దానియేలును దర్శించుటలో గల గబ్రియేలు యొక్క ఆరు ఉద్దేశ్యములు

దానియేలును దర్శించుటలో గల గబ్రియేలు యొక్క ఆరు ఉద్దేశ్యములు

VGR COUNT -157 1ఈ ఉదయము మనయొక్క యౌవ్వన స్త్రీలు, మీకు తెలియునా పదహారు యౌవ్వనములో ఉన్న యువతులు చిన్న "పెఫే'' మరియు ''ఫిఫీ''… చాలా ఆశ్చర్యముగానున్నది… మరియు వారు ఆలయమునకు వచ్చియున్నారు… మీకు వారిని గురించి తెలియును - ఆ వయస్సులో ఉన్న యువతులు, వారు సొగసుగా కనిపించవలయునని కోరుకొందురు, మీకు తెలియును, మీకు తెలియును వారు - వారి తలలపై వారు వెంట్రుకలను చుట్టలు చుట్టలుగా, ఉంగరమువలె ముడుచుకొని యుందురు. మరియు నేను ప్రసంగించుచుండగా, నేను గమనించియున్నాను. ఆ ముడుచుకొనియున్న చుట్టవలెనున్న వెంట్రుకలు వారి ముఖములపై పడుచున్నప్పుడు మరియు వారు వాటిని ఊది వేయుదురు. ఆ చుట్టలన్నియు…..

2డౌనింగ్ సోదరి యొక్క చిన్న కుమార్తెను మరి నేను గమనించియున్నాను. మరియు చిన్న… సోదరుడు కొలిన్స్ - ఆమె పేరు ఏమిటీ? చిన్న బెట్టి. నాలో నేను నవ్వుకోన్నాను, అయితే ఆ అందమునంతయు నేను చూసియున్నాను, మీకు తెలియునా అన్నియు వారికి సమకూడియున్నవి.

సరి, ప్రియురాలా, మీ హృదయములు ఆశీర్వదింపబడనిమ్ము, ఎట్లున్నను మీరు నాకు అందమైనవారు. అది నిజము. చక్కని, చక్కని అనగా మంచి ఆత్మీయ కూటములకు వచ్చి మరియు సువార్తను భుజించుటయే. అదే ఒక బాలికను ముచ్చటగా ఉండునట్లు చేయును. మరియు వివాహము చేసికొనుటకు అర్హుడైన ప్రతివాడును అదే విధముగానే తలంచును. [ఎవరో ఒకరు "ఆమెన్" చెప్పెను.] వందనములు, అయ్యా - ఎవరో నాతో అంగీకరించుచున్నారు. అది నిజము. మంచిది. అది సత్యమని నేను నమ్ముచున్నాను.

PS 133:1,2

 

3ఇప్పుడు, అది ఆశ్చర్యముగా లేదా? నేను బైబిలును తెరచిన వెంటనే నేను దానియేలు 9కి సరిగ్గా త్రిప్పితిని. ఇప్పుడు చొక్కాయిలో రంధ్రములు కలవారు వారి పైకోటును తీయవద్దని నేను ఎల్లప్పుడు చెప్పుదును, నా చొక్కాయిలో ఆ విధముగా లేదు అని ఆశించుచున్నాను. అయితే నా చొక్కాయిలో రంధ్రములు (చినిగినందువలన) ఉన్నందున నిజముగా ఒకప్పుడు నేను కోటును తీయలేని పరిస్థితిని చూసియున్నాను. మరియు ఇప్పుడు ధరించియున్న చొక్కాయికి ఆ విధముగా లేదని నేను అనుకొనుచున్నాను.

ఇప్పుడు, ఓ, నా మట్టుకైతే మేము, మరి శ్రోతల కొరకు, ఈ ఉదయము పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నతను మేము అభినందించుచున్నాము. మరియు ప్రతి ఒక్కొక్కరి యొక్క ఐక్యతను, ఉనికిని మేము అభినందించుచున్నాము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము.

అది అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె ఉండును.

4ఈ రోజు బ్లూ-బోర్ అను హోటల్కు భుజించుటకు వెళ్లియుంటిని, మరియు అక్కడ ఎవరిని కలిసితిని, సోదరుడు బిల్ మరియు సోదరి డౌచ్, నేను ఇంతవరకు చూడని మంచి వేయించిన కోడి మాంసమును తినుచుండిరి. వారు రుచించుచు మంచి సమయమును గడుపుచుండిరి, మీకు తెలియునా. పైకి వెళ్లి మరియు అక్కడ చాలా సంఘ సభ్యులను అక్కడ కలుసుకొన్నాను, మరియు వారు నా యొక్క భోజనమునకు కూడ పైకము వారే చెల్లించవలెనని కోరిరి. ఇప్పుడు, అది నిజముగానే చాలా బాగున్నది. దానిని నేను అభినందించుచున్నాను.

నేను ఇంటికి వెళ్లినప్పుడు, బిల్లి ఒక పెట్టే నిండుగా టమోటాలను తీసికొనివచ్చెను. ఎవరో ఒకరు చల్లని ప్రదేశమైన జార్జియా నుండి వాటిని నా కోరకు తీసికొని వచ్చిరి. అక్కడ ఈ సమయమున చాలా చల్లగా ఉండునని వారు నాతో చెప్పిరి.

5ఈ రోజు మధ్యాహ్న సమయమున నా సమావేశమును ముగించుకొని ఒంటి గంటన్నరకు ముందు సంఘమునకు ప్రక్కగా వచ్చుచున్నప్పుడు, అక్కడ బయట ఒక చిన్న వ్యక్తిని కలుసుకొంటిని. అతడు ఒక యవ్వనస్తుడు. ''వేడిగా ఉన్నదని'' నేను చెప్పాను.

అతడు చెప్పేను, ''అది నిశ్చయముగా.'' అతడు జార్జియా నుండి వచ్చియున్నాడని నేను ఎరిగియున్నాను, కావున అతడు చెప్పెను, "జార్జియాలో అక్కడ నిశ్చయముగా వేడిగా ఉన్నది.''

సరి, వేడైన స్థలము నుండి మనము తప్పించుకొనుటకు ప్రయత్నించుచున్నాము. మనము ప్రయత్నించుట లేదా? అందుకొరకే మనము ఇక్కడ ఉన్నాము.

6స్నేహితులారా, మీ యొక్క మంచితనమునకు మీకు కృతజ్ఞతలు. మీరు లేకుండా నేనేమి చేయగలను? మీరు లేకుండా నేనేమి చేయగలను? ఒకవేళ నన్ను ప్రేమించువారు ఎవరు లేకుండా, వర్తమానమును వినుటకు ఎవరు లేనియెడల, నా యొక్క వర్తమానమంతయు, ఏ మంచియు చేయదు. నేను టెలీఫోను స్తంభములకు, మరియు చెట్లకు ప్రసంగించలేను. దానిని అవి అర్థము చేసికొనలేవు. కావున మీలాంటి జనులు, అందరు వచ్చి దానిని వినెదరు. మరియు మీలాంటి జనులు వచ్చి ఇటువంటి వేడి ప్రదేశములలో ఉన్నప్పుడు మరియు అది… ఈ రోజు ఉదయము అక్కడ తీవ్రమైన ఉష్ణముతో కాలిపోయినట్లు అనుభూతి నొందినట్లు నా భార్య చెప్పెను. మరియు జనులను చూచుట, కొన్ని సమయములలో వ్యాధిగ్రస్థులను, అటువంటి కూటములలో వారు ఉన్నప్పుడు, దేవుడు మీకు మహిమలో ఒక అందమైన, చక్కటి గృహము అనుగ్రహించవలయునని నా ప్రార్థన. మరియు ఆయన దానిని చేయునని నేను నమ్మి, విశ్వసించుచున్నాను.

7ఇప్పుడు, మనము చూచెదము. నా యొక్క కోటు? ఇక్కడెవరో దానిని తీసికొనిపోయిరి. ఈ రాత్రి నేను కొద్దిగా చదువ వలయును. ఈ యొక్క మొదటి భాగమును ఎందరు అనుభవించుచున్నారు…? ఓ, ఇక్కడ అధిక వేడి లేనియెడల, ఈ వారమంతయు ప్రకటన గ్రంథమును పూర్తిగా ధ్యానించ వచ్చును. మరియు దానిని నేను ప్రేమించుచున్నాను. దానిలో నేను జీవించుచున్నాను. ఈ వారము నా కొరకై ప్రార్థించుడి, ఏలయనగా ప్రభువు చిత్తమైనయెడల, రాబోవు ఆదివారము, ఆ వారములను ఒక్కటిగా సమకూర్చవలయునని యున్నాను. మరియు అదేమిటని నాకు తెలియని కార్యము అది, మరియు నేను ప్రభువుపై ఆధారపడబోవుచున్నాను, నా కొరకు ఆయన దగ్గర బదులున్నది.

మరియు దానిని గురించిన పలికిన, దానిని గురించి వ్రాసిన ఎవరెవరివో, పలువిధములైన వ్యక్తులని నేను చదివియున్నాను. ఒక గొప్ప వేదాంత పండితుడైన డాక్టరు స్కోఫీల్డు పుట్-నోట్స్ ను (పుస్తకములో పేజీ అడుగున వ్రాయబడు వివరణ) నేను చదివియున్నాను. నిజముగానే అతని యొక్క అనేక పుట్-నోట్లతో నేను అంగీకరించలేకున్నాను, అది సరిగా చిత్రీకరింపబడి యుండవలయును, అందువలన నేను అక్కడ చూడలేకయున్నాను.

8ఇప్పుడు, మీరు జాగ్సా ఫజిల్ ను (మర్మమైన కార్యములను) ఒక్కటిగా వుంచినయెడల, మీకు తెలియును, మొదటి కార్యము, మీరు చెప్పెదరు, "ఓ, ఇక్కడ ఇది పైకి పోవుచున్నది."

"కాదు, ఇది పైకి పోవుచున్నదని నాకు నిశ్చయముగా తెలియును."

సరి, మీరేమి చేయుచున్నారో, దాని మాదిరిని మీరు చూడవలయును. మరియు అప్పుడు మీరు అట్లు చేయనియెడల మీ కార్యమును అంతయు తుడిచివేయుదురు.

ఇప్పుడు, ఒకవేళ విశాలమైన, అందమైన గ్రామములాంటి ఊరి ప్రక్క, ఒక ఆవు చెట్టుపై గడ్డిని మేయు చిత్రము ఏలాగుండును? ఇప్పుడు అది సరి కాదు, ఏలయనగా ఒక చెట్టుపై ఆవు గడ్డి మేయదు. కావున అది ఆలాగే ఉన్నది.

పరిశుద్ధాత్మ లేఖనములను సరిగ్గా సమకూర్చనియెడల… అప్పుడు పరిపూర్ణమైన ఆ గొప్ప విమోచన పటమును (చిత్రీకరణను) మీరు పొందెదరు. అందుకొరకే, సత్యమును మనము కోరుచున్నాము. మరియు సత్యమును మనమును తెలిసికొనువరకు, దానిని అట్లే మనము వదలి వేయుదము. అటు పిదప, దేవుడు మనకు సత్యమును అనుగ్రహించినయెడల, అప్పుడు నేను దానిని గురించి పలికెదను.

9ప్రారంభకాలము నుండి సంఘమునకు వచ్చుచున్న సోదరుడు రాయ్ స్లాటర్ మరియు ఇంకా కొంతమంది పాత సహోదరులు చాలా కాలము క్రిందని అనుకొనుచున్నాను… ఈ గుడారములో నా యొక్క సేవలోని మొదటి మూడు లేక నాలుగు సంవత్సరములలో అనుకొనుచున్నాను, నరకము అనే అంశమును నేను ప్రసంగించనే లేదు, ఏలయనగా అది ఒక మండుచున్న స్థలమా లేక అదొక సమాధియేనా? అనే దానిని నేను సరిగ్గా గ్రహించలేకపోయాను. వాక్యములో సమాధి అని వచ్చే స్థలమున చదివేటప్పుడు, ఒక్కొక్కసారి ఆ వాక్యము యొక్క అర్థము పాతాళము (Hades) అనే దానిని నేను సమాధి ( Grave) అనే మాటకు తర్జుమా చేసేవాడిని. పాతాళము అనే మాటకు సమాధి అని అర్థము. అందులో, నేను దాని గురించి సరిగ్గా గ్రహించలేనందువలన, నేను ఏమీ మాట్లాడుతున్నానో దానిని గురించి ఖచ్చితముగా తెలుసుకునేంత వరకు దేనిని గురించి మాట్లాడనే మాట్లాడను. దానిని గురించి తెలుసుకున్నప్పుడు నేను నరకమును గురించి ప్రసంగించాను. అందులో నేను నిజంగానే నరకము యొక్క పరిపూర్ణమైన సన్నివేశమును నేనే చూచి, అది ఎక్కడున్నదని తెలుసుకున్న తరువాత, ఎందుకనగా… కావున ఒక వాక్య పరిచారకుడు తన యొక్క సంఘమునకు దేనిని ప్రసంగించుచున్నాడో దానికి అతడు బాధ్యతను వహించవలెనని నేను తలంచుచున్నాను, ఎందుకనగా ఆ ప్రజలు అతడు చెప్పిన దానిని అట్లే దానిని గ్రహించి గైకొనెదరు. అందుచే, ఒకవేళ, వారు తప్పైన కార్యములను గైకొనేలా నేను చేసినట్లయిన, ఆ తప్పైన ఉపదేశములను (ప్రసంగములను) నిలకడ లేకుండా మరుగైపోయే సమయము ఆసన్నమైనప్పుడు, దానిని గ్రహించి గైకొనుటవలన ప్రయోజనమేమున్నది? కొద్ది కాలము క్రితం ప్రభువు నాకు ఆ దర్శనమును చూపించినప్పుడు, అక్కడ ఉన్న ఆ లక్షలాది మందిలో ఒకడు నా దగ్గరకు వచ్చి, "నీవు ప్రసంగించిన సువార్త ప్రకారమే నీవు మొదటగా న్యాయతీర్పు పొందెదవు,'' అని చెప్పెను.

నేను చెప్పాను, "పౌలు ఏమి ప్రసంగించెనో, తక్కినవారు ఏమి ప్రసంగించిరో - అదే కార్యమును నేను ప్రసంగించితిని.''

మరియు ఆ లక్షల కొలది స్వరములు కేకలేసిరి, "మేము దానిపై ఆధారపడియున్నాము.'' అది అట్లే, చూశారా. నిజము.

DAN 8:19•

MATT 24:36•

MARK 13:32

 

10కావున, ఇప్పుడు, ఈ రాత్రి నేను కొనసాగించవలయునని యున్నాను, కావున మనము అధిక సమయము తీసికొనబోవుట లేదు. మరియు ఇప్పుడు మరచిపోకుడి… ఈ ఉదయము నేను ప్రసంగించిన దానిని (ఇక్కడ నేను కొన్ని నోట్సును కలిగియున్నాను.) ఈ రోజు ఉదయము దానియేలు చెరలో ఉన్న కార్యమును, గబ్రియేలు అతని యొద్దకు వచ్చి భవిష్యత్ కాలమును అతనికి సూచించెను. ఈ రోజు ఉదయమున అదే మనము ధ్యానించియున్నాము, భవిష్యత్ కాలము యొక్క సూచనలు.

ఇప్పుడు, ఈ రాత్రి మరియు తదుపరి ఆదివారము, ప్రభువు చిత్తమైనయెడల, డెబ్బది వారములను కాల చక్రములో అవి ఏ కాలమునకు సంబంధించినవనీ, మరియు మనము ఏ స్థానములో యున్నాము? ఇప్పుడు, మనము అది ఖచ్చితముగా సరి, అని తెలుసుకొనినయెడల, మనము ఏ కాలములో జీవించుచున్నామో మనము తెలిసికొనగలము.

ఇప్పుడు, ఆయన ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు, ఎవరును దానిని ఎరుగరు. యేసుకి కూడ ఆయనకే అది తెలియదు. ఆ విషయమును దూతలకు కూడ తెలియదు. ఆయన ఎప్పుడు వచ్చునో మనకెవ్వరికీ తెలియదు, అయితే మనము జీవించుచున్న కాలమును మనము చెప్పగలము… మనము జీవించుచున్న సమయము, ఎంత చేరువలో ఉన్నామో తెలిసికొనగలము.

11ఇప్పుడు, కొద్దిగా ముందుకు పోయెదము, ఏలయనగా దీనిని ఆ అబ్బాయిలు టేప్ చేయుచున్నారు… గదిలో యంత్రములు వెనుకకు తిరుగుచున్నవి. మరి ఆ టేపులు ప్రతి ఒక్కొక్క చోటుకు పంపించబడుచున్నవి.

ఇప్పుడు, ఈ రోజు ఉదయము 4వ మరియు 5వ అధ్యాయము మరల చూచినప్పుడు దానియేలు 9వ అధ్యాయము మొదలు పెట్టినప్పుడు నిలిపివేసితిమి. మరియు ఇప్పుడు, ఈ రాత్రి 9వ అధ్యాయమును కొనసాగించెదము. దానిని మనము ఆరంభించుటకు ముందు, ఒక్క క్షణము మన తలలు వంచి, మరియు వాక్యము యొక్క గ్రంథకర్తతో మాట్లాడెదము.

LUKE 24:32

 

12మా కృపగల దేవా, మా యొక్క హృదయ రహస్యములు మీరు ఎరిగియున్నారని మాకు నిశ్చయముగా తెలియును. ఇక్కడ మేమెందులకు ఉన్నామో మీకు తెలియును. ఈ మధ్యాహ్నము కొద్దిగా విశ్రాంతి లేక విరామము తీసికొనుటకు ఇదేదో మంచి స్థలమని ఈ రాత్రి ఇక్కడికి మేము రాలేదని మీకు తెలియును. తండ్రి, ఆ ఉద్దేశ్యము కొరకు ఇక్కడ ఒక్కరైనా ఉన్నారని నేను నమ్ముట లేదు. ప్రభువు సెలవిచ్చునది తెలిసికొన వలయునన్న, నిజముగా, నిష్కపటముగా ఇక్కడ ఈ రాత్రి మేమున్నామని నేను నమ్ముచున్నాను.

మిమ్మును మేము ప్రేమించుచున్నాము, ప్రభువా, మరియు మీ యొక్క వాక్యమును మేము ప్రేమించుచున్నాము. మా కొరకు మీరు అనుగ్రహించిన ఈ యొక్క స్థలము, మా తలలపై ఒక కప్పు, ఈ సిమెంటు కట్టడములు. (చర్చి బిల్డింగు) ఈ యొక్క స్థలము కొరకు మీకు మేము కృతజ్ఞులమైయున్నాము. ఆకాశము దాటి ఇంకనూ పైన అక్కడొక గృహము (నివాస స్థలము) ఉన్నదని మేము నమ్ముచున్నాము, అక్కడికే మేము దానినెదుర్కొనుటకు ఆ మార్గములో సాగిపోవుచున్నాము. మరియు ఈ విశేషమైన కార్యములేని మా పితరులను తలంచినప్పుడు, మా తలలను సిగ్గుతో మేము వంచులాగున చేయుచున్నది. ప్రభువా, ఫిర్యాదు చేయుటకు కూడ.

ఇప్పుడు, తండ్రీ ఈ రాత్రి లేఖనములను మీరు, మాకు తెరువవలయునని మేము ప్రార్థించుచున్నాము. ఈ రాత్రి ఈ మార్గము ద్వారా పోవునప్పుడు, వచ్చి మా ఒక్కొక్కరితో కూడ మా ప్రక్కలో నడువుము. యెరూషలేము నుండి ఎమ్మాయు అను ఊరికి పోవు వారితో కూడ మాటలాడినట్లు మాతో మాట్లాడుము, ఈ రాత్రి ఈ ఆరాధన ముగియునప్పుడు, మేము మా యొక్క వేర్వేరు గృహములకు వెళ్ళి మరియు చెప్పవలయును, "మనతో మాడలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండలేదా.''

చదువుటను ఆశీర్వదింపుము. ప్రభువా, నా యొక్క బలహీనమైన ప్రయత్నములను ఆశీర్వదించుము. సత్యమైన దానికి నా నోరు తెరువుము మరియు తప్పైన దానికి (నా నోరు) మూయుము. మరియు మీకు మీరే మహిమను పొంది, జనుల మధ్య మహిమ పొందుము, ఎట్లనగా వారు మేము జీవించుచున్న ఈ సమయమును చూచులాగున మరియు ప్రభువైన యేసు రాకడ సమీపముగా ఉన్నదనియును, ఎందుకనగా ఆయన నామములో దీనిని మేము అడుగుచున్నాము, యేసుక్రీస్తు నామమున. ఆమేన్.

