దానియేలు యొక్క డెబ్బది వారములు
VGR COUNT -230 1ఉదయకాలపు శుభములు స్నేహితులారా. దానియేలు యొక్క ఈ డెబ్బదియవ వారమను ఈ గొప్ప వర్తమానమును మనము వివరించుటకు ప్రయత్నించుచుండగా, దానిని కొనసాగించుటకు ఈ ఉదయకాలమున మరల ఇక్కడ ఈ గుడారములో కూడుకొనుట ఒక విశేషముగా ఉన్నది. మరియు ఈ యొక్క ఉష్ణమైన దినమున అనేకులు కూడుకొనుటను చూచుటకు మేము సంతోషించుచున్నాము, అయినను అందరిని కూర్చుండబెట్టుటకు మా యొద్ద గదులు లేవు. జనులు అనేకులు ఈ విధముగా కూడుకొని మరియు చుట్టూ నిలుచునియున్నారు, అయినను ఏమి చేయను వీలుకాని పరిస్థితి. మరియు మీకు తగినంత సౌకర్యము లేనందువలన ఇటువంటి పరిస్థితులలో మీరు అర్థము చేసికొనుటకు మీకు కఠినముగా ఉండవచ్చును. అయితే దానిని త్వరగా చేయుటకు మావలన వీలైనదంతయు చేయుదుము.
మరియు ఈ రోజు, నేను ఒకవేళ కొద్దిగా అధిక సమయము తీసికొనిన, మీరు నన్ను మన్నించెదరని నేను నమ్ముచున్నాను, ఏలయనగా ఈ యొక్క వర్తమానమును మేకువలె గట్టిగా లోతుగా కొట్టవలసిన సమయమిది — మేకువలె లోతుగా కొట్టవలసిన వేళ ఇది. దీనిని మనము మూడు అంశములుగా భాగించియున్నాము, కావున దానిని నిశ్చయముగా మనము గైకొనగలము.
2ఇప్పుడు, అవును, ఈ వర్తమానములు టేపు చేయబడి, మరియు ప్రపంచమంతటయును అవి పంపించబడుటను ఇక్కడ కనబడుచున్న సంఘమంతయును ఎరిగినదే. ప్రపంచమంతటను ప్రతియొక్క దేశము ఈ టేపులను పొందుచున్నారు. ఈ టేపులను వినుచున్న వారికి దీనిని నేను చెప్పవలయునని ఇష్టపడుచున్నాను, మీరెక్కడనున్నను మరియు ప్రపంచములో ఏ భాగములో మీరున్నను, దీనిలో కొన్ని కార్యములు ఉన్నవి, నేను బోధించిన - నేను చేసిన వాటి వలన మీరు నాతో అంగీకరించకుండ ఉండవచ్చును. అయితే నేను చెప్పుటకు ఇష్టపడుచున్నాను, సహోదరులారా, మీరు దానిని చూచునట్లు మీరు వివరించగలిగిన యెడల, అది - నేను నమ్ముదానికి వేరుగా ఉన్నప్పటికిని, మీరు చెప్పదలచిన దానిని వినుటకు నేను సంతోషపడెదను.
3మరియు నేను నా హృదయములో వున్న ఉద్దేశము వలన సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకును, సంఘమంతటి కొరకును, ప్రపంచమునందున్న సర్వ సంఘమంతటి కొరకును, క్రీస్తు సంఘము కొరకును, సర్వ ప్రపంచము కొరకు ఈ తలంపుతో దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్యము ద్వారా ఈ వర్తమానములను నేను తీసికొని వచ్చుచున్నాను. మరియు మనము చివరి దినములో జీవించుచున్నామని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. మరియు దీనిని వివరించు నా ప్రయత్నములు, ఈ ప్రక్క లేక ఇంకొక ప్రక్క దానిని త్రోయుటకు నేను ప్రయత్నించుట లేదు… అట్లు దానిని చేయుట వలన నేను నిర్దోషినని నేనెరిగియున్నాను.
4అనేక సమయములు టేపుల ద్వారా జనులు విని, మరియు వారు చెప్పెదరు, "సరి దానితో నేను అంగీకరించలేకున్నాను. అతని బోధనలు ఏమిటో అతనికే తెలియుట లేదు, లేఖనములు గురించి తెలియదు." సరి, అదంతయు నిజముగా ఉండవచ్చును, చూశారా. అది నిజము కాదని నేను చెప్పను, అయితే నేను చదివి యున్నాను, ఏ యొక్క వాక్యములను తీసికొనలేదు… ఇతర వ్యక్తులు ఏమి చెప్పదలచినారో నేను దానిని చదివి మరియు వారిని మెచ్చుకొనెదను. మరియు ఏ ఒక్కరైనా చెప్పునదంతయు, నేను దానిని మెచ్చుకొనెదను. అయితే అప్పుడు దానిని నేను దేవుని యొద్దకు తీసికొనిపోయెదను, ఆదికాండము నుండి ప్రకటన వరకు వివరించగలను అని ఎరుగు వరకు నేను దానిపై అట్లే నిలచెదను, మరియు బైబిలు అంతటితో అది జతచేయబడి యుండుటను చూచెదను, మరప్పుడు అది సరి అని సమీపముగా నుండుటను నేను తెలుసుకొందును. మరియు అవును, మీరు సరియైనప్పుడు, కేవలము ఆ ఒక్క స్థలములోనే నేను గీతను తప్పియుందును. మరియు బహుశ మీరు తప్పు అయినప్పుడు, లేక సరియైనా, ఆ స్థలములోనే నేను గీతను తప్పియుందును, మరియు లేక మరొక విధముగా.
2CH 1:10
5కావున, ఇక్కడ ఈ ఉదయము వినుచున్న శ్రేష్ఠమైన మిమ్ములను మరియు ఈ టేపులను వినుచున్న మంచి జనులను మేము అభినందించుచున్నాము. మరియు మేము టేపు చేయుచున్న ఈ కార్యమలన్నియును దేవుని యొక్క రాజ్యము కొరకై యున్నవి. నేను ఎంతగానో అభినందించుచున్న ఎంతో మంది మంచి స్నేహితులు ప్రపంచమంతటను నాకు కలరు. మరియు వారితో నిత్యముగా గడిపెదనని నేను నమ్ముచున్నాను. ఎట్లయినను ఆ జనులను మోసగించవవలెననో లేక వంచింపవలెననే కార్యము నా హృదయములో లేదు, అయితే వారికి నేను నా వీలైనంత మట్టుకు సహాయము చేసి మరియు దానిని నెరవేర్చుటకే నేను ప్రయత్నించుదును.
సొలోమోను దేవుని జనులను తాను నడిపించుటకు ప్రార్థించి అడిగినట్లు, నేను కూడ అదే అనుభూతిని చెందెదను. అదే నా యొక్క మనఃపూర్వకమైన ప్రార్థన.
6ఇక్కడ నాతో కూడ, చుట్టూ ఉన్న నా సహచరులు… నేను, సోదరుడు మెర్సియర్, మరియు సోదరుడు రాయ్ బార్డర్స్, మరియు సోదరుడు నెవిల్, మరియు నా కొడుకు బిల్లీ పాల్, మరి జెన్నీస్ ఇక్కడెక్కడో మరియు సహోదరులు, టెడ్డీ మరియు వారందరు, నేను వీరిని చూచుచున్నాను. నా కొరకై వచ్చి సహాయపడు ఈ జనులందరిని నేను అభినందించుచున్నాను.
నాకు గుర్తున్నది కొంత కాలము క్రితము, సోదరుడు లియో ఒక - అతనొక దర్శనము పొందెను - కల అని అతడు దానిని చెప్పెను - ఒక రాత్రి మేము మొదటిగా కలిసినప్పుడు, పిరమిడ్ కొనభాగమును చూసినట్లు చెప్పెను. మరియు అక్కడ పైనుండి ఎక్కడో ప్రసంగించుచున్నాను, మరియు అతడు దానిపైకి ఎక్కి అదంతయు ఏమిటని చూడదలచెను. మరియు అతడు శిఖరం పైకి ఎక్కినప్పుడు, వెండి వలె మెరయు ఒక పళ్లెము వంటి దానిని చూచి అతడు అడిగెను, ఎందుకు, నేనక్కడ జనులకు ప్రసంగించుచున్నాను. మరియు అతడు నా యొక్క దృష్టిని ఆకర్షించెను, మరియు నేను అతని వైపు తిరిగినప్పుడు మరియు అతడు అడిగెను, "మీరెట్లు అక్కడికి వెళ్ళగలిగితిరి? నేనెట్లు అక్కడికి రాగలను?''
నేను చెప్పాను, "లియో, ఇక్కడికి ఎవ్వరును రాలేరు. దేవుడే ఇక్కడికి ఒక వ్యక్తిని తీసికొని రాగలడు. ఇప్పుడు, నీవెక్కడికి పైకి రాకూడదు దానిని చూచిన పిదప నీవు క్రిందికి పోయి అది సత్యమని, అది సత్యమని అక్కడ క్రిందనున్న ఆ జనులకు దానిని గురించి సాక్ష్యమియ్యవలెను.'' జనులకు సాక్ష్యమిచ్చుటకు లియో మరల క్రిందకు దిగిపోయేను.
అది ఎంత కాలము క్రితము లియో సోదరుడా? అనేక సంవత్సరములకు, అది అట్లేనా? అనేక సంవత్సరములు. అప్పటి నుండి నాకు తెలిసినంత వరకు, ఈ వాక్య పరిచర్య దేవుని యొద్ద నుండి వచ్చినదని, అతడు జనులకు సాక్ష్యమిచ్చుటలో చాలా విశ్వాసముగా ఉండి, ఆ కార్యము చేయుచున్నాడు. ఇప్పుడు, మరియు అది నా యొద్దకు రావలయునని నేను కోరుటలేదు. ఒకవేళ అది (వాక్యము) నా యొద్ద నుండి వచ్చినయెడల, అది మంచిది కాదు, ఏలయనగా ఒక మనుష్యునిలో ఏ మంచితనమును లేదు, చూశారా. అది దేవుని యొద్ద నుండి రావలయును.
7ఇప్పుడు, నేను చుట్టు చూచినప్పుపుడు… మరియు నిన్నటి దినమున మధ్యాహ్నము నా యొక్క స్నేహితుడైన సోదరుడు వెస్ట్ తో నేను కరచాలనము చేసితిని. ఇంకనూ ఈ కట్టడములో నేను అతనిని కనుగొనలేదు - అవును, ఇప్పుడు చూచాను — ఈ ఉదయము. ఇప్పుడు నేను, మరియు మీకు తెలియునా, ఎంత దూరము నుండి జనులు ప్రయాణము చేసి వచ్చుచున్నారని? ఆదివారము ఇక్కడికి వచ్చుటకు చాలా దూర ప్రదేశమైన అలబామా నుండి, అలబామా నుండి ఇక్కడికి వచ్చుచున్నారు.
గత ఆదివారము సోదరుడు వెల్చ్ ఈవాన్స్ ను నేను చూడలేదు. ఈ రోజు ఇక్కడ ఉన్నాడని ఎవరో చెప్పారు. జార్జియాలో నుండు తిఫ్టన్ నుండి వారందరు తమ వాహనములను నడుపుకొని వచ్చుచున్నారు. అతని సహచరులు అందరును ఇక్కడ కూడి యున్నారు. కావున అనేక… జార్జియాలోని, మెకాన్ అను ప్రాంతము నుండి సోదరుడు పామెర్ మరియు నేను చూచుచున్నాను, సోదరి అన్గ్రీన్ వారందరు అక్కడ వెనుక యున్నారని నమ్ముచున్నాను. టెన్నిసీలో నుండు మెంఫిస్ నుండి వారు వచ్చియున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించుడి… అనేక ప్రదేశముల నుండి మరియు ఇతరులు అనేకులు దక్షిణ కరోలినాలో ఉండు ఒక స్త్రీని ఇక్కడ ఇప్పుడే కలుసుకున్నాను.
8ఇప్పుడు, ఇక్కడున్న ఆ జనులను మీరు ఆలోచించుడి (చికాగోలోను, ఇతర అనేక ప్రదేశముల నుండి వచ్చు జనులను నేను చూచుచున్నాను) ఒక్క ఆరాధనలో పాల్గొనుటకు వందల కొలది మైళ్లు ప్రయాణము చేసి వచ్చుచున్నారు. అట్లు కష్టపడి అంత దూరము నుండి వచ్చినను, ఇక్కడ కూర్చోనుటకు స్థలము ఉండదు, ఒక ఏర్-కండిషన్ ఉన్న గదులు లేవు, చెమటను తుడుచుకొనుచు ఎక్కువ వేడిగల పాత బిల్డింగులో అక్కడ నిలుచుకొని యుందురు, ఇక్కడ ఈ వర్తమానమును వినుటకు తమ బిడ్డల కొరకు పొదుపు చేసిన డబ్బులను నుండి తీసికొని వచ్చుచున్నారు. ఒకానొక దినమున వారు ఆవలకు వెళ్ళబోవు ఒక స్థలము ఉండదు అని మీరు నాకు చెప్పుదురా? ఖచ్చితముగా అది ఉన్నది. అది విశ్వాసము! వారు దశమ భాగమును క్రమముగా చెల్లించు జనులు. వారు వచ్చుట మాత్రమే కాదు, వారి కానుకలను, దశమ భాగములను దేవుని యొక్క ఆలయమునకు తీసికొని వచ్చెదరు, ఏది సరి దానిని వారు చేయుటకు ప్రయత్నించుదురు. అటువంటి జనులను దేవుడు మెండుగా ఆశీర్వదించును. దేవుని కృప మరియు కనికరము వారితో ఉండును గాక.
9దక్షిణ కెంటకీలో నుండు నా స్నేహితుడు చార్లీ కాక్స్ మరియు ఇతరులనందరిని నేను చూచుచున్నాను. మరియు మీరు చుట్టూ ఎటు చూచినను, పలుచోట్ల నుండి వచ్చిన జనులను మీరు చూడగలరు.
ఇక్కడ కూర్చొనియున్న ఈ యవ్వన వ్యక్తి, అతని పేరును నేను పిలువలేక యున్నాను. చికాగోలో అతనిని నేను కలిసియున్నాను. ఇక్కడ నుండి ఎక్కడనో యున్న బైబిలు పాఠశాల నుండి నీవు వచ్చి యున్నావు కదూ? నీవే కదూ అది? స్ప్రింగ్-ఫీల్డ్, మిస్సోరిలో ఉన్న అసెంబ్లీ-ఆఫ్-గాడ్ బైబిలు పాఠశాల. అవును, సరి మంచిది. మీరు చూశారా, ఈ చిన్న పాత ఆలయమునకు ప్రతియొక చోట నుండి వచ్చుచున్నారు.
దానిని గురించి ఆలోచించుడి… సుమారుగా ముప్పది సంవత్సరములకు మునుపు ఆ ఉదయము నేను మూలరాయిని పెట్టినప్పుడు, ఆ ఒక ఇండ్ల వరుసకు దూరముగా, ఆ ఏడవ వీధిలో అక్కడ నేను నిలబడియుంటిని, అప్పటికి నాకింకను వివాహము కాలేదు, నేనొక యవనస్తుడుగా ఉంటిని. మరియు సమస్త స్థలముల నుండి జనులు ఇక్కడకు వచ్చి, ప్రజలతో క్రిక్కిరిసి, నిండిపోయినట్లుగా నేను ఒక దర్శనములో చూచితిని. మరియు నేను ప్రసంగ వేదిక వెనుక నిలుచుని చాలా ఉత్సాహముతో యుంటిని. మరియు అప్పుడు ఆయన నాలో చెప్పెను, "అయితే ఇది నీ యొక్క గుడారము కాదు.'' మరియు ఆయన నన్ను ఆకాశము క్రింద కూర్చుండబెట్టెను. మరియు మిగత జరిగిన కార్యములన్నియు మీకు తెలియును, అదంతయు అక్కడ మూల రాయిలో పెట్టబడిన బైబిలు కాగితముపై వ్రాయబడియున్నది.
10మీ యెడల నేను కృతజ్ఞత గలవానిగా యున్నాను. నేను చెప్పలేకున్నాను… అట్లు చెప్పుట చాలా స్వల్పముగా ఉన్నది, అట్లు చెప్పుట, "సరి నేను మీకు కృతజ్ఞుడుగా ఉన్నాను.'' అయితే నేను మీ కొరకు ప్రార్థించెదను. మీ పై నాకు నమ్మకము కలదు. మీకు దేవునితో గల అనుభవములను నేను నమ్ముచున్నాను. ఒక వ్యక్తి లేక ఒక స్త్రీ వందల కొలది మైళ్లు వాహనములు నడుపుకొని, వారెటువంటి వస్త్రములు ధరించుకొన్నారో ఇతరులకు ఇక్కడ చూపించుటకు వారు వచ్చుచున్నారని నేను నమ్ముట లేదు. వారు ఆ విధముగా చేయుదురని నేను అనుకొనను. లేదు! వారు ఇతరులకు తమ్ము తాము చూపించుకొనుటకు ఇక్కడికి వచ్చుట లేదు. వారెందుకు ఇచ్చటికి వచ్చుచున్నారనగా, వారు గాఢముమైన… మనఃపూర్వకముగా వారి యొక్క ఆత్మల రక్షణకై ఇచ్చటికి వచ్చుచున్నారు. నా యొక్క ప్రార్థన ఇది: "దేవా, నాకు సహాయము చేయుము. దేవుని తట్టు చూచుచు, నా హృదయమంతటితో వారికి పరిచర్య చేయుటకు ప్రయత్నించుచుండగా, వారికి గల ఆ నమ్మకములో సగమైనను నేను కలిగియుండుటకు నాకు సహాయపడుము.''
11ఈ ఉదయము మీరు చూచుచున్న వర్తమానము, ఇక్కడున్న నల్లబోర్డుపై చిత్రీకరించబడియున్నది. అదెందుకనగా - దానిని వివరించుచు పోవుచుండగా - నేను ఏమీ చెప్పుటకు ప్రయత్నించుచున్నానో దానిని మీరు చక్కగా అర్థము చేసికొనుటకు అట్లు చేయుచున్నాను.
మరియు ఈ దానియేలు యొక్క డెబ్బది వారములు ఒక గొప్ప ధ్యానముగా ఉన్నది. సరిగా సత్యమైన దానిని చెప్పుటకు సరైన వాక్యములను వెదకుచు ప్రయత్నించుచు, ఈ వారపు కడపటి నుండి ఇక్కడదానిపై ధ్యానించుటకు మొదలు పెట్టినప్పటి నుండి నేను రెండు రోజులు మరియు రెండు రాత్రులు నేను దాని పైనే యున్నాను, బైబిలులోని ఇతర వాక్యములతో అది పోల్చబడవలయును, చూశారా. మీరు దానిని ఊరక ఏదో అని గైకొనకూడదు, మీరేదో ఒక చిన్న వాక్యమును తీసికొని, దానిని మాత్రము అర్థము చేసికొని, మరట్లు చెప్పుచు, "సరి, ఇది దీనిని చెప్పుచున్నది," మరియు మరల తిరిగి ఇట్లు చెప్పుచు, "సరి, అయితే ఇక్కడ ఇది వేరే విధముగా చెప్పుచున్నది. దీనికి విరుద్ధముగా ఉన్నది.'' అది అట్లు చేయకూడదు. అది అన్ని వేళలయందు అదే కార్యమును చెప్పవలయును. మీకు వీలు కానియెడల అప్పుడెందుకు - అప్పుడు మీరు - మీరు తప్పుగా యున్నారు. మరియు ఆ విధముగానే నేను దీనిని బోధించుటకు ప్రయత్నించితిని.
12అదే విధముగా, టేపులపై (టేపుల పై ఉండుట వలన), గొప్ప విమర్శ టేపులను గురించి నాకు ఉన్నది, ప్రపంచములోని పలు భాగములలో గల నా సహోదరులు, మరియు ప్రపంచము నిర్మింపబడక మునుపే మనలను దేవుడు ఏర్పరచుకొన్నాడు అని - నా విధానములో నేను బోధించుదును అని - దేవుని కృపను నమ్ముచున్నారు.
నా పెంతెకోస్తు సహోదరులారా, మీ యొక్క అభిప్రాయములు లీగలిస్ట్ అనగా మంచి క్రియల ద్వారా రక్షణ పొందగలమన్న అభిప్రాయములు, చూశారా, మరియు నేను ఎరుగుదును అది మీ యొక్క అభిప్రాయములను తారుమారు చేయుచున్నది. అయితే మీరు ఒక క్రైస్తవ సోదరునిగా, మీ యొక్క బైబిలుతో దేవుని ముందు మోకాళ్ళని బాగుగా చింతించి మరియు మీకు దానిని వివరించమని దేవుని అడుగగలరా? దానిని మీరు చేయుదురా? మీ యొక్క లీగలిస్ట్ విధానమును తీసివేసి, ఆదికాండము నుండి ప్రకటన వరకు దానిని జోడించగలరా?
GEN 3:15
13మరియు సర్పము యొక్క సంతానము, అదే చంపునది. అనేక జనులు దానిని నమ్మరు. అయితే మీరు ఆదికాండములో చదివినయెడల, బైబిలు చెప్పుచున్నది, సర్పమునకు ఒక విత్తనము ఉన్నదని. ''మరియు సర్పసంతానమునకును, స్త్రీ సంతానమునకును నేను వైరము కలుగజేసెదను. కావున సర్పము ఒక విత్తనము కలిగి ఉండెను. మరియు సర్పము యొక్క విత్తనము ఆత్మీయమైనదిగా ఉన్నయెడల, అప్పుడు యేసు ఒక మనుష్యుడు కాదు, కావున స్త్రీ యొక్క విత్తనము ఆత్మీయమైనది. వారిరువురే విత్తనములు కలిగియుండిరి, మరియు ఆ వైరము ఇంకను ఉన్నది. సర్పమునకు ఒక విత్తనము ఉండెను. మరియు మీరు మీ యొక్క బైబిలు తీసికొని దేవుని ముందు భయభక్తులతో ఉండినయెడల, దేవుడు దానిని మీకు బయలుపరచునని నేను నమ్ముచున్నాను.
మరియు ఒకవేళ మీరు దానిని అర్థము చేసికొనలేకున్నయెడల, నేనెల్లప్పుడు మీకు అందుబాటులో ఉందును, మీకు లెటర్ ద్వారా నాకు తెలిసినంత వరకు సహాయపడుటకు, లేక వ్యక్తిగత సంభాషణ ద్వారా లేక వేరే ఏ విధమైన కార్యము ద్వారా అయినా మీకు సహాయపడగలను, ఏలయనగా మనము గుర్తెరిగియున్నాము అది ఒక మనుష్యుని రక్షింపదు, లేక ఒక మనుష్యునికి శిక్ష విధింపదు, అయితే ప్రజలందరు చూచులాగున కష్టపడి మనమందరము ప్రయత్నించుచున్న ఈ పాఠముపై అది వెలుగును కొనివచ్చును. అది వెలుగును మాత్రమే కొనివచ్చును.
ఇప్పుడు, కనిపించుచున్న శ్రోతలకు, దీనినెందుకు చెప్పుచున్నాననగా టేపుల కొరకు, మీరు చూశారా. మరియు ఈ టేపులు అన్ని చోట్లకు పోవును.
14ఇప్పుడు ఈ వాక్యము యొక్క గ్రంథకర్తను సమీపించుటకు ముందు ఒక్క క్షణము మన తలలు వంచెదము. మరి వినుచున్న వారిలో ఈ ఉదయము ఎంత మంది అవసరములో యున్నారు? ఊరక చెప్పుడి, ''నేను అవసరములో ఉన్నాను, ఓ దేవుడా, నాపై దయకలిగి యుండుము." ప్రభువు ఆశీర్వదించును గాక, మరియు టేపులు వినుచున్న వారలారా, దానిని మీరు వినుచుండగా, మీ యొక్క కోరికలను దేవుడు అనుగ్రహించును గాక.
JOHN 15:16•
JOHN 16:23
15మా పరలోకపు తండ్రి, మేము కృతజ్ఞతగల ప్రజలము, అయినను అనర్హులమైన జనులము. అయితే ఈ ఉదయము మీ యొక్క కృపా సింహాసనమును సమీపించుచున్నాము ఏలయనగా మేము రావలయునని పిలువబడియున్నాము. యేసు చెప్పెను, "మీరు నా యొక్క నామములో తండ్రిని ఏమైనను అడుగుడి, నేను దానిని మీకు చేయుదును.'' ఇప్పుడు అది సత్యమని మనము ఎరిగి యున్నాము.
మరిక్కడ శ్రోతలలో, మరియు వెలుపల టేపులు పోవు చోట్లలో, అక్కడ పదివేల కొలది తిరిగి-జన్మించిన క్రైస్తవులు దీనిని వినెదరు. మరియు మేమెరిగి యున్నాము, తండ్రి, మేము నూతనముగా జన్మించినప్పుడు, మేము పై నుండి వచ్చిన ఆత్మతో జన్మింపబడియున్నామని. అది దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మనపై యున్నది. మరియు మన మెరిగియున్నాము ఆ పరిశుద్ధాత్మ సర్వశక్తివంతమైనదని, మనకేమి జరుగవలయునని కోరుకొనెదమో, మరియు అది మన కొరకేదైనను చేయునని. అప్పుడు పరలోకపు తండ్రి, మేము అడుగుచున్నాము, ఆ ఆత్మకు మా విశ్వాసమును విడిపింపమని, ఈ ఉదయము మా కొరకు అది సంపాదించగలదని, మరియు దేవుని రాజ్యము యొక్క మహిమకై, ఈ అన్ని మనవులు, కోరికలు, మా యొక్క వ్యాధి నుండి, బాధల నుండి స్వస్థతనొంది, మా అంతరంగములో, మాలో ఉన్న సమస్తముతో మన దేవునికి సేవ చేయులాగున చేయుము.
16ఈ రోజు అర్థము చేసికొనులాగున మా యొక్క చెవులను తెరువుము. మరియు నేను ఈ యొక్క గొప్ప ప్రశ్నను తీసికొని వచ్చి దానిని విశదపరచుటకు ప్రయత్నించుచుండగా… మరిక్కడ నేను దానిని పేపరుపై వ్రాసియుంచుకొని యున్నాను, ప్రభువా, మరియు ఈ పటము నల్లబోర్డ్ పై చిత్రీకరించియున్నాను, అయితే దానిని వివరించుటకు నేను పూర్తిగా అసమర్థుడిని. ఎవరైతే వాక్యమును వ్రాసినారో, ఎవరు దానిని ప్రేరేపించినారో, ప్రవక్తయైన దానియేలుకు ఎవరిచ్చిరో, ఆ గొప్ప బోధకుడైన మిమ్ములను ఇప్పుడు పిలుచుచున్నాము. మరియు ఈ ఉదయము మీరు ప్రేరేపణను పంపవలయునని మేము ప్రార్థించుచున్నాము. ఈ కడపటి దినములలో, ఆయన చెప్పినట్లు ఈ సమయము వరకు పుస్తకము మూయబడియుండునని మీరు మాకు అర్థము చేసికొను జ్ఞానమును తెరచెదరని, మా హృదయములో మృదువైన పరుపువలె విశ్వాసమును పుట్టించి, అందుకొరకే ఉద్దేశించబడిన విధముగా ఆ విశ్వాసము వాక్యము ద్వారా పట్టబడి మరియు వెలిగించబడి, మరియు మా జీవితములలో నీతిగల వృక్షములను మొలిపించ వలయునని మేము ప్రార్థించుచున్నాము. దేవుని యందు మాకు గల విశ్వాసము, ఈ ఉదయము మాకు దానిని సంపాదించులాగున చేయనిమ్ము. ఏలయనగా ఇప్పుడు మేము వినయముతో నిరీక్షించుచున్నాము మరియు మీ కొరకు మమ్ములను మేము అర్పించుకొనుచున్నాము, యేసుక్రీస్తు నామములో. ఆమేన్.
17ఇప్పుడు, దేవుని యొక్క నిత్యమైన వాక్యము అను ఈ పుటలను మరల తెరచుటకు ఈ ఉదయమున ఇయ్యబడిన గొప్ప అవకాశము కొరకు మేము కృతజ్ఞులమైయున్నాము.
ఇప్పుడు, దీనిని నేనే విశద పరచుటకు ఎందులకు ప్రయత్నించుచున్నాననగా, దాని కారణము, ఏలయనగా… ప్రకటన గ్రంథమును ధ్యానించుచున్నాము, మరియు ఇప్పుడే ఏడు సంఘ కాలములను ధ్యానించియున్నాము, మరియు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చివర, సంఘము భూమి నుండి, మహిమలోనికి ఎత్తబడియున్నది. సంఘ కాలమునకు చెందని, ప్రకటన గ్రంథములో వ్రాయబడిన కార్యములను జనులు చూచి ఏదో కార్యము సంభవింపనైయున్నదని ఎదురు చూచుచుండగా, మరియు నా హృదయవంతటితో ప్రయత్నించి దీనిని జనులకు తీసికొనిరావలయునని యున్నాను; మరియు మీరు తలంచు దాని కన్నను మనము ముగింపునకు చాలా సమీపములో ఉన్నాము.
18కొన్ని రాత్రులకు మునుపు, బిల్లీ, నా… లేక నా కోడలు ఒక రోజు రాత్రి నన్ను టెలిఫోనులో పిలిచి, మరియు చెప్పెను ఆండీ హెర్మన్ అను పేరుగల ఒక వ్యక్తి ఉన్నాడు - అతను నా యొక్క బంధువు - అతడు హాస్పిటల్లో చనిపోవు స్థితిలో ఉన్నాడని చెప్పెను. మరియు అతనిని చూచుటకు నేను వెళ్లితిని. అతనికి అధికముగా మత్తుమందు ఇచ్చినందు వలన అతను నిద్రించుచున్నందు వలన నేనతనితో మాటలాడలేక పోయాను. మరుసటి దినపు ఉదయమున… దేవుడతనిని జీవముతో ఉంచవలయునని నేను దేవుని అడిగితిని… అతడొక మంచి వ్యక్తి, అయితే అతడు ఒక క్రైస్తవుడు కాడు. అతడు మామయ్య (అంకుల్) కాదు, అతడు ఒక బంధువు - నా యొక్క బంధువురాలును వివాహమాడెను.
మరియు అప్పుడు అక్కడ నిలుచుకొనియున్న అత్త (ఆంటీ) హేట్టీ నాతో చెప్పెను, ఆమె చెప్పెను, ''బిల్లీ, అతని యొక్క ఎనభై సంవత్సరముల జీవితములో అతడేప్పుడు దేవుని సేవించలేదు. అయితే, చెప్పెను, "కొద్ది వారముల క్రితము అతడు ఇంటిలో కూర్చునియుండెను… అతడు ఎనభై సంవత్సరముల వయస్సు చెందినతను. అతను అధికముగా శరీర కష్టము పడలేదు. అయితే చెప్పెను, అతడు ఆమెను పిలిచి మరియు చెప్పెను, "హాట్టీ, ఏమి జరిగినది నీకు తెలియునా? కొద్ది నిమిషముల క్రితము క్రీస్తు నాకు ముందుగా వచ్చెను."
ఆమె అతనిని చూచి మరియు చెప్పెను, "ఆండీ, ఏమి సంగతి?" అని ఆమె అడిగెను.
అతను చెప్పెను, "లేదు. ఆయన నా ముందు నిలబడెను, మరియు ఆయన ఏదో నాతో చెప్పెను."
చెప్పెను, "ఆయన ఏమి చెప్పెను?"
"నీవు ఆలోచించుటకు సమయము లేదు."
19అప్పటి నుండి కొద్ది వారములకు - రెండు లేక మూడు వారములు - అతడు కొట్టబడి (స్ట్రోక్) మరియు పక్షవాతముతో అక్కడ వైద్యశాల యందు చనిపోవు స్థితిలో ఉండెను. నేను చెప్పాను, ''ఆడీ ఆంటీ, ఇప్పుడు అతడు వచ్చియున్న ఈ పరిస్థితిలో, అతని హృదయమును ఈ వేళలో మంచి స్థితిలో పెట్టుటకు (అతనిని దేవుని తట్టుకు త్రిప్పుటకు) నన్నయినను లేక ఎవరినైనను పిలువకుండనుండుటకు నీకు సిగ్గుగా లేదా."
