భావ వ్యక్తీకరణలు

భావ వ్యక్తీకరణలు

VGR COUNT-74 1మనలను విడిచిపెట్టి వెళ్ళిన ఈ యొక్క సహోదరిని గూర్చి, ఈ యొక్క కొన్ని సాక్ష్యములతోను, మరియు ప్రతి వందనములతోను నేను కూడా ఈ యొక్క కొన్ని మాటలు చెప్పవలెనని ఆశిస్తున్నాను. ఈ యొక్క బెల్ కుటుంబముతో నా యొక్క మొట్టమొదటి పరిచయము - ఆమె యొక్క భర్త జిమ్మిగారితో ఇతడు వెళ్లిపోయిన మా యొక్క నాన్నగారికి చాలా ప్రియమైన స్నేహితుడు మరియు ఆ తరువాత సంవత్సరాలలో, నేను ఒక సేవకునిగా అయిన పిదప మరియు సహూదరి బెల్ తో నాకు పరిచయమేర్పడినది మరియు ఆమె ఒక నిజమయిన భక్తిగల క్రైస్తవ స్త్రీ. ప్రతి చోటను ఆమెను మనము జ్ఞాపకము చేసుకొందుము. ఇలా ఎవరో ఒకరు పైన మాటలు చెప్పడం చాలా సులువు, ఎందుకనగా మీరు దేనిని కూడా వెనుకకు తీసుకు రాలేరు గనుక ఒక క్రైస్తవురాలిగా ఎలా ఉండవలెనో, ఆమె అలా ఉండినది.

కొద్ది క్షణాల క్రితము ఒక సహోదరి పాటపాడుచుండగా నేను వినినప్పుడు, ఆమె ఎంతగా పాడియుండెనో కూడా నాకు గుర్తుకు వచ్చినది, ఎందుకనగా ఆమెను చుట్టూ ఇచ్చట మనమంతా ఎరిగియున్నాము. ఆమే పాటలు పాడుటను ఇష్టపడేది. ఇది జరిగినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను, సహూదరి బెల్ ఎంతగా భావన పొందియుంటుందో, ఇది నిజముగా చేసినది. ఆమె ఆ మార్గములో తనను తాను వ్యక్తీకరించుకొవలెనని కోరుకొని ఉన్నది. నా యొక్క ప్రార్ధన మరియు యధార్ధమైన ప్రార్ధన ఏదనగా, ఆమె కలిగియున్న సాక్ష్యములాంటి దానినే మనమందరము ఈ రహదారి అంతమున కలిగి ఉండబోతున్నాము.

JOB 14:1-16

 

2నేను ఇచ్చట లేఖనములలో నుండి ఒక భాగమును చదువవలెనని ఆశిస్తున్నాను. ఆమె దేవుని వాక్యమును ఎంతో గొప్పగా ప్రేమించే వ్యక్తని నేను భావిస్తున్నాను, మరియు ఆయన యొక్క వాక్యము శాశ్వతమైనది. మరియు యోబు గ్రంధము 14వ అధ్యాయములో నుండి ఒక భాగము చదువవలెనని నేను భావిస్తున్నాను.

యోబు 14:1-16:

స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును.

పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును.

అట్టివాని మీద నీవు కనుదృష్టి యుంచియున్నావు, తీర్పు నొందుటకై నన్ను నీ యెదుటకి రప్పించి యున్నావు.

పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు? అలాగున ఎవడును పుట్టనేరడు.

నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయః పరిమాణము నీవు వారికి నియమించియున్నావు.

కూలివారివలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించువరకు వారు విశ్రమము నొందునట్లు వారివైపు చూడక యుండుము.

వృక్షము నరకబడిన యెడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకలము కలదు.

దాని వేరు భూమిలో పాతవైపోయినను దాని అడుగు మొద్దు, మంటిలో చీకిపోయినను,

నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్కవలే అది కొమ్మలు వేయును.

అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు?

తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి గతించుపోవు వరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు.

నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతో మేలు, నీ కోపము చల్లారు వరకు నమ్న చాటునుంచిన యెడల ఎంతో మేలు,

నాకు ఇంత కాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరుకొనుచున్నాను.

మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా ? అలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు సా యుద్ద దినములన్నియు నేను కనిపెట్టియుందును,

అలాగుండినయెడల నీవు పిలచెదవు నేను నీకు ప్రత్యుత్తర మిచ్చెదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.

అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్క పెట్టుచున్నావు… నా పాపమును సహింపలేక యున్నావు.

JOB 14:7

 

3నిత్యజీవ వాక్యము నుండి చదువుచుండగా, కొద్ది క్షణాలు ఒక్క మాట మీద మనము ఆలోచించవలెనని నేనాశిస్తున్నాను, మరియు ఆ యొక్క పదమే "భావ వ్యక్తీకరణలు." "వ్యక్తీకరణలు" అనే దానిలో చాలా జీవం ఉన్నది. మరియు భూమి మీద జీవించే వారెవరును లేరుగాని తన యొక్క జీవితములో అతడు ఏదో ఒక సమయమున ఆగిపోవలసియున్నాడు. మరియు అతడు ఎచ్చట నుండీ వచ్చియున్నాడో ఆలోచించవలసియున్నాడు, అతని యొక్క ఉద్దేశము ఏమిటి మరియు ఇచ్చట నుండి అతడు ఎచ్చటకు వెళ్లుచున్నాడు, అని ఆలోచించవలసియున్నారు. ఆ వెనకాల ఏమున్నదో ప్రతి ఒక్కరు కూడా చూచుటకు ఇష్టపడతారు. ఆ పరిశుద్ధ గ్రంధములో అతి ప్రాచీనమైన గ్రంథమైన యోబు గ్రంథమును చదువుతూ ఉండగా, ఈ యొక్క పితరుడు ఇదే విషయమును కనుగొనుటకు ప్రయత్నించియున్నాడు. మరియు ఇతడు దేవుని యొక్క ప్రేరేపణకు ఒక దారిని ఇస్తున్నాడు, అనగా ఆయనే మరణము తరువాత ఒక జీవమని వ్యక్తీకరిస్తున్నాడు.

ఇటువంటి దానిని మనము ఎదుర్కొనినప్పుడు, మనము కూడా దానిని భావిస్తాము, అనగా ఇదియే సమస్తమని భావిస్తాము. అయితే ఇది కానే కాదు. ఇది కేవలము ఒక మార్పు ఇది ఒక… ఒక మెట్టు ఎత్తుకు, ఇది ఒక జీవము నుండి మరియొక దానికి దాటిపోవుట.

మరియు యోబు, ఒక ప్రవక్తగా, ఈ విషయమును గూర్చి అతడు ఆలోచిస్తుండగా, అతడు దీనిని వృక్షశాస్త్రములోని, మొక్కల జీవములోని మరియు వృక్షజీవములోని కనుగొన్నాడు. కావున దేవుడు ఆయన యొక్క సృష్టిలో ఎలా ఉంటాడో అతడు దానిని గమనించాడు; అనగా ఆయనే ఈ యొక్క సృష్టిని చేసినచో, పిమ్మట ఆయన తన సృష్టిలో జీవిస్తాడు. ఎందుకనగా ఆయన దీనిని ఒక ఉద్దేశము కొరకు చేశాడు, అనగా తాను జీవించుట కొరకు, అనగా ఒక మనిషి తాను ఒక గృహమును నిర్మించునట్లుగా, ఈ యొక్క చిన్న చిన్న జీవులు, దేవుని యొక్క సృష్టిలో ఉన్న సమస్తమును వాటి యొక్క సృష్టికర్తకు లోబడవలసియున్నవి.

మరియు ఇతడు (యోబు) ఆలోచించుచున్నదేమనగా, ఒక తుఫాను వచ్చి ఒక బలమైన వృక్షమును క్రిందికి నెట్టినప్పటికి, అదే ఆ యొక్క వృక్షము చనిపోయినచో అది మరలా జీవించును. మరియు అనేకసార్లు మనము నిరాశలో ఉన్నప్పుడు, మనము మన చుట్టూ చూచినచో, దేవునిని ప్రతి చోటను నీవు చూడగలవు.

4ఇప్పుడు మనము ఆయనను తీసుకొని, ఒక వృక్షమును ఇక్కడ ఉంచినచో దానితో కూడా ఆయన జీవమున్నది. మరియు ఇచ్చట గల ప్రతీది ఒక ఉద్దేశము నిమిత్తము ఉన్నది, మనమందరము ఖచ్చితముగా ఒక ఉద్దేశము నిమిత్తము ఉన్నరీతిగానే, ఇచ్చట మన యొక్క సహోదరి కూడా ఒక ఉద్దేశము నిమిత్తమున్నది. ఇచ్చట మనమందరము దేవుని యొక్క ఉద్దేశము కొరకు ఉన్నాము, ఆ ఉద్దేశము ఏమిటో మనము కనుగొన్నచో, మరియు పిమ్మట దానిని బాగా నెరవేర్చెదము. అచ్చట నిశ్చయముగా, ఒక వృక్షజీవాన్ని పునరుత్థానపరచుటకు దేవుడు మనస్సు పెట్టినప్పుడు, మానవుల యొక్క జీవితాన్ని పునరుత్థానపరచుటకు కూడా ఆయన చాలినంతగా ఆలోచిస్తాడు.

