ఏకత్వము
VGR COUNT -2431సహో. అర్మన్ మీకు వందనములు. దేవుడు మిమ్ము దీవించు గాక. స్నేహితులారా, శుభోదయము. ఈ మందిరమందు ఈ ఉదయ కాలము మరలా ఈ విధముగా సమకూడుట ఎంతో మనోహరము. నేను లోపలకు వచ్చుచుండగా, భాషల రూపముల ప్రవచనములను మాట్లాడుచు దానికి అర్థము చెప్పుటను వినుచు అక్కడ నిలిచాను. ఆ గది అంతా నిండిపోయినదని అక్కడి ప్రజలతో చెప్పుచుంటిని, కాని "నాకు తెలియదు; అతనితో నేనెప్పుడు మాట్లాడలేదని చెప్పుచుంటిని." అతను సహో. హిగ్గిన్బోతమ్ అని అనుకుంటాను. నేను చెప్పునది అతనేనా? ఆయనతో చేయి కలిపి ఎంతో కాలమైనది. ఈ ఉదయమున అతను దేనిని పలికాడో దానినే నేనిప్పుడు మాట్లాడుచున్నాను. ఆయనకు అదేదో తెలియదు. ఇప్పటి వరకు నాకును అది తెలియదు. నేను దేనిపై మాట్లాడనైయున్నానో కొంతసేపటి వరకు నాకు తెలియదు. కేవలము అప్పుడు అతను చెప్పినదే అది. కావున మనము ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆయన రక్షణ రెక్కల క్రింద సమకూడామని గ్రహించినందుకు మనమెంతో సంతోషించుచున్నాము.
2ఇప్పుడు, నేను చూచుచుండగా ఆ స్థలము కిక్కిరిసి యున్నందున అనేకులు నిలచియున్నారు. ఈ స్థితిని చూచుటలో మనమెంతో అసహ్యపడుచున్నాము. వీలుపడినంత త్వరలో దీనిని ఒక పెద్ద ఆలయముగా చేయుదము. ఇప్పుడు ఫోనిక్స్ వివరములను త్వరగా తెలిపెదను.
గత ఆదివారము రాత్రి నేను ఇక్కడ ఉన్నాను మరియు "సంస్కారము" (Communion) అను అంశమును గురించిమాట్లాడితిని. సంస్కారమనగా రొట్టెను తీసికొనుట కాదు. సంస్కారము అనగా "మాట్లాడుట, తిరిగి సహవసించుట, మరొకరితో సంభాపించుట," అను భావము.
ఒకవేళ ఈ ఉదయ కాలపు ఆరాధన, నేను కొంత అధిక సమయమును తీసికొనినయెడల, కూర్చొనియున్న మీలో కొందరు - నిలుచున్నవారు కొంతసేపు కూర్చొనుటకు స్థలమియ్యుడి, వారిని కొంతసేపు కూర్చొననియ్యుడి. అది మెచ్చుకోదగినది. మనము జీవించు ఈ కాలమును గురించి నేనెంతో ఆలోచించుచున్నాను. నేను దాని ఆలోచించుచు, జరుగవలసిన కార్యములన్నియు జరుగుటను చూచినప్పుడు, ఏదో కొంత నాలో కదలుచున్నది. నేను కేవలము నా సమయమును తీసికొన ప్రయత్నించుటకు ఇష్టపడుచున్నాను.
3ఈ ఉదయకాలపు వర్తమానముగా, "ఏకత్వము" అను అంశముపై నేను మాట్లాడనైయున్నాను. నా సమయమును తీసికొని ఆ సందేశమును ఎంత ఖచ్చితముగా తేవలెనో అంత ఖచ్చితముగా తెచ్చుటకు నేను ఇష్టపడుచున్నాను. మీరు కూడియు౦డగా, మీ ప్రార్థనలను నేను కోరుచున్నాను.
ఇప్పుడు, మీరు నాతో కలసి చదువుటకు ఇష్టపడినయెడల, మీ బైబిలును తీసికొని, హెబ్రీ మొదటి అధ్యాయమును త్రిప్పుడని కోరుచున్నాను. మొదటి హెబ్రీ అధ్యాయము, మొదటి మూడు వచనములను మరియు ఆదికాండము 1:26 మరియు 27 వచనమును కలిపి చదువుటకు ఇష్టపడుచున్నాను. దేవుడు ఒక మనిషికి, మాట్లాడుటకు సహాయము చేయనిదే ఏ మనిషియు దేనిని చెప్పుటకు యోగ్యుడు కాడు. అది ఈ ఉదయము ఈ సందేశముతో వచ్చునదైయున్నది. అది మనుష్యులతో దేవుని ఏకత్వము గురించినదై యున్నది.
ఇప్పుడు, హెబ్రి మొదటి అధ్యాయములో మనము దీనిని చదువుదము.
పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములు గాను, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు.
ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై యండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్దీకరణము తానే చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్టుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను.
ఇప్పుడు, ఆదికాండము మొదటి అధ్యాయము 26 మరియు 27 వచనములను నేను చదువుదును.
దేవుడు - మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను.
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమ౦దు వాని సృజించెను; స్త్రీనిగాను, పురుషుని గాను వారిని సృజించెను.
4ఇప్పుడు, మనము ప్రార్ధించుచుండగా ఒక్క క్షణము మన తలలు వంచుదుము. ప్రేక్షకులలో ఎందరికో ఎన్నో విన్నపములు ఉన్నవని నమ్ముచున్నాను, అందువలన విన్నపము ఉన్నవారు తమ చేతిని దేవుని వైపునకు ఎత్తుట ద్వారా మనము ప్రార్థనలో కోరునదేదో ఉన్నదని తెలుపువారమగుదుము. దేవుడు మీ ప్రతి విన్నపమును తీర్చును గాక.
ప్రభువా, మేము ఈ మందిరపు నీడను సమకూడియున్నాము. ఈ నీడను మేము కలిగియున్నందుకు మీకు వందస్తులము. అయితే మేము కూడి వచ్చు ఉద్దేశము దీని కంటే గొప్పదిగా ఉన్నది. దేవుని వాగ్ధానము చేత సర్వశకుని రెక్కల నీడను కూడి వచ్చియున్నామను అనుభూతి మాకు కలుగుచున్నది. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద చేర్చుకొని కాపాడునట్లు, మేము కాపాడబడుచు, ఆయనను కోరుదానంతటితో మమ్ములను కాపాడుచున్నాడు. ఆయన ఆ విధముగా మమ్ములను కప్పుచు, మాకు కావలసిన, అనుదిన, శారీరిక, ఆత్మీయ ఆహారమును దయచేయుచు పోషించుచున్నాడు. అందును బట్టి మేము ఈ భూమిపై నడచుటకు శక్తిని పొందుచున్నాము. ఆకలిగొన్న ప్రజలకు దేవుని వాక్యమును తెచ్చుటకు ఆత్మ యొక్క శక్తిని పొందుచున్నాము. మేము మా పెదవుల యందును, హృదయమందును నూతన తైలాభిషేకముతో నింపబడి, మేము జీవించు ఈ దినపు దేవుని కాల స్థితిని ఇతరులకు చెప్పుటకు ఇక్కడ నుండి వెళ్ళుదుము గాక. మేము నీ యందు పూర్తిగా నమ్మిక ఉంచుచున్నాము. ఏ ఒక్కరూ వెళ్ళుటకు మరొక స్థలము లేదు. ఆ దినము యేసు — "మీరును వెళ్ళెదరా?" అని పేతురును అడిగినప్పుడు, ఆయన పొందిన అనుభూతినే మేమును పొందుచున్నాము.
"ఆయన (పేతురు) ఈ విధముగా చెప్పెను, "ప్రభువా, మేము ఎక్కడికి వెళ్లగలము? నీవు ఒక్కడివే నిత్యజీవపు మాటలు కలిగియున్నావు." అందువలననే ఈ ఉదయము నీ నామమున మేము కూడియున్నాము, ఎందుకనగా నీవు ఒక్కడివే నిత్యజీవపు మాటలను కలిగియున్నావు. దీనిని ఈ దినమున మాలో ప్రతి ఒక్కరికి నిజరూపమున దయచేసి, మా హృదయములు మాలో మండునట్లు చేయుమని ప్రార్థించుచున్నాము. మా అంతరాత్మలు బలపడునట్లును, మా శరీరములు స్వస్థపడునట్లును, మా ఆత్మలు నూతనపరచబడునట్లును, మేము ఏ విధముగా ఉండవలసియున్నదని, దేవుడు సృష్టించాడో ఆ విధముగా ఉందుము గాక.
5తండ్రి, ఇక్కడ ఉన్న ఈ గదులయందు, ఆ గోడల చుట్టూను వెలుపలను, నిలుచుండువారికి శక్తిని ఇవ్వుమని మనవి చేయుచున్నాను. వారికి శక్తి ఇవ్వుమని మనవి చేయుచున్నాను. ఈ టేపు అనేక దేశములకును, భూభాగములకును, భూమిపై నున్న అనేక జాతులకును వెళ్ళుచున్నది. దేవా, మేము మీ యందు పూర్తి నమ్మకము ఉంచుచున్నాము. కేవలము శక్తిని, వాక్కును, అభిషేకమును మాకు దయచేయుము. అది ఈ దినమునకు నీవు మా కొరకై ఉంచిన మార్గముగా ఉండును గాక. ఇప్పుడు మమ్ములను మేము మీకు అప్పగించుకొనుచున్నాము. మా వినికిడిని, మా స్వరమును, మా గమనమును, మాకున్న సమస్తమును మీకు అప్పగించుకొనుచున్నాము. మాతో సంచరించి క్రియ చేయుమని, మాతో ఉన్న ఆ గొప్ప ప్రసన్నతను ప్రత్యక్ష్యపరచుమని, మనవి చేయుచు, మీ కుమారుడైన యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
6"ఏకత్వము" అను పదమునకు, "ఒక్కడై యండుట: ఏకత్వము, సంయుక్తము" అని అర్థము. ఇది ఒక మంచి అంశమై యున్నది. నేను ఉంచగలిగిన దాని కంటెను, అధిక గమనము కావలసియున్నది. భూమిపై అతి ముఖ్యమై ఏ వ్యక్తియైనను దీని కొరకు ఇవ్వగలిగిన శ్రద్ధ కంటెను అధికముగా ఇవ్వవలసియున్నది. అయితే మనకు దేవుడు దేనిని ఇవ్వనైయున్నాడో దానితో నా అభిప్రాయమును వెలిబుచ్చుటకు ఇష్టపడుచున్నాను. ఇప్పుడు, ఈ అంశము ఒక బోధించు సిద్దాంతమై యున్నది. ఈ టేపును విను సహోదరులకు నేను చెప్పునదేమనగా, ఇది ఒక అయాసకరమైనది కాదని నేను నమ్ముచున్నాను. అయితే ఇది పరీక్షించదగిన లేక ఆలోచించదగినదిగా మిమ్ములను చేయును. దీనిని ప్రార్థనా పూర్వకముగాను, శ్రద్దగాను చదువవలసినదిగా ఉన్నది. ఇది దేవుని నుండి కలిగినదా, కాదా అని చూచుటకు దేవుని వాక్యముతో సరి తూచవలసియున్నది.
సాధారణముగా మనము అన్ని సమయముల యందు దేవుని వాక్యముతో సంగతులను సరి తూచుచున్నామని నేను నమ్ముచున్నాను, ఎందుకనగా వాక్యము మాత్రమే చివరి వరకు నిలచునదై యున్నది. యేసు ఇలా చెప్పెను - "భూమ్యాకాశములు గతించినను, నా మాటలేమాత్రమును గతించవు." అందువలన దానిని నేను నమ్ముచున్నాను. అది దేవుని కార్యక్రమమని, నమ్మవలసియున్నది. ఇది దేవుని యొక్క ముగించబడిన కార్యముగా వాక్యరూపములో వ్రాయబడియున్నదని నేను నమ్ముచున్నాను. అందువలన దేవుని వాక్యమునకు వ్యతిరేకమైనదేదైనను అది దేవునిదీ కాదు లేక దేవుని చిత్తమూ కాదు. వాక్యము దేవుని కార్యక్రమముగా వున్నదని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు, వాక్యములోని దేవుని ఆత్మ వాక్యమును సజీవముగా చేయుచూ జీవింపచేయుచున్నది, అది వాక్యమునకు జీవమిచ్చుచున్నది. అది విత్తనమును జీవింపచేయుట వలె నున్నది.
7ఏదెను తోటలోని ఆ మొదటి స్త్రీ మరియు పురుషులు దేవునితో పరిపూర్ణ సహవాసము కలిగియండిరి. ఆయన ఇష్టపడినప్పుడెల్ల దిగి వచ్చి మరియు ఆదాము, హవ్వలతో ముఖాముఖిగా మాట్లాడునంతగా అది వుండినది. దేవుడు మరియు తన సృష్టియైన ఆదాము, హవ్వలతో ముఖాముఖిగా మాట్లాడుట పరిపూర్ణ ఏకత్వముగా ఉన్నది. వారు దేవునితో ఏకమగునంతగా దేవునితో పరిపూర్ణ సహవాసము నందుండిరి. దేవుడును ఆయన కుటుంబమును ఒక్కటై యున్నది.
ఒక మానవుడును, ఖచ్చితమైన మంచి గౌరవమైన లోబడునటువంటి తన కుటుంబమును, ఒకరితో ఒకరు ఏకమైయున్నారు: ఏ కుటుంబమైనను అలా వుండవలసియున్నది. మరియు ఒకవేళ ఆ కుటుంబములో మరేదో వుండి దానిని వేరు చేయునదై యండినయెడల, అది సరియైనదిగా ఉండనేరదు; ఆ కుటుంబము ఎక్కడో విరిగిపోయినది. వారందరు ఒక్కటై యండవలెను: తండ్రితో తల్లి, తల్లితో తండ్రి, పిల్లలు తల్లిదండ్రులతో, తల్లిదండ్రులు పిల్లలతో, అందరు ఒక ఒప్పందములో వుండవలసియున్నది. అటువంటి దానిని మీరు చూచినప్పుడు, ఒక చక్కని ప్రేమపూర్వకమైన చిత్రపఠమును చూడగలరు.
8అది దేవుని ఉద్దేశ్యయున్నది. ఆయన ఉద్దేశ్యము, ఒక తండ్రిగా, ఉన్నతాధిక్యముతో, ఆదాము మరియు హవ్వలుగా ఉన్న ఈ భూమికి సంబంధించిన, ఆయన కుటుంబముతో ఏకమై యు౦డవలయునని యున్నది. వారు దేవునితో ఒకటిగా, ఒక్క కుటుంబముగా వుండుటకు మార్గముగా దేవుని స్వభావములో నిర్మించినందువలన, వారందరు ఏకమైయున్నారు. దేవుడు తన కుటుంబములో అందరికి తండ్రిగా, ఉన్నతమందున్నాడు, అక్కడ మరణము లేదు, దుఃఖము లేదు, గుండెపోటు లేవు, మరేదియు లేదు, కేవలము చెప్పనాశక్యముకాని సంతోషము: ఎన్నటికి వ్యాధి రాదు, ఎన్నటికి గుండెపోటు రాదు, కేవలము దేవునితో ఒక్కటైయుండుట. ఇది ఎంత అందమైన చిత్రము. ఎందుకనగా దేవుని నిజస్వభావము ఆ జనులలో ఉన్నది. అందువలన వారేమి చేసినను, దేవునితో ఏకముగా వెంబడించుచు, మరియు దేవుడు వారితో ఉండి వారిని ఏకముగా చేయుచున్నాడు.
9ఇప్పుడు, యేసు - యోహాను 17వ అధ్యాయము మరియు 11వ వచనము నందు ఇలా ప్రార్థించెను. సండే స్కూల్ పాఠములు వ్రాసికొనువారి కొరకు చెప్పుచున్నాను. ఈ ఉదయకాలము అలాంటి వచనములు అనేకమైనవి నా యొద్ద వున్నవి. యోహాను 17:11లో - తండ్రియు ఆయనయు ఏకమైయున్నలాగున, సంఘమును మరియు ఆయనయు ఏకమైయండవలయునని యేసు ప్రార్థించెను. క్రీస్తు శరీరము యొక్క సభ్యులమైన మనము సంఘముగా ఏకమైయున్నాము. తండ్రియు, ఆయనయు ఏకమైయున్నట్లు అది వున్నది. ఆ దినమందు ఆయన తండ్రిలో ఉన్నాడనియు - లేక తండ్రి ఆయనలో ఉన్నాడనియు, మరియు ఆయన మనలో, మనందరము ఏకమైయున్నామని మనము తెలిసికొందుము. అది ఎటువంటి ఐక్యతగా ఉన్నదనగా, దేవుడు తన సంఘముందుండగా ప్రతి ఒక్క సభ్యుడు పరిపూర్ణ సహవాసమందు ఉండువరకు, అది ఒక ఏకత్వమైయున్నది. ఆ సంఘము కొరకే యేసు వచ్చుచున్నాడు. అప్పుడే ఆయన ప్రార్థనకు జవాబు వచ్చును, అప్పుడది ఏకమైయండును.
10ప్రజలలో ఆయన ఏకమైయు౦డునట్లు, ఆయనకును మరియు ఆయన సంఘమునకును, ఆయన వేసిన ఏకైక సహవాస పునాదిగా అది ఉన్నది. అదొక్కటే సహవాసమునకు మూలాధారముగా వున్నది. అటువంటి మూలాధారమును కలిగియు౦డుటకు ఏకైక మార్గము, ఆయనతో ఎల్లప్పుడు ఐక్యపడియండుటయే. ఒక స్త్రీ తన భర్తతో ఐక్యపడినప్పుడు, అది సంఘము క్రీస్తుతో ఐక్యపడినందుకు సమానముగా వున్నది. మరణ పర్యంతము విడిపోనిది. నీవు పాపము చేయనప్పుడు, లేక మరేదైనను పొరపాటు చేయనప్పుడు, నీవు నిత్యత్వమందు దేవునితో ఐక్యపడి యున్నావు. మరియు కేవలము మరణము నిన్ను దేవుని నుండి దూరపరచును, అది శారీరక మరణము కాదు, కాని పాపపు మరణమైయున్నది. పాపము మరణమైయున్నది, మరియు అది నిన్ను దేవుని నుండి దూరపరచును. అందువలన ఆయనతో, ఆయన ఆత్మ శక్తి యందు ఏకమగుట నిత్యజీవమైయున్నది; నీవు నిత్యత్వము వరకు దేవునితో ఐక్యమైయున్నావు. ఓ, దానిని తరువాత కొంతసేపటికి తీసికొనుటకు ఇష్టపడుచున్నాను. నీవు దేవునితో నిత్యమందు ఏకమై యు౦డుట, ఆయనతో సంపూర్ణ ఐక్యతగాను, సంపూర్ణముగా జతపరచబడి, సమస్తమును కలిగిన ఒక సంఘములో దేవుడును ఆయన సంఘమును జతపరచబడి ఒక్కటై యున్నారు.
11ఏ విధముగా హవ్వ ఆదాముతో జతపరచబడినదో నీవు గమనించినయెడల, ఆమె ఆయనలో భాగమైయున్నది. నీవు అదికాండము 1:27లో గమనించిన, దేవుడు వారిని స్త్రీ పురుషులుగా నిర్మించెను, ఆయన వారిని నిర్మించెను. మనుష్యుడు స్త్రీగాను, పురుషుడుగాను ఉన్నాడు. ఆత్మలోను ఆ విధముగానే స్త్రీ తత్వమందును పురుషత్వమందును ఉన్నాడు. అప్పుడు దేవుడు అతని ప్రక్క నుండి - ఒక ప్రక్కటెముకను తీసెను. అది శరీర భాగము, అది ఒక ఉపఉత్పత్తి, అయితే ఆత్మ కాదని నీవు గ్రహించావా? స్త్రీ యొక్క, శరీరము ఒక ఉపఉత్పత్తిగా వున్నది. సృష్టియంతయు చేసి ముగించిన తరువాత, దేవుడు ఆదాము ప్రక్క నుండి ఒక ఎముకను తీసి ఒక స్త్రీగా చేసెను. అయితే ఆత్మను అలా చేయలేదు, ఆత్మ ఆదాములో భాగమైయున్నది, ఎందుకనగా అతడు స్త్రీగాను మరియు పురుషునిగాను ఉన్నాడు — ఆత్మీయముగా మాట్లాడవలెనన్న స్త్రీతత్వమును, పురుషత్వమును కలిగియున్నాడు.
12నీవిప్పుడు ఆ గొప్ప చిత్రమును చూడగలవా? శరీరమందు మనము వేరుగా వున్నాము. మనము స్పష్టించబడినవారమై పరిశుద్ధ వివాహము ద్వారా ఒక ఉపఉత్పత్తిగా ఉన్నాము. అయితే ఆత్మయందు మనము కుమారులము, కుమార్తెలముగా ఉన్నాము. మరొక ఆత్మ కాదు గాని, అది జీవించు దేవుని ఆత్మయైయున్నది. ఆయన వలె, ఆయన ఐక్యమందు, జీవించు దేవుని పరిపూర్ణ రూపమందు మనమున్నాము, ఎందుకనగా మనము కుమారులముగాను, కుమార్తెలముగాను ఉన్నాము; విభాగించబడిలేము గాని, అదే ఆత్మగా, అదే దేవునిగా, ఆ ఒక్క వ్యక్తి య౦దు, నిత్యత్వ మందు వివాహబంధముతో కలిసిపోయాము. దేవుడు ఎంత చక్కగా ప్రణాళిక చేసెననగా, మనము వేరుగా లేము గాని ఆయనలో యున్నాము, వేరు జాతికి సంబంధించిన జీవులము కాదు గాని నిజమైన కలయికలో సర్వశకుని ఉపఉత్పత్తిగా, పరిశుద్ధ కలయిక యందు చేయబడితిమి. ఇప్పుడు ఈ శరీరము తల్లిదండ్రుల నుండి వచ్చును, అయితే ఆత్మ దేవుని నుండి వచ్చుచున్నది, ఆదాము వేరుపరచబడినట్లు దేవుడు తన్నుతాను వేరుపరచుకొనుచున్నాడు.
13పెంతెకోస్తు దినమందు, అగ్నిస్తంభమైన ఆ పరిశుద్ధాత్మ తన్నుతాను విభాగించుకొనుచు, సంఘమందున్న ఒక్కొక్క సభ్యునిపై దిగి వచ్చుటను మనము కనుగొనగలము: దేవుడు తనతో జతపరచుకొనుచున్నాడు. అట్లయిన, ఆ కలిసియున్న ప్రజల సమూహముతో అది ఏమి చేయునైయున్నది? యేసుక్రీస్తు యొక్క ఐక్యపడిన శరీరమును మరలా తెచ్చుచున్నది. ఒక్కటిగా వచ్చుచున్నది…
ఈనాడు సంస్థాగతమైన వ్యత్యాసములతో, కార్యములతోనున్న గొప్ప ఎడబాటునందు మనము జీవించుచున్నాము, ఎంత దయనీయమైన స్థితి, ఎంత సిగ్గుకరమైన సంగతి.
14నిత్య దేవునితో అది పరలోక వివాహబంధమందు చేరియున్నది. అది దేవునిలోను ఆయన యందు భాగముగా వున్నది. శరీరమందు నేనొక బ్రెన్హాంగా వున్నాను. ఎందుకనగా, నా తండ్రి బ్రెన్హాంగా వున్నాడు. నీవు నీ తల్లిదండ్రుల యొక్క భాగమై యున్నాము. ఆ కారణము చేతనే ఆత్మ మరణించజాలదు. "నా యందు విశ్వాసముంచువాడు నిత్యజీవమును కలిగియున్నాడు." మరియు అతడు ఆయన స్వరూపములో ఆయన పోలిక చొప్పన ఈ భూమిపై యున్నాడు. "నేను వానిని అంత్యదినమున లేపెదను." ఒక ఆత్మీయ వ్యక్తిగా కాదు గాని దేవుని యొక్క మహిమ శరీరమును పోలిన శరీరమును కలిగియు౦దుము, అది యేసుక్రీస్తు యొక్క మహిమ శరీరమై, ఆయన రూపమందు పైకి వచ్చునదై యున్నది.
15లాజరు యొక్క సమాధి వద్దకు వెళ్ళుచు, యేసు చెప్పెను, "పునరుత్థానమును, జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు." "నా యందు విశ్వాసముంచువాడు, నా పై విశ్వాసముంచుట కాదు గాని నా యందు." ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా. "నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల." ఆయన యందు విశ్వాసముంచుట… ఓ, మై. పరిశుద్ధాత్మ చక్కగా మీకు తెలుపునని నేను నమ్ముచున్నాను.
ఇప్పుడు, మీరు ఆ చిన్న మందగా వున్నారు; అందుకొరకే ఈ వారమంతయు దేవుని ప్రార్ధించి అడిగి, మనమెక్కడ నిలుచున్నామో తెలుపుటకు గాను, నేను ఈ అంశమును ఎన్నుకొంటిని. ఆయనయందు నమ్మిక యు౦చుచున్నాను. మీరు ఆయనలోకి రానంతవరకు మీరాయనను విశ్వసించలేరు, లేక, ఆయన మీలోకి రావలసియున్నది, అప్పుడే మీరాయనలో నమ్మిక యు౦చగలరు, అప్పుడు మీరు నిత్యజీవమును పొందుదురు. మీరు నిత్యజీవమును పొందువరకు ఆయనను విశ్వసించుచున్నారు, అప్పుడు మీలో వుండు దేవుని ఆత్మయే నిత్యజీవము, అప్పుడే నీవు ఆయన యందు నమ్ముచున్నావు.
"తండ్రీ, నాయందు నీవును, నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు, ఏకమైయండవలెను." దేవుడు క్రీస్తునందును, క్రీస్తు సంఘములో ఉన్నట్లు… చూశారా? "మనము ఏకమైయున్నలాగున, వారును ఎకమైయున్నారు." నీవు ఎలా ఏకమైయుండగలవు? "నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల…" చూచారా, నిలిచియుండుట…" "నా మాటలు మీయందు, మీకేది ఇష్టమో అడుగుడి." ఎందుకనగా అది ఎంతమాత్రము నీవు కాదు, అది నీలో ఉన్న వాక్యము, మరియు వాక్యము దేవుడై యున్నాడు.
16ఇప్పుడు, దేవుని వాక్యము ఖడ్గమైయున్నది. హెబ్రీ 4వ అధ్యాయము చెప్పుచున్నది, హెబ్రీ 4:12. ఇప్పుడు, అది ఒక ఖడ్గము. ఆ ఖడ్గము ఒక చేతితో లేక ఒక శక్తి చేత వాడబడనియెడల అది సంపూర్ణముగా నిద్రాణమైనదిగా ఉండును. అయితే ఆ ఖడ్గమును పట్టుకొనుటకు ఒక చేయి కాలవలసియున్నది. మరియు - తీసుకొను… ఈ ఖడ్గమును పట్టుకొను చేయి విశ్వాసపు చేయి.
ఇప్పుడు, ఆ విశ్వాసపు చేయి, ఎంత బలముగా వున్నదో - దానిపై అది ఆధారపడియున్నది. ఆ విశ్వాసపు చేయి చీకటిలో ఒక చిన్న రంధ్రమును చేయుటకు చాలినంత శక్తి గలిగియున్నది, మరియు చెప్పును, "విశ్వాసము ద్వారా నేను రక్షించబడితిని." అది ఒక పెద్ద చేదనయై యున్నది, అదియే ఆ ఖడ్గమును పట్టుటకు మన చేతికి ఉండవలసిన శక్తియై యున్నది. అంతవరకు అది చేధించగలదు. అయితే అది అధిక శక్తిగల చేయిగా ఉన్నయెడల, ప్రతి సాతాను శక్తులను చేధించగలిగి, ప్రతి దేవుని వాగ్ధానమును ఆయన పునరుత్థాన శక్తితో ప్రకాశింపచేయగలదు. అది ఒక బలమైన విశ్వాసపు చేయిగా ఉన్నయెడల, "సూచక క్రియల దినమును నిరూపించునదై - యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడను," మార్గము ద్వారా అది చేధించును. అది ఆ ఖడ్గము వెనుక యు౦డు శక్తిగల చేతిపై ఆధారపడియున్నది.
