గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవము

గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవము

VGR COUNT-307 1ఎడ్వర్డ్ సోదరుడా, ప్రభువు నిన్ను దీవించును గాక. ప్రభువు నిన్ను దీవించును గాక. స్నేహితులారా, శుభసాయంకాలం. ఆలయము యొక్క సహవాసములో ఈ రాత్రి మరల ఇక్కడ ఉండుట నిశ్చయముగా అది ఒక ఆధిక్యతయై యున్నది. ఈ మధ్యాహ్నము నేను దాటి వెళ్ళుచుండగా, "సహవాసము'' అను మాట అది ఎక్కడ ఉండి ఉన్నదో ఆ మాటను నేను చూసియున్నాను, అది తిన్నగా సరిగ్గా నాకు సరిపోయినది. అది నాకు ఇష్టము. ఎడ్వర్డ్ సోదరుడా "సహవాసము," దానియందే మనము నమ్మికను ఉంచియున్నాము.

నా పాత స్నేహితుల్లో ఒకరైన, డాక్టర్ ఎఫ్.ఎఫ్. బోస్వర్త్, ఇప్పుడే ప్రభువుతో యుండుటకు ఆయన దేవుని గృహమునకు వెళ్ళియున్నారు, మీలో అనేకమందికి ఆయన తెలుసు. మీలో అనేకమంది ఆయనను యెరుగుదురు. ఒకసారి ఆయన ఇక్కడ ఫినిక్స్ లో ఉండి ఉన్నాడని నేను నమ్ముచున్నాను, ఆయన ఎంతో సాహసమైన ఆత్మగలవాడు. మరియు ఆయన… వృద్ధుడైన ఒక పరిశుద్ధుడు, అయితే ఆయన ఒక తమాషాగల వ్యక్తి, ఆయన ఒకసారి నాతో ఇలా అన్నారు. నేను ఆయన "సహవాసమును" గూర్చి ఆయనతో మాట్లాడుచుంటిని మరియు ఆయన ఇలా అన్నారు.

"బ్రెన్హాం సోదరుడా, సహవాసము అనగా ఏమిటో మీకు తెలుసా?

నేనన్నాను, "సరే, అలాగని నేను అనుకొనుచున్నాను."

అతడన్నాడు, "అది పడవలో ఉన్న ఇద్దరు వ్యక్తులైయున్నారు."

కాబట్టి అది ఇంచు మించుగా, సరియైయున్నది, ఒకరితో ఒకరు స్థలమును పంచుకొనుట.

2సోదరుడు బాస్వర్త్ ను మీరు యెరిగియున్నారని అనేకమంది తమ చేతులను ఎత్తుటను నేను చూసియున్నాను. మీరు ఆయనను యెరిగినవారైయున్నారు, ఆయన భూమి మీద జీవించియున్న ఆయన చివరి ఘడియలను గూర్చి నేనొక మాటను చెప్పగోరుచున్నాను. నేను కొద్ది కాలముగా ఆయనను యెరిగి యున్నాను. మరియు నేను పుట్టకమునుపే ఆయన ఇక్కడ సువార్తను భోధిస్తూ మరియు రోగుల కొరకు ప్రార్థించుచుండెను. కాబట్టి ఆయన ఏ వయస్సులో ఉండియున్నాడో మీరు చూడగలరు. ప్రభువు ఆయనను దరిదాపుగా ఎనబై-అయిదు సంవత్సరములు బ్రతుకనిచ్చియున్నాడు, ఆ రీతిగా మరియు ఆయన చనిపోవుచున్నప్పుడు ఆయన ఇంకను ధైర్యసాహసములుగల ఒక వృద్ధుడిగా ఉండెను.

3ఆయనకు డెబ్బై-అయిదు సంవత్సరముల వయస్సులో, అది అదే సమయమై యున్నదని, నేను నమ్ముచున్నాను, నేను మరియు ఆయన. మియామీ 2లోని ఎడ్జ్మంట్ హోటల్లో మేము ఉండియున్నామని నేను నమ్ముచున్నాను. మేము మా రాత్రి భోజనము భుజించి, సముద్రపు ఒడ్డునకు నడిచి వెళ్ళియున్నాను, అక్కడ అలలు లోనికి వచ్చుచున్నవి, చంద్రుడు పైకి లేచుటను మేము గమనించుచున్నాము. మరియు అప్పుడు నాకు 40 సంవత్సరముల వయస్సు. నా భుజములు వంగిపోయియున్నవి, ఆ రీతిగా అక్కడ నడుస్తూ ఉండియున్నాను. మరియు ఆయనకైతే డెబ్బై-అయిదు సంవత్సరములు, సరిగ్గా ఆయన ఉండవలసినంత నిటారుగా నిలబడియున్నాడు. నేను ఆయన వైపు చూసి ఆయనను మెచ్చుకొని యున్నాను. నేనన్నాను, "బాస్వర్త్ సోదరుడా, నేను నిన్ను ఒక ప్రశ్న అడగగోరుచున్నాను."

ఆయనన్నాడు, '"బ్రెన్హాం సోదరుడా, తిన్నగా నన్ను ఏమి అడుగుతావో నీవు అడుగుము."

నేనన్నాను, "నీ శ్రేష్ఠమైన సమయము నీ జీవితంలో ఎప్పుడై యున్నది?"

ఆయనన్నాడు, "తిన్నగా ఇప్పుడే."

సరే, తరువాత నన్ను గూర్చి నేను సిగ్గుపడియున్నాను.

మరియు అతడన్నాడు, "నేను ఒక చిన్నబాలుడనైయున్నానని, మరియు ఒక పాత గృహములో జీవించుచున్నావని నీవు మరచిపోతున్నావు," అని ఆయన అన్నాడు.

4అది సోదరుడు బాస్వర్త్ అయి ఉన్నాడు.

ఆయన ప్రభువును కలుసుకొనబోవుచున్నాడని నేను వినియున్నప్పుడు, మియామి వెళ్ళి ఆయనను చూచుటకు దరిదాపుగా నా కారు యొక్క టైర్లు మండిపోయియున్నవి. నేను మరియు నా భార్య అక్కడకు వెళ్ళినప్పుడు. బోస్వర్త్ గారి కుటుంబము మరియు మా కుటుంబము గొప్ప స్నేహితులమైయున్నాము. మేము లోనికి వెళ్ళియున్నాము. ఆ గౌరవనీయుడైన వృద్ధుడు ఒక చిన్నపడకపై యుంచబడి యున్నాడు. మరియు అప్పుడు ఆయన తన చిన్న బట్టతలను పైకి లేపి, తన చిన్న చేతులను నా కొరకు, ఈ రీతిగా చాచియున్నాడు. నా కన్నీరు నా బుగ్గల మీద నుండి క్రిందికి కారుచున్నది. నేను ఆయనను నా చేతులలోనికి లాగుకొని, "నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలుకు గుర్రములు మరియు రౌతులు నీవే," అని నేను మొర్రపెట్టాను! కారణము ఎన్నడైనా పెంతికోస్తు ఉద్యమము ఒక హోదాను ఇవ్వవలసిన ఒక వృద్ధుడు ఉండియున్నట్లైతే, ఆయన సోదరుడు బోస్వర్త్ యై యున్నాడు. నిశ్చయముగా ఆయనేయై యున్నాడు. ఆయన ఒక గొప్ప పుష్పమై యున్నాడు.

5మరియు మీకు తెలుసా, ఆయన చేసే మొదటి పని ఏమనగా, నాకు ఒక చిన్న తమాషా కార్యమును చెప్పుటయే, ఆ విధముగా, మీకు తెలుసా.

మరియు నేనన్నాను, "బోస్వర్త్ సోదరుడా, నీవు బాగుపడబోవుచున్నావా?"

అతడన్నాడు, "లేదు, బ్రెన్హాం సోదరుడా, ప్రారంభము నుండియే నేను రోగిని కాదు."

"నేను కేవలము నా గృహమునకు వెళ్ళుచున్నాను" అని అతడన్నాడు.

నేనన్నాను, "మంచిది, అది చాలా చక్కని విషయము."

ఆయన మరియు నేను ఆఫ్రికాలోని సువార్త పొలముల నుండి ఇప్పుడే వచ్చియున్నాము.

అతడన్నాడు, "ఇంకా ఎంతమాత్రము దీర్ఘముగా జీవించుటకు నేను ఎంతో వృద్ధుడనై యున్నాను." అతడన్నాడు, "నేను ఇంటికి వెళ్ళుచున్నాను."

నేనన్నాను, "బాస్వర్త్ సోదరుడా, నీవు నాకు ఏమిచేయమని సలహా ఇస్తావు?"

మరియు అతడన్నాడు, "సువార్తతో నిలిచియుండుము." మరియు అతడన్నాడు, "నీవు వెళ్ళగలిగినంత త్వరగా సువార్త పొలములలోనికి తిరిగి వెళ్ళుము. అది నా సలహా," అని అన్నాడు.

6నేనన్నాను, "బోస్వోర్త్ సోదరుడా, మరొక సంగతి నేను నిన్ను అడుగగోరుచున్నాను."

అతడన్నాడు, "బ్రెన్హాం సోదరుడా, అది ఏమిటి?"

నేనన్నాను, "ఇప్పుడు, నీవు ప్రభువు యొక్క సేవలో అరవై సంవత్సరములు, లేక బహుశా ఇంకా ఎక్కువ వెచ్చించియున్నావు." నేనన్నాను, "నీ జీవితములో అత్యంత సంతోషకరమైన సమయము ఏది? అతడన్నాడు, "ఇప్పుడే."

నేనన్నాను, బోస్వోర్త్ సోదరుడా, నీవు చనిపోవుచున్నావని నీకు తెలుసా?"

అతడన్నాడు, "నేను చనిపోలేను, నేను ఎన్నో సంవత్సరముల క్రితము చనిపోయియున్నాను." మరియు నేను… అతడన్నాడు, "బ్రెన్హాం సోదరుడా, ఆయన ఏ సమయములోనైనా నా కొరకు వచ్చి తలుపు తెరచి నన్ను తీసుకొని వెళ్ళాలని, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను."

నేను దానిని గూర్చి ఆలోచించాను, "జీవితము యొక్క కీర్తన."

గొప్ప వ్యక్తుల యొక్క జీవితములన్నియూ మనకు గుర్తుచేయుచున్నవి.

మనము మన యొక్క జీవితములను శ్రేష్ఠమైనవిగా చేయగలము,

మన వెనుక మన భాగములతో విడువగలము కాలమనే ఇసుకల మీద పాదముద్రలు.

మరియు నిశ్చయముగా, ఆయన నా కొరకు పాదముద్రలను విడిచిపెట్టియున్నాడు.

7అతడు చనిపోక మునుపు, లేక ఆయన మహిమలోనికి ప్రవేశించియున్నాడు, దరిదాపు ఒక గంటపాటు, లేక మరి ఎక్కువ సమయము, ఆయన వెళ్ళిపోకమునుపు, ఆయన కొన్ని గంటలపాటు ఒక విధమైన నిద్రలోనికి వెళ్ళియున్నాడు, ఆయన యొక్క భార్య ఆయన యొక్క కుమారులు, మరియు ఆయన్ని ప్రేమించినవారు ఆయన చుట్టూ నిలబడియున్నారు, మరియు ఆ వృద్ధుడు వెంటనే మేల్కొని చుట్టూ చూచి, పైకి లేచి నిలబడి, ఆ నేల మీద ఇటూ అటూ పరుగెత్తుచూ, ఎన్నో సంవత్సరముల క్రితము మహిమలో ప్రవేశించిన తన తండ్రితో మరియు తన తల్లితో కరచాలనము చేసెను. మరియు ఒక గంట పాటు ఆయన ప్రజలతో కరచాలనము చేస్తూ ఇలా అనుచున్నాడు, "ఈయన సోదరుడు జాన్. అవును, ఇల్లినాయిస్ లోని జోలియట్ లో జరిగిన నా కూటములో నీవు క్రీస్తునొద్దకు వచ్చియున్నావు. ఇక్కడ మరో సోదరుడు యున్నాడు" అని తన సేవలో ఎన్నో సంవత్సరముల క్రితము రక్షణ పొందినవారితో ఆయన కరచాలనము చేయుచుండెను.

GEN 49:29,33

 

8నేను మీకు చెబుతున్నాను, కొన్నిసార్లు మనం ఈ భూమి మీదనుండి మరొక స్థలంలోనికి ప్రవేశించే ఘడియలో అని నేను నమ్ముతున్నాను, నేను కొన్నిసార్లు ఇలా నమ్ముతాను. మీకు తెలుసా, ఎలాగైనా ఆ నదిని దాటుట కష్టంగా ఉంటుంది. బహుశా అప్పుడు ప్రభువు తాను ప్రేమించిన వారితో వెళ్ళి చెబుతాడని నేను నమ్ముతాను, "ఆ నది దిగువకు వెళ్ళి మరియు ఆ దిగువున వారిని కలుసుకొనుము." కారణం యాకోబు చెప్పినట్లుగా, ఒక దినమున మనము మన ప్రజలతో పోగవుతాము.

నేను కూడా ఆ రోజు వచ్చుట కొరకు ఎదురుచూస్తున్నాను. మరియు అప్పుడు ఈ జీవితం గుండా నేను ముగించినప్పుడు, లేక దేవుడు ఇక్కడ నా జీవితము గుండా ముగించినప్పుడు, నేను స్వాధీనపర్చుకున్న ప్రతీ కోటను నేను చూడగలను, నేను దానిగుండా వెళ్ళిన ప్రతీ ముళ్ళపొదను, నేను ఎక్కిన ప్రతీ కొండను చూడగలను, మరియు నేను ఎక్కడ ఉండియున్నానో వెనక్కు తిరిగి చూడగలను. అప్పుడు నేను ఆ నదియొద్దకు వస్తాను. నేను ఎల్లప్పుడు ఆ నల్లజాతి ప్రజలు చెప్పియున్నట్లుగా, వారు ఎల్లప్పుడు పాడే ఒక చిన్న పాట ఇక్కడ యున్నది, "ఆ నదియొద్ద ఏ ఇబ్బందిపడుట నాకు ఇష్టము లేదు." ఇప్పుడే నేను అన్నిటిని తిన్నగా చేసుకొనగోరుచున్నాను.

బహుశా నేను నా ఖడ్గమును అక్కడ ఒరలో పెట్టి మరియు నా శిరస్థ్రాణమును తీసివేసి, దానిని ఆ నది ఒడ్డున ఉంచి, మరియు నా చేతులను ఎత్తి ఇలా కేకలు వేస్తాను, "తండ్రీ జీవపు నౌకను నాకు తీసుకుని రమ్ము, ఈ ఉదయమున నేను ఇంటికి వచ్చుచున్నాము." ఆయన అక్కడ ఉంటాడు, భయపడవద్దు. నేను దాన్ని నమ్ముచున్నాను. అది మన ప్రతి ఒక్కరి యొక్క హృదయ వాంఛయి యున్నదని నేను నమ్ముతాను.

HEB 11:9,10

 

9ఇప్పుడు, ఈ ఫీనిక్స్ యొక్క చివరి ప్రాంతంలో క్రీస్తులో బాటసారులుగా ఉన్న ఈ అద్భుతమైన పనిలో ఈ రాత్రి ఇక్కడ ఈ ప్రియమైన సంఘకాపరితో సంఘముతో యుండుట అది నిజానికి ఒక అద్భుతమైన ఆధిక్యతయి యున్నది. ఏలయనగా నిజానికి మనము పరవాసులమై యున్నాము. ఇక్కడ మనము యాత్రికులము మరియు పరదేశులమై యున్నాము; మనము ఒక పట్టణం కొరకు వెదకుచున్నాము. ఈ ఉదయమున "రాజసంతానం" మీద సహోదరుడు పుల్లర్ యొక్క ఆలయంలో అక్కడ నేను మాట్లాడుచుంటిని.

JOHN 15:7

 

10ఇప్పుడు, మీరు టేపు రికార్డర్లను కలిగియున్నట్లైతే, నేను ఎన్నడు దానిని ఎత్తి చూపలేదు… అయితే అక్కడ ఈ ఉదయాన ఒక సంగతి జరిగియున్నది, నేను… మీరు టేపు రికార్డరును కలిగియున్నట్లైతే ఈ టేపులలో ఒకదానిని మీరు పొందినట్లైతే, మీరు నిశ్చయంగా దాన్ని మెచ్చుకుంటారు. సహోదరుడు మాగుర్ వాటిని కలిగియున్నాడు, అదే "అబ్రహాము యొక్క రాజసంతానము."

చూడండి, అబ్రహాము యొక్క సంతానము ఇస్సాకు, అది యూదుడైయున్నాడు సహజముగా, అయితే క్రీస్తు యొక్క రాజసంతానము వాగ్ధానము ద్వారా ఎవరనగా, అది దేవుడు ప్రత్యక్షపర్చిన క్రీస్తు అయి యున్నాడు. మరియు అది ఈ దినమున మన హృదయంలో యున్నది. మనము. "నేను నా యందు మీరును, మీయందు నా మాటలను నిలిచియున్న యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును."

11ఇప్పుడు, నేను ఇక్కడ యున్నప్పటినుండి ఎన్నోసార్లు ఫీనిక్స్ ను గూర్చి వ్యక్తపర్చియున్నాను. మొదటిసారిగా నేను ఇక్కడకు ముప్పై-అయిదు సంవత్సరముల క్రితం ఇక్కడ వచ్చియున్నాను. మరియు ఆ పైన హేన్షా 16వ వీధిలో నేను జీవించియున్నాను. నేను ఆ సర్కిల్లో 'ఆర్' రాంచ్లో నేను అక్కడ పని చేసియున్నాను, అది వికెన్ బెర్గ్ యున్నది (రాంచ్ అనగా దాని భావము పశువుల పెంపకమునకు ఆధారమైన పచ్చిక మైదానాన్ని రాంచ్ అని అంటారు). నేను ఒక చిన్న బాలికతో ఆ 16వ వీధిలోని హేన్షా అను స్థలమునకు వెళ్ళియున్నాను. నేను వెళ్ళి మొన్నటి దినమున ఆ స్థలము కొరకు చూచియున్నాను, అది ఇక ఎంత మాత్రమూ హేన్షా అను స్థలముగా లేదు. ఇప్పుడు దాని పేరు బక్కీగా మారినది. అది ఇక్కడ ఫీనిక్స్ లోని నానావిధమైన జాతుల ప్రజలు నివసించే ఒక పెద్ద పట్టణంగా తిన్నగా మారియున్నది. ప్రతిదీ ఎంతగానో మార్పు చెందియున్నది.

MATT 5:14

 

12నేను నా భార్య వెనుక నుండి ఆ ఫీనిక్స్ పట్టణమును చూచుటకు దక్షిణపు కొండపైకి వెళ్ళియున్నాము. నేననుకున్నాను దరిదాపు మూడువందల సంవత్సరముల క్రితం, అక్కడ నిజానికి చిన్న తోడేళ్ళు రక్కిసచెట్లు మొదలగున్నవి తప్ప మరేమియు లేవు. మరియు ఇప్పుడు అది ఒక

అద్భుతమైన పట్టణంగా యున్నది. ఇప్పుడు నేను అన్నాను, "హనీ అది మార్పు చేయబడి యున్నదా? లేక తప్పు దారి పట్టినదా? నీవు నీ ఎంపికను చేసుకొనవచ్చును. నాకైతే అది ఇప్పుడు తప్పు దారి పట్టినదిగా యున్నది, ఏలయనగా సహోదరులు మరియు సహోదరులు ఈ గొప్ప కట్టడములు మరియు భవంతుల మధ్యలో స్త్రీలు మరియు పురుషులు వాటి వీధులలో పైకి, క్రిందికు నడుస్తూ తమ చేతులను పైకెత్తి వారు దేవునిని స్తుతించినట్లైతే, ఆ రీతిగా జీవిస్తున్నట్లైతే అవి మంచివే. సారా త్రాగకుండా, పేకాట ఆడకుండా, పొగత్రాగకుండా, అబద్ధములాడకుండా, దొంగలించకుండా, బీరు కొట్లలో త్రాగకుండా ఆ సమస్తమైన చెడుగును చేయకుండా ఉంటే మంచిదే. అయితే వాటిన్నిటి మధ్యలో, అయినను …"

అప్పుడు నా భార్య నాతో ఇలా అన్నది, "అయితే బిల్లీ ఇక్కడ నీవు ఎందుకొరకు యున్నావు?"

నేనన్నాను, "అయితే, హనీ, మనం ఇక్కడ కూర్చండియున్న పదిహేను నిమిషముల సమయంలో, ఈ లోయగుండా ఎన్ని అబద్ధములు చెప్పబడియున్నవి? ఎందరిచే ప్రభువు యొక్క నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తూ ఎన్ని ప్రమాణములు ఇక్కడ చేయబడియున్నవి? మనం ఇక్కడ యుండియున్న గత కొద్ది సమయంలో ఎన్ని సిగరెట్లను కాల్చియున్నారు, ఎన్ని విస్కీలను వారు త్రాగియున్నారు, ఈ లోయగుండా ఎన్ని వ్యభిచారములను వారు చేసి యున్నారు?

ఆమె అన్నది, "అది భయంకరమైన సంగతి కాదా?"

నేనన్నాను, "హనీ ఆ కారణమును బట్టియే మనము ఇక్కడ ఉండియున్నాము. మనము ఇక్కడ యున్నప్పటినుండి ఎన్ని నమ్మకమైన ప్రార్థనలు పైకి వెళ్ళియున్నవి. 'మీరు లోకమునకు వెలుగైయున్నారు.' ఆ కారణము కొరకే మనము ఇక్కడ యున్నాము. మన చిన్న సంఘములతో మన భుజములను కలిపి మనం చేయగలిగే సమస్తమును చేస్తూ అది ముందుకు నడుచుటకు మనం సహాయం చేయుటయే, ఒక…"

13మీరందరు… పరిశుద్ధులైన మీరందరు నాకు ఒక దీవెనగా యున్నారు. ఇక్కడ మిమ్మును దర్శిస్తూయుండగా నేను మీకు దీవెనగా ఉన్నానని ఆశించుచున్నాను. నేను వివిధమైన సంఘశాఖలను మరియు సంస్థలను మరియు వివిధములైన సంఘములను ఈఫీనిక్స్ లోయగుండా నేను సహోదరులును దర్శించినప్పుడు, నా హృదయం పరవశించియున్నట్లుగా నేను కనుగొనియున్నాను. అది కూటములకు ముందుగా వస్తున్నది, నేను క్రైస్తవ వ్యాపారస్తుల కూటములో నేను మాట్లాడవలసి యున్నదని తలంచుచున్నాను, అది శనివారం ఉదయము అల్పాహారపు విందులో అటు తర్వాత ఆదివారం మధ్యాహ్నపు కూటము, దాని ముందు వచ్చుచున్న ఆదివారపు కూటము. ఆ సహోదరులను కలుసుకొనుట ఎల్లప్పుడూ ఒక అధిక్యతగా యున్నది. అక్కడ వారు 2500 మంది కూర్చొనుటకు కుర్చీలను కలిగియున్నారు. మనమందరము కూర్చొనుటకు సమృద్ధిగా స్థలమున్నది. అక్కడ మేము మిమ్మును కలుసుకోవాలని ఆశి౦చుచున్నాము.

PS 100:1

 

14అటు తర్వాత, ఒక సంఘము నుండి మరొక సంఘమునకు వెళ్ళి మాట్లాడుట మరియు ఈ సహవాసమును కలిగియుండుట, ఈ ఉదయుమున ఒక గంటన్నర పాటు గొంతు బొంగురుపోవు నంతగా నేను బోధించియున్నానని నేను తలంచుచున్నాను. మరియు అది ఒక క్లుప్తమైన వర్తమానమై యున్నది. సాధారణంగా నేను నా గృహమునొద్ద సంఘములో మూడు లేక నాలుగు గంటలు బోధించకుండా బయటకు రాను. నేను కేవలము… నేను ఒక బోధకుడను కాదు. కాబట్టి నేను కేవలము ప్రభువుకు ఒక ఉత్సాహ ధ్వనిని చేస్తాను. దానిని ఎంతో బాగుగా చేయుట నాకిష్టం, కాబట్టి నేను దానిని చేస్తూనే ఉంటాను.

నేను నాలుగు లేక అయిదు భిన్నమైన రీతులలో దానిని వ్యక్త పరచుటను కలిగియున్నాను, నేను ప్రజలను చాలా ఎక్కువసేపు నిలిపియుంచుచున్నాను, కాబట్టి అది నిజమని నాకు తెలుసు. మరియు ఈ రాత్రికి, యదార్థముగా ఒంటిగంటకు ముందే మనము బయటకు వెళ్ళిపోతాము. నేను దరిదాపుగా దానిని ధృడపరచుచున్నాను. నేను దరిదాపుగా… ఎలాంటి ఒక చక్కని ఒక భావమును కలిగించు ఆత్మ మరియు సమస్తము ఎంతో ప్రియముగా యున్నది, పరిశుద్ధాత్ముడు ఒక దీవెనను కలిగియున్నాడని నాకొక నిశ్చయత ఉన్నది.

15ఇప్పుడు, ఏ విధమైన స్వస్థతా కూటాలు ఈ కూటములలో నాకు లేవు, నేను… ఒక్క రాత్రి, ఒక సహోదరుని యొద్ద యేసు నామము వారు, ఆ సంఘకాపరి యొక్క పేరేంటి? సహోదరుడు ఔట్లా యొక్క సంఘము అక్కడ అనేకమంది ప్రార్ధింపబడగోరుచున్నారు. మరియు అక్కడ కొన్ని ప్రార్థనా కార్డులను ఇచ్చుటకు నా కుమారుడు అక్కడ యున్నాడు. అటు తర్వాత కొన్ని రాత్రులు, పరిశుద్ధాత్ముడు ఎంతగానో ఆ స్థలములో కుమ్మరించబడియున్నాడు, చివరకు… మీ అందరికి తెలుసు, మీరందరు నా కూటాలలో ఉండియున్నారు. ఆ వివేచన ఎలా ఉంటుందో, అదంతయు మీరు చూసియున్నారు. అయితే ఇప్పుడు అనేకమంది ప్రార్ధించబడుటకు అది గుమికూడి యుండుటను నేను గమనించియున్నాను.

బుధవారమున మరియు గురువారము దాన్ని ప్రారంభించుట ద్వారా మొదటిగా నేను దాన్ని గమనించియున్నాను. ఆదివారము తర్వాత కూడా నేను వేచియుండాలని నేను తలంచియున్నాను, ఎందుకంటే మీ సంఘములో స్వస్థతా కూటమును మీరు కలిగియున్నట్లైతే, మీరు చూడండి, నేను వెళ్ళిన ప్రతీచోట వ్యక్తికి ఆదివారమున వారు వారియొక్క విధినిర్వహణ నొద్ద ఉండవలెనని నేను ప్రకటించియున్నాను, మీరు చూడండి. ఈ ప్రత్యేకమైన కూటములు కేవలము సహోదరులను దర్శించుటయై యున్నది. మరియు మేము ప్రతీ ఒక్కరు వారియొక్క విధి నిర్వహణలో ఉండియుండాలని మేము కోరుచున్నాము, ఏలయనగా మీ సంఘకాపరి మీకొరకు కనిపెట్టుచున్నాడు, మరియు మీరు తప్పక ఉండవలసినది అక్కడే.

16కాబట్టి ఇంకా… రేపు రాత్రికి ప్రభువు చిత్తమైన యెడల నేను తలంచుచున్నాను, నాకు తెలియదు. రేపు రాత్రికి మనం ఎక్కడ ఉంటాము? (ఒక సహోదరుడు ఇలా చెప్పుచున్నాడు, "అరిజోనలోని టెంపేలో సహోదరుడు ఓడొనెల్.) ఇప్పుడు మీ యొక్క సంఘములోనే ఏ విధమైన ప్రత్యేకమైన కార్యక్రమం మీకు లేనట్లైతే, మీయొద్ద రోగులున్నట్లైతే, ఎందుచేతననగా, రేపు రాత్రికి నేను రోగుల కొరకు ప్రార్ధించుచున్నాను, సాధారణముగా జరుపు ప్రార్థనా వరుసను నేను కలిగియుంటాను. బహుశా రోగుల కొరకు ప్రార్థిస్తాను - బహుశా సోమవారం, మంగళవారం కూడా… మనము చూద్దాము, నేను తప్పక, నాకు తెలియదు… (బుధవారం రాత్రికి కూడా నాకు సంఘమున్నదా?) బుధవారం రాత్రి; తరువాత కూటములు బుధవారమున ప్రారంభమౌతాయి. అది సరియేనా? సహోదరుడా — మంచిది ఇప్పుడు దాన్ని గూర్చి అతడు ప్రకటన చేస్తాడు. [ఒక సహోదరుడు చెప్పుచున్నాడు, "చూడండి, ఈ రాత్రి మనమిక్కడ యున్నాము. రేపు రాత్రికి మనము టెంపేలోని అసెంబ్లీస్-ఆఫ్-గాడ్లో ఉంటాము: మరియు తర్వాత మౌంటెన్వ్యూ నొద్దకు మరియు 23వ వీధినొద్ద సన్నీస్లోప్, మరియు తర్వాత 24వ వీధిలో ఉన్న సెంట్రల్ అసెంబ్లీస్ నొద్ద.) మంచిది, అది చక్కగా యున్నది. [సహోదరుడు చెప్పుచున్నాడు, "నాకు నేనుగా దాన్ని గుర్తుంచుకొనలేను ఒకవిధంగా నేను దానితో కలగలుపై పోయాను.]

17దానిగూర్చి ఆలోచించరాదు. నేను గుర్తుంచుకొలేకపోవుటను గూర్చి మొన్నటి దినమున నేను మాట్లాడుచుంటిని, సహోదరుడు జాక్మూర్ మాతో ఇలా అన్నాడు "నీవు చెడుగా ఉన్నావని తలుస్తావా?" అని అతడు అన్నాడు.

నేనన్నాను, "జాక్ సోదరుడా, నేను మాట్లాడుట లోనికి వెళ్ళినప్పుడు, నేను ఏమి మాట్లాడుచున్నానో నేను సరిగ్గా జ్ఞాపకం ఉంచుకొనలేను."