కావున పితరుడైన యోబు గమనించాడు, అది ఆ యొక్క వృక్షము, ఇది చనిపోయినచో, ఇది మరళా జీవించియున్నది మరియు ఆ యొక్క వేసవి కాలము మరియు శీతాకాలము తన యొక్క స్వభావాన్ని ఎలా మార్చుకొనుచున్నదో, మరియు ప్రతి దినము అచ్చట ఒక సాక్ష్యము విడిచి పెట్టబడుచున్నది, అతడు గమనించినదేమనగా, ఆ యొక్క వృక్షము వేసవికాలములో జీవిస్తూ ఉన్నచో, అది చలికాములో చనిపోయినట్లుగా ఉన్నది. అయితే ఆ యొక్క ఆకులు ఆ వృక్షము మీద వ్రేలాడియున్నవి.

5ఇప్పుడు, జీవవృక్షము ఒకటి ఉన్నదని లేఖనముల ద్వారా మనము బోధించబడ్డాము. ఇది ఏదేను తోటలో ఉండినది. మరియు ఆ యొక్క జీవ వృక్షము పైన, అనగా ఒక వృక్షమునకు ఆకులు వ్రేలాడుచున్నరీతిగానే క్రైస్తవులు ఆ జీవవృక్షము పైన వ్రేలాడవలసియున్నారు. మరియు ఇప్పుడు శీతాకాలములో, ఆకులు చాలా అందముగా ఉంటాయి, ఎందుకు, అవి… లేక, శీతాకాలములో ఆ యొక్క ఆకులు అందముగాను మరియు పచ్చగాను ఉంటాయి. చలిమంచు వచ్చిన తరువాత మరియు వాటిని వివిధ రంగులలోనికి మార్చి పిమ్మట అవి చెట్టు నుండి రాలిపోతాయి. మరియు ఆ జీవము, ఆ వృక్షము యొక్క వ్రేళ్లలోనికి వెళ్లిపోతాయి. మనము సరిగ్గా గమనించినచో, ఇది ఒక మర్మమైన విషయము.

6కొంత కాలము క్రితము ఒక అవిశ్వాసీ, మత ద్రోహిలాంటి వానిని ఎదుర్కొని అతనితో మాట్లాడవలసి వచ్చినది. మరియు అతనికి సంబందించిన ఒక యాపిల్ వృక్షము ప్రక్క మేము నిలువబడియున్నాము. మరియు ఆ చెట్టు వయసెంత అని నేను అడిగాను. మరియు చాలా సంవత్సరములు అని అతడు నాకు చెప్పెను, మరియు ఎన్నో బుట్టలు యాపిల్లు ఇది ప్రతి సంవత్సరమునకు ఫలిస్తుంది అని నేను అడిగాను. మరియు ఇది ఆగష్టు యొక్క ప్రారంభ భాగము మరియు ఆ యొక్క యాపిల్స్ ఇది వరకే రాలిపోవుచున్నట్లుగా నేను గమనించితిని మరియు ఆ యొక్క ఆకులు బూడిద రంగులోనికి మారిపోవుచున్నవి.

మరియు నేనాయనతో చెప్పాను, "మిమ్ములను నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను." నేను చెప్పాను, "ఎట్టి చలిమంచు వాటిని ఇంకా తాకక ముందుగానే ఆ యొక్క ఆకులు ఎందుకు బూడిదగా మారిపోవుచున్నాయి?"

"మంచిది," ఆతడు చెప్పెను, "ఇది శీతాకాలము వచ్చుచున్నది మరియు అవి బూడిద రంగుగా మారిపోవుటకు గల కారణమేమనగా, ఆ యొక్క జీవము ఆ ఆకుని విడిచిపెట్టినది గనుక."

నేను చెప్పాను, "ఆ జీవము ఎక్కడకు పోవుచున్నది?"

మరియు అతడు నాతో చెప్పెను, "అది ఎచ్చట నుండి వచ్చినదో, ఆ యొక్క వృక్షము యొక్క వ్రేళ్ళు యొద్దకే వెళ్లుపోవుచున్నది."

మరియు నేను అడిగాను, "ఇదే ఆ యొక్క ఆకు యొక్క అంతమా?"

అతడు చెప్పెను, "లేదు, ఆ యొక్క జీవము మరలా వసంత కాలములో వచ్చును, వేరొక నూతన ఆకుతో వచ్చును." అతడు దానిని ఇదివరకెన్నడూ గమనించలేదు.

నేను చెప్పాను, "పిమ్మట అయ్యా, మీరు నాకు చెప్పమని విన్నవించుచున్నాను, ఆ యొక్క ఆకు, ఆ వృక్షము నుండి, శీతల వాతావరణానికి ముందుగానే పడిపోవుటకు ఏ యొక్క జ్ఞానము ద్వారా ఇలా జరుగుచున్నది మరియు దాని యొక్క జీవము ఆ యొక్క నేలలోనికి, భద్రత కొరకు పంపుచూ మరియొక రుతువు వచ్చేవరకు అలా చేయున్నదేమిటి. మీరు ఒక బకెట్లో నీరు పోసి మరియు దానిని ఒక స్థలములో ఉంచినచో, అది ఒక రుతువు మూలముగా మారదు. కావున జీవముపైన శాసించే దేవుడొకరు ఉన్నారని ఇది మనకు చూపించుచున్నది.

7మరియు క్రైస్తవులుగా చెప్పుకొనుచున్న మనము, దేవుని యొక్క ఆత్మ ద్వారా జన్మించిన మనము దేవుని యొక్క కృప ద్వారా మరణ వృక్షము నుండి, జీవవృక్షమునకు మార్పు చెందియున్నాము. మరియు వాటిలో ఒక ఆకు రాలిపోయినప్పుడు, నేను ఆ యొక్క సాక్ష్యమును వినినట్లుగా… ఈ యొక్క అద్భుతమైన సంఘము అనగా గిల్టేజ్ బాప్టిస్టు సంఘము నుండి ఇచ్చట అనేక మంది సభ్యులు నా యొక్క ప్రశస్తమైన స్నేహితులుగానే యున్నారు, ఇచ్చట నుండి ఒక ఆకు రాలిపోయి ఉన్నది. ఎవరైతే దీనిని ఒక ఉద్దేశము కొరకు ఇచ్చియున్నారో, ఆ యొక్క దేవుని యొద్దకే ఆత్మ జీవము వెళ్ళియున్నదని మనము నమ్ముచున్నాము, కావున సాధారణ పునరుత్థానములో మరలా వచ్చుటకు వెళ్లినది. అయితే వెయ్యేండ్ల రాజ్యపరిపాలనలో ఇంకెన్నడూ చనిపోదు. మహ గొప్ప కాలము వస్తున్నది. యోబు ఈ విషయాలను గమనించాడు.

పిమ్మట సూర్యునిలో ఉన్న జీవాన్ని అతడు గమనించాడు…

8సూర్యుడు బయటికి వచ్చినప్పుడు మీరు గమనించినచో, అది ఒక శిశువు వలె ఉంటుంది. దాని యొక్క కిరణాలు చాలా బలహీనముగా ఉంటాయి. పిమ్మట అది తన యొక్క యౌవ్వన ప్రారంభపు దశకు వస్తుంది. అది 9 లేక 10 గంటల సమయములో, పిమ్మట మధ్యాహ్నాకాల వేళలో, ఓ రోజు మధ్యభాగంలో, అది బలముగా ఉంటుంది. పిమ్మట అది పతనమౌతుంది మరియు అది చనిపోయినట్లుగా, అయితే దానిని మనము సూర్యుని యొక్క అంతము అని పిలువగలమా? లేదండి. ఆ మరునాడు ఉదయమే మన కొరకు మరియొక దినమును తెచ్చుటకు అది మరలా పైకి వస్తుంది.

ఇప్పుడు, ఇది ఏమిటి? ఇది దేవుని యొక్క వ్యక్తీకరణ. మరియు "వ్యక్తీకరణ" అనే మాటకు అర్ధమేమనగా, "ఒక భావాన్ని తెలియజేయుట" అని అర్ధము. ఇది ఒక మంచి భావవ్యక్తీకరణ, మనకు వ్యక్తీకరణ ఏమనగా, మన కొరకు ఆయన యొక్క భావనలు తెలుసుకొనుటకే, అనగా మరణము మనలను నిత్యము ఎడబాపనేరదని తెలుసుకొనుట మనము మరలా లేస్తాము, వెనుకకు వెళ్తాము.