17ఆ ఖడ్గము అత్యంత వాడిగలది. హెబ్రి 4 చెప్పుచున్నది, "ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్ళను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను చేధించుచున్నది." శారీరిక స్థితిని దాటి వెళ్ళునదై; అది ఆత్మీయ పరిధిలోనికి వెళ్ళుచు మరియు హృదయపు తలంపులను వెలుపలకు తెచ్చి మరియు వాటిని బయలుపరచును. దేవుని ఆత్మ, దేవుని వాక్యము…
ఇప్పుడు, చాలినంత చేయి దానిని ముందుకు త్రోయుచుండగా, ఆ వాక్యము దానిని చేధించును. దాని స్థానమును ఎరిగినదై ప్రతి వాగ్ధానమును బయలుపరచి నీకిచ్చును. ఆయితే నీవు దాని వెనుక బలమైన చేయి కలిగియు౦డవలసియున్నది. ఆ ఖడ్గమును ఒక విశ్వాసపు చేతితో పట్టుకొనుము. దాని గట్టి పట్టులో చేపట్టి శత్రువు వైపునకు నడువుము. ఏ విధముగా ఆ సున్నతిలేని శత్రువు నిత్య దేవుని సన్నిధిలో నిలువగలడు? కావున నీవు వాక్యఖడ్గమును గైకొని, నీకు స్వంతమైన ప్రతి వాగ్ధానమును పొందుము. బలమైన విశ్వాసపు చేతిలో దాని గైకొని ముందుకు నడువుము. నీకు స్వస్థత కావలసినయెడల, ఆ వాక్యముతో దాని చేధించుము - "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు." నీకు రక్షణ కావలసియున్నయెడల పరిశుద్ధ గ్రంధమందున్న ప్రతి వాగ్ధానము నీదై యున్నది. అది దాని వెనుక ఉన్నది, మరియు సాతాను నీకు దానిని మరుగుపరచుచున్నాడు; అయితే ఆ ఖడ్గమును ధరించినవాడవై దేవుని వెలుగు నీ ఆత్మ పై ప్రకాశించువరకు ఈ చీకటిలో ముందుకు వెళ్ళుము. అప్పుడు నీవా వాగ్ధానమును పొందుదువు. ఆయన దానిని చేయును.
18హవ్వ ఆదాములో ఒక భాగమైయున్నది; ఆమె అతని ఎముకలో ఎముక, మాంసములో మాంసము. అదియే సరియైన ఐక్యతయైయున్నది. అదియే సంఘము యొక్క సరియైన ఐక్యతయై యున్నది. ఆయన ఆత్మ యొక్క ఆత్మయు, ఆయన మాట యొక్క మాటయైయున్నది. నిజ సత్యవిశ్వాసి ఎప్పటికి ఏ వాక్యముతోను రాజీపడడు. గుర్తుందా, కేవలము ఒక్క మాటతో హవ్వ రాజీపడినది: ఒక్క మాట. అయితే నిజవిశ్వాసి ఏ వాక్యముతోను రాజీపడడు. విశ్వాస ఖడ్గమును చేపట్టి యు౦డును - విశ్వాసముందు, వాక్య ఖడ్గమును చేపట్టును, దేవుడు చేసిన ప్రతి యొక్క పరిశుద్ధ వాగ్ధానముపై తన హక్కును ప్రకటించును. అంతే.
19అవి మనకు దేవుని ఉదాహరణములుగా ఉన్నవి, మనమేమై యండవలయునని అవి తెలుపును. అవి తప్పిపోక ఎల్లప్పుడు ఉండునవైయున్నవి. వారు మాట్లాడినప్పుడు దేవుడు వారికి జవాబిచ్చును. ప్రతి దినము ఆయన వారిని కాచుచున్నాడు. రాత్రులందు వారు నిద్రించుటకు పరుండినప్పుడు, వారిని కాచుచున్నాడు. పగటి యందు వారిని నడిపించుచున్నాడు, వారిని పోషించుచు, ప్రేమించుచున్నాడు. నిరంతరము వారితో సహవాసము చేయుచున్నాడు, ఎల్లప్పుడు ఆ విధముగా చేయుచున్నాడు. వారు దేవుని స్వరూపమందున్నారు, మరియు దేవుడు వారిలో ఉన్నాడు. అది ఆయనతో సహవాసమును చేయునదైయున్నది. అదియే ఐక్యత, దేవుడు ఆయన యొక్క సంఘమ౦దున్నాడు. అదియే ఐక్యత. అనేక స్థలముల యందు చాలా చెప్పవచ్చును.
ఆయనతో ఐక్యపడి యు౦డునది నిత్యజీవమైయున్నది. ఆయనతో ఐక్యపడుటకు ఒకే ఒక మార్గము. ఆయన ప్రతి వాక్యమునకు తిరిగి వచ్చుటయే. (అది నిజము.), ప్రతి వాగ్దానమును గైకొని దానిని నమ్ముము.
20ఇప్పుడు, హవ్వ ఒక మాటను దాటు వరకు ఆ ఐక్యత యందుండినది, లేక, సత్యమైన ఒక్క మాటను సందేహించినది. అది ఆమెను వేరుపరచినది. ప్రతి వాక్యము, "మనిషి రొట్టెవలన మాత్రము కాదు గాని, ప్రతిమాట వలన జీవించును." కావున ఆ విధముగా మనము దేవుని యందు ఉండగలము, ఐక్యముగా; ఎందుకనగా ఆదాము హవ్వలు, పడిపోవుటకు ముందు, వాక్యముపై అవిశ్వాసము చూపకముందు, ఆయన యందు మనమేమైయున్నామను దానికి ఉదాహరణముగా ఉన్నారు. ఆయనతో ఐక్యపడుట జీవమైయున్నది; ఆయన నుండి వేరుపడుట మరణమైయున్నది. ఇప్పుడు, మనమాయన ఆజ్ఞలను వెంబడించినయెడల…
21మనము తప్పు చేయుదమని మనకు తెలియును, కాని దానిని మనము చూడకూడదు. అది నీ పొరపాటు కాదు, వాటిని నీవెల్లప్పుడు కలిగి యు౦దువు. అయితే నీవు ఆయన ఆజ్ఞలను అనుసరించుచున్నావాయని చూడుము, ఆయన చేయుమనిన దానిని అనుసరించుము. ఆటంకమో, మరి పడిపోవుటయై, దానితో ఏ ఒక్క దానిని చేర్చకుము. ఒక నిజ సేవకుడు, ఒకవేళ తడబడినను, అతడు మరలా లేచును. ఒకవేళ అతడు తల్లాడినను, దేవుడు అతనిని సరియైన మార్గమునకు తెచ్చును. అయితే అతడు ఆ మార్గపు విధిని కొనసాగవలసియున్నది. అతడా మార్గపు విధిలో ఉండవలసియున్నది. అతడా మార్గపు విధిని దాటినట్లయిన, దేవుడు అతని బాధ్యతను వహించాడు. అతడు ఆ మార్గపు విధిని కొనసాగించినంత వరకు అతడు కేవలము ఒక మనిషిగానో లేక స్త్రీ గానో వున్నారని యెరిగినవాడై దేవుడా బాధ్యతను వహించును. ఆ వ్యక్తి ఆ మార్గపు విధిలో ఉన్నంత వరకు ఆయన వారిని గురించి శ్రద్ధవహించును.
22ఇప్పుడు, సంఘము క్రీస్తు వివాహము కొరకు నిర్ణయించబడియున్నది. ఆ వివాహము ఇంత వరకు జరుగలేదు; అది గొర్రెపిల్ల వివాహ భోజనమందు జరుగవలసియున్నది. అందుకొరకు సంఘము ఒడంబడిక చేయబడినది, అది ఒక మనిషి తన భార్య కొరకు నిర్ణయించబడినట్లున్నది. వారు అలా ఒడంబడిక చేసినప్పుడు అతడేమి చేయును? అతడు మంచి కార్యముతో, ఆమెకు బహుమానములను పంపుతూ ఆమెను సంతోషపరచును. అదియే క్రీస్తు తన సంఘమునకు చేయుచున్నాడు. ఆయన ఆత్మ యొక్క బహుమానములను మనకు పంపుచున్నాడు. ఈ బహుమానములను నీవు నిరాకరించినయెడల ఏ విధముగా నీవు ఒడంబడిక యందున్నావు? అవి ప్రేమ కానుకలుగా ఉన్నవి. అవి సంఘమునకు దేవుని సంకేతములుగా వున్నవి. "నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడునని," యేసు చెప్పెను.
23ఇప్పుడీ సంగతులను మనస్సున నుంచుకొనుడి. సంఘము ప్రతి వాక్యమును, ప్రతి వాగ్ధానమును, ప్రతి దానిని నమ్ముచు వారి కొరకు దానిని పొందుచు వాటియందు తర్ఫీదు కావలసియున్నది. నేనొక స్త్రీని ఒడంబడిక చేసికొనినయెడల నేను ఒంటరివానినై ఆమెకు ఒక ఒడంబడిక ఉంగరమును (Engagement ring) మరి కొన్ని బహుమానములను పంపుదును. ఆమె ఆ ఉంగరమును ధరించనియెడల ఆమె నన్ను విశ్వసించలేదని చూపుచున్నది. ఆమె నా పెండ్లి కుమార్తెయగుటకు ఇష్టపడుట లేదు. అట్లయిన క్రీస్తు, ఆయన వాగ్ధానము చేసిన బహుమానములు తన సంఘమునకు పంపించినప్పుడు వారు వాటిని నిరాకరించుచు, అవి అలా కాదు అని చెప్పినయెడల, వారు క్రీస్తు వధువుగా వుండుటకు ఇష్టపడుట లేదు. వారు మరొక ప్రేమికునకు తమ్మును తాము తెలియపరచుకొనిరే గాని, పెండ్లి కుమారుడైన క్రీస్తునకు కాదు. అందువలన నిజ సంఘము ఆ వాగ్ధానము అంగీకరించును, మరియు అన్నింటిని అంగీకరించుచు, దేవుడు పంపించిన బహుమానములను అంగీకరించును. అదియే మంచిది.
24ఆ మొదటి మానవ జీవులు ఆయన వాక్యమందు అవిశ్వాసముంచుచు సాతాను యొక్క ఒక్క అబద్ధమును వినుట వలన, దేవుని నమ్ముట నుండి వేరైపోయిరి. ఇటువంటి ఆశ్చర్యమైన సహవాసము నుండి విడిపోవుటకు అదియే మొదటి కార్యమైయున్నది. ఇప్పుడు చూడండి, ఆదాము మరియు హవ్వ మరణించని ఒక స్థితి యందుండిరి, వృద్దాప్యము లేని స్థితి య౦దుండిరి; వ్యాధియైనను, వేదనయైనను లేని స్థితి యందుండిరి.
మీరు ఇలా చెప్పవచ్చును, "నేను నిశ్చయముగా అలా వుండుటకు ఇష్టపడుచున్నాను." నన్ను చెప్పనివ్వండి… మీ కొరకైన వార్త నా యొద్ద వున్నది; మీరు అదే స్థితి యందున్నారను. భూమిపై నుండు ప్రతి జీవిని దేవుడు అలాంటి స్థితి యందే వుంచియున్నాడు.
25ఆ ఒప్పందము ఏమైయున్నది? "మీరు నా మాటను గైకొనినయెడల. నా మాటను మీరు గైకొనినయెడల, దానిని నమ్మి మరియు దాని ప్రకారము జీవించినయెడల…" అయితే ఆ మొదటి సమయమందు హవ్వ వాక్యమును అవిశ్వసించి, దేవుడు చెప్పిన దానికి వెలుపల ఒక్క మాటను గైకొన్నది. అది ఆ అందమైన కలయికలోని సహవాసమును విరచినది. అలాగుననే దేవుని గ్రంధమందున్న ఏ వాక్యమునైనను సంఘము అవిశ్వసించిన నిమిషము నుండి ఆ వాక్యమును మరొక స్థానమందు వుంచినప్పుడు, వారికి అనుగ్రహించిన ఆశ్చర్యమైన సహవాసము నుండి విడిపోవుచు వేరైపోయినది. దానిని చేసిన వెంటనే ఆమె యొక్క శారీరక జీవమందు మరణము చోటుచేసికొన్నది. ఆమె అవిశ్వసించిన క్షణము నుండి దేవునితో ఆ సంబంధమును వేరుచేసికొననది. ఏ మానవుడును నమ్మజాలడు..
అది ఇక్కడున్నది. ఏ మానవుడైనను, ఏ స్త్రీయైనను — దేవుని సత్యమును అవిశ్వసించినంత వరకు సాతానుని అబద్ధమును నమ్మలేరు. ఎవ్వరైనను దేవుని సత్యమును అవిశ్వసించినప్పుడే సాతానుని అబద్ధమును నమ్మగలరు. అందువలన ఆదాము హవ్వలను చూడుడి, అది మనలను ఈ ఉదయ కాలమందు ఎక్కడ ఉంచియున్నది.
26అందువలన ఇప్పుడే తీవ్రముగా యోచించుడి, ఎందుకనగా ఈ శరీర జీవము ముగిసిన తరువాత మనము దీనిని గురించి యోచించలేము. నీవు యోచించవలసినది ఇప్పుడే. ఇప్పుడే నీవు దానిని ఎన్నుకొనవలసి యున్నది. దీని తరువాత ఎన్నుకోలేవు; నీవు ఇప్పుడే ఎన్నుకొనవలసియున్నది, ఎందుకనగా ఇదియే ఎన్నుకొను దినమై యున్నది. నీకు కావలసినదేదో ఎన్నిక చేసుకోనవలసియున్నది. ఆమె ఒక్క వాక్యమును మాత్రమే మాట్లాడిన దానినంతటిని కాదు. ఒక్క మాటను, దేవునితో ఆమె ప్రశ్నించినది, ఎందుకనగా ఆ వాక్యము ప్రశ్నించబడునదిగా అప్పటి వెలుగు నందు ఆమెకు ఇవ్వబడినది. అయితే దేవుని వాక్యము ప్రశ్నించబడనేరదు; ఆయన ఏమి చెప్పాడో అదియే దాని భావనమై యున్నది. అయితే ఆమె దానిని ప్రశ్నించినది, ఎందుకనగా "ఓ, దేవుడు నిశ్చయముగా ఆ విధముగా భావించలేదని" ఆమెకు తెలుపబడినది. అయితే ఆయన అలాగే భావించాడు. దేవుడు సెలవిచ్చిన ప్రతి మాటల ఖచ్చితము. దానికి వ్యక్తిగతమైన అనువాదము అవసరము లేదు. ఆయన సెలవిచ్చిన ప్రకారమే వున్నది.
మంచిది, "నాకు బైబిలు బాగుగా తెలియునని" నీవు చెప్పవచ్చును. నా దేవుడు ఈ బైబిలును నడిపించునని నేను నమ్ముచున్నాను. ఆయన తన వాక్యమును కాచుచున్నాడు. నాస్తికులు, మత భ్రష్టులు, ఈ చివరి దినములయందు లేచెదరని ఎరిగియున్నందున దానిని ఆయన కాచియున్నాడు. ఈ విధముగానే దేవుడు దాని భావించెను. ఇప్పుడది ఆ విధముగానే యున్నది. ఇప్పుడు మనము దానిని నమ్మవలసియున్నది. దాని నుండి ఒక్క వాక్యము లేనియెడల, మనము ఆ సహవాసమును పోగొట్టుకొని మరణమందు పడిపోదుము. ఆదాము హవ్వలు చేసినట్లే దేవుని నుండి నిత్యత్వమందు వేరైపోవుదము. మనము దేవుని సత్యమును విశ్వసించవలసియున్నది.
27నన్ను మరలా దానిని తెలుపనివ్వండి. దేవుని గ్రంథమందుండు ఏ వాక్యమునైనను అవిశ్వసించకూడదు. "అవును, నేను దానిని నమ్ముదును," అని చెప్పి, "కాని…" అని చెప్పకుము. ఆ విధముగా ఏదీ లేదు. మీరు దానిని నమ్ముము; మీరు దానిని అంగీకరించుదురు. దానిని ప్రక్కగా వుంచినట్లయిన, "మంచిది, అయితే నా సంఘము దానిని ఆ విధముగా నమ్మదు" అని నీవు చెప్పినట్లయిన, దానిని దేవుని వాక్యముగా నీవు నమ్ముట లేదు. హవ్వ ఏ విధముగా వెళ్లినదో నీవును ఆ విధముగనే నిరాకరించి దాటి వెళ్ళుచున్నావు. ఆయనతో ఐక్యపడుటకు ఒక అవకాశము కలిగినప్పుడు నీకు నీవే నిత్యత్వము నుండి వేరుపరచుకొనుచున్నావు. జ్ఞాపకముంచుకొనుడి, అది ప్రశ్నించకూడనిది, ఎందుకనగా అది దేవుని వాక్యమందు ఒక వాక్యముగా వున్నది…
28దేవుడు కొన్ని వాక్యములను ప్రజలు లోబడుటకు గాను వుంచినప్పుడు, ఆ కొన్నింటిలో ఏ ఒక్కటైనను తప్పుగా వ్యాఖ్యానించినయెడల, అక్కడ మరణమునకు అది కారణమగును. మనకున్న ఈ నాటి వాక్యములను చూడుడి. చూచారా? వాటిలోని ప్రతి ఒక్కదానిని అంగీకరించి, వాటిని పట్టుకొనియుండి, దేవుని వాగ్దానములుగా వాటియందు ప్రవేశించవలసియున్నది. దేవుని నిజ భార్య అలాగుననే చేయును, ఆమె నిజమైన ఒడంబడిక యందు తెలుపబడినదైయున్నది. ఈ కొద్ది కార్యములు మనము పట్టుకోనునట్లు లోతునకు వెళ్లి యు౦డునని నేను నమ్ముచున్నాను.
29దేవుని వాక్యమును అవిశ్వసించుటకు హవ్వకు ఏర్పడిన మొదటి కార్యమేది? సాతాను అధిక జ్ఞానమును వాగ్ధానము చేసినందువల్లనే అందుకు కారణమైనది. "నీవు జ్ఞానము కలిగియు౦దువు." ఇప్పుడు, మానవాళి ఏదో ఒక దానిని చేరుచున్నది. హవ్వ అధిక (తెలివి) జ్ఞానమునకు చేరినది.
ఇప్పుడు, మనమొక క్షణము ఆగుదుము. అదియే కదా లోకపు స్థితియై యున్నది? వారికి అధిక జ్ఞానము కావలసియున్నది. దానిని వారు కోరుచున్నారు. గొప్ప తరగతులను కోరుచున్నారు, గొప్ప విద్యను, వ్యత్యాసమైన కొన్నింటిని అధిక జ్ఞానమును వారు కోరుచున్నారు. అదియే హవ్వ కోరినది. అయితే దీనిని కూడ చెప్పనివ్వండి, ఏ జ్ఞానమును దేవుని జ్ఞానమును దాటి వెళ్లజాలదు, అయితే అది ఆ విధమైన నమ్రత యందు ఉన్నందున ప్రజలు దానిని తప్పిపోవుచున్నారు.
నేను అనేకసార్లు చెప్పినట్లు, సాతాను ప్రకాశించుచున్నది, అయితే సువార్త వెలుగుచున్నది. ఓ, ప్రకాశించుట మరియు వెలుగుట, వీటి మధ్య ఎంతో వ్యత్యాసమున్నది. హలీవుడ్ ప్రకాశించును, కాని సంఘము దేవుని శక్తి యందు, ప్రేమయందు వెలుగుచుండును. హలీవుడ్ ప్రకాశించును: ప్రకాశించుట మరియు వెలుగుటయందు ఎంతో వ్యత్యాసమున్నది. మనము ప్రకాశించవలెనని కోరుటలేదు. మనము వెలుగుటయే కావలసియున్నది.
30దానిని తలంచుటకు ఎంతో అసహ్యముగా ఉన్నది. అయితే ఈనాడు సంఘములు వారి యొక్క స్వబుద్ధిపై ఆధారపడుటకు ప్రయత్నించుచున్నవి. హవ్వ చేసినట్లే అవి చేయుచున్నవి. అది నిజమైనదిగా కనబడుచు, ఆ విధముగా సమర్పించబడినందున ఆమె ఆ విధముగా తలంచినది. ఓ, దీనిని తెలిసికొనుటకు తప్పిపోవద్దు. అది ఎంతో నిజమైనదిగా కనబడును, అయితే అది దేవుడు చెప్పిన దానితో కొంత చేర్చబడినదై యున్నది. ఆమె ఎంత వరకు వెళ్లవలసియున్నదని దేవుడు చెప్పునట్లుగా అది కనబడును. దేవుడు సముద్రమునకు ఉంచినట్లు హవ్వకు హద్దులు నియమించలేదు. సముద్రము తన హద్దును దాటలేదు, ఎందుకనగా చంద్రుడు దానిని గమనించుచున్నాడు. సాతాను ఈ భూమిపై మరేదో కలిగియున్నాడని ఆమె తలంచినది. మనము తలంచునట్లు ఆమె దేవునితో ఐక్యత కలిగియు, అందముగాను, అధిక విద్య కలిగియున్నదని అనుకొందుము. అయితే దేవుడు ఆమెకు ఏమి కావలసియున్నదో దానిని ఖచ్చితముగా ఇచ్చియున్నాడు.
ఆయన సంఘమునకు అదే కార్యమును అనుమతించెను. అది వేదాంత పాఠశాల యొక్క మలుపు కాదు, లేదా బైబిలు పాఠశాలల యొక్క వ్యాఖ్య లేక మలుపు కాదు, అయితే అది ఖచ్చితాముగా వ్రాయబడినదై, "యెహోవా సెలవిచ్చునదిగా వున్నది!" దానిని నీవు మార్చజాలవు. అయితే సంఘములు వాటి యొక్క స్వబుద్ధిపై ఆధారపడిపోయినవి. వారు మరోలా తలంచవచ్చు. అది ఏదోనని అనుకోవచ్చు, అది వారికి నియమించినదైయున్నది, మరియు అది మోసపరచునదైయున్నది.
31నేనిక్కడ ఒక్క క్షణము ఆగవలసియున్నది. ప్రపంచమంతయు దాని పైనే ఆధారపడియున్నది. ఈ దేశపు క్రమమంతయు అబద్దపు ఎన్నికపై ఆధారపడియున్నది. మీకొక తమాషాను చెప్పెదను. అది తమాషా కాదు, మీకందరికి తెలియును. ఏమనగా మనలో ప్రతివారు తమ భార్యలను ప్రేమించెదరు, లేక ప్రేమించవలసియున్నది. నేను కొంత కాలమునకు ముందు అనగా సుమారు మూడు సంవత్సరముల క్రితము, ఇక్కడొక కార్యక్రమమును చూశాను. ఒక ఉదయ కాలము నా గదిలో నేను నిద్రలేచినప్పుడు ఒక దూరదర్శిని అక్కడ అమర్చబడి యు౦డినది. అప్పుడు నేనిలా తలంచాను, "ఇది అనారోగ్యపు వాతావరణముగా వున్నది." ఆ తరువాత నేనిలా తలంచాను, "మంచిది, ఎనిమిది గంటలకు వార్తలు వచ్చును గదా?" అని అలా తలంచుచూ నా వద్ద వున్న పుస్తకమును చూచినప్పుడు, వార్తలు ఎన్ని గంటలకు వెలువడునో తెలుపబడినది.
నేను వార్తలకై ఆ సాధనమును నొక్కి, ఆ వార్తలను నేను వింటూ వున్నప్పుడు దానికి మధ్య కొన్ని రకముల వస్తువులను గురించి ప్రచురించుచు, ఒక సబ్బు ద్రవ్యమును గురించి ఇలా వివరించారు. " ఓ స్త్రీ మీరిక పాత్రలను శుభ్రము చేయుపని లేదు. మీరు చేయవలసినపని ఏమనగా కేవలము రెండు నిమిషముల పాటు ఆ సబ్బు నీళ్ల య౦దు అలా వుంచి, ఆ తరువాత తీసివేయుడి; అంతయు అయిపోయినది."
"నేను ఇంటికి చేరుకోగానే ఒక కథానాయకునిగా అయిపోదునని," తలంచాను. ఆ వస్తువు పేరేదో వ్రాసికొని, వెళ్లి నా భార్యతో, "నేను నీ కొరకు ఏమి చేయగలనో చూడుము" అని చెప్పెదననుకొంటిని.
అందుకై నేను వెళ్లి ఒక సీసా సబ్బు ద్రవమును కొన్ని నీళ్లలో కలిపి ఇంటిని శుభ్రము చేయమని చెప్పితిని. ఆ తరువాత చిన్న పిల్లల భోజనపు పళ్ళెములను, ఇతర వస్తువులను ఈ నీటి యందు కొన్ని నిమిషములు అలా ఉంచాను. ఆ తరువాత వాటిని తీసి పైన ఉంచాను. దానిని చూచినప్పుడు, నా భార్య నా యందు తన విశ్వాసమును అప్పటికే పోగొట్టుకొనినది.
32మీరు చూశారా, ఎందుకు ఈ దేశము ఇలా ప్రజలను మోసగించుచున్నది. ఆ విధముగా ప్రచురించుటకు అంగీకరించకూడదు. అది చట్ట విరోధము "ఎంత త్రాగినప్పటికిని దగ్గు అనునది లేదు" అని ఆధునిక సిగరెట్లను గురించి ప్రచురణ అన్ని రకములుగా ఉన్నవి. వాటిని అలా అనుమతించకూడదు. అది ఏమి చేయుచున్నది? అది మోసము చేయుచున్నది. వాటిలోని ప్రతి ఒక్క దానియందు మరణమున్నది. మధ్యము త్రాగుట యందును, బలవంతము చేయుట యందును, హత్య యందును, సీసాలలోని ఆశుభ్రత యందు మరణమున్నది. అయినప్పటికిని మన కార్యక్రమముల యందు వాటిని వెలువరించుటకు అనుమతించుచున్నాము. "దానిని ముత్తాత త్రాగినట్లు, తన జీవితమందు అధిక సంతోషమును పొందినట్లు," కొన్ని రకముల మధ్యపానములను అలా ప్రకటించుచు వాటిని అనుమతించుచున్నారు. అది ఏమిటి? అది మోసము చేయుటయే. అది ప్రజల ముందు దేనినో కొంత ఉంచి దానితో వారిని చంపుచున్నది. మనము దానిని అలా చేయుటకు అనుమతించుచున్నాము.
33ఈనాటి సంఘములు, మానవ-కల్పిత సిద్దాంతములతోను, ఆచారములతోను, ఒక గొప్ప ప్రజలకు సమర్పించుచున్నది. వారు దాని కొరకు పడిపోవుచున్నారు, అది మరణమైయున్నది. ఏ సంఘము గాని నీ అంతరాత్మను శుభ్రము చేయజాలదు. ఏ సిద్దాంతము గాని అంతరాత్మను శుభ్రము చేయజాలదు. యేసుక్రీస్తు రక్తము మాత్రమే మన ఆత్మలను శుభ్రము చేయగలదు. అది దేవుడు నిన్ను బాగుచేయు విధానమై యున్నది. అది సహాయాకారిగా ఉన్నది.
అందువలన తక్కినదంతయు అబద్ధమై యున్నప్పటికిని, ప్రజలు సిద్దాంతములను, సంస్థలను, ఆధారము చేసికొని వాటి గ్రహింపుపై ఆధారపడియున్నారు. లక్షలాది మంది చంపబడిన పందుల వలె వారి మార్గమును అంతములేని నరక గొయ్యిలోనికి దిగిపోవుచున్నారు. అది ఎంత అవమానకరముగా ఉన్నది. మన స్వబుద్ధిపై ఆధారపడుటకు మనము అడ్డగించబడియున్నాము. మనము ఆ విదముగా ప్రయత్నంచకూడదు.
34"మానవ సమావేశములు ఒక్క మనిషి కంటెను అధికముగా తెలుపలేవా?" అని నీవు చెప్పవచ్చు. ఒక్క మనిషి దేవుని వాక్యమును చెప్పుట అవి చెప్ప జాలవు. ఒక పర్యాయము నాలుగు వందల ప్రవక్తలు ఇద్దరు రాజుల ఎదుట తమ స్వబుద్ధిపై ఆధారపడి నిలిచారు. అయితే ఒక్కడు దేవుని వాక్యముపై నిలచి నిజమని నిరూపించాడు, ఆయనే "మీకా." అది దేవుని వాక్యమేనా అను దానిపై ఆధారపడి యున్నది. వాక్యమునకు విరోధమైనదేదైనను అది తప్పు, మరణమందు ముగించును. దేవుని జ్ఞానమును మరే జ్ఞానము అధిగమించజాలదు. ఆయన అందరికంటెను జ్ఞానముగలవాడు. ఆయనే నీటి ఊటగా ఉన్నాడు. ఆయనే జ్ఞానమునకు ఆధారమునైయున్నాడు. దేవుని వాక్యము కాక మరి ప్రతి మనిషి మాటయు బుద్ధిహీనము మరియు అబద్దమైయున్నది. ఒకవేళ అది దేవుని యొక్క… ఇప్పుడు, ఒక వ్యక్తి దేవుని వాక్యమును చెప్పినయెడల, అది ఇకపై దేవుని వాక్యమేగాని మానవునిది కాదు. చూచారా, అది మానవ జ్ఞానము కాదు.
35సాతాను అన్ని రకముల వాగ్ధానములను చేయునదైయున్నది, కాని వేటిని అది ఇవ్వజాలదు, ఎందుకనగా వానికంటూ ఏదియు లేదు. వాని యొద్ద రక్షణ అనునది లేదు. సాతాననగా యేమి? ఏదైనను వాక్యమునకు వ్యతిరేకమైనది. వాని యొద్ద రక్షణ లేదు. వాని యందు వెలుగు లేదు. చీకటియు మరణమును సాతానుని రాజ్యమై యున్నది. "బ్రెన్హాం సోదరుడా, మరలా దానిని చెప్పుము. సాతాను రాజ్యమనగా యేమిటి?" దేవుని వాక్యమునకు వ్యతిరేకమైనది ఏదైనను.
