సమస్తమును విడిచి
VGR COUNT-167 1ఇచ్చట దయచేసి కూర్చొనండి. మీ అందరికి శుభ సాయంకాలము చెప్పగోరుచున్నాను. ఈ రాత్రి ఇక్కడ ఉండుటను బట్టి ఎంతో ఆనందముగా వున్నది. ఈ చక్కటి ప్రియమైన సంఘములో ప్రభువును ఆరాధించుటకు, ఇక్కడ వుండుట చాలా గొప్ప భాగ్యముగా ఎంచుచున్నాను. కొంత సమయము గడుపుటకు, ప్రజలతో సహవాసము చేయుటకు, ఆశీర్వాదములను అనుభవించుటకు ఇక్కడకు రావాలని ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నాను. మేము, ఇక్కడున్న ఈ ప్రజలకు ఆశీర్వాదముగా ఉన్నామని నమ్ముచున్నాను. ఇప్పుడు ఈ వారము ప్రారంభమగుచుండగా, రాబోవు సభలు గురువారము నుండి ప్రారంభించబడునని మనము ఎరిగియున్నాము.
నేను ఈ మధ్యాహ్నము సహోదరుడు విలియమ్స్ ద్వారా, గురువారము రాత్రికి గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురుకాబోతున్నదని వినియున్నాను. బుధవారము రాత్రి మనతో మాట్లాడుటకు సహోదరుడు ఓరల్ రాబర్ట్స్ రాబోవుచున్నాడు. అది నిశ్చయముగా మనందరికి గొప్ప ఆశ్చర్యము, ఎందుకనగా సహోదరుడు ఓరల్ నిశ్చయముగా శక్తివంతమైన ప్రసంగికుడు. నా వరకు మరలా అతని కలిసి, అతనితో కరచాలనము చేయుట మంచిది.
2మేము గతరాత్రి టెంపిలోని అసెంబ్లీ-ఆఫ్-గాడ్ సంఘములో ఉన్నాము. అది ఆపైన ఉన్నదని నమ్ముచున్నాను. మరియు గతరాత్రి టెంపిలో మేము అద్భుతమైన సయమును గడిపాము. ఆ ఫోనిక్స్ ప్రాంతములోను మరియు టెంపిలో మేము దర్శించిన ప్రతి సంఘములో మేము అద్భుతమైన సమయమును కలిగియున్నాము. మేము ఈ సంగతులను ఎంతగానో ప్రశంశిస్తున్నాను. దానిని నేను మాటలలో వ్యక్తపరచలేను.
ప్రతి రాత్రి ఒక సంఘమును దర్శించి, ప్రజలతోను మరియు సేవక సహోదరులతోను మాట్లాడే అవకాశము అత్యంత అరుదుగా లభిస్తుంది. దీనిని బట్టి ఈ ప్రజలను, విభిన్న మత సంస్థలు మరియు ప్రజా సమూహాలను ప్రసంశించే అవకాశము నాకు కలుగుతుంది, ఎందుకనగా వారు సువార్త అనే పొలములో, విదేశి పరిచర్యలో మరియు ప్రతిచోట గొప్ప స్పాన్సర్లుగా వున్నారు. ఈ విధంగా వారిని ప్రశంసించి, నా అనుభూతులు వారితో పంచుకొనే అవకాశము కలుగుతుంది.
3మరియు మేము స్వతంత్ర సంఘములతో ఉన్నాము మరియు చర్చ్-ఆఫ్-గాడ్, అసెంబ్లీస్, మరియు ప్రతి ఒక్కరూ, ఓవర్సీస్, ది ఫోర్-స్క్వేర్ చర్చ్-ఆఫ్-గాడ్, అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ మరియు యేసు నామము వారిని కలిశాను. మరియు వారందరూ, మేము యుద్ధ రంగములో కూడికల నిమిత్తము కలుసుకున్నప్పుడు ఒక్కటిగా కనబడుచున్నారు. మీకు తెలుసు, కుటుంబములో కొన్ని విషయముల మీద భిన్నమైన అభిప్రాయములు కలిగివుండవచ్చు, కాని యుద్ధ రంగములో ప్రవేశించినప్పుడు, అక్కడ ఏ తేడాలు వుండవు.
నేను పెద్ద కుటుంబములో పెరిగాను. మేము పదిమంది పిల్లలము. బాలురమైన మేము ఇంటి వెనుక పెరటిలోనికి వెళ్ళినప్పుడు ఒకరితో ఒకరము పోట్లాడుకొనే వారము, ఓ మై, తొమ్మిది మంది అబ్బాయిలు మరియు ఒక అమ్మాయి. మేము నిజముగా పోట్లాడేవారము. కాని మాలో ఎవరినైనా ఒక్కరిని బయటవాళ్ళ ఎదిరించినా, గొడవకు వచ్చినా, ఆ సమయములో మాలో మేము ఎంత కొట్టుకున్నా అందరం ఏకమైపోయి వచ్చే వారిమి. కాబట్టి దేవుని పిల్లలైన సంఘము విషయములో కూడా అదేరీతిగా ఉండునని నేను తలస్తున్నాను.
4కొన్ని సంవత్సరముల క్రితము నేను హూస్టన్లో వున్నాను. అక్కడ మేము గొప్ప కూటములను కలిగియున్నాము. నేను అక్కడ అనేకమంది స్పాన్సర్లను కలుసుకున్నాను. సహోదరుడు రేమాండ్ రిచీ, మరియు అసెంబ్లీస్-ఆఫ్-గాడ్, యేసు నామము ప్రజలు, మరియు అన్నిరకముల వారున్నారు. మేము గొప్ప కూటము కలిగియున్నాము. మేము మ్యూజిక్ హౌస్ వద్ద వున్నాము. మంచిది, ఎనిమిది వేల మంది కూర్చొనే అంత స్థలము యందు అన్ని ఏర్పాట్లను సిద్ధపరచాము.
మరియు అక్కడ ఒక బాప్టిస్టు బోధకుడు, బైబిల్ ప్రకారముగా దైవిక స్వస్థత సరియైనది కాదు అని నాతో బహిరంగ చర్చకు రావాలని సవాలు చేశాడు. మంచిది, నేను అలాటివాటిని ఎన్నో ఎదుర్కొన్నాను. అక్కడ వేలాదిమంది ప్రజలు ప్రార్థన కొరకు వచ్చినప్పుడు, ఒక అవిశ్వాసితో వాదము ద్వారా ఆ రాత్రియందుయున్న సమయాన్ని ఎందుకు వ్యర్థపరచుకోవాలి. మీరు చూచారా? కాబట్టి ఆ సవాలుకు నేను భయపడ్డాను, అని అతడు వార్తా పత్రికలలో ప్రకటించాడు. వృద్దుడైన సహోదరుడు బోస్వర్త్ సుమారుగా ఎనభై సంవత్సరముల వృద్దుడు, "ఓ, ఆ పని నన్ను చెయ్యనీయండి" అని అన్నాడు. మరియు నేను కాలేబు గూర్చి ఆలోచించాను. మీకు తెలుసు, "ఈ పర్వతమును నేను స్వాధీనపరచుకుంటాను."
5కాబట్టి నేను, "సహోదరుడా బోస్వర్త్, పనికిరాని చిన్న విషయముల గూర్చి నీవు ఆందోళన పడుట నాకు ఇష్టము లేదు. క్రైస్తవులమైన మనము ఒకరితో ఒకరము గొడవపడుటను క్రీస్తు కోరుట లేదు. ఒకవేళ ఆ వ్యక్తి అవిశ్వాసి అయితే, అతడు అవిశ్వాసియే. అంతే. దానిని గూర్చి నీవు చేయగలిగినది ఏమియులేదు" అని అన్నాను.
కాబట్టి అతడన్నాడు, "మంచిది, వారు వార్తాపత్రికలలో ప్రకటించిన తర్వాత, మనము దానిని విడిచిపెడితే ఎలా? నీకు తెలుసు. వారంటారు, మనము కేవలము దేనిని గూర్చి మాట్లాడుతున్నామో, దానిని ఎరుగని గుంపు అంటారు. మనము ఉద్రేకాల మీద ఆధారపడి యున్నామంటారు." "నీవు నాకు ఒక అవకాశమివ్వాలని ఆశిస్తున్నాను" అని చెప్పాడు. నేను అతనివైపు చూశాను. అతడు ఎనభై సంవత్సరముల వయస్సులో లేఖనములలో సంపూర్ణమైన నిశ్చయత కలిగి నిలబడియున్నాడు!
నేనున్నాను, "మంచిది, సహోదరుడా బోస్వర్త్, నీవు గొడవపడవని నా చేతిలో ప్రమాణము చేసినట్లయితే…"
"ఓ, నేను గొడవపడను" అని చెప్పాడు. కాబట్టి విలేకరులతో చెప్పుటకు అతడు క్రిందకు వెళ్ళాడు.
మీకు తెలుసు ఆ వార్తా పత్రికలు దానిని ఎలా [స్పష్టతలేని మాటలు]. క్రైస్తవ మత సంబంధమైన బొచ్చు ఎగిరిపోవును, మీకు తెలుసు.
6మేము స్టేడియమ్ తీసుకున్నాము, ఆ స్థలమంతా క్రిక్కిరిసినది. మరియు ఆ రాత్రి సుమారుగా ముప్పైవేల మంది ప్రజలు బయటనున్నారు. ప్రజలు విమానములలోను, రైళ్ళలోను అక్కడికి వచ్చారని అది తేటపరుస్తుంది. వారు మనందరికి సమానమైన స్థానము కలిగిన ఆ బావిలోని నీటిని త్రాగారు. సమస్తమును కలిసి, మరియు ఇప్పుడు దానిని గూర్చి తలంచినప్పుడు, దానిని నుండి నేను గొప్ప ఆశీర్వాదమును పొందుకొన్నాను. మీరు గమనించినట్లయితే, నిజముగా ఒత్తిడి కలిగినప్పుడు, మనమందరిలో ఒక విషయములో ఏకత్వము కలిగియున్నాము. మనమందరము పరిశుద్ధాత్మను మరియు దైవిక స్వస్థతను విశ్వాసిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు వారి భాగమును ఇచ్చుటకు వచ్చారు.
ఆ రాత్రి ఏమి జరిగిందో మనకు తెలుసు. పరిశుద్ధాత్మ సమస్తమును తన ఆధీనములో తీసుకున్నాడు. ప్రభువు దూత క్రిందకు దిగి వచ్చినప్పుడు అది జరిగింది. వారు దాని ఛాయా చిత్రమును తీశారు. నిరూపణ నిమిత్తము దానిని వాషింగ్టన్ డి.సి.కి తీసుకెళ్ళారు. తరువాత అది అనేక పరీక్షలను, పరిశోధనలను ఎదుర్కొన్నది. ఎఫ్.బి.ఐ. యొక్క అధిపతి జార్జి, జె. లేసీ దాని పత్రములో వ్రాశాడు. అతడు ఎఫ్.బి.ఐ. అధికారిక పత్రముల మీద వేలిముద్రలు పరిశీలించే విభాగమునకు అధిపతి.
7అది సంపూర్ణముగా సహజాతీతమైన వెలుగు ఆ కెమెరా లెన్స్ కు తాకినది. అది మనో విశ్లేషణ కాదు, మరియు అతడు ఇలా అన్నాడు, "నేను కూడా తరచుగా నీ కూటములు మానసికమైన విశ్లేషణలు అని చెప్పాను. నీవు ఆ ప్రజల మనస్సులను చదువుచున్నావని నేను అనుకొన్నాను." కాని బ్రెన్హాం, కెమెరా యంత్రికమైన కన్ను మనో విశ్లేషణను గుర్తించలేదు. అది ఆ లెన్సును తాకినది." "అది అక్కడ ఉన్నది," అని అతడు చెప్పాడు. అది చిత్రీకరించబడినది. కావున అది తీయబడినది, దానికి తరువాత అనేకసార్లు అది తీయబడినది. దానిని ఎరుగుటను బట్టి నేను కృతజ్ఞత కలిగియున్నాను. ఇక్కడున్న అనేకమంది ప్రజలు దానిని చూశారు. మీరు చూడలేదా? ఓ, మీలో అనేకమంది దానిని కలిగియున్నారని ఊహిస్తున్నాను. దానిని ఎరుగుటను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను.
ఈ కడవరి కాలములోని పెంతెకోస్తు ఉద్యమము గూర్చి ఎక్కువగా మాట్లాడుకొనుచున్నప్పటికీ, బైబిల్ చరిత్ర నుండి మీకు చెబుతున్నాను…
8నేను సంఘ చరిత్రను ధ్యానించాను. చివరి అపోస్తలుడైన యోహాను మరణము తర్వాత కొన్ని సంవత్సరముల చరిత్రను పరిశీలించాను. అతడు పత్మాసు ద్వీపము విడిచిన తర్వాత అతడు ఆ గ్రంథములను వ్రాయుట ముగించి వాటిని కలిపి సమకూర్చాడు, అతడు అపోస్తలుల యొక్క రచనలు తీసుకొని వాటిని బైబిల్ గ సమకూర్చుటకు అతడు అక్కడ ఉంచబడ్డాడు. అందునుబట్టియే అతడు పత్మాసు ద్వీపముకు తీసుకువెళ్ళబడెను. రాత్రి, పగలు నూనెలో కాల్చబడిన తర్వాత ద్వీపములోనికి పంపబడ్డాడు. అతడు ఆ పుస్తకములన్నిటిని సమకూర్చాడు. మరియు దానితోపాటు దేవుడు అతనికి బైబిల్ గ్రంథములోని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథమును అనుగ్రహించాడు.
9మరియు అక్కడ నుండి నేను వెనుకకు వచ్చి అతని చరిత్ర నుండి ప్రారంభించి, తరువాత అతనిని వెంబడించిన పాలికార్పు, ఇగ్నటిస్, మరియు వారిలో అనేకమంది, తరువాత మార్టిన్, ఐరేనియస్, జస్టస్, సెయింట్ కొలంబస్, దానినుండి చీకటి యుగములు మరియు దానినుండి లూథర్ మరియు వెస్లీ వరకు అధ్యయనం చేశాను. మరియు నేను ఒక విషయమును కనుగొన్నాను. అపోస్తలుల కాలము నుండి కూడా పరిశుద్ధాత్మ యొక్క గొప్ప కార్యములలో ఏవియూ కూడా ఈ చివరి దినములలో ప్రభువు యొక్క చివరి కార్యములలోని వాటికంటె గొప్పది ఒక్కటి కూడా లేదు.
స్నేహితులారా, మనము దీనిని గుర్తించలేదు. ఇప్పుడు దేవుని నిరూపించే అనేక కార్యములు సంభవించాయి, మనతో ఉన్న క్రీస్తు చిత్రము వంటిది ఉదాహరణకు, ఆ దినములలో వారికి అలాంటి పరికరములు లేవు. కాబట్టి మనుష్యుడు దేవుని నుండి దూరము చేయుటకు ఏదో సాధించుటకు ప్రయత్నిస్తున్నాడు. కాని దేవుడు అతని ఆవిష్కరణలను తీసుకొని దానినిబట్టి తననుతాను నిరూపిస్తున్నాడు. కాబట్టి అది… నీవు ఎన్నడూ దేవుని దాటిపోలేవు, ఎందుకనగా ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, అనంతుడు. దాని నుండి దూరంగా వెళ్ళగలిగే ఏ మార్గము లేదు. నాకు తెలిసిన అత్యుత్తమమైన కార్యము ఏదనగా, దీనులుగా ఆయనను సేవించుట.
HEB 11:10
10నేను సిగ్గుపడుచున్నాను, అయితే ఈ సంఘములోని కాపరి యొక్క పేరు నాకు తెలియదు అని నేను అనుకొనుచున్నాను. [సహోదరుడు తన పేరును చెప్పుచున్నాడు.] సహోదరుడు గ్రిఫిత్ నిన్ను కలుసుకొనుటను బట్టి నిశ్చయముగా నేను సంతోషిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి మీతో సహవాసము చేయుటనుబట్టి సంతోషిస్తున్నాను సహోదరుడా, ఈ సూర్యకాంతిలో మాతో కలసి ప్రయాణిస్తున్న వారందరిని గూర్చి నేను ఎల్లప్పుడు ఈ రీతిగా చెప్పగోరుచున్నాను, ఎందుకనగా మనమిక్కడ యాత్రికులమును, పరదేశులమైయున్నాము. ఇది మన గృహము కాదని మనము ఒప్పుకొనుచున్నాము. మనము, దేనికి దేవుడు శిల్పియు, నిర్మాణకుడనైయున్నాడో ఆ పట్టణమును వెదుకుచున్న అబ్రాహాము యొక్క సంతానమైయున్నాము.
ఇది ఎంతో అందమైన దేశము. నేను ఎక్కడా ఇటువంటి దానిని చూడలేదు. నేను సుమారుగా ప్రపంచములోని ప్రతి దేశమును తిరిగాను, కాని ఎక్కడ కూడా, యూరప్, ఇటలీ, ఆసియా, తూర్పుదేశాలలో ఎక్కడ కూడా ఫినిక్స్, అరిజోనాకు సాటియైన ప్రాంతమును చూడలేదు. అవును. అది నిజము. నేను చూసినవాటన్నిటిలో ఇది అత్యంత సౌందర్యమైన ప్రాంతము. కాని, ఓ, ఇది ఆ గొప్ప వెయ్యేండ్ల పరిపాలనలో ఉండుదానికి త్రోవగా వున్నది. కాబట్టి మనము … ఇది మన గృహము కాదు; మనము ఇక్కడ యాత్రికులమైయున్నాము. మనము కలసి సహవాసము చేయుటకు ఇక్కడ కూడుకొనియున్నాము. నేను ఇక్కడకు వచ్చి దేవుని సంఘము అభివృద్ధి చెందుట చూచుట నాకు ఆశీర్వాదమైయున్నది. ఆ సంఘము నూతన భవనముతో ఆశీర్వదించబడినది. ప్రజలారా, దేవుడు ఎల్లప్పుడూ మిమ్మును దీవించును గాక! క్రీస్తుకు ఎల్లప్పుడూ నమ్మకస్తులైయుండుడి. సంఘ కాపరికి యధార్ధముగా యుండుడి. ప్రతి ఒక్కరూ చెయ్యి, చెయ్యి, కలిపి, కలసి పనిచేయండి, ఎందుకనగా ప్రభువు రాకడ సమీపముగా వున్నదని నేను నమ్ముచున్నాను.
11ఇప్పుడు, కొద్ది క్షణములు మనము తలలు వంచి, మనము వాక్యమును సమీపించుటకు ముందు మనము ప్రార్థనలో గ్రంథకర్తను సమీపించుదాము. మనము ప్రార్థించుటకు ముందుగా, మీ తలలు మరియు హృదయములు వంచియుండగా, ఎవరికైనా ప్రార్థనా మనవులు ఉన్నట్లయితే, మీ చేతిని పైకెత్తి దానిని తెలియపరచండి. మీరు ఏదైనా అవసరత కలిగినట్లయితే, "ప్రభువైన యేసూ, నన్ను జ్ఞాపకము చేసుకోండి," అని చెప్పండి. ప్రభువు ప్రతి హస్తమును చూస్తున్నారు. నేను నిశ్చయంగా చెప్పగలను.
JOHN 14:13•
JOHN 15:16
12మా పరలోకపు తండ్రీ, భూమ్యాకాశముల గొప్ప సృష్టికర్తా, గొప్ప ఎలోహీమ్, ఎల్షద్దాయ్, బలమునిచ్చువాడా, పోషించువాడా, సమస్తమునకు చాలినవాడా, నిన్ను మేము, "తండ్రీ" అని పిలువగలుగుటను బట్టి మేము ఎంతో ఆనందిస్తున్నాము. మరియు నీ స్వంత ప్రియ కుమారుని ద్వారా, ఆయన మాకు చెప్పియున్నాడు. మేము నీ యొద్దకు వచ్చి ఆయన నామములో మేము ఏది అడిగినా, ఆయన దానిని మాకు అనుగ్రహించునని చెప్పెను.
తండ్రి, మరియు అది షరతుల మీద ఆధారపడియున్నదని మేము నమ్ముచున్నాము. ఒకవేళ మేము ఏదైనా తప్పుడు కార్యమును అడిగినట్లయితే, అది అనుగ్రహించబడుతుందని నమ్ముటకు కావలసిన విశ్వాసము మేము కలిగియుండలేము. కాని మేము ఈ రాత్రి మా హృదయములను పరిశీలించుకొని, మేము ఏ తప్పుడు కార్యమును అడుగుటలేదు, కాని సరియైన కార్యమును అడుగుచున్నామని ఎరిగియున్నాము. ప్రభువా, మా అందరి పాపములను, అతిక్రమములను క్షమించండి. ప్రభువా, నిజముగా అది మొదటి కార్యమైయున్నది. మేము పాపముతో నీ సన్నిధిలోనికి ప్రవేశించగోరలేదు.
13ప్రతి దినము సమస్యలు, సులువుగా చిక్కులుబెట్టు అనేక సంగతులు, మా ఆలోచనలలో మేము గమనించని అనేక సంగతులు మేము కలిగియున్నాము… కాని మేము పరిశుద్ధుడైన దేవుని గూర్చి తలంచినప్పుడు, ఆయన దృష్టికి దూతలు కూడా మురికియైయున్నారు. ప్రభువా, యేసుక్రీస్తు రక్తము ద్వారా తప్ప నీ సన్నిధికి వచ్చే ఒక్క అవకాశము మాకు లేదని మేము ఎరిగియున్నాము. నీ రక్తము ద్వారా వచ్చినప్పుడు మేము దేవుని పిల్లలమైయున్నాము. మా తప్పిదములు ఒప్పుకొనినప్పుడు వాటిని నీవు క్షమించుచున్నావు.
తండ్రీ, ఈ రాత్రి తమ చేతులు పైకెత్తిన ఈ సమాజమును ఆశీర్వదించమని నేను ప్రార్ధిస్తున్నాను. ప్రభువా, ఆ హస్తములలో ప్రతిదాని వెనుకనున్న వాటిని నీవు ఎరిగియున్నావు. ఆలోచన, ఆశ, ఉద్దేశము, కారణములు మీరు ఎరిగియున్నారు. ప్రతివారి యొక్క మనవిని అనుగ్రహించవలసినదిగా నేను ప్రార్ధిస్తున్నాను.
14తండ్రీ, ఇప్పుడు ఈ సంఘము నిమిత్తము ప్రార్ధిస్తున్నాము. ఈ స్థలమును బట్టి మేము ఎంతో ఆనందిస్తున్నాము. మేము చదివియున్నాము. ప్రారంభ దినములలో క్రైస్తవులు ఎంతగానో ద్వేషించబడ్డారు, వారు ఒక ఆలయమును కూడా కలిగిలేరు. వారు ఎంతో ఎంతో పేదవారైయున్నారు. వారు ఒక ఆలయమును నిర్మించుకొనుటకు అవకాశము లేకుండా వున్నారు. మరియు ఈ రోజు ఈ గొప్ప అందమైన భవనము కట్టబడుట చూసియున్నాము. చక్కటి పరిశుభ్రమైన స్థలమునకు ప్రజలు వచ్చి ఆరాధించుటకు అవకాశము కలిగియున్నాము. దీనిని బట్టి మేము ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభువు కొరకు ఈ ఆలయమును నిర్మించుటకు ప్రజలు త్యాగపూరితముగా ఇచ్చిన కానుకలు, దశమ-భాగములు, విరాళములను బట్టి వందనములు.
15తండ్రీ, దేవా, సంఘ కాపరిని, డీకన్లను, ట్రస్టీలను మరియు సంఘమునకు వచ్చు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్ధిస్తున్నాను. ఇది దినదినము అభివృద్ధిపొందును గాక. సంఘము నుండి ఈ లోయ అంతా వ్యాపించే పాత-కాలపు ఉజ్జీవము ప్రారంభమగును గాక. ఈ సంఘములో అద్భుతములు, సూచనలు, స్వస్థతలు, రక్షణ వుండును గాక. ప్రభువా, దీనిని అనుగ్రహించండి.
ఈ స్థలము నుండి, చక్కటి బోధకులు, యవ్వనస్తులు, తమ జీవితములో దేవుని పిలుపు కలిగి, వారు ఎక్కడికి పిలువబడ్డారో - ఆ సువార్త పొలములలోనికి వెళ్ళుదురు గాక. ప్రభువా, దీనిని అనుగ్రహించండి.
మరియు ఈ రాత్రి, మేము ఇక్కడ కూడుకొనియుండగా, పరిశుద్ధాత్మ మా మధ్యకు వచ్చి వాక్యములోనికి ప్రవేశించి, ఇక్కడ కూడియున్న ప్రతి హృదయములో ఆ విత్తనము నాటును గాక. అది గొప్ప వృక్షములుగా ఎదిగి దేవునికి మహిమ తెచ్చువరకు మేము దానికి దివారాత్రులు విశ్వాసముతో నీరు కట్టుదుము గాక.
ప్రభువా, ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తిని స్వస్థపరచండి. నశించిన ప్రతి వ్యక్తిని రక్షించండి. విశ్వాసము నుండి జారిపోయిన ప్రతి ఒక్కరిని వెనుకకు తీసుకురండి. మునుపు నింపబడిన ప్రతి ఒక్కరిని నూతనపరచి మరలా నింపండి. ప్రభువా, దీనిని అనుగ్రహించండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్.
16నేను ఎప్పటివలెనే ఆలస్యము అయ్యాను. నేను ఇక్కడ ఉండాలని ఆశించిన దానికంటే కొంచెము ఆలస్యము అయ్యాను. మరియు మేము రేపు రాత్రికి మరొక స్థలములో ఉండబోవుచున్నాము. వారు ఇప్పటికే దానినిగూర్చి ప్రకటించారని తలచుచున్నాను. మరియు రేపు రాత్రికి ఈ స్వంత సంఘములో ఆరాధన వున్నట్లయితే, అక్కడికి రావద్దు. కాని ఒకవేళ మీకు ఆరాధన లేనట్లయితే, మిమ్ములను కలిగియుండుటను బట్టి మేము సంతోషిస్తాము. ఏ పరిస్థితులలోనైనా ప్రజలు తమ బాధ్యతాయుతమైన స్థానములలో నిలబడియుండాలని మేము ఎప్పుడూ కోరుచుంటాము. సంఘము తెరువబడినప్పుడు, ప్రతి సైనికుడు, తన స్థానములో, తన హోదాలో నిలబడవలసియున్నది.
17కాబట్టి వ్యాపారుల కూడిక సభలకు ముందుగా, ఈ స్థలములను దర్శించుట ద్వారా, గొప్ప సమయమును మేము కలిగియున్నాము. నేను ఇంతకుమునుపు ప్రకటించినట్లుగా గురువారము రాత్రికి ఆరాధన ప్రారంభించుటకు సహోదరుడు రాబర్ట్స్ ఇక్కడకు వస్తారు. సహోదరుడు రాబర్ట్స్ ను కలుసుకొనుటకు మనమందరమూ ఎంతో ఆనందిస్తున్నాము. ఒకవేళ శుక్రవారము రాత్రికి సహోదరుడు వెల్మర్ గార్డెనర్ ఇక్కడకు వస్తారని నేను తలస్తున్నాను. ఆయన ఆ రాత్రికి ప్రసంగిస్తారో, లేదో నాకు తెలియదు.
శనివారము ఉదయము, అల్పాహార సమయములో నాకు సమయము కేటాయించబడినది అని తలస్తున్నాను. ఒకవేళ శనివారము ఉదయము నేను ప్రసంగించుట దేవుని చిత్తమైతే, నేను ఈ అంశమును తీసుకోవాలనుకొనుచున్నాను, (ఒకవేళ దేవుని చిత్తమైతే), "నే కలసినవారందరిలో అత్యంత స్వార్ధమైన మనుష్యుడు," అనే అంశము మీద ప్రసంగించెదను. మరియు… మరియు తరువాత ఆదివారము మధ్యాహ్నము నేను మరలా ప్రసంగిస్తాను.