అటు తరువాత ఉదయము నేను అచ్చటికి పోయినప్పుడు దేవుని అడిగితిని… అతను మాటలాడలేని పరిస్థితిలో ఉండెను, నేను అడిగితిని, ''నీవు నన్ను వినుచున్నావా, అంకుల్ ఆండీ?'' మరియు అతడు తన తలను కొద్దిగా ఆడించి మరియు తన దవడను కదిలించెను. అతను తన పాపములను దేవుని ముందు ఒప్పుకొనునట్టుగా నేను అతని కొరకు ప్రార్థించితిని. నేను అతనిని బాప్తిస్మము ఇయ్యవలెనని కోరితిని, మరియు ఆంటి ఆడి బాప్తిస్మము తీసుకోవాలని కోరినది.
మరియు ఆ హాలులో నేను కొంచెము ముందుగా పోయి, ఇక్కడ చుట్టూ ప్రక్కన నివసించు ఒక యవ్వన స్త్రీని చూచుటకు పోతిని, ఆమెను పిచ్చి ఆసుపత్రికి వారు పంపించనై యుండిరి, మరియు - ప్రభువు ఒక గొప్ప కార్యమును ఆమెకు చేసెను - ఆమె స్వస్థతనొంది ఇంటికి తిరిగి పోయెను.
అప్పుడు మార్గములో నేను ఒక నల్ల జాతి సోదరిని కలిసాను, మరియు ఆమె చెప్పెను, '' నీవు బ్రెన్హాం సోదరునివా?''
మరియు నేను చెప్పితిని, ''నేనే అతనిని."
ఆమె అడిగెను, ''మీకు నేను గుర్తున్నానా? నేను శ్రీమతి. డైర్."
మరియు నేను చెప్పాను, "అవును, నాకు జ్ఞాపకమున్నదని నేను నమ్ముచున్నాను. పీటర్ డైర్ మరియు వారందరు. అవును, నేను నిన్ను గుర్తుంచుకొని యున్నాను. ఆమె ఆ గదిని చూచుచుండెను, మరియు మేమట్లు చేయుచుండగా… దానిని ఆమె ఎందుకు చెప్పినదో నేను ఆశ్చర్యపడుచుంటిని. మరియు అక్కడే పడక నుండి అంకుల్ ఆండీ లేచెను మరియు అక్కడ కూర్చొని తన చేతులను, కాళ్లను ఇతరులవలె ఆడించుచు, ఆ స్వస్థతను పొందుటకు ప్రయత్నించుచుండెను, ఆ పడకపై నుండి లేచి, అక్కడ నుండి స్వస్థతనొంది పోదలచెను. ఇప్పుడు అతడు మరియు అతని భార్య ప్రభువైన యేసు నామములో బాప్తిస్మము పొందుటకు వారు వచ్చుచున్నారు.
1COR 12:13
20కాని ఎందుకొరకు దానిని నేను చెప్పితిని: ఆలోచించుటకు ఇంక సమయము లేదు. మరియు ఈ దానియేలు యొక్క డెబ్బది వారములు దానిని మనము గ్రహించులాగున చేయునని నేను నమ్ముచున్నాను.
ఇప్పుడు, అనేకమంది మన పెంతెకోస్తు సహోదరులు (టేపులో ఇంతకు ముందు చెప్పినలాగున, దీనితో వారు ఏకీభవించరు), వారేదో గొప్ప, శక్తివంతమైన ఏదో కార్యము సంభవించవలయునని ఎదురు చూచుచున్నారు. మరియు నా యొక్క సహోదరులారా, మీరు చాలా జాగ్రత్తగా వినిన యెడల, మీరు కనుగొనెదరు ఆ గొప్ప, శక్తివంతమైన కార్యము సంభవించి ముగిసి పోయినదని. యేసు తిరిగి వచ్చుటకు సిద్ధముగా ఉన్నారు.
ప్రకటన 3వ అధ్యాయములో సంఘము భూమిని వదలి పోవుచున్నది. అక్కడ దేనిని గూర్చియు చెప్పబడ లేదు… ఏమియు లేదు, అయితే… కడపటి కార్యము, చివరి కాలము యొక్క కడపటి వర్తమానికుడు. అటు పిదప 19వ అధ్యాయములో ఉన్న వధువు మరల వచ్చు వరకు మనము యూదులతో వ్యవహరించెదము. 6వ అధ్యాయము మొదలు 19వ అధ్యాయము వరకు అంతయు యూదులే. ఈ ముద్రలు సమయములో, అక్కడే నా యొక్క మంచి సహోదరుని తీసికొని రావలయునని యున్నాను, సోదరుడు ఉడ్, అతను ఇంతకు మునుపు యెహోవా సాక్ష్యాలు (అతను, అతని కుటుంబము అంతయు ఈ రోజు ఉదయము ఇక్కడున్నారు) మరియు ఆ 1,44,000 మందికి, అన్యజనులకు ఏ సంబంధము లేదు. వారు యూదులు, చూశారా. ఈ రోజు అది భూమిపైనున్న మర్మమైన క్రీస్తు శరీరము కాదు. వధువే ఆ మర్మమైన శరీరము. పరిశుద్ధాత్మ ద్వారా ఆ మర్మమైన శరీరములోనికి మనము బాప్తిస్మము పొందియున్నాము.
DAN 9:24-27
21ఇప్పుడు, మనకు తెలియును, మనము చదువుచున్న ఈ దానియేలు పుస్తకములో ఇక్కడ… మనము దానిని తిరిగి చదివెదము, ఏలయనగా అది ఆయన వాక్యము. దానియేలు 9వ అధ్యాయములో 24వ వచనము:
తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ద పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడెను.
ఇరవై-ఐదవ వచనము: స్పష్టముగా గ్రహించుము మొదలుకొని… ఇప్పుడు, అదే మనము మాట్లాడుచున్న కార్యము, మరియు గత ఆదివారము "అతీ పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు," అనుదానిపై మాట్లాడుచు అంతటితో మనము ముగించియున్నాము. ఇచ్చటి నుండియే. 25వ వచనము మొదలు ఈ ఉదయము ఆరంభించేదము.
యెరూషలేమును [అది, "నీ పరిశుద్ధ పట్టణము," చూచారా.] మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అరువది-రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును.
ఈ అరువది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్రపట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధ కాలాంతమువరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను.
మరియు…
ఇప్పుడు గుర్తుంచుకొనుడి, యుద్దము యొక్క ముగింపు అది. ఇక్కడ బోర్డ్ పై మనము వ్రాసియున్నాము. మరిప్పుడు ఇంకొక కార్యమును మనము ఆరంభించనైయున్నాము.
అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్థ వారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును.
22ఓ, ఎటువంటి పాఠము! ఆ రోజు నా భార్యతో చెప్పుచుంటిని, "దానిని నిజముగా జనులు గ్రహించుచున్నారా," అని నేను ఆశ్చర్యపడుచున్నాను. ఇప్పుడు, మీరు దానిని పొందుకొనవలెనని కోరుచున్నాను. మనము దినమంతయు ఇక్కడే ఉండవలసిన యెడల, ఇక్కడే యుండుడి. ఇప్పుడు, మనము మనము దానిని పొందవలయును, చూశారా. అది సత్యము అని మనము తెలుసుకొనవలయునని యున్నాము, మరియు మీరు దానిని మాత్రము మీరు చూడగలిగినయెడల, మరియు నేను అడిగాను ఒకవేళ…
పిదప ఇక్కడ వ్రేలాడదీసియున్న పటములను (చార్ట్) ఇక్కడే వదలివేయుచున్నాను మరియు మీరు తరువాత దానిని చిత్రీకరించుకొనవచ్చును, మధ్యాహ్న సమయము మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారో అప్పుడు వచ్చి, మీరు ఈ చిత్రమును చిత్రీకరించుకొనవచ్చును. అది మీరు సరిగా అర్థము చేసికొనుటకు మీకు సహాయపడును. ఆ కారణము చేతనే దానిని నేనక్కడ ఉంచాను, కావున దానిని మీరు అర్థము చేసికొనగలరు.
JER 25:11•
DAN 9:2,3
23ఇప్పుడు, మనము చెప్పిన కార్యములను కొద్దిగా తిరగ వేయుదుము కావున మనమొక పునాదిని వేయగలము. ఇప్పుడు అక్కడ తనయొక్క జనులను గురించి దానియేలు అక్కరగొనెను, ఏలయనగా అతను ప్రవక్తయగు యిర్మియా వ్రాతలను (పుస్తకములను) చదివియుండెను, మరియు గ్రహించియుండెను. వారు డెబ్బది సంవత్సరములు చెరలో నుండెదరని యిర్మియా చెప్పియుండెనని తెలిసికొనియుండెను. మరియు అప్పుడు, వారు ఇదివరకే అరవై-ఎనిమిది సంవత్సరములు చేరలో నుండిరని అతను (దానియేలు) చూచెను. కావున ఆ సమయము ఆసన్నమైనదని అతడిరిగియుండెను. కావున అతడు తన తక్కిన పనులన్నిటిని ప్రక్కకు నెట్టి, తన అనుదిన కార్యక్రమములను అన్నిటినీ త్రోసివేసి, దేవుని వైపు తన ముఖమును పెట్టి, గోనె వస్త్రములు ధరించి, బూడిద పూసుకొని, ఆ ఘడియ ఎప్పుడని అతను తెలుసుకొన గోరి, ఉపవాసముతో ప్రార్థించుటకు ప్రారంభించెను. అప్పుడు, నేను ఇంతకు మునుపు చెప్పినట్లు, మనము చూచుచున్నాము… (ఫాన్ చాలా వేగముగా తిరుగుచున్నది; అది నా గొంతు బొంగురుపోవునట్లు చేయుచున్నది. మీకు కృతజ్ఞతలు సోదరుడా.)
DAN 9:21,24
24దానియేలు తన యొక్క జనుల కొరకు ఈ యొక్క సమాచారమును తెలుసుకొనగోరినాడని మనము ఇప్పుడు కనుగొనియున్నాము. మరియు నేననుకొనుచున్నాను, తనకు ముందున్న ప్రవక్తలను (వారి పుస్తకములను) దానియేలు చదువుచు, తాను ముగింపునకు సమీపముగా యున్నాడని ఈ రకమైన గ్రహింపును కలిగియుండి, అట్లయినయెడల, చివరి కాలము ఎంత చేరువగా ఉన్నదో తెలుసుకొనగోరి దేవుని వెదకినయెడల, ఇప్పుడు మనము మార్గము చివరన ఉన్నామని చూచుట న్యాయమైనదే, అని నేను అనుకొనుచున్నాను. ఏదో గోనె వస్త్రములు ధరించుట మరియు బూడిద పూసుకొనుట కాదు, అయితే ఈ లోక కార్యములను మరియు మన జీవన అక్కరలను త్రోసివేసి మనము జీవించుచున్న ఈ దినము ఏ సంవత్సరములోనిది అది కనుగొనుటకై దేవున్ని వెదకవలయును, ఏలయనగా మనము చివరన ఉన్నామని మనము చూచుచున్నాము. కావున మరియు సంఘము ఉపవాసముతో ఉండి, ప్రార్థించి మరియు సిద్దముగా ఉండవలయును, అందుకొరకే దీనిని నేను నాపై వేసికొనుటకు ప్రయత్నించియున్నాను, దీనిని ఎట్లు వివరించవలయునో తెలియక, ఏలయనగా ఒక్కొక్కసారి దానిని దాటిపోయియున్నాను, మరియు చెప్పియున్నాను, ఏలయనగా దానిని నేను అర్థము చేసికొనలేకున్నాను… మరియు అందువలననే ఇప్పుడు నాకు నేనే, దేవుని సహాయము వలన ఆయన కృప వలన, నేను చేయగలనని నమ్మి, ఆ స్థానమునకు దానిని తీసుకొని వచ్చి - ప్రభువు యొక్క రాకడకు మనమెంత చేరువగా యున్నామో అను కార్యమును వివరించుటకు ప్రయత్నించుచున్నాను.
DAN 9:24
25ఇప్పుడు, దానియేలు రెండు సంవత్సరములుగా అక్కడ ఉండెను. అప్పుడు మనము చూచియున్నాము, అతను ప్రార్థనలో ఉండగా గబ్రియేలు దూత త్వరితముగా అతని యొద్దకు వచ్చి, చెరలో నుండి అతని యొక్క జనులు ఎప్పుడు విడిపింపబడుదురని వివరించుట మాత్రమే గాక, అతని జనులకు నిర్ణయింపబడినదంతయు, అతని యొక్క జనులకు ఇంకను మిగిలియున్న కార్యములన్నింటిని అతనికి (దానియేలుకు) వివరించి చెప్పెను. అతను చెప్పెను, "యూదులకు ఇంకను డెబ్బది వారములు విడువబడియున్నావని చెప్పెను.''
అప్పుడు అతనికి ఆరు ఉద్దేశములు కలవని, మనము కనుగొనియున్నాము. వాటిలో ఒకటి, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును.
గడచిన ఆదివారపు ఉదయమున మనము వాటిని తీసికొని యున్నాము. అక్కడ అతనున్న పరిస్థితులలో దానియేలు ప్రార్థించుటను, గత ఆదివారము సాయంకాలమున జనులు ఇండ్లకు వెళ్ళి చదువుకొనుటకు అనేక లేఖన వాక్యములు ఇయ్యబడెను దానిని మీరు చదివియున్నారా? దానిని మీరు ఇష్టపడియున్నారా? అద్భుతము!
ఇప్పుడు, ఆరు ఉద్దేశములు… మరియు ఈ యొక్క ఆరవ ఉద్దేశమున మనము కనుగొనియున్నాము, "అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట," మనము కనుగొనియున్నాము. అతి పరిశుద్ధ స్థలము ఎల్లప్పుడును సంఘమును సూచించుచున్నది, గుడారమును. మరియు చివరగా జరుగవలసిన కార్యము మహా పరిశుద్ధమును అభిషేకించుట, వెయ్యేండ్ల పరిపాలనలో ఆయన జీవించును, మనము అందులో నివాసమైయుందుము. అదే, వెయ్యేండ్ల పరిపాలనలోని గుడారము.
DAN 9:24
26ఇప్పుడు, ఈ రోజు మనము "డెబ్బది వారములు'' అనగా ఏమిటి? అన్న కార్యమును సమీపింపబోవుచున్నాము. మరియు ఇది చాలా ముఖ్యమైన భాగము, డెబ్బది వారములు.
ఇప్పుడు, లేఖనములు అబద్ధమాడుట లేదని మనకు తెలియును. అవి సత్యముగా ఉండవలయును. మరియు ఈ యొక్క దూత గబ్రియేలు వచ్చి దానియేలుతో యూదులకు ఇంకను డెబ్బది వారములు మాత్రమే మిగిలియున్నవని చెప్పినయెడల… ఇప్పుడు మనము దానిని ఆరు రోజుల వారమునకు లేక ఏడు రోజులు ఒక వారమునకు ప్రయోగించవచ్చును, అయితే ప్రవచనములో ఎల్లప్పుడును అది ఉపమానములుగా ఇయ్యబడియున్నవి.
కావున మరి, నిస్సందేహముగా గతించిన కాలములో అనేక వందలకు, వందలుగా జనులు, పండితులు, సామర్థ్యముగల వ్యక్తులు ఈ డెబ్బది వారములు అనగా ఏమిటని వివరించుటకు ప్రయత్నించిరి. మరియు దాని పై వారిచ్చిన అనేక వ్యాఖ్యానములను నేను చదివియున్నాను. మరియు అడ్వెంటిస్టు సంఘమునకు చెందిన మిస్టర్ స్మిత్ కు, ఆయన యొక్క అభిప్రాయములకు గాను నేను ఆయనకు కృతజ్ఞునిగా యున్నాను. డాక్టర్ లర్కిన్స్ యొక్క అభిప్రాయములకు నేను చాలా కృతజ్ఞునిగా యున్నాను. ఈ యొక్క గొప్ప పండితులకు, దీనిపై వారికి గల అభిప్రాయములకు నేను చాలా కృతజ్ఞతగా యున్నాను. మరియు వాటిని చదువుటలో, అది నాకు జ్ఞానాభివృద్ధి కలిగించుచున్నది, సరి అనిపించులాగున కనబడు అనేక కార్యములను నేను కనుగొనగలను. అయితే నేను వివరించుటకు ఇష్టపడు, నేను తలంచిన అభిప్రాయములను తీసికొని వచ్చుటకై, కాలము అనగా అర్థమేమిటి అని కనుగొనుటకు సర్వసంగ్రహ నిఘంటువులో కాలమును పరిశోధించెదను.
DAN 9:24•
DAN 12:7
27మరియు మనము ఒక కాలము, కాలములు మరియు విభజింపబడు (అర్ధ) కాలమును కలిగియున్నామని మనమిక్కడ చూచుచున్నాము. కాలమనగా ఏమిటి?
ఒక వారము అనగా ఏమిటి? ఇప్పుడు, అనేక - అనేక సంవత్సరములకు మునుపు ఇంచుమించు 3,430 సంవత్సరముల ముందు దేవుడు యూదులతో వ్యవహరించుట ప్రారంభించెను. దానియేలు యొక్క కాలము క్రీస్తుకు పూర్వము (B.C.) - ఆ కాలము బి.సి. 538 - 538 సంవత్సరములు క్రీస్తుకు పూర్వము, ఆ సమయముననే ఒక కాలము, కాలములు, అర్ధ కాలము, కాలము మరియు డెబ్బది వారములు. ఏమి గురించిన కార్యములను అతడు మాట్మాలాడెను. డెబ్బది వారములు ఎచ్చటికి అతనిని కొనిపోవునో గమనించుడి. ఎందుకు, అతడింకను డెబ్బది వారములలో బబులోనులోనే ఉండెను మరియు అయినప్పటికిని, దేవుడు, అతని జనులపై అంతటి కాలమును మాత్రమే విధింపబడెనని అతడితో చెప్పెను.
DAN 9:24
28ఇప్పుడు, ఇక్కడున్న నా సంఘము ఎరిగియున్నది, గడచిన ఈ సంవత్సరములన్నిటను నేను మీకు ఎప్పుడో చెప్పియున్నాను, "వారములో ఇది ఏ దినమని మీరు తెలిసికొనగోరినయెడల, కాలెండర్ ను చూడుడి. అయితే మీరు ఇప్పుడు మనము జీవించుచున్న కాలమును గురించి తెలిసికొనవలయునన్నయెడల, ఆ యూదులను గమనించుడి." అది మాత్రమే (అదొక్కటే) ఒకే గడియారము. దేవుడు అన్యజనులకు ఎటువంటి ఒక నిశ్చయమైన కాలములను ఇవ్వలేదు. ఒక రూఢియైన కాలపరిమితి లేదు. మరి అక్కడే నేను తలంచుచున్నాను, ఆ అనేక గొప్ప రచయితలు, వాళ్లు యూదులకు మరియు అన్యజనులకు దీనిని ప్రయోగించుటకు ప్రయత్నించుచు అంతటిని కలిపి వేసిరి, ఏలయనగా ఆయన చెప్పెను, ''నీ యొక్క జనులు.'' అయితే ఆయన దానియేలుతో మాటలాడుచున్నాడు, సంఘముతో కాదు, యూదులైన దానియేలు జనులతో. ఆయన ఒకవేళ సంఘముతో మాటలాడుచున్న యెడల, అది ఎక్కడైనను ఉన్నట్లుగా మీరు చూపలేరు. మీరు చాలా కాలము క్రిందట, క్రీస్తు వచ్చుటకు మునుపే మీరున్నట్లుగా అగుపించును. మీరు ఉంచదలచిన ఏ రకమైన ప్రవచన వారములుగా నైనను లెక్కించినను, అది ఈ వేళకు సమాప్తమై యుండును. అయితే ఆయన యూదులతో మాటలాడుచున్నాడు, కావున యూదులు దేవుని యొక్క గడియారము.
29కొద్ది కాలము మునుపు కాలిఫోర్నియాకు చెందిన ఆర్గన్ బైట్ సోదరుడు, సర్వదేశ సంపూర్ణ సువార్త వ్యాపార మనుష్యుల యొక్క సహవాసపు, ఉపాధ్యక్షుడు నా ఇంటికి వచ్చి ఒక టేపును మరియు… ఒక టేపు కాదు, అయితే ఒక చలన చిత్రమును తీసికొని వచ్చెను, మీకు జ్ఞాపకమున్నదా. "అది అర్థరాత్రికి ఇంకను మూడు నిమిషములు." అది విజ్ఞాన పరిశోధనల పై ఆధారపడి తీయబడిన చిత్రము. ఆ యూదులు తిరిగి యెరూషలేముకు వచ్చుటను నేను చూచినప్పుడు నేనిచ్చట గుడారమునకు (ఆలయములో) వచ్చి, మరియు నేను చెప్పాను, ''నేను మరల మార్చబడినట్లు అనుభూతిని పొందుచున్నాను.'' దానిని మీలో అనేకులు గుర్తుంచుకొని యుందురు. నేను చెప్పాను, "యూదులు తిరిగి వచ్చుటను చూచునప్పుడు…" మత్తయి 24వ అధ్యాయములో యేసు చెప్పెను, ''అంజూరపు చెట్టు చిగిరించునప్పుడు, దేనికొరకై చూడవలయునని మీకు తెలియునా?'' చూశారా - యూదులు తిరిగి వచ్చుచున్నారు.
30ఇప్పుడు, ఇక్కడ నా యొద్ద వ్రాసియుంచుకొన్న కొన్ని వ్యాఖ్యానములు (ఇతరుల అభిప్రాయములు) కలవు, వాటిలోనికి నేను పోవుటకు (అవి చదువుటకు) ఇష్టపడుచున్నాను. ఇప్పుడు మరియు నేను నా సమయమును తీసికొనుచుండగా (అవి చూచుటకు) కావున, మీరు కూడ వాటిని వ్రాసుకొనవచ్చును. ఇప్పుడు ఇదంతయు జరిగెను…ఇప్పుడు, మనము… పైకి, ఇక్కడ మనమున్న సమయములో ఇదంతయు జరుగుచున్నది… అదంతయు యూదులకు సంబంధించినది, సంఘముతో దానికేమి సంబంధము లేదు. దానితో సంబంధమున్నట్లు సరియుని మీరు చెప్పలేరు. అదక్కడ లేదు.
ఇప్పుడు, దీనిని నేనెట్లు కనుగొంటినో అని నేను విశదపరచవలయునని యున్నాను. ఇప్పుడు బోర్డ్ పై మీలో అనేకులు చూడగలరు నేను ఖాళీ స్థలమును, కాలమును (వ్యవధానము) చిత్రీకరించి యున్నాను, అదెట్లు ఆ స్థలమునకు వచ్చుచున్నది. కావున దానిని అందరును అర్థము చేసికొనగలరు. వెనుక నున్న వారు చూడలేరు అని నేను అనుకొనుచున్నాను, అది చాలా చిన్న అక్షరములతో వ్రాయబడియున్నది. మరది బెక్కీ యొక్క చేతివ్రాత, మరియు ఆ పటము… దాని కంటెను అధ్వాన్నముగానున్న ఒకటి నా యొద్దనున్నది. అది అయితే బెక్కీ దానిని చిత్రీకరించెను - అది నెబుకద్నెజరు కలలో చూసిన ప్రతిమ. మరియు అది ఒక మగ మనిషి కన్నను ఎక్కువగా ఒక ఆడపిల్లవలె అగుపించునని నేను అనుకొనుచున్నాను. అయితే ఏమైననూ, అది మనకు కావలసిన సందేశమును ఇచ్చును.
DAN 9:24•
REV 2:15
31ఇప్పుడు, మనము బైబిలును చదివినయెడల అక్కడ జనులపై విధింపబడిన డెబ్బది వారములు కలవు… ఇప్పుడు, దానికి సంఘముతో ఏ సంబంధం లేదు. డెబ్బది వారములకు సంఘమునకు ఏ సంబంధం లేదు. మీరిక్కడ గమనించినయెడల, నా యొద్దనున్న పటములో (చార్ట్) ఆ డెబ్బది వారముల మధ్య సంఘ కాలములున్నవి. మనమిక్కడ దానిని కలిగియున్నాము. జార్జియాలో ఉన్న ఒక సహోదరుడు సంఘ కాలములను మనము ధ్యానించునప్పుడు మన కొరకు దానిని పటముగా గీసి ఇచ్చెను. మరియు మనము దాని యొక్క అర్థమేమిటని అర్థము చేసికొనగలమని నిశ్చయముతో ఉన్నాను.
ఇక్కడున్న ఈ సంఘములో తెలుపు దాని యొక్క అర్థము అది అపొస్తలుల కాలము. మరియు రెండవ సంఘ కాలములో వారు నీకొలాయితుల క్రియలు కలిగ యుండిరి. అది ఒక సిధాంతముగా మారలేదు. మూడవ సంఘ కాలములో అదొక సిధాంతముగా అయినది మరియు నాలుగవ సంఘ కాలములో అదొక శాఖగా స్థాపింపబడెను, మరియు అది రోమన్ కాథోలిక్కుల మతాధికారత్వముగా మారినది. మరియు నాలుగవ సంఘ కాలవు అది అంధకారమైన కాలములు. మీరు గమనించండి, అక్కడున్న అంధకారమంతయు నీకొలాయితుల బోధనలును లేక రోమన్ కాథోలిక్కుల ఉపదేశములుగాను తెలియ జేయుచున్నది. ఆ తెల్ల భాగము పరిశుద్ధాత్మను సంఘము తెలియ జేయుచున్నది. పరిశుద్ధుడైన పౌలు కాలములో ప్రారంభమై, అపొస్తలుల సంఘమంతయు పరిశుద్ధాత్మతో నింపబడెను. అప్పుడు గొప్ప తరగతివారు లోనికి వచ్చుట ప్రారంభమాయెను. అటు పిదప వారందరు చివరికి ఒక్కటిగా సమకూడి, దాని నుండి క్రొత్త సంఘమును తయారుచేసిరి, మరియు ఆ చిన్న నిజమైన సంఘము కాల్చబడెను, రాళ్లతో కొట్టబడెను, సింహములకు మేతగా వేయబడెను, మరియు ఆ విధముగా పలు విధములుగా హింసింపబడిరి.
REV 3:14
32సంస్కరణలో లూథర్ వచ్చెను, కొద్దిగా ప్రకాశించెను, మీరు చూశారా, వెస్లీ దినములలో ఇంకొద్దిగా ప్రకాశము కొనిరాబడెను. అయితే ఇక్కడ కడపటి సంఘ కాలములో, నీకొలాయితుల సంఘ కాలము, మనమున్న ఈ కాలము - నీకొలాయితులు కాదు, అయితే లవొదకయ - మనము జీవించుచున్న కాలము ఇదే. మీరు గమనించినట్లయితే, అధికమైన వెలుగు లేదు.
అక్కడున్న ఆ చిత్ర పటమును చూచి ఎవరో చెప్పారు, "బ్రెన్హాం సోదరుడా, మీకు సిగ్గుగా లేదా, ఇది మహత్తరమైన ప్రకాశించు దినమునై యుండగా…"
నేను చెప్పాను, "అది జల్లింపబడిన యెడల ఆ కొంచెము కూడా నిలువదు అని నేను ఊహించుచున్నాను." మీరు నిజముగా హృదయములో పరిశుద్ధులుగా ఉన్నయెడల, ఆత్మతో మరల జన్మింపబడినయెడల… గుర్తుంచుకొనుడి, మీగత సంఘకాలములన్నిటికన్నను, ఈ సంఘ కాలములో మాత్రమే, క్రీస్తు ఆయన యొక్క సొంత సంఘము నుండి వెలుపలకు నెట్టబడెను. మనము గొప్పగా ఒప్పుకొనుటను కలిగియున్నాము, అయితే మనమేమి మాట్లాడుచున్నామో దానిని మనము కలిగియున్నామా. క్రీస్తు నిజముగా సంఘములో ఉన్నాడా? అది చాలా స్వల్ప సంఖ్యలో ఉండును.
DAN 9:24
33ఇప్పుడు, ఇప్పుడు, దానియేలు యొక్క డెబ్బది వారముల ముఖ్యమైన అంశములను చూచెదము. ఇప్పుడిక్కడ మరల నేను తిరిగి చెప్పనిమ్ము, సువార్త సేవకులారా, ఒకవేళ మీరు దీనితో అంగీకరింపకున్నయెడల పరవాలేదు. అవి మూడు కాలములుగా భాగింపబడి యున్నవి, దానియేలు 9వ అధ్యాయములో మనము చూచునట్లుగా - మూడు కాలములు: మొదటిది, ఏడు వారముల కాలము; అటు పిదప మూడు ఇరువది మరియు రెండు, అదే అరువది రెండు; అటు పిదప మరియు ఒక వారము కాలము. అవి మూడు కాలములుగా భాగింపబడియున్నవి.
ఇప్పుడు, ఇక్కడ బోర్డ్ పై దానిని నేను భాగించియున్నాను. మొదటి కాలము, రెండవ కాలము, మరియు సువార్త ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నేను అర్థము చేసికొన్న ప్రకారము చివరి కాలమున దేవుడు తిరిగి యూదుల యొద్దకు వచ్చును.
ఇప్పుడు, సువార్తల ద్వారా పౌలు, ఇతరులు బోధించునట్లు దేవుడు యూదుల యొద్దకు తిరిగి వచ్చునని మనము ఎరిగియున్నాము. అట్లయిన యెడల, ఆయన తిరిగి యూదుల యొద్దకు మరలి వచ్చినట్లయిన, దానిని ఎట్లు మనము. దానియేలు కాలమునకు సంబంధ పరచుదుము? అన్యజనుల సంఘము వెళ్ళిపోయిన తరువాత మరియు ఈ కడపటి కాలములో దానిని మనము సంబంధ పరచవలయును, ఏలయనగా ఆయన ఇశ్రాయేలీయులతో ఒక దేశముగా మాత్రమే (వారందరు ఒక దేశములో కూడినప్పుడు) వ్యవహరించును, మనతో వ్యక్తిగతముగా వ్యవహరించును.
NEH 4:17•
DAN 9:25
34ఇప్పుడు, నేనిక్కడ వ్రాసియుంచుకొన్న వాటిని మనము ధ్యానించుచు పోవుచుండగా మీకు చదివి వినిపింపవలయునని కోరుచున్నాను. ఇప్పుడు, యెరూషలేమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ బయలు దేరినదెప్పుడనగా మార్చి 14వ తేది. మీలో ఎవరైనను దానిని గుర్తుంచుకొనవలయునని కోరినయెడల, హెబ్రీయుల భాషలో అది "నిసాన్" అని పిలువబడుటను మీరు కనుగొనగలరు, అట్లనగా దాని అర్థము ''మార్చి." ప్రకటన (ఆజ్ఞ) మార్చి 14వ తేది ఇయ్యబడెను, క్రీ.పూ. 445 - ప్రకటితమైన పత్రిక మరల ఆలయమును కట్టుటకు బయలు వెళ్ళెను. మీరు లేఖనములను చదివియున్న జనులైనందున దానిని మీరు గ్రహించారా. ఆలయమును మరియు నగరమును అది ముగించు వరకు, దానిని తిరిగి కట్టుటకు ముగించుటకు నలభై-తొమ్మిది సంవత్సరములు పట్టెను. మరిక్కడ బైబిలు చెప్పునట్లు, దానియేలు చెప్పుచున్నాడు, లేక దూత దానియేలుతో, ఆ గోడలు… మరియు శ్రమల కాలములో అవి కట్టబడును. మరియు మనలో అనేకులకు జ్ఞాపకముండును అది కట్టునప్పుడు, శత్రువును గమనించుటకు ఒక చేత్తో వారు సిమెంటు, ఇసుక మిశ్రమముతో, మరియు ఆయుధమును (కత్తి) ఇంకొక చేతిలో ''మరియు అది శ్రమల కాలములో కట్టబడును.'' కావున ఇక్కడే నా యొక్క దినమును గ్రహించుటకు నేను చూచుచున్నాను…
35ఇప్పుడు, మనము రెండు… మూడు రకముల కాలెండర్లు కలిగి యున్నాము. మనము పాత జ్యోతిష్య శాస్త్ర పంచాంగమున (కాలెండరు)కు చూచిన యెడల, మరియు మనము జూలియన్ కాలెండరులో దానిలో ఒక సంవత్సరమునకు 365¼ దినములు. వారు సార్ట్స్ మరియు ఇతర నక్షత్రములను వాటి కదలికలను ఆ వేళలను గుర్తించి, దాని సమయములను ఏర్పరచిరి. ఇప్పుడు రోమన్ కాలండర్లో మనము కనుగొనగలము, ఇప్పుడు మనము జీవించుచున్నది ఆ కాలెండరులో ఒక సంవత్సరమునకు 365 రోజులు. అయితే క్రైస్తవ లేక ప్రవచన (ప్రవచింపబడిన) కాలెండరులో ఒక సంవత్సరమునకు 365 దినములు మాత్రమే అని మనము కనుగొనగలము.
