బండ నుండి నిత్యమూ ఊరెడి నీరు
VGR COUNT-235 1దేవుని యొక్క సన్నిధిని బట్టి ఈ ఉదయమున మనము కృతజ్ఞత కలిగియున్నాము, మనకు ఒక వర్తమానము అనుగ్రహించుట ద్వారా పెందలకడనే ఆరాధనలను ఆరంభించెను. ఆయన మనతో చెప్పవలసిన సంగతియున్నది గనుక విని, మర్యాదగా మనము ఆయన ఎదుట ఉండవలెను. ఆయన తాను వాగ్దానము చేసిన దానిని తప్పక నెరవేర్చునని నాకు నిశ్చయత గలదు. ఆయన ఎల్లప్పుడూ తన మాటను నిలబెట్టుకొనును. ఈ ఉదయ కాలమున నిత్యత్వము యొక్క ఇటుప్రక్క సజీవులముగా యుండి మరలా ప్రభువును ఆరాధించుటకు కూడుకొనగలుగుటను బట్టి ఆయనకు వందనములు చెల్లించుచున్నాము. ఆయన మాట వినకలుగునట్లుగా మరల మనము చేరియున్నాము. ఈ ఉద్దేశ్యముతోనే మనము ఇక్కడికి కూడి వచ్చాము.
2నాకు వచ్చిన ఒక ప్రత్యేక కలను బట్టి నేడు అనుకోకుండా సహోదరుడు నెవిల్ మీద విరుచుకుపడ్డాను. నేను కలలను నమ్ముదును. దేవుడు కలల ద్వారా మానవులతో మాట్లాడునని నేను నమ్ముచున్నాను. గతరాత్రికి ముందు నాకు ఒక అసాధ్యమగు కల వచ్చినది, నేను భోజనము చేయుటకు ఒక కొండవాలు, ప్రత్యేకమైన కొండవాలు వైపుగా వెళ్ళుచున్నాను. ఆ స్థలమునకు చేరువగా వెళ్ళుచుండగా, వీణలు పట్టుకొని సంగీతము వాయించుచున్న ఒక బృందమును గమనించాను, భోజనము చేయుచున్నవారికి వినోదము కలిగించుటకు వారు సంగీతము వాయించుచున్నారు. అయితే అచ్చట ఏదో ఒకటి యున్నందువలన నాకు అది నచ్చలేదు, కాబట్టి నేను వారిని దాటి వెళ్ళిపోయాను. కొండపై నుండి దిగి వచ్చుచున్న ఒకనిని నేను కలిసికొన్నాను. నేను ఇంకా పైకి చూడగా, ఈ భోజన స్థలమునకు దిగి వచ్చుచున్న చాలామంది కనిపించారు. కాని నేను వారినుండి దూరముగా తొలగిపోయాను, నేను వెనుదిరిగి కుడికి లేదా ఎడమకు తిరిగి వెళ్ళిపోయాను.
3ఏదో విధముగా, ఆ లోయ క్రింద, ఆలయమును చూడగలిగాను. ఎవరో ఈ విధంగా చెప్పుట నేను విన్నాను, "ఫలాని చోట సహోదరుడు బ్రెన్హాం, దాటును గనుక కలిసికొనండి - అతడు కొండపై నుండి క్రిందకు వచ్చుచున్నాడు - అతనికి ఫలానీ సంగతి చెప్పండి." నేను ఈ దాటు చోటునొద్దకు వచ్చుటకు త్వరపడుచున్నాను.
ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, సహోదరుడు నెవిల్. గోధుమ రంగు సూటు ధరించి యున్నాడు, ఈ ఉదయమున అతడెట్లు ఇచ్చట కూర్చొనియుండెనో ఆలాగే కూర్చొని కనిపించాడు. అతడు నాతో ఇట్లనెను, "బ్రెన్హాం సోదరుడా, నీవు ఈ పట్టణములో నుండుట గాని జరిగినయెడల సహోదరుడు హాంక్ ఈ రోజు ఇక్కడున్నాడు గనుక నీవు వచ్చుట మంచిది. (సహోదరుడు హెన్రీ కార్ల్సనను మేము సహోదరుడు హాంక్ అని పిలచుచుందుము.) "నీవు కొద్ది దినముల పాటు ఈ పట్టణములో ఉండి కూడా ఆలయమును ఎక్కువగా దర్శించనియెడల, అది అతనికి వింతగా కనబడును," అని నాతో పలికెను. నేను మేల్కోన్నాను.
అది నాకు ఎంతో వింతగా కనబడినది. ఈ ఉదయమున సంఘమునకు ప్రత్యేకమగు కార్యక్రమము ఏదయినా ఉన్నదా అని సహోదరుడు నేవిల్ ను అడిగాను. ఎప్పటివలెనే అతడు చక్కగా ఇట్లనెను, "క్రిందికి రమ్ము." అంతట మేము క్రిందికి వెళ్ళాము. నిన్న మధ్యాహ్నము ఆలస్యంగా అతనిని నేను పిలిచాను, అయితే ఈ ఉదయాన అనుకోకుండానే ఇద్దరమూ కలిసికొన్నాము.
4మొదటగానే కొన్ని సంగతులు మీకు వివరించుట మంచిదని నేను తలంచుచున్నాను. నేను చాలామందికి ఒక వింత వ్యక్తిగా యున్నాను. నాకు నేనే వింతగా కనబడుచుందును. నాకు వీలయినంత సన్నిహితంగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును నేను వెంబడించ ప్రయత్నించెదను. చూడండి. అది మనలను వింత వారినిగా చేయును. కొన్నిసార్లు మనము చేసిన క్రియల గూర్చి కూర్చోని ఈలాగు ప్రశ్నించుకొనుచుందుము. "అటువంటి పనిని నేను ఎందుకు చేశాను? ఎన్నడయినా నేను అట్టి పనిని చేయగలనా?" మీరు ఖచ్చితంగా చేయజాలని దానిని చేసినట్లుగా అప్పుడు మీరు తలంచుచుందురు. కాని మీరు ఓపిక పట్టి విశ్వాసము కలిగియుండినయెడల, దానిని చేయుటకు దేవుడే నడిపించినట్లు మీరు కనుగొందురు. అది పూర్తిగా సరిగ్గానే పనిచేసినట్లు మీరు కనుగొందురు, చూచారా. దానిని చాలాసార్లు మనము కనుకొందుము. చాలాసార్లు సహోదరుడు నేవిల్ దానిని కనుగొనెనని నాకు తెలియును. నాయకులు మరియు ఆత్మీయ ప్రజలు దానిని గ్రహించుదురు.
కొన్ని సమయములలో నా జీవితము అది… నిజముగా చెప్పుచున్నాను, నేను ఒక బాలునిగా వున్నప్పటి నుండియే, ఎప్పుడూ కూడా నేను జెఫర్సన్-విల్లో నేను జీవించవలెనన్న నడిపింపును కలిగిలేదు. ఇక్కడ జీవించ ప్రయత్నించుట ఎప్పుడూ నాకు అత్తరు బుడ్డిలో ఈగవలెనే యున్నది. మొదటగా ఈ వాతావరణము నాకు అనుకూలించదు. మరొక సంగతి, తరువాత అక్ఏకడ దో ఆత్మీయ నిరుత్సాహము అనిపించును.
5మీరు గతంలోనికి వెళ్ళి చూడండి, వరదల సమయమందు నేను నాశనమై పోవలసింది, మొదటగా నాకు సేవ పిలుపు వచ్చినది. నేను అప్పుడు విడిచిపెట్ట నారంభించాను. సహోదరుడు జార్జ్-డి ఆర్క్ మరియు నేను…
సహోదరుడు గ్రాహం స్నెల్లింగ్ తల్లి, సహోదరుడు హాకిన్స్ ఒక పెట్రోలు బంకును న్యూ-ఆల్బనీలో నడుపుచున్నారు. ఇక్కడున్న ఒక చిన్న ప్రార్ధనా స్థలము వెలుపట చాలామంది నన్ను కలిసిరి. నేను వచ్చి జీవించినయెడల ఆలయము నిర్మించుటకు వారు తమ చిన్న పిల్లలను సహితము పంపించుదుమని చెప్పిరి. అందువలన వారిని ఒకచోట నుండి మరొక చోటికి మోసికొని వెళ్ళు పని తప్పును.
6ఒక తల్లి తన రెండు చేతులలో ఇద్దరు పిల్లలను పట్టుకొని వచ్చి, మేము ఆరాధించుటకు ఒక స్థలమును నిర్మించుటకు ఈ బిడ్డలను పంపించుదును అని చెప్పినది. దానిని నేను తట్టుకొనలేకపోయాను. సహోదరుడు జార్జి నేను కలిసికొని ఆలయము నిర్మించుటకు తీర్మానించుకొన్నాము.
ఆలయము నిర్మించబడినది, ఆలయమును నేను ప్రతిష్టించిన ఉదయాన ఒక దర్శనము చూచాను. ఆ మూలరాయిలో అది వ్రాయబడియున్నది. "ఇది నీ ఆలయము కాదు," అని పరిశుద్ధాత్మ వచ్చి చెప్పెను. నా ఆలయము ఏదని ఆయనను నేను అడిగినప్పుడు, ఆయన నాకు చక్కని నీల మేఘములను చూపించెను. "సువార్తికుని పనిచేయుము," అని ఆయన చెప్పెను. అది పుస్తకములో కూడా వ్రాయబడియున్నది.
7ఆ సంగతులన్నియూ కలిగి వచ్చినవి. ఇప్పుడు ఊడ్ నివసించుచున్న చోట ఒక రోజున నేను ఆవరణలో గడ్డి నరుకుచున్నాను. ఆ సమయములో మా అత్త అచ్చట ఉండెడిది, నేను వెనుకనున్న మెట్టు మీద కూర్చొనియున్నాను. అది ఒక చిన్న కాంక్రీటు మెట్టు, ఆ చిన్న వాసమును నేనే - నా అత్తగారి కొరకు నిర్మించాను. ఆ సమయములో ఆమె సంఘమును గూర్చి జాగ్రత్తవహించు వ్యక్తిగా పనిచేయుచున్నది. ఒక వ్యక్తి మాట్లాడునంత స్పష్టముగా ఒక స్వరము నాతో ఈలాగు మాట్లాడెను, "నీవిక్కడున్నంత వరకు నిన్ను ఎన్నడూ నేను ఆశీర్వదించను. నీవు ఈ స్థలము నుండి, నీ జనుల నుండి వేరుకావలసియున్నావు." అది నన్ను చీల్చివేసినది. వారము లేక ఇంకా ఎక్కువ దినముల పాటు నేను ముక్కలుగా చీల్చబడినట్లయ్యాను.
8"వెళ్ళిపొమ్ము , వెళ్ళిపొమ్ము . పశ్చిమ దిశగా సాగిపో. పశ్చిమ వైపుకు వెళ్ళిపో," అని నిరంతరము ఒక హెచ్చరిక నాకు వినబడుచుండెను. అది ఎప్పుడూ నన్ను తొందరపరచుచుండెను.
ఈ వారము నేను టుసాన్ కు వెళ్లి ఒక స్థలము అద్దెకు తీసికొని ఈ చలికాలములో ఉందునని నా మనస్సులో పూర్తిగా నిర్ణయించుకొన్నాను. సెప్టెంబరులో ప్రారంభమగు బడిలో పిల్లలను చేర్చవలెనని తలంచాను. నాకు స్థలము దొరికినది. అక్కడ నాకు ఒక స్థలము కూడా ఇవ్వచూపిరి. కాని నేను వెళ్ళిపోతే ఏమగునో అనిపించినది …
9మరో సంగతి నేను చెప్పగోరుచున్నాను. ఇప్పుడున్న ఈ సంఘ కాపరి ఉండు నివాస స్థలమును మేము కట్టుటకు కొద్దిగా ముందు ఇది జరిగినది. నేనయితే అది నిర్మించగోరలేదు. నా భార్య తల్లి వృద్ధురాలు. దానినిగూర్చి ఆమె ఏడ్చినది. "నా తల్లిని విడిచి నేను రాలేను. ఆమె వృద్దాప్యములో నున్నది గనుక ఆమెను ఎవరు చూతురు?" అన్నది. అది నాకు అర్ధమయినది. ఆమె తల్లి - ఆమెకు ఆ ఒక్క తల్లియే కదా, ఎప్పుడయినా ఇక ఉండును! కాబట్టి ఆమె బాధ నాకు అర్ధమయినది. కావున ప్రభువుకు నేను ప్రార్ధించాను. "ప్రభువా! ఈలాగున్నది గనుక నేను ఆ చోటికి వెళ్ళలేను," అని చెప్పాను. "నిన్ను తృప్తిపరచు ఏ చోటుకయినా నేను వెళ్ళుదును. నీవెక్కడికి పొమన్నా పోదును. కాని ఇక్కడినుండి నా భార్యను తీసికొనిపోయి దుఃఖపెట్టుట ఇష్టము లేదు, ఆమెకు ఎవరూ తెలియని క్రొత్త ప్రదేశమునకు వెళ్ళుట కష్టము. నేను ఎప్పుడూ ఇంటిలో ఉండను. ఇక్కడ ఆమెతో నేనుండునట్లు చేయుము," అన్నాను.
ఆమె తల్లి మహిమలోనికి ప్రవేశించినది. మరల పిలుపు వచ్చినది, చూడండి, ఇప్పుడు మరల కదలవలసి వచ్చెను. ఏమి చేయవలెనో నాకు తెలియలేదు.
10చుట్టూ ఉన్న సోదరులు ప్రారంభించిన ఈ సిద్ధాంతము బయలు వెళ్ళుచున్నంత కాలము నేను రంగములోనికి దిగను అని చివరిసారిగా వేదిక మీద నిలబడి ఒక రోజున చెప్పాను. కాబట్టి సోదరులు సాదరంగా దానిని చక్కదిద్దిరి. అదంతయూ సరిచేయబడెను. ఇరవై-నాలుగు గంటలలో అదంతయూ పరిష్కరించబడెను.
దానివలన నా రంగము మరల తెరువబడినది. నాకేమీ చేయవలెనో తోచలేదు. ఎటువైపు వెళ్ళవలెనో నాకు తెలియలేదు. ప్రభువును ఒక దర్శనము గూర్చి అడిగాను. ఏమి చేయవలెనో ఆయన సాకు చెప్పవలెనని అడిగాను, కాని ఆయన నన్ను ఆలాగే కూర్చోనిచ్చెను.
11గత రాత్రి పిల్లలు, నా భార్య గృహములో నుండి బయటకు వెళ్ళిన తరువాత దేవునితో నేను ఒక ఒప్పందము కుదుర్చుకొన్నాను. ప్రభువగు దేవునితో ఈలాగు నేను పలికాను, "నేను వెళ్ళుచున్న మార్గములో నీవు నన్ను దీవించినయెడల, నిన్ను నేను సేవించెదను. కాని ఎటు వెళ్ళవలెనో, ఏలాగు వెళ్ళవలెనో, ఏమి చేయవలెనో నీవు నాకు చూపించవలెను." ఆలాగు నన్ను ప్రభువుకు సమర్పించుకొన్నాను. నా పరిచర్య యావత్తును ప్రభువుకు నేను సమర్పించాను. నేనీలాగు చెప్పాను, "నీవెక్కడ తెరచెదవో, నీవు ఏమి చేసినా, ఆ మార్గములో నేను నడచెదను. నీవు మార్గము తెరచువరకు నేను ఇప్పుడున్నట్లుగానే కొనసాగుదును." నేను మోసపుచ్చబడకుండునట్లుగా ఆయనను స్పష్టముగా చెప్పమని అడిగాను. ఏదో జరుగుటకు సిద్ధముగా యున్నదని నేను నిజంగా నమ్మితిని.
ఈ ఉదయమున సహోదరుడు నెవిల్ ప్రస్తావించిన ఒక ప్రవచనమును నేను విన్నాను - ముందే ప్రవచించిన ప్రవచనమును గురించి అతడు చెప్పెను. మీ అందరికొరకు నేను ప్రార్ధించాను. మీరూ నా కొరకు ప్రార్ధించండి. మీ అందరూ పరిశుద్ధాత్మ నన్ను వెళ్ళవలసిన చోటకు నడిపించునట్లు, నేను తప్పు చేయకుండా చేయవలసినది చేయునట్లు ప్రార్ధించవలసిన అవసరత యున్నది.
12ఒక ప్రవచన వరము గూర్చి చాలాసార్లు ప్రజలు ఏమనుకొందురో మీరు చూచిరి. దేవుడిట్లు చెప్పును, "నిన్ను ఇక్కడ నుండి లేవనెత్తి అక్కడ కూర్చొండబెట్టెదను. నీవిక్కడికి వెళ్ళుము మరియు…" ఆయన నీకు అన్ని సంగతులు చెప్పడు. ఆయన అన్నీ పూర్తిగా చెప్పినచో ఇక నీ జయించు విశ్వాసము ఏమిటి? చూచారా, ఆయన అందరికంటే ఎక్కువగా నిన్ను ఒంటరిగా నిలబడచేయును, చూచారా. మీ అందరూ నా యొద్దకు వచ్చి ఏవేవో విషయముల గూర్చి అడుగుచుందురు. ఆయన మీకు ఎన్నడూ జవాబులు ఇయ్యకుండా తప్పిపోలేదు. అది నిజము. అవును. నా విషయముల గూర్చి నేను ఆయనను అడగగలను, కాని చాలాసార్లు ఆయన నన్ను ఒంటరిగానే ఉండనిచ్చెను, చూడండి, నన్ను ముందుకు వెళ్ళిపోనిచ్చును మరియు అందులోనే నన్ను నడువనిచ్చును.
నాకు పరిష్కరించుకొనవలసిన విషయములు ఇప్పుడు ఉన్నవి. ఇప్పుడు నేను తీసికోవలసిన నిర్ణయములున్నవి. ఆ మాట్లాడుచున్నది ఆయనే అని ఖచ్చితంగా నాకు తెలియువరకు నేను నిర్ణయాలు తీసికొనను. ఆయన నాకు దర్శనము చూపడు. ఆయన నన్ను ఒంటరిగా ఉండనిచ్చును. ఈ ఉదయమున నేను అనాధవలె యున్నాను. ఎటు తిరగవలెనో నాకు తెలియదు, కాబట్టి ప్రభువుకు దానిని నేను అప్పగించాను.
1COR 12:10
13ఏదో జరుగువరకు నేను ఈ ఆలయములో ఉండి సహోదరుడు నెవిల్ కు సహాయపడుటకు తిరిగి రావలెనని ఆ కలకనిన తరువాత నాకు తలంపు వచ్చెను, కాబట్టి నేను కొనసాగుతూపోయెదను.
"సంఘము ఎట్లు అభివృద్ధి చెందుచున్నది?" అని నేను కొద్ది క్షణముల క్రితము సహోదరుడు నెవిల్ ను అడిగాను.
"బాగున్నది," అని అతడు చెప్పెను.
మీకు ఇంకా ఆత్మీయ వరములు గలవారున్నారనియు, ప్రవచన వరము అమలు జరుగుచున్నదనియు, భాషలతో మాట్లాడుట, భాషలకు అర్ధము చెప్పుట ఉన్నదనియు కొద్ది క్షణముల క్రితము నేను విన్నాను. ఆ సంగతులు సంఘమునకు ఎక్కువ క్షేమాభివృద్ధి కలుగచేయును.
14నేను తలంచాను, ఈ రాత్రి సహోదరుడు నెవిల్ … పరిశుద్ధాత్మ వేరు విధముగా మనల్ని నడిపించినయెడల, నేటి రాత్రికి… ఈ ఉదయమున మీరు ఈ స్థలమున విడిచి వెళ్ళుటకు ముందుగా, మీ మనస్సులలో వుండే ప్రశ్నలను వ్రాసి ఇచ్చట ఉంచవలెను, సంఘము ఏమనుకొనుచున్నదనేది దాని ద్వారా మేము కనుగొనెదము. జనుల హృదయములలో ఏమున్నదనేది ఎరుగుటకు సంఘ కాపరులు ఆ విధముగానే చేసి కనుగొందురు. దానిని వ్రాయుటకు కాగితము మీ యొద్ద లేనియెడల, ఈ రాత్రి పెందలకడనే వ్రాసీ తీసికొనిరండి. వాటిమీద నేను సాధ్యమైనంత సమయమును గడుపుదును. వాటిని చూచి లేఖనపూర్వకంగా జవాబు ఇచ్చెదను.
15ప్రభుని చిత్తమయితే, ప్రకటనలోని చివరి ముద్రల గూర్చి మాట్లాడుదునని కొద్దికాలము క్రిందట ఇక్కడ ప్రకటించాను, ఈ సంవత్సరములో ఆ ముద్రలన్నింటినీ చెప్పి ముగించలేను, ఎందుకనగా ముద్రల గూర్చి చెప్పవలెనన్నచో, ప్రకటన 6వ అధ్యాయము నుండి 19వ అధ్యాయము వరకు చెప్పవలెను. ఆ మొదటి మూడు లేక నాలుగు వాటిని ఒక రాత్రిలో చెప్పగలనని తలంచుచున్నాను. ప్రతి ముద్రకు ఒక రాత్రి పట్టునని తలంచెను.