18కాబట్టి ఒకవేళ మీరు… ఇప్పుడు నాకు తెలిసినంతవరకూ శనివారము ఉదయము ఏ కూడిక ఉండదు, మరియు ఆదివారము మధ్యాహ్నము ఏ కూడిక వుండదు, నాకు తెలిసినంతవరకు… ఇప్పుడు నేను ప్రారంభించుటకు ముందు, నేను మర్చిపోయాను… లేదు, బిల్లీ మిగిలిన ప్రార్థనా కార్డులు ఇచ్చివేశాడని చెప్పినట్లు నేను నమ్ముచున్నాను. అది నిజమేనా? ఈ రాత్రి ఇక్కడ ప్రార్ధనా కార్డులు ఇచ్చారా? మంచిది, గతరాత్రి అతడు కొన్ని కార్డులను వేరే సంఘములో ఇచ్చాడు, ఎందుకనగా, నేను ప్రజలను చాలాసేపు ఉంచాను.
నేను చాలాసేపు ప్రసంగించాను. ఆరు లేక ఎనిమిది గంటలు, లేక సుమారుగా అంతసేపు, నేను చాలా ఒత్తిడి చెందాను. ఆ రాత్రి నేను దానిలో సగము కూడా ప్రసంగించాలని కోరుటలేదు. కాబట్టి, వారు ప్రార్థనా కార్డులు ఇచ్చియున్నారు. మరియు మీరు, మనము ప్రార్ధనా వరుస ముగించిన తరువాత మీరు మధ్య-రాత్రికి ఇంటికి వెళ్ళవచ్చు. కాబట్టి అది దానిలో సగము అవ్వవచ్చును.
నాకు ఎక్కువగా తెలియదు, కాని నాకు తెలిసిన దానిని చెప్పుటకు నాకు ఎక్కువ సమయము పడుతుంది. కాబట్టి నేను దేనినైతే ఎరిగియున్నానో, దానిని చక్కగా చెప్పుటను నేను ఇష్టపడతాను. దాని నిమిత్తము తగినంత సమయమును నేను తీసుకొంటాను, మీకు తెలుసు. అది మంచిది. నేను కేవలము మీతో పరిహాసమాడుచున్నాను, ఎందుకనగా నేను మరొక నలభై-ఐదు నిమిషాలలో ముగించి, ప్రార్ధనా వరుసలోనికి వెళ్తాను.
MARK 10:28
19ఈ రాత్రికి ఒక చిన్న వాక్య-భాగమును చదువగోరుచున్నాను. దేవుడు దీనిని ఆశీర్వదించాలని నేను ప్రార్ధిస్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తరువాత దానిని చదవాలని ఆశించినట్లయితే, అది మార్కు సువార్త 10వ అధ్యాయము, 28వ వచనము.
పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను.
కాబట్టి నేను ఇప్పుడు ఈ వాక్య-భాగమును తీసుకొని, "సమస్తమును విడిచి" అనే అంశము మాట్లాడగోరుచున్నాను. మరియు తరువాత, కొద్ది నిమిషములలో మేము రోగుల కొరకు ప్రార్ధిస్తాము. మరియు మీకు మార్కు సువార్త 10వ అధ్యాయము యొక్క పూర్వాపరములు మీకు తెలుసు. అంతకు ముందే యేసు, విడాకుల గూర్చి మాట్లాడియున్నారు.
MATT 19:16,20•
MARK 10:17,20,21•
LUKE 18:18,21
20మరియు తరువాత ఆయన ఒక గొప్ప అద్భుతమైన కార్యము కలిగియున్నాడు. ఆయన దగ్గరకు ఒక యవ్వనస్తుడైన ధనవంతుడు పరుగెత్తి వచ్చి, "సద్భోదకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి?" అని అడిగాడు.
అప్పుడాయన అతనితో, "ఆజ్ఞలను నెరవేర్చుము," అని చెప్పాడు.
ఆ యవ్వనస్తుడు, "బాల్యము నుండియే నెరవేర్చుచున్నాను, లేక ఏ ఆజ్ఞలు?" అని చెప్పెను. అవి ఏమిటో ఆయన, అతడికి చెప్పెను. మరియు అతడు, "వాటిని నేను నెరవేర్చాను," అని చెప్పెను.
ఆయన, "కాని నీకు ఒకటి కొదువగాయున్నది. నీవు నిత్యజీవము కలిగియుండాలంటే, పరిపూర్ణుడువై యుండుము. నీకున్నదంతయూ అమ్మి, బీదలకిమ్ము - నీ సిలువ నెత్తుకొని నన్ను వెంబడించుము," అని చెప్పెను.
మనము చదివిన వాక్య-భాగములోనికి వెళ్ళుటకు ముందుగా పూర్వాపరముల కొరకు కొద్ది నిమిషములు ఈ యవ్వనస్తుడిని అనుసరించుదము.
MARK 10:21
21ఇప్పుడు మీరు గమనించండి, సమస్తమును విడవమని ఆ యవ్వనస్తుడికి చెప్పబడింది, కాని దానిని చేయుటకు అతడు తృణీకరించాడు. కొన్నిసార్లు విజయమునకు కొలబద్దగా అభివృద్ధిని మరియు సంపదను లెక్కిస్తాము… కాని ఈ యవ్వనస్తుడు విజయవంతమైన యవ్వనస్తుడు, అయినప్పటికి అతడికి నిత్యజీవము లేదు. కాబట్టి, విజయము అనేది ఎల్లప్పుడూ దేవుడు ఆశీర్వదిస్తున్నాడని కాదు.
కాని మనము అతడిని గమనించుదాము. అతడు యువకుడు అని మనము చూస్తున్నాము. యవ్వనస్తుడు, బహుశా అందమైనవాడు, చక్కటి వస్త్రధారణ కలిగియున్నాడు. బైబిల్, "యేసు అతడిని ప్రేమించెను" అని చెప్పినది. అతడు ఖచ్చితముగా చక్కటి, మంచి మృదువైన మనస్సాక్షిని కలిగియుండవచ్చు. అతడు ఖచ్చితముగా ఏదో విషయములో గొప్పవాడైయుండవచ్చు, లేనట్లయితే అతడు యేసు మెప్పు పొందకలిగేవాడు కాదు, ఎందుకనగా, యేసు అతడిని చూసినప్పుడు, "ఆయన అతడిని ప్రేమించాడు." అతడు చక్కటి వ్యక్తీకరణ, మర్యాదస్తుడువలె, "నిత్యజీవమునకు వారసుడిని అవ్వాలంటే నేను ఏమి చెయ్యాలో తెలుసుకొనగోరుచున్నాను," అని అడిగాడు.
MATT 19:22-24,26•
MARK 10:22-25,27•
LUKE 18:23-25,27
22అతడు నిత్యజీవమును పొందుటకు తనకున్నదంతయు విడిచిపెట్టవలసివచ్చినప్పుడు, ఇప్పుడు ఆ ప్రశ్న ద్వారము వద్ద నిలబడినది, నీవు దానిని చేయగలవా, ఇప్పుడు ఆ ప్రశ్న మనందరియెదుట ఉన్నది.
మరియు యేసు నిజముగా అతడిని, తనకున్నదంతయు విడిచి, అతని సిలువ ఎత్తుకొని, ఆయనను వెంబడించమని అడిగాడు, మరియు మనకు ఆ కథ తెలుసు. "అతడు మిక్కిలి ఆస్తిగలవాడు, గనుక ఆ మాటలకు ముఖము చిన్నబుచ్చుకొని, దుఃఖపడుచు వెళ్ళిపోయెను." అప్పుడు యేసు, తిరిగి ఇట్లు చెప్పెను, "ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము. ధనవంతుడు పరలోకములో ప్రవేశించుటకంటే, సూది బెజ్జములో ఒంటె ప్రవేశించుట సులభము. అయితే అది మనుష్యులకు అసాధ్యము; కాని దేవునికి అది అసాధ్యము కాదు, అని ఆయన చెప్పెను.
23మనము ఈ యవ్వనస్తుడైన ధనవంతుడిని గమనించుదాము. పరిశుద్ధ గ్రంధము మరలా ఇతడిని మనము చూసినప్పుడు, అతడు ఎన్నడూ … యేసును వెంబడించే తరుణమును అతడు తృణీకరించిన వెంటనే, ఆ అవకాశము అతనికి కఠినముగా కన్పించినది.
మీరు గమనించండి, మనము కలిగియుండగలిగినవన్నిటిని హత్తుకొని, అప్పుడు యేసును వెంబడించగోరుచున్నాము. కాని కొన్నిసార్లు యేసు మనలను సమస్తమును విడవమని కోరుచున్నాడు. తద్వారా మన రెండు హస్తములతో ఆయనను కలిగియుండవచ్చును. కొన్నిసార్లు మనము దానిని ఆలోచిస్తాము, ఎందుకనగా మనము దానిని పట్టుకొన్నామని…
24నా ఇద్దరు చిన్న బాలికల గూర్చి నేను ఎప్పుడూ చెప్పే విషయము నాకు జ్ఞాపకము వస్తుంది. ఇప్పుడు వారు చిన్న పిల్లలు కాదు. వారు ఇప్పుడు యుక్త-వయస్సుకు వచ్చారు. కాని వారు చిన్న పిల్లలప్పుడు సంగతి… వారిలో ఒకామె రిబ్కా — ఆమె పెద్దది. మరియు శారా, ఆమె చిన్నపిల్ల, రిబ్కా కన్నులు నీలము రంగులో వుండేవి; శారా కన్నులు గోధుమ వర్ణములో వుండేవి. కాని మీకు తెలుసా, వారిద్దరూ నాన్న కూతుళ్ళు. కాబట్టి వారు ఇద్దరూ కూడా నేను ఇంటికి వచ్చే వరకు ఎదురుచూసేవారు. వారు ఎల్లప్పుడు నన్ను చూచుటకు ఇష్టపడేవారు. మరియు బెక్కీ పొడవుగా, సన్నగా వుండేది; మరియు శారా చిన్నగా పొట్టిగా బొద్దుగా వుండేది.
25కాబట్టి ఒక రాత్రి, వారు ఇద్దరు కూడా నేను ఇంటికి రావటం కోసం ఎదురుచూస్తున్నారు. నేను కూటముల నిమిత్తము వెళ్ళాను, నేను ఇంటికి వస్తానని వాళ్ళకు తెలుసు. కాబట్టి వారు కొంతసేపు నిరీక్షించగలమనుకొన్నారు. ఒకవేళ నేను ఇంటికి వచ్చినట్లయితే, వారు నన్ను చూడాలనుకొన్నారు. మంచిది, ఇసుక మనిషి వారి కళ్ళలో ఇసుక చల్లి ఉండవచ్చు. వారు నిద్రించారు, మరియు చివరికి వారు తమ గదిలోనికి వెళ్ళి నిద్రపోయారు.
నేను ఆలస్యముగా వచ్చాను. కాబట్టి నేను వచ్చేసరికి బాగా అలసిపోయాను, నేను పడకమీదకు వెళ్ళాను. కూడికలు అయిన తరువాత నేను బాగా అలసిపోయాను, కొన్ని వారముల సభలను బట్టి అలసిపోయాను. నాకు నిద్రపట్టుటలేదు. నేను రెండు లేక మూడు గంటలు నిద్రించిన తరువాత లేచి, హాలులోనికి వచ్చి కుర్చీలో కూర్చొన్నాను. వేకువ ఝాము ఉదయాన నేను అక్కడ కుర్చీలో కూర్చొన్నాను.
26మరికొంతసేపటి తర్వాత, బెక్కీ తన పడక గదిలో కదిలింది. ఆమె అది పగటి వెలుగు అని గుర్తించినది. ఆమె హాలులోనికి చూసినది, నేను అక్కడ కుర్చీలో కూర్చొనియుండుట ఆమె చూసినది. ఆమె పడక మీదనుండి దిగి తన శక్తికొలది నా వద్దకు చేరుటకు వచ్చినది. ఆమె పొడవైన, సన్నని కాళ్ళు నన్ను సమీపించాయి.
మంచిది, అది శారాని మేల్కొలిపినది. మీ పిల్లలు ఆ విధముగా చేస్తారో, లేదో నాకు తెలియదు కాని నేను, మీరు పెద్దవారికి దుస్తులు తెచ్చినప్పుడు అవి తర్వాత చిన్నవారు దానిని వేసుకుంటారు. శారా, రిబ్కా యొక్క పైజమా వేసుకున్నది. కాళ్ళు చాలా పొడవుగా వున్నాయి. ఆ పైజమా ఆమెకు చాలా పెద్దగా వున్నది. ఆమె మంచము దిగి, పెద్ద పాదములలో ఎగురుతూ నా వద్దకు వచ్చినది. ఆమె రిబ్కాతో పోటీపడలేకపోవుచున్నది.
27కాబట్టి ఆమెను దాటి నా వద్దకు వచ్చింది. ఆమె, నా ఒడిలోనికి దూకినది. ఆమె రెండు చేతులను నా చుట్టూ వేసినది. ఆమె, నా కుడికాలు మీద వున్నది. ఆమె పొడవైన కాళ్ళు నేలను తాకుచున్నవి. ఆమె చక్కగా సమతూకముగా వున్నది.
అది నాకు ప్రారంభములో వచ్చిన గొప్ప సంస్థలను జ్ఞాపకముకు తెచ్చినది. మీకు తెలుసు, అవి చాలా కాలము నుండి వున్నాయి — పొడవైన కాళ్ళు కలిగి అందముగా, సమతూకముతో ఉన్నారు. మరియు ఇక్కడికి శారా వచ్చినది, యువ సంఘము, మీకు తెలుసు, అది కొద్ది కాలము క్రితమే ప్రారంభమైనది. మరియు ఆమె, బెక్కీ తనను ఓడించుట చూసినది.
28కాబట్టి రిబ్కా నా చుట్టూ తన చేతులు వేసినది. ఆమె చుట్టూ చూసినది, మరియు ఆమె అన్నది, "శారా, నా సహోదరీ, నీవు ఒక విషయము తెలుసుకోవాలి. నేను మొదటిగా ఇక్కడకు వచ్చాను." మరియు ఆమె అన్నది, "నేను నాన్నను పూర్తిగా కలిగియున్నాను, నీ కోసం ఏమీ మిగలలేదు." (వారు ఎల్లప్పుడూ దానిని మనకు చెప్పుటకు ప్రయత్నించుదురు.) ఆమె అన్నది, నేను ఇక్కడకు ముందుగా వచ్చాను మరియు నాన్నను పూర్తిగా నేను కలిగియున్నాను, మరియు నీ కోసము ఏమియు మిగలలేదు."
పాపం చిన్న శారా తన తలను దించుకొన్నది. ఆమె చిన్న పెదవి క్రిందకు వాలినది. ఆమె అక్కడి నుండి వెళ్ళిపోబోయినది, ఆ పెద్ద గోధుమ వర్ణపు కన్నులలో నీరు నిండినది. మరియు బెక్కీ తన తలను నా భుజము మీద వాల్చి, నన్ను హత్తుకొన్నది. నేను నా వేలును శారా వైపుకు ఆ విధంగా చూపి, మరొక కాలును ముందుకు చూపాను.
29అమె అక్కడికి వచ్చి మరొక కాలమీద ఎగిరి కూర్చొన్నది. మరియు ఆమె స్థిరముగా కూర్చోలేకపోయినది. ఆమె కాళ్ళ నేల మీద ఆనుటలేదు. కాని ఆమె ఏదో రీతిగా ఆ కాలుమీద కూర్చొనియున్నది, చూచారా. కాబట్టి ఆమె ఆ విధంగా అటూ ఇటూ కదులుచున్నది.
మంచిది, ఆమె పడిపోకుండా పట్టుకొనుటకు, నా రెండు చేతులు తీసి, ఆమె చుట్టూ ఈ విధముగా పెట్టాను. ఆమెను నా దగ్గరకు చేర్చుకొని పట్టుకొన్నాను. ఆమె తన చిన్న తలను నా మీద ఆనించినది. ఆమె పైకి లేచి బెక్కీ వైపు చూస్తూ అన్నది, "ఇప్పుడు నా సహోదరీ రిబ్కా, నేను కూడా నీకు ఒక విషయము చెప్పగోరుచున్నాను. నీవు ఒకవేళ నాన్నను పూర్తిగా కలిగియుండవచ్చును, కాని నీవు ఈ విషయము కూడా తెలుసుకోవాలి, నాన్న నన్ను పూర్తిగా కలిగియున్నారు." అది నిజము.
కాబట్టి మనము ఆ రీతిగా ఉండగోరుచున్నాము. ఆయన మన సమస్తమును కలిగియుండాలని కోరుచున్నాము. కాబట్టి, మనము సమస్తములోని విశ్వాసము కలిగి ఆయనను విశ్వసిస్తూ, ముందుకు సాగిపోవాలి, కేవలము నమ్ముము. మనము దానిని వివరించలేము. దానిని వివరించుటకు ఏ మార్గము లేదు; మనము కేవలము దానిని విశ్వసించి, మరియు దానిని అలాగు తీసుకొన్నాము.
LUKE 12:19•
LUKE 16:23
30ఈ ధనవంతుడైన యవ్వనస్తుడు, తనను తాను క్రీస్తుకు అర్పించలేకపోయాడు, కాబట్టి అతడు వెళ్ళిపోయాడు. మరల తరువాత అతనిని మనము చూస్తాము.. అతడు ఎంతగానో అభివృద్ధి చెందాడు. అతని కొట్లన్నియూ పూర్తిగా నిండిపోయాయి, అతడన్నాడు, "నా ప్రాణమా సుఖించుము." ఓ, అతడు ప్రతి విషయములో ఎంతో అభివృద్ధి చెందాడు. అతడు ఎంతో సమృద్ధిని కలిగియున్నాడు, అతనికి కొదువ ఏమిలేదు.
కాని ఒక సంఘటన జరిగింది. తర్వాత అతనిని మనము చూసినప్పుడు, అతడు అగ్నిగుండములో తన కన్నులెత్తి, దూరమున అబ్రాహాము రొమ్మున ఆనుకొనియున్న భిక్షగాడిని చూశాడు. దాని కారణము ఏమిటంటే, యేసుక్రీస్తును వెంబడించుటకు అతడు తనకున్న సమస్తమును విడిచిపెట్టలేకపోయాడు.
MATT 19:27•
MARK 10:28
31ఇది జరిగిన తరువాత, ధనవంతుడైన యవ్వనస్తుడు, యేసును వెంబడించుటకు తనుకున్న సమస్తమును విడిచిపెట్టలేకపోయిన తర్వాత, అది పేతురులో ఒక ప్రశ్న ఉద్భవింపచేసినది (ఈ వాఖ్యనము చేసినది, లేక ఈ ప్రశ్న వేసినది అతడే అని తలస్తున్నాను.) అతడున్నాడు, "ఇప్పుడు, నిన్ను వెంబడించుటకు మేము సమస్తమును విడిచిపెట్టాము. మేము సమస్తమును విడిచిపెట్టాము. మేము చేసిన దానిని చూడుము. మేము మా ఇండ్లను విడిచిపెట్టాము, మేము మా కుటుంబములను విడిచిపెట్టాము, మేము మా పొలములను విడిచిపెట్టాము, నిన్ను వెంబడించుటకు మాకున్న సమస్తమును విడిచిపెట్టాము."
అది అతడిలో జ్ఞాపకము వచ్చినది. బహుశా క్రీస్తును గమనిస్తూ అతడు ఆ పనిలో ఎంతగానో లీనమైయుండవచ్చు. క్రీస్తును గమనిస్తూ, అతడు తన ఇంటిని విడిచివచ్చిన సంగతి కూడా అతడు మరచిపోయాడు. ఆ విషయము అతనికి జ్ఞాపకము లేదు. అతడు తన కుటుంబమును విడిచి వచ్చాడు. అతడు తన తల్లిని, తండ్రిని విడిచి వచ్చాడు. యేసును వెంబడించుటకు అతడు తనకున్నదంతయూ విడిచి వచ్చాడు.
32అయితే దేవుడు ఖచ్చితముగా దానినే కోరుచున్నాడు. సమస్తమును విడిచి, ఆయనను వెంబడించుము. అది దేవుడు కోరేది. మనము కూడా దానిని చేయాలి. కొన్నిసార్లు మనము మన స్వంత ఆలోచనలు కూడా మరచిపోవాలి. దేనిగూర్చి అయినా మన ఆలోచనలు వాక్యమునకు వ్యతిరేకముగా వున్నట్లయితే, మనము మన ఆలోచనలు విడిచిపెట్టి ఆయనను వెంబడించాలి. మనము ఆయనను వెంబడించగలిగిన ఒకే ఒక్క మార్గము, ఆయన వాక్యమును వెంబడించి, దానికి లోబడుట. దేవుడు మననుండి కోరేది, ఆశించేది, మనము సమస్తమును విడిచి ఆయనను వెంబడించుట.
కాని అలాగు చేయుటలో కొన్నిసార్లు మనము, మన స్నేహితులను విడిచిపెట్టవలసి యుండుటను మనము కనుగొంటాము. అనేకసార్లు ఆ పని చేయుటకు కఠినముగా వుంటుంది. ఇప్పుడు, అనేకమంది ప్రజలు వారు మొదటిసారిగా క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. ఉదాహరణకు కొంతమంది స్త్రీలు, కొన్ని ప్రత్యేకమైన రాత్రులలో వినోదాలకు వెళ్ళి జూదము, పేకాట ఆడుతుంటారు. పొరుగువారితో సహవాసము కలిగి, ఫలాని సొసైటీలకు చెంది, పొరుగువారితో కలసి జూదమాడుతుంటారు.
ఈ స్త్రీలు వీటిని గూర్చి మరొక రీతిగా చెప్పుతారు. వారు దానిని గ్రహించలేరు. అయినప్పటికినీ నీవు దానిని విడిచిపెట్టవలసియున్నది, ఎందుకనగా జూదము, పేకాట అనునది సరియైనది కాదు. నీవు ఒకవేళ యేసును వెంబడించాలంటే నీవు దానిని విడిచిపెట్టాలి.
DEUT 22:5
33కొన్నిసార్లు మన సంఘములలోని స్త్రీలు పొట్టి దుస్తులు, అనైతిక వస్త్రములు, అసభ్యమైన వస్త్రధారణ కలిగియుంటున్నారు. మరియు పరిశుద్ధ గ్రంథము దానిని గూర్చి, "స్త్రీ అటువంటి వస్త్రధారణ కలిగియుండుట దేవుని దృష్టికి హేయమైనది," అని చెబుతుంది. ఆమె దాని గూర్చి ఏమి తలంచినప్పటికి, ఆమె దానిని విడిచిపెట్టాలి. కొన్నిసార్లు మనము చూస్తాము, స్త్రీలు మార్గములోనికి వచ్చి రక్షించబడిన తర్వాత, వారికి అంతకుముందు జట్టు కత్తిరించే అలవాటు వుంటుంది. వారు లోకములో మిగిలినవారివలె ప్రఖ్యాతి కలిగియుండాలని కోరుకుంటారు. కాని వారు అది కష్టమైన కార్యమని గుర్తిస్తారు, ఎందుకనగా నీవు క్రైస్తవులవలె వస్త్రములు ధరించినప్పుడు, క్రైస్తవుని వలె ప్రవర్తించినప్పుడు, క్రైస్తవునివలె నీవు జీవించినప్పుడు - వారు నిన్ను పాత-కాలపు పద్ధతులు పాటించువాడివంటారు. వారు నిన్ను పాత-కాలపు వాడివంటారు, కాని నీవు ఆయనను వెంబడించుటకు సమస్తమును విడిచిపెట్టాలి.
JOHN 15:7•
1JN 2:15
34యేసు చెప్పెను, లేక లేఖనములు చెప్పుచున్నావి, "లోకము ప్రేమించువానిలోను, లేక లోకములో ఉన్నవాటిని ప్రేమించువానిలో, దేవుని ప్రేమ ఎంతమాత్రముండదు." నిజము. అది కలిగియుండాలంటే, సమస్తమును విడవాలి. నీవు సమస్తమును విడిచిపెట్టుటకు ఇష్టపడి, ఆయనను వెంబడించగోరినప్పుడు, అప్పుడు, "మీరు నాయందు నిలిచియుండుడి, నా వాక్యము మీయందు నిలిచియున్నయెడల, అప్పుడు మీకేది ఇష్టమో దానిని అడుగుడి. అప్పుడది మీకు అనుగ్రహించబడుతుంది." కాని అవి తప్పు అని నీవు ఎరిగినవాటిని నీవు పొందుకోలేవు. ఎందుకనగా అవి తప్పు అని నీకు తెలుసు.
పేకాట, సిగరెట్ త్రాగుట, మద్యపానము సేవించుట, అసభ్యమైన వస్త్రధారణ కలిగి నీవు క్రైస్తవుడవని చెప్పుకొనుటను బైబిల్ వ్యతిరేకిస్తుంది. ఒకవేళ నీలో వున్న ఆత్మ వాటిని ఖండించనట్లయితే, అప్పుడు నీలో వున్న ఆత్మలో ఏదో తప్పు ఉన్నది. ఎందుకనగా వాక్యము వ్రాసిన దేవుడు వాక్యమైయున్నాడు, మరియు నీలో ఉన్న వాక్యము నిన్ను ఖండిస్తుంది, అది దానిని చేయాలి. మరియు ఒకవేళ అలా జరుగకపోతే, నీవు మోసగించబడ్డావు. పరిశుద్ధాత్మ ఒక కార్యమును గూర్చి వ్రాసినప్పుడు, నీవు దానినుండి తొలగిపోయి, దానికి వ్యతిరేకముగా ప్రవర్తిస్తూ, పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తుంది అని ఎలా చెప్పగలవు? నీవు దానిని చేయలేవు.
35కాబట్టి సిగరెట్లు త్రాగుట, విస్కీ త్రాగుట, పేకాట, జట్టు కత్తిరించుకొనుట, పొట్టి వస్త్రములు ధరించుట, ఇలాటివన్నియు తప్పు, పాపము, నీవు వీటిని విడిచిపెట్టే వరకు నీవు ఎక్కడకు వెళ్ళలేవు. ఇవి మన పెంతుకోస్తు ఉద్యమములోనికి నిదానముగా చొరబడుచున్నవి. అది మీకు సిగ్గుచేటు. నీవు దానిని గూర్చి సిగ్గుపడాలి. మనము ప్రపంచ వ్యాప్త ఉజ్జీవము కలిగిలేమంటే ఆశ్చర్యపడవలసినది లేదు. మనము పెంతుకోస్తు ఉజ్జీవము కలిగి లేకపోవుటలో ఆశ్చర్యములేదు. ఏదో జరిగింది. అది నిజము. మనము మన అడ్డు కర్రలను పడవేసి, జరుగకూడని కార్యములు, జరుగునట్లు చేస్తున్నాము. కాబట్టి క్రీస్తును వెంబడించుటకు నీవు సమస్తమును విడిచిపెట్టాలి.
MATT 28:20•
JOHN 1:1,14
36నీవు ఖచ్చితముగా నీ స్వంత ఆలోచనలు విడిచిపెట్టాలి. నీవు ఖచ్చితముగా వాక్యముతో సమ్మతించాలి. పరిశుద్ధాత్ముడు ఎన్నడూ అది పలికిన వాక్యమును తృణీకరించదు. మరియు పరిశుద్ధ గ్రంధము, పరిశుద్ధాత్మవలన వ్రాయబడినది. బైబిల్ ఆ విధముగా చెప్పుచున్నది. పరిశుద్ధ గ్రంధములోని వాక్యము దేవుడయితే… "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద వుండెను. వాక్యము దేవుడై యుండెను. మరియు ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను." ఇప్పుడు, వాక్యము ఆత్మగా మారి మనలో నివసిస్తున్నది, "నేను మీతోను, మీలోను యుగసమాప్తి వరకు ఉందును" — పూర్తియగుట.
PHIL 2:5
37ఇప్పుడు, పరిశుద్ధ గ్రంధమును వ్రాసిన అదే దేవుడు, నీలో ఉన్నాడు, నీవు నీ స్వంతానివి కావు. నీవు లోకములోని కార్యములకు మరణించావు. నీవు నీ స్వంత తలంపులకు మరణించావు. మరియు మనస్సు… "…క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరు కలిగియుండుడి." నీవు సమస్తమును విడిచి ఆయనను వెంబడించినప్పుడు దానిని కలిగియుంటావు. నీ స్వంత ఆలోచనలు కాదు. ఆయన ఏమి చెప్పెను, "నా చిత్తము కాదు. ప్రభువా, నీ చిత్తమే." అప్పుడు నీవు దేవుని వాక్యమునకు అనుగుణముగా అడుగులు వేస్తావు. దాని దగ్గర చాలాసేపు నిలిచియుండవచ్చు, కాని నేను ఇంకా కొంచెము ముందుకు వెళ్తాను.
