అన్నింటి కన్నా అతి గొప్ప పోరాటము
VGR COUNT-492 1ఆర్మన్ సోదరుడా, వందనములు! ప్రభువు నిన్ను దీవించును గాక.
స్నేహితులారా, శుభోదయము. ఈ ఉదయము మరల ఇక్కడున్నందుకు సంతోషించుచున్నాను. అనుకోకుండా వచ్చినందుకు నాకే ఒక విధంగా యున్నది. జనులకు మరి ఆశ్చర్యముగా ఉండును. నేను చదువుచుండగా (సోదరీ, వందనములు), ప్రభువు నా హృదయములో ఉంచిన దానిని సంఘమునకు చెప్పవలసిన సమయము ఇదేనని తలంచాను. ఈ ఆదివారమునకు ఇక్కడ చేరియు౦దుమనుకోలేదు. సంఘము కొరకు ఒక వర్తమానమున్నదని ప్రకటించాను. దేవుని చిత్తమయితే, ఈ వర్తమానము వచ్చే ఆదివారము బోధించెదను. మరియు అప్పుడు చాల ఎక్కవ సమయము ఉండును, కావున అది 12:30 గంటలకు ముందు లేక 1 గంటకు బహుశా అయిపోవచ్చును. అది నా హృదయములో చాలా సమయము నుండి ఉన్నది, మరియు ఎందుకు నేను సేవలో అంత చురుకుగా ఉండలేకపోవుచున్నానో జనులకు జవాబు చెప్పవలసియున్నాను. నేను దానిని సూటిగా బోధించకుండ చుట్టూ త్రిప్పి బోధించాను. బోధించవలసినది ఇంకా బోధించలేదు. ప్రభుని చిత్తమయితే, వచ్చే ఆదివారము, నా సమయము తీసికొని ఏమి జరుగుచున్నదనో లేఖనపూర్వకముగా బోధించెదను, చూడండి. ఎందుకనగా ఆ వెంటనే విదేశములకు వెళ్ళవలసియుండును. ఆయన నన్ను ఎటు వెళ్ళమని పిలుచునో అని ఎదురు చూచుచున్నాను.
2రెండు లేదా మూడు రాత్రుల క్రితం అర్థరాత్రి వేళ నాకు ఎవరో ఫోను చేసిరి. ఆస్పత్రిలో నున్న ఒకామెకు ప్రార్థన చేయమని అడిగిరి. (వారు చెప్పిన పేరును మరచిపోయాను శ్రీమతి. జమ్స్ బెల్ కు, స్నేహితురాలు. ఈ నల్లజాతి సోదరి ఈ సంఘములో చాలా అణకువ కలిగిన సభ్యురాలిగా ఉన్నది. నాకు చెప్పిన ఆ పేరు షెపర్డ్ అనుకుంటాను.) నేను పడక మీద నుండి లేచి మోకాళ్ళూని అప్పుటికే లేచిన నా భార్యతో ఇట్లన్నాను. (ఫోను మోతకు లేచెను), "శ్రీమతి. షెపర్డ్ కొరకు మనము ప్రార్ధించవలెను. ఆమె శ్రీమతి. జేమ్స్ బెల్ స్నేహితురాలు."
3ఆమె కొరకు మేము ప్రార్ధి౦చి తిరిగి పరుంటిమి. ఆ మరుసటి రోజు 10 లేదా 11 గంటలకు మరల ఫోను వచ్చెను. శ్రీమతి. షెపర్డ్ కొరకు కాదు గాని శ్రీమతి. బెల్ కొరకే ప్రార్ధన చేయమని బిల్లీ చెప్పెను. ఆమె బహు వ్యాధితో ఆస్పత్రిలో యున్నది. ఆస్పత్రిలో వెళ్ళుచుండగానే ఆమె చనిపోయినది. శ్రీమతి. బెల్ ను ప్రభువు తన గృహమునకు పిలుచుకొనెను.
4చాలా సంవత్సరాల నుండి శ్రీమతి. బెల్ ఈ సంఘమునకు నమ్మకముగా వచ్చుచుండెను. ఆమె భర్తయగు జేమ్స్ మరియు నేను చాలా సంవత్సరాల క్రితం నా తండ్రితో కలిసి పనిచేసాము. దాదాపు ముప్పయి సంవత్సరాల క్రితం పెన్సిల్వేనియా నుండి కాల్గేట్కు రవాణా వ్యాపారము చేసేడివారము. శ్రీమతి. బెల్ని మేము ప్రేమించెడివారము; ఆమె ఒక ఘనురాలు.
5ఆమెకు పిత్తాశయములో చాలా తీవ్రమైన వ్యాధి వచ్చినది. ఆ వ్యాధి గూర్చి బాగుగా ఎరిగిన ఆమె వైద్యుడు ఆ సమయంలో పట్టణములో లేడు. ఒక క్రొత్త వైద్యుడు వచ్చి ఆమెను చూచెను. ఆమెకు అత్యవసరంగా ఆపరేషను చేయ ప్రయత్నించెను గాని ఫలితము లేకపోయెను. ఆమెకు ఎప్పుడూ వైద్యము చేయు వైద్యుడున్నచో అలాగు చెప్పి యుండకపోవునని నాకు తెలిసినది, ఎందుకనగా ఆమె చాలా లావుగానున్నది. ఆమె పిత్తాశయములో రాళ్ళున్నవి. ఆమెకు ఇంతకు ముందు ఎన్నో ఇట్టి ఆపదలు వచ్చెను, అయితే ప్రభువు ఎన్నో సార్లు కృప చూపి రక్షించెను. అయితే ఈసారి ఈలాగు జరిగినది. పూర్తి అవగాహనతో ఇట్లు చెప్పుగలను. బెల్ను దేవుడు పిలిచెను. అందుకే ఇలాగు జరిగినది. మీరు చూచారా?
ROM 8:28
6మిస్ షెపర్డ్ కొరకు ప్రార్ధించవలెనని నాకు చెప్పిరి. నాకు మిస్ షెపర్డ్ తెలియదు. ఆమె ఈ ఉదయము ఇక్కడ ఉండి యుండును. ఆమె ముఖము చూచినయెడల నేను ఆమెను ఎరుగుదును. కాని శ్రీమతి. షెపర్డ్ అని వారు చెప్పిరి, లేనియెడల శ్రీమతి. బెల్ కొరకు వెంటనే విజ్ఞాపన చేసి యుందును. బహుశా దేవుడు మనలను ఆ విధంగా చేయనియ్యలేదు. దేవుని ప్రేమించువారికి ఇవన్నియూ మేలు కొరకే సమకూడి జరుగును. సోదరి బెల్ ప్రభువునెంతో ప్రేమించెను; ఆమె ఒక మంచి స్త్రీ
7ఇప్పుడామె మనలో ఒక్కటై యున్నది. శ్రీమతి. బెల్ ఇక్కడ ఎటువంటి రంగు బేధములు లేదు. దేవుని కుటుంబము రంగును బట్టి ఎట్టి వివక్ష చూపదు. మనము ఎర్రగా ఉన్నా, తెల్లగా ఉన్నా, గోధుమ రంగులో ఉన్నా, పసుపుగా ఉన్నా, నల్లగా ఉన్నా, క్రీస్తునందు సోదరీ సోదరులమే. ఆమెను మనము ప్రేమించుచున్నాము. ఇక ఈ సంఘములో ఆమెను చూడము. శ్రీమతి. బెల్ ఆ వెనుక మూలన కూర్చొని "ఆమేన్" అని బిగ్గరగా చెప్పెడిది. ఆమెను గృహమునకు కొనిపోయెను. ఆమె ప్రభువైన యేసు గూర్చియే మాట్లాడును.
వచ్చే మంగళవారము ఒంటి గంటకు ఈ సంఘములోనే ఆమె సమాధి కార్యక్రమము జరుగునని ఇప్పుడే తెలిసినది. (కొద్ది క్షణములు క్రితమే తెలిసినది), ఆ ఆరాధనా కార్యక్రమములో మీరు నేను పాలుపొందవలెను. [సహో నెవిల్ " 1 గంటలకు" అని చెప్పుచున్నారు.] ఈ ఉదయమున సంఘములో ఒకరు తక్కువయిరి.
JOB 1:21•
ROM 1:16•
1COR 1:18•
1PET 1:5
8సోదరి బెల్ గౌరవార్థము ఒక్క క్షణము లేచి తలలు వంచుదుము.
జీవాధిపతి జీవమును ఇచ్చి తీసికొనువాడా, నీ గూర్చి ఆనాటి యోబు ఇట్లు చెప్పెను. "యెహోవా ఇచ్చెను, యొహోవాయే తీసికొనెను; ఆయన నామమునకే స్తుతి చెల్లును గాక!" ఈ దేవుని యొక్క గొప్ప కామన్ వెల్త్ లో మాతో కూడా సహ పౌరురాలిగా యుండుటకు కొన్ని సంవత్సరాల క్రితం నీవు శ్రీమతి. బెల్ ను మా మధ్యకు పంపితివి. ఆమె మాకు ఎంతో స్ఫూర్తినిచ్చినందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. ఆమె పరిశుద్ధాత్మతో నీకు పాటలు పాడి సాక్ష్యమిచ్చెడిది. ఆమె పరిశుద్దతతో నింపబడి, బిగ్గరగా అరచి చప్పట్లు కొట్టెడిది. యేసుక్రీస్తు సువార్తను గూర్చి ఆమె సిగ్గుపడలేదు, ఎందుకనగా ఆమెను రక్షించిన శక్తి అదే. ఆమె సంవత్సరముల లెక్క ముగియుట మేము చూచుచున్నాము. మేమందరము జవాబు చెప్పవలసిన సమయము వచ్చును. నీ సన్నిధిలో యుండుటకు ఈ ఉదయమున ఆమెను మా మధ్య లేకుండా తీసికొని యున్నావు. ఈ చోటు మేము విడిచిన వెంటనే నిశ్చయంగా దేవుని సన్నిధిలో యుందుము.
9ఓ, దేవా! సమస్తము బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. ఆమె భర్త, నా స్నేహితుడగు జేమ్స్ ఆమె కుమార్తె, కుమారుడు తదితరులను నీవు దీవించుము. ఆమె కుమారుడు సైనిక దళములో యున్నాడు. ఎడబాసిన తల్లిని కడసారిగా భూమి మీద చూచుటకై అతడు జర్మనీ నుండి వచ్చుచున్నట్లు తెలిసినది. ఈ ఉదయమును ఆ యువకుని గుండె ఎట్లుండునో గదా? ప్రభువా, అతని కొరకు ప్రార్ధి౦చుచున్నాను. దేవా అతని దీవించుము, తన కుటుంబమును పోషించుటకు అలసటతో పనిచేయుచున్న జిమ్మిని దీవించుము. ఆ గొప్ప కుటుంబము విడిపోకుండునట్లు ప్రార్ధి౦చుచున్నాను. అద్దరినున్న ఆ దేశములో కుటుంబ చక్రము పగిలిపోదు.
ప్రభువా, మేము! మా నడుములు మరి కొద్దిగా బిగించుకొని యుద్ధమునకు సన్నద్దులగుదము గదా! గతవారం కంటె ఎక్కువగా పోరాడుదము గాక. మమ్ములను బలపరచుమనియు, శక్తితో నింపుమనియు, మేము ముందుకు సాగిపోవుచుండగా - సహాయము చేయుమని ప్రార్ధి౦చుచున్నాము. ఒక దినమున మేమందరము అవతలి దరిని కలిసికొందుము. యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్!
10మమ్మును వీడి వెళ్ళిన సోదరీ యొక్క ప్రాణము విశ్రాంతి పొందుగాక!
వచ్చే మంగళవారము ఆమె సమాధి కార్యక్రమము జరుగును. ఎవరైనా రావచ్చును. అందరికి ఆహ్వానము నెవిల్ సోదరుడు అన్ని ఏర్పాటు చేసెనని తలంచుచున్నాను. (సహో బ్రెన్హాం నెవిల్ సోదరునితో మాట్లాడుచున్నారు.)
11స్లాటర్ దంపతుల కొరకు ఎక్కడయినా చోటును చూడండి. స్లాటర్ సోదరి యొక్క మరో సోదరి జీన్ స్లాటర్ విష-జ్వరముతో బాధపడుచుండగా ప్రార్ధించ వెళ్ళాము. ఆమె చాలా వ్యాధిగ్రస్తురాలిగా యున్నది, కాని ఆమె బాగవునని దేవుని నమ్ముచున్నాను.
12ఈ ఉదయము బోధించుట కొరకు వాక్యభాగమును చదువుదుము. ఆరిజోనా నుండి వచ్చినప్పటి నుండి నా గొంతు బాగాలేదు. వచ్చే ఆదివారము గూర్చి మరచిపోవద్దు. బిల్లీ ఎప్పుడో ప్రకటనలను పంపెను. వీలైనంత పెందలకడ రండి, ఎందుకనగా ఆరాధన చాలాసే పుండును. 9:30 లేదా 10:00 గంటలకు ప్రారంభించి 1:00 లేదా 12:00 గంటల వరకు జరుగును. మూడు లేదా నాలుగు గంటల పై గానే జరుగును.
నేను వాక్యమును తీసుకొనుటకు ఇష్టపడుదును. (మీరు పెన్సిలు మరియు పేపరు తెచ్చుకొనండి) మీకున్న ప్రశ్నలను అడుగవచ్చును. (చూచారా?) వాటికి మేము శాయశక్తులా జవాబు చెప్ప ప్రయత్నించెదము. మా సహాయము మీకందించెదము.
13ఇప్పుడు, మొదటిగా వాక్యము చదువుదము. బైబిలులోని మూడు చోట్ల నుండి వాక్యము చదువగోరుచున్నాను. (మీ యొద్ద పెన్సిలు ఉన్నచో వ్రాసికొనండి) నేను ఈ ఉదయమున చాలా వాక్యములను ప్రస్తావించెదను. I పేతురు 5:8-10; ఎఫెసీ 6:10-17; దానియేలు 12:1-14.
14చదువుటకు కొంత సమయము పట్టును. (అందరూ దాదాపుగా కూర్చొని యున్నారు గాని కొందరు వెనుక నిలబడియున్నారు), వీలయినంత త్వరగా దీనిని ముగించి మిమ్మును పంపివేయ ప్రయత్నించెదము. ఆ తరువాత రోగులకు ప్రార్ధి౦చెదము.
ఈ ఉదయాన ఇక్కడ ఒకామె చాలా వ్యాధితో పడియున్నది. నిన్న ఆమె చాలా జబ్బుగా నున్నట్లు తెలిసినది. ఆమె కొరకు నేను ప్రార్ధి౦చు ముందుగా దీనిని ఆమె వినవలెనని నేను కోరుచున్నాను. ఆమె యొక్క పరిస్థితి నాకు తెలియదు. ఆమె చాలా జబ్బుగా ఉన్నది, అయితే మన వ్యాధులన్నింటిని జయించిన ఒక గొప్ప పరలోకపు తండ్రి మనకున్నాడు.
15నా వద్ద చిన్న వ్యాసమున్నది. దానిని చూచి వైద్యుడు చాలా ఆశ్చర్యపడును. అతడు దైవిక స్వస్థతను నమ్మడు, అసలు దాని గూర్చి ఎవరినీ, అనగా తన నర్సును కూడా తన ఆఫీసులో మాట్లాడనీయడు. (శ్రీమతి. ఉడ్ దానిని చదువునేమో అని అడుగుచున్నాను) అతని యొద్దకు ఒక కాన్సరు రోగి వచ్చెను. ఆమెను గూర్చి ఏమియూ చేయలేక మరో వైద్యశాలకు పంపెను. వారు కూడా ఏమి చేయలేక మరల వెనక్కు పంపిరి.
16అది రొమ్ము కాన్సరు. భయంకర స్థితిలో యున్నది. శరీరము తినివేయబడినది. రొమ్ములో నుండి ఎముకలలోనికి ఆ కాన్సరు వెళ్ళినది. మీరిది గ్రహించగలరనుకొనుచున్నాను. (నార్వే నుండి వచ్చిన ఒక వైద్యుడు ఇచ్చట కూర్చొని యున్నాడు. అతడు తన పరికరములన్నియు సిద్ధపరచి యుంచెను. ఆమె ఆపరేషన్ చేసి రొమ్మును తీసివేయమని కోరినది. అది చాలా కష్టమయిన పని, అతడు అంతా సిద్ధము చేసెను. నర్సు ఆమెను శస్త్రచికిత్స గదిలోనికి తీసికొని వచ్చెను. ఆమె రొమ్మును తీసివేయుటకు డాక్టరు మరియు అతని సహాయకుడు వేచి యుండగా, నర్సు ఆ పరికరములు తెచ్చుటకు గదిలోనికి వెళ్ళెను. వారు బట్టలు కూడా సిద్ధపరచిరి. కావున వారు ప్రారంభించిరి - వారు తిరుగుటకు ప్రారంభించినప్పుడు…
17ఆమె భర్త గది చివరన కూర్చొని ప్రార్ధించసాగెను; అతడు ఒక పరిశుద్ధ సమాజపు బోధకుడు. అతడు ఆ పడక యొద్ద ప్రార్ధి౦చుచుండెను. డాక్టరుకు అది నచ్చలేదు. అయితే అతడు చూడనంతవరకు — మరియు అతడిని అది బాధపెట్టదు, ఎందుకు, అది పరవాలేదు అని నేను అనుకుంటున్నాను — సోమ్మసిల్లుడు.
18అతడు ప్రార్ధి౦చుచుండగా, ఏదో అలజడి అయినట్లు వారు వినిరి. డాక్టరు రొమ్మును తీసివేయుటకు పరికరములన్నియూ పట్టుకొని చూడగా, ఆ రొమ్ము మీద అసలు వ్యాధి యొక్క మచ్చ కూడ కనబడలేదు! "అది ఏమయినది?" అనడిగాడు. నర్సు తన సాక్ష్యమును ఇచ్చెను. వారిద్దరు ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభువును సేవించుచున్నారు.
19ఏ మచ్చ కూడ లేదు! డాక్టర్ హల్ బ్రూన్ సాక్ష్యమిచ్చెను. "అంతకు ఒక్క నిమిషము ముందే ఆమె యొక్క రొమ్ము మీద పెద్ద కాన్సరు గడ్డను నేను నర్సు చూశాము. ఒక్క నిమిషము తరువాత దాని మచ్చ కూడా లేదు" అని చెప్పెను. ఈ అమెరికాలోని మంచి వైద్యులలో అతడు ఒకడు. వెంటనే అతడు మార్పు పొందెను. అతడు అప్పుడే ఒప్పింపబడెను, మరియు ఇప్పుడు ఒక సంఘములో అతడు డీకన్ గా ఉన్నాడు, చూచారా.
మంచిని నేర్చుకొనుటకు లేదా మరేదో నేర్చుకొనుటకు సంఘానికి వెళ్ళాలని చాలామంది అనుకొందురు. స్నేహితుడా! అది తప్పు. దేవుడు దేవుడే; ఆయన నిన్న, నేను, రేపు ఉన్న విధముగానే ఎల్లప్పుడూ గొప్పవాడైయున్నాడు. ఆయనను మనము ప్రేమించుచున్నాము.
1PET 5:8-10
20ఇప్పుడు I పేతురు 5వ అధ్యాయము 8 మరియు 10 వచనాలను చదువుదము.
నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి. మీ విరోదియగు అపవాది గర్ధి౦చు సింహము వలె ఎవరిని మ్రి౦గుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు:
లోకమందున్న మా సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.
తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి, స్థిరపరచి, బలపరచును.
EPH 6:10-17
21దేవుని నెంతగానో స్తుతించవలెను!
ఇప్పుడు, ఎఫెసీ గ్రంథములో నుండి చదువుదము. ఎఫెసీ 6 అధ్యాయము 10 నుండి 17 వచనములు చదువుదము. తుదకు ప్రభువు యొక్క మహా శక్తిని బట్టి ఆయనయందు బలవంతులై యుండుడి.
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని, ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాధులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
అందుచేత మీరు అపద్ధినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
ఏలయనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని, నీతియను మైమరపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొని నిలువబడుడి.
ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్చుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి.
DAN 12:1-7
22ఇప్పుడు, దానియేలు గ్రంథములో నుండి చదువుదము. దానియేలు 12వ అధ్యాయము 1 నుండి 14 వచనములు చదువుదము.
ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథము నందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు.
మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కోనెదరు. కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.
బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గముననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు.
దానియేలూ, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రించుము. జనులు నలుదిశల సంచరించినందువల్ల తెలివి అధికమగును.
దానియేలను నేను చూచుచుండగా, మరి ఇద్దరు మనుష్యులు ఏటి అవతలి యొడ్డున ఒకడును ఏటి ఇవతలి యొడ్డున ఒకడును నిలిచిరి.
ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసికొన్నవాడై ఏటి నీళ్ళపైన ఆడుచుండువాని చూచి - ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా?
నార బట్టలు వేసికొని యేటి పైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని, ఎడమ చేతిని ఆకాశము వైపు కెత్తి, నిత్యజీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలము, కొలములు, అర్థకాలము పరిశుద్ద జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా, సకల సంగతులు సమాప్తములగును. [ఇక్కడ ఆపెదను.]
23చదివిన భాగము నుండి ఒక అంశమును నేను తీసికొందును. (అంశమని పిలుచుచున్నాను) "పోరాడిన అతి గొప్ప పోరాటము" అని దీనిని పిలుచుచున్నాను. నా అంశముగా అదే ఉపయోగించెదను.
24ఈ ఉదయమున ఆ అంశమును తీసికొని ఇక్కడికి వచ్చియున్నాను. ఈ సంఘములోని కొందరు ట్రస్టీలు, నేను కలిసి అరిజోనాలో ఉన్నాము. ఫోనిక్సులో సహో షారిట్ సంఘ కూటమునకు వెళ్ళాము. ఆ పట్టణములో గుడారము వేసి ఒక సోదరుడు కూటము ఏర్పాటు చేసినందున నేను కూటము పెట్టుటకు వెనుకాడను. ఆదివారము మధ్యాహ్నము పెడితే ఎవరికి తొందర కలుగదని తలంచాను. అతనికి ఆదివారము మధ్యాహ్నము కూడా కూటమున్నదని తెలిసినది. కాబట్టి మా కూటము గూర్చి నేను కొద్దిగా చింతించాను. కాబట్టి మా సోదరులతో కలిసి పట్టణములోని సహో, అలెన్ కూటమునకు వెళ్ళాను. (మేము వేటకు వెళ్ళిన ఆ సమయంలో సహో అలెన్ కూటములను జరిపించుచుండెను.) మేము ఆ కూటములకు వెళ్ళాము. సహో, అలెన్ ఒక బలమగు వర్తమాన మందించెను. వారి పాటలు, ఆయన బోధ మేము విని చాలా ఆనందించాము. వారు చక్కగా పాడిరి, కేకలు వేసిరి, మరియు గొప్ప కూటమును కలిగియుండిరి.
25మార్గమంతటిలోను దేవుని హస్తమును మేము చూచాము. మేము వెళ్ళిన ప్రతి చోట ప్రభువైన యేసును కలిసికొన్నాము. ఆ ఎడారులలో ఉండుట మీకు తెలియును. మీరు అక్కడ ఒంటరిగా ఉంటే తెలియును. ఏదో నిన్ను ఆకర్షించును. నేను బయటి స్థలములలో గడుపుటకు అది ఒక కారణము. శత్రువు యొక్క శక్తి నుండి నీవు దూరమగుదువు.
MARK 5:12,13•
LUKE 8:32,33
26అపవాది పని చేయుటకు ఏదో ఒకటుండవలెను. ఆ సేవలో నుండి వెళ్ళగొట్టబడిన దయ్యములను చూచారా? ఇంకా అవి ఏదో చేయగోరి పందులలో ప్రవేశించెను. కాబట్టి అపవాది ఎవరి ద్వారానైనా పనిచేయవలెనని కోరును. దేవుడు కూడా అలాగే చేయును. ఆయనకు మనము కావలెను; మన ద్వారా, మన మీద ఆధారపడి ఆయన పనిచేయును.
27మేము పర్యటనలో యుండగా చాలామంది దర్శనములతో వచ్చిరి, మరియు ఆయన ఎన్నడూ తప్పలేదు కాని సరియైన మరియు ఖచ్చితమైన అనువాదము ప్రభువైన యేసు ఇచ్చెను.
ఆయన మమ్మును వేటకు నడిపించెను. జంతువున్న చోటకు ఆయన నడిపించెను. అది చాలా అద్భుతము. రాత్రులందు అందరము మంట చుట్టూ కూర్చొని ఎన్నో మైళ్ళ దూరంలో మా వలె మంట వేసికొనిన వారిని పర్వతముల అంచులను చూచుట ఎంతో అద్భుతముగా యుండెను.
28మాతో పాటు ఒక సోదరుడుండెను. అతడు ఎన్నో సంత్సరాల క్రితం మా యొద్దకు కొన్ని కుటుంబ కలహముల గూర్చి చెప్పెను. అతని భార్యకు అతనికి విభేదములు వచ్చినవి. వారిని నేను నెమ్మదిగా ఉండుడని హెచ్చరించాను. ఒకనాటి కూటములో ఒకామెలో నున్న దురాత్మ వేదిక మీద నాపై తిరుగుబాటు చేసినది. ఇది దాదాపు పద్నాలుగు సంవత్సరాల క్రితం మాట. ఆమె మానసికంగా చాలా జబ్బుతో నుండెను, తప్పు పనులు చేయుచుండెను. ఆమె తన స్వంత భర్తను విడిచిపెట్టి మరో వ్యక్తిని పెండ్లి చేసికొనెను, అతనికి భార్య యున్నది; ఇవన్నీ అడిగితే ఆమె తనకేమి తెలియదని చెప్పినది.
29వైద్యులామెను పరీక్షించిరి. దానికని అమ్నీసియా అను వ్యాధిగా వారు పిలిచిరి గాని, అది ఒక దురాత్మ. ఆమె నా స్నేహితుని భార్య, కాని ఆ రాత్రి నుండి ఆమె నన్ను బహిరంగంగా ద్వేషించసాగెను. (ఎందుకాలాగు చేసినదో మీరు గ్రహించగలరు.)
ఆమె భర్త వచ్చినప్పుడు మరియు మేము గదిలో మోకరించి ప్రార్ధి౦చాము. పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. అదే రాత్రి కలలో ఆమె భర్తకు ఆయన కనిపించెను. అతడు ఆ కలతో మా యొద్దకు వచ్చెను. అది ఏదో ఎగతాళిగా అతడు భావించెను. కాని అతని భార్యను స్వస్థపరచుటకు అదే జవాబు. పరిశుద్ధాత్మ ఎట్లు పనిచేయునో చూడండి! సహో, నార్మన్ తదితరులతో టూసాన్ ను వెళ్ళాము. అక్కడ ప్రభువు మరల అద్బుతమగు, గొప్పవగు, మహత్కార్యములను బయలుపరచెను. ఇక్కడ దీనిని నేను చెప్పుటకు ఒక కారణమున్నది. సహో, వుడ్ మరియు సాద్మన్ లతో ఒక రాత్రి నిలబడి యున్నారు. అపుడు 10 గలంటలవుతున్నది. నేను ఆకాశము వైపు చూచుచున్నాను. ఒక గొప్ప శక్తి నన్ను కమ్ముకొన్నది. నేనిట్లు చెప్పాను, "ఆ పరలోక సైన్యమును చూడండి! అందరూ ఐక్యతగా యున్నారు."
30"ఆ రెండు చిన్న నక్షత్రములు దగ్గరగా కలిసిపోయినందున ఒక వెలుగు వలె కనిపించుచున్నది" అని సహో ఉడ్ చెప్పెను.
31"ఉడ్ సోదరుడా, అవీ రెండు అంగుళముల దూరములో కూడా లేనట్లు కనబడుచున్నవి గాని పైన ప్రకారము మనము వాటికి ఎంత దూరములో యున్నామో, అంతకంటె ఎక్కువ మధ్య దూరములో అవి ఉన్నవి. అది భూమిని చేరవలెనన్నచో గంటకు కొన్ని వేల మైళ్ళ వేగముతో ప్రయాణించినా గాని కొన్ని వందల సంవత్సరములు పట్టును. ఇక్కడ మనకు గొప్ప విశాల వ్యవస్థ యున్నది. వారు అద్దముల గుండా 120 మిలియనుల వెలుగు సంవత్సరముల దూరమును చూడకలుగుచున్నారు. ఇంకా అక్కడ సూర్య చంద్రులున్నారు. దేవుడే వీటన్నింటిని చేసెను. ఆయన వాటి మధ్యన కూర్చొనియున్నాడు," అని చెప్పాను.
32"ఎక్కడో గాని ఒకసారి నేను ఖగోళ పరిశోధన శాలలో కన్య మొదలుకొని సింహము వరకు గల నక్షత్ర రాశిని చూచాను. క్రీస్తు యొక్క మొదటి రాకడ కన్య రెండవ రాకడలో ఆయన యూదా గోత్ర సింహముగా వచ్చును. నేను నక్షత్ర రాశిని చూచుటకు శాయ శక్తులా ప్రయత్నించాను గాని కుదురలేదు. కాని శిక్షణ పొందినవారు వాటిని చూడగలరు. యోబు వాటిని చూచెను; చాలామంది దానిని చూచు అలవాటు కలిగియున్నారు. ఒకప్పుడు అదే బైబిలు, మిలియనులలో, బిలియనులలో వెలుగు సంవత్సరముల దూరములో నున్న వాటి మధ్య దేవుడు కూర్చొని క్రిందికి చూచుచున్నాడు. పౌలు అక్కడున్నాడు; మా తల్లి అక్కడ ఉండి క్రిందికి చూస్తూయున్నది," అని నేను చెప్పాను.