DAN 9:2

 

13ఇప్పుడు, కొన్ని క్షణములు వెనుకకు లేఖనములను తిప్పిన, దానియేలు అరవై-ఎనిమిది ఏండ్ల కాలము చాలా సంవత్సరములు చెరలో ఉన్నట్లు కనుగొన్నాము. దానిని గురించి ఆలోచించుడి! ఇప్పుడు, ఈ రోజు ఉదయము పేపరు, పెన్సిలు తీయనివారు, ఈ రాత్రి తీసికొన వచ్చును. క్రీ.శ. 606 నుండి 538 - 538 నుండి 606 వరకు తీసికొనుడి, దానియేలు చేర పట్టుబడిన సంవత్సరములు అరవై-ఎనిమిది, ఏ సంఘమునకు వెళ్ళు మార్గము లేదు, వినుటకు ప్రసంగములు లేవు, ఏమి లేదు. అయితే అతని యొద్ద కొన్ని పుస్తకములు మరియు అతనికి ముందు ప్రవచించిన ఒక ప్రవక్త యొక్క పుస్తకములు ఉండెను, మరియు (అతను) యిర్మియాతో ఉండెను.

HEB 1:1

 

14ఇప్పుడు, లేఖనములు చదువుచుండగా, సమయము గతించిపోవుటను చూచెను, డెబ్బది సంవత్సరముల కాలము… ప్రవక్తయైన యిర్మియా పలికిన ప్రతి ఒక్కొక్క వాక్యమును దానియేలు భయభక్తులతో వినెను. మరియు దీనిని నా యొక్క తరగతికి (ఈ జనులకు) ఈ రాత్రి చెప్పుచున్నాను మన ప్రవక్తలను మనము నమ్ముచున్నామా? అవునయ్యా! ఏలయనగా ప్రభువు వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చును. వారి యొద్ద "ప్రభువు సెలవిచ్చుచున్నాడు" కలదు. మరియు ఒక నిజమైన ప్రవక్త, ఇతర ప్రవక్తల యొక్క వాక్యములతో వేరుపడదు. అది (ప్రవక్తలు) చెప్పిన కార్యమును, వారు చెప్పరు. నిజమైన ప్రవక్త ఏమి చెప్పెనో దానినే వారు చెప్పెదరు. అదే వారిని ఒక ప్రవక్తగా చేయుచున్నది. అప్పుడు దానిని వారు పొందినప్పుడు, మరి అప్పుడు ఏమి జరుగనైయున్నది ముందుగానే చెప్పినప్పుడు… దీనిని తెలుసుకొని వారి హృదయములలో భయముతో, వారేదైనా తప్పైన కార్యము చెప్పెదరో అని, మరియు అది ఎవరినైనా తప్పు త్రోవ పట్టించునేమో అని, మేము దానిని చేయదలచుకోలేదు. "ప్రభువు సెలవిచ్చుచున్నాడు," అని మేము చెప్పుటకు మునుపు, ప్రభువు యొక్క వాక్యము మేము పొందియున్నామని, మేము పరిపూర్ణమైన నిశ్చయతతో ఉండవలయునని కోరుచున్నాము. అది పరిపూర్ణముగా, దేవుని యొక్క సింహాసనము నుండి నేరుగా వచ్చిన వర్తమానముగా ఉండవలయును, లేనియెడల దానిని మేము ఎప్పుడు చెప్పకూడదు.

DAN 9:21•

LUKE 1:19,26,27

 

15ఇప్పుడు, లేఖనములను చదువుచుండగా, డెబ్బది సంవత్సరములు గతించిపోవుటను అతను చూచెను, అతను అరవై-ఎనిమిది సంవత్సరములు అక్కడ ఉన్నందువలన, దేవుడు ఆయన జనులను వారి యొక్క, మాతృ భూమికి మరల చేర్చువరకు ఇంకను రెండు సంవత్సరములు ఉండుటను (భవిష్యత్తును) చూచెను, పరలోకము నుండి బలమైన దూత, అతను ప్రార్థించుచుండగా వచ్చుటను మనము చూచి యున్నాము. ఎవరైనా అతని (దూత) పేరు చెప్పగలరా? గబ్రియేలు. యూదుల సంఘమునకు అతను దూతగా యున్నాడు. గబ్రియేలు యూదుల సంఘమునకు వర్తమానికుడు. మరియ యొద్దకు వచ్చెను, అతను జెకర్యా యొద్దకు వచ్చెను. ఎల్లప్పుడు అది గబ్రియేలు. మరియు పరలోకములోనున్న గొప్ప దూతలలో అతనొకడు.

DAN 9:23•

ROM 5:8•

2COR 1:22•

2COR 5:5•

EPH 1:13,14•

EPH 2:12,13

 

16మరియు అతను మన సహోదరుడు దానియేలుకు దేవుని యొద్ద నుండి మహత్తరమైన వందనములు తీసికొని రాలేదా? "ఓ, ఎంతో ప్రియమైన దానియేలు." దేవుడు ఆ విధముగా నిన్ను ప్రేమించుటను తలంచుకొనిన అది నీకు ఎంతో మంచిదనిపించుట లేదా? నేను అంత అధికముగా ప్రేమించబడ లేకున్నను, నేను అక్కడ కొద్దిగానైనను ప్రేమించబడియున్నానని నేను తెలిసికొనుటకు ఇష్టపడుచున్నాను. మీకు అట్లు లేదా? నిశ్చయముగా. ఆ విధముగా ఆయన ఎప్పుడైనా నన్ను తలంచుకొనును. ఆయన నాపై చింతను కలిగియున్నాడని తలంచుకొనిన అది నేను ఎలుగెత్తి కేక వేయులాగున నన్ను చేయుచున్నది. మరియు మనకొక నమ్మకము కలదు. ఆయన మనపై చింతను కలిగియున్నాడని, ఏలయనగా మనమింకను పాపులమై యుండగానే, క్రీస్తు మన కొరకు చనిపోయెను, సోదరుడా. మరిప్పుడు మనమొకప్పుడు దేవుని నుండి దూరముగా తొలగిపోయినను, దేవుడు మనలనిప్పుడు ఆయనకు సమీపముగా చేర్చుకొని, మన రక్షణానందమైన పరిశుద్ధాత్మను ముందుగా మనఃపూర్వకముగా మనకు అనుగ్రహించి, మరియు దానిలో ఉన్న విశ్వాసము ద్వారా ప్రపంచ కార్యములన్నిటి కంటే ఉన్నతమునకు అది మనలను పైకెత్తి, మరియు దానిపై మనము సఫారీ చేయుచున్నాము. అది మహిమ గలది, అది అట్లే కదూ? మంచిది.

DAN 9:24,27

 

17ప్రార్థనలో ఉండగా, వారు వారి యొక్క మాతృభూమికి (స్వదేశమునకు) తిరిగి పోవుటకు ఇంకను రెండు సంవత్సరములు ఉండుట మాత్రమే కాదు, గబ్రియేలు చెప్పినది వారి దేశము యొక్క చివరి దశను కూడా అతనికి చెప్పెను. దానిని గురించి ఆలోచించుడి! వారి గమ్యస్థానమును, భూమిపై వారి యొక్క యాత్రను, దానియేలుకు గబ్రియేలు దానినంతయు వివరించెను. ఈ గొప్ప కార్యమును దానియేలుకు చెప్పుటకు తాను పంపబడినాడని చెప్పెను. ఆ ప్రవక్త ఏ విధముగా అనుభూతి చెందియుండవలయును. మరియు ముగింపు వరకు డెబ్బది వారములు, జనులపై నిర్ణయించబడినవని అతడు (దూత) చెప్పెను. అదే అంత్యకాలము, సమస్తమును ముగించువరకు, ముగింపు (నాశనకరమైన ముగింపు). అతడు చెప్పెను, "ఇంకను డెబ్బది వారములు.''

కొందరు దానిని నెలలు అని, కొందరు దినములు అని, కొందరు.. అది నిజముగా వారములే అని, అక్కడ సుమారుగా రెండుంపావు… లేక దానిలో ఒకటింపావు. మరియు మీరు చూచిన… అక్కడే మనము సత్యమును కనుగొనవలసిన వారమై యున్నాము.

DAN 9:24

 

18"నీ జనమునకు డెబ్బది వారములు విధింపబడెను.'' ఏ ఉద్దేశ్యము కొరకు? ఎందుకొరకు? ఏ జనులపై అది నిర్ణయించబడెను? దానియేలు జనులు, యూదులు. మరియు ఎందుకొరకు అది నిర్ణయించబడెను? దానియేలుపై మాత్రమే కాదు, అయితే దానియేలు యొక్క పరిశుద్ధ పట్టణముపై, చూశారా - దానియేలు యొక్క పరిశుద్ధ పట్టణము. ఇప్పుడు శ్రోతలారా, దానియేలు యొక్క పరిశుద్ద పట్టణము ఏది? [సంఘము బదులిచ్చుచున్నది, ''యెరూషలేము.''] యెరూషలేము.

మరిప్పుడు, ధ్యానించబోవుచున్నాము, వీలైతే ఈ రాత్రి దానిని గైకొనెదము, యెరూషలేము ఎక్కడ ఉన్నది? యెరూషలేమును ఎవరు స్థాపించారు? దానిని గురించి ఎప్పుడైనా మీరు తలంచినారా? యెరూషలేమును ఎవరు కనుగొన్నారు? ఎప్పుడు అది స్థాపించబడెను? దానిని కొద్ది సేపటిలో మనము చూడబోవుచున్నాము. యెరూషలేమును ఎవరు స్థాపించిరి? బాలుడా, అది ఒక మూలలో మరుగుబడియున్న కార్యము, అయితే అది దానిని గురించి చెప్పుచున్నది. సరి అయ్యా! యెరూషలేమును ఎవరు స్థాపించిరి, మరియు అది ఎప్పుడు స్థాపించబడెను? మంచిది, మరియు అదే దానియేలు యొక్క పరిశుద్ద పట్టణము.

19మరియు మనము గ్రహించియున్నాము రెండువేల సంవత్సరములుగా శపించబడియున్న ఆ పట్టణము, మరల కట్టబడి మరియు తిరిగి స్థాపించబడును, మరియు ఆదిలో ఉన్న విధముగా దేవాలయపు ఆరాధన జరుపబడును. అది నిజము. యెరూషలేము ఆ విధముగా మారును. ఇప్పుడు… మరియు ఆదిలో ఉన్న విధముగా అక్కడ బలియు, ప్రతి దినపు నైవేద్యమును మరల అర్పింపబడును. అనేక కార్యములను మనము చూడబోవుచున్నాము, ఈ రాత్రి అనుకొంటాను, లేక ఆ అనేకమైన కార్యములను.

20ఇప్పుడు, స్నేహితులారా, ఈ కార్యములను గురించి చెప్పునప్పుడు మీరు తెలిసికొనవలయునని నేను కోరుచున్నాను, వారముల తరబడి బోధింపక, అయితే కొన్ని కార్యములను మాత్రము బోధించెదను కావున శీతోష్ణస్థితి చల్లబడినప్పుడు లేక కొంచెము కాలము పిదప మనము ఆ ఏడు ముద్రలు, ఏడు పాత్రలు, ఏడు బూరలు, అనే వాటిని గురించి మరల ధ్యానించునప్పుడు, అప్పుడు నేను ముందు చెప్పబడిన వాటిని గురించి మరల అన్వేషించి, దానియేలు యొక్క డెబ్బది వారముల గురించి మీకు జ్ఞాపకమున్నదా? సంఘ కాలమనేది సమాప్తమై సంఘము పైకి ఎత్తబడినప్పుడు ఏమి సంభవించినదనేది మీకు గుర్తున్నదా? మరియు ఈ దానియేలు డెబ్బది వారములు సంఘము పైకి ఎత్తబడినప్పటి నుండి ప్రారంభించి, అది (వధువు) మరల వచ్చు వరకు ఉండే కార్యములను విశదపరచుచున్నది. ఆ ఖాళీని అది విశదపరచుచున్నది. ఇప్పుడు, దానియేలు యొక్క అన్ని డెబ్బది వారములు కాదు, దానిలోని ఒక భాగమును మాత్రమే.

DAN 9:24

 

21''డెబ్బది వారములు నిర్ణయింపబడెను.'' ఇప్పుడు, అతను దర్శించుటలో గల ఆరు ఉద్దేశ్యములలో, ఏమి నేరవేరబోవుచున్నదని అతనికి చెప్పుచుండెను. ఇప్పుడు, అతని రాకడలో ఆరు ఉద్దేశ్యములు కలవు. ఈ రోజు ఉదయము మనము ధ్యానించిన వాక్యములను ఇప్పుడు వదలి పెట్టుట మంచిదని నేను అనుకొంటున్నాను, అక్కడే ఆ ఆరు ఉద్దేశ్యములు కలవు, మనమిప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు, మనము ఆరు ఉద్దేశ్యములు కలవని కనుగొన్నాము. దానిలో ఒకటి… ఇప్పుడు 4వ అధ్యాయము మనము తీసెదము లేక 4వ వచనము, దానియేలు 9వ అధ్యాయములోని 24వ వచనము.

మరియు నీ జనమునకు డెబ్బది వారములు విధింపబడెను…

ఇప్పుడు గుర్తుంచుకొనుడి, ఈ భూమిపై ఇశ్రాయేలీయుల యొక్క యాత్ర అంతే. అవి విధించబడెను. డెబ్బది వారములు నిర్ణయింపబడెను. యూదులకు భాగించి ఇచ్చినది అంతే "….నీ జనమునకు మరియు నీ పరిశుద్ద పట్టణమునకు." కావున, ఈ డెబ్బది వారములు (ఇప్పుడు దీనిని వదలకుడి), ఆ వేళ నుండి, యూదుల యొక్క ముగింపు వరకు, మరియు యెరూషలేము ముగించు వరకు, ఒక నూతన పట్టణము కట్టబడు వరకు అది బయలు పరచును. ఇప్పుడు… ఓ, దానిలో చాలా బాగుగా మరియు లోతుగా మనము పోబోవుచున్నామని నేను నమ్ముచున్నాను "…నీ జనమునకు మరియు నీ పరిశుద్ధ పట్టణమునకు." దేనికి? అతిక్రమమును మాన్పుటకును.

22ఇప్పుడు అతను (దూత) అతనికి (దానియేలుకు) ఏమి చెప్పెను? ఇంకా ఎంత కాలము ఈ విధముగా (చెరలో) ఉండాలని అతను కనుగొన ప్రయత్నించుచుండెను.. "మనము అంత్యకాలములో ఉన్నామని నాకు తెలియును [మనమిప్పుడు ఉన్నట్లు], ప్రభువా."

ఈ రాత్రి ఈ తరగతిలో ఉన్న వారెందరు మనము అంత్యకాలములో ఉన్నామని నమ్ముచున్నారో, ''ఆమేన్!'' అని చెప్పుడి. మీకు కృతజ్ఞతలు. మనము చివరన ఉన్నాము. ఇప్పుడు, దేవుని వలన అదెంత కాలము అని మనము తెలుసుకొన ప్రయత్నించుచున్నాము. ఏ దినములో మనము జీవించుచున్నాము? అందువలననే మనము వెనుకకు తిరిగి ఈ ప్రవక్తలను గురించి ధ్యానించుచు ఆ విధముగా మనమెక్కడ యున్నామని కనుగొన ప్రయత్నించుచున్నాము.

మరియు దానియేలు చేసినది అదే. దేవుని వైపు అతను తన ముఖమును ఉంచెను.

23దానియేలు 9వ అధ్యాయము ఈ రోజు ఎంత మంది చదివితిరో, మీ చేతులను పైకెత్తుడి. మంచిది. అతని ప్రార్థనను మీరు చూడండి, అతనెట్లు తన జనుల యొక్క తప్పిదములను తానే ఒప్పుకొనెను మరియు తన తప్పిదములను తానే ఒప్పుకొనెను, వారెప్పుడు తిరిగి పోయెదరని తాను కనుగొన్నది నిశ్చయమని అతను తెలుసుకొనగోరెను, ఏలయనగా తిరిగి పోవుటకు జనులను సిద్ధపరచవలయునని అతడుండెను. ఇప్పుడు నేనేమి చేయ ప్రయత్నించుచున్నాననగా, మనమెప్పుడు ఉన్నతమునకు పోయెదమని తెలుసుకొని మరియు జనులను ఉన్నతమునకు పోవుటకు సిద్ధపరచుటకు… పెండ్లి తరువాత. ''ప్రభువా, ఏ వేళలో మనము జీవించుచున్నాము?'' అని తెలుసుకొనుటకు మనము మన ముఖములను ప్రార్థనల ద్వారా, విన్నపముల ద్వారా దేవుని వైపు పెట్టియున్నాము.

DAN 9:24

 

24మరియు ఈ పలు విధములైన కార్యములు జరుగుటను మనము చూచియున్నాము. ప్రపంచము చిందర వందరైన స్థితిలో నుండుట మనము చూచుచున్నాము. గోడ మీద చేతి వ్రాత, దేవుడు చెప్పిన సమస్తమును… ఇప్పుడే మరొక యుద్దము రాబోవుచున్నదని మన దేశాధ్యక్షుడు చెప్పుట మనము వినుచున్నాము. ఓ ఇంకా కొద్ది గంటలలో యుద్ధము జరుగబోవుచున్నదనగా, రాజ్యములన్నియును అగ్నితో కాలి భస్మమగును. మరియు మనకు తెలియును దానిని మనము కలిగియున్నాము. కావున ఇదంతయు సంభవింపక మునుపు సంఘము ఎత్తబడవలయునని మనమెరిగియున్నాము. కావున, "ప్రభువా, మేమెక్కడ యున్నాము?" ఆ కారణము వలననే ఆయన మనకు తెలియపరచునని నేను నమ్ముచున్నాను. తెలుసుకొనుటకుగాను మనము మన ముఖములను కనిపెట్టియున్నాము. ఇప్పుడు, మొదట, మనము కనుగొనెదము.

అతిక్రమమును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు… పరిశుద్ద పట్టణమునకును, డెబ్బది వారములు విధింపబడెను.

గబ్రియేలు దర్శించుటలో గల ఆరు ఉద్దేశ్యములు అవే. ఇప్పుడు మొదటిది మనము ఆరంభించెదము. పెన్సీలు గలవారు, మీరు గుర్తించుకొనవచ్చును. మొదటిది: అతిక్రమమును మాన్పుటకును అదే మొదటి కార్యము.

ISA 59:20•

ROM 11:21,24-26

 

25ఇప్పుడు, దేవునికి విరోధముగా తిరిగిన ఇశ్రాయేలు యొక్క అతిక్రమమును మానివేయుట అనగా, యాకోబు యొక్క భక్తిహీనతను తొలగించి వేయుట. ఇప్పుడు ఇది తెలుసుకొనుటకు, రోమీయులకు వ్రాసిన పత్రికకు త్రిప్పెదము, రోమీయులకు 11వ అధ్యాయము, మరియు రోమీయులకు 11, 21వ వచనము మొదలు. ఇప్పుడు, ఎందులకు మనము పోవుచున్నాము? అతిక్రమమును మాన్పుటకు రోమా 11:21. మంచిది.

దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టనియెడల [అదేవరు? ఇశ్రాయేలు.], …నిన్నును విడిచిపెట్టడు.

ఇప్పుడు, మీరు ఇండ్లకు వెళ్ళి 11వ అధ్యాయము పూర్తిగా చదువవలయునని నేను కోరుచున్నాను. నేను ఈ కొంత భాగమే చదువుచున్నాను….. గుర్తుంచుకొని 11వ అధ్యాయమును పూర్తిగా చదువుడి.

…నిన్నును విడిచిపెట్టడు.

నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని యెడల నీవును నరికి వేయబడుదువు.

వారును తమ అవిశ్వాసములో నిలువక పోయినయెడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తి గలవాడు. [చూశారా? అన్యజనులు నరుకబడి, మరియు ఇశ్రాయేలీయులు మరల వచ్చువేళ ఒకటుండునని చెప్పుచున్నది.]

ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి, [అన్యజనులు] స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటు కట్టబడిన యెడల…

మనము స్వభావమునకు విరుద్ధముగా ఉంటిమి, అన్యులుగా, దయలేనివారుగా, దేవుడు లేకుండ, ఏ మాత్రమూ నిరీక్షణ లేనివారిగా ఉండిరి; మరియు దేవుడు ఆయన దయ వలన మనకొక అవకాశమిచ్చుటకు, నీతిమంతులైన ఇశ్రాయేలును వారి యొక్క అతిక్రమముల వలన నరికివేసి మరియు వారిని త్రోసివేసెను, మంచి ఒలీవ చెట్టును త్రోసివేసి మరియు స్వభావ విరుద్ధముగా అడవి ఒలీవ చెట్టును లోనికి తీసుకొని వచ్చెను.

