జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసము
VGR COUNT-547 1నెవిల్ సోదరుడా, నీకు ధన్యవాదములు, ప్రభువు నిన్ను దీవించును గాక.
శుభోదయము, స్నేహితులారా! శుభోదయము. ప్రభువు మందిరములోనికి తిరిగి వచ్చుట సంతోషముగా వున్నది. కొంత సమయము ముందు ఒక వృద్ద సేవకునికి ప్రార్థించుట కొరకు నన్ను అక్కడికి పిలిచారు. అతను కొంతసేవు స్పృహ తప్పినట్లుగా అయ్యాడు. కానీ, అతనిలో ఏ జబ్బు లేదు, అతను దేవుని యొక్క పరిశుద్దుడైన వృద్ద వ్యక్తి. ఇచ్చటకు నేను వచ్చుచుండగా దారిలో సాతాను నన్ను కూడా వాంతులతో బలహీనపరచడానికి ప్రయత్నించాడు, "ఇప్పుడు మనము ఒకరి కొరకు ఒకరు ప్రార్థించబోవుచున్నాము," అని నేను చెప్పాను. ఆ విధముగా వున్న వృద్ద వ్యక్తి పేరు సహోదరుడు కగ్గిన్స్; ఈ మందిరములో అతడిని గూర్చి మనము చాలా బాగా ఎరుగుదము. అతను కరోలినా నుండి వస్తాడు. చాలా బలహీనముగా వుండి, లేచి నిలువబడిన వెంటనే సృహతప్పి పడిపోయాడు, కానీ శారీరకముగా ఏ విధమైన సమస్య అతనికి లేనట్లు కనిపించుచున్నది; అందువలన అతన్ని అలా శోధించుటకు కేవలము సాతాను ప్రయత్నించినది, వాడు గొప్ప శోధకుడు మరియు వాడు మంచివాడు కూడా.
ఎవరి గురించి చెడు మాట్లాడకుండా ఉంటూ సంఘమునకు వెళ్ళే ఒక వృద్ద సహోదరి, సోదరి కథ గురించి మీరు విన్నారు.
చెప్పెను, "దయ్యము గురించి నీవేమి తలస్తున్నావు?"
"మంచిది, అతను ఒక మంచి శత్రువు!" కనుక అతడు ఏమైవున్నాడో, అదే అతడు, అని చెప్పింది.
2ప్రభు రాకడకు ఎదురు చూస్తూ, మరలా ఈ వారము ప్రభువు మందిరములో వుండుట ఈ ఉదయకాలము మనకు ఎంతగానో సంతోషముగా వున్నది.
ఇప్పుడు, ఈ ఉదయ కాలము "రక్తము ద్వారా భద్రపరచుట" అనే అంశము పై మాట్లాడాలని వచ్చాను, కానీ పరిశుద్ధాత్మ నా మనస్సును మార్చినట్లు కనిపించుచున్నది. వేరొక అంశమును నేను బోధిస్తాను, ఎందుకనగా నేను గతరాత్రి చెప్పాను, "రక్తము ద్వారా భద్రపరచుట," అనే అంశము మీద నుండి నా మనస్సును ఎందువలన ఆయన త్రిప్పెనో, ఆ అంశము ఎక్కడిదో మీరు అర్ధము చేసుకొన్నారా? ఇశ్రాయేలీయులు రక్తము క్రింద వుండి వాగ్దానము కొరకు సాగిపోయిరి. మీరు చూశారా? నేను ఇంకెప్పుడైనా దాని గురించి మాట్లాడతాను.
3కొంతకాలము క్రిందట నాకు వచ్చిన కల గుర్తుకు వచ్చుచున్నది. ఈ కలలో నేను ఆహారమును ఆలయములలో నిల్వ చేయవలసివున్నాను. (చూశారా), కొన్ని వారముల క్రిందట నాకు ఆ కల రావడము ఎంత మందికి జ్ఞాపకమున్నది? దానియొక్క భావమును నేను మీకు చెప్పలేదు. మరి దానిని చెప్పుటకు అది ఎక్కువ సమయమము తీసుకోనియెడల, మీరు వినుటకు ఇష్టపడినట్లైతే ఇప్పుడు నేను దానిని గూర్చి మీకు చెప్పెదను.
4తరచూ ఏదో ఒక అర్థము కలిగిన కలలను నేను కంటూ వుంటాను, సాధారణముగా, నేను ఆలస్యముగా నిద్రపోతూ మేల్కొంటాను, మేల్కొనిన తరువాత ఉద్రేకముగా లేదా అలసటగా వుంటుంది; మీరు కూడా కలలుకని మరలా వెళ్ళి నిద్రపోయి, కలనుకని, మేల్కొనండి. అప్పుడు మీ శరీరమందు ఏ విధమైన అనుభవము కలిగి వుంటారో మీకే తెలుస్తుంది. కావున ఒక ఉద్రేకముతో నిండిన నా శరీరము ఏలాగు వుంటుందో మీకు అర్ధమగును. సహోదరుడు ఉడ్ మరియు సహోదరుడు సాత్మన్లతో కలసి నేను బయట ప్రదేశాలకు వెళ్ళాను. టుసాన్, అరిజోనా మరియు అనేక ప్రాంతములలో నుండి ప్రజలు ప్రభువును అంగీకరించుచున్నారు. ప్రతి విషయములను గూర్చి ప్రభువు స్వప్నములనిచ్చి మరి వాటికి ఖచ్చితమైన అనువాదము ఇచ్చుచుండెను.
5ఇప్పుడు, మీరు చూడండి, ఎవరైనా నాతో ఎప్పుడైనా ఒక కల గురించి చెప్పినప్పుడు, దానికి నేను అర్ధము చెప్పే ఒకే ఒక విధానమేమనగా, ఆ కలను మరలా చూస్తాను. ఇక్కడ మీలో చాలా మందికి తెలుసు, కొంతమంది తమ కలలను చెప్పుచూ దానిలోని విషయములను చెప్పుదురు, కానీ మీ కలలో ఏమి చూశారో దానినంతటిని మీరు నాతో చెప్పరు, కానీ మీరు చూసిన అదే కలను నేను మరల చూచుట ద్వారా మీ కలలో దేనినైతే మీరు నాతో చెప్పలేదో దానిగూర్చి నేను తెలుసుకుంటాను, చూశారా. కావున మరలా మీరు కనిన కలను మీరు గుర్తుచేసుకోవచ్చును, అప్పుడు ఆయన ఆ కలయొక్క భావము చెప్పును. అట్లు ఆయన ఆ కలకు భావము చెప్పినప్పుడు అది కొన్నిసార్లు ఖండించును, కొన్నిసార్లు అది కఠినముగా వుండును, దానితో నీవు ఏకీభవించకపోవచ్చును; కానీ, నీవు ఆ విషయమునందు తప్పక యదార్థముగా వుండాలి, ఎందుకనగా అది ప్రభువు యొక్క వాక్యమైయున్నది, చూశారా. ఎందుకనగా ఆ కలకు నిజమైన భావమును వారు ఎదురుచూచుచున్నారు. ప్రభువు నా యెడల ఎంతో మంచిగా వుంటూ చెప్పిన ఆ కల యొక్క భావము ఎలప్పుడూ సరిగానే ఉంటుది.
6ఆ రాత్రి నిద్రపోగా నేను కలగన్నాను, మరి నేను అనుకున్నాను, సంత్సరాల క్రిందట ఒక వ్యక్తితో నేను బాక్సింగ్ చేసేవాడిని, మీలో చాలా మందికి పాతకాలపు వారికి తెలుసు, నేను సహోదరుడు రాయ్ స్లాటర్ గురించి ఆలోచించుచున్నాను. అక్కడ ద్వారము యొద్ద నిలుబడి వుంటాడు. అతడు మనతో ఉండేవాడు. ఇక్కడ సంఘములోని పాత సభ్యులలో అతడు ఒకరని నేను ఊహించుచున్నాను. సహోదరుడు స్లాటర్, పురాతన సభ్యులలో ఎవరో ఒకరి ప్రక్కన వుంటాడని నేను తలుస్తున్నాను.
నేను అతని గురించి మాట్లాడుచుండగా, అతని గురించి ప్రజలకు తెలియని ఎన్నో మంచి సంగతులు రాయ్ స్లాటర్ గురించి చెప్పుటకు కలవు. ఆయన నా సోదరుడు. ఆయన మరణించి అవతలి గట్టుకు వెళ్ళిపోయిన తరువాత ఒక పెద్ద పూలదండను ఇవ్వడం కంటే అతడిలో ప్రాణం ఉన్నప్పుడే ఒక పూలగుత్తి లేక ఒక మొగ్గను ఇచ్చుట యుక్తమైనది. అది నిజము. అతన్ని గురించి చాలా మంచి విషయములు వున్నవి.
సోదరుడు రాయ్ నాకు ఒక నిజమైన సోదరుడిగా వుండెను, అతను మరియు అతని కుటుంబము అక్కడ నివసించుచుండెను, ఆ కుటుంబము నిమిత్తము కష్టపడి పనిచేసి చక్కగా పిల్లలను పెంచాడు. అతని కుమారులు మరియు కుమార్తెలందరిని నేనెరుగుదును. అతని చిన్న కుమారుడు చనిపోయినప్పుడు, అతని సమాధి కార్యక్రమ సమయములో నేను ప్రసంగించితిని.
7ఒకప్పుడు ఇచ్చట సంఘములో ఒక వ్యక్తి పని చేయుచుండుట నాకు జ్ఞాపకమున్నది. అతడు వడ్రంగి పనిని ఇచ్చట చేయవలసి వచ్చినది. మా దగ్గర ఎక్కువ ఖర్చుపెట్టుటకు అంత ధనము లేదు. అతడు మందిరములో లోపలి భాగమందు పని చేయుచుండెను. ఎవరో ఒకరు తాను కూడా పని చేయాలని ఇష్టపూర్వకముగా వచ్చాడు, కాని అతడు పని చెయ్యలేదు. ఎంతో ఇష్టంగా తనంట తానుగా సంఘములో పనిచేయాలని వచ్చిన అతడు, తాను అరగంట మాత్రమే పనిచేసెను. ఆ విధంగా పని చేసేటప్పుడు అతని కాలికి దెబ్బ తగిలినదని చెప్పెను. తన కాలికి తగిలిన గాయము నిమిత్తము నష్టపరిహారముగా పదివేల డాలర్లు అతడు కోరెను (సంఘమునకు వ్యతిరేకముగా అతడు నష్టపరిహారము కోరుచూ వ్యాజ్యము వేసెను). మా దగ్గర ఏమీలేదు. అతడు వేసిన వ్యాజ్యము యొక్క తీర్పు వెలువడే వరకు మాకసలు దానినిగూర్చి ఏమీ తెలియదు, చూశారా. వారు వ్యాజ్యమును మాపై వేసిరి, ఆ వ్యక్తికి భీమా లేకపోవడము వలన అది మా మీద పడింది. మేము అసలు డబ్బు చెల్లించవలసిన అవసరమే లేదు.
8మరియు అక్కడ నేను ఆ వెనుక, అలాగే కూర్చున్న రాత్రిని నేనెన్నడూ మరువను, రాయ్ తన జేబులో చేతినిపెట్టి, చినిగిన పాత (సహోదరుడు రాయ్ ఈ విధంగా చెప్పుచున్నందుకు నన్ను క్షమించుము) జేబులోయున్న చిన్న పుస్తకమును తీసి తాను కష్టపడి పని చేయుట ద్వారా సంపాదించిన చెక్కులను తీసి "సహోదరుడా బ్రెన్హాం ఈ చెక్కుల (డబ్బు)ను మీకు ఇచ్చుచున్నాను," అనెను.
అతడి యొక్క సహోదరి వృద్దురాలైన ఎవిలైనా, (ఇప్పుడు ఇచ్చట ఎచ్చటో ఒకచోట కూర్చుని యుండును) ఆమె, "సహోదరుడా బ్రెన్హాం, నాకున్న నా చిన్న పాత గృహము మూడు వందల డాలర్ల విలువ చేస్తుంది, అందుచేత దానిని అమ్మివేసి ఆ డబ్బుతో ఏదైనా చేయవచ్చును," అని చెప్పినది, చూశారా. అది నిష్కళంకమైన ఒక చర్యగా వున్నది. మీరు నన్ను అడిగినయెడల, అది ఒక యదార్థమైన చర్యగా వున్నది.
అప్పటికి కొంతకాలం తరువాత నాకు జ్ఞాపకమున్నది, నా మొదటి బహిరంగ కూటములో నేను వున్నాను. నా మొదటి పెద్ద కూటములలో ఒకటైన సెయింట్ లూయీస్ లో నేను ఉండగా ఒక టెలిగ్రామ్ వార్త నాకు వచ్చినది. అందులో, "నా చిన్న కుమార్తె మరణపు అంచున వున్నది. ఒక్కసారి రావలెను - సోదరుడు స్లాటర్," అని యుండెను. నేను తర్వగా వెళ్ళి నా బట్టలు సర్దుకుని బయలుదేరాను. అతను పంపిన వార్తను నేను త్రోసివేయలేను, దానిని నేను చేయవలసివున్నది, మేము ఇచ్చటకు వచ్చాము. నేను ఇంటికి వచ్చి అచ్చటవున్న గదిలోనికి వెళ్ళాను, న్యూ-ఆల్బనీ యందు ఒక కేథలిక్ వైద్యశాల కలదు, అచ్చటనున్న నర్సులు ఈ చిన్న బిడ్డ ఇక బ్రతుకదు అని తండ్రితో చెప్పి, ఆశలు వదులుకున్నారు. మేము గదిలోకి వెళ్ళిన వెంటనే, ప్రభువైన యేసు ఆమెను స్వస్థపరచెను. అచ్చట ఆమె ఆరోగ్యముగా చక్కగా ఉన్నది, చూశారా. ఆహారమును నీళ్ళమీద వేయుము ఒక దినమున నీయొద్దకు అది తిరిగివచ్చును, అనే సామెత రీతిగా ఉన్నది.
9నేను మాట్లాడవలసిన దానిని వదిలేసి వేరొక దానికి వెళ్ళిపోయాను, కాబట్టి మరలా ప్రారంభము నుండి చూద్దాము. నేను బాక్సింగ్ చేసేవాడ్ని. అక్కడ ఒక వ్యక్తి వుండేవాడు. అతని పేరు స్మిత్ (ఈ పట్టణంలోనే అతడు నివసించుచున్నాడు. అతడి పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి, ఎందుకనగా త్రాగుడికి అతడు బానిస అయిపోయాడు. అతని కుమారులలో ఒకరు పోలీసు శాఖలో వున్నారు.) జార్జ్ స్మిత్; అతన్ని వారు "ఆరు నిమిషముల స్మిత్," అని పిలిచేవారు. "గోల్డెన్ గ్లోవుస్" అనే పోటీలు ప్రారంభము కావడానికి ముందే జరిగిన సంభవము, కాబట్టి ఈ జార్జ్ స్మిత్ అనే అతడే బాక్సింగ్ లో నాకు తర్ఫీదును ఇచ్చేవాడు. మేము ప్రభుత్వ మైదానమందు వున్నాము. నేను చూసిన వారిలో ఇతడే చాలా కరుకైన వ్యక్తిగా నాకు కనిపించెను. అతడు నన్ను ఒక్క గుద్దు మాత్రమే గుద్దేవాడు. ఇక నా కళ్ళు బైర్లు కమ్మి, గాలిలోనే బొంగరము తిరిగినట్లు తిరిగిపోయేవాడిని. మళ్ళీ నేను లేచి నిలబడి, "నీవు నన్ను ఇంత గట్టిగా కొట్టకూడదు, నా శ్వాస ఆగిపోయేలా కొట్టి నన్ను కిందకి త్రోసేస్తున్నావు," అని నేను చెప్పేవాడిని.
"బిల్లీ, నీవు ఎంత మంచి తర్ఫీదు పొందినప్పటికినీ, ఎంత గొప్ప అనుభవము కలిగిన ఆటగాడిగా వున్నప్పటికీ నీ యొక్క ఎత్తుకు సరిపడే ఎంత బలము వున్నప్పటికీ లేక అటువంటిదీ ఏదైనప్పటికినీ, ఒక్క దెబ్బ ఆ విధముగా తగిలినప్పుడు అది నీ రక్తమును నిలిపి వేస్తుంది," అని చెప్పాడు. ఇప్పుడు నన్నునీవు ద్వేషించినను నీవు ఆ రింగ్ లోకి వెళ్ళినప్పుడు, నేను ఇచ్చిన ఈ తర్పీదును, అప్పుడు మెచ్చుకుంటావు. ఈ తర్ఫీదు వలన ఎదుట వ్యక్తి కొట్టే దెబ్బలను ఎదుర్కొనే శక్తిని నీ శరీరము పొందుకొనును. అతడు నిన్ను ఒక్క గుద్దు గుద్దినప్పుడు, నీవు క్రింద పడిపోతే అప్పుడు ఆట యొక్క మధ్యస్థుడు నీవు లేచే వరకు అంకెలను లెక్కించడము ప్రారంభిస్తాడు. కానీ నీ శరీరము తర్ఫీదువలన బాగా దృడపడినప్పుడు, ఆ గుద్దులను ఎదుర్కొని నిలబడగలదు. ఒక బలమైన గుద్దు నీ శరీరమును తాకినను దానిని లెక్క చేయకుండా నీ యెదుటి వ్యక్తిని వెంటనే తాకుటకు సిద్దముగా వుండెదవు. క్రింద పడిపోయినను వెంటనే లేచి మరలా సిద్దపడెదవు. అతడు గుద్దిన గుద్దుకు ఒకవేళ వృత్తము (రింగు)కి వెలుపల దాటి నీవు క్రింద పడిపోయినను, వెంటనే లేచి మరలా వృత్తములోనికి వచ్చి నిలబడతావు, అర్ధమైందా? అతను నన్ను చంపటానికి ఇష్టపడ్డాడు. అతను నాకంటే 30 లేక 40 పౌండ్ల ఎక్కువ బరువు కలిగినవాడు. అతను ఒక యోధుడు మరియు నేను ఒక విద్యార్థిని, అందువలన అతను నన్ను చంపినంతగా చేశాడు. "నీవు రింగులోనికి వెళ్ళినప్పుడు దానిని నీవు సమర్ధించెదవని," అతను చెప్పాడు. అది నిజమేనని నేను తెలుసుకున్నాను.
10రాణ సైన్యములో కొత్తగా చేరే కుర్రవాళ్ళకు సార్జంట్ కఠినమైన తర్ఫీదును ఇచ్చునని నేను విన్నాను. వారు ఆ సార్జంట్ను ద్వేషించెదరు. కానీ యుద్ధము వచ్చినప్పుడు ఆ సమయమునందు వారు ఎదుర్కొను సవాళ్ళనుబట్టి వారు ఆ సార్జంట్ ని మెచ్చుకుంటూ ప్రేమిస్తారు, ఎందుకనగా, ఆ సార్జంట్ ఆ కుర్రవాళ్ళకు ఇచ్చిన తర్ఫీదు వలననే వారు ఆ గట్టి సవాళ్ళను ఎదుర్కొని నిలబడగలిగారు. ఆ విధముగానే క్రైస్తవులగు మీకు నేను తర్పీదును ఇచ్చుటకు ప్రత్నించుచున్నాను. స్త్రీలారా, మీరు మీ వెంట్రుకలను చెవుల వరకు కత్తెరించుకొనవద్దు. మీ ముఖములకు రంగులను వేసుకుంటూ అలంకరించుకోవద్దు, ఇటువంటి కార్యములను మీరు చెయ్యకూడదు. కఠినమైన తర్పీదును మీరు అనుసరించండి. ఆ విధముగా క్రైస్తవులగు మిమ్ముల్ని తర్ఫీదు చేయడానికి నేను ప్రయత్నించుచున్నాను. ఈ మార్గము యొక్క చివరకు మీరు వచ్చి చేరినప్పుడు నన్ను మెచ్చుకొనెదరు, చూశారా. ఆ తర్ఫీదు (చూశారా), సరైన శిక్షణ తీసుకోవడం. సరైన విధానములో ఆ తర్ఫీదును మీరు తీసుకొనండి. మనము వాక్యముతో ఏకీభవిస్తూ సరైన విధానములో దానితోనే నిలిచియుందుము. అది కఠినముగా ఉన్నప్పటికీ, నీ సంస్థల యొక్క భిన్నమైన బోధలను ముక్కలు ముక్కలుగా అది ఖండించినప్పటికిని, తర్పీదు అనే మార్గములగుండా, ఆ మార్గము యొక్క చివరకు వచ్చినప్పుడు మీరు దానిని మెచ్చుకొంటారు, చూశారా. మీరు ఆ గ్రంథముతో నిలిచియున్నారు.
11కావున, నా భార్య తన చేతిని నా చేతిలో వుంచి నన్ను పట్టుకొనగా, మేము అలా నడుస్తూ ముందుకు సాగిపోయాము మరియు జార్జ్ స్మిత్ (ఇప్పుడు, అతడు తల వెంట్రుకలు నెరసినవాడై, అతడు ఏడు, ఎనిమిది లేక పది సంవత్సరములు నాకంటే పెద్దవాడని నేను ఊహించుచున్నాను), అతడు మరలా ఆ బాక్సింగ్ రింగ్ లోకి వెళ్ళి ఆ పోటీలో పాల్గొనుచున్నాడు. ఆ పోటీలలో అతడిని ఎదుర్కొనే యవ్వనస్తులు వెడల్పయిన భుజములు గలవారై, ఎంత బలముగా ఉన్నను, అతడితో సరితూగలేక పోవుచున్నారు. అతడు ఒకే ఒక్క క్షణములోనే వారిని పడగొట్టుచున్నాడు.
ఒక యవ్వనస్తుడు, "ఆ ముసలి వ్యక్తిని నేను ఓడించగలనని నాకు తెలుసు, నేను అతడిని ఓడిస్తానని," చెప్పాడు. కావున ఆ బలిష్ఠమైనవాడు, ఈ వృద్దుడైన జార్జి స్మిత్ తో పోటీపడుటకు వృత్తములోకి దూకెను, కేవలం అర నిమిషము కూడా అతనిని ఈ యవ్వన వ్యక్తి ఎదుర్కొనలేకపోయెను. అతడు ఆ వృత్తములో నుండి వెలుపలికి వచ్చి, "అతడు వృద్దుడైనా కూడా అతడు గుద్దే ఆ గుద్దులో ఆ బలము ఎక్కడ నుండి వచ్చుచున్నదో నాకు తెలియటలేదు, ఖచ్చితముగా అతడు ఒక నిజమైన యోధుడు," అని చెప్పెను.
12పిదప, ఒక స్వప్నమునందు నేను నా భార్యవైపు చూస్తూ "శ్రీమతి, ఇతడే నాకు మొట్టమొదటిగా శిక్షణ ఇచ్చినవాడు," అని చెప్పాను. (స్వప్నములు గమ్మత్తుగా వుండునని మీరెరుగుదురు), తరువాత నేను పెద్ద సముద్రము యొద్దకు వచ్చాను, అది అలలతో ఉప్పొంగుచున్నది. ఆ పడవ యజమాని… (అప్పుడు, నా భార్య మీడా నాతో లేదు.) అక్కడికి వచ్చాడు, అతడు ఇంచుమించు రెండున్నర అడుగులు లేదా మూడు అడుగుల పొడవుగల చిన్న పడవను నాకిచ్చాడు. అది స్వచ్చమైన తెల్లని రంగులో వున్నది; మరియు చెప్పెను… అది ప్లాస్టిక్ పదార్ధముతో చేయబడి తెల్లగా వున్నది. ఆ పడవని నడుపువాడు, "నీ పడవ ఇదిగో ఇక్కడ వున్నదని చెప్పాడు."
"ఓ, నేను దీనితో దాటలేనని," చెప్పాను.
అతను, "అది గంటకు యాభై మైళ్ళు ఈ మార్గములో వెళ్ళి రాగలదని," అన్నాడు.
"అది ఒకవేళ ఒడ్డు ఓరగా వెళ్ళి రాగలదుగానీ, అక్కడకు చేరదని," నేను చెప్పాను.
"మంచిది, వారితో వేళ్ళుము," అని అతడు అన్నాడు. అక్కడ సహోదరుడు ఉడ్ మరియు సహోదరుడు ఫ్రెడ్ సాత్మన్ కూర్చొని వుండుట నేను చూశాను, ఆ ఇద్దరు సోదరులు కలకనిన రోజు రాత్రి నాతో వున్నారు. వారు ఒక ఆకుపచ్చని నావలో కూర్చుని వున్నారు. నావకు సంబంధించిన సామాగ్రి చాలా వుంది. గుడారములను వేయు కాన్వాసు గుడ్డలు, త్రాళ్ళు మొదలగు వస్తువులు కలవు. "వారక్కడ కూర్చొనివున్నారు, వారితో వెళ్ళు," అని అతడు చెప్పాడు.
"వారికి పడవను ఎలా నడపాలో అసలు తెలియదు," అని నేను అన్నాను. "అది నాకు తెలుసు," అని అతడు అన్నాడు. "కానీ, నాకు పడవను నడపటము తెలుసు, ఆ దోనెను ఏ విధంగా ఉపయోగించాలో దానిని గూర్చి కూడా నాకు తెలుసు; కాని వారికి దానిని గూర్చి అసలు ఏమీ తెలియదు, ఎలా ఉపయోగించాలో తెలియదు. కావున, వారితో కలసి ఆ విధముగా నేను వెళ్ళలేను," అని నేను చెప్పాను.
"సరే, వారు నిన్ను ప్రేమించుచున్నారు, నీవు ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళి, ఎందుకని దానిని నిలువ చేయకూడదు?" అని అతడు అడిగాడు.
13కనుక నేను వెనక్కి వెళ్ళాను, మేము క్లోన్ డైక్ అనే ఒక చిన్న స్థలమునందు ఉన్నాము (అది నాగరికతతో జీవించే జనసంచారముగల వారినుండి సుమారు నలువది మైళ్ళ దూరమునకు అవతల ఆ స్థలము కలదు. పశువుల కొరకు వస్తువులను దాచుకొనుటకు ఒక చిన్న గది మరియు మొదలగునవి కలవు) కాని అది ఈ గుడారమువలె మారిపోయినది. నేను సరిగ్గా ఇక్కడే నిలువబడి వున్నాను. నేను ఎన్నడూ చూడనటువంటి శేష్ఠమైన ఆహారముతో నింపబడియున్న పీపాలను తీసికొనివచ్చి పెట్టమని కేకలువేస్తూ నేను పిలుస్తున్నాను. చూచుటకు మూడు అడుగుల పొడవుగల ముల్లంగి దుంపలు కనబడినవి, వేరొక రకపు దుంపలు, కూరగాయలు, బంగాళదుంపలు, మరియు ప్రతి కాయగూరలు అందులో కలవు.
నేను దానిని సరిగ్గా నిలువచేయుచు అక్కడ నిలువబడ్డాను, అంతలో నేను మేల్కొన్నాను. దానిని నేను అర్ధము చేసుకొనలేకపోయాను; అది ఒక సాధారణమైన కల అని తలంచి దానిని నేను అలాగే విడిచిపెట్టాను. సహోదరుడు ఉడ్ మరియు అనేకులు, కావున ఇక్కడ దాని అర్ధము కలదు. మీతో చాలాసార్లు చెప్పినట్లుగా, నేను నిరీక్షించి యుండవలసియున్నది. జరగవలసిన సంగతులు మీకు జరుగుటకు ముందుగా కొన్ని వాస్తవమైన సంగతులు జరగవలెను.
LUKE 22:42•
1COR 4:19•
JAS 4:15
14ఇదిగో దాని అర్ధము ఇలా వున్నది, చూడండి. మేము విదేశాలలో సేవ చేయుటకు ఆహ్వానము కొరకు ఎదురుచూచుచుంటిమి, నాకు మరియు నా భార్యకు పాలస్తీనా ప్రయాణమునకు అయ్యే ఖర్చులు నా చిన్ననాటి స్నేహితుడు సహోదరుడు మైనర్ ఆర్గన్ బ్రైట్ చెల్లించుచుండెను. మేము స్విట్జర్లాండ్ వెళ్ళి అక్కడ నుండి ఆఫ్రికాకు జూన్ లో ఒక కూటము కొరకు వెళ్ళాలి. నా భార్య మరియు రిబ్కా వారు జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మరియు పాలస్తీనాలకు వెళ్ళబోవుచున్నామని ఎరిగి చాలా ఉత్సాహపడిరి. నేను ఆఫ్రికా యందు నా కూటములను ముగించుకొని తిరుగు ప్రయాణమందు మార్గం మధ్యలో వారిని నాతో కలుపుకొని వెళ్ళు వరకు వారు అచ్చటనే నా కొరకు వేచియుండునట్లుగా ఏర్పాట్లు చేయబడినవి. కావున వారందరూ గొప్ప నిరీక్షణతో వున్నారు.
"ఒకవేళ దేవుని చిత్తమైతే, అని నేను (ఎల్లప్పుడు) చెప్పడము మీరు విన్నారు, ఒకవేళ దేవుని చిత్తమైతే, విదేశములో ఆ కూటము చెయ్యాలని గురి కలిగివున్నాను. అయినప్పటికీ ఇంకా ఖచ్చితముగా దానిని గూర్చి నాకు తెలియదు." కావున నేను దాని కొరకు వేచియున్నాను, కానీ అది ఏమైవున్నదో ఇక్కడ వున్నది; శ్రీ. స్మిత్, జార్జ్ స్మిత్ (ఆ బాక్సింగ్ ను నేర్పుటలో అతడే నా మొదటి శిక్షకుడు, అతడితో పోటీ చేయుటకు నేడు ఈ దేశమందుండు యవ్వనస్తులలో ఎవ్వరూ సరితూగలేరు), ప్రార్ధనా వరుసలో నా మొదటి శిక్షకుడు అతడే, చూశారా. అనేక సమయములలో నేను జనులను పైకి పిలిచినప్పుడు, దర్శనములు వచ్చును, వేచి యుండవలసి వచ్చును, "ఈ దర్శనము వచ్చినది దానిని చూడండీ, ఆ దర్శనము వచ్చినది," అని చెప్పెదను. అది ఎన్నడూ ఏ మంచి క్రియను చేయలేక పోయినది.
15ఇప్పుడు, నేను మొదటగా ప్రార్ధనా వరుసను ప్రారంభించగానే, ప్రార్థనా వరుస క్రమములో ఏదైనా సరిగా వున్నదా లేదా అని ఖచ్చితముగా కనుగొనేంత వరకు నేనెన్నడూ ఏ వ్యక్తిని ప్రార్ధించుకొనుటకు అనుమతించను. ఆయనే నన్ను ఆపి (చూశారా) దానిని గురించి నాకు తెలియ చేయును. నేను ముందుకు వెళ్ళి ప్రజల కొరకు ప్రార్థిస్తాను. అప్పుడు ఆ ప్రార్ధన యొక్క ఫలితములు వందరెట్లుగా వుండును. ఒకే రాత్రియందు నేను నాలుగు వందలు లేక అయిదు వందల మందికి ప్రార్ధించెదను. అట్లు ప్రార్ధించేటప్పుడు ఇరవై-ఐదు లేక ముప్పై దర్శనములు చూచెదను, అంతకంటే ఎక్కువ చూడకపోవచ్చు. బహుశా కొన్నిసార్లు పది లేదా పదిహేను దర్శనములను చూసెదను. అప్పుడు చివర్లో నేను బాగా బలహీనుడనై పోవుటవలన నన్ను బయటకు తీసికొని వెళ్ళుటకు ఇంచుమించుగా మీరు నన్ను మోసుకు వెళ్ళవలసి వచ్చును, అయినా గానీ మరలా అదే ప్రార్ధనా వరుసకు నేను వచ్చి నిలువబడి ప్రార్ధించుటకు ప్రారంభించెదను. (చూశారా), దాని భావమేమనగా మరలా నా మొదటి తర్ఫీదు యొద్దకు నేను తిరిగి వచ్చుట, ఆ సేవ అనే రంగము మీద ఏదీ కూడా దాని ముందు నిలబడుటకు శక్తి చాలదు లేదా దానికి సరితూగ లేదు, ఎందుకనగా అది వాక్యమైయున్నది. అది ఒక సంఘశాఖ కాదు; అది వాక్యము, చూశారా.
16అక్కడ మీరు తరువాత భాగమును గమనించినయెడల: కలలో మీడా వెళ్ళిపోయిన తరువాత నేను సముద్రము యొద్దకు వచ్చినప్పుడు, అది విదేశాలకు వెళ్ళుటకు భావముగా వున్నది.
ఇప్పుడు, సోదరుడు ఆర్గన్ బ్రైట్ గత రాత్రి ఫోనులో నన్ను పిలిచెను. ఎంతో ఉద్వేగముతో అతడు నాతో మాట్లాడెను. "సహోదరుడా బ్రెన్హాం, ఈ పర్యటన యందు అనేక దినములు విశ్రాంతిలో గడుపునట్లుగా వుండును. సహోదరుడు శకారియన్ కు గుండెపోటు వచ్చినది, అందువలన విదేశములలో ఏర్పాటు చేయబడిన కూటములు రద్దు చేయబడినవి," అనెను. కావున, ఆ స్విట్జర్లాండ్లో జరగబోవు కూటము కొరకు అచ్చట ఒకే ఒక రాత్రి కూటమునకు నేను వెళ్ళవలెనని అతడు ఆశించెను. అచ్చట ఒక్క రాత్రి కూటము మాత్రమే ఏర్పాటు చేయబడినది. పిదప, ఆ పర్యటనంతా విశ్రాంతితో గడపవలసిన ఒక పర్యటనగా అది మారిపోయినది. ఆ దేశమునంతటా కేవలము తిరుగుచూ గడుపునట్లుగా యుండును. అది ఎంతో చక్కగా వుండినది. సహోదరుడు ఆర్గన్ బ్రైట్, ఓ, క్రైస్తవ్యములో అతడు ఒక ఉన్నతమైనవాడు మరియు నాకు, నా కుటుంబానికి సన్నిహితమైన స్నేహితుడు.
17అంతే కాకుండా ఇచ్చట మీరు ఆ స్వప్నమును గమనించండి, ప్లాస్టిక్ తో చేయబడిన ఒక చిన్న పడవ గలదు. పడవలో నేను వెళ్ళవలెనని అతడు కోరాడు, ఆ చిన్న ప్లాస్టిక్ పడవ యొక్క భావమేమనగా, అది దేవుని యొక్క వాక్యమైవున్నది. నన్ను విదేశాలకు ఆహ్వానించేంతటి కూటములు ప్రసంగించుటకు నాకు అచ్చట లేవు. నేను అన్నాను, "ఒహ్! అది కాదు, కేవలము, దానికోసమా, ఒహ్."
అతడు, "అయితే వెళ్ళు - వారితో కలసి వెళ్ళు, వారు వెళ్ళుచున్నట్లు వెళ్ళు," అన్నాడు.
"వారు పడవను నడిపేవారు కాదు - ప్రసంగీకులు. నేనొక సేవకుడను. వారు వారి గుడారముల యొక్క సామాగ్రితో వెళ్ళినయెడల, అది వారందరూ కలసి వెళ్ళే ఒక విశ్రాంతిని పొందుకొను ప్రయాణమగును," అని నేను చెప్పాను. కానీ, నేను దానిని చేయలేదు. నేను ఆ ప్రయాణపు ఆహ్వానమును తిరస్కరించితిని. కావున, అదే ఆ కలయొక్క భావముగా వున్నది, చూశారా.
పిదప ఆర్గన్ బ్రైట్ గారు కొన్ని రాత్రుల క్రితము ఫోన్లో నాతో మాట్లాడుతూ… సహోదరుడు శకారియన్ యొక్క అనారోగ్యము కారణముగా విదేశాల కూటములు రద్దు చేయబడినవని మన మెరుగుదుము. కావున స్విట్జర్ల్యాండ్లో ఒకే ఒక రాత్రి కూటము మాత్రమే ఏర్పాటు చేయబడినది. కానీ మీడా మొదట "తాను విదేశాల ప్రయాణమునకు రాలేను," అని చెప్పవలసి యున్నది. కావున, ఒక దినమున నేను ఫ్లోరిడా లేదా జార్జియా నుండి మీడాతో ఫోన్లో మాట్లాడాను. సహోదరడు ఆర్గన్ బ్రైట్ నన్ను పిలిచి, "మనము మే నెల 20వ తారీకున బయలుదేరవలెనని చెప్పెను," అని నేను ఆమెతో చెప్పాను.
అందుకు ఆమె, "లేదు, కుదరదు, కుదరనేకుదరదు [చూశారా]. పిల్లలకు ఆ సమయములో పరీక్షలు జరుగుచుండును, అందువలన వెళ్ళుటకు వీలుపడదు," అని చెప్పినది, చూశారా! ఆ ఆహ్వానము ఆమె నిరాకరించునట్లుగా ఉండవలెను, ఎందుకనగా ఆ ప్రయాణములో ఆమె కూడ చేర్చబడియున్నది; ఆ ప్రయాణము ఆమెకు కూడా ఒక విశ్రాంతి పొందుకును ప్రయాణముగా వుండును. కావున దాని భావము అదియేయగును. కాబట్టి స్వప్నములు కూడా ప్రతీదానికి ఒక భావమును కలిగియున్నవి. ప్రతీది కూడా ఎచ్చటో ఒకచోట భావమును కలిగియుండును. కావున స్వప్నములు భావమునులను కలిగియుండును.
18నేను వెనక్కి వచ్చి మీరు అర్థము చేసుకొనునట్లు చెప్పుటకు గల కారణము ఇది టేపు చేయబడుచున్నది. ఇంటినుండి వచ్చే మార్గ మధ్యలో… అక్కడికి వెళ్ళే కొంచెము ముందు… నాకు ఒక దర్శనము వచ్చిన తరువాత గదిలో ఒక స్వరము నా యొద్దకు వచ్చి, ఒక సర్పమును గురించి మరియు అది బంధించబడినదనియు, కావున దేనినిగూర్చి నీవు భయపడనవసరము లేదని చెప్పిన విషయమును ఇచ్చట అనేకసార్లు నేను మరలా, మరలా చెప్పిన విషయము మీలో ఎంతమందికి జ్ఞాపకమున్నది? "భయపడవద్దు, నీవు ఎక్కడికి వెళ్ళితే అక్కడ నీతో వున్నానని నేను రుజువు చేయలేదా, నీ యొక్క వేట పర్యటనలలో నీతో వున్నానని నేను రుజువు చేయలేదా?" అని ఆయన చెప్పెను. నేను వెళ్ళే ముందు నేనేమి పొందుకొనబోవుచున్నానో మీతో నేను చెప్పుట మీకు జ్ఞాపకము లేదా? తరువాత నిజమైన మధుర స్వరము వచ్చి, "నేను నీతో ఉన్నానని నేను రుజువు చేయలేదా! నీవు ఎక్కడికి వెళ్ళితే అక్కడ ఎన్నడూ అపజయమెరుగని యేసుక్రీస్తు సన్నిధి నీతో వుండునని," చెప్పెను. దానివలన మనము దేనివద్దకో కదిలి ముందుకు సాగిపోవుచున్నామని తెలుసుకొన్నాను. అది ఏమిటో నాకు తెలియదు; నేను చెప్పలేను.
19గడచిన రాత్రి ఇంటికి వచ్చుచుండగా లేక ఇంటికి చేరేముందు, నేను ఒక దర్శనము వచ్చినది. నేను కొంతమంది చిన్నవాళ్ళను చూశాను, బక్క పలచగా, చూడడానికి యవ్వన కుర్రవాళ్ళువలె ఉన్నారు. టోపీలు పెట్టుకొని యున్నారు. మరి మేము వేటలో వున్నాము. నేను పెద్ద గంభీరమైన జంతువగు ఊదారంగులో గల ఎలుగుబంటిని కాల్చితిని. తరువాత వారు వెనక్కి తిరిగి నాతో, కానీ కూటము గురించి అక్కడ కొంత గందర గోళముగా ఉన్నదని చెప్పారు.
నేను "ఏ విధమైన గందరగోళమైనా లెక్కలేదు, ఒకవేళ నేను వెళ్ళాలని ఉంటే అది ఏమైనా గాని నేను వెళ్ళెదను," అని చెప్పాను, [చూశారా] దానిని గురించి నేను లెక్క చేయను, ఆ దర్శనము ఆగిపోయింది. ఆ దర్శనము ఏ స్థలమును గురించి సూచించుచున్నదో నాకు తెలియదు, కాని ఇది టేపులో వున్నది, అది జరగబోవుచున్నది, చూశారా? అది ఒక దర్శనము; అది జరుగునని గుర్తుంచుకొనండి.
20అందువలన, ఇప్పుడు వచ్చే ఆదివారము ప్రభువు చిత్తమైతే, టెన్నీస్సీలో వుంటాను, వచ్చే శనివారము రాత్రి మరియు ఆదివారము సోదరుడు ఎం.ఇ. లిటిల్ ఫీతో క్లీవ్లాండ్ నందలి టెన్నీస్సీలోని చర్చ్-ఆఫ్-గాడ్ ప్రధాన కార్యలయమునందు, సోదరుడు ఎం.ఇ. లీటల్ ఫీల్డ్ అతని యొక్క సంఘములో (2 లేక 3 సంవత్సరాల మునుపు దానిని అతని కొరకు ప్రతిష్ఠించితిని) క్లీవ్లాండ్ నందు టెన్నిస్సీలో వచ్చే శనివారము రాత్రి మరియు ఆదివారము ఉదయమునందు నేనచ్చట వుందును. ఆదివారము నాడు కేవలము ఉదయపు ఆరాధన మాత్రమే వుండును. నా కుటుంబముతో వెళ్ళి వచ్చుటకు నాకు సమయము వుండును. అతని సంఘమునకు మరలా వచ్చి బోధిస్తానని అతనికి నేను వాగ్దానము చేసాను. అది వచ్చే ఆదివారమగును.
అటు తరువాత వచ్చే ఆదివారము ముగ్గురు లేక నలుగురు రాష్ట్రపతుల క్రింద ఉద్యోగము చేసిన వాషింగ్టన్ పట్టణము యొక్క రాయబారియగు సహోదరుడు రోల్ తో పాటు సహోదరుడు ఆర్గన్ బ్రైట్ ఇచ్చట వుంటారు. ఆ ఆదివారం ఒక కొత్త చిత్రముతో వారిక్కడ వుంటారు. ఆ సమయమందు సాధ్యమైనంత వరకు అందరూ ఇక్కడ వుండటానికి ప్రయత్నించాలని నేను కోరుచున్నాను. నేను కూడ ఇక్కడ వుండాలని ఆశించుచున్నాను.
21దాని తరువాత ఆదివారము ఈస్టరు. ఈస్టరు రోజు ఇచ్చట గొప్ప కూడిక కొరకై మనము ఎదురుచూస్తున్నాము. ప్రభువు చిత్తమైతే, ఈస్టరు ఆదివారము ఇక్కడ నేను వుండాలని ఆశించుచున్నాను. మనకు తెల్లవారుజామున ఆరాధన ఉండును, బాప్తిస్మములు ఇవ్వటము జరుగును, మనయొక్క ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందగోరు వారందరూ ఇక్కడ ఆదివారము వుండండి. ఇంతకు ముందు చెప్పిన విధముగా లేదా ఊహించిన విధముగా మనకు కూర్చోనుటకు చోటు లేనందున మేము బాయిస్-క్లబ్ ను తీసుకొనేదము (ఏడు లేక ఎనిమిది వందల మందిని కూర్చోబెట్టుటకు సదుపాయము గల ఒక స్థలమది, ఇచ్చట నుండి కొంచెము దూరములో, సరిగ్గా ఇచ్చట మూలలో గల ఒక నూతన క్లబ్). బాప్తీస్మపు ఆరాధన కొరకు ఇచ్చటకు వచ్చి బాప్తీస్మపు ఆరాధన ముగించుకొని మరలా మనము అచ్చటకు వెళ్ళెదము, కావున ఈస్టరు ఉదయమున ప్రతి ఒక్కరు కుర్చోడానికి ఒక అనుకూలమైన సదుపాయము కలిగియుండెదము. ఈ వారములో దాని గురించి ప్రయత్నము చేసి దానిని కనుగొంటాము.
22దాని తరువాత ఆరాధన ప్రారంభమౌతుంది. ఇక్కడి నుండి నేను ఇరవై-ఐదు, లేక ఇరవై-ఆరున, ఈ నెలలో వెళతాను మరియు తరువాత 6, 7, 8, 9 మరియు 10న ముగించుకొని తిరిగి వచ్చు మార్గములో విక్టోరియా దీవిలో కొంతమంది ఇండియన్ల మధ్యకు వెళతాను. అక్కడ వారిని కలవాలంటే ఒక పడవలో వెళ్ళాలి.
నా యొక్క చిన్న మిషనరీ స్నేహితుడు, సోదరుడు … పోయినసారి ఆకురాలు కాలమందు వేటాడు పర్యటనయందు నేనతనితో వున్నాను. ఒక మంచి అందమైన గృహమునందు అతనితో, అతని భార్యతో నేను గడిపాను. అతడు ఉపయోగించే ఆయుధములు, అచ్చట వుండు సమస్తము మరియు వివిధ స్థలములు క్రొత్తగా వుండెను. అవును, అది అలాగే అనిపించినది. మినుగురు పురుగులు, నల్లులు మరియు అటువంటివి యుండు స్థలమందు వారు జీవించుచున్నారు. (చూశారా) వీటితోనూ మరియు ఆ ఇండియన్లతో కలసివారచ్చట వుంటున్నారు, ఈ సహోదరుడు వారినందరిని ఆ కూటమునకు తీసుకొని వచ్చెను (వారిలో ఇంచుమించు అందరు క్యాథలిక్కులు) వారిలో ఒక ముఖ్యమైన వ్యక్తి వుండెను, అప్పుడు పరిశుద్ధాత్మ వారిమధ్య క్రుమ్మరించబడి ఆ ప్రాముఖ్యమైన వ్యక్తిని మరియు అతడితో వున్న వారందరిని తాకినందువలన, ఆ కూటమునందే వారిలో ప్రతి ఒక్కరూ స్వస్థతను పొందుకొనిరి. వారు ఆ పరిశుద్ధాత్మ అభిషేకముతో ఆ సముద్రతీర ప్రాంతమంతటిని రగులుకొనునట్లు చేసిరి. ఆ తీరప్రాంత జనులు మత్స్య వ్యాపారస్తులు. కావున, సహోదరుడు ఎడ్డి నన్ను రమ్మని ఆహ్వానించుచుండెను. అచ్చటకు వెళ్ళవలెనను తలంపు నాలో కలుగుచుండెను, చూశారా? తరువాత మేము అచ్చటనుండి బయలుదేరి ఒక దినము ప్రయాణము చేసి 2 లేక 3 కూటములు ఫోర్ట్ సెయింట్ జాన్ అనే స్థలమునందు జరిపించుచున్నాను. అది అలస్కా జాతీయ రహదారియందు రెండు రాత్రులు జరుగు కూటముగా ఉండును.
23తరువాత ఇంటికి రావడము అనుకొంటున్నాను, అది జూన్ 7, 8, 9, 10 అని నేను అనుకుంటూన్నాను. ఇప్పుడు మీరందరు వెళ్ళవలసిన స్థలము ఒకటి కలదు. ఈ కూటములు ఇక్కడ సదరన్-పైన్స్ నందు వుండును. ఇక్కడ ఎంతో చక్కని వ్యాసము వ్రాసిన సోదరుని మీరెరిగి యుందురు. ఎంతో కాలము అవ్వలేదు, అలాగే కొన్ని పత్రికలు అతడు నాకు పంపించాడు. నేను వాటిని తేవలసినది. దేవుని చిత్తమైతే, వచ్చే ఆదివారం తెస్తాను. అది సదరన్-పైన్స్, ఇక్కడ నుండి ఇంచుమించు 6 లేక 8 గంటల ప్రయాణముండును. సదరన్-పైన్స్, నార్త్-కరోలినా లేక అది సౌత్-కరోలినా? నార్త్-కరోలినా, అవును! అది సత్యము.
దాని తరువాత మేము 10న అక్కడ నుండి వెళతాము మరియు 11, 12న కొలంబియాలో దక్షిణ-కరోలినా నందు సోదరుడు బిగ్బైతో మేము వుంటాము.
24అతనే ఆ వ్యాసము వ్రాసెను. అతనొక ప్రేస్బిటేరియన్ సంస్థకు చెందినవాడు. నా గురించి వ్రాసిన వ్యాసములన్నిటిలోనూ నన్నెంతగానో ఆకర్షించిన వ్యాసము ఇదియే. అతడు వేదాంత శాస్త్రములో డాక్టర్-ఆఫ్-డివినిటీ పట్టమును పొందిన ఒక ప్రెస్బిటేరియన్ సంస్థకు చెందినవాడు. అతడు చికాగోకి వచ్చి ఒక వ్యాసమును వ్రాసెను… అది దేనిని గురించి వ్రాసెనో దానిని నేనిప్పుడు మరిచిపోయాను, అది ఎంతో బాగున్నది. ఎచ్చట నుండో దానిని నేను పొందుకొన్నాను. అది … ఒక పత్రికయందు వుండినది. ఒక ప్రెస్బిటేరియన్, ఒక పెంతెకొస్తు వ్యక్తిని సంధించు దానిని గురించి లేక అటువంటి భావముతో ఆ వ్యాసము వుండును. "పెంతెకొస్తు ప్రవక్త ఒక ప్రెస్బిటేరియన్ వ్యక్తిని సంధించుట," అంశములాగా అది వుండును. కావున నేను అతనితో వుంటాను.