GEN 1:2
33ఆ పరలోక క్రమమును గూర్చి నేను ఆలోచించాను. అందులో ఏ ఒక్కటి స్థానము తప్పుట లేదు. ప్రతిది తన సమయమును చక్కగా పాటించుచున్నది. అది దేవుని మహా సైన్యము. చంద్రుడు గాని తన క్రమమును తప్పినచో కొద్ది నిముషములలో భూమి అంతయూ నీటిలో మునిగిపోవును. అప్పుడు భూమి గతంలో యున్నట్లుగా యుండును. అప్పుడది నిరాకారముగాను, శూన్యముగాను ఉండెను, మరియు జలములు భూమి పైన అల్లాడుచుండెను. భూమికి కొద్ది దూరంగా చంద్రుడు వెళ్ళినచో అలలు భూమిని ముంచెత్తును. అది దేవుని మహా సైన్యము.
34నేను పడక మీద పరుండి ఇదంతయూ ఆలోచించాను. అందులో ఏ ఒక్కటి తన స్థానము తప్పుట లేదు. అవన్నీ క్రమములో యున్నవి. అవి ఎంత మెల్లగా కదలినా భూమి మీద ఆ ప్రభావము కనబడును. వాటి యొక్క కొన్ని ఫలితములను మనము చూచాము. అందులో కొన్ని మరికొన్ని చోట్లకు వెళ్ళుచున్నవి. దాని వలన ఎంతో ప్రభావము ఇక్కడ పడుచున్నది
35ఆకాశ సైన్యమంతయూ అంత క్రమములో చక్కగా కొనసాగుచున్నదో మరి ఈ భూలోక సైన్యము మాట ఏమిటి? ఒక్కటి స్థానము తప్పితే మొత్తం విపత్తుకు గురియగును. ఒక్క సభ్యుడు క్రమము తప్పిన యెడల, దేవుని యొక్క కార్యక్రమమంతయూ తల క్రిందులగును. ఆత్మయొక్క క్రమమును కొనసాగించుటకు మనము ప్రయాసపడవలెను.
36ఈ ఉదయము నిజమగు స్వస్థతా కూటము జరుగునట్లు నేను దేవుని అడుగుచున్నాను. అట్టి ఐక్యతతో ఈ ఉదయము ఈ స్థలంలో కూడుకొని యున్నాము. ఈ ఉదయము ప్రతి సభ్యుని పరిశుద్ధాత్మ అట్టి ఐక్యతతో యుంచునట్లు వేడుకొనుచున్నాను. ప్రాణము మరియు శరీరములకు వెంటనే స్వస్థత కలుగును గాక. మనము మన స్థానములో ఉండవలెను.
37కాన్సరు రోగిని గూర్చి ప్రారంభంలో నేను చెప్పాను. దేవుడే డాక్టర్ హాల్బ్రుక్ గదిలోనికి వచ్చి శబ్దము చేసి ఆ కాన్సరు పోవునట్లు చేసెను. అసలు మచ్చ కూడా కనబడలేదు. ఆ దేవుడు ఇక్కడున్నాడని మీరెరుగరా? నక్షత్రములు తమ స్థానమందునట్లుగా ఆయన సైన్యము తమ స్థానములలో ఉంటే చాలును, అందుకొరకు ఆయన వేచియున్నాడు.
38ఎన్నో యుద్ధములు, యుద్ద సమాచారములు మనము విన్నాము. ఇంకా భూమి నిలిచియున్నచో మరెన్నో యుద్ధములు జరుగును. కాని ఈ విశ్వాసములో రెండే శక్తులున్నవని మీరు గ్రహించారా? దేశముల మధ్య జాతుల మద్య వైసమ్యములు పెరిగి రెండే శక్తుల క్రిందకు వచ్చుచున్నవి. రెండే శక్తులు, రెండే రాజ్యములున్నవి. ఈ చిన్న చిన్నవన్నియూ ఆ రెంటిలో ఏదో ఒక దానికి చెందియుండును. అది దేవుని శక్తి లేదా సాతాను శక్తి అయి యుండును. ప్రతి యుద్ధము, ప్రతి అక్రమము దేవుని శక్తి లేదా సాతాను శక్తి యొక్క అదుపులో ఉండును, ఎందుకనగా ఆ రెండే శక్తులున్నవి, జీవపు శక్తి మరియు మరణము శక్తి ఆ రెండు శక్తులే యున్నవి.
39దేవుని శక్తిని సాతాను వక్రీకరించెను. అది నిజమగు శక్తి కాదు. దేవుని శక్తిని వంకరగా మార్చెను. జీవమును వక్రీకరించినప్పుడు మరణము వచ్చెను. సత్యమును వక్రీకరించినప్పుడు అబద్ధము వచ్చెను, చూచారా. ఒక నీతి కార్యమును వక్రీకరించుట వలన వ్యభిచారము వచ్చెను, చూడండి. కాబట్టి సాతానుకున్న ప్రతి శక్తియు వక్రీకరించినదే, కాని అది శక్తియే.
నేడు ఇక్కడ కూర్చుని యున్న మనలను ఏదో ఒక శక్తి అదుపులో ఉంచుచున్నది. కాబట్టి చెడ్డదానిని మనము తరిమి కొట్టెదము. ఆకాశమండలి నక్షత్రముల వలె స్థానమును మనము తీసికొందుము.
JUDE 1:13
40దారి తప్పి తిరుగు నక్షత్రముల గూర్చి బైబిలు చెప్పెను [యూదా పత్రికలో] తమ అవమానమును వెళ్ల గ్రక్కుచున్నవి. దారితప్పి తిరుగవద్దు విధి నిర్వహణలో యున్న సైనికుని వలె, ఆకాశమందలి జ్యోతుల వలె యుండుడి. నమ్మి నిలబడండి!
LUKE 14:28
41ఒక దేశము మీదికి దండెత్తు దేశము ముందుగా తమ శక్తి సామర్థ్యములను అంచనావేసుకొందురు. యేసు అదే నేర్పించెను. ఇరు దేశముల వారు దాని గూర్చి ఆలోచించిన యెడల ఇక మనకు యుద్ధములుండవు.
ఒక దేశపు పైన్యాధిపతులు మొదట తమ గురి, లక్ష్యములను చూచుకొందురు. ఎదుటి సైన్యమును ఓడించు శక్తి, బలము ఉన్నదో లేదో లెక్కవేసికొనుము; లేని యెడల తప్పక ఓడిపోవుదురు.
42జనరల్ కస్టర్ అక్కడ ఘోర తప్పిదము చేసెను. సిమోక్సు భూభాగము మీదికి యుద్ధమునకు పోవద్దని ప్రభుత్వము జనరల్ కస్టర్కు ఆజ్ఞాపించెను, ఎందుకనగా అది వారికి తమ నిష్ట సమయము కాని కస్టర్ బాగా త్రాగి ఇష్టమొచ్చినట్లు చేయగోరెను. అనుమతి ఉన్నా లేకపోయినా వెళ్ళుదుననుకొనెను. వారు అమాయకులను చంపిరి. ఆరాధనలో ఉన్న తమ జనులకు ఆహారము వెదుకుచున్న స్కవుట్లను వారు చంపిరి. వారిలో కొందరు తప్పించుకొని తిరిగి వచ్చిరి. వారేమి చేసిరి? ఆయుధములు ధరించి యుద్ధమునకు దిగిరి. దానితో జనరల్ కస్టర్కు అంతము వచ్చెను. మొదట అతడు కూర్చొని ఆలోచించలేదు.
అక్కడతనికి అసలు పనిలేదు. అక్కడికి వెళ్ళు హక్కు అతనికి లేదు. ఇండియనులను తూర్పు తీరము నుండి అతడు త్రోసివేసెను. వారు పశ్చిమ తీరమున వ్యాపించిరి. వారికి సంధి జరిగినది, కాని ఆ సంధిని అతడు మీరినందున యుద్దములో ఓడిపోయెను.
43కాబట్టి ఒక సైన్యము యుద్ధమునకు సిద్ధపడు ముందు కొందరు సైనికులను ఎన్నుకొనెను. వారు యుద్ధమునకు సంబంధించిన దుస్తులు ధరించవలెను. పోరాడుటకు వారు శిక్షణ పొందవలెను. అన్నింటికన్న గొప్ప పోరాటము ఇప్పుడు మనముందున్నదని నేను నమ్ముచున్నాను. దేవుడు తన సైనికులను ఎన్నుకొనుచున్నాడని నేను నమ్ముచున్నాను. ఆయన వారికి దుస్తులు ధరింపచేసి శిక్షణ ఇచ్చుచున్నాడు. యుద్ధ రంగము ఇప్పుడు తయారైనది, పోరాటము ప్రారంభమగును.
44ఈ గొప్ప యుద్ధము పరలోకములోనే ప్రారంభమాయెను. మిఖాయేలు మరియు ఇతర దూతలు లూసీఫరు, దాని దూతలకు విరోధంగా పోరాడిరి. మొదటి యుద్ధము పరమందే ఆరంభమాయెను. కాబట్టి పాపమునకు మూలము భూమి కాదు గాని పరలోకమే. అది పరలోకము నుండి క్రిందికి త్రోయబడినది. అది భూమి మీద మానవులపై పడినది. కాబట్టి దేవదూతల యుద్ధము మానవ యుద్ధముగా మారినది. దేవుని సృష్టిని నాశనము చేయుటకు సాతాను వచ్చెను. దేవుడు తన కొరకు సృజించుకొనిన దానిని వాడు (సాతాను) నాశనము చేయుటకు వచ్చెను. దానిని నాశనము చేయుటయే వాడి గురి. కాబట్టి భూమి మీద ప్రారంభమైన ఈ పోరాటము ఇంకా ఎక్కువగుచున్నది.
1SAM 17:2,8,40
45యుద్ధము చేయు పక్షములు ముందుగా యుద్ధ రంగమును ఎన్నుకొందురు. మొదటి ప్రపంచ యుద్ధములో ఎవరికి చెందని చోట యుద్ధము ప్రారంభించిరి. ఒక స్థలమును ఎన్ను కోవలసియున్నది
ఫిలిష్తియులతో ఇశ్రాయేలీయులు యుద్ధమునకు దిగినప్పుడు ఒక కొండ ప్రక్కగా ఇరువైపులా వారు దిగి యుండిరి. అక్కడే గొల్యాతు వచ్చి ఇశ్రాయేలీయులను సవాలు చేసెను. ఆ లోయలోనే దావీదు అతనిని కలిసికొనెను. ఆ రెండు చిన్న కొండల మధ్య పారుచున్న యేటిలో నుండి దావీదు గులక రాళ్ళు ఏరి తెచ్చెను. వారు ఒక చోటను ఎన్నుకొనిరి.
46ఎవరికి చెందని భూమి మీద వీరు యుద్ధము చేసిరి. ఇక్కడ ఒకరు, అక్కడ ఒకరు యుద్ధము చేయరు. ఒక యుద్ధ రంగముండును. అక్కడ వారు కలిసికొని తమ శక్తిని పరీక్షించుకొందురు. ప్రతి సైన్యము తన శక్తిని పరీక్షించుకొనును. అది వారు పరస్పరము కలిసికొను చోటు.
దీనిని జాగ్రత్తగా వినండి! ఈ భూమి మీద ఆ గొప్ప యుద్ధము ఆరంభమయినప్పుడు ఒక చోట ఉండవలసియున్నది. ప్రారంభమునే ఆ చోటును ఎన్నుకొందురు. ఈ తరువాత అది ఉధృతమగును. మానవ మనస్సులోనే మొదట యుద్ధము ప్రారంభమాయెను. అదే యుద్ధపు ప్రారంభ చోటు. యుద్ధము జరుగు చోటును మానవ మనస్సును ఎన్నుకొనెను. శిరస్సు లేదా మనస్సులోనే నిర్ణయములు చేయుదము.
ఒక సంస్థ నుండి వారు దానిని ప్రారంభించలేదు. ఒక యాంత్రిక వ్యవస్థ నుండి దానిని ప్రారంభిచలేము. ఆ చోటు వేరుగానున్నది. ఈ సంస్థ దేవుని పనిని ఎన్నడూ చేయలేదు, ఎందుకనగా నీవు ఈ శత్రువును ఎదిరించవలసిన చోటు మనస్సు. అక్కడే అది నిన్ను కలిసికొనును. నీవు నీ ఎన్నికను చేసికొనవలసియున్నావు.
ఇక్కడ చాలా జబ్బుతో నున్న ఈ చిన్న బాలిక జాగ్రత్తగా వినవలెనని కోరుచున్నాను.
47నిర్ణయములు మనస్సులోనే చేయుదుము — శిరస్సు. అక్కడే సాతాను నిన్ను కలిసికొనును. దేవుడు మనిషిని ఆ విధంగా చేసెను. నా నోటులో చిన్న పటము గీసి యుంచాను. కొంతకాలం క్రితం బోర్డు మీద దానిని చూపించాను.
మానవ మనస్సు చిన్న గోధుమ గింజవలె యున్నది. అది ఒక విత్తనము శరీరకంగా నీవు నీ తల్లిదండ్రుల యొక్క బీజమైయున్నావు. జీవము తండ్రి నుండియు, గుజ్జు తల్లి నుండియు వచ్చుచున్నది. అండము మరియు రక్తము కలియుచున్నది. రక్త కణములలో జీవమున్నది, మరియు అక్కడే బిడ్డ అభివృద్ధి చెందును.
48ప్రతి విత్తనమునకు బయట పెంకు యుండును. లోపట గుజ్జు ఉండును. గుజ్ఞ లోపట జీవకణముండును. ఆ విధంగానే మనము నిర్మించబడియున్నాము. మనము శరీరము, ప్రాణము, మరియు ఆత్మలుగా ఉన్నాము. బయట శరీరమున్నది, దాని లోపల, మనస్సాక్షి మొదలగువాటి లోపట ప్రాణము ఉన్నది, ప్రాణము లోపట ఆత్మ ఉన్నది. ఆత్మ అన్నింటిని పరిపాలించును.
49మీరు ఇంటికి వెళ్ళి కూర్చొని మూడు వలయములు గీయండి. బయట శరీరమునకు అయిదు జ్ఞానేద్రియములున్నవి. దృష్టి వాసన, తాకిడి, వినికిడి, రుచి చూచుట, మానవ శరీరమును ఇవే అదుపులో ఉంచుచున్నవి. శరీరము లోపల ప్రాణము యున్నది. ఊహ, మనస్సాక్షి, జ్ఞాపకము, హేతు బుద్ధి, అనురాగముల ద్వారా ప్రాణము అదుపులో ఉంచబడుచున్నది; అవియే ప్రాణమును అదుపు చేయును. కాని ఆత్మకు మరేమీయులేదు — ఆత్మ. ఓ, మనము దానిని పొందుకొందుము! ఆత్మకు ఒకే ఇంద్రియము ఉన్నది, ఆ ఇంద్రియము విశ్వాసము లేదా సందేహము అనునవి మాత్రమే ఆత్మ ఏలును. అది ఒక స్వేచ్చాయుత కేంద్రము. నీవు విశ్వాసమును అంగీకరించవచ్చు లేదా సందేహమును అంగీకరించవచ్చు. నీవు ఏదో ఒకదాని మీద పని చేయవలెను.
కాబట్టి సాతాను మొదటగా మానవుని ఆత్మ మీద దాడి చేసి దేవుని వాక్యమును సందేహించునట్లు చేసినది. దేవుడు మొదట తన వాక్యమును ఆత్మలోనే యుంచెను. అక్కడే మీరున్నారు, అదే చేయును.
50సంఘములోని ప్రతి వ్యక్తి ఏక మనస్సుతో కలిసి ఎట్టి సందేహమునకు తావు ఇయ్యనిచో మరో అయిదు నిముషములలో మన మధ్య ఒక్క బలహీనుడు కూడా ఉండడు; పరిశుద్ధాత్మను పొందగోరు వారందరూ పొందుదురు. అయితే మీరు దానికి మొదట కట్టుబడి యుండవలెను!
JOHN 15:7
51ఇప్పుడు, యుద్ధము ఎక్కడ ఆరంభమగును — నేరుగా అది మీ మనస్సులోనే యుద్ధము ఆరంభమగును. ఇది క్రైస్తవ సైన్సు కాదు గాని మానవ మనస్సు. దేవుని వాక్యమును మనస్సు అంగీకరించినప్పుడు జీవము కలుగును. నీ ఆలోచన దేవుని వాక్యము చొరబడినప్పుడు నీ గమనము మారును, చూచారా. క్రైస్తవ సైన్సు అను గుంపు వారు చెప్పినట్లుగా ఆలోచన కాదు గాని దానిపై నున్న మనస్సే ముఖ్యము. నీ మనస్సు దానిని అంగీకరించి పట్టుకొనును. నీ మనస్సును ఏది నియంత్రించుచున్నది? నీ ఆత్మ; మరియు నీ ఆత్మ దేవుని వాక్యమును పట్టుకొనును, అందులో జీవమున్నది. దానివలన నీవు జీవములోనికి తేబడుదువు.
ఓ సోదరా, అది జరిగినప్పుడు నీలోనికి జీవము పొర్లి వచ్చును. దేవుని వాక్యము నీలో ప్రత్యక్షమగును. "నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి యుండిన యెడల, మీకేది ఇష్టమో అడుగుడి. అది మీ కనుగ్రహించబడును."
52దాని వలన ఏమి జరుగును? హృదయము మధ్యలో ప్రాణము యున్నది. ప్రతి దానికి పోషణ అక్కడి నుండియే వచ్చును. ఇక్కడ మనము చాలా సందేహముతో నిలబడియున్నాము. దానిని అంగీకరించుటకు ప్రయత్నించుచున్నాము. దానిని ఆపి, నిజదేవుని వాక్యము నొద్దకు రావలసియున్నావు. అప్పుడు సందేహము దానికదే వెడలిపోవును. అది లోపట యున్నది. లోపట ఉన్నదే లెక్కలోనికి వచ్చును. సాతాను లోపట నుండియే ప్రవేశించును.
JOHN 3:3,7
53నీవిట్లు అనుకొందువు, "నేను దొగిలించను; త్రాగనుల; ఈ క్రియలు చేయను." కాని అంతరంగమే వీటికి కారణము, నీవెంత మంచివాడివైనా, ఎంత నీతిపరుడవైనా, ఎంత సత్యవంతుడవైనా, యేసు చెప్పినట్లు, "తిరిగి జన్మించవలెను." అంతరంగమున కార్యము జరుగవలెను. నీవు బయట ఎంత సరి చేసినా హృదయములోని వాంఛ అలాగే యుండును.
PROV 23:7•
MATT 17:20•
MATT 21:21•
MARK 11:23
54కృత్రిమము పనిచేయదు, వాస్తవము కావలెను. మరియు అది లోనికి వచ్చుటకు అక్కడ ఒకే ఒక్క ద్వారము ఉన్నది, మరియు అది స్వేచ్చాయుత కేంద్రము ద్వారా, నీ ఆలోచనలను బట్టియే నీ ప్రాణములో నీవు ప్రభావితుడవగుదువు. "ఒకడు తన హృదయాలోచన బట్టియే నడచును. ఈ పర్వతములను కదిలి పొమ్మని చెప్పి హృదయములో సందేహించరాదు. నీవు చెప్పినది జరుగునని నమ్మవలెను. అప్పుడు నీవు అడిగినది పొందెదవు." ఇది గ్రహించారా? అక్కడే మీరున్నారు, చూచారా. అదే యుద్ధ రంగము.
55నీవు మొదట దీనిని ప్రారంభించుము. మనము జరిగించుకొనుటకు చాలా ఆసక్తి చూపెదము; దేవుని కొరకు ఏదో చేయవలెనని ఆరాటపడుచుందుము. ఇక్కడున్న ఈ స్త్రీ బ్రదుకవలెనను ఆసక్తితో యున్నది. ఆమె బాగుపడగోరుచున్నది. బాగవవలెనని తలంచువారు కొందరున్నారు. దేవుడు గొప్ప కార్యములు చేయుట గూర్చి మృతులు లేచుట గూర్చి మనమెంతో ఆశతో ఎదురుచూచుచున్నాము. ఈ జ్ఞానేంద్రియముల ద్వారా మనము దేనినో పట్టుకొనవలెనని ఆరాటపడుచున్నాము.
56చాలామంది చాలాసార్లు వాక్యమును తప్పుగా చెప్పుచున్నారు. వేదిక పిలుపులు ఇచ్చుటను నన్ను అపార్థము చేసికొనుచున్నారు. వేదిక పిలుపులు నాకు నచ్చవని ముందే చెప్పాను; మీరు వేదిక పిలుపులు ఇయ్యవద్దని నేను చెప్పుట లేదు, అయితే కొందరు ఈ వేదిక పైకి పిలుచుటను బట్టి చెప్పుదురు, "ఓ, సాహో జాన్, నీకు తెలుసా? నేను మరియు నీవు మంచి చాలా కాలముగా పొరుగువారిగా నివసించాము; పైకి వేదికనెక్కి రమ్ము; మ్రోకరించుము."
"అతడేమి చేయుచున్నాడు? ఇక్కడ నల్లబల్ల యున్నచో అతడు చేయుచున్న దానిని చూపించి యుందును. ప్రాణమును కొన్ని క్రియల మీదకు మళ్ళించి వాడు పని చేయుచున్నాడు. అది పనికిరాదు! నిశ్చయంగా అది మార్గము కాదు. ఒక జ్ఞాపకము బట్టి వాడు పనిచేయును. అది అతని ప్రాణము యొక్క జ్ఞానేంద్రియము ద్వారా పనిచేయును. "ఓ, జాన్ సోదరుడా! నీకు మంచి తల్లి యుండెడిది. ఆమె చనిపోయి చాలా కాలమయినది అందువు. అది ఒక జ్ఞాపకము, చూడండి. నీకు మంచి తల్లి ఉన్నందున గాని, నీకు మంచి పొరుగువాడున్నందున గాని లాభము లేదు; దేవుడు నిన్ను పిలిచినందున నీవు రావలెను. ఆయన వాక్యమును ఆధారము చేసికొని ఆయనను నీవు నమ్మవలెను. ఆ వాక్యములోనే అంతా యున్నది.
వాక్యమునకు నీవు చోటిచ్చినప్పుడు, నీ మనస్సాక్షి, అన్ని జ్ఞానే౦ద్రియములు - మరియు కేవలము వాక్యమును లోనికి రానిమ్ము, అప్పుడు వాక్య ఫలితమును పొందును.
57ఇక్కడ, అది దేనితో కప్పబడియున్నదో చూడుము? "బ్రెన్హాం సోదరుడా! ఈ మనస్సాక్షి, జ్ఞానేంద్రియములు మొదలగు వాటిలో దానికేమీ సంబంధము లేదని," నీవు అనవచ్చును. నిశ్చయముగా వీటితో సంబంధమున్నది! నీవు వాక్యమునకు తావిచ్చి మనస్సాక్షితో దానిని కప్పరాదు. వాక్యమును మూసిన యెడల అది ఎదుగదు. ఆ వాక్యపు రూపము మారును. గోధుమ గింజను నేలలో పాతి పెట్టి దాని మీద ఒక కర్ర నుంచినచో ఏమగును? అది వంకరగా ఎదుగును. మొలచునది ఏదైనా అలాగే అవును, ఎందుకనగా దానికి ఒకటి అడ్డుగా వచ్చినది.
MATT 24:35•
MARK 13:31•
LUKE 21:33
58ఈనాడు మన పెంతెకొస్తు విశ్వాసము కూడా అలాగే యున్నది. దానికి ఎన్నో అడ్డంకులు మనమేర్పరచితిమి, మనకు నేర్పించబడిన విశ్వాసము, మనలో జీవించుచున్న పరిశుద్ధాత్మ మూసివేయబడెను. అపవాది ఎల్లప్పుడూ ఓడిపోయిన వారినే నీకు చూపించును, కాని నిజమగు సాక్ష్యమును నీకు చూపించదు. ఏదో ఒక అనుకరణ కర్తను, ఒక వేషధారిని మాత్రమే నీకు చూపించును. ఎందుకనగా అపవాదియు అనుకరణ చేయును. కాని నిజమగు దేవుని వాక్యము నుండి అది వచ్చినట్లయితే, "భూమ్యాకాశములు గతించినా నా మాటలేమాత్రమును గతించవు." అది నిలచియుండవలెను. మీరది చూచారా, సహోదరి?
59మనస్సులో దానిని అంగీకరించవలెను; తరువాత హృదయములో దానిని విశ్వసించవలెను; అప్పుడు దేవుని వాక్యము నిజమగును మరియు ప్రతి జ్ఞానేంద్రియము, అనగా ప్రాణము మరియు శరీరము కూడా పరిశుద్ధాత్మతో ఏకీభవించును. అప్పుడు నీ యొక్క దేవుని ఇంద్రియము; నీ యొక్క దేవుని మనస్సాక్షి; దేవునిలో నున్న సమస్తము నీలో ప్రవహించును. ఎక్కడా ఎట్టి సందేహము కనబడదు. ఎట్టి అభ్యంతరము తలెత్తదు. అప్పుడు నీ మనస్సులోనికి అభ్యంతరపరచు ఆలోచనలు రావు. "ఒకసారి శ్రీమతి. జోన్సు స్వస్థత కొరకు దేవుని నమ్మి విఫలమయినది. ఫలాని వారు అపజయము పొందారు," అను జ్ఞాపకము రాదు. ఏ విధముగా మార్గము సరాళమయినప్పుడు, ప్రక్షాళన జరిగినప్పుడు, అంతరంగము పరిశుద్ధాత్మతో ని౦పబడును, అపజయము నీ జ్ఞాపకములోనికి రావు. శ్రీమతి. జోన్సు ఏమి చేసినా గాని నీవు మరియు దేవుడు ఇప్పుడు కలిసిపోవుదురు. మీ ఇద్దరే తప్ప మరెవరూ ఇక కనబడరు. అక్కడే నీవున్నావు; అది నీ పోరాటము.
60ఆదిలోనే వానిని చంపుము; వాడి త్రోవలోనే వాడిని చంపుము! యుద్ధమును ఎక్కువ కాలము జరుగనీయక ఇప్పుడు ఆపుము. పాత జ్ఞాపకములు, పాత మనస్సుతో నీవు రావద్దు. "నేను ఓడిపోవచ్చు. నేను సరికాక పోవచ్చు." ఆలాగు నీవు ఏ మాత్రమూ చేయవద్దు! ప్రతి దానిని నీవు ప్రక్కకు త్రోసి మరియు మార్గమును తెరువుము, ఇట్లు చెప్పుము, "దేవా, నీ వాక్యము నిత్య సత్యము, మరియు అది నా కొరకే ఇయ్యబడినది. సంఘమంతా విఫలమైనా, ప్రపంచమంతా ఓడిపోయినా, నేను ఓడిపోను, ఎందుకనగా నేను నా వాక్యమును తీసికొన్నాను."
61అక్కడే పోరాటము ఉన్నది; అదే విషయము. ఒక స్త్రీ రొమ్ము నుండి కాన్సరును తొలగించిన దేవుడు, ఒక బిడ్డను మరణించవచ్చునా? ఆయన మచ్చ కూడా లేకుండా కాన్సరును నిర్మూలించిన సర్వశక్తుడగు దేవుడు. లేదండి!
62హై స్కూలు నుండి ఒక చిన్న బాలిక కొంత కాలం క్రితం వచ్చినది. ఆమె తల్లి నాతో ఫోనులో ఇట్లు చెప్పినది, "నా కుమార్తెకు హాడ్డిన్స్ వ్యాధి వచ్చినది. (అది ఒక రకమగు కాన్సరు.) వైద్యులు ఆమె గొంతులో నుండి ముక్కను తీసి పరీక్షకు పంపగా, అది నిశ్చయంగా హాడ్డిన్స్ వ్యాధి అని తేలింది.
ఆమె ఇంకా ఇట్లన్నది, "మరొకరు వచ్చి ఆమె గుండెలోని ముక్కను తీయుదురు; అప్పుడామె చనిపోవును. ఆ విధంగా వారు ముక్కలు కత్తిరించుట తగదు. ఏమయినా ఆమె మూడు నెలలే బ్రదుకును."
నేనా బాలికను స్కూలుకు పంపాలా, వద్దా?" అనడిగినది.
"ఆమెను వెళ్ళనివ్వము, ఎందుకనగా ఆమె అకస్మాత్తుగా చనిపోవును. ఆమెకు సాధారణ జీవితము జీవించనిమ్ము. వ్యాధి గూర్చి అసలు ఏమి చెప్పవద్దు," అన్నాను.
మరలా ఆ స్త్రీ ఇట్లడిగినది, "నేను ఏమి చేయవలెను?"