అతడు నాతో అన్నాడు, " అది చెడుగా యున్నదని తలంచవద్దు." అతడన్నాడు, "నేను ఫోన్లో ఎవరినైనా పిలిచి నీకు ఏమి కావాలి అని నేనంటే?"

సరే, అది చాలా చెడుగా ఉంటుంది.

కాబట్టి, నేను, అది తమాషాగా వినబడుతుంది, ఈ వేదిక మీదనుండి దాన్ని ఇక్కడ చెప్పుట సరి అని నేననుకోవడంలేదు. అయితే దేవుని యొక్క పిల్లలు ఎలాగైనా సంతోషకరమైన పిల్లలై యున్నారు, మీకు తెలుసు. కాబట్టి మనము కేవలము… అది ఒక విధముగా ఆకర్షణీయంగా ఉంటుందని నేను తలుస్తాను.

18మీరు అందరూ, మీలో అనేకులు సోదరుడు జాక్ మూర్ ను ఎరుగుదురు. ఆయన శ్రీవ్-ఫోర్ట్ లోని లూసియానా - లైఫ్ టేబర్నికల్ చెందినవాడు, చాలా చక్కటి సోదరుడు కాబట్టి అతడు దాన్ని నాకు చెప్పుచుండెను. అతడు ఒక కాంట్రాక్టర్ కూడా.

అతడన్నాడు, బ్రెన్హా౦ సోదరుడా, అది చెడ్డగా ఉంటుందని తలంచవద్దు." అతడన్నాడు, "మొన్నటి దినమున నేను ఒకరిని పిలిచియున్నాను, మరియు వారి నెంబరును పిలిచియున్నాను." అతడన్నాడు, "వారు జవాబిచ్చి, 'హలో' అని అన్నారు. నేనన్నాను, సరే మీకు ఏమి కావాలి?"

నేను తలంచాను, "మంచిది, జాక్ సోదరుడా అది దారి క్రిందికి వెళ్ళిపోవుచున్నది."

కాబట్టి ఇప్పుడు, అది చక్కగా ఉంటుందని నేననుకుంటాను. మరియు ఈ స్నేహితులు ప్రార్ధింపబడగోరుచున్నారు, మరియు వారి రోగులను లోనికి తెచ్చియున్నారు. అలాగైతే మనం వారి కొరకు ప్రార్థన చేద్దాం.

19ఇప్పుడీ రాత్రి, ఈ చిన్న ప్రియమైన సంఘములో నేను ఏమి చెప్పాలి అని ఈ రాత్రి ఆలోచించియున్నాను, నేననుకున్నాను, "సరే అదేమిటో నాకు తెలీదు." నేనొక చిన్న అంశమును తీసుకోవలసియున్నది. మరియు ప్రభువు దానికి ఎక్కడో కొన్ని మాటలను కలుపుతాడని నేను నమ్ముతాను, మరియు అది ఎవరికి సహాయపడుతుందో అక్కడ దాన్ని సహాయపడనిమ్ము. నీవొక అంశమును తీసుకొనుటకు ఎన్నడును ప్రయత్నము చెయ్యలేదు. నేనెల్లప్పుడు ఆత్మ ద్వారా నడిపించబడుటకు ప్రయత్నము చేస్తాను, మరియు కొన్ని లేఖనములను ఆ విధంగా రాసి ఉంచుకుంటాను. తరువాత, ప్రభువు నన్ను భిన్నముగా నడిపినట్లైతే, అప్పుడు ఆయన నడిపినట్లుగానే నేను వెళతాను. మనమందరము ఆ విధానములోనే తప్పక చేయవలసి యున్నదని నేను తలుస్తాను. అదేరీతిగా చేయాలని మీరును తలంచారా?

20ఇప్పుడు, అక్కడ ఒక విషయము నాకు కావాలి, ప్రతి సంఘము దానిని స్థానిక ప్రజలకు చేయవలసి యున్నదని నేననుకొనుచున్నాను. అదే విషయము. మీరు మీ యొక్క కాపరి కొరకు మరియు మీ ప్రియులైన వారికొరకు ప్రార్ధనచేయుట ముగించిన తరువాత నా కొరకు కూడా ప్రార్ధనచేయుట మరువవద్దు — ఏలయనగా ప్రతిరోజు ఇదివరకు కంటే ఎక్కువగా మనము మార్గము యొక్క అంతమునకు వచ్చియున్నామని నేను గ్రహించుచున్నాను.

కొన్నివారముల క్రితమే నేను నా తల్లిని సమాధి చేసియున్నాను. మరియు దేవుడు ఆమె యొక్క ఊపిరిని తీసుకొనువరకు, ఆమె ఆత్మ పరలోకమునకు వెళ్ళువరకు నేను ఆమెను నా చేతులలో పట్టుకొని యున్నాను. ఒక పరిశుద్ధాత్మతో నింపబడిన స్త్రీ యొక్క సాహసమైన మరణమును నేను గమనించియున్నాను, మరియు ఆమె తిన్నగా తన మార్గము యొక్క అంతమునకు వచ్చుట నేను చూశాను, "ఓ నేను ప్రతీ తల్లి తప్పక అలా యుండాలని నేను కోరుదును. నేను చేయగలిగిన దానిని తప్పక చేస్తాను, దాని భావము నిజముగా ఏమైయున్నదో ప్రజలు చూడగలుగునట్లు నేను చేస్తాను."

ISA 6:2,3

 

21మరియు స్నేహితులారా, బహుశా అది కొంచెం లోతుగా ఉంటుందని నేను ఒప్పించబడ్డాను. అది నిజముగా ఏమైయున్నదో దానికంటే ఒక చిన్న తేలికైన దానిగా మనము దాన్ని తీసుకుంటామని నేను తలుస్తాను. దానిని మనం తప్పక గుర్తుంచుకొనవలెనని నేను తప్పక యోచిస్తాను. పరిశుద్ధమైన దేవుని దూతలే దేవునికి మురికిగా ఉన్నప్పుడు మనం ఎలా కనబడతాము? చూడండి. అది నిజము కాబట్టి మనం దాన్ని జ్ఞాపకం ఉంచుకోవలెను. మరియు గుర్తుంచుకోండి, దేవుడు నిత్యత్వంలో సింహాసనాసీనుడైయుండగా, ఆయన వెలుగు సౌర వ్యవస్థలోని సూర్యుల కంటే ఎక్కువగా ఉండను. "పరిశుద్ధుడు, పరిశుద్ధుడు," అని దేవుని దూతలు వారి ముఖములను కప్పుకొని, పాదములను కప్పుకొని ఆయన సన్నిధిలో "పరిశుద్ధుడు" అని కేకలు వేయుచున్నవి. అలాగైతే మనం తప్పక ఏమి చేయాలి? కాబట్టి మనము… దానినే చేయుటకు ప్రయత్నం చేయుచున్నాము.

MATT 13:47•

ROM 8:29,30

 

22దీనిని నేను ఈ రీతిగా భావించుచున్నాను, దేవుని యొక్క రాజ్యము యేసయ్య చెప్పినట్లు ఒక మనిషి తన వలను తీసుకుని సముద్రమునొద్దకు వెళ్ళి ఆ వలను ఆ సముద్రంలో విసిరియున్నాడు. మరియు అతడు ఆ వలను పైకి లాగినప్పుడు అతడు నానా విధములైన వాటిని పట్టుకున్నాడు. అయితే మంచి చేపలు ఒక ప్రక్కన దాచబడియున్నవి; మరియు ఇతరమైన చేపలు తిరిగి నీళ్ళలోనికి వెళ్ళిపోయినవి, అవే పాములు, తొండలు, పీతలు, తాబేళ్ళు మొదలగునవి. అయితే సువార్త యొక్క వలలు వాటన్నిటిని పట్టియున్నవి. మరియు మనము… ఒకరోజు ఒక సమయమున మనం చివరిసారిగా మన వలను విసరుతాము, సోదరుడా అది నిజము. ఏది చేపయో, ఏది చేప కాదో అని చెప్పుట అది నీవు కాదు అది నేను కాదు. మనకు తెలియదు. కేవలం మనము వలను విసిరి దాన్ని పైకి లాగుచున్నాము. అంతమట్టుకే.

దేవుడు తనవారిని ఎరుగును. "ఆయన ఎవరిని ముందుగా యెరిగియున్నాడో, ఆయన వారిని పిలిచియున్నాడు, మరియు నీతిమంతులుగా తీర్చియున్నాడు, మరియు ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చియున్నాడో ఆయన వారిని మహిమపర్చియున్నాడు." కాబట్టి మనము కనిపెట్టుచున్నాము, కేవలం మనము వలను విసరుచున్నాము. మరియు ఈ రాత్రి ఎడ్వర్డ్ సోదరుని యొక్క ఆలయంలో నిలబడి ఆయన రాజ్యము కొరకు ఏదైనా చేప ఉన్నదేమోనని చూచుటకు, ఈ స్థలంలో వలవేయుటలో సహాయ పడుటకు ఇది నా భాగ్యమై యున్నది.

23ఇప్పుడు, మనము వాక్యమును చదువుటకు ముందు, మనము తలలను వంచియుండగా, వాక్యము యొక్క గ్రంథకర్తతో మనం కొంచెం మాట్లాడుదాము. మన తలలు వంచియుండగా, ఈ పవిత్రమైన క్షణములో సజీవుడైన దేవుని యొక్క వాక్యమును మనము సమీపించగోరుచున్నాము — అది దేవుడైయున్నాడు — తమ హృదయంలో ప్రార్థనా విన్నపములు కలిగిన వారెవరైనా ఉన్నారా అని నేను ఆశ్చర్యపడుచున్నాను, అలాంటివారు ఈ ప్రార్థనలో వారు గుర్తుచేసుకొనబడవలెనని వారు కోరినట్లైతే, దానిని మీ చేతిని ఎత్తుట ద్వారా తెలియజేయండి.

2CH 1:6•

1JN 1:9•

REV 12:11

 

24ప్రభువైన యేసు, ఈ ప్రజలను చూచుచుండగా, నీవు ప్రతీ హృదయమును ఎరిగియున్నావు. నీకు వందనములు. అత్యంత కృపగల పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిగలవాడా, ఎలషద్దయ్ అను నామములో అబ్రహాముకు ప్రత్యక్షమైనవాడా, సర్వశక్తిగల స్థనములు గల దేవా, బలమునిచ్చువాడా, బలహీనులను పోషించువాడా, తండ్రీ, ఈ రాత్రి మా యొద్దకు రండి, మేము మా యొక్క బలహీనతలను మరియు మా పొరపాట్లను మేము గ్రహించుచున్నాము. మా పాపములను నీ ముందు మేము ఒప్పుకొనుచున్నాము, మరియు వాటిని తీర్పు తీర్చు ఇత్తడి బలిపీఠముపై ఉంచుచున్నాము. మేము అర్పించు బలి అర్పణలో, యేసు క్రీస్తు యొక్క రక్తములో వాటిని మా నుండి దూరంగా తీసివేయమని అడుగుచున్నాము. ఓ దేవా, దాన్ని దయచేయండి.

మా సమస్తమును, మరియు మాకివ్వబడిన ప్రతి చిన్న తలాంతును, మా జీవితములను మేము మీకు అర్పించుచున్నాము. ప్రభువా, వాటిని దేవుని మహిమ కొరకు వాడుము. ఈ సంఘమును, దానియొక్క ప్రియమైన కాపరిని, సంఘ పెద్దలను, ధర్మకర్తలను, మరియు బోర్డులో ఉన్నవారందరినీ, మరియు "సహవాసము" అను పిలువబడు ఈ సంఘము లోనికి వచ్చు ప్రతీవారిని దీవించుము. దేవా, ఈ ద్వారము గుండా స్త్రీ, పురుషులు నడిచి వచ్చుచుండగా, లోపల కట్టడములోని పరిశుద్ధాత్మ యొక్క రమ్యమైన క్రమమును బట్టి వారు ఒప్పుదల క్రిందకు వచ్చుదురు గాక. ప్రభువా, దాన్ని చేయండి.

ISA 42:3•

MATT 12:20

 

25మా పాపములను, మా అతిక్రమములను క్షమించుమని మరల అడుగుచున్నాము. తమ చేతులను ఎత్తినవారిని జ్ఞాపకం చేసుకొనండి. ప్రభువా, ఆ హస్తము లోలోపట ఆ హృదయంలో బహుశా నిన్ను అభ్యర్ధన చేయు ఏదో ఒక మనవి యున్నది, నిజానికి నీవు మాత్రమే దాన్ని ఇవ్వగలవు. నీవు దాన్ని దయచేయుమని నేను ప్రార్థన చేయుచున్నాను, తండ్రీ. వారి అవసరత ఏదియైనప్పటికి దానిని వారికి సమృద్ధిగా దయచేయండి. అక్కడ ఎవరైనా రోగులున్నట్లైతే, ప్రభువా వారిని బాగుచేయండి. ఎవరైనా మార్గము ప్రక్కగా పడియున్నట్లైతే, ఆ బలహీనమైన మోకాలును, ఆ వ్యక్తిని బలపర్చుము. "నలిగిన రెల్లును, మకమకలాడుచున్న జనపనార ఒత్తెను ఆయన ఆర్పడు." నలిగిన రెల్లును ఆయన ఎన్నడూ త్రోసివేయడని మనమెరుగుదుము, ఆయన దానిని మంచి స్థితిలోనికి తెచ్చును. పరలోకపు తండ్రీ, ఏవైనా విరిగిన ఆత్మలు లేక నిరాశలో యున్నవారు, లేక బలహీనమైన చేతులతో వ్రేలాడుచూ, మరియు బలహీనమైన మోకాళ్ళతో కొట్టుకొనుచున్నవారు, ఈ రాత్రి పైకి వారు లేపబడుదురు గాక, అని నేను ప్రార్ధన చేయుచున్నాను. పరిశుద్ధాత్ముడు వచ్చి, మా భౌతిక దేహములను మా హృదయాలను మరియు మా ఆత్మలను బాగుచేయును గాక. మరియు దానికొరకు స్తుతినంతయూ ఆయనకే మేము ఇచ్చుచున్నాము. యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.

REV 19:1-7

 

26మీరు లేఖనమును తీయగోరినట్లైతే, ఒక ముప్పై నిమిషములు మాట్లాడుట కొరకు, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము నుండి మీరు నాతో పాటు చదవాలని నేను కోరుచున్నాను. మొదటి వచనం నుండి 7వ వచనం వరకు నేను చదువగోరుచున్నాను.

అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును,

ఆయన తీర్పులు సత్యములను, న్యాయములనైయున్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను,

మరి రెండవసారి వారు - ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది.

అప్పుడు ఆ ఇరువదినలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి — ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచూ సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి,

మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనము నొద్ద నుండి వచ్చెను.

అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము -

సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది,

గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని.

గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవమును గూర్చి కొన్ని క్షణముల పాటు నేను మాట్లాడగోరుచున్నాను. ఈ లేఖనములతో ఎంతో పరిచయమును కలిగియున్నాము.

EPH 5:27

 

27సందేహము లేదు నీ ప్రియమైన సంఘకాపరి ఈ అంశమును ఎన్నోసార్లు సమీపించియున్నాడు. మరియు అది, అక్కడ ఒక వధువు ఉండబోవుచున్నదని మరియు మధ్యాకాశములో ఒక వివాహోత్సవపు విందు అక్కడ ఉండబోవుచున్నదని మనకు తెలుసు. దేవుడు ఉన్నట్లుగానే అది కూడా అంత నిశ్చయముగా ఉన్నది, కారణము అది ఆయన వాక్యమై యున్నది.

మరియు ఆ వధువుగా తయారుకాబోవువారు ఆయన సంఘముగా ఉండబోవుచున్నారని మనము ఎరుగుదుము, మరియు వారు ఆయన ముందు మచ్చ లేక ముడతలేకుండా ప్రత్యక్షము కాబోవుచున్నారు. వారు ఇప్పుడు తమ్మును తాము సిద్ధపరుచుకొనుటకు వారు ఆ పదార్థములను కలిగియున్నారు.

REV 2:7,11,17,26•

REV 3:5,12,21•

REV 19:7

 

28మీరు గమనించినట్లయితే, అది చెప్పియున్నది, "ఆమె తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది." అనేకులు ఏమనుచున్నారనగా, "ప్రభువు ఈ దురాత్మను నా నుండి తీసివేసినట్లైతే, త్రాగుడు నుండి, పేకాట నుండి, అబద్దములాడుట నుండి లేక దొంగలించుట నుండి గానీ ఆయన నన్ను తీసివేసినట్లయితే అప్పుడు నేను ఆయనను సేవిస్తాను అని వారు అంటారు. అయితే అది నీకు విడువబడియున్నది. నీవును తప్పక కొంత చేయవలసియున్నది. "జయించువారు వాటన్నిటిని స్వత్రించుకొనును," అనగా జయించువారు దానిని చేయుటకు నీకు శక్తియున్నది, అయితే నీవు దాన్ని ఇష్టపూర్వకంగా నీవు తప్పక దాన్ని విడిచిపెట్టుటకు సంసిద్ధత చూపాలి. ఆమె తన్ను తాను సిద్ధపర్చుకొనియున్నది. ఆ మాట నాకు ఇష్టము.

మీరు చూడండి, ఒక చిన్న గొట్టముగుండా దేవుడు నిన్ను బయటకు త్రోసి, మరియు మరొక వైపునకు ఆయన లాగలేడు, మరియు తరువాత, "జయించువాడు ధన్యుడు అని చెప్పలేడు." జయించుటకు నీకు ఏమీ లేదు; ఆయన కేవలము దానిగుండా నిన్ను బయటకు త్రోసియున్నాడు. అయితే నీవు తప్పక నీ కొరకై నీవు తీర్మానములు చేయవలసియున్నది. నేను నా కొరకు తీర్మానములు చేయవలసియున్నది. అలా చేయుట ద్వారా దేవుని పట్ల మన గౌరవములను మరియు మన విశ్వాసమును మనము చూపుతాము.

JOSH 1:3

 

29అబ్రహామునకు ఒక కుమారుడు వాగ్ధానము చేయబడియున్నాడు, అయితే అతడు కలిగియున్న అనేకమైన ఎత్తుపల్లములగుండా, మరియు శోధనలగుండా, ఆ ఇరవై-అయిదు సంవత్సరములు ఆ వాగ్ధానమును అతడు తప్పక కాచుకొనవలసియుండెను, అయితే అతడు వాక్యవాగ్ధానమును పట్టుకొనియుండెను.

అలాగునే ఇశ్రాయేలుకు ఒక వాగ్ధాన భూమి, వాగ్ధానము చేయబడినది, అయితే దానిలోని ప్రతి అంగుళము కొరకు వారు పోరాడవలసియుండెను. "మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇచ్చియున్నాను," దేవుడు యెహోషువాకు చెప్పియున్నాడు. అదంతయు అక్కడ ఉండియున్నది. ఆ దేశము అక్కడ ఉండియున్నది, మరియు దేవుడు దాన్ని వారికి ఇచ్చియున్నాడు. అయితే వారు తప్పక దానికొరకు పోరాడవలెను.

HEB 12:1

 

30ఆ విధానములోనే దైవిక స్వస్థత కూడా ఉన్నది. దేవుడు నిన్ను స్వస్థపరచుటకు శక్తిని కలిగియున్నాడు, దానిని అంగీకరించుటకు నీకు ధైర్యమున్నట్లైతే, నీ మార్గములోని ప్రతీ అంగుళము కొరకు నీవు పోరాడవలెను. దేవుడు నిన్ను రక్షించుటకు అద్భుతమైన కృపను కలిగియున్నాడు, మరియు ఆయన దానిని చేస్తాడు, అయితే నీ మార్గంలోని ప్రతీ అంగుళం కొరకు నీవు పోరాడవలసియున్నది. నేను వేదిక వెనుక నిలబడి ఒక పోరాటమైయుండిన ప్రతీ అంగుళం కొరకు 31 సంవత్సరములు ఎడతెగకుండా పోరాడినాను. అయితే మనం తప్పక ఏలుబడి చేయవలెనంటే, మనం తప్పక పోరాడవలసియున్నది. "కాబట్టి వధువు తన్నుతాను సిద్ధపర్చుకొనియున్నదని మనం కనుగొంటాము. "మన ముందుంచబడిన పందెంలో ఓపిగ్గా పరిగెత్తుటకుగాను మనం ఇష్టపూర్వకంగా ప్రతీ భారమును సుళువుగా చిక్కులు పెట్టే ప్రతీ పాపమును ప్రక్కకు పెట్టవలెను." మనకై మనముగా వాటిని తప్పక ప్రక్కకు పెట్టవలెను, "దేవా, నీవు వచ్చి వాటిని మా కొరకు ప్రక్కకు పెట్టుము," అని మనము చెప్పలేము. మనకై మనమే దాన్ని తప్పక చేయవలసియున్నది.

MATT 25:21,34•

REV 21:4

 

31ఇప్పుడు, వివాహములను గూర్చి నేను ఆలోచన చేయగోరుచున్నాను. కొందరు ప్రజలకు వివాహం జరిగించిన భాగ్యమును నేను కలిగియున్నాను మరియు నేను యోచిస్తాను, నేను ఒక యౌవనస్తుడిని ఒక యౌవనస్తురాలను వేదిక నొద్దకు తీసుకువచ్చినప్పుడు, వారు చక్కటి వివాహపు వస్త్రాలతో వారు లోనికి వచ్చుటను నేను చూస్తాను, మరియు ఆమె ముఖము మీద క్రిందకు ఆ ముసుగు వ్రేలాడుతూ ఉంటుంది. మరియు పెండ్లికుమారుడు తిన్నగా చక్కటి వస్త్రధారణతో, మరియు యౌవన-ప్రాయములో సంపూర్ణమైన శక్తితో వారి జీవితంలోనే అతి శ్రేష్టమైన భాగముతో వారు నడిచి వచ్చి వారి వివాహపు ప్రమాణములను చేస్తారు. దానిని గూర్చి ఏదో ఒక తియ్యటి కార్యమున్నదని నేను తలుస్తాను. అక్కడ ఏదో పవిత్రమైనది ఉన్నది, కారణము….

ఒకానొక దినమున మరొక గొప్ప వివాహము అక్కడ ఉండబోవుచున్నదని అది గుర్తుచేస్తుంది, అప్పుడు క్రీస్తు మరియు ఆయన యొక్క వధువు, మహిమ ప్రాకారములను దాటి క్రిందికి నడుచుకుంటూ వస్తారు. పెండ్లి కుమారుడు సమస్తమును సిద్ధముగా ఉంచుతాడు, అక్కడ వివాహము మరియు విందు ఉంటుంది. ఒకరి నుండి మరొకరికి ఎదురుగా పరచబడిన ఆ బల్లమీద ఈ వైపు నుండి ఆ వైపునకు కూర్చుని, ఒకరితో ఒకరము కరచాలనము చేస్తూ యుండగా, మన బుగ్గల మీద నుండి కన్నీరు క్రిందకు ప్రవహిస్తూయుండగా దాన్ని తలంచుటను మనము ఎంతో ప్రేమిస్తాము. మరియు ఆలోచించండి, ఆయన మనచుట్టూ వచ్చి మన కన్నుల మీదనుండి భాష్ప బిందువులను తుడిచివేసి ఇలా అంటాడు, "ఏడ్వవద్దు అంతా ఇప్పుడు సమాప్తమై యున్నది. జగత్తుకు పునాది వేయబడక ముందే మీ కొరకు సిద్ధపర్చిన ప్రభువు యొక్క ఆనందములో ప్రవేశించుడి." ఓ, సోదరుడా, అది మనము ఒకరిని ఒకరము ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు చేస్తుంది.

32ఈ దినమున ఉన్న వధువు, మరియు సంఘముతో ఉన్న సంగతి అదియే, క్రీస్తులో విశ్వాసముంచిన సంఘములన్నిటి నుండి అది తయారుచేయబడుతుంది. అది సంఘ కట్టడము కాదు, శాఖ లేక సంస్థ కాదు, అయితే అది సంఘములో ఉన్న వ్యక్తులైయున్నారు, వారే వధువును తయారు చేస్తారు.

33లూయిస్విల్లోని కెంటక్కీలో నేనొక మంచి స్నేహితుడిని కలిగియున్నాను. ఆయన డాక్టర్ వాలెస్ కాబుల్, అతడు క్రీస్తు సంఘములోని ఒక సేవకుడు మరియు అతడు లోనికి వచ్చి పరిశుద్ధాత్మను పొందెను. అక్కడ అతి గొప్ప పెద్దదైన సంఘములలో (సేవకులు) అది ఒక బాహాటముగా తెరువబడిన సంఘము. అతడు నాకు ఒక అతి ప్రశస్తమైన స్నేహితుడై యున్నాడు. కొన్ని దినముల క్రితము నేను వీధిలో నిలబడియుండగా, అతడు వీధిగుండా నడిచివచ్చుటను నేను చూసియున్నాను. నేను ఎల్లప్పుడు అతనిని ప్రేమించియున్నాను, మరియు అతడు నన్ను ప్రేమించియున్నాడు.

అయితే ఒక దినమున తోన్సిల్స్ ఆపరేషన్ ఆయనకు జరిగినది, మరియు మరణమగునంతగా అతనికి రక్తం కారుచుండెను. మరియు వారు ఆయనను సెయింట్ జోసఫ్ హాస్పటల్లో ఉంచిరి, మరియు అతడు చనిపోవుచున్నాడని వారు చెప్పిరి.

శ్రీమతి మెక్ స్పాడేన్ నన్ను పిలిచి, "డాక్టర్ వాలెస్ కబుల్ అని చెప్పినది. నేను ఇంకను ఆయనను యెరిగియుండ లేదు, అయితే తెరువబడిన ద్వారముగా ఉన్న ఒక పెద్ద సంఘము అక్కడ ఉండియున్నదని నేనెరిగియున్నాను.

ఆమె అన్నది "ఆయన చనిపోవుచున్నాడని, వైద్యులు ఆయనకు ఇంజక్షను ఇచ్చి సమస్తమును చేసియున్నారు. వైద్యులులోనికి కుట్లు వేసియున్నారు. ఎడతెగకుండా అతని నుండి రక్తము స్రవించుచున్నది. మరియు రక్తము కారుటను వారు ఆపలేకపోయారు. అతని రక్తము గడ్డగా మారుట లేదు, మీకు తెలుసా, అది రక్తమును ఆపుట లేదు." మరియు వారన్నారు, "అక్కడ వారు కొందరు మిషనరీలను కలిగియున్నారు, మరియు వారు లోనికి వచ్చి ప్రార్థన చేయాలని కోరుచున్నారు."

34సరే, నేను డాక్టర్ వాలేస్ కాబుల్ గూర్చి వినియున్నాను. మరియు అతడు ఒక విధమైన చిన్న అయిష్టతగల వ్యక్తిగా యుంటాడు. అయినను నేను లోనికి వెళ్ళాను. నేను హాస్పటల్ గదిలో చూడగా, అక్కడ అనేకమంది మిషనరీలు మరియు గొప్ప సేవకులు అందరూ అక్కడుండి ఏడ్చుచూ వారు ఆయన కొరకు ప్రార్ధన చేయుచున్నారు. మరియు నేననుకొన్నాను, "ఓ-మై!, చిన్నవాడనైన నేను ఒక చిన్న పరిశుద్ధ గుండ్రాయినైన నేను లోనికి వెళ్ళుటయా? నేను బయటనే నిలిచి ఉండుట మంచిదని నేననుకున్నాను." కాబట్టి నేను ఆ హాలులోని బయట కోక్ మిషన్ క్రిందకు వెళ్ళాను. సహో. కాబుల్ కొరకు ప్రార్ధించి రక్తము కారుటను ఆపమని దేవునికి ప్రార్ధించితిని.

నేను మరల క్రిందకు వెళ్ళి బయటకు వెళ్ళిపోయాను. నేను ఇంటికి వెళ్ళిన పదిహేను నిమిషములకు ఫోన్ మరల మ్రోగినది. నేను అక్కడ ఉండక పోవుటలో, నా ఆలస్యము ఏమైయున్నదో వారు తెలుసుగొనగోరారు.

నేనన్నాను, "నేను వచ్చాను. అయితే లోపల అక్కడ ఎందరో యున్నారు, నేను బహుశా అక్కడ అనేకమంది గొప్ప సేవకులు ఉన్నందున, నేను లోనికి వచ్చుటకు నడిపించబడలేదు."

అతడన్నాడు, "తిన్నగా ఇప్పుడే రండి. ఆ మనిషి ఇంకా కొంచెం సేపు మాత్రమే బ్రతుకుతాడు," అని అన్నాడు.

35కాబట్టి, మరల తిరిగి వెనుకకు నేను వెళ్ళాను. మరియు నేను లోనికి వెళ్ళగానే, ఒక కాథలిక్ సహోదరి తన సర్వరక్షకునిగా ప్రభువును అంగీకరించమని ఆమెతో చెప్పుటకు ఆయన ప్రయత్నించుచుండెను. అతనికి రక్తము కారుచున్నది మరియు అతని నోటిలో నుండి రక్తము ఎగురుచున్నది. నేను లోనికి నడిచి వెళ్ళాను.

అతడన్నాడు, "మీరెలా ఉన్నారు?"

నేనన్నాను, "మీరెలా ఉన్నారు?"

అతడు మంచం మీద కూర్చునియుండి, ఆ విధంగా దగ్గుచుండగా రక్తం బయటకు వచ్చుచుండెను. అతడన్నాడు, "నీ పేరేమిటి?"

నేనన్నాను, "నేను సోదరుడు బ్రెన్హాంను."

అప్పుడతడు నా చుట్టూ చేతులు వేసి ఏడ్వడం ప్రారంభించాడు, నేనక్కడే మోకరించాను.

ఇప్పుడు, అది డాక్టర్ వాలెస్ కబుల్, లూయిస్విల్లోని తెరువబడిన ద్వారం యొక్క సంఘము. ఒక ఉత్తరము అతనిని తెమ్మనండి. రక్తము ఆ క్షణములోనే ఆగిపోయినది, అప్పటినుండి అది ఎన్నడూ అది కదలలేదు. మరియు అప్పటినుండి మేము చాలా చక్కని స్నేహితులమైయున్నాము..

