దానియేలుకు గబ్రియేలు యొక్క సూచనలు

దానియేలుకు గబ్రియేలు యొక్క సూచనలు

VGR COUNT -169 1స్నేహితులారా, ఉదయ కాలపు వందనములు. ఈ ఉదయము ఈ గుడారములో ఉండుటకు చాలా వేడిగా నున్నది, అయితే ఇక్కడ ఉండుట చాలా గొప్ప కార్యముగా ఉన్నది. కావున ఈ రోజు ఈ ఆరాధనలో మనము ఉండుట మనకు చాలా ఆనందముగానున్నది. మరియు ఈ దానియేలు యొక్క డెబ్బది వారములుపై ఇప్పుడు మనము ధ్యానింపనై యున్నామని నేను ఇది వరకే తెలిసియున్నాను. అది నేను చెప్పనైయున్న మిగతా వర్తమానములతో ముడివేయబడియున్నది. నేను ఏడు ముద్రలకు పోకమునుపు, అక్కడ ఏడు ముద్రలు, ఏడు తెగుళ్ళు, ఏడు బూరలు, మూడు శ్రమలు, సూర్యునిలో ఉండు ఆ స్త్రీ, ఎర్రని దయ్యమును వెళ్లగొట్టుట, 144,000 మంది ముద్రింపబడుట - ఈ మధ్య సమయము ఇవన్నియు సంభవించుచున్నవి. మరియు దీనిని (దానియేలు యొక్క డెబ్బది వారములు) మొదలు తీసికొని రావలయుని నేను తలంచితిని.

2ఇప్పుడు, చాల వేడిగా ఉన్నది, ఇక్కడ చాలా సేపు ఉండవలయునని మేము అనుకొనుట లేదు - వీలైనంతవరకు. మరియు ఈ కాలములో, సాధారణముగా జనులు అధికముగా బయటికి వెళ్లరు, సంఘ ఆరాధనలు ఎక్కువ ఉండని వేళ ఇది, మరియు విశేషముగా… మరియు వారందరికి చల్లని శీతోష్ణస్థితి గల (ఎయిర్ కండిషన్) గదులు మరియు ఆ విధముగా అక్కడ చాలా సౌకర్యముగా ఉండెదరు. అది (ఎయిర్ కండిషన్) మనము కలిగి యుండవలయునని కోరుచున్నాము, అయితే ఈ సమయము మనము దానిని కలిగి యుండలేదు.

మన యొక్క పూర్వ పితరులు అనేకులు ఆ మండే ఎండలో ఉండెడివారు. మనకు ఒక ఎయిర్ కండిషన్ సౌకర్యం గల గది లేనందుకై జనుల యొద్ద మన్నింపును కోరుటను తలంచేటప్పుడు నా యొక్క తలంపులు ఎప్పుడు ఆఫ్రికాకు పోవును. వారు అక్కడ ఆ గాలి వానలో పండుకొని యుండుటయు, మరియు ఆ స్త్రీలు ముఖములపై వారి వెంట్రుకలు వ్రేలాడు చుండగా, వారున్న చోటి నుండి అటు ఇటు కదలక రాత్రింబగళ్ళు అక్కడే పడియుండెదరు. ఏమియు తినక, త్రాగక, వేరే ఏమియు చేయక ప్రభువు యొక్క ఒకటి లేక రెండు వాక్యములను అప్పుడప్పుడు వినుట కొరకై అక్కడే కాచుకొని యుండెదరు.

3చాలా ఉష్ణముగా ఉన్న కాలములో మెక్సికోకి వెళ్ళిన దానిని గురించి నేను తలంచి చూడగలుగుచున్నాను, ఎయిర్ కండిషన్ సౌకర్యం గల గదిలో నేను కూర్చొని, చాలా చాలా ఉష్ణముగా ఉన్నందువలన నేను విసురుకోవలసి వచ్చిన దానిని నేను మనఃపూర్వకముగా చెప్పుచున్నాను. మరియు ఆ యొక్క రంగపు బయలులో పెద్ద ఆటల మైదానములో ఉదయము 9 గంటలకే జనులు వచ్చెదరు, మరియు కూర్చొనుటకు కుర్చీలు ఉండవు — వ్యాధిగ్రస్తులు, నిజముగానే వ్యాధితో పీడింపబడువారు, వ్యాధితో చనిపోవుచున్న ప్రజలు, కాన్సర్, కణితిలు గలవారు, వ్యాధితో ఉన్న తల్లులు, చనిపోవుచున్న చిన్న బిడ్డలు, మరియు వారందరు అక్కడే నిలుచుని యుందురు, ఆ తీవ్రమైన ఎండలో, ఎక్కడ కూడా నీడ యుండదు, ఒకరిపై ఒకరు ఆనుకొని ఆ ఉదయము 9 గంటలు మొదలు రాత్రి 9 గంటల వరకు, ఎందుకొరకనగా, తర్జుమా చేయబడు ఆ ముప్పై నిమిషముల వర్తమానమును వినుటకును మరియు దేవుని యొక్క క్రియలు చూచుటకును అక్కడే ఉండి కాచుకొని యుండెదరు, దళసరి దుస్తులు ధరించుకొని, చలి కాలములోను, ఎండా కాలములోను అదే దుస్తులు ధరించుకొని యుందురు — ఏలయనగా వారికున్నవి అవే.

4మరియు ఆ అరణ్యములలో వారు కాచుకొని యుండుటను తలంచుచున్నాను, కదలలేని స్థితిలో ఉన్న ఆ వ్యాధిగ్రస్తులను వారు ఏ విధముగా తీసికొని వచ్చెదరో, మరియు ఇండియాలో కుష్టు మరియు ఇతర వ్యాధిగ్రస్తులతో కూడిన ప్రజలను ఒకరిపై ఒకరు మోసికొని తీసికొని వచ్చెదరు వీపులలో వారిని లాక్కోని తీసుకు వస్తారు. ఆ యొక్క తీవ్రమైన ఎండలో, భయంకరమైన వేడిలో, అతిగా నుండు సూర్యరశ్మిలో, మరియు గాలి వానలో, ఉరుములు, మెరుపులలో మరి అటు వంటి కార్యములలో, ఆ ఎండలో, గాలివానలో అక్కడే వారు కదలక కాచుకొని యుండెదరు, వారు ఆ చోటు (అటువంటి పరిస్థితులలో) అటు ఇటు కదలక ఎటువంటి ఫిర్యాదు చేయక, అప్పుడప్పుడు దేవుని వాక్యమును పట్టుకొనుటకు ప్రయత్నించుచు మరియు వారి ఆత్మలు పోషింపబడుటకు కూడా, మరియు వారు అటువంటి పరిస్థితులలో ఉండి కూడా దేవుని కొరకు ఆ విధముగా వేచి యున్నప్పుడు, ఇక్కడ మన పైన కప్పబడి యుండగా (రూఫ్ లేక ఇంటిపై కప్పు), ఫ్యాన్ తిరుగుచుండగా మేము ఎందులకు మిమ్ములను మన్నింపు అడగవలయును. దానిని గురించి మనము ఫిర్యాదు చేసిన యెడల మనము సిగ్గుపడవలసిన వారమైయున్నాము.

5కావున కొద్ది కాలము పిదప ఒక దీవిలో, దక్షిణ సముద్ర ప్రాంతములో ఒకానొక దీవిలో, ఆ రాత్రి నేనొక ఆరాధనను జరుపుచుంటిని. మరియు ఓ, ఓ, ఒక తుఫాను లేచినది. ఓ, అటువంటి తుఫానును నేను చూడలేదు. ఒకదాని పిదప మరియు యొక మెరుపు, ఆ ప్రదేశమంతయు మెరుపులు, చెట్టులన్నియు కూలి నేలపడు విధముగా ఆ గాలి భయంకరముగా వీచుచున్నది. "మంచిది, నేను నా కోటు తిసివేసెదను, ఏలయనగా అక్కడ ఎవ్వరు ఉండరు," అని నేను అనుకొన్నాను.

మరికొన్ని క్షణములలో ఒక చిన్న కారు వాకిట ముందు నిలుపబడి మరియు ఎవరో తలుపులు తట్టారు.

నేను ఆ అబ్బాయితో చెప్పితిని (అతడు ఇంగ్లీషు మాటలాడ గలడు), నేను అడిగితిని, "అక్కడెవరైనా ఉన్నారా?"

అతడు చెప్పెను, "క్రీడాస్థల మైదానంలో కూటము జరుగు స్థలమునకు వెళ్ళే మార్గమున ఉన్న పొలిమేరలను కూడా దాట లేని స్థితిగా ఉన్నది."

మరియు నేను అడిగితిని, "నీవు నిజముగా చెప్పుచున్నావా, జనులు ఆ విధముగా అక్కడ ఉన్నారా? నేను అడిగితిని, "ఇంతటి గాలివానలో కూడానా?"

అతడు చెప్పెను, "వారు దేవునిని గూర్చి వినదలచియున్నారు."

6మరియు కావున నేనచ్చటికి వెళ్లాను, మరియు అక్కడ స్త్రీలు, యౌవ్వన బాలికలు, యౌవ్వనస్తులు — కొట్టుకొనకుండా, హాస్యము చేయకుండా (నవ్వుకొనకుండా) జిగురు (చూయింగ్ గమ్) నమలకుండా, తమ స్నేహితులను (ఆడ, మగ) గురించి ముచ్చటించు కొనకుండా, ప్రతి వాక్యమును, అక్కడే వారు కదలక ఉండి, అచ్చటనే యుండి ప్రతి మాటను వినిరి. బలిపీఠపు పిలుపునివ్వగా - ఇదే ఒక బలిపీఠపు పిలుపుగా ఇయ్యగా వేలకు వేలుగా జనులు తమ కండ్ల నుండి ధారలు ధారలుగా కన్నీరు కార్చుచుండగా, దేవునికి తమ చేతులను ఎత్తి, వారి ఆత్మలకు దయ చూపమని కోరుచు - యౌవ్వన స్త్రీలు, మరి బాలురు, పదిహేడు, పదునెనిమిది వయస్సుగలవారు. వయస్సు ముదిరిన వృద్దులను వినులాగున చేయుట కష్టమైన కార్యముగా ఉన్నది. మీరు చూచారా? దానిని గురించి ఫిర్యాదు చేయుటకు మన యొద్ద ఏమిలేదని అది చూపుచున్నది. దేవునికి స్తోత్రము. సరి అయ్యా.

అమెరికాలో ఉండులాగున అన్ని నవీన సౌకర్యములతో మనకు ఉండ వలయునని ఆశించుచున్నాము, అయితే ఆ విధముగా మనకు లేదు, కావున మనకు ఏమి ఉన్నదో దానితో సర్దుకొనెదము.

7ఇప్పుడు, ఈ యొక్క గుడారములో నేను గమనించిన ఒక చిన్న కార్యమును మరల ఈ గుడారములో చేయవలెనని యున్నాను. ఎందరి యొద్ద బైబిళ్లు కలవు? మీ చేతులు పైకెత్తుడి. మంచిది. మనము ప్రార్ధి౦చుటకు ముందు కీర్తనలు 99 త్రిప్పెదము. సోదరుడు నెవిల్ ఈ ఉదయము మీరు కీర్తనలు అనుసరించిచుంటిమి. చాలా సంవత్సరములకు మునుపు దీనిని మనము ఇదివరకే చదివి యున్నారా? నాకు తెలియదు… సంఘము కొన్ని కీర్తనలను చదువ వలయునని నేను కోరుచున్నాను.

ఈ రోజు ఉదయము నా చదువుకొను గదిలో కూర్చొని ఈ వర్తమానము పై మరియు వాక్యము పై ధ్యానించుచుండగా, నేను తలంచితిని, "మీకు తెలియునా, ఒక సంగీతమును మరల చదువుట మంచిది; దానిని నేను ఇష్టపడుచున్నాను." నేను కొద్దిగా ఆలస్యమైనందులకు కారణమేమనగా, చెయన్నె అను స్థలము నుండి వచ్చిన దూరపు ఫోన్ కాల్ వలన, అందువలన నేను ఆలస్యము…

మరియు ఇప్పుడు ఈ కీర్తనలకు తిరిగి మనము వచ్చునప్పుడు, నా యొద్ద ఇయ్యబడిన కొన్ని ప్రకటనలు ఉన్నవి. ఇప్పుడు కీర్తనలు 99.

8"ఇకమీదట నుండి, గుడారములో (బ్రెన్హాం టాబర్నికల్ లో) జరుగు అన్ని కూటములు, మరియు బయట జరుగు కూటముల యొక్క వివరములు జెఫర్సన్-విల్ నందుండు కార్యాలయము నుండి ప్రకటింపబడును. కూటములను గురించి తెలుసుకొనగోరువారు ఈ రోజు రాత్రి ఆరాధన ముగించిన వెంటనే వారి పేరు, చిరునామా వ్రాసి ప్రసంగ పీఠముపై పెట్టవలయును. కూటములకు మీరు సకాలములో హాజరగుటకు వీలుగా మీరు ముందుగానే సిద్ధపడుటకు గాను ఒక నోటీసు లేక మీటింగుల వివరములు మీకు పంపబడును." మరియు మీలో ఎవరైన, మేమెక్కడ కూటములు నడుపుదుమని తెలిసికొనగోరిన ఎడల, ఇప్పుడు ఆ కార్యాలయములో మరొక పద్దతి ఏర్పరచబడిన ప్రకారము, మీ పేరు, చిరునామా ఇక్కడ యిచ్చిన ఎడల, ఎక్కడ కూటములు జరుగునని మీకొక కార్డును సకాలములో పంపబడును, మీకొక అవకాశము కలిగిన ఎడల పాఠ్యా౦శములు మరియు ఇతర వివరములు, చూడుడి. ఒకవేళ మీకు అధికారపూర్వకముగా అటువంటి సమాచారము రాకున్న ఒకరేమో దీనిని మరి ఇంకొకరు దానిని చెప్పిన ఎడల మరి మీరు దానిని పొందలేకపోయిన, మీరు చూశారా. కావున మీ పేరు మరియు చిరునామా వ్రాసి ఇక్కడ ఉంచుడి, మరి బిల్లీ పాల్ వాటిని తీసి, మీకు కావలిసిన కార్యక్రమముల వివరములను అందించును.

9ఇప్పుడు, ఈ విధముగనూ అడుగబడినది, ఇంకనూ ఏదైనా… "బ్రెన్హాం సోదరుడా, గుడారములో మీరు ఇంకేదైనా వివేచించు స్వస్థతా ఆరాధనలు జరుపబోవుచున్నారా?" లేదు! లేదు, శోధించుట లేక వివేచించుట మా యొక్క సంఘ సభవలన ఇవ్వబడును. ప్రవచన వరము కలిగిన సోదరుడు నెవిల్ ను ఇప్పుడు మేము కలిగియున్నాము, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రవచించి, వారు తెలుసుకొన వలసిన అవసరమైన కార్యములను వారికి తెలియపరచును. మరియు మనము హిగ్గిన్ బోతమ్ అను పేరు గల సహోదరుడు ధర్మకర్తలలో ఒకరు సభ్యులలో విశ్వాసపాత్రునిగా సేవ చేయువానిని కలిగియున్నాము. ఈ రోజు ఉదయము అతనిని నేను చూడలేదు, అయితే అన్య భాషలలో మాట్లాడు వరమును అతను కలిగి యున్నాడు, మరియు ఒక మర్యాదస్తురాలైన స్త్రీ పేరు ఆర్గన్ బైట్, ఒక మంచి సోదరి, భాషలతో మాట్లాడు దానిని అర్ధము చెప్పగల వరము కలిగి యున్నది.

10మరియు ఈ వర్తమానములు దేవుని యొద్ద నుండి వచ్చినవని నిరూపింపబడుచున్నవి, ఏలయనగా అవి అక్రమముగా (తారుమారుగా) రాకుండ, అవంతయు ఒక క్రమములో అమరియున్నవి. మరియు ఈ వరములన్నియు పోగు చేయబడుచుండగా, సంఘము యొక్క పద్దతి ప్రకారము అవన్నియు మరల అక్కడ క్రమముగా పెట్టబడుచున్నది. మరియు నేను అతి త్వరలో దేవుని యొక్క క్రమము ప్రకారము ఆ కూటములన్నియు సంపూర్ణముగా ఏ లోపము లేకుండ నడుపబడుట చూడబోవుచున్నాను, మరియు మనము దానిని సరిగా గైకొనిన ఎడల.

నా యొక్క పొరుగువారైన శ్రీమతి. ఉడ్ అయితే వీరు ప్రియమైన జనులని చెప్పును, ఆమె ఇక్కడ మైక్రోఫోను అమర్చి, అక్కడ జరుగు కూటములను టేప్ చేయును, ఎందుకనగా ఆ వర్తమానములను టేప్ చేసిన పిదప, వాటిని వ్రాసి మరియు అది సరియా, కాదా అని చూచును, చూశారా. ఆమె ఆ విధముగా వాటిని (వర్తమానములను) పరిశోధించును. శ్రీమతి ఉడ్ నమ్మకము గల మంచి స్త్రీ అని నాకు తెలియును, మరియు నెరవేరిన సందర్భములను ఆమె నాకు ముందుగానే చెప్పియన్నది.

11ఇప్పుడు, దాని కొరకు మనము కృతజ్ఞలుగా ఉన్నాము. అదెట్లు నాకు శ్రమ తగ్గించును, నా స్వగృహములో అప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు. ఆ ప్రవచించుచు, వివేచించు లేక శోధించు కార్యములు నన్ను చాలా కృంగదీసినవి, మరియు అందువలననే దాని కొరకే నాకు శ్రమ తగ్గించుటకు దేవుడే నాకు వీటిని పంపెను, ప్రవచించుట ద్వారా, అన్య భాషలలో మాట్లాడుట, మరియు భాషలకు వ్యాఖ్యానము చెప్పుట (అర్ధము చెప్పుట) అది ప్రవచనమే - అది ప్రవచనమే, భాషలలో మాట్లాడుటకు… ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ప్రవచించెదరు. ఒకరు మాటలాడెదరు, ఇంకొకరు ఆ అన్య భాషలలో ఇంకొకతను పలికిన దానిని అర్ధము చేసి కొనుటయే, ఖచ్చితముగా ప్రవచనము.

12మరియు ఇప్పుడు, మనము ప్రతిరోజు, ఇక్కడ జరుగు ప్రతి కూటములోను మనకు ప్రార్ధన వరుసలు కలవు. ఇప్పుడు ఎవరో ఒకరు వరములను గురించి అడిగెదరు. అవును, నేను వాటిని ఇంకను కలిగి యున్నాను, అయితే వాటిని ఉపయోగించు ఒకే మార్గము నేను వ్యక్తిగతమైన ఇంటర్వ్యూలను కలిగియున్నప్పుడు మాత్రమే. మరియు వాటిని పొందుటకు (అక్కడ నోటీసు పలకపై దానిని ఉంచి యున్నారు) అనుమతి పొందుటకు, క్రమముగా మీ వేళను సమకూర్చుకొనుటకు నా కుమారుడైన బిల్లీ పాల్ ఇక్కడైనను, ఈ కూటములైన పిదపను, ఎక్కడైనను, బిల్లీ పాల్ ఇచ్చు చిన్న కార్డు మీరు పొందియుండ వలయును. ఒకవేళ మీరు అర్థము చేసికొనలేని కార్యములు మీ జీవితములో ఉండవచ్చును, దానిలో నుండి ఎట్లు విడిపించు కొనవలెయునో తెలియకపోవచ్చును, మరియు మీరు దేవుని యొక్క జ్ఞానమును వెదుకుచుండవచ్చును, అట్లయిన, అప్పుడు కార్యదర్శి, నా కుమారుడైన బిల్లీ పాల్ ను కలవ౦డి. మరియు అప్పుడతను ఒక చిన్న కార్డును మీకిచ్చును మరియు మీ తేదిని, వేళను నిర్ణయించును. మరియు అప్పుడు అటువంటి ఇంటర్వ్యూ వేళలో మీరు నేను మాత్రమే ఉందుము, అప్పుడు మేము కలిసి వెళ్ళుదుము, కేవలము నీవు మరియు నేను. (ఒక వేళ స్త్రీలు వచ్చిన ఎడల, నా భార్యతో కూడ వచ్చి - నేను, మీరు మరియు నా భార్య ఉండెదము.) మీరేమి చేయవలెనో ప్రభువును అడిగి, వెదకి కనుగొనెదము.

NUM 11:25

 

13మరియు ఇతర చిన్న కార్యములు, చిన్న సమస్యలు మరియు ఆలాంటివి సోదరుడు నెవిల్ దగ్గరను, సోదరుడు హిగ్గన్ బోతమ్ మరియు సోదరి ఆర్గన్ బైట్ మరియు ఇతరులు అన్య భాషలలో పలికి దానికి అర్థము చెప్పలేక వ్యాఖ్యానించు ఈ సంఘములో ఉన్న వారి యొద్ద ఇవ్వబడును.

అందువలన ఈ యాత్రను మనము ఇష్టపడుచున్నాము. యిత్రో అని నేను అనుకొనుచున్నాను. ఒక రోజు మోషేతో చెప్పెను, చూశారా, "కొంతమంది పెద్దవారిని మనలో తీసికొని…" మరియు మోషేలో ఉన్న దేవుని ఆత్మను తీసి ఆ డెబ్బది మంది పెద్దలపై ఉంచబడెను, మరియు వారు ప్రవచించిరి. అయితే పెద్ద మరియు కఠినమైన కార్యములు మోషే యొద్ద మాత్రమే వచ్చుచుండెను. ఇప్పుడు, మనము మోషే కాదు, ఈ పెద్దలు కాదు, అయినను మనము ఇంకనూ యెహోవా దేవుని సేవించుచున్నాము, అదే అగ్నిస్తంభము, మనలను వాగ్ధాన భూమికి నడిపించుచున్నది. కావున అప్పుడు, అవును, ఇతర కూడికలు మరియు వ్యాఖ్యానములు - శోధించుట (హృదయ రహ్యసములను పరిశోధించుట) వచ్చును. అటువంటివి నేను ప్రార్థనలో గడిపి, అభ్యసించుటకు ఒక అవకాశమును ఇచ్చును, మరియు నాకు తెలియును, ఆ ఇంటర్వ్యూలు వచ్చునప్పుడు, దాని కొరకు నేను సిద్దముగా ఉండవలయును.

ఇప్పుడు గుర్తుంచుకొనుడి, బిల్లీ పాల్ బ్రెన్హాం, వేర్వేరు ప్రాంతాలలో జరుగు కూటములను పరామర్శించు కార్యదర్శి… ప్రకటన పలకపై ధర్మకర్తల ద్వారా వ్రాయబడియున్నవి. నా యొద్ద ఒక చిన్న చీటి ఉన్నది, అదేమనగా జనులు బయటికి వెళ్ళునప్పుడు వారు ఆ ప్రకటన పలకపై వ్రాసియున్న కార్యక్రమముల వివరములు చదువుకొని వెళ్లమని, వారికి ప్రకటించమని చెప్పబడియున్నది.

14ఇప్పుడు, ఈ ఉదయము మనకు ఒక గొప్ప పాఠము కలదు, మరియు ఈ రాత్రి కూడా దానినే సాగించెదము, మరియు ప్రభువు చిత్తమైన ఎడల రాబోవు ఆదివారము, ఇంకొక వారము కూడా దానిని కొనసాగించెదము. దానిని చదువుటకు లేక లోతుగా ధ్యానించువరకు, అదెంత లోతైన కార్యమని, ఎంత దృఢముగా ఆ పాఠము పోవునని నాకు తెలియదు. మరియు ఇంకను, ఇప్పటికిని నాకది మర్మముగానే యున్నది. కావున మరి నేను దేవునిపై ఆధారపడి యున్నాను.

PS 99:1

 

15ఇప్పుడు, మీరు మీ యొక్క బైబిలును, కీర్తనలు తొంభై తొమ్మిది - 99 త్రిప్పెదము. మరియు నేను మొదటి వచనము చదివెదను, కూడియున్నవారు రెండవ వచనము చదువ వలయును, మరల మన మందరము కలసి చివరి వచనమును చదువుకొనెదము. మనము అట్లే కొనసాగించెదము: నేను మొదట వచనము, సంఘము రెండవది, నేను మూడవ వచనము, సంఘము నాలుగు, అట్లే చివరి వచనము వరకు; మరియు అటు పిదప చివరి వచనము, అందరు కలసి చదువు కొనెదము. దేవుని వాక్యమును చదువుచుండగా మనము లేచి నిలువబడెదము,

యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును ఆయన కెరూబుల మీద ఆసీనుడై యున్నాడు భూమి కదులును.