ఇప్పటికే అతడు పశ్చిమతీర ప్రాంతములో వున్నాడు. జరుగబోవు కూటములకు ఇంచుమించు 35 లేక 40 సంఘములు కలిసి సహకరించుటకు అచ్చట కలరు. సియోలియా, కాలిఫోర్నియా, గ్రాస్ సిటీనందు మరియు అక్కడనుండి… బహుశ గ్రాస్ వ్యాలీ, అక్కడ నుండి ఒరిగాన్, అక్కడ నుండి వాషింగ్టన్ కు వెళ్ళెదము.
25పిదప ఆర్గన్ బ్రైట్ వచ్చుచున్నాడు. మేము జూలై ఆఖరి వారములో క్రైస్తవ వ్యాపారస్తుల సమూహము కొరకు ఒక కూటము ఏర్పాటు చేయుటకై అలస్కానందుగల అన్కోరేజ్ అనే స్థలమునకు వెళ్ళుటకు ఇప్పుడు మేము ప్రణాళికను సిద్దము చేయుచున్నాము. ఆ విధముగా వెంటనే కఠినమైన మెరక పల్లములతో కరుకుగా నుండు అలస్కానందు 6 లేక 8 దినములు ఉజ్జీవ కూటములు జరిపించవలెననీ నేను ఎదురుచూచుచున్నాను. అలస్కా ప్రాంతము ఏ విధముగా వుంటుందో మీరెరుగుదురు. అచ్చట కేవలము గనులలో పనిచేసే వారు, ఖనిజాలను అన్వేషించువారు మాత్రమే నివసించు స్థలమది. అచ్చట హామ్ అనే తిను బండారము మరియు గుడ్లుతో కలిసిన ఆహారము ఒక ప్లేటు యొక్క వెల సుమారుగా 3 డాలర్లు 50 సెంట్లు. అది నిజముగా ఒక కరుకు ప్రదేశము. కానీ, సువార్త వారికి కావలెను.
ఇచ్చట నేను బోధించుచున్న విషయములను, ఈ ఆహారమును (వర్తమానము) నిల్వ చేసివుంచి దానిని సక్రమముగా భద్రపరచుట కొరకే ఇప్పుడు నేను ప్రయాసపడుచున్నాను. ఇప్పుడు నేను సువార్తను విత్తుటకై వెళ్ళాలని ఆశించుచున్నాను. ఏ స్థలమునకు వెళ్ళవలెనో దానిని గురించి ఖచ్చితమైన నడిపింపు నాకు ఇంకా కలుగలేదు.
26నా భార్యకు (ఆమె ఇక్కడే ఎక్కడో వున్నది), ఒక రోజు ఇల్లినోయి లో ఒక స్త్రీ నుండి ఒక ఉత్తరము వచ్చినది. ఆమే వ్రాసిన ఉత్తరములోని సారాంశము నా హృదయాంతరంగములో ఎంతగానో మండించినది. ఆ స్త్రీ తన ఉత్తరములో ఈ విధంగా వ్రాసినది. సహోదరి బ్రెన్హాం, మీకు వివాహమైన దగ్గరనుండి నీవు అనేక శ్రమలను, ఇబ్బందులను ఎదుర్కొని వుంటావనే విషయములో ఏ సందేహము లేదు, సహోదరుడు బ్రెన్హాంగారు సేవ నిమిత్తమై అనేక ప్రాంతాలకు వెళ్ళుచూ వుంటారు. ఆ సమయమున పిల్లల బాగోగులను చూచుకోవడము ఎంతో కష్టమైన కార్యము, పిల్లలు తమ తండ్రి కోసము, ఇంకా అనేక కార్యములను గురించి ఏడుస్తూ, గోలచేసేటప్పుడు పరిస్థితి ఏ విధముగా వుంటుందో నేను ఎరుగుదును, ఎందుకనగా నాకు ఒక ప్రియమైన భర్త కలడు. కానీ, నా పరిస్థితిని గురించి నేను మీకు వివరించాలి అనుకుంటున్నాను. గడచిన 4 సంవత్సరాలలో నాకు నాలుగు పెద్ద ఆపరేషన్లు జరిగినవి, ఒక రోజుకు నాకు 15 లేక 16 మత్తు ఇంజక్షన్లు వేసేవారు. ఒక వారమునకు మూడు రకాల లెక్సాట్రాన్ అనే ఇంజక్షన్లు వేసేవారు. చాలా నిద్ర మాత్రలను వేసుకుంటున్నాను. అవి చాలక నరముల ఉద్రిక్తతను తగ్గించుకొని ప్రశాంతముగా నిద్రపోవుటకు కొద్ది రోజుల నుండి రాత్రులయందు నిద్రపోయే ముందు రెండు నిద్రమాత్రలను వేసుకొనుచున్నాను. అయినా కూడా నాకు నిద్ర రావటం లేదు. "నీ ఆరోగ్య పరిస్థితి ఇంకా దిగజారిపోవుటకు ముందే మానసిక వైద్యశాలకు వెళ్ళండి, మీ మానసిక పరిస్థితి బాగుపడుటకు ఒకవేళ ఆ వైద్యశాల మీకు ప్రయోజనముగా వుంటుందేమో," అని మా డాక్టరు నాతో చెప్పాడు. ఇటువంటి మీ మానసిక పరిస్థితిని బట్టి వైద్య పరిశోధనయందు గాని వైద్యశాస్త్ర పుస్తకములలోగాని ఒక్కరు కూడా మిమ్ముల్ని బాగుచేయు కార్యము లేమిలేవని డాక్టరు చెప్పాడు, "కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలని తలంచాను, నా ప్రియమైన భర్తను మరియు నా చిన్న కుమార్తెను వదిలేసి వెళ్ళిపోవాలని నేను అనుకున్నాను. మేము కన్సాస్లో నివసించుచున్నాము. దానిని నేను ప్రేమించుచున్నాను, ఎందుకనగా గోధుమ పరిపక్వము చెందుటను మేము చూచుచున్నాము మరియు కోత గురించి మేము ఆలోచించుచున్నాము," అని ఆమె ఉత్తరం వ్రాసినది.
27ఆమె ఒక మెథడిస్ట్ అని నేను అనుకుంటున్నాను. పదకొండు నెలల క్రితము ఇచ్చట ఇల్లీనోయి నందున్న బ్లూమింగ్టన్ లో గల మెథడిస్ట్ కళాశాలకు నేను వచ్చుచున్న సమాచారము గల ఒక కరపత్రము వారికి లభించినదని ఆమె చెప్పింది. ఆ బ్లూమింగ్టన్ కూటముల గురించి మీలో అనేకులకు గుర్తుండే వుంటాయి; ఆ కూటములందు మీరు కూడా పాల్గొన్నారు.
ఇంకా ఆ ఉత్తరములో ఆమె ఇలా వ్రాసియున్నది, "నా భర్త నన్ను మరియు ఇంకా కొంతమంది స్నేహితులను ఆ కూటములకు తీసికొని వెళ్ళెను, ఇంకా ఒక్క దినము ఎక్కువగా గడచినయెడల నేను భరించలేనని ప్రభువుకు తెలుసు. (ఆమె ఆరోగ్య పరిస్థితి అంతగా క్షీణించిపోయినది.) నీ కుమారుడు బిల్లీపాల్ ప్రార్థనా కార్డును ఇచ్చినప్పుడు దానిని తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిని నేనే, ఆ దినము రాత్రి కూటములో నీ భర్త ప్రార్థనా కార్డు మీద ఉండు సంఖ్యలను పిలిచినప్పుడు ఆ సంఖ్య క్రమమున మొదటిగా ప్రార్థించినది నా కొరకే, నేను వేదిక మీద ఆయన ముందు నిలబడగానే నా జీవితములో సంభవించిన కార్యములను గూర్చి, నేనేమి చేసానో ఆ కార్యములన్నిటి గూర్చి ఆయన నాతో చెప్పెను. పిదప 'ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు' అది పోయినది, ఇక ఆ సమస్య వుండదు" అని ఆయన నాతో చెప్పెను. అప్పటికప్పుడే నా శరీరమందు ఏదో జరిగి, శరీరములోవున్న ఇబ్బంది, బాధవెంటనే పోయినది. అనారోగ్యముతో నేనప్పుడు 70 పౌండ్ల బరువును మాత్రమే ఉన్నాను. కాని ఇప్పుడు పూర్తి ఆరోగ్యములో 160 పౌండ్ల బరువుతో బాగున్నాను. సహోదరి బ్రెన్హాంగారు, నీ భర్త బ్రెన్హాం గారు ఈ విధముగా అనేక ప్రాంతములలో సంచరించుచూ, దేవుని సువార్తను ప్రకటించుచూ నాలాంటి
బలహీనులను స్వస్థపరచుచు, ఆయన చేయుచున్న సేవ ఎంతో గొప్పది, అయినా నీవు ఒంటరితనములో పిల్లలను చూచుకుంటూ వుండినను, నీవు ఏ విధముగా సంగతులను బట్టి అనుభూతి చెందుచున్నావో దానిని నేనెరుగుదును. కానీ నీ భర్త దేవుని చిత్తమును చేయుటవలన కెన్సాస్ లో యున్న ఒక గృహిణి నేడు ఏ విధముగా విడుదలను పొందుకొనెనో నీవు గుర్తుంచుకొనుము," అని ఆమె వ్రాసినది.
నేను దీనిని బిల్లీకి చూపించి, "నీవు దీనిని ఆ మేథడిస్ట్ కళాశాలకు పంపించాలని," చెప్పాను.
అతడు వెళ్ళి ఆ విధమైన ఉత్తరముల కట్ట పట్టుకొని వచ్చి, "వీటిలో కొన్ని చదువమని," చెప్పాడు.
"నాకు తెలుసు, నాకు తెలుసు… నాకు తెలుసు, అవి అద్బుతమైనవి, కానీ ఈ ఒక్కటీ సరిపోతుంది. ఇది సరిగ్గా ఆ స్థలాన్ని చక్కబెడుతుంది," అని చెప్పెను.
MATT 8:28
28"అపవిత్రత! అపవిత్రత!" అనే దానిని గూర్చి వినియున్నారా? ఆ దుష్ట ఆత్మలు అతడిని బయటకు నెట్టుకొని వెళ్ళినవి. (చూశారా? అతడిని మానసికముగా బలహీనపరచి, ఆ దుష్ట ఆత్మలు అతడిని సమాధుల యొద్దకు తీసుకొని వెళ్ళినవి.) యేసు వచ్చినప్పుడు, ఆ దుష్ట ఆత్మలతో బంధించబడియున్న వానిని విడుదల చేసెను; మరియు యేసే వాక్యమైయున్నాడు. కావున వాక్యమును స్వీకరించినప్పుడు, ఆ వాక్యము బంధకములలోవున్న వారిని విడుదల చేయును. నేనింకా ఈ విధముగా మాట్లాడుచూనే వున్నాను. నా సమయమును, మీ సమయమును తీసుకుంటున్నాను, సమయము ఎక్కువగుచున్నది చెప్పవలసిన సంగతులు చాలా వున్నవి. కాబట్టి మనము శిరములు వంచుదాము.
29ప్రభువా! మర్త్యులముగా మాకు మాట్లాడుకొనుటకు ఎక్కువ సమయము లేదని తెలియును. నేను ఈ ఆకలిగల దీన హృదయము కలిగిన యాత్రికులను చూచినప్పుడు వారు పొలము నుండి, వ్యవసాయము నుండి, కొందరు ప్రజా పనుల్లో నుండి, ఉద్యోగాల నుండి మరికొందరు కొండలు దాటుకొని ప్రయాణించి ఎడారుల నుండి మరియు లోయలలో గుండా, బురద నేలలో ప్రయాణించి కూడుకొనియున్నారు. కానీ వారు యాత్రికులుగా ఇక్కడ నిలబడియున్నారు. వారు ఈ లోక సంబంధులు కారు. వారు కేవలము నీకు సాక్ష్యులుగా, కొండమీద యుండు దీపములుగా, వారు ఎచ్చటైతే జీవించుచున్నారో ఆ సమాజము మధ్య వెలుగును ప్రకాశించు జనులుగా వున్నారు. వాక్యములో బలమును పుంజుకుని మరలా తామును ప్రతిష్ఠించుకొనుటకై వారు ఇచ్చట ఏకముగా కూడుకొనియుండగా, వారు నిలబడి యుండుట వలన వారి కాళ్ళు తిమ్ముర్లుపట్టి బాధపడుచున్నారు. పెద్దలు మరియు యవ్వనస్తులు అట్లే ఏకముగా కూడి నిలబడియున్నారు.
ప్రభువా! వారు నిన్ను ప్రేమించుచున్నారు. అందునిమిత్తమే వారు ఇక్కడకు వచ్చారు. ఒక మనిషి ఎన్నో మైళ్ళ దూరము కారు నడుపుకుంటూ ప్రయాణించి, గోడల ప్రక్కన నిలబడి, జారబడి మరియు కాళ్ళు తిమ్మిర్లుపట్టి వంకర పోతున్నంతగా నిలబడి, తాను ఇంకొకరికి గొప్పగా చూపించుట కొరకు ఇచ్చటకు రాలేదనేది అనేకులు ఎరుగుదురు.
30ప్రభువా! ఈ గుంపు ప్రజలమైన మేము పేద ప్రజలము. మేము నాజూకు వస్త్రములు ధరించి రాలేదు. మేము నిన్ను ఆరాధించుటకు వచ్చియున్నాము. మా హృదయములో ఒకే కారణము, ఒకే ఉద్దేశ్యము, ఒకే గురి కలిగియున్నాము. అది నీవే ప్రభువా. దేవా! వీరిని బహుగా ఆశీర్వదించమని నేను ప్రార్థించుచున్నాను, ఏ ఒక్కరు కూడా నిత్యజీవము లేకుండా ద్వారము దాటి బయటకు వెళ్ళకుందురు గాక! "మేము మార్గాంతమునకు వచ్చునప్పుడు మార్గములోని కష్టాలు ఎన్నదగినవికానట్లు కనబడును గాక."
ఒకవేళ వారు రోగగ్రస్తులైతే, ప్రభువా, వారిని ఇప్పుడే స్వస్థపరచుము. ఇప్పుడు వేరొక కూటములను గురించి చెప్పాను. ప్రభువా! నేను ఆ కూటములకు వెళ్ళెదనో, లేదో నేనెరుగను. నీ చిత్తమైనయెడల, విత్తనములను మాత్రమే చల్లి వచ్చెదను. అవి ఒకవేళ మంచి నేలలో పడినట్లయితే, అవి మొలకెత్తి పైకి ఎదుగును, ప్రభువా, మీరు వాటిని మంచి నేలలోనికి నడిపించమని ప్రార్థించుచున్నాను.
31ఈ బలిపీఠము మీదయున్న చేతిరుమాళ్ళు, చిన్న మూటలు చూస్తే దీని అర్ధము ప్రజలు బలహీనతలలోనూ, అవసరతలలోనూ వున్నారని ఈ ఉదయము చెప్పగలను. ఓ, పరలోకపు దేవా! క్రీస్తును మృతులలో నుండి పైకి లేపి, ఈ చివరి దీనములలో పరిశుద్ధాత్మ రూపములో మాకు బహుకరించావు, ఆయన సర్వవ్యాప్తి క్రిందకు చూసి, సర్వజ్ఞానిగా అన్ని ఎరిగియుండి, సర్వశక్తిమంతునిగా ఈ చిన్న మూటను చూసి, అవి రోగగ్రస్తులను మరియు పీడించబడుచున్న వారిని తాకినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని చెవులకు ఆ ప్రార్థనను పునరుద్దించి, వారు వెంటనే స్వస్థత పొందునట్లు చేయును గాక!
ప్రభువా, కెన్సాస్ లో యున్న ఆ స్త్రీ యొక్క సాక్ష్యమును గూర్చి ఇప్పుడే చెప్పాను. ఆ దీన స్త్రీ గురించి ఆలోచించుచుండగా, ఓ, ప్రభువా, వాస్తవముగా నీవు వచ్చినప్పుడు సమస్తమును బాగుండును. ఆ విధముగానే ఇప్పుడు ఆమెలోయున్న సమస్త బాధల నుండి నీవు బాగు చేశావు. ఆమె ఇప్పుడు సంతోషముగా యున్నది. ఇక ఏ నొప్పి, ఇక ఆ వ్యాధి యొక్క అవస్థలు లేవు. ఆందోళన కొరకు ఏ మందులు తీసుకోనక్కరలేదు, ఇక ఏ నిద్రమాత్రలు అవసరంలేదు. ఏ రోగము యొక్క లక్షణాలను, ఏ డాక్టరు ఆమెలో ఇక కనుగొనలేరు. చక్కగా, ప్రశాంతముగా నిద్రపోవుచున్నది. అందునుబట్టి మేము మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము.
ఇప్పుడు తండ్రి, మేము వాక్యము వైపుకు తిరుగుచుండగా నీ యొక్క వాక్యమును ఆశీర్వదించుము. నిరుపయోగముగా అది నీ యొద్దకు తిరిగి రాకుండును గాక! ఏ ఉద్దేశ్యము కొరకు అది నిర్ణయించబడినదో, మరియు ప్రతిష్ఠించబడినదో దానిని అది సాధించునుగాక! యేసు నామములో దీనిని మేము అడుగుచున్నాము. ఆమెన్.
32ఇప్పుడు అందరు చక్కగా వినగలుగుచున్నారా? వెనుకవున్న వారికి చక్కగా వినబడుచున్నదా? నేను ఇలాగుండి మాట్లాడితే బాగుందా! లేక అలావుండి మాట్లాడితే బాగుందా? ఇక్కడ లోపల ఈ ప్రక్కనుండి మాట్లాడితే బాగుందా! వెనుకవున్న మీ అందరికి పర్వాలేదా, వినబడుచున్నదా! మంచిది, అయితే దీనిని కొద్దిగా ఇక్కడకు దగ్గరకు లాక్కుంటాను.
గత ఆదివారమున, ఒక వారము, నేను… కొంత ఆలస్యం జరిగినది. నేను బొత్తిగా ఎక్కువ సమయము తీసుకొనిన ఆరాధన అది, నేను ఆ విధముగా వుండాలని కోరుకోను. ఇప్పుడు … ఎప్పుడో ఒక్కసారి (అది కొద్దిగా కూడా నన్ను విసిగించదు), ఎవరైనా ఒకరు కూర్చొని ఉన్నవారు నిలబడియున్న వారికి కొంత విశ్రాంతి ఇవ్వడం కోసము, కొంత సమయము తమ స్థానాన్ని వారికి ఇవ్వడం చాలా మంచి క్రైస్తవ స్వభావము. ఇప్పుడు, ఈ ఈస్టర్ లోపు ముఖ్య ఆరాధన జరుపుట కొరకు వేరొక స్థలమును కలిగియుండెదము.
33ఇప్పుడు, ఈ ఉదయము మనము… సైనికులైన మీరందరూ, ఇప్పుడు మీ యొక్క ఖడ్గమును తీసికొనండి. ఇప్పుడు మనము శత్రువుల మీద యుద్దమును ప్రకటించ బోవుచున్నాము. మనము ఒక చిన్న పాట పాడెడివారము, మీకు తెలుసా:
ఓ, క్రైస్తవ సైనికుడా! పోరాటం ప్రారంభమైనది,
ముఖాముఖిగా క్రమశిక్షణ కలిగిన వ్యూహముతో
(మీరు ఈ పాటను విన్నారా?)
కవచములు తళతళలాడుతూ, రంగులు మిళమిళా పారుచూ,
సత్యమూ మరియు అసత్యము తలపడినవి!
(చూశారా? అది నిజము.)
పోరాటము ఆరంభమైనది, కాని అలసిపోవద్దు,
శక్తి కలిగియుండండి మరియు ఆయన మహిమను గట్టిగా పట్టుకొనండి;
ఒకవేళ దేవుడు మన పక్షముగా వున్నట్లయితే,
ఆయన జయ ధ్వజము మనతో వున్నది,
అంతమున ఒక జయ గీతమును మనము పాడెదము!
(అది నిజము.)
JOHN 10:1-5
34మొట్టమొదటి వాక్య పఠనము కొరకు యోహను సువార్త 10వ అధ్యాయము, మొదటి ఐదు వచనములు చదువుటకు త్రిప్పాలని కోరుచున్నాము:
గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొకమార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై యున్నాడు.
ద్వారమున ప్రవేశించువాడు గొర్రెలకాపరి.
అతనికి ద్వారపాలకులు తలుపులు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును.
మరియు అతడు తన సొంత గొర్రెలన్ననీటిని వెలుపలకి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును.
గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వారియొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.
35ఇప్పుడు, ఈ ఉదయము కొంత సమయము బోధించడానికి నేను ఎన్నుకొనిన అంశము, "జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసము." జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసము. ఇప్పుడు, కేవలము రెండు ఆధారములు అక్కడ వున్నవి లేక మనము ఆ రెండు ఆధారములతోనే జీవించవలసియున్నది. దానిని గూర్చి మీరు ఎరుగుదురా?
నేను ఇక్కడ చాలా వాక్యములను వ్రాసికొనియున్నాను. మనము ముందుకు వెళ్ళుచూ వాటిని పరిశీలించాలని నేను ఆశించుచున్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ సంగతులను మీకు చెప్పెదను. వాటిలో నుండి మీరు విషయములను గ్రహించుటకు వాటిని మీముందు కేవలము అలాగే వుంచుతాను, చూశారా.
మనము మన జీవితాన్ని అమర్చుకొనుటకు కేవలము రెండు మూల ఆధారములను మాత్రమే కలిగియున్నాము. అందులో ఒకటి జ్ఞానము మరియు ఇంకొకటి విశ్వాసము. జ్ఞానం దేనిని ఉత్పత్తి చేస్తుంది మరియు విశ్వాసము దేనిని ఉత్పత్తి చేస్తుంది అని ఒకవేళ మనము ఆలోచిస్తే… కానీ ఆ రెండు మూల ఆధారముల గురించి మనము ఈ ఉదయ కాలమందు మరలా ఒకసారి చూసి ఆదివారము ఆరాధన యొక్క పాఠ్యాంశముగా దానిని తీసుకొని, వాటిని పరిశుద్ధ గ్రంథములో నుండి తీసుకొని అవి ఏమైయున్నది, అది ఏమి చేయబోవుచున్నవి, అవి ఏమి చేశాయి అనే దానిని ప్రభువు సహాయముతో చూసెదము.
36ఇప్పుడు, విశ్వాసము మరియు జ్ఞానము. ఇప్పుడు, ప్రారంభించుటకు, ఆదికాండము మొదటి అధ్యాయములో విశ్వాసము పరిచయమగుటను మరియు జ్ఞానము పరిచయమగుటను మనము కనుగొనెదము. నేటివరకు ఆ రెండు మూల ఆధారములు ఇంకా మానవ జాతికి పరిచయము చేయబడుచున్నవి. దేవుని యొక్క వాక్యమందు జనులు నమ్మకమును మరియు విశ్వాసమును కలిగియుందురని మరియు విశ్వాసమునకు దేవుడే కర్తయని మనము కనుగొనుచున్నాము. సాతాను జ్ఞానమునకు కర్తయై, ప్రజలు దేవుని యొక్క వాక్యమందు విశ్వాసము లేకుండునట్లు చేయుచూ వారిని దానినుండి దూరముగా లాగివేసి ఆ సాతాను యొక్క జ్ఞానమును వారు అంగీకరించున్నట్లు వాడు ప్రయత్నించుచున్నాడు… ఈ విధమైన రెండు మూలాధారములను గురించి మనము కనుగొనబోవుచున్నాము.
37ఈ మూలమైన అధ్యాయము ఆదియందు, ఆదికాండమందు ప్రారంభమగుట ఎంతో వింతగా వుండుటను మనము కనుగొనుచున్నాము. నేటికి కూడా మనము కలిగియున్న ఈ సమస్తకార్యములు మొట్టమొదటిగా ప్రారంభమైనది ఈ ఆదికాండమునందే, ఎందుకనగా "ఆదికాండము" అనగా "ప్రారంభము" అని అర్థము. మరి ఈ రోజు వున్న విషయాలు, వాటి విధానము చూస్తే ఎక్కడో ఒకచోట వాటికి ప్రారంభము వుండాలి. ప్రతిదానిని మీరు వెంబడించుచూ దాని మూలమునకు వెళ్ళి చూసినయెడల ప్రతిదానికి ఒక ఆరంభముగలదనే దానిని మీరు గమనించి చూడగలరు.
38ఇక్కడ మీ కొరకు ఒక చిన్న ఆలోచన, ప్రారంభము కలిగిన ప్రతీదానికి అంతము కూడా వుంటుంది. కాని వేటికి ప్రారంభమనేది లేదో అవి అంతము లేనివి. కేవలము నిత్యమైన కార్యములు మాత్రమే కలవు, అందువలన ఒక ప్రశ్న అడగాలని అనుకోనుచున్నాను: దేవుని నిత్యత్వ కుమారత్వము అనే పదమునకు ఏ విధముగా మనము అర్థము ఆపాదించగలము? ఆయన కుమారుడైయితే, ఆయనకు ఒక ప్రారంభము యుండును. ఒకవేళ ఆయన నిత్య కుమారుడైతే ఏ విధముగా కుమారుడుగాను, నిత్యుడుగాను వుండగలడు? కుమారుడు అనే కార్యము ఏదో ఒకదానిని నుండి ఉత్పత్తి అయినది కదా? ఆయన "నిత్యకుమారుడు" కాలేడు. దేవుని యొక్క "నిత్యకుమారుడు" అనేటువంటిది ఏదీలేదు, ఎందుకనగా ఆయనకు ఎన్నడూ ఒక ఆరంభమనేది లేనియెడల ఆయన నిత్యుడుగానే వుండవలెను గాని వేరొక విధముగా ఆయన ఉండలేడు. ఆయన ఒక కుమారుడైతే ఆయనకు ఒక ఆరంభము వుండవలెను. కావున, ఆయన ఒక "నిత్యకుమారుడు"గా వుండలేడు. అదేమిటో కాదు గాని నిత్యమైన దేవునిలో నుండి ఒక కుమారుడుగా ప్రత్యక్షమగుటయేయగును, చూశారా, నిత్యమైనదనేది ఒకటి వున్నదంటే అది దేవునికి మాత్రమే చెందును.
EPH 1:11
39మనము నిత్యజీవమును కలిగియుండుట వలన మాత్రమే మనము నిత్యము జీవించగలము. ఈ శరీరము చనిపోతుంది. మన శరీర భాగాలు అన్నీ చనిపోతాయి; కానీ ఒకే ఒక్క భాగమే నిత్యమైన దేవుడగును. కావున, దానికి మరణము లేదు. ఇప్పుడు, ఈ వాక్యము పరిశుద్ధ గ్రంథములోనిది. అది నిత్యమైనది, ఎందుకనగా అది అక్షరూపములోయున్న దేవుడై యున్నాడు. కావున దేవునిలో, ఆయన యొక్క ఆలోచనలో, మనస్సులో, పలుకబడిమాట యుండుటకు ముందే ఏముండినది? మీరు దానిని చూడగలుగుచున్నారా? అది దేవుడైయున్నాడు. అందువలన ముందు నిర్ణయించబడినవారముగా, ఎవరైతే ముందుగా నిర్ణయించబడియున్నారో (మీతో మేము వున్నామని, మేము నమ్ముచున్నామని చెప్పుచూ), వారు నిత్యమందు దేవునిలో వుండిరి. కావున మీరు మరలా జన్మించిన దేవుని యొక్క పిల్లలైతే (మీరు పరిశుద్ధాత్మను కలిగియున్నవారైతే) అది ఒక వాక్యముగా వుండుటకు ముందుగానే, మీరు ప్రత్యక్షపరచబడిన దేవునియొక్క పలుకబడిన మాటగా (వాక్యము)యుండిరి. అది ఒక మాట కాకముందు, అది ఒక ఆలోచనైయుండాలి. ఒక "మాట" అనేది పలుకబడిన ఆలోచనయగును మరియు ఆ ఆలోచనలు దేవునిలో వుండెను. కాబట్టే నిత్యత్వమునందు మనము దేవునిలో వున్నాము. మనము వాక్యము ద్వారా పలుకపడి, ఉనికిలోనికి వచ్చాము. ఓ, ఏమి… ఏ వాక్యము ద్వారా? ఈ వాక్యము ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా వచ్చాము.
GEN 2:16,17•
GEN 3:5
40ఇప్పుడు, విశ్వాసమునకు దేవుడే కర్త, సాతాను జ్ఞానమునకు కర్త. దేవుడు తన మొదటి పిల్లలకు ఆయన తన వాక్యమును ఇచ్చెను. వారు తప్పక దానిని విశ్వసించాలని చెప్పెను. ఒకవేళ వారు దానిని విశ్వసించుటలో విఫలమైన యెడల మరణమనే వేర్పాటును శిక్షగా నియమించెను. మరియు సాతాను హవ్వ చుట్టూ తిరిగుచూ జ్ఞానము ఇవ్వడానికి ప్రయత్నము చేసినది: "మీరు జ్ఞానము కలిగి యుంటారు, మంచి చెడ్డలను యెరిగి దేవునివలే యుందురని చెప్పెను."
ఇప్పుడు (చూశారా) ప్రారంభములోనే చాలా తొందరగా ఆ జ్ఞానము దెయ్యము నుండి వస్తుందని మీరు తెలుసుకుంటారు. అది వింతగా లేదా? కానీ అది సత్యము. జ్ఞానము దెయ్యము నుండి వచ్చును, వాడే జ్ఞానమునకు కర్త.
ఇప్పుడు, సాతాను వద్దగల ఏ కార్యమైనను, అది అసలైన (మూలమైన) దానిని తారుమారు చేసిన కార్యమైవుండును. నీతిని వక్రీకరించుటయే పాపమైయున్నది. వ్యభిచారము అనగా చట్టసమ్మతమైన దానిని వక్రీకరించుట. నిజాన్ని వక్రీకరించుటే అబద్దమైయున్నది.
41అందువలన ప్రారంభించుటకు ముందు ఈ జ్ఞానమును గూర్చి మీకు స్పష్టముగా తెలపాలని నేను కోరుచున్నాను. దేవుని జ్ఞానము కలదు. ఆయన వాక్యముతో నిలిచియుండుటయే దేవుని యొక్క జ్ఞానమైయున్నది. కానీ సాతాను తన జ్ఞానముతో వాక్యమును తారుమారు చేయడానికి ప్రయత్నించాడు; కనుక ఆ జ్ఞానము గురించే నేను మాట్లాడాలనుకుంటున్నాను.
కొంత పరిమిత విశ్వాసము సాతానుతో పాటు వెళ్తుంది. సాతానుని అంగీకరించాలంటే నీవు సాతానుని నమ్మవలసియున్నది. అందువలన అక్కడ తారుమారు చేయబడిన ఒక కార్యము కొరకు తారమారు చేయబడిన ఒక విశ్వాసము గలదు. దేవుని యొక్క వాక్యమును వంకరగా త్రిప్పి, వాక్యము చెప్పని దానిని చెప్పినట్లుగా ప్రయత్నించే ఏ కార్యమైనను, దేవుని యొక్క జ్ఞానమునకు విరోధముగా బుద్ధిపూర్వకమైన భావమును ఇచ్చుటకు ప్రయత్నించు ఏ కార్యమైనను అది తప్పుడు ఆత్మయైయున్నది. (చూశారా), కనుక దానిని మనము సాతాను యొక్క విశ్వాసమని చెప్పకుండా సాతాను యొక్క జ్ఞానముగా సంబోధించుచున్నాము.
దానిని నమ్మిన ప్రజలు చాలా మంది నిజాయితీగా వారి విశ్వాసమంతటితో వారు నమ్మినది సత్యమని నమ్ముతారు, చూశారా. మీరు దానిని క్షుణముగా గమనించవలెను, ఇప్పుడు ఈ విషయము రెండు మార్గములను కలిగియున్నది. కానీ విషయమును ఖచ్చితముగా ఎరుగుటకుగల ఏకైక మార్గమేదనగా మూల (నిజమైన) వాక్యము యొద్దకు తిరిగి వచ్చుటయే అగును. ప్రతి విషయము ఏ వాక్యము మీద ఆధారపడియున్నదో అచ్చటకు రావలెను.
HAB 2:4•
ROM 1:17•
GAL 3:11•
HEB 10:38
42ఈ రెండు వర్గాలు లేదా మూల ఆధారములు ఏమైవున్నవో మనము కనుగొనేదము: అవి ఒకటి జ్ఞానము, ఇంకొకటి విశ్వాసము. ఏదేను తోటలో సృష్టి ప్రారంభము నుండి ఈ రెండు ఒక దానితో ఒకటి వ్యతిరేకముగా విభేధిస్తున్నవి.
ఇప్పుడు, అక్కడ రెండు వైపులా పిల్లలను కలిగివున్నారు. ఇప్పుడు మనము మాట్లాడుకొనుచున్న జ్ఞానము ఏమైవున్నది? "ఈ వాక్యమంతా సత్యము," అనే దానిని ఈ జ్ఞానము అంగీకరించదు. ఇది వాక్యములోని సత్యమును తీసివేసి, తన గొప్ప స్వజ్ఞానమును మరియు అనుభవరీతిగా గొప్ప తెలివితేటలు తనకే సొంతమన్నట్లుగా తన్నుతాను హెచ్చించుకొనును. ఆ విధమైన బుద్ధిపూర్వకమైన జ్ఞానము సాతానునుండి వచ్చినట్లయితే వాడియొక్క పిల్లలు కూడా అటువంటి బుద్ధిపూర్వకమైన జ్ఞానముతోనే జీవించెదరు. దేవుని విశ్వాసము, దేవునిద్వారా వచ్చినప్పుడు, మరియు దేవుడు వాక్యమై వుండెను, దేవుని పిల్లలు విశ్వాసమువలన జీవించెదరు. "నీతిమంతులు జ్ఞానము ద్వారా జీవించెదరని," పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. "విశ్వాసము!" "నీతి మంతుడు విశ్వాసము ద్వారా జీవించును," అతడు తెలివితేటలతో దేనిని నేర్చుకొనెనో దానితో కాదు కాని, అతడు ఏమి విశ్వసించెనో దానిమీద అది ఆధారపడియున్నది. మంచిది.
GEN 3:1-3
43ఇప్పుడు, మనము మొదట జ్ఞానమును తీసికొని దానినిగూర్చి కనుగొనెదము. జ్ఞానము తర్కమును కలిగియుండును. మనమిప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 3వ అధ్యాయము త్రిప్పెదము, దీనిమీద కొద్దిగా చెప్పెదను. ఇప్పుడు ఈ ఉదయకాలమందు మనమేమి చేయుచున్నాము, మన ప్రయత్నము దేనికొరకు? "ఆహారమును నిల్వ చేయుము," అని ప్రభువు చెప్పిన దానిని అట్లే అనుసరించి చేసెదము. రాబోవు ఈ దినములలో అది మీకు అవసరమగును, "ఆహారమును నిల్వ చేయుము." ఇప్పుడు, ఆదికాండము చదివి ఏ విధముగా జ్ఞానము తర్కమును (స్వబుద్దితో కారణములను అన్వేషించుట) కలిగి వుంటుందో చూసెదము.
"దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో, [నమ్ముచున్నది, వాక్యమును చెప్పుచున్నది], "ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?" అని అడిగెను.
అందుకు స్త్రీ, "ఈ తోట చెట్లు ఫలములను మేము తినవచ్చును:
అయితే… తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియూ, వాటిని ముట్టుకూడదనియు చెప్పెనని," [వాక్యమును ప్రస్తావించుచున్నది] సర్పముతో అనెను.
ఇప్పుడు, విశ్వాసము దానిని పట్టుకొనియున్నది. ఇప్పుడు, గమనించండి!
అందుకు సర్పము స్త్రీతో, "మీరు నిశ్చయముగా చావరు," అనెను.
GEN 3:4
44బుద్ధిని ప్రయోగించుట, సొంత తెలివితేటలు ఉపయోగించుట… "దేవుడు చాలా మంచివాడు, దేవుడు ఎంతో దయ కలిగినవాడు, నిన్ను ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు." అదే ఆ పాత దెయ్యము యొక్క మాటలను నేడు కూడా మీరు వింటున్నారు. "దేవుడు ఆ విధముగా చేయడు, ఆయన ఎంతో మంచివాడు, దేవుడు దానిని చేయడు, దేవుడు శిక్షించడు," అని సాతాను చెప్పినది. ఆయన వాక్యమందు తానేమి చేస్తానని చెప్పెనో ఖచ్చితముగా ఆయన దానినే చేయును, చూశారా.
"మీరు నిశ్చయముగా చావరు." అతడేమి చేయడానికి ప్రయత్నించుచున్నాడో చూశారా? అతడు ఆమెను తనతో కలసి ఆలోచించుచూ, కారణమును అన్వేషించునట్లుగా చేసెను. దేవుని వాక్యముతో తర్కించడము ప్రారంభించిన క్షణమందే మీరు విశ్వాసమును కోల్పోదురు. "ఒకవేళ ఆ విధముగా వుండునేమో, అలాగ వుండదేమో, ఉండవచ్చేమో," అనే వ్యర్థమైన ఆలోచనలు లేకుండా, మీరు వాక్యముతోనే నిలకడగా నిలిచియుండవలెను. హవ్వ సరిగ్గానే సంధించినది, కానీ ఆమె సాతాను యొక్క తెలివితేటలతో కూడిన ఆలోచనకు చెవి యొగ్గినది.
GEN 3:4,5
45నేడు అనేక మంది ప్రజలు చక్కని జ్ఞానమును కలిగియుండి, ఈ వాక్యము దేవుని యొక్క వాక్యమని, ఇది దేవునిదేయని వారు ఎరిగియుండియూ, ఎవరో వేద కళాశాల నుండి వచ్చిన ఒక విద్యార్ధి వాక్యమునకు వ్యతిరేకముగా బుద్ధిపూర్వకమైన జ్ఞానముతో వారిని దారి తప్పించుటకును, పరిశుద్ధాత్మ నుండి, దేవుని యొక్క కార్యముల నుండి ఎంతో దూరముగా వారిని తొలగిపోవునట్లుగా చేయుటకు అవకాశమిచ్చుచున్నారు. సొంత ఆలోచనలను, అభిప్రాయములను మన దగ్గర నుండి పారద్రోలవలసిన వారుగా మనము వుండవలెను. సాతాను దీనిని ఎందుకు చెప్పిందో నేను మీకు చెప్పబోవుచున్నాను. నేను 4వ వచనము మొదట చదివిన తరువాత, 5వ వచనము చదువుతాను.
అందుకు సర్పము స్త్రీతో, "మీరు నిశ్చయముగా చావరు," అని చెప్పెను.
ఏలయనగా, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరువబడుననియు, మీరు మంచి-చెడుల నెరిగినవారై, దేవతలవలె వుందురని దేవునికి తెలుసుననియూ స్త్రీతో చెప్పెను.
GEN 3:6,7
46చూశారా? సాతాను హవ్వకు తన సొంత అభిప్రాయమును లేదా ఆలోచనను ఇచ్చుచున్నాడు. "దేవునితో సమానముగా వుండుట నీకిష్టము లేదా?" మరొక మాటలో చెప్పాలంటే, "నీవు నిజముగా దేవునితో సరిగ్గా వుండాలని ఆశించినయెడల నా సలహాను పాటించు, నేనేమి చెప్పుచున్నానో దానిని ఆలకించుము, దేవుడు ఆ విధముగా మీతో చెప్పలేదు. ఆయన చెప్పిన దానికి అర్థమేమిటంటే…"
అటువంటి కార్యములను మీరు విన్నప్పుడు వాటి నుండి మీరు దూరముగా తొలగిపోండి. అది నిజము. అది సర్పము యొక్క హి…స్…స్…స్… అనే శబ్దముతో కూడిన బుస వంటిది. ఆ శబ్దము లేదా ఆ మాటలు వినుటకు ఎంతో సత్యమువలె వుండును. కావున నీ స్వబుద్దీని ఉపయోగించి ఆ మాటలను గూర్చి నీవు ఆలోచించవద్దు. కేవలము దేవుడేమి చెప్పెనో దానిని మాత్రమే నమ్మవలెను.
స్త్రీ, ఆ వృక్షము యొక్క ఫలములు మంచిది అని చూసినప్పుడు… ఆమె ఆ ఫలములు తీసికొని తిని, తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. [అదేమిటనే దానిని గమనించండి? వాడియొక్క తర్కము వలన ఆమె అది నిజమే అని నమ్మెను. అది సత్యము.] అది కన్నులకు ఇంపుగాను, మరియు ఆ వృక్షము ఒకనికి వాంఛ కలిగించునదిగా [విశ్వాసము యుండునా? ఒకనికి జ్ఞానము నిచ్చునదిగా?] ఒకనికి తెలివి నిచ్చునదిగానూ అది వున్నది [అచ్చట ఏమి జరిగినదో దానిని గమనించండి? సాతాను బుద్ధిపూర్వకమైన జ్ఞానమును ఇవ్వజూపుచున్నాడు, ఒకనిని జ్ఞానవంతుడుగా చేయుచున్నటువంటి ఒకరి జ్ఞానము. అది వాక్యమునకు విరుద్ధమైన జ్ఞానము.], ఆమె ఆ ఫలములు తీసుకొని తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చెను, అతడు కూడా తినెను.
అప్పుడు వారిద్దరి కన్నులు తెరువబడెను. వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజారపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసికొనిరి.
47ఇప్పుడు, దానిని ఏది మొదలుపెట్టింది? విశ్వాసమునకు తర్కము లేదు. మీరు ఎప్పుడూ వాదించరు; మీరు విశ్వసించెదరు. నీవు దేవుని వాక్యమును స్వస్థత నిమిత్తము అంగీకరించి ప్రార్థించినప్పుడు, నీలో కలుగు అనుభూతులతో తర్కించవద్దు, దేనితోను తర్కించవద్దు. దానికి ఏ విధమైన వాదన లేదు. దేవుడు ఆ విధముగా చెప్పాడు, కాబట్టి అది దానిని నెరవేర్చుతుంది.
ఓ, నేను ఇక్కడ కొన్ని నిమిషములు ఆగి దాని మీద నిలవాలని కోరుచున్నాను. మరియు దాని నుండి ఒక వాక్యమును తీసుకొనవలెనని కోరుచున్నాను. నేను వ్రాసుకొన్న నలువది లేదా యేబది వాక్యములను నేను బోధించలేను.
48కానీ తర్కము, ఒక దర్శనము ప్రభువు ఇచ్చి…నేను చిన్నపిల్ల వాని తరహాలో మీకు చెప్పెదను. జరగబోయే ఏదో ఒక దానిగురించి ప్రభువు దర్శనము యిచ్చును. దానికి వ్యతిరేకముగా ఏది వున్నప్పటికినీ నేను లెక్క చేయను. మరియు గుర్తుంచుకొనండి, వ్యతిరేకమైన ప్రతి దానిని తీసికొని వచ్చేది సాతాను చేయుపని, "మీరు దానిని చేయలేరు," అని అంటూ వాడు తర్కించడానికి ప్రయత్నించును.
ఉదాహరణకు, ప్రయాణము గురించి కొన్ని క్షణముల ముందు నేను చెప్పినట్లు … ఇప్పుడు ఇది సామాన్యముగా వుండు దానికంటే భిన్నముగా యుండు ఒక దానివలె యున్నది. నా తల్లి వెళ్ళిపోవుటకు కొంచెము ముందు, నేను వేటకు వెళ్ళటకై, ఆ సహోదరుడితో నేను వెళ్ళుటకు తీర్మానించుకొన్న ఆ ప్రయాణము నందు నేను వెళ్ళలేనని ప్రభువుకు తెలుసు. కావున, ఆయన నాకు ఒక దర్శనమును ఇచ్చి తిన్నగా బ్రిటీష్ కొలంబియాకు నడిపించెను. మేము అచ్చటకు వెళ్ళినప్పుడు మార్గదర్శి (guide), "నా జీవిత కాలమంతా నేను ఇచ్చటనే గడిపితిని, బూడిద రంగు మూతి గల ఎలుగుబంటిని నేనిచ్చట ఎన్నడూ చూడలేదు. మనము ఇప్పుడు గుర్రములు, గొర్రెలు వుండు గ్రామమునకు వెళ్ళబోవుచున్నాము. బూడిద రంగు మూతి గల ఎలుగుబంటు అస్సలు లేనేలేదు; ఇచ్చట లేదు… అటువంటిది అచ్చట పైన మీకు అస్సలు దొరకదు," అని అనెను, తన స్వంత అభిప్రాయముతో జరగబోయే కార్యము నుండి దారి మళ్ళించుటకు చేసే ప్రయత్నము (చూశారా), అది బుద్ధిపూర్వకమైన జ్ఞానము.
సాతాను నాతో, "నీవు దర్శనాన్ని సరిగ్గా అర్థము చేసుకోలేదు," అన్నది.
కానీ, నేను దాని మాట వినలేదు! అది "ప్రభువు ఇలా సెలవిచ్చుచున్నాడుగా" యున్నది.
49ఆ ధృవపు జింక పైకి వచ్చినప్పుడు మేము దానిని కాల్చి చంపితిమి, (అది దర్శనములో వున్నది, మీరందరూ ఎరుగుదురు), తరువాత మార్గదర్శి అన్నాడు, (చాలా చక్కని సోదరుడు… కొన్ని వారములే అతనితో గడిపాను, చాలా బాగున్నది మంచి యవ్వన క్రైస్తవ సోదరుడు), "సహోదరుడా బ్రెన్హాం, నా సోదరునికి మూర్చ రోగము వున్నది. నీవు ఆ రోజు గుర్రముపై స్వారీ చేస్తూ పైకి వచ్చినప్పుడు నీవు ఒక పని చేయమని, అది చేస్తే అతని మూర్ఛ వ్యాధి పోవునని చెప్పావు. దానిని ఏ రీతిలో చెయ్యమని పరిశుద్ధాత్మ నీకు చెప్పెనో, సరిగ్గా నేను ఆ విధముగానే దానిని చేసినప్పుడు ఆ దినము నుండి అతనికి ఆ రోగము పోయి ఇక ఏ సూచన కూడా ఎన్నడూ కనబడలేదు," అని చెప్పాడు. "ఇప్పుడు, మనము ఇక్కడ పర్వతముకొన మీద వున్నాము. మూడు మైళ్ళ దూరము వరకు నేలమీద నాలుగు అంగుళాల ఎత్తుగల పొదకూడా లేదు. రెండు, మూడు అంగుళాలు ఎదిగే పిచ్చిమొక్కలు కారిబౌమాన్ మరియు బ్లూబెర్రి మొక్కలు కొన్నివున్నాయి," అని అతడు చెప్పెను. అతను, "ఈ నాచు మొక్కలు మరియు బ్లూబెర్రి మొక్కలు, వృక్షముల వరుస వరకు వ్యాపించి వున్నాయి. మరి మన గుర్రములు వృక్ష వరుసలోయున్న వృక్షములకు కట్టబడివున్నాయి, ఇప్పుడు నీవు నాకు చెప్పిన దానినిబట్టి మనము ఇక్కడికి వచ్చేముందు ఇక్కడి నుండి ఆ గళ్ళచొక్కా వేసుకున్న అబ్బాయి నిలబడిన ప్రదేశము యొక్క మధ్యలో నీవు ఆ తొమ్మిది అడుగుల బూడిద రంగు మూతి గల ఎలుగు బంటిని చంపాలి," అని అన్నాడు.
నేను చెప్పాను, అది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు!"
చూశారా? అది ఏమై వుండెను? సాతాను - నాకు దాని మీద (దర్శనము) అపనమ్మకము కలుగునట్లు చేయుటకు ప్రయత్నించుచుండెను.
50మేము పర్వతము దిగుటకు ప్రారంభించాము, దగ్గరగా మేము వచ్చాము, "సోదరుడా బ్రెన్హాం, దాని నుండి ఇప్పుడు మనము ఒక మైలు దూరంలోనే వున్నాము," అని అతను సందేహించుచూ చెప్పుచునే వున్నాడు.
"ఎంత మాత్రము సందేహించవద్దు, నీవు సందేహించుచున్నావా? బడ్?" అని నేను అన్నాను.
"ఏ మాత్రము లేదు."
మేము ఒక అరమైలు దూరము వచ్చాము. మేము ఒక అరమైలులో వున్నామని చెప్పాడు.
అది సత్యమని నేను చెప్పాను.
"సరిగ్గా ఆలోచించు, ఒక అర మైలు దూరములో… అతడు తన స్వకీయ బుద్దితో ఆలోచించుచున్నాడు. మనముందు వున్నదంతా మనకి కన్పించుచున్నది; అక్కడ అటువంటిది ఏమీ లేదని," అతను అన్నాడు.
"కానీ నేను వాక్యమును ఇచ్చిన దేవుడు అది అక్కడ లేకపోయినా ఒక దానిని సృష్టించగలడు," అన్నాను. నీ సొంత బుద్ధిని ఉపయోగిస్తూ ఆలోచించకు, కేవలము దాన్ని నమ్ముము! నీ సొంత అభిప్రాయము వైపునే దృష్టిని నిలుపకు. దేవుడు చెప్పిన దానికి, నీ ఆలోచనకు ఏ సంబంధం లేదు. ఆయన ఏమి చెప్పెనో దానిని నీవు నమ్మితే చాలు, కార్యములు అవే జరుగును," అని నేను అన్నాను.