ఇది కత్తరించు, కాని ఇది కత్తరించు సమయమైయున్నది. చూశారా? ఏ చెట్టయినను, అది ఫలింపవలెననగా దానిని కొమ్మలను కత్తిరించవలసియున్నది. ఇది ఆ సమయము.
"దేవుని వాక్యమునకు వ్యతిరేకమైనది ఏదైనను అది దేవునిది కాదు. అది ఏమిటి? పాపమనగా ఏమిటి? నీతి అనునది వక్రీకరించుట. మరణమనగా ఏమిటి? జీవమును వక్రీకరించుట. సాతాను రాజ్యమనగా ఏమిటి? మరో ఉపదేశమైనను మరేదైనను వాక్యపు స్థానమందు వుంచుటయే. ఒక్క వాక్యము, లేక ఒక్క మాట. నీవు ప్రతి దానిని నమ్మవచ్చు. హవ్వ ఆ ఒక్క వాక్యమునకు ప్రతిగా అన్నింటిని నమ్మినది. ఆ ఒక్క మాటను ఆమె అవిశ్వసించవలసి వచ్చినది. ఆ ఒక్క మాటయే అవిశ్వసించవలసి యున్నది.
36మనమిప్పుడు దానిని చూచెదము. పరిశుద్ధ సహవాసమును నిలుపుకొనుటకు ఒకే ఒక మార్గము వాక్యమందుండుటయే. దేవుడు ఇలా చెప్పెను, "నీవు దీనిని చేయవచ్చు. నీవు దీనిని చేయకూడదు. నీవు మరో దానిని చేయవచ్చు. అయితే దీనిని చేయవద్దు." ఆమె ఆజ్ఞ లోని ఒక చిన్న భాగమును అవిస్వసించుటకు ప్రారంబించినది. ఆమె అలా చేయుట ద్వారా లోకమందు ప్రతి బిడ్డ ఆకలిగొనవలసి వచ్చినది. ప్రతి ఒక్కరు, దుఃఖమును, హృదయ వేదనను, మరణపు బాధను అనుభవించవలసి వచ్చినది. ఆమె అప్పుడు దానిని చేసినది. దేవుని మాటను అవిశ్వసి౦చుట అనగా, ఎంత ఘోరమైనది. ఆమె అప్పుడు అలా చేయుట ద్వారా ఈనాడు ప్రతి వ్యక్తి మరణ బాధతో మూలుగుచున్నాడు. ప్రతి అవివాహిత కుమారుడు, ప్రతి బిడ్డయు దేవునితో వివాహ సంబంధము లేకనే జన్మించుటకు ఆనాడు ఆమె చేసినదే కారణమైనది. ఈనాడు చేయబడు ప్రతి పాపము ఆమె ద్వారా వచ్చినది. ఆమె అక్కడ ప్రతి యొక్క వాక్యమును విశ్వసించి, ఇక్కడ ఒక్క చిన్న స్థలమందు ఆ వాక్యమును బట్టి కారణమును వెతికెను. ఆమెకది తెలియదు… ఆమెకు తెలిసినను, ఆమె మరొక అధికమైన దానిని ఆశించుట ద్వారా ఈడ్వబడినది, ఎందుకనగా ఆమెకు గొప్ప తరగతి ప్రజలు వాగ్ధానము చేయబడిరి. ఆమె అధిక జ్ఞానముచే మరులుగొలుపబడినది. ఆమె దీనిని చేసినట్లయి దానిని గురించి అధికముగా ఎరుగుదును అనుకొనినది. "మన సేవకులు గొప్ప విద్య కలిగినవారు. మనకు గొప్ప తరగతి వున్నది.
దేవుని వాక్యమందున్న వారికంటె గొప్ప తరగతి ప్రజలు మరొకరు లేరు. అదియే ఉత్తమమైనది. ఆ తరగతినే దేవుడు చూచువాడై యున్నాడు. ఇంకనూ కొద్ది సమయము దేవుడు దానియందు మనలను నడిపించును.
37అతని (సాతాను) రాజ్యము మరణమును గాక మరొక దానిని వాగ్దానము చేయలేదు. వానికున్నదంతయు అది మాత్రమే. అతడు మరణమునకు కర్తయై యున్నాడు. అతడు అబద్దమునకు తండ్రియైనందున అసత్యములను మాత్రమే వాగ్ధానము చేయగలడు. అతడు నీకు జీవమునివ్వజాలడు. అతడు నీకు పరలోకము నివ్వజాలడు. నీకు ఇచ్చుటకు అతని పరలోకము అంటూ ఏదీ లేదు.
దీనిని యోచించుము. సాతాను వాగ్దానము ద్వారా ఒక్క మాటను అవిశ్వసించినయెడల లేక వాని యంత్ర సామాగ్రి ద్వారా అవిశ్వసించినయెడల ఆ ఒక్క వాక్యము నిన్ను నరకమునకు పంపునదై యున్నది. ఆ విధముగనే అది ప్రారంభమైనది. దేవుడు తన కృప యందు ఆయన ఉండియు, ఇటువంటి గొప్ప పాతాళమును భూమి పైకి పంపినయెడల, అది ఆ చిన్నవారు ఆకలికి గురియగునట్లు చేయుచు, అన్ని రకముల బాధలు, కరువులు, వేదనలకు గురి చేసినదనుటకు, ప్రారంభముందు ఆ ఒక్క వాక్యమే కారణము. ఆయన ఆ మాటను దాటి చూడలేడా? దానిని ఆయన చేయలేడా? ఆయన ఒక్క మాటను క్షమించలేనియెడల, ఎందుకనగా ఆ ఒక్క మాట దీనంతటికి కారణమని ఎరిగియండినయెడల, అవిశ్వసించువారు ఈ బాధనంతటిని అనుభవించనైయున్నారని యెరిగి - ఆ ఒక్క మాటను క్షమించలేడు. మీరు యోచించుడి; అది ఎంతో భయంకరము.
38ఇప్పుడు, ఆదాము హవ్వలు, సాతాను యొక్క అబద్ధమును నమ్మినప్పుడు, పరిశుద్ధ దేవుని స్వరూపము వారిని విడిచినది. దేవునితో వారి సహవాసము విరిగిపోయినది. దేవునితో వారి ఐక్యత యొక్క సహవాసము విరిగిపోయినది. వారు సాతాను యొక్క అబద్ధమును విన్న క్షణమందే, అది ఆ సహవాసమును విరచివేసినది. ఆ విధముగానే నీవు సాతానుని అబద్ధమును విన్న క్షణమందే, అది నీ సహవాసమును విరచివేయును. ఆ క్షణమందే దేవుని సన్నిధి నుండి దూరమగుదువు. ఆమె (హవ్వ) చేసినట్లే నీవును దేవుని వాక్యమును అది ఉన్న విధముగా స్వీకరించుటకు తప్పిపోయినయెడల అలాగుననే జరుగును.
39ఇప్పుడు చూడుము, నేను మిమ్ములను ఒక విషయమును అడుగుటకు ఇష్టపడుచున్నాను. దేవుడున్నాడని మనకందరికి తెలయును. దేవుడు తన మాటలతో ఖచ్చితముగా ఉండినయెడల, అది ఎంత నిశ్చయముగా ఉన్నదనగా ఆయన తన వాక్యము ద్వారా ప్రజలకు తీర్పు తీర్చుటకై దానిని భద్రపరచియున్నాడు. అదియే ఈ పరిశుద్ధ గ్రంథము. దానిని మరిచిపోవద్దు. ఈ బైబిలు ద్వారానే దేవుడు ప్రజలకు తీర్పు తీర్చును. ప్రకటన 22లో ఇలా చెప్పబడినది, "ఎవడైనను వీటితో ఏదైనను తీసివేసినయెడల, లేక మరేదైనను కలిపినయెడల…"
"నేను సంఘమునకు వెళ్ళుదును. నేను దేవుని నమ్ముచున్నాను" అని చెప్పినంత మాత్రమున సరిపోదు. ఎందుకు, పాతాళమ౦దున్న ప్రతి దయ్యము ఆయనను నమ్ముచున్నది. వారిలో ప్రతి ఒక్కరు భక్తి కలిగియున్నారు.
40అయితే ఒక్క మాటను మాత్రము తప్పినయెడల; అక్కడే ఆ సహవాసము విరిగిపోవును. ఒక గొలుసంతయు దాని బలహీనమైన బంధముకంటెను బలమైనది కాదు. దేవుని వాక్యమును అవిశ్వసించుటయే అధిక బలహీనమైయున్నది; అక్కడే నీవు నూతనమైన బంధమును ఉంచవలసియున్నావు, అప్పుడే మిగిలిన వాటితో బలముగా వుండగలవు. యేసు నిన్ను రక్షించునని నీవు నమ్మినయెడల, ఆయన స్వస్థపరచుననియు నమ్మవలసియున్నది. ఆయన ఉండినవాడని నీవు నమ్మినయెడల, ఉన్నవాడనియు నమ్మలసియున్నది. హల్లెలూయ!ఆయన ఉండినవాడని నమ్ముచు ఇప్పుడు ఉన్నవాడని నమ్ముటకు అభ్యంతరపడినయెడల, ఆ గొలుసు విరిగిపోవును. అప్పుడు నీవు నశించెదవు. నా భావమును చూచావా? అది కరుకైనది, అది కఠినమైనది, అయితే అది సత్యమైయున్నది. ఆయనను నీవు నమ్మవలసియున్నది, ఆయన చెప్పిన ప్రతిదానిని నీవు నమ్మవలసియున్నది.
41ఇప్పుడు, నీవు ఇప్పుడు ఇలా చెప్పవచ్చు, "మంచిది, బ్రెన్హాం సోదరుడా, ఈ సంస్థల గతియేమి?" మంచిది, అట్లయిన వినుము. వారు ఈ వాక్యముతో ఉండిన అది సరియే. అయితే వారు వాక్యమును త్రోసివేసిన అది సరి కాదు; మరలా అది అపవాదియైయున్నది. చూచారా?
అట్లయిన "ఫలానా-ఫలానా సంఘములను గురించి చెప్పగలిగినదేమిటి?" ఆ సంఘములను గురించి నాకేమియు తెలియదు. నాకు తెలిసినదంతయు ఈ వాక్యమే. అక్కడ తొమ్మిది వందలకు పైబడిన సంస్థలు ఉండగా, సంఘమును ఏ విధముగా నీవు నమ్మగలవు? వాటిలోని ప్రతి ఒక్కటి, "మా సంస్థ ఖచ్చితమై సత్యమును కలిగియున్నదని," చెప్పుచున్నది.
ఇప్పుడు, ఎక్కడకు వెళ్ళవలసియున్నావు? నీకు దేనియందైనను విశ్వాసముండవలసియున్నది. "నాకు మెథడిస్ట్ నందు విశ్వాసమున్నదని" నీవు చెప్పవచ్చు. మరొకరు బాప్టిస్తునందు, మరొకరు ప్రెస్బిటేరియనునందు, మరొకరు లూథర్ నందు, మరొకరు పెంతెకోస్తు నందు, మరొకరేమో కాతలిక్కు నందు, మరేదైనను సరే నాకు అందులో విశ్వాసమున్నదని చెప్పవచ్చు. అది వాక్యమునకు వ్యతిరేకముగా ఉండగా నీకు ఒక సంస్థ యందు విశ్వాసమున్నదని చెప్పినయెడల, హవ్వ చేసిన అదే కార్యమును నీవు చేయుచున్నావు. ఖచ్చితముగా, ఆమె చేసిన దానినే నీవును చేయుచున్నావు. ఆమె దేవుని వాక్యమును ప్రక్కకు త్రోసివేసి దానిని మరొక దానిగా చేసినది.
42"మంచిది, ఇక్కడకు ఉన్నతమైన తరగతి ప్రజలు వెళ్ళుచున్నారు. అది గొప్ప కట్టడముగా ఉన్నది. వారు మంచి నాగరిక ప్రజలు," అని నీవు తలంచవవచ్చు. వారు దీనితో ఏలాంటి సంబంధము లేనివారు. హవ్వ కంటెను సాతాను అధిక అందము గలవాడు. ఆమె అసలు చిత్రములోనే లేదు. అయితే ఆమె అందముగా ఉండుట కాదు; ఆమె విధేయత గలిగి యు౦డవలసియున్నది. మనము అందముగా వుండుటకు కాదు. యేసు ఇలా చెప్పెను, ఈ లోకపు పిల్లలు, ఈ లోక రాజ్యము, ఎక్కువ అందము గలిగియు౦దురు. వెలుగు పిల్లల కన్నను చీకటి పిల్లలు ఆ విధముగా ఉందురు. మనము గొర్రెల వలె ఉన్నాము. గొర్రెలు తమకుతాము ముందుకు వెళ్లలేవు; వాటికి ఒక కాపరి అవసరమైయున్నాడు. దేవుడు మనలను జ్ఞానముగా వుండుమని కోరలేదు. ఆయన గ్రహింపుపై మనము ఆధారపడియు౦డుటకు ఆయన ఇష్టపడుచున్నాడు (ఆమేన్.) ఆయన ఎక్కడకు నడిపించునో అక్కడకు వెళ్లవలసియున్నది. ఆమెన్. ఆ చిత్రమును చూశావా? నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక, సామెతలు 3:5, నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక, ఆయన గ్రహింపుపై ఆధారపడుము. అది ఎంత వ్యతిరేకముగా కనబడుచున్నను, ఎంత గొప్ప ప్రకాశమైన వెలుగులు కనిపించుచున్నను దానిపై లక్ష్యముంచకుము. ఆయన తలంపులపై మాత్రము ఆధారపడియు౦డుము, ఆయన చెప్పినదే సత్యము.
43"దేవుని వాక్యములోని ఒక భాగము లేక ఒక చిన్న మాటను ఆమె అవిశ్వసించిన క్షణమందు, దేవునికిని ఆయన పిల్లలకు మధ్య నుండిన సహవాసములోని ఐక్యత విరిగిపోయినది. గ్రహించిన ప్రతి ఒక్కరు, "ఆమేన్" అని చెప్పండి. [సమాజము "ఆమేన్" చెప్పుచున్నారు.] ఒక బైబిలునంతటిని కాదు; "నేను బైబిలును పూర్తిగా నమ్మను. దానిలో సగము భాగమును నమ్ముదును" అని నీవు చెప్పవచ్చు. అయితే ఆమె దానంతటిని నమ్మవలసి యున్నది, దానిలోని ప్రతి భాగమును విశ్వసించవలసియున్నది.
అంత మాత్రమే కాదు, అయితే భార్య భర్తల మధ్య నుండిన ఐక్యత విరిగిపోయినది. భర్తకు, భార్యకు, మరియు దేవునికి మధ్య సంబంధము లేకుండనే అది ఒక వివాహమనిన నేను దానిని నమ్మజాలను. అది సత్యము. అటువంటి వారు తమ పిల్లలను ఈ లోక మందు, అవినీతివారిగా పెంచి, వారికి సిగరెట్టులను, త్రాగుడును, జూదమును నేర్పుచు, వారి ఎదుటనే మధ్యమును త్రాగుదురు. వారు వారి వివాహ ఒడంబడికకు ఎంత నమ్మకముగా ఉండినను, అది శరీరానుసారమైనదిగా ఉండును. అక్కడొక ఆత్మ ఉన్నది, ఆ పాపియైన తల్లిదండ్రుల ఆత్మ, వారు ఎంత నమ్మకముగా ఉన్నప్పటికిని తప్పు మార్గమునకు నడిపించును.
44మంచిది, నీవు ఇలా చెప్పవచ్చు, "వీటిని బోధించని తల్లిదండ్రులు నాకు తెలిసినవారున్నారు, మరియు వారు క్రైస్తవులు కారు." అయినను వారిని క్రీస్తు యొద్దకు నడిపించనిదేదైనను, అది తప్పు కార్యమై వేరైన దానిని చేయుదురు: క్రీస్తు యొద్దకు నడిపించజాలరు. చూచారా? అందువలన ఆ సహవాసము లేనిదే ఖచ్చితమైన ఐక్యతను కలిగి యు౦డలేవు. ఆ సహవాసము విరిగిపోయినది…
ఆదాము, హవ్వల మధ్య ఆ సహవాసము విరిగిపోయిన వెంటనే… దేవునికిని వారికిని మధ్య ఆ సహవాసము విరిగిపోయిన వెంటనే, వారిరువురి మధ్య సహవాసమును విరిగిపోయినది.
దీనిని వినుము! ఒక సంస్థలో చేరుట వలన ఏ సంఘమయినను దేవునితో తన సహవాసమును కోల్పోవుచున్నది. దాని ద్వారా ఆ విశ్వాసుల మధ్య సహవాసమును విరిగిపోవుచున్నది. ఒక్క మనస్సుతో, ఒక్క హృదయముతో ఒకే విధముగా మనము విశ్వసించవలసియున్నది. ఆ విధముగానే పెంతెకోస్తు దినమందు ఆ ఐక్యత ఏర్పడుటకు ముందు, వారావిధముగానేయు౦డిరి. వారు ఏకాత్మయందు, ఏక మనస్సు నందు, ఏక హృదయమందుండిరి. ఎప్పుడైతే సంఘము సంస్థకు మార్చబడినదో, దాని యందు అన్ని రకముల విభేదాలను కలిగి యండవలసి వచ్చినది. ఎందుకనగా వారిలో కొందరు దేవుని యందు విశ్వసించెదరు; వారు మంచి దానిని చేపట్టియు౦దురు; మరియు తక్కిన వారు వేరు మార్గములకు వెళ్ళుదురు. అందువలన మీరు సహవాసమును కలిగియు౦డలేరు. అవును.
45ఏమది? ఆమె తలంపు మారిపోయినది. ఓ, అది నిజము. ఆమె తలంపు మారిపోయినది. తన భర్తతో ఆమె సహవాసము సరిగాదు. వారు కలిసియు౦డు స్థితిని దాటి వెళ్లిరి. చూచారా? ఆమె తలంపు నిజమునకు మారిపోయినది. ఎందుకు? ఆమె ఆ అపవాది జీవితమును తన యందు కలిగియు౦డినది. ఖచ్చితముగా, ఆ విధముగానే ఉండినది. ఆమె దేవుని వాక్యమును అవిశ్వసించిన వెంటనే ఆమె ఆ అపవాది జీవమును అంగీకరించినది, ఎందుకనగా అతని ఉపదేశమును అంగీకరించినది.
దీనిని నేను నిశ్చయముగా చెప్పగలను. ఇది టేపుల యందు పదిలపరచబడియున్నది. సంఘమా నీవు గ్రహించి యు౦దువని నేను నమ్ముచున్నాను.
ఆమె దేవుని వాక్యమును అవిశ్వసించి, దేవుని నుండి ఎడబాసినప్పుడు, ఆమెలో ఆ అపవాది యొక్క జీవము ప్రవేశించినది. ఆమె అతని అబద్దమును నమ్మినది. "ఆ ఫలములు బాగున్నవని" తలంచినది. అతనితో కలసి దానిని గైకొన్నది. అది నిజము.
46నేను ఈ అంశమందే ఉండబోవుటలేదు. అయినను ఏ విధముగానైనను రానిచ్చుచున్నాను. దానిని ఆపుట లేదు. గత దినమున "ఆరిజోనా"లో అక్కడ ఒక సంఘమందు ఉపదేశించుచున్నప్పుడు, నేను వెనుదీయుదునని ఆత్మ ద్వారా నేను చెప్పలేదు. ఎందరో సేవకులు నా వెనుక వచ్చి సాతానుని బీజమైన సర్ప సంతానమును గురించి చర్చించారు. "ఒక ఆపిలు పండును తినుచున్న ఆ స్త్రీ." ఓహూ. అది బాగానే ఉన్నది. కయీను కూడా అలాగే తలంచాడు. అతడు పొలములోని పంటను తెచ్చాడు. మీరు చూశారా? అది ఆపిలు పండు కాదు. ఆమె దిగంబరియని ఎలా గ్రహించగలిగినది? మనము దాని ద్వారా వచ్చాము. అది నిజమునకు ఒక లైంగిక సంబంధము. అది నిశ్చయము; ఆమె దిగంబరియని గ్రహించినది. సర్పము ద్వారా ఆమెకు ఒక కుమారుడు కలిగెను. అతడు ప్రాకు జీవి కాదు. అతడు భూజంతువులన్నిటియందును, మిగుల తంత్రముగలవాడు. అతడు మానవునికి తరువాత వాడుగా ఉండెను. మానవుడు కోతులను, చింపాజీలను మరి వేటినైనను కనుగొనవచ్చు, కాని వారు మానవునికిని ఆ మృగమునకును ఉన్న బంధమును కనుగొనలేరు. అక్కడే వాడున్నాడు. వాడు తిరిగి రాలేనంతగా దేవుడు వానిని శపించాడు. (అది నిజము.), అతడు చేసిన దుష్ట కార్యమును బట్టి ఆ శాపము వానిపై వచ్చినది. మానవునిలో కలసిపోగల ఒకే ఒక బీజము అతని యందున్నది.
47గత దినమందు నేను ఉపదేశించుచుండగా, కాథలిక్ ప్రజలు గుంపుగా ఆ ప్రేక్షకులలో ఉండినప్పుడు కాథలిక్ ప్రజలైన మీరు, మరియను, "దేవుని తల్లియని" పిలచెదరు. ఆయన నిత్యుడుగా ఉన్నప్పుడు దేవుడు ఒక తల్లిని ఏల కలిగియు౦డును? ఆయనకు "తల్లి" అనునది లేదు. యేసుకు మరియతో ఏ బాంధవ్యమును లేదు, కాని కేవలము ఒక పొదుగుడు పాత్ర వలె ఆయనను పొదిగినది" అని చెప్పితిని.
మంచిది, వారు ఎల్లప్పుడు అలాగే విశ్వసించెదరు, మరియు కొన్ని సంవత్సరముల క్రితము దానిని గురించి నాకొక అభిప్రాయము కలదు. ఆ సంపర్కము ఎలాగు జరిగినదిగా, దేవుని ఆత్మ ఆమెను ఆవరించినప్పుడు రక్త కణమును దేవుడు మరియ గర్భమందున్న అండము యందుంచాడు. ఆ అండము ఆ స్త్రీ నుండి కలిగినది. ఆ అండము స్త్రీ నుండి కలిగినయెడల, ఆ అండమును ఆ నాళము గుండా తెచ్చుటకు ఒక అనుభూతి కావలసియున్నది. చూడుడి, దేవునితో ఏమి చేయగలరు? ఆయనను ఒక లైంగిక క్రియకు గురి చేయుదురా? దేవుడు, రక్త కణమును సృష్టించినవాడు, ఆ అండమును సృష్టించాడు… ఓ వైద్యుడా, అక్కడ స్త్రీ మరియు పురుష పుప్పొడి ఉండవలసియున్నది. అది నిజము.
48మంచిది, స్త్రీ ఆ అండమును ఉత్పత్తి చేయునదైతే, "నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు," అని ఎలా చెప్పగలిగెను? క్రీస్తు న౦దు స్త్రీ అండము ఉండినట్లయిన, పురుత్థానమందు ఆ వ్యక్తి తన కొరకు ఏదో కొంత చేయవలసియున్నది, ఎందుకనగా అది పూర్తిగా దేవునికి సంబంధించినదై యున్నది. దేవుడు ఎందుకొరకు ఒక లైంగిక సంబంధ భాగము కలిగిన వ్యక్తిని తేవలసివచ్చినది? పునరుత్థానమ౦దు ఆ శరీరమును ఎందుకొరకు కుళ్ళు పట్టనీయ్యడు? ఎందుకనగా ఆయన పరిశుద్దుడై యున్నాడు. ఆయన పరిశుద్దుడైన శారీరిక సంబంధ ప్రక్రియతో మరియు గర్భము ద్వారా ఎలాగు ఉత్పన్నము కాగలడు? అక్కడ ఆ అండము ఏర్పడుటకు కొంత అనుభూతి కావలసియున్నది.
"ఆ అండము అక్కడే ఉండవచ్చు. అది సాధ్యము కావచ్చు," అని నీవు చెప్పవచ్చు. అట్లయిన ఆయన పరిపూర్ణముగా దేవుడుగా వుండుటకు వీలు లేదు. ఆయన మానవునిగానే ఉండవలసియున్నది. అది ఆ విధమైనయెడల స్త్రీకి గూడా అక్కడ కొంత భాగమున్నది. నిజమునకు మేరీ నుండి వచ్చిన బీజము ఆమె తల్లి మరియు తండ్రి నుండి వచ్చినది. మానవ ఇచ్చతో కలిసినదై యు౦డును. అది ఆ విధముగా వుండుటకు వీలు లేదు. లేదండీ! నేనిలా చెప్పాను, "ఆయన… ఆమె కేవలము…"
49అది ఏ విధముగా ఉన్నదనగా, ఒక పక్షిరాజు గ్రుడ్డును తీసికొని మరియు కోడిపెట్ట క్రింద పొదుగుటకు ఉంచినట్లే ఉన్నది. ఆ కోడి దానిని పొదుగును. అది కేవలము పొదుగునదిగా ఉన్నది. అయితే ఆ పక్షి రాజుకు ఆ కోడికి ఏలాంటి సంబంధము లేదు. లేదండి. అది ఆ గ్రుడ్డును పొదుగునదిగా వున్నది. ఆ గ్రుడ్డు పొదుగుటకు కావలసిన ఉష్ణమును ఇచ్చునదిగా ఉన్నది.
యేసు విషయమందును అలాగే ఉన్నది. మరియ కేవలము పొదుగునదిగా ఉన్నది. తక్కిన స్త్రీలకు చేయగలిగినట్లే దేవుడు ఆమెను ఉపయోగించుకొనెను. ఆమె కన్యగా వున్నది; ఆమెకు పిల్లలు లేరు. ఆయన ఒక కన్య గర్భముందు ప్రవేశించాడు, అయితే సృష్టికర్తయైన దేవుడు ఆ అండమును, మరియు జీవమును సృష్టించాడు: దానిని సృష్టించెను. అందువలన అది ఒక నిష్కల్మషమైన గర్భధారణగా ఉన్నది.
50నేను వెలుపలకు వచ్చినప్పుడు, సహోదరులు నా కొరకు వేచి యు౦దురని నేను ఎరిగియున్నాను. వారు, "బ్రెన్హాం సోదరుడా, నేను నిన్ను ఒకటి అడుగగోరుచున్నాను. నీవు ఒక పొరపాటు చేశావు. మేము నిన్ను అందులో పట్టుకొంటిమి" అని చెప్పిరి.
నేను, "మంచిది, ఆ విధముగా పట్టబడుటయే నాకు కావలసియున్నది," అని చెప్పితిని.
"నీవు సర్ప సంతానమును భోదించుచుండగా, నీవు ఈ పొరపాటు చేశావు. దేవుడు ఆ అండమును చేశాడని నీవు చెప్పావు. అట్లయిన ఆదికాండము 3వ అధ్యాయమందు దేవుడు హవ్వతో ఇలా చెప్పాడు, "నీ సంతానమునకును సర్ప సంతానమునకును వైరము కలుగజేతును," అని అడిగెదరు.
నేను అనుకొన్నాను, "ఓ, మై." నా జీవితములో నేను ఎప్పుడు గాని ఏదైనా మరలా వెనకకు తీసుకొను ప్రేరేపణతో బోధించలేదు, ఎందుకనగా నా స్వబుద్ధిపై ఆధారపడను. మరియు ఒకవేళ నా స్వబుద్ధి దేవుని వాక్యమునకు వ్యతిరేకమైనయెడల, అప్పుడు నా స్వబుద్ధి తప్పగును. అది దేవుని వాక్యమై ఉండవలసియున్నది. అది అలా కానియెడల, దానిని ఒంటరిగా విడిచి పెట్టుము; అది సరి కాదు. అయితే ఇప్పుడు దానిని చింపివేయుటయే తగిన కార్యము. నా హృదయమందు, "పరలోకపు తండ్రి నీవు నాకు సహాయము చేయుము. ఇక్కడ ఏమి చేయాలో తెలియడము లేదు. ఆ మనుష్యుడు వాక్యము కలిగియున్నాడు; అతడు తన వ్రేలు దాని వైపు పెట్టి చూపుతూ: "నీ సంతానమునకును సర్ప సంతానమునకును వైరము కలుగ చేతును," అని ఇచ్చట ఉన్నదని చెప్పుచున్నాడు.