సీయోనులో యెహోవా మహోన్నతుడు జనములన్నిలటి పైన ఆయన హెచ్చియున్నాడు భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు.

యధార్దతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచి యున్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి యున్నావు.

మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి; ఆయన పరిశుద్ధుడు.

ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను వారు యెహోవాకు మొర్రపెట్టగా, ఆయన వారి కుత్తర మిచ్చెను.

మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాటలాడెను: వారు ఆయన శాసనముల ననుసరించిరి, ఆయన తమ కిచ్చిన కట్టడను వారనుసరించిరి.

యెహోవా మా దేవా, నీవు వారికుత్తర మిచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతికారము చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి.

మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ద పర్వతము ఎదుట సాగిలపడుడి.

16మనము మన తలలు వంచెదము. నిజముగా ప్రభువా, ఈ వాక్యములు నీ దాసుడైన దావీదు ద్వారా కూర్చబడి మరియు మీ కొరకు ఒక కీర్తనలుగా వ్రాయబడియున్నవి. మీరు కెరూబుల మధ్య నివసించుచున్నారు. మీరు పరిశుద్దుడు, మరియు నీ పర్వతము కూడా పరిశుద్దమైనది. ప్రభువైన యేసు రక్తముతో మా హృదయములు ప్రోక్షింపబడి మీకు సమీపముగా రానిమ్ము, మరియు శుద్దమైన మనస్సాక్షితో విశ్వాసము, మరియు నమ్మికతో, మా దేవుని యొక్క సముఖమునకు వచ్చుచున్నాము. ఇక్కడున్న ఈ శ్రోతలందరు ఈ ఉదయము భయభక్తులతో ఉండనిమ్ము. విని, అర్ధము చేసికొనులాగున మా చెవులను తెరువుము. ఈ దినములలో మరియు నీ సముఖములో మేము ఏ విధముగా ప్రవర్తించవలయును అను కార్యములను మీ జ్ఞానముతో మాతో మట్లాడుము.

MATT 6:9•

MATT 24:15•

MARK 13:14

 

17నిజమైన, అతి పవిత్రమైన వాక్యములను మేము సమీపించుచుండగా, మా దేవా, గడిచిన ఈ సంవత్సరములన్నిటను మరుగైయున్న ఈ రహస్యమైన కార్యములను మాకు బయలు పరచమని మిమ్ములను అడుగుచున్నాము. మీరు ఈ భూమిపై ఉన్నప్పుడు, దానిని గురించి మీరు చెప్పియున్నారు, మరియు చెప్పారు, "చదువుచున్నవాడు, దానిని గ్రహించును గాక." కావున మేము ఏమి చెప్పవలయునో తెలియక, దేవా నీ దయతో నీ చెంతకు వచ్చి, మరియు నీ జ్ఞానమును పొందగోరుచున్నాము. ఇక్కడ కొన్ని లేఖనములు క్రమముగా అమర్చబడి యున్నవి, మరియు పవిత్రముగా, పరిపూర్ణముగా వాటి యొక్క జవాబుకు మీపై ఆధారపడి యున్నాము, మరియు అది ఏ ఇతర ఉద్దేశము కొరకు కాదు, అయితే మేము జీవించు ఈ సమయమును తెలుసుకొనుటకు, మరియు మాకు ముందు పెట్టబడియున్న ఆ కార్యములకు మేము సిద్దపడుటకు గాను మీ దయను కోరి మీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువా, మీరు దానిని మాకు అనుగ్రహించరా? ఈ విధముగా ప్రార్ధి౦చ వలయునని మనకు ఎవరు బోధించినారో మరి ఆయన యొక్క నామములో: [ప్రభువు యొక్క ప్రార్థనను సంఘ సభ్యులందరు కలసి ప్రార్ధించిరి".]

పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ద పరచబడును గాక; నీ రాజ్యము వచ్చును గాక;

నీ చిత్తము పరలోక మందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక.

మా అనుదినాహారము నేడు మాకు దయ చేయుము.

మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించియున్న ప్రకారము మా అపరాధములు క్షమించుము.

మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పింపుము. ఏలయనగా రాజ్యమును, శక్తియు, మహిమయును మీరై యున్నారు.

మీరు కూర్చొనవచ్చును.

18మరియు ఇప్పుడు పురుషులలో ఎవరైనను మీ కోటను విప్పుకొన గోరిన, ఆ విధముగా మీరు చేయవచ్చును (వేడిగా ఉన్నందువలన). మరియు గోడల ప్రక్కన నిలుచుకొనియున్న వారికి, మీకు కాళ్ళ నొప్పి పుట్టిన ఎడల, మీరు బయటకు వెళ్ళుటకు స్వతంత్రము కలదు.

మరియు ఇప్పుడు, నేను అనుకొనుచున్నాను చిన్న బిడ్డలు వారి గదులలోనికి పోవలయునని కోరిన… లేక వారు ఇంతకు ముందే వెళ్లిపోయారా? సంఘ కాపరి చెప్పుచున్నాడు అన్ని గదులలోను జనుల నిండిపోయి నందువలన, చిన్న పిల్లలకు ఆదివారపు పాఠశాల జరుపబడలేదు. మరి చిన్న పిల్లలు మాతో ఈ ఉదయము సహకరించిన మేము సంతోషపడెదము, ఏలయనగా మనకు చాలా గొప్పదైన వర్తమానము ప్రారంభించబడనున్నది, అది నిశ్చయముగా మీ తల్లి, తండ్రులకు, ఇక్కడున్న మీ యొక్క ప్రియులకు మరియు ఒక గొప్ప కార్యముగా ఉండును. కావున దానిని మనము భయభక్తులతో సమీపించెదము.

19ప్రభువు చిత్తమైన ఎడల, ఈ ఉదయము దానియేలు యొక్క డెబ్బది వారములు అను పాఠమును మనము తీసికొనబోవుచున్నాము. మరియు ఈ ఉదయము దానియేలు చెరలో ఉన్న కార్యములు, మరియు గబ్రియేలు ఎగిరి వచ్చి భవిష్యత్ కాలమును గురించి సలహా నిచ్చుటను గురించి మనము మాటలాడ బోవుచున్నాము. దానియేలు ప్రార్ధి౦చుచుండగా, దూత అయిన గబ్రియేలు అతనికి సలహానిచ్చుటకు వచ్చెను. ఈ రాత్రికి నేను మాట్లాడదలచినది, "అతడు దర్శించుటలో గల ఆరు ఉద్దేశములు." ఆ ఆరు రకములైన వేర్వేరు విధములైన పాఠములతో గబ్రియేలు ఎందుకొరకు పంపబడెనో దానిపై ఈ రాత్రి తీసికొని రావలయునని యున్నాను.

రాబోవు ఆదివారము, ప్రభువు చిత్తమైన ఎడల ఏడు సంఘ కాలముల యొక్క ఉద్దేశము, దాని కాలములు, మరియు అవి ఏయే కాలములనియు, మరియు మనమెక్కడ నిలచియున్నామో అనే కార్యములను (మీ ముందు) ఉంచనుద్దేశించియున్నాను. ప్రభువు చిత్తమైన యెడల, రాబోవు ఆదివారము.

20ఇప్పుడు దీనికి కారణమేమనగా… గడిచిన కొన్ని వర్తమానముల నుండి నేను గుర్తుంచుకొనుటకు కొన్ని చిన్న అంశములను తీసికొని వచ్చియున్నాను. మరియు ఈ ఉదయము నేను చెప్పిన కొన్ని కార్యములను మరల కొద్దిగా నెమరు వేయవలెనని యున్నాను, ఏలయనగా ఈ వర్తమానము, మాగ్నెటిక్ టేపు ద్వారా రికార్డు చేయబడి ప్రపంచమంతటను, అనేక దేశములకు పోవును. మరియు నేను ఎందుకొరకు వెనుక చెప్పిన వర్తమానమును తిరిగి చెప్పుచున్నాననగా, ఒకవేళ ఎవరైన ఈ టేపును మొదటిసారిగా వినిన ఎడల నేను ప్రసంగించు కార్యమును ఏ అర్ధముతో చెప్పుచున్నానో మీకు అంతకు మునుపు కార్యములను గురించి తెలియని యెడల వారు ఇప్పటి పాఠ్య అంశమును గ్రహింపలేరు.

ప్రకటన గ్రంథమును మనము ఇప్పుడు అనేక నెలలుగా ధ్యానించుచున్నాము - యేసుక్రీస్తు యొక్క బయల్పాటు (ప్రత్యకత). సంఘ కాలములు మనకు ప్రసంగింపబడి యున్నది. ప్రకటన గ్రంధములోని మొదటి మూడు అధ్యాయములు సంఘ కాలములు, పిమ్మట యోహాను 4 మరియు 5వ అధ్యాయములలో పైకెత్తబడి (ఆత్మవశుడై) అతడికి చూపించబడెను. ఇప్పుడు వచనము మొదలుకొని, 19వ అధ్యాయము, 21వ వచనము వరకు, సంభవించు కార్యములను చూచుటకు 6వ అధ్యాయములో అతడు తిరిగి భూమిపైకి దించబడెను. దానిలో (6వ అధ్యాయము 1వ వచనము మొదలు, 19వ అధ్యాయము 21వ వచనము వరకు) ఏడు ముద్రలు, తెగుళ్ళు, శ్రమలు, మిడుతలు, సూర్యునిలో ఉండు స్త్రీ, ఎర్రని ఘటసర్పమును వెళ్ళగొట్టుట, 1,44,000 మంది ముద్రించబడుట మరియు ఈ కార్యములన్నియు అందులో నుండును.

21ఈ వారము అత్యున్నతమైన వాక్యము ధ్యాని౦చు వారమైయున్నది. నిన్నటి దినమంతయు నేను చదువుచు, ధ్యానించుచు, నా గదిని వదలి ఎక్కడికి పోలేదు. గడచిన కాలములో మరియు అదేదో కార్యము - ఇక్కడున్న అనేక మంది పాత విశ్వాసులు నేను ఈ విధముగా బోధించి యున్నాను, నేను ఇప్పుడు చెప్పియున్నాను, "దానియేలు యొక్క డెబ్బది వారములు గురించి ఇక్కడ సంబంధించి యున్నవి." అయితే దానిని గురించి తీవ్రముగా వివరించి చెప్పుటకు నేను ప్రయత్నించలేదు. అయితే ఈ సమయము, దేవుని దయవలన జనులకు దీనిని ప్రసంగించవలయునని నాపై ఆ యొక్క బాధ్యతను వేసికొని దేవుని ము౦దు ఆయన కృపను అడిగ ప్రయత్నించబోవుచున్నాను. మరిక్కడ నాకు కొద్దిగా కూడా, ఒక కార్యము కూడ తెలియని స్థితిలో, నేను ఆ యొక్క కార్యములను కనుగొనుచున్నాను.

22నేను, డాక్టర్ లార్కిన్స్ పుస్తకము, డాక్టరు స్మిత్ పుస్తకము, డాక్టర్ స్కొఫీల్డ్ ప్రసంగములు, అన్నిచోట్ల నుండి పలు విధములైన వ్యాఖ్యానములు, చదువుచున్నప్పటికిని, అయినను వాటన్నిటిని సమకూర్చినను సరైన భావము రాకున్నది, చూశారా. కావున ఈ వారము నేను నిర్ణయించుకొన్నాను… కెంటకీలో ఉన్న పుస్తకశాల, అక్కడున్న పురాతన పుస్తకములను వెతికి తీసి, క్యాలెండరు, కాలములు, వేళల యొక్క దానిని గురించిన ప్రాచీన జ్యోతిష శాస్త్రములన్నిటిని చదివి, నేనేమి చేయగలనో నా స్వల్ప స్థితికి తగినట్టు చేసి; ఇప్పుడు దానిని నాకు బయలు పరచుమని పూర్తిగా, పవిత్రముగా యేసు క్రీస్తుపై ఆధారపడి యున్నాను, ఏలయనగా "ఇది నాకు తెలియును, మరియు అది నాకు తెలియును అని నేను చెప్పుటకు ఇష్టపడుట లేదు. [ఆయనకు నా హృదయమును ఎరుగును; నేను చెప్పునదంతయు ఆయన వినుచున్నారు.]" అయితే ఆయన జనులకు దానిని నేను విశదపరచ వలయునని యున్నాను. అందువలననే ఆయన దానిని నాకిచ్చునని నేను నమ్ముచున్నాను. ఇప్పటివరకు నాకేమియు తెలియదు, అయితే రాబోవు ఆదివారమునకు ఆయనను నేను నమ్ముకొని యున్నాను, ఏలయనగా రాబోవు ఆదివారము అదొక గొప్ప పాఠ్యాంశమై యున్నది, ఆ డెబ్బది వారములను సరిగా తెలుసుకొని దాని స్థానములో నుంచుట.

ఒక్కొక్క దానికొక స్థానముండును. మరియు మీరు దానిని ప్రయత్నించిన అది అట్లే కొనసాగింపబడును, అది సరిగ్గా రాదు - సరైన భావము నియ్యదు - అదివ్వలేదు. మరియు అందువలననే, నేను దానిని సరిగా పొందలేకపోవచ్చును, అయినప్పటికిని దానికొరకు నేను ప్రభువు పై ఆధారపడి యున్నాను.

2CH 1:10

 

23మరియు నాకు జ్ఞాపకమున్నది సొలోమోను ఒకప్పుడు ప్రార్థించునప్పుడు మరియు ప్రభువైన దేవుని అడిగెను, తనకు ఆయన జ్ఞానము ఇయ్యవలెనని, తన కొరకు కాదు - అనేక దినములు పొడిగింపవలయునని కాదు దీర్ఘాయుస్సు కాదు, గొప్ప ఐశ్వర్యము కాదు - అయితే దేవుని బిడ్డలను న్యాయము తీర్చుటకు, వివేచించుటకు కావలసిన జ్ఞానమును అతనికుండవలయునని కోరెను. మరియు దేవుడు ఆ ప్రార్థనను గౌరవించి, ఆలకించి మరియు ఆ జ్ఞానమును సొలోమోనుకు ఇచ్చెను, ఏలయనగా అది ఆయన యొక్క జనుల కొరకై యున్నది. మరియు అందువలననే, ఈ దానియేలు యొక్క డెబ్బది వారములు అర్థమేమిటని నేను దేవునిని అడుగుచున్నాను, ఏలయనగా మనము జీవించుచున్న ఈ యొక్క కాలములో సరిగా మనము ఎక్కడున్నామని కనుగొనుటకు అదొక కాలెండర్, మరందువలననే నా కొరకు నేను దానిని తెలిసికొనవలయునని కోరలేదు, నేను… నా కొరకు కాదు గాని. అవును, నేను తెలుసుకొనవలయునని కోరుచున్నాను. "నా కొరకు కాదు," అని ఆ విధముగా నేను చెప్పుట లేదు, ఏలయనగా నా కొరకు నేను దానిని తెలిసికొనగోరుచున్నాను. నేనెందువలన తెలిసికొనగోరుచున్నాననగా, మనము ఎక్కడ జీవించుచున్నాము మరియు ఏ కాలములో జీవించుచున్నామో అని తెలిసికొనగోరుచున్నాను. మరప్పుడు అది ఇవ్వబడినదని నాకు తెలియును.

24మరియు ఒక్కొక్కరు వేర్వేరు విధములుగా దానిని చిత్రీకరించి యున్నారు, మరి వారు చాలా కాలము క్రిందట పొందియుండిరి…. నేను చదువుచున్నప్పుడు ఒకతను చెప్పెను డెబ్బది వారములు 1919లోనే ముగిసిపోయెనని. సరి, అది ఆ విధముగా కాదు. డెబ్బది వారములు ముగిసిన పిదప… డెబ్బది వారముల పిదప అంతయు ముగిసి పోవును. కావున మనము సత్యమును మనము తెలిసికొనగోరుచున్నాము, మరియు నాకు సత్యము నియ్యవలెనని నేను దేవునిని అడుగుచున్నాను.

REV 3:14

 

25ఇప్పుడు దీని వెనుక నేను ఏమి చెప్పితినో అని మీరు గ్రహించులాగున నేను ఇంతకు ముందు ప్రసంగించిన కార్యములను తిరిగి చెప్పవలయునని ఉన్నాను. కావున మనము చదివిన 5వ - 4వ మరియు 5వ అధ్యాయములో నేను కొన్ని కార్యములను టూకీగా వ్రాసికొని యున్నాను, దానివలన జనులు దానిని గ్రహించగలరు.

మొదటగా, దీనిని చేయు ముందు, నేను వాటిని ఒకదానిపై ఒకటి పెట్టెదను కావున మీరు నలుగవ దానితో పొందుకొందురు… ఇప్పుడు గుర్తుంచుకొనండి, మూడవ అధ్యాయము లవోదికయ సంఘ కాలము, మరియు లవోదికయ యొక్క అంతములో సంఘము పైకి ఎత్తబడినది.

26ఇప్పుడు, దానిని గురించి ఏదో కార్యమును నా భార్యకు వివరించుటకు నేను ప్రయత్నించుచుంటిని. మేము సేకరించగల పలు రకములైన నిఘంటువులను మేము కూర్చుకొని నా కుమార్తెయైన బెక్కితో, అవి బదులియ్యలేదు. బైబిలు నిఘంటువు నా యొద్ద కలదు. నా యొద్ద పాతకాలపు గ్రీకు నిఘంటువు కలదు. నా యొద్ద వెబ్స్టర్స్ మరి ఇతర అనేక నవీన నిఘంటువులు కలవు. వాటిలో ఏవియు సరైన వాక్యములు కలిగి యుండలేవు, సరైన జవాబు నియ్యలేవు.

నా భార్య చెప్పెను, "మన యొక్క జనులు, బీద ప్రజలైన వారు, మరియు వారిలో అనేకులు మనవలె చదువులేనివారు, దానిని అర్థము చేసికొనగలరని మీరెట్లు ఎదురు చూచెదరు?"

"దేవుడు బదులిచ్చును," అని నేను చెప్పాను. ఎంతట నీ కష్టమైన కార్యములనైనను, దేవుడు దానిని విశదీకరించి, సులభముగా గ్రహించులాగున చేయును. ఆ రోజు కొరకు, ఘడియ కొరకు ఎదురు చూచుచునుండు ఆ జనులలో మనమొక భాగమై యున్నాము, మరి మన కండ్లు పరలోకము వైపు చూచుచున్నవి, మరియు ఆయన రాకడ కొరకు మనము కాచుకొనియున్నాము. మరి నేను నిశ్చయముగా యున్నాను ఆయన మనకు చూపునని ఇప్పుడు అది ఆ రోజును గూర్చియైనను, లేక ఘడియ గురించైనను మనకు చెప్పబడలేదు, ఏలయనగా ఏ మనుష్యునికి దానిని గురించి తెలియదు, అయితే నిశ్చయముగా అది వారములో, ఏ రోజులో మనము జీవించుచున్నామని చెప్పును, మనము దానిని గ్రహించగలిగిన.

REV 3:14•

REV 4:2

 

27ఇప్పుడు 4వ అధ్యాయములో యోహాను సంఘము ముగిసిన వెంటనే ఆత్మవశుడై పైకెత్తబడెను. యోహాను పైకి పోవుచు సంఘ కాలములను పూర్తిగా చూచెను. అక్కడనే నేను నిలచి, ఒక సెకండు చెప్పవలయునని యున్నాను, అనేక జనులు ఏదో గొప్ప మహత్తర కార్యము అన్యజనుల కాలములో సంభవించునని ఎదురుచూచుట తప్పైన కార్యము. సంఘ కాలములో, అన్యజనుల పాలనలో నెరవేరు సంభవములన్నియు ప్రకటన 1 నుండి 3వ అధ్యాయము వరకు వీటిలో వ్రాయబడి యున్నవి. అటుపిదప సంఘము పైకెత్తబడును, మరియు ఇక్కడ నుండి ప్రకటన 19వ అధ్యాయము వరకు యూదులకు ఏమి జరుగుననియు, సంఘము (ఆయన వధువు) పైకెత్తబడిన పిదప, అదొక మహాశ్రమల కాలము, అన్యజనులలో ఏమియు జరుగదు, చంపబడుట మరియు ఆలాంటి కార్యములు, మనము ఇంకనూ ఈ వర్తమానమును ధ్యానించుచుండగా దానిని చూచెదము.

అయితే సంఘము మాత్రము 13లో పైకిపోవును… ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చివరి వచనములో కడపటి సంఘకాలమైన లవొదికయ సంఘ కాలము ముగించునప్పుడు.

28మరియు మనము ప్రతి సంఘ కాలమును తీసి ధ్యానించి యున్నాము, ప్రతి కాలము, సంభవించిన ప్రతి కార్యములు, ప్రతి నక్షత్రము, ప్రతి వర్తమానికుడు, వారి స్వభావము, వారేమి చేసియున్నారు, మరియు చరిత్ర నుండి ఆ కార్యములన్నిటిని ఒక్కొక్కటిగా తీసికొని వచ్చి కడపటి వారి కొరకు, ఆ ప్రక్క గోడలకు పైగా పటములు వేసి చిత్రించి చూపబడెను - మరియు మనము ముగించునప్పుడు, పరిశుద్దాత్మ లోనికి వచ్చి, గోడపై అదే కార్యమును గుండ్రముగా వేసెను, మరియు ఆయనే (దేవుడే) ఇక్కడ దానిని మనకందరికి బయలు పరచెను.

ఇప్పుడు, ఈ విధముగా చేయుటవలన, దీని చివర (ఆరాధన చివర) ఆయన ఒక మహా గొప్ప కార్యముతో వచ్చి మనము కడపటి కాలములో ఉన్నామని తిరిగి మనకు చూపించును.

MATT 24:44•

LUKE 12:40

 

29కెన్నడి చెప్పిన దానిని ఎంతమంది వినియున్నారు… అధ్యక్షుడు కెన్నడి ఉపన్యాసములో, ఆయన వ్యాఖ్యానములు మరియు అలాంటివి? అతడు జరుగబోవు కార్యములను ఊహించుట ఎందరు వినియున్నారు, జనవరి 1వ తేదీ లోపల యునైటెడ్ స్టేటర్స్ (అమెరికా) మరియు రష్యా అగ్నితో మండి బూడిద వలె అగునని ఎదురు చూడబడుచున్నది? మనకు కావలిసినది అదే. కావున మనము చాలా సమీపముగా ఉన్నాము, ఏలయనగా ఈ భూమిపై నున్న మనుష్యుడు కూడా ఈ మహా గొప్ప కార్యము సంభవింపనైయున్నదని అనుకొనుచున్నాడు, మనము మెలకువగా ఉండవలయును, అన్ని కార్యములు సరిగ్గా సరైన వేళలో జరుగుచున్నవి, మన తప్పులన్నియు ఒప్పుకొని, అన్నియును సిద్దముగా ఉన్నవి. ఏలయనగా మన ప్రభువు ఎప్పుడు మనలను పిలుచునో మనకు తెలియదు. మరియు "పైకి రమ్ము!" అని ఆయన పిలుపు నిచ్చిన వెంటనే, మీరు సిద్దముగా ఉండుడి. మీరు అనుకొనని వేళలో అది రాబోవుచున్నది.

30పెంతెకోస్తు యొక్క గొప్ప పునరుద్దరణ ఇప్పుడు ముగించబడుచున్నది. ప్రతి చోటను మనము చూచుచున్నాము — చివరి గొప్ప కదలింపు. వర్తమానము బయలు వెడలియున్నది. ఇప్పుడు సమస్తమును సిద్దపడి కాచుకొనియున్నది. సంఘము ముద్రించబడి యున్నది. దుర్మార్గులు ಇಂకను దుర్మార్గులు అగుచున్నారు. సంఘములు ఇంకను అధిక సంఘములుగా అగుచున్నవి. పరిశుద్దులు దేవునికి ఇంకనూ సమీపముగా వచ్చుచున్నారు. చిన్న చిన్న గుంపులలో ఆత్మ యొక్క ఫలములు అధికమగుచున్నవి. మనము చివరి కాలములో ఉన్నాము. ఓ, సంఘములో మనము అప్పుడప్పుడు పాడు పాటను నేను ఇష్టపడుచున్నాను.