నేను అక్కడ నిలబడివున్నాను. కొండలపైన, ప్రతీచోట గమనిస్తున్నాను, పసుపు పచ్చని కలుపు మొక్కలు కలవు, సూర్యుడు అస్తమించుచుండెను. అందమైన కొండలు, నేను ఉన్న స్థలమునకు పైనవున్న కొండ మీద మూడు మైళ్ళ వరకు ఎంత చిన్న స్థలమైనాగాని మీరు స్పష్టముగా చూడవచ్చు. నేను చూచుటకు తిరిగినప్పుడు నాకు రెండు మైళ్ళ ముందు లేక, మైలున్నర లేక రెండు మైళ్ళ దూరములో తొమ్మిది అడుగుల బూడిద రంగు మూతి గల ఎలుగుబంటి నిలవబడివున్నది. ఏ విధంగా అది అక్కడికి వచ్చిందో నేనెరుగను, కానీ అది అక్కడ వున్నది. తర్కించవద్దు, నమ్ముము. పరిస్థితులు ఏమైనప్పటికీ ఫర్వాలేదు, పరిస్థితుల మీద నీ దృష్టి నిలుపకు, నమ్ముము!
GEN 2:17•
GEN 3:4
51ఇప్పుడు, దేవుడు చెప్పెను, "మీరు తిను దినమున మీరు నిశ్చయముగా చనిపోవుదురు."
సాతాను "నీతో నేను ఒక విషయమును చెప్పనివ్వు," అన్నది. [చూశారా]. "దేవుడే సత్యము," అని ఇప్పుడు మనము అంటాము, ఖచ్చితముగా; అది నిజము. మనము ఆ వాక్యమును నమ్మెదము. "ఓ, నేను కూడా ఆ నిజమైన వాక్యమును నమ్మెదను. అవును, అది నిజము, ఖచ్చితముగా అది నిజమే. కాని నేనేమి చెప్పుచున్నానో నీవు ఆలకించుము. ఆయన చెప్పిన మాటలకు అర్థము అది కాదు," అని సాతాను చెప్పెను.
ఆయన స్పష్టముగా దానినే చెప్పెను, ఆయన చెప్పిన మాటల యొక్క ఉద్దేశ్యము కూడా అదియే.
"ఇప్పుడు చూడు, ఆయన ఎందుకు దానిని చేసాడో నేను మీకు చెప్పెదను. ఆయన నిజముగా… ఇలా చూడు, నీకసలు తెలివితేటలు లేవు, నీకు ఆలోచించు బుద్ది కూడా లేదు, [చూశారా]. నీవు కేవలము తలవంచుకుని వెళ్ళే ఒక గొర్రెవలె నడిపించబడటానికి మాత్రమే వున్నావు, అసలు నీకు నీవే సొంతము కాదు," అని సాతాను అన్నాడు. నీవు ఆ విధముగానే వుండవలెనని దేవుడు కోరుచున్నాడు. మీరు ఎన్నడు… మీరు పి.హెచ్.డి ఇంకా పొందలేదు. మీకు… మీకు తగిన విద్యలేదు. కానీ నాకు జ్ఞానము కలదు, దానిని నేను మీకు రుజువు చేస్తాను. ఇప్పుడు చూడండి, మీకు ఏది తప్పో, ఏది ఒప్పో తెలియదు. అటువంటిది. ఏదో ఒకటి వున్నదని మీకు తెలుసు. కానీ అది ఏమిటో మీకు తెలియదు, "దానిని నీవు ఏ విధముగా చేయవలెనో నేను నీకు చూపించెదను." సాతాను హవ్వతో చెప్పదలచినదంతా అదే. తాను చేయదలచినదంతా ఆశించినది అదియే. మరియు "దానిని ఏ విధముగా చేయవలెనో నేను దానిని నీకు చూపించనిమ్ము," అని అన్నాడు.
"కానీ మేము చనిపోతాము కదా?" అని ఆమె అన్నది.
"తప్పక దేవుడు దానిని చేయడు, మీరు కూడా జ్ఞానము కలిగి వుంటారని ఆయనకు తెలియును," అని సాతాను అన్నాడు, చూశారా. దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకముగా సాతాను తనయొక్క తెలివి తేటలను ప్రయోగించుట. ఈ బుద్ధిపూర్వకమైన జ్ఞానము గురించే నేను మాట్లాడబోవుచున్నాను, చూశారా. జ్ఞానమును ఎదుర్కొనే విశ్వానము. అచ్చటే మెదటి యుద్ధము జరిగినది. అప్పుడు దేవుని యొక్క వాక్యము నిశ్చలముగా మరియు సత్యముగా నిలబడి యుండెను. చేయకూడదు అనే కార్యమును వారు చేసినందువలన వారు మరణించిరి. అప్పటి నుండే వారు మరణమును పొందుకొనిరి, చూశారా. అక్కడే … అసలు సందేహపు నీడకు అవకాశమనేది లేకుండా ఉండే సరిగ్గా ఆ స్థలమందే అది నిరూపించబడినది. ఇప్పుడు, దానిని గురించి కొద్దిసేపు మనము మాట్లాడుకుందాము.
GEN 3:1,4,5•
ROM 10:17
52ఇప్పుడు, బుద్ధిపూర్వకమైన జ్ఞానము (తర్కము) తన సొంత తెలివితేటలతో ఆలోచించుచున్నదనే దానిని నేను ఆదికాండము 3:1-17 లో చూపించెదను. లేక 1-7 అయివుండవచ్చు, ఎంతమంది దానిని నమ్ముచున్నారో "ఆమేన్" అని చెప్పండి. "అమేన్!" చూశారా?
నీవు ఇప్పుడు చెప్పవచ్చును…
"మంచిది, నేను మీకు చెప్పెదను…" అని వైద్యులు చెప్పుదురు.
ఇప్పుడు, ఈ చిన్న స్త్రీని తీసుకుందాము, ఇప్పుడే నేను ఆమె యొక్క సాక్ష్యమును చెప్పాను, "ఇక నేను చేయుటకు ఏమీలేదని వైద్యుడు చెప్పెను, నీ పని అయిపోయింది, నీవు బ్రతుకుటకు అవకాశము లేదు, పిచ్చాసుపత్రిలో చేరు, ఆమెను అక్కడికి తీసుకెళ్ళమని," డాక్టరు చెప్పాడు.
"ఆ మానసిక వైద్యశాలలో, జైలులా వుండే ఆ చిన్న గదిలోకి వెళ్ళుటకంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని," ఆమె చెప్పింది.
దాని తరువాత ఏమైంది? దేవుడు రంగము మీదికి వచ్చెను, ఎక్కడో దూరముగా బ్లూమింగ్టన్ దగ్గర ఇల్లినోయి వద్ద, కెన్సాస్ లో వున్న ఆమె వార్తాపత్రికలలో ఇచ్చిన ప్రకటన ద్వారా కూటములు జరుగుచున్నవని తెలుసుకొనెను. "వినుట వలన విశ్వాసము కలుగును," చూశారా. మంచిది, ఆమె భర్త ఆమెను తీసుకొని వచ్చాడు. వారు నిజమైన ప్రేమికులు, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు, ఆలోచించండి, నాలుగు సంవత్సరములలో నాలుగు పెద్ద ఆపరేషన్లు, 15 లేక 16 ఉద్రేకమును అదుపుచేయు మందులు, అవి ఒక మనిషిని చంపడానికి సరిపోతాయి మరియు వారమునకు రెండు లేక మూడు రకముల ఇంజక్షన్లు. నాకు తెలుసు, అందులో ఒకటి "లెక్సట్రాన్" అనే మందు. మానసిక వ్యాధికి తీసుకొనే ఇంకో మందును మర్చిపోయాను, అది ఏమిటో! మానసిక స్థితి కొరకు ఉపయోగించు ఏదో ఒక మందు, ఆమె ఈ ఇంజక్షన్లు వేసుకుంటూనే వాటికి తోడు రేండు నిద్ర మాత్రలు వేసుకున్నాక కూడా నిద్రపోలేకపోయేది, దయనీయమైన స్థితి. పగలంతా, రాత్రంతా బలహీనత, సంవత్సరము ప్రారంభము నుండి సంవత్సరము చివరి వరకు కాలము గడిచిపోతుంది; ఏమీ చేయలేము. అయితే వినుట వలన విశ్వాసము వచ్చును! చూశారా?
HEB 13:8
53ఆమె అక్కడికి వచ్చినప్పుడు, దేవుడు ఆమెను మొట్టమొదటి వ్యక్తిగా వేదిక మీద నిలబెట్టాడు, చూశారా. ఏమిటి? ఎందుచేత? నేను ఆమె దగ్గరకు నడిచి వెళ్ళినప్పుడు అడిగాను "ఎలా వున్నావు సోదరి," (ఆమె ఎన్నడూ దీనిని గురించి వినలేదు; దానిని గురించి ఆమెకు ఏమీ తెలియదు.) "నీవు శ్రీమతి. ఫలానా, ఫలాన, కేన్సాస్ నుండి వచ్చావు" అని చెప్పాను.
ఇప్పుడు, వెంటనే ఆ కార్యము ఆమెను ఆలోచింప చేసినది, ఒక్క నిమిషము ఆగు, యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా వున్నానని అతడు చెప్పడము నేను విన్నాను. పరిశుద్ధ గ్రంథమునందు, క్రీస్తు తన సంఘములో చివరి దినముల యందు ప్రత్యక్షమగుననే వాగ్దానమును మరియు ఆనాడు వారు సొదొమలో చేసిన కార్యములు, ఇంకా మొదలగు కార్యములు ఈ రాత్రీయందు ఆయన ప్రసంగించిన విధముగానే ఇచ్చట దానిని నిరూపించుచూ, (నా యొక్క ప్రారంభ ప్రసంగపు సారాంశము అదియే) ఇప్పుడు ఆ కార్యములు ఖచ్చితముగా ఆ విధముగానే జరుగుచున్న దానిని ఇదిగో ఇచ్చట నేను చూడగలుగుచున్నాను.
54అవును! "ఇప్పుడు, నీవు ఎంతో మంది వైద్యుల యొద్దకు వెళ్ళావు, నీకు నాలుగు ఆపరేషన్లు జరిగాయి," అని నేను చెప్పినప్పుడు.
"ఏ విధముగా అతనికి ఈ విషయం తెలుసు? అని ఆమె ఆశ్చర్యపోయెను. ఎక్కడ నుండి అతనికి ఈ సమాచారము అందినది. ఎక్కడ నుండి అది వచ్చినది. ఆ చిన్న బట్టతల మనిషికి, దానిని గూర్చి అతనికి తెలియదు, అది ఎలాగు అతనికి తెలిసినది?"
"ఇక్కడకు మీరు వచ్చే మార్గము మధ్యలో ఈ సంగతి.."
"ఇప్పుడు సరిగ్గా దానిని గూర్చేకదా ఆయన ప్రసంగించెను," అని ఆమె గుర్తెరిగినది. అదే వాక్యము.
కానీ మీకు తెలుసా, "నీవు దానిని అంగీకరిస్తే నీ సంఘకాపరి… దానిని గురించి ఆలోచించు," అని సాతాను చెప్పింది. వాడి మాటలకు దీనికి సంబంధము లేదు, చూశారా. అటువంటి వ్యర్థమైన నీ సొంత ఆలోచనలను త్రోసివేయుము. "వెళ్ళి పిచ్చాసుపత్రిలో చేరు, అని నీ వైద్యుడు చెప్పాడు కదా!" అనే నీ స్వబుద్ధితో ఆలోచించే మాటలను త్రోసివేయుము.
"దానిని గూర్చి దేవుడేమి చేప్పునో నేను వేచి చూస్తాను," చూశారా.
అప్పుడు దేవుడు… దానిని గూర్చి ఏమి చెప్పెనో నేను ఎరుగను, అప్పుడు పరిశుద్ధాత్మ దానిని బయలుపరచి, బహిరంగముగా ఆ విషయమును తెలిపెను. ఆమె దానిని నమ్మినది. ఆమె యొక్క సొంత ఆలోచనలతో దానినిగూర్చి అస్సలు సందేహించలేదు. సంవత్సరముల తరబడి సంవత్సరములుగా నరాల బలహీనతతో, మానసిక ఒత్తిడితో, ఆపరేషన్లతో, ఇంకా అనేక కార్యములతో ఆమె సతమతమవుచూ క్షీణించి పోవుచున్నది. "ఇప్పుడు ఈ వేదిక మీద ఇచ్చట ఒక్క క్షణములో నేను స్వస్థతను పొందుకోగలను," అనే తలంపు ఒక సమంజసమైన కార్యమగును. కానీ, ఆమె అనుమానమతో కూడిన ఏ ఆలోచనలను ఆలోచించ లేదు. ఆమె కేవలము నమ్మినది, విశ్వాసము అచ్చట క్రియచేసినది, ఆ క్షణమందే ఆమె స్వస్థతను పొందుకొనెను. ఒకవేళ మీరు ఆమెకు ఉత్తరము వ్రాసి దానిగూర్చి తెలుసుకోవాలని ఆశించినయెడల, ఆమె యొక్క చిరునామాను బిల్లీ మీకిచ్చును. మంచిది.
55ఇప్పుడు, జ్ఞానము సొంత తలంపులతో అనుమానించును. కానీ, విశ్వాసమునకు ఎటువంటి సొంత తలంపులు వుండవు; లేదా తర్కించదు, అనుమానించదు, వాక్యమును పట్టుకొని నిలుచుట తప్ప వేరేదియు అది చేయదు. అది వాగ్దానము పట్టుకొని యుండును.
ఇప్పుడు, రోమా 4వ అధ్యాయమునకు త్రిప్పి కొంచెము చదివెదము. ఈ సమయమున ఈ వాక్యము మనలో చొచ్చుకొనిపోయే వరకు మనము వాటిని ధ్యానించెదము. రోమా 4వ అధ్యాయము, ఎందుకనగా నేను నిజముగా వాక్యమును చదువుట కొరకు ఇష్టపడతాను. దానిని చదువుటవలన మీకు మేలు కలుగును. రోమా 4వ అధ్యాయము 17వ వచనము నుండి ప్రారంభించుదము.
GEN 16:1•
GEN 17:4•
ROM 4:17
56వినండి పౌలు, అబ్రాహాము జీవితము మీద వ్యాఖ్యానము వ్రాసెను, అబ్రాహాము. గెరారుకి తిరిగి వెళ్ళుట గురించి, అక్కడ దానిని గూర్చి వాక్యములో ఏమీ చెప్పలేదని మీకు తెలుసు. "కేవలము అబ్రాహాము దేవుని నమ్మెను," అని ఆ గొప్ప అపోస్తలుడైన పౌలు అబ్రాహామును గూర్చి వ్యాఖ్యానము వ్రాసెను. 17వ వచనము:
(అది వ్రాయబడినట్లుగా… [నేను దానిని ఇష్టపడతాను, పౌలు వాక్యముతో నిలబడి యుండెను], "నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని" అని వ్రాయబడినట్లు వుండెను.)
అబ్రాహాము 75 సంవత్సరములు వయస్సు కలిగినవాడు, అతని భార్య ఒక యవ్వనస్తురాలిగా వున్నప్పటి నుండి - ఇద్దరూ యవ్వనస్తులుగా ఉన్నప్పటి నుండి కలసి జీవించుచుండిరి. ఆమె అతని యొక్క సవతి తల్లి కుమార్తె. వారికి పిల్లలు లేరు, అతను వంధ్యుడు, ఆమె గొడ్రాలు. కానీ దేవుడు అతనిని కలుసుకొని, "నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని." (భూతకాలము, జగదుత్పత్తికి ముందే) జనములకు తండ్రిగా (ఇంగ్లీషులో "దేశములకు తండ్రిగా" అని వున్నది) అనేక మంది పిల్లలకు తండ్రిగా నేను నిన్ను నియమించితిని అని కాదు, కానీ చాలా జనముల (దేశము)కు, కొద్దిగా దానిని గూర్చి అలోచించండి.
… అతడు ఎవరిని నమ్మెను… [దేవుని], "మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట."
ROM 4:18
57ఎన్నడూ నీ సొంత తలంపులతో అసలు అనుమానించవద్దు. వినండి, "లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు."
నిరీక్షణకు వ్యతిరేకముగా [నిరీక్షణ అనేది లేని పరిస్థితి, అతడు తన సొంత తలంపులతో అనుమానించి యుండినయెడల ఏమైయుండును?] "తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, అతడు నిరీక్షణ కలిగి నమ్మెను." నీ సంతానము ఇలాగు వుండునని ఎవరి ద్వారా పలకబడినదో దానినిబట్టి అతడు నమ్మెను.
పరిస్థితులను బట్టి ఎవరేమి చెప్పుచున్నను లెక్క కాదు, దేవుడు చెప్పెను; అది స్థిరపరచును! ఓ, ఒకవేళ హవ్వ కేవలము దానితోనే నిలిచియుండి వుంటే? కానీ, ఆమె బుద్ధిపూర్వకమైన జ్ఞానమును పొందుకొనుటకై కొద్దిసేపు ఆగి తన సొంత తెలివితేటలతో ఆలోచింపసాగినది. అబ్రాహాము ఏ జ్ఞానమును కోరుకొనలేదు. అతను వాక్యమును మాత్రమే కోరుకొన్నాడు: "దేవుడలా చెప్పెను కావున దానిని అదే ముగించును. చాలా సార్లు నేను దానిమీద బోధించాను, మీకు తెలుసు. పుట్టబోవు పిల్లవాని కోసము సిద్దపడి వెళ్ళి, కావలసిన బట్టలు, పిన్నులు మొదలగునవి అన్నీ కొని, శారా బూట్లు తయారు చేసినది. సంవత్సరము వెంబడి సంవత్సరములు గతించుచుండెను. "దేవునికి స్తోత్రము, మేము ఏ విధముగానైనా అది పొందుకోబోవుచున్నాము." అది సత్యము.
"ఏమిటీ, ఆమెకు…?" మంచిది, ఆమె పిల్లవాడిని కనే అవకాశము లేదు, నీవు దానిని పొందలేవు," అని వైద్యుడు చెప్పెను.
"హు… నాతో ఏమీ చెప్పవద్దు; ఏది ఏమైనా కానీ మేము దానిని పొందుకోబోవుచున్నాము!" అంతే.
ROM 4:18-21•
ROM 8:24,25•
2COR 10:15
58నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, అయినాగాని నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షించుటకుగల ఆధారములన్నీ పోయినవి, అయినాగాని అతడు దానియందు నమ్మకము కలిగియుండెను. అతని విషయమునందు నిరీక్షణ పూర్తిగా మృతి చెందినట్లాయెను. ప్రతీ విజ్ఞాన పరిశోధనయందు నిరీక్షించుటకు ఆధారాలు నశించినవి, ప్రతీ జ్ఞానము యొక్క మూలమునందు నిరీక్షణకు అవకాశము లేకపోయెను. అయినాగానీ దానియందు అతడు ఇంకా నమ్మకము కలిగియుండెను. అది ఏమై వున్నది? నిరీక్షణ అనేది లేనప్పుడు, నిరీక్షణయందు విశ్వాసముంచుట, దానిని విశ్వసించుట. కొంత సమయము దానిమీద ఆగాలనుకుంటున్నాను. నిరీక్షణ లేనప్పుడు అక్కడ నీరీక్షణయందు విశ్వాసముంచుట, ఎందుకనగా "నీ సంతానము ఆ విధముగా వుండునని," ఆయన నాతో చెప్పెను. ఇప్పుడు 19వ వచనము.
మరియు అతడు దానితో బలహీనుడు కాక… [జ్ఞానమా? తెలివితేటలా? డిగ్రీ పొందటములోనా, కాదు, కాదు!] విశ్వాసమునందు బలహీనుడు కాక! [హ, అక్కడే మీరున్నారు!] అతడు మృతతుల్యమైన తన సొంత శరీరము వైపు చూడలేదు, [నిరీక్షణ నశించినది, అతని శరీరము మృతతుల్యమైనది, తరువాత వినండి:] అతను సుమారు వంద సంవత్సరముల వయస్సు గల వాడయ్యెను… శారా గర్భము చనిపోయినది: [నిరీక్షణ మృతమాయెను, అతడి శరీరము మృత తుల్యమాయెను; శారా గర్భము మృత తుల్యమాయెను. అతను ఏమి చేశాడు? తరువాత వచనము:]
అతను సందేహింపక… [ఓ, మై!] అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక; [జ్ఞానము] కానీ, విశ్వాసము వలన బలమునొంది, దేవునిని మహిమపరచెను; [ఓ, మై! ఏమిటీ!]
ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్ధుడని రూఢిగా విశ్వసించెను.
59హూ! పరిస్థితులు ఎలాగున్నను లెక్క చెయ్యలేదు… ఆ కార్యము గూర్చి తన సొంత తలంపులతో తలంచుచూ ఏ మాత్రము కూడా అనుమానించలేదు. విశ్వాసము కేవలము వాక్యమును మాత్రమే తీసుకొని దానిని మాత్రమే పట్టుకొని వుండును. ఇప్పుడు, ఇది దేవుని యొక్క వాక్యమైతే (నీవు దానిని నమ్మవా?) దానిలోని ఏ మాటనైనను, ఏ వాగ్దానమునైనను ఎందుకు అనుమానిస్తూన్నావు? "ఆ భాగములో అచ్చట అది ఏమి బాగోలేదు, ఈ భాగమందు ఈ విధముగా ఉన్నది," అని అంటూ వాక్యములో మీకు ఏది ఇష్టమో దానిని మాత్రమే తీసుకుంటారా? దానిని నీవు అలాగు చెయ్యకూడదు. అయినాగాని, నీవు వాక్యముతోనే నిలిచియుండుము. అది అంతా మంచిదైనా అవ్వాలి లేక దానిలోనిది ఏదీ కూడా మంచిది కాకుండా వుండాలి. అది సత్యము! అది సత్యమని నీవు తెలుసుకున్న వెంటనే దానిని గట్టిగా పట్టుకొనుము. పరిస్థితులు ఏ విధముగా వున్నప్పటికీ, వారు అనేక విధములుగా తర్కించుటకు ప్రయత్నించినప్పటికీ, దానినిగూర్చి వారి సొంత ఆలోచనలతో వారు ఏమి చెప్పినను దానిని నీవు లెక్క చేయవద్దు. వాక్యమునందు నీకున్న పట్టును సడలించవద్దు. ఆ విధముగా చెయ్యవద్దు. సరిగ్గా వాక్యముతోనే నిలిచి యుండండి; దానిని దేవుడు వాగ్దానము చేసెను.
60ఇప్పుడు క్రీస్తు కొరకు నేను నిలబడినట్లయితే, ఆయన నాకు పరిశుద్ధాత్మ అనుగ్రహించును. ఆయన ఆత్మ నాలో ఆయన యొక్క జీవముతో సాక్ష్యమును కలిగియుండును. తరువాత నేను చనిపోవు సమయము ఆసన్నమైనప్పుడు, సాతాను, "ఇప్పుడు నీవు చూడు, నీవు ఒక సంఘ శాఖకు చెందియుండలేదు," అని అంటాడు. అయినాగానీ నీవు వాక్యముతోనే నిలిచియుండుము. "ఇది నీవు చేయలేదు; నీవు అది చేయలేదు" అని చెప్పుటకు ప్రయత్నించును. దానినిగూర్చి సాతాను యొక్క సొంత తెలివితేటల మాటలు పనిచేయవు, ఎందుకనగా అది దేవుని యొక్క వాక్యమైయున్నది. వాక్యముతో నిలిచియండుము, అప్పుడు అది సమస్త జ్ఞానముతో కూడిన తలంపులన్నిటినీ పారద్రోలును, చూశారా. ఏ మాత్రము అనుమానమును నీవు కలిగి యుండకూడదు. కేవలము దేవుని యొక్క వాక్యమును మాత్రమే పట్టుకొనియుండుము, చూశారా.
61ఇప్పుడు, విశ్వాసము కేవలము ఆయన వాక్యమునందు నమ్మకముంచును, చూశారా. అదే వారు చేయాలని ఆయన కోరుకొనెను. ఇప్పుడు, మీరు దాని పూర్వపరాలు తెలుసుకున్నారు. మానవ జాతి ఆయన వాక్యమందు ఖచ్చితముగా నమ్మకము కలిగి ఉండాలనేదే దేవుని కోరిక, ఆయన చెప్పిన ప్రతీ మాటను నమ్మవలెనని ఆయన మనయెడల ఆశించుచుండెను. హవ్వ దానిలోని చాలా మొత్తాన్ని నమ్మినది. కానీ, ఒక చిన్న విషయమునందు తప్ప. సరిగ్గా అక్కడే ఆమె తన పట్టును కోల్పోయింది. సరిగ్గా ఆ స్థితినుండే ఆమె మునిగిపోవడము ప్రారంభించినది. ఆ స్థితియందే మానవజాతి మొత్తము అక్కడే సూటిగా సమాధిలోనికి దిగిపోయింది, ఎందుకనగా ఆమె ఒక్క మాటను అనుమానించినది.
GEN 3:4
62వారిలో కొంత మంది, "మంచిది, ఇది నిజమని నేను నమ్ముచున్నాను, అది నిజమని నేను నమ్ముచున్నాను, దేవుడు రక్షించగలడని నేను నమ్ముచున్నాను, కాని ఆయన స్వస్థపరచగలడని నేను నమ్ముట లేదు. పెంతెకోస్తునాడు తప్పక పరిశుద్ధాత్మ దిగినదని నేను నమ్ముచున్నాను, కాని పెంతెకోస్తు తరువాత పరిశుద్ధాత్మ దిగినట్లుగా ఏ స్థలమునందు చెప్పబడలేదని," చెప్పెదరు.
ఓ, సోదరుడా! వారు దానిని చెప్పే విధానము అదే, క్రీస్తు సంఘములుగా తమను తాము చెప్పుకొందురు. దైవభక్తి గలవారమని చెప్పుకుంటూ, దేవుని వాక్యమును త్రోసివేయుట అదియేయగును. అయితే మీరు చూశారా, తర్కించవద్దు; కేవలము విశ్వసించు. బుద్ధిపూర్వకమైన జ్ఞానమును కలిగియుండుటకు ప్రయత్నించకు, కేవలము వాక్యమును నమ్ముము.
బుద్ధిపూర్వకమైన జ్ఞానము స్వబుద్ధితో ఆలోచించుటకు ప్రయత్నించుచూ ఇంకొక మంచి మార్గమును నీ ముందు వుంచును. ఇప్పుడు, ఖచ్చితముగా అదే సాతాను హవ్వకి చెప్పినది. "ఇప్పుడు, మీరు చనిపోరు. ఖచ్చితముగా, మీరు చనిపోరు, ఎందుకనగా దేవుడు మంచి దేవుడు," అని చెప్పెను.
MATT 4:4
63ఆయన మంచి దేవుడు, ఆయన తన వాక్యముతో నిలిచి వుంటాడు. ఆయన మంచి దేవుడని నేను నమ్మడానికి గల ఒకే ఒక కారణము అదే. నేను నమ్మదగినవానిగా లేనప్పుడు నీవు ఏ విధముగా నన్ను నీవు నమ్మదగినవానిగా ఎదురు చూడగలవు? ఒకవేళ నేను మీకు ఒకటి చెప్పి మరొకటి చేసి, నా మాటలు నిలకడగా లేకుండా వుంటే, చూశారా. ఆయన తన వాక్యమును పలికాడు, ఆ పలికిన వాక్యము మాత్రమే ఆయనను ఒక మంచి దేవునిగా చేసినది. మరి మనము ఆ వాక్యముతోనే జీవించాలి. "మనుష్యుడు రొట్టె వలన కాదు గాని, దేవుని నోటనుండి వచ్చు ప్రతీ మాటవలన జీవించును." ఆ వాక్యముతోనే దేవుడు నిలబడును; అదే ఆయనను మంచి దేవునిగా చేసినది.
MATT 7:14•
LUKE 13:24
64"సరే, వారు దీనిని చేయుట కొరకు వారిని దానితోనే వుండనిస్తాను. వారు దానిని చేయుటకు నేను అనుమతించెదను. సరే, ఫర్వాలేదు. ఓ, సరే, నేను చెప్పిన మాటల నుండి కొంచెము వెనక్కి వెళతాను," అని ఒకవేళ ఆయన చెప్పిన యెడల, ఆయన ఒక మాట చెప్పి, దాని తరువాత అది అలా చేద్దామా లేకపోతే వద్దా అని అనుకుంటూవుంటే నిలకడ లేనివానిగా వుండును, చూశారా. అలాగైతే ఆయన దేవుడు కాదు; ఆయన కేవలము ఒక సామాన్య వ్యక్తి. కానీ, ఒక మంచి దేవునిగా వుండుట కొరకు ఆయన తన వాక్యముతో నిలువవలసి యున్నది. ఒకవేళ ఒకరిని వ్యభిచరించుటకు, ఇంకొకరిని కొద్దిగా త్రాగుటకు, ఒకరిని కొద్దిగా అబద్దమాడునట్లు, మరొకరిని దొంగిలించుటకు, ఒకరిని అది, ఇది, చేయుటకు అనుమతించి, అలాగ చేస్తూ ఆయన నన్ను లోపలికి అనుమతించగలడా? ఆయనకు ఒకే ఒక్క మార్గము మాత్రమే కలదు మరియు లోపలికి ప్రవేశించు వారందరూ అదే మార్గము గుండా రావాలి. "మార్గము సంకుచితము, ద్వారము ఇరుకు, అపవిత్రత ఏదీ కూడా దానిలోనికి ప్రవేశింపనేరదు."
REV 22:14,15
65ప్రకటన గ్రంథమందు ఆయన చెప్పెను, "కుక్కలును, మాంత్రికులును, మరియు అబద్దమును ప్రేమించి దానిని జరిగించు ప్రతివాడును బయట వుందురు. ఆయన ఆజ్ఞలన్నియు నెరవేర్చువాడు ధన్యుడు, వాడు జీవవృక్షమునకు హక్కుగలవాడై వుండును." అది సత్యము. ఒకే ఒక్క మార్గము మాత్రమే కలదు, అది దేవుడే. దానితో తర్కించవద్దు, వేరొక మార్గము లేదు.
మంచిది, రోమన్ కాథలిక్ సంఘము, "మేమే నిజమైన సంఘము, ఆ పరిశుద్ధ గ్రంథము కూడా ఎందుకూ పనికి రానిది…" అని చెప్పుచున్నది.
బిషప్ షీన్, "దానితో జీవించడానికి ప్రయత్నించుటమంటే మురికి నీళ్ళగుండా నడుచుట వంటిది," అని అన్నాడు.
66చూశారా, చూశారా? దానిని మీరు ఏ విధముగా చేయనున్నారు? అప్పుడు ఒకవేళ అతను సరి అయితే పరిశుద్ధ గ్రంథము తప్పు అవుతుంది. పరిశుద్ధ గ్రంథము సరి అయితే అతను తప్పు అవుతాడు. ఇప్పుడు, మీరు ఏమి చెప్పబోవుచున్నారు? ఒకవేళ దేవుని మాట సరియైతే, ఒకవేళ బిషప్ షీన్ మాత్రమే కాదు గాని, రెవరెండ్ ఫలానా, ఫలానా మరియు డాక్టర్ ఫలానా, ఫలానా నేను ఒక మనిషి పేరు చెప్పకూడదు కానీ, రేడియోలో దానిని అతడు చెప్పాడు, కాబట్టి ఫలానా మరియు ఫలానా వారు, అతడి పేరు చెప్పవచ్చని తలంచాను, డాక్టరు ఫలానా మరియు ఫలానా మరియు ఫలానా మరియు ఫలానా చెప్పెను. ఇప్పుడు, నీవు ఎవరిని నమ్మబోవుచున్నావు, దేవునినా లేదా వారినా?
67"మంచిది, అది ఆ రకమైన అర్థముతో చెప్పబడలేదు," అని చెప్పెదరు. ఆ రీతిగా చెప్పలేదు. అదే సాతాను యొక్క మొట్టమొదటి అబద్ధము. అది ఏ విధముగా వ్రాయబడినదో అది ఆ విధముగానే దాని అర్థమును కలిగి వుండును.
వాడు హవ్వతో, "అది నిజముగా, దాని అర్థము అది కాదు, నిశ్చయముగా, దేవుడు చాలా మంచివాడు, ఆయన ఆ విధముగా చేయడు, మీరు చావనే చావరు," అని చెప్పాడు.
కానీ, వారు చేసారు! ప్రతీసారి వారు దానిని ఆ విధముగానే చేస్తూనేయున్నారు. నీవు వాక్యమును సంధించవలసి యున్నది.
నవీన మార్గమును, ప్రఖ్యాతి చెందిన మార్గమును, సులువైన మార్గమును, తనకుతానుగా కనుగొనే ఒక చక్కని మార్గమునే జ్ఞానము ఎన్నుకొనుటకు ప్రయత్నించును.
68ఇప్పుడు, ఇక్కడ ఒక వ్యక్తిని తీసుకొనండి, ఒకవేళ దేవుడు అతనితో క్రియ చేయుటకు ప్రారంభించినప్పుడు అతను ఈ విధముగా ఆలోచిస్తాడు, "నేను ఈ దుష్ట కార్యములనుండి బయటపడాలి, నా భార్యను మంచి మార్గములోనికి తీసుకొని రావాలి; పేకాట, పార్టీలు మానాలి; నేను నృత్యశాలలకు వెళ్ళడము మానాలి; నా భార్య యొక్క జుట్టును ఎదగనియ్యాలి; నా భార్య రంగులు పూసుకొనుట మానాలి; నేను పొగత్రాగుట మానాలి, త్రాగుడు మానాలి; నేనువున్న పెద్ద అంతస్తుగల సమాజమును వదిలి రావాలి; నన్ను నేను తగ్గించుకొని ఆ బలిపీఠము యొద్దకు వెళ్ళాలి," అని అనుకుంటాడు. అప్పుడు తాను మత పిచ్చి పట్టినవాడు, పరిశుద్ధ గుండ్రాళ్ళు, బయెల్జెబూబు వంటి పేర్లుతో పిలువబడును, ఏ విధముగా అతడిని పిలిచినను దానిని లెక్కచేయకుండా నిలబడగలడు. "ఓ, నేను భక్తిగలవాడిగా వుంటాను, కావున నేను వెళ్ళి అక్కడవున్న ఆ సంఘములో చేరిపోతాను, వారు సంకుచిత స్వభావముగలవారు, ఆ విధమైన తలంపులు కలుగును (చూశారా), అక్కడ నీ స్వబుద్దిని ఉపయోగించవద్దు హేతువాద కారణములను కలిగియుండవద్దు. ఈ విషయమునుగూర్చి, ఇంకా కొద్ది నిమిషములలో ఒక గొప్ప ప్రాముఖ్యమైన సంగతిని మనము చూడబోవుచున్నాము, చూశారా. అప్పుడు మీరు ఏది తప్పో, ఏది ఒప్పో మీరు ఎలా తెలుసుకుంటారు, చూశారా?
69ఇప్పుడు, వాక్యము వేరేదేనినో ఒక దానినిగూర్చి చెప్పుచున్నట్లుగా చూపించుటకు బుద్ధిపూర్వకమైన జ్ఞానము ప్రయత్నించును. అది అట్లే దానిని చేయుచున్నది. జ్ఞానము… బుద్ధిపూర్వకమైన జ్ఞానము హేతువాద కారణమును వెదకుచూ స్వబుద్ధితో ఆలోచించుటకు ప్రయత్నించును. కాబట్టి జ్ఞానము వాక్యానుసారమైన మార్గమును కాకుండా ఇంకా సులువైన, మెరుగైన మార్గమును కనుగొనును. దేవుని యొక్క మార్గము తప్ప వేరే ఏవిధమైన మార్గము అచ్చట లేదు.
బుద్ధిపూర్వకమైన జ్ఞానము, "ఓ, మంచిది, ఇప్పుడు ఈ కాలములో దానిని మనము చేయలేమని," నొక్కి చెప్పడానికి ప్రయత్నించును. కాని దానిని ఏ విధముగానైన మనము తప్పక చేయవలెను! చూశారా? జ్ఞానము సులువైన మార్గమును కనుగొనుటకు ప్రయత్నించును. పరిశుద్ధ గ్రంథము చెప్పని విషయాలను చెప్పినట్లుగా అది చెప్పుటకు ప్రయత్నించును.
AMOS 3:7•
LUKE 1:70•
ACTS 3:21•
2PET 1:20
70ఇప్పుడు, "ఓ, సోదరుడా బ్రెన్హాం, ఒక్క నిమిషము ఆగు," అని మీరు అంటారు. మరలా మనము విత్తనము వద్దకు వెళ్ళుదము. దెయ్యము బుద్ధిపూర్వకమైన జ్ఞానముతో ఏమి చేయుటకు ప్రయత్నించింది? దేవుని వాక్యము చెప్పని ఏదో ఒక విషయమును అది ఆ విధముగానే చెప్పబడియున్నట్లుగా చూపించుటకు ప్రయత్నించును. అది సత్యము. దేవుని యొక్క వాక్యము చెప్పని సంగతిని, వాక్యము వేరే ఏదో చెప్పుచున్నట్లుగా వాడు చూపించుటకు ప్రయత్నము చేసెను. అదే దారిలో ఈ రోజు కూడా అదే విధముగా అది వచ్చుచున్నది.
దేవుని యొక్క వాక్యము చెప్పని ఏదో ఒక దానిని అది ఆ విధముగానే చెప్పుచున్నదని వారు చూపించుటకు ప్రయత్నించుచూ, "సహోదరుడు బ్రెన్హాంగారు, నేను దానినిగూర్చి చెప్పుచున్నదేమనగా, దానియొక్క నిజమైన అనువాదము నీయొద్ద లేదు," అని వారు చెప్పెదరు. కానీ, ప్రవచనము ఏ వ్యక్తిగత అనువాదమునకు చెందినది కాదని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఎందుకని? ఎందుచేత? అది ఎటువంటి వ్యక్తిగత అనువాదమునకు చెందినది కాదు. ఎందుచేత? ప్రభువు యొక్క వాక్యము ప్రవక్తల యొద్దకే వచ్చును. అది ప్రవక్త ద్వారానే అనువదించబడును. అది ఏ వ్యక్తిగత అనువాదం ద్వారా అనువదించబడదు. ముందుగానే ప్రవక్తలు దానిని మీకు అనువదించారు, అదిగో అది అచ్చట వ్రాయబడి వున్నది, అది ఆ విధముగానే వుండవలసిన మార్గములోనే అది వుండును.
71ప్రజలందరినీ తీర్పు తీర్చుట కొరకు మూలాధారమైన ఏదో ఒక కార్యమును దేవుడు కలిగియుండి, దాని ద్వారా ప్రజలందరినీ ఆయన తీర్పు తీర్చవలెను. ఒకవేళ ఒక సంఘము ద్వారా ఆయన న్యాయ తీర్పును తీర్చునని అనుకుందాము. అట్లయినయెడల ఏ సంఘము ద్వారా దానిని చేయవలయును (దాదాపు 900 సంఘములు కలవు, భిన్నమైన 900 సంఘ శాఖలు కలవు) నన్ను మన్నించండి. వాటిలో ఏది సరియైన సంఘము? మీరు లోపలికి ప్రవేశించగలరనేది మీరేలాగు ఎరుగుదురు. నీవు మెథడిస్టువైతే, ఒకవేళ బాప్టిస్టు సరియైనదైతే ఏమీటి పరిస్థితి? నీవు పెంతెకోస్తువైతే, ఒకవేళ ప్రెస్బిటేరియన్ సరియైనదైతే పరిస్థితి ఏమగును? నీవు లూథరన్, ఒకవేళ క్యాథలిక్ సరియైనదైతే పరిస్థితి ఎలాగు ఉండును? చూశారా? అక్కడ ఎక్కడో ఏదో ఒక మూలాధారమనేది వుండవలయును. అయితే ఒకవేళ వాక్యము…
JOHN 1:1
72"ఆదియందు వాక్యయుండెను, వాక్యము దేవునియొద్ద వుండెను, వాక్యమే దేవుడైవుండెను," చూశారా? వాక్యము దేవునిలో వుండెను, అది దేవుడై యుండెను. అది నిరంతరం ఆయనతో వుండే ఆయన యొక్క ఆలోచనలైయుండెను. దేవునివలె ఆయన ఆలోచనలు కూడా నిత్యమైనవిగా వున్నవి. ఆమేన్. సోదరుడా, అది మీగడ తీసిన పాలలా లేదా, చూశారా.
అది ఇచ్చట ఈ విధముగా ఉండును. ప్రారంభమునందు దేవుని ఆలోచనలు ఆయన మాటగా వున్నవి… [ఇప్పుడు నిత్యత్యములో అది వున్నది. మొట్ట మొదట ఆరంభము మొదలైనప్పుడు, ఆ సమయము.] "ఆదియందు వాక్యముండెను, [దేవుని యొక్క ఆలోచనలు] వాక్యము దేవునియొద్ద వుండెను, ఆ వాక్యము దేవుడైయుండెను," చూశారా. ఆయన ఏమైయున్నాడో అదే ఆయన ఆలోచనలై యున్నవి. అలాగే నీవు కూడా, నీ ఆలోచనలు ఏమైవున్నవో అదే నీవైయున్నావు. వేరేగా నీవు జీవించుటకు ఎంత ప్రయత్నించినా లెక్క లేదు, నీవు ఏమైవున్నావో అదే నీ ఆలోచనలుగా వున్నవి. నీవు అందరితో కలసివుండి మంచి వ్యక్తిగా ప్రవర్తింపవచ్చు, కానీ నీ హృదయంలో నీవు ఒక వ్యభిచారణిగా వున్నావు. మరియు నీవు ఏమైవున్నావో అదే నీవుగా వున్నావు. నీ యొక్క ఆలోచనలే నీవైయున్నావు. మరియు దేవుని యొక్క ఆలోచనలు ఆయన వాక్యముగా వుండెను, అది ఆయనతో వుండెను, ఆయనలో వుండెను, మరియు అది దేవుడై యుండెను.
"ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద వుండెను, వాక్యము దేవుడైయుండెను." మరియు ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య సంచరించెను. దేవుని యొక్క ఆలోచనలు మానవ శరీర రూపంలో ప్రత్యక్షమయ్యెను, శరీరమును ధరించుకొని మనమధ్య నివసించెను. దానినే మీరెరుగవలయును.
GEN 3:4
73ఒకవేళ మీరు ఈ రోజు నిత్యజీవము కలిగియున్నట్లయితే, మీరు దేవునిలో వున్నారు. దేవుడు మీలో వున్నందువలన మీరు బయలపరచడిన దేవుని యొక్క ఆలోచనగా వున్నారు. ఓ! అట్లయితే, దేవుని వాక్యమునకు విరుద్ధమైన ఎటువంటి బుద్ధిపూర్వకమైన ఆలోచనలకు మీరు చెవియొగ్గ వద్దు, అట్లు మీరు వినినయెడల మీ యొక్క కిరీటము తీసివేయబడి అది వేరొకరికి ఇవ్వబడుతుంది. కాబట్టి ఏన్నడూ ఎటువంటి బుద్ధిపూర్వకమైన ఆలోచనలను (తర్కములను) గైకొనకూడదు. దేవుడు చెప్పినదే సత్యమని కేవలము నమ్ముము. దానితోనే నిలకడగా నిలిచి యుండుము.
బుద్ధిపూర్వకమైన జ్ఞానము ద్వారా వచ్చు ఆలోచనలు, వాక్యము చెప్పని ఒక విషయమును ఆ విధముగానే చెప్పినట్లుగా అది చిత్రీకరించి చూపించుటకు ప్రయత్నించును.
ఇప్పుడు, "నీవు, అది నిజమా, సోదరుడా బ్రెన్హాం" అని అనవచ్చు.
మంచిది, ఇప్పుడు మనము వెనక్కి ఆదికాండములోకి వెళ్ళి కనుగొందాము, మనము ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనము చదువబోవుచున్నాము. ఒకవేళ జ్ఞానము, వాక్యము చెప్పని దేనినో అది చెప్పుచున్నట్లుగా ప్రయత్నించుచున్నదో, లేదో? అనే దానిని చూద్దాము. ఆదికాండము 3 అధ్యాయము 4వ వచనము.
ఆ సర్పము, స్త్రీతో. "మీరు నిశ్చయముగా చావరు," అని చెప్పెను.
ఈ మాటల యొక్క ఫలితము ఏమైనదో చూడండి? అది ఏమిటి? వాక్యము చెప్పని ఒక విషయమును అది చెప్పుచున్నట్లుగా, నమ్మించుటకు ప్రయత్నించుట, చూశారా. దేవుడు, "మీరు మరణిస్తారని!" చెప్పెను.
GEN 3:4
74బుద్ధిపూర్వకమైన జ్ఞానమును సాతాను ఆమెకు ఇచ్చుటకు ప్రయత్నిస్తూ "మీరు చావనేచావరని" చెప్పింది. చూశారా? ఆ విధముగా చెప్పని విషయమును వాక్యము చెప్పుచున్నట్లు చెప్పి, ఆమెను నమ్మునట్లుగా చేయు ప్రయత్నము. ఈ రోజు బుద్ధిపూర్వకమైన జ్ఞానము ఆ విధముగానే యున్నది. ఓ, సోదరుడా, ఏ విధముగా దానిమీద సమయమును గడపగలము. సెమీనరీలూ, వేదాంత పాఠశాలలే వారి గూడులు, అవే వారి కూకటివేళ్ళు. దేవుని వాక్యము చెప్పని దానిని దేనినో అది చెప్పుచున్నట్లు ప్రయత్నించుచున్నది.
పరిశుద్ధ గ్రంథములో, అపోస్తులుల సిద్దాంతమును చూపించమని ఎవరికైన నేను సవాలు చేయుచున్నాను. "పరిశుద్దుల మధ్యవర్తిత్వము," అనే దానిని పరిశుద్ధ గ్రంథములో వున్నట్లుగా మీలో ఎవరైనా ఒక్కరు చూపించగలరా? నేను మీకు సవాలు చేయుచున్నాను. ప్రొటెస్టంట్ వారు మరియు క్యాథలిక్ ఇద్దరూ దానిని నమ్మెదరు. ఈ విషయములను పరిశుద్ధ గ్రంథమందు మీరు చూపించాలని నేను సవాలు చేయుచున్నాను.
75చూశారా? జ్ఞానమునకు మూలాధారమైన వ్రేళ్ళు దేనిని సూచించుచున్నవంటే స్వబుద్ధితో ఆలోచించుచూ కారణములు వెదకుటకు ప్రయత్నించుటయగును. మన యుద్దోపకరణములు శరీర సంబంధమైనవి కాదు గానీ, స్వబుద్ధి ద్వారా ఆలోచించే ఆలోచనలను దూరముగా త్రోసివేసి (చూశారా), నాజూకైన, సుతిమెత్తగా ఉండు వాడి మాటలను, ఆకర్షించే అందమైన జీవియగు ఆ సాతాను యొక్క దుర్గములను పడద్రోయుటకు మహత్తరమైన శక్తిగలవి. వాడు పట్టుకుంటే జారిపోయేలా వుండువాడు కాదు, ఓ, లేదు, దానియొక్క లోపలివైపు చాలా నీచముగా ఉండును; కాని వెలుపలవైపు పాపము రెండంతలు అందముగా వుండును.
మీకు తెలుసా! పాపము అందమైనది? ఎంతమంది ఇక్కడ స్త్రీ, పురుషులు 50 సంవత్సరములు వయస్సు దాటినవారు ఉన్నారు? మీ చేతులను పైకి ఎత్తండీ (నేను స్త్రీలను అడగకూడదు కానీ మనందరము సత్యమును ఒప్పుకోవాలి.) నేను మిమ్ముల్ని ఒక ప్రశ్న అడగాలని కోరుచున్నాను. ప్రపంచమంతటిలో స్త్రీలు ఈ రోజు రెండంతలు ఆకర్షణీయముగా, ఇంతకు ముందు వున్నప్పటి కంటే సరాసరిగా అందముగా వున్నారని మీరు చూశారా? అది నిజమే అన్నట్లయితే, మీ చేతిని ఎత్తండి. ఖచ్చితముగా. వారు ముందు వున్నప్పటి కంటే రెండంతలు అందముగా వున్నారు. ఇప్పుడు కొన్ని పాత ఫోటోలు తీసుకుని చూడండి.
76మన బామ్మగారు పొడుగు లంగా ధరించుకొని, అల్లిన జడ వేసుకొని వెనుక వ్రేలాడుచూ నిలబడి యుండుటను చూడండి. చూడడానికి అంత ఆకర్షణీయంగా ఆమే లేదు.
నవీనమైన స్త్రీని ఈ రోజు చూడు: ఒక చిన్న పలచని బట్టలు ధరించుకొని అర్థనగ్నముగా కనబడుచూ (ఆమె ఒయ్యారముగా కదలుచూ నడుచునప్పుడు అనేకులు పాపము చేయుటకు కారకురాలవుచున్నది.) ఆమె ఒంపుసొంపులన్నీ వయ్యారముగా కదిలించుచూ, నడుచుచూ, ముఖమునకు, కళ్ళకు, పెదవులకు రంగులను పూసి, అలంకరణ వస్తువులను వేసుకొని, వీధులలో ఒయ్యారముగా వెళ్ళుచున్నది. అంత పెద్ద వయస్సుగల బామ్మ ఒక చిన్న యవ్వనస్తురాలుగా జుట్టు కత్తిరించుకుని, మోకాళ్ళ పైన ఒక చిన్న గుడ్డ చుట్టుకొని వున్నట్లుగా కనబడే పొట్టి లంగా ధరించుకొనును. కానీ, మీరు ఆమెను చూస్తే అందముగా కనిపించును. ఆమెను ఆ విధముగా మార్చుటకు ఏమి చేయవలెనో సాతానుకు దానిని గూర్చి బాగా తెలుసు. వాడే అందానికి కర్తయై యున్నాడు. ఆ రకపు అలంకరణతో కూడిన అందము పాపమునకు దారి తీయును.