"సరే, నీనామెను ప్రార్థన వరుసలోనికి తెమ్ము. నీవు కూడా బాలికతో రమ్ము," అని చెప్పాను. (నాకేదో వింత అనుభూతి కలిగినది)
63పెదవులకు నీలపు రంగు వేసికొని ముస్తాబై, ఆ ఉదయాన ఆ బాలిక వచ్చినది. (ఫోనులో నన్ను పిలిచినది వీరేనని నాకు తెలియదు) నేనామె చేయి పట్టుకున్నా; "సోదరీ! శుభోదయము! అన్నాను. కొంతసేపటికి ఆమె తల్లిని చూచాను. ఇద్దరూ దేవుని ఎరుగని వారే. క్రీస్తును వారెరుగరు. "మీరెట్లు స్వస్థత పొందగలరని ఆశించుచున్నారు? యేసుక్రీస్తును మీ స్వరక్షకునిగా అంగీకరించెదరా? మీ పాపముల క్షమాపణ నిమిత్తము ఈ కొలనులో యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందెదరా?" అనడిగాను.
"అలాగే చేయుదుము" అనిరి. ఓ! ఏమి జరిగిందో మీకు తెలుసా.
ఈ ఉదయము ఆ స్త్రీ ఇచ్చటున్నదేమో నాకు తెలియదు. మీలో చాలామంది ఈ సంగతిని ఎరుగుదురు. ఇక్కడి ట్రస్టీలలో ఒకరగు సహో మైక్ ఈగన్ దీనిని ఎరుగును. ఇది నాలుగు - అయిదు సంవత్సరాల క్రితం జరిగినది. ఆ చిన్న బాలికను మరల వైద్యుని యొద్దకు తీసికొని వెళ్ళిరి. హాడ్డిన్స్ వ్యాధి యొక్క ఛాయ కూడా ఆమెలో కనబడలేదు.
64ఏమి సంగతి? నీవు ఒక మార్గమును తెరువవలెను! దేవుని వాక్యమును తీసుకొనుటకు నీవు సైనికుడగు పరిశుద్ధాత్మను ఆ యొక్క యుద్దపు మొదటి వరుసలో పెట్టవలెను. ఆయన వాక్యమైయున్నాడు, మరియు ఆయన అక్కడ నిలిచును మరియు అప్పుడు దానిని ఏదియు ఆపలేదు.
పాత బాయిలర్ ప్రోగ గొట్టమును మూసివేసి నీవు మంట పెట్టినట్లయితే, అది ప్రేలిపోవును. చాలామంది ప్రేలిపోయిన క్రైస్తవులు ఆ విధంగానే యున్నారు, వారు దానిని శుభ్రపరచుట లేదు; వారు అంతరంగములోనికి వెళ్ళరు. నీవు దానిని శుభ్రపరచవలెను — మనస్సాక్షి, జ్ఞాపకమును, ఆలోచనను శుభ్రము చేయవలెను. ప్రతి దానిని ప్రక్కకు పెట్టి, కల్తీ లేని దేవుని వాక్యముతో లోపల, వెలుపల శుభ్రము చేయవలెను. దేవుని వాక్యమే సత్యము, నమ్మినవారు నేడు ఇట్లు పదివేల మంది కూలినను, నమ్మినవారు రేపు పదివేల మంది కూలినను, దానితో చేయునది నాకు ఏమిలేదు. నేను వ్యక్తిగతముగా నమ్మువాడను నేనే; విశ్వసించువాడను నేనే.
65మనము మన త్రోవలను సరాళము చేయు ముందుగా గతంలో సాక్ష్యమిచ్చిన వేలాది మందిని చూడవలెను, కాని అపవాది మరోవైపుకు చూపించును. నీవు అపవాదికి చోటిచ్చినచో నీ సైన్యమును వాడు పూర్తిగా నిర్మలము చేయును. నీ జ్ఞానేంద్రియములు సరియైనవే. స్త్రీ చూపు, రుచి తాకిడి, వినికిడి మొదలగునవి సరియే, కాని అవి దేవుని వాక్యముతో సమ్మతించినప్పుడే నీవు వాటిని నమ్మవలెను. ఇది సత్యము! అని వాక్యముతో సమ్మతించనియెడల, వాటి మాట నీవు వినవద్దు.
ఊహలు, మనస్సాక్షి, జ్ఞాపకములు, హేతుబుద్ధి, అనురాగములు వాక్యముతో ఏకీభవించినచో మంచివే అగును. కాని అవి వాక్యముతో అంగీకరించనియెడల దాని నుండి దూరమగుము. వెంటనే దానిని విడిచిపెట్టుము, చూడండి. మీ హేతు బుద్ధి దేవుని వాక్యముతో సమ్మతించనియెడల దానికి దూరమగుడి. అది మంచిది. మీ అంతరంగమందున్న ఊహలు, జ్ఞాపకములు, మనస్సాక్షి వాక్యముతో ఏకీభవించని యెడల దానిని విడిచిపెట్టండి!
PS 8:3•
PS 147:4•
ISA 40:26
66అప్పుడు మీరేమి పొందుదురు? ఒక సౌర కుటుంబమును పొందెదరు. హల్లెలూయా! దేవుడు నక్షత్రములను క్రమములో పెట్టి "నేను పిలుచు వరకు అచ్చటే వ్రేలాడుడి," అని చెప్పెను. అవి అక్కడే నిలిచి యుండెను. ఏదియూ వాటిని కదపజాలదు. దేవుడు మనిషిని పట్టుకొన్నప్పుడు అతనిలోని జ్ఞానేంద్రియములు, మనస్సాక్షి, సమస్తము శుభ్రమగును. దేవునితో నిలిచి యుండును. ఆత్మ అందుకు సాక్ష్యమిచ్చును. అక్కడ సందేహమును ప్రపంచములోని ఏ అపవాది కలిగించలేదు. అది సత్యము.
67"నీవు బాగవవు" అని వాడు నీతో చెప్పెను, నీ మనసాక్షి కూడా అలాగే చెప్పవచ్చును. దేవుని శక్తి నీలో యుండి, "హల్లేలూయా, దేవునికి మహిమ!" అని బిగ్గరగా చెప్పెను, చూచారా. అదే ప్రధానము; నీ యుద్ధరంగము అచ్చటనే యున్నది. నీ యుద్ధరంగము అక్కడే ఉన్నది, ఆత్మలో, నీ మనస్సులోనే యుద్ధ రంగమున్నది. మనస్సు ప్రాణమునకు ద్వారము — ఆత్మకు ద్వారము మనస్సు అని చెప్పవచ్చు. నీ మనస్సు తెరువబడినప్పుడు అది ఆత్మను అంగీకరించుటయో లేక అది ఆత్మను నిరాకరించుటయో జరుగును.
68మీలో చిన్న మనస్సాక్షి, చిన్న అనుభూతి, చిన్న జ్ఞానేంద్రియము ఉండవచ్చును, అయితే దీనికి వాటితో ఏమి సంబంధము లేదు. అవి అల్పమైన సంగతులు, కాని వాస్తవము యొద్దకు వచ్చినప్పుడు నీ మనస్సు తెరువబడును. నీ మనస్సు దానిని అంగీకరించును లేదా నిరాకరించును. స్నేహితులారా! ఇది గమనించండి. దేవా! ఎవరూ దీనిని తప్పిపోకుండునట్లు చేయుము! చూచారా? ద్వారమును తెరిచి నీ మనసాక్షి చెప్పినది, నీ జ్ఞాపకము చెప్పినది, నీ కోరికలు చెప్పినది వినునట్లుగా చేయునది నీ మనస్సుయే. కాని నీ మనస్సు ఈ సంగతులను వినకుండా మూయబడినప్పుడు, దేవుడు, ఆయన యొక్క ఆత్మ వాక్యము నీలోనికి వచ్చును. తక్కిన చెత్తనంతటిని ఎగురగొట్టును. ప్రతి సందేహము పోవును. ప్రతి భయము పోవును. ప్రతి సందేహ జ్ఞానేంద్రియము పోవును. ప్రతి అనుభూతి పోవును. దేవుని వాక్యము తప్ప మరేదియు అచ్చట నిలబడదు. దానికి విరోధముగా సాతాను పోరాడజాలదు. దానికి వ్యతిరేఖముగా వాడు పోరాడలేడు. ఇది సత్యమని మనకు తెలియును.
GEN 3:4
69ఈ యుద్ధములు ఏదెను తోటలో నుండి చెలరేగెను. మానవ మనస్సులోనే యుద్ధము ప్రారంభమాయెను. సాతాను దానిని ప్రారంభించెను. హవ్వను కలసికొన్నప్పుడు వాడేమి చేసెను? దేవుని వాక్యమును వాడు తిరస్కరించలేదు గాని దానికి సున్నము పూసెను. చిన్న చిన్న ద్వారములను అక్కడక్కడ అది మూసివేసెను. [ఆదికాండము 3:1, చూడండి.] వాక్యము నిజమని వాడెరుగును. వాడు దానిని సూటిగా కాదనలేక దానికి పంచదార పూత పూసెను.
70మా తల్లి మాకు మందు వేసెడిది. ఆముదములో నారింజ రసము వేసెడిది. నారింజ రసము లేకుండా ఆముదము త్రాగలేము. అది వేషధారితనము! చూచారా? మేము రాత్రులందు లేవకుండా ఒకరకమగు నూనె ఇచ్చెడిది. అయితే ముందుకు పంచదార పూసెడిది, చూచారా. ఒక రకమగు వేషధారి. పంచదార పోయిన తరువాత గొంతు కాలిపోయెడిది.
71స్నేహితులారా, ఇదే విధానము. సాతాను దాని గూర్చి వేషము ధరించి యున్నది. ఒక మంచి మార్గమును, ఒక తేలిక మార్గమును, చాలా తెలివైన పథకమును వాడు నీకే చూపించును. ఆదియందు దేవుడు వేసిన పథకము తప్పు మరే ఇతర మంచి పథకము లేదు — ఆయన వాక్యము! వాక్యమును పట్టుకొనుము; దానిని వదలక యుండుము. అది నిన్ను పట్టుకొననిమ్ము! దానితో అక్కడే నిలిచి యుండుము. అది అసలు సంగతి!
GEN 3:1
72హవ్వ తన హేతుబుద్ధిని ఉపయోగించగా యుద్ధము ఎక్కువాయెను. హేతుబుద్ధి వలన తన మార్గము మూసికొని పోయెను. తన ఆత్మ యందు ఆమె కారణమును వెదికినది. ఆమె కన్నులు సర్పమును చూచెను. తన స్వంత భర్త కంటె ఎంతో అందముగాను, సుందరముగాను అది కనబడెను. తన భర్త కంటే చాలా మనోహరముగా నున్నట్లు ఆమె చూచెను. కండరములు తిరిగిన వాని వలె వాడచ్చట నిలబడి యుండెను. వాడెంత గొప్పవాడో చెప్పుకోసాగెను. మొదటగా వాడు ఆమె మనసును తెరచెను. వెంటనే ఆమెలోని మానవ బుద్ధి ఇట్లనెను, "నిజంగా అది ఒక వింతగా లేదూ!"
73నేడు వాడు స్త్రీలను అలాగే చేయుచున్నాడు. కొందరు స్త్రీలు చక్కని భర్తలను కలిగి యుండినను, పెద్ద శరీర కండరములు గల వారిని చూచి చలించెదరు. అది సాతాను అని గుర్తుంచుకొనండి. అది అపవాది. స్త్రీ, పురుషులిరువురును ఆ విధంగా భ్రమించెదరు, ఆ హేతుబుద్ధి ద్వారా వాడు పనిచేయును. మనస్సాక్షి కదులును కాని దేవుని వాక్యమునకు మొదటి స్థానమిమ్ము.
74మనిషి పాపము చేయజాలడు. హల్లెలూయా! ఇది తాజాగా వచ్చుచున్నది. దేవుని వాక్య మును మొదటిగా ప్రక్కకు త్రోసివేసినప్పుడే ఒక మనిషి పాపము చేయగలడు. అది అవిశ్వాసము దేవుని వాక్యమును దేవుని సన్నిధిని మొదట అతడు ఎడబాసినప్పుడే పాపము చేయగలడు.
దేవుని వాక్యమును ప్రక్కకు త్రోసి తన ఆత్మకు హేతుబుద్ధిని నేర్పినందున హవ్వ పాపము చేయకలిగెను. "నా భర్త ఎన్నడూ ఈ సంగతులు చెప్పలేదు. దీనిని చేయరాదని ఆయన చెప్పెను గాని ఇది చాలా అద్భుతముగా ఉండునని నేను నమ్ముచున్నాను, ఎందుకంటే అంత తేటగా నాకు చెప్పెను," అని హవ్వ తలంచెను.
చూచారా? మెదటి యుద్ధము అక్కడే జరిగినది. ఆ యుద్ధమే అన్ని యుద్ధములకు, ప్రతి రక్తపాతమును కారణమయినది. ఏదేనులో హవ్వ దేవుని వాక్యమును నమ్మలేదు.
2COR 10:5
75దేవుని వాక్యములో ఒక చిన్న పొల్లును నమ్మనందువల్లనే ఈ కలవరమంతయూ వచ్చినది. దేవుని వాక్యమును నమ్మకుండా తిరిగి మనము అక్కడికే వెళ్ళుచున్నాము. మీరాలాగు చేయరాదు. నీ స్వంత మనస్సు, జ్ఞాపకములు, హేతుబుద్ధిని నీవు మూసివేయవలసి యున్నావు. హేతుబుద్ధిని పారవేయుము. దేనిగూర్చి మనము ఆలోచించక దేవుడు చెప్పెను గనుక వాక్యమును నమ్ముదును అని పలుకవలెను. దేవునికి నీకు మధ్యను ఒక వారధిని అది కట్టును. అప్పుడు నీకు దేవునికి మధ్య ప్రతి మార్గము తెరువబడును. అదే యుద్ధము, పోరాటములో ముందు రంగము అదే.
76మనము .22 రైఫిల్ వాడరాదు, అనుబాంబును వాడుదము. సరిగ్గా పని చేయదము. మనము దేవుని వాక్యమను అనుబా౦బును వాడుదము. అది వ్యాధిని, దయ్యమును కుడి ఎడమలకు కొట్టును. వాటిని అది నాశనము చేయును, లయము చేయును. ఓ, అది నాశనము చేయును. దైవికము కాని ప్రతి దానిని అది నిర్మూలించును. విశ్వాసపు బాంబును జార విడిచినప్పుడు ప్రతి వ్యాధి ప్రతి దయ్యము, ప్రతి రుగ్మత లయమగును, దేవుని వాక్యము దాని వెనుక నుండును.
"బ్రెన్హాం సోదరుడా అది నిజమేనా అది కొందరికి పనిచేయుచున్నది మరి కొందరికి పనిచేయదేల?" అని అందువు. సరయిన మార్గములో రానందునే. నీవు దానిని చూడగలవు, కాని నీవు ఈ విధంగా దానిని చూడవలెను, చూచారా.
3JN 1:2
77"హేతుబుద్ధితో నీవు రారాదు. ఇతర సంగతులతో నీవు రాకూడదు. దేవుని మార్గములనే తిన్నగా ప్రాణములోనికి రావలెను. దానిని నీవెట్లు చేయగలవు? చివరి మార్గము ఏమిటి? నీ జ్ఞానేంద్రియములను అనుభూతిని నీవు మరచిపోవలయును.
"ఆయన ఏదో తెలిసినవాని వలె మాట్లాడుచున్నాడే? వైద్యుడేమో నేను బాగవనని చెప్పెను గదా?" అనుకొందువు.
చూడు? అది తప్పు అక్కడ అపవాది నిలబడి యున్నది. దయ్యము నీలోనికి వీటిని తెచ్చుచున్నది. దానిని నీవు నమ్మవద్దు. హల్లేలూయా! దేవుని వాక్యమీలాగు చెప్పెను. "నీవు అన్నింటి కన్న ఆరోగ్యమందు వర్ధిల్లవలెనని నేను కోరుచున్నాను." అది నిజము. నీవు నిజ సైనికునిగా ఎట్లుండవలెను? "నీవు ఆరోగ్యమందు వర్ధిల్లవలెనని దేవుడు కోరుచున్నాడు."
78ఆ మార్గములు ఇచ్చటనే యున్నవి. వాటిని నీవు తెరచిన చాలును. వాటిని నీవు దాటిపోవద్దు. ఈ మనస్సు మొదలగువాటి ద్వారా సాతాను నీ యొద్దకు వచ్చిన ఎడల వాడు నీ ప్రాణములోనికి చొచ్చుకొనిపోవును. నీవు మొదట వాడిని రానిచ్చినచో, వాడు నీపై పూర్తి ఆధిపత్యము వహించును.
వాడేమి చేయును? నీ మనస్సును వాడుకొన చూచును. ఈ బాహ్య ద్వారమును ఉపయోగించుకొనును. ఏమిటి? చూపు, రుచి, వాసన, వినుట, ఊహ, మనస్సు, జ్ఞాపకము, హేతుబుద్ధి, అనురాగము మొదలగు వాటిని వాడుకొనును. ముందు ఆ చిన్న మార్గములను ఉపయోగించుకొని పెద్దదాని యొద్దకు వచ్చును. మొదట నీ మనస్సులోనికి వచ్చును. దానిని నీవు అంగీకరించవలసి యుండును.
GEN 3:6•
EXOD 15:26•
PS 103:3
79వినండి! అది మీ మీద పడును, కాని దానిని మీరు అంగీకరించు వరకు అది మీ యొద్దకు రాదు. సాతాను హవ్వ యొద్దకు వెళ్ళి, ఇట్లు చెప్పెను, "ఆ పండు రమ్యమైనది" అని చెప్పి - ఒక క్షణమాగెను. నీవు దేని కొరకు ఆగవద్దు. నీకు వర్తమానమున్నది! యేసు జీవించుచున్నాడు; దేవుడు స్వస్థపరచువాడు; అదే వర్తమానము. కారణము కొరకు ఆగవద్దు, దేనికొరకూ ఆగవద్దు."
కాని ఆమె ఒక్క క్షణము ఆగినది. సాతాను తిన్నగా మనస్సులోనికి నడిచి వచ్చినది. "ఇది సహేతకముగా యున్నదే" అనుకొన్నది. ఓ, అలాగు చేయరాదు! దేవుడు చెప్పినది గ్రహించుము.
GEN 12:4•
ROM 4:17,18
80అబ్రాహామునకు డెబ్బది-అయిదు, శారాకు అరువది-అయిదు సంవత్సరములప్పుడు వారికి బిడ్డ కలుగునని దేవుడు చెప్పెను. అప్పుడు అబ్రాహాము హేతుబుద్ది తొంబది సంవత్సరములు వచ్చినప్పుడు కూడా దేవుని వాక్యము నిజమని నమ్మెను. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచెను, చూచారా. అతనికి నిరీక్షణ యున్నది. అతనికి ఆ సమయములో ఎట్టి ఆశ లేదు.
"నేను బాగవుదును అనుకొనుచున్నాను. నేను నయమగుదునని ఆశించుచున్నాను. నేను పరిశుద్ధాత్మ పొందుదునని ఆశించుచున్నాను. నేను క్రైస్తవుడనని తలంచుచున్నాను. దీనిని చేయగలనను ఆశ నాకున్నది" అని నీవనుకొనవద్దు. అబ్రాహాము వాటివైపు ఎన్నడూ చూడలేదు. ఆమేన్! ఆశ నశించినా అతడు దేవుని వాక్యమును నమ్మెను. ఆశకు అవతల విశ్వాసమున్నది. విశ్వాసము అంతరంగము నుండి వచ్చును. వాడు నీలోనికి మనస్సు అను ద్వారము గుండా ప్రవేశించును, యుద్ధ రంగము అక్కడే యున్నది."
81ఈ ఉదయమున ప్రతి హృదయము ముందు అపవాది నిలబడి యున్నది. ఈ చిన్న బాలిక హృదయమందు వాడు నిలబడియున్నాడు. హృదయము ముందు వాడు నిలబడియున్నాడు. ఇక్కడ ప్రతి చోట వాడు నిలబడియున్నాడు. వాడిట్లు చెప్పుచున్నాడు, "ఓ, ఇటువంటివి ఇంతకు ముందే చూచాను. దీనిని ఇంతకు ముందే విన్నాను." వాడిని తరిమి వేయుడి. అదే మీరు చేయవలెను. వాడిని త్రిప్పి కొట్టండి. ఇక్కడ బైబిలు ఏమి చెప్పెను? వాటిని బయటకు కొట్టండి; అది నిజము, వెళ్ళగొట్టుము.
DAN 12:1•
MATT 24:21
82బోధకులమైన మనము ఎట్లున్నాము? మనము శిక్షణ పొందాము. మనమెట్టి శిక్షణ పొందియున్నాము? ఈ గొప్ప యుద్ధము కొరకు దేవుని శిక్షణ మనకు కావలెను.
మత్తయి 24 మరియు దానియేలు 12లో ఇంతకు ముందెన్నడూ సంభవించని మహాశ్రమ భూమి మీద కలుగునని చెప్పబడెను. సంస్కృతి మరియు విద్య మొదలగునవి దేవుని వాక్యమును హేతుబుద్ధితో చూచు కాలములో మనము జీవించుచున్నాము. ఇప్పుడే యుద్ధము జరుగుచున్నది. ఎవరు నిలబడుదురు? హల్లేలూయా! యుద్ధము ముందుకు సాగనైయున్నది; ఇప్పుడది సిద్ధముగా యున్నది.
1SAM 17:26,32
83అవతల మనకు ఎంత గొప్ప ప్రతి పక్షమున్నదో చూడండి. దావీదు వలె ఎవరిట్లు చెప్పగలరు? "సజీవ దేవుని సైన్యములను తృణీకరించుటకు సున్నతిలేని ఈ ఫిలిష్తియుడేపాటివాడు? నేను వెళ్ళి వానితో పోరాడుదును?" ఆమేన్! ఉదయ కాలమున దేవుడు అటువంటి స్త్రీ, పురుషులు కావలెనని కోరుచున్నాడు. "నేను దేవుని వాక్యమును తీసికొందును. ఆమేన్! ఏమైనా పరవాలేదు. ఎవరేమి చేసినా పరవాలేదు. వాటిని నేను లెక్కచేయను. మీరు సౌలు వలె భయపడుచున్నారు. మీరు వెనక్కుపొండి, దేవుని సైన్యము ముందుకు సాగును." ఆమేన్. అటువంటి యోధులు, విశ్వాస వీరులు శక్తివంతులు, అవగాహన గలవారు కావలెను. వారికి తెలివి అక్కర లేదు. వారికి విద్య అక్కరలేదు. వారు దేవుని సాధనములుగా ఉండవలెను. దేవుడు ఆ చిన్న సాధనములను తీసికొనును. ఆమె ఒక్క క్షణమాగి "సరే చూద్దాం" అని ఆలోచించింది.
JOHN 11:25
84ఈ ఉదయము ఈ స్త్రీని చూడండి. ఈ ఉదయమున ఈ స్త్రీని చూడండి. వైద్యులు ఆమె జీవితము ముగియనున్నట్లు చెప్పిరి. ఏదియూ జరుగదు. వైద్యులను నేను ఖండించుట లేదు. అతడు శాస్త్రీయ మనిషి, బాలుని శరీరమును వ్యాధి జయించినట్లు అతడు చూచి యుండెను. అది నిజమే. దానిని ఆపు మందు అతని యొద్ద లేదు. ఆ స్త్రీ కాన్సరు జయించెను. మరణమే వారికి నిశ్చయము కాని మన ప్రధానాధిపతి (హల్లేలూయా!) ఈ మహా సైన్యాధిపతి, ఆయనే పునరుద్దానమును మరియు జీవమునై యున్నాడు; ఆయనను ఏదియూ జయించజాలదు. హల్లేలూయా!
85ప్రధానాధిపతిలోనే సైన్యము యొక్క తెలివి యంతయు ఇమిడియుండును. జర్మనుల మేథస్సు అంతయూ రోమెల్ లోనే దాగి యుండెను - హిట్లరులో కాదు. అది సత్యము ఐసన్ హోవర్, మొదట సైన్యాధిపతులు ఆజ్ఞలోనే యుద్ధ జయాపజయములు దాగియండెను. వారే ముందుడిరి.
మీ సైన్యాధిపతిని మీరు వెంబడించుడి, ఆయన నిజమగు సైన్యాధిపతియైనచో, ఆయన నాలుగు నక్షత్రములు సైనికాధిపతి యైనచో ఆయన అట్టివాడని రుజువైనచో ఆయననే వెంబడించుడి. నీకది తప్పుగా కనబడినా గాని, ముందుకు వెళ్ళుము; ఆయన చెప్పినట్లు చేయుము!హల్లేలూయా!
REV 1:18
86మనకు అయిదు నక్షత్రముల సైన్యాధిపతి యున్నాడు. ఆయన యేసు మనకును అయిదు నక్షత్రములు ఇచ్చియున్నాడు, విశ్వాసము - F-a-i-t-h. ఆయన ఎన్నడూ ఒక్క యుద్ధమును కూడా ఓడిపోలేదు. హల్లేలూయా! ఆయన మరణమును పాతాళమును సమాధిని జయించెను. మార్గములో నుండి అపవాదిని తరమ౦డి. ఆయన ప్రధాన సైన్యాధిపతి. కాబట్టి దయ్యము అసలు ఎక్కడా కనిపించదు.
87ఎన్నడూ లేనట్టి గొప్ప పోరాటము ఇప్పుడు మన ముందు సిద్ధముగా యున్నది. నిశ్చయంగా. ఓ, హల్లేలూయా! నేను దాని గూర్చి ఆలోచించుచున్నాను. ఆయన చేయుచున్న క్రియలను నేను నిలబడి గమనించుచున్నాను. ఆయన ఎన్నో సంగతులను బయలుపరచి బయటపెట్టుచున్నాడు. "ఇది ఆ విధంగా ఉండదు మరియు ఈ విధముగా ఉండును" అని చెప్పుచున్నాడు. అలాగే జరుగుచున్నది. ఈ గొప్ప సైనాధిపతి ఎవరు? ఆయన ఫలాని డాక్టరు అని నేను చెప్పును. సైన్యాధిపతి చెప్పినదే నేను చెప్పెదను. ఆయన మన రక్షణకు నావికుడు. హల్లేలూయా! రక్షణ అనగా ఏమిటి? విమోచన! మహిమ! ఆయనే మన విమోచకుడు నాయకుడు.
88మహాపోరాట ఘడియ సమీపమున యున్నది. హల్లేలూయా! యుద్ధ సామాగ్రితో సైనికుడు ప్రకాశించుచున్నాడు. రంగులు వెల్లివిరియుచున్నవి. ఈ ఉదయమున ఈ సంఘములో విశ్వాసము మరియు సందేహము ఒకదాని పైకి ఒకటి లేచియున్నవి. ఒక పక్షమున సందేహము, మరోక పక్షమున విశ్వాసము నిలబడి యున్నవి. సైనికులారా! మీ విధి నిర్వహణలో నిలిచి యుండండి! హల్లేలూయా! మన ప్రధానాధిపతి ఉదయ నక్షత్రము, ముందుకు నడిపించుచున్నాడు. ఆయన ఎన్నడూ వెనుతిరుగడు. వెనుకంజ అను మాటనే ఆయన ఎరుగడు. ఆయన వెనుకకు మళ్ళవలసిన పని లేదు. ఆమేన్! నిశ్చయముగా!
ముందెన్నడూ లేని మహా పోరాటము ఇక్కడ ఇప్పుడున్నది. (అవును) ఇది జీవము మరియు మరణములకు మధ్య - వ్యాధి మరియు స్వస్థతల మధ్య - విశ్వాసము మరియు సందేహం మధ్య జరుగుచున్నది. మీ ఈటెలను సైనికులారా, యుద్ధ సామాగ్రిని పదునుపెట్టండి.
HEB 4:12
89దేవుడు తన సైనికులను సిద్ధపరచుచున్నాడు. ఆమేన్! దేవుడు తన సైన్యమును అభిషేకించుచున్నాడు. అమెరికా తన సైనికులను అతి శ్రేష్టమగు వస్త్రములతో, శిరస్ట్రాణములను, డాళ్ళను, యుద్ధ టాంకులను సామాగ్రిని పదునుపెట్టండి. దేవుడు తన సైనికులను సిద్ధపరచుచున్నాడు. హల్లెలూయా! ఎటువంటి ఆయుధములను మనము వాడుచున్నాము? ఆత్మ ఖడ్గము కంటెను వాడిగలదై (హెబ్రి 4), ఎముకలు, మూలుగులోనికి దూసికొని పోవుచూ మనస్సులోని ఆలోచనలను బయటకు తెచ్చుచున్నది. ఆయన వాక్యమును నమ్మవలెను, అదే మన దేవుని కవచము.
90హవ్వకు ఆయన అదే డాలును ఇచ్చెను, కాని ఆమె దానిని విడిచిపెట్టెను. ఆమె ఏలాగు దానిని పాడుచేసినది? హేతుబుద్ధికి అవకాశము ఇచ్చినందువల్లనే. దేవుని వాక్యమును నీవు హేతుబుద్ధితో ఆలోచించరాదు. దేవుని వాక్యమును తీసికొనుము. దాని గూర్చి ఏమీ సందేహించవద్దు; దాని విషయమై కారణాలు ఆలోచించవద్దు; అది దేవుని వాక్యము, అది స్థిరపరచును. అది నిత్యము స్థిరము. నా భావము గ్రహించారా? అది దేవుని వాక్యము. దానిని దేవుడు వాగ్దానము చేసెను. అలాగని దేవుడు చెప్పెను.
