విశ్వాసము
VGR COUNT-78 1… నీ పునరుత్దాన శక్తిని నీయంతట నీలోనే ఆత్మలో నీవు కలిగియున్నావు. యేసు సిలువయందు మరణించినపుడు, "ఆయన ఆత్మ పాతాళమునకు వెళ్ళి, అచ్చట నోవాహు యొక్క దినములో దీర్ఘకాలముగా మారుమనస్సు పొందని, చెరశాలలోనున్న ఆత్మల యొద్దకు వెళ్లి ప్రసంగించెను," అని మనము ఎరుగుదుము. ఆయన శరీరము సమాధిలోనికి వెళ్లినది. కాని, ఆయన చనిపోక ముందు, ఆయన తన ఆత్మను దేవుని చేతికి అప్పగించెను. "నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను." కాబట్టి, మీరు గమనించండి, ఆయన ఆత్మ దేవుని యొద్దకు వెళ్లినది. ఆయన ప్రాణము పాతాళమునకు వెళ్లినది, మరియు ఆయన శరీరము సమాధిలోనికి వెళ్లినది.
ఇపుడు, ఆయనలో యున్న ఆ ఆత్మ దేవుని యొక్క ఆత్మగా యున్నది. పూర్వకాలమందు నానా సమయములలోను, నానా విధములుగాను, ప్రవక్తల ద్వారా, ఈ అంత్యదినములయందు క్రీస్తు ద్వారా, ఇప్పుడు ఇచ్చట ఈ దినములలో సువార్త ద్వారా, జనులకు వాక్యమును తీసుకొని వచ్చుచుండెను.
MATT 12:40•
LUKE 24:7•
JOHN 10:18
2ఇప్పుడు మనకు కావలసినది ఏదనగా క్రీస్తును మన హృదయమునందు స్వీకరించుటయే — అక్కడే నిత్యజీవమున్నది.
ఇప్పుడు, క్రీస్తు మూడు దినములు పూర్తియగువరకు మరల తిరిగి రాలేడు, ఎందుకనగా ఒక అడుకట్ట వంటి ఒక తెర వెనుక ఆయన ఆత్మ గలదు. ఆ అడ్డు తెరను దాటీ ఆయన రాలేడు, ఎందుకనగా అది దేవుడు పలికిన మాటగా యున్నది. ఆయన "మూడు పగలు మరియు మూడు రాత్రులు సమాధిలో ఉండవలయును." ఇప్పుడు మూడు పగలు, మరియు మూడు రాత్రులు పూర్తియగువరకు ఆయన తిరిగి రాలేదు. ఆ మూడు పగలు మరియు మూడు రాత్రులు గతించిపోయిన తరువాత, ఆయన యొక్క ఆత్మ విడువబడును. అది తిన్నగా ఆయన ప్రాణములో ప్రవేశించెను, మరియు ఆ ప్రాణము వచ్చి శరీరమును తీసుకొనెను మరియు "నా శరీరమును విడుచుటకు నాకు శక్తి గలదు మరియు దానిని తిరిగి లేపుట నాకు అధికారము గలదు," అని ఆయన చెప్పినది నెరవేరినది.
REV 6:9
3ఇపుడు, ప్రతీ ఒక్కరిలోను అదే విధమైన శక్తి గలదు, ఎందుకనగా మీరు దేవుని కుమారులును మరియు కుమార్తెలై యున్నారు. ఈ ఉదయకాలమందు అదే ఆత్మ నీలో యున్నది. ఈ ఉదయకాలమందు పరిశుద్దాత్మ నీలో గలదు. అదే పరిశుద్ధాత్మ నిన్ను పైకి లేపగలదు. కాబట్టి నిన్నునీవు పైకి లేపుకొనుటకు కావలసిన శక్తి నీలోనే యున్నది.
మీరు మరణించునపుడు, మీ యొక్క ఆత్మ తిన్నగా దేవుని యొక్క సన్నిధికి చేరదు. అది దేవుని యొక్క బలిపీఠము క్రిందకు వెళ్ళును. ఇప్పుడు, నీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళును, కాని మీరు మరలా తిరిగి రాలేరు. గుర్తించుకోండి, పరిశుద్ధ గ్రంధములో చెప్పిన విధముగా, "ఎంతకాలము ప్రభువా, ఇంకా ఎంతకాలము వరుకు?" అని బలిపీఠము క్రింద యుండు ఆ ఆత్మలు కేకలు వేయుచునవి. పరిశుద్ధ గ్రంధములోని లేఖనములు సంపూర్తియగువరుకు క్రీస్తు ఏ విధముగా మరలా తిరిగి రాలేకపోయెనో, ఆ విధముగానే లేఖనములు సంపూర్తియగు వరుకు ఆ ఆత్మలు కూడా తిరిగి రాలేవు. పిదప, సమస్తము సంభవించిన తరువాత, సమస్త శ్రమలు ముగించిన పిదప, సహోదరులు అదే విధముగా శ్రమలను పొందెను, లేదా వారు శ్రమలను పొందినట్లు మనము శ్రమలను పొందితిమి, మరియు ఆలాగు, ఆ దినమున… ఖచ్చితముగా నీవు ఎచట సమాధి చేయబడితివో, ఆ స్థలమును నీవు తెలుసుకుందువు. నీ ఆత్మ దేవుని యొద్ద నుండి విడువబడి, నీ ప్రాణము యొద్దుకు వచ్చును.
2COR 5:1
4ఇప్పుడు, ఎరుగుటయందును మరియు గ్రహించుటయందును, తెలివియందును ఆ ప్రాణము నాలో భాగముగా యునది. కొద్ది కాలము క్రితము నేను, చూచిన దర్శనము లేదా తెరకు అవతలి గట్టు యందు చూచిన ఆ స్థలమును, జనులను గూర్చి మీకు జ్ఞాపకము యున్నదా? ఇప్పుడు, నీ ఆత్మ ఆ శరీరము యొద్దకు తిరిగి వచ్చును. అది ఏ విధమైన శరీరమనగా… దానికి తినుట మరియు ఏ ఇతర కార్యములు చేయవలసిన అవసరములేని శరీరముగా అది యుండును. "భూసంబంధమైన మన గూడారమైన ఈ నివాసము శిధిలమైపోయినను, చేతిపని కాక, దేవుని చేత కట్టబడినదియు, మన నివాసము ముందుగానే సిద్దపరచబడియునది — పరలోక సంబంధమైన శరీరము; ఈ ఆత్మతో మరియు ఆ ప్రాణముతోను, మరియు పరలోక సంబంధమైన శరీరముతోను, ఆ గొప్ప వెయ్యేండ్ల పాలన కొరకు నీ స్వాభావికమైన శరీరము నుండి నీవు పైకి లేచెదవు. దానిని చేయుటకు ఇప్పుడే ఆ శక్తిని నీలో కలిగియున్నావు.
ఇప్పుడు, నీవు కలిగియున్న ఆ శక్తి ఒక క్రొత్త ప్రపంచమును సృష్టించగలదు. దేవుని యొద్ద స్వలమైన, బలహీనమైన భాగములు మరియు పెద్ద, శక్తివంతమైన భాగములు అనేవి లేవు. సర్వశక్తిమంతుడైన దేవునిని కేవలము సాధారణముగా తాకితే చాలును, చూచారా, ఎంతో సామాన్య రీతిలో ఆ దేవునిని నీవు తాకితే చాలును.