77ఈ భూమి దానికదే ఒక గర్భమై వున్నది. దేవుడు తన విత్తనములను ఎక్కడ వుంచేను? ఎక్కడ విత్తనములు పెట్టబడియుండెను? ఒక గర్భములో దేవుడు విత్తనములను నాటును… మనిషి ఏమి చేసెను? గర్భములోయున్న ఆ విత్తనమును దెయ్యములు తారుమారు చేయునట్లుగా అతడు చేయును, సాధ్యమైనంతవరకు గర్భంలో యున్న చక్కని ఆ శిశువు రూపమును అతడు వికారముగా మార్చివేయును. భూమిపై దెయ్యము అదే కార్యమును చేసినది. నిజ విత్తనము నుండి సంకరము చేసినది. సహజమునకు భిన్నముగా యుండు ప్రాణులను ఉత్పత్తి చేయుట, ఈ విషయమును గూర్చి మాట్లాడుట చాలించుట మంచిది. ఎందుకనగా మాట్లాడవలసిన అంశం గురించి, ఇచ్చట వ్రాసియుంచుకొనిన వాటిని నేను ముగించలేను. నేనేమి చెప్పుచున్నానో మీకు అర్థమైయుండును. అది ఒక తారుమారు (వికారము) చేయబడిన సృష్టి గనుకనే అది పనికిమాలినదిగా త్రోసివేయబడినది. దేవుడు దానితో ముగించెను. ప్రపంచ మంతటా క్రమము తప్పినది. ప్రతిదీ తారుమారై అక్రమ స్థితిలో వున్నది. నీటి ప్రవాహములు, గాలీ రోతగా, దుర్గంధముతో కలుషితమైపోయినవి.
కొద్దికాలం క్రిందట ఒక ఇండియన్ చెప్పాడు, "తెల్ల మనుష్యుడా, నేను ఇంకా జీవించాలని కోరుకోవడం లేదు. నేను యుద్ధములో అలసిపోయాను, ఎక్కడ నా బిడ్డలు? ఆకలితో వారు చనిపోయారా? ఎక్కడ నా భార్య? మీరు మీ పాపముతో, స్త్రీలతో మరియు విస్కీతో ఇక్కడికి రాకమునుపు మేము శాంతితో జీవించాము. అది మా యొక్క భూమి, దేవుడు దానిని మాకిచ్చాడు. కానీ, మీరు మావద్ద నుండి దానిని లాక్కున్నారు. ఒక రోజు దానికొరకు మీరు వెల చెల్లించెదరు."
78ఈ రోజు ఆ అందమైన ఎడారులను మరియు పర్వతములను చూడండి, దుర్గంధముతో, పాపముతో, విస్కీ సీసాలతో, బీరు డబ్బాలతో నిండిపోయినది. ప్రతీ చోట సారా అంగళ్ళు మరియు పనికిమాలిన నీచత్వముతో నిండిపోయినవి, గొప్ప ఎడారులైన రెనో మరియు నెవడాలో వ్యభిచారం తప్ప ఏమీ లేదు. అవి గొప్ప పట్టణములు… అక్కడ ఒకానొకప్పుడు అందమైన పర్వతములు, చక్కని చెట్లుతో వుండెడిది. కానీ ఇప్పుడు, అనేక కార్యముల కొరకు అవి నరకబడుచూ కొట్టివేయబడినవి, అక్కడ ఎడారులు, గల గలా నీళ్ళు పారినవి. గాలి మరియు వాతావరణం కూడా కలుషితమైపోయాయి, అక్కడంతా కలుషితమైనది. మొత్తము ప్రపంచము విసిరి వేయబడబోవుచున్నది. భూమి విత్తనము నుండి తనయొక్క బిడ్డలను ఇవ్వవలసి యున్నది. దెయ్యముల ద్వారా ఆ విత్తనము చీల్చబడి మరియు తారుమారుగా చేయబడి, దానిమీద క్రియ చేయుచున్నది. ఖచ్చితముగా, అది అలాగే యున్నది. అది తారుమారు చేయబడిన సృష్టి, దేవుడు దానిని నాశనముచేసి మరలా దానిని ప్రారంభించును. అది సత్యము.
ROM 8:19,22
79అది ఎక్కడనుండి వచ్చినది. ఒక వ్యక్తి దేవుని వాక్యములో కొంత భాగమును నమ్మి కొంత భాగమును నమ్మలేదు. అందువలన భూమి యావత్తు మూల్గుచున్నది. సృష్టియావత్తు ఆ విడుదల దినము కొరకై మూలుగుచున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు చున్నదని, పరిశద్ధ గ్రంథము చెప్పుచున్నది. వృక్షములు వ్యర్థముగా శ్రమపడుచున్నవి, పుష్పములు మన కొరకు త్రోవను ప్రకాశవంతపరచుటకు ప్రయత్నించుచున్నవి, కానీ అవి మూలుగుచున్నవి. మరియు అక్కడ ఏదో తారుమారు చేయబడినదని ఎరిగి దుఃఖించుచున్నవి, ఆ గర్భము అంత సంపూర్ణమైన దానిని మరలా తేలేదు, ఎందుకనగా ఆమె తారుమారు చేయబడినది. భూమి కంపుకొట్టుచున్నది; అది నిరపరాధుల రక్తముతో నిండిపోయింది. అది… ఆమె ఒక… (నేను ఏదో చెప్పాలి; అది బహుగా క్షీణించిపోయినది.) అది కంపుకొట్టుచున్నది; అది ఆయన ముందు దుర్గంధముతో బహు అసహ్యముగా వున్నదని దేవుడు చెప్పెను.
80మరుగు దొడ్డికి వెళ్ళిన, మూత్రశాలకు వెళ్ళిన కేవలం దుర్గంధము, కలుషితము. అదే విధముగా ప్రపంచము దేవుని ఎదుట దుర్గంధముతోనూ మరియు అసహ్యముగా వున్నది. మొత్తము అంతా కూడా దుర్గంధమే. దేవుడు ఈ భూమిని ముక్కలు ముక్కలుగా విచ్ఛిన్నము చేయును. మరియు "నేను నూతన ఆకాశమును, భూమిని సృష్టిస్తానని," ఆయన చెప్పెను. అవునండీ.
అది ఏమిటి? ఆమె గర్భము ఇంకా వెయ్యేండ్ల పాలన తీసుకురాలేదు. ఆమె ఒక తారుమారు చేయబడిన దానిని తీసుకువచ్చింది, ఎందుకు? జ్ఞానము కలిగిన దానిగా వుండుటకు ప్రయత్నించింది.
ఫ్లోరిడా ప్రాంతము గురించి నాకు ఏ వ్యతిరేక భావము లేదు. ఫ్లోరిడా నుండి వచ్చిన ప్రజలగు మీ గురించి ఇది నా ఉద్దేశ్యము కాదు. నేను మొట్ట మొదటిసారి ఫ్లోరిడా దాటుకుంటూ జార్జియాకు తిరిగి వచ్చినప్పుడు, నేను అక్కడ నిలబడి చెప్పాను, "ఒక అమెరికా పౌరునిగా దీనిలోని నా యొక్క భాగమును, దీనియొక్క పూర్వీకులగు సెమీనోల్స్ కు చెందిన వారి భాగమును నేను తిరిగి ఇచ్చెదనని చెప్పాను. (Seminoles అనగా ఉత్తర అమెరికాలో రెడ్ ఇండియన్ జాతికి చెందినవారు, వారు ఎక్కువగా ఫ్లోరిడా మరియు ఒక్లాహమా భాగము యందు నివసించుచున్నారు - తర్జుమాదారుడు) నేను నా తల వెంట్రుకల కొరకు చూపు శ్రద్దకంటే, వారు వారి పరిసరప్రాంతాలపై ఎక్కువ శ్రద్దను కలిగి వుంటారు. ప్రతీ కార్యమందు బహు చక్కగా ఆసక్తితో చేయుదురు. అచ్చటయుండు ఈత చెట్లన్నిటి మీద ద్వీపములు లైట్లు అమర్చబడివుండును, ఆడంబరమైన పెద్ద పడవలు మొదలగు కార్యములుండును. అసలు మారుమనస్సు లేకుండానే వెయ్యేండ్ల పరిపాలనను తీసుకొని వచ్చుటకు ప్రయత్నించుచున్నారు. నామట్టుకు అవన్నియు అర్థములేని వ్యర్ధమైన కార్యములగును. నేను బ్రిటీష్, కొలంబియాలో వున్న ఒక పర్వతము యొక్క శిఖరము పైకెక్కి ఈ కార్యములన్నింటి కంటెను, మానవుని హస్తములతో సృజించని, దేవుడు సృష్టించిన పర్వతములను, ఆ కార్యములను పరిశీలించి చూచుటయే ఎన్నో లక్షలాది శాతము శ్రేష్ఠమైనది. ఖచ్చితముగా.
81ఈ పట్టణముల గుండా చూస్తూ వెళ్ళితే, పెద్ద ఇండ్లు కనబడినను, అవి నన్ను ఆకర్షించవు. ఆ విధమైనవి నాకు అసహ్యము, చూశారా. నాకు తెలుసు, ఒక రోజు అది మారిపోవును. ఆమె తనయొక్క బాధించబడిన కుమారుడ్ని దూరముగా విసిరి వేయును. ఈ భూమి ఒక్క రోజులో దాని రూపము మారిపోవును.
వ్రాయబడిన ప్రకారముగా వున్నదానిని విశ్వాసము నమ్మును, మరియు "వాక్యములో ఏ విధమైన లోపములు లేవని" చెప్పును.
"ఇదిగో నేను మీకు చెప్పుచున్నాను, కింగ్ జేమ్స్ ప్రచురించిన పరిశుద్ద గ్రంథము నందు లేదా సవరించి ప్రచురించిన పరిశుద్ధ గ్రంథము నందు చూడండి, లేదా ఇచ్చట చూడండి… అక్కడ కొంచెము తేడాగా వున్నది. నిజముగా దాని యొక్క అర్థము అది కాదు" అని బోధకులు చెప్పు మాటలను మీరు ఆలకించి యున్నారా? ఓ, మీరు అటువంటి మాటలను ఆలకించారా? ఓ, ప్రపంచము అటువంటి మాటలతోనే కలుషితమై పోయినది, చూశారా. కానీ విశ్వాసము దానిని నమ్మదు. ఆ పరిశద్ధ గ్రంథమును వాక్యానుసారముగా, క్రమముగా వుంచుచూ దానిద్వారా నన్ను జీవింపచేయుచూ నన్ను నిర్మించిన ఆ దేవునియందు మాత్రమే విశ్వాసమును, నమ్మకమును నేను వుంచెదను. నన్ను నిర్మించి, నన్ను తీర్పు తీర్చు దేవుడు ఒకవేళ ఆ గ్రంథమును వాక్యానుసారమైన క్రమములో వుంచలేనియెడల, ఆయన సామర్థ్యము లేని దేవునిగా వుండును. కాని దానిలోని ప్రతీ వాక్యము (మాట) సత్యమని నేను నమ్ముచున్నాను. అవునండీ!
1CH 15:2
82దానిని నమ్మడానికి ఇది ఏమి చేసినది? ఒక సంపూర్ణమైన విశ్రాంతి అనే స్థానమును దానిలో విశ్వాసమునకు కల్పించినది, చూశారా. వాక్యమునందు కొంచెము గందరగోళము కలదని మీ స్వకీయ తలంపుతో తలంచుచూ దానిని మీరు అవిశ్వసించకూడదు. వాక్యము ఏరీతిగా వున్నదో ఆ రీతిగానే దానిని మీరు వున్నదివున్నట్లుగానే విశ్వసించవలసినవారై వున్నారు. మీరు మీ బుద్దిపూర్వకమైన జ్ఞానమును ఉపయోగించుటకు ప్రయత్నించినయెడల… వారు "ఇప్పుడు చూడు, ఇక్కడ దేవుడు అటువంటి విషయమును చేస్తాను అని చెప్పడము ఏ విధముగాను సబబు కాదు," అని చెప్తారు. కానీ దేవుడు చెప్పిన దానిని చేయును, చూశారా. అది సత్యము.
ఇప్పుడు, "దేవుని యొక్క మందసము క్రిందకు పడుబోవుచుండగా లేవీ గోత్రమునకు చెందని ఒక వ్యక్తి దేవుని మందసము మీద తన చెయ్యి చాపి దానిని పట్టుకొనినప్పుడు ఆయన అతడి ప్రాణమును తీసివేసేను… దేవుడు దానిని చేసెను కదా!" అని నీవు చెప్పవచ్చు. అతడు దానిని చేసినందుకు ఆయన అతడి ప్రాణమును తీసేసినందువలన ఆయనేమి దేవుడన్నట్లుగా నీవు ఆలోచించినను, దానితో ఏమీ సంబంధంలేదు. ఎందుకనగా, కేవలము ఒక లేవీయుడు మాత్రమే దానిని తాకవలెనని దేవుడు చెప్పియుండెను, చెప్పిన మాటకు విరుద్దముగా చేసినందువలననే ఆయన అతడి ప్రాణము తీసెను.
1CH 15:2
83ఒక లేవీయుడు తప్ప, వేరెవరు దానిని తాకకూడదు. అచ్చట ఒక ఉజ్జీవము కొరకు దేవుని యొక్క మందసము మరలా తిరిగి వచ్చుచున్నది. అప్పుడు లేవీ గోత్రమునకు చెందని ఒక వ్యక్తి ఆ వాక్యమును పట్టుకొనుటకు ప్రయత్నించెను. అది దేనిని సూచించుచున్నదనగా, దేవునిచే అభిషేకించబడిన వారు మాత్రమే ఆ వాక్యమును తాకవలెను. ఈ సంఘశాఖల సిద్ధాంతములకు, సంఘశాఖలకు ఆ వాక్యమును మార్చుటకు ఎటువంటి అధికారము లేదు. ఆ వాక్యముతో వ్యవహరించుటకు పరిశుద్ధాత్మకు మాత్రమే అధికారము గలదు, వేరే ఎవరైనా తాకుటకు ప్రయత్నించినయెడల, వారికి మరణమే సంభవించును. ఆ వాక్యములో ఏ ఒక్క భాగమును అవిశ్వసించినను లేదా దానిని ఉపదేశించినను జీవగ్రంథములో నుండి అతడి భాగమును తీసివేయబడును, చూశారా. మీ చేతులు దానిమీద పెట్టవద్దు. దానినుండి దూరముగా వుండండి. వినండి. అది ఏమి చెప్పుచున్నదో దానిని నమ్మండి. ఇంకొకరి మాటలను నమ్మవద్దు, వాక్యము ఏమి చెప్పుచున్నదో దానిని మాత్రమే తీసుకొనుము. వాక్యముతోనే నిలిచియుండుడి , దానికి బదులుగా వేరే ఏదైనా చేసిన మరణమునకు దారితీయును.
ఇప్పుడు, ఆ కారణమువలన… విశ్వాసము ఏమి చేయును? అది ఉన్నరీతిలోనే దానిని నమ్మును. యుగయుగములుగా అది దేవునిచే భద్రపరచబడుచూ మారనిదిగా, అదేరీతిగా వున్నది. ఇదిగో అది ఇచ్చట ఆ విధముగానే యున్నది. నామట్టుకైతే అది దేవుని వాక్యమైయున్నది. దేవుడు దానిని గౌరవించుచున్నాడు. దానియొక్క నిజత్వమునందు అది సంపూర్ణ విశ్వాసమును ఇచ్చును.
84ఒక యవ్వన బాలిక ఇంటిలో నుండి పారిపోయి అనేక చెడు కార్యములు చేయుచూ, వ్యభిచారిగా మారి సమస్త నీచ కార్యములను చేయుచుండగా, నీవు ఆ వ్యభిచార గృహమునకు వెళ్ళి ఆమెను సంధించి, వెలుపలికి తీసుకువచ్చిన తరువాత ఆమె, "సరే, మంచిది, ఒక మంచి స్త్రీగా వుండుటకు నేను ప్రయత్నిస్తాను," అని చెబితే. ఆమె మాటలను ఎలా నీవు నమ్మగలవు, చూశారా. దానిని నీవు చేయలేవు.
ఆ విధముగానే ఒక పురుషుడు అటువంటి నీచమైన కార్యములను చేయుచుండగా, ఒక స్త్రీ ఏ విధముగా ఆ పురుషుడిని నమ్మగలదు? అటువంటి నీచమైన కార్యములుగల స్థలమందు నీవు విశ్వాసమును కట్టలేవు; అచ్చట కట్టుటకు ఏ ఆధారమూ లేదు, చూశారా. మీరు దానిని చేయలేరు.
MATT 24:35•
MARK 13:31
85మీరు అనేక రంధ్రములు గల ఒక పడవను చూపి," ఇదిగో ఇచ్చట ఒక పడవగలదు, ఏమి ఫర్వాలేదు ఆ రంధ్రములలో గోనె సంచులను దూర్చి, నదిలోని అలలు పడవలోనికి రాకుండా నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళిపోవచ్చు కదా!" అని ఎలా చెప్పగలరు. అంతకన్నా మంచి పడవ అచ్చట ఉండగా ఇటువంటి రంధ్రములు గల పడవను తీసికొని ఆ నదిని దాటుటకు నేను అసలు ప్రయత్నము చేయను. ఖచ్చితముగా చేయను. అది ప్రయోజనము లేనిది, అది సరైనది కాదని నిరూపించబడింది. (చూశారా), ప్రతీ భయంకరమైన గాలిని, పెను తుఫానుని, ఎగిసిపడే అలలను ఎదుర్కొనే దృఢమైన సత్యమైన దేవుని యొక్క వాక్యము ఇచ్చట మనకు వుండగా - పూర్తిగా రంధ్రములతో, శిధిలావస్థలోవున్న మానవునిచే నిర్మించబడిన, మానవ-కల్పితమైన ఏదో ఒక వేద పాఠశాల సిద్ధాంతములను మనమెందుకు తీసికొనవలెను? అది తప్పిదమైనదని నిరూపించబడినది. ఆమె సాధ్యమైనంతవరకు ఆ వాక్యమును ఎంత గట్టిగా పట్టుకొనియుండవలెనో నిజముగా అంత గట్టిగా పట్టుకొని యుండవలెను, ఆ విధముగానే ఎల్లప్పుడూ అది చేస్తూ వుండవలెను. మంచిది.
యేసు చెప్పెను, "ఆకాశము, భూమియు గతించిపోవును, కానీ నా మాటలు ఏ మాత్రము గతించవు." ఎందుకు? అవి నిత్యమైనవి; అవి ఆదియందే వుండెను. దేవుని యొక్క వాక్యము బయలుపరచుటకు మాత్రమే ఆయన ఇచ్చటకు వచ్చెను. ఆయన దేవుని యొక్క బయలుపాటుగా వుండెను. దేవుడు తన కుమారుని ద్వారా తనను బయలుపరచుకొనుచుండెను.
JOHN 10:4,5,27
86ఇవి అన్నీ విత్తనముల (మూల) అధ్యాయమగు ఆదికాండంలో ప్రారంభమాయెను. పిదప ఇవన్నియూ అప్పటి నుండి ఇప్పటికీ… అవి రంగము మీదకు వచ్చినప్పటి నుండి అదే రీతిగానే వున్నవి. బుద్ధిపూర్వకమైన జ్ఞానమునకు మరియు విశ్వాసమునకు మధ్య కొనసాగు పోరాటము, వాటి మధ్య ఎప్పుడూ పోరాటము కొనసాగుతూనే వుండును. కనుక బుద్ధిపూర్వకమైన జ్ఞానము దెయ్యము వలన కలిగినదై, వాడి పిల్లల కొరకు అది వాడి ద్వారా చేయబడినది.
మీరు ఎప్పుడైనా దీనిని గమనించారా? మీరు అందరూ గొర్రెలను చూచియున్నారు, మీరు అందరును మేకలను కూడా చూచియున్నారు. కానీ, వాటి అరుపు ఇంచుమించు ఒకే విధముగా వుండునని మీకు తెలుసా? ఒక నిజమైన గొర్రెల కాపరి మాత్రమే ఆ తేడాను చెప్పగలడు. నీవు ఒక ముసలి మేకను అక్కడ పెట్టి దానిని అరచునట్లు చేయండి, పిదప మీరు ఒక గొర్రెను ఇక్కడకు తీసుకొనివచ్చి దానిని అరచున్నట్లు చేయండి, వాటి రెండు శబ్దములను వినండి; అవి ఒకేలాగున ధ్వనించును. కానీ, నిజమైన కాపరి దాని స్వరమును కనిపెట్టును.
"నా గొర్రెలు నా స్వరమును ఎరుగును," అని యేసు చెప్పెను, చూశారా. అది ఒక మేక అరుపా, కాదా, అని వారు చెప్పగలరు. ఎట్లు చెప్పగలరు? ఎందుకనగా ఆయన… నా గొర్రెలు నా స్వరమును ఎరుగును, అవి అపరిచితులను వెంబడించవు. ఆయన స్వరమనగా ఏమిటి? ఆయన వాక్యమైయున్నది. అది ఇచ్చట ఇలా వున్నది, "నా గొర్రెలు నా స్వరమును ఎరుగును." సరే, ఇప్పుడు నేను కూడా దేవుని యొక్క స్వరమును గురించే మాట్లాడుచున్నాను. "ఇది ఇచ్చట ఈ విధముగా చెప్పుచున్నది," అని ఎవరో ఒక అన్యుడు చెప్పినయెడల, ఆ గొర్రెలు ఆ అన్యుని మాటలను అంగీకరించవు. అటువంటి కార్యము సాతానుడై యున్నది. దానిని గూర్చి మనము చూద్దాము, దానిని కొంచెము వివరించి మీకు చెప్పెదను.
GEN 2:17•
GEN 3:3
87దానిని మీరు గమనించారా? వాక్య విత్తనము జ్ఞానము యొక్క వాతావరణము నందు ఎదుగదు. అది నిజమే కదా? ఎప్పుడైతే జ్ఞానము విశ్వాసముతో మిశ్రమమగునో సరిగ్గా అక్కడే విశ్వాసము అనునది చనిపోవును.
హవ్వ, "వాటిని తిను దినమున మీరు చనిపోవుదురని దేవుడు చెప్పాడు," అని చెప్పింది. అందుకు సాతాను ఏమి చెప్పునో చూద్దామని ఆలకించుటకు ఆమె కొద్దిసేపు ఆగినది.
వాడన్నాడు, "కానీ విను, నా ప్రియతమా, ప్రియమైన చిన్నదానా!" [చూశారా], ఖచ్చితముగా దేవుడు ఒక ఉద్దేశ్యము కొరకు నిన్ను సృష్టించాడనే విషయము నీకు తెలుసా? అది నిజము. నీవు ఒక స్త్రీవి, ఈ ఉద్దేశ్యము కొరకే నీవు చేయబడ్డావు, ఆ కార్యము కొరకే ఇది, ఇప్పుడు దానిని గూర్చి నీకు తెలియదు, కానీ నీవు ఈ ఉద్దేశ్యము కొరకే సృష్టించబడ్డావు. ఓ, నీవు ఎంతో అందమైన చిన్నదానవు, ప్రియా! ఆ సుతిమెత్తని నీ హస్తమును చూడు, [చూశారా] ఎందుకని అలా వాడు… నిశ్చయముగా."
"మేము దానిని చేస్తే… చనిపోతామని ఆయన అన్నాడని," ఆమె చెప్పింది.
"కానీ, ఓ, ఆయన ఎంతగానో ప్రేమించే తండ్రియగు దేవుడు, ఆ విధముగా ఆయన చేయునని నీవు అనుకుంటున్నావా?" అని సాతాను అన్నాడు. అతడి మాటలు ఆమెను ఏమి చేసినవి! ఆమె తన సొంత బుద్ధితో ఆలోచించుచూ, అతడి యొక్క బుద్ధిపూర్వకమైన జ్ఞానముతో నిండిన మాటలకు చెవియొగ్గినది. అది సంతోషమునిచ్చు ఒక వృక్షమైవున్నది, ఒకడు దానిని మోహించునట్లుగా, అది వాంఛను కలిగించునదిగా వున్నది. ఆమె దానికొరకు పడిపోయెను, సరిగ్గా అదియే జరిగినది. ఆమె ఆ విధముగా చేసినప్పుడు ఏమి జరిగినది? ఆ విధముగా చేసినందువలన ప్రతి స్త్రీకి జరిగినట్లుగానే ఆమెకు జరిగినది. అటువంటి ఇచ్చయించు కార్యమందు నీవు పడిపోయిన వెంటనే అక్కడికక్కడే నీ సమస్తమును నీవు కోల్పోతావు. అది నిజము.
మీరు గమనించారా, ఆమె పొందుకున్న ఆ విత్తనము ద్వారా చివరకు ఆమె గర్భము ధరించి, తల్లి అయినది. దేవుని యొక్క చిత్తమువలన పలుకబడిన మాటద్వారా ఆమె తల్లిగా అవ్వవలసినది. కానీ, ఆమె అంతవరకు వేచియుండకుండా వేరే మార్గముగుండా, అక్రమ కార్యము ద్వారా ఆమె దానిని పొందుకున్నది.
88ఇప్పుడు, గమనించండి, ఆమె ఆ కార్యమును చేసిన వెంటనే, వాక్యముతో బుద్ధిపూర్వకమైన జ్ఞానమును కూడా అంగీకరించిన వెంటనే… అటువంటి జ్ఞానము వాక్యమునకు విరుద్ధమైనది. నీకు అర్థమైతే "ఆమేన్ "అని చెప్పండి, చూశారా? జ్ఞానము వాక్యముతోనే వుండినయెడల, అది వాక్యముతోనే వున్నట్లుగా రుజువైతే, అప్పుడు వాక్యము దానికదే అదే కార్యమును ఉత్పత్తి చేయును, అప్పుడు అది వాక్యముగా వుండును. కాని, జ్ఞానము వాక్యమునకు వ్యతిరేకముగా వుండినయెడల, అది వాక్యముతో వుండకుండా ఎంతో కొంత వాక్యమునకు కలపడానికి లేదా దానినుండి ఎంతోకొంత తీసివేయడానికి ప్రయత్నించినయెడల, అది దెయ్యము నుండి వచ్చినది. పరిశుద్ధాత్మ యొక్క విత్తనములు లోక జ్ఞానమనే వాతావరణమునందు ఎదగనే ఎదగవు. అది దేశములోయున్న ప్రతీ వేదాంత కళాశాలను చంపివేయును. అది వారియొక్క ప్రతికార్యములను రంధ్రము చేసుకుంటూ వెళ్ళుతూ, వాటిని భంగము చేయుచూ, న్యాయతీర్పు వారిపై పడునంతవరకు బ్రద్దలు చేసికొంటూ వెళ్ళును. అది నిజము. ఖచ్చితముగా, అది అట్లే చేయును (చూశారా), ఎందుకనగా లోక జ్ఞానముతో కలసి వాక్యము ఎదుగదు. వాక్యము ఎన్నడూ దానిని చేయదు.
89ఆమెకి ఇవ్వబడిన వాగ్దానముతోనే హవ్వ వాక్యమును నమ్మవలసియున్నది. అది నిజమేనా? ఎవ్వరు ఏమి చెప్పినా దానిని వినకుండా కేవలము ఆమెకు ఏ విధముగా వాక్యము ఇవ్వబడినదో, అదే విధముగా ఆమె దానిని నమ్మవలసి వున్నది. ఆమె దానిని ఆ విధముగా నమ్మియుండిన యెడల మరణము ఆమెకు సంభవించెడిది కాదు. అది నిజము. ఒక పురుషుడు లేదా స్త్రీ, దేవుని వాక్యమును మనకు ఇవ్వబడిన రీతిలోనే అంగీకరించి, అనుసరించవలెను. దేవుడు చెప్పిన విధముగానే దానిని మీరు పట్టుకొనవలెను, ఎందుకనగా అది మీకు జీవమైయున్నది. కానీ, ఆ వాక్యముతో ఏదో ఒక సంఘశాఖ యొక్క తెలివితేటలను దానితో మీరు కలిపినయెడల, అక్కడిక్కడే మీకు మరణము సంభవించును. కేవలము ఆదిలో దానిని చేసిన విధముగా… అది విత్తనమైయున్నది. మొట్టమొదటి సారీ అది క్రియచేసిన విధముగానే, ప్రతీసారి అది అదేవిధముగా క్రియ చేయును, ఎల్లప్పుడూ ఆ విధముగానే క్రియచేయును. దేవుడు అనుగ్రహించిన పరిశుద్ద గ్రంథము ద్వారా ఈ ఉదయకాలము నందు మనము దానిని నిరూపించెదము. సమస్తమైన స్వకీయ తలంపులతో తర్కించే తర్కముల నుండి లేదా ఇటువంటి వ్యరమైన కార్యములన్నీటి నుండి తననుతాను వేరుపరచుకొని, కేవలము వాక్యమునే నమ్ముచూ వుండవలయును. అది ఎదుగుటకు ఆ ఒక్క మార్గమే కలదు.
ACTS 2:38
90దేవుడు తన వాక్యమును మనకు అనుగ్రహించిన విధముగానే, హవ్వ తాను కూడా దానిని అదే విధముగా తీసుకొని యుండవలసి యున్నది. నేను ఇంతకు ముందు మీతో చెప్పినట్లుగానే, నేను నమ్ముచున్నదేమనగా, దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములోనిది దేనిని కోల్పోనివ్వకుండా వున్నరీతిగానే దీనిని భద్రపరచి యుంచెను, అది ఎప్పుడున్న రీతిగానే దేవుడు దానిని ఇచ్చట నాకు అనుగ్రహించెను. కాబట్టి ఏ విధమైన వేరొక జ్ఞానము నాకు అవసరము లేదు. దేవుడు ఇచ్చట చెప్పిన విధముగానే అది నాకు కావలెను, నేను మిమ్మల్ని నొప్పించుట లేదని నమ్ముచున్నాను. కావున, పరిశుద్ధ గ్రంథము నేను మారుమనస్సు పొందాలని చెప్పితే, మారుమనస్సు పొందుటయే దాని అర్థమగును. ప్రాయశ్చిత్తము లేదా పాప పరిహారార్థము చెల్లించుట అని అర్థము కాదు కాని, మారుమనస్సు పొందుటయే దాని అర్థమగును.
MATT 28:19•
ACTS 2:38
91నేను యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెనని పరిశుద్ధ గ్రంథము నాకు చెప్పినది. దాని అర్థము వేరేవిధముగా చేయమని కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము తీసుకోమని దాని అర్థము కాదు. అది ఏమి చెప్పినదో దానినే చేయవలెను.
"మంచిది, వారికి తండ్రి, కుమార, పరిశద్దాత్మ నామములోనికి బాప్తీస్మము ఇవ్వమని మత్తయి 28:19 చెప్పింది అని," నీవు అంటావు.
ఇది ఏమైయున్నదో సరిగ్గా అదే అది. ఇప్పుడు అది సరియైనది కాకపోతే, వారు సరైన దానిని పొందకపోతే, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఇచ్చుటకు పేతురు కలిగియున్న విశ్వాసము మరియు పరిశుద్ధ గ్రంథములో మిగతావారు అనేకులు ఆ విధముగానే బాప్తిస్మము ఇచ్చినందువలన దేవుడు ఆశీర్వదించిన ఆ ప్రత్యక్షత తప్పుడు ప్రత్యక్షతయగును. అట్లయిన యెడల, అది ఆయనను… అట్లైతే ఆదిలో హవ్వ చేసిన తప్పుడు కార్యమును కూడ దేవుడు ఆశీర్వదించి వుండును.
MATT 28:19•
ACTS 2:38
92తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామము, అవి మూడు బిరుదులు. అక్కడ ఒకే ఒక నామము కలదు. మీరు యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము పొందేవరకు, మీరు ఎన్నడూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమలో బాప్తిస్మము పొందకూడదు, ఎందుకనగా తండ్రి, కుమార, మరియు పరిశుద్ధాత్మ యొక్క నామము అదే. మొత్తము పరిశుద్ధ గ్రంథమంతా అదే విధముగా వ్రాయబడినది. పరిశుద్ధ గ్రంథము నందు ఎప్పుడైనా, ఎవరైనా బాప్తీస్మము పొందారంటే అది యేసుక్రీస్తు నామములోనే. ఏ ఒక్కరూ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే బిరుదులలో ఎవ్వరూ లేఖనములలో ఎన్నడూ బాప్తిస్మము పొందలేదు. ప్రభుడైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిన ప్రతీవారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందినట్లు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బిరుదులలో బాప్తిస్మము పొందిన ప్రతీవారు ఏ నామములోను వారు బాప్తిస్మము పొందనట్లగును. మొత్తానికి అవి బిరుదులు, సేవకుడు, రెవరెండ్, డాక్టరు, ఇంకా అనేకమైన తండ్రి, కుమారుడు, మరియు మనిషి, భార్య…లాంటి బిరుదులు.
"ఏ బేధము లేదు," అని నీవు చెప్పెదవు.
నీ పేరు కాకుండా ఇటువంటి బిరుదులలో ఏదో ఒక బిరుదును బ్యాంకు చెక్కుల మీద వ్రాసి చూడండి, అది ఎక్కడికి వెళ్తుందో, "ఈ చెక్కు ఒక గృహిణి నామములో సంతకం చేసానని," అని చెప్పగలవా?
మంచిది, నీ ముందు ప్రత్యక్షతను వుంచినప్పుడు కూడా నీవు దేవుని వాక్యమును నమ్మకపోవడము ఆ రకమైన అర్థాన్నే అది ఇస్తుంది. ఖచ్చితముగా దాని అర్ధము అదే, చూశారా. ఖచ్చితముగా. సరే, మంచిది.
93దేవుడు చెప్పిన విధముగానే వాక్యమును నమ్మవలెను. వాక్యము వాక్యమునకు వ్యతిరేకముగా నిలువదు. ఒకవేళ అది అట్లు చేసియున్నయెడల మీరు దానిని నాకు చూపించండి. దానికదే తనకు వ్యతిరేకముగా నిలువదు. సాతాను వాక్యము వ్యతిరేకముగా వున్నట్లుగా మీకు చూపించవచ్చు. కానీ వాడు వాక్యమునకు వ్యతిరేకముగా నిలవలేడు, వాక్యము దానిని అనుమతించదు, లేదండీ? ఎంతో కాలము నుండి ఆ విధముగా వ్యతిరేకముగా వున్నట్లు ఆలోచనలు కలిగియున్నవే గాని నేటి వరకు అది ఆ విధముగావున్నట్లు రుజువుపరచబడ లేదు.
ఇప్పుడు మనము ఈ రెండు "మూలాధారములను" చూద్దాము, లేదా దానిని మీరు "వాతావరణములని" పిలువవచ్చు మరియు అవి ఏమి ఉత్పత్తి చేసాయో చూద్దాము. మనము వాటిని కొన్ని నిమిషములు వెంబడించెదము.
94వాతావరణము, ఈ రెండు మూలాధారములు ఒక వాతావరణమును ఉత్పత్తి చేయును, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని కోరుచున్నాను. మీరు ఎన్నడైనా ఒక సంఘములోనికి వెళ్ళరా?… ఒక నిమిషము చెప్పుట కొరకు… ఇప్పుడు నేను గౌరవప్రదముగా దీనిని మీకు చెప్పెదను. దేవుడు నన్ను మన్నించును గాక! బిగుసుకొని పోయినట్లు వుండే కాపరివున్న సంఘమునకు ఎన్నడైనా మీరు వెళ్ళారా? అక్కడ ప్రజలు కూడా అలాగే వుంటారు. అది సత్యము. చూశారా, అది ఏమిటి? దానిని ఆ వాతావరణమే కలుగజేసినది.
"ఒక్క నిమిషం ఆగండి, దైవిక స్వస్తత మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము వంటి కార్యములను నేను నమ్మను, అసలు అటువంటి అర్థములేని కార్యములు లేవని," చెప్పే సంఘ కాపరి గల స్థలమునకు వెళ్ళి చూడండి, అక్కడ సంఘస్తులలో ప్రతివారు కూడా అలానే వుంటారు, ఒకవేళ అక్కడ లోపల ఎక్కడో ఓ చోట పక్షిరాజు వున్నట్లయితే, ఆ కోళ్ళ గుంపు నుండి పక్షిరాజు బయటికి వచ్చును. అతను తప్పక అలాగే చేయును. అది సరిగ్గా నిజము. అతను దానిని వదిలిపెట్టును, అతను తప్పక వదిలి పెట్టును. వాళ్ళతో కలిసి అతడు వుండలేడు, అతను ఒక పక్షిరాజు, అతను గగన తలములలో విహరించునట్లు నిర్మించబడ్డాడే కానీ, పెంట కుప్పల మీద కాదు. అవునయ్యా! ఇప్పుడు ఇక్కడ అతను ఉన్నాడు.
2TIM 1:2,5
95ఇప్పుడు, మనము ఆ వాతావరణములను గురించి కనుగొందుము. ఆ విషయాలు గలవా… విశ్వాసము గురించి ఏ సంఘములో బోధించబడుచున్నదో అక్కడకు మీరు వెళ్ళండి, ఆ సంఘము అటువంటి (విశ్వాసము) వాతావరణములో వున్నట్లు మీరు కనుగొనగలరు. ఓ, దేవా! వీరు దానిని కనుగొను విధముగా అర్థమగునట్లు వీరి యొద్ద నేను దీనిని చెప్పెదను గాక! చూశారా. ప్రార్థించే పరిశుద్ధులుగల విశ్వాసుల మధ్యలోకి జనులు వచ్చుటకు కారణము అదేయగును, తిమోతి మాత్రమే ప్రశస్తమైన అటువంటి విశ్వాసమును గలవాడై యుండెను. అతడు తప్ప వేరెవ్వరిని పట్టణములో వున్నవారిని నేను కనుగొనలేదని పౌలు చెప్పెను. మిగతావారందరు సంఘ శాఖలకు చెందినవారు, చూశారా.
96ఎప్పుడైతే అతడు ఆ వాతావరణంలోనికి ప్రవేశించాడో (చూశారా), ఆ వాతావరణము సృష్టించిన కార్యములలోనికి మీరు ప్రవేశించినప్పుడు క్రియలు సంభవించుటను మీరు కనుగొనగలరు. "ఓ, అవును, పరిశుద్ధ గ్రంథము సత్యమైననది, దేవుడు స్వస్థపరచును," అని చెప్పగలిగే ఒక స్థలము యొద్దకు మీరు వెళ్ళినప్పుడు, విశ్వాసము ద్వారా జనులు జీవించుటను మీరు కనుగొనెదరు.
అటువంటి జనుల సమూహము మధ్యలో మీరు నడుస్తూ వెళ్ళినప్పుడు, అవును… నేను క్యాన్సర్ వ్యాధితో చనిపోవుచుంటిని, కానీ నేను స్వస్థపరచబడ్డాను," అని జనులు చెప్పుటను మీరు కనుగొనెదరు.
"ఒకానొకప్పుడు నేను గ్రుడ్డివాడిని, నేను…" అని చెప్పుటను మీరు వినగలరు.
"ఓ, అలాగా! ఏమిటి? నీవు ఏమి చెప్పుచున్నావు… నీకేమైనది?" అని క్రొత్తవారు అడుగుతారు.
నీవు నాతో మా ఇంటికి రా, మధ్యాహ్నము నాతో కలిసి భోజనము చేయుటకు నాతో రమ్ము, నా పుస్తకములోయున్న దానిని నీకు చూపిస్తా, నీకొక విషయమును తెలిపేదను, నేను వ్రాసియుంచుకొనియున్న ఒక పుస్తకము అచ్చట కలదు. అనేక సంవత్సరములుగా నేను పక్షవాతముతో బాధపడుచుండగా నా కొరకు ప్రార్థించబడినది. నా పొరుగు వారికి నాయొక్క పరిస్థితిగురించి తెలుసు."
చూశారా? అది ఏమైయున్నదో? ఆ సంఘములో యున్న వాక్యము, సంఘములోని ఆ విశ్వాసులగుంపు యొక్క విశ్వాసము ఆ వాతావరణమును సృష్టించాయి.
97"ఆ విధముగా అది జరిగియుండదు. అలా జరగదు," అని చెప్పుచూ, బుద్ధిపూర్వకమైన జ్ఞానము దానిని నిన్ను చూడనివ్వకుండా పూర్తిగా చీకటి కమ్మివేసిన పరిస్థితిలో వున్నప్పుడు వాక్యము తనయొక్క సామాన్యతయందు మరియు తన సంపూర్ణతయందు ఎట్లు ఎదుగగలదు? చూశారా? కావున జ్ఞానమును గూర్చి ఎచ్చట ప్రసంగించబడుచున్నదో అటువంటి వేదాంత కళాశాలల యందు పిల్లలు చనిపోవుదురు. కానీ, వాక్యము నుండి విశ్వాసమును గూర్చి ఎచ్చట బోధించబడుచున్నదో అచ్చట పిల్లలు జీవించెదరు. ఆమేన్! అదే దానియందు గల బేధము. కేవలము, జీవము మరియు మరణములు గలవు. ఏదేను తోటలో సంభవించినది కూడా అదే. ఆ రెండు వాతావరణములు ఉన్న ఆ స్థలమందు ఖచ్చితముగా అదే వారికి సంభవించేది. హవ్వ సత్యమును కలిగియుండి దానిని విడిచి అబద్దమును గైకొనినప్పుడు ఆమెకు మరణము సంభవించినది, చూశారా. ప్రతిసారి దానిని ఆ విధముగా చేయునప్పుడు మరణమే సంభవించును. కనుక వారు అచ్చట నిలబడలేక పోయిరి. ఒకవేళ మీ సంఘము అటువంటి వాతావరణమును కలిగియున్నయెడల, ఓ, బిడ్డా, నీవు జీవించాలని అశించినయెడల, నీవు వాక్యమును నమ్ముము.
98ఇప్పుడు, ఇచ్చట నేను చెప్పబోవు విషయము కొంచెము కఠినముగా వుండును. దీనిని ఈ విధముగా కఠినముగా చెప్పాలనేది నా ఉద్దేశ్యము కాదు. ఇది కేవలం ఉపదేశము. ఈ కార్యములను గూర్చి మనము చూసేటప్పుడు కొంచెము కఠినముగాను, చురుక్కుమని కాలినట్లుగా వుండును. మీకు అర్థమైనదా? ఇప్పుడు కొంచెము నెమ్మదిగా ఆలకించండి. ఇది ఎలాగ వుండుననగా, ఒక దూడకు కాల్చిన దానితో ముద్ర వేయడమువలె వుండును. ఒక దూడకు ఆ విధముగా చేయునప్పుడు ఆ కార్యమును నేను అసహ్యించుకునేవాడిని. ఆ దూడను చూస్తే ఎంతో జాలిగా వుండును. మేము అచ్చటికి వెళ్ళి… మీరు దూడను త్రాడుతో దాని నాలుగు కాళ్ళను కట్టివేయుటను మీరెప్పుడైనా చూశారో లేదో, ఒక పంది యొక్క నాలుగు కాళ్ళను కట్టినట్లుగా దానిని కట్టుదురు. నిస్సహాయకురాలైన ఆ దూడను అచ్చటకు తోలుకొని వెళ్ళి, ఇనుప ముద్రతో చేయబడిన దానిని ఆ దూడ మీద పెడతారు, దానిపైన ఆ ముద్రలో యున్న గుర్తు పడును. కాని సహోదరుడా, చూడటానికి చాలా ఘోరముగా ఉండును. ఆ దూడ పైకి, క్రిందికి, ఎగురుతూ ఎంతో వేగముగా పరిగెత్తును, అది దాని కాళ్ళను విదిలించుకుంటూ, అరుస్తూ, గిరగిరా తిరుగుచూ, అరుస్తూ పరిగెత్తుతూనే వుండును. కానీ ఆ ముద్ర దానిమీద వేసిన తరువాత అది ఎవరికి చెందినదనేది అచ్చట ఉన్నవారు ఎరుగుదురు. అది నిజము. ఆ దూడ ఏ గడ్డి మైదానమునకు చెందినదో దానిని బట్టి తెలుసుకుంటారు. ఇదేదో హాస్యము గురించి నేను చెప్పలేదు. కావున, మనము కూడా విశ్వాసులమనే వాతతో కూడిన అటువంటి ముద్రను పొందుకుందాము, చూశారా. వాతతో కూడిన ముద్రను మనము పొందుదాము. అవునండీ. వారు దానిని చెప్పినప్పుడు…
మీలో అనేకులు ఆ ఆవులను మేపు వాని ధ్యాన పాటలను పాడి యుందురు లేదా చదివియుందురు. మేత మేయుటకు ఆవులన్నింటినీ ఒక చోట చేర్చి, వాటిని కట్టుచున్నప్పుడు దారి తప్పి అటూ, ఇటూ తిరగుచూ ఆ మందలోకి వచ్చి చేరిన చిన్న దూడను వారు వాటిలో కనుగొనినయెడల, ఆ దూడను తీసికొని వండుకొని తినేస్తారు, ఎందుకనగా ఆ దూడ మీద వాతతో వేయబడిన ముద్ర లేదు. ముద్రను కలిగిన దూడలన్నీ అవి ఏ గడ్డి మైదానమునకు చెందినవో అవన్నీ వాటి సొంత మైదానమునకు వెళ్ళిపోవును. పశువుల మందలను ఒకటిగా చేర్చినప్పుడు యజమానునికి తన ఆవులు ఏవో తాను బాగా ఎరుగును. మీరు… కాల్చి వాత పెట్టి ముద్ర వేయునపుడు ఖచ్చితంగా మీకు బాధ, నొప్పియుండి తీరును.
99ఇప్పుడు చూడు! సాతాను శాస్త్రయుక్తముగా దానియొక్క జ్ఞానముతో నిరూపించగలడు. (ఇప్పుడు ఇక్కడ కొన్ని నిమిషములు, ఒక వైద్యుడి పాత్రను పోషించబోవుచున్నాను), మానవ జాతి ఎదుగుదల కొరకు భూమిలో విటమిన్లు వున్నాయని శాస్త్రయుక్తముగా వాడి జ్ఞానముతో సాతాను నిరూపించగలడు, ఖచ్చితముగా నిరూపించగలడు. వాడు దానిని విజ్ఞాన పూర్వకముగా నిరూపించగలడు. వారు దేనినైనను శాస్త్రయుక్తముగా నిరూపించగలరు. కోరినట్లయితే అన్నిటినీ కూడా. చూశారా. తప్పక నిరూపించగలరు.
100అందులో విటమిన్ (పీ) "సుఖము" ( pleasure), "ప్రఖ్యాతి" (popularity) గలదు. అది అందులో గలదు, అది సాతాను యొక్క బుద్ధిపూర్వకమైన జ్ఞానమనే మట్టిలో గలదు: (ఖచ్చితముగా) సమస్త లోక సుఖభోగాలు అందులో గలవు. సమస్త నీచమైన బొమ్మలు, అసహ్యమైన నాట్యాలు, సమస్తము… "ఆ, అదేమి ఫర్వాలేదులే, అది ఏ హాని కలిగించదు, ఏమీ అవ్వదులే, కానీ ఫర్యాలేద," అని వాడు అంటాడు. ఖచ్చితముగా, అర్థమయ్యిందా? పేరు ప్రఖ్యాతలు "అబ్బో, ఈ పట్టణములో వున్న సంఘలన్నింటిలో కంటే నీదే పెద్ద సంఘము," అనే పేరు ప్రఖ్యాత. సరే మంచిది.
అందులో విటమిన్ సి (C) గలదు. అది దేనిని సూచించునంటే లోక జ్ఞానము ( Commonsense)ను సూచించును. అనగా, స్వబుద్దితో కూడిన ఆలోచనను కలిగి యుండును.
అందులో విటమిన్ 'ఆర్' (R) గలదు. దాని భావమేమనగా, "స్వబుద్ధితో కూడిన హేతువాదములు ( Reasonings). అవును, వాడు స్వంత జ్ఞానముతో తర్కించును, కానీ మీరు గమనించండి, అది క్రియ చేయదు.
దానిలో విటమిన్ 'బి' (B)ని కలిగివున్నది. అనగా, అందము ( Beauty). సాతాను అందముగా వుండును, పాపము అందముగా వుండును, మరియు పాపము మరీ ఎక్కువ అవుతున్నప్పుడు అది ఏంతో అందముగా తయారగును. చెక్కతో చేయబడిన గృహము కంటే ఎంతో మంచి గృహమును మనము కలిగియున్నామా? అది ఎంతో అందముగా వున్నది కదా? ఈ రోజున మన స్త్రీలు ముందున్న వారికంటే ఎంతో అందముగా వున్నారు. చూశారా? ఒకప్పటికంటే ఈ ఫ్లోరిడా ఎంతో రమ్యముగా వున్నది? దేవుడు సృష్టించిన దానికంటే కూడ, చూశారా? దానికి అందము వచ్చినది. ఎంతో మందికి తెలుసును, సాతాను అందముకు చెందినవాడని, వాడు అందమును ఆశించునని, అందమైన, చాలా అందమైన రాజ్యమును మరియు మొదలగు దానిని తయారు చేయాలని వాడు ఆశించాడనేది ఎంతమంది ఎరుగుదురు? ఖచ్చితముగా, దానిని మనమెరుగుదము. అందములో సాతాను వున్నాడు.
