మనుష్యుల యెదుట మీ వెలుగు ఎంతో ఎక్కువగా ప్రకాశింపనీయుడి
VGR COUNT-242 1అది మీకు ఏలాగో, ఇది నాకూ ముందుగా ఊహించనది అవుతుంది. నేను వచ్చితిని… నేను ఒక విధంగా వేషధారిపాత్రను పోషించిన వాడనౌతానని, నేను ఒప్పుకోవలసి యుంటుంది. నేను కొంచెం ఆలస్యముగా వచ్చితిని. నేనన్నాను "నేనక్కడకు చేరుకొనునప్పటికి, సహోదరుడు నెవిల్ బోదించుయుండును, కావున నాకు ఒక్క మాట కూడా అతడు చెప్పడు. అతడు నేరుగా కొనసాగించుయుండును."
నేను తలుపునొద్దకు వచ్చునప్పటికి, బిల్లీ నాతో చెప్పియున్నాడు, "సహోదరుడు నెవిల్ బోధచేయుచునేయున్నాడు అని, నీవు సరిగ్గా సమయానికి వచ్చావు" అని అతడన్నాడు.
"మంచిదే" అని నేను చెప్పితిని.
నా యొద్దకు నడచి వచ్చి, "నేనింకా బోధ ప్రారంభించలేదు. నేను ఒక విధముగా ఎదురుచూచుచున్నాను" అతడన్నాడు.
"ఓ, బహుశా నేను… ఒక దినమునకు రెండు మూడు సార్లు ఏ విధముగా బోధించవలెనో, అది నాకు తెలుసు — ఒక విధంగా అది నిన్ను అలసిపోవునట్లుగా చేయును" అని నేనన్నాను. అది మనకు తెలుసు. ప్రత్యేకించి, మనముయుండినట్లుగా, వారు యౌవనస్తులుగా యుండినప్పుడు, ఆ యౌవనస్తుల మధ్య ఎలాగుండునో తెలుసా? అది ఎక్కువసేపు తీసికొనదు. కాబట్టి, మనము సహోదరులుగా మనము కలసి ఉండెదము; మనమొక విధముగా భుజములు కలుపుకుందాము, మన హృదయాలు కలుపుకుందాము, మన తలంపులు కలుపుకుందాము. అందువలన, దేవుని రాజ్యము కొరకు మనము కలసి పనిచేయుటకై చేయదము. ఎంతో కలసి యుండుటకు మేము ఆశపడుచున్నాము. అదియొక శోభితమైన విషయము.
అందువలన, అక్కడ నాకు యొక చిన్న పాఠ్యాంశమును ఆరంభించుటకు ఏదో యొకటి దయచేయమని నేను ప్రభువును అడిగితిని. నేనేమి చెప్పబోవుచున్నానో యింకా తెలియదు, అయితే, మనము ప్రారంభించితిమి, మరి తరువాత, ఆయన మనలను ఎక్కడకు నడిపించునో అక్కడకు మనము వెళ్ళుదము.
2అది నిజమే, నేను అలస్కా - ఫెయిర్ బ్యాంక్స్ లో ఆరు దినముల కూటమును నేను 15, పదిహేనున ప్రారంభించవలసియున్నది. అయితే ఈ సమయమునకు నేనక్కడకు చేరుకోగలనేమోయని నేను తలంచుటలేదు, ఎందుకనగా నేను వెళ్ళనైయున్న మరియొక నియామకము నాకున్నది, అది బ్రిటిష్ కొలంబియాలో నున్నది. కాబట్టి, ఈ సమయమునకు నేను లేవగలనని నేను తలంచుటలేదు. యింకా, క్రిస్టియన్ బిజినెస్మెన్ వారు వ్యాపారస్తుల సర్వసభ్య సమావేశమును ఏర్పాటు చేయాలనుకుంటు ఉన్నారు.
ఇప్పుడు మనము ఏర్పాటు చేయుట కొరకై ప్రయత్నించు మరియు రాబోతున్న కూటములకై మీ యొక్క ప్రార్థనలు నేను వేడుకొనుచు ఆశపడుచున్నాను. కొద్ది దినముల క్రితమే నాకు మంచిగా అగుపించినది యొకటి, ఒక ఆహ్వానము వచ్చినది. అందులోనున్నది ప్రభువుకు సంబంధమైనదో కాదో నాకు తెలియదు. నేను తప్పక కనిపెట్టి తెలుసుకొనవలసి యుంటున్నది. బిజినెస్మెన్ వారు జనవరిలో ఫీనిక్సుకు నన్ను రమ్మని కోరుచున్నారు. మరియు ఒక రాత్రి ఫీనిక్స్ పట్టణములో అంతట ప్రతి యొక్క సంఘమునకు వెళ్ళవలెనని, వారు కోరుచున్నారు. ఆ తరువాత మహాసభను జరిపించవలెనని ఆశించుచున్నారు. నాకైతే అది ఆసక్తిగా అగుపించినది, ఎందుకనగా సంఘములతోను, దైవసేవకులందరితోను మాట్లాడు తరుణమును అది నాకు చేకూర్చును.
3సహజముగా, ప్రజలు నన్ను గూర్చి తలంచుచుంటారు… ఎందుకంటె నేను ఎంతగానో సంస్థాపక సంఘములకు నింద వేయుదునని, సంస్థాపక సంఘములోనున్నవారికి నేను వ్యతిరేకినని తలంచుచుందురు. ఏ విధముగానైనా నేనదికాదు. నేను మనుష్యులకొరకే యున్నాను.
యిక్కడే యుండిన నదిలో ఒక పడవలో ఒక మనుష్యుడు వచ్చుచున్నట్లుగా అది యుండును. ఆ పడవ నిండుగా, రంద్రములున్నవి మరియు అది నాకు తెలుసు, మరియు అక్కడున్న అలలు గుండా ఆ పడవ వెళ్ళలేదని నాకు తెలుసు. నేనెంతగా కఠినంగా కేకవేయగలనో, అనర్హమైనది ఆ పడవయని కఠినంగా చెప్పగలనో అంతగా చెప్పగలను. ఆ పడవ అనర్హమైనదియని నేను చెప్పుచున్నాను. పడవ అది చేయలేదని నాకు తెలుసు. సంస్థాపక సంఘము అది చేయలేదని తెలుసు, అయితే, నీవు ఆలా బయటకు వచ్చినట్లయితే, దానిలోనున్న మనుష్యులు అది చేయగలరని నాకు తెలియును, చూశారా.
4అయితే, నీకొక పాతబడిన కారు యుండి, పర్వతముపైకి దానితో నీవు వెళ్ళినట్లుగా యుండును, మరియు ఆవలవైపునకు నీవు కదలిపోవుటకు ప్రారంభము చేయునప్పుడు, దానికి నిలుపుచేయు యంత్రములు లేవు. నేను మనుష్యునికి వ్యతిరిక్తముగా యుండను. నేను అతనికి వ్యతిరిక్తముగా కేకలు బెడుతున్నాను. అది అతడు కాదు; అది అతడుయుండిన కారు. అతడు హాని కలుగజేసికొనబోవుచున్నాడు. సంస్థాపక సంఘమును గూర్చిన విధము అది. అది దేవదేయైయున్నట్లుగా మరి సంస్థాపకములను ఆనుకున్న ప్రజలు, కేవలము సంస్థాపకములను ఆనుకొనుట కోసము వారు దేవుని యొక్క వాక్యమును విడిచిపెట్టుదురు. సరే. వారది చేసినపుడు, వారు ప్రాముఖ్యమైన నేరము చేయబోవుచున్నారని నేను భయపడుచున్నాను.
అది, ఏ వ్యక్తిగత మనుష్యునిపై నేను వ్యతిరిక్తత కలిగియుండుట కాదు; కానీ అది అతడు నడుపుచున్న పడవమీద ఆవుతుంది, చూశారా, అది నేను చేయనని నిశ్చయత కలిగియున్నాను. సంస్థాపకము దానినెన్నడు చేయలేదు. అయితే క్రీస్తు చేయును. కాబట్టి, సంస్థాపక సంఘ మూఢనమ్మకమైన కారుతున్న పడవలో నుండి బయటకు వచ్చి క్షేమకరమైనది, పూరాతనమైనదియగు సీయోను ఓడలో అడుగుబెట్టుము. అది యింకా ఎన్నడు అపజయమెరుగనిది, సకాలములో స్థలమునకు చేర్చునదియగు క్రీస్తు అది. మరియు అదే…. ఆ జనులతో మాట్లాడుటకు అది ఒక తరుణమును యిచ్చునని తలంచుచున్నాను.
1COR 11:27
5ఇప్పుడు, నేను తలంచియుంటిని, ఒకవేళ… ఈ రాత్రి ప్రభువు విందు భోజనపు రాత్రియని అనుకొంటిని. వారు బాప్తిస్మము జరిగించారని విన్నాను, మరియొకటి జరిగించబోవుచున్నారు. నేను ప్రభువు విందు భోజనమునకు వచ్చుటకు ఆశపడుచున్నాను. నేనిక్కడ యుండకుండయుండుటవలన గతకాలంలో నేనది పోగొట్టుకున్నాను. మరియు ఇది మొదటి ఆదివారమని నేనెరుగుదును కనుక యిక్కడయుండుటకై నేను సంసిద్ధపరచుకొన్నాను; తద్వారా ఈ రాత్రికి ప్రభువు విందు భోజనములో యుండగలుగుతాను. ప్రభువు విందు భోజనమును తీసుకొనుట ప్రతి క్రైస్తవుని యొక్క విధియై యున్నదని నేను నిజముగా తలంచుచున్నాను. "మీరు యిది తీసికొనక పోతే, నాతో మీకు పాలులేదు" యని బైబిల్ చెప్పుచున్నది.
అది క్రైస్తవులకు ఒక తుది పరీక్షా సమయమని నేను అనుకొనుచున్నాను. మనము దానిని తీసికొననట్లయితే, ఆయనతో మనకు పాలులేదు. మరి మనమది అయోగ్యముగా తీసికొన్నట్లయితే, అలాటప్పుడు క్రీస్తు శరీరమును గూర్చి, మరణమును గూర్చి మనము అపరాధులమౌదుము. కాబట్టి, క్రైస్తవుడు ప్రభువు విందు భోజనము సహవాసమునకు వచ్చునప్పుడు అతనిని ప్రార్థనా స్థానమునకు అతనిని తీసికొని వచ్చుచున్నది. మనము, మన తప్పిదములన్ని ఒప్పుకొనుచు, ఒకరికొకరు ప్రార్థించుచు, భయభక్తులతో గౌరవముతో పవిత్రతతో నడచుకుంటూ రావలసియుంటున్నది. అది మాత్రమే కాదు, అయితే మనలో ఒక సహోదరుడు కానీ, లేదా ఒక సహోదరి కానీ, గీతకు ఆవల యొకచోట కొంచెము దాటినట్లుగా మనము భావించినట్లయితే, ప్రభువు విందు భోజన సహవాస రాత్రియందు, ప్రత్యేకించి లోకమువలన ఖండింపబడుకుండు నిమిత్తము, వారు వచ్చి ప్రభువు విందు భోజన సహవాసము స్వీకరించుట కొరకు ఆ వ్యక్తి నిమిత్తమై మన హృదయాలలో మంట మండవలసియున్నది, ఎందుకనగా వారు మనయొక్క సహోదరీ - సహోదరులై యున్నారు.
6ఇప్పుడు, గత కొద్దివారములుగా — రెండు లేదా మూడు వారములు, రెండు వారములు, మూడవ వారము కాబోతున్నది. నేను ఎక్కువగా మాట్లాడలేదు. నేను విశ్రాంతిలో ఉన్నాను, ఎందుకనగా ఈ రకమగు - భారమునకు ముందు యిది నాకొక విధమైన విశ్రాంతి సమయమౌతుంది. రాజకీయవేత్తలు మద్య జరుగుచున్న ఈ విషయాలను గూర్చి అనగా అణుయుద్ధము త్వరలో ముగియనైయున్నది, డిశంబరు నుండి జనవరి వరకు ముగియటకు సమయము పడుతుందని ఆ సంగతులను గూర్చి బాగుగా గ్రాహ్యముగలవారిని గూర్చి సహోదరుడు నెవిల్ మాట్లాడుచుండుట నేను విన్నాను. సరే. అది నిజమే ఆవుతుంది. అది ఆరంభమగునని అది ప్రకటించెదరు. తరువాత రెండు బాంబులు, మరి అది అయిపోవును. కాబట్టి ఒక అణుయుద్ధమునకు దేశము జీవించియుండలేదు. మనమది చేయలేము. అయితే, అది క్రైస్తవునికి కలవరం పుట్టించలేదు, లేదా అది క్రైస్తవుని కలవర పెట్టదు. మన ప్రభువు వచ్చుటకు మనము ఎదురుచూచు సమయములోనైనా మనము సంసిద్ధముగా యుండవలసియున్నది.
7అనేకసార్లు… చూశారా, ఇవి ఇది టేపు చేయబడదు. ఇది యిక్కడ యింటి యొద్దనే యుంటుంది. టేపు లేదు, కనుక నీవేమి చెప్పుచున్నావో దానిని గూర్చి మరియు వేరొక ప్రదేశమునకు గూర్చిన, తదితరమైన వాటిని గూర్చి నీవు కనిపెట్టనవసరం లేదు. ఇది కేవలం యింటి వారికి మాత్రమే.
నేనేమి చేయుచుందునో మీకు తెలియజెప్పెదను. నేను ఉడుతలు వేటకై వెళ్ళుచుందును. అయితే, నేను చాలా బాగుగా చేయుటలేదు — అక్కడ ఎక్కువగా ఉడుతలు యుండవు. మరి ఇప్పుడు నేను గొర్రెల వేటకై అలస్కాకు వెళ్ళుచున్నాను. మరియు, బహుశా కొందరు కావచ్చును లేదా చాలమంది కావచ్చును… టేపు మీద లేక మరొకదానిపైన అది నీవు చెప్పలేవు, కారణమేదనగా అనేక మంది వేటాడుటను నమ్మరు. ఎంతమాత్రము నమ్మరు సుమా! మరైతే, ఎవరైతే వేటను నమ్ముట లేదో, వారియొద్దకు ఒక మాంసపు ముక్కను తీసికొని వచ్చినట్లయితే దానితో వారెంతగానో తృప్తి చెందుతారు. నేనెప్పుడు కూడా అది గమనించితిని.
8ఒకసారి, ఒక స్త్రీ నాతో చెప్పినట్లుగా యుండును. ఆమె అన్నది, "సహోదరుడా బ్రెన్హాం! నీవు కుందేళ్ళను వేటాడుతావని నాకు చెప్పవలెనని నీ అర్థమా?" అని అడిగినది.
"ఔనమ్మా!" అని నేనన్నాను. (ఇప్పుడు, ప్రశస్తమైన ఆత్మను గూర్చి కాదు నేను మాట్లాడుచున్నది. ఆలాగున ఆమె వెళ్ళిపోయినది.)
మరియు "ఓ, అది అన్యాయమైనది. ఆ కుందేళ్ళను నీవు కాల్చి చంపకూడదు" అని ఆమె అన్నది.
తరువాత, మంచిది, అదే స్త్రీ చెప్పినప్పటికి ఋతువు యింకా ముగియలేదు, "రెండు కుందేళ్ళు నీవు నాకు తీసికొని వచ్చెదవాయని, ఆ స్త్రీయే అడిగినది.
"నేను తినినవాటిలో అవి బహు శ్రేష్టమైనవి" అని ఆమె చెప్పినది.
"సరే, నేను దానిని సంస్కృతి యని పిలిచెదను" అని చెప్పితిని. చూచారా.
"నీ భావము ఏమిటి?" అని ఒకరు అడిగారు.
"ఆ స్త్రీకి సంస్కృతి యున్నది" అని నేను చెప్పాను. "ఒకరికి కుందేలును చంపునంతటి ధైర్యము కూడా యుండదు గాని, ఒకరు దానిని చంపిన తరువాత దానిని తింటారు. కాబట్టి, దానిని నీవు సంస్కృతి" అని పిలచెదవుయని నేనూహించుచున్నాను" అని నేను చెప్పియుంటిని.
9ఓ, నేను చేయను… నేనొక సంరక్షణము చేయువాడను. చంపి, దానిని వృధా చేయుట నేను నమ్మను. "నీవు తినుటకు నిర్ణయించుకొనినట్లయితే తప్ప ఏదీ, నీవు తీసికోవద్దు" అని నా అబ్బాయికి, నాతో కలసి వేటాడు వారికి నేను భోధించుదును, గమనించారా. దానిని ఒంటరిగా వదలివేయ్. గురికోసమై పిట్టను కొట్టవద్దు. ఔనా? అది సరియైనది కాదు. గురిని పెట్టుకొని, అక్కడ యున్నది సరిచూచుకొని దానిని కాల్చి చంపుము. ఆటను నీవు తినబోవుచున్నావు. అటు తరువాత, ఆ ఉద్దేశ్యము కొరకై అది యిక్కడ పెట్టబడి యున్నది. మరి దానిని వృధా పరచుట, దేనినైనా వృధా చేయుటవలెయౌతుంది. గురి కోసము జంతువులను కాల్చిచంపుట అది మంచిది కాదు.