కాబట్టి, నీకు తెలుసు (నేనిప్పుడు విశ్వాసమునకు మిమ్మిలి తీసుకొనువచ్చుటకు ప్రయతీంచుచున్నాను.)
5ఒక క్రైస్తవునిగా మీలో ఏదో ఒకటి సంభవించినదనే దానిని మీరు ఎరుగగలరు. మీరు దానిని ఎరుగుదురా? నీవు ఇచ్చట పెంట కుప్పలో పడియుంటివి, త్రాగటము, జూదము మరియు సమస్త లోకమనే పాపపు పెంటలో పడియుంటివి. నీ సమస్త పాపములను యేసుక్రీస్తు క్షమించెనని నీవు నమ్మిన వెంటనే, నీవు ఆ పెంట కుప్పలో నుండి పైకి లేచితివి. ఇప్పుడు నీవు ఆ నీచమైన వాటన్నింటికంటే పైగా, ఎత్తున సవారి చేయుచున్నావు, చూచారా. ఎందుచేత? ఎందుకనగా, నీవు ఒక క్రైస్తవుడవని నీవు విశ్మసించితివి. పిదప యేసుక్రీస్తును నీవు అంగీకరించినపుడు, పరిశుద్ధాత్మ నీ యొద్దకు వచ్చినపుడు, అప్పుడు అటువంటి ఒక పాపపు జీవితమును దాటి ఉన్నతమైన ఎత్తుగా సవారి చేయుటకై పరిశుద్ధాత్మ నీకు ఆ శక్తినిచ్చుననే విశ్వాసమును నీవు కలిగియుంటివి. మంచిది, ఇప్పుడు, స్వస్టత పొందుటకు ఇంకొంత ఎత్తుకు సవారి చేయుటకు నీవు చేయవలసిన ఒకే కార్యము, నీవు ఇంకా ఎక్కువైన విశ్వాసమును కలిగియుండవలెను. కేవలము ముందుకు సాగుము, చూచారా, అక్కడే నీవున్నావు.
ఇప్పుడు, నీవు రోగిగా ఉండి మరియు నీవు ఒక క్రైస్తవుడవు కానియెడల, ఇప్పడే క్రైస్తవునిగా మారుము, కావున నీవు ఒక క్రైస్తవునిగా మారిన కారణముగా ఆ స్వస్తతా శక్తి నీలోకి వచ్చును. అది పాపము కంటే ఎత్తుగా ఉన్నత స్థితియందు ఉండుటకు నీకు విశ్వాసమును ఇచ్చును. అది నీకు విశ్వాసమును ఇచ్చును; మరియు ఈ జీవిత ప్రయాణమునకు నీకు కావలసిన సమస్తమును ఇప్పుడు నీలోనే ఉన్నది. నీవు చేయవలసిన ఒకే కార్యము, దేవునియందు విశ్వాసమును కలిగియుండుటయే. నీలో యున్న మంచి గుణములను పరిశుద్దాత్మ ద్వారా ముందుకు త్రోయుచు, వాటిని వెలుపలికి తీసుకొని వచ్చును. ఇప్పుడు మీరు స్పష్టముగా అర్ధము చేసుకున్నారా?
ACTS 16:18,26
6నిన్న రాతి బిల్లీ… నన్ను పిలిచి మరియు "ఈ ఉదయకాలమందు లోపలికి రండి, ప్రాముఖ్యముగా ఈ వారము మనకు ఆ ఏడు ముద్రలు ప్రసంగించుటకు కూటములు యుండును అని, తలంచుకొంటూ వచ్చిన ఒక వ్యక్తి కొరకు, అని చెప్పెను. వారు ఒక రోగియైన బిడ్డను తీసుకొని వచ్చారనుకుంటున్నాను. అయ్యా, ఇప్పుడు మీరిచ్చటయుండినయెడల, దానిని జ్ఞాపకముచేసుకోండి, ఆ బిడ్డ ఒక పసిబిడ్డగా యుండినయెడల, మీ విశ్వాసము ఆ శిశువు కొరకు క్రియ చేయవలసియున్నది.
కాని ఇప్పుడు నేను మరొక వాక్యమును తీసుకోవాలని అనుకుంటున్నాను, అది పరవాలేదు కదా. గుర్తుంచుకొనండి, ఇప్పుడు, సువార్తలలో — పదహారవ అధ్యాయము, అని నేను నమ్ముచున్నాను, అపోస్తులుల కార్యములు — పౌలు మరియు సిలా ఒక రాత్రి చేరసాలలో యుండెను; సోది చెప్పుచున్న ఒక బాలికలోయున దయ్యపు ఆత్మను వారు తరిమివేసినందుకై వారిని వారు కొట్టితిరి. అందునిమిత్తమై ఆమె యొక్క యజమానులు కోపగించిరి. ఆ కోపముతోనే పౌలును, సీలాను కొట్టి చేరసాలలో వేయించిరి. ఆ విధముగా పౌలును మరియు సీలాను చేరసాలలో వేసి బంధించినపుడు వారు అచ్చట ప్రార్ధించుచుండగా, దేవుడు భూకంపమును పంపించి మరియు ఆ చేరసాల పునాదులను కదిపెను.
ACTS 16:27,30,31
7చేరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి ఖైదీలు పారిపోయారనుకొని శతాధిపతియగు పిలిప్పీయుడైన ఆ చెరసాల నాయకుడు కత్తి దూసి తనుతాను చంపుకోబోయెను. అప్పుడు పౌలు పరిగెత్తుకుంటూ వెళ్లి, "నీవు ఏ హానియు చేసుకొనవద్దు; మేమందరము ఇచటనే యున్నాము," అని చెప్పెను. పౌలు మరియు వారియందు ఆ శతాధిపతికి మంచి అభిప్రాయము కలిగియుండెను. వారు ఒకవేళ కీర్తనలు పాడియుండవచ్చును, సాక్షములను చెప్పుకొనియుండవచ్చును, లేదా మరి ఏదైనా ఒకటి చేసియుండవచ్చును. కాని అది ఏమైనా గాని, వారు పరిశుద్దులని వారి ఎరిగితిరి. ఇతరులకంటే వీరిలో ఏదో ఒక బేధమును కలిగియుండుటను అతడు కనుగొనెను. కాబట్టి వెంటనే, "అయ్యలారా, రక్షణ పొందుకొనుటకు నేనేమి చేయవలయును? రక్షణ పొందుకొనుటకు నేనేమి చేయవలయును?" అని అడిగెను.
అప్పుడు పౌలు, "ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును, నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పెను.
JOB 1:5,16,18•
JOB 2:8•
ACTS 16:31
8మంచిది, ఇప్పుడు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచినయెడల… అతడు పొందిన రక్షణ తన ఇంటివారిని కూడా రక్షించునని అర్థము కాదు. కాని అతడు తన స్వీయ రక్షణ కొరకు దేవునియందు తగినంత విశ్వాసమును కలిగియున్నయెడల, అదే విశ్వాసముతో తన ఇంటివారిని కూడా రక్షించుకోగలడు, మరియు అతడి ఇంటివారు కూడా లోపలికి రావలసియుండును, చూచారా. అదే కార్యము.