101ఇప్పుడు, గమనించండి, వాడియొద్ద విటమిన్ 'ఆర్' (R) అనగా సొంత బుద్దితోకూడిన హేతువాదము ( Reasoning) కలిగి వున్నాడు. మరియు "అందము" (Beauty) అనే బి" ( B) విటమిన్లు , ఆధునికత (Modern) అనే "యమ్ ( M) విటమిన్ వాడియొద్ద కలదు. మరియు (AW) ఏడబ్ల్యూ, నీవు ఆధునికముగా వుండాలని కోరుకొనుచున్నావు.
ఆ సాతాను యొక్క జ్ఞానమును మీరు తీసుకొని, ఆ కార్యమును మీరు నమ్ముచున్నారో లేదనే దానిని కనుగొనండి, అది సరిగ్గా నీలో నుండే ఎదుగును. మీరు కూర్చున్న స్థలము యొద్దకే తిన్నగా ఆ విటమిన్ వచ్చును. ఎవరైనా ఒక్క వ్యక్తి లేచి నిలబడి అతడికి ఉన్న కొంత జ్ఞానమును నీకిచ్చును. ఎట్లనగా "స్నేహితుల్లారా, ఆలకించండి, ఈ అందమైన బ్రహ్మండమైన ఆలయములో గట్టిగా కేకలు వేయుచూ, ఏడుస్తూ, అన్యభాషలు మాట్లాడుచూ, పైకి, క్రిందికి దూకుచూ, నేలపై పడి పొర్లుచూ, పిచ్చి కుక్కలవలె నోట్లో నురగలు క్రక్కుచూ వుంటే చూచుటకు ఎలాగుండును? ఈ నగరము యొక్క మేయరు ఆ విధముగా మనలను చూసినప్పుడు అతడేమనుకుంటాడనే దానినిగూర్చి కొంచెము ఆలోచించండి, డీకనుల్లారా, ఇటువంటి కార్యములను లోపల అనుమతించిన యెడల ఏమగును? ఆలోచించండి," అని సాతాను అనును. ఓ, ఖచ్చితముగా, అది ఆధునికతయగును. మన జనులు చేతిలో తంబురాను తీసికొని ఆ వీధులలో నిలబడియుండుటను గూర్చి మీరు ఆలోచించి చూడండి. మన సహోదరీలు పెద్ద పొడవైన వెంట్రుకలు వ్రేలాడుచూ నడుస్తూ వచ్చుచుండగా వారిని చూసి మిగతా స్త్రీలు, "అటుచూడు, అటుచూడు, ఆ సంఘము యొక్క అధ్యక్షుడు (అది ఏమైనప్పటికీ దానిని గూర్చి మీరెరుగుదురు)… చూడు, అలా చూడు, ఆమె చూడడానికి పాతకాలపు మనిషిలా వున్నది. అలాగే వున్నది కదా! ఆమె వెనుక పొడవుగా నల్లగా వ్రేలాడుచున్న ఆమె వెంట్రుకలు చూచుటకు కారుకి తగిలించిన అదనపు టైరువలె వున్నది కదా!" అని హేళన చేస్తూ మాట్లాడతారనేది మీరెరుగుదురు.
102"మీరు ఆధునికముగా వుండాలని కోరుకుంటున్నారు," చూశారా. అది సాతాను యొక్క జ్ఞానము, అదే అచ్చట పెరుగుచున్నది. మట్టిలో వున్న ఆ విటమిన్ యందు ఏమివున్నదో అదే బయటకు వచ్చును. నవనాగరికత యెజెబెలా, నీవు చేయుచున్నదేదో దానిని చేసుకుంటూ పో? సరే, మంచిది.
నేడు నవనాగరికత స్త్రీలవలె వారున్నారు, ఖచ్చితముగా. ఓ, నవనాగరికత! అంతెందుకు, పట్టణములోయున్న బహు నవనాగరికతతో నిండిన జనులు అటువంటి సంఘమునకే వచ్చుదురు. నిశ్చయముగా నవనాగరికతతో నిండిన సంఘమునే వారు కోరుకొనెదరు. ఎందుచేత? నవనాగరికతతో నిండియున్న విటమిన్లో మరియు కారణములను అన్వేషించు తర్కమనే విటమిన్లో వారు ఎదిగిరి. అలాగు వారు దానిలో నుండే ఎదిగిరి. దానియొక్క భావము చూశారా. కారణములను అన్వేషించు తర్కమును కలిగియుండుట. అటువంటి విటమిన్లుగల దానిలోనుండి మీరు ఎదుగుటకు ఆరంభించిన ఆ క్షణమందే వాక్యమునకు దూరమై మీరు చనిపోవుదురు. మీరు ఆ విధముగా ఎదగాలంటే ముందు వాక్యమును త్రోసివేయవలసి వచ్చును, చూశారా. మీరు ఒక పాపియగుటకు గల ఏకైక కారణమేదనగా, మీరు దేవుని యొక్క వాక్యమును త్రోసివేయుటయే యగును. పాపమనగా ఏమిటి? అవిశ్వాసము. దేనియందు అవిశ్వాసము? దేవుని వాక్యమునందు, మొట్టమొదట మీరు వాక్యమును తిరస్కరించాలి.
1KGS 21:23•
2KGS 9:10,36
103ఇప్పుడు, ఇంకనూ పది విటమిన్ల గురించి ఇక్కడ నేను వ్రాసి వుంచాను. కానీ, వారికి ఒక్క విటమిన్ గురించి చెప్పడములో ఇక్కడ సాతాను విఫలమయ్యాడు. వాడు విటమిన్ డి (D) "డెత్" ( Death) అనగా మరణమును కలిగివున్నాడు. ఇక్కడవున్న విటమిన్లన్నింటికన్నా అది చాలా పెద్ద విటమిన్; దానియొక్క ఫలితము మరణము, చూశారా. అది అందమైన చక్కటి వస్త్రములు ధరించే గుంపుగాను, అత్యాధునికతను కోరుకొనునదిగా వున్నది. చాలా అందమైన ఆలయము, పెద్దదైన సంఘసంస్థ (చూడండి). ఎంతో ఆధునికత, ఎంతో అందము అచ్చట కలదు. ఎన్నో సరసమైన విషయాలు అక్కడ చెప్పబడెను. "దేవుడు, ఆయన జీవులుగా వుండుట కొరకు మిమ్ముల్ని సృష్టించిన యెడల, మీరు చూడడానికి ఎంతో అందముగా కనిపించాలి, జుట్టు కత్తిరించికొనిన ఈ స్త్రీలను ఆయన ఎందుకు ఖండించును? కొంచెము రంగులు వేసుకొంటే ఆయన ఎందుకు ఖండించును? అలా చేయడు…" అని దేయ్యము చెబుతాడు.
మంచిది, ఆ విధముగా దేయ్యపు అలంకరణతో అలంకరించుకొనిన ఒక స్త్రీని పరిశుద్ధ గ్రంథములో ఆయన కలిగి యుండెను. కుక్కలకు ఆహారముగా ఆయన ఆమెను అప్పగించెను. అందువలన దానిని గురించి మీరు ఆలోచించండి, చూశారా. అది ఖచ్చితముగా అలాగుననే ఉన్నది.
DEUT 8:3•
MATT 4:4•
MATT 24:35•
MARK 13:31
104"ఎందుకు దేవుడు… అంతెందుకు, అసలు దేవుడు పరిశుద్ధ గ్రంథము ప్రకారముగా మనము జీవించాలని ఎదురు చూడడు," అని దెయ్యము అంటాడు.
కానీ ఆయన తప్పక అలాగే జీవించాలని కోరుచున్నాడు. ఆయన హవ్వతో ఆమె తప్పక అలాగే జీవించాలని చెప్పెను. మరియు "మనుష్యుడు ప్రతి మాట వలన జీవించును, అది దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట వలన జీవించునని," ఆయన చెప్పెను. ఎవరు దానిని చెప్పారు? యేసు. అది సరియేనా? ఒకవేళ వేరొక మనిషి దానికి వేరేదైనా చెప్పిన యెడల అతడు అబద్దీకుడు అగును. ఆయన వాక్యము సత్యము. "ఆకాశము, భూమియు గతించిపోవును గాని నా మాటలు ఎంత మాత్రమును గతించవు." మీకు కావలసినది అదే.
కనుక అతని సమీకరణము నందు విటమిన్ "డి" కలదు మరియు నవనాగరికత కలదు. అది సత్యము.
105పరిశుద్ధ గ్రంథమున యుండు వాక్య విత్తనము ఆ రకమైన భూమినందు ఎదుగదు. దేవుని ఆత్మను కలిగి, "దేవునికి మహిమ! హల్లేలూయా!" అని బిగ్గరగా దేవుని స్తుతించు ఒకడు, అటువంటి ఆధునిక సంఘములలోనికి ఎట్లు వెళ్ళగలడని మీరు అనుకుంటున్నారు? అది ఏమిటో మీకు తెలుసా! బోధకుడు బోధించకుండా తన ప్రసంగమును మ్రింగివేయునట్లుగా మీరు చేయుచున్నారు? నేను ఎందుకు మీకు చెప్పుచున్నానంటే, మ్రింగి వేయుటను నేను చూశాను.
అక్కడవున్న వారందరు కొంగల్లా మెడలు చాపి త్రిప్పి చూసి "ఏమి చెప్పాడు?" అని ప్రశ్నించెదరు.
తరువాత కొన్ని నిమిషాలకు, బోధకుడు, "యేసుక్రీస్తు దేవుని కుమారుడు," అని చెప్తాడు.
దేవునికి మహిమ! అది నిజము.
106"హు…! డీకనులు!.." వారు నిన్ను బయటికి త్రోసి వేయుదురు, మీరు… మీరు… కొన్ని నిమిషాలలో గుమ్మము బయట వుంటారు, చూశారా. వాక్యము అక్కడ ఎదగనే ఎదుగదు, ఆ విధముగా జరగదు, చూశారా. సరిగ్గా అది అక్కడ ఎదగనే ఎదుగదు, చూశారా.
తరువాత దానిపై వాడు విషమును చిమ్ముటకు వచ్చును. మీలోవున్న ఆ విత్తనము యొక్క జీవమును చంపడానికి ప్రయత్నించును. ఇప్పుడు, నేడు దేశమందు ఒక గుంపు జనులు, "దేవుడు మనలను స్వస్థపరచును," అని నమ్మేవారు కలరు, అదే సమయమున వైద్యులు మనలను బాగుచేయుటకు దేవుడే మనకనుగ్రహించెనని మనకు తెలుసు కదా! అని ఇంగిత జ్ఞానమును చూపించే జనులు కలరు. ఆ విధమైన జ్ఞానమనే విషమును వాడు తీసుకొని వచ్చి, దానిని నీలో యున్న జీవపు కణముపై చల్లుచూ చంపుటకు వాడు ప్రయత్నించును.
ఇప్పుడు, మీరు మంచి జ్ఞానముగల యదార్థవంతుడైన ఒక వైద్యుని వద్దకు వెళ్ళి, "స్వస్థపరచునది నీవే కదా!" అని అడిగి చూడండి, అందుకతడు, "లేదండి, నేను మీ యొక్క పన్నును మాత్రమే తీయగలను, కానీ ఆ పన్నువున్న ఖాళీ స్థలమును నేను స్వస్థపరచలేను," అని చెప్పును.
"విరిగిపోయిన ఒక చెయ్యిని కట్టుకట్టి సరి చేయగలను, గానీ నేను దానిని స్వస్థపరచలేనని," వైద్యుడు చెప్పును.
ఖచ్చితముగా నిజము. దేవుడు స్వస్థతనిచ్చువాడు, చూశారా. ఇప్పుడు, ఆ విధమైన పనికిరాని వ్యర్థమైన కారణములను అన్వేషించు దానియందు ఏదైనను ఎప్పుడైనా ఎదుగ గలదా! ఆ విధమైన వాతావరణములో వాక్యవిత్తనము ఎన్నడైనా ఎలా ఎదుగును? సరిగ్గా, అది అలా ఎదుగదు. ఆ రకమైన వాతావరణమునందు అది ఎదుగదు. నిశ్చయముగా, అది జరుగదు.
107కానీ, విశ్వాసము, ఒకే విటమిన్నందు మాత్రమే ఎదుగును. అది కేవలము ఒకే విటమిన్ మాత్రమే కలిగివుండును. ఏ విధమైన మిశ్రమము ఎంత మాత్రమూ అందులో కలిగియుండదు. వాక్యమనే విశ్వాసము ఒకే విటమిన్లో ఎదుగును. వాక్యమనే ఒకే పదార్థమునందే విశ్వాసము ఎదుగును. ఆ వాక్యము పెరిగే ఒకే ఒక్క మార్గము అదే, ఎందుకనగా అది వాక్యమును నమ్మును. అది పూర్తి వాక్యమును తీసికొని అది సత్యమని నమ్మవలసి యున్నది. విశ్వాసమనే విటమిన్ నాలుగు అక్షరాలు కలిగిన చిన్న మాటచేత పలుకబడును, జీవము (Life), అది విటమిన్ "యల్" ( L) కలిగివుండును. విశ్వాసము విటమిన్ "యల్" (L) లో వున్నది.
108జ్ఞానమునందు విటమిన్ (P) 'పి', విటమిన్ 'ఆర్' ( R) (Pleasure, Reasoning) అనగా సుఖ భోగములు మరియు తర్కించు స్వభావము మరియు ఇతర విటమిన్లు అనేకము గలవు. జ్ఞానము వాటన్నింటిని కలిగివున్నది. కాబట్టి, అది తర్కించును, కానీ విశ్వాసమునకు ఒక్కటి మాత్రమే యున్నది - జీవము! ఇది కదలకుండా, అట్లే దానితోనే నిలిచి యుండును. ఆయన వాక్యము జీవము, ఆయన వాక్యము సత్యము, ఆమేన్! వాక్యము. మార్గము, సత్యము, జీవము. విశ్వాసము కేవలము వాటినే పట్టుకుని వ్రేలాడును, దానికి కావలసినది అదియే. అది సాతానుకు చెందిన దానిని తీసికొనదు.
విశ్వాసము ఎచ్చట ఎదుగునో అచ్చటనే పరిశుద్ధాత్మ యొక్క జీవము, నిత్యజీవము యుండునును. "జో" (Zoe) అనే మాటకు అర్థమేమనగా దేవుని యొక్క సొంత జీవము. విశ్వాసము క్రియ చేయగల ఒకే ఒక్క స్థలము అక్కడ మాత్రమే. ఎప్పుడైతే విశ్వాసము వాక్యమును వింటుందో, అది దేవుని యొక్క వాక్యమని నమ్ముతుంది. తరువాత "జో" ( Zoe) అనే దేవుని యొక్క సొంత జీవమునందు అది ఎదుగుచూ, వాక్యము ఏమి చెప్పినదో దానినే అది ఉత్పత్తి చేయును.
GEN 1:3,6,14
109దేవుడు… ఏ రీతిగా ఈ ప్రపంచమును సృష్టించెను. ప్రపంచము దేవుని యొక్క ఆలోచనలో వున్నదని మీరు నమ్ముచున్నారా? నిశ్చయముగా, అది వున్నది. అది వుండవలసి వున్నది కూడా. ఆయన దానిని ఏ విధముగా చేసెను. ఆలోచన కేవలము పలికెను… "ఆయన ఎక్కడ నుండి పదార్థములను పొందుకొనెను?" అని సందేహించుచూ దేవునితో ఎప్పుడైనా మీరు ఎలా వాదించగలరు? "దేవా, ఆ రాళ్ళు తయారు చేయుటకు కావలసిన పదార్థములు ఎక్కడ నుండి నీకు వచ్చినవి," అని అడుగుటకు కారణమును నీవు అన్వేషించవచ్చును.
"అవి వాయువుల నుండి వచ్చినవి."
"ప్రభువా! ఆ వాయువులు ఎక్కడనుండి వచ్చాయి?" నీవు ఏ సూత్రమును ఉపయోగించావు? నీరు ఎలా తయారు చేశావు?
దానిని తయారు చేయుటకు నీకు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ ఎక్కడ నుండి వచ్చినది?
అది సందేహించుచూ, కారణములను అన్వేషించు స్వభావమది. చూశారా! ఆ విధముగా సందేహించుచూ అడగటము అర్థములేనిది. దేవుడేమి చెప్పాడు? అది ఆయన ఆలోచనలో వుండెను, ఆయన ఆలోచనలే ఆయన వాక్యమై యున్నవి. అవి వ్యక్తపరచబడిన ఆయనయొక్క ఆలోచనలుగా ఉన్నవి. అవి ముందుగా ఆయన ఆలోచనలో వుండెను. ఎప్పుడైతే ఆయన తలంపులో అవి వున్నవో "అక్కడ వుండును గాక!" అని చెప్పినప్పుడు, అక్కడ అవి కలిగెను. అది అంతే, ఎచ్చట విశ్వాసము వుండునో ఆ మాటలు దానిని ఆధారము చేసుకొని యుండెను.
HEB 11:2
110హెబ్రీ 11వ అధ్యాయములో, "విశ్వాసము ద్వారా ప్రపంచము నిర్మించబడెను." ప్రపంచము విశ్వాసము ద్వారా నిర్మించబడెను. అదృశ్యమైన పదార్థములతో దేవుడు ప్రపంచమును సృష్టించెను. విశ్వాసము ద్వారా ప్రపంచము ఉనికిలోనికి వచ్చునట్లు దేవుడు పలికెను, ఎందుకనగా అది ముందుగానే ధ్యానించబడిన వాక్యముగా వుండెను. కావున దానిని ఆయన పలికిన వెంటనే అది జీవముగా మారినది.
"సహోదరుడా బ్రెన్హాం, నేను దానిని నమ్ముచున్నాను," అని ఇప్పుడు మీరు చెప్పవచ్చు. మీ హృదయంలో దానిని మీరు నమ్మెదరు, తరువాత దానిని వ్యక్తపరచెదరు. "నేను దానిని నమ్మెదను." దానిని ఎక్కడా, ఎన్నడూ మార్చవద్దు. సరిగ్గా దానితోనే నిలిచియుండు. దానినుండి ఏది ఎదుగుచూ బయటకు వచ్చుచున్నదో దానిని గమనించి చూడండి. అది వాక్యమును ఉత్పత్తి చేస్తుంది. ఎందుకనగా, అది విశ్వాసమైయున్నది. జ్ఞానము మిమ్ములను దూరముగా తీసుకొని వెళితే, విశ్వాసము దాని దగ్గరకు మిమ్ముల్ని తీసుకొని వచ్చును.
111దానిని చూశారా? అది ప్రతీ-మానవ నిర్మిత ఆచారములను కత్తిరించును. మానవ-నిర్మిత వేదాంత విద్యను నేర్చుకొను ప్రతి పాఠశాలను ఖండించును; వాటిని అది బాగా చల్లబరుచును. అక్కడ వారు ఆచార్యులు, డీడీ, పి.హెచ్.డి., యల్.యల్, క్యూ.యు.డీ, మొదలగు పట్టములు గలవారై వున్నారు. ఈ వ్యక్తులందరూ కూడా పాఠశాలకు వెళ్ళి మానసిక శాస్త్రము, మరియు ఇతర సంగతులన్నీ నేర్చుకొనుచున్నారు. అతను పాఠశాల నుండి బయటికి వచ్చేసరికి అతనిలో ఒకే విషయము వుంటుంది, అది మానసిక శాస్త్రముతో తనను తాను ఏ విధముగా జనులకు చూపించుకోవాలి, ఏ విధమైన వస్త్రములులు ధరించాలి, ఏ విధానములో "ఆమేన్" చెప్పాలి, సరిగ్గా ఇటువంటివే నేర్చుకొనును. ఓ, బుద్ధిహీనత… మనము పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. దేవుని కుమారులు దేవుని ఆత్మచేత నడిపించబడెదరు. సెమినరీ జ్ఞానముతో నడిపించబడుట కాదు. కానీ, దేవుని ఆత్మ దేవుని కుమారులను, కుమార్తెలను నడిపిస్తుంది. ఖచ్చితముగా, అది నిజము. ఆమేన్!
1JN 2:15
112ఇప్పుడు, ప్రతి సిద్ధాంతము నుండి, మనము నేర్చుకొన్న ప్రతీ కార్యమునుండి, ప్రతీ మానవ-నిర్మిత వేదాంతము నుండి మనము బయటకి రావలెను. వారు నమ్మకపోవడంలో ఏ ఆశ్చర్యమూ లేదు. అక్కడ దానిలోపల ఎదుగుట కొరకు ఏమియూ లేదు. చూశారా? వారికి విటమిన్ "ఆర్" (R) కలదు, మనలనుండి "తర్కము" ( Reasoning) పారద్రోలవలెను. విటమిన్ " ప్రఖ్యాతి" (Popular), విటమిన్ "సుఖము' ( Pleasure) కొద్దిగా ఉల్లాసము కలిగి వుండుట.
"ఏ రకమైన ఉల్లాసము అది?"
"ఓ, అలా కొంచెము బయటికి వస్తూ అప్పుడప్పుడు కొంచెము త్రాగాలి, కొంచెము సంతోషంగా వుండటములో ఏమీ తప్పులేదు. నీకు తెలుసా అలా చేయడము వలన ఏమీ అవ్వదు, ఫర్వాలేదు," అనే తలంపు వాడు నీకు కలుగచేస్తాడు. అటువంటి చిన్న చిన్న కార్యములు, ఇంకా ఇటువంటి అన్నీ కార్యములు ఆ సాతాను యొక్క విటమిన్లో నుండి వచ్చినవని నేనెరుగుదును. మీకు చూశారా? అటువంటి విటమిన్ వాక్యమును తిరస్కరించుచుండగా, ఆ వాతావరణములో అది ఎన్నడై ఎదుగగలదా? అది ఏ విధముగా ఎదుగగలదు? చూశారా? ఎందుకనగా అది వాక్యమును తిరస్కరించుచున్నది. "మీరు లోకమునైనను, లోకములో వున్నవాటినైనను ప్రేమించినట్లయితే, దేవుని ప్రేమ మీలో వుండదు అని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. కనుక దేవుని యొక్క వాక్యమును తిరస్కరించుచున్న ఆ విటమిన్ క్రింద దేవుని వాక్యము ఏ రీతిగా ఎదుగ గలదు?
113అది ఒక విధమైన విటమిన్ని భూమి నుండి తీసికొని గింజలను ఉత్పత్తి చేయును. అది మంచి రకమైన నేలవలే వుండాలి. మనము ఇంకా కొంచెము లోతుగా వెళ్ళి దానిని చూద్దాము. అచ్చట అది మంచి నేలగా వుండాలి, లేకపోతే అది విత్తనమును మొలకెత్తించదు. మీరు కొన్ని నేలలను తీసుకొనండి, దీనినో లేక వేరే దానినో అది పండించదు. ఇసుక భూమి మరియు దానిలో వేరువేరు పోషక జానమును ఎదురోనే విశ్వాసము పదార్థములు వుండుట వలన కొన్ని విత్తనములు మాత్రమే దానిలో ఎదుగును, ఎందుకనగా అది అన్నింటిని సరిగ్గా పండించుటకు అది సరియైన సారవంతమైన నేల కాదు. దానిలో గల సారవంతము ప్రకారమే అది పడించగలదు.
ఇప్పుడు, కలుపు మొక్కలు ఎక్కడైనను, ఏ రకమైన నేలలోలైనా ఎదుగును. అది సత్యమేనా? పాత సంఘశాఖలనే వ్యర్థమైన కలుపు మొక్కలు ఎక్కడైనా చాలా బాగా ఎదుగును. కానీ నేను నీతో చెప్పుచున్నాను, "సోదరుడా, నీలో జీవ ఫలములు ఫలించాలంటే, దేవుని వాక్యములో నుండి నీవు రావలసియున్నది. అది సత్యము. అవును, ఖచ్చితముగా! సరే, మంచిది.
ఈ ఉదయ కాలమందు మిమ్ములను అందరిని ఎక్కువ సమయము ఉంచకూడదని ఆశించుచున్నాను, చూశారా. ఇప్పుడు… చూశారా. మంచిది.
MATT 13:1-9
114వారు నమ్మకపోవడంలో ఏ ఆశ్చర్యమూ లేదు. జీవించుట కొరకు వారిలో ఏదీ లేదు. యేసు వారి గురించి మత్తయి 13వ అధ్యాయము 1వ వచనములో చెప్పెను, దాని గురించి ఏమి చెప్పెనో అక్కడకు త్రిప్పి చూసెదము. మనము మాట్లాడుకొనుచున్న ఈ విషయములను గురించి మత్తయి 13వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడింది:
ఆ దినమందు యేసు ఇంటినుండి వెళ్ళి సముద్రతీరమున కూర్చుండెను.
బహు జనసమూహములు తనవద్దకు కూడి వచ్చినందున, ఆయన దోనె ఎక్కి కూర్చుండెను.
ఆ జనులందరు దరిని నిలిచి యుండిరి. ఆయన వారిని చూచి, చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను, ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను;
వారు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను:
కొన్ని చాలా మన్ను లేని రాతినేలను పడెను, అక్కడ మన్ను లోతుగా లేనందున అవి వెంటనే మొలచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను.
…కొన్ని ముండ్ల పొదల్లో పడెను, ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచి వేసెను:
…కొన్ని మంచినేలను పడి ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను.
వినుటకు చెవులు గలవాడు వినునుగాక! అని చెప్పెను. [వినుటకు జ్ఞానము కాదు, చెవులు కావలెను, చూశారా. వినుట.]
MATT 13:3
115సరే, మంచిది గమనించండి, "విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను," అని ఆయన చెప్పెను.
వాక్యమును ప్రకటించునప్పుడు విత్తనము పడినది. కొన్ని త్రోవ ప్రక్కనపడెను. బాతు వీపుపై నీళ్ళు పడితే వెనక్కి జారిపోవు రీతిగా, కొన్ని రాతి నేలనపడినవి. ఆ నేలయందు గాలివలన కొట్టుకొని వచ్చిన కొంత మట్టి మాత్రమే అచ్చట వున్నందువలన అది మొలచినది. కానీ, దానికి ఏ విధమైన వేర్లు లేవు. వేర్లు దించుటకు దానికి ఏ విధమైన స్థలము లేదు. (ఇప్పుడు, నేను ఇక్కడ కొంత వివరించాలని ఆశిస్తున్నాను, మరియు నేను ఎవరి భావాలను కించపరచకూడదు అని ఆశిస్తున్నాను, చూశారా.)
అది ఒక కాథలిక్ సంఘమునకు మాదిరిగా యున్నది. బండ మీద కట్టబడినామని వారు చెప్పెదరు. తప్పని సరిగా నేను వారితో ఏకీభవిస్తాను. అది నిజమే. దాని క్రింద నేల లేదు. అక్కడనుండి ఎదగడానికి దానియందు అసలు నేలలేదు, కాబట్టి వారు దేనిని ఫలింపలేరు, ఎందుచేత? పరిశుద్ధ గ్రంథమనే విటమిన్లు వారు ఉత్పత్తి చేయలేరు. దాని భావమేమనగా, వారు దానిని అస్సలు నమ్మడము లేదు. వారు సిద్ధాంతమనే ఆచారముగా వెంబడించుచున్నారు, (అది నిజము), రోమన్ సిద్ధాంతము, దానిలో ఎంత మాత్రమూ వాక్యము లేదు, చూశారా.
MATT 13:5
116రాతి నేలమీద పడిన విత్తనము, అది బహు తెలివితేటలతో కూడిన జ్ఞానము. ఓ, సోదరుడా, నేను మీకు చెప్పుచున్నాను, వారు దానిని బహు చాకచక్యమైన మార్గములో కలిగియున్నారు. వారు దానిని మానసిక శాస్త్ర రూపమున, గొప్ప పెద్ద భవనములుగా, చక్కని వస్త్రములు ధరించుటయందు, చూచుటకు పరిశుద్ద - దేవుళ్ళుగా కనబడే యాజకుల రూపముగా, మరి అనేక విధమైన మార్గములో దానిని ప్రదర్శించుచున్నారు. అచ్చటనుండి వెలుపలకు వచ్చిన ఆ దీన నన్ (nun) యొక్క సాక్ష్యమును నేను విన్నాను. ఆ సాక్ష్యమును మీరెంతమంది విన్నారు? ఇక్కడ దానిని మీరు విన్నారా? ఆలయములో ఒక బుధవారము రాత్రి దానిని వినిపించాలని కోరుచున్నాను. ఇక్కడ ప్రతి సభ్యుడు తప్పక ఆ సాక్ష్యమును వినాలి.
MATT 13:5•
REV 17:16
117వారిలో ఒకరు నన్ను చాలా కాలంనుండి అనుసరించుచున్నారు. నేను ఒకసారి మెక్సికోకి వెళ్ళినప్పుడు అచ్చటవున్న సున్నపు గుంటలను నేను నా కళ్ళరా చూశాను, ఆ కన్యా స్త్రీలకు పుట్టిన పసిబిడ్డలను (కాథలిక్ గురువుల ద్వారా కన్యా స్త్రీలకు (nun) జన్మించిన) ఆ సున్నపు గుంటలలోనూ, ఇంకా మొదలగువాటిల్లో వేసి కాల్చి చంపుతారు. కమ్యూనిజం మెక్సికోలో పుట్టడానికి అదే కారణమయ్యింది. నియమాలు వారు అధిగమించారు. కమ్యూనిజం ఆవిర్భావానికి కారణము అదే.
మీరు ఎన్నడూ కమ్యూనిజానికి భయపడకుడి. దేవుడు కమ్యూనిజాన్ని ఉపయోగించుకొనుచున్నాడు. దానిలో నాకు విశ్వాసము లేదు; అది దెయ్యమునకు చెందినది, అయితే నెబుకద్నెజరు రాజు వచ్చి ఇశ్రాయేలీలను చుట్టుముట్టి బంధించుటకై దేవుడు అతనిని ఉపయోగించుకొన్నట్లుగా, దెయ్యమును తీసికొని ఆయన అదే విధముగా మరలా క్రియ చేయుచున్నాడు, చూశారా. పరిశుద్ధ గ్రంథము దానిని నిరూపించుచున్నదో, లేదో క్షుణ్ణముగా పరిశీలించి చూడండి. రాబోవు దినములలో ఏదో ఒక దానిని పరిశీలించి చూడబోవుచున్నాము. దేవుని యొక్క పిల్లలను హత్య చేసిన ఆ పాత వేశ్య మీద పగ తీర్చుకొనుటకు దేవుడు కమ్యూనిజమును పైకి లేపుచుండెను. ఆ విధముగానే పరిశుద్ధ గ్రంథము ఖచ్చితముగా చెప్పుచున్నది. వారు దానిని అగ్నితో కాల్చివేయుదురని, ఆమె నాశనము అంతమునకు వచ్చును. అదే సరిగ్గా ఆమెకు జరగబోయేది కూడా! అదే ఆమె యొక్క స్థితిగా వున్నది. రాతి నేలన పడిన ఒక విత్తనమువలె అది వున్నది. చాలా తక్కువ మట్టి అక్కడ వున్నందున, అది చనిపోయినది. కావున అదేమనగా బహు నైపుణ్యమును కలిగిన జ్ఞానమగును.
118తరువాత కొన్ని విత్తనములు ప్రొటస్టెంట్లు, భూమిలో పడినవి. కాని, తరువాత కొంత కాలానికి పెద్ద సంస్థల యొక్క గొప్ప జ్ఞానము దానిని అణచివేసినది. పరిశుద్ధాత్మను అణచి వేసి వెలుపలికి త్రోసి వేసినది. "అద్భుతములు జరుగు దినములు గతించిపోయాయి. డాక్టరు ఫలానా, ఆయన చెప్పాడు, ఫలానా మరియు ఫలానా." చూశారా? ఆ విధమైనది ఏదీ లేదు. అది జరుగవలసిన విధానములో సరిగ్గా జరిగిపోయింది. సమస్తమును ఆ బుద్ధిపూర్వకమైన జ్ఞానము అణచివేసినది. దేనిని అణచివేసినది? జ్ఞానమును తీసికొనుట కొరకు పరిశుద్ధాత్మను అణచివేసి, పరిశుద్ధాత్మను వెలుపలికి త్రోసివేసిరి, చూశారా.
మార్టిన్ లూథరు కాలములో పరిశుద్ధాత్మ కుమ్మరించబడెను, జాన్ వెస్లీ కాలములో పరిశుద్ధాత్మ క్రుమ్మరించబడెను, పెంతెకోస్తు తొలి దినములలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడినది. కానీ సంస్థలు ఏమి చేశాయి? వారియొక్క జ్ఞానముతో పరిశుద్ధాత్మను అణచి వేసిరి? దేనిని అణచి వేసిరి? ఆ విత్తనమును. విత్తనము అనగా ఏమిటి? విత్తనము అనగా వాక్యమని అర్థము. "దాని అర్థము అది కాదు; దానికి అర్థము ఇదియే అగును," చూశారా, దానిని వారు తారుమారు చేసిరి.
119వారిలో చాలా మంది సేవకులు యదార్థ హృదయము కలిగిన మనుష్యులు కలరు. నేను వారిని కలిశాను. వారితో బాప్తిస్మము మొదలగు అంశముల మీద మాట్లాతిని. ఎవరినైనా సరే వచ్చి నాతో చర్చించమని అడిగాను, "సహోదరుడా బ్రెన్హాం, ఒకవేళ అలా మేము చేసినట్లయితే, మా సంఘము మమ్ములను బయటికి గెంటివేయును," అని చెప్పారు.
నేను "ఎవరు మీకు ఎక్కువ, దేవుని వాక్యమా లేక మీ యొక్క సంఘమా?" అని అన్నాను. మీరు ఎంతమాత్రము సంస్థ అనే బురదలో వుంటూ ముందుకు సాగలేరు, చూశారా. చూశారా? మంచిది. ఒకవేళ వాక్యమును అంగీకరించక పోయినట్లయితే, అది తప్పు, చూశారా. అది మానన-కల్పితమైన జ్ఞానమును చూపించుచున్నది.
REV 13:11
120ఇప్పుడు, ప్రొటస్టెంట్లు అణచి వేయబడినారు, వారు వాక్యమునందు విశ్వాసమును కలిగియుండుటకు బదులుగా జ్ఞానమును కలిగియుండాలని ఆశించి, సంఘశాఖ యందుగల జ్ఞానమును పొందుకొనుటకు ప్రాంభించినప్పుడు, అది పరిశుద్ధాత్మను అణచివేసి - వారియొద్ద నుండి ఆ పరిశుద్ధాత్మను వెలుపలికి త్రోసివేయబడెను. (అర్థమైనవారు "ఆమేన్" చెప్పండి. దేనియందు విశ్వాసము, మెథడిస్ట్ మనుష్యుల గుంపునందా, బాపిస్టు ప్రెస్బిటేరియన్, పెంతెకోస్తు, ఇవాంజలికల్స్ మరియు వారియందా? మరియు త్వరలో వారందరూ కలసి సంఘ సమైఖ్యత అను దానిని ఏర్పరచబోవుచున్నారు. అదే మృగమునకు ప్రతిమ. ఈ దేశములో అతడు అదే అధికారమును కలిగియుండును, (ప్రకటన 13:11) వారక్కడ కలిగియున్న అదే అధికారము ద్వారా, ఆరంభములో రోమన్ కాథలిక్ సంఘము చేసినట్లుగానే ఇచ్చట కూడా ఆ సాతాను పరిశుద్దలను హింసించుచూ, అణచి వేయుటకు చూచును, చూశారా. ఖచ్చితముగా, ఆ విధముగానే కార్యములు సంభవించుటకై ముందుకు కొనసాగి పోవుచున్నవి. అందుచేతనే, వాక్యము సరిగ్గా ఇప్పుడే ప్రతీ స్థలమందు విత్తబడుచున్నది: దానినుండి (ప్రతిమ) దూరముగా తొలగిపొండి! దాని నుండి వెలుపలికి రండి! చూశారా.
REV 3:20
121ఇప్పుడు, జ్ఞానము దానిని అణచివేసి వెలుపలకు త్రోసివేసినది. వారియొక్క సొంతజ్ఞానము పరిశుద్ధాత్మను గొంతు పిసికి చంపునట్లుగా చేసి వారియొద్ద నుండి ఆ పరిశుద్ధాత్మను దూరముగా పారద్రోలివేసిరి. పరిశుద్ధగ్రంథము ద్వారా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో నేను దానిని మీకు నిరూపించి చూపించెదను. ఈ అధ్యాయము నుండి సంఘ కాలముల గూర్చి కొద్ది దినముల ముందే మనము ధ్యానించితిమి. ప్రభువగు యేసును తన సంఘమే ఆయనను గొంతు పిసికి చంపునట్లుగా ఉక్కిరి బిక్కిరి చేసి వెలుపలికి త్రోసివేసేను. తన సంఘమునకు వెలుపల నిలబడి ఆయన మరలా లోపలికి ప్రవేశించుటకు ప్రయత్నించుచూ, ద్వారము యొద్ద నిలబడుకొని తలుపు తట్టుచుండెను. ఖచ్చితముగా అది అలాగే చెప్పుచున్నది. "నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఒకవేళ ఎవరైనా నా స్వరము విని నన్ను లోనికి రానిచ్చినయెడల నేను వచ్చెదను." కానీ, ఏ ఒక్కరు కూడా తలుపు తీయలేదు. వారు ఆయనను బయటనే వుంచారు. అది ఏమిటి? వారు…
122విత్తనము వారి మీద పడినది (చూడండి, చూశారా), కానీ కొన్ని శ్రమల లోయలో పడినవి; కొన్ని విత్తనములు శ్రమల లోయలోపడినవి. ఇప్పుడు, లోయలో శ్రేష్ఠమైన నేల మరియు నీరు మీరు కనుగొనగలరు, ఒకనిలోని వేదాంత జ్ఞానము అంతా బయటికి పోయేవరకు, దేవుని నామము నిమిత్తము శ్రమనొంది, అతడు అపహాస్యం చేయబడి, హేళన చేయబడి, అటుతరువాత సమస్తమైన బాధలు మరియు శ్రమలగుండా అతడు ముందకుసాగిపోతూ, అతడిలో నుండి పనికిరాని మాటలన్నిటిని వెలుపలికి తీసివేయబడి, క్రియ చేయుటకు దేవునిచే మలచబడిన ఒక లోహముగా సిద్దముగా వుండునటువంటి వానిని తీసుకొనిన యెడల, విత్తనమనే అతడు చుట్టూ కొంత తేమను మీరు కనుగొనగలరు. అది నిజము.
123లోయలోనికి, తనయొక్క సంఘ శాఖ ద్వారా వెలుపలకి గెంటివేయబడి, తిన్నగా ఆ లోయలోనికి విసిరివేయబడిన వ్యక్తి, "అతడు చాలా లోతైన స్థలములోకి త్రోయబడెను, వారు దానిని అలాగే పిలుచుదురు, చూశారా. లోతైన (dumps) స్థలం కాదు కానీ, ఆ లోయలో క్రింద భాగము అని మనము అంటాము. మీకు తెలుసా, అటువంటి స్థలమందే లిల్లీ అనే పుష్పములు కూడా మొలుచును. (మీకు తెలుసు కదా! అది నిజము). ఆ లోయలోనే మొలుస్తాయి. సరే, మంచిది.
కఠిన పరీక్షలు, శ్రమలనే లోయలో కొన్ని పడ్డాయి. వాటిలో కొన్ని విత్తనములు శ్రమల లోయ, కఠినమైన శోధనలనే లోయలో పడ్డాయి. ఏ విధముగానైనా దానిని పిలువబడవచ్చు, "లిల్లీ అనే పుష్పము ఏ విధముగా హేళన చేయబడి, బయెల్జెబూబుగా పిలువబడినది. అయితే ఈ లోయలోనే నదీ జలములున్నాయి.
PS 1:1-3
124కీర్తన 1వ అధ్యాయములో "మనుష్యుడు ధన్యుడు…" దానిని ఇప్పుడు చదివెదము. ఈ లోయలో ఏమున్నదో నన్ను మీకు చూపించనివ్వండి, ఏ కీర్తన… నాకు సమయము లేదని తలుస్తున్నాను, దానిని చదువుటకు ఇప్పుడు సమయమును తీసుకొనెదము. ఇక్కడ గ్రహించుటకు మనము దీనిని చదివి ఈ మనుష్యుడు ఎక్కడ వున్నాడో చూద్దాము. ఒకవేళ అతడు బురద కలిగిన ఎడారి రాతి మీద నాటబడి యున్నాడా? లోయలో నాటబడి యున్నాడా? సరే!
దుష్టుల ఆలోచన చొప్పున నడవని… [జ్ఞానము… ఆమేన్, ఆమేన్, ఆమేన్!] దుష్టుల ఆలోచన చొప్పున నడవని, పాపల మార్గమున నిలువని … అపహాసకులతో కూర్చుండని మనుష్యుడు ధన్యుడు.
కాని అతని ఆనందము ప్రభువు ధర్మశాస్త్రమునందు… [వాక్యమునందు]; మరియు ధర్మశాస్త్రమునందు… [వాక్యమును] అతడు దివారాత్రులు ధ్యానించును.
మరియు అతడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టువలె యుండును. ["నదులు." అది ఏమిటి? తొమ్మిది ఆత్మీయ వరములు ఒకే నీటియొక్క నదులు, ఒకే ఆత్మ, ఒకే నీరు. కానీ తొమ్మిది వేరు, వేరు వనరుల నుండి వస్తున్నాయి. నీటి కాలువలు, చూడండి, నీటి కాలువలు]… అది అతని ఫలములను ఫలింప చేయును [ఆత్మ ఫలములను] అతని కాలమునందు అతని ఆకులు వాడిపోవు మరియు అతడు చేయునదంతా ఆశీర్వదించబడును.
PS 1:3•
EPH 1:4
125చూశారా? కొన్ని అక్కడున్న ఆలోయలో పడినవి, అక్కడ నీటి కాలువలు యుండుటచే ఫలించిన ఫలములను… మీరు గమనించారా?… ఏదో ఒకదానిని పొందుకోవాలని నేను కోరుచున్నాను. అది ఏమి చేసినది? ఆ నది లోపల పడినది. అది నాటబడ లేదు. నాటబడిన చెట్టువలె అతడుండును. [ఇక్కడ నుండి అక్కడికి స్థలమార్పిడి చెందినది]. అతను నాటబడ్డాడు. ఏమిటి? ముందుగా నిర్ణయించబడ్డాడు. జగత్తుపునాదికి ముందేవున్న దేవుని ఆలోచన అక్కడ అతనిని వుంచినది. చూడండి, యాదృశ్ఛికముగా అతికించబడలేదు, కానీ నాటబడినది, ముందుగా నిర్ణయించబడినది! ఎక్కడ? నీటి కాలువల ప్రక్కన. ఓ, "అతని వేరు ఎండిపోదు." ఓ, హల్లెలూయ! "అతను చనిపోయినను, అంత్యదినమున నేను లేపెదను." అది నిజము. ఏదో యాదృశ్చికముగా అతడు అచ్చట అతికించబడ లేదు. అచ్చట వుండుట కొరకే అతడు ముందుగా నిర్ణయించబడినాడు. ఆ వాక్యమనే విత్తనము అచ్చట విత్తబడినప్పుడు, ఆ వాక్యమనే విత్తనమును అతడు పట్టుకొనుటకై అతడు ముందుగానే నిర్ణయించబడినవాడు. అతడు సరిగ్గా అచ్చటే వుండును. ఆ విత్తనము నాటబడినప్పుడు అతడు అచ్చటే యుండెను. యాదృశ్చికముగా నాటబడలేదు కాని, వాస్తవముగా అతడు అచ్చట ముందే నాటబడి యుండెను. అది నిజము. ఒక కర్రను భూమిలో గ్రుచ్చడానికి, ఒక చెట్టు నాటడానికి చాలా వ్యత్యాసముగా వుండును. అది తేడాగా వుండును.
1COR 12:8-10•
HEB 13:8
126విత్తనము నాటబడినది. అది, దాని సొంత వేర్లు లోతుగా భూమిలో నాటుకొనుటకు వెళ్ళవలసిన మార్గమును కనుగొనును. నీళ్ళు దాని వేరులోనికి ప్రవాహించినప్పుడు, జీవము, ఆత్మ దానిలోనికి వచ్చుట ఆరంభించును, అప్పుడు అది ఇలా చెప్పటము ప్రారంభిస్తుంది (నీవు చేప్తావు…) "అక్కడ తొమ్మిది వరములు కలవని."
"ఆమేన్!" అని చెప్పును.
"యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా వున్నాడని చెప్పును."
"ఆమేన్!"
"ఆయన ఎల్లప్పుడూ చేయు విధముగానే ఆయన ఇంకా స్వస్థపరచుచున్నాడని చెప్పును."
"ఆమేన్, ఆమేన్, ఆమేన్!" చూశారా?
అతడు నీటి కాలువల యోరన నాటబడును. ప్రతి ప్రక్కనుండి నీళ్ళు ప్రవహించుచూ పారుచున్నవి. అతను వాడిపోకుండ యుండుటలో ఆశ్చర్యము లేదు. అవును, ఆశ్చర్యమేమీ లేదు. అతను నాటబడెను. కొన్ని విత్తనములు అక్కడ పడినవి. అతడు చనిపోడు, జీవమును ఉత్పత్తి చేయు జీవ ప్రవాహములో అది వున్నది. అది సత్యము. అది నీటి కాలువలుగల నదిలో నుండి తన జీవమును పీల్చుకొనుచున్నది. క్రొత్త నిబంధన, పాతనిబంధన అనే నీటి కాలువలు. ఆమేన్! దాని ద్వారా అది పోషింపబడుచున్నది. ఓ, సోదరుడా.
నీవు ఆయనను ప్రేమిస్తావా? ఆమేన్!
నీవు ఆయనను స్తుతిస్తావా? ఆమేన్!
నీవు ఆయనను ఆరాధిస్తావా? ఆమేన్.
ఆమేన్, ఆమేన్!
PS 1:3•
JOHN 14:12•
JOHN 15:7
127అవునయ్యా; అవునయ్యా! ఓ, దానిని నేను ప్రేమిస్తాను. మీరు ప్రేమించరా? అవును! ఆయన యొక్క… ఆయన కాలములో ఫలించుట (ఆది కాండము 1:11), ఆయన ఫలములు ఫలించుట, ఏ ఫలములు? దేనియొక్క ఫలములు? ఆయన ఫలములు. ఏమి ఫలములు? ఆయన యొక్క సొంత ఫలములు. అది ఏ ఫలమై యున్నది? పరిశుద్ధ గ్రంథము. అదంతా ఇక్కడ వున్నది. ఫలము: ప్రేమ - అది ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో వున్నది; సంతోషము - పరిశద్ధ గ్రంథములో వున్నది; శక్తి; పరిశుద్ధాత్మ; మొదలగు అన్నియు ఇక్కడ వున్నాయి; దైవిక స్వస్థత; దేవుని వాగ్దానములు అనే ఫలములు ఇక్కడ కలవు. ఒకవేళ అతడు దీనిలో నాటబడినట్లైతే, విశ్వాసము ఏమి చేయును? విశ్వాసము దానిని ఎదుగునట్లుగా ప్రారంభించును. ఆమేన్! దానిని పైకి ఎదుగునట్లుగా చేయును, చూశారా. విశ్వాసము దానిని కదల్చుచూ పైకి తోసుకుంటూ వెళ్ళును. నిశ్చయముగా! నీటి కాలువల యోరను నాటబడిన చెట్టువలే అతడు ఉండును, తన కాలమందు ఫలమిచ్చును.
అది ఏ రకమైన ఫలమును ఫలించును? యోహాను 14:11లో ఆయన చెప్పెను, ఆయన… (అది యోహాను 14:12 అని తలుస్తున్నాను) యేసు చెప్పెను… "నాయందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలు అతడు కూడా చేయును;…" ఎందుకు? అదే వాక్యము అతనిలో ఉన్నది. ఆయన వాక్యమై ఉండెను. అది సత్యమేనా? "మీరు నాయందును, నా మాటలు మీయందు నిలిచియుండిన యెడల, మీకేది ఇష్టమో అడుగుడి."
JOHN 15:7
128నేను ఒకసారి సహోదరుడు ఇవాన్స్ తో మాట్లాడుచుంటిని. కొద్దికాలము క్రిందట అతను ఇక్కడకి వచ్చాడు (అతను చాలా దూరము కారును నడిపించుకుంటూ ఇచ్చటకు వచ్చును); అతడు తన కారును పోగొట్టుకున్నాడు, మిల్లర్స్ దుకాణములోనికి అతడు వెళ్ళుచూ తాళములు తీయకుండానే కారును అచ్చట వదిలిపెట్టి వెళ్ళాడు. ఎవరో అక్కడికి వచ్చి, ఆ కారును దొంగలించారు, అతనికున్న సమస్తము ఆ కారులోనే వున్నవి. అతను వచ్చి (అతను, సహోదరుడు ఫ్రెడ్, సహోదరుడు టామ్ కొంతమంది మా ఇంటికి వచ్చిరి)… మంచిది, ఒక పిల్లవాని చేతిలోనుండి చాక్లెట్ లాక్కుంటే ఎలా వుంటాడో, అతను అలా వున్నాడు. అతడు చాలా విచారముగా యున్నట్లుగా యుండెను. "నేను ఏమి చెయ్యాలో నాకు తెలియుట లేదని," అతను అన్నాడు.
"మంచిది…" అని నేను అన్నాను.
