అంత్యకాల సూచన విత్తనము
VGR COUNT -1921స్నేహితులకు శుభ సాయంత్రము. ఈ టిఫ్టన్ లో తిరిగి ఈ విధముగా కలుసుకొనుటను నేను ధన్యతగా భావిస్తున్నాను. నాకు ఇది ఒక విధమైన ఆశ్చర్యముగా ఉన్నది. కొంత కాలము క్రితం, నేను కొద్దిగా అలసట చెందియున్నప్పుడు నా మంచి స్నేహితుడైన సహోదరుడు వెల్స్ ఇవాన్స్ కు నేను, "చేపలు పట్టుటకు నేను టిప్టన్కు వచ్చుచున్నాను. నేను వచ్చినప్పుడు, అక్కడ ఎక్కడో ఒకచోట నిన్ను కలుస్తాను మరియు మనము ఒక గృహ కూడికను (నేను అనుకున్నాను), కలిగియుందాము" అని చెప్పియున్నాను; ఆ తరువాత ఇదిగో ఇక్కడ నన్ను నేను ఈ పాఠశాల ఆడిటోరియంలో కనుగొన్నాను.
అధికముగా మాట్లాడుట వలన కొద్దిగా నా గొంతులో ఇబ్బందిగా వున్నది. గత దినమున మేము ఒక చిన్న వర్తమానమును కలిగియున్నాము, అది కేవలం ఆరు గంటలు మాత్రమే, నేను ప్రసంగించగలినంత వరకు ప్రసంగించియున్నాను. కావున… ఇప్పుడు నేను మిమ్ములను భయపెట్టుటలేదు. ఈ రాత్రి అంతసేపు నేను ప్రసంగించబోవుటలేదు. నేను ఆ విషయములో సానుకూలముగా ఉన్నాను. కాని నా స్వరమే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది, మరియు వస్తు…
1PET 5:8•
REV 12:12
2ఈ విధముగా ఇక్కడ ఉండుట మరియు మా గురించి మంచి ఘనమైన పరిచయమును ఇచ్చిన ఈ మంచి కాపరిని కలుసుకొనుట ఎంతో ధన్యతయైయున్నది. ప్రజలను కలుసుకొనుటనేది ఎల్లప్పుడు మాకు సంతోషముగా ఉంటుంది.
ఈ సహోదరుడు ఇప్పుడు వ్యక్తపరచిన ఆ భావము నిశ్చయముగా నిజమైయున్నది. మనము దానికి "ఆమేన్!" చెపుతాము, కారణమేమంటే వాడికి సమయము తక్కువగా ఉన్నదని వాడికి తెలుసు కాబట్టి ఈ చివరి దినములలో అపవాది సింహమువలె గర్జిస్తాడు, వాడు చేయాలనుకున్న ప్రతి దానిని నాశనము చేయుటకై తిరుగుచున్నాడు. వాడు దానిని ఎంతో ఎక్కువ కాలము చేయలేడు, కావున వాడికి ఉన్న ఈ తక్కువ సమయములోనే వాడు వాటిని చేయాలి.
ఈ చిన్న ఆడిటోరియంలో ఉన్న ఈ పరిస్థితి అంటే నాకెంతో ఇష్టము. మేము ఈ కూడికను ఇక్కడ కలిగియుండుటకు అనుమతి ఇచ్చిన ప్రధానోపాధ్యాయునికి, పాఠశాల యాజమాన్యమునకు మరియు అప్పటికప్పుడే ఏర్పాటు చేయబడిన ఈ కూడికకు సహకారమును అందించిన ఉత్తములైన వారందరికి మా ధన్యవాదములు. మమ్ములను స్వాగతించునప్పుడు ఎవరో బయట స్వాగతపు తివాచిని పరచియున్నారు, అలాగు చేయుట ఎంతో బాగున్నది. బ్రదర్ విల్లీ ఆ పనిని చేశాడని నేను అనుకుంటున్నాను, నేను దానిని అభినందిస్తున్నాను.
HEB 3:13•
HEB 10:24,25
3ఈ మంచికాపరి మరియు ఇక్కడ ఉన్న మిగిలినవారు, మనమందరము నలుగు లేక అయిదు రాత్రుల ఆరాధనలలో ఒకే ఉద్దేశ్యము నిమిత్తము కలుసుకొందాము, బహుశా నేను దానిని ఇష్టపడతాను. అప్పుడు మనము దానిని తగినంతగా అందరికి తెలియచేసి అన్ని సంఘములను ఒకటిగా కలుపుదాము; ఎందుచేతనంటే, మీకు తెలుసు, గతములో చరిత్రలో కంటే ఎక్కువగా ఇప్పుడు ఇలాగు మనము ఒకరికి ఒకరు చేయుట అవసరమైయున్నది. నిజమైన రాజ్య విశ్వాసులారా! మనము ఒకరికి ఒకరము అవసరమైయున్నాము. మీరు ఎక్కడకి వెళ్ళినా అక్కడ ఉన్న దేవుని ప్రజలను కలుసుకొనుటనేది ఆశీర్వాదమైయున్నది. అది ప్రతిచోట ఒక ఆశీర్వాదమైయున్నది.
MARK 4:14•
LUKE 8:5,11
4మనము ఇక్కడ కొద్దిమంది యవ్వనస్తులను కలిగియుండుటను నేను చూస్తున్నాను. ముందు వరుసలో కూర్చునియున్న ఒక చిన్న బాలుడను మరియు ఒక బాలికను కొంతసేపటి నుండి నేను గమనిస్తున్నాను, వారు చాలా అందముగా ఉన్నారు, వారు చిన్నచిన్న సంగతులను కలిగియున్నారు, వారు చాలా చక్కగా కూర్చునియున్నారు. నేను దానిని ఇష్టపడతాను. పిల్లలలో ఒక సంగతియున్నది, అది ఏమిటంటే వారు అమాయకులు మరియు మంచివారు. నేను దానిని ఇష్టపడతాను.
ఈ రాత్రి ఇక్కడకు వచ్చిన దానిని బట్టి మీకు కృతజ్ఞతలు. ఈ రాత్రి మనము సమయమును తీసుకున్నట్లయితే అది ఎంతో బాగుంటుంది, ప్రభువు యొక్క వాక్య విత్తనములను నాటినట్లయితే అది ఎంతో బాగుంటుంది.
గత రాత్రి నేను "వాక్యము యొక్క మూలవిత్తనము" అను అంశము మీద ఆరు గంటలు ప్రసంగించియున్నాను. మేము దానిని ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు తీసుకొని, దేవుని యొక్క కార్యము ఏమైయున్నది, ఆయన ఏమైయున్నాడు, మరియు పలుకబడిన ఆ మాట దేవుని విత్తనముగా ఎలాగు అగును, అనేదానిమీద వెనుకకు మరియు ముందుకు ఆరు గంటలు గడిపాము. పరిశుద్ద గ్రంథము ఈలాగు చెప్పినది, (లూకా సువార్తలో), దేవుని యొక్క వాక్యమే విత్తనముగా విత్తువాడు విత్తియున్నాడు.
GEN 1:11,12•
MATT 7:20•
GAL 5:22,23•
HEB 6:7,8
5నాటబడిన ఏ వాక్య విత్తనమైనా అది ఫలించి పంటని ఇచ్చుటకు ముందుగా నీటితో తడపవలసియున్నదని మనకు తెలుసు. కాని, నేలమీద నీరు పడినప్పుడు, నేలలో ఏ విత్తనమున్నాగాని అది దాని యొక్క జాతిని ఉత్పత్తి చేస్తుంది, ఎందుచేతనంటే దేవుడు ఆదికాండము 1:11లో ఈ విధముగా చెప్పెను, "ప్రతి విత్తనము దాని జాతి ప్రకారము మొలకెత్తును గాక." ఆ విధముగా నీరు పడినప్పుడు (హెబ్రియులకు 6వ అధ్యాయము) ఆ విత్తనములు తయారయి వాటి ఫలములను ఇచ్చును. వాటికి నీరు ఇచ్చుటకై భూమి మీద వర్షము పడుటను మనము కనుగొనగలము. అదే నీటివలన కలుపు మొక్కలు, ఇతర మొక్కలు కూడా మొలకెత్తుతాయి. కాని వాటియొక్క ఫలములచేత అవి ఏమిటో తెలియచేయబడును.
కావున పరిశుద్దాత్మ యొక్క ఫలములచేత క్రైస్తవులు తెలియచేయబడతారు. ఒక క్రైస్తవుడు తన జీవితములో అలాగు జీవించుట చేతనే తాను రుజువు చేయబడతాడు. పరిశుద్ధాత్మ యొక్క ఫలములు ఏవనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసము, దీర్ఘశాంతము, మంచితనము, మృదుత్వము, పరిశుద్దాత్మ యొక్క సహనము. ఈ ఫలములు తమను తాము క్రైస్తవునిలో బయలు పరచుకుంటాయి.
GEN 3:4•
JOHN 1:1,14
6గత దినమున నాటబడిన విత్తనమును మనము కనుగొన్నాము, వ్యతిరేకమైన విత్తనము, అది ఏమిటంటే. హవ్వకు సాతాను అబద్ధము చెప్పినప్పుడు వ్యతిరేకమైన విత్తనమును నాటియున్నాడు. దేవుని వాక్యములలో ఒక్కదాని యందు అవిశ్వాసమును ఉంచుటచేత ప్రతి మరణమును, ప్రత బలహీనతను మరియు అన్ని విధములైన సమస్యలను మనము కనుగొనుచున్నాము. ఒక్క వాక్యమందు అపనమ్మకమును ఉంచినందువలన ఈ కార్యములన్ని జరుగుచున్నాయి. ఆమె దానిని ఖచ్చితముగా నమ్మియుండలేదు. ఆమె దానిని దేనితోనో కలుపుటకు ప్రయత్నము చేసినది, దేవుని వాక్యముతో ఎన్నడు దేనిని కలుపవద్దు. అది ఆ విధముగానే ఉండవలసియున్నది, ఎందుకనగా అది మూల విత్తనమైయున్నది. దేవుడు నిత్యమైనవాడు మరియు దేవుడే వాక్యమైయున్నాడు. "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునితో ఉండెను, మరియు వాక్యమే దేవుడైయుండెను. మరియు ఆ వాక్యమే శరీరధారియై మన మధ్య నివసించెను."
JOHN 12:48•
ROM 2:16
7దేవుడు మరియు ఆయన యొక్క వాక్యము రెండునూ ఒకటే అయ్యున్నవి. దాని గురించి ఆలోచించుము! దేవుడు ఒక దినమున లోకమునకు తీర్పు తీరుస్తాడని నేను నమ్ముచున్నాను, కాంగ్రెసు వారు రూపొందించిన దాని ప్రకారము కాదు, సంఘము రూపొంది౦చుకున్న పద్దతుల ప్రకారము కాదు కాని, తన వాక్యము చేత ఆయన లోకమునకు తీర్పు తీర్చును. ఒకవేళ మనము మతశాఖ సంఘము తీసుకొనినట్లయితే, ఆ సంఘములలో ఏ సంఘము సరియైనది? వారిలో ఒకరికి మరియు మరియొకరికి ఎంతో వ్యత్యాసమున్నది. ప్రొటెస్టెంటు వారితో క్యాథలిక్కులు విభేదిస్తారు, ప్రొటెస్టెంటువారు సంప్రదాయవాదులతో విభేదిస్తారు, మనము ఎందుకని ఇతరులతో విభేదించుచున్నాము. కాబట్టి వారిలో ఎవరిది సరియైనది? మన మనసులలో నిరంతరము ఒక గందరగోళమును కలిగియున్నాము. ఒక వ్యక్తికి ఏమి చేయవలెనో తెలియదు. కేవలము దేవుడు మాత్రమే ఈ భూమంతటికి తీర్పు తీర్చును, ఆ తీర్పు దేనిని బట్టి తీరుస్తాడో అది ఖచ్చితముగా మనకు ఇవ్వబడాలి.
DEUT 4:2•
PS 119:89,151,152•
ISA 14:24•
ISA 40:8•
MATT 13:23•
LUKE 21:33•
1COR 3:6,7•
1PET 1:23,25•
REV 22:18,19
8ఇప్పుడు, నేను దానిని పరిశుద్ధ గ్రంథములో చదువగలను, "భూమి ఆకాశములు గతించినా గాని, దేవుని వాక్యము ఎన్నడును గతించవు." పరిశుద్ధ గ్రంథములో నుండి ఎవరైనా ఏదైనా తీసివేసినా లేక జతపరచినా, జీవగ్రంథములో వానికి పాలులేకుండా చేయును అది పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడియుండుటను నేను చదివియున్నాను, అది ఆ విధముగా నిలిచియుండును. చాలామంది అది చెరపబడిందని మరియు అది ఈ విధముగా ఉన్నది లేక ఆ విధముగా ఉన్నదని చెప్పుటకు ప్రయత్నము చేయుచున్నారు. నేను దానిని నమ్మను.
సంఘమును లేదా లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఏదో ఒక విధమైన ప్రామాణికమును ఏర్పాటు చేసియున్నాడని నేను నమ్ముచున్నాను. ఏదో ప్రామాణికమన్నది. అది సంఘ శాఖలో లేదు, ఎందుకనగా వారు ఎంతో వ్యత్యాసముగా ఉన్నారు. మరి ఏమి చేయవలెనో ఎవరికి తెలుసు? కాని, అక్కడ ఒక ప్రామాణికమున్నది, అది ఏదో కాదు గాని దేవుని వాక్యమే. దేవుడు తన వాక్యములో నుండే చూస్తాడని నేను విశ్వసిస్తున్నాను. దేవుడు ఏ విధముగానైతే ఉద్దేశించియున్నాడో, ఆ విధముగానే దేవుని వాక్యము విభాగింపబడియున్నదని నేను విశ్వసిస్తున్నాను. అది ప్రజల కొరకైన దేవుని వాక్యము. ఆ కారణముచేతనే నేను ఆ వాక్యమును నమ్ముచున్నాను. వాక్యమే విత్తనమని నేను నమ్ముచున్నాను, విత్తనము సరియైన స్థలములో నాటబడినట్లయితే మరియు పరిశుద్దాత్మ చేత నీరు కట్టబడితే, అది దాని యొక్క జాతిని ఉత్పత్తి చేస్తుంది. దేవుడు ఏదైనా వాగ్దానము చేసినట్లయితే, దేవుడు ఖచ్చితముగా దానిని నెరవేరుస్తాడు.
MATT 8:16
9కొంత కాలము క్రితం మన సంఘములో దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరచుట మనము చూసియున్నాము. ఒక ఆదివారమును ప్రసంగించుటకు నేను బయటకు వెళ్ళుచున్నాను (ఒక వారము గడిచినది, గత ఆదివారము నుండి ఒక వారము గడిచియుండవచ్చును.) రోగులను మోసుకొచ్చే పడక మీద ఒక చిన్న బాలికను వారు తీసుకొనివచ్చారు. వారు నన్ను రాత్రివేళ వీధిలో పిలిచి ఇలా అన్నారు, "ఆ బాలిక ఇక ఎంత మాత్రము జీవించదు," కాన్సరు వ్యాధి చాలా అధికముగా ఉన్నది. సుమారుగా ఆ బాలికకు పదిహేడు సంవత్సరములుండవచ్చును. "ఆమె అక్కడకు కూడా రాలేకపోయినది. ఆమె అక్కడకు వచ్చుటకు ముందుగానే మరణించనుంది." అది ఎంతో బాధకరమైన విషయముగా ఉన్నది, ఎంతో ప్రియమైన పదిహేడు సంవత్సరముల చిన్న బాలిక.
నా సంఘమునకు ఏదో నిరూపించుటకు, నేను ఆ బాలికను ఎంతమాత్రము తాకియుండలేదు. నేను దాదాపుగా ఆ బాలికను తాకియుండలేదు. నేను లోపలికి నడిచాను. ఆమె పడక దగ్గరకు వచ్చియున్నాను. అక్కడ ఇంకా అనేకమంది రోగులున్నారు, కాని ఆ బాలికతో మాట్లాడినప్పుడు ఆమె యొక్క ఆత్మను పట్టుకొనుట గురించే నేను ఆలోచిస్తున్నాను. చూచుటకు ఆమె ఎంతో మంచి బాలికవలె అగుపించుచున్నది. ఆ బాలిక ముందుగానే సమాధిలోకి ఎందుకు వెళ్ళుచున్నదో ఏ కారణమును నేను చూడలేదు; ఆమె యొక్క జీవమును తీసుకొవాలని దయ్యము తన ప్రయత్నము చేస్తున్నది. కావున నేను ఆ బాలికను ఎంత మాత్రము తాకియుండలేదు, వాక్యము నిమిత్తమై బలిపీఠము మీదకు వెళ్ళి వాక్యముతో నిలిచియున్నాను. ఆమెను వాక్యము వెంటనే స్వస్థపరచగా, తరువాత ఆమె లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయినది — ఇప్పుడు అంతా బాగానే ఉన్నది, మిగిలిన అందరివలె ఆమె జీవిస్తున్నది. ఆ కాన్సరు యొక్క గుర్తులు ఆమెలో ఎంతమాత్రము కనుగొనలేకపోయారు. ఆమెను ఎన్నడు ఎంతమాత్రము తాకియుండలేదు.
వాక్యమే ముందుగా వెళ్ళియున్నది, ఆమె వాక్యమును నమ్మియున్నది, వాక్యమనగా దేవుని యొక్క జీవము మరియు దేవుని యొక్క శక్తియైయున్నది. వాక్యము ఆ విధముగా చేయును. వాక్యము బలహీనులను స్వస్థపరచును.
JOHN 1:14•
ROM 6:4,11•
2COR 5:20•
EPH 2:6•
1JN 3:2
10మీరు ఇలాగు అనవచ్చును, "మంచిది, రోగులను యేసు స్వస్థపరచెను."
ఆయన వాక్యమైయున్నాడు. ఆయనే వాక్యమైయున్నాడు. నీవు వాక్యమును గైకొనినప్పుడు, నీవు యేసును పొందుకుంటావు, ఎందుకనగా ఆయనే వాక్యమైయున్నాడు గనుక, "వాక్యము శరీరధారియై మన మధ్యన నివసించెను." మనము దానిలో ప్రతిదాని నమ్ముచున్నాము, మనము అలాగు నమ్ముట లేదా? దేవుని వాక్యమే క్రీస్తుగా బయలుపరచుకున్నాడని మనము నమ్ముచున్నాము; మరియు ఆయన యొక్క వధువు కూడా అలాగునే ఉంటు౦దని మనము నమ్ముచున్నాము. వాక్యములోని ప్రతి భాగమును ఆమె తప్పక నమ్మునని మరియు ఆమె ఆ వాక్యమును కలిగియుంటుందని మనము నమ్ముచున్నాము, ఎందుకనగా ఆ శరీరములో ఆమె ఒక భాగమైయున్నది. ఆయన శిరస్సై యుండగా, ఆమె శరీరమైయున్నది.
ఆయన మరణించి, మరణములో నుండి లేచి పునరుత్దానుడుగా వచ్చి, ఉన్నత స్థలములో ఉన్న దేవుని కుడి పార్శ్వమున, దేవుని సింహాసనమందు కూర్చునియున్నాడు — తరువాత మనము ఆయన రాయబారులుగా ఉన్నాము. మనమును మరణించినవారిగా ఎంచబడి మరియు బాప్తిస్మము ద్వారా పూడ్చిపెట్టబడి, ఆయనతో కూడా లేచియున్నాము, ఇప్పుడు ఆయనతో కలసి పరలోక స్థలములలో క్రీస్తుయేసులో కూర్చొనియున్నాము. అది మనలను కేకలువేయునట్లుగా చేయుచున్నది, అది అలాగు లేదా? దానిని గురించి ఆలోచించుము. మనము, ఎప్పుడో కాదు, మనము ఇప్పుడే. ఇప్పుడు మనము దేవుని యొక్క కుమారులమైయున్నాము మరియు దేవుని యొక్క కుమార్తెలమైయున్నాము. ఆయనలో కూర్చుంటాము కాదు; ఇప్పుడే మనము కూర్చునియున్నాము.
NUM 25:2,3•
MATT 26:54
11లేఖనములు నెరవేరవలసియున్నవని యేసు చెప్పెను. ప్రతియొక్క వాక్యము జరుగవలసియున్నది. ఈ దినము మనము వాటి నుండి చాలా దూరము వచ్చియున్నాము. మనము దానిని ఆచారములు మొదలైనవాటితో కలగలిపియున్నాము, దాని నుండి బయటకు వచ్చి ఎంతో విసుగును కలిగియున్నాము, పరిశుద్ధ గ్రంథము ఏలాగు చెప్పియున్నదో అలాగు మనము చేయవలసియున్నది. ఖచ్చితముగా.
ఆదాము… తన భార్యను కలియుటకు ముందుగానే, చెడు విత్తనము ద్వారా ఆమె గర్భవతిగా ఉన్నది. దయ్యము యొక్క అబద్ధమును తీసుకొని మరియు దేవుని వాక్యముతో కలుపుటకు ప్రయత్నము చేసినది మరియు అది మరణమును తీసుకొని వచ్చినది. ఆమె కనిన మొదటి బిడ్డ మరణమును కలిగియుండెను. అప్పటి నుండి ప్రతి బిడ్డ మరణించుట ప్రారంభించెను.
యెహోవా భార్య — ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చునప్పుడు, ఆమెను శుద్దీకరించి, ఆమెను మార్గములో ప్రవేశపెట్టగానే — ఆమె ఏమి చేసియున్నది? ఆమె కూడా అదే కార్యమును చేసియున్నది. యెహోవా తన భార్యను వాగ్దాన దేశమునకు తీసుకొని వెల్లెను. ఆమె ఆ మార్గములో బిలాము అను పేరు కలిగిన ఒక అబద్ధ ప్రవక్త మాటను విని, ఆమె ఏమి చేసియున్నది? "మనలో ఎటువంటి వ్యత్యాసము లేదు. మనమందరము కలసిపోయి ఒకే కుటుంబముగా ఉందాము."