36మొన్నటి దినమున నేనతనిని కలిసియున్నాను. మరియు అతడన్నాడు… (అస్వల్డ్ జె. స్మిత్, మీలో అనేకమందికి సహోదరుడు స్మిత్ తెలియును. అతడు ఒక గొప్ప మిషినరీయై యున్నాడు, మరియు అతడు కాబుల్ సహోదరుని యొద్దకు వస్తాడు, కారణము అతడు ఆయనను ఎంతగానో ప్రేమిస్తాడు.)

అతడన్నాడు, "కాబుల్ సోదరుడా, నీకు తెలుసా," అతడన్నాడు, "నేను [అతని భార్యను గూర్చి ఏదో యున్నది]…" అతడన్నాడు, "నాకు మొదటిగా వివాహమైనప్పుడు," అన్నాడు, "నేను ఒక తప్పు చేసియున్నట్లుగా యున్నది అని భావించాను, అవును, ఓ, నేను మరొకరిని పొందగలను?," ఏలయనగా అతడు యౌవ్వనస్తుడై యున్నాడు, అయితే అతడన్నాడు, "మార్గము వెంబడి పిల్లలు పుట్టిన తరువాత," అన్నాడు, "అప్పుడది ఒక విధముగా ఆమె లేకుండా కష్టముగా ఉంటుంది." అది నీవు యాబది సంవత్సరముల వయస్సుకు వచ్చినప్పుడు, ఆమె లేకుండా నీవు ఏమియు చేయలేవు. మరియు నీవింకా వృద్ధుడవగుచుండగా, ఎందుచేత నీవు ఆ విధంగానే భావిస్తావు."

నేనన్నాను, "అది ఇంచుమించుగా సరిగ్గా యున్నదని నేనూహిస్తాను."

మీకు తెలుసా ఏ విధమైన అంశం పైకి వచ్చియున్నదో, స్త్రీలు ఎలా షాపులలో వస్తువులు కొనుటకు వెళ్ళతారో మీకు తెలుసా, నా భార్య అక్కడుండి ఉన్నది. మరియు ఆ పనులన్నిటిలో ఆమె రాణియై యున్నది. ఆమె సమయమంతటి గుండా నిలిచియుంటుంది. వీధిలో ఆమెతో నడుస్తూ యుండగా, నా దీనమైన పాదములు బరువెక్కి దరిదాపుగా నన్ను చంపివేస్తాయి. మరియు నాకు చెప్పండి అని నేనన్నాను, "సరే ఆమె లేకుండా నీవేమియూ చేయలేవు." ఆ రీతిగానే అది పైకి ఎత్తి చూపబడుతుంది. నేను ఇంటికి వెళ్ళినప్పుడు, నేను అక్కడ గదిలో కూర్చుని ఆలోచించుచున్నాను, అది "నిజము."

నేను దాన్ని మరొక దానికి అన్వయించియున్నాను.

37మీకు తెలుసా, నేను మొదటిగా మార్పుచెందినప్పుడు, ఒక మిషనరీ బాప్టిస్టు బోధకుడిగా నేను మారియున్నాను, నేననుకున్నాను "ఒక వ్యక్తి బాప్టిస్టు అయి ఉండనియెడల అతడు రక్షింపబడియుండలేదు. అక్కడ దానికున్నది అంతయు అదే. నేను ఒక బైబిలును నా చేతిలో పట్టుకొని ప్రతి ఒక్కరినీ ఒక బాప్టిస్టుగా తయారుచేయుటకు ప్రభువు నన్ను పిలిచియున్నాడని నేను తలంచాను. మరియు బాప్టిస్టు వారు విశ్వసించినట్లే, ప్రతి ఒక్కరు విశ్వసి౦చలేదు, కనీసం వారు ఆ చిత్రములోనే లేరు.

దినములు ముందుకు గడిచియుండగా, పని అంతయు నాకై నేనుగానే చేయవలసియున్నదని తలంచాను. ఒక సంఘకాపరిగా, ఒక సంఘమును కలిగియున్న మరొక సహోదరుని నేను గమనించి కనుగొనియున్నాను. నేను తగినంత కఠినంగా అతడునూ లాగబడ్డాడు. ఎత్తైన దుప్పటి అతని మీద కూడా పరవవలసియున్నది. తరువాత మనము కనుగొనునది ఏమనగా, మనము ఒకరికొకరము ఒకరు కావాలి. మరియ ఇప్పుడు మనం ఇంత దూరము కలసి వచ్చిన తర్వాత, ఒకరి సహాయం ఒకరికి లేకుండా దాన్ని మనం చేయుట ఒక విధమైన కష్టంగా యుంటుంది. అంతవరకే. మనము తప్పక ఒకరికి ఒకరము కలిగియుండవలసి యున్నది. అది…

మరియు ఈ గొప్ప పెంతెకోస్తు యొక్క ఉద్యమములో అది ఉన్నదని నేను నమ్ముచున్నాను. భిన్నాభిప్రాయములు అను అడ్డుగోడలు విరిగిపోవుటను చూచుటకు నేను సంతోషించుచున్నాను, మరియు దేవుని యొక్క గొప్ప సంఘము దానికై అది ఏకముగా సహవాసంలో కలిసిపోవుటను చూచుటకు నేను సంతోషిస్తున్నాను. దాని భావమేమనగా, ఇప్పుడు వివాహము అతిత్వరగా వచ్చుచున్నది. ప్రభువు యొక్క రాళ్ళు… అవి ఒక వింతైన రీతిలో బహుశా చెక్కబడి అమర్చబడుటకు, అవి కట్టడములో ఎక్కడో ఉంచబడుటకు ఒక స్థానమును కలిగియున్నవి.

MATT 6:24

 

38ఇప్పుడు వివాహము అనగా ఒక భావములో ఒక మాదిరియై యున్నది… భూసంబంధమైన వివాహము ఇక్కడ, పరలోక స౦బంధమైన వివాహమునకు ఒక మాదిరియై యున్నది. ఇప్పుడు కొన్ని క్షణములపాటు, ఒక్క క్షణము దాన్ని తిరిగి అభ్యాసము చేయుటకు మనము దానిలోనికి వెళ్ళదాము. అక్కడ మొదటిగ సంగతి ఏమనగా, అక్కడ తప్పక ఒక తీర్మానము చేయవలసియున్నది. సహజమైన వివాహములో, మొదటి కార్యము ఏదనగా ఒక తీర్మానము చేయవలసియున్నది. ఒక యౌవ్వనస్తురాలు ఈ యౌవ్వనస్తుడైన వ్యక్తిని ఇష్టపడుతుందో లేదో ఆ యౌవ్వనస్తురాలు దాని విషయమై ఒక తీర్మానము చేయవలసియున్నది, మరియు అలాగునే ఆ యవ్వనస్తుడు ఆ యవ్వనస్తురాలను కోరుచున్నాడో లేదో అతడును ఒక తీర్మానం చేయవలసియున్నది. అక్కడ ఆ ఒక తీర్మానం చేయవలసియున్నది మరియు నీవే ఆ తీర్మానం చేయవలసియున్నది. ఈ ప్రపంచంలో నీవు ప్రేమించు స్త్రీ తప్పక ఆమె మాత్రమే యుండాలి, మరియు ఆమె ప్రేమించు పురుషుడు ఈ ప్రపంచంలో తప్పక అతడేయై యండాలి అలా కాకపోయినట్లైతే, అప్పుడు నీవు ఒక తప్పు తీర్మానం చేసియున్నావు.

మరియు ఆ మార్గంలోనే అది క్రీస్తు కొరకు కూడా తీర్మానము చేయవలసియున్నది. నీవు చేయవలసిన మొదటి కార్యము ఏమనగా, నీవు దేవునిని సేవించుటయా ఆయనను నీ స్వరక్షకునిగా తీసుకొనుటయూ లేక దాన్ని చేయకపోవుటమా, అనే విషయంలో నీ మనస్సును నీవు స్థిరపర్చుకోవలసియున్నది; లేక, నీవు ఈ లోకమును సేవించబోవుచున్నావా లేక క్రీస్తును నీవు సేవించబోవుచున్నావా? నీవు నీ మనస్సును ఆ విషయంలో స్థిరపర్చుకోవలసియున్నది. అక్కడ ఒక తీర్మానం అవసరత యున్నది. నీవు నీ మనస్సును స్థిరపర్చుకోలేనప్పుడు నీవు దేవునిని సేవించడం కానీ లేక సిరిని సేవించడం కానీ నీవు చేస్తావు, అప్పుడు నీవు నీ తీర్మానం చేస్తావు, అయితే ఒక తీర్మానం అక్కడ చేయవలసియున్నది.

39మరియు అప్పుడు, తీర్మానం చేయబడిన తర్వాత, అప్పుడు ప్రధానం చేయబడుట వస్తుంది, దాన్ని నీవు వేదికనొద్ద కనుగొంటావు. ఈ ఐక్యత ఉండబోవుటకు ముందు నీవు తప్పక ఒక ప్రధానమును కలిగియుండవలసియున్నది. క్రీస్తు యొక్క సంఘముతో కూడా అది ఆ విధంగానే యున్నది. అది క్రీస్తుతో ఒక ప్రధానముగా యుండవలసియున్నది. ఒక ప్రమాణము, ఒక ప్రధానము, ఒక ప్రేమ.

మరియు అప్పుడు తర్వాత కార్యము ఏమనగా వాగ్ధానములు చేయుట. అక్కడ ఒకరితో ఒకరు వాగ్ధానములు చేయుట, నీవు ఒక వాగ్ధానం చేసినట్లుగానే, "తియ్యని హృదయమా నీవు వివాహమాడినట్లైతే, నేను నీకు నమ్మకముగాను మరియు యధార్ధముగాను యుంటానని నేను నీకు వాగ్ధానం చేస్తాను. ఏ ఇతర స్త్రీ వైపు నేను చూడను."

లేక, "నేను ఏ ఇతర పురుషునివైపు చూడను. మరియు ఒక భార్యగా ఒక విధిగా నేను దానినంతయూ చేస్తాను. మనకు పిల్లలు కలిగినప్పుడు, ఒక తల్లిగా, ఒక విధిగా నేను దానినంతయూ చేస్తాను. నేను ఒక ఇంటి యొక్క కావలిదానిగా ఉంటాను." ఈ వాగ్ధానములన్నియు తప్పక చేయబడవలసి యున్నది, లేక ఒక సరియైన వివాహంలో అవి తప్పక చేయబడవలసియున్నది.

MATT 3:10

 

40నీవు క్రీస్తునొద్దకు వచ్చినప్పుడు అది ఆవిధంగానే యుంటుంది, "ప్రభువా నీవు నన్ను నీ రాజ్యము లోనికి స్వీకరించినట్లైతే, నేను నీకు వాగ్ధానం చేస్తాను," నీవును అక్కడే ఉన్నావు. "నేను నిన్ను ప్రేమిస్తాను. నేను నీకు నమ్మకంగా ఉంటాను. దివారాత్రులు నేను నిన్ను సేవిస్తాను." దాన్ని మనం మర్చిపోవుట చాలా విచారకరమైనది. "దివారాత్రులు నేను నిన్ను సేవిస్తాను, నేను ఉపవాసముంటాను. నేను నీకు నమ్మకంగా ఉంటాను. నీ సన్నిధిలోనికి నా దశమ భాగములను తెస్తాను. నేను దినములో అనేకసార్లు ప్రార్ధన చేస్తాను, నేను ఏదైనా చేస్తాను. నా ప్రేమనంతయూ నీకు తాకట్టు పెడతాను." దానినే నీవు తప్పక చేయవలసియున్నది. అది ఖచ్చితంగా సత్యము, నీవు దాన్ని వాగ్ధానం చేసినచోట అది తప్పక నీ హృదయంలో నుండి రావలెను.

నీవు నీ భర్తకు దానిని వాగ్ధానం చేసినట్లైతే, మరియు దానిని నీ హృదయం నుండి చేయనట్లైతే అది నీ భావము కానియెడల నీవు పరిపూర్ణముగా, ఖచ్చితంగా నీవు ఆయనతో జీవించుట లేదు. అది ఒక విధముగా స్వచ్ఛమైన స్పటికమువంటి వ్యవహారముగా యున్నది.

41ఇక్కడ చూడండి. నీకు పళ్ళు లేనట్లైతే మరియు ఇప్పుడు నీవు కట్టుడు పళ్ళు వాడుతున్నట్లైతే, అది మంచిదే. అది నీవు ఒకప్పుడు కలిగి ఉన్న పళ్ళకు ప్రత్యామ్నాయంగా ఉన్నది. అయితే నిజానికి ఆ పళ్ళు నీతో అతకబడి లేవు, అవి నీలో భాగమైయుండలేదు. నీకు ఉన్న ఒక చేయి తొలగించబడినప్పుడు, మరియు దానికి బదులుగా నీవు ఒక కృత్రిమమైన చేతిని పెట్టుకున్నప్పుడు, సరే, ఆ చేయి నిజానికి నీతో ఒక్కటిగా అది కలుపబడి ఉండలేదు, కేవలం అది నీపై అతకించబడియున్నది. చూడండి, అది నీతో ఒక్కటిగా కలుపబడియుండలేదు.

మనము మన యొక్క ప్రమాణమును క్రీస్తుకు చేసినప్పుడు, మనము ఆయనలో భాగముగా మారనప్పుడు, తప్పక ఒక స్త్రీ ఒక పురుషునిలో భాగమైయున్నట్లుగా మరియు ఒక పురుషుడు స్త్రీలో భాగమైయున్నట్లుగా ఉండనప్పుడు, అప్పుడు మనము కృత్రిమమైన క్రైస్తవులమై యున్నాము. మనము నిజముగా క్రైస్తవులము కాము. నీవు నిజంగా ఆ స్త్రీతో వివాహంగావించబడలేదు. నీవు నీ భర్తను ప్రేమించనియెడల మరియు ఆయన అరవై లేక డెబ్బై సంవత్సరముల వయస్సులో యున్నప్పుడు ఇదివరకు ప్రారంభంలో ఇదివరకు ప్రేమించినంతగా ఇప్పుడు ప్రేమించకపోయినట్లైతే, అప్పుడు నీవు కేవలం ఆయన పిల్లలను పెంచుచున్నావు.

42ఈ దినమున అనేకమైన సంఘములు ఆ విధానంలోనే యున్నవి. మనము కేవలం "క్రైస్తవ సంఘము" అని ఒక పేరును తీసుకొనుచున్నాము, ఆయన వధువు, అని నటించుచున్నాము. అది కృత్రితమముగా యున్నప్పుడు. మనము ఏ విధముగాను ఆయనతో ఒక్కటిగా ఏకమై యుండలేదు. మనము కేవలము ఆ కృత్రిమమైన చెయ్యివలెను, ఆ కృత్రిమమైన కన్నువలెను మనమున్నాము. చూడండి, అది కేవలం ఏదో తెచ్చిపెట్టుకున్న కృత్రిమమైనదై యున్నది. సరే, నీవు క్రైస్తవ్యమును ధరించలేవు, నీవు తప్పక దానిలో ఏకముగా కలుపబడవలసి యున్నది.

మరియు అప్పుడు క్రీస్తు యొక్క సంఘము అని పిలువబడు కృత్రిమమైన ఒక సంఘముగా కేవలము అది పిలువబడుతుంది, సరే, ఆ పిల్లలు అక్కడ లేరు, ఎందుకంటే వారు అదే శాఖలో పుట్టినవారు, అది కేవలము…. వారు క్రీస్తు యొక్క పిల్లలు కారు; వారు సంఘశాఖ యొక్క పిల్లలు, కాని వారు క్రీస్తు యొక్క పిల్లలు కారు.

1TIM 2:14

 

43ఒక స్త్రీ యదార్థతతో ఏకము కానియెడల, అప్పుడు అతడు ఆమె యొక్క భర్త కాదు. అది కేవలము ఒక మనిషితో జీవించుటకు ఆమె ప్రమాణము చేసియున్నది, మరియు ఆమె ఒక తప్పు ప్రమాణమును చేసియున్నది ఆమె తనయొక్క ప్రేమను అతనికి ప్రతిజ్ఞ చేసినది నేనతన్ని ప్రేమించియున్నానని ఆమె చెప్పినది మరియు ఆమె ఆ పనిచేయలేదు. కాలమంతటిగుండా, పురుషుడే మోసగించబడియున్నాడు. అయితే స్నేహితులారా ఒక సంగతి, అక్కడ నిశ్చయముగా ఉన్నది క్రీస్తును మనము మోసగించబోవుట లేదు. ఆయన తన వారిని ఎరుగును.

GEN 2:24•

MATT 19:5,6•

MARK 10:8

 

44అయితే, మీరు చూడండి, మొదటిగా తీర్మానములు చేయబడతాయి, తరువాత ప్రధానము, తరువాత వాగ్ధానము. అప్పుడు ఒక సంఘటన మరియు అప్పుడు వధువు పెండ్లికుమారుని యొక్క పేరును తీసుకుంటుంది. ఇక ఆమెకు ఎంతమాత్రమూ సొంత పేరు లేదు. ఆమె పెండ్లికుమారుని యొక్క పేరును తీసుకుంటుంది.

మరియు అప్పుడు సంఘము సంఘటనలను కలిగియున్నప్పుడు, వారు వాగ్దానములను చేస్తారు, అప్పుడు ఆమె పెండ్లికుమారుని యొక్క పేరును తీసుకుంది. అప్పుడు ఆమె ఇక ఎంత మాత్రము లోకము యొక్క సంఘముగా ఉండదు; ఆమె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘమై యున్నది. ఆమె కాదు… నా భావము పేరు ద్వారా అని కాదు. నా భావము ఒక పుట్టుక ద్వారా, ఒక సహజమైన, ఇప్పుడు దేవుని యొక్క శక్తి ద్వారా ఆమె హృదయములోనికి బయలుపర్చబడ్డ దేవుని సత్యము ద్వారా ఆమె ఒక క్రైస్తవ సంఘముగా మారుతుంది, అదే విశ్వవ్యాపితమైన అపొస్తులిక క్రైస్తవ సంఘముగా మారుతుంది, అదే విశ్వవ్యాపితమైన అపొస్తులిక క్రైస్తవ సంఘము. ఆమె క్రీస్తులో ఒక భాగమైనది. ఆమె అది చేసినప్పుడు, క్రీస్తు ఆమెలోనికి తన సొంత ఆత్మను ప్రవేశపెట్టును, ఆయన సొంత జీవము. మరియు బైబిలు చెప్పియున్నది, అక్కడ ఆదాము, మరియు హవ్వను గూర్చి "మీరు ఇక ఎంతమాత్రము ఇద్దరు కాదు, ఒక్కటే." మరియు స్త్రీ సంఘము క్రీస్తుతో వివాహమైనప్పుడు, వారు ఇక ఎంత మాత్రము ఇద్దరు కాదు, ఒక్కటే. నీలోని క్రీస్తు. ఆమేన్. అది అంతే. ఆయన యొక్క జీవము నీలోనికి తేబడియున్నది, అప్పుడు నీవు వధువుగా మారుతావు.

MATT 19:6•

JOHN 10:30•

JOHN 14:17,20•

1JN 2:15

 

45తరువాత మరొక విషయం. ఆమె ఈ యొక్క ప్రమాణములన్ని చేసిన తరువాత, అప్పుడు ఒక వేడుక చెప్పబడియున్నది… వివాహమునకు మునుపైనా భార్య యొక్క పేరు బ్రోయ్. ఇప్పుడు ఆమె ఇక ఎంతమాత్రమూ బ్రోయ్ కాదు; ఆమె బ్రెన్హాం అయి యున్నది. ఇప్పుడు ఆమె ఇక ఎంతమాత్రమూ బ్రోయ్ కాదు, ఆమె బ్రెన్హాం అయి ఉన్నది. మరియు నీవు క్రీస్తులోకి వచ్చినప్పుడు, నీవు ఇక ఎంతమాత్రమూ లోకసంబంధువి కాదు; నీవు క్రీస్తువాడవై యున్నావు. నీవు లోకసంబంధమైన కార్యముల గురించి నీవు శ్రద్ధవహించవు. అవి మీకు మృతమైనవి. "ఏలయనగా లోకమును కాని లేక లోకములో ఉన్నవాటిని అతను ప్రేమించినట్లైతే, దేవుని యొక్క ప్రేమ అతనిలో లేదు."

కాబట్టి మీరు చూడండి. నీవొక కృత్రిమమైన క్రైస్తవుడిగా ఉండలేవు. నీవు ఒక కృత్రిమమైన క్రైస్తవుడవని చెప్పుకొను ఒక క్రైస్తవుడుగా ఉండలేవు, అయితే క్రీస్తు స్వయముగా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం ద్వారా తన్నుతాను నీలోకి ప్రవేశపెట్టుకోనంత వరకు నీవు ఒక క్రైస్తవునిగా ఉండలేవు. అప్పుడు నీవు ఆయనతో ఏకముగా కలిసిపోయియున్నావు, మీరు ఇక ఎంతమాత్రము ఇద్దరు కాదు; మీరు ఒక్కరై యున్నారు. తండ్రి క్రీస్తులో యున్నట్లుగా క్రీస్తు మనలో ఉంటానని వాగ్ధానం చేశాడు. "నేను మరియు నా తండ్రి ఏకమైయున్నాము." చూడండి, మనలోని క్రీస్తు.

2COR 5:17•

EPH 2:6

 

46దేవునిలో ఉన్నదంతయూ, ఆయన క్రీస్తులోనికి కుమ్మరించియున్నాడు. మరియు క్రీస్తులో ఉన్నదంతయూ, సువార్త యొక్క పనిని కొనసాగించుటకుగాను, ఆయన సంఘములోనికి కుమ్మరించియున్నాడు.

అప్పుడు మనము కృత్రిమమైన పేరు ద్వారా కాదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క జీవము యొక్క యదార్ధత ద్వారా క్రీస్తులోనికి మనము ఏకమగుచున్నాము. అప్పుడు ఆయన పునరుత్థానపు శక్తి ద్వారా మృతమైన లోక కార్యముల నుండి మనము పైకి లేపబడి పరలోక స్థలాలలో ఆయనతో మనము కూర్చొనియున్నాము. ఆమేన్. అది నాకు ఇష్టం.

ఈ రాత్రి పరలోకపు స్థలాలలో క్రీస్తు యేసుతో మనము కూర్చుండియున్నాము, చూడండి, ఆయనతో మనము పునరుత్థానము చెందియున్నాము. లోక కార్యములకు చనిపోయియున్నాము, మరియు క్రీస్తును ధరించుకొనియున్నాము. మనము క్రీస్తును ధరించుకొన్నప్పుడు, అప్పుడు లోకము మనకు మృతమౌతుంది. అప్పుడిక ఎంతమాత్రము లోకమును గూర్చి మనము పట్టించుకోము, లోకము మనకు మృతమైయున్నది. మరియు అది మనకు మృతమై యున్నది, మనము దానికి మృతమైయున్నాము.

నీవు ఒక భిన్నమైన వ్యక్తివైయున్నావు, ఒక భిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగియున్నావు, కారణము నీవు ఒక నూతన సృష్టివై యున్నావు, ఒక నూతన సృష్టి! ఏదో మెరుగు పెట్టబడిన అదే పాత సృష్టి కాదు, ఏదో ఒక క్రొత్త పుటను త్రిప్పిన మనిషి కాదు. అయితే ఒక చనిపోయిన వ్యక్తి, మరియు ఒక తిరిగి జన్మించిన వ్యక్తి, మరియు క్రీస్తు యేసులో ఒక నూతన సృష్టిగా మారిన వ్యక్తి మరియు సజీవుడైన దేవుని ఆత్మ ఆ వ్యక్తిలో వికసిస్తుంది.

ఇప్పుడు, ఆ స్త్రీ ఇక ఎంతమాత్రమూ బ్రాయ్ కానట్లుగా, ఆమె ఒక బ్రెన్హాం అయియున్నది, మరియు ఆ పేరుతో ఆమె వెళ్ళుతుంది. మరియు సంఘము ఇక ఎంత మాత్రము లోకసంబంధమైనది కాదు, అయితే అది క్రీస్తు యొక్క నామమైయున్నది. ఆమె ఆయనతో, ఆయన యొక్క స్వంత జీవముతో ద్వారా సంబంధి౦ కలిగియున్నది.

GEN 1:26

 

47దేవుడు తయారు చేసిన ఆ మొదటి మనిషి, ఎలా ఒక రెండంతల వ్యక్తిగాయున్నాడో మీరెన్నడైనా లేఖనములో చదివియున్నారా? ఆయన మొదటి మనిషిని ఆయన తనయొక్క సొంత రూపములో చేసినప్పుడు ఆదాము, మరియు హవ్వగా యున్నాడు, ఆత్మసంబంధంగా మనం మాట్లాడుచున్నప్పుడు మరియు "దేవుడు ఆత్మయై యున్నాడు," అయితే దేవుడు వారిని శరీరంలో ఉంచియున్నాడు, మరియు వారిని వేరుచేసియున్నాడు. ఆయన పురుష ఆత్మను ఉంచియున్నాడు, మరియు స్త్రీ ఆత్మను స్త్రీలో ఉంచాడు.

ఇప్పుడు ఒక స్త్రీ ఒక పురుషునివలె ప్రవర్తింపగోరినప్పుడు అక్కడ ఏదో తప్పున్నది. ఆలాగునే ఒక పురుషుడు స్త్రీవలె ప్రవర్తింపగోరినప్పుడు అక్కడ ఏదో తప్పున్నది. కాబట్టి ఆ దినమున ప్రపంచమంతయూ పూర్తిగా తప్పయి యున్నది. పురుషులు స్త్రీలవలె నటించుటకు ప్రయత్నిస్తున్నారు, ఆలాగుననే స్త్రీలు పురుషులవలె ప్రవర్తించుటకు ప్రయత్నిస్తున్నారు. అది సత్యము. అది నిజమైయున్నది.

48ఇప్పుడు చూడండి. దేవుడు మానవుని తీసుకుని తయారు చేసినప్పుడు అదెంతో పరిపూర్ణంగా యున్నది. మరియు దానికంటే ఏ విధమైన భిన్నమైనది ఆయనకు ఇష్టంలేదని అది చూపుతుంది, స్త్రీ అసలయిన సృష్టిలో లేదు. కాబట్టి ఆమె మూల సృష్టిలో లేదు. కాబట్టి ఆమె ఆదాములో ఒక భాగమై యున్నది, ఆమె ఒక ఉప ఉత్పత్తియై యున్నది. ఆయన ఆదాము ప్రక్కలోనికి వెళ్ళి, మరొక జీవిని చేయుట కాదు, అయితే ఆ జీవిలో ఒక భాగమును తీసి మరొక జీవిని తయారు చేయుటయై యున్నది. మరియు ఆయన ఆదాములో నుండి స్త్రీ ఆత్మను బయటకు తీసి దానిని స్త్రీలో ఉంచెను. కాబట్టి, ఆత్మ మరియు శరీరంలో వారు ఒక్కటిగా మారారు.

కల్వరిలో దేవుడు ఏమి చేసియున్నాడో అది ఎంతో రమ్యముగా ఉంది. ఆయన క్రీస్తును తీసుకుని చీల్చబడిన ఒక ప్రక్కలో, సంఘముతో ఆయనను ఏకముగా చేసెను. మనుష్యుని శుద్ధిచేయు రక్తమును ఆయన తెచ్చియున్నాడు, అది సంఘము యొక్క శరీరమును శుద్ధి చేయుచున్నది, కల్వరిలో నుండి, క్రీస్తులో నుండి ఆయన తీసిన ఆత్మను, సజీవ దేవుని యొక్క ఆత్మను ఆయన ఒక వ్యక్తిలో ఉంచుచున్నాడు. అప్పుడు వారు ఒక్కటైయున్నారు. వారు ఒక్కటిగా మారియన్నారు. క్రీస్తు మరియు నీవు ఒక్కటై యున్నారు.

JOHN 1:1,14•

JOHN 15:7

 

49నీవు మరియు నీ భర్త తప్పక ఒక్కటిగా ఉండాలి. ఏదైనా అక్కడ విరుద్ధంగా యున్నట్టైతే, అప్పుడు మీ యొక్క ఐక్యతలో ఏదో తప్పుయున్నది.

క్రీస్తు పట్ల మనలో ఏదైనా విరుద్ధమైనది ఉన్నట్లైతే, మనము ఆయన వాక్యమును నమ్మక పోయినట్లైతే, "ఓ, అది మరొక దినమునకు చెందినది," — ఆయనతో మన ఐక్యతలో ఏదో తప్పున్నది. "అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి, దైవిక స్వస్థతలేదు, పరిశుద్ధాత్మ యొక్క బాప్తీస్మం లేదు," అది ఆ వెనుకటి దినమునకే అన్వయించబడుతుంది అని నీవు చెప్పినట్లైతే, అది క్రీస్తు యొక్క ఆత్మ నీలో లేదని చూపుతుంది,

ఏలయనగా "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను మరియు వాక్యము దేవుడైయుండెను. మరియు వాక్యము శరీరధారిగా మారెను…."

మరియు తరువాత వాక్యము నీలో ప్రాధాన్యత పొందినప్పుడు, అప్పుడు మీరు చూడండి, అది నీవు మరియు క్రీస్తు ఒక్కటిగా యున్నారు. "నా యందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి…." ఏలయనగా అది ఒక ఎంతమాత్రము నీవు కాదు, అది దేవుని యొక్క వాక్యమైయున్నది, నీలోయున్న క్రీస్తు. నీవు ఒక్కటిగా మారుచున్నావు. మంచిది.

MATT 28:20•

JOHN 14:12,17,19

 

50తరువాత, మరొక సంగతి ఆమె దానిని చేసిన తర్వాత… ఆమె తన ప్రమాణములను నెరవేర్చిన తర్వాత, ఆమెను వివాహములోకి తీసుకుంటాడు. పెండ్లికుమారుని యొక్క పేరును తన భర్త యొక్క పేరుగా యుండుటకు తన భర్తగా ఆమె ఆయనను తీసుకుంటుంది, అప్పుడు అతడు కలిగియున్న సమస్తమునకు ఆమె వారసురాలుగా యుంటుంది, ఆమె సమస్తమునకు వారసురాలైయుంటుంది. నీవు కలిగియున్న సమస్తమునకు నీ భార్య వారసురాలై ఉంటుంది.