91"నీకు బిడ్డ కలుగునని ఎట్లు తెలియును?" అని వారు అబ్రాహామును అడిగిరి.
"దేవుడాలాగు చెప్పెను!" అది స్థిరపరచును.
"అయితే ఇంకా నీకెందుకు జన్మించలేదు?"
"ఎప్పుడో నాకు తెలియదు గాని తప్పక నేను పొందుదును. అది దేవుని మాట. ఏమాత్రము నేను సంశయించను."
"నీవు ఏ దేశము నుండి వచ్చితివో అచ్చటికే తిరిగి పోకూడదా?"
"నేను ఈ దేశములో యాత్రికుడను మరియు పరదేశిని." ఆమేన్. "వాగ్దానము చేసినవాడు దేవుడు; ఆయన పంపిన ఈ దేశములోనే ఆయన నాకు కుమారుని ఇచ్చును."
92హల్లేలూయా! ఈ పరిశుద్ధాత్మ వాతావరణములోనే దేవుడు నిన్ను స్వస్థపరచును. ఇక్కడికి ఆయన నిన్ను పంపెను. దేవుడు దానిని నీకు ఇచ్చును. నమ్మిక మాత్రముంచుము! ఆమేన్! నీ ప్రాణము మరియు శరీరము, మనసాక్షి, అనుభూతుల యొక్క ద్వారములను తెరువుము. దేవుని మాటలను చొచ్చుకొనిపోనిమ్ము మొదట ఆ మనస్సును తీసివేయుము. అదియే పోరాట రంగము. ఆ మనస్సును తెరువుము. అదియే యుద్ధ రంగము. అందులోనే యుద్ధ రంగము. అందులోనే యుద్ధము ఆరంభమగును. అదే అగ్రభాగము. దానిలో నుండి ప్రతి సందేహమును తీసివేయుము. ఆమేన్! "నా సందేహములను ఇప్పుడు తీసివేయుచున్నాను; దేవుని వాక్యమును నమ్ముచున్నాను. సాతానా! నీ మీదికి ఇదిగో వచ్చుచున్నాను," అని చెప్పుము. ఒకటి జరుగనైయున్నది. నిశ్చయంగా జరుగును. అవును!
HEB 1:13,14
93ఆయన తన ఆత్మతో తన దాసులను అభిషేకించును. ఆయన దూతలను వారి యొద్దకు పంపును. కొన్నిసార్లు జనులు దేవదూతలను గూర్చి హేళన చేయుదురు. ఒక్క నిమిషము వాక్యమును చూడండి. హెబ్రి 1వ అధ్యాయము 14 వచనము చూద్దాం.
వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?
"'నా కుడి పార్శ్వమున కూర్చొనుడి' అని ఆయన ఏ దూతలతో చెప్పెను?" — దేవుని యొక్క దూతలు అందరితో చెప్పెను.
1KGS 18:36,37•
AMOS 3:7•
HEB 1:14
94దేవుడు తన దూతలను పంపునని ఇక్కడ బైబిలు మనకు చెప్పుచున్నది. మహిమ! వారెవరు? సేవ చేయు ఆత్మలు. మహిమ! ఎక్కడికి ఈ సేవ చేయు ఆత్మలను పంపును? దేవుని సన్నిధిలో నుండి, ఏమి చేయుటకు? తన వాక్యమును ప్రకటించుటకు. ఆమేన్! ఏదో ఒక శాఖ యొక్క వేదాంతమును ప్రకటించుటకు కాదు గాని, ఆయన వాక్యమును ప్రకటించుటకు. అందుకొరకు ఆయన తన సేవ చేయు ఆత్మలను పంపించును.
వారినెట్లు మనము తెలిసికొందుము? యొహోవా వాక్కు, ప్రవక్తల యొద్దకు వచ్చునని బైబిలు చెప్పెను. అది నిజమా? ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ దేవదూతలు ఆయన వాక్యమును ప్రకటించును. ఆత్మ మరియు వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చును. ప్రవక్తలు దేవుని వాక్యమును కలిగియుండిరి. ఆ కారణము చేతనే వారట్టి అద్భుతములు చేయకలిగిరి. ఆ మనుష్యులలో ఏమీ లేదు గాని, వారిలో దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మయుండెను.
ఆయనేమి చేసెను? ప్రతి మార్గమును శుభ్రము చేసెను. దేవుడా మనిషిని ఎన్నుకొని పరిశుద్దాత్మతో అభిషేకించెను. అంతేగాని వారివలన ఏమీ కాదు. దర్శనములో చూడకుండా వారెన్నడూ ఏమియూ చేయలేదు. కర్మెలు కొండ మీద ఏలియా ఇట్లనెను, "నీ ఆజ్ఞ చొప్పున ఇదంతయు చేసితివి. ప్రభువా, ఇప్పుడు నీవే దేవుడవని తెలిసికొననిమ్ము." ఓ! దేవునికి మహిమ!
95నేను అనేకసార్లు దానిని చూచాను. దేవుని ఆత్మ ఒక స్థలమును తాకుట మీరు చూచినప్పుడు, ఆ స్థలము అభిషేకించబడును. ఈ ఉదయమున ఇక్కడ ఉన్న చిన్న గుంపు మనస్సులోని ప్రతి సందేహమును తీసివేసికొనవలెను. మృతులు తిరిగి లేచుచుండగా, కుంటివారు నడచుచుండగా, గ్రుడ్డివారు చూచుచుండగా, చెవిటివారు వినుచుండగా ఇక నీకు సందేహమేల?
MARK 16:20•
HEB 13:8
96ప్రభుని దూత, ఆయన పఠము ఈ గోడ మీద వ్రేలాడుచున్నది. ప్రతి చోటను సైన్సు దానిని రుజవు చేసెను. ఆయనేమి చేసెను? వాక్యముతో నిలచియుండును. ఏమిది? అది ప్రతి దయ్యమును నరుకును. అవును. వాక్యముతో నిలిచియుండు వాక్యోపదేశకులను అభిషేకించుటకు దేవుని సన్నిధానము నుండి పరిచారక దూతలు పంపబడును. సూచక క్రియలతో ఆయన తన వాక్యమును స్థిరపరచును. యేసు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని చూపించును.
సైన్సు ద్వారాను, ఆత్మ సంబంధముగాను, వస్తు సంబంధముగాను ఆయన రుజువగుచుండగా, ఇక ఎట్లు సందేహించుదుము? అన్ని విధములుగా ఆయన రుజువాయెను. ఇక్కడ ఆయన రుజువాయెను. ఏమిటి విషయము? అది మన మనస్సులోనే యున్నది. మనము మన మనస్సులను తెరచి సందేహములను బయటకు వెళ్ళగొట్టవలెను. జరుగునో లేదో అను సందేహము వద్దు.
97నేను తరచుగా ఇది చెప్పుచుందును. శారా యొక్క స్త్రీ ధర్మము ఆగిపోయెను. (నా భావము గ్రహించారా?) ఆమెకు అరువది-అయిదేండ్లు. స్త్రీ ధర్మము ఆగి బహుశా పదిహేను లేదా ఇరవై సంవత్సరములు కావచ్చును. అబ్రాహాము శారాతో, "ఏమైనా మార్పు వచ్చినదా?" అని అడిగి యుండును.
"ఏమీ మార్పు రాలేదు."
"అయినా ఏమీ సందేహించవద్దు; ఏమయినా మనకు బిడ్డ కలుగును. ఆయన వాగ్దానము చేసి ఒక నెల అయినది. నీలో ఏమైనా మార్పు కలిగినదా? రక్తము ఏమైనా మారి, యవ్వనత్వము వచ్చినదా?"
"ఏమీ మార్పు రాలేదు అబ్రాహాము. ఏ సూచన కనిపించుట లేదు. గత కొద్ది సంవత్సరాల నుండి ఎట్లున్నానో, ఇప్పుడును ఆ విధంగానే యున్నాను. ఏమీ మార్పులేదు."
"దేవునికి మహిమ కలుగు గాక! ఏమైనా మనకు బిడ్డ కలుగును."
MATT 12:39•
MATT 16:4
98"చూడు, అబ్రాహాము. ఆయన నీకు నిజంగా వాగ్ధానము చేసినచో ఆయన మనకు ఏదో ఒక గురుతు ఇచ్చియుండును గదా? నిశ్చయంగా ఒక సూచన ఇచ్చును." హల్లెలూయా!
బలహీనమగు, చెడ్డతరము సూచన నడుగుచున్నారు. అది నిజము! అతనికి ఒక సూచన ఉన్నది. ఏమిటది? దేవుని యొక్క వాక్యము. అదే ఒక సూచన. దేవుడు నీ బిడ్డను ఎట్లు స్వస్థపరచును? దేవుని వాక్యము చెప్పినందున, నాకు అనుభూతి ఉన్నా - లేకపోయినా, ఏమి జరిగినా - జరగకపోయినా దేవుడాలాగు చెప్పెను గనుక జరుగును.
99అబ్రాహాము తనకు కలిగిన వాటన్నిటితో దేవుడు చూపించు దేశమునకు బయలుదేరెను.
"ఎక్కడికి వెళ్ళుచున్నావు?"
"నాకు తెలియదు (ఆమేన్!) కాని వెళ్ళుచున్నాము" అన్నీ మూట కట్టుకొని వెళ్ళిపోయెను. హల్లెలూయా! అదే నిజమగు దేవుని వాక్యము. అతనిని ఏది పట్టుకొన్నది? దేవుని వాగ్ధానము, దేవుని వాక్యము. "దానిని మేము పొందబోవుచున్నాము."
GEN 12:1
100నీ జనులలో నుండి బయటికి రమ్ము అబ్రహామా, వారు సందేహించు జనులు, అవిశ్వాసులు, నిన్నును వారాలాగే చేయుదురు. వారిలో నుండి బయటకు వచ్చి, నిన్ను నీవు ప్రత్యేకించుకొని, నాకై జీవించుము. నీ మనస్సును, భావములను విడిచిపెట్టుము. నీ మనస్సును తెరువుము. అది నేనే అని జ్ఞాపకము చేసికొనుము. వచ్చి, నాతో జీవించుము." ఆమేన్!
ఈ ఉదయమున అబ్రాహాము యొక్క ప్రతి సంతానమును దేవుడు అదే రకమగు జీవితమును పిలుచుచున్నాడు. ప్రపంచ వ్యాప్తముగా మహా యుద్ధము ఇప్పుడు జరుగుచున్నది. దేవుడు తన బిడ్డలను దేనినుండి వేరుకావలెనని కోరుచున్నాడు? చూపు, రుచి, వాసన, తాకిడి, వినికిడి ఊహలు, మనస్సాక్షి, జ్ఞాపకములు, హేతుబుద్ధి, అనురాగము మొదలగు వాటి నుండి వారి మనస్సులు తెరువబడి, దేవుని వ్యాములోనికి ప్రవేశించును గాక, వాక్యముతో ముందుకు సాగిపోయెదరు. వారే నిజమగు సైనికులు.
101నక్షత్రములు ఆ విధంగానే నిలబడి యున్నవి. సూర్య కుటుంబములు మారలేదు. రాశి చక్రము మారలేదు, వేకువ చుక్క ప్రతి ఉదయము తన విధిని నెరవేర్చుచున్నది. భూమి సృజించబడిన నాట నుండి ఇప్పటి వరకు అలాగే యున్నది. సంధ్యా నక్షత్రము దాని స్థానములో యున్నది. ప్రతి నక్షత్రము చిన్న ఉల్క అది ఉండవలసిన చోటనే ప్రతి రుతువులోను ఉంటున్నది. ఉత్తర నక్షత్రము నిలకడగా నిలబడి యున్నది. అది కదులుట లేదు. హల్లెలూయా! ప్రతీది ఉత్తర నక్షత్రము చుట్టూ పరిభ్రమించుచున్నవి, ఎందుకనగా అది భూమి మధ్యలో యున్నది; అదే క్రీస్తు, ఆమేన్.
EXOD 17:11,12•
HEB 1:3•
HEB 8:1
102ఆయనచ్చట నిలబడి ఒక గొప్ప సైన్యాధిపతి వలె తన సైన్యమునకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మోషే కొండ మీద చేయి ఎత్తగా ఇశ్రాయేలీయులు యుద్ధములో ముందుకు సాగిపోయిరి. అతడు తన చేతులు ఎత్తెను. సూర్యాస్తమయము వరకు అతడు ఆ విధంగానే నిలబడి యుండెను. వారతని చేతులను ఎత్తవలసి వచ్చెను. క్రీస్తుకు మోషే సాదృశ్యము. ఆయన చేతులు సిలువకు కొట్టబడినట్లే మోషే చేతులు పైకెత్తబడినవి. హల్లెలూయా! నేడు అతడు మహిమలో దేవుని ఎదుటకు ఆరోహణమై యున్నాడు. మహోన్నతుని యొద్ద నివసించుచున్నాడు (ఏమి జరిగినా నేను భయపడను) దేవుని వాక్యము స్వతంత్రము నిచ్చును. ఆమేన్!
103గ్రుడ్డులోని పిల్ల అరచుటకు భయపడితే ఎట్లు౦డును? గ్రుడ్డును పొడుచుటకు భయపడినచో ఏమగును? ఆ గుల్లను చిన్న కోడిపిల్ల పొడుచుట భయపడరాదు. ఆ గుల్లను పొడవ వద్దనది తల్లి చెప్పునా? దానిని పొడిచి రంధ్రము చేసికొని బయటకు రమ్మని ప్రకృతియే దానికి నేర్పును.
"అద్భుతములు జరుగు రోజులు గతించాయి. నీకు నీవు హాని చేసికొనుచున్నావు. నీవు మత మౌడ్యునిగా తయారగుచున్నావు," అని అన్ని సంస్థలు చెప్పనిమ్ము.
నీకు వీలయినంత బలముగా గుల్లను పొడువుము. హల్లెలూయా! "సాతానా, వెళ్ళిపో; నేను ఇక్కడికి వచ్చుచున్నాను. ఇక ఏ మాత్రము ఇక్కడ పరుండను. ఇక ఇక్కడ నేను కూర్చొనను. ఈ ముసలి అపవాది నేల మీద ఇక నేను నిలబడను; ఈ ఉదయము నేను బయటకు పొడుచుకొని వచ్చుచున్నాను. ఆమెన్! నేను ఒక పక్షిరాజును!" ఆమెన్! హల్లెలూయా!
JOHN 8:36
104ఆ చిన్న పక్షిరాజు, తన యొక్క మెడతో పొడుచుచు ఆ గుల్లను కొట్టుచున్నది, ఆ గుల్ల ఎంత కఠినముగా ఉన్నా లెక్క లేదు, దాని గుండా అది పొడచుచున్నది. మొదటి విషయము మీకు తెలుసా, అది తన యొక్క రెక్కలను చిన్నగా కొట్టును. అది బాగానే ఉన్నది.
నీవు బయటకు పొడుచుకొని రమ్ము; దానినెట్లు చేయుదువా? "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అని కేకలు వేయుము. చివరకు అది తాజా గాలిని పీల్చును. "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అని చెప్పి నీ తలను బయటకు పెట్టుము. "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." ఇంకా బలముగా త్రోయుము. నీవు బయటకు వచ్చుచున్నావు. తిరిగి అదెన్నడూ గుల్లలోనికి వెళ్ళదు. ఆమేన్! అది స్వేచ్చను పొందియున్నది. వాక్యము లోపలకు చొచ్చుకొని పోయినపుడు మనస్సు, భావములు, మనస్సాక్షి తెరువబడును. (ఓ, దేవా, కృప చూపుము), మరి దేనికి ఎన్నడూ బానిసవు కావు. నీవు స్వాతంత్ర్యము పొందెదవు. కుమారుని ద్వారా స్వేచ్చను పొందినవాడు ఇక గుల్లలో యుండడు.
JOHN 8:12
105నీ శాఖ నిన్ను ఎన్నడూ వెనక్కు పిలువదు; అపవాది నీకు ఎన్నడూ ఏమీ చేయదు. అది నిన్ను చూచి బుస కొట్టును మరియు ఊళ పెట్టును, కాని నీవు రాజ మార్గములో అమిత వేగంతో దూసుకొని పోవుచున్నావు. రాజు యొక్క మార్గములో నీవు పరుగిడుచున్నావు. సిలువ యొక్క అభిషేక సైనికునివి. "యేసే లోకమునకు వెలుగు" అని పక్షిరాజులన్నియూ విశ్వాసముతో ప్రకటించుచూ, రాజ మార్గములో పరుగిడును.
HEB 1:14
106అవును! నిశ్చయంగా! ఈ పరిచారక ఆత్మలు దేవుని సన్నిధి నుండి పంపబడినవి. దేనికి పరిచారము చేయును? దేవుని వాక్యమునకు — ఏదో వేదాంతమునకు కాదు, ఈ సేవకాత్మలు సేవకై దేవుని యొద్ద నుండి పంపబడినవి. వాక్యము కాకుండా మరి దేనికో అవి పరిచర్య చేసిన యెడల అవి దేవుని యొద్ద నుండి పంపబడలేదు, ఎందుకనగా ఆయన వాక్యము పరమందు స్థిరపరచబడియున్నది. దేవుడు తన వాక్యమును కావలి యుండును. వాక్యమునకు సేవ చేయుటకు మాత్రమే ఆయన తన సేవక దూతను పంపును.
పెద్ద డి.డి.డి. లేదా పి.హెచ్.డి. పట్టా పొంది, కాలరును వేరేగా త్రిప్పియున్న వ్యక్తిని ఆయన ఎన్నడూ పంపడు. వారు వచ్చి అద్భుతములు జరుగు రోజులు అయిపోయినవని చెప్పెదరు. వారు దేవుని యొద్ద నుండి వచ్చిన వారు కారు. అది దేవుని వాక్యమునకు విరోధము. ఆమేన్! వాక్యాత్మకు సేవ చేయు వారినే ఆయన పంపును. ఆమేన్. (నాలుగయిదు సంగతులు చెప్ప వలసినవి యున్నవి. గాని వచ్చే ఆదివారము చెప్పెదను. మంచిది!)
107సాతాను మరియు వాని దూతలు అభిషేక్షించబడిరి. ఆ దేవుని దూతలు అభిషేక్షించబడి వాక్యమును మీ యొద్దకు తీసికొని వచ్చుట వలన మీరు నమ్ముచున్నారు. నిజమగు దేవుని ప్రవక్త దేవుని వాక్యమును నిరాకరించుట ఎన్నడైనా చూచితిరా? లేదండి! వారి దినములలోని సంస్థలు వారిని తప్పుగా ఎత్తి చూపినా గాని, వారు ఆయన కొరకు ఒంటరిగా నిలబడిరి.
1KGS 22:3,6-8
108ఆనాడు మీకాయాను చూడండి, అతడు ఇమలా కుమారుడు. (చూచారా?) పరిశుద్దుడని వారు హేళనగా పిలిచారు. నాలుగు వందల మంది అభిషేకము పొందిన ప్రవక్తలున్నారు, వారిని బాగా పోషించారు, పెద్ద డిగ్రీలు ఇచ్చారు, ఉన్నత విద్యనభ్యసించారు, గొప్ప పండితులు, వారు రాజూను యుద్ధమునకు పొమ్మనిరి. దేవుడు మీకు తోడై యుండుననిరి. అది మనదే; యోహోషువా దానిని మనకిచ్చెను, "వెళ్ళి దానిని తీసికొండి" అని చెప్పిరి. అది ఖచ్చితముగా నిజమే.
"ఇంకొకడు ఇక్కడెవరూ లేరా?" అని యెహోషాపాతు అడిగెను. నాలుగు వందల మంది ఇక్కడున్నారు; వారి మాటను ఎందుకు నమ్మకూడదు? అతడు అన్నాడు, "కాని ఖచ్చితముగా, మరో ప్రవక్త ఎక్కడో ఉన్నాడు."
"ఒక్కడున్నాడు, కాని ఓ, అతడంటే మాకసహ్యము" అనెను.
"అతని మాటయే నేను వినగోరుచున్నాను," చూచారా. ఇక్కడికి అతని తీసుకొనిరండి. అతడు ఏమి చెప్పబోవుచున్నాడో విందుము," అనెను.
1KGS 22:14
109వారు అతని యొద్దకు వెళ్ళిరి, ఇట్లు అతనితో చెప్పిరి, "చూడు! ఈ ఉదయము నీవు రాజు యొద్ద ప్రసంగించవలెను. పాలస్తీనాలోని సేవక బృందమంతటికి నీవు బోధించవలెను. ఇప్పుడు నీవు గుర్తుంచుకో, వారు ఈలాగు చెప్పిరి; నీవునూ అదే విషయము చెప్పవలెను; దానినే నమ్ముదును అని నీవు చెప్పవలెను."
వారు అలంటివాడిని కలిగి లేరు! ఆ మనుష్యుడు ఆ పాత హేతువాదము నుండి దూరముగా ఉన్నవాడు. అతడు మనస్సును బట్టి నడచు వ్యక్తి కాదు. అతడు అంతరంగమును శుద్ధి చేసికొనిన వ్యక్తి. (చూచారా?)
నీవును వారు చెప్పినదే చెప్పినయెడల, వారు నిన్ను జిల్లా పెద్దగా చేయుదురు. స్థానిక జిల్లాలో నిన్ను ప్రధానునిగా చేయుదురు. వారితో నీవు ఏకీభవించు" అనిరి. అలాగు చేయువాడు నిజమగు దైవజనుడు కాదు.
అతని యొక్క అంతరంగము శుద్ధిపొందెను, సమస్తము పవిత్రమాయెను; అతని మనస్సు దేవుని వాక్యమునకు తెరువబడెను; దేవుని వాక్యము మాత్రమే అతడు నమ్మును. అదే సేవక ఆత్మ; "ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను, కాని దేవుడు నాతో చెప్పమన్నదే చెప్పెదను." కాబట్టి వారు ఆ రాత్రి వేచియుండిరి; అతనికి ఒక దర్శనము వచ్చెను.
1KGS 21:19,23•
1KGS 22:15,17
110మీకాయా లేఖనములను ఆ మరుసటి ఉదయము పరిశోధించుచుండెనని నేనూహించుచున్నాను. "ఇది వారు చెప్పిన దానికి విరోధముగా యున్నది. కాబట్టి ఎక్కడో పొరపాటున్నది. ప్రవక్తయగు ఏలియా గతంలో ఏమి చెప్పెనో చూద్దాం, ఎందుకనగా అతడు ప్రవక్తయుని మనకు తెలియును. ఏలియా యొద్దకు యోహోవా వాక్యము వచ్చెను. అదెట్లున్నది? నీతిమంతుడగు నాబోతు రక్తమును ఒలికించినందున యెజెబెలు రక్తమును కుక్కలు నాకును" అని చెప్పెను. అతనికి వచ్చిన దర్శనముతో ఈ వాక్యము సరిపోయినది. ఆ ముసలి ఆహాబు యొద్దకు ఇప్పుడు వెళ్ళుచున్నాడు.
అతడు నేరుగా నడచి వెళ్ళి మరియు చెప్పెను, "మీరు వెళ్ళుడి, అయితే ఇశ్రాయేలు…" చూచారా, అతడు వెళ్ళి తన దర్శనమును చెప్పుటకు సిగ్గుపడలేదు, ఎందుకనగా అది యోహోవా వాక్కు. అది అక్షరాలా నెరవేరునని అతనికి తెలియును. అతడు దేవుని వాక్యమునకు తన హృదయమును తెరచెను. దేవుని వాక్యమునకు తన మనస్సు తెరచెను. అది అక్షరాలా దేవుని వాక్యమని ఎరిగి యుండెను.
111నేను కూడా మీకాయా వలె ఉండిన బాగుండునని నీవు తలంచవచ్చు. నీవును మీకాయా వలెనె యున్నావు. నీ మనస్సును తెరచినప్పుడు నీవును అలాగే యుండగలవు. ఈ ఉదయము నేను ఏది చెప్ప ప్రయత్నించుచున్నాను? దేవుని వాక్యము చూచారా? నీ మనస్సు తెరువుడి! అప్పుడు నీవు స్వస్థత గూర్చిన నిశ్చయత పొందగలవు.
"మంచిది, అది ఏమిటి? దేవుని యొక్క వాక్యము."
నిశ్చయంగా, అది దేవుని యొక్క వాక్యము. అద్భుతములు జరుగు దినములు గతించెనని ఇతడు చెప్పినా నీవు వినవు. దేవునిని ముందు పెట్టుము. దేవుని వాక్యము వచ్చుచున్నది. ఆయన పలికెను గనుక అలాగే జరుగును.
GEN 3:4
112సాతాను ఏమి చేయును. మరి కొందరిని అభిషేక్షించును. సాతాను తన సేవకులను అభిపేకించును. ఓ, నిశ్చయంగా! వాడు తన సేవకులను అభిషేకించును. దేనితో వాడు వారిని అభి షేకించును? అవిశ్వాసముతో, దేవుని వాక్యమును నమ్మకుండునట్లు మానవులను చేయుటకు సాతాను, వాడి దూతలు పనిచేయును. ఆదికాండము 3:4లో అది చూడగలరు.
ఒక్క నిముషము దానిని తీసి చూద్దాం. అది సాతాను యొక్క మొదటి తంత్రము. వాడు చేసిన మొదటి పని అదే; వాడు అన్ని సమయములలోను అవే తంత్రములను ఉపయోగించును. అవేమిటో చూద్దాం. వాక్యముతో వాడు ఏకీభవించడు; వాక్యమును స౦పూర్తిగా తీసి కొనకుండా, కొద్ది భాగమును తీసికొని వాడు కోరిన విధముగా ఆమెకు తప్పుగా అర్థము చెప్పెను.
113ఆదికాండము 3 మరియు 4లో చూడండి. వారు ఇప్పుడును అలాగే చేయును. మంచిది.
నీవు నిశ్చయంగా చావవని సర్పము స్త్రీతో చెప్పెను:
"… నిశ్చయముగా చావవు": దానినెట్లు త్రిప్పి చెప్పెనో చూడండి? "ఓ, అద్భుతములు జరుగు దినములు అయిపోయినవని మేము నమ్ముదము. పెంతెకొస్తునాటి వలె జనులు నేడు పరిశుద్దాత్మను పొందనవసరములేదని మేము నమ్ముచున్నాము. ఏ విధంగా బాప్తిస్మము పొందినా తేడా లేదు." చూచారా అపవాది తంత్రములు?
"నీవు బాగవవని వైద్యుడు చెప్పెను గనుక ఇక అంతే" అని అందురు.
GEN 3:1
114వైద్యుడు శాస్త్రీయ వరుసలో పని చేయును. మనిషి జీవితమును రక్షించుటకు వైద్యుడు శాయశక్తులా ప్రయత్నించును. చేసినదంతా చేసిన తరువాత ఇక అతడు చేయకలిగినది లేక బ్రదుకవని చెప్పును. ఆ విషయంలో అతడు యథార్థపరుడే.
తెలివినిచ్చు చెట్టు మంచిదే, కాని నీ హద్దును నీవు దాటిపోయినప్పుడు అది మంచిది కాదు. ఆమేన్. అంతవరకే అది పనిచేయును. అవును!
ఇప్పుడు సాతాను పన్నాగములు ఏమిటి? ఇక్కడ ఏమి చెప్పెను? 2వ వచనము చూడండి. 1 నుండి 3 వచనములు చదివెదను:
దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను.
GEN 3:2-4
115ఇప్పుడు వాడి మాటలు వినండి, వాక్యమునకు ఎట్లు సున్నము పూయునో చూడండి? ఏమి చేయ ప్రయత్నించుచున్నాడు? ఆమె మనస్సును ఆక్రమించగోరుచున్నాడు, చూచారా. అక్కడ వాక్యము కంచెముగా యుండినది. సాతానును ఏ కంచె మీ చుట్టూ వేయనీయవద్దు, చూచారా. మీ హృదయములో దేవుని వాక్యమును కంచెగా వేయుడి. మీకాయాను మీరు ఇప్పుడు గమనించండి.
… అందుకు స్త్రీ - ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును.
అయితే తోట మధ్య నున్న చెట్లు ఫలములను గూర్చి దేవుడు - మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను.
చూచారా? అది వాక్యము; ఆమె వాక్యమును తిరిగి వాడికి చెప్పెను. ఇప్పుడు గమనించండి!
అందుకు సర్పము - నీవు నిశ్చయంగా చావవని చెప్పెను.
116వాడి పన్నాగములను చూచారా? ఏమి చేయ ప్రయత్నించుచున్నాడు? ఆ ప్రశస్త స్త్రీని, మొదటి మానవుని, దేవుని కుమార్తెను వాక్యము గూర్చి అవిశ్వాసపడునట్లు చేయుచున్నాడు. ఆమెను ఆ విధంగా చేయ ప్రయత్నించుచున్నాడు. నిన్నును వాడు ఆ విధంగానే చేయ ప్రయత్నించును. ప్రతి ఒక్కరిని వాడు ఆ ప్రకారమే చేయు జూచును — నిన్ను అభిషేకించును. నీవు చేయవలసిన ఒకే కార్యము (ఇప్పుడు, నీకు స్వేచ్చ ఉన్నది; నీవు కోరినట్లయితే స్వీకరించవచ్చును), అయితే నీవు దానిని బయటకు తన్నవలెను!