DEUT 19:15•
2COR 13:1
12వధువు కూడా అదే విధముగా లోకముతో చేసియున్నది — లోకములో ఉన్న ఆచారములతో ఉండి దేవుని యొక్క వాక్యమును తిరస్కరించి ఇలాగనుచున్నది, "అద్భుతములు చేయు రోజులు గతించిపోయాయి. పరిశుద్దాత్మ యొక్క బాప్తిస్మము అన్న సంగతియే లేదు." ఇప్పుడు ఆమె ఎక్కడున్నది? పరిత్యజించబడియున్నది. యెహోవా వధువు చేసిన విధముగానే, ఆదాము వధువు చేసియున్న మాదిరిగానే యేసు యొక్క వధువు కూడా చేసియున్నది. అవును, ఖచ్చితముగా అలాగునే చేసినది. ఇద్దరు లేక ముగ్గురి నోట పలికిన సాక్ష్యము స్థిరపరచబడునని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. అక్కడ మూడు సంఘములున్నాయి, ముగ్గురు వధువులున్నారు. ప్రతియొక్కరు ఒకే విధముగా చేసియున్నారు.
13వీటన్నింటిని ఎదుర్కొన్ననూ, ప్రతిదానిలో చిన్న భాగముగా… దేవుడు నిజమైన వధువుని ముందుకు తీసుకొని వచ్చుచున్నాడు. ప్రతికాలములో సంస్కరణ జరుగుచున్నది, వాక్యము ఎంతగానో బయలువెళుచున్నది. ప్రతి తరమునకు కొంత కాలము ఇవ్వబడినది. మీరు దానిని ఎన్నడైనా గమనించియున్నారా? దేవుని యొక్క ఒక మనుష్యుడు దేవునితో పాటుగా వచ్చి అగ్నితో కొడతాడు అప్పుడు భూమియంతా ఒక గొప్ప ఉజ్జీవముతో తుడిచిపెట్టబడుతుంది. అప్పుడు ఏమి జరుగుతుంది? వెనువెంటనే వారు ఆ మానవుని యొక్క ఆలోచనను తీసుకుంటారు, దానిని మతశాఖగా మారుస్తారు, ఆచారములను తీసుకొనివచ్చి దానిలో కలుపుతారు. ఆమె మరణించి మరెన్నడు తిరిగిలేవదు. అది నిజము. ప్రతికాలములో అలాగునే జరిగినది, అలాగునే జరుగబోవుచున్నది.
14కాని ప్రతి తరములో, అది ఏమి పొందుకున్నది? ప్రతికాలములో వారికి దేవుని యొక్క తాజా వాక్యమును పొందుకునే అవకాశము వచ్చినది, లూథరు ద్వారా నీతీకరణము క్రింద, వెస్లీ ద్వారా శుద్దీకరణము క్రింద, పెంతెకోస్తు కదలిక ద్వారా పరిశుద్దాత్మ బాప్తిస్మము. గమనించారా? ప్రతియొక్కరు ఒక అవకాశమును కలిగియున్నారు. ఆ గొప్ప సంస్కర్తలను వెంబడించిన మనుష్యులు ఏమి చేసియున్నారు? మతశాఖగా మార్చివేశారు, సంస్థగా మార్చారు, దానితో ఆచారములను కలిపివేశారు, ఇక్కడ కొద్దిగా మరియు అక్కడ కొద్దిగా ఉన్నది. పాఠశాలల నుండి మనస్తత్వ శాస్త్రమును తీసుకొని ఒక క్రొత్త విద్వాంసుల గుంపు వచ్చినది — హవ్వ ఎలాగైతే క్రొత్త వెలుగును వెతికి దేవుని వాక్యముతో దాన్ని కలుపుటకు ప్రయత్నము చేసినదో, అలాగే ప్రయత్నము చేశారు. సంస్థలోకి వెళ్ళిపోయి ఆత్మీయముగా మరణించినది. అది ఖచ్చితముగా నిజము. ఎల్లప్పుడు అది ఆ విధముగానే ఉన్నది.
15ఇప్పుడు. మీరు నమ్మినా నమ్మకున్నా… మీరు దాని గురించి ఆలోచించకున్నా, ఈ రాత్రి నేను (ప్రభువు చిత్తమైతే) "అంత్యకాల సూచన విత్తనము" అనే అంశముపై మట్లాడబోవుచున్నాను. ఈ అంత్యకాలములో ఎటువంటి సూచనను విత్తనము సూచిస్తుంది? వాక్యమును చదువుటకు ముందుగా మన తలలను వంచి గ్రంథకర్తతో దీని గురించి మాట్లాడుదాము.
మన తలల వంచియుండగా, దేవుని కుమారుని రాకడ యొక్క ఛాయలో మనమున్నాము అని తెలుసుకొనండి. ఈ రాత్రి ఏమైనా అభ్యర్థనలు ఉన్నట్లయితే నేను ఆశ్చర్యపోతాను, మీరు యధార్థముగా ఉన్నారని దేవునికి తెలియ చేయాలనుకుంటున్నారా, మీ హృదయములో ఏదైనా ఉన్నట్లయితే దాన్ని దేవుడు నెరవేర్చాలని మీరు కోరుకుంటున్నారా? ఆయన వైపుకు నీ చేతిని పెకెత్తి ఇలాగు చెప్పుము, "ఇదిగో దేవా, ఇది నేనే. నాకు ఇది కావాలి మరియు అది కావాలి." మీకు కృతజ్ఞతలు.
JOHN 14:14
16పరలోమందున్న మా తండ్రి, మేము ఎన్నడు నీ తీర్పు సింహాసనమును సమీపించాలని అనుకోవటంలేదు కాని నీ యొక్క కృపాసింహసనమును సమీపించుచున్నాము. దేవా! మేము తీర్పును కోరుకొనుటలేదు, ఎందుకనగా మేము ఆ సింహాసనము ముందు నిలబడలేము. కాని అక్కడ మా కొరకు ఒకరు ఉండుటను బట్టి మేము చాలా సంతోషముగా ఉన్నాము, ఆ ఒక్కరు నీ కుమారుడు ప్రభువైన యేసే. ఆయన మా కొరకు నిలబడి తీర్పును ఎదుర్కొంటున్నాడు, ఈ కారణమును బట్టియే మేము కృపా సింహసనము యొద్ద హక్కును కలిగియున్నాము. ఈ రాత్రి మేము ఆయన నామములో సమీపించుచున్నాము.
ఆయనే తనంతట (ఆయన నుండి వచ్చిన ప్రతిది లేఖనమే, అది తప్పక నెరవేరవలసియున్నది), తానుగా ఇలా చెప్పెను, "నా నామమున నా తండ్రిని ఏది అడిగినను, నేను దానిని చేతును, వాక్యము సత్యమైయున్నదని మనకు తెలుసు, ఆయన యొక్క కృపా సింహాసనము నుండి క్షమించే కృపను మాకు దయచేయమని మా పరలోకపు తండ్రిని అడుగుటకు మేము యేసు నామములో సమీపించుచున్నాము.
1THS 5:5
17మేము సమీపించుచున్న ఈ ఘడియలో ఆయనే తన వాక్యమును తేటగా మాకు తెలియచేయమని, మాకు బయలుపరచమని ఆయనను ఈ రాత్రి మేము అడుగుచున్నాము, తొట్రిల్లాలని మేమెవ్వరము ఆశించడంలేదు, మేమందరము ఒక్కటిగా ఎక్కడికి వెళుతున్నామో మాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళుతున్నాడో తెలియని వ్యక్తి తొట్రిల్లుతాడు. మేము వెలుగు యొక్క సంతానమని నీవు చెప్పియున్నావు, మేము ఎక్కడికి వెళ్ళుతున్నామో మరియు మేము వెలుగుతో నింపబడి వేసే ప్రతి అడుగు మాకు తెలియవలసియున్నది. దిగువన ఉన్నవారందరికి అది తెలియకపోవచ్చును కాని, మేము మాత్రము ఆ అడుగులను వెంబడిస్తున్నాము.
ఈ రాత్రి దేవుడు ఏ ఉద్దేశ్యము నిమిత్తమై ఈ కూడికలోకి మా కొరకు వచ్చెనో, మేము వేయబోవు ఈ అడుగువలన దాన్ని చూస్తామని నేను ప్రార్ధిస్తున్నాను, తండ్రీ. ఓ ప్రభువా! ఈ రాత్రి కూడికలో పైకెత్తబడిన ప్రతి చేతి వెనుక ఒక ఉద్దేశ్యము ఉన్నది, ఆ అభ్యర్థనకు జవాబు నిమిత్తమై నీకు ప్రార్ధిస్తున్నాను. దేవా! ఒకవేళ అది రక్షణ కొరకైతే ఈ రాత్రే వారు దానిని పొందుకొనులాగున దయచేయుము. ఒకవేళ అది వారియొక్క గృహములో సమస్యయైనట్లయితే, వారి గృహమును సరిగా నిలబెట్టుము, ప్రభువా! శాంతిని దయచేయుము. ఒకవేళ అది ఎవరైనా ఆందోళనతో ఉన్నట్లయితే తండ్రీ, నీ కరుణను దయచేయుము. ఒకవేళ అది బలహీనత నిమిత్తమైతే, ఈ రాత్రి స్వస్థత కలిగిన దేవుని యొక్క వాక్యము వారి హృదయలోతుల్లో మునుగును గాక, అది మంచి పంటను తెచ్చి దైవీకమైన ఆరోగ్యము వచ్చునట్లుగా మాకు దయచేయుము, ప్రభువా, మా ప్రార్థన వినుము.
MATT 25:40
18ఈ రాత్రి మా అంతట మేముగా వాక్యమును మరియు వాక్యములోని ఈ భాగములను మీ దగ్గరకు తీసుకుని వస్తున్నాము, మీరే దానికి కూర్పుని చేయమని అడుగుచున్నాము, మేము తెలుసుకోవలసిన సంగతులను మాకు బయలుపరచుమని అడుగుచున్నాము. ఈ ప్రజలను దీవించుము. ఈ పాఠశాలను దీవించుము. ఈ దినములలో ఎవరైనా మేము కూడికలు పెట్టుకుంటున్నాము అని అన్నట్లయితే ఒక మతశాఖ గుంపు దానిని చల్లబరుస్తున్నారు. కాని ఈ ప్రధానోపాద్యాయుడు ద్వారమును తెరచియున్నాడు. దేవా! అతడిని మీరు దీవించమని మేము ప్రార్ధిస్తున్నాము, మరియు అది లేఖనములలో వ్రాయబడియున్నదని అతడిని తెలుసుకోనిమ్ము, "మీలో దీనులైనవారికి మీరు ఏదైనా ఉపకారము చేసియున్నట్లయితే, అది నాకు చేసియున్నట్లే."
"నీవు ఎప్పుడు అవసరత కలిగియున్నావు, మేము నీకు ఎప్పుడు సేవ చేశాము?"
మరియు మీరు ఇలా అన్నారు, "మీరు, వారికి చేసిన సేవ నాకు చేసియున్నట్లే అని నేను మీతో చెప్పుచున్నాను."
నేను ప్రార్ధిస్తున్నాను, పరలోకములో ఉన్న మా తండ్రీ, రానైయున్న దినములలో ఈ పాఠశాలలో నుండి బలంగా అభిషేకించబడిన ప్రసంగికులు వచ్చును గాక. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి నిమిత్తము మరియు వారి కాపరుల నిమిత్తము నేను ప్రార్ధిస్తున్నాను. ప్రభువా వారి సంఘములను దీవించుము. ఇక్కడ ఉన్న ఈ ప్రజలలోకి ఆ గొప్ప ఉజ్జీవము వచ్చి అనేకమంది రక్షించబడుటకు అది ఉపయోగపడును గాక, బలహీనులను మరియు బాధించబడుచున్నవారిని స్వస్థపరచుము, నీకే మహిమ కలుగును గాక, యేసు నామమున మేము అడుగుచున్నాము. ఆమెన్.
AMOS 3:7
19చాలా వింతైన లేఖన భాగమును చదువుచున్నాను. మీరు ఇంటికి వెళ్లినప్పుడు ఈ అధ్యాయము అంతయు చదువవలసినదిగా కోరుచున్నాను. ఆమోసు 3వ అధ్యాయము, మరియు 7వ వచనము. వింతైన లేఖన భాగము. కాని మీకు తెలుసు, దేవుడు కొన్ని కార్యములను వింతగాను మరియు ఊహించనవి చేయును. ఆయన కార్యములను అసాధారణరీతిలో చేయును, మర్మయుక్తముగా చేయును మరియు చేయుటకే ఆయన యొద్ద అద్భుతములు ఉన్నవి. ఆమోసు 3:7.
"తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు."
ఇప్పుడు నేను మాట్లాడాలని ఆశిస్తున్న అంశము "అంత్యకాల సూచన విత్తనము." విత్తనము గురించి గతదినమున నేను చాలా మాట్లాడియున్నానని ఇప్పుడే చెప్పియున్నాను, వాక్యమే విత్తనమైయున్నది… ప్రతికార్యము ఆదికాండములోనే ప్రారంభించబడియున్నది, కారణమేమంటే ఆదికాండము అనగా ఆరంభము అని అర్ధము, లేక పరిశుద్ధ గ్రంధము యొక్క విత్తన అధ్యాయము అని అర్ధము. ఈ దినము భూమి మీద మనము కలిగియున్న ప్రతిదాని యొక్క ఆరంభము ఆదికాండములో ప్రారంభమైనది.
20ఈ దినమున మనం కలిగియున్నవాటిలో కొన్ని ఆదికాండములో ప్రారంభించి యుండలేదు, ఎందుకనగా అవి సంకరముచేత వచ్చినవి. సంకరము చేయబడిన ప్రతిది మోసపూరితమైనదే. అది మేలైనది కాదు. అది తిరిగి ఉత్పత్తి చేయలేదు. సంకరము చేయబడిన ప్రతిది మానవుని నిర్మితమైనది మరియు అది తిరిగి తననుతాను ఉత్పత్తి చేసుకోలేదు.
నేను చాలాసార్లు చెప్పినట్లుగా, మనము ఒక సంతానోత్పత్తికి సంబంధించిన ప్రక్రియను గమనించినట్లయితే, మీరు ఒక గాడిదను మరియు గుర్రమును తీసుకొని సంకరము చేసినట్లయితే, అది ఒక కంచర గాడిదను ఉత్పత్తి చేస్తుంది. కాని కంచర గాడిద తిరిగి సంతానోత్పత్తిని చేయలేదు. దానికి తన తండ్రి ఎవరో మరియు తన తల్లి ఎవరో తెలియదు. ఎందుకనగా అది కలగలసిపోయున్నది.
21ఈ దినమున ఉన్న మొక్కజొన్నను మనము ఉదాహరణముగా తీసుకున్నట్లయితే, అది సంకరము చేయబడినది. అది చాలా బాగున్నదనియు మరియు పెద్ద విత్తనమును కలిగియున్నదని వారు చెప్పుచున్నారు, కాని అది ఎంతమాత్రము మేలైనది కాదు. "రీడర్స్ డైజెస్ట్" అను పత్రిక దాని గురించి ఏమి వ్రాసినదో మీరు చూశారా? సంకరము చేయబడిన కోడిమాంసమును కాని, దూడ మాంసమును కాని, ఇప్పటి నుండి ఇరవై సంవత్సరముల పాటు నిరంతరము తినుచున్నట్లయితే, మానవాళి అంతరించిపోతుంది, ఎందుకనగా ఆ స్త్రీలు తమ సంతానోత్పత్తి శక్తిని కోల్పోతారు. అది నిజము. సంకరము ఎన్నటికి మంచిది కాదు.
మొక్కజొన్ననే తీసుకోండి, సంకరము చేసి దానిని పెద్ద విత్తనముగా చేశారు. అది ఏమి చేస్తుంది? నీవు ఒకవేళ పెద్ద విత్తనమును తినాలని ఆశించినట్లయితే, సరే మంచిది. కాని దానివలన ఏమి జరుగుతుంది? తిరిగి దానిని నాటుము; అది తిరిగి తననుతాను ఉత్పత్తి చేసుకోలేదు. అది మంచిది కాదు, అది మరణించినది. కాబట్టి, ఆరంభములో దేవుడు పలుకని ప్రతిది సంకరము చేయబడినదే.
22ఆ విధముగానే ప్రజలు దేవుని యొక్క వాక్యమునకు దూరమగుచున్నారు. అది ఒక సంకరము చేయబడిన సంగతిగాయున్నది. అది తప్పక మరణించవలసియున్నది. అది తనవంటి దానికి మరలా జీవమిచ్చి ఉత్పత్తిని చేయలేదు. లేఖనములలో లేని మానవ కల్పితములతోను, ఆచారములతోను, సిద్ధాంతములతోను సంకరము చేయబడిన సంఘమే దేవుని వాక్యమును విశ్వసించని సంఘము. ఆ సంఘము సంకరము చేయబడినందువలన అది ఆత్మతో నింపబడిన బిడ్డలను ఉత్పత్తి చేయలేదు. అది ఎంతమాత్రము మేలైనది కాదు. అది పెద్దగా ఉండవచ్చు, పెద్ద గోడలు ఉండవచ్చు, మంచి బల్లలను కలిగి ఉండవచ్చు, మంచి గంటలు కలిగి ఉండవచ్చు, వెనక్కి నెట్టుకుని కూర్చునే మెత్తని కుర్చీలను కలిగి ఉండవచ్చు. కాని వాటన్నింటివలన ఎటువంటి ఉపయోగము లేదు. అది ఆత్మీయముగా మరణించియున్నది. అది నిజము. అది మరణించిన కారణమువలన, అది ఇకెంత మాత్రము ఆత్మతో నింపబడిన బిడ్డలను ఉత్పత్తి చేయలేదు.
23ఆరు గంటలు ఆ అంశము మీద మట్లాడగలను, మరియు ఈ రాత్రి తిరిగి మరలా అదే అంశమైన అంత్యకాల సూచన విత్తనము దగ్గరకి వస్తున్నాము. ప్రజలందరు తెలివైనవారు, అతని తలలో సరిగా వుండినయెడల, అతడు ఎల్లప్పుడు తనకన్నా ఉన్నతమైన దానిని గురించే ప్రయత్నము చేస్తుంటాడు. మనలో ఉన్న ప్రతియొక్కరి దాని గురించి తెలుసుకోవాలని ఉంటుంది. "దీని తరువాత నేనేమి చేయాలి? ఇక్కడ నుండి నేను ఎక్కడి వెళ్ళాలి?" పారుచున్న ఒక నీటి ప్రవాహమును ఒక మనిషి దాటుచున్నట్లుగా అది ఉంటుంది. అతడు ఒక రాతి మీద ఒక అడుగును వేసి, తరువాత తను మరొక అడుగును ఎక్కడ వేయాలా అని చుట్టూ వెతుకును, అతడు వేయలేకపోవచ్చును. అతడు ఎక్కడకి దూకలేడు. ఒకవేళ అతడు అలాగు చేసినట్లయితే అతడు మునిగిపోతాడు. అతడు ఎక్కడికి వెళుతున్నాడో అతడు తప్పక తెలుసుకోవలసియున్నది. "దీనిని దాటిన తరువాత నేను ఎక్కడికి వెళ్ళాలి?" మనమందరము ఆ రీతిగానే ఉండాలి. మానవజాతి అంతా "ఇక్కడ నుండి ఎక్కడికి?" అని అన్నికాలములలో అరుచుచునే ఉన్నది.
24ఒక రాత్రి ఇంగ్లాండు యొక్క రాజు… మర్నాటి ఉదయమున ఒక పరిశుద్దుడు అతడికి బాప్తిస్మము ఇచ్చియున్నాడు, కొలిమిలో మండుచున్న ఒక మంట యొద్ద వారిద్దరు కూర్చునియున్నారు. అక్కడ మంట చాలా అధికముగా ఉన్నది లేక చాల పెద్దదిగా ఉన్నదని మనము పిలుస్తాము, చాలా అధికమైనదిగా అది ఉన్నది, చాలా పెద్ద స్థలములో పెద్ద దుంగలు వేసియున్నవి. దేవుని గురించి చెప్పుటకు ఆ పరిశుద్ధుడు ప్రయత్నము చేయుచున్నాడు, ఒక చిన్న పిచ్చుక అతడి వర్తమానమును పూర్తి చేసినది. రాత్రివేళ ఆ చిన్న పిచ్చుక చీకటిలోకి ఎగిరి వెళ్ళుచున్నది, మరియు వెలుగులోకి ఎగిరి వెళ్ళుచున్నది, తిరిగి వెలుగులోంచి చీకటిలోకి వెళ్ళుచున్నది. అప్పుడు ఆ పరిశుద్ధుడు లేచి నిలబడి, ఆ రాజుతో ఇలా అనెను, "అది ఎక్కడ నుండి వచ్చుచున్నది మరియు అది ఎక్కడకి వెళ్ళుచున్నది?"
మనకు తెలియవలసినది కూడా అదియే. మనము ఎక్కడ నుండి వచ్చియున్నాము మరియు ఇక్కడ మనము ఏమి చేస్తున్నాము, ఇక్కడ నుండి మనము ఎక్కడకి వెళ్ళబోవుచున్నాము? మనకున్న విజ్ఞాన శాస్త్రము అంతా కలసి, మన శరీరములో ఉన్న ఎముకలు ఎన్ని ఉన్నవో అంతగా తవ్వియున్నారు, మనము ఏన్నో పుస్తకములను వ్రాసియున్నాము, వాటిలో ఏ ఒక్క పుస్తకము నీవు ఎక్కడ నుండి వచ్చియున్నావో నీకు తెలియచేయలేదు, నీవు ఎమైయున్నావో నీకు తెలియచేయలేదు, నీవు ఎక్కడకి వెళ్ళుచున్నావో నీకు తెలియచేయలేదు — కేవలము ఒకే ఒక్క పరిశుద్ధ గ్రంథము మాత్రమే నీకు ఆ సంగతిని తెలియచేస్తుంది. నీవు ఎక్కడ నుండి వచ్చావో, ఇక్కడ నీవెందుకు ఉన్నావో, మరియు నీవు ఎక్కడకి వెళ్ళబోవుచున్నావో అది మాత్రమే నీకు తెలియచేస్తుంది. కాబట్టి, ఇక్కడ నుండి ఎక్కడకి వెళ్ళాలో మనకు తెలియాలంటే, మనకు తెలియచేసే ఒకే ఒక్క గ్రంథమును మాత్రమే తీసుకొనుము.
EXOD 3:5
25వారు పురాతన కాలపు ఎముకలను త్రవ్వియున్నారు, మరియు నీటి అడుగు భాగమున ఏర్పడే శిలాజములను వెదికియున్నారు, కాని దేనిని నిరూపించలేకపోయారు. దేవుని వాక్యములో సమాధానమున్నది. మనము అడుగు ప్రతిదానికి దేవుని వాక్యములో సమాధానమున్నది. అది దేవుని యొక్క గ్రంథములో ఉన్నది. మానవుడు చాలాసార్లు ఆశ్చర్యపోతుంటాడు. మనము కొన్నిసార్లు లోతులలోకి వెళ్ళి లేఖనములను చదివినప్పుడు మనము ఆశ్చర్యపోతుంటాము. కాని వాస్తవమునకు మనము ఆశ్చర్యపోకూడదు. నీవు దానిని వ్యక్తపరచకూడదు కాని, నీవు వాటిని విశ్వసించవలసియున్నది.