యోబు చేసిన విధముగా, ఒకానొక రాత్రీయందు జార్జియ పట్టణమందు జరిగిన కూటములో నేను చెప్పిన విధముగా. "నా కుమారులు పాపము చేసితిరేమో, నేనెరుగను; 'ఒకవేళ పాపమును వారి చేసినయెడల, ఏదైనా సంభవించునేమో?' అని యోబు తన కుమారుల నిమిత్తము తలంచెను." వారు నీతిమంతులగుటకు యోబు చేయవలసిన కార్యము ఒకటి గలదు — అదేమనగా దహనబలిని అర్పించుట. ఒకవేళ తన కుమారులు పాపము చేసితిరేమో అని, వారిని పాపములను మన్నింపబడుటకై వారి నిమిత్తము నేను దహనబలిని అర్చించెదనని యోబు అనుకొనెను. ఒక తండ్రిగా తన బిడ్డల నిమిత్తమై అతడు చేయు కార్యము మంచి కార్యమగును.
తండ్రిగా అది మంచి ఆలోచనగా యునది, నేటి దినమున మనకు అటువంటి తండ్రులు అనేకమంది యుండుట అవసరమైయున్నారు. అతడి శ్రమలు కాలము ప్రారంభించుటకు ముందుగా యోబు దహనబలిని అర్చించెను. కాని తన పిల్లలందరూ చంపబడిరి, అతడి గొర్రెలన్నియు నాశనమైపోయి, అతడికున సమస్తము నశించిపోయెను, తన ఇంటివెనుక బూడిద మీద కూర్చొని, చిల్లపెంకు తీసుకొని గీరుకుంటూ కూర్చునెను.
ACTS 16:31•
EPH 2:8
9మీరు గమనించితిరా? అతడి దుఃఖ దినములు ముగిసిన పిదప, దేవుడు అతను పోగొట్టుకొనినవాటిని మరలా తిరిగి ఇచ్చినప్పుడు, అతడికి పదివేల ఎడ్లను మరియు మొదలగు వాటిని కలిగియుండెను, ఆయన వాటిని రెండింతలుగా అతడికి తిరిగి ఇచ్చెను మరియు గొర్రెలను మరియు సమస్తమును అతడికి రెండింతలుగా దేవుడు ఇచ్చెను. అయితే మీరు గమనించండి… మరియు యోబుకు యుండిన ఏడుగురు సంతానమును కూడా దేవుడు మరలా తిరిగి ఇచ్చెను. వారు ఎచ్చట యున్నారను దానిని ఎప్పుడైనా మీరు అలోచించితిరా? ఆ దహనబలి అర్పణ వారికొరకు నిలిచినది. వారు రక్షించబడి, మహిమయందు అతడి రాక కొరకు వారు వేచియుండిరి. నేడు అతడు వారితో యునాడు. "నీవును, నీ ఇంటివారును రక్షించబడుదురు," చూచారా.
ఇప్పుడు, యోబు నీతిమంతునిగా ఉండుటకు చేయవలసిన కార్యము ఒకటి ఉండెను, అదేమనగా దహనబలిని అర్పించుట. నీతిమంతులుగా యుండుటకు మీరు కూడా చేయవలసిన ఒక కార్యము గలదు, అదేమనగా, దేవుని యందు విశ్వాసమును కలిగియుండుట. ఎందుకనగా విశ్వాసము ద్వారా మీరు రక్షింపబడితిరి, విశ్వాసము ద్వారా స్వస్థతను పొందుకొనిరి, మీరు అడిగిన సమస్తము విశ్వాసము ద్వారా పొందుకొనిరి. విశ్వాసము ద్వారానే దానిని నమ్మితిరి. ఇప్పుడు, "ప్రభువైన యేసునందు విశ్వాసము ఉంచుము, అప్పుడు నీవును, నీ ఇంటివారును రక్షణను పొందుదురు.
10అయ్యా, ఇప్పుడు, నీ యొద్ద ఆ శిశువు వుండినయెడల, నీయంతట నీవు విశ్వాసముంచుము. నీ విశ్వాసముతో నా విశ్వాసమును కూడా ఇచట ఉంచెదను. మనమందరము కలిసి విశ్వాసించెదము, దేవుడు ఆ శిశువును స్వస్థతపరుచును. చూచారా, మనము దానిని చేయుటకు మనకు శక్తి గలదు. దానిని చేయుటకు నీలోనే నీవు ఆ శక్తిని కలిగియున్నావు. ప్రతి క్రైస్తవుడు దానిని చేయుటకు ఆ శక్తిని కలిగియున్నాడు. కాని ఇప్పుడు దానిని మనము కలిగియున్నయెడల…
నేను ఎప్పుడూ చెప్ప విధముగా, ఆ శక్తి ఒక నియమము ద్వారా అదుపు చేయబడుచున్నది. నీటిని భూమ్యాకర్షణ శక్తి ద్వారా నియంత్రించబడుచున్నట్లుగా, ఎందుకనగా అది ఒక నియమము. భూమ్యాకర్షణ శక్తి నీటిని అదుపు చేయుచున్నది. సూర్యుడు భూమి ద్వారా అదుపు చేయబడును, భూమి యొక్క భ్రమణమును బట్టి. మీరు సూర్యుడిని మరొక కార్యము చేయులాగున చెయ్యలేరు: "నేను కొద్దిసేపు నిద్రపోవాలనుకుంటున్నాను. ఒక గంటసేపు అలాగే నిలిచియుండుము," అని నీవు సూర్యుడితో చెప్పలేవు. అది ఆ విధముగా చెయ్యదు, చూచారా, ఎందుకనగా అచ్చట ఒక నియమము గలదు. నీవు ఆ నియమము ప్రకారముగా పనిచేస్తేనే గాని అన్నీ సక్రమముగా నీకు జరుగును. సరియైన సమయమునకు నీవు నిద్రపోయినప్పుడే, సరియైన సమయమునకు నీవు మేల్కనగలవు.
అట్లు కానియెడల..
11మనకు ఒంటారియో చెరువు, హురోన్ చెరువు, అటువంటి గొప్ప చెరువులన్నియు అచ్చట గలవు, ఇచ్చట మనకు నేవడా, కాలిఫోరియా, అరిజోనా మరియు న్యూ-మెక్సికో అనే ప్రాంతములలో ఏది కావాలో దానిని పండించుకొనుటకు వేలవేల ఎకరాల భూమియునను వాటికి నీరు అవసరమైయున్నది. అచ్చటయున్న చెరువులు వంటివి ఇచ్చటయునయెడల, మొత్తం ప్రపంచమంతటినీ పోషించగలము. (ఇందువలన దానికి ఏ భయము లేదు, ఎందుకనగా అది ఇల ఊటలు కలిగిన నేలగా యునది, అది ఎండిపోయినా వెంటనే మరలా అదే విధముగా, అదే లోతుగా నీళ్లతో నిండిపోవును, ఎందుకనగా భూమ్యాకర్షణ శక్తి అచ్చట దానిని పట్టుకొని యున్నది). మంచిది, ఇప్పుడు ఆ భూమ్యాకర్షణ శక్తి యొక్క నియమము ప్రకారముగా నీవు పనిచేసినయెడల ఈ గొప్ప చెరువుల నీళ్లను అచ్చట నుండి దేశమంతటికీ తీసుకొని వెళ్లిన ప్రపంచమంతటినీ పోషించగలము, ఎవరూ ఆకలితో వుండరు. కాని మీరు ఇచ్చటే వుండి, "అవును, నిశ్చయముగా నేను దానిని చూచుచున్నాను," అని నీవు చెప్పలేవు. మీరు వెళ్లి దానిని చేయ్యవలసియున్నది.