కాని నీవు అనవచ్చు, సమస్తము విడిచిపెడితే, నేను ఏమి పొందుకుంటాను? సమస్తమును విడిచిపెట్టుట ద్వారా, నేను ఏమి పొందుకుంటాను?"
38లోకము నిన్ను హేళన చేస్తుందని నీవు ఆలోచించవచ్చు. లోకము అనేకమైన అవమానకరమైన పేర్లతో నిన్ను పిలస్తుందని ఆలోచించవచ్చు. వారు నిన్ను ఎలా పిలవాలనుకుంటే, ఆ పేర్లన్నింటితో నిన్ను పిలవవచ్చు. వారు నిన్ను నిరసిస్తారు, తృణీకరిస్తారు. యేసు, ఆయన ఇమ్మానుయేలు గనుక, దేవుడు ఆయనలో నివసించాడు. అది ఆయనను, ఆయన సంఘమునకు ఎంతో వింతైన వ్యక్తిగా మార్చినది. ఆయన లోపలికి రాగానే వారు ఆయనను వెలివేశారు. ఆయనను సిలువలో వ్రేలాడతీసినది వారే. ఆయనను ఖండించినవారు వారే. ఆయన ప్రజలను ప్రేమించాడు. ఆయన హృదయమంతయూ ప్రజల కొరకే. కాని దేవుని వెంబడించుటకు ఆయన సమస్తమును విడవవలసి వచ్చినది. అదే విధముగా మనము కూడా దేవుని వెంబడించుటకు సమస్తమును విడిచిపెట్టాలి.
2TIM 3:12
39ఇప్పుడు. ప్రతిఫలము ఏమి పొందుకుంటాను? మనము దేనిని ఆశించుట లేదు… కొన్నిసార్లు సేవలకులమైన మనము మార్పు చెందువారికి చాల ఎక్కువ పూలబాటగా చేస్తామని తలస్తున్నాను. "ఓ, క్రీస్తు వద్దకు రండి. సమస్తము ప్రియముగా ఉంటుంది." కాని మీరు చూడండి, సమస్తము సులువుగా, పూలపాన్పువలె ఉంటుంది అనేమాట సరియైనది కాదు. ఎందుకనగా, ఏ క్రైస్తవుడును…
పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, "క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకగోరినవారు శ్రమలు సహించవలెను." కాబట్టి, ఒకవేళ నీవు క్రీస్తు కొరకు శ్రమపడకపోతే, అప్పుడు ఎక్కడో తప్పున్నది. ఒకవేళ దయ్యము నీవెంట పడుటలేదంటే, వాడు నిన్ను అప్పటికే పట్టుకొని యున్నాడు. అది అంతే, ఎందుకనగా వాడు నీవెంట పడుతున్నంతకాలము, వాడు నిన్ను ఇంకా పట్టుకొనలేదని అది గుర్తుగా యున్నది. కాని ఒకవేళ వాడు నీవెనుక పడలేదంటే, వాడు పట్టుకొన్నాడని గుర్తు. అవును, కాబట్టి వాడు నీ వెనుక పడుతున్నంత కాలము, నీవు ఇంకను వాడికంటే కొన్ని అడుగుల దూరము ముందున్నావని గుర్తుంచుకో, మరియు నీవు ముందుకు కొనసాగుచూ ఉండుము.
MATT 5:12•
2TIM 3:12
40"కాని క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించకోరిన వారందరూ
హింసించబడుదురు." ఆయన చెప్పెను, సంతోషించుడి, అత్యధికముగా ఆనందించుడి, ఎందుకనగా వారు మీ ముందున్న ప్రవక్తలను ఆ రీతిగానే హింసించారు." అది నిజము. నీవు ముఖమును వ్రేలాడేసుకొని ఈ రీతిగా చెప్పవద్దు, "మంచిది, నేను దానిని చేసి యుండవలసినది కాదు. వారు నన్ను అనేక మాటలు అనునట్లుగా నేను ఒకరికోసం నిలబడియుండవలసినది కాదు. దానిని బట్టి వారు నన్ను పాతకాలపు పద్ధతులు కలిగిన వ్యక్తి అనుచున్నారు. నేను ఇది, అది, ఫలానా." ఓ, నీవు దానినిబట్టి అత్యధికముగా సంతోషించి, ఆనందించాలి, ఎందుకనగా నీవు ఆయన నామమును బట్టి నిందను భరించగలిగావు. ఆయన ఆజ్ఞలను వెంబడించుట ద్వారా నీవు దానిని చేయగలిగావు.
41కాని నీవు ఈ విషయము కూడా చెప్పగోరుచున్నాము. (సాధ్యమైనంత త్వరగా ముగిస్తాను), దేవుడు ఎప్పుడూ కూడా ఏ మనిషికి ఏ విధముగాను అచ్చియుండడు. దేవుడు ఏ మనుష్యునికి అచ్చియుండలేడు. నీవు దేవుని నిమిత్తము సమస్తము విడిచినట్లయితే, దేవుడు తిరిగి వెయ్యి-రెట్లు ఇస్తాడు. నిజము. దేవుడు తిరిగి చెల్లిస్తాడు. నీవు లోకమును విడిచిపెట్టు, లోకాశలను, లోకమును విడిచిపెట్టు, దేవుడు నీకు తిరిగి అనేక రెట్లు ఇస్తాడు. ఈ రాత్రి దానికి ఎంతమంది సాక్ష్యులు ఉన్నారు? మంచిది, దేవుడు తిరిగి చెల్లిస్తాడని మనకు తెలుసు.
GEN 13:14,15
42ఇప్పుడు, సమస్తమును విడిచిపెట్టిన కొంతమంది వ్యక్తులను చూద్దాము. మొదటిగా విశ్వాసమునకు పితరుడైన అబ్రాహామును చూద్దాము. అబ్రాహాము తన స్వదేశమును విడిచిపెట్టాడు. తనకున్న ఆస్తిని విడిచిపెట్టాడు మరియు తనకున్న సమస్తమును విడిచిపెట్టాడు. అతడు కల్దియ ప్రాంతము నుండి, ఊరు అనే పట్టణము నుండి పిలువబడ్డాడు. అతడు తన దేశమును, ఇంటిని, తన ప్రజలను, తన సమస్తమును విడిచి దేవుని వెంబడించాడు. తన వెనుక సమస్తమును విడిచిపెట్టవలసి వచ్చినది. అతడు తన భూములను, కల్దియ ప్రాంతములోని ఊరులో వున్న తన ఆస్తులను విడిచి వచ్చాడు. అతడు తన ఆస్తిని విడిచివచ్చాడు, మరియు దేవుడు అతనికి వాగ్దాన దేశము అంతటిని ఇచ్చాడు. దేవుడు ఎంతో వడ్డీతో తిరిగి చెల్లించాడు. ఆయన అతడికి ఇచ్చాడు… ఆయన, అతడిని ఆ దినమున కలిసినప్పుడు చెప్పెను, "అబ్రాహామా, లెమ్ము. తూర్పువైపున, ఉత్తరము వైపున, పశ్చిమము వైపున, దక్షిణము వైపున చూడుము. దీనంతటిని నేను నీకు ఇస్తున్నాను. అది అంతా నీదే."
43ఈ రాత్రి క్రైస్తవులతో అదే విషయము ఉన్నది. దేవుడు దానిని మనకు ఇచ్చెను, కాని దానిని పరిశీలన చేయుటకు భయపడుచున్నాము. నీవు క్రైస్తవుడవైనప్పుడు, పరిశుద్ధ గ్రంధములోని ప్రతి వాగ్దానమునకు నీవే వారసుడవైయున్నావు. అది నిజము. దేవుడు వాగ్దానము చేసిన సమస్తమును నీదే. అది ఒక పెద్ద దండవంటిది. క్రీస్తు అయిన దానిలోనికి ఒక్క ఆత్మవలన బాప్తిస్మము పొందితిమి, మంచిది, ఒకవేళ నేను… ఒకవేళ ఎవరైనా నాకు ఏదైనా ఇస్తే, నేను అక్కడికి వెళ్ళి మరియు నా సొత్తును నేను చూస్తాను.
ఈ రాత్రి క్రైస్తవులు అదే కార్యమును చేయవలసియున్నదని నేను తలంచుచున్నాను. నీవు ఏమి పొందుకున్నావో, వెళ్ళి దానిని కనుగొనుము. ఒకవేళ ఏదైనా కొంచెం ఎత్తులో నాకు అందకుండా ఉంటే, నేను వెళ్ళి నిచ్చెన వేసుకొని దానిని అందుకుంటాను. మరియు పరిశుద్ధ గ్రంథములో దేవుడు వాగ్దానము చేసినది నాకు అందకుండా దూరముగా వుంటే, నేను మోకాళ్ళ మీద ఉండి, దానిని అందుకొనే వరకు యాకోబు నిచ్చెన ఎక్కుతాను, ఎందుకనగా అది నాది. దేవుడు దానిని నాకు ఇచ్చాడు.
MARK 11:24
44ఒకవేళ, పరిశుద్ధ గ్రంధము దైవిక స్వస్థత వాగ్దానము చేసినప్పుడు, నేను రోగిగా ఉంటే, దేవుడు దానిని నాకు ఇచ్చువరకు నేను అక్కడ నిలబడియుంటాను, ఎందుకనగా అది వాగ్దానము. నేను లోకమును విడిచిపెట్టినప్పుడు, ఆయన నాకు పరిశుద్ధాత్మను ఇస్తానని, దేవుడు వాగ్దానము చేశాడు. దేవుడు నా హృదయాశను తీరుస్తానని వాగ్దానము చేసినప్పుడు, మరియు నా హృదయాశ సరియైనది అయినప్పుడు, దేవుడు దానిని ఇచ్చువరకు నేను అక్కడే ఉంటాను, ఎందుకనగా అది దేవుని వాగ్దానము. నేను సర్వలోకమును విడిచిపెట్టాను. నేను ఆయన వెనుక నడవగోరుచున్నాను. మరియు ఆయన చెల్లిస్తాడు. అది సత్యమని నాకు తెలుసు, అది ఖచ్చితముగా నిజము.
GEN 12:1
45అతడు ఏమి చేశాడు? అతడు తన భూములను, దేశమును విడిచిపెట్టాడు. మరియు దేవుడు అతనికి ఆ ప్రాంతము అంతయూ ఇచ్చివేశాడు. లేక పాలస్తీనా ఖండమంతటిని ఇచ్చాడు. పాలస్తీనాలో ఉన్న సమస్తమును పొందుకొనుటకు అతడు తన ప్రాంతములో ఉన్న చిన్న స్థలమును, బహుశా తన చిన్న పాత ఇల్లు ఉన్న ఎకరము భూమిని విడిచిపెట్టాడు. మంచిది.
కాని మొదటిగా అతడు చేయవలసినది తననుతాను ప్రత్యేకపరచుకొనుట. అతడు తన ప్రజల నుండి, తనను వేరుచేసుకొన్నాడు. తన ప్రియుల నుండి, తన సహోదరులు, సహోదరీలు, తన్ను ఎరిగిన తన స్నేహితుల నుండి, బబులోను నుండి తనతో వచ్చిన తన బాల్య-కాలపు స్నేహితుల నుండి అతడు వేరుపరచబడ్డాడు. దేవుడు అతనిని పిలిచినప్పుడు, అతనితో చెప్పెను, నీ స్వజనుల నుండి వేరుకమ్ము. దానంతటి నుండి తొలగిపొమ్ము." ఇప్పుడు అది కఠినమైనది, కాని అతడు తన స్వజనులు అందరినుండి వేరు అయ్యాడు. ఎందుకని? ఎందుకనగా వారు అతనితో సమ్మతించారు.
46వారు అతనితో ఏకీభవించుటను నీవు ఊహించగలవా? ఇక్కడ ఒక వృదుడు, డెబ్బై-ఐదు సంవత్సరముల వృద్దుడు, అరవై-ఐదు సంవత్సరముల ముసలి భార్యతో కలసి బయలుదేరుచూ, "మీకు ఇది తెలుసా? నేను అక్కడ దేవుడిని కలిశాను. ఆయన నాతో, నేను శారా వలన బిడ్డను కనబోవుచున్నాను" అని చెప్పెను. ఎందుకు, అబ్రాహాము యొక్క స్నేహితుడైన వైద్యుడు, "ఈ వృద్దుడి మతిపోయింది" అని చెప్పియుండవచ్చు. కాని అతడు అప్పటికే పిన్నులు, ఆట వస్తువులు, మరియు సమస్తమును కొని, దేవుడిచ్చిన వాగ్దానము కొరకై సిద్ధపడియున్నాడు, ఎందుకనగా అతడు ఆ వాగ్దానమును ఖచ్చితముగా పొందుకుంటానని అతడు దానిని ఎరిగియున్నాడు. అది నిజము. ఎట్టి సందేహము లేదు. ఎందుకు? దానిని దేవుడు వాగ్దానము చేశాడు. ఒకవేళ ఆ ప్రజల గుంపు వారిని చూసి ఎగతాళి చెయ్యాలనుకున్నారు, అతని మతిపోయింది అని తలంచారు…
వారు ప్రతి విశ్వాసిని అదే విధముగా చేశారు. అబ్రాహాము సంతానము అందరూ దానిని కలిగియున్నారు. అది నిజము. కొన్నిసార్లు నీ సంఘము కూడా నీకు వ్యతిరేకముగా మారుతుంది. నీ చుట్టూవారు, నీ స్వస్థలమువారు, నీ పొరుగునున్న సహవాసములు, నీ సహాధ్యాయులు నీకు వ్యతిరేకముగా మారుతారు. కొన్నిసార్లు నీ ప్రియుడు లేక ప్రియురాలు నిన్ను క్రిందకు తోసివేస్తారు. కాని నీవు ఆయనను వెంబడించాలంటే నీవు సమస్తమును విడిచిపెట్టాలని దేవుడు కోరుచున్నాడు. ఆయనకు వ్యతిరేకముగా ఉన్న సమస్తమును విడిచిపెట్టి, ఆయనను వెంబడించాలి.
47అబ్రాహాము తన ప్రజలను విడిచిపెట్టాడు, దానికి బదులుగా అతడు ఏమి పొందుకున్నాడు? దానితోపాటుగా ఏమి లభించినది. అతడు అనేక దేశములకు పితరుడయ్యాడు. దేవుడు అతడిని అనేక జనాంగములకు తండ్రిని చేశాడు. అతడు ఏ చిన్నవాటిని విడిచిపెట్టాడో, తరువాత అతడు ఏమి పొందుకున్నాడో చూడండి. యేసు చెప్పెను, "నా కొరకు విడచిపెట్టు…తండ్రిని మరియు తండ్రిని," మరియు మొదలైన. సమస్తమును విడిచి, ఆయనను వెంబడించుట ద్వారా అబ్రాహాము ఏమి పొందుకున్నాడో చూడండి. అవునయ్యా, అనేక జనాంగములకు తండ్రి.
48అయితే మొదటిగా అతడు సమస్త అవిశ్వాసము నుండి వేరుపడాలి. అంతమాత్రమే కాదు, చల్లటి, నులివెచ్చటి సంఘ సభ్యుడైన సహోదరుడు లోతు నుండి కూడా వేరుపడవలసివచ్చింది. దాని నిమిత్తము అతడు తననుతాను విడువవలసి వచ్చింది. అవిశ్వాసము కలిగియున్న సమస్తము నుండి, నిన్నునీవు వేరుపరచుకొనవలసి యున్నది. అది ఏదైనా సరే. ఒకవేళ అది సంఘ సిద్దాంతమైనా, నీవు సంఘములో ఉండి, దేవుని వాక్యమును విశ్వసించకుండా, కేవలము ఆ సిద్దాంతము మీదనే ఆధారపడినట్లయితే, ఒకవేళ వాక్యము దానికి వ్యతిరేకమైనట్లయితే… ఒకవేళ సిద్ధాంతము, వాక్యముకు వ్యతిరేకమైనదైతే, నీవు దానిని విడిచిపెట్టవలసియున్నది. నీవు సమస్తమును విడిచిపెట్టాలి.
GEN 13:14
49అబ్రాహాము సంపూర్ణముగా లోబడేవరకు దేవుడు అతనిని ఆశీర్వదించలేదు. అబ్రాహాము తనతో పాటు తండ్రిని కూడా తీసుకువెళ్ళాలని కోరాడు. మరియు ఆ వృద్దుడు ఎల్లప్పుడూ తైలములోని ఈగవలె ఉన్నాడు. చివరికి అతడు మరణించాడు. తరువాత లోతు — అతనితో ఎల్లప్పుడూ గొడవలు. అబ్రాహాము దేవునికి సంపూర్ణముగా విధేయత చూపించిన వెంటనే, అతడు తనను తాను వేరుపరచుకున్నాడు, లోతును తనకు నచ్చిన మంచి భూములను ఎన్నుకోనిచ్చాడు. అతడు సొదమకు వెళ్ళాడు. తరువాత దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమయ్యి, అతనితో, "నీ కన్నులను పైకెత్తుము. ఈ సమస్తమును నీకు ఇచ్చుచున్నాను," అని చెప్పెను.
అబ్రాహాము ఒక్కడే వేరుపడ్డాడు. దేవుని వెంబడించుటకు అతను సమస్తమును విడిచిపెట్టాడు. అతడు విశ్వాసులకు తండ్రి. అతడు విశ్వాసము కలిగినవాడని మనము నమ్ముచున్నాము." వాగ్దానము అబ్రాహాముకు, అతని సంతానముకు ఇవ్వబడినది. క్రీస్తునందు మృతులైన మనము అబ్రాహాము యొక్క సంతానమును మరియు వాగ్దానమునకు వారసులైయున్నాము.
50ఇశ్రాయేలు ఐగుప్తును విడిచిపెట్టెను. వారు ఐగుప్తులోని పాత భూములను విడిచిపెట్టారు. దేనిని పొందుకొనుటకు? పాలస్తీనా, ఐగుప్తలోని ఆ భయంకర స్థలముల నుండి, వెట్టిపని చేపించే అధికారులను విడిచి వారు వచ్చారు.
ఈ రోజు అనేకమంది ప్రజలు, ఒక రోజున మన రేడియోలో విన్నట్లుగా, యవ్వనస్తులు వీధులలో తిరుగుచూ, సిగరెట్లు త్రాగుచు, మద్యపానము త్రాగుచూ ఉన్నారు. ఆ పాత దయ్యము పట్టి, వీధులలో తిరుగుచూ బూగీ-వూగీ అని పిలచే నాట్యము చిందులు వేయుచున్న వారిని పోలీసులు వచ్చి అరెస్టు చేయవలసివస్తుంది. వారి మతులు పోయి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. చూశారా, నిజముగా ఒక యవ్వన స్త్రీ తన గూర్చి ఒక్క ఔన్సు మర్యాద కలిగియుండినా, లేక తన పురుషుని గూర్చి వారు ఆ విధముగా ప్రవర్తించరు. అది వారిని వెట్టిపని చేయించు అధిపతిగా, ఆ పని చేయుటకు వారిని నడిపిస్తుంది.
నీవు దానిని విడిచిపెట్టి, దేవుడు నీకు నాట్యమును ఇస్తాడు. ఓ, మై! ఆయన ఖచ్చితముగా ఇస్తాడు. నీవు కేవలము దానిని విడిచినట్లయితే, దేవుడు నీకు ఒకదానిని ఇస్తాడు. అయితే నీవు దానిని పొందుకోవాలంటే, నీవు ఆ విషయములన్నింటిని విడిచిపెట్టాలి. నీవు ఆ రెంటితో కలసి కొనసాగలేవు.
51అబ్రాహాము లేక ఇస్సాకు పాలస్తీనాను పొందుకున్నాడు. భూమికి బదులుగా అతడు పాలస్తీనా పొందుకున్నాడు. వారక్కడ తమ పాత భూములను వదిలిపెట్టి, పాలు - తేనెలు ప్రవహించే పాలస్తీనా పొందుకున్నారు. అవునయ్యా. వారు దేనిని విడిచిపెట్టారు? ఐగుప్తులో ఆ వెట్టిపని చేపించు అధికారులను, ఎండలో పని చేయుటను విడిచిపెట్టారు.
వారు అక్కడ ఆ తీక్షణమైన ఎండను విడుచుట వలన వారు ఏమి పొందుకున్నారు? వారు అగ్నిస్తంభపు వెలుగులో నడిచారు. అక్కడి ఎండను వారు విడిచి, దేవుని అగ్నిస్తంభపు వెలుగులో వారు నడిచారు. అది ఎలాంటి మార్పుడి! నేను కూడా ఆ మార్పుడిని చేసుకోగోరుచున్నాను, నీవు కోరవా? అగ్నిస్తంభము, ఆ భౌతికమైన సూర్యుని వెలుగులో ఆ పని చేపించు అధికారుల క్రింద వారు పనిచేశారు. దానినుండి వారు బయటకు వచ్చి, దేవుని వెలుగులో పరిశుద్ధాత్మ శక్తి క్రింద వారు నడిచారు. ఆ అగ్నిస్తంభము వారిని వాగ్దాన దేశము నడిపించుచున్నది.
ఈ రోజు కూడా అదే విషయము: దేవుని వెలుగులో నడచుటకు, ఈ లోకపు వెలుగు నుండి, ఈ లోకపు కార్యముల నుండి బయటకు రమ్ము. అది నిన్ను వాగ్దాన దేశమునకు నడిపించును.
52వారు ఐగుప్తు యొక్క పాత వెల్లుల్లి కుండలను విడిచిపెట్టారు. ఐగుప్తులో మాంసపు పాత్రలను విడిచిపెట్టారు. ఆ పాత మాంసపు కుండలను వారు విడిచినందుకు వారు ఏమీ పొందుకున్నారు? వారు దేవదూతల ఆహారమును తిన్నారు. వెల్లుల్లికి బదులుగా, పరలోకము నుండి మన్నా వచ్చినది. నీవు ఇప్పటి వరకు వెల్లుల్లి తప్ప మరేదియు తినకపోయియుంటే, నీకు ఒక విషయము చెప్పనీయండి. నిన్ను పోషించుటకు దేవుడు పరలోకము నిండా దేవదూతల ఆహారము కలిగియున్నాడు. అది నిజము. దానికి బదులుగా వారు దేవదూతల ఆహారము పొందుకున్నారు, పాత ఐగుప్తు యొక్క వెల్లుల్లి బదులుగా.
వారు ఐగుప్తు యొక్క బురద నీటిని విడిచిపెట్టారు. వారు అక్కడ ఏమి పొందుకున్నారు? అరణ్యములో కొట్టబడిన బండ నుండి, స్వచ్ఛమైన పరిశుద్ధమైన, దేవుని జలములు పానము చేశారు. వారు ఐగుప్తు యొక్క బురద నీటిని, పాత మత సంస్థల బురద నీటిని విడిచిపెట్టారు.
53ఈ రోజు మనము కొన్ని విషయములలో ఆ రీతిగా చేయవలసియున్నది. ఆ పాత సిద్దాంతమును, మత శాఖలు చెప్పేదానిని విడిచిపెట్టు, "అద్భుతములు జరిగే కాలము గతించిపోయినది. వారు పిచ్చివాళ్ళు ఇక్కడికి వచ్చి, "ఇమ్మానుయేలు రక్తనాళముల నుండి ఊటలోనిది పానము చేయుము. పాపులు అందులో మునిగి తమ పాపపు డాగులనుండి శుద్దులవుతారు." అయ్యా!
ఆ పాత బురద నీటిని విడిచిపెట్టి, సందేహములు, కలవరము, వివాదములు, కలతలు మరి అటువంటి వాటితో అవి మిళితమైయున్నాయి. రాత్రిపూట విందులు చేసి, కోడి మాంసము వేయించి, ప్లేటును, యాభై సెంట్లకు అమ్మి బోధకునికి జీతము చెల్లిస్తున్నారు. నీవు ఒకవేళ దేవుని ఆజ్ఞల క్రిందకు వచ్చినట్లయితే, దేవుని పరిశుద్ధమైన కట్టడములు, నీవు దశమ-భాగములు చెల్లిస్తావు. దానినిబట్టి బోధకుడు బాగుగా ఉంటాడు. నీవు దేవుడు చెప్పిన ప్రకారము చేసినట్లయితే అది సరియైనది. పాత బురద నీటిని విడిచి — బండలోని నీటిని త్రాగుము.
EXOD 15:26•
PS 103:3•
PS 105:37
54తమ గూర్చి గొప్ప చెప్పుకొనే వైద్యులను వారు ఐగుప్తులో విడిచివచ్చారు. "ఈ కాలములో ప్రపంచములో తెలివికలిగిన వారిమి మేము అని గొప్పలు చెప్పేవారు. ఆ గొప్ప వైద్యుని దగ్గరకు వచ్చుటకు, వారు డంబములు పలికే వైద్యులను విడిచిపెట్టారు. ఆమెన్. ఆ గొప్ప వైద్యుడు చేసినట్లుగా, ఈ దినమున కొంతమంది వైద్యులు చేయుట నేను చూడగోరుచున్నాను. ఆ ప్రజలు నలభై సంవత్సరములు అరణ్యములో ఉన్నారు, కాని వారిలో బలహీనుడు ఒక్కడు లేడు. నలభై సంవత్సరములలో ఒక్క బలహీనుడు కూడా లేడు. ఆ సమయములో సుమారుగా ఇరవై లక్షలమంది ప్రజలు వచ్చారు.
ప్రతి రాత్రి ఎంతమంది శిశువులు జన్మించారు? రోగులు ఎంతమంది? మరియు వారు… నేను వైద్యుడైన మోషే దగ్గరకు వెళ్ళి ఆయన వారికి ఎలాటి ఔషధములు ఇచ్చాడో, అతని సంచిలోని చీటినీ చూడగోరుచున్నాను. నీవు కూడా దానిని చూడగోరుటలేదా? అనేకమంది వైద్యులు ఆ మందుల చీటి చూడగోరుచున్నారని నేను ఊహించగలను. మంచిది. నేను దానిని చెప్పగలను, నేను దానిని చదివాను. అది ఏమిటో నేను మీకు చెప్పనా? "నీ రోగములన్నింటిని నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే." అతడు కలిగియున్నదంతా అదియే. ఆ గొప్ప వైద్యునితో ఉండుటకు, డంబములు పలికే వైద్యులను విడిచి వచ్చిన వారికోసం అతనికి కావలసినంతా అదియే. అవునయ్యా!
55"అద్భుతములు జరిగే కాలము దాటిపోయినది, ఇక ఎంతమాత్రము అద్భుతములు జరుగవు," అని చెప్పే ప్రజల మాటలు నీవు విడిచిపెట్టుము. ఏమి చేయుటకు వారు దానిని విడిచిపెట్టారు? తరువాత వారు ఏమి చేశారు? దినదినము అద్భుతములు జరిగే సన్నిధిలో వారున్నారు. ఆమెన్! ఈ రోజు ఎవరైతే అద్భుతములు లేవు అంటున్నారో, వారి మనస్సులో ఏదో తేడా ఉన్నది. అది నిజము.
56ఒకసారి ఒక వ్యక్తి నాతో చెప్పెను, "నీవు ఏమి చేసినా నేను లెక్క చేయను. నేను లక్ష్యపెట్టను, నీవు ఎంత రుజువులు చూపినా నేను లక్ష్యపెట్టను. నేను దానిని విశ్వసించను."
నేనన్నాను, "ఖచ్చితముగా కాదు, నీవు ఎన్నడూ దానిని చూడలేవు. నీవు దానిని చూడలేనంత గ్రుడ్డివాడివి." అది సత్యము. నేనన్నాను, "అది అవిశ్వాసుల కొరకు కాదు; అది విశ్వాసుల కొరకే. విశ్వాసులు దానిని చూస్తారు," అది నిజము.
ఒక వ్యక్తి ఒక సమయములో నన్ను వీధిలో కలిసినప్పుడు చెప్పెను, "నీ బోధ తప్పు."
"అది బైబిల్," అని నేను అన్నాను.