ఒక మంచి కొరకు….. స్వాభావికమైన కొమ్మలగు వారు మరియు నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకట్టబడరా?

మంచిది, మనము ముందుకు చదివెదము.

సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను.

DAN 9:24•

ROM 11:25,26

 

26దేవుడు అన్యజనులతో వ్యవహరించుట సంపూర్ణమగు వరకు, ఇశ్రాయేలు గ్రుడ్డిగా చేయబడెను. వారు దేవునికి విరోధముగా పాపములో, అతిక్రమములో పోయిరి; ఏలయనగా మనము అంటు కట్టబడులాగున దేవుడు వారి కండ్లను గ్రుడ్డి పరచెను. దానిని పట్టుకొన్నారా? ఇప్పుడు ఇరవై-ఆరవ వచనము.

మరియు ఇశ్రాయేలంతయు రక్షింపబడును: …

నా కొరకు మరియు మీ కొరకు దేవుడు ఉద్దేశ్యపూర్వకముగా దేవుడు వారిని గ్రుడ్డివారిగా చేసెను. దేవుడు వారిని గ్రుడ్డివారిగా చేసినందువలన వారు చూడలేరు. మరియు ఇశ్రాయేలంతయు, నిజమైన ఇశ్రాయేలు, రక్షింపబడును. దూత ఏమీ చెప్పెను? మహిమ! "ఇశ్రాయేలు యొక్క అతిక్రమమును మాన్పుటకు. ఇశ్రాయేలు యొక్క అతిక్రమములు సమాప్తమగు సమయము రాబోవుచున్నదని నీకు చెప్పుటకు నేను వచ్చియున్నాను.'' దేవుడు ఆ అడవి కొమ్మను నరికి, మరల నిజమైన కొమ్మను అంటుకట్టును.

ఓ, కొన్ని సమయములలో ఆ దీన, నిర్భాగ్యులైన వారు, తాము ఎక్కడికి వెళ్ళుచున్నదనేది తెలియబడకుండునట్లు ఖండించి వేరుపరచబడ్డ ఆ జనులను చూచునప్పుడు నా హృదయము కదులుచున్నది, మరియు దేవుని యొక్క కృప వలన నేను రక్షించబడితిని, వారి యొక్క కనులను వారి యొక్క సొంత మెస్సీయా నుండి గ్రుడ్డి చేయబడినవి. ఆయన స్వరమును వినబడకుండునట్లు వారి యొక్క చెవులను మూసివేసెను, ఆయన యొక్క అద్భుత కార్యములను వారు కన్నులారా చూచారు. ఆయన చేసిన అద్భుత కార్యములను వారు కన్నులెత్తి చూచినను, ఆయన చేసిన వాటిని చూచినను కూడా, ఆ విధముగా జరిగెను.

ISA 6:10•

MATT 13:15•

MARK 4:12•

JOHN 12:37,40•

ACTS 28:26,27•

ROM 11:25,26

 

27నేను అనుకొనుచున్నాను, మత్తయి 12వ అధ్యాయము లేక 8 లేక 12వ అధ్యాయము చెప్పెను: యేసు అనేక అద్భుతములు చేసినప్పటికీ, అయినను వారు నమ్మలేకపోయిరి. ఏలయనగా దేవుడు చెప్పెను, "వారికి కండ్లు ఉండియు మరి వారు చూడలేకపోయిరి, మరి చెవులు ఉండియు వారు వినలేక పోయిరి, మరి నేను వారిని మార్చితేనే గాని, వారు వారి కండ్లతో చూడలేరు మరి వారి చెవులతో వారు వినలేరు. కావున మనకు ఒక అవకాశము కలుగులాగున, ఆయన తన సొంత బిడ్డల కండ్లపై తెరలాగి (మూసివేసి), బల్ల యొద్ద నుండి తన సొంత బిడ్డలను త్రోసివేసి, పలుచటి ఆత్మ యొద్దకు వారిని త్రిప్పెను. కావున ఆయన కనుగొనెను… మనము జీవించుటకు ఒక అవకాశము కలిగెను - మనకు జీవము నిచ్చెను.

ఇరవై-ఆరవ వచనము:

మరియు కావున ఇశ్రాయేలంతయు రక్షింపబడును; వ్రాయబడినట్లుగా, విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించును.

అవును, ఒకానొక, ఈ రోజులలో ఆయన సీయోను కొండపై వచ్చును. ఒలీవ కొండపై, వారు ఆయనను గుర్తించెదరు మరియు ఇశ్రాయేలీయులందరు అది ఆయనే అని తెలిసికొనెదరు. అప్పటికి అన్యజనులు ముగించబడి యుందురు. అంటుకట్టబడిన ఆ కొమ్మ, దానిలోనున్న ఫలములను దేవుడు గైకొనును, మరియు ఆ అడవి కొమ్మ…

ROM 11:26•

REV 22:16

 

28మరియు ఇప్పుడు, మీరు వెనుక చదువుచుండగా ఇక్కడ గుర్తుంచుకొనుడి, ఆయన చెప్పెను, (ఆ వేరు గనుక పరిశుద్ధమైన యెడల), మరియు ఆ వేరు, పరిశుద్దమైన వేరైనయెడల, ఆ పరిశుద్దమైన వేరు నుండి వచ్చు ఫలము కూడా, పరిశుద్ధమైన ఫలమును తీసుకొని వచ్చును మరియు ఆ వేరు యేసు క్రీస్తుయైన యెడల, ఆయనే దావీదు యొక్క వేరు మరియు సంతతి, యూదుల యొక్క వంశము నుండి వచ్చిన ఆయన యొక్క జీవము వారి యొద్ద నుండి నరికివేయబడి, మనము చూచులాగున మరియు వారి యొక్క కండ్లు గ్రుడ్డి చేయబడెను, మన యొక్క జీవితములు ఆశీర్వదింపబడిన కొమ్మతో సరితూగవలెను. ఓ, సరి. సహోదరుడా! అది సరియే!

DAN 9:24•

ROM 11:21,24,25

 

29దేవుడు ఉద్దేశ్యపూర్వకముగా వారిని నరికివేసి మరియు వారి కండ్లను గ్రుడ్డి చేసెను అందువలను చూచుటకు మనకొక అవకాశము, ఒక తరుణము మనకు ఇవ్వబడెను, మరియు మనమేమో ఎవరో అనుకొని నడచుకొనుచున్నాము. ఇక్కడ పౌలు వారిని గురించి చెప్పుచున్నాడు: "దానినెట్లు చేయుదువో అని జాగ్రత్తగా వినుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల, అడవి కొమ్మలపై ఆయనకు ఎట్లు దయ కలుగును ఏలయనగా వారప్పుడే….." కావున మనము చుట్టు నడచుచు మరియు చెప్పెదము, ''నేను ప్రెస్పిటేరియన్,'' ''నేను మెథడిస్టు,'' ''నేను బాప్టిస్టు,'' ''నేను పెంతెకోస్తును.'' అది దేవునికి ఏమి కాదు. వేరు నుండి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మరల జన్మించవలయును.

అయితే ఆయన వచ్చి… ఇప్పుడు గుర్తుంచుకొనుడి, ఆయన అన్యజనులను గురించి మాటలాడుట లేదు. నేను కేవలము అన్వేషించి దీనిని ఇక్కడ పెట్టుచున్నాను, కావున ఎక్కడ నుండి అన్యజనులకు అవకాశముండెనని మీరు చూడగలరు. అయితే ఆయన అతిక్రమమును మాన్పుటకు, దానిని ముగించుటకు వచ్చెను.

ISA 59:20•

DAN 9:24•

ROM 11:26

 

30ఇప్పుడు, మనము దానియేలుకు తిరిగి పోయినయెడల, మరియు మనము కనుగొనగలము, దానియేలులో ఇక్కడ చూచుచున్నాము, 24వ వచననము… మంచిది.

''అతిక్రమమును మాన్పుటకును.'' దేనిని మాన్పుటకు? ఇశ్రాయేలీయుల అతిక్రమములు ముగించుటకు. అతిక్రమము అనగా ఏమిటి? ఏదో ఒక కార్యమునకు విరోధముగా పోవుట. నాకు విరోధముగా ఒక అతిక్రమము, అనగా నాకు చెడు చేయుట. మీకు విరోధముగా అతిక్రమము అనగా, తప్పిదము చేయుట. కావున ఇశ్రాయేలు దేవునికి తప్పిదము చేసియున్నారు. మరియు డెబ్బదియవ వారములో ఏమి జరుగనైయున్నది? ఇశ్రాయేలు యొక్క అతిక్రమమును దేవుడు మాన్పనైయున్నారు. ''అతిక్రమమును మాన్పుట, యాకోబు నుండి భక్తిహీనతను తీసివేయుటయే. అటు తరువాత ఇశ్రాయేలంతయు మరల జన్మించును. వారందరు పరిశుద్ధాత్మను పొందెదరు.

DAN 9:24

 

31ఇప్పుడు, రెండవది. మీ పేపరుపై వ్రాసుకొనుడి. దానిపై అధిక సమయము ధ్యానించి దానిపై నిలిచియుండ వచ్చును, అయితే దానిపై నేను ప్రసంగించదలచుకోలేదు. నేను మీతో మాట్లాడదలచుచున్నాను, కావున దానిని సూక్ష్మముగా తెలిసికొనగలరు. మనము ఏడు ముద్రలను తీసికొనునప్పుడు, అప్పుడు సంఘములకు మనము (సంఘ కాలములలోనికి) పోవచ్చును, ముద్రలలోనికి, తెగుళ్లలోనికి, మరియు మనమెక్కడ నిలుచుకొనియున్నామో తెలిసికొనగలము. మంచిది.

రెండవది: "పాపమును నివారణ చేయుటకు." ఇప్పుడు, మనము తిరిగి దానియేలును చదివెదము. "అతిక్రమమును మాన్పుటకును మరియు పాపమును నివారణ చేయుటకును." అదే ఆయన రెండవ రాకడలో గల ఉద్దేశ్యము. మొదటిది, ఇశ్రాయేలీయుల అతిక్రమమును మాన్పుటకును మరియు పాపమును నివారణ చేయుటకును. ఇశ్రాయేలు ఎక్కడ పాపము చేసెను? వారెక్కడ, వారి యొక్క ముఖ్యమైన పాపము చేసిరి? ఎక్కడ వారు దేవుని యొద్ద నుండి వేరుపడిరి?

DAN 9:26•

MATT 27:21,22,25

 

32ఇప్పుడు, జాగ్రత్తగా వినుడి. మత్తయి 24కు మనము త్రిప్పెదము. మరియు ఇక్కడే ఇశ్రాయేలు ఆమె యొక్క ఘోరమైన తప్పిదము చేసెను. ఇక్కడే ఆమె యొక్క చివరి పాపమును చేసెను. ఈ రోజు ఆమె ఇటువంటి పరిస్థితులలో ఉండుటకు కారణము. మత్తయి 27వ అధ్యాయములోని 25వ వచనము. 21వ వచనము నుండి మనము ప్రారంభించెదము.

అధిపతి - ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారినడుగగా, వారు బరబ్బనే అనిరి [ఇప్పుడు గుర్తుంచుకొనుడి, అది ఇశ్రాయేలు.] బరబ్బ.

అందుకు పిలాతు - అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారినడుగగా?… [వారు చెప్పునది వినుడి!] సిలువ వేయుమని అందరును చెప్పిరి.

గుర్తుంచుకొనుడి, దానియేలు రాబోవుచున్నాడని చెప్పిన వారి యొక్క మెస్సీయా ఆయనే అది. ఇక్కడ ఈ రోజు ఉదయపు పాఠములో మీకు గుర్తున్నదా, ఆయన తనకు తానే తన కొరకు నరుకబడలేదు, ఆయన ఏమియు చేయలేదు.

… అతని సిలువవేయుము.

అధిపతి - ఎందుకు? ఇతడే దుష్కార్యము చేసెనని అడుగగా, వారు - సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలు వేసిరి.

పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమియు లేదని గ్రహించి, నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని - ఈ నీతిమంతుని గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను.

వినుడి! ఇక్కడే వారి యొక్క తప్పిదము, ఇక్కడే వారి యొక్క పాపము.

అందుకు ప్రజలందరు - వాని రక్తము మా మీదను, మా పిల్లల మీదను ఉండుగాకనిరి.

DAN 9:24•

LUKE 23:34•

ROM 11:25

 

33అక్కడే వారు దానిని చేసియున్నారు. ఆయన వారి కొరకు పాపమును నివారణ చేయుచున్నాడు. ఆయన వారిని మన్నించుట కాక వేరేమి చేయగలడు, ఏలయనగా ఆయనకు తెలియును - మనము లోనికి రావలయునని వారి కండ్లను ఆయన గ్రుడ్డితనము కలుగజేసెను. అదెట్లున్నదనగా, ఆయన యొక్క సొంత బిడ్డలు, ఆయన రక్తమును కోరుచున్నట్లున్నది. మరియు వారు గ్రుడ్డివారుగా ఉండిరి, మరియు వారు గ్రుడ్డివారుగా చేయబడినారని ఆయన ఎరిగియుండెను. అందువలననే ఆయన వారి కొరకు మన్నింపునకై కేకలేసెను: "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమింపుము.'' వారు గ్రుడ్డివారు. మన నిమిత్తము వారు గ్రుడ్డివారిగా చేయబడిరి. అయితే వారు మరల ఆయనను చూచినయెడల…! ఆమేన్!

DAN 9:24

 

34"పాపమును నివారణ చేయుట." పాపమనగా ఏమిటి? అవిశ్వాసము. ఆయనే మెస్సీయా అని వారు నమ్మలేదు. మెస్సీయా చేయవలసిన ప్రతియొక్క సూచనను ఆయన చేసినప్పటికిని, ఆయననే మెస్సీయా అని వారు చూడలేకపోయిరి. వారు గ్రుడ్డివారిగా నుండిరి.

కావున జనులు చెప్పుటను మీరు చూచునప్పుడు, "దైవిక స్వస్థతను నేను నమ్ముట లేదు. దానిని నేను చూచుట లేదు. ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మమును నేను చూచుట లేదు." (ఆ విధముగా జనులు చెప్పునప్పుడు) వారిపై కోపపడకుము. వారు గ్రుడ్డివారు. ''ఆయన రాకడ యొక్క ఈ వర్తమానమును నేను చూచుట లేదు. సర్పము యొక్క సంగతిని నేను చూచుట లేదు. ఈ కార్యములన్నిటిని నేను చూచుట లేదు.'' వారు గ్రుడ్డివారుగా యుండి మరియు దానిని ఎరుగకయున్నారు. వారి కొరకు ప్రార్థించుడి. మంచిది.

35వారి యొక్క అవిశ్వాసములో… అయితే ఆయన తిరిగి వచ్చునప్పుడు, ఆయనను వారు చూచునప్పుడు, వారి యొక్క అవిశ్వాసమును అది ముగించును. ఓ, మై! మనము మొదట ఆదికాండము 25… 45వ అధ్యాయముకు త్రిప్పెదము, మరియు దానియేలు యొక్క గురుతులను తీసికొనెదము. ఇక్కడ వాటిని కొన్నిటిని నేను వ్రాసికొనియున్నాను… అది ఆదికాండము 45, గుర్తుంచుకొని (నోట్స్) వ్రాయుచున్న మీరు. ఓ, ఈ పాత మంచి సువార్తను నేనెట్లు ప్రేమించుచున్నాను! మంచిది. ఇప్పుడు, మనమెక్కడ యున్నామో మనమెరిగి యున్నాము.

బిల్డింగు వెనుక భాగమున ఉన్న మీరు నా స్వరమును వినగలుగుచున్నారా? వినుచున్నయెడల, మీ చేతులను పైకెత్తుడి. దీనిని (మైక్రోఫోను మొదలగు వాటిని) చాలా దగ్గరగా అమర్చుచున్నాము.

36ఇప్పుడు, ఈ యొక్క లేఖనములో కొంత భాగమును మనము చదువుబోవుచున్నాము. బైబిలు లేనివారు, మీరు వినవలయునని నేను కోరుచున్నాను. బైబిలు ఉన్నవారు, ఆదికాండము తీయుడి…. మొదట మనము 44వ అధ్యాయము, 27వ వచనము మొదలు ప్రారంభించెదము.

ఇది యోసేపు, మరియు యోసేపు, క్రీస్తుకు ఒక పరిపూర్ణ ఉదాహరణముగా ఉన్నాడు. అది మనకు తెలియును. అది ఎందరికి తెలియును? తన సహోదరుల ద్వారా ద్వేషించబడెను. ఎందుకు? ఎందుకనగా అతడు ఆత్మీయముగా ఉండెను. అతడు దర్శనములను చూచెను, కలలను గురించి వ్యాఖ్యానించుచుండెను. అతడు తన సోదరుల మధ్య భక్తిగలవానిగా ఉండుటచే మరి వారు అతనిని ద్వేషించిరి, మరియు అతని తండ్రి అతనిని ప్రేమించెను. ఆ విధముగానే యేసు సంఘశాఖల ద్వారా ద్వేషించబడెను, అయితే తన తండ్రియైన దేవుని ద్వారా ప్రేమించబడెను, ఆయనను ఎందులకు వారు ద్వేషించిరి? ఏలయనగా ఆయన ఆత్మీయముగా ఉండెను, ఏలయనగా…

GEN 37:19,24,28,32•

GEN 39:7,10,12•

MATT 4:1•

MATT 26:15•

MARK 1:13•

LUKE 4:2•

JOHN 7:20•

ACTS 5:31•

ACTS 7:10

 

37వారు చెప్పారు, ఆయనొక సోది చెప్పువాడని, ఒక దయ్యము. యోసేపు సహోదరులు అతనితో ఏమి చెప్పారో మీకు గుర్తున్నదా? ''కలలు కనువాడు అతను ఇదిగో ఇక్కడ వచ్చుచున్నాడు." చూశారా, అదే కార్యము. యేసును, యూదా అమ్మిన అదే వెలకు వారు యోసేపును అమ్మివేసిరి, ముప్పది వెండి నాణెములకు. ఒక గుంటలో అతనిన త్రోసివేసి మరి వెళ్లిపోయిరి, మరియు ఏదో ఒకటి అతనిని చంపివేసినదని వారి తండ్రితో చెప్పిరి, అతను చనిపోయినాడని చెప్పిరి. అయితే అతడు గుంటలో నుండి పైకెత్తబడెను. మరియు అక్కడ నుండి భూమిపై గల ఎత్తయిన (ఉన్నత) స్థలములకు అతను పోయెను. ఆమేన్! ఫరో యొక్క కుడి, పార్శ్వమునకు వెళ్ళెను. మరియు యేసు దేవుని కుడిపార్శ్వమునకు వెళ్ళెను. ఆయన శోధనలలో, ఆయన హెచ్చింపబడుటకు ముందు… యేసు, ఆయన హెచ్చింపబడుటకు ముందు శోధించబడెను.

MATT 27:42•

MARK 15:31

 

38ఎందుకు, అది బిల్లీ సండే అని నేను అనుకొనుచున్నాను, ఒక గొప్ప సువార్తీకుడు చెప్పెను, "ప్రతి యొక చెట్టులో 10 లక్షల దూతలు ఆ సిలువ వేయబడిన దినమున కూర్చొనియుండిరి. వారు (దూతలు) చెప్పిరి, "మీ చేతిని ఊరకట్లు కదిలించి మా వైపుకు చూపి మరియు చెప్పుము, మేము ఇక్కడున్న ఈ దృశ్యమునే మార్చివేయుదుము." అయితే ఆయన దానిని చేయలేక పోయెను.

కయప చెప్పెను, "ఆయన తనను రక్షించుకొనెను; ఇతరులను ఆయన రక్షింపలేకున్నాడు." తాను విమర్శించుచున్నాడని అతను ఎరుగకుండెను. ఆయన తనను తాను రక్షించుకొనియున్న యెడల, ఇతరులను ఆయన రక్షింపలేడు, కావున ఇతరులను రక్షించుటకు ఆయన తనను తాను అర్పించుకొనెను. చూశారా, దాని నుండి గ్రుడ్డివారిగా. ఇప్పుడు వారు…

GEN 39:7-12,20

 

39అప్పుడు అక్కడతను హెచ్చింపబడినప్పుడు - లేక తాను హెచ్చింపబడక మునుపు, తన శోధనలలో…… గుర్తుంచుకొనుడి, యోసేపు చెరసాలలో ఉంచబడెను, ఏలయనగా అతడు నిరపరాధి.