ఆ ఆనందమైన వెయ్యేండ్ల పరిపాలన రోజు

వచ్చుటను గురించి నేను కాచుకొనియున్నాను,

అపుడు మన ఆశీర్వదింపబడిన దేవుడు వచ్చి

మరియు వేచియున్న ఆయన వధువును కొనిపోవును,

ఓ, నా యొక్క హృదయము,

ఆ యొక్క తియ్యని, విడుదల దినము కొరకు మొర్ర పెట్టుచున్నది, దప్పిగొనుచున్నది.

మన రక్షకుడు మరల ఎప్పుడు భూమికి తిరిగి వచ్చును.

(ఆ యొక్క వేళ కొరకు వేచియున్నాము.)

REV 5:5,7

 

31ఇప్పుడు 5వ అధ్యాయములో 5వ వచనములో, ఇంతకు మునుపు పాఠములో మనము చూచియున్నాము, ఆ సమీపబంధువుడగు (రక్త సంబంధముగల) విమోచకుని గురించి మనము ధ్యానించి యున్నాము, అది క్రీస్తే అని మనము కనుగొని యున్నాము. దానిని రూతుతో పోల్చబడి యున్నది. రూతు నిర్ణయించుకొనుట, రూతు సేవచేయుట, రూతు విశ్రాంతినొందుట. నిర్ణయించుకొనుట నీతిమత్వము; సేవచేయుట ఆమె తన్నుతాను సిద్దపరచుకొనుట, పరిశుద్ద పరచుకొనుట. విశ్రాంతి నొందుట అనగా పరిశుద్దాత్మతో నింపబడి పెండ్లి విందు వరకు కాచుకొనియుండుట. ఎంత చక్కగానున్నది!

సంఘము జాన్ వెస్లీ ద్వారా వచ్చెను, నీతిమత్వము నొందుట… లేక మార్టిన్ లూథర్, నీతిమత్వము నొందుట; జాన్ వెస్లీ ద్వారా, పరిశుద్దపరచబడుట, పెంతెకోస్తు కదలింపు ద్వారా పరిశుద్ద అభిషేకము; మరి ఇప్పుడు, విశ్రాంతి నొందుట, ఆమె ప్రభువు కొరకు కాచుకొని యుండుట. పరిపూర్ణముగా!

మన యొక్క సమీపబంధువుడగు విమోచకు, ఆయన న్యాయాధిపతిగా ఒక సింహముగా మారబోవునప్పుడు, ఆయనను ఒక గొర్రెపిల్ల అని వారు, (ఆ పెద్దలు) పిలుచుట సరియే. మీకు తెలియునా, ఆయన ఏడు ముద్రల పుస్తకముతో నున్న ఒక గొర్రె పిల్ల. ఆ పుస్తకము తీయబడినప్పుడు, మధ్యవర్తి యొక్క పని ముగించబడియున్నది.

32ఇప్పుడు, 3వ అధ్యాయములో, సంఘము పైకెత్తబడియుండును, అయితే ఇప్పుడు విమోచింపబడుట బయలుపడవలయును, ఏ విధముగా సంఘము విడిపింపబడెను, సంఘ కాలములలో ఏమి సంభవించినదన్న బయలుపాటు, చూశారా, సంఘము (వధువు) వెళ్ళిపోయి వుండును. కావున ఆయన 5వ అధ్యాయములో ఇప్పుడు చూపించుచున్నాడు, దానిని (విమోచనను) ఆయన ఎట్లు చేసియున్నాడని, ఏమి జరిగినదని, ఏ విధముగా సంఘమును ఆయన ముద్రించియున్నాడు. ఆయన యొక్క నామము బయల్పడుట, ఆయన నామములో నీటి బాప్తిస్మము, నిత్యజీవము, నిత్యనరకము లేదను కార్యము, సర్పము యొక్క సంతానము, నిత్యమైన భద్రత, ఆ గొప్ప బైబిలు సిద్దాంతములు, సంఘము జగత్తుకు పునాది వేయబడక మునుపే సంఘము యొక్క ముందేర్పాటు, ఇవన్నియు సంఘమునకు బయలు పరచబడి యున్నవి. దానిని ఆయన ఏ విధముగా చేసినారని ఆయన చూపించుచున్నాడు.

REV 5:7

 

33ఇప్పుడు, ఏడు ముద్రలు ద్వారా ముద్రించబడిన ఆ విమోచన పుస్తకము, సొంతదారుని నుండి, మనలను సమీపబంధువుడగు విమోచకుని చేతికి అప్పగింపబడెను. ఆమేన్! ఎవరు సొంతదారుడు ఎవరని మనము కనుగొని యున్నాము? దేవుడు తనకుతానే. "మరియు ఆ గొర్రెపిల్ల వచ్చి సింహాసనము నందు ఆసీనుడైయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను." ఆ గొర్రెపిల్ల ఎవరు? విమోచకుడు, మనలను విడిపించు సమీపబంధువుడగు విమోచకుడు, సంఘమును విడిపించు బంధువుడు, ఆయనే ఇశ్రాయేలును విడిపించినవాడు.

ఇప్పుడు, దానిని గురించిన కార్యము లోనికి ఈ ఉదయము మనము పొ౦దబోవుచున్నాము. ఇశ్రాయేలీయులు విమోచింపబడిరి, అయితే అది వారికి వర్తించలేదు (వారిపై ఆ విమోచన ప్రయోగింపబడలేదు) ఎందుకనగా ఆయనను వారు నిరాకరించిరి. అయితే సంఘము వారి యొక్క విమోచనను అంగీకరించినది. మరియు ఆయనే మన యొక్క సమీపబంధువుడగు విమోచకు - అన్యురాలు, మోయూబీయురాలైన రూతును పొందుటకు, బోయజు ఏ విధముగా నయోమిని విడిపించెనో — ఆలాగుననే క్రీస్తు ఇశ్రాయేలును విడిపించినను, విమోచనను వారిపై ప్రయోగించినను మరియు నిరాకరించబడినది.

34నేను అప్పుడప్పుడు చెప్పినది మీకు గుర్తున్నదా. అంతఃకలహముల సమయములో మంచివానిగా ఒక వ్యక్తి ఉండియు, అతడికి మన్నింపును ప్రసాదించినను అతడు కాల్చి చంపబడెను. అతడు నిరపరాధి, మరియు వారు అతనిని దోషిగా కనుగొనిరి. అతడు యుద్ద భూమి నుండి పరుగెత్తి పారిపోయినందువలన, అతడు ఒక విధముగా అపరాధే. మరియు వారు అతడిని దోషిగా కనుగొని, అతడిని కాల్చిచంపబోవుచున్నారు. మరియు ఒక వ్యక్తి, అధ్యక్షుడైన లింకన్ యొద్దకు వెళ్ళి మరియు చెప్పెను, "లింకన్ గారు, అతనొక క్రైస్తవుడు. అతడు బాలుడు వలె ఉన్నందున యుద్ద భూమిని చూచి భయపడెను. అతని యొక్క జనులను నేనెరుగుదును. అతను భయపడెను, అంతే. అతడు వేరే ఏ తప్పిదమైన అర్ధముతో ఆ కార్యము చేయలేదు. అతను పరుగెత్తి పోయెను." "శ్రీ లింకన్ గారు, అది మీ చేతులలో ఉన్నది. అతనిని మన్నించగల ఒకే వ్యక్తి మీరు మాత్రమే." శ్రీ లింకన్ గారు ఒక చిన్న కాగితపు ముక్కను తీసికొని, పెన్ను తీసికొని, "ఈ ఫలానా వ్యక్తి మన్నింపబడెను" అని వ్రాసి, అబ్రాహాము లింకన్ అని సంతకము చేసెను.

అతడు చెరసాలకు వేగముగా తిరిగి వెళ్ళి మరియు అతను చెప్పెను, "ఇదిగో అదిక్కడ, నీ యొక్క మన్నింపును నేను పొందియున్నాను."

35మరియు ఆ వ్యక్తి (ఖైదీ) చెప్పెను, దానివైపు చూచుటకు నిరాకరించుచున్నాను. దానిపై పెద్ద ముద్ర (అధ్యకుని ముద్ర) వేసియుండవలయును. అప్పుడే అది పరిపూర్ణమైన మన్నింపు కార్యముగా ఉండును. నన్ను నవ్వుల పాలు చేయుటకే నీవు ఆ విధముగా (ఒక కాగితపు ముక్కతో) చేయుచున్నావు. అది అబ్రాహాము లింకన్ కాదు. ఎవరైనను అబ్రాహాము లింకన్ వలె ఆయన చేవ్రాలు వేయ వచ్చును, అయితే అది ఆయన నుండి వచ్చి యుండిన ఎడల చక్కగా అతని ముద్ర, పేరు ముద్రించబడిన కాగితముతో, ఆయన ముద్రతో వచ్చియుండును." మరియు ఆ వ్యక్తి అతనిని ఎంతగానో సమ్మతింప జేయుటకు ప్రయత్నించెను, అయితే ఆ ఖైదీ అతనేదో ఆటలాడుచున్నాడని తలంచి అతని మాట వినకపోయెను. మరుసటి ఉదయము అతడు కాల్చిచంపబడెను. మరియు అతడు కాల్చిచంపబడిన పిదప అతడి మరణమును గురించి ఆ న్యాయ తీర్పు (విచారణ) జరిగెను; ఏలయనగా అతడు చనిపోవుటకు ఇరువది నాలుగు గంటలకు మునుపు, అతడు మన్నించబడి యున్నాడని అబ్రాహాము లింకన్ (అప్పటి అమెరికా దేశపు అధ్యకుడు) తన చేతి వ్రాత క్రింద ఒక కాగితపు ముక్కపై వ్రాసెను. అయినను ప్రభుత్వము అతడిని తుపాకితో కాల్చి చంపెను. అప్పుడు ఏమి? అమెరికా సంయుక్త రాష్ట్రముల న్యాయస్థానము చెప్పెను - ఆ న్యాయస్థానము ఇట్లు తీర్పు నిచ్చి చెప్పెను, "ఒక మన్నింపును అంగీకరింపని యెడల అది మన్నింపుగా వర్తించదు." ఆ అధ్యకుని మన్నింపును ఆ ఖైదీ నిరాకరించినందువలన, అది అతనికి మన్నింపుగా ఎంచబడలేదు."

36మరియు యేసు కల్వరిలో ఇశ్రాయేలీయులను విమోచించెను, అయితే అది వారికి మన్నింపుగా లేకుండెను, ఏలయనగా దానిని వారు మన్నింపుగా అంగీకరించలేదు. అయితే ఇప్పుడు మన డెబ్బది వారముల పాఠములో, వారు తిరిగి వచ్చి మరియు తను కొరకైన మన్నింపును అంగీకరించెదరు. అయితే ఆయన సంఘమును (వధువును) విమోచించెను. అట్లయిన మనము మన్నింపబడి యున్నాము, ఏలయనగా యేసు క్రీస్తు రక్తమును మన మన్నింపుగా (ప్రాయశ్చిత్తముగా) మనము గైకొని, అంగీకరించి యున్నాము.

REV 20:10

 

37ఇప్పుడు, మనము చూచుచున్నాము ఆయన మనలను విడిపించు సమీపబంధువుడగు విమోచకు, మరియు ఆ సొంతదారుని చేతి నుండి ఆయన ఆ పుస్తకమును తీసికొనెను. అది ఒక విమోచించిన దస్తావేజు, దానిని మనము చూచియున్నాము. దానిని గురించి మనము ధ్యానించిన కార్యములు మీకు జ్ఞాపకము ఉన్నవా? అది విమోచించు దస్తావేజు (హక్కును స్థిరపరచు పత్రము). అది ఒక అధికార ప్రమాణము, దానితో దేవుడు మరణమునకు ప్రతిగా జీవమును కోరుచున్నాడు. అప్పుడు ఏదెను తోటలో, నీతిమంతుడైన యేసు, మరణించి మరియు దస్తావేజును తీసికొని, ముద్రలను విప్పగలిగి, వాటిలో ఏమున్నదని తెలిపి, ఆయనకు చెందిన వారసత్వమును తన జనులకు ఇచ్చెను. దానిని చేయుట వలన ఆయన పొందిన వారసత్వము నిత్యజీవము. ఆయన తన యొక్క జీవమును అక్కడ కల్వరిలో అర్పించి, పరిశుద్దాత్మ ద్వారా దానిని మన మధ్యలో భాగించెను. ఆమేన్! ఏ మనుష్యుడు ఆయన చేసినట్టు చేయలేదు - ఆయన చేసిన విధముగా, ఆ ప్రేమను ఎవ్వరు గ్రహించి చూచుటకు కూడ వీలు కాదు.

సైతాను, ఆ తోటలో (ఆదాము) పాపమువలన పడిపోయినందువలన, సమస్తమును తన ఆధీనములో ఉంచుకొనెను, అతడిప్పుడు కట్టబడి అగ్నిగుండములో త్రోయబడును. అతని దినములు ముగిసినవి.

38సువార్తలో యేసుకు నాలుగు బిరుదులు కలవు, దానిని మనము కనుగొని యున్నాము: దావీదు కుమారుడు, సింహాసనమునకు వారసుడు; అబ్రాహాము యొక్క కుమారుడు, రాజరికపు సంతతిలో నుండి వచ్చినవాడు; మనుష్య కుమారుడు, ఈ భూమికి వారసుడు; దేవుని కుమారుడు, సమస్తమునకు వారసుడు, రాజరికపు సంతతి.

పాత్ర నిబంధనలో, ఏబది సంవత్సరములకు పైగా ఆస్తిని ఎవరు ఉంచుకొనకూడదు. ఏబది సంవత్సరములు ముగియక మునుపు అది దాని యొక్క యజమానుని యొద్ద నుండి వశపరచుకొనుటకు వీలుపడదు. మరియు ఆ నలువదియవ రోజున ఆయన దాని క్రయమును చెల్లించెను. ఏబదియవ దినమున, సంఘమునకు చెందిన ఏదెను తోటలో కోల్పోయిన, విమోచనను మరియు శక్తిని మరల విడిపించి మరియు యాభైదియవ దినమున పరిశుద్దాత్మ అభిషేకము ద్వారా మనకు తిరిగి పంపబడినది.

JER 32:8,14

 

39మరల మనము ఆ కాగితపు చుట్టను తీసికొని యున్నాము. ఆ కాగితపు చుట్టను మనము చూచియున్నాము, ఏ విధముగా ఆ కాగితపు చుట్ట ఆయన చేతికి అప్పగింపబడినది, ఏ విధముగా ఆ యిర్మీయా, యిర్మీయా 32:6లో అతని తండ్రి తోడబుట్టిన వాని కుమారుడగు హనమేలు, అతని దగ్గర కొంత వారసత్వపు భూమిని విడిచి మరియు వారు చెరపట్టబడి కొనిపోబడుదురు - ఈ ఉదయము దానిలోనికి మనము పోబోవుచున్నాము - చెరపెట్టబడుట. మరియు అది ఒక మట్టి కుండలో దాచి పెట్ట బడెను; ఇది దేనిని సూచించుచున్నదనగా మన హృదయాంతరంగములోనున్న దేవుని శక్తిని ఎక్కడున్నదన్న దానిని, మరియు కాగితపు చుట్టలు, మరియు దేవుని యొక్క మర్మయుక్తమైన విషయములను ఉంచుటను ఇది సూచించుచున్నది. మన యొక్క విమోచన ఏర్పాటు, అది ఒక మట్టి కుండలో పెట్టబడెను — యేసు యొక్క నామమును మరియు ప్రత్యక్షతను.

REV 5:1

 

40ఇదంతయు ఏడు ముద్రలతో ముద్రింపబడి యున్నదనియు, మరియు ఒక్కొక్క ముద్ర ఒకదానిపై ఒకటి చుట్టబడి యున్నదనియు మనము కనుగొనియున్నాము. మరి (దానిని గురించిన) బయలు పాటు వచ్చుచుండగా, ఆయన ఆ ముద్రను లాగెను, దానిని తెరచెను, మరి ఆ ముద్ర ఏమి చెప్పుచున్నదో చదివెను, అటుపిదప తదుపరి ముద్రను ఆయన తెరచెను, ఆ కాగితపు చుట్టవలె, ఉన్న దానిని విప్పి ఆ ముద్ర ఏమి చెప్పియున్నదో చదివెను, అట్లే ఇంకొక ముద్రను విప్పి, మనము త్వరలో ధ్యానించనైయున్న మన ఏడు ముద్రలను గురించిన కార్యము సరిగా ఆ విధముగా యుండును, మనము నమ్ముచున్నాము అది చేయునని. ఒక్కొక్క ముద్ర ఎత్తినప్పుడు ఆ పుస్తకము విప్పబడి మరి ఏమి సంభవించినదనే దానిని అది చూపించుచున్నది.

అక్కడ ఏమి ఉన్నదని మనము చూచుచున్నాము. విమోచన ప్రణాళిక ఏడు కార్యములున్నవి. ఏడు ఆ సంఖ్య అక్కడ ఐదు, ఏడులున్నవి: ఏడు ముద్రలు, ఏడు ఆత్మలు, ఏడు దూతలు, ఏడు బూరలు మరియు ఏడు సంఘ కాలములు. కావున మీరు గమనించిన ఐదు, ఏడులు కృపయై యున్నది. ఐదు కృపకు గుర్తు మరియు ఏడు పరిపూర్ణతను సూచించుచున్నవి. కావున అది పరిపూర్ణముగా, సరిగ్గా, ఖచ్చితముగా సమస్తము సంభవించుచున్నవి, చూశారా. అది సరి.

REV 10:1,2,6

 

41దేవుని వాక్యములోనున్న ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు, ఏ కాలములో మనము జీవించుచున్నామని, ఆ కాలముల యొక్క ఆత్మను గురించియు, ఆ సంఘ కాలమును గురించియు, ఆ కాలపు వ్యక్తికి (దూతకు దేవుని వాక్యము) బయలుపరచబడును. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము, ఆ కడపటి ముద్ర తెరువబడునప్పుడు, చివర మనము చూచుచున్నాము, ఆ దూత సముద్రము మీద ఒక పాదము, ఇంకొక పాదము భూమి మీదను మోపి, ఆయన చేతులు ఆకాశము (పరలోకము) తట్టు ఎత్తి, మరియు ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సుండెను, సదాకాలములు జీవించువాని తోడని ఒట్టు పెట్టుకొని, ఆ ఏడవ ముద్రలో ఇక ఆలస్యముండదు అనుట మనము కనుగొనుచున్నాము. మరియు మీరు ఆ ముద్రలకు మనము పోవు వరకు వేచి యుండుడి. మనమిప్పుడు చూడుడి ఆ ముద్రలు ఎక్కడున్నవని. మీరు డెబ్బది వారములు చూచిన పిదప, అప్పుడు ముద్రలు ఏ స్థానములో ఉన్నవనే దానిని చూడండి. ఇక ఆలస్యముండదు. విమోచన సమాప్తమై యున్నది. ఆయన ఇప్పుడు సింహము మరియు న్యాయాధిపతి. ఈ రోజు ఉదయము ఆయన మీ రక్షకుడు, అయితే ఒక రోజు ఆయన మీకు న్యాయాధిపతిగా ఉండును.

REV 5:12,13

 

428 నుండి 14 వరకు - 5వ అధ్యాయములో 14వ వచనములో, పరలోకములోను మరియు భూలోకము లోను గొర్రెపిల్లను స్తోత్రించుచుండు ఆ సమయమును బయలు పరచుచున్నది, ఏడు ముద్రల పుస్తకము, అర్హతగల గొర్రెపిల్ల, విడిపించు సమీపబంధువుడగు విమోచకు. మరియు 8వ వచనము మొదలు 14 వచనము వరకు దూతలు ఆయనను ఆరాధించుచున్నారు, పెద్దలు ఆయనను ఆరాధించుచున్నారు, ప్రతి జీవించు సృష్టియు ఆయనను ఆరాధించుచున్నవి, మరియు యోహాను ఈ విధముగా చెప్పులాగున ఆయనను ఆరాధించెను, "పరలోకములోను, భూమిలోను, భూమి క్రిందను ఉన్న సమస్త సృష్టియు ఇట్లు చెప్పగా వింటిని, 'రాజైన గొర్రెపిల్లకు స్తోత్రములు, మహిమయు, శక్తియు, జ్ఞానము కలుగును గాక.'" — రాజైన గొర్రెపిల్లకు ఆరాధన సమయము

DAN 9:1-4

 

43ఇప్పుడు, గుర్తుంచుకొనుడి, సంఘము పైకెత్తబడి యున్నది. ఇప్పుడు, చదివెదము దానియేలు పుస్తకము 9వ అధ్యాయము, 1వ వచనము మొదలుకొని 3వ వచనము, మరియు అటుపిదప 20వ వచనము మొదలు 27 వచనము వరకు మనము తీసికొన బోవుచున్నాము, ఏలయనగా ఇది దానియేలు యొక్క ప్రార్థన. ఇప్పుడు దీనిని గ్రహించు వరకు ఈ వాక్యములను, మరల, మరల మీరు చదువవలెనని నేను కోరుచున్నాను.

మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్వావేషు కల్ధీయుల పైన రాజాయెను.

అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియగుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని.

ఇప్పుడు, అటు తరువాత.

అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యొదుట నా మనస్సును నిబ్బరము చేసికొంటిని.

… నేను నా దేవుడైన యెహోవా యెదుట ప్రార్థన చేసి యొప్పుకొన్న దేమనగా: … [మరి ఈ ప్రార్థన అట్లే 20వ వచనము వరకు కొనసాగింపబడును.]

DAN 9:20-23

 

44జనులు నిలుచుకొని యుండగా, సమయమును మిగుల్చుకొనుటకు ఇప్పుడు 20వ వచనమునకు పోయెదము.

నేను ఇంక పలుకుచు ప్రార్థన చేయుచు, పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా యెదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని.

నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా, మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను.

అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను - దానియేలూ, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని.

అక్కడ మనముండిన ఎట్లు౦డును ఆయనను ఎట్లు అతను కనుగొనెను? ప్రార్ధనలో, దూత, మనుష్యుడు. మీరు గమనించిన, ఆయనను అతడు (దానియేలు) "మనుష్యుడు" అని పిలిచెను.

నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు, ఈ సంగతిని నీకు చెప్పుటకై నేను వెళ్ళవలెనని ఆజ్ఞబయలు దేరెను; కావున ఈ సంగతిని తెలిసికొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము.

తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతమువరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ద స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ద పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడెను

అతని (దూత) రాకడలో గల కారణము ఆ ఆరు ముఖ్యమైన ఉద్దేశములే.

ఇప్పుడు గమనించుడి, యెరూషలేమును మరల కట్టించ వచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచ వీధులను కందకములును మరల కట్టబడును.

ఈ అరువది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ద ఆలయము నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ద కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను.

అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధ వారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును.

45ఇప్పుడు రాబోవు మూడు, నాలుగు లేక ఐదు కూటములకు ఇదే మన పాఠము, దేవుడు ఏమి బయలుపరచునో. డెబ్బది వారములు!

ఇప్పుడు, నేను డాక్ ను అడగబోవుచున్నాను, అతనికి వీలైన ఈ రాత్రికి నా యొక్క పలకను అక్కడ తగిలించ వలయునని, అందువలన దానిలో నేను గుర్తులు చెప్పుటకు వీలుగా ఉండును. దానినిప్పుడు మీరు వదలకూడదని నేను మిమ్ములను కోరుచున్నాను. మీరు నాతో కూడా చదువవలెను, చాలా లోతుగా గనునించవలయును, లేనియెడల మీరు పోగొట్టుకొనెదరు. మరియు నేను ఆ బోర్డ్ పై నేను వ్రాయవలయునని యున్నాను, మరియు మీరు ఈ తేదీలను, ఈ కాలములను వాటిని గురించిన అన్ని కార్యములను గుర్తుంచుకొనుటకు వీలుగా మీ పెన్సిళ్ళను, కాగితములను తీసుకొనిరండి.

