వధువు వృక్షము యొక్క పునరుద్ధరణ

వధువు వృక్షము యొక్క పునరుద్ధరణ

1ఆర్మన్ సోదరుడా, నీకు వందనములు. ప్రభువు మిమ్ములను దీవించును గాక.

స్నేహితులారా, శుభోదయము, ఈ చక్కని ఈష్టరు ఉదయమున, తిరిగి ఆలయములో, మన ప్రశస్త ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును ఆరాధించుట, అది ఒక భాగ్యమైయున్నది.

2 నిశ్చయముగా నేను దీనిని చెప్పగోరుచున్నాను…మన సంఘకాపరి ఎన్నడైనా బోధించిన వర్తమానములలో, అతి శ్రేష్ఠమైన ఆయన వర్తమానమును ఈ ఉదయమున వినియున్నాను. నేను ఇంటికి వెళ్ళి నా భార్యకు చెప్పాను. “హనీ, నీవు పెందలకడ లేవకపోవుట వలన, నీవు ఈ ఉదయమును పోగొట్టుకొన్నావు.” నా జీవితమంతటిలో, పునరుత్థానమును గూర్చి నేను విన్నదానిలో అది శ్రేష్ఠమైనది. ఈ ఉదయమున, పునరుత్థానము మీద మన సంఘకాపరి ఇచ్చిన దానికంటే, శ్రేష్ఠమైన దేనిని నేను ఎన్నడూ వినలేదు. ఎలాటి నమ్మశక్యముకాని వర్తమానము, సమస్తమూ తిన్నగా దాని గురిమీదయున్నది. అది చూపునదేమనగా, అభిషేకము ఒక మనిషిని పట్టుకొన్నప్పుడు, ఏమి సంభవిస్తుందో, చూడండి. అప్పుడు అది ఏదో చేస్తుంది. దేవుడు మనకు ఇచ్చిన ఈ అద్భుతమైన కాపరిని బట్టి, మనకు ఎంతో సంతోషముగాయుంది.

ఇప్పుడు మీలో ప్రతీ ఒక్కరికి నేను వందనములు చెప్పగోరుదును.

3 కొన్ని సమయములలో ముందుకు వెనుకకు, కొద్ది సమయము మనము ఇక్కడ యుండియున్నాము, అయితే మీరు ఎరిగియున్నట్లుగా, ఇప్పుడు నేను పొలములోనికి వెళ్ళుచున్నాను. ఈ వారము, బ్రిటిష్ కొలంబియాలోని క్రి ఇండియన్స్ నొద్దకు వెళ్ళుచున్నాను. తరువాత అక్కడ నుండి, సెయింట్ జాన్ పోర్టు నొద్దకు, తరువాత, ఈ వేసవిలో, ప్రభువు చిత్తమైన యెడల, అంతా పశ్చిమ తీరమునకు, పైన తూర్పుకు, బయట పశ్చిమ తీరమునకు మరియు అలస్కాలోని ఎంక్రిడ్జి వరకు, అలస్కా గుండా వెళతాను. తరువాత, బహుశా, అక్కడ నుండి రాబోవుచున్న చలికాలము కూటముల కొరకు కొందరు దూతలను ఆఫ్రికాకు మిగిలిన ప్రపంచమునకు పంపుచున్నాను. కాబట్టి నేను తిరిగి ఆలయమునకు వచ్చేటప్పటికి బహుశ కొద్ది సమయము పడుతుంది. కనీసము నేను తిరిగి వచ్చేసరికి, ఆగష్టు లేక ఆకురాలు కాలము అవుతుంది.

4 మీరు చేసిన సమస్తమును బట్టి, మీ యొక్క చక్కని సహకారమును బట్టి మీ అందరికి నేను కృతజ్ఞతను చెపుతాను. ఈ ఉదయ సమయములలో మనకు ఎప్పుడూ ఎక్కువ స్థలము లేనందువలన, మేము చింతిస్తున్నాము. మీరు ఎరిగియున్నట్లుగా ఈ కూటముల కొరకు పెద్ద ఆలయమును కట్టు నిర్మాణపు పనిలో ఇప్పుడు మేము యున్నాము. కాబట్టి ఇప్పుడే అది తిన్నగా ప్రభావితమవుతుంది. వారు ఆలయము మీద కట్టుట ప్రారంభిస్తారు.

5 మీ బహుమానములను బట్టి, జన్మదినము కార్డులను బట్టి, ఈష్టర్ కార్డులను బట్టి, బిల్లీకి మీరు ఇచ్చిన బహుమతులను బట్టి, సహోదరుడు ఉడ్ వారిలో అనేకమంది ఇచ్చిన వివిధమైన వాటిని బట్టి, వారిలో ప్రతీఒక్కరికి నేను కృతజ్ఞత తెలుపుచున్నాను, వాళ్ళందరిని నేను మెచ్చుకొంటాను.

6 ప్రతీ ఒక్కరు వచ్చి ఇలా అంటారు…అది ఎలాటి భారమైయున్నదో నీకు తెలియదు. ఎవరో వచ్చి ఇలా అంటారు. “ఇప్పుడు మేము సోదరుడు బ్రెన్హాంను చూడగోరుచున్నాము. మేము నీ తండ్రిని చూడాలి,” “ఈ పట్టీ నిండిపోయిందని” అంటారు. ఓ, అలాగైతే నీకు ఎన్నో యున్నప్పుడు, ఇబ్బందిని పెట్టే స్థితిని నీపై యుంచుతుంది; నీవు చేయగలిగినది అంతమట్టుకే.

7 ఆలాగున ప్రతీ ఒక్కరిలో దీర్ఘ సమయము ఉంటే బాగుంటుందని నా ఆశ. దానిలో కొంత చేయాలని నా నిరీక్షణ. అయితే ఈ భూమి మీద అది జరుగదు, కారణమేమనగా ప్రపంచమంతటి నుండి ప్రజలు ఇక్కడకు వస్తున్నారు, చూడండి. ఈ వారము, అనేక దేశముల నుండి ప్రజలు ఇక్కడకు వచ్చియున్నారు, మరియు ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన వారితో ముఖాముఖిగా దర్శనములు చేయబడి, వారి కొరకు ప్రార్థించుట జరిగింది.

8 అది ఇక్కడేయున్న జఫర్ సన్ విల్ లోని మన చిన్న స్థానిక సంఘమైనట్లైతే, నేను సంతోషముగా రెండు, మూడు గంటలు ప్రతీ ఒక్కరితో తీసుకొని, తిన్నగా కలుపు తీసినట్లు వారిని ముగించగలను. కానీ, చూడండి, అక్కడ రెండు లేక ఐదు కాల్స్, తిన్నగా మన స్థానిక ప్రజల నుండి వస్తుండగా, ఈ రెండు కాల్స్ వస్తున్న సమయములోనే, ప్రపంచము చుట్టూ నుండి ఒక వంద లేక రెండు వందల కాల్స్ వస్తున్నవి. కాబట్టి, ఎక్కడ నుండో వచ్చే వేల కాల్స్ ను అక్షరాలా కనీసము తాకలేకపోవుచున్నాను. ప్రజలను చూడండి. ప్రపంచమంతటి నుండి “ఇక్కడకు వచ్చే పిలుపులు, అక్కడకు వెళ్ళే పిలుపులు,” విమానపు టిక్కెట్లను లోనికి పంపుచూ, “రండి, రోగుల కొరకు ప్రార్థించండి,” అటు వెళ్ళండి అని సమస్తమూ చేస్తున్న వారు, కాని నీవు దానిని చేయలేవు.

9 కాబట్టి ప్రజలు నిరుత్సాహ పడుతున్నారు. నేనును నిరుత్సాహపడుచున్నాను. కాని సరిగ్గా ఈష్టరు ఉదయమున, నా ఒప్పుకోలులో చెప్పినట్లుగా, దానిని గూర్చి ఏమి చేయాలో నాకు తెలియదు. మీకు తెలుసా, చేరుకొనవలసిన వారు, ప్రపంచమంతటి నుండి అక్కడ ఎందరోయున్నారు, వేలకొలది ప్రజలున్నారు. మీరు ఎరిగియున్నట్టుగా, ప్రపంచము చుట్టూ నేను నా ఏడవ యాత్రను ప్రారంభించాను. మరియు వ్యక్తిగతముగా పది లక్షల మంది ప్రజలతో నాకు బాగా వ్యక్తిగత సంబంధమున్నది.

10 కాబట్టి అది ఎలాయుంటుంది, ఎలాటి ఒత్తిడిని అది నీపై యుంచుతుందో, మీరు ఊహించగలరు. అనేకసార్లు చిన్న ఒత్తిడులను మనము తాకుతాము, మీరును తాకుతారని నాకు తెలుసు, చిన్న నిరుత్సాహములు. అయితే నేను కలిగియున్న వాటిని గూర్చి ఆలోచించండి, నేను కలిగియున్న నిరుత్సాహములు, రోగులుగాయున్న తల్లులు ఫోను మీద పిలుస్తూ యుండగా, “‘ఓ, దేవా…’ సరే, ఒక్క నిమిషము ఆగండి. బ్రెన్హాం సోదరుడా. ‘ప్రభువైన యేసు, నీవు ఆయనను ఇక్కడకు పంపుము.’” సరిగ్గా మరొకరి నుండి ఫోనును వ్రేలాడదీయుట, ఇక్కడ, మరియు ఇక్కడ, అక్కడ, ప్రపంచమంతటా అది ఎలా యుంటుందో నాకు తెలుసు. ఫోను అవతలవైపున ఎవరో రోగిగాయున్న బిడ్డతో, లేక రోగిగాయున్న భర్తతో లేక చనిపోవుచున్న భార్యతో నన్ను రమ్మని ప్రార్థించుచున్నారు. ఇప్పుడు నీవు ఊహించవచ్చు.

11 ఆశ్చర్యము కాదు, నేను నరముల బలహీనతగలవాడను…నన్ను నరముల బలహీనత గల ఒకనిగా తయారుచేయుటకు అది చాలు. అయితే నేను చిక్కైన గుణ లక్షణమును కలిగియుండుటకు బదులుగా, నేను ఈ ఒక్క కార్యమును చేశాను. నన్ను నేను తిన్నగా పట్టుకొనియుండుటకు ప్రయత్నించి, కల్వరిపై నా నేత్రములను యుంచి ముందుకు సాగుచు, సరిగ్గా ఆయన నన్ను ఏమి చెయ్యమన్నాడో ఎదురుచూస్తాను. నా పొరపాట్లు ఎన్నో యున్నాయి, ఆ పనులను బట్టి దేవుడు నన్ను క్షమించాలని నేను ప్రార్థన చేస్తాను. బహుశా నేను ఒక స్థలమునకు వెళ్ళవలసియుంటే, నేను ఆ స్థలమునకు వెళ్ళలేదు. నేను కేవలము మానవమాత్రుడను…పొరపాట్లు చేయుటకు బద్దుడనైయున్నాను.

12 అక్కడ ఒక చిన్న, పూజ్యనీయమైనది ఈ ఉదయమున ఆ వెనుక పెరట్లో నేను సూర్యోదయపు ఆరాధన నుండి బయటకు వెళ్ళుచుండగా అక్కడ నాకు చెప్పింది.

13 నేను ఒక ప్రశస్తమైన పాత స్నేహితుని కలిగియున్నాను, అతడు బహుశా ఇక్కడ ఎక్కడో యుండవచ్చు. అతడు చికాగో వాసి. అతని పేరు స్టీవర్ట్. అతడు…ఎడ్ స్టీవర్టు. అతడు డెబ్బది సంవత్సరముల మధ్య ప్రాయములో లేక కొంచెము ఎక్కువ వయస్సు గలవాడు అని నేను ఊహిస్తాను. అతడు బయట నన్ను కలుసుకొన్నాడు. అతడు దశమభాగపు సొమ్మును అణాలలో దాస్తాడు. అతడు అణాల చిల్లరతోయున్న ఒక పెద్ద సంచిని నాకు ఇచ్చాడు. ఆ విధముగా. ఓ, నాకు తెలియదు…నిజానికి అవి విదేశీ సువార్త పొలములోనికి వెళ్తాయి.

