత సమయము తరువాత చూద్దాం.
1PET 1:18
62విమోచనము గూర్చి కొద్దిగా చూద్దాం. మొదటగా ఈ విమోచించు వ్యక్తి యోగ్యుడై యుండవలెను. సరయిన వ్యక్తియై యుండవలెను. యేసుక్రీస్తు కన్యక గర్భమున జన్మించుట ద్వారా ఇది నెరవేరెను. ఆయన దేవుడై యున్నాడు. ఆయన దేవుడై యుండి మానవునిగా మారెను. ఆయన శరీరధారియైన దేవుడు. ఆయన యోగ్యుడై యుండవలెను. యేసుక్రీస్తు యొక్క రక్తము ఆయనను యోగ్యునిగా చేసెను. దానినిమీరు I పేతురు 1:18-20 వరకు చూచిన యెడలకనుగొందురు. మీరు వాక్యములు వ్రాసికొనవలెను. ఆయన యోగ్యుడై యుండవలెను. ఆయన యోగ్యుడే. ఎందుకనగా ఆయన మానవ రూపమును ధరించుకొనెను. ఆయన నరుడాయెను. దేవుడు మన రక్త సంబంధిగా వచ్చెను. యెహావా దేవుడు శరీరధారియై మన మధ్య నివసించి యోగ్యుడాయెను. ఇదిచాలా చక్కని భాగము. అందమగు దశ్యము. ఆమేన్.
ఆయన జయించెను. దేవుడు మానవ రూపమను ధరించెను. ఆయన భూమి మీదికి వచ్చెను. చిన్న శిశువుగా జన్మించెను. మన మధ్య నడిచెను. ఆయన తన పరిశుద్ధ రక్తము ద్వారా జయించెను.
63తన స్వంత ఆస్తిని విడిపించుటకై పాత నిబంధనలో ఒక వ్యక్తిక ఏమి చేయును? పది మంది పెద్దలను తీసికొని వెళ్ళిర గవిని యొద్ద నిలబడును. తాను చేయనైయున్న దానిని గూర్చి తెలియచేయును. పొగోట్టుకొనిన దానిని విడిపించబోవుచున్నట్లు చెప్పును. తానెవరో వారికి తెలియపరచుకొని సాక్షమును చూపించును. రూతు మరియు రక్త సంబంధియగు బోయజు గాధలో ఎంతో చక్కని దశ్యమును చూడగలము. (నేను ఇక్కడ చిన్నగా వ్రాసి యుంచాను. ఈ ఉదయము కొద్దిగా ఉద్రిక్తతగా యున్నందున మరచిపోకుండునట్లు ఇది వ్రాశాను) రూతు గాధను మనం ఈ మధ్య చూచాము. ఈ విశ్రాంతి గూర్చి మూడు దశలను మీరు గమనించవలెనని కోరుచున్నాను.
REV 5:3,5
64సంఘము యొక్క విశ్రాంతిని గూర్చి మీరు గమనించవలెనని కోరుచున్నాను. చక్కని సాదశ్యము. ఇపుడు చూడండి. "రక్త సంబంధియగు విమోచకుడు" అను ప్రసంగము విన్నారు. విమోచకుడగుటకు దేవుడు శరీరము ధరించెను. 5వ అధ్యాయములో ఆయనే యున్నాడు.
అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తిలేకపోయెను.
ఆ గ్రంథము విప్పుటకైనను, చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా
ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము. ఇదిగో, దావీదుకు చిగురై యూద గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. (ఆయన వైపే మనము చూచుచున్నాము)
RUTH 1:1-6
65గమనించండి ఇప్పుడు రూతు, నయోమి, బోయజులు చక్కని సాదశ్యము. కరవు సమయములో నయోమి సంఘమును విడిచిపెట్టి వెళ్ళిపోయినది. దేశమును విడిచిపెట్టినది. మోయబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండినది. ఆమె తనకున్నదంతయూ కోల్పోయినది. ఆమె భర్త ఎలీమెలెకు అక్కడుండగా చనిపోయినది. కావున అతని స్వాస్థము ఎవరి వశమో అయిపోయినది. ఆమె తిరిగి వచ్చునపుడు తనతో కూడా అందమగు మోయాబీయ విధవరాలిని వెంటబెట్టుకొని వచ్చినది. క్రీస్తుకు సాదశ్యముగానున్న బోయజు ఈమెను చూచి ప్రేమించెను. ఆమె కొరకు ఎదురు చూచెను. ఆమెను విడిపించగోరెను. తన సోదరుడగు ఎలీమెలెకు పొగోట్టుకొనిన దానిని అతడు మాత్రమే ఆమెను అతడు భార్యగా పొందగలడు. అది ఒక్కటే మార్గము.