16ఆ ప్రకటన గ్రంథమును మనము ఎక్కడ మనము ఆపితిమో మీరు అర్ధము చేసికొనండి. సంఘము మహిమలోనికి ఎత్తికొనిపోబడినది, ఆ తరువాత భాగము యూదులకు సంబంధించి మాట్లాడును, సంఘమునకు సంబంధించినది కానే కాదు. అదంతయూ యూదా రాజ్యము గూర్చి వ్యవహరించును. కాబట్టి మనము సంఘము ఎత్తబడుట యందు ప్రారంభించి, ఆ ముద్రలప్పుడు, అన్యజనుల సంఘ కాలమందు ఏమి సంభవించుననేది ఇచ్చట మనము చూచుచున్నాము. సంఘము ఎత్తబడిన పిదప, విడిచిపెట్టబడిన ఇశ్రాయేలు దేశము, అది విడువబడినప్పటి కాలము నుండి ప్రస్తుత కాలము వరుకు అట్లేయుంటూ, మెస్సీయా వచ్చు వరుకు కొనసాగుచు, రానున్న మెస్సీయాను వారు చేర్చుకొందురు.
ఇప్పుడిది అర్ధమయినదా? సంఘము కొనిపోబడెను. దేవుడు మొదట సంఘముతో వ్యవహరించును — సంఘ కాలములు. దానిని మనము తీసుకున్నాము. పిదప సంఘము మహిమలోనికి కొనిపోబడెను. అప్పుడు పరిశుద్ధాత్మ తిరిగి వెళ్ళి, ఇశ్రాయేలును ఒక రాజ్యముగా చేరదీసెను. ఇంత దూరము తీసికొనివచ్చెను. పెండ్లి విందు జరుగుచుండగా, వారిని ఆ కాలాంతము వరకు తిరిగి తీసికొనివచ్చును. నేను నా నల్లబల్లను శుభ్రము చేశాను. సమయము వచ్చినప్పుడు దానిని గీసి బోధించెదను, అంతట ప్రభువు వధువుతో తిరిగివచ్చును. ఇశ్రాయేలు ఆమెను చూచును. ఓ, అదెట్టి సమయముగా నుండును!
DAN 9:24
17దీనిని సరిగ్గా మనము పొందుపరచు ముందుగా ఒక గొప్ప పాఠము చెప్పవలెను, అది అన్ని కాలములలో నుండిన వేదాంత పండితులను, అనేకమంది ఉపాధ్యాయులను క్రీస్తు సంఘము వారు దీనిని, వినిన వారందరిని ఇది అభ్యంతరపరచును. అది దానియేలు యొక్క డెబ్బది వారములు. దానియేలు యొక్క డెబ్బది వారములతో వధువును మరియు ఇశ్రాయేలును ముడివేయనిచో ప్రకటనలో ఇంకా ముందుకు మనము వెళ్ళజాలము. దేవుని చిత్తమయినచో, ఆయన భవిష్యత్తులో నాతో మాట్లాడినయెడల, డెబ్బది వారముల గురించి… లేదు, డెబ్బది వారముల గురించి కాదు, కాని ఆ చివరి ఏడు ముద్రల గూర్చి మాట్లాడెదను. వచ్చే ఆదివారము, ప్రభుని చిత్తమయినచో, దానియేలు యొక్క డెబ్బది వారములను తీసికొనుటకు ప్రయత్నించెదను. తక్కినవి ప్రారంభించుటకు అది మార్గమును సరాళము చేయును. ఆయన మనలను నడిపించవలెను, అప్పటినుండియూ దానిని మనము కనుగొందుము.
1SAM 10:2
18సహోదరుడు నెవిల్ మరియు నేను కలిసి దీని మీద పనిచేయుచున్నాము. ప్రజల మేలు కొరకు మేము చేయకలిగిన ప్రతిదియూ చేయుచున్నాము.
ప్రతిసారి మనము రోగులకు ప్రార్ధన చేయుచున్నాము. దానిని చేయుటకు ఎల్లప్పుడూ సంతోషించుచున్నాము. ప్రతి కూటములోను రోగులకు ప్రార్ధించుటకు నేను ప్రయత్నించెదను.
ఇంకా ఎక్కువ వివేచన కావలెనని నేను కోరుట లేదు. ఏమి జరిగినదో ఇక్కడున్నది, నేను ప్రయత్నించాను. తప్పు కార్యములు చేసితినని నాకు తెలియును. కాని ఎల్లప్పుడు దేవునికి సన్నిహితంగా జీవించుటకు నేను ప్రయత్నించాను. అందుకే ఈ దర్శనములు ఇవన్నియూ కలుగుచు ఏమి సంభవించబోవుచున్నదో తెలుపును. వస్తువులు పోగొట్టుకొనినవారు సహితము వచ్చి అవెక్కడున్నవో ప్రార్ధించి చెప్పమని అడుగుచున్నారు. గాడిదలను యెష్షయి పొగొట్టుకొనెను, అతని కుమారులు వెదకుచూ ప్రవక్త యొద్దకు వెళ్ళి వాటినిగూర్చి అడిగిరి. ఆ గాడిదలు ఇంటికి తిరిగి వచ్చినవని ఆ ప్రవక్త చెప్పెను. అటువంటివి అక్షరాలా నిజము. కాని అది ఈ స్థానిక జనులకు మాత్రమే కాక, ప్రపంచ వ్యాప్తముగా ప్రసిద్ధిచెందును, చూడండి. కాబట్టి అది నన్ను బాగా నలుగగొట్టును. ఎప్పుడూ ఉద్రిక్త స్థితిలో నిన్ను ఉంచును.
19శరీరములో ప్రత్యక్షమైన ప్రభువు యేసుక్రీస్తుగా నన్ను ఆ సహోదరులు చెప్పుచు అటువంటి సిద్ధాంతమును వారు ప్రారంభించుటకు అదే కారణమగును. అది సేవను ముక్కలు చేయునని నాకు తెలియును. క్రీస్తు మీదికి నిందను తీసికొని వచ్చును, చూచారా. దానిని వెంటనే ఆపమని అందుకే నేను గట్టిగా మందలించి చెప్పాను. అది దేవుని వలన కాక దయ్యము మూలముగా వచ్చినదని వారిని తెలిసికొననీయుడి, చూచారా. వారు మంచి జనులే. వారు దేవుని యొక్క ఆత్మ మూలముగా మరలా జన్మించినవారే, ఎందుకనగా వారు వాక్యమును బట్టి సత్యమును చూచినప్పుడు దేవుని వైపు తిరిగిరి, చూచారా, వెంటనే మళ్ళిరి. సాతాను వీరితో ఏదో చేయ ప్రయత్నించుచున్నదని అది తెలియచేయుచున్నది. వారందరూ భక్తిగల క్రైస్తవ ప్రజలే.
20"బ్రెన్హాం సోదరుడా, మునుపటికంటే ఇప్పుడు ఎక్కువ నమ్మకము మాకు నీలో కలిగినది," అని వారిలో చాలామంది చెప్పుటకు అది దోహదపడినది.
దేవుడు నాకనుగ్రహించిన వరముతో నేనేమి చేయగలనో చూడండి. నా కాళ్ళ యొద్దకు దేశమును, జనులను రప్పించగలను. నేను "దేశము" అని చెప్పుచున్నది దేనిని గురించి అనగా లోకములోనున్న అందరినీ కాదు - యుద్ధములో మరణించేవారిని కాదు, నేను నిజమైన విశ్వాసులను, క్రైస్తవులను గురించి చెప్పుచున్నాను. వారు "తిరిగి జన్మించిన జనులను" గూర్చి మనము మాట్లాడుచున్నాము. వారే రాజ్యము. అంతేగాని అందరూ కారు. మనము జీవించుచున్న ఈ లోకములో ఎంతో మురికి, కల్మషము ఉన్నది. తిరిగి మట్టిగా అది మారిపోవుచున్నది. నిజమగు క్రైస్తవులు, తిరిగి జన్మించిన క్రైస్తవులు గూర్చి నేను మాట్లాడుచున్నాను.
JOHN 9:6,7
21ఒక సంగతి గూర్చి ఒక వ్యక్తి నా మీదకు దూకునని నేను ఎదురుచూచుచున్నాను. కొంతకాలము క్రిందట ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చి ఇట్లనెను, "క్రీస్తు నేలమీద ఉమ్మివేసి, ఆ ఉమ్మితో తడిసిన మట్టిని ఒక గ్రుడ్డివాని కండ్లమీద రుద్దుట ఎంత అపవిత్రము! ఉమ్మితో బురదచేసి ఒకని కండ్లమీద రుదుట ఎంత అపరిశుభ్రము!"
"కాని అతడు చూపును పొందెను గదా?" అని నేను పలికాను. చూడండి, అంతే.
అదే వ్యక్తి!…. నా స్థలము యొద్ద వారు దిగంబర మేళమును తెరచిరి - అది మీకు తెలియును గదా! ఈత కొలను. తన పిల్లలు ప్రతీ ఒక్కరు ఆ ఈత కొలనులోనికి వెళ్ళునట్లు అతడు టిక్కెట్లు సంపాదించాడు. అతడు అతని భార్య కూడా ఆ కొలనులోనికి వెళ్ళెదరు. నా సోదరీలారా! క్షమించండి. ఆ ఈత కొలనులో ప్రతీరోజూ దాదాపు రెండు వందలమంది స్త్రీలు ఈత కొట్టుచుందురు. మురికి, ధూళి నిండిన ఆ కొలనులోని నీటిలోనికి త్రాగుచూ, బయటకు ఊయుచూ ఈత కొట్టుచుందురు. నేడు స్త్రీలు అట్టి అపవిత్ర క్రియలలో పాల్గొనుచున్నారు. అతడు నా మీదికి దూకునని నేననుకొనుచున్నాను, చూడండి.
"నేడు క్రీస్తు జీవించియుండినయెడల, అట్టి అపరిశుద్ద కార్యము చేసినందుకు అరెస్టు చేసియుందుము," అని వారని.
మరి దాని మాట ఏమిటి? నా భావము మీరు గ్రహించిరని నాకు తప్పక తెలియును. వారు తిన్నగా ఆ కొలనులోనికి వెళ్ళుచున్నారు, అందులోనికి సిఫిలిస్, గొనొరియా ఇంకా ఆయా రోగములున్నవారు వచ్చి మునిగెదరు. అందరూ ఆ నీటినే నోటిలో త్రాగి, ఊసెదరు. అందరూ అందులోనే స్నానము చేయుదురు. అదేనా శుభ్రము?
22ఓ, సోదరీ, సోదరుడా! ఇట్టి దినములలో మనము జీవించుచున్నాము! ప్రభువు యొక్క రాకడ సమమయు! సంఘమునకు ఒకే నిరీక్షణయున్నది, మరియు అది ప్రభువు యొక్క రాకడ.
సరే, నేను ఆ కార్యములను ఆపజాలను. ఆ అవసరము లేదు. అవి జరుగునని బైబిలు ముందే చెప్పెను. వాటిని ఆపజాలను. కాని వాటికి వ్యతిరేకముగా నేను మాట్లాడిన స్వరము పరలోకములో నమోదు కావలెనని కోరుచున్నాను, తీర్పు సమయమునకు అది కావలెను. దానికి నేను వ్యతిరేకిగా ఉంటిని.
ఈ బైబిలు దేవుని యొక్క వాక్యమని ఇంకా నేను బైబిలును నమ్ముచున్నాను. ప్రపంచములో దానికి వ్యతిరేకమైనదిగాని, దానిని ఆపునదిగాని ఏదియూ లేదు. ఇక్కడున్న ఈ బైబిలు సత్యము. ఇది దేవుని యొక్క వాక్యము. కనుక మనము మన ఓడలను లాక్కొని వెళ్ళి, పరలోకపు సమాధానదరిని లంగరు వేయుదము. రేపు మనమెక్కడికో సాగిపోదుము, కాని ఇప్పుడే మనము లంగరు వేయుదుము. ఆయన వాక్యము ద్వారా మాట్లాడుచుండగా పరమతండ్రి యొక్క స్వరమును మనము విందము, నేడే నమ్ముదము.
23మీకు ఏ చిన్న ప్రశ్నయున్నాగాని ఈ రాత్రి జవాబు పొంద… ఎవరినో బాధపరచునది తీసికొనిరావద్దు. మీరు అలాంటివి తీసికొనివచ్చినయెడల, వాటికి జవాబు చెప్పనని మీకు ముందే తెలుపుచున్నాను. మరొకరు ఈలాగు అడిగెదరు, "నేను ఫలాని పనిచేసినయెడల దానిని దేవుడు అంగీకరించునా?" మీ హృదయములో ఉన్న చిన్న ప్రశ్నలను తెలియచేయండి. "బ్రెన్హాం సోదరుడా! మాకు వరములు ఉన్నవి. వాటిని ఈ విధంగా వాడవలెనా లేక ఆ విధంగా వాడవలెనా? మేము ఏమి చేయవలెను?" అని కొందరు ప్రశ్నించెదరు. తిరిగి లేఖనము ద్వారా మీకు జవాబు ఇయ్యకలిగిన దానినే అడగండి. ఏదయినగాని వ్రాయండి. ఇది ఆదివారము, మరియు నేను… నేను సంతోషించెదను. ప్రశ్నలేవీ లేనియెడల నేను ఒక అంశము తీసికొని, ప్రభుని చిత్తమయితే బోధించెదను.
24గత ఆదివారము సహోదరుడు కాబెల్స్ యొద్దకు వెళ్ళ బయలుదేరాను. ఈ సంఘ గంట మ్రోగుట విన్నాను, ఆవరణలో అటు, అటు నేను నడిచాను. నేను దానిని సహించలేకపోతిని. ఇక అంతే, మీ అలజడి విని వచ్చేశాను.
ఇప్పుడు మన శిరములు వంచి మన సృష్టికర్తతో మాట్లాడుదము, ప్రార్ధన చేయుదము. ఎవరికయినా ప్రత్యేక విన్నపమున్నదా? మీ చేతులెత్తుట ద్వారా దానిని తెలియచేయండి. మీ హృదయంలో ఉన్నదానిని దేవుడెరుగును. ఇప్పుడు మీ విన్నపమును మీ మనస్సులో అలాగే ఉంచుకోండి.
REV 22:20
25మిక్కిలి పరిశుద్ధుడవగు దేవా, నీ హృదయాలోచనల చేత, నీ నోటి మాటచేత నీవు భూమ్యాకాశములను సృజించితివి. మా పట్ల నీవు చేసిన సమస్తము కొరకును నీకు వందనములు చెల్లించుటకు మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా నీ సన్నిధికి వచ్చుచున్నాము. రానున్న భవిష్యత్తును గూర్చియు, ఇప్పుడు మేము నిలబడియున్న మా స్థానమును గూర్చియు, కాల చరిత్రను గూర్చియు ఈ ఉదయమున మేము ఎరిగియున్నందుకు, ప్రభువా, మేము ఎంతో కృతజ్ఞత చెల్లించుచున్నాము. కల్వరి యొక్క రక్తములో మేము కడుగబడియున్నామని దేవుని కృపను బట్టి నేడు ఎరుగుదుము. ఆయన నేడు వచ్చినయెడల కలిసికొనుటకు మా హృదయములందు విశ్వాసముతో సిద్ధపడియున్నాము. "ప్రభువైన యేసూ, రమ్ము," అని మేము చెప్పవలెను.
పాపము పెరిగిపోవుటను మేము చూచుచున్నాము. లోకము పాపము యొక్క ప్రభావము క్రింద తొక్కబడుచున్నదన్నట్లుగా తోచుచున్నది. త్రాగుడు, జూదము, పోకిరితనము, వస్త్రహీనత, ఎంతగా యున్నదో, ఓ దేవా, ప్రజలు మురికి, అపవిత్రతతో మగ్గియున్నారు. ప్రభువా, వారది గ్రహించిన ఎంత మేలు? భక్తిహీనతతో, చిన్నబట్టలు ధరించి ప్రజలు వీధులలో తిరుగుచున్నారు. వారు కేవలము పురుగులు, మరియు ధూళి అన్న సంగతి గ్రహించినచో ఎంత బాగుండును! వారెంతో అతిశయించుచున్న ఆ శరీరము ఒక వారము రోజులలోనే పురుగులచే తినివేయబడును. దానిని మట్టి పురుగులు తినివేయునని వారు గ్రహించారా? వారి ప్రాణము ఆవలివైపున నిత్యత్వములో దేవుడు లేక, క్రీస్తు లేక, నిరీక్షణ లేక, నిరాశలో కూరుకోనిపోవును. ఆయన రాకడయందు నాశనమే అగును. ఓ దేవా, సమీపించుచున్న అపాయము నుండి ప్రతి ప్రాణము హెచ్చరిక పొందునట్లుగా మాకు హెచ్చరిక స్వరమును దయచేయుము.
26నేడు మాకు తోడైయుండుము, మాకు "జ్ఞాన వాక్యములను" దయచేయుము. ప్రసంగిలో సొలోమోను ఒకసారి "జ్ఞానముగల నిర్మాణకులు" గూర్చి చెప్పెను. సంఘ కాపరులమగు మేము ఆలాగుండునట్లు కృప చూపుము. ప్రభువా, ఈ ఉదయకాలమున అవసరతలోనున్న హృదయములను పట్టుకొను కళాఖండముల వంటి మాటలను మేము అందించుటకు వెదకుచున్నాము. సహాయము చేయుమని ప్రార్ధించుచున్నాము.
ఎవరో చూడవలెనని నేడు మేము వేడిగానున్న ఈ పైకప్పు క్రిందికి రాలేదు గాని, మేము నిన్ను ప్రేమించుచున్నాము గనుక నీ మాట వినవలెననీ మేము ఆశించుచున్నాము. మేము ప్రేమించు మా ప్రేమికునివి నీవే, నీ మాటలు వినవలెనని మేము కోరుచున్నాము. ఇప్పటికే మేము వినినదానినిబట్టి కృతజ్ఞత చెల్లించుచున్నాము. అది చిరకాలము మాతో యుండును. నేడు నీవు మాకు దాచియున్న భాగమును ఇప్పుడు మాకు దయచేయుము, నీ కొరకు ఇంకా మేము కనిపెట్టుకొనియున్నాము. దీనిని యేసు నామములో ఆయన కొరకు అడుగుచున్నాము. ఆమేన్.
27[ఒక సోదరి మరో భాషలో మాట్లాడుచున్నది. ఒక సోదరుడు అర్ధము చెప్పుచున్నాడు.]
ఆత్మ నుండి ఈ హెచ్చరికలు పొందుటను బట్టి కృతజ్ఞత చెల్లించుచున్నాము. ఈ రోజు పరిశుద్ధాత్మ మాట్లాడనైయున్న పలుకులను గమనించి హెచ్చరిక పొందవలెనని మనకు ఆదేశించబడుచున్నది. ఆయన మన కొరకు దాచియుంచినది మనకు తెలియదు. ఆయన ఏదో తీసుకొని రానైయున్నాడని మాత్రము మనకు తెలియును. మీ మనస్సులో యున్న ప్రశ్నను గూర్చి ఆయన మాట్లాడవచ్చును. ఈ ఉదయ కాలమున వర్తమానము ద్వారా ఆయన మాట్లాడును, ఈ రాత్రి ఆరాధనయందు ఆయన దానిని మాట్లాడవచ్చును. ఈనాడు ఎక్కడో, ఎవరినో, ఆయన వాక్యమును పట్టుకొనుటకు హెచ్చరించుటకు ప్రయత్నము చేయుచున్నట్లు కనిపించుచున్నది.
28వ్రాయబడిన వాక్యము వైపునకు తిరుగుదుము, ఆదివారము పాఠము కొరకు నిర్గమ కాండము తీయుదము.
మీకు బాప్తిస్మమపు ఆరాధన యున్నదా? ["ఈ సాయంకాలము ఆరు గంటల వరకు లేదు," అని సహోదరుడు నెవిల్ చెప్పెను.] బాప్తిస్మపు ఆరాధన ఈ సాయంకాలము ఆరుగంటలకుండును.
EXOD 17:5,6
29నిర్గమకాండము 17వ అధ్యాయము 5, 6 వచనములు చదువుదము.
అందుకు యెహోవా - నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసికొని ప్రజలకు ముందుగా పొమ్ము; నీవు నదిని కొట్టిన నీ కర్రను చేతపట్టుకొనిపొమ్ము.
ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను మీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్ళు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు
చేసెను.
ఇప్పుడు, ఈ ఉదయకాల పాఠము కొరకు ఆదివారపుబడి అంశముగా దీనిని తీసికొందును: "బండనుండి నిత్యమూ ఊరేడి నీరు" అని ఈ అంశమును పిలచుదును.
2COR 6:14•
REV 18:4
30ఇశ్రాయేలు ఎల్లప్పుడునూ సంఘమునకు ఒక చారిత్రక ఉదాహరణముగా యున్నదని మనకు తెలియును. ఎందుకనగా ఇశ్రాయేలీయులు దేవుని జనులు ఐగుప్తు నుండి వారు బయటకు వచ్చినప్పుడు దేవుని సంఘమయిరి, ఎందుకనగా వారు తక్కిన లోకమునుండి వేరయిరి.