10మరియు, స్నేహితులారా, నేను పర్వతాలకు వెళ్ళునప్పుడు ఎక్కువగా "వేటకు వెళ్ళుటకు," అందుకొరకు కాదు. దేవునితో ఒంటరిగా యుండుటకై నేను వెళ్ళుచుంటాను. మీలో కొందరు, మీరు గమనించినట్లయితే, నాకు కలిగిన గంభీరమైన అనుభవము, నేను బయటకు వేటకు వెళ్ళినప్పుడు, నేను దేవుని కలసికొనియుండినప్పుడు జరిగినది. నా యొక్క అనుభవములన్నిటిలో, యిక్కడనే నిన్నటి ఉదయం నేను అనుభవించిన అనుభవం నా బ్రతుకులో నేనెన్నడు అనుభవించలేదు. నేను ఉడతల వేటకు వెళ్ళినది అది. నా బ్రతుకులో అనేకములైనవి అద్భుతాలు, సూచక క్రియలు మొదలైనవి నేను చూచితిని. అయితే యింతవరకు నన్ను సంధించిన వాటిలో దేనికంటేను అది నన్ను బలముగా తాకినది.
ఇపుడే నేను ఊహించుచున్నాను, కొద్దిగా తెల్లవారుచున్న సమయములో, వర్షము పడుచున్నది. కారు మేఘాలు చుట్టూర కమ్ముకొనియున్నవి. నేను చూచుచుండగనే, నా యెదురుగా కొండ మీద యొక పాత్ర పెట్టబడినట్లుగా అక్కడే పెట్టబడియుండి, మూడు వర్ష ధనస్సులు పైకి, యింకా పైకి లేచినవి. నీవు మాట్లాడలేనంతగా నీ శరీరమంతట ఎంతగానో తిమ్మిరెత్తి పోయినట్లుగా పైకి లేచినవి. తరువాత దానికి సమీపముగా నడచుట; మరియు ఆయన మాట్లాడుట వినబడుట; మరియు నీవు మాట్లాడుచున్న అదే వర్తమానమును సత్యమని నిర్ధారించుట జరిగినది.
11"క్రొత్త నిబంధన యొక్క యేను, పాత నిబంధన యొక్క యెహోవాయైయున్నాడు. ఆయన కేవలం ఆయన యొక్క ముసుగును మార్చుకున్నాడు," అని చెప్పబడెను.
ఇప్పుడు, నేను కూర్చొని అది చదువుచున్నాను. అదే మాటను, "ఆయన ఎక్కడైతే ఆయన ముఖవర్చస్సును మార్చుకొనెనో అను అదే మాటను నేను కనుగొంటిని. గ్రీకులో "ముసుగును మార్చుకొనుట" యని భావము. ఖచ్చితముగా ఆయన యొక్క ముసుగుయని కాదు, అయితే ఆయన యొక్క "వేషము" అది. ఆయన "రూపాంతరము" చెందెను అనుదాని యొద్దకు అది వచ్చుచున్నది, చూశారా. దాని భావము "ఆయన మార్గమును ఆయన మార్చెను" అని అర్థమౌతున్నది. ఆయన దేవుడై యుండెను, యెహోవా, యెహోవా దేవుడు, ఆత్మనుండి తనకుతాను మార్చుకొని మానవుడాయెను. ఆయన అదే యెహోవా దేవుడు. అదేదనగా అది, ఒకే వ్యక్తియై యుండి — తండ్రియై యుండెను మరియు ఇది కుమారుడైయున్నాడు.
మరి ఏలాగు… మాట్లాడుటకు ఆయన నాకు యొకటి యిచ్చియున్నాడు. ప్రభువు అంగీకరించినట్లయితే, ఉదయమునకు, షుమారు తెల్లవారుజామునకు అదే చెట్ట యొద్ద యుండుటకు నేను ఉద్దేశించియున్నాను. మరియు ఆయన మరలా నాకు అగుపించునని నా నిరీక్షణ. తద్వారా నేనేమి చేయగలనో నేను తెలుసుకొనుటకై ఆయన చేయునని నేను నమ్ముతున్నాను. ప్రజల నిమిత్తమై నా హృదయములో ఒక భారమున్నది. సమయము సమీపించుచున్నకొలది మరియు ప్రజలు, నా ప్రియమైనవారు సంసిద్ధపడకుండుట చూచి నేనేమి చేయవలెనో, నేనేమి చెప్పవలెనో నాకు తెలియదు. నేను పైకి వెళ్ళిపోయి, ఆయన నాకు ఏమి చెప్పునో నేను చూచెదను.
12కాబట్టి నా కొరకు ప్రార్ధించుడి. అటు తరువాత, రేపు మధ్యాహ్నము లేక మంగళవారం ఉదయము నేను విడచి వెళతాను. ఇక్కడ ఆలయంలో ఒక సహోదరుడు, మరియు నేను బ్రిటీష్ కొలంబియాకు వెళ్ళుచున్నాము. మరియు ఒక పెంతెకోస్తు సేవకుల వర్గముతో కలసి నేను వెళ్తున్నాను. ప్రయాణపు పూచిని అది భరించినది. అది, ఒక్క పెన్ని కూడా నాకు ఖర్చు కానివ్వదు. మరియు ప్రయాణపు పూచిని వారే భరించుదురు. యింకా మార్గదర్శిని వారే ఏర్పాటు చేసియున్నారు. మార్గదర్శి పరిశుద్దాత్మతో నిండిన ఒక పెంతెకోస్తు సహోదరుడు.
తరువాత, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలసినవారు నాకు కొందరున్నారు, మరియు నేనక్కడ యుండినప్పుడు వారు జంతువులను ఉచ్చు వేసి పట్టుకోనువారు. ఈ టేపులు అక్కడకు వెళ్ళినప్పుడు వెలుగును చూచి; నార్వేలో జంతువులను ఉచ్చు వేసి పట్టుకోనువారు, మరియు మొదలగువారు, యేసుక్రీస్తు నామములో వారికి బాప్తిస్మము యివ్వమని నన్ను కోరినవారు వారు. మరియు, రాబోతున్న ఆదివారము సాయంకాలమున బ్రిటీష్ కొలంబియాలోని డాసన్ క్రీక్ లో నున్న ఫైన్ లాడ్డిలో బ్రిటీష్ కొలంబియా వారి దైవసేవకుల సంఘము యొక్క ప్రధానాధికారిని నేను కలసికుంటాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుకొనుటకై అతడు ఆకలి దప్పికతో యున్నాడు. కనుక, మీరు గమనించుడి! స్నేహితులారా! అదంతా వేటకు మాత్రమే కాదు సుమా! ఈ మార్గదర్శిని మరియు ఈ సమయమందు నాతో వచ్చుచున్న ప్రతిబోధకునికి యేసుక్రీస్తు నామములో నేను బాప్తిస్మము యివ్వగోరుచున్నాను. మీరు నా కొరకు ప్రార్థించుడి. నా హృదయము, ఆ దేవుని చూచుటకై ఆకలి దప్పిక కలిగియున్నదని నేనెరిగినది సత్యమే.
13మీ యొక్క సమయమును నేనెక్కువగా తీసికొనను. ఇప్పుడు, వాక్యమును మనము సమీపించక మునుపు, కొంత లేఖనములో నుండి, ప్రార్థించుటకు ఎక్కడకు చేరగలమో, ఆ స్థానమునకు వచ్చువరకు కొద్ది లేఖనము నుండి కొద్దిగా ఉపదేశము పొందుకుందాము. మరియు చేరుతూ… ఇక్కడ యొకరు నిలువబడియున్నారని అనుకుంటున్నాను… నన్ను క్షమించండి, ఒకవేళ…. ఒకరు కొంచెం సమీపముగా వచ్చి, అది చెప్పెదరా? సహోదరుడు ఏమిటి అనునది నేను వినలేదు… అతని బిడ్డను ప్రతిష్ఠ చేయవలెనా? తప్పకుండ, నా సహోదరుడా. ఔనండి. నేరుగా మీ బిడ్డను పైకి తీసుకొని రండి. అది చేయుటకు మేము ఆనందముగా ఉన్నాము. మరి ఇప్పుడు, నేను దీనిని నమ్ముచున్నాను. కాబట్టి, ఇప్పుడు ప్రజలు రాకమునుపు వారికి నేను వివరించవలసియుండెను. సహోదరుడు ఆర్నాల్డ్ … టెడ్డీ? మంచిది. మా కొరకు నీవు పియానో యొద్దకు రాగలవా?
14ఇప్పుడు, అనేకమంది ఈ చిన్న పిల్లలను చిలకరించెదరు. దానిని వారు శిశు బాప్తిస్మముయని పిలిచెదరు. మీ సంఘము అది చేసినట్లయితే, అది, అది సరే; అయితే మీరు గమనించుడి, అది వారు చేసినట్లయితే, అది సంఘము యొక్క ఆజ్ఞయైయుండి యుండును. అది లేఖనము కాదు. మీ యొక్క చిలకరింపు బాప్తిస్మము చేయుటను లేఖనము బలపరచుట లేదు. చిలకరింపు చేయుటను లేఖనము ఏ విధముగానైనా బలపరచుటలేదు. బైబిల్ గ్రంధములో ఎవరైనా ఎప్పుడైనా చిలకరించబడలేదు. వారిలో ప్రతియొక్కరు యేసుక్రీస్తు నామములో ముంచడం ద్వారా బాప్తిస్మము పొందిరి.
అయితే, ఇప్పుడు బైబిల్ గ్రంధములో వారు చిన్న బిడ్డలను తీసికొనివచ్చి ప్రభువుకు ప్రతిష్ఠ చేసిరి. ప్రభువైన యేసు చేతులలో వారిని యుంచిరి.
15సహోదరీ, నీ చిన్న బిడ్డను తీసికొనివచ్చుట మంచిది. మరియు బిడ్డలు కలిగియున్న మిగతావారు ఎవరైనా, అది చేయుటకు మన చిన్న బిడ్డలకు ప్రతిష్ఠ కూటముగా చేయుటకు మేము సంతోషించుచున్నాము.
ఇప్పుడు, లేఖనములో యేసు… ఇక్కడ సంఘముతో అన్ని విధములైన మిశ్రితమైన సంస్థలుగా మనమున్నాము. కొందరు ప్రొటెస్టెంట్ వారు, కొందరు కథోలిక్ వారు మరియు చిట్టచివరకు యిక్కడకు వచ్చేవారు యూదులు కూడా యున్నారు, అనగా సాంప్రదాయకమైన యూదులు వారు. ఆ కారణముచేతనే మనకు మనము "సంఘ శాఖల అన్యోన్యత" అని రూఢిగా పిలుచుకుంటాము. ఇప్పుడు నీవు అర్థంచేసికొనుట కొరకు ఈ ఆలయము లేఖన సంబంధమైన ఆలయముగా ఉండునట్లుగా, బైబిల్ పైనే నిలబడునట్లుగా మేము ప్రయత్నిస్తున్నాము. బైబిల్ ఎక్కడ ఏదైనా చెప్పినట్లయితే, ఖచ్చితంగా ఆ విధముగా మేము వెంబడించెదము.
16ఇప్పుడు, సంఘము… క్రైస్తవులందరును మరియు దైవ సేవకులైన మీరందరు, మొదటి సంఘము యొక్క చరిత్ర యిదే అని మీరు అంగీకరించెదరు. మనందరికిది తెలియును. ఏమి జరిగియున్నదో ఖచ్చితంగా ఇదే. ఇక్కడే, రహదారిపై నివాసముంటున్న ఒక కథోలిక్ మాతాధికారితో, ఈ మధ్య నేను మాట్లాడుచుయుంటిని. అతడడిగాడు, "మిస్టర్ బ్రెన్హాం గారూ! నీవు నాన్-కథోలిక్ వడవా లేక ఒక ప్రొటెస్టెంట్ వాడవా?"
"నేను చెప్పాను, ప్రొటెస్టెంటువాడను," అని చెప్పాను.
అతడన్నాడు "అలాగైతే నీవు మమ్ము విరోదిస్తున్నావు."
"లేదండి. నేను ప్రజలను నేను అడ్డగించను; అది సంఘమును, సంఘము యొక్క సిద్దాంతమును నేను విరోదిస్తున్నాను," అని నేను చెప్పాను.
"నీవు ఆలాగా… ఆలాగైతే నిన్నునీవు బాప్టిస్టుగా పిలచుకుంటున్నావా? లేక ప్రెస్బిటేరిన్ గా పిలచుకుంటున్నావా?" అని అడిగాడు.
"లేదండి, కేవలం క్రైస్తవుడను మాత్రమే" అని నేను చెప్పాను.
"సరే, నీ సిద్దాంత రూపమును నీవెక్కడ నుండి నిర్మించుకున్నావు?క్రైస్తవునిగా యుండుటకు, ఒక సిద్ధాంతాన్ని నిర్మించుకొనుటకు నీకు ఒక ఆధారము యుండవలసియున్నది గదా!"
"అది నిజమే" "అది బైబిల్ గ్రధము" అని నేను చెప్పాను.
"సరే, అది కథోలిక్ సంఘము యొక్క చరిత్ర కదా?" అని అతడు అన్నాడు.
"అపోస్తలులు కథోలిక్ వారా?" అని నేనడిగాను.
"ఔనండి" అని అతడు చెప్పాడు.
నేనన్నాను, "మంచిది, అది సరేనని నేనంగీకరించబోవుచున్నాను." "ఆలాగైతే మీరు కూడా లేఖనముతో ఎందుకు నిలువబడకూడదు?" అని నేను అన్నాను.
"చూడూ! వారు కోరినప్పుడు, ఏ సమయంలోనైనా లేఖనమును మార్చుటకు క్రీస్తు సంఘానికి అధికారమిచ్చాడు" అని అన్నాడు.
నేనడిగాను, "సరే." "అలాగైతే మీరు దానిని మార్చి ఈ రోజు ఏమి కలిగియుంటున్నారో అదే కలిగియున్నారు."
"ఔనండి" అని అతడన్నాడు.
"ఆలాగైతే నేనొకటి అడుగుతాను," అని నేను అన్నాను. ఆలా౦టప్పుడు క్రీస్తు అందునుబట్టి ఆనందించడు, ఎందుకనగా మొదటి సంఘము పైన ఆయన పరిశుద్దాత్మను కుమ్మరించెను. మొదటి కథోలిక్ సంఘ సిద్దాంతము ద్వారా వారు రోగులను స్వస్థపరచిరి, చనిపోయినవారిని లేపారు, దయ్యములను వెళ్ళగొట్టారు, మహా గొప్ప బలమైన అద్భుతాలు చేశారు" అని నేను చెప్పితిని; కథోలిక్ సంఘములో, వారు సిద్దాంతాన్ని మార్చినప్పటి నుండి అది కనబడుటలేదు."
MARK 10:13,14,16•
LUKE 18:15,16
17మనము వెనుకకు వెళ్ళిపోయి అసలైన కథోలిక్ గా యుందాము అని నేను చెప్పితిని. మనము వెనుకకు వెళ్ళిపోయి - వారు ఏమైయుండిరని బైబిల్ చెప్పినదో, అలాగే యుందాము. క్రీస్తు వారితో నడిచెను.
ఆ కారణంచేతనే స్నేహితులారా! ఏ సంఘమును గద్దించుటకు, సంఘములోని ఏవరైనా గద్దించుటకు మేము ప్రయత్నించుట లేదు. అయితే బైబిల్ గ్రంధము ఏమని చెప్పుచున్నదో, ఆ విధముగా ఉంచుటకు మేము ప్రయత్నం చేయుదుము. ఇప్పుడు, బైబిల్ గ్రంధములో అక్కడ చిన్న బిడ్డకు ఏనాడు కూడా బాప్తిస్మము ఇవ్వలేదు ఎక్కడ కూడా చిన్న బిడ్డను చిలకరింపచేయలేదు. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథములో ఈలాగు చెప్పబడినది, యేసు చిన్న బిడ్డలపైన ఆయన చేతులుంచి వారిని దీవించుటకై, చిన్న బిడ్డలను వారు ఆయన యెద్దకు తీసికొని వచ్చిరి" యని, మరియు ఆయన చెప్పియుండెను, "చిన్న బిడ్డలను నా యెద్దకు వచ్చుటకు ఆటంకపరచకుడి, దేవుని రాజ్యము ఈలా౦టి వారిది." ఇప్పుడది ఖచ్చితంగా నిజం.
కాబట్టి చిన్న బిడ్డలను తల్లి కౌగిటిలో నుండి లేక తండ్రి కౌగిటిలో నుండి తీసికొని ఇప్పుడు వారిని మన పరలోకపు తండ్రికి అర్పణము చేయదము. మరియు అన్ని విధముల అనూహ్య విధేయతతో వారిని ప్రతిష్ఠకై అర్పణ చేయదము.