అతడన్నాడు, "నీవు తప్పు చేస్తున్నావు. అందుకే నేను నీకు వ్యతిరేకముగా ఉన్నాను." "నన్ను గుడ్డివాడిగా చేయుము. పౌలు ఒక వ్యక్తిని గుడ్డివాడిగా చేశాడు. నన్ను గుడ్డివాడిగా చేయుము," అని అనెను.
నేను చెప్పాను, "నేను దానిని చేయలేను. నీవు ఇప్పటికే గుడ్డివాడివి. అవును, నీవు … నీ తండ్రియైన అపవాది ఇంతకు ముందే చేసిన కార్యమును, నేను ఎలా చేయగలను? అలాటి మాటలు పలికే వ్యక్తి ఎంతో అంధుడు. పగటి వెలుగుకు చీకటి మధ్య బేధము తెలియదు. జీవము మరియు మరణము మధ్య తేడాను వివేచించలేడు. అది నిజమైన అంధత్వము. అవునయ్యా.
57ఆ గొప్ప పరమ వైద్యుడు వారితో ఉన్నాడు. వారు అద్భుతములు సంభవించుట చూశారు. ఖచ్చితముగా.
మరియు శిష్యులు, వారు ఏమి విడిచారు? వారు వలలు కలిగియున్నారు, చేపల వలలు. ఆయనతో కలసి నడచుటకు, మెస్సీయాగా ఆయన చేసే సూచనలు అద్భుతములు, ఆయన శక్తిని చూచుటకు వారు తమ చేపల వలలను విడిచిపెట్టారు. దాని వెంబడించుటకు, ఒక దినపు చేపల వేటను విడిచిపెట్టని ఏ వ్యక్తిలో అయినా, సమస్య ఉన్నది. చేపలతో నిండియున్న వారు వలలను వారు విడిచిపెట్టారు. వారు ఆ వలను లాగుట ప్రారంభించారు, వారు ఎన్నడూ పట్టనటువంటి గొప్ప చేపలను వారు ఆ దినమున పట్టారు. ఆయనను వెంబడించుటకు దానిలోని ప్రతిదానిని వారు విడిచిపెట్టారు, ఎందుకనగా ఆయనే మెస్సీయా అని వారు హృదయములో విశ్వసించారు, మరియు మెస్సీయ యొక్క సూచనలు ఆయనను వెంబడిస్తున్నవో లేదో చూచుటకు ఆయనను వెంబడించాలని ఆశించారు. మరియు వారు దానిని చూడవలసియున్నది.
HEB 13:8
58ఈ లోకములో ఉన్న దేనినైనా నేను విడిచిపెడతాను. యేసుక్రీస్తు తననుతాను ప్రత్యక్తపరచుకొనుటను, నేను దేనిని విడవవలసి వచ్చినా నేను లెక్క చేయను; ప్రత్యేకముగా ఆయన జీవితములో ప్రత్యక్షమైనప్పుడు, నేను మరణము నుండి జీవములోనికి దాటియున్నానని నేను ఎరుగుదును, మరియు ఆయన మెస్సీయ అని నేను ఎరుగుదును. ఆయన వాక్యమును బట్టి ఆయనను అంగీకరించుట ద్వారా నేను, నా పాప జీవితము నుండి రక్షించబడ్డానని నాకు తెలుసు. పరిశుద్ధాత్మ నాలో నివసించుచున్నదని నేను ఎరుగుదును. ప్రతిచోట జరుగుచున్న అద్భుతములు దానినే చూపిస్తున్నది. ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా యున్నాడని నేను ఎరుగుదును. సమస్తమును విడిచిపెట్టి. దేనినైనా విడిచిపెట్టుటకు నేను సిద్ధమే.
59ఒకప్పుడు నేను మంచి మత సంస్థకు, చక్కటి సంఘముకు, దేశములోనే అత్యున్నతమైన దానికి నేను చెందియున్నాను. కాని వారు చెప్పారు, "బిల్లీ, నీవు మతి పోగొట్టుకొని పరిశుద్ధ గుండ్రాయిగా మారతావు."
అక్కడే, నేను చెప్పాను, "ఇప్పుడు మీరు కావాలంటే నా సహవాసపు కార్డు తీసుకొనవచ్చు, ఎందుకనగా నేను పరిశుద్ధాత్మను వెంబడిస్తాను." అది నిజము! సత్యము. ఆయనను వెంబడించుటకు నీవు సమస్తమును విడిచిపెట్టాలి. అది సత్యము. ఎవడైతే సమస్తమును విడిచి ఆయనను వెంబడిస్తాడో, దేవుడు అతనిని విస్తారమైన ఆశీర్వాదములతో, ఐశ్వర్యమును తిరిగి అనుగ్రహిస్తాడు. దానితో పోల్చుటకు సాటియైనది ఏదియులేదు. సరే.
60ఇప్పుడు శిష్యులు తమ వలలను, చేపలతో నిండుగా ఉన్న చేపల వలలను, తమ వృత్తిని విడిచిపెట్టారు. ప్రభువైన యేసును వెంబడించుటకు, ఆయన శక్తిని, సూచనలను చూచుటకు వారు తమ వృత్తిని విడిచిపెట్టారు. వారు శిక్షణ పొందిన వారు. మెస్సీయ ఏమి చేయవలసియున్నదో వారు ఎరిగియున్నారు. వారు బైబిల్లో చదివారు, మెస్సీయా వచ్చినప్పుడు ఏమి చేయబోవుచున్నాడో, వారు అర్థము చేసుకున్నారు. అది జరిగే కాలము. అదే అని వారు ఎరిగియున్నారు. ఎప్పుడైతే ఈ వ్యక్తి రంగము మీదికి వచ్చి, ఆ చిత్రములో అమరుట చూచితిరో, ఆయన చెప్పిన దానిని వినుటకు వారు సమస్తమును విడుచుటకు సిద్ధపడ్డారు; ఎందుకనగా ఆయన మెస్సీయా అయినట్లయితే, అప్పుడు అది వారికి జీవము, ఎందుకనగా ఆయనను వెంబడించుటకు వారు ఆహ్వానించబడ్డారు. కాబట్టి వారు ప్రతిదానిని విడిచిపెట్టారు.
JOEL 2:23•
MARK 16:17•
JOHN 11:25,26•
JOHN 14:12
61కాబట్టి ఈ రోజు అలా ఉన్నదా? ఒకవేళ ఇది సత్యమైతే, ఈ చివరి దినములలోని పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క వర్తమానము, ఆయన తన కడవరి వర్షమును మరియు తొలకరి వర్షమును మన మీద కుమ్మరిస్తానని చెప్పెను. ఒకవేళ ఇవి సత్యమైనట్లయితే, దానిని వెంబడించుటకు సమస్తమును విడుచుటకు యోగ్యమైనది. యేసు చెప్పెను, "విశ్వసించు వారిని ఈ సూచనలు వెంబడించును. నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను, అతడు మరలా బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచినవాడు ఎన్నటికినీ చనిపోడు. నాయందు విశ్వాసముంచిన వాడు, నేను చేయు కార్యములను చేయును." నిజము.
MATT 28:20•
MARK 16:15-18•
JOHN 20:21
62"సర్వలోకమునకు, సర్వసృష్టికి వెళ్ళుడి. విశ్వసించిన వారిని ఈ సూచనలు వెంబడించును. నా నామములో వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు, సర్పములను ఎత్తిపట్టుకుందురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు." అది ఆయన చెప్పినది.
"తండ్రి నన్ను పంపినట్లుగా, నేను మిమ్ములను పంపుచున్నాను." కుమారుని పంపి తండ్రి, కుమారునితో తోడుగా వెళ్ళాడు. కుమారునిలో నివసించాడు. యేసు తను పంపిన వ్యక్తికి, తోడుగా వెళ్తాడు, అవే కార్యములు చేయుటకు అతనిలో ఉంటాడు. "ఇదిగో, నేను ఎల్లప్పుడూ మీతో ఉందును. యుగసమాప్తి వరకు మీతో ఉందును. మరియు నేను చేసిన కార్యములు మీరు కూడా చేస్తారు."
63సహోదరుడా, అది పాత సిద్దాంతములు. లోకములోని పారంపర్యాచారముల కంటే ఉత్తమమైనప్పుడు, ఆ సమస్తమును తృణీకరించుము. సజీవుడైన దేవుడు మన మధ్య సంచరించుటను చూచుటను బట్టి మనము ఈ ప్రపంచములో అందరికంటే ఆనందముగా ఉండాలి. ఆయనను వెంబడించుటకు, మనము సమస్తమును విడిచిపెట్టామని ఎరుగుటనుబట్టి ఆనందించాలి. ఆమేన్! అది నాకు మరింత భక్తి అనుభూతిని ఇచ్చుచున్నది. ప్రభువైన యేసును వెంబడించుటకు సమస్తమును విడిచిపెట్టుట. ఈ రోజు అలాగే, నీవు సమస్తమును విడిచిపెట్టాలి. గతకాలములో వారు చేసిన విధముగానే, నీవు కూడా చేయవలసియున్నది.
MATT 8:20•
MATT 10:25•
MATT 12:24•
MARK 3:22•
LUKE 9:58•
LUKE 11:15
64మనము సమస్తమును వీడిన కొంతమంది గూర్చి మాట్లాడినాము, ఇప్పుడు యేసు, మన కోసము యేసు ఏమి విడిచిపెట్టాడో చూద్దాము. యేసు సమస్తమును విడిచిపెట్టాడు. ఆయన పరలోకములో గృహము కలిగియున్నాడు. ఆయన పరలోకములో ఉన్న తన గృహమును విడిచి, భూమి మీదకు వచ్చాడు. ఆయనకు ఇక్కడ తలవాల్చుకొనుటకు కూడా స్థలము లేదు. అది నిజము. ఆయన ఎంతో అల్పునిగా చేసుకొనెను, ఎంతవరకు అనగా ఆయన… చాలా పేదవాడిగా మారాడు, నిద్రించుటకు పడక కూడా లేనంతగా తగ్గించుకున్నాడు. ఆయన చెప్పెను, "నక్కలకు బొరియలున్నాయి, ఆకాశపక్షులకు గూళ్ళున్నాయి, కాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకు కూడా స్ధలము లేదు," చూచారా.
అయితే దానినిబట్టి ఆయన ఏమి పొందుకున్నాడు? ఆయన ఎంతో ఉన్నతమైన స్థానముకు హెచ్చించబడ్డాడు. పరలోకమును చూచుటకు ఆయన క్రిందికి చూడవలసినంత ఎత్తుకు హెచ్చించబడ్డాడు. ఆయన ఈ లోకములోనికి వచ్చి, ఈ లోకములో ఆయన తీసుకోగలిగిన అత్యంత నీచమైన పేరును తీసుకున్నాడు. ఆయన హీనమైన పేరు భరించాడు — బయల్జెబూబు అని పిలువబడ్డాడు. బయల్జెబూబు అనేది … ఆయన ఆత్మలను ఆ రీతిగా వివేచించుట వారు చూసినప్పుడు, "అతడు సోదెగాడు, బయల్జెబూబు, దయ్యము" అని వారు పిలిచారు. సోదె చెప్పుట దయ్యపు కార్యము, వారు ఆయనను అన్నింటికంటే హీనముగా దయ్యము అని పిలిచారు. ఆయన హీనమైన పేరు కలిగియున్నాడు.
65ఆయన హీనమైన పట్టణమునకు వెళ్ళాడు. ఆ పట్టణములో అందరికంటె పొట్టివాడైన వ్యక్తి ఆయనను పైనుండి చూశాడు — జెక్కయ్య (అది సరియే) యెరికో వద్ద. ఆ మార్గములో ఆయన ఆ విధముగా చేశాడు. భూమి మీద అందరికంటే హీనమైన పేరు కలిగియున్నాడు. ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు, వారు ఆయనను అక్రమ సంతానము అని పిలిచారు, ఎందుకనగా వారు నిజముగా ఆయన వివాహ బంధము వెలుపల జన్మించాడనుకొన్నారు. ప్రారంభము నుండి ఆయన దానితో పోరాడవలసివచ్చింది. తరువాత ఒక మనుష్యుడు కలిగియుండే హీనమైన పేరు, బయల్జెబూబు అని పిలువబడ్డాడు. ఆ విధముగా పిలువబడుటకై ఆయన తన పరలోకపు స్థలమును విడిచి వచ్చాడు.
అయితే పరలోకములో ఉన్న ప్రతి నామముకంటే ఉన్నతమైన నామమును దేవుడు ఆయనకు ఇచ్చాడు. భూమి మీద ఉన్న ప్రతి నామముకంటే ఉన్నతమైన నామము. చివరికి భూమి మీది మరియు పరలోకములో సమస్త కుటుంబము, ప్రభువైన యేసు అని పేరు పెట్టబడినది. హల్లెలూయా! అవును, ఆయన విడిచిపెట్టాడు, ఆయన బహుమానము పొందుకున్నాడు. ఖచ్చితముగా ఆయన పొందుకున్నాడు. సరే.
JOHN 4:31,32
66భూమ్యాకాశమునకు సృష్టికర్త ఆయన — ఆయన ఈ భూమి మీదకు వచ్చినప్పుడు, తినుటకు ఆయన వద్ద ఏమియూ లేదు. ఆయన మన కొరకు ఉపవాసము చేయుచున్నప్పుడు, సాతానుడు ఆయనను శోధించాడు. కాని ఆయన ఎవరికిని తెలియని ఆహారమును పొందుకున్నాడు. ఒక రోజు ఆయన ఆ విధముగా చెప్పెను, "నాకు ఆహారమున్నది."
చెప్పెను, "మీరు వచ్చి ఆహారమును ఎందుకు భుజించకూడదు?"
ఆయన, "భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పెను." అది నిజము. వారికి తెలియని ఆహారమును ఆయన కలిగియుండెను.
67ఇక్కడ భూమి మీద, ఆయనకు ఏ ఆశ్రయములేదు, ఆయనకు ఇల్లు కాని, స్థలము కాని, ఆయనకంటూ స్వంతది ఏదియూ లేదు. అయితే మీకు ఒక విషయము తెలుసా? మనలో ప్రతి ఒక్కరికి ఆయన ఆశ్రయముగా మారినాడు. సమస్త మానవాళికి దేవుడు ఆయనను ఆశ్రయముగా చేశాడు. ఆయనకు తన స్వంత ఆశ్రయములేదు, కాని ఆయనే మనకు ఆశ్రయము.
వారు అణుబాంబుల నుండి భూగర్భ గృహములను గూర్చి ఎక్కువగా మాట్లాడుకొనుచున్నారు. ఓ, మై! మనకు కూడా ఒకటున్నది. భూగర్భములో అణుబాంబు నుండి రక్షించే ఆశ్రయాలు నిర్మించారు. వారు నాతో చెప్పారు, ఆ బాంబులు నేలమీద ప్రేలి, భూమిలో నూట-యాభై అడుగుల లోతున, వందల అడుగుల కంటె ఎక్కువ చతురస్రాకారపు గోతులను ఏర్పరచును. భూమిలో నీవు అరమైలు లోతులో ఉన్నను అది నీ ఎముకలన్నింటిని విరిచివేస్తుంది. ఖచ్చితముగా, అది ఎక్కడైనా చేస్తుంది, కాని మనము ఒక ఆశ్రయము కలిగియున్నాము. క్రీస్తు మన ఆశ్రయము. ఆమేన్.
68ఒక రాత్రి నేను చెప్పినట్లుగా, రష్యా తన గూర్చి ఎంతో డంబముగా గొప్పలు చెప్పుకొనుచున్నది. "మేము మొదటిగా మానవుని అంతరిక్షములోనికి పంపించాము," అని గొప్పలు చెప్పుకొనుచున్నది. నేను దానితో విభేదిస్తున్నాను. మనము రెండువేల సంవత్సరముల నుండి ఒకరిని అంతరిక్షములో కలిగియున్నాము. ఆమెన్. అది నిజము. అవునయ్యా. విజ్ఞాపన చేయువాడు (అవునయ్యా), రెప్పపాటులో పరలోకమునకు వెళ్ళి రాగలిగినవాడు. ఖచ్చితముగా, మనము అంతరిక్షములో ఒక ఆయనను కలిగియున్నాము. వారు దానిని కలిగిలేరు. నిజము.
69సరియే మనము కనుగొన్నాము ఆయనకు… ఆయన మనందరికిని ఆశ్రయముగా మారాడు. మన నిమిత్తము పాపముగా మారుటకు ఆయన, తండ్రికి, తనకు మధ్యనున్న కుమారత్వమును విడిచిపెట్టాడు. నీకు ఆ సంగతి తెలుసా? "పాపమెరుగని ఆయన మన నిమిత్తము పాపమయ్యెను. మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి." పాపముగా మారుటకు ఆయన తన కుమారత్వమును విడిచిపెట్టాడు: ఇప్పుడు ఆయన పాపులను కుమారులుగా మార్చుతున్నాడు. అది మేలైన భాగము. పాపులను తీసుకొని కుమారులుగా మార్చుచున్నారు, పాపముగా మారుటకు తన కుమారత్వమును ఇచ్చివేసిన తరువాత, ఇప్పుడు ఆయన పాపులను తీసుకొని వారినుండి పాపములేని కుమారులుగా చేయుచున్నాడు. ఆమెన్! ఎంత ధన్యత! అవునయ్యా!
దేనివలనను దేవుడు గ్రహించజాలబడడు. లేదయ్యా. నీవు దానిని చేయలేవు, ఎందుకనగా దేవుడు దానిద్వారా కార్యము చేయుచున్నాడు. పాపులను తీసుకొని వారిని దేవుని కుమారులుగా మార్చుటకు ఆయన కుమారుడు పాపపరిహారార్ధ బలియైనాడు. అది ఎంత సుందరమైన కార్యము. ఇప్పుడు. అవునయ్యా.
70ఆయన తన బలమును ఇచ్చివేశాడు. ఆయన మనకు బలముగా మారుటకు, ఆయన బలహీనమైనాడు. ఆయన మనకు సర్వమునకు చాలిన బలమైయున్నాడు. ప్రభువైన యేసు యొక్క బలము తప్ప మనకు మరియొక బలము అవసరములేదు. "అనుదినము ఆయన నాకు బలము. ఆయన లేకపోతే నేను కూలిపోతాను," అని కీర్తనాకారుడు చెప్పెను. ఎంత అద్భుతము!
ఏమి విడిచిపెడుతున్నావు… ఏమి పొందుకుంటున్నావు. నీవు విడిచిన ప్రతిదానికి, మై! లోకమును విడిచిపెట్టు. నీ స్వంత తలంపులను విడిచిపెట్టు. నీ సందేహములను విడిచిపెట్టు. నీ కలవరములను విడిచిపెట్టు. దానిని విడిచి, ఆయనను పొందుకొనుము. ఆయనను విశ్వసించుము.
చెప్పుము, "ఇప్పుడు అది అలా ఉన్నదా? అద్భుతముల దినములు గతించిపోయినవా?" అలాటి ఆలోచనలను విడిచిపెట్టుము. దానిని విశ్వసించుము.
ACTS 2:38,39
71ఎవరో ఒకరు ఇలా అన్నారు, "యేసు నిజముగా స్వస్థపరచువాడేనా, లేక ఈ ప్రజలు మానసిక ఉద్రేకాలను కలిగియున్నారా?" ఒక్కసారి కేవలము ఆ ఆలోచన విడిచిపెట్టుము. "ఇప్పుడు, అది బాగవుతుందో లేదో నీవు ఎలాగు తెలుసుకుంటావు?" అది వాగ్దానము. నీవు ఆ విధముగా దానిని తెలుసుకుంటావు.
నీవు ఇలాగు చెప్పవచ్చు, "ఓ పరిశుద్ధాత్మ చాలా కాలము క్రిందటి ప్రజల కొరకు మాత్రమే అని నేను నమ్ముచున్నాను, కేవలము శిష్యులకు మాత్రమే."
ఓ, అది ఆ రీతిగా ఉండుజాలదు. ఒకవేళ అదే విధముగా జరిగితే, బైబిల్ తనను తానే విభేదిస్తుంది. పెంతుకోస్తు దినమున పేతురు చెప్పెను, "మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, దూరస్తులదరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందును." అప్పుడు అది దేవుని వాగ్దానము. మనము దానిని పొందుకోగలము. దేవుడు పరిశుద్ధాత్మ దగ్గరికి పిలిచిన వారికందరికి, నీవు వచ్చుటకు అధికారము కలిగియున్నావు. కేవలము దానిని గూర్చి నీకున్న ఆలోచనలు విడిచిపెట్టుము, నిర్ణయించబడిన దేవుని వాక్యమును తీసుకొనుము.
MARK 9:39•
MARK 16:17
72నీవు చెప్పవచ్చు, "ప్రజలు భాషలతో మాట్లాడుట అనే కార్యము ఉన్నదా, లేక అది కేవలము బుద్ధిహీనత లేక వదరుటా?
కేవలము నీ స్వంత ఆలోచనలు విడిచిపెట్టుము. యేసు ఈ విధముగా చెప్పెను: "విశ్వసించువారిని ఈ సూచనలు వెంబడించును. వారు క్రొత్త భాషలు మాట్లాడుదురు." బైబిలు ఆ విధముగా చెప్పినది. అవునయ్యా.
"సహోదరుడా, ఈ కూటములలో నేను చూసే అద్భుతములు, అవి దేవుని వలన కలిగినవేనా?"
ఖచ్చితముగా కలిగినవి.
"మంచిది, ఇష్టానుసారముగా జీవించిన వ్యక్తులు వీళ్ళే, వారు రోగుల కొరకు ప్రార్ధించినప్పుడు, వారు స్వస్థపడుట నేను చూశాను."
"నన్ను గూర్చి చులకనగా మాట్లాడిన ఏ వ్యక్తి కూడా అద్భుతములు నా నామములో చేయలేడు," అని యేసు చెప్పెను. అది నిజము. ఒకవేళ ఆ వ్యక్తి తప్పుడు వ్యక్తి అయితే, దేవుని యొక్క వరమును తీసుకొని దానిని తప్పుగా ఉపయోగించినట్లయితే, అతడి విషయమును దేవుడు చూసుకుంటాడు. కాని అది దేవునిది, దానిలో ఏ భేదము లేదు. అది ఖచ్చితముగా అవును. ఎందుకనగా అతడు వేషధారి, అది నిన్ను మరింత ప్రకాశించునట్లుగా చేయును.
73నీవు కలిగియుండలేవు … నీవు నకిలీ డాలరు కలిగి యుండాలంటే నిజమైన ఒకటి ఉండాలి. మరియు ప్రతి ఒక్కరు అంటున్నారు, "నేను సంఘమునకు వెళ్ళుట లేదు. నేను సంఘమునకు వెళ్ళగోరుట లేదు. అక్కడ అనేకమంది వేషధారులు ఉన్నారు." ఎందుకు, నీవు వారికంటే చిన్నవాడివి. నీవు వారివెనుక దాగుకొనుటకు ప్రయత్నిస్తున్నావు. నీవు వారి వెనుకకు వెళ్ళినట్లయితే, నీవు వారికంటే చిన్నవాడివి. అది నిజము.
74ఒక రోజు నేను వార్తాపత్రికలో ఒక చిన్న సంఘటన గూర్చి చదివాను, ఒక వృద్దుడు… అతడు చెవిటివాడు, మూగవాడు, మరియు గ్రుడ్డివాడు. అది ప్రతి ఆదివారము ఆరాధనకు వెళ్ళేవాడు. వారు అతడిని బ్రెయిలీ లిపిలో ప్రశ్నించారు, "నీవు సంఘమునకు ఎందుకు వెళ్తున్నావు? నీవు బోధకుడు చెప్పేదానిని వినలేవు, ఆ కీర్తనలలో వేటిని వినలేవు. నీవు సంఘమునకు ఎందుకు వెళ్తున్నావు?"
మరియు అతడు చెప్పెను, "ప్రతి ఒక్కరికి నేను ఏ వైపున ఉన్నానో తెలుపగోరుచున్నాను." అపవాదికి మరియు ప్రతి ఒక్కరికి అతడు ఏ వైపున ఉన్నాడో చూపించాలని ఆశించాడు. అది మంచిది, అని నేను తలస్తున్నాను. అవునయ్యా.
75యేసు ఇంకా ఏమి చేశారు? ఆయన తన స్వంత ప్రాణమును విడిచిపెట్టాడు. నీ ప్రాణమును, మరియు నా ప్రాణమును విమోచించుటకు ఆయన తన ప్రాణమును విడిచిపెట్టాడు. ఆయన తన ప్రాణమును పెట్టాడు కనుక… ఆయన దానిని అర్పించవలసిన అవసరత లేదు. ఆయన దానిని ఇష్టపూర్వకముగా చేసెను. ఆయన దానిని చేయవలసిన పని లేదు, కాని ఆయన నిన్ను రక్షించుట కొరకు దానిని ఇష్టపూర్వకముగా అర్పించెను.
వారి సంఘము నిన్ను రక్షిస్తుంది అని చెప్పే ఒక మతశాఖ గూర్చి నాకు తెలుసు. "నీవు సంఘముచే రక్షించబడ్డావు." నీవు యేసుక్రీస్తు వలన రక్షించబడ్డావు, లేనట్లయితే నీవు నశించిపోయావు. అవునయ్యా. నీవు చేయకలిగినది ఏమియూ లేదు, ఒక్క కార్యము కూడా లేదు. నీవు చేయకలిగినది నీవు నీ పాపమును బట్టి పశ్చాతాప్పడు. యేసుక్రీస్తు రక్షకుడు. అవునయ్యా. ఆయన నీ కోసము తన ప్రాణమును ఇచ్చాడు, ఆయన నీ కొరకు తన ప్రాణము పెట్టాడు. నేను తలస్తున్నాను, ఈ రోజు మనము ముగించు ముందుగా మనము దీనిని గూర్చి చెప్పవచ్చు. ఆ శిష్యులు ఆయన వెంబడించినట్లుగా మనమును వెంబడించుటకు మనము ప్రాణమును పెట్టుట, లోక సంబంధమైన ప్రతి కార్యమును విడిచి, దేవునికి వ్యతిరేకమైన ప్రతిదానిని, అవిశ్వాసమును విడిచిపెట్టుట మన బాధ్యత, దానిని చేయుటకు నీవు ఇష్టపడుటలేదా?
JOEL 2:23•
ZECH 14:7
76దేని కొరకు? ఆయనను వెంబడించుట? ఆయన రాకడ యొక్క గొప్ప సూచనలు చూచుటకు. ఇప్పుడు, గుర్తుంచుకోండి. ఈ చివరి దినములలో, కాలము యొక్క ముగింపులో మరియొక క్రైస్తవ వెలుగు కలుగునని పరిశుద్ధ గ్రంథము వాగ్దానము చేస్తుంది — తొలకరి వర్షము మరియు కడవరి వర్షము కలసి వచ్చును. సాయంకాలమందు వెలుగు కలుగును అని ప్రవక్త చెప్పెను.
పగలు లేక రాత్రి అని పిలువబడని దినము వచ్చును. అది ఎలాటి దినము? వర్షము, పొగమంచు కమ్మి, అస్పష్టముగా, చీకటిగా ఉండు దినము. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఖచ్చితముగా, మేఘము మరియు పొగమంచు పైన సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పొగమంచు గుండా అది వెలుగును ప్రసరిస్తుంది. దానిని వలన నీవు నడువగలవు, ఏ విధముగా ముందుకు పోవాలో చూడగలవు. సంవత్సరములుగా, రెండువేల సంవత్సరముల గుండా మనము దానినే కలిగియున్నాము, చూచారా. మనము విశ్వాసమును బట్టి నడిచాము, మరియు మనము తలంచాము, "మంచిది, అది అంతా సరిగా వున్నది. మనము విశ్వసించాము, మనము సంఘములో చేరాము, మన పేరు పుస్తకములో వ్రాయబడ్డాయి. అది చాలును. మనము విశ్వసించాము. ఆదికాలములో, అతడు చూసిన విధముగా మనము వాటిని చూచుటలేదు. వారంటారు, "అది అంతా అయిపోయినది. అది అప్పుడు…" ఆ విధముగా, వందల మరియు వందల మరియు వందల సంవత్సరములుగా — కేవలము ఒక దుర్దినము.