MARK 11:24
12"సరే, దేవుని యొక్క నియమము కూడా అదే విధముగా యున్నది. దేవుని యొక్క నియమము విశ్వాసమైయున్నది. ఈ ఉదయకాలమందు ఏ వ్యాధినైనను స్వస్థపరచుటకును, ఏది చేయుటకైనను ఇచ్చట మనము విశ్వాసమును కలిగియున్నాము. కాని అది ఒక నియమము ద్వారా అదుపు చేయబడియున్నది, ఆ నియమము విశ్వాసమైయునది. దేవుని నియమము విశ్వాసము. "మీరు ప్రార్ధించునపుడు, మీరు ఏమి కోరుకుంటున్నారో వాటిని పొందుకునేదమనే విశ్వాసము మీకున్నయెడల మీరు వాటిని పొందుకొనెదరు," అని యేసు చెప్పెను. అదే కావలసినది. కాబట్టి విశ్వాసము మనకు అనుగ్రహించబడియున్నది.
ఇప్పుడు మనము చేయవలసిన… దేవుడు విశ్వాసమును కొంతమందికి కొంచెముగా మరియు ఇంకొకరికి ఇంకొక విధమైన విశ్వాసము అనుగ్రహించెను. అదేదో ఒక అతీతమైన శక్తి మీకు కలదని కాదు, ఎందుకనగా నీవు ఒక క్రైస్తవుడిగా ఎప్పుడు మారితివో, అప్పుడే ఆ శక్తిని నీవు పొందుకొనియున్నావు; కాని ఆ శక్తిని క్రియ చేయించుటకు విశ్వాసమునందు నీవు కొరతను కలిగియున్నావు.
ISA 53:5•
MATT 9:28•
JAS 5:14,15•
1PET 2:24
13కావున ఇప్పుడు ఈ ఉదయకాలమందు మీరు ప్రార్ధించుకొనుటకు వచ్చినపుడు పరివుద్ద గ్రధములో చెప్పిన దానిని జ్ఞాపకముంచుకోండి, అది నిజము, యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో, "మీలో ఎవడైనను రోగయైయున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి, అతని కొరకు ప్రార్ధన చేయవలెను. విశ్వాసహితమైన ప్రార్ధన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును," అని చెప్పబడియున్నది. దానిని నీవు నమ్మినయెడల, అది ఒక వాగ్దానముగా యున్నది. అందుచేత గమనించండి, స్వస్థత వ్యక్తిగతముగా విభాగించి ఇవ్వబడినది. నజరేయుడగు యేసు యొక్క దినములలో జనుల యొక్క స్వకీయ విశ్వాసమునకు విరుద్ధముగా ఆయన వారిని స్వస్థపరచలేకపోయెను. ఆయన చెప్పెను, "నీవు నన్ను విశ్వసించినయెడల, నేను చేసెదను. నీవు దానిని విశ్వసించినయెడల నేను దానిని చెయ్యగలను, నేను దానిని చేసెదను — నీవు విశ్వసించినయెడల."
కాబట్టి, సువార్తికులకు లేదా ఇంకా వేరే ఎవరికో ఆ స్వస్థపరచు శక్తి కలిగియుందురు అని కొంతమంది తలంచుచున్నారు. అది ఆ విధముగా కాదు; స్వస్థపరచు శక్తి నీలోయున్నది. అది నీలోనే యున్నది. వారు జట్కా బండిని తీసుకొని గుర్రమునకు దానిని కట్టకుండానే గుర్రము ముందు దానిని ఉంచుచున్నారు. సువార్తికులకు స్వస్థపరచు శక్తి లేదు. పరిశుద్దాత్మకు స్వస్థపరచు శక్తి గలదు మరియు మీరు ఆ పరిశుద్ధాత్మను పొందకొనియున్నారు. మీరు ఒక చిన్న వృక్షముగా యున్నారు. మీకు కావలసినవనియు మీలోనే వున్నవి. కావున దేవుడు చెప్పియుండెను, "ఆయన నన్ను స్వస్థపరచెదనని, అది సత్యము. ఆయన పొందిన గాయములవలన నేను స్వస్థతను పొందుకున్నాను." అందుచేత, దేవుని యొక్క వాగ్దానములనే ఊట నుండి కేవలము నీవు త్రాగుతూనే యుండుము. నీవు చేయవలసినది అదియే. నీవు ఏమి చేయవలెనో నీవు ఎరుగుదువా, స్వస్థతను వెలుపలకు త్రోయుటకు మీరు ప్రారంభించండి, చూచారా.
పిదప మీరు దేనిని కలిగియున్నావు అనే దానిని ఇతరులు చూడగలరు.
JAS 5:14
14ఇప్పుడు, అది ఏమైయున్నను…? "విశ్వాసమనునది నీరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకును రుజువులైయున్నది." నేను ఆ చిన్న వృక్షమును క్రింద కూర్చొనియున్నాను, ఆ వృక్షమందు ఆపిల్ ఫలములు నాకు కనబడుట లేదు; కాని అవి దానిలో ఉన్నవి. అవి అచ్చట దానియందు గలవని ఆ చిన్న వృక్షమునకు తెలుసు, కాబట్టి అది నీటిని త్రాగుచూ, త్రోసికుంటూ త్రోసికుంటూ, వచ్చటకు ప్రారంభించుచున్నది, ఎందుకనగా అవి "దానిలో గలవని అది ఎరుగును. ఇంకా, కొద్ది దినములలో వాటిని ఇచ్చెదను. నాకు కొంత కాలము అవకాశము ఇవ్వండి, కేవలము కొద్ది దినములు నన్ను అలా ఉంచితే చాలును. [ఆ వృక్షము నీటిని త్రాగుచునే యున్నది.] "అవును, నాలో ఆపిల్ ఫలములు గలవు, నేను వాటిని వెలుపలికి తెచ్చెదను." ఆ వ్యక్షమందు ఆ ఫలములు ఫలించినవి, ఇచ్చట మొదట మీరు ఎరుగవలసిన కార్యమేమనగా, ఆ వృక్షము తనలో ఆ ఫలములు గలదని అది సమ్మగలిగినది.
నిన్ను స్వస్థపరచగల ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలో గలదని నీవు విశ్వసించినయెడల, (అక్కడే నీవున్నావు!), కేవలము దానిని త్రాగుకుంటూ ముందుకు కొనసాగిపో. అది నీలోనే యునది, గమనించితివా. నీకు విశ్వాసము గలదు. దానియొక్క ఫలితములను నీవు వెంటనే కనుగొనలేవు. నీవు దానిని వెంటనే చూడలేవు.