మిగతా ప్రపంచము నుండి మనము వేరయినప్పుడు, అప్పుడు మనము సంఘముగా అవుదము. అయితే లోకముతో పాటు మనమును ముడివేయబడి యున్నంతకాలమూ మనము సంఘము కాదు, దానిని బహు లోతుగా వెళ్లి పట్టుకొనవలెనని నా ఆకాంక్ష. చూడండి, లోకము నుండి వేరగువరకు మనము సంఘము కాదు. మనలను మనము వేరుచేసికొని అపవిత్రమగు జనులలో నుండి బయటకు రావలెను, వారితో పొత్తు ఉండరాదు, వారి పాపములలో పాలిభాగస్థులము కారాదు. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, కాబట్టి మిమ్మును మీరు లోకక్రియలలో నుండి వేరుచేసికొనుడి.
ఇశ్రాయేలు వారు ఐగుప్తులో ఉండగా వారు దేవుని ప్రజలు. వారు బయటకు పిలువబడినప్పుడు, నిర్గమనము చెందినప్పుడు, వెలుపలకు వచ్చినప్పుడు, సంఘముగా పిలువబడిరి, ఎందుకనగా అప్పుడే వారు తమను తక్కిన లోకము నుండి వేరుచేసికొనిరి.
EXOD 13:21
31"సంఘము" అను మాటకు "బయటకు పిలువబడినది" అని అర్ధము. నిర్గమనము అనగా "బయటకు వచ్చుట." క్రైస్తవులముగా మన ప్రతి ఒక్కరికి మన జీవితములో ఒక నిర్గమనమున్నది. మన స్నేహితుల మధ్యనుండి మనము బయటకు పిలువబడిన సమయము ఒకటున్నది. ఒకప్పుడు మనము సహవాసము చేసినవారి మధ్యనుండి బయటకు పిలువబడితిమి. మనము ప్రత్యేకమైన జనులమైతిమి, ప్రత్యేకమైన జనులతో నడచుటకు వచ్చితిమి. ఒక ప్రత్యేకమైన విధానములో ప్రవర్తించి, ఒక ప్రత్యేకమైన విధానములో మాట్లాడు వారితో వచ్చితిమి. ఇది మన జీవితములో ఒక నిర్గమనము.
దేవునిచే పిలువబడిన ఇశ్రాయేలీయులు మనకు ఒక చక్కని ఉదాహరణ. వారికి ఒక నిర్గమనముండెను, లోకస్థుల మధ్యలోనుండి బయటకు వచ్చిరి, దేవునికి ఒక వింతయిన ప్రజలుగాను, ఒక ప్రత్యేక రాజ్యముగాను మారిరి. వారు కరుణాపీఠము యొక్క నీడల క్రింద నడిచిరి. ఆ గొప్ప అగ్నిస్తంభము ద్వారా వారు జీవించిరి మరియు నడిచిరి. దేవుడు వారిని ఐగుప్తులో నుండి వాగ్దాన భూమిలోనికి తీసికొనివచ్చెను.
EXOD 2:3
32ఈ నిర్గమములో, వారికి ఒక ఆత్మీయ నాయకుడు ఇవ్వబడెను. ఆ నాయకుడు మోషే, ఒక గొప్ప అభిషేకము పొందిన ప్రవక్త. ఒక గొప్ప వ్యక్తి. అతడు ఒక దైవజనుడు, అతడు ఒక దైవజనునిగానే పుట్టెను. తల్లి గర్భములో పడకముందే దేవుడాతనిని పిలిచెను, ప్రజలను ఈ విధముగా బయటకు తెచ్చుటకు ఆ తరమునకు ఒక నాయకునిగా ఉండుటకై దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే అతడిని పిలిచెను.
33ఇక్కడి ఈ ఆలయములో కొంతకాలము క్రిందట చిన్న పిల్లలకొరకు ఒక చిన్న ప్రసంగము చేశాను; మోషే తల్లిదండ్రులగు యోకెబెదు, అమ్రాములు ఏ విధంగా ప్రార్ధించిరో ఒక చిన్న ఉదాహరణ చూపించాను, ప్రజలను విమోచించవలెనని దేవుని అడిగిరి. దేవుడు లేదా దేవుని దూత నిలబడి ఉత్తరము వైపుగా చూపించి ఏమి జరుగునని చెప్పెనో తెలియచేశాను. చిన్న మోషే పుట్టెను. రాజు యొక్క ఆజ్ఞలకు గాని బెదిరింపులకు గాని వారు భయపడలేదు. మోషే మీద దేవుని హస్తమున్నదని వారెరిగిరి, మరియు అది స్థిరపరచినది. అది నిజము. రాజు ఏమి చెప్పినా, రాజకీయ లోకము ఏమి చెప్పినా, ఎవరేమి చెప్పినా వారికి లెక్కలేదు. మోషే మీద దేవుని హస్తమున్నదని వారికి తెలియును. కాబట్టి అతనిని వారు పెంచుటకుగాని, మొసళ్ళ మధ్య విడిచిపెట్టుటకు గాని వారు భయపడలేదు. అందులో జారవిడిచిన హెబ్రీ పిల్లలను తిని మొసళ్ళు బాగా బలిసినవి. అయినాగాని మోషేను చిన్న పెట్టెలో పెట్టి మొసళ్ళ మధ్యను విడిచిపెట్టిరి - ఎందుకనగా వారెందుకూ భయపడలేదు, మోషే మీద దేవుని హస్తమున్నదని వారికి తెలియును.
MATT 28:20•
JOHN 14:19
34పరిశుద్ధాత్మ అను గొప్ప నాయకుని దేవుడు మనకొరకు పంపెనని, ఇప్పుడు మనము ఎరిగియుండినయెడల ఎంత బాగుండును! ఆయనే మన నాయకుడు. లోకము ఏమన్నా, ఎందరు మనలను చూచి నవ్వినా, హేళన చేసినా మనము మన నాయకుని వెంబడించెదము! దేవుడు మనకు నాయకునిగా ఉండుటకు పరిశుద్ధాత్మను పంపెను, చూచారా. "ఇక కొంతకాలమైన తరువాత లోకము నన్ను చూడదు. అయినను మీరు నన్ను చూచెదరు. ఏలయనగా లోకాంతము వరకు నేను మీతోను, మీలోను ఉందును." కాబట్టి పరిశుద్ధాత్మ అను గొప్ప నాయకుడు మనతోనున్నాడు. ఇప్పుడు మనము తప్పక ఈ నాయకుని వెంబడించి ఆయన చెప్పినది చెప్పినట్లుగానే చేయవలెను. ఈ నాయకుడు ఎన్నడూ మనలను త్రోవ తప్పించడు. ఎల్లకాలము ఆయన మనలను వాక్యపు త్రోవలోనే యుంచును. ఆయన ఎన్నడూ దీనికోసమని ఈ ప్రక్కకో, దానికోసమని ఆ ప్రక్కకో ఒరగడు. ఆయన ఎల్లప్పుడూ వాక్య త్రోవలోనే యుండును.
EXOD 4:29•
EXOD 14:21,22•
ROM 8:28•
EPH 4:30•
HEB 12:6
35ఇశ్రాయేలును తీసికొని వెళ్ళవలసిన పని మోషేకు ఉన్నది, ఎర్ర సముద్రమును, యోర్దానును దాటించి వాగ్దాన దేశములోనికి వారిని కోనిపోవలసియుండెను. అరణ్యమార్గము గుండా నడిపించెను. వరుసలో నుండి తప్పిపోయినవాడు మోషే కాడు. దేవుడు వరుసలో నుండి తప్పిపోలేదు. ప్రజలే వరుసలో నుండి తప్పిపోయి, శ్రమకు కారకులయిరి. కాబట్టి ఇప్పుడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుదము.
మోషే ఒక అభిషిక్త నాయకుడు. చివరగా, దేవుడు మాత్రమే అద్భుతములను, ఆశ్చర్యములను జరిగించగలడని సూచక క్రియల ద్వారా అతడు ప్రజలకు చూపించెను. వారికి వాగ్దానము చేయబడిన ఆ మంచి దేశమునకు ఈ దేశములో నుండి నడిపించుకొని వెళ్ళుటకు మోషే మాత్రమే అభిషిక్తుడని వారు సంతృప్తి చెందువరుకు ఇశ్రాయేలు వారియెదుట, ఇశ్రాయేలు పెద్దల యెదుట ఈ అద్భుతములను, సూచక క్రియలను చూపించెను. దేవుని పేరట మోషే జరిగించిన ఈ గొప్ప కార్యములను వారు చూచి అతనిని వెంబడించుటకు ఇష్టపడిరి. వారిని అతడు వెలుపలకు తీసికొనివచ్చెను, ఎర్ర సముద్రము గుండా నడిపించెను, ఎండిన భూమి ద్వారా అవతలకు దాటిరి, అరణ్య ప్రయాణము చేయించెను, అనగా అది పరీక్షల కాలమని దాని భావము.
36ఆ విధముగానే ఒక వ్యక్తి క్రీస్తు తన స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, సమస్తమూ తలక్రిందులై పోయినట్లుగా అతనికి అనిపించును. అతడు పరిశుద్ధాత్మ అభిషేకమను పొందుటకు ముందు, మొదటగా శుద్ధీకరణ యొక్క పద్ధతిలోకి అతడు వెళ్ళవలెను. అతని జీవితములో ఒక పరీక్షాకాలము తప్పక వచ్చును. అది మీ అందరికి వచ్చినది. ఇతనికి ఈ శోధనాకాలము వచ్చును. "దేవుని యొద్దకు వచ్చిన ప్రతివాడు శోధింపబడును. ఈ శిక్షకు మనము నిలబడనియెడల మనము దేవుని పిల్లలము కాము. మనము అక్రమ సంతానమే గాని దేవుని పిల్లలము కాము," అని బైబిలు ఆలాగు చెప్పెను. కాని మనము దేవుని శిక్షను సహించి, "దేవుని ప్రేమించువారికి సమస్తము మేలుకొరకు సమకూడి జరుగుచున్నవని" ఎరిగినయెడల, మనము దేవుని కుమారులము - కుమార్తెలము అగుదుము. అప్పుడు విమోచనా దినము వరకు ఆయన పరిశుద్ధాత్మతో మనలను ముద్రించును. చూడండి, అది పరీక్ష, అట్టి ఒత్తిడి ద్వారా మనము వెళ్ళవలెను. ఒక చారిత్రక మాదిరిగా ఉన్న ఇశ్రాయేలు ఈ పరీక్షను ఎదుర్కొనవలసియుండెను.
EXOD 7:19,20•
EXOD 8:16,17,24
37వారు ఐగుప్తులో నుండగా దేవుడు మోషేను పంపెను, అతడు కర్ర చాపగా - ఈగలు, పేలు నేలమీదికీ వచ్చెను, అతడు సూర్యునివైపు కర్ర చాపగా - అది అస్తమించెను. నీటిమీద అతడు కర్ర చాపగా - అది రక్తమాయెను, ఇశ్రాయేలీయులు గోషేనులో ఉండగా ఎంతో మహిమకరముగా ఉండిరి, సూర్యుడు అస్తమించలేదు, తెగుళ్ళు రాలేదు. ఎందుచేత, అది వారికి ఒక మహిమకరమగు సమయమది!
మొదట నీవు రక్షింపబడినప్పుడు ఆలాగే యుందువు. పిట్టలు వేరుగా పాడినట్లుండును, అంతా ఎంతో మాధుర్యముగా ఉండును. ఓ, మొదట నీవు రక్షించబడినప్పుడు అంతా ఎంతో తేలిపోవుచున్నట్లుండును. అప్పుడు పరీక్షా కాలము వచ్చును, శుద్ధీకరణ సమయము వచ్చును, లోకము యొక్క సంగతుల నుండి నీవు శుద్ధిచేసుకొందువు, "సుళువుగా చిక్కులు పెట్టు ప్రతి భారమును ప్రక్కకు పెట్టుదువు." నీవు పొగత్రాగుట మానవలసి ఉండును, నీ త్రాగుడు ఆపవలసియుండును, రాత్రంతా పేకాట, వినోదములను మానవలసి ఉండును, నీవు యేసుక్రీస్తు యొక్క రక్తమునందలి విశ్వాసము బట్టి వాటన్నిటి నుండి నిన్నునీవు శుద్ధిచేసుకోవలసియుందువు. నిన్నునీవు శుద్దీకరించుకొనుట! స్త్రీలు తమ జుట్టును ఎదుగనియ్యవలెను, శరీరము నిండుగా బట్టలు ధరించవలెను, మునుపటికంటే ప్రత్యేకమైన ప్రవర్తనను నీవు కలిగియుండవలెను; శుద్ధీకరించుకొను సమయము! చాలాసార్లు వారు తిరగబడి వెనుకకు పోవుదురు, వారు దేవుని పిల్లలు కారు, చూచారా. దేవుని బిడ్డ తిన్నగా కల్వరివైపు చూచును. అది తన మేలుకొరకేనని అతనికి తెలియును.
NUM 21:5
38కావున అట్టి పరీక్షా పద్ధతి సమయమందు ఇశ్రాయేలు గొప్ప పతనమునకు గురి అయ్యెను. ఈ గొప్ప తొట్రుపాటు కాలములో, ప్రజలు ఒక ప్రక్క నుండి మరొక ప్రక్కకు పడిపోసాగరి. "వారి సణుగుడులో అప్పుడు, "మంచిది, మనము ఐగుప్తులో ఉండినయెడల బాగుండెడిది. మన ప్రాణములకు రొట్టె కావలసివచ్చెను," అనుకొనిరి. ఆనాడు చరిత్రలో వారాలాగే సణిగిరి.
ఇప్పుడీ అధునిక దినములలో ఈలాగనుచున్నారు, "ఓ, ప్రతి బుధవారము రాత్రి ప్రార్ధనా కూటము, ప్రతి ఆదివారపుటుదయము చర్చికి వెళ్ళాలి! ఏమి విందుము? అదే కదా! బోధకుడు నిలబడి మాట్లాడును, పాటలు పాడెదరు, ముగియును." అంటే ఒక విధినిర్వహణవలె నీవు సాగిపోవుచున్నావు. నీవు ఒక ఆరాధికునివి కావు. ఆరాధికుడు అక్కడకు ఆరాధించుటకు వెళ్ళును, దేవుని యెదుట తన్నుతాను వ్యక్తపరచుకొనును, దేవునిని ఆయన మంచితనమును బట్టి స్తుతించును. ప్రతి మాట, అతడు దానిపై ఆధారపడును.
39ఒక ప్రేమ వ్యవహారము వలె యుండును. నీవు విధిని నెరవేర్చుటకు ఒక బాలికతో స్నేహించవు, లేదా ఒక బాలునితో స్నేహము చేయవు, నీవు యవ్వనములో యున్నప్పుడు ("మా అమ్మ చెప్పినందువలన ఈ యువకుడుతో వెళ్ళుచున్నాను, నాకు అతడు నచ్చలేదు" అని చెప్పినయెడల), అతడు వచ్చి నిన్ను చూచినచో అందులో ఏమీ ప్రయోజనము నీకు లేదు. యువకుడు, యువతితో విధి నెరవేర్చుట కోసము వెళ్ళిన కూడా అంతా ఒక్కటే. అది ప్రేమ కాదు. అటువంటి పరిస్థితితో నీకు ఆసక్తి ఉండదు. అవతలి వ్యక్తిని చూడవలెననీ ఆకాంక్షించవు. అది నీకు ఒక విసుగుదల పనిగా ఉండును. అవతలి వ్యక్తి నిన్ను చూచుటకు వచ్చినాగాని, నీవు ఆనందించక మరి ఎంత త్వరగా పోవునా అని చూచెదవు.
అందుకే నీకు కూడా ఆలాగు అనిపించుచున్నది, "ఇంతసేపు ఎందుకు ప్రసంగించుచున్నాడు? ఇదంతా ఏమిటి?" చూచారా, అంటే నీవు ప్రేమలో లేవు.
ఈ ఉదయకాలము ఆత్మ హెచ్చరికను బట్టి ప్రతి మాటను నీవు నిజంగా గట్టిగా పట్టుకొనియుండవలెను, చూడండి… "ప్రతి మాటను పట్టుకొని నిలచుట." ఆయన దానిని గూర్చియే మీకు చెప్పియుండును, ఆలాగే పట్టుకొనియుండండి! దేవుని యొక్క ప్రతి మాట నిత్యజీవమే. ఏ పరిస్థితులలోనయినా గాని సంఘమునకు వెళ్ళుట ఆనందముగా నుండును. అది ఎండయినా, చలి అయినా, ప్రజలు ఏమనుకొనినా, ఇతరులు ఏమనుకొనుచున్నా ప్రభుని యొక్క మాట వినుట ఆనందముగా ఉండును. అనగా నీవు క్రీస్తుతో ప్రేమలోనున్నావు, చూచారా, నీవు సంఘమునకు వెళ్ళుటకు ప్రేమించెదవు.
40''మంచిది, మధురమైనదానా, మరలా ఆదివారము ఉదయము వచ్చెను, మనము పిల్లలను సిద్ధము చేసుకొని, అచ్చటకు వెళ్ళవలెను, అది మరల ఆదివారము వచ్చినది. ఇక మనకు సమయముండదు. మై, చాలా విసుగు," అని అన్నావంటే. చూడండి, నీవు ప్రేమలో లేవు.
కాని నీవు నిజంగా ప్రేమలోయున్నయెడల, ఆదివారము ఉదయము వచ్చేవరకు ఆగలేవు. దేవుని యొక్క ప్రజల యొద్దకు నీవు వెళ్ళి ఆనందించెదవు. వారు నిన్ను విసిగించరు, ఎందుచేత, వారే నీకు సోదరులు, సోదరీమణులు. "చలితో గడ్డకట్టిన బెల్లపు పొగువలె ఉందువు," అని మామూలుగా నేను అనుచుందును, అది విడిపోదు, ఒక్కటిగా దానితో అంటుకొనియుండును, మీరెరుగుదురా, గట్టిగా అంటుకొనియుండును. నా అర్ధమును మీరు గ్రహించవలెను, మీరు చూచారా. మీరు ఒక్కొక్కరితో కలిసియుందురు. ఎంత చలి ఎక్కువగునో, అంత దగ్గరగా వారు కలిసియుందురు. మనము కూడా ఆలాగే యుండవలెను. చలి…
లోక స్నేహితులు విడిచిపెట్టినప్పుడు,
ఆయనను మరింత సన్నిహితముగా హత్తుకొనుము.
41మనము ఏదో అయినందువలన ఒకరినొకరము ప్రేమించుకొనుటలేదు గాని, క్రీస్తు మనలో యున్నందున ప్రేమించుచున్నాము, మీరు చూచారా. మనలో దేవుడున్నాడు గనుక మనము ప్రేమించుచున్నాము. ఇప్పుడు మనము చేరువగుటకు ఇష్టపడుచున్నాము. ఆ పాత పాట మనము పొడుచుందుము.
బంధించు బంధము దీవించబడు గాక
మన హృదయములను క్రైస్తవ ప్రేమలో;
అదే మనకు గల సహవాసము
పైనున్న దానికి సమానముగా ఉండును.
చూడండి, ఏక మనస్సుగల సహవాసము పైనున్నదానివలె ఉండును.
మన తండ్రి యొక్క సింహాసనము ఎదుట
మన గంభీర ప్రార్ధనలు కుమ్మరించుదుము.
మన భయములు, మన ఆశలు, మన గురులు ఒక్కటే
మన ఆదరణలు మరియు మన చింతలు ఒక్కటే.
చూచారా? అవునండీ! ఒకరికి దీవెన కలిగినప్పుడు, మనందరము దానిగూర్చి ఆనందించెదము. ఒకరు దుఃఖములో యున్నప్పుడు, మనందరము దుఃఖపడుదుము. మనందరమూ ఒక్కటిగా కలిసి ఉండగోరుచున్నాము. ఆ విధముగానే మనము ఉండవలసియున్నాము.
NUM 11:5•
NUM 21:5
42ఇశ్రాయేలు ఆ విధముగానే ఉండవలసియుండెను. కాని అది వారికి భారమయినది. "ఓ, ఇది పాతబడిన రొట్టె. దేవదూతల రొట్టె! ఆ పాత తేలిక రొట్టె ఎవరికి లెక్క? మన ప్రాణములు ఆ తినుబండారములకు ఆశించుచున్నవి. అంతా పొరపాటు. ప్రతి రాత్రి కురియుచున్న ఆ పాత మన్నాకంటే - ఐగుప్తులోని ఉల్లిగడ్డలు, కీరకాయలే బాగుండును." చూడండి, వారి హృదయములు ప్రయాణమునకు సిద్ధంగా లేవు.
ఆలయమునకు వెళ్పు విషయములో స్త్రీ లేదా పురుషులెవరయినా సణిగినయెడల, ఆలయమునకు వెళ్పుటకు విసుగుదల చూపినయెడల, వారు ప్రయాణమునకు సిద్ధముగా లేరు. అది నిజము. ఎక్కడో ఏదో పొరపాటున్నది.