దేవుడిని ఏ మానవుడు సాంకేతికముగా నిరూపించలేడు. ఒకవేళ దేవుడిని నీవు సాంకేతికంగా నిరూపించినట్లయితే, అప్పుడు ఇంక విశ్వాసమన్నదే ఉండదు. విశ్వాసమనేది శాస్త్రీయత కాదు కాని, మనము మాత్రము దేవునియందు విశ్వసించవలసియున్నది.
తను చూచిన పొదనుండి మోషే కొన్ని ఆకులను లాగి ఇలాగు అన్నట్లయితే ఎలాగుండును, "ఈ ఆకులను తీసుకొని వీటిని పరీక్షించు కేంద్రమునకు తీసుకు వెళ్ళి అక్కడ ఏ ద్రవము వీటిపైన ఉండుటచేత ఇవి కాలిపోకుండా ఉన్నాయో కనుగొనిన తరువాత నేను నమ్ముతాను." అలాగు మోషే చేసియున్నట్లయితే, దేవుడు ఎన్నడు మోషేతో మాట్లడియుండేవాడు కాదు. అతడికి అది తెలియదు. అతడు చేసిన ఒకే ఒక కార్యమేమనగా, తన కాళ్ళకున్న చెప్పులను తీసివేసి గౌరవముతో క్రింద కూర్చునియున్నాడు, అప్పుడు దేవుడు తిరిగి మోషేతో మాట్లాడెను.
దేవుని యొక్క ఈ వాగ్దానములను మనము శాస్త్రీయముగా నిరూపించలేము, కాని మనము వెనుక తిరిగి గమనించినట్లయితే, ప్రతికాలములో దేవుడు పలికిన ప్రతి వాగ్దానము దానియొక్క కాలములో నెరవేరుటను మనము కనుగొనగలము. ఈ రాత్రి మనము కూడా కూర్చుని ఆయన వాక్యము పట్ల గౌరవమును మరియు యధార్థతను కలిగి కొద్దిసేపు వాక్యమును చూసినట్లయితే, మనము ఎక్కడకు వెళ్ళుచున్నామో, మరియు దానియొక్క ఉద్దేశ్యము ఏమిటో గమనించుదాం. ఇదంతా ఏమిటి? ఎందుకని మనం ఇక్కడవున్నాము?
26కొంతకాలం క్రితం నేను పశ్చిమమున ఉన్నప్పుడు, నన్ను ఒక వ్యక్తి తన గృహమునకు రాత్రి విందుకై ఆహ్వానించియుండగా, నేను వారి ఇంట నిలబడియున్నాను. అతడు ఇలాగు అనెను, "సహో బ్రెన్హాం, అక్కడ చలిమంట కొరకు ఏర్పాటు చేసిన దానిపైన ఉన్న ఆ రంగుల చిత్రమును లేక అది చిత్రము కాదు అది ఒక చెక్కను చిత్రముగా చెక్కినది, దాన్ని చూచి మీరు తన్మయత్వము చెందుటను నేను గమనించియున్నాను."
"అవును అయ్యా! నేను తన్మయత్వము చెందియున్నాను" అని నేను చెప్పియున్నాను. అది ఒక పాత ఎద్దులబండి, లేక ఎద్దుల మీద సరుకులను మోసుకొనిపోవు ఒక బండి, దానికి ముందు ఒక మనిషి ఉన్నాడు, లోపల తన తల్లి ఒడిలో కూర్చునియున్న ఒక చిన్న బాలుడున్నాడు, వారు ప్రయాణము చేయుచున్నారు.
అతడు ఇలా అనెను, "వారు నా తల్లి తండ్రులు, ఒడిలో కూర్చునియున్న ఆ చిన్న బాలుడను నేనే. ఇంకా, "ఇక్కడకు మేము ఎద్దుల బండిలోనే వచ్చాము. కాని ఆ తరువాత, మేము ఎంతో అభివృద్ధి చెందాము. ఇక్కడ నుండి మీరు ఆరుబయటకు అడుగు పెట్టవలసినదిగా నేను కోరుచున్నాను." అతడు చెప్పెను, "నా యవ్వనప్రాయంలో నేను ఎన్నివేల ఎకరముల పొలము సంపాదించియున్నానో కూడా నాకు గుర్తులేదు" అనెను.
"అటు తరువాత, ఆ ప్రక్కనే పశ్చిమమున ఉన్న ఆ పొలమును కూడా నేను స్వంతం చేసుకున్నాను, దక్షిణము వైపున ఉన్న ఆ పొలమును కూడా నేను స్వంతం చేసుకున్నాను. దూరమున అక్కడ పొగ వచ్చుటను నీవు చూస్తున్నావా?"
"అవును, అయ్యా."
చెప్పెను, "అది ఒక నగరము." అక్కడ అతడు ఎంత సంపదను కలిగియున్నాడో నేను మరిచిపోయాను.
అతడు, "అక్కడ ఉన్న ఆ బ్యాంకుకు నేనే అధ్యక్షుడనైయున్నాను" అనెను. ఇంకా అతడు, తను కలిగియున్నదానినంతటి గురించి చెప్పుచున్నాడు.
JAS 4:14
27కొద్దిసేపు అతడు చెప్పినది నేను వినిని తరువాత, నేను ఇలా అన్నాను, "అయ్యా! నేను మిమ్ములను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. తూర్పు నుండి పడమర ఉన్న నగరము వరకు మీరు కలిగియున్న పొలములు చూపించియున్నారు. మీరు ఈ విధముగా పైకి చూడాలని నేను ఆశిస్తున్నాను, చూసి… పైన అక్కడ మీరు ఎంత సంపాదించియున్నారో చెప్పమని అడుగుచున్నాను." అదియే అన్నింటికన్నా ప్రాముఖ్యమైన విషయము, ఎందుకనగా ఒక దినమున ఇక్కడ ఉన్న ప్రతి చిన్నదానిని కూడా నీవు విడిచిపెట్టి వెళ్ళవలసియున్నది. అక్కడ నుండి ఆ తరువాత నీవు ఎక్కడకి వెళతావు? అదియే ముఖ్యమైనది.
ఇక్కడ కొద్దికాలమే ఉంటాము, కాని అక్కడ నిత్యమూ ఉండవలసియున్నది. కాబట్టి నిత్యత్వమునకై మనము ఎక్కడకు వెళుచున్నామో మనము గుర్తించాలని నేను అనుకుంటున్నాను. మనము బాగా సంపాదించి, ఇక్కడ గృహములను కట్టుకొని, అవసరతలకు ఏర్పాట్లు చేసుకొని, చదువులు చెప్పించి మొదలైనవి చేసి కుటుంబములను ఏర్పాటు చేసుకునే కార్యక్రమములను కలిగియుంటున్నాము. కాని వీధి చివరకు చేరేంతవరకు కూడా అన్నింటికన్నా ప్రాముఖ్యమైన సంగతిని చేయకుండా ఉండిపోతున్నాము, దేవుని గురించి మనము ఏమియు తెలుసుకొనకుండా, మనం రక్షణ నిమిత్తమైన ఆయన ప్రణాళికను తెలుసుకొనకుండా యేసుక్రీస్తు యొక్క విమోచనా కృప గురించి తెలుసుకొనకుండా మనము నిత్యత్వములో మునిగిపోవుచున్నాము. మనము చేయుచున్నది ఎంతో దయనీయమైనది, కాని మనము అదే చేయుచున్నాము.
JOB 14:7
28ఈ తెలివైన ప్రజలు, వారు తాము కాలమునకు లోబడిన జీవులుగా ఉన్నామని కనుగొన్నారు, కాలము ముగిసిన తరువాత అది ఏమిటో తెలిశాక వారు ఆశ్చర్యపోతారు. కొంతసేపు యోబు అను పేరుగల ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడతాను. అది పరిశుద్ధ గ్రంథములోనే అత్యంత పురాతనమైన గ్రంథమైయున్నది. తను జీవించిన కాలములో యోబు అందరికన్నా అత్యంత తెలివైన వ్యక్తియని మనము అర్ధము చేసుకోగలము. యోబు సంతకి వెళ్ళునప్పుడు, అతడికి ఉన్న జ్ఞానమును బట్టి యవ్వనస్తులైన రాజకుమారులు ఆయనకు వంగి నమస్కారము చేసేవారు. అతడు ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు.
కాని, ఆ వ్యక్తి తనకున్న గొప్పదనము గురించి అవగతము అగుచున్నకొలదీ, అతడు ఆశ్చర్యపోవుచున్నాడు. ఇదంతయూ గతించిపోయిన తరువాత, ఏమి జరుగనైయున్నది? తరువాత ఏమి జరుగబోవుచున్నదోనని అతడు ఆశ్చర్యపోయెను.
అప్పుడతడు మాట్లాడి, దేవుని యొక్క సృష్టిని గమనించుట ప్రారంభించెను. దేవుని నుండి వచ్చిన వాక్యమే అన్నింటిని సృష్టించినదని అతడు తెలుసుకున్నాడు. అతడు గమనించి "వృక్షము మరణించినను తిరిగి జీవించునని దానికి ఆశ కలదు" అనెను
PS 19:1
29ప్రకృతిని మీరు గమనించినట్లయితే, దేవుడు తన యొక్క భావములను తన ప్రజలకు వ్యక్తపరచిన ఒక గొప్ప మార్గముగా ప్రకృతి ఉన్నది, వారు పరిశుద్ధ గ్రంథమును కలిగియున్నను లేక ఏది కలిగియున్నను, ఆయన తననుతాను ప్రకృతిలో చూపించుకొనెను.
ఉదయమున సూర్యుడు పైకి వచ్చుటను గమనించుము. సూర్యునికి ఏమి జరుగుచున్నది? ఒక చిన్న బాలుడు తూర్పున జన్మించినట్లుగా ఉండును. పది గంటలకు అది యవ్వనములోకి వచ్చినట్లుగా ఉండును. మధ్యాహ్న సమయమున అది బలమైన ప్రాయములోయుండును. మధ్యాహ్నము తరువాత అది మధ్య వయస్సులోకి వచ్చును. సాయంకాల సమయమునకు అది అస్తమించి కనపడకుండా పోవును, ముగిసిపోయినది. సూర్యుని గురించి ఇక అంతేనా? లేదు. సూర్యుని పట్ల దేవుడు ఒక ఉద్దేశ్యము కలిగియుండెను, కాబట్టి సూర్యుడు మర్నాడు ఉదయమున తిరిగి పైకి లేచును. అది ఏమని చెప్పుచున్నది? పుట్టుక, జీవము, మరణము, పునరుత్దానము గురించి చెప్పుచున్నది.
DEUT 30:19
30పువ్వులను చూడుము. ఈ దినము నేను వచ్చునప్పుడు గమనించియున్నాను, ఆ పువ్వులు ఎంతో అందముగా ఉన్నాయి. అవి ఒక ఉద్దేశ్యము నిమిత్తము ఇక్కడ ఉన్నాయి. దేవుని యొక్క పలుకబడిన మాటలుగా అవి ఇక్కడ ఉన్నాయి. ఉనికిలోకి రమ్మని దేవుడే వాటితో చెప్పెను. ఆయన అలాగు పలుకగా, ఏమి జరిగినదో చూడండి. మీ పెరటిలో అవి ఎంతో అందముగా నిలబడియున్నాయి.
కొంతకాలము తరువాత మంచు వాటి మీద కురుస్తుంది. యవ్వనమైనవి, మధ్య వయస్సులో ఉన్నవి, ముదుసలివి, ఆ మంచు ఎప్పుడైతే వాటిని కొడుతుందో అప్పుడు అవి మరణిస్తాయి. అవి తమ చిన్న తలలను వాల్చేస్తాయి, మరియు అప్పుడు ఏమి జరుగుతుంది? వాటిలో నుండి చిన్న నల్లటి విత్తనము వంటిది రాలిపడును. మీరు నమ్మినా - నమ్మకపోయినా, దేవుడే వాటికి అంత్యక్రియలను ఏర్పాటు చేసెను. వర్షము కురుస్తుంది, చుక్కలు, ఆకాశము నుండి చుక్కలు క్రిందకు పడి ఆ విత్తనమును పూడ్చి పెడతాయి.
తరువాత శీతాకాలము వస్తుంది. పుష్పపు రెక్కలు గతించిపోయాయి, పుప్పొడి గతించిపోయింది, చిన్న బుడిపె వంటిది పోయింది; విత్తనము గట్టిపడిపోయింది, పగిలి బయటకు వచ్చును, పైన గుజ్జు పోవును. అదే ఆ విత్తనము యొక్క అంతమా? లేదయ్యా. వెచ్చని సూర్యుని వెలుగు వచ్చినప్పుడు, ఆ వెలుగు ఆ మొక్క యొక్క జీవమును పునరుద్ధరిస్తుంది. సూర్యని వెలుగు భూమి మీద పడుతున్నప్పుడు భూమి వేడెక్కుతుంది, ఆ విత్తనములో ఎక్కడో మొలకెత్తే జీవము ఉంటుంది, అది తిరిగి జీవిస్తుంది. ఎందుకు? దేవుడు ఒక ఉద్దేశ్యము నిమిత్తమై దానిని చేసియున్నాడు, అది తిరిగి జీవించుటకు దేవుడే ఒక మార్గమును ఏర్పరిచియున్నాడు.
మనము కూడా ఒక ఉద్దేశ్యము నిమిత్తమే ఇక్కడ ఉన్నాము, కాని మనము ఆ ఉద్దేశ్యమును నెరవేర్చవలసియున్నది, జీవమునో లేక మరణమునో ఎంచుకోవలసియున్నది. కావున ఇక్కడ మనము ఒక ఉద్దేశ్యము నిమిత్తము ఉన్నాము, కాని మనము ఆ ఉద్దేశ్యమును నెరవేర్చవలసియున్నది. అది ఆయన సేవచేయుట అయియున్నది, ఎందుకనగా మనము ఆయన యొక్క కుమారులము మరియు కుమార్తెలమై యున్నాము.
JOB 14:2,10,12,13,21
31సృష్టిని యోబు గమనించెను. మరణించాక అదే అంతము కాదని అతడు చూసెను. మరణము తరువాత తిరిగి జీవిస్తామని అతడు చూసెను. జీవం… సూర్యుడు వచ్చినప్పుడు జీవం తిరిగి వస్తుంది. "మంచిది," అతడు, "ఒకవేళ అది పలుకబడిన మాట అయితే, లేక దేవుని చేత పలుకబడిన మాట అయితే, అది ఒక ఉద్దేశ్యము నిమిత్తము జీవిస్తుంది మరియ మరణిస్తుంది. కాని," అతడు ఇలాగు అనెను, "ఒక మనుష్యుడు [యోబులో నుండి ఒక లేఖనము కొరకు నేను చూస్తున్నాను, యోబు 14], కాని నరులు మరణమై కదలలేక పడియుందురు, అతడు తన ఆత్మను విడచిపెట్టును, ప్రాణము విడిచిపెట్టును. అతడు కుమారులు వచ్చి ప్రలాపించుదురు, అతడు దానిని ఎరుగడు. అతడు ఎక్కడ ఉన్నాడు. నీవు పాతాళములో నన్ను దాచిన యెడల ఎంతో మేలు నీ కోపము చల్లారు వరకు నన్ను చాటునుంచినయెడల ఎంతో మేలు."
యోబు ఇలాగు చెప్పెను, "ఒక పువ్వు మరణించుటను నేను గమనించాను. దాని ఉద్దేశ్యమును అది నెరవేర్చినది, మరియు అది తిరిగి లేచినది. ఒక వృక్షము మరణించుటను నేను గమనించాను, వసంతకాలములో తిరిగి చిగురించుట నేను గమనించాను."
ECCL 12:7
32మీరెప్పుడైనా ఒక వృక్షమును గమనించారా? అది చిగురించిన తరువాత అది గ్రీష్మకాలములో తన ఉద్దేశ్యమును అది నెరవేరుస్తుంది. ఆకులు రాలే కాలము వస్తుంది. మంచు పడుటకు ముందుగా, ఆ ఆకు, పసుపు రంగులోకి మారుట ప్రారంభిస్తుంది, తరువాత ఎరుపు నుండి గోధుమ రంగులోకి మారుతుంది. కొద్దికాలము తరువాత అది చెట్టు నుండి రాలి క్రిందపడుతుంది. అది దాని యొక్క అంతమా? లేదు. ఏమి జరిగినది? ఆ ఆకులలోకి జీవము ఎక్కడ నుండి వచ్చినదో తిరిగి అదే చెట్టు యొక్క వేర్లలోకి ఆ జీవము చేరుకుంటుంది. అటు తరువాత అదేమి చేస్తుంది? వసంతకాలములో అది తిరిగి వస్తుంది, పునరుత్దానములో తిరిగి వస్తుంది, ఒక క్రొత్త ఆకు ద్వారా అదే జీవము తిరిగి వస్తుంది.
జీవవృక్షములో క్రైస్తవులు వ్రేలాడుచున్నారు. ఈ పాపహితమైన శరీరమును జీవము విడిచినప్పుడు దానిని ఇచ్చిన దేవుని యొద్దకు అది తిరిగి వెళుతుంది, అది నూతన పరచబడి మరలా తిరిగివస్తుంది, ఎందుకనగా దానికి ఒక ఉద్దేశ్యమున్నది.
33కొంతకాలము క్రితం కెంటకీలో దిగువ భాగములో ఉన్నాను లేక ఇక్కడ నుండి ఉత్తరము వైపున ఉన్నకెంటకీ రాష్ట్రములోని ఎగువ ప్రాంతమునకు నేను వెళ్ళవలసియున్నది. ఈ రాత్రి ఇక్కడ ఉన్న మన ధర్మకర్తలలో ఒకరైన శ్రీ. ఉడ్స్, మరియు నేను వేటాడుచున్నాము. ఆక్షన్ అను చిన్న నగరములో మెథడిస్టువారి ఆవరణమునందు నేను ఒక కూడికను కలిగియున్నాను.
ఒక రాత్రి మేము అక్కడ మాట్లాడుచుండగా, ప్రభువు గొప్ప కార్యములను చేసెను, అక్కడ మేము స్వస్థతా ఆరాధనను కలిగియున్నాము, బలహీనుల కొరకు ప్రార్ధించాము. ఇక్కడ మీరందరు వేరొక కూడికలో ఉన్నారు — అక్కడ ఏమి జరిగినదో మీకు తెలుసా.
ఏ ఒక్క మనుష్యుడను నేను స్వస్థపరచలేను. దేవుడు దానిని ఎప్పుడో చేసెను. నీవు కేవలం దాన్ని నమ్మవలసియున్నది. ఆయన చెప్పియున్నట్లుగా, ఈ అంత్య దినములలో ఆత్మలను వివేచించు ఒక వరము, మరియు మొదలైన కార్యములను చేయును. మనకది వంద శాతం ఖచ్చితముగా తెలుసు, ఎందుకనగా ఈ అంత్యదినములలో దేవుని వాక్యము ఆయన యొక్క వాగ్దానములను బయలుపరుచుచున్నది.
ACTS 2:17,18
34అక్కడ ఒక స్త్రీ ఉన్నది… నేను ఆ దేశములో ఎన్నడు ఉండలేదు. వినుటకు వచ్చిన వారిలో అక్కడ ఒక స్త్రీ కూర్చునియున్నది, ప్రజలందరిలో పరిశుద్ధాత్ముడు వారిని పిలుచుట, వారికి చెప్పుట ప్రారంభించెను. ప్రభువైన యేసు, తన శరీరమనే సంఘములో ఆయన వాక్యము బయలుపరుచుకొనును. యేసు రంగం మీదకు వచ్చి నిలబడి, మాట్లాడుట ప్రారంభించగానే వారి హృదయములో ఉన్న ఆలోచనలు వారితో చెప్పబడ్డాయి. ప్రజలతో వివిధమైన సంగతులు చెప్పబడ్డాయి, పరిశుద్ధ గ్రంథమును చదివే వారందరికి అంత్య దినములలో అదే కార్యములు మరలా జరుగునని వాగ్దానము చేయబడిన సంగతి తెలుసు, ఆయన లేఖనముల ద్వారా దానిని చేస్తానని వాగ్దానము చేసెను.
35ఇప్పుడు మీరు గమనించవలెనని కోరుచున్నాను. ఇప్పుడు, అది జరుగుచునప్పుడు, ఆ పెద్ద మైదానములో ఆ స్త్రీ వెనుక ఎక్కడో కూర్చుని ఏడ్చుచున్నది. కొన్ని వందల, వందల మంది అక్కడ కూర్చునియుండగా ఈ స్త్రీ వారి మధ్యలో కూర్చుని యేడ్చుచున్నది. గమనించండి, పరిశుద్ధాత్మ ఆ స్త్రీ దగ్గరకు వెళ్లి, మరియు చెప్పెను, "నీవు నీ సహోదరి గురించి యేడ్చుచున్నావు. ఆమె పేరు పాలనా-పాలన. ఆమె ఈ ప్రదేశములో నివసించును. నీ పాకెట్ పుస్తకములో చేతి రుమాలు ఉన్నది, దానిని నీవు ఇంటి నుండి వచ్చేముందు అక్కడ పెట్టితివి. అది ఇలాగు, ఈ మాదిరిగా, ఒక చేతి రుమాలు. నీవు ఈ చేతి రుమాలును తీసుకోని వెళ్లి నీ సహోదరి పై పెట్టుము. ఆమె కాన్సరుతో చనిపోవుచున్నది. మరియ ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆమె జీవించబోవుచున్నది."
ఆ స్త్రీ దానిని ఆ భవనములో నుండి తీసుకోని, వెళ్లి మరియు ఆమె చేతి రుమాలును ఆ రాత్రి స్త్రీ పై పెట్టెను. మరియు ఆ మరుసటి ఉదయము ఆమె స్వస్థతనొందెను.
36ఇప్పుడు. కావున నేను… కాలము చాల వేడిమిగా ఉండెను. ఉడుతల వేట… నా తోటి ఉడుతల వేటగాళ్ళు ఎరుగుదురు, ఆ ఆకుల యొక్క శబ్దము ఉడుతలను భయపెట్టును, మరియు మేము… అడవిలో నడచుటకు మేము వెళ్ళవలసిన స్థలము కొంత పల్లములతో అది చాలా ఎండుగా ఉండెను — చిన్న గుంటలు. నా స్నేహితుని పేరు శ్రీ. వుడ్స్. ఆయన ఇక్కడ నా కుడి ప్రక్క కూర్చొనియున్నాడు.