ఆ ఒక్క క్షణము హవ్వ దాని మాటలు వినుటకు ఆగకుండా యుండినయెడల ఎంత బాగుండేది? దేని కొరకు ఆగవద్దు! ఆగవద్దు!
2KGS 4:24,29
117ఏలియా గెహజీతో అదే చెప్పెను, "నా దండమును తీసికొని వెళ్ళి, చనిపోయిన ఆ బాలుని మీద ఉంచుము; ఎవరైనా నీతో మాట్లాడిన యెడల ప్రత్యుత్తరమీయవద్దు. ఎవరైనా నిన్ను ఆప ప్రయత్నించెదరు గాని, నీవు ముందుకు సాగుము."
ఆమె తన దాసుని పిలిచినప్పుడు గమనించండి. "ఒక గాడిదను సిద్ధపరచి బయలుదేరుము. నేను ఆగమను వరకు ఆగవద్దు" అని చెప్పెను. అంతే! నీవు వర్తమానము విని ముందుకు పోవలెను. ఆమేన్! "నేను నడువలేను. నాకు నీరసముగా ఉన్నది" అనవద్దు. ముందుకు సాగిపొమ్ము; ఆగవద్దు! సమస్తము ప్రక్కకు పెట్టుము, అన్నింటిని గుండా నరుకుచూ రమ్ము. సోదరుడా, నీ చేతిలో ఖడ్గమున్నది, కేవలము నరుకుచూ ముందుకు పొమ్ము.
118ఒకసారి నేను బోధించుటకు పుటిబాల్ స్టేడియంలోకి వెళ్ళాను. నేను తలుపు నొద్ద ఆగి చూచాను. అక్కడ ఇట్లు వ్రాయబడియున్నది, "పోరాటము కుక్క యొక్క పరిమాణములో లేదు గాని, కుక్కలోనికి పోరాట పరిమాణమే లెక్కలోనికి వచ్చును." యుద్ధమును జయించునది అదియే.
దీనికి గొప్ప సంఘములు వ్యతిరేకముగా యున్నవి. వారెంత పెద్దగా నున్న నాకు లెక్క లేదు. కుక్కలోని పోరాట పటిమ ముఖ్యము. వ్యక్తిలో నున్న విశ్వాసమే లెక్కలోనికి వచ్చును. నీవు పిరికివానివయితే నీ రంద్రము లోనికి పోయి దాగుము. సోదరుడా, నీవు సైనికునివైతే నిలబడియుండు! ఒక యుద్ధము సాగుచున్నది. మంచివారు, చెడ్డవారు ఇందులో యున్నారు. మనము పోరాడుదము.
119పీటర్ కార్డ్ ఒక పట్టణములోనికి వెళ్ళి, ఇట్లనెను, "ప్రభువు నన్ను ఇక్కడికి వెళ్ళి ఉజ్జీవ కూటములు ఏర్పరచమనెను." అతడు ఒక పాత స్టోరు రూమ్ అద్దెకు తీసికొని దానిని శుబ్రపరచెను.
ఆ పట్టణములోని ఒక పెద్ద రౌడీ చేతిలో తుపాకీ పట్టుకొని, "అక్కడతడు ఏమి చేయుచున్నాడు?" అనడిగెను.
"అతడు బోధకుడు, ఒక కూటము పెట్టనై యున్నాడు" అని చెప్పిరి.
"నేను వెళ్ళి వాడిని వీధిలోనికి విసిరి వేయుదును, ఇక్కడ నుండి తరిమి వేయుదును. ఈ స్థలంలో కూటములెవరూ పెట్టరాదు," అనెను.
120కాబట్టి వాడు వెళ్ళి గుమ్మము యొద్ద ఆగెను. పీటర్ కార్డ్ రైట్ తన కోటును ధరించియుండెను. అతడు చిన్న మనిషి - కిటికీలు, గోడలు తుడుచుచుండెను. బోధకుడు అతనిని చూచి, అతడు చేతులతో మాంసము తినుచుండెను గనుక అతడిని చూచి నవ్వెను (ఈనాడు అది సాధారణ విషయము, మీకు తెలుసా). కావున గదిని శుభ్రము చేయుచున్న ఈ బోధకుని యొద్దకు ఇతడు వెళ్ళి, కోటును లాగి, పిస్టలు చూపుచూ, "నీవేమి చేయుచున్నావు?" అనడిగెను.
"నేను కిటికీలు తుడుచుచున్నాను" అని చెప్పి తన పని తాను చేసికొనుచుండెను. అతని ఉద్దేశము ఒక్కటే: ఒక ఉజ్జీవ కూటము ఏర్పరచమని దేవుడు చెప్పెను.
2TIM 2:12
121"ఇక్కడ మేము ఉజ్జీవ కూటములకు అనుమతించము," అన్నాడు.
"కాని ఈ ఉజ్జీవ కూటమును ఏర్పరచమని ప్రభువు చెప్పెను," అన్నాడు. చూచారా? అతడు తన పని చేసికొనుచుండెను. చూడండి?
"ఒక్క సంగతి నీవు గ్రహించు. ఈ పట్టణ ప్రాంతమంతా నా ఆధీనములోనే యున్నది."
"ఓ, అలాగా?" అని చెప్పి అతడు కిటికీలు తుడుచుచుండెను.
"నీవు ఉజ్జీవ కూటములు ఏర్పరచు ముందుగా నన్ను పడగొట్టవలెను" అన్నాడు.
"ఓ, అది నేను చేయుదును, అని చెప్పి, వాడి కాలరు పట్టుకొని నేల మీద పడగొట్టి, వాని మీద పడి, "నేను పరిపాలన చేయవలెననిన పోరాడవలెను. ప్రభువా! నా ధైర్యము వృద్ధి చేయుము" అనెను. వాడిని చిత్తుగా కొట్టి, "ఇంక చాలునా?" అనడిగెను.
"చాలును," అని చెప్పి లేచి, అతనితో కరచాలనము చేసెను; ఆ రాత్రి చర్చిలో అతడు రక్షించబడెను. అక్కడే మీరున్నారు, చూచారా.
122దేవుని వాక్యము తీసికొనండి. మీ ప్రతి సందేహమును నరకండి. అలాగు మనము చేయుదము. నా సందేహములను నరికి పారవేయవలెను.
నాలోని అనుభూతులు, నా గూర్చి చెప్పుచున్న అభ్యంతరములను నేను నరికి పారవేయవలెను. నా నిరాశలను త్రోసివేయవలెను.
నా మనస్సాక్షి గూర్చి ఏదో చెప్పును. దానిని నేను నరికివేయవలెను. దానిని నీవు నరికి పారవేయనంత కాలము ముందుకు సాగజాలవు. నీవు ముందుగా సాగిపొమ్ము. "నేను జయించెదను, నేను ఓడిపోను, నేను జయించెదను" అను గురిని కలిగి యుండుము. ఆమెన్!
123సాతాను యొక్క మొదటి పన్నాగము ఏమిటి! మొదటగా వాడు దేనిని వశపరచుకొనును? మనస్సును. వాడు చెప్పినది వినుటకు కొద్ది క్షణములు ఆగి ఆమె వినెను.
చాలా మ౦ది స్త్రీలు, చాలామంది పురుషులు ఆ విధంగానే తప్పు చేయుచున్నారు. ఇది నిజము. ఒక్క క్షణము ఆగినందునే ప్రమాదము.
124నేను ఎన్నో విడాకులు కేసులు చూచాను. వారిలో ఒకరిట్లు చెప్పిరి, "బ్రెన్హాం సోదరుడా, అతని ఈల విని నేను ఆగాను, నిజంగా నేను ఆగవలెనని ఆగలేదు." [సహో బ్రెన్హాం ఈల వేసెను.] అక్కడే మీరున్నారు.
ఓ, నేను ఆమె బల్లకు ఎదురుగా కూర్చొన్నాను; ఆమె కన్నులు చాలా అందంగా యున్నవి." చూచారా? అంతే. అపవాది అదే చేయును.
1JN 4:4
125"నేను బాగవనని వైద్యుడు చెప్పెను" అని నీవందువు. అక్కడే నీవున్నావు. అన్నింటి కన్నా అతి గొప్ప పోరాటము!
"మంచిది, పరిశుద్ధాత్మ పొందామని చెప్పిన చాలామందిని నేను చూచాను," అని నీవ౦దువు. నీవు ఒక వేషధారిని చూచి యుందువు. నిజంగా పొందిన వారి మాట ఏమిటి? చూచావా? అపవాది నీకు చిన్న కాకిని చూపించును గాని నిజమైన పావురమును చూపించదు. ఇది సత్యము. వాస్తవమును నీకు చూపించదు. దాని చూపకుండా నిన్ను గ్రుడ్డివానిగా చేయును.
ఓ, అతడు కూడా యోధుడే. మరువవద్దు, నీలో నున్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు. కాబట్టి దేవుని వాక్యము పట్టుకొనుము; దానిని నమ్ముము, మీరు సైన్యాధిపతులుగా ఉన్నారు. సోదరుడా, నీ కోటను స్వాధీనము చేసికొనుము. అది నిజము, నీ విధిని నిర్వహించుము!
126ఒకసారి ఒక చిన్న బాలిక లోనికి వచ్చినది. ఆమె పేరు నెల్లి సాండర్స్. దయ్యము వెళ్ళిపోవుటను మొదటగా నేను అప్పుడే చూచాను. (సమాధుల అవతల మూడా వీధుల మధ్య మేముండేవారము.) అప్పుడే నేను సేవలోనికి వచ్చాను. ఒక గుడారపు కూటములో ఈ మూలన నేను బోధించుచున్నాను. ఆ చిన్న పిల్ల గొప్ప నాట్యగత్తె, ఇక్కడి హైస్కూలులో చదువుచుండెను. ఆనాడు లీహారన్ దేశములో గొప్ప నృత్యకారిణి. (ఈ పట్టణము వారికి ఎంతమందికి లీహారన్ తెలియును) వారు కాతలిక్కు వారు. మతముతో వారికేమీ సంబంధము లేదు. (నెల్లీ) "బ్లాక్ బాటమ్" "జిట్టర్ బగ్స్" అను డాన్సులు వారు చేయుచుండిరి. వారిద్దరే దేశంలో గొప్పవారు.
127ఒక రోజున ఆమె కూటమునకు వచ్చినది. (రాత్రి కూటము) ఆ చిన్న నెల్లీ బలిపీఠము యొద్ద పడిపోయినది. ఆమె ఏడ్చినది. ఆమె బుగ్గల మీద నుండి కన్నీరు కారినది. "బిల్లీ! నేను రక్షించబడవలెను" అన్నది. (ఆమె నన్ను ఎరుగును.)
"నెల్లి, నీవు రక్షించబడగలవు; యేసు ఎప్పుడో నిన్ను క్షమించెను. ఆయన వాక్యమును ఆధారము చేసికొని దానిని ఇప్పుడు నీవు అంగీకరించవలెను" అని చెప్పాను. ఆమె అక్కడే యుండి ఏడ్చి ప్రార్ధి౦చినది. లోక సంగతులు వైపు ఎన్నడూ ఇక తిరుగనని ఆమె దేవునితో చెప్పినది. వెంటనే ఆమె ఆత్మలోనికి మధురమగు సమాధానము వచ్చినది. ఆమె లేచి దేవుని స్తుతించి మహిమపరచసాగినది.
1JN 1:7
128"ఆ తరువాత ఆరు లేదా ఎనిమిది నెలలకు స్ప్రింగ్ వీధికి ఒక రాత్రి వచ్చినది. (ఇప్పుడామె పద్దెనిమిదేండ్లు యుక్త వయస్సులో నున్నది), "నేను హోప్ మరియు ఐరీన్ల వలె కనిపించగోరుచున్నాను అని నాతో చెప్పినది. (నా భార్య హోప్ చనిపోయెను.) "వారు ఎన్నడూ లోకము లోనికి రారు. లోకము మన మీద ఒక ముద్ర వేయును. నా చూపు కరుకుగా ఉన్నది. నేను రుంగులను అలంకరణ మానివేసినా కరకగా కనబడుచున్నాను. నా ముఖం నిర్మలంగా లేదు. వారెంతో అమాయకంగా, మృదువుగా కనబడుచున్నారు. నేను ఆ విధంగా జీవించకుండా ఉంటే ఎంత బాగుండును" అన్నది.
"నెల్లీ, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరచును. నమ్మి వెళ్ళుము" అని నేను చెప్పాను
129వేని బ్లేడ్సో ఒక త్రాగుబోతు (మీలో చాలామంది ఎరుగుదురు. నా చిరకాల స్నేహితుడు), అతడు నా సోదరుడు ఎడ్వర్డుతో ఇచ్చటికి వచ్చెను. అతడు త్రాగి వీధిలో పడియుండగా, నేను లేపి తెచ్చాను, ఎందుకనగా పోలీసులు అతనిని పట్టుకొందురు. ఇక్కడికి నేను తీసికొని వచ్చాను. నేను ఒక బోధకుడను. పెండ్లి చేసికొనక ముందు నుండియూ ఇక్కడ నేను నా తల్లి దండ్రులతోత జీవించాను. అతనిని నేను పడక మీద వేశాను. నేను డ్యూ-ఫోల్డు మీద పడుకొన్నాను. చాలామంది బ్రెన్హా౦ములు ఇక్కడుండిరని మీరెరుగుదురు. (పదిమందిమి ఉంటిమి), కాబట్టి నాలుగు గదులు మాకున్నవి. మేమిద్దరము పరుంటిమి. నేను ఆ పాత మంచం మీద పరుంటిని. త్రాగి యున్న వేన్ తో పాటుగా నుండుటకు ప్రక్కనే వేసికొన్నాను. అతనిని మేము ఎత్తి పరుండబెట్టాము. నేను అడిగాను, "వేన్, ఈ రకమగు జీవితం గూర్చి నీవు సిగ్గుపడుట లేదా?"
130"బిల్లీ, నా గూర్చి అలాగు మాట్లాడవద్దు" అన్నాడు. "వేన్, నీ కొరకు నేను ప్రార్ధి౦చెదను. దేవుడు నిన్ను దీవించును," అని అతనితో నేను చెప్పాను.
నేను రక్షించబడి, బహుశా ఒక సంవత్సరము అయి యుంటుంది. అంతలోనే ఆకస్మాత్తుగా బయటి తలుపు తెరుచుకొన్నది. ఎవరో చాలా బిగ్గరగా "బిల్ సోదరుడా! బిల్ సోదరుడా" అని పిలిచారు."
"ఎవరో చనిపోతున్నారేమో," అనుకొన్నాను. నేను తటాలున లేచి పైజామా ధరించుకొన్నాను. వేన్ కు కూడా కప్పి తలుపు యొద్దకు పరుగెత్తాను. ఒక స్త్రీ స్వరంలా వినిపించింది. నేను తలుపు దగ్గరగా వెళ్ళగా, ఒక యువతి అక్కడ నిలబడి యున్నది. "ఓ, నేను లోనికి రావచ్చునా?" అన్నది.
"లోనికి రమ్ము" అన్నాను, మరియు నేను లైట్లు వేశాను.
"బిల్లీ, నా పని అయిపోయింది. నా పని అయిపోయింది" అని ఆమె ఏడ్చుచున్నది.
131"ఏమిటి సంగతి నెల్లీ? నీకు గుండెపోటు వచ్చినదా?" అనడిగాను.
"లేదు, బిల్ సోదరుడా! నేను స్ప్రింగ్ వీధి నుండి వచ్చుచున్నాను. నేను నిజమే చెప్పుచున్నాను. ఎవరికీ హాని చేయుటకు ఇది చెప్పుట లేదు," అన్నది.
"అసలు ఏమయింది?" "ఇప్పుడు ఆమెతో నేను ఏమి చేయవలెను?" అని నాలో నేను అను కొన్నాను. ఏమి చేయాలో నాకు తోచలేదు. నేను ఒక యువకుడును.
"ఓ, బిల్ సోదరుడా, నేను ముక్కలయిపోయాను" అన్నది.
"నెమ్మది పడి అంతా వివరంగా చెప్పు" అన్నాను.
"నేను రెడ్ మాన్స్ హాలు నుండి వీధిలో వచ్చుచున్నాను. (శనివారపు రాత్రి నాట్యములు అక్కడ జరిగేవి.) నా యొద్ద ఏమో సామానులు యున్నవి. నేను ఒక డ్రస్సు తయారు చేసికొనుటకు ఇంటికి వెళ్ళుచున్నాను. నేను ఆ సంగీతం విన్నాను. ఒక్క నిముషము ఆగినది. ఒక్క నిముషము నిలబడినందువలన ఏమి కాదు కాదా?" అనుకున్నది.
1THS 5:22
132ఆమె ఆక్కడే పొరపాటు చేసినది, ఒక్క క్షణము పాటు ఆగినది.
ఆమె ఆ సంగీతము విన్నది, ఇంకా ఇట్లు అనుకొన్నట్లు చెప్పినది. "ప్రభువా! నిన్ను నేను ప్రేమించుచున్నానని నీవెరుగుదువు. నేను, లీ కలిసి ఎన్నో పందెములు గెలిచిన రోజులు గుర్తుకొస్తున్నవి. ఆ పాత సంగీతము నన్ను మరల ఆకర్షించుచున్నది." "నీవు ఇక్కడ అడుగు పెట్టినప్పుడే అది నన్ను ఆకర్షించినది." ఓ! సాతాను నిన్ను అక్కడికి రమ్మని కోరును. నీవు ఆ కోరికను చూచావా?
నెల్లీ సాండర్స్ ను ఎందరు ఎరుగుదురు? మీరందరూ ఎరుగుదురు. తప్పుకుండా మీకు తెలియును. ఇంకా ఇట్లు నాతో చెప్పినది, "నేను అక్కడికి వెళ్ళి కొందరికి నా సాక్ష్యమును చెప్పితే బాగుండును గదా? నీవు అపవాది భూభాగమన యున్నావు. దాని యొద్ద నుండి దూరమగుము! చెడును అసలు సమీపించవద్దు.
కాని ఆమె ఎట్లు మీద నుండి అక్కడ కొన్ని నిముషములు నిలబడినది, మరియు మొదటి సంగతి మీకు తెలుసా, ఆమెను ఒక యువకుడి చేతుల్లో నేలపై పడియున్నది. ఆమె అక్కడ ఏడ్చుచూ ఇట్లు చెప్పినది, "ఓ! ఇప్పుడు నేను నశించాను?"
MARK 16:17
133"నాకు బైబిలు ఎక్కువగా తెలియదు గాని యేసు ఇట్లు చెప్పెను: "నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు" అని చెప్పెను గదా అనుకొన్నాను. వేన్ కొంత తేరుకొని ఈ సంగతిని గమనించుచున్నాడు. నేను ఇట్లన్నాను, "అపవాదీ! నీవెవరవో నాకు తెలియదు, కాని నా సోదరి ఆమెతో నీకేమి పని లేదు. ఆమె ఒక్క క్షణము అక్కడ ఆగినదే గాని ఆమెకు నిజంగా అక్కడికి వెళ్ళు మనస్సులేదు. (ఆమె అక్కడే తప్పు చేసినది.) కాని నీవు ఆమెలో నుండి బయటకు రావలెను." (దేవుడు తీర్పునాడు నన్ను నిలబెట్టును), ఆ తలుపు మూసికొని మరల తెరుచుకొనుచున్నది — అది అటు ఇటు కొట్టుకొనుచున్నది. "బిల్లీ, ఇట్లు చూడు, చూడు," అన్నదామె.
"ఏమిటిది?" అనడిగాను.
"నాకు తెలియదు" అన్నది.
134"నాకు కూడా తెలియదు," అన్నాను. మరల తలుపు ఇటు అటు కొట్టుకొన్నది. "ఏమిటి సంగతి? ఏమయింది?" అనుకొంటూ అటువైపు చూచాను. "సాతానా, యేసు నామములో ఆమెను విడిచి పొమ్ము" అని చెప్పగానే, ఒక పెద్ద గబ్బిలము వలె నున్న పొడవైనది, ఆమె వెనుక నుండి లేచినది, దాని రెక్కలు పొడవైన వెంట్రుకల వలె యున్నవి. అది శబ్దము చేయుచూ, నా వైపు వచ్చుచుండెను. "ఓ ప్రభువైన దేవా, యేసుక్రీస్తు రక్తముతో నన్ను కాపాడుము" అనడిగాను.
వేన్ పడక మీద నుండి లేచి చూడసాగెను; అది ఒక పెద్ద నీడ వలె చుట్టూ కమ్మి, పడక క్రిందికి దూరినది. వేన్ ఆ పడక మీద నుండి లేచి తరువాత గదిలోనికి బలమంతా కూడగట్టుకొని పరుగెత్తెను.
135నేను నెల్లీని ఆమె ఇంటికి తీసికొని వెళ్ళి, మరల వచ్చాను. మా తల్లి ఆ దుప్పట్లన్నీ దులిపినది. ఆ పరుపులో ఏమి కనబడలేదు. ఏమిటి? ఆమెలో నుండి దయ్యము బయటకు పోయినది. ఏమయినది? ఆమె ఒక్క క్షణము ఆగినందున ఇదంతయూ జరిగినది. అంతే.
ఏమాత్రము ఆగవద్దు! దేవుడు తన వాక్యమును నీ హృదయములో ఉంచును. ఆ ఖడ్గమును పట్టుకొని దూసికొని పొమ్ము. హల్లెలూయా! "దేని కొరకు అగుటకు నాకు సమయము లేదు. కూర్చొనుటకు నాకు సమయము లేదు."
2KGS 4:29
136అతడిట్లు చెప్పెను, "నీవు నా దండమును తీసికొనిపోయి ఆ బిడ్డ మీద ఉంచుము. ఎవరు నిన్ను పలుకరించినా జవాబు ఇయ్యవద్దు." దయ్యము నీ ఆరోగ్యము గూర్చి నిన్ను ప్రశ్నించును గాని నీవు మాట్లాడవద్దు, ముందుకు సాగిపొమ్ము."
దయ్యము ఇట్లు చెప్పును, "నీకు ఫలాని వారు తెలియునా? వారు పరిశుద్ధాత్మను పొందినప్పుడు పూర్తిగా మతిపోయి ప్రవర్తించిరి." వాడితో నీవు మాట్లాడవద్దు; ముందుకు సాగిపొమ్ము. ఎవరి గూర్చియూ నీకు వద్దు, నీకు దేవునికే సంబంధమున్నది. దేవునితోనే నిలిచియుండుము. అది మంచిది. దేవుని కలిగియుండుము!
137వాడు తన అనుచరులను అభిషేకించును. (నేను త్వరగా ముగించవలెను.) దేవుడు తన దాసులను అభిషేకించును, చూచారా? (కొన్ని వ్రాసిన సంగతులను నేను దాటిపోవలెను, కాని నేను దీనిని చెప్పగోరుదును.) జాగ్రత్తగా వినండి.
సాతాను పన్నాగములను మనము చూచాము. మనమెట్లు తెలుసుకున్నాము? ఇక్కడ ప్రవక్తలు చెప్పిన లేఖనములు చాలా సంగతులు వ్రాసియుంచాము. వాడు చాలామంది యొద్దకు వచ్చినట్లు బైబిలులో యున్నది. దేవుని వాక్యము నమ్మకుండా చేయుటయే వాడి మొదటి పన్నాగము.
ROM 3:4•
EPH 6:11
138సిలువ యోధులారా వినండి! బైబిలులో వ్రాయబడిన ఒక్క దేవుని వాక్యమును నీవు నమ్మకపోయినా, నీవు నిరాయుధుడవగుదువు. ప్రియా, దానిని నమ్ముము. నీవు నిరాయుధుడవైతే; నీవు లొంగిపోదువు. దేవుని యొక్క పూర్తి కవచమును ధరించుకొనుము. ఆమేన్! మనము యుద్ధములో యున్నాము. దేవుడు చెప్పినదే సత్యము, ప్రతి మానవుని మాట అబద్ద౦, చూచారా.
వాడి యొక్క ఒక్క మాటను కూడా వినవద్దు. నిన్ను నిరాయుధునిగా చేయుటకు వాడు తంత్రము పన్నుచున్నాడు. హవ్వ ఎన్ని మాటలు విన్నది? ఒక్క మాట వెంటనే ఆమె నిరాయుధురాలయినది.
దయ్యము ఏమి చేయును? మనస్సులో నుండి ఆత్మలోనికి దూరును. హవ్వను వంకరగా చేసినది నిజమేనా? ఆమెను వక్రీకరించినది. ఆ క్షణములోనే, అనగా దేవుని వాక్యమును సందేహించిన వెంటనే ఆమె నిరాయుధురాలయినది. నిజము. వాడి పన్నాగములను ఇక్కడ చూడగలము.
EPH 6:10,11
139దేవుని యొక్క పూర్తి యుధోపకరణములను దేవుని సైనికులు ధరించవలెనని ఆజ్ఞాపించబడియున్నది. అది నిజమేనా? మీరు లేఖములను వ్రాసికొనగోరినచో, చూడండి, ఎఫెసీ 6:10 మరియు 13, చూడండి. కొద్దిసేపటి క్రితం దానిని మనము చదివాము; అది మన అంశము. మంచిది.
దేవుని యొక్క సర్వాంగ కవచము ధరించుకొనిడి. (మీకు కొద్ది నిముషముల సమయమున్నదా?) ఒక్క నిముషము ఇది చూద్దాం. దేవుని యొక్క సర్వాంగ కవచమేమిటో చూద్దాం. 10వ వచనము చూడండి. దేవుని యొద్ద సర్వాంగ కవచమును గమనించుదాం.
తుదకు, నా సోదరులారా…
140ఇరవై నిముషముల తక్కువ పన్నెండయినది. ఈ రోజు నేను మరీ ఎక్కువ సేపు ప్రసంగించను. ఎండాకాలపు పర్యటనకు ముందు ఇక బోధించను. (మీరు చూచారా?)
141ఎందుకు ఈలాగు నేను చేయుచున్నానో మీరెరుగుదురా? నేను చెప్పెదను. ఒక రోజు నాకు కల వచ్చినది. దానిని నేను చెప్పబోవుచున్నాను, కాని అది నా మనస్సులో యున్నది; నేను ఆ ప్రకారమే చేయుదును.
ప్రభువు నాకు భావము తెలిపెను, సేవా పని మీద ఒక పెద్ద నదిని నేను దాటనైయున్నట్లు కలగన్నాను. నా భార్యతో మొదట నేను అక్కడున్నాను. ఈ పట్టణములో యున్న జార్జిస్మిత్ ను ఎందరెరుగుదురు? అతని కొడుకు ఇక్కడ పోలీస్ దళంలో యున్నాడు. ఇప్పుడు జార్జి త్రాగుడుకు బానిసగా మారెను. కాని అతడు చాలా గొప్పగా పోరాడేవాడు. నేను వై.ఎమ్.సి.ఎ. కు వెళ్ళకముందు, నాకు అతడే శిక్షణ ఇచ్చెను. అతడు మాకు తర్ఫీదు ఇచ్చుచుండెను. అతడు బహు వేగముగా ఉండేవాడు. 145 పౌనుల బరువులో నాకు శిక్షణ ఇచ్చెను. అతడు అక్కడే నిలబడి యుండి చూచేవాడు. నా కడుపులో కొట్టి, గోడకు అదిమేవాడు. అయినా అది నాకు బాధ కలిగించేది కాదు. ఆ విధంగా అతడు నాకు తర్ఫీదు ఇచ్చెను.
142ఆ కలలో నేను స్మిత్ ను చూచాను. (అది దర్శనము కాదు, అది ఒక కల) యువకులు అతనితో పోరాడుచున్నారు. నాకు ఏబది-రెండేళ్ళు; అతనికి ఏబది-ఎనిమిది లేదా అరవై ఏళ్ళుండును; అయిన గాని ఏ యువకుడు అతనిని కదపలేరు. ఒక్క పిడికిలలితో వారిని నేల మీద పడగొట్టును. నాకది చాలా వింతగా తోచినది. నా భార్య నాతో ఉన్నది. "మిడా! ఈయనే నాకు శిక్షణ ఇచ్చెను" అన్నాను.
"నాకు ఇంతకు ముందు ఇది చెప్పినట్లు గుర్తున్నది" అన్నదామె.
"అతడిచ్చిన మంచి శిక్షణ వలన పదిహేను ప్రొఫెషనల్ పోరాటములు గెలిచాను. కాని సువార్తను బోధించుటకు ఆ వృత్తి వదిలేశాను" అని చెప్పాను.
143అంతలోనే నేను నదిని దాటవలసి వచ్చెను. కాని నేను ఒక యంత్రపు పడవ మీద దాటుచున్నాను. నేను చూడగా, నా ఇద్దరు సోదరులు చిన్న దోనెలో కూర్చొని నాతో పాటు వచ్చుటకు సిద్ధపడుచునాము. "సోదరులారా, మీరు దాటలేరు. నేను ఒంటరిగానే దాటవలెను," అని చెప్పాను.
నా పడవ యజమాని వచ్చి, "ఇదిగో నీ పడవ" అని చెప్పాను. అది చాలా తెల్లని ప్లాస్టిక్ తో చేయబడిన దోనె.
"అది కాదు" అని నేను అన్నాను.