ఇప్పుడు, ఈ విధముగా గందరగోళముగా ఎట్లయినదని మీరు ఆశ్చర్య పడవచ్చును. ఇప్పుడు దీనిని నేను నా యొక్క సొంత భావనలో చెప్పుచున్నాను. యోబు జీవించు దినములలో, జలప్రళయముతో నాశనము చేయబడుటకు మునుపు వారు కాలమును నక్షత్రముల మూలముగా లెక్కించుకొనుచుండిరి అని నేను నమ్ముచున్నాను, మరియు మనము గ్రహించియున్నాము… లేక ఆ కాలమున ప్రపంచము నీటారుగా నిలువుకు ముందు. మరప్పుడు మనుష్యుని యొక్క పాపము వలన, ప్రపంచము జలప్రళయముతో నింపబడి మరియు అది వంగి మరియు వరదలు వచ్చెను. అందువలననే మనము అప్పటి నుండి మంచు గడ్డ (మంచు కొండలు) మరియు అలాటివి కలిగియున్నాము, వారి భూమి యొక్క పైన క్రింద అంతయు మంచు గడ్డ నింపబడెను. దానిని మనము ఎరిగియున్నాము. మరియు అప్పటి నుండి భూమి నిటారుగా తిరిగి నిలబడలేదు. అది వంగినట్లే ఉండుచుండెను. ఆ కారణము వలన చంద్రుడు మరియు నక్షత్రములు కదల్చబడి, వాటి స్థలములు మారినవి. అందువలననే వాటి ద్వారా కాలములను లెక్కించుట అప్పటినుండి కూడని కార్యమైనది, ఏలయనగా అది (భూమి) నరుకబడినట్లాయెను - వంగియుండెను. అందువలన నక్షత్రములు స్థానము తప్పినందున వాటి వెలుగు అంతకు మునుపు వలే భూమిపై పడకుండెను, ఏలయనగా నక్షత్రములు సరైన స్థానములో లేక యుండెను. మీరు గ్రహించితిరా? దాని కార్యము అదే అని నేను నమ్ముచున్నాను.
DAN 12:10
36అటువంటి పరిస్థితి ఒక కాల సమయము మాత్రమే. మీరు దానిని చూడలేక యున్నారా? అందుబాటులో లేకుండునట్లు దేవుడు కార్యములను ఉంచడు. ఆ విధముగా ఉండునట్లు కొద్ది కాలమునకు మాత్రమే దేవుడు అనుమతించును. మరియు ఆ కార్యము ఆ విధముగా చేయబడియున్నదని నేను నిజముగా నమ్ముచున్నాను, మరియు ఈ కడపటి దినములలో దేవుడు తన యొక్క సంఘమునకు ఈ రహస్యములన్నియు బయలుపరచునని నేను నమ్ముచున్నాను. ఆయన ఇంతకు మునుపు చేయలేదు, అట్లు చేయకుండుటకు కారణము, అదెప్పుడు వచ్చునో అని తెలియక సంఘము మెళకువతో ఉండి మరియు ప్రార్థించుట కొరకే ఆయన అట్లు చేసెను. అట్లే మీకు గుర్తున్నది, దానియేలు 12వ అధ్యాయములో ఆయన చెప్పెను, "ఈ కడపటి దినములలో బుద్దిమంతులు గ్రహించెదరు." అది ఆయనకు ఇవ్వబడెను.
పరిశుద్ధాత్మ యొక్క బయలుపాటు వలన సంఘమునకు తెలియపరచుటకు మనము ఏ దినములలో జీవించుచున్నామని సంఘమును తీసికొని వచ్చి మరియు దానిని బయలు పరచుటకు జ్ఞానము గల ఆత్మ సంఘమునకు వచ్చును. గబ్రియేలు దానియేలు నొద్దకు వచ్చినట్లు, ఈ యొక్క గొప్ప, లోతైన, రహస్య కార్యములను బయలు పరచుటకు పరిశుద్ధాత్మ సంఘమునకు వచ్చును. ఇప్పుడు మీరు గ్రహించారా?
REV 11:3
37భూమి కొద్దిగా వంగినందువలన జ్యోతిష్య శాస్త్రపు సంవత్సరము లేక జూలియన్ సంవత్సరము - కాలెండర్, చూశారా, ఖగోళ సంవత్సరము అన్నియు పనికిరాకుండ పోయేను. మనము పాఠశాలయందు చదివినందువలన తెలుసుకొని యున్నాము అది ఉపయోగములో లేదని. అందువలన అవి - ఆ నక్షత్రములు భూమిపైన ఒక నిర్ణయమైన గీతలో, అదే సమయములో దాటుట లేదు. అందువలననే రోమన్ కాలెండర్ కూడా తప్పే, ఏలయనగా మీరు దినములను ఒక్కటిగా కూర్చలేరు… ఇక్కడ నేను అనేక కార్యములను చెప్పగలను — కనుక మనము కనుగొని యున్నాము స్వాభావికముగానే మనము బోధింపబడుచున్నాము. సంవత్సరములో సరిగా ముప్పది రోజులు మాత్రమే అని.
ఇప్పుడు, మనము ప్రకటన గ్రంథమును తీసికొనెదము, అక్కడ ఆ ఇరువురు ప్రవక్తలున్న ఆ దినములకు మనము పోబోవుచున్నాము. వారు వెయ్యిన్ని రెండు వందల అరువది దినములు ప్రవచించినారని, బైబిలు చెప్పుచున్నది. ఇప్పుడు మీరు ఖగోళ శాస్త్రపు కాలెండరును (పంచాంగము) తీసికొనిన, మూడున్నర సంవత్సరములను అది సరిగా లెక్కకు రాని విధముగా దానికి చాలా దూరముగా నున్నది. మరియు, ఈ రోజులలో మనము కలిగియున్న రోమన్ కాలెండరును మీరు తీసికొనినయెడల, అదియును దానికి చాలా దూరముగా నుండి దానిని సరిగా లెక్కింపలేకున్నది. అయితే మీరు ప్రవచన కాలెండరును తీసికొనిన, మరియు అక్కడే సరిగ్గా వెయ్యిన్ని రెండు వందల అరువది దినములు, ఒక నెలకు ముపై దినములు, చూశారా.
REV 7:14
38మనకు కొన్ని నెలలో ముప్పది రోజులు, తరువాత నెలలో ముప్పై ఒకటి, కొన్నిటికి ఇరవై ఎనిమిది. చూశారా, మనమంత గందరగోళముగా కలిపియున్నాము. అయితే దేవునికి అది ఆ విధముగా చిందులు తొక్కుట కాదు, పైకి క్రిందికి, హెచ్చు తగ్గులుగా వుండుట కాదు, ముందు వెనుక అలాంటి కార్యము కాదు. ఆయన అన్నియును క్రమముగా సరిగా ఒకే విధముగా చేయును. అవునయ్యా, ఖచ్చితముగా అదే. ఒక నెలలో ముప్పై రోజులు, ముప్పై ఒకటి కాదు, అటు పిదప ముప్పై, వేరేదో కాదు, చూశారా? అయితే సంఘము మెళకువతో ఉండి ప్రార్థించుచు, గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములు శుద్ధీకరించుకొని సిద్ధముగా ఉండుటకు దేవుడు తన యొక్క గొప్ప ఏర్పాటులో ఇదంతయు చేసెను. ఓ, ఈ యొక్క కడపటి దినములలో ఆయన వాగ్దానము చేసెను… మనమెక్కడ జీవించుచున్నామో, ఇప్పుడు మనము చూచుచున్నాము. మరియు గుర్తుంచుకొనుడి, ఉద్దేశము, దీనిని చేయుటయే జీవము యొక్క ముఖ్య ఉద్దేశ్యమైయున్నది.
DAN 9:25
39ఇప్పుడు, ఏడు ఉన్న యెడల… చూడుడి, అక్కడ సరిగా నలభై-తొమ్మిది దినములు - నలభై-తొమ్మిది సంవత్సరములు, ఆలయమును కట్టు సమయములో ఉండెను, ఏడు - లేక ఏడు ప్రవచన వారములు, ఏడు వారములు ఏలయనగా ఆలయమునకు — ఆలయమును తిరిగి కట్టుటకు అక్కడ ఏడు వారములు విధింపబడెను, అప్పుడది సరిగా నలభై-తొమ్మిది సంవత్సరములలో కట్టబడెను. ఇప్పుడు వారముల కాలము అనగా ఏమిటన్న అర్థమును మనము కలిగియున్నాము, ఏలయనగా బైబిలు చెప్పినయెడల, దూత చెప్పెను ఆలయమును కట్టువరకు ఏడు వారములు పట్టెను… మరియు అది సరిగా నలభై-తొమ్మిది సంవత్సరములు, ఆలయమును కట్టుటకు ఆరంభించినది మొదలు - మార్చి 14వ తేది నుండి - క్రీ. పూ. 538లో ఆరంభింపబడి ఆలయమును తిరిగి కట్ట బడుటకును మరియు వీధులు తిరిగి కట్టబడుటకును సరిగ్గా- నలభై-తొమ్మిది సంవత్సరములు. కావున మనమేమి గ్రహించియున్నాము? మనము ఏమి గ్రహించియున్నాము? కావున ఏడు వారములు అనగా నలభై తొమ్మిది సంవత్సరములైనయెడల, అప్పుడు ఒక వారము ఏడు సంవత్సరములకు సమముగాను, మరియు ఏడు, ఏడు మారులు నలభై తొమ్మిది ( ఏడు ఏడుతో గుణించిన నలభై తొమ్మిది) సరిగ్గా అట్లే యున్నది. మీరు చూడుడి.
40కావున ఇప్పుడు, ఇక మీదట దానిని గురించి ఊహించనక్కర లేదు. ఇప్పుడు మనకు తెలియును ఒక వారమనగా అర్థము ఏడు సంవత్సరములు. దానిని మీరు గ్రహించుకొన్నారా? మనమందరము కలసి దానిని చెప్పెదము, "ఒక వారము, ఏడు సంవత్సరములకు సమానము.'' ఇప్పుడు మనము దానిని అర్థము చేసికొనియున్నామని మనకు తెలియును. ఒక వారము ఏడు సంవత్సరములకు సమమగును.
ఇప్పుడిక్కడ సరిగా మనమున్నాము - మొదటి వారము. ఆలయమును తిరిగి కట్టుటకు నలభై-తొమ్మిది సంవత్సరములు. ఇప్పుడు, ఈ పైగీత యూదుల దేశమును సూచించుచున్నది. అది అడ్డముగా పోవుచుండగా ఇది సమయము (కాలము) మరియు ఆ గీత క్రిందికి దిగినప్పుడు, అది యూదుల దేశము నుండి, అన్యజనుల కాలమునకు వచ్చుచున్నది, తిరిగి అది పైకిపోయి ఇశ్రాయేలును పట్టుకొని మరియు అట్లే పోవుచుండెను.
LUKE 21:24
41ఇప్పుడు, అన్యజనులకు ఏ ఒక్క స్థిరమైన కాలము ఇయ్యబడలేదు. కేవలము చెప్పబడెను, "అన్యజనుల కాలము." మరియు యేసు కూడ వారికొక కాలము నిర్ణయింపలేదు, అని మనము చూచుచున్నాము, ఏలయనగా లూకా సువార్త 21:24లో మనము చూచుచున్నాము, ఆయన చెప్పెను, "అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత తొక్కబడును…" దానిని నేను మీకు చెప్పనిమ్ము. నేను జ్ఞాపకముంచుకొన్న దాని నుండి, దానిని నేను చెప్పు చున్నాను. దానిని నేను చదవనిమ్ము, ఏలయనగా ఇక్కడ అది టేపు చేయబడుచున్నది, దానిని సరిగా మనము గ్రహించవలయునని యున్నాము. అది సరి, మీరు నాతో దానికి త్రిప్పవలయునని ఉన్నయెడల పరిశుద్ధ లూకా 21 మరియు 24. దీనిని నాకు వీలైనంత మట్టుకు స్పష్టముగా చదివియున్నాను.
వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడినవారై, సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు [ఆయన ఎవరిని గూర్చి మాటలాడుచున్నారు? యూదులు. ఇది ఆలయము నిర్మూలమగుటను గురించి చెప్పబడుచున్నది క్రీ.శ. 70.] చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు: [ఇప్పుడు గుర్తుంచుకొనుడి, బబులోనులో మాత్రము కాదు, రోములో మాత్రము కాదు, అయితే అన్ని దేశములకును.] ఈ రోజు యూదులు ఆ విధముగానే అన్ని దేశములలో చెదరి యున్నారు, అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము అన్యజనముల చేత తొక్కబడును.
42అట్లయిన అక్కడ ఒక నిర్ణయింపబడిన కాలము కలదు, అయితే అదెప్పుడు అని ఎవరికి తెలియదు. అదొక మర్మము, చూశారా, అన్యజనుల కాలము, అయితే యూదులు మరి ఏ సంఘము ద్వారా కాని, అది వెనుదిరిగి దిగజారిన ద్వారా కాని, లేక అది ముందుకు సాగిపోవుచున్నదని కాని, లేక అది ఏమి చేయుచున్నదని కాని, వీటన్నిటి ద్వారా మనము కాలమును చెప్పలేము, అయితే యూదులను గమనించుడి, అక్కడ కాలమును గురించి తెలియపరచు కాలెండర్ కలదు. దానిని మీరు చూచుచున్నారా? దేవుడు వారికి సరిగా ఒక దినమును, గంటను, మరియు కాలమును నిర్ణయించెను, అయితే అన్యజనులకు ఆయన ఆ విధముగా చేయలేదు. యూదులకు ఆయన చేసెను, కావున మనము యూదులను గమనించెదము, అప్పుడు మనమెక్కడ యున్నామో మనము చూడగలము.
ఇప్పుడు, ఏడు వారములు అనగా నలభై-తొమ్మిది సంవత్సరములు. మనకు ఇప్పుడు స్పష్టముగా అర్థమైయున్నది, ఒక వారము అనగా ఏడు సంవత్సరములు. ఒక వారము, ఏడు సంవత్సరములు.
DAN 9:25
43ఇప్పుడు, మనకు చెప్పబడియున్నది, నగరమును మరల కట్టించ వచ్చునని ఆజ్ఞ బయలు దేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు (మరి అభిషిక్తుడగు అనగా క్రీస్తు) ఏడు వారములు మరియు అరువది-రెండు వారములు, అంతయు కలిపి అరవై-తొమ్మిది వారములు, చూశారా. అది సరి. మరియు అరవై-తొమ్మిదిని, ఏడుతో గుణించిన అది 483 సంవత్సరములు. అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఇప్పుడు, మీరు దానిని వ్రాసుకొనుచున్నారా? ఒకవేళ నేను తిరిగి మీకు దానిని చెప్పవలయునని మీరు కోరినయెడల, దానిని నేను చేయుటకు సంతోషపడెదను.
ఇప్పుడు, మనకు చెప్పబడియున్నది నగరమును మరల కట్టించ వచ్చునని ఆజ్ఞ బయలు దేరిన సమయము మొదలుకొని అభిషిక్తుని వరకు ఏడు (ఏడు, అది మొదటిది - ఇక్కడే మొదటిది), ఏడు వారములు మరియు అరువది-రెండు - అరవై-తొమ్మిది వారములు. అరవై-తొమ్మిది ఏడు మారులు 483 సంవత్సరములు. కావున అభిషిక్తుడు వచ్చువరకు (ఇప్పుడు, ఇక్కడ ఈ భాగమునకు మనము వచ్చుచున్నాము)… అభిషిక్తుడు వచ్చువరకు, అక్కడ 483 సంవత్సరములుగా ఉండవలయును - 483 సంవత్సరములు.
DAN 9:25•
MATT 21:5•
MARK 11:7,11•
LUKE 19:35•
JOHN 12:12,14
44ఇప్పుడు, యేసు, మెస్సీయా, యెరూషలేము అను నగరమున జయోత్సాహముతో ఒక తెల్ల గాడిదపై మట్టలాదివారమునాడు క్రీ.శ. 30, మట్టలాదివారము యెరూషలేములో సవారి చేసెను. మరిప్పుడు, ఇప్పుడు క్రీ.పూ. 445 నుండి క్రీ.శ. 30 వరకు సరిగా 475 సంవత్సరములు.
అయితే మనము ఇంతకు మునుపే చూచినట్లు అరవై-తొమ్మిది వారములు అనగా 483 సంవత్సరములు… ఇప్పుడు అక్కడే చిక్కు వచ్చుచున్నది, అక్కడే, చూశారా. ఇక్కడున్న బైబిలులో మనము గుర్తుంచుకొనినట్లు, కాలము 475 సంవత్సరములు మాత్రమే, మరి వాస్తవముగా అది 483 సంవత్సరములు, ఎనిమిది సంవత్సరములు వ్యత్యాసము.
ఇప్పుడు, అట్లు అది తప్పిపోవులాగున దేవుడు చేయడు. ఆయన అవి అన్ని దినములు అని చెప్పినయెడల, అది అన్ని దినములే ఉండును. ఆయన అది అంతే అని చెప్పిన, అది అంతే. కావున మనము ఏమి చేయబోవుచున్నాము? ఇప్పుడు క్రీ. పూ. 475 నుండి క్రీ.శ. 30 వరకు జూలియన్ లేక ఖగోళ సంవత్సరములు, అవి 365¼ దినములు ఒక్కొక్క సంవత్సరమునకు. అయితే ఆ దినములను మన ప్రవచన కాలెండరుకు తగ్గించిన…
REV 11:3
45ఇప్పుడు, నేనొక్క నిమిషము ఆగనిమ్ము. మీరు నిస్సందేహముగా గ్రహించునట్లు, సందేహము లేకుండ అర్థము చేసికొనులాగున. నేను లేఖనములలో ఒక చోట నుండి మాత్రము తీయుట లేదు. నేను అన్ని లేఖన వాక్యములను తీసికొని మరి మీకు నిరూపించగలను. ఒక వారములో ఏడు దినములు బైబిలులో ఏడు సంవత్సరములకు పోల్చబడియున్నది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము లేక 11వ అధ్యాయము మరియు 3వ వచనములో దానిని ఇక్కడ మీకు ఎత్తి చూపించియున్నాను. ఆ ప్రవక్తలు వెయ్యిన్ని రెండు వందల అరువది దినములు ప్రవచింతురు, అదేప్పుడనగా యూదుల యొక్క చివరి వారపు మధ్యలో. అటు పిదప వారు నరుకబడుదురు మరియు హార్‌మెగిద్దోను (యుద్దము) తొడగును. కావున మరియు ఆ విధముగా కార్యము ఉన్నయెడల, అక్కడ సరిగా ఒక నెలకు ముప్పది దినములను అక్కడ చూడగలము, చూశారా. అప్పుడది ముప్పై-ఒక రోజులు మరియు ఇరవై-ఎనిమిది దినములు మరియు ఆ విధముగా కాదు - ప్రతిసారియు అది సరిగా ఒక నెలకు ముప్పది దినములు.
DAN 9:25,26
46లేఖనములలో ఇప్పుడు మనము ఉపయోగించులాగున, మన ప్రవచన కాలెండరు మనకు 360 దినములను తీసికొని వచ్చుచున్నది. మనకు సరిగా 483 ఉన్నది, 483. ప్రవచన యొక్క సరైన ఆధారము ఇక్కడ మనకు కలదు - సరిగా సత్యము. ఆలయమును కట్టుటకు ఆజ్ఞ వెడలిన కాలము మొదలు నిర్మూలము చేసిన వరకు… వారు క్రీస్తును నిరాకరించి మరియు ఆయనను క్రీ.శ. 33లో చంపిరి. క్రీస్తు చంపబడినప్పుడు సరిగ్గా అది 483 సంవత్సరములు. ఇప్పుడు యెరూషలేమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ వెడలినది మొదలు ఏడు వారములు విధింపబడెను, అట్లనగా నలభై-తొమ్మిది సంవత్సరములు అని అర్థము, మరియు నలభై-తొమ్మిది సంవత్సరములు సరిగా అక్కడ సమకూర్చబడియున్నవి. సరి, ఆలయమును తిరిగి కట్టుటకు మొదలు పెట్టినప్పటినుండి, మెస్సీయా రాక వరకు 483 సంవత్సరములు, కావున 434 సంవత్సరములు మరియు 434, 49 కూడినచో (కలిపిన) సరిగా 483 సంవత్సరములు. అది సరిగా ఈ రోజు, దినములలో సహా ఏమియు తప్పక అన్నియు క్రమముగా నెరవేరెను. ఆమేన్! అక్కడ అన్ని సరి అని మీరు కనుగోనగలరు.
మెస్సీయా, రాజకుమారుడు వచ్చును, చూశారా. అరవై-తొమ్మిదిని ఏడుతో గుణించిన సరిగా 484 సంవత్సరములు. అది సరిగా సూటిగా జరిగినది. కావున అప్పుడు మనము పరిపూర్ణముగా ఎరుగుదుము. మనము ఖచ్చితముగా ఎరుగుదుము, ఆ లేఖన వాక్యములు సరి అని. ఇదిగో ఇక్కడ అది ఉన్నది. అయితే మీరు గమనించుడి, ఇవన్నియు…
DAN 9:25,26
47దేవుడు జల ప్రళయమునకు ముందున్న ప్రపంచమును కలిగియుండి మరియు దానిని నీటితో నాశనము చేసినప్పుడు, ఆయన ఖగోళశాస్త్ర తేదీలను మార్చివేసి మరియు అటు పిమ్మట రోమనులను రప్పించి వారి కాలెండరును వారు తయారు చేయులాగున చేసి, దానిలో హెచ్చు తగ్గులను వారు ఉంచుకొనిరి. మరియు నేను చదువు సర్వసంగ్రహ నిఘంటువులో (encyclopedia) కూడ ఆది వ్రాయబడియున్నదని నేను నమ్ముచున్నాను.
సరి అట్లుండనిమ్ము, సహోదరుడు కెన్ని కాలిన్స్, ఈ ఉదయము అతను ఈ బిల్డింగు లోపల ఉన్నాడా, కెన్నిట్ కాలిన్స్? మీకు గుర్తున్నదా, మీరు నాకు అనేక ఎన్సైక్లోపెడియోలు నాకు పంపియున్నారు? అది మీకు గుర్తున్నదా? నాకు ఇంచుమించు ఒక సరకుల బండి నిండుగా మీరు పంపియున్నారు. నేను అనుకొన్నాను, "వీటన్నిటితో ఈ లోకములో ఏ జ్ఞానము, అనుభవము లేని నాలాటి వ్యక్తి ఏమి చేసికొనగలను?'' కేన్నీ, నీకు తెలియునా, దేవుడు నిన్ను నడిపించుచున్నాడు. అక్కడి నుండియే, ఆ పాత సర్వ సంగ్రహ నిఘంటువు - కాలములో నుండి నాకు కావలసినంత సమాచారమును నేను సేకరించితిని. మరియు నేను అవన్నియు చదువుచుంటిని. మరియు వాటిని బెక్కీ తన పాఠశాలలో ఉపయోగించును. వాటినన్నిటిని చదువుటకు క్రిందనున్న నా యొక్క చదువు గదిలో ఉంచుకొన్నాను. మరియు మేము అక్కడ క్రిందకు వెళ్ళి, వాటిని తీసి చూసి, సరైన కార్యములను కనుగొని, వాడుకలో ఉన్న అన్ని కాలెండర్లను మరియు కాలములను వ్రాసికొన్నాము, చూశారా. కావున, ఆ విధముగా మేము వాటిని సేకరించుకొన్నాము.
అక్కడ సరిగ్గా 483 సంవత్సరములు, ఆ కట్టడమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ బయలు వెడలినది మొదలు అధిపతియైన మెస్సీయా నిరాకరింపబడు వరకు, కాలెండరులో సరిగా 483 సంవత్సరములు ఆయెను.
48ఇప్పుడు మీరు గమనించుడి, ఇప్పుడిక్కడ మనము ఇదే కాలెండరును ఉపయోగించుచున్నాము, ఏలయనగా దేవుడు ఇక్కడ ఈ కాలెండరును ఉపయోగించినయెడల, అప్పుడు బైబిలులో తక్కిన కాలమంతయు ఆయన ఆదే కాలెండరును ఉపయోగించి యుండవలయును. అది సరియేనా? దేవుడు మారనివాడు. కావున, ఏడు వారములు, నలభై-తొమ్మిది సంవత్సరములైనయెడల, ఏడు వారములు తిరిగి నలభై-తొమ్మిది సంవత్సరములగును. ఒక వారము, ఏడు సంవత్సరములు, చూశారా, కావున అది పరిపూర్ణముగా అమర్చబడియున్నది. మరియు అదక్కడ ఏ విధమైన పొరపాటు లేక సరిగ్గా పొందికగాయున్న యెడల, మరల అది అదే విధముగా పొందికగా యుండవలయును. ఆమేన్! ఓ, మై! అది నాలో సమస్తమును కదలించుచున్నది. ఓ, నేను ఇష్టపడుచున్నాను. నేను ఏమి మాట్లాడుచున్నానో తెలిసికొనుటకు నేను ఇష్టపడుచున్నాను. నేను దానిని ప్రేమించుచున్నాను, ఏలయనగా…
అక్కడ కెంటకీలో ఉన్న ఒక వృద్ధుడు నాతో చెప్పినట్లు, ''వారేమి మాటలాడుచున్నారో, వారు ఎరిగి మాటలాడుటను నేను వినుటకు ఇష్టపడుచున్నాను."
నేను చెప్పాను, "నేను కూడా ఆలాగుననే కోరుదును."
అతను చెప్పెను, "ప్రసంగీకులైన మీ యొద్ద ఉన్న చిక్కు అదే. మీరేమీ మాటలాడుచున్నారో మీకు తెలియదు.''
"సరి," నేను చెప్పాను, "మీ యొక్క అభినందనమును నేను అభినందించుచున్నాను, అయితే మేమేమీ మాటలాడుచున్నామో వాటిని గురించి మేము బాగుగా ఎరిగియున్న కొన్ని కార్యములు కలవు." నేను తిరిగి జన్మించియున్నానని నేను ఎరిగియున్నాను. నేను మరణమును దాటి జీవమునకు ప్రవేశించియున్నానని నాకు తెలియును. ఒక దేవుడున్నాడని నాకు తెలియును, ఏలయనగా నేను ఆయనతో మాటలాడియున్నాను. ఆయన నా ద్వారా మాటలాడియున్నాడు, నా ద్వారా అయిన పలికియున్నాడు మరియు నా ద్వారా ఇతరులతో మాటలాడియున్నాడు, మరియు ఇతరులను గురించి నాతో చెప్పుచున్నాడు, మరియు ఆయన దేవుడని నాకు తెలియును. నా ఫోటో ఆయనతో కూడ తీయబడులాగున చేసెను, దానిని గురించి విజ్ఞానముతో నిండియున్న ప్రపంచము కాదనలేకున్నది, మరియు నేను లేఖనములను తీరుగవేసి మరియు చూచాను అదంతయు ఈ సంఘ కాలములో ఏమి సంభవింపవలయునని ఉన్నదో, ఆ నెరవేరవలసిన కార్యములు సరిగ్గా నెరవేరుటను చూచాను, కావున మనము ఇక్కడ ఉన్నామని నాకు తెలియును. ఆమేన్.
49ఇప్పుడు, మనము విద్యా జ్ఞానము లేనివారుగా ఉండవచ్చును, మనము అంతస్థు లేని వారముగా ఉండవచ్చును, మనకు పేరుప్రఖ్యాతులు లేకుండ ఉండ వచ్చును, అయితే మనము దేవునిని ఎరిగియున్నాము. ఆయనను మనము ఎరిగియున్నాము, ఏలయనగా పరిశుద్ధాత్మ వలననే, ఆ పరిశుద్ధాత్మ లేఖనములలోని ప్రతి యొక్కొక్క వాక్యమును సరిపోల్చుచున్నది. అందువలననే అది సత్యమని మనము ఎరిగియున్నాము. మనము కడపటి దినములో జీవించుచున్నాము.
ఇప్పుడు, అక్కడ ఈ ప్రవచన సంవత్సరములో ఒక సంవత్సరమునకు 360 దినములు కలిగియుండుటను గుర్తుంచుకొనుడి… ప్రతియొక దానిని సూక్ష్మముగా గమనించుడి. స్త్రీల యొక్క సహజమైన ప్రక్రియలతో కూడా, దాని ద్వారాను మీలోని కొందరు గ్రహించగలరు, మీరు గ్రహించారా? ముప్పది. ముప్పది దినములు. కేవలము… మీరు చూడుడి, సృష్టి అంతయు ఆ విధముగానే అమర్చబడియున్నదని మీరు గమనించగలరు, చూశారా. ముప్పై-ఒకటి కాదు, ముప్పై లేక ఇరవై-ఎనిమిది, లేక వేరే ఏమైనా లెక్కింపు కాదు, అది సరిగా ముప్పై దినములు; ప్రతి యొక్క సంవత్సరములో అదే. ప్రవచన కాలెండరు - సరిగా 483 దినములు.
ఇక్కడ మనకు ప్రవచింపబడిన దానికి సరైన ఆధారము కలదు - క్రీ. పూ. 445 సంవత్సరములు ఖచ్చితముగా సరియే. ఇప్పుడు, ఆ డెబ్బది వారములలో సంభవించునని ప్రవచింపబడిన సమస్త కార్యములును ఇంకను నెరవేరలేదు. కావున, ఆ మిగిలిన కార్యములను ఇప్పుడు కడపటి దినముల కొరకు విడిచిపెట్టబడి యున్నవి.
50ఇప్పుడు, నా యొక్క పెంతెకోస్తు సహోదరులారా, నా యొక్క యెహోవా సాక్ష్యుల సహోదరులారా, మీరు గుర్తించగలుగుచున్నారా…? 144,000 మంది ఎక్కడ ప్రత్యక్షమగుచున్నారో మీకు తెలియునా? ప్రకటన గ్రంథములోని సమస్త గొప్ప అద్భుతములు ఎక్కడ సంభవించనైయున్నవో మీరు ఎరుగుదురా? యూదుల కాలములో అవి సంభవించును; మన కాలములో కాదు. సంఘము సిద్ధపడి మరియు వెళ్ళిపోవువుట తప్ప మరియు అక్కడ ఏమియు వ్రాయబడియుండలేదు. నిశ్చయముగా, దేవుని యొక్క శక్తితో మనము అద్భుతములను, గొప్ప కార్యములను మనము చేయగలము. అది మనకు తెలియును. అయితే నిజమైన కార్యము ఇక్కడ యూదులకు మాత్రమే… నేను చెప్పునది నిజమైన క్రియ చేయు శక్తి, అద్భుతములు చేయుట యూదులకే.
అక్కడ 1,44,000 మంది కనబడరు. వారు ఇంకొద్దిగా… 3వ అధ్యాయములో అగుపించరు, లేఖనములలో ఇంకా ముందుకు పోయినయెడల వారు అక్కడ ఉండెదరు. మరిప్పుడు, ఈ కార్యములన్నియును డెబ్బదియవ వారములో, కడపటి వారములో జరుగనైయున్నవని మనము గమనించుచున్నాము. ఇప్పుడు, దేవుడు చెప్పిన మార్గము ప్రకారము వారు జీవించియున్నయెడల, వారికి ఇంతకు మునుపే అరవై-తొమ్మిది వారములు గతించిపోయినయెడల, మరియు దేవుడు అదట్లు జరుగును అని చెప్పిన ప్రకారము, అది సరిగా సంభవించియున్నయెడల, మరియు ఇంకను ఒక వారము యూదులకు వాగ్దానము చేయబడియున్నది. ఇప్పుడు సహోదరులారా, సిద్దపడుడి. చూశారా? మనమెంత చేరువలో ఉన్నామో గమనించుడి. కడపటి వారము, ఏడు… ఏడవ సంవత్సరము…
DAN 9:26
51ఇప్పుడు, ఇంత వరకు చెప్పబడినవన్నియును అందరు అర్థము చేసికొన్నారా? మీరు గ్రహించియున్న… ఇంత వరకు అందరు గ్రహించియున్నయెడల, అది పరిపూర్ణమైన సత్యము, అది బైబిలు, అవి ప్రవచన సంవత్సరములు?