ఈ యొక్క పుష్పములవలె, ప్రతి సంవత్సర ప్రారంభములో, భూమిలో ప్రతిసారి ఆ విత్తనము చనిపోతూ ఉంటుంది, అవి, ఆ యొక్క చిన్న విత్తనాలు, ఆ చలిమంచు వాటిని తాకిన వెంటనే బయటకు వస్తాయి. మరియు ఆ విత్తనము నేలపైకి వెళ్తుంది మరియు అది చూచుటకు ఎంత విచిత్రముగా ఉన్నప్పటికీ, ఇది సత్యమైయున్నది మరియు దేవుడు ఎంతో అనంతమైనవాడు, ఎందుకనగా ఆయన ఏ విషయాన్ని కూడా అశ్రద్ద చేయడు. ఆయన తన యొక్క పుష్పము కొరకు ఒక సమాధి కార్యక్రమాన్ని కలిగియున్నాడు.

9ఆ మంచు వాటిని తాకిన తరువాత, పిమ్మట వర్షము వస్తుంది, మరియు గొప్ప పెద్ద వర్షపు బిందువులు రాలుతాయి, అవి ఆకాశము నుండి రాలుతాయి మరియు ఆ యొక్క పుష్పము విత్తనాన్ని సమాధి చేస్తాయి. ఆ విత్తనాన్ని దాని మీద పూడ్చుతాయి, మరియు బహుశ ఇది ఒకటి లేక రెండు అంగుళముల భూమి యొక్క అడుగు భాగానికి వెళ్తుంది. పిమ్మట శీతల గాలులు తుడిచి పెట్టుట ద్వారా ఎండిపోతుంది. ఆ తరువాత ఆ చిన్న విత్తనము మరలా ఘనీభవిస్తుంది మరియు గుజ్జు దాని నుండి బయటకు వస్తుంది, ఎందుకనగా వసంత రుతువులోగానే దాని నుండి ఏదీ మిగిలిపోయినట్లుగా నీవు చూడజాలవు.

అయితే అది ఆ పుష్పము యొక్క అంతమేనా? కానే కాదు ఇది ఇచ్చట ఒక ఉద్దేశము కొరకు ఉంచబడినది. మరియు ఇది దీనియొక్క ఉద్దేశమును బాగా నెరవేర్చిన పిదప దేవుడు మనలను ఆ పుష్పము ద్వారా తెలుసుకొనవలెనని కోరుచున్నాడు. ఇది మన కొరకు ఆయన యొక్క భావవ్యక్తీకరణ.

సూర్యుడు వెచ్చనైన తన కిరణాలను తెచ్చుటకు, భూమికి దగ్గరగా అతడు వచ్చిన క్షణమే, ఆ యొక్క జీవాన్ని ఇక నీవెక్కడనూ దాచి పెట్టలేవు. నీవు ఒకవేళ దానిని ఒక బండ క్రింద మూసివేయవచ్చు. శీతాకాలములో మీరు కాంక్రీటు వేసినప్పుడు ఎన్నడైననూ గమనించారా, వసంత కాలములో ఆ దుబ్బుగా నున్న గడ్డి ఎచ్చటనున్నది? ఆ కాంక్రీటు యొక్క చివరి భాగము చుట్టూ కన్పిస్తున్నది. ఇది ఎందుకు అలా ఉన్నది? ఆ బండ క్రింద ఉన్నటువంటిది దాని యొక్క జీవము. సూర్యుడు మరలా భూమికి స్నానము చేయుటకు బయటికి వచ్చినప్పుడు, మీరు జీవాన్ని ఇక పట్టి ఉంచలేరు, ఇదీ కాంక్రీటు క్రింద నుండి దాని యొక్క మార్గాన్ని కనుగొని, దాని యొక్క చిన్న తలను పైకెత్తి దేవునిని స్తుతించుటకు పైకి వచ్చును, ఎందుకనగా సూర్యుడు ఒక పునరుత్థానమైయున్నాడు… సూర్యుడు (s-u-n) సమస్త వృక్షజీవమునకు పునరుత్థానమైయున్నాడు. సూర్యుడు ప్రకాశించి నంత వరకు మీరు దాని యొక్క జీవాన్ని దాయలేరు.

MAL 4:2•

JOHN 11:25

 

10కుమారుడు (S-o-n) చాలా కాలాలలో దూరాలలో ఉన్నట్లుగా కన్పిస్తాడు. అయితే అతడు ప్రకాశించుట ప్రారంభించినప్పుడు, "నీతి సూర్యుడు" ఉదయించినప్పుడు ఆయన రెక్కల క్రింద ఆరోగ్యము కలుగును. " మరియు ప్రతీ జీవము, అది ఎచ్చట పాతి పెట్టబడినప్పటికి, ఎంత తోడైనప్పటికి, నీటిలో ఎంతదూరముగా ఉన్నప్పటికీ, ఇసుకలో ఉన్నప్పటికి, రాళ్లలో ఉన్నప్పటికీ, ఇదీ దేవుని యొక్క మహిమకు లేచును, ఎందుకనగా దేవుడు, ఆయన, మనకు ఏమి చేయుచున్నాడో మనకు తెలియజేయుచున్నాడు (వ్యక్తం చేయుచున్నాడు).

ఆయన యొక్క ఉద్దేశమును మనకు పుష్పము ద్వారా, సూర్యుని ద్వారా, వృక్షము ద్వారా, అన్ని - జీవముల ద్వారా తెలియజేయుచున్నాడు. అనగా ఆయనే పునరుత్థానమును మరియు జీవమునైయున్నాడు. దాని యొక్క ఉద్దేశము నెరవేరిన పిమ్మట, దేవుడు ఆయన యొక్క జీవాన్ని పునరుత్థాన పరుస్తాడు. మరియు ఒక పుష్పము తన యొక్క ఉద్దేశమును నెరవేర్చిన పిదప మరియు దేవుడు పుష్పము కొరకు ఒక పునరుత్థానమును కలిగియున్నాడు. అలాగే తన జీవితములో ఈమె యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన ఈ సహోదరి కొరకు ఇంకెంతగా కలిగియున్నాడు. ఎవరైతే వారి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుతారో దేవుడు వారందరి కొరకు ఒక పునరుత్థానాన్ని కలిగి ఉన్నాడు. మనము మన యొక్క ఉద్దేశాన్ని కూడా కనుగొని మరియు వాటిని నెరవేర్చెదము.

11ఈ చిన్న పుష్పమును గూర్చి మీరు అడుగవచ్చు. అవి ఈ మధ్యాహ్నకాల సమయములో ఒక ఉద్దేశాన్ని నెరవేర్చుటకు ఇచ్చటనున్నవి. అందు నిమిత్తమే దేవుడు ఈ పుష్పములను కలిగియున్నాడు, ఒక ఉద్దేశమును నెరవేర్చుటకు. అది ముందుకు అలా కొనసాగి వెళ్లగలదు.

మీరు గమనించినచో, ఈ పుష్పములన్నియు ఒకే రంగు కలిగినవి కాదు. అవి వాటి రంగులలో విభిన్నముగా నున్నవి, అనగా దేవుడు ఒక విభిన్నమైన దేవుడని అవి చూపిస్తున్నవి. ఆయన వివిధ రకాలైన రంగులను ఇష్టపడతాడు. అవన్నింటిని కలసికట్టుగా చేస్తే ఒక పుష్ప గుచ్చముగా తయారవుతాయి. దీనిని ఆయన ఇష్టపడతాడు. దేవుడు, దేవుడు ఒక విభిన్నమైన దేవుడు. ఆయన తన యొక్క తెల్ల పుష్పములను కలిగియున్నాడు, ఆయన తన ఎర్ర పుష్పములను కలిగియున్నాడు, మరియు ఆయన యొక్క అన్ని రకాలైన రంగులు గల పుష్పములును కలిగివున్నాడు. మరియు వాటన్నింటిని కలసికట్టుగా పెట్టి, ఆయన యొక్క ఉద్దేశము కొరకు ఉంచాడు.

ఆయన తన యొక్క పెద్ద పర్వతములను కలిగియున్నాడు. మరియు చిన్న కొండలను మరియు మైదానమును కలిగియున్నాడు. ఆయన ఎడారులను కలిగియున్నాడు. ఆయన సముద్రాన్ని కలిగియున్నాడు. ఆయన పెద్ద వృక్షములను కలిగియున్నాడు, మరియు ఆయన పెద్ద తాటి వృక్షములను కలిగియున్నాడు. సమస్తమును కలసికట్టుగా దాని యొక్క స్థానములో కలిసిపోయియున్నది. అచ్చట దేవుడు, సమస్త ప్రకృతి యొక్క దేవుడు, జీవించి ఆయన యొక్క సృష్టియందు ఆనందించగలడు. ఏదైతే ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుచున్నదో సమయానుకూలముగా ఆయన యొక్క జీవులలో ఆయన జీవించగలడు.