"నీవు దీనితో గంటకు ఏబది మైళ్ళు వెళ్ళవచ్చును" అని అతడు అన్నాడు.
"కానీ నేను అటువైపు దాటవలెను?" అన్నాను, చూచారా.
"అయితే వారితో వెళ్ళు" అన్నాడు.
"వారు పడవ నడుపు వారు కారు. వారికి అంతగా ఇది తెలియదు, వారు ఉత్సాహపడుచున్నారు గాని వారు మునిగిపోయెదరు" అన్నాడు.
"నీవు నమ్మగలవా…?" అన్నాడు.
"చూడు, వారికంటే నాకే ఆ పడవల గూర్చి ఎక్కువగా తెలియును. ఆ విధమగు నావలను నేను నడుప ప్రయత్నించను. నేను యాంత్రిక పడవను తీసుకొనవలెను. మరో గొప్ప పడవలో మాత్రమే దానిని దాటగలను" అన్నాను.
144ఆ సోదరులలో ఒకరిని అతడు, "నీవు పడవ నడుపగలవా?" అని అడిగెను.
"అవును," అని వారు చెప్పిరి, చూచారా.
"అది తప్పు" అని నేను అన్నాను.
ఆ పడవ యజమాని తిరిగి వచ్చెను; నాతో ఇట్లనెను, "వారు నిన్ను ప్రేమించుచున్నారు; వారు నిన్ను నమ్ముచున్నారు. నీవు యాంత్రిక పడవలో దాటినచో, వారు దోనెలో నిన్ను వెంబడించి దాటవలెనని చూచుచున్నారు; వారు ఇరువురు చచ్చెదరు," చూచారా. "వారు నిన్ను వెంబడించలేరు," అని చెప్పెను.
"మంచిది, అయితే నేనేమి చేయవలెను?" అనడిగాను.
ఆ పడవ యజమాని ఇట్లు చెప్పెను, "నీవు ఆ వెనక్కి వెళ్ళుము. ప్రాంతమంతటిలో ఒకే స్టోర్ ఇల్లు ఉన్నది, దానిలో అన్నీ సమృద్ధిగా యున్నవి. నీవు వెళ్ళిపోయిన తరువాత వారందులో యుందురు గాని వారికి సరుకులుండేటట్లు చూడు."
నేను క్యాబేజి, ముల్లంగి, ఇంకా ఆయా పథార్థములు తెప్పించి అక్కడ పోగుచేశాను. ఆ తరువాత నాకు మెళకువ వచ్చినది. అదేమిటో అప్పుడు నాకు తెలియలేదు గాని, ఇప్పుడు తెలియును, చూచారా. స్నేహితులారా, మనము సరుకులు నమకూర్చుచున్నాము. ఈ జీవితములో నీవు ఒంటరిగా నడువవలెను.
145లియో, నీవు మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు పిరమిడ్ గూర్చి వచ్చిన కల నీకు గుర్తు౦డును. నీవు అక్కడికి వచ్చినట్లుగా తలంచావు. కాని నేను ఇట్లన్నాను, "లియో, ఇక్కడికి ఎవరూ రాలేరు; దేవుడే మనుష్యుని ఇక్కడ పెట్టవలెను. నీవు శరీరకంగా ఎన్నో ఎక్కి యుందువు. కాని లియో, నీవు ఇక్కడికి రాలేవు, చూచారా. క్రిందికి వెళ్ళుము, దేవుని వలన మాత్రమే ఇది సాధ్యమని జనులతో చెప్పుము, చూడండి. చూచారా? నీయంతట నీవు దీనిని చేయజాలవు…"
నా సంఘము, నా సోదరీల వలెనె ఇతర సంఘములు, ఇతరులు యున్నారు…
NUM 16:21,45
146ఇప్పుడు, సంఘము విడిచి నేనుండలేను. "మంచిది, ఏకత్వము వారిని, త్రిత్వము వారిని, యేసు నామము వారిని, వీరిని అందరినీ నీవు కలగలుపు చేయుట ఎందుకు?" అని కొందరడుగుచున్నారు. వారు నా వారు. వారేమి చేసినా గాని, వారు నా వారే. వారే నా బలిపీఠమైయున్నారు.
ఇశ్రాయేలీయులు బహుగా చెడిపోయినప్పుడు, మోషేను వేరుగా నుండమని దేవుడు చెప్పెను. అతనితోనే ఒక క్రొత్త జాతిని లేపెదనని ఆయన చెప్పెను. కాని మోషే దేవునికి అడ్డము వచ్చి వారిని తీసికొను ముందుగా నన్ను తీసికొనుమని చెప్పెను.
వారేమి చేసినా గాని నేను వారి కొరకే పంపబడితిని. చీకట్టున్న చోటు ప్రకాశించుటకే ఆయన వెలుగును పంపును గాని, వెలుగున్న చోటుకు కాదు. వారితోనే నీవు నిలబడవలెను; వారెట్లున్నాగాని నీవు వారి కొరకు నిలబడవలెను.
MATT 10:16
147ఇశ్రాయేలు ఘోర తప్పిదము చేసెను. వారు చెడిపోయినందున, దేవుడు వారిని వదిలెను, కాని మోషే చేసిన దానిని చూచి నేను ఎప్పుడూ ఆశ్చర్యపడుచుందును. మోషేలో క్రీస్తు ఆత్మ యుండెను. చూచారా? మనందరము తప్పు చేశాము. మనమింకా తప్పులో యున్నప్పుడే, ఆయన మనందరి కొరకు నిలబడెను.
వారెంత తప్పిదములో యున్నాగాని, మనము దేనితోను సహవాసము లేదా సంబంధము తెంచుకోవద్దు. మనము ఆత్మలను సంపాదించవలెను, అందుకు "పావురము వలె నిష్కపటముగాను, పామువలె వివేకముగాను ఉండవలెను." (చూచారా), మరియు సాధ్యమైనంత వరకు ప్రతి ఆత్మను మనము జయించవలెను.
148ఈ ఉదయమున నేను ఇదే చెప్పుచున్నాను, మీరు భుజించునట్లు, మీరు విందారగించునట్లు ఆహారము నిలువ చేయవలెను. మీ టేపులలో అది యున్నది; గదిలో కూర్చొని వినండి. నేను బహు సుదూరము వెళ్ళిపోయినా, ఈ సంగతులు సత్యములని మీరు గుర్తుచేసుకోగలరు. మీ గదిలో కూర్చుని మీరు వినండి, చూచారా. ఇదే ఆహారము, నిలువ యుంచు గదిలో దానిని నిలువ చేయండి. ఆ ప్రయాణము ఎటో నాకు తెలియదు, కాని అది ఎక్కడికయినా, ఆయనే నన్ను ఎక్కడికి నడిపించుచున్నాడో ఆయన ఎరుగును; నాకు తెలియదు. నేను కేవలము వెంబడించెదను.
EPH 6:10-12
149ఇక్కడాయన చెప్పినది జాగ్రత్తగా వినండి.
తుదకు, నా సహోదరులారా, ప్రభువు యొక్క మహా శక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. [ఆయన యొక్క మహా శక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి.]
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
ఏలయనగా మనము పోరాడునది శరీరములతో కాదు గాని [బుల్లెట్లు పేల్చుట కాదు, కత్తులతో నరుకుట కాదు], ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అందకార సంబంధులగు లోకనాధులతోను, ఆకాశమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. [అందకార సంబంధులగు లోకనాధులతో.]
150లోకమును ఎవరు పరిపాలించుచున్నారు? దయ్యము. నిశ్చయంగా. ఈ ప్రభుత్వములను, భక్తిహీన కార్యములను ఎవరు నడిపించుచున్నారు? అది అంతయూ దయ్యమే; బైబిలు అలాగు చెప్పుచున్నది. అమెరికా దేశము దయ్యము యొక్క వశములో యున్నది. జర్మని దేశము దయ్యము యొక్క ఆధీనములో యున్నది. ప్రపంచములోని ప్రతి దేశము దయ్యము యొక్క అదుపులోనే యున్నది. (కొద్ది నిముషములలో ఆ సంగతి యొద్దకు వెచ్చెదను.) దేవుడు తన రాజ్యము స్థాపించువరకు, ఇప్పుడున్న ప్రతి రాజ్యము ఇక రాబోవు రాజ్యములను ఎవరు ఏలుచున్నారో, ఏలుదురో నేను చెప్పెదను, మరియు వాడు అది చేయునో లేదో మనము కనుగొందాము — వీటిని దయ్యమే ఏలును. అయితే ఇప్పుడు రాజ్యములలో ఉన్న వారందరూ దయ్యపు సంబంధికులు కారు. ప్రభుత్వ కార్యాలయములలో దేవుని జనులున్నారు.
EPH 6:13-17
151కొద్ది రోజుల క్రితం ఆర్గన్ బ్రయిట్ తో కూడా ఒకాయన వచ్చెను. అయిదుగురు దేశాధ్యక్షులకు అతడు దౌత్య ప్రతినిధిగా యున్నాడు. అతని పేరు సహో, రోమే. (ఏప్రియల్ రెండవ వారంలో ఇక్కడికి అతడు వచ్చును. దాని గూర్చి సహో నెవిల్ ప్రకటన చేయును). అతడు చాలా అద్భుతమగు వ్యక్తి.
"అతడు ఎనిమిది భాషలను మాట్లాడగలడు. (నేను అనుకొనుచున్నాను) కాని అతడు పరిశుద్దాత్మను పొందినప్పుడు ప్రభువుతో మాట్లాడుటకు ఏ భాష పనికిరాలేదు. కాబట్టి ప్రభువు అతనికి ఒక భాష ఇచ్చెను. ఇంతకు ముందు అతనికి తెలియని భాషతో అతడు ప్రభువుతో మాట్లాడెను. ఇది నిజము.
అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనము చెడు దినములలో జీవించుచున్నాము. కాబట్టి కదలకుండా మనము నిలబడవలెను. ఆమేన్! అదే మీరు చేయవలెను.
కావున మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని [వినండి, అది మీ మధ్య భాగము.] నీతియను మైమరపు తొడుగుకొని, [దేవుని వాక్యమే సత్యము. ఆ దేవుని వాక్యమును నీలో ఉంచుకొనవలెను.]
పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనసును జోడు తొడుగుకొని నిలబడుడి; [ఏ సమయములోనయినా, ఎచ్చటికైనా వెళ్ళి సువార్తను బోధించవలెను, చూచారా?]
ఇవన్నియూ గాక [అన్నిటికన్న మిన్నయైనది] విశ్వాసమును డాలు పట్టుకొనుడి. [అది ఎదుటి వారిని చెదరగొట్టును] దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్చుటకు శక్తిమంతులవద్దురు.
మరియు రక్షణయను శిరస్త్రాణమును [అది ప్రాణము, మనస్సు — అక్కడి మనస్సు — శిరస్సు — శిరస్సును కప్పును.] మరియు ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి, అది దేవుని వాక్యమే.
152ఈ శిరస్త్రాణము వలన ఏమి జరుగును? అది నీకు రక్షణ ఇచ్చును. శిరస్త్రాణమును దేనితో తయారు చేయుదురు? ఇత్తడితో, ఇనుము కంటె ఇత్తడి ధృడమైనది. దానిని శిరస్సు మీద పెట్టుకోవలెను. దీనిని ఎరుగుటయే రక్షణ, "నా స్వస్థత దేవుని యొద్దనుండి వచ్చును. నా రక్షణ దేవుని నుండి వచ్చును; నా ఆత్మ ఆయన వాక్యముతో విజ్జోడగును." వాక్యము సంఘము యొక్క ఉద్దేశ్యము కాదు. ఆమేన్! అక్కడే మీరున్నారు. ఒక రక్షణ నీకు ఇవ్వబడియున్నది. రక్షణ, విమోచన శిరస్త్రాణమును తీసికొని ముందుకు సాగిపొండి. ఇదే మనము చేయవలసియున్నాము.
153ఇప్పుడు సాతాను సైన్యమును గమనించండి. (నేను త్వరగా చెప్పవలెను), సాతాను సైన్యమువలన వ్యాధులు వచ్చును. సాతాను నాశనకర్త, సాతాను యొక్క రాజ్యమంతయూ వ్యాధి, మరణము, దుఃఖము, నిరాశ, చింతలతో నిండియున్నది. దేవుడయితే జీవము, విశ్వాసము, సంతోషము, సమాధానము అయియున్నాడు, చూచారా.
ఇప్పుడు, రెండు గొప్ప శక్తులు కలిసి వచ్చుచున్నవి. అది ఒకదానికొకటి ఈ భవనములో ఇప్పుడే యుద్ధమునకు తలపడుచున్నవి. అవి నీతో ప్రతిరోజు పోరాడుచున్నవి. సాతాను గొప్ప గొల్యాతు వలె నిన్ను కలవరపరచును. కాని సువార్త ద్వారా దేవుడు నీకు రక్షణ దయచేసెను. (ఆమేన్!) నీ నడుము చుట్టూ సత్య వాక్యమున్నది. మహిమ! బోధకుడా, రక్షణ శిరస్త్రాణము, విశ్వాస డాలు, వాక్య ఖడ్గము పట్టుకొనుము. "సాతానా, నీ మీదకి వచ్చుచున్నాను. నీవు సైన్సు పేరిట నా మీదికి వచ్చుదువా? సంస్కృతి పేరట నా మీదకి వచ్చుదువా? సంస్థ పేరున నా మీదికి వచ్చుదువా? నేను నిన్ను ఇశ్రాయేలు దేవుడగు యోహోవా నామములో ఎదుర్కొనుచున్నాను. నీ మీద పడుచున్నాను. రమ్ము!" అని చెప్పుము. మరణము సహితము అచ్చట నిలువజాలదు. దానికి రంధ్రము చేయుము. అది నిజము.
MARK 16:17•
2COR 10:5•
EPH 2:6
154సాతాను సైన్యము జబ్బులను తెచ్చును. దేవుని సైన్యము వాటిని పారద్రోలును. ఆమేన్! అక్కడే మీరున్నారు. సాతాను నీ మీదికి ఎప్పుడు ఏది విసిరినా గాని దేవుని సైన్యము దానిని తరిమి వేయును. ఆమేన్! వెళ్ళగొట్టము, దేవుడు ఉపయోగించిన పథకము అదే. సాతాను నిన్ను నాశనము చేయుటకు వాక్యము పట్ల అవిశ్వాసము కలుగజేయును. మిఖాయేలు కంటె గొప్ప రాజ్యము స్థాపించుదుననుకొనెను.
దేవుడు వానిని వెళ్ళగొట్టెను. చెడును హేతుబుద్ధిని, మూఢత్వము, వ్యధ, వ్యాధులు, పాపమును వెళ్ళగొట్టుటయే దేవుని పని. ఆమేన్! నీవు వాటిని దాటియున్నావు. క్రీస్తు యేసునందు పునరుత్తానము పొంది, ఉన్నత స్థలములందు కూర్చొనియున్నావు. నీ పాదము క్రింద అపవాది యున్నది. వాడి తల చితకగొట్టబడెను.
ROM 6:4•
COL 2:12
155నీవు చనిపోయానని నీవెరుగుదువా; నీ జీవము దాచబడియున్నది. ఏలాగు చనిపోయావు? నీ భావముల విషయంలో, నీ మనస్సు విషయంలో నీ హేతుబుద్ధి విషయంలో నీవు చనిపోయియున్నావు. (నీ స్వచిత్తము చెప్పును, "అవును, నేను అనుకొను…) యేసుక్రీస్తు నామములో నీవు సమాధి చేయబడితివి, ఆయనతో నీవు లేపబడితివి. ఆయనెక్కడున్నాడో నీవును అక్కడే యున్నావు.
సందేహించువాడు పరలోకమునకు వెళ్ళినప్పుడు ఆయనేమి చేయును? దేవుడు అతడిని బయటకు తన్నెను. క్రీస్తుతో కూడా తిరిగి లేచిన సైనికులతో ఆయన ఏమి చెప్పును? వారితో కూడా అపవాది వచ్చినచో ఏమి చేయును? వెళ్ళగొట్టును!
MARK 16:15-18•
GAL 2:20
156యేసు తన సైన్యమునకు శిక్షణ ఇచ్చి భూదిగంతములు వరకు వెళ్ళుడని ఆజ్ఞాపించెను: "మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి." నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడును. నమ్మనివానికి శిక్ష విధించబడును. విశ్వాసుల వలన ఈ సూచక క్రియలు కనబడును, వారు నా సైనికులు; నా నామములో వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు; క్రొత్త భాషలు మాట్లాడెదరు; సర్పములను ఎత్తి పట్టుకొందురు; లేదా విషకరమైనది త్రాగినను వారికి అది హాని చేయదు; వారు రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత పొందుదురు."
క్రైస్తవ సైనికులారా, ముందుకు సాగుడి.
యుద్ధమునకు సాగిపొండి యేసు సిలువతో ముందుకు సాగిపొండి!
"ఆయనతో కూడా నేను సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను గాని, ఆయనే నాలో జీవించుచున్నాడు." ముందుగా వాక్యము నడిచిపోవుచున్నది, దేవుడు తన వాడియగు రెండంచుల ఖడ్గముతో ఖండించుచున్నాడు.
157ఆశ్చర్యము లేదు, ఒక దక్షిణాది స్త్రీ గ్రాంటు వచ్చుట చూచి ఆవేశముతో నిండినదై ఇట్లు పలికెను:
రానున్న ప్రభువు యొక్క మహిమను నా కన్నులు చూచెను,
ద్రాక్షా గానుగను తొక్కినట్లుగా
ఆయన త్రోక్కుచున్నాడు;
తన బలమగు భీకర ఖడ్గముతో
నమ్మకస్తులను విడిపించెను;
ఆయన సైన్యములు ముందుకు సాగిపోవుచున్నవి. (ఆమేన్!)
158గ్రాంట్ రిచ్మండ్ ను ఏ విధంగా అక్రమించెను. అతడు వచ్చిన వెంటనే. ఆమేన్! రిచ్మండ్ ను ఆ విధముగానే పొందుకొనెను. దేవుని సైనికులు పాపమును, వ్యాధిని ఆ విధంగానే అక్రమించిరి — వారు వచ్చిన వెంటనే. ఆమేన్! ఆ విధంగానే వారు తమ సందేహములను, భయములను జయించెదరు. ఎ౦దరు వచ్చినా, వారిని వారు నిర్మూలించుదురు. ఓ, మై! అంతే.
ఆయన పరమందు చేసినట్లే వారిని పారద్రోలును. అది ఎట్లు జరిగెనో ఆయన, అనగా మన ప్రధాన సైన్యాధిపతి చూపించెను.
159రాయ్ రాబర్సన్, సహో బంక్, ఇంకా చాలమంది పాత యోధులు ఇక్కడున్నారు. నిజమగు సైన్యాధిపతి ఎవరో మీరెరుగుదురు.
ఫావెల్స్ కు అగ్ని అంటుకొన్నప్పుడు జెఫర్సన్ విల్ అగ్నిమాపక దళం వారు అక్కడే యుండిరి. ఆ ప్రధాని వచ్చి ఇట్లనెను, "కొద్దిగా నీరు చల్లండి [చిన్న పంపు ద్వారా నీరు వచ్చిన శబ్దమును సహో బ్రెన్హాం చేసి చూపించారు.] క్లార్క్ విల్ వచ్చి మరికొంత నీటిని చల్లెను. [పంపు గుండా నీరు వచ్చునప్పుడు కలుగు శబ్దమును సహో బ్రెన్హాం అనుకరించి చూపిరి.] ఫావెల్స్ భవనం తగులబడినది.
160వారు లూయిస్ విల్ నుండి ఒక నిపుంగిని పిలిచారు. గంటలు మ్రోగించుకొంటూ అవి ఎట్లు వచ్చెనో చూచారా? ఆ ప్రధానాధిపతి వచ్చెను. శిక్షణ పూర్తిగా లేని అగ్నిమాపక దళము వారు అక్కడక్కడ కొద్దిగా నీరు చల్లిరి. సోదరుడా, ఆ ఇంజను ఆగిన వెంటనే నిచ్చెన పైకి ఎక్కెను. అది కిటికి యొద్దకు వెళ్ళెను. (అతడింకా దానిని అందుకోలేదు), తన గొడ్డలితో కిటికీని కొట్టెను. తన క్రింద పని చేయు వారిని రమ్మని పిలిచెను. కొద్ది నిముషములలోనే అగ్నిని ఆర్చివేసెను. ఒక ప్రధానాధిపతి చేయకలిగెను! అతడు ఇట్లు కొద్దిగా, అటు కొద్దిగా నీరు చల్లలేదు, కాని వారిని రమ్మని పిలిచెను. ఆమేన్. మార్గమును చూపించెను.
ఎట్లు చేయవలెనో చక్కగా శిక్షణ పొందిన అగ్నిమాపక దళము వారు కొద్ది నిముషములలోనే మంటలనార్పిరి. ఎందువలన? వారికి ఒక నిపుణుడగు నాయకుండెను, అతనికి అంతా తెలియును.
MATT 4:3-10•
LUKE 4:3-7
161సోదరుడా, నీ వేదాంత విధ్య, మానవ శాఖలు నేర్చిన సిద్దాంతము, సంస్థలు నేర్చిన పాండిత్యము చాలదు. నాకు ఒక ప్రధాన సైన్యాధిపతి యున్నాడు. ఆయనకు ఎట్లు చేయవలెనో తెలియును.
ఆ సైన్యాధిపతి లూకా 4వ అధ్యాయములో ఎట్లు చేయవలెనో చూపించెను. దానిని నేను చదువు సమయము లేదు. లూకా 4వ అధ్యాయము మొదటి వచనము నుండి మీరు చదువుకొనండి. "మీరు వెళ్ళి పెద్ద సంస్థను తయారు చేయండి. పెద్దలను ఏర్పరచండి, బిషప్పులను నియమించండి" అని ఆయన ఎన్నడూ చెప్పలేదు.
సాతాను ఆయనతో ఇట్లన్నది, "ఇప్పుడు నీవు ఆకలిగొనుచున్నావు కదా? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసికొనుము."
అందుకాయన, "ఈలాగు వ్రాయబడియున్నది" అని చెప్పెను.
"నిన్ను పైకి తీసికొనిపోయి చూపించెదను" అన్నది.
"అయితే ఈలాగు వ్రాయబడియున్నది" అన్నాడు.
"నీవు ఇది చేస్తే…" అన్నది.
"ఈలాగు వ్రాయబడియున్నది!" అన్నాడు.
MATT 16:17,18•
JOHN 5:24
162ప్రధానాధిపతి ఆ విధంగానే చేసి చూపించెను. సోదరీ, ఎట్లు చేయబడినది? "మీరు రోగుల మీద చేతులుంచగా బాగయ్యెదరు" అని వ్రాయబడినది. "నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు" అని వ్రాయబడినది. ఆమేన్! ఈలాగు వ్రాయబడియున్నదని ప్రధానాధిపతి చెప్పెను. అవి ఆయన ఆజ్ఞలు. "నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు." ఈలాగు వ్రాయబడియున్నది; వ్రాయబడియున్నది, అని చెప్పెను. అది ఆజ్ఞలు, ఆ విధంగానే సైనికులు కదిలి వెళ్ళుదురు.
1SAM 17:44-46
163అతడేమి చేసెను? గొల్యాతు దగ్గరకు అతడు నడిచి వెళ్ళెను. దావీదు ఆ సైన్యమునకు, ఆ ఇశ్రాయేలీయులకు ఎట్లు చూపించెను? దావీదు అనగా "ప్రియమైనవాడు, రక్షకుడు" అని అర్థము, చూచారా. దావీదు దానిని ఏ విధంగా చేసెను? దేవుని వాక్యమందు విశ్వాసముంచెను.
గొల్యాతు వచ్చి ఈటె చివరతో ఎత్తి పారవేసి పక్షులకు ఆహారముగా వేయుదునని చెప్పెను. అందుకతడు ఇట్లనెను, "నీవు ఒక సంస్థగా నన్ను ఎదిరించుచున్నావు."
ఒక ఆధునిక శాస్త్రవేత్తగా నీవు నా మీదికి వచ్చుచున్నావు. నీవు నీ పెద్ద పద్నాలుగడుగుల ఖడ్గముతో నా మీదికి వచ్చుచున్నావు. నీవు ఇత్తడి శిరస్త్రాణముతోను, నేను పైకి ఎత్తలేని ఒక డాలుతోను నా మీదికి వచ్చుచున్నావు. నీవు పి.హెచ్.డి. తో నా మీదికి వచ్చుచున్నావు. నీ ఎల్.ఎల్.డి. మరియు రెండు రెట్లు ఎల్. డి. పట్టాలతో నా మీదికి వచ్చుచున్నావు. కాని నేను ఇశ్రాయేలీయుల దేవుడగు యొహోవా నామములో నీ మీదికి వచ్చుచున్నాను. నేడు నేను నీ తలను నీ భుజముల మీద నుండి వేరు చేసెదను." ఆమేన్!
164ఒక చిన్నపాటి వ్యక్తి రాక్షసుని వంటి వాని మీదికి వచ్చుచున్నాడు, కాని అతనికి అతడున్న స్థానము తెలియును. ఇశ్రాయేలీయులు, "ఓ, ఇతడు చిన్నవాడు" అని భయపడుచుండిరి.
"రా, నీ పని చెప్పెదను" అని గొల్యాతు సవాలు చేయుచుండెను.
అతనికి యేసు నందు విశ్వాసమున్నది. (f-a-i-t-h in J-e-s-u-s) అందుకే అయిదు రాళ్ళను ఏరి తెచ్చెను. ఒక చిన్న రాయిని తీసి దానిని వడిసెలలో వేసి విసరెను. ఆ రాయిని పరిశుద్దాత్మ పట్టుకొన్నది. గొల్యాతు నేల కూలెను. అలాగు ఆ పని ముగిసినది.
సువార్త సేవలో ఎదురగు దయ్యములను జయించుట ఎట్లో యేసు చూపించెను.
DEUT 6:16•
DEUT 8:3•
MATT 4:3-7•
LUKE 4:3-12
165"నిన్ను ఎదుర్కొందును, నేనేమి చేయుదునో చూపించుదును. నీవు దేవుని కూమారుని వైతేనా సవాలు ఎదుర్కొనుము. నీవు దేవుని కుమారునివైతే నా మీదికి రా! నీవు దేవుని కుమారునివైతే నీవు ఆకలిగానున్నావు గనుక ఈ రాళ్ళను రొట్టెలుగా చేయుము. నీవు దేవుని కుమారునివైతే నీ శక్తి చూపించు," అని సాతాను (గొల్యాతు) పలికెను.
అందుకాయన ఇట్లనెను, "మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడని వ్రాయబడియున్నది." సైన్యాధిపతి అలాగు చెప్పెదను.
దేవాలయ శిఖరమునకు ఆయనను తోడుకొని పోయి, "ఇక్కడి నుండి దూకుము," అనగానే ఆయన "ఈలాగు వ్రాయబడియున్నది" అని చెప్పెను.
ఆయన వ్రాయబడిన వాక్యమునే ఎత్తి చూపెను, "నీ ప్రభువగు దేవుని శోధింపవలదని వ్రాయబడియున్నది." ఆయన తన్ను ఎవరని చెప్పుకొనెను? "నీ ప్రభువగు దేవుడు, నీ ప్రభువు ప్రభువగు దేవుని శోధింపవలదు? అది కూడా వ్రాయబడియున్నది, చూచారా?"
MARK 16:17
166ఓ, ఆయనేమి చేసెను? దేవుని వాక్యముతో వానిని ఓడించెను. దేవుని వాక్యమును నిన్ను నమ్మకుండా చేయుటయే అపవాది తంత్రము. మన సైన్యాధిపతి దేవుని వాక్యము తీసికొనమని చెప్పెను. "నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టెదరు."
167కొన్ని శాఖలు సాతానును డెక్కలు గలదిగాను, తోకగలదిగాను చిత్రీకరించుచున్నవి. దానిని మీరు నమ్మకుడి. వాడు ఈ విధంగా లేడు. సోదరుడా, వాడు మోసగాడు. నిన్ను భయపెట్టుటకు వారాలాగు చూపించుచున్నారు. ఆదిలో కూడా సాతానుకు డెక్కలు లేవు. వాడు ఆత్మయై యుండెను. వారు చిత్రీకరించు భీకర రూపము వాడికి లేదు. వాడు తెలివిగలవాడు. సోదరుడా, వాడు నిజంగా తెలివిగలవాడు. లోక విద్య మొత్తము వాడెరుగును. (ఇప్పుడును) ఓ, వాడు అందమైనవాడు. వాడు తన సైన్యమునకు లోక జ్ఞానము నూరి పోసెను. సోదరుడా, నీ మాటలు చెప్ప ప్రయత్నించవద్దు. "అద్భుతములు జరుగు రోజులు గతించాయి," అని చెప్పేవారితో నీవు ఏమి మాట్లాడుచున్నావో ఎరిగి యుండుము.