14 సోదరుడు స్కాజ్స్, నాకును అతనికి మంచి స్నేహితుడు, అతడు లియోనార్డ్ స్కాజ్స్, ఇండియానాలోని లోవిల్ నుండి వచ్చిన అతడు అక్కడ నిలబడియున్నాడు. ఇదివరకు ఎన్నడూ అతడు నాకు తెలియదు; అతడు ఒక తాపీ పనివాడు. అతడు అతని మీద తాపీ పనివాని గుండీని కలిగియున్నాడు. మనము ఇటుక పని యొక్క క్రమమును గూర్చి మాట్లాడుచున్నాము.

15 కాబట్టి వృద్ధ సోదరుడైన స్టీవర్టు నాతో ఇలా అన్నాడు, “బ్రెన్హాం సోదరుడా, నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నీతో మాట్లాడాలనుకొనుచున్నాను.” ఈ ఉచ్ఛరణను క్షమించండి. “కానీ,” అతడన్నాడు, “టర్కిష్ దేశములోని ఉంపుడుగత్తె దగ్గరకు వెళ్ళుట కంటే, నీ దగ్గరకు రావడం చాలా కష్టం.”

16 ఈ మధ్యనే ఒకరు నాతో ఇలా అన్నారు. “ఆయనను చేరుట అంత కఠినము కాదని నేను సంతోషిస్తాను.” బాగుంది, ఆ విధముగా యుండుట నా భావము కాదు. నేను ప్రజలను ప్రేమిస్తాను. కాని నేను…కొంచెము ఊహించండి…

17 నేను ఇంటికి వెళ్ళి నా భార్యకు చెప్పాను, మేము బల్ల దగ్గర కూర్చొని నవ్వియున్నాము, టర్కీ దేశములోని వేశ్య నొద్దకు చేరుట ఎంత కఠినమో నీకు తెలుసా. కాబట్టి…కాబట్టి నేను…

18 స్టీవర్టు సోదరుడా, నీవు ఇంకనూ ఇక్కడ యున్నట్లైతే, అది అంత ఇబ్బంది కాదు అని నేను నమ్ముతాను. కానీ నిశ్చయముగా అది ఒక రకమైన హాస్యముగా, మేము లోలోపన నవ్వుకొనునట్లు చేసింది.

19 కాబట్టి, ప్రతీ ఒక్కరిని చూడాలని నేను కోరతాను మరియు నేను ప్రతీ ఒక్కరిని ప్రేమిస్తాను. అది సత్యము. అతడు స్నేహితుడైనా లేక శత్రువైనా, అది ఒకే రకముగా యుంటుంది.

20 ఇప్పుడు నిశ్చయముగా రాబోవుచున్న కూటముల కొరకు, నిశ్చయముగా నేను మీ ప్రార్థనలను ఆశించుచున్నాను. నేను ఇండియన్లు మధ్యకు వెళ్ళుచున్నాను. నీకు తెలుసా, నీవు రోములో యున్నప్పుడు, నీవు ఒక రోమన్ గా యుండవలెను, నీవు ఇండియన్లు మధ్య యున్నప్పుడు, నీవు ఇండియన్ల వలే జీవించాలి.

21 నా మిషనరీ స్నేహితుడు, అలాగా నాతో వేటాడు భాగస్వామియగు అతడు, అలస్కా రాజ మార్గములో యున్నాడు మరియు నేను అతనితో యున్నాను. ఒక చక్కని యవ్వనస్థుడు, అతని భార్య, ఒక చక్కని కుటుంబము నుండి వచ్చారు. అతని చేతులు తినివేయబడినవి, చెవులు వెనుక అంతా తినివేయబడింది. దాని విషయము ఏమిటి అని నేను ఆశ్చర్యపడ్డాను, “అతడు తామర వ్యాధిని కలిగియున్నాడా?” దోమలు మరియు నల్లులు ద్వారా అది వస్తుంది, అక్కడ అతడు ఎలా జీవించవలసియున్నదో…కాబట్టి వారిని క్రీస్తు కొరకు సంపాదించుటకు, నీవు తిన్నగా ఆ ప్రజలతో జీవించవలసియున్నది. వారు క్రీస్తు యొక్క వారసత్వమైయున్నారు. ఆ ప్రజల కొరకు, ఆయన ఎవరి కొరకు చనిపోయారో వారు ఆ ప్రజలైయున్నారు మరియు తప్పక ఎవరో వారి యొద్దకు వెళ్ళాలి.

22 నేను ఈ మధ్యనే జరిగించిన ఉత్తరాది కూటములలో ఒక చోట ఆ నాయకుడు ఉండియున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆ కూటములలో ఆ విడిది స్థలములో, (అది టూరిష్టు కోర్టు అని నేను అనుకొంటాను), ఆ గ్రౌండ్ లో అతని యొక్క పేరు పిలవబడింది, అతడు ఎవరో, అతడు ఏమి చేసియున్నాడో అంతా చెప్పబడింది. ఓ, అయ్యో, అది అతనితో దానిని పరిష్కరించింది. అది సర్వశక్తి గల దేవుని నుండి రావలసియున్నదని, ఏ మానవమాత్రుడు దానిని చేయలేడని అతడు ఎరిగియుండెను.

23 కాబట్టి, ఆ తీరమున అంతా పైకి క్రిందకు, ఆ నాయకుడు పేల్చివేసియున్నాడు మరియు ఒక ప్రయాణపు పడవలో ఈ కూటములను తీసుకొని వెళ్ళగోరుచున్నాము, మేము దాని ద్వారా వెళ్ళగలిగే స్థలములకు, పోర్ట్ లాండ్ కు, ఇంకా ముందుకు, తీరమున యున్న ఇతరుల వరకు, క్రీ ఇండియన్స్ వరకు, మర్చిపోబడిన ప్రజల వరకూ వెళతాము. పెద్ద కూటములను కలిగియున్న అనేకమంది సోదరులు, వారి యొద్దకు వెళ్ళలేరు. ఇప్పుడు, ఇండియన్లు…

24 అక్కడ ఒక్క పైసా డబ్బు లేదు…మీరు ఎరిగియున్నట్లుగా, నా కూటములలో ఎన్నడూ నేను కానుకను తియ్యను. నేను డబ్బును తీసుకొనను. కాని ఇక్కడయున్న సంఘము, ఇండియన్ల కూటము కొరకు సహాయము చేయుచున్నది. ఆ దీనులైన, విద్యలేని ఇండియన్లకు రక్షణ మరియు విడుదల వర్తమానమును తెచ్చుటకు, మీలో కొందరి దశమభాగములు దాని కొరకు చెల్లించబడతాయి.

25 అన్నిటి తరువాత, మీకు తెలుసు, వారు అమెరికా వారైయున్నారు. మనము విదేశీయులము, మీరు చూడండి. మనము లోనికి వచ్చి వారి నుండి ఈ దేశమును తీసుకొనియున్నాము. మనకు అది కావాలి…వారికి వారి దేశమును నేను తిరిగి ఇవ్వలేను, కాని క్రీస్తులోని నిరీక్షణలను నేను వారికి ఇయ్యగలను. అది మన అందరినీ ఏకముగా సహోదరత్వముతో ఆ దేశములో యుంచుతుంది. అక్కడ యుద్ధము ఉండదు మరియు ఒకరి నుండి ఒకరు దేశమును లాగుకొనుట ఉండదు. అది అందరికి స్థలమున్న ఒక దేశముగా యుంటుంది. నా ప్రియులందరు రక్షించబడి, ఆ సమయమునకు సిద్ధమైనట్లైతే, ఆ సమయము వచ్చినప్పుడు నేను కృతజ్ఞుడుగా ఉంటాను.

26 ఇప్పుడు నేను మాట్లాడుచుండగా, ఆ చుట్టూ కూర్చొనియున్న అనేకమంది స్నేహితులను నేను చూస్తాను. నేను ఒక సహోదరిని గమనిస్తున్నాను అని నేను నమ్ముతాను…నేను ఆమె పేరును ఆలోచించలేను, అది లీయై యుంటుంది. అది నిజమేనా? నీవు శ్రీమతి లీవే నా? నీ కుమార్తెలలో స్వస్థత పొందిన ఒక కుమార్తె ఇక్కడయున్నది? అది చక్కగాయున్నది. ఒకరు మంచి సమరయుని గృహములో యున్నారు, లేక కాదో…దాని పేరు ఏమని పిలవబడుతుంది? “సహోదరీ…” (ఏదో ఒక కాథలిక్ సంస్థ) “లేడీ ఆఫ్ పీస్,” దాని పేరు అదియే. ఆ కాథలిక్ పేర్లన్నిటినీ నేను కలగలుపు చేస్తాను. కాబట్టి ఆమె అక్కడయున్నది…మానసికముగా నరముల ఉద్రిక్తతను కలిగియున్నది. ప్రభువైన యేసు, నేను ఆ మంచము మీద కూర్చొనియుండగా, ఆమె ప్రశస్తమైన తల్లి మరియు తండ్రి దగ్గరగా కూర్చొనియున్నారు. అది ముగించబడినదని, అది సమాప్తమైనదని ప్రభువైన యేసు ఉచ్ఛరించియున్నాడు. ఆమె అక్కడయున్నది. అది అంతయూ సమాప్తమైనది. నిజానికి, సహోదరి ఈ ఉదయమున ఎంతో కృతజ్ఞతతో యున్నదని మనకు తెలుసు.

27 ఈ మధ్యనే, కేన్సర్ వ్యాధితో చనిపోవుచున్న ప్రజలను నేను బయట చూస్తున్నాను. ఇక్కడకు చక్రాల కుర్చీలలో, చంక కర్రలతో ప్రాకుకుంటూ వచ్చారు, ఇప్పుడు వారు మామూలుగా ఆరోగ్యముగా ఈ ఉదయమున యున్నారు. ఆ ప్రపంచము సమాప్తమైనది. నా ద్వారా కాదు; కాని ఆయన ద్వారా, మన ప్రభువు మృతులలో నుండి లేచియున్నాడు, సదాకాలము సజీవుడుగా యున్నాడు. మన ప్రభువు సదాకాలము స్తుతించబడును మరియు సన్నుతించబడునుగాక, అదే నా ప్రార్థన.

28 మీరు నా కొరకు ప్రార్థన చేస్తారా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] అందరూ నా కొరకు ప్రార్థన చెయ్యండి. ఇప్పుడు, నేను దానిపై ఆధారపడతాను. నేను బయటకు వెళ్ళినపుడు, చూడండి, ఇక్కడ, ఇంటి దగ్గర, ఈ చుట్టూ అంత అద్వాన్నముగా లేదు; కానీ నీవు అక్కడకు వెళ్ళినపుడు, నీవు నిజముగా యుద్ధరంగమును తాకుతావు. ఇది తర్ఫీదుయైయున్నది.

29 మన సంఘము నా ప్రయాణమునకు ఒక క్రొత్త స్టేషన్ వాగన్ వాహనమును నిన్న కొన్నారు, ఇప్పుడు నాకున్నది పాతబడి అరిగిపోయింది. కాబట్టి నేను వార్తలను వినుటకు రేడియో త్రిప్పియున్నాను. గతరాత్రి, నేను మరియు యోసేపు, ప్రార్థన చేయుటకు వెళ్ళి తిరిగి వస్తున్నాము. అప్పుడు మేము, గ్రీన్స్ మిల్ నుండి వస్తున్నాము, మరియు నేను రేడియోను త్రిప్పాను. అది వార్తలు, వార్తలు వింటున్నప్పుడు, ఆ విశ్లేషకుడు, తన తర్ఫీదులోయున్న ఒక యవ్వనస్థుని గురించి వివరిస్తున్నాడు. అతడు ఎలా తన జేబుల నిండా ఇసుకతో నింపబడి, అక్కడ అతడు తన తలను ఎంతో క్రిందికి వంచియున్నాడు, ఆ ముళ్ళ కంచెలు గుండా ప్రాకుతూ ఆ తుపాకి గుళ్ళు పేలుచూ అతని తల మీదుగా వెళ్ళుచున్నాయి, అతడు అక్కడ కఠినమైన తర్ఫీదును తీసుకొనుచున్నాడు.