మరియు ఆయన చెప్పెను, "నాకు తెలిసిన వ్యక్తికి కొన్ని ఎకరాల భూమి ఉంది." అయితే, చెప్పెను, "అతడితో వ్యవహారము చాల కష్టము." చెప్పెను, "అతడు ఒక నాస్తికుడు," మరియు చెప్పెను, "అతడు దేవుని నమ్మడు. దాని విషయమై ఎగతాళి చేయును." మరియు అతడు చెప్పెను, "అయితే అతడు నన్ను ఎరుగును, నా తండ్రిని ఎరుగును. నేను వెళ్లి ఆ స్థలములో మనయొక్క వేట కొరకు అడుగుదును…" అని చెప్పెను.
నేను చెప్పాను, "మనము వెళ్ళుదము."
37మేము ఆ ప్రదేశమునకు వెళ్లితిమి, ఆ ప్రక్క మార్గము గుండా, మరియు ఆపిల్ వృక్షము క్రింద ఇద్దరు వృద్ధ పురుషులు కూర్చొనియున్నారు. అతడు చెప్పెను, "అదిగో అక్కడ, కుడి ప్రక్కన వ్యక్తి.
"సేవకుడను గనుక నేను కారులోనే కూర్చుందును," అని చెప్పితిని.
కావున అతడు వెళ్లి మరియు అనెను, "ఎలాగున్నావు?"
మరియు ఆ మనుష్యుడు, "వచ్చి కుర్చోనుము" అనెను.
అతడు చెప్పెను, "నా పేరు వుడ్స్. మేము నీ స్థలములో ఉడుతలను వేటాడుటకు అనుమతి దొరకునా అని చూచుచుంటిని."
అతడు, "నీ పేరు ఏమి?" అనెను.
అతడు చెప్పెను, "నేను జిమ్ వుడ్స్, కుమారుడను."
అతడు, "జిమ్ వుడ్స్ నా యొక్క స్నేహితుడు, మరియు అతడి యొక్క కుమారులెవరైనా ఎక్కడైనా వేటాడవచ్చును" అనెను.
అతడు చెప్పెను, "ధన్యవాదాలు."
అతడు, "నేను ఆశ్చర్యపోవుచున్నాను, నీవు వారిలో ఎవరు?" అనెను.
"నేను బ్యాంక్స్." కొద్ది నిమిషములు మాట్లాడి, మరియు శ్రీ. వుడ్స్ చెప్పెను, "నేను నాతో మా పాస్టర్ను వెంటబెట్టుకొని వెళ్ళవచ్చునా అని చూచుచుంటిని."
అతడు, "నీవు చాల దిగజారిపోయి, నీవు వెళ్ళు ప్రతిచోటికి బోధకుని తీసుకోని వెళ్ళుచున్నవా?" అనెను.
అతడు చెప్పెను, "నా పాస్టర్ అక్కడ ఉన్నాడు."
38నేను కారు దిగుట మంచిది అని నేను అనుకున్నాను. మరియు నేను కారు దిగాను, మరియు అక్కడికి నడచి, మరియు నేను, "మీరు ఎలా ఉన్నారు?" అని అడిగితిని.
అతడు, మీరు ఎలా ఉన్నారు? కావున మీరు ఒక బోధకులా?" అనెను.
నేను చెప్పాను, "అవునండి."
మరియు అతడు, "సరి, నేను ఒక నాస్తికుడను" అనెను.
నేను అన్నాను, "సరి, దాని గురించి అతగా చెప్పనవసరము లేదు, అవునా?"
అతడు, "అది అవసరము అని నేను అనుకోనుచున్నాను" అనెను.
అతడు, "అయితే మీ ప్రజల గురించి నాకు వ్యతిరేకము ఏమనగా, మీకు తెలియనిదాని గురించి మీరు మాట్లాడుదురు" అనెను.
"ఓ," "అలాగా?" అని అన్నాను.
అతడు, "అవునండి. వారు ఎల్లప్పుడూ దీని గురించి ఎక్కువగా చెప్పుదురు, దేవుని గురించి, మరియు ప్రతిదాని గురించి." మరియు అతడు "అలా౦టిది ఏది లేదు" అనెను.
నేను చెప్పితిని, "ఉహ్-హు." "సరి, బహుశా అది ఎలాగున్నదో మీకు తెలియునా అయ్యా," నేను చెప్పితిని, "ప్రతియొక్కరు వారి తలంపునకు అలాగే అనుకొందురు." నేను నా యొక్క హృదయములో అనుకోనుచున్నాను, "ఇప్పుడు, ఈ మనుష్యునికి సహాయము చేయుటకు నాకు ఏమైనా ఇవ్వుము, ప్రభువా — సందేహము లేదు నిజాయతిగా ఉన్నాడు.
మరియు అతడు, "నా జీవితమంతటిలో నేను ఒకే ప్రసంగికుడను చూశాను. నేను అతడు చెప్పుట వినుటకు ఇష్టపడుదును — అతడి గురించి విన్నాను."
నేను అడిగితిని, "అతడు ఎవరయ్యా?"
అతడు, "సుమారుగా రెండు సంవత్సరముల క్రితం, ఆక్షన్ అని పిలువబడే ఒక పట్టణములో ఒక ప్రసంగీకుడు వచ్చాడు" అనెను. మరియు అతడు, "ఇంకా ఆ వ్యక్తి ఇలా చెప్పుచున్నాడు, ఒక మహిళ సుమారుగా రెండు సంవత్సరముల నుండి కాన్సరు వలన లేవలేకుండా ఉన్నది. వారు ఆమెను కనీసము మలపాత్ర వద్దకు కూడా తీసుకొని వెళ్ళలేక పోవుచున్నారు. వారు దాని కొరకు ఒక ప్రత్యేకమైన దుప్పటిని వాడుచున్నారు. ఆ ఉదయమున నేను మరియు నా భార్య అక్కడికి వెళ్ళాము. వైద్యులు ముందు రోజున ఆమె ఈ రాత్రిని దాటుట కష్టమేనని చెప్పియున్నారు" అనెను.
39"ఆమెకు కడుపులో కాన్సరు ఉన్నది. అది ఆమెను తినివేసినది. ఆమె కొద్దివారముల నుండి కనీసం బార్లీ నీరు కూడా త్రాగలేకపోతున్నది. ఆమె యొక్క నరములు కుచించుకుపోయేంతవరకు వారు ఆమెకు నరముల ద్వారా గూకోజ్ ను ఎక్కించియున్నారు, ఇంక ఆమెకు చేయలసినది ఏమిలేదని వారు చెప్పియున్నారు."
మరియు చెప్పెను "ఆమె యొక్క సోదరి ఆ ప్రసంగికుని యొక్క ప్రసంగమును వినుచున్నది, ఆ ప్రసంగికుడు ఎన్నడు ఇక్కడకు రాలేదు మరియు అతడికి ఇక్కడ ఎవరును తెలియదు. అయితే ఈమె ఎవరో అతడు చెప్పెను మరియు ఆమె యొక్క సాహోదరి ఎవరో కూడా చెప్పెను, మరియు ఆమెయొద్ద ఉన్న చేతిరుమాలు గురించి కూడా చెప్పెను, అది ఆమె యొక్క సోదరి మీద ఉంచమని చెప్పెను." "రక్షణదళము వారు ఆ రాత్రి ఆ పైన ప్రాంతములో ఎక్కడో ఉన్నారనుకుంటా, వారందరు కేకలు వేయుచున్నారు." ఇంకా ఇలా చెప్పెను, "ఆమె మరణించినదేమో అని మర్నాటి ఉదయమున మేము వెళ్ళాము. మేము అక్కడకి చేరుకునే సమయమునకు ఆమె లేచి, ఆపిల్-పై అను వంటకమును వండుకొని మరియు తినుచున్నది. ఇప్పుడు, ఆమె ఇతరుల పని కూడా చేస్తున్నది."
నేను, "అందులో వింతగా ఏమున్నది?" అన్నాను.
40అతడు, "మంచిది, ఇక్కడ నేను తెలుసుకోవలసినది ఏమిటంటే. నేను ఎప్పటికైనా ఆ ప్రసంగికుడిని చూసినట్లయితే, ఆ స్త్రీ యొక్క స్వస్థత గురించి, అతడికి ఎవరు చెప్పారో అని ప్రశ్నించాలని అనుకుంటున్నాను," అనెను.
నేను, "ఓ, అవునయ్యా?" మీకు తెలుసా, ఉడుత యొక్క రక్తమంతా నా మీద పడియున్నది, గడ్డము పొడవుగా పెరిగింది. మరియు నేను, "ఇప్పుడు చూచుటకు నేను ఒక ప్రసంగికుని మాదిరిగా లేను" అన్నాను.
అతడు, "మంచిది, మరింత మానవునిగా కనిపించుచున్నావు."
నేను, "అవునయ్యా," ఆ ఆపిల్స్ లో నేను ఒకటి తీసుకొనవచ్చునా? అన్నాను. చిన్న కందిరీగ వంటి కీటకాలు (ఆంగ్లములో యెల్లో జాకెట్ అందురు) వాటన్నిటి పైన ఉన్నాయి.
అతడు, "తీసుకోవచ్చును." నేను ఒక దాన్ని తీసుకొని కొరికియున్నాను. అతడు, "ఆ కీటకాలే వాటిని తినివేస్తున్నాయి, నీకు నీవే సహయము చేసుకోనుము" అన్నాడు.
నేను, "మీకు కృతజ్ఞతలు" అని చెప్పి, దాన్ని కొరికి, ఇది మంచి ఆపిల్" అన్నాను.
అతడు, "అవును, నా కోసము ఆ పాత చెట్టు చాలా ఉత్పత్తి చేసింది" అన్నాడు.
నేను, "అవునయ్యా, ఈ చెట్టు యొక్క వయస్సు ఎంత ఉండవచ్చును?"
అతడు, "సూమారుగా 40 సంవత్సరములు, అది చిన్న మొక్కగా ఉన్నప్పుడు అక్కడ దాన్ని నాటియున్నాను," అనెను.
41నేను, "హ-హుహ్, అన్ని ఆపిళ్ల క్రిందకు పడుచున్నాయి, ఆకులు కూడా రాలిపోతున్నాయి" అన్నాను.
అతడు, "అవును, అది అలాగునే చేస్తుంది."
నేను, "మిమ్ములను నేను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను" అన్నాను.
అతడు, "అలాగే, తప్పకుండా అడుగు" అనెను.
నేను, "ఇప్పుడు, మనకు మంచుపడుటలేదు కదా, ఇది కేవలం ఆగష్టు నెలలోని మధ్య భాగము మాత్రమే. మనకు అక్టోబరు లేదా నవంబరు వరకు మంచుపడదు. కాని, ఈ ఆగష్టు మధ్యలోనే చెట్లనుండి ఆకులు రాలుచున్నాయి. ఆకులు రాలునట్లుగా చేస్తున్న కారణం ఏమైయున్నది?" అని అడిగితిని.
అతడు, "కారణమేమంటే, ఆ పసరు వదిలేసిపోతుంది" అని చెప్పెను.
నేను, "ఆ పసరు వదిలిపెట్టకపోతే ఏమి జరుగుతుంది?" అని అడిగాను.
అతడు, "ఎందుకనగా, శీతాకాలములో చెట్టు మరణిస్తుంది. ఆ పసరులో తిరిగి జీవం ఇచ్చే గుణం ఉంటుంది. అది వదలకపోతే అది చెట్టును చంపుతుంది, చెట్టు మరణిస్తుంది" అనెను
నేను, "అవునయ్యా, కాబట్టి, ఎక్కడైతే వెచ్చదనము ఉంటుందో ఆ వేర్లలోనికి పసరు తిరిగి వెళ్ళిపోతుంది, అక్కడే శీతాకాలమంతా ఉంటుంది, మరియు వసంతకాలములో తిరిగి వచ్చి ఇంకా ఎక్కువ ఆపిళ్లను మరియు ఆకులను ఇస్తుంది" అన్నాను.
అతడు, "అవును, అలాగే జరుగుతుంది" అన్నాడు
42నేను, "మిమ్ములను నేను ఒకటి అడగాలని అనుకుంటున్నాను. ఏ జ్ఞానమూ…? ఆ చెట్టుకు లేదు. చెట్టునకు శీతాకాలము వచ్చుచున్నదని ఏ జ్ఞానము చెప్పుచున్నది? సంవత్సరములోని వసంతకాలము వచ్చువరకు దానిని దిగువున వేర్లలోనే ఉండమని చెట్టుకు ఏ జ్ఞానము చెప్పుచున్నది?" నేను ఇలా అన్నాను, "ఒక బక్కెటులో నీళ్ళుపోసి ఒక స్తంభము యొద్ద ఉంచుము, ఆకురాలు కాలము వచ్చినప్పుడు ఆ నీరు దిగువకు వెళుతుందేమో గమనించుము. అది అలాగు వెళ్ళదు. ఆ పసరు చెట్టును వదలి అడుగున ఉన్న వేర్లలోకి వెళ్ళమని ఆ చెట్టుకు ఏదో జ్ఞానము తెలియచేయుచున్నదని నీవు తప్పక ఒప్పుకొనవలసియున్నది. అది అలాగు జరుగనట్లయితే అది తప్పక మరణిస్తుంది. దాని జీవమును అది దూరముగా దాచుకొనుచున్నది. ఆ చెట్టుకు ఏ జ్ఞానము లేదు. దేవుని యొక్క చట్టము ఆ విధముగా జరుగునట్లుగా చేయును."
అతడు, "మంచిది, ఆ విధముగా ఉంటుందని నేను ఎన్నడు అనుకోలేదు?" అనెను.
నేను, "ఏ జ్ఞానమైతే చెట్టును వదలి పసరుని వేర్లలోకి వెళ్ళమని చెప్పినదో ఆ జ్ఞానమే నాకు, ఆ స్త్రీకి ఏమి జరుగబోవుచున్నదో చెప్పియున్నది" అన్నాను.
అతడు "నువ్వు, ఆ ప్రసంగికుడవు కాదు కదా?" అని అడిగాడు.
నేను, "అవునయ్యా." ఆ తరువాత అతడు క్రీస్తువైపు నడింపించబడి, ఒక సంవత్సరము తరువాత ఎనబై-అయిదు సంవత్సరముల వయస్సులో ఒక క్రైస్తవునిగా మరణించెను.
JOB 14:4,10•
JOB 15:14•
JOB 25:4•
AMOS 3:7
43దేవుడు మన చుట్టూ ఉన్నాడని గమనించారా, దేవుడు ప్రతిచోటా ఉన్నాడు. మనము ప్రకృతిని చూచినట్లయితే, ఆయనను మనము అక్కడ కనుగొనవచ్చును. ప్రకృతిలో మరణమును, పూడ్చిపెట్టుటను, పునరుద్ధరణలో తిరిగి తన పూర్వపు వాటిని ఉత్పత్తిచేసే గుణమును యోబు కనుగొన్నాడు, అటు తరువాత, మనుష్యునికి ఏమగును అనేది అతడికి అర్ధము కాలేదు. అతడు ఇలా అనెను, "నరుడు మరణించిన తరువాత అతడికి ఏమగును? గమనించండి, చెట్టు ఎన్నడును పాపమును చేసియుండలేదు. ప్రకృతి ఎన్నడు పాపము చేయలేదు. మానవుడు పాపము చేసియున్నాడు. కావున, అతడు అలాగు లేడు. యోబు ఒక ప్రవక్తయైయుండి…
పరిశుద్ధ గ్రంథములోని భాగము ఇలా చెప్పుచున్నది, "ఆయన తన ఆలోచనలను ప్రవక్తలకు తెలియచేయును." వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చును. యోబు అనే ప్రవక్త యొక్క కథ మనకు తెలుసు. దేవుడే చివరకు యోబుకు ఆ సంగతిని తెలియచేసెను, మానవుని యొక్క విత్తనము పరిపూర్ణమైనది కాదు, ఎందుకనగా దేవుని వాక్యమును ఆచరించుటలో మానవుని యొక్క తల్లి విఫలమైనది. ఆమె వేరొక దానితో వాక్యమును కలగలపు చేయాలని ప్రయత్నము చేసినది మరియు దేవుని వాక్యము దేనిచేతను సంకరము కాదు. అది నిజము.
44భూమిపై యేసు ఉన్నప్పుడు ఆయన ఇలాగు చెప్పెను, "ఆవగింజంత విశ్వాసము మీకున్న యెడల, మీరు ఆ పర్వతముతో ఇలా చెప్పినట్లయితే…" ఆయన ఎందుకని ఆవగింజను ఉదహరించెను? ఎందుకనగా ఆవగింజను సంకరము చేయలేరు. అది అసలైన ఆవగింజ (విత్తనము). దానిని దేనితోనూ సంకరము చేయలేరు. మరియు ఆయన ఇలాగనెను, "వాక్యములో మీకు అంత విశ్వాసమున్నట్లయితే, అది అవిశ్వాసముచేత సంకరము చేయబడదు, లేక ప్రశ్నించదు… ఓ, నేను మతపరమైన అనుభూతిని చెందుతున్నాను. నీవు దానిని ప్రశ్నించవు!
నీకు ఏ సమస్య వచ్చినా నీవు దానిని ప్రశ్నించవు, ఏది ఏమైనా గాని దేవుని వాక్యమును నీవు ప్రశ్నించవు. నీవు దానిని విశ్వసిస్తావు. నీవు దానిని విశ్వసించవలసియున్నది. హవ్వ పొందుకున్న వాక్యమును ఆమె విశ్వసించినట్లయితే, ఆమె నిజమైన సంతానమును ఉత్పత్తి చేయవలసియున్నది. కాని, ఆమెను తన భర్త కలియుటకు ముందుగానే. యెహోవా భార్యవలె, యేసు భార్యవలె, ఆమె అప్పటికే అపవిత్రపరచబడినది. ఆమె యొక్క ఆలోచనలు అనే గర్భములో అపవిత్రమైనది ఉన్నది. దేవుని యొక్క వాక్యమునకు అవిశ్వాసమైన విత్తనమును ఆమె అంగీకరించియున్నది, ఎందుకనగా అది ఆమెకు ఎంతో వెలుగైనది ఉత్పత్తిని చేసేదిగా ఉన్నది, ఆమె అధికమైన జ్ఞానమును కోరుకున్నది.
REV 22:20
45ఈ దినమున ఉన్న సమస్య కూడా అదియే. నేను ఒక పాఠశాలలో నిలబడి యున్నాను. మనకు చదువుకు సంబంధములేని అనేకమంది అజ్ఞానులున్నారు, చదువు అనేది నాగరికతలో ఒక భాగముగా ఉన్నది. కానీ చదువు మరియు నాగరికత అనేవి కేవలం క్రైస్తవ్యములో నుండే వచ్చాయి. నాగరికత యొక్క అసలైన వేర్లు క్రైస్తవ్యమే… లేక క్రైస్తవ్యమే నాగరికత యొక్క అసలైన వేర్లు. నిశ్చయముగా. క్రీసు నుండే నాగరికత వచ్చినది. ఖచ్చితముగా.
దేవుని వాక్యమును అవిశ్వసించుట, లేక అధిక వెలుగుకై వాక్యముతో వేరే దేనినో కలుపుట… నీవు దానిని చేయకూడదు. అది కలగలుపు అవ్వదు. దేవుడు ఎలాగు పలికియున్నాడో, ఆ విధముగానే ఆయన వ్రాసియున్నాడు; ఆ విధముగానే నీవు దానిని నమ్మవలసియున్నది. దానికి ఏదియు కలపవద్దు, లేక దానిని నుండి ఏదియు తీసివేయవద్దు, అయితే అది ఉన్న విధముగానే నీవు దానిని విశ్వసించుము.
LUKE 1:38
46ఇప్పుడు, యోబు ప్రవక్తగా ఉన్నప్పుడు… ఆ దర్శనము చివరకు వివరించబడినది. దేవుడు ఏ విధముగా మానవుడు తిరిగి జీవించుటకు మార్గమును ఏర్పరిచియున్నాడో యోబు చూచిన తరువాత, ఎందుకనగా ఆ తరువాత మరొక పలుకబడిన వాక్యమును కన్యక పొందుకున్నది…
మొదటగా హవ్వ వాక్యమందు సందేహించినది. వాక్యము మరియ వద్దకు వచ్చినప్పుడు, ఆమె దానియందు సందేహించలేదు. ఆమె ఇలా అనెను, "ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను." గమనించారా, "ఇప్పుడు, నేను ఆ జీవమును అనుభూతిని చెందువరకు నీవు ఆగుము, అటు తరువాత నేను సాక్ష్యము ఇస్తాను. నేను దీనిని గురించి సానుకూలముగా స్పందించేంత వరకు నీవు ఆగుము" అని ఆమె ఎన్నడు అనలేదు.
ఆ విధముగానే ఈ దినము నామమాత్రపు క్రైస్తవులు చేస్తున్నారు. "నేను సానుకూలముగా ఉండేంత వరకు ఆగుము. నేను బాగుపడేంతవరకు ఆగుము." మరియు "ఏదో ఒక కార్యము జరిగేవరకు ఆగుము. అప్పుడు నేను చేస్తాను." లేదయ్యా! అసలు అది ప్రశ్నయే కాదు. మొదటగా నీవు దానిని విశ్వసించుము.
1KGS 17:13•
JOHN 3:14•
JOHN 4:14•
1COR 10:4
47తను వెళ్లినచోట ఉన్న స్త్రీతో ఏలియా ఏమని చెప్పియున్నాడు, ఒక గుప్పెడు భోజనమును మాత్రమే అడిగియున్నాడా? అతడు ఇలా అనెను, "వెళ్ళి నా కొరకు మొదటగా ఒక అప్పము చేసి ఇవ్వుము." దేవుని వాక్యమును నీవు మొదటగా తీసుకున్నట్లయితే ఆ తరువాత అద్భుతము జరుగుతుంది. దేవుని వాక్యమును నీవు విశ్వసించుట ప్రారంభించగానే వాక్యములో అద్భుతము జరుగుతుంది, ఎందుకనగా వాక్యమే విత్తనమై అద్భుతమును తీసుకొనివస్తుంది. దేవుని వాక్యమును మొదటగా తీసుకొనవలసియున్నది, ఆకాశము నుండి నీరు పడుచున్నట్లుగా పరిశుద్ధాత్ముడు జీవమును ఇస్తాడు.