168వాడికి భయంకర రూపము లేదు. సెమినరీలో బాగా చదివినవాడు. సోదరుడా, వాడు చాలా మేధావి. పి.హెచ్. డి. ఎల్.ఎల్.డి. క్యూ.యు.ఎస్.డి. మొదలగు ఎన్నో పట్టాలు పుచ్చుకొనెను. మేధావి? సర్పము అన్నింటికన్న యుక్తిగలది. వాడి బట్టలు అన్నియూ ఎక్కడా మడతలు లేక యున్నవి. చాలా తెలివిగలవాడు. ఇది నిజము. వాడితో నీవు ఆటలాడవద్దు. నీవు ఎరిగి మాట్లాడుము. ఓ, మనకు వాడి పాత పన్నాగములు తెలియును. వాడేమిచేయ ప్రయత్నించుచున్నాడో మనమెరుగుదుము. దేవుని వాక్యమును నమ్మకుండా చేయును. వాడికి భీకర రూపము లేదు.
వాడికి భీకర రూపము లేదు గనుక మరేదో రూపము ఉండి యుండును. వాడు మోసగాడు. విద్య, తెలివి, యుక్తి కలిగియున్నాడు. సోదరుడా, వాడి సైన్యము అట్టిదే.
169చూడండి. ఒకసారి స్విట్జర్లాండులోనికి జర్మనీ సైన్యములు వచ్చినవి. (ఆ చోట నేను చెప్పలేను!) అది ఒక ఇటుక రాతి గోడ వలె కనిపించెను. ప్రతివారం శిక్షణ పొందినవారే, ఈటెను ఎనిమిది లేదా పది అడుగుల ముందుకు దూయగలదు. వారు ఆ స్విస్ వారి యొద్దకు వచ్చిరి. వారికేమున్నది? కర్రలు, రాళ్ళు, కొడవళ్ళు తప్ప మరేమీ లేదు. వారు వాటితో నిలబడి యుండిరి. వారి ఇండు ఆ కొండకు ఆవల యున్నవి. ఈ స్విస్ సైన్యము వీరితో తలపడ వెళ్ళినది. వారు వీరినేమి చేయలేదు. వచ్చి వారి యొక్క భూమిని ఆక్రమించిరి.
170ఈ చిన్నది ఏమి చేసెను? - కేవలము చిన్నది. సాతాను ఆమె ప్రాణమును తీసివేయగలడు, వాడు అదే అయి యున్నాడు. నిశ్చయంగా! అది వారి అపరిపక్వతను సూచించుచున్నది.
చూడండి? స్విస్ వారు ఏమి చేయలేదు. వారు మంచి ప్రజలు. వారు తమ గృహములను రక్షించుకొనగోరిరి వారచ్చట నిలబడిరి. ఆర్నాల్డ్-వాన్-వింకిల్-రీడ్ అను పేరు గల ఒకడుండెను.
ఈ సైన్యము వచ్చి వారిని చుట్టుముట్టెను. "ఏమి చేయగలము? ఎటు చూచినా శిక్షణ పొందిన జనులు చుట్టుముట్టియుండిరి. సాతాను ఆ విధంగా చేయును. చక్కగా శిక్షణ పొందిన వారు. ఈటెను విసరగలరు. ఆ సైన్యము చక్కగా అడుగులు వేయుచూ ముందుకొచ్చుచున్నది. వారి ఈటెలతో అందరినీ పొడిచిరి. స్విస్ సైన్యము నాశనమయినది.
171వారి ఇండ్లు, ప్రియులు ఆ కొండ మీద యుండిరి. స్త్రీలను మానభంగము చేసిరి. వారి యువతులను, పిల్లలను చంపి, ఇండ్లు తగులబెట్టిరి. ఆహారము, పశువులు మొదలగు వాటిని దోచుకొనిరి ఏమైనది?
ఆర్నాల్డ్-వాన్-వింకిల్-రీడ్ అను ఒకనికి ఆవేశము పుట్టినది. అతడిట్లనెను, "స్విట్టర్లాండు వారలారా! ఈ రోజు నేను స్విట్జర్లాండు కొరకు చనిపోదును? ఆమేన్. "ఈ రోజు నేను స్విట్టర్లాండు కొరకు చనిపోదును!"
"నీవు ఏమి చేయుదువు?" అని వారు అడిగారు.
"మీరు నన్ను వెంబడించి మీకున్నవాటితో పోరాడుడి" అనెను. అతడక్కడ నిలబడి తన ఈటెను విసిరెను. (అతని చేతిలో నున్న కర్రను); చేతులు పైకెత్తి, "స్వాతంత్ర్యమునకు చోటియ్యుడి" అని బిగ్గరగా అరచుచూ సైన్యములోనికి చొచ్చుకొనిపోయెను. అలాగు పరుగిడుచూ తనకు అందిన ఈటెను లాక్కొని వారి ఈటెలతో వారిని పొడిచెను, మరియు చివరకు అతడును మరణి౦చెను.
172అంతకు ముందు అతడిట్లు చెప్పెను, "అక్కడనా చిన్న ఇల్లున్నది, నా భార్య, పిల్లలు అందులో అందులో యున్నారు. నేను ఇంటిని కొద్దికాలము క్రితం కొన్నాను. అది వదిలి వెళ్ళుచున్నాను. వారిని నేను ప్రేమించుచున్నాను, కాని ఈ రోజు స్విట్టర్లాండు కోసం చనిపోవుచున్నాను. దేశమును రక్షించుట కొరకు నా ప్రాణమిచ్చుచున్నాను." అతడు ఒక హీరో… అప్పటి నుండి వారికి యుద్ధమే లేదు; అదే ముగింపు. అతని శౌర్యము వలన సైన్యము తుడిచి పెట్టబడెను. ఆ సైన్యము గందరగోళమై పోయినది. వారి మీద స్విస్ వారు రాళ్ళు దొర్లించిరి. వారిని దేశము నుండి తరిమి వేసిరి. అప్పటి నుండి మరెన్నడూ వారు దండెత్తలేదు. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినది. చూచారా?
EXOD 15:26•
PS 103:3
173అది ఒక గొప్ప కార్యము, కాని ఓ, సోదరుడా, అజ్ఞానము, మూఢత్వము, సందేహము, నిరాశ, భయము దేవుని జనులను మూలకు త్రోసివేసెను. యేసుక్రీస్తు అను పేరుగల ఒకాయన ఇట్లు పలికెను, "ఈ దినము నేను జనుల కొరకు చనిపోయెదను." అది నిజము.
ఆయన తన సైన్యమునకు ఏమి చెప్పెను? "నన్ను వెంబడించుడి మరియు మీ యొద్ద ఉన్నదానితో పోరాడుడి. మీ వద్ద కర్ర ఉన్నచో, ఆ కర్రతోనే పోరాడుడి. భయపడవద్దు! మీ వద్ద రాయి యున్నచో, ఆ రాయితోనే పోరాడుడి. ఈనాడు మన సైన్యాధిపతి అదే చెప్పుచున్నాడు. "నేను దేవుని వాక్యమును తీసికొని దయ్యమును పూర్తిగా ఓడించాను." ఆ వాక్యముతో వాడిని తుత్తునియలు చేసెను. (ఆమేన్!)
మీ యొద్ద ఒక్క మాట యున్నదా, "నిన్ను స్వస్థపరచు యొహోవాను నేనే." దానితో కొట్టండి! ఆయనను వెంబడించుడి. (ఆమేన్!) మన సైన్యాధిపతిని వెంబడించుడి. అవును, ఆయన వాడిని ముక్కలు చేసెను.
LUKE 16:8
174సాతాను యొక్క అందమగు పెద్ద రాజ్యములు, ఆధునిక వసతులు, మరియు ప్రతియొక్కటి, దానితో మనకు చేయునది ఏదియు లేదు. అది నిజము. వాడు భూజంతువులన్నింటిలోను యుక్తిగలవాడు. అవునయ్యా! ఈ లోక సంబంధులు దేవుని రాజ్య సంబంధికుల కంటె తెలివిగలవారని యేసు చెప్పెను.
ఇప్పుడు, ఈ రెండు పోరాటములు బహు దగ్గరగా వచ్చుచున్నవి. (నేను ముగించవలెను.) ప్రపంచమును వ్యాధులు ముంచెత్తు సమయము ఇదే. వైద్య శాస్త్రము ఏమీ చేయలేకపోవుచున్నది. ఎవరూ ఏమీ చేయజాలరు. దేవుని యొక్క చిన్న సైన్యము మూల దాగినది. మరో ఆర్నాల్డ్-వాన్-వింకిల్-రీడ్ లేవవలసిన ఘడియ ఇదే.
ISA 59:19
175మరో దైవజనుడు లేవవలసిన సమయమిదే; ఏలియా ప్రత్యక్ష్యమవ్వవలసిన సయమము ఇదే. ఏదో జరుగనైయున్న సమయము ఇదే; దేవుని సైన్యమా, నీ మనస్సు మూసికొనుము; ఒక్క నిముషము కూడా ఆగి ఆలోచించవద్దు. నీ జ్ఞానేద్రియములు ద్వారా అపవాది ఏదో చెప్పును. గుర్తుంచుకొనుము, దేవుని వాక్యము ఎన్నడూ విఫలము కాదు. రెండు మహా సైన్యములు…
నేడు శత్రువు ప్రవాహము వలె వచ్చుచున్నాడు. దేవుడుతానేమి చేయుదునని చెప్పెను? దానికి విరోధముగా దేవుని ఆత్మ లేచును. నీవు వారిలో ఒకనిగానున్నావా? అవునయ్యా!
JAS 4:7
176యాకోబు 4:7లో మనకు నేర్పింపబడినది చూడండి. (నాకు చదివే సమయము లేదు), యాకోబు 4:7లో అపవాదిని ఎదిరించుడి అని యున్నది. అపుడు వాడు నశించుపోవునని చెప్పలేదు గాని పారిపోవునని చెప్పెను. అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎట్లు ఎదిరించగలరు? మనలను ఏమి చేయమని మన సైన్యాధిపతి చెప్పెనో అలాగే చేయవలెను. దేవుని వాక్యమును తీసికొనండి. దేవుని వాక్యముతో మీరు అపవాదిని ఎదిరించగలరు. మన సైన్యాధిపతి మనకు మాదిరి చూపెను. మంచిది.
177ముగింపులో ఇది చెప్పగోరుచున్నాను: ఆ ముసలి అపవాది ఆయన పిల్లల మీదికి మాత్రమే వచ్చునని మీరు అనుకోనుచున్నారా? వాడు దేనినైనా ఎదిరించును; యేసుక్రీస్తుపై వాడు దాడి చేసెను. మూడు భీకర పోరాటములు ఆయనతో చేసెను. మీరది ఎరుగుదురా? సాతాను ఒక్కసారి ఎదుర్కొని వెళ్ళడు. ఒకసారి వ్యాధితో నిన్ను ఎదుర్కొనును. మరోసారి, "అద్భుతములు జరుగు దినములు గతించినవి. నీవు స్వస్థత పొందలేదు; అట్టిది అసలు లేదు," అని చెప్పి ఎదుర్కొనునని నీవెరుగుదువా?
యేసును మూడుసార్లు వాడు ఎదుర్కొనెను. దేవుని వాక్యమును నమ్మకుండునట్లుగా ఆయనను చేయుటకు మూడు సార్లు ఆయనపై దండెత్తెను. సాతాను దేవుని వాక్యము నమ్మదు. అందుకే, "నీవు దేవుని కుమారునివైతే" అని చెప్పినది. శత్రువు మూడు సార్లు భీకరముగా మీద పడినది. "నీవు దేవుని కుమారునివైతే, ఒక అద్భుతము చేసి నాకు చూపించు," అన్నది. సోదరుడా, వాడు మూడుసార్లు భీకరంగా దండెత్తి "నీవు దేవుని కుమారునివైతే?" అని అడిగినది.
JOHN 1:1,14
178ఇప్పుడు, యేసు ఏమి…? యేసు దేవుని వాక్యము; అయనే వాక్యము. అపవాది వాక్యము మీద దండెత్తెను. నిజంగా ఇప్పుడు నాకు బోధించవలెననిపించుచున్నది. యేసే వాక్యము. ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యమే శరీధారియై మన మధ్యనివసించెను. యేసే వాక్యము, ఆయనేమి చేసెను? వాడిని ముక్కలు ముక్కలుగా చేసెను. ఓ, మై! (నేను ముగించబోవుచున్నాను.) యేసు ఏమి చేసెను? ఆయన వాక్యము, కాబట్టి వాక్యముతోనే ఆయన సాతాను పన్నాగములను చిత్తు చేసెను. యేసు మీదికి వాడు ఆ మూడు శోధనలను వదిలెను. యేసు వాక్యమును తీసికొని వానిని ముక్కలుగా నరికెను. హల్లెలూయా! ఆ వాక్యముతో వానిని ఓడించెను, వానిని ముక్కలుగా నరికెను.
179వాని పన్నాగములను చూడండి? ముగింపులో జాగ్రత్తగా వినండి. వాడి ఆయుధము ఏది? దేవుని వాక్యమును నమ్మకుండా చేయుటయే. ఇంతకంటే గొప్ప పోరాటము మరెన్నడూ ఉండదు. రెండే శక్తులున్నవి: సాతాను మరియు దేవుడు. నీకు విరోధముగా సాతాను ఆయుధము ఏమిటి? నీ ఆయుధమును నీవు నమ్మకుండా చేయును. ఆ విధంగా నిన్ను నిరాయుధునిగా చేయును. ఇప్పుడు బహు జాగ్రత్తగా వినుము.
నీ ఆయుధము పట్ల నీకు నమ్మకము లేకుండా చేయును, అనగా నీ ఆయుధము బలమైనది కాదని నీవనుకొనునట్లు చేయును. నిన్ను నిరాయుధునిగా చేయును. (ఓ, నెవిల్ సోదరుడా, నీవెన్నడూ ఆ అపనమ్మకము కలిగి యుండవని ఆశించుచున్నాను.) నీ ఆయుధములో నీకు నమ్మకము లేనిచో, నీవు నిరాయుధుడవే. దానిని నీవు క్రిందపడవేసినచో నీ యుద్ధము అయిపోయినట్లే. ఆ ఆయుధమును పట్టుకొనుము; దానిని క్రింద పడవేయవద్దు! వాడి అవిశ్వాసమును మనము చూచాము. ఒక నిముషము పాటు మరో సంగతి నేను చెప్పెదను.
180బైబిలు విద్యారులు మరియు విశ్వాస యోధుల ఉపయోగార్థము ఇది చెప్పగోరుచున్నాను. రష్యా గూర్చి మీరెందుకు గగోలు పెట్టుచున్నారు? మీరు బాంబు దాడి నుండి దాగు ఆశ్రయము కట్టుకొనవలెనని నేను చెప్పలేదా? రష్యా గూర్చి మీ చింత ఏమిటి. రష్యా ఏ యుద్ధమును జయించలేదు. ప్రపంచమును అసలే జయించలేదు. జనుల మాట వినవద్దు. దేవుని మాట తప్పిపోవునా?
వినండి, ఇది టేపు అగుచున్నది. ప్రపంచమునకు చెప్పుచున్నాను లేదా ఈ టేపు వెళ్ళు ప్రతి చోట ఇది వినబడును. నాకేమి జరిగినా గాని మీరు ఈ మాట నమ్మండి. రష్యా కమ్యూనిజము, దేనినీ జయించలేవు, దేవుని మాట తప్పిపోదు. రోమనిజం ప్రపంచమును జయించును.
DAN 2:37-39
181దానియేలు దర్శనము చూడండి; అది దేవుని వాక్యము. "ఆ బంగారు శిరస్సు, రాజగు నెబెకద్నెజరు — బబులోను. దాని తరువాత మరో రాజ్యము వచ్చును , అది వెండి, (చూచారా), అది మాదీయ పర్షియా; మరొకటి గ్రీసు, అనగా మహా అలెగ్జాండరు; తరువాత రోమ్ వచ్చును" — కమ్యూనిజం గూర్చి ఏమి చెప్పబడలేదు! ప్రపంచమును రోమ్ జయించెను.
యేసుక్రీస్తు మొదటి రాక రోమా రాజ్యములోనే జరిగెను. రోమా రాజ్యములోనే యేసుక్రీస్తు జన్మించెను. ఇప్పుడాయన రెండవసారి వచ్చును. రోమా రాజ్యములోనే ఆయన హింసించబడెను. ఆయన వర్తమానము రోమను శాఖ ద్వారా హింసించబడుచున్నది. అదే వాటన్నింటికి తల్లి, ఆయన తిరిగి వచ్చినప్పుడు, రోమను రాజ్యమును తుడిచి వేయును. ఆయన వచ్చి రోమను రాజ్యమును తుడిచివేయుట కొరకు యూదులు నిత్యము ఎదురు చూచుచుండిరి. కాతలిక్కు శాఖలన్నియూ ప్రపంచమంతటా ఏకమగుచున్నవి. ఇప్పుడు ఒక సంస్థగా మారుచున్నవి. సంఘ సమాఖ్య ఒకటిగా కలియుచున్నది. రష్యా కాదు, అది రోమ్! అది "యోహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు."
182కమ్యూనిజం గాని మరొకటి గాని ఏలునని వాక్యమెక్కడ చెప్పుచున్నదో నాకు చూపించండి - రోమ్ ఏలును. నెబుకద్నెజరు తరువాత మాదీయ పారసీకులు వచ్చిరి. నిశ్చయంగా! వారి తరువాత గ్రీసు వచ్చెను. అవును. వారినుండి రోమ్ తీసికొనెనా? పది ఒట్మాన్ శక్తులుగా అది విడిపోయినది. నేడు అదే యున్నది. ఐసెన్ హోవర్ అనగా ఇనుము. కృశ్చెవ్ అనగా మట్టి, వారివురి కూడిక జరుగలేదా? కృశ్చెవ్ తన చెప్పు తీసి దానిని విశదపరచెను. బల్ల మీద దానిని కొట్టి జనులకు చూపించెను. [సహో బ్రెన్హాం వేదిక మీద కొట్టి చూపించిరి.] నేడు జనులు ఏమి తలంచుచున్నారు?
JOHN 17:17•
REV 17:1,5
183మనవిశ్వాసము ఎక్కడున్నది? దేవుని వాక్యము సత్యమని మీరు నమ్ముట లేదా? నేటి బోధకుల మాట ఏమిటి? ప్రతి బోధకుడు కమ్యూనిజం గూర్చి పోరాడుటకు ప్రయత్నించుచున్నాడు. కమ్యూనిజం శూన్యము. దయ్యపు పన్నాగము మీరు గుర్తించుట లేదు. అది రోమనిజం, శాఖావాదము ఏలును, శాఖలకు తల్లి రోమ్. అది వేశ్య అనియు దాని పిల్లలు వేశ్యలనియు బైబిలు చెప్పెను. వారు దేవునికి, దేవుని వాక్యమునకు విరోధులు. సైనికులారా, దేవుని వాక్యము పట్టుకొని; [దేవా కృప చూపుము] దానితోనే నిలచియుండండి.
ఒక రోజున నేను నశించెదను, కాని ఈ వాక్యము నశించదు. నా తరములో ఇది జరుగని యెడల, యౌవ్వనులారా, మీరు దానిని చూచెదరు. అక్కడే ఉన్నది.
184ఈ ఉదయము వార్త మీరు విన్నారా? శ్రీమతి. కెన్నెడీ పోపును చూచుటకు వెళ్ళుచున్నది. పోపు ఏమి చెప్పును? చూచారా? లోక మతములన్నియూ. చూచారా? మంచిది, వచ్చే ఆదివారము దానిగూర్చి మరెక్కువ తెలిసికొందము.
REV 17:5
185చూడండి? రష్యా గూర్చి చింతపడవద్దు. రష్యా కేవలము సముద్ర తీరములోని చిన్న గులకరాయి వలె యున్నది. కమ్యూనిజం గూర్చి చింతపడవద్దు; రోమనిజంను మీరు గమనించండి, అది సంఘములతో చేరుచున్నది. కమ్యూనిజం లోకమును ఏలునని లేఖనములో ఎక్కడా వ్రాయబడలేదు. ఎవరేమి చెప్పినా, నేను వాక్యమునే నమ్ముదును. దానిని బట్టి నడిచెదను.
రోమనిజం ప్రపంచమును ఆక్రమించును. రోమనిజం సంస్థలకు తల్లి. రోమ్ మొదటి సంస్థ, మిగతావన్నియూ అందులో నుండియే వచ్చెను అని బైబిలు చెప్పుచున్నది. అది వేశ్యలకు తల్లి, (ఒక రోజంతా దాని గూర్చి చెప్పగలను, కాని ఇప్పుడు కుదరదు.)
PHIL 2:5
186శత్రువు మిమ్మును ఎదుర్కొన్నప్పుడు మీరేమి చేయుదురు? వెనుదిరుగుదురా? రాజీపడుదురా? నిజమగ సైనికుడు వెనుదిరగడు. అప్పుడు మనము ఏమి చేయుదుము? క్రీస్తుకు కలిగిన మనస్సు మీరును కలిగియుండుడి . బైబిలు అదే కదా చెప్పెను? క్రీస్తుకు కలిగిన మనస్సును మీరును కలిగియుండుడి. ఆయన ఏ రకమగు మనస్సు కలిగి యుండెను? వాక్యముతో నిలిచి యుండెను. అది నిజము! వాక్యముతో నిలిచి యుండెను. తండ్రి వాక్యముతో నిలిచియుండి ప్రతిసారియు శత్రువును ఓడించెను.
EPH 6:17
187శత్రువు నీ మీద పడి, నీవు ఇది చేయవలెను, అది చేయవలెను అని చెప్పుటకు ప్రయత్నించును. అప్పుడు నీవేమి చేయవలెను? వాక్యముతో నిలిచి యుండుము. అది మంచిది. అప్పుడు మీరేమి చేయవలెను? వాక్యమును తీసికొనవలెను! వాక్యము అనగా ఏమిటి? బైబిలు చెప్పుచున్నది, ఇప్పుడే మనము బైబిలులో చదివాము. దేవుని ఆత్మయే వాక్యము, చూచారా. ఇటు చూడండి. "రక్షణ శిరస్త్రాణము, ఆత్మ ఖడ్గమును తీసికొనుడి — ఆత్మ ఖడ్గము. ఏమిటి? నీ మనస్సు ద్వారా వచ్చి నీలో ప్రవేశించు ఆత్మ; మరియు ఆత్మ ఖడ్గమే దేవుని యొక్క వాక్యము! అత్మ దేనితో పోరాడును? పరిశుద్దాత్మ దేనితో యుద్ధము చేయును? భావములు? వాక్యపు అనుభూతి! మహిమ!
అది దేనితో పోరాడును? భావములు? వాక్యము! వాక్యము! అందరము వాక్యము అని చెప్పుదము. దేవుని వాక్యమును తీసుకొని ఆత్మ పోరాడును.
దేవుని ఆత్మ అపవాది యొద్దకు వెళ్ళి, "ఈలాగు వ్రాయబడియున్నది?" అని చెప్పెను. ఆమేన్! "ఈలాగు వ్రాయబడియున్నది!" అనగానే అపవాది తొలగిపోయెను.
JOHN 17:17•
HEB 4:12
188మనము ఏమి చేయవలెను? దేవుని వాక్యము అను ఖడ్గమును తీసికొనవలెను. దేనితో దానిని లాగవలెను? విశ్వాస హస్తముతో, బలమగు విశ్వాస హస్తముతో రెండంచుల ఖడ్గమును లాగవలెను. హెబ్రీ 4లో బైబిల్ ఈలాగు చెప్పెను, అది రెండ౦చుల ఖడ్గము. ఇరువైపుల నరుకును.
సోదరుడా, అతడేమి చేయును? నీ హృదయములోనిక ఆత్మను రానీయవలెను. నీ మనస్సు తెరచి "నీ వాక్యమే సత్యము" అని చెప్పుము. (సోదరీలు కూడా ఇదే చేయవలెను) "ప్రభువా, నీ వాక్యమే సత్యము, నా భావముల పట్ల నేను దృష్టి నిలుపుటలేదు. ఎవరేమి చెప్పినా వినను, నాలో నున్న ప్రతి సందేహమును పేల్చివేయుచున్నాను, వాటన్నిటిని దాటి నేను ఆత్మ యొద్దకు తిన్నగా వచ్చుచున్నాను.
NEH 8:10
189ఓ, ప్రభువా, రమ్ము; "నన్ను స్వేచ్చా జీవిగా చేసియున్నావు, అని చెప్పితివి."
"నా కుమారుడా, నీవు స్వతంత్రునివే."
"మంచిది. నా హృదయమును, నా మనస్సును తెరచెదను. ప్రభువైన యేసు, లోనికి రమ్ము" అని చెప్పి విశ్వాసమును పుంజుకొనుము. ఆత్మ ఖడ్గమును పట్టుకొమ్మని, "యోహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు!" "హల్లెలూయా" అని కేక వేయుము. ఆమేన్! నీ ఎదుట నున్న ప్రతి శత్రువును సంహరించుము.
ప్రతి శత్రువును నరికి వేయుము. ముసలి భూతము నిన్ను కలవరపరచుచున్నదా? ప్రభుని వాక్యముతో దానిని నరికి వేయుము. యోహోవా యందలి ఆనందమే మన బలము. వాక్యముతో దానిని నరికి, సంహరించుము. దూరంగా త్రోసివేయుము.
190దయ్యమైనా, శత్రువైనా, వ్యాధి అయినా, బలహీనత అయినా, ఏమయినా గాని; వాక్యమును తీసుకొని మరియు ఖడ్గముతో దానిని నరికి వేయుము: మొదటసారి నీవు నరికినప్పుడు, అది కదలనట్లు కనబడినచో, మరలా దానిని నరుకుము. కోడిపిల్ల లేక పక్షిరాజు పిల్ల గుల్లను పొడిచి రంధ్రము చేసినట్లు నీవును దానికి రంధ్రము చేయుము. వ్యాధి అను గుల్లకు రంధ్రము చేసి, దానిగుండా బయటకు రమ్ము, చెప్పుము, "హల్లేలూయా, మరొకటి ఎక్కడ?" అని చెప్పుము. ఆమేన్! అదియే యుద్ధము; అతడే సైనికుడు. అతడే సిలువ యోధుడు. అవునండి!
191ప్రతి శత్రువును పడగొట్టుము. ఎందువలన? ఎందుకు? మనము ముందుగా నిర్ణయించబడిన అబ్రాహాము యొక్క రాజ సంతానముగా ఉన్నాము. దేవుని వాక్యమునకు విరోధముగా నున్న ప్రతి దానిని అబ్రాహాము వ్యతిరేకించెను. అతని ఎదుటికి వచ్చిన ప్రతి ఆటంకమును నరికివేసెను.
"నీ భార్య చాలా ముసలిది" అని వారనగా. ఆ మాటను తన త్రోవలో అడ్డము రాకుండా తొలగించెను.
"నీవది చేయలేవు, ఇది చేయలేవు," అని అపవాది పలుకును.
అబ్రాహాము దానిని మార్గములో నుండి నరికివేసెను. అతడు అన్నింటినీ పూర్తిగా నిర్మూలించి, "ప్రభువా, తరువాత ఏమిటి?" అని అడిగెను.
"నీ గుడారమును ఇక్కడ నుండి తీయము." అతడు దానిని తీసి ఆ చోటులో బలిపీఠము కట్టెను.
అక్కడికి వెళ్ళినప్పుడు సాతాను వచ్చి, చెప్పెను, "ఇప్పుడు, నేను నీకు చెప్పెదను, ఇది సరి అయిన చోటు కాదు."
"నేను ఇక్కడే యుందును. నీవిక్కడ నుండి పొమ్ము!" హల్లెలూయా!
"నీవు ఇక్కడికి వచ్చుట మంచిది; ఇక్కడ మాకు చాలా బాగున్నది. ఇక్కడ మేమందరము ఒక సంస్థగా ఉన్నాము. నా భార్య ఆ సాహిత్య సమాజమునకు మరియు పట్టణలో ప్రతియొక్కదానికి అధ్యక్షురాలు. నీవిచ్చటికి రమ్ము" అని లోతు చెప్పెను.
192శారా చెప్పెను "అబ్రహామా…"
"శారా! నోరు మూసికో. [హల్లేలూయా!] ఇక్కడే నిలిచి యుండుము! దేవుని నన్ను ఇక్కడే ఉంచెను. ఇక్కడే నేను నిలబడెదను. దేవుడు నన్ను ఇచ్చట ఉండమనెను."
యేసు నామములోని శక్తిని అందరూ కొనియాడుడి.
దేవదూతలు సాష్టాంగపడును;
రాజమర్యాదను చూపెదరు
క్రీస్తు అను స్థిరమైన బండ మీద నిలబడియున్నాను;
మిగిలినదంతయూ మునిగిపోయే ఇసుక,
తక్కినదంతయూ కూలిపోయే నేల.
మరణము మరియు తక్కినదంత కూడా కూలిపోవు ఇసుకయే. "క్రీస్తు అను స్థిరమైన బండ మీద నేను నిలబడియున్నాను." అబ్రాహాము యొక్క రాజ సంతానము, రాజ వంశము.
193ఎందుకు, ఇంగ్లాండు యొక్క ఎన్నుకొనిన సైన్యము రాజ సైన్యము, రాజరికపు రక్తము అందులో యున్నది. క్రీస్తు యొక్క రాజ వంశము పరిశుద్దాత్మతో నింపబడిన సంఘమే. పరిశుద్దాత్మతో నింపబడినది. వాగ్దానముతో కూడిన రాజ సంతానము భావోద్రేకములతో కాదు గాని, దేవుని వాగ్దానముతో కూడినది. వారు దేవుని వాక్యముబట్టి నిలబడి, మార్గములోని ప్రతి దానిని నరికి వేయుదురు. "హల్లెలూయా!" అని కేకలు వేయుదురు. మరణము ముంచుకొని వచ్చిన గాని, వారికి మార్గము ఉన్నది.