బాగుంది, దానినే మనము ఇక్కడ చేస్తున్నాము.

30 అయితే యుద్ధ రంగములో అది ఎంతో భిన్నముగా యుంటుంది. చూడండి? ఆ మర తుపాకి ఒక నిర్ణీతమైన దశకు తర్ఫీదు చేయబడి, ఒక సమయమునకు ఎక్కుపెట్టబడియున్నది. కాని యుద్ధరంగములో, అది పైకి రాగలదు లేక క్రిందికి వెళ్ళగలదు. చూడండి? కాబట్టి అది అక్కడయున్నదాని కంటే కొంచెము భిన్నముగా యుంటుంది, మీరు చూడండి.

31 మంచిది, ఇది ఇక్కడ తర్ఫీదుయైయున్నది. కానీ బయట నీవు యుద్ధ రంగములో యున్నావు, కాబట్టి ఇప్పుడు మనము శత్రువును ఎదుర్కొనబోవుచున్నాము. కాబట్టి మనము యుద్ధము చేసేవారము…ఒక చిన్న పాటను ఇక్కడ పాడతాము. పోరాటము కొనసాగుచున్నది. ఎవరికైనా ఇంకనూ ఆ పాట గుర్తుంటుంది? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.]

పోరాటము కొనసాగుచున్నది, ఓ క్రైస్తవ సైనికులారా,

ముఖాముఖిగా దృఢమైన వ్యూహము,

ఆయుధములు తళతళలాడుచు, రంగులు ప్రవహించుచున్నవి,

మంచి మరియు చెడు ఈ రోజున నిమగ్నమైయున్నవి.

అది సత్యము. చూడండి?

పోరాటము కొనసాగుచున్నది, కాని కలత చెందవద్దు,

ఆయన బలముతో బలముగా యుండుము, గట్టిగా పట్టుకొనుము;

దేవుడు మనకు తోడైయున్నయెడల, ఆయన ధ్వజము మనపైయున్నది,

అంతములో మనము జయగీతము పాడుతాము.

32 అది నిజము. ఇప్పుడు, ఎన్నో విషయములు అక్కడ నేను చెప్పవలసినవి యున్నవి, కాని నేను క్లుప్తముగా కత్తిరిస్తాను, బయట ప్రజలు కిక్కిరిసిపోయి నిలబడియున్నారు. బయటకు వారు చిన్న స్పీకర్లను కలిగియున్నారు. చిన్న ప్రసారము, నేననుకొంటాను, ప్రతి కారు ఆ ప్రసార పద్ధతిని కలిగియున్నది, అది దానితో ఆలయము నుండి కొన్ని గజములు బయటకు వెళుతుంది. కాబట్టి, ఈ ఉదయమున మనలను దర్శించుటకు వచ్చిన ప్రతీ ఒక్కరిని మనము మెచ్చుకొనుచున్నాము.

33 ఇప్పుడు, ఇంకా ముందుకు వెళ్ళుటకు ముందు, దానిని మనము చెపుదాము…ఇప్పుడు, దీని తరువాత వెంటనే, బాప్తిస్మపు ఆరాధన యున్నదని నేను అనుకొంటాను. మొదటగా, ప్రార్థనా వరుస. ఈ ఉదయమున రోగుల కొరకు మనము ప్రార్థించబోవుచున్నాము. మనము దేనిని గూర్చి మాట్లాడుచున్నామో, ఆ దృశ్యము మీదికి దేవుడు వచ్చుటయే, ఒక రుజువు అని నేను తలంచెదను, అదియే ఆయన పునరుత్థానము. ఆయన సజీవుడేనా లేక ఆయన సజీవుడు కాడా? ఇది ఒక కట్టు కథా లేక ఇది సత్యమా? ఆయన సజీవుడైయున్నట్లైతే, ఆయన ఒక వాగ్దానము చేశాడు, “నేను ఎల్లప్పుడు, యుగ సమాప్తి పర్యంతము మీతో కూడా యుంటాను.” ఇప్పుడు, ఆయన మన మధ్యకి వచ్చి, ఆయన ఇక్కడ యున్నాడని రుజువు చేసినట్లైతే, అప్పుడు దానిని గూర్చి ఇంక ఎంతమాత్రము ఊహాగానము లేదు. చూడండి?

34 మీకు గుర్తున్నదా, ప్రపంచములోని మతములన్నిలో, వారు పరిశుద్ధ దినములను, సెలవులను కలిగియున్నారు. కాని వారిలో ఏ ఒక్కరూ వారి స్థాపకుని రుజువు చేయలేరు…అతడు మరణించగానే, దానికున్నదంతా అదియే. కాని మనము, క్రైస్తవ మతము, మన స్థాపకుడు చనిపోయి తిరిగిలేచాడు.

35 మెక్సికోలో, ఈ మధ్యనే, ఆ చిన్నబిడ్డ తిరిగి బ్రతికించబడినప్పుడు ప్రెస్ వారు నన్ను ఇంటర్య్వూ చేశారు, ఆ ఉదయమున 09:00 గంటలకు బిడ్డ చనిపోయింది. మరలా ఆ రాత్రే 10:30 గంటలకు, పదిన్నర లేక పదకొండు గంటలకు, తిన్నగా వేదికనొద్దే లక్షల ప్రజల ముందు, తిన్నగా తల్లి హస్తములో యుండగా, అతను మరణము నుండి తిరిగి బ్రతికించబడ్డాడు. ఆ రాత్రి ముప్పయి వేలమంది క్రీస్తు నొద్దకు వచ్చారు. చూడండి? కాబట్టి, అప్పుడు, అక్కడ ఏమియున్నదో మీరు ఊహించగలరు.

36 ఆ చిన్న బిడ్డను గూర్చి, నా ముందు ఒక దర్శనమును చూశాను; ఆ చిన్న బిడ్డ యొక్క పేరు మరియు అతనిని గూర్చి సమస్తమును చెప్పబడింది. ఆ తల్లి ఎక్కడో వెనుక యున్నది, ప్రార్థనా కార్డును పొందలేకపోయింది, లోనికి ప్రవేశించలేకపోయింది. అయితే ప్రార్థనా వరుస గుండా ఆమె పైకి లేవలేకపోయింది. కాబట్టి, ఆ చిన్న బిడ్డను తీసుకొని వచ్చినపుడు; అది క్రుమ్మరించుచూ వర్షించుచున్నది.

37 మనము నిలబడుటను గూర్చి తలస్తాము; వారిని గూర్చి ఆలోచించండి. ఆ రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభించబడబోయే కూటముల కొరకు, వారు ఆ రోజు ఉదయమున తొమ్మిది గంటలకే అక్కడ యుంటారు. మండుచున్న ఎండలో, నీడ కొరకు ఒకరికి ఎదురుగా ఒకరు ఆనుకొని నిలబడియుంటారు. నిలబడియుండుట, కూర్చొనియుండుట కాదు; నిలబడియుండుట. ఆ విధముగానే వాళ్ళు చేస్తారు. ఆ విధమైన స్థలములో, మరియు ఆఫ్రికాలో ఆలాగున జరుగుతుంది, ఇండియా దేశములో ఒకేసారి, ఐదు లక్షల మంది కూడుకొన్నారు.

38 ఇప్పుడు, ఈ చిన్న స్త్రీ కనీసము ప్రార్థనా కార్డును పొందలేకపోయింది. అక్కడ మూడు వందలకు పైగా ద్వారపాలకులు, ప్రార్థనా వరుసలోనికి రాకుండా, ఆమెను వెనుక ఆపియుండవలసి వచ్చింది. అక్కడ నిలబడి ఆ చిన్న బిడ్డ కొరకు, ఆ చిన్న కాథలిక్ స్త్రీ ప్రార్థించుచున్నది. పరిశుద్ధాత్ముడు పిలిచి, “ఆ చిన్న బిడ్డను ఇక్కడకు తీసుకొని రమ్మని,” చెప్పియున్నాడు.

39 ఆ చిన్న బిడ్డ ఒక తడిసిపోయిన దుప్పటి క్రిందయున్నది; ఉదయము నుండి అక్కడ నిలబడియున్నది. ఆ బిడ్డ చనిపోయినదని వైద్యులు ఉచ్ఛరించియున్నారు. ఆ ఉదయమున, ఆ చిన్న బిడ్డ తొమ్మిది గంటలకు చనిపోయినదని, వైద్యులు ఉచ్ఛరించిన ప్రకటన కాపీని మనము కలిగియున్నాము. అప్పుడు రాత్రియైయున్నది, దరిదాపుగా అర్థరాత్రి. సరిగ్గా దర్శనము చెప్పిన ప్రకారము, నేను వెళ్ళి, నా చేతులను ఆ చిన్న బిడ్డపై యుంచాను. అప్పుడు ఆ చిన్న బిడ్డ బ్రతికియున్నది. వైద్యుడు సాక్షమిచ్చాడు.

40 ప్రెస్ వారు నన్ను ఇంటర్య్వూ చేశారు. కాబట్టి, ఏ ఒక్కరి విశ్వాసమునకు వ్యతిరేకముగా లేకుండా, అది బైబిలుతో యున్నంత కాలము, అది మంచిదే. అయితే నన్ను ఇంటర్వ్యూ చేయుచున్న వ్యక్తి, ఒక కాథలిక్ వాడు, అతడన్నాడు, “మా పరిశుద్ధులు దానిని చేయగలరని నీవు నమ్ముతావా?”

41 నేనన్నాను, “వారు బ్రతికియున్నట్లైతే.” అవును, నీవు ఒక పరిశుద్ధుడుగా మారుటకు చనిపోవలసియున్నదని కాథలిక్ సంఘము నమ్ముతుంది. కాబట్టి, అప్పుడు నేనన్నాను, “వారు జీవించియున్నట్లైతే, అవును.”

మరియు అతడన్నాడు, “ఓ, నీవు చనిపోవు వరకు ఒక పరిశుద్ధుడవు కాలేవు.”

42 నేనన్నాను, “పౌలు చనిపోకముందు పరిశుద్ధుడా, లేక చనిపోయిన తరువాత పరిశుద్ధుడా? అతడు ఈలాగు మాట్లాడినప్పుడు, అతడు ఎవరికి వ్రాస్తున్నాడు, చనిపోయినవారికా, ‘ఎఫెసులోయున్న పరిశుద్ధులకు’ ఒక నిర్ణీతమైన స్థలములోయున్న పరిశుద్ధులకు? ఆయన మృతులకు వ్రాయుటలేదు, నీకు తెలుసు.”

43 కాబట్టి అప్పుడతడన్నాడు, “ఇప్పుడు నీవు నీ వ్యాజ్యమును బైబిలు ద్వారా తీర్పు చేయుటకు ప్రయత్నించుచున్నావు. మేము సంఘమైయున్నాము.”

నేనన్నాను, “మంచిది, సరే, అయ్యా.”

అతడన్నాడు, “మేము సంఘము.”

44 నేనన్నాను, “అప్పుడు సంఘము దానిని చేయుటను మనము చూద్దాము.” చూడండి, కాబట్టి, అప్పుడు, సంఘము మాత్రమే దానిని చేయగలదు. అది నీకు తెలుసు.

అతడన్నాడు, “కాథలిక్ సంఘమును గూర్చి నీ అభిప్రాయము ఏమిటి?”

నేనన్నాను, “నీవు దానిని నన్ను అడుగరాదని నేను కోరతాను.” చూడండి?

అతడన్నాడు, “బాగుంది, నేను దానిని వినగోరుచున్నాను.”

నేనన్నాను, “అక్కడయున్నది ఉన్నత రూపములోయున్న దయ్యపు ఆత్మ.”

అతడన్నాడు, “దయ్యపు ఆత్మ?”

నేనన్నాను, “అవునండి”

అతడన్నాడు, “నీవు దానిని ఎలా కనుగొంటావు?”

45 నేనన్నాను, “మృతులతో విజ్ఞాపన చేయునది, పరిశుద్ధులతో సంప్రదించేది ఏదైనా, చూడండి.”