ఓ, మీరు దేవుని ప్రేమించినప్పుడు, మరియు పరలోకమునకు వెళ్ళుచున్నట్లు తలంచుదురు, మీరందరూ కలిసి వెళ్ళెదరు!
ఎట్టి సహవాసము, ఎంత దైవ సంతోషము,
నిత్య బాహువు మీద ఆనుకొనుట;
ఓ, నా ప్రభువు అంత దగ్గరగా నున్నప్పుడు,
ఎంత ధన్యకరమగు సమాధానము.
ఆయన యొక్క నిత్య బాహువుపై ఆనుకొనుట.
మనము ఆ పాటలు పాడుచుందుము.
మన పరస్పర దుఃఖములు పంచుకొందుము;
మన పరస్పర భారములు మోయుదుము
తరచుగా ఒకరిపట్ల ఒకరికి సానుభూతి కన్నీరు చాలును.
మనము విడిపోయినప్పుడు అంతరంగ బాధ కలుగును.
కాని హృదయములో మాత్రము ఇంకా కలిసేయుందుము.
వచ్చే ప్రార్ధనా కూటములో
తిరిగి కలిసికొను నిరీక్షణ కలిగియుందుము.
అవునండీ, ఇంకా హృదయములో కలిసియుందుము.
NUM 16:3•
NUM 21:5
43ఇప్పుడు మీరు ప్రయాణమునకు సిద్ధమగుచున్నారు, చూడండి, వాగ్దాన దేశములోనికి వెళ్ళుటకు మీరు సిద్ధమగుచున్నారు, పరీక్షా సమయము అచ్చట ప్రమాద స్థలములు, అరణ్యము, అనగా శ్రమల కాలము.
ఇశ్రాయేలు, ఆమెకు ఒక శోధనాకాలములో యున్నది, ఆమె ఒకరితో ఒకరు పోట్లాడుకొనుచూ, తగవులాడుకొనిరి, ఆహారము కొరకు వారు కీచులాడుకొనిరి, తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోగోరిరి.
అంతట వారు తమ నాయకుని గూర్చి సణుగులాడసాగిరి. ఓ, అతడు తమను త్రోవ తప్పించున్నాడేమోనని భయపడిరి, తాను నాయకుడనని కనుపరచుకొనిన తరువాతనే వారిలాగు తలంచిరి, అతడే నాయకుడని దేవుడు నిరూపించెను. "బహుశా మేము మితిమీరి ప్రవర్తించాము. మేమందరమూ తప్పటడుగు వేసియుందుము," అని వారనుకొనియుందురు, చూడండి. వారు దేవునికి, మోషేకు - దేవునికి, తమ నాయకునికి విరోధముగా మాట్లాడసాగిరి.
44ఇప్పుడు మనము ఆ స్థలమునకు వెళ్లినప్పుడు, "వాక్యభావము ఇదేనా లేక కాదా, అనే సంగతి నాకు తెలియదు. పరిశుద్ధాత్మ గూర్చి నాకు తెలియదు. దానిగూర్చి నాకు కొద్ది సందేహమున్నది. ఇతరులకు అది తెలియదు." మంచిది, ఐగుప్తునకు వెళ్ళుము, చూచారా.
మీరు మార్గములోనే నిలచియుండుటకు నిజముగా నిశ్చయించుకొనినయెడల పరిశుద్ధాత్మ అను నాయకునితో నిలచియుండుడి, వాక్యముతో నిలచియుండుడి. మీరు ఆత్మతోనే నిలచియుండినయెడల, అది మిమ్మును వాక్యములోనే యుంచును. అది నిజము. వాక్య మార్గములోనే అది మిమ్మును తీసికొనివెళ్ళును. దానినిగూర్చి భయపడకుడి. అదేమియూ బాధపెట్టదు; మీరు గాయపడినయెడల, అది మీకు సహాయము చేయును. అది మీ గాయములన్నింటిని స్వస్థపరచును, పరిశుద్ధాత్మ స్వస్థపరచును.
EXOD 17:6
45ఈ విధముగా వారు మార్గములో పరిస్థితులను ఎదుర్కొని హోరేబు అను చోటకు వచ్చిరి. హో-రే -బు, హోరేబు, పిదప మనము కనుగొనెదము… ఆ పేరును చీల్చి చూచెదము, హోరేబు అను మాటకు, "ఎండిన స్థలము," లేక "ఎడారి" అని అర్ధము.
సంఘములో ఒకరితో ఒకరము సహవాసము పోగొట్టుకొనినప్పుడు, పరిశుద్ధాతో సహవాసము కోల్పోయినప్పుడు, అది మనల్ని ఒక ఎండిన చోటికి, ఎడారికి తీసికొని వచ్చును. జీవముండదు, అంతా ఎండిపోవును. ఎడారిని చూడండి, ఆకులు లేని ముండ్ల పొదలు పెరుగును. అదేమిటో మీరెరుగుదురా? నీరు లేక ముడుచుకొనిపోయిన ప్రశస్తమగు ఆకు. అది ముడుచుకుపోయినది. ఆ విధముగా ఎవరయినా ఉండుట మీరు చూచినయెడల, ఆ ప్రాణముకు నీరు పోసినయెడల, అది చక్కని పచ్చని, ఆకుగా ఎదిగియుండును. అందుకు బదులుగా అది ముడుచుకొని ఎండిపోయినట్లయినది, ఎప్పుడూ తప్పులు పట్టుకొనుట తగదు. దానికి కావలసినది నీరు, అంతే. దానికి ఒక ఉజ్జీవము కావలెను, లేదా ప్రభువు యొద్ద నుండి విశ్రాంతి పొందవలెను. దానిని నీవు నీటియొద్దకు తీసికొనివచ్చినయెడల అది విచ్చుకొనును.
46ఒక చోట జీవించువారు ఆ స్థలము యొక్క పరిస్థితులను బట్టి శ్రమపడుచుందురు. ఆ వాతావరణములో జీవించగోరువారు ఆలాగే తగువులాడుకోనుచూ, వాదించుకొనుచూ, పాట్లు పట్టుచుందురు. దానికి కారణము నీవు అట్టి వాతావరణము క్రింద జీవించుటయే. అక్కడ మనము జీవించనవసరము లేదు. అక్కడ నిలచియుండవలసిన అవసరత లేదు.
ఈ హోరేబు నొద్ద దేవుడు జనులతో విసుగుచెందెను, ఎందుకనగా వారు ఆయా స్థలములలో తిరిగి వచ్చి ఈ స్థితిలోనికి చేరిరి. వారు మార్గములో నడువనందున దేవుడు వారిని చుట్టూ త్రిప్పెను. వారు ప్రధాన త్రోవను తొలగిరి, ప్రక్క త్రోవను తప్పిరి. అప్పుడు దేవుడు భీకరమైనది ఒకటి చేయవలసి వచ్చెను. దేశమునకు తీర్పు తీర్చిన ఆ కర్రతోనే బండను కొట్టి నీరు రప్పించమని దేవుడు మోషేను కోరెను.
ఇప్పుడు, గ్రహించగలిగినచో ఇక్కడ మనకు చక్కని పాఠమున్నది, చూచారా. మనము స్థానము తప్పిపోయినందువలన, లోక కార్యములలో బంధింపబడుటవలన, దేవుడు లోకము యొక్క తీర్పును తీసికొని కల్వరి యొద్ద తన స్వంత కుమారుని మనము స్వాతంత్ర్యము పొందునట్లుగా కొట్టవలసి వచ్చెను. నా భావము మీరు గ్రహించారా?
EXOD 17:5,6
47ఇప్పుడు, వారు అక్కడికి చేరిన తరువాత నీళ్ళు కావలసి వచ్చెను, ఈ ఎండిన స్థలము ఒక కల్వరిగా అయినది. అక్కడ దేవుడు మోషేకు ఈలాగు చెప్పెను, "కర్రను, పెద్దలను తీసికొని వెళ్ళుము. ఆ బండమీద నీకంటే ముందు నేను నిలబడియుందును." ఆ బండ క్రీస్తే. ఇశ్రాయేలు దేశము మీదికి ఏ కర్రతో తీర్పు తీసికొనివచ్చెనో, అదే కర్రను తీసికొని దేవుని న్యాయతీర్పును ఆ బండమీద కొట్టెను, చూచారా. అతడు ప్రజల పాపములను ఈ కర్రమీద వేసెను. ఆ కర్రతో ప్రజలను కొట్టవలెను. ప్రజలను కొట్టుటకు బదులుగా అతడు ఆ బండను కొట్టెను, ఆ బండ, దేవుని క్రియల ద్వారా రక్షణను తీసికొనివచ్చెను, నశించుచున్న జనులకు జలమును ఇచ్చెను. చనిపోవుచున్న జనులకు అది జీవమును తీసికొనివచ్చెను. దేవుడు అదే చేసెను. ఆయన నీ పాపములను నా పాపములను, తీసికొని తన తీర్పు దండమునకు చుట్టిపెట్టి దానితో మనలను కొట్టుటకు బదులుగా క్రీస్తును కొట్టెను. ఆయనలో నుండి జలములు వచ్చెను, అనగా "ఆత్మ" ఆయనలో నుండి పరిశుద్ధాత్మ వచ్చెను, మనకు జీవమిచ్చుటకు వచ్చెను. ఇప్పుడు, మనకు నిత్యజీవమున్నది, ఇప్పుడు, ఆ బండ క్రీస్తే. దానిని మనము గమనించాలి.
48ఊహా చిత్రములుగా గీచిన ఎన్నో చిత్రలేఖనములను నేను చూచితిని. ఆ చిత్ర లేఖనములలో ఒకదానిని ఖండించుటకు తగినదైయుండెను. అంతటి విమర్శనాత్మకముగా వున్నదానిని నేను ఒకటి చూచాను, కొద్దికాలము క్రిందట అతి విమర్శనాత్మక వివరణ దానిపై విన్నాను. ఆ చిన్న కొండమీద ఒక చిన్న బండ యుండెను. మోషే ఈ బండను కొట్టునట్లుగాను, క్రింద ఇశ్రాయేలు వారు టీ-కప్పువంటిది పట్టుకొని ఈ బండలో నుండి చిమ్ముచున్న చినుకలవంటి నీటి బొట్లను పట్టుకొని త్రాగుటకు కనిపెట్టుచుండునట్లుగా, ఆ చిత్రలేఖనములో గీచియుండెను. అది. మానవ అభిప్రాయము.
కాని ఈ బండలోనుండి వచ్చిన జలములను ఇరువది లక్షలమందికి పైగా జనులు, పశువులు, ఒంటెలు, త్రాగగా - వారింకా తొట్టెలలో నీళ్ళు నింపుకొనిరి. అది ఒక ఎగచిమ్ముతూ ప్రవహించిన ప్రవాహము!
PS 23:5
49ఈనాడు కూడా వారు పరిశుద్ధాత్మయగు క్రీస్తును ఆ విధముగా చిత్రించుచున్నారు - "అది బొట్లు బొట్లుగా కారే ఒక చిన్న జళ్ళుగా," చూడండి, అది అచ్చట దేవుడున్నాడని మీకు నమ్మకము కలుగచేయునంతగా యున్నది. అది కాదు!
అది ఒక జలసమృద్ధి! "నా గిన్నె నిండి పొర్లుచున్నది," అని దావీదు చెప్పెను. అది పరిశుద్ధాత్మ యొక్క ఉబికెడి ఊట.
ప్రజలు దానిని గూర్చి భయపడుచున్నారు. "ఇంకా కొద్ది లోతునకు నేను వెళ్ళినయెడల, ఏదేదో చేయుదునని భయము కలుగుచున్నది. కొద్దిగా లోతునకు వెళ్ళిన వారిని నేను మీకు చూపించెదను," అని కొందరనుచున్నారు. కాని వెళ్ళగలిగినంత దూరంగా వెళ్ళిన వారిని గురించి మీరు గుర్తించి చెప్పుట లేదు, చూచారా. కాని వెళ్ళగలగవలసినంత దూరమునకు వెళ్ళలేని వారిని గురించి మీరేమి చెప్పగలరు?
50ఇప్పుడు, శరీర సంబంధమైన వాటిలో పాలిభాగస్తులై తప్పటడుగులు వేసి వెళ్ళిపోయిన కొందరి గురించి మనమెరుగుదుము (దేవునిది తప్పు కాదు గాని, ప్రజలదే తప్పు) మంచి నాయకత్వము లేనందున వారాలాగు తప్పు త్రోవలోనికి, మూఢత్వములోనికి వెళ్ళిపోయిరి. పిదప సర్వ ప్రపంచము, సాతాను వారినే వ్రేలుపెట్టి, "దానిని చూచారా? దానిని చూచారా?"
ఈ ఉదయకాలమున నేను నిలబడి అసలు ఆరంభమే చేయని కోట్లాదిమందిని, వ్రేలుపెట్టి చూపించుచున్నాను. వారి సంగతి ఏమిటి? చూడండి, వారి స్థితి చూడండి. ఐక్మన్ వంటివాడి స్థితిని నేడు చూడండి. వారు ఈలాగందురు, "పెంతెకోస్తువారు మంచి, మర్యాద, విద్యలేనివారు." ఐక్మన్ ను చూడండి. ప్రపంచములో అత్యంత విద్యావంతులలో ఐక్మన్ ఒకడు. అరువది లక్షల ప్రాణములను అతడు హత్యచేసెను, పిల్లలు, స్త్రీలు, పురుషులును కలిపి అరువది లక్షల మందిని చంపెను. అట్టివారిని మీరు వ్రేలెత్తి చూపగోరరు.
51కాని అంతగా విద్యలేని, పరిశుద్ధ గ్రంథములోని పేర్లును కూడ సరిగ్గా చదువలేని ఒక వ్యక్తి ఏదయినా తప్పు చేసినయెడల, ఏదయినా పొరపాటు చేసినయెడల వార్తాపత్రికలు కొండంత చూపి వ్రాయును. "వారిని నమ్మ వీలులేదు," అని అందురు.
దానిని నమ్మ వీలులేనప్పుడు మరి ఈనాడు విద్యావంతులుగా, మేధావులుగా చెప్పుకొనుచున్నవారి మాటను నమ్మ వీలున్నదా? అడాల్ఫ్ హిట్లర్ ను చూడండి. లోకములోని ఈనాటి మేధావులను చూడండి. వారిని చూడండి! "ఆడ బాతునైనా, మగ బాతునైనా వండితే పులుసుకోసమే గదా!" అనే పాత సామెత కలదు.
ఏది తప్పో, ఏది ఒప్పో పరిశుద్ధాత్మ వలన నీవు గ్రహించవలసిన అవసరమున్నది. అప్పుడు తప్పు ఒప్పులను తెలుసుకొనెదవు.
1COR 10:4
52ఇప్పుడు, వారు కలిగియున్న ఈ యొక్క కల్వరి, జీవజలములు - ప్రజల కొరకు పొర్లి పారినవి అని మనము కనుగొన్నాము.
ఇశ్రాయేలీయులు త్రాగినంత జలము త్రాగి, ఒంటెలను, గుర్రములను బండ్లకు కట్టి పిల్లలతో ప్రయాణమైపోయి, ఆ బండను అక్కడే వదిలిపెట్టిరని కొందరి అభిప్రాయము. అది తప్పు.
ఆ బండ వారిని వెంబడించెను, మరియు ఆ నీరు వారిని వెంబడించెను. I కొరింథీ 10వ అధ్యాయము 11వ వచనములో, "ఆ బండ ఇశ్రాయేలీయులను వెంబడించెను," అని చదువుదురు. ఆ రోజు నుండి వారెక్కడికి వెళ్ళితే అక్కడికి, ఆ బండ వెంబడించి వెళ్ళెను, ఆ జలము వారిని వెంబడించేను.
1COR 10:4•
HEB 13:8
53ఎంత చక్కని మాదిరి మరియు నేటి విశ్వాసికి అది ఒక చక్కని లంగరు. కల్వరిలో ఒకసారి. కొట్టబడిన ఆ బండలోనుండి ప్రవహించిన జలము మనము వెళ్ళు ప్రతిచోటకూ వచ్చుచున్నది. ఓ, అది మనము ఒక ప్రత్యేక స్థలమునకు వెళ్ళి చేరిపోయిన తరువాత, "మంచిది, మొన్నటి వరకు మనకు నీళ్ళు లభ్యమైనవి," అని చెప్పుట కాదు. నేడును మనకిక్కడ నీరున్నది, ఎందుకనగా ఆ బండ క్రీస్తే. క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.
ఆ బండ ఇశ్రాయేలీయులను వెంబడించెను. వారెన్నడూ ఆ బండను వెంబడించలేదు; కాని ఆ బండే వారిని వెంబడించెను. ఆమేన్. ఇశ్రాయేలీయులు తమ ప్రయాణములో ముందుకు వెళ్ళిరి. వారు తిన్నగా వాగ్దాన దేశములోనికి వెళ్పుట మాత్రమే చేయవలసియుండిరి. ఆ బండ, నీరు వారిని వెంబడించెను… "ఆ బండ వారిని వెంబడించెను:…" I కొరింథీ 10వ అధ్యాయము ఆలాగు చెప్పుచున్నది. మంచిది. ఆ బండ క్రీస్తే.
ISA 53:5•
1PET 2:24
54దేవుడు ప్రజల యొక్క తీర్పులను క్రీస్తు మీద వేసెను, ఆయనను కొట్టెను. అప్పటినుండియూ ఆ బండలో చీలిక ఏర్పడినదని మీరెరుగుదురా? మోషే కొట్టినందున ఆ బండలో చీలిక ఏర్పడెను. క్రీస్తును కొట్టబడినప్పుడు ఒక చీలిక ఏర్పడెను." "ఆయన మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడెను, ఆయన పొందిన దెబ్బలవలన మనకు స్వస్థత కలుగుచున్నది." ఈనాడు మనము అనుభవించుచున్న జీవజలములు ఆ జీవములో నుండియే వచ్చెను.
MATT 28:20•
1COR 10:4
55ఇప్పుడు గుర్తుంచుకోండి. ఈ జీవమును పొందవలెనన్న క్రీస్తు జీవము సంఘములో ఉండవలెను. హల్లెలూయా! పది నిమిషముల పాటు మన ఆలోచనలను అక్కడ లంగరు వేయుదము. క్రీస్తు సంఘమును విడువడు. "ఇదిగో, లోకాంతము వరకు నేను మీతో యుందును." ప్రజలే క్రీస్తును విడిచిపెట్టెదరు గాని క్రీస్తు ప్రజలను విడువడు. ప్రజలు తమ అవిశ్వాసము బట్టి విడిచిపెట్టెదరు. వారు క్రీస్తును విడిచిపెట్టెదరు గాని క్రీస్తు వారిని విడిచిపెట్టడు.
ఇశ్రాయేలీయులు ఆ ప్రవాహమును విడిచిపెట్టిరిగాని, ఆ ప్రవాహము ఇశ్రాయేలీయులను విడిచిపెట్టలేదు, చూచారా. బైబిలు తేటగా దానిని చెప్పుచున్నది. "ఆ బండ, ఊట ఇశ్రాయేలీయులను వెంబడించెను." వారిని వెంటాడెను! వారెక్కడికి వెళ్ళితే అక్కడికి అది వెళ్ళెను.
JOSH 1:3•
MATT 28:20•
HEB 13:8
56సమయమున్నయెడల ఈ ఉదయమమున యెహోషువా 1వ అధ్యాయము చూడవలేనని కోరుచున్నాను. "మీరు అడుగుపెట్టు ప్రతి చోటు మీ స్వాధీనమగును. మీరు వెళ్ళు ప్రతి స్థలమునకు మీ దేవుడగు యెహోవా తోడుగా వచ్చును. ఎవరికిని భయపడవద్దు. ధైర్యముగలవారైయుండుడి! మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చెదను," అని ఆయన చెప్పెను - దేవుడు యెహోషువాతో వెళ్ళుచున్నాడు.
ఆ దేవుడే ఈ ఉదయమున సంఘముతో కూడా వచ్చుచున్నాడు, ఆవలనున్న ప్రవాహములో నుండి మనము త్రాగుదము. నీవు అడుగుపెట్లు ప్రతి చోట దేవుడు నీకు తోడైయుండీ నీకు జలమును మరియు జీవమును దయచేయును. "యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీకు తోడైయుందును." క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. దేవుని యొక్క చట్టములు.
57"అయితే బ్రెన్హాం సహోదరుడా, మనము చేయవలసిన కార్యములు ఎందుకు చేయలేకపోవుచున్నాము. సంఘములోని వరములు తదితర క్రియలు ఉండవలసిన రీతిగా ఎందుకు ఉండుట లేదు? మన సంఘము ఎత్తబడవలసియున్న చోటికి ఎందుకు ఎత్తబడుట లేదు?" అని మీరు అడుగవచ్చును. ప్రజలు పరీక్షా కాలములో ఇశ్రాయేలు వారివలె వెనుకబడిపోవుచున్నారు. తమను దేవుడు విడిచిపెట్టెనని వారు తలంచుచున్నారు.