ఇప్పుడేమిటిది? ఇప్పుడు వారు వచ్చి విషయమును చెప్పినప్పుడు మొదట ఏమి చేయవలెను? వాక్యము యొద్దకు వెళ్ళుట, తండ్రి యొద్ద అడుగుట, "నీవు నాయందును, నా వాక్యము నీయందు నిలిచియున్నట్లయితే, నీకేది ఇష్టమో అడుగుము." ఏమిటి? వాక్యముతో నిలిచియుండు; సరిగ్గా వాక్యముతోనే నిలకడగా నిలిచి యుండుము.
129"మనము ప్రార్థించెదము" అని నేను అన్నాను, మేము నేలమీద మోకరించి ప్రార్థించటము మొదలు పెట్టాము. అక్కడ ప్రార్థించుచుండగా, "తండ్రీ, ప్రభువైన యేసు నామములో నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, ఇక్కడవున్న ఒక సహోదరుడు (అతని చేతులు ఆ పాత కార్లను మరియు వాటిని బాగుచేసి, చేసి గట్టిపడిపోయాయి) వారములో కొన్ని రోజులు కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి, పద్నాలుగు లేదా పదిహేను వందల మైళ్ళ దూరము కారు నడిపించుకొని, ఇక్కడ ఆదివారమున కూటమునకు వస్తాడు, వారి పిల్లలకు ఆహారము పెట్టుటకు సంపాదించాలి, ఒక ఆదివారము ఆలయమునకు వచ్చుటకు యాభై లేదా డెభై-ఐదు డాలర్లు ఖర్చు అగుచున్నది. (చూశారా? నిజము!) అంత దూరము తన భార్యా పిల్లలతో ప్రయాణము చేసి ఇచ్చటకు వాక్యము వినుటకొరకై వస్తున్నాడు. అతడు ఆ విధముగా వాక్యము కోసము ధైర్యముగా, పోరాడుచూ ప్రయత్నించుచుండగా, "ఒక దుష్ట వ్యక్తి అతని కారును దొంగిలించాడు." అది ఏమైయున్నది? "ప్రభువా! యేసుక్రీస్తు నామములో అతని కారును అతనికి తిరిగి ఇవ్వమని ప్రార్థించుచున్నానని," నేను ప్రార్థించాను.
130నేను ఏమి చేశాను? నేను ఆ వాక్యమును, ఆ వాగ్దానమును దేవునిముందు వుంచాను. దానిని యేసు నామములో ముద్రించి, ఆ వాక్యమును పంపించాను. నేను పంపించిన ఆ వాక్యము రోడ్డు వెంబడి వెళ్ళుచూ అది ఎక్కడ దొంగిలించబడినదో అచ్చట నుండి ప్రారంభమై వెళ్ళినది. వేట కుక్క కుందేలుని వాసనపట్టి వెంటాడినట్లుగా, చూశారా. ఇదిగో అతడు కేరింతలతో అరచుకుంటూ దారిలో వెళ్ళుచున్నాడు, బౌలింగ్ గ్రీన్ నుండి కెంటకీకి సుమారు సగము దూరము ప్రయాణించి వెళ్ళాడు. అలా అతడు దొంగలించిన కారుతో వెళ్ళుచుండగా, అతడిని ఏది భంగపరచినది? వాక్యము అతడిని కనుగొన్నది.
తరువాత వెంటనే ఒక దర్శనము వచ్చినది, నేను ఒక యువకుడిని చూశాను, పసుపురంగు చొక్కాయి వేసుకున్నాడు, ఒకప్పుడు క్రైస్తవునిగా జీవించాడు, కారుని నడిపించుచున్నాడు, వాక్యము అతనిని తాకినది. "నీవు తప్పు చేస్తున్నావు!" వాక్యము అతనిని పట్టుకున్నది. ఆయన తన వాక్యమును పంపించెను (చూడండి, చూశారా) అది అతన్ని పట్టుకొన్నది. "ఏదో ఒక రోజు నీవు పట్టుబడతావు, ఈ పని చేసినందుకు చట్టము నిన్ను పట్టుకొనును. వెనక్కి తిరిగి వెళ్ళుము, కారును వెనక్కి తీసుకొని వెళ్ళుము," అని వాక్యము గద్ధించినది.
131వాక్యము అతనిని పట్టుకొన్నది. అతను ఒకప్పుడు క్రైస్తవుడు, అతడు దానిని ఇక్కడకు తెచ్చి రోడ్డు ప్రక్కన నిలపడము నేను చూశాను. నేను చెప్పాను, "ఇప్పుడు సోదరులారా, సరిగ్గా ఈ మార్గములో మీరు అక్కడకు వెళ్ళండి, మీరు మీ కారును కనుగొంటారు. అతను తిరిగి వెనక్కి వచ్చేవరకు. ఇక్కడ కొంతసేపు వేచి వుండండి. ఇప్పుడు మీ కారులో పెట్రోలు నిండుగా నింపబడి యున్నదా? (కారు పోవడానికి ముందు) అని అడిగాను.
అతను "అవును," అని చెప్పాడు.
ఇక్కడ బాధపడడానికి ఏమీ లేదు. కానీ, అందులో సగం పెట్రోలు మాత్రమే యుండును, ఎందుకనగా బౌలింగ్ గ్రీన్ వెళ్ళి వచ్చుటకు దానిలో సగం పెట్రోల్ అయిపోతుంది. సుమారు వందమైళ్ళు నడవాలంటే ఆ మాత్రం పెట్రోలు కావాలి, అతను దానిని చూసినప్పుడు, సరిగ్గా అది అదే రీతిగా సగం పెట్రోలే వున్నది. కాబట్టి ఇక్కడ ఏమి జరిగినది. వాక్యము వెళ్ళి, అతనిని పట్టుకొని "వెనక్కి వెళ్ళు," అని చెప్పింది.
132అది జరిగిన కొంత కాలమునకు ఎవరో ఒక వ్యక్తి అతని వద్ద నుండి కారు కొన్నాడు, అతను డబ్బు చెల్లించకుండా తప్పించుకొన్నాడు, చూశారా. చెప్పెను, "సోదరుడా, బ్రెన్హాం, నేను…"
"దీన వ్యక్తి" (ఇతనికి అతడు 400 డాలర్లు అప్పు ఇవ్వవలసి యుండెను) అని తలంచాను. అందుకు "నేను ప్రార్థిస్తాను" అని చెప్పాను. నేను వాక్యమును పంపించాను, ఆ వాక్యము అతను వెళ్ళిన దారిలోనే వెళ్ళి అతడిని కనుగొన్నది. మేము ఆ వ్యక్తిని కనుగొనుటకు వెళ్ళినప్పుడు, అతడు క్రైస్తవుడు కాడని కనుగొన్నాము, చూశారా. ఒకసారి చర్చికి వెళ్ళమని అతనితో చెప్పినప్పుడు, అతడు నవ్వి "బోధకుడు, బోధించుచుండగా నేను అందమైన యవ్వన పిల్లల ముఖాలను చూచుట కొరకు వెళతానని," అన్నాడు. కనుక మీరు చూశారా, మీరు కనుగొనలేరు… అవును, అది దేయ్యము… చూశారా.
JOHN 15:7
133కావున వాక్యము అతనిని పట్టి వుంచలేదు, కానీ వాక్యము ఏమి చేసినది? అది అతనిని కనిపెట్టుచూ వుండినది, చూశారా. సరిగ్గా అలా కాదు… సహోదరుడు వెల్చ్, విడువక నమ్మకముతో దృఢముగా వుండెను. "అంతా సరియగును, అంతా సరియగును," అని చెప్పుచుండెను. ఆ వాక్యము అతడిని వెంబడిస్తూ వెళ్ళుచున్నది. "మీరు నాయందును, నా వాక్యము మీయందును నిలచియున్నట్లైతే, మీకేది ఇష్టమో అడుగుడి," చూశారా. వాక్యము అతన్ని వెంబడించుచునే వెళ్ళుచున్నది. మొదటి సంగతి ఏమిటంటే, అతడి యొక్క కుమారులలో ఒకడు ఆ దారిన కారును నడుపుకుంటూ వెళ్ళుచుండగా అప్పుడు ఆ కారు అచ్చట వుండెను, ఒకడు ఆ కారులో వుండుటను అచ్చట చూశాడు, అతడు అతని దగ్గర ఫోను నెంబరు తీసుకున్నాడు, సహోదరుడు ఉడ్ దానిని పంపించి, అది ఎక్కడ వుందో కనుగొనాలని చెప్పాడు, వారు ఆ నెంబరుకు ఫోను చేసినప్పుడు, అతను బౌలింగ్ గ్రీన్ లో వున్నాడు, అని కనుగొనిరి.
పరలోకములోవున్న దేవునికి అది తెలియును, ఒక్క మాట కూడా దాని గురించి నేను వినలేదు. నాకు దాని గురించి ఏమీ తెలియదు.
134గడచిన ఆదివారము (వారం క్రిందట) ఇక్కడ మధ్యాహ్నాము మేము బోధించడము అయిన తరువాత అక్కడకు వెళ్ళి, మా బట్టలు మార్చుకొని, బ్రదర్ వేల్చ్ స్థలములో జరగబోవు మరుసటి రాత్రి కూటముకు ఫ్లోరిడాకు వెళ్ళుటకు సిద్ధమయ్యాము. నేను, వేల్చ్ సహోదరుడు… నేను కార్లోకి ఎక్కిన వెంటనే ఆ వ్యక్తిని నేను దర్శనములో చూశాను. నేను దానిని ఇప్పుడు చెప్పకూడదు, అతనే దానిగూర్చి మాట్లాడవలసి యున్నది. అచ్చట మీడా తన యొక్క తీర్మానాన్ని ఆనాడు తనంతట తానే తీసుకున్న విధముగా, ఇప్పుడు అతడే దానిని నాతో మాట్లాడాలి, చూశారా. "మనము బౌలింగ్ గ్రీన్ దారిమీదుగా వెళ్దాము," అని చెప్పాను.
"అది మనము మామూలుగా వెళ్ళే దారికన్నా 30 మైళ్ళు దూరము అవుతుంది," అని అన్నాడు.
ఆ దారిగుండానే వెళ్ళుచున్నాడు: "ఓ, అతను దానిని అర్థము చేసుకుంటాడు, (చూశారా) అతను దానిని తెలుసుకుంటాడు, అతను ఇప్పుడు దానిని తెలుసుకొని తీరవలెయును," అని నేను తలంచాను.
సోదరి ఇవాన్స్ మరియు నేను అలా వెళ్ళుచూండగా, కొంత సమయము తరువాత "మీకు తెలుసా, సోదరుడా బ్రెన్హాం, నీవు బౌలింగ్ గ్రీన్ అనగానే నా తల తిరిగినట్లయింది," అన్నాడు.
"అవును", నా డబ్బులు తీసుకొని పారిపోయిన ఆ మనిషి నీకు తెలుసా?" అని అడిగాడు.
"అవును."
"అతను బౌలింగ్ గ్రీన్ లో వున్నాడు, ఇప్పుడు దానిగురించే ఆలోచిస్తూ వున్నాను… నేనక్కడికి వెళ్ళి, అతను ఎక్కడ ఉన్నడో కనుక్కొని ఆ సంగతిని తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను దానిని తెలుసుకోబోవుచున్నాను," అని అన్నాడు. "నీవు ఏమి చేస్తావు? నీవు అక్కడికి వెళ్ళి, నీ డబ్బులు అడిగి తీసుకుంటావా?" అని అడిగాను.
ఇప్పుడు (చూశారా) నేను అతనికి చెబితే, అప్పుడు అతను… చూశారా, అతడు తనకు తానుగా చేయుటకు ఒకటి కలదు, ఏదో ఒకటి అతను చేయడానికి వున్నది. నేను దానిని అతనికి చెప్పలేను. నేను అలా చేస్తే, నేను చూసిన దర్శనమును అది తారుమారు చేస్తుంది. కనుక అది ఎలా జరగాలో అది అలా నేను…
MATT 9:38•
LUKE 10:2
135యేసు అక్కడ నిలచి మరియ, మార్తలతో "రాయిని పొర్లించమని," ఎందుకు చెప్పాడు? ఆయన దేవుడు; "రాయి అక్కడ లేకుండును గాక!" అని చెప్పగలడు. అలా ఆయన చెప్పిన నిమిషమున అది అక్కడ వుండదు. అయితే వారు ఏదో ఒకటి చెయ్యాల్సి వున్నది.
ఆయన అక్కడ నిలబడి పండిన చేలవైపు చూశాడు? (మీరు నమ్ముచున్నారా? ఆయన కోతకు ప్రభువని?) ఆయన తన శిష్యులతో "పని వారిని పంపించునట్లు మీరు కోతయజమానుని ప్రార్ధించండి," అని చెప్పెను. మరో మాటల్లో చెప్పాలంటే, "నేను చేయబోవుచున్న దానిని చేయమని నన్ను అడగండి," అని అర్ధము.
136చూశారా? మనము స్నేహితులము, ఇది ఒక సంఘము, మనకు మనము చేయాల్సిన కార్యము ఏదో ఒకటి మనకున్నది, మీరు చేయవలసిన కార్యములు మీకు కలవు. ఇక్కడ సువార్త వున్నది; అది నాకు తెలుసు, కానీ ఒకవేళ మీరు ఇక్కడ కేవలము కూర్చొని సువార్తను ప్రకటించకుండా వున్నట్లయితే, అది ఏ మంచిని మీకు చేయగలదు? నీవు చేయుటకు ఏదో ఒకటి కలదు; అయితే దానిని నీవు ప్రయత్నించాలి, నీవు పొందావని… "మంచిది, దేవుడు స్వస్థపరచగలడని నమ్ముచున్నాను, కానీ నాకు ఏమి తెలియదు," అని నీవు చెప్పి, లేచి నిలబడు, ఆ వాక్యము నీ మాటగా మారనిమ్ము. దానిని నమ్ము; దానితో తర్కించవద్దు; దానిని కేవలము నమ్ముము.
"మంచిది…" (అతడు వెళ్ళకపోతే ఒకవేళ దానిని పోగొట్టుకుంటాడని నాకు తెలియును.) అదే నేనైతే, ఒకవేళ అది నేనైతే, నేను వెళ్ళి, నా డబ్బులు ఇప్పుడే వెనక్కి తీసుకుంటానని నేను చెప్పాను. అతడు అలాగే చేసాడు. అతను మంచము మీద నుండి లేవక ముందే అతనిని పట్టుకొన్నాడు. అతనివద్ద కొంత డబ్బు వున్నది. అతడు తన పొరుగు వానియొద్ద నుండి మిగిలిన డబ్బు తీసికొని దానిని చెల్లించి వేసాడు. అది ఏమిటి? అది వాక్యము. చూశారా, అది ఒక స్థలమును కనుగొనిన యెడల, అది పరిస్థితినే మార్చివేయుగలదు.
137ఇప్పుడు, దైవిక స్వస్థత మీద కూడా అదే విషయము. ఇప్పుడు, సహోదరుడు వేల్చ్, "మంచిది, నేను అక్కడకు వెళ్ళగలనని తలంచుటలేదు, వేరొక దారిలో వెళ్ళాలనుకుంటున్నాను," అని చెప్పినయెడల, ఏమగును? "ఒకవేళ నేను ఆ ప్రదేశానికి రాలేను," అని చెప్పినట్లైతే, ఏమగును? చూశారా? అది జరిగి యుండదు. కానీ నీవు నమ్మువలసి యున్నది. నీవు దానిని నమ్మువలసిన యున్నది. అది విశ్వాసమనే వాతారణమునందు పడితే, అప్పుడు అది దానిని ఉత్పత్తి చేసి తీరును. అది కేవలము కార్యమును సఫలపరచును. ఓ, అది…
138ఎవరైనా చనిపోయిన వారు లేచినప్పుడు ఏమి సంభవించుచున్నదని ఎన్నడైనా మీరు ఆలోచించారా? ఏమి జరుగును? ఫిన్లాండ్ లో అక్కడ ఆ సమయములో చిన్న బాలుడు మరణము నుండి లేచిన దానిని గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అతని ఆత్మ వానిలోనుండి వెళ్ళిపోయినది. ఇప్పుడు, వాక్యము ఎక్కడో అంతరిక్షములోనికి ప్రయాణించి ఆ చిన్న ఆత్మను పట్టుకొని ఆ స్థలము యొద్దకు వెనక్కి తేవలసి వచ్చెను. ఏ విధముగా అది దానిని చేసినది. అది వాక్యము. అది బలహీనతలను బాగుపరచును, చనిపోయిన వారిని బ్రతికించును, చూశారా. ఆయన దానిని ఎలా చేయచున్నాడు? నీరు కట్టబడిన వాక్యమ ద్వారా అది రావలసియుండెను. ఆయన దర్శనము చూపించెను, గనుక అది జరగాల్సి వున్నది. అక్కడ బాలుడు చనిపోయి ఉన్నాడు; ఆయన 2 సంవత్సరములు ముందు చెప్పినట్లుగానే, ఎచ్చట ఏమేమి ఉండాలో ప్రతిదీ ఆ స్థలములో వున్నవి, అది అక్కడ పడియున్నది. ఆ కారణమును బట్టే కొండ దిగుచున్న ఎలుగుబంటిని గూర్చి నేను చెప్పాను, అది ఏమైయున్నప్పటికిని. అది జరగవలసియున్నది, అది ఆ విధముగానే జరగాలి, చూశారా.
MARK 16:17
139అది ఏమి చేసేను? వాక్యము. "పరలోకమందున్న తండ్రీ, నా సొంత దేశములో నీవు నాతో 2 సంవత్సరములు ముందు ఈ చిన్న బాలుడు బ్రతుకునని చెప్పావు. కావున నీ వాక్యమును, నీ వాగ్దానమును ఆధారము చేసుకొని… మొదటగా, "నమ్మినవానిని ఈ సూచక క్రియలు వెంబడించునని," వాక్యము చెప్పుచున్నది. నీవు శిష్యులను బయటకు పంపించి రోగులను బాగుచేయుమని, చనిపోయిన వారిని బ్రతికించమని, దెయ్యములను వెళ్ళగొట్టమని చెప్పాను. తరువాత ఒక దర్శనము ద్వారా ఈ దేశములో ఈ చిన్న బాలుడు తిరిగి జీవిస్తాడని చూపించావు," అందుచేత "మరణమా, నీవు ఎంతమాత్రము అతనిని పట్టుకొనలేవు, నేను ప్రభువు వద్ద నుండి వాక్యమును పొందియున్నాను. ఇది నా మాట కాదు, కానీ ఆయన వాక్యమైయున్నది," చూశారా. నేను వాక్యమైనట్లయితే…
JOHN 1:1
140కేవలము ఒకే ఒక్క వ్యక్తి వాక్యమై వుండగలడు, ఆయనే యేసు, ఆయన కన్యకు జన్మించిన దేవుని యొక్క పలుకబడిన వాక్యమైయున్నాడు. నేను వంకర మార్గమున వచ్చిన వాడిని, చూశారా. నేను నా తల్లి, తండ్రి, కలయిక యొక్క ఫలితమై యున్నాను. "నేను" అనేది చనిపోవలసీ యున్నది. (చూశారా); ఈ శరీరము చనిపోవాలి. యేసునియందు ఆ విధముగా లేదు. ఆయన వాక్యముగా ఉండెను. ఆయన కన్యకకు జన్మించెను. సోదరుడా, ఏ పురుషుడైనను లేక ఏ స్త్రీయైనను, ఏదీ కూడా ఆయనకు సమము కాదు. స్త్రీ పొదుగు యంత్రముగా యున్నది. (అది సత్యము), మరియు ఆమె రొమ్ము పాలను ఆయన త్రాగెను. ఆ విషయము నిజము కావచ్చును, కానీ నన్ను చెప్పనివ్వండి, ఆయన దేవుడై యుండెను. ఆయన ఏమైయుండెనో అదేవిధముగా, ఆయన అదే దేవుడై యుండెను. శారీరక లైంగిక కార్యమనే మాటకు అసలు అవకాశము లేదు. ఆ రక్తము ద్వారా జీవమును తీసుకొని వచ్చుటకు ఆయన శరీరక సంబంధమైన లైంగిక కార్యమనే దానితో సంబంధము లేకుండా ఆయన జన్మించవలసి ఉండెను. కొన్ని నిమిషములలో దానిలోనికి మనము వెళ్ళుచున్నాము.
AMOS 3:7•
ACTS 3:12•
2PET 1:21
141పిదప, చూడండి, ఆయన వాక్యమై ఉండెను. ప్రభువు యొక్క వాక్యము… ప్రవక్తలు వాక్యమై లేరు, కాని ప్రభువు యొక్క వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చును. వారు వాక్యముగా లేరు, వాక్యము వారియొద్దకు వచ్చింది. నేడు కూడా అదేరీతిలో అది క్రియ చేయుచున్నది. ఆ చిన్న బాలుని కొరకు వాక్యము వచ్చినది. అది ఏమిటి? ఒక దర్శనము. ఎలుగుబంటిని గురించి, మిగిలిన విషయముల గురించి వచ్చిన కార్యములు ఏమిటి? అవన్నీ కూడా ఒక దర్శనము. ఆ విషయములన్నింటి గురించి వచ్చిన ప్రభువు యొక్క వాక్యముగా అది ఉన్నది. అప్పుడది ఏమి చేసినది? వాక్యము ఆ దర్శనము జరుగునట్లుగా చేసినది.
ఇప్పుడు, మొదటగా అది పలుకబడవలసి ఉన్నది. "మరణమా, యేసుక్రీస్తు నామములో అతని ప్రాణమును తిరిగి ఇచ్చి వేయుము! ఆ వాక్యమును నేను పంపించుచున్నాను." ఎక్కడో బౌలింగ్ గ్రీన్ లో దొంగిలించబడిన కారులో ఉన్న అతడిని ఆ పలికిన మాట పట్టుకున్న రీతిగానే, ఆ బాలుని యొక్క ప్రాణమును కూడా ఆ పలికిన మాట వెళ్ళి, పట్టుకొన్నది. ఆ పలికిన మాట ఏమి చేసినది? అది ఆ చిన్న ఆత్మను పట్టుకొని, వెనక్కి తిన్నగా ఇక్కడకు తెచ్చి, ఆ శరీరములో ప్రవేశపెట్టినది. వాక్యము ఏ విధముగా చేయునని అది చెప్పుచున్నదో, సరిగ్గా అలాగునే అది క్రియ చేసినది. అక్కడ అది ఉన్నది. దానిని ఏది చేసినది? విశ్వాసము, తెలివితేటలు కాదు.
HEB 13:8
142"ఇప్పుడు, మనము చూద్దాము. ఆ గాలి ఫలానా, ఫలానా దానితో చేయబడినది అక్కడ చాలా ఎక్కువ ఆమ్లములు, చాలా ఎక్కువ వాయువులు వున్నాయి. అక్కడ చాలా కాస్మిక్ వెలుగు కూడా ఉన్నది. ఇంకా ఏవేవి ఉన్నవో నేను దానిని చెప్పగలను. ఒకవేళ నేను…" అని మీరు చెప్పవచ్చు. ఓ, మీరు కాలమును వృధా చేయుచున్నారు. జ్ఞానము కాదు, విశ్వాసము కావలయును. "అది ఎంత మాత్రము జరగదని," బుద్ధిపూర్వకమైన జ్ఞానము చెప్పును. కానీ, అది జరిగిందని విశ్వాసము రుజువు చేస్తుంది, చూశారా. అది సత్యము. ఆయన, నిన్న, నేడు, నిరంతరము, ఒక్కటే రీతిగా ఉన్నాడని విశ్వాసము రుజువు చేయును. (ఇప్పుడు మనము త్వరపడాలి. మనము త్వరగా ముందుకు సాగిపోదాము.)
GEN 1:11•
MARK 5:37,38•
MARK 6:41•
JOHN 14:12
143యోహాను సువార్త 14లో చెప్పెను, "దాని రకమైన ఫలములను అది ఫలించును." నా యొక్క.. నా యందు విశ్వాసముంచువాడు, క్రియలు (నేను చేయుచున్న సూచనలు)…
ఇప్పుడు మీరనవచ్చు, "ఆయన సూచనలు చేసాడా!" అని, ఆయన ఒక గ్రామమునకు వెళ్ళి అక్కడ ఒక సమాజమందిరపు అధికారి యొక్క ఒకే ఒక్క కుమార్తెయగు చిన్న బాలిక చనిపోయి పండుకొనబెట్టబడి యున్నది. పాలిపోయి, చల్లబడిపోయి ఉన్నది. బహుశా ఆయన అక్కడికి చేరుకొనుటకు కొన్ని గంటల ముందు ఆమె చనిపోయినది. ఆమెను చిన్న మంచము మీద పండుకొనబెట్టారు. ఆమెను పరిమళ ద్రవ్యములతో సిద్దపరచ ప్రారంభించారు. ఆమె ఉన్న ఆ గదిలోనికి యేసు నడచి వచ్చెను. వారు రోధిస్తూ, విలపిస్తూ వున్నారు. ఆయన "ఇక్కడ నుండి బయటికి వెళ్ళండి, బయటికి పొండి," అని అందరిని బయటికి పంపివేసి, "పేతురు, యాకోబు మరియు యోహాను ఇక్కడకు రండి, మీరు నమ్ముచున్నట్లు నేనెరుగుదును," అని చెప్పెను. ఆమె తండ్రితో, "నీవు నమ్ముచున్నావు కదా! లేకపోతే నీవు నన్ను వెంబడించవు," అని చెప్పెను.
"ప్రభువా, నేను నమ్ముచున్నాను," అని ఆ బాలిక తల్లి చెప్పెను.
"ఇక్కడ నిలువబడి వుండుము," అని ఆయన చెప్పెను.
ఆయన చుట్టూ చూచి ఆ బాలిక వద్ద నిలువబడి, "తలీతాకుమీ," అని పిలిచెను. అనగా "చిన్నదానా." హల్లేలూయ! ఆయన ప్రార్థించనవసరము లేదు. ఆయన వాక్యమైయుండెను. ఒకవేళ నేను దర్శనము చూచినచో, నేను కుడా ప్రార్థించనవసరము లేదు. కారణమేమనగా, ముందే వాక్యము సమస్తము సిద్దపరచి ఉన్నది. వాక్యమును పొందుకొనుట కొరకు, దేవుడేమి చెప్పుచున్నాడో తెలుసుకొనుట కొరకు నేను ప్రార్థించాలి. ఆయన చెప్పినది పొందుకొనిన తరువాత, అప్పుడు నేను దానిని పలుకుటకు యుక్తముగా ఉండును. అయితే ఆయన వాక్యమైయుండెను. ఆమేన్!
"చిన్నదానా, నేను నీతో చెప్పుచున్నాను, లెమ్ము," అని చేయిపట్టి ఆమెను ఆయన లేపెను. అది అంతే, చూశారా. దానిని రుజువుపరచుచూ ప్రత్యక్షపరచి చూపించుటయగును, అది దేనికి చెందినదో దానిని అది బయలుపరచుచున్నది.
యేసు చెప్పెను, "నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును."
2TIM 3:4
144కావున ఇవన్నియూ గమనిస్తున్నారా! ఈ భూమి తనయొక్క గర్భమునందు సృష్టిని కలిగియున్న విధముగా, ఈ సంఘశాఖలు మరియు ఇతర కార్యము లన్నియు, అన్నింటినీ కలగలిపిన హేయమైన పాపపు ముద్దగా అది యున్నది.
ఏ విధముగా అది జరుగును? ఈ కత్తిరించబడిన జుట్టు కలిగిన, పొట్టి బట్టలు ధరించెడు, సిగరెట్లు తాగేడు, బంతి ఆట ఆడే క్రీడా స్థలములో వుంటూ కేరింతలు కొట్టుచూ, నామకార్థ క్రైస్తవులుగా ఏదో సంఘములో చేరాలని చేరేవారిలో నిజమైన దేవుని వాక్యము ఏ విధముగా ఎదుగగలదు? సుఖభోగ ప్రియులయందు, ఇటువంటి సుఖభోగ ప్రియులుగా వుండాలని ఆశించే జనసముహమును వెదుక్కుంటూ వెళ్లి అచ్చట సమయాన్ని వ్యర్థపరుస్తూ వుండే వారియందు, లోకపోకడలను అనుసరించి లోకమును ప్రేమించే వారియందు దేవుని క్రియ ఏ విధముగా జరుగును? ఏ విధముగా దేవుని ప్రేమ వారిలోకి వచ్చును? ఆ రకమైన భూమిలో దేవుని విత్తనము ఎలా ఎదుగును? అది ఎంత మాత్రము వేరు తొడగదు. అది ఎంత మాత్రము జీవమును దానికి తేలేదు. పాత మట్టి పేరుకుపోయున్న సంఘశాఖనే రాళ్ళ మీదపడి ఆ విత్తనము కుళ్ళిపోవలసిందే గానీ అది ఎన్నడూ జీవాన్ని తీసుకొని రాదు. అవునండీ!
సుఖమును వెదికే వారు, దేవునికంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు… భయంకరమైనవారు, అయినను వారు తెలివైనవారు. వారు మిగిలిన తరగతి ప్రజలకంటే రెండంతలు తెలివైనవారు. ఖచ్చితముగా. తెలివైనవారు, విద్యావంతులు, హవ్వ వెదికినట్లు జ్ఞానమును వెదికేవారు. ఆమె పొందిన అదే విధమైన బుద్ధిపూర్వకమైన జ్ఞానమును వారు కూడా పొందుతారు. అది నిజము.
2TIM 3:5
145లిల్లీ (బురదలోని కలువ పుష్పము) ఏ విధముగా జీవించగలుగుతుంది. ఒక లిల్లీ పుష్పము యొక్క విత్తనము ఎలా ఎదుగుతూ జీవించుచున్నది. అది నీళ్ళ మీద ప్రాకుకుంటూ ఎదుగుచున్నది? మట్టి పేరుకుపోయి ఉన్న రాయి అనే సంఘశాఖ మీద అది ఏ విధముగా ఎదుగగలదు? నీళ్ళల్లో ఉంటూ పైకి ఎదుగుచూ అది ఏ విధముగా ఎదుగుచున్నది? నీళ్ళు ఆత్మయై వున్నవి. వారు పైకి భక్తిగలవారివలే వుండి, దాని శక్తిని ఆశ్రయించరు, చూశారా. వాక్యము వారిమీద పడినప్పటికి, అది ఎదుగలేక పోవుచున్నది. ఏ విధముగా హవ్వ యొద్ద వాక్యమువున్నా, అది ఎదుగులేక పోయినదో. అదే విధముగా అది ఎదుగదు. సాతాను యొక్క జ్ఞానమును అంగీకరించినందువలన ఆ వాక్యమనే విత్తనము ఎదుగలేక పోయినది.
146వాక్యము వారియొద్దకు వచ్చుచున్నది, వాక్యము వారిమీద పడుచున్నది. ఖచ్చితముగా అది వారిమీద పడుచున్నది. అవునయ్యా! ఎదుగుచున్నది… అది వారిపై పడినది. ప్రసంగించబడుచున్న వాక్యము వారు వినుచున్నారు. మీరు సంఘములో కూర్చొని ఉన్న ప్రజలను ఎన్నడైనా చూశారా. వారు ఎన్నడూ కూడా కదలరు. జుట్టు కత్తిరించుకొనుట గురించి స్త్రీలకు సంవత్సరముల తరబడి ప్రసంగించబడుచునే యున్నది. అయినా ఇంకా జుట్టు కత్తిరించుకోవడము అలానే ఉన్నది. పురుషులకు పొగత్రాగుట గురించీ, స్త్రీలు మధ్యము త్రాగకూడదని ఎంత చెప్పినా, అదే విధముగా వారు త్రాగుచున్నారు. బాతు వీపు మీద నీళ్ళు పోసినట్లుగానే, వారిలో వాక్యము ఎదుగుటకు స్థలము లేదు. సుఖానుభవమును, కీర్తిని వెదకే ప్రాచీన స్వభావముగల జనము. "మొదట ఆ స్త్రీలు చెయ్యనీ, తరువాత నేను చేస్తాను." ఎవరు ఏమి చేస్తారో నీకు సబంధంము లేదు. దేవుని వాక్యమును వెంబడించుట నీ కర్తవ్యమై యున్నది. అది సత్యము, చూశారా.
HEB 13:8
147వాక్యము వారిమీద పడినప్పటికినీ అది ఎదుగదు. అది సాతాను జ్ఞానము. కనుక అది సంఘశాఖ మట్టిగా మారిపోయింది. వారు హెబ్రీ 13:8ని విశ్వసించలేరు. అందరూ సాతాను యొక్క జ్ఞానముతో ఉబ్బిపోయి ఉన్నారు. వారిలో ఎదగడానికి ఏదీ లేదు. హెబ్రీ పత్రిక 13:8లో వున్న, "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు," అనే దానిని వారేలాగు నమ్ముదురు? వారు దానిని నమ్మలేరు, గమనించారా. "ఓ, మేము ఖచ్చితముగా నమ్ముచున్నామని వారు చెప్పెదరు. అలాగైతే నీవు వారిని ఇలాగు అడుగుము, "మీరు నమ్ముచున్నారు కదా! అయితే దానియొక్క ఫలములను నాకు చూపించండి, వాటిని నన్ను చూడనిమ్ము. నీలో ఏమి జరిగినదో దానిని నన్ను చూడనిమ్ము. మీరు బోధించుచున్న సంఘము ఏ విధముగా యున్నదో నన్ను చూడనివ్వండి. ఆది అపోస్తుల సంఘము చేసినట్లుగానే మీ సంఘము కూడా చేసియుండాలి. ఆ సంఘము వాక్యమును నమ్మినది. మీరు బాప్తిస్మమును తారుమారు చేసారు; దాని రుజువులను తారుమారు చేసారు; మీరు వాక్యమును తీసుకొనుటకు బదులుగా, ఆ వాక్యము దానంతట దాని సొంత ఫలములను ఫలించిటబడుటకు బదులుగా మీరు దానిని ఏదో ఒక ఆచారము లేదా సిద్ధాంతముల యందు అమరునట్లుగా చేసిరి. అట్లు చేయుటయే గాక, మీరు చేసిన కార్యమును రుజువు పరచునట్లుగా దానికొరకు ఏదో ఒక కార్యమును తీసుకొని వచ్చిరి. మీరు తీసుకొని వచ్చి ముందు పెట్టిన ప్రతీ రుజువులకు సాతాను అర్థము చెప్పగలదు. తప్పకుండా సాతాను దానికి అర్థము చెప్పగలడు; ఖచ్చితముగా వాడు చేస్తాడు, కాని వాక్యమును వాడు ఉత్పత్తి చేయలేడు. సాతాను అలా చేసినయెడల, అది వాడిని దహించి వేయును; దానిని ఎన్నడూ సాతాను చెయ్యలేడు. అవునయ్యా! ఓ, అవును!
GEN 4:3
148ఇప్పుడు, కయీను,హేబెలును గమనించండి. ఇద్దరూ కూడా యదార్థపరులు. తన తల్లి సంఘము యొక్క బుద్ధిపూర్వకముమైన జ్ఞానమును కయీను తీసుకున్నాడు. హవ్వ… (అతని తల్లి, కయీను తల్లి హవ్వ, అని ఎంతమందికి తెలియును? ఖచ్చితముగా సరే.) తన తల్లివలే అతను కారణములను అన్వేషించు మార్గమును తీసుకొనెను. (చూశారా), బుద్ధిపూర్వకమైన జ్ఞానము, అతని సొంత జ్ఞానము, ఒక అందముగా కనిపించు బలి, పుష్పములు, పొలములోని పండ్లు అతని బలి పీఠము మీద యుండెను. మంచిది, ఇప్పుడు ఖచ్చితముగా… దేవుడు, (ఇది సాతాను హవ్వతో చెప్పినట్లుగా ఉన్నది. "ఖచ్చితముగా నిశ్చయముగా దేవుడు నా బలిని అంగీకరించును. నేను సుందరమైన బలిపీఠాన్ని నిర్మించాను. దానిని చాలా అందముగా అలంకరిచితినని," అతను చెప్పాడు. ఈస్టరు పుష్పము ఉన్నట్లుగా అది వున్నది. ఈ ఈస్టరు పుష్పము కొరకు మరియు బలిపీఠములను అలంకరించు సామాగ్రి కొరకు కొన్ని వేల డాలర్లు ఖర్చు పెడతారు. బలిపీఠము పుష్పములు అలంకరించుట కొరకు కాదు గానీ, బలిపీఠము అనేది ఒక బలిని అర్పించుట కొరకే, చూశారా. ఆ పురాతన కయీను యొక్క అదే ఆత్మను మీకు చూపించుచున్నారు (చూశారా), పురాతన ఏదేనులో యున్న అదే దెయ్యాన్ని వారు చూపించుచున్నారు, చుశారా.
149ఏమి జరిగింది? ఖచ్చితముగా కయీను, యదార్థవంతుడు అని మీకు తెలుసా, ఎందుకనగా అది అతనికి జీవము లేక మరణము అనే స్థితియందు ఉండెను. మరియు ఈ ప్రజలు వేషదారులని అనుకొనవద్దు; వారు యదార్ధముగానే ఉన్నారు.
మీరు అడగవచ్చు, "అయితే వారు యదార్థముగా ఉండి కూడా తప్పు చేయుచున్నారా?" నిశ్చయముగా! ఒక మనిషి యదార్థముగానే పాషాణమును, ఆముదము లేక మరేదో అనుకొని త్రాగవచ్చు, చూశారా. అతను యదార్థముగా ఆ పనిచేశాడు. కాని అది పని చేయదు. అది నిజము. సత్యమే ప్రాముఖ్యము గానీ యదార్థత కాదు, సత్యము.
150ఆఫ్రికాలోని స్త్రీలు మొసళ్ళను తమ దేవుళ్ళుగా మొక్కుచూ తమ చిన్న శిశువులను వాటికి బలిగా అర్పించెదరు. మీరు వారివలే అంత యదార్థముగా ఉన్నారా! లేదు. వారిలో ఎంతమంది… చైనీయులు వంట గది దేవుళ్ళ కొరకు తమ ఎముకలను విరుచుకొంటారు. మరి అక్కడున్న మహ్మదీయుల గురించి మాటేమిటి? అగ్నిలో నడుస్తారు. శరీరములో మరియు నోటిలో కొక్కెములు గ్రుచ్చుకొని తగిలించుకొనెదరు, నోళ్ళు కుట్టించుకొని అందులో కొంతమంది ఒక చిన్న పుల్లను పెట్టుకొంటారు. అక్కడ ఉన్న విగ్రహమునకు తాను పరలోకమునకు పోయెదనని అనుకొని వారే విధముగా దానికి బలి అర్పించెదరో దానిని చూపించు రూపము గల విగ్రహము నాయొద్ద వున్నది. పూజారి ఒక చిన్న కర్రను అతని నోటిలో గ్రుచ్చి, అతని తలచుట్టూ ఒక గొలుసు చుట్టి, దానితో ఆ కర్రను కట్టి అతని చేతులను వెనుకకు వంచి, ఆ గోలుసుతో బంధించి దానిని అలా క్రిందవరకు తీసుకొనివచ్చి, కాళ్ళను గొలుసులతో బంధిస్తాడు. అతను చనిపోయేవరకు మాట్లాడలేడు, తినలేడు, ఏమి చేయలేడు. ఏ క్రైస్తవుడయినా అటువంటి బలిని ఇవ్వడము మీరు చూశారా? అసలు మీరు నిజమైన వాక్యమును కూడా సరిగ్గా నమ్మలేరు.
151ఇప్పుడు, అందము, "తప్పకుండా దేవుడు దీనిని అంగీకరిస్తాడు, చూడు, ఎంత అందముగా నా బలి పీఠము ఉన్నదో?" అని కయీను అనుకున్నాడు. గమనించి చూడండి, అదే ఆత్మ ఈ రోజు ఉన్నది, అది ఒక బుద్ధిపూర్వకమైన జ్ఞానపు ఆత్మగా యున్నది.
"మంచిది, ఈ గొప్ప సంస్థను మనము తయారు చేస్తే తప్పక దేవుడు మనల్ని చేర్చుకొంటాడు." ఆయన దానిని చేర్చుకొనడు. ఆయన వాక్యమును తప్ప మరిదేనిని ఆయన అంగీకరించడు. లేదు, చూశారా.
"బాగుంది, సహోదరుడా బ్రెన్హాం చూడు, ఇప్పుడు, ఒకవేళ ప్రతీ సంవత్సరము మేము అనేక మంచి సేవకులను నియమిస్తే.. మా యొక్క సువార్త కార్యక్రమమునకు పోయిన సంవత్సరము అయిన ఖర్చు లక్ష డాలర్లు," అని వారందరు. అది మంచి కార్యమే సోదరుడా, కానీ వాక్యమును అంగీకరించి నీవు దాని దగ్గరకు వచ్చేవరకు నీవు మృతుడవే. అది సరిగ్గా అంతే!
152"ఎందుకు? సహోదరుడా బ్రెన్హాం, మా యొక్క సంఘమును… నీవు ఏమను కొంటున్నావు. నీకు చిన్న వేరుశనగ గింజంత మెదడు ఉన్నది," అని వారంటారు. అది సత్యము. నిశ్చయముగా నిజమే. కాని, నేనేమై వున్నప్పటికీ, నన్ను ఆ వాక్యముతో అట్లే నిలచి ఉండనివ్వండి, ఆ వాక్యము ఏదో ఒక రోజు శ్రేష్ఠమైన రీతిలో ఎదుగును, చూశారా. అది ఏమైనప్పటకీ ఫర్వాలేదు. వాక్యములోనే ఉండండి. మనకు ఇచ్చటవున్న ఈ చిన్న ఆలయము తప్ప మరేమీ లేదు. ప్రస్తుత సమయమునకు కావలసినదానికంటే ఇది మనకు ఎక్కువ. ఈ స్థలమును మన ఆరాధనా స్థలముగా మనము ఏర్పరచుకొన్నాము. యేసుక్రీస్తు రాకడ కొరకు మనము ఎదురుచూచుచున్నాము. భవనములమీద మరియు మొదలగు వాటిమీద లక్షలకొలది డాలర్లు ఖర్చుపెట్టి, పెద్ద గొప్ప సంస్థలు మనము కోరుకోవడం లేదు. ప్రజలు తినటానికి కూడా ఏమీ లేకుండా అనేక విషయములతో బాధపడుచుండగా మనము అలా చేయ్యలేము. ప్రజలతో వచ్చిన చిక్కు ఏమిటి? అహ్! ప్రజలు మేల్కొనినట్లున్నారు.
REV 17:2
153క్యాథలిక్ సిద్ధాంతమును ఎవరైనను అంగీకరించవచ్చు, మరిదేనినైనా అంగీకరించుటకు వారు గ్రుడ్డివారై యుండాలి. నేను మీకు నిజము చెప్పుచున్నాను. వారి మెడను అచ్చట వంచు వారెవరైనను సరే… అతడు తెలివైన వాడు, భూలోక రాజులు సహితము ఆమెతో వ్యభిచరించెదరని పరిశుద్ధ గ్రంథము చెప్పడములో ఆశ్చర్యము లేదు. కావున, అతడు తెలివైనవాడు… జ్ఞానవంతుడు, మరి వారు దానినే ఉత్పత్తి చేశారు… ఆ గురువులు, సూక్ష్మబుద్ధి గలవాడు? ఓ, మానవుడా! నీవు చదువుకున్న వారిగురించి మాట్లాడతావు! పిల్లవాడా, సంవత్సరముల వెంబడి సంవత్సరములు, నీవు శిక్షణను పొందవలసి ఉండును.
REV 13:15
154ఆ కన్యా (nun) స్త్రీలతో వారు ఏ సంబంధము కలిగిలేరని వారు చెప్పెదరు. మరి అలాగైతే నేను మిమ్మల్ని ఒకటి అడగాలని కోరుకుంటున్నాను. అలాగైతే ఆ కన్యా స్త్రీలు గొడ్రాళ్ళుగా ఉండాలి కదా? వారు కన్యా స్త్రీలంటూనే పెళ్ళి కుమార్తెలై పోతున్నారు. అవును, ఆ కన్యా స్త్రీలే పెళ్ళి కుమార్తెలై, అచ్చట ఉండు ఆ గురువులే పెళ్ళి కుమారులుగా వున్నారు. అది నిజము. ఆ కన్యా స్త్రీలకు పెద్దగా ఉండు స్త్రీ గురువులనే వారిద్వారా కన్యా స్త్రీలకు జన్మించు పసిపిల్లల ముక్కును పట్టుకొని ఊపిరి ఆడనివ్వకుండా చేసి, చంపివేసి అచ్చట ఉండు ఆ సున్నపు గుంటలో ఆ పసి బిడ్డలను పారవేయును. మీరు దానిని నమ్మనియెడల, నిజముగా అచ్చట ఆ విధముగానే జరుగుచున్నదనే దానిని చూచి, వాటినిగూర్చి సాక్ష్యమిచ్చువారు గలరు. ఆ సాక్ష్యములను మీరు వినండి, "చట్టము నన్ను బంధించనివ్వండి, చూచుకుందాము, రమ్మనండి చూద్దాము," అని వారంటారు. "కాథలిక్ సంఘమునకు రష్యా ఏమి చేసినదో, మెక్సికో ఏమి చేసినదో దానినే మనము కూడా చేద్దాము. ఆ కార్యము ప్రభుత్వము చెవులకు వెళ్ళేవరకు దానిని మనము బట్టబయలు చేద్దాము," అని చెప్పెదరు. కానీ దానియొక్క ప్రధాన అధికారి ఇప్పుడు ప్రభుత్వములో ప్రాముఖ్యమైనవాడుగా ఉండునట్లు మనమే చేసినందు వలన దానిని ఏ విధముగా బట్టబయలు చేయగలరు? చూశారా, చూశారా!
ఆ వాక్యము నెరవేరవలసి ఉన్నది, అచ్చట కూర్చొనియున్న ఆ మృగముతో వారు ఏకీభవించి, ఒక మృగపు ప్రతిమను ఏర్పరచుకొని, అందుకొరకై వారిరువురు ఐక్యమై, ఆ మృగమునకు మాట్లాడుటకు శక్తినిచ్చెదరు. ఓ, సోదరుడా, ఆ వాక్యము సరిగ్గా అక్కడే నిలబడబోవుచున్నది. కమ్యూనిజము సమస్తముపై ఆధిపత్యము చెలాయించబోదు గాని, రోమనిజమే సమస్తముపై ఆధిపత్యము చెలాయించును.
155ఇప్పుడు, దీనివైపు చూడండి, "తప్పక దేవుడు నా బలి అంగీకరిస్తాడని," కయీను అనుకొనెను. కానీ ఏ రకపు బలి… "నేను బలి అర్పించాను," అని అతడు చెప్పాడు. కాని అది ఏ రకమైన బలిగా ఉన్నది? వృక్షజీవము, చెట్లు, పువ్వులు, కూరగాయలు అనే వృక్ష జీవమునకు సంబంధమైన బలిని అర్పించెను. అక్కడ ఏ విధమైన బాధ లేదా నొప్పితో బాధపడుటగాని, ప్రాయశ్చిత్తముగాని లేదు.
ప్రజలు బాధ పడటానికి ఇష్టపడరు. ఈనాడు ఉన్న కొరత అదే, వారువున్న ఆ సంఘము నుండి బయటకు రాకుండా, అపహాస్యము చేయబడకుండా, ఆ సంఘ జనులు వారిని చూసి నవ్వకుండా, ఇటువంటి ఏ బాధలు, పరిస్థితులు లేకపోతే వారిప్పుడే వచ్చి ఈ వాక్యమును నమ్మెదరు. అలాగ కుదరదు. వారు ఏ బాధ, ఏ ప్రాశ్చిత్తము లేని కయీను అర్పించిన బలివంటి వృక్షజీవమునకు సంబంధించిన దానిని కోరుకుంటున్నారు. అటువంటి ఏదో రకపు బుద్ధిహర్వకమైన జ్ఞానమును ఆశించుచున్నారు. "మంచిది, ఈ జీవితమే చాలా చక్కగా, తృప్తిగా యున్నది." కాని, ఇది అటువంటి సులభమైనది కాదు! ప్రభువు చిత్తమైతే, ఒక్క నిమిషములో అటు వంటిది ఎక్కడనుండి వచ్చినదో నేను మీకు చూపిస్తాను.
HEB 11:4
156కానీ హేబెలు విశ్వాసము ద్వారా… కయీను జ్ఞానముతో, "తప్పక దేవుడు దీనిని అంగీకరించును, నాకు ఒక ఆలయము వున్నది. ఇక్కడ ఒక బలిపీఠము వున్నది," అని చెప్పెను. సంఘము కూడా అదే రీతిగా వున్నది. ఒక బలిపీఠము నాకు వున్నది, నా సహోదరునివలె నేను కూడా యదార్థతతో ఆరాధించాలని కోరుచున్నాను. ఆరాధించుట కొరకు ఒక అందమైన దానిని నేనిచ్చట ఉంచాను. దానిని తప్పక దేవుడు అంగీకరించును. అదే విషయమును, అదే అబద్ధమును, బుద్ధిపూర్వకమైన జ్ఞానమును గురించే సాతాను హవ్వకు చెప్పింది.
ఇప్పుడు, హేబెలు… హెబ్రీ 11వ అధ్యాయము చెప్పుచున్నది, "విశ్వాసమునుబట్టి హేబెలు కయీను కంటే శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను, అతడు మృతి పొందియూ ఇంకను మాట్లాడుచున్నాడు," చూశారా!