RUTH 4:9,10
66తన ఇతర సోదరులు విడిపించగలరోలేదో అడిగెను. అతడు తనకంటె సన్నిహితుడని తెలిసెను. కాని అతడు విడిపించలేకపోయెను. కావున దేవుని యొక్కక ధర్మశాస్త్ర ప్రకారము ఖచ్చితంగా చేయుటకు వెళ్ళెను. అతడు గవినియొద్దకు వెళ్ళి చెప్పును విడిచెను. ఈలాగున బహిరంగముగా ప్రకటించెను. "ఈ రోజున నయోమికున్న దానినంతటినీ నేను విడిపించి యున్నాను. (నా సోదరుడు) ఎలీమెలెకు యొక్క ఆస్తినంతటినీ విడిపించి యున్నాను. ఇపుడు నేను ఆ తరువాత రక్త సంబంధినై యున్నాను. నేను మాత్రమే ఈమెను విడిపించగలవాడను. దానిని నేను చేసియున్నాను. నా కంటె ఇంకా ఎక్కువ సమీప బంధవు ఎరయినా యున్నచో ఇప్పుడు ముందుకు రావలెను." అతడు సహేతువును చూపించవలెను. లేని యెడల ఇక ఎన్నడునూ ఎవరునూ నోరు విప్పరాదు. ఆలాగున అతడు తన చెప్పును విడిచెను. దానిని సాక్షముగా చూపించెను. "నా సోదరుడు ఎలీమెలెకు యొక్క సమస్తమును విడిపించియున్నానని చెప్పెను." ఎందువలన? అతడు రక్త సంబంధియగు బంధువు. అతడు విడిపించగల సమీప బంధువు. ఎంత చక్కని దశ్యము! అది చాలా అందమగు గాధ.
ఈ సమయమంతటిలోను రూతు విశ్రాంతి పొందుచూ కనిపెట్టుచున్నది. ఏమి జరుగునో అని చూచుచుండెను. అతడు తిరిగివచ్చి సాక్షమిచ్చెను. అతడు రూతును స్వీకరించెను ఆమె అందమగు మోయాబీయురాలు. వారు కవివాహము చేసికొని ఆస్తిని అనుభవించిరి. ఎంత చక్కని గాధ!
RUTH 1:16•
RUTH 2:2,12
67రూతు గాధలో మూడు దశలున్నవి. రూతు తీర్మానము చేసినది. ఆమె తన స్వదేశమును విడిచి వెళ్ళవలెనో లేదో అను తీర్మానమును చేసికొనినది. (సంఘము వలెనె) రూతు సేవ చేసినది. ఆమె పరిగె ఏరుకొనినది. రూతు ఇపుడు విశ్రమించుచున్నది. (సంఘము) రూతు బహుమానము పొందినది. ఆ తరువాత అదే జరిగినది. (సంఘము నీకు బహుమానమిచ్చును)
MATT 5:5
68ఇప్పుడు, మనకు సమయము లేదు. బాప్తిస్మపు కార్యక్రమమున్నది. ఇపుడు పదకొండుపావు అయినది. వచ్చే ఆదివారము లేదా భవిష్యత్తులోని మరో ఆదివారము ప్రభుని చిత్తమయితే చెప్పుకొందము. ఏడు కొమ్ములు, ఏడు కన్నులు, ఏడు ముద్రలు, ఏడుపరిచర్యలు, ఏడు సంఘ దూతలు గూర్చి చూడండి. ఏడు నక్షత్రములు ఉన్నవి.
ఇక్కడ మొత్తం సంగతిని చూడవలెను. యోగ్యుడై యుండవలెను. యేసు మాత్రమే యోగ్యుడు. ఆయన రాకడలో మనము సంపూర్ణ విమోచనా ఆశీర్వచనమును అనుభవించెదము. సాత్వికులు భూమిని స్వతంత్రించుకొందురు. స్త్రీలు మరియు పురుషులు దేవుని కుమారులు గాను కుమార్తెలు గాను మారుదురు. సంపూర్ణ వెయ్యేండ్ల పాలన ఆరంభమగును. ఎంత చక్కని దృశ్యము!