కాని గుర్తుంచుకొనండి, ఆ బండ ఇశ్రాయేలీయులను ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలీయులు బండను విడిచిపెట్టిరి. ఎల్లవేళలా ఆ బండ తమతోయున్నదన్న సంగతి మరచిపోయిరి. అది అక్కడే యుండెను. మార్గాంతము వరకు వారితోనే అది వెళ్ళెను. "అది వారిని వెంబడించెను." మాటకందని దూరములో కూడా అది లేదు. వినబడనంత దూరములో అది లేదు. లేదా, కనబడనంత దూరములో అది లేదు.
క్రీస్తు కూడా ఆలాగే యున్నాడు! నేడు ఆయన సంఘమునకు వినబడనంత దూరములో లేడు. మీలో కొందరు వెనుకకు జారిరి, ఏదైతే తప్పో దానినే చేసిరి. మీ ఆనందము కోల్పోయిరి, మీ నీరు ఎండిపోయినది. ఇంకా ఆయన మీరు మాట్లాడగలిగిన దూరములోనే యున్నాడు. ఆయన మిమ్మును వెంబడించుచున్నాడు. మీ ప్రతి కదలికను, మీ ప్రతి పనిని ఆయన ఎరుగును, మీరాయనను రంగము మీదకు పిలువవలెనని ఆయన కనిపెట్టి చూచుచున్నాడు.
MATT 28:20•
1COR 10:4
58నేటి గొప్ప పెంతెకోస్తు కదిలింపు, నీవు ఆయనను రంగము మీదికి ఆహ్వానించాలని దేవుడు కనిపెట్టుచూచూచుచున్నాడు. మీరాయనకు వినబడునంత చేరువలోనే యున్నారు. మనము తప్పుచేశాము, పాపము చేశాము, మన వీపులు ఆయన తట్టు త్రిప్పాము, చేయరాని పనులు చేశాము. అయినాగాని ఆయన ఇంకా మనతోనే యున్నాడు. మనతో ఉందునని క్రీస్తు చెప్పెను.
"జలములు ఇశ్రాయేలీయులను వెంబడించెను," అని బైబిలు చెప్పెను. వారు తాము దాహముగొన్నప్పుడు, నీరు దగ్గరేయున్నదని ఎరుగుదురు.
59ఈ సంగతులు శాసనములకు లోబడియుండును. దేవుని క్రమమంతయూ శాసనములకు ఆధీనమైయుండును. ఒక్క నిమిషము ఆగుదము.
ప్రపంచమును తీసికొందము. అది తనచుట్టూ తాను ఇరవై-నాలుగు గంటలు తీరుగుచూ యున్నది, ఎంతో ఖచ్చితముగా యున్నది! మన విజ్ఞానమంతటిని కలిపీనా, ఖచ్చితమగు గడియారమును మనము తయారుచేయలేము. ఎంత అత్యుత్తమ గడియారమైనాగాని సంవత్సరములో ఎన్నో నిమిషములు తక్కువయినా లేదా ఎక్కువయినా తిరుగుట పరిపాటి. కాని ప్రపంచము ఎన్నడూ తప్పిపోదు. సెకెండు కూడా తప్పిపోదు. అది ఎంతో ఖచ్చితముగా యున్నది. ఈనాడు శాస్త్రజ్ఞులు మరియు అంతరిక్ష యాత్రికులు ఇప్పటి నుండి ఇరవై సంవత్సరముల తరువాత లేదా ఏబది సంవత్సరముల తరువాత సూర్యచంద్రులు ఒకదానిని ఒకటి దాటిపోవునని చెప్పగలుగుచున్నారు. అది ఇరవై-నాలుగు గంటల పరిధిలో తిరుగుచున్నప్పుడు, సమయము తిరుగుచున్నది, ఒక రుతువు ఏర్పడుచున్నది. ఒక్క క్షణము కూడా అది తప్పిపోవుట లేదు. హల్లేలూయా! అది ఖచ్చితముగా యున్నది, ఎందుకనగా అది దేవుని యొక్క సూత్రములననుసరించి పనిచేయుచున్నది.
60అది ఎప్పుడు పైకి వచ్చునో వారు నిమిషము ప్రకారము చెప్పగలరు, ఎందుకనగా ఏ సమయములో చంద్రుడు అస్తమించునో వారికి తెలియును. దేవుడు ప్రతిదానిని ఒక నియమము ద్వారా క్రమములో యుంచెను. చంద్రుడు లోనికి పోవుచున్నప్పుడు, దానితో పాటు అలలోనికి పోవును. చంద్రుడు బయటకు వచ్చునప్పుడు, అల కూడా బయటకు వచ్చును. చంద్రుడు ఎప్పుడు లోనికి పోవునో వారు అక్షరాలా ఎరుగుదురు. ఎన్నో సంవత్సరములకు ముందే ఒక కాల పట్టికను వారు రూపొందించగలుగుచున్నారు. అల ఎప్పుడు లోనికి పోవునో నిమిషముల ప్రకారము చెప్పగలరు. నిశ్చయంగా, ఎందుకనగా ఆ రీతిగానే చంద్రుడు వెళ్ళిపోవుచున్నాడు, ఎందుకనగా అది దేవుని యొక్క నియమమున క్రమముగా అమర్చబడినది.
61ఒక రోజున మిషిగాన్ సరస్సునొద్ద నేను నిలబడియున్నాను. కెనడాకు వెళ్ళుచూ దారిలో సుపీరియర్ సరస్సు నొద్దకు వెళ్ళాను, చోలా పెద్ద నీటి సరస్సు. అక్కడ నిలబడి నేను ఈలాగు తలంచాను, "ఎన్ని మైళ్ళ దూరము ఈ నీరు వ్యాపించినది?" ఆ తరువాత నేను సుపీరియర్ సరస్సు దాటి మిషిగాన్ సరస్సు యొద్దకు వచ్చాను. దాదాపు ఒకే విస్తీర్ణములో యున్నవి. సుపీరియర్ సరస్సు నుండి మిషిగాన్ సరస్సు యొద్దకు, మిషిగాన్ సరస్సు యొద్ద నుండి ఓంటారియో సరస్సు యొద్దకు వచ్చాను. హ్యూరన్ సరస్సు సమీపములోనే యున్నది. అన్ని సరస్సులు కలిసేయున్నవి. ఆ సరస్సులలో లెక్కలేనన్ని లక్షకోట్ల, లక్షకోట్ల తాజా నీరు ఏలాగు దాగియున్నది!
ఆవల కెనడా, ఆరిజోనా, న్యూ-మెక్సికో, తూర్పు కాలిఫోర్నియోలలో పదిలక్షల ఎకరములు ఎండిన భూమిపడియున్నది. ఆ భూమిమీదికి ఈ నీరు వెళ్ళినచో ఎంతో ఫలవంతమగును. ప్రపంచమునే ఈ దేశము పోషించకలుగును. అది నిజము! ఆ పదిలక్షల కొలది ఎకరములలో ఎన్నో పదిలక్షల టన్నుల బంగాళాదుంపలు, కాబేజీ, చిక్కుళ్ళు, దుంపలు, దోసకాయలు, పప్పు ధాన్యములు పండును, దానిని ఆ నేల పండించును, నీరు కొరకు ఎదురుచూచుచున్నది.
62ఈ పైన నీరున్నది, ఈ దిగువన నేలయున్నది. దానిని మనము చూడగలము, నీటిని మనము పరీక్షించి అది తియ్యగా ఉన్నదని చెప్పగలము, నేలను పరీక్షించి అది సారవంతముగా ఉన్నదని చెప్పగలము. అయితే మనమనుకొన్నట్లు జరుగవు. ఒక నియమము యున్నది. అది భూమ్యాకర్షణ నియమము. భూమ్యాకర్షణ నియమము ప్రకారము మనము పనిచేయకలిగినయెడల ఆ ప్రతి నేలను నీటితో తడపగలము. సరస్సులలో నుండి పనిచేయవలెను. మన కోరికలు, కేకలు, అరుపులు అక్కడ పని చేయవు. దానిని ఇక్కడకు తీసికొని రావలెనన్నయెడల భూమాకర్షణ సూత్ర ప్రకారము పనిచేయవలెను. దేవుడు ప్రతిదానిని ఒక నియమ ప్రకారము నిర్ణయించెను.
63ఇక్కడ నేను ఆలోచించుచున్నాను. దీనిని ఎప్పుడయినా మీకు చెప్పెనో లేదో నాకు తెలియదు. నేను కెంటకీలో సహోదరుడు ఉడ్ తో ఉడతల వేటలో దాదాపు ఒక సంవత్సరం క్రితం ఉన్నాను. ఉడుతల కొరతగా యున్నందున వేట కనుగొనుటకు ఒకాయన ఇంటికి వెళ్ళాము. ఒకాయనకు చాలా ఎకరముల భూమి యున్నది. ఆ భూమిలో చాలా అడవియున్నది. కాని అతడు నాస్తికుడు అని సహోదరుడు ఉడ్ చెప్పెను. అతడు అవిశ్వాసి, అతనిని ఎరిగినందుకు వేటకు అనుమతి అడుగుదనని ఉడ్ సోదరుడు చెప్పెను.
మేము అతని స్థలము యొద్దకు వెళ్ళాము. అతడు, ఇంకో వ్యక్తి ఒక యాపిల్ చెట్టు క్రింద కూర్చొనియుండిరి. ఇద్దరూ డెబ్బది ఏండ్ల వయస్సులో ఉన్నారు.
ఉడ్ ఇతని యొద్దకు వెళ్ళి, "మీ స్థలంలో మేము కొద్దిగా వేటాడుకోవచ్చునా?" అని అడిగేను. "మంచిది. ఆలాగే. నీవు జిమ్ ఉడ్ కుమారునివి గదా?" అని అతడు ప్రశ్నించాడు.
"అవును," అన్నాడు.
"ఆ ముసలి జిమ్ చాలా యధార్థపరుడు. నీవు నా స్థలంలో నీకిష్టమొచ్చిన చోట వేటాడుకోవచ్చును. నాకు కొన్ని వందల ఎకరముల భూమి ఉన్నది. నీ ఇష్టం. నీ స్వంతదానివలే దానిని వాడుకో," అని అతడు పలికెను.
నేను కారులోనే కూర్చోనియున్నాను, ఎందుకనగా బోధకుడు నాస్తికుడు కలిసి ఇమడలేరు, నాస్తికుని నుండి మాకు మేలు కావాలి.
64కొద్దిసేపటి తరువాత సహోదరుడు ఉడ్ ఇట్లనెను, "మా సంఘ కాపరిని మాతో కూడా తీసికొని వెళ్ళవచ్చునా? మీరేమీ భావించరు కదా?"
ఆ ముసలి వ్యక్తి కుర్చీలో నుండి వెనుదిరిగి, "వుడ్, నీవు ఇంతగా దిగజారిపోయావా? నీవు వెళ్ళు ప్రతిచోటకు బోధకుని వెంటపెట్టుకొని వెళ్ళుచున్నావా?" అనడిగెను.
ఆ తరువాత నేను కారులో నుండి దిగుట మంచిదని తలంచాను. నేను వెళ్ళి వృద్దునితో కొద్ది నిమిషములు మాట్లాడాను. బోధకులతో తనకు అంత వాడుక లేదని అతడు వెంటనే చెప్పెను. వారు తమకు అసలు తెలియని దానినిగూర్చి ఏదో మాట్లాడుచుందురు అని అతని అభిప్రాయము.
అతడీలాగు పలికెను, "వారు తమకు తెలియని దానిగూర్చి ఏదో గొప్పగా చెప్పెదరు. తను చెప్పుదానిని గూర్చి తెలిసినవాడైయుంటేనే గాని నాకు అతని మాట వినుటకు ఇష్టముండదు. అది మంచిది. ఒక వ్యక్తి తన ఊహను బట్టి ఏదో నాతో మాట్లాడితే నేను ఇష్టపడను." ఆ వృద్ధుడు చెప్పిన ఆ మాటను నేను గౌరవించాను.
"సరే, మంచిది. ప్రతి వ్యక్తి తన స్వంత అభిప్రాయము కలిగియుండును," అన్నాను.
65అతడు ఈలాగనెను, "కొద్ది సంవత్సరముల క్రితం ఒక బోధకుడు ఇక్కడికి వచ్చి కూటము ఏర్పాటు చేసెను. ఆ బోధకుడు ఈ ప్రాంతమునకు క్రొత్తవాడు. ఒక రాత్రి కూటమందు జనసమూహములో కూర్చోనియున్న ఒకామెను చూపించి ఆమె యొద్ద చేతిరుమాలున్నట్లు చెప్పెను. ఆమె పేరు చెప్పెను. ఆ కొండమీద ఆమె సోదరి రోగియై పడియున్నదని చెప్పెను. ఆమె పేరు చెప్పెను. ఆమె కడుపులో కాన్సరుతో చనిపోవుచున్నట్లు చెప్పెను. ఆ చేతిరుమాలును తీసికొనివెళ్ళి, ఆమె మీద ఉంచినయెడల, ఆమె చావక జీవించునని 'యెహోవా సెలవిచ్చుచున్నాడు' అని చెప్పమని చెప్పెను."
"ఈమె మాకు స్నేహితురాలు. ఆ బోధకుడిచ్చిన చేతిరుమాలును ఈమె తీసికొని వెళ్ళినది. నేను నా భార్య కూడా వెళ్ళి, ఆ స్త్రీయొద్ద కనిపెట్టుకొనియున్నాము. ఆమె చాలా విషమ స్థితిలో యున్నది. వైద్యులు ఎప్పుడో ఆమెను విడిచిపెట్టిరి. ఆమె తనకు తానుగా లేవలేని స్థితిలో యున్నందున, మేమే ఆమెను క్రిందికి దించి సహాయము చేసితిమి. అమె అంత తీవ్ర ఆనారోగ్యముగా ఉన్నది. ఒక రాత్రి అమె చనిపోయినదని పుకారు కూడా పుట్టినది," అనెను.
66ఆ చేతిరుమాలును పట్టుకొని బెన్ అక్కడ ఉండెను. బెన్, నీవే కదా ఉన్నావు? సహోదరుడు బెన్ అక్కడ ఉండి. చేతిరుమాలును పట్టుకొనెను. ఆ స్త్రీని అతడే అక్కడ పట్టుకొనెను.
"మరుసటి ఉదయము ఆమె వండిన యాపిలు పై తినుచున్నది. ఆమె తన పని చేసికొనుటయే గాక పొరుగువారి పనికూడా చేయుచున్నది. ఆమె అంతగా బాగయినది. నేను దానిని తలంచుకొని ఎప్పుడూ ఆశ్చర్యపడుచుందును. ఆ బోధకుని నేను కలిసికొని మాట్లాడవలెనని ఆశించుచున్నాను. అతడు చెప్పినది అతనికి తెలియును," అని పలికెను.
సహోదరుడు, ఉడ్ నావైపు చూచాడు, మరియు నేను అతనివైపు చూచాను. అడవులలో వేటాడుట వలన మా బట్టలు మురికి అయిపోయి ఉడుతల రక్తము చిమ్మి చెమటతో అసహ్యముగా తయారయినవి. అక్కడ నిలబడి ఈలాగన్నాను, "ఆ కార్యమును అతడేలాగు చేసెనో మీరు అతనితో మాట్లాడి తెలిసికోగోరుచున్నారా?"
"అవునయ్యా, అదే నా ఉద్దేశ్యము," అన్నాడు.
"మంచిది, అది మంచి పని," అన్నాను.
67అతడిచ్చిన యాపిలు పండ్లలో ఒకదానిని నేను తినుచున్నాను. ఆగస్టు నెల, ఆకురాలు కాలములో, యెల్లో-జాకెట్ అనే కీటకాలు ఆ పండ్లపై ఉండెను. నేను చిన్న యాపీలు తినుచున్నాను. "చాలా మంచి యాపిలు ఇది. ఈ చెట్టు ఎంతకాలము నుండి యున్నది?" అనడిగాను.
"ఓ, ఆ చెట్టును నేను దాదాపు ముప్పయి, నలుబది సంవత్సరాల క్రితం నాటాను," అన్నాడు.
"అవునండి! అయితే మిమ్మును ఒక ప్రశ్న అడుగగోరుదును." లోకములో చెట్లు ఆకులు రాల్చును. ఆగస్టు మధ్యలో ఈ యాపిళ్ళు చెట్ల నుండి రాలుట చూస్తున్నాను. ఇంకా చలిగాలిగాని, పొగమంచుగాని మనకు రాలేదు, అయినాగాని చెట్టు ఆకులను రాల్చుచున్నవి. ఎందువలన?"
చెట్లులో నుండి రసము పోవును," అని అతడనెను.
"ఓ, ఆలాగా! ఎక్కడికి పోవును?" అనడిగాను.
"వ్రేళ్ళు లోపలకు పోవును," అన్నాడు.
"ఎంతకాలము అక్కడ ఉండును?" అనడిగాను.
"వసంతకాలము వరకు," అన్నాడు.
"అది మరల వచ్చి నీడ కొరకు క్రొత్త ఆకులను, తినుటకు యాపిలు పండ్లను ఇచ్చును," అన్నాను.
"అది నిజము. అక్షరాలా నిజము," అన్నాడు.
68"అయితే ఒక సంగతి మిమ్మును అడుగగోరుచున్నాను. తాము మాట్లాడుచున్న దానినిగూర్చి ఎరుగనివారిగూర్చి మీరు ప్రస్తావించారు. చెట్టును విడిచి రసము క్రిందికి పోవు జ్ఞానము చెట్టుకు ఎవరిచ్చారో చెప్పగలరా? చలికాలమంతయూ అది అక్కడే నిలచియుండినయెడల చచ్చును, చెట్లు మరణించును, ఆ రసములోనికి జీవకణము ఉన్నది. చెట్టులో నుండి రసము వేరులోనికి వెళ్ళి వసంతకాలము వరకు దాగియుండునట్లు ఏ జ్ఞానము దానికి బోధించెను? అది మరల వచ్చి ఇంకా ఎక్కువ యాపిలు పండ్లను తెచ్చును. ఒక స్తంభము వాల్చి దానిమీద బకెట్టు పెట్టి అందులో నీరు పోసి, ఆ నీరు ఆగష్టు నెలలో ఆ స్తంభములోనికి వెళ్ళి మరల వసంత కాలములో తిరిగి వచ్చునేమో చూడండి. ప్రకృతికి ఒక నియమము ఉన్నది. ఒక జ్ఞానము ఈ నియమమును క్రమములో పెట్టుచున్నది. అంతే కాదు. ఆ నియమమును అమలు చేయు జ్ఞానమే చెట్టు యొక్క వేరులోనికి ఆ రసము వెళ్ళునట్లును తిరిగి వచ్చునట్లును చేయుచున్నది," అని మాట్లాడాను.
"ఆ ఆలోచన నాకెన్నడూ రాలేదు," అని అతడనెను.
"ఆ చెట్టు కొమ్మలలో యున్న రసము అడుగునకు పోవునట్లును, అది మరల తిరిగి వచ్చునట్లును ఏ జ్ఞానము చేయుచున్నదో అదే జ్ఞానము ఆ రాత్రి నాతో, "ఆ స్త్రీ మీద చేతిరుమాలును ఉంచమని," చెప్పెను.
"ఆ బోధకుడవు నీవేనా?" అనడిగాడు.
"అవునయ్యా, అది నిజము," అని చెప్పాను.
69గత సంవత్సరము నేను మరల అక్కడికి వెళ్ళాను (అతడు చనిపోయాడు), అతని భార్య యాపిళ్ళు వలుచుచూ అదే చెట్టుక్రింద కూర్చొనియుండెను. మేము ఎవరమో తెలియక వారు మొదట మమ్మును పొమ్మనిరి. నేను ఆమె యొద్దకు వెళ్ళి, అంతా చెప్పాను. మాకు అనుమతి ఇచ్చెను. అతడు చనిపోక ముందు క్రీస్తును పూర్తిగా ఒప్పుకొనెను," అని అమె చెప్పెను.
మీరు చూచారా, ఆ చెట్టు ఏ జ్ఞానము వలన ఆలాగు చేయుచున్నది. అది ఒక నియమము. దేవుడు క్రమములో ఉంచిన ఒక నియమము. అది దేవుని యొక్క నియమము. అది దానిగూర్చి జాగ్రత్తవహించును. ఆమేన్!
మీరెంత గగ్గోలు పెట్టినా నేను లెక్కచేయను. "ఈ ఎండాకాలము సూర్యుడు ప్రకాశించడని," మీరు చెప్పినా సూర్యుడు ప్రకాశించి తీరును. రాత్రిని రానివ్వనని నీవు నాతో చెప్పవచ్చును, అయితే రాత్రి రాక మానదు - ఎందుకనగా మనము జీవించుచున్న ఈ లోకము దేవుని యొక్క ఒక నియమము ద్వారా నియంత్రించబడుచున్నది.