సంఘము అదేయై యున్నది, ఆమెలో కలిగియున్న ఆయన ఆత్మ ద్వారా, ఆయనలో ఒక భాగమైయున్నదని కేవలం దానిని ఆమె గుర్తించినట్లైతే, "నేను చేయు క్రియలు మీరును చేయుదురు. వీటికంటే మరియొక్కువ కార్యములు మీరు చేస్తారు, ఏలయనగా నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. కొద్దికాలము లోకము ఇక ఎంతమాత్రము నన్ను చూడదు; అయినను మీరు నన్ను చూస్తారు: ఏలయనగా నేను మీతోను, మీలోను యుగసమాప్తి పర్యంతము ఉంటాను." అప్పుడు అది మీలోనున్న క్రీస్తుయై యున్నాడు. మీరు ఏకముగా ఆయనతో కలుపబడియున్నారు, మరియు మీరు ఆయనతో వారసులైయున్నారు.

LUKE 2:49•

HEB 13:8

 

51ఆయన భూమిమీద ఉన్నప్పుడు ఆయన ఏమి చేయుచుండెను? అదే కార్యమును ఆయన అక్కడ చేసెను,; ఏలయనగా ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా యున్నాడు. ఆయన తండ్రి యొక్క పనిమీద మనస్సును కలిగియుండెను. ఆయన రోగులను స్వస్థపరుచుచుండెను. ఆయన అద్భుతాలు చేయుచుండెను. ఆయన భూమిమీద ఉన్నప్పుడు ఏ కార్యములను చేశాడో, ఖచ్చితంగా అవే కార్యములను ఆయన ఇప్పుడును చేస్తాడు, కారణము ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగానే యున్నవాడు. అది సరిగ్గా పరిపూర్ణంగా ఉంది. అదే వివాహమై యున్నది.

52అయితే ఇప్పుడు, ఆ స్త్రీ తన ప్రమాణములన్నియు సమస్తము చేసి, ఆ స్త్రీ వివాహం చేసుకున్నట్లైతే, ఆమె ఈ మనిషి యొక్క భార్యగా మారుతుంది మరియు అతడు కలిగియున్న సమస్తమునకు ఆమె వారసురాలు అవుతుంది, మరియు తరువాత ఆమె క్రూరముగా ప్రవర్తిస్తే? ఆమె ఒక ముక్కోపిగా మారినట్లైతే, ఆమె ఇతర పురుషులతో పారిపోవడం ప్రారంభించినట్లైతే, అంతేగాకుండా ఆమె తన ప్రేమను ఇతరులతో పంచుకొనుట. ఈ మనిషి తన భార్యతో ఉన్నాడు, వారు వాగ్ధానములన్నిటిని చేశారు, మరియు ఆమె బయటకు వెళ్ళి ఇతర పురుషులతో ఆమె జీవితాన్ని పంచుకొనడం ప్రారంభించినట్లైతే, ఆమె ప్రేమ మరియు అనురాగమును ఇతరులతో పంచుకొన్నట్లైతే ఎలా ఉంటుంది?

ఎంతోమంది నమకార్ధ క్రైస్తవులు చేయుచున్న పని అదియే. మీ ప్రేమను లోకముతో పంచుకొనుచున్నారు — ఆడుకొనుచున్నారు, డాన్సులు వేయుచున్నారు, పేకాట ఆడుచున్నారు, టెలివిజన్ చూచుటకు ప్రార్ధనా కూటాన్ని ఎగ్గొట్టి ఇంటి దగ్గరే ఉంటున్నారు. సంఘము యొక్క హృదయములో ఈ లోకసంబంధమైన ఈ కార్యములన్నియు దేవుని యొక్క ప్రేమకు బదులుగా అవి తీసుకొనబడినవి, ఆమె ఒక ముక్కొపిగా మారినది. ఆమె క్రూరముగా మారినది. ఆమె ఇతర పురుషుల వెంబడి బయటకు వెళ్ళిపోయినది. ఆమె తన ప్రేమను ఇతరులతో పంచుకొనుచున్నది. ఆమె తాను సంఘములో తప్పకుండా చెల్లించవలసిన దశమ భాగములను ఆమె లోకములోని బయట ఇతర కార్యముల కొరకు ఖర్చుపెట్టుచున్నది. ఆమె తప్పక దేవుని ప్రేమించవలసిన రీతిలో దేవుని ప్రేమించక, దేవుని కొరకు జీవించుటకు బదులుగా మరియు సంఘములోకి రావడం వంటి వాటిని ప్రేమించుటకు బదులుగా, సంఘమునకు రావల్సి యున్నదని ఆమెను దరిదాపుగా నీవు ఒప్పించవలసిన స్థితి వచ్చియున్నది.

53ఎందుచేత, కొంతకాలం క్రితం నాకు తెలుసు, ఒక సేవకుడు ప్రజలు కనీసం సంవత్సరములో ఆరు నెలలకు ఒకసారి వారు ఆదివారపుబడికి రావల్సినదిగా వారు ప్రమాణము చేసి ఆ కార్డుల మీద వారు సంతకము పెట్టవలెనని, ఎన్నో కార్డులను వారికి పంపియున్నానని నాతో చెప్పియున్నాడు.

నేను పనిచేయుచున్న ఆ స్థలములో కొండ దిగువున నేనొక చిన్న బాలికను చూసియున్నాను. ఆమె అక్కడి నుండి వచ్చియున్నది. నేను తలుపునొద్ద నిలబడియున్నాను. ఆమె తలుపును తట్టి తలుపునొద్ద నిలబడినది. ఆమె అక్కడ ఉన్న కొందరు క్రూరమైన పిల్లల ఆటగాళ్ళవలె ఉన్నది, మీకు తెలుసా. గతరాత్రి ఫీనిక్స్ లో ఉన్న ఈ గుంపు వంటివారు, వారిని తప్పక అరెస్ట్ చేయవలసియున్నది. దాన్ని నేను నమ్ముచున్నాను, ఈ క్రొత్త వంకరతనము రాక్-అండ్-రోల్లో గంతులు వేయుచున్నవారు, అది ఏమైయున్నప్పటికీ. వారిని తీసుకొని వెళ్ళుటకు వారు పోలీస్ వారిని పిలువ వలసి వచ్చినది.

యౌవ్వనస్తులు, అది ఒక దయ్యపు ఆత్మయై యున్నదని మీరు గ్రహించుట లేదా? వీధుల్లో వారు ఒకరి మీద ఒకరు పడుచుండగా వారేమైయున్నారో చివరికి ఎలాటి ప్రభావం క్రింద వారున్నారో వారు తెలుసుకొనుట లేదు.

54ఈ హాస్యనటులైన కొందరివలె లేక రికార్డ్ ఆటగాళ్ళవలె మరియు తమాషా చేయువారివలె, వారు నేనున్న పట్టణములోని ఒక స్థలమునకు వచ్చారు. మరియు ఆ యౌవ్వన స్త్రీలు వారి లోదుస్తులను ఈ కుర్రవాని యొక్క సంతకం (ఆటోగ్రాఫ్) వ్రాయించుకొనుటకు గాను వేదికపై విసిరి వేశారు, అది దెయ్యము అని నీవు గ్రహించావా? అది చివరి దినములు యొక్క ఆత్మయై యున్నది. ఇది ఎలాంటి అవమానకరమైన విషయమో. అక్కడే మీరున్నారు, క్రూరముగా మారియున్నారు.

55ఈ యౌవ్వన స్త్రీ తూలుకుంటూ బయటకు వచ్చింది. కనీసం అక్కడ నేనున్నానన్న సంగతి ఆమె ఎరుగదు. నేను ఆ తలుపునొద్ద నిలబడియున్నానన్న సంగతి ఆమె మర్చిపోయినది, మరియు ఆమె అన్నది, "ఓ నన్ను క్షమించండి. మీరు అక్కడ నిలబడియున్నారన్న సంగతి మర్చిపోయెను," మరియు "ఆమె రేడియోలో ఆ కుర్రవానికి ముద్దిచ్చినది, ఎన్నడైనా అలాంటి సంగతి ఏమైయున్నది మరియు అతనితో ఇలా అన్నది, గ్రీన్ బ్రయర్ పాచ్ నొద్ద? నేను నిన్ను కలుసుకుంటాను, లేక అది ఏమైయున్నదో, ఆ రాత్రి వారు అక్కడ ఒక విధమైన డాన్స్ వేయబోవుచున్నారు.

మరియు నా స్నేహితుడైన డాక్టర్ బ్రౌన్తో నేను ఇలా అన్నాను.

అతడన్నాడు, "బీల్లీ, అక్కడ నీ సంఘము ఎలా ఉన్నది?''

నేనన్నాను, "మంచిది, మేము వారికి మ౦దు బిళ్ళలను ఇచ్చుచున్నాము," అన్నాను.

అతడన్నాడు, "ఏ విధమైన మందు బిళ్ళలు?"

నేనన్నాను, "సువార్త బిళ్ళలు." అది నిశ్చయముగా ఎల్లప్పుడు వారిని ఆలయమునకు వచ్చేటట్టుగా చేస్తుంది," చూశారా.

ఆ ప్రతిజ్ఞలపై వారు సంతకములను చేయుటకు గూర్చి అతడు నాతో చెప్పాడు. నేనన్నాను "డాక్టర్ బ్రౌన్, ఆ క్రూరమైన జంగురు పిల్లి ఆటగాడు? రేడియోలో ఆ రాత్రికి ఆమె అక్కడ ఉండబోవుచున్నదని ఆమెతో సంతకం పెట్టించి ప్రతిజ్ఞ చేయించాడు? అది ఏ మాత్రము కుదరదు. ఆమె తాను ధరించిన వస్త్రములతోనే అక్కడకు తన్నుతాను కుదవ పెట్టుకున్నది. ఎందుచేత? ఒక ఆత్మ ఆమెలో ఉన్న దేనితోనో ఆ లోకసంబంధమైన విలాసములతో కలుపబడినది."

56సజీవ దేవుని యొక్క సంఘము, క్రీస్తు యొక్క వధువుగా పిలువబడుతుంది, దేవునితో ఆ విధముగానే ఆమెకై ఆమె కలుపబడనంతవరకు… ఆమె యొక్క హృదయము దేవుని మహిమతో మరియు దేవుని శక్తితో ఎంతగానో నింపబడనంత వరకు; క్రీస్తును తప్ప మరి దేనినీ చూడనంత వరకు ఆమె లోకములోను, పాపమనే జిగటగల ఊబిలోను పొర్లాడుచునే ఉంటు౦ది. అది నిజము.

దానినే మనం చేయవలసియున్నది. అలాంటి కార్యమును చేయుటయే, దేవునికి ఉన్న ఒకే ఒక ప్రణాళిక, అది దేవుని యొక్క ఉద్దేశ్యమైయున్నది. నీవు తప్పక కృత్రిమంగా లోపలికి రాకూడదు. నీవు తప్పక లోనికి తిరిగి జన్మించవలసియున్నది, లోనికి కరచాలనం చేయుట కాదు, లేక సంఘమునకు ఒక ఉత్తరం తెచ్చుట కాదు. అయితే సజీవ దేవుని యొక్క సంఘములోనికి జన్మించుట అనగా, అది పునర్జన్మ ద్వారా యేసు క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి ద్వారా, అదే నిన్ను ఆయనలో ఒక నూతన జీవిగా మారుస్తుంది. ఆమేన్. అది దానిని తిన్నగా చేస్తుంది. అది దాన్ని చేస్తుంది. నిశ్చయముగా, మంచిది.

JAS 3:11

 

57ఆమె క్రూరముగా మారినది. ఆమె తనయొక్క ప్రేమను ఇతరులతో, లోకసంబంధమైన కార్యములతో, లోకసంబంధమైన విలాసములతో పంచుకొనుచున్నది, ఆమె వెళ్ళకూడని స్థలములకు, ఆమె వెళ్ళుచున్నది, ఆమె చెప్పకూడని సంగతులను చెప్పుచున్నది.

ఒకసారి ఇక్కడ నేను… అక్కడ వారు కొంతమంది స్త్రీలను కలిగియున్నారు. పైన మిద్దెల మీద ఒక విధమైన సంఘ ఉత్సవము (చర్చి పార్టీ) జరుగుచున్నది. ఆ ఇంటి యొక బేస్మెంట్ భాగమున ఒక పనికొరకు నేనక్కడ ఉండుట జరిగినది. నేను మీకు చెబుతాను, నేను ఒకప్పుడు పాపిగా ఉన్నప్పుడు కొన్ని రోత కార్యములను విన్నాను. అయితే అది ఒక స్త్రీల కూటమైయున్నది, నా జీవితమంతటిలో నేనెన్నడు వినని అతి హీనమైన మురికి సరసోక్తులను నేను వినియున్నాను. మీరు ఊహించగలరా, క్రైస్తవుడు అని పిలువబడు ఒక వ్యక్తి, వారినుండి అలాంటి మురికిని ప్రవహింపనిస్తాడా?

ఒకే తొట్టిలో నుండి నీవు తియ్యని నీటిని మరియు చేదు నీటిని పొందలేవు. నీవు బావిలోనికి ఒక బక్కెట్టను వేసినప్పుడు, అది దాని నిండా ఏలిక పురుగులతో బయటకు వస్తుంది. వాటిని అలా మేము పిలుస్తాము. మరల నీవు బక్కెట్టును వదిలినప్పుడు, అది అవే నీళ్ళను పైకి తెస్తుంది. ఆ తొట్టెను రుద్ధి శుభ్రము చేసి, మంచినీటితో దానిని నింపాల్సిన అవసరత ఉన్నది.

2TIM 3:3,4

 

58విశ్వవ్యాప్తముగా మాట్లాడుచున్నట్లైతే — ఈ దినమున సంఘముతో ఉన్న ఇబ్బంది కూడా అదే, ఆమెను రుద్ధి శుభ్రముచేసి, పరలోకము నుండి వచ్చు దేవుని యొక్క పరిశుద్ధమైన నీళ్ళతో ఆమె నింపబడవలసియున్నది. ఆమె యొక్క హృదయము మార్గము వెంబడి వచ్చు దేనితోనైనా నింపబడు ఒక మురికి కొలనువలె యున్నది. అనేక రకములైన ప్రేమికులను ఆమె కలిగియున్నది. బైబిల్ చెప్పియున్నది, ఆమె "దేవునికంటే ఎక్కువ సుఖానుభవమును ప్రేమించువారై యున్నారు. అనురాగరహితులు, క్రూరులు, అపవాదకులు, మరియు సజ్జనద్వేషులు."

సరిగ్గా జీవించుటకు ప్రయత్నం చేయు ఒక స్త్రీ, సరిగ్గా జీవించుటకు ప్రయత్నము చేయు ఒక మనిషి, అతడు ఒక "పరిశుద్ధ గుండ్రాయిగా పిలువబడతాడు. ఆమె ఒక మూఢభక్తిగల వ్యక్తిగా గల పాతకాలపు స్త్రీగా పిలువబడింది. ఆమె ఒక వెలివేయబడిన వ్యక్తిగా ఉంటుంది. ఆమె ఈ లోకంలోని జనులచేత తిరస్కరించబడి, మరియు త్రోసివేయబడినదిగా ఉంటుంది. అది నిజము.

LEV 14:5-7•

ISA 6:3

 

59అయితే ఒక నిజమైన సంఘము తప్పక ఏమి చేయవలసియున్నదో నీవు గమనించావా? పాత నిబంధనలో, వారు బలిని అర్పించినప్పుడు, వారు ఒక పక్షిని చంపి, చనిపోయిన పక్షి రక్తమును మరొక జతపక్షి మీద క్రుమ్మరిస్తారు, మరియు అది భూమి ఈ అంతట ఎగురుతూ, చనిపోయిన పక్షి రక్తము చిమ్ముకుంటూ వెళ్ళుతుంది. సంఘము క్రీస్తు యొక్క నిజమైన వధువుగా మారినప్పుడు, ఆమె యేసుక్రీస్తు యొక్క రక్తమును మోస్తూ భూమి మీద చిలకరిస్తూ, "పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రభువు, పరిశుద్ధుడు, అని కేకలు వేస్తుంది." ఆమె యొక్క వాతావరణము, ఆమెలోని ప్రతి అణువు దేవునిదై యుంటుంది. ఆమె యొక్క పూర్తి నిర్మాణము దేవునిదై యుంటుంది. ఇంకా దేనికొరకు నీవు ఎదురుచూడలేవు.

MATT 5:13•

JOHN 12:32

 

60ఆ కారణమును బట్టియే ప్రజలు సంఘమునకు కూడా వస్తారు. పేకాట ఆడటానికి కాదు, బంతులాట ఆడుటకు కాదు, బేస్మెంట్లో నాట్యమాడుటకు కాదు, సాయంకాలపు సూప్ విందులు అలాంటి కార్యములు చేయుటకు కాదు. అవి లోకమునకు సంబంధించినవి. మరియు మనము ఎన్నడూ వారితో పోల్చుకొనలేము, వాటిని చేయుచున్నందున మనము సిగ్గుపడాలి. మనము తప్పక పరిశుద్ధాత్మను గూర్చి క్రీస్తు యొక్క పునరుత్థానమును గూర్చి బోధించాలి. వారికి లేనిది ఒకటి మనకున్నది, దానిని మనము జీవిద్దాము, వారు చేయు దానిని అనుకరించుటకు ప్రయత్నించుట కాదు. ఏది సత్యము అని మనము ఎరిగియున్నామో దానిని మనము జీవించాలి, క్రీస్తులో జీవించండి. యేసు చెప్పెను, "నేను పైకి ఎత్తబడిన యెడల, సమస్త జనులను నా యొద్దకు ఆకర్షిస్తాను. మీరు భూమికి ఉప్పుయై యున్నారు; అయితే ఉప్పు దాని సారమును పోగొట్టుకొన్నయెడల, అది మనుష్యుల కాళ్ళ క్రింద తొక్కబడుటకే తప్ప మరిదేనికీ పనికిరాదు." మన సాక్ష్యములు…

61ఆశ్చర్యము లేదు, మన పెంతికోస్తు గుంపులు వారు సహితము, అంతే చెడ్డగాయున్నారు, దానిని చెప్పుటకు నేను అసహ్యించుకొనుచున్నాను, మన పెంతికొస్తు గుంపుల వారు తిన్నగా అదే కార్యములోనికి పడిపోవుచున్నారు, అదే పోకడలోనికి తిన్నగా పడిపోవుచున్నారు. ఆశ్చర్యము లేదు, వారు ఏమి చెప్పుచున్నారో వారు దానిని కలిగిలేరని ప్రజలు చెప్పుచున్నారు. చివరకు యేసుక్రీస్తు యొక్క జీవమే, దానిద్వారా ప్రతిబింబించునట్లు, పెంతికోస్తు ఉద్యమము సర్వశక్తుడైన దేవుని యొక్క శక్తితో తప్పక ఒక్కటిగా చుట్టబడవలసియున్నది.

అయితే మనము లోకము యొక్క మాదిరిని కోరుచున్నాము. ఎలాగైనా మనము దానిని చేయబోవుచున్నాము, చూడండి. దానిని గూర్చి మన మార్గమును మనము కలిగి యుండబోవుచున్నాము. అయితే మనము దానిని తప్పక చేయరాదు. దానిని చేయుట తప్పై యున్నది.

సంఘములన్నియూ స్త్రీల వలె, క్రూరముగా మారిపోయినవి. మొదటి సంగతి మీకు తెలుసా, యాబది లేక యాబది-అయిదు సంవత్సరముల క్రితము, పెంతికోస్తు సంఘమునకు దేవుడు జన్మనిచ్చినప్పుడు, ప్రారంభములో, ఆమె పరిశుద్ధముగా జీవించినది, ఆమె పరిశుద్ధముగా యున్నది. దేవుని యొక్క శక్తి ఆమెతో యున్నది. అయితే మనము ముందుకు వెళ్ళుచుండగా, మనము లోకముతో మనలను మనము పోల్చుకొనుటను ప్రారంభించాము. మొదటి సంగతి మీకు తెలుసా, ఆ మూలన యున్న ఇతర మెథడిస్టు సంఘ కట్టడము కన్నా మన కట్టడము ఎక్కువగా మించి దాని మీద శ్రేష్ఠమైనదిగా తప్పక యుండాలని మనము తలంచుచున్నాము. మనము తప్పక ఎంతో పెద్దదానిని కలిగియుండాలి, అతిపెద్ద దానిని మనము కలిగియుండాలి, మరియు అన్నిటికంటే అతిపెద్ద దానిని మనము కలిగియుండాలని తలస్తున్నాము. అది ఒక అవమానకరమైన సంగతి!

62మనలో అనేకమంది దానిని పొందినప్పుడు మనకై మనము, ఆయాసపడుతుండగా గప్పు గప్పున ఊదివేస్తాము. ఒక చిన్న పెంతికొస్తు సోదరుడు ఆ దిగువన ఒక చిన్న పనిని కలిగి, ఒక చిన్న సంఘమును కలిగియున్నాడు, అయితే వారు ఒక పెద్ద సంఘమునకు వెళతారు, "మేము మొదటి సంఘమునకు చెందిన వారము, లేక పెద్ద సంఘమునకు చెందినవారము," లేక అలాంటిది ఏదో చెప్పి — చిన్న చూపు చూస్తారు.

కొంచము నిన్ను గాలి తీసి తగ్గించుటకుగాను మనకు కావలసినది ఏమనగా పరిశుద్ధాత్మ నిజమైన పరిశుద్ధాత్మను నీవు కలిగియున్నప్పుడు, నీవు ఒక మంచి టక్సిడో సూటు ధరించి యున్నప్పుడు, నీ చేతులను ఒక వాడుక బట్టలను ధరించిన వానిచుట్టు చేతులను వేసి, "సోదరుడా", పిలచునట్లు నిన్ను చేస్తుంది. (సత్యము), అదే నిజమైన పాతకాలపు రక్షణ, సర్వశక్తుడైన దేవుని యొక్క శక్తి, (అవునండి), అది సిల్కు బట్టలతో యున్న నిన్ను ఒక సామాన్యమైన ముతక బట్టలు ధరించిన నీ సహోదరి మీద చుట్టు చేతులుంచి, "సహోదరీ, నేను నిన్ను ప్రేమించుచున్నాను," అని పిలచునట్లు నిన్ను చేస్తుంది. నిశ్చయముగా అది చేస్తుంది.

1SAM 15:14•

ACTS 15:14

 

63అయితే మనము లోకముతో బయటకు వెళ్ళిపోవుచున్నాము, వాటి అలలతో కొట్టుకొని పోవుచున్నాము. మన సంఘము దానిని కలిగియున్నది. మనము ఇక ఎంత మాత్రము మెథడిస్టూ వారిని గూర్చి మరియు బాప్టిస్టువారిని గూర్చి మాట్లాడవలసిన పనిలేదు. అది మనమేయై యున్నాము. అది మన సొంత పరిధిలోనే యున్నది. ఆ కారణమును బట్టియే పరిశుద్ధాత్మ కదలలేకపోవుచున్నది, ఆ కారణమును బట్టియే నేను దానిని చెప్పుచున్నాను, ఈ రాత్రి దేవుడు తన ఆమోదమును ఏ సంస్థ పై యుంచలేడు — ఎందుచేతననగా ఒక దేశముగా అన్యజనాంగము తీసుకొనబడలేదు వారు అన్యజనాంగము నుండి తీసుకొనబడిన ఒక ప్రజయైయున్నారు, ఆయన నామము కొరకు. దేవుడు వ్యక్తులను తీసుకుంటాడు.

ఇప్పుడు మన సంస్థలు ఒక మంచి పనిని చేయుచున్నవని నేను తలంచుదును. అది మంచిదే. అయినను నీవు దాని మీద ఆధారపడలేవు. "నేను పెంతెకోస్తును, ఏలయనగా "నేను ఒక పెంతికొస్తు సంస్థకు చెందియున్నాను" అని నీవు చెప్పలేవు. నీవు ఒక పెంతికొస్తు అను భావమును పొందినప్పుడు, నీవు అప్పుడు ఒక పెంతికొస్తువు. నీవు కాథలిక్ సంఘమునకు చెందియున్నప్పటికి నేను లెక్క చెయ్యను, నీవు పెంతికొస్తువాడవై యున్నావు. నీవు పెంతికొస్తును సంస్థగా చేయలేవు. పెంతికొస్తు ఒక అనుభవమై యున్నది, ఒక సంస్థ కాదు. మరియు అది సత్యము.

PROV 18:10

 

64పెంతికొస్తు ప్రజలమై మనము ఎలా ఆలోచించుట ప్రారంభించామంటే, మనము పెంతికొస్తు అను పేరును కలిగియున్నందున, మనము ముందుకు వెళ్ళి లోకములో జీవించి, మనము ఏదైనా మనము కోరినది చేయవచ్చునని మనము తలంచుచున్నాము. మనము నిమ్రోదు యొక్క గోపురమును ఎక్కుచున్నవారివలె యున్నాము, అది బూడిదగా మారుతుంది. ఆదాము యొక్క అంజూరపు కచ్చడమువలె, అమె వెనుకకు వెళ్ళిపోతుంది. ఫ్రాన్స్ దేశములోని సిగఫీల్డ్ అను అడ్డుగోడ వలె, జర్మనీలోని మాగినాట్ అను అడ్డుగోడ వలె, ఆమె కూలిపోయినది, కారణము అక్కడ ఏ ఇతర గోపురము నిలబడలేదు. అయితే "యోహోవా నామమే బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి క్షేమముగా నుండును." నీవు దానిలోనికి పురుగెత్తినప్పుడు అది పేరును తీసుకొంటుంది, అది పేరు, ఏదో కేవలము పేరును పిలుచుట కాదు, పేరు మరియు ఆ వ్యక్తి నీవై యున్నావు. అది నీలోని క్రీస్తువంటి జీవితము. ఆమేన్. ఆయన అద్భుతమైనవాడు. అవును.

EPH 5:27

 

65సంఘము కూడా అదే కార్యమును చేసియున్నది, ఒక స్త్రీ తన భర్తతో పంచుకొనవలసిన ప్రేమను మరొకరితో పంచుకొన్నట్లుగా, సంఘము ఆత్మసంబంధమైన జారత్వమును జరిగించుచున్నది. అటువంటి భర్తతో జీవించుటకు సరిపోదు. మీకు అది తెలుసు. మరియు సంఘము ఆమె యొక్క ఆ సహవాసమును లోకముతో పంచుకొనుటకు ప్రయత్నించినప్పుడు, దేవుడు రోషముగల దేవుడై యున్నాడు. ఆ కారణమును బట్టియే ఆయన ఇశ్రాయేలు విడిచిపెట్టి యున్నాడు, మరియు ఆయన కుమారుడును అదే రీతిగా ఆమెను విడిచిపెడతాడు.

ఆమెలో ఒక మడత కూడా లేని వధువును ఆయన కలిగియుండబోవుచున్నాడు. ఆమె సంపూర్ణముగా, స్వయముగా ఆయన రక్తము ద్వారా ఆమె సంపూర్ణముగా కడుగబడి యున్నది. అది నిజము. మనము దేనికొరకు నిలబడియున్నామో దానిని మనము చూస్తాము, వివాహము వచ్చుటకు సిద్ధముగా యున్నది.

66ఇప్పుడు, ఆమె లోకము వెంబడి వెళ్ళుచూ ఒకదానిని ఒప్పుకొనుచూ, మరొకదానిని భిన్నముగా చేయుచూ ఆమె ఆత్మసంబంధమైన జారత్వమును చేయుచున్నదని మనము కనుగొంటాము. అది ఎన్నడూ పనిచేయదు. సంఘము తప్పక చేయవలసిన కార్యము ఏమనగా, ఎస్తేరు చేసినట్లు చేయుటయే. లోక సంబంధమైన అలంకరణను ఎస్తేరు తిరస్కరించినది.

ఆ చిన్న ఎస్తేరు గ్రంథమును మనము ఎరుగుదుము, ఎలా మొర్టెకై… అతని పిన తండ్రి ఒక కుమార్తెను కలిగియుండెను. అది మాదీ - పారసీకుల కాలములోని వారి ఏలుబడిలో జరిగినది. అది ఒక చక్కని మాదిరిగా అక్కడ యున్నది. రాజు, ఆ దినమున ప్రపంచములోనే యున్న గొప్ప రాజులలో ఆయన ఒకడు, ఆయన ఒక గొప్ప విందును చేశాడు. ఆ సమయములో అతడు తన రాణి వచ్చి అతని ప్రక్కన కూర్చొండవలెనని అతడు ఆమెను పిలిచెను. అయితే అమె దానిని చేయలేదు. ఆమె దానిని చేయుటకు తిరస్కరించియున్నది. అప్పుడు ఆయన ఏమి చేశాడు? ఆయన యొక్క గౌరవ - మర్యాదలు గాయపర్చబడియున్నవి, ఏమి చేయాలో అతనికి అర్థము కాలేదు, ఆయన సొంత భార్య పిలిచినప్పుడు రాలేదు.

EPH 2:6

 

67ఈ దినమున క్రీస్తువలె యున్నవారిలో అనేకమంది అలాగునే యున్నారని నేను తలుస్తాను, ఆయనతో పరలోకపు స్థలములలో కూర్చుండవలెనని క్రీస్తు మనలను ఆహ్వానించి యున్నాడు, మరియు మనము దానిని గూర్చి సిగ్గుపడుచున్నాము. అనేకమంది తాము పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును పొందియున్నామని చెప్పుటకు సిగ్గుపడుచున్నారు. పెంతికొస్తు ప్రజలు, అది నిజము. వారు దానిని చెప్పుటకు సిగ్గుపడుచున్నారు, మనము ఆయనను గూర్చి సిగ్గుపడుచున్నాము. కాబట్టి రాణి వచ్చియుండలేదు. ఆమె వచ్చుటకు సిగ్గుపడియున్నది. అది ఆయన గౌరవ - మర్యాదలను గాయపరిచినది. ఆయన ముఖము ఎర్రబారినది. ప్రతి ఒక్కరూ దానిని గుర్తుపట్టారు.

ఆయన మనలను ఒక పనికొరకు, పెంతికొస్తు ఉద్యమములోని సహవాసమునకు మరియు సహోదరత్వమునకు పిలిచినప్పుడు, యేసు యొక్క ముఖము కూడా కొంచెము ఎర్రగా మారనట్లైతే, ఎలా అని నేను ఆశ్చర్యపోతున్నాను, మనము ఎంతో బిగుతుగా సంస్థలలోని చిన్న గుంపులతో సంస్థాగతమై పోయాము, చివరకు మనము ఒకరికి ఒకరము వంగుట లేదు. మనము ఎంతగానో, ఆ రీతిగా లోకకార్యములలోనికి వెళ్ళిపోయినాము, పెంతికొస్తు అను పేరును బట్టి మనము సిగ్గుపడుచున్నాము. కొందరు దానిని చెప్పుటకు భయపడుచున్నారు. "సరే, నేను ఒక క్రైస్తవుడనై యున్నాను. అయినా… " నేను పెంతెకోస్తు అనుభవమును కలిగియున్నందుకు సంతోషించుచున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క నామమును భరించుటలో నేను సంతోషిస్తాను. నేను ఆయనలో ఒక భాగమైయున్నానని చెప్పుట, అది ఎన్నడైనా నేను కలిగియున్న గొప్ప ఆధిక్యతయై యున్నది.

68ఇప్పుడు మనము కనుగొంటాము, తరువాత, అతడు తప్పక ఏమి చేయవలసియున్నదో తన యొద్దనున్న కొందరు సలహాదారులను రాజు అడిగాడు. మరియు వారన్నారు, "ఇది ఇలాగే కొనసాగితే, దేశములోని మిగిలిన స్త్రీలందరూ, దేశములోని ప్రథమ-మహిళ యొక్క మాదిరిని తీసుకొంటారు." (అమెరికాలో ప్రెసిడెంట్ గారి భార్యను ప్రథము-మహిళ అందురు - తె. తర్జుమాదారుడు)

బహుశా, ఈ రాత్రి అదే జరుగుచున్నది. నేను ఈ స్త్రీలలో కొందరిని చూచుచున్నాను. (మీ భావనలను గాయపర్చనని నేను కొరుతాను, మరియు ఇంకనూ, నేను దానిని చేయగోరుదును, అది నిజము.), ఈ ఒకరకపు నీటి పొంగువలె వెంట్రుకల కత్తిరింపు, దేశములోని ప్రథమ-మహిళ వలె చేయునట్లు ప్రయత్నించుచున్నారు. నా జీవితమంతటిలో అలాంటి కార్యమును నేను ఎన్నడూ చూడలేదు. మొన్నటి దినమున ఒక స్టోరులో నా భార్య కొరకు ఎదురుచూచుచుండగా, ఒక స్త్రీ లోనికి వచ్చినది మరియు ఆ స్త్రీ యొక్క తల అంత పెద్దగా ఉన్నది, మరియు ఆమె తన కన్నుల క్రింద పచ్చటి రంగు వేసుకుని యున్నది. నేనన్నాను, "వెనక్కు వెళ్ళు వికృతమైన దయ్యమా, నేనైతే చక్కగా ఉంటాను." అది అత్యంత వికృతమైన దృశ్యం. ఆ దృశ్యం నిన్ను భయకంపితునిగా చేస్తుంది. అది ఏమైయున్నది? అది ప్రథమ-మహిళ, అది ఆ దేశములోని ప్రథమ-మహిళయై యున్నది. అది అంతవరకే, వారు దాని ద్వారా ఒక మాదిరిని తీసుకొనుచున్నారు.

69ఇది నన్ను మీకు చెప్పనివ్వండి. (నేను దీన్ని ఒక తమాషాగా చెప్పుట లేదు. అయితే ఒక ఉపమానంగా దీన్ని చూస్తారని చెప్పుచున్నాను.) పాత క్రైస్తవులైన మీరు దానినే ఖచ్చితంగా ఈ యౌవ్వన క్రైస్తవులకు చేయుచున్నారు. ఖచ్చితంగా సత్యము. మీరు తప్పక మాదిరులు చూపే వారుగా ఉండవలసియున్నది. మేము పరిశుద్ధాత్మను కలిగియున్నామని చెప్పుకొనే పెంతెకొస్తు వారగు మీరు, మెథడిస్టు వారికి, బాప్టిస్టు వారికి మరియు ప్రెస్బిటేరియను వారికి మీరు మాదిరిగ ఉండవలసియున్నది. ఆ ప్రథమ-మహిళవలె కాదు, తప్పక యేసువలె మీరుండవలసి యున్నది. దాన్ని ఎలా చేయాలో, ఏమి చేయాలో ఇక్కడ ఆయన మీకు చెప్పుచున్నాడు. మనము ఆయన నిబంధనలను మరియు ఆయన మాదిరులను తప్పక వెంబడించవలసియున్నది. అయితే, దానిని ఆ విధంగానే మనము కనుగొంటాము.

EST 1:12,17,19•

EST 2:3

 

70ఎస్తేరు….ఈ రాణి దానిని వినలేదు ఆమె వచ్చుటకు ఇష్టపడలేదు, ఆయనను అవమానపరచినది. ఆయన అన్నాడు, "ఈ దేశం యొక్క ప్రథమ-మహిళ అలాంటి ఒక మాదిరిని చూపినట్లైతే, అప్పుడు మిగిలిన స్త్రీలందరూ దాన్నే చేస్తారు. కాబట్టి అప్పుడు ఒక మనిషి తన భార్యను రమ్మని పిలిచినప్పుడు, ఆమె ఇలా అంటుంది, నీవు వెళ్ళి నదిలో దుముకుము." చూడండి? కుర్రవాడా, ఆయన అమెరికాను గూర్చి నిజముగా ముందే చెప్పాడు, ఆయన చెప్పలేదా?

ఇప్పుడు అలా చేయుటను బట్టి, దానిపట్ల మనం కనుగొనేదేమనగా అప్పుడు ఆయనను గూర్చి కొంత జ్ఞానం కలిగిన ఒక మనుష్యుడు వచ్చి రాజుకు ఈ విధంగా సలహా ఇచ్చాడు. అతడన్నాడు, "ఇప్పుడు చేయవలసిన పని ఏదనగా, ఆమెను బహిష్కరించుటయే మరియు ఆ దేశమంతటి గుండా కన్యకలను, అనగా యౌవ్వన కన్యలను పిలిపించి, అప్పుడు వారిలో నుండి నీ కొరకు ఒక భార్యను తీసుకొనుము." అది రాజునకు సమ్మతమైనది.

EST 2:3,7,12

 

71కాబట్టి అతడు రాజనగరిని కాయు పనికత్తెలను తాను రాజైయున్న ఆ స్థానములన్నిటిగుండా, ఆ రాజ్యములన్నింటిగుండా కన్యకలందరినీ సమకూర్చుటకు వారిని బయటకు పంపెను, అది ప్రపంచములోనే అతి గొప్పదై యున్నది.

అతడు ఆ పని చేసినప్పుడు, ఆ వంతు ఈ చిన్న యూదా బాలికకు వచ్చినది. అన్యులవలె ఆమె కూడా ఒక విధముగా బయటకు త్రోసివేయబడినది, మీరు చూడండి, ఆమె మరొక ప్రక్కకు త్రోసివేయబడినది. ఆమెకు తల్లిలేదు మరియు తండ్రి లేడు. మరియు ఆమె పినతండ్రియైన మొర్దేకై ఆమెను పెంచుచుండెను, ఆమె రాజుకు తగిన అర్హురాలుగా ఉండుటకు ఆమె ఆయన యొద్దకు వెళ్ళవలసియుండెను. కాబట్టి వారేమి చేసిరి, వారు ఈ బాలికలను ఎన్నో నెలలుగా శుద్ధీకరణ కొరకు తీసుకొనియున్నారు. వారు తమ్మునుతాము అన్నివిధములైన అలంకరణలతో అలంకరించుకొని, మరియు చక్కగా తమ్మునుతాము దిద్దుకొని మరియు తమను తాము సుంగధ ద్రవ్యములతో సిద్ధపరచుకొనవలసియుండెను, అప్పుడు వారు రాజుసముఖమునకు వెళ్ళవచ్చును.

72ఈ దినము ఆ విధానములోనే లోకము సంఘమును అల౦కరింపగోరుచున్నది. లోకమువలె దానిని అలంకరించుచున్నది; లోక కార్యముల యొక్క మాదిరిని తీసుకొనుచున్నది, ఎక్కువ మంది సభ్యులను పొందుటకు ప్రయత్నం చేయుచున్నది — దేనినైనా సహవాసం లోనికి తీసుకొనుచున్నది. ఓ, మై! ఇది ఒక విచారకరమైన సంగతి. ఒక సంస్థ మరొక సంస్థను అధిగమించుటకు ప్రయత్నం చేయుచున్నది, ఎవ్వరినైనను లోనికి ఒక సభ్యునిగా తీసుకొనుచున్నది. మీరు ఈ సంస్థలోనికి వారిని తీసుకొనవచ్చును, అయితే వారు శుద్ధిచేయబడి మరియు దేవుని ఆత్మతో తిరిగి జన్మించనంతవరకు, వారెన్నడు క్రీస్తు యొక్క సహవాసములోనికి రాలేరు. అది నిజము. వారు వారియొక్క పేరును ఇక్కడ గ్రంథములో కలిగియుండవచ్చు అయితే పైన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో వారి పేరు లేదు, యేసుక్రీస్తు యొక్క రక్తముతో అది వ్రాయబడనంతవరకు.

73స్త్రీలందరూ వారు చక్కగా కనబడునట్లు తమ్మును తాము సిద్ధపరచుకున్నారు. మరియు ఓ, నేను ఊహించగలను దేశములోని ఆ ప్రథమ-మహిళవలె కొన్ని చూపులు వారిమీద పడునట్లు నిజంగా వారు తమ్మునుతాము అలంకరించుకున్నారు. వారందరు తమ్మునుతాము చక్కగా దువ్వుకున్నారు, ఎందువలననగా వారు రాజు ముందు హాజరు కాగోరుచున్నారు.

ఈ దినమున మన సంఘములతో ఉన్న పూర్తి వ్యవహారమంతయు నేను తలంచుచున్నాను. లోకసంబంధులవలె తమ్మునుతాము అలంకరించుకొనుటకు ప్రయత్నించుచున్నారు. లోకసంబంధమైన వినోదములను వారు కలిగియున్నారు, దానిలో లోకకార్యములున్నవి, లోకసంబంధమైన కార్యములను వారు చేయుచున్నారు, వారు తాము రాజును కలుసు కోగలమని తలంచుచు, లోకముతో స్నేహం చేయుచున్నారు. దేవుడు దాన్ని లెక్క చేయడు. ఆయన దాన్ని అసహ్యించుకుంటాడు. అయితే మనము లోకంలోని వారివలె నటించగోరుచున్నాము.

నేను చెప్పినట్లుగా మన సంఘములలో కొన్ని సంఘములు వారిని లోనికి రానిచ్చుటకు ఇనుప ఊచలను క్రిందికి నెట్టి వారిని పెద్దలుగా లోపలికి తీసుకొనుచున్నారు. సంఘములో కొన్నిసార్లు సంఘకాపరులు నాలుగు లేక అయిదు సార్లు పెళ్ళిచేసికొనిన వారున్నారు, మరియు వారిలో కొందరు సిగరెట్లు త్రాగుచున్నారు. "వారు బాగానే ఉన్నారు, వారు దాన్ని చూసుకుంటారు అని చెప్పుచున్నారు." ఒక రాత్రి సారాయి కొట్టులో ఉన్న వ్యక్తిని తీసుకుని, మరుసటిరోజు ఆ వ్యక్తిని వేదిక మీద ఉంచుచున్నారు. అలాంటి వాటియందు నాకు నమ్మిక లేదు. ఒక మనిషి తప్పక రుజువు చేయబడవలెనని నేను కోరుచున్నాను. అది నిజము, రుజువు చేయబడవలసి యున్నది. నేను మీకు చెబుతాను, ఎన్నోసార్లు మనం …

GAL 5:22,23•

EPH 4:13•

COL 3:12

 

74పరిశుద్ధాత్మ బాప్తిస్మమునందు నేను నమ్మిక కలిగియున్నాను. భాషలు మాట్లాడుట యందు నేను నమ్మికను కలిగియున్నాను. అయితే దానిమీదనే ఎంతో ఎక్కువగా మనం నొక్కి చెప్పుచున్నామని తలుస్తాను. ఒక స్త్రీ భాషలతో మాట్లాడగలడు మరియు ఒక స్త్రీ భాషలతో మాట్లాడుతుంది, అయితే నీవు మాట్లాడుచున్న భాషలతో ఆమె జీవితము లేక అతని యొక్క జీవితము సరితూగనియెడల, అప్పుడు అది తప్పు భాషయైయున్నది, ఏలయనగా బైబిల్లో ఉన్నట్లుగా నీవు ప్రవర్తించునట్లు పరిశుద్ధాత్మ చేస్తాడు. పరిపూర్ణమైన క్రీస్తు సారూప్యమునకు అది నిన్ను తెస్తుంది.

భాషలతో మాట్లాడు ఒక వ్యక్తిని మీరు తీసుకోండి, పరపరమని శబ్దము చేస్తూ కూయు ఒక రంపముతో పోరాడే తగినంత కోపమును అతడు కలిగియున్నాడు, మరియు తన పొరుగువారిని గురించి అతడు మాట్లాడతాడు మరియు సమస్తము ఆ రీతిగా చేస్తాడు. ఎందుకని, మీరు దాన్ని పరిశుద్ధాత్మ అని పిలువగలరా? అది పరిశుద్ధాత్మ కానేరదు. లేదండీ.

పరిశుద్ధాత్మ అనగా సాత్వికము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము, విశ్వాసము. అదే పరిశుద్ధాత్మ అది ఆత్మ యొక్క ఫలమై యున్నది. సజీవదేవుని యొక్క సంఘములో పరిశుద్ధాత్మ యొక్క రుజువు. మాధుర్యము, దీనత్వము, తగ్గింపు ఒకరిపట్ల ఒకరికి ప్రేమ, దీర్ఘశాంతము.

MATT 18:12•

LUKE 15:4•

GAL 5:22,23

 

75ఒక సోదరుడు తప్పిపోయినట్లైతే, మీరతన్ని కొట్టవద్దు లేక అలాంటిది మరేదో చేయవద్దు. అతని వెనుక వెళ్ళి అతనిని తిరిగి వెనుకకు తేగలరేమో చూడండి. ఆ కార్యము చేయుటకు బోధకుని కొరకు మీరు వేచియుండవద్దు. మీరు దాన్ని చేయండి, ఎవరైనా దాన్ని చేయండి. బోధకుడు అంతయు చేయలేడు, అలాగే పెద్దలు కూడా దాన్ని చేయలేరు. ప్రతి ఒక్కరు క్రీస్తు యొక్క శరీరంలో ఒక సభ్యులైయున్నారు, మనము తప్పక ఒకరికొరకు ఒకరము వెళ్ళాలి. మరియు మనము క్రీస్తుయొక్క ఆత్మను మనలో మనము కలిగి యున్నట్లైతే, ఆయన మనకు ఒక గొప్ప ఉపమానములో వారు తొంబై-తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి, మరియు నశించిన ఆ ఒక్క గొర్రె కొరకు వెళ్ళారు. దాన్నే మనము తప్పక చేయవలసియున్నది.

అయితే, "ఓ, వారిని వెళ్ళనివ్వండి" అని మనమనుచున్నాము. మనము ఎన్నడూ దాన్ని తప్పక చేయరాదు. మనము తప్పక మృదువుగా, క్షమించువారముగా, దీర్ఘశాంతమును కలిగిన వారముగా ఉండాలి - అది ఆత్మయొక్క ఫలమైయున్నది.

EST 2:15

 

76ఇప్పుడు, మనకై మనము దాన్ని తరువాత కనుగొంటాము, ఆ ఎస్తేరు, మళ్ళీ ఆమె… రాజు ముందు తన్నుతాను కనపరచుటకు, ఆమె తన్నుతాను సిద్ధపరచుకొనుటకు, వారామెను ఈ స్థలముల్లో ఒకచోట ఉంచారు. మై! ఆమె దాన్ని (ఈ లోకము వంటి అలంకరణను తె. తర్జుమాదారుడు) తిరస్కరించినది. ఆమె దాన్ని ఇష్టపడలేదు. ఆమె ఉన్నవిధముగానే రాజువద్దకు వెళ్ళగోరినది. ఆమేన్.

ఈ దినమున ఉన్న సంఘములు లోకములోని వారివలె ప్రవర్తింపగోరుచున్నారు, లేక కారణము మనము పెద్దవారనుచున్నాము దేవుడన్నాడు, "ఒకప్పుడు వారు చిన్నవారిగా ఉన్నారు, అప్పుడు వారు ఆయన్ని సేవించారు. అయితే వారు పెద్దవారైన తరువాత వారు ఆయన్ని మరిచిపోయారు. అది నిజము. ఒక సందులో ఎక్కడో మనము ఒక పెనము వంటి ప్లేటును తీసుకొని, ఒక తంభుర తీసుకొని మన చేతులతో దానిని కొట్టుచూ, మరియు ఒక పాత గిటారును తీసుకొని దానిని ఒక విధముగా శబ్దము చేయుటకు మనము ప్రయత్నించి, ఒక వీధి కూటమును నడిపినప్పుడు, మీరు దీనులుగా యున్నారు, అయితే మనకు ముప్పది లేక నలుబది లక్షల డాలర్ల కట్టడము వచ్చినప్పుడు, మరియు అలాంటి గొప్పతనం వచ్చినప్పుడు, మనం ఎంతో తలబిరుసుగల వారిగా మారి, మనమును పరిస్థితిని మర్చిపోవుచున్నాము — లోకముతో మెరుగులు దిద్దుకొనుచున్నాము.

DEUT 22:5

 

77మొన్నటి దినమున నేను ఒక స్థలమునకు వెళ్ళియున్నాను, అక్కడ ఒక హోలీనెస్ సంఘమునకు సంబంధించిన ఒక సోదరుడు, కొంతమంది ప్రజలు అక్కడ అతని కొరకు పనిచేయుచున్నారు. కాఫీ విరామ సమయములో అక్కడ బయటకు వచ్చిన ప్రతి స్త్రీ కూడా జుట్టు కత్తిరించబడి, పెదవులకు రంగులు వేసియున్నారు. ఇప్పుడు, నీవంటావు, "సోదరుడా బ్రెన్హాం, దానిని ఎత్తిచూపుట నీ పని కాదు." నేను ఆ పనిని కలిగియున్నాను. బైబిలు దానిని చెప్పుచున్నది. అది సత్యము.

అనేకమంది పెంతుకొస్తు స్త్రీలు పురుషునికి సంబంధించిన బట్టలను ధరించుచున్నారు, మరియు అది ఆయన దృష్టిలో హేయమైయున్నదని దేవుడు చెప్పియున్నాడు. అది సత్యం. నీవు అలాగైతే ఎలా పరలోకమునకు వెళ్ళుటకు ఎదురుచూస్తావు? అక్కడ పరిశుద్ధాత్మలేడని అది చూపుచున్నది. అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నట్లైతే, అది నిన్ను దోషిగా తీర్పు తీరుస్తుంది. నిజం. ఓ, నువ్వు కేకలు వేయవచ్చు, భాషలతో మాట్లాడవచ్చు, పైకి క్రిందికి ఎగురవచ్చు, ఆత్మలో నాట్య మాడవచ్చు, ఇండియా దేశం వారు, హిందువులు దానిని చేయుట చూసియున్నాను, మరియు అలాంటి సమస్తమును వారు చేసియున్నారు. నువ్వు దేనినైతే మాట్లాడుచున్నావో, నిన్ను దేవుని ప్రజలవలె జీవింపచేయునట్లు చేయు పరిశుద్ధాత్మ యొక్క శక్తి నువ్వు మాట్లాడుచున్న జీవితాన్ని అది సమర్ధించని యెడల దానివలన ఏ అర్ధమూ లేదు. అదే క్రీస్తు యొక్క వధువైయున్నది.

78ఎస్తేరు ఒక వధువు కావలసియుండెను. కాబట్టి ఆమె లోకసంబంధమైన అలంకరణను కోరుకొలేదు, ఆమె ఎలా ఉండియున్నదో, ఆ రీతిగానే రాజు యొద్దకు వెళ్ళగోరినది. పెంతుకొస్తు వారు తప్పక తమ్మునుతాము అలంకరించుకొను రీతిగా, ఆమె తన్నుతాను సాత్వికముగా, దీనమైన ఆత్మతో అలంకరించుకున్నది. మరియు అలంకరణలన్నిటితో, వారి క్రొత్త అభిమానింపబడే వస్తువులతో వారు లోనికి వచ్చినప్పుడు, రాజు వారివైపు చూసి వారందరిని ఉపపత్నులతో అంతఃపురములో ఉంచెను. ఈ ఎస్తేరు ఆయన దృష్టిముందుకు వచ్చినప్పుడు, అతడు ఆ తియ్యని, దీనమైన సాత్వికపు ఆత్మ యొక్క దృశ్యములను ఆమెలో చూసెను, అప్పుడతడన్నాడు "అది ఆమెయే, వెళ్ళి రాజ కిరీటమును ఆమె తలపై ఉంచండి." అది అంతే.

వారు తమ్మునుతాము ఆ విధమైన ఆత్మతో అలంకరించు కొనవలసియున్నది. స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా, తమ్మునుతాము ఆ విధమైన దీనత్వపు ఆత్మతో తమ్మునుతాము అలంకరించుకొనవలెను. అప్పుడు నీవు వధువుగా సిద్ధమగుచున్నావు. తియ్యగా, మర్యాదగా, ఎస్తేరు తన హృదయమును శుద్ధముగా చేసికొనియున్నది.

79మనము బాహ్య అలంకరణ కొరకు శ్రద్ధవహించుచున్నాము. ఓ, ముడుతలను తొలగించుకొనవలెనను వారు ఎందరో తప్పక యున్నారు, వాటి మీదనే ఎంతో ఎక్కువగా పరిగెత్తు వారున్నారు.

కొంతకాలము క్రితము టెన్నెసీలోని ఒక మ్యూజియంలో నేను నిలబడియున్నాను. ఆ చిన్న స్థలముగుండా నేను దాటి వెళ్ళియున్నాను, ఒక మానవ శరీరము యొక్క విశ్లేషణను అది చూపియున్నది. ఒక మనిషి తనయొక్క బరువులో 150 పౌన్లు తూగుతాడు, అయితే రసాయినాలలో అతని విలువను లెక్కిస్తే, దాని విలువ 84 సెంటు (పైసలు). ఇప్పుడు, నీవు నేను ఒక గొప్ప వ్యక్తిని అనుకొనుచున్నావు, నీవు అనుకొనుటలేదా? 84 పైసలు విలువ గలవాడా? మరియు పెంతికొస్తు స్త్రీలైన కొందరు, 500 డాలర్ల విలువైన ఒక జంతువు యొక్క ఉన్నితో తయారు చేయబడిన మెత్తని గోధుమ రంగు సూటును ధరించి మరియు తన తలను పైకి నిటారుగా బిగదీస్తుంది, ఒకవేళ వర్షము పడినట్లైతే, అది వారిని ముంచివేస్తుంది, వారు 84 పైసలు విలువచేయ్యరు, రసాయనములలో (అది నిజము). అది సత్యమై యున్నది, ఒక తమాషా కాదు. అది సత్యమైయున్నది. 84 పైసల విలువైన శరీరము: ఒక చిన్న కోళ్ళగూడుకు సున్నము వేయుటకు అది సరిపోదు, కొంచెము కాల్షియం తదితరమైనది. 84 పైసలు విలువ గలది. మీరు దానిని చాలా దగ్గరగా గమనించండి.

నీవు ఒక ఆహారశాలకు వెళ్ళి నీవు భుజించు ఒక చారు గిన్నెలో సాలెపురుగును నీవు కనుగొన్నట్లైతే, నీవు ఆ ఆహారశాల మీద కేసు పెడతావు. అయితే దయ్యము పాత మురికి టెలివిజన్లను నీలో దూర్చుచున్నప్పుడు, మరియు పేకాట కార్డులను అలాంటి వాటిని నీ మెడమీద వేస్తున్నప్పుడు, నీవు దానిని మ్రింగుచున్నావు, అసభ్యకరమైన దుస్తులను నీ మీద ధరింపచేయుచున్నది, ఈ స్త్రీలు ఈ చిన్న పాత, చర్మమునకు అతుకుకొను ఉల్లిపొరవంటి వస్త్రములను ధరించుకొని, ఆ రీతిగా వీధులలో నడుచుచున్నారు.

MATT 5:28

 

80నా సహోదరీ, నీకు తెలుసా, (నేను తమాషాగా మాట్లాడుట లేదు. నీవు నన్ను తప్పుగా అనుకోవద్దు.) వినండి. నేను దీనిని చెప్పుచున్నాను: మీరు ఆ విధముగా ప్రవర్తించినట్లైతే, తీర్పు దినమున, నీవు ఒక వ్యభిచారిణిగా లెక్కించబడతావు. నిజము. యేసు చెప్పెను, "ఒక స్త్రీని, మోహపుచూపుతో చూచువాడు అప్పుడే తన హృదయములో వ్యభిచారము చేసినవాడగును." మరియు ఆ పాపి వ్యభిచారము చేసినందుకు లెక్క చెప్పవలసియున్నట్లైతే, దానికి కారణము ఎవరు? నీవే. నీవే దానికి కారణము? నీవే. అది నిజము. లోకము ముందు లోకస్తుల ముందు, పురుషుల ముందు నీవు ఆ రీతిగా నిన్నునీవు చూపించుకొన్నట్లైతే…

నేను ఒకసారి అది చెప్పినప్పుడు, లూయిస్విల్లోని - కెంటక్కీలో ఒక స్త్రీ నాతో అన్నది "సరే, మిస్టర్. బ్రెన్హాం, ఇక్కడ విను, ఇప్పుడే దీనిని గ్రహించాలని నేను కోరుచున్నాను."

నేనన్నాను, "సరే, అమ్మా."

ఆమె అన్నది, "ఆ రకమైన బట్టలనే వారు తయారు చేస్తున్నారు."

నేనన్నాను, "వారు కుట్టు మిషన్లు మరియు దాని తదితర వస్తువులను అమ్ముచున్నారు." దానికి కారణము అది నీకు ఇష్టము. నీలో అక్కడ ఏదో తప్పుయున్నది.

అది ఖచ్చితముగా సత్యము. అది ఒక ఫ్యాషన్ యై యున్నందువలన నీవు దానిని చేయుట లేదు, నీవు దానిని కలిగియున్నందున దానిని చేయుట లేదు; నీకు అది ఇష్టము కాబట్టి నీవు దానిని చేయుచున్నావు.

81నీవు పొగత్రాగుచున్నావు కారణము అది నీకు ఇష్టము. నీవు దానిని చేయవలసిన పని లేదు. నేను ఎన్నడైన చూచిన అతి హీనమైన దృశ్యమేమనగా, ఒక స్త్రీ వీధిలో, ప్రతిఒక్కరిని మీరు చూచినట్లుగా, వారి చేతివ్రేళ్ళలో సిగరెట్లు పెట్టుకొని త్రాగుచూ వెళ్ళుటయే. ఎందుచేత, అది ఒక అవమానమై యున్నది. వైద్యులు మరియు మెడికల్ సైన్సువారు అది పూర్తిగా కాన్సర్తో నిండియున్నదని చెప్పుచున్నదని చెప్పుచున్నప్పుడు, మన దేశములో మనము కలిగియున్న అతిపెద్ద అయిదవ పత్రికా రచయితల ఉద్యమమై యున్నది. మరియు ఎల్లప్పుడు తిన్నగా, సమయమంతా దానిని వారిలోనికి పీల్చుచున్నారు.

… చూడండి, ఒక క్రైస్తవురాలుగా యుండవలసిన ఒక స్త్రీ తన్నుతాను బయట పారజూపుకొని, ఒక స్నానము చేయు జుబ్బాను ధరించి, స్త్రీలు మరియు పురుషులు చేయు కలగలుపు స్నానములో, అక్కడ ఒడ్డున పారజూపుకొని యున్నది. నాకు ఇద్దరు బాలికలు యున్నారు. వారు దానిని చేస్తారని నేను చెప్పను. ఒక సూర్యరశ్మిని తమ శరీరమునకు తగులునట్లు చేయుచున్నామని వారు చెప్పుచున్నారు. నేను జీవించియన్నట్లైతే, వారు కుమారుని సానబెట్టు వేడిని వారు చూస్తారు. అది ఈ కుమారునిడిగా…. అంత పొడువాటి కట్టెతో శ్రీ బ్రెన్హాం యొక్క సరిచేయుట. అది తప్పు అని నేను నమ్ముతాను.

82తరువాత మనలను మనము… "పెంతికొస్తు సంఘము యొక్క ఒక సభ్యుడిగా మనలను మనము పిలచుకొనుచున్నాము." ఓ, మీకు సిగ్గుచేటు! నిజము. పెంతికొస్తు సంఘమునకు ఒక శుభ్రపరచుట, వెనుక నుండి ముందువరకు, మిద్దెల నుండి బేస్మెంట్ (అడుగున) వరకు ప్రతి అడుగు గది గుండా అవసరమైయున్నది. అది సత్యము. మరియు ఇంకనూ, వాటి అన్నిటిలో అది, మనము శ్రేష్టమైన దానిని కలిగియున్నాము. అయితే అది…

జోన్-ఆఫ్-ఆర్క్ కాలములో, ఫ్రాన్సు దేశమునకు ఒక విప్లవము అవసరమైయున్నట్లు, అప్పుడు వారు వ్యతిరేకించుచున్న కొన్ని కార్యములను తిరిగి ప్రతిఘటించి విప్లవము లేచి వాటిని చక్కగా తిన్నగా చేయుట వారికి అవసరమైయుండెను. మరియు పెంతికొస్తు సంఘమునకు ఒక విప్లవము అవసరమైయున్నది. సత్యము. (నిశ్చయముగా అది చేస్తుంది.), తప్పైన వాటిని వ్యతిరేకించి, సరియైన వాటిని అంగీకరించు విప్లవము. ఆమేన్. ఒక తాజా పరిశుద్ధాత్మ బాప్తిస్మము, ఒక సంఘము తన్నుతాను సిద్ధపర్చు కొనవలసి యున్నది.

ACTS 15:14•

EPH 5:26

 

83గుర్తుంచుకొనండి, అది ఎన్నడూ. "సరే, ఇప్పుడు, నేను దీనికి చెందియున్నాను, చెందియున్నాను. నేను ఫోర్స్ స్క్వేర్ కు చెందియున్నాను, లేక చర్చ్-ఆఫ్-గాడ్ కి చెందియున్నాను, లేక యేసు నామమునకు చెందియున్నాను," లేక వాటిలో మిగిలిన దేనికో చెందియున్నానని, నీవు చెప్పలేవు. లేదు! వాటిలో దేనిలోనికి నీవు వెళ్ళలేవు. "దేవుడు నిన్ను ఒక వ్యక్తిగా పిలుచుచున్నాడు. మరియు అది నీవే, నిన్నునీవు శుద్ధిచేసి కొనవలసియున్నది, కారణము, "ఆయన తన నామము కొరకు ఒక అన్యులను తీసుకొనుచున్నాడు, ఆయన వధువు, అన్యురాలు.

ఎస్తేరు తన్నుతాను శుద్ధిచేసికొనియున్నది. ఆమె తన హృదయమును శుద్ధిచేసికొని యున్నది. అదే ఆమె శుద్ధిచేసికొన్నది. సంఘమునకు అవసరమైనది అదియే, హృదయమును శుద్ధిచేయుట. "బ్రెన్హాం సోదరుడా, నీ హృదయమును ఎలా శుద్ధిచేసికొంటావు?" వాక్యజలముల ద్వారా కడుగబడుట వలన, యేసుక్రీస్తు రక్తము ద్వారా.

84స్త్రీలు ఆ విధముగా ప్రవర్తించుట తప్పు, మరియు పురుషులు వారిని అలా ప్రవర్తించుటకు అనుమతించుటకు తప్పు, అని బైబిల్ చెప్పియున్నది. అది మీరిద్దరై యున్నారు. ఒక పురుషుడు తన స్త్రీని ఆ విధముగా వీధులలో దిగంబరముగా తిరుగనిచ్చినట్లైతే , కనీసము ఒక మనిషిగా నాకు అతని పట్ల కొంచెమే గౌరవమున్నది. అతడు ఒక కీలుబొమ్మ. అది సత్యము. ఆమె అతనిని ఒక మసిబట్టగా వాడుకొనుచున్నది. మీకు సిగ్గుచేటు! మీరు తప్పక పురుషులై యుండాలి.

ఒక సంఘకాపరి అతని సంఘమున అలాంటి కార్యములతో వెళ్ళనిచ్చినట్లైతే, వేదిక మీద నుండి దానిలోని తారును బ్రద్దలు చేయక పోయినట్లైతే, అతడు ఒక ఆడవాడై యున్నాడు. మనకు అవసరమైనది ఏమనగా, రబ్బరు తొడుగులు ధరించుకొనువారు కాదు, కాని దేవుని యొక్క శక్తితో, పరిశుద్దాత్మ యొక్క ప్రదర్శనతో, వాక్యముతో యున్న మనుష్యులు మనకు అవసరము. బైబిలు ఈ కార్యములు తప్పు అని చెప్పుచున్నది. ప్రజలు అలా చేయుట మరియు అలా ప్రవర్తించుట తప్పు అయియున్నది. అది ప్రతిచోట తప్పక బోధించబడాలి, జీవించాలి. లేక సంఘమునకు ఒక శుభ్రము చేయుట, కల్మషమును తొలగించుట అవసరమై యున్నది.

2COR 5:17•

EPH 5:26

 

85దేవుని ముందు తన హృదయమును కడుగుకొన్నది, ఆమె సాత్వకమైన దీనమైన ఆత్మతో నడిచి వెళ్ళినది, అది క్రీస్తు యొక్క వధువుగా వుండబోవు సంఘము. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఎస్తేరు లోకసంబంధమైన అలంకరణను త్రోసివేసినది. రాజు ముందుకు వెళ్ళుటకు, ఆమె తన లోనికి దేవుని ఆత్మను తీసుకొన్నది.

మరియు ఈ దినమున ఉన్న స్త్రీ ఈ దినమున ఉన్న సంఘము ఆమె ఎక్కువ మంది సభ్యులను కలిగియున్న శ్రేష్టమైన బట్టలను ధరించిన సంఘమును కలిగియున్నందువలన, ఆమె అతిపెద్ద శాఖను కలిగియున్నందువల్ల, పట్టణములో అతిపెద్ద సంఘము కలిగి యుండటం వల్ల మరియు అలాంటి వాటిని బట్టి ఆమె, నేను లోనికి వెళ్ళగలను అని తలంచుచున్నది. నీవు దాని మీద ఆధారపడియున్నటైతే, దానిని 10 లక్షల మైళ్ళ దూరంలో నీవు తప్పిపోతావు.

దేవుని వాక్యము పట్ల అది ఒక తియ్యని, దయగల మర్యాద గల ఆత్మయై యున్నది, "వాక్యజలముల ద్వారా శుద్ధిచేయబడినది." మరియు నీలోనున్న వాక్యం అదే ఒక కడుగటై ఉన్నది. ఆమేన్. ఒక శుభ్రము చేయుట, సంపూర్ణ సువార్త ద్వారా సంఘమునకు అవసరమైయున్నది. అది సత్యము. పాక్షికముగా కడగబడుట కాదు, అయితే సంపూర్ణ సువార్తతో కడగబడుట, శుభ్రము చేయబడుట, "క్రీస్తు యేసులో నూతన జీవులుగా మార్చబడుట."

EPH 5:27

 

86యేసు యొక్క వధువు ఒక మురికి వధువు కాదు. ఆయన ఒక మురికి వధువును తనకొరకు తీసుకొనడు. ఒక స్త్రీ వివాహము కొరకు వచ్చినట్లైతే, మరియు ఆమె ఆ బయటనున్న పందుల దొడ్లో నుండి వచ్చిన దానివలె ఆమె కనబడినట్లైతే, ఏ మాత్రమైనా తనకు హోదా ఉన్న ఒక మనిషి ఆమెను వివాహమాడడు. అతడు ఆమెను శుభ్రము చేస్తాడు. క్రీస్తు యొక్క సంఘము వివాహమునకు వచ్చినప్పుడు, ఆమె వధువుగా ఉండబోవుచున్నదని తలంచినప్పుడు, లోకమునంతయు ఆమె తన మీద అతికించుకొనునా… క్రీస్తు యొక్క వధువు ఆ విధముగా ఉండలేదు. లేదండి. (నేను తప్పక త్వరపడాలి.)

ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘము క్రీస్తు యొక్క సంఘము అది మురికి గుడ్డల సంఘము కాదు లేక సంఘశాఖల యొక్క అరిగిపోయిన మురికి గుడ్డలతో కాదు. ఏదో ఒక గొప్ప సంఘశాఖలో ఆమె ఒక సభ్యురాలిగా యుండవలసిన పనిలేదు, ఆమె రక్తములో కడుగబడవలసియున్నది. రక్తముతో కొనబడినది. మేము అతిపెద్ద సంఘమునకు చెందినవారము, అతిపెద్ద సంస్థకు చెందినవారము, ఇది, అది, లేక మరొక దానికి చెందినవారమని చెప్పుట కాదు. ఆమె రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మచ్చలేక ముడతలేనిదిగా, శుద్ధముగా, శుద్ధి చేయబడి, పరిశుద్ధముగా ఆమె యుండవలసియున్నది.

ISA 3:16

 

87ఎస్తేరు వలె, హృదయములో మరుగుచేయబడియున్న మనిషి మానవ హృదయములో నున్న అదే దేవుని యొక్క ఆత్మ సాత్వికము, మృదుత్వము, లోకము యొక్క దండము మరియు లోకము యొక్క శ్రేణి కాదు.

నేను ఎల్లప్పుడు చెప్పియున్నట్లుగా, లోకము ప్రకాశిస్తుంది, అయితే సువార్త మండుతుంది. ఓ, అది 10 లక్షల మైళ్ళ దూరములో యున్నది. హాలివుడ్ ప్రకాశిస్తుంది: ఆయితే క్రీస్తు యొక్క సంఘము మృదువుగా, తియ్యగా, దయగా, ప్రేమగా మండుతుంది. అది సత్యము.

లోకసంబంధమైన అధునాతన వస్త్రధారణతో ఎస్తేరు తన్నుతాను అలంకరించుకొనుటకు ఇష్టపడలేదు. అది రాజు యొక్క భార్యగా యుండునట్లు కనబడదు. మనము, లోకములోని వారివలె యుండగోరినట్లైతే, మరియు అది ఒక పరిశుద్ధుడైన మనిషి యొక్క భార్యవలె కనబడుతుందా? మనము, సజీవ దేవుని యొక్క సంఘమువలె, మనలను మనము లోకములోని వస్తువులతో అలంకరించుకొన్నట్లైతే, అప్పుడు అది ఒక పరిశుద్ధుని యొక్క భార్యవలె కనబడుతుందా? అని సహజముగా కనబడుతుందా?

ఈ దినమున మీరు ఒక మనిషిని తీసుకొనండి, అతడు తప్పక పరిశుద్ధమైన మనిషిగా యుండవలసియున్నది, ఇక్కడ అతని భార్య దేశములోని ప్రథమ-మహిళవలె వస్తుంది, ఆమె తన జుట్టును ఒక పెద్దగొప్ప అలంకరణగా ముడివేసికొని యున్నది, ఒకవైపు ఎర్రని రంగు పులుముకొన్నది, మరొకవైపు పచ్చని రంగు పులుముకొన్నది, మరియు - తన నోటికి రంగులు వేయు బ్రష్ తో కొట్టుకొనియున్నట్లుగా కనబడుచున్నది. మరియు అలాంటి వాటన్నిటితో చర్మము కనబడునట్లుగా బిగుతైన బట్టలతో, వీధులగుండా వారు నడుచుచున్నారు. మరియు ఎతైన మడిమెలు గల చెప్పులతో, వీధుల వెంబడి తమ్మునుతాము ఊపుకొంటూ, కులుకు నడకలతో వెళ్ళుచున్నారు. "అది ఒక పరిశుద్ధమైన మనిషి యొక్క భార్య," అని మీరంటరా? (నేను తమాషాలు చెప్పుటలేదు. నేను కేవలము ప్రకటనలు చేయుచున్నాను.)

88ఈ మధ్యనే ఇక్కడ మన గొప్ప పెంతెకొస్తు ఉద్యమములలో ఒకదానియొద్దకు నేను వచ్చాను. ఒక పెద్ద గుడారము నా కొరకు వేయబడినది.

మరియు ఆ సంఘకాపరి నాతో ఇలా అన్నాడు, "ఇక్కడ ఆర్గాన్ వాయించునది నా భార్యయై యున్నది."

"సోదరుడా, అది మంచిది," అని నేనన్నాను.

"ఆమె వాయించుట మీకు అభ్యంతరము లేదు కదా?"

నేనన్నాను, "లేదు, లేదండి. నిశ్చయంగా నాకభ్యంతరం లేదు."

అతడు మేనేజరు యొద్దకు వెళ్ళాడు, మేనేజరైన సోదరుడు బాక్స్టర్ ఇలా అన్నాడు, "అది పరవాలేదు."

అతడన్నాడు, "బ్రెన్హాం సోదరుడా, ఇక్కడకు రండి. మీరు నా భార్యను పరిచయం చేసుకోవాలని నేను కోరుచున్నాను."

మరియు నేనక్కడకు వెళ్ళియున్నాను. (మీరు నన్ను మన్నించండి. చూడండి, నేను ఒక విషయమను మీకు ఎత్తి చూపించుటకు ప్రయత్నించుటలేదు; నేను ఒక వివరణ ఇచ్చుటకు ప్రయత్నిస్తున్నాను, చూడండి.) మరియు ఆ స్త్రీ ఇక్కడ యున్నవారిలో ఒకరివలె ఆమె గోళ్ళకు రంగులు పులుముకొనియున్నది, లేదా, నాకు తెలియదు, దానిని మీరు ఏమంటారో మీకు తెలుసు, అంతా చక్కగా అమర్చుకొని యున్నది, మరియు ఇలాంటి దృశ్యమును నా జీవితమంతటిలో నేను ఎన్నడూ చూసియుండలేదు. మరియు ఆమె ధరించిన బట్టలు ఎంతో మునిగిపోయినట్లున్నవి, దాని వెనుక గుండీలు లేవు, మరియు కనీసము దానికి అడుగు భాగము లేదు. మరియు నేను నా జీవితమంతటిలో అలాటి దృశ్యమును నేనెన్నడూ చూచియుండలేదు. మరియు ఆమె ఎంతో క్రిందుగా వ్రేలాడుచున్న పెద్ద చెవిపోగులను ధరించియున్నది. ఇంకా ఎన్నో ఆమె పై యున్నవి.

నేను చుట్టూ చూసియున్నాను. నేను ఇలా తలంచాను, "ఓ నేను! నేనొక బాప్తిస్టును, దానికంటె ఎక్కువ బాగా నాకు తెలుసు." నేను మరలా చూశాను. నేనన్నాను… ఇప్పుడు దయచేసి, ఇది ఒక తమాషా కాదు. అయితే నేను దాన్ని ఆ సోదరునికి చెప్పవలసి యున్నది, అది అతనికి సహాయపడుతుందని నా నమ్మకం, భిన్నంగ యుండుటకు నేను దాన్ని చెప్పుట లేదు — నేను అలా చేసినట్లైతే, నేనొక వేషధారినౌతాను, చూడండి, నాకై నేనుగా శుద్ధి చేసుకొవలసియున్నది.

నేనన్నాను, "అయ్యా, నీ భార్య ఒక పరిశుద్ధురాలని నీవు చెప్పలేదా?"

అతడన్నాడు, "ఓ, అవును."

నేనన్నాను, "ఆమె నాకొక దెయ్యంలాగా కనబడుచున్నది." నేను అన్నాను, "నేను ఒక సేవకుని భార్యగా, అలాంటి దృశ్యమును నేను నా జీవితమంతటిలో నేనెన్నడూ చూడలేదు. అది ఒక పరిశుద్ధమైన వ్యక్తి యొక్క భార్యగా నాకు కనబడుటలేదు."

89అలాగుననే సజీవుడైన దేవుని యొక్క సంఘము కూడా ఆమె యొక్క ఫ్యాషన్లపై, ఆమె యొక్క టీ-పార్టీలపై, బంకో పార్టీలపై, పేకాటలపై, డాన్స్ పై, సామాజికమైన వాటిపై ఆధారపడరాదు. పరిశుద్ధుడైన దేవుని యొక్క వధువువలె కనబడుచూ, లోకముతో తన్నుతాను ఆ విధంగా అలంకరించుకొనరాదు. ఆమె సిగరెట్టు త్రాగుచూ, డాన్సులు వేయుచూ, పార్టీలకు వెళ్ళుచూ, రాత్రి విందులకు వెళ్ళుచూ, వెట్టి కలిగించే మత్తుపానీయాలు సేవిస్తూ, అలాంటి కార్యములన్నియు చేస్తూ, వారి౦కనూ క్రీస్తు యొక్క వధువని చెప్పగలరా?

ఒక పరిశుద్ధుడైన వ్యక్తి యొక్క భార్యగా ఆమె నాకు కనబడుటలేదు. లేదండి. అలాంటి దానిని ఆయన ఎన్నుకొనడు. సరియైన స్థితిలో ఉన్న స్త్రీని, ఆయన దేనికి ప్రాతినిధ్యం వహించుచున్నాడో, దానిని చేయుటకు ప్రయత్నించునట్లుగా కనబడు స్త్రీ ఆయన తీసుకుంటాడు, అది సత్యమని నేను నమ్ముతాను. అది కొంచెం మిమ్ములను గాయపర్చవచ్చు.

90దక్షిణాది ప్రాంతపువాసియగు నా తల్లి గతించిపోయినది. నేను చిన్న బాలుడుగా ఉన్నప్పుడు మాకు కొన్ని ఉండేవి. కనీసం మేము భుజించుటకు మాకు ఏమియు ఉండేవి కావు, మేము జొన్న రొట్టెను, నల్లటి కన్నులవలె పెద్ద చిక్కుడు గింజలను కలిగియుండేవారము, అవి ఏలా ఉంటాయో ఆ సంగతి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. కాబట్టి మాకు లేవు… సంవత్సరమంతటి గుండా వాడుటకు ఇంటర్లో వంటనూనె ఉండేది కాదు, మేము దరిదాపుగా ఒక పెద్ద పాత పెనము తీసుకొని మాంసపు చర్మములను ఉడకబెట్టేవారము. కబేళాలలో మాంసమును కోసే వారి యొద్ద మాంసమును కోసి మాకు ఆ చర్మములను ఇచ్చేవారు, మరియు మేము దానిని ఉడకబెట్టి దానినుండి క్రొవ్వు నూనెను తీసి దానిమీద పోసెడివారము.

ప్రతి శనివారం రాత్రి మా తల్లి మాకు అముదమును త్రాగించేది, మరియు నేను కనీసము ఇప్పటివరకు దాన్ని తట్టుకొనలేదు. దాన్ని నేను తీసుకొనవలసి వచ్చేది.

నా ముక్కును ఈ రీతిగా పైకెత్తి పట్టుకొని వచ్చేవాడిని.

"నా తల్లియొద్దకు వచ్చి, అమ్మా నేను దాన్నితట్టుకొనలేను," అని చెప్పేవాడిని. "అది నన్ను రోగిగా చేస్తుంది" అని చెప్పేవాడను.

ఆమె ఇలా అనేది, "అది నిన్ను రోగిగా చేయనియెడల, అది నీకే మేలు చేయనట్లే."

REV 19:7

 

91కాబట్టి సువార్త ప్రకటన కూడా ఆ మార్గంలోనే యున్నది, అది నిన్ను కొంచెం ఒత్తిడితో కుదుపనియెడల, నిన్ను పంపని యెడల నీ ఆత్మసంబంధమైన జీర్ణకోశములు సరిగ్గా ప్రారంభంకావు, అది నిన్ను రోగిగా చేయనియెడల నిన్నునీవు బైబిల్ తో పరీక్షించుకొననియెడల; చూడండి ఆ పాత కోపము, స్వార్థం, భక్తిహీనత, లోకసంబంధమైన ప్రేమ, టెలివిజన్, మరియు రాత్రి కార్యకలాపాలు… మరియు సంఘమును ఖాళీగా వదలడం, మరియు బల్లలన్నియు ఖాళీగా ఉండడం, ఎందుచేత నీవు తప్పక యేసువలె ఉండవలసియున్నది, (ఆయన ఆత్మ నీలో కలిగియున్నావు), ఆ దేశంలోని ప్రతి ఒక్కరు నీ ఆలయమునకు వచ్చి క్రీస్తును స్వీకరించునట్లుగా నీవు ప్రయత్నం చేయవలసియున్నది. మరియు అప్పుడే, క్రీస్తు యొక్క వధువుగా మనం పిలువబడతాము.

ఓ, స్నేహితుడా, ఎలాంటి దయనీయమైన స్థితి. ఆ ఘడియ వచ్చియున్నది. ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది. ఓ, ఆమె తన్నుతాను సిద్ధపర్చుకొనియున్నది. ఈ కార్యములన్నిటిని ఆమె ఒక ప్రక్కకు పెట్టియున్నది.

గుర్తుంచుకోండి, ఎస్తేరు ఎన్నుకొనబడియున్నది, ఇతరులు తిరస్కరించబడియున్నారు. తిరిగి జన్మించినవారు మాత్రమే, దేవుని యొక్క ఆత్మ కలిగినవారు మాత్రమే, ఆ దినమున ఎన్నుకొనబడతారు. మహిమ కిరీటం ఆమె పై ఉంచబడుతుంది. మిగిలినవారు తిరస్కరించబడతారు.

92సంభవించియున్న ఒక చిన్న సంఘటనను గూర్చి నన్ను మీకు చెప్పనివ్వండి, నేను మీకు తెలిసినట్లుగా నేనొక మిషనరీనై యున్నాను. మిషనరీ పనిచేస్తూ సువార్త ప్రకటిస్తూ ప్రపంచమంతా దరిదాపు ఇప్పటికి ఏడు సార్లు తిరిగియున్నాను. ఈ మధ్యనే ఇక్కడ రోమ్ పట్టణంలో… రోమ్ ఒక కళావైభవము కలిగిన గొప్ప పట్టణము, మరియు వారక్కడ ఒక కళాపాఠశాలను కలిగియున్నారు, అమెరికా వారగు మనవారు అనేకమంది యవ్వనస్తులు ప్రతి సంవత్సరం అక్కడకు వెళ్తారు. చిత్రములను గీయుటకు, కళా తర్ఫీదును పొందుటకుగాను ఒకటి లేదా రెండు సంవత్సరములు వారు అక్కడ ఉంటారు. కొన్ని సంవత్సరముల క్రితం ఇక్కడకు వచ్చిన కొందరు ఒక గుంపు అమెరికా యవ్వనస్తులు ఒక కథను నాకు చెప్పారు, వారక్కడకు వెళ్ళినప్పుడు వారు కేవలం నియంత్రణ లేనివారివలె అక్కడకు వెళ్తారు. వారు రోమ్ లో ఉన్నప్పుడు, వారు రోమన్ వారు చేసినట్లు చేయవలసియున్నది, అయితే వీళ్ళు త్రాగి ఆ బాలురు మరియు బాలికలు ఒకరి మీదకొకరు తూలుకుంటూ, తమ బట్టలు చింపుకొని సమస్తమును చేయుచున్నారు.

93అక్కడ ఒక నిర్ణీతమైన పాఠశాలయున్నది. ఆ పాఠశాలకు ఈ అమెరికా యవ్వనస్తుల గుంపు వెళ్ళియున్నారు. వారిలో ప్రతి ఒక్కరు దరిదాపుగా అదే కార్యమును చేసియున్నారు. అయితే ఒక ప్రత్యేకమైన బాలిక దానినెంత మాత్రము సహించలేకపోయినది. ఆమె లోపలే ఉండి పోయినది. రాత్రివేళలో వారందరూ బయట త్రాగుచుండగా, ఆమె లోపలే చదువుకుంటూ ఉండేది. పగటివేళ, ఆమె చదువుకుని పనిచేస్తూ ఉండేది. అయితే పూర్తి పాఠశాలలో వారందరికి ఆమె వెక్కిరింతల పాలుగా ఉన్నది. ఆమె తన్నుతాను ఒక స్త్రీగా ఒక మర్యాదగల స్త్రీగా ఆమె ప్రవర్తించినది. వారందరూ యవ్వనస్తులై యున్నప్పటికీ, రోమన్ కుర్రవాళ్ళు ఆమె చుట్టూ ఉండి ఆమెను బయటకు తీసుకెళ్ళుటకు ప్రయత్నించినప్పటికి, ఆమె దాన్ని తిరస్కరించినది. లేదండి. తిన్నగా ఆమె తన పాఠములతో బొమ్మలు గీస్తూ పెయింటింగ్స్ చేస్తూ లోపలనే ఉండిపోయినది. ఆమె వాటితోనే నిలిచిపోయినది.

94చివరిగా, ఆ గృహమును కాయు వృద్ధుడైన వ్యక్తి ఆమెను గమనించుచుండెను, ఆమె అందరికంటే ఎంతో తేడాగా ఉండుటను అతడు చూచుచుండెను. అతడు ఒక రోమన్ కాథలిక్ అయినప్పటికీ, ఆమె ఎలా ప్రవర్తిస్తున్నదో, ఆమెను గమనించుచుండెను. ఒక సాయంకాలపు వేళ ఈ యవ్వన బాలిక ఆ స్టూడియో ఉన్న స్థలములో… ఆ పార్కులో అక్కడ వుండియున్నది, లేక ఆ పాఠశాల ఉన్న స్థలములో ఉండియున్నది, ఎందుకు, ఆమె ఆ ఆవరణం పైకి నడుచుకుంటూ ఆ కొండ శిఖరం పైకి నడిచి వెళ్ళినది, మరియు సూర్యుడు అస్తమించుచుండెను, ఆమె తన చక్కని శుభ్రమైన ముఖముతో ఆమె పొడవైన వెంట్రుకలు వ్రేలాడుచుండగా, అక్కడ నిలబడి సూర్యుడు అస్తమించుటను గమనించుచుండెను.

95ఈ వృద్దుడైన ఆ గృహమును కాయువాడు దంతెతో అతడు నేలను చదును చేయుచున్నాడు, అతడు నేలను చదును చేయుచూ ఆ బాలికను గమనించుచుండెను. "వెళ్ళి ఆమెతో మాట్లాడుము" అది ఏదో అతనితో తిరిగి తిరిగి చెప్పుచుండెను. అతడు తన దంతెను క్రింద వదిలి పెట్టి తన పాత వంగిపోయిన టోపీని తీసుకుని ఈ యవ్వన బాలిక ఉన్న స్థలానికి పైకి నడిచి వెళ్ళెను. అతడు తన గొంతును సరి చేసుకున్నాడు. ఆమె వెనుకకు తిరిగినది.

అతడన్నాడు, "మిస్ నన్ను మన్ని౦చండి."

ఆమె అన్నది, "నిశ్చయముగా, అవునండి."

ఆమె ఏడుస్తూ యుండియున్నది, అతడు గమనించుచుండెను. మిగిలినవారందరూ ఆ రాత్రి కొరకు త్రాగి తండనాలాడుతూ బయట ఉన్నారు. అతడన్నాడు, "మేడమ్, నేను సరైన విధముగా నీతో మాట్లాడబోవుచున్నానని మరియు నీవు నన్ను అర్థం చేసుకుంటావని నేను నమ్ముచున్నాను." అతడన్నాడు, "రెండు సంవత్సరములకు పైగా నీవు ఇక్కడ ఉండియున్నావు. నీతో వచ్చిన గుంపును నేను గమనించియున్నాను, వారు ఎల్లప్పుడు ఎడతెగకుండా బయట పార్టీలకు వెళ్ళి రాత్రివేళలో లోనికి వస్తూ, బాగా తప్ప త్రాగి, సగము బట్టలు వారి మీద లేకుండా సమస్తమూ చేస్తూ వస్తున్నారు. అయితే నేను నిన్ను గమనించియున్నాను, నీవు అలాంటి పార్టీలకు హాజరగుట లేదు." మరియు అన్నాడు, "నేను దానిని గమనించియున్నాను. నీవు అలాంటి పార్టీలకు హాజరగుట లేదు."

మరియు అన్నాడు, "నేను దానిని గమనించియున్నాను. నీవు ఎల్లవేళలా సముద్రము ఇవతల నుండి అవతలకు చూస్తూ యున్నట్లుగా కనబడుచున్నది. సాయంకాలపు వేళ, నీవు ఇక్కడకు నడిచి వచ్చి మరియు ప్రతి సాయంకాలము ఇక్కడ నిలబడి సూర్యుడు అస్తమించుటను గమనిస్తున్నావు." మరియు అతడన్నాడు, "ఏమిటి, దానికి కారణమేమిటి"? అన్నాడు, "నేను ఒక వృద్ధుడను, మరియు నేను నీకు మరియు ఇతరులకు మధ్యలో వున్న బేధమునకు కారణము ఏమిటో నేను తెలుసుకొనగోరుచున్నాను."

96ఆమె అన్నది, "అవునయ్యా." ఆమె అన్నది, "అయ్యా, సూర్యుడు అస్తమిస్తూయుండగా, నేను నా గృహము వైపు చూచుచున్నాను." ఆమె అన్నది, "దాని వెంబడి, సూర్యునికి ఆవల నా జన్మస్థలమున్నది." మరియు ఆమె అన్నది, "ఆ దేశములో ఒక రాష్ట్రమున్నది. మరియు ఆ రాష్ట్రములో ఒక పట్టణమున్నది. మరియు ఆ పట్టణములో ఒక గృహమున్నది. మరియు ఆ గృహములో ఒక కుర్రవాడున్నాడు." అన్నది,

"అతడు కూడా ఒక చిత్రకారుడై యున్నాడు. నేను ఇక్కడికి వచ్చుటకు, ఆ స్థలమును విడిచిపెట్టినప్పుడు, నా ప్రేమను అతనికి వాగ్ధానము చేశాను. మేము ఒకరికొకరము ప్రధానము చేయబడ్డాము." మరియు ఆమె అన్నది, "ఇతరులు ఏమి చేసినప్పటికి నాకు లెక్క కాదు, అది నాతో చేయునది ఏదియూ లేదు." ఆమె అన్నది, "నేను నమ్మకముగా మరియు యదార్థముగా జీవిస్తానని నేను ఆయనకు వాగ్ధానము చేసియున్నాను." ఆమె అన్నది, "నేను ఈ దినము కొరకు ఎదురుచూస్తున్నాను. అప్పుడు నేను ఆ పెద్ద రెక్కలు కలిగిన ఆ విమానపు శిఖరమును సృశిస్తాను అది నన్ను సముద్రంగుండా ఆవలకు దాటించి నన్ను విమానాశ్రయములో ఉంచుతుంది. అక్కడ నేను అతనిని కలుసుకొంటాను. అతడు నా కొరకు ఒక గృహమును నిర్మించుచున్నాడు, మరియు ఆ దేశములో మేము ఇద్దరము కలిసి జీవిస్తాము."