"యోర్దాను, నేను దాటునట్లుగా మార్గము ఇమ్ము" అని చెప్పుము. వాగ్దాన దేశములోనికి నీవు నేరుగా సాగిపో. ఆమేన్!
194ఏమవును? యుద్దమంతయూ ముగిసిన పిదప పరిశుద్దులు ఇంటికి సాగిపోయెదరు. (నిశ్చయంగా నేను ముగించవలెను), ఒక సంగతి మిమ్మును అడుగగోరుచున్నాను. హిట్లరు ఫ్రాన్సులోనికి వెళ్ళినప్పుడు ఏమయినది? విమానముల వలన ఆకాశము కనబడలేదని వారు చెప్పిరి. జర్మనులు విజయోత్సాహములను నిలబడి జరుపుకొనిరి? (చూచారా?)
స్టాలిన్ రష్యాకు వచ్చినప్పుడు వెనుక మైళ్ళ తరబడి టాంకులు నిలబడి యుండినవి. బెర్లిన్లో ఏమీ మిగల్చకుండా బాంబు దాడి చేసిరి. ఈ రష్యను సైనికులు విజయోత్సవమును జరుపుకొనిరి. వారు ఒక వింత పని చేసిరి. వారెట్లు ఉత్సవము జరుపుకొన్నారో ఒకసారి నేను లండన్లో చిత్రపటమును చూచాను. (జరిగిన దాని యొక్క వాస్తవపటము) ఓ, యుద్ధము సమాప్తమైనదని మేము విని కేకలు వేశాము. ఈలలు వేశాము. యోధులు వచ్చినప్పుడు వారిని మేము ఎదుర్కొన్నాము; వారందరూ కేకలు వేసి కేరింతలు కొట్టిరి.
195నాకు ఒక బంధువున్నాడు. వారు తిరిగి వచ్చినప్పుడు యుద్ధ భయము వలన పడకల మీద నుండి లేవలేదని అతడు చెప్పెను. నిలబడియున్న స్వాతంత్ర్య విగ్రహము చూచుటకు వారు ఓడ పైభాగమునకు వచ్చిరి. వారు ఆ స్వాతంత్ర్య విగ్రహమును చూచి ఏడ్చిరి. అంత బలాఢ్యులు దానిని చూచి ఏడ్చిరి. వారు యుద్ధములో నాలుగు సంవత్సరములుండిరి. ఇంటి నుండి దూరమైరి. యుద్ధ భీతితో మూర్చిల్లిరి, కాని స్వాతంత్ర్య విగ్రహము వెనుక తన ప్రియ భార్య, తల్లి, కుమార్తె, తండ్రి, పిల్లలు, ప్రియులు ఉన్నారని వారెరుగుదురు. వారు పోరాడుచున్నట్లు అది నిలిచి యున్నది. ఓ, ఈలలు వేసిరి. న్యూయార్కు దద్దరిల్లినది. యోధులు వచ్చినప్పుడు అలాగే యుండును. ఇది ఇంకా చిన్న విషయము!
GAL 6:5
196ఒకసారి సీజరు మహా యుద్ధము తరువాత ఇట్లు పలికెను, "శత్రువును జయించిన ఈ విజయోత్సవములో అతి గొప్ప యోధుని నాతో కూడా స్వారీచేయవలెనని కోరుచున్నాను." ప్రతి అధికారి తమ దట్టీలు శుభ్రపరచుకొని డాలులను మెరిపించిరి. నిజ సైనికులు అలాగు ముందుకు సాగెదరు. (అది మీరెరుగుదురు) కొద్ది సేపటికి ఒక చిన్నవాడు వచ్చెను. దీనినంతటినీ తేరి చూచెను. అతనికి కొన్ని గాయములున్నవి. సీజరు అతనిని పిలిచి, "ఒక్క నిమిషము ఆగండి; ఒక్క నిమిషము! నీవు, "(ఒక అధికారి వలె దుస్తులు దరింపలేదు) చెప్పెను, "దగ్గరికి రమ్ము. ఈ గాయము ఎక్కడ కలిగెను?" అని అడిగెను.
"యుద్ధ రంగములో" అని చెప్పెను.
"ఇక్కడికి ఎక్కి రమ్ము; నీవు నా ప్రక్కన కూర్చోవలెను" అని చెప్పెను. ఎందువలన? అతడు యుద్ధ రంగములో యుండెను.
ఓ, దేవా, కృప చూపుము. యుద్ధములో గాయములు పొందునట్లు కోరుచున్నాము. "యేసుక్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు కలిగియున్నాను," అని పౌలు చెప్పెను. అందుకే నేనును యుద్ధ రంగములో పోరాడగోరుచున్నాను.
197ఒక దినము మన సైన్యాధిపతి వచ్చును. ఆయనే మనకు సర్వాంగకవచమిచ్చెను. దేవుని కవచమిచ్చెను. అది పరిశుద్దాత్మ యుద్ధము చేయుటకు వాక్యమిచ్చెను. మన సైన్యాధిపతి స్వారీ చేయుచూ వచ్చును. నేను రథము మీద అడుగిడి ఆయనతో కూడా ఇంటికి వెళ్ళెదను; మీరు వెళ్ళరా? నా భార్యను చేతితో పట్టుకొందును, నా సోదరులను, వారి భార్యలను, వారి పిల్లలను నేను చూచెదను. దేవుని యొక్క పరదైసులో మనము నడచెదము. దేవదూతలు గీతములతో వాతావరణమును నింపును. అది ఒక విజయోత్సవము.
యుద్దము ముగిసిన పిదప కిరీటము ధరించెదము. ఓ, సిలువ యోధులారా, ఈ ఉదయము విశ్వాసపు హస్తము లాగుడి. ఈ ఆయుధమును చేతితో పట్టుకొనండి.
సోదరీ, నీ మాట ఏమిటి? సిద్ధముగా ఉన్నావా? ఆయుధమును లాగి ఇట్లు చెప్పుము. "దేవా, అపవాది నాతో ఏమి చెప్పినా వినను, ఎవరుఏది చెప్పినా వినను. ఈ ఉదయము నేను నమ్ముచున్నాను. నేను విశ్వసించుచున్నాను."
198కొన్ని ఆదివారాల క్రితం ఒకాయనకు ఒక కల వచ్చినది. అపవాది చిన్నగా యుండి అతనియొద్దకు పరుగెత్తికొని వచ్చి, "బూ!" అన్నదట. ఇతడు త్రుళ్ళిపడగా అపవాది పెద్దగా ఎదిగినది. మరల "బూ!" అన్నది. ఇతడు భయపడెను. అపవాది ఇంకా పెద్దదయినది. చివరకు అపవాది అతనిని జయించునంత పెద్దదయినది. అతడు దానితో పోరాడుటకు ఆయుధము కొరకు వెదకెను. పోరాడుటకు ఏదీ దొరకలేదు. అతడు బైబిలును పట్టుకొనగా అపవాది మరల "బూ!" అన్నది.
ఇతడు కూడా "బూ!" అనగానే అపవాది చిన్నదయిపోయినది. క్రమ క్రమంగా అది చిన్నదయి పోయినందున వాక్యముతో దానిని అతడు జయించెను.
199సోదరీ, నీవు సైనికురాలవు. వాక్యము తీసికొని మరియు చెప్పుము, "ఈలాగు వ్రాయబడి యున్నది [ఆమేన్!] నేను చనిపోను; నేను బ్రతుకుదును. సంఘములోనికి వచ్చి అందరితో కూడా దేవుని మేలును బట్టి స్తుతించెదను" అని చెప్పుము. పరిశుద్దులారా, అది మీరు నమ్ముచున్నారా? ఆమేన్! మనము తలలు వంచుదము.
ACTS 19:12
200ఓ, ప్రభువైన దేవా, భూమ్యాకాశముల సృష్టికర్తా నీవు ఇంకా దేవునిగానే యున్నావని నేడు తెలియనిమ్ము. నేను ఎంత బోధించినా, ఎన్ని సంగతులు చెప్పినా, ప్రభువా, నీ నుండి వచ్చు ఒక్క మాట అందరినీ సిద్ధపరచును.
ఇక్కడ ఈ చేతి గుడ్డలు పడి యున్నవి. ఇది రోగులకు ప్రతినిధులు. పరమ తండ్రీ ప్రతి ఒక్కరి మీద నీ శక్తి, నీ దీవెన నిలచి యుండనిమ్ము. వాటి మీద నా చేతులుంచుచున్నాను. దేవా, నీ పరిశుద్ధ సన్నిధితో ఈ రూమాళ్ళను అభిషేకించమని యేసుక్రీస్తు నామములో నేను ప్రార్ది౦చుచున్నాను; ఇది వాక్యములో వ్రాయబడియున్నది, వాక్య విరుద్ధము కాదు, పౌలు అంగీని చింపివారు రోగుల మీద ఉంచగా దయ్యములు వెళ్ళిపోయాయి, వివిధ రోగులు స్వస్థత పొందిరని వాక్యములో వ్రాయబడియున్నది.
ఇప్పుడు, మేము పరిశుద్ధ పౌలు కాదు, కాని నీవు ఇంకా మారని దేవునిగానే యున్నావు, నీవు ఇంకను మారని పరిశుద్దాత్మగా ఉన్నావు. ప్రభువైన యేసు నామములో ఈ రుమాళ్ళ మీద నా చేతులుంచి, ఈ ప్రతి ఒక్కరిని దీవించి, బాగుచేయుమని ప్రార్ది౦చుచున్నాను.
201దేవా, ఈ పడక మీద ఒక అందమగు బిడ్డ పడియున్నది. ప్రభువా, ఆమె బ్రదుకలేదు. సాతాను ఆమెకు కీడు చేసినది. ఈలోక వైద్యులు చేయకలిగినదంతా చేసిరి. నిస్సందేహముగా బిడ్డను కాపాడుటకు ప్రయాసపడిరి; ఇక వారేమీ చేయజాలరు. వారు వారియొక్క మానవ ప్రయత్నముల చివరన ఉన్నారు; ఇక ఏమి చేయవలెనో వారెరుగరు. కాని ప్రభువా, మరో అధ్యాయము వ్రాయబడియున్నందుకు నేను సంతోషించుచున్నాను. మరో పేజీని మేము త్రిప్పగలము. ఈ పేజీలో మహా వైద్యుడు వచ్చుట చూడగలము. ఈ ఉదయమున ఆయనను సంప్రదించుటకు వెళ్ళుచున్నాము.
MATT 18:19,20•
MARK 16:17,18
202ప్రభువా, "నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును," అని నీ వాక్యములో వ్రాయబడలేదా? ప్రభువా, నేను విశ్వాసిని కానియెడల ఇప్పుడు విశ్వాసినిగా చేయుము. ఈ చిన్నపిల్ల విశ్వాసి కానియెడల ఇప్పుడామెను విశ్వాసిగా చేయుము. "నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు బాగవుదురు." ఇంకా ఈలాగు వ్రాబడియున్నది: "నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు." ప్రభువా, అవి నీ మాటలు; నీ మాటలే కదా?
నీ దాసునిగా నీవు చెప్పినది చేయుచున్నాను. "ఎక్కడ నా నామమున ఇద్దరు ముగురు కూడియుందురో వారి మధ్యను నేను యందును; ఒక దానిని తాకినట్లు మీరు ఏకీభవించిన యెడల, దానిని మీరు పొందెదరు."
203దేవా, ఈ ఉదయమున ఈ భవనములో ఇంత కంటె వ్యాధి గల వారెవరూ లేరని నేను చెప్పగలను, నీవు లేనియెడల ఆమె ఎక్కువ కాలము బ్రదుకదు. ఆమె బహుగా జబ్బు పడినది. సైనికులమగు మేమందరు ఈ విషయములో ఏకీభవించుచున్నాము. అబ్రాహాము యొక్క రాజ సంతానముగా మేము గుంపుగా ఇక్కడ నిలబడియున్నాము. ఇప్పుడు సాతాను మీదికి దండెత్తుచున్నాము. మా యుద్దాయుధములు మెరయుచున్నవి. స్త్రీ, పురుషులు తమ ఖడ్గములు పట్టుకొనిరి. ఈ చిన్న బిడ్డ నిమిత్తము నీ మీదికి ఇప్పుడు వచ్చుచున్నాము. సాతానా, నీవు పారిపోవుటకు సిద్ధపడుము. సాతానా, ఆమెలో నుండి బయటకు రమ్ము! ఆ బిడ్డను విడిచి పొమ్ము! సజీవ దేవుని సైన్యముగా నిన్ను మేము ఎదిరించుచున్నాము. యేసుక్రీస్తు నామములో ఆమెను విడిచిపొమ్ము. నేనామెపై చేతులుంచుచున్నాను.
204సాతానా, నీవు ఈ బిడ్డను బంధించితివి. నీవే ఈ కీడు చేసితివి. నీవు మానవుని కంటె అధికునివి కావచ్చును గాని నా ప్రభువుకు నీవు సరిపోవు. అందువలన ఆయన నామములో నేను వచ్చుచున్నాను. దయ్యపు ఆత్మా, ఆమెను నీవు విడిచిపెట్టుము. వ్యాధిని తెచ్చుచున్న దయ్యమా, ఈ బిడ్డలో నుండి రమ్ము. ఈ రోజు నుండి ఆమె విడుదల పొందును - యేసు క్రీస్తు నామములో దీనిని నేను ప్రకటించుచున్నాను.
ప్రభువగు దేవా, నీవు మృతులను లేపి దేవునిగా నిరూపించుకొన్నావు. ఈ యువతిని ఆరోగ్యము, బలముతో లేపుము. ఆమె ఈ భవనములో నిలబడునట్లు చేయుము. ఆమెలో నుండి అపవాది పోయినది. ఆమెను నీవే బాగుచేయువాడవు. దేవుని మహిమ మరియు ఘనత కొరకు ఆమె జీవించు గాక! ఇప్పుడు పలుకబడినది. దానిని జరుగనిమ్ము.
205ఇంకా ఇక్కడ చేతులెత్తి ఈలాగె చెప్పేవారెవరైనా యున్నారా? "నేను రోగిని, ప్రార్ధి౦చబడ గోరుచున్నాను. దేవుడు నాకు అవసరము." మనకెంత సమయమున్నదో నాకు తెలియదు. జనులను ఇక్కడికి రానిచ్చు సమయమున్నది. ఈ ఉదయము నేను బహు నమ్మకముగా యున్నాను. బిల్లి, నీవు ఇక్కడికి రావలెనని కోరుచున్నాను. ఈ వైపు వారు, ఆ ప్రక్క వారు రండి. మొదటగా, ఈ వైపు వారు రండి. తరువాత వెనుక వైపువారు రండి. ఆ తరువాత అటు నుండి పిలచుదము.
ఇప్పుడు సహో నెవిల్, ఇంకా సేవక సోదరులు ఇక్కడికి వచ్చి నా ప్రక్కను నిలబడవలెనని కోరుచున్నాను. మీరు వారిని ఈ మధ్య నుండి సమీపించండి. మంచిది.
206మంచిది. ఎంతమంది మీ కవచమును ధరించుకొన్నారు? (ఇప్పుడామెలో మార్పు వచ్చినది. ఇంటికి వెళ్ళి బాగవుము.) ఆమేన్!
ఓ, సైనికులారా, ఖడ్గమును దూయుడి! ఖడ్గమును దూయుడి! సిలువ యోధులారా, ముందుకు పదండి, ముందుకు సాగండి!
క్రీస్తు అను స్థిరమైన బండ మీద నేను నిలబడియున్నాను;
తక్కినదంతయూ కూలిపోవు ఇసుకయే.
207వేదిక ప్రక్కగా రండి! వారు వచ్చుచుండగా అందరూ ప్రార్థనలో యుండుడి. ఇప్పుడు మీ ఖడ్గములు దూయుడి! కేకలు వేయుచు చెప్పుచూ రండి. [జనులు ప్రార్థనా వరుస గుండా వచ్చుచున్నారు.]
యుద్ధమునకు వెళ్ళునట్లు క్రైస్తవ సైనికులారా, ముందుకు సాగండి.
యేసు సిలువతో ముందుకు పదండి!
సాతానా! త్రోవ ఇమ్ము. సైనికులారా, ఏమిటి సంగతి? మనము జయించగలమని తలంచుట లేదా? ఎప్పుడో మనము జయించాము. క్రీస్తు యేసునందు మనము అత్యధిక విజయులము, ప్రతి దయ్యము వెళ్ళగొట్టబడినది.
208[సహో బ్రెన్హాం రోగులకు ప్రార్ధి౦చుచున్నారు.]
నా సాహో స్వస్థపరచుము…?… ప్రభువా. నీవు ఇతడిని స్వస్థపరుచు…?…
నా సాహో స్వస్థపరచుము…?… ప్రభువైన యేసు…?…
ప్రభువైన యేసుక్రీస్తు నామమున…?…
ఓ, ప్రభువైన దేవా, భూమి ఆకాశముల సృష్టికర్త, ఓ, దేవా, ఆమె మనసులో ఏముందో నీవు ఎరుగుదువు. నేవు అన్నియు తెలుసు…?.. నేను ఆమె కొరకు ప్రార్ధి౦చు…?… ప్రభువైన యేసుక్రీస్తు…?…
ప్రభువైన యేసుక్రీస్తు నామమున నిన్ను అభిషేకించుచున్నాను…?… నేను ప్రార్ధి౦చుచున్నాను…?..
ప్రభువైన యేసుక్రీస్తు నామమున…?…
నా సహోదరితో దేవుడు ఉండును గాక. మనకు తెలుసు సంవత్సరములు నెమ్మదిగా వచ్చు…?… గొప్ప పరిశుద్ధాత్మ గాక మరేదియు కాదు. ఇప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు నామమున…?…
ప్రభువైన యేసుక్రీస్తు నామమున దీవించును…?… పోరాటములు…?.. నీవు ఏమి చేయుచున్నావో ఎరిగియుండి, దేవా, తీసుకొనిరమ్ము…?… ఆమెకు ఈ ఉదయాన దీనిని క్రుమ్మరించుము…?…
ఈ చిన్న బాలుడిని దీవించుము…?… తండ్రి మరియు కుమారుడు, మరియు నేను ప్రార్దించుచున్నాను…?…
దేవా, నా సాహో దీవించుము…?… అతడి…?.. మన ప్రభువైన యేసు నామమున…?…
యేసుక్రీస్తు నామమున, మా సహోదరిని స్వస్థపరచుము.
యేసుక్రీస్తు నామమున, మా సహోదరిని స్వస్థపరచుము.
యేసుక్రీస్తు నామమున, మా సహోదరిని స్వస్థపరచుము.
యేసుక్రీస్తు నామమున…?…
యేసుక్రీస్తు నామమున మా సహోదరిని స్వస్థపరచుము.
యేసుక్రీస్తు నామమున మా సహోదరిని స్వస్థపరచుము.
యేసుక్రీస్తు నామమున స్వస్థపరచుము…?…
యేసుక్రీస్తు నామమున మా సహోదరుని స్వస్థపరచుము.
యేసుక్రీస్తు నామమున మా సహోదరిని స్వస్థపరచుము.
యేసుక్రీస్తు నామమున మా సహోదరిని స్వస్థపరచుము.
యేసుక్రీస్తు నామమున…?…
యేసుక్రీస్తు నామమున, నిన్ను బాగుచేయును.
209[ప్రార్ధనా వరుస అలాగే కొనసాగుచున్నది.]…
నీవు ఎవరో తెలుసుకొని…?… సమస్త ఇబ్బందులు. నేను ప్రార్దించుచున్నాను, దేవుడు, నీ యొక్క… అన్నిటి పై…?.. ఖడ్గమును దూసి…?.. మరియు ముందుకు సాగుము..?..
ఓ తండ్రియైన దేవా, నీవు మా సహోదరుని స్వస్థపరచి మరియు ఆయనను బాగుచేయుము, యేసుక్రీస్తు నామమున మేము…?…
దేవా, నీవు మా సహోదరిని స్వస్థపరచుమని ప్రార్దించుచున్నాను..?.. యేసుక్రీస్తు నామమున…?..
తండ్రియైన దేవా, యేసుక్రీస్తు నామమున నా సహోదరుని స్వస్థపరచుమని ప్రార్దించుచున్నాను…?…
ఓ దేవా, ఈయనను దీవించుము, ప్రభువా, యేసు…?… కల్వరి..?.. నీవు దయచేయుము. యేసు నామము…?…
పరలోకము తండ్రి, నా సహోదరుని కొరకు నేను ప్రార్దించుచున్నాను. ఓ దేవా, నేను ప్రార్దించుచున్నాను..?.. దేవా, అతడు…?…
దేవా…?.. నేను ప్రార్దించుచున్నాను నీవు స్వస్థ..?.. దయచేయుము..?..
దేవా, సహోదరుని దీవించుము..?.. నీవు స్వస్థపరుస్తావని ప్రార్దించుచున్నాను, ప్రభువా, యేసు నామమున…?..
మా పరలోకపు తండ్రి, కేవలము…?… ఆమె…?… మాట్లడుచు, పనిచేయుచు…?… నమ్ముము. దేవా, ఆమెను స్వస్థపరుస్తావని నేను నేను ప్రార్దించుచున్నాను…?.. ఖడ్గమునేత్తి దేవుని యొక్క గొప్ప సైన్యము ముందుకు సాగుచున్నది…?.. ప్రభువా. ఆమె చిన్న హృదయము..?.. కాన్సర్ పరుపు పై ఆమె యొక్క తలంపులు…?… బహుశా కాన్సురుతో చనిపోవుచున్నది, వైద్యులు ఆమెపై ఆశలు వదులుకొని..?.. మరియు ఈ ఉదయాన ఇక్కడ అతడు, చిన్న సైనికుడు…?… అతడిని బలపరచుము, ప్రభువా…?… యేసు నామమున. ఆమెన్.
210నేను కోరుచున్నాను ఈ చిన్న స్త్రీ… ఇక్కడున్న బోధకుని గూర్చి ఒక మాట చెప్పవలెను. ఇక్కడికి పైకి రమ్ము! ఇతనిని ఆసుపత్రి నుండి ఈ మధ్యనే పంపిరి. రెండేళ్ళ నుండి ప్రొస్టేటు గ్రంథి కాన్సరుతో తినివేయబడుచున్నది. మరణావస్థలో యున్నాడు. కొద్దిరోజులు మాత్రమే బ్రదుకునని వైద్యులు చెప్పిరి. ఒకనాడు చాలా పెందలకడ మేము వెళ్ళి ప్రార్ధి౦చాము. అంతే, కాన్సరు, ఛాయ కూడా పట్టుకోలేకపోయిరి. ఇంతకు ముందు కంటె ఎక్కువ పని చేయుచున్నాడు. నేను పుట్టుటకు ముందే ఆ దంపతులు సేవలో యుండిరి… ఏబది-అయిదు సంవత్సరములు, నేను ఈ భూమి మీదకు రాక ముందే వారు సువార్తను ప్రకటించిరి. ఇక్కడతడు స్వస్థత పొందియున్నాడు. డెబ్బది-అయిదు లేదా ఎనబై-ఒక్కటి ఏండ్లు. [సహో, కిడ్స్ మరల సహో, బ్రెన్హాంతో మాట్లాడిరి.] రెండు వారములు ఉజ్జీవ కూటములు పెట్టి ప్రతి రాత్రి మాట్లాడెను. ఎనబై-ఒక సంవత్సరాల వృద్దుడు, కాన్సరు నుండి స్వస్థత పొందెను.
211సోదరీ, ఇప్పుడు నీ సమయము. నమ్ముచున్నావా? (క్రైస్తవ సైనికులారా, ముందుకు సాగి పొండి!) మంచిది, సోదరీ, ఇప్పుడు మనము ఏమి చేయగోరుచున్నాము? "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." సాతాను, నీవు నశించావు. ఇక్కడెందుకు నిలబడెదవు? ఇప్పుడు మేము వచ్చుచున్నాము. వాగ్దాన దేశములోనికి మేము సాగిపోవుచున్నాము. ఏమిటది? వారు నిర్మించుచున్న కొండ మనముందు ఏ పాటిది? మనముందు నిలబడియున్న పర్వతము చదును భూమిగా మారును. ఎందువలన? రెండంచుల ఖడ్గము దానిని నేలమట్టము చేయును. ఇది నిజము.
క్రైస్తవ సైనికులారా, ముందుకు సాగండి! యుద్ధమునకు సాగినట్లు సాగిపొండి.
యేసు సిలువతో యుద్ధమునకు సాగిపొండి!
రాజ యజమాని యగు క్రీస్తు, శత్రువునకు ఎదురుగా నడిపించుట;
(ఆయన వాక్యముతో)
యుద్ధమునకు ముందుకు సాగండి, చూడండి ఆయన ధ్యజము ఎగురుచున్నది!
క్రైస్తవ సైనికులారా, ముందుకు సాగండి! యుద్ధమునకు సాగినట్లు సాగిపొండి.
యేసు సిలువతో ముందుకు సాగిపోవుదము!
212హల్లెలూయా! వారేమి చేసిరి? ఇశ్రాయేలు యుద్ధమునకు పోయినప్పుడు ముందుగా ఏమి చేసిరి? గాయకులు పాడిరి. తరువాత ఎవరు వెంబడించిరి? మందసము, ఆ తరువాత యుద్ధము జరిగెను. మంచిది! ఇప్పుడు దానిని మీరు నమ్ముచున్నారా? "క్రైస్తవ సైనికులారా, ముందుకు సాగుడి" అని ఇప్పుడు పాడుచున్నాము. ప్రతి సందేహమును మనము పారద్రోలియున్నాము. ఇప్పుడు లేచి నిలబడి యుద్ధమునకు సాగుదము. అందరము లేచి నిలబడుదము.
క్రైస్తవ సైనికులారా, ముందుకు సాగండి! యుద్ధమునకు సాగినట్లు సాగిపొండి.
యేసు సిలువతో యుద్దమునకు సాగిపొండి!
రాజ యజమాని యగు క్రీస్తు, శత్రువుకు విరోధముగా నడిపించును. (వాడినెట్లు ఓడించగలము? వాక్యముతో.)
యుద్ధమునకు ముందుకు సాగండి,
చూడండి ఆయన ధ్వజము ఎగురుచున్నది.
క్రైస్తవ సైనికులారా, ముందుకు సాగండి! యుద్ధమునకు సాగినట్లు సాగిపొండి.
యేసు సిలువతో యుద్ధమునకు సాగిపొండి!
ముందుకు సాగిపోవుదము!
మనము విభాగించబడలేదు; మనమంతా ఒకే శరీరము,
నిరీక్షణ, బోధ ఒక్కటే, ప్రేమలోను ఒక్కటే…
213దేవుని నమ్మువారంరూ, "ఆమేన్" చెప్పండి. హల్లెలూయా! మీరది నమ్ముచున్నారా? మనము జయశీలురము. ప్రతి శత్రువు ఎక్కడున్నది? మన కాళ్ళ క్రింద ఉన్నది. మీరు సిద్ధంగా యున్నారా? క్రీస్తునందు లేవండి! సోదరీ, ఇక అది పోయినది, నీవది నమ్ముచున్నావా? ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళవచ్చును. బాగున్నదా? ఆమె బాగున్నట్లుగా చెప్పినది. బాగవును. ఎందరు ఇంకా బాగున్నట్లుగా అనుభూతి పొందుచున్నారు?
వారు కేకలు వేసినప్పుడు గోడలు కూలెను మరియు వారు దానిని తిసుకోనిరి (ఆమేన్!); వారు పట్టణమును స్వాధీనపరచుకొనిరి. ఆమేన్! ఆమేన్! మీరాయనను నమ్ముచున్నారా?
214ఈ రాత్రి ఆరాధనను మరచిపోవద్దు. సహో. నెవిల్ ఈ రాత్రి ఇక్కడుండి వర్తమానమందించును. ప్రభుని చిత్తమయితే, వచ్చే ఆదివారము కూడా ఇచ్చట ఉండును. ఈ భవనము నుండి మనము కదిలి వెళ్ళుటకు ముందుగా, "క్రైస్తవ సైనికులారా ముందుకు సాగండి," అను పాట పాడుదము. ఈ రోజు నుండి ఎన్నడును ఖడ్గమును ఒరలో పెట్టవద్దు. దానిని బయటకు లాగండి మరియు జయించుదము. వారు జయించుచూ జయించుటకు వెళ్ళిరి. మంచిది, మరల మొదటి వచనము పాడుదము.
క్రైస్తవ సైనికులారా, ముందుకు సాగండి,
యుద్ధమునకు సాగినట్లు సాగిపొండి.
యేసు సిలువతో ముందుకు సాగండి!
రాజ యజమానియగు క్రీస్తు,
శత్రువుకు వ్యతిరేకముగా నడిపించును.
యుద్ధమునకు పోయినట్లుగా, చూడండి, ఆయన ధ్వజము ఎగురుచున్నది.
క్రైస్తవ సైనికులారా, ముందుకు సాగండి! యుద్ధమునకు సాగినట్లు సాగిపొండి.
యేసు సిలువతో ముందుకు సాగిపొండి!