పరిశుద్ధాత్మ ఎవరికి సాదృశ్యముగా ఉండెనో మనకు తెలుసు. నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది, ఎలాగంటే… మోషే అడవిలో ఇత్తడి సర్పమును పైకెత్తినట్లుగా మనుష్యకుమారుడు పైకెత్తబడాలి. ఎందుకు? ప్రజలు మరణిస్తున్నారు. వారు ఇత్తడి సర్పమును పైకెత్తినప్పుడు, అది మరణిస్తున్న ప్రజలను కాపాడింది. అతడు బండను కొట్టినప్పుడు… ఆ కొట్టబడిన బండ క్రీస్తే, మరణించబోవుచున్న ప్రజలకు ఆ బండ నుండి వచ్చిన నీరు జీవమును ఇచ్చినది. నీవు దానిని తప్పక విశ్వసించి దాని ప్రకారమే జీవించవలసియున్నది.
JOB 19:25,26
48ఇప్పుడు జ్ఞాపకముంచుకొనండి. దేవునికి మరియు పాపికి మధ్యలో నిలబడగలిగిన ఒకే ఒక్కడు వచ్చుట యోబు చూచినప్పుడు, మరియు ఆ రెంటిని కలుపు — ఆ పరిపూర్ణమైన విత్తనము… "ఈ విత్తనములు," అతడు ఇలాగు చెప్పెను, "వారు భూమిలో పాతి పెట్టబడి పాడైపోవుటను నేను చూస్తున్నాను." అతడి కుమారులు అతడి మీద పడి అతడి కొరకై దుఃఖిస్తారు, అతడు దానిని తెలుసుకొనలేడు. అతడు అక్కడే పడియుండి, ఎన్నడూ లేవడు. అతడు అక్కడే పడియుండి కుళ్ళిపోవును, అదియే అతడి అంతము, ఎందుకనగా అతడు ఒక అపరిపూర్ణమైన విత్తనము కనుక అతడెన్నడు తిరిగి లేవడు.
కాని యోబు ఇలా చెప్పెను, రాబోయే ఒకరు దేవుని వాక్యమునకు తిరిగి పరిపూర్ణతను తీసుకొనివస్తారని అతడు కనుగొనెను, అది ఒక మార్గమును ఏర్పరుచును — అది ఆ మార్గమును కలుపు వంతెనగా వుంటుంది — ఆ వెంటనే ఆ ప్రవక్త ఆత్మచేత పట్టబడి ఇలాగు కేకపెట్టెను, "నా విమోచకుడు సజీవుడు, చివరి దినములో ఆయన భూమి మీద నిలబడతాడు. ఈ శరీరమును పరుగులు తినివేసినా, నేను నా శరీరముతో దేవుని చూస్తాను." రాబోవు పరిపూర్ణుడిని అతడు చూసెను. ఏమి జరిగినది? యోబు ఒక ప్రవక్త, దేవుడు తన రహస్యములను తన ప్రవక్తలకు తెలియజేయును. అతడు వాక్యమునే పలికెను. దేవుడు చూపించిన వాక్యమును మాత్రమే అతడు పలుకును, అది పలుకబడిన మాట కనుక, అది ఉనికిలోకి వచ్చును. అది పలుకబడిన విధముగా దాని రుతువు కాలములో అది ఖచ్చితముగా జరుగును.
క్రీస్తు జన్మించెను. జీవించినవారికి మరియు మరణించినవారికి మధ్యలో వంతెన మాదరిగా నిలబడి పునరుత్దానమును తీసుకొనివచ్చే విమోచకుడు ఆయన ఒక్కడే. ఖచ్చితముగా. ఎందుకు? అది దేవుని యొక్క వాక్యమైయున్నది. అతడు వాక్యమును పలికెను, ఆ వాక్యము విత్తనమైయున్నది మరియు అది దాని కాలములో పరిపక్వమునకు వచ్చును. సరిగా నాటబడిన ప్రతియొక్క దేవుని యొక్క ప్రతి విత్తనము తప్పక పరిపక్వమునకు వచ్చును.
LUKE 1:34,42
49దేవుడు ఒకవేళ మరియ దగ్గరకు ఒక దూతను పంపి ఇలాగు చెప్పినట్లయితే, "ఓ మరియ, స్త్రీలలో నీవు దీవించబడినదానవు. ఏ పురుషుడిని ఎరుగకయే నీవు ఒక కుమారుడిని కనుదువు." ఆమె, "ఒక్క నిముషము ఆగుము. నిన్ను ఒక పరీక్షా కేంద్రానికి నన్ను తీసుకెళ్లనిమ్ము అప్పుడు నీవు చెప్పుము. అక్కడ ఉన్న వైద్యుడు, ఇది నాకెలాగు జరుగుతుందో నిరూపించనిమ్ము," గమనించారా, "అప్పుడు నేను నిన్ను నమ్ముతాను." అది ఎన్నటికి జరిగివుండేది కాదు. కాని ఆమె ఏమి చేసియున్నది? ఆమె హృదయమనే గర్భము, ఆమె గర్భములోకి ఆ ఆత్మ… నీ ఆత్మ యొక్క గర్భమేదనగా, నీ యొక్క మనసే. నీ మనస్సు అన్నింటిని ప్రసారముచేయు ఒక సాధనమువంటిది.
శరీరమును నియంత్రించే అయిదు ఇంద్రియములు నీవు కలిగియున్నావు. ఆత్మను నియంత్రించే ఇంద్రియములు నీవు కలిగియున్నావు - మనస్సాక్షి మొదలైనవి. శరీరమునకున్న అయిదు ఇంద్రియములు, చూచుట, రుచి చూచుట, స్పర్శ, వాసన చూచుట మరియు వినుట. కాని నిన్ను విత్తనముగా చూపించునది ఆత్మలోపల కేవలం ఒక్కటే ఉన్నది. నీ ప్రాణము, శరీరము మరియు ఆత్మ మరియు ఆ ప్రసారము చేయునది, వేదిక, దాని లోపలకు ఒక్కటే మార్గమున్నది, నైతికమైన నీ స్వంత ఎంపిక. అది ఏమిటంటే, నీవు తీసుకొనుట లేక త్రోసివేయుట అనేదానిలో నీవు ఏదైతే అనుకుంటావో దాన్నే చేస్తావు.
MATT 1:18•
LUKE 1:34,38•
1TIM 3:16
50కావున, హవ్వ కూడా దానినే చేసింది. దేవుని వాక్యమును ఆమె తీసుకుని మరియు ఇలా చెప్పినట్లయితే, "దేవుడు దానిని చేయవద్దని చెప్పెను, మరియు నా నుండి దూరముగా పొమ్ము." అది ఎంతో సరిగా ఉండేది. కాని అలాగు చేయుటకు బదులుగా సాతాను యొక్క అబద్దముతో ఆమె కలగలపు చేయాలని ప్రయత్నము చేసింది, మరియు ఆమెకు మరణము వచ్చినది. కాని మరియ దగ్గరకు వచ్చినట్లయితే, అది వ్యత్యాసముగా ఉన్నది. "ఇదిగో ప్రభువు దాసురాలను." అక్కడ ఏమి జరుగనైయున్నదనే సమస్యేలేదు. "నీవు పలికిన మాట దేవుని వాక్యమైయున్నది, నేను దానిని పొందుకున్నాను. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక." అదిగో అది అక్కడ అలాగునే జరిగినది. ఆమెకు ఆ తరువాత అంతయు బాగానే వున్నది.
గమనించారా, ఒక మానవుని రూపములో బయలుపరచబడిన దేవుని యొక్క వాక్యము జీవమును ఆమె తీసుకొని వచ్చినది. నీతిమంతుడైన ఆ ఒక్కని మరణము ద్వారా అనీతిమంతులమైన మనందరి యొక్క మరణమునకు వెల చెల్లించెను. వాక్యమును అంగీకరించుట వలన అది జీవమును మరియు క్రీస్తును తిరిగి మనలోకి తీసుకొని వస్తుంది, ఎందుకనగా ఆ పలుకబడిన వాక్యమే క్రీస్తు. నీవు దాన్ని పొందుకున్నట్లయితే, అది దాని కాలములో పరిపక్వమవుతుంది. నీవు బలహీనముగా ఉన్నప్పుడు దానిని ఒప్పుకొనుము. దానిని విశ్వసించుము. దాని కాలములో అది పరిపక్వమవుతుంది, అది అలాగు జరుగవలసియున్నది.
2PET 3:8
51మనమందరము అంత్యకాలములో ఉన్నామని మనము విశ్వసిస్తున్నాము. జ్ఞానవంతుడైన ఏ మానవుడైనా మన చుట్టూ ఉన్నవాటిని చూసినట్లయితే, అవి అన్నియు ఇంక ఎంతో కాలము ఉండవని అతనికి ఆ సంగతి తెలుసు అని నేను విశ్వసిస్తున్నాను. నా ఉద్దేశ్యము ఏమిటో మీకు తెలియ చేయుటకు నాకు పదిహేను నిముషముల సమయము ఇచ్చినట్లయితే తెలియజేయగలను. ఏదో జరుగబోవుచున్నదని ప్రతియొక్కరికి తెలుసు. ప్రతి లేఖనము దీనివైపే చూపించుచున్నది.
ప్రపంచము ఆరువేల సంవత్సరములు సృష్టించబడినది మనకు బోధించబడినది, వేయి సంవత్సరములు ఒక దినమైనటైతే, దేవునికి ఒక్క దినమంటే మనకు వేయి సంవత్సరములు, కావున సృష్టికి ఆరువేల సంవత్సరములు పట్టినది. అదంతయు మంచిదే. అప్పుడు అది ఆరు దినములుగా పరిగణించబడుతుంది, ఒక్క దినమనగా వేయి సంవత్సరములు లేక వేయి సంవత్సరములు దేవుని దృష్టిలో ఒక్క దినమని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది.
JOHN 3:17,19•
JOHN 5:22,27•
JOHN 9:34
52ఇప్పుడు, మొదటి రెండువేల సంవత్సరములలో విశ్వము (ప్రపంచము యొక్క క్రమము) దాని యొక్క అంతమునకు వచ్చెను, ఆకాశము నుండి దేవుడు తీర్పు నిమిత్తము దేనినో పంపెను, మరియు ఆ తీర్పులో భూమికి తీర్పు తీర్చి మరియు నీతిమంతుడైన నోవహును మరియు అతడి కుంటుంబమును కాపాడెను.
రెండవ రెండువేల సంవత్సరములలో అదే విధముమై కార్యము జరిగియున్నది. విశ్వము, ప్రపంచ క్రమము, సంఘము మరింతగా పాడైపోయినది. నోవాహు దినములలో నోవాహును వెక్కిరించారు మరియు అతడిని ఎగతాళి చేశారు, ఓడ ద్వారము వద్ద అతడు 120 సంవత్సరములు ప్రకటించెను. రెండవ వెయ్యి సంవత్సరములలో సంఘము దాస్యములోకి వెళ్లి, లోకముతో వ్యభిచరించి ఏమియు లేకుండా కేవలం ఏదో రూపములను మరియు ఆచారములు చేయునదిగా మారిపోయినది. దేవుడు తన కుమారుడిని పంపుట ద్వారా భూమి మీదకు తీర్పును పంపించెను — దాని యొక్క శక్తులకు అంతము వచ్చియున్నది.
MATT 24:32•
MARK 13:20
53ఈ 1962లో, పరిశుద్ధ గ్రంథము ఏమి చెప్పుచున్నది? ఈ చివరి దినములలో ఎంచుకోబడిన వారిని మిత్తము లేక కేవలం ఎంచుకోబడిన శరీరులను కాపాడు నిమిత్తమే పని తగ్గించబడినదని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది (లేఖనములు అసత్యములు చెప్పవు) లేనియెడల ఏ శరీరియు రక్షించబడరు. దానిని బట్టి మనము అంత్యకాలములో ఉన్నామని తెలుస్తున్నది.
యేడవ దినము సబ్బాతు దినము, అదియే వెయ్యేండ్ల పాలనకు సాదృశ్యము. వెయ్యేండ్ల పాలన కాలములో అది జరుగును. ఇప్పుడు ఆరు దినములు పూర్తయినవి. తనని తాను నాశనము చేసుకునే ఆయుధమును మానవుడు తన చేత పట్టుకొనెను. ప్రపంచమును అతడు నాశనము చేయగలడు, ఒక్క క్షణములో అతడు ప్రపంచమును ప్రేల్చివేయగలడు. ఒక దేశములో తిరుగుతూ వేరొక దేశములో ఉన్న వ్యక్తిని ఒక కక్ష్య ప్రకారము కాల్చగలడు, మరియు ఇలాగనును, "లొంగిపొమ్ము లేదా దీనిని నేను వదులుతాను." అంతే. అతడు ఏమి చేయును? సున్నితమైనవారు ఎవరైనా సరే లొంగిపోతారు. తరువాత ఏమిటి?
చిన్న దేశముల మీద పెద్ద దేశములు అధికారము చేస్తున్నాయి, ఇంక అవి మిగలవు. వారు దానినే కలిగియున్నారు, చూచారా. కావున ఈ సమయములో మనము వాటిని చూచి మరియు మనము అంత్యకాలములో ఉన్నామని నమ్మాలి.
ACTS 3:18,21•
ACTS 26:22,23
54ఇప్పుడు, దానిపైన మనము కొన్ని గంటలు మాట్లాడుకోవచ్చును, కాని ఒక్క నిముషము ఇక్కడ అంత్యకాలము నిమిత్తము నాటబడిన కొన్ని లేఖనములను చూద్దాము.
అది ఆ విత్తనము… యోబు చేత పలుకబడిన వాక్యము, రాబోవు విత్తనము గురించి యెషయ మాట్లాడియున్నాడు, దేవుని యొక్క ప్రతి వ్యక్తి రాబోవు విత్తనము గురించి మాట్లాడియున్నారు, దేవుని యొక్క ప్రతి ప్రవక్తకు దేవుడు తన రహస్యములను (దావీదుకు, యెషయకు, యిర్మియాకు, మిగిలిన ప్రవక్తలందరికి), తెలియచేసియున్నాడు. దాని యొక్క రుతువు వచ్చినప్పుడు అది ఖచ్ఛితముగా నెరవేరుతుంది. ప్రతి కాలములలో అది ఆ విధముగానే జరిగియున్నది. అది విఫలమవ్వదు. అది దేవుని యొక్క వాక్యమైయున్నది. అది నిత్యమైనది. అది విఫలమవ్వదు. యేసే వాక్యమని మనందరికి తెలుసు.
DEUT 18:15•
MATT 24:3,7•
LUKE 21:29•
ACTS 3:22•
HEB 1:1,2
55ఆయన యొక్క వాక్యమును మనము తీసుకొందాము. హెబ్రీయులకు 1, "పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మాటలాడిన దేవుడు, కాని ఈ అంత్యదినములలో యేసుక్రీస్తు ద్వారా మాటలాడెను." ఆయన ప్రవక్తయును -దేవుడునైయున్నాడు. ఆయన ఖచ్చితముగా ఒక ప్రవక్త, ఎందుకనగా మోషే ఇలాగు చెప్పెను, "ప్రభువైన మన దేవుడు ఒక ప్రవక్తను లేపును." కాని అది ఒక ప్రవక్తకంటే అధికముగా ఉన్నది; ఆయన, శరీరములో బయలుపరచబడిన దేవుడు.
చూచుటకు ఈ దేవుడు-ప్రవక్త, రెండు లేక మూడు సూచనలు ఇచ్చెను, గొప్ప సూచనలు మనం గుర్తుంచుకొనుటకు ఇచ్చెను. మత్తయి 24లో "ఇవన్నియు ఎప్పుడు జరుగును? ప్రపంచము యొక్క అంతమెప్పుడు? ఈ సంగతులు ఎప్పుడు సంభవించును?" చాలా భిన్నమైన సంగతులు జరుగునని ఆయన చెప్పియుండెను: దేశము మీదకి దేశము లేచును, రాజ్యము మీదకి రాజ్యము లేచును, మొదలైనవి అనేకము అనేకములు జరుగును, జరుగుచు౦డును. కాని ఇలాగు చెప్పెను, "మిగిలిన అన్ని చెట్లను చూసి — అంజరపు చెట్టును చూచి ఒక ఉమానము నేర్చుకొనుడి."
JOB 14:7•
JOEL 1:4•
JOEL 2:25•
LUKE 21:29,30•
ROM 11:16,17
56ఇక్కడ ఉన్నవారిలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడే మీ చేతులను పైకెత్తుము. వంద శాతము ఉన్నారని నేననుకుంటున్నాను. అంతా మంచిది, మీకు కృతజ్ఞతలు. అంతా మంచిది. ఇప్పుడు ముగించబోవుచున్నాను గమనించుము, ఈ అంత్యకాలమును సూచించు విత్తనమును మనము తీసుకొనివస్తున్నాము. యేసు ఇలా అనెను, "చూచారా చెట్టును చూచి ఒక ఉపమానమును నేర్చుకొనుడి." అంజూరపు చెట్టును మీరు చూచినప్పుడు, ఒక అంజూరపు చెట్టును చూచి ఏ ఉపమానమును నేర్చుకొనవలసి యున్నది? యూదాజాతి ప్రజలకు అంజూరపు చెట్టు సాదృశ్యముగా ఉండునని పరిశుద్ధ గ్రంథమును చదువు ప్రతియొక్కరికి తెలుసు.
యోవేలు ఇలాగు చెప్పెను, "గొంగళి పురుగులు విడిచిపెట్టిన దానిని చీడ పురుగులు తినివేసియున్నాయి," మొదలైనివి. ఆచారములు మరియు కార్యములు సంఘమును తినివేయగా మిగిలినది ఆ మోడు. కాని ఈలాగు చెప్పెను, "తిరిగి పునరుద్దర్తిస్తానని ప్రభువు చెప్పెను."
ఇప్పుడు యూదులు తీసివేయబడ్డారు, దేవుని యొక్క రాజ్యమునకు అన్యజనులు అంటుకట్టబడియున్నారు అని మనకు పౌలు చెప్పెను. కాని గమనించుము. యేసు ఇలాగు చెప్పెను, "అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానమును నేర్చుకొనుడి." యోబు చూచినట్లుగా ఆ చెట్టు తిరిగి జీవించునా?
నిశ్చయముగా. ఆయన ఇలాగు చెప్పెను, "అంజూరపు చెట్టును, మిగిలిన చెట్లను చూచినప్పుడు…." చెట్లు. ఏ చెట్లు? జీవవృక్షము, ఆచారవృక్షము (మతశాఖ), ఆచారములను పాటించు దేశములు. "అంజూరపు చెట్టును మరియు మిగిలిన చెట్లను చూచినప్పుడు, అవి చిగురించినప్పుడు [ఆకులను బయటకు తీసుకొని వచ్చుట] ఇంక వసంతకాలము సమీపముగా ఉన్నదని మీరనుదురు. మిగిలిన దేశముల గురించి ఉపమానము చెప్పుచున్నాడని గమనించుము.
LUKE 21:29,30
57ఇప్పుడు అన్యజనులతో వధువు నిమిత్తమై దేవుడు వ్యవహరించును — ఒకరు ఇక్కడ, మరియు ఒకరు అక్కడ. కాని యూదులతో ఆయన ఒక రాజ్యముగా వ్యవహరించును. వ్యక్తిగతముగా వ్యవహరించడు; ఒక రాజ్యముగా వ్యవహరించును. ఆయన ఎల్లప్పుడు… అది దేవుడు ఎన్నుకొనిన రాజ్యము. వారిని దేవుడు ఒక రాజ్యముగా ఎన్నుకొనెను. మిషనరీలు యెరుషలేముకు వెళ్ళుచున్నారు, ఇశ్రాయేలు ఒక దేశముగా మారినప్పుడు అది రక్షించబడును. ఒక్క దినములోనే జన్మించునని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. అది నిజము. కావున ఇశ్రాయేలు దేశమంతా ఒకేసారి క్రీస్తును అంగీకరించును… కేవలము… ఒక దేశముగా; కేవలము ఒక వ్యక్తిగా కాదు.
కాని గమనించుము, ఆయన ఏమని చెప్పెను. మనము దానినే తీసుకొందాము. దానిని జాగ్రత్తగా గమనించుము. "అంజూరపు చెట్టు చిగురించుట ప్రారంభించినప్పుడు, మిగిలిన అన్ని చెట్లకు మొగ్గలు వచ్చును…"
LUKE 21:29,30
58ప్రతిదానికి ఒక ఉజ్జీవమున్నది లేక ఒక ఉజ్జీవము ఉండేది. యూదులు తమ స్వ౦త భూమికి తిరిగి వెళ్ళి ఒక దేశముగా ఏర్పడియున్నారు, తమ యొక్క స్వంత జెండాను ఎగురవేసినారు, స్వంత ధనమును కలిగియున్నారు మరియు స్వంత పరిపాలనను ఏర్పాటు చేసుకున్నారు. సుమారుగా 1800 సంవత్సరముల తరువాత… వారు మొదటిసారిగా ఒక దేశముగా ఏర్పడియున్నారని నేను అనుకుంటున్నాను. ఓ, 2200 సంవత్సరములకన్నా అధికముగానే లేక 2200 సంవత్సరములు అనుకుంటాను. ఇశ్రాయేలు తిరిగి ఒక దేశముగా అవిర్భవించినది. ప్రపంచములో అత్యంత పురాతనమైన జెండాను వారు కలిగియున్నారు, అది దావీదు యొక్క ఆరు మూలలు కలిగిన నక్షత్రము ఉన్న జెండా, 2200 సంవత్సరముల తరువాత అది తిరిగి ఎగురుచున్నది. యేసు ఇలాగు చెప్పెను, "అది లేతదై చిగురించునప్పుడు, సమయము సమీపగానే ఉన్నది." ఇశ్రాయేలు, యూదులతో మాట్లాడుచుండెను.
DAN 2:31-35
59ఇప్పుడు గమనించుము. మిగిలిన అన్ని చెట్లు చిగురించుట ప్రారంభించినప్పుడు అని ఆయన చెప్పెను. రోమన్ క్యాథలిక్ సంఘము ఎన్నడు లేనటువంటి గొప్ప ఉజ్జీవమును కలిగియున్నది. ప్రొటెస్టెంట్ స౦ఘము గొప్ప ఉజ్జీవమును కలిగియున్నది. బిల్లీ గ్రాహము మరియు జాక్ స్కల్లర్, పెంతెకోస్తు వారు గొప్ప ఉజ్జీవమును వారును కలిగియున్నారు. ఓరల్ రాబర్ట్స్, టామి హిక్స్ మరియు మిగిలిన గొప్పవారు ఒక ఉజ్జీవమును కలిగియున్నారు.