ఇప్పుడు, డెబ్బది వారములు, (దీనినిప్పుడు గ్రహించుడి) సంఘము పైకెత్తబడిన పిదప ప్రారంభమగును. దానిని అర్థము చేసికొనిన వారందరు ఇప్పుడు "ఆమేన్!" అని చెప్పుడి. ఇప్పుడు, సంఘము పైకెత్తబడిన పిదప…

REV 6:1•

REV 19:21

 

46ప్రకటన 6:1 నుండి ప్రకటన 19:21 డెబ్బది వారములతో జతపరచబడియున్నది, అందువలన మనము ముందుకు వెళ్ళకమునుపు ఇక్కడ నిలిచి దీనిని వివరింప వలసి యున్నది. ఇక్కడ మనము నిలిచి ఈ డెబ్బది వారములు ఎందుకొరకని వివరించ వలసియున్నది, ఏలయనగా దీనిని మీరు గ్రహింపకున్న ఎడల, ఆ ఏడు ముద్రలను మీరు వదలివేయుదురు, ఆ బూరలను వదలి వేయుదురు, ఆ పాత్రలను, వదలి వేయుదురు, ఆ తెగుళ్ళును, ఆ మూడు కప్పల వలె ఉన్న అపవిత్రమైన ఆత్మలను, ఆ మూడు అయ్యోలను, ఆ ఎర్రని ఘటసర్పమును వెళ్ళగొట్టుట, సూర్యునిలో ఉండు ఆ స్త్రీ. ఈ డెబ్బది వారములలో ఇక్కడే ఈ కార్యములన్నియు సంభవించుట వలన, మీరు సరిగా గ్రహింపకున్న ఎడల పైన చెప్పినవన్నియు మీరు వదలి వేయుదురు. అక్కడే ఇదంతయు సంభవించుచున్నవి.

JER 25:11

 

47ఇప్పుడు, దానియేలు ప్రవక్త బబులోనులో అరవై-ఎనిమిది సంవత్సరములు ఉండెను - మీరు సమయమును మిగుల్చుకొనవలెనని అనేక గుర్తులను వ్రాసుకొనగోరిన యెడల - అరవై-ఎనిమిది సంవత్సరములు. క్రీస్తు పుట్టక మునుపు 606లో అతను చెరపట్టబడెను. మరియు అతనికి వచ్చినప్పుడు క్రీస్తు పూర్వము 538; 538, 606 నుండి అరవై-ఎనిమిది. అరవై-ఎనిమిది సంవత్సరములు అన్యజనులైన విగ్రహారాధికుల మధ్య అతను బబులోనులో ఉన్నప్పటికిని, అతను జయమును పొందెను. ఆమేన్! మనము ఒక గంట కూడా అక్కడ ఉండలేము.

అయితే అతడు ఎవరి మధ్యను లేక మూడు శూరుల మధ్య ఉండెను, వారు వేర్వేరు భాగములందు ఆ రాజ్యములో ఉండిరి. అయితే దానియేలు దేవునితో తాను మాత్రమే వేరుగా నిలిచి, అరవై-ఎనిమిది సంవత్సరములు విజయమును కాచుకొనెను. దానిని గురించి ఆలోచించుడి! నేను ప్రసంగించుటకు మొదలుపెట్ట కోరుటలేదు, ఏలయనగా ఇది ఒక బోధించు వర్తమానమై యుండవలసినది. అయితే అతడు ఆ జయమును అరవై ఎనిమిది సంవత్సరములు కాచుకొని, దేవుని ముందు తనను అపవిత్రపరచు కొనక, పరిశుద్దాత్మ యొక్క అభిషేకము లేక, తన కొరకు మధ్యవర్తిత్వము చేయు యేసుక్రీస్తు యొక్క రక్తము లేక, ఎద్దులు, మేకలు, మరి పెయ్య వీటిని అతడు రహస్యముగా బలినివ్వవలసి యుండెను; ఏలయనగా ఆ దేశము యొక్క మూడ విగ్రహారాధన పర్యముల వలన. అక్కడికి వారు చెర పట్టబడికోనిపోబడిరి. వారు ఆ విధముగా పోయెదరని యిర్మీయా ప్రవచించెను.

JER 25:11•

DAN 9:2

 

48ఇప్పుడు దానియేలు (ఓ, మై!) అతడు కాలము సమీపించుచున్నదని చూడగలిగెను, ఈ రోజు మనము ఎదురుచూచువలె, పుస్తకములు (లేఖనములు) చదువుట ద్వారా అతను అర్థము చేసికొనగలిగెనని అతడు చెప్పెను. మరియు దానియేలు మొదటి సంవత్సరము ఏలుబడిలో… ఏలుబడిలో … .

దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియగుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని.

యిర్మీయా క్రీ.పూ. 606లో, వారి యొక్క పాపముల వలన మరియు భక్తిహీనత వలన డెబ్బది సంవత్సరములుందురని ప్రవచించెను.

JER 28:3,6,15

 

49ఆ రోజులలోనే ఇంకొక ప్రవక్త లేచియుండెను మీకు గుర్తున్నదా. (ఈ సమయములో అతని పేరును నేను చెప్పలేను. ఇంకొద్ది నిమిషములలో తిరిగి చూచి దానిని మీకు చెప్పెదను.) అయితే అతను లేచి చెప్పెను, "యిర్మీయా నీవు తప్పుగా ఉన్నావు. దేవుడు కొన్ని రోజులు మాత్రమే ఇశ్రాయేలీయులను అక్కడ పెట్టును - కొన్ని దినములే - ఇంచుమించు రెండు సంవత్సరములు."

యిర్మియా చెప్పెను, "అలా జరుగును గాక. ఆమేన్!" ఆయన చెప్పెను, "అయితే ఒక్క క్షణమాగుము. నీవు నేను ప్రవక్తలుగా ఒకరినొకరు పరిశోధించుకొనెదము." ఆయన చెప్పెను, "గుర్తుంచుకొనుము, మనకు మునుపే ప్రవచించిన వారున్నారు, మరియు వారు తప్పైన కార్యములను చెప్పియున్నారు. వారు తప్పైన కార్యములను చెప్పినందులకు గాను దేవుడు వారిని మొత్తియున్నాడు. కావున మనము నిశ్చయమైతే గాని ప్రవచింపకూడదు. అయితే ప్రభువు నాతో చెప్పియున్నాడు, ఇంకను డెబ్బది సంవత్సరములు ఉన్నవని అదే సంవత్సరములో దేవుడు ఆ అబద్దపు ప్రవక్తను మొత్తి అతని ప్రాణమును తీసెను, ఏలయనగా దేవుడు ఆ నిజమైన ప్రవక్తకు చెప్పెను - డెబ్బది సంవత్సరములు ఉన్నవని.

JER 25:11

 

50మరియు మీరు దీనిని గమనించవలయునని కోరుచున్నాను, ఏ విధముగా దానియేలు పరాధీనములో ఉన్నను, తన జనుల మధ్య నుండి వేరుపరచబడినప్పటికిని, తన సంఘము నుండి వెళ్ళగొట్టబడినప్పటికిని, ఒక సంఘ ఆరాధన లేకుండ, ఆరాధించుటకు ఏ సంఘము లేకుండ, ఏ విధమైన పాటలు పాడుటకు వీలుకాక, అయితే తనకు తానే పాటలు పాడుకొనుచుండెను, వీటన్నిటికి మధ్యను ప్రవక్త ఏమి చెప్పియున్నాడో దానిని పట్టుకొని యుండెను. ఆమేన్!

వెళ్ళుటకు ఏ సంఘము లేదు, ఐక్యతకు ఎవరు లేరు, ప్రతి యొక్కరు అన్య దేవతల ఆలయములకు వెళ్ళుచుండిరి, ప్రతియొక్కరు వారి విగ్రహములను ఆరాధించుచుండిరి, ఏ క్రైస్తవ గీతములు లేవు, అతను చేయు కార్యములను ఎవరు నమ్మలేదు, మరియు ఆ అరవై-ఎనిమిది సంవత్సరములలో, పన్నెండు - పధ్నాలుగు సంవత్సరముల ఆ చిన్న ప్రాయము నుండి, అతనక్కడ చెరపట్టి కొనిపోబడినది మొదలు, అతను దేవుని విడువక సత్యముగా నుండి మరియు యిర్మీయా ప్రవక్త వలన ఆ దినములు నెరవేరి సమాప్తమగుచున్నవని గ్రహించెను. ఈ కార్యములన్నియు ఏ ఒక్క నిజమైన దీర్ఘదర్శి యొక్క హృదయమును ఏ విధముగా హెచ్చరిస్తుందని, దానిని మనము వెనుకకు తిరిగి చూచి, ఈ నిజమైన దీర్ఘదర్శి ఏమి చెప్పుచున్నాడనే దానిని గ్రహించి, మరియు మనము చివరి కాలములో ఉన్నామనే దానిని తెలుసుకొనవలయును.

అతడు చెప్పెను, "నా సహోదరుడగు యిర్మియా అనేకనేక సంవత్సరములకు మునుపు ఇశ్రాయేలీయులు ఇక్కడ డెబ్బది సంవత్సరములు ఉందురని (బబులోను దేశపు చెరలో - తెలుగు తర్జుమాదారుడు) మరియు ఆ సమయము నెరవేరుచున్నదని నేను పుస్తకముల ద్వారా గ్రహించియున్నాను." మరియు అతడు తనను సిద్దపరచుకొనెను, ఉపవాసముండి, మరియు తనను పరిశుద్ద పరచుకొని, మరప్పుడు - బూడిదను, తన తలపై వేసికొని గోనెపట్టు కట్టుకొని మరియు ఉపవాసముతో ప్రార్ధించుచు ఏ దినములలో వారు జీవించుచున్నారో అని అర్థము చేసికొనుటకు ప్రయత్నించెను.

51మరియు దేవుని యొక్క ప్రవక్తయైన దానియేలు, యిర్మీయా పుస్తకములను పరిశీలించెను, ఇశ్రాయేలీయులందరు జీవముతో ఉండి, బయటికి వచ్చుటయు, బబులోను నుండి బయటికి వచ్చి తిరిగి తమ స్వదేశమునకు పోవుటయు, అనే కార్యములను గ్రహించినప్పుడు, అది అతడిని (దానియేలును) బూడిదను పోసుకొని, గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండేలా చేసియుండినప్పుడు, జీవించు దేవుని యొక్క సంఘము, కాలము గతించుచున్నదని, ఇక ఆలస్యముండదని, మరియు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాకడ, ఆ గొప్ప వెయ్యేండ్ల పరిపాలన సమీపముగా ఉన్నదని గ్రహంచి మరియు ఏ విధముగా ఎంత అధికముగా వీటికై కార్యములను చేయవలసి ఉండవలయును? మనమెట్లు జూదమాడుటకు సమయము వృధాపరచుచున్నాము, ఆది వారములలో ఈత కొట్టు ఆటలు, అయితే ప్రభువు కొరకు సమయము లేదు. మీకు ఇష్టము లేని కార్యములను సంఘకాపరి చెప్పిన ఎడల మీరు లేచి బయటికి వెళ్ళిపోయెదరు. అధిక సమయము ఆరాధన జరిగిన యెడల, మీరు సంతృప్తి పడక యుందురు. మన యొక్క స్థితిని గమనించుడి. మనమేమి చేయుచున్నామో చూడుడి. ఆ యొక్క ప్రవక్తతో (దానియేలుతో) మన జీవితములను పోల్చిచూచుకొనుడి. ఒకే ఒక వ్యక్తి ఆ రాజ్యమంతటిలో, పోవుటకు సంఘము లేదు వేరెక్కడికి పోవుటకు అవకాశము లేదు. అది చింపబడి మరియు కాల్చివేయబడినది. అతని పట్టణము, అతని జనులు చెరపట్టబడి, అరవై-ఎనిమిది సంవత్సరములు అరవై-ఎనిమిది, అరవై-తొమ్మిది, డెబ్భది ఇంకను రెండు సంవత్సరములు మిగిలి యున్నవి.

HEB 13:8

 

52కావున అతడు నెరవేరు సమయము సమీపించుచున్నదని చూచినప్పుడు దానిని గురించి తెలిసికొనుటకు ప్రార్థన ద్వారా దేవుని యొద్దకు పోయెను, మరియు అతను పుస్తకములను చదువుటకు ప్రారంభించెను. ఎటువంటి సమయమది! రాజ్యములు పడిపోయి, చీలిపోవుచున్నవి (ఒక రాజ్యముపై ఇంకొక రాజ్యము), సముద్రము గర్జి౦చుచున్నది, మనుష్యులకు భయము వలన గుండె పోటు, కలవర పెట్టు దినములు, ఈ కార్యములన్నియు, గోడ మీద చేతివ్రాత, జాతులు విడదీయబడుచున్నవి (జాతి కలవరములు), సమస్త విధములైన నీచ కార్యములు ప్రపంచములో జరుగుచునే యున్నవి, మరియు అనవసరమైన రచ్చలు, జగడములు, మరియు అల్ల కల్లోలములు, హేంగర్లలో ఆయుధములు వ్రేలాడదీయబడుచున్నవి. ఇక్కడున్న క్యూబా అంత పరిమాణములో ఉన్న ఆ చిన్న రాజ్యము, ప్రపంచమును పది నిమిషములలో సర్వనాశనము చేయగలుగును, ఇన్ని కార్యములు సంభవించుచుండగా మనమేమి చేయుచున్నాము? మరియు ఒకరితో ఒకరు జగడములు, రచ్చలు పెట్టుకొనుచున్నాము, దేవునిని గురించియు, ఆయన శక్తిని గురించియు తెలియని భక్తిహీనులు. మరియు పరిశుద్దాత్మ సంఘములో ఎన్నుకొనబడిన వారి మధ్య కదలాడుచున్నది, రెండు వేల సంవత్సరములకు తరువాత కూడా ఆయన జీవించియున్నాడని చూపించుచున్నది, ఆయన నిన్న, నేడు, మరియు యుగ యుగములు మారనివాడైయున్నాడని చూపించుచుండగా మనమేవిధముగా బద్ధకస్తులుగా ఉండగలుగుచున్నాము? దానిపై (అక్కరలేక) మనమెట్లు పరుగెత్తుచున్నాము? ఆ యొక్క గొప్ప వేళ సమీపించుచుండగా, ఇది మనలను మనము పరిశోధించు కొనవలసిన సమయమై యున్నది.

JER 25:8,11

 

53ఇప్పుడు, అతను యిర్మీయా 25వ అధ్యాయములో చదివెను. యిర్మీయా ఏమి చెప్పదలచెనో, మనము యిర్మీయా 25వ అధ్యాయము త్రిప్పి మరియు చదివెదము. వాస్తవముగా మనము 8వ వచనము నుండి ప్రారంభించెదము, ఏలయనగా అది… మీరు దానిని సరిగా గ్రహించవలయునని నేను కోరుచున్నాను. నేను 11వ వచనము మొదలు చదువవలయునని వ్రాసియుంచుకొనియున్నాను, అయితే మనము 8వ వచనము నుండి మొదలిడెదము.

సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు; [ప్రభువైన దేవుడు సెలవిచ్చుచున్నాడు? అను దానితో ఒక ప్రవక్త లేచి పలుకుటను నేను వినినప్పుడు దానిని నేను ఇష్టపడెదను. సహోదరుడా అది అంతే. నాకు దానితో కార్యము ముగిసినట్టే. దాని కార్యమంతయు అదే.] సైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు;

మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వ జనములను, నా సేవకుడైన నెబుకడ్నజరను బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశము మీదికిని దీని నివాసుల మీదకిని చుట్టునున్న ఈ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను, ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మయాస్పదముగాను అపహస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను… [గుర్తుంచుకొనుడి, వారు దేవునిచే ఎన్నుకొనబడిన జనులు, వారిని గురించియే ఆయన చెప్పుచున్నాడు. వారు నాస్తికులు కారు వారు సంఘ సభ్యులు.]

సంతోష నాదమును, ఉల్లాస శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును తిరుగటి రాళ్ళ ధ్వనిని ద్వీప కాంతిని వారిలో ఉండకుండ చేసెదను… [ఈ రోజులలో మనకున్న విధముగా రాక్ అండ్ రోల్ డాన్స్ లు, రిక్కీ మరియు ఎల్విస్ మరియు ఓ…]

ఈ దేశమంతయు పాడుగా నుండును…

ప్రవక్త కేకవేయుటను వినుడి, "దేశమంతయు పాడుబడును." ఈ యొక్క గొప్ప దేవుని సేవకుని అనుసరించుట కాదు గాని, అయితే ఈ యొక్క దేశమంతయు పాడుబడునని నేను ప్రవచించుచున్నాను. ఆమె పాపముల కొరకు దేవుడు ఈ దేశమును శిక్షించును. దేవుడు ఇశ్రాయేలీయులను వదలలేదు, ఆయన ద్వారా ఎన్నుకొనబడిన, అబ్రాహాము యొక్క సంతతి, వారితో ఆయన ఒక ఒడంబడిక చేసి మరియు దానితో వాగ్దానము చేసియుండెను, (వారు హృదయములో భక్తిగల వారిగా ఉన్నప్పటికిని, గొప్ప ఆలయములు కలిగియున్నప్పటికిని, ఆ మత గురువులు, మరియు బోధకులుగా ఉన్నప్పటికిని…) దేవుడు వారిని శిక్షింపక వదలలేదు, ఏలయనగా పాపమైన కార్యములు వారి మధ్య ఉండెను, మరి దేవుడు వారేమి విత్తినారో దానినే వారు కోయులాగున చేసెను, కావున దానినే మనము పొందెదము (ఆ విధముగా నుండిన ఎడల) మనము దీనిలోని భావమును గ్రహించగలరు

11వ వచనము:

ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, [వారిని గమనించుడి మరి చెప్పబడియున్న, వారక్కడ, "వారు చాలా గొప్పగా నుండిరి ఇప్పుడు వారిని చూడుడి."]; ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. [అది జీవిత కాలమంతయు. అప్పుడు మీ యొక్క సొంత ఆశీర్వదింపబడిన వృద్దాప్య తల్లి ఒక చిన్న బిడ్డగా నున్నప్పుడు. వారక్కడ దేవుడు లేకుండ ఉండిరి, సంఘము లేకుండ ఉండిరి, పాటు లేకుండ ఏమియు లేకుండ ఒక తరమంతయు అక్కడే ఉండిరి, ఆ పాపము చేయుచున్న ఆ తరమంతయు మరణించు వరకు.]

యెహోవా వాక్కు ఇదే - డెబ్బది సంవత్సరములు గడచిన తరువాత, వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్ధీయుల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగ నుండునట్లు నియమింతును,

నేను ఈ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నియు యిర్మీయా ఈ జనములన్నిటిని గూర్చి ప్రకటింపగా, ఈ గ్రంథములో వ్రాయబడినదంతయు ఈ దేశము మీదికి రప్పించెదను.

ఏలయనగా నేను వారి క్రియలను బట్టియు వారి చేతి కార్యములను బట్టియు వారికి ప్రతీకారము చేయునట్లు అనేక జనములును మహా రాజులును వారిచేత సేవ చేయించు కొందురు.

ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకీలాగు సెలవిచ్చుచున్నాడు - నీవు ఈ క్రోధపు మధ్య పాత్రను నా చేతిలో నుండి తీసికొని, నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికి దాని త్రాగింపుము.

[ఇంకొక విధముగా చెప్పవలయుననిన, "యిర్మీయా ఈ వర్తమానమును నేను నీకు ఇచ్చి యున్నాను. ఊరకుండకుము. ఒకే చోటు నుండకుము, అయితే అన్ని దేశములకు ప్రవచింపుము." దీనిని నీవు గ్రహించుచున్నావా. "అన్ని దేశములకు ప్రవచింపుము. నా యొక్క సూచనలు మరియు అద్భుతములు వారికి చూపించుము, మరియు నేను వచ్చి దీనిని చేయబోవుచున్నానని మీరు తెలిసికొందురు గాక."]

వారు దాని త్రాగి, సొక్కి, సోలుచు నేను వారి మీదికి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రి వాండ్రగుదురు.

54ఈ యొక్క దినమున వారేమి చేయుదురు? వారు నిన్నొక అబద్దపు ప్రవక్త అనెదరు, అన్నిటితో రాజీ పడెదవని నిన్ను అనెదరు, ఒక మూఢభక్తి గల వారనెదరు, సోదె చెప్పువాడనెదరు, లేక స్వప్నములను కనేవాడని, లేక మనో భావములను గ్రహించు శక్తి గలవాడని నిన్ను పిలిచెదరు. "వారు పిచ్చి వారగుదురు." మరియు "పిచ్చి" అన్న పదమును, మీరు విరచిన ఎడల దాని అర్ధము "వెర్రితనము," చూడబోతే వారే వెర్రిగల వారై మరియు చెప్పెదరు, "హా, ఆ పరిశుద్ద దొర్లే వారిని గమనింపకుడి, అదంతయు తెలివిలేని వెఱ్రితనము." "ఏలయనగా నేను వారి మీదికి పంపుచున్న వాక్యమును బట్టి వెర్రివాండ్రగుదురు."

JER 25:17

 

55చరిత్ర మరల తిరగబడుటను మీరు చూచుచున్నారా? యిర్మీయా వారి యొక్క పరిస్యయ్యులతో, సద్ధూకయ్యలతో, హేరోదీయులతో, వారెవరైనను వారితో ఒప్పుకొనకుండెను. అతడు వాక్యమును బయట పెట్టెను, మరియు అది అందరు అతనిని పిచ్చివాడని చెప్పులాగున చేసెను. ఏమి? ఇప్పుడు గమనించుము:

అంతట యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసికొని, యెహోవా నన్ను పంపిన జనములన్నిటిని దాని త్రాగించితిని. [యిర్మీయా ఇంటిలోనే కూర్చుండి యుండలేదు. ఒక చోటునే యిర్మీయా నిలువ లేదు, అయితే దానిని అన్ని దేశముల చేత త్రాగించెను.]… వారి కొరకే ప్రభువు నన్ను పంపెను.

JER 25:11,17

 

56ప్రభువు యొక్క వాక్యమును యిర్మీయా తీసికొని, ఆయన యొక్క వాక్యమనే మద్యము మరియు మద్యము అనునది ఆయన వాక్యములో గల శక్తి, మద్యమునకు ఒక శక్తి గలదు. మద్యము, మత్తు కలుగజేయును. మద్యమునకు దాని వెనుక శక్తి గలదు. "మరియు దేవుని యొక్క వాక్యమును నేను గైకొనియున్నాను," మరియు అది బయలుపడెనని యిర్మీయా చెప్పెను. మద్యమును, దానిలో ఉన్న ఆ శక్తిని, వారి ముందు ప్రయోగించితిని, మరి దానిని వారు వినక పోయిరి. "అప్పుడు బబులోనుకు నేను వారిని డెబ్బది సంవత్సరములు పంపెదనని," దేవుడు చెప్పెను. ఆయన చేసిన కార్యమదే. నీతిమంతులును, దుర్మార్గులును ఇరువురును అదే విధముగా పోయిరి.

57ఇప్పుడు, తిరగి పాఠమునకు వచ్చెదము. దానియేలు చదువుచుండెను. ఊరికే తలంచి చూడుడి. ఈ ఉదయము మనము చదువుచున్న ఇదే వాక్యములను దానియేలు చదివెను. మనము కడపటి కాలములో ఉన్నామని మీకు చూపు అదే కార్యమును, దేవుని సహాయము వలన రాబోవు వర్తమానములలో నేను మీకు చదవబోవు అదే కార్యములను, అదే వచనములను, అదే గురుతులను, అదే పరిశుద్ద గ్రంథమును దానియేలు చదివెను. మరియు దానియేలు యిర్మీయా దగ్గర నుండి వాక్యమును గైకొని, బబులోనుకు పోయెను మరి అతను అభిషేకింపబడిన ప్రవక్త [టేపుపై ఖాళీ కలదు.] వారి మధ్య అద్భుతములు, అయినను, తానొక్కడే ఒంటరిగా నిలచెను. ఆమేన్! అతడు ఒంటరిగా నిలచెను.