REV 5:1,2,5,7
69బలమగు దూత బలమైన స్వరముతో పలికినది. "ఎవరు యోగ్యులని ప్రశ్నించినది. దీనిని విప్ప గల సమర్థులెవరు?"
అంతట పెద్ద ఈలాగు చెప్పెను, "ఏడువ వద్దు. యూద గోత్రపు సింహము జయించినది. యోగ్యత కలిగి యున్నది."
"ఆయన గ్రంథమును తీసికొని విప్పెను. ముద్రలను తెరచెను." ఏమి జరిగెనో ఆయన ఎన్నడునూ చెప్పనే లేదు. బైబిలు ద్వారా ఏడు ముద్రలు విప్పబడుట మనము చూచునపుడు ఏమి జరగినదో గమనించండి. ఇపుడు మనము ఈ ఏడుముద్రల గ్రంథములోనే యున్నాము. సంపూర్ణ మర్మమును పట్టుకొని యున్నాము. దేవుని యొక్క విమోచనా దీవెనలన్నియును మనకున్నవి. గుర్తుంచుకొనండి, ఆయనే గొర్రెపిల్ల. దానిని ఆయన మాత్రమే విడిపించెను. గుర్తుంచుకొనండి. ఆ గ్రంథము వెనుకన ముద్రలున్నవి. లోపట కాదు. దాని వెనుక ముద్రించబడినది. వ్రాత కలిగి లేదు. ఆ గ్రంథమును విప్పగలిగిన యోగ్యుడు ఆయన మాత్రమే. ముద్రలను ఆయన మాత్రమే. బయలుపరచగలడు. దానిని చేయకలిగిన వాడు ఆయనే.
70కావున ఇది ఒక విషయము… ఈ విషయములోనే వారందరూ తడబడుచున్నారు, దానిగురించి అది ఏమిటి, కాని ఆయన దైవ సంబంధమగు అర్థమును ఆయన మాత్రమే చెప్పగలడు. కాని అది వెనుక వైపునున్నది గనుక ఎవరూ ఏమీయూ చేయజాలరు. అది కేవలము ఆయనకు మాత్రమే చెందును. ఆ ఏడు మర్మములను ఆయన మాత్రమే బయలుపరచగలడు. ఇక్కడ దానిని చూడండి. అది విమోచనా సంబంధమైనదని తెలియుచున్నది. సంఘము విమో చింపబడియున్నది. విమోచింపబడవలసిన వారు ఎందరో యుండిరి.
మన నిండు హృదయములతో ఆయనను ప్రేమించుదము. మన చేతనయినదంతయూ చేయుదుము.
71ఒక రచయిత ఒక కథ వ్రాయుచుండెను. (నేనిక ముగించెదను. నెవిల్ సోదరునికి ఆరాధన అప్పగించెదను.) మీరు ప్రత్యక్షతను అనుభవించుచున్నారా? ఓ! అది నాకు ఇష్టము. ఈ ఉదయకాలమున దానిలోని మూడు వచనములను చూచాము. మరల తరువాత చూద్దాం.
దేవునిని కనుగొనుటకు ప్రయత్నించి వెదకుచున్న ఒక యువతిని గూర్చి ఒక రచయిత గాధ వ్రాయుచుండెను.
చాలా సార్లు మనము దేవుని కొరకు వెదకుచుందుము. దేవుని కొరకు చూచుచుందుము. ఎక్కడయినా దేవుడుండును. ఆయన ఎక్కడో పైన పెద్ద సింహాసనము మీద కూర్చొని లేడు. ఆలాంటి దేవునిని అందరూ నమ్ముదురు. ఆయన ఇచ్చట ఎక్కడో ఒక మహా సింహాసనము మీద కూర్చొని యున్నాడంటే అందరూ వచ్చెదరు. ఆయన పలాని పట్టణములో, పలాని చోట కూర్చొనియున్నాడంటే ఆ దేవునిని చూచుటకు అందరును తరలి వచ్చెదరు. అటువంటి దేవునిని అందరునూ నమ్ముదురు. ఇక విశ్వాసము అక్కరలేదు. విశ్వాసము యొక్క అవసరత ఇక ఉండదు. అదే వెయ్యేండ్లపాలన. కాని ఈ రోజున ఆయన పిలచుచున్నాడు. అది చాలా మర్మయుక్తముగా కనబడుచున్నది. చూడలేనంత చీకటిగా యున్నది. ఏమి చేయవలెనో మీకు తోచుట లేదు. కాని మనము విశ్వాసము ద్వారా నమ్ముచున్నాను. దానిని మనము విశ్వసించుచున్నాము. ఆ కారణము చేతనే ఆయన ఈ విధంగా చేసెను. అందరూ దానిని చూచెదరు.