రోము… లేక, పోతీఫర్ అను పేరుగల ఇశ్రాయేలు సేనాధిపతి…. పోతీఫర్ పర్యటనకు వెళ్ళెను. అతనికి అందమైన భార్య యుండెను. మరియు ఆమె యోసేపు ఇంటిలోపలికి వచ్చి చేసే విధమైన పనిని అతనికి కల్పించెను. మరియు యోసేపు ఏదో తప్పిదమైన కార్యము అతడు ఆమె పట్ల చేయులాగున ఆమె ప్రయత్నించెను. మరియు అతడు దేవుని పట్ల భక్తిగలవాడు. నేను మీకు చెప్పుచున్నాను, వారెప్పుడును…

1PET 3:7

 

40స్త్రీలైన మీపై నేను అరిచాను; ఒక్క నిమిషము మీ కొరకు నేను తీసికొన వలయునని యున్నాను, చూశారా. స్త్రీ, ఒక బలహీనమైన పాత్ర. ఒక తప్పైన స్త్రీ ముందు ఉంటేనే గాని ఒక తప్పైన పురుషుడు ఉండడు, అని నాకు తెలియును. అయితే అది తెలిసిన పురుషుడా, నీవు ఒక దేవుని కుమారుడవు అని తెలిసికొనియున్న పురుషుడా, స్త్రీ యొక్క బలహీనతను స్వలాభమునకు వాడుకొనుచున్న పురుషులారా, మీరు సిగ్గుపడవలయును. ఏది ఏమైనను ఆమె ఏమి చేసినను, ఆమె ఒక బలహీనమైన పాత్ర, ఒకవేళ ఆమె తప్పిదముగా ప్రవర్తించినను, ఆమె చేతిని పట్టుకొని ఒక సహోదరివలె ఆమెతో మాట్లాడవలయును. నీవు ఒక దేవుని కుమారుడవు. వారియెడల చెడు కార్యములు చేయకుము. యోసేపును చూడుడి. అతడు మీకు ఒక ఉదాహరణ.

GEN 39:7-12,17-21•

ISA 35:1,2

 

41మరియు అప్పుడు పోతీఫర్ భార్య - ఈ అందమైన స్త్రీ, గౌరవీంచతగ్గ, ఉన్నత దేశములోనే ఉన్నత స్త్రీలలో ఒకరై, అతనిని బ్రతిమలాడి మరియు బలవంతము చేసెను, మరియు అతడు తొలగిపోయెను….. మరియు ఆమే అతనిని పట్టుకొని, తనపై హత్తుకొన ప్రయత్నించెను, మరియు అతడు ఆమె అడవిని బలవంతము చేయునప్పుడు, అతడు విదిలించుకొనినప్పుడు, అతడి పై వస్త్రము ఆమె చేతిలోనికి వచ్చిన కూడా ఆమె నుండి విడిపించుకొని తప్పించుకొని పారిపోయెను. మరియు అప్పుడు అతడు (పోతీఫర్) వచ్చినప్పుడు, వారతనిపై (యోసేపు పై) చెప్పి, ఇట్లు అబద్ధము చెప్పిరి అతడు, ఆమెను బలత్కారము చేయుటకు వచ్చినప్పుడు - అతని వస్త్రమును అక్కడే వదలి వెళ్ళెనని చెప్పిరి. మరి అందుకొరకు అతడు చెరసాలకు వెళ్ళెను. అయితే చెరసాలలో దేవుడు అతనితో ఉండెను, అతనిని వారెక్కడ బంధించినను దేవుడు అతనితో ఉండెను. అతడు క్షేమాభివృద్ధి కుమారునికి ఒక గుర్తుగా (ఉదాహరణగా) ఉండెను.

యోసేపు చేసినదంతయు అభివృద్దియాయెను. మరియు యేసు వెయ్యేండ్ల పాలనలో తిరిగి వచ్చునప్పుడు, అందువలననే, ఎడారి అంతయు రోజా పువ్వు వలే వికసించును. అతడు ఏమి చేసినను అది అభివృద్ధియగును. అతడు క్షేమాభివృద్ధి కుమారుడు. యోసేపును ఎక్కడ పెట్టినను అది ఆశీర్వదింపబడును, ఎక్కడ యేసు ఉన్నను అది ఆశీర్వాదకరముగా ఉండును. కావున ఆయనను మీ హృదయములో అంగీకరించి మరియు ఆశీర్వదింపబడుడి.

GEN 40:1-3,21,22•

GEN 41:43,45,50•

LUKE 23:39-43•

ACTS 5:31•

ACTS 7:10•

PHIL 2:10,11

 

42కావున యోసేపు అప్పుడక్కడ చెరసాలలో ఉంచబడినాడని మనము కనుగొన్నాము. మరక్కడ చెరసాలలో ఇద్దరు మనుష్యులు ఉండిరి. వారిలో ఒకడు నశించెను మరియొకడు రక్షింపబడెను. యేసు తన సిలువపై శ్రమలలో ఉన్నప్పుడు, ఒక దొంగ నశించెను మరి ఇంకొకడు రక్షింపబడెను.

ఆయనప్పుడు హెచ్చింపబడినప్పుడు, ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వమునకు పోయెను. అప్పుడు యోసేపు హెచ్చింపబడినప్పుడు, అతడు ఫరో యొక్క కుడిపార్శ్వమునకు పోయేను, మరియు ఏ వ్యక్తియైనను యోసేపుతో మొదట మాట్లాడి అతని అనుమతి పొందిన గాని ఫరోతో మాట్లాడలేడు. మరియు యోసేపు అంతఃపురమును విడిచినప్పుడు (ఓ, మై!) అప్పుడు యోసేపు అంతఃపురమును విడిచివచ్చినప్పుడు, బాకా (బూరలు) శబ్దము చేయుచు ఊదబడును మరియు మనుష్యులు అతనికి ముందుగా వెళ్ళి, చెప్పెదరు, "మోకాళ్లూనుము, యోసేపు వచ్చుచున్నాడు!" ఆమేన్! మరియు యేసు ఆ మహోన్నతుని కుడిపార్శ్వము నుండి వచ్చునప్పుడు బూర ఊదబడును, మరియు ప్రతి మోకాలు వంగును, మరియు ప్రతి నాలుక, "యేసు వచ్చుచున్నాడు!'' అని ఒప్పుకొనును. నిశ్చయముగా!

అదేమిటి… మరియు గుర్తుంచుకొనుడి, అతను తన సహోదరుల ద్వారా నిరాకరించబడినప్పుడు అతనేమి చేసెను? అతడొక అన్యజనపు స్త్రీని భార్యగా పొందెను. యేసు అక్కడ తన సహోదరుల యొద్ద నుండి నరికి వేయబడినప్పుడు యూదుల నుండి, ఆయన ఒక అన్యజనపు వధువును వివాహమాడెను. అయితే ఇప్పుడు, సంవత్సరములకు పిదప, బిడ్డలు జన్మించిన పిదప, ఎఫ్రాయిము మరియు మనషే అతనికి ఒక కుటుంబము ఉండెను.

GEN 42:3,23•

GEN 44:27

 

43అప్పుడు ఒక రోజు అతని సహోదరులు అతనిని దర్శించుటకు వచ్చిరి. గమనించండి! మనకు ఆ కథ తెలియును, ఏ విధముగా ఆ చిన్న కార్యమును (వెండి గిన్నె) అక్కడ పెట్టి, వారిని మరల రప్పించి, వారి భాష తెలియని విధముగా నటించి, తాను హెబ్రీయుడు అయినప్పటికిని, హెబ్రీయుల భాషను తర్జుమా చేయుటకు ఒక వ్యాఖ్యానిని పెట్టుకొనెను. మరియు వారి యొక్క సహోదరుడు దిగి వచ్చెను. వారికి అతను తెలియదు. అతడు గొప్ప రాజకుమారుడు. మరి క్రీస్తు యూదులను ఇప్పుడే సందర్శించుచున్నాడు, వారి వ్యాధిని స్వస్థపరచి మరియు అటువంటి కార్యములను చేసినను, మరియు ఆయన ఎవరని ఇంతవరకు వారికి తెలియలేదు, మెస్సీయా.

44వ అధ్యాయములోని 27వ వచనమును మనము ప్రారంభించెదము:

అందుకు తమ దాసుడైన నా తండ్రి - నా భార్య నా - నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు.

మరియు… వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్లిపోయేను [అది వారు మాటలాడుచున్న యోసేపే.], అతడు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చీల్చబడెననుకొంటిని; అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు:

మీరు నా యెదుట నుండి ఇతని తీసికొని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించినయెడల, నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను.

GEN 44:30•

REV 7:4

 

44అక్కడ వారికి చిన్న బెన్యామీను ఉండెను, వారి చిన్న సహోదరుడు. బెన్యామీను ఎవరికి సాదృశ్యముగా ఉన్నాడో మీకు తెలియునా? అక్కడ 1,44,000 జనులుగా కూడుకొనుచున్న ఈ నిజమైన యూదుల యొక్క నూతన గుంపు, వచ్చుచున్న ఈ సంతతి. ఈ వాల్-స్ట్రీట్ (అమెరికాలోని ద్రవ్యపు లావాదేవిలు జరుపు ఒక వీధి) యొక్క కపటమైన వారు కారు. కాదు, కాదు. అది (వారు) ఆయుధములకు (ఫిరంగులకు) మేత. వారు యూదులు కాదు. వారు యూదులు కాదు. యేసుక్రీస్తు యొక్క వాక్యమును వినని, దూర ప్రదేశముల నుండి వచ్చిన ఆ చిన్న బెన్యామీను వారే ఈ నిజమైన యూదులు.

GEN 44:31-34•

JER 3:14

 

45కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్లినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేనియెడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసి కొనియున్నది;

దేవుని యొక్క సొంత జీవము ఇశ్రాయేలుతో కట్టబడియున్నది. ఆమెతో ఆయన వివాహము కాబడియున్నాడు. ప్రభువు చిత్తమైనయెడల, ఇంకొద్ది నిమిషములలో దానిని మనము ధ్యానించెదము. ఆయన ఇశ్రాయేలుకు వివాహము కాబడెను. నేనెట్లు నా భార్యకు కట్టబడియున్నానో, మీరెట్లు మీ భార్యకు కట్టబడియున్నారో, ఆయన జీవితము అట్లే ఆమెకు కట్టబడియున్నది. మీ జీవితము దానిలో చుట్టబడియున్నది. మరియు దేవుడు ఇశ్రాయేలుకు వివాహము కాబడియున్నాడు. మరి అదేమిటి? యాకోబు చెప్పెను, "నా యొక్క ప్రాణము ఈ చిన్న బిడ్డలో చుట్టబడి, పెనవేసుకొని యున్నది.''

ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే [యోసేపు ఆ చిన్నవానిని తనతో ఉంచుకొనబోవుచున్నాడు మీకు తెలియును. మనకు ఆ కథ తెలియును.], చనిపోవును [అతని తండ్రి]: అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము. [ఇప్పుడు రూబేను చేయు విన్నపమును వినుడి.]

తను దాసుడనైన నేను ఈ చిన్నవానిని గూర్చి నా తండ్రికి పూటపడి - నీ యొద్దకు నేనతని తీసికొని రానియెడల, నా తండ్రి దృష్టియందు ఆ నింద నా మీద ఎల్లప్పుడు ఉండునని చెప్పితిని.

కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్న వానికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా నుండనిచ్చి…

ఓ, మై! చూడుడి, తన సోదరుడైన యోసేపుకు ముందుగా అతను నిలుచుకొని యున్నాడు. ఇది యోసేపు, మరియు అతను ఇతనిని ఎరుగకయుండెను. ఓ, ఆ వెయ్యేండ్ల పరిపాలన వరకు వేచియుండుము, సోదరా!

… ఆ చిన్నవానికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా నుండనిచ్చి [అతను చెప్పునది వినుడి, ఏలినవాడా అని ఒప్పుకొనుట.]; ఈ చిన్నవాని తన సహోదరులతో వెళ్లనిమ్ము.

ఈ చిన్నవాడు నాతో కూడ ఉంటేనే గాని నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్ళగలను? వెళ్ళినయెడల, నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసివచ్చునని చెప్పెను.

GEN 45:1,2

 

46బ్రతిమాలుట, తన యొక్క సొంత జీవము నిచ్చుట, అక్కడ ఎట్లు యూదులు తమ చేతులు విరుచుకొని నిలువగలరు. గమనించుడి! 45వ వచనమును ఇప్పుడు గమనించుడి. అటు ఇటు చెదరక జాగ్రత్తగా వినుడి, దీనిని వదలకుడి.

అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణచుకొనజాలక [సహోదరుడా, మరియు పాపము నివారించబడి ముగియునప్పుడు, అవిశ్వాసము చెదరిపోవునప్పుడు.]; నా యొద్ద నుండు ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసికొనినప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచియుండలేదు.

అదేమిటి? అతని సొంత భార్య కూడా అంతఃపురమునకు తిరిగి వెళ్ళిపోయెను. ఓ, మై, యేసు తిరిగి వచ్చునప్పుడు వధువు మహిమలో ఉండును (దానిని ఇప్పుడు ధ్యానించెదము) తనను తాను తెలియపరచుటకు.

GEN 45:3

 

47అతడు ఎలుగెత్తి యేడ్వగా [యోసేపు దానిని ఇంకనూ అణచుకొనజాలక అతడు గట్టిగా కేక వేసెను.]; ఐగుప్తీయులును ఫరో ఇంటివారును వినిరి. [అంతఃపురములో ఉన్న అందరును యోసేపు కేక వేయుట వినిరి.]

ఇప్పుడు, అది యేసు యూదులను సంధించుటకు ఒక పోలికగాయున్నది. అది ఆయనకు తెలియును, మనకు ఒక అవకాశము కలుగులాగున ఆయన వారిని గ్రుడ్డివారిగా చేసెను. అయితే వారి యొద్దకు ఆయన తిరిగి వచ్చునప్పుడు, ఇశ్రాయేలు యొక్క పాపము ముగించి యుండును.

అప్పుడు యోసేపు, నేను యోసేపును; [యేసు ఏమి చెప్పునని మీరు అనుకొనుచున్నారు? - నేనే మీ యొక్క మెస్సీయాను. మీరు సిలువ వేసినది, అది నన్నే.'']; నా తండ్రి ఇంక బ్రతికియున్నాడా అని అడిగినప్పుడు, అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి.

DAN 9:24•

ZECH 12:10

 

48ఓ, ఒక్క నిమిషము నేనిక్కడ నిలుపవలయును. జెకర్యా 12వ అధ్యాయమునకు మనము త్రిప్పెదము. ఇప్పుడు నాతో కూడా జెకర్యా పుస్తకమునకు, జెకర్యా 12వ అధ్యాయమునకు త్రిప్పుడి. నేనొకవేళ అధికముగా సమయమును తీసికొనుచు, దీనిపైన మరియు ప్రసంగించుటకు ప్రారంభించుచున్నాను, మీకు తెలియునా, అయితే నేనట్లు చేయలేదని అనుకొనుచున్నాను. మరియు నేను ఎట్లయినను మీరు దీనిని అర్థము చేసికొని గైకొనవలెనని నేను కోరుచున్నాను.

జెకర్యా. జెకర్యా 12వ అధ్యాయము మనము తీసికొని, ఆయన తన సహోదరుల ముందు నిలుచుకొనినప్పుడు, ఆయన ఏమి చెప్పనైయున్నాడో చూచెదము. జెకర్యా 12 మరియు 10వ… ఇప్పుడు పాపము నివారించబడుట ముగించుట. మంచిది, 12వ అధ్యాయము మరియు 10వ వచనము.

ZECH 12:10

 

49గమనించుడి. మరిప్పుడు ఇక్కడ మిగిలినవారిని గురించి ఆయన మాట్లాడుచున్నాడు. యెరూషలేము చుట్టు ముట్టబడుట, మృగము మరియు సేనలును కొనిపోవుట మరియు ఆ కార్యములన్నియు. ఇప్పుడు సమస్త కార్యములును ముగింపుకు వచ్చుచున్నవి. ఇది వెయ్యేండ్ల పాలనకు అతి సమీపముగా ఉన్నది, ఇప్పుడే వెయ్యేండ్ల పాలన ప్రారంభించుటకు సిద్ధముగా ఉన్నది.

దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు [ఏమిటి?] కృప [ఆమేన్! అద్భుతమైన కృప!] సంతతి వారి మీదను - యెరూషలేము నివాసుల మీదను [దానియేలు యొక్క పరిశుద్ధ పట్టణము] ఆత్మను విజ్ఞాపనము చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టియుంచి, యొకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించునట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.

ZECH 12:11-14•

ZECH 13:6

 

50వినుడి! యోసేపు చేసిన విధముగా, ఆయన అక్కడ నిలువబడి తనను తాను వారికి తెలియపరచుచుండగా అది ఎటువంటి దుఃఖముగా ఉండును. వినుడి!

మెగిట్టోను లోయలో హదద్రిమ్మోను [హా-ద-ద్రి-మ్మో-ను నేను ఉచ్ఛరింపలేకున్నాను] దగ్గర జరిగిన ప్రలాపము వలెనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును.

దేశ నివాసులందరు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు, దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను;

లేవి కుటుంబీకులు … ప్రత్యేకము గాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాన;

మిగిలిన వారిలో ప్రతి కుటుంబపువారు, ప్రత్యేకము గాను… వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు.

వారిని గురించి వారు సిగ్గుపడెదరు, మరప్పుడు వారు అక్కడ నిలుచుకొని, ఆ రోజు రాత్రి సిలువలో వేసిన ఆ ఒక్కడు వారి యొక్క ప్రశస్తమైన యోసేపు అక్కడ నిలుచుకొని యుండుట చూచునప్పుడు. అక్కడేటువంటి దుఃఖము ఉండుననగా. వారు చెప్పెదరు, ''ఈ గాయపు మచ్చలను నీవెక్కడ పొందితివి?''

ఆయన చెప్పెను, ''నా యొక్క స్నేహితుల ఇంటిలో.'' నేను ఏ అర్థముతో చెప్పుచున్నానో మీరు చూచారా? పాపమును నివారణ చేయుటకును, అవిశ్వాసమును, ఆయన వచ్చుచున్నది అందుకొరకే.

DAN 9:24•

JOHN 8:24

 

51దానియేలు యొక్క ఈ డెబ్బదియవ వారములో - డెబ్బదియవ వారము, పాపమును నివారణ చేయుటకును, దూరముగా ఉంచుటకును వచ్చుచున్నది. ఇప్పుడు మీరు అర్థము చేసికొన్నారా? మొదటిది ఏమి? అతిక్రమమును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకు.

మూడవది: దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును - వ్రాసుకొనుచున్నారా మీరు… (మరియు అక్కడ నా యొద్ద సుమారుగా ఆరు ఇతర లేఖన వాక్యములు కలవు, అయితే అధికముగా వేడిగా ఉన్నందువలన నేను దానిని దాటిపోవుచున్నాను. మనము అధిక సమయమును తీసికొనగోరుటలేదు. నా వీలైనంత మట్టుకే నేను తీసికొనదలచుచున్నాను, అయితే అధిక సమయము మిమ్ములను ఉంచవలయునని అనుకొనుట లేదు.)

52మంచిది, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును. దోషము అనగా, వారు సిలువ యొద్ద చేసిన విధముగా తప్పు చేయుట. ఆయన ప్రాయశ్చిత్తము చేసెను, అయితే అది వారికి వర్తించదు. అది వారిపై ప్రయోగింపబడ లేదు. ఎందులకు? ఏలయనగా వారు గ్రుడ్డివారుగా నుండి మరియు దానిని చూడలేకపోయిరి, మరియు వారు ఎందుకొరకు వారు గ్రుడ్డివారుగా చేయబడిరి? మీరు చెప్పెదరు, ''మంచిది, ఈ రోజు ఒకవేళ ఏలయనగా నేను గ్రుడ్డి…'' మీకు తెలిసియే గ్రుడ్డివారుగా ఉన్నారు! వారు గ్రుడ్డివారు, ఏలయనగా దేవుడు వారిని గ్రుడ్డివారిగా చేసెను, అయితే మీరు గ్రుడ్డివారు, ఏలయనగా మీకు తెలిసియే (మీ మూర్ఖతనపు పట్టుదల వలన) గ్రుడ్డివారుగా ఉన్నారు! మీకు ప్రాయశ్చిత్తము లేదు. ''ఆయనే, నేను అని మీరు నమ్మనియెడల," యేసు చెప్పెను," మీ యొక్క పాపములో మీరు మరణించుదురు!'' అది సరియే!