దానిని పునరుత్థానము చేయుటకు ఆయన ఎక్కువగా ఆలోచించునప్పుడు, మరియు దానికొరకు తప్పించుకొనుటకు ఒక మార్గమును తయారు చేసుకొనుటకు, అనగా భవిష్యత్తులో మరియొక ఉద్దేశము కొరకు చేసినప్పుడు, ఆయన తన ప్రజలమైన మనకు అనగా మనము ఎవరిమైనప్పటికి, ఏ జాతి అయినప్పటికి, ఏ రంగు అయినప్పటికి, ఏ సిద్ధాంతము లేక ఎదైనప్పటికి మనలను గూర్చి ఇంకెంతగా ఆలోచిస్తాడు. అనగా మనమందరము దేవుని దేవుని యొక్క సన్నిధిలో జీవించి మరియు ఆయన యొక్క ఆశీర్వాదములను పొందుకొనుచున్నాము.

ఆ యొక్క పుష్పమునకు పునరుత్థానము ఏ రీతిగా ఉన్నదో, అదే రీతిగా, నిశ్చయముగా, ఒక దినాన ఒక పునరుత్థాన మున్నది. దానిని మనము అందరమూ చూస్తున్నాము. మనమంతా దానిని నమ్ముచున్నాము. ఈ విషయములన్నియు ఒక వ్యక్తీకరణగా మనము ఎరిగియున్నాము. అవి సాక్ష్యమిస్తున్నవి, మనకు చెప్పుచున్నవి. మనము తెలుసుకొనవలెనని దేవుడు కోరుచున్నట్లుగా ఆ భావన తెలుసుకొనవలెనని ఆశిస్తున్నాము.

12ఈ పుష్పములను ఇచ్చటకు పంపిన ప్రజలు, ఈ పుష్పములను ఇచ్చటకు పంపిన మన యొక్క సహూదరి యొక్క స్నేహితులు, వారు ఈ కుటుంబమునకు తమ్మును తాము తెలియజేసుకొనుచున్నారు. ఒక స్నేహితురాలు కోసము, ఒక సహోదరి కోసము, లేక ఒక ప్రియమైన వ్యక్తి కోసం, వారి యొక్క సానుభూతిని వీటి ద్వారా వ్యక్తము చేయుచున్నారు. వారు తెలియజేసుకొనుటకు ప్రయత్నిస్తున్నారు. వారి యొక్క భావ వ్యక్తీకరణ తెలియజేయుబడుచున్నది, దేనినో ప్రకటిస్తున్నది. ఈ యొక్క విషయములన్నింటిని గూర్చి మనము కొన్ని గంటల తరబడి మాట్లాడుకోగలము, అనగా మానవ జాతి కొరకు దేవుని యొక్క భావవ్యక్తీకరణలు, ఇవన్నియు వాటి వాటి స్థానాన్ని కలిగియున్నవి మరియు అవి దానిని బాగా చేస్తున్నవి. ప్రతి పుష్పము, ప్రతీ వృక్షము, ప్రతీ సూర్యోదయము, ప్రతీ సూర్యాస్తమయము ప్రతిదీ దాని దాని భావాన్ని నెరవేస్తున్నది.

అయితే అవన్నియు దేవుని యొక్క భావవ్యక్తీకరణలు, మనకు తెలియజేయబడుచున్నవి మరియు ఆయన ఏదో ఒక దినమున ఒక మహా గొప్ప భావ వ్యక్తీకరణ అనగా ఒక — నిత్యమైన వక్తీకరణ చేయబోవుచున్నాడనే దానికి మాదిరిగా ఇవి మనకు ఇచ్చుచున్నవి. పిమ్మట ఆయన, ఆయన యొక్క బయలుపరచబడిన రూపమును, ఆయన యొక్క కుమారుని రూపములో ఆయన మనకు పంపించెను. ఆయన మనకొరకు ఏమి తలంచాడో అని మానవ జాతికి ప్రకటించుటకు, దేవుడు ఆయన యొక్క కుమారుని తనకు తానుగా వ్యక్తీకరించుకొనిన ఒక రూపములో మనకు పంపించాడు.

ఆయన తన ముఖ జాడను మార్చుకున్నాడు. ఆయన మనిషిగా మారాడు, ఆయన మనలో ఒకని వంటివాడాయెను. దేవుని నుండి అనగా నిత్యుడగు తండ్రి నుండి, ఒక మహా గొప్ప సృష్టికర్త నుండి, అనగా ఈ జగత్తుకు ముందున్నవాడు, సమస్త విశ్వమును మరియు కాలమును ఆవరించియున్నాడు. అప్పుడు ఒక కాల కొలమానము కూడా లేదు. కనీసం ఒక ధూళి కణము లేక రేణువు కూడా లేదు. అయినప్పటికి ఆయన దేవుడైయున్నాడు, మరియు ఆయన ఎల్లప్పుడూ దేవుడుగా నున్నాడు. అయితే ఆ మహా గొప్ప వ్యక్తి, మీరు రాత్రి కాల వేళలో పైకి చూసి మరియు ఆ సౌర కుటుంబములో పై నున్న నక్షత్రములను చూచినచో…

MATT 8:20•

LUKE 9:58

 

13కొన్ని సంవత్సరాల క్రితము, ఈ యొక్క పెద్ద టెలిస్కోపు ద్వారా చూచుటకు నాకు భాగ్యము దొరికినది, మరియు 120 మిలియన్ సంవత్సరాల కాంతి సంవత్సరాలను, కాంతి కొలమానాన్ని చూడగలమని వారు చెప్పుకొనుచున్న దానిలో నేను చూచాను. మరియు దాని వెనకాల కూడా నక్షత్రాల మరియు చందమామలు మరియు ఆయన నియంత్రించే ప్రపంచాలు కూడా ఉన్నవి. మరియు పిమ్మట మనకు ఆయన తెలియపర్చుకొనుటకు ఆయనెంతగానో మనస్సు పెట్టియున్నాడు, అనగా ఆయనేంత గొప్పవాడో తెలియజేసుకొనుటకు చేశాడు. అయినప్పటికి ఆయన ఒక మానవ రూపములో క్రిందికి దిగివచ్చాడు.

ఆయన ఏమైయున్నాడో తెలియజేసుకొనుటకు (వ్యక్తము చేయుటకు) ఆయన దుఖఃపు మనిషిగా, విచారముతోను తెలియజేసుకున్నాడు. ఆయన ఒక మానవ జీవితాన్ని జీవించాడు. తలవాల్చుకొనుటకైనా ఆయనకు చోటులేదు. దేవుడు ఏమైయున్నాడో, ఆయన తెలియజేసికొనియున్నాడు. మనము రోగులుగా ఉన్నప్పుడు, మన రోగములును బాగుచేశాడు. ఆయన దేవుని యొక్క బయలుపరచబడిన రూపమని, చనిపోయినవారిని ఆయన లేపాడు. మనము కూడా ఈ చిన్న వ్యక్తీకరణ కొరకు చూడగలమని మరియు దేవునిని చూడవలేనని ఆయన మనందరి కొరకు ఒక ప్రణాళిక వేశాడు. పిమ్మట మనందరము కూడా పైకి చూసి మరియు దేవుని యొక్క గొప్ప భావవ్యక్తీకరణ చూడవలెనని మరియు ఒక నిశ్చయత కలిగియుండవలెనని, మరియు పిమ్మట ఈ ఘడియలు వచ్చినప్పుడు, ఇది మాత్రమే దీని యొక్క అంతము కాదని తెలుసుకొనవలెనని ఆశిస్తున్నాడు.

JOHN 5:24

 

14"ఈమె నా యొక్క సహోదరి, ఈమే ఎచ్చటనున్నదో ఈమె తెలుసుకొనే వరకు దీనిని నేను ఈ రీతిగా పాడలేను," అని కొద్ది క్షణాల క్రితము మన సహోదరి వ్యక్తము చేసిన ఆ పాటను నేను ఇష్టపడుచున్నాను. చూచారా, మనము ఎక్కడికి వెళ్లుచున్నామో మనము తెలుసుకొనే ఒక మార్గమున్నది, ఎందుకనగా దేవుని యొక్క వ్యక్తము చేయబడిన రూపము ఈ ప్రణాళికను వేసియున్నది. మరియు ఆయన చెప్పెను, ఎవరైతే ఈ యొక్క ప్రణాళికను అంగీకరించుదురో, వారు నిత్యజీవమును కలిగియుందురు. యోహాను 5:24 చెప్పుచున్నదేమనగా, "నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోని నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."