72దేవుడు ఒక సింహాసనము మీద కూర్చొని యున్నాడనుకొనండి. లేక దేవుడు ఒక ప్రత్యేక స్థలములో యున్నాడనుకొనండి. అపుడు మనందరమును వెళ్ళి "దేవా. నాకిది చేయవా?" అని అడుగుదుము.
"అవును, చేయుదునని" ఆయన చెప్పును. అంతటితో అది జరుగును. చూచారా? దేవుడా లాగుండవలెను అనుకొనుచున్నారు? అటువంటపుడు విశ్వాసమునకు చోటుండదు. ఇక విశ్వాసము వలన ఏమీ ప్రయోజనము లేదు.
EPH 2:8
73ఈ లోకములోని ప్రతి మనిషి క్రైస్తవుడయినచో ఎట్లుండును? అందరూ ఆత్మ నింపుదల గల క్రైస్తవులయిన ఎడల ఎట్లుండును? ఇక మనకు విశ్వాసమనునది అవసరమే ఉండదు. కాని మనము విశ్వాసము ద్వారానే రక్షింపబడియున్నాము. అందుకే కొందరు దానిని నిరాకరించుచున్నారు. మనము విశ్వాసమును సాధకము చేయవలసియున్నాము. ఇపుడు దానిని మీరు అర్థము చేసికొన్నారా? మీరు ఇవతలి వైపునకు రావలెను. చూచారా? ముందు నీవు చెడ్డ వ్యక్తివైనపుడు ఆ తరువాత మంచి వ్యక్తినయితినని చెప్పగలవు? చూచారా? అబద్ధమున్నపుడే సత్యమనగా ఏమిటో తెలియును. అంతా సత్యమే అయితే ఇది ఎట్లు అర్థమగును? మామూలుగానే యుండును. చూచారా? విశ్వాసము, సత్యము అనునవి నిజమైనవి మరియు గొప్పవి.
74మనము అనుకూల, ప్రతికూల పరిస్థితులు రెండింటినీ ఎదుర్కొనవలసి యుండును. అది ఆ విధముగా కొనసాగుచుండును. చెడ్డ దినములు నీకు ఎదురయినపుడే మంచి రోజులనగా ఏమిటో అర్థమగును. మంచి ఆరోగ్యమనగా ఏమిటో నీవు తెలిసికొనవలెనన్నచో నీకు కొద్దిగా వ్యాధి అనగా ఏమిటో ఎరిగి యుండవలెను? చూచారా? నీవు లోయలలో బడి వెళ్ళినపుడే పర్వతపు శిఖరముపైన ఉండుట అనగా ఏమిటో అర్థమగును. ఆరోగ్యము, సంతోషము అనునవి దేవుని నుండియే కలుగును. దేవుడిచ్చు సంతోషమునకు అంతము లేదు. కనుక అంతవరకు మనము అనుకూల, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనవలసి యుండును.
దానిని అర్థము చేసికొనినవారందరూ "ఆమేన్" చెప్పండి.
75ఈ బాలిక తాను వెళ్ళిన ప్రతిచోటను దేవుని కనుగొనుటకు ప్రయత్నించినది. ఆమె ఆలయములను దర్శించినది. ఎన్నో సంఘములకు వెళ్ళినది. కాని దేవుని కనుగొనలేదు. ఒక రోజున ఆమె దారిన వెళ్ళుచుండగా ఒక ముసలి వాడు ఎదురయ్యెను. అతని వీపు మీద ఒక పెద్ద ఆలయమున్నంతగా ఉన్నది. అతడు దారిన పోవుచుండెను. ఆమె అతనిని చూచి ఇట్లనెను, "నీ వెనుక అంత మూట, బరువు ఉన్నది గదా?" "అది నిన్ను అణగద్రొక్కును."