18నా బిడ్డలు, నాకు యిద్దరు బిడ్డలున్నారు. వారింకా బాప్తిస్మము తీసుకోలేదు, ఎందుకంటే వారు కేవలం ప్రతిష్ఠత మాత్రము చేయబడిరి. మహిమలో నాకొక బిడ్డ ఉన్నది, కేవలం ప్రతిష్ఠత మాత్రమే చేయబడినది, బాప్తిస్మము తీసికోలేదు; ఎందుకనగా పాపక్షమాపణ కొరకు బాప్తిస్మము పొందవలెను, గమనిస్తున్నారా! నీవు పశ్చాత్తాపము పొందితివి అని చూపించుటకు అది జరుగును. పశ్చాత్తాప పడుటకు ఆ బిడ్డ ఏమియు చేయలేదు. అది కేవలం చిన్న బిడ్డ, అది ఈ లోకంలో జన్మించినది. అంతే. "ఇక్కడకు వచ్చుటకు ఆమెకు ఎటువంటి బలము లేదు, చూచారా, మరియు దానికి ఏ పాపము లేదు. క్రీస్తు శిలువలో చనిపోయినప్పుడు, లోకపాపములు తీసివేయుటకు ఆయన చనిపోయెను. పశ్చాత్తాపము పొందుటకు ఈ బిడ్డ ఒకటి చేయు వరకు, యేసుక్రీస్తు రక్తము ప్రాయశ్చిత్తము చేయును. అయితే ఇప్పుడు తల్లి, తండ్రి; తల్లిదండ్రులకు బిడ్డను తీసికొనివచ్చి దేవుని వలన వారికనుగ్రహించబడిన బిడ్డను తిరిగి దేవుని అర్పించుటకు వారికి హక్కుయున్నది.
1SAM 1:2,10,11
19హన్నా ఆలయంలో ఉన్నది. ఆమె వాగ్దానం చేసికున్నది… ఆమె గొడ్రాలు. వృద్దురాలు, ఆమెకు బిడ్డలు లేరు. ఆమె బలిపీఠము యొద్ద ఎంతో విధేయతతో ప్రార్ధన చేసినది, ఎంతవరకనగా యాజకుడు అక్కడకు వచ్చి ఆమె మత్తురాలని ఆమెపై నేరము మోపు వరకు ప్రార్ధించినది. దేవుడు తనకు బిడ్డను దయచేయుటకై ఆమె బలిపీఠమునొద్ద మొరపెడుచు, ఏడ్చుచు౦డెను. మరియు "దేవా! నీవు నాకొక బిడ్డను అనుగ్రహించినట్లయితే, మరలా ఈ స్థలమునకే నేను తీసికొనివచ్చి నీకు దానిని యిచ్చెదను" అది ఆమె చెప్పినది.
తల్లులారా, ఆ విధముగా మీరు మీ బిడ్డను పొందుకున్నారు. మీ బిడ్డను దేవుడు ఇచ్చియున్నాడు, అది హన్నాకు బిడ్డను ఎలా ఇచ్చియుండెనో, అది ఆలాగుయున్నది. ప్రతిష్ఠ ఆరాధనలో ఆలయమునకు వచ్చి చిన్న సమూయేలుకు హన్నా ఏ విధముగా చేసెనో, తిరిగి ఈ రాత్రి మీ బిడ్డలను మీరు తీసికొనివచ్చుచున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ బిడ్డను మీకు యిచ్చియుండెనో, ఆ దేవునికి బిడ్డను ప్రార్ధన ద్వారా ప్రతిష్ఠచేసి మీకు మేము తిరిగి యిచ్చెదము. మరియు ఇక్కడ ఈ రాత్రి నిలబడియున్న చిన్న బాలురు, బాలికలు, ప్రభువునకు మీరు ఎవరినైతే తిరిగి యిచ్చుచున్నారో, అట్టివారు ప్రభువునకు పురాతన కాలంలోని సమూయేలు వలే ప్రవక్తలు, ప్రవక్తీలు, వీరు కావాలని నేను ప్రార్ధించుచున్నాను.
REV 22:18,19
20ఇప్పుడు, సభలోని వారు, ఒక క్షణం తలలు వంచినట్లయితే. మహా ప్రేమ, కృపాబాహుళ్యతలుగల దేవా! మేము గతించిపోయిన తరువాత రాబోవుచున్న తరము కొరకై ఈ గడియలో నీ కృపా కనికర సింహాసనమును మేము సమీపించుచున్నాము. ఇక్కడ ఎవరైతే నిలబడియున్నారో, ఆ చిన్న బిడ్డలు వారిని వారు పట్టుకొనియున్నారు. వారి తల్లియొక్క తండ్రి యొక్క ముంజేతుల్లో ఈ రాత్రి వారు పట్టుకొనబడియున్నారు. వారు రేపటి జాతి యొక్క విత్తనములైయున్నారు. ఈ యొక్క తల్లులు, తండ్రులు ఇక్కడకు ఈ చిన్నారులను ప్రతిష్ఠతకై తెచ్చుట ద్వారా, జీవముగల దేవునికి వారి చిన్న జీవితాలను అర్పించుట ద్వారాను, వారు సరియైన ప్రారంభాన్నే ఆరంభించారనునది నిశ్చయమైన విషయమౌతున్నది.
తండ్రీ, పాస్టర్ గారు మరియు నేను ముందుకు నడచి వచ్చి, ఈ చిన్న బిడ్డలను ప్రతిష్ఠత ప్రార్థన ద్వారా నీకు అర్పించుకుంటున్నాము. మా తండ్రీ! వారిని ఆశీర్వదించుము. నీ యొక్క చిన్న సేవకులుగా యుండుటకై నీవు వారిని ఆశీర్వదించమని మేము ప్రార్ధన చేయుచున్నాము. వారు చాలాకాలము జీవించి, భూమి మీద సంతోష జీవితం జీవించి, ప్రభువైన యేసు రాకడను చూచెదరు గాక. అంతమాత్రమే గాక, ఆరోగ్యపరమైన ఆనంద జీవితం జీవించి, ఎంతోకాలం జీవించి, నీకు సేవకులు అవుదురు గాక.
HEB 1:3•
HEB 8:1
21నీవే వారిని నడిపించుదువు గాక. ఈ బిడ్డలలో నుండి, రేపటి కొరకు అది రేపు అనునది వచ్చినట్లయితే - నీవు వారిని బోధకులుగాను, పాటలుపాడు వారిగాను, సువార్తికులుగాను, మిషనరీలుగాను, నీవే చేయుదువు గాక! ప్రభువా! అనుగ్రహం చూపుము. నీవు మాకై విడిచిపెట్టినట్లుగా, నీ యొక్క లేఖనము పరిశుద్ధ వాక్యము ప్రకారముగా మేము ఎరిగినంత మట్టుకు వీరిని నీకు ప్రతిష్ఠ చేయుచున్నాము. అది, బైబిల్ గ్రంధంలోని ఆఖరి పుస్తకంలో వ్రాయబడియున్నది. "జీవగ్రంధములో నుండి ఒక్క వాక్యమును తీసివేసినవానిని, లేక దీనికి ఒక మాట కలిపిన వానిని, దానిలో నుండి దేవుడు తీసివేయును." అలాగైతే - బైబిల్ గ్రథము పవిత్రమైన దేవుని యొక్క వాక్యము యని మేము గ్రహించుచున్నాము. మేము దానికి ఒక్క మాటను కలపలేము, లేక దానినుండి ఒక్కటి తీసివేయలేము. కాబట్టి ప్రభువా! నీవు దానిని మాకిచ్చినట్లుగానే, దానిని వదలివేయుచున్నాము. దానినే బోదించెదము. నీ కృప ద్వారా దాని ప్రకారంగా జీవించుటకు ప్రయత్నించెదము.
గతించిపోయిన దినములలో యేసునొద్దకు వారు తేబడినట్లుగా, ఈ బిడ్డలను మేము ప్రతిష్ఠ౦చుచున్నాము. ఆయన ఈ రాత్రి యిక్కడ భూమి మీద శరీరరూపమున ఉన్నట్లయితే, ఆ చిన్నవారిని తీసికొని వచ్చుచున్న ఈ తల్లులు, తండ్రులు పరుగులు తీయుదురు. ఆయన వారిమీద చేతులు పెట్టి వారిని ఆశీర్వదించును. ప్రభువైన యేసు! మహోన్నతుని కుడిపార్శమున నీవు కూర్చొనియున్నావు. నీ సేవకులముగా మేమిక్కడ పెట్టబడియున్నాము. నీవు వారి చిన్న జీవితములు స్వీకరించి, నీ మహిమకై వారిని వాడుకొనమని ప్రార్ధనలో వారిపైన మా చేతులు పెట్టుచున్నాము. యేసుక్రీస్తు నామములో మేమది అడుగుచున్నాము. ఆమేన్.
22అతని పేరేంటి? జాన్. ఇతడే చిన్న జాన్ మేయెర్, మనమందరము గత దినము ప్రార్ధించినవాడు అతడు మనతో ఈ రాత్రిలో ఉండియున్నాడు. మనము తలలు వంచుకుందాము. ప్రభువైన యేసూ! ఈ రాత్రివేళలో నీ యొక్క సంఘకాపరిగా మరియు నేను కలసి నిలబడి, అతడి తండ్రివలె కన్పించుచున్న ఈ పసిబిడ్డను ఈ తల్లి హస్తాల్లో నుండి తీసుకొనుచున్నాము. రాబోవుచున్న దినములలో ఈ చిన్నవాని నిమిత్తమై గొప్ప అవకాశమును నిరీక్షించుచున్నాము. ప్రభువా! ఇప్పుడు నేను ఈ చిన్న జాన్ మేయర్ ను నీ పరిచర్య కొరకై నీకు యిచ్చుచున్నాను. యేసుక్రీస్తు నామములో దేవునికి మేము ప్రతిష్ఠ చేయుచున్నాము. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు చిన్న వానిని దీవించును.
ఆమె పేరు ఏంటి? లిండా కోలిన్స్. అయితే చిన్న లిండా కోలిన్స్, మనము తలలు వంచుకుందాము. పరలోకపు తండ్రీ! దీనిని మరియొక చిన్న [స్పష్టత లేని మాటలు]. ఆమెను ఆశీర్వదించుము. ఆమె యొక్క తండ్రిని, ఆమె తల్లిని వారి గృహములలో ఆశీర్వదించుము. మరియు ఆమె ప్రభువు మహిమకై జీవించును గాక. ప్రభువు అనుగ్రహము చూపుము. ఆమె యొక్క జీవిత ప్రతిష్ఠ కొరకు ఎలిసబెత్ కోలిన్స్ ను మేము నీకు అర్పించుచున్నాము. యేసుక్రీస్తు నామములో. దేవుడు నిన్ను దీవించును గాక.
23ఇది చిన్న బోనీ గెయిల్ స్తెతెన్. ఆమె తల్లి తదితరులు ఇప్పుడే ఆలయానికి వచ్చుచున్నారు, పరిశుద్దాత్మను పొందియున్నారు మరియు బాప్తిస్మము పొందియున్నారు. మనము తలలు వంచుకుందాము. మా యొక్క పరలోకపు తండ్రీ! ఈ యౌవన తల్లి తండ్రి యొక్క ధైర్యమును, ఆమె వచ్చుచున్న మార్గమును మరియు ఆమె చేసిన పురోగమనమును మేము అభినందించుచున్నాము. కోమలమైన వారి చిన్న హృదయాలను, దీనిని నీవెంతగా ఆశీర్వదించితివో కదా! ప్రభువా! ఆమె చిన్న బ్రతుకును నీవే దీవించమని, ఈ చిన్నారిని నీకు అప్పగించుచున్నాము. మరియు ఈమె నీకు దాసురాలు అవునును గాక! ఆమె తల్లిని తండ్రిని ఇరువురిని దీవించుము. ఆమె ఎల్లవేళలలో కూడా దేవుని యొక్క ప్రభోధలోను క్రైస్తవ గృహములోను పెంచబడును గాక. యేసుక్రీస్తు నామములో మేము నీకు ఆమెను అప్పగించుచున్నాము. ఆమేన్.
24ఇది చిన్న ఎలిజబెత్ క్రౌటన్. ఒకవేళ ఆమె నన్ను పైకెత్తనిస్తున్నదేమో. ఆమె మధురమైన చిన్న బాలికయైయున్నది. మనము తలలు వంచుకుందాము. పరలోకపు తండ్రీ, ఈ చిన్న బిడ్డను [స్పష్టత లేని మాటలు] మరియు పరలోకపు తండ్రీ, నీవు ఆమెను ఆశీర్వదించమని, ఆమె జీవితమును నీ రాజ్యములో సాధనముగా చేయమని, మేము ప్రార్థించుచున్నాము. ఆమె యొక్క తల్లిని తండ్రిని దీవించుము. బిడ్డ క్రైస్తవ గృహములోను, దేవుని యొక్క ప్రభోధములోను, పెంచబడును గాక. మేము ఆమెపై మా చేతులుంచి ఆమెను నీకును, ఆమె చిన్న జీవితమును నీ పరిచర్యకు ప్రతిష్ఠ చేయుచున్నాము. యేసుక్రీస్తు నామములో, ఆమేన్. దీవించును గాక.
25బెంజమిన్ [స్పష్టత లేని మాటలు]. మనము తలలు వంచుకుందాము. మా పరలోకపు తండ్రీ! ఈ చిన్న ప్రియమైన బిడ్డను మేము నీకు యిచ్చుచుండగా, ప్రభువా! ఏమి జరుగుచున్నదో ఎరుగుటకు ఇంకా చిన్నదిగానే ఉన్నది. అయితే, ప్రభువా, అన్నియును నీవు ఎరిగినవాడవు. అతని చిన్న జీవితమును నీవు ఆశీర్వదించమని ప్రభువా! మేము ప్రార్ధించుచున్నాము. అతని గృహమును దీవించుము. మరియు ప్రభువా, ఈ చిన్నవాడు దీర్ఘాయువు గల మంచి జీవితమును దేవుని మహిమకై జీవించును గాక! సాధ్యమైతే ప్రభువైన యేసు రాకడను చూచును గాక. ప్రభువా! అది అనుగ్రహించుము. యేసుక్రీస్తు నామములో నీ పరిచర్య కొరకై నీకు మేము ప్రతిష్ఠ చేయుచున్నాము. ఆమేన్.
ఇప్పుడు, గమనించుడి. నేను అతనిని పట్టుకొనూటను తల్లి ఎంతో తీక్షణంగా గమనించుచున్నది. చిన్న విలియం బేట్స్. నిజంగా చిన్న ముద్దు బిడ్డ, చక్కగా కనిపించు చిన్నవాడు. మనము తలలు వంచుకుందాము. ప్రభువైన యేసూ! నీ యొక్క పరిచర్య కొరకై ప్రియమైన చిన్న బాలుని నీకు ఇచ్చుచున్నాము. ప్రభువా! దేవుని మహిమ కొరకు అతడు వాడబడుటకై తండ్రి, తల్లి అతనిని తీసికొని వచ్చుచున్నారు. అందుచేత ప్రభువా! గడచిపోయిన దినములో నుండి పఠనము చేసినట్లుగా, ఆయన ఆయన హస్తములను ఈలాగు పసిబిడ్డలపై పెట్టి వారిని ఆశీర్వదించెను. ఆయన యొక్క ప్రాతినిధ్యము వహించుటకు మా యొక్క హస్తాలు బలహీనమైయుంటున్నవి, అయితే ఈ బిడ్డను జీవితకాలపు పరిచర్యకై యేసుక్రీస్తు నామములో మేము అడుగుచు, నీకు యిచ్చుచున్నాము. ఆమేన్.
MARK 10:15•
LUKE 18:17
26నీ పేరు ఏమిటి? సుసి బేట్. చిన్న సుసి బేట్. మనము తలలు వంచుకుందాము. పరలోకపు తండ్రీ! మెరయుచున్న కన్నులతోనున్న ఈ చిన్న బాలిక, వారు ఏమి ఎరుగాకయే [స్పష్టత లేని మాటలు], వారిలో ఎవరికీ తెలియదు. అయితే తండ్రి, తల్లి సంకుచితమైన ఇరుకు దారిన ఆమె నిలబడాలని వారు కోరుకొనుచున్నారు. మరి యిటువంటి అందమైన ఈ చిన్న సాధనమును సాతాను ఏ విధముగా ఉసిగొల్పునో కదా! అయితే వారు దానిని తీసుకొని వచ్చారు. తద్వారా సాతాను దానిని ఆక్రమణ చేసికొనకుండునట్లుగా చేయుటకు తీసికొనివచ్చిరి. ప్రభువా! నీ పరిచర్య కొరకై ఆమె చిన్న జీవితమును దాచుము. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
వారిని లోనికి తీసుకొనిరండి, వారిని లోనికి తీసుకొనిరండి,
పాపపు పొలములో నుండి,
వారిని లోనికి తీసుకొనిరండి, వారిని లోనికి తీసుకొనిరండి,
చిన్న బిడ్డలందరిని యేసు నొద్దకు తీసికొని రండి.
ఓ, ఏలాగు… చిన్న బిడ్డలను మీరు ప్రేమించరా? ప్రజలు చిన్న పిల్లలను ప్రేమించనట్లయితే, ఏదో తప్పు ఒకటి అక్కడ యుంటున్నది. యేసు చెప్పియున్నాడు, "మిరు మార్పుచెంది, ఈ చిన్న బిడ్డలవలె మీరు కానట్లయితే, మీరు రాజ్యములో ప్రవేశించరు," ఒక్కరు కూడా. (అక్కడ వెనుక ఒక తండ్రికి యిరువురు చిన్న బాలికలుయున్నారు, ఇంకా అతడు తీసుకొని రావలెనని కోరుకొనుచున్నాడు. "నేరుగా వారిని ముందుకు తీసుకొని రమ్మని," నేనతనికి చెప్పితిని.)
27"మనము మార్పుచెంది ఈ చిన్న బిడ్డలవంటి వారమైతేనేగాని…" అదేమిటో మీకు తెలుసా? వారి చిన్న భావనను మీరు గాయము చేయగలరు. అమ్మ మరియు నాన్నకు తెలుసు. అనేకసార్లు వారు చికాకులో పడినప్పుడు, వారిని చిన్న దెబ్బ కొడతారు. ఎందుకు? రెండు నిముషములలో దానినంతా మరచిపోయి, వారి యొక్క చిన్న హస్తాలు నీ చుట్టూరా చుడతారు. ఆ విధముగా మనము చేయవలసియున్నది. ఏమి జరిగినది అనవసరము, మనము క్షమించవలసియున్నది, మరియు ఒకరియెడల ఒకరు దయకలిగి యుండవలసియున్నది, మరియు ఆ విధముగా మనము చిన్న బిడ్డలవలె క్షమించుటకు యిష్టపడుటకు, మరియు మరిచిపోవుటకు ఆ విధముగా యుండవలసియున్నది. ఆ విధముగా మనము చేయవలసి యుంటున్నది. అప్పుడు, ఆ విధముగా మనము చేసినప్పుడు, దేవుని రాజ్యమునకు మనము సమీపముగా వచ్చుచుందుము.
ఒక విధముగా సిగ్గుతో నున్న యిద్దరు అమ్మాయిలు అనుకుంటాను. నాన్న అమ్మ వారితో నడువవలసియున్నది. మంచిది, అది ఎంతో బాగున్నది. అది ఎంతో యిష్టపడుతున్నాము. బిడియము గల ఆడపిల్లలను మనము యిష్టపడతాము.
28ఓ, వీరు, ఆ పాటలు పాడు ఆ చిన్నవారా? ఔను కదా? ఆ పాట పాడినది యిదేనా? నీ పేరు ఏమిటి? రూతు. అదెంతో అందంగా యున్నది. రూతు ఎంతో అందమైన పేరు, నేనది యిష్టపడుతున్నాను. నిజముగా అది మంచిదని నేనిష్టపడుచున్నాను. మరి చివరి పేరేంటి? మేయేర్స్. చిన్న రూతు మైయేర్స్. ఆమె మనకు పాటలు పాడు చిన్నవారిలో ఒకరైయున్నది. వారు కవల పిల్లలా? అంతా ఒకే విధంగా కన్పిస్తున్నారు. మా పరలోకపు తండ్రీ! ఏ విధముగాను పరిచర్యకును, దేవుని రాజ్యమునకు యింకా ప్రతిష్ఠ చేయలేదని తండ్రి తల్లి తెలుపుచున్నారో, అట్టి ఈ చిన్న బాలికను నీకు మేము యిచ్చుచున్నాము, ఈ రాత్రి ఈ చిన్న రూతుపైన, రూతు మైయేర్స్ పైన మేము చేతులు పెట్టి, పాడుటకు ఎవరైతే వరమును ఆమెకు దయచేసెనో, అట్టి సర్వశక్తివంతుడైన దేవుని శక్తి ఆమెను ఆశీర్వదించ కొనసాగించమని అడుగుచున్నాము. మరియు ఆమె యిక్కడ భూమి మీద యున్నంతకాలము, నీకే ఆమె బ్రతుకు సమర్పణగా నుండును గాక. యేసుక్రీస్తు నామములో ఆమెను మేము నీకు అప్పగించుకుంటున్నాము. ఆమెన్.
29చిన్న సహోదరి యొక్క పేరేంటి? లోయిసి చిన్న లోయిసీ మై! పరలోకపు తండ్రీ! చిన్న వయస్సులో సువార్తను గూర్చి పాడుటకు వరమును కూడా కలిగియున్న లోయిసీ పైన మేము చేతులు పెట్టుచున్నాము. ప్రభువా! ఈ బిడ్డల యొక్క వరములను ఆశీర్వదించుము. వారియొక్క తల్లి తండ్రి వలన, వారి యొక్క జీవితములు ఇప్పుడు నీకు ప్రతిష్ఠ చేయబడుచున్నవి. ఎంతో త్వరగా, ప్రభువా! బాప్తిస్మము పొందుటకు వారు సరిపోయినవారు కాబోవుచున్నారు. తప్ప ఏదో తదితరమైనవేవో వారు గ్రహించుకొనుటకు తప్పుచేయుటకు వారు ప్రారంభించగనే, అప్పుడు వారు తప్పక పశ్చాత్తాపము నొంది బాప్తిస్మము పొందవలసియున్నది. ప్రభువా! ఆ సమయము వచ్చు వరకు, నీకు మేము వారిని ప్రతిష్ఠ౦చుచున్నాము. నీ మహిమకై వారి వరములను నీవు వాడుకొందువు గాక! అనేక దినములు జీవించి, సంతోషముగా జీవించిన జీవితములను, నీకై పరిచర్య చేయుటకు వారి జీవితములను వాడుకొనుము, యేసుక్రీస్తు నామములో ఈ చిన్న బాలికను నీకు మేము ప్రతిష్ఠ చేయుచున్నాము. ಆమెన్. దేవుడు నిన్ను ఆశీర్వదించును. వెళ్ళుము, మరియు దేవుడు నీతో యుండి, నీవు చేయు ప్రతికార్యమును నిరంతరము ఆశీర్వదించును గాక!
MATT 5:12,16
30ఓ, వారు ఎంతో చక్కగా ఉన్నారు అనుకొనుచున్నాను. నా ఆడపిల్లలు ఇప్పుడు పెద్దవారైపోతున్నారు. కనుక నేను ఒక విధముగా… నేను వారిని నా వీపు పై ఎక్కించుకొని త్రిప్పేవాడిని, దాదాపు వారిని ఆలాగు ఆడించే వాడిని, ఇప్పుడు వారు ఎంతో పెద్దవారైపోయారు. ప్రత్యేకించి, బెక్కీ — ఎంతో పెద్ద అమ్మాయి.
ఇప్పుడు, మనము ప్రభువు యొక్క వాక్యమును తెరిచెదము, మత్తయి 15… లేదా, 5 అద్యాయము, కొంత భాగము మాత్రమే చదువుదాము. తరువాత, ప్రభువు చిత్తమైతే షుమారు పదిహేను, ఇరువై నిముషముల కొరకు ఒక చిన్న పాఠమును దీనిలో నుండి నేను తీసుకొని వచ్చెదను. అటు తరువాత, మనకు రొట్టె విరచుట, పాద పరిచర్య, యింకా బాప్తిస్మపు ఆరాధన యుండును. అది షుమారు తొమ్మిది-ముప్పయి వరకు మనకు సమయము పడుతుంది, ఆ తరువాత లేదా కొంచెము ఆలస్యముగానో ముగించుకొనుట అవుతుంది.
MATT 5:16
315వ అద్యాయము 12వ వచనము నుండి నేను ప్రారంభించ ఆశించుచున్నాను.
సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రోక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.
మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండమీదనుండు పట్టణము మరుగైయు౦డనేరదు.
మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కానీ అది యింటను౦డు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్థంభముమీదనే పెట్టుదురు.
మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి.
అక్కడున్న ఆఖరి వచనములో నుండి - అనగా 16వ వచనము నుండి, ఒక విషయ శీర్షిక నేను తీసికోవాలని ఆశిస్తున్నాను. "మనుష్యుల యెదుట మీ వెలుగు ఎంతో ఎక్కువగా ప్రకాశింపనియ్యుడి… మనుష్యులు మీ సత్క్రియలు చూచి, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ఎంతో ఎక్కువగా ప్రకాశింపనీయుడి."
ROM 4:2
32మనము లేఖనములో ఈలాగు కనుగొనుచున్నాము. అది రెండు స్థలములలో ఇద్దరు వేరువేరు మనుష్యులు నీతిమత్వమును గూర్చి మాట్లాడుచున్నారు. అందులో ఒకరు పౌలు; మరొకరు పేతురు. పరిశుద్దుడైన పౌలు, పరిశుద్దుడైన పేతురు. మరియు పౌలు అబ్రహామును విశ్వాసమును బట్టి నీతిమంతునిగా తీర్చుచుండెను. మరి పేతురు, క్రియల ద్వారా అతనిని నీతిమంతునిగా తీర్చుచుండెను. క్రియలు మాలముగా అతడు నీతిమంతుడుగా తీర్చబడెనని పేతురు చెప్పుచున్నాడు; అతని విశ్వాసము వలన నీతిమంతునిగా తీర్చబడెనని పౌలు చెప్పుచున్నాడు.
ఇప్పుడు వారు ఒకరికి ఒకరు వైరుధ్యముగా వారు లేరు. రెండు వేరువేరు దృశ్యభావములతో వారు చూశారు. పౌలు, అబ్రహాము యొక్క విశ్వాసమును గూర్చి మాట్లాడుచుండెను. అది అబ్రహాములో దేవుడు చూచినది. అతని విశ్వాసమును గూర్చి పలుకబడిన అతని క్రియలను గూర్చి పేతురు మాట్లాడుచుండెను. కాబట్టి అది "నీ విశ్వాసము లేకుండ నీ క్రియలను చూపము, మరియు నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనపరచెదను" అని వ్రాయబడినది. కాబట్టి ఇప్పుడు, దేవుడు ఏది చూచియున్నాడో అది చూచుచూ, పౌలు మాటలాడుచున్నాడు. మరియు మనుష్యుడు ఏమి చూచెనో, దానిని గూర్చి పేతురు మాటలాడుచున్నాడు — ఎందుకనగా ఒక మనుష్యునికి విశ్వాసము యున్నట్లయితే, ఆ విధముగానే అతడు నడుచును. అతని బ్రతుకు దానిని యితరులకు చూపును.
33కనుక, దానిని గూర్చి ఈ రాత్రి, నేను మాట్లాడబోవుచున్నాను, "మన వెలుగు ప్రకాశింపచేయుటకు అనుమతించుట," ఇప్పుడు ఈ కొద్ది నిముషాల కొరకు.
నేనేదో యితరులకు కనుపరచుకొనుటకు, లేదా ప్రజలకు నన్ను వినిపించుకొనుటకు నేనిక్కడ నిలబడను. అది అనుచితమైనదిగా యుండదు. అయితే, దేవుడు నాకు సహాయము చేయుచుండుట వలన మనందరికి ఉపయుక్తమైనవి. మనమేలాగు మంచిగా యుండవలెనో మరియు మంచి జీవితం ఏలాగు జీవించవలెనో, బహుశా అటువంటివి మేము మాట్లాడగలము. దిద్దుబాటును స్వీకరించి మనలును మంచి క్రైస్తవులనుగా మనలను చేయుటకు మనమేమేమి చేయాలి అనునది గ్రహింపు పొందుటకు, అందుకే మనమంతా యిక్కడున్నామని నేను నిజంగా అనుకుంటున్నాను. నా జీవితంలో నాకొక కోరిక ఒకటి యున్నట్లయితే, అది నేనున్నదానికంటే మంచి క్రైస్తవునిగా నేను కావాలి అనునదియేయౌతుంది. ఇక్కడ ఈ రాత్రి ఉన్న ప్రతి ఆత్మ యొక్క హృదయ కేక, మంచి క్రైస్తవుడు కావలయునుననుదియే నేను దృఢముగా నమ్ముచున్నాను.
34కొంత కాలము క్రితము రహదారిపై వెళ్ళుచుంటిని, బహు వేగంతో నడుపుకుంటూ వెళ్ళుచున్నాను. మరియు సహజముగా నేను గమనిస్తున్నట్లుగా గమనించుచూ, నాకు నేనే బండి నడుపుకుంటూ వెళ్ళుచున్నాను. నీకు నీవే నడుపుకుంటూ వెళ్ళుచున్నప్పుడు అది ఒంటరి ప్రయూణమౌతుంది. ఏవో కుటుంబమునకు సంబంధించిన నెట్వర్క్ ఎక్కడైతే మతసంబంధమైన (క్రైస్తవ) సంగీతము యుంటే తప్ప రేడియోను నీవు త్రిప్పలేవు, ఎందుకనగా అలంటి విషయాలు నీలోనున్న ఆత్మనంతా అది తీసివేయునది అదంతాయౌతుంది. (నేను కొద్దిగా పెద్దవాడైనైన తరువాత), నేనెక్కడకు వెళ్ళినప్పటికి చిన్న కాగితపు అట్టను తీసికొని వెళ్ళుదును. ప్రభువు నాకు ఒకటి బయలుపరచినప్పుడు, నేను వెంటనే గురుతు పెట్టుకుంటాను. చివరకు అడవులలో తుపాకి గుండుతో, తుపాకి కట్టె మీద వ్రాసుకున్నాను. నాకు యివ్వబడిన దానికి తలంపునకు తెచ్చుకొనుటకు ఆలాటి సంగతులను అలాగు చేయుదును. నా బట్టలలో నుండి చిన్న దారపు ముక్కను లేక యింకొకటి తీసికొని దానిపైన వ్రాసికుంటాను — వర్తమానం నా మనస్సులో యుంచుకొనుటకై ఏదో యొకటి తీసుకుంటాను.
35ఈ దారి క్రిందుగా నేను నడుపుకుంటూ వెళ్తుండగా, ఒక పెద్ద అందమైన ప్రకటన ఫలకము (సైన్-బోర్డు). నేను గమనించాను, మరియు ఇది మీకు తెలుసా! సహజముగా ఈ ప్రకటన ఫలకము మీద వారు చాలా చాల వస్తువులు అతికించెదరు, అయితే అటువంటివేమి ఈ ప్రత్యేకమైన ప్రకటన ఫలకముల మీద యుండుట నేను గమనించలేదు. సహజంగా సగము - సగము వస్తాలతోనున్న స్త్రీల బొమ్మలను వారు ఉంచుతారు, లేక మరొకటి యేదో వుంచెదరు. ఒక రకానికి చెందిన సిగరెట్టు ప్రకటన, లేక విస్కీ లేక బీరు, లేక అలాటిదేదో బాగుగా ప్రకాశించు ప్రకటన ఫలకములు యుంచెదరు. అయితే నా మొదటి దృష్టిలోనే నాకు ఆశ్చర్యం కలిగి౦చినది. అది! నా గమనమును అది ఆకర్షించినది, ఎందుకంటే మరేదో యొక దానితో అది మసిగొట్టుకొనపోలేదు. దానిపైన మరకలేదు. నేను చూచుటకు వెనుక తీక్షణంగా చూచితిని, అది అందమైన ఫలకము. సరైన స్థలములో పెట్టబడియుండెను. నీవు ఈ మూలకు తిరిగినట్లయితే, ఆ ప్రకటన ఫలకమును నీవు చూడకుండ ఉండలేవు. అచట అది పెట్టబడియుండెను. నాకు ఆశ్చర్యాన్ని కల్లించినది ఏమనగా, దానికి అడ్డముగా ఒక్క పదము మాత్రమే వ్రాయబడియున్నది "ఆకలిగా ఉన్నారా" అని. కేవలం "ఆకలిగా ఉన్నారా," అక్కడున్నదంతా అదే. అటు తరువాత ఫలకము దిగువ భాగమున కొద్ది చిన్న అక్షరముయున్నది. "మూడు మైళ్ళ దూరాన" అని యున్నది. "ఆకలిగా ఉన్నారా, మూడు మైళ్ళ దూరాన" అని చెప్పబడియున్నది.
36సరే, దానిని గూర్చి అధ్యయనము చేయుటకు నేనారంభించాను. ప్రజలు ఎంతగా యుండరు… సహజముగా వారికి ముందు భోజన శాల ఉండినట్లయితే, వారు ఉడుకుతున్న గొడ్డు మాంసపు ముద్దలు మొదలైన వాటి బొమ్మల చిత్రమును ప్రకటనగా పెట్టుదురు, ఇ౦కొకరికంటే హెచ్చుగా అమ్ముటకు ప్రయత్నిస్తుంటారు. మరి నీవు లోపలకు వెళ్ళిన తరువాత, వారు ఏవేవి ప్రకటనలు ప్రకటి౦చారో అటువంటివి సహజంగా నీవు కనుగొనలేవు. అయితే ఇది ప్రజలను సమీపించు మరోక విధమైన పద్దతిగా కనిపించినది.
మనము బ్రతుకుతున్న ఈ దినమున, ప్రకటన కొరకు డబ్బు చెల్లించవలసి యున్నదని మనకు తెలుసు. వీరు, ఎవరైతే వ్యాపారములో బహుగా అభివృద్ధి చెందినవారైయున్నారో వారందరు, ప్రకటనలు చేయుటలో గొప్పవారైయున్నారు. వారు దానిని టెలివిజన్లలో పెట్టెదరు, మరియు వారి ఉత్పత్తులను ప్రకటనలు చేయుటకై, అక్కడ వారు పులుముతారు. వారి ఉత్పత్తులను ప్రకటన చేయుటకై వారికిష్టమైన చోట పూయుదురు. "దీనిని ధూమపానము చేయుము, బండి బరువంత దగ్గుకాదు." మరియు "ఆలోచనపరుని వడపోత సాధనము" మరియు మరొక మనుష్యుని రుచి లేక అలాటివి. వారి యొక్క బీరుతో "చాలాకాలము జీవిస్తూ ఉండుము," ఆలాటిదంతా. అది యొక ప్రకటన. మరియు ప్రకటన కొరకు వారి యొక్క ఆదాయపు పన్నును వాడుకొందురు, మరియు అది వారికి ఫలితమును (రాబడి) యిచ్చుచున్నది.
37అందునుబట్టి అది ఫలితము ఇచ్చినట్లయితే, "ఆలాగైతే క్రైస్తవ్యము ప్రకటన చేయబడితే ఎందుకని ఫలితమునివ్వదు?" అని నేను ఆలోచన చేయుటకై మొదలుపెట్టితిని. మంచిది, అటు తరువాత, "ఆలాగైతే, ప్రకటన" అనగా ఏమిటి? అని ఆలోచించాను. మిగతావారు కలిగియున్నదానికంటె కొద్దిగా వ్యత్యాసమైనది నీవు కలిగియుండవలసి యుంటున్నది. లేదా లోకము యొక్క మిగతా వస్తువువలె అది సాధరణముగా యున్నట్లయితే, అది ప్రజల యొక్క గమనమును అది ఏనాడు ఆకర్షించలేదు. ఇప్పుడు, ఒక ఇంధన వాహనము కొరకు ఒక మనుష్యుడు ఎదురుచూస్తున్నట్లయితే, ఆ గురుతును, అతడు దాటిపోవలసియుండెను. అయితే, అతడు ఆకలిగొని యుండినట్లయితే, అతడు ఆ గురుతుకై ఎదురుచూచుచూ యుండును.
కాబట్టి క్రైస్తవుడు దేవుని యొక్క "ప్రకటన ఫలకము" (బిల్-బోర్డు) అని నేను నమ్ముతున్నాను. మనలో ఒక్కొక్కరు కూడా దేవుని యొక్క ప్రకటనల ఫలకమైయున్నామని నేను నమ్ముతున్నాను. మరియు దానిని గూర్చి మనం చేస్తున్నట్లుగా మనమెక్కువగా చేయనవసరంలేదు. నీ వలె యుండుటకు ప్రజలు ఆకలిగొనువారిగా చేయునట్లు నీవు జీవితము జీవించితే చాలును.
38నేనొక ప్రత్యేకమైన యొకదానిని ఈ ప్రకటన ఫలకము మీద గమనించాను, "నీవు ఆకలితోనున్నావా? అది ప్రశ్నను మాత్రం తప్ప మరి దేనిని అది చూపించలేదు. వారు ఆకలితోనుంటేనే తప్ప, నీవు ఎవరికి ఏదైనా అమ్మకం చేయలేవు.
ప్రకటన చేసే ప్రప్రథమ విషయమేదనగా, దారిని వెళ్తున్న వ్యక్తి దానిని చూచునట్లుగా అది చేయును. క్రీస్తును లోకములో చూచునటువంటి ఒకే ఒక మార్గమేదనగా, ఎప్పుడైతే వారు దానిని నీలోను మరియు నాలోను దానిని చూచుటయౌతుంది. క్రీస్తును చూచునటువంటి మార్గము అదొక్కటే. సూర్యాస్తమయాలకు, పక్షుల కోలాహలానికి, ఆకులకు, మరియు గడ్డికి, పువ్వులకు, సంగీతానికి, మరియు వర్తమానమునకు యింకా తదితరమైనవాటికి వారి యొక్క వునస్సాక్తి చైతన్యము లేనిదైపోయినది. క్రీస్తును కనుగొనిన తరువాత తద్వారా మనము ఆనందించినది అది యౌతున్నది. అయితే, మనము క్రీస్తును కనుపరచుకొను స్థానమునకు వచ్చునప్పుడే ఆది యౌతున్నది.
ఇప్పుడది జ్ఞాపకముంచుకో! ఈ రాత్రి మొదలుకొని మీలో ప్రతి ఒక్కరు మీరు దేవుని యొక్క ప్రకటన ఫలకములని జ్ఞప్తించుకోవలసియున్నది. మీరు దేవుని యొక్క ప్రకటనలు చేయు ప్రతినిధులు. ఇప్పుడు, క్రీస్తు ఏమైయున్నది చూచుటకు లోకము మీవైపు చూచును. కాబట్టి, మనము నిజంగా కానివేవో, తెలియజేయువాటిని మరింత చెత్తను అక్కడ మనము రుద్దుకోకూడదు. మనం ప్రప్రధమంగా ఆలాగు యుందాము. అప్పుడు, మనం ఆ విధముగా యు౦డినప్పుడు, అప్పుడు లోకము నీలోను మరియు నాలోను క్రీస్తును చూచును.
JOHN 6:44
39ఏ ప్రకటననైనా దాని యొక్క మొదటి విషయం… దానిని వ్యక్తి చూడవలసియున్నది. అటు తరువాత, అది కావలయునని వారు కోరుకొనవలసియున్నది. వారు దానిని చూచి, అది వద్దంటే; అది వేరే విషయం. అయితే ఉపయోగంలేని ప్రకటనను నీవు అక్కడ పెట్టలేదు. అయితే, మొదట వారది చూడగలిగినట్లయితే, ఆలాటప్పుడు వారికది ఎంతో ఆకర్షణముగా యుండునట్లుగా, దానిని మనము చేయవలసియుంటుంది. ఓ, వ్యక్తి యెడల అది ఏమి చేయునో, అట్టి రక్షణ యొక్క ఆకర్షణను మనం చూస్తున్నామని నేను నిరీక్షిస్తున్నాను. క్రీస్తు కొరకు లోకమును మనము ఆకర్షించవలసియున్నది. సువార్తకు ఒక ఆకర్షణనను కలిగియున్నది. దేవునికై ఎవరైతే ఆకలిగొనియుందురో, వారికి అది వర్తిస్తున్నది. ఎవరైతే ఆకలి దప్పిక కలిగియుండెదరో, ఆలాటివారిని మాత్రమే అది ఆకర్షిస్తుంది. ఆందుకొరకై యున్నవారమే మనము. "నా తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాడు."
అయితే తండ్రి ఆకర్షించిన వారు చాలా మందియున్నారు. మరియు వారు దేవుని కనుగొనుటకు ఆకలి - దప్పికతో యున్నారు. మరియు ఆయనను ఎక్కడ కనుగొనవలెనో ఎరుగక, ఉన్నారు. ఎందుచేతనగా ప్రకటనల ఫలకములుగా యుండవలసినవారు, లోకము యొక్క విషయములతో బూజుపట్టి యున్నారు. ఎంతవరకనగా, ఆయన యొద్దకు రాకమునుపు, ఎంత కలిగియున్నారో, అంతకంటే ఎక్కువ కలిగి, అది చూడలేనంతగా యున్నారు. లోకమువలె వారు జీవించెదరు, లోకమువలె వారు మాట్లాడుదురు, లోకము పాడే పాటలను వారు పాడుదురు, లోకమువలె వస్త్రములను ధరించుదురు, (ప్రత్యేకించి ఆడవారిని గూర్చియని నా భావము). మరియు లోకంవలె వారు ప్రవర్తిస్తారు, లోక స్థలాలకు వారు వెళతారు, లోకసంబంధమైన వినోదములకు వారు హాజరవుతారు.
40గత దినము ఒకరు నాతో ఒక విధమైన దైవసేవకుని గూర్చి, ఒకరు నాతో అనెను… నేనా మనుష్యుని ప్రేమిస్తున్నాను. అతడొక గొప్ప మనుష్యుడనుటకు ఏలాటి సందేహము లేదు. అతడు చెప్పెను, "అయితే అది మీరు పరిశుద్ధ గుండ్రాళ్ళని అతడనెను [అంటే, నేను పరిశుద్ధ గుండ్రాయినని అన్నాడు.]"
"మంచిది, నేను ఆలాగుయని - నేను అనుకొనుట లేదు, కాని," నేను చెప్పాను, నేను పరిశుద్ధముగా యుండవలెనని కోరుకుంటాను. నేను గుండ్రాయివలె దొర్లాలని ప్రభువు నాకు చెప్పినట్లయితే, నేను దొర్లుతానని అనుకుంటున్నాను. అయితే, ఎలాగైతేనేం నేను పరిశుద్ధముగా యుండాలనుకొంటున్నాను. పరిశుద్ధ జీవితం జీవిస్తాను, దాని అర్థం దేవుని యెదుట శుభ్రముగా యుండుట.
"కాబట్టి మంచిది, నీవు విదేశాలకు పరుగులు తీయుచూ, ఆ విధముగా చుట్టూ తిరుగుతూ మిషనరీగా నిన్నునీవు చేసికున్నావు." ఏ సంఘము నిన్ను పంపలేదు. మరి, నిన్నునీవే తయారు చేసికున్న మిషనరీవి అయ్యావు," అని అన్నాడు.
"మంచిది, నన్ను నేనే, తయారుచేసుకొన్న మిషనరినియైతే, అదెన్నడు లోకము యొక్క గమనమును ఆకర్షించదు, ఎందుకంటే దానికోసం వారు చూచుటలేదు; వారు క్రీస్తు కొరకు ఎదురుచూచుచున్నారు," అని నేను చెప్పితిని.
41అటువంటి విషయాలను తలంచు ప్రజలు, మనుష్యులు యుండుట మనం చూస్తున్నాము…
రెండు వ్యత్యాసకరమైన తరగతుల వారున్నారు. దేవునికి రెండు వ్యత్యాసకరమైన తరగతులవారు ఉన్నారు. ఇంటి యొద్దనే ఉండిపోయి, రోగులను వివాహంచేసికొని, చచ్చిపోయినవారిని పాతిపెట్టి, చిన్న పిల్లలను ముద్దుపెట్టుకొని, వారి యౌవనులను పెండ్లిచేసికొని యింకా అలాటివి చేయునటువంటి దేవుడు వాడుకొను మనుష్యులున్నారు. వారిలో అనేకులు కత్తిని సంచిలో పెట్టుట ఏమిటో ఎరుగనివారైయున్నారు, మరియు బయటకు వెళ్లి… అక్కడకు వెళ్ళి రెండంచుల ఖడ్గముతో యుద్ధశ్రేణి వరుసలో నిలుచుండుట ఏలాగో ఎరుగనివారున్నారు. యుద్ధ మంటే ఏమిటో వారికి తెలియదు. శత్రువుకు వ్యతిరేకముగా పోరాడుట ఏలాగో తెలియదు. వారు యిక్కడకు వచ్చెదరు. వారు తెలివైనవారు, మతవేదాంత పండితులు, గొప్పవారు, వారితో ఎవరు నిలబడగలరు? ఎంతగానో ఆకట్టుకొనే ప్రసంగాన్ని చేయుదురు. యింకా వారు చెప్పుచున్న వెబ్స్టర్ నిఘంటువులోనే లేనంత భాషను వారు మాట్లాడుదురు. కళాశాలలో విద్యా పట్టములు వారికున్నవి. అయితే, సంఘ నివాసము కోసమై ఎదురుచూచే జ్ఞానవంతుల గుంపుతో నీవు మాట్లాడుచున్నట్లయితే, అది పరవాలేదు. అయితే ఎప్పుడైతే యుద్ధ శ్రేణిలో నీవు వచ్చి, ఎక్కడైతే…
HEB 13:8
42ఆ మనుష్యులకు దానికంటే ఎక్కువ కావలెను. సర్వశక్తిమంతుడైన దేవుని శక్తి ప్రత్యక్షతను వారు చూడవలసియున్నది, లేదా వారికి నీవు దానిని ఎన్నడూ అమ్మకము చేయలేవు. క్రీస్తు యొక్క పునరుద్దానములో వారు ఆయనను చూడవలసియున్నది. అయినను, రెండంచుల ఖడ్గమును పట్టుకొనుట అనగా ఏమిటో, అక్కడున్న శత్రువుతో సరిసమానముగా ఏలాగు పోట్లాడవలెనో వారికి తెలియదు; దయ్యాలు, మంత్రగాళ్ళ సమస్త విధములైనవి అక్కడే నిలబడి, ప్రతి కోణమున నిన్ను సవాలు చేయును. "యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగముగములు ఒక్కటే రీతిగా యుండినట్లయితే, వెనుక పరిశుద్దాత్మ చేసిన అదే కార్యాలు నాకు కనపరచుము" అని బైబిల్ చదివి, అది చెప్పమనువారు యుండునది అక్కడే," చూశారా. ఆలాగైతే నీవు పాండిత్యాన్ని తీసికొని - దానిని చేయలేవు. అది ఉత్పత్తి చేయుటకు యేసుక్రీస్తు యొక్క పునరుద్దానమును మరియు శక్తిని అది తీసుకుంటుంది. ఔను. దానికొరకే ఆకలితోనున్న స్థానిక ప్రజలు ఎదురుచూచుచున్నది. వారు దానిని చూడవలసియున్నది, మరియు దానిని వారు కావాలని కోరుకొనవలసియున్నది.
43ఈ దేశమునకు అటువంటిదే కావలసియున్నది. ఆ కారణము చేతనే, ఈ రాత్రి, అణుయుద్ధం యొక్క ఈ హెచ్చరికలు మనకుయుంటున్నవి, ఎందుకనగా దేశాలు దానిని చూచినవి. ఈ దేశము దానిని అది వద్దని అనుచున్నది. ఆ కారణము చేతనే, దైవిక న్యాయతీర్పు వారిపైన ఉన్నది, కారణమేదనగా మనము త్రాసులో తూయబడియుంటిమి కనుక, కెనెడి, టామ్ మన ప్రెసిడెంటును, అతని పేరు కెనెడి అని అనుకుంటాను. ఇందు కొరకు ఈ అసంయుక్త యుద్ధము కొరకు అనేకమంది అధికారులను అతడు పంపియున్నాడు. దక్షిణాదికి, ఈ అసంయుక్త యుద్ధమును నిలుపు చేయుటకై నాలుగువందల మందిని, యింకా కొందరిని అతడు పంపియన్నాడు. అతని యొక్క సంపూర్ణ విదానములో అతడు నిలుపు చేసినప్పుడు, వారెవరిని పంపలేదు. అతడు 666 ఖచ్చితంగా కలిగియుండెను. అది "టైం" పత్రికలో ఉన్నది. ఓ, ప్రజలు ఆత్మ సంబంధులుగా యుండినట్లయితే, కళ్ళు తెరచి 666 ఏమిటి అని చూచియుందురు. ఖచ్చితముగా వారు అదే కలిగియుండిరి. అది ఈ నెల టైమ్స్ పత్రికలో ఉన్నది.
MATT 5:6
44కనుక, దేవుడు కావాలని ప్రజలు ఆశించే వరకు, ప్రజలు దాహముగొను వరకు అని మనమిప్పుడు చూడగలుగుచున్నాము… "నీతి కొరకు ఆకలి దప్పికగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు" అని యేసు చెప్పియున్నాడు. ఇప్పుడు నీవు దానికొరకు ఆకలి దప్పిక కలిగియుండవలసియున్నది.
మనము క్రీస్తు యొక్క "ప్రకటనల ఫలకలము" మరియు క్రీస్తే మన యొక్క జామినుదారుడైయున్నాడు, ఎందుకనగా ఈ ఉత్తరవాదత్వం క్రీస్తు ద్వారానే జరుగును. ఆయనకు జమీనుండుటకోసము మనకు జీవమును ఆయన యుచ్చుచున్నాడు. ఇప్పుడు, నీవు ఒకని ద్వారా పూచిపడియుండుట జరిగితే, ఎటువంటి వ్యక్తిగా నీవు౦డెదవు? క్రీస్తు ద్వారా మనము పూచిబడియుండినట్లయితే, ఎటువంటి వ్యక్తులుగా మనము ఉండెదము? ఆయన మనకు రక్షణ యిచ్చును, ఆయన మనకు స్వస్థత యిచ్చును, ఆయన మనకు ఆరోగ్యము మరియు బలము ఇచ్చును, ఆయన మనకు ఆహారము యిచ్చును, ఆయన మనకు మన గృహములు యిచ్చును. ఆలాగైతే, మనము క్రీస్తువలన పూచిచేయబడిన వారమౌతున్నాము. ఎవరైతే పరిశుద్దాత్మతో నింపబడియున్నారో, అట్టి పెంతెకోస్తువారు, యేసుక్రీస్తు వలన జామీనుదారులైయున్నారు. యేసుక్రీస్తు వలన పూచిచేయబడిన వారలై, పరిశుద్దాత్మ యివ్వబడినవారై ప్రజలకు ఒక ఆదర్శవంతులుగా యుండువారలై యుందురు.
ఈ దినము మనము ఏమైయుండవలసియున్నది? ఈ దినము సంఘము ఎక్కడ ఉండవలసియున్నది?
45మనము, లోకమంతా మనవలె ఉండాలని ఆశించుటకు కారణమౌనట్లుగా మనము ఉండవలసిన వారమైయుంటున్నాము; "ఇదిగో అక్కడొకడున్నాడు అతనితో, అతని మతసంబంధమైన సిద్ధాంతంతో నేను నిరాకరిస్తాను, అయితే నీకొక విషయము చెప్పుదును: అతడు అసలైన క్రైస్తవుడు" అని మనుష్యులు వీధులలో గుండా వెళ్ళిపోతూ చెప్పునట్లుగా మనము ఉండవలెను. "పాతకాలపు స్త్రీవలె ఆమె కన్పించవచ్చును, నీవు చూచుచున్న ఈ మిగతా స్త్రీలవలె ఆమె యుండకపోవచ్చును, అయితే ఈ పట్టణములో ఒక క్రైస్తవరాలు ఉన్నది. ఎవరైనా ఒకరు ఉన్నార౦టే, అది ఆమెనే," అని స్త్రీలు వీధులలో గుండా వెళ్ళిపోతూ చెప్పునట్లుగా మనము ఉండవలెను.
ఎందుకనగా మనం యేసుక్రీస్తు వలన పూచిపడియున్నాము. ఆమేన్. ఓ, ఆయన యొక్క ప్రకటన ఫలకములని మనమైతే, ఆయన వలన మన పూచీపడినవారమైతే, ఆలాగైనట్లయితే, ఎటువంటి వ్యక్తిగా మనము౦డెదము? ఆ తరువాత క్రీస్తులో, ఆయన ఒక్కరిలో మాత్రమే మనము జీవమును పొందుకొనునది మరియు మనము బలమును పొందుకొనునది, మనకు కలిగియున్నదంతా క్రీస్తునుండే వచ్చునది. ఆయన మనయొక్క పూచిదారుడైయున్నాడు. ఓ, అందుకై నేనెంతగానో కృతజ్ఞుడనైయున్నాను.
MATT 5:6
46కాబట్టి మనము ఆయనవలె యుండవలసియున్నది. మనము ఏమి చేస్తున్నది; మనము ఏమి చెప్తున్నది; మనము అనుదిన జీవితంలో ఏమి చేయుచున్నది, బహు జాగ్రత్తగా ఉండవలసియున్నది; ఎందుకనగా మనము క్రీస్తు ద్వారా పూచీపడియున్నాము. క్రీస్తు వలన మనము ఉత్తరవాదత్వము కల్లియున్నట్లయితే, మనమేది చెప్పవలసియుంటున్నది? ఒకరు మనలను గూర్చి చెడ్డగా పలికితే, క్రీస్తువలన ఉత్తరవాదత్వం పొందినట్లయితే, మనమేమి చెప్పవలసియుంటున్నది? మనము క్రీస్తువలె యుండవలసియున్నది, అది నిజము కాదా?
ఇప్పుడు, అక్కడ ఒకటే ఒకటియున్నది, మరొక్కటి కూడా మనము చేయవలసియున్నది — అది మాత్రమే కాదు గాని, మరొకటి — దైవసేవకులమైన మనము తప్పక చేయవలసియున్నది; ఆకలితో నున్నవారికి సువార్తను మనము ప్రకటించవలసియున్నది. ఇప్పుడు, మనము సమాజ స్నేహబాంధవ్యాల సువార్తను ప్రకటించితే, మరియు "నీవు వచ్చి మా సంస్థాపకంలో చేరవలసియున్నది. గత సంవత్సరము, మా యొక్క సంస్థాపక సంఘములో మాకు నాలుగువేల మంది పైపెచ్చు ఉన్నారు" అని చెప్పినట్లయితే, అది కాదు యిది. లేక, నీవు నా ఆలయమునకు వచ్చినట్లయితే, లేదా నా సంఘములో సభ్యుడవైనట్లైతే, నీవు వృద్దుడవైపోయిన తరువాత నిన్ను జాగ్రత్త తీసికొనబాడెదవు. నీవు నమ్మకమైన సభ్యునిగా యుండుము మరియు అది జీవితభీమా పధకమువలె యుండును. దాని గురించి మేము చూచెదము."
అది ఇంకనూ ఆకర్షణ కాదు.
MATT 5:6•
ACTS 6:5,12,13
47మనము చేయవలసిన విషయమేదనగా, ఆకలితోన్ను లోకానికి సువార్త బోధించవలసియున్నది. వారు ఎక్కడ నుండి వచ్చియున్నారో, అనునది సహా, చివరకు ఎరుగని వారికి - వారెవరో, వారెక్కడకి వెళ్ళుచున్నారో చివరికి ఎరుగనటువంటి ఆకలితోనున్న లోకమునకు నీవు ఎలా విన్నవించగలవు — సాక్షాత్తు, యిక్కడనే జీవము గల వాతావరణములోనున్న సువార్త నీవు ప్రకటించితే తప్ప. మనమది చేయలేము. మరి వేరేమార్గమే లేదు. మనము మేసన్లోను, ద-ఓడ్-ఫెలోస్ అనుదానిలోను లేక ఏదైనా సత్రంలోను, సరిగా ఉండు, సత్రంలోను చేరుతాము. అది ఒక సత్రములో (లాడ్జిలో) చేరినట్లుగానే ఉండును. అయితే, ఆకలితోనున్నవారికి అనువర్తించునటువంటి సువార్తను మనము బోధించవలసియున్నది, ఎవరైతే నీతికొరకు ఆకలిదప్పిక కలిగియున్నారో అటువంటివారిని, అది పట్టుకుంటుంది. "నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు."
ఇప్పుడు, వారు ఎలా ఉంటారు? "నీతిమంతులు తృప్తిపరచబడుదురు. దేనితో తృప్తిపరచబడెదరు? పరిశుద్దాత్మ వలన. "స్టెపను… నిండినవాడై యని," బైబిల్ చెప్పుచున్నది. దేనితో నింపబడినవాడు? శక్తితో నిండుకొనినవాడు, విశ్వాసముతో నిండుకొనినవాడు, పేమతో నిండుకొనినవాడు, పరిశుదాత్మతో నిండుకొనినవాడు. అతడేమైయున్నాడో అదే అతనిని అది చేసినది, ఎందుకనగా అతడు పరిశుద్దాత్మతో నిడుకొనినవాడు. అతడు నిజముగా క్రీస్తు కొరకు ప్రకటనల ఫలకమై యుండెను.
ACTS 6:15•
2TIM 1:12
48సనైద్రసభ యెదుట ఆ ఉదయవేళ అతడు నిలబడినప్పుడు, వారతనిపై నేరముమోపారు… వారన్నారు, "ఈ మనుష్యుడు…" అతడు చేస్తున్నదేంటి. అతడు ఒంటరిగా నిలబడియుండెను, ఆ మహాగొప్ప సనెద్ర సభ యెదుట కేవలము అతడు మాత్రమే నిలువబడియుండెను. మరియు బహుశా, అక్కడ వ్రేలు చూపుచూ రెండు లేక మూడువేలమంది యూదులు లేదా ఐదువేల మంది అక్కడ నిలబడవచ్చును.
అతడక్కడ బయటకు నడుస్తున్నప్పుడు, "అతని ముఖము దేవదూత ముఖమువలె కనబడెను" అని బైబిల్ చెప్పెను. అతని ముఖములో వెలుగు ప్రకాశించుచున్నదని దాని భావం కాదు. అతడు మాట్లాడుచున్నది ఏదో అతడు ఎరిగిన వాడైయుండిన వర్తమానికుడై యుంటాడు.
ACTS 7:2,51
49మరణాన్ని గూర్చి భయపడక, సైఫను అక్కడకు నడచి వెళ్ళెను. అతడు దేనికి బయపడలేదు, ఎందుకనగా అతడు మాట్లాడుచున్నది అతడు ఎరిగియుండెను. పౌలు చెప్పియున్నట్లుగా, "నేను నమ్మినవానిని నేను ఎరుగుదును. నేనాయనకు అప్పగించిన దానిని ఆయన కాపాడగలడని, నేను రూఢిగా నమ్ముచున్నాను." అయితే, అతని రక్తముకొరకై బొబ్బరింతలు పెడుతున్న తోడేళ్ళ మంద మద్య ఒక గొర్రె ఉన్న రీతిగా సనైద్రసభ యెదుటకు స్టెఫను వెళ్ళాడు. మరియు వారతనిని అపరాధినిగా చేశారు, మరియు దోషియంటు వ్రేలిని అతనివైపు గురిచూపిరి.
అతడేమి చేశాడు? అతడు చెప్పెను, "సహోదరులారా, మన పితరుడైన అబ్రహాము అతడు పిలువబడకమునుపు మెసపొతమియలో ఉండగనే, మహిమగల దేవుడు ఆతనికి ప్రత్యక్షమాయెను." అతడలా దానిని ముందుకు కొనసాగించి అబ్రహము యొక్క చరిత్రను అతని ద్వారా అన్యులలోకి ఏలాగు తెచ్చినది అతడు తెల్పెను. మరియు, అతడు ఒక స్థలమునకు వచ్చినప్పుడు, అతనివైపు చూడూ — పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడైయుండెను. అతని మీద వారు చేతులుంచే వరకు, వారు నిలువలేకపోయారు. అతడన్నాడు, "ముష్కరులారా, హృదయములయందును చెవులయందును సున్నతి పొందనివారలారా, మీరు ఎల్లప్పుడు పరిశుద్దాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు చేసినట్లుగానే, మీరునూ చేయుచున్నారు?
ACTS 7:56,58
50అతడు దేవుని యొక్క ప్రకటనల ఫలకమైయుండెను. అతని చంపుటకు అతనిపై వారు రాళ్ళు వేసినప్పుడు, పట్టణపు బయటకు నెట్టి చచ్చిపోవాలని రాళ్ళతో కొట్టుచున్నప్పుడు, అతడు మరణించుచూ, ఆతని తలను పరలోకమువైపునకు ఎత్తి, అతనిపై రాళ్ళు వేయువారి క్షమాపణపై అతడు అడిగాడు. యేసు శిలుపై ఎలాగు చేసెనో, అలాగే చేశాడు. అటు తరువాత, తీసివేయబడబోతున్న ఆయన చిన్న ప్రకటనల ఫలకమును, దేవుడు చూశాడు. స్టెఫను ఆకాశంవైపు కన్నులెత్తి చూచి, "ఇదిగో, ఆకాశము తెరువబడుటయు, యేసు దేవుని కుడి పార్శ్వమున నిలబడియుండుటయు, నేను చూచుచున్నానని" చెప్పెను. దేవుని హస్తాల్లోకి అతడు పడిపోయి నిద్రించాడు. ఆకలితోనున్న లోకమునకు అతడొక ప్రకటనల ఫలకమైయుండెను.
"మంచిది, అక్కడెంతమంది యున్నారని నీవు అడుగుతావు?" "బహుశా ఐదువేల మంది అక్కడ యుండవచ్చునని అంటావు."
"వారిలో ఎంతమంది రక్షింపబడ్డారు?"
అక్కడ ఒక్కడు యుండెను. వెంటనే అతడది అంగీకరించలేదు, అయితే కొన్ని సంవత్సరాల తరువాత అది జరిగెను. హల్లెలూయ! [స్పష్టత లేని మాటలు] పౌలు పై చొక్కాయి పట్టుకొని యుండెను. సౌలు, ఆ యౌవన పరిసయ్యుడు, అక్కడ నిలబడి ఆలోచించి, అతని మరణమును గూర్చి సాక్షమిచ్చాడు. అయితే, పునరుద్దానుడగు క్రీస్తు బలము యొక్క ప్రకటనను ఆ చిన్న వ్యక్తిలో, అతడు చూచినప్పుడు అది ఆతనిలో నుండి ఎన్నడూ తొలగిపోలేదు. ఆ ఉదయవేళ, అక్కడ నిలబడియున్న ఒక్కడైన అదే పౌలు, పదివేల వేలలో ఆత్మలను క్రీస్తునొద్దకు నడిపించాడు — యేసుక్రీస్తు కొరకు ప్రకటనల ఫలకముగా నుండుటకై ఒక మనుష్యుడు ప్రాణాన్ని అర్పించుటకు ఇష్టత చూపియుండెను కాబట్టి.
ఈ రోజు మనం ఏమి తప్పక చేయవలసియున్నది?
51పెద్ద సభికుల గుంపులు మనకు అవసరం లేదు, పదివేల మందికి మనం బోధించనవసరం లేదు. చివరకు మనము బోధ కూడా చేయనవసరం లేదు. మనము దేవుని యొక్క ప్రకటనల ఫలకముగా యుండగలము. నీకెలా తెలియును, నీ యొక్క జీవితము ఒక యౌవన మనిషిని సువార్తలో ఆరంభమగునట్లు చేయును. కొందరు వృద్దులైన పురుషులగు మీరు కొందరు వృద్దులైన స్త్రీలు, అక్కడ సువార్త పొలములో యౌవనులుగా ఉన్నవారిని ప్రారంభి౦చునట్లు మీరు చేసియుందురు - వారు పదివేల మంది ఆత్మలను క్రీస్తుకు సంపాదించియుండవచ్చును. అందకు కారణమేమనగా నీవు క్రీస్తును అతనికి చూపించుట ద్వారా సువార్త యొక్క చిన్న శక్తి ద్వారా, క్రీస్తును నీలో అతడు చూశాడు. ఔను, క్రీస్తు మనకు కావలసియున్నదని నేను తలంచుచున్నాను. ఔనండి.
క్రీస్తును చూచు ఒకే ఒక మార్గము, మనలో ఒకరి ఒకరులో ఆయన ప్రతిబింబించుట ద్వారా అది యౌతుంది. నీలో క్రీస్తును నేను చూశాను; ఆయనను నీవు నాలో చూశావు. ఆ విధముగా మనము క్రీస్తును గమనించెదము. నేను కూటమునకు వచ్చితిని. బోధను ప్రారంభించాను, ప్రజలను నేను గమనించాను. కొద్ది నిముషములలో వారు ఆశగాయున్నారో లేదో నీవు చూడగలవు. నీ సభికులను నీవు చూడుము. వారికి నీవు విసుగు కలిగిస్తున్నావో లేదో నీవు చెప్పగలవు, చూచారా.
52మరి, మొదటి విషయమేంటో తెలుసా, అక్కడ వారు కూర్చొనియుండి, ఎదురు చూపులతో ఆశతో ప్రతి వాక్యమునకు వారు పట్టుకొనియుండుట నీవు చూచెదవు, చూచారా. ఆ వ్యక్తిలో క్రీస్తు ప్రతిబింభించుట నేను చూచుచున్నాను, ఎందుకనగా అతడు దేవుని కొరకై ఆకలి దప్పిక కలిగియున్నాడు. అటు తరువాత, సువార్త ప్రకటించు నాలో క్రీస్తు ప్రతిబింభించుట అతడు చూచును; క్రీస్తు అతనిలో ప్రతిబింభించుట నేను చూచెదను. దాని అర్ధము క్రీస్తు మనమద్య ఉన్నాడనుటయే.
ఆకలి దప్పిక కలిగియుండుట. వారది ఏలాగు స్వీకరిస్తున్నారని నేను ప్రజలను గమనిస్తాను. ఒకటి, మరొకటి చెప్పి, వారిపైన అదెంత ప్రభావము చూపుతుందో గమనించుచు. వారి ముఖములు వెలిగింపబడి, నిండు ఆనందంతో ఉండుట గమనించుచు. వారు అప్పుడే దేనినో స్వీకరించుటకు వారు సంసిద్దులైయున్నారు. అది క్రీస్తు. ఆ వ్యక్తిలో క్రీస్తు ప్రతిబింభించుట నేను చూచితిని, ఎందుకనగా సువార్త, సామాన్యమైన క్రీస్తు యొక్క సువార్త - ఆ హృదయమును పట్టుకున్నది, ఎందుకనగా వారు ఆకలి దప్పికతో యున్నారు కాబట్టి.
HEB 13:8
53నేను ఒక ప్రకటనను, ప్రకటనల ఫలకమును మీకు చూపితిని. ఎటువంటి ప్రకటనయది? ఏదో యొక మత ధర్మశాస్త్రము కాదు, మనుష్య-కల్పిత మూఢవిశ్వాసం కాదు; అయితే, క్రీస్తుయొద్దకు ఈ రోజూ కూడా అదే విధముగా జీవించు ఒక బలము కొరకుయున్నటువంటి ప్రకటన ఫలకము యొద్దకు, ఎందుకనగా ఆయన నిన్న, నేడు, యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆమేన్. మంచిది. ఆ దేవుని శక్తి కదలుట వారిని చుడనిమ్ము, భవనములలో దానిని గమనించగలరు మరియు అది ప్రజలను ఎన్నుకొని, వారి యొక్క హృదయాలను వివేచించి, రోగులను స్వస్థపరచి, లేక వారి హృదయ రహస్యాలను బయలు పరచి, చెవిటివారి చెవులను తెరవజేసి మరియు గ్రుడ్డివారిని చూచునట్లుగా చేయును. అదేమిటి? అది విన్నవించుకొనుట, క్రీస్తు యొక్క ప్రకటన ఫలకము. ప్రజలది చూచెదరు, వారు గుంపులుగా చేరెదరు, మరి వారు దేవుని స్తుతించుదురు. వారు దేవుని స్తుతిస్తున్నప్పుడు, వారిలో నేను దానిని గమనించితిని; అది ఈ దారిన వెళ్ళుచున్నప్పుడు, వారిక్కడ దానిని గమనించుదురు; కాబట్టి మన యిరువురి ద్వారా, క్రీస్తు, ఆయన వెలుగు ప్రతిబింభించుట మనము చూచుచున్నాము.
1COR 15:9•
GAL 1:13
54ఇప్పుడు, నేనెంతగా యిక్కడ దానిని ప్రతిబింభించినా, అది నీపైన కూడా ప్రతిబింభించికపోతే, దానిని మనం ఎన్నడూ అర్థం చేసుకోలేము. సువార్తను స్వీకరించువారు ఒకరు అక్కడ యుండునంతవరకు, సువార్త నిరుపయోగముగా యుండును. అనేకమంది దానిని స్వీకరించనివారు ఉన్నారు, అయితే దానిని స్వీకరించువారిలోనైతే అది వారియందు ప్రతిబింభించును. ఆ ఉదయము స్టెఫను యొక్క మరణ శిక్ష సమయమున, ఐదువేల మంది అక్కడ యుండియుండవచ్చును, అయితే అది ఒక్కరిలో ప్రతిబింభించినది. ఆతని జీవిత ముగింపు సమయమున కూడా, "నేను పరిశుద్దులలో ఒకనిగా పిలుచుకొనుటకు యోగ్యుడను కాదు," అని అతడన్నాడు, "ఎందుకనగా దేవుని సంఘమును, చివరకు మరణము వరకు నేను హింసించితిని," అని చెప్పియుండెను. ఆ హతసాక్షియైన స్టెఫనుపైన రాళ్ళు వేయుటకు తానిచ్చిన అంగీకారమును పౌలులో నుండి అది ఎన్నడూ అతని యొద్దనుండి దూరం కాలేదు. "సంఘమును మరణము వరకు నేను హింసించితిని," యని అతడు చెప్పాడు.
55చూశారా, అది అతడి నుండి ఎన్నడూ దూరము కాలేదు, ఎందుకనగా క్రీస్తు ప్రతిబింభించుట అతడు చూశాడు. స్టెఫను, అది ఎలా చేశాడు? క్రీస్తు అద్భుతాలు చేయువాడని అతడు ఎరిగియున్నవాడైనప్పటికి, అతడెన్నడు ఏ అద్భుతములు జరిగించలేదు. ఈ శక్తులన్ని తదితరమైనవి అతడెరిగియుండెను, అయితే అతడేమి చేశాడు? అతడు కేవలము క్రీస్తు యొక్క శక్తియని వారు చూచునంతగా, అతడు తన జీవితమును సమర్పణ చేసికున్నాడు. ఆమేన్.
నీవు ఏనాడూ ఒక దర్శనము చూడకపోవచ్చును. నీ చేతులు ఒక వ్యాధిగ్రస్తునిపై యుంచగా, అస్తిపంజరమైయున్న ఒక మనిషి తిరిగి ప్రాణము పొందుకొని యుండిన సర్వశక్తిమంతుడైన దేవుని స్పర్శను నీవు భావనముగా తెలుసుకొనకపోవచ్చును. దూరాన మూడు, నాలుగు వర్ష ధనస్సులలో ఆయన నిలబడియుండుట నీవు ఏనాడు చూడకపోవచ్చును. ఆయన ప్రతిమను నివేన్నడు చూడకపోవచ్చును, నివేన్నడు ఆయన స్వరమును వినకపోవచ్చును; అయినప్పటికి, లోకమందు నిష్కలంకమైన, ఎంతో పవిత్రమైన జీవితమును నీవు జీవించుట ద్వారా, యేసుక్రీసును ప్రతిబింభింపజేయు ఒక ప్రకటన ఫలకముగా నీవుండవచ్చు, నీ జీవితము చుట్టూ ఉన్న కార్యముల వలన మురికిలో పడకుండా, అయితే పవిత్రమైన [స్పష్టత లేని మతలు] అది ఆకలిగొనిన హృదయానికి, నీవలెనుండుటకు ఆకలి దప్పికను కలుగజేస్తుంది. ఆమేన్.
MATT 5:13,16•
MARK 9:50•
LUKE 14:34
56"మీరు లోక్షమునకు ఉప్పయియున్నారు. ఉప్పు నిస్సారమైతే, మరి దేనివలన అది సారము పొందును?" అది నిజము. ఆకలి మరియు దప్పిక. "మనుష్యులు మీ సత్క్రియలు చూచి, నీవు చేయు వాటిని చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు, వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి." ఆకలిగొనుట, ప్రకటన ఫలకముగా ప్రతిబింభించుట, ಅద్బుతము. అవునండి.
ఇంకా, మేమిది చేయవలెనని అనుకొనుటలేదు: ఇది త్వరగా అమ్మకము జరగాలని మేమనుకొనుటలేదు. అంటావు, "మంచిది, గత రాత్రే నేను మార్పు చెందితిని. హల్లెలూయ! ప్రపంచమంతా…" నీవది చేయలేవు. అది చాల త్వరగా జరిగే అమ్మకము. మనమది చేసినట్లయితే, ఉత్పాదనం అంత మంచిది కాదు. నీవు కేవలం మంచిగా జీవించి, "నేను మార్పుచెందిన తరువాత, రెండు వారములు నేనెంతో బాగుగా జీవించితిని. నేను రెండు వారములు, మంచి జీవితం జీవించితిని" అని నీవు చెప్పినట్లయితే. అది త్వరగా జరిగే బేరము. అది మనకున్నటువంటి హాడికాల్ (విటమిన్ల మందు) వంటిది. మూటగట్టిన విటమిన్ల మందు తప్ప మరేమి కాదు, అది కొద్ది కాలము తప్ప అదెక్కువ కాలము ఉండలేకపోయెను, మరియు ఆఖరికది మరుగైపోయినది. ప్రతిదినపు క్రైస్తవుడుగా నీవుండవలసియున్నది, ప్రతిగంట క్రైస్తవునిగా నీవుండవలసియున్నది, ప్రతి-సంవత్సరపు క్రైస్తవునిగా నీవుండవలసి యున్నది; ఎదో త్వరగా అమ్మకమైపోవుట కాద. అయితే నీ వెలుగు ఎంతగానో ప్రకాశింపనీయుము.
HEB 13:8
57నీవు ఒక మనిషి యొద్దకు వెళ్ళిపోయి మరియు క్రీస్తును అంగీకరించమని అడిగితే, అతడు నీ యెదుటనే నవ్వుతూ, "మంచిది, ఆలాటిదేమి లేదు అని చెప్చును, లేనియెడల అతడు దానిని అంగీకరించియుండేవాడు." కాదు, అది ఒక హాడికాల్ మందును అమ్మునట్లు ఉన్నది. మనము హాడికాల్ అమ్మట లేదు. మనము సువార్తను - నిన్న, నేడు యుగయుగములు ఒక్కటేరీతిగా ఉన్నాడను - జీవముగల దేవుని శక్తిని అమ్ముచున్నాము. లోకము మిమ్మును ద్వేషించిన యెడల, నిన్ను వారు ద్వేషించకమునుపు క్రీస్తును వారు ద్వేషించిరి. ఆ కారణము చేతనే, వారు ఆయనను శిలువకు ఎక్కించారు.
అయితే మనము ఆయన యొక్క ప్రతినిధులమైయున్నాము. మనము ఆయన ప్రకటనల ఫలకలమైయున్నాము. మనము ఆయనను ప్రకటనను ప్రసారము చేయుదుము. మరింత శృంగారపు సామాగ్రి, ఎన్నెన్నో డాక్టర్, పి.హెచ్.డి., యల్.యల్.డి., ఘనమైన పవిత్ర సంఘము ఫలానా-మరియు-ఫలానా అనునది కావలసియుండనవసరము లేదు. మాకు ఫలానా-మరియు-ఫలానా కుటుంబము; మేము ఫలానా-మరియు-ఫలానా కలిగియున్నాము. కేవలము వారిని ఆకలిగొనునట్లుగా చేయుము. ఆమేన్.
58"మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న తండ్రిని మహిమ పరచునట్లు, నీ జీవితంపైన క్రీస్తు చేత వ్రాయబడిన ఒక సాధారణమైన, నిర్మలమైన ప్రకటనల ఫలకలమువలె యుండవలెను. అంతే.
లోకము యొక్క మురికిని అంటించుకొనవద్దు. "మంచిది, నేను ఫలానా ఈ పెద్ద సంఘమునకు చెందినవాడను, నగరంలో ఇదే పెద్ద సంఘం అని" ఒకరు చెప్పినట్లుగా, నీకునీవే ప్రకటనలు చేసికోవద్దు. ఇక్కడే రహదారిపైనున్న ఒక చిన్న సంఘమును వదలి పెట్టి ఒక పెద్ద సంఘమున వెళ్ళుచున్న మన రహదారిపై పొరుగునేయున్న ఒక వ్యక్తియున్నాడు, ఎందుకనగా వారంటారు ఒక ఉన్నత తరగతికి చెందినవారు అక్కడకు వెళ్ళుదురు. చూచారా, వారికి తెలియదు… వారి మెదడు దుమ్ముకొట్టుకొనిపోయినది. లోకకార్యకలాపాల వలన అది మలినమై పోయినది. ఒక ఉన్నత తరగతి ప్రజలా. మంచి తరగతికి చెందిన ప్రజలనగా ఏమిటి? దేవుని ఆత్మ వలన జన్మించిన ప్రజలే, ఆలాటి వారైయుందురు. వారెంతో పేదవారై యుండినట్లయితే, తరువాత భోజనము ఎక్కడ నుండి వచ్చునో వారికి తెలియని బీదవారైనయెడల, అటువంటి తరగతికి చెందిన వారు మాత్రమే ఆ యొక్క యోగ్యమైన తరగతికి చెందినవారౌతారు. వారే తిరిగి జన్మించిన ప్రజలైయున్నారు.
JOB 19:25•
ISA 14:14,15•
ACTS 8:35,38,39
59యేసు వచ్చినప్పుడు ఏలాటి తరగతి ప్రజలను ఆయన సంపాదించగలిగెను? విద్యలేని వారు, చేపలు పట్టు మనుష్యులు… పరలోకరాజ్యపు తాళపుచెవులు యివ్వబడిన మహా గొప్పభక్తుడగు అపోస్తలుడైన పేతురు, చివరకు తన స్వంత పేరునే సంతకం చేయలేనివాడు అతడు. ఈ పాతపడిన పలిసిపోయిన చేపలతో, చేపల కంపుకొట్టు కొంటూ, పేరుకుపోయిన పాత వస్త్రము కట్టుకొనియున్నాడు అతడు. ఆ తరగతి మనిషిని, యేసు తీసుకున్నాడు. ఈ రోజు ఆరాధన చేయుటకు నేరుగా అతడు లోపలకు వచ్చినట్లయితే, ఆలయములో నుండి అతనిని తృణీకారముతో నెట్టి వేయుదురు. నిజము. కావున అది ఎక్కడ ఉన్నది? చూచారా, ఉన్నత తరగతి కోసము ప్రజలు చూచుచున్నారు. ఉన్నత తరగతిలో దయ్యము నివాసము చేయును అని మీకు తెలుసా?పరలోకంలో మొదటియుద్ధమునకు కారణమేమిటో మీకు తెలుసా? లూసిఫర్ గొప్ప ఉన్నత తరగతి వారితో నిర్మించుకున్నప్పుడు, ఉన్నత తరగతి దేవదూతలను తీసికున్నాను అని అతడనుకున్నాడు. పెద్ద రాజ్యము, ఎంతో ప్రకాశమానమైనది, మిఖాయేలు కంటే తోజోవంతమైన రాజ్యము అని అనుకున్నాడు — అతడు పరలోకము నుండి తన్నివేయబడ్డాడు. ఉన్నత తరగతి ఎక్కడ నుండి వచ్చునో చూచారా? ఉన్నత తరగతికి దూరముగా యుండుము.
ఆకలితోనున్నవారికి ఉన్నత తరగతి అవసరం లేదు; ఆకలితో నున్నవారికి ఆహారం కావాలి. ఔనండి!
60చలితో నున్నవానికి నిప్పులు కావాలి; బొమ్మ కాదు కావలసినది; నిప్పుకావలెను. దేవుని కొరకు ఆకలితో నున్నవారికి, దప్పికతో నున్నవారికి, సువార్త కావలెను మరియు యేసుక్రీస్తు శక్తి కావలెను. ఆమేన్. అదెంత చిన్నదైనా ఫరవాలేదు. లోకంలో అది ఎంత అయోగ్యమైనా ఫరవాలేదు, వారికి వాస్తవము కావలయును. చనిపోతున్న ఒక మనుష్యుడు, దేవుని అతడు కలసికోవలసి యున్నదని ఎరిగిన ఒక మనుష్యుడు, అతడు ఏ ఉన్నత తరగతిని లెక్క చేయడు. దేవుని కనుగొనుటయే అతనికి కావలసియున్నది. నిశ్చయతను అతను కనుగొనకోరుచున్నాడు. నదీతీరమునకు అతడు చేరునప్పుడు, అక్కడ ఒకరు అతని కలసికొని, ఆతనికి త్రోవను చూపించవలసియుండెను. ఇప్పుడు అతనికి లంగరు వేయునది యొకటి ఆతని కావలసియున్నది. "నా విమోచకుడు సజీవుడని ఆయన కడవరి దినములలో భూమిపై నిలుచునని ఎరుగుట కావలెను. "ఇప్పుడున్నవైనను, రాబోవునవైనను, లేక వచ్చునవైనను, ఆకలి, ఆపదలు, లేక మరి యిక ఏదైనను, క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపలేవని నేను రూఢిగా నమ్ముచున్నాను." అదే వారికి కావలసియున్నది. ఆలాటిది కావలెను…
అనుకునే విశ్వాసము కాదు, త్వరగా అమ్ముడు పోయేది కాదు, మరియు ఇక్కడకు నీవు వచ్చి ఈ సంఘములో చేరు. నాకు ఒకటి కావాలి…
61"మంచిది, నేను వెళ్ళిపోయి మరియు సంఘములో చేరుతాను. సమర్పణ చేసికున్న పరిచర్యను నేను కలిగియుంటాను, సంఘకాపరి రహస్యముగా బాప్తిస్మము నాకు ఇచ్చి మరియు సంఘములోకి తీసికొని వెళ్ళును" అని అంటావు. కాదు, కాదు, అది కాదు. అది త్వరగా అమ్ముడుపోయే సరుకు. అది ఎక్కువ కాలము ఉండదు.
నాకు పాత-కాలపు వంటి నిజమైన మరుమనస్సు కావాలి. "నేను తప్పు చేశాను. పొరుగువానివలె మారాలని నేను కోరుకుంటున్నాను. నాయింటి పొరుగు స్త్రీవలె నేను యుండవలెనని ఆశపడుచున్నాను. నా పొరుగుననున్న పురుషునివలె నేనుండాలని ఆశపడుచున్నాను. ప్రజలయెదుట ఎంతో భక్తిగా నడువవలెనని ఆశించుచున్నాను — అతన్ని గూర్చి ప్రజలు అనుకున్నట్లుగా, నన్ను గూర్చి అనుకోవాలని కోరుచున్నాను. యేసుక్రీస్తువలె నేనుండగోరుచున్నాను" అని ఒక స్త్రీ లేక పురుషుడు బయటకు వచ్చి చెప్పవలెను.
62ఇప్పుడు, ముగింపులో జ్ఞాపకము౦చుకొనుడి… నేను ముందుకు సాగివెళ్తున్నాను, అయితే ముగింపులో నేనిది చెప్పాలనుకుంటున్నాను. మనము ఆయన యొక్క విక్రయదారులము కాదు; మనము ఆయన ప్రకటనల ఫలకలము. మనము ఆయన విక్రయదారులమని తలంచవద్దు. ఆయనకు ఎటువంటి విక్రయము చేయువారు అవసరం లేదు; అయితే కేవలం ప్రకటన ఫలకలమే కావలయును. నేను పబ్లిక్ సర్వీస్ కంపెనీలో పనిచేయుచుండెడివాడను. అక్కడ మొగల్ దీపము మాకు వచ్చుచుండెడిది. దాని మీద వారికి ఒక పోరాటముండెడిది. ఎవరు ఎక్కువగా దీపములు అమ్ముదురో, వారికొక బహుమతి, యింకా నూటికి యింత అనే కొంతభాగము పొందుకొందురు. వారు వాటికై వాటిని అమ్మవలసియుండెను. మంచిది, ప్రతి వ్యక్తి, ప్రతియొక్క ఉద్యోగి, ఈ దీపముల కొరకై విక్రయదారులుగా ఉండవలసియుండెను. "ఉత్పత్తియైన వస్తువు నాకు హమీయిచ్చినట్లయితే, ఆ కంపెనీ ఆ యొక్క దీపమును గూర్చి నాకు హామీ ఇచ్చును. ఇప్పుడు, ఆ దీపము మంచిదైతే, దానికదే అమ్ముడుపోతుంది. అది ఉపయోగం లేనిదైతే, అలాటప్పుడు ప్రజలపైన సరియైనది కానిదేదో నేను పెట్టుచున్నాను." దానిలో నేనెన్నడు నమ్మకముంచలేదు. ఎక్కువ వత్తిడి తెచ్చు ఈ సరంజామా విక్రదారుల మీద నేను నమ్మకముంచను. ఆ కారణము చేతనే, మతములో నేనది నమ్మను. మంచిదైన ఉత్పత్తి వస్తువును నేను కలిగియుంటినా, దానికదే అమ్ముడుపోతుంది. అది నిజం, దానికదే అమ్మకమైపోవును.
63కాబట్టి నేనేమి చేశానో మీకు తెలుసా? నేనక్కడ వెళ్ళిపోయి మరియు ఖచ్చితముగా "ఈ దీపములు నిజంగా హామీయ్విగలవేనా?" అని పర్యవేక్షకుని అడిగితిని.
"ఖచ్చితముగా హమీ కలవు."
"అవి తిరిగిపోవునా."
"లేదండి."
"అవి హామీ యివ్వగలవేనా, దాని పనితనము మరియు ప్రతిదీ హామీ యివ్వగలవే."
"అవును."
64అందమైన సున్నితమైన వెలుగుతో వారది చేయుట నేను చూశాను. ఏ స్త్రీయైనను గదిలో వాటిని అభినందిస్తుంది. నేనేమి చేసితినో తెలుసా?వాటిలో రెండువందలు మూటకట్టుకొని, నేనెరిగిన ప్రతివారియెద్దకు బయలుదేరాను.
"బిల్లీ, ఈ ఉదయము నీకేమికావాలి?" అని అడిగారు. "నా బిల్లు నేను చెల్లించలేదా?" అని అడిగాను. (నేను బిల్లులను ప్రోగుచేసికోవలసియుండెను.)
"లేదు, నీ బిల్లు నీవు చెల్లించితివి. యింకొకటి నీవు కావాలనుకొనుటకు నేను కోరుతున్నాను" అని నేను చెప్పితిని. నేను చెప్పాను "ఇక్కడ నా యొద్ద ఒక దీపము ఉన్నది," అని అన్నాను.
"ఓ, నేను చెల్లించుకోలేను."
"ఇప్పుడు ఒక నిముషము ఆగు. కేవలము… నీవు కొనవలెనని నేనడుగులేదు. నాయొద్ద అంత బరువున్నది, నేనొకటి మీ యింట్లో దింపివేయాలనుకుంటున్నాను. రెండు వారాలు నీ యొద్ద అది యుంచుము మరి దానివలన ఆనందించుము, మరియు తిరిగి నేను వచ్చినప్పుడు దానిని తీసుకుంటాను. వారు తీసికొనుటకై మేమవి ప్రకటనులు చేయవలసియుండెను. కాబట్టి కేవలము అది మీ యింటిలో వెలిగించి ఉంచెదను."
"మంచిది, బిల్లీ! ఇప్పుడు దానిని నేను కొనలేను. అది కొనుటకు నాయొద్ద డబ్బులేదు."
"నిన్ను కొనమని కూడా నేనడుగుటలేదు, నేను అడిగానా? నీ యింటిలో పెట్టాలని మాత్రమే నేనడిగాను, దానితో నీవు ఆనందించుదువు గాక."
"అక్కడ దగా ఏమియు లేదా?"
"అది కొద్దిగా కూడా లేదు. నీవు నన్ను ఎరుగుదువు. నేను వచ్చి అది తీసుకొని వెళ్తాను. తిరిగి రెండు వారాలలో తీసుకొని వెళ్తాను.
"మంచిది."
నేనే వచ్చి నేరుగా తీసుకొని వెళ్తాను. నీవు చేయాలని నేను కోరునది ఒక్కటే… నా బండిలో నుండి దింపుకొని అది పెట్టుటకు స్థలము కావాలి. ఇక్కడే చాలా దింపాలని కోరుచున్నాను. నా ట్రక్కులో నుండి దింపాలనుకుంటున్నాను. నీవది కొనవలెనని నేను కోరుట లేదు. నీవది కొనవలెనని అడుగలేదు, అది ఇక్కడ యుంచుటకు నేను నిన్ను అనుమతి కోరుచున్నాను."
"సరే, అది పగిలిపోతే ఏంటి?"
"అది నా బాధ్యత. (దానికి బాధ్యత వహించునది నేను) దాని వెనుకయుండునది నేనేయౌతాను."
దీపము దానికదే అమ్ముడుపోతుందని నాకు తెలుసును. అది వాస్తవమగు ఉత్పత్తి వస్తువని నాకు తెలసుసు. దీపమును యింటిలో నేను పెట్టితిని. రెండు వందలలో పది కూడా నేను వెనక్కి తీసుకోలేదు. పోటీలో నేనే గెలిచాను. కారణమెందుకనగా? ఎందుకు? దీపము దానికదే అమ్ముకున్నది. నీవు ఒక్కసారి చూచితివా, అది ఏమైనది చూశావా, అప్పుడు నీవు కావాలని కోరుతావు. దానికదే అమ్ముడుపోతుంది.
MATT 5:6
65ఆలాటిదే ఆ విషయము. క్రీస్తును అమ్ముటకు మనకు పెద్ద సంస్థాపక సంఘాలు అవసరంలేదు. ఉన్నత విద్యావంతులైన భోదకులు అవసరంలేదు, గొప్ప పైపై మెరుగులు గల మనుష్యులగు మేయర్లు మనకు అవసరంలేదు, నగరంలోని వివిధములైనవి మనకు అవసరంలేదు. మనకు కావలసినదేదనగా, క్రీస్తు మరియు క్రీస్తు ఆయనకు ఆయనే అమ్మకుంటాడు. క్రీస్తును మనుష్య హృదయంలో నీవు పెట్టము, "నీవు యీ సంస్థాపకంలో చేరు, లేక దానిలో చేరు," అని నీవు అతనితో చెప్పనవసరంలేదు — ఆయనెప్పుడో ఉత్పత్తి వస్తువును అమ్మివేశాడు.
నీవు ఆకలిగొనియున్నావా? "ఆకలి దప్పిక గలవారు ధన్యులు." ఇప్పుడు మనము నమావాస భోజన ఆరాధన బల్ల యొద్దకు వచ్చుటకు సంసిద్ధపడుచున్నాము. ఎవరైనా, మీ జీవితంలో క్రీస్తును యింతవరకు స్వీకరించకపోతే… నీవు క్రైస్తవుడవైతే, ఆలాగైతే నీవు ఆకలిగొనుచున్నావు. ఇప్పటికి, ముప్పయి-ఒకటి సంవత్సరముల నుండి నేనొక క్రైస్తవుడనైయున్నాను. నేను ఆరంభించిన దానికంటె, అనుదినము ఎక్కువగా క్రీస్తు కొరకు నేను ఆకలిగొనుచున్నాను. దినములు సాగిపోవుకొలది, ఆయన ఎంతో ప్రియముగా ఉంటున్నాడు. వీధులలో గుండా నేను వెళ్ళుచూ, ఆయన చిన్న ప్రకటనల ఫలకములను గమనిస్తున్నాను. ఆసుపత్రిలో యిక్కడే వారిని గమనించాను. వారి మరణగఢియలో వారిని గమనించుచున్నాను, వారి యొక్క బలపరీక్షలో వారిని గమనించుచున్నాను. ఆ చిన్న స్త్రీ, అక్కడ, తనకుతాను ఆమె ఏలాగు పట్టుకున్నది, అక్కడ అసలైన నిజమైన పరిశుద్దురాలిగా ఆమెను గమనిస్తున్నాను.
ACTS 3:2,7•
ACTS 4:13,18
66ఇక్కడే కొంచెము కాలం క్రితం కౌంటర్ వద్ద, [టేపు పై విరామం]… వెనుకకు తిరిగి, చిన్న స్త్రీని గమనించితిని, " యేసు నీ రక్షకుడని నీకు తెలుసా?" అని అడిగితిని. అక్కడ అబ్బాయి తల దించుకొని మరియు ఆ ద్వారము బయటకు పరగుతీసెను. అక్కడే నీవున్నావు సుమా. ఓ, నేనెవరో ఆమెకు తెలియదు, అయితే ఆమె నాకు తెలుసు. ఆమె నాకు తెలియును. నేను ఆమెను గమనించితిని. ఆమె ఇప్పుడు పెండ్లిచేసికున్నది. ఒక చిన్న బోధకుని ఆమె పెళ్ళి చేసుకున్నది, అతడు బాగుగనే యున్నాడు. కాబట్టి అంతే, మీరు చూశారా. అ ప్రకటనల ఫలకమును గమనించుటకు కోరితిని. దానిని గమనించుటకు నేను ఇష్టపడతాను. అది నన్ను ఆకలిగొనునట్లు చేస్తున్నది, ఎక్కడ మనము ఆత్మసంబంధమైన ఆహారమును భుజించవలెనో అక్కడకు తీసికొనివెళ్చును. ఎందుకనగా ఆ అమ్మాయి సంఘమునకు సంబంధించినది కాదని నాకు తెలియును; ఆమె క్రైస్తవురాలు. అది నిజము. అవును, నీవది చెప్పగలవు.
అయినను, పేతురు, యోహానులు శృంగారమను ద్వారమునొద్ద - ఆ మనుష్యుని స్వస్థపరచిన తరువాత… అతడు తల్లి గర్భములో నున్నది మొదలు అతడు కుంటివాడైయుండెను. ఆతనికి ఎక్కువ బలము లేదు. ఆతడు ఎక్కువసేపు నిలబడలేడు. పేతురు నడిపించుటకు అతనిని పట్టుకొని నిలవబెట్టవలసి వచ్చెను — స్వస్థత పొందెను. "తల్లి గర్భములోనున్నది మొదలుకొని," అని బైబిల్ గ్రంధము చెప్పుచున్నది.
67వారతనిని సభవారియెదుటకు తీసుకొని వెళ్ళినప్పుడు, మరియు యేసు నామమున బోధచేయవద్దని వారిని ఆటంకపరచారు. "వారు పామరులని వారు గ్రహించారు" అని బైబిల్ చెప్పియున్నది. ఈ అపోస్తలులు పేతురు, యోహానులు విద్యలేని పామరులైయుండిరి. వారికి ఏ గొప్ప మత వేదాంతము తెలియదు. వారు చేపలు పట్టు వారైయుండిరి. వారి పేరును వారు సంతకం చేయలేనివారు. అయితే "వారిని గూర్చి వారు గమనించినప్పుడు - వారు యేసుతో ఉండినవారు" యని చెప్పబడినది. వారు ఎవరైయన్నారు? ప్రకటనల ఫలకములు. ప్రకటన ఫలకములు.
ఓ, మనము ముందుకు వెళ్ళవచ్చు. దేవా! ప్రకటనల ఫలకములుగా యుండుటకు, మాకు సహాయము చేయుము. ఇక్కడున్న ఈ బ్రెన్హా౦ టాబర్నకల్ (మందిరము), ఈ చిన్న స్థలము, దేవుని సమర్పణ చేయబడి ప్రతిష్ఠ చేయబడినది. యిక్కడున్న ఈ దేశములోని అన్ని ప్రాంతములలో చిన్న ప్రకటనల ఫలకములను ఉత్పత్తి చేయును గాక! తద్వారా, ఆకలి దప్పికతోనున్న ఈ దేశమంతా క్రీస్తుయొద్దకు వచ్చునట్లు చేయుదురు గాక. నా ప్రార్ధన అదేయైయున్నది. ఒక నిముషం మనము తలలు వంచుకుందాము.
మహా కృపాభరితుడవగు తండ్రీ! మా బ్రతుకులలోను, మా హృదయాలలోను, క్రీస్తును మేము కలిగియున్నందులకు మేమెంతో ధన్యజీవులమై యుంటున్నాము. మా తండ్రియగు ఆయనకు మేమెంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఆయనను ఎరుగుటయే నిత్యజీవమని మాకు తెలియును. ఆచరమును ఎరుగుట కాదు, గ్రంథమును ఎరుగుట కాదు, క్రీస్తును ఎరుగుటయే అది జీవముయైయున్నది. తండ్రియైన దేవా! మా రక్షకునిగా, మమ్ములను స్వస్థపరచువానిగా, మా బలముగా మాకు సహాయముగా ఎరిగియున్నాము. మేము ఆ విధముగా ఆయనను ఎరిగియున్నాము. మా సహాయము ప్రభువునొద్దనుండియే వచ్చును. మేము వట్టివారమని ఒప్పుకొంటున్నాము. మేము వట్టివారమని మాకు తెలుసు. మేమెరిగినది యొకటే యొకటి లేక మేమెరుగటకు కోరిక కలిగినది ఒక్కటే ఒక్కటి. అది క్రీస్తును ఆయన పునరుద్దాన బలమును ఎరుగుటయే. ఏలయనగా ఇది నమ్మిన ప్రతియొక్కరు నిత్యజీవమును కలిగియుందురు.
పరలోకపు తండ్రీ, ఈ చిన్న సంఘమును నీవు దీవించుమని మేము ప్రార్ధిస్తున్నాము. ఈ వేడి రాత్రిలో యిక్కడ ఈ సబ్బాతు సాయంకాలవేళలో, ఈ చిన్న చెక్క ఆలయంలో కూర్చొని యుండి, దేవుని ఆశీర్వాదముల కొరకై ఎదురుచూస్తున్న వారిని ఆశీర్వదించమని ప్రార్ధిస్తున్నాము. కొద్దిగా కలియబెట్టినవి, విరచినవియైన మాటలు యివ్వబడినవి. ఆకలితోనున్న యాత్రికుడు ప్రకటన ఫలకమును చూచుటకై, దేవా! నీ యొక్క ప్రకటనల ఫలకలను మేము గమనించుటకు, క్రైస్తవ జీవితాన్ని మేము చూచుటకు మాకెంతగానో ఆకలి దప్పిక కలుగజేయుము. మేము నీ కొరకు ప్రకటనల ఫలకముమౌదుము గాక! ఆకలితో నున్న ఆత్మకు నీ వెలుగు ప్రతిబింభింపజేయుము. తద్వారా, మేము ప్రకటనలు చేయుచున్న ప్రకటనల ఫలకమును వారు చూచి ఆకలిగొనెదరు గాక! క్రీసుయగు మా ఉత్తరవాది మాకు సమాదానకరమైన జీవితమును మా ఆత్మలో నిండు ఆనందము, బలము దయచేసియున్నాడు. ప్రజలు ఆలాగుండవలెనను ఆశించే జీవితమును జీవించువారినిగా చేసియున్నాడు. ప్రభువా! దయచేయుము. మాకందరికి దయచేయుము.
అది౦కా ఎరుగనివారు, బహుశా కొందరిక్కడ యుండియుండవచ్చును, అయితే ఈ రాత్రి జీవితయాత్రలో గుండా యుండిపోయిన వారిని, రకరకాలైన పాతకాలపు భక్తులను, గతించిపోయిన వృద్ధ తల్లులును, వీధిలో ఒక మూలన ఉండి బోధిస్తున్నప్పుడు, అతడు మతిపోయినవాడు అని చూచి అనుకొనియుండిరి. అయితే ఇప్పుడు ఆ మనుష్యుడు ప్రకటనల ఫలకముగా యుండెనని వారు చూచుచున్నారు, గురిని చూపించుచున్న గురుతు అతడు. వృద్ధురాలైన ఆ పరిశుద్ధ స్త్రీ, వీధిలో వెనుక వెంట్రుకలు ముడిపెట్టుకొని వెళ్ళుచుండగా ఏ రకపు పాతకాలపు పద్ధతి అది" అని మా యౌవనస్తులు వారిని చూచి నవ్వి ఆలాగు తలంచియుండవచ్చును, అయితే ప్రభువా! నిత్యజీవానికి అది ప్రకటనల ఫలకము అని మేము గ్రహించితిమి. తండ్రీ! మేమది దాటిపోతిమి. మమ్ములను క్షమించుము. మమ్ములను క్షమించుము. తిరిగి ఈ రాత్రి దాని దారి గురుతులలో మరలుకొందుము గాక. తండ్రీ! మమ్ము ఆ విధముగా చేయుము. మాకు జీవమును దయచేయుము. నీ యెదుట మేము పరిశుద్దులవలె కన్పించ ఆశించుచున్నాము. ఆ విధముగా నడవాలని మేము ఆశించుచున్నాము. మేము చెడుగా మాట్లాడిన ఆ మనిషి, మేము గడబిడలు చేసిన ఆ మనిషి. అతడు తిరిగి మాట పలుకలేదు, అయితే ఎంతో ప్రియముతో "ఫరవాలేదు బిడ్డా! ప్రభువు నిన్ను దీవించును" అని చెప్పెను.