70సోదరీ సోదరులారా, ఒక సంగతి మిమ్మును అడుగగోరుచున్నాను, దేవుని ఆత్మ ద్వారా మనము తిరిగి జన్మించవలెను! దేవునికి చిన్న బలహీన భాగములు, పెద్ద బలమగు భాగములనేవి ఉండవు, ఆయన సంపూర్ణ దేవుడు! మీరు సరిపోయినంత దేవుడిని మీలో కలిగియున్నయెడల, అది బహు స్వల్పమైనంతగా యుండినను, మీరు ఒక క్రొత్త భూమిని తయారు చేయుటకు అది తగినంత శక్తిగా యుండును. ఆ తగిన శక్తి క్రొత్త చంద్రుని, ఒక క్రొత్త క్రమమును సృష్టించును. అది దేవుడు, మరియు ఆయన బలముగలవాడు! ఇక్కడున్న ప్రతి విశ్వాసి నిత్యజీవమును కలిగియున్నాడు, దేవుని ఆత్మ మీలో యున్నది - మృతులను లేపుటకు, రోగులను స్వస్థపరచుటకు, గ్రహములను సరియగు స్థితిలో ఉంచుటకు ఆ శక్తి చాలును. కాని అది ఒక నియమము ద్వారా నియంత్రించబడుచున్నది, ఆ ఆత్మ నీలోనేయున్నది. మీరు దేవునికి కుమారులు, కుమార్తెలు, మీలో కలిగియున్న ఆ ఆత్మ వలననే మీరు పునరుత్థాన దినమందు లేచెదరు.
1COR 15:4•
1PET 3:19,20
71యేసు, ఈ భూమీమీద నుండగా, ఆయన చనిపపోయినప్పుడు, ఆయన ప్రాణము పాతాళమునకు దిగిపోయెను మరియు నోవహు దినములలో దీర్ఘశాంతము చూపబడినప్పుడు పశ్చాత్తాపపడని చెరలోనున్న ఆత్మలకు ఆయన బోధించెను. ఆయన శరీరము సమాధిలోనికి పోయెను. అయితే ఆయన మరణించక ముందు, ఆయన యొక్క ఆత్మను దేవుని హస్తములలో సమర్పించెను. ఆయన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళెను, ఆయన ప్రాణము పాతాళమునకు వెళ్ళెను, మరియు ఆయన శరీరము సమాధిలోని వెళ్ళెను. లేఖనములు నెరవేరువరకు యేసు పునరుత్థానుడు కాలేదు. ఆయన తిరిగి రాలేడు, ఎందుకనగా ఆయన మూడు దివారాత్రులు సమాధిలో ఉండవలెను. అయితే లేఖనమంతయూ నెరవేరిన పిదప ఈ ఆటంకము తొలగిపోయెను; ఆయన ఆత్మ ఆయన యొక్క ప్రాణములోనికి దిగివచ్చెను, ఆయన ప్రాణము ఆయన శరీరములోనికి వచ్చెను, మరియు ఆయన తిరిగి లేచెను.
JOSH 1:3•
ECCL 3:20•
MARK 9:23
72మనము చనిపోయినప్పుడు, మన ప్రాణములు దేవుని బలిపీఠము క్రిందికి వెళ్ళును, కొన్ని రోజుల క్రితం దర్శనములో దానిని చూచు భాగ్యము నాకు దొరికినది. దానిని మీరెరుగుదురు, బైబిలు చెప్పునది అదే. దానిని దయచేసిన దేవుని సన్నిధికి మన ఆత్మలు చేరును, మన శరీరములు భూమియొక్క ధూలియొద్దకు మరలును. కాని ఒక దినమున లేఖనము నేరవేరును, మన ఆత్మలు దేవునియొద్ద నుండి విడుదలై ప్రాణములను పట్టుకొనును, మరియు ప్రాణము శరీరమును పట్టుకొనును. మనలను లేవనెత్తు శక్తి ఇప్పుడు మనలోనే యున్నది. ఇప్పుడు మనము పరలోక స్థలములందున్నాము. ఇప్పుడు మనము పునరుత్థాన శక్తియందున్నాము.
దానికి ఒక నియమము లేకున్నయెడల దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలు ఇక్కడ తమకొరకు ఒక ప్రపంచమును సృష్టించుకొని, అందులో తమ స్వంత జీవితమును జీవింపసాగుదురు. దానిని చేయుటకు నీలోనే నీకు శక్తియున్నది. దేవుని యొక్క శక్తిని ఛాయా రూపముగా నీవు కలిగియున్నాగాని దానిని నీవు చేయుదువు. దేవుడు సర్వశక్తుడు. నా భావము గ్రహించారా? మీలోనున్న శక్తియే తయారుచేయును. మీరు మాటతో ఒక ప్రపంచమును ఉనికిలోనికి తెచ్చి, వెళ్ళి దానిలో జీవించెదరు. హల్లేలూయా! అక్కడే మీరున్నారు.
సంఘములో ఇప్పుడున్న శక్తి అదే, కాని అది ఒక నియమము ద్వారా అదుపులో ఉంటున్నది. "కొన్ని ఆజ్ఞలను గైకొనుట" మాత్రమే ఆ నియమము కాదు. అది ఒక విశ్వాస నియమము. "నమ్మువానికి సమస్తమూ సాధ్యమే," అని యేసు చెప్పెను. మీరు దానిని నమ్మకలిగినయెడల, దేనిని నమ్ముటకు దేవుడు మీ ప్రాణమును నడిపించునో, అది మీదగును. విశ్వాసము ద్వారా మీరు ఏ స్థలములో అడుగుపెట్టుదురో అది మీదగును. దానిని మీకు దేవుడు ఇచ్చును. ఆమేన్. అది మీదగును, అది మీ వశమగును, ఈ విశ్వాసపు నియమునకు తాళపుచెవిని మీరు కనుగొనినయెడల, అది మీకు తెరువబడును. నా భావము మీరు గ్రహించారా? ఆ శక్తిని అదుపులో వుంచుట ద్వారా… మీరు దేవుని కుమారులు మరియు కుమార్తెలు అయినయెడల ఆ శక్తి మిమ్మును ఎన్నడూ విడిచిపెట్టదు. ఎల్లవేళలా అది మీతోయుండును. కాని మీ విశ్వాసము దానినుండి దూరమైపోయినాగాని అది ఇంకా అచ్చటనే యుండును. హల్లెలూయా!
MATT 9:29•
MATT 17:20•
MARK 9:23•
MARK 11:23•
EPH 2:8
73మీరు రక్షించబడినప్పుడు, భూసంబంధమగు స్థితినుండి పైకి లేచు శక్తిని దేవుడు మీకు ఇచ్చును. మీ విశ్వాసము లోకము యొక్క సంగతులను జయించును. మీ విశ్వాసము ఏమిటి? దేవుడు మీలో జరిగించియున్న ఆ క్రియయందు మీకున్న విశ్వాసమే మిమ్మును ఒక దేవుని కుమారునిగా చేయును. మీరు మీ అబద్దము ఆడుట మానివేయుదురు, మీరు మీ దొంగతనము మానివేయుదురు, మీరు మీ త్రాగుడు మానివేయుదురు, ఎందుకనగా మీ విశ్వాసము వాటన్నింటికంటే పైకి మిమ్మును లేవనెత్తును. ఆమేన్. ఆలాగు మీరు లేనియెడల, మీకు విశ్వాసము లేనట్లే. "మీరు కృప ద్వారా విశ్వాసము చేతనే రక్షించబడియున్నారు."
మీ విశ్వాసమును మీరు ఎంతగా విడుదల చేయుదురో, అంతగా మీరు శక్తిని పొందెదరు, ఎందుకనగా మీలో భూమ్యాకాశముల శక్తులు నివాసము చేయును. దేవుడు మీలో నివాసము చేయుచున్నాడు, మీరు దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలుగా యున్నారు. ఆమేన్. అక్కడే మీరున్నారు. కాని అది మీ విశ్వాసమే. యేసు ఇట్లనెను, "నీ నమ్మిక చొప్పున నీకు మేలు కలుగును గాక! నమ్మినయెడల నీకు సమస్తమూ సాధ్యమే. నీవు సందేహించక, నీవు చెప్పినది జరుగునని నమ్మినయెడల కొండను ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పినచో అది పడును."
MATT 28:20
74మనము ఎటువంటి వారముగా ఉండవలసియున్నాము! మనలో జీవించుచున్న ఈ గొప్ప విమోచక క్రీస్తులో విశ్వాసము కలిగియుండవలెను. ఈ కొట్టబడిన బండ సంఘమును ఎన్నడూ వీడదు. "లోకాంతము వరకు నేను మీలో యుందును." ఆ గొప్ప రక్షణ యూట నిత్యమూ తోడైయుండును, "కల్వరిలో నుండి సంఘములోనికి ఆ శక్తి పోయబడియున్నది. సజీవ దేవుని యొక్క నిత్య సన్నిధి, గొప్ప ప్రవాహము, కొట్టబడిన బండ మన ప్రయాణములో మనతో కూడా వచ్చును.
EXOD 16:3•
NUM 13:30
75ఇశ్రాయేలు తన విశ్వాసమును ఆమె పోగొట్టుకొన్నది. వారు మార్గమును తప్పిరి. వారు తిండి కొరకు దురాశతో తిరిగిరి. వారు విశ్వాసముతో నిలచియుండినయెడల, ఆ దేశమునకు దేవుడు వారిని తీసికొని వెళ్ళునని నమ్మికయుండినయెడల, వారిని ఏదియూ అడ్డగించియుండెడిది కాదు. అప్పటికే వారు సముద్రములను చీల్చిరి, తెగుళ్ళను తమ శత్రువుల మీదికి పంపించిరి, వారు తమ వెనుక శత్రువులను సిలువ వేసిరి, భూమి మీదికి నడిచి వెళ్ళిరి. అయినా వారికింకా వాగ్దానము యొద్దకు వెళ్ళుటకు విశ్వాసము లేకపోయినది.
యెహోషువా, కాలేబులకు ఆ విశ్వాసముండెను! "మా ఎదుటకు వచ్చు దేనినయినా గాని మేము జయించుటకు బలముగలవారము," అనిరి.
ఈనాడు సంఘము యొక్క సమస్య అదే. మనము ప్రతి వ్యాధిని జయించగలము. మనలోనే ఆ శక్తియున్నది. మనము దేవుని యొక్క కుమారులము మరియు కుమార్తెలముగా యున్నాము. మన ఎదుట ఏదియూ నిలబడజాలదు. అయితే దానిని నమ్మకలిగే వారిని కనుగొనుటకు ఆయన ఆశించుచున్నాడు; దేవుడు నీకొరకు ముందే చేసిన దానినీ నమ్మకలిగే వారెవరు. మనము ఉందుము కాదు; ఇప్పుడు మనము ఉన్నాము! నిత్యమూ - జీవించే ఆత్మ యొక్క ప్రసన్నత మనకు తోడైయున్నది. ఆమేన్. అక్కడే మీరున్నారు.
76"బండ నుండి నిత్యమూ ఊరెడి నీరు" అను అంశము గూర్చి ఈ ఉదయాన నేను మాట్లాడిన దాని భావము ఇదే. బండనుండి నిత్యమూ ఊరేడి నీరు ఇప్పుడు ఇక్కడే యున్నది, కల్వరియొద్ద కొట్టబడిన బండలో నుండి నిత్యము నీరు ఊరుచున్నది. కల్వరి యొద్ద ఆయనలో నుండి పరిశుద్ధాత్మ బయటకు వచ్చెను. అది పెంతెకోస్తు దినమున తిరిగి సంఘము మీదికి వచ్చెను, అదే పరిశుద్ధాత్మ ఈ ఉదయమున మనతో యున్నది, మరియు అది మనకు ఒక వాగ్దానము ఇచ్చుచున్నది.
ఆ కారణము చేతనే, రోగులకు ప్రార్ధించు పనిని ఆయన నాకు ఇచ్చినందువల్లనే నేను వారియొద్దకు వెళ్ళుచున్నాను, నేను నమ్ముచున్నాను - దేవుడు చెప్పెను! దర్శనములు ఆలాగే సంభవించుచున్నవి, దానిని దేవుడు వాగ్దానము చేసెను. దేవుడు అబద్ధము ఆడజాలడు.
77దానిని నమ్మండి! దానిని నీవు నమ్మవలసియున్నావు. నీవు అందులో ప్రవేశించునట్లుగా దీనిని తెరచునది ఒకటి ఉండవలసియున్నది. ఈనాడు మనకు రావలసినది ఎక్కువ శక్తి కొరకు ప్రార్ధించుట కాదు. ఒక క్రొత్త భూమిని తయారు చేయుటకు కావలసిన శక్తి నీలోనే యున్నది. ఆ శక్తిని ఉపయోగించుకొనుటకు నీకు విశ్వాసము అవసరమైయున్నది. ఆ జీవితమును అదుపులో ఉంచి, భక్తిగల జీవితమును జీవించు అవసరత నీకున్నది. నీవు దేవుని ఏది అడిగినా అది నీకు తెలియును. దానిని గూర్చిన నిశ్చయత దేవునిలో మనకున్నది. మనమాయన ఆజ్ఞలను గైకొనినయెడల, ఆయనతో మనము నడిచినయెడల, ఆయన ఏ మేలు మనకు చేయకుండా ఉండడు, మనమది ఎరుగుదుము. దేవుడు మనతో నడచుచున్నాడు. ఓ, మై!
78వారు చేయవలసినది ఒకే ఒకటున్నది. వారు చేయవలసినది ఒక్కటే యున్నది, రంగములో నిలిచియుండవలెను. ఇక్కడికి, అక్కడికీ పరిగెత్తుట కాదు, పందెము రంగములోనే నిలచియుండవలెను. సంఘము చేయవలసినది ఒకే ఒకటున్నది, రంగములో నిలచియుండవలెను. వారికి అగ్నిస్తంభముండెను, పందెములో నిలచి యుండుటకు వారు అగ్నిస్తంభమును వెంబడించవలెను. అదే వారిని నడిపించెను. వారు తమ గురిని చూడగలరు, అదే ఆ అగ్నిస్తంభము. అది మోషే ద్వారా పనిచేయుటను వారు చూచిరి, అతడే నాయకుడని వారెరిగిరి.
నేడు మనకు వాక్యమున్నది. మనము వాక్యమును వెంబడించవలెను. విశ్వాసులలో వాక్యము పనిచేయుట మనము చూచుచున్నాము, అది అవునని మనకు తెలియును. దేవుడు మనతో పనిచేయుచూ, సూచక క్రియల ద్వారా వాక్యమును స్థిరపరచుచున్నాడు. మనము వాక్యముతో నిలచియుందము. వాక్యము ఫలితములను ఉత్పత్తి చేయును.
వారు మోషేతో నిలచియుండిరి, ఎందుకనగా మోషే అగ్నిస్తంభమును వెంబడించెను, వారును వెంబడించిరి. మోషేకు విరోధముగా వారు ఎదురు తిరిగినప్పుడు, దేవునికి, మరియు మోషేకు విరోధముగా వారు మాట్లాడినప్పుడు, వారు త్రోవ తప్పి తీరుగుట జరిగెను. కష్టములు వచ్చినవి. నిశ్చయము.
MARK 16:17•
ACTS 2:38
79మనము వాక్యముతో నిలచియుండవలెను, వాక్యము సూచక క్రియలను ఉత్పత్తి చేయును. యేసు చెప్పెను, "వాక్యమును నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును." చూడండి, మీరు వాక్యముతో నిలచియుండుడి, వాక్యము సూచక క్రియలను ఉత్పత్తి చేయును.
కాని మోషే ఏమి చేసెను? వారు త్రోవ తెలియక తిరిగిరి, వారేమి చేసిరి? మార్గము తప్పిరి మరియు నీళ్ళ సరఫరాను వారు పోగొట్టుకొనిరి.
నేడు సంఘము కూడా అదే చేసెను. నేను తలంచుచున్నాను, అది వాక్య మార్గమును తప్పి తిరుగుచున్నది. వారు వాదములలోనికి వెళ్ళిపోయిరి. వారు చొరబడరాని చిన్న చిన్న విషయములలోనికి వెళ్ళిపోయిరి. వారు కొన్ని సంగతులు అలవరచుకొనిరి. అపోస్తలుల విశ్వాస ప్రమాణములవంటి వాటిని హత్తుకొనిరి. దానిని బైబిలులో మీరు ఎక్కడ కనుగొందురు? వారు సంఘశాఖల సిద్దాంతములను అంగీకరించి ఆ పాఠములను చదువుచున్నారు. అనుభవమునకు బదులుగా, వారు శాఖలను పట్టుకొనిరి. తిరిగి జన్మించు అనుభవమునకు బదులుగా, వారు కరచాలనము చేయుచున్నారు. నీటి బాప్తిస్మమునకు బదులుగా, వారు చిలకరింపు ఇచ్చుచున్నారు. "తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ" అను ఒక చెడ్డ రూపమును వారు అలవరచుకొనిరి, బైబిలులో అటువంటిది లేదు. "యేసుక్రీస్తు నామములో" అని బైబిలు చెప్పుచున్నది. అదే నీరు, అదే మార్గములోనికి నీవు రాగోరినయెడల ఒక్క పని చేయవలెను. మార్గమునకు వెనుకకు తిరిగి వెళ్ళు. ఆయన విడిచిపెట్టలేదు; ఆయన ఇంకా ఇచ్చటనే యున్నాడు.
80క్రీస్తుకు బదులుగా మీరు ఆచారములను అనుసరించుచున్నారు. మీరు త్రోవ తప్పి తిరుగుచున్నారు.
ఒకరు ''నేను మెతడిస్టుని" అని, మరొకరు "నేను బాప్టిస్టుని" అని చెప్పుకొనుచున్నారు. నీవు ఒక క్రైస్తవుడవు కావనేది అది చూపించుచున్నది. మనము క్రీస్తువారము! మనము ఆయనకు చెందుదుము. నేను "ఒక బాప్టిస్టుని" అని నీవు చెప్పినయెడల, నీవు క్రీస్తుకు చెందినవాడవు కాదు, నీవు ఒక బాప్టిస్టువే. "మంచిది, నేను పెంతెకోస్తునని," నీవు చెప్పినయెడల, పెంతెకోస్తు ద్వారా నీవు సంఘశాఖకు చెందినవాడవే గాని నీవు క్రీస్తుకు చెందినవాడవు కాదు.
కాని మీరు పెంతెకోస్తు అనుభవము పొందియుండినయెడల… పెంతెకోస్టు వాక్యము ఒక పెంతెకోస్తు అనుభవమునే తీసికొనివచ్చును. ఆ శిష్యులు ఏమి చేసితిరో దానినే నీవు వెంబడించెదవు, ఆ పరిశుద్ధాత్మతో నింపబడువరకు అక్కడే నిలచియుండుము.
నీవు వాక్యమునకు వేరుగా వెళ్ళినయెడల, వాక్యమును చెప్పిన దానికి నీ ఆత్మ విరోధముగా నడచినయెడల, నీలో పరిశుద్ధాత్మ లేదు. అది దయ్యము పరిశుద్ధాత్మను అనుకరించుటయే. దానిని మనము ఎచ్చట పొందుకున్నామో మీరు గమనించారా?
81ఓ, మనలో కొందరము భాషలతో మాట్లాడుచున్నాము. మనకు కేకలు, చప్పట్లు చాలా యున్నవి, కాని తక్కినవాటన్నిటినీ నిరాకరించుచున్నారు. సంఘములోనికి వచ్చుట కొరకు మనము వాక్యము కానిది ఏదయినా వెంబడించుటకు వెనుకాడుట లేదు. నేడు మనము ఎక్కడకు చేరియున్నాము? మరొక ఎడారి యొద్దకు మనము వచ్చాము, ఎండిపోయిన సంస్థ యొద్దకు మనము సంస్థగా మారితిమి. మనము మన జలమును పోగొట్టుకొన్నాము. పెంతెకోస్తు చేసినది సరిగ్గా అదే. అది సంస్థగా మారుటతోనే సహవాసమును విచ్ఛిన్నము చేసినది. "మంచిది, ఇప్పుడు ఈ వ్యక్తి దానిని నమ్మితేగాని, మేము చేర్చుకొనము," అని అనుచున్నారు.
ముందుకు సాగిపో, సత్య వాక్యము నొద్దకు, సత్యమును ఎరుగు జ్ఞానము యొద్దకు అతడు వచ్చువరుకు నీవు అతనితోనే నిలచియుండుము. అదేమయినాగాని ఆలాగే పోనిమ్ము, సోదరులుగా సాగిపోండి.
"ఓ, మనము సంస్థగా చేరాలి, కాని మీరు ఏకత్వవాదులు కారు లేదా ద్విత్వవాదులు కారు లేదా త్రిత్వవాదులు వారు కారు లేదా ఫలాని వారు కారు. అందువలన మాతో సహవాసము లేదు," అనుచున్నారు. ఆలాగు మనము చేసినయెడల మనము ఏమయినట్లు? మనలను మనము మరల ఎడారి స్థితికి తెచ్చుకొనుచున్నాము. అది నిజము.
కాని గుర్తుంచుకొనండి, ఇశ్రాయేలీయులు త్రోవతప్పి, వాగ్దాన దేశపు గురితప్పి తిరిగినాగాని ఆ బండవారినెన్నడూ విడిచిపెట్టలేదు. అది అక్కడే నిలచియుండెను. నీరు అక్కడే యుండెను. ఆలాగే పరిశుద్ధాత్మ కూడా అచ్చటే నిలచియున్నది. మనము తిరిగి త్రోవ తప్పనవసరము లేదు.
NUM 20:11
82ఇప్పుడు, ఇక్కడ దేవుడు ఒక సంగతి మనకు బోధించుచున్నాడు. దేవుడు ఇక్కడ ఒక పాఠము మనకు బోధించుచున్నాడు. క్రీస్తు ఒక్కసారే కొట్టబడి, అందరికీ ఒకేసారి పెంతెకోస్తు అనుభవమును ఇచ్చుచున్నాడు. ఆ బండ కొట్టబడినది గనుక మరల అది కొట్టబడనవసరము లేదు. అది ఒక్కసారి కొట్టబడెను.
రెండవసారి దానిని కొట్టుట ద్వారా మోషే తప్పు చేసెను, పరిహారమునందు అతనికి గల విశ్వాస బలహీనతను అది చూపించుచున్నది. కాని క్రీస్తు ఒక్కసారి కొట్టబడెనో, ఆయన మరల కొట్టబడనవసరము లేదని మనకు తెలియును. మోషే ఏమి చేయుచుండెను? మోషే ఒక క్రొత్తదానిని స్థాపించుటకు, ఒక క్రొత్తదానిని రూపొందించుటకు ప్రయత్నించుచుండెను.
ఈనాడు మన సంఘ వ్యక్తులు ఆ విధముగానే చేసియున్నారు. వారు ఒక క్రొత్తదానిని చేయ ప్రయత్నించుచున్నారు. "మాకు మేము దేవుని సమాజమును తయారుచేసికొందుము. మాకు మేము పెంతెకోస్తు దేవుని సంఘమును తయారు చేసికొందుము. మాకు మేము ఆలోచనా సభను తయారుచేసికొందుము. మాకు మేము ఇది, అది తయారుచేసికొందుము." దేవుడు చేసినది అది కాదు. అది ఆయన ఉద్దేశ్యము కాదు.
ACTS 2:38
83క్రీస్తు ఒక్కసారే కొట్టబడెను. అదే మూల అనుభవము. అదే మూల మార్గము. పెంతెకోస్తు దినమున పేతురు ఈలాగు చెప్పిను, "మీలో ప్రతివాడును మారుమనస్సు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను."
"మేము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున చిలకరించుదుము, దానిని గూర్చి అని రకముల మత ప్రమాణములు చెప్పెదము," అనుచున్నారు. వాక్యము నుండి మనము దూరమైనప్పుడు, మనము ఎక్కడికి వెళ్ళలేము అనుటలో ఆశ్చర్యము లేదు.
84దేవుడు మనకు ఒక పాఠము బోధించును. "ఇప్పుడు మనము ఒక క్రొత్తదానిని స్థాపించుదము. మనము సంస్థగా మారి కాథలిక్కు సంఘమును స్థాపించుదము," అని మోషే చెప్పవలసిన పనిలేదు. వారు చేసిన మొదటి పని అదే. "మనము ఒక క్రొత్తదానిని ప్రారంభించుదము. మనము లూథరన్ను తయారుచేయుదము," అని కొద్దికాలము తరువాత వారనిరి. ఆ తరువాత ఆంగ్లికను, తరువాత బాప్టిస్టు, తరువాత కాంప్ బెల్లీట్స్ వారు, క్రీస్తు సంఘము వారి. మరియు అంత్యక్రీస్తులు ఇంకా ఎవరెవరో వచ్చిరి. చూడండి, వారందరూ ఒకరి తరువాత ఒకరు శాఖలు, సంస్థలు రూపొందించుకొంటూ పోయిరి. అది తగదు. చూడండి వారు ఏమి చేయుచున్నారు? ఒక క్రొత్త దానిని ప్రారంభించుటకు మరల బండను కొట్టుచున్నారు. ఒక క్రొత్త బోధ మనకు అవసరము లేదు.
NUM 20:8
85బైబిలులో ప్రతి మనిషి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందెను, బైబిలులో పరిశుద్ధాత్మను పొందిన ప్రతి వ్యక్తియు దేవుని మార్గములోనే వచ్చెను. ఆదియందు దేవుడు జరిగించిన విధానములోనే వచ్చిరి. వారు ఆలాగే చేసిరి. వారు అదే అనుభవము కలిగియుండిరి, అదే సూచకక్రియలు వారిని వెంబడించెను. అదే క్రియలు వారిని వెంబడించెను. ఎందువలన? వారు బండ ద్వారానే జీవించిరి. అదే నీటిని వారు పొందిరి.
ఈనాడు మనము చాలా మత సిద్దాంతములు మరియు శాఖలు కలిగియుండుటకు కారణము మనము ఒక క్రొత్తదానిని ప్రారంభించుటయే. మనకు ఏ క్రొత్తది అవసరము లేదు. వెనక్కు వెళ్ళండి!
మోషే బండను మరల కొట్టనవసరము లేదు, ఏదో క్రొత్తది ప్రారంభించెను. అసలు బండతో అతడు మాట్లాడవలసియుండెను. ఓ, అది మీరు గ్రహించిరని తలంచుచున్నాను. మొదట కొట్టబడిన బండతో మోషే మాట్లాడవలసియుండెను, మరల దానిని కొట్ట ప్రయత్నించకూడదు, క్రొత్తదానిని ప్రారంభించ ప్రయత్నించరాదు, కాని పాతదానిలోనే మాట్లాడవలెను.
ACTS 2:38
86దేవా, నాకు సహాయము చేయుము. ఒక దరిద్రునిగా ఈ వేదిక మీద నేను చనిపోవలసి వచ్చిననూ, నేను ఆ అసలు బండతోనే మాట్లాడుదును. అసలు అనుభవముతోనే మాట్లాడుదును. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇచ్చిన ఆది లేఖనములతోనే మాట్లాడుదును. ప్రతివాడును మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు." బండ నుండి నిత్యమూ ప్రవహించు నీరు ఇంకా మనతోనే యున్నది. అది ఇంకా ఆలాగే ప్రవహించుచున్నది. అది దర్శనములను ఇచ్చును, అది స్వస్థతలను ఇచ్చును. అది ప్రవచనములను ఇచ్చును. వారు కలిగియుండిన ప్రతిదానిని అది మనకు ఇచ్చును.
NUM 14:33•
NUM 32:13•
JOSH 5:6
87ఇశ్రాయేలీయులు తిరిగి వాక్య మార్గములోనే వచ్చినప్పుడు, సరైన మార్గములో పడినప్పుడు, వాగ్దాన దేశములోనికి వెళ్ళిరి. కాని అందుకు నలుబది సంవత్సరములు పట్టెను.
అరణ్యములో నలుబది లేదా ఏబది సంవత్సరములు తిరిగిన పెంతెకోస్తు వచ్చెను. తిరిగి బండ యొద్దకు రా! అది కనబడుచున్నది. అది ఇక్కడి ఈ వాక్యములో వ్రాయబడియున్నది. ఆయన ఎల్లప్పుడూ చేసిన కార్యములనే పరిశుద్ధాత్మ ఇక్కడ జరిగించుచున్నాడు, కావున నిత్యమూ ఊరెడి నీరు ఇక్కడున్నది. దానియొద్దకు తిరిగి రమ్ము, ముందు దానియొద్దకు, అసలు దానియొద్దకు తిరిగి రమ్ము.
88ఆదియందు అది ఏలాగుండెను?
"వారు బోధకునితో కరచాలనము చేసి చాలనుకొనిరా?" లేదు. అట్టిది లేదు. వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందిరా? లేదు. అట్టిది లేదు. బైబిలులో ఎక్కడనూ ఆ విధముగా పొందిన వ్యక్తులు లేరు. (మూడు వందల సంవత్సరముల తరువాత) బైబిలులో లేని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ఇచ్చిరి. అది ఒక కాథలిక్కు సిద్ధాంతమేగాని బైబిలు బోధ కాదు, చూచారా.
MARK 16:17•
ACTS 2:38
89వారికి పరిశుద్ధాత్మ ,యుండినది. నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును." నేడు కూడా అది ఆ విధముగానే యుండును. కొట్టబడిన ఆ బండ ఎల్లప్పుడూ వున్నట్లుగానే అది నిత్యమూ యుండును.
మీరు వచ్చి మా పెంతెకోస్తు సంఘములో చేరండి, మా పెంతెకోస్తు ఆధీనములోకి రండి అని చెప్పకండి. "మీరు బాప్టిస్టులోకి లేదా మెథడిస్టులోకి లేదా ప్రెస్బిటేరియన్లోకి లేదా కాథలిక్ లోకి వచ్చి చేరండి," అని చెప్పకూడదు. అది ఏమిటది? అది బండను మరల కొట్టుటయే, ఏదో ఒక క్రొత్తదానిని ప్రయత్నించుటయే అగును.
"మారుమనస్సు పొంది, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను." వారి పాపక్షమాపణ నిమిత్తము, మరియు నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును." మీరు మరల దారికి రావలెను, అదే నీటియొద్దకు రావలెను. ఆ నీరు అదే విశ్రాంతిని ఇచ్చును. అది శరీరమునకు అదే సేదదీర్చును. అది శుద్ధిచేయు అదే శక్తిని ఇచ్చును. అది స్వస్థపరచు అదే శక్తిని ఇచ్చును. మనము అదే ఆత్మ యొద్దకు మాత్రము తిరిగి వచ్చినయెడల, అది ముందు చేసిన అదే కార్యములను అది చేయును.
90ద్రాక్ష తీగయందున్న జీవము ద్రాక్షపండ్లనే తిరిగి ఇచ్చును. గత సంవత్సరము కాచిన వాటినే ఈ సంవత్సరము ఇచ్చును. అది దేవుని యొక్క నియమము. ద్రాక్ష తీగె ద్రాక్షపండ్లను కాయుట దేవుని చట్టము. మీరు దానికి వేరే మొక్కను దానితో అంటుకట్టగలరు, కాని దానిని మీరు ఆలాగే వదిలివేసినయెడల అది మరల అదే ద్రాక్షఫలములనే యిచ్చును.
మనము పెంతెకోస్తు వాదముతో, బాప్టిస్టు వాదముతో, మెథడిస్టు వాదముతో, ప్రెస్బిటేరియను వాదములో, ఆంగ్లికను వాదముతో, ఇంకా ప్రతినిధమగు వాదముతో సంఘమును కలగలుపు చేశాము. వాటిని మీరెందుకు ఆలాగే వదిలివేయకూడదు? ద్రాక్షావల్లి యొద్దకు రండి. అది అదే శక్తియొద్దకు మిమ్మును తీసికొని వచ్చును. ఆమేన్! ఆమేన్! అది నాకు ఇష్టము.
91ఏదో క్రొత్తది ప్రారంభించవలెను, మనము అదే చేశాము. మన అధికారము చూప ప్రయత్నించాము. "డాక్టరు ఫలాని-ఫలాని, ఆయన ఆ గొప్ప ఫలానీ-ఫలాని సంఘమునకు సంస్థాపకుడు," అని చెప్పుకోగోరుచున్నారు. కాని అది తప్పు.
మోషే చెప్పినది అదే, "నేనేమి చేయగలనో వారికి నేను చూపించెదను. ఏమైనా గాని తెచ్చెదను!" అని దానిని అతడు కొట్టెను, నీరు రాలేదు, మరల అతడు అరచి, "నా ప్రతాపము చూపించెదను" అని కొట్టెను. అందుకు దేవుడతనికి శిక్ష ఇచ్చెను.
ఒక శాఖకు అంటిపెట్టుకొనియున్నచో చాలును, అని తలంచినయెడల, దేవుడు అందుకు నిన్ను నిలదీయును. అది ఖచ్చితముగా నిజము. నీవు అసలైన దానియొద్దకు రావలెను. తిరిగి రమ్ము.
MARK 16:17•
ACTS 2:38
92జనులతో మాట్లాడినయెడల, "మా సంఘములో వచ్చి చేరండి, మా విశ్వాస ప్రమాణము చెప్పండి," అని వారితో అనవద్దు. "మీరు వచ్చి మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము - యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. మీ హృదయము సరియగును. విశ్వాసులను ఈ సూచక క్రియలన్నియూ వెంబడించును. విశ్వాసుల గుంపుతో ఈ సూచక క్రియలన్నియూ వెంటవచ్చును. ఎందువలన? బండ, కొట్టబడిన బండలో నుండి ఆయన యొక్క జీవజలములు పొర్లిపారుచున్నవి, ఆయన వెనుక చేసిన అదే కార్యములనే తిరిగి తీసికొని వచ్చును. అదే జరుగును. ఓ! అవును.
"మేము మెథడిస్టు, మేము బాప్టిస్టు" అని చూపించుట మనకు ఇష్టము.
GAL 5:22,23
93బండతో మాట్లాడుము, ఆయన నిత్యమూ యుండును. దానిలో చేరుటకు ప్రయత్నించవద్దు. "నేను ఇందులో చేరవలెను." అందులో చేరుటకు ప్రయత్నించవద్దు. దేనిలోనూ నీవు చేరలేవు. నీవు మెథడిస్టులో చేరగలవు, బాప్టిస్టులో చేరగలవు, పెంతెకోస్తులో చేరగలవు, ఆంగ్లికన్ లో చేరగలవు; కాని దీనిలో నీవు చేరలేవు. లేదు. నీవు దీనితో నింపబడవలెను. దీనిలో చేరుట కాదు; దానితో నింపబడవలెను. అంతే. అది దేనితో నింపబడియున్నది? శక్తితో నింపబడియున్నది, ఆత్మతో నింపబడియున్నది, జీవముతో నింపబడియున్నది, సంతోషముతో నింపబడియున్నది, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, నీ జీవితములో పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ఎందుకనగా నిత్యమూ యుండు దైవసన్నిధి అక్కడున్నది. గుర్తుంచుకొనుము…
ఆలస్యమగుచున్నది గనుక నేను ముగించవలెను.
MATT 28:20•
1COR 10:4
94కాని గుర్తుంచుకోండి, ఆ బండ వారిని ఎన్నడూ విడిచిపెట్టలేదు. అది వారిని ఎన్నడూ విడిచిపెట్టలేదు. క్రీస్తు ఎన్నడూ మనలను విడువడు. "యుగసమాప్తి పర్యంతము నేను మీతో యుందునని," క్రీస్తు చెప్పెను. అది నిజమేనా? హోరేబు నుండి నెబో వరకు ఆ బండ వారితోనే యుండెను. యోర్దాను దగ్గర అది ఉన్నది. అది ఇంకా అచ్చటనే యున్నది. ఓ దేవా, యోర్ధాను యొద్ద దానిని నేను చూడగోరుచున్నాను.
మోషే, యోర్దాను యొద్ద ఉన్నప్పుడు, ఆ బండ అతనితోనే యుండెను. అతడు అక్కడ నిలబడియుండి, వెనుకకు జారి దేవుని నుండి దూరమైన జనులను చూచుచుండెను. అతని హృదయము వారికొరకు పరితపించుచుండెను. అతడు యోర్దాను వైపు చూచెను. అతడు యోర్ధాను యొద్ద ఉండెను. ఆత్మసంబంధమైన యోర్దాను గూర్చి నేను మాట్లాడుచున్నాను. అతడచ్చట నిలబడియుండెను, మరణము ఆసన్నమాయెను, కాని ఆ బండ తన ప్రక్కనే యుండుట అతడు చూచెను. అతడు బండ మీద అడుగుపెట్టెను, మరియు దేవదూతలు వచ్చి అతనిని కొనిపోయెను.
HEB 13:5
95"నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను." ఎంత కష్టసమయమైనాగాని, ఎంత ముసలివారమైనాగాని, ఎట్టి మరణము మనము మరణించవలసియున్నాగాని, గుర్తించుకొనండి, ఆ బండ యోర్ధాను యొద్దనే యుండును. అదెన్నడూ విడువదు, ఎడబాయదు. దానిని గుర్తించుకొనండి. మన జీవతకాలమంతయూ, యోర్దాను యొద్ద సహితము, నిత్యమూ ఊరేడి నీటి బండ మనతో యుండును.
96మన తలలు వంచుదుము. [ఒక సంఘ సోదరుడు ప్రవచన సందేశము ఇచ్చుచున్నాడు.]
దేవుని యొక్క ఆత్మ మనమధ్య సంచారము చేయుచుండగా, క్రీస్తును ఎరుగని వారెవరయినా ఈ ఉదయకాలము ఇక్కడున్నయెడల, బండకు సమీపముగా మీరు లేనియెడల ఈ ఉదయమున దానితో మీరు మాట్లాడారా? అది ఇక్కడే ఉన్నదని తెలిసికొనుడి. అది ప్రతిచోటా పనిచేయుట చూడండి. ఆయన చుట్టూ కదలుట చూడండి. అది జనులపై సంచరించుట చూడండి. అది నిత్యమూ ఊరెడి జలము. అదియే రక్షణ. వారి గిన్నెలను పొర్లిపారవేయు ఆత్మ అదియే, వారు నెమ్మదిగా ఉండజాలరు, ఏదో లోనికి రావలసియున్నది. నీవు ఆయనను ఎరుగవు, "బ్రెన్హాం సోదరుడా, నా కొరకు ప్రార్ధించుము. ఇప్పుడు నేనాయనను తెలిసికొనగోరుచున్నాను. ఆయనతో నేను మాట్లాడగోరుచున్నాను, ఆయన యొక్క ఆత్మ సంపూర్ణతను నేను తెలిసికోగోరుచున్నాను. ఎల్లవేళలా ఆయన నా ప్రక్కనే యుండునట్లు నేను ఆశించుచున్నాను. ఆయన ఉన్నాడని నేను నమ్ముచున్నాను. నేను దాహము కలిగియున్నాను, దేవుని కొరకు ఆకలిగొనియున్నాను, ఆయనను ఎక్కువగా తెలిసికొనగోరుచున్నాను," అని మీరు మీ చేతులను పైకెత్తి చెప్పుటకు ఆశించుచున్నారా?
LUKE 23:46
97దేవుడు నిన్ను దీవించును, దేవుడు నిన్ను దీవించును, మరియు సోదరుడా, నిన్ను దీవించును. నిన్ను దీవించును. ఆ వెనుకనున్న నిన్ను దీవించును. ఇక్కడున్న ఈమెను దీవించును. అవును, అవును ఆమెను దీవించును. మీ చేతులు మేము చూచుచున్నాము, దేవుడు వారిని చూచుచున్నాడు. యువకుడా, దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. ఆమెను దేవుడు దీవించును. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును. సోదరీ, దేవుడు నిన్ను దీవించును. కొందరు నిశ్శబ్ద క్షణములో యున్నారు. ఆ వెనుకనున్న యువకుని దేవుడు దీవించును.
దానిగూర్చి ఆలోచించుము. బండ నుండి నిత్యమూ ఊరేడి నీటి బుగ్గను గూర్చి ఆలోచించుము. అదే ఆత్మ, ఆయన మన తీర్పును అక్కడ మీద వేసికొని, తీర్పు దీనమున కేకవేసెను. దేవుని యొక్క ఉగ్రతా దండము ఆయనను కొట్టెను, నీ పాపములు ఆ దండములో చుట్టబడియున్నవి, ఆయనను మొత్తెను. ఆయనలో నుండి నీళ్ళు, రక్తము చిమ్మెను. "తండ్రీ, నా ఆత్మను నీ చేతులకు అప్పగించుచున్నాను," అని ఆయన పలికెను. పెంతెకోస్తు దినమున అది మనతో కూడా యాత్ర చేయుటకు వచ్చెను. ఇప్పుడది ఎంతో సన్నిహితముగా యున్నది.
98"ప్రభువా, నేను ఇంటికి వచ్చుచున్నాను," అని చెప్పుము. ఆ పాట పాడుచుండగా, మీరు వేదిక యొద్దకు వచ్చి పునఃసమర్పణ చేసికోవచ్చును. క్రీస్తుకు మీ ప్రాణము సమర్పించవచ్చును. ఆమేన్.
దేవుని నుండి నేను దూరమై తిరిగితిని,
(మార్గము విడిచితిని)
ఇప్పుడు నేను ఇంటికి వచ్చుచున్నాను.
ఎంతో కాలము అవిశ్వాసపు త్రోవ తొక్కితిని.
ప్రభువా, నేను ఇంటికి వచ్చుచున్నాను.
ఇంటికి వచ్చుచున్నాను, ఇంటికి వచ్చుచున్నాను,
మరెన్నడూ ఇంకా ఊరక తిరుగను.
నీ ప్రేమ బాహువులు వెడల్పుగా తెరువుము.
ప్రభువా, ఇప్పుడు, ఇంటికి వచ్చుచున్నాను.
["ప్రభువా, నేను ఇంటికి వచ్చుచున్నాను" అను పాటను సహోదరుడు బ్రెన్హాం ఇంకా ఆలపించుచున్నారు.]
99ముగ్గురు యువకులు వచ్చి కన్నీళ్ళు కార్చుచూ, బహు తొందరగా వేదిక యొద్దకు వచ్చి మోకరించిరి. వారు క్షమాపణ పొందిరి. వారు తమ మనస్సులో నిర్ణయించుకొన్నప్పుడే, తమ చోటు విడిచి రాకముందే క్షమించబడిరి. వారు ఏ పక్షమున యున్నారో ప్రజలు తెలిసికొనునట్లుగా, ఈ ఉదయము ముందుకు వచ్చి మోకరించిరి.