PS 66:18•

DAN 9:24

 

53ఇప్పుడు, జెకర్యాకు మరల తిరిగి పోవుదము, 13వ అధ్యాయము. ఇప్పుడిక్కడ మనము వినెదము. ప్రాయశ్చిత్తము చేయుట… ఇప్పుడు, ఎక్కడ…? (ఇక్కడ ఎవరో ఒకరు దీనిని వినవలయునని నేను ఎదురు చూచుచున్నాను, అయితే ఎట్లయినను దానిని ప్రభువు తీసికొని వెళ్లును.) "ఆ దినమున అక్కడ…" ఆ దినమున.

డాక్టర్ స్కోఫీల్డ్ తన పుస్తకము పుటకు అడుగున వ్రాసిన దానిలో, లేక ఆయన పుస్తక భాగపు శీర్షికలో, "మిగిలిన - పశ్చాత్తాపము నొందిన మిగిలిన వారు సిలువ తట్టు చూపిరి.''

దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, దోషము అనగా మీరు ఇది చేయకూడదని బాగుగా తెలిసి కూడా ఆ తప్పునే మీరు చేస్తే దానినే దోషము అందురు. ''నా హృదయములో నేను పాపమును గర్భము ధరించిన (తలంచుకొన్న) ప్రభువు నా మనవి వినడు.''

ZECH 13:6,7

 

54ఇప్పుడు, జెకర్యా 13వ అధ్యాయము మొదటి నుండి మనము ఆరంభించెదము - మొదటి వచనము నుండి:

ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును, యెరూషలేము నివాసుల కొరకును ఊట యొకటి తియ్యబడును.

అక్కడొక తెరచియుంచిన ఒక గృహము ఉండును. మనము అట్లే క్రింద వరకు చదువుచూ పోవచ్చును. మీరు గుర్తుంచుకొనవలయునని నేను కోరుచున్నాను, కావున మీరు దానిని చదువుకొనగలరు. అయితే ఇప్పుడు, 6వ వచనము మొదలు 10వ వచనము వరకు చదువవలయునని నేను ఇక్కడ గుర్తుంచుకొనియున్నాను. అది సరి, ఇప్పుడు మనము చదివెదము మరియు చూడుడి - 9వ వచనము వరకు చదివెదము.

నీ చేతులకు గాయములేమని వారడుగగా? వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును.

ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యముల కధిపతియగు యెహోవా వాక్కు, గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్న వారి మీద నేను నా హస్తము నుంచుదును. ఇదే యెహోవా వాక్కు.

DAN 9:24•

ZECH 13:1,7•

MATT 26:31•

MARK 14:27

 

55ఇప్పుడు, యేసు ఆ లేఖనములను ఉదహరించి చెప్పెను, చూశారా. ''కాపరిని మొత్తుము మరియు గొర్రెలను చెదరగొట్టుము.'' అయితే గమనించుడి తదుపరి భాగమును. ఆయన దానిని మాత్రము ఉదహరించి చెప్పెను. అయితే దానిలో తదుపరి వాక్యమును, అదేమి చెప్పుచున్నదో గమనించుడి, దాని తదుపరి వాక్యభాగము, "మరి నా హస్తములను చిన్న వారి మీద నుంచెదను." ఏమిటి? ఇప్పుడు వచ్చుచున్న బెన్యామీను సంతతిని. "నా హస్తములను చిన్న వారి మీద నుంచెదను."

"కాపరిని మొత్తుము." ఇశ్రాయేలు, మొదట కాపరిని మొత్తుము, ప్రపంచమంతటికి గొర్రెలను చెదరగొట్టుము, అయితే దేవుడు చెప్పెను. "కడపటి దినములలో చిన్న వారిని తెచ్చుటకు నా హస్తములను వెనుకకు త్రిప్పెదను." ఎప్పుడు? దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడినప్పుడు. ఇశ్రాయేలు రక్షింపబడును, వారిలో ప్రతి యొక్కరు.

ISA 66:8•

DAN 9:24

 

56మనము యెషయాకు త్రిప్పెదము, యెషయా 66వ అధ్యాయము మరియు ఒక్క క్షణము దానిని చదివి, ఇశ్రాయేలు రక్షింపబడుటను గురించి దేవుడు ఏమి చెప్పుచున్నాడని చూచెదము, మరియు ఇశ్రాయేలును రక్షించుటకు ఎంత కాలము పట్టును. ఎంత త్వరగా అది వచ్చునని గమనించండి, యెషయాలో 66వ అధ్యాయము మరియు 8వ వచనము, దానినంతయు మీరు చదువ వలయునని కోరినయెడల, సరియే.

అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? … సీయోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను.

సీయోను అది వారి మెస్సీయా అని చూచిన వెంటనే, ఆమె ఒకే రోజులో తిరిగి జన్మించెను. పాపములకు ప్రాయశ్చిత్తము చేసెను, దోషము నిమిత్తమును, అపరిశుద్దమునకును ప్రాయశ్చిత్తము చేయుటకును. ఓ, మై! ఏది దుష్టకార్యమో, ఏది తప్పో దానిని వారు చేసిరి. వారి దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను.

దానియేలు 9:24

DAN 9:24•

REV 12:9•

REV 20:1,2

 

57నాలుగవది: యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును. అదే ఆయన రాకడలో గల నాల్గగవ కార్యము, ఆయన ఏమి చేయుటకు వచ్చు చున్నాడు, నాల్గవది. యుగాంతము వరకుండునట్టి నీతిని బయులు పరచుటకును, పాపమును నివారణ చేయుటకును, ప్రాయశ్చిత్తము మరియు యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును ఇశ్రాయేలు యొక్క అతిక్రమములు ముగించునప్పుడు… ఇశ్రాయేలు యొక్క అతిక్రమములు……

ఇప్పుడు, దీనిని మీరు గ్రహించవలయునని నేను కోరుచున్నాను, ఏలయనగా మనము ఆ స్త్రీని మరియు వెళ్లగొట్టబడిన ఘటసర్పమును తీసికొని వచ్చినప్పుడు దానిని గురించి ధ్యానించినప్పుడు మరల మీరు అదే లేఖనములకు తిరిగి వచ్చెదరు. దానిని గుర్తించుటకు మరువ వద్దు. అప్పుడు ఇశ్రాయేలు యొక్క అతిక్రమము మాన్పబడినప్పుడు సాతానుడు, వారిపై నేరము మోపువాడును, మరియు మనపై నేరము మోపువాడగు, సాతాను అగాధములో ముద్ర వేయబడును. అప్పుడేమి? అప్పుడు యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుచున్నప్పుడు అది, ముగియని ఏదో ఒక కార్యముగా ఉన్నది, ఏలయనగా ఇదంతయు అవినీతిని నిర్మూలించుట వలననే జరుగుచున్నది.

DAN 9:24•

REV 20:1,3

 

58మనము ఒక్క నిమిషము ప్రకటన 20వ అధ్యాయము మరియు 13వ వచనము తీసికొనెదను, మరియు ఒక్క నిమిషము ఇక్కడ మనము చదివెదము. ప్రకటన 20 మరియు 13. కాదు, మీరు నన్ను మన్నించండి, ప్రకటన… 1 నుండి 3 అది. దాని మధ్యనున్న చిన్న గుర్తును నేను చూడలేదు. ఇక్కడ నా కండ్లపై చెమట కారినవలన. ప్రకటన 20వ అధ్యాయము, మరియు … మనము చూచెదము.

మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవి గల యొక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని.

అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి,

అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను.

యుగాంతము వరకుండులాగున… యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును. అగాధములో సాతాను పడవేయబడును. మరప్పుడు ఆయన దానిని చేసినప్పుడు, జనులను మోసగించిన ఆ దయ్యమును మరి ముద్రించును……

DAN 9:24•

HAB 2:14•

REV 20:3

 

59ఇప్పుడు, మనము హబక్కూకు 2వ అధ్యాయమునకు త్రిప్పెదము - హబక్కూకు 2వ అధ్యాయము, మరిప్పుడు, ఆయనెందులకు ఈ పాత సర్పమును ముద్రించియున్నాడు, మరియు ఎందుకొరకు అది అట్లు చేయబడినది, మరియు అతడు ముద్రింపబడిన వెంటనే ఏమి సంభవించెనను కార్యములను మనము చూడబోవుచున్నాము. దీనిని నేను ఇష్టపడుచున్నాను. మీరు ఇష్టపడుట లేదా? అది ఏదో కార్యమును గురించిన జ్ఞానమును మనకు ఇచ్చును. హబక్కూకు 2వ అధ్యాయము మరియు 14వ వచనము, అదే అని నేను నమ్ముచున్నాను, నేను చదువవలయునని యున్నాను. అప్పుడు ఇది సంభవించునప్పుడు… గమనించండి.

ఏలయనగా సముద్రము జలములతో నిండియున్నట్లు భూమి యెహోవా మాహాత్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును.

మరొక మాటలతో చెప్పవలయుననగా, శత్రువు దూరముగా నుంచబడినప్పుడు, పాపము యొక్క ముగింపు వచ్చియున్నది. యుగాంతము వరకుండు నట్టి నీతి బయలుపరచబడి యున్నది, సాతాను అగాధములో ముద్రింపబడి యున్నాడు, సముద్రము జలములతో నిండియున్నట్లు భూమి యెహోవా జ్ఞానముతో నిండియుండును. ఆమేన్! దేవునికి మహిమ! అది వచ్చుచున్నది, సహోదరుడా, అది వచ్చుచున్నది! స్త్రీలు మంచి మర్యాద గల స్త్రీలుగా మారెదరు, మరియు పురుషులు మర్యాదగల వారుగా మారెదరు. ఆమేన్!

ప్రభువు యొక్క జ్ఞానము భూమిని,

మరియు సముద్రమును, మరియు ఆకాశమును నింపును,

మరియు, ఓ, నా హృదయము మూలుగుచున్నది, మొర్రపెట్టుచున్నది

ఆ యొక్క తియ్యనైన విమోచన దినము కొరకు,

మన యేసు తిరిగి భూమిపై మరల వచ్చునప్పుడు. (ఆమేన్!)

మంచిది. ఇప్పుడు, అప్పుడు వెయ్యేండ్ల పరిపాలన కొనసాగుచుండును. అప్పుడు ఆ వెయ్యేండ్ల పరిపాలనప్పుడు, ఆ నగరము కట్టబడును. నాల్గవది. నా యొద్ద సుమారుగా ఇంకనూ ఆరు లేఖనములు ఉన్నవి, అయితే మనము త్వరపడి పోయెదము. ఇప్పుడు,మనము తిరిగి వచ్చునప్పుడు, ఈ ఇతర లేఖనములను నేను తీసికొనెదను, అయితే మీకొక సాధారణ ఆలోచన ఇచ్చుటకే.

DAN 9:24

 

60ఐదవది: దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును. దూత దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు వచ్చెను… [టేపుపై ఖాళి ఉన్నది.] ఓ, నన్ను మన్నించండి. దానిని ఆ అర్థముతో నేను చెప్పుట లేదు, నన్ను మన్నించండి. ఆ అర్థముతో నేను చెప్పలేదు. నేను నిజముగా కాదు. కాదు. అభిషేకము లేకుండ ఒక వ్యక్తి, చూశారా. ఆ వ్యక్తి చెప్పెను, ఇక్కడ మీరు చూచిన ఆ దర్శనములు మరియు ప్రవచనములు ఎల్లప్పుడు యూదుల సంఘమునకు అనుమతింపబడియున్నది. మరియు చెప్పెను, "దానియేలు కాలము నుండి, దానియేలు అప్పుడు వచ్చినప్పుడు, దాని యొక్క అర్థము వారికి ఇక దర్శనములు లేక ప్రవచనములు ఇక ఉండవు."; ఈ రోజు ఈ కార్యములన్నియు దర్శనములు మరియు ప్రవచనములు దయ్యము యొక్క కార్యములు, దర్శనములు మరియు ప్రవచనములు అన్నటువంటి కార్యము లేదు. సోదరుడా, దానియేలు తరువాత డజన్ల కొలది ప్రవక్తలు ఉండిరి. మరియు బాప్తిస్మమిచ్చు యోహాను ఉండెను, యేసుక్రీస్తు ఉండెను, క్రొత్త నిబంధనకు ప్రవక్తలు ఉండిరి. దర్శనములు ఉండెను. దూతలు ఉండిరి. ఆ విధముగా ఈ ప్రపంచములో ఒక వ్యక్తి ఎట్లు చెప్పగలడు? అయితే మీరు చూడుడి, అది స్వార్థపరమైన ఉద్దేశ్యముతో జనులపై ఏదో త్రోయవలెనని, ఒక చిన్న సంఘపు బోధనగా దానిని చేయవలెనని, ఒక చిన్న కార్యమును నిజమైన కార్యముగా జనులకు చూపించవలయును. మరియు జనులకు పరిశుద్ధాత్మ లేనియెడల, దాని ద్వారా వారు వంచింపబడుదురు.

DAN 9:24•

DAN 12:1,2•

REV 6:1,2

 

61ఇప్పుడు, మనము ఎవరో ఒక వ్యక్తి చెప్పినది తీసికొనకూడదు. ఇప్పుడు, అది నిరూపించుటకు ఒక్క లేఖనము కూడ లేదు. కావున దానిని నేనెట్లు గైకొనగలను? మంచిది, ముద్రించుట అనగా నిజముగా ఏమిటన్న కార్యమును మనము కనుగొనెదము. గమనించండి, దర్శనమును మరియు ప్రవచనమును ముద్రించుటకు దాని కొరకు అతను వచ్చెను.

ఇప్పుడు, మనమెక్కడ ఉన్నామో దానియేలు పుస్తకములో అక్కడికే తిరిగిపోయెదము. దానియేలు పుస్తకములో అక్కడ అదేమి చెప్పుచున్నదో మనము కనుగొనెదము. ఇప్పుడు, మనము దానియేలు 12వ అధ్యాయమునకు త్రిప్పెదము. ఇప్పుడు, దానియేలు 12కు మనము పోవుచుండగా. ఇప్పుడు, మనము ప్రారంభించి మరియు చదివెదము… మీరు ఇండ్లకు వెళ్ళినప్పుడు, మీరు 1వ వచనము నుండి చదువవలయునని నేను కోరుచున్నాను. మనము 1వ వచనము మొదలు 4వ వచనము వరకు చదివెదము.

ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. [ఇప్పుడు, ఇది అంత్యకాలము.]: అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును.

అదెప్పుడనగా క్రీస్తువిరోధి, ఈ మొదటి ముద్రలో సవారి చేయుచు పోవునప్పటి కార్యము, అతడు ఆ స్థానమును ఎత్తికొనినప్పుడు, ఈ కాలము వరకు. యెరూషలేము గోడలను తీతు చక్రవర్తి పడగొట్టిన ఆ కాలములో కాదు. ఆ కార్యము ఆ ఒక్క చోట మాత్రమే జరిగినది. గమనించుడి, ఈ యొక్క క్రీస్తువిరోధి, రాబోవుచున్న ఆ అధిపతి, గమనించుడి అతను వచ్చినప్పుడు.

… అయితే నీ జనులలో గ్రంథము నందు వ్రాయబడిన వారెవరో వారు తప్పించుకొందురు. [హల్లెలూయ! నీ జనులు, ఇశ్రాయేలు, ఒక పుస్తకములో వ్రాయబడుదురు.]

మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.

DAN 12:3,4

 

62యెరూషలేము యొక్క గోడలను తీతు (రోమా చక్రవర్తి) పడగొట్టునప్పుడు అది ఎట్లు సంభవింపగలదు? అది ఆ విధముగా ఎట్లు జరుగును? అది అటు జరుగకయుండును. చూశారా, అంత్యకాలములో జరుగు పునరుత్థానమును గురించి ఆయన చెప్పుచున్నాడు. అది సరియేనా? ఇప్పుడు:

బుద్దిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతి మార్గము ననుసరించి నడచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.

వినుడి! ఇదిగో ఇక్కడ అది, నిజముగా ముద్రింపబడియున్న కార్యము.

దానియేలూ, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రించుము: …

DAN 12:4

 

63అదేమిటి? ఓ, హల్లెలూయ! శ్రోతలారా, దానిని మీరు చూచుచున్నారా? యేసుక్రీస్తును గూర్చిన బయలుపాటు, మరియు ఆయన యొక్క శక్తి, ఆయన రాకడ, అంత్యకాలమును గురించిన కార్యములు, ఈ కాలము వచ్చువరకు ముద్రించబడియుండెను. అందుకొరకే దానిని చేయుట కొరకే ఆయన వచ్చెను. వేదపండితులకు అది మరుగు చేయబడియున్నది. ఆ ముద్రించబడిన కార్యములు వెనుకటి ప్రవక్తలతో దానిని జతపరచ చూశారు, మరియు ఆలాటి కార్యములు వారు చేయుటలో ఆశ్చర్యము లేదు. అది సరైన ఉపదేశము కాదు. అయితే దర్శనము - ఇప్పుడు ఇక్కడి వరకు ఈ దర్శనము ముద్రించబడియున్నది, మరియు దేవుడు డెబ్బది వారములను గురించిన బయలు పాటును అనుగ్రహించునని; దానిపై నేను నా విశ్వాసమును ఉంచుచున్నాను. "దానిని ముద్రించుము,'' అతను చెప్పెను, ''అంత్యకాలము వరకు. ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము.''

DAN 9:24•

2THS 2:3,4

 

64అతనేమి చేసెను? దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు. దానియేలు ఈ కార్యములను ప్రవచించెను. అతడు దానిని దర్శనములో చూచెను, మరియు దూత ఆ దర్శనమును ముద్రించుటకును, మరియు ప్రవచనమును ముద్రించుటకును దిగి వచ్చెను (వారు దానిని చదువగలరు, అయితే దానిని అర్థము చేసికొనలేరు) అంత్యకాలము వరకు. అంత్యకాలము - అంత్యకాలము అనగా ఏమిటి? డెబ్బై వారములు ముగింపు, ఆ అధిపతి, క్రీస్తువిరోధి ఈ యొక్క కాలములో బయలుపడును, తనను తానే దేవునిగా చేసికొనును. ఈ కాలము వరకు ఇది ముద్రించబడియున్నదని మనకెట్లు తెలియును? దానియేలు దానినిప్పుడే గ్రహించెను… ఇది దానియేలు చివరి అధ్యాయము.

DAN 12:4-7

 

65సింప్సన్ సహోదరి ఈ రోజు మధ్యాహ్నము నాతో చెప్పెను, ఆమె చెప్పెను, ''బ్రెన్హాం సోదరుడా, నేను దానియేలు పుస్తకమంతటిని చదివితిని. నాకేమియు తెలియలేదు, నేను చదవను తొడగినప్పుడు నాకేమియు తెలియకుండ ఏలాగుంటినో అదే విధముగానే ముగించునప్పుడు కూడా ఉన్నది.'' ఇదిగో ఇక్కడున్నది, సోదరి సింప్సన్, నీవు గనుక ఈ రాత్రి ఇక్కడ ఉన్నట్లయిన. అక్కడెక్కడో ఆమె కూర్చొని యున్నదని నేను నమ్ముచున్నాను, నేను చూచుచున్నాను. ఆ బండిలో నేను ఉన్నప్పుడు దానిని గురించి నేను ఏమియు చెప్పలేదు. నేను నోరు తెరువక మౌనముగా ఉంటిని, ఏలయనగా దానిని నేను పొందుదునని నేను అనుకొంటిని. అయితే దానియేలు ఆ నది ఒడ్డున చూచిన ఆ దర్శనము అంత్యకాలము వరకు ముద్రించబడెను. ఇది… నేను ముందుకు సాగి, దానినక్కడ చదివెదను, చూశారా.

దానియేలూ, నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలు దిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలను నతడు చెప్పెను.

దానియేలను నేను చూచుచుండగా మరి యిద్దరు మనుష్యులు ఏటి అవతలి యొడ్డున ఒకడును ఏటి ఇవతలి యొడ్డున ఒకడును నిలిచిరి.

ఆ యిద్దరిలో ఒకడు నార బట్టలు వేసికొన్నవాడై యేటి నీళ్లపైన ఆడు కొనుచుండువాని చూచి - ఈ యాశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని యడుగగా? [ఇప్పుడు, ఆలకించుడి.]

నార బట్టలు వేసికొని యేటి పైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకెత్తి నిత్య జీవియగువాని నామమున ఒట్టు పెట్టుకొని, ఒక కాలము, కాలము, అర్థ కాలము;

ఇప్పుడు, సరిగా దానిని పొందబోవుచున్నాము. "… కాలము, కాలము, అర్థ కాలము." ఇప్పుడు, మీరు గమనించిన మనము దానియేలు డెబ్బది వారములకు పోయినప్పుడు, అదెట్లు వచ్చుచున్నదో చూడుడి. అదెప్పుడనగా మర్మములు బయలు పడినప్పుడు. మంచిది.