ఇప్పుడు, మనము ఇంతవరకు మెస్సీయాను నిరాకరించువరకు వచ్చియున్నాము, చూశారా, నుండి - మెస్సీయా నిరాకరింపబడు వరకు కడపటి వారములో.
ఇప్పుడు, నేనిక్కడ ఒక్క క్షణము నిలిపి మరియు దీనిని వివరించవలయునని యున్నాను. వారు యేసును రక్షకునిగా అంగీకరించక, నిరాకరించి మరియు ఆయనను సిలువ వేసినప్పుడు, అప్పుడు వారు మెస్సీయాను నిరాకరించియున్నారు. బైబిలులో ఏమి చెప్పబడి యున్నదని మీకు గుర్తున్నదా, "ఏమియు లేకుండ నిర్మూలము చేయబడును, మెస్సీయా, అధిపతి…'' ఇప్పుడు, ఆ యొక్క ప్రవచనము ఏమి విడువబడకుండా సమస్తము సరిగ్గా జరిగినవా అని ఆలోచించుడి. ఇది మీలో చొచ్చుకొని పోవలయునని నేను కోరుచున్నాను, ఆ యొక్క ప్రవచనము ఆ విధముగా సంభవించునని చెప్పబడినట్లు ఆ తేదీలలో, సరిగ్గా ఆ సమయములో ఆ ప్రవచనము నెరవేరినయెడల, ఈ యొక్క ఇంకొక ఏడు - ఈ ఒక ఏడు వారములు మిగిలి యున్నని - ఒక ఏడు సంవత్సరములు, లేక ఏడు దినములు, ఏడు సంవత్సరములు - లేఖనముల ప్రకారము ఖచ్చితముగా, సరిగా నెరవేరును.
MATT 27:25
52ఇప్పుడు గుర్తుంచుకొనుడి, ఆయన తెంపబడెను - మెస్సీయా. యూదులైన వారితో దేవుడు వ్యవహరించుట నిలిపెను. వారు అటు పిమ్మట ముందుకు కొనసాగలేదు. అప్పుడు వారు రోము ప్రభుత్వము ద్వారా చెదరగొట్టబడిరి. మరియు ఇక్కడున్న నా యొక్క పటము మీరు గమనించారా… ఇప్పుడు మీరు దీనిని గ్రహించి మరియు దానిని వ్రాసుకొనుడి. నేను సిలువను ఎక్కడ పెట్టియున్నానో మీరు గమనించారా? అక్కడే వారు ఆయనను నిరాకరించియున్నారు. అయితే దానిపై ఇంకా కొద్ది కాలము పొడిగింపబడినది, చూశారా. ఎందుకు? ముప్పై, నలభై, యాభై, అరవై, డెబ్బది - నలభై సంవత్సరములకు పిదప టైటస్ అను రోమన్ సేనాధిపతి ఇశ్రాయేలు - యెరూషలేమును నాశనము చేసి మరియు జనులను ప్రపంచమంతటను చెదరగొట్టెను.
మీరు చూడుడి, టైటస్ నలభై సంవత్సరముల పిదప… కావున, వాస్తవముగా అదంతయు ముగించు వరకు యూదుల కాలము పొడిగింపబడెను… వారితో దేవుడు వ్యవహరించ లేదు. వారు క్రీస్తును నిరాకరించు వరకు మాత్రమే దేవుడు వారితో వ్యవహరించెను. అప్పుడు వారు క్రీస్తును సిలువ వేసినప్పుడు, వారు అరచిరి, ''ఆయన రక్తము మా మీదను, మా పిల్లల మీదను ఉండు గాకనిరి," అదప్పటి నుండి అట్లే జరిగెను. అయితే వారు చెదరగొట్టబడుటకు మునుపు… వినండి! ఓ, సహోదరుడా! ప్రపంచమంతటను వారు చెదరగొట్టబడుటకు మునుపు, ఆలయమును పడగొట్టుటకు మరియు వారిని ప్రపంచమంతటను చెదరగొట్టుటకు దేవుడు సుమారుగా నలభై సంవత్సరములు తీసికొనెను (సిలువవేసినప్పటి నుండి ఇంచుమించు నలభై సంవత్సరముల వరకు వారు చెదరగొట్టబడలేదు). అయితే అప్పటి నుండి దేవుడు వారితో వ్యవహరించ లేదు. దేవుడు అప్పటి నుండి వారితో వ్యవహరించ లేదు. ఆయన అన్యజనులతో వ్యవహరింప తొడగెను. అది మీకు తెలియునా - ఇప్పుడు దానిని అర్థము చేసికొన్నారా? ఇప్పుడిక్కడ మనము సంఘ కాలములతో ప్రారంభించియున్నాము, అన్యజనుల కాలము, దేవుడు యూదులకు దూరముగా యున్నాడు.
ACTS 15:14
53ఇప్పుడు, యూదులకు సువార్త సేవ చేయు నా యొక్క సోదరుడు, ఇక్కడెక్కడో యున్న నా యొక్క అమూల్యమైన ప్రియ సోదరుడా, ఇక్కడే నీవు దానిని గైకొని మరియు గ్రహించవలయునని నేను కోరుచున్నాను. చూడుడి, అక్కడే దేవుడు యూదులతో వ్యవహరించుట వదలివేసెను, ఏలయనగా దేవుడు ఎల్లప్పుడు ఇశ్రాయేలును ఒక దేశములో ఉన్నప్పుడు మాత్రమే వారితో వ్యవహరించును. అది మనకందరికి తెలియును. ఇశ్రాయేలు ఒక దేశము. అన్యజనులు ఒక జనులైయున్నారు. మరియు ఆయన నామము నిమిత్తము ఆయన అన్యజనులలో నుండి ఒక జనులను తీయవలసియుండెను. ఇంకొద్ది నిమిషములలో దానికి ఆ కార్యమునకు మనము వెళ్ళుదము.
అయితే ఇప్పుడు, మనము అన్యజనుల కాలము ఈ యొక్క ఏడు సంఘ కాలములలో క్రీస్తు సిలువ వేయబడినప్పటి నుండి, సంఘ కాలములు ముగించువరకు, ఇప్పుడు దానిని మనము గ్రహించియున్నాము. ఇంత వరకు వాటినన్నిటిని ధ్యానించుచు వచ్చియున్నాము. ఇప్పుడు మనము చూడబోవు ధ్యానించబోవు కార్యములు - ఏడు ముద్రలు, ఏడు పాత్రలు, ఏడు బూరలు మరియు ఇవన్నియు ఒక్కటిగా బయలుపడును. ఇవన్నియు యూదులతో వ్యవహరింపబడి మరియు భూమి పైనున్న జనులపై దేవుని యొక్క న్యాయ తీర్పుగా ఉండును, మరియు శేషించిన…
LUKE 21:24•
REV 12:17
54గుర్తుంచుకొనుడి, ఈ యొక్క గొప్ప ఉపద్రవ కాలములో, అప్పుడు దానిలో లక్షలకొలది అన్యజనులు మరణించెదరు. ఆ నిరాకరించబడిన వధువు, ఆ స్త్రీ యొక్క సంతానములో శేషించినవారు, నిద్రించు కన్యకలు. దానిగుండా ఆమె పోవును. ఇది డెబ్బది వారముల వలె చాలా స్పష్టముగా ఉన్నది. మరియు వారు ఆ ఉపద్రవములో పోయెదరు. కావున మీరు పరిశుద్ధాత్మను పొందనియెడల, మీకు వీలైనంత త్వరగా దానిని పొందుడి. మనము చివరి కాలములో ఉన్నాము.
ఇప్పుడు, గమనించుడి, ఏడు సంఘ కాలములు. ఇప్పుడు, దానిని నేను విడమర్చి చెప్పనక్కరలేదు, ఏలయనగా టేపులలో వాటిని మనము కలిగియున్నాము, మరియు అవి పుస్తకములలో సమస్తమును ముద్రించబడియున్నవి, అది ఆ యొక్క కాలములో… ఇంకను ఇన్ని దినములున్నవని, ఇన్ని గంటలు అని, లేక ఇన్ని సంవత్సరములు అని దేవుడు ఎప్పుడు చెప్పియుండ లేదు, ఆయన ఆ విధముగా ఏమియు చెప్పలేదు. ఆయన చెప్పెను, "అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు," వరకు… దేవుడు అన్యజనులతో వ్యవహరించుట విడిచి పెట్టు వరకు ఆ గోడలు తొక్కబడును.
MATT 25:5
55ఇప్పుడు, మనము కనుగొనియున్నాము, గడచిన కాలముల నుండి పరిశుద్దాత్మ మనకు వచ్చెను; మరియు అప్పుడు దేవుడు, ప్రారంభములో, క్రీస్తు నిరాకరింపబడినప్పుడు చెప్పుటకు ఆరంభించెను… అన్యజనుల ఏలుబడిలో ఏమి జరుగనైయున్నదన్న కార్యమును దేవుడు యోహానుకు ఖచ్చితముగా చూపించెను. ఇప్పుడు, యూదులకు ఉన్న విధముగా మనకు ఒక నిర్ణయమైన కాలము లేదు, అయితే మనము ఒక సూచనను కలిగియున్నాము. సరి, వారిలో అరవై-తొమ్మిది సంవత్సరములలో - లేక 483 సంవత్సరములు, అయితే అరవై-తొమ్మిది వారములలో ఆయన ఏమి చేసెదనని, ఆయన చెప్పెనో, దేవుడు యూదులకు అదే చేసెను. మరియు ఒక వారము మిగిలియున్నది, ఒక వారము ఇంకను నిర్ణయింపబడియున్నది.
ఇప్పుడు, దీనినిక్కడ మనము అనువర్తించలేము, ''ఏలయనగా, ఇది అన్యజనములు, సంఘము. దానిని ఎందరు అర్థము చేసికొనియున్నారు? ఇప్పుడు ఇది ప్రకటన గ్రంథము, 1వ అధ్యాయము మొదలుకొని 3వ అధ్యాయము వరకు మనలను అక్కడ లవొదకయకు తీసికొనిపోవుచున్నది. ఇపుడు, మనము చూచుచున్నాము అదంతయు సరిగా సంఘమే అని - సంఘ ప్రపంచమే. పాపియైన వ్యక్తి తనకు తానే రక్షింపబడవలయునని కోరు వరకు దేవుడతనిని సంఘములో చేర్చలేదు. అయితే సంఘ ప్రపంచమంతయు తెల్లగా ఉండెను. అటు పిదప నీకొలాయితులు వచ్చిరి, వారు ఒక సంఘ శాఖను ఏర్పరచవలయునని కోరిరి. గొప్పవారు దానిలో ప్రవేశించిరి. ఇది రోములోని నైసియాలో, వారక్కడ నైసీన్ సభ జరిపినప్పుడు జరిగెను. మరియు వారేమి చేసిరి? వారు సంఘమును ఒక శాఖగా స్థాపించిరి, అప్పుడు ఆ శాఖ క్రైస్తవులను హింసించుటకు ఆరంభించెను. అటు తరువాత సంఘ కాలములో, పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మము పొందు క్రైస్తవము పూర్తిగా తుడిచివేయబడెను.
ACTS 2:38•
1COR 12:10
56అయితే అప్పుడు జనులైన మీరు ఎరిగినట్లు, నేను తిరిగిపోయి మరియు చరిత్ర పుస్తకములైన "నైసీన్ పితరులు," మరియు "నైసీన్ కు మునుపు పితరులు," మరియు సంఘము యొక్క చరిత్ర అంతయు, నేను కనుగొన గలిగిన అతి పురాతనమైన వ్రాత పుస్తకములను కనుగొని పరిశీలించి చూసిన, మరియు ఇవన్నియు నిరూపించుచున్నవి దేవుడు చెప్పుచున్న సంఘము ఆ ఏర్పరచబడిన కేథలిక్కుల సంఘము కాదు, లేక వేరే ఇతర సంఘశాఖలు గాదు. దేవుడు దేనిని గురించి మాట్లాడుచున్నాడనగా, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును బోధించిన వ్యక్తులు, వారు ఆ కాలము యొక్క నక్షత్రములు, ఇంకను యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును, దేవుని యొక్క ఆత్మ యొక్క రాకడను, మరియు భాషలలో మాట్లాడుట, భాషలకు వ్యాఖ్యానములు, మరియు స్వస్థత, అద్భుతములు మరియు సూచనలు. అదే దేవుని యొక్క కార్యమైయున్నది. ఆయన తన తలంపులను మార్చడు, తలంపులను మార్చివేసి ఇట్లు చెప్పడు, "సరి, ఒక సంఘమనిన ఇట్లుండవలెననియే నా అభిప్రాయము, అపొస్తలుల సంఘము. నా యొక్క అభిప్రాయము ఒక గౌరవనీయమైన సంఘము.'' దేవుడు ఎన్నడు మారనివాడు! అదింకను పరిశుద్ధాత్మయే.
మరియు మనము గమనించి మరియు దానిని తీసికొని వచ్చిన ఎడల, అప్పుడు దేవుని స్వభావమును మరియు ఆయన ఏమిటనే దానిని మనము చూడగలిగినప్పుడు - మరియు అప్పుడు ఆయన లేఖనములను వెలుపలికి తీసి, మరియు చరిత్రను తీసికొనిన, అది చూపించును ఖచ్చితముగా సమస్తమును నెరవేరుటను, తేదీతో సహా, కాలముతో సహా యోహాను మూలముగా ఇటు సంభవించునని దేవుడు చెప్పిన సమస్త కార్యములు, ఆ యొక్క అన్యజనుల కాలమునకు అవి నెరవేరెను.
REV 1:4,16
57ఇప్పుడు, నిస్సందేహముగా మనము లవొదకయ కాలములో ఉన్నామని మనము చూచుచున్నాము. మనము దానిలో ఉన్నామని మనకు తెలియును. మనము లూథరనులు కాలము ద్వారా, వెస్లీ కాలము ద్వారా, వచ్చియున్నాము. ఇప్పుడు కడపటి కాలమైన, లవొదకయ కాలములో మనము ఉన్నాము. మరియు మనము వాస్తవముగా చూచుచున్నాము ఆ ఒక్కొక్క సంఘములును ఒక్కొక్క వర్తమానికుని కలిగియుండిరి. దానిని మనము కలిగియున్నాము. ఆయన చేతిలోని ఏడు నక్షత్రములు. దేవునికి ముందుగా పోయిన ఏడు ఆత్మలు. ఒక్కొక్క సంఘమును ఒక వర్తమానికుని కలిగియుండెను.
మరియు మనము బైబిలు ద్వారా చూచుచున్నాము ఆ యొక్క వర్తమానికుని స్వభావము ఎట్లుండునని, ఆ వర్తమానికుని యొక్క స్వభావము ఎట్లుండునని. మరియు అటువంటి స్వభావము గల ఆ వ్యక్తిని చరిత్ర నుండి మనము తీయుచున్నాము. మరియు అటువంటి స్వభావము గల ఆ వ్యక్తిని చరిత్ర నుండి మనము కనుగొనిన పిదప, ఆ సంఘకాలమునకు అతడే వర్తమానికుడని మనము చూచుచున్నాము. అప్పుడు మనము కనుగొనుచున్నాము అతనిలో ఉన్నది ఏ ఆత్మ అని మరియు ఆ వ్యక్తి ఏమి చేయునని. మరియు మనము చూచుచున్నాము అతను పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక పరిశుద్ధుడని, పరిశుద్ధ ఐరేనియస్ మరియు ఆ ఇతరులందరు - మరియు పరిశుద్ధ కొలంబస్ మరియు అందరు - వారందరు - ఆ వ్యక్తులందరు ఆత్మతో నింపబడిరి. మరియు అటువంటి ఆత్మ అటువంటి విధమైన వ్యక్తిపై అదే సమయములో ఉండును, అని లేఖనముల ద్వారా మనము ఎరిగియున్నాము. అక్కడే అటువంటి కార్యమున్నది, కావున అది తప్పుగా ఉండదు. ఆమేన్! దేవునికి మహిమ!
REV 2:18•
REV 3:1,14
58అది నాకు తెలియదు, సహోదరుడా. దేవుని వాక్యము తనకు తానే మాట్లాడుట వలన నాకు తెలిసిన దేనికన్నాను అది నాకు అధికముగా చేయుచున్నది, చూశారా, ఎందుకనగా అది తనకుతాను మాట్లాడుచున్న దేవుని వాక్యమైయున్నది. దేవుడు ఏమైనా చెప్పుటను నేను వినినయెడల, "ఆమేన్!'' అని నేను చెప్పెదను. అది దానిని స్థిరపరచును. దేవుడు ఆలాగు చెప్పెను. అది దానిని చేయును. సరి, దేవుడు చెప్పెను ఆ విధముగా అది సంభవించునని, మరియు దానిని మనము చరిత్రలోను, లేఖనముల ద్వారాను కనుగొనుచున్నాము. ఈ యొక్క సంఘ కాలమును గురించి మనము చదివియున్నాము, ఏదేమి చేయును, ఏమి జరుగనై యున్నది, ఆ సంఘ కాలమునకు ఏ రకమైన ఒక వర్తమానికుడని, "లవొదకయలో ఉన్న సంఘపు దూతకు…"; "సార్దిస్ లో ఉన్న సంఘపు దూతకు, తుయతైర," ఈ వేర్వేరు సంఘములన్నిటికీ. మరియు మనము వెనుదిరిగి చరిత్రకు మరలి మరియు ఆ సంఘపు వర్తమానికునికి కనుగొని మరియు మనము అదెవరని చూచియున్నాము. కావున, అప్పుడు మనము దానిని పటముగా గీసి, దాని క్రింద వారి యొక్క పేర్లు వ్రాసియున్నాము, మరియు అదిగో వారు అక్కడ. చూశారా, అది ఖచ్చితముగా అమరియున్నదని మనము ఎరిగియున్నాము.
REV 2:15
59ఇప్పుడు… దేవుడు ఎల్లప్పుడు, ఇది వరకును, ఇక ముందును. సంఘ శాఖలకు ఎప్పుడు విరోధముగా ఉండునని వనము ఎరిగియున్నాము. అవునయ్యా! ఆయన చెప్పెను, "నీకొలాయితుల క్రియలు నేను ద్వేషించుచున్నాను." ఆంగ్లములో నీకొ అనగా ''లాయితును జయించుట'' అని అర్థము." లాయితు (ఆంగ్లములో లైతీ) అనగా సంఘము, శరీరము (నిజమైన దేవుని సంఘము) నీకో అనగా గెలుచుట, జయించుట,'' అని అర్థము, ఇంకొక విధముగా చెప్పవలయుననిన ఒక పరిశుద్ధ మనుష్యుని తయారు చేయుట, ఒకరిపై ఇంకొకరిని. మనమందరము పుత్రులమే, మనకు ఒక రాజు కలడు. అది దేవుడు. మనకు ఒక పరిశుద్ధుడు కలడు మరియు అది దేవుడు. ఆమేన్! మరియు ఆయన పరిశుద్ధాత్మ రూపములో మన మధ్య ఉన్నాడు, అదే పరిశుద్ధమైనది.
ఇప్పుడు, యూదుల యొక్క కాలమును గురించి ధ్యానించునప్పుడు సరిగా చరిత్ర ద్వారా వారికి అరవై-తొమ్మిది వారములు కలిగియుండిరని మనము దృఢ నిశ్చయత కలిగియున్నాము ఏలయనగా, దానిని ధ్యానించునప్పుపుడు ప్రవచన కాలెండరు యొక్క చరిత్రను పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు తీసికొని వచ్చి, అది సరిగా ఉన్నదని చూపించుటను మనము చూచియున్నాము. చూశారా. ఇప్పుడు, మనము అన్యజనముల సంఘమును ప్రారంభము నుండి ఈ కడపటి దినము వరకు దానిని గురించి ధ్యానించి, చూచియున్నాము, మరియు మనము కడపటి దినములలో జీవించుచున్నామని మనమెరిగియున్నాము. ఆమేన్! మీరు అర్థము చేసికొనియున్నారా?
మరియు మనము ఈ యొక్క కడపటి దినములో, ఈ కాలపు చివరన జీవించుచున్న యెడల, మరియు మనమెక్కడ ఉన్నాము?
60గమనించుడి, ఇక్కడ చాలా కాలము క్రిందట… ఇక్కడ గీయబడియున్న ఈ గీతను మీరు చూడుడి, అక్కడే దేవుడు యూదులతో వ్యవహరించెను… లేక యూదులతో వ్యవహరించలేదు, వారిని తీసికొని వచ్చుటకు ఆయనకు చాలా కాలము పట్టెను… వారిని నాశనము చేసి అన్ని దేశములకు చెదరగొట్టుటకు మరియు వారిని అటువంటి స్థితికి తీసికొనివచ్చుటకు ఆయనకు నలుబది సంవత్సరములు కావలసియుండెను. ఇదంతయు అన్యజనముల దినములలో, ఆయన యొక్క వాక్యము నెరవేర్చుటకు మునుపు ఆయన వారిని ఆ స్థితికి తీసికొని రావలయును. నేనేమి చెప్పుచున్నానో చూచారా? అర్థము చేసికొనిన వారందరు, "ఆమేన్!'' అని చెప్పుడి! దానిని మీరు గ్రహించియున్నారని నేను నిశ్చయతతో ఉండగోరుచున్నాను.
ఇప్పుడు, ఏమి జరిగినది? ఈ యొక్క కడపటి కాలము పైగా చూడుడి. ఇక్కడ కొద్దిగా పొడిగింపబడిన కాలమును చూచారా? అన్యజనముల యొక్క దినములు ముగింపబడుచున్నవి. మరియు గడచిన నలభై సంవత్సరములు యూదులు యెరూషలేమునకు తిరిగి వచ్చుచున్నారు, మాతృ భూమికి మరల వెళ్ళుచున్నారు. మనమెక్కడ ఉన్నామో చూశారా? మెస్సీయా నిర్మూలము చేయబడినప్పటి నుండి, టైటస్ ఆలయమును నాశనము చేసి మరియు యూదులను చెదరగొట్టుటకు నలభై సంవత్సరములు పట్టెను. యూదులను వారి యొక్క స్వదేశమునకు పంపివేయుటకు దేవుడు అన్ని చోట్లనున్న, పలు రకములైన ఫరోల యొక్క హృదయములను కఠినపరచుటకు ఇంకొక నలభై సంవత్సరములు పట్టెను, యూదులు వారి మాతృ భూమిలోనికి చేరిపోయిరి. మరియు సంఘము సమాప్త కాలమున ఉన్నది. ఆమేన్! ఓ, నేను చదువుటకు ప్రయత్నించుచున్నాను. నేను చేయలేకున్నాను.
1THS 4:15•
REV 3:20
61గమనించుడి! యూదులు వారి యొక్క మాతృభూమిలోకి వచ్చేశారు, మరియు వారు తిరిగి పోవుచునే యున్నారు… మీరు డిక్లయిన్-ఆఫ్-ద-వరల్డ్-వార్, అను పుస్తకములో 2వ సంచికలో చదివిన యెడల, ఆ సైన్యాధిపతి ఆలన్-బి మొదటి ప్రపంచ యుద్ధము తరువాత విమానములో యెరూషలేముపై ఎగిరి, యెరూషలేమును కైవశపరచుకొనెను, మరియు ఆ క్రైస్తవులు సేనలు నడచులాగున తమ టోపీలను తీసివేసి మర్యాదతో నడచిరి, మరియు ఒక్క తుపాకీ కూడా పేల్చకుండ ఆలన్-బి తొలగిపోయేను… లేక, వారు తుర్కీయులు ఆలన్బికి లొంగిపోయిరి. మరప్పటి నుండి ఆ యూదుని ద్వేషించులాగున, ముస్సోలినీ హృదయమును, హిట్లర్ హృదయమును, స్టాలిన్ హృదయమును దేశములో ఉన్న వారందరి హృదయములను దేవుడు కఠినపరచెను.
మరియు అటు పిమ్మట గొప్ప పక్షులు (విమానములు) అక్కడికి పోయెను, తూర్పు దేశపు విమానములు (ఈస్టన్ ఏరలైన్స్) లేక పాన్ అమెరికన్ ఏర్లైన్స్ లేక ఏమి పిలువబడినను… అది టీ డబ్యుయే ( TWA) అని పిలువబడుచున్నదని నేను అనుకొనుచున్నాను. లైఫ్ పత్రికలో, అది లుక్ లేక లైఫ్ అనీ నేను అనుకొనుచున్నాను, అది లైఫ్ అని నేను నమ్ముచున్నాను. ఇప్పుడే గడచిన మూడు లేక నాలుగు సంవత్సరములుగా అన్యజనులు సిద్ధపడుచుండగా, రెండు వేల సంవత్సరములుగా దూరముగా ఉన్న వారి మాతృభూమికి మరియు దేవుడు యూదులను తరుముచున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ప్రకారము మరిప్పుడు అన్యజనులు క్రీస్తును సంఘమునకు బయట పెట్టి ఆయనను నిరాకరించియున్నారు. ఆయన సంఘములోనే ఆయన తిరిగి పోలేకున్నాడు. ఆయన తిరిగి పోవుటకు అక్కడ ఆయనకు స్థలము లేదు. ఆయన నిరాకరింపబడి యున్నాడు! మరిప్పుడు ఎత్తబడుటకు సమయమిదే!
ఇక్కడ విమోచింపబడిన వారందరు… ఈ చిన్న చుక్కలు (గురుతులు) ఇవి పరిశుద్దులు పునరుత్థానములో పైకి పోవుటను సూచించుచున్నది. మీరు చూడుడి, ఇక్కడ మనమందరము ఒక్కటిగా సంధించెదము. బైబిలు చెప్పుచున్నది, "ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము, నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము." ఇక్కడే, ఇక్కడే మరియు ఇక్కడి నుండి అందరును.
1THS 4:15,17
62ఇప్పుడు, పెంతెకోస్తు సహోదరులారా, ఇక్కడ ఇదంతయు మీరెట్లు లవోదీకయ సంఘ కాలమునకు సంబంధపరచుదురు? వారు ఈ ఒక్కొక్క కాలములోను నిద్రించి కాచుకొనియున్నారు. "మరియు ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము (ఇక్కడున్న ఆ చిన్న మిగిలియున్న గుంపు) నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము; ఏలయనగా దేవుని బూర శబ్దము చేయును, మరియు క్రీస్తు నందుండి మృతులైనవారు మొదట లేతురు, ఆ మీదట మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు, వారితో కూడ ఆకాశ మండలములో ప్రభువును ఎదుర్కొనుటకు పట్టబడుదుము. ఆమెన్! వారితో కూడా (ఇక్కడే మనము ఉన్నాము, ఇక్కడే కలుసుకొనుచున్నాము) ప్రభువును మధ్యాకాశములో కలుసుకొనుటకు. అక్కడే మీరున్నారు. మనము ఎక్కడ ఉన్నాము? ఇక్కడే. మెస్సీయా ఎక్కడ నిర్మూలింపబడెను? వాక్యము ఎక్కడ అని చెప్పియున్నదో సరిగా అక్కడే. ఆ డెబ్బదియవ వారము ఎక్కడ ప్రారంభమగును? సరిగా ఈ సంఘము తెంపబడిన పిదప అప్పుడు దేవుడు యూదుల వైపుకు తిరుగును.
సంఘము వెళ్ళిపోయిన వెంటనే… సంఘము వెళ్ళిపోయిన తరువాత, యూదుల సమయము వచ్చును అని మీకు జ్ఞాపకము లేదా? వారి వంతు వచ్చును. అయితే మొదట, అటు పిదప వరుసలో వచ్చు కార్యము ఏదో ఒక గొప్ప దేశము కాదు, అన్యజనులలో దేశ వ్యాప్తిగా ఒక కదలింపు కాదు. వరుసలో వచ్చు తదుపరి కార్యము దేవుని యొక్క రాజ్యము వచ్చును, క్రీస్తు యొక్క రాకడ.
DAN 2:31,33
63ఇప్పుడు, మీకిష్టమైనయెడల మనము దానియేలు 2వ అధ్యాయము, 34వ వచనము మరియు 35వ వచనమునకు ఇప్పుడు తిరిగి పోయెదము. మరియు దానియేలుకు ఇవ్వబడినప్పుడు (2వ అధ్యాయము, 34 మరియు 35) అప్పుడు దానియేలుకు దర్శనము ఇవ్వబడినప్పుడు, అందులో అతని జనుల యొక్క దినములు ఒక నిర్ణయ కాలములో ముగియును, మరియు అన్యజనులు లోనికి వచ్చుటను అతడు చూచెను, మరియు ఇక్కడున్న ఈ యొక్క గొప్ప పెద్ద రాయిని దర్శనములో చూచెను, లేక ఈ గొప్ప పెద్ద ప్రతిమ. ఆ ప్రతిమకు శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, మరియు రొమ్ము వెండిదియు, (ఇప్పుడు గమనించుడి, అది గట్టిపడుచు నుండెను, వెండి నుండి బంగారు తరువాత ఇనుప తొడలు… లేక, ఇత్తడి తొడలు, మరియు అటు పిదప ఇనుప పాదము, మోకాళ్లు, అయితే కాలివ్రేలు, పది కాలివేళ్లు, మరియు ఆ కాలివేళ్లు ఇనుము మరియు మట్టిదియునై యుండెను. మరియు అతను చెప్పెను, "ఇనుము మట్టితో అతకనట్లు దానిని మీరు చూచులాగున, ఈ రాజ్యము విభజింపబడి వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు, అయితే వారి వారి సంతతి మిళితమై, ఇంకొకరి యొక్క శక్తిని నిర్మూలము చేయుటకు ప్రయత్నించుదురు." చూచారా?
DAN 2:38,39,41
64ఇప్పుడు, ఏమి జరిగెను? అతను దానిని అనువాదము చెప్పిన విధముగా, బంగారు శిరస్సు నెబుకద్నెజరు. చెప్పెను, "తమరికంటే తక్కువైన ఇంకొక రాజు లేచును,'' అతను మీదో పారసిక దేశపు, దర్యావేషు అను నతడు, అన్యజనుల రాజ్యమును వశపరచుకొనెను. మీదో-పారసీకపు వారి తరువాత వచ్చునది ఏమి? గ్రీసు దేశస్థులు, గొప్ప అలెగ్జాండర్, గ్రీకు దేశస్థుల నుండి ఎవరు వశపరచుకొనిరి? రోమీయులు. మరియు అప్పటినుండి అన్యజనుల ప్రపంచమును ఎవరు పరిపాలించిరి? రోమీయులు. రోమీయులు. ఇప్పుడు, అదియే ఇనుము.
అప్పుడు గమనించుడి, రోము చివరి వరకు నిలిచి యుంటున్నది, ఏలయనగా అది కాలివేళ్ల చివరి వరకు పోవుచున్నది. మరియు అతను బురదయు, మంటిని చూచెను (అది ప్రజలను సూచించుచున్నది. దానిలోనే మనము చేయబడియున్నాము) మరియు ఇనుము రోము యొక్క శక్తి అన్ని దేశములలోను వ్యాపించియున్నది. ఆకాశము క్రింద నుండు ప్రతి దేశము పైనను రోముకు అధికారము కలదు.
REV 13:4
65ప్రపంచములో ఒక వ్యక్తి కలడు అతడు ఒక్క మాట చెప్పి ఒక యుద్ధమును నిలుపగలడు లేక ఒక యుద్ధమును ప్రారంభించగలడు. అతడే పోపు. "ఏ ఒక్క కేతలిక్కు ఒక ఆయుధమును కూడ ఎత్తకూడదు,'' అని అతను చెప్పిన, అతని మాటలే తుది నిర్ణయమై యుండును, సహోదరుడా. మీరు కోరినదేదైనను తీసికొనుడి. క్రైస్తవ ప్రపంచములోని అధిక భాగము కేతలిక్కులే. చూశారా? సరి.