JER 25:12

 

58అయితే యిర్మీయా అనేక, అనేక సంవత్సరములకు మునుపు ఈ వాక్యములను వ్రాసెను, అప్పుడు దానియేలు వాక్యమును వాఖ్యాన్యపరచి - చెప్పెను, "ఇప్పుడు ఒక్క నిమిషమాగుము, మనము చివరి కాలమునకు వచ్చి యున్నాము, ఏలయనగా ఇక్కడే నేను ఇదివరకే అరవై-ఎనిమిది సంవత్సరములుగా ఉన్నాను. మరియు దేవుని యొక్క ప్రవక్త [ఆమేన్!], నా సోదరుడా, తానొక ప్రవక్త అని తనను తాను నిరూపించుకొన్న నిజమైన దేవుని ప్రవక్త, మనకు ప్రవచించెను. నేను వ్రాసియుంచుకొన్న ఒక పుస్తకములో అది చెప్పుచున్నది, "డెబ్బది సంవత్సరములు సమాప్తియగును." కావున ప్రభువైన దేవుడా, మేము అంతమునకు సమీపించుచున్నాము. ఆ సంతతి అంతయు మరణించి యున్నది. ప్రభువా, ఇప్పుడు మీరేమి చేయబోవుచున్నారు? మా కొరకు పంపించెదరని మీరు వాగ్దానము చేసియున్నారు…" మరియు అతడు ప్రార్థించుటకు తన్ను తాను సిద్దపరచుకొనెను.

59ఓ దేవుడా, ఎప్పుడైనను మమ్మును మేము క్రమపరచుకొని మరియు ప్రార్ధింపవలసియుండగా, అది ఇప్పుడే. ఏలయనగా వేుము నీ యొక్క నిజమైన దాసులుగా, మేము చివరి దినములలో ఉన్నామని అపొస్తులుల యొక్క పత్రికల ద్వారా చూచుచున్నాము, పరిశుద్దాత్మ యొక్క హెచ్చరికల ద్వారా చూచుచున్నాము, పరిశుద్దాత్మ పలుకుచున్నది కడపటి దినములలో మనుష్యులు మూర్ఖులుగా, గర్వాంధులుగా, దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారై, అనురాగ రహితులుగా, అతిధీ ద్వేషులుగా, అపవాదకులుగా, అజితేంద్రియలుగా, క్రూరులుగా, మరియు సజ్జన ద్వేషులుగా నుండెదరు. పత్రికల ద్వారా నేను వాటిని గ్రహించియున్నాను.

ISA 3:16•

ISA 40:3•

JER 23:1-4•

MAL 4:5,6•

MATT 24:7•

MARK 13:8•

LUKE 21:10,11,25,26•

2TIM 3:3,4•

2PET 2:1•

2PET 3:3

 

60చివరి దినములలో పరిహాసకులు వచ్చెదరని నేను గ్రహించియున్నాను. కడపటి దినములలో రాజ్యము పైకి రాజ్యము లేచునని నేనెరిగియున్నాను. చివరి దినములలో సముద్రపు అలలు ఉండునని నేను గ్రహించియున్నాను. ఎగిరే పళ్ళెములు లాంటి భయంకరమైన ధృశ్యములు, ఆకాశములో మర్మమైన దృశ్యములు, మనుష్యుల హృదయములు భీతితో కృంగిపోతు, కలవరపరచు సమయమై మరియు ప్రజల మధ్య దుర్ఘటనలను నేను గ్రహించియున్నాను. చివరి దినములలో వారందరు సంఘశాఖలకు మరియు సంఘస్థాపనములకు వెళ్ళుచు, సంఘము యొక్క కట్టుబాటును ఏర్పరచుకొందురనే దానిని గురించి నేను చదివియున్నాను. చివరి దినములలో స్త్రీలు వెంట్రుకలు కత్తిరించుకొందురు అని నేను గ్రహించియున్నాను. వారు పొట్టి దుస్తులను ధరించి, మరియు ఎత్తైన చెప్పులతో, వయ్యారము ఒలక బోయుచు, టింగు టింగు మనుచు కడపటి దినములలో పోయెదరని నేను గ్రహించియున్నాను. చివరి దినములలో నీతి చాలా తక్కువ స్థాయిలో ఉండునని నేను గ్రహించియున్నాను. చివరి దినములలో వాక్యపరిచారకులు (ప్రసంగీకులు) అబద్దపు కాపరులుగా ఉండి, అన్నిటితో రాజీపడి, దేవుని వాక్యమును ప్రజలకు పోషింపక, అయితే దానికి బదులుగా సంఘశాఖలు, సిద్దాంతములు ఆ కార్యములకు తట్టుకు పోయెదరని నేను గ్రహించియున్నాను. అయితే నేను గ్రహించియున్నాను, చివరి దినములలో ఒక స్వరము వచ్చును, అరణ్యము నుండి కేక వేయును, ఆది వర్తమానము వైపుకు జనులను పిలుచును, తిరిగి దేవుని యొక్క కార్యములకు త్రిప్పును. పుస్తకము ద్వారా, ఆ కార్యములన్నియు సంభవించ బోవునని నేను గ్రహించియున్నాను.

AMOS 8:11,12•

MAL 4:5,6

 

61నేను గ్రహించియున్నాను, కడపటి దినములలో కరువు సంభవించునని, సంఘములన్నియు శాఖలుగా కలసి ఈ విధమైన ఏర్పాటులో అమర్చబడును, కడపటి దినములలో ఒక కరువు వచ్చును మరియు అది రొట్టెకు నీళ్ళకు మాత్రము కాదు, అయితే దేవుని యొక్క నిజమైన వాక్యము వినుటకు కరువు ఏర్పడును. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి మరియు దక్షిణము నుండి, దేవుని వాక్యము వినుటకు వెదకుచు పోయెదరు. అయితే సంఘ శాఖలన్నియు వారు వినుటకు వీలుకాకుండునట్లు అన్నిటిని బంధించి వేయుదురు. పుస్తకముల ద్వారా దానిని నేను గ్రహించియున్నాను. అయితే ఆ దినమున, ఓ దేవుడా, దావీదు నుండి ఒక కొమ్మ చిగురించినను.

మలాకి 4:5,6

ఆయన (దేవుడు) కడపటి సమయములో, ఆ దినము రాక మునుపు ఏలియాను పంపునని నేను గ్రహించియున్నాను, పిల్లల యొక్క హృదయుమును, తండ్రుల వైపు త్రిప్పు వర్తమానమును అతడు కలిగి యుండును, ఆది (మూల) వర్తమానమునకు త్రిప్పి అంతిమము వరుకు తిరిగి వెళ్ళి మరియు మళ్ళి ప్రారంభించును. ఆత్మ అన్యజనుల సంస్థలో మునుపు విడచి తిరిగి యూదుల యొద్దకు పోవుటకు మునుపు అది సంభవించునని నేను గ్రహించియున్నాను.

REV 11:3

 

62నేను పత్రికల ద్వారా మాత్రము కాదు, వాక్యము ద్వారాను, వ్రాయబడిన వాక్యము వలనను, ఇశ్రాయేలు ఆమె యొక్క స్వదేశమునకు తిరిగి వెళ్ళునని నేను గ్రహించియున్నాను. మరియు ఆమె లోనికి ప్రవేశించుట నేను చూచుచున్నాను.

ప్రవక్తల యొక్క పత్రికల ద్వారా ఇశ్రాయేలు ఒక స్వతంత్ర దేశముగా అగునని నేను గ్రహించియున్నాను. ఆలయ ఆరాధన వారు తిరిగి నెలకొల్పెదరు. ఆమె తన స్వదేశమునకు తిరిగి వచ్చినప్పుడు మరియు దేవుడు ఆమెతో మరల వ్యవహరించును. ఓ! వారితో కడపటి దినములలో ఇరువురు ప్రవక్తలు లేచెదరు. దానిని నేను గ్రహించియున్నాను. అన్యజనుల సంఘము పోయిన వెంటనే, ఇరువురు ప్రవక్తలు ప్రవేశించెదరు, ఇశ్రాయేలుకు ఏలియా, మరియు మోషే మనము పాఠములోకి పోవుచుండగా దానిని గూర్చి ధ్యానించెదము.

అక్కడ బబులోనులో కాలము సమీపించినదని ప్రవక్తలు చూచి యున్నారు. అది సరి.

63అతను (దానియేలు) అడిగిన దానిని మాత్రము బయలుపరచుటకు గబ్రియేలు దర్శించలేదు, అయితే యూదుల సంతతికి చివరి వరకు ఏమి జరుగవలయునని నిర్ణయింప బడియున్నదో దానినంతయు చెప్పుటకు గబ్రియేలు అతనికి ప్రత్యక్షమాయెను. ఆమేన్! అతను కొన్ని మాత్రమే అడిగెను మరియు సమస్త కార్యములను పొందెను. అతను కేవలము తెలిసికొనుటకు అడిగెను…

దానియేలు కనుగొనుటకు ప్రయత్నించెను, "ఎంత కాలము ప్రభువా, అది ఇప్పుడేనా? నా యొక్క సోదరుడు, మీ దాసుడు, యిర్మీయా అరవై-ఎనిమిది సంవత్సరములకు మునుపు ప్రవచించెను మరియు చెప్పెను, ఇక్కడ డెబ్బది సంవత్సరములు ఈ యొక్క జనులు ఉండెదరు. మరియు పాత సంతతి అంతయు ఇప్పటికే నశించిరి."

DEUT 1:38

 

64నలభై సంవత్సరములకు మునుపు లేచిన ఆ పాత పెంతెకోస్తు సంతతి — "పాత వీరులు," అని వారు పిలువబడిరి. వారు స్థాపింపబడి ఆ పాత మరి హోరేబుకు, నిబో పర్వతముల వరకు అరచుచు, కేకలు వేయుచు అక్కడ నుండిరి, అయితే చివర ఇప్పుడు మనము నది దగ్గర ఉన్నాము, ఆయన వారిని నడిపించుటకు యొహోషువతో ఒక నూతన సంతతిని లేపవలసి యుండెను. ధర్మశాస్త్రము ఓడిపోయెను. మోషే దానిలో పోయెను, మోషే ఓడిపోయెను. యెహోషువ వారిని నడిపించెను. స్థాపింపబడినవన్నియు (సంఘశాఖలు) ఓడిపోయెనని మనము కనుగొనియున్నాము, అయితే దేవుని యొక్క ఆత్మ (యెహోషువా, యొహోషువ అనగా అర్ధము "యేసు మన రక్షకుడు")… అది పరిశుద్దాత్మ సంఘములోనికి వచ్చుట. ఒక శాఖ కాదు, అయితే పరిశుద్దాత్మ జనుల మధ్యకు వచ్చి మరి ఆమె పైకి ఎత్తబడుటకు సిద్దపరచుట, యొర్దాను దాటి. నేను పుస్తకములు చదువుట ద్వారా, ఏమి సంభవించనై యున్నదని నేను గ్రహించియున్నాను, మరియు దేవునికి తెలియును, ఇప్పుడు నేనేమి వెదకుచున్నానని, నేను ఆయన జనులకు ఆదరణను యిచ్చి మరియు ఇప్పుడేమి జరుగుచున్నదని వారికి చెప్పి, ఈ ఉదయమున ఇక్కడున్న జనులకు మరియు ప్రపంచమంతట టేపులు పోవు ప్రదేశములన్నిటికి (విస్తారముగా) మనము కడపటి కాలములో యున్నామని చెప్పదలచుచున్నాను.

DAN 9:24

 

65రాజ్యమంతయు తిరిగి పూర్వస్థితికి తేబడి మరియు వెయ్యేండ్ల పరిపాలన స్థిరపడు వరకు ఆయన అన్ని కార్యములను బయలుపరచి యున్నాడు. అది గబ్రియేలు యొక్క వర్తమానము. అతను (దూత) చెప్పెను, "ఇంకను డెబ్బది సంవత్సరములు ఉన్నవని నీకు చెప్పుటకు నేను వచ్చియున్నాను - నీ జనులపై ఇంకను డెబ్బది వారములు విధించబడెను, యూదుల యొక్క సంతతి ముగియు వరకు (యుగాంతరము వరకు) అక్కడే డెబ్బది వారములు." ఇప్పుడు గమనించుడి అతను ఏమి చెప్పెనని, మరల కట్టించ వచ్చునని (ఆజ్ఞ) బయలుదేరిన సమయము మొదలుకొని…

నీ జనమునకు, నీ పట్టణమునకు డెబ్బది వారములు విధించబడెను…

నీ పట్టణము. బబులోను అతని పట్టణము కాదు. అతని పట్టణమెక్కడ నున్నది? యెరూషలేము.

DAN 9:24,25

 

66ఇప్పుడు, ఆ ఏడు - లేక ఆరు దృఢపరచు కార్యములను ఎప్పుడైతే మనము గ్రహించుతామో, ఆ పట్టణము ఏమని కనుగొన వచ్చును మరియు అదెవరని, దానిని ఎవరు కనుగొన్నారు, అదెక్కడి నుండి వచ్చినది, ఎంత కాలము అది నిలచును? అది తిరిగి కట్టబడునా, మరియు ఏ కాలములో? ఓ, గొప్ప కార్యములు మన కొరకు ప్రోగుచేయబడి యున్నవి. అది సరి.

తిరుగుబాటును మాన్పుటకు, నీ జనమునకు మరి నీ పట్టణమునకు డెబ్బది వారములు విధించబడెను…

ఇప్పుడు, అతను "దానియేలు…" అని చెప్పలేదు. అయితే నిస్సందేహముగా అతడు డెబ్బది వారములు అని అతనికి చెప్పెను - అట్లనగా, డెబ్బది సంవత్సరములు సమాప్తమగుచున్నవి - అరవై-ఎనిమిది, ఇంకను రెండు సంవత్సరములున్నవి. మరియు మనము కనుగొన్నాము. యిర్మీయా ప్రవచనము ఖచ్చితముగా జరిగెను. ఏడు సంవత్సరముల పిదప వారు వెళ్ళిపోయిరి. నెహెమ్యా రాజు నొద్దకు పోయి ఆజ్ఞ పొంది ఇబ్బంది సమయములందు ఆ గోడలను కట్టెను. వారు పనిచేసిరి. అతను చెప్పెను "గోడ …" దీనిని వినండి:

తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణము చేయుటకును…

పాపమును నివారణ చేయుటకు ! ఎవరికి? యూదులకు "నీ జనమునకు విధింపబడెను." అన్యజనులకు కాదు; "…నీ జనమునకు, [యూదులకు], మరి నీ పట్టణము." న్యూయార్కు పట్టణము కాదు, బోస్టన్, ఫిలడెల్పియా, చికాగో, లాస్ ఏంజల్స్, రోము పట్టణములు కాదు, అయితే "నీ పట్టణము," యెరూషలేము.

…తిరుగుబాటును మాన్పుటకు, … పాపమును నివారణ చేయుటకు… దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ద స్థలమును అభిషేకించుటకును. [గమనించండి!]

యెరూషలేమును మరల కట్టించ వచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని [అతని పట్టణమేది] … అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము.

DAN 9:27

 

67దానిలోనికి మనము వెళ్ళువరకు వేచియుండండి. ఓ, మై! అదొక ఆశీర్వాదము నేను… నేనొక త్రాడు తీసికొని ఇక్కడే నన్నునేను కట్టియుంచుకొనవలయును.

చివరి వరకు దానిని బయలుపరచెను, "వారికి ఇంచుమించు రెండు సంవత్సరములు ఉన్నవనుటయే కాక - అది పూర్తగును - నెరవేరును అని నేను మీకు చెప్పదలచి యున్నాను." మరియు మనకందరికి తెలియును, వారు ఖచ్చితముగా డెబ్బది సంవత్సరములు అక్కడే ఉండిరి - మరియు సరిగ్గా ప్రవక్త చెప్పినట్లు బయలుదేరిరి. మరియు యెషయా - నేను చెప్పునది ఆ దానియేలు ప్రవక్తను నమ్మెను, కావున అతనిక్కడ సిద్దముగా ఉన్నాడు. సరి.

మరియు అతడు మరిప్పుడు, గబ్రియేలు వచ్చినప్పుడు, అతను చెప్పెను, "నేను సమస్తమును జరుగబోవు వాటిని చూపించుటకు వచ్చియున్నాను - ఈ కార్యములను బయలు పరచుటకు - యుగ సమాప్తి వరకు జరుగు కార్యములను," చూశారా. గమనించుడి.

…హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగు జరుగును… [సమస్త కార్యములు ముగించు వరకు.]

DAN 9:23

 

68"ఏమి జరుగనైయున్నదో నేను మీకు చూపించబోవుచున్నాను…" ఇప్పుడు, వినుడి. దీనిని గ్రహించుడి, "దానియేలూ, నేను పంపబడియున్నాను. పరలోకములోనున్న నీకు ప్రియమైన వారు. మరియు నేను నీ ప్రార్థనలు వినియున్నాను, మరియు ఇప్పటి నుండి, ముగింపు వరకు సమస్త కార్యములు, యూదులకు, యెరూషలేమునకు ఏమి విధింపబడెనో, వాటిని గురించి నీకు చెప్పుటకు నేను దిగివచ్చి యున్నాను."

ఇప్పుడు, తరగతిలో ఉన్న వారలారా, మీరు అర్థము చేసికొన్నారా? మనము డెబ్బది వారముల విషయము ఏమిటని కనుగొన గలిగిన ఎడల, ముగింపు ఎప్పుడని మనము తెలిసికొనగలము. ఓ, మై,! దేవా, దానిని తెలిసికొనుటకు మాకు సహాయపడుము. ఈ యొక్క పుటలలో ఎక్కడో ఒక చోటు అది మనకు చెప్పుచున్నది, సరిగా ఆ సమయము నుండి ఈ సమయము వరకు, ముగింపు వరకు మరియు అది ఒక్క నిమిషమును కూడా వదలదు. దేవుని వాక్యము ఎంత గొప్పగా యున్నది.

DAN 9:24

 

69దేవుడు భూమిని చేసి మరియు దానిని కక్ష్యలో అమర్చినప్పుడు, (ఆ రోజు రాత్రి, ఆదివారపు రాత్రి నేను ప్రసంగించునప్పుడు ఏ విధముగా ఏ ఒక్క కార్యము విడువబడదు అన్న నా యొక్క ప్రసంగము. ఎందులకు, ఈ భూమి చాలా క్రమముగా, సంపూర్ణముగా తిరుగుచున్నది, సూర్యుడు, చంద్రుడు ఒకదాని నొకటి ఎట్లు దాటి పోవునని ఈ రోజు నుండి ఇంక ఇరవై సంవత్సరములకు ఖచ్చితముగా ఆ నిమిషముతో సహా వారు చెప్పగలుగుచున్నారు. ప్రపంచములో మనము కలిగియున్న ఏ ఇతర గడియారములతో నేను చెప్పలేను. మన యొద్దనున్న శ్రేష్టమైన గడియారము ఒక నెలకు రెండు లేక మూడు నిమిషములు కోల్పోవును, లేక రెండు లేక మూడు నిమిషములు వేగముగా పోవును. ఆ విధమైన పరిపూర్ణముగా దేనిని మనము చేయలేము, ఏలయనగా ఒకే ఒక కార్యమే పరిపూర్ణమైనది; అదే దేవునిది! మరియు దేవుడు మరియు ఆయన వాక్యము ఒక్కటే! కావున దేవుని వాక్యము పరిపూర్ణమైనది!

ఈ దినములను గురించి మనము తెలిసికొనగలిగిన ఎడల, ముగింపు సరిగా ఎప్పుడనుటను మనము కనుకొనగలము. దానిని మీరు గ్రహించియున్నారా? ముగింపు కొరకు అది విధింపబడెను. 24వ వచనము: "…నీ జనమునకు మరి నీ పరిశుద్ద పట్టణమునకు," అదియే యెరూషలేము. 21 - 24వ వచనము గైకొన్నారా ఇక్కడ. మత్తయి 24 లో దీనిని గురించి యేసు చెప్పుచున్నారు.

MATT 24:15

 

70ఇప్పుడు, సోదరుడు కొలిన్స్ (ఈ ఉదయమున అతనిక్కడ ఉన్నాడా, అతనున్నాడా లేదా నాకు తెలియదు), గత రాత్రి అతడొక ప్రశ్నను అడిగెను. (కొలిన్స్ సోదరుడా అది నేను చెప్పుట సరి అని ఊహించుచున్నాను) నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుటను గురించి, చూశారా, అట్లనగా అర్థమేమిటి? మత్తయి 24వ అధ్యాయములో దానిని గురించి యేసు చెప్పెను, మరియు మనము కనుగొనవచ్చును…. అవును, మత్తయి 24:15.

ఇప్పుడు, దానిని త్వరగా నేను తీసిన, యేసు ఇక్కడ అదే కార్యమును ఏ విధముగా మాటలాడుచున్నాడని మీరు చూడగలుగుదురు, దానియేలును గురించి చెప్పుచు (దానియేలు గ్రంథమును చూపుచు మత్తయిలో యేసు పలుకుచున్నారు) మత్తయి 24:15 వ్రాసుకొనుచున్న మీకు, ప్రత్యేకముగా ఈ రాత్రి మరియు రాబోవు ఆదివారము మీలో ప్రతియొక్కరు పెన్సిలు, మరియు పేపర్లు తీసుకొని రవాలి, ఎందుకనగా, మనము… మీకు టేపులు ఉన్నయెడల ఫరవాలేదు లేని యెడల వ్రాసుకోనుటకు. 24వ అధ్యాయము మరి 15వ వచనము:

కాబట్టి ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు. [యోచించుడి, ఇది నాలుగు వందల ఎనభై - మూడు, నాలుగు, ఐదు… ఎనభై-ఆరు సంవత్సములకు మునుపు - 486 సంవత్సరములకు మునుపు.] … దానియేలు ప్రవక్త పరిశుద్ద స్థలమందు నిలుచుట [ఇప్పుడు మీ బైబిలులో చూడుడి. అది స్పష్టముగా ఇయ్యబడి యున్నది.] (చదువువాడు గ్రహించును గాక.)

MATT 24:2,15•

MARK 13:2•

LUKE 19:44•

LUKE 21:6

 

71ఇప్పుడు, ఆయన యూదులతో మాట్లాడుచున్నాడు. వారు తెలిసికొన వలయుననియున్నారు: "ఈ ఆలయమును గురించిన కార్యము ఏమిటి, ఎప్పుడు అది నాశనము చేయబడును? మరల ఎప్పుడు అది కట్టబడును? రాతిపై రాయి నిలువని కాలము ఎప్పుడు వచ్చును? అదెంత కాలము ఉండును?"

ఆయన చెప్పెను, "నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ద స్థలమందు నిలుచుట మీరు చూడగానే…" అప్పుడు దానియేలు పరిశుద్ద స్థలమందు నిలబడినప్పుడు, చెప్పెను, "ఇది నెరవేరుట మీరు చూచినప్పుడు, ఇప్పుడు చదువువాడు గ్రహించును గాక, అతను దేనిని గురించి చెప్పుచున్నాడని…" అందువలననే ఒక చిన్న సందేహమైనను లేకుండ అది పరిపూర్ణముగా, సరిగ్గా (అర్థమగులాగున) చేయమని మనము దేవునిని ప్రార్థించుచున్నాము, ఏలయనగా ఆ కార్యములకు మనము మన యొక్క సొంత జ్ఞానముతో వివరణ ఇవ్వకూడదు. అది "ప్రభువు ఈలాగు సెలవిచ్చునదిగా," రావలయును. కావున దాని అర్థము నేను గ్రహించు వరకు దానినక్కడే వదలి వేయుచున్నాను.

HOS 11:1•

MATT 2:15

 

72అతనికి అన్ని కార్యములు బయలు పరచెను. ఆ హేయమైన కార్యము… మరియు గుర్తుంచుకొనుడి, దీనికి ద్వంద అర్ధములు కలవు, ఎట్లనగా "ఐగుప్తు నుండి నా కుమారుని పిలువుము." ఇశ్రాయేలీయులు ఏ విధముగా బయటికి రమ్మని పిలువబడిరో, ఆలాగుననే ఆయన కుమారుడు యేసు బయటికి పిలువబడెను. మరియు నేను ఇక్కడ నిలుచుకొని యుండుట ఎంత వాస్తవమో, అది సరిగ్గా ఆ విధముగానే సంభవించును. మరియు ఆయన దానిని ఒక విధమైన రీతిగా చేసియున్నాడు, సంఘమునకు అవన్నియు ఆయన మరుగు పరచియున్నాడు. ఓ, దానిలోనికి మనము ధ్యానించబోవునప్పుడు, ఆ ఆరు విధములైన వివరణలకు ఏ విధముగా ఆయన దానిని సంఘమునకు మరుగుపరచియున్నాడు. అందువలన ప్రతి యొక్కొక్క నిమిషమును సంఘమునకు మరుగు పరచియున్నాడు, అందువలన ప్రతి యొక్కొక్క నిమిషమును సంఘము గమనించుచుండును. ఆయన ఏ వేళలో రానైయున్నాడో తెలియదు. అయితే ఇప్పుడు, సంఘ కాలము సమాప్తమై యున్నది. కావున అది రాకడకు సిద్దముగా ఉన్నది, అది సిద్దపడుచున్నది.