ROM 4:3,19•
JAS 2:21,24•
JAS 5:14
15ఇప్పుడు, గమనించండి, యాకోబు, అబ్రాహామును అతడి క్రియల ద్వారా నీతిమంతునిగా ఎంచెను; పౌలు, అబ్రాహామును అతడి విశ్వాసము ద్వారా నీతిమంతునిగా ఎంచెను. వీరిద్దరి మనసులను గూర్చి మనము ఏమని చెప్పగలము? అబ్రాహాము దేనిని గూర్చి మాట్లాడుతున్నాడంటే… నా భావము, దేవుడు అబ్రాహాములో ఏమి చూచెనో ఆ విషయమును గూర్చి పౌలు ఇచ్చట మాట్లాడుతున్నాడు, అదే విధముగా జనులు అబ్రాహాములో ఏమి చూచిరో ఆ విషయమును గూర్చి ఇచ్చట యాకోబు మాట్లాడుచున్నాడు, గమనించితిరా. ఇప్పుడు, చూడండి, అందునుబట్టి, శిశువు జన్మించకముందే - అబ్రాహాములో ఆ విశ్వాసము గలదని దేవునికి తెలుసు, తమకు బిడ్డలు పుట్టరని అతడి ఎరిగియుండినా గాని తనకు శిశువు జన్మించునను నిశ్చయతను గలవాడుగా అతడు ప్రవర్తించుట ద్వారా దేవునికి తన విశ్వాసమును నిరూపించి చూపెను. అతడికి సంతానము లేదు — అతని భార్య యొక్క గర్భము ఎండిపోయినది, ఆమె గొడ్రాలుగా యుండెను. అయినప్పటికిని, అచ్చట ఎచ్చటనో ఆ శిశువు గలదని అతడు ఎరిగియుండెను. మీరు గమనించండి, ఆ గొప్ప ఎల్-షద్దాయి అనే దేవుని యొక్క రొమ్ములపై ఆనుకొని వాగ్దానమనే పాలను త్రాగుచూ అతడు వేచి యుండెను. అది ఒక వాగ్దానమని అతడు ఎరిగెను, కాబట్టి, దేవుడు దానిని ఖచ్చితముగా చేస్తాడనియు, తనకు ఆయన సంతానమును ఇచ్చునని అతడు ఎరిగియుండి, ఆ రోమ్ములపై ఆనుకొని అతడు ఆ పాలను త్రాగుచూనే యుండెను. మనము అబ్రాహాము యొక్క పిల్లలమైయునాము. కాబట్టి దేవుడు దానిని ఖచ్చితముగా చేస్తాడని ఎరిగినవారమై ఆయన మనకు ఇచ్చిన వాగ్దానమును ఆధారముగా చేసికొని దానిని పట్టుకొని యుండెదము — ఆయన ఆ విధముగా చెప్పెను. మీరు దానిని ఇప్పుడు నమ్ముచున్నారా?
తరువాత, ప్రార్ధించుకోవాలని కోరుకుంటున్న వ్యాధిగ్రస్తులు ఈ ప్రక్కలో ఏదో ఒక ప్రక్కన, వరుసగా నిలబడండి. పెద్దలు ఇచ్చటకు వచ్చి, వారిని నూనెతో అభిషేకించుదురు. నేను వారిపై చేతులుంచి ప్రార్ధించెదను. "మీరు విశ్వసించినయెడల," దేవుడు ప్రతీ ఒక్కొక్కరిని స్వస్థపరచునని మనమందరము విశ్వాసించెదము. (టెడ్డీ, నీవు ఎచ్చట వున్నావు?) కుడి చేతి ప్రక్కగా ఇటు రమ్ము. అది మంచిది. (నీవు "కేవలము నమ్ముము" అనే పాటకు సంగీతమును వాయించవలెను.) వారు వరుస క్రమములోకి వచ్చుచుండగా, మిగతా వారందరు మీ శిరములను వంచి, వచ్చుచున్న వారి కొరకు ప్రార్ధించెదము.
JOHN 1:1,14•
ACTS 2:38•
HEB 11:1•
JAS 5:14,15
16మా పరలోకపు తండ్రీ, ఈ ఉదయకాలమందు ఈ దీనులను, బలహీనులను, భయంకరమైన స్థితిలలోను, ఆపదలలోను బాధపడుతున్న ఈ మానవ జాతిని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీయొద్దకు తీసుకొని వచ్చుచున్నాము. ప్రభువా, నేను మిమ్మల్ని నమ్ముచున్నాను. మీ వాక్యము సత్యమని నేను ఎరుగుదును. అది మిక్కిలి సత్యమైన వాక్యము. అవి తప్పిపోవు, ఎందుకనగా అవి దేవుని యొక్క నిత్యమైన మరియు ఎప్పటికిని నిలచియుండు వాక్యముగా యున్నది. దేవునివలె అవన్నీయు శక్తివంతమైనవి, ఎందుకనగా అవి ఆయనలో ఒక భాగముగా యున్నవి. "ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్దయుండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణడుగా మన మధ్య నివసించెను." మా పూర్ణహృదయముతోను, మా పూర్ణ ఆత్మతోను, మా సమస్త అంతరంగముతోను ప్రభువా, మేము దానిని నమ్ముచున్నాము. దానిని మేము నమ్ముచున్నాము.
దేవుని యొక్క శక్తి వారిలోనే దాగియున్నదని వారు ఎరుగునట్లుగా వారికి అర్థమయ్యే రీతిలో, చిన్న పిల్లలకు చెప్పు విధముగా, ఈ జనులకు దానిని చాలా సామాన్య రీతిలో చెప్పటకు నేను ప్రయత్నింటితినీ. వారు విశ్వాసమును మాత్రము కలిగియుండినయెడల, వారు దేవుని యొక్క ఆజ్ఞలను వెంబడించెదరు. ఆ విధముగానే వారు రక్షింపబడితిరి. వారు వచ్చి, ఈ పరిశుద్ధ గ్రంధములోనున్న అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము ప్రకారముగా వారి పాపముల నిమిత్తము మారుమనస్సును పొంది, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొందిరి. పిదప, పేతురు "పరిశద్ధాత్మ వరమును మీరు పొందెదరు," అని చెప్పిను. అది ఆ విదముగానే ఖచ్చితముగా సంభవించినది, అది ఇచ్చటకు వచ్చినది, ఎందుకనగా అది దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమగుటయగును. మంచిది, అదే విధముగా, తండ్రి, రోగులను నూనెతో అభిషేకించి, వారికొరకు ప్రార్ధించుచుండగా అది సత్యమని మేమెరుగుదుము. "విశ్వాస సహితమైన ప్రార్ధన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును."