గమనించుము. జాతీయ శక్తులు కూడా ఒక ఉజ్జీవమును కలిగియున్నాయి. అత్యంత శక్తిని ఎవరు కలిగియున్నారు? అనే దానిమీద ఒక ఉజ్జీవమును కలిగియున్నారు. కమ్యూనిజమా? ప్రసంగికుడు ఇక్కడ నిలబడి ఇలాగు చెప్పుట మీరు వినేవుంటారు, "ఓ, కమ్యూనిజము మనలను భయపెట్టుచున్నది." బుద్ధిహీనత! ప్రపంచమును కమ్యూనిజము ఏలుతుందని లేఖనములలో ఎక్కడ ఉన్నదో నాకు చూపించండి. కమ్యూనిజము కాదు, ప్రపంచమును రోమనిజమ్ ఏలుతుంది. నెబుకద్నెజరు యొక్క దర్శనమును చూడుము, అది ప్రభువు యొక్క వాక్యమైయున్నది, బంగారు తల, దిగువన ఇత్తడి, ఎన్నడు మారని ఇనుప వైన రోమన్ పాదములు. కొద్దిసేపటి తరువాత ఒక రాయి వచ్చి ఆ ఇనుముని కొట్టినది. ఆ పాదముల యొక్క చివర మట్టితో కలిసియున్నది, అదే బలహీనత, ఇనుము మరియు మట్టి కలసియున్నాయని గుర్తుంచుకోండి.
60క్రూస్చెవ్ మరియు ఈసెన్హెూవర్ల మధ్య ఇక్కడ వారు ఒక గొప్ప కూడికను కలిగియున్నారు. క్రూస్చెవ్ అను మాటకు వారి జాతీయ బాషలో తన స్వంత దేశము అని అర్ధము? క్రూస్చెవ్ మాటకు బురద, మట్టి అని అర్థము. ఈసెన్హెూవర్ అను మాటకు ఆంగ్లములో అర్థము ఏమిటో మీకు తెలుసా? ఇనుము. క్రూస్చెవ్ తన యొక్క కాలి బూటును తీసి బల్లమీద కొట్టుట అనేది ప్రజలకు ఎంతో సాధారణమైనది అనిపించవచ్చును. వారు దానిని అంగికరించరు. ఏది ఏలబోవుచున్నది? రోము ఏలబోవుచున్నది. సంఘముల యొక్క సమాఖ్య కతోలిజంతో… అన్ని ఒకటిగా కట్టుచున్నది, మరియు అక్కడే మీరున్నారు — పరిపాలించు శక్తి. బైబిల్ దానిని చెప్పుచున్నది. అది విత్తనము ఎన్నడు విఫలమవ్వదు.
61ఈ దినమున చూడండి. ప్రొటెస్టెంట్ సంఘములన్నిటిని లోపలకి రమ్మని ఈ నూతన పోపు ఆహ్వానించుటలేదా? వారు వెళ్ళుచున్నారా?పెంతెకోస్తులారా మీ సంగతి ఏమిటి? అదే సంగతి, సంఘముల సమాఖ్య అక్కడనే మీరున్నారు. ఆ విత్తనములు బయటకు రావలసియున్నాయి. అది జరుగవలసియున్నది. అది పరిపక్వం చెందవలసియున్నది. అది పరిపక్వత చెందవలసిన సమయము వచ్చియున్నది. ప్రజలు ఏమి చేస్తారు? సంస్థగా మారి పెద్ద పెద్ద భవనములను కట్టుదురు, పెద్ద సంస్థలు, పెద్దవైన మత శాఖలుగా మారతారు. అంతా ఏమి జరుగుతుంది?పరిశుద్ధ గ్రంథము ఏమని చెప్పియున్నదో ఖచ్చితముగా అదే కార్యమును వారు చేయుచున్నారు.
దేవుడు-ప్రవక్తయైన యేసుక్రీస్తు అదే జరుగును అని చెప్పెను. యూదులు పునరుద్ధరింపబడుదురు, ఒక దేశముగా వారి మధ్యన ఒక గొప్ప ఉజ్జీవమును కలిగియుంటారు, ఒకే దేశముగా వారు ఏకమగుదురు. మెథడిస్తుల మధ్యలో, బాప్టిస్టుల మధ్యలో, ప్రెస్బటేరియన్ల మధ్యలో, పెంతెకోస్తువారి మధ్యలో ఇంకా మొదలైనవారి మధ్యలో వారు తమ తమ ఉజ్జీవములను కలిగియున్నారు, అదిగో మీరు అక్కడే ఉన్నారు. విత్తనము పరిపక్వమునకు వచ్చినది కాబట్టి ఒక దేశము మీద మరో దేశము పోరాటము చేయును. ఇశ్రాయేలు 2200 సంవత్సరముల తరువాత దేశముగా ఏర్పడినది. ఏమి జరుగుతుంది? సంఘములన్నియు కలసి ఒక ఉజ్జీవమును కలిగియుంటాయి. అయ్యా! అది సరియే.
LUKE 21:28•
2THS 2:3•
1TIM 4:1•
2TIM 3:1,7-9,13
62మరొక గొప్ప విత్తనము నాటబడియున్నది. ఆయన చివరి దినములలో ఇలాగు జరుగును అని చెప్పెను, II తిమోతి 3వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథము యొక్క విశ్వాసమునుండి సంఘము తప్పిపోయి పడిపోవును. అది నిజము. అదీ ఒక విత్తనమేనా? అదియు ఒక వాగ్దానమేనా? ఈ దినమున వాటిని చూద్దాము. మీ సంఘములను చూడుము. వారు ఏమి చేయుచున్నారు? వారు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ, వారు ఒకరొకరుగా కలసి సంస్థగా మారియున్నారు, వారు పరిశుద్ధ గ్రంథమును విశ్వసింపక — పడిపోయి, ఒకరిని మరొకరుతో కట్టుకొనుచున్నారు, దేవుని యొక్క నిజమైన సత్యవాక్యమును వారు విశ్వసించుటలేదు.
"పరిశుద్ధ గ్రంథము ఇది చెప్పియున్నదని" మీరనవచ్చును.
ఆ సంగతులు గతించిపోయాయి. అటువంటి కార్యములు ఏమియు లేవు. ఓ, అటువంటిది అసలు లేనేలేదు. అద్భుత కార్యములు ఎన్నడో గతించిపోయాయి. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము అనేదే లేదు. అపోస్థలులైన ఆ పన్నెండు మంది మాత్రమే దానిని చేసియున్నారు. ఆ కొద్దిమందే వాటిని చేసియున్నారు." ఆ విత్తనము ఏమిటో గమనించియున్నారా? అది పరిపక్వమగుచున్నది. అదే అంత్యకాల సూచన విత్తనము.
సంఘమునకు యేసు ఏమని చెప్పెను, "ఈ సంగతులు జరుగుట మీరు చూచినప్పుడు, మీ తలలను పైకెత్తుకొనుడి, మీ యొక్క విమోచన దగ్గరకు వచ్చినది." ఆమె పడిపోవుటను మనము చూసియున్నాము. మనము దానిని కనుగొన్నాము. అది సరి.
JOEL 2:23
63ఇప్పుడు, యోవేలు చివరి దినములలో మనతో ఇలాగు చెప్పెను అని మనము చెప్పుచున్నాము, (లేఖనములోని మిగిలిన భాగము. ఇప్పుడు జాగ్రత్తగా వినుము.) ఒకే రుతువులో తొలకరి మరియు కడవరి వర్షములు ఉండునని చెప్పెను. ఎంతమంది క్రైస్తవులకి ఆసంగతి తెలుసు? "ఆమేన్" అని చెప్పండి.
తొలకరి మరియు కడవరి వర్షములు ఒకే రుతువులో వచ్చునని, నేను దానిని వేరొక దినమున చూచినప్పుడు ఆశ్చర్యమునకు గురయ్యాను. హెబ్రీ బాషలో (హెబ్రీ బాషా నిఘంటువును చూసి కనుగొనుము.) "తొలకరి" అనగా హెబ్రీ బాషలో "మోరెహ్" అని అర్ధము. "మోరెహ్" అనగా"బోధించుట" అని అర్ధము. బోధించే వర్షము రానున్నది. అది ఏమిటి? ఏ విత్తనములైతే ఉన్నాయో ఆ విత్తనములను భూమిలో నాటుట.
ఏమి జరుగుతున్నది? మంచిది, బోధించెడి వర్షము రాబోచున్నదని మనము కనుగొన్నాము. బాప్టిస్టువారు, "ఆ 44 లో ఇంకా పదిలక్షల మంది సంఘ సభ్యులు రావలసియున్నదని" వారనుచున్నారు, అది వారియొక్క లక్ష్యమైయున్నది. గొప్ప సువార్తీకుడైన మన బిల్లీ గ్రాహమ్ గొప్ప ఉజ్జీవములను కలిగియున్నాడు, అతడు ఏమి చేసియున్నాడో చూడండి. పెంతెకోస్తు వారిని మరియు ఓరల్ రాబర్ట్స్ ను చూడుము. ముందుగానే ఆ బోధించెడి వర్షము వెళ్లియున్నది.
ప్రతి దేశములోని ప్రజల మధ్యన ఆ జాతీయతను బోధించెడి వర్షము కమ్యూనిజమును నాటియున్నది.
అక్కడ రోమను యొక్క ఉజ్జీవమున్నది. అప్పుడు ఏమి జరిగియున్నదో మీకు తెలుసా? వారు పశ్చిమవైపు భాగమును… కాని లేక తూర్పువైపున ఉన్న బెర్లిన్ యొక్క భాగమును వెనుకకు ఇచ్చినట్లయితే, అది కమ్యూనిజమును తెచ్చును… లేక నా ఉద్దేశ్యములో రోమను సామ్రాజ్యము, కచ్చితముగా పాత వృత్తము వలె, యేసు జీవించిన కాలములో ఏ విధముగా జరిగినదో. కచ్చితముగా అది చేయును, పరిపూర్ణముగా.
64మరొక ఉజ్జీవము జరుగుచున్నది. అది ఏమైయున్నది? విత్తబడుట అనేది జరుగుతున్నది.
బిల్లీ గ్రాహమ్ గురించి మీరు ఏదైనా అధికముగా వినుచున్నారా? ఓరల్ రాబర్ట్స్ యొక్క సంగతి ఏమిటి? మిగిలిన వారి సంగతి ఏమిటి? గొప్ప ఉజ్జీవము యొక్క ఆ అగ్ని ఇప్పుడు మండుటలేదని మీకు తెలుసా, అది ఏమైయున్నది? అది అంత్యకాలము యొక్క సూచనై యున్నది. వాక్యములు విత్తబడియున్నాయి. అది ఏమిటి? మతశాఖ, తన పంటయైన మతశాఖను కోయును. అది వారిని ఒక సమాఖ్యగా చేయును.
కాని దేవుని యొక్క వాక్యము కూడా విత్తబడియున్నది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుట ప్రారంభమవుతుందో, అప్పుడు దేవుని యొక్క వాక్యము ప్రజలలో జీవిస్తుంది. అప్పుడు వ్యభిచారము చేసిన ఆ అబద్ధ వధువు బయటకు వెళ్ళి తననుతాను ఆచారములకు అప్పగించుకుంటుంది, తనయొక్క జన్మహక్కు అమ్ముకున్న ఆ అబద్ధ వధువు ఏమి కోయునో మీకు తెలుసా? ఒక సమాఖ్య సంఘము, అది కట్టబడి అగ్నిలో కాల్చబడే ఒక ముళ్ళ చెట్టు మాదిరిగా ఉండును. అయితే ఎక్కడైతే ప్రజల హృదయములలో దేవుని యొక్క వాక్యము విత్తబడియున్నదో, వారు క్రీస్తు యొక్క వధువును కోయుదురు, అది నేను ఇక్కడ నిలబడియున్నంత నిశ్చయముగా అది జరుగును. ఇవి అంత్యకాలము యొక్క సూచనలు.
65చర్చి-ఆఫ్-గాడ్, మరి మీ సంగతి ఏమిటి? మరి మన సంగతి ఏమిటి? బాప్టిస్తులు, ప్రెస్బటెరియన్లయిన మీరు, అసెంబ్లీస్-ఆఫ్-గాడ్, యేసు నామమువారు, ఇంకా మిగిలినవారందరు, మరి మీ సంగతి ఏమిటి? మరి మన సంగతి ఏమిటి? ఆ విత్తనమును మీరు చూచుట లేదా? మీ హృదయమనే గర్భములోకి ఎటువంటి విత్తనమును తీసుకొనుచున్నారో జాగ్రత్త, ఆచారములను తీసుకొనవద్దు; వాక్యమును మాత్రమే తీసుకొనుము.
వారు కడవరి వర్షమును గురించి బహుగా మాట్లాడుచున్నారు. మీ యొక్క కడవరి వర్షమును నేను తీసి పడవేయటం లేదు, కాని అది కడవరి వర్షము కాదు. ఒకవేళ ఇక్కడ కడవరి వర్షమున్నట్లయితే, దేవుని యొక్క శక్తి దానిని పట్టుకొనును, అప్పుడు అది ప్రపంచమును తుడిచిపెట్టును. కడవరి వర్షము రావలసియున్నది. మరి సంగతి ఏమైయన్నది? హవ్వ చేసియున్న మాదిరిగా సంఘము కూడా దేనినో కలగలుపుటకు తయారు చేయుచున్నది. ఆమె అధికమైన వెలుగు కొరకు దేనినో తయారు చేయుటకు ప్రయత్నము చేసియున్నది.
మనకు మనముగా దేనినో తయారు చేసుకొనుచూ మనము కూడా అదే కార్యమును చేసియున్నాము. దాని నుండి నీ చేతిని తీసివేయుము. దేవుడే దానిని చేయనిమ్ము. వాక్యమును మాత్రమే తీసుకొని దానియందు విశ్వసించుము. నీ హృదయములో గట్టిగా పట్టుకొనుము. వర్షము పడుట ప్రారంభి౦చినప్పుడు, జీవము దానిని పట్టుకొనును, మరియు వాక్యము తననుతాను బయలుపరచుకొనును.
LUKE 17:28,30
66మీరు నన్ను పిచ్చివాడిని అనుకుంటున్నారని నేను ఊహించగలను, కాని నేను పిచ్చివాడిని కాదు. ఒకవేళ నేను పిచ్చివాడినైతే, నన్ను ఒంటరిగా వదిలేయండి — ఈ విధముగా నేను సంతోషము ఉన్నాను. కావున, నేను దేవుని యొక్క వాక్యమును నమ్ముదును. సంఘమా, మరి నీ సంగతి ఏమిటి? తెరవబడిన ఆమె మనసే ఆమె యొక్క గర్భము. అది దేవుని యొక్క వాక్యమును కాకుండా, అన్నిరకములైన ఆచారములను మరియు మానవ కల్పితమైన సిద్ధా౦తములను తీసుకొనుచున్నది. క్రీస్తు వచ్చినప్పుడు, ఆదాము కనుగొనిన దానినే ఆయన కూడా కనుగొనును, యెహోవా కనుగొనిన దానినే ఆయన కనుగొనును. ఇదిగో ఇక్కడ ఆ సూచనలు ఉన్నాయి, అంత్యకాలము కనిపించుచున్నది మరియు సంఘము యొద్ద సమాధానము లేదు. అది నిజము. ఇదే సమయము.
తొలకరి వర్షము ముందుగానే వెళ్ళియున్నది. ఆ కారణము చేతనే బిల్లీ అధికముగా ఏమి చేయుటలేదని గుర్తుంచుకొనుము అక్కడ ఒక……
67యేసు చెప్పెను, "మనుష్యకుమారుని యొక్క రాకడ దినములు, సొదమ దినముల వలె ఉండును." సొదమీయుల దగ్గరకు ఇద్దరు దూతలు వచ్చియున్నారు. అబ్రహాముతో లోతు ఒకసారి నడిచి యున్నాడని జ్ఞాపకముంచుకొనుము. సంఘము కూడా సహవాసము నిమిత్తము ఒకసారి వాక్యమైయున్న క్రీస్తుతో నడచియున్నది. అయితే అది తన యొక్క జన్మహక్కును మతశాఖకు అమ్మివేసుకున్నది. ఒక పెద్ద సమాఖ్యా సంఘముగా అవతరించుటకు ఆమె తనని తాను పూర్తిగా అమ్మివేసుకున్నది.
లోతు దినములలో కూడా ఖచ్చితముగా అదే జరిగియున్నది. అతడు అక్కడికి వెల్లెను. ఇద్దరు దూతలు — ఈ దినమునకు ఓరల్ రాబర్ట్స్ మరియు బిల్లీ గ్రాహమ్ ఉన్నట్లుగా — అక్కడకు వెళ్లి, సువార్తను చెప్పెను. ఏమి జరిగినది? దానిలో నుండి సిగ్గుపడదగినది వచ్చియున్నది.
68అయితే అబ్రహాము… ఒక్కడే ఆయనతో నిలబడియున్నాడు. అతడిని మాత్రమే దేవుడు పిలిచియుండెను. వారి ఎదుట ఆయన ఒక సూచన చేసియుండెను, అది ఏమి చేసియున్నది? అది అతడేనని నిరూపించియున్నది, ఎందుకనగా అబ్రహాము ఎన్నుకోబడెను. అబ్రహాము వాగ్దానమును కలిగియున్నాడు. ఇప్పుడు చూడండి ఇది అబ్రహాము యొక్క విత్తనము. ఆ వాగ్దానము అబ్రహామునకు మాత్రమే కాదు కాని, తన సంతానముకు కూడా వర్తించును. ఆ విత్తనము ఇస్సాకు కాదు, అది విఫలము చెందినది, అది నిరూపించబడి యున్నది. కాని అతడు కలిగియున్న విశ్వాసమే ఆ విత్తనము — ఏ సమస్యలు ఉన్నాయి అనేది విషయము కాదు, ప్రకృతి దానికి ఎంత వ్యతిరేకముగా ఉన్నదనేదీ విషయము కాదు, అబ్రహాముతో వైద్యుడు "ఇది జరుగదు" అని ఎంతగానో చెప్పియుండ వచ్చును. అది అసాధ్యమై యున్నప్పుడే… తనకు ఇవ్వబడిన వాగ్దానమును అతడు కలిగియున్నాడు.
GEN 18:10•
GAL 3:16
69వరుసకు అర్ద సాహోదరియైన పదిహేడు సంవత్సరముల సహోదరిని అతడు వివాహము చేసికొనియున్నాడు. వారికి సంతానములేదు. ఆమెకు అరవై-అయిదు సంవత్సరములు, అతనికి డెబ్బది-అయిదు సంవత్సరముల వయస్సులో ఉన్నప్పుడు దేవుడు వారికి కనిపించి, ఇలాగు చెప్పెను, "ఆమె వలన నీకు ఒక కుమారుడు జన్మించును." ఎందుకు, ఆమె తీసుకున్న ఆయన వాక్యమును అతడు తీసుకున్నాడు. అతడు దానికొరకు సిద్ధపడియున్నాడు. ఇరవై-అయిదు సంవత్సరముల వరకు కూడా ఏమియు జరిగియుండలేదు. ఇప్పుడు అతడు నూరేండ్లవాడు మరియు ఆమెకు తొంభది సంవత్సరములు. ఆ విషయము అతడిని ఏ మాత్రము కూడా ఆపలేదు. "దేవుని వాగ్దానమందు అతడు అవిశ్వాసముచేత వెనుతీయలేదు."
అదియే అసలైన విశ్వాసము. అదియే అబ్రహాము యొక్క రాజ-సంతానము (విత్తనము). ఆ రకమైన విత్తనమును దేవుని యొక్క వాక్యమును తీసుకొనును. ఆ కార్యమే వధువును తీసుకొని వచ్చును. ఆ కార్యమే క్రీస్తును కలుసుకొనునట్లుగా చేయును. ఆయన వాక్యమైయున్నాడు.
70వాక్యమునకు వెలుపట ఉన్నవి సంఘములో నాటబడినట్లయితే, ఆ సంఘము ఆయనను కలుసుకొనుటకు వెళ్ళదు. బూజు పట్టిన అసహజమైన శరీరముతో ఆయన లేడు. పరిపూర్ణమైన శరీరమును ఆయన కలిగియుండెను, మరియు ఆయనే పరిపూర్ణమైన వాక్యమైయున్నాడు. సంఘములో పరిపూర్ణమైన వాక్యము నాటబడాలి, మరియు పరిపూర్ణమైన వాక్యమును సంఘము విశ్వాసించాలి. పరిపూర్ణమైన వాక్యము మరియు పరిపూర్ణమైన చిత్తము ఒకే శరీరముగా ఏకమై, ఒక భర్త మరియు భార్యవలె ఉండాలి. ఆమేన్. (నాకు నేనుగా "ఆమేన్" చెప్పుకోలేను, కాని "ఆమేన్" అనగా, "అలాగు జరుగును గాక.") అది ఎలాగున్నా నేను దానిని నమ్ముదును. అవునయ్యా!
తొలకరి వర్షము ముందుగానే వెళ్ళినది. ఆ వర్షము పడుటకు సిద్ధపడియున్నది. అది దేనిని తీసుకొని వస్తుంది? మీరు కేవలం గమనిస్తూ ఉండండి.
MATT 25:1-8
71మరొక సూచన బుద్ధిలేని కన్యక, యేసు చెప్పెను, "పెండ్లి కుమారుడు రాకడకు ముందుగానే బుద్ధిగలిగిన కన్యలు తమ దివిటీలలో నూనెను కలిగియుందురు." ఒక దినమున వారు రావలసిన స్థలమునకు వచ్చునప్పటికి బుద్ధిలేని కన్యలు లేచి తమ దివిటీలలో నూనె లేదని తెలుసుకున్నారు, "ఇదిగో పెండ్లికుమారుడు వచ్చుచున్నాడు. ఆ కేక ఇలాగునే ఉండును. "క్రీస్తు వచ్చుచున్నాడు!" ఆమె లేచి మరియు తన దగ్గర నూనె ఎంతమాత్రము లేదని కనుగొన్నది.
నూనె అనగా "పరిశుద్దాత్మ." వాక్యమునకు జీవమును తీసుకొని వచ్చునది ఆత్మయే. వాక్యమునకు జీవమును తీసుకొనివచ్చు నీరు పరిశుద్దాత్మయే. మీరు ఇలాగనవచ్చును, దాన్ని విసిరివేయుము. "మంచిది, మరి ఈ సంఘముల సంగతి ఏమిటి? ఒకవేళ అవి మతశాఖ యొక్క విత్తనములు నాటియున్నట్లయితే అవి వాటికే జీవమును ఇస్తాయి. దేవుని యొక్క ఆత్మయే దానికి జీవమును ఇచ్చును.