మనందరి కొరకు గొప్ప వ్యక్తీకరణే యేసుక్రీస్తు, ఆయనే మన కొరకు ఒక మార్గమును తయారు చేసెను, ఈ పుష్పములను గూర్చి మరియు వృక్షజీవమును గూర్చి మరియు సూర్యుని గూర్చి, మరియు సౌర కుటుంబమును గూర్చి ఆయన ఈ యొక్క అన్ని వ్యక్తీకరణలను నెరవేర్చి మరియు నిరూపించాడు. ఆయన రాకడకు ముందుగా వీటి ద్వారా సాక్ష్యమిచ్చాడు, అనగా ఒక ఖచ్చితమైన వ్యక్తి మన కొరకు వచ్చుచున్నాడని మరియు దానిని బలంగా నమ్మునట్లుగా మనలను చేయుచున్నాడు, ఎందుకనగా ఆయన దేవుని యొక్క వ్యక్తీకరింపబడిన (బయలుపరచబడిన) రూపమై ఉన్నాడు.

ఈ యొక్క వ్యక్తీకరణలు అన్నియు నిజమేనని ఆయన నిరూపించాడు. ఆయన వాటికి నిరూపణలు ఇచ్చాడు. ఎందుకనగా ఒక పుష్పము మరలా ఉద్భవించునట్లు, ఒక వృక్షము మరలా ఉద్భవించునట్లు, సూర్యుడు మరలా ఉదయించునట్లు, ఒక క్రైస్తవుడు కూడా మరలా ఉదయించును. అది అలా ఉండవలసియున్నది, ఏలయనగా దేవుడు మానవ రూపములో ఒక వ్యక్తీకరింపబడిన రూపముగా, లేక దేవుని యొక్క వ్యక్తీకరింపబడిన రూపములో ఒక మానవునిగా ఆయన యొక్క పునరుత్థానము ద్వారా దీనిని నిరూపించాడు.

JOB 19:25-27

 

15పిమ్మట, అచ్చట, ఈ విషయములు జరుగుట ప్రవక్త చూచినప్పుడు — ప్రవక్త యోబు — సమస్త వృక్షజీవము మరియు మొదలగువాటిని చూచినప్పుడు…

పరిశుద్ధ గ్రంధములో బాగా పరిచయం కలిగియున్న మనము దీనిని ఎరిగియున్నాము, భూడిద కుప్పమీద కూర్చొని, వేదనలో, సమస్య అతనిని కొట్టియున్నది. అతని సంఘ సభ్యులు అతనికి చెప్పియున్నారు… అతడొక రహస్య పాపియని నిందించారు. చాలా సార్లు ఇలా చెప్పబడినది, "తన కాలనికి ముందుగానే ఒక వ్యక్తి చనిపోయినచో లేదా అలా జరిగినచో, బహుశా వారేదో ఒక పాపము చేశారు గనుక అలా చనిపోయారు. వారేదో ఒక తప్పు చేశారు. లేదండి… ఒక క్రైస్తవుని విషయములో అది అలా కాదు.

అతడు ఈ యొక్క గొప్ప, చిట్టచివరి వ్యక్తీకరణ చూచినప్పుడు, యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఆయన యొక్క ప్రణాళికను బయలుపరుస్తూ ఉన్నాడు. అతడొక పెద్ద స్వరముతో అరిచాడు. మెరుపులు మెరిసినప్పుడు, ఉరుములు ఉరిమినప్పుడు, అతడిలా చెప్పాడు, "నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును. మరియు చివరి దినాలలో ఆయన భూమిమీద నిలుచును. మరియు చర్మపు పురుగులు నా యొక్క శరీరమును తినివేసినప్పటికి: నా శరీరముతోనే నేను దేవునిని చూచెదను."

JOB 19:25•

PS 16:9,10•

ACTS 2:27•

ACTS 13:35

 

16కొన్ని వందల సంవత్సరాల క్రితము, అతడు ఆ చివరి వ్యక్తీకరణను చూచాడు. అయితే ఒక ప్రవక్తగా ఒక దర్శనములో, దేవుని యొక్క మహా గొప్ప వ్యక్తీకరణ (యేసుక్రీస్తును - సంపా) చూచాడు. అతడు క్రిందకు చూసి మరియు విత్తనములు యొక్క పునరుత్థానాన్ని చూడగలిగాడు, వృక్షములు యొక్క పునరుత్థానాన్ని అతడు చూడగలిగాడు. మరియు అది దాని యొక్క కాలమును నెరవేర్చిన పిమ్మట మరియు మరలా ఉదయించిన పిమ్మట, ఒక దినమునకు సేవ చేసిన పిమ్మట, మరియొక దినమున ఉదయించిన పిమ్మట, అనగా సూర్యుని యొక్క పునరుత్థానమును అతడు చూచాడు. సమాధి కార్యక్రమము కొరకు పుష్పములు చనిపోతాయి. అయితే మరియొక పునరుత్థాన కార్యక్రమము కొరకు అవి చనిపోయి మరలా పునరుత్థానమౌతాయి. ప్రతీది దాని దాని ఉద్దేశమును నెరవేర్చుతాయి.

పిమ్మట అతడు దూరంగా చూచి, ఒక నీతిమంతుడు రావటం చూచి బిగ్గరగా అరిచాడు, "నా విమోచకుడు సజీవుడనీ నేనెరుగుదును."

"నీ శరీరము నిరీక్షణలో విశ్రాంతి తీసుకొనుచున్నది," దావీదు చెప్పెను, "ఏలయనగా ఆయన తన పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయుడు. మరియు ఆయన యొక్క ప్రాణమును పాతాళములో విడిచిపెట్టడు." ఆయన ఏమి చేయబోవుచున్నాడో, దేవుని యొక్క ఆ పరిపూర్ణ వ్యక్తీకరణ, అతడు ఆ దినాన్ని చూచాడు, మానవునికి తెలియజేసుకొనుటకు, అనగా రహదారి చివరన మరణమే అంతము కాదని ఆయన నిరూపించాడు.

ఇది అంతము కాదు. ఇది ఆరంభము మాత్రమే. ఇది దుఃఖము యొక్క అంతము మాత్రమే. ఇది నిర్ణయకాలము యొక్క అంతము మాత్రమే, అయితే ఇది ఆనందకాలము మరియు ప్రతిఫలము యొక్క ఆరంభము మాత్రమే, ఇది సంఘము యొక్క అంతము కాదు. అమర్త్యమైన విషయము ప్రారంభించుటకు ఇది మర్త్యమైన విషయాల అంతము మాత్రమే. ఈమె (Mary Bells -సంపాదకుడు) తన యొక్క విశ్రాంతి లోనికి వెళ్లినది. దేవుడు ఆమె ఆత్మకు విశ్రాంతి నిచ్చాడు. ఇప్పుడు, అతడు (యోబు) ఈ యొక్క గొప్ప వ్యక్తీకరణను గూర్చి బిగ్గరగా అరిచాడు, ఎందుకనగా ఏమి జరుగబోవుచున్నదో అతడు చూచాడు గనుక.

17ఇప్పుడు ఈ యొక్క ముగింపునకు మనము వద్దాము, మనము నేడు ఇచ్చట కూడియున్నాము, ఎందుకనగా ఒక పొరుగువానిని గూర్చి, ఒక సహూదరిని గూర్చి, ఒక భార్యని గూర్చి, ఒక తల్లిని గూర్చి మన యొక్క భావనను తెలియజేయుటకు లేక వ్యక్తీకరించుటకు. అందుచేతనే మనము ఈ యొక్క మధ్యాహ్నకాల సమయములో కూడియున్నాము. మనము కోల్పోయిన వ్యక్తి కొరకు మనయొక్క భావాన్ని వ్యక్తికరించుటకు, తెలియజేయుటకు, అందుకే దీనిని చేయుటకు మనమిచ్చటనున్నాము. భార్యను కోల్పోయినందుకు; పిల్లలను, తల్లిని, పొరుగువానిని లేక ఈ సహూదరిని కోల్పోయినందుకు, ఆ తండ్రి తన భావాన్ని వ్యక్తీకరించవలసియున్నాడు.

సేవకులమైన మేము, నేను వారి నుండి ఆ భవనము గుండా వినుచుండగా, ఆ యొక్క అద్భుతమైన, మహిమకరమైన, ఆదరణకరమైన, స్పష్టమైన మాటలు అనగా ఈ సహోదరి వారికేమైయున్నదో మరియు వారి సంఘముతో వారికేమైయున్నదో, ఆ మాటలను వ్యక్తీకరించారు. సేవకులముగా మనము ఈ మధ్యాహ్నకాలములో వచ్చియున్నాము, (నిశ్చయముగా మన హృదయాలలో మనము కూడా విచారమును కలిగియున్నాము), అయితే దేవుని యొక్క భావవ్యక్తీకరణను కూడా మనము తెలియజేయుటకు వచ్చాము, ఈ యొక్క విషయము గురించి ఆయన యొక్క సత్యాన్ని తెలియజేయుట. దీనిని గూర్చి దేవుడు ఏమి చెప్పుచున్నాడో తెలియజేయుటకు మనము వచ్చాము. ప్రజల యొక్క హృదయాలను ఆదరించడానికి మనము వచ్చాము; ఇది ఎంత అకస్మాత్తు సంభవమైనప్పటికి, దేవుడు దీనిని ఈ మార్గములో చేయుటకు మరియు ఇది సర్వశక్తుని యొక్క సంఘటన మరియు ఆయన యొక్క ప్రణాళిక. మరియు ఇది అంతము కాదు. ఇది ఒక నూతన జీవము యొక్క ఆరంభం మాత్రమే.

18పిమ్మట మనము దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారముగా, ఈ విషయములు గూర్చి, మనము మన యొక్క భావాన్ని వ్యక్తము చేయాలి. మరియు ఈ మధ్యాహ్నకాల సమయములో నేనెంతో సంతోషముగా ఉన్నాను, అనగా దేవుని యొక్క వాక్యము వైపుగా మనందరము అదే విషయమును వ్యక్తము చేయగలము, ఎందుకనగా ఆమె దీనిని నెరవేర్చినది.

సహోదరి బెల్, ఈమెను మనము ఇచ్చట గుడారములో ఎరిగియుండగా, ఒక ప్రియమైన పరిశుద్ధురాలుగా క్రైస్తవ స్త్రీగా, ఆమె తన యొక్క భావాలను కూడా బయలు పరిచినది. దేవుని గూర్చి ఆమె తన యొక్క భావన వ్యక్తము చేసినది, కొద్ది నిముషాల క్రితం ఆ యొక్క శ్రద్ధాంజలిని చదివిన దానిని నేను వినుచుండగా, సహూదరుడు జీమ్ ఆమెను వివాహమాడక మునుపు టెనెస్సిలో అనుకుంటున్నాను. ఆమె ఒక నిర్ణయము తీసుకొనెను. ఆమె నిర్ణయాన్ని వ్యక్తము చేసినది.

కావున ఇవన్నియు ఆ సాక్ష్యములు మరియు నాకు తెలిసినంతవరకు, ఆ దినము నుండి ఇప్పటి వరకు, ఆమె వ్యక్తము చేసిన దానిని ఎన్నడూ బ్రద్దలు చేయలేదు. బహుశ ఈ దినము పరలోక ద్వారములు పైన, ఎచ్చటో నిత్యత్వములో, మహిమ రాజ్యములో, దేవుని యొక్క వీధులలో నడుచుచున్నది. ఇప్పటికి దీనిని వ్యక్తము చేయుచున్నది. ఈ యొక్క మర్త్యమైన రాజ్యపు ఛాయలు వెనుక ఆమె ఇంకా దీనిని వ్యక్తము చేయుచున్నది.

19సహూదరి బెల్ ను మనము ఎరిగియుంటుండగా, ఆమె సాక్ష్యమును మనము సిగ్గుపడుట లేదు. అచ్చట ఒక్కసారియైనా కూడా ఆమె యొక్క సాక్ష్యమును గూర్చి మనము కోపపడలేదు, ఎదో ఒక విషయమును చెప్పుటకు ఒక్కసారి కూడా ఆమె అయిష్టముగా లేదు. ఆమె దీనిని తెలియజేసినది మరియు ఆమే సిగ్గుపడలేదు. ఆమె యొక్క చేతులును గాలిలోనికి ఉంచి, అచ్చట ఎలా నిలువబడియున్నదో నేను ఆమెను చూచేవాడను. మరియు ఆమె వేదికపైన నిలువబడి పాటలు పాడుచూ ఉండేటప్పుడు, సమస్త సంఘము కూడా ఒక అరుపులతో ఇచ్చట భూమికి అవతల ఉన్నట్లుగా అనిపించేది. అమె సిగ్గుపడేది కాదు. ఆమె ప్రతిచోట తన భావనను వ్యక్తం చేసేది. ప్రతి పొరుగువారికి, ప్రతీ సంఘమునకు, ప్రతీచోట ఆమె సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండేది, దేవునిని గూర్చి ఆమె ఏమి ఆలోచించేదో ఆమె తనకుతానుగానే బయటకు వ్యక్తం చేస్తూ ఉండేది.

ఈమె నా యొక్క ప్రియమైన ముసలి తల్లికి ఒక ప్రియమైన స్నేహితురాలు, ఆమె కూడా కొద్ది వారాల క్రితము అదే మెట్లు ఎక్కినది. నేడు వారిద్దరు అచ్చట కలిసియున్నారు. దేవుడు వ్యక్తము చేసినవాటిని చూచుటకు ఎంత అద్భుతమైన విషయము. ఆ యొక్క లేఖలు, బెల్ సోదరి నేను ఇంటికి వచ్చిన ప్రతి సారి నా కుమారుడైన బిల్లి, నాకు కొన్ని ఉత్తరాల కట్టలనిచ్చేవాడు మరియు సొదరి బెల్ నుండి అనేకమైన టెలిఫోన్ కాల్స్ వచ్చేవి. "ఇతను కొరకు ప్రార్థించండి, అతని కొరకు ప్రార్ధించండి."

అది ఏమి తెలియజేయుచున్నది? నాకైతే, అది ఆమె యొక్క వ్యక్తీకరణ, ఆమెలోపట ఏమున్నదో తెలియజేయుట; ఆమె యొక్క సహచర వ్యక్తి కొరకు ఒక భారము, ఆమె యొక్క పిల్లల కొరకు ఒక భారము, చుట్టూ ఉన్నవారి కొరకు ఒక భారము, ప్రతి రోగి కొరకు ఒక భారమును ఆమే కలిగి ఉండేది.

20గతించిన కొన్ని సంవత్సరాలుగా బెల్ సోదరి దేవుని యొక్క కృప ద్వారా జీవించినది. దైవీక స్వస్థత విషయములో ఆమె ఒక నమ్మకమైన విశ్వాసి. మరియు ఆ మరునాడు రాత్రి ఇది అలా జరిగినది… ఆమె కొరకు నా జీవితంలో నేనెన్నడూ అలా ప్రార్ధించలేదు. మరియు ఆ యొక్క ప్రియమైన ముసలి పరిశుద్ధునితో కలసి ఆమెను దేవుడు స్వస్థపరిచేంత వరకు ప్రార్థించాను. మరియు ఆ మరునాడు రాత్రి, నన్ను వారు పిలిచినప్పుడు, నేను రమారమి మధ్య రాత్రిలో నుండి ఆరిజోనా నుండి వచ్చాను. వారు నా కుమారున్ని పిలిచి చెప్పారు, "సోదరి షిప్పార్డ్, అనగా, బెల్ సోదరికి ఒక స్నేహితురాలు మిమ్ములను ప్రార్థించమని అడుగుచున్నది. ఆమె ఆసుపత్రులో ఉన్నది." అది షిప్పార్డ్ సోదరి అనే అర్ధము చేసుకున్నాను, ఇప్పుడు ఈ భవనములో ఎవరో ఒక స్త్రీ ఉన్నది షిప్పార్డ్ అని పిలువబడు ఒక స్త్రీ అని ఆమె ఎరిగియున్నది. ఆమె ఆసుపత్రిలో ఉన్నదని నేను తలంచాను.

ఆ మరునాడు ఉదయము 11 గంటల ఆ మధ్య ప్రాంతములో, వారు మరలా పిలిచారు. మరియు చెప్పారు, "అది షిప్పార్డ్ సోదరి కాదు. ఆమె సోదరి బెల్, అసుపత్రులో ఉన్నది. దానిని చూచుటకు దేవుని యొక్క ప్రణాళిక మరియు తెలివైన దైవ కార్యముగా ఉన్నది. అతడు అచ్చటకు వెళ్లడానికి ముందుగానే, సోదరి బెల్, తన యొక్క బంగారు మెట్లును ఎక్కియున్నది. నేను అచ్చటికి వెళ్ళుటకు ముందుగానే, దేవుడు తన రంగులు గల రోజా పుష్పమును, ఆ వెయ్యేండ్ల రాజ్యపరిపాలన కొరకు పుష్పగుచ్చములోనికి అమర్చాడు. నేను అచ్చటికి వెళ్లగలగడానికి ముందుగానే, ఆమె దేవునిని కలుసుకోవటానికి వెళ్లిపోయినది. దేవుడు, ఆయన యొక్క ప్రేమ వ్యక్తీకరణ.

21ఈ యొక్క ఆమె వివాహదిన సంవత్సరాలన్నింట్లో కూడా ఒక వినయము గల భార్యగా తనను తాను బయలుపరచు కొనియున్నది, ఆమె తన భర్త కొరకు మరియు తన పిల్లల కొరకు ఒక గృహమును తయారు చేసినది. అది కూడా అనేక మైన గడ్డుకాలాల ద్వారా బయటకు వ్యక్తమైనది. ఆ చిన్న పిల్లలు బల్ల చుట్టూ ఉండగా, అది కఠినత్వము గుండా వెళ్లినది. మరియు ఒక తల్లి అనేకమైన విషయాలు కలసికట్టుగా ఎలా ఉంచాలో తెలుసుకొనును, అనగా భోజనపు బల్లచుట్టూ ఆ చిన్న పిల్లల నోళ్ళు ఆకలితో ఉన్నప్పుడు, వాటిని తెలసుకొనును. అయితే ఆమె యొక్క భర్త ప్రక్కనే వినయముగా నిల్చొని, పిల్లల ప్రక్కన నిల్చొని, ఉండుట అనేది ఇది యధార్ధమైన వినయానికి ఒక వ్యక్తీకరణ. మీ అందరి ముందు కూడా అలా చేసినది. నేను దానిని చెప్పనవసరం కూడా లేదు. ఈ విషయము సత్యముగా ఉన్నదని మీకు తెలుసు, చూచారా.

అవునండి.

22ఆమె తన యొక్క పిల్లల కొరకు అభ్యర్ధన చేయుటలో ఎన్నడూ విఫలము కాలేదు… ఆమె తన పిల్లల కొరకు విన్నపము చేయకుండా ఆమెను నేనెన్నడూ కలవలేదని లేక విడిచిపెట్టలేదని నేను నమ్ముచున్నాను. అది ఆమె యొక్క నిజమైన మాతృత్వాన్ని చూపిస్తున్నది; జీవితమనేది సామాన్యమైన ఒక కల అని, తన పిల్లల కొరకు సిద్దపరిచే ఒక స్థలమని ఎరిగియున్నది. తన పిల్లలు కూడా ఈ దేశమును విడిచి దీని వెనుక నున్న దేశములో వారిని కలుసుకోవాలని ఆశించినది, ఎందుకనగా అచ్చట ఇక ఏ విధమైన కష్టకాలములు ఉండవు.

ఆమె ఎల్లప్పుడు నాతో చెప్తూ ఉండేది (ఆమె నన్ను "బిల్లీ" సోదరుడా అని పిలస్తూ ఉండేది.) ఆమె ఇలా చెప్పేది, "బిల్లీ సోదరుడా నా పిల్లల కొరకు ప్రార్థించండి, వారిలో ఏ ఒక్కరూ నశించిపోకూడదు." అది ఒక నిజమైన మాతృత్వాన్ని వ్యక్తము చేయుటలేదా; తన పిల్లలయందు శ్రద్ధ కలిగే తల్లి, తన పొరుగువారి యందు శ్రద్ద కలిగియుండుట, తన భర్తయందు అనగా అమె యొక్క ప్రియమైన వ్యక్తి యందు శ్రద్ద కలిగియుండుట… ఇది దేవుడే ఆ స్త్రీలో ఉండి నిత్యమైన విషయాలను వ్యక్తీకరించుట.

23నా మంచి స్నేహితుడైన ఆమె యొక్క భర్తకు, నేను ఎలా సానుభూతి తెలుపవలెనో. ఆ యొక్క పిల్లలతో నేను ఎలా సానుభూతి తెలుపవలెనో, వారిలో కొంత మంది ఈ వర్తమానమును జర్మనీలోని మరియు వివిధ స్థలాలలోను వినుచున్నారు, వారి తల్లి వెళ్లిపోయినది. అయితే అబ్బాయిలు, ఆమె ఇచ్చట మీ సన్నిధి నుండి వెళ్లిపోవచ్చుగాని ఆమె చనిపోలేదు. ఆమె నిత్యము జీవిస్తూనే ఉంటుంది. మీరంతా ఆమెను కలుసుకొనవలెనని, ఏ దేశములో ఉండవలెనని ప్రార్ధించేదో, ఆ దేశములో ఆమె జీవిస్తున్నది. ఆమెను మీరు నిరాశపర్చవద్దు. ఆమె నిరాశ పడదని నేను నిశ్చయత కలిగియున్నాను.

ఈ మధ్యాహ్నకాల సమయములో, ఆ చక్రము నుండి ఎవరో మాట్లాడుట నేను చూచాను. నాకు గుర్తున్నది, ఆ యొక్క మొదటి మాట నా యొక్క కుటుంబము నుండే తీసుకొనబడినది. ఒకరి వెంబడి ఒకరు, వారంతా రాలిపోతారు. ఇది ఎంతో ఆలస్యము కాదు. వినండి. ఆ చక్రము మరలా కలసికట్టుగా ఐక్యపరచబడుతుంది, ఆ మరియొక దేశములో అచ్చట విరిగిన చక్రాలు ఇక ఉండనే ఉండవు, అచ్చట దేవుని యొక్క గొప్ప గృహకృత్య నిర్వాహకము సాధింపబడగలదు మరియు యుగముల గుండా దొర్లుతుంది. ఆ కుటుంబము ఆ మార్గములో ఉండవచ్చు. మీరు ఎల్లప్పుడూ మీ తల్లిని కలిగి ఉంటారు; ఇప్పుడు ఆమెతో ఎల్లప్పుడూ ఉండండి. అది నిజము.

PS 84:11•

MATT 9:24•

MARK 5:39•

MARK 11:24•

LUKE 8:52

 

24దేవుని యొక్క ప్రేమను వ్యక్తము చేసిన ఇంకొక విషయము నేను దానిని అర్ధము చేసుకొన్న రీతిగా, ఆమె ఎప్పుడూ వృద్ధురాలిగా ఉండకూడదని విన్నవించుకొనేది. అనగా ఈ ముసలి వయస్సు చుట్టూ ఇలా కాలము గడుపుతూ ఉండకూడదని అనుకొనేది మరియు అవిటితనముతోను మరియు అనారోగ్యముతోను అగుగడుగునా చనిపోకూడదని అనుకొనేది. దేవుడు ఆమె యొక్క విన్నపాన్ని అంగీకరించాడు. అది నిజము. రెండు ఆదివారాల క్రితమే ఎందుకు, ఆమె సంఘములో ఇచ్చట నిలబడి, క్రీస్తు యొక్క మహిమ కరమైన సువార్తను గూర్చి పాడేది. ఇది ఏమిటి? ఈ యొక్క తల్లి 65 సంవత్సరాల వయస్సులో, వయస్సు ఇంకా పూర్తిగా నిండకముందే వెళ్లిపోయినట్లుగా కన్పిస్తున్నదేంటి? దాని యొక్క భావమేంటంటే? ఇది దేవుడే తనకు తానుగా వ్యక్తము చేయుచున్నాడు. అనగా "ఆయన ఎదుట నిజాయితీగా నడిచినవారి నుండి, ఆయన ఏ మంచి విషయమును దాచుకోడు."

దేవుడు, ఆమె యొక్క మరణములో కూడా వ్యక్తము చేయుచున్నాడు, దేవుడు మనకు కూడా వ్యక్తము చేయుచున్నాడు, అనగా, ఆయన దేవుడైయున్నాడు. మరియు ఆయన యొక్క హృదయ వాంఛలను వారికి ఇచ్చును, వారి యొక్క హృదయము, ఆయన ముందు యధార్ధముగా నడుచువారికి ఆయన ఇచ్చును. దీనిని చూస్తూ, ఆయన దేవుడని గ్రహించి మరియు మనమందరమును ఈ స్థలమునకు రావలసియున్నాము.

పిమ్మట మన మందరము ఆ యొక్క వక్తీకరణ గురుతులను చూడవలసియున్నాము. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క సంఘము, ఆయన యొక్క ప్రజలు మరియు దానిలో ప్రతి ఒక్కటి కూడా మనకు దేవుని యొక్క భావ వ్యక్తీకరణలే. పిమ్మట నేను ఆలోచించినదేమనగా, ఈ యొక్క జీవము కొరకు అనగా క్రీస్తు ద్వారా ఆయన మరణమును జయించిన దాని కొరకు మనమందరమును అతి వినయముగా, మన తలలు వంచి మరియు దీనికొరకు దేవునికి వందనములు చెల్లించవలసియున్నాము.

మరి అటుపిమ్మట, యేసు, యాయీరు యొక్క కుమార్తె వద్దకు ఆయన వెళ్లినప్పుడు చెప్పిట మాటలు, "ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదు." ఆమె తన నిద్రలోనికి వెళ్లినది మరియు ఆమె మరణములోనికి వెళ్లలేదు. ఆమె ఒక చిన్న పాపగా చాలా సంవత్సరాల క్రితము చనిపోయినది మరియు ఇప్పుడు క్రీస్తునందు జీవిస్తున్నది, మరియు మనకు కేవలము నీద్ర; అయితే క్రీస్తుతో మేల్కొనియున్నది.

25మనము మన యొక్క తలలు వంచి మరియు ఈ యొక్క బలమైన జీవము కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసియున్నాము.

పరలోకపు తండ్రీ, నీవు నిశ్చయముగా మా హృదయములను ఎరిగినవాడవు, నిశ్చయముగా మా మనస్సులలో ఉన్న తలంపులను ఎరిగినవాడవు, మా గూర్చి నీకు సమస్తమును తెలియును. మేము మీ చేతి సృష్టి, మా నుండి, "బెల్" సోదరి వెళ్లిపోవడాన్ని మేము చింతించుచున్నామని మీకు తెలియును. అయితే, దేవా, మేము మా యొక్క తలలను, హృదయములను వంచుచున్నాము, ఈమె యొక్క విన్నపాన్ని మీరు ఆమోదించారని కృతజ్ఞతా భావముతో ఉన్నాము. ఆమె కొరకు మీ వాంఛ నెరవేరియున్నదని నమ్ముచున్నాము. ఈ యొక్క రహదారి అంతమున ఇచ్చట, ప్రతీ ఒక్కరి జీవితములోను ఈమె యొక్క శ్రద్ధాంజలి చరిత్ర వ్రాయబడినప్పుడు, ఈమె వీటితో సందర్శనములోనికి వచ్చినది మరియు ఈమె మీ దాసురాలు, ఈమె యొక్క ప్రభావము, ఈమెను ఎంత మంది ఎరుగుదురో వారి అందరి యొక్క హృదయములలో చిరకాలముండును గాక.

దేవా, ఈమె యొక్క బలమైన ఆత్మను ఈమె ప్రేమించే ఆ రాజ్యములో, అనగా ఈ సంవత్సరాలన్నింటిలో దేని కొరకు ఈమె మాట్లాడి, పాటలు పాడియున్నదో ఆ రాజ్యములో నీవు ఆమె ఆత్మకు శాంతినివ్వండి.

26ప్రభువా, ఈ మధ్యాహ్నకాల సమయములో జిమ్మి కొరకు నేను ప్రార్ధించుచున్నాను, నేను అతనిని అచ్చట ఉండుట చూసినప్పుడు మరియు అతడు తన స్వచ్ఛమైన కన్నీళ్ళును తన చెంపల మీద నుండి, తన యొక్క ఆలోచనలను వాటి ద్వారా వ్యక్తీకరించుచున్నాడు. ఆతడు ఒక నమ్మకమైన భార్య గూర్చి ఆలోచిస్తున్నాడు. మరియు ఈ యొక్క పిల్లలు, వారి చెంపల మీద నుండి కన్నీరు క్రిందుకు ప్రవహించుచున్నది, ఎందుకనగా వారు ఒక మంచి ప్రేమగల "అమ్మ" గూర్చి ఆలోచిస్తున్నారు. మరియు దేవా, నేను ప్రార్థించుటను మీరు వారిని ఆశీర్వదించండి, వారి హృదయములను ఆదరించండి. దేనినైనా చేరుకోగల మీ హస్తమును చాచండి, ఒక మానవ హృదయాన్ని చేరుకోగలదు మరియు వారిని మేము ఏదో ఒక దినమున కలిసెదము, ఈ యొక్క గొప్ప సంతృప్తిని వారికి ఇవ్వండి మరియు అచ్చట మేము మరియొక సమాధి కార్యక్రమాన్ని కలిగియుండము.

27ఆమె యొక్క ప్రియులను దీవించండి, ఆమె యొక్క సహోదరులను, ఆమె యొక్క సోదరీలను, ఆమె యొక్క మనుమలును మరియు ఆమె యొక్క పొరుగువారిని దీవించండి. మరియు ప్రభువా, ఈ సంఘములు ఈమెను ఎంతో ప్రేమించినదని మాకు తెలియును. ఆమె మా మధ్య నడిచిన రీతిగానే, వారు, ఈమె కూడా వారి మధ్య నడిచినది. మరియు వారందరితో కలిసి, ప్రభువా, మేము ఈ యొక్క గొప్ప పరస్పర భావనలను కలిగియున్నాము. అనగా ఈమెను మేము ప్రేమించియున్నామని మరియు ఈమె యొక్క జీవితము కొరకు మేము మా యొక్క కృతజ్ఞతా భావాన్ని మీకు ఇచ్చట వ్యక్తము చేయుచున్నాము.

ప్రభువా, మమ్ములను మలచండి మరియు మేము కూడా అలా అగునట్లు తయారు చేయండి, మేము ఆ యొక్క రహదారి చివరకు వచ్చినప్పుడు బహుశ మిమ్ములను కలుసుకొనుటకు సిద్ధమౌతాము. ఓ నిత్యుడగు దేవా, మా యొక్క చాలా పాపములను క్షమించండి. ప్రభువా, మా మీద కనికరం చూపండి, ఎందుకనగా మేము అలసి సొమ్మసిల్లియున్నాము.

JOHN 14:16,18

 

28మరియు ఈ మధ్యాహ్నకాల సమయములో మీరు మాకు ఆదరణ ఇస్తారని నేను ప్రార్థించుచున్నాను. మేము దీనిని ఈ వాక్యాలలో కనుగొందుము గాక, ఎందుకనగా ఇది మీ యొక్క వాక్యము నుండి వివిధ రకాలైన సేవకుల ద్వారా మరియు అట్టిది తీసుకురావడానికి అభిషేకింపబడిన వారి ద్వారా మరియు పొరుగువారు మరియు స్నేహితురాలు ద్వారా ఇది వ్యక్తము చేయబడినది. మేము అచ్చట, అనగా పుష్పముల యొక్క సాక్ష్యములతో, మరియు చెట్లుతో, మరియు సూర్యోదయముతో, ఆకులతో మరియు అన్నింటి కన్నా క్రీస్తు యొక్క పునరుత్థాన సాక్షియైన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధితో దీనిని కనుగొందుము గాక. "నేను మిమ్ములను అనాధలుగా విడువను, నేను తండ్రిని వేడుకొందును మరియు ఆయన మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపించును మరియు ఆయన నిరంతరం జీవించును." ఓ, ఆయనను మేము ఎలా ప్రేమించవలయునో, ప్రభువా, మరియు మీరు ఆయనను మా కొరకు పంపించినందుకు, ఇట్టి ఘడియలలో మరియు కష్ట సమయాలలో మాకు దీవెనకరమైన నిశ్చయత ఇచ్చుటకు, ఆయనను మీరు పంపించినందుకు మేము మిమ్ములను ఎలా అభినందించవలయునో.

29మరియు ఇప్పుడు మిగతా కార్యక్రమము జరిపించుటకు మాకు బలమునివ్వండి. ప్రభువా, నేను ఒక ప్రత్యేకమైన దానిని అడగవలెనని ఆశిస్తున్నాను, ఈ యొక్క అబ్బాయిలు, ఈ యూనిఫామ్ దుస్తులలో ఉన్నారు. ఆ అబ్బాయిలు దీవింపబడును గాక, వారు వారి యొక్క స్థానములోనికి వెళ్లుచుండగా దీవించండి. అయితే ప్రభువా నేను ప్రార్థించుచున్నాను. ఆ దినమున… వీరిప్పుడు ధరించిన ఈ యూనిఫామ్ దుస్తులను మేము అభినందించుచున్నాము. అయితే ఆ తల్లి యొక్క ప్రార్థనకు జవాబు వచ్చును గాక; వారు పరిశుద్ధతలోను మరియు యేసుక్రీస్తు యొక్క నీతిలోను, ఆ దినమున వస్త్రము ధరించుదురు గాక! ఈ అమ్మాయిలు మరియు మిగతా అందరూ కలసి, ప్రభువా, మేము అలా ఉండవలెనని కోరుచున్నాము. క్రైస్తవ సైనికులువలె, నిజమైన బలమైన విశ్వాసము కలిగి ఉండవలెనని.

ఆ దినము వరకు మమ్ములను నడిపించి మార్గదర్శకత్వము చేయండి. ప్రభువా, మేము మరలా కలుసుకొనే వరకు అలా చేయండి. ఇప్పుడు ఈమె యొక్క జీవితము కొరకు మీకు మేము వందనాలు చెల్లించుచున్నాము. మరియు మేమంతా మీ యొక్క పాదముల చెంత చేరేవరకు సహాయము చేయమని ప్రార్థించుచున్నాము. యేసు నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమెన్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...