GEN 18:13•
ZECH 14:7•
LUKE 17:28,30
77కాని ఆయన చెప్పెను, "సాయంకాలమందున వెలుగు కలుగును." ఇప్పుడు, తూర్పువైపున ఉదయించిన అదే సూర్యుడు, పడమరవైపున అస్తమించును. తూర్పు వైపున ఆ ప్రజల మీద పరిశుద్ధాత్మను కుమ్మరించిన అదే యేసు, ఈ చివరి దినములలో అదే యేసు తన ఆత్మను పాశ్చాత్యుల మీద కుమ్మరించాడు. ఆయన దానిని వాగ్దానము చేశాడు. ఆయన వాగ్దానము చేశాడు.
ఆయన చెప్పెను, "లోతు దినములలో ఉన్నట్లుగా, మనుష్యకుమారుని దినములలో ఉండును." దేవుడు, మనుష్యుని శరీరములో ప్రత్యక్షపరచబడి, అబ్రాహాముతో కలసి భుజించాడు. ఆయన తన వీపువైపునున్న గుడారములోని శారా ఆలోచనను చెప్పెను. ఆయన అబ్రాహాముతో అతని పేరు, శారా పేరు, వారిని తను ఎలా దర్శించబోవుచున్నాడో చెప్పెను. శారా దానిని విశ్వసించలేదు, గుడారములో ఆమె నవ్వింది మరియు దూత చెప్పెను, "శారా నవ్వనేల?" గుడారములోపల, మనుష్యుని వెనుక.
LUKE 17:30
78యేసు చెప్పెను, "లోతు దినములలో ఉండినట్లుగా, మనుష్యకుమారుని రాకడలో ఉండును." నేను తరచుగా చెప్పినట్లు, గతరాత్రి చెప్పాను, దానిని మరలా చెప్పగోరుచున్నాను: నోవాహు ముగ్గురు కుమారులు హాము, షేము, యాపేతు ఉన్నట్లుగా, ఎల్లప్పుడు అన్ని సమయములలో మూడు రకముల ప్రజలు ఉంటారు. మొదటి నుండి మూడు రకముల ప్రజలున్నారు. ఇప్పుడు మనము వారిని ఈ విధంగా విభజిస్తున్నాము: అవిశ్వాసి, వేషధారి, విశ్వాసి. ఇప్పుడు, అది ఆ రీతిగా పోల్చబడుచున్నది… అక్కడ అదే జరిగినది. యేసు చెప్పెను, "సొదమ దినములలో ఉన్నట్లుగా ఉండును."
79వెంబడించుటకు అబ్రాహాము తనకున్న సమస్తమును విడిచిపెట్టాడు, ఇప్పుడు అతడు ఇక్కడున్నాడు. అతడు సంవత్సరముల తరబడి, ఇరవై-ఐదు సంవత్సరములు వాగ్దానమును హత్తుకొనియున్నాడు. ఇప్పుడు అతని వయస్సు వంద సంవత్సరములు, అతడు పొలములో ఉన్నాడు. అతని మంద చిక్కిపోయినది, నీరు లేదు; మరియు లోతు, అక్కడ విలాసవంతమైన జీవితము జీవిస్తున్నాడు. అతడు కోరిన ప్రతిదానిని కలిగియున్నాడు.
మరియు శారా, ఒకప్పుడు ఆ దేశములో అందమైన స్త్రీ; ఆమె ఇక్కడ ఒక విధముమైన దీన స్తితిలో ఉన్నది.
బహుశా శ్రీమతి. లోతు, అనేక రకములగా తలను అలంకరించుకొని యుండవచ్చు. అక్కడ ఆమె విలాసవంతమైన జీవితము జీవిస్తున్నది. ఆమె, మేయర్ భార్య, ఆ పట్టణములో పెద్ద సంఘ సభ్యురాలు. అవునయ్యా, నిస్సందేహముగా ఆమె అనేక సొసైటీలలో సభ్యురాలు. దానిని విడిచి జీవించుట ఆమెకు ఎంతమాత్రము ఇష్టములేదు. ఆమె వెనుకకు తిరిగి చూచునంతగా దానిని కోరినది. దేవదూత మాటకు లోబడుటకంటే మిన్నగా ఆమె లోకమును ప్రేమించినది, అందునుబట్టి ఉప్పు స్తంభముగా మారినది.
80ఇప్పుడు. మూడు రకముల గుంపులను గమనించండి: అవిశ్వాసులు, సొదము ప్రజలు; కేవలము సరిహద్దు, నులివెచ్చని, సంఘ సభ్యుడు లోతు; కాని ఏర్పరచబడి, బయటకు పిలువబడిన సంఘము, అబ్రాహాము మరియు అతని గుంపు. ఎప్పుడైతే ఈ దేవదూతలు… వారు ఎవరియొద్దకు వచ్చారు? అబ్రాహాము మరియు అతని గుంపు దగ్గరకు. అవును. ఆయనతో వచ్చిన ఇద్దరు దూతలు అక్కడికి నవీన సువార్తికులవలె వెళ్ళారు. మనము గొప్ప సువార్తికులము కలిగియున్నాము, ఈ రోజ మతశాఖల వద్దకు వెళ్ళుచున్నవారు. ఈ దేశములో మనము ఎరిగినవారిలో అత్యంత గొప్ప వ్యక్తి బిల్లీ గ్రాహం. అక్కడ ఉన్న వారికి నిశ్చయముగా అతడు సువార్త ప్రకటిస్తున్నాడు, "సొదమ నుండి బయటకు రండి!" అని బయటకు పిలచుచున్నాడు.
2COR 6:17
81"సొదమ నుండి బయటకు రండి" అని మనము ఈ సంఘమునకు అరిచి చెప్పవలసిన అవసరములేదు. అది ఇప్పటికే బయటకు వచ్చియుండాలి. ఒకవేళ అది పరిశుద్ధాత్మ ద్వారా పిలవబడినట్లయితే, అది ఎప్పుడో సొదమ విడిచియుండును. అది నిజము. అది సొదమను విడిచిపెట్టింది. ఆమె ఇక్కడ తనుకు తాను ఖచ్చితముగా, ప్రత్యేకించబడి జీవిస్తుంది. "సంఘము" అనే మాటకు అర్థము. "బయటకు పిలువబడినది, ప్రత్యేకపరచబడినది" అని అర్ధము. మరియు నీవు ప్రత్యేకపరచబడినట్లయితే… "వారిలో నుండి బయటకు రండి. వారి అపవిత్రమైన వాటిని ముట్టకుడి." నీవు ఇంకనూ దానిని చేయనట్లయితే, నీవు సొదమలో ఉన్నావు, నీవు నులివెచ్చని సంఘ సభ్యుడవు. అప్పుడు నిన్నునీవు ప్రత్యేకపరచుకొని, లోకము నుండి వేరుపడి, బయటకు వచ్చి, పరిశుద్దమైన మరియు పవిత్రమైన జీవితము జీవిస్తూ - దేవుని ఆజ్ఞలను వెంబడించవలసియున్నది.
82గుర్తుంచుకోండి, వారిలో ఇద్దరు దేవదూతలు అక్కడికి వెళ్ళారు. వారు అనేక అద్భుతములు చేయలేదు. వారు అక్కడ ఒకే అద్భుతమును చేశారు, వారి మీదకు వచ్చిన ప్రజలను గ్రుడ్డితనముతో మొత్తారు. దేవుని వాక్యమును ప్రకటించుట ఖచ్చితముగా అదే చేస్తుంది, ప్రజలను గ్రుడ్డితనముతో మొత్తుతుంది. మనము ఎరిగిన ఈ గొప్ప సువార్తికులు, ఈ దినములలో ఫినిక్స్ ను దర్శించును. మరియు ఆ గొప్ప సువార్తికులు సువార్త పొలములోనికి వెళ్ళినవారు, అద్భుతములు చేయుటలేదు, కాని వారు అవిశ్వాసులను, సొదోమీయులను, "యేసుక్రీస్తు దేవుని కుమారుడు" అనే వాక్యమును బోధించి గ్రుడ్డివారిని చేయుచున్నారు.
83కాని ఇప్పుడు ఇక్కడ ఆత్మీయమైన సంఘము ఉన్నది. అది సహజమైన సంఘము కాదు, అది సొదము కాదు, కాని ఆత్మీయమైన సంఘము, అబ్రాహాము వలె ఎల్లప్పుడు దేవుని విశ్వసించుచు, దేవుని దర్శనము కలిగిన సంఘము. అబ్రాహాము తన తర్వాత సంఘములోని అబ్రాహాము సంతానమునకు సంపూర్ణ మాదిరిగా ఉన్నాడు: (నేను ఆదివారము ప్రసంగించినట్లుగా) "ఆయన నామము నిమిత్తము, అన్యజనుల నుండి బయటకు పిలవబడిన ప్రజలు, రాజ సంతానము, చూచారా.
ఇప్పుడు, ఈ సంఘము, అది బయటకు పిలువబడినది, ప్రత్యేకపరచబడి, లోకములో ఉన్న సమస్తమును విడిచిపెట్టి, అబ్రాహామువలె పరిశుద్ధాత్మతో నడచుటకు బయటకు వచ్చినది. అబ్రాహామువలె మనము అనేక కార్యములు చూసియున్నాము, కాని అతడు తన యాత్ర ముగింపునకు ముందు అతడు చూసిన చివరి సూచన ఏమిటి? చివరి సూచన ఏమిటి… ఎదురుచూస్తున్న కుమారుడు రంగముపై వచ్చెను.
84అబ్రాహాము కుమారుని కొరకు ఎదురు చూస్తున్నాడు. అవునా? మనము అబ్రాహాము సంతానమేనా? అయినట్లయితే, మనము కుమారుని కొరకు ఎదురు చూస్తున్నాము, వాగ్దాన కుమారుడు, దేవుని కుమారుడు. దేవుడి తనని పిలిచినప్పుడు అబ్రాహాము దేవుని యొక్క మర్మమైన కార్యములను చూశాడు. ఆ బరిలో ఆ వెలుగు చూశాడు, నిబంధన రూఢి చేయబడినది. మరియు అనేకసార్లు ఆయన అతనిని అనేక రీతులలో కలిశాడు. కాని అబ్రాహాముకు ఆయన చూపిన చివరి సూచన, శరీరముతో ప్రత్యక్షమయ్యాడు, తన వీపును గుడారము వైపునుంచి, శారాతో మాట్లాడినాడు… అబ్రాహాము ఎట్టి సందేహము లేకుండా ఆయన దేవుడని విశ్వసించాడు. కొందరు ప్రజలు దానిని విశ్వసించరు. కాని, పరిశుద్ధ గ్రంధము ఆయన దేవుడని చెప్పినది. అబ్రాహాము ఏమి పిలిచెననగా — అతడు ఆయనను "ఎలోహిం" అని పిలిచాడు, "ఎలోహిం అనగా భూమి ఆకాశముల గొప్ప సృష్టికర్త.
JOHN 14:12
85ఇప్పుడు, ఒక సూచన కొరకు ఆయన మరలా శరీరధారియాయెను, ఈ చివరి దినములలో… అవిశ్వాసులైన సొదోమీయులను, చూడండి. సంఘ సభ్యులను చూడండి? ఇప్పుడు ఏర్పరచబడిన వారిని, బయటకు పిలువబడినవారిని చూడండి. ఏర్పరచబడినవారిలో, మానవ శరీరములో ఆయన పరిశుద్ధాత్మ శక్తితో బయలుపరచబడ్డాడు. ఆమెన్! ఆయన మెస్సీయా అని గ్రహించలేవా? దేవుడు, క్రీస్తు తన సంఘమునకు ప్రాతినిధ్యం వహించుచున్నాడు — సంఘము అదే జీవమును ఇస్తూ, అదే జీవితమును ఇస్తూ, అదే సూచనలు చేస్తున్నది. "నాయందు విశ్వాసముంచువాడు, నేను చేయు కార్యములను అతడును చేయును."
86ఒకవేళ నేరగాళ్ళ ముఠా నాయకుడి ఆత్మనాలో ఉన్నట్లయితే, నేను తుపాకులు ధరించియుంటాను. ఒకవేళ చిత్రకారుడి ఆత్మ నాలో ఉన్నట్లయితే, చిత్రకారుడి వలె చిత్రాలు వేస్తాను. యంత్రకారుని ఆత్మ నాలో ఉన్నట్లయితే, నీ కారులో ఉన్న సమస్య ఏమిటో నేను చెప్తాను, చూచారా. మరియు యేసుక్రీస్తు ఆత్మ నాలో ఉన్నట్లయితే, నేను క్రీస్తు యొక్క కార్యములను చేస్తాను, ఎందుకనగా నీలో ఉన్నది క్రీస్తు జీవము, చూచారా. ఎవరిలో ప్రత్యక్షమయ్యాడు? ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఆయన పాపులను తీసుకొని వారిని కుమారులుగా చేయుటకు, ఆయన తన కుమారత్వమును విడిచిపెట్టి పాపముగా మారినాడు. నేను ఆయనగా మారుటగా ఆయన నావలె మారాడు. నేను దేవుని కుమారుడిగా మారుటకు ఆయన పాపిగా మారాడు. ఆయన చేసిన కార్యము అసాధారణమైనది. చూచారా, ఆయన స్థానము నీవు తీసుకొనుటకు ఆయన నీ స్థానము తీసుకున్నాడు. "ఆయన రాజ్యములో మీరు ఆయనతో సహవారసులు." నిన్ను పరలోక్ష రాజ్య పౌరునిగా చేయుటను, ఆయనతో ఆయన రాజ్యములో స్థిరపరచుటకు - ఆయన నీవలె పాపిగా మారాడు, నీ పాపములు ఆయన మీద మోపబడ్డాయి. అక్కడే నీవున్నావు — ఆయన ఆత్మను నీలో ఉంచాడు. ఆయన ఆత్మ నీలో ఉన్నట్లయితే, ఆయన చేసిన కార్యములను నీవు కూడా చేస్తావు.
JOHN 1:45,46
87ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏమి చేశాడో చూడుము. ఆయన తనను తాను ఎలా ప్రత్యక్షపరచుకున్నాడు? నీవు అలా తిరుగకూడదు, అటు ఇటూ తిరుగుతూ, జూద గృహములలో తిరుగుతూ, సంఘమునకు దూరముగా ఉంటూ, బుధవారము రాత్రి టెలివిజన్లో వచ్చే అసభ్యకరమైన కార్యక్రమాలు చూచుటకు, మరియు అలాటి వాటికొరకు సంఘమును విడిచిపెట్టి, క్రీస్తును చూడగలనని ఎన్నడూ తలంచవద్దు. పరిశుద్ధాత్మను వెంబడించుటకు నీవు ఆ కార్యములను విడిచిపెట్టాలి.
ఆ మొదట వెంబడించినవారు చేసినట్లుగా, ఆయన తన్నుతానే ప్రత్యక్షపరచు కోనీయండి. ఆయన మెస్సీయా కాడా, అని వానిని చూచుటకు వారు ఆయనను వెంబడించారు. ఆంద్రెయ, ఫిలిప్పు ఆ రాత్రియంతా ఆయనతో ఉన్నప్పుడు ఆయన ఏమి చేశాడనుకొనుచున్నారు? మరుసటి ఉదయము ఫిలిప్పు ఒకవైపుకు వెళ్ళాడు మరియు ఆంద్రెయ మరొక వైపుకు వెళ్ళాడు. ఆంద్రెయ తన సహోదరుడిని చూచుటకు వెళ్ళాడు, మరియు అతడు సీమోనును చూడగానే అతడు చెప్పెను, "వచ్చి చూడము, మేము మెస్సీయాను కనుగొన్నాము." ఆయన మెస్సీయా అని అతడు ఎరిగియున్నాడు. ఎందుకని? మెస్సీయా ఎలా ఉంటాడో అతడు ఎరిగియున్నాడు. మెస్సీయా ఎలా ఉంటాడో అతడు వాక్య ప్రకారము ఎరిగియున్నాడు.
ZECH 9:9•
MATT 3:12•
MATT 21:5•
JOHN 1:33
88ఇప్పుడు, ఆ దినములలో, ఆ పెద్ద సంఘములు అన్నియు ఒక ఊహలలో ఉన్నారు. "ఓ. మెస్సీయా వచ్చినప్పుడు, ఆకాశములో బూర శబ్దము వినబడుతుంది. దేవుడు ఒక అద్భుతమును చేస్తాడు, పరలోకపు వీధులు క్రిందకు దిగివస్తాయి, దూతల సమూహముతో, వాయిద్యములతో, ఆయన నేరుగా ఈ ఆలయమునకు వస్తాడు, ఆయనే మెస్సీయా అవుతాడు. ఆయన రాజదండముతో భూమిని పరిపాలిస్తాడు."
ఆయన ఎంత భిన్నముగా వచ్చాడో చూడండి. అయితే ఆయన లేఖనముల ప్రకారము వచ్చాడు; దీనునిగా మరియు సాత్వికముగా ఆయన దీనమైన గాడిద మీద యెరూషలేము వైపు వచ్చాడు." అది నిజము, చూచారా. అది ప్రవక్త యోహానును కూడా తిప్పివేసినది. తన చేతిలో చేట కలిగి, పంటను పూర్తిగా శుభ్రపరుస్తున్న మెస్సీయా గూర్చి ఆయన బోధించాడు. ఆయన వచ్చినప్పుడు సాత్వికుడిగా, దీనునిగా వచ్చాడు. కాని ఆయన మెస్సీయా అని యోహాను ఎరిగియున్నాడు, ఎందుకనగా అతడు ఆయన మీదనున్న వెలుగును చూశాడు. అతడు దానిని ఎరిగియున్నాడు. అతడు చెప్పెను, "అరణ్యములో ఆయన నాతో చెప్పెను, 'వెళ్ళి నీళ్ళలో బాప్తిస్మము ఇమ్ము,' 'ఎవరిమీదకు ఆత్మ దిగివచ్చి నిలిచియుండుట నీవు చూచెదవో, ఆయనే, పరిశుద్ధాత్మతోను మరియు అగ్నితోను బాప్తిస్మమిచ్చువాడు.'"
JOHN 6:37,44
89దానిని మరి ఎవరూ చూడలేదు. యెహోను దానిని చూశాడు. వాగ్దానము యోహానుకు ఇవ్వబడినది. జ్ఞానులు వెంబడించిన ఆ నక్షత్రమును ఎవరూ చూడలేదు. మరియు ఈ రాత్రి కూడా అదే విధముగా ఉన్నది. నీవు ఇక్కడ ఉండి రెండంతల గ్రుడ్డితనముతో, దేవుని శక్తిని ఎన్నడూ చూడకపోవచ్చు. దేవుడు నీ కన్నులు తెరచువరకు నీవు దానిని ఎన్నడూ చూడలేవు. "తండ్రి నాకు అనుగ్రహించువారందరూ నా యొద్దకు వత్తురు." మరియు, "నన్ను పంపిన తండ్రి ఆకర్షించితేనేగాని యెవడును నా యొద్దకు రాలేడు." అది అంతే. అది దానిని స్ధిరపరచును.
NUM 12:6•
DEUT 18:15,18,22•
JOHN 1:42
90ఇప్పుడు వారు సమస్తమును విడిచిపెట్టి, ఆయనను వెంబడించి, ఆయన మెస్సీయా అని వారు గ్రహించారు అని మనము కనుగొన్నాము. ఆంద్రేయ వెళ్ళి పేతురుతో చెప్పెను, "మన తండ్రి మనతో చెప్పినది గుర్తున్నదా. (బహుశా ఈ రీతిగా చెప్పియుండవచ్చు.) "మెస్సీయ వచ్చినప్పుడు మనము తెలుసుకుంటాము. దేవుడైన యెహోవా ఆయన వంటి ప్రవక్తను పంపును అని మోషే చెప్పెను. మరియు మనకు తెలుసు, మనకు బోధించబడింది, "మనలో ఎవడైనా ప్రవక్త కాని ఆత్మీయుడు కాని వచ్చి అతడు చెప్పినది జరిగినప్పుడు, అతని మాట వినుడి. ఒకవేళ అతను చెప్పినది నెరవేరనియెడల, అతని మాట ఆలకించవద్దు. మనకు తెలుసు, మెస్సీయ… ఆయన ప్రవక్త మాత్రమే కాదు. ఆయన దేవుడు-ప్రవక్త. కాబట్టి ఈ మనుష్యుడే ఆయన."
"అంద్రేయ, నీకు ఎలాగు తెలుసు?"
"కేవలము వచ్చి చూడుము."
అక్కడికి నడచి వెళ్ళాడు, మరియు వారు యేసు యెదుటకి నడచివెళ్ళగానే, యేసు చెప్పెను, "నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడివి." అదే సమయాన ఆయన దేవుని కుమారుడని అతడు తెలుసుకునెను.
JOHN 1:47-49
91ఇప్పుడు ఫిలిప్పు నతానియేలును తీసుకువచ్చాడు. నతానియేలు ఆయన దగ్గరికి రాగానే [అస్పష్టమైన మాట]… బహుశా వారు దాని గూర్చి విస్తారముగా సంభాషించుకొనుచూ అక్కడికి వచ్చియుండవచ్చు; ఆయన పేతురుతో ఈ విషయములు ఎలా చెప్పాడో, అతనికి మరొక పేరు ఎలా ఇచ్చాడో, అతడు, అతడి తండ్రని గూర్చి ఏమి చెప్పాడో, వాటిని గూర్చి, "నీకు తెలుసా, మెస్సీయా, ప్రవక్తయై యుండాలి."
మంచిది, అతడు అక్కడికి వచ్చాడు, యేసు ముందుకు వచ్చాడు. అప్పుడు యేసు చెప్పెను, "ఇదిగో ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు."
అతడన్నాడు, "రబ్ళీ, నీవు నన్ను ఎప్పుడు ఎరిగియున్నావు?"
ఆయన చెప్పెను, "ఫిలిప్పు నిన్ను పిలువకముందే, నీవు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూశాను."
అతడు చెప్పెను, "రబ్బీ, నీవు దేవుని కుమారుడవు. నీవు ఇశ్రాయేలు రాజువు." అతడికి అది స్థిరపచబడినది.
JOHN 4:7,9,10,18
92ఆరుగురు పురుషులతో జీవించుచున్న దౌర్భాగ్యమైన, మురికి, అసహ్యమైన స్త్రీ — ఆమె అయిదుగురిని వివాహం చేసుకున్నది, మరియు ఇప్పుడు ఆమె జీవిస్తున్న వ్యక్తి ఆమె భర్త కాదు. ఒక దినమున నీళ్ళ కొరకు బావి దగ్గరకు వెళ్ళినది. నీరు చేదుటకు ఆమె బావిలో బక్కెట్ వేసినది ఆమె ఆ బక్కెట్టు పైకి లాగుచున్నప్పుడు, యూదుడైన మధ్య-వయస్సు గల వ్యక్తి అక్కడ కూర్చొనియుండుట ఆమె చూసినది.
"అమ్మా, నాకు దాహమునకు నీళ్ళిమ్ము" అడిగాడు.
ఆమె అన్నది, "మనకు సాంగత్యము లేదు, అలాటి విషయమును
సమరయురాలనైన నన్ను యూదుడువైన నీవు అడిగే సాంప్రదాయము లేదు. మన మధ్య ఎలాటి సంబంధాలు లేవు."
ఆయన చెప్పెను, "నీతో మాట్లాడుచున్నది ఎవరో నీవు ఎరిగియుంటే, నీవు
నన్ను నీళ్ళు అడుగుదువు." వారు ఒకరితో ఒకరు కొద్దిసేపు సంభాషించారు. ఆయన ఏమి చేస్తున్నాడు? ఆమె సమస్య ఎక్కడున్నదో కనుగొనుటకు ప్రయత్నిస్తున్నాడు.
JOHN 4:4
93ఇప్పుడు, యేసు సమరయ గుండా వెళ్ళవలసివచ్చినది. గుర్తుంచుకోండి, ఆయన తననుతాను యూదులు మరియు అన్యులతోనే గుర్తించబడగలడు. వారు హాము, షేము సంతానము, చూచారా. యాపేతు ప్రజలు విడువబడ్డారు. మనము ఆంగ్లో-శాక్సనులము, మనము అన్యులము, ఆ దినములలో విగ్రహములను పూజించిన వారము. గుర్తుంచుకొనుడి. (యేసు, తాను ఈ భూమి మీద ఉన్నప్పుడు), అదే సూచనలో ఆయన తననుతాను అన్యులకు ఎందుకు బయలుపరచుకోలేదు? ఎందుకనగా అన్యులు మెస్సీయా కొరకు ఎదురు చూచుటలేదు. యూదులు మెస్సీయా కొరకు ఎదురుచూస్తున్నారు, మరియు సమరయులు మెస్సీయా కొరకు ఎదురుచూస్తున్నారు. ఆయన రాజ్యపు తాళపు చేతులు ఇచ్చిన పేతురుకు ఆయన తననుతాను మెస్సీయాగా కనపరచుకొన్నాడు. మరియు నతానియేలుకు, గుడ్డి బర్తలోమయి విశ్వాసము ఆయనను ఆపినప్పుడు, మరియు రక్తస్రావ రోగము కలిగిన స్త్రీకి, మరియు ఇంకా యూదులకు తననుతాను మెస్సీయాగా కనపరచుకున్నాడు.
LUKE 2:26,29,30
94అయితే ఇక్కడ ఆయన సమరయుల ఎదుట ఉన్నాడు, తనను తాను నిజమైన మెస్సీయాగా ప్రత్యక్తపరచుకొనుటకు ఆయన సమరయుల ఎదుటికి వచ్చాడు. ఇప్పుడు, కొన్ని వందల సంవత్సరములుగా యూదులు మరియు సమరయులు, వారిరువురూ మెస్సీయా వస్తాడని విశ్వసించుచున్నారు. కాబట్టి, మెస్సీయా భూమి మీద ఉన్నట్లయితే, తననుతాను బయలుపరచుకొనవలసినది మెస్సీయానే.
దేవాలయములోని వృద్ధుడైన సీమోయోనును చూడండి, "నేను ప్రభువైన క్రీస్తును చూచువరకు మరణించను," అనే సాక్ష్యమును కలిగియున్నాడు. మరియు ఆ శిశువును లోపలికి తీసుకు వచ్చిన అదే క్షణమందు, పరిశుద్ధాత్మ సుమోయోనుతో మాట్లాడెను. అతడు ఎక్కడైతే నిలబడియున్నాడో, ఆ చోటికి వచ్చి ఆ రీతిగా అతడు చేతులెత్తి ఈ విధముగా చెప్పెను, "నాధా, నీ మాట చొప్పున నీ దాసుని సమాధానముతో పోనిమ్ము, నీ రక్షణ నేను కన్నులారా చూచితిని." ఆయన చేసిన మెస్సీయా కార్యములు చూచునంత వరకు సుమెయోను జీవించలేకపోయాడు, కాని అతడు ఆ సాక్ష్యము కలిగియున్నాడు.
JOHN 4:16-19,25,26,29,39
95అయితే ఆయన తననుతాను ప్రజలకు మెస్సీయా, దేవుడు-ప్రవక్తగా కనపరచుకున్నాడు. ఆయన ఆ స్త్రీతో మాట్లాడుచున్నప్పుడు, ఆమెతో, "నీవు వెళ్ళి, నీ పెనిమిటిని, తీసుకురమ్ము," అని చెప్పెను.
ఆమె చెప్పినది, "నాకు పెనిమిటి లేరు."
ఆయన చెప్పెను, "నీవు చెప్పినది సరియే, నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటికాదు."
ఆమె అన్నది, "అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మెస్సీయా వచ్చినప్పుడు ఆయన మాతో ఈ సంగతులు చెప్పునని తెలియును. ఇదే మెస్సీయా సూచనగా ఉండును. ఆయన వచ్చినప్పుడు ఆయనే మాకు ఈ సంగతులను గూర్చి బోధించును."
మరియు యేసు చెప్పెను, "నీతో మాట్లాడుచున్న నేనే, ఆయనను."
వేగముగా ఆమె తన కుండను విడిచిపెట్టి, పట్టణములోనికి పరుగెత్తి, ఆ పట్టణములోని ప్రజలకు చెప్పినది, "నేను చేసినవన్ని నాతో చెప్పిన వానిని వచ్చి చూడుడి. ఈయన మెస్సీయా కాడా? మెస్సీయా మనము కనపరచుకొనే సూచన ఇది కాదా?"