దేవా, ఈ ఉదయకాలమందు బలిపీఠమును వదిలి వెళ్ళువారును, ఈ స్థలమందు చుట్టూయున్న ప్రతీ ఒక్కరు, దేవుడు తమను స్వస్థపరచెనని గ్రహించినవారై, ఎంతో సంతోషముతోను, ఆనందముతోను ఇచ్చట నుండి వెళుదురు గాక! స్వస్థతను పొందుకొని ముందుకు కొనసాగిపోదురు గాక! ఇప్పుడు, వారిని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు సమరించుచున్నాము. అబ్రాహాము వలే, లేనివాటిని ఉన్నట్లుగా విశ్వసించుచూ వాటిని ఆహ్వానించుచూ ఆ దర్శనమును పట్టుకొని, దాని భావమును గ్రహించి ప్రతీ ఒక్కరు స్వస్థతను పొందుదురు గాక! దాని ఫలితము ఏమైనాగాని దాని గురించి అక్కర్లేదు. విశ్వాసముతో దానికి సంబంధము లేదు. ఫలితములతో సంబంధమేమియు లేదు. విశ్వాసము ఎప్పుడో దానిని అదుపులోకి తీసుకున్నది, "విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది." దేవా, నీవే వారికి ప్రధాన అవసరమై యున్నందువలన ఇది వారి హృదయాంతరంగములోనికి చొచ్చుకొని వెళ్తునట్లు చేయుదువు గాక! నేను నీ దీన సేవకునిగా వెళ్లి, ఇచ్చటయున్న ఇతర సేవకులతో కలసి, ఇచ్చట నిలబడుతూ ఈ రోగుల కొరకు మా హృదయాలను సమరించుకొంటూ ప్రార్ధించుచున్నాము. దీనిని మేము యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
17సహోదరుడు ఎస్టల్ బీలర్ ఈ భవనములో ఉన్నాడని ఎవరో చెప్పిరి. ఈ ఉదయకాలమందు ఇచ్చటయున వేరొక సేవకుడు ప్రార్థనను నడిపించును. ఇచ్చటయున్న సేవకులందరిని అడుగుచున్నాను, వారెవరైనగాని పైకి వచ్చి, ఈ బలిపీఠమందు చుట్టూ నిలబడగలరా. ఒక్క నిమిషము, సహోదరులారా, దయచేసి రండి. సహోదరుడా, బీలర్ మీకు వందనములు. పైకి వచ్చి ఇచ్చటయున్న ఈ బలిపీఠమందు వచ్చి నిలబడినయెడల, ఈ జనులపై చేతులను ఉంచి, మనము కలిసి వారికొరకు ప్రార్ధించగలము.
ఇప్పుడు, వారు ఆ పాటను వాయించుచుండగా, సేవకులు ఇచ్చటకు వచ్చి వారి స్థలములో నిలబడితే, మనము ప్రతీ ఒక్కరము వ్యాధిగ్రస్తులపై చేతులను వుంచెదము.
LUKE 9:37
18అచ్చటయున కొండ ప్రాంతము నుండి ఒక వ్యక్తి క్రిందకు దిగి వచ్చుటను నేను చూచున్నాను. అందరివలె ఆయనలో ఏ బేధము లేదు. ఆయన చిన్న సన్నని శరీరాకృతి కలిగిన సామాన్యమైన మానవుడు. ఆయన లోయలో నడుచుకుంటూ వచ్చుచుండగా, ఆయన కన్నులు క్రిందకు చూస్తూయుండే ఒక దృశ్యమును మనము చూచినపుడు, అది ఆయన యొక్క అపోస్తులులు, క్రింద ఒక మూర్చరోగము గల బాలుడితో యున్నారు. ఇతడిని స్వస్థపరచుము, ప్రభువా, ఇతడిని స్వస్థపరుచుము, అని చెప్పుచూయున్నారని అనటములో ఏ సందేహము లేదు. అయితే, మీరు గమనించండి, "ఇతనిని స్వస్థపరుచుము ప్రభువా, ఇతనిని స్వస్థపరచుము" అని కేవలము చెప్పుటవలన ఏ ప్రయోజనము లేదు. అలా చెప్పినంత మాత్రాన అది ఏ కార్యము చెయ్యదు. దాని వెనుక ఏదో ఒక కార్యము గలదు. "ప్రభువా! ఇతనిని స్వస్థపరచుము, ఇతనిని స్వస్థపరచుము." మీరు దానిని విశ్వసించనట్లు నేను చేసినయెడల, మరియు మీరు హృదయపూర్వకముగా దానిని విశ్వసించినయెడల, ఆ దర్శనమును మీరు చూచునట్లుగా నేను చేయగలిగినయెడల, మీరు స్వస్థతను పొందుకోగలరు.
ఇప్పుడు, ఆ శిష్యులు అచ్చట నిలబడి యుండి, అతడిని బలముగా త్రోయుచూ, ఇటుఅటు కుదుపుచూ వుండవచ్చును, "దీనిని నమ్ముము, సహోదరుడా నమ్ముము, హల్లేలూయా, దీనిని నమ్ముము! ప్రభువా! ఇతడిని స్వస్థపరుచుము! ఇతడిని స్వస్థపరచుము?" కాని ఆ దెయ్యము ఇంకా అక్కడే వున్నది, ఎందుకనగా అది అతడిని వదిలి వేళ్ళటకు తగినంత విశ్వాసమును అతడు కనుగోనలేక పోయెను. కాని అదే సమయమున కొండ ఎగువ నుండి దిగివచ్చుచున ఒకాయనను చూచిన వెంటనే అందరికంటే ఆయన కొంచెము బేధమును కలిగియుండుటను దేయ్యము కనుగొనెను. ఇప్పుడు, మన ప్రభువగు యేసుక్రీస్తు వంటి వ్యక్తులు మనకు కావలయును. అవును కాని, నీవేదో ఒక గొప్పవాడిగా చూపించుకొనుటకు కాదు కాని, మన దేవుడిని ప్రేమించుచూ, దానిని చేయుట కొరకే మనము ఆజ్ఞాపించబడితిమనే దానిని మనము ఎరిగిన వారుగా వెళ్లవలెను. ఇదే మన సేవయైయున్నది.
MATT 17:15,16•
LUKE 9:40
19పిదప, అతడు అతని తండ్రి యొద్దకు నడచి వెళ్ళెను. వాక్యములోని ఈ భాగములో నుండియే ఆ పాటను వ్రాసి సంగీతము కూర్చెనని నేను భావిస్తున్నాను. ప్రభువా, నా కుమారుని కరుణింపుము వాడు చాంద్ర రోగియై మిక్కిలి బాధపడుచున్నాడు; ఏలాగనగా అగ్నిలోను, నీక్షలోను తరుచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చితిని గాని, వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. కానీ నీకు నేను అనుకుంటున్నాను…
"నీవు విశ్వసించినయెడల, నేను స్వస్థపరచెదను, ఇప్పుడు, దానిని చేయుటకు నాలో ఆ శక్తి కలదు," అని అయిన చెప్పెను. "మీరు దానిని విశ్వసించినయెడల."
ఈ ఉదయకాలమందు, కేన్సర్ వ్యాధితో మంచము పట్టినవారును, రక్త కేన్సర్ తోను, వ్యాధులతోను మరియు బాధలలోను యున్నవారిని దేవుడు దాటిపోవుచుండగా, వారిని ఆయన స్వస్థపరచునా? ఆ విధముగా జరుగదు. లేదు, జరుగదు. గమనించారా, ఆయన తప్పిపోడు. నేను స్వస్థపరచగలను, అయితే "మీరు విశ్వసించవలయును." ఆయన ఏమి చెప్పెను?
సమస్తమును సాద్యమే, కేవలము నమ్ముము.
సమస్తమును సాద్యమే, కేవలము నమ్ముము.
సమస్తమును సాద్యమే, కేవలము నమ్ముము.
సమస్తమును సాద్యమే, కేవలము నమ్ముము.
(ప్రార్ధనలో ప్రతి ఒక్కరు.)
ప్రభువా, దయను కలిగియుండుము. యేసుక్రీస్తు నామమున ఈ ప్రజలను స్వస్థపరచుము [టేపు పై ఖాలీ]. వరుస క్రమమున వచ్చుచున్న అనేకుల ఏ విధముగా యున్నదో వారిని గమనించి చూచినపుడు, ఆ క్రియవలన వారేవిధముగా స్పందించుచున్నారో గమనించారా? వారు పైకి లేచి ముందుకు రావటమే ఆ క్రియకు వారు సంధించిన కార్యమైయున్నది. ఇంకొక విషయమేమనగా, ఆ క్రియను వారే విధముగా సంధించితిరో, దానినే వారు చేసిరి. వారు విశ్వసింది రావలసిన స్థలమునకు వారు వచ్చిన పిదప, వారికొరకు ప్రార్ధించునపుడు వారు స్వస్థతను పొందుకొనిరి, ఇపుడు ఆ క్రియవలన వారు పొందిన స్పందనను గమనించండి.
JAS 5:14
20ఇపుడు, ఈ ఉదయ కాలమందు మన సంఘ కాపరి వర్తమానమును కలిగియుండెనని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. ఒక విషయమును గూర్చి మీ యొద్ద చెప్పుటకు నేను ఆశించుచున్నాను బలిపీఠమందు కాథలిక్కు అమ్మాయి నిలబడి యుండుటను చూచితిని. కొద్ది దినముల ముందు ఆ అమ్మాయి, ఆమె భర్త నా గృహములో యుండిరి మరియు ఆమె భర్తను కొంత కాలము క్రితముగా నేనెరుగుదును. మేము వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడుకొనుచుండగా, ఏదో ఒక విషయమును గూర్చి చర్చించుకొనుచున్నాము. (ఆ సమయమున అచ్చట నేనొక దర్శనమును చూచితిని. ఎప్పుడూ సంఘములో నేను దర్శనములను చూచెదను, కాని ఆ దినమున ఉ దయకాలమందు నాకు దర్శనము వచ్చినది.) కాబట్టి అప్పుడు నేను అచ్చట ఆ దర్శనమును చూచితిని… ఆమె ఒక బాలికగా యున్నందువలనను, ఎప్పుడు కాథలిక్కు మార్గమునే వెంబడించునదిగా యుండుటవలనను ఆమె యొద్ద నేనేమియు చెప్పలేదు; కాని ఆమె తన తల్లి గూర్చి చెప్పినది, ఆ సమయమున ఆమె తల్లిని గూర్చిన దర్శనమును నేను చూచితిని. ఆమె తల్లి యొక్క బలహీనతను గూర్చియు, చూచుటకు ఆమె ఏ విధముగా వుంటారనే దాని గూర్చియు నేను వివరించి చెప్పితిని. నేను చెప్పినవి సరియా, లేదా తప్పా అని మెల్లగా ఆలోచించుచున్నాది, ఆమె యొక్క తల్లిని నేనెన్నడూ చూడలేదనేది ఆమెకు తెలుసు.
ఆ అమ్మాయి ఈ ఉదయకాలమందు ఇచ్చటకు వచ్చి ఈ బలిపీఠమందు నిలబడి తన పాపములను ఒప్పుకొని మరియు యేసుక్రీస్తును తన రక్షకుడిగా అంగీకరించెను. ఈ ఉదయకాలమందు ఈ బలిపీఠము యొద్ద ఆమె దానిని చేసినది. సహోదరుడు నేవిల్ కు ఆమెను గురించి తెలియక ఆమెను నూనెతో అభిషేకించెను. దేవుడు ఏ విధముగా క్రియలు చేయుచున్నాడో, పరిశుద్ధాత్మ యొక్క కదలికను గమనించండి! రోగులనే నూనెతో అభిషేకించవలయును, కాని ఆమెను సూనెతో అభిషేకించెను, ఆమే రోగి కాదు, అయినాగాని ఆమె ఇప్పుడు అభిషేకించబడినది. ఏ విధముగా సమస్తము చక్కగా క్రియలు జరుగుచున్నవో గమనించుచున్నారా? ఒక క్రైస్తవునిగాయగుటకు మనము విశ్వాసించుచున్నట్లుగా ఇప్పుడు ఆమె ఒక క్రైస్తవురాలిగా నిలబడియున్నది. "నా తల్లి కోరకు నీవు ప్రార్ధించగలవా? ఆమె బలహీనురాలిగా యునది" అని ఆమె అడిగినది. అది అదేవిధమైన కార్యమైయున్నందువలన ముందే ఆమె నూనెతో అభిషించబడినది.
కేవలము ఇప్పుడే రక్షింపబడిన ఆమే నిమిత్తము ఎంత చక్కగా కార్యము జరిగినదని నేను తలంచితిని. గమనించారా, క్రీస్తు మన అందరి పక్షమున నిలబడును. ఆయన అందరి పక్షమున నిలుచును. ఒక క్రైస్తవురాలిగా ఆమె మారిన వెంటనే మరొకరి నిమిత్తమై నిలబడుటకై ఆమె ఆశించినది. మనము నిజమైన రక్షణను పొందుకున్నపుడు క్రీస్తు ఆత్మ వారిలోనికి ప్రవేశించుననే దానికి ఇది ఒక సాదృశ్యమునయున్నది. ఇప్పుడు అది ఎంత చక్కగా వున్నది. నేను నిశ్చయముగా ఆమెను మెచ్చుకొనుచున్నాను. అది విశ్వాసించుచున్న చక్కటి క్రీస్తు యొక్క ఆత్మయైయున్నది. ఇప్పుడు జ్ఞాపకముంచుకోండి.
21ఈ ఉదయకాలమందు ఆ యవ్వన స్త్రీ ఇంకొక, కాథలిక్కు స్త్రీతో ఇచ్చటకు వచ్చి ఎచ్చటోయున్నది, దీనిని గమనించండి, ఈ కూటమును మన సంఘ కాపరి గారికి అప్పచెప్పటకు ముందుగా నేను ఈ మాటలను మీకు చెప్పాలని ఆశించుచున్నాను. కాథలిక్కు సంఘము ఒకానొకప్పుడు ఈ సంఘమువలె ఉండినది. మనము విశ్వసించుచున్న ఈ పరిశుద్ధ గ్రంధమును వెళ్లి మీరు చదివినయెడల, ఈ కాథలిక్కు సంఘమే మొదటి సంఘముగా మీరు తెలుసుకొందురు. అది సత్యము. కాని ఉపదేశముల నుండి అది దారి తొలగిపోయినది, ఈ పరిశుద్ధ గ్రంధము కంటేను పోపులు మరియు ఇంకా కొంతమంది వ్రాసిన ఆరువందల పుస్తకములు మరియు తదితరములు వారికి పరిశుద్ధమైనవిగా తీసుకొనిరి. ఇదియే ఆ కాథలిక్కు సంపుము యొక్క ఉపదేశములుగా యుండుటను మీరు గమనించగలరు. కాబట్టి అది ఏమైయున్నది. గమనించండి, మీరు మార్పు చెందలేదు. అలాగైతే మీరు ఏమి చేసిరి, మీరు కేవలము వేరొక దానిలోనికి ప్రవేశించితిరి, గమనించితిరా.
ఇప్పుడు, నీవు ఒకవేళ తీసుకున…
ACTS 2:4,13
22మీలో కొంతమంది కాథలిక్కులుగా ఉండవచ్చని నేను భావించుచున్నాను. ఈ ఉదయకాలమందు ఆ ఇద్దరు స్త్రీలు మరియు కొంతమంది కాథలిక్కు పురుషులు ఇచట కూర్చొని యుండవచ్చును. మీరు సంఘము యొక్క చరిత్రను అన్వేషించి చూచినయెడల, మీరు "ఈ పరిశుద్ధ గ్రంధములో అపోస్తులుల కార్యములు ఆ విధముగా యుండినవా. వారే మొదటి కాథలిక్కులా?"
మీ గురువును మీరు అడిగిన అతడు "అవును" అని చెప్పను. అది నిజము. వారు ఆ విధముగానే యుండిరి.
ఇప్పుడు, వారు ఏ విధమైన మత మార్గమును కలిగియున్నారో చూడండి. ఆ ప్రాచీన కాథలిక్కులు సామాన్యమైన చిన్న స్థలములలో, కూడుకొనెడివారు. "మరియకు వందనములు" లేదా "మా తండ్రికి వందనములు," అని వారు ఎప్పుడు చెప్పలేదు. అది ఆ కాథలిక్కు సంఘము యొక్క ఆచారము. వారు ఏమి చెప్పిరి? "తండ్రి…" అని ప్రార్దించిరి. వారు కేకలు వేసిరి, వారు ఏడ్చిరి.
ACTS 2:15,16
23పరిశుద్ద అపోస్తులులైన పేతురు, యాకోబు, యోహాను మరియు వారందరు ఏకముగా కూడి వచ్చినపుడు, ఇచ్చట అపోస్తులును కార్యములు 2వ అధ్యాయములోని దానిని చూడండి, వారు అన్యభాషలలో మాట్లాడిరని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది. వాళ్ళు కేకలు వేయుచూ, తూలుతూ, ఆత్మతో నింపబడియుండుటను వారు చూచినపుడు, ఆ అపోస్తులులు మత్తులో తూగుచునట్లుండిరి. అంతే కాకుండా వెలుపలయున్నవారు, "వీళ్ళ క్రొత్త మద్యమును త్రాగియున్నారు," అని చెప్పుకొనిరి.
పిదప పరిశుద్దుడైన పేతురు లేచి నిలిచినపుడు, అతడు, "మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, కాని వారు ఆత్మతో నింపబడి యున్నారు. పరిశుద్ధ గ్రంధము దీనిని గూర్చి చెప్పియునది," అని అనెను.
ఇప్పుడు, ప్రాచీన కాతలిక్కులు విధానము ఆ విధముగా ఉంటూ, వాక్యానుసారముగానే వారి ఉపదేశములు ఉండెడినవి. ఇపుడు, మీరు గమనించండి, అటు తరువాత రెండు వందల సంవత్సరములకు పిదప గొప్పవారు సంఘంలోకి ప్రవేశించనారంభించిరి, అప్పుడు వారేమి చేసితిరో తెలుసా? క్రీపూ. 606వ సంవత్సరమున నైసియ కౌన్సిల్ అనే చోట వారు సంఘమును మొట్టమొదటగా సంస్థగా మార్చిరి. వారు దానిని ఆ విధముగా మార్చి… ఈ నైసియా కౌన్సిల్ అనేది రోము పట్టణములో నైసియా అనే స్థలము యుండెడిది, ఆ సైసియా కౌన్సిల్ ఏర్పడిన పిదప గొప్ప గొప్పవారిని, పేరు ప్రఖ్యాతలు గలవారిని చేర్చుకొంటూ పేరుకు ఒక సంఘముగా ఏర్పరచి, దానిని వీరందరు ఒక సంఘముగా చేసికొనిరి. పిదప అది నాలుగు లేదా ఐదు సార్లు చీలిపోయినది. దానినుండి అనేక విధాలుగా, బిషప్పుగాను, బిషప్పు నుండి పోపుగా మరియు అందులో నుండి గ్రీకు ఆర్తోడాక్స్ అనే చీలికగా ఏర్పడి మరలా అందులో నుండి అనేక భిన్నమైన సంఘ సంస్థలుగా అది చీలిపోయినది. నేడు మీరు చూచునది ఏమిటో తెలుసా? కేవలము అనేక చీలికలుగా చీలిపోయిన సంఘ సంస్థనే.
24కాని మనమేమి చేయాలని ప్రయత్నించుచున్నాము, నా కాథలిక్కు స్నేహితులారా… గమనించుము, మేము కూడా కాథలిక్కులమే — మేము ఆదియందున ఆ కాథలిక్కు విధానమునకు చెందినవారము. ఇంచుమించు మమ్మల్ని పెంతెకోస్తులుగా పిలువబడుచున్నాము, ఎందుకనగా మేము పెంతికోస్తు ఆశీర్వాదములను విశ్వసించుచున్నాము. ఆ విధముగానే అచ్చట కాథలిక్కు సంఘము సంస్థగా మార్చబడినది. అంతేకాకుండా, నేడున్న మన పెంతెకోస్తు సంస్థలలో, ఒకవేళ ఈ ప్రపంచము ఇంకో ఐదువందల సంవత్సరములు యుండినయెడల, నేటి పెంతెకోస్తు సంస్థ కూడా ఇప్పుడున్న రోమన్ కాథలిక్కు సంస్థ కంటేను మరెంతో ఎక్కువగా పారంపర్య ఆచారములతో నిండిన సంస్థగా అది మారిపోవును. అది ఆ విధముగానే దారి తొలగిపోతూనే యున్నది. ఎప్పుడైతే అది ఒక సంస్థగా మారిపోయినదో, ఇప్పుడది కేవలము ఒక విడిది గదిగా మారిపోయినది, పిదప అది అసలు మారుమనస్సు లేని ఆత్మలను కలిగిన సంఘ సభ్యుల విడిది గదిగా మారిపోయినది.
నా ప్రశస్తమైన, ప్రియమైన సహోదరులారా, మరియు సహోదరీలారా, మీ అందరికి, ఒక దేవుని సేవకునిగా దీనికి ముందెన్నడూ, ఈ లోకమందు గాని, ఈ సంఘమందుగాని నేను దీనిని ఎన్నడూ చెప్పలేదు… కాని దేవుని యొక్క ప్రవక్తగా నేను దీనిని చెప్పుచున్నాను, "ఇది వెలుగైయున్నది. మీరు దీనిలో నడవండి."