అతడన్నాడు, “బాగుంది, నీవు క్రీస్తుకు ప్రార్థన చేస్తావు. ఆయన చనిపోయాడు.”

నేనన్నాను, “అయితే ఆయన తిరిగి లేచాడు చూడండి.”

46 కాబట్టి అది మంచి కార్యము, ఆయన తిరిగి లేచాడని మనము ఎరుగుట, మనము కృతజ్ఞులము కాదా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.]

47 మన తలలు వంచి మన నీతీకరణము కొరకు ఆయన మృతులలో నుండి లేచియున్న కారణమున ఆయనకు కృతజ్ఞతను చెల్లిద్దాము.

48 పరలోకపు తండ్రీ, ఈ ఉదయమున యేసును బట్టి మేము కృతజ్ఞులము; ఈ రోజున ఆయన గొప్ప పునరుత్థానమునకు సంస్మరణగా, ఆ పండుగ ఉదయమున, ఆయన మృతులలో నుంచి లేచినపుడు, మరణము పాతాళము సమాధిపై ఆయన జయము పొందాడు. ఆయన భూమి మీదయుండగా, ఆయన వ్యాధిపై, రోగములపై విజయము పొందియున్నవాడుగా చూపించాడు. ఆ గొప్ప కడపటి శత్రువు, మరణము ఆయనముందు ఉంచబడింది. ఈష్టర్ ఉదయమున, ఆయన దేవుడైయున్నాడని రుజువు చేశాడు. కడపటి శత్రువైన మరణము ఆయనను పట్టుకొనలేకపోయింది, ఆయన మృతులలోనుండి లేచాడు. సమాధి ఆయనను వదిలివేసింది; పాతాళము ఆయనను ముందుకు విడిచిపెట్టింది; పరలోకము ఆయనను చేర్చుకొన్నది.

49 ఓ, దేవా, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో, ఆయన యొక్క కార్యనిర్వహణాధికారులుగాయుండుటకు, ఆయన యొక్క మాదిరులుగాయుండుటకు, ఆయన యొక్క సేవకులుగా ఈ భూమి మీద పరదేశులుగాయుండగా, మా హృదయము ఆయనను స్వీకరించును గాక. దానిని దయచేయుము.

50 ఇక్కడయున్న వారందరిని దీవించుము. దేవా, నిలబడియున్న ఈ ప్రశస్తమైన ప్రజలు, వారిలో కొందరు పట్టపగలు నుండి ఇక్కడ కిక్కిరిసిపోయియున్నారు. పరలోకపు తండ్రీ, నా ప్రార్థన ఏమనగా, “మేము చేయగలుగు దానికంటె లేక ఆలోచించు దానికంటే పైగా, ఈ రోజున వీరిపై అత్యధికముగా సమృద్ధిగా క్రుమ్మరించుము,” మరియు వారి లోతైన హృదయవాంఛలను దయచేయుము. ఈ ఉదయమున వచ్చిన ప్రతి ఒక్కరూ తృప్తిపర్చబడి తిరిగి వెళ్ళుదురు గాక. నీవు ఎవ్వరిని దూరముగా త్రోసివేయవు కాని మంచి కార్యములతో నీవు అతనిని నింపుతావు. అతడు ఆనందిస్తూ వెళ్ళునట్లు అతనిని పంపుము. ప్రభువా, దానిని దయచేయుము.

51 నీ యొక్క సర్వశక్తి. నీ యొక్క పరిశుద్ధాత్మ, పునరుత్థాన శక్తితో యేసు రక్తము యొక్క నీతిపై ఏ మాత్రము తక్కువ కాకుండా, మా యొక్క నిరీక్షణలు నిర్మించబడునట్లు మాలో ప్రతి ఒక్కరితో ఎంతగానో పని చేయుము. తండ్రీ, దానిని దయచేముము.

ఇప్పుడు చదువబోయే మాటలను దీవించుము.

52 మేము పెందలకడ సంఘమునకు వచ్చియుండగా, ఈ ఉదయమున చక్కని వర్తమానమును బట్టి నీకు వందనములు. నీవు మా సోదరుని తీసుకొని, కొన్ని క్షణముల క్రితము అలాటి మార్పును తెచ్చుటను చూస్తున్నప్పుడు, ఈ చనిపోవుచున్న తరము యొక్క ప్రజలకు ఒక వర్తమానమును విడుదల చేయుటను చూస్తున్నప్పుడు మేము దానిలో భాగమైయున్నాము, ప్రభువా మేము ఎలా నీకు కృతజ్ఞత చెల్లించుచున్నామో! ఓ దేవా, ఆ కార్యములను గూర్చి ఆలోచిస్తున్నపుడు, సంతోషముతో మా హృదయములు పులకించుచున్నవి. ఇప్పుడు ప్రభువా, ఆయనకు ముందున్న దినములు క్రింది వరకు ఆయనను అభిషేకిస్తూనేయుండుము.

53 ఈ చిన్న సంఘమును దీవించుము. మరియు ఇతరులకు నేను వర్తమానమును తేబోవుచుండగా నాకు సహాయము చేయుము. మేము ఏకముగా, ఒకే వ్యక్తిగా, ఒకే కుటుంబముగా, ఏకముగా అతుక్కొనిన వారమై ఏకముగా ప్రార్థిస్తూ యేసు మమ్మును ఆయన రాజ్యములోనికి స్వీకరించు వరకు, పరిశుద్ధాత్మ యొక్క పవిత్రమైన ఐక్యతతో జీవించుదుముగాక. ఆమేన్.

54 [సోదరుడు నెవిల్ చెప్పుచున్నారు, “బ్రెన్హాం సోదరుడా, మిమ్మల్ని ఒక్క క్షణము ఆపుటకు నాకు అవకాశం ఇస్తారా?”—ఎడి.] సోదరుడా, నీవు నిశ్చయముగా దానిని చేయుము. [“మా యొక్క అభినందనకు గుర్తుగా మరియు మన మధ్యలోనున్న ఒక యవ్వన సోదరుని పని ద్వారా, ఈ యొక్క చిత్రమును మేము నీకు బహుకరిస్తున్నాము, బ్రెన్హాం సోదరుడా మా యొక్క సంపూర్ణ ప్రేమ మరియు అభినందనలతో.”] నెవిల్ సోదరుడా, మరియు సంఘమా మీకు వందనములు. [“ఆ యొక్క యవ్వనస్థుడు స్టెఫీ, ఆ యొక్క బొమ్మను గీచాడు.”]

55 సోదరుడు జెర్రీ స్టెఫీ ఆ చిత్రమును గీచియున్నాడు. ఆ కుర్రవాడిని దేవుడు దీవించునుగాక. ఈ ఉదయమున నీవు ఇక్కడయున్నట్లైతే, అది చాలా బాగున్నది, జెర్రీ. అది చాలా హీనముగాయున్నది. ఒక చిత్రకారుడిగా అతడు స్కూలుకు వెళ్ళే అవకాశము ఇవ్వాలని నేను కోరుచున్నాను. దేవుడు కళలోయున్నాడని నేను నమ్ముతాను. మీరు ఆ విధముగా నమ్మరా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] దేవుడు సంగీతములోయున్నాడు. దేవుడు కళలోయున్నాడు. దేవుడు దీనిలోయున్నాడు. ఆ తలాంతు అభివృద్ధి కాకుండా, ఆ విధముగా చూచుట చాలా హీనముగాయుంటుంది. అతడు ఎంత ఎక్కువ చేస్తాడో, అతడు అంత ఎక్కువ వృద్ధి చెందుతాడు. జెర్రీ, దేవుడు నిన్ను దీవించాలని నేను ప్రార్థిస్తాను.

56 నెవిల్ సోదరుడా, నీకు మరియు సంఘమునకు, ఈ చక్కని చిత్రమును బట్టి, దాని క్రిందయున్న వచనమును బట్టి మీకు వందనములు. నేను దానిని కొంచెము తరువాత చదువుతాను. [సోదరుడు నెవిల్, “నేను దీనిని చదవాలని నీవు కోరుచున్నావా?” అని అడుగుచున్నారు.—ఎడి.] అయ్యా మంచిది. నెవిల్ సోదరుడు ఈ వచనమును చదువుతాడు. అది ఏమైయున్నదో నేను ఒక ఆలోచన చేశాను…[సోదరుడు నెవిల్ ఎవరిని గౌరవించాలో వారినే గౌరవించండి అనే దానిని చదువుచున్నారు.]

అతడు స్వరూపములో ఒక ఎత్తైన మనిషి కాడు,

అతని మార్గములో ఉన్నతమైన వాడు కాదు,

అతడు తనకై తానుగా ఏ బూరను ఊదడు

అతడు దినము నుండి దినమునకు వెళతాడు.

సంపద మరియు కీర్తి కొరకు ఆశ లేదు;

అయితే అతని స్థానమును ఎవరునూ నింపలేరు;

అతడు మేము కోరిన దారిలో సరిగ్గాయున్నాడు,

మన సొంత సోదరుడు బ్రదర్ బిల్.

నమ్మకత్వంతో అతడు మనకు బోధిస్తాడు

కల్తీలేని వాక్యము,

ఏ అలంకరణ మార్గములు లేవు, పొగడ్తలు ఇష్టము లేదు,

కేవలము ప్రభువును వెంబడించుటయే.

అతని మాట మృదువైనది మరియు మెత్తనిది

అతడు తన స్వరమును పైకి లేపడు,

తప్పుకు వ్యతిరేకముగా కేక వేయుటకు తప్ప

అప్పుడు అతడికి మరొక అవకాశములేదు.

ఎన్నడూ ఎక్కువ అభ్యసించలేదు

కళాశాలల నుండి మరియు పాఠశాలల నుండి,

కాని ఏది ముఖ్యమో అతనికి తెలుసు

నిశ్చయముగా అతడు ఎవ్వరి యొక్క వెర్రివాడు కాదు.

ఏలయనగా అతనికి ఇవ్వబడిన జ్ఞానము

నిత్యమైనది పై నుండి ఇవ్వబడియున్నది,

అతనికి ఏ సిద్ధాంతము లేదు, క్రీస్తు తప్ప

సార్వభౌమికమైన ప్రేమ తప్ప, ఏ చట్టము లేదు.

అతని యొక్క దీనమైన, అల్పమైన జన్మకు

అక్కడ ఏ గొప్ప ప్రకటనయును లేదు,

కాని మనకైతే అతడు ఒక గొప్ప మనిషి

భూమిమీద నివశించుచున్న వారిలో.

ఆయనను ఒక ఒక స్నేహితుడుగా ఎరుగుటకు

ఒక ఆధిక్యతకంటె ఎక్కువుగా మేము లెక్కిస్తాము,

అతడు నిలబడే ప్రతి దానిని బట్టి, మేము అతనిని మెచ్చుకొంటాము,

అంతము వరకు తిన్నగా మేము మెచ్చుకొంటాము.

అతడు ఒక ఉపదేశకుడు కాదని చెపుతాడు,

అతడు ఉండవలసినంత అణకువగాయుంటాడు,

కాని అతనిని వేదిక మీదకు తెస్తే

అతనిని చూచుట కష్టము కాదు.

అతడు ముందుగా నిర్ణయించబడిన ఒక ప్రవక్త,

మనుషులు దానిని ఏమని పిలుస్తారో పిలవనివ్వండి,

ఆయన మనకు సోదరుడు బిల్ ను ఇచ్చినపుడు

దేవుడు మనకు గొప్ప ఉపకారమును చేశాడు.

[“‘ఈ చిన్న గుంపు,’ సంతకం చేసియున్నది.”]

57 నెవిల్ సోదరుడా, నీకు వందనములు. మీ తలంపులకై వందనములు, దానిని ఎవరు సమకూర్చారు? [సోదరుడు నెవిల్ చెప్పుచున్నాడు, “వాళ్ల అమ్మగారు అది చేశారని నేను అనుకొనుచున్నాను.”—ఎడి.] అది…

58 ఆ చెప్పుచున్న సంగతులకు నేను యోగ్యుడను కాను, కాని ఈ లోకములోయున్న డబ్బంతటికంటె అది నాకు ఎక్కువైయున్నది. చూడండి? కొంచెము ఆలోచించండి, ఎవరో నిన్ను ఆయన సేవకునిగా గౌరవిస్తున్నారు, ఒక దేవుని సేవకుడిగా. నేను ఎల్లప్పుడు దానికి నమ్మకముగా జీవించాలని నా ప్రార్థనయైయున్నది. నా తలంపులు ఎల్లప్పుడు నీ కొరకుగా వుంటాయి. నేనును నా ప్రేమను నీకు వ్యక్తపర్చుతున్నాను.