MATT 5:45•
MATT 7:20•
HEB 6:7,8
72పరిశుద్ధ గ్రంథము ఇలాగు చెప్పెను, "నీతిమంతుల మీదను మరియు అనీతిమంతుల మీదను వర్షము కురియును, "భూమియందున్న ఫలమును పక్వమునకు తెచ్చుటకు తరచుగా వర్షము వచ్చునని హెబ్రీయులకు 6వ అధ్యాయము చెప్పుచున్నది. కాని ముళ్ళు మరియు ముళ్ళ చెట్లు కూడా ఆ వర్షమునకు సంతోషిస్తాయి మరియు ఆ వర్షము వలనే అవి జీవిస్తాయి. "కాని వాటి యొక్క ఫలములచేత అవి గుర్తించబడతాయి." అది ఖచ్చితముగా నిజము. అక్కడే మీరున్నారు. దానిని వారు చూచినప్పుడు… గమనించారా, ఆ వర్షము పడుట ప్రారంభించినప్పుడు ఆ ఫలములన్ని సమకూర్చబడతాయి. మతశాఖ మరియొక మతశాఖను పొదుగును, అది అంతే. కాని వాక్యము మాత్రము క్రీస్తును, వధువును పొదుగును. నిశ్చయముగా. వాక్యమనే విత్తనమును నాటుము. ఇప్పుడు, ఎప్పుడైతే ఆ బుద్ధిగల కన్యకలు…
73క్రైస్తవులలోని వ్యాపారస్తుల యొక్క స్వరమును మీరు గమనించియున్నారా? నేను వారి కొరకు అంతర్జాతీయముగా మాట్లాడియున్నాను. నేను వారి మీద ఎటువంటి విసుర్లు విసరలేదు. ఇది వాక్యమైయున్నది. చూడండి! అక్కడ ఏమైనది… ప్రెస్బెటేరియన్లోను, ఎపిస్కోపలియన్స్ ను చూడుము, వారిలో వందలమంది పరిశుద్దాత్మను పొందుకొనుటకు ప్రయత్నము చేస్తున్నారు. వారు చాలా గొప్పదానితో ఆటలాడుచున్నారు.
నాకు ఆఫ్రికా దేశములో ఒక ప్రియమైన, మంచి వ్యక్తి మరియు దేవుని యొక్క మనిషియైన స్నేహితుడున్నాడు, అతడిని నేను ఇలాగు అడిగాను, "అది ఏమిటో నీకు తెలియదా, సాహోదరుడా? నీ పరిచర్య ఏమిటి?
అతడు ఇలాగనెను, "బబులోనును తీసుకొనివచ్చుటకు నేను ప్రయత్నిస్తున్నాను."
నీవు చూడలేవా, అదే సమయములో బుద్ధిలేని కన్యకలు తమ విత్తనములు పెరుగుట కొరకు కొద్దిగా నూనెను కావాలని కోరుకున్నారు, క్రీస్తు వచ్చే సమయమునకు ఆమె బయటకు వెళ్ళిపోయినదా? గొప్ప ప్రసంగికుడైన బిల్లీ గ్రాహమ్ ఇప్పుడే మనకు పెంతెకోస్తు అవసరమని చెప్పెను, ప్రజలు వెనుకకు తిరుగుట మనకు అవసరమైయున్నది. ఎపిస్కోపలియన్లు ఒక గొప్ప వార్తను వ్రాసియున్నారు, ఇంత పెద్దదిగా ఇలా వ్రాశారు, "బాషలతో మాట్లాడు ప్రసంగికులు మనకు కావలసియున్నది, సంఘపు స్వస్థతా ఆరాధనలలో బయట ఉన్న బలహీనులైన ప్రజలకు ప్రార్ధించవలసియున్నది." వారు ఏమి చేయుటకు ప్రయత్నము చేయుచున్నారు? వారి దివిటీలలో నూనె కొరకు ప్రయత్నము చేయుచున్నారు. ఖచ్ఛితముగా, అది ఒక అంత్యకాల సూచనా విత్తనమైయున్నది! ఆమేన్. ఆమె అలాగు చేయుటకు ప్రయత్నము చేయుచుండగా, పెండ్లికుమారుడు వస్తాడు మరియు వధువు లోపలికి వెళ్ళిపోతుంది, మరియు ఆమె బయటనే విడువబడుతుంది. ఓ, మనము ఎంత అద్భుతమైన దినములో జీవిస్తున్నాము.
74నేను ఇంకొక విషయమును చెప్పాలని కోరుచున్నాను: దేశముల మధ్య ఆనిశ్చిత. ఓ, మై! భయములేని సంగతులు ఆకాశములో కనిపించుచున్నవి — వాటిని మీరు నమ్ముచున్నారా? చూడండి. వాటిలో నుండి మనము రెండింటిని తీసుకుందాము… మనకు సమయము తొమ్మిదిన్నర అగుటకు మనకు మరికొన్ని నిముషములున్నాయి, కనుక ఈ ఆడిటోరియమును ఎక్కువ సమయము పట్టుకొనియుండాలని నేను అనుకోవటంలేదు. ఇది కృపయైయున్నది, ఈ ప్రజలు దానిని మనము కలిగియుండుటకు అనుమతి౦చిరి.
వినుము. ఎంతమంది… మీలో ప్రతియొక్కరు చూసియున్నారు… దేశము ఈ సూచనల చేత ఈ మధ్యనే కంపించబడ్డాయి. వేరొక దినమున ఈ కక్ష్యలో ఉన్న ఆ మనుష్యుడను మీరు చూశారా..? పైన అతడు కనుగొన్న ఆ సంగతులు అతడికి ఎన్నడు విజ్ఞాన శాస్త్రమునకు అసలు అవి ఏమిటో కూడా తెలియదు. భూమిని అతడు దాటుచున్నప్పుడు… వారు ఇంకనూ చూస్తూనే మరియు చూస్తూనే మరియు చూస్తూనే ఉన్నారు, కాని వాటిని వారు చూడలేకపోయారు. అతడు, అతని యొక్క కక్ష్య ముక్కలు అవుతుందని భావించాడు. కాని అది అలాగు జరగలేదు. అతడి యొక్క కక్ష్య చక్కగానే ఉన్నది. వెలుతురు.
LUKE 21:25,26
75అక్కడ ఏమి జరిగినదో చూడండి… ప్రతిచోటా ఎగురుచున్న పళ్ళెములు — మీరు దానిని రేడియోలో వినియుంటారు, దానిని మీరు టెలివిజన్లో చూసియుంటారు, అది దినపత్రికలో కూడా వచ్చినది. వేరొక దినమున పెంటగాన్ దాని గురించి (ఆరు వారముల క్రితం) అది అభూత కల్పనకాదు అనినది. వారు ఎలాగు ఆ ఎగురుచున్న పళ్ళెములను పట్టుకున్నారో టెలివిజనులో చూపించియున్నారు, జ్ఞానము — లైట్లతో క్రిందకు వచ్చి, పెంటగాన్ పైన ఈ విధముగా వ్రేలాడుచున్నది, వాషింగ్టన్ డి.సి., అంతటా వారు దానిని రాడారు ద్వారా పట్టుకొనియున్నారు. మరియు ముందుగా వెళ్ళే రక్షకులు అక్కడ పైన ఉన్నారు. వారు దానిని చుట్టుముట్టియున్నారు, ఆ తరువాత వారు కాంతివేగముతో కదిలియన్నారు. ఒక జ్ఞానయుక్తమై౦ది! అది ఏమైయున్నది?
ఆకాశములో భయంకరమైన సూచనలు మరియు దృశ్యములు ఉండునని, గందరగోళమైన సమయములు, దేశముల మధ్య అనిశ్చిత ఉండునని వాటిని బట్టి భయముతో మానవుని యొక్క హృదయములు ఆగిపోవునని యేసు చెప్పెను. ఆ అంత్యకాల విత్తన సమయము ఇదేనని మీరు చూచుట లేదా? కోతకాలము, పరిశుద్ధ గ్రంథము చెప్పియున్న ఆ కార్యములు ఇప్పుడు సంభవించుటలేదా? నాటబడిన ఆ విత్తనము జీవమును పొందుకొని జీవించుటను మీరు చూచుటలేదా? అదియే అసలైన సంగతి.
MATT 2:9
76ఇప్పుడు మరొక సంగతియున్నది. జాగ్రత్తగా వినుము… ఇప్పుడు దీనిని కనిపెట్టుటలో విఫలము చెందవద్దు. యేసు మొదటి రాకడకు ముందుగా, భారతదేశములోని నక్షత్ర శాస్త్రవేత్తలు, జ్ఞానులు… భారతదేశమునకు నేను మిషనరీగా వెళ్లియున్నాను, మరియు దీని గురించి అక్కడ ఉన్న జ్ఞానులతో మాట్లాడియున్నాను. వారును దానిని గమనిస్తున్నారు. వారు నక్షత్ర శాస్త్రవేత్తలు — ఆకాశములో ఉన్న గ్రహాలను, నక్షత్రములను వారు గమనిస్తున్నారు. ఎల్లప్పుడు తాను భూమిమీద ఏదైనా కార్యములను చేయుటకు ముందుగా దేవుడు తననుతాను గ్రహాలు, నక్షత్రములలో అగుపరచుకొనును.
వారు ఇలాగు చెప్పెను, "ఎందుకు, ఎప్పుడు… భూమిని పరిపాలించబోవు ఆ బాలుడైన రాజును ఆరాధించుటకు ముగ్గురు మనుష్యులు ఆ నక్షత్రమను వెంబడిస్తూ బయలుదేరియన్నారని మీ లేఖనములు చెప్పుచున్నాయి." అతడు ఇలాగనెను, "కాని నిజానికి, అక్కడ మూడు నక్షత్రములున్నాయి; ఆ మూడు నక్షత్రములు ఏకమై, ఒక్క నక్షత్రముగా మారినది." నేను ఒక క్రైస్తవ నక్షత్ర శాస్త్రజ్ఞునితోనో లేక జ్ఞానితోనో మాట్లాడియున్నాను, అతడు ఇలాగనెను, "దాని అర్ధము ఏమిటంటే, మూడు జాతుల ప్రజల కొరకు ఈ మనుష్యుడు మరణించియున్నాడు. మూడే జాతులున్నాయి, అవి హాము, షేము, మరియు యాపేతు జాతుల ప్రజలు. మరియు ఆయన సువార్తలో వారు ముగ్గురు ఏకమగుదురు — తరువాత ఆయన యొక్క రాకడ ఉండును."
అతడు అలాగు నమ్ముచున్నయెడల, అది సరి. మూడు అనే అంకె పరిపూర్ణతకు సాదృశ్యముగా ఉన్నది. కాని ఆ మూడును నేను ఏమని నమ్ముచున్నాను? మనము ఏమని నమ్ముచున్నాము? దేవుని యొక్క త్రిత్వమైన ఆ మూడు విధములైన పరిపూర్ణతలు (తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మ), ఒకే ఒక్క మానవునిలో బయలుపరచుకున్నాయి, ఆ ఒక్కడు పరిపూర్ణుడైన మానవుడు యేసుక్రీస్తే, మిగిలిన మానవులందరు విఫలమైనారు. ప్రతియొక్కరు మరణించియున్నారు. కాని ఇప్పుడు వచ్చిన ఈ మానవుడు మరణించడు, పరిపూర్ణత, మరణము కూడా ఆయనను చంపలేకపోయినది. ఆయన తిరిగి లేచెను.
77మూడు అనేది పరిపూర్ణతకు సాదృశ్యముగా ఉన్నది. మనందరికి ఆ సంగతి తెలుసు. ఆయన యొక్క సంఖ్యాశాస్త్రములో మూడు అనేది దేవుని యొక్క సంఖ్య. దేవుడు తన సంఖ్యల చేత తనను తెలియచేసుకుంటాడు. మూడు అనేది పరిపూర్ణత, యేడు అనేది ఆరాధన, ఇరువది నాలుగు అనేది ఆరాధన, నలుబది అనేది శోధన, ఏభది అనేది పెంతెకోస్తు, జూబిలీ, గమనించారా, మొదలైనవి. ఆయన యొక్క అన్ని అంకెలు, దేవుని యొక్క ఆయన సంఖ్యలు పరిపూర్ణతలో ఉన్నవి మరియు పరిపూర్ణమైనవి. మూడు అనేది పరిపూర్ణతకు సాదృశ్యముగా ఉన్నది. ముగింపుకు ముందు…. ఇప్పుడు జాగ్రత్తగా వినుము. ఎప్పుడైతే ఈ చిన్నబాలుడైన యేసు జన్మించెనో, మూడు నక్షత్రములు కలసి ఏకమై ఉదయ నక్షత్రముగా మారినవి, అది పరిపూర్ణ బాలుడైన క్రీస్తు యొక్క రాకడను ప్రతిబింబిస్తున్నది.
78ఇప్పుడు ఏమి జరిగినది? అయిదు నక్షత్రములు ఒకే సరళరేఖలాగా లోకములో పడియున్నాయనే ఒక గర్జనను మనము దినపత్రికలో చూశాము, దేశములోని ప్రతి టెలివిజనులో దాన్ని చూశాము. అయిదు అంటే ఏమిటి? కృప యొక్క సంఖ్య. ఆ నక్షత్రములు వచ్చిన ప్రతిసారి భూమిమీద ఏదో జరుగుచున్నది. భూమిమీద ఏమి జరుగుచున్నది? అయిదు నక్షత్రములు పడియున్నాయి. అది ఏమైయున్నది? అవి దేనిని పరిచయము చేస్తున్నాయి?
ఆ తరువాత ఏమి జరిగియున్నదో దానిని చూద్దాం. ప్రపంచ పటము నుండి జర్మనీ దాదాపుగా తుడిచి పెట్టుకుపోయినది. ప్రపంచము ఒక పుచ్చకాయలాగా ప్రేలిపోతుందని, ఒక జ్ఞాని చెప్పెను. ఈ చివరి దినముల నిమిత్తమై వారు ప్రతియొక్క బాధాకరమైన సంగతులను ప్రవచించియున్నారు. ఏమి జరుగుతున్నదో చూద్దాము. ఇంగ్లాండులో వేరొక దినమున ఒక గాలి తుఫాను వచ్చి డెబ్బది వేల ఇళ్ళను ఒక్క దినమునే పడేసినది. ప్రతిచోట నాశనము తటస్థించుచున్నది. కాలిఫోర్నియా, లాస్ వేగాస్ దాదాపుగా సముద్రములోకి కొట్టుకొనిపోయాయి. అది ఏమిటి? అది దుఃఖము యొక్క ప్రారంభము. ప్రతిచోటా భూకంపములు వస్తున్నాయి. ఎందుకు అలా జరుగుతుంది? అయిదు నక్షత్రములు ఒకే సరళరేఖలో వచ్చినవి. కృప, దేవుని యొక్క కృప.
ఏమి జరిగినది? ఒక శిశుప్రాయలో ఉన్న సంఘము (హల్లెలూయా!), ఒక వధువు, బాల్యదశ, ఆమె మీద దేవుని యొక్క శక్తి కుమ్మరించుట ప్రారంభించబడినది. ఈ పెండ్లికుమారుడి నిమిత్తము ఆమె ఒక వధువు రూపములోకి మారుచున్నది. ఆ మూడు నక్షత్రములు, అనగా, పరలోకపు తండ్రి యొక్క పరిపూర్ణత, భూమిమీద మన మధ్యలో త్రిత్వము ఏకమగుచున్నది, దేవుని యొక్క కార్యాలయములు ఒకే కార్యాలయముగా మారుచున్నవి. ఇప్పుడు ఏమి జరుగుతుంది? దేవుని యొక్క జీవముగల సంఘము, దేవుని యొక్క వాక్యము క్రింద ఏకమవుతున్నాయి, అంతము సమీపించబోతున్నదని ఖగోళ సంబంధమైన ఆకాశము ప్రకటించుచున్నది. ఆమేన్! ఇది నమ్మశక్యముగా లేకపోవచ్చును, కాని వాక్యము అలాగనే ఉన్నది. అవునయ్యా.
EPH 5:27
79ఏమి జరుగుచున్నది? (నేను ముగించిబోవుచున్నాను.) స్నేహితుల్లారా, నేను దీన్ని చెప్పవలసియున్నది, సంఘము రాబోవుచున్నది. మచ్చయైనను లేక ముడతయైనను లేని ఒక సంఘమును దేవుడు తీసుకొనబోవుచుండెను. ఆమె ముందుగా నిర్ణయింబడినది. తాను దాన్ని కలిగియుంటానని దేవుడే చెప్పెను. అదియే దానిని సరి చేయును. దానిలో సభ్యులు ఎవరు? నాకు తెలియదు. నేనుంటానని నేను నమ్ముచున్నాను. మీరును దానిలో ఒక సభ్యులేనని నేను నమ్ముచున్నాను. ఆయన మచ్చయైనను లేక ముడతయైనను లేని శరీరమును కలిగియుండబోవుచున్నాడు.
ఈ కడవరి దినములలోని సూచనలు మరియు కార్యములు అందుకే జరుగుచున్నాయని నేను విశ్వసిస్తున్నాను, వారిలోని ప్రతియొక్కరు బయటకు వచ్చి కలిసికొనుటను బట్టి ఈ వధువు కోసము క్రీస్తు సిద్ధపడి వచ్చుచున్నాడని తెలియుచున్నది. దేవుడే, ఒక పరిపూర్ణమైన మానవునిలో తన వాక్యము ద్వారా తనను బయలుపరచుకున్నాడు. కావున దేవుడు మరియు వాక్యము తిరిగి ఏకమై మరియు తనని తాను వధువులో బయలుపరచుకొనెను. హవ్వ సంకరము చేసినదానివలె వేరొకదానితో సంకరము చేసినట్లుగా కాదు, కాని ఆ సంఘములో అపవిత్రపరచబడని దేవుని యొక్క వాక్యము జన్మించినది, ఆయన ఆత్మాభిషేకముతో ఆయన వాక్యములో యేసుక్రీస్తువలె ఆమె నిలబడియున్నది. ఆమేన్! ఇప్పుడు ఇదే ఆ ప్రకటన అని నేను నమ్ముచున్నాను.
ZECH 14:7
80ప్రవక్త ఇలా చెప్పెను, "రాత్రియేదో పగలుయేదో తెలియని ఒక దినము వచ్చును, కాని సాయంకాల సమయమందు వెలుగు కలుగును." పరిశుద్ధ గ్రంథమును చదువు వారికి ఆ సంగతి తెలియును. ఏమి జరుగుతున్నది? నాగరికత తూర్పు నుండి పడమరకు ప్రయాణము చేయుచున్నది. మనకున్న నాగరికతలో అత్యంత పురాతనమైన నాగరికత చైనా కలిగియున్నది. నాగరికత తూర్పున ప్రారంభమైనది. అది సూర్యునితో పాటు ప్రయాణము చేసి పడమరకు వెళ్ళినది. ఇప్పుడు అది ఎక్కడున్నది? పశ్చిమ తీరమున ఉన్నది. దాన్ని దాటి ముందుకు వెళ్ళినట్లయితే, అది తిరిగి తూర్పునకు వెళ్ళిపోతుంది. నా ఉద్దేశ్యము ఏమిటో గమనించండి?
తూర్పున ఉదయించిన అదే సూర్యుడు పడమర అస్తమించును, అదే సూ-ర్యు-డు, అదే కు-మా-రు—డు, దేవుని కుమారుడు భూమి మీదకు వచ్చి తూర్పున ప్రజలలో నుండి ఒక వధువును తీసుకొనును… హవ్వ వలె మరియు యెహోవా యొక్క వధువువలె, ఆ వధువు తననుతాను కలుషితము చేసుకున్నది. అక్కడ వెలుగుతున్న అదే కుమారుడు తన యొక్క అదే శక్తితో పెంతెకోస్తులో తను నాటిన విత్తనము యొక్క పంటను కోయుచున్నాడు, అదే కుమారుడు ఇప్పుడు పశ్చిమమున గోళమునందు వెలుగుచున్నాడు. దేని కొరకు? ఒక వధువును కొరకు ఆయన నాటియున్న విత్తనము యొక్క పంటను పరిపక్వమునకు తీసుకొనివచ్చుటకు ఆయన అలాగు చేయుచున్నాడు. వధువును సువార్త యొక్క సాయంకాలపు వెలుగు తీసుకొనివచ్చును. ప్రభువైన యేసు కొరకు. (ఆమేన్!) సాయంకాలపు సూచనా విత్తనములు — కొన్నివందలు ఉన్నాయి.
81ముగింపుకు మనము అయిదు నిముషములు కలిగియున్నాము. వారిలో మీరును ఒకరేనా? ఆ విత్తనములలో మీరును ఒకరని మీరు నమ్ముచున్నారా? అపవిత్రము కాని సువార్త మీ హృదయములో నాటబడినదని మీరు నమ్ముచున్నారా? మీ హృదయము నుండి దేవుని యొక్క వాక్యమును తీసుకొనిపోవునది ఈ ప్రపంచములో లేదని మీరు నమ్ముచున్నారా? నా స్నేహితుడా, ఒకవేళ అలాగు లేకపోయినట్లయితే, నేను ఈ భూమిమీద నీ ముఖమును ఎన్నడు మరలా చూడను, కాని ప్రభువు యొక్క వాక్యమును జ్ఞాపకముంచుకో మరియు ప్రభువు యొక్క రహస్యములు తన ప్రవక్తలకు బయలుపరచును. ఆయన యొక్క ప్రవక్తలు దానిని పలుకుదురు. అది ఇక్కడే ఇప్పుడే అది సమీపించుటను మనము చూస్తున్నాము. వారు ఏమని మిమ్ములను హెచ్చరించారో మీకు మరలా తెలియచేస్తున్నాను.