అతను ఒక్క మాట చెప్పనిమ్ము అది చాలును, అంతయు దానిలోనే యున్నది. వారు - ఇది ఈ విధముగా ఉన్నది… మనము దానిలోనికి తదుపరి పోయేదము. ఆ క్రూర మృగముతో ఎవ్వరు యుద్ధము చేయగలరు? అతని వలే ఎవరు మాడలాడ గలరు? దానిని ఎవరు చేయగలరు? "అట్లయిన క్రూరమృగమునకు మనమొక ప్రతిమను చేయవలెను.'' అదే సంఘములన్నియు కూడి ఐక్యమైన ఒక సమాఖ్య, ఆ విధముగా ప్రతిమను చేయును. చూశారా? సంఘ శాఖలను ఒక్కటిగా కూర్చుట, దానిని ఇదివరకే చేసియున్నారు. ఓ, మనము చివరన ఉన్నాము. స్నేహితులారా, దానికి గల కార్యములన్నియు అంతే. ఇక్కడ మనము చివరలో ఉన్నాము. "మనము క్రూర మృగమునకు ఒక ప్రతిమను చేసెదము,'' ఆ విధమైన కార్యము ఏదో ఒక ప్రతిమ అనగా, అది ఇంకొక దానివలె అగుపించును. గమనించారా? ఇప్పుడు, మనము చివరి కాలములో ఉన్నాము.
DAN 2:34
66ఇప్పుడు, ఇక్కడ ఈ కాలము చివర గమనించుడి… ఇప్పుడు, దానియేలు, 2వ అధ్యాయము, మరియు 34, 35వ వచనములలో ఈ యొక్క ప్రతిమను చాలా తీవ్రముగా దానిని ఆలోచించి గమనించెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి దొర్లుచు వచ్చి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దానిని విరుగగొట్టు వరకు అతడు దానిని (ప్రతిమను) గమనించెను. ఇప్పుడు… అది తల పైన కొట్టలేదు, ఇప్పుడు పాదములపై అది కొట్టెను. అదియే చివరి కాలము, ఆ పది కాలివేళ్లు.
ఇక్కడ మీరు గమనించి యున్నారా, శ్రీ. ఐసన్ హావర్ పోవుటకు ముందు అతడు కడపటి ప్రోటేస్టెంట్. అమెరికా అధ్యక్షులలో, అతని లాంటివారు ఇంకొకరు వచ్చెదరా అని నా సందేహము, అయితే మీకు చూపించుటకు… ప్రజలు మేల్కొని యున్నయెడల మంచిది. అతడు కలసినప్పుడు, రష్యాతో కడపటి సారిగా అతను సంధించినప్పుడు, అక్కడ ఐదు తూర్పుకు చెందిన కమ్యూనిస్టు దేశముల ప్రతినిధులు, ఐదు పశ్చిమ దేశముల ప్రతినిధులు ఉండిరి. శ్రీ. కృశ్చేవ్ తూర్పు దేశములకు నాయకుడుగాను, శ్రీ. ఐసన్ హావర్ పశ్చిమ దేశములకు నాయకుడుగా ఉండెను. నేను అర్థము చేసికొనియున్నాను నాకు ఒకరు చెప్పుట వలన రష్యా భాషలో "కృశ్చేవ్" అనగా అర్థము "బంకమన్ను'' మరి "ఐసన్ హావర్" అనగా "ఇనుము'' అని ఆంగ్లములో అర్థము. అక్కడే ఇనుము మరియు బంక మన్ను కలువదు. మరియు అతను (కృశ్చేవ్) తన పాద రక్షలను (బూటును) తీసి అక్కడ వేదికపై దానిలో కొట్టి మరి అటువంటి కార్యములు చేసెను! అది కలువదు. అయితే ఈ యొక్క సామ్రాజ్యపు జనములలో చేతి సహాయము లేక పర్వతముల నుండి తియ్యబడిన ఆ రాయి ప్రతిమ యొక్క పాదములను కొట్టును.
ఇప్పుడు, పర్వతము నుండి తియ్యబడిన. అదొక రాతి పర్వతముగా ఉండవలయును. అది రాతి పర్వతము నుండి తీయుబడినదైయున్నది. ఇప్పుడు, మీరు గమనించారా?
67ఇప్పుడు, వాక్య సేవ చేయు సోదరులారా, మరియు ప్రపంచమంతటనున్న సహోదర, సహోదరిలారా నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిగా వ్రాయబడిన బైబిలు, దేవుడు ఆకాశములో వ్రాసెను, ఏలయనగా వారు వారికి పైన ఒక దేవుడు, పరలోకములో ఉన్నాడని చూడవలయును. మరియు మీరు రాశి చక్రములో చూచినయెడల…. ఇప్పుడు జనులలో ఎవరైనను… ఇక్కడున్న ఈ బైబిలుతో నిలువుడి. చూశారా? అయితే రాశి చక్రములో ఆరంభించు మొదటిది కన్యరాశి. రాశి చక్రముల వరుసలో కడపటిది లియో, సింహరాశి. క్రీస్తు యొక్క మొదటి రాకడ కన్యక ద్వారా, రెండవ రాకడ యూదా గోత్రపు సింహముగా వచ్చును. చూశారా? అట్లే అక్కడ మనకు కర్కటరాశి కాలము (కాన్సర్) ఆ రాశి చక్రములలో ఒకటిగా యున్నది.
ఇప్పుడు, మనము కనుగొనుచున్నాము, ఇంకొక వ్రాయబడిన లేక ఉంచబడిన వేరొకటి ఉన్నది మరియు అది పిరమిడ్ ను మీరు గమనించియున్నారా, పిరమిడ్ లో అది క్రింద ఒక కొండ వలె వెడల్పుగా ఉండి, గట్టి రాతితో చేయబడి, పైకి వరకు అట్లే పోవును (కొండ క్రింద వలె వెడల్పుగా నుండి అట్లే కూచిగా పోవును), అయితే దాని పై ఆ పిరమిడ్ పై తలరాయి పెట్టుబడ లేదు. ఐగుప్తులో ఆ పెద్ద పిరమిడ్ మీ యొద్దనున్నది తీయుడి… మీ జేబులో డాలర్ ఉన్నయెడల పైకి తీయుడి, ఒక డాలరును పైకి తీసి మరియు దానిపై చూడుడి, దానిపై ఒక ప్రక్క అమెరికన్ ముద్ర ఉండును, మరియు ఇంకొక ప్రక్క క్రింద పిరమిడ్ ఉండును, మరియు ఆ పిరమిడ్ పైన తలరాయి, అయితే ఇదొక గొప్ప పెద్ద కన్ను, మరియు అది ఈ యొక్క పిరమిడ్ క్రింద ఉండును, ''గొప్ప ముద్ర'' ఎందుకు అమెరికన్ పక్షిరాజు ఆ గొప్ప ముద్రగా ఉండకున్నది? అది దేవుని యొక్క ముద్ర.
ఒక చిన్న పాటను మనము పాడుట గుర్తున్నదా:
మార్గమంతయును
ఆ యొక్క ఆత్మ యొక్క నిజమైన నివాస స్థలమునకు,
నిన్ను గమనించు ఒక కన్ను కలదు.
నీవు వేయు ప్రతి యొక్క అడుగు,
ఈ యొక్క గొప్ప కన్ను మేలుకొని యున్నది,
నిన్ను గమనించు ఒక కన్ను కలదు.
అది సరి. మీకు గుర్తున్నదా, "మనమేదైనా కొద్దిగా - కొద్దిగా ఉత్సాహముతో ఉన్నప్పుడు, మనము చెప్పెదము:
మీరు దొంగిలించి మరియు మోసగించి మరియు అబద్ధమాడి,
మరియు సంఘములో మీరు సాక్ష్యమిచ్చిన యెడల,
మిమ్ములను అక్కడొక కన్ను గమనించుచుండును.
68ఇప్పుడు, ఆ గొప్ప ముద్ర. ఇప్పుడు దానిని గురించి మనము ఎరిగియున్నాము… దానిని గురించి, ఆ పిరమిడ్ యొక్క కొలతలు నాకర్థము కాలేదు, అయితే దానిని గురించిన బోధనలను కొన్నిటిని ప్రజలైన మీకు నేను చెప్పుచునే యున్నాను, అదంతయు ఒక్కటిగా చేర్చబడును.
ఇప్పుడు, పిరమిడ్ సంఘమునకు పోల్చబడియున్నది. క్రింద వెడల్పుగా నుండును. మరియు అది పైకి రాను రాను అది కూచిగా గొట్టము రూపములో ఉండును.
ఇప్పుడు, మనము కనుగొని యున్నాము, ఆ పర్వత శిఖరము కొన వరకు పోవుచు అది ముగించబడనే లేదు. ఎందుకు? ఎందుకు అని నేను ఆశ్చర్యపడుచున్నాను! ఏలయనగా బైబిలు చెప్పుచున్నది, తలరాయి నిరాకరించబడియున్నది. వారు నిరాకరించియున్నారు.
69ఇప్పుడు గమనించుడి, సంఘకాలము (ఇప్పుడు జాగ్రత్తగా వినుడి. దీనిని వదలకుడి.), అపొస్తలుల బోధనలపై పునాదుల రాళ్ళు వేయబడిన కాలముల నుండి, లూథర్ సంఘ సంస్కారము చేయు కాలము నుండి సంఘ కాలము ప్రారంభింపబడినది. అటుపిదప కాలములు ఒక కాలము నుండి ఇంకొక కాలము పోవుటను మనము కనుగొనియున్నాము. సంఘము ఎల్లప్పుడు అల్ప-సంఖ్యలో ఉండుచు నుండెను. లూథర్ నీతికరణను బోధించెను. ఆ సమయములలో మీరు క్రైస్తవుడని ఒప్పుకొనిన యెడల వారు మిమ్ములను చంపెదరు - వారు క్రైస్తవులని ఆ ఒప్పుకొనుట వలన, ఆ భక్తి వైరాగ్యము చేత చంపబడు దినములు, చంపబడ్డారు.
ఇప్పుడు, మనము కనుగొని యున్నాము, వెస్లీ దినములలో అప్పుడు మీరు క్రీస్తును ఒప్పుకొనిన యెడల మీరు పరిశుద్ద గుండ్రాళ్ళు - అదొక క్రొత్త పద్ధతి! (మీరు చరిత్రలో చదివిన యెడల) వెస్లీ మరియు ఆన్బరీ ఇక్కడికి వచ్చినపుడు, ప్రజలు అక్కడ కూడినప్పుడు వారు అమెరికాలో కూటములు జరిపిరి, సంఘములలో వారిని చేర్చనందున, పాఠశాల గదులలో వారు కూటములు జరిపిరి. అవి ఎట్లుండినవనగా, పరిశుద్ధాత్మ వారిపై కుమ్మరింపబడి వారు నేలపై పడులాగున చేసేను. వారికి మైకము వచ్చి పడిపోయినారని, అనుకొని ఇతరులు వారి ముఖములపై నీళ్లు చల్లి, వారిని విసన కర్రలతో విసరుచుండిరి. నా యొక్క యాభై ఏండ్ల సంవత్సరములలో వారి యొక్క కూటములకు నేను వెళ్లి కలుసుకొని యున్నాను. మరియు వారు ఆ విధముగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా క్రింద పడి, వారి ముఖముల పై నీళ చల్లుట మరియు అటువంటి అన్ని కార్యములు చాలా సంవత్సరములకు మునుపు పాత స్వేచ్ఛాపరులైన మెథడిస్టు వారి కార్యములుగా ఉండెను. అదొక విధమైన హింస.
MARK 12:10
70అప్పుడు అటు తరువాత వెస్లీ కాలము జీవించి ముగించిన పిదప, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మములో పెంతెకొస్తు కాలము వచ్చెను. అన్ని కాలములలోను మీరు సరైన ఆకారములో వచ్చుచున్నారు, చూశారా. ఇప్పుడు గుర్తుంచుకొనుడి, దానిపైన తలరాయి ఇంకనూ రాలేదు. ఎందుకు? వారు సంఘమును ఖచ్చితముగా… లేక తలరాయి కుదురునట్లు ఆ పిరమిడ్ తయారు చేయబడుచున్నది, అయితే తలరాయి రాలేదు. ఓ, నేనక్కడ ఉన్నాననో మీరు గ్రహించుచున్నారా?
ఇప్పుడు, లూథర్ నుండి, పెంతెకోస్తు ముగించు వరకు సువార్త సేవ చాలా అల్ప-సంఖ్యలో జరుగుచుండెను… ఆ కారణము వలననే ఈ కాలములో వెలుగు లేకుండ ఉండుటను ఆ కాలెండర్ - ఆ పటముపై చూచుచున్నాము. అది పెంతెకొస్తు కాలము. పెంతెకోస్తులు, కాదు - పెంతెకోస్తు సంఘ శాఖలు కాదు, ఏలయనగా లవొదకయలో వారు చేసిన విధముగా వారు చేసియున్నారు. వారు లవోదీకయనులు. నీకొలాయితుల వలె వారు చేసినారు - శాఖగా మారిరి. అయితే యేసు క్రీస్తు చేసిన సేవ వలె, అదే విధమైన వాక్య పరిచర్య జరుగులాగున, ప్రపంచ మంతటను నిజమైన సంఘము అటువంటి స్థాయికి రూపొందించబడుచున్నది. నిజమైన సంఘము మధ్య యేసుక్రీస్తు వలే వాక్య సేవ జరుపబడును. ఇప్పుడు, వారేమి పొందియున్నారు? వారు సరైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు తదుపరి కార్యమేమిటి? పిరమిడ్ కు నిరాకరింపబడిన ఈ రాయి, పర్వతము నుండి తియ్యబడిన, ఏ సహాయము లేక? చేతి సహాయము లేక, దేవుడు దానిని పంపించెను. దానిని మీరు చూచుచున్నారా? నిరాకరించబడిన అది, నిరాకరించబడిన ఆ తలరాయికి తల ఆయెను. మరియు ఈ యొక్క అన్యజనుల కాలములో వారు నిరాకరించినది క్రీస్తునే, మరియు క్రీస్తు సంహరింపబడి ఇక్కడ సంఘములకంత ఒక ప్రతినిధిగా లేక దేవ కుమారునిగా లేక సంఘములో ఏదో గొప్ప స్థానములో ఉంచబడలేదు. ఆయన పరిశుద్ధాత్మయై యున్నాడు. మరియు క్రీస్తు యొక్క రాకడ పిరమిడ్ కు తలరాయిగా ఉండును. దానిని మీరు చూచుచున్నారా?
DAN 2:34
71ఇప్పుడు, ఏలయనగా వారు ఆ రూపములో ఉన్నారు… వారిని పిరమిడ్ రూపములో ఎక్కడ వారిని రూపొందించినానో చూచారా? పరిశుద్ధుల యొక్క పునరుద్ధరణయే, మహిమలో అడుగులు వేయుచు పోవుటను చేయుచున్నది. దానినిప్పుడు మీరు గ్రహించియున్నారా? తలరాయి అయిన క్రీస్తు, నిరాకరించబడిన రాయి, సర్వమును చూచు నేత్రము, బైబిలు చెప్పు విధముగా సరిగా అట్లే వచ్చు చున్నది. మరియు దానియేలు చెప్పెను, చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఈ రాయి వచ్చు వరకు దానియేలు ఈ యొక్క అన్యజనుల కాలమును గమనించుచుండెను. వారు ఆ పిరమిడ్ పై తలరాయి పెట్టలేదు. అది చేతి సహాయము లేక తీయబడినది. దేవుని చేతులే ఆ రాయిని నరికినవి. దానిని మీరు చూచారా? మరి అదేమి చేసినది? అది ప్రతిమ యొక్క పాదముల మీద పడి దానిని తుత్తునియలుగా విరుగగొట్టెను. హల్లేలూయ! ఆ రాయి వచ్చునప్పుడు ఆ సమయములో ఏమి సంభవించెను? మహిమలో సంఘము ఎత్తబడి యుండును, ఏలయనగా అన్యజనుల కాలము ముగింపబడి యుండును. దేవుడే దానిని ముగియులాగున చేసెను, ఆ రాయి వచ్చునప్పటి కార్యము ఇది.
72ఇక్కడికి ఈ సంఘమునకు ఒక చిన్న వ్యక్తి మరియు అతని భార్య వచ్చుచుండిరి. వారు వారి యొక్క బైబిలును తీసికొని అక్కడెక్కడో పెట్టి, వారు పాడుచు పోవుచుందురు:
ఓ, ఆ రాయి కొరకు నేను ఎదురు చూచుచున్నాను
అది బబులోనులో పొర్లుచున్నది,
బబులోనులో పొర్లుచున్నది.
(ఇంటికి పోవుచు వారు చెప్పెదరు)
ఆ రాయి కొరకు ఎదురు చూచుచున్నాము
బబులోనుకు పొర్లి వచ్చుచున్నది.
అదుగో ఆయనక్కడ! క్రీస్తే ఆ రాయి. ఆయన మనుష్యుని ద్వారా జన్మింపబడ లేదు, ఆయన దేవుని ద్వారా జన్మించెను. దేవుని ఆత్మ ద్వారా మరల జన్మించిన ఆ సంఘము కొరకై ఆయన వచ్చుచున్నాడు, ఏలయనగా ఆ యొక్క తలరాయి యొక్క శక్తి ఒక అయస్కాంతము వలె సంఘముంతయు ప్రవహించి యున్నది.
73ఒకప్పుడు ఒక యంత్రశాలకు నేను పోయి గమనించిన కార్యము నాకు జ్ఞాపకమున్నది, అక్కడ వారు అన్నిటిని ఇనుము మొదలైన లోహములను ముక్కలుగా చేసి మిగిలిన మునుకలను బయట ఊడ్చి వేయుదురు. ఆ పెద్ద రాయి వచ్చి వాటినన్నిటిని ఎత్తుకొనును - ఆ పెద్ద అయస్కాంతపు రాయి ఆ ఇనుప తునకలన్నిటిని ఎత్తుకొనును, ఏలయనగా దానిలో అయస్కాంత ఆకర్షణ శక్తి కలదు. ఆ తలరాయి పరిశుద్ధాత్మయే - క్రీస్తు. మరియు పరిశుద్ధాత్మ యొక్క ఆకర్షణ శక్తి గల మనలో ప్రతీ యొక్కరును, ఆ రాయి ప్రతిమను కొట్టునప్పుడు, సంఘమంతయు దాని యొద్దకు పరుగెత్తి పోవును. అప్పుడు ఆమె ఆ దినములలో, ఎత్తబడు పరిశుద్ధులతో కూడి ఆమె ఎత్తబడి మహిమలో ఉండును.
DAN 9:27
74ఇప్పుడు, ఇక్కడ చూడుడి. ఆ ఆలయమును నశింపచేయుటకు ఏ విధముగా నలుబది సంవత్సరములు పట్టినచో, ఆ విధముగానే యూదులు సుమారు నలభై సంవత్సరములుగా (వారి దేశమునకు) తిరిగి వచ్చుటను మనము చూచుచున్నాము. వారు మరల తిరిగి వచ్చి ఇంకొక ఆలయమును కట్టుటకు సుమారుగా నలభై సంవత్సరములు పట్టేను. చూశారా, మనము మార్గము చివరలో ఉన్నాము. సరీ, ఒక వేళ అన్యజనులు…
ఇప్పుడు మనము తీసెదము… సంఘమనే రాయి వచ్చుటను మనము చూచుచున్నాము. కడపటి కాలమును మనము తీసికొనెదము. మనము దానిలోపలికి పోయి చూచియున్నాము. మరియు అదెట్లు అని మనము చూచియున్నాము, దాని పైన వ్రాసియుంచుకొన్న కార్యములు నా యొద్ద ఉన్నవని నేను అనుకొనుచున్నాను. ఒక్క నిమిషము మనము చూచెదము. ''మరియు రాబోవు అధిపతి, అతడే క్రీస్తు విరోధి, యూదులతో ఒక నిబంధనను స్థిరపరచును, మరియు దానియేలు 7, లేక 9:27: "మరియు వారమునకు మధ్యలో, మూడున్నర సంవత్సరములో, ఆ మృగము ఒక నిబంధనను చేయుచు…" నేను తరువాత దానికి పోవలయునని యున్నాను, ఆ నిబంధన. ఇప్పుడిక్కడే నేను ప్రారంభించవలయునని యున్నాను.
REV 2:5
75ఈ ఒక్కొక్క అన్యజనుల కాలములలో, వాటి యొక్క వర్తమానికుల ద్వారా, వర్తమానము ద్వారా ఏమి సంభవింపనైయున్నవని వారు చెప్పినవన్ని పొరపాటు లేకుండ నిరూపింపబడియున్నవి. ఇక్కడున్న ఈ కాలము ఒక మహిమ గల కాలము. తరువాత కాలములో ఒక బోధన అని చెప్పబడియున్నది లేక ఏదో ఒక కార్యము వచ్చి అదిట్లు పిలువబడుచున్నది, "నీకొలాయితుల బోధనలు.'' అప్పుడు అది ఒక బోధనగా తరువాత కార్యముగా స్థిరపడెను. అప్పుడు ఆ తరువాత నీకోలాంతుల సంఘమునకు వివాహము కాబడునని మరియు పరిశుద్దులను హింసింపబడుదురని చెప్పబడెను, అవన్నియును చెప్పిన విధముగా సంభవించెను. అటుపిదప మనము తరువాత కార్యమునకు వచ్చిన, కొద్దిగా వెలుగు ప్రకాశింప తొడగెను. "నీకు కొద్దిగా బలము కలదు, నీవు జీవించుచున్నావన్న పేరు కలిగియున్నావు, కాని నీవు మృతుడవే. నేను వచ్చి దీపస్తంభములను తీసివేయకుండునట్లు నీవు ఇదివరకే కలిగిన దానిలో బలపడుము."
76అటు పిదప తన కాలములో వెస్లీ వచ్చెను. వెస్లీ కాలము ఎప్పుడని, అదేమిటని మనము చూచియున్నాము… అది ఏమని పిలువబడెను? ఫిలదెల్పియా, గొప్ప కాలము - మనమెప్పుడూ కలిగి యుండని ప్రేమతో నిండిన కాలము, ఫిలదెల్పియా కాలము. అది సరియే, జాన్ వెస్లీ కాలములో. అతను పోయిన పిదప, పెంతెకోస్తు వచ్చినది, మరది నులివెచ్చని కాలము. అటుపిదప మనము పెంతెకోస్తు యొక్క చివర ఏ విధమైన వర్తమానము రానున్నదో కనుగొని యున్నాము… మరియు గుర్తుంచుకొనుడి, ప్రతి యొక్కటియు ఆ కాలము చివర వచ్చును. పరిశుద్ధుడైన పౌలు ఆ కాలము చివరన వచ్చెను, పరి. ఐరేనియస్ మరియు తక్కిన వారందరును తమ కాలము చివరన వచ్చిరి. ఒక్కొక్కరి యొక్క కాలము ఇంకొకరి కాలమునకు అట్లే కొనిపోబడెను, ఆ కాలపు వర్తమానికుడు ఆ వర్తమానముతో తదుపరి కాలమునకు పోయెను, చూశారా.
MAL 3:1•
MAL 4:6•
MATT 11:10•
LUKE 1:17
77ఇప్పుడు, ఈ యొక్క కాలములో మనము చూచియున్నాము… మనమక్కడ నక్షత్రములను కలిగియున్న విధముగా మనకిప్పుడు నక్షత్రములు కలవు. మనకు ఒక నక్షత్రపు వర్తమానికుడు కలడు. మనకొక వ్యక్తి కలడు, ఒక వర్తమానము ఈ కాలమునకు పోవుచున్నది, దానిని నిరాకరించుటకు ఒక జనులు, దానిని అంగీకరించుటకు ఒక జనులు. మరియు ఈ కాలపు వర్తమానికుడు ఏలీయా యొక్క శక్తితో రావలయును. అది సరి! మరియు అతడు పిల్లల యొక్క విశ్వాసమును తండ్రుల తట్టుకును, మిగిలియుండు పెంతెకోస్తులో శేషించిన వారి విశ్వాసమును నిజమైన అపోస్తలుల విశ్వాసమునకు తీసికొని వచ్చును.
ఇప్పుడు, నిజమైన అపోస్తలుల విశ్వాసము, మీరు అపొస్తలుల కార్యముల పుస్తకములో చదివినయెడల, మీరు కనుగొనగలరు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములో ఏ ఒక్కరును, ఎప్పుడును బాప్తిస్మము పొందినట్లు లేనే లేదు. ఎవ్వరును చిలుకరించబడినట్లు కూడ లేదు. పెంతెకోస్తు అని చెప్పుకొను ఆ అనేక కార్యములన్నియు ఏవియును లేవు, అటువంటి ఇప్పుడు జరుగుచున్నపెంతెకొస్తు కార్యములు వెనుకటి కాలములో జరిగియుండలేదు. వారి మధ్య దేవుని యొక్క ఆత్మ నిజముగా ప్రత్యక్షపరచబడి, అది ఏమి చూపించుచున్నదనగా, దేవుని కుమారుడు వారి మధ్య క్రియ చేయుట మారలేదు. రావలసియున్న ఈ వ్యక్తి - ఈ వర్తమానము, రావలసియున్న ఆ వ్యక్తి ఏలీయా వలె ఉండును. ఏలీయా మూడు సార్లు రావలయును. ఇప్పుడు మీరు చెప్పవచ్చు, "ఆ బాప్తిస్మమిచ్చు యోహానే ఆ వ్యక్తి అని!" మీరు గమనించిన యెడల, యేసు చెప్పెను, మలాకీ 3లో చెప్పబడిన వర్తమానికుడే బాప్తిస్మమిచ్చు యోహాను అని, మలాకీ 4లో చెప్పినతను కాదు. ''ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను…'' మత్తయి 11:6 అని నేననుకొనుచున్నాను. మత్తయి 11వ అధ్యాయములో అక్కడ దాని క్రింద మీరు కనుగొనగలరు.
78అయితే ఇప్పుడు ఈ యొక్క కడపటి దినములలో ఏలీయా ఆత్మ జనుల మధ్య రావలసియున్నది, మరియు వెనుక వారు చేసిన అదే కార్యమును అతడు చేయవలసి యున్నది. అతని స్వభావము అదే కార్యముగా ఉండును. సంఘము యొక్క స్వభావము సరిగా లేక ఖచ్చితముగా అదే విధముగా ఉండును. మరియు ఆ యొక్క వర్తమానము బయలు వెడలి ప్రయత్నించుచున్నది… జనుల ద్వారా అతడు ద్వేషింపబడును. అతను స్త్రీలను - అలంకరించుకొను స్త్రీలను, చెడ్డవారిని ద్వేషించును, అరణ్యవాసమును అతను ప్రేమించును, ఒకప్పుడు కోపముతో, ఒకప్పుడు వ్యసనముతో ఏలియా వలె, యోహాను వలె అతను కలవరపడుచు నుండును. ఇదంతయు నెరవేరుట మనము చూచియున్నాము. మనము వర్తమానమును పొందియుండినయెడల, క్రీస్తు నిరాకరింపబడుటను మనము చూచియున్నాము, అతను ఏదైనా సంఘ శాఖకు చెందియుండవలయును లేనియెడల, వారి మధ్యకు మీరు పోలేరు. కావున ఆయన వెలుపలికి త్రోయబడియున్నాడు, చూశారా. క్రీస్తు వారి మధ్య క్రియ చేయలేడు.
"నీవెవరు?''
''ఒక క్రైస్తవుడను.''
''నీవే సంఘశాఖకు చెందినవాడవు?"
''నేను దేనికి చెందినవాడను కాను."
"మేము నిన్ను ఉపయోగించుకొనలేము,'' చూశారా. ఆయన నిరాకరింపబడియున్నాడు, చూశారా, నిరాకరింపబడి యున్నాడు. కావున ఏలీయా నిరాకరింపబడి యున్నాడు. మరియు ఆలాగే యోహాను నిరాకరింపబడెను. అయితే ఏమి అది వారిని బాధించినదా? వారి యొక్క వర్తమానమును అది బాధించినదా? వారు చెప్పారు, "ఓ తల బిరుసుతో మొండివారలారా." వారు దానిని వారిపై పోశారు. వారు వారి యొక్క సేవను విడువక వారు వర్తమానమును అందించుటకే యుండిరి. మరియు వారేమి చెప్పినను దేవుని వర్తమానము పోవుచునే యుండును, కడపటి వరకు మరి అప్పుడు - ఆ నిర్ణయింపబడినవి పోయబడును. మరియు మనము చివరన యున్నాము.
EXOD 19:4•
REV 7:4,8
79ఇప్పుడు, మనకు మనమే కనుగొని యున్నాము మొదటి ప్రపంచ యుద్ధము జరిగినప్పటి నుండి నలభై సంవత్సరములు తిరిగి వచ్చుటలో, మరియు యూదులు వారి యొక్క సొంత దేశమునకు తిరిగి వచ్చియున్నారు. ఇశ్రాయేలు ఆమె యొక్క సొంత భూమిలో ఉన్నంత వరకు దేవుడు ఆమెతో వ్యవహరించడు.
ఇప్పుడు మీకు గుర్తున్నదా, ఇతర దేశములలో ఉన్న యూదులు తిరిగి వచ్చునప్పుడు 'లుక్' అను పత్రిక దానిని గురించి వ్రాసి ప్రచురించిరి. ఆ విమానములు ఇరాన్ దేశములో ఉన్న యూదులను ఎక్కించుకొని వచ్చుటకు పోయినప్పుడు, నాకు తెలియదు వారందరు ఎక్కడుండిరని, వారు పలు చోట్లలో చెదరియుండిరి. నేను, దీనిని ఒక మత సంబంధమైన పత్రికలో ఒక పేపరులో కత్తిరింపబడిన దానిలో నేను చదివితిని. ఇప్పుడు వారు నిజమైన యూదులు, వారికి ఒక అవకాశము కూడ రాలేదు. ఇప్పుడు, సోదరుడా అక్కడే మీ యొక్క 1,44,000. మనము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయమునకు పోయిన మీరు దానిని చూడగలరు. ఆయన చెప్పెను, "అక్కడ గాదు యొక్క పన్నెండు గోత్రములు, ఆషేరు యొక్క పన్నెండు గోత్రములు, రూబేను యొక్క పన్నెండు గోత్రములు, ఎన్ని పన్నెండు గోత్రములు… మరియు వారందరు ఎక్కడ నిలుచుకొని యున్నారు? సీనాయి కొండపై యూదులు - వారి యొక్క సొంత దేశములో (మాతృభూమిలో). వారే అక్కడున్నారు. వారు వాల్-స్ట్రీట్ లో ఉన్న కపటమైన యూదులు కారు. కాదు అయ్యా! వీరు నిజమైన యూదులు.
మరియు మీరు పత్రికలో చదివియుండెదరు, వారి యొక్క వృద్ధాప్య బోధకుడు అక్కడ నిలుచుకొని ఆ విమానములు దిగుచుండుట చూచి… వారింకను ఆ కోయ్య నాగలితో దున్నుచునుండిరి. మరియు ఆ విమానములు యూదులను దించుట వారు చూచినప్పుడు, దాని చుట్టూ వారు పోలేదు. వారి యొక్క వృద్ధుడైన రబ్బీ అక్కడ నిలుచుండి మరి చెప్పెను, ''గుర్తుంచుకొనుడి, మనము పక్షిరాజు రెక్కలపై ఎక్కించుకొనబడి మన యొక్క సొంత దేశమునకు తిరిగి పోయెదమని మన ప్రవక్త చెప్పియున్నాడు.''
దేశములు విరిగి పోవుచున్నవి,
ఇశ్రాయేలు మేలుకొనుచున్నది,
ప్రవక్తలు ముందుగా చెప్పిన సూచనలు;
వారి కొరకైన ఆ ఏడవ వారమును గురించి మనము ధ్యానింపబోవుచున్నాము.
80పెట్రుస్ సోదరుడు ఆ చిన్న బైబిళ్లను వారికి పంపించునప్పుడు నేనక్కడ ఉండుటను గురించి నేను తలంచుచున్నాను మరియు వారు (యూదులు) వాటిని (ఆ బైబిలును) చదివిరి. వారు చెప్పారు, "సరి, ఇది మెస్సీయా అయిన యెడల, ఆయన (యేసు) చనిపోలేదని, ఆయన జీవించుచున్నాడని అనిన యెడల ఆయన ప్రవక్త యొక్క సూచనను చేయుటను మమ్మును చూడనిమ్ము. ఆయన ప్రవక్త యొక్క సూచనను చేయుటను మేము చూచినయెడల, మేము ఆయనను నమ్మెదము." దానిని యూదులు ఎప్పుడు నమ్మెదరు. మెస్సీయా ప్రవక్తయని వారికి తెలియును.