59 ఇప్పుడు, మన దగ్గర ఎన్నో విషయములున్నాయి, అది సరిగ్గా ఒక పూర్తి రోజును తీసుకొంటుంది, మనము ఇంకా ఎన్నడూ వాక్యమునొద్దకు వెళ్ళియుండలేదు, మీరు చూడండి, ఎన్నో చక్కని విషయములు.

60 ప్రభువు నుండి నాకు ఒక దర్శనము వచ్చియున్నది, దానిని గూర్చి నేను ఒక దానిని చెప్పబోవుచున్నాను, ఒకరు ఒక కలకన్నారు, ఓ, అది ఎంతో విశేషమైనది, అది ప్రభువు యొక్క రాకడను గూర్చి.

61 ఆ వెనుకయున్న నా చిన్న కుమార్తె రిబ్కా…కొద్ది సేపటి క్రితము నేను ఆమెతో తమాషాగా మాట్లాడాను. ఆమె ఒక రకమైన పెద్ద టోపీ పెట్టుకొని వచ్చియున్నది. నేనన్నాను, “ఇప్పుడు, హనీ, అది ఒక పక్షి గూడు వలె కనబడుతుంది.” “దానిలో పుల్లలు, అన్నీ ఆ విధముగా వున్నాయి” అని అన్నాను. “వెళ్ళి ఆ టోపీ తీసివేయమన్నాను.”

62 తరువాత కొన్ని నిమిషములలో తిరిగి నా దగ్గరకు వచ్చింది; నీకు తెలుసా, నాకు దూరముగా వెనుకకు వెళ్ళింది. ఒక గొప్ప పెద్ద పోకెట్ పుస్తకాన్ని పట్టుకొని వచ్చింది. “అది ఎక్కడ నుండి వచ్చింది?” అని నేనన్నాను.

63 ఆమె అన్నది, “డాడీ,” “నేను పెద్దకాళ్ళు కలిగియున్నాను, కాబట్టి దానిని జోడీగా చేయుటకు నేను పెద్ద పోకెట్ పుస్తకాన్ని తీసుకొన్నాను.” కాబట్టి, ఓ, ఇలాటివి!

64 అయితే నేను ఆమె కారులో స్వారీ చేయుచున్నామని రెండుసార్లు కలకన్నది, మరియు నేను సమీపములోని ప్రభువు యొక్క ఆగమనమును గూర్చి ఆమెకు చెపుతున్నాను; అదే కల, రెండవసారి. నేను మూడవకల కొరకు కనిపెట్టుచున్నాను; బహుశా ప్రభువు, అలాగైతే, దాని భావమేమిటో నాకు ఇస్తాడు.

65 ఇప్పుడు, ఎన్నో విషయములు చెప్పవచ్చును, అయితే మనము వాక్యములోనికి వెళదాము.

66 ప్రతి ఒక్కరు మంచి అనుభూతిని కలిగియున్నారని, నేను ఆశిస్తాను. [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] నీవు ఆలాగుయుండనియెడల, కూటము ముగించబడక ముందు, దేవుడు నీకు మంచి అనుభూతిని కలిగిస్తాడని, ఈ కూడిక ముగించబడే సమయానికి, మన మధ్య ఒక్క బలహీనమైన వ్యక్తియుండడని నేను ప్రార్థిస్తాను.

67 ఇప్పుడు, భక్తిహీనులు కొరకు క్రీస్తు చనిపోయాడని మనము తప్పక గుర్తుంచుకోవాలి, అది మనమే. చూడండి; అది మనమే. మనలను రక్షించుట కొరకు, ఆయన చనిపోయాడు.

68 ఇప్పుడు, మీరందరూ చుట్టూ చక్కగా వినగలుగుచున్నారా? బాగా ఆ వెనుక కూర్చొన్నవారు, బాగా వినగల్గుచున్నారా? అది ఆ వెనుకకు వచ్చుచున్నదా? అలాగే, మంచిది.

69 ఇప్పుడు ఆయన వాక్యములో కొంచెము నేను చదువగోరుచున్నాను. మొదటగా ఇప్పుడు యోవేలు గ్రంథమును చూద్దాము, 1వ వచనము నుండి 4వ వచనము వరకు నేను చదువుతాను. తరువాత 2 వ అధ్యాయము, 25వ వచనము. మరియు ఆదికాండము 20:7. నేను ఇప్పుడు తప్పక మెచ్చుకొంటాను.

70 ఇప్పుడు మీరు అలసిపోయినట్లైతే, బయటకు వెళ్లవచ్చును. చూడండి? ఇది సంఘమునకు నా చివరి వర్తమానము, ఏలయనగా కొంతకాలము సంఘములో ఈ భాగము. ఈ ఉదయము ఒక స్వస్థతా కూటము కొరకు మేము ఎదురు చూస్తున్నాము. ఈ వర్తమానము, దేవుడు దీవించినట్లైతే, అది మన హృదయాలలో లోతుగా నానాలి, ఆ ప్రకారము దాని భావము ఏమైయున్నదో మనము పొందుతాము.

71 ఇప్పుడు, మనము నమ్ము విషయములను ఇక్కడ వ్యక్తపర్చుటకు మనమున్నాము, మరియు లేఖనము ఆ రీతిగా చెప్పుచున్నదని, లేఖనము ద్వారా దానిని రుజువు చేస్తాము; తరువాత దేవుడు తిరిగి దానిని రుజువు చేస్తాడు, అది సత్యమైయున్నదని, అది సరియని, దానిని యథార్థముగా చేస్తాడు. సరిగ్గా దేనివలనైనా…

72 నీవంటావు, “ఇది ప్రొద్దు తిరుగుడు పువ్వు విత్తనము.” దానిని నాటి అది ఏమైయున్నదో చూడుము. తరువాత అది ఒక ప్రొద్దు తిరుగుడు చెట్టుగా పైకి వస్తుంది, అది దానిని పరిష్కరిస్తుంది. అది ఒక ప్రొద్దు తిరుగుడు విత్తనము. చూడండి? అంతమట్టుకే.

73 ఇప్పుడు, అప్పుడప్పుడు, మీరు సీటులను మార్చుకొనగలిగినట్లైతే; కొందరు కూర్చిండి, మరికొందరు లేచి నిలబడి కొంచెము కనిపెడతారు. నేను ఎంత క్లుప్తముగా మాట్లాడాలో, అంత క్లుప్తముగా మాట్లాడతాను.

74 ఇప్పుడు గుర్తుంచుకోండి, నా కొరకు ప్రార్థించండి. సంఘమునకు నమ్మకముగాయుండండి. తిన్నగా సోదరుడు నెవిల్ తో ఇక్కడ నిలబడియుండండి. ఇప్పుడు దర్శించుచున్న ప్రజలైన మీరు, మంచిది, ఇప్పుడు, తిన్నగా వెనుకకు రండి.

75 ఇప్పుడు, ఏ విధమైన నిర్దిష్టమైన పిలుపులేకుండా, నేను ఈ కూటములపైయున్నాను. అయితే నేను సరిగ్గా ఈ చుట్టూ యుండలేను; ప్రపంచము చనిపోవుచున్నది. చూడండి? పౌలు ఒకసారి ఆ అనుభవమును కలిగియున్నాడు. అతడు మరొక దేశమునకు వెళ్ళుచుండగా, దారిలో, అతనికి మాసిదోనియా పిలుపు వచ్చింది. ఇప్పుడు, దేవుడు ఏ సమయములోనైనా మాసిదోనియా పిలుపును ఇవ్వగలడు. దేవుడు నాకు పిలుపును ఇచ్చినపుడు, నేను దేనినైనా రద్దు చేస్తాను.

76 నేను చేయగలిగిన శ్రేష్ఠమైన దానిని చేస్తున్నాను, ఈ మూలకు, ఆ మూలకు వెళ్ళి, ఇక్కడా, అక్కడా నేను విత్తనములు జల్లుచున్నాను. విసిరి, విత్తనములు నాటుచున్నాను. నాకు తెలుసు, ఆకాశ పక్షులు వాటిలో అనేకమైన విత్తనములను ప్రోగుచేసుకొంటాయి, వాటిలో కొన్ని ఎండిపోతాయి, అయితే అక్కడ కొన్ని విత్తనములు కూడా పైకి వచ్చి, మంచి నేలలో పడతాయి, మీకు తెలుసు. కాబట్టి విత్తనములను చల్లుదాము, అదే ముఖ్యమైన సంగతి.

77 ఈష్టరు వర్తమానము కొరకు, ఒక వింతైన పఠనము, యోవేలు 1వ అధ్యాయము.

పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు

పెద్దలారా, ఆలకించుడి దేశపు కాపురస్థులారా, మీరందరు చెవియొగ్గి వినుడి ఈలాటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా?

ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియజేయుదురు.

గొంగళిపురుగులు విడిచిన దానిని మిడుతలు తినివేసి యున్నవి మిడుతలు విడిచిన దానిని పసరుపురుగులు తినివేసియున్నవి. పసరుపురుగులు విడిచిన దానిని చీడపురుగులు తినివేసియున్నవి.

78 ఇప్పుడు 2వ అధ్యాయములోని 25వ వచనము.

మీరు కడుపార తిని తృప్తిపొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులను పసరుపురుగులును చీడపురుగులును అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలనిత్తును.

నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు.

79 ఆదికాండము 20వ అధ్యాయము. ఆదికాండము 20 అధ్యాయము 7వ వచనము. నేను దీనిని వెంబడించు దాని సందర్భమును నేను తీసుకొని చదువగోరుదును. దాని పూర్వ వృత్తాంతమును పొందుటకు 6వ వచనమును చదువగోరుదును.

అందుకు దేవుడు అవును, యథార్థ హృదయముతో దీని చేసితివని నేనెరుగుదును; మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నిన్ను నేను అడ్డగించితిని; అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు.

కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రదుకుదవు. నీవు ఆమెను అతనికప్పగించని యెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను.

80 ఇప్పుడు లేఖన పఠనము నుండి ఒక అంశమును తీసుకొనగోరుదును, ఆ అంశము యొక్క ముగింపు, “పునరుద్ధరణ,” అని పిలవబడుతుంది.

81 ఇప్పుడు, సోదరుడు నెవిల్, ఆ ప్రఖ్యాతిగాంచిన వర్తమానమును ఈ ఉదయమున బోధించిన తరువాత, చివరిగా, ఆయన చివరి తలంపు, ఆయన ఏమి చెప్పియున్నాడనగా, “పునరుద్ధరించబడాలి.” కాబట్టి అది అక్కడ నాకు ఒక ఆలోచనను ఇచ్చింది, “పునరుద్ధరణ.”

82 కాబట్టి నేను ఇంటికి త్వరగా వెళ్ళి, నా నిఘంటువును తీసుకొని, కొన్ని లేఖనములను తీసుకొన్నాను, మరియు కొన్నిటిని వ్రాసుకోవటం ప్రారంభించాను. తరువాత నేను వెబ్ స్టర్ నిఘంటువును తీసుకొని, పునరుద్ధరణ, అనగా భావము ఏమిటో కనుగొన్నాను. పునరుద్ధరణ అనగా భావము, “దానిని తిరిగి అసలైన హక్కుదారునికి ఇచ్చుట, లేక ఆస్తిని తిరిగి మొదటి స్థానమునకు తెచ్చుట.” ఒక దావా పునరుద్ధరించబడునట్లుగా మనము చట్టము ద్వారా అమలుచేయగలము.

83 ఇప్పుడు, పునరుద్ధరణ అనగా భావము అదే అని వెబ్ స్టర్ చెపుతున్నాడు, “మొదటి హక్కుదారునకు దానిని తిరిగి ఇచ్చుట, లేక ఆ ఆస్తిని తిరిగి మొదటి స్థానమునకు తెచ్చుట.” దేని మీదయైనా ఒక దావా వేయబడితే, దానిని పునరుద్ధరించుటకు, అది దాని యొక్క సరియైన స్థానమునకు వచ్చుటకు, నీవు చట్టము ద్వారా అమలు చేయవచ్చును.

దేవుడు ఈ బలహీనమైన మాటలను ఇప్పుడు దీవించును గాక.

84 పునరుద్ధరణ అనగా భావము, “తిరిగి వెనుకకు తెచ్చుట.” లేక పునరుద్ధరించుట, అది ఎక్కడకు చెందియున్నదో, ఆ నిజమైన హక్కుదారుని యొద్దకు దేనినైనా వెనుకకు తెచ్చుటకు, ఒక దావా చట్టము ద్వారా అమలు చేయబడవచ్చును. అందుచేత, ఎలాగో అది నిజమైన హక్కుదారుని నుండి ఎక్కడికో వెళ్ళిపోయింది. కాని దానిని పునరుద్ధరించుటకు, దానిని నిజముగా కలిగియున్న వ్యక్తి యొద్దకు తిరిగి తెచ్చుటకు, లేక ఆ సహజమైన సొత్తు మొదటగా ఎక్కడయుండియున్నదో, అక్కడకు దాని సహజమైన అసలైన స్థితికి తిరిగి తెచ్చుటయైయున్నది. దానిని చేయుటకుగాను, అక్కడ చట్టమును అమలు చేయుటకు దానిని సరియైన స్థితిలోనికి తెచ్చుటకు గాను, దానిని అమలు చేయుటకు, దానిని పునరుద్ధరించుటకు, మనము హక్కును కలిగియున్నాము.

85 ఎవరైనా ఏదైనా ఆస్తిని దొంగిలించినట్లుగా, వారు ఆ ఆస్తిని చెరపట్టియున్నారు. అప్పుడు నీవు చట్టమును తీసుకొని, ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి, ఆ వ్యక్తి ఆ ఆస్తిని తిరిగి అప్పగించునట్లుగా, ఆ ఆస్తి మొదటియుండినట్లుగా, చట్టము ద్వారా దానిని అమలు చేయవచ్చును.

86 చట్టమును అమలు చేయుట. ఓ, ఎలాటి అంశము! చట్టమును అమలుచేయుట పై ఎలా నేను రెండు రోజులను కలిగియుండగోరుచున్నానో.

87 ఇప్పుడు, సోదరుడు నెవిల్ మన కొరకు బోధించాడు. నేను కొంచెము మాట్లాడతాను, ఒక సండే స్కూలు వలె బోధిస్తూ, అతడు కలిగియున్న దానితో కొంచెము ముందుకు కొనసాగుతాను.

88 అమలుచేయుట! దేవుడు మనకిచ్చిన దావాలను, సాతానుపై అమలు చేసే ఆధిక్యతను మనము కలిగియున్నాము. ఏలయనగా దేవుడు ఒక చట్టమును కలిగియున్నాడు, ఆయన వాక్యమే చట్టమైయున్నది, మరియు దేవుడు తన వాక్యములో సంఘమునకు కొన్ని ప్రత్యేకమైన దావాలను ఇచ్చియున్నాడు. అందుచేత, సాతానుపై ఈ దావాలను అమలు చేయు హక్కును మనము కలిగియున్నాము, “దానిని నాకు తిరిగి ఇవ్వు,” అని చెప్పు, వాడు దానిని చేయవలసియున్నది. కారణమేమనగా, మనము దేవుని యొక్క ప్రతినిధిని తీసుకొనవచ్చును, పరిశుద్ధాత్ముడు, తిన్నగా మన మోకాళ్ళపై వంగి, “అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,” అని చెప్పు. వాడు దానిని వదులుకొనవలసియున్నది, కారణము, దానిని వాడి చేత చేయించుటకు అక్కడ పరిశుద్ధాత్ముడున్నాడు.

ఆ దేశ చట్టమును అమలు చేయవలసియున్నది. అది ఆ దేశము ద్వారా, ఆ దేశము కొరకుయైయున్నది.

89 అయితే దేవుని ఆత్మ యొక్క చట్టమేమనగా, అన్యాయముగా మరియు మోసముగా దేవుని యొద్దనుండి తీసుకొన్న దానిని విడిచిపెట్టవలసినదిగా సాతానును బలవంతము చేయుటయైయున్నది. మనుషుల ఆత్మలు, స్త్రీల ఆత్మలు, పిల్లల ఆత్మలను వాడు దేవుని నుండి తీసుకొనియున్నాడు. శరీర రోగమును, వాడు ప్రజలపైయుంచాడు, దేవుడు వారిని తన పోలికలో, ఆయన వలె చేశాడు, పరిశుద్ధాత్మను తీసుకొని వారి మీద దానిని అమలు చేయుటకు, బైబిలు ద్వారా సంఘమునకు సరియైన చట్టపరమైన హక్కులు ఇవ్వబడియున్నవి.

90 గత కూటములో ఇక్కడ దానిని సూచించియున్నానని నేను నమ్ముతాను నిశ్చయముగా అని నేను అనుకొనను. కాని ఒక సోదరుడు జార్జియా నుండి, లూయిస్ విల్ వచ్చాడు. తన కారును ఆ పైన పెట్టినపుడు, ఎవరో దానిని దొంగిలించారు. అతడు దానిలో అతని బట్టలను, తన భార్య బట్టలను, తన పిల్లల బట్టలను కలిగియున్నాడు. అది ఇక్కడయున్న ఇవాన్స్. వారు సాధారణముగా ఇక్కడయుంటారు. మనము ఇక్కడ కూటమును కలిగియున్నప్పుడు, ప్రతి రోజు పదిహేను వందల మైళ్ళు కారును నడుపుకొని, ఇక్కడ కూటమునకు వస్తారు. ఆ దీనునికి ఏమియులేవు, ఇంటి దగ్గర నుండి ఏడువందల మైళ్ళ దూరములోయున్నాడు. ఏమి చేయాలో అతనికి తెలియలేదు.

91 అతడు పోలీస్ దగ్గరకు వెళ్ళాడు. అయితే వారు లూయిస్ విల్ లో ఒక పెద్ద రచ్చను కలిగియున్నారు. వారు కారులను దొంగిలించి, వాటికి తిరిగి రంగులు వేయుచున్నారు. దానిని అమ్ముటకు వారు అక్కడ ఏ చిరునామాను కలిగిలేదు. నీవు దాని మీద ఏ నెంబరు పెట్టగోరినా, కొన్ని నిమిషములలోనే, వారు నీకు ఒక చిరునామాను తయారుచేస్తారు. కాబట్టి వారు భయంకరమైన సమయమును కలిగియున్నారు.

92 కాబట్టి మేము మా మోకాళ్ళు వేశాము. చూడండి? ఇప్పుడు యేసు దానిని చేసియుండవలసిన పని లేదు, కారణము ఆయన వాక్యమైయుండెను. “వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చియున్నది.” వారు వాక్యమైయుండలేదు, కాని వాక్యము వారి యొద్దకు వచ్చింది. కాని యేసు వాక్యమైయున్నాడు. చూడండి? ఆయన ప్రార్థించవలసిన పనిలేదు. తనకై తానుగా ఆయన దేవుడైయున్నాడు. చూడండి? కాని మనము ఆయన ప్రవక్తలమైయున్నాము; ప్రభువు యొక్క వాక్యము ఎవరి యొద్దకు వస్తుందో, ఆయన సేవకులము. అలాగైతే, అది దేవుని యొక్క వాక్యమో లేక కాదో, అతడు చెప్పినది నెరవేరుట ద్వారా, ప్రవక్త సత్యమని రుజువు చేయబడతాడు.

93 కాబట్టి, అప్పుడు మనము ఒక లేఖనమును కలిగియున్నాము, యేసు అన్నాడు, “ఇద్దరు లేక ముగ్గురు నా నామము పేరట కూడుకొని, ఏకీభవించినట్లైతే, నేను వారి మధ్యలోయుంటాను. వారు ఒక ప్రత్యేకమైన విషయములో ఏకీభవించి నన్ను అడిగినట్లైతే, దానిని సందేహించనట్లైతే, వారు అడిగినది వారు పొందుతారు. అది వారికి అనుగ్రహించబడుతుంది.”

94 ఇప్పుడు, అక్కడే నియమమున్నది. ఇప్పుడు, ఆ నియమమును అమలు చేయువాడు పరిశుద్ధాత్ముడైయున్నాడు. పరిశుద్ధాత్మను నమ్మనివాడు, ఆయనను తిరస్కరించు ప్రజల యొక్క సంగతేమిటి? చూడండి? నీవు నీ యొక్క సొంత సమాధానమును, కనికరమును త్రోసివేయుచున్నావు. చూడు?

95 ఇప్పుడు సహోదరుడు ఫ్రెడ్ సాత్ మన్ తో కలసి, నలుగురు లేక ఐదుగురు పురుషులమున్నాము, ఇతరులు చాలామంది అక్కడయున్నారు. మేము మోకరించాము, దేవుని ముందు ఈ వ్యాజ్యమును బ్రతిమలాడాము. అప్పుడు నేను వాక్యమును తీసుకొని లేక వాగ్దానమును తీసుకొని దానిని ముందుకు పంపాము. ఆ గొప్ప పరిశుద్ధాత్ముడు, వాక్యమును తీసుకొని, పిలుపులను ఇస్తూయుండగా, ఒక దర్శనము బ్రద్దలయింది, ఒక మనిషి బౌలింగ్ గ్రీన్, కెంటక్కీ వెళుతున్నాడు, పసుపురంగు షర్టు వేసుకొని, ట్రక్కు నడుపుతున్నాడు. పరిశుద్ధాత్ముడు అతని మీదకు వచ్చాడు, అతనిని ఖండించాడు, అతడు సగము దారిలోనే వెనక్కు తిరిగాడు. అతడు వెనక్కి తిరిగి ఆ కారును, ఆ నది మీద ఒక వీధిలో దానిని ఉంచాడు. నేను పైకి లేచి, సోదరులకు చెప్పాను, అది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.”

96 వారు బయటకు వెళ్ళినపుడు, వారు దారిగుండా వెళ్లారు. అక్కడే కారు ఉంచబడియున్నది, గాసోలిన్ సగము ఖాళీ అయింది, అది నింపబడిన తరువాత ట్యాంకు సగము ఖాళీ అయింది. బౌలింగ్ గ్రీన్కు అతనిని తీసుకొని వెళ్ళి, మరలా తిరిగి తెచ్చుటకు, అది సరిపోయింది. ఇప్పుడు ఆ మనుషులు, ఒక సాక్ష్యముగా ఇక్కడ ఈ ఉదయమున కూర్చొనియున్నారు.

97 అది ఏమిటి? అమలు చేయుట! “తిరిగి ఇచ్చివేయుము.” చూడండి? అది అంతే. దానిని గూర్చియే అది మాట్లాడుచున్నది. “దానిని పునరుద్ధరించుము. తిరిగి దానిని అసలైన హక్కుదారుని యొద్దకు తెచ్చుట.”

98 ఒక దేవుని యొక్క కుమారుడిగా లేక ఒక దేవుని కుమార్తెగా నీవు యుండు ఆ ఆధిక్యతను సాతాను నీ నుండి దొంగిలించినట్లైతే, ఈ ఉదయమున, పరిశుద్ధాత్మ ద్వారా, ఆ దేవుని దావాను అమలు పర్చుటకు, మనము హక్కును కలిగియున్నాము. “దానిని తిరిగితెమ్ము.”

99 వాడు నిన్ను బాధించి, రోగిగా చేసినట్లైతే, దేవుని యొక్క నియమములను అమలు చేయుటకు, దేవుని ముందు మనము హక్కును కలిగియున్నాము. “ఆయన పొందిన దెబ్బల ద్వారా మనము స్వస్థత నొందియున్నాము.” ఆమేన్. “తిరిగి వెనుకకు తెమ్ము. అతనిని విడిచిపెట్టుము. అదిగో నీవు అతనిని మరణమునకు తీసుకొని వెళ్ళుచున్నావు. ఇప్పుడు అతనిని వెనుకకు తెమ్ము.”

100 అదే అమలు చేయుటయైయున్నది; దానిని తిరిగి దాని యొక్క సహజమైన స్థితికి పునరుద్ధరించుట. ఒక మనిషి రోగిగాయున్నాడు, చిన్న బిడ్డ రోగిగాయున్నది; ఒక స్త్రీ రోగిగాయున్నది. చూడండి? వారు వారి సహజమైన స్థితికి బయటయున్నారు. అప్పుడు మన దావాను అమలు చేయుటకు మనము హక్కును కలిగియున్నాము. అది మన దావా కాదు. దేవుడు మనకు ఇస్తున్న కారణమున అది మన దావాయైయున్నది. “ఆయన పొందిన దెబ్బల ద్వారా మనము స్వస్థత నొందియున్నాము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపర్చబడెను. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనము స్వస్థత నొందియున్నాము.” ఇప్పుడు ఆ చట్టమును అమలుచేయుటకు మనము హక్కును కలిగియున్నాము. మరియు చట్టమునిచ్చువాడు, స్వయముగా పరిశుద్ధాత్ముడే, ఆ మార్గములో అది జరిగించబడుటను చూచుటకు, దేవుని యొక్క ప్రతినిధి ఇక్కడయున్నాడు. ఆమేన్.

101 ఇప్పుడు, ఆయన పనిచేయగలిగే ఒకే మార్గము ఏమనగా, ఆయనను పనిచేయుటకు నీవు అనుమతించినప్పుడే. చూడండి? మనము తప్పక దానిని నమ్మవలసియున్నది. అక్కడ ఒక చట్టమున్నది. ఓ, నేను ఎన్నడైనా నా అంశములోనికి వెళ్ళగలిగినట్లైతే. అక్కడ ఒక చట్టమున్నది సమస్తము మధ్య ఒక చట్టము అక్కడ ఇవ్వబడియున్నది.

102 నీకు తెలుసా, ఒక చేప ఒక నియమమును కలిగియున్నది. ఆ చేప నీళ్ళలో నిలబడగలదు, దానిలోలోపట అది ఒక నియమమును కలిగియున్నది. ఆ చేప ఆ నియమమును అతనిలో నుండి వెళ్ళిపోనిచ్చినట్లైతే, అది తిన్నగా సముద్రము అడుగున మునిగిపోతుంది. ఒక్క రవ్వంత అతనిని బాధించదు. దానితో ఒక్క కణము బ్రద్దలు కాదు. నీవు దానిని చేయుటకు ప్రయత్నము చేస్తావు. ఆ నియమము నీలో లేదు. నీవు దానిని చేయలేవు, కాని చేప చేయగలదు. ఆ గాలితో చేప తన్ను తాను తగ్గించుకొంటుంది, ఆ విధానములో, అది చేయగలదు. బ్రద్దలు చేసి దానిని తెరచుటకు అక్కడ ఏమియు లేదు. వాడు ఆ మార్గములో తయారుచేయబడ్డాడు. వాడికి అది తెలుసు. తిన్నగా సముద్రము అడుగునకు వెళ్ళి, మరలా తిరిగి దానిని పైకి లేపుకొనుటకు, ఆ నియమమును అది అమలు చేయగలదు.

103 క్రీస్తులో ఒక నియమమున్నది. ఆ నియమము సంఘములోయున్నది. నీవు లోతైన సమాధిలో అతనిని పాతిపెట్టవచ్చును, లేక లోతైన సముద్రములో పాతిపెట్టగలవు, లేక లోతైన పాతాళములో, కాని అక్కడ దేవుని ఆత్మ యొక్క ఒక నియమమున్నది, అది అతనిని తిరిగి లేపుతుంది. చూడండి?

104 ఒక పక్షి ఒక నియమమును కలిగియున్నది. ఇప్పుడు, దాని శరీరము ఒక పదార్థము. అది భూ సంబంధమైనది, ఇక్కడ భూమి మీద కూర్చొంటుంది. కాని దాని లోలోపల ఒక నియమమును కలిగియున్నది, అదేమనగా, అది ఒక విధముగా రెక్కలు చాపినట్లైతే, నీ చూపుకు కనబడకుండా ఎగిరిపోతుంది. అది సైన్సుకు వ్యతిరేకమైయున్నది. అది భూ సంబంధమైనదని వారు వాదిస్తారు; భూమ్యాకర్షణ శక్తి దానిని ఇక్కడే పట్టుకొనవలసియున్నది. కాని అది భూమ్యాకర్షణను ఎదిరించగలదు, తన్ను తాను తిన్నగా పైకి లేపుకొని, తిన్నగా బయటకు వెళ్లిపోతుంది, కారణమేమనగా, అది దానిలోని నియమమును పనిచేయుటకు ఉంచవలసియున్నది. అది ఆ నియమమును కలిగియుండుటకు నిర్మించబడింది.

105 ఇప్పుడు నేను భక్తి అనుభూతిని చెందుచున్నాను. ఇప్పుడు, మనము ఒక నియమమును కలిగియున్నాము, ఆ జీవ నియమము మనలోయున్నది. నీవు చేయగలిగే ఒకే కార్యము ఏమనగా…నీవు ఆ విధముగా తయారు చేయబడ్డావు, జన్మించావు, మరియు దేవుని యొక్క కుమారులు మరియు దేవుని యొక్క కుమార్తెలుగా, క్రీస్తు యొక్క శరీరములో మనము ఉంచబడియున్నాము. నీవు దయ్యమునకు మడతబందుగా వంగవలసిన పనిలేదు. మనము ఒక నియమమును కలిగియున్నాము. అదే పరిశుద్ధాత్మ యొక్క నియమము నీవు చేయవలసిన ఒకే పని యేమనగా, దేవునిని నీతో ఎలా వెళ్ళనియ్యాలో ఎరిగియుండుటయే. నీవు దానితో పోరాడుతూనేయుంటావు, చూడు అది ఎన్నడూ పనిచేయదు. కాని నీవు దేవునిని రానిచ్చినపుడు, అంతమట్టుకే. చూడండి?

106 ఒక వేళ చేప ఇలా అంటే, “ఆగు, నేను నా గాలిని బాగా పీలుస్తాను. నేను కొంచెము ఆక్సిజన్ ను నాలోనికి పీల్చి, అడుగునకు వెళ్ళగలనేమో చూస్తాను.” లేదు. అది ఆలాగున చేస్తే. అది బ్రద్దలైపోతుంది. చూడండి?

107 పక్షి ఒక వేళ ఇలా అంటే, “నేనె ఎంత వేగముగా అక్కడకు పరుగెత్తగలనో చూస్తాను, బహుశా అక్కడ నుండి పైకి ఎగిరిపోతాను.” లేదు. అతడు దానిని చేయలేడు. వాడు క్రింద పడిపోతాడు. చూడండి? అతడు తప్పక ఆ నియమము ఎలా అతనిని నియంత్రణ చేయుచున్నదో, అతడు తప్పక దానిని ఎరుగవలెను.

108 అది మనతోనూ ఆలాగునేయున్నది. అది మనము పోరాడేది కాదు, లాగేది కాదు, తొందర పడేది కాదు, “ఓ, నేను దీనిని, లేక దానిని పొందకపోయినట్లైతే అని కాదు.” అది అది కాదు. అది జీవపు నియమము నీలోయున్నదని ఎరుగుటయే, అది నీవు ముందుకు సాగిపోవుట, దేవుని వెళ్ళనిచ్చుటయైయున్నది. అప్పుడు ఆయన నీ స్వస్థతను తీసుకొంటాడు, ఆత్మ యొక్క బాప్తిస్మమునకు నిన్ను తీసుకొంటాడు, లేక ఆయన వాగ్దానము చేసిన దేనికైనా తీసుకొంటాడు. ఆయన నీకు ఇచ్చే ఏ దావాయైనా అది నీదైయున్నది. దానిని వెళ్ళనిచ్చుట ద్వారా, దేవునిని వెళ్ళనిచ్చుట ద్వారాయైయున్నది.

109 నీ కారును దొంగిలించిన వ్యక్తిని, ఆ అధికారి పట్టుకొని అతనిని కోర్టుకు తీసుకొని వెళ్ళుతున్నప్పుడు, నీవు అతనిని వెనుకకు లాగుట ప్రారంభించినట్లైతే, “బాగుంది, అతడు దానిని సరిగ్గా చేశాడో లేదో నాకు తెలియదు అని అంటే,” అతడు ఎన్నడూ వాడిని అక్కడకు తీసుకొని వెళ్ళలేడు. సరిగ్గా అతనిని వెళ్ళనియ్యండి.

110 ఆ విధానములోనే నీవు చేస్తావు. నీలోని అనుమానములు, సమస్తమూ నీ మనసులోనుండి పారిపోనియ్యు, సాతానుని దూరముగా వెళ్ళిపోనియ్యు, అప్పుడు దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. మంచిది.

111 ఇప్పుడు, ఇది ఈష్టరు సమయమైయున్నది. ఓ, ఈష్టరు అంటే నాకు ఇష్టము. అవునండి. కాని ఈ రోజున ఈష్టరు మీద ఎంతోయున్నది, అది బన్నీ కుందేళ్ళని, బాతులని, అది కెంపు కోడిపిల్లలని, చక్కని టీపీలని, క్రొత్త వస్త్రములని అంటున్నారు; కాని అది ఈష్టరు కాదు. ఈష్టర్ అనగా పునరుత్థానము, పునరుద్ధరించుట, వెనుకకు పునరుద్ధరించుట. అది దేవుని యొక్క పునరుద్ధరించు సమయమైయున్నది. నీవు బయట నేలను చూడు; దేవుడు పునరుద్ధరించుచున్నాడు. దేనిని పునరుద్ధరిస్తున్నాడు? ప్రకృతిని. అది నిజము. ఆయన పుష్పములను పునరుద్ధరించుచున్నాడు. ఆయన ఆకులను పునరుద్ధరించుచున్నాడు. ఆయన చేనిలోని ఫలములను పునరుద్ధరించుచున్నాడు. అది ఏమిటి? దేవుడు పునరుద్ధరిస్తున్నాడు. అది ఈష్టరుయైయున్నది; అనగా భావము, “దానిని తిరిగి వెనుకకు తెచ్చుట.”

112 అది ఏమైయున్నది? అక్కడ ఒక శిక్షయుండియున్నది, ఒక దావా. ఈష్టర్ దావాలు లేక పుష్పముల దావాలు, అవి తిరిగి లేచుటకు హక్కును కలిగియున్నవి. చూడండి? దేవుని యొక్క ప్రకృతి చట్టము భూమి చుట్టూ లాగి, ప్రకృతిలో, ఒక పునరుత్థానమును, ఒక ఈష్టరును ముందుకు తెస్తుంది. అది రమ్యముగాయున్నది. అది భూమి మీదయుండగా, చలికాలము చంపివేసిన దానిని, సూర్యుడు తిరిగి వచ్చుట ద్వారా, అది పునరుద్ధరించబడుతుంది. మనకు చెప్పబడియున్నట్లుగా, ఈ చివరి నుండి తిన్నగా, సూర్యుని చుట్టూ దేవుడు భూమిని గుండ్రముగా పంపుతాడు.

113 భూమి సూర్యుని నుండి దూరముగా వెళ్ళిపోయింది. ఇక్కడ వెనుకకు బయటకు వెళ్ళిపోయింది. ఆ విధముగానే ఒక పాపి చేస్తాడు, కుమారుని నుండి దూరముగా వెళ్ళిపోతాడు. బాగుంది, ఇది సూర్యుడు. కాని ఈ భూమి తిరిగి వచ్చినపుడు…అది బయటయున్నది, మరణము దానిని తాకుతుంది, అదియే శీతాకాలము. ఆ బయటయున్న ప్రతి సజీవమైన దానిని అది చంపివేస్తుంది.