వారిలో ఏ ఒక్కరి ఎదుటను ఆయన మరలా ఆ కార్యమును చేయలేదు. కాని ఆయన మెస్సీయా అని ఆ స్త్రీ ఇచ్చిన సాక్ష్యమునుబట్టి, ఆ పట్టణములోని పురుషులు ఆయనను విశ్వసించామని చెప్పిరి. ఆమెన్!
96ఇప్పుడిది అన్యుల సమయము. మనము రెండువేల సంవత్సరముల నుండి సందేహములు, ఎత్తు పల్లాలు, మత శాఖలు, మంచి చెడులు, కలవరములు, పోరాటములు, మరియు అనేకములు కలిగియున్నాము — వేదాంతములు మరియు సెమినరీలు మరియు ఇంకెన్నో. ఇప్పుడు, దేవుని సేవించుటకు ఈ లోక దేవతలను విడిచి వచ్చిన యూదులకు మరియు సమరయులకు, ఆ మెస్సీయా కొరకు ఎదురుచూస్తున్నవారికి — ఆ దినమున మెస్సీయా తననుతాను బయలుపరచుకున్నాడు, మరియు ఆయన తన నియమములను మీరలేడు… ఆయన, ఒకరికి ఒక విధముగా చేసి, మరొకరికి మరో విధముగా చేసే తండ్రివంటివాడు కాదు. ఆయన అదే యేసు. నిజము.
97ఇప్పుడు, మనము రెండువేల సంవత్సరములు కలిగియున్నాము. పరిశుద్ధాత్మ మన మీద క్రుమ్మరింపబడెను, మనము భాషలతో మాట్లాడినాము, సూచనలు మరియు అద్భుతములు చూశాము, వాగ్దానము చేయబడిన కుమారుడిని పొందుకొనుటకు ముందుగా అబ్రాహాము చూసిన చివరి సూచన, దేవుడు, భోజనము చేయకలిగిన శరీరములో తననుతాను ప్రత్యక్షపరచుకున్నాడు. యేసు మెస్సీయా వలె ఇక్కడ ఉన్నప్పుడు ఆయన అదే సూచన చేశాడు. ఇప్పుడూ, యేసు ప్రవచించాడు మరియు అదే విధముగా ఉండునని చెప్పెను.
MATT 10:25•
MATT 12:24,31,32•
MARK 3:22,29•
LUKE 11:15•
LUKE 12:10
98మరియు స్నేహితులారా, ఇదే ఆ ఘడియ. యేసు, ఆ వ్యక్తి చెప్పిన దానిని వినుచున్న యూదులు, వారు అన్నారు… వారు తమ సమాజములోని వారికి జవాబివ్వాలి. వారు, అది జరిగినదని వారికి తెలుసు. కాబట్టి వారు దానిని గూర్చి ఏమియూ చేయలేకపోయారు. వారు సమాజములోని వారికి జవాబివ్వాలి, కాబట్టి వారు, "ఈ వ్యక్తి బయల్జెబూబు. అతడు…" వారు దానిని వారి హృదయములో అనుకున్నారు. "ఈ వ్యక్తి బయల్జెబూబు," చూడండి, "అతడు సోదె చెప్పువాడు, ఒక రకమైన మనస్సులు చదువువాడు, లేక మరొకటి." ఆయన బయల్జెబూబు.
యేసు, వారి తలంపులు గ్రహించాడు మరియు ఆయన వారివైపు తిరిగి, వారితో అన్నాడు, "మీరు నాకు వ్యతిరేకముగా మాట్లాడారు, మనుష్యకుమారునికి వ్యతిరేకముగా మాట్లాడారు, నేను మిమ్ములను క్షమిస్తాను, కాని ఒక దినమున పరిశుద్ధాత్మ ఇదే కార్యమును చేయుటకు వచ్చును. దానికి వ్యతిరేకముగా మాట్లాడినట్లయితే, ఈ లోకమందైననూ, రాబోవు లోకమందైననూ క్షమాపణ లేదు."
99ఓ, సహోదరుడా, మనము పెంతుకోస్తు ఆశీర్వాదము కలిగియుండుటను బట్టి ఈ రాత్రి నేను సంతోషించుచున్నాను. ఆమెన్. సందేహము లేదు, ఇక్కడ చర్చి-అఫ్-గాడ్ నుండి, ఫోర్-స్క్వేర్, అసెంబ్లీస్-ఆఫ్-గాడ్, మరియు అనేక రకములైన సహోదరులు ఇక్కడ కూడియున్నారు. అది అద్భుతము. దానిని ఆ రీతిగా కొనసాగించండి. దానితో నిలిచియుండుండి, చూచారా. కాని ఎన్నడూ ఆ దుప్పటి మరొక సహోదురుని మీదకు కప్పబడదని అనుకోవద్దు, మరొక సంస్థకి అది… అంతే పరిశుద్ధాత్మను కలిగియున్నది. ఆయనకు విధేయత చూపిన వారికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించెను. కాబట్టి మరొక సహోదరుడు కూడా చేస్తాడు, మీరు చూచారా. కాబట్టి దానిని విస్తరింపచేయుము. అది సరియే. మరియు మనము ఒక దగ్గర కలిసి మరియు సంతోషించుదాము.
LUKE 17:28
100మనము లోకమును విడచిపెట్టియున్నాము. మనము అబ్రాహాము సంతానమైయున్నాము; మనము క్రీస్తు సంతానము, వాగ్ధానము చేయబడిన సంతానము. మరియు ఇక్కడ మనము… మరియు ఆయన మన పితరుడైన అబ్రాహామునకు ఇచ్చిన చివరి విషయము ఏమిటి? సోదమకు ముందు ఆ సూచన, దహించబడుటకు ముందు, మరియు కుమారుని యొక్క రాకడ. ఇప్పుడు వాగ్ధాన పుత్రుని రాకకు ముందు, మరియు సోదోమ దహించబడుట… దేవుడు యేసుక్రీస్తు ద్వారా వాగ్ధానము చేసెను, అదేమనగా, అది ఖచ్చితముగా సోదోమ దినముల వలె యుండును.
ఈ రోజు లోకమును చూడండి. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ కూడా ఈ దినములలో యుండు రీతిగా నైతిక విలువలు పతనము కావడం చూడలేదు. నా ఉత్తరాల పెట్టె, కాలిఫోర్నియా నుండి కన్నీటితో తల్లలు వ్రాసిన ఉత్తరములతో నిండిపోయినది. వార్తా పత్రికలలో చదివాను. వక్రమార్గము పట్టుట, కాలిఫోర్నియాలో అది ఎందుకు మారినది. అంతకు ముందు సంవత్సరము కంటే ముప్పై-శాతము పెరిగినది. వక్రమార్గము పట్టుట ప్రతిచోటనున్నది. పాఠశాలలు, మతపరమైన పాఠశాలలు ప్రజలను వారి పాఠశాల నుండి బయటకు పంపివేయవలసివస్తుంది — బయటకు తీయుట కఠినముగా ఉన్నది. వక్రమార్గము పట్టుచున్నారు, "సాత్వికమైన దానికి విరుద్ధముగా," సొదొమలో ఉన్నట్లుగా. మనము దానిని ఆ విధముగా చూస్తున్నాము.
101బిల్లీ గ్రాహంను చూడండి, దేవుని నుండి వచ్చిన వర్తమానికుడు, సువార్తను వ్యాపింపచేస్తున్నాడు. ఇప్పుడు, ఏర్పరచబడిన సంఘము సంగతి ఏమిటి? అది కూడా సూచన కలిగియుండవలసియున్నది. అది నిజము కాదా? అది దానిని కలిగియుండవలసియున్నది. నేను నమ్ముచున్నాను, మనమందరము మన అవిశ్వాసమును విడిచి, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి, ఆయనను వెంబడించి, ఆయన వాగ్దానము చేసినట్లుగా ఈ చివరి దినములలో ఆయన సూచనలు చూడాలి. మనము తలలు వంచుదాము.
102ఆయనను మీ రక్షకుడిగా ఎరుగనివారు ఈ రాత్రి ఎవరైనా ఉన్నారా, నీవు సమస్తమును విడిచి ఆయనను వెంబడించకోరుచున్నావా? నీవు చేతిని పైకెత్తి, "సహోదరుడా, బ్రెన్హాం, నిజమైన క్రైస్తవునిగా ఉండుటకు నేను ఆ రీతిగా చేయగోరుచున్నాను," అని చెప్పుము. దేవుడు నిన్ను దీవిచును గాక. ఇంకా మరొకరు ఉన్నారా? దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. సహోదరి, దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును, సహోదరుడా, మరొకరు? అయ్యా, దేవుడు నిన్ను దీవించును. "నేను సమస్తమును విడిచిపెట్టగోరుచున్నాను. సహోదరుడా, బ్రెన్హాం, నేను దానిని చేస్తాను."
LUKE 1:35•
JOHN 15:7
103నేను మరొక విషయము అడగగోరుచున్నాను. సహోదరుడా, సహోదరి, నేను ఎవరిని నొప్పించగోరుటలేదు, కాని మీరు చూడండి, నీవు దేవుని వాక్యముకు బాధ్యుడవు. "మీరు నాయందును, నా మాటలు మీయందును నిలిచియున్నయెడల…" కొన్నిసార్లు నన్ను గాయపరిచే మాటలు నేను చెప్పవలసి వస్తుంది, ప్రత్యేకముగా నా సహోదరీలతో మాట్లాడుచున్నప్పుడు.
ఎందుకనగా, ఆదియందు సాతానుడు ఉపయోగించుకున్నది స్త్రీని అని మీరు గ్రహించుడి. దేవుడు పురుషుడిని ఎన్నుకున్నాడు; సాతానుడు స్త్రీని ఎంచుకున్నాడు. యేసుక్రీస్తును ఈ భూమి మీదకు తెచ్చుటకు ఒక పొదుగు యంత్రము (ఇంక్యుబేటర్), ఆమె దీవించబడినది. ఇప్పుడు ఆయన ఆమె కుమారుడు కాదు. మీరందరికి అది తెలుసు. యేసు ఎప్పుడూ కూడా ఆమెను తల్లి అనలేదు. ఆమె ఎన్నడు కూడా… ఇది మిశ్రిత జనాంగము, కాని మీరు నా మాట వినండి. మరియ నుండి ఏ కణము రాలేదు. అది పూర్తిగా, దేవుని చేత సృష్టించబడినది. "పరిశుద్ధాత్మ ఆమెను కమ్మెను." అందునుబట్టియే, యేసు ఆమెను తల్లి అని పిలువలేదు. ఆమెకు ఆయనలో ఎంత మాత్రము భాగము లేదు.
MATT 12:47-50•
MARK 3:32-35•
JOHN 2:4•
1COR 15:20,23
104శిశివు జన్మించుటకు దేవుడు ఆమెను ఒక పాత్రగా వాడుకున్నాడు, ఎందుకనగా ఆ బాలునిలో స్త్రీకి చెందినది ఏదైనా ఉన్నట్లయితే, ఆ శిశివు… ఆ స్త్రీ… పెద్దలైన మీరు నేను చెప్పేది గ్రహిస్తారు. అక్కడ గర్భధారణ వంటిది ఉండవలసియున్నది, స్త్రీ నుండి ఒక విధమైన అండము రావాలి, అప్పుడు అది సుమారుగా సర్వోన్నతుడైన దేవునితో లైంగిక కార్యముగా ఉంటుంది. అలా ఉండుటకు వీలులేదు.
దేవుడే ఆ శిశువును సృష్టించాడు, అండము మరియు శుక్రకణము రెంటినీ. స్త్రీ మరియు పురుషుడి రెండు కణములను దేవుడు సృష్టించాడు. అందును బట్టియే ఆ శరీరము తిరిగి లేపబడినది. ఖచ్చితముగా. ఆయన పునరుత్తానములో మొదటి వాడైయున్నాడు. కాబట్టి ఆయన ఎన్నడూ ఆమెను తల్లి అని పిలువలేదు. వారు ఆయనతో అన్నారు, "నీ తల్లి అక్కడ నీ కొరకు చూస్తున్నది."
ఆయన చెప్పెను, "నా తల్లి ఎవరు?" నా తండ్రి చిత్తమును నెరవేర్చువారే నా తల్లి." కాబట్టి ఒక్కసారి కూడా ఆయన తల్లి అని పిలువలేదు. ఆమెను ఆయన "స్త్రీ" అని పిలిచాడు. ఆమె అదే అయి యుండెను.
105మీలో కొదరు ప్రియమైన కాథలిక్కులు ఆమెను దేవుడు, లేక దేవతగా, ఆకాశరాణిగా చేస్తున్నారు. అది సరియైనది కాదు. లేదు, అది కాదు. ఆమె మంచి స్త్రీ. అవునయ్యా. ఖచ్చితముగా. కాని దేవుడు ఎంచుకొన్న ఏ స్త్రీలకంటే కూడా ఆమె ఎక్కువైనది కాదు. ఆయన స్త్రీని మరొక పనికి ఉపయోగించగలడు. ఆమెను ఏ విధముగానైనను ఉపయోగించకలడు. ఆమె కేవలము పొదుగు సాధనము (ఇంక్యుబేటర్) వంటిది. ఆ జీవమును ఆ విధముగా వెచ్చగా యుంచుటకు, ఆ శిశువులోనికి జీవము వచ్చినది. కాని రక్తము, హిమోగ్లోబిన్, మనకు తెలుసు, అది ఎల్లప్పుడు పురుషుని నుండి వచ్చును. మరియు ఆయన పురుషుడు — సృష్టికర్త.
LUKE 1:35
106ఆమె యూదురాలు కాదు… ఆ శిశువు… యేసు యూదుడు కాదు లేక అన్యుడు కాదు. ఆయన దేవుడు. అది నిజము. తను నివశించుటకు దేవుడు తనకుతానే శరీరమును సృష్టించాడు. అది ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, ఆ పవిత్రమైన, కన్య జన్మము, ఆయన మానవ శరీరమును తెచ్చినది, పరిశుద్ధాత్మ వలన లోపము లేని గర్భధారణ, కాబట్టి అండము విషయములో కాని, రక్తకణము విషయములో కాని ఆ స్త్రీ పాత్ర ఏమియులేదు. పురుషుడు రక్తకణమును కలిగియున్నాడు. స్త్రీ అండము కలిగియున్నది. కాబట్టి ఈ విధముగా కార్యము జరుగుటకు అక్కడ కోరిక, మరియు గర్భధారణ జరుగవలసియున్నది. మరియు ఆ విషయములో పరిశుద్ధాత్మ ఆమె మీదకు వచ్చినది, దేవుడు స్త్రీలో సృజించాడు. అది తప్ప మరేమియూ లేదు. అది నా రక్షకుడు. ఆయన లేకుండా, మనమందరమూ నశించినవారిమే.
DEUT 22:5•
1COR 11:5
107ఇప్పుడు, ఇక్కడున్న కొంతమంది ప్రజలు, స్త్రీలైన మీరు, మీరు పెంతెకొస్తు స్త్రీలు కావచ్చు, మీరు అసభ్యమైన దుస్తులు ధరించి, తలవెంట్రుకలు కత్తిరించుకొని, అలాటి విషయంలో తప్పు చేసియుండవచ్చు. నేను ఈ కాలిఫోర్నియాలో గమనించాను. వారిలో అనేకమంది … లేక ఇక్కడ అరిజోనాలో… వారిలో అనేకమంది ముఖమునకు రంగు పూసుకుంటారు. దానికి కూడా వ్యతిరేకముగా పోరాడాలి. మంచిది, నీవు ముఖమునకు రంగు పూకోకూడదని బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. అది తప్పు అని మనకు తెలుసు, ఎందుకనగా అది లోకపు కార్యము. కాని పరిశుద్ధ గ్రంథములో ఒక ఆజ్ఞ ఉన్నది, తల వెంట్రుకలు కత్తిరించుకున్న స్త్రీ గౌరవమునకు యోగ్యురాలు కాదు. అది దేవుని దృష్టిలో ఆ విధముగా ఉన్నప్పుడు, నీవు పరిశుద్ధాత్మను కలిగియున్నావని చెప్పుకొనుచూ, ఆ రీతిగా చేసినట్లయితే ఎక్కడో తప్పున్నది.
"పురుషుని వస్త్రములు ధరించుట… ఓ, ప్రియమైన సహోదరీ, లోక మర్యాదను అనుసరించవద్దు. లోకమును విడిచిపెట్టు; క్రీస్తును హత్తుకొనుము." నీవు అడగవచ్చు, "అది ఏమి వ్యత్యాసమును కలుగజేయును."
LUKE 11:28•
JAS 2:10•
REV 22:14
108"ఆయన ఆజ్ఞలన్నింటిని నెరవేర్చువాడు ధన్యుడు, అతడు జీవవృక్షములో ప్రవేశించే హక్కు కలిగియుంటాడు." ఒక్క విషయములో తప్పు చేసినవాడు సమస్తములో నేరస్తుడే. నీకు బాగుగా తెలియును. నీవు పరిశుద్ధాత్మను కలిగియున్నట్లయితే, అది నీకు ఉత్తమముగా బోధించును. అది పరిశుద్ధాత్మ అయితే, నీకు మెరుగుగా బోధించును.
ఒకవేళ నీవు పాపివైతే, ఈ రాత్రి ప్రారంభించగోరినట్లయితే, ఇలా చెప్పుము, "సహోదరుడా బ్రెన్హాం, నేను దానిని గ్రహించలేదు. మార్గములో ఇంతకాలము నేను తప్పిపోయాను. నేను క్రొత్తగా ప్రారంభించకోరుచున్నాను. ఇప్పటి నుండి నేను దేవుని సేవిస్తాను," నీ చేతిని పైకెత్తి చెప్పుము, "సహోదరుడా, బ్రెన్హాం నా గూర్చి ప్రార్ధించు." దేవుడు నిన్ను దీవించును. దానికి ధైర్యము కావాలి, దానికి నిజమైన… దేవుడు నిన్ను దీవించును. మీలో అనేకులు. దేవుడు మిమ్ములను దీవించును.
109ఒకవేళ నీలో ఉన్నది ఏదైనా, నీవు తప్పు చేస్తున్నావని చెప్పినట్లయితే, అప్పుడు దేవుడు నీకు సమీపముగా ఉన్నాడని తెలుసుకో. కాని నీవు వాక్యమును స్పష్టముగా విన్న తరువాత, నీవు ఇంకనూ అక్కడే ఉండి, "నేను దానిని చేయను. అతడు దేనిని గూర్చి మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు," మరియు ఇక్కడ నేను నేరుగా వాక్యమును చెప్పుచుండగా, నీవు అలా చేస్తున్నట్లయితే, నీలో ఉన్నదానిలో ఏదో తప్పు ఉన్నది, చూచారా. అది సాతానుడు తప్ప మరొకటి కాదు, అంతే. అది దేవునికి వ్యతిరేకము. అది ఆయన నియమములకు వ్యతిరేకము. అది ఆయన వాక్యముకు వ్యతిరేకము.
110కొద్ది కాలము క్రితము ఒక వ్యక్తి నాతో చెప్పారు, అతడు ప్రఖ్యాతిగాంచిన బోధకుడు, అతడు నన్ను తన గదిలోనికి పిలిచి, నా మీద చేతులుంచి, "నీవు నీ పరిచర్య నాశనం చేసుకొనబోవుచున్నావు," అని చెప్పెను.
"ఎందుకు?" అని నేను అన్నాను.
అతడన్నాడు, "ప్రజలు చేసే కార్యములను బట్టి నీవు ఎల్లప్పుడు వారిమీద కేకలు వేస్తున్నావు." చెప్పెను, "నీవు ఎందుకు … ప్రజలు నిన్ను ప్రవక్తవని నమ్ముచున్నారు."
నేనన్నాను, "నేను ప్రవక్తను కాను."
అతడన్నాడు, "మంచిది, ప్రజలు నీ గూర్చి తలంచుచున్నారు, గొప్ప ఆత్మీయ ఆశీర్వాదములను ఎట్లా పొందుకోవాలో వారికి నీవు ఎందుకు బోధించకూడదు?"
నేనన్నాను, "వారికి మొదటగా అ,ఆలు కూడా రాకుండా, వారికి నేనెలాగున ఆత్మీయమైన సంగతులను బోధించగలను? వారికి దేవుని వాక్యముయెడల కొద్దిగా కూడా తగిన గౌరవము లేదు, ఆత్మీయ సంగతులు మాత్రమే కాదు. భూసంబంధమైన సంగతులను వారు విశ్వసించనప్పుడు, ఎలాగు వారు పరలోకపు సంగతులను విశ్వసించగలరు?"
అతడన్నాడు, "మంచిది, నీవు నీ పరిచర్య నాశనం చేసుకుంటున్నావు."
నేను చెప్పాను, "దేవుని వాక్యమును నాశనము చేసే ఏ పరిచర్య అయినా, అది నాశనము కావలసిందే." దేవుని వాక్యము దగ్గరకు తిరిగి రమ్ము. అది నిజము.
111ఇప్పుడు, నీవు సిగరెట్లు త్రాగుతూ మరియు అలాటి కార్యములను చేయుచూ, నీవు పరిశుద్ధాత్మను కలిగియున్నావని చెప్పకొనుచున్నట్లయితే, అది నీకు అవమానము. పురుషులారా… "స్త్రీలను ఎందుకు నొప్పించుచున్నావు?" అని మీరు అంటారు. మీ స్త్రీలు అలాగు చేయుటకు అనుమతించే పురుషులారా! ఓ, సేవకుడా, మరియు నిన్నునీవు ఒక క్రైస్తవుడవాని పిలుచుకొనుచున్నావు? నీకు అవమానము. ఇది కఠినముగా ఉన్నదని నాకు తెలుసు, కాని సహోదరుడా, ఇది కత్తిరించు సమయము. ఇది పరిశుద్ధాత్మ వచ్చి ఆయన వధువును తీసుకు వెళ్ళే సమయము. అది దేవుని వాక్యము సరిపోనప్పుడు, దానిలో ఏదో పొరపాటు ఉన్నది.
112మీరు పతనమైపోయారు, బుధవారము రాత్రి సంఘముకు రాకుండా ఇంటివద్ద నుండి టెలివిజన్ చూస్తున్నారు, ఆలోచించండి… మీరు నిజముగా ఆలోచించండి… మీరు సంఘముకు వెళ్ళాలంటే, బలవంతముగా వెళ్ళవలసివస్తుంది, ఎందుకనగా మీరు దానిని ఒక విధిగా తలస్తున్నారు; నీవు దానిని చేయాలి, అది గౌరవనీయమైన కార్యము. ఒకవేళ నీవు దానిని ప్రేమించనట్లయితే, ఎక్కడో తప్పున్నది. దేవుని సేవించుటను మీరు ప్రేమించునట్లు చేయుటకు పరిశుద్ధాత్మ ఉన్నది.
ఇప్పుడు, దీనిని మనసులో ఉంచుకొని మన తలలు వంచియుండగా, ఈ రాత్రి మరలా దేవునితో నూతన ప్రారంభము ఆశించువారు, మీ చేతులు పైకెత్తండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీ చేతులు పైకెత్తండి. ఇక్కడున్న అందరూ, దేవుడు నిన్ను దీశించును. నిన్ను దీవించును, నిన్ను, నిన్ను నిన్ను. దేవుడు నిన్ను దీవించును. మంచిది. నేను మీ కొరకు ప్రార్ధిచబోవుచున్నాను.
113పరలోకపు తండ్రీ, నాకు తెలిసినంతవరకు నీ వాక్యమును తేటగా, సూటిగా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినాను. భిన్నముగా ఉండుటకు కాదు, ఒకవేళ నా ఉద్దేశ్యము అదే అయినట్లయితే ప్రభువా, ఆ బలిపీఠముపైన ఉండవలసినది నేనే. కాని ఒకవేళ నా సహోదరుడు లేక సహోదరీ ఎవరైనా నీళ్ళ లోపలికి వస్తున్న పడవలో ఉండుట చూసినప్పుడు, నేను వారికి అరచి చెప్పనట్లయితే, లేక వారిని గద్దించనట్లయితే, లేక వారిని ఆ స్థితినుండి తప్పించనట్లయితే, అప్పుడు నేను వారిని ప్రేమించుటలేదు. ప్రభువా, వారు సురక్షితముగా ఉండునట్లు వారిని బయటకు తీసుకురావటానికి ప్రయత్నిస్తునాను.
ఓ, పరలోకపు దేవా, చేతులెత్తిన ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్ధిస్తున్నాను. జట్టు కత్తిరించుకున్న అనేకమంది స్త్రీలు చేతులు పైకెత్తుట చూసియున్నాను. వారు చేయుచున్నది తప్పు అని గ్రహించకలిగిన కృపనిచ్చావు. చేయనివారు ఇంకా అనేకమందియున్నారు. మీరే దానికి న్యాయాధిపతి. కాని ప్రభువా, వారిని రక్షించమని ప్రార్ధిస్తున్నాను. దానిని అనుగ్రహించండి. ఆ పురుషులు తమ చేతులు పైకెత్తారు. బలమైన, చక్కటి యవ్వన పురుషులు తమ భార్యలతో కలసి తమ చేతులు పైకెత్తారు. వృద్దులు తమ చేతులు పైకెత్తారు. తండ్రీ, ఇప్పుడు మేము లోకమును మరియు లోకములో ఉన్నవాటిని విడిచిపెట్టాలి, లేనట్లయితే మేము నిన్ను సేవించలేము.
114నీ వాక్యము ప్రకటించబడినది, ప్రజలు నిన్ను చూచునట్లుగా, ఈ రాత్రి మిమ్ములను మీరు ప్రత్యక్షపరచుకొనవలసినదిగా ప్రార్ధిస్తున్నాను. మనుష్యులు ఏదైనా చెప్పగలరు. కాని దేవుడు దిగివచ్చి ఆయన వాక్యమును నిరూపించినప్పుడు, అప్పుడు మేము ఎలాటి సాకులు చెప్పలేము. తండ్రి? ఈ రాత్రి అనుగ్రహించవలసినదిగా ప్రార్ధిస్తున్నాను. ఈ ప్రజలు… బహుశా వారిలో చాలామంది పాపులైయుండవచ్చు. పాపులని ఒప్పుకొనుచు అనేకులు తమ హస్తములను ఎత్తియున్నారు. మరియు నేను ప్రార్ధిస్తున్నాను, తండ్రి, ప్రత్యక్షపరచుకొనుటను చూచిన వెంటనే…
అంతము వచ్చియున్నది అని మిమ్ములను మీరు కనపరుచుకొందురని మరియు మీరు అది ఈ రాత్రి చేయుదురు అని నేను నమ్ముచున్నాను. అబ్రాహాము సంతానమునకు ఎదురుచూచు కుమారుడు త్వరగా రాబోవుచున్నాడు, మరియు సోదోమ దహించబడవలసియున్నది. ఒక దినాన, ఫినిక్సులో రాయిమీద రాయి నిలబడియుండదు. ఈ లోయ అంతా శుభ్రముగా ఊడ్వబడును. ఈ రాత్రి పట్టణములో ఎక్కడ వ్యభిచారము జరుగుతుందో, మత్తుపదార్ధములు సేవించుట, సిగరెట్ల త్రాగే తల్లలు, కుమార్తెలు నాట్యమాడుట, వక్రమార్గమున నడచుట, పురుషులు పాపములో జీవించుట, ఈ పట్టణము యొక్క పాపము!
EZEK 9:4
115ఓ దేవా, నేను వీటన్నిటిని చూస్తూ, "ప్రయత్నించుట వలన కూడా ఉపయోగము ఏమిటి? అని తలంచాను. కాని ప్రభువా, నేను ఇక్కడ చూసినప్పుడు, అక్కడ కొద్దిగా, ఇక్కడ కొద్దిగా చిన్న వెలుగు కన్పిస్తుంది, సమర్పణ కలిగిన క్రైస్తవులు ప్రార్ధిస్తున్నారు. "ఆ పట్టణములో జరుగు హేయ కృత్యములు గూర్చి మూల్గులు విడుచుచూ ప్రలాపించువారికి గురుతును వేయుటకు వారిపై ముద్రను వేయుటకు దేవుని దూతకు ఆజ్ఞ ఇవ్వబడినది. వారు మాత్రమే నశించిపోరు.