GEN 3:24
157హేబెలు దేనినిబట్టి బలి అర్పించెను? జ్ఞానము ద్వారానా ? వేదాంతము ద్వారానా? విశ్వాసమునుబట్టి దేవునికి శ్రేష్ఠమైన బలిని అర్పించేను. దేనిలో విశ్వాసము? దేనిలో విశ్వాసమునుబట్టి? అక్కడ కేవలము అతని తండ్రి, తల్లి, మాఱు తండ్రి యొక్క కుమారుడగు తన సహోదరుడు మాత్రమే ఉన్నారు. లోకములో అది ఏ విధముగా వున్నది. ఎక్కడ నుండి… ఎక్కడ నుండి దానిని (విశ్వాసము) పొందాడు, దేనిలో విశ్వాసము కలిగి యున్నాడు? వృక్ష శాస్త్రములో విశ్వాసము కలిగియుండెనా? దేనిలో విశ్వాసము కలిగియున్నాడు. లేదండి! అతడు వాక్యములో విశ్వాసము కలిగియున్నాడు, ఎందుకనగా ఆ తోట వెలుపల వారు ఉండవలసి వచ్చిందో దానిని అతడు తెలుసుకొనగోరాడు. "మేమెందుకు బయటకు గెంటి వేయబడితిమి?" అనే దానిని గూర్చి తెలుసుకొనగోరాడు.
"ఎందుకనగా, నేను దేయ్యము యొక్క అబద్దమును విన్నాను, అందువలన ఈ కుర్రవాడు (కయీను) ఫలానా-ఫలానా మార్గములో జన్మించాడు, అందుచేత దేవుడు మమ్ముల్ని బయటకు గెంటి వేసెను," అని హవ్వ హేబెలుకు చెప్పి వుండును.
"మంచిది, నేను కనీసము ఆ తోట ద్వారము వద్దకు కూడా వెళ్ళలేకపోవుచున్నాను. ఖడ్గము పట్టుకొని కెరూబు అక్కడ ఆ జీవవృక్షము చుట్టూ కావలి కాస్తున్నది." కనుక విశ్వాసమును బట్టి…
158చూడు, బుద్ధిపూర్వకమైన జ్ఞానమునుబట్టి కయీను బలిని అర్పించాడు… వాక్యము ఎరగకుండా బలిని అర్పించెనని మీరుగుదురు. కేవలము తన ఆలోచనల మీద అధారపడి జ్ఞానమునుబట్టి అతను ఒక మంచి స్థలమును ఏర్పాటు చేసి మరియు దానిని సుందరముగా, చక్కగా తయారు చేశాడు. కానీ, హేబేలు (అతడు కేవలము చిన్న పిల్లవాడు, అతనికి ఎవరు చెప్పలేదు) అది వృక్షజీవమునకు సంబంధించినది కాదని, అది రక్త సంబంధమైన లైంగిక చర్య అని విశ్వాసమును బట్టి కనుగొనెను! సోదరుడా, అక్కడే నీవున్నావు. అర్థము చేసుకోవటానికి మీకు కఠినముగా యున్నను, మీ ఆలోచనలు ప్రక్కకు పెట్టి దానిని గ్రహించండి. విశ్వాసమునుబట్టి ఆయన పిల్లలు ఇంకా దానిని ఇంకా చూస్తూ ఉన్నారు!
ఆయన ఎన్నడూ దానిని కొంత జ్ఞానముతో బోధించలేదు. అవి జ్ఞానమును బట్టి రాలేదు. అది విశ్వామునబట్టి వచ్చిందని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. "విశ్వాసమునుబట్టి హేబెలు…" అతను ఏమి ఆర్పించాడు? రక్తము, జీవించుచున్న జీవమునుండి, జంతు జీవమునుండి వచ్చినది. మనము కూడా జంతువుల వంటివారమే, రక్తము కలిగిన జంతువులము. అది నిజము. ఉన్నతమైన జంతుజాలము యొక్క ఉన్నత తరగతికి చెందిన జాతివారము; కానీ అక్కడ ప్రాణము (soul) కలదు. జీవము, అనగా అదియేయగును.
MATT 16:18
159ఇప్పుడు గమనించండి, విశ్వాసమునుబట్టి హేబెలు ప్రత్యక్షతను చూచెను. దాని కొరకై ఒక దర్శనమును కలిగినవాడై, జీవముతో రక్తము కారుచున్న దానిని తీసుకొని వచ్చెను. ఎందుకనగా, రక్తమునందే జీవము గలదు. పుష్పము యొక్క కాడలో కూడా జీవముండును, కాని అది వృక్ష సంబంధమైన జీవము, దానికి స్పందన ఉండదు. (అది చక్కగా అర్థమైనదని ఆశిస్తున్నాను!)
హేబెలు విశ్వాసమునుబట్టి వాక్యముతో నిలచియుండెను. విశ్వాసమునుబట్టి - జ్ఞానమునుబట్టి కాదు, విశ్వాసమునుబట్టి అది లైంగికపరమైనదని కనుగొనెను. రక్తసంబంధమైన కార్యమని ఎరిగెను. రక్త కణములు మగవాని నుండి వచ్చును. మగవాని శుక్లమందు రక్తకణములుండును. హిమోగ్లోబిన్ లేదా రక్తము మగవాని నుండి వచ్చును. ఆపిలు పండ్లు, పీచ్ పండ్లు మరియు బంగాళదుంపలు లేక ఏదైనప్పటికీ ఆ తోటనుండి వారు బయటికి వచ్చుటకు కారణము ఆ పండ్లు కాదని ఆదాము ఎరిగియుండెను. లైంగికపరమైన రక్తమునకు సబంధించినదే పాపమునకు కారణమైనది, గనుకనే అతడు రక్తమును తిరిగి బలిగా అర్పించాడు. విశ్వాసమునుబట్టి అతడు దానిని చేసెను, జ్ఞానమునుబట్టి కాదు. పరిశుద్ధ గ్రంథమంతా మరియు దేవుని సంఘమంతా విశ్వాసము ద్వారా, దైవిక ప్రత్యక్షత మీద కట్టబడి యుండగా, ఒక మనిషి తన జ్ఞానముతో దానిని ఏ విధముగా చేయగలడు? "ఈ బండ మీద నా సంఘమును కట్టుదును," చూశారా.
"ఓ, మేము నిశ్చయముగా దానిని నమ్ముచున్నామని" వారంటారు. అలాగైతే క్రీస్తు యొక్క జీవము ఈ విధమైన వాటిల్లో ఎక్కడ ఉన్నది. క్రీస్తు యొక్క జీవము ఎక్కడ ఉన్నది?
MARK 16:17•
JOHN 14:12
160రెండవదిగా, ఈ వాక్యములోని కొన్నింటిని వ్రాసుకొనుటకు ఇష్టపడుచున్నారా? చూశారా? వారు "మేము నమ్ముచున్నాము, మేము నమ్ముచున్నాము," అని చెప్పెదరు. అలాగైతే జీవము ఎక్కడ ఉన్నది?
ఒకవేళ మీరు నమ్మితే, అప్పుడు "ఈ సూచక క్రియలు నమ్మిన వారిని వెంబడించునని ("వెంబడించ వచ్చు" అని కాదు కాని "వెంబడించును.") యేసు చెప్పెను, "నా యందు విశ్వాముంచిన వాడు నేను చేయు క్రియలను అతడు కూడా చేయును, నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలనే అతడు కూడా చేయును." ఆయన ఏదో మాట వరసకు చెప్పలేదు, కానీ ఆయన ఏమి చెప్పాడో దానిని ఆయన చేయును. అవి ఏ విధముగా జరుగును? ఎందుకనగా, క్రీస్తులోవున్న అదే జీవము నీలో వున్నది. అది ఏ బుద్ధిపూర్వకమైన జ్ఞానమును కలిగించదు. అది దానిమీద (జ్ఞానము) ఎదుగదు. విశ్వాసమును తీసుకోవాలంటే జ్ఞానమును తృణీకరించాలి. వాక్యమునందు విశ్వాసమును కలిగియుండుటయే ముఖ్యము. వాక్యమునందు జ్ఞానమును కలిగియుండట కాదు గాని వాక్యమునందు విశ్వాసమును కలిగియుండుటయే మనకు ప్రధానమైనది.
161ప్రసంగీకులందరి కంటే, యాజకులందరికంటే, మిగతా వారందరి కంటే, సమస్తమును ఏకముగా సమకూర్చి, వారందరూ వాక్యముగూర్చి కలిగియున్న జ్ఞానము కంటే సాతానుకు వాక్యమును గూర్చిన జ్ఞానము బహుగా ఉన్నది, కాని వాడికి విశ్వాసము లేదు. విశ్వాసము జీవింపచేయును, విశ్వాసము మారుమనస్సు పొందునట్లు చేయును, విశ్వాసము సంఘసంస్థ నుండి బయటికి వెళ్ళునట్లు చేయును. అతడికి తెలివి ఉన్నది, కనుక అతడు దానితోనే నీలుచును. మంచిది.
కానీ హేబేలు విశ్వాసమునుబట్టి అది లైంగిక చర్య అని కనుగొనెను, అందువలన అతడు రక్తమును బలిగా అర్పించాడు. రక్తములోని జీవమును అర్పించాడు; మరియు దేవుడు దానిని అంగీకరించాడు.
2TIM 3:1,5•
2TIM 4:3
162II తిమోతి 2:3లో (వారికొరకు ఇప్పుడు వాక్యము వచ్చుచున్నది. అయిననూ, అది చెడ్డ నేలయందు పడినది. మీరు చూడండి), "వారు భక్తిగలవారై యుండియు, దాని శక్తిని ఆశ్రయించనివారు, ఆత్మ యొక్క శక్తిని ఆశ్రయించనివారు ( II తిమోతి 3, ఒకవేళ దానిని మీరు వ్రాసుకుంటే, సరే) పైకి భక్తిగలవారివలే వుండుట.
నిత్యజీవముతో నిండిన పరిశుద్ధాత్మ యొక్క సూచనలను వారు తృణీకరిస్తారు. "ప్రజలు భాషలలో మాట్లాడనవసరం లేదు, దైవిక స్వస్థత, పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేది ఏమి లేదు, అది అంతా అపోస్తుల కొరకే," అని చెప్పెదరు. భక్తిగలవారి వలె వేషమును ధరించి వుండుట.
పౌలు చెప్పెను, దానిని ప్రవచించెను, "అంత్యదినములలో, "అంత్యకాలములో ఈ సంగతులు జరుగును," వారియొక్క దినములలో కాదు. మరియు ఆత్మ తేటగా చెప్పుచున్నట్లుగా, అంత్యదినములలో కొంతమంది విశ్వాసము నుండి తొలగిపోయెదరు మరియు సమస్త కార్యములు జరుగును, చూడండి, అక్కడ అలాగే జరుగుచున్నది: భక్తిగల వారివలె వేషమును ధరించి వుండుట.
163ఇప్పుడు, ఆత్మ అనే నీరు లేని ఇటువంటి మత సంబంధమైన బురద నేల యందు ఏ విధముగా పరిశుద్ధాత్మ యొక్క నిత్యజీవపు సూచనలు ఎదుగును? గమనించరా? సంఘ సంస్థల యొక్క విధానమనే ఉల్లాస వినోదముల యందు, జ్ఞానమనే పొలములయందు అవి ఎదుగ లేవు. కనీసము సామన్య స్త్రీలా కూడా ప్రవర్తించలేని స్త్రీ యందు జీవించుచున్న దేవుని యొక్క అద్భుతములు, సూచక క్రియలు ఎలా ఎదుగ గలవు? నేను మిమ్ముల్ని ఒకటి అడగాలని కోరుచున్నాను, అల్పమైన పొట్టకూటి కోసము లేదా ఏదో ఒక సంఘ సంస్థ యొక్క సహాయము కొరకు ఆశించుచూ, ప్రసంగ వేదిక ముందు నిలబడి దేవుని యొక్క సత్యమును ప్రక్కదారిపట్టిస్తూ ప్రసంగిచుచున్న ఒక వ్యక్తిలో విశ్వాసము ఏ విధముగా ఎదుగును? ఏ విధముగా ఆత్మీయ సూచనలు (గుర్తులు) వారిని వెంబడించును? అలా ఏ సూచనలు, ఏవి కూడా వెంబడించవు.
164తనయొక్క సంఘమును ఒక నదీ తీరమునకు తీసుకొనివెళ్ళి, అచ్చట వారిని తమ వస్త్రములను తీసివేసి తిరుగులాగుచేయు ఒక బోధకునిలో అది ఏ విధముగా ఎదుగును? గత రాత్రి ఒక ప్రదేశమును దాటి వెళ్ళాను, అక్కడ ఒక ప్రత్యేకమైన ఆచార్య సమాజములో (పెరీష్) "షిండింగ్" అనే గొప్ప నాట్య వినోదమును ఏర్పాటు చేసి అందులో అందరూ ఉల్లాసముగా కేరింతలు కొడుచూ నాట్యమాడుచున్నారు. ఆ విధమగు స్థలమందు ఏ విధముగా ఆత్మ ఫలములు ఫలించును? అది ఒక మత సంబంధమగు బండయందు పడిన విత్తనములగును. (అది నిజము), పరిహాసము చేయబడుట, ఎగతాళి చేయబడుటయనే నేలయందు ఆ విత్తనములు పడలేదు.
MATT 6:28,29
165లిల్లీ పువ్వు ఎంతగానో శ్రమపడుతుంది. "శ్రీ. లిల్లీ గారు," అనే దానిపై కొన్ని సంవత్సరముల క్రిందట చేసిన నా ప్రసంగము మీరు విన్నారు. "అది వడకదు, అయినకప్పటికీ నేను మీతో చెప్పుచున్నాను, సొలొమోను సహితము అతని ప్రభావమంతటితో వాటిలో ఒకదానివలెనైననూ అలంకరింపబడలేదు," అని యేసు చెప్పెను. దానికది సుందరముగా కనిపించుట కొరకు ఏ రకముగా అది శ్రమపడునో. అది ఎందుకు శ్రమిస్తుంది? అది ఏ విధముగా ఎదుగుతూ వచ్చుచున్నది, దేనికొరకు? బయటకి తనను తాను సమర్పించుకొనుట కొరకు, దాని ప్రక్కన వెళ్ళితే [బ్రాన్హాం గారు వాసన చూసే శబ్దము చేయుచుండెను] వాసనలు, సువాసనలు, తేనేటీగ దాని హృదయములోనికి వెళ్ళి దానినుండి తేనె తీసుకుంటుంది. అది దానిని ఉచితముగా ఇచ్చివేయును. ఇలా చేయుట కొరకే అది శ్రమించును. హల్లేలూయా! నిజమైన దేవుని మనిషి అలాగే వుండవలెను: పాస్టర్ లిల్లీ, రెవ. లిల్లీ గారు. (అవునండీ!) వాక్యము కొరకు శ్రమించుచూ తన ముఖమును వంచి సాష్టాంగముగా పడి దేవుని వైపు చూస్తూ, "దేవా, ఇది ఎక్కడ కలుసుకొనునో నేను చూడలేకపోవుచున్నాను," అని ఎలుగెత్తి అడుగుము. అది వాక్యము ద్వారా రావలసియున్నది. దానిని నీవు చూసినప్పుడు దేవుడు దానిని నీకు ఇచ్చును. దేవుడు నీకిచ్చిన దానిని నీవు ఉచితముగా ఇవ్వవలెను. పెద్ద కూటము కొరకు కాదు, నీవు నాకు ఇన్ని వేల డాలర్లు ఇస్తానని వాగ్దానము చేసినట్లైతే వస్తాను అని కాదు, కానీ ఉచితముగా ఇయ్యవలెను. "ఒకవేళ అది టింబక్టు లేక వేరే ఎక్కడైనా అది ఉండినా సరే, దేవా! నీవు ఎక్కడ నన్ను విత్తనములు చల్లమని కోరుదువో అక్కడ దానిని ఉచితముగా ఇస్తాను." హల్లేలూయా!
MATT 10:8
166"సొలొమోను తన గొప్పతనమంతటిలో సహితము, దానిలో అలంకరింపబడలేదని," లిల్లీని చూడమని యేసు చెప్పెను. (తెలుగు బైబిల్ లో అడవి పుష్పముని, ఆంగ్లములో "లిల్లీ" అని వుంటుంది- తర్జుమాదారుడు) దానికున్న ప్రతీ దానిని ఉచితముగా ఇతరులకు ఇచ్చుటకొరకు అది ఎంతగానో శ్రమపడును. హేళన చేయబడి, ఎగతాళిగా నవ్వబడి, మతపరమైన గుంపుతో బయటికి నెట్టివేయబడి, ఎంత చెడ్డ పేర్లతో పిలువబడాలో, అంత చెడ్డ పేర్లతో పిలువబడినప్పటికినీ, ఆ దీన పుష్పము తను కలిగియున్న దానిని పొందుకొనుటకు ఈ సమస్త కార్యములతో వేధించబడి, ఎంతగానో శ్రమపడినను, అతడు వాక్యముతోనే చక్కగా నిలచియుండి దివారాత్రులు శ్రమించుచూ ఆ లోయలోనే అది వుండును. తాను పొందకోవలసిన దానిని ఎచ్చట నుండి పొందుకోవాలో, ఆ జీవజల నది నుండి దానిని పొందుకొనును. ఇంతగా శ్రమించడము దేనికొరకు? "ఉచితముగా నీవు పొందుకొన్నావు, కనుక ఉచితముగా ఇవ్వు." అవునండీ! ఆ మతపరమైన రాతిమీదనున్న బురద నేల అనే పొలములో నుండి అది ఎలా ఎదుగ గలదు!
167కయీను పిల్లలు జ్ఞానవంతులు, విజ్ఞానవంతులుగా వుండిరి. కయీను సంతానము అభివృద్ధి చెందుచుండుటను గమనించండి. ఒక నిమిషము వారిని గమనించెదము. కయీను యొక్క పిల్లలు వేటియందు అభివృద్ధి చెందియున్నారు? కట్టడములను నిర్మించుటలో, విజ్ఞాన శాస్త్రంలో, గొప్ప శాస్త్రజ్ఞులు. వారు జ్ఞానము కలిగియుండిరి, చూశారా. వారు కట్టడములను సహితము నిర్మించిరి. వారు ఇనుమును తయారు చేసి దానిని గట్టిపరచడము మొదలగు వాటిని చేశారు. వారు శాస్త్రవేత్తలు, తెలివైనవారు, విద్యావంతులు, మరియు మతపరమైనవారిగా ఉండిరి. కానీ, ఆ జ్ఞానము యొక్క పంట దేనిని ఉత్పత్తి చేసింది? దేవుని యొక్క న్యాయతీర్పు వచ్చునప్పుడు సమస్త మానవ జాతికి అది మరణమును తీసికొని వచ్చినది. అది సత్యమేనా! ఆ గుంపు ఏమి చేసినది? మరణము ఉత్పత్తి చేసినది. జ్ఞానమును మరియు తెలివితేటలను వారు అందరూ కలిగివున్నప్పటికీ ఏమి జరిగింది? వారు చనిపోయారు. వారిలో ప్రతీ ఒక్కరు దేవుని న్యాయ తీర్పులో నాశనమైపోయారు. అది నిజమేనా? దేవుడు ఆ విధముగా చెప్పెను. వారు తెలివైనవారు, మిక్కిలి విద్యావంతులు, మెరుగైనవారు, మతపరమైనవారు, చాలా చక్కనివారు, జ్ఞానవంతులు, వారి సొంత జ్ఞానము మీద వారు ఆధారపడినవారు - మరియు సమస్త మానవ జాతీని చంపివేసిరి.
REV 19:17,18
168ఈ రోజు వారు సరిగ్గా అదే కార్యమును చేయుచున్నారు. వారు తమ కోసము అణు బాంబులను ఉత్పత్తి చేసుకొంటూ… ఈ తెలివైన శాస్త్రవేత్తలు చేయబోవు కార్యమేమనగా, సమస్త మానవజాతిని నాశనము చేసెదరు. అటువంటి అణు బాంబులను ఇదివరకే ఉపయోగించిరి. దాని ప్రభావము వలన మీ కన్నులు మంటలతో మండునట్లగును, క్యాన్సర్ వ్యాధిని, ఇంకా సమస్తమైన నాశనమును తీసుకొని వచ్చును. చాలినంత వరకు సముద్రములో వారు వాటిని పడవేసిరి; వారు మరలా వాటిని ఎంతమాత్రము కనుగొనలేరు. అణుబాంబులు ప్రేలునప్పుడు సమస్త ప్రపంచమును అది నాశనము చేయును. మానవుల యొక్క దేహములు కాలిబూడిదై పోవును అని చెప్పుచున్నారు. "ఆకాశ పక్షులు అధిపతుల యొక్క శరీరమును తినును" అని పరిశుద్ధ గ్రంథము చెప్పడములో ఆశ్చర్యము లేదు. క్రుళ్ళిపోతూ రాలిపోవుచున్న మాంసపు ముద్దలను, సమస్తమును అవి తినును.
మరియు సూక్ష్మమైన జ్ఞానముతో వారిని వారే నాశనము చేసుకొనెదరు. మరణము సంభవించుటకు తెలివి, జ్ఞానమే కారణమైయున్నది. కేవలము దేవుని యొక్క వాక్యమునే నమ్ముచూ దానిని ఆధారము చేసుకొని జీవించండి, లేదా నీ బుద్ధిపూర్వకమైన జ్ఞానముతో నిన్ను నీవు చంపుకొనెదవు… మంచిది. ఇది కోతకాలము, అంత్యకాలము, వారు నాశనమగుదురు.
169మంచిది, హేబెలు పిల్లలు వినయముగలవారు, రైతులు, కాపరులుగా ఉన్నారు. (సంఘకాపరులు, మీకు తెలుసా), కాపరులు, రైతులు, వినయము గలవారు. అటువంటివారు మేము తెలివైనవారమని చెప్పుకోలేదు, కానీ వారు వాక్యముతోనే సరిగ్గా నిలిచియుండిరి. వారు అంత్యకాలమునందు దేనిని ఉత్పత్తి చేసారు? ఒక ప్రవక్తను. అది ఉత్పత్తి చేసెను. దేనికొరకు ఒక ప్రవక్త? అంత్యకాలము నందు సంభవించు సూచనల కొరకు.
ఆ ఓడను నిర్మించుచూ నోవహు దాని ద్వారములో నిలబడి, "వర్షము రాబోవుచున్నదని చెప్పినప్పుడు, అతడు పిచ్చివాడుగా పిలువబడెను. కానీ, అతడు ఒక ప్రవక్త. ఆమేన్! అతడేమి చేసాడు? నమ్మిన వారికి మరియు తప్పించుకోవాలని ఆశించిన వారికి అతడు రక్షణను తీసుకువచ్చాడు. విశ్వాసమునందు నమ్మకము గలవారును, వినయముగల వారును, విద్యలేని పామరులే దానిని ఉత్పత్తి చేసిరి. మిగిలిన వారు జ్ఞానమునందు నమ్మకముగల వారైనందువలన, వారు సమస్త మానవ జాతికి మరణమును తీసుకువచ్చిరి. వినయము గలవారు విశ్వాసముతో ఏమి చేసారు? అచ్చట అంత్యకాలము సమీపించుచున్నదనే సూచనను తీసుకొను వచ్చు ప్రభువు యొక్క ప్రవక్తను, రక్షణను తీసుకు వచ్చారు.
విద్యావంతులు దానిని నమ్ముతారని మీరు అనుకుంటున్నారా? వారు ముక్కు పుటలు ఎగురవేస్తూ, "ఎక్కడ నుండి వర్షము వస్తుంది, అక్కడ ఎక్కడైనా వర్షమున్నట్లు శాస్త్రయుక్తంగా నాకు నిరూపించు," అని అడిగి, నడిచి వెళ్ళిపోయారు. జ్ఞానము కలిగిన ఆ గుంపు, ఆ శాస్త్రవేత్తలు దేవుడు లేడని విజ్ఞాన పూర్వకముగా నిరూపించుటకు ప్రయత్నించుచున్నారు.
170అది ఫోటో తీయబడినప్పుడు (అగ్నిస్తంభము) వారు కూర్చున్న కుర్చీ దగ్గరకే ఆ చిత్రము వెళ్ళినది. వారికది అర్థం కాలేదు. "ఒక విధమైన వెలుగు ఆ కటకాన్ని (కెమేరా లెన్స్) తాకింది," అన్నారు. కెమేరా, వారి సొంత విజ్ఞాన సంబంధమైన ఉపకరణమే ఆ చిత్రమును తీసినది. జార్జి లేసి చెప్పినట్లుగా, "అయ్యా, ఈ కెమేరా మానసిక శాస్త్రమును చిత్రించలేదు, ఆ వెలుగు కటకాన్ని తాకింది, అది అక్కడ వున్నది," అన్నాడు. ఇప్పుడు అది ఏమైయున్నదో నేను మీకు చెప్పలేను, కానీ అది అక్కడ వున్నది. అతడు "నా యొక్క పేరును దాని మీద వ్రాస్తాను," అని దానిని వ్రాశాడు. మీరు దానిని గ్రహించవలెను. అవునండీ! అది ఎఫ్.బి.ఐ. (అమెరికన్ గూడాచార సంస్థ) వద్ద ఉన్నది. చూశారా.
171ఈ అంత్యదినములలో మన దేవుడు సమస్త కార్యముల ద్వారా ఆయన తనను బయలుపరచుకొనుచుండెను, అయితే ఆయన బయలుపరచు కార్యములను ఈ ప్రపంచము జీర్ణించుకోలేక పోవుచున్నది. జ్ఞానము, తెలివితేటలు ఎదుగుచున్నవి. జెట్ విమానములు ఈగలు వలె గాలిలో ఎగిరిపోవుచున్నవి. మరియు నీటిలోపల యుద్దములు, ప్రతీరకమైన అవినీతి, పాపములో జీవించుట, వారు తమను కాపాడుకొనుట కొరకు దేనినైన ఒక దానిని నిర్మించుటకు ప్రయత్నించుచున్నారు. దేవుని యొక్క నీతి ఆ ఓడ ద్వారమునందు నిలిచియున్నదనే ఒక్క మార్గము మాత్రమే గలదు.
JOHN 3:2•
JOHN 10:4,5,7,27
172ద్వారము ఎవరు? "గొర్రెలు పోవు ద్వారమును నేనే," అని క్రీస్తు చెప్పెను. నేను వాక్యభాగమునందు చదివినట్లు, "నా గొర్రెలు నా స్వరము వినును, ఒక అపరిచితుని అని వెంబడించవు." వాటిలో ఒక దానిని కూడా మీరు అక్కడ ఆ సంస్థల వైపు త్రిప్పలేరు. అవి లోకము నుండి బయటికి వచ్చునంత ఖచ్చితముగా దానిలో (సంస్థ) నుండి బయటికి వచ్చును. "గొర్రెల దొడ్డీలో నుండి వాటిని పిలిచి, వాటిని నేను నడిపించెదను. వాటి ముందు నేను నడిచెదను." ఆమేన్! "అది నేనే అని అవి ఎరుగును. ఎవరు కూడా నావలె నడువలేరు. నేను చేయు కార్యములను ఎవరు కూడా చేయలేరని," ఆయన చెప్పెను. ఆమేన్!
"రబ్బీ! ఇప్పుడు నీవు దేవుని వద్దనుండి వచ్చితివని మేము ఎరిగితిమి, ఎందుకనగా నీవు చేసిన అద్భుతములను దేవుడతనికి తోడైవుంటేనే గానీ ఏ మనిషీ చేయలేడు." అది సత్యము. అది నికోదేము యొక్క ఒప్పుకోలు. అది అంతే.
REV 2:7,11,29•
REV 3:6,22
173ఆ వినయముగల చిన్న గుంపు ఒక ప్రవక్తను ఉత్పత్తి చేసినది. ఆ ప్రవక్త ఈ అంత్యకాలములోని హేబేలు యొక్క సంతానమునకు అంత్యకాలప సూచనలను చూపించి, వారిని హెచ్చరించి, వాటినుండి తప్పించే ఒక ప్రవక్తను ఉత్పత్తి చేసెను. నేడు కూడా ఆ కార్యము ఆదే విధముగా వున్నట్లు నేను తలంచుచున్నాను. "వినుటకు చెవులుగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న దానిని వినును గాక!"
అందువలన చూడండి, జీవవాక్య విత్తనము అటువంటి జ్ఞానయుక్తమైన వాతావరణము నందు ఎదుగలేదు, అది ఆ విధముగా చేయలేదు.
174మోషే మరియు యెహోషువా వాక్యమునందు విశ్వాసమును కలిగియుండిరి. మిగిలిన వారు స్త్రీలతో నాట్యమాడుచూ, వారిని వివస్త్రలనుగా చేయడానికి ఇష్టపడిరి. కోరహు దానిని చేసెను. ఎందుకు? అతనియొక్క ఐగుప్తు జ్ఞానముతో దానిని చేసెను. మోషే దానిని కోరుకొనలేదు. ఈ దినపు కోరహుల వైపు చూడండీ, సులువైన దానిని ఏర్పాటు చేసుకొనుచున్నారు. నాట్యమాడుట, రాత్రంతా సంబరాలు, స్త్రీలు తల వెంట్రుకలు కత్తిరించుకొనుట, కురచ దుస్తులు, ఏదైనను సరే. "ఆ! అదేమి తప్పులేదు, మరేమీ ఫర్వాలేదులే," అంటారు. అది ఆలాగు కాదు! అది తప్పని వాక్యము చెప్పుచున్నది. అది నిజము. ఆనాడు చేసిన అదే విషయము, చూశారా.
1COR 10:1,2
175వారిలో ప్రతి ఒక్కరూ బాప్తిస్మము పొందారు - ప్రతి ఒక్కరు, కోరహు, మిగిలిన అందరూ బాప్తిస్మము పొందారు. అక్కడ మత సంబంధమైన మాదిరిని మరలా చూపించుచున్నది. "వారు ఎక్కడ బాప్తిస్మము పొందారని," మీరు అడుగుతారు? 1వ కొరింథీ 10:1 నుండి 3 వరకు దానిని చదివెదము. ఆలస్యమవుత్నుదని నాకు తెలియును. రాత్రి భోజనము చల్లారి పోదులే, ప్రభువు మనలను పోషించుచుండగా, నేటి రాత్రియందు ఆ ఆహారం తరిగిపోదు, చూడండి. I కొరింథీ 10:1 నుండి 2 ( కాదు, II వ కొరింథీని నేను వ్రాసుకున్నాను) I కొరింథీ 10:1-2:
అంతేకాకుండా, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట మాకు ఇష్టములేదు, అదేదనగా మన పితరులందరు మేఘముక్రింద నుండిరి, వారందరనూ సముద్రములో నడిచిపోయిరి;
మరియు అందరునూ మోషేను బట్టి మేఘములోనూ, సముద్రములోనూ బాప్తీస్మము పొందిరి;
176కోరహు కూడా మిగిలినవారు పొందిన రీతిగానే బాప్తిస్మము పొందెను, కానీ అతను ఏమి చేయాలని కోరెను? స్త్రీలు కొంచెము నాట్యమాడాలని, మరియు వారు కొద్దిగా ద్రాక్షారసము త్రాగాలని, కొద్దిసేపు ఆనందముగా గడపాలని, వారిని వివస్త్రలు చేయాలని, మరియు వ్యభిచరించారని మీకు తెలుసా? అది వారు చేశారని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. వారు ఆ స్త్రీలను వివస్త్రలుగా చేసి, వారు నాట్యమాడునట్లు మరియు మొదలగు విషయములు చేసిరి. మోషేకు వారిమీద కోపము రగులుకొనెను. ఆ సందర్భము మీకు గుర్తున్నదా? ఎందుకు? వారితో కూడా డాక్టర్ కోరహు వున్నాడు. అతడు జ్ఞానమును కలిగినవాడు. "మిమ్ముల్ని వెనక్కి ఐగుప్తుకి నడిపించెదనని చెప్పాడు. అందువలననే వారు వెళ్ళింది కూడా అక్కడికే. కానీ, సహోదరుడా, మోషే క్రిందికి దిగి వచ్చినప్పుడు, అతని కళ్ళకు అంతా భిన్నముగా కనబడెను. అతను మరియు యెహోషువా ఆ వాక్యముతో నిలిచారు, దేవుడు ఒక వాగ్దానము చేసెను; దానితోనే వారు నిలిచిరి. అంతా సరిగ్గా వున్నది.
కోరహు నుండి పొందిన జ్ఞానము ద్వారా మిగిలిన వారు నాట్యమాడాలని కోరారు, మరియు వస్త్రములు తీసివేయుటకు ప్రారంభించిరి; వారందరూ ఒకే దానిలో బాప్తిస్మము పొందిరి.
177ఇశ్రాయేలు మరియు మోయాబు. ఓ, నేను దానిగురించి ఒకసారి చెప్పాను, మనము దానిని తీసికొనబోవుట లేదు, నేను త్వరపడాలి. ఇశ్రాయేలు మరియు మోయాబు, అది ఏ విధముగా అక్కడ వున్నదో మీకు తెలుసా? ఒకటి జ్ఞానముతో నిండినది,పెద్ద సంస్థలు గలదిగా వుండినది, మిగిలినవి ఒక చిన్న సంస్థగా వున్నది.
MATT 4:1,6,7•
LUKE 4:1,2,10-12
178అప్పుడు ఒక రోజు (ముగించే ముందు దానిని చెప్పాలనుకుంటున్నాను). ఒక రోజు ఈ రెండు మూలాధారములు లేక శక్తులు దేవుని వాక్యము నిమిత్తము బలపరీక్ష కొరకు తలపడినవి, ఇప్పుడు, మనము చివర దృశ్యముమనకు రాబోవుచున్నాము. మనము వెనక్కి వెళ్ళగలము, నేను ఒక డజను తీసుకొన్న… నేను ఇక్కడ ఒక వారమంతా నిలబడినా కూడా నేను దాని అంచును కూడా ముట్టలేను, నేను దేనినీ గురించి మాట్లాడుచున్నానో దానిని సరిగ్గా నిరూపింపగలను. దానిని మీరు గ్రహించారని నేను ఆలోచించుచున్నాను, చూశారా.
ఒక దినమున అది బలపరీక్షయందు నిలబడే సమయము ఆసన్నమైనది. జ్ఞానము మరియు విశ్వాసములకు బలపరీక్ష వచ్చినది. యేసు మరియు సాతాను సంధించవలసి వచ్చినది. నిజము. యేసు మరియు సాతాను సంధించిరి; ఆ రెండు గొప్ప శక్తులు, జ్ఞానము మరియు తెలివి బలపరీక్ష కొరకు నిలబడవలసి వచ్చెను, చూశారా.
ఇప్పుడు, ఆ రెండు వాక్యమునే ఉపయోగించినవి. అది సత్యమేనా? (ఓ, సోదరుడా, ఇది నాకు ఉత్సాహమునిచ్చుచున్నది. దానిని ఇప్పుడు మీరు తప్పిపోవద్దు. ఓ, "దేవా, నా హృదయము తెరువుము," అని చెప్పుము.) అవి రెండు వాక్యమునే ఉపయోగించినవి, పరిశుద్ధ గ్రంథమును ఉపయోగించిరి. మారుమనస్సు చెందని మార్గములో అది క్రియ చేయదు. నిశ్చయముగా, అది క్రీయ చేయదు. ఖచ్చితముగా, క్రియ చేయదు. ఇద్దరూ దేవుని వాక్యమును ఉపయోగించారు. కాని సాతాను దాని తలలోని బుద్ధిపూర్వకమైన జ్ఞానమును ఉపయోగించినది. (చూశారా), బుద్ధిపూర్వకమైన జ్ఞానము, మరియు అది పనిచేయలేదు.
HEB 4:1,2
179ఇచ్చట నేను ఒక వాక్యమును వ్రాసి వుంచాను. నేను దానిని చదివెదను, మీకు అభ్యంతరము లేదు కాదా? చాలా త్వరగా హెబ్రీ 4వ అధ్యాయము తీయుదుము. ఒక్క నిమిషము నేను దీనిని చదువగోరుచున్నాను. ఇక్కడ చాలా మంచిగా అది కన్పించుచున్నది. హెబ్రీ 4:1 నుండి 2 వరకు చదువుదాము:
ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచియుండగా, మీలో ఎవరైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగియుందము.
వారికి ప్రకటించబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడెను గాని [జ్ఞానముతో? తెలివితో?] వారు వినిన వారితో విశ్వాసముగలవారై కలసియుండలేదు గనుక విన్న వాక్యము వారికి నియోజనమాయెను. [వారిలోవున్న విశ్వాసము ఏమి చేసినది?] దానిని విన్నది.
180మీరు వాక్యమంతయు కలిగియుండవచ్చు. ఆ వాక్యము మొదట నుండి చివరివరకు యెరిగి యుండవచ్చు, అది మీ కోసము ఎన్నడూ క్రియ చేయదు, ఒక మనిషి ఆ వాక్యము తీసికొని దానిచేత క్రియ చేయించుట కొరకు ప్రయత్నించినవానిని చూశారా? "సోదరుడా, దేవునికి మహిమ…" అని చెప్పును. అది అలా క్రియ చేయదు. వాక్యముతో మీరు చెలగాటము ఆడలేరు. లేదు, లేదు, లేదు, లేదు! నీవు ఏమి చెప్పినప్పటికీ దానితో సంబంధము లేదు. వాక్యము దానిగూర్చి అదే సాక్ష్యము పలుకును. నీవు ఏమి హక్కు కోరినప్పటికీ దానితో సంబంధము లేదు. వాక్యము దానికదే సాక్ష్యము ఇచ్చును. అది సత్యము.
ఇప్పుడు, సాతానుకి వాక్యము తెలియును. వాడు మొదటి నుండి చివరి వరకు వాక్యమును బాగుగా ఎరిగి వున్నాడు. నీకు అది తెలియునా? నేను ఊహించుచున్నాను, ఒకవేళ వాడికి డిగ్రీలు ఉన్నట్లుయితే, నాలుగు లేక అయిదు పేజీలు వ్రాయుటకు సరిపడినన్ని డిగ్రీలు, బిరుదులు కలిగియుండును. డాక్టరు రేవరెండ్, ఎల్దర్, పీ.హెచ్., ఎల్.ఎల్., క్యూ.డి., మరియు అక్షరములు అన్నీ మరియు అన్ని రకముల డిగ్రీలు వాడు కలిగియుండును. అన్నీ పరిశుద్ధ గ్రంథమునకు సంబంధించినవే వుండవచ్చు. వాడు దానిలో ప్రతీ మాట ఎరుగును. ఖచ్చితముగా, వాడు ఎరుగును, చూశారా.
181అందుచేత సాతాను చెప్పెను, "ఇప్పుడు, నాకు వాక్యము తెలియును." వాడు హవ్వ వద్దకు వచ్చినప్పుడు, వానికి వాక్యము తెలియునని నేనెరుగుదును. అందుచేత తలలో నుండి వచ్చిన బుద్ధిపూర్వకమైన జ్ఞానముతో దానిని వాడు కలిగియున్నాడు, కాని అది క్రియ చేయదు. దేవుని వాక్యపు ప్రత్యక్షత వలన కలిగిన విశ్వాసముతో, ముందుగా నిర్ణయించబడిన జీవమును కలిగియుండి యేసు దానిని ఎరిగియుండెను. మహిమ! మీ హృదయములలోనికి అది చొచ్చుకొని పోయి అర్థమైనదని ఆశిస్తున్నాను. ఆయన తనను గూర్చి, తాను ఎవరనేది యేసు ఎరిగియుండెను! సాతాను ఆశ్చర్యపడుచుండెను. దేవుడు తనకు తానుగా తనలో ప్రత్యక్షమాయెనని, తను ముందుగా ఒక నిర్ణయించబడిన దేవుని యొక్క జీవియని ఆయన ఎరిగియుండెను. ఆ ప్రత్యక్షతయే ఆయన ద్వారా క్రియలను జరిగించుచున్నవి, ఆయన కాదు గాని, ఆయన యందు నివసించు తండ్రియే వాటిని జరిగించుచుండెను. ఆమేన్! వానియొక్క వేదాంతమంతటితోను సాతాను ఎంత ఎరిగియున్ననూ అందువలన ఏ ప్రయోజనము లేదు.
PS 91:12•
MATT 4:6•
LUKE 4:10,11•
REV 13:8
182సాతాను దానిని ఎరుగును; అతనికి వాక్యము తెలియును. ఇప్పుడు, బాలుడా, ఒక నడిచే పరిశుద్ధ గ్రంథమువలె సాతాను వాక్యమును తీసుకొని దృష్టాంతముగా చూపించగలడు. కానీ యేసు నిశ్చలముగా అలాగే నిలబడియుండెను, ఎందుకనగా ఆయన ఎక్కడ నిలిచి యున్నాడో ఆయన ఎరిగియుండెను. ఆయన ముందుగా నిర్ణయించబడిన, జగత్తు పునాదికి ముందే వధించబడిన గొర్రెపిల్లయని, ఆ వ్యక్తి తానే అని ఆయన ఎరిగియుండెను. ఓ, సోదరుడా! "వినుటకు చెవులు గలవాడు వినును గాక! ఆ విషయము ముందుగానే నిర్ణయించబడినదని ఆయన ఎరిగియుండెను. మరియు ఆ మార్గములోనే ఆయన వాక్యము ఎరిగియున్నాడు, చూశారా. అది తప్పక క్రియ చేసింది. సాతాను దానిని జ్ఞానము ద్వారా ఎరిగి వుండెను; అది విఫలమయ్యింది. యేసు చూపించిన అదే వాక్యము నుండి, అదే పరిశుద్ధ గ్రంథము నుండి వాడు కూడా చూపించాడు. వాడు కీర్తనల గ్రంథముల నుండి దృష్టాంతముగా చూపించాడు. "నిన్నుగూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను ఎత్తిపట్టుకొందురు," అని సాతాను చెప్పెను.
"మరి ఈ విధముగా కూడా వ్రాయబడి వున్నదని," ఆయన చెప్పెను.
1TIM 1:15
183సాతాను దానిని జ్ఞానము ద్వారా ఎరిగియుండెను. యేసు దానిని అనుభవము ద్వారా ఎరిగియుండెను; ఆయన ప్రత్యక్షత ద్వారా దానిని ఎరిగెను. ఈ లోకములోనికి రావలసివున్న దేవుని కుమారుడు తానే అని ఆయన ఎరిగియుండెను. ఆయన దేనిమీద నిలిచియున్నాడో ఎరిగియుండెను; ఆ పని నిమిత్తమే ఆయన ఈ లోకములో జన్మించెనని ఎరిగియుండెను; మరియు ఆ కారణమును బట్టియే దేవుని వాక్యము ఆయనద్వారా పని చేయగలుగుచున్నది, ఎందుకనగా ఆయన ఏమైయుండెనో ఆయన ఎరిగియుండెను. మహిమ! (ఇప్పుడైనా, మీరు దానిని పట్టుకున్నారా?) ఆయన ఏమైయుండెనో అది ఆయన ఎరిగియుండెను! సాతాను, దాని వెనుక యుండెను, ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఎరిగియుండెను; వాక్యము మీద వాడికి గల జ్ఞానముతో తనకు ఏ విధమైన సంబంధము లేదని ఆయన ఎరిగియుండెను, ఎందుకనగా దేవుడే వాక్యమైయుండెను. అది మీకు అర్థమయిందా?
MATT 18:11•
LUKE 19:10
184ఇప్పుడు, ఒకవేళ యేసు ఆయన ఎవరైనది ఎరిగియున్నట్లయితే… ఈ కాలము యొక్క ముందుగా నిర్ణయించబడిన జీవిగా ఆయన యున్నాడు. మీరు నమ్ముచున్నారా! శరీరధారియైన యేసు తాను ముందుగా నిర్ణయింరచబడిన వాక్యమని పాపపరిహారము నిమిత్తము ఆ దినమునందు నిలువబడువలసిన దేవుని యొక్క వ్యక్తి తానేనని ఆయన ఎరిగియుండెను. ఆయన తన శత్రువుని కూడా ఎరిగియుండెను. (కొన్ని ఆదివారముల ముందు దానిని గూర్చి బోధించినట్లుగా), ఆయన తన శత్రువుని ఎరిగియుండెను. తానెవరనేది ఆయనకు తెలుసు; కనుక ఈ రెండు గొప్ప శక్తులు కలసి వచ్చినవి, జ్ఞానము మరియు విశ్వాసము. ఆయన ఎవరో యేసుకు తెలియును. యేసు ఎరిగియున్నట్లుగా, సాతాను కూడా పరిశుద్ధ గ్రంథమును ఎరిగియుండెను, కాని అది సాతాను కొరకు పని చేయదు. నీవు ఎంత జ్ఞానము కలిగివున్నా గాని, అందువలన ఏ ప్రయోజనము లేదు.
ఇప్పుడు, దానిని కొన్ని పెద్ద సంఘ సంస్థల వద్దకు తీసుకొని వెళితే, "దానిని గూర్చి ఒక్క నిమిషము ఆలోచించు, మంచిది మాకు వాక్యము కలదు," అని అంటారు. అది క్రియచేయుటను నన్ను చూడనివ్వండి. కాథలిక్కులైన మీరు, "మేమే అసలైన వారము," అంటారు. దానిని ఇప్పుడు చూద్దాము. నీ యొక్క క్రియలు… లేక నీ యొక్క విశ్వాసము లేకుండా నీ క్రియలను చూపించు, మరియు నా విశ్వాసము ద్వారా నేను క్రియలను చూపిస్తాను, చూడండి. వాక్యము ఏమి చెప్పిందో దానిని గమనించండి.
JOHN 14:12
185అది ఏ రకమైన ఫలమును ఇచ్చునో తెలియని ఒక విత్తనమును నీవు నాటెదవా, ఒకవేళ దానిని పెంచెదవా? ఒక జొన్న విత్తనమును నాటి అది జొన్నను ఫలింపని యెడల, అటువంటి దానిని విత్తేదవా! బంగాళదుంపగా పెరగని దానిని బంగాళదుంప అని నాటతావా! మంచి రకపు పుష్పముగా తలంచి వేరొక పుష్పపు మొక్కను నాటతావా? అట్లైతే దేవుని విత్తనమును నీ హృదయములో విత్తితే, అది దానినే ఉత్పత్తి చేయాలి. "నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలనే అతడు చేయును," అని యేసు చెప్పెను. ఒకవేళ అతను నేను నమ్ముచున్నానని చెప్పిన, మరి ఆ క్రియలు అతడిని వెంబడించకపోయిన యెడల, అతను అబద్దికుడు. "నాయందు విశ్వాసముంచినవాడు నేను చేయు క్రియలను అతడు కూడా చేయును ఇంకా ఎక్కువ క్రియలు చేయును. మరి దీనికంటే ఎక్కువ చేయును. నేను నాతండ్రి వద్దకు వెళ్ళుచున్నాను." ఎందుకు? అది అంత బలముగా వున్నది. కానీ అది జారిపోయే స్థలమునందు పడలేదు, ఎక్కడోవున్న ఒక రాయిమీద అది పడకుండా, అది సరిగ్గా లోయలో పడును గనుక గాలి దానిని చెదరగొట్టలేదు మరియు పక్షులు దానిని తినివేయకుండ అది ఎదుగును. మీ హృదయ లోతులో దానిని దాచుకోండి.
PS 1:2•
PS 119:11
186దావీదు చెప్పెను, "నీ ధర్మశాస్త్రమును నా హృదయములో ఉంచుకొనియన్నాను" (కనుక ఏ సంస్థ దానిని బయటికి తీసి వేయలేదు, పక్షులు దానిని ఎత్తుకొనిపోలేవు); దానిని నేను ఇక్కడ దాచుకొని యున్నాను. దివారాత్రులు దానిని నేను ధ్యానించుచున్నాను. అవి నా మంచము కోళ్ళ మీద వ్రాయబడెను, ప్రతిచోట వాటిని వ్రాసి వుంచియున్నాను. నా వ్రేళ్ళు చుట్టూ వాటిని కట్టుకొని యున్నాను.
"మీ యొక్క పేర్లు నా అరచేతిలో వున్నవి," అని యేసు చెప్పెను. కనుక ఏ విధముగా అవి మర్చిపోబడును? మరచిపోవుటకు వీలులేదు. మంచిది.