కొందరు పెద్దవారు కూడా ఈ విధముగా మోకరించి, "ప్రభువా, నేను త్రోవ విడిచి ఎంతో దూరము వెళ్ళితిని, నాకు ఎంతో సందేహమున్నది. కొన్నిసార్లు నేను తిరిగి పాపములో పడియున్నాను. ఆలస్యము కాకముందే నేను మరల రాగోరుచున్నాను. దేవా, నేను రాగోరుచున్నాను. నేను నిజంగా వచ్చి మోకరించగోరుచున్నాను," అని చెప్పండి.
100ఇప్పుడు, అది వింతగా కనిపించవచ్చును, అందరు ఒకే ఆకారములో ముగ్గురు చిన్న బాలికలు ఇక్కడకు వచ్చి మోకరించిరి.
ఒక చిన్న బాలిక ముందుకు వచ్చుచున్నది, ఆమెకు ఇంకో చిన్న సోదరుడున్నాడు. దీనిని గురించి నేను ఆ దినమున చెప్పాను. ఈ సోదరి ప్రసవము కొరకు ఆస్పత్రికి వెళ్ళుచున్నదని శ్రీమతి. ఉడ్ నాకు చెప్పెను. "బాలుడు పుట్టును," అని చెప్పమని పరిశుద్ధాత్మ నాకు తెలిపెను. చిన్నబాలుడు ఆలాగే జన్మించెను.
సహోదరుడు ఆర్నాల్స్ తరగతి నుండి చిన్నపిల్లలు ఈ ఉదయమున వచ్చి తమ జీవితములను సమర్పించుకొనుచున్నారు. నా కుడివైపుననున్న వేదిక అంతా చిన్న పిల్లలతో నిండియున్నది. తక్కిన పెద్దవారందరి కొరకు ఒక పాట పాడితే బాగుండునని నాకు తోచుచున్నది. (అవునా?)
101ఇప్పుడు, ప్రభువా, నేను ఇంటికి వచ్చుచున్నాను.
[సహోదరుడు బ్రెన్హాం వేదిక యొద్దనున్న పిల్లలతో మాట్లాడుచున్నారు.]
ఇంటికి వచ్చుచున్నాను,
ఇంటికి వచ్చుచున్నాను.
మరెన్నడూ తిరుగను;
నీ ప్రేమ బాహువు వెడల్పుగా తెరువుము,
ప్రభువా, నేను ఇంటికి వచ్చుచున్నాను.
ప్రభువా, పాపము మరియు తిరుగులాడుట వలన అలసియున్నాను,
ఇప్పుడు నేను ఇంటికి వచ్చుచున్నాను;
నీ ప్రేమను నేను నమ్మి, నీ మాటను విశ్వసించెదను,
ఇప్పుడు నేను ఇంటికి వచ్చుచున్నాను.
ఇంటికి వచ్చుచున్నాను,
ఇంటికి వచ్చుచున్నాను,
మరెన్నడూ తిరుగను;
నీ ప్రేమ బాహువులు వెడల్పుగా తెరువుము.
ప్రభువా, ఇంటికి వచ్చుచున్నాను.
102ఈ చిన్నవారికొరకు ప్రార్ధించుటకై ఒక్క క్షణము మన శిరములు వంచుదము.
పరమ తండ్రీ, రేపు అనునది ఉన్నయెడల, యేసు రాకడ పది లేదా పదిహేను సంవత్సరములు అలస్యమైనయెడల, రాబోవు తరమునకు ఈ వర్తమానమును ఈ బాలబాలికలే కొనిపోవుదురు. ప్రభుతో, ఈ వేదిక యొద్దకు వచ్చిన ఈ జ్ఞాపకము వారి జీవితములలో చిరస్థాయిగా నిలచిపోవును. అందులో నాకు సందేహము లేదు. ప్రభువా, వారు చిన్న ఆభరణముల వంటివారు. వారు వర్తమానమంతయూ వినకుండానే వారియొక్క యవ్వన, లేత హృదయములు ఈ ఉదయమున గద్దించబడినవి. సహోదరుడు ఆర్నాల్డ్ చెప్పినది విని, ఇప్పుడే గదిలో నుండి వచ్చిరి. తమ చిన్న జీవితములను నీకిచ్చుచూ ఈ వేదిక యొద్దకు వచ్చిరి.
తండ్రి, మాలో పరిశుద్ధాత్మ నివాసము చేయుచున్నదని ఇప్పుడు మాట్లాడుచూ చెప్పాను. ఈ పరిశుద్ధాత్మ మరియు పరిశుద్ధాత్మయందు విశ్వాసము సమస్తమును జరిగించును. ఈ ఘడియలోనే వారు చేసిన ప్రతి పాపమును క్షమించుము. నేను నమ్ముచున్నాను, నా హృదయమందున్న విశ్వాసమంతటితో అడుగునదేమనగా - వారి చిన్న జీవితములను మార్గమంతయా కాపాడవలేననియే. వారెన్నడూ త్రోవ తప్పి తిరుగకుందురు గాక!
103ఇది నిజముగా ఒక వింత సంగతి. మేము "ఒక వింత చూతుము" అనీ ఈ ఉదయాన ఆత్మ చెప్పెను. దేవా, ఈ చిన్నపిల్లలతో మాట్లాడుము, ఈ ఉదయమున వేదిక పిలుపులో పెద్దలులేరు గాని, చిన్నపిల్లలందరూ ఎట్లు వచ్చిరో చూడుము. ఈ వర్తమానము పెద్దలు కూడ గ్రహించుట కష్టము, అయినా ఆ చిన్నవారు దానియొక్క ఆత్మను ఎట్లు పట్టుకొనిరో చూడుము. తండ్రీ, వీరినిబట్టి నీకు వందనములు. ఈ కూటము యొక్క విజయసూచకములుగా నీ దాసుడనైన నేను నీకు ఇచ్చుచున్నాను. వారు జీవించునంతకాలము నిత్యమూ ఊరెడి జీవజలమును జ్ఞాపకము చేసికొందురు గాక! ఇప్పుడు జరుగుచున్న దానియందు వారు విశ్వాసము కలిగియుందురు గాక! దేవుడే వారిని తమ చోటునుండి లాగి, ఇక్కడికి పంపెను. ఆ దేవునియందు వారు తమ జీవితకాలమంతయూ విశ్వాసము కలిగియుందురు గాక! వారి మరణ దినములందు వారి చిన్న ఆత్మలు నీ సన్నిధికి తీసికొనిరాబడు గాక! వారి శరీరము పునరుత్థానమందు తిరిగి లేచును గాక! తండ్రి, వారు నీవారు. యేసు నామము ద్వారా వారిని నీకు అనుగ్రహించుచున్నాను.
104మనము తలలు వంచియుండగా, వేదిక యొద్దనున్న ఈ చిన్నపిల్లలనందరినీ నేను అడుగబోవుచున్నాను. మీరు యేసును రక్షకునిగా నమ్మిరి. జనసమూహములో నుండి లేచి ఈ వేదిక యొద్దకు వచ్చి మోకరించమని ఆయనే మీకు చెప్పెను. యేసు మిమ్మును ప్రేమించి, మీ పాపమును క్షమించెనని నమ్ముచున్నారా? మీరందరూ లేచి నిలబడి, మీ వెనుకనున్న జనులవైపు చూడవలెనని కోరుచున్నాను. యేసు మిమ్మును రక్షించెనని ప్రజలతో మీరు ఆ విధముగానే చెప్పగలరు. ఇప్పుడు లేచి నిలబడండి. జనులవైపు పూర్తిగా తిరగండి. యేసును ప్రేమించుచున్న చిన్నపిల్లలారా, మీ ప్రతిఒక్కరు లేచి నిలబడి జనులవైపు చూడండి.
105ఈ ముందునున్న చిన్న బాలికల మాట ఏమిటి? మీరు నమ్ముచున్నారా? మీరు యేసును ప్రేమించుచున్నారా? ఈ చిన్న బాలికలు మీ పూర్ణ హృదయములతో యేసును ప్రేమించుచున్నారా? ప్రేమించుచున్నారా? ఆయనను ప్రేమించండి, చిన్నవారలారా, ప్రేమించుచున్నారా? ఇక్కడ నిలబడండి. మీరు యేసును ప్రేమించుచున్నారని జనులకు తెలియనీయండి. దేవుడు మిమ్మును దీవించును.
ఇప్పుడు ఈవైపు మనము తిరిగి మనము విడిచి వెళ్ళకముందు వీరికొరకు, "యేసు నన్ను ప్రేమించుచున్నాడు, ఇది నాకు తెలియును. బైబిలు ఆలాగు చెప్పుచున్నది," అను పాట పాడుదుము. చూచారా? మనము చేతులెత్తి ఆ పాట పాడుదము. సరే, మనము దానిని పాడుదము.
యేసు నన్ను ప్రేమించుచున్నాడు! ఇది నాకు తెలియును;
బైబిలు ఆలాగు నాకు చెప్పుచున్నది;
చిన్నవారు ఆయనకు చెందినవారు,
వారు బలహీనులు కాని ఆయన బలవంతుడు.
ఇప్పుడు మనము పాడుచున్నప్పుడు మీ చేతులు పైకి ఎత్తండి. రండి, అందరు కలిసి.
అవును, యేసు నన్ను ప్రేమించుచున్నాడు.
అవును, యేసు నన్ను ప్రేమించుచున్నాడు.
అవును, యేసు నన్ను ప్రేమించుచున్నాడు.
బైబిలు ఆలాగు నాకు చెప్పుచున్నది.
106మీరందరూ నా వెనుక చెప్పండి. యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు అని నేను నమ్ముచున్నాను. ఈ రోజు, నేను నా స్వరక్షకునిగా ఆయనను అంగీకరించుచున్నాను. ఈ రోజు నుండి ఇక మీదట, నేనాయనను ప్రేమించెదను మరియు ఆయనను సేవించెదను. ఆమేన్.
107[సభలోని ఒక సోదరుడు ఈలాగు చెప్పెను, "బ్రాన్హాం సోదరుడా, ఈ సమయములో నా హృదయమందు నలుగులు పిల్లలున్నారు. దయతో వారికొరకు ప్రార్ధించవా?"] నిశ్చయంగా ప్రార్ధింతును, సహోదరుడా బెన్.
పరమ తండ్రీ, ఈయన ఈ ఇతర పిల్లలు క్రీస్తునొద్దకు రావలెనని కోరుచున్నాడు, ఒక తండ్రిగా ఆయన తన స్వంత పిల్లల కొరకు మొర్రపెట్టుచున్నాడు. వేదికయొద్దకు ఈ చిన్నవారిని తెచ్చిన అదే ఆత్మ, ఈ పిల్లలను కూడా రక్షించును గాక, ప్రభువా. దానిని దయచేయుము. తండ్రీ, యేసుక్రీస్తు నామములో వీరిని నీకు ఇచ్చుచున్నాను.
108ఈ చిన్నవారు తిరిగి తమ తమ స్థానములలో కూర్చొనుచుండగా, ప్రతివారు వారితో కరచాలనము చేయండి, లేదా వారి వీపును తట్టవలెనని కోరుచున్నాను. మీరందరూ ఈ వైపు నుండి మీ చోట్లకు వెళ్ళండి. వెళ్ళుచుండగా, ప్రతిఒక్కరు ఆ చిన్నవారి వీపు తట్టండి. మీ హృదయమంతటితో మిమ్మును ప్రేమించుచున్నాము. మా అందరివలెనే మీరును క్రీస్తు శరీరములో సభ్యులైయున్నారు.
మనము సీయోను వైపు సాగిపోవుచున్నాము
అందమగు, రమ్యమగు సీయోను;
మనము సీయోను వైపు సాగిపోవుచున్నాము,
ఆ అందమైన దేవుని పట్టణము.
ప్రభువును ప్రేమించు, మనము వెళ్ళుదము,
మన సంతోషము వెల్లడి చేయుదము,
మాధుర్య మనస్సుతో పాటతో కలియుదము,
మాధుర్య మనస్సుతో పాటతో కలియుదము,
ఆ విధముగా సింహాసనము చుట్టుముట్టుదము
ఆ విధంగా చుట్టుదము
బలమగు మంచి గానము!
ఇప్పుడు మన చేతులు ఎత్తెదము.
మనము సీయోను వైపు సాగిపోవుచున్నాము,
ఆంధమగు, రమ్యమగు సీయోను;
మనము సీయోను వైపు సాగిపోవుచున్నాము,
ఆ అందమైన దేవుని పట్టణము.
ఇప్పుడు పాడుచుండగా ఒకరితో ఒకరము కరచాలనము చేయుదము.
మనము సియోను వైపు సాగిపోవుచున్నాము,
అందమగు, రమ్యమగు సియోను;
మనము సీయోను వైపు సాగిపోవుచున్నాము,
ఆ అందమైన దేవుని పట్టణము.
109మనము తలలు వంచి ప్రార్ధించుచుండగా, అది పాడుదము. సహోదరుడు టెడ్డీ…
ఇక్కడ నాకు కొన్ని విన్నపములు, చేతిరుమాళ్ళు వచ్చియున్నవి. అవి విదేశముల నుండి వచ్చియుండవచ్చు. ఇంగ్లాండు నుండి ఒక చిన్న బాలుని బూట్లు వచ్చియున్నవని బిల్లీ చెప్పెను. అవి వంకరగా యున్నవి, కుంటివానివి, వానికొరకు కూడా ప్రార్ధించుదము.
110["బ్రెన్హాం సోదరుడా, నన్ను క్షమించుము. గతరాత్రి నా కారును గుద్దినవారెవరో తెలియబడునట్లు కూడా ప్రార్ధించుము. ప్రభువు దానిని బయలుపరచునట్లు ప్రార్ధించుము,'' అని బెన్ సోదరుడు చెప్పెను.] ఆమేన్. బెన్ సోదరుడా, తప్పక ప్రార్ధించెదను.
["మనము సీయోనుకు సాగిపోవుచున్నాము," అను పాటను ఇంకా బ్రెన్హాం సోదరుడు ఆలపించుచున్నాడు.]
111ప్రభువా, మేము సాగిపోవుచుండగా, కొట్టబడిన బండ ఎల్లవేళలా మాతోనే యుండునని ఎరుగుదుము. బండనుండి నిత్యమూ ఊరెడి నీరు సంఘముతో వచ్చును. ఓ నిత్యుడగు దేవా, మాతోయున్న ఈ దేవునియందు మాకు విశ్వాసమును దయచేయుము. నీవు మా పట్ల మేలు చేయుదువనియు, నీవు మమ్మును నమ్ముదువనియు మేమెరుగుదుము. ప్రభువా, మాకు సమృద్ధిగా అది ఇమ్ము, దానిని దుర్వినియోగము చేయకుందుము గాక! నీ కృపను పొందినవారమయినయెడల ఆలాగు జరుగనిమ్ము.
ఎవరో కారును గుద్దిరని మా సోదరుడు చెప్పియున్నాడు. ఓ దేవా, మరమ్మత్తు చేసికొను డబ్బు ఆయనయొద్ద లేదు, ఆ వ్యక్తిని ఒప్పింపచేయుము. ఈ పని చేసినందుకు అతడు పశ్చాత్తాపపడి వచ్చి, "సోదరుడా, నీ కారు నేను బాగుచేయుదును, నేనే దానిని చేశాను," అని చెప్పును గాక. సహోదరుడు బెన్ మరియు అతని ప్రియులకు సహాయము చేయుము.
ACTS 19:12
112ఆ దేవునియందు విశ్వాసమున్నవారు పంపిన మనవులు మరియు చేతిరుమాళ్ళు ఇక్కడ నా చేతిలో యున్నవి. మోషేకు ఆ దేవునియందు విశ్వాసమున్నది. మరియు అతడు సముద్రమును దాటెను. ఆ దేవునియందు దానియేలునకు విశ్వాసమున్నది, అతడు సింహపు బోనులో నుండి విడిపించెను. షద్రకు, మేషెకు, అబేద్నెగోలు ఆయన యందు విశ్వాసముంచిరి, అగ్నిని ఆర్పిరి. పౌలుకు ఆయనయందు విశ్వాసముండెను, పౌలు ఎవరియొద్దకు వెళ్ళలేని స్థితిలోయుండెను. అతనికి పని భారము చాలా యుండెను. అందువలన ఒకనాడు అతడు తన అంగీని చింపి ఇచ్చెను. "దేవుడు నాతో యున్నాడని నమ్ముచున్నాను," అనెను. అతడు తన హస్తములను చేతిగుడ్డల మీద, అంగీల మీద ఉంచి ఇచ్చెను. వాటిని జనులపై యుంచగా, దురాత్మలు వెడలిపోయినవి. వ్యాధులు మరియు రుగత్నలు వారిలో నుండి వెళ్ళిపోయెను. దేవా, ఆ దేవునియందు నాకు విశ్వాసమున్నది. దురాత్మ వెడలిపోవును గాక. ప్రభువా - వ్యాధులు, రుగ్మతలు, బాధలు వెడలిపోవును గాక!
113ఆ నదియొద్ద అగ్నిస్తంభములో మాట్లాడిన దేవుడవు నీవే. ఆ గోడమీద వ్రేలాడుచున్న పటములో నాయొద్ద ఉన్నది నీవే. ప్రభువా, నీవు మాతో యున్నావు. అదే అగ్నిస్తంభముగా నీవు నిత్యమూ ఉన్నావు, ఆత్మలో మేము జత అయియుండగా, ప్రతి దినము మేము బండనుండి నీరును అనుభవించుచున్నాము. నీవు ఇక్కడున్నావు. ప్రభువా, నీయందు మాకు నమ్మకమున్నది. నీయందు మాకు విశ్వాసమున్నది. నీవు మమ్ము అభిషేకించి, మాకు సహాయము చేయుదువని మేము విశ్వసించుచున్నాము. ప్రభువా, మా మహిమ కొరకు కాదు, ఆలాగయితే మేమును మోషేవలె పొరపాటు చేయుదుము. ప్రభువా, నీకు సహాయము ఏదో విధముగా చేయవలెనని మేము కోరుచున్నాము. మాకు సాధ్యమయినయెడల, నీకు సహాయము చేయవలెననునదియే మా హృదయ వాంఛ. తండ్రి, మేము చేయగలిగినయెడల, మేము ఏమి చేయవలెని నీవు కోరుదువో, అది మాకు చూపించుము.
114ఈ చేతిగుడ్డలు ఎవరికొరకు పంపబడినవో, ఈ మనవులు ఎవరి నిమిత్తము ఇవ్వబడినవో వారిలోనున్న రోగమును విశ్వాసమును బట్టి నేను ఖండించుచున్నాను. జనులలో నుండి అది పోవును గాక. ప్రభువా, అది నీవు చేయగలవని నేనెరుగుదును. దానిని నీవు చేయగలవని నా హృదయములో విశ్వసించుచున్నాను. ఈ ఉదయము మా మధ్యనున్న రోగమును స్వస్థపరచుము.
బండ యొద్దకు నీటి కొరకు రావలెనని చెప్పి తమ చేతులెత్తిన వీరిని రక్షించుము. దేవా, నేడు వారెంతో దాహముతో గలరు. దేవా, వారి జీవితము ఉప్పు వేసినట్లుగా యుండి ఇతరులు క్రీస్తు కొరకు దాహము గొనునట్లుగా ఉండును గాక! ఆలాగు దయచేయుము.
తండ్రి, ఈ రాత్రి మాతో యుండుము. ఓ, దేవా, ఈ మనవులు బట్టి జనుల హృదయములలో ఏమున్నదో నేను కనుగొనునట్లు దయచూపుము. ప్రభువా, వారి హృదయములలో ఏదీ లేనియెడల, ఈ రాత్రి వారి హృదయములకు బోధించునట్లు ఏదయినా నాకు అనుగ్రహించుము.
115సోదరుడు నెవిల్ ను, ఆయన భార్యను, కుటుంబమును, మా చిన్న సంఘమును, మా ట్రస్టీలను, మా పెద్దలను, మా సభ్యులను ఆశీర్వదించుము. తండ్రి, అన్నిచోట్ల ఉన్న నీ శరీరముతోను, మాతోను ఉండుము. యేసుక్రీస్తు నామములో దీనిని మేము నీ చేతులకు అర్పించుచున్నాము.
……సీయోను;
మేము సీయోను వైపు సాగిపోవుచున్నాము;
దేవుని యొక్క అందమైన పట్టణము.
నిజంగా, భావయుక్తంగా దీనిని ఆయనకు ఇప్పుడు మనము పాడుదము, చూచారా.
రండి, ప్రభువును ప్రేమించుచున్నవారలారా,
మన సంతోషమును వెల్లడిచేయుదము
మాధుర్య మనస్సు యొక్క పాటలో చేరుదము
మాధుర్య మనస్సు యొక్క పాటలో చేరుదము
ఆ విధముగా సింహాసనమును చుట్టుదము
ఆ విధముగా సింహాసనమును చుట్టుదము.
ఇప్పుడు మనము హృదయములు వంచుదము.
మనము సీయోనుకు సాగిపోవుచున్నాము
అందమగు, సుందరమగు సీయోను.
మనము సీయోను వైపు సాగిపోవుచున్నాము.
దేవుని యొక్క అందమగు పట్టణము.