… ఒక కాలము, కాలము, అర్థకాలము - పరిశుద్ద జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగుననెను. [''అతడు,'' వ్యక్తిగతముగా అతనిని సూచించుచున్నది, క్రీస్తువిరోధి. అదెప్పుడనగా అతడు తన ఒడంబడికను వారము మధ్యలో భంగపరచునప్పుడు.], ఈ కార్యములన్నియు నెరవేరునప్పుడు. [ఆమేన్!]

నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని - నా యేలినవాడా, వీటికి అంతమేమని నేనడుగగా, అతడు - ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక,

దానియేలూ, నీవు ఊరకుండుమని చెప్పెను. [ఓ, దానిని నీవు మరువ వద్దు! చివరి కాలము వరకు.]

అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులు నిర్మలులును అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు.

DAN 12:4

 

66అంత్యకాలము వర్తమానము దానిని బయలు పరచును, కడపటి సంఘ కాలము. మహిమ! అక్కడే మీరున్నారు! ఓ, మై! దానిని తలంచుకొనిన అది నన్ను కదిలించి వేయుచున్నది. మర్మము మరియు ఆ కార్యములను, సంఘ శాఖలు ఆ ప్రపంచము వారి కండ్లు మూసికొని ఏమి కదలలేక మరియు చెప్పుచున్నారు, "అదొక వెర్రి," అని. యేసుక్రీస్తు ఎవరనే మర్మము - ఇంకొక మూడవ వ్యక్తి కాదు, రెండవ వ్యక్తి కాదు, మూడవ వ్యక్తి కాదు, అయితే దేవుడు అనే వ్యక్తి; ఈ దేవుని యొక్క మర్మములన్నియు బయలుపడును, ఏలయనగా ఇక్కడ ఈ యొక్క పుస్తకములో అది వ్రాయబడియున్నది. అది చివరి (కడపటి) సంతతికి బయలు పడును. యూదులు ఏ విధముగా మెస్సీయాను చూడలేకపోయారో, వేద పాఠశాలలు, వేదమును గురించి తర్కించు పాఠశాలలు మరియు సంఘ శాఖలు దానిని చూడకున్నారు. మీరు వెర్రివారని వారు తలంచుటలో ఆశ్చర్యము లేదు. వారు మిమ్ములను బుద్దిహీనులని తలంచుట ఆశ్చర్యము కాదు. వారితో చేరి మీరెందుకు అరవకున్నారో వారికి అర్థము కాకుండుట ఆశ్చర్యములేదు. ఏలయనగా ఒక శక్తి మరియు ఒక దర్శనము దాని వెనుకనున్నది, ఎత్తబడి ఇంటికి (పైకి) పోవుటకు సంఘమును క్రమపరచుటకు, బయలుపడిన దేవుని వాక్యమున్నదని వారు గ్రహింప కుండుటయే. అవును, చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును. నిశ్చయముగా!

2THS 2:2-4,7-10

 

67ఇప్పుడు, తెలియబడబోవు ఇంకొక కార్యము ఏమిటి? ఈ రోజు సంఘములను చూడుడి. ఇదిగో ఇక్కడ. అది బాధించదు అని నేను నమ్ముచున్నాను, అయినను దానిని నేను చెప్పవలయును. చేయుచు…

ఆ రోజు ఒక క్రీస్తువిరోధి లేచును.

ఇప్పుడు, గుర్తుంచుకొనుడి, మనము ముద్రలలో చూచినప్పుడు, ఆ ముద్రలలో ఆ క్రీస్తువిరోధి సవారి చేయుచున్నాడు. దానినిక్కడ దానియేలు పలుకుచున్నాడు, అధిపతి రాబోవుచున్నాడనీ, ఆయన (యేసు) నిర్మూలము చేయబడును, ప్రజల కొరకు ప్రాయశ్చిత్తము చేయుటకు. అయితే ఆ అధిపతి నిలుచుండి నాశనకరమైన హెయవస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచులాగున చేయును, అదియే రోము తీతు ద్వారా మరియు ఈ సమయము రోము నుండి వచ్చు ఒక అధిపతి దానిని చేయును. మరియు కడపటి దినములలో అతను బయలుపడును. (ఇప్పుడు వినుడి!), తనకు తానే దేవునిగా చేసికొనెను, పరిశుద్ధాత్మ II థెస్సలొనీకయులకు, రెండవ…. లో మనకు హెచ్చరించినట్లు…… దానికి ఇప్పుడు మనము పోయేదము - II థెస్సలొనీకయులకు, మరియు అప్పుడు మీరు నా వాక్యములను గైకొనరు, అయితే దేవుని వాక్యమును II థెస్సలొనీకయులకు, 2వ అధ్యాయము మరియు 12వ వచనము. మనము చూచెదము, II థెస్సలొనీకయులకు, 2వ అధ్యాయము మరియు 12వ వచనము. మనము చూచెదము, మనము పైనున్న దానిని ఆరంభించెదము, 7వ వచనము.

ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది… [ఇది పౌలు పరిశుద్ధాత్మ ద్వారా పలుకుచున్నాడు] గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. [ఇక్కడ ఎవరు, ఎవరికైనా తెలియునా? పరిశుద్ధాత్మ, అడ్డగించుచున్నాడు.]

అప్పుడా ధర్మవిరోధి బయలు పరచబడును……

ఎప్పుడు? పరిశుద్ధాత్మ తీయబడు సమయములో, ఇప్పుడే అది జరుగనైయున్నది. ఆయన ఎందుకొరకు పోవుచున్నాడు? సంఘమును ఆయనతో తీసికొనిపోవుటకు.

….. బయలుపరచ బడును, [పౌలు ప్రేరేపణతో పలుకుచున్నాడు] ప్రభువైన యేసు తన నోటి యూపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. [అతడు నిజముగా ధర్మవిరోధి.]

నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింబకపోయిరి గనుక, వాని రాక అబద్ద విషయమైన సమస్త బలముతోను, నానా విధములైన సూచక క్రియలతోను, మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసములతోను నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి యుండును.

''మేము గొప్ప సంఘము." "మాకు ఇది యున్నది; మాకు అది యున్నది." "ఇప్పటికే ఒక్కటిగా కూడుకొని యున్నారు," చూశారా. "మేమే గొప్పవారము" - ఆబద్ధమైన మహత్కార్యములు.

ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాష గల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.

దానిని మీరు గ్రహించియున్నారా? ఓ, మై! ఇప్పుడు, పౌలు పలుకుచున్నాడు…. దేవుని యొక్క ముద్ర బయలుపడినప్పుడు, ఆయన ఆత్మ, ఆయన నామము, ఆయన కృప, ఇప్పుడు చెప్పబడుచున్న ఈ యొక్క గొప్ప మర్మములన్నియు, ఎత్తబడుటలో పోవుటకు - ఆయన సంఘము సిద్ధపడు సన్నాహములు, ఇదంతయును పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు చేసియున్నది. ఈ కడపటి దినములలో అదే ఆయన చేసియున్నాడు.

68(ఇప్పుడు, మనము చూచెదము. ఈ చివరి కార్యమునకు మనకు సమయమున్నదా?) ఆరవది: అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. ఓ, మై! ఇక్కడొక కార్యమున్నది. ఆయన చేయవలసిన కడపటి కార్యము ఏమిటి? ఇప్పుడు, మనము దానియేలుకు తిరిగి పోయి, ఇక్కడ ఆయన చేయవలసిన కార్యమును కనుగొనెదము.

డెబ్బది వారములు [ఈ కాలములో ఏమి నెరవేరవలసియున్నది? మంచిది.] అతిక్రమమును మాన్పుటకును… [జనుల యొక్క అతిక్రమము], …… పాపమును నివారణ చేయుటకును [జనుల కొరకు], దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును [యూదులకు] దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, .[చివరి కాలము వరకు] అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. [ఆయన రాకడలో గల ఆరు ఉద్దేశ్యములు అవే].

DAN 9:24•

ACTS 10:38

 

69ఇప్పుడు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. (ఇప్పుడు ఒక్క నిమిషము బోధకులైన మీలో అనేకులకు ఇదొక వింతగా అనిపించవచ్చు, అయితే ఒక్క నిమిషము ఓర్పుతో నుండుడి; అదేట్లు వచ్చునో చూడుడి.)

ఇదొక అభిషేకము, ఒక వ్యక్తిది కాదు… యేసు ఇంతకు మునుపే అభిషేకింపబడియున్నాడు. అది సరియేనా? అపోస్తలుల కార్యములలో పుస్తకములో చెప్పబడియున్నది, దేవుడు యేసును పరిశుద్దాత్మతో అభిషేకించియున్నాడు, మరియు ఆయన మంచి కార్యములు చేయుటకై చుట్టు ప్రక్కల తిరుగుచు, వ్యాధిగ్రస్థులను స్వస్థపరచుచు మరియు ఆలాటి కార్యములు చేయుచుండెను. యేసు ఇంతకు ముందే… ఆయన మెస్సీయా మరియు మెస్సీయా అనగా ''అభిషేకింపబడినవాడు.'' అది సరియేనా? అయితే ఇక్కడ అంత్యకాలములో ఆయన మహా పరిశుద్ధుని అభిషేకించవలసినదిగా యున్నది.

మహా పరిశుద్ధమైనది ఏది? నేను దానిని చూచుచున్న ప్రకారము, లేఖనముల ద్వారా దానిని నేను మీకు నిరూపించగలనని నేను నమ్ముచున్నాను, మహా పరిశుద్ధమైన దానిని అభిషేకించుట అనగా, వెయ్యేండ్ల పరిపాలనలో ఉపయోగించబడు ఆ గుడారమే అది (ఇప్పుడు నేను దానిని ఎందులకు తీసికొని వచ్చుచున్నానో గమనించుడి), యెహెజ్కేలులో వివరించబడినది - 4వ అధ్యాయము. కాదు, నేను చెప్పదలచుకొన్నది, 43వ అధ్యాయము 1వ మరియు 6వ వచనము.

మనము తిరిగి యేహెజ్కేలుకు పోయి మరి కనుగొనెదము అతనెట్లు వెయ్యేండ్ల పరిపాలనను చిత్రీకరించుచున్నడో, వారెట్లు అభిషేకించెదరు… యెహెజ్కేలు 43, మరియు మనము ఇప్పుడిక్కడ కొద్దిగా చదివి మరియు చూచెదము, అతనేమి ఈ వెయ్యేండ్ల పరిపాలనలో చేయబోవుచున్నాడో, అభిషేకించుచు… యెహెజ్కేలు 43. మంచిది. మరియు ఇప్పుడు మనము 1వ వచనము నుండి 6వ వచనము వరకు మొదలు పెట్టెదము. మీరు మీ గృహములకు వెళ్లి, మీరు గుర్తుంచుకొనుచున్న యెహెజ్కేలు 43వ అధ్యాయము చదువుకొనవచ్చును. అటు పిదప…

EZEK 43:1-6

 

70ఇప్పుడు గమనించుడి - వెయ్యేండ్ల పరిపాలనలో కట్టబోవు ఆ ఆలయము యొక్క వివరణ. ఇప్పుడు, ఎవరైనా, చదువువారెవరైనా… వారికి తెలియును యెహెజ్కేలు 40వ అధ్యాయము మొదలు 44వ అధ్యాయము వరకు భూమిపైన వెయ్యేండ్ల పరిపాలనలోని ఆలయము కట్టబడుట తప్ప వేరే ఏ కార్యము భూమి పైన లేదు. (దానిని గురించి ఎవరికైనా తెలియునా, చూశారా), అది దేవుని యొక్క మహిమలో నింపబడి మరియు ఆ విధముగా ఇప్పుడు, 43వ అధ్యాయములో మరియు 1వ వచనము నుండి 6వ వచనము వరకు ఆలయమును గురించి వివరించబోవుచున్నాము.

తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా:

ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వనివలె వినబడెను, ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను.

నాకు కనబడు దర్శనము, పట్టణమును నాశనము చేయుటకై నేను రాగా, నాకు కనబడిన దర్శనము వలె నుండెను. మరియు కేబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా, నేను సాగిల పడితిని.

తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజోమహిమ మందిరములోనికి ప్రవేశించెను.

ఆత్మ నన్ను ఎత్తి, లోపటి ఆవరణములోనికి తీసికొని రాగా; యెహోవా తేజోమహిముతో మందిరము నిండియుండెను.

మందిరములో నుండి యొకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడెను; అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనెను.

LEV 8:10

 

71అభిషేకించుట - వెయ్యేండ్ల పరిపాలన కొరకు ఆ ఆలయమును అభిషేకించుట. ఇప్పుడు లేవీయకాండములో అదెట్లు అభిషేకింపబడినదో గమనించుడి. ఇప్పుడు మనము లేవీయకాండము లోనికి తిరిగి పోయి చూచిన, మోషే ఆలయమును అభిషేకించుట మనము కనుగొనగలము. దానిలో ఉన్నప్పుడే మనము తిరిగి పోయేదము. మనకు దానికి సమయము ఉన్నది. మరియు మనము లేవీయకాండమునకు మరల వెళ్ళి మరియు కనుగొనెదము మోషే ఎప్పుడు ఆలయమును అభిషేకించెనని - లేవీయకాండము 8వ అధ్యాయము.

ఓ, ఈ లేఖనములను ఒక దానితో మరియొక దానితో పోల్చి చూచుటను నేను ఇష్టపడుచున్నాను. దానిని మీరు ఇష్టపడుట లేదా? మరి అప్పుడు మీకు, మనము ఏమి చూచుచున్నాము మరి మనమేమి చేయుచున్నామన్న ఉద్దేశ్యము అర్థము కాగలదు. ఇప్పుడు, మనము ఒక లేఖన వాక్యమును ఉపయోగించి దానిపై మరి ధ్యానించుచున్నామని మీలో ఎవరైనను ఎరిగియుందురు.

LEV 8:10

 

72ఇప్పుడు, లేవీయకాండము 8వ అధ్యాయము. ఇప్పుడు నేనిక్కడ 10వ వచనమును గుర్తుంచుకొనియున్నాను. 8 మరియు 10 గుర్తుంచుకొనుడి. మనము చూచెదము.

మరియు మోషే అభిషేక తైలమును తీసికొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను.

అతడు దానిలో కొంచెము ఏడుమారులు బలిపీఠము మీద ప్రోక్షించి, బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను ప్రతిష్టించుటకై వాటిని అభిషేకించెను.

మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్టించుటకై అతనిని అభిషేకించెను.

మోషే అరణ్యములో వారు వారి ప్రయాణములో ఉన్నప్పుడు ఇశ్రాయేలు పుత్రుల కొరకు ఆరాధించు ఆలయమును పరిశుద్ధపరచెను, లేక అభిషేకించెను. అది అభిషేకింపబడెను.

2CH 5:13,14•

DAN 9:24•

REV 21:2

 

73ఇప్పుడు, II దినవృత్తాంతములకు త్రిప్పినయెడల, మరియు ఆ అర్పణమును చూడగలము… అప్పుడు పరిశుద్ధాత్మ గుడారములో ఆయన యొక్క స్థానమును తీసికొని మరియు ఇప్పుడేమి జరుగుచున్నది. గమనించుడి II దినవృత్తాంతములు 5వ అధ్యాయము మరియు మనము 13వ వచనము నుండి ప్రారంభించెదము - II దినవృత్తాంతములు, 5వ అధ్యాయము మరియు 13వ వచనము నుండి మొదలిడెదము:

వారితో కూడ బూరలు ఊదు యాజకులు నూట-ఇరువది మంది నిలిచిరి, బూరలు ఊదువారును పాటకులును ఏక స్వరముతో

యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్లి, ఆ బూరలతోను తాళములతోను వాద్యములతోను కలసి స్వరమెత్తి - యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి; అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండ నిండెను.

యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి.

దేవుడు జనులు వచ్చి ఆరాధించులాగున తనకు ఇయ్యబడిన అభిషేకించబడనున్న పరిశుద్ధ ఆలయమునకు వచ్చెను. కావున "నీ పరిశుద్ధ స్థలమును" అభిషేకించుటకు కాదు, అయితే "మహా పరిశుద్ధ స్థలమును" అభిషేకించుటకు. మరియు మనము గమనించుచున్నాము, నూతన యెరూషలేము మహా పరిశుద్ధ స్థలమని, మరియు ఆ అభిషేకము, తన భర్త కొరకు అలంకరింపబడిన వధువు వలె సిద్దపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చు నూతన యెరూషలేముపై ఉండును. ఆ అభిషేకము వారిపై ఉండును.

EZRA 6:16,17•

DAN 9:24•

REV 21:23

 

74ఇప్పుడు, జెరుబ్బాబెలు అతని ఆలయమును అది కట్టబడిన పిదప అర్పించునప్పుడు మరల అది అభిషేకింపబడలేదు, ఏలయనగా ఇంతకు మునుపే అది అభిషేకింపబడెను, అది నేల పడగొట్టబడెను లేక అది మరల కట్టబడెను, అది నశింపబడెను. అది తిరిగి కట్టబడెను కావున అటు పిదప మరల అభిషేకింపబడ లేదు. అది ఒక్కసారి అభిషేకింపబడినప్పుడు, అది అట్లే కొనసాగును, అది ఈ సమయము వరకు అట్లే యుండును. అయితే దేవుడు వెయ్యేండ్ల పాలనలోని గుడారమును స్థాపించినప్పుడు, ఆయన మహా పరిశుద్ధతను అభిషేకించును; "నీ యొక్క పరిశుద్ధతను" కాదు, అయితే "మహా పరిశుద్ధతను."

అయితే రాజు ఆ వెయ్యేండ్లకు అతని సింహాసనమును తీసికొనినప్పుడు. (సింహాసనాసీను డైనప్పుడు) … మహిమ! ఇప్పుడు ఆమె (కార్యము) ముగిసియున్నది. మహా పరిశుద్ధతను అభిషేకించుటయే జరుగనైయున్న కడపటి కార్యము.

75ఆ గుడారము లేపబడినప్పుడు, పునరుత్థానము వచ్చియుండును, యూదులు తిరిగి వచ్చియుందురు, క్రీస్తు ఆయన యొక్క వధువు వచ్చియుందురు, 1,44,000 మంది యూదులు ముద్రించబడియుందురు, వెయ్యేండ్ల పరిపాలన ఆరంభించి యుండును, మహా పరిశుద్ధ స్థలము అభిషేకింపబడినప్పుడు, అక్కడొక అభిషేకముండును - పరిశుద్ధ, పరిశుద్ధములో పరిశుద్ధమైనది, మరియు మహా పరిశుద్ధ… మహా పరిశుద్ధ స్థలము ఒక పరిశుద్ధాలయము అక్కడే కెరూబుల మధ్య దేవుడు జీవించుచున్నాడు; మరియు ఈ సమయములో క్రీస్తు మహా పరిశుద్ధ స్థలములో, ఆయనపై అభిషేకముతో కూర్చుండును. మరియు వారికి అక్కడ సూర్యుడు అక్కర లేదు, ఏలయనగా పట్టణము మధ్యలోనున్న గొర్రెపిల్ల, వెలుగుగా నుండును. ఆ వృద్ధుడైన అంకుల్ జిమ్ చెప్పుచుండేవాడు, ఆ పట్టణములో సూర్యుడు అస్తమించడు. మరియు ఎన్నడు ఆ విధముగా జరుగదు, ఏలయనగా క్రీస్తే ఆ వెలుగుగా నుండును, అభిషేకింపబడినవాడు. మరియు రాజు వచ్చి వెయ్యేండ్లు పరిపాలించుటకై ఆయన యొక్క సింహాసనమును గైకొనును.

GEN 43:15•

JER 3:12,14

 

76యిర్మియా 3:12-18 వరకు దానిని మనము చదివెదము. యిర్మియాలో 18వ అధ్యాయము, అని నేను నమ్ముచున్నాను. కాదు, 12వ అధ్యాయము, నన్ను మన్నించండి, యిర్మియా 12వ అధ్యాయము, మరియు మనము ప్రారంభించెదము… యిర్మియా 3, నన్ను మన్నించండి. యిర్మియా 3, ఇక్కడెక్కడో నేను వ్రాసియుంచుకొనియున్నాను… చదువుచుండగా, పరిశుద్ధాత్మ ఒక చోట నుండి ఇంకొక చోటికి కదలుచుండగా, నాకు వీలైనంత వరకు నేను టూకీగా వ్రాసియుంచుకొనియున్నాను. యిర్మియా 3 మరి 12-18 వరకు. దానిని మనము చదివెదము.

నీవు వెళ్లి ఉత్తర దిక్కున ఈ మాటలను ప్రకటింపుము - ద్రోహినివగు ఇశ్రాయేలూ, తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను, నేను కృప గలవాడను గనుక నేనెల్లప్పుడు కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు.

నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసికొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము, ఇదే యెహోవా వాక్కు. [అందుకే వారు తూర్పు, పడమర, ప్రతియొక్క దేశము చెదరియున్నారు, చూచారా.]

భ్రష్టులగు పిల్లలారా, తిరిగి రండి. [దీనిని వినుడి!] భ్రష్టులగు పిల్లలారా, తిరిగి రండి నేను మీ యజమానుడను, [వారి యొక్క కండ్లు గ్రుడ్డిగా నున్నవి, ఏలయనగా అన్యజనులకు ఒక తరుణమును నేను ఇచ్చియున్నాను, అయితే మీరు తిరిగి వచ్చియున్నారు, నేను మీకు వివాహము కాబడియున్నాను."]: ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణములో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములో నుండి ఇద్దరిగాను, మిమ్మును తీసికొని…..

యూదులు అని పిలువబడు అందరును లోనికి పోలేరు, అయితే ఆ ఎన్నుకొనబడిన గుంపు లోనికి పోయెదరు, యోసేపుకు ముందు వచ్చిన ఆ చిన్న బెన్యామీను, ప్రతి యొక్క దేశము నుండి ఆ గుంపు ఒక్కొక్క పట్టణము నుండి మరియు ఒక్కొక్క కుటుంబములో నుండి.

…… సీయోనునకు రప్పించెదను;

నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను, వివేకముతోను మిమ్ము నేలుదురు.

మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు - యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు, అది వారి మనస్సు లోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసికొనరు, అది పోయినందుకు చింతపడరు, ఇక మీదట దాని చేయరాదు, ఇదే యెహోవా వాక్కు.

ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నియు తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడచుకొనక యెహోవా నామమునుబట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు.

REV 21:2,18•

REV 22:2,5

 

77ఆ పట్టణము అభిషేకింపబడినప్పుడు అట్లుండును. నూతన యెరూషలేము అభిషేకింపబడినప్పుడు అట్లుండును. మరియు పట్టణములోని అన్ని శాఖల… ప్రకటన 22వ అధ్యాయములో, అక్కడ చెప్పబడి యున్నది, ఈ రాత్రులలో గుమ్మములు మూయబడవు, ఏలయనగా అక్కడ రాత్రి లేనందున, మరియు భూరాజులు అందరును తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు. దాని గోడలు కెంపు మరియు సూర్యకాంతము రాళ్లుగా ఉండును, పండ్రెండు రకముల రాళ్లు, మరియు పండ్రెండు గుమ్మముల ఒక గట్టి ముత్యముగా ఉండును, ఒక్కొక్క గుమ్మమును. అక్కడ మైనపు క్రొవ్వువొత్తి అవసరము లేదు. అక్కడ సూర్యుని వెలుగు ఉండదు, ఏలయనగా పట్టణపు మధ్యలోనున్న గొర్రెపిల్ల వెలుగుగా ఉండును. మరియు ఆయన, ఆయన యొక్క జనులను నిత్యజీవములోనికి నడిపించును. అక్కడ నదికి ఈవలను, ఆవలను రెండు వృక్షములు ఉండును, మరి అవి జనులను స్వస్థపరచుటకు. అదే అభిషేకము పొందినటు వంటి ఆ పరిశుద్ధ పట్టణము, అది పరలోకమును వదలి దేవుని యొద్ద నుండి భూమికి దిగి వచ్చునదిగా యుండును.

ISA 65:17-19

 

78ఆ సమయములో ఏమి జరుగనైయున్నదని, ఇప్పుడు మనము తీసికొనెదము. ఓ, దానిని మీరు ఇష్టపడుతున్నారా? ఒక్క నిమిషము యెషయా 65కు మనము త్రిప్పెదము. దాటిపోవుట మంచిదే. (వదలి వేయుట కూడా మంచిదే. ఉష్ణము కొద్దిగా ఎక్కువగానే ఉండవచ్చు, అయినను మనము ముందుకు కొనసాగెదము.)

యెషయా 65, ఆ సమయములో ఏమి జరుగనైయున్నదో వినుడి. పాపియైన స్నేహితుడా నీకు నీవే ప్రశ్నించుకొనుము, దీనిని వదలి వేయగలనా అని, యెషయా 65, 17వ వచనము మొదలు మనము ఆరంభించెదము. ఇప్పుడు అందరును చాలా జాగ్రత్తగా వినుడి. ఇది వెయ్యేండ్ల పరిపాలనప్పుడు, మహా పరిశుద్ధమైనది అభిషేకింపబడినప్పుడు.

ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారిగాను సృజించుచున్నాను. ["నేను యెరూషలేమును సృజించుచున్నాను." అదియే నూతనమైన యెరూషలేము.]

అభిషేకము అనగా ఏమిటి? దేవుని యొక్క ఆనందము. "నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను - రాజు సింహాసనములో నున్నాడు రాజయోగ్యముగా, ఘనతగల ఆ సింహాసనముపై, నిత్యమైన సింహాసనము మరియు నిత్యజీవపు జనులు, నిత్య ఆనందములో, నిత్యజీవపు పట్టణములో. ఓ, మై!

నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను. నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు.

అక్కడ ఇకను కొద్ది దినములే బ్రదుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు, బాలురు నూరు సంవత్సరముల వయస్సు గలవారై చనిపోవుదురు; పాపాత్ముడై, శాపగ్రస్తుడగువాడు సహితము నూరు సంవత్సరములు బ్రదుకును.

జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు.

వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు [అట్లనగా మీరు చనిపోయినప్పుడు, మీ కువూరుడు మీ స్థలమును తీసికొనునట్లు,]; వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు; నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును. నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసికొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు.

వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారి సంతానపువారు వారి యొద్దనే యుందురు.

వారికీలాగున జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను [కెరూబుల వెనుక ఆ మహిమగల అభిషేకము]; వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను.

తోడేళ్లును గొర్రెపిల్లలును కలిసి మేయును, … సింహము ఎద్దువలె గడ్డి తినును. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హానియైనను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. [దానిని మీరు పోగొట్టుకొనగలరా? లేదు!]

ISA 11:1

 

79కొద్దిగా వెనుకకు మరల పోయి, మరియు యెషయా మరల 11వ అధ్యాయము, 1వ వచనము నుండి 9 వరకు పలుకుచున్నాడు. తిరిగి ఇక్కడ అతను ఏమి చెప్పుచున్నాడో వినుడి - స్త్రీలను చూచిన పిదప అతను పొందిన దర్శనము - కడపటి దినములో వారెట్లు ప్రవర్తించెదరు - ఇప్పుడు యెషయా 11, 1:

యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును [అదెవరు? క్రీస్తు]: వాని వేరుల నుండి:

యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలముకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును.

యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు… తాను విను దానిని బట్టి అతడు విమర్శ చేయడు.

నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును భూనివాసులలో దీనులైన వారికి యదార్థముగా విమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును.

అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.

తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుత పులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును.

… ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.

పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును.

నా పరిశుద్ద పర్వత మందంతటను ఏ మృగమును హాని చేయదు నాశనము చేయదు సముద్రము జలములతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును.

ఇదంతయు ఆ యొక్క నూతనమైన యెరూషలేములో, ఆ నూతన… అంకురము ఇక్కడ, దావీదు యొక్క అంకురము (కొమ్మను) గురించి చేప్పబడుచున్నది. ఆయనే అంకురమును మరియు సంతతియైయున్నాడు.

JOHN 1:1,14•

REV 19:1,13

 

80ఇప్పుడు, దీని తరువాత వధువు కనబడును. డెబ్బది వారములు అయిన పిదప, ప్రకటన 19వ అధ్యాయము 1వ మరియు 16వ వచనములో వధువు కనబడును. ఆమె తన యొక్క బలవంతుడగు రాజైన పెండ్లి కుమారునిలో వచ్చును. (ఓ, మై! నాకు తెలియదు మనము అన్ని కార్యములను గ్రహించినామా, లేక లేదా అని గ్రహించియున్నాము అంతే…… సరి. ఏదైనను దీనిలో ఒక భాగమును మనము చదివెదము.) దీని తరువాతనే, ఇక్కడ వధువు వచ్చును, చూశారా. వెయ్యేండ్ల పరిపాలన స్థాపింపబడిన పిదప, అప్పుడు వధువుతో క్రీస్తు తిరిగి వచ్చును. సరి! 19వ అధ్యాయము, 1 నుండి 16 వరకు. అటు తరువాత - ఆ బాధల పిదప, శ్రమల పిదప, ముద్రల పిదప, తెగుళ్ల పిదప, సాతాను వెళ్లగొట్టబడిన (త్రోయబడిన) పిదప, వెయ్యేండ్ల పరిపాలన స్థాపింపబడిన పిదప… గమనించండి.

… అటు తరువాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని - ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును.

ఆయన తీర్పులు, సత్యములును న్యాయములునై యున్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను.

మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ ఇరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి - ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి.

మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి, గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసము నొద్ద నుండి వచ్చెను.

అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును [వినుడి! ఇక్కడే మీరున్నారు, సంఘమా 3వ అధ్యాయములో ఆమె పైకి వెళ్లిపోయిన పిదప, ఇక్కడ ఆమె వచ్చుచున్నది, చూశారా. ఆరవ వచనము.] అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము హల్లేలూయు! సర్వాధికారియు ప్రభువునగు వన దేవుడు ఏలుచున్నాడు. [హల్లేలూయ! గమనించుడి! ఇప్పుడు గొర్రెపిల్ల యొక్క వివాహము వచ్చియున్నది. ఇక్కడ ఆమె వచ్చుచున్నది!]

ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సన సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని యున్నది. [ఇక్కడ ఆమె వచ్చుచున్నది, వధువు మరియు పెండ్లి కుమారుడు ఇరువురును.]

గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకియ్య బడెను. అవి పరిశుద్దుల నీతి క్రియలు.

మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము, మరియు ఈ మాటలు దేవుని యదార్థమైన మాటలని నాతో చెప్పెను.

అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల యెదుట సాగిలపడగా అతడు వద్దు సుమీ నేను నీతోను, యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను. దేవునికే నమస్కారము చేయుము. యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను.

మరియు పరలోకము తెరువబడి యుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి [ఓ, మై!] కనబడెను. దాని మీద కూర్చుండియున్న వాడు నమ్మకమైనవాడును, సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు.

ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. [ఆయన వేటితో కిరీటము ధరించి యుండెను? రాజులకు రాజు.]; వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికిని తెలియదు.

రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.

''ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై యుండెను, మరియు ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను.'' అదెవరు? యేసు. "మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది."

పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని, తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి. [మహిమ! ఇక్కడ ఆయన వచ్చుచున్నాడు.]

జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి తొక్కును.

రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తోడ మీదను వ్రాయబడియున్నది.

81అదేమిటి? ఆయన జనులు ఆయనకు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను కిరీటమును ధరింపజేసిరి, ఆయన తన ఆలయమునకు తిరిగి వచ్చి ఆయన సంఘములో (వధువుతో) వెయ్యేండ్ల పరిపాలన చేయుటకు దేవుని సముఖముతో అభిషేకింపబడెను. ఆమేన్! ఆయన ప్రక్కలో, సర్వాధికారియగు రాజుతో ఆమె తన స్థానమును గైకొనుటకు కనబడుచున్నది, నూతన రాజరికమైన అభిషేకింపబడిన ఆలయము.

ఇప్పుడు, ప్రకటన 6:1 నుండి ప్రకటన 19:21 గల ఆరు ఉద్దేశ్యములు నెరవేరియున్నవి. వినుడి!

82ఇప్పుడు ముగింపులో, ఏడు ముద్రలు, ఏడు బూరలు, ఏడు పాత్రలు, మూడు శ్రమలు, సూర్యునిలో ఉండు స్త్రీ, దయ్యమును లేక ఎర్రని ఘటసర్పమును వెళ్లగొట్టుట ఈ కాలముల మధ్య, గొప్ప శ్రమలు కాలములో పైన చెప్పినవన్నీ సంభవించును. దానిని మరువకుడి. ఈ కార్యములన్నియు, ఈ కాలములో జరుగును, అయితే ఇదిగో ఇక్కడ అతని రాకడలో గల ఆరు ఉద్దేశ్యములు. దానిని మీరు నమ్ముచున్నారా? ప్రభువును ప్రేమించువారికి ఎటువంటి మహిమకరమైన సమయము వేచియున్నది. నేను మీకు చెప్పుచున్నాను, స్నేహితులారా దానిని మనము పోగొట్టుకొనజాలము. మీరేమి చేసినను దానిని వదలకుడి. నిశ్చయముగా దానిని పొందుడి.

83ఇప్పుడు, రాబోవు ఆదివారము ప్రభువు చిత్తమైనయెడల, ఆయన సహాయము చేసినయెడల, ఆ ఏడు రోజులను గురించి విపులముగా, అవెక్కడ నున్నవని మీకు చూపి, అవెక్కడ సంభవించేనని, ఈ రోజు ఆ కార్యములను తీసికొని వచ్చినట్లు, మరియు ఆ ఏడు సమయములను, ఏడు వారములను యూదుల యొక్క పరిశుద్ధ స్థలములో పెట్టి మరియు ఇక్కడ ఈ చివరి కాలములో మన మెక్కడ సరిగ్గా యున్నామో, అని ప్రభువు చిత్తమైతే చూపించదలచియున్నాను.

DAN 9:27•

DAN 12:7,11•

1COR 15:52•

1THS 4:15-17•

REV 11:3•

REV 12:15

 

84మీరు ఆయనను ప్రేమించుచున్నారా? పరలోకమును మీరు కోల్పోగలరా? మనము అంత్యకాలములో ఉన్నాము! ఆయన ఏమి చేయుటకు వచ్చుచున్నాడు? మొదట ఏ కార్యము జరుగును? యేసు భూమిపై రాక మునుపు, జరుగబోవు మొదలైన కార్యముగా ఏముండును? సంఘము ఎట్లు (ఏ స్థితిలో) ఉండును? ఎత్తబడి యుండునా! యేసు భూమి పైకి వచ్చి, సమాధుల యొద్ద చుట్టూ నడిచి, మరియు తల్లి, తండ్రులతో కరచాలనము చేసి, ఇక్కడ మనందరితో కూడా మాట్లాడి మరి పైకీ వెళ్లునా? కాదు! అదెట్లు ఉండును? దేవుని యొక్క వాక్యమును బట్టి దీనిని మీకు చెప్పుచున్నాము, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము ( II థెస్సలొనీకయులకు 5వ అధ్యాయము) ''ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము, నిద్రించిన వారిని ఆటంకపరచక లేక వారిని అడ్డగించము. ఏలయనగా దేవుని బూర ధ్వనించును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఒక్క క్షణములో మనము కొనిపోబడుదుము, కను రెప్ప పాటులో. ఆ సమయమున… సంఘకాలము ముగియును.

అప్పుడు ఇక్కడ భూమిపై దేవుడు యూదులతో వ్యవహరించును.

85ఇద్దరు ప్రవక్తలుండెదరు (11వ అధ్యాయము, దానిని మనము తీసికొనెదము) - ఎలీయా, మోషే వలె అభిషేకింపబడిన ఇద్దరు ప్రవక్తలు, వారే అని నేను అనుకొనుచున్నాను. మరియు వారు గొప్ప శాపములను తీసికొని వచ్చెదరు, వారందరు ఏకమై ఒక్కటైనప్పుడు, మరియు రోము దాని యొక్క ఒడంబడికను త్రుంచి, (ఆ అధిపతి) డెబ్బదియవ వారము మధ్యలో అది రోములో ఒడంబడికను త్రుంచి (మీరి)… లేక రోము దానిని ఇశ్రాయేలుతో మీరి, మరియు అది అసహ్యమైన, హేయ వస్తువును వేదజల్లుటకు ఆరంభించును. మరియు అప్పుడొక గొప్ప వరద, అన్యజనులలో మిగిలిన శేషము, నిద్రించు కన్యకలు… ఆ ఘటసర్పము (రోము) దేవుని ఆజ్ఞలు గైకొనుచు ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై తన నోట నుండి నీటి ప్రవాహమును వెళ్లగ్రక్కెను. రోము దానిని చేయును.

DAN 9:27•

REV 11:3,6

 

86సంఘములన్నియు కలిసి ఒక కట్టగా చేరి మరియు ఆ ఐక్యతలో యూదులను తీసికొని వచ్చెదరు, మరియు వారి యొక్క ఆలయములో వారు తిరిగి ఆరాధించుకొనుటకు వారిని తీసికొని వచ్చెదరు, బైబిలులో చెప్పబడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు ప్రకారము, మరియు వారికి వారి సొంత ఆలయము ఉండును.

ఇప్పుడు వారెట్లు ఉన్నారు? లేక వారి స్థితి ఏమిటి? (ఇప్పుడే దానిని పట్టుకొనియున్నాను.) వారు ఒక దేశముగా గుర్తింపబడియున్నారు. అది సరియేనా? అయినను ఇంకను వారు ఆలయములో ఆరాధించుట లేదు. మరి వారు ఆలయములో ఆరాధనను స్థాపించినప్పుడు, సంఘము (వధువు) ఎత్తబడి ఉండును. దేవుడు యూదులతో ఒక దేశముగానే వ్యవహరించును. మరి వారు ఈ యొక్క ఐక్యతలో కొనిరాబడినప్పుడు డెబ్బదియవ వారపు మధ్యలో రోము ఆ సంధిని త్రుంచి వేయును - మూడున్నర సంవత్సరములకు, వారితో చేసిన ఒడంబడికను అతను తుంచివేయును మరియు అంతము వరకు నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచులాగున చేయును. అప్పుడు అతడు ప్రొటెస్టంట్లను, యూదులను ఇరువురినే హింసించును, మరి ఆ సమయములో ఈ ఇద్దరు ప్రవక్తలు లేచి నిలిచి, వారి ప్రవచన దినములలో భూమిపై వర్షము కురియకుండ శపింతురు, ఆకాశము నుండి అగ్నిని రప్పించెదరు మరియు అనేక కార్యములను చేయుదురు. మీరు వేచియుండుడి. మనము తెలిసికొనవలసిన అనేక కార్యములు ఇంకను ఉన్నవి.

87ఓ, ఆయన ఎంత గొప్ప దేవుడు! ఎటువంటి దయగల తండ్రి! స్నేహితులారా, మీ యొక్క కాపరిగా ఇది మీకు చెప్పనిమ్ము. మీరు విశేషాధికారములను కలిగి వాటి క్రింద మీరు జీవించుచున్నారనుటను మీరు గుర్తించుట లేదు. మీరు గుర్తించుట లేదు. ఎందరో పరిశుద్ధులు కలరు, గడచిన సంవత్సరములో చనిపోయిన వేల కొలది పరిశుద్దులు కలరు, మీరు జీవించుచున్న ఈ దినమును చూచుటకు ఇష్టపడిన అనేక ఆత్మతో నింపబడిన వ్యక్తులు ఉండిరి. మీరు, నేనును దాని ప్రయోజనములను గైకొనెదము.

మనము ఇంకనూ దేని కొరకు ఎదురు చూడవలయును? దీని పిదప మనమేమి చేయగలము? మనమెక్కడికి పోవుచున్నాము? ఏమి సంభవించనైయున్నది? మనము ఎక్కడికో పోవలసియున్నది. ఎల్లప్పుడును ఇచ్చటనే ఉండ జాలము. మీరు గడ్డి కోయవచ్చును, తదుపరి వారము అది తొందరగా పెరుగుట వలన ఆ గడ్డి మరల కోయవలెను. అవును, ఆ సమయము లోపల రెండు మార్లు మీ బిడ్డలను మీరు పెంచవచ్చును. మధ్యాహ్న సమయము వారికి ఆహారము పెట్టవచ్చును, రాత్రి వేళ మరల వారికి ఆకలి కలుగును. రాత్రి వారికి ఆహారము పెట్టినను, మరుసటి ఉదయము వారికి మరల ఆకలి కలుగును. మీరు వారికొక జత పాదరక్షలను కొని ఇయ్యుడి; అవి నా మాదిరి ఉండినయెడల, (నేను పాదరక్షలను ఉపయోగించినట్లు ఉపయోగించిన) రెండు లేక మూడు నెలల పిదప మీరు ఇంకొక జతను కొనెదరు. ఈ నెల వారికి వస్త్రములు కొని ఇచ్చెదరు, ఒక నెల లేక రెండు నెలల పిదప వారికి మరల మీరు మరొక నూతన వస్త్రములు కొని ఇచ్చెదరు. చూశారా? ఏదియును నిరంతరము కాదు. ఏదియును నిలుకడ కాదు, ఏ కార్యము నిలువదు.