నేను అక్కడ దూరములో ఉన్న సోదరుడు ఆర్గన్-బ్రైట్ స్థలములో ఆ రోజు ఉన్నప్పుడు, యూదులు అక్కడ ఉండినప్పుడు వారు చెప్పిరి, ''మా యొక్క స్థలమునకు రండి, మా ప్రజలు.''
"నిశ్చయముగా, నేను వచ్చుటకు ఇష్టపడుచున్నాను,'' అని నేను చెప్పాను. తొందరగా ఒక నిర్ణయము తీసికొన్నాను. మరియు నేను ఐగుప్తులో ఉన్న కైరో పట్టణమునకు పోయాను… (టేపులో ఖాళి ఉన్నది.)
…వేలకొలది నాయకులు. ''ఎక్కడైన సమమైన చోటుకు వారిని తీసికొని రండి, ఆయన ఇంకనూ ప్రవక్తనా లేక లేదా అని మేము కనుగొనగలము. ఆమేన్! చెప్పెను, "ఆయన ఏమి చేయునో మమ్ములను చూడనిమ్ము.'' ఓ, వారికి అది చాలా సమీపములో ఉండెను. వారు కోరునది అదే. వారు దానిని చూడగలిగి యుండినయెడల, దానిని వారు నమ్మియుండెదరు.
GEN 15:16
81కావున నేనేమి చేసితిని? కైరోలో దిగి మరియు ప్రయాణము సాగించుటకు (యూదుల యొద్దకు) మొదలిడితిని, నా టిక్కెట్ నా యొద్ద ఉండెను, ఇంకను సుమారుగా పేరు పిలచుటకు ఇరవై నిమిషములు ఉండెను. ఏదో చెప్పెను, "ఇప్పుడు కాదు, అన్యజనుల పాపము, అక్రమముల పాత్ర ఇంకను నిండలేదు. అమోరీయుల పాపము ఇంకను పరిపక్వపడ లేదు. అక్కడి నుండి (ఇశ్రాయేలు నుండి) దూరముగా ఉండుము!'' నేను అదేదో నేను ఊహించినాను అనుకొన్నాను మరియు విమానాశ్రయము వెనుకకు వెళ్ళి ప్రార్థించితిని. చెప్పెను, "ఇప్పుడు ఆ చోటికి దూరముగా ఉండుము." (ఇశ్రాయేలుకు పోకుము) అప్పుడు నేను నా టిక్కెట్ తీసికొని వేరే ఎక్కడికో పోతిని. నేను (ఇశ్రాయేలుకు) వెళ్ళలేదు, ఏలయనగా అది సమయము కాదు.
ఇప్పుడు, ఏ సమయమున దేవుడు తిరిగి వారితో వ్యవహరింపనై యున్నాడు, నేను మీకు చెప్పలేను. నాకు తెలియదు. ఎవరికి అది తెలియదు. అయితే వినుడి. ఇశ్రాయేలు ఇదివరకే తన సొంత భూమిలో ఉండి యుండినట్లయిన, అది ఇంతకు మునుపే… రాళ్లంతయు ఎత్తి వేయబడి నేలంతయు చదును చేసి, వ్యవసాయము, నీరు, మరియు దేవుడు వాగ్దానము చేసినదంతయు, వారు బావులను కనుగొనిరి మరియు ఆలాటీ కార్యములను, పెద్ద నదులను. మీరు ఇంత వరకు చూడని అందమైన ప్రదేశము. అక్కడ వారు పెద్ద పట్టణమును కట్టిరి. వారికి ఆనకట్టలు కలవు. అక్కడ ప్రపంచములోనే కొనుటకు కావలసినంత రసాయన వస్తువులు వారి యొద్ద ఉండుటను మనము చూడగలము, చూచారా.
82వారి చేతులకు సమస్తము సమకూడెను. దానిని వారేలాగు చేయగలిగిరి? ఏలయనగా హిట్లర్ హృదయము కఠినపరచబడెను, ముస్సోలిని హృదయము కఠినపరచబడెను. ఫరో యొక్క హృదయము కఠినపరచబడిన లాగున వారిని వారి సొంత భూమికి, తోలెను. మరియు గడచిన నలుబది సంవత్సరములుగా ఆ భూమికి వారు తిరిగి వచ్చుచునే యున్నారు. ఇప్పుడు అక్కడ వారు కాచుకొనియున్నారు.
అన్యజనుల సంఘము లవొదికయలో ఉన్నది - లవొదకయ కాలపు చివర నున్నది. యూదులు వారి యొక్క స్వదేశములో ఉండి యున్నట్లయిన, మరియు అన్యజనుల విశ్వాస ద్రోహము ఇది వరకే సంభవించి యున్నట్లయిన, మరియు మనకు ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు ఉన్నట్లయిన, ఇది వరకే విరిగిపోయిన దేశము వంటి దేశము మనకున్నట్లయిన, హేంగర్లలలో వ్రేలాడు అణుగుండ్లు మనము కలిగియున్నట్లయిన, నులివెచ్చని సంఘము మనకుండినట్లయిన, తమ్మును తాము వేరు పరచుకొని బయటికి వచ్చి ఒక్కటిగా కూడిన సంఘము మనము కలిగియున్నాము, ఆయన వచ్చినప్పుడు ఆ రాయిని గైకొనుటకు యేసుక్రీస్తును పోలిన వాక్య పరిచర్య మనము కలిగియున్నాము, ఇంకను నెరవేరవలసిన కార్యము ఏమి మిగిలి యున్నది? ఏ నిమిషములోనైనను అది సంభవింప వచ్చును. ఇంక ఏమియు మిగిలి యుండలేదు. మనము చివరి కాలములో ఉన్నాము! ఓ, మహిమ! ఆ పండుగను గురించి నేను చెప్పగలనో దానిని వివరించగలనా, లేదా అని నాకు తెలియదు, అయితే నేను కోరుచున్నాను - దానిలో నుండి కొంత భాగమును ఎట్లయిన మీకు తీయవలెనని యున్నాను.
DAN 9:26
83వినుడి. ఇప్పుడు ఎందరు చూడగలుగుచున్నారు? ఆ డెబ్బది వారములు, నలభై-తొమ్మిది సంవత్సరములు అని లేఖనములు ఎక్కడ నిరూపించుచున్నవో మీరు చూడగలుగుచున్నారా? ఎక్కడ ఆ అరవై-రెండు వారములు, 434 సంవత్సరములు అని మీరు చూడగలుగుచున్నారా? అప్పుడు అరవై-తొమ్మిది వారములు… అదేమిటి? అని మీరు చూడగలుగుచున్నారా? ఎనిమిది వందలు మరియు - 483 సంవత్సరములు - ఈ కాలము వరకు 483 సంవత్సరములు… అధిపతి ఎక్కడ తెంపబడెనో (సంహరింపబడుట లేక నిర్మూలించబడుట) మీరు చూడుడి. చూశారా, ఎక్కడ అని దేవుడు చెప్పి యున్నాడో, ఆ స్థలమునకు యూదులు చివరగా వచ్చి చేరుటకు నలభై సంవత్సరములు పట్టెను…
అదిట్లు ఉండునని మనము చెప్పిన విధముగా అన్యజనుల కాలము సమస్త కార్యములలో ఎటు పోయెనో తిరిగి ఎట్లు వచ్చెనో అని ఇక్కడ గమనించండి. ఎక్కడికి - ఇదిట్లు చేయబడియుండును, ఇట్లు జరుగును అని మనము చెప్పినట్లు కాదు, అదిట్లు జరుగనైయున్నదని బైబిలు చెప్పిన విధముగా. కడపటి కాలములో బైబిలు ఏమి చెప్పినదో ఆ విధముగానే సంభవించినది, మరియు నలభై సంవత్సరములుగా వారు యూదులు, ఇక్కడ ఏమి చేసియున్నాడో దానిని సరిగా, ఖచ్చితముగా దేవుడు వారికి చేయుటకు తిరిగి వచ్చుచున్నారు. వారు ఏ మార్గమున వెళ్ళారో, అదే మార్గమున వారు మరల తిరిగి వచ్చియున్నారు. మరియు ఇశ్రాయేలు తిరిగి తన స్వదేశమునకు చేరుకున్నది.
DAN 2:34•
1COR 6:2•
REV 22:11
84ఇప్పుడు, వారి యొక్క కడపటి వారమును దేవుడు ఎప్పుడు ప్రారంభించనైయున్నాడు? ఎప్పుడు? అది ఒకవేళ ఈ రోజు ఉండవచ్చును. ఒక వేళ ఈ రాత్రి సూర్యాస్తమయము లోపల ఉంపవచ్చును. దేవుడు దానిని ప్రకటించును. అదెప్పుడని నాకు తెలియదు. నేను విస్మయముతో ఉన్నాను. అయితే ఇంకొద్ది నిమిషములలో నేను ఏదో కార్యమును తీసికొని రాబోవుచున్నాను. (మీరు నమ్మొదరో లేదో నాకు తెలియదు. అయితే ఎట్లయినను దానిని నేను చెప్పవలయును.)
మనము మన స్వదేశములో ఉన్నాము. యూదులు వారి స్వదేశములో ఉన్నారు. మనము ఎత్తబడుటకు సిద్ధముగా కాలము యొక్క చివరన ఉన్నాము. ఎత్తబడుట వచ్చును, సంఘము పైకి పోవును, ఆకాశములో ఆయనను సంధించుటకు మనము పైకి ఎత్తబడుదము. అది మనకందరికి తెలియును. పర్వతము నుండి తియ్యబడిన ఆ రాయి ఏ సమయములోనైనను వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. మరిప్పుడు అది వచ్చినప్పుడు అదేమి చేయును? అది అన్యజనుల కాలమును పూర్తి చేయును (ముగించును). అదంతయు ముగిసి, మరియు దేవుడు వారితో వ్యవహరించుట పూర్తిగా మానును. "అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము," చూశారా. అప్పుడు ఆయన ఏమి చేయును? పరిశుద్దాత్మతో నింపబడిన ఆయన సంఘమును ఆయన తీసికొనును (సంఘము ఎత్తబడును).
అపవిత్రత అనగా ఏమిటి? అది బుద్దిలేని నిద్రించు కన్యకలు మరియు వారు ఇక్కడ న్యాయ తీర్పులో వచ్చెదరు. దీనిని మనము ప్రసంగించుట కొనసాగించినప్పుడు, ఇంకొక పాఠములో దానిని మనము చూచెదము. ఆమె తెల్ల సింహాసనపు న్యాయ తీర్పులో వచ్చి మరియు విమోచింపబడిన వారి ద్వారా న్యాయము తీర్చబడును. కోర్ట్ కు (న్యాయ స్థానమునకు) కార్యములను తీసికొనపోకూడదని పౌలు మనకు చెప్పియున్నాడు, ఏలయనగా పరిశుద్దులు భూమిని న్యాయము తీర్చెదరు. అది సరియే. నిస్సందేహముగా, ఇప్పుడు మనము చివరి కాలములో ఉన్నాము. సరి.
EXOD 1:8•
DAN 9:24,26
85మరియు ఈ వారము యొక్క మధ్యలో… ఇప్పుడు ఇక్కడే ఆ డెబ్బది… ఇప్పుడు, ఇది సరిగా ఏడు సంవత్సరములైనయెడల, "ఒక్కొక్క వారముగా, మరియు మనకు అరవై-తొమ్మిది వారములు ఇది వరకే ముగింపబడియున్నవి, అటు పిదప మనకు అన్యజనుల కాలము, మరియు మనము అన్యజనుల కాలపు చివరన ఉన్నామని మనమెరిగియున్నాము, అట్లయిన యూదులకు ఇంకొక వారము మిగిలియున్నది. అది సరియేనా? మరియు అది సరిగా ఏడు సంవత్సరములు. ఇది ఏడు సంవత్సరములైనయెడల, ఆ ఏడు సంవత్సరములు, ఏలయనగా ఆయన చెప్పెను, "నీ జనులపై డెబ్బది వారములు విధింపబడెను.'' కావున, యూదుల కొరకు ఏడు సంవత్సరములు మనము కలిగియున్నామని మనకు తెలియును. అది నిజమేనా? ఇప్పుడు దాని తట్టు చూడుడి. ఒకవేళ ఏదైనా ప్రశ్న ఉండినయెడల, దానిని నేను తెలుసుకొనగోరుచున్నాను, చూశారా.
ఇప్పుడు… మరియు అర్థవారములో ( వారమునకు మధ్య) - ఈ యొక్క యూదుల వారపు మధ్యలో, చూశారా, - ఆ మూడున్నర సంవత్సరములు - క్రీస్తువిరోధి, అధిపతి, రానున్న అధిపతి… మరియు అతను రోము నుండి వచ్చునని గుర్తుంచుకొనుడి. రాబోవు అధిపతి. అతనేమై యున్నాడు? ఒక పోపు, (రోమన్ కాథలిక్కుల మత గురువు) జనుల మధ్య ఒక అధిపతి రానున్నాడు. యోసేపును గురించి తెలియని ఒక ఫరో లేచును.
DAN 9:27•
REV 11:3,8,11,13•
REV 13:15
86ఇప్పుడు, ప్రోటెస్టెంట్లు మీరు చెప్పవచ్చు. "సరి, అదంతయు అంతే." అయితే ఒక్క నిమిషమాగుడి. మనము చూచియున్నాము, ప్రోటెస్టెంట్ కు ఒక స్థాపిండబడిన శాఖ ఉన్నది, సంఘ శాఖలన్నియు కలసి ఒక సంఘ సమాఖ్యను చేసి, ఆ క్రూర మృగమునకు ఒక ప్రతిమ చేసి, మరియు వాటితో పోవుచున్నారు. మరియు మనము తెలుసుకున్నాము, యూదులను కూడా ఈ సంఘ సమాఖ్యలో పిలువబడుదురు. అవునయ్యా! మరియు వారు ఒప్పుకొని యున్నారు. మరియు వారట్లు చేసియున్నారని బైబిలు చెప్పుచున్నది.
మరియు అతడు వారితో ఒక నిబంధనను స్థిరపరచును, మరియు డెబ్బదియవ వారపు మధ్యలో, అతడు విరచును - క్రీస్తువిరోధి యూదులతో అతడు చేసిన నిబంధనను అతిక్రమించును (దానిని విరచి) - ''నీ యొక్క జనులు.'' ఎందుకు? ఇప్పుడు, ప్రకటన గ్రంథము 11లో మీరు దానిని చదివినయెడల, నేను పంపెదను…'' (అది 11; మీరిప్పుడు 19కు రండి) - ఆయన తన ఇరువురు ప్రవక్తలను పంపును, మరియు ఆ సమయములో వారు ప్రవచించెదరు. అటు పిదప వారు ఈ ప్రవక్తలపై కోపపడి వారిని చంపివేయుదురు. అది సరియేనా? మరియు వారి యొక్క శవములు ఆత్మీయ వీధి, ఉపమాన రూపముగా సొదొమ, గొమొర్రా వీధులలో, మన ప్రభువును సిలువ వేసిన అదే చోట, యెరూషలేములో పడియుండును. అది సరియేనా? మరియు వారు (ఆ శవములు) మూడు దినములు మూడు రాత్రులు అక్కడే పడి యుండును. అటు తరువాత మూడు దినములు మరియు రాత్రుల పిదప జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించి, వారు లేపబడి మరియు మహిమలోనికి పోయెదరు. ఆ ఘడియలోనే ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను. అది సరియేనా? చూశారా? అదేమిటి? ఈ యొక్క కడపటి డెబ్బది సంవత్సరపు మధ్యలో.
DAN 9:27•
MATT 24:24•
MARK 13:22
87సంఘము పైకిపోయిన పిదప, అప్పుడు ఈ సంఘ సమాఖ్య, నిద్రించు బుద్ధిలేని కన్యకలు - మెథడిస్టు, బాప్తిస్థు, ప్రెస్బిటేరియన్, నులివెచ్చని పెంతెకోస్తు - వీరందరు కూడి ఒక ఐక్యతగా - వారిది వరకే ఒక పెద్ద సమాఖ్యగా చేరియున్నారు… మరియు వారాలాగు చేసినప్పుడు, వారొక నిబంధనను చేసికొందురు. ఇప్పుడు మనము చూచుచున్న క్రొత్త పోపు వారందరిని ఆ సంఘశాఖల ఐక్యతలోనికి తీసికొని రావలయునని ఉన్నాడు. ఆ కార్యములన్నియు సమకూడుట మీరు చూచుచున్నారా? వారితో మాట్లాడే అనేక వందల వందల లేక రెండువేల సంవత్సరములలో మొదటిసారిగా వారందరిని ఒక్కటిగా తీసికొని వచ్చుచున్నాడు. అయితే ఇప్పుడు, వారందరిని తీసికొని వచ్చి ఒక సంఘ సమాఖ్యగా చేయును, మరియు దానిని యూదులు కూడా అంగీకరించెదరు. ఓ, మహిమ, హల్లేలూయ! సదాకాలము జీవించు మన దేవునికి స్తోత్రములు. అక్కడే మీరున్నారు! ఇప్పుడు, సోదరుడా, ఇది చాలా సులువుగా అర్థము చేసికొనగలవు… ఇది సామాన్యముగా కనిపించుచున్నది. ఒక చిన్న బిడ్డ కూడా దానిని చూడగలుగును. ఆ సంఘ సమాఖ్య యూదులను, ప్రొటెస్టెంటులను, మరియు కాథలిక్కులను ఒక్కటిగా చేర్చును.
88మరియు గుర్తుంచుకొనుడి, ఆ ఇరువురు ప్రవక్తలు వారు వచ్చిన పిదప ఏమి చేయుదురు? ఈ క్రూర మృగము, ఈ అధిపతి పరిశుద్ధ జనుల యొక్క శక్తిని చిన్నాభిన్నము చేయును, అతనేమి చేయును? అతడు వారితో మూడున్నర సంవత్సరముల పిదప తన నిబంధనను కొట్టివేయును. అతడు వీరిని వెలివేయును. ఇప్పుడు జనులు అది కమ్యూనిజమ్ అని తలంచుచున్నారు, ఆ విధముగా ఎందుకు అనుకొనుచున్నారనగా, దేవుని ఆత్మ వారితో ఇంకనూ వ్యవహరించనందువలన కమ్యూనిజమ్ కాదు, అదొక మత సంబంధమైనది. వీలైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచు విధముగా అది అంత సమీపముగా ఉండునని బైబిలు చెప్పుచున్నది. యేసు అట్లు చెప్పియున్నారు. చూశారా, మనము చివరి…
REV 7:4•
REV 11:3,6,7•
REV 19:13,14
89ఇప్పుడు ఈ ఇద్దరు ప్రవక్తలు, వారేమి చేయుదురు? ఆ దృశ్యములో మోషే మరియు ఏలీయాను లేచెదరు. ఆ యూదులకు వారి యొక్క తప్పిదములు (పొరపాట్లు) వారు చెప్పెదరు. దేవుడు ఈ ఇరువురు ప్రవక్తలను ఉపయోగించుకొని, ఆ యూదుల యొక్క గుంపు నుండి ఆ 1,44,000 ను ఇప్పుడు పిలుచును… అదేమిటి? ఈ అన్యజనుల సంఘము యొక్క ఏలీయా ఆత్మ యూదుల సంఘమునకు కూడా పోవును. తనతో కూడా మోషేను కూడ పిలుచుకొనును. హల్లేలూయ! దానిని మీరు చూచుచున్నారా? మెస్సీయాను నిరాకరించిన వారికి అదే పెంతెకొస్తు వర్తమానమును అతడు ప్రసంగించును. ఆమేన్! దానిని మీరు చూచు చున్నారా? ఈ యూదులు (ఇరువురు ప్రవక్తలు) అదే పెంతెకోస్తు వర్తమానమును వారికి ప్రసంగించెదరు. మరియు వారు ఆ యూదులను చంపివేయునంతగా ఘోరముగా ద్వేషించుదురు. అన్నీ దేశముల ద్వారాను వారు ద్వేషింపబడెదురు - మరియు వారము మధ్యలో… ఎందుకనగా వారు గొప్ప శక్తివంతమైన 1,44,000 మందిని లేపెదరు. వారు పరిశుద్ధాత్మను పొంది యుండెదరు, మరియు సోదరుడా, అద్భుతములను చేయుట గురించి మీరు మాటలాడుచున్నారు, వారు వాటిని చేసారు. వారు ఆకాశమును మూయుదురు, మరియు వారి ప్రవచన దినములో వర్షము కురువదు, వారు తలంచినప్పుడెల్లను వారనుకొనినట్లు భూమిని తెగుళ్లతో బాధించిరి. వారు తెగుళ్లను మరి నానా విధములైన వాటిని వారికి ఇచ్చిరి. వారు రోమను వారికి అడ్డుగా నిలిచి వారి ప్రయత్నములకు అడ్డుబండగా నుండిరి. అయితే చివరకు, వారు చంపబడేదరు. మన దేవుడు, ఆయన కోపపడునప్పుడు భయంకరమైన (తీవ్రమైన) దేవుడుగా నుండును. అయితే గుర్తుంచుకొనుడి, అది డెబ్బదియవ వారములో జరుగుననియ మరియు సంఘము (వధువు) మహిమలో ఉండును. ఆమేన్! పెండ్లి విందు జరుగుచుండును. అవును!
ఇప్పుడు, గమనించుడి. యూదుల కాలము యొక్క చివర - అభిషేకింపబడిన వారు తిరిగి వెయ్యేండ్ల పరిపాలనలో ఆ ఆలయమునకు వచ్చుట అక్కడ మనము చూచుచున్నాము. ఇక్కడ ఆయన తెల్ల గుర్రముపై సవారీ చేయుచు వచ్చుచున్నాడు - ఆ తెల్ల గుర్రముపై వారు ఆయనను వెంబడించుచున్నారు (గుర్రములు అనగా శక్తి అని అర్థము), వారు రక్తములో ముంచబడిన ఆ తెల్ల వస్త్రములు ధరించుకొనియున్నారు, ''దేవుని యొక్క వాక్యము'' అని ఆయనపై వ్రాయబడి యున్నది. ఆయన వచ్చుచున్నాడు, గొప్ప జయ వీరుడై (అవునయ్యా!) వెయ్యేండ్ల పాలనను నెలకొల్పుటకు, ఆలయమునకు వచ్చుచున్నాడు. మహిమ! అక్కడే ఆయన ఆ 1,44,000 మందిని సంధించును.
REV 11:7•
REV 18:17,18,24
90ఇప్పుడు, ఇక్కడ ఆ డెబ్బదియవ వారము పిదప - డెబ్బదియవ వారము… ఇది ఈ డెబ్బదియవ వారములో జరుగును. మరియు ఆ మూడు, దాని మధ్యలో అతను దానిని (ఒప్పందమును) మీరును లేక అతిక్రమించును, ఏలయనగా భూమిని (తెగుళ్లతో) కొట్టిన ఆ ఇరువురు పెంతెకొస్తు ప్రవక్తలను అతడు చంపును. (అవునయ్యా!) మరి బాలుడా, ఆయన ఆ సంఘమును శపించును, మరియు ఆయన ఆమె అగ్నితో కాల్చును. మరియు, ఎందులకు, మనము చూచుచున్నాము, ఓడపైనున్న ఆ నావికులు కూడా నిలుచుకొని చివరగా నవ్వుచు చెప్పెదరు, ''ఆ గొప్ప నిత్యమైన రోము నగరము, ఒక్క ఘడియలో ఆమె తన చివరి దశకు (క్షీణదశకు) వచ్చెను." ఆమె ముక్కలు ముక్కలుగా బ్రద్దలై, చిన్నాభిన్నమగును. ఏ విధముగా కార్యములను చేయవలెనని దేవునికి తెలియును. మరియు దూతలలో ఒక దూత దాని వైపు చూచి మరియు చెప్పెను, "ఎందుకు, క్రీస్తు కొరకు హతసాక్షులైన ప్రతి యొక్కొక్కరి రక్తము ఆమెలో ఉన్నది.'' ఆమె మోసపుచ్చినందులకై, అక్కడికి పోయి మరియు స్థాపించిన సంఘశాఖలుగా మార్చి, మరియు ఆ ఇటువంటి రకములైన కార్యములను చేసినందులకు గాను, మరియు సంఘమును కలుషితము చేసినందులకు గాను, అనేక తప్పైన కార్యములను సంఘములో దూర్చినందులకు మరియు, ఈ తప్పిదములన్నిటి నుండి వారిని బయటికి తీసికొని రావలయునని యున్నవారిని, నిజమైన బోధనలకై నిలిచిన వారిని హతమార్చెను, మహిమ! ఓ, నాకు తెలియదు. నేను ముందుకు కొనసాగవలెనని అనుభూతి పొందుచున్నాను, చూశారా.
DAN 2:34•
DAN 9:26,27
91ఈ సూర్యుని వెలుగు కొరకు, సూర్యుని వెలుగులో నడచుచుండుటకు మీరు ఆనందముగా లేరా? మనము ఎక్కడున్నాము సహోదరులారా? కడపటి ఘడియలో. అది ఏ సమయములోనైనను నెరవేరవచ్చును. మరియు మనమక్కడ ఉన్నాము.
కడవరి సంఘమునకు వర్తమానము అందియున్నది, సంఘము తన క్రీస్తును నిరాకరించి యున్నది. నలభై ఏండ్ల కాలముగా యూదులు తమ సొంత భూమిలో వచ్చి చేరియున్నారు. కొత్త పట్టణము కట్టబడినది. వారు దేనికొరకు కాచుకొని యున్నారు? మెస్సీయా రాకడను. అదెప్పుడు జరుగును? నాకు తెలియదు. ఆ రాయి ఇక్కడ ప్రతిమను కొట్టునప్పుడు ఆమె వెళ్లిపోయి ఉండును. అప్పటికి అంతయు సమాప్తమై యుండును.
ఇప్పుడు, ఇక్కడ గమనించుడి. వారము యొక్క మధ్యలో, మూడున్నర దినములలో - మూడున్నర సంవత్సరములలో, అతను ఒప్పందమును మీరి లేక అతిక్రమించి, వారు అంతకు మునుపు నుండి చెల్లించుచున్న బలులను, నైవేద్యములను నిర్మూలము చేయును… ఏలయనగా వారు తిరిగి పోయి, చెప్పుదురు, "ఇప్పుడు చూడుడి, మీరందరు సంఘములుగా యున్నారు. ఈ ప్రతిమ ద్వారా ఆ క్రూర మృగమునొద్దకు మీరు గైకొనబడవచ్చును. మనమందరము ఐక్యతగా ఉండెదము. కమ్యూనిజమును తొలగించెదము, పూర్తిగా కమ్యూనిజమును తుడిపి వేయుదము," చూశారా. మరియు వారు దానిని చేయగలరు, చూశారా. మరియు వారు దానిని చేయగలరు.
అయితే ఇప్పుడు గమనించండి. మరియు ప్రతి దినపు ఆరాధనను నెలకొల్పుటకు - ఆలయము తిరిగి కట్టబడినప్పుడు బలి నైవేద్యము నగరములో తిరిగి వచ్చును. మరియు ఈ వారము యొక్క మధ్యలో రాబోవు ఈ యొక్క అధిపతి అతని నిబంధనను నిర్మూలించి ఈ యొక్క బలిని నిలిపివేయును. నేను చెప్పినట్లు, అతను చెదరగొట్టబడును, దానిని చెదరగొట్టును, మరియు అతను చేయునది చివరి వరకు అట్లేయుండును.
DAN 9:27
92మరియు నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట వ్యాపించుటను గమనించుడి. హేయమైన, కార్యము వ్యాపించుట. హేయమైనది ఏమిటి? ''అసహ్యమైనది.'' నిర్మానుష్యము (నాశనము) చేయుట, అట్లనగా ఏమిటి? దానిని ముగించుట నాశనము జరుగు వరకు ఆ ఏహ్యమైన కార్యము వ్యాపించుచునే యుండును, అదే యూదులను, నిద్రించు బుద్ధిలేని కన్యకలను జయించుటకు వ్యాపించుచున్న ఆ రోమను శక్తి… మన మందరము రోమనులతో చేరవలయును లేనియెడల మనమేమియు చేయలేము. అతను అర్ధవారములో తన నిబంధనను నిర్మూలించును.
అసహ్యమైన కార్యము వ్యాపించుట… రోము అక్కడికి వచ్చి యేసు ఉన్న కాలములో, వారి కార్యములతో వ్యాపింపజేసినది హేయమైన కార్యములైనచో - తిరిగి అది రోము మరల - సంఘమునకు మరల అది హేయమైన కార్యము నిర్మానుష్యము చేయుటకు, దానిని చివరి వరకు పొడిగించును. అతనేమి చేయును? చివరి వరకు దానిని అతడు కొనసాగించుచునే యుండును. అదే దాని ముగింపు.
REV 13:14
93ఇప్పుడు, యూదుల మార్గము, మరియు రోమను మార్గము, ప్రొటెస్టెంట్ మార్గము (అదే బుద్ధిలేని నిద్రించు కన్యకలు) ఈ మార్గములన్నియు, వీరందరు సంఘముల యొక్క సమాఖ్య విధానము క్రింద ఐక్యపడుదురు. మరియు అదెట్లున్నది అనగా, మత్తయి 24 మరియు ప్రకటన 13:14 నుండి యేసు చెప్పినట్లు, మనము ప్రకటన 13:14కు పోయి మరియు అదెట్లని చూద్దాము… 13:14 ఏమని చూడవలయునని నేను ఇక్కడ గుర్తుంచుకొని యున్నాను. సరి, అయ్యా.
కత్తి దెబ్బతినియు బ్రదికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, [సంఘములను సంఘటితము చేయుచున్నది] ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది.
ఇప్పుడు, నిస్సందేహముగా మనము ఎరిగియున్నాము. ఆ క్రూర మృగము ఎవరని, కత్తి దెబ్బ తినియు బ్రదికిన ఆ శక్తి గలది ఏమిటని. అదెప్పుడనగా ప్రతిమారాధన చేయు రోము చంపబడి మరియు పోప్ రోము దాని స్థానమును తీసికొన్నప్పుడు - ప్రతిమారాధన చేయు శక్తి చంపబడి మరియు పోపు శక్తి దాని స్థానమును గైకొన్నప్పుడు.
2THS 2:4•
REV 13:14
94ఇప్పుడు, ఇప్పుడు, ప్రకటన గ్రంథము 13:14… యేసు మత్తయి 24లో దానిని గురించి హెచ్చరించెను. "ఆ క్రూర మృగమునకు ఒక ప్రతిమ.''
పౌలు, II థెస్సలోనికయులకు 2వ అధ్యాయములో, 3 మరియు 4వ వచనము… దానిని మనము తీసికొనెదము, దానిని గురించి పౌలు ఏమి చెప్పుచున్నాడో చూడుడి. ప్రభువు యొక్క గొప్ప ప్రవక్తపై ఆ గొప్ప పరిశుద్ధాత్మ, దానిని గురించి ఆయన ఈ కడపటి దినమున ఏమి చెప్పుచున్నాడో చూడుడి. II థెస్సలొనీకయులకు రెండవ అధ్యాయము, అందులో ఉన్నదే అది. సరి అయ్యా, 3వ అధ్యాయము నుండి ఆరంభించును అని నేను నమ్ముచున్నాను. అది సరి. ఇప్పుడు మనము చదివెదము. ప్రతి యొక్కరు జాగ్రత్తగా వినుడి. పౌలు పరిశుద్ధాత్మతో నింపబడియున్నాడని ఎందరు నమ్ముచున్నారు? ఇక్కడ గమనించుడి.
మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడగు పాపపు పురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు. [అప్పుడే ఆయన వచ్చునని వారికున్న అభిప్రాయములను ఆయన (పౌలు) వారి తలంపుల నుండి తీసివేసి, మొదట విశ్వాస ద్రోహము, సంఘము విశ్వాసము నుండి తొలగిపోవుట జరుగునని, అది ఈ లవొదకయ సంఘములో జరుగునని చెప్పుటకు ప్రయత్నించుచున్నాడు.] [ఆ పాప పురుషుడు, పరిశుద్ధాత్మతో అవిశ్వాసము - అవిశ్వాసము.] [ఇస్కరియోతు యూదావలే, సంఘము యొక్క కోశాధ్యక్షుడు.]
ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగా నైనను, ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి… [సహోదరుడా, వాటికన్ పట్టణముకు వెలుపల భూమిపై, ఆ విధముగా చేయు ఒక వ్యక్తి కలడా? అదెక్కడ అట్లు జరుగును?]
2THS 2:3,4•
REV 13:18•
REV 17:9
95ఇప్పుడు, ప్రకటన 13కు పోయి ఆ వ్యక్తి ఒక నగరముపై ఉన్నాడు అను చూపించబోవుచున్నాను - ఒక నగరములో, మరియు ఆ నగరము ఏడు కొండలపై ఉన్నది. మరియు కూర మృగము యొక్క సంఖ్యలు 666 అది వైకారియస్-ఫీలి-డీ (VICARIUS FELHI DEI) అట్లనగా, "దేవ కుమారునికి బదులుగా,'' పోపు యొక్క సింహాసనముపై. ఒక త్రీవిధమైన కిరీటము కలిగి యుండును. మరియు నేను నా చేతులకు నా ముఖము ఎంత చేరువగానున్నదో అంత సమీపములో ఆ కిరీటమును చూచియున్నాను. వాటికన్ (నగరము) లోనే అక్కడే ఆ అలంకరింపబడిన కిరీటమును చూచియున్నాను - నేనే నిజముగా చూచియున్నాను, నేనేమి మాట్లాడుచున్నానో నేనెరిగి యున్నాను. దేవుడను అని పిలచుదానికి, అన్ని దైవజనులను అతడు ఎదిరించుచు, తనను తానే హెచ్చించుకొనుచున్నాడు. అతడు అందరిలో తనను తానే పరిశుద్ధుడు అనుకొనుచు. భూమిపై పాపములు మన్నించుచు మరియు ఇతర కార్యములు చేయుచు, మీకు తెలియునా, దేవుని ఆలయములో, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు కూర్చుండియున్నాడు. ఖచ్చితముగా.
2THS 2:5
96పౌలు చెప్పెను, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడును.
నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా?
ఓ, నేనక్కడ కూర్చొని పౌలు దానిని ప్రసంగించుటను వినవలయునని ఆశపడుచున్నాను, మీరు కోరుతలేదా? నేనెట్లు అతని ప్రసంగమును వినవలయునని ఆశపడుచున్నానో. ఓ, మై!
ఇప్పుడు, అతడు ఏమి చేయబోవుచున్నాడు? క్రూర మృగమునకు ఒక ప్రతిమ, II థెస్సలొనీకయులకు. ఇప్పుడు వినుడి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినుడి. అప్పుడే పోపు వచ్చుటను నిజముగా, సంఘము అనుభూతిచెందుచున్నది. అదేమిటి? అది ఆ సంఘ కాలపు చివర, పౌలు యొక్క కాలము. ఈ నీకొలాయితుల కార్యములు లేయుటను, ఒక పరిశుద్ద వ్యక్తిని తయారు చేయుటయు వారు చూచియున్నారు. ఎవరిని? పోపుని. ప్రపంచపు కార్యములు మరియు ప్రభువులు (గొప్పవారు) సంఘములో మెల్లగా జొరబడిరి మరియు ఆరాధన క్రమమును మార్చివేసిరి. పౌలు పరిశుద్ధాత్మ వలన, ఆత్మలో దానిని తెలుసుకొనెను, మరియు సంఘము ఘనులైన వారితో, అంతస్థు, హోదా గల గౌరవనీయులతో మరియు ఆ విధమైన కార్యములతో ఆ… వారు అక్కడ ఏదో రానున్నదని చూచారు, మరియు పరిశుద్ధాత్మ కడపటి దినములను గురించి వారికి హెచ్చరించుచుండెను. మీకు గుర్తున్నదా, యేసు, నీకొలాయితుల క్రియలను గురించి పలుకుచు అదెట్లు చివరకు ఒక బోధనగా మారి అటు పిదప ఒక స్థాపింపబడిన శాఖగా మారినట్లు చెప్పలేదా? సహోదరులారా, ఇప్పుడు మనము చీకటిలో లేము, దానిని గుర్తుంచుకొనుడి, చూశారా. ఇక్కడే మనము ఉన్నాము.
2THS 2:3,4
97నీకొలాయితుల క్రియలు, శాఖలు స్థాపింపబడుట, గొప్ప అంతస్థు, ఘనులైన వారు మరియు అటుపిదప సంఘ శాఖలు మరియు ఆ విధముగా, అవన్నియు అట్లే కాథలిక్కు సంఘముగా మారినవి. మరియు పౌలు చెప్పియున్నాడు, నిజమైన పెంతెకోస్తు విశ్వాసము నుండి సంఘము దిగజారిపోతేనే గాని చివరి కాలము సమీపించదు. పెంతెకోస్తు విశ్వాసము త్రోసివేయబడి మరియు ఘనులైన వారు (గొప్పవారు) లోనికి వచ్చెదరు. దేవుని యొక్క స్థానమును తీసికొను ఒక వ్యక్తిని వారు కలిగియుండెదరు. అతడు దేవుని ఆలయములో కూర్చుండి, ఆ నిజమైన విశ్వాసము కలిగియున్న జనులందరిని తాను ఎదిరించుచును. చూశారా, అదేమిటి? నీకొ ''సంఘమును జయించుట," చూశారా. ఏది దేవుడనబడునో - దేవుని వలె అతడు దేవుని ఆలయములో కూర్చుండును. పౌలు చెప్పియున్నాడు, చివరి దినములలో మొదట భ్రష్టత్వము సంభవించును. మరిక్కడ, మనమిప్పుడు ఇక్కడే (అటువంటి పరిస్థితులలో) ఉన్నాము మరియు భ్రష్టత్వము చూచుచున్నాము, దాని ( విశ్వాసము) నుండి సంఘము కొద్దిగా కొద్దిగా దూరమగుటును చూచుచున్నాము మరియు తిరిగి అదే విధముగా సంఘ శాఖలుగా మారిపోవుటను చూచుచున్నాము, మరియు మనము చివరి కాలములో ఉన్నాము. అది సరి.
98ఇప్పుడు, ఆ అరవై-తొమ్మిది వారములు సరిగా లెక్క ప్రకారము నెరవేరినట్లయిన, మరిప్పుడు యూదులు వారి యొక్క స్వదేశములో ఉన్నట్లయిన, చివరి కాలములో అన్యజనుల సంఘకాలము ఏ విధముగా, నీకొలాయితుల కాలము లేక లవొదకయ కాలము ప్రకారము ఉండునని చెప్పబడినదో అట్లున్నట్లయిన యెడల, ప్రభువు యొక్క రాకడ, అన్ని కార్యముల యొక్క ముగింపు, ఈ కాలపు ముగింపు మరియు ఎత్తబడుట ఎంత చేరువలో ఉన్నది? ఆయన ఆ డెబ్బదియవ వారము లేక ఏడు సంవత్సరములు ఆరంభించు ఆ క్షణమే సంఘము వెళ్లిపోయి ఉండును. స్నేహితులారా, దానిని మీరు చూడలుగుచున్నారా? మీరు చూడగలిగిన యెడల, మీ హస్తములను పైకెత్తుడి.
చూశారా, ఇప్పుడు మనమింకను చిన్న బిడ్డలవలే ఉండకూడదు. మనమింకను ఆటలాడుకొనుచు ఉండకూడదు. మనము చివరి కాలములో ఉన్నాము. ఏదో సంభవించనై యున్నది. మనము చివరన యున్నాము. ఇక్కడే మనమున్నాము.
99ఈ అరవై-తొమ్మిది వారములు సరిగా నెరవేరినవి, యూదులు దూరముగా పోవుట సరిగా నెరవేరినది, సంఘ కాలములు సరిగా నేరవేరినవి. మనము చివరి కాలములో ఉన్నాము, చివరి కాలము లవొదకయ సంఘ కాలము, దాని యొక్క చివర యున్నాము. నక్షత్ర వర్తమానికులు అందరును వారి యొక్క వర్తమానమును ప్రసంగించిరి. ఆ వర్తమానము అంతయును, అందరి యొద్దకు పోయి ఉన్నది; మనము తీరపు ఒడ్డు చేరబోవుచున్నాము. గత నలభై సంవత్సరములుగా యూదులు తిరిగి వచ్చుచున్నారు. వారు వారి యొక్క స్వదేశములో ఉన్నారు. అటు తరువాత ఏమి నేరవేరనై యున్నది? ఆ రాయి రావలసి యున్నది. ఆ కాలములో మనము ఉన్నాము! ఏ వేళలో అది సంభవించును? నాకు తెలియదు. అయితే, సోదరుడా, నా మట్టుకైతే నేను సిద్ధముగా ఉండవలయునని కోరుచున్నాను.
ఇప్పుడు, మనకు ఇంకను కొద్ది నిమిషములు ఉన్నవి, మరియు ఒక్క నిమిషము మీరు నెమ్మదిగా వినవలయునని కోరుచున్నాను. ఆయన డెబ్బదియవ వారమును లేక ఏడు సంవత్సరములను ప్రారంభించిన ఆ క్షణమే సంఘము పైకి పోవును. ఇప్పుడు వినుడి, నేను తిరిగి ఆ గుర్తులను చెప్పుచున్నాను - మరల గుర్తించి చెప్పుచున్నాను, కావున మీరు దానిని మరువ లేరు. నేను వ్రాయుచుండగా దీనినే పరిశుద్ధాత్మ నా కలము ద్వారా వ్రాయించెను. మనము లవొదకయ సంఘ కాలములో ఉన్నాము, ఆయన యొక్క సొంత సంఘము ద్వారా క్రీస్తు నిరాకరించబడెను. ఈ కాలపు దూత, వర్తమానము బయలు వెడలి యున్నది, మరియు ఇశ్రాయేలు ఆమె యొక్క దేశములో ఉన్నది. మనమెక్కడ ఉన్నామో మీరు చూచుచున్నారా? మనము చివరన ఉన్నాము. మరియు ఇంకను ఒకటి లేక రెండు వ్యాఖ్యానములున్నవి.
100ఇంతవరకు మనము ధ్యానించిన కార్యములన్నియు ఆయన కృప వలన మనము ఏడు ముద్రలు గురించి ధ్యానింప మొదలు పెట్టినప్పుడు చాలా ఉపయోగకరముగా ఉండును. దానిని ఎక్కడ మనము చూడకుండా వదలినామని చూశారా? ప్రకటన గ్రంథము 6:1 నుండి ప్రకటన గ్రంథము 19:21 వరకు, వాటినన్నిటిని మనము దాటి, వదలి ఉండియుండ వచ్చును, ఏలయనగా, చూశారా, దానిని మనము ఈ యొక్క అన్యజనుల కాలమునకు చెందినదని, ఈ కాలమునకు దానిని ప్రయోగించవలెనని మనము ప్రయత్నించుచున్నాము, అయితే అది ఈ కాలములో ముగిసినదని మనము చూచియున్నాము. చూశారా? ఇప్పుడు ఇంకా ఏదియు మిగిలియుండలేదని, దేవుని వాక్యము ద్వారా, మరియు చరిత్ర ద్వారా, మరియు ప్రతి యొక్క కార్యము ద్వారా, మరియు కాలపు సూచనల ద్వారా, దినముల ద్వారా, మనము దానిని నిరూపించియున్నాము, ఇంక ఏమియు మిగిలియుండలేదు. మనము అన్యజనుల యొక్క ముగింపులో ఉన్నాము. అదేమి - దాని ద్వారా మనమేమి చేయబోవుచున్నాము? అది నా యొక్క ఆత్మయును మీ యొక్క ఆత్మయును, అది నా యొక్క జీవమును మరియు మీ యొక్క జీవమును, అది మన ప్రియుల యొక్క జీవమును వీటన్నిటికి సంబంధించినది. మనము అధికముగా సౌమ్యముగా అన్ని కార్యములు నేర్పబడియున్నాము. మనకు అనేక కార్యములు సులభముగా లభించెను. మనము ముందుకు కొనసాగవలెను. వెనుక చింతించుట కంటే ముందే తలంచి బాగుపడుట మంచిది, గుర్తుంచుకొనుడి.
AMOS 8:11
101ఇప్పుడు, మీరు గుర్తుంచుకొన గోరిన యెడల, ఒక గట్టి వివరణ ఇది. దయచేసి జాగ్రత్తగా వినుడి. ఇదే నా యొక్క చివరి వాఖ్యానములు - దాని తదుపరి నేను మాట్లాడదలచిన ఇంకొద్ది నోట్స్ లు నా యొద్ద నున్నవి. ఇప్పుడు, ఒక్క క్షణము ఊరకుండి మరియు జాగ్రత్తగా వినుడి. దీనికి సంబంధించిన ఒక కార్యమును మీకియ్యబోవుచున్నాను, చూశారా. ఈ కాలపు ముగింపునకును మరియు క్రీస్తు యొక్క రాకడకును మధ్య ఒక కత్తి యొక్క అంచు వెడల్పు కూడా లేదు. సమస్తమును… ఏమియు మిగిలి యుండలేదు. ఇశ్రాయేలు ఆమె స్వదేశములో నున్నదా? అది మనకు తెలియును. మనము లవొదకయ కాలములో ఉన్నామా? ఈ పెంతెకొస్తు కాలపు వర్తమానము బయలివెడలి జనులను కదలింపజేసి, ఆది పెంతెకొస్తు ఆశీర్వాదమునకు త్రిప్పుటకు ప్రయత్నించినదా? ఒక్కొక్క కాలపు వర్తమానీకుడు సరిగ్గా వారి వారి కాలములలో వచ్చియున్నారా? దేశమునకు విరోధముగా దేశములు లేచియున్నవా? తెగుళ్లు? ఈ రోజు భూమిపై కరవు ఉన్నదా, నిజమైన సంఘము దేవుని వాక్యమును వినుటకు వందల కొలది మైళ్లు కారు నడుపుకొని పోవుచున్నారా? రొట్టెకు మాత్రము కాదు, అయితే దేవుని వాక్యమును వినుటకు ఒక కరవు వచ్చి యున్నది, అది సరియేనా? ఎందులకు, ఇప్పుడు దాని మధ్యలో మనము జీవించుచున్నాము. మనమెక్కడ యున్నామో చూచారా? ఆ యొక్క రాయి కొరకు మనము వేచియున్నాము…
GEN 12:2,3•
ACTS 15:14•
GAL 3:16,17
102ఒక ఆశ్చర్యకరమైన వార్త: అబ్రాహాముకు దేవుడు వాగ్దానమును చేసినప్పటి నుండి (దీనిని వదలి పెట్టకుడి!) అబ్రాహాముకు దేవుడు వాగ్దానమును చేసినప్పటి నుండి ఆదికాండము 12:3 నుండి క్రీస్తు యూదుల ద్వారా క్రీ.శ. 33లో నిరాకరింపబడిన వరకు, గలతీయులకు 3:16 మరియు 17 ప్రకారము, మరియు అషర్ అను వ్యక్తి హెబ్రీయుల యొక్క చరిత్రలో వారి కాలక్రమమును వ్రాసిన ప్రకారము, దేవుని యొక్క శక్తి యూదులతో సరిగా 1954 సంవత్సరములుండెను. యూదుల యొక్క చరిత్ర కాలక్రమము ప్రకారము, మరియు గలతీయులు 3:16, 17 ప్రకారము దేవుడు యూదులతో 1954 సంవత్సరములు వ్యవహరించెను. నా యొద్ద అనేక లేఖన వాక్యములు కలవు, అయితే ఇవి మాత్రము చెప్పి యున్నాను, అటు పిదప వారు క్రీస్తును నిరాకరించిన పిదప, ఆయన తన యొక్క నామము కొరకు. జనులను ఎత్తుకొనుటకు అన్యజనుల తట్టు తిరిగెను. దానిని గురించి తెలుపు వాక్యము మీకు కావలయునా? అపొస్తలుల కార్యములు 15:14.
LEV 25:8,10
103ఇప్పుడు, కాలమును లెక్కించిన యెడల, (వినుడి!) మనకు సరిగా పదిహేడు ( 17) సంవత్సరములు ఇంకను మిగిలియున్నవని మనము చూచుచున్నాము, మరియు పరిశుద్దాత్మ యొక్క శక్తితో క్రీ.శ. 33 నుండి 1977 వరకు మనతో వ్యవహరించుటకు దేవుడు మనకిచ్చిన అదే కాలము. అది ఎన్ని సంవత్సరములు అనగా అదే 1954 సంవత్సరములు, యూదులతో ఆయన ఎట్లు వ్యవహరించెనో అట్లే మనతో వ్యవహరించుచున్నాడు. దానిని గురించి ఎట్లు?
ఇప్పుడు నేను మీకియ్యదలచిన ఒక చిన్న లేఖన వాక్యమును మీ యొక్క పుస్తకములలో గుర్తుంచుకొనుడి. లేవీయకాండము 25, 8వ వచనము మొదలుకొని, ప్రతియొక నలభై తొమ్మిది సంవత్సరములకు దేవుడు ఒక విడుదల పండుగ లేక ఉత్సవము (ఆంగ్లములో జూబిలి) నియమించును. 50వ సంవత్సరము జూబిలి. అది మనకు తెలియును దానిని మనము అర్థము చేసికొనియున్నాము. లేవియకాండము 25:8 లో మొదటి పండుగ (జూబిలి) అటు పిదప 1977లో డెబ్బదియవ జూబిలి, లెక్క ప్రకారము సరిగా 3430 సంవత్సరములు. జూబిలి అనగా పోవుట, "విడుదల" అని అర్థము.
ఓ, మనము రాకడ కొరకు కాచుకొని యున్నాము
ఆ యొక్క ఆనందమైన వెయ్యేండ్ల పరిపాలన రోజు కొరకు,
అప్పుడు మన ఆశీర్వదింపబడిన ప్రభువు వచ్చును.
మరియు ఆయన కొరకు కాచుకొనియున్న
వధువును తీసికొని పోవును.
ఓ, ప్రపంచము మూలుగుచున్నది, మొర్ర పెట్టుచున్నది.
మధురమైన ఆ విడుదల రోజు కొరకు
అప్పుడు మన రక్షకుడు భూమికి తిరిగి వచ్చును.
104దానిని మీరు గైకొన్నారా? ఆయన అబ్రాహాముకు వాగ్దానమును ఇచ్చినప్పటి నుండి క్రీ.శ. 33 మెస్సీయా నిరాకరించబడిన వరకు 1954 సంవత్సరములు, దేవుడు పైన చెప్పిన అదే కాలము మనతో వ్యవహరించి యున్నాడు. మరిప్పుడు మనకు పదిహేను సంవత్సరములు మిగిలియున్నవి. ఇంచుమించు 1930 సంవత్సరములు మనకు ముగించియున్నవి. మొదటి జూబిలి నుండి 1977లో డెబ్బదియవ జూబిలీ పండుగ జరుపబడుటకు మనకింకను పదిహేను సంవత్సరములు మిగిలియున్నవి. మరియు అదేమైయుండును? ఓ, సహోదరుడా! ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినుము. దీనిని వదలకుము. అది అన్యజనుల వధువు పైకి పోవు జూబిలిగాను మరియు యూదులకు క్రీస్తు తిరిగి వచ్చు జూబిలిగా యున్నది, అప్పుడు వారు బానిసత్వము (దాస్యము) నుండి విడుదల నొంది బయటికి వచ్చెదరు. ఆమేన్! దానిని మీరు చూచుట లేదా? ఆ దినము కొరకు ప్రపంచమంతటి నుండి వారు అక్కడ కూడుకొనుచున్నారు. ఓ, మే! మనమెక్కడ ఉన్నామో చూచుచున్నారా? అది ఎప్పుడు సంభవించునో మనకు తెలియదు. మనము చివరి కాలములో ఉన్నాము.
105ఇప్పుడు వినుడి. చాలా కాలముగా ఈ సంఘములో ఉన్న పాత విశ్వాసులందరును, మీరిక్కడ ఒక కార్యమును గమనించవలయునని కోరుచున్నాను. నిన్నటి వరకు దీనిని నేను నేర్చుకొన లేదు. చరిత్ర కారుడైన పౌలు బోయడ్ నుండి నేను గుర్తించుకొన్న కార్యములు, మరియు అటు పిదప వాటిని లేఖనములలో వెతికి, ఇతర తేదీలను మరియు ఇతర కార్యములను (వాటికి సంబంధించినవి) అన్నిటిని చరిత్రలోను, బైబిలులోను వెతికి నేను గుర్తుంచుకొనియున్నాను.
ఇప్పుడు, 1933లో ఇప్పుడు క్రీస్తు యొక్క సంఘము నిలిచి యుండు ఆ మసోనిక్ ఆలయములో మేము ఆరాధించు చుండగా ఏప్రిల్ నెలలో ఒక రోజు ఉదయము, ఇంటికి పోవుటకు ముందు నా యొక్క కారును అర్పణ చేయునప్పుడు (నా యొద్ద 33వ సంవత్సరపు మోడల్ కారు ఉండెను మరియు నేను దానిని దేవుని సేవకు సమర్పించుచుంటిని), అప్పుడొక దర్శనములో నేను చివరి కాలమును చూచియున్నాను. ఇప్పుడు అది ఎంత ఖచ్చితముగా పొందికగా ఉన్నదో చూడుడి, నేను ఒక బాలునిగా వెనుకటి కాలములో ఉన్నప్పుడు, మరియు మీరు ఊహించగలరు. 1933 సంవత్సరపు కారు ఎట్లుండునని - ఇప్పుడు అది ఏ విధముగా చూచుటకు ఉండునని. మరియు నేను అక్కడ మసోనిక్ ఆలయమునకు పోయిన కార్యము… ఇక్కడున్న పాత (చాలా కాలముగా ఉన్నవారు) విశ్వాసులకు గుర్తుండ వచ్చును. ఇంటిలో ఒక పాత కాగితముపై అది వ్రాయబడి యున్నది, చూశారా. అది 1933లో జరిగినది. మరియు 1977 లోపల లేక ఆ సంవత్సరములో ఏదో గొప్ప ఆపద అమెరికాకు జరుగనైయున్నదని నేను ప్రవచనగా చెప్పియున్నాను. నేను దానిని చెప్పుట ఎందరు గుర్తుంచుకొనియున్నారు? చేతులను చూడుడి. నిశ్చయముగా!
106ఇప్పుడు గమనించుడి. అమెరికాలో గొప్ప కార్యము ఏదో సంభవింపనై యున్నది లేక ఏదో గొప్ప భయంకరమైన కార్యము, సంభవించుటకు గాను జరుగబోవు ఏడు కార్యములు ఇవన్నియు ఈ యొక్క గొప్ప ముగింపు (చివరి) లోపల జరుగనైయున్నవని నేను ముందే చెప్పి యున్నాను. నేను చెప్పియున్నాను… ఇప్పుడు గుర్తుంచుకొనుడి, ఇది ప్రారంభించుటకు ముందు (నేను చెప్పియున్నాను) మనము రెండవ ప్రపంచ యుద్ధములో పోవుదము అని నేను చెప్పియున్నాను. నేను దానిని చెప్పుటను ఎందరు వినియున్నారో, ఆమేన్ అని చెప్పుడి. అది సరి. రెండవ ప్రపంచ యుద్ధము. నేను చెప్పియున్నాను, "ఇప్పుడున్న అధ్యక్షుడు [దీనిని నేను పాత లేఖనముల నుండి నిన్న కాపీ చేసుకొని యున్నాను. చూసి వ్రాసుకొనియున్నాను] -ఇప్పుడు మనకున్న దేశాధ్యక్షుడు, ఇంతకు ముందున్నతను [ఆయనెవరని ఎందరు గుర్తుంచుకొని యున్నారు?] ఫ్రాంక్లిన్ డి. రూసువెల్ట్…" నేను చెప్పియున్నాను, "మన దేశ అధ్యక్షుడు మొదటి సారిగా అధ్యక్ష పదవిని చేపట్టినప్పుడు, అతడు నాలుగు మార్లు ఆ పదవికి పోటీపడి, దక్కించుకొనును అని - అతడు నాలుగవ తడవ అధ్యక్షునిగా కొనసాగించునప్పుడు, మరి మనము రెండవ ప్రపంచ యుద్దములో పాల్గొనెదము."
107నేను చెప్పియున్నాను, "ఇటలీలో ఇప్పుడు పైకిలేయు నియంత [అతనే ముస్సోలిని] అతడు అధికారములోనికి వచ్చిన పిదప మరియు అతడు ఇతియోపియా దేశమునకు పోవును; మరియు ఇతియోపియా అతనికి లొంగిపోవును." ఇప్పుడు ఇక్కడున్న కొందరు జనులకు తెలియును, అక్కడ రెడ్ మాన్స్ హాలు అనుచోట ప్రసంగించుటకు పోయినప్పుడు అక్కడ కూటములలో నేను అట్లు చెప్పినందులకు నన్ను హాలు నుండి బయటికి తరిమి యుండెదరు. అవును, శ్రీమతి. విల్సన్ ఆమె కూడ అక్కడున్నారని నాకు తెలియును… అది సరియేనా, అప్పుడు నేను దానిని చెప్పినప్పుడు. అయితే అతడు (ముస్సోలిని) దానిని చేసియున్నాడా? అయితే నేను చెప్పాను, "అతను అవమానకరమైన చావుతో ముగించబడును అని మరియు అతనికి ఆ విధముగానే జరిగెను. అతను మరియు అతనితో పరుగెత్తిన అతని ప్రేమికురాలు ఇరువురిని ఒక వీధిలో, వారి కాళ్లను పైకి పెట్టి తాళ్ళతో వారిని వేలాడదీసిరి, వారి వస్త్రములన్నియు క్రిందకు వ్రేలాడుచుండెను. అది సరి, అదంతయు నెరవేరెను.
మరియు నేనప్పుడు చెప్పాను, "స్త్రీలు ఓటు వేయుటకు అనుమతించబడెను, అది నిజముగా ఈ దేశములో ఏర్పడిన ఒక అవమాన కార్యము. మరియు ఓటు వేయునప్పుడు ఒక రోజు వారు తప్పైన వ్యక్తిని ఎన్నుకొనెదరు." మరియు వారు దానిని గడచిన ఎన్నికలలో చేసియున్నారు. మై, మై!
108నాలుగు: నేను చెప్పియున్నాను, "విజ్ఞానము చాలా వేగముగా అభివృద్ధి చెందును… " కాదు, ఇక్కడ, అది మూడవది. నన్ను మన్నించుడి. ఇప్పుడిక్కడ తదుపరి కార్యము.
నాల్గవది నేను చెప్పియున్నాను, ''మన యుద్ధము జర్మనీతో ఉండును మరియు వారు ఒక గొప్ప, పెద్ద కాంక్రీటుతో తమ్మును కాచుకొనుటకు కోటవలె కట్టుకొనెదరు, మరియు అమెరికనులు వారి దగ్గర ఘోరముగా కొట్టబడెదరు. ఇప్పుడు నేను నిలుచుకొనియున్న సర్వోన్నతమైన దేవుడు ఎరిగియున్నాడు, ఆ స్వతంత్రులైన నాజీస్ (జర్మనులు) అమెరికనులను ఆ గోడ యొద్ద తన్నులను, హింసించుటను నేను చూచియున్నాను. మరియు ఇక్కడ నిలుచుకొని యున్న అనేక మంది యవ్వనస్థులకు ఆ సీగ్-ఫ్రైడ్ గీత బలమైన గోడ ఏమని తెలియును. మరియు గుర్తుంచుకొనుడి, నేను ఆ సీగ్-ఫ్రైడ్ గోడ కట్టుటకు పదకొండు సంవత్సరములకు మునుపే జరుగబోవు కార్యములన్నిటిని చెప్పి యున్నాను. దేవుడు సత్యమైన దేవుడుగా ఉన్నారా? జరుగబోవు కార్యములను ఆయన ముందుగా తెలియజేయునా? గమనించుడి! అది నాల్గవది.
109ఇప్పుడు, ఐదవ కార్యము. "విజ్ఞానము ఏ విధముగా అభివృద్ధి చెందుననగా, వారొక కారును తయారు చేయుదురు. అది స్టీరింగ్ వీల్ లేకుండ తానంతట తానే త్రిప్పుకొని పోవును, మరియు ఆ కార్లు అన్నియు గ్రుడ్డు రూపములో ఉండును చివరి వరకు (ముగింపు వరకు)" - చివరి కాలము. అమెరికన్ వారు ఒక కుటుంబముగా అటువంటి కారులో వారి వీపులను స్టీరింగ్ ప్రక్క త్రిప్పి (స్టీరింగ్ వీల్ లేనందువలన కారు తానంతట అదే పోవును) ప్రయాణము చేయుచు. వారు చెస్ లేక పేకాట ఆడుచుండుటను నేను చూచి యున్నాను. మరియు మనము దానిని చూచుచున్నాము. పాపులర్ సైన్సు - మెకానిక్సు అను పత్రికలలో అది ప్రచురింపబడి యున్నది. మనము ఆ కారును కలిగి యున్నాము. అది దూరము నుండే అదుపులో ఉంచబడుచున్నది (రిమోట్ కంట్రోల్) 'రాడర్' ద్వారా. దానిలో వారు స్టీరింగ్ వీల్ ఉండదు. మీరు టెలిఫోనులో నంబరు త్రిప్పు లాగున త్రిప్పిన యెడల, మీ కారు సరిగా అక్కడికే మిమ్ములను తీసికొని పోవును, ఏ ఆక్సిడెంట్ లేకుండ ఏ విధమైన తప్పిదములు లేక మిమ్ములను కొనిపోవును. ఆ అయస్కాంత శక్తి ఇతర కారులను, ఈ కారుతో తగలనీయకుండా తీసికొనిపోవును. దానిని వారు కలిగి యున్నారు. ఓ, మై! దానిని గురించి ఆలోచించుడి. అది నెరవేరుటకు ముప్పది సంవత్సరములకు మునుపే అది చెప్పబడినది.
110ఇప్పుడు, అటు పిమ్మట అధ్యక్షుడు కెన్నడిని ఎన్నుకొనుట యొద్దకు అది మనలను తీసికొని వచ్చుచున్నది, మరియు ఈ కారు దృశ్యములో వచ్చుచున్నది, చెప్పబడిన ఏడు కార్యములలో, ఐదు కార్యములు సరిగా ఖచ్చితముగా నెరవేరియున్నవి.
ఇప్పుడు, నేను ముందే జరుగబోవు కార్యమును చూచి చెప్పియున్నాను, ''నేను అందమైన, ఉదా రంగును పోలిన రాజరిక దుస్తులతో అలంకరించుకొనియున్న ఒక గొప్ప స్త్రీ నిలుచుకొనియుండుట చూచియున్నాను, మరియు దానిని గురించిన కొన్ని కార్యములు ఇక్కడ నా యొద్ద ఉన్నవి, ''ఆమె అమెరికా దేశమును పాలించు పాలకురాలు (అధికారి) గా ఉన్నది. అది ఒకవేళ కాథలిక్ సంఘము.'' ఒక స్త్రీ, ఏదో స్త్రీ… అది కాథలిక్ సంఘము అని నాకు తెలియదు. నాకు తెలియదు. నేను చెప్పలేను. నేను చూచినదంతయు, ఒక స్త్రీని నేను చూచి యున్నాను, అదంతే.
అయితే అది ఒక స్త్రీ యొక్క దేశము, ప్రవచన వలన ఈ దేశము పదుమూడు సంఖ్య కలిగియున్నది, ఆమె పదుమూడు గీతలు కలిగి యున్నది, పదుమూడు నక్షత్రములు, పదుమూడు కాలనీలు. పదుమూడు, పదుమూడు, ప్రతి యొక్కటియు పదుమూడు, ప్రకటన గ్రంథము పదుమూడులో ఆమె కనిపించుచున్నది. ఆమె పదుమూడు, మరియు ఆమె ఒక స్త్రీ యొక్క దేశము.