73ఇది ఒక ముఖ్యమైన లేఖనముగా గ్రంధములో ఉన్నది. అదేమి చేయును? యూదుల యొక్క రాజ్యము, యూదుల యొక్క ముగింపును ఇది చెప్పుచున్నది. ఈ లేఖనములలోని వాక్యములు డెబ్బది వారములు, దానియేలు అక్కడ చెరపెట్టబడిన కాలము నుండి, ముగింపు వరకు, సమస్త కార్యములను బహిర్గతము చేసి మరియు తెలియపరచుచున్నవి. అదొక గొప్ప కాల గమనములలో ఒకటి… నేను చెప్పుట ఎందరు విని యున్నారు, వారములో ఇది ఏ రోజని మీరు తెలుసుకొనగోరిన ఎడల, కాలెండరును చూచెదరు. ఏ కాలములో మనము జీవించుచున్నామని మీరు తెలిసికొన గోరిన ఎడల, యూదులను గమనించుడి"? అది సరి. సరిగా ఇక్కడి నుండియే దేవుని కాలెండరు తీయబడెను. యూదులు మాత్రమే కాలాన్ని సూచించే గడియారమై ఉన్నారని ఏ వేదాంతి యైనను, బైబిలు పండితుడైనను, ఎవరైనను మీకు చెప్పెదరు.

ఇప్పుడు ఏ సమయమును మనము కలిగి యున్నాము? (ఏ కాలములో ఉన్నాము) మనము కేవలము… జనులు వేడిలో… ఓ నేను…

అన్యజనులకు దానికి ఏ సంబంధము లేదు. ఈ ఏడు ముద్రలు, ఏడు తెగుళ్ళు, ఏడు శ్రమలు, ఏడు బూరలు వీటితో వారికి ఏ సంబంధము లేదు… అన్యజనుల సంఘము ఆ సమయములో మహిమలో ఉండును; అది అన్యజనుల సంఘముతో ఏ సంబంధము లేదు; అది కేవలము ఇశ్రాయేలుకు మాత్రమే వర్తించును. "దానియేలు, నీ యొక్క జనులు మరియు యెరూషలేము."

74ఇప్పుడు, యూదులు వారి స్వదేశములో ఉన్నప్పుడు మాత్రమే వారితో దేవుడు వ్యవహరించునన్న విషయములను మరియు అది తెలియపరచుచున్నది. హల్లెలూయా! అక్కడే నేను అకొనుచున్నాను, సరియైన భాగమున ఆ సారమును నేను గైకొన్నాను. దానియేలు కాలములో ఇశ్రాయేలు అక్కడ నుండిన సమయము నుండి వారు అనుమతించుచు, మరియు… ఒక గొప్ప వ్రాతగాడు… ఏలనగా అతని వెంబడించువారు కొందరిక్కడ ఉన్నారని నాకు తెలియును, దానిని నేను చెప్పను, అయితే అందువలననే ఈ యొక్క తప్పైన కార్యములను వారు కలిగియుండిరి.

75ఏడవ దినమును అనుసరించు సంఘముగా (సెవంత్-డే అడ్వెన్టిస్టు) అవక మునుపు వారు మిల్లర్ అను మనుష్యుని వెంబడించుచున్నప్పుడు, 1919లో వారేమి చేసినారో తెలియునా? వారు రెక్కలను కట్టుకొని ఆ రోజు ఉదయము మేము ఎగిరిపోవుచున్నామని చెప్పుకొనిరి (దానిని మీరు "కురియర్ వార్తా పత్రికలలో చూసియుందురు) మిల్లర్ ను అనుసరించు మిల్లరైటు దానియేలు డెబ్బది వారములను గురించి బోధించుదురు. అటుపిదప వారి యొక్క దీర్ఘదర్శిణిగా పిలువబడిన శ్రీమతి ఎల్లెన్ వైటర్ లేచిన పిదప వారు ఏడవ దినము అనుసరించు సంఘముగా (సెవంత్-డే అడ్వెన్టిస్టు)గా పిలుచుకొనిరి, మరియు ఇప్పుడు వారు వారి పేరును ప్రవచన యొక్క స్వరముగా మార్చుకొనిరి, చూశారా. అదే మత మార్గ పద్దతికి మూడు వేర్వేరు పేర్లు.

REV 7:1,4,9,12

 

76ఇప్పుడు, వారు తప్పైయున్నారు, ఏలయనగా వారు డెబ్బది వారములను యూదులకు మరియు అన్యజనులకు ఇరువురుకే దానిని ప్రయోగించుటకు ప్రయత్నించిరి, మరియు ఆయన ఇక్కడ చెప్పుచున్నాడు, "ఇది నీ యొక్క జనులకు" మరియు దేవుడు, యూదులు పాలస్తీనా దేశము వెలుపల ఉన్నప్పుడు వారితో ఎన్నడు వ్యవహరించడు. మరియు అభిషిక్తుడు (మెస్సీయా) డెబ్బది మరియు రెండు వారముల పిమ్మట నిర్మూలము చేయబడును - అతని కొరకు కాదు, మన కొరకు - నిర్మూలన చేయబడును, ఇశ్రాయేలీయులు చెదరగొట్టబడి, ఈ చివరి కొన్ని సంవత్సరములను తప్పనిచ్చి వారి సొంత దేశమునకు వారెప్పుడు తిరిగి రాలేదు. కావున సంఘకాలమునకు అక్కడ సమయము లెక్కింపబడలేదు. దానిని మీరు గ్రహించారా? 1919లో కాదా. 1919లో ఏదో సంభవించినదని నేను చూపగలను, అయితే ఆ దూత - మూడవ దూత యొక్క వర్తమానము పలికినప్పుడు మరియు ఆ శ్రమ బయలు వెడలెను - సరిగ్గా అయితే అది, అది కాదు - అది మర్మముగా ఆ యుద్దము నిలిచిపోయెను. మనము 7వ అధ్యాయములోనికి పోయినప్పుడు దానిని గైకొందుము - 7వ అధ్యాయమునకు పోయినప్పుడు. అనేకమార్లు దానిని నేను ప్రసంగించుటను మీరందరు వినియున్నారు, చూశారా, ఆ యొక్క దూత వర్తమానము ఇట్లు చెప్పబడెను, "దాసులైన, యూదులను ముద్రించు వరకు, భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని యుండుము." మరిప్పుడు, అన్యజనుల యొక్క కాలము సమాప్తమవు వరకు వారు కాచుకొని యుండిరి, అప్పుడు ఆయన లోనికి వచ్చినప్పుడు, యూదులను ఆయన ముద్రించినప్పుడు, 1,44,000 మంది పరిశుద్దాత్మను పొందిరి. ప్రకటన 7వ అధ్యాయములో ముద్రించబడిన ఆ 1,44,000 మంది అక్కడున్నారు. "మరియు ఇంతకు మునుపే పరలోకములో ఉన్న ప్రతి వంశములో నుండియు, ఆయా భాషలు మాటలాడు వారిలో నుండియు, ప్రజలలోనుండియు, (యోహాను వారిని చూచెను) ఎవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహములను నేను చూచితిని, మరియు వారు దేవుని ముందు నిలుచుకొని, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని, తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, పాడుచు, 'హల్లెలూయా, ఆమేన్! మహిమ, జ్ఞానము, గౌరవము, ఉన్నతమైన వాడును, శక్తి యుగ యుగములు మరియు సదాకాలము మన దేవునికే, ఆమేన్!' వారు కేకలు వేయుచుండిరి."

77యోహాను వారిని అర్థము చేసికొనలేక పోయెను, అయితే అతను వెను తిరిగి సీనాయి కొండపై (మహిమ!) 1,44,000 మంది స్త్రీలతో మాలిన్యము చేసుకొననివారు - యూదులు, స్త్రీలు (సంఘములు). లూథరను, మెథడిస్టు, బాప్టిస్టు మరియు ప్రెస్బెటేరియన్ మరియు ఈలాటి సంఘశాఖలతో చేరలేదు, అయితే వారు ఆది నుండి ఆచారములతో గల యూదులుగా నుండి, సీనాయి కొండపై గల ఆలయములో ఆరాధించుకొనుచుండిరి. అదే 1,44,000 మంది. ఇది జరిగిన పిదప అది. సంఘము మహిమలో ఎత్తబడిన పిదప, చూశారా.

కావున శ్రీ, స్మిత్ తప్పుగా ఎంచెను. ఆయన నిజముగా తప్పే, ఏలయనగా 1919 ఎట్లు దానిని మీరు ప్రయోగించి, మరియు 1,44,000 మందిని బయటికి లాగెదరు? అట్లయిన అప్పుడు మీరు రస్లైట్ యొద్దకే తిరిగి పోవుచున్నారు, చూశారా. అప్పుడు మీరు రస్లైట్ సిద్ధాంతముకు తిరిగి పోయినట్లుండును, అదెట్టనగా: యేసు 1914 లో వచ్చి 1919లో తన సంఘమును ఎత్తివేసి, ఇపుడు, ఆయన ఒక మర్మయుక్తమైన శరీరములో ఉంటు భూమి చుట్టు తిరుగుచు, రస్లైటర్స్ గా వున్న అవ్వ, తాతలను సమాధుల నుండి పునర్జీవింపజేస్తున్నాడంటున్నారు. పిచ్చితనముగా ఉన్నది! వాక్యముతో అది పోల్చబడని పిచ్చి కార్యముగా ఉన్నది. అది సరిగా లేదు. కాదయ్యా, అది సరి కాదు.

78అయితే దేవుడు సత్యమును కలిగియున్నాడు! దేవుడొక్కడే దానిని బయలు పరచి మరియు అక్కడ దాని నుంచి మరియు మనకు దానిని సరిగా చూపించును! ఆయన దానిని చేయునని నేను నమ్ముచున్నాను. దానిని గురించి నాకు తెలియదు. నేను మీకు సత్యమునే చెప్పుచున్నాను. నాకు తెలియదు, అయినను నేను నమ్ముచున్నాను, ఆయన చేయునని నేను నమ్ముచున్నాను.

కావున మీరు చూచారా, దేవుడు యూదులతో ఎప్పుడును వ్యవహరింపడు (ఇది మీ తలంపులో ఉండవలయునని నేను కోరుచున్నాను) ఇశ్రాయేలు వారి సొంత దేశము వదలి బయట ఉన్నంత వరకు

ZECH 3:9

 

79ఇశ్రాయేలు దేశమునకు పోవలయునని మాటలాడుచున్న ఈ సహోదరునికి నేను చెప్పదలచుకొన్న కార్యమిదే. ఇశ్రాయేలుకు దూరముగా నుండుము! దాని నుండి దూరముగా నుండుము, యూదులను మార్చెదము అని చెప్పు జనులైన మీరందరు, దానికి దూరముగా ఉండుడి. ఈ వర్తమానము ముగియు లోపల వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా "ఇది ప్రభువు సెలవిచ్చునది" అని మీరు చూడగలరు! ఒకే రాత్రిలో ఇశ్రాయేలు దేశమంతయు మార్చబడుదురు. బైబిలు ఆ విధముగా చెప్పుచున్నది. అయితే సువార్త వారికి కాదు. యూదుల యొక్క మతాచారములను వదలి, వాటి నుండి బయటికి వచ్చిన వారికి - యూదుల యొక్క ఐక్యతను వదలిన వారు - మరియు వారే రక్షింపబడుదురు. అది సత్యము. నా హృదయపూర్వకముగా దానిని నేను నమ్ముచున్నాను. అయితే గుర్తుంచుకొనుడి, ఇశ్రాయేలీయులు వారి స్వదేశములో లేనంత కాలము వారు రక్షింపబడరు. ఇప్పుడు వారు తిరిగి వచ్చుచున్నారు మరియు వారు రక్షింపబడుదురు — అందరు, ఒకే రోజులో. బైబిలు ఆ విధముగా చెప్పుచున్నది. ఒక రోజు ఇశ్రాయేలు అంతయు దేవుని వైపుకు తిరుగులాగున చేయును. ఈ దినములలో ఒకానొక రోజు దేశమంతటిని కదిలించు విధముగా ఒక గొప్ప కార్యము ఇశ్రాయేలులో జరుగనై యన్నది. ప్రవక్త కూడ కేకలేసి, అరచి మరియు చెప్పెను, "ఒకే దినములో నీవు దీనిని చేసియున్నావు" - ఒకే దినములో. దానిని వారు చూచెదరు.

80ఒక గొప్ప కార్యము అక్కడుండును. నా యొక్క అభిప్రాయమేదనగా, ఒక గొప్ప ప్రవక్త లేచి, ఇశ్రాయేలుకు ముందు నిలువబడి, అభిషిక్తుడు (మెస్సీయా) ఇంకనూ జీవించుచున్నాడని వారికి నిరూపించును. వారు నిరాకరించిన అభిషిక్తుడు [స్పష్టతలేని మాటలు].

ఆ చిన్న పరిశుద్ద గ్రంథమైన ఇశ్రాయేలు పరిశుద్ద గ్రంథమును వారు చదువు విధమేదనగా వెనుక నుండి ముందుకు చదివెదరు. అదే వారు చదివే విధము మరియు మీకు తెలియునా, యూదుల భాష ఎట్లు వ్రాయబడి యున్నదని, మరియు వారు దానిని చదువునప్పుడు ఆలాగుననే చదివెదరు. లూయి పెత్రుస్ పది లక్షల బైబిళ్ళను అక్కడికి పంపించెను, వారు (యూదులు) చెప్పిరి, "ఈ యేసు…" ఆ యూదులందరు ఇరాను నుండి తీసికొని రాబడినవారు, వారికి మెస్సీయా (అభిషిక్తుడు) అనునటు వంటి ఒక కార్యమును ఎన్నడును వారు వినియుండలేదు. మరియు వారు తమ స్వదేశమునకు తిరిగి వచ్చుటకు సిద్దముగా ఉన్నను వారి కొరకై యున్న విమానములలో వారెక్కలేదు. వారింకను పాత నాగలి పట్టుకొని వ్యవసాయము చేసి భూమిదున్నుచుండిరి. దానిని మీరు లుక్ పత్రికలో చదువుడి. ఎందరు లుక్ మరియు టైమ్స్ పత్రికలలో ఆ కార్యములను చదివియున్నారు? ఎంతమ౦ది నిజముగా మీరు చదివి యుందురు, చూశారా. వారు ఆ విమానములలో ఎక్కుటకు ఇష్టపడక, ఎక్కలేదు. వారి యొక్క ఆ పాత బోధకుడు (రబ్బి) అక్కడ నిలుచుకొని మరియు చెప్పెను, "గుర్తుంచుకొనుడి, మన ప్రవక్త చెప్పెను మన స్వదేశమునకు పక్షిరాజు రెక్కలపై తిరిగి పోయెదము."

రాజ్యములు పడద్రోయబడుచున్నవి:

ఇశ్రాయేలు మేలుకొనుచున్నది,

బైబిలులో ముందుగానే చెప్పబడిన సూచనలు;

అన్యజనుల దినములు లెక్కింపబడుచున్నవి,

భయంకరమైన కార్యములు తొందర పెట్టుచుండగా

ఓ చెదిరిపోయిన వారలారా, మీ యొక్క సొంత దేశమునకు తిరుగుడి.

మీరు మేలుకొనుట మంచిది. మీరు దానిని వినియున్నారు, వినియున్నారు మరియు వినియున్నారు, అయితే ఒకానొక రోజు ఇదే కడపటి సారిగా ఉండును.

81ఇశ్రాయేలీయులు తమ స్వదేశమునకు తిరుగుచున్నారు. ఇశ్రాయేలు ఒక దేశము అని (స్వతంత్ర దేశమని) దేవుడు ఏ రోజైతే నిర్ణయించునో, ఆ రోజు (ఆ రోజు నుండి) ఇంకొక అన్యజనుడు రక్షింపబడడు. (ఇశ్రాయేలు "దేశము" అయిన పిదప అన్యజనుల కాలము ముగియును.) నేను ఆ దినములను కనుగొన గలిగన యెడల ఈ యొక్క డెబ్బది వారముల ద్వారా, దానిని నేను నిరూపించగలను. నేను జ్యోతిష శాస్త్రము, కాలెండరు, మరియు జూలియన్, జ్యోతిషము మరి రోమన్ వాటన్నిటిని తీయబోవుచున్నాను. దానిలో ఎక్కడో ఏదో కార్యము. దానిని గురించి దేవునికి తెలియును మరియు ఆయన దానిని బయల్పరచగలడు. ఒక సంవత్సరములో, జూలియన్ కాలెండర్లో 365¼ దినములు ఉన్నవని నేనెరుగుదును. కావున, ఓ, అవన్నియు కలిసిపోయినవి, అయితే సత్యము ఎక్కడో ఉన్నది.

82నేను చూచుచున్నాను అనేక సంఘములు, అనేక సంఘ శాఖలు, అనేక జనులు ఇట్లు పోవుచు, వారిలో కొందరు, "మేరికి నమస్కారము," మరియు కొందరు దీనిని ఆరాధించుచు, దానిని లేక వేరే విధముగా, సత్యము ఎక్కడో ఉండవలయును, ఎక్కడో దేవుడు ఉండవలయును, ఎక్కడో ఒక వర్తమానము ఉండవలయును. అనేక అబద్దపు ప్రవక్తలు లేచి తమకు వివేచించు వరమున్నట్లు నటించుచు మరియు ఆ విధమైన కార్యములు సంభవించుచున్నవి, ఎక్కడో ఒకచోట నిజమైనది ఉండవలయును, దానిలో నుండి కల్పితములు (అబద్దమైనవి) తయారు చేయబడుచున్నవి.

83ప్రజలు శారీరకముగా ఉండు భక్తిగల వారమని తలంచుకొనుచు అరచుచు మరియు ఆ విధమైన కార్యములు చేయుచు, మరి వెలుపలికి వెళ్ళి అనేక (లోక రీతిగా) విధములుగా జీవించుటను నేను చూచుచున్నాను. ఎక్కడో ఒకచోట స్వచ్చమైన పరిశుద్దాత్మ అక్కడ ఉండవలయును. జనులు మతమును పొంది యున్నట్లు నటించుచు మరియు ఆ విధముగా దైవభక్తి గల వారిగా నుండుటకు ప్రయత్నించుటను నేను చూచుచున్నాను. యదార్ధమైన, దేవుడు ఎక్కడోనున్నాడని నాకు తెలియును. ఎక్కడో స్వచ్చమైన ఆత్మ ఉండుట వలన, దానిని అనుసరించి దాని పోలికలో సత్యమైన ఒకటి వేషధారణ చేయుచున్నది. ఎక్కడో ఒకచోటు ఒక నిజమైన — ఒక వ్యక్తి, ఒక జనులు, ఒక సంఘము, ఒక దేవుడు ఉండ వలయును. ఎక్కడో ఒకచోటు సత్యమైనది ఉండుట వలన, ఏలయనగా దానిని అనుసరించుచు పోలికలు వచ్చుచున్నవి. (అబద్దమైన కార్యములు సత్యమును చూచి దానివలె నటించుచున్నవి) ఎక్కడో ఒకచోటు ఒక నిజమైన కార్యము ఉండవలయును.

మీ యొక్క వరములను గురించి ఈ సంఘమునకు నేను చెప్పియున్నాను. మీ యొక్క వరములకు చెవి యొగ్గుడి, బైబిలులో వాటి నుంచుడి! ఆకాశము నిండుగా నిజమైన కార్యములతో నిండియున్నప్పుడు, వాటికి బదులుగ వేరే కార్యములను గైకొనవద్దు. నిజమైన కార్యములను మనము గైకొని, వేచియుందుము. మనము నిజమైన కార్యములను పొందెదము లేనియెడల ఏ విధమైన అసత్యపు కార్యములు మనకు వద్దు. ఆమేన్!

84ఇప్పుడు, ముగించుట యదార్థము, ఇశ్రాయేలీయులు తమ మాతృభూమిలో ఉన్నప్పుడే, దేవుడు వారితో వ్యవహరించును. మనము చూచిన… దేవుడు… అబ్రహాము తన స్వదేశమును వదలి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు, ఏమి సంభవించెను? అతడు దేవుని యొక్క చిత్తమును విడిచి దూరముగా పోయెను. అతడు తిరిగి తన స్వదేశమునకు తిరిగి వచ్చు వరకు ఆశీర్వదింపబడలేదు. దేవుడు అతడితో వ్యవహరించలేదు — ఒక్క దర్శనము కూడా అతనికి కలుగలేదు, అతడు తిరిగి తన స్వదేశమునకు తిరిగి వచ్చు వరకు - ఏ విధమైన కార్యము అతడికి ఇవ్వబడలేదు.

ఇశ్రాయేలీయులను గమనించి చూచిన ఎడల, వారు ఐగుప్తుకు పంపబడినప్పుడు, ఆ నాలుగు వందల సంవత్సరములు — ఒక్క అద్బుత కార్యము సంభవించ లేదు, లేదా ఒక్క సూచనకూడా లేదు, చరిత్ర పుస్తకములలో ఆ విధముగా ఏదైనను సంభవించినట్లు వ్రాయబడ లేదు. అదే పాత తొమ్మిది మరియు తొమ్మిది: సంఘమునకు పోవుట, గొర్రెపిల్లను బలి ఇచ్చుట, "మేరీకి స్తోత్రములు," లేక ఆ విధముగా చెప్పి తిరిగి పోవుట. ఆ తరువాత సంవత్సరము అదే విధముగా, యాజకులందరు తర్కించుకొనుచుండిరి. "బోధకులు మరియు ఫలానా మరియు ఫలానా వారిని బోధకులుగా ఎన్నుకొనెదము. అతనికి మంచి చదువు ఉన్నది. ఐగుప్తియులను గురించి అతనికి అధికముగా తెలియును." మొదటి కార్యమేదో మీకు తెలియునా, ఐగుప్తియులు మరియు వారందరూ కూడా అదే విధమైన కార్యములలో ఉండిరి.

85సంఘమునకు అదే విధమైన కార్యము సంభవించి యున్నది. మనమందరము మెతడిస్టులుగా, లేక బాప్టిస్టులుగా లేక ప్రెస్బిటేరియన్ గా నుండుటకు వెళ్ళియున్నాము; మరియు హార్ట్పోర్ట్ నుండి పట్టుబధ్రులమై యున్నాము, వీటన్ నుండి పట్టుబధ్రులమై యున్నాము, ఎక్కడి నుండియో పట్టుబధ్రులమై యున్నాము, లేక బాబ్ జోన్స్; మనము బి.ఏ. డిగ్రీని పొందియున్నాము, డి.డి., ఎల్ఎల్.డి., లేక వేరే దేనినో మనము కలిగి యున్నాము. అదంతయు ఏమి చేయును? అదంతయు బుద్ధిహీనత.

ఐగుప్తులో అదే విధముగా ఉండెను.

86మరి దేవుడు, ఇశ్రాయేలు తన స్వదేశమునకు తిరిగి వచ్చు వరకు ఆమెతో వ్యవహరించ లేదు, నాకు చెవి యొగ్గుడి! "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆమె స్వదేశమునకు తిరిగి వచ్చు వరకు, దేవుడు తన సంఘముతో వ్యవహరింపడు — ఈ ఘడియ వర్తమానము. మూల ఉపదేశములకు తిరిగి రండి! మీ యొక్క మెతడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్ అభిప్రాయుములను, మీ యొక్క పెంతెకోస్టులు, అసెంబ్లీస్, ఏకత్వము, త్రిత్వము, మరియు పంచతత్వము, ఏది ఏమైనను, దేవుని యొక్క సంఘము, నాజరీన్, యాత్రికుని పరిశుద్దము, చర్చి-ఆఫ్-క్రైస్ట్ - అన్నియు అబద్దపు క్రీస్తు కార్యములు! మరియు ప్రపంచము ఇది గుర్తించునని నేను అనుకొనుచున్నాను. సమస్తమును అసత్యములే! సమస్తమును దయ్యపు కార్యములే. ప్రతి ఒక్కొక్క దానిలో దేవుని జనులు ఉన్నారు, ఆ కదలికలలో దేవుని వ్యక్తులున్నారు, అయితే సంఘ శాఖలు దేవునివి కావు, దేవుడు దానిని ఆశీర్వదించడు. ఆ విధముగా ఆయనెప్పుడు దానిని చేయలేదు.

87మరియు ఈ టేపును వినుచున్న ఏ చరిత్రకారుడైనను సంఘము ఒక శాఖగా మారినప్పుడు దేవుడు దానిని బీరువాలో లేక ఒక అరలో పెట్టి, దానితో మరెప్పుడు వ్యవహరించలేదని, అట్లు కాదని నాకు వ్రాత మూలముగా చెప్పవలయునని కోరుచున్నాను. లూథరనులను, వెస్లీ, మెతడిస్టు లేక పెంతెకోస్తులను తిరిగి ఎప్పుడైనను లేపినాడా అని నాకు చెప్పుడి. ఎన్నడు శాఖలుగా మారిన వాటిని లేపలేదు. ఆ సంఘ శాఖ అక్కడే పడియుండి, చలనము లేక కొరుకు పుండు వలె తినివేయబడి, మరి క్రుళ్ళిపోయెను! దేవుడు ఒక మనిషిని మాత్రము తీసికొని, జనులను, స్వదేశమునకు త్రిప్పుటకు ప్రయత్నించెను. మరియు మనిషి వ్యక్తిగతముగా బలహీనుడై ఒక విధమైన డిగ్రీతో అలంకరింపబడిరి. మరియు ఇంకొక శాఖగా వారు నిర్మించుకొనువరకు బలహీనులుగా నుండి, మునుపు కంటెను, రెండింతలుగా నరకమునకు పోవు బిడ్డలుగా వారు మారిరి.

88అయితే ఎక్కడో ఒక చోట, నిశ్చయముగా, యెహోవా తనకంటు ఒక వ్యక్తిని ఏర్పరచుకొనును. ఆయన, ఆ వ్యక్తిపై చేతులుంచును. అతడు ఆ భక్తిహీనుల సంఘశాఖలతో రాజీపడడు. అతడు జనులను యేసు క్రీస్తు అను బండ వైపుకు త్రిప్పును, ఆది నిజమైన పెంతెకోస్తుకు, మరియు ఆది, నిజమైన పరిశుద్దాత్మ వైపుకు త్రిప్పును, అదే విధమైన సూచనలతో మరియు నిజమైన అద్భుతములతో, నిశ్చయుముగా, ఎటువంటి హింసలలోనైనను పడిపోని, పారిపోని, నిరాకరింపక, క్రింద పడిపోకుండ నుండు మరియు ఏ ఇతర కార్యములతో ఓడిపోని ఒక వ్యక్తి ఎక్కడో ఆయనకు కలడు.

89ఇశ్రాయేలు, ఆమె స్వదేశమునకు పోవు వరకు దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదించడు. మెతడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, కేథలిక్ లేక పరిశుద్ద యాత్రికుడు, నజరేయుని, క్రీస్తు సంఘము, లేక పెంతెకోస్టు సంఘ శాఖలైన మిమ్ములను దేవుడు ఎప్పటికి ఆశీర్వదించడు. ఆ యొక్క మార్గములో దేవుడు మిమ్ములను ఎన్నడూ ఆశీర్వదింపడు. పెంతెకోస్తు దినమున సంభవించిన విధముగా అది పెంతెకోస్తు యొక్క అనుభవములాంటి మీ స్వదేశమునకు మరలి రండి. పెంతెకోస్తు దినమున జీవము గల దేవుని యొక్క శక్తి ఎన్నో వేల మంది ప్రజలను మార్చి, వారి యొక్క హృదయములను దేవుని యొక్క అగ్ని దహింపజేసినది. ఏదో ఒక వేషధారితనము కాదు, మనుష్యులు తయారుచేయు మనోశాస్త్రము కాదు, ఏదో ఎగతాళి చేయు కార్యములు కాదు, అమెరికాలో మనకున్నట్లు ఎలుకల పందెము కాదు, ఎవరికి పెద్ద గుడారములుండును, ఎవరి యొద్ద ఎక్కువ మంది సమూహము ఉందురన్న కార్యము కాదు, అది దేవునికి ఏ విధమైన భేదము కలుగ జేయును! హృదయములో నిష్కపటము గల జనులను దేవుడు కోరుచున్నారు, పెద్ద గుంపులను కాదు. అయితే స్వచ్చమైన ఆది అపోస్తలుల కార్యముల దినములకు, మనము తిరుగ వలయును. మరిప్పుడు మనము ఎలుకల పరుగు పందెము వలె ఇక్కడ పరుగిడుచున్నాము — ఎటువంటి అవమానము — ఇంకొక వెయ్యిమందిని మన సంఘ శాఖలో మనము చేర్చగలిగిన యెడల, అది అవమానము. ఆయన మనలను సత్యమునకు తిరుగ వలయునని, ఆత్మీయ కార్యములకు తిరుగవలయునని, సత్యమైన జీవితమునకు తిరుగవలయునని, క్రీస్తునందున్న ఆ రహదారికి తిరుగవలయునని, సత్యమునకు తిరుగవలయునని కోరుచున్నాడు. మనము పోవుచున్న మార్గములో ఆయన మనలనెట్లు ఆశీర్వదించగలడు? ఆయన చేయడు.

90వాగ్దాన భూమికి వారు తిరిగి వచ్చు వరకు ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించ లేదు; మరియు వారు వాగ్ధాన భూమికి తిరిగి వచ్చినప్పుడు, సూచనలు మరియు అద్భుతములు నెరవేర తొడగెను. వారి మధ్య మోషే అను పేరుగల వ్యక్తిని ఆయన పంపించెను. ఈ మోషే ఏ కార్యముతో వచ్చెను, మెరుగైన వేదాంత శాస్త్ర జ్ఞానముతో వచ్చెనా? బి.ఏ. డిగ్రీతో ఆయన వచ్చెనా? ఆయన ఎల్.ఎల్.డి. పి.హెచ్.డి. తో వచ్చెనా? యెహోవా యొక్క శక్తితో: "ఇక్కడి నుండి స్వదేశమునకు తిరిగి రండి." అన్న వర్తమానముతో ఆయన వచ్చెను. ఓ, చెదరగొట్టబడిన వారలారా, మీ యొక్క స్వదేశమునకు తిరుగుడి. ఆమేన్!

91ఇంచుమించు రెండువేల సంవత్సరములుగా, యూదులు వారి యొక్క స్వదేశమును వదలి, భూమిపై యున్న నాలుగు దిశలకు చెదరగొట్టబడిరి. ఇప్పుడు దీనిలోనికి విపులముగా పోవలయునన్న అనేక వారములకు ఈ వర్తమానమును ఎట్లు చెప్పగలుగుదుము. మెస్సీయా (అభిషిక్తుని) నిరాకరించిన పిదప, ఇశ్రాయేలు, రోమన్ సామ్రాజ్యము ద్వారా ఏ విధముగా చెదరగొట్టబడినదని మనము తిరిగి వెనుకకు పోయి చూపించవచ్చును. ఆకాశము క్రిందనున్న ప్రతియొక్క దేశమునకు ఆమె ఎట్లు తరుమగొట్టబడెను. యాకోబుకు తిరిగి పొమ్ము, ఇశ్రాయేలు, ఆదికాండము 44 మరియు 45లో చూపించుచున్నది - అక్కడ ఆయన ఆ యొక్క గోత్ర కర్తలను ఆశీర్వదించి మరియు వారికి చెప్పెను కడపటి దినములలో వారు ఎక్కడ ఉండెదరని; మరియు నేను ప్రతి యొక్క ఇశ్రాయేలు రాజ్యమును మీకు గుర్తించి చూపగలను, వారక్కడ ఏ రాజ్యములో ఉండెదరని చెప్పబడెనో, ఆ ప్రతి ఒక్కొక్క ఇశ్రాయేలు గోత్రమును అక్కడే యున్నది. మరియు ఈ రోజు మనమిక్కడ ఉన్నాము.

DAN 9:25,27

 

92మనకు తెలిసిన ఆ యూదుడు, అతడు నిజమైన యూదుడు కాడు. పోయి ఇతర సంఘములతో చేరకుండ, ప్రపంచ కార్యములలో తనను అపవిత్ర పరచుకొనక, సదాచారములతో యున్న (ఆ పాత మతమునే పాటించు చున్న) యూదుడే నిజమైన యూదుడు. వారే దూర ప్రాంతముల నుండి తిరిగి వచ్చుచున్నారు. జున్ను మరియు రొట్టె తినుచు, కొండలపై జీవించుచు, పాత పట్టణములోనికి అనుమతింపబడక యున్నారు. ఎవరిది కాని చోటులో వారికి ఒక పట్టణము కట్టబడి, ఇరు ప్రక్కల మెషిన్ గన్లు (మెషిన్ తుపాకులు) వారిపై గురి చూపబడుచున్నవి. అయినను ఆమె చిగురించ తొడగెను. ఆమేన్ మరియు ఆమేన్! కాలము సమీపముగా ఉన్నది.

93అక్కడ ఇష్మాయేలు మరియు ఇస్సాకు నిలుచుకొని ఆ భూమిని గురించి నీదా, నాదా అని తర్కించుకొనుచున్నారు, అయితే ఆమె (దేశము) ఇశ్రాయేలుకు చెందినది. మీరు గనుక క్రొత్త యెరూషలేమునకు పోవుట సంభవించిన ఎడల, వారు మీరు పాత యెరూషలేమునకు వచ్చుటకు అనుమతింపరు. మీరు మొదట అక్కడికి పోయిన ఎడల, వారు అరబ్బులు మీకు అంతయును వివరించుదురు, అటుపిదప ఆవలి తట్టుకు మిమ్ములను కొనిపోయెదరు. వారే ఇష్మాయేలు సంతానము. అయితే వేచి యుండుడి, దేవుని బిడ్డలు దానిని (ఆమెను, దేశమును) వశపరచుకొను కాలము వచ్చుచున్నది. అది సరియే! యెరూషలేము తిరిగి కట్టబడును. అనుదిన బలి అర్పణము నెలకొల్పబడును. ఏడు వారముల చివర వారి కొరకు అబద్దపు క్రీస్తు ఒక నిబంధనను ఏర్పరచుకొనును, మరియు దాని మధ్యలో, ఆ నిబంధనను అతడు మీరి (విరుగ గొట్టి) వారందరిని కేథలిక్కులకు త్రిప్పును. హేయమైన కార్యము ఆ విధముగా అన్నిట వ్యాపింపజేయబడును, మరప్పుడే అంతము వచ్చును. గమనించుడి.

94డెబ్బది వారములు. అవును, వారు సుమారుగా రెండువేల సంవత్సరములు వారు దూరముగా నుండిరి. ఇప్పుడు వారు త్రోలబడిరి (నెట్టుబడిరి). ఫరో యొక్క హృదయమును కఠినపరచబడినట్లు జనులుండిరి. ఆయన హిట్లర్ యొక్క హృదయమును కఠినపరచవలసి యుండెను. లక్షలకొలది వారు చనిపోయిరి. ఈ యొక్క ఈక్మాన్ను చూడుడి అరవై లక్షల యూదులను చంపిన అపరాధి, హృదయము గల మనుష్యులను వారిలో ఆరు మిలియన్లను (అరవై లక్షల మంది) మనుష్య ప్రాణములు — పసిబిడ్డలు, బిడ్డలు, పెద్దవారు — అందరును చంపబడిరి. ఈక్మాన్, ఒక్క మనిషి.

రష్యాను గమనించుడి, మీరెట్లు అక్కడి నుండి వారిని వెళ్ళగొట్టితిరి. వారిని నలుమూలలకు, అన్ని ప్రక్కలకు తరుమగొట్టిరి, మరియు వారు ఒక తృణీకరించబడిన దేశము, అయితే డబ్బులపై వారికి ఉన్న ఆశ, వారు తిరిగి వచ్చిరి. అయితే ఆ చిన్న గుంపు పాలస్తీనాకు తిరిగి వచ్చుచున్నారు. ఆమేన్, సహోదరులారా!

95ఆమె తిరిగి తన స్వదేశమునకు తిరిగి వచ్చుట ఆరంభించుట మీరు చూచినప్పుడు… అక్కడ 1,44,000 మంది కూడుటకు కావలసిన జనులు అక్కడ వారి యొద్దనున్నారు. మరియు ఏమి సంభవించుచున్నది? వారి యోసేపును వారు తెలిసికొందురు. మీరు చింతించవద్దు. అవునయ్యా! అది నెరవేరుటకు గాను మరియు వారందరు అక్కడ నిలుచుండి ఎదురు చూచుచున్నారు. మరియు ఆ గడియలోనే అది…

పోయిన సంవత్సరము రాజ్యములన్నియు వారిని (ఇశ్రాయేలును) ఒక దేశముగా చాటించినవి. అప్పుడది జరిగినప్పుడు, అంతమునకు మనము సమీపముగా ఉన్నాము. అన్యజనుల సంఘము పోయి యుండును. కావున ఏ సమయములో నైనను, "ఇశ్రాయేలు నా జనులని," దేవుడు చెప్పును. అది జరిగినప్పుడు, అన్యజనులు సమాప్తమగును.

LUKE 21:24

 

96"అవి పడద్రోయబడును," మత్తయి 24లో యేసు చెప్పెను, "అన్యజనముల కాలముల సంపూర్ణమగు వరకు యోరూషలేము యొక్క గోడలు పడద్రోయబడును." మరప్పుడు అది ముగించినప్పుడు, అప్పుడు యూదులు తిరిగి యెరూషలేమునకు తిరిగి వచ్చి, ఆలయమును తిరిగి స్థాపించి మరియు ఆలయ ఆరాధనను మరల నెలకొల్పెదరు. రానున్న తదుపరి వర్తమానములలో దానిని మనము గ్రహించెదము. ఆరు ఉద్దేశములు గల డెబ్బది వారములు. ముగించుటకు ముందు ఇప్పుడు దానిని నేను చదివెదను, ఏలయనగా మనము ఇండ్లకు పోవు సమయుముగా ఉన్నది, అటు పిదప ఈ రాత్రి 7 గంటలకు తిరిగి రావలయును.

DAN 9:24

 

97(మీరు వ్రాసుకొనుచున్న యెడల), మొదట: "తిరుగుబాటును మాన్పుటకును." దానియేలు 9వ అధ్యాయము, 24వ వచనము: "తిరుగుబాటును మాన్పుటకును [1], పాపమును నివారణ చేయుటకును [ 2], దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును [3], యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును [ 4], దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును [5], అతి పరిశుద్ద స్థలమును అభిషేకించుటకును [ 6]," మరియు దానిపైననే ఈ రాత్రి మనము మాట్లాడబోవుచున్నాము — దేవుడు నెరవేర్చును …

DAN 9:24

 

98ఇప్పుడు వేచియుండుడి, దానిపైన నేను తిరిగి చెప్పెదను కావున దానిని మీరు గ్రహించెదరు. మొదలు, తిరుగబాటును మాన్పుటకును; రెండవది, పాపమును నివారణ చేయుటకును; మూడవది, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును; నాలుగవది, యుగాంతము వరకుండునట్టి నీతిని బయులు పరచుటకును; అయిదవది దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును; ఆరవది, అతి పరిశుద్ద స్థలమును అభిషేకించుటకును. బైబిలు నుండి నేను మీకు చదివి వినిపించెదము. అది 24వ వచనము.

తిరుగుబాటును మాన్పుటకును [1], పాపమును నివారణ చేయుటకును [ 2], దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును [3], యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును [ 4], మరియు దర్శనమును ముద్రించుటకును [5], దర్శనమును మరియు ప్రవచనమును, మరియు అతి పరిశుద్ద స్థలమును అభిషేకించుటకును [ 6], నీ జనమునకు [యూదులు] పరిశుద్ద పట్టణమునకును [ఇశ్రాయేలు, యూదులు, యెరూషలేము] డెబ్బది వారములు విధింపబడెను - యెరూషలేము.

సరిగ్గా, ఆ విధముగా జరుగనై యున్నదని చెప్పుటకే అతడు వచ్చెను, మరి అప్పుడే అంతము వచ్చును.

ఇప్పుడు, ఈ రాత్రి ఆ కార్యములు ఏమని మనము చూచెదము మరి అక్కడికి ఎంత సమీపముగా మనమున్నామని చూడబోవుచున్నాము, మరి అటు పిదప, తరువాత ఆదివారము, ఆ కార్యములన్నియు ఆ వేళలు మనము ఎక్కడ నిలుచుకొనియున్నామో అని ఆయా కార్యములను, ఆయా వేళలో కుదర్చబోవుచున్నాము. నేను ఆయనను ప్రేమించుచున్నాను.

MAL 4:6

 

99ఇశ్రాయేలీయులు తమ స్వదేశమునకు తిరిగి వచ్చుచున్నారు, ఇశ్రాయేలు. దీనిని నేను ఇప్పుడు చెప్పనిమ్ము… ఇది టేపులో రికార్డు చేయబడలేదని నేనూహించుచున్నాను. దీనిని నేను చెప్పనిమ్ము: ఇశ్రాయేలు ఒక దేశముగా ఉన్నది… నేనెల్లప్పుడు నమ్ముదును ఎందుకనగా - ఇక్కడున్న నా జనుల ముందు - అక్కడే ఏదో కార్యమున్నది, నేను చనిపోక మునుపు ఇశ్రాయేలును తిరిగి దేవుని యొద్దకు నడిపించు బాధ్యత (నా వంతు కార్యక్రమము) నాకున్నది, ఎందుకనగా, ఆ గడియలోనే, (పాన్-అమెరికన్ చార్ట్ ద్వారా), ఇశ్రాయేలు రెండు వేల సంవత్సరములుగా చెదరగొట్టబడిన పిదప మొట్టమొదటి సారిగా, ఆ ఇశ్రాయేలు ఒక దేశముగా చాటింపబడిన ఆ వేళ, ఒక జనులు కాదు, సరిగా అదే సమయములో, ఖచ్చితముగా అదే ఘడియలో, దేవుని యొక్క దూత, దూరములో అక్కడ నన్ను కలిసి మరియు సువార్తతో నన్ను పంపెను - అదే కార్యము - మే 7, 1946. (ఇశ్రాయేలు, చెదరగొట్టబడి రెండు వేల సంవత్సరముల పిదప వారి స్వదేశమును చేరి ఒక దేశముగా అయిన అదే వేళలో ప్రవక్తను, దేవ దూత సంధించి - ఆయనను సువార్త సేవకు ప౦పెను.)

ఇప్పుడు, నేను తెలుసుకొన వలసినదిగా నాకు ఇయ్యబడిన ఇంకొక కార్యము, పిల్లల హృదయములను తండ్రుల తట్టుకు త్రిప్పుట, మరియు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు త్రిప్పుట — అది వర్తమానము. గమనించ౦డి మలాకీ 4, 3 కాదు; 4.

ZECH 3:9•

ZECH 14:7,8•

ROM 11:10,11

 

100ఇంకొక కార్యము, నా కుమారుడు బిల్లీ, మరియు నేను, మరియు సోదరుడు ఎర్న్ బాక్స్టర్ పాలస్తీనాకు పోవుచుంటిమి. ఆ యూదులు ఆ కూటములు చూచిన పిదప, ఆ యూదులను సోదరుడు ఆర్గన్ బైట్ యొద్ద మేము కలిసిన పిదప… లెవి పెట్రస్ బైబిళ్ళ అక్కడికి పంపెను మరియు చెప్పెను, "ఈ యొక్క యూదులు వచ్చి యున్నారు, చెప్పెను, "ఇశ్రాయేలు పెద్దలను కొందరిని పిలువుము, అలంకరణలతో ఉన్న క్రొత్త బోధకులను (రబీ) కాదు, అయితే నిజమైన ఇశ్రాయేలు పెద్దలను ఒక్కటిగా పిలిచి… మరియు మేము ఈ క్రొత్త నిబంధన చదివియున్నాము, మరియు మేమెరిగియున్నాము, అభిషిక్తుడు (మెస్సీయా) వచ్చునప్పుడు, సమరయలో ఉన్న స్త్రీకి వలె ఆయన ఈ కార్యములన్నియు మాకు చెప్పును. మా అభిషిక్తుడు (మెస్సీయా) ఒక ప్రవక్తగా ఉండును" అని మోషే చెప్పుట మేము ఎరిగి యున్నాము. మరియు మీరు వారికి చెప్పిన ఎడల, లేఖనముల ద్వారా వారికి చూపించి నట్లయిన [దానిని గురించి ఈ రాత్రి వర్తమానములో ధ్యానించెదము] వారు అంధకారములో నుండి, అన్యజనులు వచ్చులాగున వారి హృదయములు త్రుంచబడెను, కావున అన్యజనులకు సమాధాన పరచబడులాగున మనకొక సమయము కలిగెను, మరియు వారి హృదయములు కఠినపరచబడెను, సరిగ్గా యోసేపు కాలములో సంభవించినట్లు, మరియు అటు పిమ్మట ఆ యూదులను తీసికొని వచ్చి, శ్రోతలలో నుండి వారిని పిలిచి, ఏ విధముగా అన్యజనులను ఆత్మ ప్రేరేపణ ద్వారా మీరు చేయుదురో (కూడికలలో పేరు పెట్టి పిలిచి వారిని గురించి చెప్పుట), ఏలయనగా వారు చెప్పిరి, "ఒకవేళ ఈ యేసు ఆయన అభిషిక్తుడు (మెస్సీయా) అయిన ఎడల మరియు మీ వాక్యములు నిజమైన యెడల మరప్పుడు ఆయన చనిపోలేదు, మరియు ఆయన జీవించియున్నాడు. మరియు ఆయన జీవించియున్న యెడల, ఆయన తన శిష్యులలో ఉందునని వాగ్దానము చేసియున్నారు. మరియు ఆయన ఒక ప్రవక్త యొక్క సూచనను చేయుట మేము చూచిన యెడల, అప్పుడు ఆయన అభిషిక్తుడు (మెస్సీయా) అని మేము నమ్మెదము."ఎటువంటి ఒక పరిపూర్ణమైన కార్యము, ఖచ్చితముగా సరియే. అప్పుడు అది ఏమి చేయును? ఆ నాయకులలో ఒకే దినమున ఒక దేశము జన్మించును. వారిలో ప్రతి యొక్కరు చెప్పెదరు. "అది మాకు తెలియును." మరియు ఆ బోధకుడు (రబ్బీ దానిని చెప్పిన యెడల, అది వారికి చాలును. ఒక రాజ్యము (దేశము) ఒకే దినములో ఉద్భవించును. ఇశ్రాయేలు ఒకే దినమున జన్మించును.

101మరియు నేను ఆ మార్గములో కైరోలో, ఐగుప్తులో నన్ను పిలుచుటకు (విమానాశ్రయములో) పదిహేను లేక ఇరవై నిమిషములు ఉందనగా, నేను నా చేతిలో టికెట్టుతో అక్కడ నిలుచుకొని యున్నాము. వారు నన్ను విమానములో ఎక్కుటకు పిలువబోవుచున్నారు. మరియు నేను నల్ల చేమ్రానుతో చేయబడిన… ఏనుగు దంతముతో చేయబడిన ఒక చిన్న ఏనుగును, చూచుచుంటిని, పేపర్ వెయిట్ (బల్లపై పెట్టుటకు) నా స్నేహితుడైన డాక్టర్ శ్యామ్ అడియార్ కు దానిని కొని పంపించదలచితిని. మరియు నేను దానిని చూచుచుండగా, మరి ఏదో నాతో పలికి చెప్పెను, "ఇది ఇంకను సమయము కాదు. పాలస్తీనాకు ఇప్పుడు వెళ్ళకుము."

"నేనేమి తలంచుకొంటిననగా దానిని (పాలస్తీనాకు పోవద్దు అనుటను) నేనే అనుకొనుచున్నానా," మరియు నేను ముందుకు సాగితిని.

ఏదో చెప్పెను, " ఇది సమయము కాదు."

మరప్పుడు నేను విమానశ్రయము వెనుకకు వెళ్ళి, దేవుని తట్టు నా తలను పైకెత్తితిని. నేను చెప్పుకొంటిని, "దేవా, నాతో మాట్లాడుచున్నది నీవేనా?"

ఆయన (దేవుడు) చెప్పెను, "ఇది సమయము కాదు. పాలస్తీనాకు దూరముగా ఉండుము. ఇది ఘడియ కాదు." అప్పుడు నేను నా ప్రయాణ టిక్కెట్టును మార్చుకొని, అక్కడి నుండి రోమ్ కు పోయి పోర్టుగీస్ లోని లిస్బన్ కు తిరిగి వచ్చి అక్కడి నుండి అమెరికాకు తిరిగి వచ్చితిని.

102ఆ వేళ ఇంకను రాలేదు. అన్యజనుల యొక్క పాపములు (అక్రమములు) పరిపూర్ణము కాలేదు - పాత్ర నిండలేదు - అయితే ఒక రోజు ఆ విధముగా జరుగును. (పాపములు పరిపక్వము చెందలేదు). మరి దేవుడు అక్కడికి ఎవరో ఒకరిని, ఒక ప్రవక్తను పంపి, మరియు వారికి నిరూపించును… నేను నమ్ముచున్నాను, ఇప్పుడే దేవుడు అతనిని లేపవలయునని, అతడెవరైనను అతనిని త్వరగా లేపవలయును. అది నెరవేరవలయునని నేను నమ్ముచున్నాను. దానిని గురించియే మనము చదువబోవుచున్నాము. మనము చాల సమీపముగా ఉన్నాము…

103మరియు గుర్తుంచుకొనుడి, యూదులు క్రీస్తును అంగీకరించిన అదే నిమిషమున, అన్యజనుల సంఘము ఎత్తబడియుండును. అప్పుడు తెగుళ్ళు అన్యజనులపై క్రుమ్మరింపబడును - శ్రమలకాలము.

మరియు ఎట్లు మనుష్యుడు, గొప్ప బోధకులు - ఈ బైబిలును చూచి మరియు చెప్పుచున్నారు, సంఘము శ్రమల కాలములో వెళ్ళునని, బైబిలులో మరియు ఆ విధముగా చెప్పు వాక్యమే లేనప్పుడు, వారెట్లు చెప్పుచున్నారు? వారి యొద్ద ఏ ఒక్క కార్యము లేదు.

REV 12:15,17•

REV 19:11

 

104ఒక వ్యక్తి కొద్ది కాలము క్రితము నా యొద్దకు వచ్చి చెప్పెను, "ఓ మెక్ఫర్సన్ సోదరి బోధించెను, శ్రమలలో సంఘము వెళ్ళునని, ఏలయనగా ఆ సమయములో మనము ప్రకాశించు దీపములుగా ఉండెదమని. అప్పుడు అది ఇశ్రాయేలు, అన్యజనులు కాదు. అన్యజనుల కార్యము ముగించి యుండును, అది సంఘము. వారు శ్రమలలో పోనవసరము లేదు. ఆ ఘటసర్పము తన నోటి నుండి ప్రవాహమును గ్రక్కెను (17 అధ్యాయము) శేషించిన వారితో యుద్దము చేసెను, నిద్రించుచున్న కన్యకలు… నిజమైన సంఘము (వధువు) పైకి కొనిపోబడి యుండును. ఆ సమయములో ఆమె పెండ్లి విందులో ఉండును - కడపటి వారములో అది జరుగును ఆ వేళలో పెండ్లి విందు జరుగుచుండును. మరియు అప్పుడే శ్రమలు ప్రారంభింప తొడగును, మరియు మిడుతలు మరియు హింసలు (బాధలు) ఆ విధమైన కార్యములు సంఘములపై (సంఘ శాఖలపై) లేచును. అప్పుడు చివరిగా, ఇక్కడ 19వ అధ్యాయములో ఆమె తన పెండ్లి కుమారునితో వచ్చును. (హల్లెలూయా!) — రాజాధిరాజు మరియు ప్రభువులకు ప్రభువు, రక్తములో ముంచబడిన వస్త్రములు, మరియు పరలోక సైన్యసమూహము తెల్ల గుఱ్ఱములపై సవారి చేయుచు ఆయనతో కూడా (వధువు) వచ్చును. అదిగో అక్కడ వెయ్యేండ్ల పరిపాలనలో ఆమె స్థానమును గైకొనుటకు ఆమె వచ్చుచున్నది. ఆమేన్! ఓ!

నామము ఆశీర్వదింపబడును గాక,

ఓ, నామము ఆశీర్వదింపబడును గాక,

ప్రభువు యొక్క నామము ఆశీర్వదింపబడును గాక,

నామము ఆశీర్వదింపబడును గాక,

ఓ, నామము ఆశీర్వదింపబడును గాక,

ప్రభువు యొక్క నామము ఆశీర్వదింపబడును గాక,

యేసు ఆ నామము, ప్రభువు యొక్క నామము యేసు!

యేసు ఆ నామము,

ఓ, యేసు ఆ నామము,

ప్రభువు యొక్క నామము యేసు!

ఆయన నామమును ఘనపరచుడి,

ఓ, ఆయన నామమును ఘనపరచుడి,

ఓ, ప్రభువు యొక్క నామమును ఘనపరచుడి!

నామమును ఘనపరచుడి,

ఓ, నామమును ఘనపరచుడి,

ప్రభువు యొక్క నామమును ఘనపరచుడి!

105దానిని మీరెట్లు చేయుదురు? మీ జీవితములో దానిని గొప్పగా చేయుడి. మీరు జీవించునటువంటి జీవితమును వారు ఎట్లు చెప్పెదరనగా, "అదిగో అక్కడ ఒక క్రీస్తు యొక్క దాసుడు." ఇప్పుడు ఆ విధముగానే మీరు ఆయన నామమును ఘనపరచ వలయును, చూచారా.

ఓ, మీరు ఆయనను ప్రేమించుట లేదా? ఓ, మై! ఇప్పుడుమన యొక్క చిన్న పాట:

చాలా కాలము క్రిందట

అది నిజముగా జరిగినదని నాకు తెలియును,

ఒక పశువుల తొట్టిలో మానవులను, వారి పాపముల నుండి రక్షించుటకు ఒక బిడ్డ పుట్టెను.

యోహాను ఆ తీరమున ఆయనను చూచెను.

నిత్య నిత్యముగా ఒకే గొర్రెపిల్ల, (ఆ గొర్రెపిల్ల

ఏడు ముద్రలతో, పరలోకములోను,

మరియు భూమిపైనను ఒకే ఒక్కడే దానిని.)…

నిత్య నిత్యముగా, గొర్రెపిల్ల,

చాలా కాలము క్రిందట ఒక పశువుల తొట్టిలో

అది నిజముగా జరిగినదని నాకు తెలియును,

మానవులను, వారి పాపముల నుండి రక్షించుటకు ఒక బిడ్డ పుట్టెను.

యోహాను ఆ తీరమున ఆయనను చూచెను

నిత్య నిత్యముగా గొర్రెపిల్ల,

ఓ, ప్రభువు యొక్క నామము రక్షింపబడును గాక,

ఓ, నామము ఆశీర్వదించబడును గాక!

ఓ, నామము ఆశీర్వదించబడును గాక,

ఓ, ప్రభువు యొక్క నామము ఆశీర్వదింపబడును గాక.

నామము ఆశీర్వదింపబడును గాక,

నామము ఆశీర్వదింపబడును గాక,

ప్రభువు యొక్క నామము ఆశీర్వదింపబడును గాక!

106నేను ఆరాధించుటకు ఇష్టపడుచున్నాను, మీరిష్టపడుట లేదా? ఇప్పుడు మనము ప్రసంగమును వినుటకు మాత్రము సంఘమునకు రాలేదు; దానితో కూడ అదియు ఉండును, అయితే ఆరాధించుటకు మనము సంఘమునకు వచ్చుచున్నాము ఆత్మతో మరియు సత్యముతో ఆరాధించుటకు. మీరు సత్యమును వినియున్నారు అది వాక్యము. చూసారా. ఇప్పుడు, ఆరాధించుట అనగా, మిమ్ములమీరు ఆయనకు వ్యక్తపరచుట, చూశారా.

"ఓ, ఆ గలిలయ వ్యక్తిని నేను ప్రేమించుచున్నాను!" దానిపై శ్రుతి (రాగము), మాకు నియ్యుడి. అది మీకు తెలియునా, టేడ్డి? ఇప్పుడు నేను మరచిపోయియున్నాను… మనమిప్పుడు చూచెదము, మనము చూచెదము.

ఓ, గలిలయ నుండి వచ్చు ఆ వ్యక్తిని నేను ప్రేమించుచున్నాను.

ఏలయనగా నా కొరకు అధికముగా చేసియున్నాడు,

ఆయన నా పాపములన్నిటిని ఆయన మన్నించి యున్నాడు,

లోపల పరిశుద్దాత్మను ఉంచి యున్నాడు,

ఓ, నేను ప్రేమించుచున్నాను,

ఆ గలీలయ మనుష్యుని నేను ప్రేమించుచున్నాను.

సుంకరి ఒక రోజు అక్కడ ఆ ఆలయములో ప్రార్ధించుటకు వెల్లెను,

అతడు మొరపెట్టెను,

"ఓ ప్రభువా, నా పై దయకలుగనిమ్ము, "

అన్ని పాపముల నుండి అతడు మన్ని౦పబడెను,

లోపల ఒక గాఢమైన సమాధానము ఉంచబడెను.

అతడు చెప్పెను, "గలిలేయుడైన ఈ వ్యక్తిని వచ్చి చూడుడి

మనుష్యుని నేను ప్రేమించుచున్నాను, గలిలయ నుండి వచ్చిన,

ఏలయనగా ఆయన నా కొరకు అధికముగా చేసియున్నాడు.

ఆయన నా పాపములన్నిటిని క్షమించి యున్నాడు,

నాలో పరిశుద్దాత్మను ఉంచెను,

ఓ, నేను ప్రేమించుచున్నాను,

గలిలీయుడైన ఆ వ్యక్తిని నేను ప్రేమించుచున్నాను.

కుంటివారు నడచు లాగున చేసెను,

మూగవారు మాటలాడు లాగున చేసెను.

సముద్రముపై ఆ శక్తి ప్రేమతో పలికెను.

గ్రుడ్డివారు చూచులాగున చేసెను

నాకు తెలియును అది గలిలైయుడైన ఆ మనుష్యుని శక్తి మాత్రమే.

ఓ, గలిలైయుడైన ఆ వ్యక్తిని నేను ప్రేమించుచున్నాను,

గలిలయ నుండి వచ్చిన,

ఏలయనగా ఆయన నా కొరకు అధికముగా చేసెను,

నా పాపములనన్నిటిని ఆయన మన్ని౦చెను,

నాలో, ఆ పరిశుద్దాత్మను ఉంచెను.

ఓ, నేను ప్రేమించుచున్నాను,

ఆ గలిలైయుడైన మనుష్యుని నేను ప్రేమించుచున్నాను.

దీనిని వినుడి:

ఆమె యొక్క పాపములన్నిటిని ఆయన చెప్పెను,

ఆ సమయములో ఎట్లు ఐదుగురు భర్తలను

సమస్త పాపముల నుండి ఆమె మన్నింపబడెను,

మరి ఒక గాడమైన సమాధానము లోనికి వఛ్చెను!

అప్పుడామె కేకవేసెను,

"గలిలయ నుండి వచ్చిన ఆ వ్యక్తిని వచ్చి చూడుడి."

ఓ, గలిలయ నుండి వచ్చిన ఆ వ్యక్తిని నేను ప్రేమించుచున్నాను,

గలిలయ నుండి వచ్చెను,

ఎందుకనగా ఆయన నాకు అధికముగా చేసెను.

నా పాపములన్నింటిని ఆయన మన్నించెను,

నాలో పరిశుద్దాత్మ ఉంచెను.

ఓ, నేను ప్రేమించుచున్నాను,

ఆ గలిలైయ మనుష్యుని నేను ప్రేమించుచున్నాను.

107ఆయనను నేను ప్రేమించుచున్నాను, మీరు ప్రేమించుట లేదా? నా హృదయపూర్వకముగా. మీరు ఆ విధముగా ప్రేమించుట లేదా? ఆయన అద్భుతమైనవాడు కాడా?

ఓ, ఆశ్చర్యకరుడు యేసు నాకు ఆశ్చర్యకరుడు. (ఆయన ఏమై యున్నాడు?)

ఆలోచన కర్త, సమాధానకర్తయగు అధిపతి, బలవంతుడైన దేవుడు ఆయన,

ఓ, నన్ను రక్షించుచున్నాడు, నన్ను కాచుకొనుచున్నాడు పాపమంతటి నుండి మరియు నీచ స్థితి నుండి

నా యొక్క విమోచకుడు ఆశర్యకరమైన వాడు, ఆయన నామమును స్తోత్రించుడి.

ఇప్పుడు మనము మన తలలు వంచి మరి దానిని గురించి తలంచెదము.

నేను ఒకప్పుడు తప్పిపోయి యుంటిని, అయితే ఇప్పుడు నేను కనుగొనబడ్డాను;

శిక్షావిధికి నేను తప్పియున్నాను.

(రాజ్యములు పగులగొట్టబడుచున్నవి, పరవాలేదు.)

యేసు స్వాతంత్ర్యము మరియు ఒక పరిపూర్ణ రక్షణ నిచ్చును.

ఆయన నన్ను రక్షించుచున్నాడు,

నన్ను ఆయన కాచుకొనుచున్నాడు

పాపమంతటి నుండి మరియు నీచ స్థితి నుండి

నా యొక్క విమోచకుడు ఆశ్చర్యకరమైన వాడు,

ఆయన నామమును స్తోత్రించుడి.

ఓ, ఆశ్చర్యకరుడు, యేసు నాకు ఆశ్చర్యకరుడు.

ఆలోచన కర్త, సమాధానకర్తయగు అధిపతి,

బలవంతుడైన దేవుడు ఆయన నన్ను రక్షించుచున్నాడు,

నన్ను కాచుకొనుచున్నాడు

పాపమంతటి నుండి మరి నీచ స్థితి నుండి

నా యొక్క విమోచకుడు ఆశ్చర్యకరుడు

ఆయన నామమును స్తోత్రించుడి.

ఓ, దానిని గురించి తలంచుడి!

నేను ఒకప్పుడు తప్పిపోయి యుంటిని;

ఇపుడు నేను కనుగొనబడ్డాను;

శిక్షా విధికి నేను తప్పియున్నాను.

యేసు స్వాతంత్ర్యమును మరియు ఒక పరిపూర్ణ రక్షణను ఇచ్చును.

నన్ను రక్షించును, (ఆయన ఏమి చేయును?)

నన్ను కాచుకొనును (కాపాడును.)

సమస్త పాపముల నుండి మరియు నీచస్థితి నుండి

(దానిపైన సవారి చేయుచు!)

ఓ, నా యొక్క విమోచకుడు ఆశ్చర్యకరుడు.

ఆయన నామమును స్తోత్రించుడి

ఇప్పుడు అందరును కలిసి!

ఓ, ఆశ్చర్యకరుడు,

యేసు నాకు ఆశ్చర్యకరుడు.

ఆలోచన కర్త సమాధానకర్తయగు అధిపతి,

ఆయన బలవంతుడగు దేవుడు ఎందులకు,

నన్ను రక్షించుచున్నాడు,

నన్ను కాచుకొనుచున్నాడు.

సమస్త పాపముల నుండియు మరి నీచ స్థితి నుండి

నా యొక్క విమోచకుడు ఆశ్చర్యకరుడు,

ఆయన నామమును స్తోత్రించుడి

ఓ, నేనెట్లు యేసును ప్రేమించుచున్నాను, (మహిమ!)

ఓ, నేనెట్లు యేసును ప్రేమించుచున్నాను

(మీ చేతులను పైకెత్తుడి; దానిని పాడుడి.

ఆయన కొరకు నేను వేచి యున్నాను!)

ఓ, నేనెట్లు యేసును ప్రేమించుచున్నాను,

ఏలయనగా ఆయన నన్ను మొదట ప్రేమించెను.

ఇప్పుడు, మన చేతులు పైకెత్తబడియుండగా,

ఆలాగున నిజముగానే చేయ వలయుననిన యెడల

ఆయనను ప్రేమించవలయునన్న.

ఆయనను ఎన్నడూ నేను విడువను,

ఆయనను ఎన్నడూ నేను విడువను,

ఆయనను ఎన్నడూ నేను విడువను,

ఏలయనగా ఆయన నన్ను మొదట ప్రేమించెను.

108మీరు ఆయనను ప్రేమించుచున్నారా? అట్లయిన మీరు ఒకని నొకరు ప్రేమించవలయును. ఏలయనగా మీకు ఎవరని తెలిసి మీరు చూచుచున్న వారిని మీరు ప్రేమించనియెడల, మీరు చూడని ఆయనను మీరేల ప్రేమించగలరు? మనము ఒకరి కొకరు చేతులు పట్టుకొని మరియు పాడెదము.

ఓ, నేనెట్లు యేసును ప్రేమించుచున్నాను,

ఓ, నేనెట్లు యేసును ప్రేమించుచున్నాను,

ఓ, నేనెట్లు యేసును ప్రేమించుచున్నాను,

ఏలయనగా ఆయన నన్ను మొదలు ప్రేమించెను.

ఆయనను ఎన్నడూ నేను విడువను,

(ఇప్పుడు ఆయన కొరకు మీ చేతులు పైకెత్తుడి.)

ఆయనను ఎన్నడూ నేను విడువను,

ఆయనను ఎన్నడూ నేను విడువను,

ఏలయనగా ఆయన నన్ను మొదట ప్రేమించెను.

MATT 28:20

 

109ఆలోచించండి, ఆయన ఈ యొక్క గొప్ప ప్రత్యక్షత మనకు బయలుపరచెను. ఆయనను మనము ప్రేమించుట లేదా? ఆయన ఆశ్చర్యకరుడు కాడా? మన యొక్క ప్రభువైన యేసుకు మనమెట్లు కృతజ్జలమైయున్నాము. మనలను ఎన్నడూ విడువడు - "ఇదో నేనెల్లప్పుడు మీతో కూడా ఉన్నాను, వరకు…"

దానియేలు యొక్క డెబ్బది వారములను గూర్చి మనము ఆనందించుచున్నామా? ఓ, ఆయనను మనము ప్రేమించుచున్నాము కదూ? అదెట్లు చేయును?

నా విశ్వాసము నీ వైపుకు చూచుచున్నది,

కల్వరి గొర్రెపిల్లవైన నీవు, దైవీక రక్షకా!

(మీ హృదయాంతరములో నుండి ఆయనను ఆరాధించుడి.)

ఇపుడు నేను ప్రార్థించుచుండగా వినుము,

నా యొక్క పాపములనన్నిటిని దూరముగా పారద్రోలండి.

ఓ, ఈ దినము నుండి నేను పరిపూర్ణముగా నీకు చెందనీ!

జీవితములో సంభవించు, చీకటి చిక్కులు (కష్టములు) పై నేను నడచునప్పుడు,

(మన మందరమును దానిని చేయుదుము.)

మరియు బాధలు నన్ను చుట్టు ముట్టియుండగా

నన్ను నడిపించు దేవునిగా మీరుండుము

(ప్రభువా దానిలో నన్ను నడిపించుము.)

ఈ రోజు అంధకారమంతయు పోవులాగున ఆజ్ఞాపించుము,

దుఃఖములు బయములు పోయేలాగున తుడిచివేయుము

నిన్ను వదలి నేనెన్నడును నీ త్రోవ విడిచి పోకుండును గాక,

[బ్రెన్హాం సోదరుడు తనలో తానే పాడుకొనుచున్నారు.]

సొమ్మసిల్లు నా హృదయమునకు బలమును,

నా ఉత్సాహము ప్రేరేపింపబడుచున్నది,

ఈ రోజు అంధకారమంతయు పోయేలా ఆజ్ఞాపించుము,

నా యొక్క భయములన్నిటిని తుడిచివేయుము,

ఓ, ఈ దినము నుండి నేను పరిపూర్ణముగా నీకు చెందనీ!

DAN 9:3

 

110ఓ, యేసు, ఏదో కార్యమునకు మేము సమీపించుచున్నామని మేము చూచుచున్నాము. యెషయా ప్రవక్త దానిని గురించి పలికియున్నాడు, యిర్మీయా దానిని గురించి చెప్పియున్నాడు. వారేమి చెప్పియున్నారని దానియేలు వెనుదిరిగి చూచెను. అది అతని హృదయుమును కదిలించెను. అతను పరలోకము వైపు తన ముఖమును ఉంచెను, అతను గోనెపట్ట కట్టుకొని మరియు బూడిదలో ఉపవాసముండెను. అతను వినదలచెను ఏలయనగా అప్పుడే, అతడు జనులను హెచ్చరించెను.

ప్రభువా మేము కడపటి కాలముకు సమీపముగా యున్నామని పుస్తకముల ద్వారా, మీ పుస్తకము యొషయా గ్రంథము, యిర్మీయా, గ్రంథము, యాకోబు పత్రిక, యోహాను, లూకా, మార్కు, మత్తయి, ప్రకటన గ్రంధముల ద్వారా, నీ పరిశుద్ద గ్రంథముల ద్వారా చూచుచున్నాము. మరియు ప్రార్థన ద్వారా మా ముఖములను పరలోకము వైపు పెట్టియున్నాము, "ప్రభువా మేమెక్కడ ఎక్కడ జీవించుచున్నామో అని తెలిసికొనుటకు విజ్ఞాపనలను నీ యొద్ద ను౦చి యున్నాము. ఉదయకాలపు కిరణములు ప్రకాశించుటను మేము చూచుటకు ఆరంభించుచున్నాము. మరియు ప్రభువా, మేము మీ యొద్దకు వచ్చుచున్నాము. ఇప్పుడు మా యొక్క విశ్వాసము నీ వైపుకు చూచుచున్నది. మన యొక్క సమయము చాలా స్వల్పముగా ఉన్నదని, గ్రహించి, ప్రతి భారమును, సులభముగా చిక్కుల బెట్టు పాపమును విడిచిపెట్టి ఇప్పుడు మనము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాము.

111ప్రభువా, ఇక్కడున్న ఈ జనులను ఆశీర్వదించుము. వారు నిన్ను ప్రేమించుచున్నారు. వారు నీ వారు. వారు బయటికి వచ్చియున్నారు, మీరే వారికి బయులుపాటును ఇచ్చుచున్నారు. వేుము మీ కొరకు వేచియుండగా, ఈ కార్యములనన్నిటిని మీరు మాకు అనుగ్రహించవలయునని మేము ప్రార్ధించుచున్నాము.

ప్రభువా, క్షుణ్ణంగా ధ్యానించు మంచి మధ్యాహ్న సమయమును మాకు దయచేయుము. మాకు అర్ధము చేసికొను జ్ఞానము నిమ్ము. ఈ రాత్రి తిరిగి మమ్ములను ఉత్సాహముతో తీసికొని రమ్ము. గబ్రియేలు దర్శించుటలో గల ఈ ఆరు ఉద్దేశములలో గల కారణములను నేను ధ్యానించుచుండగా, ఓ, ప్రభువా, ఈ మధ్యాహ్నము నన్ను అభిషేకించుము. ఒకవేళ గబ్రియేలు దర్శించుటకు వచ్చి మరియు ఆరు ఉద్దేశముల అర్ధమును యిచ్చుచుండగా, ప్రభువా, దానిని మేము తెలిసికొన వలయును. ఈ గ్రంథములను మేము చదువుట ద్వారా మేము చాలా సమీపముగా యున్నామని మరియు ఎరిగియున్నాము, కావున ఈ రాత్రి దానిని మాకు బయలుపరచ వలయునని మేము ప్రార్ధించుచున్నాము.

రాబోవు ఆదివారము, ప్రభువా, ఓ దేవా అక్కడ వారికి ఆ దినములను క్రమపరచుము. అదెట్లు అని నాకు తెలియదు, అయితే సకాలములో మీరు మమ్ములను పిలుచుకొని రాగలరు. మీ వైపు మేము చూచుచున్నాము. మేము ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నాము మరియు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తము, అన్ని పాపముల నుండి మమ్ములను శుద్ధిపరచెను. ఇప్పుడు మీ వైపుకు మేము చూచుచున్నాము, మీ పై మేము కాచుకొనియుండగా మాకు సహాయపడుము, తండ్రి. మా ప్రభువైన యేసు ద్వారా…

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...