MAL 4:5
187తాను ఎవరనే దానిని ఆయన ఎరిగినవాడై తాను ముందుగా నిర్ణయించబడిన జీవిగా, ఆయన తననుగూర్చి ఎరిగిన విశ్వాసముతో ఆయన సాతాన్ని జయించినయెడల, (మీరు సిద్దముగా యున్నారా!) ఇప్పుడు, యేసుక్రీస్తు యొక్క ముందుగా నిర్ణయించబడిన వధువు సంగతి ఏమిటి? వధువు ముందుగా నిర్ణయింబడినదని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు ముందుగా నిర్ణయంచబడిన క్రీస్తు యొక్క వధువును వాక్యమనే విత్తనమును, సంఘమును, సమస్తము సంఘములో ఇప్పుడే పెట్టెదనని దేవుడు వాగ్దానము చేసియుండెను; ఇప్పుడవి అందులోనే యున్నవి. ప్రతిదీ ఒక క్రమములో వున్నవి; పరిశుద్ధాత్మ ఇవ్వబడినది; విత్తనములు విత్తబడినవి; సాయంకాల దీపములు ప్రకాశించుచున్నవి; యేసు వాగ్దానము చేసిన సొదొమ గురుతు; మరియు మలాకీ 4, ఒక ముందుగా ఒక నిర్ణయించబడిన సంఘము ఇక్కడ వున్నది. ఓ, దేయ్యమా…
MAL 4:5,6•
LUKE 17:28•
ROM 8:29,30
188జీవించుచున్న దేవుని యొక్క సంఘమా, టేపును ఆలకించుచున్నవారలారా! ఇప్పుడు మీరు ఎక్కడ నిలబడియున్నారో ఎరుగుదురా! మీరు దేవునిచేత పిలువబడినవారని, పరిశుద్ధాత్మ నీ హృదయములో పరిపాలన చేయుచున్నదని మరియు ప్రతీ దేవుని మాట మీకు నిజమైనదని మీరెరుగుదురా? ఓ, సోదరుడా! దానికి వ్యతిరేకముగా సాతాను ఏ విధముగా నిలువగలదు? దానిని ఎదుగకుండా ఎలా అది ఆపగలదు? సూచనలు వెంబడించకుండా ఎలా అది ప్రక్కకు తప్పించగలదు? ఎందుకు? మీరు జైలులో పెట్టబడవచ్చు, ఒకవేళ నీవు… ఏమి చేస్తావో నాకు లెక్కలేదు, వారు దానిని చేసి చూచిరి. వారు జైళ్ళల్లో మగ్గారు, వారు సింహములకు ఆహారముగా వేయబడిరి, వారు అంపములతో కోయబడిరి, వారు ముక్కలుగా కోసి కాల్చబడిరి, ముందుగా నిర్ణయించబడిన ఒక సంఘమును నీవు చంపలేవు (సత్యము!), "ఆయన ఎవరిని ముందుగా ఎరిగెనో (యేసును ఆయన ఏ విధముగా ఎరిగెనో అలా) ఆయన వారిని పిలిచెను, ఎవరిని పిలిచేనో వారిని నీతి మంతులుగా తీర్చెను, మరి ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని ఇదివరకే మహిమపరచెను, ముందుగా నిర్ణయించెను." ఇప్పుడు చివరి దినములయందు ప్రతి విత్తనము విత్తబడినది. ప్రతిదీ ఒక క్రమములో వున్నది. ప్రపంచము దాని క్రమములో వున్నది. కాలము ఆకారములోనికి వచ్చినది, సంఘము దాని క్రమములో వున్నది. విత్తనము, సాయంకాలపు వెలుగులు సూచనలు… "ఆయన చెప్పిన విధముగా సొదొమ దినములలో జరిగినట్లు…" (దేవుని దూత, పరిశుద్ధాత్మ క్రిందికి దిగివచ్చుచున్నది, ఆ పరిశుద్ధాత్మ కదులుచూ, అప్పుడు ఆయన చేసినట్లుగానే సూచక క్రియలు చేయుచుండెను); అంత్యదినములలో పంపుదునని ఆయన మలాకీ 4వ అధ్యాయములో వాగ్దానము చేసెను. ఏమి వాగ్దానము చేయబడినదో సమస్తము, ఆ సమస్తము సరిగ్గా ఇచ్చట వుండుటను మనము చూస్తున్నాము. ఎక్కడ? ఎక్కడ?
ఆమేన్, ఆమేన్ ఆమేన్, ఆమేన్!
ఆయనను మీరు ప్రేమిస్తున్నారా? ఆమేన్! (అవును!)
ముందుగా నిర్ణయించబడిన సంఘము, వారు ఎక్కడ నిలబడివున్నారో ఎరిగిన సంఘము, విత్తనముతో విత్తిన సంఘము, పరిశుద్ధాత్మ కలిగిన సంఘము, అంత్యదినములలో సరిగ్గా ఇక్కడే వుండును. సాతానా, జాగ్రత్తగా వుండు!
MAL 4:5,6
189ఏమి జరిగినది? (ఇప్పుడు ఒక్క నిమిషము.) ఏమి జరిగినది? సంఘము కొరకు వాగ్దానము చేయబడిన ప్రతీదానితోనూ, చివరకు మలాకీ 4వ అధ్యాయములో చెప్పబడిన వాగ్దానము కూడా ఇప్పుడు ఇక్కడ…
యేసును కలిసినప్పుడు సాతాను ఏమి చేసెను? దానికున్న మత సంబంధమైన శక్తులన్నింటితోను ఆయన యొద్దకు ఎగిరి వచ్చాడు, "నాకు వాక్యము తెలుసు," అని ఆయన యొద్దకు ఎగిరి వచ్చాడు. వాడు కలిగియున్న సంస్థాగతమైన బురదనంతా, ఆ బురదను మనము సరిగ్గా వాడిపైనే వేశాము, కానీ ఈ బురదలో ఏ విధమైన జీవము లేదు. వాడు ఎగురుచూ వచ్చాడా? ఎంత త్వరగా వచ్చాడో అంత త్వరగా సాతాను పారిపోయాడు. ఎందుకు? అక్కడయున్న వంద కోట్ల వోల్ట్ శక్తిగల విద్యుత్ తీగను వాడు తాకాడు; వాడి ఈకలన్నీ మాడి మసైపోయాయి. ఆయన వద్దనుండి వాడు ఎంతో దూరముగా తూలుతూ ఎగిరి పడ్డాడు. వాడు ఆయన వద్ద నుండి బయటకు వచ్చేశాడు, ఎందుకనగా ఆ తీగ లోపల (యేసులో) శక్తివంతమైన విద్యుత్ ప్రవహించుచున్నది.
MATT 24:35•
LUKE 17:26
190సాతానుడికి కూడా ఒక విద్యుత్ తీగ వున్నది. కానీ అది ఎంత చక్కగావున్న రాగితీగ అయినా లెక్కలేదు. దానిలో జీవము లేకపోతే అది చచ్చినదే. అది పని చేయదు. అదే తీగ ఒకటి విద్యుత్ తయారు చేయు పరికరానికి (డైనమో) కలుపబడితే మరియు ఇంకొకటేమో విద్యుత్తు లేని తీగతో కలుపబడియున్నది. ఆ కారణము వలననే ముందుగా నిర్ణయించబడిన పాత్రలో మాత్రమే అది పనిచేయును. ఆ కారణము వలననే వాక్యము పనిచేస్తుంది. అది అక్కడ కలుపడియున్నది. ఎక్కడ అది కలపబడినది? సంస్థతోనా? కాందడీ! అది పనిచేయని లేక జీవములేని సంస్థపైకి దైవభక్తిగా వేషము ధరించుకొని దేవుని శక్తిని తృణీకరించుచున్నది. కాని వాక్యముతో సంబంధము కలిగి కలపబడి ఉన్నట్లైతే, అది ఎన్నడూ గతించిపోదు. ప్రతీసారీ అది అదే శక్తిని ఉత్పత్తి చేయును. అది దేనియందు జీవము కలిగియున్నదో దానితో సంబంధము కలిగియున్నది! మహిమ!
ఆమేన్, ఆమేన్!
మీరు ఆయనను ప్రేమిస్తున్నారా?
మీరు ఆయనను సేవిస్తారా? ఆమేన్!
ఏదో ఒక సంస్థతో అసలు నీవు సంబంధము కలిగియుండవద్దు, కానీ ఇప్పుడు విధ్యుత్ శక్తితో, వెలుగుచున్న సాధనముతో నీవు కలుపబడి యుండుము. సోదరుడా, నేను నీకు చెప్పుచున్నాను, అది అక్కడ పని చేయును, ఎందుకనగా అది అదే వాక్యముతో కలుపబడింది.
HEB 4:2
191మోయాబు కూడా కలపబడియుండెను మరియు ఇశ్రాయేలు కూడా కలపబడినది. మోయబునకు ఏమీలేదు. అది జీవములేని సిద్ధాంతములను మరియు అబద్దపు ప్రవక్తను కలిగియున్నది. కానీ, ఇశ్రాయేలీయులు కొట్టబడిన బండను, ఇత్తడి సర్పమును, అగ్నిస్తంభమును (హల్లేలూయ!), జీవించివున్న దేవుని యొక్క సూచనలను కలిగియున్నారు. అది ఖచ్చితముగా పని చేసింది. ఎందుకు? అది విశ్వాసము మీద ఆధారపడి వున్నది. (అవునండీ!), జ్ఞానము మీద కాదు, లేక కొంత మంది మనుష్యుల ఆచారముల మీద ఆధారపడి లేదు. కేవలము, వాక్యము మీద ఆధారపడి యున్నది. జీవము వాక్యము నుండి వచ్చును. "నా వాక్యము జీవము." ఆ విద్యుత్ శక్తి వాక్యము ద్వారా వచ్చును; సాతాను అక్కడ నుండి తొందరగా తప్పుకొనును. వాడి వేదాంత బురద ఏ మంచిని జరిగించదు. అక్కడ సాతాను తీగలో విద్యుత్ లేదు. అది చనిపోయిన సిద్దాంతములు మాత్రమే కలిగివున్నది. ఇప్పుడు, అదే విద్యుత్ గల తండ్రి యొక్క వాక్యమనే తీగను యేసు ఉపయోగించెను. సాతాను కూడ తండ్రి యొక్క వాక్యమును వాడెను. సాతాను దయ్యము; యేసు దేవుడు. అదే వ్యత్యాసము. అది సత్యము. ఒకటేమో ఆచారము, మరియు రెండవది వాక్యము. ఒకటి నిజము, మరొకటి అబద్ధము. ఒకటి దానిని ఉత్పత్తి చేయగలదు, రెండవది దానిని ఉత్పత్తి చేయలేదు. మీకు అర్థమయ్యిందా? ఒకే రకమైన విద్యుత్ తీగలు, అది సత్యము, ఒకే విద్యుత్ తీగలు. హెబ్రీ 2వ అధ్యాయము, మనము ఇప్పుడు తీద్దాము. హెబ్రీ 4:2, ఇప్పుడే దానిని చూశాము, చూడండి.
192సంస్థలు చెప్పినట్లుగా, జ్ఞానముతో (చూసారా), సంస్థలు జ్ఞానముతో ఇలా చెప్పును, విద్యుత్ శక్తిని కలిగియుండు దినములు గతించి పోయాయి."
మీరు ఆయనను ప్రేమిస్తున్నారా? ఆమేన్!
మీరు ఆయనను సేవించగలరా? ఆమేన్!
మీరు ఆయనను నమ్ముచున్నారా? ఆమేన్, ఆమేన్, ఆమేన్!
నేను ఆయనను నమ్ముచున్నాను, అవునండీ, 'ఆమేన్' అనగా "ఆ విధముగా జరుగును గాక." ప్రభువా! ఈ ఉదయ కాలములో నా ప్రార్థన ఇక్కడవున్న ప్రతీ విశ్వాసిని విద్యుత్ శక్తిగల ఆ తీగలోనికి లాగుము. ఓ, వానిలో జీవమును పెట్టుము. అతను దేవుని యొక్క మహిమలో ప్రకాశించి మరియు ప్రజ్వలింపచేయనిమ్ము. అవునయ్యా! విద్యుత్ శక్తిని పని చేయునట్లు మీట నొక్కండి.
1PET 4:12
193నేనేమి నమ్ముచున్నానో మీరు ఎరుగుదురా? ఆ గొప్ప సంఘము కొరకు విత్తనములు విత్తబడినవి (మీరు దానిని నమ్ముచున్నారా?) భవనముగుండా విద్యుత్ తీగలు అమర్చబడినవి. విద్యుత్ ప్రవహించు ప్రతీ సాధనము వాక్యము ద్వారా పరీక్షింపబడినది. (ఓ, మై!) ప్రతీ సరఘా కేంద్రము వాక్యము ద్వారా పరీక్షించబడినది. మిమ్ముల్ని శోధించుటకై అగ్నివంటి కఠినమైన శోధనలు మీకు కలిగినప్పుడు, ఆ శోధనలు మీకు క్రొత్తవిగా భావించుచూ కలత చెందవదు. అవి మిమ్మును శోధించుటకై మీకొరకే వచ్చినవి. విద్యుత్ ప్రవహించు తీగల యందు ఆ ప్రవాహమునకు ఆటంకము కలిగించునట్లుగా, అచ్చట ఏదైనా ఒక కార్యము దానిని అడ్డుకున్నట్లయితే మీట (స్విచ్) వుండు స్థలమునంతటినీ ఆ విద్యుత్ శక్తి పేల్చివేసి ప్రమాదమును సంభవింప చేయును. ఆ విధమైన ప్రమాదమును సంఘములో తీసుకొనివచ్చు వారిని దేవుడు తన సంఘములో వుండుటకు ఇష్టపడడు. విద్యుత్ ని వెలిగించుటకై సంబంధమును కలిపే రాగివంటి తీగ కాలి బూడిదైపోవునట్లుగాను, విద్యుత్తు సరఫరా చేయు కేంద్రమైన మీట స్థలము మండిపోవునట్లు గాను, ఈ అంత్యకాలమందు అటువంటి కార్యము సంభవించుటకు ఏ అవకాశము వుండదు. (లేదండీ!) ఆయన మళ్ళీ వచ్చి ఎక్కడ కాలిపోయి తెగిపోయిందో సరిగ్గా ఆ స్థలమునే అతికించును. ప్రతీ విద్యుత్ దీపము దాని, దాని స్థలమందు అది వ్రేలాడుచూ వుండవలెను. అన్నీ ఒకే ఒక కార్యము కొరకు వేచి వున్నవి. అదేమనగా యజమానుడు వచ్చి వాక్యమునందు మీటను నొక్కి వెలిగించుట కొరకై వేచి వున్నవి. ఖచ్చితముగా! అది ఇప్పుడే కావచ్చు. సోదరుడా, నీకు ఒకవేళ స్వస్థత అవసరమైతే మీటను నొక్కు అదే నీవు చేయవలసినందతా! నీవు నిజమైన విద్యుత్ శక్తితో నిండియున్న తీగను కలిగియుండి కూడా, యేసులో నుండి వచ్చు విద్యుత్ శక్తి తీగతో నీవు సంబంధమును కలుపబడి లేకపోతే, అప్పుడు, నీవేమి చేయవలెనో దానినే నేను నీకు చెప్పుచున్నాను. ఆమేన్! అది సత్యము.
MATT 4:4-9•
LUKE 4:4,6,7,10,11
194"ఇప్పుడు, అద్భుతములు జరుగు దినములు గతించి పోయినవి, ఆ విద్యుత్తు తీగలలో ఏ విద్యుత్ శక్తి లేదు," అని సంఘ సంస్థల జ్ఞానము చెప్పుచున్నది. కానీ వారు చెప్పుచున్న మాటలకంటే విశ్వాసము శ్రేష్ఠమైన దానిని ఎరుగును. వారు దానిని స్పర్శిస్తూ అనుభూతిని చెందుతున్నారు. విశ్వాసము క్రియ చేయుటను వారు చూచుచున్నారు. అది ప్రకాశించుటను వారు ఎరుదుగురు, అది ఏమి చేయుచున్నదో వారు దానిని ఎరుగుదురు.
విద్యుత్ శక్తి విశ్వాసమై వున్నది, అది ఆత్మ సంబంధమైనది. జ్ఞానము సంఘసంస్థ యొక్క రూపించిన రూపమైవున్నది. తండ్రి యొక్క వాక్యమునందలి విశ్వాసము నుండే యేసును శోధించడానికి సాతాను ప్రయత్నించినది. ఇక్కడ వాడేమి చేశాడో వున్నది. వానియొక్క పెద్ద, గొప్ప మతపరమైన సంస్థలను, భూమి మీద వున్నవాటిని ఆయనకు చూపించుటకు ప్రయత్నించెను. కానీ, సాతాను ఆయనను శోధించలేకపోయాడు. "నావద్దకు వచ్చి వాటితో చేరు, నేను వాటిన్నింటి మీద నిన్ను బిషప్ ను చేస్తాను," అని దెయ్యము ఆయనతో అనెను..
"ఇలా వ్రాయబడివున్నది," అని యేసు చెప్పెను. అవునండీ. సాతాను ఆయన్ను శోధించలేకపోయెను. లేదండీ! ఆయన ఈ కార్యములన్నిటికంటే ఉన్నతమైనవాడు.
JOHN 1:14
195కానీ, యేసు వాక్యమైవుండెను. ఆయన తానే వాక్యమైవున్నానని తనను గూర్చిన విశ్వాసముతో మోషేవలె… ఎలా, మోషే తాను ఏమైవుండెనో అతను ఎరిగియుండెను. అతను దేవుని యొక్క సేవకుడని మోషే ఎరిగి వుండెను. అతడు దేవుని చేత పిలువబడినవాడని ఎరిగియుండి, తానేట్లు చేయబోవుచున్నాడో దానిని అతడు ఎరిగియుండెను. అందువల్లనే సాతాను చెప్పిన దానికి అతడు భయపడలేదు. సాతాను అతడిని శోధించుటకు, భయపెట్టి తన కర్తవ్యము నుండి వెళ్ళగొట్టుటకు ప్రయత్నించినది, కాని మోషే తాను ఎక్కడ నిలిచియున్నాడో ఎరిగియుండెను. అది నిజము.
ఇప్పుడు, నేను తొందరపడడలసి వున్నది. ఇక్కడ పేజి వెంబడి పేజీని వదిలిపెట్టుచున్నాను.
1COR 4:18-20•
1JN 2:19
196పౌలు (ముగించేముందు ఒక విషయము ఇక్కడకు తీసుకురావాలనుకుంటున్నాను), ఆయనకు సమర్పించెదనని తన కాలములోవున్న తన భాగమైన వధువుకు స్పష్టముగా దానిని వివరించి చెప్పెను. (పౌలు వధువులో కొంత భాగము తీసికొని వచ్చును; దానిని మీరు నమ్ముతున్నారా?) పౌలు తన వధువు భాగమునకు స్పష్టముగా వివరించెను, అంత్యదినములలో యేసుక్రీస్తుకు వధువును సమర్పించెదనని చెప్పెను. జ్ఞానముతోనా లేక విశ్వాసముతోనా? దేనితో సమర్పించును? ఇప్పుడు కొంచెము చదువుదము. మీరు I కొరింథీ 4వ అధ్యాయము తిప్పాలని కోరుచున్నాను. I కొరింథీ 4వ అధ్యాయము మనము చదువుదాము, మనము కొద్ది నిమిషాలలో ముగించబోవుచున్నట్లు I కొరింథీ 4వ అధ్యాయము 18 నుండి 20వ వచనము వరకు. సరే, ఇక్కడ మనము వున్నాము:
నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు.
ప్రభువు చిత్తమైతే, త్వరలోనే మీవద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలిసికొందును.
అది మీకు తెలుసు, అది… రోమా సంఘము అక్కడ నుండి ఎదుగుచూ లోపలికి ప్రవేశించుట ప్రారంభించెను, అతనికీ తెలుసు… పరిశుద్ధ గ్రంథము ఏమి చెప్పుచున్నదో దానిని మీరెరుగుదరు, "వారు మావద్దనుండి బయటికి వెళ్ళారు, ఎందుకుంటే వారు మనలోనివారు కాదు." మీరు చూశారా? అది సత్యము.
దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే వున్నది.
1COR 4:20,21
197చూశారా? మాటలతో కాదు: "మంచిది, నేను చదువుకొన్నవాడిని. సోదరుడా, నీవు చదువుకొన్నదానికంటే ఇంకా ఎక్కువ నేను చదువుకొన్నాను. నేను ఒక యాజకుడిని. నేను…" అని నీవు చెప్పవచ్చును. చదువుకి, దీనికి ఏ సంబంధము లేదు; ఒక పంది కంటే నీవు ఎక్కువేమి కాదు, మరియు దేనికంటే నీవు ఎక్కువ కాదు, చూడండి, చూశారా? దానికి దీనితో ఏ సంబంధము లేదు, చూశారా. నీకంటే దెయ్యానికి కూడా ఎంతో ఎక్కువ జ్ఞానమున్నది, చూశారా. మంచిది, చూశారా.
దేవుని రాజ్యము మాటలతో కాదు గాని… శక్తితో వున్నది. [చూశారా?]
అప్పుడు మీరు ఏమైవున్నారు? నేను మీ యొద్దకు బెత్తముతో రావాలా? లేక ప్రేమతోనా? లేక… దీన మనస్సుతోనా?
1COR 2:1
198ఇప్పుడు, 2వ అధ్యాయము (నేను దీనిని ముగించు ముందు సంపూర్తి చేయాలనుకుంటున్నాను), 2వ అధ్యాయము (పేజీ తిప్పండి), మొదట మనము అక్కడ ప్రారంభించెదము, పౌలు ఏమి చెప్పుచున్నాడో ఇప్పుడు గమనించండి, అతడు ఇప్పుడు వధువును గూర్చి ఏమి చెప్పుచున్నడో గమనించండి. అతడు ఈ భాగమైన వధువును క్రీస్తునకు సమర్పించబోవుచున్నాడు. దానిని వారు తెలుసు కోవాలని అతడు ఆశించుచున్నాడు… ఇప్పుడు, గుర్తుంచుకోనండి, పౌలు ఒక రకమైన జ్ఞానము కలిగివుండెను… అతడు జ్ఞానవంతుడు, అతడు జ్ఞానము కలిగి వుండెను, కానీ దానిని అతడు మర్చిపోవలసి వచ్చిందని, అతడు చెప్పాడు. అతనికి అన్ని రకముల డిగ్రీలు మరియు విద్య వుండెను, కానీ క్రీస్తును ఎరుగుట కొరకు అతడు దానినంతా మర్చిపోవలసియుండెను (ఇప్పుడు చూడండి!) క్రీస్తును ఎరుగుట కొరకు.
"సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చునప్పుడు వాక్చాతుర్యముతో రాలేదు, లేక జ్ఞానము…" [చూశారా? నేను జ్ఞానముతో రాలేదు], దేవుని యొక్క సాక్ష్యమును మీకు రుజువుపరిచాను.
1COR 2:1-5
199ఇప్పుడు, నేను డాక్టర్ ఫలానా మరియు ఫలానా మరియు నాకు అన్నీ వున్నవి… నేను వేదాంత పాఠశాలలయందు బోధిస్తాను, అది-ఇది," అని చెప్పలేదు. లేదు, లేదు! పౌలు ఇలా చెప్పెను, "నేను మీయొద్దకు జ్ఞానముతో రాలేదు." ఇప్పుడు నా యొక్క అంశము ఏమిటి? "జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసము," చూశారా. "నేను మీయొద్దకు జ్ఞానముతో రాలేదు," అని పౌలు చెప్పెను. "దేవుని యొక్క సాక్ష్యమను జ్ఞానముతో వచ్చాను," అని చెప్పెను. "ఇప్పుడు, ఇక్కడ చూడండి, నేను మీకు చెప్పుచున్నాను, నేను వేదాంత కళాశాలలో అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి అని నేర్చుకున్నాను. ఆ విషయముల అర్థము అది కాదని, సెమినరీల ద్వారా నేర్చుకున్నానని చెప్పుటకు నేను మీ యొద్దకు రాలేదు, సోదరులారా!" అని అతడు చెప్పెను. ఇప్పుడు, అతడేమి చెప్పాడు?
యేసు కాకుండా మరి దేనిని మీమధ్య ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు సిలువవేయబడిన ఆయనను.
మరియు బలహీనతతోను, భయముతోను, ఎంతో వణుకుతోను మీయొద్దనుంటిని. [నేను మీతో వుంటిని.]
నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తియ్యని మాటలు ఉపయోగించక… [ఆహా! బూత్-క్లిబ్బోర్న్ చెప్పినట్లు, "హల్లో, అప్పుడు ఎవరు తట్టారు?" అని ప్రకటించుటకు నేను వేదాంత పాఠశాల జ్ఞానముతో మీయొద్దకు రాలేదు.], కానీ పరిశుద్ధాత్మయు, దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని:
అది మీ యొక్క [విశ్వాసము] విశ్వాసము, మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనకూడదు, కానీ దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెను.
అమేన్! దానిని మీరు నమ్ముచున్నారా? "మీ విశ్వాసము సంఘసంస్థల జ్ఞానము మిద ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని వుండవలెను. మీ యొక్క ఆశలు…"
GEN 13:9•
GEN 25:24,33•
NUM 16:9•
1KGS 22:6,14•
2COR 6:17
200ఈ రెండు ఆధారములు ఏదేను నుండి విభేదించుకొంటూనే వున్నాయి. దేవుని యొక్క విశ్వాసమునకు విరుద్ధముగా సాతాను యొక్క జ్ఞానము. దేవుని యొక్క విశ్వాసముతో సాతాను యొక్క జ్ఞానము ఎన్నటికీ కలువదని ప్రతీకాలమందు దేవుడు దానిని రుజువు చేసెను; దేవుని విశ్వాసము ప్రత్యేకముగానే ఎదగవలయును.
ఇప్పుడు, త్వరగా ప్రతీ దానిమీద ఒక మాట, రెండు మాటలు చెప్పుకుంటూ వెళతాను, నేనిక్కడ వ్రాసుకొన్న కొన్ని అంశములున్నవి.
ఏశావు మరియు యాకోబు ఒక పరిపూర్ణ మాదిరి. ఇద్దరూ కూడా భక్తిగలవారు, ఇద్దరు కవలలు. మతపరమైన దానికి ఏశావు మాదిరి. జ్ఞానముకలిగిన ఒక మనిషి, మంచి నీతినియమాలు మరియు ఆ విధమైనవి అనేక కార్యములు అతను కలిగియున్నా కానీ, ఆ జన్మహక్కు విషయమునందు అతని మంచి కార్యములేమియు ఉపయోగపడలేదు. యాకోబు తాను చేయుచున్న కార్యములేమిటన్న దానిని గురించి ఏమి పట్టించుకోలేదు. కానీ, తాను పొందుకోవాలనుకున్న జన్మహక్కును అతడు పొందుకొనెను. ఏశావు మరియు యాకోబు ఇద్దరు కలిసి ఒక చోట వున్నంతవరకు వారు దేనిని ఉత్పత్తి చేయాలో దానిని వారు ఉత్పత్తి చేయలేకపోయిరి. అది నిజమే కదా! వారు ఒకరికొకరు వ్యతిరేకముగా వుండిరి. దానిని మీరు గ్రహించారా? ఆమేన్! దేవుడు చెప్పెను, "దాని మధ్యనుండి బయటకు రా; నీవు వేరుపడు, మరియు వారియొక్క అపవిత్రమైన వాటిని ముట్టకూడదు; నేను నిన్ను అంగీకరించెదను," చూశారా.
దేవుడు యాకోబును ఆశీర్వదించుటకు ముందు అతడు సంఘశాఖకు చెందిన తన సహోదరుని నుండి వేరుగా విడిపోవలసియున్నది. అదే సంగతిని గూర్చి దేవుడు అబ్రాహామునకు చెప్పెను. ఇశ్రాయేలు , మోయాబు, నాలుగువందల మంది ఇశ్రాయేలీయుల యొక్క ప్రవక్తలు, మీకాయా ప్రవక్త ముందు నిలువబడిరి. వారినుండి మీకాయ తన్నుతాను వేరుపరుచుకొని, దేవుని వాక్యమును పొందుకొని మరియు దానితో వెనకకు వచ్చెను. మోషే మరియు కోరాహు, అదే విషయము, వారిరువురు కలవలేకపోయిరి, వారు విడిపోవాలి. అది నిజమేనా?
GEN 13:14,15
201అబ్రాహాము మరియు లోతు. లోతు మతపరమైన భక్తిని కలిగినవాడు, అతడు నులివెచ్చని సంఘానికి మాదిరి. కానీ లోతు అబ్రాహాముతో కలిసివున్నంత కాలము అతడు అబ్రాహాముతో పాటు సంవత్సరాలు ప్రయాణించాడు, అయితే అతడు - దేవుడు అబ్రాహామును ఆశీర్వదించలేదు, అబ్రాహాము పూర్తిగా దేవునికి లోబడి, సంఘ శాఖకు మాదిరియైన లోతు నుండి వేరైయ్యే వరకు దేవుడు అబ్రాహామును ఆశీర్వదించలేదు. తనకు తానుగా అబ్రాహాము వేరుపడిన వెంటనే మరియు లోతు నుండి వేరై దూరముగా వుంటూ ఒంటరిగా నడిచెను. అప్పుడు, దేవుడు చెప్పెను, "ఇప్పుడు, అబ్రాహామా! లేచి నిలబడు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షణములు చూడు; అది అంతా నీకు సొంతము." కానీ, అతను పూర్తిగా వేరైయ్యే వరకు ఆయన దానిని చేయలేకపోయెను. అది ఖచ్చితమైన సత్యము.
GEN 4:15,16•
GEN 5:3
202దేవుడు షేతును కయీను నుండి వేరైయ్యే వరకు ఆశ్వీరదించలేదు. ఆయన కయీనుకు ముద్రవేసి అతనిని నోదు దేశములోనికి పంపించి వేసెను. కను తనయొక్క తెలివి, జ్ఞానముతో శాస్త్రజ్ఞులను మరియు మొదలగు ప్రావీణ్యులను కలిగియుండి, జ్ఞానయుక్తమైన పంటను పెంచెను. మరి షేతు నీతియుక్తమైన దానిని అనుసరించుచూ దేవుని ప్రేమయందును మరియు దేవుని వాక్యమందు, విశ్వాసమునందు ఉంటూ అంత్యదినములలో జనులనుద్దేశించి హెచ్చరించే ఒక ప్రవక్తను ఉత్పత్తి చేయు పంటను పెంచెను, తద్వారా ప్రతీ విశ్వాసిని రక్షించెను; బుద్దీపూర్వకమైన జ్ఞాసముగల వారందరినీ అది నాశనముచేసి విశ్వాసమునందున్న వారినందరిని రక్షించెను. మానసిక శాస్త్రములో అన్ని డిగ్రీలు లేక మొదలగువాటిన్నింటిని వారు కలిగివున్నను, వారు దేవుని తీర్పునందు నాశనమైపోయిరి.
LUKE 13:3,5•
JOHN 3:15,16
203నిజమైన దేవుని యొక్క ఆత్మతో తిరిగి జన్మించిన వారికి, వాక్యము యొక్క ప్రతీ మాటను విశ్వసించు విశ్వాసులకు విరుద్ధముగా వెలుపల నిలబడు ప్రతీదియు దేవుని యొక్క తీర్పునందు నాశనమగును. వీధులలో ఒయ్యారముగా మెలికలు తిరుగుచూ, పనికిమాలిన పనులుచేస్తూ తిరుగుచున్న వీరిని చూచుచున్నప్పుడు, ఈ లోకములో వారు పనికిరాని చెత్తవలెయుండి, దేవుని యొక్క న్యాయతీర్పు దినమందు అగ్నికి భస్మమైపోయే పొట్టువంటి వారు తప్ప, మరి ఏమి కాదనే దానిని గుర్తుంచుకొనండి. అది కుళ్ళిపోవును; అది ఏకముగా కట్టబడి కుళ్ళిపోవును. స్త్రీలారా, మేల్కొనండి!
204నేను చిన్న సాక్ష్యము కలిగివున్నాను, నాకు చెప్పడానికి సమయము లేదు. కొద్దికాలము క్రిందట ఇక్కడ ఒక చిన్న యువతి కాలిఫోర్నియాలో వుండేది. నేను రహదారిపై కారు నడుపుచూ, గుడారములోనికి వారు ఆహ్వానించుటకై నేను ఎదురుచూచుచుంటిని, అప్పుడు ఒక యవ్వనరాలు అచ్చటకు వెళ్ళుచూ వున్నది. (అది సిగ్గుచేటుగా యున్నది) చూచుటకు, ఒక అందమైన యవ్వనస్తురాలు అనడానికి ఏ సందేహము లేదు, అలా ఒయ్యారముగా త్రిప్పుకుంటూ తలపై ఒక చిన్న టోపీని పెట్టుకొని, రహదారిపై తన శరీరమును మెలికలు త్రిప్పుచూ నడుచుకొంటూ వెళ్ళుచున్నది, కాళ్ళ బూట్లకు కుచ్చులతో వుండిన వాటిని వేసుకొని అలా రహదారిపై ఒయ్యారము ఒలకపోస్తూ వెళ్ళుచున్న ఆమెను దాటి వెళ్ళే ప్రతి పురుషుడు తన కారు హరన్ మ్రోగిస్తూ, ఆమె వైపు చేతులు ఊపుతూ ఆ విధముగా చేయుచున్నారు. నేను అనుకొన్నాను, (ఒకవేళ నేను బోధకుడిని కాకపోతే… మిడా నాతో ఉండియుంటే) నేను ఆమెను ఆపి ఇలా చెప్పేవాడిని, "చూడు, సోదరీ, నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నీవు అందముగానే ఉండవచ్చు, నీవు దానిని నిరూపించవచ్చును, చూడు! కార్లలో వెళ్ళేవారు నిన్ను చూసి వేగముగా బ్రేకులు కొట్టించి, వారిని బోల్తా కొట్టించి వారితో నీవు సాహసాలు చేయించగలవు. కుర్రాళ్ళు నక్కల్లాగా ఈలలు వేస్తూ, నిన్ను చూసి కేరింతలు నీవు కొట్టించగలవు. ఒంపుసొంపులను నీవు ఒకలపోస్తూ ఉండుటచే అనేక సాహసాలను నీవు వారితో చేయించ వచ్చును. కానీ, రాబోవు ఒకానొక దినముయందు నీ అందమైన శరీరములో పురుగులు ప్రాకుచూ, తిరుగుచూ నీ శరీరమును తినివేస్తాయి. ఒకవేళ నేటి నుండి ఆరు వారముల దినములలో నీ అందమైన శరీరము కుళ్ళిపోతూ సమాధిలో వుండును. కానీ, నీలోవున్న ఆ యిచ్ఛయించే నీ యొక్క ఆత్మ రాబోయే దినముల యందు పూర్తిగా దెయ్యము యొక్క పాతాళములో వుంటూ, కాలమంతా ఆ దేయ్యముతోనే అందులోనే వుంటావు."
MATT 14:33•
MATT 15:3,6•
MARK 1:1•
MARK 7:7,13•
LUKE 1:35•
LUKE 22:70•
JOHN 1:34•
JOHN 5:39•
JOHN 6:69•
JOHN 10:37,38•
JOHN 20:31•
ROM 1:3,4•
HEB 4:14
205మోషే మరియు కోరహు, లోతు మరియు అబ్రాహాము, బాప్తీస్మమిచ్చు యోహాను మరియు శాస్త్రులు, యేసు మరియు సంస్థాగతమైన ఆ దినము యొక్క సంఘములు (చూశారా) - విశ్వాసము మరియు జ్ఞానము.
"ఆ యాజకులు లేచి, మంచిది, మేము…" అని చెప్పవచ్చును.
"మేము, ఇది మా తండ్రి కోసము కలిగియున్నాము, మేము దీనిని, దానిని చేసాము," అని వారు యేసుతో చెప్పిరి.
"అవును," అని ఆయన చెప్పెను.
"అవును! మీరు, మీ ఆచారములతో దేవుని ఆజ్ఞలను ప్రభావము లేనిదిగా చేశారు. మనుషుల ఆజ్ఞలను దైవోపదేశములుగా బోధించుచున్నారు," అని ఆయన చెప్పెను.
"మంచిది, మాకు చెప్పటానికి నీవెవరవు? ఏ పాఠశాల నుండి నీవు వచ్చావు?" అని వారు అడిగిరి.
"నేను చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును, ఒకవేళ నేను మెస్సయ్యా యొక్క క్రియలు జరిగించనట్లయితే నన్ను నమ్మవద్దు, ఒకవేళ నేను మెస్సయ్య క్రియలను జరిగిస్తే నన్ను నమ్మండి," అని ఆయన చెప్పెను. "అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును, ఒకవేళ నేను క్రియలు చేయలేకపోతే, అప్పుడు దానిని నమ్మవద్దు," అని చెప్పెను.
అచ్చట ఆయన ఉన్నప్పటికీ, ఆ సంఘ సంస్థలు తమయొక్క జ్ఞానమును ఆధారము చేసికొని స్థాపించబడియుండిరి. యేసునకు విశ్వాసముండెను. దేనిలో విశ్వాసం కలిగియుండెను? తాను దేవుని కుమారుడినై యున్నాననే దానియందు ఆయన విశ్వాసము కలిగియుండెను, చూశారా. మంచిది
ZECH 4:6
206సంస్కరణ దినములలో రోమా సంఘములోయున్న పరిశుద్ద మార్టిన్.. నేనేమి చెప్పుచున్నానంటే… వారు అన్యత్వములోనికి వెళ్ళటకు ముందుగా, రోమీయులు, రోమా సంఘమునకు వచ్చుటకు ప్రారంభించినప్పుడు, మార్టిన్ అచ్చట రోమా సంఘమునకు బయట నిలువబడి, క్యాథలిక్ సంఘము యొక్క సిద్ధాంతములకు విరుద్దముగా పోరాడెను. ఆద్భుతములు, సూచనలు, ఆశ్చర్య కార్యములు చేసెను. అతడు స్థాపించిన సంఘములు మరియు అందులోవున్న వారందరూ అన్యభాషలు మాట్లాడిరి, ప్రవచనములు పలికిరి, గొప్ప కార్యములు చేసిరి మరియు దేవుని యొక్క శక్తి ఉండినది. అతను చనిపోయిన వారిని లేపెను, రోగులను స్వస్థపరచి మరియు అనేక కార్యములను జరిగించెను. అక్కడ క్యాథలిక్ సంఘము తీవ్రముగా అతనిని ఎదిరించెను. అతనిని కాల్చి చంపుటకు మరియు ఏదో విధముగా హ్యత చేయుటకు ప్రయత్నించెను. అది ఏమది? జ్ఞానము, విశ్వాసము.
ఇప్పుడు కూడా అదే సంభవించుచున్నది, దానినంతటికంటే ఇంకా మెరుగైన దానిని ఇప్పుడు మనము ఆలకించెదము. జకర్యా 4:6, ఇక్కడే నేను ముగించబోవుచున్నాను. "శక్తిచేత కాదు, బలముచేత కాదు గానీ నా ఆత్మచేత, అని ప్రభువు సెలవిచ్చెను," అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. జ్ఞానముచేత కాదు, తెలివిచేత కాదు, సంస్థలచేత కాదు, కానీ నా ఆత్మచేతనే నేను చేసెదను [ఏమిటి?] నా యొక్క వాక్యమును శక్తితో నింపుతాను.
ZECH 4:6
207శిష్యులు వాక్యమనే విత్తనమును తమలో నాటబడునట్లుగా చేసికొనిరి, అప్పుడు ఆత్మ ఆ వాక్యమును శక్తితో నింపుటకు వచ్చినది. "శక్తితో కాదు, బలముతో కాదు, జ్ఞానముతో కాదు, అర్థము చేసుకొనుట కాదు, దీనితో కాదు, దానితో కాదు, కానీ నా ఆత్మ ద్వారా," అని ప్రభువు సెలవిచ్చెను. విశ్వాసమనే నీరు దేవుని యొక్క వాక్యమును శక్తితో నింపి, అది క్రియ చేయునట్లు చేయును.
ZECH 4:6•
LUKE 12:32
208ఏది జయించును? ఇప్పుడు జ్ఞానము క్రియచేయు దానివలె కనిపించును. కానీ, అది క్రియ చేయదు, అది అలా జరుగదు, ఇప్పుడు దేవుని యొక్క పూర్తి వాక్యమును నమ్మే ఆ చిన్న సంఘము తక్కువ సంఖ్యలో వున్నట్లు కనిపించును, కానీ, మీరు దానిని గురించి బాధపడవద్దు. "చిన్న మందా భయపడవద్దు; తండ్రి రాజ్యమును మీకిచ్చుట దేవుని చిత్తమైవున్నది," అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. అది సత్యము. కావున, భయపడవద్దు, కేవలము విశ్వాసములో నిలిచి వుండండి, సరిగ్గా వాక్యముతోనే నిలచి వుండండి. వాక్యమును విడిచి పెట్టవద్దు, వాక్యముతోనే నిలిచియుండండి.
మీరు ఆయనను ప్రేమిస్తున్నారా? ఆమేన్!
మీరు ఆయనను సేవిస్తారా? ఆమేన్!
మీరు ఆయనను నమ్ముచున్నారా? ఆమేన్! ఆమేన్! ఆమేన్!
దానిని ఇప్పుడు పాడుదాము.
మీరు ఆయనను సేవిస్తారా? ఆమేన్!
మీరు ఆయనను ప్రేమిస్తారా? ఆమేన్!
మీరు ఆయనను నమ్ముచున్నారా? ఆమేన్! ఆమేన్! ఆమేన్!
మీరు ఆయనను ప్రేమిస్తారా? ఆమేన్!
మీరు ఆయనను సేవిస్తారా? ఆమేన్!
"మీరు ఆయనను నమ్ముచున్నారా? ఆమేన్! ఆమేన్! ఆమేన్!
ఓ, నేను ఆయనను ప్రేమిస్తున్నాను, మీరు కాదా? ఏమిటిది? విశ్వాసముతో, జ్ఞానముతో కాదు, విశ్వాసము ద్వారా మనము రక్షింపబడ్డాము. అది నిజమేనా? "జ్ఞానముతో కాదు, తెలివితో కాదు, నా ఆత్మతో, అని ప్రభువు సెలవిచ్చెను."
209ఇప్పుడు, వారిని సంఘములో ఇమిడిపోనివ్వండి. ఆ రాగి తీగ, అది ఒక విద్యుత్ వాహకమై యున్నది. (అంటే విద్యుత్తును తనగుండా ప్రవహింపచేయుదానిని విద్యుత్ వాహకము అంటారు - అనువాదకుడు.) ఇప్పుడు, అల్యూమినియం తీగ విద్యుత్ వాహకము కాదు, (చూచారా); అది కాదు. ఒక రబ్బరు గొట్టము విద్యుత్ వాహకము కాదు; అది విద్యుత్ నిరోధకము. (విద్యుతను తనగుండా ప్రవహింపనియదు - అనువాదకుడు.) చెక్క ఒక విద్యుత్ నిరోధకము. మనకు ఏ నిరోధకము అవసరములేదు. మనకు అది ఎంతో ఎక్కువగా ఉన్నది; మరియు అది ఎడబాటును కలిగిస్తుంది. కనుక వాహకమును మనము కోరుచున్నాము, తిరిగి జన్మించిన స్త్రీ పురుషులు, దేవుని వాక్యమును నమ్మేవారు కావలెనని ఆశించుచున్నాము.
PS 1:3-5•
JER 17:8•
JOHN 14:13,14•
REV 12:9•
REV 13:8,14
210ఇప్పుడు, విద్యుత్ ఉత్పాదనా యంత్రము (డైనమో) ఏమి చెప్పుచున్నది? "నా నామములో తండ్రిని ఏదైనా అడగండి, నేను దానిని చేయుదును." ఇప్పుడు మీరు ఏమి చేయ్యాలి? విద్యుత్ శక్తి ఉన్న స్థలమందు (ప్లగ్) కలుపబడండి. ఆమేన్! అది సత్యమేనా? కేవలము విద్యుత్ శక్తి వున్న స్థలమందు (ప్లగ్) మీరు కలుపబడండి, అదే మీరు చేయవలసినదంతా, అప్పుడు విద్యుత్ ప్రవహించటము ప్రారంభమగును.
"నీటి కాలువల యోరను నాటబడిన చెట్టువలె అతడు వుండును. అతడి ఆకులు వాడిపోవు; అతను చేయునదంతయూ సఫలమగును. భక్తిహీనులు ఆ విధముగా వుండరు. భక్తిహీనులు అలాగు వృద్ధి చెందరు." ఇప్పుడు, అది పాపి అని చెప్పడము లేదు గాని ఇచ్చట భక్తిహీనులు అని చెప్పుచున్నది. భక్తిహీనులవలె వుండు ఒకని గూర్చి అది చెప్పుచున్నది, మీరు చూశారా. అది సత్యము.
భక్తిహీనులు అలాగుండక, నీతిమంతులతో పాటు న్యాయతీర్పులో వారు నిలువలేరు. లేదండీ, వారు ఎంత మాత్రము నిలువలేరు. కనుక సమయము వచ్చింది, విత్తనము విత్తబడినది, ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో, అక్కడ ముందు నిర్ణయము అనేది ఒకే ఒక్క మార్గము.
211దానిని మీకు రుజువు చేయట కొరకు నేను ప్రకటన 12 మరియు 13 తియ్యగలను, పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, "ఈ భూమి మీదకు రాబోయే అంత్యక్రీస్తు అందరిని మోసపరచును, ఆ సంఘ సంస్థలు మరియు వారి సిద్ధాంతములలో వున్నవారిని, ఈ సంఘ సంస్థలను, వారి సిద్ధాంతములను వెంబడించుచున్న ఈ భూమి మీదనున్న వారినందరినీ వాడు మోసపరచును. జగదుత్పత్తికి ముందుగానే నిర్ణయించబడిన వారు తప్ప, భూమి మీదయున్న వారందరినీ దేయ్యము మోసగించును. కనుక సోదరుడా! నీవు దాని గురించి ఏమీ చేయలేవు, "ఆమేన్!" అని అరవడం తప్ప. ఓ, మై! నేను దానిని ప్రేమించుచున్నాను, అవునండీ!
నీవు ఆయనను ప్రేమించుచున్నావా? ఆమేన్!
నీవు ఆయనను సేవించెదవా? ఆమేన్!
నీవు ఆయనను నమ్మొదవా? ఆమేన్! ఆమేన్! ఆమేన్!
పాటను మీరందరూ పాడుటకు నేర్చుకోవలెనని నేను ఆశించుచున్నాను, నాకు ఆ పాటంటే చాలా ఇష్టము. మీకు కూడా కాదా! ఈ పాట ఫీనిక్స్ కూటముల యందు పాడిన పాట, ఆ పాట అంటే నాకు ఇష్టము, దాన్ని నేను ఇష్టపడుచున్నాను. దానిని మరలా మనము పాడెదము.
మీరు ఆయనను ప్రేమించుచున్నారా? ఆమేన్!
మీరు ఆయనను సేవించుచున్నారా? ఆమేన్!
మీరు ఆయనను నమ్మొదవా? ఆమేన్! ఆమేన్! ఆమేన్!
212మంచిది, మీరు అలానే సాగుచూ వుండండి, మీకు తెలుసా? "నీవు ఆయనను ఆరాధిస్తావా?" అందరూ, మరలా మరలా పాడుచూ వుండండీ మై! ఫీనిక్స్ లో మేము ఆ పాటను పాడుటకు ప్రారంభించి పాడుచుండగా, ఆ స్థలమంతా స్థంభించిపోయి, బ్రద్దలైపోయేలా అనిపించింది. అవునండి. ఆమేన్! ఆమేన్! ఆమేన్!
నీవు ఉదయ కాలమందు విధ్యుత్ శక్తితో కలపబడి వున్నావా? ఆమేన్!
మీట (స్వేచ్)ను నొక్కండి !ఆమేన్!
నీవు విద్యుత్ శక్తిని కలిగివున్నావా? ఆమేన్! ఆమేన్! ఆమేన్!
ఇప్పుడు అది ఎదుగును. ఆమేన్!
ఫలమును ఇచ్చును, ఆమేన్!
వాటిని నీవు చూపించెదవు. ఆమేన్! ఆమేన్! ఆమేన్!
ఓ, అది ఎంతో అద్భుతముగా వున్నది, ఇంతసేపు మిమ్ములందర్ని ఇచ్చట ఈ విధముగా వుంచినందుకు క్షమించండి, నాకు మాత్రము సునాథ ఉత్సవము నందు ఉన్నట్లుగా అన్పించుచున్నది, అద్భుత సమయము. మంచిది.
213ఈ చుట్టు ప్రక్కలవుండు జనులారా, కొంచెము గమనించండి, వచ్చే ఆదివారము సహోదరుడు లిటిల్ ఫీల్డ్ యొక్క స్థలమునందు వాక్యమును చెప్పుటకు వెళ్ళెదను. బహుశా ఇచ్చట మనము ధ్యానించిన వాక్యమునందలి కొన్నింటిని తీసుకొని దేవుని యొక్క సంఘమగు వారి మధ్యన చల్లెదను. బహుశా, ఇచ్చట నేను మాట్లాడిన కార్యములో కొన్నింటిని చెప్పెదను, మీరు కూడా అచ్చటకు ఆహ్వానించబడుచున్నారు. కాని, 1500 మంది కూర్చునే ఒక చిన్న సంఘము అది, కొన్ని సంవత్సరముల క్రితము నేను ఆ ఆలయమును ప్రతిష్ఠించాను. నేనిప్పుడు వస్తానని సహోదరుడు లిటిల్ ఫీల్డ్ కి నేను మాట ఇచ్చాను. కాబట్టి ఆ చిన్న సంఘము జనులతో కిక్కిరిసిపోయింది. సహోదరుడు ఫీల్డ్ ప్రశస్తమైన సహోదరుడు, తాను మాట ఇచ్చిన దానిని కాపాడుకొను ఒక వ్యక్తి, తన శాయశక్తులా దానిని కాపాడుకొనును. ప్రభువు చిత్తమైతే, నేను అచ్చటికి వెళ్ళెదను. ఇచ్చట గుడారము నందు ఆరాధన కలదు. ఇచ్చట చుట్టు ప్రక్కలయుండు జనులగు మీరు ఇచ్చటకు రావచ్చును. పిదప రాబోయే ఆదివారము సహోదరుడు రోనాల్డ్, సహోదరుడు ఆర్గన్ బ్రైట్ ఇచ్చట వుండెదరు. సహోదరుడు రోనాల్డ్ ప్రసంగమును మీరు ఆలకించి సంతోషించ గలరనేది నిశ్చయము. సరే, మంచిది. ఇప్పుడు ఆరాధన సమయము సహోదరుడు నెవిల్ కి అప్పగించెదము. మరి ఇప్పుడతడు మనతో ఏమి చెబుతాడో చూద్దాం, ప్రభువు మిమ్ములందరినీ దీవించును, గాక!