మరియు ఆమె అన్నది, "ఆ కారణమున బట్టియే నేను ప్రవర్తించుచున్న మార్గములో నేను నడుచుచున్నాను. ఆ కుర్రవాడు నాకు చేసిన వాగ్ధానము ప్రకారము నేను అతనికి నమ్మకముగా జీవిస్తాను." అన్నది, "అప్పుడప్పుడు ఆయన నుండి నాకు ఉత్తరములు వస్తాయి, మరియు నేను ఆయనకు వ్రాస్తాను." మరియు అన్నది, "మేము ఒకరితో ఒకరము ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకొనుచున్నాము. నేను ఇంకనూ మా ప్రమాణాలను పట్టుకొనియున్నాము. మేము కలుసుకొనబోవు ఆ దినము కొరకు మేము ఎదురుచూస్తున్నాము."

1JN 2:15•

REV 7:14•

REV 19:7

 

97ఓ, లోకకార్యముల నుండి దూరమగుటకు, అది ఒక నిజమైన క్రైస్తవునికి ఏమి చేస్తుంది. మరియు ఒక దినమున పావురపు రెక్కల మీద ఆయన రేవునొద్దకు వస్తాడు! ఆయన ఒక వధువు కొరకు వచ్చుచున్నాడు — లోకముతోను మరియు లోక కార్యములతో వెర్రిది కానిదియగు ఒక వధువు. ఆమె గొర్రెపిల్ల యొక్క రక్తముతో కడుగబడియున్నది. ఆమె ఆయనకు మాత్రమే, ఆమె ప్రేమను ఒప్పందము చేసినది. లోకప్రేమ ఆమెనుండి వెళ్ళిపోయినది మరియు అది ఆమెకు మృతమైపోయినది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, మరియు ఆయన భార్య తన్నుతాను అలంకరించుకొనియున్నది.

98ఒక్క క్షణము మనము తలలను వంచియుండగా, దానిని మనము ఆలోచిద్దాము. ఒక దినమున, నేను కూడా సూర్యాస్తమయమును చూస్తాను… ముప్పై-ఒక్క సంవత్సరముల క్రితము నా ప్రేమనంతా ఆయనకేనని నేను ఒకరికి ప్రమాణము చేసియున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినను, నేను ఆయన కొరకే ఆయన వాక్యము కొరకే నిలబడియున్నాను. ఆ విధముగా, ఇక్కడ అనేకమంది కూర్చొనియున్నవారు నాకు తెలుసు, ఆ పాత సియోను ఓడరేవునొద్దకు వచ్చి, ఎవరికైతే మన ప్రేమను మనము ఒప్పందము చేసి, ఎవరిని ప్రేమించుచున్నామని ప్రతిజ్ఞ చేశామో, ఆయన మన ఆత్మలను పట్టుకొని, ఆయన సన్నిధిలోనికి మనలను తోడుకొనిపోవును.

99ఆ ఒప్పందమును ఆయనతో ఎన్నడూ చేయనివారు కొంతమంది ఈ రాత్రి ఇక్కడ యుండవచ్చును, కొందరు దానిని చేసి విచ్చిన్నము చేసిన వారుండవచ్చును. స్నేహితుడా, నీవు ఈ రాత్రికి ఆ స్థితిలో యున్నట్లైతే, నీవు ఎందుకు తిరిగి వచ్చి, నీ ప్రమాణమును ఆయనతో నూతన పర్చుకొనకూడదు? నీవు దానిని చేయకున్నట్లైతే, నీవు ఈ రాత్రి ఎందుకు వచ్చి దానిని చేయకూడదు? "ప్రభువైన యేసు, నేను నిన్ను ప్రేమించుచున్నాను" అని చెప్పండి.

గుర్తుంచుకోండి, నీవు ఇదివరకే ఆ ప్రమాణము చేసి, మరియు ఇంకనూ లోకముతో కలగలుపుగా యుంటే, అలాంటి వధువును యేసు కలిగియుండడు. నీ ప్రేమ అంతయూ తప్పక ఆయన కొరకై యుండాలి. మరియు నీవు లోకములోని వారిని ప్రేమిస్తున్నట్లైతే, లోకములోని ఫాషన్లను నీవు ప్రేమిస్తున్నట్లైతే, దేవునికంటె ఎక్కువగా, అప్పుడు నిన్నునీవు సిద్ధము చేసికొనియుండలేదు.

100మనము తలలను వంచియుండగా, అలాంటి వ్యక్తి ఈ రాత్రి ఎవరైనా యున్నారా, "సోదరుడా బ్రెన్హాం, నా కొరకు ప్రార్ధించు, అని మీ చేతులను ఎత్తగలరా? నేను ఆ మార్గములో యుండగోరుచున్నాను. నేను వధువులో భాగముగా యుండగోరుచున్నాను. మరియు నేను చేయరాని కార్యములను చేయుచున్నానని నాకు తెలుసు. నా కొరకు ప్రార్థించండి?" నా ఇండియన్ సహోదరీ, ప్రభువు నిన్ను దీవించును. సహోదరీ, ప్రభువు నిన్ను దీవించును. నా సోదరుడా, ప్రభువు నిన్ను దీవించును. సోదరుడా, నీవు. ఇంకా ఎవరైనా యున్నారా? "బ్రెన్హాం సోదరుడా, నా కొరకు ప్రార్ధన చేయండి, నేను సరిగ్గా లేనని నాకు తెలుసు" అన్నవారు మీ చేతిని ఎత్తండి.

ఇప్పుడు, నీకునీవు యదార్ధముగా యుండుము. నీ జీవితమును వెనుకకు చూచుకొనుము. నీవు ముందుకు వెళ్ళుటకు ముందు, నీవు వెనుకకు చూడవలసియున్నది. నీవు ఏమైయుండియున్నావో చూచుకొనుము. నీవు కలిగియున్న ఏ ఆత్మ నిన్ను అట్లు చేసినది చూచుకొనుము. నీకు అది లేనియెడల… నీవు క్రైస్తవుడవని ప్రకటించుకొన్నటైతే, మరియు ఇంకనూ నీవు లోకకార్యములతో కలగలుపుగా యు౦టే, సోదరుడా, సోదరీ, నీవు తప్పు అని చూడలేనప్పుడు, నీవు గ్రుడ్డివాడవు కాక మరి ఏమిటి?

101ఎవరో మొన్నటి దినమున నాతో ఇలా చెప్పియున్నారు, "బ్రెన్హాం సోదరుడా, నీవు ప్రజలను తప్పక ఆ విధముగానే విడిచిపెట్టాలి," అన్నాడు. "ప్రజలు నిన్ను ఒక ప్రవక్త అని పిలచుచున్నారు."

నేనన్నాను, "నేను ఒక ప్రవక్తను కాదు."

అన్నాడు, "ప్రజలు అలా యోచిస్తున్నారు. నీవు తప్పక వారికి ఈ సంగతులను ఉపదేశించాలి. వారు పొడవాటి జుట్టును కలిగియుండాలని మరియు సరియైన బట్టలను ఆ రీతిగా ధరించవలెను అని చెప్పుటకు బదులుగా, నీవు తప్పక వారు ఆత్మసంబంధమైన వరములను ఎలా పొందాలో వారికి చెప్పాలి."

నేనన్నాను, "వారు కనీసము కి౦డర్-గార్డెన్ - అ, ఆ లు నేర్వనప్పుడు, నేను వారికి లెక్కలు ఎలా చెప్పగలను? వారికీ కనీసము తమ్మును తాము శుద్ధిచేసుకొను సహజమైన సభ్యత వారికి లేదు?"

102క్రీస్తు యొక్క వధువుగా పిలవబడుచున్నారు? మీకు కోపమును రేపుటకు నేను అది చెప్పుట లేదు. నేను దానిని దైవిక ప్రేమతో చెప్పుచున్నాను. ఈ ఉదయమున నేను చెప్పియున్నట్లుగా, నీవు నదిలో ఒక పడవలో ప్రయాణము చేస్తూ, నీవు జలపాతములలో నీపడవ మునిగిపోబోవుటను నేను చూచినప్పుడు, నీ పడవ దానిని తట్టుకొనలేదు, అప్పుడు నేను నీ వైపు చూసి కేకలు వేయుచున్నాను, అలా చేయుట ద్వారా నేను నిన్ను గాయపర్చుట లేదు. నేను నిన్ను ప్రేమించుచున్నాను. కారణమేమనగా, నీవు విననియెడల, నీ ప్రాణమును నీవు పోగొట్టుకొంటావు.

మనము ప్రార్థన చేయకమునుపు తమ చేతులను ఎత్తువారు మరొకరు ఎవరైనా యున్నారా? ఆ వెనుక బయట నేను మిమ్మును చూడగలను. దేవుడు నిన్ను దీవించును, మరియు నిన్ను, నిన్ను, నీవు తప్పైయున్నావని నీ జీవితము చూపుటకు నీవు ఎరుగుదువు. నీవు దేవునికంటే ఎక్కువగా ఇంకనూ లోకమును ప్రేమిస్తున్నట్లైతే, అప్పుడు అక్కడ ఏదో తప్పున్నది. నీవైపు చూచుకొనుము. ఆ గదులలో బయటయున్నవారు, "సోదరుడా బ్రెన్హాం, నా కొరకు ప్రార్థన చేయండి," అని చెప్పి మీ చేతులను ఎత్తండి. దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. అది సత్యము. మంచితనమునకు అది యదార్ధత, నేను యదార్థతను మెచ్చుకొంటాను.

ఈ దినమున పెంతికోస్తు సంఘముతో యున్న ఇబ్బంది అదియే. ఇదివరకు మనము కలిగియున్న నిజమైన యదార్థతను ఇప్పుడు మనము కలిగిలేము. మనము తప్పైయున్నామని వచ్చి చెప్పి, దానిని అంగీకరించుటకు మనకు సాహసము లేదు.

PROV 28:13

 

103సంఘము యొక్క బురదలో పోరాడునంతవరకు, దయ్యము సంఘము మీద ఒక విధమైన పట్టును కలిగియున్నది.

దానిని చేయవద్దు. నీవు దేనిని కలిగియున్నావని చెప్పుకొనుచున్నావో, దానిని నీవు కలిగిలేవని, నీ సొంత జీవితమే రుజువు చేయుచున్నది. అలాగైతే ఎందుకు నీవు దానిని ఒప్పుకోవు? "అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును." నీవు దానిని దాయలేవు. దానిని గూర్చి దేవునికి అంతయూ తెలుసు. నీవు సరిగ్గా జీవించుట లేదని, నీవు ఎరిగియున్నటైతే మరియు నీవు దానిని చూచుచున్నట్లయితే, అప్పుడు ఎందుకు నీవు దానిని ఒప్పుకొనవు, మరియు బయటకు వచ్చి ఎందుకు దానిని తేటగా చేసికోవు?

కొందరి పాపములు వారికి ముందుగా వెళ్ళుచున్నవి. మరికొందరివి వారిని వెంబడించుచున్నవి. నావి ముందు వెళ్ళనివ్వండి. ఇప్పుడే నా పాపములన్నిటిని నన్ను చెప్పనివ్వండి. దేవుడు దానిని సరిచేయనివ్వండి. దానినే మనము తప్పక చేయవలసియున్నది.

104దరిదాపుగా ఆరు లేక ఎనిమిది చేతులు అక్కడ పైకెత్తబడియున్నవి. ఇక్కడున్న వంద లేక రెండువందల మంది ఉన్న ఈ చిన్న సంఘంలో ఈ రాత్రి, అంతకంటే ఎక్కువమంది నిశ్చయంగా ఆ ఎనిమిది మంది కంటే ఎక్కువ మంది అక్కడుండి ఉంటారు, లేక బహుశా నూట-యాబై మంది ఇక్కడ ఉండియుండవచ్చును. యవ్వనస్తుడా, దేవుడు నిన్ను దీవించును గాక. ఇప్పుడు, ఓ స్త్రీ ప్రభువు నిన్ను దీవించును గాక. సహోదరీ, ప్రభువు నిన్ను దీవించును గాక. అది నిజము. కుమారుడా ప్రభువు నిన్ను దీవించును గాక. అది మంచిది. [టేపు మీద ఖాళీ ఉన్నది.]

ఆ పెంతకోస్తు స్త్రీలు తమ జుట్టును వారు కత్తిరించుకునేవారు కారు, అయితే ఈ దినమున వారు తమ జుట్టును కత్తిరించుకొనుచున్నారు. ఏమి సంభవించినది, వారు ఇదివరకు ముఖములకు రంగులు వేసేవారు కాదు. నీ యొక్క తల్లి అలా చేసియుండలేదు, అమె ఒక పెంతికొస్తు స్త్రీ యున్నట్లైతే, ఈ దినమున ఏమి సంభవించియున్నది? కారణమేమనగా ఈ దినమున వారు లోకకార్యములలో ఇటు అటు పొర్లాడుచున్నారు. మరియు లోకము మనవైపు చూచుచున్నది. మనము ఒక పరిశుద్ధమైన సంఘమని చెప్పుకొనుచున్నాము. విషయమేమిటి? మనము క్రీస్తు యొక్క వధువువలె కనబడుట లేదు. ఆ బయట ఉన్న పురుషులైన మీరు అలాగునే యున్నారు. సోదరుడా, నీకు సిగ్గుగా లేదా.

105పరలోకపు తండ్రీ, నేను ఈ వైపు నుండి ఆ వైపునకు చూచుచుండగా, మరియు ఆ రీతిగా వేదిక పిలుపును ఇచ్చుచుండగా — గద్దించుచుండగా, వారిని క్రిందికి చీల్చివేయుచుండగా — అది కఠినముగా కనబడుచున్నది! అయితే మనము అంతమును సమీపించుటను నేను యెరిగియుండగా, అది నా లోపల రక్తము కారుచున్నది. ఈ దినములలో ఒక దినమున ఈ చిన్న పడవలు బ్రద్దలవ్వబోవుచున్నవి. మరణం, మరియు పెనుగులాటలు వారిని తాకబోవుచున్నవి. మరియు ఎన్నిసార్లు నేను వారి పక్షముగా పిలువబడి మరియు వారు ఈ రీతిగా చెప్పుట నేను విన్నాను. "ఓ, బ్రెన్హా౦ సోదరుడా, మరల తిరిగి దాన్ని జీవించగలిగినట్లైతే." అలాగైతే, ప్రభువా, వారు దాన్ని సరిచేయుటకు ఇష్టపడుచుండగా, వారికి సహాయం చేయుము…

నేను నా శ్రేష్టమైన రీతిలో ప్రయత్నిస్తున్నాను, దేవా. నేను వారిని గద్దించుటలేదని నేను కేవలం వారికి సహాయపడుటకు మాత్రమే ప్రయత్నం చేయుచున్నాననియు, పరిశుద్ధాత్ముడు దానిని ప్రజలకు బయలుపరచును గాక. అయితే ఆ పాతకాలంలో పౌలు చెప్పినట్లుగా! దేవా వారు గాయపడుట నా ఉద్ధేశ్యం కాదు, అయితే వారు ఎక్కడ తప్పైయున్నారో వారు చూచుకొనునట్లుగా వారు తగినంతగా గాయపర్చబడవలెనని కోరుచున్నాను.

MATT 7:7•

LUKE 11:9•

REV 14:7•

REV 19:7

 

106ఈ రాత్రి తమ చేతులను ఎత్తిన ఈ ప్రజలు తగినంతగా గౌరవములతో దేవుని ముందు వారు తప్పైయున్నారనియు మరియు వారు దాన్ని సరి చేసుకొనుగోరుచున్నారనియు ఈ రాత్రి దాన్ని వారికి దయచేయమని ప్రార్ధన చేయుచున్నాను. "వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును." అయితే నీవెన్నడూ తట్టనియెడల అది నీకెలా తెరవబడుంది? నీవు ఎన్నడు వెదకని యెడల నీవు దాన్నెలా కనుగొనబోవుచున్నావు?

ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఒక సంపూర్ణమైన రీతిలో ఈ ప్రజలను, దేవా నీ స్వాధీనమునకు తెచ్చును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ గొప్ప తండ్రి వారి ఆత్మ శరీరము, ప్రాణములను శుద్ధిచేసి వారిని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఉంచును గాక; గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్నుతాను సిద్ధపర్చుకొనియున్నది. ఓ. ప్రభువా ఈ రాత్రి మాకు సిద్ధపాటు రాత్రిగా ఉండును గాక, కారణము రేపు మేము ఆయనను కలుసుకొను దినముగా ఉండును గాక, ఏ ఘడియలో మనము ఆయనను కలుసుకొనుటకు పిలువబడతామో, మనము యెరుగము, ప్రభువా దాన్ని దయచేయుము.

107ఇప్పుడు, మనము ప్రార్థన చేయుచుండగా మరియు మన తలలను క్రిందికి వంచియుండగా, మీలో చేతులు పైకెత్తిన ప్రతి ఒక్కరు, మీరు దానితో లోతుగా యదార్థంగా యున్నట్లైతే, మరియు నిజముగా అది మీ భావమైతే, మరియు మీరు తప్పై యుండియున్నారని, ప్రజలు యెరుగటను మీరు సిగ్గుపడనియెడల! ఎలాగైనా తీర్పు దినమున మీరందరూ వారితో నిలబడబోవుచున్నారు, మరియు దేవుడు మీరు తప్పైయున్నారని మీరు గ్రహించునట్లుగా తగినంత ఒప్పుదలను ఆయన ఉంచియున్నాడు.

ఇక్కడ కొంతకాలం క్రితం అలాంటి ఒక విషయం మీద నేను భేదించుచుంటిని. అక్కడ వెనుక నిలబడియున్న ఒక యౌవ్వన స్త్రీతో నేను మాట్లాడియున్నాను. ఆమె చూచుటకు చాలా హేయముగా కనబడినది, అమె ఒక సేవకుని యొక్క కుమార్తె, మరియు ఆమె నన్ను క్రిందకు నన్ను దువ్వలేకపోగా, బయట ఆలయమున ఆమె నన్ను కలుసుకొన్నది!

ఆమె అన్నది, "నీవు తెలివితక్కువవాడవు." ఆ చిన్న పెదవులకు రంగు రాసుకున్న పొట్టి బట్టలు ధరించి, జుట్టు కత్తిరించుకున్న ఆ ఆకతాయి పిల్ల. ఆమె అన్నది, "దాన్నిగూర్చి ఎవరైనా నాతో మాట్లాడాలని నేను కోరితే జ్ఞానం కలిగిన ఎవరో ఒకరిని నేను తెచ్చుకుంటాను." నీవు మరలా ఎన్నడూ నా తండ్రి యొక్క వేదిక మీదికి వచ్చి అలాంటి విషయములను ఎన్నడూ బోధించవద్దు అని అన్నది."

నేనన్నాను, "నీ తండ్రి ఒక మంచి యదార్థవంతుడైన బాప్టిస్టు బోధకుడైయుండి, దానికి వ్యతిరేకంగా బోధించడని, నీ భావమా?"

ఆమె అన్నది? "నీవిక్కడకు రావడానికి ఆయన నిన్ను అద్దెకు తెచ్చుకోలేదు…"

నేనన్నాను, "ఆయన ఎంతమాత్రం నన్ను అద్దెకు తెచ్చుకోలేదు. నేను ఆహ్వానించబడుట ద్వారా వచ్చాను."

అమె అన్నది, "దాన్నిబట్టి నేనెన్నడూ నిన్ను క్షమించను."

నేనన్నాను, "అది నీ ఇష్టం. నేను కేవలం సువార్తను వెంబడించియున్నాను."

ఆమె చక్కని అందమైన స్త్రీ. ఆ చిన్న గాలిలో అక్కడ గులాబీ పొదలు అల్లాడుచున్నవి.

108కొంచెం కాలం తర్వాత, దరిదాపుగా ఒక సంవత్సరం తర్వాత నేను ఆ పట్టణంగుండా వెళ్ళియున్నాను. అదే, యౌవ్వన స్త్రీ సిగరెట్ త్రాగుచూ ఆమె యొక్క బట్టలు వ్రేలాడుచుండగా, వీధులలో నడిచివెళ్ళుచున్నది. నేను అనుకున్నాను, "ఆమె ఫలానా - ఫలానా సోదరుని యొక్క భార్య, లేక కుమార్తె." నేను ఆ దారిగుండా ఆమె యొద్దకు నడచి వెళ్ళాను. ఆమె నా వైపు చూచి సిగరెట్ త్రాగుచూ, ఆ పొగను ముక్కుగుండా వదులుచున్నది.

ఆమె అన్నది, "హలో, బోధకుడా, — అది ఒక భక్తిహీనమైన సందర్భమునకు తగిన మాటగా ఉన్నది.

నేనన్నాను, "మంచిది, మంచిది!"

ఆమె అన్నది, "నా సిగరెట్ నుండి దమ్ములాగి, ఒక మనిషిగా ఉండు."

నేనన్నాను, "నిన్ను గూర్చి నీవు సిగ్గుపడుట లేదా?"

ఆమె తన పాకెట్ లో చేయిపెట్టి ఇలా అన్నది, "అలాగైతే ఇదిగో సిగరెట్ట్."

నేనన్నాను, "ఒక దేవుని సేవకుడిపైన నాకు ఒక సిగరెట్ ను నీవు ఇవ్వచూపుట నీగు సిగ్గుగా లేదా, నీకు సిగ్గుగా లేదా."

ఆమె అన్నది, "బహుశా అలాగైతే నా సారాయి సీసాలో నుండి ఒక గుక్క త్రాగు.

నేనన్నాను "దయచేసి దాన్ని చెప్పవద్దు." నేను ఆమె వైపు చూశాను, నేను ఏడ్వకుండా ఆపుకోలేపోయాను, 'కారణమేమనగా ఆమెయొక్క తండ్రి ఒక మంచి మనిషి. నేను ఆమె వైపు చూశాను, నేను ఇలా తలంచాను, "ఓ, మై! ఆమెకు ఎంతో సమయం ఉన్నదని ఆమె తలంచినది."

109నేను ముందుకు వెళ్ళుట ప్రారంభించాను. నా కన్నుల నుండి కారుచున్న కన్నీటిని నేను ఆపుకోలేకపోయాను. నేను ముందుకు నడిచి వెళ్ళాను.

ఆమె అన్నది, ఒక్క నిమిషం ఆగండి."

నేనన్నాను, "సరే, అమ్మా?"

ఆమె వెనుకకు నడిచినది. ప్రజలు నడిచి దాటిపోవుచున్నారు, ఆ వీధిలో ఆమెతో అలా మాట్లాడుట దరిదాపుగా ఒక అవమానంగా ఉన్నది. ఆమె పైకి నడిచి వచ్చినది.

ఆమె అన్నది, "ఆ రాత్రి నీవు నాకు ఏమి చెప్పావో నీకు తెలుసా?"

నేనన్నాను, "నేనెల్లప్పుడు గుర్తుంచుకుంటాను."

ఆమె అన్నది, "బోధకుడా, నీవు చెప్పినది సరైనదేనని నేను నీకు చెప్పగోరుచున్నాను." ఆమె అన్నది, "చివరిసారి నేను పరిశుద్ధాత్మను దుఃఖపరచాను."

ఇప్పుడు ఒక విషయమును ఇక్కడ ఆమె నాకు ఎత్తిచూపినది. నేను జీవించియున్నంతకాలము నేను దాన్ని ఎన్నడూ మరువలేను, ఆమె అన్నది, "మీరు నాతో మాట్లాడిన రాత్రి ఆయన నాతో మాట్లాడగోరి యన్నాడు. అయితే ఆమె అన్నది, "నేను ఆ సమయంలో నేను ఆయనను తిరస్కరించినప్పుడు, అది నా చివరి అవకాశమై యుండెను," అన్నది. "నా హృదయం ఎంతో కఠినమై పోయినది, నేను దేవునిని, సంఘమును, లేక దేనినీ నేను లెక్కచేయుట లేదు. ప్రతిసారి నేను నా తండ్రిని శపించుచున్నాను." మరియు ఆమె అన్నది, "నా తల్లియొక్క ఆత్మ నరకములో ఒక బబ్బట్టు వలె కాలిపోవుటను నేను చూడగలను, మరియు నేనది చూచి నవ్వుచున్నాను." అది నేను చివరిసారిగా పరిశుద్ధాత్మను దుఃఖపరచుటయై యున్నది."

110పావురపు రెక్కలపైన మనం ఇంటికి వెళ్ళదాము. వధువుగా మనం ఉందాము. నీవు తప్పుగా యున్నట్లైతే నీ కుర్చీలో నుండి ఇప్పుడే పైకి లేచి నిలబడుము. ఈ పైకి రమ్ము, వేదిక నొద్ద నిలబడి ఇలా చెప్పు, "బ్రెన్హాం సోదరుడా నేను తప్పైయున్నాను. నాకు కోపం ఉన్నది. లేక, నేను భక్తిహీనంగా జీవించాను - నేను చేయుచున్న ఈ కార్యములు నేను తప్పక చేయరాదు. బ్రెన్హాం సోదరుడా, నేను ఇది, అది లేక ఫలానిది చేసియున్నాను. అబద్ధమాడినందుకు నేను దోషారోపణతో యున్నాను. నేను దొంగలించినందుకు దోషారోపణతో యున్నాను. దీని విషయంలో నేను దోషారోపణతో యున్నాను. నేను తప్పక సేవించాల్సిన విధానంలో నేను దేవునిని సేవించియుండలేదు, మరియు నన్ను గూర్చి నేను సిగ్గుపడుచున్నాను. నేను నా జీవితమును సరిచేసుకొనగోరుచున్నాను. బ్రెన్హాం సోదరుడా, ఈ రాత్రి ఇక్కడ నా కొరకు నీవు ప్రార్థన చేయవా?" దాన్ని చేయుటకు నేను సంతోషిస్తాను.

JAS 4:17

 

111వ్యాధిగ్రస్తులుగా యున్న వారికొరకు, గ్రుడ్డివారి కొరకు, మరియు బాధించబడుచున్న వారి కొరకు నేను చేయు ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చినట్లైతే, ఆయన నిశ్చయంగా ఒక పాపి కొరకు నేను చేయు ప్రార్థన కూడా వింటాడు. మీరు వచ్చి ఈ రాత్రి వధువులో భాగముగా ఉండండి? మీరు రావలసినదిగా నేను మిమ్మును ఆహ్వానించుచున్నాను. నా సోదరుడా, నీకు వందనములు అలా బయటకు నడిచి నీ యొక్క తప్పును అంగీకరించుట, ఆ విధమైన ధైర్యమును నేను మెచ్చుకొనుచున్నాను, సోదరుడా దేవుడు నిన్ను దీవించును, ఇక్కడే తిన్నగా నిలబడియుండండి.

మీరు మీ చేతిని ఎత్తి మరియు మీరు దానిపట్ల యదార్థంగా లేరని నాకు చెప్పుట మీ భావమా? ఆ ప్రజలకు ఏమి సంభవించియున్నది? సోదరుడా విషయమేమిటి? ఈ దినమున మన ప్రజలతో ఉన్న విషయమేమిటి? నీవు తప్పైయున్నావని నీ భావము, నీవు నీ చేతిని ఎత్తియున్నావు, మరియు అలాగైతే నీవు ఎందుకు రావు? మరియు తెలుసుకోండి, "మేలైనది యెరిగియు, దాన్ని చేయకపోవుట అతనికి పాపమైయున్నది." మీరు రారా? ఆర్గాన్ వాయించుచున్న సహోదరి చిన్నగా సంగీతమును వాయించుచుండగా.

112నేను మిమ్ములను ఒకటి అడుగగోరుచున్నాను. ఇక్కడ జనసమూహములో ఈ కూటములలో ఉండినవారు ఎంతమంది ఉన్నారు. నేను ఒక బోధకుని కాను అని మీరెరుగుదురు. నాకు చదువులేదు. ఒ చిన్న స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక. దానిని చేయుటకు ఒక నిజమైన బాలికను అది తీసుకుంటుంది. ఈ చిన్న గాయక బృందం ఇక్కడకు వచ్చుచున్నారు. నా సహోదరి ప్రభువు మిమ్ము దీవించును. అది నిజమైన సాహసమై యున్నది. నేను ఆ చిన్న స్త్రీని మెచ్చుకొనుచున్నాను. హనీ, ప్రభువు నిన్ను దీవించును. నీ వయస్సులో ఉన్న ఒక నా చిన్న బాలిక రిబ్కా గృహము నొద్ద ఉన్నది. నేను నిన్నుమెచ్చు కొనుచున్నాను. నిన్న ఇండియన్ బాలిక? హనీ, ఈ చిన్న రాణిని దేవుడు దీవించును. తీయని హృదయమా దేవుడు నిన్ను దీవించును. నీవు, చిన్న సహోదరి, దేవుడు నీతో ఉండును గాక, మరియు నీతో, సహోదరి.

ఇప్పుడు ఇక్కడ చూడండి. ఆ విధంగా యున్న స్త్రీలు, చిన్న బాలికలు, మృదువైన మనస్సాక్షిగలవారు, వారిని ముక్కలుగా చేసిన ఒక ప్రసంగము వారికి బోధించబడినను, వారు తప్పై యున్నారని యెరిగినవారై, వారు ఇక్కడకు, వచ్చుచున్నారు. మరియు జనసమూహము ముందు నిలబడి ఒక ఒప్పుకోలును చేయుటకు వారు ఇక్కడ నిలబడియున్నారు. నిశ్చయంగా, నిశ్చయంగా వృద్ధ స్త్రీలైన మీరు, మీరు రారా? ఈ పైకి కదలండి, మరియు ఇక్కడ నిలబడండి.

…..నేను నీ ముఖమును వెదుకగలనా;

గాయపడిన, విరిగిన నా ఆత్మను బాగు చేయుము.

(మనము దీనిని పాడుదాము.)

నీ కృప ద్వారా నన్ను రక్షించుము.

రక్షకుడా, రక్షకుడా, వినుము…

నిశ్చయంగా ఒక దీన ప్రార్థన చేయుటకు తగినంత యదార్థతను మీరు కలిగియున్నారు. "పిలవండి, ప్రభువా నన్ను శోధించుము, నాలో ఏదైనా తప్పున్నదేమో పరీక్షించుము."

నన్ను దాటిపోవద్దు.

ప్రియమైన సహోదరి, దేవుడు నిన్ను దీవించును.

113నేను నిలబడి రోగుల కొరకు ప్రార్థన చేయుచున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు వారియొక్క విషయాలను మరియు వారి కార్యములను చెప్పుట ఈ జనసమూహములో ఉన్న స్త్రీలు మరియు పురుషులు మరియు అందరు ఎంతమంది మీలో ఇక్కడకు వచ్చి నిలబడి దాన్ని చూచిన వారున్నారు? అది సత్యమైయున్నదని మీలో ఎంత మందికి తెలుసు? ఎన్నడూ తప్పిపోలేదు. పరిశుద్ధాత్ముడు నాకు చెప్పుచున్నాడు, ఈ రాత్రి ఇక్కడ ఏదో ఆయనను దుఃఖపర్చునది ఉన్నదని ఆయన చెబుతున్నాడు. ఇప్పుడు, అది 'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.' ఇప్పుడు దానిని ఇక్కడ కలుసుకోండి, లేనిచో అక్కడ కలుసుకోండి.

నేను ఉద్రేకముల మీదికి వెళ్ళు వ్యక్తిని కాదు. లేదండి. నేను ఖచ్చితంగా ఎక్కడ నిలబడియున్నానో నాకు తెలుసు. మరియు నేను దేవునిని యెరుగుదును. అది సత్యము. ఈ యౌవ్వన బాలికలున్న చోట తిన్నగా అక్కడే అనేక మంది నిలబడవలసిన అవసరత యున్నది. ఇప్పుడు మీరున్నారా? నేను మిమ్మును ఆహ్వానించుచున్నాను. నేను మిమ్మును ఒప్పించను, నేను కేవలం మీకు చెప్పుచున్నాను.

ఎవరో అన్నారు, "వేదిక పిలుపు నొద్ద ఒక సేవకుడు జనసమూహములను గద్దించడం, అలాంటి క్రియలను చేయుట నేనెన్నడూ వినలేదు." ఆ విధానంలోనే అది తప్పక జరగవలసియున్నది. నీవు ఏదో హృదయము బ్రద్దలయిన కథ మీద నీవు పైకి రాలేవు. ఎవరో తల్లి చనిపోవుట లేక మరేదో, అది ఒక ఉద్రేకం క్రింద జరిగేది. మీరు దేవుని వాక్యం పైకి వచ్చియున్నారు. ఏ ఉద్రేకం క్రింద మీరు ఇక్కడకు రాలేదు. దేవుడు దేవుడై యున్నాడని, మరియు ప్రభువు యొక్క తీర్పు గృహంలో మీరున్నారని నమ్ముతూ మీరు వచ్చియున్నారు. మీ కేసును వాదించుకుంటూ మీరు వస్తున్నారు.

REV 19:7

 

114నా సొదరుడా, నా సోదరి దేవుడు మిమ్మును దీవించును. మీతో నేను కరచాలనం చేయగోరుచున్నాను, నేను మీ యొక్క యదార్ధమైన ఒప్పుకోలును మెచ్చుకొనుచున్నాను. ఓ చిన్న స్త్రీ నేను నిన్ను మెచ్చుకొనుచున్నాను. దేవుడు నిన్ను దీవించును. ఆ ధైర్యసాహసంగల ఆత్మను ఆయన నీకు దయచేయును గాక. నా సోదరుడా దేవుడు నిన్ను దీవించును. మరొక్కసారి తర్వాత మనం ముగించబోవుచున్నాము. అది చివరిసారిగా కూడా ముగించబడుతుంది, చూడండి. అది ఎప్పుడో నాకు తెలియదు. అది ముగియకూడదని నా ఆశ. అయితే అది ముగియవచ్చు, చూడండి.

రక్షకుడా, రక్షకుడా……

(సహోదరుడు బ్రెన్హా౦ వేదికపైన ఉన్నవారితో మాట్లాడుచున్నారు.)

…………

నా మీదుగా దాటి వెళ్ళండి.

రక్షకుడా…….

ఏమిటి? "గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, మరియు ఆయన భార్య తన్నుతాను అలంకరించుకొన్నది."

………… దీనమైన మొర్ర;

ఇతరులను నీవు పిలచుచుండగా,

ఓ, నన్ను దాటిపోవద్దు.

(ఏమిటి?) నేను నీ యొక్క యోగ్యతనందే నమ్మికయుంచుచున్నాను,

నేను నీ ముఖమును వెతుకుతాను,

వాక్యము దానిలోనికి నన్ను కోసిన చోట,

నా గాయపర్చబడిన, విరిగిన మనస్సును బాగుచేయుము.

నీ కృప ద్వారా నన్ను రక్షింపుము.

రక్షకుడా, రక్షకుడా, నా దీనమైన మొరను వినుము;

నీవు ఇతరులను పిలుచుచుండగా,

ఓ, నీవు నన్ను దాటిపోవద్దు.

1JN 3:20,21

 

115గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్ముడే నీ హృదయమున లోపటికి త్రోసియున్నాడు, మరియు ఇక్కడకు వచ్చియున్నాడు. నిన్ను ఆయన కోసిన స్థలములను కొంచెం ఆలోచించుము, మరియు ఆ వ్యక్తి ఇక ఎన్నడూ అలా నీచముగా జీవించడు. వారు ఎల్లప్పుడు దాన్ని గుర్తించుకుంటారు. "మన హృదయములు మన మీద నేరారోపణ చేయనట్లైతే…" అయితే నీవు దేవుని వాక్యముతో ఒకదానితో వచ్చినప్పుడు, మరియు నీవు దానిని దాటవేసినప్పుడు అది అబ్రహాము యొక్క సంతానము కాదు. అబ్రహాము ఏది వచ్చినా లేక ఏది వెళ్ళిపోయినా దేవునియొక్క వాగ్ధానమును తన హృదయంలో దాచుకొనియున్నాడు.

MATT 5:6

 

116ఈ వేదిక చుట్టు నిలబడియున్న వారందర్నీ నేను మెచ్చుకొనుచున్నాను. ఈ రాత్రి మీ కొరకు నా ప్రార్ధన ఏమనగా, దేవుడు మీ హృదయ వాంఛను తీర్చి మరియు నిజమైన పరిశుద్ధమైన ప్రజలుగా తయారు చేయును గాక,

ఇక్కడున్న కొందరు యవ్వనస్తులు, ఇక్కడున్న ఇండియనులు, స్పానిష్ వారు, మెక్సికన్లు, అందరూ ఈ చుట్టు నిలబడియున్నవారు, బహుశా ఎన్నో సంవత్సరాలుగా తాము క్రైస్తవులమని చెప్పుకొనుచున్నారు, అయితే చూడండి అది తప్పైయున్నది. వారు సరికాగోరుచున్నారు. "నీతి కొరకు ఆకలి దప్పులుగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు." దోషిగా తీర్చబడినావా, దేవుని భీకరమైన తీర్పు వేదికగుండా, దాన్ని దేవునితో సరిచేయగోరుటకు సిద్ధపడినావా, స్నేహితులారా, దానిని ఎక్కడో మీరు తప్పక కలుసుకొనవలసియున్నది. నీవు తప్పక దానిని ఎక్కడో కలుసుకొనవలసియున్నది. కాబట్టి దానిని ఇక్కడే కలుసుకొనుము, రేపు ఉదయము వరకు వేచియుండవద్దు. ఈ రాత్రే నీ గృహమునకు వెళ్ళుచుండగా బహుశా యాక్సిడెంట్లో నీవు చనిపోవచ్చు.

117ఈ మధ్యనే ఒక కూటములో నేను వేదిక పిలుపునిచ్చియున్నాను, మరియు నేను పిలిచియున్నాను. ఓహియోలో చేసినట్లుగా, మరియు ఆ రాత్రి నేను ఆ స్థలమును విడిచిపెట్టి యున్నాను. నేనక్కడ నుండి వెళ్ళిపోయి 15 నిమిషములు అయినది. ఎవరో రోడ్డు పక్కన కేకలు వేయడం నేను విన్నాను. నేను ఆగి అక్కడకు వెళ్ళాను. ఒక కారు మరొక కారు మీదికి పరుగెత్తి ఒక ప్రమాదమును చేసినది. మరియు ఆమె తన ఉంగరాన్ని తీసివేసియున్నది. ఆమె ఎంతో ఉద్రిక్తతగా ఉన్నది, ఆమె చంపబడియున్నది. మరియు ఆ రోడ్డు క్రింద కారు నడుపుచున్న తన కుమార్తెతో మాట్లాడుచున్నది. హాస్పటల్ కు తీసుకు వెళ్ళుటకు వారు ఆమెను కలిగియున్నారు. మరియు వారిద్దరూ తప్పక వేదిక యొద్దకు వచ్చినవారే. మరియు ఆమె కుమార్తె ఇలా అన్నది, "అమ్మా కారు ఆమెను డీ కొట్టక ముందు ఆమె కుమార్తె ఇలా అన్నది, "అమ్మా, కారు ఆమెను ఢీకొనకముందు ఆమె నాతో చెప్పిన మాట ఏమనగా, ఈ రాత్రి నేను తప్పుచేసి యున్నాను. నేను తప్పు చేశానని నాకు తెలుసు." మరియు అక్కడ ఆమె జీవితం పిలువబడినది.

118ఓ, నీవంటావు, "అది నాకు సంభవించదు" అది నీకు సంభవించగలదు. అది నీకు సంభవించగలదు. నీవు తప్పై యున్నావని మరొకసారి పరిశుద్ధాత్ముడు ఎన్నడు నిన్ను దోషిగా తీర్పు తీర్చనట్లైతే? అప్పుడు నీవు నిత్యత్వంలోనికి అలానే నడిచివెళ్ళిపోతావు. మరియు నీకు తెలుసా అలాంటి ఆత్మతో నీవు దానిని చేయలేవు. అయ్యా, మీ జీవితం గుండా వెనుకకు తీసుకోండి నీవెలా జీవించావో చూసుకొనుము. మరియు వెనుకకు చూచుకొని అక్కడ ఆ తియ్యని క్రీస్తు యొక్క దీనమైన జీవితము నీలో ఆయన వాక్యమంతటితో సరితూగుచున్నదేమో చూచుకొనుము. అది అలా లేనియెడల, తిన్నగా ఇక్కడకు రమ్ము. అక్కడ… ఎందుకు, ఆకాశములన్నియు సంపూర్ణంగా నిజమైన పెంతెకొస్తు దీవెనలతో నీ హృదయము శుభ్రం చేయుటకు, నీ ఆత్మను శుభ్రం చేయుటకు నీవు ఎందుకు ఒక ప్రత్యామ్నాయమును తీసుకుంటావు? అది నిజము కాదా?

JOHN 5:24•

JOHN 6:40

 

119ఈ రాత్రి ఇక్కడ సేవకులు ఎంతమంది ఉన్నారు. మీలో కొందరు సోదరులు మాతో ఇక్కడకు నడిచి రావాలని కోరుచున్నాను. సోదరుడా, అది బాగానే ఉన్నది? అవును. సోదరులారా ఒక్క క్షణము మీరిక్కడకు వస్తారా? అది మంచిది.

యేసు తన వాక్యంలో ఇలా చెప్పారు. "నా మాటలు విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు, మరియు అతడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటియున్నాడు." యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పినది, "నేను అతనిని అంత్యదినమున లేపుదును." — ఒక పునరుత్థానము.

120ప్రజలారా, మనము దానిని తప్పక తట్టుకోవాల్సియున్నది. మనము తప్పక దానిని చేయాలి. అది సరిగ్గా తప్పక చేయబడవలసియున్నది. కాబట్టి. అది ఉద్రేకం కాదు, నిజమే, ఉద్దేశములు దానితో వెళతాయి. అది నిజము. అయితే దాని విషయం ఏమనగా ఒక సమర్పించబడిన హృదయమైయున్నది. కేవలం దేవుని వాక్యమును తీసుకుని ఇలా చెప్పండి, "దేవా నేను తప్పు చేసియున్నాను. నేను దాన్ని చేసినందుకు బాధపడుచున్నాను. నా హృదయం నీకు తెలుసు. నేను తప్పు చేశాను, తిన్నగా ఈ ఆధారముల మీదనే, నా తప్పును నేను ఒప్పుకుంటాను. మరియు ఈ రాత్రి నుండి ఇకమీదట నేను నీకు ప్రధానము చేయబడినాను. నేను వధువులో భాగమైయున్నాను. ఎన్నడు తిరిగి నేను దాన్ని చేయను, ఎన్నడు నా కోపము మరల జారకుండును గాక, నేను నేను ఒక స్త్రీ వలె ప్రవర్తిస్తాను, నేనొక మర్యాదగల మనిషివలె ప్రవర్తిస్తాను. బైబిల్ చెయ్యమని చెబుతున్న కార్యములను నేను చేస్తాను. ఇప్పుడే తిన్నగా, నీ వాక్యము నొద్దకు నేను నిన్ను తీసుకొనుచున్నాను." అప్పుడు ఒక చోటికి నీవు వెళ్ళుచున్నావు. సువార్త బోధకులారా మీరు దాన్ని నమ్ముతారా అది సత్యమేనా? అది సత్యము.

121ఇప్పుడు నీ సొంత విధానములో, మీలో ప్రతిఒకరు, మనమందరం ప్రార్థనలో మన తలలను ఇప్పుడు వ౦చుదాము. గుర్తుంచుకోండి, తిన్నగా నీ ప్రక్కనే క్రీస్తు ఉన్నాడు. నీముందు ఇక్కడ వేదిక మీద క్రైస్తవులు ప్రార్థన చేయుచున్నారు. నీ వెనుక, సువార్త సేవకులు ప్రార్ధన చేయుచున్నారు. ఇప్పుడు, అది నిన్ను ఒక ప్రార్ధనా వాతావరణంలో ఉంచుతుంది.

ఇప్పుడు, నీ సొంత విధానములో నీ ఒప్పకోలు నీ హృదయంలో ఉన్నది. "ప్రభువా నేను తప్పైయున్నాను." "ప్రభువా నేను తప్పైయున్నాను", "ప్రభువా నేను విచారిస్తాను." "నేను ఈ కార్యములను చేశాను? "ఇప్పుడు నేను నా పాపములను ఒప్పుకొనుచున్నాను." "నేను నీయందు విశ్వాసం ఉంచియున్నాను." "ఇప్పుడు నేను నిన్ను అంగీకరిస్తాను." "నేను వధువులో భాగముగా ఉండగోరుచున్నాను." "యేసు నామములో నేను ప్రార్థన చేయుచున్నాను."

ఇప్పుడు మీ ఒప్పుకోలును మీ హృదయంలో ఉంచుకొనండి. ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్దించబోవుచున్నాను.

HEB 4:12

 

122పరలోకపు తండ్రీ, కొన్నిసార్లు నన్ను ప్రేమించుచున్న ప్రజల వైపు చూచునప్పుడు అది నన్ను ఎలా దుఃఖపరుస్తుందో, నీవు ఎలా నీ వాక్యమును తీసుకుని బయట అక్కడ ఉంచుతావో, అది ఎముకలోని మూలుగును కూడా కోసివేస్తుంది, కానీ మరల నీవు తిన్నగా చుట్టూ వచ్చి అది సత్యమని ఋజువు చేస్తావు. అది సత్యమైయున్నది. ఇక్కడ స్త్రీలు మరియు పురుషులు, చిన్న స్త్రీలు సహితము చిన్న బాలికలు ఇక్కడ తలలు వంచి నిలబడియున్నారు. మరియు వారి కన్నులలో కన్నీరు కారుచున్నది, వారు వారి జీవితం యొక్క రహదారుల కూడలిలో తిన్నగా వారు నిలబడియున్నారు. ఆ దిగువనే ఆ ఊగులాడలు, రాక్-అండ్-రోల్, దయ్యములు పట్టి, దయ్యములచే బాధింపబడుచున్న గుంపు అక్కడే వారి జీవితములను ముగించగలరని నేను యోచిస్తాను. అయితే ఈ రాత్రి ఇక్కడ తలలను వంచి నిలబడియున్నారు. "ప్రభువైన దేవా, లోకకార్యములన్నిటి నుండి నన్ను శుద్ధిచేయుము" అని కోరుచూ, వారి చేతులను దానిమీద ఉంచగోరుచున్నారు.

123ఇక్కడ మధ్యవయస్కులు ఉన్నారు, యవ్వనస్తులు, యవ్వన స్త్రీలు అందరూ ఏకంగా నిలబడియున్నారు. వారు తప్పుయై ఉన్నారని అక్కడ ఒప్పుకొనుచున్నారు. నీవు వారి హృదయాలతో మాట్లాడియున్నావు… లేనిచో వారు ఇక్కడ ఎన్నడూ ఉండియుండేవారు కాదు. ఒక తీర్మానము ఇంతకు ముందే చేయబడకుండా కనీసం వారి కుర్చీలలో నుండి వారు పైకి లేవలేరని అది చూపుతుంది. ఒక దేవుని ఆత్మ వారిచుట్టు యున్నది, మరియు "నీవు తప్పై యున్నావని చెప్పియున్నది."

మరియు వారి చిన్న జీవితం ఇలా చెప్పినది, "ప్రభువా అలాగైతే నీవు నాకు కావాలి."

మరియు దయ్యం అన్నది, "నీవు ఊరకుండుము." అయితే దేవుని ఆత్మ "లేచి నిలబడుము" అని చెప్పినది. మరియు వారు విధేయతతో నడిచి వచ్చి ఇక్కడ వేదికనొద్ద నిలబడియున్నారు.

ISA 1:18•

MATT 3:10•

JOHN 5:24•

JOHN 6:37•

2COR 12:9•

EPH 5:26•

REV 19:7

 

124ఇప్పుడు, నేను మీ వాక్యమును వారికి ఉదహరించినట్లుగా, "నా యొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రము త్రోసివేయను. మీ పాపములు కెంపువలె ఎర్రనివైనను, అవి హిమమువలె తెల్లబడతాయి, రక్తము వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చువలె తెల్లబడతాయి. వచ్చి నాయొద్ద ద్రాక్షారసమును మరియు నూనెను కొనండి. నా కృప చాలును. నా మాటలు విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు, మరియు వాడు తీర్పులోనికి రాక, మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు. ఇప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవము వచ్చియున్నది, మరియు వధువు తన్నుతాను సిద్ధపర్చుకొనియున్నది.

తండ్రీ, వారు నీవారైయున్నారు, వారు నీ వాక్యమునకు బహుమతులై యున్నారు. వాక్య జలముల ద్వారా కడుగబడుటకు వారిక్కడ ఉన్నారు, ఏలయనగా అది సంపూర్ణమైన సువార్తయై యున్నది, అది దేనినీ విడిచిపెట్టలేదు. అది క్రిందికి కోసి, క్రిందకు కిండర్-గార్డెన్ స్థలమునకు వెళ్ళుచున్నది. అది వేర్లను పెకిలించుచున్నది, చేదైన వేర్లను, భిన్నమై వేర్లను, లోకముయొక్క వేర్లను అది పెకిలించుచున్నది. ప్రభువా పరిశుద్దాత్మ ద్వారా వాటిని బయటకు పెకలించుచున్నది. ఈ ప్రజలనుండి వాటిని దూరంగా తీసివేయుము.

JOHN 14:14•

JOHN 16:23

 

125యేసు ఈ రాత్రి వారిని నీ స్వంత వ్యక్తిగతమైన సొత్తుగా, నీ కిరీటంలో మాణిక్యములుగాను నీ వధువులోని సభ్యులుగా వారిని నీకిచ్చుచున్నాను. వారి జీవితములను నీకిచ్చుచున్నాడు. ఈ సేవకులతో కలిసి, ఈ సజీవుడైన దేవుని పరిచాలకులతో కలసి నా హృదయమంతటితో నేను ప్రార్ధన చేయుచున్నాను. వారు సాతాను ముఖం ముందు నిలబడుటకు వారికి ధైర్యమును ఇమ్ము, ప్రభువా, లోకకార్యములన్నిటిని వారినుండి దూరంగా తీసివేయమని నేను ప్రార్థన చేయగోరుచున్నాను, ప్రభువా, దాన్ని దయచేయండి. నీవు దాన్ని చేయుదువని నేను నమ్ముచున్నాను. నీవు చెప్పావు, "నా నామములో మీరు తండ్రిని ఏది అడిగినను మీకు అనుగ్రహింతును," ఇప్పుడు, "హ, బహుశా నేను చేస్తాను" అని నీవెన్నడూ చెప్పలేదు. నీవు అన్నావు, "నేను దాన్ని చేస్తాను," మరియు అది సత్యమని నేను నమ్ముచున్నాను.

MARK 16:17

 

126ఇప్పుడు, ఇది కూడా లేఖనములలో వ్రాయబడినది, "నా నామములో వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు." ఒక యవ్వన స్త్రీని లేక ఒక స్త్రీని గాని అది దయ్యము మాత్రమే తీసుకొని ఆమె జీవితమును బ్రద్దలు చేస్తుంది. అది దయ్యమే ఒక మనిషి యొక్క జీవితమును తీసుకొని అతని జీవితమును బ్రద్దలు చేస్తుంది. మరియు ప్రభువా, నా ప్రార్థనలో ఈ చిన్న కథను నేను సూచిస్తాను, మరియు నీవు నా ప్రార్థన వింటావని, ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఈ రాత్రి నీ రాజ్యము కొరకైన మాణిక్యములుగా నీ వారై యుందురని నేను ప్రార్థన చేయుచున్నాను, మరియు ఇక్కడ నాతో నిలడుటకు, మా స్థానమును క్రీస్తులో తీసుకొనుటకు వారు వచ్చియున్నారు.

1SAM 17:35•

JOHN 6:37

 

127ఇప్పుడు సాతానా, నీవు దాన్ని కోల్పోయావు. వారిలో కొందరిని నీవు వెనుకకు దాచావు, అయితే నీవు యుద్ధమును జయించలేదు, యేసు అన్నాడు, "నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము త్రోసివేయను."

సాతానా, నేను మీకు చెబుతాను, ఒక దినమున తన తండ్రి యొక్క గొర్రెలను మేపుచున్న ఒక చిన్న బాలుడు ఉన్నాడు. మరియు ఒక సింహంలోనికి వచ్చి వాటిలో ఒక దానిని పట్టుకొన్నది, దాన్ని బయటకు తీసుకుని వెళ్ళి దాన్ని చెడ్డగా బాధిస్తూ దాన్ని మ్రింగివేయబోవుచున్నది. అయితే ఈ చిన్న నిజమైన గొర్రెలకాపరి ఒక చిన్న ఒడిసెల తప్ప మరి ఎక్కువైనది ఏమియు లేదు, అయితే అతడు సజీవుడైన దేవునియందు విశ్వాసము కలిగియున్నాడు. అతడు ఆ సింహాం వెంబడి పరుగెత్తి దాన్ని పట్టుకొని దానిని హతం చేశాడు. అది అతని మీదికి పైకి లేచినప్పుడు, అతడు దాని గడ్డముతో దాన్ని పట్టుకొని హతమార్చెను. అతడు ఆ గొర్రెను ఆ సింహం యొక్క నోటినుండి బయటకు తీసి, తిరిగి అది స్వస్థపడుటకు దాన్ని తిరిగి మరల పచ్చిక బయళ్ళలో ఉంచెను.

128సాతానా ఈ ప్రశస్తమైన దేవుని గొర్రెలను, ఈ స్త్రీలను తీసుకుని, వారు తమ జుట్టును కత్తిరించుకునేలా చేశావు, వారు రంగులు పూసుకొన్నట్లు చేశావు. బైబిల్ ఖండించుచున్న వాటిని చేసి కనబడునట్లుగా చేశావు, మరియు నీవు వారిని కలిగియున్నాను అని తలంచావు, అయితే ప్రార్ధన అను సామాన్యమైన ఈ చిన్న వడిసెలతో నేను నీ మీదికి వచ్చుచున్నాను, ఈ రాత్రి నేను వారిని వెనుకకు తెచ్చుచున్నాను. నీవిక ఎంతమాత్రము వారిని పట్టుకొనియుండలేవు, నీవు యుద్ధములో ఓడిపోయియున్నావు. ఇక్కడ నిలబడియున్న దేవుని గొర్రెపిల్లలై ఉన్న ఈ మనుష్యులను నేను విడుదల చేయుచున్నాను.

ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేము నిన్ను ఆజ్ఞాపించుచున్నాము. ఈ చెడు అలవాటు, కోపములు, మరియు అనైతికమైన మరియు అవి ఏమైయున్నప్పటికి, వారికి మరియు వాటికి మధ్యలో విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు యొక్క రక్తమును నేను ఉంచుచున్నాను. వారు ఆయన పిల్లలై యున్నారు, వారినుండి దూరముగా వెళ్ళుము. యేసుక్రీస్తు నామములో నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.

129నీవు దానిని నమ్మినట్లైతే పాతాళములోని ఒక్క దెయ్యం కూడా నిన్ను తాకజాలదు. నీవు రక్తం ద్వారా కప్పబడియున్నావు. సువార్త సేవకుల యొక్క ప్రార్ధన ద్వారా మరియు నిబంధన దూతల యొక్క ప్రార్థన ద్వారా నీవు కప్పబడియున్నావు. ఇక్కడ నిలబడినవారందరూ మీ అలవాట్లను, పొరపాటు మరియు నీవు సిగ్గుపడుచున్న విషయములతో ఈ పైకి రండి. ఇప్పుడు నీవు వీటిని దేవుని యొక్క ఇత్తడి బలిపీఠంపై ఉంచినట్లైతే మరియు దానిని నీ యొక్క క్షమాపణగా అంగీకరించినట్లైతే, దానిని క్రీస్తు నీకిస్తాడు, నీవు విశ్వాసం ద్వారా ఆ అర్పణను చేస్తూ నీ చేతులను పైకెత్తి ఇలా చెప్పుము, "ఇప్పుడు నేను దానిని అంగీకరిస్తాను, అది వెళ్ళిపోయినది. మరియు ఈ దినం మొదలుకొని, దానిని తిరిగి నేనెన్నడూ చేయను." యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా నీవు రక్షించబడియున్నావు. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తుతికలుగును గాక.

130ఇంకా ఎవరైనా ఇక్కడకు వచ్చి ఈ గుంపుతో ఏకమగుటకు ఇష్టపడుచున్నారా? ఈ సమయంలోనే ఈ ఆవరణంలో ప్రార్థన కొరకు నిలబడు ఎవరైనా రోగులు ఉన్నారా? నిలబడండి.

మీలో ప్రతిఒక్కరు ఇక్కడ, ఏదైనా ఒక మంచి సంపూర్ణ సంఘంలో మీరు సభ్యులుకానట్లైతే, అలాంటి ఒక ఆలయమునకు మీరు వెళ్ళండి, ఈ ఆలయమునకు మీరు దగ్గరగా ఉన్నట్లైతే, మీరు కోరినట్లైతే వెళ్ళండి. సంఘకాపరి యొద్దకు వెళ్ళి మరియు బాప్తిస్మం పొందండి. దేవుడు నీకు పరిశుద్ధాత్మను ఇచ్చి నిన్ను నింపునట్లు, వధువులో ఒక సభ్యునిగా చేయునట్లు దేవునికి ప్రార్థన చేయండి.

సోదరులారా ఈవైపు నుండి ఆ వైపు వరకు అక్కడున్న రోగులైన ప్రజలను చూడండి. దెయ్యము ఆ ప్రజలను పట్టుకుని ఉండలేదు. ఇది విడుదలపొందు సమయము. హల్లెలూయ! దానిని నీవు నమ్ముతావా?

MARK 16:17,18

 

131అలాగైతే మనమందరము తలలువంచి ప్రార్థన చేద్దాం. ఆ బయట ఉన్న ప్రతి ఒక్కరు, రోగులైన వారందరూ, నిలబడియున్న మీరందరూ ఒకరి మీద ఒకరు మీ చేతులను ఉంచండి. యేసుక్రీస్తు అన్నాడు, "నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు కనబడును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు, వారు స్వస్థత నొందుదురు." మీరు చేతులను ఒకరి మీద ఒకరు అలాగునే వేసి ఉంచండి. ఇప్పుడు, నీవు నీ కొరకు నీవు ప్రార్థన చేయవద్దు, నీ మీద చేతులుంచిన నీ ముందు వ్యక్తి కొరకు ప్రార్థన చేయుము. కారణం వారు నీ కొరకు ప్రార్ధన చేయుచున్నారు. ఒక క్రైస్తవ సంఘముగా మనమందరం ఏకముగా ప్రార్థన చేద్దాం.

MARK 16:17,18•

1PET 2:24

 

132ప్రభువైన యేసు ఈ రాత్రి నీ యొద్దకు వచ్చుచున్న ఆత్మలను బట్టి నీవిచ్చిన విజయమును బట్టి నీకు వందనములు. ఇప్పుడు దెయ్యము నీ గొర్రెలలో కొన్నింటిని రోగముతో బంధించియున్నది. తిరిగి మేము వాటిని అవి నీవని యాజమాన్య హక్కును ప్రకటించుచున్నాము. సజీవుడైన దేవుని యొక్క సంఘముగా, మేము దెయ్యమును గద్దించి, "దెయ్యమూ ఈ రోగులను విడిచిపెట్టుము అని చెప్పుచున్నాము. వారు బాగుపడునట్లు యేసుక్రీస్తు నామములో దెయ్యమునకు ఆజ్ఞనిచ్చుచున్నాను. బైబిలు చెప్పియున్నది, "నమ్మినవారివలన ఈ సూచకక్రియలు కనబడును. వారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు, వారు స్వస్థత నొందుదురు." అది దేవునియొక్క వాగ్ధానమైయున్నది. మరియు అది సత్యమని మేమెరుగుదుము. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దెబ్బల ద్వారా వారు స్వస్థతనొందియున్నారు.

ఇప్పుడు, మీరు దాన్ని నమ్మినట్లైతే, మీ చేతులను పైకెత్తి ఆయనకు స్తుతి చెల్లించండి. ఆమేన్.

మంచిది, సంఘకాపరి ఇదంతయూ మీదే సోదరుడా, దేవుడు నిన్ను దీవించును. ఈ రాత్రి మీతో ఉండుట ఎంతో చక్కగా ఉన్నది. దేవుడు మీతో ఉండును గాక, ఇక్కడ ఉన్న సోదరులారా, దేవుడు మిమ్మును దీవించును గాక.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...