111ఇతర దేశముల కంటెను, అమెరికా దేశములో నున్న విడాకుల న్యాయ స్థానములలో అనేక విడాకులు మన స్త్రీలు తీసికొనుచున్నారు. మన దేశములో నీతితో కూడిన నడత చాలా తక్కువ స్థాయిలో ఉన్నది మరియు విడాకులు, ఫ్రెంచి లేక ఇటలీ దేశముల కన్నను అక్కడ వ్యభిచారము వీధులలో జరుగును… వారు వ్యభిచారులే, అయితే మన వివాహమైన స్త్రీలు ఇతర పురుషులతో జీవించుటకు ప్రయత్నించుచున్నారు, మరియు అనేక వివాహమైన అనేకమంది పురుషులు, ఇతర స్త్రీలతో జీవించుటకు ప్రయత్నించుచున్నారు.
బహుభార్యాత్వము గల దేశములలో, అది వెయ్యి రెట్లు మేలుగా ఉన్నది. అయినను బహు భార్యాత్వము తప్పు, మనకు తెలియును.
మనము ఎంత నీచ స్థాయికి దిగజారినామని, దానిని గురించి చెప్పబడిన ఒక పేపరు ముక్క, నా యొద్ద కలదు, దానిలో ఇట్లు చూపబడి యున్నది, పోయిన యుద్ధములో మన అమెరికా యవ్వనస్థులు దూర ప్రదేశములకు పోయినప్పుడు, నూటికి డెబ్బది శాతము అని నేను నమ్ముచున్నాను… సరి, ఇప్పుడొక నిమిషముండుడి, యుద్దము కొరకు దూర దేశములకు పోయిన ప్రతి యొక్క నలుగురిలో ముగ్గురి భార్యలు, వారు యుద్ధము నుండి తిరిగి వచ్చు లోపల వారికి విడాకులు ఇచ్చియుందురు. మరియు పెద్ద అక్షరములతో శీర్షిక వలే ఇట్లు చెప్పబడుచున్నది, "మన యొక్క అమెరికా ప్రజల యొక్క నీతికి ఏమి జరిగినది? ఆ విధముగా పెద్ద పెద్ద అక్షరములతో వ్రాయబడుట మీరు చూసినది మీకు జ్ఞాపకము లేదా? అది మీరందరు చదివియుందురని నేను అనుకొనుచున్నాను. మన అమెరికన్ స్త్రీల యొక్క నీతికి ఏమి సంభవించెను? యంత్రశాల లేక కర్మాగారములలో పురుషులతో వారు పని చేయుచున్నారు. ఇది ఒక స్త్రీల యొక్క దేశముగా ఉన్నది. ఆమె ఏమి పొందబోవుచున్నది? ఒక ఆడ దేవుడు - లేక ఒక దేవత.
112ఇప్పుడు అటు పిదప నేను తిరిగి మరియు చూచాను, మరియు ఈ అమెరికా దేశములోపలనే కాలిపోయి, రగులుకొని - రాళ్లు పైకి విసరబడుటను చూచాను. కట్టెలు కుప్పలుగా పేర్చబడి అవంతయు కాల్చబడిన ఎట్లుండునో, ఆ విధముగా అమెరికా దేశము మండుచుండును. నేను చూచినంత మట్టుకు ఆమె కాలిపోయు, బ్రద్దలై తునాతునకలై విసరబడెను. మరియు అటు పిదప ఆ దర్శనము నన్ను వదిలేను. ఐదులో మూడు నెరవేరెను - ఏడులో ఐదు నేరవేరినది.
మరియు ఇదంతయు తిరిగి వచ్చి అది చూపించునదేమనగా, మరప్పుడు నేను ముందే చెప్పియుంటిని… అది ప్రభువు చెప్పినాడని నేనెప్పుడు చెప్పలేదు, అయితే ఆ ఉదయము ఆలయములో నిలుచుకొని, నేను చెప్పాను, "ఇదంతయు అభివృద్ధి చెందుట…" నేను గోడ వారగా అటు ఇటు తిరుగుచు మరియు నేను చెప్పాను, ''వేగముగా అభివృద్ధి చెందుచు పోవుట చూడగా, నేను అనుకోనుచున్నాను - "నేను ఎందులకు దీనిని చెప్పుచున్నానో నాకు తెలీయుట లేదు - అయితే నేను ముందుగా చెప్పిన కార్యములన్నియును ఇప్పుడు సంభవించుచున్న కార్యములను చూడగా 1933 మరి 1977 మధ్య అన్నియును నేరవేరును. దేవుడు నా హృదయమును దేవుడు ఎరిగియున్నాడు. నేనెరుగను, నిన్నటి దినము వరకు నాకు తెలియదు, 1977వ సంవత్సరము జూబిలీ యూదులకు ఇచ్చిన అదే కాల పరిమితిని మరన్నిటిని చివరలో. కావున మనము… మరిక్కడ మనము కాలము యొక్క చివర, డెబ్బదియవ వారము వచ్చునప్పుడు ఉన్నాము. సంఘము ఎప్పుడు ఎత్తబడి పైకి పోవునో మనకు తెలియదు. ఓ, మై! మనమేమి చేయగలము స్నేహితులారా? మనమెక్కడ యున్నాము?
REV 6:1,2,8•
REV 7:4•
REV 9:12•
REV 16:1,13
113ఇప్పుడు మనమెక్కడ యున్నామో మీరు చూచుచున్నారా? దానియేలు యొక్క డెబ్బదియవ వారమును ఇప్పుడు మీరు అర్థము చేసికొనియున్నారా? ఇప్పుడు చూడుడి, మనము ఈ ముద్రలు మరియు ఆ కార్యములకు పోయిన యెడల, ఈ ముద్రలు విరచి చూచిన, మొదట వచ్చునది ఒక తెల్ల గుర్రముపై సవారి చేయునతను, అతని చేతిలో ఒక విల్లు ఉండును. అతడెవరని గమనించి చూడుడి. పిదప పాండుర వర్ణము గల గుర్రము అతని తరువాత సవారి చేయుటను గమనించుడి. చూశారా? అతడు ఎవరని గమనించుడి, మరియు అతడెట్లున్నాడని చూడుడి. ఆ 1,44,000 మంది లోనికి వచ్చుటను గమనించుడి. ఆ బుద్ధిలేని నిద్రించు కన్యలను గమనించుడి. అప్పుడు ఈ కార్యములన్నియును నెరవేరుట చూడుడి, పాత్రలలోనిది పోయబడుటను, శ్రమలను, కప్పలవలే ఆ మూడు అపవిత్రాత్మలు, ఆ కార్యములన్నియు ఏ విధముగా సరిగా ఒక దానితో ఒకటి జతపరచబడి నేరవేరుచున్నవో చూడుడి, ఆ తెగుళ్ళు మరలి సరిగా ఎప్పుడు పోయబడునో గురించి. ఒక ముద్ర విప్పబడునప్పుడెల్లను, ఒక తెగులు పోయబడి మరియు నాశనము వచ్చును. మరియు ఇప్పుడు మనమున్న ఈ అంతములో ఏమి జరుగుచున్నదో గమనించుడి.
DAN 9:27•
REV 11:3
114మరియు, ఓ, ఈ ముగ్గురు ప్రవక్తలను గమనించుడి - లేక ఈ ఇద్దరు ప్రవక్తలను, వారక్కడ లేచినప్పుడు మరియు వారు వారము మధ్యలో చంపబడినప్పుడు మరప్పుడు హార్‌మెగిద్దోను యుద్ధము మొదలిడును, అప్పుడు దేవుడు తానే (ఆయనే) మాటలాడుటకు ప్రారంభించును. అప్పుడు ఆయన లేచి యుద్ధము చేయుటకు తొడగును. వారు భూమిని కొట్టెదరు. వారు యేసుక్రీస్తు నామమును ప్రకటింతురు. అదే మార్గములో వారు బాప్తిస్మము ఇచ్చెదరు. ఆది పెంతెకోస్తు తండ్రులు (పితరులు) ఏమి చేశారో, వారు అదే చేయుదురు, మరియు అనేకులు వారిని అనుసరించెదరు. అయితే ఆ సంఘశాఖలన్నియు ఒక్కటిగా చేరి సమాఖ్ఐయగా నుండి వారి కార్యములను ఇంకా కొనసాగించుచునే యుందురు. మరియు ఆ యొక్క ప్రవక్తల యొక్క శక్తి కూడ వారిని నిలుపలేక పోయినది. మరియు చివరగా వారు చెప్పెదరు, ''మన మందరము ఒకే ఒక గొప్పగా స్థాపింపబడిన సంఘ శాఖగా చేసెదము,'' మరియు అతడు హేయమైనది, లోనికి తీసికొని వచ్చును (అదేమిటి?) అదే రోమీయుల యొక్క సిద్ధాంతములను, కార్యములను అన్ని చోట్లలో వ్యాపింపజేసి, తద్వారా నాశనము చేయును. అన్ని కార్యములలోను నాశనము చేయు హేయ వస్తువు ఉండును, అది అసహ్యమైనది.
REV 17:3,4
115మీకు గుర్తున్నదా, యేడు తలలును, పది కొమ్ములును గల ఆ ఎర్రని మృగము మీద కూర్చొనియున్న ఆ పాత తల్లి వేశ్య, దానిని మీరు గుర్తుంచుకొని యున్నారా? మరియు ఆమె తన చేతిలో అపవిత్రతో కూడిన తన ఏహ్యమైన కార్యములతో నిండిన ఒక పాత్రను పట్టుకొనియుండెను. జనులకు ఆమె ఇచ్చిన బోధనలు అవే. నా సహోదరులారా, అక్కడనే మనము ఆ మర్మమును చూడవలసినవారమై యున్నాము. మనము చివరి కాలములో ఉన్నాము.
చిన్న బిడ్డలారా, మనకు తెలియదు. ఈ రాత్రి తిరిగి వచ్చు వరకు మనకు జీవముతో ఉండదేమో, ఒకరినొకరు తిరిగి చూచుటకు మనము ప్రాణముతో ఉండక పోవచ్చును. నాకు తెలియదు. అయితే ముగింపు చాలా దగ్గరలో ఉన్నది. ముగింపు చాలా సమీపముగా ఉన్నది. ఇక్కడొక లేఖన వాక్యమున్నది. అక్కడ అది లేఖనముల ఆధారముతో సంపూర్ణమైనదిగా యున్నది.
ఇప్పుడు, మీరు అర్థము చేసికొనని కార్యములు ఏవైన ఉన్నయెడల, నాకు వ్రాసి దానిని గురించి నాకు తెలియపరచుడి. ఇతర ప్రదేశములలో టేపుల ద్వారా వినుచున్న వారలారా, నేను ఏ కార్యములోనైనను మీకు సహాయపడగోరినయెడల, నాకు తెలియపరచుడి. నాతో మీరు అంగీకరింపగపోవచ్చును. నేను మీ యొక్క సంఘ శాఖలతో అంగీకరింపక పోవచ్చును, మీతో కాదు - అయితే మీ సంఘశాఖల యొక్క విధానములతో నేను ఏకీభవింపక పోవచ్చును. కాతోలిక్కు జనులతో కూడ నేను అంగీకరించకుండ ఉండుట లేదు. నేను కాతోలిక్కునులను ప్రేమించుట లేదు అని, సంఘశాఖల జనులను ప్రేమించుట లేదు అని నేను చెప్పుట లేదు. అక్కడున్న కార్యము అది కాదు. నేను అందరిని కాతోలిక్కులను సంఘశాఖలో ఉన్న ప్రజలను ప్రేమించుచున్నాను. అయితే మిమ్ములను కట్టవేయు ఆ సంఘశాఖ క్రమమును లేక పద్ధతిని నేను ఇష్టపడుట లేదు. అదే వాటిలో నున్న పద్ధతులు. అది అంతే.
116జర్మనీకి నేను వ్యతిరేకముగా లేను. నాజిజమ్ సిద్ధాంతములకు వ్యతిరేకిని. ఇటలీయులకు నేను వ్యతిరేకిని కాను, ఫాసిసమ్ సిద్ధాంతములకు వ్యతిరేకిని. మరి గుర్తుంచుకొనుడి, ఆ కాలములో నేను ఇంకొక కార్యము, జరుగబోవు దానిని ముందుగా చెప్పియున్నాను - అది భవిష్యత్తును గురించి చెప్పియున్నాను, మరియు దానిని మీలో ఉన్న అనేక పాత విశ్వాసులు గుర్తుంచుకొని యున్నారు. నేను చెప్పాను, ఈ రోజు మూడు గొప్ప "ఇజమ్స్" (సిద్ధాంతములు) ప్రపంచమును కైవశపరచు కొనవలెనని యున్నవి, అవి "ఫాసిసమ్, నాజిసమ్, మరియు కమ్యూనిజమ్.'' మరియు వాటిని గురించి నేనేమి చెప్పియున్నాను? అవన్నియు కమ్యూనిజమ్ లో పోయి చివరకు కమ్యూనిజమ్ ఒక్కటే నిలుచును.
అటు పిదప అప్పుడు మిమ్ములనందరిని నాతో కూడా చేరి మరల చెప్పమనియున్నాను, "రష్యాపై మీ దృష్టి నుంచుడి.'' అది మీకు గుర్తున్నదా? "మీ దృష్టి రష్యాపై నుంచుడి," దాని సిద్ధాంతములన్నియు కమ్యూనిజమ్ తో ముగియును. మరి అటు పిదప అదంతయును చివరికి కాథోలిజమ్ లో ముగియును. గుర్తుంచుకొనుడి, చివరి కాలములో అదంతయు కాథోలిజమ్ లో ముగియును, అది ఖచ్చితముగా సరియే, అట్లే జరుగును. అప్పుడిక్కడ క్రీస్తు తానే వచ్చునప్పుడు, అది హార్‌మెగిద్దోను యుద్దము.
REV 11:3,7,8
117అయితే ఈ ముగ్గురు ప్రవక్తలు… చెప్పవలయుననిన ఈ మూడున్నర సంవత్సరములు, మరియు ప్రకటన గ్రంథము 11:3లో అది (దానిని మీరు అనేకమార్లు చదివియున్నారు), "నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను, మరియు వారు వెయ్యిన్ని-రెండు-వందల-అరువది-దినములు ప్రవచింతురు." అవెన్ని రోజులు. వెయ్యిన్ని రెండు వందల అరవై దినములేనా? మూడు మరియు అర్ధ సంవత్సరములు. మరియు ఈ యొక్క డెబ్బదియవ వారములో వీధులలో వారు చంపబడెదరు. కావున దానియేలు యొక్క డెబ్బది వారములు ఇక్కడ అని మీరు చూచుచున్నారా? నా యొక్క ప్రియ స్నేహితులారా, మనము చివరి కాలములో ఉన్నాము. మనము ముగింపు కాలములో ఉన్నాము. దినములు…
రాజ్యములు బ్రద్దలగుచున్నవి;
ఇశ్రాయేలు మేలుకొనుచున్నది,
ప్రవక్తల ద్వారా ముందుగానే చెప్పబడిన సూచనలు
(ఇక్కడ ఆ కాలములో మనమున్నాము!)
అన్యజనుల దినములు లెక్కింపబడుచున్నవి.
భయంకరమైన కార్యములు తొందర పెట్టుచుండగా
ఓ, చెదరిపోయిన వారలారా,
మీ యొక్క సొంత దేశమునకు తిరుగుడి.
మనము పాడెదము:
విమోచన దినము సమీపించుచున్నది,
భయము వలన మనుష్యుల హృదయము సోలిపోవుచున్నది
ఆత్మతో నింపబడుడి,
ఓ, మై! అది అద్భుతముగా ఉన్నది కదూ?
రాజ్యములు పడద్రోయబడుచున్నవి
ఇశ్రాయేలు మేలుకొను చున్నది,
ప్రవక్తల ద్వారా ముందుగానే చెప్పబడిన సూచనలు
అన్యజనుల దినములు లెక్కింపబడుచున్నవి.
భయంకరమైన కార్యములు తొందర పెట్టుచుండగా
ఓ చెదరిపోయిన వారలారా,
మీ యొక్క సొంత దేశమునకు తిరుగుడి.
ఇప్పుడు అందరు కలసి.
విమోచన దినము సమీపించుచున్నది,
భయము వలన మనుష్యుల హృదయము సోలిపోవుచున్నది
ఆత్మతో నింపబడుడి,
మీ దీపము చక్కబరచి తేటగా ఉండనిమ్ము పైకి చూడుడి,
మీ యొక్క విమోచన సమీపముగా ఉన్నది.
ఒక చిన్న చరణమును మీ కొరకు నన్ను పాడనిమ్ము.
తప్పైన ప్రవక్తలు అబద్ధము లాడుచున్నారు.
దేవుని సత్యమును వారు కాదనుచున్నారు
యేసుక్రీస్తు మన దేవుడు
(వారు ఒక మూడవ వ్యక్తిని చేయుచున్నారు.
మీకది తెలుసునా!
అయితే ఆయన మూడు వ్యక్తులలో ఒకరు కాదు.
ఆయనే మన దేవుడు.)
అయితే అపోస్తలులు అడుగు జాడలలో మనము నడిచెదము
ఏలయనగా విమోచన దినము సమీపించుచున్నది
భయము వలన మనుష్యుల హృదయము సోలిపోవుచున్నది
ఆత్మతో నింపబడుడి,
మీ దీపములు చక్కబరచి తేటగా ఉండనిమ్ము;
పైకి చూడుడి, మీ యొక్క విమోచన సమీపముగా ఉన్నది.
GAL 1:8
118మీరు సంతోషముగా లేరా? వర్తమానమునకు తిరిగి రండి సహోదరుడా! ఆది ఉపదేశములకు మరలండి, తిరిగి పెంతెకోస్తునకు. నిజమైన ఆశీర్వాదమునకై తిరిగి రండి! మరల యేసుక్రీస్తు నామమునకు, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము యొద్దకు తిరిగి రండి, సూచనలకు మరియు అద్భుతములకు తిరిగి రండి, తిరిగి రండి పెంతెకోస్తునకు! సంఘ శాఖలను విడిచిపెట్టుడి! పరిశుద్ధాత్మ యొద్దకు. తిరిగి రండి! ఆయనే మన బోధకుడు.
విమోచన దీనము సమీపించు చున్నది,
భయము వలన మనుష్యుల హృదయము సోలిపోవుచున్నది
ఆత్మతో నింపబడుడి,
మీ దీపము చక్కబరచి తేటగా ఉండనిమ్ము
పైకి చూడుడి, మీ యొక్క విమోచన సమీపముగా ఉన్నది.
అది అద్భుతముగా లేదా? ప్రవక్త ఏమి చెప్పెను? ఒక కాలము వచ్చును. అది రాత్రియా లేక పగలా అని మీరు చెప్పలేరు. అదెట్లున్నదని చూడుడి, చూశారా. ఓ, ఈ సంఘ కాలములలో అది చాలా మోసముగా ఉండెను, అయితే అది…
సాయంకాలపు వేళలో వెలుగుండును.
మహిమకు దారి మీరు నిశ్చయముగా కనుగొనెదరు.
ఈ రోజు నీటి మార్గములో వెలుగు కలదు
అమూల్యమైన యేసు నామములో పాతి పెట్టుబడుడి.
పిన్నలారా, పెద్దలారా
మీ యొక్క పాపములన్నింటికి మారుమనస్సు పొందుడి
పరిశుద్దాత్మ నిశ్చయముగా మీలోనికి వచ్చును.
ఏలయనగా ఈ సాయంకాలపు వెలుగు వచ్చియున్నది
దేవుడు మరియు క్రీస్తు ఒక్కడే అనునది సత్యము.
సాయంకాలం వేళలో వెలుగుండును
(అందరు కలసి)
మహిమకు దారి మీరు నిశ్చయముగా కనుగొనెదరు.
ఈ రోజు నీటి మార్గములో వెలుగు కలదు
అమూల్యమైన యేసు నామములో పాతి పెట్టుబడుడి.
పిన్నలారా, పెద్దలారా
మీ యొక్క పాపములన్నింటికి మారుమనస్సు పొందుడి
పరిశుద్దాత్మ నిశ్చయముగా మీలోనికి వచ్చును.
ఏలయనగా ఈ సాయంకాలపు వెలుగు వచ్చియున్నది
దేవుడు మరియు క్రీస్తు ఒక్కడే అనునది సత్యము.
(ముగ్గురు కాదు అయితే ఒక్కడే)
గలతీ 1:8
119వర్తమానమునకు తిరిగి రండి! తిరిగి ఆరంభమునకు మరలండి! పౌలు ఏమి ప్రసంగించెనో దాని యొద్దకే తిరిగి రండి. అతడు దేనితో బాప్తిస్మము పొందెనో, అదే బాప్తిస్మమునకు తిరిగి రండి! తప్పైన మార్గములో జనులు బాప్తిస్మము పొందుటను అతను చూచినప్పుడు, సరైన మార్గములో మరల బాప్తిస్మము పొందుడని అతను వారికి చెప్పెను. ఒకవేళ పరలోకము నుండి ఒక దూత వచ్చి మరియొక సువార్తను ప్రకటించినయెడల, అతడు శాపగ్రస్తుడవును గాక అని పౌలు చెప్పెను, కావున, స్నేహితులారా, అది మరల వర్తమానమునకు త్రిప్పుట అగును! ఇది సాయంకాలపు సమయము.
ఓ, ఆయనను నేను అధికముగా ప్రేమించుచున్నాను, మీరు ప్రేమించుట లేదా? ఇప్పుడు ఎందరు దానియేలు యొక్క డెబ్బది వారములు మరియు ఈ డెబ్బదియవ వారము ఏమిటి అని చూచియున్నారు. దానిని ఎందరు నమ్ముచున్నారో "ఆమెన్" చెప్పుడి. దేవునికి స్తోత్రములు.
120ఇప్పుడు, తదుపరి కార్యమేమిటి? ఇప్పుడు ఏడు ముద్రలు. ప్రభువు అనుమతించిన వెంటనే వాటిపై ధ్యానించెదము. అదెప్పుడని నాకు తెలియదు. ఆయన ఎప్పుడు అనుగ్రహించునో అప్పుడు దానిలోనికి మనము పోయెదము. అప్పుడు ఏడు ముద్రలు ధ్యానించునప్పుడు మనకు దీర్ఘమైన, పెద్ద కూటములుండును, ఏలయనగా మనము ప్రకటన గ్రంథము 6వ వచనము మొదలుకొని 19వ వచనము వరకు తీసికొని ధ్యానించబోవుచున్నాము. మరియు దానితో ఎంత మెల్లగా నేను పోవలయునో అంత మెల్లగా…
ఇప్పుడు, దీనిని ఎవరును తప్పుగా అర్థము చేసికొని బయటకు వెళ్లవలెనని నేను కోరుట లేదు. దీనిని ఎవరును తప్పుగా అర్థము చేసికొనవలెనని నేను కోరుట లేదు. ''యేసు 1977లో వచ్చెదరని సోదరుడు బ్రెన్హాం చెప్పినారు,'' అని ఇప్పుడు తప్పుగా అర్థము చేసికొనవద్దు. అటువంటి కార్యము నేనెప్పుడు చెప్పలేదు. యేసు ఈ రోజు రావచ్చును. అయితే నేను దర్శనములో చూచిన జరుగనైయున్న కార్యములు 1933, 1977వ సంవత్సరములకు మధ్య సంభవించునని, ఏదో ఒక కార్యము జరుగునని నేను ముందుగానే చెప్పియున్నాను. మరి వాటిలో అయిదు ఇదివరకే సంభవించియున్నది.
121మరియు ఇప్పుడు మన యొద్ద నున్న అణుశక్తి కార్యములతో నేను నమ్ముచున్నాను… మరియు మన దేశాధ్యక్షుడు ఏమి చెప్పెనో గమనించితిరా? ఇంకొక యుద్ధము రావలయునని కోరుచున్నాడు. బెర్లిన్ ను (జర్మనీలో ఒక నగరము) తీసికొని దానిలో నుండి ఒక ఉదాహరణగా తీసికొనవలెనని ఆయన కోరునట్లు అతను చెప్పెను. ఒక ఉదాహరణగా ఏర్పరచవలెనని కోరెను. మన వెనుక ఉన్న క్యూబా గురించి ఏమి? దాని నుండి దేనికి ఒక ఉదాహరణను ఏర్పరచుకొనవలెను? దాని గురించి ఏమి? ఓ, అటువంటి మాటలు బుద్ధిలేనివిగా ఉన్నవి! చూశారా?
ఓ, సహోదరులారా, మనము సరిగా చివరి కాలములో ఉన్నాము. దేవుడు ఎట్లు చెప్పినా అదే విధముగానే అది సంభవింపబోవుచున్నది. కావున ఆయనేమి చెప్పెనో అది చదివి, సరి చేసుకొని, దాని కొరకు సిద్దపరచుకొని, అది రానిమ్ము అని ఈ విధముగా ఉండుట వదలి వేరే ఏదో కార్యము చేయుటలో ఏమి ప్రయోజనమున్నది! మనము దాని కొరకే కాచుకొని యున్నాము.
ఆ ఆనందమైన వెయ్యేండ్ల పరిపాలన దినము
వచ్చుటను మనము కాచుకొని గమనించుచున్నాము,
అప్పుడు మన ఆశీర్వదింపబడిన ప్రభువు వచ్చి
మరియు కాచుకొనియున్న ఆయన వధువును తీసికొనిపోవును,
ఓ, భూమి మూలుగుచున్నది, మొర్ర పెట్టుచున్నది,
ఆ యొక్క మధురమైన విమోచన దినము కొరకు,
అప్పుడు మన రక్షకుడు మరల భూమికి తిరిగి వచ్చును.
ఓ, మన ప్రభువు భూమికి మరల వచ్చుచున్నాడు
అవును, మన ప్రభువు భూమికి మరల వచ్చుచున్నాడు.
ఓ, సాతానుడు ఒక వెయ్యేండ్లు బంధింపబడును.
యేసు మరల భూమికి తిరిగి వచ్చినప్పుడు
అప్పుడు మనకు శోధకుడు ఉండడు,
ఎందరు సిద్ధముగా ఉన్నారు,
మీ చేతులను పైకితుడి, ఓ, మై!
ఓ, మన ప్రభువు మరల భూమికి వచ్చును
(మనము లేచి నిలువబడి ఒకరి చేతులను ఒకరికి ఇచ్చి కరచాలనము చేసెదము!)
మన ప్రభువు భూమికి మరల వచ్చును.
ఓ, సాతాను ఒక వెయ్యేండ్లు బంధింపబడును.
యేసు మరల భూమికి తిరిగి వచ్చినప్పుడు
అప్పుడు మనకు శోధకుడు ఉండడు,
ఓ, మన ప్రభువు మరల భూమికి వచ్చుచున్నాడు
అవును, మన ప్రభువు భూమికి మరల వచ్చుచున్నాడు
ఓ, సాతాను ఒక వెయ్యేండ్లు బంధింపబడును
యేసు మరల భూమికి తిరిగి వచ్చినప్పుడు
అప్పుడు మనకు శోధకుడు ఉండడు.
యేసు తిరిగి వచ్చుట
మనయొక్క దుఃఖమునకు, మొరలకు జవాబైయున్నది
ప్రభువును గురించిన జ్ఞానము
భూమిని, సముద్రము మరి ఆకాశమును నింపును
దేవుడు సకల వ్యాధులను తీసివేయును
మరియు కన్నీరు, కష్టములు తీరిపోవును
యేసు మరల భూమికి తిరిగి వచ్చినప్పుడు
ఓ, మన ప్రభువు మరల భూమికి వచ్చుచున్నాడు
అవును, మన ప్రభువు భూమికి మరల వచ్చుచున్నాడు
ఓ, సాతాను ఒక వెయ్యేండ్లు బంధింపబడును
యేసు మరల భూమికి తిరిగి వచ్చినప్పుడు
అప్పుడు మనకు శోధకుడు ఉండడు.
MATT 10:22•
MARK 13:13•
GAL 6:9
122ఓ, మై! మీరు మంచి అనుభూతి పొందుట లేదా? యోచించుడి, స్నేహీతులారా, ఇది పెంతెకోస్తు ఆరాధన. ఇది పెంతెకోస్తు. మనము మన చేతులు తట్టి మరి దానిని పాడెదము. పెంతెకోస్తు జనులారా, అందరును పాత మెథడిస్ట్ సాంప్రదాయములను మీ యొద్ద నుండి పారద్రోలుడి, స్వతంత్రులుగా ఆరాధించుడి. ఇప్పుడు రండి, దానిని మనము పాడెదము.
ఓ, మన ప్రభువు మరల భూమికి వచ్చుచున్నాడు
అవును, మన ప్రభువు భూమికి మరల వచ్చుచున్నాడు
ఓ, సాతాను ఒక వెయ్యేండ్లు బంధింపబడును
యేసు మరల భూమికి తిరిగి వచ్చినపుడు
అప్పుడు మనకు శోధకుడు ఉండడు.
ఓ, మన ప్రభువు మరల భూమికి వచ్చుచున్నాడు
(బైబిలు ఆ విధముగా చెప్పుచున్నది!)
అవును, మన ప్రభువు భూమికి మరల వచ్చుచున్నాడు
ఓ, సాతాను ఒక వెయ్యేండ్లు బంధింపబడును
యేసు మరల భూమికి తిరిగి వచ్చినపుడు
అప్పుడు మనకు శోధకుడు ఉండడు.
ఆయనను మీరు ప్రేమించుచున్నారా? ఓ, ఇప్పుడు ఆయన తట్టు మన చేతులను పైకెత్తెదము.
నేను ఆయనను ప్రేమించుచున్నాను,
నేను ఆయనను ప్రేమించుచున్నాను,
ఏలయనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను,
మరియు నా రక్షణను కొనెను
కల్వరి వృక్షము పై
నేను ఆయనను ప్రేమించుచున్నాను,
నేను ఆయనను ప్రేమించుచున్నాను,
ఏలయనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను,
మరియు నా రక్షణను కొనెను.
కల్వరి వృక్షముపై.
[భాషలు మరియు అనువాదము: "అవును, నేను, దేవుని వలన, ఆత్మ ద్వారా ఈ దినాన మీతో మాట్లాడును. నేను చెప్పునది ఏమనగా, నేను నా ప్రవక్తను ఈ రాజ్యముల గుండా పంపియున్నాను. నేను చెప్పుచున్నాను, ఈ దినాన అతడు ద్వారముల నుండి లోనికి ప్రవేశించెను, నేను ప్రత్యెకమైన విధముగా అతడిని అభిషేకించియున్నాను. నేను చెప్పుచున్నాను, నా యొక్క జ్ఞానమును అతడిపై పెట్టియున్నాను. అవును, పూర్వకాలపు ప్రవక్తలు కలిగియున్న జ్ఞానము. మరియు నేను చెప్పుచున్నాను, యుగముల నుండి దాచబడిన మర్మముల గుర్చిన గొప్ప వెలుగును నేను అతనికి ఇచ్చియున్నాను. నేను చెప్పుచున్నాను, ఈ దినాన ఉన్నటువంటి ప్రియమైన పిల్లలారా, ఈ దినాన మీ కొరకు నేను తెచ్చిన మాటలను మీరు విన్నయెడల, మీ యొక్క గ్రహింపు ఫలభరితముగా ఉండును, మరియు నా శక్తియందు మీరు బలముగా అభివృద్ధి చెందుదురు, మరియు నా వాక్య ప్రత్యక్షతలో మరియు నా యొక్క ఆత్మ ద్వారా నడచుట ఏమిటో మీరు తెలుసుకొందురు, ఎందుకనగా నేను చెప్పుచున్నాను - నేను మీ మధ్యలో నడచెదను, మరియు మీ కొరకు గొప్ప కార్యములను చేయుదును. నేను చెప్పుచున్నాను, పెండ్లివిందు సిద్దపరచబడియున్నది. మరియు నేను చెప్పుచున్నాను, నా యొక్క జనులను నా యొద్దకు, గృహమునకు పిలువబడు ఆ ఘడియ ఎంతో త్వరగా రాబోవుచున్నది. మరియు నేను మీకు చెప్పుచున్నాను, ఈ దినాన ఉన్న నా అతి ప్రియమైన పిల్లలారా, మేలైనది చేయుటకు అలసిపోకుడి; ఎందుకనగా నేను చెప్పుచున్నాను, అంతము వరకు సహించినవాడే, వాడే రక్షింపబడును. మరియు నీవు నా యెదుట తెల్లని వస్త్రములను ధరించుకొని నిలచియుందువు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు."]