మరియు తీర్పుదినము రాబోవుచున్నది, అప్పుడు ఎలాటి సాకు చెప్పుటకు కుదరదు. ఈ రాత్రి వర్తమానము రంగము మీద ఇవ్వబడినది, ఆకాశము క్రింద ప్రకటించబడినది, మేము అందరము జవాబివ్వాలి. కాబట్టి, తండ్రి, నేను ప్రార్ధిస్తున్నాను, ఈ లోక సంబంధమైన విషయాల నుండి వారికి సున్నతి అనుగ్రహించండి. తద్వారా వారు ఈ ప్రస్తుత కాలములో భక్తి గలిగి జీవించుదురు. యేసు నామములో ప్రార్ధిస్తున్నాము. ఆమెన్.
2PET 1:20
116మిమ్ములను ఎక్కువ సేపు ఉంచినందుకు క్షమించండి. మనము… నేను నిజముగా ఆలస్యము చేశాను. నేను ఆలస్యము చేయాలని తలంచలేదు. గతరాత్రి… ప్రతి రాత్రి నేను కనీసము పది గంటల వరకు ఉంటున్నాను. నేను ఈ రాత్రి తొమ్మిదిన్నరకు ముగించాలని తలంచాను, కాని చేయలేకపోయాను.
ఇప్పుడు, ఒక్క నిమిషము, నేను చెప్పినదానికి ముద్ర వేయుటకు. నేను నిజానికి బోధకుడను కాను. ఎవ్వరైనా దానిని ఎరుగుదురు. నాకు చదువు లేదు, "అతడిది," "కాదు," మరియు "తీసుకురా" వంటి కెంటకీ పదములు ఉపయోగిస్తాను. మీకు తెలుసు. నేను అలాటి బోధకుడను కాను. నాకు చదువు లేదు.
కాని నేను క్రైస్తవుడను. ప్రభువు నా పాపముల నుండి నన్ను రక్షించాడు. నాకు అది తెలుసు. నాకు తెలిసిన కొంచెము దానిని నిర్ధారించుటకు ఆయన నాకు మరొక వాక్యమును ఇచ్చాడు. నేను చేసే ఒకే కార్యము, దానిని నా స్వంత వాఖ్యానము చేయను. నేను కేవలము దానిని చదువుతాను. అది ఏమి చెబుతుందో, నేను కూడా అదే చెబుతాను, చూచారా. నాకు తెలిసినదంతా అదియే, చూచారా. ఇప్పుడు అది తప్పుగా అనువదించబడితే, నాకు తెలియదు. అది ఇక్కడ ఎలా అనువదించబడినదో నేను కేవలము అదే విధముగా చెప్పుచున్నాను, చూచారా, ఆయన ఎల్లప్పుడు దానితో నిలిచి, తన మద్దతునిచ్చాడు.
MATT 28:20•
JOHN 14:19,20•
HEB 13:8
117యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడని నేను విశ్వసించుచున్నాను. నిన్న, నేడు, మరియు నిరంతరము ఆయన అదే యేసు అని నేను విశ్వసిస్తున్నాను. ఆయన చెప్పిన ఈ మాటను నేను విశ్వసిస్తున్నాను, "కొంతకాలము తర్వాత ఈ లోకము [ప్రపంచ క్రమము] నన్ను చూడదు. అయినను మీరు నన్ను చూతురు [మీరు, సంఘము], నేను [వ్యక్తిగత సర్వనామము], "నేను మీతో ఉందును, మీలోను యుగాంతము వరకు ఉందును." నేను చేయు కార్యములను మీరు చేయుదురు."
మీరు దానిని విశ్వసించుచున్నారా? ఆయన ఏ కార్యములు చేశాడో, ఆయన తనను తాను ఏ రీతిగా ప్రత్యక్షపరచుకున్నాడో మనము కనుగొన్నాము. ఈ రాత్రి నేను ప్రార్ధిస్తున్నాను, దేవుడు ఈ సంఘమును… ఇప్పుడు ఆయన నన్ను ఎంతగా అభిషేకించినప్పటికినీ, ఆయన నిన్ను కూడా అభిషేకించవలసియున్నది. చూశారా, ఇక్కడ మాట్లాడుటకు పరిశుద్ధాత్మ ఎంతగా ప్రయత్నించినప్పటికినీ, దానిని వినువారు ఇక్కడ ఉండవలసియున్నది.
MARK 5:29-31•
LUKE 8:44-46•
HEB 13:8
118ఒక రోజు యేసు ఒక గుంపు దగ్గర నుండి వెళ్ళుచున్నారు, వారు, "రబ్బీ, రబ్బీ, మీరు ఇక్కడ ఉండుట మాకు ఎంతో సంతోషము" అని కేకలు వేస్తున్నారు. యేసు నడుస్తూ వెళ్ళుచున్నాడు.
అక్కడికి ఒక చిన్న స్త్రీ నడచి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టినది, వెనుకకు వెళ్ళి అక్కడ కూర్చొన్నది. యేసు ఆగి, "నన్ను ముట్టినది ఎవరు?" అని అడిగాడు.
ఎందుకు, అని సీమోను పేతురు ఆయనను గద్దిస్తున్నట్లుగా అన్నారు. ఆయన చెప్పెను, "నీవు ఎందుకు అలాగు అడుగుచున్నావు? అందరూ నిన్ను ముట్టుచున్నారు."
ఆయన చెప్పెను, "నాకు బలహీనముగా అన్పిస్తుంది. ప్రభావము, [అనగా బలము], ప్రభావము నా నుండి వెడలిపోయినది." ఆయన తన చుట్టూ ఉన్న జనసమూహమును చూశాడు. ఆయనను విశ్వసించినవారు అక్కడ ఉన్నారు. అక్కడ వందలకొలది ప్రజలు ఉండవచ్చు, అక్కడ విశ్వసించిన వారున్నారు. ఆయన ఆ స్త్రీని కనుగొన్నాడు, ఆమె రక్తస్రావము గూర్చి చెప్పెను, అది ఆగిపోయినది, ఆమె స్వస్థపడినది. (అది నిజమేనా?) ముందుకు సాగిపోయాడు, చూచారా. ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు.
119ఇప్పుడు, మేము ప్రార్ధనా కార్డులు ఇచ్చాము. వాటిలో సగము నిన్నటి రాత్రి ఇచ్చాము, మిగిలిన సగము రాత్రి ఇచ్చాము. గత రాత్రి మనము మొదటి నుండి ప్రారంభించామా? మనము మొదట పదిహేను లేక ఇరవై నుండి గతరాత్రి ప్రారంభించామా? అది ఎంత? చెప్పండి, ఒకటి-నుండి-ఇరవై సరే. వారిలో అనేకమంది ఇక్కడ ఈ రాత్రి ఉన్నారు. అలా అయితే ఇప్పుడు కొన్ని వెనుక నుండి ఇద్దాము. మనము ప్రారంభించుదాము. చూద్దాం. మనకు పదిహేను నిమిషాల సమయము ఉన్నది, అయితే పదిహేను కార్డులు ఇద్దాము. సరే చూద్దాము, ఎనభై-అయిదు నుండి వందవరకు, సరే ఎనభై-అయిదు నుండి వంద వరకు ప్రారంభించుదాము.
120ఎనభై-అయిదు, ప్రార్ధనా కార్డును ఎవరు కలిగియున్నారు? మీ చేతిని పైకెత్తండి. ఎనభై-అయిదు, ఆ స్త్రీ వెనుక ఉన్నదా? సహోదరీ ఇక్కడకు రమ్ము. ఎనభై-ఆరు, ఎనభై-ఆరు కార్డు ఎవరిదగ్గరున్నది? ఇక్కడే ఉన్నారు. ఎనభై-ఏడు, ఎవరో మీ చేతిని ఎత్తండి, ఎనభై-ఏడు? ఈ వ్యక్తి, ఎనభై-ఏడు. ఎనభై-ఎనిమిది, ఎనభై-ఎనిమిది, ఎనభై-తొమ్మిది, ఎనభై-తొమ్మిది, తొంభై, తొంభై-ఒకటి, తొంభై-రెండు, తొంభై-మూడు, తొంభై-నాలుగు, తొంభై-అయిదు, తొంభై-అయిదు. అవును తొంభై-ఆరు, తొంభై-ఏడు, తొంభై-ఆరు, అతను చెయ్యి ఎత్తుట చూడలేదు. తొంభై-ఆరు. ఇప్పుడు నీ దగ్గర కార్డు ఉంటే ఇక్కడకు రమ్ము, చూశారా. తొంభై-ఏడు, తొంభై-ఎనిమిది, తొంభై-తొమ్మిది, వంద. సరేనా, ఈ ప్రజలు… ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది. అక్కడ ఎనిమిది మంది రాలేదు.
HEB 4:15
121ఇప్పుడు వినండి. ఇది నిజము — నీ జీవితములో పాపమును కలిగి ఇక్కడకు రావద్దు. నీవు అక్కడ దేవుని ఎదుట ఒప్పుకొనుట మంచిది. కాని నీవు నీ పాపమును ఒప్పుకొనియుంటే, ముందుకు రమ్ము. మీలో అక్కడ ఎంతమందికి ప్రార్ధనా కార్డులు లేవు, మరియు ఎంతమంది యేసు మిమ్ములను స్వస్థపరచాలని కోరుచున్నారు? మీ చేతులను పైకెత్తండి. యేసు ఆ కార్యము చేసినట్లయితే, ఎంతమంది విశ్వసిస్తారు… ఆయన… మీలో ఎంతమంది దీనిని విశ్వసిస్తున్నారు…?
గమనించండి. నేను నా వెనుక ఉన్న సేవకులను అడుగుచున్నాను. సహోదరులారా, సువార్త సేవకులముగా, మనము బైబిల్ ను విశ్వసిస్తున్నాము. క్రొత్త నిబంధన, హెబ్రీ పత్రికలో, "ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడు" అని చెప్పినది నిజమేనా? "మన బలహీనతలలో సహానుభవము కలిగిన ప్రధాన యాజకుడు," అది నిజమేనా, సహోదరులారా? "ప్రధాన యాజకుడు" అని బైబిల్ చెప్పినది మీలో ఎంత మందికి తెలుసు?
HEB 4:15•
HEB 13:8
122మంచిది, ఆయన మన బలహీనతలలో సహానుభవము కలిగినవాడు… ఇప్పుడు ఆయన ఎలా…? ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా యున్నట్లయితే, బలహీనతలతో ఉన్నవారు ఆయనను ముట్టినప్పుడు ఆయన ఎలా ప్రవర్తించాడు? ఆ స్త్రీ, రక్త స్రావము కలిగినది ఆమెను ముట్టినది, ఎందుకనగా ఆయనను ముట్టవలసిన అవసరతలో ఆమె యున్నది. ఆయన తిరిగి, ఆమెను కనుగొనువరకు చుట్టూ చూశాడు, మరియు ఆమెను పిలిచాడు. అది నిజమేనా? ఇప్పుడు, ఆయన అదే ప్రధాన యాజకుడు అయినట్లయితే, ఆయన అదే రీతిగా ప్రవర్తించవలసియున్నది, ఎందుకనగా ఆయన… ప్రధాన యాజకుడు, అది నిజమేనా? మంచిది, ఆయన అదే రీతిగా ప్రవర్తించవలసియున్నది.
123ఇప్పుడు, నీకు ప్రార్థనా కార్డులు అవసరము లేదు. లేదు, నీకు ప్రార్ధనా కార్డు అక్కరలేదు. నీకు కాలసినది దేవునియందు విశ్వాసము ఒక్కటే. నీవు విశ్వసించు, నీ హృదయమంతటితో యేసుక్రీస్తు రోగులను స్వస్థపరచును అని, నీ విషయములో నిశ్చయముగా కార్యము చేస్తాడని విశ్వసించుము.
ఇంకా ఏదైనా చెప్పుటకు ముందుగా, ఇప్పుడు మనము ఒక్క నిమిషము తలలు వంచి, ప్రార్థన చేద్దాము. ఆయన చేస్తాడేమో అని నేను చెప్పుటలేదు. ఆయన చేస్తాడని నేను నమ్ముచున్నాను. నేను విశ్వసిస్తున్నాను, ఆయన నిశ్చయముగా చేస్తాడని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు, ఆయన చేసినప్పుడు, మీలో ఎంతమంది విశ్వసిస్తారు? మీ చేతులు పైకెత్తండి. ఆయన దానిని అనుగ్రహించాలని నా ప్రార్థన.
JOHN 3:18
124పరలోకపు తండ్రీ, "నిన్ను వెంబడించుటకు, సమస్తమును విడిచిపెట్టాలి," అని నీ వాక్యము చెప్పిన మాటలను నేను ఇప్పుడు చెప్పాను. సమస్తమును విడిచిపెట్టినవారు నిన్ను చూడాలి. మరియు నీవు ఏమి చేస్తున్నావు, పాపమును విడిచిపెట్టకుండా వెంబడించువారు ఎన్నడూ దానిని గ్రహించలేరు. ఎవరైతే పాపమును అవిశ్వాసమును విడిచిపెడతారో…
అవిశ్వాసమే పాపమని మనము ఎరుగుదుము. మనము ఎంత పరిశుద్ధముగా జీవించినా, మనము ఏమి చేసినా, మనము ఇంకను అవిశ్వాసముతో ఉంటే, మనము పాపులమే. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, "విశ్వసింపనివాడు శిక్షింపబడతాడు." కాబట్టి మనము దేవుని నోటనుండి వచ్చిన ప్రతిమాటను తప్పనిసరిగా విశ్వసించాలని మనకు తెలుసు. అదియే మన అనుదిన ఆహారమైయుండాలి.
తండ్రి, (ఈ రాత్రి నేను వాక్య భాగములను ఎత్తి మాట్లాడియుండగా), ఈ చివరి దినములలోని నీ వాగ్దానములను, మరియు ఈ చివరి దినములలో మేము దేనికొరకు ఎదురుచూడాలో చెప్పియున్నావు. ప్రభువా, అవి సరియైనట్లయితే, వాటిని వెంబడిస్తూ నీ సూచనలు అనుగ్రహించవలసినదిగా ప్రార్ధిస్తున్నాను. అనుగ్రహించండి.
నన్ను వాక్యమును మరియు ప్రజలను నీకు అప్పగిస్తున్నాను. తండ్రీ, వారి హృదయమంతటితో నిన్ను విశ్వసించునట్లుగా, వారి హృదయములకు సున్నతి అనుగ్రహించండి. అప్పుడు ఈ ప్రజలు మెస్సీయ, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ మనతో ఈ రాత్రి ఉన్నదని ఈ ప్రజలు చూచుదురు గాక, ఆయన సంఘములో, ఏర్పరచబడిన సంఘములో, బయటకు పిలువబడిన, అబ్రాహాము సంతానములో రాజరిక వాగ్దానము ద్వారా ఉన్నాడు. యేసు నామములో దీనిని అనుగ్రహించండి. ఆమెన్.
JOHN 15:7
125ఇప్పుడు, ఒక్క నిమిషము నన్ను చూడనీయండి. ఇప్పుడు మనము కొద్ది సమయమును, చాలా కొద్ది సమయమును, సుమారుగా పది నిమిషాలు తీసుకుందాము. మీరు ఆయనను ప్రేమిస్తున్నారా? మీరు ఆయనను విశ్వసిస్తున్నారా? ఈ రాత్రి నేను వాక్యము నుండి మీతో చెప్పిన సంగతులు సత్యము అని మీరు విశ్వసిస్తున్నారా? యేసు భూమి మీద ఉండినప్పుడు ఇవే కార్యములను చేశాడని మీరు నమ్ముచున్నారా? ఆయన దానిని వాగ్దానము చేశాడని మీరు నమ్ముచున్నారా? మనము అంత్యదినములలో ఉన్నామని మీరు నమ్ముచున్నారా? ఇప్పుడు, అది ఆయన వాగ్దానము. ఆయన దానిని నెరవేర్చాలి, "మీరు నాయందును, నా మాటలు మీయందును నిలిచియుండినయెడల, ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును." ఇప్పుడు నీ ఉద్దేశ్యములు, క్రియలు సరిగా ఉండాలి. నీవు దానిని నీ హృదయమంతటితో విశ్వసించాలి.
126ఈ ప్రార్ధనా వరుసలో నాకు తెలిసినవారు ఎవరూ లేరనుకొనుచున్నాను. మనము పరిచయము లేనివారిమి. నేను అన్యుడను. మిగిలినవారు పరిచయము లేనివారు. మీ గూర్చి నాకు తెలియదని, మీకు తెలుసు. ఈ ప్రార్ధన వరుసలో మీ గూర్చి నాకు తెలియదు అన్నవారు మీ చేతులు పైకెత్తండి. మీరు అక్కడున్నారు. ఇప్పుడు ఇది మర్మమైన కార్యము.
ఇక్కడ ప్రార్ధనా కార్డులు ఉన్నవారున్నారు; అక్కడ ప్రార్ధనా కార్డులు లేనివారున్నారు . ప్రార్థనా కార్డు అనగా సంఖ్యను కలిగిన ఒక కార్డు తప్ప మరొకటి కాదు. అది నీకు ఒక సంఖ్యను ఇస్తుంది. ఆ బాలుడు ఆ కార్డులను కలిపియుంచగా, ప్రార్థనా కార్డు కావలసిన ఎవరైనా వాటిని తీసుకోవచ్చు. అది ఎక్కడున్నదో అతనికిగాని, మరెవరికిగాని తెలియదు. ఆ కార్డులు అటు, ఇటు కలిపివేయుట వలన అతనికి తెలియదు.
HEB 13:8
127ప్రార్థనా వరుసలోనికి ఎవరు పిలువబడతారో అది వారికెన్నడూ తెలియదు, ఎందుకనగా మనము దానిని చెప్పలేము. అనేకసార్లు మనము దానిని అక్కడనుండి తీస్తాము… నేను మొదటిగా ప్రారంభించినప్పుడు, అక్కడ ఒక వ్యక్తి ప్రార్ధనా కార్డులు అమ్మాడు. "నా భార్యను ప్రార్ధనా వరుసలో నిలబెట్టినట్లయితే, నేను ఐదువందల డాలర్లు ఇస్తాను," అని ఒకరు చెప్పారు, చూచారా.
నేను నా స్వంతకుమారుడిని తీసుకున్నాను. అప్పుడు నేను చెప్పాను, "కుమారుడా, నీవు ప్రార్ధనా కార్డులు అమ్ముట లేదని ప్రజలు తెలుసుకొనునట్లుగా, వారి యెదుటకు వెళ్ళి, ప్రార్ధనా కార్డులను ఈ విధంగా కలిపివేసి, అప్పుడు కావలసిన వారికి వాటిని ఇమ్ము, మరియు దానితోపాటుగా నేను అక్కడకు వెళ్ళి పిలుచునంతవరకు, నేను ఎక్కడ నుండి పిలుస్తానో నీకు కూడా తెలియదు." ప్రతిసారి కూటములలో అలాగు జరుగుట మీలో ఎంతమంది చూశారు? ప్రతిసారి నేను మార్చి ఇక్కడ, అక్కడ పిలుస్తుంటాను. మరియు దానితోపాటు, వేదిక మీద ఒక్కరు స్వస్థతపడతారు, మరియు అక్కడ ప్రార్ధనా కార్డులులేని వారు, డజను మంది పిలువబడతారు. (అది నిజము.)
128అది యేసుక్రీస్తు, నిన్న, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా యున్నాడనుదానికి తప్పిపోని రుజువు.
ఆయనను వెంబడించుటకు నీవు సమస్తమును విడిచిపెడతావా? స్వస్థత కొరకు ఆయనను వెంబడించుటకు, నీ అవిశ్వాసమును విడిచిపెట్టుటకు నీవు సిద్ధమేనా? పరిశుద్ధతలో ఆయనను వెంబడించుటకు, నీ లోకానుసారమైన కార్యములను విడిచిపెట్టుము. ఆయన కొరకు సాగిపోవుము. దానిని ఇప్పుడే చేయుము. ఆయన దానిని చేస్తాడని నేను చెప్పుటలేదు. ఆయన చేస్తున్నట్లయితే, అప్పుడు నీవు తెలుసుకుంటావు.
129ఇక్కడ నిలబడియున్న స్త్రీ, గత రాత్రి నేను చెప్పినట్లుగా యోహాను 4 యొక్క చిత్రమైయున్నది. ఇక్కడ ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ తమ జీవితములో మొదటిసారి కలుసుకున్నారు. అది చిన్న బల్ల దగ్గర, మీరు ఎప్పుడైన సమరయలోని సుఖారను దగ్గర చిన్న బావి దగ్గరకు వెళ్ళినట్లయితే, దాని ప్రక్కన విశాలముగా ద్రాక్షావల్లులు కన్పిస్తాయి. అక్కడ ఆ స్త్రీ, యేసుతో మాట్లాడినది. ఆ పురుషుడు మరియు స్త్రీ మొదటిసారిగా అక్కడ కలుసుకున్నారు. ఆయన ఆ స్త్రీతో, ఆమె సమస్య ఏమిటో చెప్పెను. ఆమె సమస్య, పాపము.
ISA 53:5•
1PET 2:24
130అది ఆమెనే కావచ్చు. ఆమె పాపి కావచ్చును, ఆమె వేషధారి కావచ్చు, ఆమె పరిశుద్దురాలు కావచ్చును, ఒకవేళ ఆమెకు శారీరక స్వస్థత కావలసియుండ వచ్చును, ఆమె మరొకరి స్వస్థత కోరియుండవచ్చును, ఆమె ఆర్థికపరమైన సమస్యలతో ఉండవచ్చును. ఆమె ఎందుకొరకు వచ్చినదో, నాకు తెలియదు. నేను దానిని మీకు చెప్పలేదు. ఆ స్త్రీ, అక్కడ నిలువబడి యున్నది. అంతే. అది సత్యము. మనమెన్నడూ కలుసుకొనలేదు.
కాని ఒకవేళ యేసుక్రీస్తు ఇక్కడకు వచ్చినట్లయితే… ఆమెను స్వస్థపరచుట, ఒకవేళ ఆమె రోగిగా ఉంటే, నేను దానిని చేయలేను. దేవుడు ఇప్పటికే చేసిన కార్యమును నేను చేయలేను. ఇప్పుడు, ఒకే కార్యము… ఒకవేళ యేసు ఈ సూటును ధరించి ఇక్కడ నిలబడియుంటే? ఒకవేళ ఆమె ఇక్కడికి వచ్చి, "యేసూ, నీవు నన్ను స్వస్థపరుస్తావా?"
ఆయన ఇలా చెప్పుతాడు, "నా బిడ్డా, నేను దానిని ఎప్పుడో చేశాను. నేను నీ అతిక్రమముల నిమిత్తము గాయపరచబడ్డాను. నేను పొందిన దెబ్బలవలన నీవు స్వస్థత పరచబడితివి." అది నిజమేనా? అది ముగించబడిన కార్యము.
నీవు వచ్చి, "యేసు, నీవు నన్ను రక్షిస్తావా? నీవు నన్ను రక్షిస్తావా?" అని అడిగినట్లయితే, అది ప్రశ్న కాదు. ఆయన ఎప్పుడో దానిని చేశాడు. "ప్రభువైన యేసు, నాకు నీవు చేసిన నీ ప్రాయశ్చిత్త బలిని నేను అంగీకరిస్తున్నాను," చూశారా. నీవు ఎప్పుడో అక్కడ రక్షించబడ్డావు. నీవు అప్పుడే అక్కడ స్వస్థపరచబడితిని. నీవు కేవలము దానిని అంగీకరించుము.
EPH 2:5,8
131విశ్వాసము వలన నీవు రక్షించబడ్డావు. విశ్వాసము వలన నీవు నీ రక్షణ అంగీకరించుము. మరియు ఎవరైనా నీ వద్దకు వచ్చి, వారికి స్వస్ధపరచు శక్తి ఉన్నదని చెప్పినయెడల, వారు నిన్ను స్వస్థపరచగలరని చెప్పిన యెడల… నీవు జాగ్రత్తగా చూచుకో, అది నిజము కాదు. స్వస్థతా శక్తి క్రీస్తులో యున్నది, అది సంపూర్తి చేయబడిన కార్యము.
ఒకవేళ ఏ వ్యక్తి అయినా నీ పాపములను క్షమించే అధికారము దేవుడు తనకిచ్చాడని చెప్పినట్లయితే, మరియు అలా చేసినట్లయితే, నీవు దానిని విశ్వసించవద్దు. అవి ఎప్పుడో క్షమించబడియున్నది. ఈ రాత్రి యేసు ఇక్కడ నిలబడియున్నాడు, ఆయన దేవుని కుమారుడని అది ప్రకటిస్తుంది. ఒకవేళ నా చేతులలో మేకుల గురుతులు, వాటిలో నుండి రక్తము కారుచున్నట్లయితే, ఇక్కడ చుట్టూ ముండ్లు ఉన్నట్లయితే? అది ఇంకనూ యేసుగా మార్చదు. అది నా శరీరము. మనకు తెలుసు, ఆ శరీరము దేవుని కుడి పార్శ్వమున ఉన్నది. మరియు అది వచ్చినప్పుడు, ఇక సమయముండదు. అది నిజము. యేసు వచ్చినప్పుడు, అది అంతా అదే. కాని ఆయన ఇక్కడ ఆత్మ రూపములో ఉన్నాడు. అప్పుడు నీకును, నాకును విశ్వాసము ఇచ్చుటకు ఆయన జీవము నీలో మరియు నాలో యున్నది.
132ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ మైక్రోఫోన్, ఇక్కడ నేరుగా మాట్లాడే స్వరము లేనట్లయితే, అది పూర్తి నిశ్శబ్దముగా ఉంటుంది, అది నిజమేనా? (ఇప్పుడు, చూడండి, జాగ్రత్తగా ఆలకించండి, తద్వారా మీరు దానిని తప్పిపోరు. ఈ కార్యమును దేవుడు చేసినట్లయితే, అది దానిని స్థిరపరచును.) ఇప్పుడు ఈ మైక్రోఫోన్ ఏదియు మాట్లాడలేదు, ఎందుకనగా మాట్లాడునది ఏదియూ దానిలోలేదు. అది నిజమేనా? ఇప్పుడు ఆ మైక్రోఫోన్ మాట్లాడగలిగే ఒకే మార్గము దానిలో ఎవరైననూ మాట్లాడాలి.
ఇప్పుడు నేనిక్కడున్నాను. నాకు ఆ స్త్రీని గూర్చి ఏమియూ తెలియదు. ఎన్నడూ ఆమెను చూడలేదు. నా చేతులు దేవుని ఎదుట ఉన్నాయి, మరియు ఆమె తన చేతులు ఎత్తినది. మేము ఒకరికొకరికి తెలియము. ఆమె గూర్చి నాకు ఏమియూ తెలియదు. కాని ఒకటి ఇక్కడికి వచ్చి, తప్పు ఎక్కడ ఉన్నదో చెప్పేవరకు నేను మూగవాడిని, ఎందుకనగా నాకేమియూ తెలియదు. దేవుడు దానిని ఎరిగియున్నాడు, గమనించారా. కాబట్టి మాట్లాడుటకు ఒకరు ఉండవలసియున్నది.
JOHN 1:49
133ఇప్పుడు, నీవు నీ ఎంపిక చేసుకొనవచ్చును. నీవు ఫిలిప్పువలె, లేక నతానియేలు చెప్పెను, "నీవు సజీవుడైన దేవుని కుమారుడవు, నీవు క్రీస్తువు. నీవు ఇశ్రాయేలు రాజువు," చూశారా. లేక నీవు కూడా వారివలె బయల్జెబూబు అని పిలువవచ్చును. ఈ రాత్రి వారు ఎక్కడ ఉన్నారో నీవు చూడవచ్చును? ఈ రాత్రి నతానియేలు ఎక్కడ ఉన్నాడు? అక్షయతలో, చూశారా. నీ ఎంపిక చేసుకో, నిర్ణయము నీదే. చూశారా.
134ఇప్పుడు, ఆయన ఆ అభిషేకము ఇచ్చుటకు నేను ఎదురుచూస్తున్నాను. ఒకవేళ ఆయన నాకు అభిషేకము ఇవ్వనట్లయితే, స్నేహితులారా నేను చెయ్యగలిగినది ఒక్కటే, ఆయన ఈ రాత్రి నన్ను కలవలేదని క్షమాపణ చెప్పటమే. అప్పుడు మేము ప్రజల మీద చేతులుంచి, వారి కొరకు ప్రార్ధించి, బలిపీఠపు పిలుపునిచ్చి, ఆశీర్వదించి, ఇంటికి వెళ్ళుట. మేము చేయగలిగినదంతా అదియే. నాకు తెలిసినది అదే.
కాని ఆయన వచ్చినట్లయితే, క్రీస్తును చూడాలని చేతులెత్తిన మీలో ప్రతి ఒక్కరూ, ఇది ముగియగానే ఇక్కడకు వచ్చి మోకరించి, "ప్రభువైన యేసు, ఇప్పుడు నన్నునేను నీకు సమర్పించుకుంటున్నా," అని చెప్పుట మీ విధి, ఎందుకనగా…
ఒకవేళ నేను అబద్ధికుడనైతే, ఆయన ఎన్నడూ అబద్దికునిగా రుజువుపర్చడు. పాపముతో ఆయనకు ఎలాటి సంబంధము లేదు. దేవుడు చేయడు. కాని నేను సత్యము చెప్పినప్పుడు, వాక్యమునుబట్టి అది సత్యము అని నిరూపించుటకు ఆయన బద్దుడైయున్నాడు. దేవా, దానిని అనుగ్రహించండి.
135ఇప్పుడు భయభక్తులతో ఉండండి, చూచారా, ప్రేక్షకులలో ఉన్న ప్రతి ఒక్కరూ భయభక్తులతో ఉండండి. నేను ఒక్క నిమిషము నీతో మాట్లాడవచ్చు, లేక మరొకరితో. అభిషేకము నా మీదనున్న అనుభూతి నాకు కలుగుటలేదు. నీ గూర్చి నాకు తెలియదు. నీవు చేయవలసినది, నేను నిన్ను ఏదైనా అడిగినప్పుడు, "అవును" మరియు "కాదు" అని చెప్పుము. గ్రహించావా, ఇప్పుడు నేను ఇది చేయుటకు కారణము… మనము ఏదో ఒకటి తీసుకుందాము, అప్పుడు నీవు …
JOHN 4:4
136మనము ఎన్నడూ వాక్యమును విడిచిపెట్టగోరుటలేదు. వాక్యములోనే నిలువబడుము. అప్పుడు మనము చేసేది సత్యము అని మనము తెలుసుకుంటాము. ఇప్పుడు ఒక్క నిమిషము, యేసు, ఇప్పుడు ఆయన మరొక దేశములో ఉన్నాడు. ఆయన యెరికో మార్గమున వెళ్ళుచున్నాడు, కాని ఆయన ఈ మార్గములో సమరయగుండా వెళ్ళవలసివచ్చినది. ఇప్పుడు, తండ్రి ఆయనను అక్కడికి పంపాడు.
తరువాత అధ్యాయములో, 5వ అధ్యాయములో, యేసు చెప్పెను, ఒక వ్యాధిగ్రస్తుడను ఆయన స్వస్థపరిచాడు. వేలమంది ప్రజలు అక్కడ పడియున్నారు, కుంటివారు, గ్రుడ్డివారు, ఊచచేతులు కలవారి సమూహము ఆ నీళ్ళ కదలించబడుట కొరకు ఎదురు చూస్తున్నారు. మరియు యేసు అక్కడికి వచ్చి, దీర్ఘవ్యాధిగలవాడు, క్షయ, ప్రోస్టేట్ కాన్సరు, లేక మరొకటితో బాధపడుచున్న వ్యక్తిని చూశాడు. ఆయన అతడిని సస్థపరిచాడు - ఎందుకనగా అతడు అక్కడున్నాడని, ఆ మార్గములో ఉన్నాడని ఆయనకు తెలియును. అక్కడున్న సమూహమును విడిచి ముందుకు వెళ్ళాడు, ముందుకు వెళ్ళిపోయాడు. అది సత్యమని మనకు తెలుసు. అది నిజము? వారు ఆయనను కనుగొన్నారు, యూదులు ఆయనను కనుగొని ప్రశ్నించారు.
JOHN 5:7,19
137వారు ఈ రాత్రి కూడా మరలా ఆయనను ప్రశ్నిస్తున్నారు. అది ఏమిటి? ఒకవేళ ఆయన జాలికలిగి అందరిని ప్రేమించినవాడైతే, అక్కడ సమూహముగా పడియున్న గ్రుడ్డివారిని, కుంటివారిని, ఊచచేతులు కలిగిన వారిని విడిచి ఎందుకు వెళ్ళాడు? ఎక్కువ వ్యాధిలేని వాడిని యేసు స్వస్థపరిచాడు — అది అతడికి మరణకరమైనది కాదు. ముప్పై-ఎనిమిది సంవత్సరముల నుండి అతడు బాధపడుచున్నాడు. అది అతడిని క్రుంగదీసింది. అతడు నడువగలడు. అతడు చెప్పెను, "నేను ఆ కోనేటిలోనికి దిగుచుండగా, నాకంటే ముందుగా వేరొకడు వెళ్ళచున్నాడు," చూచారా. "నాకంటె ముందుగా మరొకరు వెళ్ళచున్నారు." కాని ఆయన ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు.
మరియు ఆయనను ప్రశ్నించినప్పుడు, ఆయన ఈ మాటలు చెప్పెను, యోహాను 5:19: "తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును అలాగే చేయును."
HEB 1:1,2
138కాబట్టి ఆయన సమరియ వెళ్ళినప్పుడు, ప్రభువు ఆయనను అక్కడికి నడిపించాడు. ఇప్పుడు ఆయన సేవకుడనైన నన్ను ఫోనిక్సు నడిపించాడు. ఆయన ఈ రాత్రి నన్ను ఇక్కడికి నడిపించాడు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఈ మాటలు చెప్పుచున్నాను. యేసు సమరియకు వెళ్ళగానే, ఆయన మొదటిగా కనుగొన్నది, ఆయన ఎదుటికి ఒక స్త్రీ రావటం చూశాడు. ఆమె స్థితిని గ్రహించువరకు ఆయన ఆమెతో మాట్లాడినాడు. ఆమెతో ఆయన చెప్పగానే, వెంటనే ఆయన ప్రవక్త లేక వాగ్దానము చేయబడిన మెస్సీయా అని ఆమె గుర్తించినది. ఆయన తాను మెస్సీయా అని చెప్పెను, చూచారా.
కావున గతించిన కాలములో ప్రవక్తలున్నారని మనకు తెలుసు. ఈ రోజు అది క్రీస్తు, "పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, ఈ దినముల అంతమందు తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మాట్లాడెను." అది మనలో ఉన్న పరిశుద్ధాత్మ.
139ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. నీవు దానిని గుర్తించావా? ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుడిని అడిగినట్లుగా నిన్ను అడుగుచున్నాను. నేను ఆ పైన చూచిన వెంటనే, నిజముగా మధురమైన, సాత్వికమైన ఆత్మ అక్కడ ఒక కార్యము జరిగినట్లు నీవు చెప్పగలవు. అది నిజమేనా? అది నిజమైతే, ప్రజలు చూచునట్లుగా నీ చేతిని పైకెత్తుము. ఇప్పుడు, ఇప్పుడే ఆ స్త్రీని చూడగలిగినట్లయితే, అక్కడ చూడండి, ప్రకాశవంతమైన వెలుగు కన్పిస్తుంది. అది ఆ స్త్రీ చుట్టు తిరుగుతుంది.
ఇప్పుడు ఆమె నా నుండి కదులుచున్నది. లేదు, అది మరియొక వైపుకు వెళ్ళుచున్నది. ఆమె మరియొక స్త్రీ. నీవు మరొకరి కొరకు ప్రార్ధిస్తున్నావు. ఆమె నీ అత్త. ఆమె మూత్రపిండముల వ్యాధితో బాధపడుచున్నది. మరియు ఆమె ఒకే మూత్రపిండము కలిగియున్నది. మరియు అది కాన్సర్ అని నీవు భయపడుచున్నావు, అందునిమిత్తమే నన్ను ప్రార్ధన చేయమని అడుగుటకు ఇక్కడకు వచ్చావు. అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." నీవు విశ్వసిస్తున్నావా? నీ హృదయమంతటితో విశ్వసిస్తూ వెళ్ళుము, వారు దానిని తొలగించవలసిన అవసరము లేదు. సందేహించకు. నీ చేతిలో ఉన్న ఆ చిన్నదానిని ఆమె మీద పెట్టము. మీరు హృదయమంతటితో విశ్వసించుచున్నారా?
MATT 18:20
140ఎలా ఉన్నావు? మనము ఒకరికొకరము అపరిచితులము. ఇది మనము మొదటిసారి కలుసుకొనుట. మరియు దేవుడు, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన ఆత్మను పంపాడు. యేసు చెప్పారు, "ఎక్కడ ఇద్దరు, ముగ్గురు నా నామమున కూడియుంటారో వారి మధ్య నేనుంటాను." అది ఆయన వాగ్దానము, కాదా? ఆయన తన వాగ్దానమును వెనకకు తీసుకోలేదు. ఒకే విషయము ఏమనగా, మనము ఆయనను చూచుటకు తప్పిపోవునంతగా విశ్వాసములో బలహీనులమైయున్నాము. అందుబట్టియే దేవుడు ప్రవక్తలను భూమి మీదకు పంపాడు.
చూచారా, ప్రజలు తమ బైబిళ్ళ చదువరు. వారు చదువరు. వారు అలా వెళ్ళిపోవుచున్నారు, అందుకే దేవుడు ఎల్లప్పుడు ఒక సూచన పంపుచున్నాడు, సాధారణముగా, ప్రవక్త ఒక సూచన, చూచారా? ఈ రోజు పరిశుద్ధాత్మడు మనకు సూచన, ఎందుకనగా ఆయన మనలో సంచరిస్తున్న దేవుని ప్రవక్త. ఆయన దేవుని ప్రవక్తగా ఈ చివరి దినములకు ఒక సూచనగా యున్నాడు.
141ఇప్పుడు, నీవు నాకు తెలియదు. నీ గూర్చి ఏమియూ నాకు తెలియదు. కాని ఒకవేళ నేను పరిశుద్ధ గ్రంథము నుండి నేను చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తు నా ద్వారా మాట్లాడినయెడల, నీవు ఇక్కడ ఎందునిమిత్తము నిలబడియున్నావో చెప్పినట్లయితే, దానినిబట్టి నీవు విశ్వసిస్తావా? దానినిబట్టి ఈ సమాజమంతయూ విశ్వసిస్తారా? ఇప్పుడు, తండ్రి వినుచున్నాడు, నేను ఎరుగుదును. నీవు నరములకు సంబంధించిన వ్యాధితో బాధపడుచున్నావు. అది నిజము. ఒకవేళ అది సత్యమే అయితే నీ చేతిని పైకెత్తుము.
ఇప్పుడు, అక్కడున్న ఎవరో నేను దానిని ఊహించి చెప్పానని తలస్తున్నారు. ఇప్పుడు, నీవు దానిని మరుగు చేయలేవు సహోదరుడా, ఎందుకనగా నీవు దేనిని తలంచుచున్నావో, నీ తలంపు నా దగ్గరకు తిరిగి వచ్చుచున్నందువలన దానిని నేను తెలుసుకోగలుగుచున్నాను. గమనించితిరా? నీవు దానిని విశ్వసించుటలేదా? నీవు దానిని ఎన్నడూ విశ్వసించవా? అది పాపము. అది అవిశ్వాసము. దానిని బట్టి దేవుడు నిన్ను శిక్షిస్తాడు. తీర్పు దినమున నీవు దానికి జవాబివ్వాలి. సాధారణముగా నేను దానిని చెప్పాలి, కాని సమస్యలో పడతాను.
142ఆయన నీకు ఏమి చెప్పాడో నేను ఎరుగను. ఇప్పుడు ఒక నిమిషము. ఆ ఛాయ అక్కడున్నది. అది నరముల బలహీనత, దానివలన నీవు క్రుంగిపోతూ బలహీనురాలగుచున్నావు. అది దీర్ఘకాలముగా ఉన్నది. అది నిజము. నీకు మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. నీవు మరియొకరి గూర్చి ప్రార్ధిస్తున్నావు. నీ భర్త, ఉదర సమస్యతో ఆసుపత్రిలో ఉన్నాడు, ఆయనకు శస్త్ర చికిత్స జరిగినది. శ్రీమతి గుడ్, నీ హృదయమంతటితో విశ్వసించుచూ ఇంటికి వెళ్ళుము. నీవు దానిని అతని మీద పెట్టుము, అతడు బాగవుతాడు. దేవుడు నిన్ను దీవించును.
ఆయన నిన్ను ఎరుగునా? ఖచ్చితముగా, ఆయన ఎరుగును. గలలీయ ప్రాంతములో నడిచిన అదే యేసు, ఈ రాత్రి ఇక్కడున్నాడని నీవు గ్రహించుటలేదా? నీవు దానిని గ్రహించలేవా? ఇప్పుడు, దానిని గూర్చి నాకేమీ తెలియదు… ఆమె ప్రార్ధించబడియున్న స్త్రీ అని తలస్తున్నాను. అది నిజమేనా? ఆ స్త్రీని ఎరిగినవారు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా ఆ స్త్రీ తెలుసా? నీ చేతిని పైకెత్తుము. ఆ విషయములు సత్యమేనా? అలా అయితే నీ చేతులు ఊపుము. అక్కడే, అది చక్కగానున్నది.
143రమ్ము. ఇంగ్లీషులో మాట్లాడగలవా? అది సరియే. ఇండియన్ వా? ఒక నిజమైన అమెరికా పౌరునిగా నేను నిన్ను గౌరవిస్తున్నాను. నేను తలంచుట లేదు… ఒక వ్యక్తిగా, నేను నిర్ణయించలేను. నేను కేవలము నా ఒక్క నిర్ణయము మాత్రమే తీసుకోగలను. నీవు సరియైన నిర్ణయము చేయలేదని నేను తలస్తున్నాను. నీకు తెలుసు, నాకు దానిని గూర్చి తెలియదని. వారు విదేశములకు లక్షలాది, కోట్లాది డాలర్లు పంపుటకు బదులుగా, వారు మీ గూర్చి శ్రద్ధ తీసుకొనియుంటే బాగుండునని నేను తలస్తున్నాను. సరి సరియే. ఖచ్చితంగా అదియే సరియైన కార్యము. నా హృదయము ఎల్లప్పుడూ మిమ్మును వెంబడించును. కొద్దికాలము క్రిందట నేను శాన్-కార్లోస్ లో ఉన్న రిజర్వేషన్ ప్రాంతమును దర్శించాను. పరిశుద్ధాత్మడు అక్కడ గొప్ప కార్యములు జరిగించెను, ఆ పేదలను స్వస్థపరిచెను!
144అయ్యా, నేను నీకు అపరిచితుడను. నిన్ను నేను ఎరుగను. నా జీవితములో ఎన్నడూ నిన్ను చూడలేదు. మనము పూర్తిగా అపరిచితులము. అది నిజము. మనము రెండు జాతీయులము. నేను ఆంగ్లో-సాక్సన్ను; నీవు ఇండియన్. నేను నాలో నా తల్లి రక్తమును కొద్దిగా కలిగియున్నాను. నా అమ్మమ్మ చెరొకి జాతీయురాలు, దానినిబట్టి నేను గర్విస్తున్నాను. నిజము. కాని సహోదరుడుగా, నేను నీకు ఏ హాని చేయను. నేను కేవలము నీకు సహాయము చేస్తాను.
ఇండియన్ తెగవారిలో వారిలో ఎవరైనా వేట ఎక్కడ దొరుకునో ఊహించి జోస్యము చెప్పగలిగితే, అతడు వారికి ప్రవక్త అయ్యేవాడు. మరియు వారు… అయితే అతడు జోస్యము చెప్పినట్లుగా జరుగనట్లయితే, దానినిబట్టి అతడు మరణించాలి, అతడు చావాలి. అది నిజము. వారి మధ్య మాటజారుట లేదు.
145ఒకవేళ దేవుడు దేవుడయినట్లయితే… ఈ దేశము నీతో చెడ్డగా ప్రవర్తించియుండవచ్చు, కాని దేవుడు అలా చేయడు. ఆయన నీ కొరకు తన కుమారుడిని పంపించాడు. నేను ఇప్పుడే ఏమి జరిగినదో చూశాను. నీవు ఇప్పుడే ఆసుపత్రి నుండి నేరుగా వచ్చావు. నీవు ప్రార్ధన చేయించుకొనుటకు ఇక్కడకు వచ్చావు.
నీవు ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుచున్నావు. శస్త్ర చికిత్స కొరకు వెళ్ళావు. అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." ఇక్కడకు రమ్ము. పరలోకమందున్న తండ్రీ, ఈ కడుపు సమస్యను నేను గద్దిస్తున్నాను. సాతానా, నీవు వైద్యుల దగ్గర దాగుకొన్నావు, కాని నీవు ఎన్నడూ దేవుని నుండి దాగుకొనలేవు. యేసుక్రీస్తు నామమునుండి అతడి నుండి బయటకు రమ్ము. ఆమెన్. దానిని గూర్చి కలవరపడకు. స్వస్థతపొంది వెళ్ళుము.
HEB 4:15
146నీవు విశ్వసిస్తున్నావా? ఎలా ఉన్నావు? ఈ ముందున్న యువతికి కొంచెము వెనుక నిలబడియున్న ఆ స్త్రీ, మూత్రాశయ వ్యాధితో బాధపడుచూ ప్రార్ధిస్తున్నది. అమ్మా ప్రభువైన యేసు నిన్ను స్వస్థపరుస్తాడని నీవు నమ్ముచున్నావా? అది నిజము. ఆమె ఎవరిని తాకినదో నాకు చెప్పండి. ఆమె నాకు ఇరవై అడుగుల దూరములోనున్నది. ఆమె తన ప్రధాన యాజకుడిని ముట్టినది (అది నిజము) ఆయన మన బలహీనతలలో సహానుభవము కలిగినవాడు. నీవు దానిని విశ్వసించుట లేదా?
అమ్మా నీవు నమ్ముచున్నావా? [అవును.] నీ సమస్య ఏమిటో దేవుడు నాతో చెప్పగలడని నీవు నమ్ముచున్నావా? ["అవును, నమ్ముచున్నాను."] ఆ సమస్య నీది కాదు. అది సహోదరి సమస్య ["అది నిజము."] ఆమె కాన్సర్ తో బాధపడుచున్నది. ["అవును"]. అది నిజము. విశ్వసించుము. సందేహించవద్దు. ఆమె కొరకు తీసుకున్న చేతిరుమాలు తీసుకొని ఆమె మీద పెట్టుము. నీ హృదయమంతటితో విశ్వసించు. నీ హృదయమంతటితో విశ్వసించినట్లయితే, ఆమె దానినుండి బయటపడుతుంది. విశ్వాసమును కలిగియుండుము. నీవు నీ హృదయమంతటితో దానిని విశ్వసించుచున్నావా?
147అది ప్రసంగ వేదికను విడిచిపెట్టినది. అది ప్రజల మధ్యలో ఉన్నది. అక్కడ సన్నగా ఉన్న ఒక స్త్రీకి క్షయవ్యాధి ఉన్నది. ఆమె ప్రార్ధిస్తున్నది. దేవుడు నిన్ను బాగుచేస్తాడని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? ఆ వెనుకనున్న ఆ చిన్న స్త్రీ కుడివైపు చూస్తున్నది. వెనుక తిరిగియున్న పురుషుని వెనుక నిలబడిన స్త్రీ నీ చేతిని పైకెత్తుము. నీ హృదయమంతటితో విశ్వసించుము. అవును, పొట్టి జట్టు కలిగియున్న స్త్రీ. సరే. అదే విశ్వసించు అది ముగిసినది. అంత క్రితము ఆ వెనుక ఉన్న ఆమె దేనిని తాకినది? దానిని విశ్వసించమని నేను మిమ్ములను సవాలు చేయుచున్నాను.
148అమ్మా నీ సంగతి ఏమిటి? నీవు ఇక్కడ నిలబడియున్నప్పటి నుండి నీ వీపు సమస్య నిన్ను విడిచిపోయినది అని నమ్ముచున్నావా? మంచిది, అలా అయితే ముందుకు వెళ్ళుము. నీవు చేయవలసినది అంతా అదియే. నీలోనున్న సమస్తముతో దానిని విశ్వసించుము. నీవు కూడా అటువంటిదానినే కలిగియున్నావు. కాబట్టి, నీవు విశ్వసించినట్లయితే, "ప్రభువా, దానిని బాగుచేసినందుకు వందనములు," అని చెప్పుచూ ముందుకు సాగుము. హృదయమంతటితో విశ్వసించుము.
కీళ్ళవాతమును బట్టి నీవు కుంటిదానివైపోతావేమో అని భయపడుచున్నావు. కాదా? కాబట్టి, విశ్వసించినట్లయితే, నీ హృదయముతో విశ్వసించుము. వెళ్ళుము. నీ హృదయమంతటితో విశ్వసించి, స్వస్థతనొందుము. నీవు చేయవలసినది అంతా విశ్వసించుటయే. మీరు నమ్ముచున్నారా?
149అక్కడున్న వారిలో కొందరి పరిస్థితి ఏమిటి? మీరు విశ్వాసముతో ఉన్నారా, నమ్ముచున్నారా? అక్కడ నిలబడియున్న నీతో యేసు నిన్ను సస్థపరిచాడని నేను చెప్పినట్లయితే, నీవు విశ్వసిస్తావా? ముందుకు నడుస్తూ వెళ్ళుము, చూశారా, నీ హృదయమంతటితో విశ్వసించుము. మీరు వెళ్ళిపోయి, భోజనము చేయగోరుచున్నారా? నీ పాత ఉదర సమస్య నిన్ను విడిచిపోయినది అని విశ్వసించుము. నీవు వెళ్ళుము, విశ్వసించుము. మీరు నమ్ముచున్నారా?
అక్కడ నిలబడి ఆ చిన్న బాలిక కొరకు ప్రార్ధిస్తున్న స్త్రీ సంగతి ఏమిటి? ఆ చిన్న బిడ్డ రక్తములో వ్యాధి యున్నది? దేవుడు ఆ బిడ్డను స్వస్థపరచునని నీవు విశ్వసిస్తున్నావా? సరియే, దానిని నీవు పొందుకుంటావు. అక్కడున్న నీ ప్రక్కలో ఉన్న స్త్రీ అది తాకినది. అక్కడ నిలబడియున్న ఆ స్త్రీ నరములకు సంబంధించిన వ్యాధి కొరకు ప్రార్దిస్తున్నది. అవును, నీ ప్రక్కన, మరియు మానసిక రోగముతో బాధపడుచున్న సహోదరుడు నీకు ఉన్నాడు. అది నిజము. కంటి వ్యాధితో బాధపడుచున్న తల్లి ఉన్నది. వారిని దేవుడు స్వస్థపరుస్తాడని, నీ హృదయమంతటితో విశ్వసించుము. ఆమెన్.
HEB 13:8
150మీరు ఆయనను విశ్వసిస్తున్నారా? అక్కడ చక్రాల కుర్చీలో ఉన్న నీ సంగతి ఏమిటి? నీవు నమ్ముచున్నావా? అక్కడ నిలబడి ఆ మాటలు చెప్పినది నీ కుమారుడు. అతడు నీ కుమారుడు. నీవు ముఖము మీద కాన్సరు ఉన్నది. నీకు వినికిడి సమస్య కూడా ఉన్నది. నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు వెదకుచున్నావు. అది నిజము. నీవు నీ హృదయమంతటితో విశ్వసించినట్లయితే, కుమారుడా, ఆయన కొరకు నీవు విశ్వసించుము… నీ హృదయమంతటితో విశ్వసిస్తున్నావా? ఆయన చెవిలో చెప్పుము. నీ చేతిని ఆయన మీద పెట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఆయనను పొందనిమ్ము.
యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని మీరు నమ్ముచున్నారా? మీరు మెస్సీయాను, తన ప్రజల మధ్య సంచరిస్తున్న గొప్ప మెస్సీయాను నమ్ముచున్నారా? మీరు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించుటకు ఇష్టమేనా? మీకు ఇష్టమైతే, మీ చేతులు ఆయనవైపు ఎత్తి, "నేను ఆయనను వెంబడిస్తున్నాను, నేను ఆయనను వెంబడిస్తాను, నేను ఆయనను విశ్వసిస్తున్నాను, ఆయన చెప్పిన ప్రతిమాటను నేను నమ్ముచున్నాను. నా జీవితమును సరిచేసుకుంటున్నాను, నేను ఆయన కొరకు పనిచేస్తాను," అని చెప్పుము. దేవుడు మిమ్మును కరుణించును. దేవుడు మిమ్మును ఆశీర్వదించును.
151ఇప్పుడు, ఇక్కడ ఎంతమంది విశ్వాసులున్నారు? మీ చేతులు పైకెత్తండి. మీలో ఎందరు ఆయనకు సన్నిహితముగా ఉండగోరుచున్నారు? మీ చేతులు పైకెత్తండి. ఆయనకు సన్నిహితముగా ఉండగోరినవారందరు, ఆయనను ఇప్పుడే అంగీకరించండి. ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఇది ఆయన సన్నిధి.
వెనుకవైపున అక్కడ నిలబడి పొస్టేటు వ్యాధితో బాధపడుచున్న వ్యక్తి సహోదరుడా అది బాగుపడినది. ఇప్పుడే దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, ఎందుకనగా అది వెలుగువలె ఈ భవంతి అంతా తిరుగుచున్నది. ఇప్పుడే ఏ కార్యమైనా జరుగకలదు. నీవు విశ్వసించినట్లయితే, మనము మరియొక పెంతుకోస్తును కలిగియుండగలము.
HEB 13:8
152మీలో ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి. మీ చేతులు దేవుని వైపు ఎత్తుడి. ఆయనను స్తుతించండి. ప్రభువైన యేసు వందనములు. తండ్రి మీరు మా దేవుడు, మా రక్షకుడవు అందునుబట్టి మేము మిమ్ములను ఆరాధిస్తున్నాము. నీవు ఇక్కడున్నావు. నీవు వాక్యమును రుజువుపర్చావు. అది ఆ విధముగా ఉన్నదని నీవు రుజువుపరిచావు. నీవు దేవుడవు, మెస్సీయ, నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు. ఎలాంటి విఫలము కాకుండా, ఎలాటి సందేహము లేకుండా నీవు అదే ప్రభువైన యేసువు. ఆయన పరిశుద్ధ నామమునకు స్తోత్రములు.
MARK 16:17,18
153మీరు ఆయనను ప్రేమిస్తున్నారా? "ఆమెన్" అని చెప్పండి. ఇప్పుడు మీలో ఎంత మంది విశ్వాసులు? మీ చేతులు పైకెత్తండి. యేసు తానే ఈ మాటలు చెప్పియున్నారు: "విశ్వసించినవారిని ఈ సూచనలు వెంబడించును. వారు రోగులమీద చేతులుంచినప్పుడు వారు స్వస్థపడుదురు." పరిశుద్ధాత్మను కలిగినవాడిని నేను ఒకే ఒక్కడిని కాదు. నీవు కూడా దానిని పొందుకున్నావు. నేను ఏ రీతిగా విశ్వాసినో నీవు కూడా విశ్వాసివే. ఇప్పుడు నీ సందేహములన్నింటిని విడిచిపెట్టుము. ఎవరిమీదనైనా నీ చేతులు వేసి, వాక్య ప్రకారముగా దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరచునని విశ్వసించుము. ఒకవేళ దేవుడు దానిని…
నీవు మరొకరి మీద హస్తనిక్షేపణ చేసి ప్రార్థించుము, "ప్రభువా, ఈ వ్యక్తిని స్వస్థపరచండి," అని చెప్పుము. ప్రార్ధించి ఏమి జరుగుతుందో చూడుము. నీవు విశ్వాసివి.
సర్వశక్తుడవైన దేవా, యేసుక్రీస్తు నామములో మేము అపవాదిని ఓడించాము. మేము వాడిని గద్దించి, వాడి శక్తిని లాగివేశాము. ప్రభువైన యేసుక్రీస్తు పొందిన దెబ్బలవలన…