త్వరగా నశించు ఈ ప్రపంచము యొక్క

ఐశ్వర్యములను ఆశించవద్దు

నిత్యమైన కార్యములపై నీ నమ్మకమును కట్టుము

అవి ఎన్నడును నశించవు

కాలము త్వరితమైన మార్పులతో నిండి యున్నది;

శూన్యమైన ఈ భూమిపై, కదలింపబడనివి నిలుచునా,

నిత్యమైన కార్యముల పై నీ నమ్మకమును కట్టుము

మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుము!

వినుడి!

మన యొక్క యాత్ర ముగించినప్పుడు

(ఆయన మనకు తెలియ పరచును ఎప్పుడది ముగిసినదని!)

మనకు దేవునికి గనుక సత్యముగా ఉన్నయెడల

మహిమలో మన గృహము అందముగా ప్రకాశముగా ఉండును

(ఆ అభిషేకింపబడిన పట్టణము)

ఎత్తబడిన మన ఆత్మ దానిని చూచును!

మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుము!

మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుము

నిత్యమైన కార్యములపై నీ నమ్మకమును కట్టుము

మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుము

త్వరగా నశించు ఈ ప్రపంచము యొక్క ఐశ్వర్యములను ఆశించవద్దు,

నిత్యమైన కార్యములపై నీ నమ్మకమును కట్టుము,

అవి ఎన్నడును నశించవు,

మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుము!

మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుము!

నిత్యమైన కార్యములపై నీ నమ్మకమును కట్టుము,

మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుము!

మనము మన తలలు వంచియుండగా, ఆయన హస్తమును మీరింకను పట్టుకొననియెడల, దానిని ఇప్పుడే చేయుటకు రాకూడదా.

… … … … … .

మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుము!

నిత్యమైన కార్యములపై నీ నమ్మకమును కట్టుము,

మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుము!

88చిన్న బాలికలారా, ఇప్పుడు మీరు అందమైన స్త్రీలుగా ఉన్నారు. మీ యొక్క చిన్న వెంట్రుకలు చక్కగానున్నవి. మీ యొక్క చిన్న బుగ్గలు ఎర్రగా నున్నవి. అయితే మీకు తెలియునా, రేపు అన్న ఒక దినమున్నది, అప్పుడు అవన్నియు వాడిపోవును. రానున్న వారమే పురుగులు మన్నులో ఆ అందమైన బుగ్గలను తినవని మనకెట్లు తెలియును?

యవ్వన సహోదరుడా, నీవు బలవంతుడుగా, పెద్దగా, బలమైన కండరములు కలిగియున్నావు, నీవెన్నో గొప్ప కార్యములను నీ జీవితములో ఎదురు చూచుచున్నావు. అయితే కొద్ది కాలమైన పిదప, రేపు అను ఒక దినమున, ఆ అందమైన చుట్టలు చుట్టలుగా నున్న వెంట్రుకలు రాలిపోవును మరియు నీకు మిగిలియున్న వెంట్రుకలు నెరసిపోవును. ఆ పెద్ద, నిటారైన భుజములు వంగిపోవును, మరియు పురుగులు చేతులను మరియు మాంసమును తిని వేయును. అవి నిన్ను మంటికి కొనిపోవును.

… … … …

నిత్యమైన కార్యములపై నీ నమ్మకమును కట్టుము

అవి ఎన్నడు నశించవు!

మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుము.

దేవునిది పట్టుకొనుము (మీరు హస్తములను చాచి

ఇప్పుడే ఆయన హస్తములను పట్టుకొనకూడదా?)

నిత్యమైన కార్యములపై నీ నమ్మకమును కట్టుము,

మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుము,

అప్పుడు ఈ యొక్క యాత్ర ముగించినప్పుడు

(ఒక రోజు అది ముగియును.)

దేవునికి గనుక నీవు సత్యముగా ఉన్నయెడల,

మహిమలో నీ గృహము అందముగా, ప్రకాశముగా ఉండును,

ఎత్తబడిన మన ఆత్మ చూచును.

(మీరేల) మారని దేవుని యొక్క హస్తమును పట్టుకోనకూడదు?

మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుము.

నిత్యమైన కార్యములపై నీ నమ్మకమును కట్టుము,

మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుము.

89ఈ బల్ల (ప్రసంగ పీఠము) వెనుక ముప్పై-ఒక సంవత్సరములుగా నేను అనేక దృశ్యములను చూచియున్నాను. ఎన్నో దుఃఖకరమైన దృశ్యములను నేను చూచియున్నాను, ఎన్నో అద్భుతమైన మంచి దృశ్యములను నేను చూచియున్నాను, ఆకలితో పస్తులుండు బిడ్డలను వీధులలో నేను చూచియున్నాను, ఒక చిన్న రొట్టె ముక్క కొరకు తల్లులు భిక్ష మడుగుటను నేను చూచియున్నాను - ఇవన్నీయు నేను చూచిన దుఃఖకరమైన దృశ్యములు, అయినను నేను చూచిన అతి వేదనకరమైన దృశ్యము ఒక వ్యక్తి, దేవుని కుమారునిగా ఉండవలయునని కోరి, దేవునిని తెలిసికొనకుండా చనిపోవుటయే.

90నాకు గుర్తున్నది ఒక స్త్రీ ఒక రాత్రి ఈ చర్చి గుమ్మము యొద్ద నిలుచుకొని, నన్ను చూచి నవ్వుచు (హేళన చేయుచు) మరి చెప్పెను, "అతను పొందిన ఆ విధమైన మతమును, నా ఆవు కూడా కలిగియుండుటకు నేను అనుమతించను." ఒక గంట కూడా అయి ఉండదు నేను వైద్యశాలకు పిలువబడ్డాను. అందమైన స్త్రీ, సుమారుగా ఇరవై-రెండు సంవత్సరముల వయస్సుగల, ఆమె అరచి కేకలేయుచున్నది, "ఇక్కడికి ఆ బోధకుని తీసికొని రండి!'' ఆమె ఒక కేథలిక్ విశ్వాసురాలు.

నేను అక్కడికి వెళ్లినప్పుడు, అక్కడున్న ఒక వృద్ధాప్య సోదరి చెప్పెను, "మీరు చాలా ఆలస్యముగా వచ్చియున్నారు బ్రెన్హాం సోదరుడా. ఐదు నిమిషముల ముందే ఆమె చనిపోయెను."

"ఆమెను నేను చూడవచ్చునా?" అని అడిగితిని.

ఆమె చెప్పెను, "ఆమె మీ కొరకు అరచి కేకలేసెను, ఆమె యొక్క కడపటి మాటలు, 'ఇక్కడికి ఆ బోధకుని తీసికొని రండి.'''

ఆమె యొక్క భర్త అక్కడ అరచుచు, "ఆమె కొరకు ప్రార్థన చేయుము! ఒక ప్రార్థన చేయుము!"

నేను చెప్పాను, "ఇప్పటికి చాలా ఆలస్యమైనది.'' ఆ ముసుగును క్రింది వరకు లాగాను. ఆమెకు పెద్ద అందమైన గోధుమ రంగు కన్నులు, చక్కటి స్త్రీ, ఆమె ముఖముపై చిన్న పుట్టు మచ్చలు, కొంచెము ఎరుపు-గోధుమ వెంట్రుకలు, ఆకర్షింపబడు రూపము. ఆమె ఎంతగా అవస్థ పొందినదనగా ఆమె యొక్క అందమైన పుట్టు మచ్చలు ఆమె ముఖములో మొటిమల వలే నిలచినవి. ఆమె కండ్లు ఆ కంటి పల్లములో నుండి ఉబికి బయటికి వచ్చి యుండెను. అనేక మంది చనిపోవునప్పుడు జరుగునట్లు, ఆమె యొక్క పేగులు, మూత్ర పిండములు కొద్దిసేపు పని చేయుచుండెను. అక్కడ ఆమే అటువంటి స్థితిలో పండుకొనియుండెను. ఆమె నోరు తెరచుకొని, గోధుమ రంగు భాగము గల ఆమె కండ్లను ఆమె కనురెప్పలు మూసి యుండెను. దానిని నేను ఎన్నడును మరువలేను. ఆ పాట నాకు జ్ఞాపకమునకు వచ్చుచున్నది:

ఈ ప్రపంచపు నశించు ఐశ్వర్యములను ఆశింపకుము…..

91ఇక్కడ పోర్ట్ పుల్టన్ అను చోట చనిపోవుచున్న ఒక వ్యక్తి ప్రక్క నేను నిలుచుకొని యుంటిని, అతని పడక ప్రక్క వారు నన్ను పిలిచిరి. ఒక రాత్రి ఇక్కడ ఆల్టరు (బలిపీఠము) దగ్గర అతనితో ప్రార్థించునప్పుడు, అతను తన చేతులను ఒక స్త్రీ చుట్టూ వేసేను. నేను చెప్పాను, "ఆ స్త్రీ పై నుండి నీ చేతులను ఎత్తి వేయుము."

అతను చెప్పెను, "నేను ఆమెను దేవుని యొద్దకు నడిపించుచున్నాను.''

నేను చెప్పాను, "నీ చేతులను ఆమె చుట్టూ వేయరాదు.'' అటువంటి కార్యములను నేను నమ్ముట లేదు. నాపై అతనికి కోపము వచ్చి తలుపును కాలితో కొట్టి బయటికి వెళ్ళెను. మరి కొంత కాలమైన పిదప అతను చనిపోవునప్పుడు అతని యొద్దకు నేను వెళ్లితిని. అతను నా ముఖములో చూచి మరి చెప్పెను, "నా కొరకు ప్రార్థించ వద్దు బిల్ సోదరుడా. నేను తప్పిపోతిని. నేను చెడిపోతిని.'' చెప్పెను, "నేను సంపాదించినదంతయు సమస్తము పోగొట్టుకొనియున్నాను."

92ఇక్కడ నుండి సమీపములో గల ఒక స్థలములో నేనుండగా ఒక రోజు ఒక చనిపోవు వ్యక్తి అతని పడక ప్రక్కగా వారు నన్ను పిలిచెను. అతను చెప్పెను, "నేనెప్పుడు అది-మరి-ఇది-మరి-అది-ఇది కావలయునని కోరుచుంటిని,'' అతను చెప్పెను, "బ్రెన్హాం సోదరుడా, నేను చేయు కార్యములకు దూరముగా ఉండు నా చిన్న కుమార్తె, ఆమె దేవునికి ఏదైనా కార్యము చేయులాగున మీరు ప్రార్థించండి.''

నేను చెప్పాను, "ఆ విధముగా చేయను వీలు కాదు, సహోదరుడా. నీవు చేయవలెనని అనుకొన్న కార్యములన్నియును మరుగైపోయినవి.

93ఒక వ్యక్తి ప్రక్కన కూర్చుండి. ఇరవై-నాలుగు గంటలు అతను దయ్యముతో పోరాడుటను చూచియున్నాను. అతను చెప్పెను, అతని మెడ చుట్టు గొలుసులు చుట్టబడి, ద్యుములు అతని పడక ప్రక్కగా నిలుచుకొని యున్నవని చెప్పెను, చెప్పెను, ''నన్ను అవి పట్టుకొనకుండ నిమ్ము!'' (ఆ దయ్యములు అతని యొద్దకు రాకుండ చేయమని కోరెను) ఆ విధముగా భయముతో కేకలు వేయుచు పడకలోనే యుండెను. చెప్పెను, "అదిగో అక్కడ నిలుచుకొని యున్నది. దానిని నీవు చూచుట లేదా? "అది నన్ను వెంటాడుచున్నది." అతడు దేవునిని చాలా కాలముగా త్రోసి యుంచెను. ధాన్యపు కొట్టుల నిండుగా ఎండు గడ్డి, గోధుమలు ఉండెను, మంచి పందెపు గుర్రములు. ఒక సంవత్సరము ముందుగా దేవునిని ఆయనకెదురుగా శపించెను, తన భార్య ఆలయమునకు పోయినందులకు కొట్టెను. ఏమీ జరిగినదో మీకు తెలియునా? పిడుగు అతని ధాన్యపు కొట్టుపై పడి అతని గుర్రములను చంపెను, అతని గడ్డినంతయు కాల్చి వేసెను. మరియు ఆ మనుష్యుడు ఒక విధమైన దయ్యములకు బద్ధుడై, ఆ దయ్యములతో పోరాడుచు మరణించెను.

EXOD 17:12

 

94నా యొక్క పాత స్నేహితుడు ఇప్పుడు చనిపోయి దూరముగా మహిమలో ఉన్నాడు, జీవితములో చివరి దశలో వచ్చినప్పుడు, నేను అడిగితిని, "డాడ్ (తండ్రి) మీరు పోవుచున్నారా?''

చెప్పెను, "ఇదే అది, బిల్లీ."

నేను అడిగితిని, "అదేట్లు?"

అతను చెప్పెను, ''సమస్తము బాగున్నవి." చెప్పెను, "నా పడక ప్రక్కగా పిల్లలందరిని తీసికొని రమ్ము. అతను తన బలహీనమైన చేతులను ఒక్కొక్క బిడ్డపై వుంచి మరియు వారిని ఆశీర్వదించెను, తన ఇద్దరు కుమారులతో ఇట్లు చెప్పెను, "నా చేతులను ఎత్తి పట్టుకొనుడి, యెహోషువా, కాలేబు చేసినట్లు." అతను ఏమి చెప్పబోవునో అని మేము ఆశ్చర్యపడుచుంటిమి. అతను చెప్పెను:

ఆనందకరమైన రోజు, ఆనందకరమైన రోజు,

యేసు నా పాపములన్నిటిని కడిగిన రోజు నుండి!

నేనెట్లు మెలకువలో ఉండి ప్రార్థించవలయునని ఆయన నాకు నేర్పెను.

మరియు ప్రతి దినము ఉల్లసించుచు జీవించుచున్నాను. స్నేహితులారా, అటువంటి కార్యములు ఇంకను ఉన్నవి చెప్పుటకు. మనము మంచి ఆహారము భుజించుటకు ఆశించవచ్చును, మంచి మోటారు వాహనమును నడుపుటకు కోరుకొన వచ్చును, అన్నింటిలో మంచిది, ఉత్తమమైనది పొంది యుండవలయునని కోరుకొన వచ్చును. మిమ్ములను నేను నిదించలేదు. అదంతయు సరియే. దేవుడు మీరు అదంతయు పొంది, యుండవలయునని కోరుచున్నాడు. అయితే…

త్వరితముగా నశించిపోవు, ఈ ప్రపంచపు

వ్యర్థమైన ఐశ్వర్యములను ఆశించవద్దు,

నిత్యమైన కార్యములపై నీ నమ్మకమును కట్టుము,

అవి ఎన్నటికిని నశించవు.

మనము పాడుచుండగా,

ఇప్పుడు మన చేతులను పైకెత్తెదము.

మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుడి!

మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుడి!

నిత్యమైన కార్యములపై నీ నమ్మకమును కట్టుము,

మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుము!

95మనము నిలిచియుండగా, ఇప్పుడు మనము చుట్టు తిరిగి మరి ఇతరులతో కరచాలనము చేసికొనెదము. ఇంకొక్క క్షణము ఈ ఆరాధనను కొనసాగించేదము. అయితే ఆ పాటలోని ఇంకొక వచనమును పాడుచుండగా, మీరు చుట్టూ తిరగవలయునని నేను కోరుచున్నాను.

మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుము!

(తల్లులారా, దానిని చేయుము!

తండ్రులారా, దానిని చేయుము!)

మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుము.

(చిన్న పిల్లలారా దానిని చేయుడి,

సహోదరిలారా దానిని చేయుడి!

సహోదరులారా, దానిని చేయుడి!)

నిత్యమైన కార్యములపై నీ నమ్మకమును కట్టుడి,

మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుడి!

96ఆయన కొరకు మీరు ఆనందించుట లేదా? "ఆమేన్!'' అని చెప్పుడి. ఆయనను ప్రేమించువారందరు, చెప్పుడి, "దేవునికి స్తోత్రము.'' నలుచదరమైన ఆ పట్టణములోనికి పోయెదమని నమ్ము వారందరు, మీ చేతులు పైకెత్తుడి. (ఓ, మీ పాటతో ఒక్క నిమిషము దానినట్లే పట్టుకొనుడి.)

ఆ యొక్క అందమైన పట్టణమునకు పోవుటకు నేను సిద్ధముగా ఉన్నాను.

(ఇప్పుడు అదేట్లు పోవును?)

ప్రభువు ఆయన యొక్క సొంతము కొరకు సిద్ధపరచెను,

సమస్త కాలముల యందును విమోచింపబడిన వారందరు

అక్కడ తెల్ల సింహాసనము చుట్టు మహిమను పాడెదరు.

కొన్ని సమయములలో పరలోకమునకు వెళ్ళవలయునని

నేను ఇంటి వైపు బెంగతో నున్న విధముగా ఉండును,

మరియు నేను వీక్షించు ఆ మహిమ.

అది ఎటువంటి ఆనందముగా ఉండును,

నా యొక్క రక్షకుని నేను చూచునప్పుడు

శృంగారమైన ఆ బంగారు పట్టణములో

మీరు దానిని ఇష్టపడుచున్నారా?

ఆ యొక్క అందమైన పట్టణమునకు పోవుటకు నేను

సిద్ధముగా ఉన్నాను,

నా యొక్క ప్రభువు ఆయన యొక్క సొంతము కొరకు సిద్ధపరచెను.

సమస్త కాలముల యందును విమోచింపబడిన వారందరు

అక్కడ దవల సింహాసనము చుట్టు మహిమను పాడెదరు.

ఓ, కొన్ని సమయములలో పరలోకమునకు పోవలయునని

నేను ఇంటి వైపు బెంగతో నున్న విధముగా ఉండును,

మరియు అక్కడ నేను వీక్షించు ఆనందము,

అది ఎటువంటి ఆనందముగా ఉండును,

నా యొక్క రక్షకుని నేను చూచునప్పుడు

శృంగారమైన ఆ బంగారు పట్టణములో.

ఆయనను ప్రేమించుచున్నారా?

యేసు నామమును మీతో కొనిపోవుడి,

దుఃఖమును, శ్రమలలోను ఉన్న బిడ్డ,

అది నీకు ఆనందమును, ఆదరణను ఇచ్చును,

అట్లయిన అది తీసికొని పొమ్ము, నీ వెక్కడికి పోయినను

ప్రశస్తమైన నామము, (ప్రశస్తమైన నామము)

ఓ ఎంత మధురము!

భూలోక నమ్మకము మరి పరలోకపు ఆనందము,

ప్రశస్తమైన నామము, (ప్రశస్తమైన నామము)

ఓ ఎంత మధురము!

భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము.

ఇప్పుడు, మరచిపోకుడి రాబోవు ఆదివారము ఉదయము 9:30 మరియు అప్పుడు, ప్రభువు చిత్తమైనయెడల, మనము ప్రయత్నించెదము, వ్యాధిగ్రస్థులకు ప్రార్థించుటకై సరిగ్గా సమయమునకు కూడుకొనుటకు, రాబోవు ఆదివారము ఉదయము 9:30కు.

యేసు నామములో వంగి,

ఆయన కాళ్లపై సాగిలపడి,

పరలోకములో రాజులకు రాజు

ఆయనకు కిరీటము ధరింపజేయుదురు,

మన యొక్క ప్రయాణము (యాత్ర) ముగించినప్పుడు.

ప్రశస్తమైన నామము, (ప్రశస్తమైన నామము)

ఓ ఎంత మధురము! ( ఓ ఎంత మధురము!)

భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము,

ప్రశస్తమైన నామము, (ప్రశస్తమైన నామము)

ఓ ఎంత మధురము!

భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము.

ఈ యొక్క వచనమును వినుడి.

యేసు నామములో వంగెదము,

ప్రతి ఒక్కొక్క వల నుండి ఒక రక్షణ కేడెముగా;

శోధనలు నిన్ను చుట్టు ముట్టినప్పుడు,

ప్రార్థనలో ఆ పరిశుద్ధ నామమును శ్వాసించుము.

(అది దానిని చేయును!)

ప్రశస్తమైన నామము, (ప్రశస్తమైన నామము),

ఓ ఎంత మధురము! (ఓ ఎంత మధురము),

భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము,

ప్రశస్తమైన నామము, (ప్రశస్తమైన నామము),

ఓ ఎంత మధురము, (ఓ ఎంత మధురము!)

భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము.

ఇప్పుడు, కాపరికి ఆరాధనను నేను అప్పగించుచున్నాను. సోదరుడు నెవిల్ తన ముగింపు వాక్యములను, లేక ఆయన ఏమి చెప్పవలయునో చెప్పును.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...