"అది నన్ను అణచజాలదు. ఎందుకనగా అది నిర్మించబడిన పునాదిని నేనే," అన్నాడు. అది ఆయనే.
ప్రార్థించుదము
76ఓ, యుగముల బండా, ఒక ఆలయములో ఉండుటనుబట్టి మేమెంతో సంతోషించుచున్నాము. మేము బండ మీద అనుకొనియున్నాము. ఆ బండ కాగితము కంటెను తేలికగా యున్నదని చెప్పెను. ఆ బండ నెమ్మదిగా కదలుచుండగా ఆ చక్కని గంటలు మ్రోగుచుండెను. ఓ యుగముల బండా! నీ కృపలో మమ్మును దాయుము. మార్గములో మమ్ము మోసికొని పొమ్ము. మా జీవన గమనములో మా హృదయములునిండు ఆనందముతోను, స్తుతులతోను నింపబడునట్లు కృప చూపుము. మార్గమంతటిలోను ఆ విధంగా ఉండునట్లు సహాయము చేయుము.
వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ ఈ ఉదయమున మమ్ము దర్శించినందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. అది వచ్చి వాక్యమును నిజముగా మార్చి యున్నది. మా యొక్క లోటు పాట్లను క్షమించుము. మేము చేసిన, చెప్పిన తప్పులను క్షమించుము. తండ్రియగు దేవా, మేము మంచి క్రైస్తవులముగా ఉండునట్లు సహాయము చేయుము. నీ కృప మా మీద నిలచియండవలెనని ప్రార్థించుచున్నాను.
ప్రభువా, అది నీ చిత్తమైన యెడల మేము త్వరలోనే ఈ స్థలమునకు తిరిగి వచ్చి మిగిలిన అధ్యాయములను అధ్యయనము చేసి ఏడు ముద్రలను గూర్చి చెప్పుకొనగలుగునట్లు కృప చూపుము. ప్రభువా, ఆ సమయము కొరకు మేము ఎదురుచూచుచున్నాము. ఆలాగు మమ్మును చేయనిమ్ము. తండ్రీ , దానిని మాకు అనుగ్రహించుమని ఈ చిన్న సంఘమగు మేము ప్రార్థించుచున్నాము. దేవుని యొక్క గొప్ప సంగతులను మేము అర్థము చేసికొనగలుగునట్లు చేయుము. ప్రభువా, ఇందుకు మాకు అర్హత లేదు. కాని మా హృదయములు ఆకలిగొనుచున్నవి. దాని కొరకు కనిపెట్టుకొని యున్నవి. దానిని నీవు దయచేయుమని ప్రార్థించుచున్నాము.
77మాకు నమ్మకమగు దేవునిచే పంపబడిన సంఘ కాపరియగు నెవిల్ సోదరుని కొరకు ప్రభువా మేము ప్రార్థించుచున్నాము. నీవాయనకు సహాయము చేసి ఆయనను దీవించుమని, ఆయన యొక్క మధురమగు భార్యను, పిల్లలను దీవించుమనియు ప్రార్థించుచున్నాను.
ఈ ట్రస్టీలు మరియు పెద్దలు,ఈ సంఘమునకు వచ్చు ప్రతి ఒక్కరిని దీవించుమని ప్రార్థించుచున్నాను. మేము మా కొరకే కాదు గాని, నీ నామములో ప్రార్థించు ప్రతిఒక్కరి కొరకును ప్రార్థించుచున్నాను. దేశములో యున్న ప్రతి స్నేహితుని కొరకును ప్రార్థించుచున్నాను. వారందరూ ఇచ్చటకి వచ్చుటకు సిద్ధముగా యున్నారు. తండ్రీ, దీనిని బట్టి నీకు నేను వందనములు చెల్లించుచున్నాను.
యేసు రాకనుత్వర పెట్టుమని నేను ప్రార్థించుచున్నాను. రాత్రి గాని, పగలు గాని లేని రోజున మేమందరము కూడుకొనునట్లు కృప చూపుము. అపుడు కాలమునకు అవధులుండవు. నిత్యత్వములో మేమందరము నిరంతరము నిలచియుందుము. ప్రభువా, దానిని దయచేయుము.
ప్రభువా, నిన్ను రక్షకునిగా ఎరుగని వారు ఈ ఉదయమున ఇచ్చట ఎవరైనా యున్నచో ఏడు ముద్రల మర్మముగల గ్రంథమును చేతిలో పట్టుకొనియున్న గొర్రెపిల్లను వారు ఎరుగునట్లు చేయుము. దేవా, మేమందరము నిన్ను ఎరుగునట్లు చేయుము. భవిష్యత్తులో మేము ఈ ముద్రలు విప్పబడుటను చూచెదము. దానిని గూర్చి దేవుడేమి చెప్పుచున్నాడో చూచెదము. దేవుని మహిమార్థమై ఆయన కుమారుడగు యేసు క్రీస్తు నామము ద్వారా అడుగుచున్నాము.
78మన శిరములు వంచుదము:
"బ్రెన్‌హాం సోదరుడా, ప్రార్థించుచుండగా నన్ను గుర్తు చేసికొనుము. నా కొరకు ప్రార్థించుము" అని చెప్పువారెవరైనా యున్నారా? దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను, నిన్ను, నిన్ను దీవించును. దేవుడు నీకు మేలు చేయును. దాదాపు రెండు డజనుల చేతులు, అంతకన్న ఎక్కువ పైకి లేచినవి.
ఓ ప్రభువా, నీవు వారి చేతులను చూచియున్నావు. వారి కోరికను నీవెరుగుదువు. వారి హృదయములో ఉన్నది నీకే తెలియును గాని నాకు తెలియదు. ప్రభువా, నీ మంచితనమును, నీ కృపను వారికి బయలుపరచుమని ప్రార్థించుచున్నాను. వారిని క్షమించుము. వారి వ్యాధిని స్వస్థపరచి వారి శరీరములను బాగు చేయుము. ఈ కూటము మీద, ఈ జనుల మీద ఇపుడు అభిషేకమున్నది. తండ్రీ, నీ కార్యమును చేయుము. ఆ గొప్ప పరలోకపు దేవుడు వీరిని అభిషేకించి దైవ సన్నిధిలో ప్రతి ఒక్కరిని దీవించునట్లు కృప చూపుము. "మా హృదయములు మనలో మండుచుండలేదా?" అని చెప్పుకొనుచూ ఇక్కడ నుండి వెళ్ళగలుగునట్లు ఈ ఉదయము కృప చూపుము. దయచేయము, ప్రభూ.
79ఇపుడు నేను అలసిపోయాను. బలహీనుడనై నా స్వరము పోయినది. దేవా, నీ స్వంత బలము కొరకు ఇపుడు నేను ప్రార్థించుచున్నాను. నీవు నాకు సహాయము చేయవా? నీవు నన్ను బలపరచవా? ప్రభువా, ఆ చిన్న గాయమును బాగు చేయుము. దేవుని యొక్క పరిశుద్ధ నూనె దానిని తాకునట్లు చేయుము. ప్రభువా, ఈ గాయమునే గాక ప్రతి వారి గాయమును తాకుము. ప్రభువా, నీ ఘనత, నీ మహిమ నిమిత్తము మేము జీవించగోరుచున్నాము. దయచేయుము. రోగులను, శ్రమపడుచున్న వారిని బాగు చేయుము. ప్రభువా, నీవే మహిమ పొందుము. ఎంతో కాలము ఈ కూటములు ఇక ఉండవనియు అవి గత అనుభవములుగా మిగిలిపోవుననియు మేము గ్రహించుచున్నాము.
తండ్రీ, ఇపుడు దీవించుము. యేసుక్రీస్తు నామము ద్వారా అందరం కలిసి ప్రార్థించుచున్నాము. తండ్రీ, ఈ ఉదయమున ప్రభువైన యేసు నామములో బాప్తిస్మము పొందబోవువారి గూర్చి ప్రార్థించుచున్నాము. వారికి పరిశుద్ధాత్మ బాప్తిస్మమును దయచేయుము. గొప్ప మహిమ మరియు ఘనత ఇమ్ము. తండ్రీ, దయచేయుము. ఇపుడు సమస్తమును నీకే సమర్పించుచున్నాము.
తండ్రీ, దానంతటితో పాటు నన్ను నేను అప్పగించుకొనుచున్నాను. ప్రభువా, నన్ను మరువకుము. ఇపుడు నాకు సహాయము చేయుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.