51ఇదిగో ఇప్పుడది ఇక్కడే ఉన్నది. పరిశుద్ధాత్మ ఇక్కడ సంచరించుచున్నాడు. ఆయనే మరియను ఆవరించెనని నేను నమ్ముచున్నాను. ఆయన సృష్టి చేయగలడు. వారి నోట తన మాటను ఉంచగలడు. నేను ప్రతి రోజు ఆయన పైనే ఆధారపడి యు౦దును. అది ఎల్లప్పుడు ఆయన వాక్యమైయున్నది. ఆయన తన వాక్యమునకు వ్యతిరేకముగా మరేదియు చెప్పులేడు. అట్లయిన నీవు ఆత్మాభిషేకము పొందానని చెప్పుకొనుచు, దేవుని సత్యమునకు వ్యతిరేకముగా భోదించినయెడల, అప్పుడది పరిశుద్ధాత్మ అభిషేకము కాదు, ఎందుకనగా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించినప్పుడు, ఆయన అదే కార్యమును తెచ్చువాడైయున్నాడు, ఎందుకనగా అది వాక్యమైయున్నది.
52దీనిని వినుము. అక్కడ ఏమి జరిగినది? నేనిలా చెప్పాను, "మంచిది, నేను కొంత అడుగుటకు ఇష్టపడుచున్నాను. స్త్రీ అండమును కలిగియు౦డలేదు. ఆమెకు బీజమనునది లేదు. ఆయన అక్కడ ఇలా చెప్పుచున్నాడు, ఒక అండము అని ఆయన చెప్పుట లేదు, గాని "నీ సంతానమునకు" అని చెప్పుచున్నాడు. ఆమెకు సంతానమనునది లేదు."
ఒక సంతానము ఏర్పడవలయునని ఒక ఐక్యత కావలసియున్నది. అది నిజమేనా, డాక్టరు? అది ఆ విధముగానే ఉండవలసియున్నది. నీవు ఎంత గుజ్జును కలిగియున్నప్పటికిని, అందులో జీవము లేక అది నాటబడినయెడల, అది చిగురించక అలాగే వుండి కుళ్లిపోవును. అయితే గుజ్జులేనిదే నీవు జీవమును నాటజాలవు. అందువలన దీనిని నీవు చూచినట్లయిన, అదంతయు ఒక ఐక్యతగా ఉన్నది. నేనిప్పుడు క్రీస్తును గూర్చియు, సంఘమును గూర్చియు చెప్పుటకు ప్రయత్నించుచున్నాను. అది ఒక ఐక్యతగా ఉన్నది. చూడుము, స్త్రీ తన స్వంతముగా బీజమును కలిగియు౦డినయెడల ఆమెకు పురుషుడు అక్కర లేదు. ఆమె తనకు తానుగా బిడ్డను కనగలదు. అయితే ఆమె ఆ విధముగా ఉండలేదు — ఎందుకనగా ఆమె పురుషునితో కలిసినప్పుడే ఆమెకు బిడ్డ కలుగును. ఆమె పురుషునితో ఉండవలసియున్నది. ఒక బీజమేర్పడుటకు ఆ ఇద్దరు కలసియు౦డవలసియున్నది. అది నిజమేనా? జీవము లేని విత్తనమును నాటి ఏమి జరుగునో చూడుము.
అది ఏలాగున్నదనగా, ఆ స్త్రీ ఆ కుక్కలకు పుట్టుకనిచ్చినదని వారు చెప్పినట్లున్నది. చూడండి, అది జీవించియు౦డజాలదు, అది ఆ విధముగా ఉండజాలదు, ఎందుకనగా (చూచారా?) ఆ పుప్పొడి అక్కడ ఐక్యపడదు.
53ఇది గమనించండి. స్త్రీ ఒక బీజము కాదు అందువలననే ఆయన చెప్పెను, "నీ సంతానమునకును, సర్ప సంతానమునకును వైరము కలుగజేతును." ఆమెతో ఇలా చెప్పుచున్నాడు. ఆయన తనంతట తానే ఆమెకు సంతానము కలుగజేయబోవుచున్నాడు, అది లైంగిక సంబంధముగా కాదు. ఆయన ఆమెలో ఒక సంతానమును సృష్టించబోవుచున్నాడు. అయితే నీవు ఇలా చెప్పవచ్చు, "అది ఆయన సంతానముగా ఉండునా?" అవును. ఆయన వానిని ఆమెకు ఇచ్చిన తరువాత అది మరియకు స్వంతమగుచున్నది. ఇది నా కన్ను; ఆయన నాకిది దయచేసెను. ఇది నా స్వరము, కాని అది నాకివ్వబడినది. చూశారా? ఆ సంతానము మరియతో చేయగలిగినది ఏమి లేదు. అది దేవుడే తన స్వంతముగా చేసినదైయున్నది.
54అప్పుడు ఆమెలో వున్న ఆ సంతానము చట్ట విరుద్ధమైన క్రియగా ఉన్నది, అది మరణమైయున్నది. ఆమె ముందుగానే సర్పము ద్వారా గర్భము ధరించి సర్పము యొక్క సంతానమును కలిగియున్నది, ఎందుకనగా ఆమె దానితో నివసించినది. ఆమె తనకు తానే "సర్పము నన్ను వంచించినదని" చెప్పినది. అది నిజము. వెంటనే కయీను ఉనికి లోనికి వచ్చాడు.
ఓ, మనకు తెలియును, ఆమె దేవుని దయవలన కుమారుని పొందితినని చెప్పినది. నిజమే ప్రతి కుమారుడు, అక్రమముగానైనను మరే విధముగానైనను దేవుని ద్వారానే రావలసియున్నది. ఆయన ఒక్కడే జీవమును కలుగజేయువాడైయున్నాడు. నిశ్చయముగా. అది నిజమై యున్నది.
చూడండి, ఆమె అప్పటికే తల్లియైయున్నది. అది సర్ప సంతానమని బాహాటముగా తెలియుచున్నది. "నీలో వున్న సంతానము, నా వాక్యమునకు వ్యతిరేకముగా చట్ట విరోధమైన కార్యము ద్వారా గర్భము ధరించినదై యున్నది. ఈ కార్యము ద్వారా నీవు సర్ప సంతానమును కలిగియున్నావు. అయితే నిష్కల్మషమైన గర్భము ద్వారా నీకు ఒక సంతానము నిచ్చెదను, మరియు ఆయన సంతానము ఆ సర్పము యొక్క తలను చితుకగొట్టును." అది అతని మడిమను కొట్టును. ఆమేన్. దేవునినే దాని కలిగి యు౦డనిమ్ము; అది ఆయన వాక్యమైనయెడల దానిని ఆయనే నెరవేర్పునకు తెచ్చును.
55అందుకొరకే నీవు దేవునితో ఐక్యత కలిగి యు౦డవలసియున్నది. అదే కారణమున యేసు, "మీరు వెళ్ళి తండ్రి యొక్క, కుమారుని యొక్క, ఆత్మ యొక్క నామమున బాప్తిస్మమియ్యుడి," అని చెప్పిన తరువాత పేతురు పెంతుకోస్తు దినమున వారి వైపునకు తిరిగి - "యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడని" వారితో చెప్పెను, ఎందుకనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామము (Name)" ప్రభువైన యేసుక్రీస్తుగా వున్నది. దానిని చూశారా? అది ఒక ఐక్యతను చేయుచున్నది.
పౌలు పేతురును ముందుగా ఎప్పుడు చూడలేదు, అయతే పరిశుద్ధాత్మయైన ఆయనే ఆ ఐక్యత యందు (మహిమ.) అదే కార్యము చేయునట్లు చేసినది. "మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా?" అని వారిని అడుగగా.
వారు, "పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి."
"అట్లయిన ఎందును బట్టి బాప్తిస్మము పొందితిరని?" అడిగినప్పుడు.
"యోహాను బట్టియే" అని బదులిచ్చిరి.
"మీరు మరలా యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మము పొందవలసియున్నదనెను." అప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందిరి.
అది ఏమైయున్నది? దేవుడు చెప్పు దానినే చెప్పు ఒక ఐక్యతగా ఉన్నది. అదియే ఒప్పుదల. "ఒప్పుదల" (Confess) అనగా చెప్పుబడిన దానినే అంగీకరించుటయైయున్నది. మనము ఒప్పుకొనిన దానికి ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఆయన చెప్పిన దానినే చేయువాడైయున్నాడు. మనము దానిని సత్యమని చెప్పినప్పుడు ఆయన దానిని చేయువాడైయున్నాడు. ఓ మై. అక్కడే మీరున్నారు. అక్కడే ఒప్పుదల ఉన్నది.
56ఇప్పుడు, గమనించండి ఆమెకును, ఆమె భర్తకును మధ్య ఐక్యత విరిగిపోయియినది. చూడుడి, దేవుడు, "ఆదామా దీనిని ఎలా చేశావు?" అని అడిగిన వెంటనే, తన భార్య కొరకై తాను అంగీకరించుటకు బదులుగా ఆమెపైనే నెట్టివేశాడు. "నీవిచ్చిన ఈ స్త్రీ నాకు దానిని ఇచ్చినది." ఆ ఐక్యత విరిగిపోయినది. చాశారా?
ఆమె చేసినదేమి? ఆమె భర్తను ప్రేమించుట కంటెను, అతనికి సత్యము చెప్పుట కంటెను, ఆమె అబద్ధమును పలికినది. ఆమె ఇలా చెప్పి ఉండవలసినది — అతడు (ఆదాము) అమాయకుడు; నేనే దానినతనికి ఇచ్చాను." ఆమేన్. అయితే బైబిలు ఇలా చెప్పుచున్నది, "ఆమె తన భర్తకు దానినిచ్చినది." "అతడు అమాయకుడు. నేను అతడికి ఇచ్చితిని అప్పుడు దానిని అతడు తినెను," అని చెప్పి ఉండవలసినది. దానికి బదులు, ఆమె సర్పముపై నెట్టి వేసినది, దగ్గర ఉన్న దానిపై వేసినది.
57ఈ దినమున వారు దానిని చేయుటకు ప్రయత్నము చేయుచున్నారు. చూడుడి, భార్య భర్తల ఐక్యత విరిగిపోయినది. భార్య భర్తల మధ్య సహవాసము విరిగిపోయినది; వారి ఐక్యత విరిగిపోయినది; వారికిని దేవునికిని మధ్య నున్న ఐక్యత విరిగిపోయినది. సమస్త కార్యము చెడిపోయినది. ఎందుకు? ఎందుకనగా ఒక్క మాటను అవిశ్వసించుట ద్వారానే! ఓ, సహోదరుడా, మై. అవును, ఆమె సత్యము చెప్పియు౦డవలసినది. ఆమెకును, ఆమె యొక్క భర్తకును మద్యనుండు ఐక్యత విరిగిపోయినది. వారికిని, దేవునికిని ఉన్న ఐక్యత విరిగిపోయినది. దేవుని వాక్యమంతటిని తీసికొనని ప్రతి సంఘమునకు, అదియే సంభవించును. నేను దానిని ప్రేమించుచున్నాను, నీవు ప్రేమించవా?
58ఆమె తొలి సంతానమును గమనించుము, కయీను ఒక హంతకుడు, అబద్ధికుడు, మోసగాడు, ద్వేషి, తన సహోదరుని ద్వేషించినవాడు. అతని సహోదరుడు దేవుని ఆజ్ఞల గైకొనినవాడు. దేవుడు వారి కొరకు బలి అర్పణను చేసెను. సాతాను యొక్క అజ్ఞానమును గమనించుడి. దానికి బదులుగా మరొక దానిని చేయుటకు ప్రయత్నించెను. బైబిలు ఇలా చెప్పుచున్నది - దేవుడు వారి కొరకు చర్మపు చొక్కాయిలను చేసెను. చర్మమును తీయుటకు ఏదో ఒకటి మరణించవలసియున్నది. ఆదాము తన కొరకు కొన్ని అంజూరపు ఆకులను, ధరించుటకు ప్రయత్నించెను. కాని వృక్ష జీవము అక్కడ పని చేయదు. జీవము కావలసియున్నది. కదిలే జీవము మరణించవలసి యున్నది. అందువలన ఆయన ఒక తక్కువ రూపములో ఉన్న జీవముగల దానిని వధించెను. అలాగున చేయుచు, "ఒకనాడు నా స్వంత జీవమునే నీ కొరకు ఇవ్వబడును. అది నిజజీవమై మరలా ఈ ఐక్యతను తెచ్చునదైయున్నది," అనుచు అక్కడ చెప్పెను. దేవుని చిత్తమయినయెడల మనము ఆ అంశమునకు చేరుదము. ఆయన ఇలా చెప్పెను, "చూడుము, ఇక్కడ ఒక గొర్రెపిల్ల జీవమున్నది. నీవు దీనిని ధరించి, నీ దిగంబరత్వమును మరుగుచేసుకొనుము." "నీవు ఆపిలు పండ్లను తినకూడదు!" అనునది బుద్ధిహీనత. చూశారా? "ఈ చర్మముతో నిన్ను కప్పుకొనుము." ఆయన దేనినో వధింపవలసియున్నది.
59మరియు అతడు సాతానుని కుమారుడు, వాడు ఆశించిన మార్గమునకు వారు రాకపోయిరి - అందునిమిత్తము వాడు దాని చేశాడు. మీరు ఏ విధముగానైనను చెప్పవచ్చును, కాని వాడు సాతాను కుమారుడు, ఎందుకనగా దేవునికిని ఆదామునకును ఉన్న పవిత్రత అలాంటి రకపు కార్యమును తేజాలదు. గుర్తించండి, సాతానుని కుమారుడైన (కయీను) అతడు, అధికులైన ఈనాటి ప్రజలు చెప్పుచున్నట్లు, భూఫలములైన ఆపిలు పండ్లను తెచ్చుచున్నాడు. అతడు వాటితో ఒక బలి అర్పణను చేయనైయున్నాడు, ఒక విరుగుడు.
అయితే నీతిమంతుడైన హేబేలు చేసినదేమి? అది ఆపిలు పండు తినుట కాదని అతడు ఎరిగియండెను. అతడు తన తల్లి, తండ్రి యొక్క రక్తమైయున్నాడు, ఆదాము యొక్క జీవము. కావున దేవుడు చేసినట్లే, అతడును ఒక గొర్రెను వధించెను. హల్లెలూయా. అతడు దేవుని వాక్యానుసారముగా చేశాడు, అయితే కయీను అతనితో ద్వేషము కలిగి యు౦డెను.
ఈనాడు అలాగుననే ఉన్నది. దేవుని వాక్యమును, రక్త ప్రోక్షణకు వచ్చి ఖచ్చితముగా తెలియుచున్నదేదో దానియందు స్థిరముగా ఉండుడి. అనేకులు రక్త ప్రోక్షణను నిశ్చయముగా నమ్మెదరు, కాని వాక్యమందు మరొక దానిని చెప్పెదరు. ఎట్లనగా — "ఓ, లేదు, నేను దానిని నమ్మను. అది వేరొక దినమునకు సంబంధించినది," అనుచుందురు. అది ఆ నాటి పాత అపవాది. అది ఆ పాత తంత్రమే… మనము దాని ద్వారా వెళ్ళు వరకు వేచి యు౦డుడి. గమనించుడి, అతడు ఆ మార్గముననే వచ్చును.
60అయితే కయీను తన బుద్ధిహీన మార్గమందు, అంత ఎక్కువ బుద్ధిహీనుడును కాకున్నను గాని, తంత్రముతో, మోసపుచ్చువాడై, భూఫలములను తెచ్చెను. ఆదాము.. హేబెలు దేవుని వాక్యమందు నిలచి గొర్రెపిల్లను తెచ్చెను. దేవుడిలా చెప్పెను, "హేబేలు నీవు నా మాట యందు నిలచావు." "కయీను నీవు దాని ఎరుగవు… నీ తండ్రి చేయుటకు ప్రయత్నించినట్లు, అంజూరపు ఆకులను నేను తిసుకొంటినా? లేక ద్రాక్షలను, లేక ఆపిలు పండ్లను లేక నీవు ఇక్కడకు తెచ్చినదేదైనను. నీ తండ్రి చెట్ల ఆకులను తీసికొని, బలిని చేయుటకు ప్రయత్నించాడు, మరియు ఇప్పుడు నీవేమో చెట్ల ఫలములను తెచ్చుటకు ప్రయత్నించుచున్నావు." కావలసినది అది కాదు. జీవము నుండి వచ్చు రక్తము కావలసియున్నది.
61ఓ, దేవుడు దానిని తెచ్చుచు ఇలా చెప్పెను, "ఇదిగో అది ఇక్కడున్నది." అలాగే హేబేలు ఖచ్చితమైన దానిని అర్పించెను. అప్పుడు తన సహోదరుడు తన యందు అసూయపడెను. అతడేమి చేశాడో చూడుడి; అతడు తన సహోదరుని చంపి వేశాడు. అయితే దేవుడు మరొకరిని పైకి తెచ్చాడు; అది క్రీస్తు యొక్క మరణ, భూస్తాపన, పునరుత్థానమువలెను యున్నది. గమనించుడి. అప్పుడు దేవుడు… ఆదాము హవ్వలతో చెప్పినదేమి? "మీరు ఫలించి, భూమిని ని౦డించి యేలుడనెను" అలా మానవాళిని భూమిపై చెదరిపోవునట్లు చేయుచు, వారినందరిని మరలా సమకూర్చి తెచ్చునంత వరకు వారితో వ్యక్తిగతముగా సంప్రదించుచుండెను. తను ప్రజలతో వ్యక్తిగతముగా ఒక్కొక్కరితో, సంప్రదించుటకు ఇష్టపడెను. కాని వారు దానిని ఆ విధముగా ఇష్టపడలేదు.
ఈ ప్రత్యక్షతను తప్పిపోనియ్యకుడి. దేవుడు, అలా జరుగుటకు అనుమతించెను. నేను చూచు విధముగానే మీరును చూచుదురు గాక.
62చూడుడి, దేవుడు ఒక సమూహములోని వ్యక్తితో సంప్రదించడు; అది అలా కానేరదు. దేవుడు ఒక సంస్థ యందు నీతో సంప్రదించడు. వ్యక్తిగతముగా మాత్రమే నీతో సంప్రదించును. వ్యక్తిగతముగా మనము పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందుచున్నాము. వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరము పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందుచున్నాము. దేవుడు ప్రతి ఒక్కరితో సంప్రదించుచున్నాడు. అది ఆయన ఉద్దేశ్యమైయున్నది. అందువలననే వారిని భూమిపై చెదరిపో చేసెను. దాని ద్వారా ఒక్కొక్కరితో వ్యక్తిగతముగా ఆయన సంప్రదించగలడు.
అయితే దానికి బదులుగా, జరిగినదేమి? దేవుడు కయీను సంతతిని, షేతు సంతతి నుండి వేరు చేయవలసి వచ్చెను. ఆయన కయీనును దూరపరచెను. ఆయన తన సంఘముతో సంప్రదించుట వారిని వేరుపరచెను. గమనించుడి. కయీను వేరుపరచబడెను. ఇప్పుడు, దేవుడు హవ్వ యొక్క దుష్ట సంతతియైన కయీనును ఆదాము పరిశుద్ధ సంతతియైన షేతు వేరుపరచెను. ఓ. ఆయనే దానిని చేశాడా? ఒక తప్పుడు కార్యము ద్వారా ఈ స్త్రీ మరొకరితో జీవించి కుమారుని కన్నది, దేవుడు ఆ కుమారుని అతని సంతతిని ఆయన యొక్క పరిశుద్దుల నుండి వేరుపరచెను. ఆయన పిల్లలు పరిశుద్దులై యున్నారు.
అదే విధముగా ఈ దినమున: వేరుపడుచు, వేరుపడి, వారిని కనుగొని, వారు ఐక్యత యందులేరు. వారు ఐక్యతను కలిగి యు౦డలేరు. రాత్రి పగలుతో ఐక్యత పడగలదా? విశ్వాసి అవిశ్వాసితో ఐక్యపడగలడా? ఎప్పుడైనను వాక్యమంతటిని నమ్మువారు, వాక్యములో కొంత భాగమును నమ్మువారితో ఐక్యపడగలరా? దేవుడు వేరుపడువారిని కోరుచున్నాడు.
63ఇప్పుడు, కయీను హవ్వ యొక్క కుమారుడు; ఆమె ఇలా అన్నది, "నేను ఒక కుమారుని కంటిని." అయితే షేతు ఆదాము కుమారుడు. దేవుడు వారిని వేరుపరచెను, ఎందుకనగా వారు చెడిపోదురు. కయీను దుష్ట సంతతి, షేతు యొక్క మంచి సంతతిని చెడిపివేయును. అది నిజము.
ఇప్పుడు, గమనించండి. దేవుని ఒక్క మాటను అవిశ్వసించునట్లు చేసిన అదే పాత అపవాది, వ్యత్యాసముగా జీవించుటకు గాను వారిని వేరుపరచెను. అదే అపవాది వారిలో చేరి, వారిని జతపరిచెను. దానిని గ్రహించారా? "ఆమేన్" అని చెప్పుడి. [సమాజము "ఆమేన్" అని చెప్పినది.] వాడు వారిని ఒక తప్పిదమైన ఐక్యతకు మరలా సమకూర్చాడు — అది దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా. ఏమి జరిగినది? అతడు దానిని ఎలా చేశాడు? "దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచిరి అని బైబిలునందు ఆదికాండములో చెప్పబడినది. "దేవుని కుమారులు" షేతు సంతతి, నరుల కుమార్తెలను చూచిరి. వారు కయీను సంతతి. వారెంతటి చక్కని వారో. ఓహూ, వారేమి చేశారు? వారిని ఇష్టపడిరి, వారు మరలా ఐక్యపడిరి, ఎందుకనగా సౌందర్యము కొరకు, "వారు చూచుటకు చక్కని వారుగా కనబడిరి. "
64ఈనాడు అదే జరుగుచున్నది. ఇచ్చట యున్న సహాదరులారా, బలహీనులైన పెంతుకోస్తువారలారా, మీరు ప్రత్యేకముగా ఉండుటకు దేవుడు మిమ్మును వేరు చేశాడు. మీరు పెంతుకోస్తును ఒక సంస్థగా చేయలేరు, ఆయన పిల్లలుగా ఉండుటకు మిమ్ములను వెలుపలకు పంపినను, మీరు ఆ గొప్ప వేదాంత చదువులను; గొప్ప సంఘాలను, గొప్ప గొప్ప, పాఠశాలలలో మిమ్ములను అమర్చుకొంటిరి. మీరేమి చేశారు? దేవుని పిల్లలను మరలా సంస్థలతో ఐక్యపరచితిరి. ఆ సంస్థలు అన్నియు క్యాతోలిజము నుండి వచ్చిన పునాదులు కలవి. చక్కని, గొప్ప సంఘములు, చక్కని దుస్తులు ధరించిన ప్రజలు, ఆ పట్టణపు మేయరు ఆ సంఘమ౦దున్నాడు, మిగిలిన వారందరు అక్కడకు వచ్చెదరు. చక్కని గొప్ప చదువులు, గొప్ప వేదాంత విద్య గలవారు, వారందరు నవనాగరికులై అక్కడకు వచ్చుచున్నారు. ఆ కాపరి చక్కగా అతని స్థలమందు నిలచి యు౦డును. ఇదంతయు ఏమిటి? దేవుడు ఖండించినవాటి వైపు నీవు చూచుచున్నావు. నీవు పెంతెకోస్తు సంఘమును (దేవా, టేపుల యందు ఈ సందేశమును పదిలపరచుము.) మరియు ఒక సంస్థగా ఐక్యపరిచావు. దేవుడు అలా ఐక్యపడుటకు ఇష్టపడుట లేదు; ఆయన దానిని ప్రత్యేకపరచుటకే ఇష్టపడుచున్నాడు, ఎన్నడు కూడా ఈ ప్రపంచముతో ఐక్యపరచడు.
65హవ్వను దేవుని వాక్యమందు అపనమ్మకపరచిన అదే పాత అపవాది, ఆమెకు కీడు చేసినది. ఇప్పుడు మరలా షేతు పిల్లలు, కయీను అందమైన స్త్రీలను చూచుట చేసినది. వారు ఆ విధముగా మరలా ఐక్యపడిరి. వారు మత ద్రోహులో, లేక కమ్యూనిస్తులో కాదు, కానే కాదు. వారు విశ్వాసులే. "దేవుడు మరేదైనా చేయవచ్చునని," వారు చెప్పెదరు. లేక, ఇది ఆ విధముగా ఉన్నదని చెప్పెదరు. వారు చేయునదే సరియైనదని వారు తలంచిరి. అయితే దేవుడు చేయగలిగినదేమి? ఆయన దానినంతటిని కొట్టి వేయును. దానంతటిని కొట్టివేయవలసియున్నది, వారు తప్పుడు ఐక్యత యందున్నారు… ఆయన జలప్రళయము ద్వారా వారిని నాశనము చేయవలసియున్నది. తప్పుడు ఐక్యతకు తీర్పు రావలసియున్నది. తప్పుడు ఐక్యతను బట్టి ఏదేనుకు తీర్పు తీర్చబడినది. ఇప్పుడు, సర్పము సంతానమును కలిగియున్నదా? అది మీకెంతో అవమానము.
66ఏదెనులోని తప్పుడు ఐక్యత తీర్పును భూమిపై తెచ్చినది. దేవుని కుమారులు నరుల కుమార్తెల యందు వాంఛ గలిగి, వారి కొరకు ఆశించి వారితో తప్పుడు ఐక్యత కలిగియు౦డినందున, దేవుని తీర్పుగా జలప్రళయము భూమి పైకి వచ్చినది. మీరును అక్కడే వున్నారు. అది తప్పుడు ఐక్యత, "ఏమి జరుగదులే." దేవుడు ఏమిచేసెను? ఆయన సమస్తమును నాశనము చేసెను, అయితే నోవహును అతని కుటుంబమును రక్షించబడిరి. ఆయన… వారు ఆయనతో జతపరచబడిరి.
నోవహు మరణము తరువాత, ఆ ఆత్మీయ నోవహు కుటుంబము, మరలా పడిపోయినది. మొదటిగా తెలుసుకొనవలసినదేమనగా, నరుల కుమారులు ఒకరినొకరు చూచుకొనుటకు ప్రారంభించిరి. వారేమి చేశారు? వారు ఇలా చెప్పుకొనిరి, "మనము నాస్తికులము కాము; మనమందరము దేవుని యందు విశ్వసించుచున్నాము," అనుచూ, ఒక అధిపతిని, "నిమ్రోదు" అను పేరుగల వ్యక్తిని ఏర్పరచుకొని, ఒక గొప్ప గోపురమును కట్టిరి. వారు నాస్తికుల కాదు. పరలోకమనునది ఉన్నదని వారు నమ్మిరి. నరకమున్నదని వారు నమ్మిరి. తీర్పుయందు వారికి నమ్మకమున్నది. అయితే దేవుని కుమారులు, నరుల కుమార్తెలతో మరలా ఐక్యపడిరి, వారి మధ్యన ఒక తప్పుడు ఐక్యతను ఏర్పరచుకొని, ఒక గొప్ప శిఖరమును నిర్మించిరి. ఒక గొప్ప సంస్థగా ఉండినది. అన్ని స్థలములు ఆ బాబిలునకు మర్యాద చెల్లించవలసి యు౦డినది.
67మరియు వారు ఇలా చెప్పారు, "మేము చాలా జ్ఞానముగల ప్రజలము. మేము చేయునదేదో తెలిపెదము." ఆ జ్ఞానమును వారెక్కడ నుండి పొందిరి? ఆ అపవాది నుండియే, అది నిశ్చయము. హవ్వ పొందినట్లే వారును అపవాది నుండి పొందిరి. అందువలన వారిలా చెప్పిరి, "మేము ఒక గొప్ప సంస్థను నిర్మించుదుము. దాని ద్వారా దేవుని సంతోషపెట్టుదము. మేము చేయునదేదో తెలిపెదము. మేము పైకి ఎక్కుటకు చిన్న మెట్లను ఏర్పరచుదుము. ఆ విధముగా పైకి వెళ్లి దేవదూతలతో కలిసి పాడెదము. మరలా క్రిందికి దిగి వచ్చి, మా సొంత జీవితమును జీవించెదము." ఆ అపవాది ఇంకను జీవించుచున్నది. చూశారా? అది దేవుని కట్టడలకు వ్యతిరేకమైనది. వారు దేవుని కట్టడల యందు నిలచియు౦డలేదు. దేవుడేమి చేశాడు? మరల తప్పుగా, వారు ఒక గొప్ప బాబెలు గోపురమును నిర్మించిరి, కావున దేవుడు వారి భాషలను తారుమారు చేసి మరియు వారిని వేరుపరచెను.
68మరలా దేవుడు వేరుపరచి, నీతిమంతుడైన అబ్రాహామును ఆయన పంపించుచు ఇలా చెప్పెను, "నేను నీ నుండి ఒక గొప్ప జనమును తీసి నిన్ను గొప్ప దేశముగా చేసెదను." దేవుడతనిని వేరు చేసెను. "అబ్రాహామా, వారి నుండి వెలుపలకు రమ్ము. ప్రతి దానిని విడచిపెట్టుము." అతడు సమస్తమును విడచి పెట్టనంత వరకు దేవుడతనిని ఆశీర్వదించలేదు; కడపటిగా లోతు మిగిలెను. "అబ్రాహామా, వెలుపలకు రమ్ము! అవిశ్వాసుల నుండి నిన్ను వేరుపరచుకొనుము. నేను నీ నుండి ఒక గొప్ప దేశమును చేసెదను. నా కట్టడలయందు నిలచు ప్రజలను ఏర్పరచెదను. వారికి నేను మరొక తరుణమును ఇవ్వనైయున్నాను."
ఆ మంచివాడైన అబ్రహాము ఎరుగని దేశమునకు పరవాసిగా వెళ్ళెను. అదియే ప్రతి అబ్రాహాము చేయవలసినదైయున్నది. ఎరుగని దేశమునకు పరవాసిగా వెడలుట. ఏమిటది? మానవ రీతిగా నమ్మజాలని ఒక వాగ్ధానమును నమ్ముట. అధునిక కయీను యొక్క డాక్టరు ఆ దినమున ఏమి చెప్పియుండవచ్చునని నీవు తలంచుచున్నావు? "ఓ, ఒక నూరేండ్ల ముసలివాడు తొంభై ఏండ్ల భార్య ద్వారా బిడ్డను కలిగి యు౦డుటయా? ఏమా విపరీతము." అయితే అబ్రాహాము దేవుని మాటను నమ్మెను. దానికి వ్యతిరేకమైనదేదైనప్పటికిని, అది లేనప్పటికిని ఉన్నట్లే దాని పిలచాడు.
ఈనాడు మన మధ్యన ఉన్న తప్పుడు బాప్తిస్మములు, తప్పుడు ఉద్రేకాలు, తప్పుడు రకమైనవన్నియు, అక్కడ లేవు. వారు దేవుని వాక్యమును నమ్మి, దానియందే నిలచారు. అవన్నియూ నిజ స్థితిని చేరుట నుండి నిన్ను దూరపరచనైయున్నవి. అది నిజము. చిన్న పిల్లలారా కదలి వెళ్ళుడి. దేవుని వాక్యము, దేవుడు తన వాక్యమును నిలబెట్టును. సాతాను ఎన్ని అబద్ధమైన వాటిని ముందుంచినను, దేవుడు తన సత్యవాక్కును ಇಂకనూ కలిగియుండి మరియు దాని స్థాపించును.
69అబ్రాహాము, వ్యతిరేకమైన ప్రతి దానిని తప్పని పిలచెను. మీరు గుర్తుంచుకోదలచిన యెడల, రోమా 4వ అధ్యాయము. అబ్రాహాము దేవుని మాటకు వ్యతిరేకమైన ప్రతి దానిని, లేనట్లుగా పిలచెను. అది సరియైనది. అతడు, తన దేహము ఎంత బలహీనమైనప్పటికిని, అది జరుగుటకు వీలు లేదని చెప్పినను, దేవుని బలముగా నమ్మి, అబ్రాహాము ఆ విశ్వాసమును కొనసాగించెను. అతడు బలపీఠమునకు దిగి వచ్చి, "అది ఇప్పుడు జరుగకున్నయెడల, నేను దానిని నమ్మవలయునా లేదా తెలియడము లేదని," చెప్పవలసిన అవసరత అబ్రాహామునకు లేదు. అది వచ్చుటకు ముందు అబ్రాహాము ఇరువది-ఐదు సంవత్సరములు ఆ వాగ్ధానముతో నిలచియండెను, అయితే అది నెరవేరినది. అది ఎప్పుడును నెరవేరును.
70అబ్రాహాము నుండి ఇస్సాకు వచ్చెను; ఇస్సాకు నుండి యాకోబు వచ్చెను; యాకోబు నుండి గోత్రకర్తలు వచ్చిరి; ఆ గోత్ర కర్తలు ఈజిప్టు లోనికి వెళ్లి, అక్కడ ఒక దేశముగా వృద్ధి చెందిరి. అప్పుడు ఆయన యొక్క దేశము వృద్ధిచెంది పైకి వచ్చినప్పుడు, ఆయన చెప్పిన దానిని సాధించెను. అప్పుడు ఆయన ఏమి చేశాడు? మరలా వారిని వేరుపరచెను. విశ్వాసము మరియు అవిశ్వాసము జతగా వెళ్లలేవు. లేదండి. ఆయన తన వారి కొరకు వారిని మరలా వేరుచేసెను. వారి నిశ్చయతతో ఖచ్చితముగా నడిపించబడుటకు ఆయన చేసినదేమి? చాలా జాగ్రత్తగా గ్రహించుడి. మనకు అధిక సమయము లేదు. పదిహేను నిముషములు మాత్రమే ఉన్నవి. వారిని అతి సమీపముగా నడిపించెను. గమనించుడి, ఆయన ఒక దేశమును ఏర్పరచి, వారిని క్రమశిక్షణ కారుల క్రిందను, అనేక కార్యములయందును ఉంచెను. వారు కొట్టబడుచు, కేకలు వేయుచు ముందుకు వెళ్లిరి. అయితే దేవుడు క్రిందికి చూచుచు; అబ్రాహాముతో చేసిన ప్రతి వాగ్ధానమును జ్ఞాపకము చేసికొనెను. ఒక దినమున ఆయన ఇలా తలంచెను… ఆయన వారికి ఏమి చెసెను? వారిని వేరుపరచినప్పుడు ఆయన చేసినదేమిటి? ఆయన వారికి ఒక ధర్మశాస్త్రము నిచ్చెను. ఆయన వారికొక ప్రవక్త నిచ్చెను. మరియు ఆయన వారికి తన అగ్నిస్తంభమును ఇచ్చెను. ఆయన ఇంకనూ ఏమి చేసెను? (ఓ, దేవా.) ఆయన తన సంఘమును క్రమమందుంచెను. ఒక అగ్నిస్తంభము వారిని నడిపించుటకు తన ఆత్మను ఇచ్చెను. తన వాక్య సత్యమును తెలుపుటకు ఒక ప్రవక్తను వారికి ఇచ్చెను. అప్పుడు వారు ప్రయాణమునకు సిద్ధపడిరి. ఇది ఆశ్చర్యముగా లేదా?
71వెలుపల అరణ్యములోనికి కదలి వెళ్లిరి, అంతకు ముందు సూచనలు చేయుచు, ఆశ్చర్య కార్యములను చేసిరి. ఫరో పై పాతాళ లోక తెగుళ్లనన్నింటిని రప్పించిరి. ఎర్ర సముద్రము విడిపోజేసిరి. ఓ, మై. ఒక అగ్నిస్తంభము వారి ముందు నడచుచు వారిని రాత్రి పగళ్ళు నడిపించుచున్నది. హల్లెలూయ. ఒక ప్రవక్త వాక్యమునకు నమ్మకముగా నిలచి, వారిని క్రమపరచుచున్నాడు. ఆయన వారిని కొనిపోవుటకు సిద్ధముగానుండెను. అప్పుడే మొదటిగా వారు సంఘమని పిలువబడిరి. ఆయన చివరి దినములయందు చేయు కార్యమునకు అది మాదిరిగా ఉన్నది. మనము మరికొన్ని నిమిషములలో ఆ సందేశములోనికి వెళ్ళుదము. ఆయన వారిని వెలుపలకు పిలచి, వారికి ధర్మశాస్త్రమునిచ్చెను. తన వాక్యము నిచ్చెను. వారికొక ప్రవక్త నిచ్చెను. ఆయన వారికొక సూచనను ఇచ్చి, అరణ్యములోనికి పంపి వేసెను. ఈ విధముగా ఆయన మిగిలిన ప్రపంచము నుండి వారిని వేరుపరచెను.
అప్పుడు వారేమి చేశారు? వారు చక్కని మోయాబు స్త్రీలను చూచి మోహించిరి. అది (మోయాబు) దేవుళ్లను, దేవతను కలిగి, నులువెచ్చని సంఘముగా నున్నది. వారింకనూ ఏమి చేశారు? వారి కొరకై వెళ్లి, వారిని వివాహము చేసికొనిరి. అది నిజము. ఖచ్చితముగా నిజము. ఆ మోయాబు మృదువైన స్త్రీలు చాలా చక్కనివారని నేను ఊహించుచున్నాను.
72ఇంటిలో నా దగ్గర ఒక ప్రవచనమున్నది. ఒక రోజున నేను దానిని చదివెదను. నేను స్త్రీల విషయములో కఠినముగా మాట్లాడు విధానమును గురించి మీరు ఆశ్చర్యపడెదరు, ముప్పది సంవత్సరముల క్రితము… "యెహోవ సెలవిచ్చిన దానిని," నేను పొందియు౦టిని. ముప్పది సంవత్సరముల క్రితము నేను సేవలో ప్రవేశించునప్పుడు, ఆయన నాతో ఇలా చెప్పెను. స్త్రీలు అధిక ఒత్తిడి కలిగి, అవినీతికరమగును, అసహ్యముగను, కడవరి దినములయందు భూమిపై యు౦దురు. అది నిజమే! ఆమె దానిని ఆదిలో ప్రారంభించినది మరియు సాతాను చివరిగా దానిని వాడుకొన్నది. కాలములలో జరిగినదేమిటో చూడండి, "స్త్రీ తనకు తానే దిగంబరియగుచు కొనసాగును" అని చెప్పెను. మరియు "అక్కడ అతికొద్ది చిన్న కూడిక, ముందుగా ఎన్నుకొనబడినదై ఆ భయంకరత్వమును తప్పించుకొనును," అనియు సెలవిచ్చెను.
ఆ దర్శనము వచ్చినప్పుడు, అది నన్నెంతో కలవరపరచినది. అప్పుడు నేనిలా తలంచాను, "స్త్రీలారా…" నేను బైబిలులోని యెషయా గ్రంథమును త్రిప్పి చూచాను, 5వ అధ్యాయమని నమ్మెదను. అక్కడ ఇలా చెప్పబడినది, "తప్పించుకొనిన చిగురు కొమ్మ… సీయోను కుమార్తెలు ఆ దినమున ప్రభువునకు మహిమ భూషణమగును."
73ఒక స్త్రీ గత దినమున నాకు ఒక ఉత్తరమును ఇలా వ్రాసినది; "బ్రెన్హాం సహోదరుడా…" లేక ఒక సేవకుడని తలంచెదను. అతడు ఈ ఉదయ కాలము ఇక్కడ ఉండ వచ్చును. అతడు ఓహాయో ప్రాంతము నుండి వచ్చెను. అతడిలా చెప్పాడు, "మేమును నీవు చేయుటను చేయుటకు ఇష్టపడుచున్నాము గాని మీ టేపులయందు పొరపాటును మేము కనుగొనుచున్నాము." కావున బిల్లి, ఆ ఉత్తరమును నాయొద్దకు తెచ్చాడు. ఆ ఉత్తరములో ఇలా వ్రాయబడియున్నది, "బ్రెన్హాం సోదరుడా, మీ టేపుల యందు ఏదో కొంత దేవుని వాక్యమును వ్యతిరేకముగా ఉన్నది. అయితే మేమును దానినే చెప్పుటకు ఇష్టపడుచున్నాము." మరలా ఒక్క ప్రశ్నను మీకు వేయుచున్నాను, అది I కొరింథి 11వ అధ్యాయమందున్నది. అక్కడ స్త్రీల తల ముసుగును గురించి చెప్పబడినది. మరియు పురుషుడు ముసుగు వేసికొనకూడదనియు చెప్పబడినది. మేము దానిని నమ్ముచున్నాము. స్త్రీలు ఆలయములో ముసుగు వేసికొనవలసియున్నది. పురుషులు తమ టోపీలను తీసివేయవలసి యున్నది. మేమూ తల ముసుగులను మొదలగువాటిని నమ్ముచున్నాము" అని వ్రాయుచూ, ఇంకనూ ఇలా వ్రాసెను, "మరో ప్రశ్నయేమనగా - "ప్రజలు మా యొద్దకు వచ్చి ఇలా చెప్పుచున్నారు. మీతో ప్రతి దానిని దేవుని దూత నుండి కలిగినదనియు చెప్పుచున్నారు. బ్రెన్హాం సోదరుడా, అలాంటి దానితో పోరాడుట చాలా కష్టతరము." "మా సంఘములో, మేము అదే మాటను చెప్పుటకు ఇష్టపడుచున్నాము. ఇప్పుచు, బ్రెన్హాం సోదరుడా, అక్కడ కొంత పొరపాటు ఉన్నది అని నీవు తోచుట లేదా?" అని వ్రాశాడు.
నేను ఇలా మరలా జవాబు వ్రాశాను, "నా ప్రియ సహోదరుడా, నేను పొరబడుట లేదు, I కొరింధీకి 11వ అధ్యాయమందు, స్త్రీ తన తలపై ముసుగును కలిగి యు౦డవలయునని చెప్పుచున్నది. ఎందుకు? అక్కడ 15వ వచనముందు, ఆమె పొడవైన తల వెంట్రుకలు ఆమెకు ముసుగుగా ఇవ్వబడెను, అని వ్రాయబడియున్నదే కాని ఒక టోపి కాదు." ఎంతో కాలముగా కాథలిక్ ఆత్మ యొక్క ప్రభావము సంఘమందున్నది. ఆమె పొడుగైన వెంట్రుకలు ఆమెకు ముసుగుగా ఇవ్వబడినది. ప్రకృతి తనకు తాను ఆలాగు…
74ఇక్కడ చూడుడి, ఎవరో ఒకరు కొంత కాలము క్రితము నన్నిలా ప్రశ్నించారు… అక్కడ ఉన్నప్పుడు నేను దానిని వివరించాను. వారడిగినదేమనగా, "మంచిది, ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద పొడవైన తలవెంట్రుకలు ఉన్నవి. ఒక స్త్రీతో దేవదూతలు చేయునదేమి?"
అందుకు నేనిలా చెప్పాను, "దూత అనగా ఏమిటి? అతడొక వర్తమానికుడు." పౌలు అక్కడ ఏమి చెప్పుచున్నాడు? ఒక నిజ వర్తమానికుడో లేక దేవుని యొద్ద నుండి ఒక దేవదూత వచ్చునప్పుడు, నీకు పొడవైన వెంట్రుకలు ఉండవలసియున్నది. లేకున్న అతడు దానిని ఖండించును. అది నిజము. ఒక దేవదూత అనగా ఒక వర్తమానికుడని ఎందరు ఎరిగి యున్నారు? అది ఖచ్చితముగా నిజము. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక వర్తమానికుడు దానిని ఖండించును. ఎట్లనగా, "దేవదూతలను బట్టి నీవు పొడవైన వెంట్రుకలు కలిగియు౦డుము." దేవుని యొద్ద నుండి పంపించిన వర్తమానికుడు ఆ కార్యమును ఖండించును. అవును. అది నిజము. ఎందుకనగా ఒక నిజ వర్తమానికుడు, అతడు దేవుని యొద్ద నుండి వచ్చినయెడల, ఒక దేవదూత దేవునితో సంబంధము కలిగియు౦డును. కావున ఆయన మాట తప్పిపోదు. అది ఖచ్చితముగా నిజము. పరిశుద్ధ పౌలు అక్కడ ఇలా చెప్పెను, పరలోకము నుండి ఒక దేవదూత వచ్చి మరొక సువార్తను లేక ఉపదేశమును బోధించినట్లయిన అతడు శాపగ్రస్తుడు. అది నిజము. ఇప్పుడు అది సత్యమని మనము కనుగొన్నాము; ఆమె పొడవైన వెంట్రుకలు కలిగి యు౦డవలసియున్నది; అది ఆమెకు ముసుగుగా ఇవ్వబడెను.
75అయితే ఈ మోయాబు స్త్రీలు ఎంతో చక్కనివారని నేను ఊహించుచున్నాను; ఈనాటి యెజెబెలుల వలె వారు ఉండియుందురు. అయితే స్త్రీలందరు ఆ విధముగా కాదు. నిజమైన (దేవుని వాక్యమును నమ్మిన స్త్రీ) స్త్రీ ఆభరణమైయున్నాది. ఒక నిజ స్త్రీని బట్టి దేవునికి స్తోత్రము. వారు దేవుని పరిచారకులు. అయితే ఒక నిజ స్త్రీ పురుషుని పోలియున్నది; సాతాను ఏమి చెప్పినా లేక అబద్ధమును బోధించినప్పటికిని, వారు దేవుని వాక్యమును వెంబడింతురు.
ఒకవేళ నీవు, "మా కాపరి అదంతయు సరియేనని చెప్పెను" అని చెప్పవచ్చు. మీ కాపరి ఏమి చెప్పినప్పటికిని నాకు లెక్క లేదు. అది దేవుని వాక్యమునకు వ్యతిరేకమైనయెడల, అతని మాట ఒక అబద్ధమైయున్నది. దేవుని మాట యందు నిలచియు౦డుము. అతడు ఏ సంస్థకు చెందిన వాడైనప్పటికిని దానిని గుర్తించి ఏదైనను చెప్పతలంచినయెడల, దేవుని వాక్యమును చూడనిమ్ము. అది ముమ్మాటికి సత్యమై యున్నది.
76ఓ, మనమీలాగున వెళ్ళుచు మరియు దేవుడు ఏవిధముగా వేరు చేయుచున్నాడో చూచుచున్నాము. మనమొక నిమిషము ఇచ్చట ఆగవలసియున్నది. ఇచ్చట కొన్ని లేఖన భాగములను, దాటి వెళ్లవెలసియున్నది, ఎందుకనగా నేను త్వరితముగా ముగించవలసియున్నది. ఆ మోయాబు స్త్రీలు వచ్చినప్పుడు ఏమి జరిగినది? దేవుడు మరలా వారిని వేరుచేయవలసి వచ్చినది. ఆయన ఏమి చేసాడు?
అప్పుడు యేసు వచ్చెను. మనమిప్పుడు ఎక్కడికో వచ్చుచున్నాము. అప్పుడు తెలుపబడిన దేవుని స్వరూపమైన యేసు వచ్చెను. ఆయన స్త్రీ సంతానమైయున్నాడు. దేవుడు తనకు తానే గర్భమున ప్రవేశించెను. ఆ గొప్ప నిర్మానకుడు తనకు తానే ఒక శరీరమును నిర్మించుకొనెను. ఆయన మరొకరి నుండి ఏ సామాగ్రిని బదులుగా పొందనవసరము లేదు. ఏ స్త్రీ నుండి యైనను, పురుషుని నుండి యైనను పొందనవసరము లేదు. ఆయనే తనకొక నివాస స్థలమును నిర్మించుకొనెను. ఓ, మై.
77ఆనాడు నిలువబడి మాట్లాడిన సైఫనును తలంచుకొనుచున్నాను, అతడిలా చెప్పెను," ముష్కరులారా, హృదయమును, చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. అయితే సొలోమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, కాని సర్వోన్నతుడు హస్తకృతాలయములో నివసింపడు, అయితే ఆయన కొరకు ఒక శరీరమును ఏర్పరచుకొనెను."
ఆయన మరెక్కడను సామాగ్రిని అప్పు తీసికొనవలసినది లేదు. హెబ్రి 11:2,3 వచనములని నమ్ముచున్నాను. అక్కడ ఇలా చెప్పబడినది, "ఈ ప్రపంచములు దేవుని వాక్కు చేత నిర్మింపబడి, దృశ్యమైనది కనబడెడు పదార్ధములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము." దేవుడు పలికెను, "కలుగును గాక," అది కలిగినది. ఆయన మరలా వెళ్లి చంద్రునితో, చంద్రుడా నాకేమైనను కొంత కలపను అరువుగా నిచ్చెదవా? నక్షత్రమా "కొంత కాల్షియమును నా కిచ్చెదవా?" అని అడుగవలసినది లేదు. దేవుడు అలా చేయడు.
78ఆయన మరియ యొద్దకు వెళ్లి, "మరియా నీ గర్భకోశమును నాకిమ్ము, నేనొక శరీరమును చేసికొని దానిలో నివసింపవలసియున్నదని," అడుగవలసినది లేదు. సృష్టికర్తయగు దేవుడు మాట్లాడెను. అప్పుడే ఆమె తల్లియైనది. ఆమె నిజమునకు గర్భము ధరించిన తల్లి కాదు. ఆయన సంతానమును భరించు కేవలము ఒక స్త్రీగా వున్నది. అది సత్యము. జ్ఞాపకముంచుకొనుడి. ఆమె యేసు తల్లి కాదు. లోకము ఆ విధముగా చెప్పుచున్నది. ఎక్కడైనను ఆమె తల్లిగా పిలువబడిన స్థలమును వాక్యములో నాకు చూపుడి. ఇప్పుడు వాక్యమునకు వచ్చెదము. "దేవుని తల్లి" యని పిలచుట నీకు అది అవమానకరము. చూశారా?
ఒక రోజు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనతో, "వెలుపల నీ తల్లి నీ కొరకు వేచియున్నదనిరి."
అందుకు ఆయన, "ఎవరు నా తల్లి? తన శిష్యులను చూచి," నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే నా తల్లి…" అని చెప్పెను.
ఆమె ఆయన తల్లి కాదు; ఆమె పొదుగునదిగా ఉన్నది. దేవుడు మరొక దానిని తీసికొనగలడు, కాని ఆయన అతి తక్కువ దానిని తీసికొని, దానితో ఆయన చేయగల దానిని చూపించగలడు. ఆయన లేనిదాని నుండి రప్పించగలడు, చేయగలడు. అందుకే ఆయన దేవుడు.
యేసు తెలుపబడిన స్వరూపిగా వచ్చెను. ఆయన ఒక ప్రియమైన నిష్కల్మషుడు, పదివేలలో శ్రేష్టుడు, ఆయన లోయలోని పద్మము, శారోను పుష్పము. ఓ, ఆయన ఉదయ నక్షత్రము. ఆయన ఏమై యున్నాడు? ఆయన ఎందుకొరకు వచ్చాడు. (ఇప్పుడు కొంత జాగ్రత్తగా వినుడి.) ఎందుకనగా మరలా దేవునికిని, మానవునికిని మధ్య ఏకత్వమును స్థాపించుటకై ఆయన వచ్చెను. ఓ, సహోదరుడా, నీవు చూచావా?
79వారి బాబెలు గోపురములు గాని ఇతర వెనుకటి కార్యములు గాని పని చేయవు. వారి తోట ఫలములన్నియు, ప్రతిదియు దేవుని సంతోషపరచలేవు. అందుకొరకే దేవుడు దిగి వచ్చి ఒక స్త్రీ గర్భము నందు ప్రవేశించెను. ఆయన తనకు తానుగా ఒక శరీరమేర్పరచుకొని ఇమ్మానుయేలుగా మారెను. దేవుడు మనకు తోడు - ఆయన యూదుడో మరి అన్యుడో కాదు, కాని దేవుడు. ఆయన యూదుడు కాదు; అయన అన్యుడు కాడు; ఆయన దేవుడు. అన్యులును ఆయనకు కావలసిన వారే. ఆయన ఒక ప్రత్యేక దేశము కొరకు యూదులను వేరుపరచెను. ప్రతి దానిని క్రమముగా పొందుటకు ఆయన ప్రయత్నించెను. ఆయన దానిని నిర్మించుటకున్న ఒక్క మార్గమేదనగా ఆయన ప్రారంభమున ఉన్నట్లు, ఒక్కొక్కరి యొద్దకు తిరిగి వచ్చుటయే. ఈనాడు అదే విధముగా ఉన్నది. ఆయన ప్రతివారిని వ్యక్తిగతముగా సంధించుచున్నాడు. ఆయన ఒక సంస్థకో, మరి ఒక ఒక శాఖకో, లేక ప్రజలు సమాజముగా కూడిన దానికో వచ్చుట లేదు. ఆయన వ్యక్తిగతముగా సంధించుచున్నాడు. గమనించుడి, దేవునికిని, మానవునికిని మధ్య మరలా ఏకత్వమును స్థాపించుట కొరకే.
80ఆయన నిజమైన పాప పరిహారార్థ బలిగా ఉన్నాడు. గొర్రెలు, మేకలు మొదలగునవి పాపమును తీయజాలవు. అయితే ఆ జీవము… ఎందుకనగా బలిని అర్పించినప్పుడు, అమాయకమైన ఆ గొర్రెపిల్ల యొక్క జీవము మరలా విశ్వాసి పైకి తిరిగి రాజాలదు, ఎందుకనగా అతడు ఒక మానవుడుగా ఉన్నాడు. అతనికి ఆత్మ వున్నది, కాని గొర్రెకు అత్మ లేదు.
మానవుడు తప్ప మరే దానికి ఆత్మ లేదు. దేవుడు అలా ఉంచాడు… అతడొక మృగపు రకమే (అది నిజము.), అయితే ఆయన ఆత్మను అతనిలో ఉంచాడు. అదియే అతనిని మృగము నుండి వేరుపరచినది. ఆ ఆత్మ అతనిపై వచ్చినప్పుడు, మంచి చెడ్డలు ఎరిగిన వాడాయెను. అయితే, జ్ఞాపకము చేసికొనుడి, దేవుడు తన స్వరూపమందు మానవుని చేసినప్పుడు, అతడు ఒక జీవించు ఆత్మ ఆయెను… చూశారా, అతడు మంచి చెడ్డలను ఎరిగిన వాడాయెను.
81ఇప్పుడు, గమనించండి. అయితే ఇప్పుడు, దీనిలోకి యేసు వచ్చెను మరియు ఆయన దేవుడై వున్నాడు. ఒకరి జీవము మరొకరిపై వచ్చుట మాత్రమే కాదు. దేవుని జీవమే అతనిని మరలా దేవుని బిడ్డగా చేయుచూ, అతడు పడిపోవుటకు ముందు ఉన్న ఐక్యతయందు మరలా ఉంచుచున్నది. ఇప్పుడు మనము నిజమైన ఐక్యతను పొందుచున్నాము.
ప్రజలలో కొందరు నాతో ఇలా చెప్పిరి, "సహో బ్రెన్హాం, మీరు ఏకత్వపువారు కాదా?" సంస్థాగతమైన ఏకత్వము కాదు. నేను క్రీస్తుతో ఏకమైయున్నాను. (చూశారా?) అయితే సంస్థాగతమైన ఏకత్వము కాదు.
ఆయన మన పాపముల రుణమును చెల్లించెను. దేవునికిని, మానవునికిని మధ్య ఏకత్వమును తెచ్చెను. యేసు భూమిపై శరీరములో ఉన్నంత కాలము దాని చేయలేడు. అందువలన విశ్వాసి యొక్క కళంకమును తీసివేయుటకు గాను ఆయన సంపూర్ణ పాపపరిహారార్థ బలిగా మారవలసివచ్చెను (చూశారా?), ఆ పాపమును తీసివేయుట ద్వారా పరిశుద్ధాత్మ మరలా మానవునిలోనికి రాగలడు. ఆ విధముగా దేవుడు మానవుడు మరలా ఏకము కాగలరు. దానిని మరలా పునరుద్ధరణ చేయుటకు ఎదో కొంత కావలసియున్నది యున్నది.
82ఇప్పుడు, ఏది పునరుద్ధరణగా చేయగలదు? దేవుని వాక్యము పరిపూర్ణమైనప్పుడే, ఒక దేవదూత దానిని సంపూర్ణము చేయగలడా? అతనికి రక్తమనునది లేదు. దేవుడు దానిని సంపూర్ణము చేయగలడా? ఆయనకు రక్తమనునది లేదు. అందువలన దేవుడే రక్తమాంసముల యందు జన్మించుట ద్వారా ఖచ్చితముగా ఆ రుణమును చెల్లించి, పాపమును తీసివేయగలడు. అదొక్కటే మార్గమైయున్నది. బాబెలు గోపురములు భూమిపై వారిని వేరుచేయుచున్నవి. ప్రతిది ఏదైనను, సంస్థలైనను, కార్యములైనను, సమస్తమును ఏ మార్గమైనను ఓడిపోయినవి. వారందరు ఏకముగా కలసిపోయిరి. ప్రపంచము అందులో ఉన్న ప్రతిది కలసిపోయినది; అయితే ఇది పరిపూర్ణముగా వేరుపరచునదై యున్నది. మహిమ.
నేనెంతో భక్తి అనుభూతిని పొందుచున్నాను. మంచిది, ఇప్పుడు నేను నా అంశమును గైకొని ప్రసంగించెదను. నేను ప్రారంభించవలసినది ఎక్కడో అది ఇక్కడే ప్రారంభమగుచున్నది, అయితే ఇది నేను ముగించవలసిన సమయముగా వున్నది. నేను ఇంక కొంత సమయములో ముగించెదను. ఇది దేవునికిని, మానవునికిని మధ్యనున్న ఏకత్వమని మీరు గ్రహించారా? గ్రహించిన వారందరు "ఆమేన్" అని చెప్పుడి. [సమాజము "ఆమేన్" అని చెప్పినది.]
83చూడండి, మానవుడు మరలా తన నిజ స్థితికి తిరిగి వచ్చుటకు అదొక్కటే మార్గమైయున్నది. ఆ పాపరుణము చెల్లింపబడవలసియున్నది. ఆ పాప రుణము ఏమై యున్నది? మరణము "పాపము వలన వచ్చు జీతము మరణము." దేవుడిలా చెప్పెను, "నీవు దాని తిను దినమున, ఈ కలయికకు నీవు కలిగియున్నప్పుడు, ఆ దినమున నీవు మరణించెదవు." అదెప్పుడు జరిగినదో, అప్పుడు వారి సహవాసము విరిగిపోయినది. దేవునితో వుండిన సంబంధము విరిగిపోయి, చివరకు ఆ అపరాధము చెల్లించబడు వరకు అది తిరిగి రాలేదు. మరెవ్వరును దాని చెల్లించుటకు యోగ్యులు కాలేకపోయిరి, ఎందుకనగా ప్రతి ఒక్కరు మానవాళితో పడిపోయిరి. ప్రతి జీవియు మానవాళి క్రింద నుండునదే. అతడు పడిపోయాడు. మహిమ, ఓ, సహోదరుడా.
84సహోదరుడా మాక్, మీరు ఇక్కడ కూర్చొనియు౦డుటకు నేను చూడలేదు. దేవుడు మిమ్ము దీవించును గాక. సహో మాక్ "మరణపు రుణము క్రింద వచ్చెనని" మనము నమ్ముచున్నాము. నేను ఇచ్చట లేనప్పుడు సహో మాక్ ఈ ఆలయమునకు కాపరిగా నుండును. అది నిజము. ఇక్కడ మరియొక మంచి బాప్టిస్ట్ మిషనరీ, ఆయన పరిశుద్ధాత్మను పొందిన బాప్టిస్ట్… చూశారా?
ఇప్పుడు గమనించండి, వారు దేవునితో ఐక్యతలోనికి వచ్చిరి.
85మనము దీని చూచినప్పుడు… చూచారా, రుణము చెల్లించవలసి యున్నది. మరియు మృగ జీవులలో అత్యధిక రకమైనవాడు, మానవుడు. ఆ మానవుడు తనకు తానుగా పడిపోయాడు. ఏ విధముగా ఒక మానవుడు మరొకరిని రక్షింపగలడు? అందుకే దేవుడు దానిని తీసికొనెను. దేవుడు ఆత్మ మరణించలేడు. అందువల్ల, "దేవుడు దేవదూతల కన్నను కొంత తక్కువవానిగా తనను తెచ్చుకొనవలసి వచ్చినది." హెబ్రియులకు వ్రాసిన పత్రిక మొదటి ఆధ్యాయములోని మొదటి వచనము. మరణమును పొందుటకై దేవదూతల కంటెను కొంచెము తక్కువవానిగా తనను చేసికొనెను. ఆ విధముగా రుణమును చెల్లించి, దేవునికిని మానవునికిని మధ్య ఐక్యతను తెచ్చుటకు పరిశుద్ధాత్మ మరలా వచ్చును.
పాపరుణము చెల్లింపబడినది. ఏదేను తోటయందు పూర్వమున్నట్లుగా ప్రజలు మరలా ఏకమగుటకు, పరిశుద్ధాత్మను వారి పైకి పంపుటకు యేసు దీనిని చేయవలసి వచ్చెను. యేసు మరణించినప్పుడు ఆ రుణము చెల్లించబడినది. అదే దానిని స్థిరపరచినది. ఆమేన్. సహోదరుడా, నీలో అది ఇముడుటకు గాను దానిని నేను తీసికొన్నాను. చూశారా?
ఆ రుణము చెల్లించబడినది. గొర్రెపిల్లకు హల్లెలూయ! ఆ రుణము చెల్లి౦చబడినది. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ఈ ఉదయకాలము నేను మాట్లాడుదానిని వినుచున్నవారు లేక టేపుల ద్వారా వినుచున్న వారికి, మీ రుణము చెల్లించబడినది. నీవు మరలా దేవుని వాక్యమును అవిశ్వసించవద్దు. వాక్యమునకు మరలి రమ్ము. వేరైన దానిని నమ్మవద్దు… ఆయన వాక్యముగా ఉన్నాడు. మహిమ. నేను ఎక్కువగా కేకలు వేయుచున్నట్లు తలంచుచున్నాను, నిజముగా నేను ఆ అనుభూతిని చెందుచున్నాను. ఆ రుణము చెల్లించబడినది. అదంతయు ముగిసిపోయినది. దేవదూతలు ఎలుగెత్తి పాడినప్పుడు, పరలోకపు గీతములు మారు మ్రోగినవి. అవునండి, ఆ తప్పిపోయిన మంద దొరికినది. అతడు మరలా తన స్థానము చేరుటకు అతని కొరకు ప్రాయశ్చిత్తము చేయబడినది. దేవుని వాక్యము అక్రమములన్నింటిని కడిగివేసినది. అవి ప్రత్యేకపరచు జలములు. వాక్యము నా స్థానముందు మరణించి మరలా పునరుత్థానము చెంది, నా జీవితములో వచ్చినప్పుడు, నా హృదయమందు వచ్చినప్పుడు, నా అక్రమములకు ప్రాయశ్చిత్తము కలిగినది. ఆమేన్.
86నా రుణము చెల్లించబడినది. అదంతయు ముగిసినది, మనము విమోచించబడితిమి. ఒక కాథలిక్ సంఘము ద్వారా కాదు, మనము కాథలిక్లము, నిజ అపొస్థలుల కాథలిక్కులము. అవునండి. సిద్దాంతములతో కూడిన రోమను కాథలిక్లము కాము. వారి సిద్దాంతములతో వారు ఈ వాక్యమును నిరాకరించుచున్నారు. వారిదంతయు సిద్దాంతములే, వాక్యము కాదు. మెథడిస్ట్ లు, బాప్టిస్తులు, అది మీకెంతో అవమానము. దేవుని ప్రేమించువారిగా ఉండుటకంటెను అక్రమమును ఎక్కువగా ప్రేమించువారుగా ఉన్నారు. సుఖములను, సంతోషములను, ప్రేమించువారుగా ఉన్నారు, పందులు కొట్టము కొరకు పందులను వధించువారు. అపవాది ఆ విధముగా తన సాధనములుగా ఉంచుకొని ఈ రకమైన కార్యముతో నింపునప్పుడు, ఏదెను తోటలో సాతాను చేసినట్లు మీరు చేయుచున్నారు. "మంచిది, మన సేవకులందరు అధికముగా చదువుకున్నవారు. వారు పి.హెచ్.డి., ఎల్.ఎల్.డి, లను బిరుదులను కలిగి యున్నవారు" అని నీవనవచ్చును. అది అర్థము లేనిది. నీవు వాక్యమును నిరాకరించినట్లయితే, అది ఇంకను అపవాది తంత్రమైయున్నది. ఈ ఉదయ కాలమున వాక్యముతో నేను దానిని రుజువు చేశాను; ఇకపై అది నీకే వదలివేయబడినది, ఇకపై నీ ఇష్టము.
87యేసుతో నడచినప్పటికిని శిష్యులలో ఐక్యత లేకుండెను. వారిలో ఏకత్వము లేదు. లేదండి, వారు తర్కించుకొనిరి, "దీని తరువాత బిషప్పు ఎవరని, మనలో గొప్ప వారెవరు? అని తర్కించుకొనిరి. వారు యేసును నమ్మినవారు కాదు. వారాయనను గ్రహించలేదు. "నీవు ఉపమానముతో మాట్లాడుచున్నావు. నీవేమి తలంచుచున్నావో స్పష్టముగా మాతో చెప్పుము," అని ఆయనను అడిగిరి. యేసుకును తన శిష్యులకును గ్రహింపునందు ఏకత్వము లేదు. శిష్యుల మధ్య ఐక్యత లేదు.
దానిని గురించి పరవాలేదు, సహోదరుడా అది నీకు చూపించుట కొరకే. ఇప్పుడు జాగ్రత్తగా వినుము; ఇది మీ హృదయాలలో లోతుగా అతుకవలెనని నేను ఆశించుచున్నాను. చూశారా? దేవుడు ఒక ఏర్పాటును కలిగియున్నాడు. ఆ ఏర్పాటునకు వెలుపల, అదేమైనను నీకు ఎంత జ్ఞానమున్నను, ఎంత ధనమున్నను, ఎన్ని వేదాంత పాఠశాలలున్నను, ఎందరు పరిశుద్దులున్నను, అది పరిశుద్ధమైనది, అది పరిశుద్ధమైనది అని నీకు చెప్పినప్పటికిని, అది ఏ వ్యత్యాసమును తీసుకొని రాదు; దేవుని ఒక్క మాటను నీవు నిరాకరించినయెడల, అది సాతాను సంబంధమే. అప్పుడు ఆ కార్యమును పాత మరియు క్రొత్త నిబంధనల నుండి నేను నిరూపించాను. నేను ఈ దినమునకు ఆమెను (సంఘము) తీసికొని వచ్చెదను, ఇంక కొన్ని నిమిషములు మాత్రము నాతో ఉండుడి.
88శిష్యులు యేసుతో చేయికి చేయిగా నడిచిరి, ఆయనతో నిద్రించిరి, ఆయనతో భోజనము చేసి, ఆయన చేసిన అద్భుతములను చూచిరి. ఆయనతో కలసి ఉండినటువంటి వారు. ఒక సహోదరుని వలె అతి సన్నిహితముగా ఉండినప్పుటికిని, వారు దానిని కలిగియు౦డలేదు. వారు సువార్తను ప్రకటించుటకు తగనివారు కారు. యేసు వారితో ఇలా చెప్పెను, "మీరు భోధించవద్దు; ఆ విధముగా చేయుటకు ప్రయత్నించవద్దు. యేరుషలేము పట్టణమందు వేచియు౦డుడి. మీకివ్వబడిన, మీకై ఉన్న ఆ వాగ్ధానమును నేను పంపెదను. అది మిమ్ములను ఏకపరచును."
"ఇప్పుడు, తండ్రీ నీవును, నేనును ఏకమైయున్నలాగున వారును ఏకమైయు౦డునట్లు ప్రార్థించుచున్నాను, మరియు నేను… సువార్తను ప్రకటించుటకు నా తండ్రి నన్ను పంపినట్లు, నేను మిమ్ములను పంపుచున్నాను."
కుమారుని పంపిన తండ్రి ఆ కుమారునిలోనికి వచ్చెను. ఏకత్వము ఒకటై యున్నది. ఆయన ఇలా చెప్పెను, "నేను నా తండ్రి కార్యములు చేయునట్లయిన నన్ను నమ్మకుడి. నేను ఇంత శబ్దముతో మాట్లాడు ఆ కార్యములను మీరు చూడలేనట్లయిన, మీరు చెవిటి వారును, మూగ వారును, గ్రుడ్డివారునై యున్నారు." ఓ, సహోదరుడా. ఆయన ఇంకను ఇట్లనెను, "వేషధారులారా, మీరు ఆకాశ వైఖరిని చూతురు గాని కాలములను, సూచనలను గ్రహించలేరు." "మీరు నన్ను ఎరిగియున్న యెడల, నా దినమును ఎరిగి యు౦దురు. మిమ్ములను గురించి యెషయా మాట్లాడినది సరియే. మీరు చెవులుండియు చెవిటివారుగా ఉన్నారు. మీకు నోరుండియు మూగవారై యున్నారు. మీకు కనులున్నవి గాని, గ్రుడ్డివారైనందున చూడలేకున్నారు…"
అపొస్తలుడైన పౌలు చెప్పినదియు సరియే, "అంత్యదినముల యందు వారు పైకి భక్తిగలవారి వలె ఉండియు, దాని శక్తిని ఆశ్రయించనివారునై యు౦దురు." ఈ విధముగా వాక్యము తరువాత వాక్యము. ఈ కడవరి దినముల యందు ఈ సంస్థలలో ఏమి జరుగనైయున్నదో తెలుపుచున్నది. అయినను ఎందుకు ఆ మానవ-కల్పిత అపవాది యొక్క పద్ధతులకు వ్యతిరేకముగా నేను కేకవేయుచున్నందుకు వారు ఆశ్చర్యపడుచున్నారు. చూడుము, అనేకులైన విలువైన పిల్లలు అక్కడ కసాయివాని వెంబడించు గొర్రెలవలె వారు వున్నారు. ప్రభువా, వారిని బయటకు తెమ్ము.
89అవును, శిష్యులలో ఐక్యత లేదు. వారు యేసును గ్రహించలేదు. వారు ఇలా చెప్పిరి, "ఈ సంగతులను గ్రహింపగలవారు ఎవరు?" చూశారా, ఎందుకనగా ఇంకను దేవుడు వారిలోకి రాలేదు. వారు కేవలము సహవాసమందుండిరి. వారు కేవలము ఆయనతో నుండిరి. ఈ నాడును ఆ విధముగా ఎందరో మంచివారున్నారు. వారు త్రాగరు, అబద్దము చెప్పరు, దొంగిలించరు, మరొక దానిని చేయరు, కాని వారికి దేవునితో ఏకత్వము లేదు. వారింకను దేవునితో ఐక్యపడలేదు. చూశారా, ఆ విధముగా ఉండలేరు. ఓ, వారు ఆశ్చర్య కార్యములు చేశారు. వారు దయ్యములను వెళ్లగొట్టారు. అదంతయు ప్రయోజనము లేదు.
గత దినమున నేనొక శీర్షికను చదివాను, అందులో దయ్యములను వెళ్లగొట్టు కార్యమున్నది. ప్రజలు ఇలా చెప్పెదరు, "ఓ, సహోదరుడా, అదే నిజమైనది. నేను చెప్పుచున్నాను." అయితే అది కాదది. ఏ మానవుడైనను దయ్యములను వెళ్లగొట్టుచు, దేవుని వాక్యమును నిరాకరించినయెడల అతడొక అబద్ధికుడైయున్నాడు. అవునండి! దయ్యములను వెళ్లగొట్టగలనని అతడు చెప్పవచ్చు. వారు దాని చేయుచున్నామని చెప్పుకొనుచున్నారు. అతడు దేవుని వాక్యముతో లేనట్లయిన, ఆ కార్యమును అతడు చేయలేడు. యేసు అలా చెప్పెను.
90ఇప్పుడు, అంతట పెంతుకోస్తు వచ్చినది; దేవుడు వారిని మరలా ఏకపరచాడు. ఓ, మై. అంతట వారు దేవునితో ఏకత్వము కలిగియు౦డిరి. దేవుడు వారిలో ఉండెను. మీరు గుర్తు౦చుకోదలచిన అపోస్తులలు కార్యములు 4:32, బైబిలు ఇలా చెప్పుచున్నది, "విశ్వసించిన వారందరును ఏక హృదయమును ఏకాత్మయుగలవారై యు౦డిరి." ఓ, సోదరుడా. ఎందుకు? పూర్వపు స్థితికి వారు మరలా తేబడ్డారు. వారు విడిచిపెట్టవలసినది ఒక్కటే ఉన్నది. ఒక పాతదైన పట్టణము, లేక వారు నివసించు పాతదైన శరీరము, ఒక పట్టణము లేక ఒక ఆలయమని పిలువబడుచు ఇచ్చట నివసించునది క్రుళ్ళిపోవలసియున్నది, ఎందుకనగా అది మరణించి మరియు చెడిపోవలసియున్నది. అయితే ఆత్మయందును, జీవమందును, దర్శనమందును, ప్రతి కార్యమందును, వారు దేవునితో ఒక్కటై యున్నారు.
ఓ, ఆదామా, కృంగిన నా సోదరుడా, మరలా సాతానును నీతో అబద్ధము చెప్పనీయకుము. అలాంటిది జరుగనియ్యకుము. వాక్యము చెప్పుదానికి భావము అది కాదని సాతాను మరలా నీతో చెప్పనీయకుము. అది నిజము. వాక్యములోని భావమే నిజమైనది… అవును. మరొకటి కాదు.
91నేను యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును గురించి మాట్లాడుచుంటిని. అది నిజమైనది. దాని ప్రత్యక్షత వచ్చినది. అది సత్యమై యున్నది. అయితే ఈ ప్రజల గుంపు చేయునదేమి? ఇక్కడ గుంపుగా చేరి, అందులో నుండి ఒక సంస్థను తెచ్చి మరొక బాబెలు గోపురమును కట్టుచున్నారు. అదే కార్యములను మరలా అందులోనికి తెచ్చుచున్నారు. నిశ్చయముగా, జరుగునది అదే. లూథరు దానినే చేసెను. వెస్లీ దానినే చేసెను; జాన్-స్మిత్ దానినే చేసెను, అలెగ్జాండర్ కాంప్బెల్ దానినే చేసెను. పెంతెకోస్తు దానినే చేసెను. దేవుడు వ్యక్తిగతముగా సంప్రదించు తన వాక్యమందు నిలుపుచున్నాడు, సత్యమైన ఏకత్వమునకు విశ్వాసులను తెచ్చుటే దేవుని ఉద్దేశమైయున్నది. ఆ విధముగా పరిశుద్ధాత్మను పొందవలెననునది ఆయన చిత్తము. అట్లయిన అదెట్లు జరిగినదో ఇక్కడున్నది…
మీరిలా చెప్పవచ్చు, "సహో బ్రెన్హాం, నేను భాషలతో మాట్లాడగలను. నేను శబ్దము అధికముగా చేయగలను, నేను అది చేయగలను." నీవు అటువంటి ఆత్మను కలిగి వాక్యమును నిరాకరించినట్లయిన, నీలో నీవు దేవుని వాక్యమును కలిగియు౦డలేదు. నీకు నిజదేవుని ఆత్మ లేదు. నీవు నెమ్మదిగా కూర్చొని, సత్యమును విని, దానిని బైబిలు నందు స్పష్టముగా చూచియు, ఆ విధముగా చేయుటకు నిరాకరించినయెడల అది దేవుని ఆత్మ కాదు. నీవు ఎంతగా భాషలలో మాట్లాడినప్పటికిని, నీవు ఎంతగా అరచి కేకలు వేసినప్పటికిని, నీవు ఎన్ని సంఘములు చెంది యున్నప్పటికిని, నీవు ఎన్ని పర్యాయములు బాప్తిస్మము తీసికొన్నను, మరేది చేసినప్పటికిని నేను లెక్క చేయను. వాక్యము సత్యమై యున్నది. అదియే ఆ సత్యమును నిరూపించునదై యున్నది. ఈ సత్యములన్నింటిని వాక్యము ద్వారా నీవు పొందియునట్లయిన (ఆమేన్.), నీవు నీ గృహమునకు వచ్చుచున్నావని తెలిసికొనుము.
92బైబిలు వ్రాసిన దేవుడు ఏ విధముగా దానికి ప్రత్యామ్నాయముగా మరొక దానిని ఉంచగలడు? షేతురు మా సంఘమ౦దు భూస్థాపన చేయబడెనని చెప్పుకొను, కాథలిక్ ప్రజలైన మీరు - ఆయన ఆత్మ మాకు పాపములను మన్నించుటకు కావలసిన అధికారమును ఇచ్చినదని, ఇతర కార్యములను చేయు మీరు, ఏ విధముగా ఒక యూదుడైన పేతురు, ఆలయముందు విగ్రహములను ఉంచుటకు అనుమతించగలడు? ఏ విధముగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము వచ్చుటను, భాషలను మాట్లాడుటను, ఆయన చేసిన శక్తివంతమైన కార్యములను నిరాకరించగలడు. చిన్న గోధుమ పిండి బిళ్లలో దేవుడున్నాడని ఎలా చెప్పగలడు? ఓ, అది అజ్ఞానము, ఆత్మీయ అజ్ఞానము.
మంచిది, ప్రాటెస్టెంటులైన మీరును అదే కార్యము చేయుచున్నారు. లేవండి మరియు బొధించు వారితో చేతులు కలిపి, "నేను యేసును నా స్వంత రక్షకుడిగా అంగీకరించుచున్నానని" చెప్పుచు, మరలా వెళ్లి ఎటువంటి జీవితమునైనను ఈ లోకముతో కలసి వెళ్ళుచు జీవించగలవు? ఇది మరొక బాబెలు గోపురముగావున్నది.
93మనము చివరకు వచ్చాము. గమనించండి. దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు. దేవుడు ఆ పరిశుద్ధాత్మగా వున్నాడు. ఆయనే దేవునికిని మానవునికిని ఏకత్వము కలుగజేయువాడై యున్నాడు. దానిని ఇక్కడ కనుగొందుము. దానిని చూచుటకు గాను, మీ దిశ మారని గమనమును ఐదు నిమిషములు ఉంచుడని నేను కోరుచున్నాను. గమనించండి.
మానవుడు అపవాది యొక్క ప్రణాలికతో సంఘమును ఏకత్వము నందు సంస్థగా చేయుటకు ప్రయత్నించుచున్నాడు. వారు ఏకత్వమునందు సంఘమును విద్యావంతురాలిగా చేయుటకు ప్రయత్నించుచున్నారు. వారు కేవలము సంస్థ మూలముగను, విద్య మూలముగను దానిని చేయుచున్నారు. వారు ఇప్పుడు ప్రపంచ సంఘ సమాఖ్య ఏర్పాటుకు ప్రయత్నము చేయుచున్నారు. ఈ విధముగా చేయుచు కాథలిక్లను, ప్రొటస్టెంటులను ఏకము చేయుటకు ప్రయత్నము చేయుచున్నారు. అది ఏమైయున్నది? అపవాది యొక్క ప్రణాళిక.
"నీవు అలా చెప్పుటకు గొప్పవాడివి కావని" నీవు చెప్పవచ్చు. నేను కొద్దివాడినే కాని నా దేవుని వాక్యము ఎంతో గొప్పది. నేను దానిని చెప్పగలను. భూమ్యాకాశములు గతించినను, దేవుని మాటలు గతించవు. అది చెప్పుచున్న వానిది కాదు గాని, అది ఆయనే - ఆయనే దానిని మొదట చెప్పెను. ఆయన చెప్పిన దానిని నేను చెప్పుచున్నాను. నేను ఆయన వాక్యమును ఒప్పుకొనుచున్నాను.
అది అపవాది యొక్క ప్రణాళిక ఏర్పాటు క్రింద జరుగుచున్నది. ఆ ఉదయ కాలము మీ ఎదుట అది నిరూపించబడినది. అది పూర్తిగా అపవాదికి సంబంధించినది. ఏ సంస్థలైనను ఆ విధముగానే యున్నది.
94అపవాది యొక్క ప్రణాళిక క్రింద మానవుడు ఏకత్వమునకు ప్రజలను ఒక సంస్థగా చేయుటకు ప్రయత్ని౦చుచున్నాడు. "మీరందరు వచ్చి అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ లో చేరిపోవుడి. వన్నెస్ లో చేరిపోవుడి. చర్చి-అఫ్-గాడ్ సంఘమందు చేరిపోవుడి. మెథడిస్ట్ నందు చేరుడి. మనమందరము ఒక్కటే," అనుచున్నారు. భక్తిహీనులైన సమూహములారా! భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యున్నారు. మీ ఎదుట దేవుని వాక్యము సమస్తమును కదిలించి వేసినది. దానిని ఎదిరించుటకు మీరు భయపడుచున్నారు. మీరు దేవునితో ఉన్నట్లయిన, దేవుడు దానిని మీకెందుకు చూపడు. మీరెందకు దేవుని క్రియలను చేయలేకున్నారు? పైకి ఆ రూపమును కలిగి, వెలుపలి వాటి వెంట వెళ్ళుచు, ఆయనను నిరాకరించుచున్నారు? పైకి ఆ రూపమును కలిగి, వెలుపలి వాటి వెంట వెళ్ళుచు, ఆయనను నిరాకరించుచున్నారు. ఆయన నిజ క్రియలను ఏ విధముగా ఒక బయల్జెబూబు అని పిలచుచున్నారు? మీరందరు విద్య గలిగిన సంఘ సభ్యుల సమూహములని అది చూపుచున్నది. యేసు ఇలా చెప్పెను, "మీరు మీ తండ్రియైన అపవాదికి సంబంధించినవారు." అది నిజము! మీరు గ్రహించియు౦దురని నేను నమ్ముచున్నాను. నిశ్చయముగా, ఎందుకు కొందరు దీనిని ఎదిరించలేకయున్నారు? ఎందుకనగా దేవుడు దాని వెనుక ఉన్నాడని మీరెరిగి యున్నారు. దేవుడు తన వాక్యముతోనే కదలును.
95మానవుడు దానిని చేయును. అది మరొక బాబెలు గోపురమును నిర్మించును. అతడు ఏమి చేయుచున్నాడు? వారు దేనినో చూపుటకు ప్రయత్నించుచున్నారు. ఈ ప్రపంచ సంఘ సమాఖ్యలోకి చూడుడి. అందులో ఆంగ్లికనులు, రోమను కాథలిక్లు, మెథడిస్తులు, ప్రెస్బిటేరియనులు, పెంతెకోస్తులు, వారందరు జతగా ఏకమైరి. వారి మధ్య క్రైస్తవ విజ్ఞానము, ఇంకనూ అనేక అసహ్య క్రియలను కలిగి, చివరకు కన్య జన్మమును నిరాకరించుచు, యేసు యొక్క అధికారమును నిరాకరించుచు, ఆయనను ముగ్గురు వ్యక్తులుగా చేయుచు, ముగ్గురు దేవుళ్లను ఆరాధించుటకు ప్రయత్నించుచున్నారు. వారు కన్యక జన్మమును నిరాకరించుచున్నారు. కొందరేమో రక్తమునే నిరాకరించుచున్నారు. కొందరేమో ఆయన ఆశ్చర్య క్రియలను నిరాకరించుచున్నారు. చివరకు అందరు ఆ విధముగానే చేయుచున్నారు. అటువంటి వారు ఏకమగుటకు ప్రయత్నము చేయుచున్నారు. మీరు దానిని ఏలాగు చేయగలరు? అది మానవ-కల్పిత శిఖరముగా వున్నది. అది బాబెలు పడినట్లు, పడిపోవును.
96అయితే దేవుడు ఇలా చెప్పుచున్నాడు, "శక్తి చేత గాదు, బలము చేత గాదు, గాని నా ఆత్మతో దీని చేయుదును" అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ విధముగానే నేను నా సంఘమును ఐక్యపరచెదను. సంస్థ ద్వారా కాదు, వేదాంతులు ద్వారా కాదు; అయితే నా ఆత్మతో అని, యెహోవ సెలవిచ్చుచున్నాడు. నేను నా గొర్రెలను జతపరతును." ఓ, ఆయన ఆ విధముగా చేయునప్పుడు ఏమి జరుగును? ఆయన సూచనలు, ఆ విధముగానే పదిలపరచబడి యున్నవి. ఆ విధముగానే ఇశ్రాయేలు మోయాబుతో కలియుటకు ముందు చెప్పుచుండిరి. వారిపై అగ్నిస్తంభముండినది. అవునండి. ఆయన ఏమి చేయుచుండెను? అవే రకమైన సాక్ష్యమును పధిలపరచెను. వారు కలయిక నుండి వేరైపోయిన తరువాత, దేవునితో వేరైన తరువాత వారికిని దేవునికిని మధ్య నుండిన ఏకత్వము విరిగిపోయినది. వారు మోయాబుతో ఏకమైరి. వారి విజయమంతయు ఓడిపోయినది. వారు ఆ అరణ్యమందు మరో నలుబది సంవత్సరములు ఉండవలసి వచ్చెను. మరొక సంతతిని దేవుడు లేపి, వారిని (కానానుకు) నడిపించుట ద్వారా ఆయన ఏర్పాటు పూర్తి చేయబడినది. ఖచ్చితముగా దానినే వారు చేసిరి.
97ఇప్పుడు, చూడండి. దేవుడు తన సంఘమును తన ఆత్మతో జతపరచి తెచ్చినప్పుడు, వారు సజీవుడైన దేవుని యొక్క సూచనలను వారి మధ్య కలిగియు౦దురు. ఏ విధమైన సూచనలు? దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వేరు చేసినప్పుడు, దేవుడు మోషేకును మరియు ఇశ్రాయేలునకు, అగ్నిస్తంభమును సూచనగా ఇచ్చెను. అది నిజమేనా? ఒక ప్రవక్తను ఇచ్చెను. ఆయన అబ్రాహామును లోకము నుండి వేరుచేసినప్పుడు అబ్రాహాము వద్దకు ఒక దేవదూత వచ్చెను. అతడు ఆలోచనలను గ్రహించి, హృదయపు తలంపులను వెలికి తెచ్చెను: అదే గురుతు. హల్లెలూయ.
ఇప్పుడు, ఈ సంఘములో పట్టబడిన ఈ సంస్థలు ఐగుప్తు వలె ఏకత్వమును చేయుటకు ప్రయత్నించుచున్నవి. ఏదెను తోటలో వలెనె ఎన్నో రకములుగా వారు…
అయితే నేను మిమ్ములను ఒకటి అడుగ తలంచుచున్నాను. దేవుడు ఇశ్రాయేలును వేరుపరచినప్పుడు, ఆయన ఒక అతీతమైన సూచనగా అగ్నిస్తంభమును ఇచ్చెను. ఆయన వారికొక ప్రవక్తను ఇచ్చెను. ఆయన అబ్రాహామునకు ఏమి చేసెను? ఆయన ప్రతి సమయమందు ఏమి చేసెను? వారిమధ్య దేవుడు నియమించిన ప్రవక్తను చూపగలరా. ఆయన తన సంఘమును, అపోస్తులులతోను, ప్రవక్తలతోను, ఉపదేశకులతోను, సువార్తికులతోను సమకూర్చియున్నాడు. హల్లెలూయ. అక్కడే మీరున్నారు. ఆయన ఇశ్రాయేలును వెలుపలకు పిలచినట్లు మరలా ఒక సంఘము ఏర్పడుచున్నది. దానికి తరువాత మరలా వెళ్ళుదునని మీతో చెప్పియు౦టిని. అవునండి.
దేవునిచే నిర్ణయించబడిన ప్రవక్త వారిమధ్య లేడు. (లేదండీ.) ఇశ్రాయేలుతో ఉండినట్లు వారి మధ్య లేడు. అది ఏమైయున్నది? మరలా అదొక అపవాది యొక్క గోపురమై యున్నది.
98ఇప్పుడు, యేసు యొక్క రెండవ రాకడ ఆసన్నమైనది. ఆయన తాను ఎన్నుకొన్న వారిని జతగా సమకూర్చుచున్నాడు. నేను దానిని విశ్వసించుచున్నాను. ఓ, వారు తూర్పు నుండి - పడమర నుండి వచ్చెదరు. తాజా ఆహారము ఎక్కడుండునో పక్షిరాజులు అక్కడ పోగవును. ఓ, మై, అదేమైయున్నది? ఆయన తన ఏకత్వమును గలిగియున్నాడు, ఆయన నిజ ఏకత్వము, ఆయన తనకుతాను మన మధ్య కనపరుచుకొనుచున్నాడు; ప్రతి సంస్థ నుండి, అన్ని రకముల సంఘముల నుండి, ప్రతి స్థలము నుండి ఆయన ఎన్నుకొన్నవారిని సమకూర్చి తెచ్చుచున్నాడు. ఆయన వాక్యముతో చక్కగా ఉండునట్లు తన పిల్లలను తెచ్చుచున్నాడు. ఏమిటి?
ఇప్పుడు, ప్రభువైన యేసు యొక్క రాకడ ఎంతో సమీపముగా ఉన్నది. ఇప్పుడు తీర్పు వచ్చుచున్నది. ఆయన తనతో ఏకత్వమునకు, తాను ఎన్నుకొన్న వారిని ఆయన సమకూర్చి పిలచుచున్నాడు. ఆయన యొక్క అదే రకమైన పరిచర్య ద్వారా సమకూర్చుచున్నాడు. దానిని ఏ విధముగా సంఘ కాలముల యందు రూపుదిద్దితేనో అది మీకు తెలియును. అదొక గొప్ప గోపురమైయు౦డి, " పిరమిడ్" అని పిలువబడినది. అదే తలరాయి దానిపై ఉంచబడలేదు. లూథరనులు ఎలా వచ్చారో, వెస్లియనులు కొద్దివారై ఎలా వచ్చారో చూచారు, పెంతుకోస్తు వారు ఆ తరువాత వచ్చారు. ఇప్పుడు ఆయనేమి చేయుచున్నాడు, వాటి నుండి మరలా పిలచుచున్నాడు. ఆయన ఏమి చేసెను? మొదటిలో లూథరనులుగా ఉండుటకు తాను ఎన్నుకొన్న వారిని పిలచెను; ఆ తరువాత లూథరనుల నుండి తాను ఎన్నుకొన్న వారిని వెస్లియనులుగా చేయుటకు పిలచెను; వారి నుండి తాను ఎన్నుకొన్న వారిని పెంతెకోస్తు వారినిగా చేయుటకు పిలచెను; ఇప్పుడు ఆయన తాను ఎన్నుకొన్న వారిని ఆ పెంతెకోస్తు నుండి తలరాయిగా ఉండుటకు పిలచుచున్నాడు. అదే రకమైన పరిచర్యను అందులో ఉంచి తన పిల్లలను, అన్ని రకముల సంస్థల నుండి అన్ని రకముల జీవితముల నుండి, వెలుపలకు పిలచుచున్నాడు.
99అంతట ఆయన ఏమి చేసెను? ఆయన వారితో (ఎన్నుకొనబడిన వారితో) ఒక నిజ ఉపదేశకుని ఉంచెను, బైబిలులోని తన వాక్యమందు నిలచు ప్రవక్తను ఇచ్చెను. "నా గొర్రెలు నా స్వరమును వినును" అని యేసు చెప్పెను. అది ఆనాడు ఆయన స్వరమైన యెడల, ఈనాడును ఇది ఆయన స్వరముగా ఉన్నది. ఆ స్వరమునకు వ్యతిరేకమైనది ఏదైనను, అది ఆ గొర్రెల ఆహారము కాదు. వారు దానిని వెంబడించరు. ఓ, సహోదరుడా. తూర్పు నుండి, పడమర నుండి, ప్రతి సంస్థ నుండి, ప్రతి సహవాసము నుండి, వారు తూర్పు నుండి, పడమర నుండి ఒక్కటిగా సమకూడుచున్నాడు.
మనము మన రాజుతో విందు చేయుదము.
ఆయన అధితులుగా,
ఆయనతో కలసి భోజనము చేయుదుము.
ఈ యాత్రికులు ఎంతగా ఆశీర్వదించబడిన వారో,
ఆయన ముఖము పరిశుద్ధ ప్రేమతో ప్రకాశించుచున్నది.
ఆయన యొక్క ప్రకాశించు కీరీటము,
రత్నముల వలె ఆశీర్వదించబడిన అధికులుగా,
ఆయన కృప యందున్నారు.
యేసు త్వరగా వచ్చుచున్నాడు.
అప్పుడు మన ప్రయాసములు ముగిసి పోవును. (హల్లెలూయ.)
పాపము నుండి విడుదల పొందిన వారి కొరకు
ప్రభువు వచ్చిన యెడల ఏమగును?
అప్పుడది నీకు సంతోషము కలుగ జేయునా
లేక దుఃఖమును కలుగజేయునా?
అయితే మన ప్రభువు మహిలో వచ్చునప్పుడు
ఆయనను మధ్య ఆకాశమందు కలసికొసెదము. (హల్లెలూయ! అవునండి.)
100అది ఏమైయున్నది? దేవుడు పంపిన, వాక్యమందు ఖచ్చితముగా నిలచు ఉపదేశకునితో ఉండుటయై యున్నది. సంస్థలు ఏమి ఉపదేశించినను ఒక పొల్లు కూడా తప్పుని నిజ సంఘముతో నిలచుటయైయున్నది; వారు దానితో సంబంధపడువారు కాదు. ప్రవక్తలు; విశ్వాసుల వలె కనబడుట కాదు, ఏదో క్రైస్తవులని పిలువబడువారు కాదు. కాని ఒక నిజ ప్రవక్త "యెహోవ ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అను దానిని కలిగియు౦డును. అది ప్రతిసారి, ప్రతి సమయమందుండును. అతనినే ఆయన సంఘమునకు పంపును. ఆయన దేనిని సెలవిచ్చునో, దానినే అతడు చేయును. అతడు వాక్యమును నమ్మును, సిద్దాంతమును కాదు. ఒక పద్ధతిని కాదు గాని వాక్యమునే నమ్మును. ఈ విధముగా చేయుట ద్వారా ఆయన (దేవుడు) తన వాక్యమును స్థిరపరచుచు, వారికి తనను తెలియపరచుకొనును. ఆయన జీవమును వారిలో ఉత్పన్నము చేయుచు, ఒకప్పుడు ఆయన జీవించినట్లే ఇప్పుడును వారిలో జీవించుచు, ఆయన వాక్యమును నెరవేర్చును. ఓ, మై.
101జాగ్రత్తగా వినండి, I కొరింథి 4:20 ఇలా చెప్పుచున్నది, దేవుని రాజ్యము శక్తివంతము చేయు తన వాక్యమందున్నది. మీరు వ్రాసుకోవలెననిన, I కొరింథి 4:20. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే యున్నది. దేవుని రాజమేమైయున్నది? అది మీలోనే వున్నది. ఆ రాజ్యము మీలోనే వున్నది. అక్కడకు వాక్యము వచ్చినప్పుడు, ఆ వాక్యము దేనిని ప్రారంభించును? దానిలో చెప్పుబడినదేదో దానినే చేయుచు, అది శక్తిగా మారిపోవును.
"అది ఇలా చెప్పుచున్నదని," నీవు చెప్పజాలవు. అది చెప్పబడినట్లే ఉండి క్రియ చేయుచున్నది. నీవును ఆ విధముగానే దానిని ఒప్పుకొనవలసియున్నది. అదియే ఒప్పుకోలు. "మంచిది, అక్కడ కొంత మెరుగుపెట్టిబడినది, నాకు అధిక తెలివియున్నది, నేను దీనియందె నిలచుట శ్రేష్టమని," చెప్పుట కాదు.
నీవు వాక్యముతో నిలచియు౦డుము. అది అక్కడ ఖచ్చితముగా వున్నది. చూశారా? అది దానిని శక్తివంతము చేయును, "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు." యోహాను 14:12లో యేసు ఇలా చెప్పుచున్నాడు, "నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును." "మీరు నా యందును, నా మాట మీ యందును ఉన్నయెడల, మీరు ఇష్టపడుదానిని అడుగుడి, అది మీకు చేయబడును. మీరు నా యందును, నా మాట మీయందును ఉన్నయెడల…"
102అది ఏమి? నీవు వాక్యముతో చేరిపోవలసియున్నది, సజీవ యాగముగా చేయబడవలసియున్నది. మనలో అనేకులు, మన స్నేహితులు పరిశుద్ధాత్మను పొందియున్నారని గ్రహించుచున్నాను. మనము అబద్ధము చెప్పకుండను, దొంగతనము చేయకుండను, ఏదైనను చేయకుండునంతగా చాలినంత పరిశుద్ధాత్మను పొందియున్నాము. అయితే దేవుడు తన సంఘము యొక్క ప్రతి దానికి పరిశుద్ధాత్మతో నింపుటకు ఇష్టపడుచున్నాడు; ఆయన నీ తలంపులను నింపుటకు ఇష్టపడుచున్నాడు; నీ మనస్సును నింపుటకు ఇష్టపడుచున్నాడు. నీలోని ప్రతి భాగమును ఆయన పరిశుద్ధాత్మతో నింపుటకు ఇష్టపడుచున్నాడు. ఈ విధముగా నిన్ను పరిపూర్ణము చేయుట ద్వారా, పూర్తిగా నీవు సజీవ యాగమై ప్రతి తలంపునకు మరణించి, దేవుని వాక్యము నీ ద్వారా పూర్తిగా నివసించునంత వరకు దేవునికి నిన్ను సమర్పించుకొనుము. నీవు దేవుని వాక్యమును తప్ప మరే దానిని ఎరిగి యు౦డకూడదు. వాక్యముతో నిలచి యు౦డుము. అది జీవమైయున్నది. "నా మాటలు జీవమై యున్నదని," యేసు చెప్పెను. ఆయన వారితో బైబిలును విశ్వసించు బోధకులను ఉంచియున్నాడు. సత్యమును తెలియపరచు, కాలముల యందు వారు చేసినట్లు ప్రవచనములను తెలియపరచు ప్రవక్తలను వారితో ఉంచెను. ఆయన ఏమి చేయుచున్నాడు? ఆయన తన్నుతాను సజీవునిగా వారి మధ్య చూపించుకొనుచున్నాడు. ఆ విధముగా తన వాక్యమును స్థిరపరచుచున్నాడు. ఆయన వాక్యము శక్తియైయున్నది. శక్తివంతము చేయు దేవుని వాక్యమే దేవుని రాజ్యమైయున్నది.
103ఈ సంస్థలేమో మానవ తలంపులపై, ఊహలపై కట్టబడియున్నవి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనము మానవ తలంపులపై ఆధారపడకూడదు. సామెతలు 3వ అధ్యాయము, 5వ వచనములో ఇలా చెప్పబడినది, "నీ స్వబుద్ధిని ఆధారముచేసికొనక." చూశారా? దేవుని వాక్యము ఎలా కనబడినప్పటికిని దానికి వేరైన దానిని చేయకుడి.
"అది ఈ విధముగా, ఈ భావముతో చాలా బాగున్నదని నీవు చెప్పవచ్చు.
దాని భావము నీవు తలంచినట్లు కాదు. అది దేవుని వాక్యము. అది చెప్పబడినట్లే దానిని తీసికొనుము. సాతాను హవ్వతో ఇలా చెప్పెను,
"దేవుడు అలా చెప్పాడని నేనెరుగుదును, అయితే నీవనుకొన్నట్లు అది దాని భావము కాదు. ఇదియే దాని అర్థము" (నీవు చావవు). ఆమె దానిని నమ్మినది. ఆమె దానిని నమ్మినది. అది ఆ ఏకత్వమును విడదీసినది; ఆ సహవాసమును విడదీసినది; ఆ ఐక్యతను విడదీసినది; అది ప్రపంచమునే విడదీసినది; అది జీవమును విడదీసినది. సమస్తమును విరిగిపోయినది.
దేవుని ఒక్క మాటను అవిశ్వసించు ఏ వ్యక్తియైనను సమస్త సహవాసమును విరచివేయును. అది నిజము. మనము నమ్మగలిగినను, నమ్మలేకున్నను, వాక్యముతో నిలచియు౦డవలసియున్నది. దేవుడలా చెప్పాడు, మరియు దానితో నిలచియు౦దము. ఎన్నో సంగతులను నేను విడచిపెట్టవలసియున్నది, ఎందుకనగా ఇప్పటికే ఎక్కువ సమయమైపోయినది.
104గత కాలమందు మానవుడు దీని చేసినప్పుడు, అది ప్రపంచముపై దేవుని తీర్పును తెచ్చినది. బాబెలు గోపురమైన కయీను పిల్లలు మరియు షేతు పిల్లలు తీర్పును తెచ్చిరి. అదెల్లప్పుడు దేవుని తీర్పును లోకము పైకి తెచ్చుచున్నది. చూశారా? ఓ, ఆ నిజమైన ఏకత్వము ఆయనతో తీర్పునకు పైగా లేపబడును. ఆ తీర్పులో నోవహు తన కుటుంబముతో ఎత్తబడెను. నీతిమంతుడైన నోవహు మరియు అతని కుటుంబము ఆ తీర్పునకు పైగా ఎత్తబడిరి. వారేమి చేశారు? వారు వెళ్లిపోయారు…
సహో లీవెయిల్, నీవు దీనిని అందుకొన్నట్లయిన అది ఇచ్చట ఉన్నది. ఒక్క ప్రశ్నపైనే మనము ఒకరినొకరము అంగీకరించము. సంఘము తీర్పు ద్వారా వెళ్ళునని ఆయన నమ్మును. నేను అలా చూచుట లేదు. నేను దాని నమ్ముట లేదు.
నోవాహు తీర్పు ద్వారా వెళ్లలేదు. ఆ తీర్పునకు పైగా వెళ్లిపోయెను. అబ్రాహామునకు ఏలాంటి అగ్నియు లేదు. ఆ అగ్ని నుండి ఆయన దూరముగా నుండెను. ఇశ్రాయేలు, తమ యొక్క తీర్పునందు లేరు. అగ్ని నుండి వేరు చేయబడిరి. తీర్పునకు దూరముగా ఉండిరి. సంఘము తీర్పునకు పైగా వెళ్లిపోవును. పరిశుద్ధాత్మ అను ఓడ ద్వారా భూమిపై నుండి ఎత్తబడును.
105ఈ సంఘ సమాఖ్య అనునది ఈ ప్రపంచమందు బుద్ధిలేని కన్యక యొక్క కలియికగా ఉన్నది. అంత్యక్రీస్తును అందుకొనుటకు గాను భూమిపై విడచి పెట్టబడును. అయితే దేవుని నిజ సంఘము నోవహువలె తేలిపోవును. నేను ఇచ్చట నిలుచున్నది ఏ విధముగా నిజమైయున్నదో, ఆ విధముగానే మహిమలోనికి వెళ్లిపోవును. అందువలననే ఆయన వారిని ఒక్కటిగా సమకూర్చుచున్నాడు. దీనినే ఈనాడు ఆ స్వరము మాట్లాడుచున్నది. దేవుడు కూడా ఆ విధముగానే లాస్ ఏంజిల్స్ నుండి ఒకరిని, ఫిలడెల్ఫియా నుండి ఒకరిని, జార్జియా నుండి ఒకరిని, అలాగున సమకూర్చుచున్నాడు. వారు ఆయన ప్రజలై జీవించుచు, దేవుని వాక్యమును నమ్ముటకు ఇష్టపడెదరు. "నోవహు దినములలోజరిగినట్లు మనుష్యకుమారుని దినములలోను జరుగును." అక్కడ ఆ కొందరు రక్షించబడిరి, చాలా కొద్దిమంది." మంచిది, దేవుని తీర్పుకు పైగా మన పరిశుద్ధాత్మ అను ఓడ తేలిపోవుచున్నది, ఎందుకనగా మనము యేసును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే మనకు తీర్పు తీర్చబడినది, మరియు ఆయన మన తీర్పును గైకొనెను.
106ఈ సంస్థలు తల బిరుసువైనప్పటికిని, వారు హవ్వవలెయున్నారు. దేవుని మాట ఎట్లున్నను ఆమె జ్ఞానమును ఆశించినది. నిమ్రోదు తన గోపురమును ఆశించెను. అది వాక్యము కాకపోయినప్పటికిని, వారు తల బిరుసుగా వుండిరి. హవ్వకు ఇదంతయు బాగుగా తెలియును. షేతుకు ఆ స్త్రీల అందమును వాంచించుట కంటెను ఇది బాగుగా తెలియును. ఇశ్రాయేలుకు ఆ వ్యభిచారము నుండి తొలగిపోవుటకు బాగుగా తెలియును. అదే విధముగా నీవును ఉన్నావు. అయితే కొందరు తల బిరుసుగా ఉన్నారు. అది లేఖనమో, కాదో, "దేవుడు దీవించు గాక, మా తల్లి ప్రెస్బిటేరియనుగా ఉన్నది. నేనునూ ఆ విధముగానే ఉందును." అట్లయిన వెళ్ళుము, అదొక్కటే నీవు చేయగలిగినదై యున్నది. నీ పాపపు హృదయమును దేవుడు కనికరించును గాక. దీనిని ఏ విధముగా తప్పించుకొందువు? ఇది సత్యమని నీకు తెలియును. నీవు దేవుని వాక్యమును చూచియు సత్యమని గ్రహించనియెడల, అప్పుడు నీ ఆత్మ స్థితిలో ఏదో లోపమున్నది. అది నిజము. ప్రపంచపు నలుమూలలను చూడుము. ఈ కార్యములు ఎక్కడ జరుగుచున్నవో గమనించుము. స్నేహితులారా, మనము చివరి కాలములో ఉన్నాము. సంఘ కాలముల గుండా వెళ్లి మరియు లవొదికయ సంఘ కాలములో ఏమి జరుగనైయున్నదో గ్రహించుము. మనము దానిద్వారా రాలేదా? నేనేమి చెప్పుచున్నానో చూచారా? మనము చివరి కాలమందున్నాము
107భూమి నలుమూలల నుండి దేవుడు తాను ఎన్నుకొన్న వారిని సమకూర్చుచున్నాడు. వారిని సమకూర్చుటను దేవదూతలను పంపెదనని ఆయన చెప్పెను. అది నిజమేనా? గురుగుల నుండి వేరుపరచి వారిని సమకూర్చుచున్నాడు. ఆమేన్. గురుగులు కాల్చివేయబడును, గోధుమలు కాదు. అది నిజము.
అయితే వారు ఎంతో తల బిరుసుగా ఉన్నారు; వారు కలిగియున్నను, లేకున్నను ఏ బేధము లేదు. ఓ.
అయితే దేవునిచే ఎన్నుకొనబడిన వారు వారి మధ్య నుండి వెలుపలకు రమ్మని ఆజ్ఞాపించబడుచున్నారు. యెహూవా సెలవిచ్చునదేమనగా, "వారి నుండి ప్రత్యేకముగా ఉండుడి." నేను మిమ్ములను చేర్చుకొందును, వారి లోకసంబంధమైనవాటిని ముట్టకుడి. నేను మీకు తండ్రినై యు౦దును, లేక దేవుడనై యు౦దును, మరియు మీరు నాకు కుమారులును మరియు కుమార్తెలునై యు౦దురు. అవిశ్వాసులతో కలసి యు౦డకండి. అయితే వారి నుండి వెలుపలకు రండి." దేవుడు లోకము నుండి వేరుకమ్మని కోరుచున్నాడు. ఆయన తనకు తానే నీతో ఐక్యతను కోరుచున్నాడు. ఎటువంటి మానవ-కల్పిత శాఖలు గాని, లేక సంస్థలు గాని లేక మరో మానవ-కల్పిత వేదాంతములు గాని నిలువజాలవు. దేవుడే దానిని తీసికొని, పరిశుద్ధాత్మను నీలో ఉంచుట ద్వారా, నిన్ను దేవునితో ఐక్యపరచుచున్నాడు. నీవు దానిని పొందావని ఏ విధముగా ఎరుగుదువు? లేఖనమును వ్రాసిన పరిశుద్ధాత్మ ప్రతి మాటకు సాక్షిగా ఉండి, రుజువుపరచును. పాత నిబంధన యందు చేసిన కార్యములను క్రొత్త నిబంధన యందును చేయును. ఈ కాలమందున మరలా పరిశుద్ధాత్మ అనే కార్యములను చేయును, ఎందుకనగా యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నీవు ప్రపంచముతోను, సంస్థలతోను కలసిపోకూడదు. నిన్ను వారి మధ్యలో కలుపుకొనకూడదు గాని, వారి మధ్య నుండి వెలుపలకు రమ్ము. మీరు క్రీస్తుతో కూడా కట్టబడియున్నారు. ప్రభువైన యేసుక్రీస్తుతో కట్టబడియున్నారు.
108బైబిలు ఇలా చెప్పుచున్నది, చివరి దినముల యందు సంఘములు మరొక బాబెలు గోపురములాంటి దానిని కట్టెదరు. వారు పైకి భక్తిగలవారి వలె నుండి దాని శక్తిని ఆశ్రయించని వారు. వారు దేవుని వాక్యమును దాని శక్తిని నిరాకరించెదరు. అది ఆయన వాక్కు శక్తియైయున్నది. వాక్యమేమైయున్నది? దేవుని రాజ్యమనగా ఏది? మనము రాజు యొక్క సంబంధులు అగుటకు ముందు ఆ రాజ్యమునకు సంబంధించిన వారిమిగా ఉండవలసియున్నది. "ఆమేన్." [సమాజము "ఆమెన్" చెప్పుచున్నది.] ఆ రాజ్యములో ఎలా ప్రవేశించగలవు? దేవుని రాజ్యము మరలా శక్తివంతము చేయబడిన దేవుని వాక్యమై యున్నది. (ఆమేన్.) శక్తిగా మారి, పాపమును తీసివేయుచు, సూచనలను ఇచ్చుచున్నది. ఏ రకమైన సూచనలై యున్నవి? మోషేను వెలుపలకు తెచ్చిన అదే వాక్యము, అదే సూచనను తెచ్చును.
నులివెచ్చని లోతును వేరుపరచిన అదే కార్యము జరుగనైయున్నది. లోతు నులివెచ్చని వాడని మనకు తెలియును. అదియే చివరి కార్యమునకు సూచనయని యేసు చెప్పెను. నులివెచ్చని లోతు అచ్చట కూర్చొనియున్నాడు. అతడు భక్తిపరుడు. అతడును, అతని భార్యయు భక్తిపరులే. అది నిజము. వారు అన్ని రకముల సమాజములకు చెందినవారు. అతడు ఆ పట్టణపు మేయరుగా ఉన్నాడు. ఓ, అచ్చట ఎన్నో కార్యక్రమములు జరుగుచున్నవి. అతడు చాలా భక్తిపరుడు. అతడు సేవకులను ప్రోత్సాహపరచేవాడు. వచ్చిన వారందరు అతని ద్వారానే వచ్చారు. ఆ విధముగా అతడు సరియైనవాడే. ఓ, సహోదరుడా, అయితే అతడు ఎన్నుకొనబడినవాడు కాదు.
109ఏమి జరిగినదో చూడండి. ఎందుకు అలా జరిగినది? వేరుపరచిన తరువాత అబ్రాహాము దగ్గరకు వచ్చిన ఆ దేవుడే, తాను ఏలాగు వేరుపరచెనో దానిని నిరూపించి చూపించెను. ఓ, దేవా. దానిని ఏ విధముగా మీకు చూపుటకు ఇష్టపడుచున్నానో, దేవుడు అబ్రాహామునకు తనకు తాను ఏ విధముగా వేరుపరచుకొనెనో చూపించెను. దానిని గురించి ఒక నిరూపణను చూపెను. అదేమనగా, అతని మధ్య అతనితో ఆయన ఉండెను. అదే కార్యము కడవరి దినములలో జరుగునని యేసు చెప్పెను. అబ్రాహాము ఒక దేశము కాదు గాని తక్కువగా అతడుండెను. అయితే దేవుడతనితో ఉండెను. ఆయన అతనిని వేరుచేసెను. మనమును ఈ కడవరి దినములయందు వేరుకావలసియున్నది.
దేవుడు మోషేకు, ఇశ్రాయేలుకు సూచనగా ఒక అభిషేకించబడిన ప్రవక్తను, ఓ అగ్నిస్తంభమును ఇచ్చినయెడల, అబ్రాహాముకు ఒక సూచనను ఇవ్వగలడు. ఆయన ఇశ్రాయేలుకు ఒక సూచనను ఇచ్చెను. ఆయన తన శిష్యులకు ఒక సూచనను ఇచ్చెను; ప్రతిసారియు అదే సూచన, అగ్నిస్తంభము, అదే సూచన.
పౌలు దనుస్కు మార్గమున వెళ్ళుచున్నప్పుడు, అక్కడ అతని యెదుట ఒక అగ్నిస్తంభము ప్రకాశించినది. అది అతని గ్రుడ్డివానిగా చేసి, తన మోకాళ్లపై పడవేసినది. ఏ ఒక్కరు దాని చూడలేదు. ప్రతి ఒక్కరు చుట్టూ నిలువబడియున్నారు. వారు దానిని చూడలేదు. అప్పుడొక స్వరము ఇలా పలికినది, "సౌలా, సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు?"
"నీవెవరివి, ప్రభువా?" అని అతడడిగెను.
అందుకాయన, "నేను యేసును." అదొక సూచన, పౌలు ఎవరు? అన్యులకు అపొస్తలుడు. ఆమెన్.
110ఇక్కడ మనము కడవరి కాలమందున్నాము. తూర్పు నుండియు, పడమర నుండియు, ఉత్తర, దక్షిణముల నుండియు వారు వచ్చుచున్నారు. మనమేమి చేయుచున్నాము. ఎత్తబడుటకు ఆయత్తపడుచున్నాము. మనము సిద్ధపడుచు — మనలోని ప్రతి భాగము పరిశుద్ధాత్మతో నింపబడునట్లు కొన్ని నిమిషములు మనలను మనము చేపట్టియున్నాము. అంతట ఆమె పైకి వెళ్లిపోవును. ఓ, మై. ఆయనే తన ప్రజలను ఒక్కటిగా పిలచుచున్నాడు. ఆయనతో నిజమైన ఐక్యతకు పిలచుచున్నాడు, ఎందుకనగా అది ఆయన యొక్క పరిశుద్ధాత్మయైయున్నది. "ఒక్క ఆత్మ ద్వారా మనమందరము (వ్యక్తిగతముగా) ఆ శరీరమందు బాప్తిస్మము పొందితిమి. అది సమూహముగా వున్నది. అది యేసుక్రీస్తు శరీరమై యున్నది." యేసుక్రీస్తు తన ఆత్మతో మన శరీరముల యందు నివసించుచు, సంఘమునకు సేవ చేయుచు, అవే కార్యములను చేయుచున్నాడు. ఆయన ఒక గురుతుగా ప్రపంచమునకు ఒక సూచనగా, మనము కడవరి దినములయందు ఎత్తబడుటకు సిద్ధపడునట్లు చేయుచున్నాడు. ఓ, నేనాయనను ప్రేమించుచున్నాను. మీరు ప్రేమించరా?
111నేను ఇచ్చట ఒక పుస్తకమునే ఉంచుకొనియున్నాను, కాని నేను ముందుకు వెళ్లలేను; మనకు ఇప్పటికే చాలా ఆలస్యమైనది. మరొక పర్యాయము దీనిని తీసికొందము.
మనము చివరిలో వున్నాము. ఏకత్వము… నీవు దేవునితో ఒక్కటై యున్నావా? ఆ విధముగా నీవు ఉండవలసియున్నది. అవును. మనము ఆయనతో ఒక్కటిగా ఉండబోవుచున్నాము, ఎంతవరకు… క్రీస్తుకు ఉన్న మనస్సు మీలోను ఉండనియ్యుడి. అప్పుడు మీలో నున్న క్రీస్తు మనస్సు ఆయన వ్రాసిన ప్రతి మాటను గుర్తించును. ఆ విధముగా అపోస్తులలో జరిగినది, లేఖనమును ఖచ్చితముగా విభాగించుట, అదే సత్యమైయున్నది (చూచారా?), పరిశుద్ధాత్మ. అది సత్యమైనయెడల, అవే సూచనలను తెచ్చుచు, వాటిని నిర్ధారణ చేయుచున్నది. అది మోషేకు ఇచ్చిన సూచనను, అబ్రాహామునకు ఇచ్చిన అదే సూచనను, క్రీస్తు ద్వారా చేసిన సూచనను, పౌలునకిచ్చిన సూచనను, నిర్ధారణ చేయును. మనము చివరి కాలమందున్నాము. ఇలాగు ఉండును అని ఆయన చెప్పుచున్నాడు. మనము చివరి కాలమందు ఉన్నాము. సంఘము కూడికగా ఒక ఐక్యతకు సమకూడుచున్నది, ఇక్కడ ఒకరు మరియు అక్కడ ఒకరని, ఏకము చేయబడుచున్నారు…
"పొలములో ఇద్దరుందురు, నేను ఒకరిని తీసికొనెదను" అని ఆయన చెప్పెను. ఒక్కరు… చూడండి, "ఇద్దరు పొలమందున్నారు," అది పగలు కాలముగా ఉన్నది, కోత కాలము, "ఒక్కరిని తీసికొని మరియు మరొకరిని విడచెదను. పడకపై ఇద్దరుందురు," అది ప్రపంచమునకు ఆవలి వైపు, "ఒకరిని తీసికొందును మరియు మరొకరిని విడచి పెట్టుదును," ఇది మనుష్యకుమారుని రాకడయందు జరుగును. అది ఎంతో ఆసన్నమైనది, అది ఎంతో సమీపములో ఉన్నది.
112వద్దు. వద్దు, ఆదామా. ఆదామా. హవ్వ, ఆదాము, నీ కొరకు నన్ను ఆక్రందన చేయనిమ్ము; ఇకపై సాతాను యొక్క అబద్ధమును ఎంతమాత్రము వినకుము; దేవుని వాక్యముతో నిలచిపొమ్ము; అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." ఆయన వాక్యముతో నిలుపుము. అందులో నుండి వేరైపోవుట దేవుని సహవాసము నుండి విరిగిపోవుటయే, అది దేవుని పరిశుద్దాత్మ ద్వారా కలుగు దేవుని ఐక్యత నుండి విరిగిపోవుటయే. నీవు పరిశుద్దాత్మను కలిగియున్నానని చెప్పి, మరియు అది దేవుని వాక్యముతో ఏకీభవించనియెడల, అప్పుడు నీవు దేవునితో ఏకత్వములో లేవు.
ఇది దేవుని ఏకత్వము, ఎప్పుడైతే నీవు — నీవు పొందిన ఆత్మ దేవుని వాక్యముతో ఏకీభవించినప్పుడు, మరియు ఈ వాక్యమును ప్రత్యక్షపరచి మరియు ముందు చేసినట్లే చేయు శక్తిగా మారును.
మనము కలసి ఇలా చెప్పెదము. దేవునితో [దేవునితో] ఏకత్వము [ఏకత్వము] దేవుని ఆత్మను [దేవుని ఆత్మను కలిగి యండుట] కలిగి యండుట. వాక్యముతో [వాక్యముతో అంగీకరించుచు] అంగీకరించుచు వాక్యమంతటికి [వాక్యమంతటికి] పూర్తి వాక్యమును [పూర్తి వాక్యమును] శక్తిలో [శక్తిలో దానిని నిరూపణ] దానిని నిరూపణ చేయుటయై యున్నది.[చేయుటయై యున్నది.]
అక్కడే మీరున్నారు; అది దేవునితో ఏకత్వము. ఆ శక్తి నీలో, నాలో, పనిచేసినప్పుడు, మనము ఏకమైన్నాము. ఆమెన్. సహోదరుడా కిడ్, నాలో నున్న పరిశుద్ధాత్మ శక్తి నీలో పనిచేసినప్పుడు, అక్కడ ఏ అసమ్మతి ఉండదు, అక్కడ వాక్యము ఉన్నది. అది పని చేయును. ఆమెన్. అదేమై యున్నదో దానినే చేయును: తన వాక్యము ద్వారా దేవుడు నీలో శరీరముగా చేయబడెను, మీ మధ్యలో వాక్యము శక్తివంతము చేయబడినది, ప్రతి వాక్యము.
113ఇప్పుడు సాతాను వాక్యములోని అధికభాగమును తీసికొనియున్నదని జ్ఞాపకము చేసికొనుడి. దాదాపు తొంబై-తొమ్మిది శాతము పొందియున్నది. అతడు దానంతటిని స్వాధీనపరచుకొనినప్పటికిని, దానంతటిని నిజమని అంగీకరించినప్పటికిని ఈ ఒక్క స్థలమందు అతడు దాటిపోవును. అదొక్కటే మరణానికి కారణమగును. నీవు వెళ్ళుచుండగా, అది గొలుసులోని మధ్యభాగమున విరిగిపోవునట్లు చేయుచున్నది.
ప్రతి వాక్యము. యేసు ఏమి చెప్పెను? "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటవలన జీవించును." ఏదో కొన్ని దేవుని మాటల వలన కాదు గాని, మరి తొంబై-తొమ్మిది శాతము మాత్రము కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట వలన మనుష్యుడు జీవించును.
సాతాను ఆయనను ఎత్తైన స్థలమునకు తీసికు వెళ్లి, "ఇలా వ్రాయబడియున్నదని" చెప్పెను. చూశారా, అదంతయు హవ్వతో, "ఇలా వ్రాయబడియున్నది. అది ఇలా వ్రాయబడియున్నదని," చెప్పినట్లే యున్నది.
"ఈ విధముగాను వ్రాయబడియున్నదని," యేసు చెప్పెను.
"ఇలా వ్రాయబడియున్నది, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, బైబిలు ఇలా చెప్పుచున్నది." అబ్బాయి, అతడొక పండితుడు. "ఇలా వ్రాయబడియున్నది. ఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును. నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందురు," అని సాతాను చెప్పెను.
అందుకు ఆయన, "'ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని' మరియొక చోట వ్రాయబడియున్నదని," వానితో చెప్పెను.
114"మాకు లేఖనమున్నది," అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము, "మేము యోహాను ద్వారా బాప్తిస్మము పొందితిమి," అని వారు చెప్పిరి.
అయితే పౌలు మరొక దానిని చెప్పుచున్నాడు; అతడు చెప్పెను, "అది ఇక ఏ మాత్రము పనిచేయదు." చూశారా? "యోహాను మారుమనుస్సు నిమిత్తము బాప్తిస్మమిచ్చెను." పౌలు యోహాను మాటకు అపనమ్మకము చూపలేదు. "యోహాను చెప్పినదేదో నేను చెప్పెదను. యోహాను మారుమనస్సు నిమిత్తము బాప్తిస్మమిచ్చెను, పాపక్షమాపణ కొరకు కాదు." ఆ బలి ఇంకను వధింపబడలేదు. చూశారా? ఆయన ఇలా చెప్పెను, "యోహాను తన వెనుక వచ్చువాని యందు, అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారుమనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెను." వారు దీనిని వినినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిరి. పౌలు వారి మీద చేతులుంచినప్పుడు, పరిపూర్ణమైన వాక్యము మరియు పరిశుద్ధాత్మయు వారిపై వచ్చినది. వారు ప్రవచించుచు, భాషలు మాట్లాడుచు, దేవుని మహిమపరచిరి. అది ఎటువంటి సమయమో. ఓ, మై. అది ఎంత పెద్ద సంఘము? కేవలము పన్నెండుగురు. ఓ, అవును. ఓ, దేవుడు గొప్ప సంఖ్యలతో వ్యావహరించడు; ఆయన నమ్మకమైన హృదయాలతో వ్యావహరించును. మనమును అలాంటి హృదయమును కలిగియు౦దము. మీరాయనను ప్రేమించుచున్నారా? మనము ప్రార్థింతుము.
115ఓ, నా ప్రియమైన యాత్రికుడా, మోయాబు కుమార్తెలను చూశావా లేక కయీను కుమార్తెలను (సంఘములను గురించి నేను మాట్లాడుచున్నాను) చూశావా? వారు వాక్యమునకు ఎంత దూరమున నిలచియున్నారు. నా ప్రియ స్నేహితుడా, కడవరి దినముల యందు ఈ కార్యములు నెరవేరునని గ్రహించావా? సమీప కాలమందు దేవుని వాక్యము ఏ విధముగా రూపుదాల్చినదో చూచావా? ఏ విధముగా ఒక ఉజ్జీవము ఒక కాలమందు జరిగినట్లే ఇప్పుడును జరిగినదో చూచారా? అది ఏమిటి? అది గాలి వానకు ముందు ఉపశాంతిగా వున్నది. తీర్పులు సిద్ధమైనవి. వీటన్నింటిని గుర్తించుచున్నావా? లేఖనముతో లేఖనమును, బైబిలులోని మాటతో మాటను, సాక్ష్యముతో సాక్ష్యమును సరి చూచారా? యేసు చెప్పిన మాటలను మీరు సరిపోల్చండి, ఆయన చెప్పెను, ఈ కడవరి దినములలో సాతాను నిజమైనదానివలె సన్నిహితముగా ఉండును, ఎంతవరకు అనగా, సాధ్యమైతే ఎన్నుకొనబడినవారు తప్ప తక్కిన వారినందరిని మోసపుచ్చును, ఎన్నుకొనబడినవారు.
నీవే యోచించుము, ఆ వాక్య ఉపదేశము ఎంత సమీపముగా వెళ్ళుచున్నదో, "ఓ మేము పరిశుద్ధాత్మ యందు విశ్వసించుచున్నాము. దేవుడు ఎల్లప్పుడు స్తుతించబడును గాక. మేము పరిశుద్ధాత్మను పొంది యున్నాము; మేము భాషలతో మాట్లాడెదము," అని చెప్పుకొనుచూ వాక్యము వైపు తిరిగి దాని తృణీకరించెదరా? అవును. సాధ్యమైతే ఏర్పరచబడినవారు సహితము మోసపుచ్చును.
116ఇక్కడ ఎవరైనను దేవునితో సరియైన సంబంధము కలిగి యు౦డలేకపోవచ్చు. ఇక్కడ ఎవడైనను వ్యాధి గలిగి, బాధలతో వుండవచ్చు. ఇక్కడ చేతి గుడ్డలు, ఇతర వస్తువులువున్నవి. నేను వాటికై ప్రార్ధించబోవుచున్నాను. నీకేమి అవసరము దాని గురించి చి౦తించకుము. గ్రంధములోని ప్రతి వాగ్ధానము నీదైయున్నది. అది నీదే.
ఇప్పుడు, నేను మీకు వాక్యమును తెచ్చాను. ఆదికాండము నుండి మనము జీవించు ఈ దినము వరకు అనేక స్థలములలో అనేక కార్యములను చూపించాను. ఎన్నో వందల స్థలములను చూపించాను. నాకు సమయము లేకపోయినది. అయితే ఖచ్చితముగా నీవు దానితో, ఈ సంస్థలలోని చెత్త కార్యములను చూడగలవు. అది సాతాను యొక్క అబద్ధ తలంపులు, మానవుని తన సొంత తలంపులో ఏకత్వమును ఏర్పరచి ఒక సంస్థగా ఏర్పాటు చేయుటకు ప్రయత్నించినది. మనము పరిశుద్ధాత్మ ఏకీభవించును. చూడండి, యేసు చెప్పిన దానిని బైబిలు ఇలా చెప్పుచున్నది… వారు దానిని ఒప్పుకొందురు, అని యేసు చెప్పెను, మీరు చూచారా, "సాధ్యమైతే ఏర్పరచబడినవారు సహితము మోసపుచ్చుటకై." మనమెక్కడ నిలబడియున్నామో చూచారా?
117ఇప్పుడు, విశ్వాస హస్తముతో దేవుని వాక్యమును చేపట్టుము. ఈ ఉదయకాలము నీకు అవసరమైనదేది? యేసుక్రీస్తు నామమందు నీటి బాప్తిస్మమును కోరుచున్నావా? అదిగో కొలను తెరువబడియున్నది. నీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కావలసియున్నదా? ఆయన తన మార్గమును నీలో అమర్చుటకు ఇష్టపడుచున్నాడు. నీకు స్వస్థత కావలసియున్నదా? వాక్కు రూపమైన పరిశుద్ధాత్మ తానే శక్తిగా మార్చబడి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. హృదయ రహస్యములను గ్రహించు శక్తి ప్రేక్షకులను చూచుచు ఇక్కడున్నది. ఆ వెలుగు గుండ్రముగా తిరుగుచు, మీ చుట్టూ తిరుగుచు చూచుచున్నాడు. నేనెప్పుడైనా ఏ తప్పిదమునైనా చెప్పానా? ఎప్పుడైనను అలా చేశానా?
ఆ ఇశ్రాయేలీయులు మానవ ప్రయత్నము ద్వారా రాజును కలిగి యు౦డుటకు ముందు ఆ ప్రవక్త ఇలా చెప్పెను, "నేను చెప్పినది ఎప్పుడైనను జరుగక పోయినదా? మీ ధనమును ఎన్నడైనను తీసికొంటినా? నేనెప్పుడైనను దిగి వచ్చి మిమ్మును డబ్బు కొరకు భిక్షమెత్తితినా? ఆ ధనము ద్వారా తిరుగుచు, గొప్ప భవనములను కట్టుచు, మీ ధనమును తీసికొని గొప్ప కార్యములను చేశానా? మిమ్ముల ఎప్పుడైన ఒక రూపాయి కొరకు అడిగితినా? ఎన్నడూ లేదు."
దేవుడు దేనిని నెరవేర్చెనో దానిని కాక మరొక దానిని ప్రభువు నామములో నేను చెప్పితినా? నేను ఆయన నామమున చెప్పినదంతయు జరుగలేదా? ఈ ప్రజలపై చెప్పబడిన దర్శనమును వారు కొత్తవారైనను, ఈ స్థలమునకు వచ్చువారైనను లేచి "అది సత్యము" అని చెప్పలేదా? నేను ఎప్పుడైనను ఏ పొరపాటైనను చెప్పితినా? అట్లయిన ఇప్పుడు "యెహోవా సెలవిచ్చు దానిని చెప్పనియ్యుడి." పరిశుద్ధాత్మను పొందుడి, ఆ ఆత్మవారి విశ్వాస హస్తములకు దేవుని వాక్యమును అందించుచుండగా - సంస్థల నుండి, శాఖల నుండి, అబద్ధపు సహవాసముల నుండి దూరముగా వెళ్లిపోవుడి. సమస్త రాజ్యము మీదైయున్నది. పిల్లలారా, అది మీది.
118మీరు దేశపు నలుమూలల నుండి జార్జియా నుండియు, ఓహాయై నుండియు కన్సాస్ నుండియు, ప్రతి స్థలము నుండియు ఎందుకొరకు ఇక్కడ జరుగు ఈ చిన్న కూడికలకు వచ్చుచున్నారు? టేపులు నిలచిపోయివుండునని తలంచుచున్నాను. అందువలన నేను దీనిని చెప్ప వచ్చు. మీరెందుకు ఈ విధముగా వచ్చుచున్నారు? ఏది మిమ్ములను ఈ విధముగా వచ్చునట్లు చేయుచున్నది? అది ఏమిటి? ఈ ప్రజలు అర్కన్సాస్ నుండియు ఇంకను అనేక మైళ్ల దూరము నుండి వచ్చుటకు నేను చూచుచున్నాను.
గతరాత్రి కన్సాస్ పట్టణము నుండి వచ్చుచుండగా, ఒక చక్కని "పోలిష్" (దేశపు) సహోదరుడు అక్కడ నిలుచుండి ఇలా చెప్పాడు, "బ్రెన్హాం సోదరుడా కొన్ని సంవత్సరముల క్రితము కెనడాలో మీ సందేశమును వినినప్పటి నుండి, మీరు చూసిన, నెరవేర్చిన కార్యములను నేను చూచాను, పరీక్షించాను. ఎంతగా ముందు వెనుకల పరీక్షించినప్పటికిని వాటిలో ఒక్కటైనను తీసిపోలేదు." అతను బహుశా ఒక పోలిష్ కాథలిక్ అని తలంచెదను. అతడు ఇక్కడ వచ్చుచు, టేపులను తీసుకొని వెళ్లి వినిన తరువాత అనేకులను కలిసికొని మాట్లాడును. నాతో ఉండి సహాయము చేయవలసిన సేవకులు ఆ శక్తిని, వాక్య సత్యమును త్రోసివేయుచున్నారు, అయినను పరిశుద్ధాత్మను పొంది యున్నామని చెప్పుకొనుచున్నారు.
నన్నునేను ప్రవక్తగా పిలచుకొనుటలేదు. మీరే ఆ విధముగా పిలచుచున్నారు. అది అలాగైతే దేవుని వాక్యము ఎక్కడ నుండి వచ్చును. ఆ వాక్యమును స్థిరపరచని యెడల ఏ విధముగా అది నిజమైనది లేక కానిది అని ఎలా తెలిసికొనగలము? వ్రాయబడిన దేవుని వాక్యము ఇక్కడ ఉన్నది. వ్రాయబడిన వాక్యము స్థిరపరచిన యెడల, దేవుడే ఆ వాక్యమ౦దుండి, ఆ వాక్యమును సత్యముగా నిరూపించుచున్నాడు. పౌలు ఇలా చెప్పెను, "నేను క్రీస్తును వెంబడించినట్లు మీరు నన్ను వెంబడించుడి."
119ఇప్పుడు, వ్యాధి నిమిత్తము దేవుని సహాయము కావలసియున్నయెడల, నీకు రక్షణ కావలసియున్నయెడల, కొందరు స్త్రీలు తమ తల వెంట్రుకలు ఎదుగనీయుటకు, కొందరు పురుషులు సిగరెట్లను విడచుటకు కృప కావలసియున్నది. కొందరు బోధకులు యేసు నామములో నీటి బాప్తిస్మము యొక్క సత్యమును అంగీకరించుటకు కావలసిన కృపను పొందకయున్నారు. కొందరు వ్యాధితో మరణపడక యందున్నారు, ఎందుకు ఈ ఉదయ కాలము ఈ వాక్యమును గైకొనరు. ఇప్పుడు నేను మీకు చెప్పెదను; అది మనలో ఉండు శారీరక స్థితి. ఆ వాక్యమును మీ చేత తీసికొనుడి.
ఇక్కడ దేవుని దూత యొక్క పటము గోడపై వ్రేలాడుచున్నది. అది ఇశ్రాయేలు పిల్లలను నడిపించినది, అదియే పౌలును సందించినది. అదియే క్రీస్తులో నివాసము చేసినది. అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు మీలో ఉన్నది. మిమ్ములను ఒక్కటిగా ఐక్యపరచుచున్నది. అనేక వందల మైళ్ళ దూరము నుండి మన హృదయాలు ఎందుకు ఇక్కడ సమకూడుచున్నవి?దేశమందు ఎక్కడ ఈ విధముగా లేదు. వారు వాక్యము నొద్దకు వచ్చుచున్నారు.
120"అక్కడొక ఊట ఇమ్మానుయేలు నుండి తీయబడిన రక్తముతో నింపబడియున్నది. అవిశ్వాసులు దాని ద్వారా తమ పాపపు డాగులను పోగొట్టుకొను స్థలమది. ఎంతో కాలముగా విశ్వాసముతో చూచినప్పుడు, ఆ సెలయేరు నీ గాయములకు అందించబడుచున్నది. విమోచన ప్రేమయే ఆ మూలాధారము. అది నేను మరణించువరకును ఉండునదైయున్నది."
121మా పరలోకపు తండ్రి, ఇక్కడ అనేకములైన చేతి గుడ్డలు మరియు ధరించు వస్త్రములు వెలుపట ఉన్నవారికి వెళ్ళుటకు గాను ఉన్నవి. వాటిని ఇక్కడ ఎవరు ఉంచారో ఎరుగను. బహుశా, బిల్లీ యై యు౦డవచ్చు, లేక ఇక్కడకు వచ్చియున్న ప్రజలైయు౦డవచ్చు. ప్రభువా, నేను దీని చేయుటకు తలంచుచున్నాను. ప్రభువా, నా చేతులతో ఏమియు లేదు. నేను ఒక మనిషినైనందున, నాలో ఏమి లేదు. నా సొంత మానవ తలంపుతో ఆధారపడలేదు. ఇదెందుకో నాకు తెలియదు గాని నేను నీ మాటను వెంబడించుచున్నాను. "పౌలు వద్ద నుండి తీసిన చేతి గుడ్డలు మరియు రుమాలును అపవిత్రాత్మ ఉన్నవారి మీద ఉంచినప్పుడు, అవి వారిని విడచి వెళ్ళినవి. ఆయన చాలా గొప్పవాడని కాదు గాని, దేవుడు అతనితో మాట యందును, శక్తి యందును ఉండెను. ఆయన తక్కిన అపోస్తలులను సంప్రదించలేదు, అయితే వారిని కలిసినప్పుడు వారందరును ఒక సువార్త యందును ఒకే బాప్తిస్మమునందును, ప్రతి కార్యమును ఒకే విధముగా చేయుచుండిరి. కంటికి కన్నుగా అదంతయు ఒక్క విధముగా ఉండినది.
122ఇప్పుడు, నేనడుగునది ప్రభువా, నిన్ను నమ్ము ఈ ప్రియమైన ప్రజలు, వీరిని స్వస్థపరచుము. ఇక్కడ చేరియున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచుము. ప్రభువా, వారి విశ్వాసము, వాక్యమును దరి చేరి దానిని గట్టిగా చేపట్టుము. "గడ్డలతో, వ్యాధులతో, అపవిత్రాత్మలతో మీరు విడచి వెళ్ళుడి; ఇదిగో నేను దేవుని ఖడ్గముతో నరికి వేయుచున్నాను. నేను దానిని నమ్ముచున్నాను; ఇదిగో నేను దేవుని ఖడ్గముతో నరికి వేయుచున్నాను. నేను దానిని నమ్ముచున్నాను. నా విశ్వాసము గట్టిది. నేనా ఖడ్గమును లోతునకు దించుచున్నాను. నా మార్గము నుండి తొలగిపోవుడి. నేను స్వస్థపడునట్లు నా స్థలములో నుండి లేచి నిలుచున్నాను అని చెప్పుచున్నారు. నేను నా చేతులను నా తండ్రి మీదను, నా చెల్లి మీదను, నా బిడ్డ మీదను, నా పొరుగువాని మీదను ఉంచుచున్నాను. నీ వాక్యము సత్యమైనదని నమ్ముచున్నాను. నేను నీతో ఏకత్వమందున్నాను. ఈ క్రియలు నీవు చెప్పినవి, నీవు నెరవేర్చినవి, మేమును చేయుదుము. ప్రభువైన దేవా, నేను ప్రతి మాటను నమ్ముచున్నాను. నేను ముందుగా వచ్చుచున్నాను, దానిని నాది అని ప్రకటించుటకు, ఈ ఉదయము దానిని అందుకొనుటకు ముందుకు వచ్చుచున్నాను."
123ఓ దేవా, సంఘము కదలి వెళ్ళుచుండగా నేను ఇలా తలంచెదను, మోషేకు సముద్రము దగ్గర కష్టమేర్పడినప్పుడు అతడు అక్రందన చేయుటకు ప్రారంభించాడు. అప్పుడు ప్రభువు చెప్పినదేమనగా, "నాకు ఏల మొర్రపెట్టుచున్నావు? దేని కొరకు మొర్రపెట్టుచున్నావు? ముందుకు వెళ్లి మాట్లాడుము. నేను నిన్ను ఆ పని కొరకు నియమించలేదా? మాట్లాడుము." దేనిని మాట్లాడెను? నీలోని దేవుని వాక్యమును మాట్లాడుము. "ముందుకు వెళ్లి మాట్లాడుము. నాకు మొర్ర పెట్టకుము. ముందుకు వెళ్ళుము."
ప్రభువైన దేవా, ఈ దినము ప్రభువైన యేసు నామమందు వచ్చియున్నాను. నేను ఈ విశ్వాస ఖడ్గమును చేపట్టి వచ్చుచున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా మానవునికిని, దేవునికిని వున్న ఏకత్వమును కోరుచున్నాను. వీటినన్నింటిని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు బలి ద్వారా, కృప ద్వారా అడుగుచున్నాను. ఈ కట్టడమ౦దు వున్న ఎవరినైనను బంధించియున్న అపవిత్రాత్మలను ఖండించుచున్నాను. వారు బాల బాలికలైనను, స్త్రీ లేక పురుషులైనను వారి కొరకు ప్రతి విధమైన వ్యాధిని ఖండించుచున్నాను. ప్రతి సందేహమును ఖండించుచున్నాను. ప్రతి భయమును ఖండించుచున్నాను. భక్తిహీనమైన ప్రతిదియు వీరిలో నుండి వెడలునట్లు యేసుక్రీస్తు నామమందు ఖండించుచున్నాను. వీరిలో నుండి వెడలి రమ్ము, మేము మా దేవునితో ఏకమై ఆయనకు పరిచర్య చేయునట్లు వెడలి రమ్ము, భయము లేక వ్యాధి లేక మేము దేవునికి సేవ చేయుదుము. దేవునితో మమ్ము ఏకపరచిన ఆ శక్తి… ఏ విదముగా అభిషేకి౦చబడినవాని యందు అపవాది ఏ విధముగా తనకుతానై యు౦డగలదు? ఏ విధముగా అపవాది గొల్యాతు వలె నిలువబడును? దావీదు దళము లోనికి వచ్చునప్పుడు, "ఆ సున్నతి లేని ఫిలిష్తియుడు నిలువబడి, జీవముగల దేవుని సైన్యమును తృణీకరించగలడని మీరు తలంచుచున్నారా?"
ఓ దేవా, ఆత్మ శక్తితో ప్రతి పురుషుడును మరియు స్త్రీయు లేచునట్లు చేయుము. ఆ మారని, తృణీకరించబడిన అపవాది, కాలములో మానవజాతికి హానిచేసినదై నిలువబడి, ఏ విధముగా జీవముగల దేవుని సంఘమును తృణీకరించగలదు? సాతానా, యేసుక్రీస్తు నామములో విడచి వెలుపలకు రమ్ము.
124ఇప్పుడు, ఖడ్గము ధరించుటకు శక్తిగలవారు. దేవుని వాక్యమందు చాలినంత గ్రహింపును కలిగి, అది మీ స్వంత ఆస్తియని పొందగలిగిన వారు, మీ హస్తములలో దేవుని వాక్యమును గైకొనువారు. విశ్వాస హస్తముతో పట్టుకొని ఇలా చెప్పండి. " నేను ప్రభువు ప్రక్క నిలుచున్నాను. నేను ఇకపై దేవునితో ఏకమైతిని. నేను ఈ ఆత్మ ఖడ్గమును వాక్యమందు పట్టుకొని, దేవుడు వాగ్ధానము చేసిన ప్రతి వాగ్ధానముతో సాతానును చేధించెదను."
నీ పూర్ణహృదయముతో నీవు విశ్వసించినయెడల, నేను నా పూర్ణహృదయముతో యేసుక్రీస్తు నామమందు అడుగునదేమనగా, లేచి నిలువబడి అంగీకరించుము. దాని యందు నిలువబడి అంగీకరించుము. దాని గ్రహించారా? నమ్మకముగా ఉన్నారా? మీ హస్తములలో వాక్యమున్నదా? మీ విశ్వాసము మీ హస్తములుగా వున్నదా? దేవునికి మీ చేతులను ఎత్తుచూ ఇలా చెప్పండి, "దేవా, ఈ చేతులను పైకెత్తుట ద్వారా నా జీవితమును పూర్తిగా సమర్పించుకొనుచున్నాను; నా ఆత్మను, నా తలంపులను సమర్పించుకొనుచున్నాను; దేవుని వాక్యమునకు ప్రతి దానిని సమర్పించుకొనుచున్నాను; ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ నా విశ్వాసమును గైకొని ఆ కార్యమును దయచేయును గాక. నాలో నుండి ప్రతి సందేహమును తీసివేయును గాక, విశ్వాసముతో ఈ ఘడియకు నేనడిగిన వాగ్దానమును పొందుచున్నాను.
"మీరు దానిని నమ్మినట్లయిన, "ఆమేన్" అని చెప్పుడి. [సమాజాము "ఆమేన్" చెప్పుచున్నది.] మరల చెప్పండి, "ఆమేన్." ఆమేన్, ఆమేన్, మరియు ఆమేన్. మీ హృదయమంతటితో నమ్మినట్లయిన యేసుక్రీస్తు నామమందు మీరు అడిగిన దానిని వాగ్ధానము చేయుచున్నాను. ఆమేన్. మీ పూర్ణహృదయముతో దీనిని నమ్ముడి. దేవుడు మిమ్ములను దీవించు గాక. నెవిల్ సోదరుడా.