ఒకవేళ ఈ రాత్రి మీరు ఇక్కడ ఉన్నట్లయితే, మీరు ఆ విత్తనములను కలిగియుండకపోతే, మీరు క్రైస్తవులే కారు. బహుశా మీరు సంఘమునకు సంబంధించివారై యుండవచ్చును. సాహోదరుడా నీవు దానిని అవకాశముగా తీసుకొనవద్దు. నీవు ఆ కార్యముల గురించి వినవద్దు. అది ఒక సంకరమైన సంగతిగా ఉన్నది. ఆయన శిరస్పైయుండగా, దేవుని యొక్క వాక్యము నీలో అన్నింటికన్నా అధికముగా యేసుక్రీస్తులో జీవించిన మాదిరిగా జీవించవలెను. ఆయన శరీరము ఒకరీతిగా మరియు ఆయన శిరస్సు వేరొకరీతిగా ఉండజాలదు. రెండింటిలో ఒకే వాక్యము ఉండవలసియున్నది. ఒకవేళ నీ యొక్క సంఘము లేఖనములలో లేని ఆచారములు మరియు మానవకల్పిత సిద్ధాంతములను మాత్రమే బోధించుచున్నట్లయితే, నీవు వాటిని నమ్మవద్దు. నీవు సంఘములో చేరలేవు, జీవం కలిగిన దేవుని యొక్క వాక్యముచేత ఒక శరీరములో నీవు జన్మించియున్నావు. నీవు దానిని పొందుకోనట్లయితే, నీవు ఒక అవకాశమును తీసుకొనవద్దు.
MATT 10:28•
MARK 12:5
82ఈ దిగువున మీరు ఒక కప్పు సూప్ ను కొనుటకు వెళ్ళినట్లయితే, దానిలో ఒక సాలెపురుగు ఉన్నట్లయితే, నీవు ఆ హోటలు వారిమీద కేసు పెట్టెదవు. ఎందుకు, నీవు దానిని తినలేవు, ఎందుకనగా నీవు ఈ శరీరమును నాశనము చేసుకుంటానని నీవు భయపడుచున్నావు. సాహోదరుడా, శరీరమును ఏది నాశనము చేస్తుందా అని భయపడవద్దు, కాని శరీరమును మరియు ఆత్మను రెండిని పాతాళములో నాశనము చేయువాని గురించి భయపడుము. నీ యొక్క ఆహారము గురించి నీవు అంత జాగ్రత్త వహిస్తున్నట్లయితే, ఈ శరీరమును బలహీనపరచే లేక రోగగ్రస్తముచేసే ఏవిధమైన దానిని నీవు తినవు. నిత్యత్వమునకు సంబంధించిన నీ యొక్క ఆత్మ ఏదైనా ఆచారమును మింగినట్లయితే, అప్పుడు ఈ శరీరము మరణించవలసియున్నది. నీ గొంతులో అటువంటి దానిని దెయ్యమును దూర్చనీవ్వకుము.
దేవుని యొక్క ఆత్మచేత నీవు తిరిగి జన్మించియున్నావు, ఇక్కడ వ్రాసియున్న ప్రతియొక్క దేవుని వాక్యమునకు నీ ఆత్మ సాక్ష్యమిచ్చుచున్నది, ఆయన ఇచ్చియున్న ప్రతి వాగ్దానము దానంతట అదే నీలో బయలుపరచబడును. దేవుని యొక్క ఆత్మ వచ్చి నీలో నివసించును. నీవు, క్రీస్తు యొక్క శరీరమైయున్నావు, అది భూమిమీద ఆయనను ప్రతిబింబించును. నీవు దానిని కలిగియుండకపోతే, నీవు దైవీకమైన స్వస్థతను నమ్మలేవు.
EXOD 15:26•
PS 103:3
83ఇక్కడ ఉన్న బలహీనులారా, దేవుడే దైవీకమైన స్వస్థతను దయచేయునని మీరు నమ్ముచున్నారా, మీరు కేవలం వాక్యమును అక్కడ ఉంచుము, "నీకున్న అన్ని వ్యాధులను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రభువా, నేను దానిని నమ్ముచున్నాను" అక్కడ ఏమి జరిగినదో గమనించుము. "ప్రభువా, నేను దానిని నమ్ముచున్నాను. ప్రతిదానిని తెరువుము. నా మాటను వినుము" అని చెప్పము. ఏమి జరిగినదో గమనించుము, వేరొక దినమున చనిపోవుచున్న ఆ చిన్న బాలికకు ఏమి జరిగినదో అదే జరుగును, అటువంటి వారు ప్రపంచములో వేలలో ఉన్నారు.
84అక్కడ నిలబడి నేను వాటిని చూశాను. దక్షిణాఫ్రికాలో కొంతమంది ప్రజలకు ఒక ప్రార్థనను చేసినప్పుడు వారు సుమారుగా ఏడు ట్రక్కుల నిండుగా వాటిని తీసుకెళ్ళారు. వారు తీసుకెళ్ళిన విధముగా ఆరు లేక ఎనిమిది చక్రములు కలిగిన ఒక్క ట్రక్కు కూడా జార్జియాలో తీసుకొని వెళ్ళలేకపోయారు.
మరునాటి ఉదయము అక్కడి నగర మేయరుతో నేను కూర్చునియున్నాను, కిటికి దగ్గరకు అతడు వచ్చి ఇలా అనెను, "బ్రెన్హాం సహోరుడా, క్రిందకు వచ్చి ఇక్కడ చూడుము." యేడు ట్రక్కుల నిండుగా చేతికర్రలను మరియు చక్రాల కుర్చీలను మిగిలినవాటిని ప్రజలు వీధులలోకి తీసుకొని వచ్చుచున్నారు. వారు ఈ కార్యమును చేయుటకు ముందు దినమున, కేవలం వాక్యమును మాత్రమే వారియొద్దకు తీసుకొనివచ్చి వారిని దానిని నమ్మమని చెప్పియున్నాను — వారిలో ఏ ఒక్కరిని తాకియుండలేదు; మరియు వారు నమ్మిరి. ఇప్పుడు వారి హృదయముల మీద వారి చేతులుంచుకొని వీధులలో వారు నడుస్తూ, వారి యొక్క స్వబాషలో వారు, "కేవలం నమ్ముము, సమస్తము సాధ్యమే" అని పాడుచున్నారు.
ఆయన తన వాక్యమును పంపెను." నీవు చేయవలసినది అదియే, వాక్యమును సంఘమునకు పంపుము మరియు సంఘము దానిని తీసికొననిమ్ము. దేవునిలో జన్మించినవాడు దేవుని నమ్మును మరియు దేవుడిని పొందుకొనును. నీవు ఆయనను నమ్ముచున్నావా? మనయొక్క తలలను వంచుదాము. ఈ చేతిరుమాళ్ల గురించి నేను ప్రార్ధన చేస్తాను.
85ప్రతి కన్ను మూసియుండగా మరియు మీ తలలు వంచియుండగా, నేను ఒక ముఖ్యమైన ప్రశ్నను అడగాలనుకుంటున్నాను. దేవునితో మీరు సరిగా లేనట్లయితే, దేవుని యొక్క వాక్యము ద్వారా పరిశుద్ధ గ్రంథమును నమ్ముటకు ప్రేరపణ కలిగించకుండా మీలో ఉన్న ఏదో మిమ్ములను ఆపుతున్నట్లయితే, దాని యొక్క నిబంధనలకు అనుగుణముగా మీరు జీవించుచున్నారని మీరు నమ్మనట్లయితే, మీ చేతిని పైకెత్తి ఇలాగు చెప్పుము, "దేవా! కరుణ చూపుము. బ్రెన్హాం సహోదరుడా, నేను ఒక క్రైస్తవునివలె ఉండులాగా నా కొరకు నీవు ప్రార్ధన చేయుము." మీరు వినుచున్నారా? మీ చేతులను పైకెత్తుము. యవ్వన స్త్రీ నీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. దేవుడు నిన్ను దీవించును గాక. అంతా మంచిది. ఈ భవనములో ఉన్న ఒక వ్యక్తి ఇలాగు ఆలోచిస్తున్నాడు, ఇక్కడ ఉన్నవారిలో ఇద్దరు ఇలాగు ఆలోచిస్తున్నారు.
వాక్యము దానిని కదపకపోయినట్లయితే, నేను వారిని ఒప్పింపచేయువాడను కాదు. మీరు ముందుగా నిర్ణయించబడియున్నారని మీరు నమ్మినట్లయితేనే మీరు దానిని చేయగలరు. మీరు జ్ఞాపకముంచుకొనండి, యేసు అద్భుతములు చేసియుండెను, కాని పరిసయ్యులు దానిని నమ్మియుండలేదు. వారి దానిని వారియొక్క తలలోకి తీసుకొనలేకపోయారు, ఎందుకనగా వారు ఆ మార్గములో లేరు. మీ లోపల దేవుని యొక్క వాక్యము క్రియచేయదని మీ హృదయమును మీరు కఠినపరచుకున్నట్లయితే, అప్పుడు దేవుని యొక్క కరుణకై మీ చేతిని పైకెత్తవు, తీర్పు దినమును నీవేమి చెయుబోవుచున్నావు? మంచిది.
86బలహీనముగా ఉన్నవారిలో ఎవరైనా జ్ఞాపకము చేసుకోవాలని అనుకుంటున్నారా? మీ చేతులను పైకెత్తుము. మూడు లేక నాలుగు, అయిదు, ఆరు, యేడు, ఎనిమిది, వారిలో పదిమంది.
మంచిది. మనయొక్క తలలను వంచుదాము. నీవు సందేహించవద్దు. అక్కడ చేతిని పైకెత్తిన నీవు నా చిన్న సాహోదరివి, "నన్ను జ్ఞాపకముంచుకొనుము," సాహోదరీ దేవుడు నిన్ను దీవించును గాక, నీకివ్వబడిన హృదయము దీవించబడును గాక. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము నీ చిన్ని హృదయములోని అసలైన వేర్లను చేరుకొనును గాక, మరియు క్రీస్తుకై నీవు ఒక మిషనరీవి అవుదువు గాక.
కొద్ది సమయము తరువాత చేతిని పైకెత్తిన ఈ వ్యక్తి: సాహోదరుడా, నీ తలవెంట్రుకలు తెల్లవిగా ఉన్నాయి. కాని జ్ఞాపకముంచుకో, అబ్రాహముతో దేవుడు మాట్లాడుటకు ముందుగా అతడి వయస్సు డెబ్బై-అయిదు సంవత్సరములు. ఈ రాత్రి దేవుడు తన వాక్యము యొక్క వేర్లను నీ హృదయములో నాటును గాక. ఆ గొప్ప వర్షము ఎప్పుడైతే పడునో, అది కేవలం ఆచారమును మాత్రమే తీసుకొని రాకుండా, అది నీలోపల క్రీస్తును బయలుపరచును గాక.
ACTS 10:34•
JAS 5:15
87స్వస్థత నిమిత్తము చేతులను పైకెత్తిన మీరందరు, పరిశుద్ధ గ్రంథము ఇలాగు చెప్పెను, "విశ్వాస సహితమైన ప్రార్ధన రోగులను స్వస్థపరచును మరియు దేవుడే వారిని పైకిలేపును." విత్తనము మీ హదయములో ఉన్నట్లయితే, ఇప్పుడే పరిశుద్దాత్మడు ఆ విత్తనముకు నీరు కట్టునట్లుగా నేను ప్రార్ధన చేయబోవుచున్నాను. ఏదో జరుగుచున్నది.
ఒక వ్యక్తిని దేవుడు గౌరవించడు. ఒకరిని ఆయన కాపాడినట్లయితే, దానినే నమ్మిన వేరొకరిని కూడా దేవుడు కాపాడును. ఒకరిని ఆయన స్వస్థపరచినట్లయితే, మరొకరిని కూడా ఆయన స్వస్థపరచును. కాని నీవు దానిని నమ్మవలసియున్నది. నీవు దాన్ని నమ్మినట్లయితే, ఇప్పుడే నీ కొరకు నేను ప్రార్ధిస్తాను.
MATT 15:22,26-28•
MARK 7:25,27-30
88పరలోకమందున్న మా తండ్రి, ఇక్కడ ఉన్న కొన్ని చేతిరుమాళ్ల మీద నా చేతిని ఉంచి పట్టుకొని యున్నాను. బహుశా, ఎక్కడో ప్రియమైనవారు బలహీనతతో బాధపడుచున్నారు, వారిలో ఏదో సమస్య ఉన్నది, బహుశా ఎక్కడో బలహీనతతో ఉన్న ఒక చిన్న బిడ్డను కలిగియున్న ఒక తల్లి, జార్జియాలో ఎక్కడో తన చిన్నగదిలో వెనుకకు జారగిలబడి కూర్చునియున్న వృద్దుడును గ్రుడ్డివాడైన ఒక తండ్రి, బహుశా ఎవరో ఆసుపత్రిలో ఉండి ఉండవచ్చును. ప్రభువా! వీటన్నింటి గురించి నీకు మాత్రమే తెలుసు. మాకు తెలిసినది ఒక్కటే, అది ఏమిటంటే, క్రీస్తువైన నీవు స్వస్థతను ఎప్పుడో కొనియున్నావని మాత్రమే మాకు తెలుసు. ప్రభువా! ప్రార్థన అనే మార్గము ద్వారా నీ వాక్యమును పంపుచున్నాను. నీవు నీ వాక్యమును పంపియున్నావు.
నీ దగ్గరకు వచ్చిన ఆ స్త్రీ ఇలాగనెను, "దావీదు కుమారుడా, ప్రభువా! నా యెడల కనికరము చూపుము." ఆమె ఒక అన్యజనురాలైయున్నది — మరియు నీవు ఆమెకు దావీదు కుమారుడవు కానప్పటికి.
నీవు ఇలాగు చెప్పియున్నావు, "పిల్లలు తిని తృప్తి పొందవలసిన భోజనమును మీ వంటి కుక్కలకు వేయుట నాకు సాధ్యము కాదు."
అప్పుడు ఆమె ఇలాగు బదులిచ్చినది, "ప్రభువా, అది సత్యమేనయ్యా, కాని, యజమాని బల్ల యొద్ద క్రిందపడిన ముక్కలను కుక్కలు తినునుకదా.
దానికి మీరిలాగు సెలవిచ్చారు, "నీవు ఇలాగు చెప్పిన కారణమున నీ కుమార్తె జీవించును." నీవు ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు మేము కనుగొన్నాము… లేక ఆమె ఇంటికి తిరిగివెళ్ళే సరికే, నీ వాక్యము ఆమె ఇంటికి వెళ్లి ఆ చిన్నబాలికను అప్పటికే స్వస్థపరచబడియున్నది.
JOHN 5:24•
JOHN 6:47
89ఒకసారి ఒక తండ్రి, తన బిడ్డ నిమిత్తము, అతడు అప్పుడు సమయము ఎంతైనది అని విచారించియున్నాడు. పదకొండవ ఘడియలో ఆ బిడ్డను జ్వరము విడిచిపోయినది అని వారు చెప్పియున్నారు. ప్రభువా, నీ వాక్యమును నీవు పంపియన్నావు. విశ్వాసభరితమైన ప్రార్ధన ద్వారా ఆ వాక్యమును నేను పంపుచున్నాను. అక్కడ ఉన్న ఆ చిన్నబాలిక యొక్క చేతిని బాగుపరుచు నిమిత్తము నేను వాక్యమును ఆమె యొద్దకు పంపుచున్నాను. చేతిని పైకెత్తిన ఆ వ్యక్తి దగ్గరకు నీ వాక్యమును నేను పంపుచున్నాను. అది ఈ రాత్రి రక్షణను తీసుకొనివచ్చును గాక. ప్రభువా, దానిని దయచేయుము.
నీవు ఇలాగు చెప్పియున్నావు, "నమ్మినవారు. నా మాటను విని నాయందు విశ్వాసముంచినవారు నిత్యజీవమును పొందుకొనును." ఇప్పుడు ప్రభువా! అది నీ వాక్యమైయున్నది. నీవే దానిని చెప్పియున్నావు.
విజ్ఞాన శాస్త్రము ప్రకారము వారు ప్రతి నియమమును జయించారు. మా చేతులను మేము పైకెత్తలేమని విజ్ఞాన శాస్త్రము చెపుతుంది, గురుత్వాకర్షణ శక్తి క్రిందకు లాగుతుందని అది చెపుతుంది. కాని, మానవునిలో ఒక ఆత్మ ఉన్నది. అతడు నిర్ణయమును తీసుకొని మరియు తన చేతిని పైకెత్తగలడు, ఎందుకనగా అతడిలో ఉన్న ఆ ఆత్మ అతడిని విజ్ఞాన శాస్త్రము యొక్క నియమమునకు వ్యతిరేకముగా నడిపించుచున్నది. దేవుడు ఇలాగు చెప్పెను, వారియొక్క చేతులను వారి యొక్క సృష్టికర్త వైపు ఎత్తును. పరలోకపు తండ్రి, ఇప్పుడే వారి హృదయములలో నీ వాక్యము కుమ్మరింపబడును గాక, హృదయము యొక్క గర్భమందు అది కుమ్మరింపబడును గాక, అది వారిలో నుండి క్రీస్తు యొక్క వధువును బయటకు తెచ్చును గాక. తండ్రీ, దయచేయుము.
90ఈ భవనములో రోగులు ఎవరైతే తమ చేతులను పైకెత్తియున్నారో, వారందరు చేతులెత్తిన కారణమేమంటే వారు అవసరతలో ఉన్నారు. స్వస్థపరచేది నీవేనని వారు నమ్ముచున్నారు. ఇప్పుడు, ఈ విశ్వాసభరితమైన ప్రార్థనను నేను ప్రార్ధిస్తున్నాను. ప్రభువా, యేసుక్రీస్తు నామమున నేను దానిని పంపుచున్నాను, ఆ విశ్వాసము ఇప్పుడే ప్రతియొక్కరి హృదయములో కుమ్మరింపబడును గాక. వారిలోని ప్రతియొక్కరు స్వస్థతను ధృఢముగా పొందుకొనులాగున దేవుని యొక్క వాక్యము పనిచేయును గాక. తండ్రి వీరికి అది దయచేయుము.
మరలా చెప్పుచున్నాను, ఇక్కడ ఉన్న ఈ చేతి రుమాళ్ళకై చెప్పుచున్నాను, పౌలు శరీరమును తాకిన చేతిరుమాళ్ళు మరియు గుడ్డలను వారు తీసుకున్నారని వాటివలన అపవిత్రాత్మలు మరియు వ్యాధులు ప్రజలలో నుండి పారిపోయినవి అని పరిశుద్ధ గ్రంథములో ఉన్నదని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. మనము పరిశుద్ధుడైన పౌలు వంటివారిమి కాము. కాని, ఆ కార్యములను చేసినది పౌలు కాదు ఎందుకనగా అతడిలోవున్న వాక్యము ఆ కార్యమును చేసియున్నది. నీవింకను అదే వాక్యముగా ఉన్నావు.
ISA 55:11•
3JN 1:2
91తండ్రీ, ఇశ్రాయేలు ఒకసారి వాగ్దాన భూమిని దాటినట్లయితే, అది నీ యొక్క వధువుగా మారును. ఆమెను నీవు వాగ్దాన దేశపు మార్గమున నడిపించియున్నావు. ఆమె కొరకు నీవు ఒక మార్గమును ఏర్పరిచియున్నావు. శత్రువు ఆ దారిని పట్టుకున్నాడు. అప్పుడు రౌద్రమైన కళ్లతో నీవు అగ్నిస్థంభములో నుండి క్రిందకు చూశావు. అప్పుడు సముద్రము భయపడి వెనుకకు వెళ్ళినది. ఇశ్రాయేలు ముందుకు వెళ్ళినది.
దేవా! ఇప్పుడు, నీవు ఆ అగ్నిస్థంభములో నుండి చూడవద్దు కాని, ఒక ఉద్దేశ్యము నిమిత్తము మరణించియున్న నీ స్వంత కుమారుని యొక్క రక్తములో నుండి చూడుము. నీ వాక్యమును నేను పంపుచున్నాను. దెయ్యము భయపడును గాక, వాడు పారిపోవును గాక, ఇశ్రాయేలు చేరుకున్న ప్రజలు దేవుని యొక్క వాగ్దానమును ఏ విఫలము చెందకుండా చేరుకుందురు గాక. ఆ గొప్ప వాగ్దానము యొద్దకు వారు వచ్పుదురు గాక, "పై అన్ని కార్యములతో పాటుగా నిన్ను నేను ఆరోగ్యముతో అభివృద్ధి చెంది౦చెదను." ప్రభువా మాకది దయచేయుము. మేము వాక్యమును ఎక్కడకి పంపియున్నామో అక్కడ ఆ కార్యములు చేయును గాక, శూన్యముగా నీ వాక్యము వెనుతిరగదు అని చెప్పుచున్నాము. ఏ ఉద్దేశ్యము నిమిత్తమైతే నీ వాక్యము పంపబడినదో, నీ వాక్యము తప్పక దాన్ని చేరుకుంటుంది. ఈ ప్రజల కొరకు నేను విశ్వాసముతో యేసుక్రీస్తు నామమున ప్రార్ధిస్తున్నాను.
92మనము మన తలల వంచియుండగా, చెప్పబడిన దానిని మీలో ఎంతమంది అంగీకరిస్తున్నారు, దేవుని యొక్క వాక్యము మీ దగ్గరకు వచ్చినదని నమ్ముచున్నారా, మీరు దానిని అంగీకరిస్తున్నారా? చేతులను పైకెత్తిన ప్రతియొక్కరు, అది నీకేమైయున్నది అనేదానికి సంబంధము లేకుండా నీ చేతిని పైకెత్తి ఇలాగు చెప్పుము, "నేను నమ్ముచున్నాను. ఇప్పుడే నేను దీనిని అంగీకరిస్తున్నాను. నేను అడిగినది నేను పొందుకున్నానని నమ్ముచున్నాను." దేవుడు నిన్ను దీవించును. అది అద్భుతముగా ఉన్నది. అది మేలైనది. దేవుడు నిన్ను దీవించును. దేవుని యొక్క వాక్యము నీలో తన వేర్లను ఉంచుతుందని నేను ఆశిస్తున్నాను.
93మీ తలల వంచియుండగా, ప్రియమైన సోదరుడు, మీ కాపరి ఇక్కడకు వచ్చి అతను ఇంతకు ముందు చెప్పియున్న భాగమున చెప్పును. కూడికలలో సువార్తీకులే సమస్తము చేయకూడదు. పరిశుద్దుడైన మీ కాపరిని మీరు ఎరిగియుండవలెను. తమ కార్యముల నిమిత్తము తమ చేతులను పైకెత్తిన ఈ ప్రజలను బట్టి నేను సంతోషిస్తున్నాను, ఈ ప్రియమైన కాపరిని నేను వారికి అప్పచెప్పుచున్నాను. మీ స్వస్థతకు మరియు మీ యొక్క రక్షణ నిమిత్తమై అతడు మిమ్ములను దేవునిలో మరింత లోతైన అనుభవములలోకి నడిపించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక.