ప్రకటన, 5వ అధ్యాయము #2
VGR COUNT -254 1మరలా ఈ ఉదయకాలమున మందిరమునకు వచ్చుటకు మరియు నలుదిశలు మంచి సువార్తను ప్రకటించుటకు భాగ్యము లభించెను, కావున ప్రభువైన దేవుడు మనకు ఎంత మంచివాడుగా ఉన్నాడో తెలియుచున్నది.
గత ఆదివారము ఆ దర్శనమును గూర్చి నేను చెప్పినప్పుడు మీలో అనేకమంది ఇచ్చటున్నారు. (ఆ సర్పమును మధ్య భాగమున తుఫాకీతో కాల్చి చంపిన దానిని గూర్చి దర్శనమది). ఈ ప్రసంగ వేదిక నుండి ఆ దర్శనమును గూర్చి చెప్పిన తర్వాత ఇరువది నాలుగు గంటలలో ఆ దర్శనము అక్షరాల అలాగే నెరవేరినది. ప్రభువు ఏమి చేసెనో అది మహిమకరముగా ఉండెను. నాకు ఇప్పుడు ఏబది రెండు సంవత్సరముల వయస్సు, నా జీవిత కాలమంతటిలో ఆ దర్శనములలో ఒక్కటి కూడా విఫలమవ్వుటను నేను చూడలేదు. ఆ దర్శనములో నేను చూచినది చూచినట్లుగానే అక్షరాల అలాగే పరిపూర్ణముగా నెరవేరినది. అది నాకెంతో చక్కని అనుభూతిని యిచ్చుచున్నది. ఎంతో చక్కని అనుభూతిని నాకు కలిగించెను.
2ఆ నిందారోపణను గూర్చి, ఆ విషయములన్నింటిని గూర్చి నేను చెప్పుచుంటిని. లేదా అది నిందారోపణ కాదు గాని యదార్ధ హృదయముగల, దేవుని భయముగల వ్యక్తినుండి ఇది ఉద్భవించెను. ఎట్లనగా నా పరిచర్య కొద్దిగా… చాలా సహజాతీతముగా వారికి కనబడుట వలన వారు నన్ను ప్రభువైన యేసుక్రీస్తుగా తలంచుటకు ప్రారంభించిరి. కాబట్టి అది ఒక చిన్న ఉపదేశముగా మారుటకు ప్రారంభించెను. కాని అవన్నీ వెంటనే నిలిచిపోయినవి. అందుకొరకు ప్రభువుకు నా కృతజ్ఞతలు.
ఆ నిందారోపణ నుండి నాయంతట నేను విడిపింపబడిన వెంటనే మరియు ప్రభువే దానిని చూచుకొనునని, ఆ విషయమును ప్రభువు చేతికి అప్పగించిన పిదప, వెంటనే అది, అనగా ఇరువది నాలుగు గంటలలో అదంతా ముగిసిపోయెను. కాని ఆ విషయము నాకు ఉద్రిక్తతను కలుగజేసి నన్ను కొంచెం ఇబ్బందిపరచెను. కాని కొంత సేపటి తర్వాత దానినుండి నేను విడిపింపబడితిని. నిజంగానే అది నాకు విభ్రాంతిని కలుగజేసెను, కాని ఇప్పుడు నేను చక్కగా, సంతోషంగాను ఉన్నాను.
3. ఈ వారమున మనకు గొప్ప విజయాలు లభించాయి. ఒక విషయమును గూర్చి నివేదికను సమర్పించాలని నేను కోరుచున్నాను.
ఇప్పుడు, ప్రభువు నాకేమి చెప్పెనో దానిని నేను శ్రద్ధగా ఆలకించి యుండిన యెడల అది అలాగు జరిగి ఉండదు. దానిని ఆయన నాలుగు సంవత్సరముల క్రితమే నాతో చెప్పెను. నేను దీనిని గూర్చి చెప్పేటప్పుడు నా భార్య ఇచ్చట సభ్యుల మధ్య కూర్చొనియుండెను. నా కుమారుడు కూడా ఇచ్చట ఈ వేదికపై కూర్చొని యుండెను. మరియు నేను మరలా, మరలా చెప్పుచున్న ఆ విషయమును అనేకమంది కూడా ఆలకించుచూ ఉండిరి. "హృదయ రహస్యములను వివేచించే కార్యము ఇదే చివరిసారిగా ఉండునని" నేను చెప్పాను. అర్ధమైనదా? అదెంతో… దేవునికి నేను బహు సన్నిహితముగా జీవించుటకు ప్రయత్నించుట వలన, అట్లు బహుగా నేను ప్రయత్నించుచుండగా, ప్రజలు వారేమి ఆలోచించుచున్నారో వారికే తెలియనంతగా, ఒక రకమైన, భిన్నమైన అభిప్రాయము వారిలో కలుగునట్లుగా అది తీసుకొని వచ్చెను. నా ప్రయత్నమును వారు భిన్నమైన కోణములో తీసుకొనిరి.
4అదే సమయమున మనము ఎదుర్కొనిన ఆ ఆదాయపు పన్ను వ్యాజ్యం. ఆ వ్యాజ్యం విషయములో ప్రభువు నాకు చెప్పిన దాన్ని నేను ఆలకించియున్నయెడల, దానిని గూర్చి అసలు ఏ ఇబ్బంది ఉండేది కాదు. నేనెల్లప్పుడూ ఏమి చేస్తానో అట్లే అది అచ్చట ఉండెను. నేను ఆయన మాటకు అవిధేయతను చూపునప్పుడెల్లా నేను అలాగే ఇబ్బందికి గురియగుదును. ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించి, అట్లే ఆయనతో కూడా నేను సన్నిహితముగా నడుచుచూ ఉంటే ఏ ఇబ్బంది ఉండదు.
పిదప నా పరిచర్య…కొన్ని సమయములలో ఈ పరిచర్య చాలా సహజాతీతమైనదిగా ఉండుటవలన… నా హద్దును మీరి దాటిపోవుదునేమోనని కూడా నేను భయపడెదను. కాని ఇప్పుడు, నేను చెప్పే మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దు… నేనేమి చెప్పుచున్నానో దానిని ప్రతీ ఒక్కొక్కరు సరిగ్గా అర్ధం చేసుకోండి. ప్రభువును విడిచిపెట్టి నేను మార్గమును తొలగిపోయెదనని నేను చెప్పుట లేదని మీలో ప్రతీ ఒక్కరు అర్ధంచేసుకోవలెను. కాని నేను చెప్పే భావమేమనగా, అలాంటి సహజాతీతమైన విషయములను గూర్చి మరియు హృదయ రహస్యములను వివేచించువంటి వాటిని గూర్చి ఇక మీదట వివరిస్తూ వ్యక్తపరచవలెనని నేను కోరుటలేదు.
ఇప్పుడు, ఈ సమయమున ప్రభువు మనపట్ల కృపాకనికరములను కలిగివున్నాడు. ప్రవచనా వాక్యమును ప్రవచించు వరముగల సహోదరుడు నెవిల్‌ను ప్రభువు లేపెను. అలాగే ఆయన హిగ్గిన్‌బోతం సహోదరుడిని మరియు ఇంకా అనేకమంది సహోదరులను సంపూర్ణమైన ఆత్మ వరములను గలవారిగా లేపెను. సంఘములో ఆత్మ వరములద్వారా అద్భుతములు జరుగునట్లుగా ఆయన చేయుచున్నాడు.
5ఒక సాక్ష్యమును నేను మీకు చెప్పనివ్వండి. ఓపల్ వీవర్ అనే ఒక సహోదరి ఉన్నది. ఈ ఉదయమున ఆమె ఇచ్చట మన మధ్య ఉన్నదో లేదో నాకు తెలియదు. ఓపల్ సహోదరీ నీవు ఇచ్చట ఉన్నావా? ఆమె ఎచ్చట ఉన్నదో నేను కనుగొనలేకపోవుచున్నాను. ఓ, మంచిది, కొన్ని సంవత్సరముల క్రితము ఆమె కేన్సర్ వ్యాధితో మరణించు తరుణములో ఉండెను. ఆ కేన్సర్ క్రిములు స్త్రీల గ్రంధులలో మరియు ఆమె యొక్క మూత్రపిండములలో వ్యాపించెను. ఆమె ఇంకా ఒక్కరాత్రి మాత్రమే జీవిస్తారని కూడా వారు చెప్పిరి. అంతగా ఆమె ఆరోగ్యం క్షీణించిపోయెను. కావున ఆమె కొరకు నేను ప్రార్ధించుటకు ఆమె వద్దకు వెళ్ళినప్పుడు ఒక దర్శనము వచ్చెను. ఆ దర్శనము ప్రకారముగా ఆమె సంపూర్ణముగా స్వస్థతను పొందుకొనెను. అది పదునైదు సంవత్సరముల క్రితము జరిగెను. ఆమె "స్వస్థత పొందుకొని అనేక సంవత్సరములుగా మనమధ్యకు వచ్చుచూ, వెళ్ళుచూ ఉన్నది.
6ఆ తర్వాత ఒకానొక దినమున మరలా వేరొక రూపమున అస్వస్థతకు గురైనది. ఆమె గొంతులో నొప్పి ప్రారంభమై గొంతులో నుండి రక్తము పడుచున్నది. కావున వెంటనే వైద్యుడిని సంప్రదించమని ఆమెకు సలహా ఇవ్వబడినది. (ఆ సమయమున నేను కెనడా దేశమున ఉన్నాను). కాబట్టి ఆమె, నెవిల్ సహోదరునికి ఫోన్‌చేసి పిలిచెను. నెవిల్ సహోదరుడు మరియు హిగ్గిన్ బోతమ్ సహోదరుడు అచ్చటకు వెళ్ళిరి. ఈ ఉదయమున హిగ్గిన్ బోతమ్ సహోదరుడు ఇచ్చట లేడని నేను తలంచుచున్నాను. రూపెర్డ్ పాగ్గిన్ బోతం సహోదరుడు మనమాజీ ధర్మకర్తలలో ఒకరు. ఒక మంచి సహోదరుడు. అతడు ఇచ్చట ఉన్నాడా?
కాబట్టి వారు ఆమెకు ప్రార్థించుటకు వెళ్ళిరి. ఆమెకు వారు ప్రార్థించినప్పుడు… .ఆమె యొక్క గొంతు రక్తనాళములో నుండి రక్తము శ్రవించుచు, ఉమ్మి ఊంచినప్పుడు నోటినుండి రక్తము పడుచుండెను. ఆవిధముగా ఆమెకు ఎన్ని దినములనుండి, ఎంత కాలమునుండి పడుచున్నదో నాకు తెలియదు. ఒకవేళ రెండు లేదా మూడు దినములో తెలియదు. ఆమె కొరకు నెవిల్ సహోదరుడు ప్రార్థించినప్పుడు, ఇకప్పటి నుండి ఒక్క చుక్క రక్తము కూడా ఆమె నోటినుండి పడలేదు. అది నిజము.
7మరలా ఆమెకు నోట్లో పై భాగమున రెండు కండలు పెరిగినవి, దద్దుర్లు లేదా ఏదోకటి వచ్చినవి… ఒకవిధమైన కురుపులు లేదా గడ్డలు వంటివి లేదా అలాంటివి ఆమె నోట్లో పై భాగమున ఏర్పడి ఆమెను బాధపెట్టుచుండెను. ఆ గడ్డలనుండి ఆమెకు ఏ ఉపశమనం కలుగకపోగా, వాటివలన…"ఆ గడ్డలు హిక్కరీ గింజలో సగమంత ఉండునని" ఆమె చెప్పెను. అవి ఆమె నోట్లో అలాగే కొన్ని దినములుగా ఉండెడివి.
హిగ్గిన్‌బోతం సహోదరుడు… అతనియొక్క జర్మనీ దేశపు పేరును నేను సరిగ్గా ఉచ్చరించలేకపోవుచున్నాను. రూపెర్ట్ సహోదరుడా అందుకొరకు నీవు నన్ను మన్నించుము. అదేదైనాగాని ఇచ్చట నేను దానిని తప్పుగా ఉచ్చరించవచ్చును. లేదా కాదు. అతడికి అన్యభాషలను మాట్లాడుట మరియు భాషలను అనువాదము చెప్పు వరము గలదని నేను నమ్ముచున్నాను. ఆ సమయమున అతడు తన చేతులను ఆమె ముఖముపై పెట్టి ప్రార్ధించెను.
"బ్రాన్హాం సహోదరుడా, నిన్న కాదు, నిన్న రాత్రి కాదు గాని ఆ క్షణమే ఆ స్థలమునుండి అవి మరుగైపోయెను అని ఆమె చెప్పెను. ఆమె నోటిపై భాగమునుండి అవి ఆ క్షణమందే మరుగైపోయెను!
8పిదప వైద్యులు ఆమె గొంతును పరీక్షించి చూచి, "ఆమె ఖచ్చితముగా వైద్యశాలకు వెళ్ళాలి. ఎందుకనగా గొంతులో ఆమెకు కేన్సర్ వ్యాధిగలదు"అని చెప్పిరి. కావున వారు ఆమెను వైద్యశాలకు తీసుకొని వెళ్ళిరి. నేను మన మంచి సంఘ కాపరి నెవిల్‌గారిని కలుసుకునేంత వరకు ఆమె వైద్యశాలలోనే ఉన్నదనే విషయము నాకు అసలు తెలియదు. కావున ఆమెను చూచుటకు నేను అచ్చటకు వెళ్ళాను. మరియు ఆమె భర్త అచ్చట కూర్చుని ఉండెను. నలుగురు లేదా ఐదుగురు వైద్యులు వచ్చి ఆమెకు పరీక్షలు చేసి, తమ తలలను ఊపుచూ, "ఇది ఖచ్చితముగా కేన్సరే, విష క్రిమి కేన్సర్, ఇది కేన్సర్" అని చెప్పిరి.
9కాబట్టి అచ్చటున్న వైద్య నిపుణుడు వచ్చి దానియొక్క మాదిరిలను తీసుకొని వెళ్ళెను. "ఏ సందేహము లేకుండా అది కేన్సర్ వ్యాధియే" అని అతడు చెప్పెను.
"కాని సహోదరీ, ఈ కేన్సర్ వ్యాధి నుండి దేవుడు నిన్ను ఒకసారి స్వస్థపరచుట వలన… అదేమైనాగాని అదట్లే ఉండనిమ్ము. ఒకవేళ ఆ వైద్యులు చెప్పిందే నిజమైనా, అది కేన్సరో కాదో లేదా అది కేన్సర్‌వలె కనబడినా లేదా అదేమైనాగాని, వారు ఆ రంగములో శిక్షణపొందిన నిపుణులు, ఆ ఉద్దేశ్యం కొరకే వారు శిక్షణను పొందిరి. వారి కళ్ళకు అది కేన్సర్‌వలె కనబడుచున్నది. కావున వారు దానిని కేన్సర్" అని చెప్పుచున్నారు. "అది బహుశా అలాగే ఉండవచ్చు"అని నేను చెప్పాను.
కాని అది కేన్సర్ వ్యాధనే మాటను నమ్ముటకు ఆమె ఇష్టపడుటలేదు. కాబట్టి, "నీ నోటిలో నుండి పడుచున్న రక్తమును ఆపుటకు అనాడు అచ్చట వారు చేసిన ప్రార్ధనకు దేవుడు జవాబు యిచ్చినయెడల, అట్లే దేవుడు ప్రార్ధనను ఆలకించి నీ నోటిలోనున్నఈ భయంకరమైనవాటిని కూడా తీసివేయగలడు. అదేమైనాగాని ఉండనిమ్ము. ఇచ్చటే, ఇప్పుడే దేవుడు దానిని తీసివేయలేడా?" అని నేను అడిగాను.
"ఆమేన్!" అని ఆమె చెప్పెను. ఆమె భర్త అచ్చట కూర్చొని ఉండెను. "దేవుడు దానిని తీసివేయగలడనే విశ్వాసముతోనే ఇప్పుడు నేను ముందుకు సాగిపోవుచున్నాను" అని ఆమె చెప్పెను. ఆమె కొరకు నేను ప్రార్ధించాను. పిదప వారు వాటి మాదిరిలను తీసుకొని పరిశోధించి చూచి, వచ్చి "ఆ వ్యాధి లక్షణములు లేవు" అని చెప్పిరి. ఆ వైద్యులందరూ కలిసి "అది కేన్సర్ వ్యాధియే" అని చెప్పిరి. చూచారా.
10కాబట్టి స్నేహితుల్లారా, దాని భావమేమనగా, ఆయన దేవుడైయున్నాడు. మన ప్రార్ధనలకు ఆయన జవాబు యిచ్చువాడు. ఈ చిన్న దీన మందిరమునకు వచ్చి ఇచ్చట మనలను ఆయన దర్శించుటనుబట్టి మనమెంతగానో సంతోషిస్తున్నాము. ఇది చూచుటకు ఏమంత చక్కగా ఉండకపోయినను, వర్షమునకు తడవకుండా, మంచుకు గురికాకుండా మరియు మొదలగు వాటినుండి కాపాడుకొనుటకు అనేక సంవత్సరములక్రితం పాత చెక్క పలకలతో పై కప్పును వేసుకున్నాము. కాని ఈ ప్రయాస వలన నేటికీ అనేకమంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. మరియు అందుకొరకు మనమెంతగానో కృతజ్ఞులమై యున్నాము.
11మన ధర్మకర్తల కొరకు మనము కృతజ్ఞులమై యున్నాము. మన డీకన్ల కొరకు మనము కృతజ్ఞులమై ఉన్నాము. మన సంఘ సభ్యుల కొరకు మనము కృతజ్ఞులమై ఉన్నాము. మన సంఘకాపరి కొరకు మనము కృతజ్ఞులమై ఉన్నాము. మన సంఘమునకు ఆయన అనుగ్రహించిన ప్రతీ వరము కొరకు మనము కృతజ్ఞులమై వున్నాము. ఈ మనుష్యులు ఈ మార్గమునుండి తప్పుడు మార్గమునకు తొలగి పోకుండా, దీనికొరకు సరియైన తిన్నని మార్గమున, మార్గమునకు సరిగ్గా మధ్యలో నిలబడి వుండునట్లు ఆయన వీరికి మంచి గ్రహింపును ఇచ్చునట్లు మనము ప్రార్థించెదము. ఎన్నడూ ఏ విషయములోను మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు హెచ్చించుకొనెదరో, అప్పుడే, సరిగ్గా అచ్చటే మీరు నశించిపోయెదరు. మీకు అర్ధమైనదా? మీకు ఉన్నదానితో మీరు "వినయముతో అట్లే నిలిచి ఉండండి.
ఇప్పుడు గమనించండి, వ్యాధులతో, బాధలతో ప్రార్ధన కొరకు ప్రజలు వచ్చుచుండగా, ఆ సమయమున ఒక సంవత్సరము లేదా రెండు సంవత్సరములు నేను విశ్రాంతి తీసుకుంటూ నేను రాకపోయినను, ఆవిధముగా నేను విశ్రాంతి తీసుకుంటున్న సమయములో ప్రజల కొరకు శ్రద్ధ వహించి దేవుడు వారికి వేరొకమార్గమును సిద్ధపరచి ఏర్పరచి అనుగ్రహించును. అర్ధమైనదా! ఓ, అదెంత గొప్ప విషయముగా ఉన్నది కదా? అది ఆ విధముగానే ఉండును. అందుకొరకు మనము వందనస్థులమై ఉండవలెను కదా? తన కొరకు ఒక్క సాక్షికూడా లేకుండా దేవుడు ఎన్నడూ వదిలివేయడు మరియు అందుకు మనమెంతగానో సంతోషించవలెను.
12ఇప్పుడు ప్రభువు చిత్తమైతే, వచ్చే వారం పాఠశాలల సెలవు వలన నా చిన్న కుమార్తెలను కొన్ని ప్రాంతాలకు నేను తీసుకొని వెళ్ళబోవుచున్నాను. మీరు మాకోసం ప్రార్థించమని మిమ్మల్ని నేను కోరుచున్నాను. "పాల్ రెవిరె యొక్క అర్ధరాత్రి స్వారీ" అనే స్థలమునకు వెళ్ళి చూడాలని నా పెద్ద కుమార్తె కోరెను. అచ్చటయున్న తన సంఘమునుండే అతడు బయలుదేరి వెళ్ళెను. అది క్రొత్త ఇంగ్లాండులో ఉన్నది. కావున మేము అచ్చటకు వెళ్ళి దానిని చూడాలని ఆశించుచున్నాము.
పిదప, నేనెల్లప్పుడూ, "ఓల్డ్ ఐరన్ సైడ్స్" చూడాలని ఆశించెదను. (ఓల్డ్ ఐరన్ సైడ్స్ అనగా అమెరికా దేశం ఉపయోగించిన ఫిరంగులు అమర్చబడి యుండు యుద్ద నౌకలు-తె.త.,). "ఓల్డ్ ఐరన్ సైడ్స్ కావ్యమును" మీలో ఎంతమంది ఆలకించిరి? క్రైస్తవ్యమునకు చెందని విషయములలో ఇదే నాకు చాలా ఇష్టమైనది. నేనెరిగిన శ్రేష్టమైన విషయము అదే. దానిలోనున్న సంగతులను చదువుటకు ప్రారంభించినప్పుడు, దు:ఖముతో నాకు ఊపిరాడకుండా చేయును. ఇకప్పుడు నేను కూర్చొని పైకిలేచి చుట్టూ తిరుగుచూ నడుస్తూ మరలా వెనుకకు వెళ్ళెదను. దాన్ని మీరేలాగు ముంచి వేయుదురు. అదెట్లున్నదనగా, నీకు మరియు నీ కుటుంబానికి జీవనోపాధిగానున్న మీ గుర్రమును లాగుకొని చంపివేసినట్లున్నది. అలాంటి కార్యమును నేను సహించలేను. "కాబట్టి నేను దాన్ని నిర్మూలించెదను!" అని ఆ కావ్యములు చెప్పబడినవి. లేదు. దానిని అలాగు చెయ్యకూడదు. బ్రిటిష్‌వారి యొక్క ఫిరంగులు ఆ నౌకను తాకినప్పుడు, దాని ప్రక్కననున్న పాత టేకు చెక్క పలకలను ఆ ఫిరంగి గుండ్లు చేధించుకొని వెళ్ళినవి. ఆవిధముగా దానిని నాశనము చేయుచూ, దానిని మునిగిపోవునట్లు చేయుటను నేను చూడలేను. తుఫాను యొక్క దేవతల చేతులలో దానిని అప్పగించండి. ఉరుము, మెరుపులకు మరియు పెనుగాలులకు దానిని అప్పగించండి. ఈ! కావ్యమును నేను చాలా ఇష్టపడెదను.
13పిదప మేము అచ్చటనుండి బయలుదేరి వెళ్ళాము, శ్రీ కెన్నడిగారు మమ్మల్ని ఆహ్వానించలేదు, కాని మేము అచ్చటకు వెళ్ళినప్పుడు, అచ్చటున్న వైట్‌హౌస్‌ని వెళ్ళి చూడాలని ఆశిస్తున్నాము. నేను అచ్చటకు అనేకసార్లు వెళ్ళాను, కాని దానిని చూడాలని పిల్లలు ఆశపడుచున్నారు. పిదప ప్రభువు చిత్తమైన యెడల అచ్చటనుండి మేము మా గృహమునకు తిరిగి వెళ్ళెదము. కాబట్టి మా కొరకు ప్రార్థించండి.
ఇచ్చటున్న అనేకమంది సెలవులకు విహరయాత్రకు అనేక స్థలములకు వెళ్ళిరి. అట్లు వెళ్ళిన మన ప్రియమైన వారందరి కొరకు మేము ప్రార్థించుచున్నాము. వారిలో కొంతమంది ఈ ఉదయ కాలమున కెంటకీ మరియు టెన్నెస్సీ మరియు పలు ప్రాంతములకు వెళ్ళిరి. కాబట్టి మనము వారికొరకు ప్రార్ధించెదము.
14ఇప్పుడు నేను ఒక విషయమును గూర్చి ప్రకటించబోవుచున్నాను. ఓ, అవును. ఈ ఆరాధన ముగిసిన వెంటనే బాప్తిస్మము ఆరాధన గలదు. అలాగే చిన్న పిల్లలను ప్రతిష్టించు కార్యము గలదని నేను నమ్ముచున్నాను. చిన్న పిల్లల ప్రతిష్ట కార్యక్రమమును గూర్చి సహోదరుడు నాతో చెప్పుచుండెను. అట్లు ఇంకానేక కార్యములు మనకు గలవు. ఏమి అడుగుచున్నారు? (సాయంకాలపు ఆరాధననుగూర్చి ఒకరు బ్రాన్హాం సహోదరుడిని అడుగుచున్నారు - సంపా.,). మంచిది, రెండు ఆరాధనలలో నేనే ప్రసంగించుటకు ఇష్టపడను. మీరు గమనించండి. ఒక ఆరాధనను నేను తీసుకుంటాను, మరొక ఆరాధనను నెవిల్ సహోదరుడు తీసుకుంటాడు. నాకు కుదరదు…అది అలాగు కాదు… ఇచ్చట మేమిద్దరం ఉన్నప్పుడు, ఒకరు మాత్రం ఎందుకు ఊరకే కూర్చొని ఉండవలెను? నెవిల్ సహోదరుడా, అది సరియేకదా? ఖచ్చితముగా అదే సరియైనది.
ఆ తర్వాత, డాక్‌గారు నాతో చెప్పెను. మీ అందరి ప్రార్థనలలో తనను గూర్చి జ్ఞాపకము చేసుకోమని చెప్పెను. మందిరమును నిర్మించుటకు వారికి తగినంత ధనము సమకూడిన పిదప మందిరమును నిర్మించు పనిని ప్రారంభించాలని వారు నిర్ణయించుకొనిరి. అందుకొరకు మీరు ఇచ్చిన నిక్షేపములు…
వారు నాతో ఏదోక విషయమును చెప్పినట్లు…ఆ చిన్నపిల్లలను ప్రతిష్టించుటను గూర్చే వారు నాతో చెప్పిరి. అవును, దానిని గురించే. ఈ ఆరాధన ముగిసిన వెంటనే దానితోపాటు వెంటనే దానిని కూడా మనము జరుపుదాము.
ఇప్పుడు ఈ గుడ్డలను నేను ప్రార్థించుట కొరకు ఇచ్చట పెట్టితిరా? సరే అయ్యా, మనమందరము కలిసి దానిని చేద్దాము, ఆ తర్వాత…
15ఇప్పుడు మనము వాక్యమునకు సమీపించుటకు ముందుగా… వాక్యమును ఆలకించుటకు ఎంతమందికి ఆనందముగా ఉండును? ఓ, దేవా, పర్వతముమీద జీవించునట్లు అనిపించుచున్నది. మీరు గమనించండి, దేవుని యొక్క మార్గమున కార్యములను ఏవిధముగా చెయ్యవలననే విషయమును గూర్చి గత ఆదివారమున మీరు చూచితిరి. అర్ధమైనదా? ఆ ప్రశస్తమైన సహోదరుల మధ్య అటువంటి ఒక ఆత్మవారిని ఇబ్బందిపరచుచున్న విషయమును నేను చూచినప్పుడు, స్వాభావికమైన మానవులు అలాంటి ఆత్మను తరిమికొట్టలేరు. కాబట్టి మనము చెయ్యవలసిన కార్యమేమనగా దానికొరకు మనల్ని ప్రతిష్టించుకొనుట లేదా ప్రభువు చేతికి దానిని అప్పగించినప్పుడు, ఇక కొన్ని గంటలలోనే అవన్నీ సమసిపోతాయి.
LEV 19:17•
MATT 18:15-17•
LUKE 17:3•
GAL 6:1•
1TIM 5:21
16నేను అనేక స్థలములకు వెళ్ళుచున్నాను. ఇచ్చట మీతో కూడా ప్రభువుయొక్క పరిచర్యలో మన సంఘకాపరి మీకు సహాయకుడిగా ఉంటున్నాడు. మరి, "దేవుని ఎదుటను మరియు ఏర్పరచబడిన దేవ దూతల యెదుటను నీకు, నేను ఆనబెట్టుచున్నానని" పౌలు చెప్పినట్లుగా చెప్పుచున్నాను. చూడండి. సంఘమున ఎవరైనా క్రమమునుండి తప్పిపోయిన, దానికేమి చెయ్యవలెనో పరిపూర్ణమైన ఒక మాదిరి అచ్చట ఉన్నదని, ఇచ్చటున్న ఈ సంఘమునకు నేను చెప్పుచున్నాను. అర్థమైనదా?.
సంఘమున ఏదైనా ఒక తప్పుడు కార్యము జరుగుచున్నయెడల, అది సరియైన కార్యము కాదని ఎవరైతే ఎరుగుదురో, సంఘమున తప్పుడు కార్యమును చేయుచున్న వ్యక్తి వద్దకు అతడు వ్యక్తిగతముగా వెళ్ళి కలుసుకోవలెను. అతడు వెళ్ళి తప్పుచేయుచున్న వ్యక్తివద్ద ఆ తప్పిదమును గూర్చి వ్యక్తిగతముగా చెప్పినప్పుడు, అప్పుడు కూడా ఆ వ్యక్తి తనను సరిదిద్దుకొననియెడల, మరలా ఆ వ్యక్తివద్దకు ఒకరు లేదా ఇద్దరు సాక్షులను తనతో కూడా తీసుకొని వెళ్ళి ఆ తప్పుడు కార్యమునుగూర్చి అతడితో చెప్పి దానినుండి అతడిని సరిచేసుకొనునట్లుగా లేదా ఆ కార్యమును చక్కదిద్దుటకు చేయవలెను. జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు ఇది టేపు మీద రికార్డు చేయబడుచున్నది. అట్లు సాక్ష్యులను తీసుకొని వెళ్ళికూడా ఆ కార్యము చక్కదిద్దబడనియెడల…
SONG 2:15
17మీమధ్య ఎన్నడూ ఒక వాదం (సిద్ధాంతము)ను లేదా వేరేదైనా ఒక దానిని, లేదా దుష్ట భావము ఉద్భవించునట్లు ఎన్నటీకీ అనుమతించవద్దు. అలాంటివి కనబడిన వెంటనే అప్పటికప్పుడే దానిని మీ మధ్యనుండి వెలుపలికి పారద్రోలవలెను. అప్పుడు అలాంటి… చిన్న గుంటనక్కలే ద్రాక్షా తోటలను నాశనము చేయునని మీరెరుగుదురు. కాబట్టి అలాంటి వాటిని మీ నుండి దూరముగా ఉంచండి. ఎవరిపట్లైనా ఏదైనా విచిత్రమైన భావము మీలో పురికొల్పినయెడల, ఆ వ్యక్తి దగ్గరకు నీవు వెళ్ళి నీలో జరుగు విషయమునుగూర్చి అతడి వద్దకు వెళ్ళి, "నీగురించి నాలోమంచి అభిప్రాయమును కలిగిలేను, నీ విషయములో నేను పొరపాటుగా తలంచుచున్నాను. అది నాలోనుండి తొలగిపోవునట్లు నా గురించి ప్రార్ధించుము. నాకు సహాయము చేయుము. ప్రార్థించుము. నేను చక్కబడుదును" అని చెప్పుము. ఎందుకనగా, మన మధ్య కలుషితంలేని పరిశుద్ధాత్మను కలిగివుండుట తప్పనిచ్చి వేరేదియు ఉండుటను మనము ఆశించకూడదు. మనందరికీ కావలసినది అది మాత్రమే. ఇకప్పుడు వరములు మరియు అద్భుత కార్యములు వంటివి మనమధ్య క్రియ చేయును మరియు సమస్తము సరిదిద్దబడి క్రమములోకి వచ్చును.
MATT 5:23,24•
MATT 18:15•
LUKE 17:3
18ఒక సంపూర్ణమైన సంఘమును మీరు కలిగియున్నప్పుడు, అసంపూర్ణమైన సంఘముగా మీరెందుకు ఉండవలెను? ఆకాశములలో పూర్తిగా అసలైనవి వుండగా వేరొక ప్రత్యామ్నాయాన్ని మనమెందుకు అంగీకరించాలి? అర్ధమైనదా? అటువంటి వ్యర్థమైనవి మనకనవసరము. సంఘ సభ్యులగు మీమధ్య ఒకరికొకరిలో విపరీతమైన విరుద్ధ భావములను తలెత్తినప్పుడు, మీరు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి సరిదిద్దుకోండి.
"వారు నాకు ఇది చేసారు…" అని మీరు చెప్పవచ్చును. అది…ఇది…
ఇప్పుడు గుర్తుంచుకోండి. "ఒక సహోదరునికి వ్యతిరేకముగా నీవొక పొరపాటును లేదా తప్పును చేసినయెడల" లేదా "ఒక సహోదరుడు నీకు వ్యతిరేకముగా ఏదైనా చేసినయెడల", అర్థమైనదా? మీరు అతని వద్దకు వెళ్ళి అతనితో సమాధానపడి సరిదిద్దుకోండి. కావున నీవు అతని వద్దకు వెళ్ళి అతనిపట్ల నీకున్న తప్పుడు భావమునుగూర్చి చెప్పి అతనితో స్నేహమును కలిగి ఉండాలని చెప్పి, బలిపీఠము వద్దకు వెళ్ళి ప్రార్థించి మీ నుండి పారద్రోలండి.
19ఇప్పుడు, ఈ భూమిమీద నుండి మిమ్మల్ని నిర్మూలము చేసేంతవరకు సాతాను నిరంతరము తన పిడి గుద్దులతో గుద్దుచూ ఉండుననే విషయమును మరచిపోవద్దు. నీవు ఊపిరిని పీల్చుకొనుటకు సమయమును విడువకుండా ఎడతెగక అది నిన్ను వెంబడిస్తూ తన పిడిగుద్దులతో గుద్దుచూనే ఉండును. ఎందుకనగా, నీవు యుద్ద రంగమున ఉన్నావు. విహార యాత్రకు వెళ్ళడానికా మిమ్మల్ని క్రీస్తు వద్దకు రమ్మని అడిగింది? సరే, ఖచ్చితముగా మీరు విభ్రాంతి చెందెదరు. ఎందుకనగా, అది ఒక ఎడతెగని పోరాటము. ఆ ఎడతెగని పోరాటములో నేను ముప్పది ఒక్కటి సంవత్సరములుగా పోరాడుచూనే ఉన్నాను. మరియు నా మార్గముననున్న ప్రతీ అంగుళమును పోరాడుచూ ముందుకు సాగుచూ వచ్చాను. అది నిజము. అలాగే ఇశ్రాయేలీయులు కూడా ప్రతీ అంగుళమును పోరాడి గెలుచుకుంటూ వెళ్ళినది. వారికి ఆ పాలస్తీనా దేశము వాగ్ధాన భూమిగా ఇవ్వబడినను అందుకొరకు దానిలోని ప్రతీ అంగుళము కొరకు వారు పొరాడుచూ వెళ్ళవలసి వచ్చెను.
MATT 18:15-17
20ఇప్పుడు దీనిని గుర్తుంచుకోండి, సంఘములో ఏదైనా ఒక కార్యము తలెత్తినయెడల, అప్పుడు సంఘ కాపరి దగ్గరకు…మీ సంఘ కాపరిని ఆ వ్యక్తివద్దకు తీసుకొని వెళ్ళి మాట్లాడాలని మీరు ఆశించి మాట్లాడిన పిదపకూడా ఆ వ్యక్తి తన తప్పును ఒప్పుకోకుండా, కాపరి మాటను ఆలకించని యెడల, అప్పుడు ఆ విషయమును గూర్చి సంఘము ఎదుటకు వచ్చి దానిని సంఘము ఎదుట చెప్పవలెను. తమను సరిదిద్దుకొనుటకు అటువంటి వారికి ఎక్కువ సమయమును యివ్వవలెను. అనగా ఒక ఆదివారము నుండి వచ్చే ఆదివారము వరకు. సంఘము యొక్క మాటను కూడా వారు వినని యెడల, అప్పుడు పరిశుద్ధ గ్రంథము చెప్పిన ప్రకారముగా, "అతనిని నీకు అన్యునిగాను, సుంకరిగాను ఎంచుకొనుము".
అది, గమనించండి, సంఘముద్వారా వారు కాపాడుబడు కాలంవరకు సాతాను వారి దగ్గరకు రాలేడు. కాని సంఘముయొక్క భధ్రతా వలయమునుండి మరియు క్రీస్తురక్తము యొక్క భధ్రత నుండి సంఘము వారిని విడువబడునప్పుడు, సాతాను వారివద్దకు వెళ్ళి వారిని తాకి విరోధముగా క్రియచేయును. ఇప్పుడు వారు తమను సరిదిద్దుకొని సమాధానపడుటకు తిరిగి వచ్చెదరు. అర్థమైనదా? దానిని మీరు అర్ధముచేసుకున్నారా? పాష్టరుగారు, అది ఆవిధముగానే కదా? అవునండీ.
MATT 24:24•
MARK 13:22
21వారిని సరిదిద్దుటకు, సమాధానపడుటకు, దేవుని వద్దకు తిరిగి తీసుకొని వచ్చుటకు మరియు పిదప దేవునియొక్క మార్గమున వారు కొనసాగుటకు ఇదే చెయ్యవలెనని మీరు గుర్తుంచుకొనవలెను.
ఇది మనకు దేనిని నిరూపించుచున్నది? రెండు లేదా మూడు సంవత్సరములుగా అలాంటి విషయమును ఎదుర్కొనుటకు నేను ఎట్లు శ్రమపడితినో ఇద్దరు లేదా ముగ్గురు సహోదరులకు తెలుసు. అది నిజము. కాని వ్యక్తుల కొరకు తలంచుచు, వారి పరిస్థితినిగూర్చి ఆలోచించు స్థానమునకు నేను వచ్చినప్పుడు, వారిని నేను ప్రేమించిన కూడా, చివరకు వారు ఆ తప్పుడు ఉపదేశమును వదిలి ఇక రాలేరని నేనెరిగితిని. అప్పుడు సాక్ష్యులను వారివద్దకు నేను తీసుకొనివెళ్ళాను. కాని అదిపని చేయలేదు. ఆ సంగతిని నేను సంఘము ఎదుటకు తీసుకొని వచ్చాను, పిదప గత ఆదివారము ఈ వేదికనుండి, "మరలా దానిని వినుటకు నేను ఇష్టపడుటలేదు. దానినుండి నేను విడుదల పొందితిని. దానిని నేను దేవుని చేతులకు అప్పగించాను. దాన్ని నేను దేవునివద్దకే తీసుకొని వెళ్ళి అప్పగించాను. అర్ధమైనదా?"అని నేనే చెప్పాను.
కాబట్టి వారటువంటివారో దానిని అది నిరూపించెను… అనగా వాక్యానుసారముగా తమను సరిదిద్దుకొనుటకు వారు వచ్చినా, కాని వారు దానికి అంగీకరించని యెడల, అనగా వాక్యానుసారమైన దిద్దుబాటును ఒక వ్యక్తి అంగీకరించనప్పుడు, అతడు విపరీతముగా కోపపడి, మండిపడుచూ బ్రద్దలైపోవును. అత డు దేవునితో సరియైన సంబంధమును కలిగిలేడని అది చూపించును. నిజము! కాని ఒక అసలైన దేవునియొక్క పరిశుద్ధుడు దేవుని వాక్యము ద్వారా తనను దిద్దుకొని సమాధానపడును. అది నిజము. వాక్యమే సరిదిద్దుకొనుటకు మార్గమైయున్నది. ఆ సహోదరులు దేవునికి కృతజ్ఞులై ఉండవలెను.
గమనించండి, "చివరి దినములలో అబద్దపు క్రీస్తులు లేచి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుదురు" అని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. కాని అది సాధ్యమవ్వదు. లేదండీ. ఎందుకనగా ఎన్నుకొనబడిన వారు ముందుగానే నిర్ణయించబడినవారు. కాబట్టి వారు మోసపరచబడలేరు. మీరు గమనించారా.
22వెంటనే ఆ సహోదరులు…ఆ మరుసటి దినమున వారు మా యింటికివచ్చి, ఇంకాకూడా వారు విశ్వసించుచున్న ఆ తప్పుడు ఉపదేశమునకు తగిన విధముగా లేఖనములను సూచిస్తూ నాకు చెప్పుటను ప్రారంభించినప్పుడు, పరిశుద్ధాత్మ ఆ లేఖనముల ద్వారానే వారు చెప్పిన ప్రతీదానిని ఖండించుచూ చెప్పెను. మీరు గమనించారా? కాబట్టి అచ్చటున్న లేఖనములను కనుగొనినవారు, ఎన్నుకొనబడిన ప్రజల సమూహము ఆ తప్పుడు ఉపదేశములోనుండి వెలుపలికి వచ్చి దేవుని సన్నిధిలోకి నడుస్తూ వెళ్ళిరి. కాని మిగిలినవారు తిరస్కరించి బయటకు వెళ్ళిపోయిరి. ఆలాగు దేవుని సన్నిధి వైపుకి నడిచిన వారిని చూచి నేను సంతోషించి, అందుకొరకు కృతజ్ఞతలను తెలుపునట్లుగా నన్ను చేసినది. అవునండీ. వారే అసలైన మనుష్యులు.
ఒక వ్యక్తి పొరపాటుగా ఉండుటను మీరు చూచినప్పుడు, అది రుజువుపరచబడినప్పుడు, అది తప్పని తెలిసికొని, తానొక క్రైస్తవునిగా ఉండాలని ఆశించు వ్యక్తి, "నేను తప్పు"అని చెప్పి తనను సరిదిద్దుకొనును. అతడే నిజమైన కైస్తవుడగును.
1JN 2:19
23కాని తాను తప్పని తెలిసికూడా దానిని మరుగు చేయుటకు విపరీతముగా మండిపడుచూ, గట్టిగా కేకలు వేయుచూ, ఇటు, అటు పరిగెత్తుచూ, "ఆ, అదేమి పెద్దతప్పు కాదు, అసలు అదేమి లేదు" అని చెప్పును. సహోదరుడా, అతనిని గమనిస్తూ చూడండి. సరిగ్గా ఆ క్షణమందే అతడు ఖండించబడి శిక్షకు పాత్రుడై వెలుపలికి వెళ్ళిపోవుటను మీరు చూచెదరు. ఎందుకనగా, అతడు మనకు సంబంధించిన వాడు కాదు. కాని వాక్యము వద్దకు రండి, అప్పుడది ప్రతీసారి మిమ్మల్ని చక్కదిద్దుచూ ఉండునని సంఘకాపరి ఎల్లప్పుడూ చెప్పుచూ ఉండును.
ఆ కారణము చేతనే నేను వేదిక యొద్దకు వచ్చినప్పుడు, నా శేష జీవితమును ఇకమీదట ఎన్నడూ అమెరికా సంయుక్త రాష్ట్రముల దేశములో హృదయ రహస్యములను వివేచించు కార్యమును చెయ్యుటకు నేను కోరుకొనను. కేవలము విదేశములలో మరియు ఇతర దేశముల కూటములలో మాత్రమే దానిని చేయుదును. అది ఒక వరమైనాగాని, ప్రవచనాత్మక వరమైనా, అది అలాగే నాలో క్రియ చేయుచూనే ఉండును. కాని నేను దానిని నాలోనే ఉంచుకొని దాన్ని ఎచ్చట ఉపయోగించాలో అచ్చటనే ఉపయోగించెదను. ఎట్లనగా అది… ఈ దినములలో దాన్ని ఉపయోగిస్తూ క్రియ చేయుటకు మనము చాలా వెనుకబడి, ఆలస్యం చేయుచున్నాము. మనము అంత్యకాలమునకు చాలా సమీపముగా ఉన్నాము. కాని విదేశముల కూటములలో వేదిక పై ఒకటి లేదా రెండు సంఘటనలు మాత్రమే ఉండును. సహోదరుడా, నా భావమేమనగా వారికి జరుగవలసినది జరుగుచూ ముందుకు సాగిపోయెదరు.
1COR 14:8
24దానిని భౌతికజ్ఞానముతో అనుకరణ చేయుటకు వచ్చుచున్న అనుకరణ నకిలీలు, మన మధ్య గలవు. ఓ, దేవా, ఇది చాలా విచారకరము. నేను ఆశించు… ఇచ్చట ఎంతమంది పెంతెకోస్తువారు గలరు? మీ చేతులను పైకిఎత్తండి. సరే. పెంతెకోస్తువారులారా గమనించండి. కొన్ని సంవత్సరములకు ముందు, నిజముగానే దేవుడు మీపై ఆత్మను క్రుమ్మరించెను. కావున మీరు అన్య భాషలలో మాట్లాడుటకు ప్రారంభించిరి. నిజము. కాని అపవాది ఏమి చేసెను? అపవాది దానిచుట్టూ తిరుగుచూ వచ్చి దానికి భౌతిక సంబంధమైన అనుకరణలను తీసుకొని దానిని తారుమారు చేసెను.
అపవాది అసలైన దానికి బదులుగా నకిలీని రూపొందించెను. ప్రజలను ఆ నకిలీ దానిని అనుసరించునట్లు చేసి మరియు ఆ నకిలీ అన్యభాషను మాట్లాడునట్లుగా వారిని బ్రమింపజేసి, అసలైన దానినుండి వారిని దారి తొలగిపోవునట్లు అపవాది చేసెను. అలాగు ప్రజలు అన్యభాషలలో మాట్లాడుచూ, వేరొకరి భార్యతో జీవించెదరు, కొంతమంది త్రాగుదురు, పొగ పీల్చుదురు. అన్ని రకముల చెడు కార్యములను, అన్ని విధములైనవాటిని చేయుచూ, అనగా సమస్త నీచమైనవి చేయుచూ ఇంకా కూడా వారు అన్య భాషలలో మాట్లాడుచూనే ఉందురు. ఎందుచేత? అపవాది దానిని అట్లు చేసెను. ఒక అసలైన బూర స్పష్టముకాని ధ్వనిని ప్రజలకు ఇచ్చునప్పుడు, యుద్దమునకు ఎవరు సిద్దపడగలరు? అర్థమైనదా?.
25ఇలాంటి కార్యము ఎప్పుడైతే తలెత్తినదో… అలాంటి ప్రజలను కూటములందు మనము చూడగలము. ఒక రాత్రి… అంతెందుకు, కెనడా దేశమున ఒక కూటమున నా ముందే పోలీసులు ఒక స్వలింగ సంపర్కుడిని పట్టుకొని తీసుకొని వెళ్ళిరి. ఆ
వ్యక్తి వారితో , "ప్రభువు నాకు వివేచనా వరమును యిచ్చెను. "హల్లెలూయా, ఇప్పుడు ఇచ్చట జాన్ పేరుగల ఎవరో ఒకరు ఉన్నారని ప్రభువు నాతో చెప్పెను" అనెను.
అలాగే ఒక చిన్న వయస్సుగల స్త్రీ ఒక ఉదయమున ఇచ్చటకు వచ్చెను. అది మీకు జ్ఞాపకము ఉన్నదా? ఇచ్చటకు వచ్చి, "ప్రభువు నాకు కూడా అదే వరమును యిచ్చెను" అని చెప్పినది.
"మంచిది" అని నేను చెప్పాను,
"ఒక అవకాశము ఇచ్చినయెడల దాన్ని నేను రుజువు చేస్తానని ఆమె చెప్పెను,
"అదిగో అచ్చట వేదిక గలదు" అని నేను చెప్పాను.
అప్పుడు ఏమి జరిగెనో మీరు చూచిరి. అది పూర్తిగా అసలైన మనస్తత్వశాస్త్రం. గమనించండి. కాని సహోదరి స్పిడెర్ వేదికపైకి వచ్చి, తనకు కీళ్ళవాతం ఉన్నదని ఆమెతో చెప్పినప్పుడు ఇక ఆమె పని అయిపోయినదని మీరు చూచిరి. సహోదరి స్పిడైర్ ఆమెతో దానినిగూర్చి చెప్పినప్పుడు…
అప్పుడు నేను, "ఆమెకు గల సమస్య అదికాదు, ఆమె క్రిందపడుట వలన ఆమె నడుము విరిగిపోయెను, ఆమె అచ్చట నిలుచుటకు కూడా సాధ్యమవ్వలేదు…" అని చెప్పాను. బహుశా దానిని సహోదరి స్పిడెర్ సరిగ్గా ఆలకించలేకపోయెను. ఆమెకు ఏ సమస్యగలదో ఆమె చెప్పెను… అనగా అది ఆమె కడుపులో పెరిగినగడ్డ లేదా అలాంటి ఏదోక సమస్యతో ఆమె భాదపడుచున్నదని నేను నమ్ముచున్నాను. "అటువంటి సమస్యే ఆమెకు గలదు, దానినిగూర్చే ఆమె ఎల్లప్పుడూ ఇచ్చట కూర్చొని సహోదరులతో చెప్పుచూ ఉంటాది" అని నేను చెప్పాను. అర్ధమైనదా?
కాని, అదొక భౌతిక సంబంధమైన అనుకరణ (నకిలీ)అనే విషయము సంఘము ముందు ప్రదర్శించుటకు అదట్లు చెప్పబడినది. అటువంటి నకిలీ కార్యము ఏమి చేయునో మీరు గమనించండి. అదొక నిజమైన బూరధ్వని…
1COR 14:8
26నేను కెనడా దేశములో ఉన్నప్పుడు ఈ వ్యక్తిని ఆ పోలీసులు అచ్చట నుండి తీసుకొని వెళ్ళిపోయిరి. ఇచ్చటున్న ఈ జనముకంటే పదిరెట్లు ఎక్కువగా జనాభాగల నార్వే దేశ జనుల కూటమున మధ్యలో అతడు లేచి, "ప్రభువు నాతో ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ కూటమున ఎవరో ఒకరు జాన్ అనే పేరు గలవారు వున్నారు. బహుశా, జోన్నెస్, సరిగ్ధా ఇచ్చటే అలాంటి పేరుగల వారు ఉన్నారని నేను నమ్మచున్నాను. లేదు. ఇచ్చటెచ్చటో ఒకచోట ఉన్నాడు" అని చెప్పుచుండెను. అతడు పేక ముక్కలను మార్చుచున్నట్లు మాటలను మారుస్తూ ఉండెను. ఆ నార్వే దేశమున మొత్తంలో అటువంటి వారెందరో గలరు. ఆ దేశమున పీటర్ సన్స్, కార్గ్‌సన్స్, జోహాన్స్ అనువారు తొంబైశాతం మంది గలరు. కాబట్టి ఆ పేరుగల వారు అచ్చట ఖచ్చితముగా ఉండి తీరవలెను. పిదప అతడు,"ఇచ్చట ఎవరో ఒకరికి వీపు నొప్పిగలదని ప్రభువు నాకు సెలవిచ్చుచున్నాడు, నాకు వీపు నొప్పిగా ఉన్నట్లుగా నేను అనుభూతి చెందుచున్నాను" అని చెప్పెను. లేఖనములను చక్కగా తర్ఫీదుపొందిన వారెవరైనా ఇటువంటి కార్యములన్నీ మనస్తత్వశాస్త్రము ద్వారా చేయుదురని ఎరుగుదురు. అది ఖచ్చితముగా అటువంటిదే.
కాని, అదేమి చేసినదో గమనించండి. ఆ తర్వాత వారు ఆ వ్యక్తిని అచ్చటనుండి తీసుకొని వెళ్ళిరి. వారు అతడిని అచ్చట నుండి తీసుకొని వెళ్ళి రాయల్ మౌంటడ్ పోలీస్ అనే వారి చేతికి స్వాధీనం చేసిరి. అప్పుడు సేవకుల సమితిలోనున్న సేవకులు నావద్దకు వచ్చి, "ఆ వ్యక్తి ఒక స్వలింగ సంపర్కుడు" అని చెప్పిరి. వారు, "బహుశా, బ్రాన్హాం సహోదరుడు కూడా ఆ కోవకు చెందినవాడేమో, అందుకే ఆమార్గమున అవన్నీ జరుగుచున్నాయి" అని చెప్పిరి. అదేమి చేయుచున్నదో చూసారా? అది స్పష్టము కాని బూర ధ్వనిని యిచ్చుచున్నది. అర్ధమైనదా? అది ఖచ్చితముగా అలాగే జరుగుచున్నది. అదెల్లప్పుడూ ఆలాగే జరుగుచూ వచ్చును. అనగా వాస్తవమైన కార్యములకు వ్యతిరేకముగా అదెల్లప్పుడూ అలాంటి అస్పష్టమైన ధ్వనినే యిచ్చును. ఆ విధముగా చేయుట సాతాను యొక్క పనియైయున్నది.
27కాని, మీరెన్నడూ వాక్యమును విభేదించుచు దానినుండి వేరుపడ వద్దు. దేవునికి ముందు మిమ్మల్ని నేను ఆజ్ఞాపించుచున్నానని గుర్తుంచుకోండి. ఆ వాక్యముతోనే నిలిచి ఉండండి. దానినుండి ఎన్నటికీ మీరు వేరుపడి తొలగిపోవద్దు. అలాంటి కార్యములు జనుల మధ్య తలెత్తినప్పుడు మరియు అటువంటి కార్యములు మీ మధ్య ఉన్నప్పుడు, ప్రతీసారి ఒక నకిలీదాన్ని మీరు కలిగియున్నప్పుడు, అచ్చట అసలైనది కూడా ఒకటి ఉన్నదని అది చూపించును. ఒక అసలైన డాలర్ (అమెరికా దేశపు నాణెము) ఉండుటవలననే ఒక నకిలీ డాలర్ రూపొందించబడుచున్నదని అది చూపించుచున్నది. ఒక వంచకుడు (వేషదారి) అన్య భాషలలో మాట్లాడుటను మీరు ఆలకించినప్పుడు, అతడికి పరిశుద్దాత్మ గలదని మీరు చెప్పలేరు. కాని అతడు ఏదోక అసలైన పదార్థమును, అనగా అన్య భాషలలో మాట్లాడు వరమును గలవారు మాట్లాడుచున్న దానిని చూచి ఇతడు కూడా అలాగే వారివలె మాట్లాడునట్లు నటిస్తూ మోసగించు మోసగాడని మీరు గుర్తుంచుకోండి. అలాంటి నకిలీ కార్యములను మీరు కనుగొన్నప్పుడు, అవన్నీ ఒక అసలైన వాటి నుండి నకిలీగా పుట్టుకొచ్చినవనే విషయమును మీరు గుర్తుంచుకోండి. సమస్త మంచి ఈవులకు దేవుడే మూలకర్తకాని ఆ వరములను సాతాను అనుకరణ చేయుచు మోసగిస్తున్నాడు. మంచిది, ఈలాగే చెప్పుకుంటూ వెళ్ళితే, పాఠ్యాంశములోకి వెళ్ళలేము, మనము వెళ్ళగలమా?
28("బ్రాన్హాం సహోదరుడా, క్షమించండి, ఒక్క నిమిషము- " అని బెన్ బ్రయాంట్ చెప్పుచున్నాడు -సంపా.,)
చెప్పండి, సహోదరుడా.
(దయచేసి, గత ఆదివారము నేనిచ్చటకు రాలేదు. మీరు దేనినిగూర్చి చెప్పుచున్నారో ఆ వర్తమానము కొన్ని నెలలకు ముందే గాలివలె వ్యాపించి నాకు తెలిసినది. అది నిజంగానే నన్ను కొద్దిగా కలవరపరచినది. ఆ విషయమును గూర్చి మీవద్దకు మరియు సహోదరుడు నెవిల్ వద్దకు వచ్చి చెప్పాలని నేను తలంచాను. కాని ఆ విషయమును నేను మరియు నా భార్య ప్రార్ధనలో పెట్టి ప్రార్ధింస్తున్నట్లు మీరెరిగినట్లుగా నేను తలంచాను. ఈ ఉదయమున నేను ఈ మందిరములోకి వచ్చినప్పుడు, ఏమి జరిగినదో నాకు తెలియదు. మన సహోదరులలో ఒక ప్రశస్త సహోదరుడు ఈ ఉదయమున నావద్దకు వచ్చి నావద్ద క్షమాపణ కోరెను. అది క్రీస్తుయొక్క ఆత్మలాంటిది తప్ప వేరేదికాదని నేను తలంచుచున్నాను " అని బెన్‌బ్రయాంట్ చెప్పెను - సంపా.,).
ఆమేన్.
(ఆ సహోదరుడు చేసిన కార్యము చాలా ప్రశంసనీయమైనదని నేను తలంచుచున్నాను.")
అవునండీ.
("నన్ను క్షమించమని అతడు నన్ను అడిగెను. ఎందుకనగా, ఆ తప్పుడు ఉపదేశమును నేను అంగీకరించుటకు దానిని అతడు నావద్దకు తీసుకొని వచ్చుటకు ప్రయత్నించెను.")
కాని దానిని నేను అంగీకరించలేదు. ఉదయమున అతడు నన్ను క్షమించమని నావద్ద కోరెను. అతడిని నేను యేసుక్రీస్తు నామమున క్షమించాను" అని సహోదరుడు బెన్ చెప్పెను - సంపా.,)
ఆమేన్. బెన్‌బ్రయాంట్ సహోదరుడా, నీకు నా ధన్యవాదములు. బెన్ సహోదరుడా, అదే ఖచ్చితము…నీవు చెప్పిన విషయమును బట్టి నేను సంతోషించుచున్నాను. ఎందుకనగా, ఆ మనుష్యులు ప్రతీచోటుకు వెళ్ళుచు తమ తప్పును సరిదిద్దుకొనుచున్నారు. మీరు గమనించండి. అదే నిజమైన క్రైస్తవత్వమగును. అటువంటి కైస్తవత్వమే క్రియ చేయును. నీవు తప్పు చేసినప్పుడు, అందుకొరకు వెళ్ళి నీ తప్పును గురించి ఒప్పుకొని సరిదిద్దుకోండి. అర్ధమైనదా? మరియు వెళ్ళి, పైకి లేచి నిలబడి, "నేను తప్పు చేసాను, నన్ను క్షమించండి" అని చెప్పండి.
29ఇప్పుడు, ఒక వ్యక్తి తాను చేసిన తప్పును తన వెనుక మరుగు చేయుటకు ప్రయత్నించిన, అట్లయితే అతడు ఏదోక తప్పును మరుగుచేయుట వలన అతడిలో ఏదోక పొరపాటు గలదు. లేదు, అయ్యా.
ఇచ్చటున్న ఒకచిన్న వెద్యునివలె… చూడండి అతడి పై నేరమును నేను మోపుటలేదు. కాని ఎలాగైతేనేమి, అతడు ఒక చిన్న కార్యమును చెయ్యవలెనని కోరుకొనెనని మీకు తెలుసు. ఓ, లేదు, వైద్యుడా, దేవునికి నీవు లంచమును ఇవ్వలేవు. "కాబట్టి నీవు చేసిన పొరపాటును బాహాటముగా అందరి ముందు పెట్టవలెనని" నేను. చెప్పాను. అది నిజము. ఆ విధముగా ఆ విషయమును సరిదిద్దుకొని ముందుకు సాగిపోవలెను. ఏదొక పొరపాటును చేయుటకు ప్రయత్నించు అతడు ఖచ్చితముగా అమాయకుడై ఉండునేమో. ఒక చిన్నస్థలమును సంపాదించుకొనుటకు అదే మంచిమార్గమని అతడు తలంచి ఉండవచ్చు. చెడు స్వభావముతో దానిని చెయ్యుటకు అతడు ప్రయత్నించుట లేదు గాని సరియైన విధానముగానే చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. అతడలాగు ఆశించుట వలన…
అతడు చెప్పెను… ఇచ్చటున్న వ్యక్తి తన ప్రభావముతో లోబరుచుకొనుటకు, ఎవరినైనా అందుకొరకు ఉపయోగించుటకు అతడెరిగిన మార్గము ఇదే. కాని ఆ మార్గమున నీవు దానిని చెయ్యకూడదు. నీవు దానిని యుక్తమైన మార్గముననే చెయ్యవలెను. అర్ధమైనదా? మీరు వాక్యముతోనే సరిగ్గా నిలిచి ఉండండి, అప్పుడు దానిని మీరు పొందుకొనెదరు. వాక్యముతోనే సరిగ్గా నిలిచి ఉండండి! దేవుడు అతడిని ఆశీర్వదించి ఒక గొప్ప కార్యమును అతడి కొరకు చేసెను. అవునండీ.
30ఇప్పుడు ప్రార్ధన కొరకు మనము తలలను వంచుదాము. మిమ్మల్ని ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకోమని ఎంతమంది కోరుచున్నారు? ఇచ్చట చక్రాలకుర్చీలో కూర్చొనివున్న ఒక స్త్రీ ప్రార్ధనలో నిశ్చయముగా తనను జ్ఞాపకము చేసుకోమని కోరుచున్నదని నేనెరుగుదును; నేను నమ్ముచున్నాను. ఇచ్చటున్న ఈ సహోదరి, అందరు మరియు ఈ స్థలమంతటావున్న సమస్తమును గమనించండి. ఇప్పుడు, సమస్తమును ప్రక్కన పెట్టి ఆరాధనలోకి ప్రవేశించండి. అందుకొరకే మనమిచ్చట ఉన్నాము. ఇంకో ముప్పై ఐదు లేదా నలుబది నిమిషములు ఆయనను ఆరాధించుట కొరకే మనమిచ్చట ఉన్నాము. సరే మంచిది.
NUM 13:30•
ROM 8:37•
EPH 5:27
31ప్రభువా, ఇప్పుడు, మమ్మల్ని మేము మీముందు నిమ్మళపరచుకొనుచు౦డగా మా గొప్ప యెహోషువా, పరిశుద్ధాత్మ, ఈ దినముయొక్క మా దైవీక నాయకుడు, యెహోషువా, మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, "ఆ దేశమును స్వాధీనపరచుకొనుటకు మన శక్తి చాలుననెను". ఎందుకనగా, అతడు అమాలేకీయులను, అమోరీయుల పై దృష్టి పెట్టలేదు. కాని తన దృష్టినంతా దేవుని ద్వారా అనుగ్రహించబడిన ఆ దైవీక వాగ్ధానము వైపే చూస్తూ ఉండెను.
గందరగోళంతోయున్న ఈ దినమున, ఈ పరిస్థితిలో వున్న ఈ లోకములో, మరియు ఈ రమ్యమైన సబ్బాతు ఉదయమున మమ్మల్ని నీముందు నిమ్మళపరచుకొనుచున్నాము. మరియు మోసపుచ్చు సమస్త నకిలీల మధ్య, భౌతిక సంబంధమైన వేషదారుల మధ్య, సమస్త దుష్ట మరియు దారిని మళ్ళించు ఆత్మల మధ్య మరింతగా దేవుని వాక్యమందు మా దృష్టిని ఉంచి, వాటన్నింటిపై మేము జయమును పొందుకోగలమని మేము చెప్పుచున్నాము. ఏ మచ్చ లేదా ముడత లేని ఒక సంఘమును నేను కలిగియుందునని దేవుడు చెప్పెను. కాబట్టి ఏదోక దినమున ఆ సంఘమును మనము చూచెదమని మనమెరుగుదుము. సభ్యులుగా మనము అందుకొరకు పోరాడుచున్నాము. మరలా నూతనముగా జన్మించిన ఈ గొప్ప దేవుని యొక్క సమాజములో మేము సభ్యులమై ఉన్నామని నమ్ముచున్నాము. మరియు నేడునూ భూమిమీదయున్న సంఘము అదేయని విశ్వాసించుచున్నాము. మేము భయభక్తులతో ప్రభువైనయేసుక్రీస్తు నామమున దేవునిని సమీపించుచున్నాము.
మరియు మేము దీనులమై వచ్చుచుండగా, మా మనస్సులనుండి మరియు మా హృదయముల నుండి సమస్త లోక కార్యములను పారద్రోలి, సమస్త కష్టముల నుండి బాధలనుండి మాకు విడుదల దయచేయుము. ఓ, దేవా, ఆరాధనకు తగినట్లుగా మమ్మల్ని చక్కని స్థితియందు ఉంచుము. నీ వాక్యమును ఆలకించుట ద్వారా మేము నిన్ను ఆరాధించునట్లు చేయుము.
REV 5:4
32ఇప్పుడు, ఈ ఉదయకాలపు పాఠ్యాంశములో యోహాను ఏడ్చుచున్నట్లుగా, ఎందుకనగా, ఆ గ్రంథమును తీసుకొనుటకు అచ్చట యోగ్యుడెవరూ లేనందున, అలాగే ప్రభువా, ఈ ఉదయమున ఈగ్రంథమును విప్పుటకు ఏ ఒక్కరికి కూడా యోగ్యత లేనందున మా హృదయములు ప్రలాపించుచున్నవి. కాని యోహాను కొద్దిసేపే ఏడ్చెను. వెంటనే అతడు ఓదార్చబడెను. గొఱ్ఱెపిల్ల వచ్చి ఆ గ్రంథమును తీసుకొనెను. ఓ, దేవునియొక్క గొఱ్ఱెపిల్లా, ఈ ఉదయమున వచ్చి ఈగ్రంథమును తీసుకొని మాకు తెరువుము. ప్రభువా, మేము మీకొరకు వేచివున్నాము. అసంపూర్తులైన మేము మీకొరకు వేచిచూస్తూ… మీ సన్నిధిద్వారా మరియు వాక్యముద్వారా మమ్మల్ని సంపూర్ణులుగా చేయుము.
ఓ, దేవునియొక్క గొఱ్ఱెపిల్లా, ఇచ్చట అనేక చేతులు పైకి ఎత్తబడియున్నవి. ప్రతీ హృదయమును నీవు ఎరిగినవాడివని ఎందుకనగా, వారియొక్క ఉద్దేశ్యములను నీవు ఎరిగినవాడవని మేము ఎరుగుదుము. నీవు నిరంతరము ఉన్న ప్రకారముగానే నేడు కూడా అదే రీతిగా ఉండు దేవుడవై ఉన్నావు. నీవు నిరంతరము అదే రీతిగా ఉన్నావు. ఎందుకనగా, దేవా, నీవు పరిపూర్ణుడవు, అంతములేని వాడవు మరియు నీవు మారనివాడవు. ప్రతీ ఒక్కొక్కరి విజ్ఞాపనలను మరియు ఈ ఉదయమున మేము అడుగుచున్న వాటిని అనుగ్రహించి మమ్మల్ని తృప్తిపరచు దేవుడవు నీవు. ప్రభువా, వారు ఈ భవనమును విడిచి వెళ్ళినప్పుడు, తాము దేవునియొక్క సన్నిధిలో గడిపామని మరియు వారియొక్క హృదయ వాంఛలను పొందుకున్నవారుగా తృప్తిచెందుచు వెళ్ళుదురు గాక! ప్రభువా, వారితోపాటు నన్నుకూడా ఒకనిగా చేర్చుటకు మరచిపోవద్దు. దీనిని యేసు నామమున నేను అడుగుచున్నాను. ఆమేన్.
33ఇప్పుడు, మన కృపా గ్రంథమును త్రిప్పుదాము. ముద్రలను గొర్రెపిల్ల తెరచుట కొరకు ఎదురుచూస్తూ లేదా ఆ గ్రంథమును మనకు తెరచి అనుగ్రహించుటకై ఎదురు చూచుచున్నాము. ఇప్పుడు దానిని త్రిప్పుదాము. మనము ప్రకటన గ్రంథములో 5వ అధ్యాయమున యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను ధ్యానించుచున్నాము.
ఈ అయస్కాంత టేపులద్వారా ఈ వర్తమానమును ప్రపంచమంతటానున్న పలు ప్రాంతములనుండి ఆలకిస్తున్న నాస్నేహితులకు నేను చెప్పుచున్నదేమనగా, ఇచ్చట ఈవర్తమానమును ప్రసంగించుటకు, ఉపదేశములను, మొదలగువాటిని నేను చెప్పవలసివున్నది. ఏమనిషికైనా ఏ ఉపదేశము లేనియెడల అతడికి ఎలాంటి సేవ ఉండదు. కాబట్టి మీ సమాజపు సభ్యులు ఈ టేపునుండి వెలువడే వర్తమానమును ఆలకించుటకు మీరు ఇష్టపడనియెడల ఈ వర్తమానము వినకుండునట్లు వారిని దూరంగా ఉంచండి. కాని నా స్వంత అభిప్రాయమును, నా స్వంత భావములను, దేవుని వాక్యమందున్న నా స్వంత ప్రత్యక్షతను నేను వ్యక్తపరచుచున్నాను.
34ఇప్పుడు, కొన్ని నెలల క్రితము లేదా కొన్ని దినముల క్రితము మనము ప్రకటన గ్రంథమున ౩వ అధ్యాయములో మరియు 4వ అధ్యాయములో నేపధ్యములను మనము చూచాము. గత ఆదివారమున 4వ అధ్యాయమునుండి 5వ అధ్యాయముననున్న నేపధ్యంను చూచాము. ఈ దినమున 5వ అధ్యాయముయొక్క నేపధ్యంను ఇప్పుడు మనము చూడాలనుకుంటున్నాము. ఎందుకనగా, 6వ అధ్యాయమునకు అదే పునాదియై యున్నది.
బహుశా, భవిష్యత్తు కొరకు లేఖనములను ఒక క్రమబద్దీకరణను చేయవలననే ఉద్ధేశ్యమును ఈ దినమున నాకు కలదు. అదెప్పుడో నాకు తెలియదుగాని, ప్రభువు సమకూర్చినయెడల ఏదోక వారమున ఏడు దినములు ఈ మందిరమున ఏడు ముద్రలనుగూర్చి ధ్యానించుటకు ఏర్పాటు చేద్దాము. మనము ఏడు సంఘకాలముల వర్తమానమును కలిగియున్నాము. మరప్పుడు ఏడుదినములు రాత్రి కూటములో దేవుని ముద్రలయొక్క ఏడు మర్మములనుగూర్చి మనము ధ్యానిస్తూ, ప్రతీ రాత్రి ఒక్కొక్క ముద్రను తెరుచుచూ, ఏడవ ముద్ర వద్దకు వచ్చువరకు వాటిని మనము ధ్యానించెదము. ప్రభువు దానిని ఎప్పుడు సమకూర్చి మనకు అనుగ్రహించునో నాకు తెలియదు. కాని ఆయన దానిని సమకూర్చి మనకు అనుగ్రహించిన యెడల, దానియొక్క పునాదిని ఈ ఉదయమున నేను వెయ్యబోవుచున్నాను.
REV 5:4
35ఈ లేఖనములయొక్క ఆఖరి వచనములను ధ్యానిం…ఆ అంశము ఇచ్చట ఉన్నది లేదా ఆ లేఖనముయొక్క భాగము ఇచ్చటగలదు. దానిని దానియేలుయొక్క డెబ్బది వారములోనుండి మనము తీసుకుందాము, గత మూడు వారములు, వాటిని చివరికి ముద్రల వద్దకు ప్రజలను తీసుకొని వచ్చే పెంతెకోస్తు జూబ్లీ (సునాదము)తో కలుపుదాము. పిదప గొఱ్ఱెపిల్ల ముద్రలను విప్పుటకొరకు సిద్దంగా సిద్దపడివుందాము.
మరి ముద్రలు మర్మమైన విషయమని మీరు గుర్తుంచుకోండి. ఆ గ్రంధము ముద్రించబడి ఉన్నది. అది దానివెనుక వైపు ఉన్నది. దానిలో ఆ ఏడు ముద్రలు ఉన్నను, వాటిని ఆగ్రంధములో కూడా ప్రత్యక్షపరచబడలేదు. ఈ విషయములను గూర్చి పరిశుద్ధ గ్రంథములోకూడా వ్రాయబడలేదు. కాని, వీటికి అనువాదమును ఎవరైనా ఇచ్చిన యెడల, అది పరిశుద్ధగ్రంథములో మిగితా లేఖనములతో సరిపోల్బబడి చూడవలసి యున్నది. మరియు ఓ, దానిలోనున్న విషయములద్వారా మీరు దీవించబడుదురని నిశ్చయముగా నమ్ముచున్నాను. లేదా నిశ్చయముగా దానిని పొందెదరని తలంచుచున్నాను. మీరు దీవించబడుదురని నేను నమ్ముచున్నాను.
36ఈ ఉదయమున ఇచ్చటకు సరియైన సమయమునకు వచ్చుటకు నా కోటును కూడా ధరించుకొనుటకు నాకు సమయము చాలలేదు. ఎందుకనగా అది…నేను అచ్చట కూర్చొని వాక్యమును ధ్యానించుచుండగా, ఆయన తన దయతో నాపై పరిశుద్ధాత్మను కుమ్మరించి మరియు 'కుమ్మరిస్తూనే ఉండెను. దాన్ని నేను గమనించినప్పుడు, "ఓ, ఇచ్చట ఈవిధముగా పరిశుద్ధాత్మతో నన్ను నింపుచున్నట్లు, ఇదే విధముగా నేను సంఘమునకు వెళ్ళినప్పుడు ఉన్నయెడల మనమందరికి అదొక రమ్యమైన సమయముగా ఉండునని" నేను తలంచాను. కాని ఏదో విధముగా మీరు దానినుండి లేచి ప్రజలముందుకు వెళ్ళినప్పుడు, మీరు ప్రార్ధనలో లేదా వాక్య ధ్యానములో ఉన్నప్పుడు పొందుకొనుచున్న ఆ అభిషేకపు అనుభూతిని, మీరు ప్రజల ముందుకు లేచి వెళ్ళినప్పుడు అదే అనుభూతిని మీరు కలిగివుండలేరు.
EPH 1:13,14
37కాని, ఇప్పుడు దీనిని ప్రారంభించుటకు ముందు మొదటివచనముల యొక్క నేపధ్యంను చూద్దాం. గత ఆదివారము ఎచ్చట నిలిపివేసితిమో దాని నేపధ్యంను, అది ఇచ్చట ఎఫెసీ పత్రిక 1:13 మరియు 14వ వచనములలో మన రక్షణయొక్క సంచకరువును మరియు మన విమోచనయొక్క సంచకరువును మనము పొందుకొనియున్నామని పౌలు మనతో చెప్పెను. పరిశుద్ధాత్మయే మన విమోచనయొక్క సంచకరువై యున్నది. రాబోయే కొన్ని వారములయొక్క ప్రసంగములన్నీ విమోచనా కార్యములపైనే ఆధారపడి ప్రసంగించబడును. గమనించారా, విమోచన మీద ఆధారపడియుందును. నీతీకరణ మీద కాదుగాని, అది విమోచన పైనే ఆధారపడి ప్రసంగించబడును. ఓ, మధ్యవర్తిగా విజ్ఞాణము చేయు విషయము మీద కాదు, గాని విమోచించబడినవారిపై ఆధారపడి ఉండును. ఓ, కోల్పోయిన స్వాస్థ్యమును లేదా పోగొట్టుకొనిన స్వాస్థ్యమును మరలా మనకు విమోచింపబడి ఇవ్వబడుట. అవన్నీఎట్లు జరుగబోవుచున్నవి మరియు ఈ లోకమనేది ఏర్పడుటకు ముందే దేవుడు దానినేవిధముగా ప్రణాళికను చేసెను. మరియు ఏవిధముగా సంఘము లంగరు వేయబడి భధ్రముగా ఉన్నదనే విషయములపై ఆధారపడి ఉండును.
38మనమెట్లు ఇందుకొరకు నిలబడబోవుచున్నామనే కార్యమును మనము తెలుసుకోవలసిన సమయమునకు మనము వచ్చామని నేను నమ్ముచున్నాను. మీరు చేయుచున్న ఏ కార్యమందైనను మీకు విశ్వాసము లేనియెడల దానిని ఏలాగు చెయ్యగలరు? మీకు విశ్వాసము ఉండవలెను. ఇచ్చటున్న ఈ సంఘమునకు ఆ ఉద్ధేశ్యముతోనే దీనిని నేను చేయుచున్నాను. అనగా విశ్వాసులు, తాము దేనికొరకు నిలబడుచున్నారో అందుకొరకు కావలసిన విశ్వాసమును మరియు ధైర్యమును వారికి ఇచ్చుటకొరకే ఆ ఉద్దేశ్యమైయున్నది. ఎందుకనగా, ఇది దేవుని వాక్యము. ఆవిధముగా అది లేఖనముల ప్రకారముగా ఉన్నంతవరకు, ఆదికాండము నుండి ప్రకటనవరకు, వెనుక మరియు ముందు, పైన మరియు క్రిందవరకు పెట్టబడి, ఇటు, అటు మరియు ఏప్రక్కన అపవాది లోపలికి ప్రవేశించుటకు మార్గములేని విధముగా భధ్రపరచబడియున్నది. అందువలన మీకు పరిపూర్ణమైన ధైర్యమును కలిగిస్తున్నది. చూచారా. మీరెచ్చట నిలబడివున్నారో మీరెరుగగలరు.
39ఇచ్చట చక్రాల కుర్చీలో కూర్చొనివున్న మన సహోదరి లేదా వ్యాధి మరియు బాధలలోవున్న ఇతరులకైనను అది అదే కార్యమైయున్నది. "మమ్మల్నిబాగుచేయుట దేవునియొక్క దయాసంకల్పమై యున్నది". ఆ విషయము పై మీరు సంపూర్ణమైన గ్రహింపును కలిగివున్నయెడల, మిమ్మల్ని అనారోగ్యంతో ఉంచడానికి దేశంలో తగినంత దెయ్యములు లేవు. అర్ధమైనదా? అది నిజము. మిమ్మల్ని స్వస్థపరుచుటనే విషయము దేవునియొక్క మంచి దయా సంకల్పమైయున్నదని మీరు గ్రహించినప్పుడు, అప్పుడు ఆయన దానిని మీకొరకు చేయును. అప్పుడే మీరు ఒక నిర్ధిష్టమైన కార్యమును ఏవిధముగా చెయ్యాలనే విషయమును అర్ధం చేసుకోగలరు.
అది ఇలాగు ఉన్నది. నా హృదయమంతటితో నేను మీకు చెప్పినయెడల…మీరు ఆకలితో అనగా మరణించునంతగా ఆకలిని కలిగి ఉందురు. ఆ పరిస్థితిలో ఒక నమ్మకమైన వ్యక్తిగా నాపట్ల మీరు మిక్కిలిగా నమ్మకమును కలిగి యున్నప్పుడు, వెయ్యి డాలర్లు డబ్బు ఎచ్చట ఉన్నవనే విషయమును నేను మీకు చెప్పగా, దానిని ఏలాగు పొందుకోవాలో, ఏ మార్గమున దానికి వెళ్ళవలనో, ఖచ్చితముగా ఎచ్చటకు వెళ్ళవలెనో వాటన్నింటిని నేను మీకు చెప్పినప్పుడు, ఆ డబ్బు ఎచ్చట ఉన్నదనే విషయమునుగూర్చి మీరు సరిగ్గా అర్ధం చేసుకొనెదరు? అర్థమైనదా? నన్ను మీరు నమ్ముటవలన అది అర్ధమైన వెంటనే, ఆ డబ్బు అప్పుడే మీ చేతులలో ఉన్నట్లుగా మీరు ఎగిరి గంతులు వేస్తూ సంతోషించుటకు ప్రారంభించెదరు.
EXOD 15:26•
PS 103:3•
EPH 1:14•
HEB 11:1
40కాబట్టి, మీరు గమనించండి. దానిని మీరు పొందుకొనుటకు ముందుగానే…ఏదోక వ్యత్యాసమైన అనుభూతిని కలిగియున్నట్లుగా లేదా వేరేదైనా పొందుకొనుటకు ముందే, "దానిని పొందుకున్నానని" చెప్పుచూ, మీయొక్క స్వస్థత నిమిత్తము మీరు సంతోషించగలరు. ఎందుకనగా, దానిని నిశ్చయముగా మీరు పొందుకొనెదరనే విషయమందు రూఢీయైన నమ్మకమును కలిగియుండుట వలన. ఎట్లనగా, ఎవరైతే మీకు దానిని వాగ్ధానము చేసితిరో ఆయనయందు ధృఢమైన విశ్వాసమును మీరు కలిగియుండుట వలన. అర్ధమైనదా? అర్ధమైనదా? ఆయన అబద్దమాడని వాడని మరియు ఆస్వస్థత సరిగ్గా ఎచ్చట ఉన్నదనే దానినిగూర్చి ఆయన చెప్పిన మాటలపై మీరు ధృఢనమ్మకమును కలిగియున్నారు. కనుక ఆ స్వస్థతను ఇదివరకే పొందుకున్నామనే నమ్మకమునుగలవారై యున్నారు. ఎందుకనగా, మీ విశ్వాసమే విమోచనయొక్క సంచకరువుగా ఉన్నది.
వేరేవిధముగా చెప్పాలంటే, మీ అనారోగ్యంనుండి మీరు విడుదలను పొందుకోవాలని ప్రయత్నిస్తుండగా మరియు మీ విశ్వాసమే దీవెనకరమగు పదార్థముగా… లేదా అది మీ స్వస్థతయొక్క సంచకరువుగా ఉన్నది. "నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే విషయము మీ హృదయములో ధ్వనించుచున్నంత వరకు, అది మీకు ఎంతో యుక్తమైనది. మీకు కావలసినదంతా అదియే. ఓ, మీకేమి సంభవించినా అది అనవసరము, మీరెంతగా సంతోషంగా ఉండవలెనో అంత సంతోషముగా ఉండుటకు ప్రారంభించండి. మీరు స్వస్థతను పొందుకోలేకపోయినా, ఇంకా ఆరోగ్యం క్షీణించిపోతున్నా మీరెంతగా సంతోషంగా ఉండాలో ఇంకా కూడా అలాగే సంతోషంగా ఉండండి. అప్పుడు మీరు సంపూర్ణముగా బాగవుదురు. ఎందుకనగా, మీరు స్వస్థతను పొందుకున్నారనే ఒక హామీని కలిగియున్నారు. ఇప్పుడు మీలో ఎంతమంది దీనిని అర్ధముచేసుకున్నారు. మీ చేతులను చూడనివ్వండి. మీరు అలాగే దానిని నమ్మవలెను. "అదృశ్యమైనవి ఉన్నవనుటకు అది రుజువైయున్నది."
41ఇప్పుడు, ఈ 5వ అధ్యాయముయొక్క ప్రారంభమున మనము కనుగొనునదేమనగా, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, 8వ అధ్యాయముననున్న సంఘకాలములయొక్క చివరి భాగమును కట్టుచు, నలుమూలలనున్న వాటిని ఒక్కచోట కట్టి, ముడివేయు వజ్రపుముడివలె ఉన్నది. 4వ అధ్యాయమున యోహాను పరలోకమునకు ఎందుకు కొనిపోబడెనో చెప్పుచున్నది. మరియు 5వ అధ్యాయమున ఏడుముద్రలను తెరువబడుట కొరకు దృశ్యమును యోహాను ఇచ్చట అమర్చునట్లు కనబడుచున్నది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయమున యోహాను సంఘకాలములను తెరచుటకు మార్గమును సిద్దపరచుచున్న విధముగానే, అనగా ఆయన ఏడు సువర్ణదీప స్తంభముల మధ్య నిలబడియుండి, మరియు ఆయన సూర్యకాంతము మరియు చంద్రాకాంతము రాయిని పోలి ఉన్నట్లుగా కనబడెను. ఆయన అచ్చట ఆ ఏడుసంఘ కాలముల కొరకు సిద్దపరచుచున్నాడు.
42ఇప్పుడు, ఆయన విమోచనయొక్క ఏడు ముద్రలను తెరుచుట కొరకు సిద్దపరచుచున్నాడు. గమనించండి,
5వఅధ్యాయములోవున్న విషయము అదే. ఆ కారణము చేతనే వాటిని ఆవిధముగా ధ్యానించుచు, పిదప వాటిలోని విషయములను సమకూర్చి తీసుకొని మరియు వాటిపై ప్రసంగించుచు మరియు ఆ లేఖనములలోని ఇతర భాగములలో నుండి తీసి చెప్పుచున్నాను. ఎట్లనగా, ఆ వచనములు ఒకదాని తరువాత ఒకటి లేవు. ఏదోకటి సంభవించుచున్నట్లుగా, ఏదోకటి జరుగుట కొరకు అది సిద్దపరచబడుచున్నది. మీరు ఆ సిద్దపాటును పొందుకొనిన యెడల, అప్పుడు మీరు…ఆ సిద్దపాటుకొరకు మీరు సిద్దపడియుందురు. అది ఆవిధముగా విశ్వాసము ద్వారా లేదా వేరేవిధముగానైనను ఉండును. ఇప్పుడు ఈ ముద్రలు…
ROM 8:16,17•
2COR 1:21,22•
EPH 1:11-14•
EPH 4:30•
REV 21:7
43ఇచ్చట నేను కొన్ని లేఖనములను, వ్యాఖ్యానములను మరియు మొదలగువాటిని ఇచ్చట వ్రాసి ఉంచాను. ఇప్పుడు ఎఫెసీయులు 1:13-14, మీరు దీనిని వ్రాసుకోదలచిన వ్రాసుకోండి, "ఇప్పుడు మనము సంచకరువు కలిగియున్నాము. పరిశుద్ధాత్మయే మన స్వాస్థ్రముయొక్క సంచకరువై యున్నది". వేరోక మాటలలో చెప్పాలంటే, అది "ధృవ పత్రం లేదా హామీ"గా ఉన్నది. ఆ సంచకరువే "ధృవపత్రం" "బయానా" అనగా మనము క్రీస్తులోకి స్వీకరించబడితిమి. మనకు నిత్య జీవముగలదనే దీవెనకరమగు నమ్మకము మరియు భీమాను మనకు అనుగ్రహించినట్లు అది ఉన్నది. అంతేగాక, మనకొరకు ఆయన క్రయమును ఇచ్చి కొనిన సమస్తమునకు వారసులమై యున్నాము. ఓ, దేవా! దానిని మీరు చూడగలుగుచున్నారా?.. ఓ, మనము పరిశుద్దాత్మ ద్వారా ముద్రించబడినప్పుడు (దానిని నేనెప్పుడూ సూచించుచూనే ఉన్నాను. ఎందుకనగా, మీరు దానిని విఫలమవ్వకూడదు), ఏవేమి మనకు చెందినవో వాటన్నింటిని మనకు స్వంతమగుట కొరకు క్రీస్తు మరణించి తద్వారా అవి దేవునియొక్క ఆమోద ముద్రగా మనకు ఇవ్వబడినవి. దానినే దేవుడు ఈలాగు చెప్పెను. "ఇప్పుడు నేను మిమ్మల్ని అంగీకరించితిని. మరియు నేను మీకు ఈ ముద్రను యిచ్చెదను. ఆ సమయము కొరకే మీరు ఆసక్తితో వేచియున్నారు". మన సంపూర్ణమైన విమోచనను మనము పొందుకొనుటకు ఇదివరకే మనము పాక్షికం(ఒక భాగము)గా విమోచింపబడితిమి.
44ఒక ఆదివారమున నేను చెప్పినట్లుగా, దిగువన ఇచ్చట ఈ దిగువనయున్న మార్గమున, బురదలోను, ధూళిలోను, మలినముతో, మురికితో ఒక పాపి సతమతమగుచూ జీవిస్తున్నను, అటువంటి వారు కూడా శుద్దీకరింపబడుదురు. కాని ప్రతీ నాలుగు గంటలకు ఒకసారి స్నానం చేయుచు, చాలా మంచివస్త్రములను ధరించుకొనుచు, వారు గొప్ప విధ్యావేత్తలై యుండవచ్చుగాని, వారి ఆత్మ నీచమైనవాటితో బహు అసహ్యమైన వాటిలో పాతాళపు మురికి గోడలవలె ఉండును. అర్ధమైనదా?.
కాని ఒక క్రైస్తవుడు దానికి మించి పైగా జీవించును. ఎందుకనగా, మనకుగల సంచకరువుయొక్క స్వాస్థ్యమును ఇచ్చట అతనుకూడా కలిగియున్నాడు. అతడు అపవిత్రత నుండి, అసహ్యత నుండి, ఏహ్యమైనవాటినుండి పైకి ఎత్తబడి ఆ మలినమైనవాటన్నింటి పైగా ఉన్నతమైన స్థితిలో కొనసాగిపోవును. ఓ, దానిని నేను ఇష్టపడుచున్నాను. ఎంతో కాలముక్రితము పాల్‌రాడెర్ చెప్పిన విధముగా, "దానికి పైన నేను స్వారీ చేయుచున్నాను. దానికంటేపైగా ఉన్నత స్థితిలో నేను స్వారీ చేయుచున్నాను". ఇప్పుడు అది అచ్చటే ఉన్నది.
దీవెనకరమగు అభయము (హామీ), యేసు నా వాడు.
ఓ, దైవిక మహిమయొక్క తొలి రుచి ఎంత మధురం అది!.
(ఆ ఊటలోని ఒక గుక్కెడు రుచి చూచుటకు నేను అనుమతించబడితిని).
దేవునిచేత నేను కొనబడితిని గనుక ఇప్పుడు నేను రక్షణ యొక్క వారసుడినైతిని
ఆయన రక్తములో కడుగబడి మరియు ఆయన ఆత్మలో జన్మించితిని,
ఇదే నా గాధయని, ఇదే నా గానమని చెప్పుటలో ఆశ్చర్యము లేదు.
దినమంతా ఆయన్నే స్తుతిస్తూ కీర్తించెదను.
EPH 1:13,14
45గమనించండి, గాఢాంధకారములో నుండి, మలినములలో నుండి వెలుపలికి తీయబడి ఉన్నతమునకు ఎత్తబడితిమి. ఆ తొలి రుచి ఎంత మధురంగా వున్నది. మన సంపూర్ణమైన స్వాస్థ్రమునకు ఇప్పుడు మనము సంచకరువును కలిగివున్నాము. ఎందుకనగా, నేలలో లోతుగా పాతుకుపోయివున్న ఈ లోక కార్యములనే వేళ్ళును వదులు చేయుచు దేవుడు ఇదివరకే వాటన్నింటిని పెరికివేసి, ఉన్నతమైన ప్రదేశములలో నాటెను. నన్ను బయటికి తీసి లేవనెత్తెను, నన్ను రూపాంతరపరచెను. ఈ లౌకిక కార్యములనుండి నన్ను రూపాంతరపరచెను. లోక కార్యములనే వేర్లును, కొమ్మలను, సమస్తమునుండి నన్ను లాగివేసి, నన్ను ఉన్నత స్థితికి లేవనెత్తెను. అనగా మురికి బురదగుంటలోనుండి మరియు పాపమనే పాత పెంట కుప్పలోనుండి నన్ను బయటకు తీసి సీయోను పర్వతము యొక్క శిఖరముపై నన్ను నాటెను. దేవుని యొక్క పరిశుద్దులనే ప్రియమైన ఫల తోటలో నన్ను అమర్చెను. మనము ఇప్పుడు దేవుని రాజ్యముయొక్క పౌరులము. క్రీస్తు యేసులో మనము సహోదర మరియు సహోదరీలమై ఉన్నాము. సమస్త అసహ్యమైనవి, మలినములు మరియు దుర్గంధములు మన మనస్సులలోనుండి తీసివేసెను. శుద్ద జలములతో మన శరీరములు కడుగబడి, మన హృదయములు ప్రభువైన యేసు రక్తముద్వారా చిలకరింపబడి మరియు ఆయన తన రమ్యమైన గాలిని మన కొమ్మలద్వారా దినమంతా వీచుచూ మనలో పరిశుద్ధాత్ముడై నివాసమైయున్నాడు. మనలను ముందుకు, వెనుకకు ఊపుచూ, మన వేర్లు ఇంకా గట్టిపడి మరియు స్థిరపడి మిక్కిలి లోతుగా పాతుకొనునట్లు చేయుచున్నాడు. అది అద్భుతముగా లేదా? "మన రక్షణ యొక్క సంచకరువు".
46మనము కోల్పోయిన స్వాస్ద్యము గూర్చి ఈ అధ్యాయము బయలుపరచుచున్నది. మన కృపగల, ప్రశస్తమైన సమీప బంధువుడగు విమోచకుని ద్వారా మరలా మనము పొందుకోగలిగితిమి. అనగా దేవుడే క్రిందకు దిగివచ్చి, దేవుడనే ఉన్నత స్థితినుండి ఆయన మానవ రూపమును దాల్చుటకై ఒక మానవునిగా మారెను. ఒక మానవుని పాత్రను ధరించి ఒక మానవుడై సమిపబంధువుడగు విమోచకునిగా మారెను. ఎందుకనగా తన భౌతిక జనులకు భౌతిక ప్రపంచమును యిచ్చుటకై అట్లు మారెను. ఆమేన్!. అంత గొప్ప దేవుడు, అనగా సహజాతీతమైన దేవుడు సమీప బంధువుడుగా ఒక సహజమైన రీతిగా మారెను. ఎందుకనగా తన సొంత చట్టములను తానే ఉల్లంఘించలేడు. ఆయన సమీప బంధువుడగు విమోచకుడనే మార్గము ద్వారానే రావలసియుండెను. ఎందుకనగా, అదే ఆయన మార్గము… ఆయన ప్రణాళికయై యున్నది. దానిని ఆయన ఆవిధముగానే రూపొందించెను.
మానవుడు పడిపోవునని దేవునికి తెలుసు. అయినప్పటికీ మానవుడు పడిపోవునట్లుగా ఆయన చెయ్యలేడు, మానవుడు తన స్థానమును కోల్పోవునని దేవునికి తెలుసు. ఎవ్వరూ తన స్థానమును కోల్పోవుటకు దేవుడు ఇష్టపడలేదు. కాని మానవులందరికీ తనలోనున్నగొప్ప గుణ లక్షణములను వ్యక్తపరచు క్రమములో దేవుడు తనను మానవులకు ప్రత్యక్షపరచుకోవలసి యుండెను. అనగా తానొక విమోచకుడునని, ఒక రక్షకుడునని తనను ప్రత్యక్షపరచుకొనుటకై మానవుడు పడిపోవలసియున్నది. పడిపోవు లక్షణము మానవునిలో ఉండెను. పడిపోయిన మానవుడిని మరలా విమోచించు లక్షణము దేవునిలో ఉండెను. అందుకే మనము పగటిపూటను కలిగి ఉండుటకు రాత్రి పూటను కలిగి ఉండవలెను. మనము అనారోగ్యంను కలిగి ఉంటేనే ఆరోగ్యంనుగూర్చి ఆనందించగలము. ప్రతీదీ, అనుకూల మరియు ప్రతికూలమును కలిగివున్నది. ఇప్పుడు మన సమీప బంధువుడగు విమోచకుడు…
REV 5:5,6
47ఇప్పుడు, ఇచ్చట మీరు గమనించాలని నేను కోరుచున్నాను. సరిగ్గా ఈ 5వ అధ్యాయమును నేను చూస్తున్నాను. అతడు దానివైపు చూచినప్పుడు, "భయపడవద్దు!", 5వ వచనములో, "భయపడవద్దు" అనే మాట ఉన్నది. చూడండి.
అచ్చట ఎల్లప్పుడూ…ఏ విషయమును గూర్చి మీరు భయపడనవసరము లేదు.
ఆ పెద్దలలో ఒకరు-ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను.
మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని."
"ఒక గొఱ్ఱెపిల్ల". ఆ గొఱ్ఱెపిల్లను ఇంతకు ముందు యోహాను ఎందువలన చూడలేదు? ఆ గొఱ్ఱెపిల్ల తండ్రియొక్క సింహాసనముమీద ఆశీనుడై ఉండెను. అనగా కాపలాదారులను దాటి లోపల ఉండెను. యోహాను లోపలనున్న దానిని చూడలేకపోయెను. ఆ నాలుగు తలలు…లేదా ఆ నాలుగు జీవులు అచ్చట నిలబడియుండెను. లేదా పరిశుద్ధ స్థలమును కావలికాయుచున్న నాలుగు కెరూబులు అచ్చట నిలబడి ఉండుటను మాత్రమే యోహాను చూచెను. గత ఆదివారపు వర్తమానములలో మరియు ఇతర వర్తమానములలో మనము వాటినిగూర్చి చూచాము. యోహాను వాటిని చూచినా వాటి లోపల ఏమున్నదో చూడలేకపోయెను. అచ్చట లోపల అకస్మాత్తుగా, అచ్చట ప్రత్యక్షమాయెను… అనగా మర్మయుక్తముగా, హఠాత్తుగా, అచ్చట ఒకటి నిలబడియుండెను. అదే ఆ గొఱ్ఱెపిల్ల.
ఇప్పుడు, అది ఒకగొఱ్ఱెపిల్ల అయినప్పటికీ, సహజమైన మృగము కాదనేది అది చూపించుచున్నది. ఎందుకనగా, అది సింహాసనములో ఆసీనుడైయున్నవాని కుడిచేతిలోనుండి ఆ పుస్తకమును తీసుకొనెను. ఒక సాధారణమైన గొఱ్ఱెపిల్ల అలాంటి కార్యమును చేయుటకు సాధ్యమవ్వదు. అర్ధమైనదా!. ఆయనే ఒక గొఱ్ఱెపిల్లగా, క్రీస్తుగా ఉండెను. మరోక మాటలో చెప్పాలంటే ఆయన గుణా లక్షణములలో ఆయన ఒక గొఱ్ఱెపిల్లవలె మృధువైన మరియు సున్నితమైనదిగా ఉండెను.
48ఇప్పుడు, అది విమోచకుడనే ఒక గొఱ్ఱెపిల్లను విషయమును గమనించండి. మొదట ఉన్నట్లుగానే ఆయన ఒక విమోచకుడగు "ఒక గొఱ్ఱెపిల్ల" గా ఉండెను. దేవుడు ఎప్పటికీ మారలేడు! ఆమేన్! ఏదేను తోటలో మొదటి విమోచకుడు ఒక గొఱ్ఱెపిల్లయే యగును. ఎట్లనగా, దేవుడు అచ్చట ఒక గొఱ్ఱెపిల్లనే బలిగా అర్పించెను. ఇదిగో ఇచ్చట ప్రకటన గ్రంథములో అది మరలా ఒక గొఱ్ఱెపిల్లగా కనబడుచున్నది. దేనిని విమోచించుటకు? పతనస్థితిలోనున్న పడిపోయిన మానవ జాతిని మరియు మానవ జాతి పోగొట్టుకున్న స్వాస్థ్యమును విమోచించి యిచ్చుటకొరకు. ఆదిలో మనకున్న ఆ స్థానమునకు మరలా మనల్ని విమోచించి, ఆ స్థానమునకు మనల్ని తీసుకొని వెళ్ళుటకు గొఱ్ఱెపిల్ల మనల్ని విమోచించుటకు మరలా వచ్చెను.
దేనిని విమోచించుటకు? ఎందుకొరకు ఆయన మనలను విమోచించబోవుచున్నాడు? దానిని తీసుకొనివచ్చుటకు… ఏదైతే పోగొట్టుకొనబడినదో దానిని విమోచించవలసియున్నది. ఏదోకటి పోగొట్టుకొనబడినది, గనుక దానిని మరలా విడిపించి తీసుకొనివచ్చు కార్యమే విమోచించబడుటగును. ఈ గొఱ్ఱెపిల్ల అనగా ఆయన దేనిని మనకు మరలా విమోచించి తీసుకొని వచ్చి యిచ్చెను? ఆదియందు మనము కలిగియున్న సమస్తమును విమోచించి తీసుకొనివచ్చి ఇచ్చుటయగును.
49ఆదియందు మనము దేనిని కలిగివున్నాము? నిత్య జీవమును. ఈ భూలోకము యొక్క వారసులమైయుంటిమి. మనకు జీవము తప్ప మరణమనేది ఎప్పుడూ లేదు. అసలు మనకు వ్యాధియనేది ఎన్నడూ లేదు. అసలు మనకు వృధ్యాప్యమనేది లేనే లేదు. అలాగే మనకు అసలు బాధలనేవి లేవు. మరియు సమాధి చేయుకార్యములు లేవు. సమాధులు లేవు. ఏ చెడుతనము లేదు, మరణము లేదు. తెల్లవెంట్రుకలు లేవు. వంగిపోయిన భుజాలు లేవు. దుఃఖము లేదు, ఏడుపు లేదు. మనకు జీవము మాత్రము గలదు. నిత్యజీవమును కలిగియుంటిమి. ఈ సమస్త భూలోకమంతటిపై పరిపాలన అధికారమును మనము కలిగినవారమై ఈ భువిపై మనము ఒక దేవుని వలె ఉంటిమి. అదే మన స్థానము. అలాగే దేవుని వలె ఈ భూమి పై నడుచుచూ, ఒక వృక్షము ఉండవలసిన స్థలమున ఉండకుండా దారిమధ్యలో ఉంటే ఆ వృక్షమును చూచి; "నీవు వేరుతో పెకలించుకొని లేచి వెళ్ళి అదిగో అచ్చట నాటబడు" అని మనము చెప్పినప్పుడు, ఆ వృక్షము అలాగే లోబడి చెప్పిన చోటకు వెళ్ళి నాటబడి నిలుచును. ఎడతెగక గాలులు వీచుచున్నప్పుడు, ఆ గాలులు వీచుటను మనము ఇష్టపడకపోతే, "నిశ్చబ్ధముగా, నెమ్మదిగా ఉండు"అని చెప్పినప్పుడు, గాలి మన మాటకు లోబడి అదట్లే నిశ్చబ్ధమగును. ఏమి చేయుటకొరకు ఆయన వచ్చెను? వాటన్నింటిని విమోచించి మరలా మనకు తిరిగి ఇచ్చుటకొరకు. ( ఓ, దేవా!) వాటన్నింటిని మరలా మనము పొందుకోవాలనే ఉద్ధేశ్యము కొరకే ఆయన వచ్చెను.
ROM 8:19,22•
EPH 1:13,14
50ఇప్పుడు ప్రకృతి కూడా తనలో తాను మూలుగుచున్నది. దేనికొరకు ప్రకృతి ఎదురుచూచుచున్నది? దేవుని కుమారులయొక్క ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారులు ప్రత్యక్షమగుట కొరకు.
రక్షణయొక్క సంచకరువును మనము కలిగిఉన్నాము. కాన్సర్ వ్యాధితో మరణించనున్న మన సహోదరుడి దగ్గరకు వెళ్ళి, ఆ చిన్న విమోచనా శ్వాసతో అతడియొద్ద నిలబడి, విశ్వాసముతో అతని కొరకు ప్రార్థించినప్పుడు, ఆ ప్రార్ధన అతడిపై పైనున్న నీడను తొలగించి, మరలా ఒక ఆరోగ్యవంతుడగు మానవునిగా అది అతడిని మార్చివేయును. మనకు గల సంపూర్ణమైన ఆధిపత్యమును మనము పొందుకొని ఆ స్థానమునకు మనము వచ్చినప్పుడు అదేమి చేయును? ఆమేన్!.
ROM 8:19-22
51ప్రకృతికి దానిని గురించి తెలుసు. ప్రకృతియొక్క మూలుగుతోపాటు మనము కూడా మూలుగుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు ప్రకృతి తేరి చూచుచున్నది. ఎట్లనగా, తన యజమానితో పాటు ప్రకృతి కూడా శపింపబడెను. తన యజమానుడు శపింపబడినప్పుడు అన్నింటికంటే ఉన్నత స్థితిలో ఉన్నవాడు ఈ ప్రకృతికూడా అతడితోపాటు పడిపోయెను (పతనమైపోయెను). కాని బంధువుడగు విమోచకుడు వచ్చుచున్నప్పుడు (హళ్లెలూయా!), ప్రకృతి (సృష్టి పై యజమానుడుగా ఉన్న మానవుడిని ఆయన మరలా విమోచించెను. ఇప్పుడు సర్వసృష్టి తన యజమానుడగు మానవుని కొరకు తేరిచూచుచు కనిపెట్టుచున్నది.
మనమేమి చెయ్యుచున్నాము? ఇప్పుడు ఒక వృక్షమును నరికి పడవేయాలనుకుంటే, అందుకొరకు గొడ్డలిని చేతిలో పట్టుకొని వృక్షమును నరికి వేయుచున్నాము. కాని ఆ దినమున మనము అలాంటి కార్యమును చెయ్యము. ఆమేన్!.
సర్వసృష్టి తన యజమానుని కొరకు ఎదురు చూచుచున్నది. దేవునియొక్క కుమారులే దానికి యజమానులు. వారికొరకే ఈ భూమిని ఇచ్చెను. ఇప్పుడు, దేవుడు తన మహాకాశములను కలిగియున్నాడు. కానీ ఈ భూమి మానవుని కొరకు ఇవ్వబడినది. సమీప బందువుడగు విమోచకుడు మనము దేనినైతే పోగొట్టుకున్నామో దానిని మరలా విమోచించి ఇచ్చుటకే వచ్చెను. అదెంత రమ్యముగా ఉన్నది. దానిని గూర్చి నేను ఆలోచించగా …."ఒక గొఱ్ఱెపిల్ల విమోచకుడయ్యెను".
కాని ఈ భూమి మానవుని కొరకు ఆ పని ఎప్పుడైతే ముగించబడునో, అప్పుడు మరలా మనము సమస్తమును పొందుకొనెదము. ఆ సమస్త కార్యములు ఏవిధమైనవి? మనము సమస్త శక్తిని కలిగి ఉండెదము. మనము నిత్య జీవమును కలిగి ఉండెదము. మనము నిత్య ఆరోగ్యమును కలిగి ఉండెదము. మనము నిత్య యవ్వనులమై ఉందుము. మనము నిత్యమైన శక్తిని కలిగి ఉందుము. ఓహ్, మనము నిత్యుడగు ఆయనలో నిత్యమైన వారుగా ఉండెదము. ఆ సమయము ఎప్పుడు వచ్చునని అందుకొరకు మనమందరము ఎదురుచూచుచు మరియు మూలుగుచూ, కనిపెట్టుకొని చూచుచున్నాము.
REV 5:1•
REV 10:9,10
52ఏడు మడతలను కలిగియున్న ఈ ఏడు విమోచనా ప్రణాళికల యొక్క పుస్తకమును మన కోసము తీసుకొని రాబడినది. ఆ ఏడు మడతలనే ఈ పుస్తకమందు కలిగియున్నది. బలిష్టుడైన ఒక దూత ఏదోక విషయమును గూర్చి ఆర్భటించుటకు మరియు ఆయన చేతిలోవున్న ఒక చిన్న పుస్తకమును యోహానుకు ఇచ్చి, "తినివేయుము" అని చెప్పు దృశ్యమును ఇప్పుడు మనము ప్రకటన 10వఅధ్యాయమునకు వెళ్ళి చూడబోవుచున్నాము. యోహాను ఆ పుస్తకమును తీసుకొని తినివేయగా అది అతని నోటికి తేనెవలె మధురముగా ఉండెను గాని అతని కడుపుకు చేదాయెను.
దానిని మీరు తిని జీర్ణించుకున్నప్పుడు, అది మీలోకి వెళ్ళి చేదాయెను. అనగా ప్రతీ ఒక్కొక్కరు మీకు వ్యతిరేకముగా మారుదురు. "నీవు ఒక పరిశుద్ధ గుండ్రాయివి, నీవు ఇది, అది లేదా వేరేదైనా" అని ప్రతీ ఒక్కరు నిన్ను చూచి తిట్టెదరు. అర్థమైనదా? మరియు నీకు-నీకు-నీకు మతిపోయింది". కాబట్టి అటువంటి మాటలను జీర్ణించుకొనుట కష్టము. కాని ఆయనయొక్క మహిమనుగూర్చి నీవు సాక్ష్యమిచ్చుచున్నప్పుడు అది నీ పెదవులకు మధురముగా ఉండును. అవును. అదట్లే ఉండును. అర్ధమైనదా? ఒక కూటమున నీవు నిలబడి, "దేవునికి మహిమ, హల్లెలూయా…" అని నీవు చెప్పినప్పుడు, అనేక విషయములు నిన్ను చుట్టుముట్టి, ఆ గొప్ప ముట్టడి గుండా నీవు ప్రయాణించునప్పుడు అది నీకు కష్టముగా ఉండును. కాని ఆ గొప్ప ముట్టడి నుండి నీవు విడుదలను పొందుకొని బయటపడి దానినిగూర్చి నీవు సాక్ష్యమును చెప్పగలవు. అట్లు నీవు సాక్ష్యమును చెప్పుచున్నప్పుడు, అప్పుడది నీ పెదవులకు మధురముగా ఉండును. అర్థమైనదా? అది నిజము. అదే ఈ విమోచనా గ్రంథమగును.
RUTH 1:16-18•
RUTH 2:2,3,8•
RUTH 4:9,10
53ఇప్పుడు, ఇచ్చటున్న 5వ వచనమునకు ఒక చిన్న వ్యాఖ్యానమును మనము ఇచ్చిన పిదప 6వ వచనమును ప్రారంభించి ముందుకు వెల్దాము. విమోచనాయొక్క ప్రణాళికను దేవుడు ముందుగానే చూపించెననే విషయమును మీరు గమనించవలెనని నేను మిమ్మల్ని కోరుచున్నాను. రూతు మరియు బోయజుల జీవితములో దానిని ఆయన పరిపూర్ణముగా క్రియారూపముగా చేసెను. గత ఆదివారము మన ఆరాధనను దానితోనే ముగించాము. ఇప్పుడు సరిగ్గా అచ్చటనుండే అనగా రూతు మరియు బోయజుల నుండే ఈదినము ప్రారంభించాలని నేను కోరుచున్నాను.
ఇప్పుడు అచ్చట నాలుగు స్థలములు లేదా రూతు మరియు బోయజుల కథలో నాలుగు కూడలి గలదు. మొట్టమొదటి కూడలి రూతుయొక్క నిర్ణయము. నేను ప్రసంగించిన ఆ వర్తమానమును మాలో ఎంతమంది ఆలకించారు? "మీ చేతులను చూడనివ్వండి. నాకు తెలుసు… మంచిది, అందరూ ఆలకించిరి, నేను ఊహించాను. దానిని ఇచ్చటే ప్రసంగించాను. అది టేపులో కూడా రికార్డు చేయబడి ఉన్నది. రూతు తన అత్తయగు నయోమితో ఆ దేశమునకు వెళ్ళవలెనా లేదా అనే విషయమును మొదటగా నిర్ణయించుకోవలసి ఉన్నది. ఆమె నిర్ణయమును తీసుకోవలసియున్నది. పిదప రూతు ఆ దేశమునకు వెళ్ళిన తర్వాత అచ్చటున్న పంట పోలములోకి వెళ్ళి పనిచేయవలెననే కార్యము అనగా పంట పోలములలోకి వట్టి కాళ్ళతోనే వెళ్ళి, కోతను కోసిన పిదప ధాన్యమును ఏరుకుంటూ పనిచేయవలెను. కావున రెండవదిగా పనిచేయుట ఆ తరువాత బోయజుయొక్క దృష్టిలో పడి రూతుపట్ల దయను కలిగియుండుట. ఇక ఆ తరువాత సమీప బంధువునిగా విమోచించు కార్యమును బోయజు చేయునంతవరకు రూతు బోయజు కొరకు వేచియుండవలసియున్నది. అనగా నయోమి కోల్పోయిన సమస్తమును మరలా విడిపించి మోయోబీయురాలగు రూతును ఆ స్వాస్ద్యమునకు తీసుకొని రావలసిన క్రమమును బోయజు చేయవలసియున్నవి.
ఇక చివరిగా రూతుకు బహుమానము చేయబడుటగును. ఇప్పుడు గమనించండి. రూతు పరిపూర్ణముగా నిర్ణయించుకొనెను.
"ఈ పరిశుద్ధ గ్రంధము ఆత్మ ప్రేరణతో వ్రాయబడలేదని"ఎవరైనా చెప్పిన, వారిలో ఏదో పొరపాటుగలదు. ప్రతీ మాట ప్రేరణతో వ్రాయబడెను. కొయ్య ముక్కలను ఒకదానితో ఒకటి కూర్చునట్లు ప్రతీ వాక్యము ఒకదానితో ఒకటి సరిగ్గా సరిపోల్బబడి ఉన్నది. మరియు ఒక్క క్షణమునకు 10లక్షల్లో ఒక భాగము చక్కగా పనిచేయునట్లు పెద్ద చక్రములో అమర్చబడిన పళ్ళ చక్రంయొక్క పళ్ళు ఏ విధముగా ఉండునో అదేలాగున ఖచ్చితముగా అవి ఒకదానితో ఒకటి ఏకీభవించుచున్నవి.
RUTH 1:16-18
54ఇప్పుడు, దీనిలోనున్నవిషయమును గమనించండి. రూతు నిర్ణయమును తీసుకోవలెను. తన అత్తతో తాను వెళ్ళవలెనా లేదా నే కార్యమునుగూర్చి నిర్ణయమును తీసుకొని, ఆ నిర్ణయము ప్రకారము ఆమె కార్యమును చెయ్యవలసియున్నది. కాబట్టి ఆమె తన నిర్ణయమును తీసుకోవలసియున్నది. ఇప్పుడు, ప్రతీ విశ్వాసికూడా ఆవిధముగానే చెయ్యవలసి యున్నది. మిమ్మల్ని వెంటాడుచున్న పాత జీవితమును, అపవిత్రాత్మలను మీరు విడువవలసి ఉన్నది. మీరు మీ పాత జీవితమును విడువవలెను. పాత లోక కార్యములను, పాతవన్నింటిని మీరు విడువవలసి యున్నది.
55రాయ్ సహోదరుడా, రాబర్సన్ సహోదరి అనారోగ్యంగా ఉన్నారా? అనారోగ్యంగా ఉన్నట్లు నేను తలస్తున్నాను. ఆమె అనారోగ్యంతో లేదా వేరేదేనితోనైనా బాధపడుచున్న యెడల ఇచ్చటకు ఆమెను తీసుకొని రావలెనని నేను చెప్పాలనుకుంటున్నాను.
56తమ జీవితమున వెంటాడే ఆ పాత అపవిత్రాత్మలను వారు విడువవలెను. లేదా అలాంటి పాతవాటిని వారు విడిచివేయవలెను. వాటన్నింటిని విడిచి, ఇదివరకు మీరెరుగని నూతన జనులతో కలిసి ఒక నూతన దేశములోకి ప్రవేశించవలసి ఉన్నది. మీరు క్రైస్తవులుగా మారినప్పుడు, ఇదేనా మీరు చేసినది? బిల్లియర్స్స్ ఆట గదులను మీరు వదిలి వేసిరి. విలాస-వినోద విడిది గదులను మీరు విడిచిరి. నరాల బలహీనతతో ఊగిపోతున్న వారివలె, గడగడలాడుచు, వణికిపోతూ, కేకలు వేయుచూ మరియు తమ తలలను ఇటు, అటు ఊపుచూ, పైకి క్రిందికి దూకుచున్నవారివలె కనబడు ప్రజలతో మరియు "వెట్టి గుంపు"అని పిలిచే ప్రజలగుంపు మధ్యకు మీరు రావలసివున్నది. కాబట్టి అలాంటి గుంపువారి మధ్యకు మీరు వెళ్ళగలరా లేదా అనే దానినిగూర్చి మీరు నిర్ణ్మయమును తీసుకోవలసి ఉన్నది. అది నిజము. మీరలాగు ఎప్పుడైతే చేయుదురో, ఏ స్వకీయ జనులను మీరు వద్దనుకొని వదిలివేసెదరో, ఆ స్వకీయ జనులే మిమ్మల్ని చూచి హేళన చేయుదురని మీకు తెలుసు. అది నిజమే కదా? అది యధాప్రకారముగా జరుగు విషయమే. కాబట్టి ప్రారంభంలోనే మీరు దానిని ఎదురుచూడవలసి యున్నది. ఎట్లనగా అది అలాగే జరుగును.
57ఇప్పుడు రూతుకూడా అలాంటి కార్యమునే ఎదుర్కొనవలసి వచ్చెను. నీవు సరిహద్దులను దాటుకొని ఇశ్రాయేలీయుల దేశములోనికి వెళ్ళితే అచ్చట మూఢభక్తి జనులు ఉందురని మోయోబీయులు ఆమెతో చెప్పి ఉండవచ్చు కదా? చూచారా? కావున ఆమె ఒక నిర్ణయమును తీసుకోవలసి ఉండెను. ఆమె తన నిర్ణయమును తీసుకోవలెను. మీరుకూడా నిర్ణయమును తీసుకోవలెను. చివరగా, ఆమె తన నిర్ణయమును తీసుకొనిన పిదప ఆ నూతన దేశములోకి వెళ్ళి ప్రవేశించెను.
ఇప్పుడు, అది నీతీకరణకు మాదిరిగా ఉన్నది. అవును కదా? ఇప్పుడు ఈ సంఘమును గమనించండి. ఓ, అది పరిపూర్ణముగా ఉన్నది.
మీకు తెలుసా మనమేవిధముగా… "అబ్రాహాముయొక్క భీజము" అనే అంశముపై నేను ప్రసంగించిన వర్తమానమును మీలో ఎంతమంది ఆలకించిరి? అదేలాగు నీతీకరణకు, శుద్దీకరణకు మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు సాదృశ్యముగా ఉన్నదో చెప్పాను. ఇప్పుడది సరియా లేదా తప్పా అనే విషయమును చూడండి.
RUTH 1:16-18•
RUTH 2:2,3•
PHIL 2:12
58రూతు తన నిర్ణయమును తీసుకొనుచున్నది. ఆమె అన్య సంఘమునకు ఒక సాదృశ్యముగా ఉన్నది. ఆమె తన నిర్ణయమును తీసుకొని ఆ దేశములోనికి ప్రవేశించెను. ఇప్పుడు, అనేకసార్లు (మెథడిస్టులు మరియు బాప్తిస్టులయగు మనము) మరియు మనమందరము చేయవలసినదంతా ఇంతే ఇక ఇది చాలునని తలంచెదము. ఆమె తన ప్రయాణమును ఇప్పుడే ప్రారంభించెను. ఆమె వెళ్ళి చేరవలసిన దేశమునకు ఇంకా వెళ్ళిచేరనప్పటికీ ఆమె అలాగే ముందుకు సాగిపోవుచు…తాను వెళ్ళి చేరవలసిన దేశములోనికి ఇప్పుడే అడుగుపెట్టింది.
ఇప్పుడు తదుపరి కార్యముగా ఆమె చేయవలసినదేమనగా, అందుకొరకు ఆమె శ్రమించవలసి యుండెను. ఆమె ఒక చట్టబద్దురాలుగా మారిపోయెను. అనగా, "తన స్వంత రక్షణకొరకు భయముతో మరియు వణుకుతోను శ్రమించి పనిచేయవలసిఉన్నది". మీరు చేసినట్లుగానే ఆమె దానిని చేయవలసిఉన్నది. తనపై వస్త్రములను చుట్టుకొని పంట పొలములలోకి ఆమె వెళ్ళెను. ఆ పంట పొలములలోనికి వెళ్ళి, కోతకోయువారి వెనుక వెళ్ళుచూ జీవనాధారం కొరకు అనుదిన ఆహారమును ఆమె ఏరుకొనుచుండెను. అవును కదా? ఆమె ఏమిచేయుచున్నది? బోయజు కనులలో దయను పొందుకొనుట కొరకు ప్రయత్నించుచున్నది. కాబట్టి ఆమెకు గల చట్టబద్దత యొక్క దశ అనే మార్గము గుండా ఆమె పనిచేసింది.
59అట్లే సంఘముకూడా చేసెను. లూథరన్లు విశ్వాసముద్వారా దానిని నమ్మి ఆ దేశములోకి ప్రవేశించిరి. కాని మెథడిస్టులు శుద్ధీకరణను బోధించిరి. అదేమనగా, అది వారి బోధకు చట్టబద్దమైన కేంద్ర బిందువుగా (అనగా నీతి క్రియల ద్వారా రక్షణ పొందుకొనుటగును-తె.త,) ఉండెను. గమనించండి. "మీరు ఏదోక దానిని చేసి తీరవలయును", "నేను దానిని వదిలివేయాలి. నా వెట్రుకలను పొడువుగా పెంచుకోవాలి"అని స్త్రీలు చెప్పిరి. బహుశా, దానికన్నా మించి వారేమియు చెయ్యలేరు. కాని వెంట్రుకలను పొడవుగా పెంచుకోవాలనే తలంపుతో వారు దానిని చేసిరి. ముఖములకు రంగులు పూసుకొని అలంకరించుటను వారు వదిలివేయ వలసి ఉన్నది. ఇతరులు ధరించునట్లు వారు వస్త్రములను అసభ్యంగా లేదా కురచగా ధరించరు. వారు అలాంటి ఏదోక కార్యములను చేయవలసి ఉన్నది. అర్ధమైనదా? దానినే ఆమె చేసెను. నీతీకరణయొక్క దశ, నీతీకరణయొక్క దశనే ఆమె చేసెను.
RUTH 3:18•
HEB 4:10
60ఇప్పుడు, చివరగా బోయజు దృష్టిలో తనకు దయ లభించినదని ఆమె కనుగొనినప్పుడు, ఏమి జరిగెను? పిదప, నయోమి రూతుతో, "బోయజు సమీప బంధువునియొక్క విమోచన కార్యమును చేసి ముగించువరకు నీవు ఇచ్చటనే
వేచి ఉండుము. ఎందుకనగా, ఈ విమోచనా కార్యమును అతడు మాత్రమే చెయ్యగలడు. అతడే మన సమీప బంధువుడగు విమోచకుడు మరియు నీవు అలాగే ఇచ్చటనే వేచి ఉండుము. వేరొక చేనులోకి ఇంకెప్పుడు వెళ్ళవద్దు. దీనిని చెయ్యవద్దు దానిని చెయ్యవద్దు, ఇతర కార్యములు చెయ్యవద్దు. సమిప బంధువుడు ద్వారా విమోచనా కార్యము నెరవేర్చబడువరకు నీవు అట్లే వేచి ఉండుము" అని చెప్పెను. ఆమె అట్లే విశ్రాంతి తీసుకొనెను. ఆమేన్!.
సంఘముకూడా ఖచ్చితముగా అదేవిధముగా పెంతెకోస్తనే చివరి దశవద్దకు వచ్చిచేరెను. అర్ధమైనదా? పెంతెకోస్తు యొక్క ప్రారంభమున వారందరూ శ్రమించి పనిచేయవలసి యుండెను. మరియు వారు "దీనిని చెయ్యవలసియుండెను." వారిని వారు కదిలించుకొని మరియు సమస్తమును చేసిరి. ఇప్పుడు సంఘము ఏమి చేయుచున్నది? నిజ సంఘము విశ్రాంతి నొందుచున్నది. విశ్రాంతి అనగా ఏమిటి? అది ఇచ్చట ఉన్నది. విశ్రాంతి అనగా, "పరిశుద్ధాత్మ. అది విశ్రాంతి దినమైయున్నది. (సెవంత్ డే అడ్వంటిస్టులు, ఏడవ దినమే విశ్రాంతి దినమని మనవద్ద చెప్పుటకు ఇష్టపడుదురని మీకు తెలుసు). హెబ్రీయుల పత్రిక 4వ అధ్యాయములో, "దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును" అని చెప్పబడినది. కాబట్టి విశ్రాంతి (సబ్బాతు) అనగా "పరిశుద్ధాత్మ" యగును.
RUTH 3:1•
RUTH 4:10•
JOHN 5:24•
ROM 8:22,23•
EPH 1:13,14•
1JN 3:14
61రూతు విశ్రాంతి నొందుచుండగా, దేవుని యొక్క వాగ్థానములందు సంఘము విశ్రాంతి పొందుచున్న కార్యమునకు అదొక మాదిరిగా ఉన్నది! ఇప్పుడు మనము రక్షణయొక్క సంచకరువును కలిగియున్నాము. మనము అచ్చటకు వెళ్ళి చేరెదమో లేదోననే బాధ ఏ మాత్రము వద్దు. మనము అచ్చటకు వెళ్ళుచున్నాము. అది నిజము. ఎందుకనగా, దేవుడు అలాగే చెప్పెను, మనము సంచకరువును కలిగి ఉండుటను దేవుడు వాగ్దానము చేసెను (ఆమేన్). దానిని మనము పొందుకున్నాము. క్రీస్తు మనలను అంగీకరించెను. దానినుండి ఇప్పుడు తప్పించుకొని వెళ్ళుటకు మనకు ఏమార్గము లేదు. మనము అచ్చటే ఉన్నాము! ఆమేన్! మనము చేయవలసినదంతా కేవలము అంతవరకు అట్లే వేచియుండుట… ఆయన తీసుకొని… ఆయన మనపట్ల సమీప బంధువుడగు విమోచనా ప్రణాళికను నెరవేర్చువరకు మనము కేవలము అట్లే వేచియుంటే చాలు. సరిగ్గా ఇప్పుడే ఆ సంచకరువును కలిగి ఉన్నాము, ఆయన మరలా తిరిగి వచ్చు ఆ సమయము వరకు కేవలము మనము వేచి ఉండవలెను.
ఆ తర్వాత కార్యముగా రూతుకు ఏమి జరిగెను. రూతు బహుమానమును పొందుకొనెను.
దానినే సంఘము కూడా చేసెను. లూథర్‌ద్వారా సంఘము నీతీకరణములోకి ప్రవేశించెను. పిదప వెస్లీద్వారా శుద్దీకరణములోకి సంఘము ప్రవేశించెను. ఈ చివరి దినములలో పరిశుద్ధాత్మయొక్క బాప్తిస్మములోకి సంఘము ప్రవేశించెను. మన స్వాస్ద్యముయొక్క సంచకరువుతో మనము ఇప్పుడు విశ్రాంతి నొందుచున్నాము. తద్వారా మనలో ఏదోక కార్యము సంభవించినదని ఎరిగినవారమై, మనము మరణము నుండి జీవములోకి దాటి, సృష్టితో పాటు అక్షయతను పొందుకొనే ఆ సమయముకొరకు మూలుగులతో కనిపెట్టుకొని చూచుచున్నాము. సమస్తము విమోచింపబడెను. మరియు ఆ ద్వారము నుండి ఆయన మరలా తిరిగి వచ్చు ఆ సమయము కొరకు ఎదురుచూస్తూ మనము కనిపెట్టుకొనియున్నాము. ఆమేన్!
REV 5:1
62ఆ తర్వాత ఏమైనది? రూతుకు బహుమతి లభించెను. ఆవిధముగానే మనకు కూడా బహుమతి లభించెను. ఆ కారణముచేతనే ఈ ఏడు ముద్రలతో ముద్రించబడిన పుస్తకము మనకు తెరవబడి ఇవ్వబడబోవుచున్నది. ఇవన్నీ ఏమైయున్నవి? అవి రహస్యములు, అవి వాక్యములో వ్రాయబడలేదు, గనుక అవి పరిశుద్ధాత్మద్వారా ప్రత్యక్షపరచబడవలసి ఉన్నవి. కాని మీరు గమనించినట్లైతే, వాస్తవముగా అవన్నీ లేఖనములలో గుండా ప్రత్యక్షపరచబడి ఉన్నవి. కాని ప్రజలకు అవి మరుగుచేయబడి యున్నవి. కొంత కాలం తరువాత ఆ గ్రంథపు చుట్టను మనము చూచినప్పుడు, అవి ఏవిధముగా అమర్చబడియున్నవో దానిని మీరు చూచెదరు. అప్పుడు ఆ విషయములు ఎట్లు తెరువబడుననే కార్యమును కూడా మీరెరుగుదురు.
JOHN 14:1-3
63అవును, ఇప్పుడు, విశ్రాంతిపొందుచున్నది. నీతీకరణము ద్వారా రూతు…మీరు దానిని చూడగలుగుచున్నారా?, "ఆమేన్" అని చెప్పండి. (సమాజము "ఆమేన్" అని చెప్పుచున్నది - సంపా.,). రూతు శుద్దీకరణద్వారా క్రియలద్వారా మించుచున్నది. అలాగే రూతు విశ్రాంతి పొందుచూ, ముగించబడిన పనినుండి తిరిగి వెళ్ళుటకు బోయజు కొరకు కనిపెట్టుకొని ఉన్నది.
ఇప్పుడు మన బోయజు కల్వరినందు తాను చేయవలసిన ప్రణాళికను చేసి ముగించెను. కాని ఆయన మనలను తన గృహమునకు తీసుకొని వెళ్ళుటకు ముందుగా, మొదట ఆ గృహమునకు ఆయన (యోహాను 14) ముందుగా వెళ్ళి మనకొరకు ఒక స్థలమును సిద్దపరచును. మహిమ!.
మీ హృదయమును కలవరపడనియ్యకుడి. దేవునియందు విశ్వాసముంచుడి. నాయందును విశ్వాసముంచుడి.
నా తండ్రి యింట అనేక నివాసములు గలవు. లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్దపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్దపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున
మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును…
RUTH 4:8-10
64గమనించండి. బోయజు పురద్వారమునొద్దకు వెళ్ళి, అతడేమి చేసెను? అతడు పురద్వారమువద్దకు వెళ్ళి, నిలబడి…ఆ ఊరి పెద్దలను తీసుకొని, పురద్వారమువద్దకు వెళ్ళెను. అచ్చట అతడు తన పాదరక్షలను తీసివేసి, "నేడు నేను నయోమిని, ఆమెయొక్క స్వాస్థ్యమును, సమస్తమును విమోచించితినని తలియపరచబడుచున్నది" అని చెప్పెను. వాటితోపాటు మోయోబీయురాలిని కూడా అతడు పొందుకొనెను.
యేసు వచ్చినప్పుడు, ఎవరిని విమోచించుటకు ఆయన వచ్చెను? ఇశ్రాయేలీయులను. ఇశ్రాయేలీయులను తీసుకొనుటకు వచ్చిన ఆయన ఏమి చేసెను? ఆయన అన్యజాతి వధువుని పొందుకొనెను. నిశ్చయముగా, ఆయన ఇశ్రాయేలీయులను తీసుకొనుటకు వచ్చినప్పుడు, ఆయన దానిని చేసెను ఆయన తన స్వకీయులవద్దకు వెళ్ళెను ఆయన ఆవిధముగానే చెయ్యవలసి ఉన్నది. మొట్టమొదటగా ఆయన చెయ్యవలసిన కార్యమేమిటి? తన స్వకీయులను ఆయన విమోచించవలెను. ఇశ్రాయేలీయుల సంఘమగు స్త్రీకి అన్య జన సంఘము ఒక సహోదరియైయున్నది. ఖచ్చితముగా! ఈ అన్యజాతి వధువును పొందుకొను క్రమములో ఇశ్రాయేలీయులను ఆయన విమోచించవలసి ఉన్నది. రూతును తన భార్యగా పొందుకోవాలంటే నియమము ప్రకారముగా బోయజు నయోమిని విమోచించవలయును.
65ఇప్పుడు అతడేమి చేసెను? ఆమెను తన భార్యగా స్వీకరించుటకు ముందు… ఓ, మహిమ! అతడేమి చేసెను? అతడు పొలములోనుండి వెళ్ళి, తన గృహమునకు, సమస్తమునకు రంగులను వేయించి, అలంకరించి, నేలపై క్రొత్త తివాచీలను పరిచి ఉండును. ఓ, ఒక నూతన గృహమునుకూడా నిర్మించి ఉండునేమో. (మన దృష్టిలోయైతే, అదొక నూతన గృహమగును). అతడు సమస్తము అలాగు సిద్దపరచి వుంచెను. పిదప చక్కని పుష్ప గుచ్చముతో వివాహము కొరకు అతడు తిరిగి వచ్చెను. ఆమేన్.
రూతు ఏమి చేయుచున్నది? విశ్రాంతిని పొందుట తప్ప వేరేమి చేయుటలేదు. విశ్రాంతితోపాటు, కనిపెట్టుకొనియున్నది. ఇక ఎలాంటి శ్రమలు లేవు. ఇక ఎలాంటి నిరాశలు లేవు.
"నేనొక మెథడిస్టుకు చెందినవానిగా ఉండాలా? నేను బాప్తిస్టులో సభ్యునిగా చేరవలెనా? నేనొక ప్రెస్టిటేరియన్‌గా మారవలెనా?" లేదండీ. పరిశుద్దాత్మను పొందుకోండి,
మరియు విశ్రాంతి పొందుచూ ఉండండి. (టేపులో ఖాళీ గలదు - సంపా).
సంతోషకరమగు ఆ వేయ్యెండ్ల పరిపాలన దినముయొక్క రాకడకొరకు మనము కనిపెట్టుకొని ఉన్నాము.
దీవెనకరమగు మన ప్రభువు వచ్చునప్పుడు,
కనిపెట్టుకొనియున్న తన వధువును కొనిపోవును.
ఓ, ఆ మధురమైన విడుదలకొరకు భూమి మూలుగుచూ, కేకలువేయుచున్నది.
(అవన్నీ సృష్టియావత్తు మూలుగుచున్నది, అంజూరపు ఆకులు మరియు సమస్తము దీవెనకరమగు ఆ విడుదల దినముకొరకు వేచియున్నవి).. సమీప బంధువుడగు విమోచకుడు మరలా తిరిగి వచ్చినప్పుడు తన వధువును తీసుకొని వెళ్ళును.
ISA 28:10-12•
REV 10:7
66ఇప్పుడు ఆమె విశ్రాంతి పొందుచున్నది. శుద్ధీకరణ క్రింద విశ్రాంతి పొందుచున్నదా? లేదు. నీతీకరణ క్రింద విశ్రాంతి పొందుచున్నదా? లేదు. కాని నీతీకరణ మరియు శుద్దీకరణయను రెండింటక్రింద విశ్రాంతి పొందుకొనుచుండెను.
యెషయా 28వ అధ్యాయము10వ వచనములో ఈలాగు చెప్పు చున్నది:
..ఆజ్జ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట, కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు. నిజమే.
అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు,
నత్తివారి పెదవులచేతను, అన్యభాషతోను ఈజనులతో మాట్లాడుచున్నాడు.
ఇదే విశ్రాంతి, [ఇదే సబ్బాతు… ఇందుకే సంఘము వేచియుండుట కొరకై వెళ్ళుచున్నది]….
మనమేవిధముగా నీతీకరణ, శుద్ధీకరణ మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మములోకి వెళ్ళి విశ్రాంతి పొందుకొనుచు, వేచియుండెదమో చూడండి. ఏమిటి? మరియు ఇప్పుడీ ప్రత్యక్షతలను మనము పొందుకున్నప్పుడే, అవి ఏమైయున్నవనే విషయములను మీరు చూడగలరు. చూచారా? అవి ఎట్లు… ఈదినమువరకు ఈ విషయములు బోధింపబడలేదు. అవి బోధింపబడలేదు. వాటిని బోధింపబడలేని విధముగా అవి ఉండెను. మనుష్య కుమారులకు వాటిని తెరచి ప్రత్యక్షపరచబడలేదు. పరిశుద్ద గ్రంథము అలాగే చెప్పుచున్నది. ఈ దినమువరకు అవి మనుష్య కుమారులకు తెరచి ఇంకా ప్రత్యక్షపరచబడలేదని చెప్పిన విషయమును ఇచ్చట ఈ లేఖనములలో నేను మీకు చూపించగలను. దీవెనకరమగు ఈ గొప్ప విషయములతో ఇప్పుడు మనము ముగింపునకు వచ్చియున్నాము. ఇప్పుడు… సరే మంచిది.
RUTH 4:1-4•
REV 5:5-7
676వ లేదా 5వ వచనముయొక్క భాగము. 5వ వచనములో పెద్దల్లో ఒకరు "ఇదిగో, ఒక గొఱ్ఱెపిల్ల?" అని చెప్పినప్పుడు, కాని యోహాను తిరిగి చూచినప్పుడు ఒక సింహమును చూచెను. అచ్చటొక గొఱ్ఱెపిల్లకు బదులు ఒక సింహము వుండెను. కాని పిదప అదేమై ఉండెను. ఆయన మధ్యవర్తి పని చేయుచుండెను. మధ్యవర్తియొక్క పని. సంఘ కాలములయొక్క ముగింపులో యూదా గోత్రపు సింహముగా మారుటకు ఆయన తన మధ్యవర్తియొక్క పరిచర్యను విడిచిపెట్టును. ఆయనయొక్క మధ్యవర్తి పరిచర్య ముగించబడెను. ఇప్పుడు, ఆ చేతిలోనుండి ఆ పుస్తకమును ఆయన తీసుకొనునప్పుడు ఒక సింహముగా …న్యాయాధిపతిగా ఆయన మారును.
ఇప్పుడు, గుర్తుంచుకోండి. ఒకవ్యక్తి దేనినైనా విమోచించుటకై వెళ్ళినప్పుడు (ఇప్పుడు దీనిని మరచిపోవద్దు), ఒక వ్యక్తి విమోచించుటకై వెళ్ళినప్పుడు, అతడు తనతోపాటు కొంతమంది మనుష్యులను పురద్వారము వద్దకు తీసుకొని వెళ్ళును. అతడు తీసుకొని వెళ్ళు మనుష్యులు పెద్దలై ఉండవలెను. అచ్చటకు తాను వచ్చిన ఉద్దేశ్యము అతడు ప్రకటింపవలెను. దానినే అతడు చేసెను. అతడు పురద్వారము వద్దకు వెళ్ళి, "నేను ఇచ్చటకు ఒక సమీప బంధువుడగు విమోచకునిగా ఈ స్థానమును హక్కు కోరుటకు వచ్చాను. దీనినిగూర్చి పురద్వారమువద్ద ఈ పెద్దల ఎదుట తెలియజేయుటకే నేనిచ్చట ఉన్నాను" అని చెప్పును. అర్ధమైనదా?.
REV 5:4,5
68యోహాను ఏడ్చుచున్నప్పుడు… ఒకరు దానినెట్లు చెప్పారో గత ఆదివారమున నేను చెప్పాను. "ఎవ్వరు అందుకు అర్హులుగా కనబడకపోయినందున యోహాను ఏడ్చెనని" వారు చెప్పిరి. అదలాగు కాదు. పరిశుద్ధాత్మయొక్క ప్రభావము క్రిందనున్న ఒక వ్యక్తి అట్లు ఏడ్వడు. "ఎట్లనగా, తాను అందుకు అనర్హుడునని ఏడ్చెను" అనే తలంపుతో వారు చెప్పిరి. బహుశా, యోహాను అందుకు అనర్హుడై ఉండవచ్చు. మరి అచ్చట అందుకు ఎవ్వరూ అర్హులు కాదు. కాని అందుకొరకు యోహాను ఏడ్వలేదు.
తనకు కలిగిన సంతోషమువలన యోహాను ఏడ్చెనని నేను నమ్ముచున్నాను. ఎందుకనగా, విమోచన యొక్క సంపూర్ణ ప్రణాళికను ఇచ్చటున్న ఈపుస్తకములో వ్రాయబడి ఉండుటను యోహాను చూచెను. దానిని తెరచుటకు అచ్చట అర్హులు ఎవ్వరూ లేనందువలన కాదుగాని, అందుకు అర్హతగల గొఱ్ఱెపిల్ల సరిగ్గా అచ్చటే నిలబడియున్నందున యోహాను ఏడ్చుచూ, "ఓ, దేవునికి మహిమ" అని చెప్పెను. అతడు గట్టిగా కేకలు వేయుటను, అతడి వైపు చూస్తూ మీరే దానిని ఆలకించండి. కాని ఇచ్చట అతడు ఏడ్చుచున్నట్లుగా మనము కనుగొన్నాము. ఎందుకనగా, అవి ఎంతో సంతోషముద్వారా కార్చిన కన్నీళ్ళు. కారణమేమనగా, సింహాసనమునందు కూర్చొనియున్నవాని చేతిలో నుండి గొఱ్ఱెపిల్ల ఆ గ్రంథమును తీసుకొనుటవలన.
REV 5:2-6
69అతడు ఏడ్చుచుండగా… ఈ దూత, బలిష్టడైన దూత "ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని" బిగ్గరగా ప్రచురించినప్పుడు, ఆ దూత అలాగు ప్రచురించిన వెంటనే, అనగా అతడు ఒక సమీప బంధువుడగు విమోచకుని కొరకు ప్రచురింపచేసెను. పిదప వెంటనే ఆ బలిష్టుడైన దూత, "ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని" అడిగెను. అప్పుడే యోహాను ఏడ్చుటకు ప్రారంభించెను. ఆ తర్వాత ఏమి జరిగినది? అచ్చట ఆ గ్రంథము ఉండుటను యోహాను చూచెను. అది అచ్చట ఉన్నది, కాని దానిని విప్పుటకు యోగ్యుడైనవాడెవరు?.
మంచిది. అచ్చట గాబ్రియేలు దూత నిలబడిఉండెను. అతడు అర్హుడైవుండవచ్చు, కాని గమనించండి. గాబ్రియేలు ఒక మనిషి కాదు, అతడొక దూత. అచ్చట మిఖాయేలు నిలబడివుండెను. అతడు అర్హుడై ఉండవచ్చు, కాని అతడొక మానవుడు కాదు. అతడు ఒక దూత. కాబట్టి మనవంటివాడు అనగా, భూసంబంధమైన ఒక మానవునివంటి వాడెవరోకరు అందుకు అవసరమై ఉన్నది. పిదప యోహాను, ఈ జగత్తుకు పునాదివేయబడక ముందే ఈ కాలములంతటి గుండా ఆయన వధింపబడినవానిగా ఉండెను. అప్పుడు యోహాను ఏడ్చెను. ఆమేన్! ఎందుకనగా, అది అచ్చటఉన్నది. దానిలోవున్న సమస్తమును అతడు చూచెను. అర్ధమైనదా?.
REV 5:2,6-9
70ఆ దూత "యోగ్యుడైనవాడెవరు?" అని బిగ్గరగా ప్రకటించిన వెంటనే, అనగా బంధువుడగు విమోచకునియొక్క రాకడనుగూర్చి ఆదూత ప్రకటిస్తున్నది. ఇచ్చటొక గొఱ్ఱెపిల్లగా ఆయన నిలబడివుండెను. ఆయన ఏమి చేశాడు? ఎచ్చటెతే దేవునియొక్క ఆత్మ ఎచ్చట ఉండెనో ఆసింహాసనము వైపుగా ఆయన నడిచివెళ్ళి, సింహాసనము మీద ఆసీనుడైనవాని కుడి చేతిలోనుండి ఆ గ్రంథమును తీసుకొనెను. పెద్దలందరూ గొఱ్ఱెపిల్ల ఎదుట సాగిలపడి, "నీవే యోగ్యుడవు, ఎందుకనగా, వధింపబడినవానిగా నీవు ఉన్నావు" అని చెప్పిరి. అర్థమైనదా? పిదప, ఆయన విమోచకునిగా మారెను, లేదా ఆయన గ్రంథము, లేదా విమోచనా గ్రంథము, లేదా సంఘ కాలములలోనున్న మధ్యవర్తిత్వము పరిచర్య సమాప్తమైనది. ఇప్పుడు ఆయన విమోచకునిగా ఆయెను.
ఆయన దానినేవిధముగా చేసెననే విషయమునుగూర్చి ఈ ఏడుముద్రలలో బయలుపరచబడబోవుచున్నది. ఇప్పుడు, మనము గమనించాము…సంఘ కాలములనుగూర్చి వివరించుచున్న ప్రకటన గ్రంథములోని మొదటి మూడు అధ్యాయములలో మధ్యవర్తిత్వము యొక్క పరిచర్యను ఆయన చేసినప్పుడు, ఆ పరిచర్య ముగింపునకు వచ్చెను. కాని ఇప్పుడు విమోచన, విమోచన యొక్క కార్యము బయలుపరచబడవలసి ఉన్నది. అదేమిటది? ఆయన ఆ గ్రంథమును తీసుకొనిన… ఇప్పుడిచ్చట మీ లోతైన ఆలోచననను పెట్టుటకు ప్రయత్నించండి. ఎందుకనగా, ఈ ఏడు రాత్రులు మనకు లభించిన యెడల ఇప్పుడే వాటిని మీరు పొందుకోబోవుచున్నారు.
మీరు దానిని అర్ధం చేసుకోలేక పోయినయెడల, మీ చేతులను పైకిఎత్తి, "అది నాకు అర్ధంకాలేదు" అని చెప్పండి. గమనించండి. ఆ విషయమును మీరు నిశ్చయముగా అర్ధం చేసుకోవాలని నేను కోరుచున్నాను.
71ఇప్పుడు, గమనించండి. "విమోచన". సంఘముకొరకు తనమధ్యవర్తిత్వము యొక్క పరిచర్యను ఆయన ముగించిన వెంటనే, ఆయన తనను సమీప బంధువుడగు విమోచకునిగా బయలుపరచుకొనెను. ఇప్పుడు దీనిని మీరు గమనిస్తున్నారా? దీనిని ఆయన ఏవిధముగా చేసెననే విషయమును గూర్చి ఇప్పుడు సంఘమునకు బయలుపరచబోవుచున్నాడు. ఈ బయలుపాటు ఇదివరకే ప్రారంభమైతే, మనము మన మార్గమునకు అంతమున ఉన్నామని అది బుజువుపరచుచున్నది. ఆమేన్! అదిసరియా, కాదానే విషయమును ఇచ్చటున్న ఈ లేఖనముల గుండా మనము ధ్యానించబోవుచుండగా దాన్ని అట్లే మీరు పరిశీలించి చూస్తూ వుండుడి.
ఏది బయలుపరచబడబోవునో దానినిగూర్చి మనము కనుగొని చూద్దాం. విమోచనయొక్క బయలుపాటు అనగా ఏమిటి? మనమెట్లు విమోచింపబడితిమి. గత కొన్నిసంవత్సరములుగా ఇచ్చటేమి జరిగినదో గమనించి చూడండి. యేసుక్రీస్తు నామములోని బాప్తిస్మముగూర్చి బయలుపాటు, నిత్య నరకమనేదిలేదనే విషయము గూర్చి బయలుపాటువంటివి, దీనికి ముందు తెలియపరచబడలేదు. ఇదివరకు మీ ప్రియమైనవారు నిత్య కాలము నరకమున వేయబడివుందురని తలంచుచుండిరి.
మీరు రక్షింపబడితే తప్ప, నిత్య జీవమును కలిగియుండలేరు. మీకు నిత్యజీవము ఉంటే, ఇకప్పుడు నిత్య నరకములో మిమ్మల్ని కాల్చలేరు. భౌతిక జీవితమున మీరు చేసిన పాపములకొరకు శిక్షింపబడుదురు. కాని నరకములో నిత్య జీవమును కలిగి ఉండలేరు. మీరు నిత్య జీవమును కలిగియున్నయెడల సదాకాలం అగ్నితో దానిని సంఘము నిశ్చయముగా అర్ధము చేసుకున్నదని నేను నమ్ముచున్నాను.
72ఇప్పుడు, అదేమిటది? ఇతర విషయములనుగూర్చి ఏమిటి? విమోచన యొక్క ప్రణాళిక. పరిశుద్ధాత్మద్వారా సమీప కాలమందు మనకేది అనుగ్రహింపబడినదో ఆ విషయమును మీరు గమనించండి. అబ్రాహాము యొక్క భీజము -మరియు ఆ బయలుపాటు ఏ భావమును యిచ్చుచున్నదో గమనించండి.
సర్పముయొక్క భీజము (సంతానము). ఈ ప్రకటన గ్రంథమును గమనించారా? మనము దానినిగూర్చి ధ్యానించుచూ కనుగొనినప్పుడు అదేవిధముగా తెరచి యివ్వబడినదో చూడండి. అది ఖచ్చితముగా సత్యమని సరిగ్గా ఇచ్చట ఈ లేఖనములద్వారా నేను మీకు బుజువుపరచి చూపించాను. నేను మరలా వెనుకకు వెళ్ళి ప్రకటన…లేదా వెనుకకు వెళ్ళి ఆదికాండమును లోతుగా అన్వేషించి మరియు పరిశుద్ధ గ్రంథములో ముందునుండి వెనుకవరకు, అనగా ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ఆ ముద్రలు తెరవబడియున్నవనే విషయమును తీసి చూపించుచు మీకు నేను తెలుపగలను.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము తీసుకోలేదని విషయమును గూర్చి కొంచెం ఆలోచించండి అదొక తప్పుడు బాప్తిస్మము. ఒక దినమున చికాగో యొక్క గొప్ప సేవకుల సమితిలో ఉన్నాను. 300మంది మరి అంతకన్నాఎక్కువమంది గల బోధకుల ఎదుట నేను నిలబడి ఒకరికొకరు వ్యతిరేకముగా కేకలు వేసుకున్నంతగా దానిని నేను నిరూపించి చూపించాను. వారిలో 70 మంది బోధకులు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం తీసుకొనుటకు వచ్చుచున్నారు.
GEN 3:15
73మరియు సర్పము యొక్క బీజము గురించి (సంతానము) ఆదికాండము నుండి ఉన్నది. సర్పమునకు బీజము లేనియెడల, అట్లయితే యేసుక్రీస్తు కూడా కూడా జన్మించలేదు. ఎందుకనగా ఆయన నీ భీజమున మరియు సర్పము యొక్క సంతానంనకు మధ్య వైరము కలుగజేసెదనని చెప్పెను. సర్ప సంతానం అనేది ఒక కల్పిత కథ అయితే క్రీస్తు కూడా ఒక కల్పిత కథ అగును. అంతేకాదు సంఘము కూడా ఒక కల్పనా కథయగును. వీటన్నింటినీ మీరు గమనించిన, మీరు వాటిని విడదీయలేరు సర్పమునకు ఒక బీజము గలదు. వాస్తవముగా ఆ విషయమే వారిని తొట్రిళ్లినట్లు చేసినది. ఆ విషయమును ఎందుకు వారెందుకు అర్థం చేసుకోలేకపోయారు? ఎందుకనగా ఆ విషయమునుగూర్చి వారికి బయలుపాటు లేదు.
ఈ విషయమునుగూర్చి చర్చించుటకు నావద్దకు వారెందుకు వచ్చుటలేదు? బలిపీఠం (వేదిక) అన్ని సమయములలో తెరచి ఉండును. ఎవరినినైనా నేను కలుసుకొనుటకు సిద్దమే. వారితో నేను వాదించను. కాని వారితో ఖచ్చితముగా నేను చర్చించెదను. ఆ సేవకుల సమితి ఎదుట నేను వారిని అడిగాను. దానిలో ఎచ్చట తప్పు ఉన్నదో మీలోనున్న ఎవరైనాగాని నాతో చెప్పాలని నేను కోరుచున్నాను మీరు ఒక మూలన నిలబడిదానిని గూర్చి తర్కించుచు, నా గురించి మాట్లాడవద్దు. తిన్నగా నా ఎదుటకు రండి, వచ్చి నాముందు నిలబడి మాట్లాడండి. వాటియొక్క వాస్తవ కార్యములనుగూర్చి మనము చర్చించుకుందాము. ఆ విషయములో ఎవరే ఒప్పో లేదా తప్పో చూచుటకు మీరిచ్చటకు రండి. కాని వారు దాన్ని ఎదిరించి పోరాడలేరు. స్పష్టంగా చెప్పాలంటే, వారు వచ్చి చర్చించిన ఏమి జరుగునో వారెరుగుదురు.
EPH 4:30
74ఎందుకనగా, అది నేను కాదు. కాని అది పరిశుద్ధాత్మయైయున్నది. చూస్తున్న అదే దేవునియొక్క దూతయై యున్నది. ఈ ప్రభువు యొక్క దూత సమీపముగా నిలచివుండగా, ఈ కార్యములన్నీ ఇచ్చట ఈలాగు బయలుపరచబడుచుండగా మరి ఈ దినములగూర్చి విషయమేమిటి? ఈవిషయములనుగూర్చి నాకు తెలియదు, కాని ఇచ్చట అవి బయలుపడుటకు ఇదే ఆ ఘడియయై యున్నది. ప్రభువు చిత్తమైనయెడల ఈ దినమున ఈ ఏడు ఆత్మలను గూర్చి, ఏడు కొమ్ములను గూర్చి మరియు ఆ విషయములను గూర్చి మనము ధ్యానించగలిగిన యెడల అవి ఎచ్చట ఉన్నవనే విషయమును మీరు చూచెదరు. ఈ ప్రత్యక్షతలు ఈలాగు బయలుపరచబడు ఘడియలో మనము ఉన్నాము. ఇది ప్రత్యక్షతలయొక్క గ్రంథము. ఇది యేసు క్రీస్తునుగూర్చి బయలుపరచుచున్నది. ఆయన ఏమైయున్నాడనే విషయమును ఆయనే బయలుపరచు కార్యమును మొట్టమొదటి అధ్యాయములోనే మనము కనుగొన్నాము. ఇప్పుడు ఈ ఏడు ముద్రలను ఆయన తెరచి యిచ్చుచూ తద్వారా ఈ భూమిని ఆయన ఏవిధముగా విమోచించెనో బయలుపరచుచున్నాడు.
అలాగు బయలుపరచినవాటిల్లో యేసుక్రీస్తు నామమునుగూర్చి బయలుపరచుట ఒకటగును. ఇతర విషయములేవనగా, నిత్యమునుగూర్చి, నిత్య విమోచనను గూర్చి, విశ్వాసముద్వారా నీతీకరణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మయొక్క బాప్తిస్మము గూర్చి ప్రత్యక్షమగుటవలన ప్రజలలోవున్న భయాందోళనలను తీసివేనెను. ఏమిటి? మనము నిత్యము భద్రపరచబడి ఉన్నామనే విషయము ప్రత్యక్షమగుటవలన జనులలోనున్న సందేహములన్నీ తొలగిపొవునట్లు చేసెను. మీ రక్షణయొక్క సంచకరువును మీరు కలిగివున్నట్లెతే ఇదివరకే దేవుడు మిమ్మల్నివిమోచనా దినమువరకు ముద్రించియున్నాడు. ఎఫెసీయుల పత్రిక 4:30లో చెప్పుచున్నదేమనగా…..దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినమువరకు ఆయన యందు మీరు ముద్రింపబడి యున్నారు.
HEB 10:2•
1JN 2:15
75ఇప్పుడు ఈ కార్యములన్నీ ఇట్లుండగా వీటినుండి తొలగిపోయి మీరేలాగు వెనుకడుగు వేయుచున్నారు? మీరు దారి తప్పిపోయిన విశ్వాసిగా ఉండవచ్చునేమోగాని తప్పిపోలేరు. మీరు ఆ స్థితిలోనే అట్లే ఉండినయెడల, ప్రారంభములోనే మీరు దానిని పొందుకోలేదనియగును. కాని నీవు దేవుని కుమారుడవైతే, "సేవించువారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు" అని హెబ్రీయుల పత్రిక చెప్పుచున్నది. నిజము. కావున దారి తొలగిపోయి మరియు ఈ లోక కార్యములను అనుసరిస్తూ జీవించే నీవు ఒక క్రైస్తవునిగా ఉండలేవు. అలాగే నీవు పరిశుద్ధాత్మనుకూడా కలిగి ఉండలేవు. "మీరు లోకమునైనను, లోకములో ఉన్నవాటినైనను ప్రేమించినయెడల దేవుని ప్రేమ మీలోఉండదు". అలాగైతే మీరు ఎచ్చట నుండో తప్పుడు స్వరము (ధ్వని)ను వినుచున్నారు. సాతాను తన తప్పుడు మాటలతో మీమనస్సునంతా నింపివేసి మిమ్మల్ని ఉబ్బిపోవునట్లుచేసి, దారి తొలగిపొవునట్లు చేయును. కాని దేవుని వాక్యముద్వారా మీ జీవితమును పరీక్షించుకొనిన యెడల అప్పుడది సరిగ్గా పరిశుద్ధ గ్రంథములోని లేఖనముల ప్రకారముగా మీరు జీవిస్తున్నారని చూపించును. ఇకప్పుడు మీరు నిత్య భద్రతను పొందుకొనెదరు.
దేనిగురించి భయపడనవసరము లేదు.
దేవుడు దేనినైతే వాగ్దానముచేసెనో, దానిని దేవుడు చేయును. దానినిగూర్చి ఎవరికైనా నేను సవాలు చేయగలను. ఆ వాగ్ధానమును అట్లే విశ్వసించుచు మరియు ఆ వాక్యముతోనే నడుస్తూ సాగిపోండి. అప్పుడు మీకు ఏమి జరుగుచున్నదో మీరు గమనించి చూడండి. సహోదరుడా, ఆ వాగ్ధానములన్నీ మీ జీవితములో నెరవేరును. దేవుడు అలాగే చెప్పెను. దేవుడు వాగ్ధానము చేసిన సమస్తము, అవన్నీ జరుగుతాయి.
JOHN 3:16
76నేను నా పరిచర్యను ప్రారంభించిన దినమునుండి, దాదాపు గత పదిహేనుసంవత్సరములుగా ఈ ప్రపంచమును తిరిగి, తిరిగి వచ్చుచున్నాను. ఒక్కసారికూడా ఆ వాగ్ధానము విఫలమవ్వలేదు. ఎందుచేత? ఎందుకనగా, ప్రధానంగా నేను ఆ దేవునియొక్క వాగ్థానముపై నిలబడ్డాను. అది సత్యమని నేనెరుగుదును. అదేదో నా గొప్ప జ్ఞానముతో కలిగినదని నేను చెప్పుటకు ప్రయత్నించునట్లు నాగురించి మీరు తలంచ వద్దు. కాని హృదయ రహస్యములను ఎవరైతే బయలుపరచుచున్నాడో, ఆయనే ఈ లేఖనములలో దానిని నాకు చూపించెను. ఎందుకనగా, అసలు నాకు…ముప్పది సంవత్సరముల క్రితము మొట్టమొదటిగా ప్రసంగించుటకు నేను ప్రారంభించినప్పుడు, నా స్నేహితురాలే అచ్చట కూర్చొని పరిశుద్ధ గ్రంథమును చదువుచుండేది. నేను తగినంత విధ్యను అభ్యసించనందువలన నాకు చదువుటకు కూడా రాదు. హోప్ అచ్చట కూర్చొనివుండి నాకొరకు పరిశుద్ద గ్రంథములోని లేఖనములను చదివి చూపించుననే విషయమును విల్సస్ సహోదరీ నీకు నిశ్చయముగా జ్ఞాపకము ఉండును. అప్పుడు నేను, "అదేమి చెప్పుచున్నదో, అది చెప్పుచున్న ప్రకారముగానే చెయ్యండి. మీకు చెప్పుటకు నాకు తెలిసినదంతా అది మాత్రమే అని చెప్పెదను. అప్పట్లో నేను చేసినదంతా అది మాత్రమే. ఎందుకని? సరియైన దానిని వారు పొందుకొని ఉండిరి. అప్పట్లో అది అట్లే ఉండెను.
ఆమె, "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను" అని చదువును.
"ఎంతమంది దానిని విశ్వాసించుచున్నారు? ప్రియమైనదానా, దాని తరువాత ఉన్న దానిని చదువుము" అని నేను చెప్పెదను.
ఆయన తన అద్వితీయ కుమారునిగా అనుగ్రహించిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందుకొనునని" ఆమె చదువగా
"ఎంతమంది దానిని మీరు విశ్వాసించెదరు? అదేమి చెప్పినదో మీరు విన్నారా?" అని నేను చెప్పెదను. నాయంతట నేను దానిని చదువలేను.
ZECH 14:7
77కావున గమనించండి. ఏ పాఠశాలకు వెళ్ళి విద్యను అభ్యసించే మార్గము నాకు లేకుండెను. కాని ఓ, నేను వెళ్ళిన పాఠశాలను నేను ఇష్టపడెదను. అచ్చట ఏకాంతములో, ఎచ్చటోవున్న ఒక చిన్న గుహలో, దేవుని వైపు నా చేతులను పైకి ఎత్తి, రాత్రింబగళ్ళు ప్రార్ధనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ తన రమ్యమైన మాధుర్యంతో క్రిందికిదిగివచ్చి, తనను తాను బయలుపరచుకొనుచు, మరియు, "ఇది ఈలాగు ఉన్నది, అది అలాగు ఉన్నదని" ఆయన చెప్పుచుండును. ఏ మనిషిగాని, ఎలాంటి జీవులుగాని మరియు ఏదీ ఒక్కసారి కూడా అచ్చట ఎటువంటి ఇబ్బందిని నాకు కలుగజేయలేదు. దేశమంతటా వ్యాపించియున్న మతోన్మాదం మరియు అటువంటి సమస్త పనికిమాలిన కార్యములవంటి, వాటన్నింటికి పైగా దీనిని హెచ్చించి మరియు పవిత్రముగా భద్రపరచి మరియు ఇది ఈ ప్రపంచమంతటా సంచరిస్తూ తిరుగుచూ వచ్చునట్లు దేవుడు చేసెను. హల్లెలూయా! సహోదరులారా, మనము అంత్య కాలమందు ఉన్నాము. ఇక అంతే! "సాయంకాల సమయమున వెలుతురు కలుగును". ఖచ్చితముగా దానినే ఆయన చెప్పెను.
REV 19:20•
REV 20:15
78ఇప్పుడిది ఒక ప్రకటన ప్రత్యక్షతల గ్రంథము. తనను తాను దేవుడు ప్రత్యక్షపరచుకొనుచున్నాడు. ఇప్పుడు ఈ గొప్ప రహస్యములద్వారా బాప్తిస్మము నందు ప్రభువైన యేసుక్రీస్తు నామమును ఆయన బయలుపరచుచున్నాడు. నిత్య నరకమనే కార్యము అసలు లేనేలేదని ఆయన బయలుపరచుచున్నాడు. అలాంటిది ఉండుటకు సాధ్యము లేదు. అలాంటి విషయము పరిశుద్ధ గ్రంథము లేఖనములలో లేనేలేదు. ఇప్పుడు, నరకమనేది ఉన్నది. అగ్నిగుండము ఉన్నది. అచ్చట దుష్టులు శిక్షింపబడుదురు. కాని చివరకు వారు అగ్నితో దహింపబడుదురు. బహుశా అది పది కోట్ల సంవత్సరములు ఉండవచ్చు. కాని చివరకు వారు అగ్నితో దహింపబడుదురు. ఎందుకనగా, మీరు రక్షింపబడితే తప్ప మీకు నిత్య జీవము ఉండదు. నీవు నిత్యము మండుచున్నయెడల, నీకు నిత్య జీవముగలదని అర్థమగును. ఎందుచేత? ఒక సామాన్యమైన ఇంగిత జ్ఞానము దానిని మీకు చూపించగలదు. అర్ధమైనదా? ఏవిధముగా నిత్య అగ్ని..మీరు నిత్య జీవమును కలిగియున్నయెడల మీరు రక్షింపబడితిరని మీలో ఎంతమందికి తెలుసు? మీరు నిత్యము మండుచుండుటను గుర్తించుటకొరకు మీరు నిత్యజీవమును కలిగి ఉండవలయునా? కాబట్టి చూడండి, ఆ విషయము అసలు అర్థములేనిదగును. అర్ధమైనదా?
MATT 24:24•
MARK 13:22•
ROM 8:29,30•
EPH 1:4,5•
REV 13:8
79ఇప్పుడు, "భద్రత". "ఎవరినైతే ముందుగా ఎరిగెనో వారిని ఆయన పిలిచెను. ఎవరిని ఆయన పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని ఇదివరకే ఆయన మహిమపరచెను." ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయములో పౌలు, "దేవుడు ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపే, యేసుక్రీస్తుద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను".
యోహాను, ఈ ప్రకటన గ్రంథములో ,"అంత్య దినములలో శత్రువు, అనగా ఆ మతోన్మాదశత్రువు, జనుల మధ్య చొరబడి సంఘ సంస్థలను, మొదలగు వాటిని, మత ఆచారములను, సంప్రదాయములువంటివాటిని ఏర్పరచి, నేడు వారికున్న వాటిని వెంబడించునట్లు చేయుచు, సాధ్యమైతే ఏర్చర్చబడినవారిని సహితము మోసపుచ్చుటకు చూచును. జగదుత్పత్తి మొదలుకొని గొఱ్ఱెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారందరిని మోసపుచ్చునని" మనకు చెప్పెను.
నీ పేరు గొఱ్ఱెపిల్ల జీవ గ్రంథమున ఎప్పుడు వ్రాయబడెను? జగత్తుపునాది వేయబడకముందే, పందొమ్మిది వందల సంవత్సరముల క్రితము క్రీస్తు కొట్టబడెనా? లేదండీ. జగత్తు పునాది వేయబడకముందే. "గొఱ్ఱెపిల్ల జగత్తు పునాది వేయబడక ముందే కొట్టబడెను".
ఇదేమి చేయుచున్నదో చూడండి? ఈ ముద్రలను ఇది తెరుచుచున్నప్పుడు, విమోచనయొక్క ప్రణాళికను బయలుపరచుటకు ప్రారంభించెను. దీనిని ఆయన ఏలాగు చేసెను? ఇప్పుడు సమస్తము సమాప్తమయ్యెను… అనగా ముగించబడుచున్న వాటి విషయమునుగూర్చి. కావున మనము అంత్యకాలమందు ఉన్నాము. ఆ కారణముచేతనే ఈ విషయములన్నీ బయలుపరచబడుచున్నవి. సరే మంచిది.
REV 5:7•
REV 20:10
80ఇప్పుడు, ఏడు ముద్రలతో ముద్రింపబడివున్న విమోచనా గ్రంధమును దానియొక్క మూల (అసలైన) యజమానుని ద్వారా మన సమీప బంధువుడగు విమోచకునివద్ద అప్పగించబడెను. అసలైన యజమానుడు… ఆదాముద్వారా దానిని ఏదేను తోటలో మనము కోల్పోయినప్పుడు, అది మరలా మూల యజమానుని వద్దకే తిరిగి వెళ్ళెను. కాని ఆ స్థలమును ఒకడు అక్రమముగా ఆక్రమించెను. ఒక కబ్జాదారుడు, అతడే ఆ సాతాను, సాతాను అచ్చటకు వచ్చెను. అతడొక అక్రమణదారుడు. ఈభూమి దేవునికి చెందినది. ఈ భూమి సాతానుకు స్వంతమైనదికాదు. కాని సాతాను ఒక అక్రమణదారుడు, కబ్జాదారుడు. మానవుడా! అతడిగూర్చి సరిగ్గా ఇప్పుడే ఏదోక కార్యమును చెప్పగలను. కాని నేను ఆ విధముగా చెప్పకపోవుట మంచిదగును. ఈ ఏడు ముద్రల పుస్తకము మన విమోచనయొక్క హక్కు పత్రమైయున్నది. ఇదే హక్కుపత్రమై (అధికార పత్రము లేదా దస్తావేజు-తె.త.,) యున్నది. ఆ ముద్రలనుగూర్చి మనము పొందుకునే వరకు మీరు వేచి ఉండండి!
ఆయన ముద్రలను విప్పి, బయలుపరచి తనయొక్క స్వాస్థ్యమును ఆయన తన జనులకు ఇచ్చుచున్నాడు. ఆయన మనకు సమిప బంధువుడగు విమోచకుడైనందువలన, ఆయనకు వారసత్వముద్వారా సంక్రమించిన తనస్వాస్థ్యమును మనకు స్వాస్థ్రముగా ఇచ్చుచున్నాడు. ఆయన ఆ వారసత్వమును మనకే ఉచితముగా ఇచ్చుచున్నాడు. అదంతా ఆయనకు చెందినది. దానిని విమోచించిన వాడు ఆయనే. కాని దానిని ఆయన తనకొరకు ఉంచుకోకుండా తన జనులకే మరలా ఇచ్చివేయుచున్నాడు. అది మనపట్ల ఆయనకు గల ప్రేమయై యున్నది. ఓహ్!.
ఇప్పుడు సాతాను ఆ స్వాస్థ్యమును ఆక్రమించుకొని తన స్వాధీనములో ఉంచుకొని యజమానుడిగా ఉన్నాడు. ఆ స్వాస్థ్యమును సాతాను అంత సులువుగా తిరిగి ఇచ్చుటకు ఇష్టపడడు. దానిని లేఖనములలో ఇచ్చట కొంతసేపు తర్వాత మనము కనుగొనిచూద్దాము. నేనిచ్చట వేరొక అధ్యాయమును గూర్చి తలంచుచున్నాను. సాతాను ఆ స్వాస్థ్యమును మరలా తిరిగి ఇచ్చుటకు అసలు అంగీకరించడు. కావున అందుకొరకు అతడు పోరాడవలసి ఉన్నది. కాని చివరకు, బలపరీక్షలో నిలబడినప్పుడు సాతాను ఓడిపోయి అన్ని సముద్రములో త్రోయబడును. నిజము.
2SAM 7:12•
PS 89:35,36•
PS 132:11•
JER 33:15,22
81యేసు, సువార్తలలో "యేసు" అనే నామము నాలుగు బిరుదులతో "కుమారుడు"గా కనబడుచున్నది. దానిని మీరెరుగుదురా? యేసు సువార్తల కుమారునిగా నాలుగు బిరుదులను కలిగియున్నాడు. దానిలో ఒకటి దావీదు కుమారుడు", మరొకటి "అబ్రాహాము యొక్క కుమారుడు", మరొకటి "మనుష్యకుమారుడు", మరొకటి "దేవుని కుమారుడు" అనునవి.
ఇప్పుడు గమనించండి. మన సమీపబంధువునిగా యేసుక్రీస్తు వచ్చినప్పుడు, ఆయన దావీదుకుమారునిగా అయ్యెను. ఆ సందర్భములో ఆయన ఆ సింహాసనమునకు వారసునిగా అయ్యెను. మహిమ! దావీదు యొక్క కుమారునిగా ఉండుటవలన ఆయనే ఆ సింహాసనమునకు వారసుడు. ఇదివరకే నేనెన్నటికీ విడువనని, "దావీదుకు సంతానములేకుండా ఎన్నడూ విడువబడడు అని దేవుడు చెప్పెను. మరియు క్రీస్తు దావీదు యొక్క కుమారుడు. ఆయన మనకు సమీప బంధువుడగు విమోచకునిగా మారెను, మరియు మనతో కలసి ఎచ్చటైతే ఆయన రాజ్యమును పాలించునో ఆ స్థలమును సిద్దపరచి మనకొరకు వేచివున్నాడు.
82దావీదుయొక్క కుమారునిగా ఆ సింహాసనమునకు ఆయనే వారసుడు.
అలాగే అబ్రాహాముయొక్క కుమారునిగా, ఆయనే రాజరీతి నిధికి వారసుడై యున్నాడు. ఆమేన్. అది నిజమా? రాజరీతి నిధికి ఆయనే వారసుడు ఆమేన్. పాలస్తీనా మరియు దానిలోనున్న సమస్తము, "అబ్రాహాముయొక్క సంతానమునకు స్వంతమైనవి. ఆయన అబ్రాహాము యొక్క కుమారుడు.
మనుష్య కుమారునిగా, మనుష్య కుమారుడు ఏమి చేయును? మానవుడు దేనిని పోగొట్టుకొనెను? మానవుడు ఈ భూమిని పొగొట్టుకొనెను. కాబట్టి మనుష్య కుమారుడైన క్రమములో ఈ భూమిలోనున్న సమస్తమునకు ఆయన వారసుడైయున్నాడు. వీటన్నింటిని ఆయన పొందుకొని వాటిని మరలా మనకే తిరిగి ఇచ్చెను. పిదప, ఆయన ఉన్నవిధముగానే తన స్థానమునకు తిరిగి వెళ్ళి పోవుచున్నాడు.
పిదప దేవునియొక్క కుమారుడనే రీతిలో ఆయన వారసత్వముగా సమస్తము పొందుకొనుచున్నాడు. దావీదు కుమారునిగా సింహాసనముపై ఆసీనుడగుటకు ఆయనే వారసుడు. అబ్రాహాము కుమారునిగా ఆయనే రాజరీతినిధికి వారసుడు. మనుష్యకుమారునిగా భూమికి ఆయన వారసుడైయున్నాడు. దేవుని కుమారునిగా ఆకాశములో ఉన్నవాటికి, భూమికి, సమస్తమునకు ఆయన వారసుడగును. ఓ, దేవా! ఆయనే మన విమోచకుడు. ఆయనే మన సమీప బంధువుడగు విమోచకుడు.
REV 20:10
83ఇప్పుడు, గమనించండి! ఓ, ఇది నాకు మిక్కిలి యుక్తమైన కార్యమును చేయుచున్నది. వాస్తవముగా దీనివల్లనే నేను చక్కగా పోషింపబడుచున్నాను. ఇప్పుడు మీ హృదయములను కఠినపరచుకోకుండా కొద్ది నిమిషములు దేవుని వాక్యమునకు చక్కగా స్పందించునట్లు సిద్దంగా ఉండండి. దీనిని ఆలకించండి.
సాతాను ఒక కబ్జాదారుడు. దీనిని సాతానుచట్ట ప్రకారముగా తనకు స్వంతం చేసుకోలేదు. మరియు రెండు వేల సంవత్సరములుగా, తాను ఆక్రమించుకున్న స్వాస్త్యమునకు తాను యజమానుడా లేదా వేరెవరైనా దీనికి యజమానుడా అనే విషయములో వివాధిస్తునే ఉన్నాడు. కాని సమీప బంధువుడగు విమోచకునిగా యేసుక్రీస్తు వచ్చి, దానిని మరలా ఆయన మనకు తిరిగి ఇచ్చెను. కాని సాతాను దానిని స్వాధీనపరచుకొనెను. కాని కొంతకాలమైన పిదప, ఈ భయంకరమైన యుద్దం ముగించిన పిదప అగ్నిసముద్రములోకి సాతాను త్రోయబడునని మీరరుగుదురా? అర్ధమైనదా? సాతానుని, సాతానుని ఆరాధిస్తూ, వెంబడిస్తున్న అందరినీ ఆ అగ్ని సముద్రములోకి త్రోయబడుదురు. కాని రక్షణయొక్క స్వాస్థ్రమును కలిగినవారు క్రీస్తుతోకూడా వచ్చెదరు. సాతాను చట్టవిరోధముగా కబ్జాచేసిన కబ్జాదారుడు.
LEV 25:10
84ఇప్పుడు గుర్తుంచుకోండి. పాత నిబంధనలో ఒక వ్యక్తి తన స్వాస్థ్రమును పోగొట్టుకొనినప్పుడు, ఒక ఆక్రమణదారుడు వచ్చి ఆ స్థలమును ఆక్రమించుకొనిన ఏభై సంవత్సరములకు పైగా ఆక్రమణదారుడు తనవశమున ఉంచుకొని దానిని ధ్వంసం చెయ్యలేడు. ఏబది సంవత్సరములకు పిదప అనగా సునాద సంవత్సరమగు ఏబది సంవత్సరము వచ్చినప్పుడు, ఇక ఆదిలో దానికి ఎవరైతే మూల హక్కుదారుడో దానిలోనున్న సమస్తము మరలా అతని వశమగును. అలాగే ఒక వ్యక్తి పొలమును దున్నుచూ పనిచేయుచున్న సమయమున సునాద సంవత్సరపు బూరధ్వనిని వినినయెడల చేతిలోవున్న పారను విసిరివేసి, "ఇక నేను ఒక బానిస కాదు. నేను నా కుటుంబము నివసిస్తున్న నా గృహముకు తిరిగి వెళ్ళెదనని" చెప్పును. సమస్తము తిరిగి ఇచ్చెదరు. ఆ ఆక్రమణదారుడు తన వశముననున్న స్థలమును వదిలి, దానిని ఖాళీచేసి వెళ్ళిపోవలెను. అతడు చేయవలసినది అదే. అతడు ఆ స్థలమును ఖాళీచేసి వెళ్ళవలెను. ఎందుకని? ఆ స్థలముయొక్క స్వంత హక్కుదారుడు అచ్చటకు మరలా తిరిగి వచ్చుచున్నాడు. కాబట్టి అతడు ఆ హక్కుదారునికి దానిని ఇచ్చివేయవలెను.
హల్లెలూయా! ఈ దినములలో ఏదోక దినమున ఈ ప్రపంచ రాజ్యముల కూలిపోవును. దీనియొక్క చట్టబద్దమైన యజమానులు ఈ దినములలో ఏదోక దినమున వచ్చి దీనిని స్వాధీనపరచుకొనెదరు. ఆమేన్!
MATT 28:12-15•
ACTS 1:3
85ఇప్పుడు, అచ్చట వివాదమైన ఒక కాలము ఉన్నప్పుడు, నలుబది దినముల వరకు, అనగా పరిశుద్ధస్థలమున శుద్దీకరింపబడు మొదటి దినము నుండి లేదా క్రీస్తు కల్వరికి వెళ్ళిన దినమునుండి క్రీస్తు పరమునకు ఆరోహణమైన దినము వరకు నలుబది దినములుగా ఉండెను. కాబట్టి అచ్చట టక వివాదం ఉండెను. ఆ విషయమును గూర్చి అపవాదికి చెందిన గుంపువారు ఏమి వాదించిరనగా, ఆయన మరణము నుండి జీవముతో లేవలేదని చెప్పెదరు. మరియు, ఆ దుర్వార్తను వారు అలాగే ప్రకటించి అంతటా వ్యాపింపచేయుటకు ప్రారంబించిరి. "ఆయన శిష్యులు రాత్రి వేళలో వచ్చి ఆయనను దొంగిలించి తీసుకొని వెళ్ళిపోయిరి అని చెప్పిరి. మీరు పరిశుద్ధ గ్రంథములో ఆ విషమును గూర్చి చదివి చూడండి. "వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచనచేసి ఆ సైనికుల చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవుచుండగా ఆయన శిష్యులు రాత్రి వేళవచ్చి, ఆయనను ఎత్తికొనిపోయిరని మీరు చెప్పుడి" అని చెప్పిరి. కాని ఆ దినములలో ప్రశ్నార్ధకముగా ఉండెను. ప్రతీ ఒక్కొక్కరికి అది ఒక ప్రశ్నగానే మిగిలిపోయెను.
"మంచిది, వాస్తవముగా, అది సంఘ శాఖకు చెందినది. అట్లయితే, మొత్తం దానికే చెందుతాయి."
LEV 25:10•
MATT 28:13•
ACTS 2:1-4•
2COR 5:5
86. కాని యాభైయవ దినము, పెంతెకోస్తు దినమగును. చట్టపరమైన యజమాని వారి మధ్యకు వచ్చి (హల్లెలూయా!), ఇది సంఘశాఖ కాదని చూపించెను. పరిశుద్దాత్మతో నింపబడుటయగును. అది ఆయన తన సంఘమునకు ఇచ్చిన దేవునియొక్క బయానా (సంచకరువుగా ఇచ్చిన డబ్బు)యగును. తద్వారా శాఖలద్వారా మరియు ఇతర వాటిద్వారా తన సంఘమును స్వాదీనపరచుకోకుండ దేవునియొక్క బయానాయగును. అదేమనగా, పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క బయానాతో దేవునియొక్క శక్తి మరియు దేవునియొక్క ప్రేమయై యున్నవి ఆమేన్! ఓ, అది మీలో ఏదోక కార్యమును చేయుట లేదా? చట్టపరమై యజమాని? అది ఎవరి చేతులలో ఉన్నది? దేవుని చేతులలో ఉన్నది. మరియు…
చూడండి. దానిని అతడు ఏబది సంవత్సరములకంటే ఎక్కువగా తన వశమున ఉంచుకోలేడు. దానిని మీరు లేవీకాండములో చదువవచ్చు. దానియొక్క నియమములు అచ్చటగలవు. ఆ మూల యజమాని ఉండగా వారు దానిని తమ వశమున ఉంచుకోలేరని నేను చెప్పాను. ఏభై సంవత్సరములకు తరువాత దానిని ఆ మూల (అసలైన) హక్కుదారునియొక్క చేతులలోకే మరలా తిరిగి అప్పజెప్పవలెను. మనమందరము దానినెరుగుదుము. దానిని మనము అనేక సార్లు చదివాము. కాని గమనించండి. "ఏబది సంవత్సరములకు తర్వాత అది మరలా ఆ స్థలము యొక్క స్వంత హక్కుదారుని యొద్దకే తిరిగి వెళ్ళి చేరవలసియున్నది.
మంచిది, అట్లయితే ఈ ఏబది సంవత్సరములకు పిదప… ఒక దినము అనగా ఒక సంవత్సరమునకు సమానము. పస్కాపండుగ దినమున వారు, ఆ సమిప బంధువుడగు విమోచకుడిని తీసుకొని వెళ్ళి వధించిరి. అప్పటినుండి ఈ వివాదం ప్రారంభమైనది. ఆయన సమీప బంధువుడగు విమోచకుడని అంత వరకు సంఘము నమ్ముచూ వచ్చెను. "ఆయనే విమోచకుడు". పిదప సంఘము ఏమి చేసెను? ఆయనను సిలువలో వేసి చంపిరి. దానిని శత్రువు చేసెను. శిష్యులు వచ్చి ఆయన దేహమును తీసుకొని వెళ్ళిపోయి, ఆ దేహమును ఎచ్చటో ఒకచోట దాచివేసిరని చెప్పిరి. "ఆయనకు ఏమి జరిగినది? ఏమి జరిగెను?" అనే అనేక రకములైన సందేహములు ప్రజలలో తలెత్తినవి.
EPH 1:13,14
87ఇప్పుదు, యాభైయవ దినముయొక్క చివరి దినమున మీరు గమనించిన, ఇకమీదట అదొక వివాదముగా లేకుండాపోయెను. అనగా, అంతటితో ఆ వివాదము సమసిపోయెను. పిదప, దేవుడు… ఆ పాత సాంప్రదాయకమైన, కొయ్యబారినట్లు ఉండు, చల్లని సంఘమునకు వారు వెళ్ళి, వారితో మిళితమై పోవుటకు బదులుగా, తన సంఘమునకు దేవుడు పరిశుద్ధాత్మను పంపించి, దానిలోనున్న ఆక్రమణదారులందరిని వెలుపలికి పారద్రోలిన తరువాత దానిని స్వాధీనపరచుకొని తన వశమున తీసుకొనెను. శక్తివంతమైన పరిశుద్ధాత్మ క్రిందికి దిగి వచ్చెను. మరియు అప్పుడు సంఘము, దానికి చెందిన రక్షణ యొక్క సంచకరువును పొందుకొనెను.
ఇప్పుడు, సహోదరులారా, మీ భావములను లేదా ఆ విషయములనుగూర్చి మీకున్న అభిప్రాయములను గాయపరచాలనే భావముతో నేను దీనిని చెప్పుటలేదు. మీరు మీ సంఘ సంస్థ సరియైనదని భావించుచు, మీరొక కాతలిక్ సంఘసంస్థ సభ్యునిగా ఉండినయెడల, మీరొక బాప్తిస్టు సంఘ సంస్థ సభ్యునిగా ఉండినయెడల మీరు నళించిపోవుదురు. అర్ధమైనదా? మన రక్షణయొక్క సంచకరువు అనగా, ఒక సంఘములో సభ్యునిగా చేరుట కాదు. మన రక్షణయొక్క సంచకరువు అనగా, ఏదోక సంఘసంస్థకు చెందినవారముగా ఉండుటకాదు. ఏ సంఘ సంస్థకు చెందినవారముగా కాకుండా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును పొందుకొనటయే మన అసలైన రక్షణయొక్క సంచకరువగును, ఆమేన్!
LEV 25:10
88ఏభైయవ దినమునకు పిదప కూడా దానిని వారు తమ వశమున ఉంచుకోలేరు. ఎందుకనగా, అది సునాద దినమైనందువలన సమస్తము మరలా అవి ఆదిలోయున్న ఆ మూల స్థానమునకే తిరిగి వెళ్ళిపోవును. ఆ ఏభైయవ దినమున దేవునియొక్కశక్తి మరల దాని మూల స్థితికి తీసుకొని వెళ్ళెను. మరియు సునాదసంవత్సరమున సమస్తము మరల మూల స్థితికి తిరిగి వెళ్ళును.
ఇప్పుడు, మరొక సునాద సంవత్సరము రాబోవుచున్నది. దానిని ఇప్పుడే సరిగ్గా ఈ కాలమందే మనము కలిగియున్నాము. మీరు గమనించి చూచిన యెడల అమెరికాలో దాదాపు ఏబది సంవత్సరములుగా పెంతెకోస్తు కుమ్మరింపబడుచున్నది. ఇంచుమించు అది ఆ కాలమునుండే క్రుమ్మరింపబడుచున్నది. సరిగ్గా దాదాపు ఏబది సంవత్సరములుగా పెంతెకోస్తు క్రుమ్మరింపబడుట ప్రారంభమైనది. ఇప్పుడేమి జరుగుచున్నది. యేసుక్రీస్తుయొక్క ప్రత్యక్షతను గూర్చి ఏడు ముద్రలలో ముద్రింపబడిన పుస్తకము (ఏడు ముద్రలు)ద్వారా సంఘము పొందుకొనుచున్నది. కాని వారు పదిమందిలో ఒక్కరు కూడా వారు దానిని పొందుకోలేదు.
89కాని మీరు జూబ్లీ సంవత్సరమును చూచుటకు ప్రారంభించినప్పుడు ఇతరులతో గొడవలుపడుట మరియు ప్రయాసపడుట మరియు నువ్వా నేనా అన్నట్లుగా త్రాడును లాగుట వంటివి మనకు అచ్చట ఉండవు. ఎట్లనగా మనము ఇదివరకే క్రీస్తులో భద్రతపరచబడి ఉన్నాము. ఇదివరకే ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును మనము పొందితిమి. ఈ గొప్ప రహస్యములువంటి విషయములన్నీ మనకు గలవు. వాటిని ఈ ఏడు ముద్రలలో మనము తీసుకొని రాబోవుచున్నాము. మరియు ఈ ముద్రలు ప్రజల కనులకు మరుగుచేయబడి ఉన్నవనే విషయమును మీకు రుజువుపరచి చూపించెదను. దేవుడు నాకు సహాయుకినిగా ఉండుట వలన పరిశుద్ద గ్రంథములో వారు దానిని చూడలేకపోతిరనే విషయమును మీకు రుజువుపరచెదను, (ఇట్లైతే నిశ్చయముగా, పరిశుద్ధ గ్రంథము దానిని అట్లు చెప్పిన యెడల మీరు నమ్మెదరు). ఈ కాలమువరకు తండ్రీ కుమార పరిశుద్ధాత్మ ( అనే దానిని మాత్రమే చూచితిరి తప్ప మరేదీ చూడలేకపోయిరి. ఈ కాలము వరకూ నిత్య నరకము లేదనే విషయమును వారు చూడలేకపోయిరి. ఒక నిజమైన విశ్వాసికి నిత్య భద్రతగలదనే విషయమునుకూడా వారు చూడలేకపోయిరి. ఆ విషయములను గూర్చి విన్న వెంటనే ప్రతీచోటా పరిహాసముచేయుచు, అస్పష్టమైన ఒక ధ్వనిని ఇచ్చెదరు.
ఆ కారణముచేతనే ప్రజలు "సిగరెట్ల పొగను పీల్చుచూ, మద్యం త్రాగుచూ లోక కార్యములన్నీ చేయుచూ మాకు నిత్యమైన భద్రత గలదని చెప్పుచున్న ఆ ప్రెస్టిటేరియన్లను మరియు మొదలగు వారిని చూడండి" అని చెప్పెదరు. అవును కాని మీరు గమనించండి. అదేమనగా, ఒక నిజమైన బూరధ్వనిని వారు త్రోసివేయుచున్నారని అది చూపించుచున్నది.
ఈ ముద్రలు తెరువబడినప్పుడు బూర ధ్వని స్పష్టమైన ధ్వని ధ్వనించుచున్నదా, తద్వారా ఆదికాండమునుండి ప్రకటన గ్రంథము వరకు ముందు, వెనుక పరిశీలించి చూచి అవి వాటితో ఏకీభవించుచున్నవో లేవో మీరు పరిశుద్ధగ్రంథమున కనుగొనవచ్చు. అందుకొరకే ఈ విషయములు బయలుపరచబడుచున్నవి. గమనించారా?.
90ఇప్పుడు, ఓ, సహోదరుడా, నేను తలంచినదేమనగా,.. మరలా మరొకసారి నేను ఈ అంశమువద్దకు వచ్చువరకు దీనిని ఇచ్చటే ఇలాగే విడిచిపెట్టబోవుచున్నాను. ఈ అంశమును గూర్చి ఇచ్చట ఇంకా ఆరుపేజీలు నా వద్ద గలవు. కావున సాధ్యమవ్వదు. ఎందుకంటే మనకు బాప్తిస్మము ఆరాధనగలదు. ఈ సునాద సంవత్సరమనే అంశమును గూర్చి ఇచ్చటున్న కొన్ని విషయములను గూర్చి నేను చదివెదను.
ఇప్పుడు, ఈ లేఖనములను మీరందరూ వ్రాసుకొనుచున్నారా? యిర్మియా 32వ అధ్యాయము 6వ వచనము. దీనిని మీరు చదువదలచిన మీ ఇంట్లో చదువుకోండి.
ఇప్పుడు యిర్మియా, ఈ గ్రంథపుచుట్టలో మీరు కనుగొనునట్లుగా, దీనిలో ఉన్న విషయములను తీసి నేను మీకు వివరించెదను. ఎలాగైనా ఆ గ్రంథపుచుట్టను మనము తీసి చూద్దాము. ఈ గ్రంథపు చుట్టనుగూర్చి వివరించుటకు నాకు మరొక పది నిమిషములు పడుతుంది. ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి. ఈ గ్రంథము ముద్రించబడినది. పాత పరిశుద్ధ గ్రంథము యొక్కకాలములో, ఇప్పుడు ఈ కాలములో మనకున్న ప్రకారము, నాలుగు మూలలు కలిగిన పుస్తకము వంటిదికాదు అది. ఇది ఇట్లు చుట్టబడునట్లు ఉండును. ఆ పుస్తకమును, "గ్రంథపు చుట్ట" అని పిలిచెదరు. అది మీకు ఎంతమందికి తెలుసు? ఉహ్, నిశ్చయముగా అది ఒక గ్రంథపు చుట్టయగును. సరేమంచిది.
JER 25:11•
JER 29:10•
JER 32:2,3,8-12•
REV 5:1
91ఈ గ్రంధము ఏడు ముద్రలతో ముద్రించబడినది. ఇప్పుడు ఇది పరిశుద్ధ గ్రంధమై మరియు ఇది ఏడు ముద్రలతో ముద్రించబడి యున్నది. ఇప్పుడు అదే విధముగా జరిగినదో గమనించండి.
యిర్మియా ప్రవచించినప్పుడు, తాను కూడా చెరపట్టబడికొనిపోబడుదునని ప్రవచించెను. యిర్మియా 32వ అధ్యాయమున చెప్పెను. తాను కూడాచెరపట్టబడి బబులోనుకు కొనిపోబడుదునని, అచ్చట వారుడెబ్బది సంవత్సరములు చెరలో బంధింపబడి ఉందురని యిర్మియా ప్రవచించి చెప్పెను. పరిశుద్ధ గ్రంథమును పఠనముచేయు మీరు దానిని అనేకసార్లు చదివివుందురు. యిర్మియా డెబ్బది సంవత్సరములు అచ్చట ఉండునట్లుగా చెరపట్టబడి కొనిపోబడెను. హనమేలు, యిర్మియాకు తనతండ్రి తోడబుట్టిన కుమారుడగును. హనమేలుకు యిర్మియా చాలా దగ్గర బంధువగును. ఈ హనమేలు మరణించెను. యిర్మియా హనమేలు యొక్క భూమిని క్రయము యిచ్చి కొనెను. కావున ఆ క్రయ పత్రములను, స్వాస్థ్రమగు స్థలమును శత్రువులు అపహరించెదరని ఎరిగినవాడై మరియు దేవుడు తన ప్రజలను ఎన్నడూ వదిలివేయడని, తన జనులను ఆయన విడుదల చేయునని యిర్మియాకు తెలుసు. కాబట్టి వారు మరలా తమ స్వదేశమునకు తిరిగి వచ్చినప్పుడు తాను కొనిన తన స్వాస్థ్రమునకు చట్టబద్దమైన యజమనుడుగా ఉండవలననే ఉద్ధేశ్యముతో యిర్మియా ఈ కార్యమును చేసెను. ఆ స్ధలము యొక్క పూర్తి వివరములను ఆ పత్రములలో అతడు వ్రాసియుంచెను.
JER 32:10
92దానిని మీలో ఎంతమంది చదివిరి? సరే. మీరు దానిని చదివితిరి అట్లయితే మీరు దీనిని చదివిరి. సరే. ఇప్పుడిచ్చట ముద్రించబడివున్న ఈ గ్రంథపు చుట్టలవలె అతడు ఆ క్రయ పత్రములను తీసుకొని ఖచ్చితముగా ఇలాగే వాటిని ముద్రించి చుట్టెను. మీరు కనుగొనిన విషయములన్నింటికంటే ఇది బహు రమ్యమైనది.
ఇప్పుడు, దీనిని ఈ చిన్న కాగితముద్వారా నేను వివరించి చెప్పుటకు ప్రయత్నించబోవుచున్నాను. దానిని నేను అలాగు వివరించి చెప్పగలనా లేదా నాకు తెలియదు. ఇప్పుడు, ఇచ్చటున్న ఈవిధముగానే అది వ్రాయబడి ఈలాగు చుట్టబడెను. మరియు ప్రతీ దానిని ఈలాగు ముద్రించి, అతడు ఆ పత్రములు ఈలాగు చుట్టెను. అనగా ఆ ముద్రింపబడిన పత్రములలో తనయొక్క స్వాస్థ్యమును గురించి మరియు ఆనాడు ఏమి సంభవించినదో వాటియొక్క విషయములన్నిటిని ఈ ఒక్కొక్క ముద్రలలో వ్రాసి మరియు అతడి ఎదుట ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరు మరణించిరో వారందరి వివరములను గూర్చిమరియు ఆ స్థలమును తాను ఎట్లు స్వాస్థ్యముగా పొందుకొనెనో వాటన్నింటిని ఆ ముద్రలలో వివరించి వ్రాసి వాటిని అతడు ముద్రించెను. వాటన్నింటిని అతడు ఈలాగు ముద్రించెను.
MATT 25:41•
2PET 2:4•
REV 5:1
93ఇప్పుడు దేవుడు కూడా ఏడు ముద్రల పుస్తకమును అట్లే కలిగియున్నాడు. ఆయన ఆ ముద్రలను విప్పినప్పుడు, ఆ ప్రత్యక్షతయొక్క పూర్వాపరములు మరియు సమస్తము పుస్తకముయొక్క వెనుక ప్రక్క వరకు కొనసాగుచూ వచ్చుచున్నవి. కాబట్టి యేసుక్రీస్తు నామమునుగూర్చి ప్రత్యక్షతను మీరు గైకొని మరియు ఆ ప్రత్యక్షతద్వారా ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ధ్యానిస్తూ వచ్చి"తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అనే విషయము లేనేలేదని నిరూపించి చూపించవచ్చు. అర్థమైనదా? ఈ ప్రత్యక్షత పరిశుద్ధ గ్రంథమంతటా బయలుపరచుచూ వెళ్ళుచున్నది. దానిని అది ప్రత్యక్షపరచుటను మీరు గమనించండి.
"నిత్య నరకము గలదు" అనే విషయమునుగూర్చి తీసుకొని చూద్దాం. ఈ విషయమునుగూర్చి పరిశుద్ధ గ్రంధమంతటా మీరు అన్వేషించి పరిశీలించినా అసలు నిత్యనరకమనే విషయము లేదని కనుగొనబడును. ఎందుకనగా, ఆ నరకము దయ్యమునకు మరియు దాని దూతలుకొరకు, రాబోయే కాలములో వాటిని శిక్షించుటకు ఆదియందు సృష్టింపబడినదని దేవుడు చెప్పెను. నరకము నిత్తమైనదైతే అదెట్లు సృష్టింపబడి ఉండును? సృష్టి అనే పదము… నిత్యమనే పదమనకు అర్ధమేమనగా, "ఎన్నడూ ఆరంభము లేనిది మరియు ఎన్నడూ అంతములేనిది". కాబట్టి నరకమనేది, నిత్య నరకం ఉన్నయెడల, "దేవుడు నిత్యము నిత్యుడైయండగా అదే సమయమున నిత్యనరకమనేది ఉంటే నిత్యుడగు దేవుడు ఉన్నట్లుగానే అదికూడా ఉండవలెను. అనగా పాపమనేది ఒకటి ఉండుటకు ముందే నరకమనేది ఒకటి ఉన్నదని అర్ధమగును." హు! ఓ, దేవా! చూచారా, మీరు దాన్నిఅలాగు చెయ్యలేరు.
JER 32:10•
MATT 11:25•
LUKE 10:21
94కాబట్టి, ఈ విషయములు వాటంతటవే విప్పబడుచుండుటను మీరు గమనిస్తూ ఉండగా అది సరిగ్గా వెనుకకు తిరిగి వెళ్ళుచూ, పుస్తకమును తెరచుచున్నది. కాబట్టి ఇప్పుడది పరిశుద్ధ గ్రంథముయొక్క వాస్తవమైన పరిపూర్వమైన దృశ్యమును ఇచ్చుచున్నది. మరియు జ్ఞానులకు మరియు వివేకుల కన్నులకు ఈ పరిశుద్ధగ్రంథము మరుగుపరచుచున్నది. దేవుడు పరిశుద్దాత్మద్వారా సరిగ్గా పరిశుద్ద గ్ర౦ధము గుండా వాటిని ప్రత్యక్షపరచుచూ మరియ తద్వారా ఆ ముద్రలను విధముగా తెరచి ఇచ్చుచున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.
సహోదరుడా, ఇది నా ఆత్మీయ మధుర స్పృతిని రేపుచున్నదని నేను మీకు చెప్పుచున్నాను. అర్ధమైనదా? అర్ధమైనదా? ఇప్పుడిచ్చట గమనించండి! చూడండి అది …నేను చెప్పే భావము మీకు అర్ధమగుచున్నదా? చూడండి. ఇచ్చట ఒక ముద్ర గలదు. ఇప్పుడు మీరు గమనించిన, దానిని ఇచ్చట చదవండి. యిర్మియా గ్రంథముకు వెళ్ళి మరియు అతడు దానిని ఏవిధముగా ముద్రించెనో మీరు గమనించండి.
REV 6:1-3,12
95ఇప్పుడిచ్చట ఆ పుస్తకము గలదు. దానిలో అవి వ్రాయబడియున్నవి. మొదటి ప్రత్యక్షతను బయలుపరచు సరియైన సమయమున, అప్పుడు ఆయన ఈ ముద్రను తెరచును. కావున మనము ముద్రలనుగూర్చి ధ్యానిస్తున్నప్పుడు, ఇప్పుడు మొదటి ముద్ర ఏమిటని మీరు గమనించి చూడండి. పిదప రెండవ ముద్రను ప్రత్యక్షపరచు సమయములో, ఆయన దాని తర్వాత ముద్రను తెరచుచున్నాడు. ఇప్పుడు మనము ఏ సమయములో ఉన్నామో మీకు తెలుసా? మనము దాదాపుగా, సరిగా ఇప్పుడే ఏడవ ముద్రయొక్క సమయమున ఉన్నాము. ఏడవ ముద్ర తెరచినప్పుడు…..
మొదటి ముద్ర తెరువబడినప్పుడు, మొదటి బూర ఊదబడెను. మరియు మొదటి తెగులు క్రుమ్మరింపబడెను. అలాగే ఆరవ ముద్ర తెరువబడునప్పుడు, ఆరవ బూర ఊదబడెను. మరియు ఆరవ తెగులు క్రుమ్మరింపబడెను. బహు రమ్యమైన ఈ కార్యమును మీరెన్నడూ చూచి ఉండరు. కావున దీనిని అట్లే గమనించండి. నేను వీటిని ప్రసంగించేటప్పుడు, ఒక పెద్ద నల్ల పలకను నాకొరకు తీసుకొని పెట్టి ఇచ్చటకు తీసుకొని వచ్చి పెట్టినదానిపై విషయములను వ్రాసి వివరించుచు, సరిగ్గా ఇచ్చట వాటినిగూర్చి నేను ఉపదేశించెదను. ఒక్కొక ముద్రనుగూర్చి బోధించుటకు మనము ఎక్కువసమయమును తీసుకుందాము. దానియొక్క పూర్వపరాలను అన్వేషించుచు, దానియొక్క చరిత్ర సంఘటనలను పరిశీలించుచు, ఆ సంఘటనలు ఎప్పుడు జరిగినవో వాటిని గూర్చి నిరూపించుచు మరియు పరిశుద్ధ గ్రంథములో ఆ విషయములు ఎచ్చట చెప్పబడినవి, అవి ఎచ్చట ఉన్నవి, అవి సరిగ్గా ఎప్పుడు జరిగినవి? వీటిని తేదీలతో సహా మరియు సమస్త కార్యములను కనుగొని వాటిని ఇచ్చట మీకు చూపించెదను. వాటిని నేను పొందుకున్నాను. ఆయన నుండి నేను వాటిని పొందుకున్నాను. ఆమేన్. అది నిజము. అచ్చట ముద్రలు గలవు.
JER 25:11•
JER 29:10•
JER 32:9-14
96ఇప్పుడు, యిర్మీయా ఈ గ్రంథమును వ్రాసెను. దానిని ముద్రించెను… ఇచ్చట ఉన్న ఒక మంచి విషయమును మీరు గమనించవలెనని నేను కోరుచున్నాను. మీరందరూ దానిని చదివితిరి. ఆ గ్రంథములో అవి వ్రాయబడి ముద్రించబడెను… తాను కూడా బంధింపబడి చెర శాలకు కొనిపోయెదనని, అతడు ప్రవచించెనని ఇప్పుడు గుర్తుంచుకోండి. అది అతడికి తెలియదు. ప్రవచనముద్వారానే దానిని అతడు తెలుసుకొనెను. మీరు నేను చెప్పుచున్న దానిని ఆలకించుచున్నారా? దేవుని యొక్క ప్రత్యక్షతద్వారా, ప్రవచించిన ప్రవచనముద్వారా అతడు దానిని ఎరిగెను. తాము తమ స్వదేశమునుండి దూర ప్రాంతమునకు కొనిపోబడి అచ్చట డెబ్బది సంవత్సరములు ఉండబోవుచున్నామని అతడు ఎరిగియుండెను. యిర్మీయా దానిని ప్రవచించెనని మీకు గుర్తున్నదా? వారు చెపట్టబడి వారితోపాటు అతడు డెబ్బది సంవత్సరములు అన్య దేశమున ఉండవలసి వున్నదని యిర్మీయా ఎరిగియుండెను. కాబట్టి తాను సంపాదించిన తన స్వాస్ద్యముయొక్క క్రయ పత్రములను ముద్రించి, నిశ్చయముగా వాటిని భద్రపరచి ఉంచవలెనని యిర్మీయా కోరుకొనెను. ఎట్లనగా, ఆ స్వాస్థ్యమును తన తండ్రి యొక్క తోబుట్టువు కుమారునినుండి సంపాదించుకొనెను. కాని ఆ విషయములన్నింటిని చట్ట పూర్వకముగా క్రయ పత్రములో అతడు వ్రాసి యుంచెను. ఆ పత్రములు తుప్పుపట్టి పాడైపోకుండా ఉండుటకు అతడేమి చేసెను? అతడు ఆ పత్రములను మట్టి కుండలో పెట్టెను. డెబ్బది సంవత్సరములు సమాప్తమగు వరకు ఆ పత్రములు పాడైపోకుండా లేదా తుప్పుపట్టకుండా ఉండుటకై అతడు వాటిని ఆవిధముగా భద్రపరచెను.
HEB 13:8
97దేవునికే మహిమ! మీరు దానిని అర్థం చేసుకొనిరని నేను నమ్ముచున్నాను. దేవుడు ఏమి చేసెనో మీరు చూడగలుగుచున్నారా? ఆయన దీనిని మేధావులకు మరియు విద్యావంతులకు ఎన్నటికీ ప్రత్యక్షపరచడు. కాబట్టి వారు ఈ కాలములన్నింటిలో తమనుగూర్చి అతిశయించలేకపోయిరి. కాని ఆయన దీనిని ఒక మట్టి పాత్రలో పెట్టి మరియు ఆయన యేసేక్రీస్తు అనే తన స్వంత కుమారుడిని తానే సృష్టించెను. ఈ కడవరి కాలములో ఇప్పుడు ఆయన ముద్రలను తెరచుచు దానిలో వున్న విషయములను తన సంఘమునకు చూపించుచున్నాడు. అవి పాడై పోకుండా లేదా తుప్పుపట్టకుండా ఆయన వాటిని మట్టి పాత్రలో పెట్టెను. ఓ, మీరు నన్నొక పరిశుద్ధ దొర్లు గుండ్రాయిగా తలంచుచున్నారని నాకు తెలుసు. అట్లే ఉండవచ్చు. మీకు అర్థమైనదా? కాని అది మట్టి పాత్రలో భద్రపరచబడి ఉన్నది. అది గ్రంథపు చుట్టవలె చుట్టబడి భూసంబంధమైన మట్టి పాత్రలో బద్రపరచబడి, ఈభూమి నుండి విమోచింపబడి, ఈస్టరు ఉదయమున ఇక మరణము యొక్క ముద్రలు ఆయనను పట్టి బంధించి ఉంచుటకు సాధ్యమవ్వకపోవుటవలన పునరుద్ధానుడై లేచెను. కాని ఆయన మరణముయొక్క ముద్రలను బ్రద్దలు చేసుకొని పునరుద్ధాణుడై లేచి తాను సజీవుడని తనను ఈ అంత్య దినములలో నిరూపించుకొనెను. ఆయన తన సంఘములో సజీవుడై యుండి, నిన్న నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆ రహస్యములను వేద శాస్త్రపాఠశాలలో విద్యను అభ్యసించిన వారికి మరుగుజేసెను మరియు సంఘ సంస్థలకు వాటిని మరుగుజేసెను.
ఈ అంత్య దినములలో తన ప్రజల మధ్య, తన స్వకీయ ప్రసన్నత ద్వారా ప్రత్యక్షపరచుచున్నాడు. ఈ లోక కార్యముల నుండి తొలగించుకున్న కొంతమందిని ఆయన ఎన్నుకొని, వారినుండి సంఘము యొక్క తత్వమును తీసివేసి మరియు అలాంటి వ్యర్థమైన కార్యములన్నింటిని ఆయన వారినుండి తీసివేయునప్పుడు, ఆయన వారిద్వారా మాట్లాడగలడు. ఈ ముద్రల విషయములో ఆయన ఎట్లు చేసెనో అట్లే వారికి ఈముద్రలను తెరచి మరియు ప్రత్యక్షపరచి ఇవ్వగలడు. అర్ధమైనదా? హల్లెలూయా! ఓ, మీరు ఆయనను ప్రేమించుటలేదా?.
GEN 18:9-15
98మన రక్షణయొక్క ప్రణాళిక ఆవిధముగానే, యేసుక్రీస్తులో ఇప్పుడు ప్రత్యక్షపరచబడుచున్నది. ఈ అంత్య దినములలో ఆయన తననే విధముగా ప్రత్యక్షతపరచుకొనుచున్నాడు? ముద్రను తెరచుటద్వారా తనను ప్రత్యక్షపరచుకొనుచున్నాడు. ఎందుచేత, అబ్రాహాముయొక్క సంతానముగూర్చి మీ జీవితములో ఇదివరకు మీరెన్నడూ వినియుండలేదు. నీతీకరణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మయొక్క బాప్తిస్మము ద్వారా వారేవిధముగా వెళ్ళిరో మనము కనుగొన్నాము. ఈ అంత్యదినములలో ఏవిధముగా ఆ దూత వచ్చి, ఈ సమాజము ఎదుట నిలబడి వెనుక ప్రక్కకు తిరిగి, గుడారములోనున్న శారా తన హృదయములో ఏమి తలంచుచున్నదో వివేచించి చెప్పినట్లుగా, ఖచ్చితముగా అదేవిధముగా చెప్పెను. (అది ఈ దినము వరకు జరుగలేదు. అది నిజము. కాని అది జరిగే దినము ఇదే). అది అబ్రాహాము యొక్క విశ్వాసము మరియు యేసు క్రీస్తునామమును గూర్చిన విషయమేయగును.
REV 5:6
99ఇప్పుడిచ్చట ఒక విషయము గలదు. ఇచ్చటున్న ఐదు విషయములను గూర్చి నేను మాట్లాడాలని కోరుచున్నాను. ఒక్క నిమిషము, ఎంత త్వరగా సాధ్యమగునో అంత త్వరగా చెప్పెదను. అచ్చట ఏడు ముద్రలు గలవు. దేవునియొక్క విమోచనా ప్రణాళికలో ఐదు మరియు ఏడు సంఖ్యలు గలవు. ఐదు అనే సంఖ్యయొక్క అర్ధమేమనగా "కృప" అని అర్ధము. అదెంతమందికి తెలుసు? జీసస్ (J-E-S-U-S) మరియు విశ్వాసము( F-A-I-T-H-) ఐదు అనే సంఖ్య కృపకు సాదృశ్యముగా ఉన్నది. ఆరవసంఖ్య మానవుని యొక్క దినమును సూచించుచున్నది. ఏడు అనేది, అతడి యొక్క విమోచనా దినమును సూచించుచున్నది.
ఇప్పుడు గమనించండి. ఈ ఏడు ముద్రలలో లేదా ఈ గొప్ప విమోచనా పథకములో ఏడుదశలు గలవు. విమోచనయొక్క ఏడు ముద్రలు, దేవుని యొక్క ఏడు ఆత్మలు, దానిని మనము "ఏడు ఆత్మలు" అని వచనము చెప్పుచున్నది, మీరు చూడాలనుకుంటే చూడవచ్చు. ఒక్క నిమిషము ఇచ్చట నన్ను చూడనివ్వండి .. 5వ అధ్యాయము, ప్రారంభములోనున్న 6వ వచనము (ఇచ్చట మనము చూడగలమని నేను నమ్ముచున్నాను) 6వ వచనము. …
సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములను, ఏడు కన్నులునుండెను. ఆ కన్నులు భూమియంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.
ఆ ఏడు ఆత్మలు ఏమైయున్నవి? అవి ఏడుగురు వర్తమానికులు. వారిలో పరి.కొలంబో, ఐరేనియస్, జాన్‌వెస్లీ, మార్టిన్‌లూథర్ మొదలగువారు. "ఏడు ఆత్మలు" అనగా ఏడుగురు వ్యక్తులు (ఏడుగురు దూతలు), అనగా ఏడుగురు వర్తమానికులు.
DAN 7:7,24•
MATT 25:5,7•
REV 5:6•
REV 17:12
100ఏడు ముద్రలు, ఏడు ఆత్మలు, ఏడుగురు దూతలు, ఏడు కొమ్ములు మరియు ఏడు సంఘములు. గమనించండి. ఏడు ఏడులు, ఐదు ఏడులు, అనగా 7అనే సంఖ్య "పరిపూర్ణత", ఐదు అనేది "కృప". తన ఏడు సంఘ కాలములకు దేవుడు అనుగ్రహించిన కృపయైయున్నది. తన ఏడుగురు వర్తమానికులగు దూతలు, దేవునియొక్క ఏడు ఆత్మలు, తన ఏడుగురు వర్తమానికులగుదురు. విమోచనా ప్రణాళికయొక్క ఏడు ముద్రలు. సరిగ్గా ఇప్పుడు మనము దానినే ధ్యానించుచున్నాము. ఏడు కొమ్ములు, అనగా భావమేమనగా "యుగములు". ఒక కొమ్ము, అనగా "రాజ్యము" అని అర్ధము. దానియేలు గ్రంథములో ఆ మృగముపై కిరటము (కొమ్ము ధరించి యుండుటను మీకు గుర్తున్నదా? చూడండి దాని భావమేమనగా, అదొక రాజ్యము అని అర్ధము లేదా "ఏడు కాలములు" ని అర్ధము.
గుర్తుంచుకోండి. యేసు, "మొదటి జామున కొంతమంది నిద్రించిరి, దాని తరువాత జామున, దాని తరువాత జామున, దాని తరువాత జామున అలాగు జాములలోనున్నకొంతమంది నిద్రించిరి. అలాగు ఏడవ జామును గమనించ౦డి, ఆ ఏడవ జామున పెండ్లి కుమారుడు వచ్చును. అప్పుడు వారందరు మేల్మొని వుండిరని చెప్పిన మాటలు మీకు జ్ఞాపకము ఉన్నవా? అది జ్ఞాపకము ఉన్నదా?
కాబట్టి ఆ ఏడు "యుగములు" అనగా ఏడు కొమ్ములని అర్ధము. అనగా ఏడు సంఘకాలాలు లేదా ఏడు… "విశ్వాసులయొక్క శరీరమనే కాలములయొక్క మార్పు" అని అర్ధము. ఓ, అదెంతో పరిపూర్ణముగా ఉన్నది. యిర్మీయా… "గ్రంథము" యుగములు (కాలములు)" అది ఏలాగు విమోచింపబడెను? ఎట్లు…(టేపు లో ఖాలీ గలదు - సంపా.,)
JOHN 1:14•
1TIM 3:16•
REV 5:5,6•
REV 10:1-7
101సరిగ్గా ఇచ్చట గలదు. ఈ ముద్రలలోని చివరిది మరియు ఏడవది, అది తెరవబడినప్పుడు, (దీనిని ప్రకటన గ్రంథము పదవ అధ్యాయమున కనుగొనవచ్చు) అచ్చట ఒక బలిష్టుడైన దూత అది క్రీస్తే క్రిందికి దిగివచ్చి, ఒక పాదము భూమిమీదను మరియు ఒక పాదము సముద్రము మీదను మోపి మరియు ఆయన తన చెయ్యిని ఆకాశము తట్టు ఎత్తి, "ఆ దినము సమాప్తమైనది, కాలము సమాప్తమైనది, సమస్తము సమాప్తమైనది. ఇక ఆలస్యం ఉండదు (కాలం చెల్లదు)" అని చెప్పెను.
"ఆయన ఆర్భటించినప్పుడు… ఈ కాలములో, దేవుని యొక్క మర్మము సమాప్తమగును" అని ఆయన చెప్పెను. దేవుడు ఎవరు మరియు ఆయన ఎట్లు ప్రత్యక్షపరచుకొనెను. ఆ ముద్ర ఏవిధముగా తెరువబడును, ఆయన ఎట్లు దేవునియొక్క కుమారుడగును. ఆయనే దేవుడైయండి తానే శరీరధారిగా అయ్యెను. మరియు ఆయన ఎవరనే ప్రత్యక్షతను గూర్చి, ఈ విషయములనుగూర్చి మనమేవిధముగా అర్ధము చేసుకొనుటకు ప్రారంభించెదము. "ఆ కాలము సమీపించినప్పుడు ఇక ఆలస్యం ఉండదు" అని ఆ దూత ఒక పాదమును భూమిమీదను మరియు ఒక పాదమును సముద్రముమీద మోపి చెప్పుటకు ముందే ఆ రహస్యములన్ని బయలుపరచబడి సమాప్తమగును. అవి సంభవించుటకు ఇప్పుడు సరిగ్గా మనము ఆ ముందు ఆవరణములో సరిగ్గా అచ్చటే ఉన్నాము. అర్థమైనదా?.
వాటిల్లో చివరిది ప్రకటన 10వ అధ్యాయమగును. "… పాదము భూమి మీదను మరియు పాదము సముద్రముపై మోపి"కాలము సమాప్తమయ్యెను, విమోచన ముగించబడినది. మరిప్పుడు ఆయన ఒక సింహమువలె వచ్చును. ఒకప్పుడు ఆయన ఒక గొఱ్ఱె పిల్లగా ఉండెను, కాని ఇప్పుడు ఆయన యూదా గోత్రపు సింహముగా వచ్చుచున్నాడు.
REV 5:8,9
102ఇప్పుడు, మీరు ఆ విషయమును తెలుసుకొనుట కొరకు ఇచ్చటున్న ఎనిమిదవ వచనమును త్వరగా చదువుదాము.
ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులును, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువది నలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్ధనలు.
ఇప్పుడు, ప్రతీది ఆరాధించవలసిన సమయము ఇదే. ఇదెంత సముచితముగా ఉన్నదో గుర్తుంచుకోండి. ఇప్పుడు దీనిని మనము విఫలమవ్వకూడదు. శద్దగా ఆలకించండి. సంఘకాలములయొక్క సమస్త మర్మములు సమాప్తమగునప్పుడు, విమోచన యొక్క ప్రణాళికలను గూర్చి సమస్త మర్మములు సమాప్తమైనప్పుడు, ఆ ఏడు ముద్రలు తెరువబడుట… అవన్నీ జరిగిన వెంటనే వాటికి తర్వాత, ఇప్పుడు గమనించండి. పరలోకముననున్న సమస్తమును మరియు భూమిపైనున్న సమస్తమును దేవునిని స్తుతించవలసిన సమయము అదే అగును. ఇప్పుడేమి జరుగుచున్నదో చూడండి. కొంతసేపు ఆ విషయములను గూర్చి శ్రద్దగా వినండి.
REV 5:9-13
103మహిమను, స్తోత్రమును నీవే పొందనర్హుడవని… వారు క్రొత్త పాటను పాదుదురు…
అదెలాంటి ఆరాధనగా ఉండెనో ఆలకించండి. ఆ పెద్దలు, ఆ జీవులు, సర్వము ఆయన యెదుట సాగిలపడిరి, చూడండి, ఆవిధముగా ఆయన తన పరిపూర్ణమైన ప్రణాళికను నెరవేర్చెను. ఇప్పుడది ఆరాధించు సమయమై ఉన్నది. చూడండి.
…ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి వంశములోను,
దేవుని కొరకు మనుష్యులనుకొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, యాజకులనుగాను చేసితివి. గనుక వారు భూలోకమందు ఏలుదురని (ఆలకించండి, అచ్చట విమోచింపబడిన ఆత్మలు ఆర్భటిస్తూ కేకలువేయుచున్నారు).
క్రొత్త పాటపాడుదురు.
నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించియున్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను. (పరలోకమందున్న ఈ గొఱ్ఱెపిల్లను స్తుతించుచున్నవి, చూచారా?)
వారు వధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును, జ్ఞానమును. బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొoదనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. (హల్లెలూయా, హల్లెలూయా!)
REV 5:13,14
104ఆలకించండి, "సర్వ సృష్టి", యోహాను ఏమి చేసెనో ఆలకించండి :
అంతట పరలోకమందును, భూలోకమందును భూమిక్రిందను, సముద్రములోనున్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును - సింహాసీనుడైయున్నవానికిని, గొఱ్ఱె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగాలు కలుగును గాకని చెప్పుట నేను (యోహాను) వింటిని.
యోహాను తనలో తాను ఒక నిజమైన పెంతెకోస్తు అనుభవమును పొందుకొనెను. పరలోకమందున్న ఫ్రతీ సృష్టియు, భూలోకమందున్న ప్రతీ సృష్టియు, భూమి క్రిoదున్న ప్రతీ సృష్టియు, సముద్రములోనున్న ప్రతీ సృష్టియు, సింహాసినుడైయున్నవానికిని, గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును, యుగ యుగములు కలుగును గాకని చెప్పుట నేను వింటిని" యోహాను చెప్పెను. ఆమేన్!
ఆరాధనయొక్క సమయము! ఆమేన్!. "వారు దానిని ఏవిధముగా చేసిరి?" ఇదిగో ఇచ్చట ఆయన వాక్యము ఉన్నది. దీనిని వారందరూ ఆలకించిరి.
ఆ నాలుగు జీవులు- ఆమేన్ అని చెప్పగా… (యోహాను, నీవు చేయుచున్నది సరియైనదే, అలాగే ఆర్భటిస్తూ నీకు సాధ్యమైనంత బిగ్గరగా ఆయనను స్తుతించుచూ)
….స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగములు కలుగును గాక! అని చెప్పుట నేను వింటిని.
….నాలుగు జీవులు, మరియు ఆ ఇరువది పెద్దలుసాగిలపడి నమస్కారము చేసిరి.
DAN 9:24-27•
DAN 11:31•
DAN 12:11•
MATT 24:15•
MARK 13:14
105ఎంత అందమైన కథ ఇది! ఇప్పుడు నాకు సమయము లేదు. దానియొక్క పూర్వోత్తర సందర్భంలను కొన్ని నేను వ్రాసి యుంచాను. కానీ మన తదుపరి కూటములో దానినిగూర్చి ముందుగా మనము తీసుకుందాము. బహుశా నాయొక్క విశ్రాంతి దినములలో నేను వచ్చినప్పుడు లేదా ఏదోక సమయమున ఇచ్చట ఈ విషయములతో ముడిపెట్టుచూ ఈ దానియేలు యొక్క డెబ్బది వారములనే వర్తమానమును ప్రసంగించి, పెంతెకోస్తు సునాదము ఎచ్చటకు తీసుకొని వెళ్ళుచున్నదనే విషయమును చూపించి, మరలా ఈ ఏడు ముద్రలగుండా తిరిగి వచ్చిమనము వెళ్ళుటకు ముందుగా ఇచ్చట ఈ ముద్రలను తెరచి చూపించి మరియు అది అంత్య కాలమందు ఉన్నదనే విషయమును చూపించెదను.
ఈ… గొఱ్ఱెపిల్ల, మెస్సియ్యా, తన జనులకు ప్రవచించిన ప్రకారము డెబ్బదివారము (అవి ఏడు సంవత్సరములు)ల కొరకు మహా అధిపతి వచ్చును. ఈ కాలముల మధ్యలో అధిపతి కొట్టేవేయబడును, అనగా అవి మూడున్నర సంవత్సరములు, అనగా ఏడులో సగము మూడు మరియు ఒక అర్ధకాలమగును, అధిపతి కొట్టివేయబడును, అనుదిన బలి నిలిపివేయబడును. మరియు నాశనము కలుగజేయు హేయమైన దానిని (అనగా, ముస్లింల ఓమర్ మసీదుని వారు తగులబెట్టిన దినమున, ఆ మసీదు ఉ oడిన స్థలములో అది నిలబెట్టబడి ఉండెను) నిలబెట్టెదరు, ఇకప్పుడు మిగిలిన మూడున్నర సంవత్సరముల కాలము ఇశ్రాయేలీయుల కొరకు కేటాయించబడెను.
DAN 9:27•
LUKE 21:24•
REV 11:2,3
106క్రీస్తు వచ్చెను, సరిగ్గా మూడున్నర సంవత్సరములు బోధించెను మరియు ప్రవచించెను. మరియు అనుదిన బలియర్పణ నిలిపివేయబడెను. సమస్తము ఎంత పరిపూర్ణముగా జరుగవలెనో అంత పరిపూర్ణముగా జరిగెను. మోస్క్ ఆఫ్ ఓమర్ (మసీదు) సరిగ్గా అచ్చటే నిర్మింపబడి నేటివరకు అచ్చటనే ఉన్నది. అన్యజనుల యొక్క కాలం పూర్తి అయ్యేవరకు యెరుషలేముయొక్క గోడలనువారు త్రొక్కెదరు. అప్పుడు ఎన్నుకొనబడినవారు, వధువు సంఘము ఎత్తబడును.
ఏలీయా మరియు మోషే, ఆ ఇద్దరు ప్రవక్తలు శేషించియున్న మూడున్నర సంవత్సరములు ఇశ్రాయేలువద్దకు తిరిగి వచ్చెదరు. ఆ సంగతులను గూర్చి నేను మీకు వివరించి చెప్పినప్పుడు అదెంత రమ్యమైనదిగా ఉండునో మీరు చూచెదరు.
HEB 13:8
107మీ హృదయమంతటితో మీరు ఆయనను ప్రేమించుచున్నారా? ఏడు ముద్రలతో ముద్రించబడిన గ్రంథమనగా ఏమిటని మీరిప్పుడు అర్ధం చేసుకున్నారా? అదేమిటది? దానిని ఇప్పుడు మనము, "చుట్టబడిన గ్రంథపు చుట్టలో" ఉన్నట్లు పొందుకున్నాము. దాన్ని అలాగే గుర్తుంచుకోండి. అలాగే ఈ అంత్యదినములలో… ఇది భూ సంబంధమైన పాత్రలో (మట్టి కుండలో) భద్రపరచబడి యుండెను. మీరిప్పుడు దానిని అర్ధం చేసుకున్నారా? భూ సంబంధమైన పాత్ర అనగా ఎవరు? యేసుక్రీస్తు, ఏ మానవుడు దానిని కలిగి యుండలేదు. ఏ ఒక్కరు కూడా దానిని కలిగియుండలేదు, ఇది ఆయనద్వారా మాత్రమే సాధ్యమగును. ఇది లేఖనములలో కూడా వ్రాయబడలేదు. ఇది లేఖనములలో వ్రాసియున్నయెడల, అది మరుగుచేయబడి ఉండుటవలన మీరు దానిని కనుగొనుటకుకూడా సాధ్యమవ్వదు. అది నిజము. కాబట్టి ఇది ఆయనలోవుండి తద్వారా ప్రత్యక్షపరచబడెను. అనగా అది మట్టికుండలో భద్రపరచబడెను. కాబట్టి ఇది చెడిపోకుండా లేదా తుప్పు పట్టకుండా ఉండెను.
పిదప, ఆయన వచ్చి ముద్రలలో ఒకదానిని బయటకు తీసి తన సంఘమునకు (తెరచి) యిచ్చి, "చూడండి, నేను నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాను. అర్ధమైనదా? అర్థమైనదా? దౌర్భాగ్యుడగు ఒక పాపి నిత్యము అగ్నిలో మండుచు ఉండునా లేదా ఒక పది లక్షల సంవత్సరములుగా అతడు అలాగే మండుచూ నాశనమైపోవలెనని తలంచుచు నీవెల్లప్పుడూ విభ్రాంతి చెందుచున్నావు. కాని అది అలాగు కాదు. అదెట్లున్నదనగా, అలాంటి నిత్య నరకమనే కార్యము అసలు లేనేలేదు. అది నిరంతరము అట్లుండదు. ఎందుకనగా, ఆదినుండి నేను ఉనికిలో ఉన్నప్పటినుండి నాతో అలాంటి నిత్య నరకమనేది లేదు. దుర్మార్గులను శిక్షించడానికే నేను దానిని సృష్టించాను. అర్ధమైనదా? దానినిగూర్చి నీవెందుకు బహుగా భయపడుచున్నావు? గమనించుము. అబ్రాహాము యొక్క సంతానమును గూర్చి మరియు అనేకమైన ఈ విషయములన్నింటినిగూర్చి భయపడుచున్నావా?" అని ఆయన చెప్పెను. అది కేవలము దానియొక్క సంక్షేపము మాత్రమే. గమనించారా? కాని దేవుడు ఆ ముద్రలను ఏవిధముగా తెరచి యిచ్చెనో, వాటిని ఏవిధముగా తెరచి చూపించెనో, ఆ ముద్రలను ఏవిధముగా బయలుపరస్తూ వచ్చెనో, అట్లే మీరు ఆ ముద్రలయొక్క బయలుపాటును పొందుకున్నప్పుడు, మీరు గమనించండి, ఇకప్పుడు ఈ గ్రంథము నుండి మీరు తొలగిపోలేరు. ఆ ముద్రలు…
108"ఓ, బ్రాన్హాం సహోదరుడా! ముద్ర అనగా వేరొక అర్ధంను కలిగినది" అని మీరు చెప్పవచ్చును.
అలాగైతే ఒక్క నిమిషము ఆగండి! మీరు చెప్పే విషయము దీనితో సరిపోల్చబడి ఉండవలెను. ఎందుకనగా, దీనిని బయలుపరచుటకై దీని వెనుక ప్రక్క అది ముద్రించబడి ఉన్నది. అది… అదేమిటది? అదేమిటది? యిర్మీయా గ్రంథములో ఉన్న విధముగా అది ఇచ్చట ఉన్నది. ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగినదని మీరు చెప్పవచ్చు. దీనిని బయటకు లాగండి. అది ఇచ్చటే గలదు. సరే మంచిది. దానిని విప్పి మరియు ఇచ్చట వెనుక ప్రక్కనున్న దానిని చూడండి. అచ్చట ఏమి జరిగెనో దానిని ఇచ్చట గమనించి చూడండి. గమనించారా, అదే విషయమును ఈ గ్రంథమున కలిగియున్నది. అర్ధమైనదా, ఇది దానియొక్క వెనుక ప్రక్కన గలదు.
"నాకు అర్ధమవుటలేదు. ఒకరు, 'తండ్రి, కుమారుడని', ఒకరు పరిశుద్ధాత్మ' అని, మరొకరు, యేసు నామమని, అన్నీ ఒకేలాగ ఉన్నవి," అని వారు చెప్పిరి.
ఇది ఇన్ని సంవత్సరములుగా మరుగైవుండెను. కాని ఇప్పుడు ఆ మర్మము దొర్లుకుంటూ సరిగ్గా ఈ కాలమునకు వచ్చి, ఆ గ్రంథపు చుట్టలోదాగియున్న కార్యములు దీనిద్వారా బయలుపడుచు, తద్వారా "దేవుడు ఒక్కడే" అనే కార్యమును అది చూపించుచున్నది. ఒకే ఒక్క దేవుడు మాత్రమే ఉన్నాడు గాని వేరే ఎవ్వరూ లేరు. అదినిజము. మరియు ఆయన నామము (పేరు)…
MATT 1:18-23•
MATT 28:19
109మత్తయి పత్రిక 28:19లో చెప్పబడినట్లుగా, "కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్దాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమిచ్చుచు…" అని ఉన్నది.
తండ్రియొక్కయు అనగా ఒక నామము (పేరు కాదు, కుమారునియొక్కయు అనగా ఒక నామము కాదు, పరిశుద్ధాత్మ యొక్కయు అనగా ఒక నామము కాదు. ఇప్పుడు వారికి మీరేవిధముగా బాప్తిస్మమును ఇవ్వవలెను? ఆ నామము(పేరులలో)ఏ నామములో వారికి బాప్తిస్మమును యిచ్చెదరు. వాటిల్లో ఏదీ కూడా నామములు కాదు. మరి అట్లయితే మీరు ఏ నామములేని బాప్తిస్మమును వారికి యిచ్చెదరా? అది మరలా ప్రవక్తలయొక్క కళాశాలగా మారిపోవుచున్నది. అర్ధ్థమైనదా?.
పిదప మీరు మరలా ఇచ్చటకు ఈ స్థలమునకు తిరిగి వచ్చి, ఇచ్చటున్న ఈలేఖనమును తీసుకొనవలెను. కావున మరలా మత్తయి 1వ అధ్యాయమునకు తిరిగి వెళ్ళాం. అచ్చట ఆయన ఏమి చేయును? అచ్చటున్న ఈలేఖనమును తీసుకొని దానిలోయున్న విషయమును వెలుపలికి తీసి చూపించును.
యేసుక్రీస్తుయొక్క జనన విధానము ఇట్లున్నది: (ముగ్గురు దేవుళ్ళు కాదు, ఇప్పుడు గమనించండి). ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకముకాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా
ఉండెను. (తండ్రియగు దేవుని వలన అని చెప్పబడలేదు గాని పరిశుద్ధాత్మ వలన అని చెప్పబడెను. ఉహ్?)
ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై - దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన (తండ్రియగు దేవుని వలన అని ఉన్నదా?) కలిగినది.
"తండ్రియగు దేవుడే ఆయనయొక్క తండ్రి"అని నేను తలంచాను. బాఫ్తిస్మము నిమిత్తము నేను దీనినిగూర్చి చెప్పుచున్నాను. అర్ధమైనదా? "తండ్రియగు దేవుడే ఆయనయొక్క తండ్రి" అని నేను తలంచాను. ఇప్పుడు, ఒకటి పరిశుద్ధాత్మయు మరియు తండ్రియగు దేవుడు ఒక్కరుగానే ఉండవలెను. లేదా యేసుక్రీస్తుకు ఇద్దరు తండ్రులు ఉన్నట్లగును. ఆవిధముగా ఆయన ఇద్దరు తండ్రులుగలవాడైతే జారత్వము వలన జన్మించిన కుమారుడగును. అట్లున్నయెడల ఏవిధమైన దేవునిని మనము కలిగియున్నాము? అర్ధమైనదా?
ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికినమాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను… ఆయనకు "యేసు" అను పేరు… (అది నిజమే కదా?)… ఆయనకు "ఇమ్మానుయేలను" పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున "దేవుడు మనకు తోడని" అర్ధము.
110ఇప్పుడు, చూడండి. ఆయన ఆ ముద్రను వెనుకనుండి లాగి తెరచినప్పుడు మత్తయి 1వ అధ్యాయము వరకు ఉన్న విషయములన్ని ఏమైయన్నవి (పూర్తిగా అన్వేషించుటకు వెనుకకు వెళ్ళి చూడుము)? ఎందుచేత? అవన్నీ యేసుక్రీస్తునే సూచిస్తున్నవని చూడగలము. పెంతెకోస్తు దినమున దానినే పేతురు ఖచ్చితముగా చెప్పెను. పేతురు మాత్రమే కాదుగాని ఇతరులుకూడా అదే విషయమునే చెప్పిరి.
బహుశా, కొంతమంది రోమియులు గుంపుగా కలిసి వచ్చి, "ఓ, లేదు! మాకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. మాకు ఉన్నారు…" అని చెప్పవచ్చు. ఆవిధముగా ఇప్పుడు వారికి పది వేల దేవుళ్ళు గలరు. మరియు అచ్చట వారికి పరి.మరియమ్మ, పరి.సెసెలియా, పరి.మార్యుక్, పరి.ఫలానా మరియు ఫలానా వంటివారు గలరు. మెక్సికో పట్టణములో ఐదు వేలమంది, ఇంకా అంతకంటే ఎక్కువ మందే మరణించిన పరిశుద్ధులు గలరు. ఒకానొకప్పుడు ఒక స్త్రీకి కొంతమంది ప్రేమికులు ఉండేవారు. ఆమెకొరకు ఒకరినొకరు కలహించుకొని గొడవలు పడుచూ ఆ ప్రేమికులలో కొందరు చంపబడిరి. చివరకు ఆమెను ప్రేమించిన వారిలో ఒకరు ఆమెను కూడా చంపి వేసెను. పిదప ఆమెను వారు ఒక పరిశుద్ధురాలుగా మార్చి ప్రకటించిరి. ప్రజలు ఆమె పేరుతో పాప క్షమాపణకొరకు వేడుకొనెదరు. మరియు అలాంటి అనేక అర్ధంలేని కార్యములు అచ్చట ఉన్నవి. చనిపోయిన వారి ఆత్మలతో సంభాషిస్తూ సంబంధమును కలిగి ఉండవచ్చుననే సిద్ధాంతము వారికి కలదు.
111ఆవిధముగా ప్రాటెస్టంటు సంఘము అపొస్తులుల విశ్వాస సిద్దాంతమనే దానిని ఇచ్చట వారు చెప్పుకొనుచు వచ్చుచున్నారు. "ఆకాశమును మరియు భూమిని సృజించిన సర్వశక్తిమంతుడు తండ్రియగు దేవునిని మరియు పరిశుద్ద రోమన్ కాతలిక్ సంఘమును నేను నమ్ముచున్నాను. పరిశుద్దుల యొక్క మధ్యవర్తిత్వాన్ని పరిశుద్దుల యొక్క సహవాసమును నేను నమ్ముచున్నానని" చెప్పుచున్నారు. దేవునియొక్క ప్రమాణము క్రింద మరియు పరిశుద్దుల యొక్క సహవాసమును నేను నమ్ముచున్నానని ప్రొటెస్టంట్లు చెప్పుచున్నారు. అది చనిపోయిన ఆత్మలతో సంభాషించుచు, వాటితో (ప్రేతాత్మలతో) సంబంధమును కలిగివున్న మార్గము. అర్ధమైనదా? ఆవిధముగా వారు ఇంకా అలాంటివి చేయుచూ అలాగే ఉన్నారు. నిశ్చయముగా. ఎందుకనగా సంఘము అలాగు చేయమని చెప్పెను, కాబట్టి వారు అలాగే చేయుచున్నారు. (ఓ, దేవా! నేనేమి తెలుసుకున్నానో దానిని నేను తెలుసుకున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను! నేనేమి తెలుసుకున్నానో దానిని నేను తెలుసుకున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను). తాము దేవుని నుండి చాలా దూరంగా తొలగిపోయి అంధకారములో తమను తామే ముద్రించుకొనుచున్నారని వారు గ్రహించలేకపోవుచున్నారు. ఆ విషయమును గూర్చి మారు చెప్పి గ్రహించునట్లు చెయ్యలేరు. ఎందుకనగా, ఆ విషయమును సంపూర్ణముగా వారు చూడలేకపోయిరి.
112నేను ఒకటి అడగాలనుకుంటున్నాను… దీనిని ఎవ్వరూ చెప్పనవసరములేదు. నేను యేసుక్రీస్తు అని నన్ను గూర్చి తప్పుగా తలంచుచున్నవారు కనీసం పదిహను లేదా ఇరువదిమంది ప్రజలు సరిగ్గా ఇచ్చట కూర్చొని ఉన్నారు. వారేవిధముగా దీనిని చెయ్యుచున్నారు? "అది ఒక ఆత్మ" అని దేవుడు నాతో చెప్పి, దానిని నేను కనుగొనువరకు వారిపై నాకు కోపం ఉండెను. ఆ మనుష్యులు నేను చెప్పే ప్రతీ మాటను అట్లే నమ్మే మనుష్యులు. "నేను మీతో చెప్పినయెడల, దానిని అట్లే మీరేలాగు నమ్మగలరు? అని నేను అడిగాను. పిదప నేను వారికి వాక్యములోని విషయములను చూపించినప్పుడు, అప్పుడు వారు నేను చెప్పిన విషయమును అర్థం చేసుకున్నారు. కాబట్టి వారు, "సరే, నిశ్చయముగా, మేము నిన్ను నమ్ముట లేదు లేదా నీవేమి చెప్పితివో దానిని మేము విన్నాము అని చెప్పిరి. ఆ విషయమును గమనించితిరా?. కాని వాస్తవముగా తాము సరిగ్గానే ఉన్నామని వారు యదార్ధముగా తలంచుచున్నారు. అర్ధమైనదా?
అలాంటి ఆత్మలలో ఏదైనా ఒకటి మిమ్మల్ని ఆవరించినయెడల మీరు దానినే సంపూర్ణముగా నమ్మెదరని గమనించండి. అలాంటివాటిని నేను పట్టించుకోను. దానిలోవున్న బేధమును ఎవ్వరూ మీకు చెప్పలేరు. అర్ధమైనదా? దానిని గురించి వాక్యముద్వారా ఎంతగా వివరించి చెప్పినను ఆ ఆత్మ మిమ్మల్ని ఆవరించివున్నందువలన వాక్యమును ఎంత మాత్రము నమ్మలేని స్థితికి మీరు వెళ్ళిపోయెదరు. ఆ అసత్యమునే నమ్ముచు అలాగే కొనసాగుదురు. "మీరు అలాగే ఉండాలని కోరుకొనిన యెడల, మీరు అలాగే కొనసాగండి, మరి నాకు గల నా స్వంత మార్గమున నేను వెళ్ళెదను" అని వారు చెప్పెదరు. అర్ధమైనదా? మీరు తప్పుడు ఆత్మతో అభిషేకింపబడి ఉన్నారని అది తెలుపుచున్నది.
113దేవునియొక్క ఆత్మ ఎల్లప్పుడు…
"మంచిది, బ్రాన్హాం సహోదరుడా, నీ సంగతేమిటి?" అని మీరు అడుగవచ్చు.
ఎవరినైనా నేను అడుగుచున్నాను… ఏది సత్యమో మరియు ఏది అసత్యమో ఎవరైనా నాకు చూపించుటకు నేనెల్లప్పుడూ సిద్దంగా ఉన్నాను. కాని అది వాఖ్యాను సారముగా ఉండవలెను. వారు చెప్పలేరు… మీరేది చెప్పినను దానిని వాక్యములో నుండి చూపించుచు చెప్పవలెను! కాబట్టే ఈముద్రలు ఆవిధముగా అచ్చట తెరువబడినది. అదొక ముద్రయైన యెడల అది ఆదికాండము నుండి ప్రకటన గ్రంథమువరకు వాటిని అదే ప్రకటించును. కాబట్టి వాటి గురించి మీరేమి చింతించనవసరము లేదు. కాబట్టి అచ్చటే ఆ ముద్రలు ఉన్నవి. మీరు ఆయనను ప్రేమించుట లేదా?
నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను,
ఎందుకనగా, ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను,
ఆ కల్వరి వృక్షము నందు, నా రక్షణను కొనెను.
ACTS 2:41•
ACTS 8:12•
ACTS 18:8
114మన తలలను వంచుదాము. ("నేను ఆయనను ప్రేమించుచున్నాను"అనే పాటను సహోదరుడు బ్రాన్హాంగారు ఆలాపన చేయుచున్నారు-సంపా.,). ఆయన మీ రక్షకుడని ఇచ్చటున్న వారిలో ఇంకా ఎంతమంది ఎరుగనివారు ఉన్నారు. మీ హృదయాంతరంగములో నుండి ఆయనను మీ రక్షణకునిగా హక్కును కోరుదురా? బలిపీఠము వద్దకు వెళ్ళు విషయమును నేను విశ్వసిస్తున్నాను. నిజముగా దానిని నేను విశ్వసిస్తున్నాను. అదే యుక్తమైనది. కాని పరిశుద్ధ గ్రంథములో రక్షణను పొందుకొనుటకు వారెన్నడూ బలిపీఠము వద్దకు వెళ్ళలేదు. వారు కేవలము తమ హృదయములో విశ్వసించి, దానిని అంగీకరించిరి. "ఎంత మందైతే విశ్వసించిరో వారు బాప్తిస్మమును పొందుకొనిరి". మీలో పరిశుద్ధగ్రంథపు మార్గము ప్రకారము ఎంతమంది రాగలరు? ఈ దినమున ఎంతమంది విశ్వసించుచున్నారు. ఇదివరకు చెయ్యని విధముగా మీమార్గములో మీరు వచ్చి, నేను "తప్పు" అని మిమ్మల్నిగూర్చి మీరు బహిరంగముగా ఒప్పుకొని, యేసుక్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించుటకు మీరు ఆశించెదరా? మీ తలలతో పాటు మీచేతులను మీరు పైకి ఎత్తగలరా?.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక! దేవుడు మిమ్మల్ని దీవించునుగాక! దేవుడు మిమ్మల్ని దీవించునుగాక! మిమ్మల్ని… వెనుక వున్న వారిని దేవుడు మిమ్మల్ని దీవించునుగాక! మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని దీవించునుగాక! అక్కడ వెనుక ఉన్నవారు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక! "ఇప్పుడు నేను విశ్వసించుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక! అచ్చట వెనుక ఉన్న ఆ పురుషులను దేవుడు దీవించును గాక! ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి, ఇచ్చట కాదు గాని మీ హృదయములో నుండి బహిరంగముగా, "ప్రభువా, మేము అంత్యకాలమున ఉన్నామని నేనెరుగుదును. నేను అంతమునకు వచ్చాను" అని చెప్పుచూ ఒప్పుకోండి.
115ఒక దినమున ఇచ్చట పట్టణములోనున్న నా స్నేహితుడు డాక్టరు సామ్ అడయార్‌తో మాట్లాడుచున్నాను. కార్యాలయములో కూర్చొని మాట్లాడుచు, "సామ్, జీర్దాశయ సంబంధమైన ఏదోక సమస్య నాకు కలదు"అని నేను చెప్పాను.
అతడు "అది జీర్దాశయములో వాయువుకు సంబంధించినదని నీకు ఎలాగు తెలుసు? అది నీ గుండెచుట్టూ ఆవరించి ఉన్నదా?" అని అడిగెను.
"అవును" అని నేను చెప్పాను.
అందుకు అతడు, "అది బహుశా, గుండెలో రక్తము గడ్డకట్టుకొని పోవుటగా ఉండవచ్చునేమో…గుండె సమస్యగా ఉండవచ్చు. (క్షమించాలి)…అది గుండె సమస్యగా ఉండవచ్చును.
ఇప్పుడు, అది అచ్చట ఉన్నట్లుగా నీకు ఎలాగు తెలుసు? ఏది నన్ను పరీక్షించి చూడనిమ్ము" అని అతడు చెప్పెను. అతడు నన్ను పరీక్షించి చూచి, "లేదు, నీలో ఏ సమస్యలేదు" అని చెప్పెను.
"సామ్, అది వచ్చినప్పుడు…" అని నేను చెప్పాను. నాకు ఏబది రెండు సంవత్సరములు మరియు సామ్ నాకన్నా కొద్దిగా పెద్దవాడు. "సామ్, అది వచ్చినప్పుడు, ఈ ముప్పది సంవత్సరములలో పూర్తిగా నేనెవరినైతే ప్రేమించితినో మరియు నా జీవిత కాలమంతా ఎవరికొరకై పరిచర్య చేసితినో ఆ యేసుక్రీస్తుపై ప్రజలు విశ్వాసము ఉంచునట్లుగా నేను ప్రయత్నించాను. కాబట్టి ఆయన వచ్చునప్పుడు అది నాకే వ్యత్యాసమును కలిగించదు. నేను ఆ పరమ గృహమునకు వెళ్ళి చేరెదను.
అందుకు అతడు, "బిల్లీ, నేనెచ్చట నా గొప్పతనమును పొందుకొనుచున్నానో నీకు తెలుసా? ఎవరికైనా ఒకరికి నేను చేయవలసిన యుక్తమైన దానిని ఏదైతే చేయుదునో అదే నన్ను ఒక గొప్పవానిగా చేయుచున్నది" అని చెప్పెను.
"అదే నిజమైన జీవితము"అని నేను చెప్పాను.
LUKE 15:11-13•
1PET 1:3,4
116స్నేపితుడా, ఈ లోకములో మీరేమైన స్వాస్థ్యమును కలిగివున్నయెడల ఆ స్వాస్థ్యము క్షయమైనది. కాని మనము వాడిపోని స్వాస్థ్యమును పొందుకొనెదము. చెడ్డ కుమారుడు తన స్వాస్థ్యమును వదిలి దూరముగా వెళ్ళిపోయెను. అతను వెళ్ళుచూ ఆ స్వాస్థ్యములో కొంత భాగమును మాత్రమే తనతో తీసుకొని వెళ్ళెను. మరలా అతడు తిరిగి వచ్చినప్పుడు, అతడియొక్క స్వాస్థ్యము కలుషితమైనది. కాని మీకు చెందిన వాటినుండి మీరు తొలగిపోయినయెడల, ఎందుకనగా, అవి దేవుని రాజ్యమునకు సంబంధించినవి కావు. కాని మనము అక్షయమైన స్వాస్థ్యమును పొందుకొనెదము. మీరు దానిని పొందుకొనుటకు కోరుకొనుచున్నారా? ఇచ్చటున్న వారిలో పదిహేను మంది తమ చేతులను పైకి ఎత్తిరి. ఈ ఉదయమున పాపులు తమ స్వాస్థ్యమును పొందుకొనుటకు కోరుకొనుచున్నారు. మనము ప్రార్ధించుటకు ముందు ఇంకా వేరేవరైనా దానిని పొందుకోవాలని కోరుచున్నారా? "అవును.
ఇప్పుడు మెల్లగా పాడండి.
నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను,
ఎందుకనగా ఆయనే మొదటగానన్ను ప్రేమించెను,
ఆ కల్వరి వృక్షము పై నా రక్షణను కొనెను…
117(సహోదరుడు బ్రాన్హాంగారు, "నేను ఆయనను ప్రేమించుచున్నాను" అనే పాటను ఆలాపన చేయుచున్నారు-సంపా. ) పరలోకపు తండ్రి, బలహీనమైన పరిస్థితిలో క్రిందవున్న ఈ సమయమున, ప్రభువా, ప్రజలకు ఈ వర్తమానమును తీసుకొనివచ్చి ప్రయత్నించుటకు కారణమేమనగా, నేను వారిని ప్రేమించుచున్నాను. ప్రభువా, వారు ఈ వర్తమానమును ఆలకించవలెనని నేను కోరుచున్నాను. వారు లంగరు వేయబడి ఉండవలెనని నేను కోరుచున్నాను. ఈ సంగతులన్నింటిని వారు ఎరుగవలెనని నేను కోరుచున్నాను. ఎట్లనగా, ఇవి ఏదో అకస్మాత్తుగా ఈ ఆఖరి కొద్ది సంవత్సరములలో జరిగినవి కావుగాని, ప్రభువా, ఇవి నీ వలన జరిగినవి. ఈ విషయములను ప్రభువా, నీవు తెరచి చూపించుచున్నావు. ఓ, దేవా సరిగ్గా మా ముందు ఒకగొప్ప సునాదము(జూబ్లీ) ఉన్నదని మేమందరము అనుభూతి చెందుచున్నాము.
ఎవరైతే తమ చేతులను పైకి ఎత్తిరో వారికొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వారు తాము తప్పని ఎరిగిరి. అనేక చిన్న విషయ …బహుశా వారు ఎవరోకరి దగ్గర కొంత ధనమును వారసత్వముగా పొందుకొని ఉండవచ్చు. కాని అదేమి చేసెను?
అదేమైపోయెనో, ఎలాగుమాయమైపోయెనో వారికి తెలియదు. దానిలో ఇంకా కొంత మాత్రమే మిగిలినది. ఎట్లనగా, అదొక క్షయమైన వారసత్వము. వారికున్న ఆ వారసత్వమును వేరేవరికైనా వదిలి వెళ్ళినయెడల, అది మరలా క్షయమైపోవును.
1PET 1:3,4
118కాని మనకు అక్షయమగు స్వాస్థ్యము గలదు. అదేమనగా, రక్షణ, విమోచన, మరలా ఏదేను తోటవద్దకు తిరిగి వెళ్ళుట, దీనిని గూర్చిఆలోచించండి. ప్రభువా, మరలా ఆనాడు ఆదాము మరియు హవ్వ జీవించినట్లుగా తిరిగి వెళ్ళి అలాగే జీవించాలని ఎవరు కోరుకొనరు? అచ్చట మా అనుదిన ఆహారము అనుగ్రహింపబడును. పరలోకపు తండ్రి మాతో కలిసి అడుగులు వేయుచూ, ఎల్లప్పుడూ మాట్లాడుచూ ఉండును. ఆ గొప్ప వెలుగు మా ఎదుట నడిచి వెళ్ళుటను మేము చూచెదము. సింహము మరియు తోడేలు కలిసి మేయుచుండును. ఎద్దు గడ్డి మేయుచుండగా దానితో సింహము కూడా కలిసి మేయును. ఆ రెండు అలాగు కలిసి మేయుచుండును. కాని ఇప్పుడు సింహము వేటాడి ఎద్దును చంపి తినుచున్నది. తోడేలు ఎద్దును తినుచున్నది. అది ఏమి తినాలనుకొనునో దానిని అది తినును. కాని ఆ దినములలో అవి ఆవిధముగా చెయ్యవు. గొప్ప అందమైన పక్షులు ఎగురుచూ వెళ్ళును. అచ్చట ఏ బాధ ఉండదు. మా ఆశలను కోల్పోయే ఎటువంటి పరిస్థితులు అచ్చట ఎన్నడూ ఉండవు. మా జీవిత కాలమంతా ఆ మార్గముగుండా అచ్చటకు వెళ్ళినప్పుడు అచ్చట మా బిడ్డలను, మా ప్రియులను మేము చూచెదము. ఓ, దేవా, అదెటువంటి గొప్పదినము! అదెంత అద్భుతమైన దినము.
ఈ భూమియందు మేము ఏమి కలిగియున్నను అవన్నీవాడిపోయి, గతించిపోవును.కాని అచ్చట ఉన్నవి మాత్రము ఎన్నడూ వాడిపోవు మరియు గతించిపోవు.
JOHN 6:37,44•
2COR 1:22•
2COR 5:5•
EPH 1:13,14
119దేవా మీవైపు తమ చేతులను పైకి ఎత్తిన ఈ ప్రజలతో ఇచ్చట ఈ భూమి పై వాటిని వివరించి చెప్పుటకు నాకు సాధ్యమవ్వక పోవచ్చు. నాకు తెలియదు. సాధ్యమవ్వదని నేను నమ్ముచున్నాను. అట్లు సాధ్యమవ్వని యెడల ప్రభువా, ఆ మార్గమున అచ్చట వారిని కలుసుకొనుటకు నాకు సహాయము చేయుము. అప్పుడు అచ్చట వారు ఈలాగు చెప్పుదురు గాక! బ్రాన్హాం సహోదరుడా, ఈ గొప్ప సంఘటన జరుగుటకు ముందు భూమిపై జరిగిన కార్యము, అనగా ఈ ముద్రలు ఏలాగు తెరువబడుచున్నవో, అవి మట్టికుండలో (భూ సంబంధమైన పాత్ర ఎట్లు భద్రపరచబడినవో ఒక ఉదయమున ఆ కార్యములనుగూర్చి నీవు ప్రసంగించావు. కావున ఆ వర్తమానమును వినిన ఆ సమయమున నా భూ సంబంధమగు ఈ పాత్రలోకి ఆయన వచ్చుట వలన, ఆ ఉదయము నేను ఆయనను అంగీకరిస్తూ నా చేతులను పైకి ఎత్తితిని. ఓ, ఆ సమయమున నేను అచ్చట ఉన్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను".
"సహోదరుడా, సహోదరీ, నేనుకూడా అచ్చటున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. యుగయుగములు మనమందరము సమకూడి సహవాసము చేసెదము" అని నేను చెప్పెదను.
తండ్రీ, వారు నీ వారు, వారిని దీవించుము. "తండ్రి ఒకనిని ఆకర్షించితేనేగాని ఎవడును నాయొద్దకు రాడు, తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నా యొద్దకు వత్తురు, వారిలో ఒకనిని నేను పోగొట్టుకొనను" అని నీవు చెప్పితివి. కాబట్టి తండ్రీ, అందుకు మేము కృతజ్ఞులమైఉన్నాము. ఇప్పుడు వారు వచ్చి తమ యొక్క రక్షణ సంచకరువును పొందుకొనెదరు గాక! అనగా ఏదో సంఘమున చేరుట కాదు. సంచకరువు అనగా ఏదో సంఘమున సభ్యులుగా చేరుట కాదు గాని అదొక నూతన జన్మయగును అనగా పరిశుద్దాత్మను పొందుకొనుట. తండ్రీ వారు మిమ్మల్ని అంగీకరించెదరు గాక! మమ్మల్ని మీ చేతుల్లోకి యేసుక్రీస్తు నామమున సమర్పించుకొనుచున్నాము. ఆమేన్!.
120ఈ చేతి రుమాళ్ళ కొరకు, ప్రభువగు యేసు, ఈ చేతి రుమాళ్ళకొరకు నేను ప్రార్థించుచున్నాను. ఇచ్చటున్న వారందరిని, వారి అవసరతలన్నింటి నిమిత్తము మీరు వారిని దీవించుమని అడుగుచున్నాను. ప్రభువా, ఇచ్చట చక్రాల కుర్చీలో దీనురాలుగా కూర్చొనియున్న ఈ స్త్రీని దీవించుము!
ఈ ఉదయమున ఈ గొప్ప ఆరాధన ముగించిన పిదప, తండ్రీ మీ పరిశుద్ధాత్మ మాద్వారా సంపూర్ణముగా సంతృప్తి చెందునట్లు అనుభూతిని కలిగి, మీ వాక్యము ప్రజలయొక్క హృదయాంతరంగమున లోతుగా నాటుకొని వెళ్ళునట్లు అనుభూతిని పొందుకొనెదరు గాక! ప్రభువా, దీనిని ఎన్నడూ వారు మరచిపోవద్దు. ఈ విషయములను గూర్చి విను ప్రతిసారి, ఈ ముద్రలు తెరవబడుచుండుటను గూర్చి వారు తలంచుదురుగాక! అచ్చటున్న ఈ ముద్రలలో ఏమున్నదో దానిని గ్రహించునట్లు మీరు మాకు సహాయము చేయుదురు గాక!. కాబట్టి ప్రభువా, ప్రతీ ఒక్కొక్కరు తమ మనస్సులలో దీనినిగూర్చి అయోమయము చెందకుండా, ఈ విషయములనుగూర్చి, "ఇది ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" గా వారు ఎరుగుటకును, మరియు ఇది దేవుని యొక్క ముద్రనియు, ఆ ముద్రలను దేవుడు మాకు తెరచి చూపించుచున్నాడని వారు గ్రహించుదురు గాక!.
వ్యాధి మరియు బాధలతోవున్నవారిని నీవు స్వస్థపరచమని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువా, దీనిని అనుగ్రహించుము. మీ ఆత్మ ఇచ్చట ఉన్నది. కాబట్టి ఈ భవనమునకు వెనుకనున్న ఒక పాపిని నీవు రక్షించగలవు. అలాగే అచ్చటున్న రోగినికూడా నీవు స్వస్థపరచగలవు. ప్రభువా, దీనిని అనుగ్రహించమని నేను ప్రార్థించుచున్నాను. మరియు ఈ దినమున ఆరాధనలో పాల్గొనలేకపోవుట వలన తమ చేతి రుమాళ్ళను యిచ్చి పంపించిన రోగులను స్వస్థపరచుము. వీటన్నింటిని మేము ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ వద్ద సమర్పించుచున్నాము.
ROM 8:28
121వారు తమ శిశువును ప్రతిష్టించాలని కోరుచున్నారని నేను నమ్ముచున్నాను. చిన్న బిడ్డతో ఇచ్చటున్న ఆ స్రీయే కదా? ఆ చిన్నవారిని ఈ సమయమున ఇచ్చటకు తీసుకొనిరాగలరా? చిన్న బిడ్డలను ప్రతిష్టించుటకు మేము సంతోషించెదము. చిన్నపిల్లలు మాత్రమే కాదు, మీరు కూడా ఇచ్చటకు రావచ్చు. (ఈ సమయమున కొంతమంది పెద్దలు వచ్చి నాతో నిలబడండి). ఈ బాబుకు ఎంత వయస్సు? రెండున్నర సంవత్సరములు. ఈ బాబుకు ఏ పేరుపెట్టాలి? స్కాట్? స్కాట్‌ఫోర్డ్, చిన్న స్కాట్‌ఫోర్డ్ నాలుగున్నర సంవత్సరములు వయస్సు.
ఈ ఉదయమున ప్రభువును, రక్షకుడగు యేసుక్రీస్తును అంగీకరిస్తూ తనను ప్రతిష్టించుకొనుటకు కోరుచున్నాడు. అతడిని అతని తల్లి తీసుకొని వచ్చినది. (సహోదరుడా, తిన్నగా ముందుకురండి). కృపగల ప్రభువా, ఈ ఉదయమున ఈ చిన్నబిడ్దను మీవద్దకు ప్రతిష్టించుట అనే మార్గముద్వారా తీసుకొని వచ్చుచున్నాము. ఈచిన్న బిడ్డపై మా చేతులను పెట్టుచున్నాము. యేసును సమాధినుండి పునరుద్ధాణుడుగా లేపిన అదే శక్తితో ఈ చిన్నబిడ్డను జీవింపజేయుమని అడుగుచున్నాము. దేవా, మంచి ఆరోగ్యముతోను మరియు
శక్తితోను ఇతడు జీవించునుగాక! ప్రభువా, నీ మహిమ కొరకు ఇతడు జీవించును గాక! ఈ బిడ్దకు సహాయము చేయుటకు ఇదివరకే నీవు సిద్దపరచిన విధానమును బట్టి మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ చిన్నవానికి నీవెల్లప్పుడూ తోడుగా ఉందువుగాకని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఇతడి తల్లిదండ్రులతో, ఇతడి ప్రియులతో నీవు తోడుగా ఉండుము. ప్రభువును ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించుచున్నాడని మేమెరుగుదుము. ఈ కార్యములన్నీ కొన్ని సమయములలో ప్రజలను మీకు దగ్గరగా చేర్చుచున్నవి. మేము అడుగుచున్న ఈ దీవెనలను మీరు అనుగ్రహించమని నేను ప్రార్ధిస్తున్నాను.
మరిప్పుడు, తండ్రీ మీ వాక్యమునకు విధేయత చూపించుచూ యేసుక్రీస్తు నామమున ఈ బాలుడిని మేము మీకు 'సమర్పిస్తున్నాము. ఇతడియొక్క చిన్న ఆత్మను, ప్రాణమును, శరీరమును మీరు తీసుకొని మీ మహిమకొరకు ఇతడిని ఉపయోగించుకొనుము. ఆమేన్.
సహోదరీ, దేవుడు నిన్ను దీవించునుగాక. చిన్న స్కాట్ దేవుడు నిన్ను దీవించునుగాక. అందుకొరకు మనమెంతగానో ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించవలెను!
122ఇప్పుడు, ఎవరు బాప్తిస్మమును తీసుకోవాలనుకుంటున్నారు? కొంతమంది ప్రజలు బాప్తిస్మమును తీసుకోవాలనుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. మనము అందుకొరకు సిద్దపరచుచుండగా, మనము ఒక పాటను పాడుదాము… మనమేమి చెయ్యవలెనో నేను మీకు చెప్పెదను., ఇప్పుడు పాటను పాడుదాము… నేను సహోదరుడు నెవిల్ ను చేయులాగున అనుమతిస్తాను. అది సరియైనది అని నాకు తెలుసు. సరియే, అయ్యా, సహోదరుడు నెవిల్.
మీరు ప్రభువును ప్రేమిస్తున్నారా? "ఆమెన్." మీరు నా కొరకు ప్రార్ధిస్తారా?