114 ఇప్పుడు, భూమి దాని చుట్టూ తిరిగి వచ్చినపుడు. విత్తనములు భూమిలోయుంచబడియున్నవి. అవి మంచుతో గడ్డకట్టుకుపోయినవి. సారము దానిలోనుండి బయటకు పరుగెత్తింది. సమస్తమూ వెళ్ళిపోయింది; కాని అక్కడ ఒక చిన్న జీవము భద్రము చేయబడింది. సూర్యుడు తిరిగి భూమితో దాని స్థానములోనికి రాగానే, అప్పుడు అక్కడ ఒక ఈష్టర్ యుంటుంది, ఒక పునరుద్ధరణ. తిరిగి పుష్పములు పైకి వస్తాయి. సమస్తము పైకి వస్తుంది. శీతాకాలము చంపివేసిన సమస్తమును, సూర్యుడు పునరుద్ధరిస్తాడు. అదే శీతాకాలము యొక్క మరణపు చావు, కాని జీవపు సూర్యుడు పునరుద్ధరిస్తాడు.

115 కాబట్టి ఇప్పుడు అది ప్రజలతోను ఆలాగునేయున్నది. చలికాలపు చల్లదనము, నామకార్ధ మతము, దానిని బయట చంపియున్నది, ఈ చివరి దినములలో సమీపముగాయున్న దేవుని కుమారుని యొక్క సంఘమునకు వచ్చుచున్న ఆయన రాకడ, దానిని తిరిగి జీవమునకు పునరుద్ధరిస్తుంది. “నేను పునరుద్ధరిస్తాను, అని ప్రభువు చెప్పుచున్నాడు.” చూడండి? దేవుడు తన పుష్పములను, ఆయన ఆకులను, ఆయన ప్రకృతిని, భూమి మీద ఆయన విత్తనములను పునరుద్ధరిస్తాడు, అందుచేత మనకు తెలుసు, తరువాత, దేవుడు తన నివాస స్థలమును కూడా పునరుద్ధరిస్తాడు. ఆయన తన ఏదెనును పునరుద్ధరించును. మరణము చంపియున్న సమస్తమును ఆయన పునరుద్ధరించును. అది నిజము. ఇప్పుడు అది తప్పు స్థలములో ఉండనిచ్చుట వల్ల మాత్రమే, అది ఎన్నడైనా మృతముగా యుంటుంది. కాని అది సరియైన స్థలములో పడినట్లైతే, అది తిరిగి తప్పక జీవములోనికి రావలసియున్నది. కాబట్టి, దేవుడు, సరియైన కాలువలో మనలను పడనిచ్చినట్లైతే, అది నిజము, ఒక పునరుద్ధరణ కొరకు.

116 చలికాలము చంపివేసిన దానినంతా, తరువాత సూర్యుడు పునరుద్ధరిస్తాడు. సూర్యుడు తిరిగివచ్చుట, అది ఏమి చేస్తుంది? అది బలవంతము చేస్తుంది. వినండి. అది మరణమును బలవంతము చేస్తుంది. వసంతకాలమున భూమియొక్క వరుసలోనికి తిరిగి వచ్చే సూర్యుడు. అది నిజానికి దాని మరణమును, ఒక పునరుత్థానమునకు విడిచిపెట్టాలని మరణమును బలవంతము చేస్తుంది, (దేనికొరకు?) ఒక పునరుద్ధరణ, “తిరిగి మరలా పునరుద్ధరించుట.” అది ఏమి చేస్తుంది? సూర్యుడు వస్తున్నాడు, అది దేవుని యొక్క చట్టమైయున్నది.

117 దేవుడు భూమిని నియమములో ఉంచాడు, భూమ్యాకర్షణ నియమము. ప్రకృతిలో సమస్తమూ దేవుని యొక్క నియమము ప్రకారము పని చేస్తుంది. పుష్పములు వాటి యొక్క ఉద్దేశమును సేవించియున్నవి, విత్తనములు వాటి ఉద్దేశమును సేవించియున్నవి; అవి భూమిలోనికి చనిపోయినవి. తరువాత అక్కడ ఒక పునరుద్ధరణయుంటుంది.

118 అవి చనిపోయి అక్కడ యుంచబడియున్నవి. అక్కడ ఒక్కటి లేదు. మనము ఇక్కడయున్న లైట్లలో ఒక దానిని తీసుకొని ఈ విధంగా, దానిపై దానిని ప్రకాశింప చేయలేము. అది ఎన్నడూ ఏ మంచియూ చేయదు. దానిని చేయుటకు అక్కడ మనకు ఏ మార్గము లేదు. కాని దేవుడు ఒక నియమమును కలిగియున్నాడు, ఆ సూర్యుడు విత్తనము మీదికి వచ్చినపుడు, అది విత్తనములోని ఆ జీవమును బయటకు బలవంతము చేస్తుంది. దానిని ఇక ఎంత మాత్రము మరణము ఆపలేదు.

119 సహజమైనవి మరియు ఆత్మసంబంధమైనవి రెండూ, ఆయనను సేవించునట్లు, దేవుడు ఆయన నియమములన్నిటిని స్థిరపర్చియున్నాడు, పరిస్థితుల ప్రమేయము లేకుండా, ఆయన వాక్యము ప్రకారము అవి పని చేయుచున్నవి. నేను దానిని ప్రేమిస్తాను. దాని మీద నేను ఒక లేఖనమును కలిగియున్నాను. అవునండి. దేవుడు ఆయన నియమములన్నిటిని చలనములో యుంచియున్నాడు. దానిని గూర్చి ఆలోచించండి. దానిని లోపల ఇప్పుడు నాననివ్వండి, ఏలయనగా కొన్ని నిమిషములలో మనము ఒక స్వస్థతా కూటమునకు వస్తున్నాము. చూడండి? దేవుడు ఆయన నియమములన్నిటిని చలనములో ఉంచియున్నాడు, అవి తప్పక ఆయన సొంతమాట ప్రకారము పని చేయవలెను. ఆయన సూర్యునికి ఆజ్ఞ ఇచ్చియున్నాడు. ఆయన చంద్రునికి ఆజ్ఞ ఇచ్చియున్నాడు. ఆయన భూమికి ఆజ్ఞ ఇచ్చియున్నాడు. ఆయన ప్రకృతికి ఆజ్ఞ ఇచ్చియున్నాడు. అవన్నియూ తిన్నగా వరుసలోయున్నవి, మరియు అన్ని నియమములు దేవుని యొక్క పలుకబడిన మాటతో సఖ్యతగా పని చేస్తాయి. మనలోయున్న జీవము యొక్క నియమము, మనలను కూడా ఒక పునరుత్థానములోనికి తెస్తాయి. అది తప్పక దానిని చేయాలి. అది ఆలాగున చేయకపోవుట అసంభవము.

120 ఆ కారణము బట్టియే, అది క్రీస్తులోయున్న జీవపు నియమమైయున్నది. “నా పరిశుద్ధుని క్రుళ్ళు పట్టనియ్యను, అతని ఆత్మను పాతాళములో విడిచిపెట్టనియ్యను,” అని వాక్యము మాట్లాడియున్నప్పుడు, అక్కడ ఎన్ని దయ్యములున్నా, మరి ఏదైనా, క్రీస్తు యొక్క (అతని) శరీరమును క్రుళ్ళిపోవునట్లుగా అవి చెయ్యలేవు, కారణము దేవుని యొక్క నియమము, వాక్యమును నెరవేరునట్లు చేస్తుంది. దేవుని యొక్క నియమములు, పరిశుద్ధాత్మ ద్వారా, ఏ వాగ్దానమునైనా పరిస్థితులతో ప్రమేయము లేకుండి నెరవేరునట్లు చేస్తాయి (నీకు అర్థమైనదా?)

121 యోబు అన్నాడు, “మట్టి పురుగులు నా దేహమును తిని వేసినప్పటికి, ఇంకనూ నా శరీరములో దేవుని చూస్తాను.”

122 మనము ఎంత చిన్న వారమైనప్పటికీ లెక్క కాదు, మనము ఎంత దిగజారిన స్థితిలోయున్నను లెక్క కాదు, మనము ఎంత అపవిత్రముగాయున్ననూ లెక్క కాదు, మనము ఎంత కాలుష్యమైనప్పటికి లెక్క కాదు, మనము ఎంత వ్యాధిగ్రస్థులమైనను లెక్కకాదు, మనము ఎంత పీడించబడినప్పటికి లెక్క కాదు; దేవుని ఆత్మ నియమము ఆయన వాక్యము ద్వారా, దానిని ఆయనకు లోబడునట్లు చేస్తుంది, ఆ దావాను ఒత్తిడి చేస్తుంది, “దానిని తిరిగి ఇమ్మని” చెపుతుంది. ఆమేన్. ఓ, ఒక్క నిమిషము మనము దానిని ఆలోచించగలిగినట్లైతే బాగుంటుంది. ఏ పరిస్థితుల ప్రమేయం లేకుండా, దానిని బలవంతము చేస్తుంది. పరిస్థితి ఏదైనను లెక్కకాదు, దేవుని వాక్య నియమము ఆ పరిస్థితిని ఆ వాక్యముతో భరించునట్లు చేస్తుంది. చూడండి? అది తప్పక ఆలాగు చేస్తుంది.

123 ఇప్పుడు, ఒక పుష్పము అక్కడ చనిపోయియున్నట్లైతే, విత్తనములు మురిగిపోయినవి, సారము దానిలోనుండి వెళ్ళిపోయింది, అయినను అది దానితో చేయునది ఏదియు లేదు. అది తిరిగి లేస్తుంది, కారణము అది తిరిగి లేవాలని దేవుడు ఒక నియమమునుంచాడు.

124 యోబు మంటిలో యుంచబడినపుడు, (బహుశ, నాలుగువేల సంవత్సరములకు ముందే, యేసు అతని యొద్దకు వచ్చుటను చూసియున్నాడు.), నాలుగువేల సంవత్సరములలో మానవ దేహము ఎలా కనబడుతుందో, మీరు ఊహించగలరు, బహుశ ఒక చెంచా లో ఒక ప్రక్కకు వచ్చుటకు అక్కడ తగినంత బూడిద మిగిలియుండలేదు. కాని యోబు అన్నాడు, “అయినను నా శరీరములో నేను దేవునిని చూస్తాను. నా మట్టుకు నేనే చూస్తాను.”

125 మత్తయి 27 లో బైబిలు మనకు చెపుతుంది, అదేమనగా. ఆయన మరణము, సమాధి, పునరుత్థానము తరువాత, అదే, “అనేకమంది నిద్రించిన పరిశుద్ధుల శరీరములు, భూమిలోనుండి పైకి లేచెను.” ఎందుచేత? ఆ ప్రవక్త దేవుని యొక్క వాక్యముతో మాట్లాడుచుండెను. మరియు వాక్యము పలుకబడియున్నది. దేవుని యొక్క నియమము, ఆత్మ ద్వారా, వారిని పైకి లేపెను. బైబిలు చెప్పింది, “వారు పట్టణములో ప్రవేశించి, అనేకులకు కనబడిరి.” యేసు లేచుట మాత్రమే కాదు, కాని పరిశుద్ధులు ఆయనతో పాటు లేచిరి.

126 ఎందుచేత? కీర్తనలలో అది చెప్పబడింది, “మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన గుమ్మములారా, మిమ్మును లేవనెత్తుకొనుడి.” బాగుంది, ఆయన మరణమును, సమాధిని, పాతాళమును, రోగమును జయించి మూడవదినమున తిరిగిలేచెను, “ఆయన పరమునకు ఆరోహణమై, చెరను చెరగా కొనిపోయెను.”

127 అది ఏమైయున్నది? ఇప్పుడు మనము కలిగియున్న వాగ్దానము కొరకు చెరలోయున్నవారు ముందుకు చూచిరి. ఓ, సోదరుడా! వారు ఎన్నడూ కనీసము పరిశుద్ధాత్మను కలిగియుండలేదు. “కాని, నమ్మిరి, మంచి సాక్ష్యమునిచ్చిరి. దాని ద్వారా వారు సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి, వాగ్దానము లేకుండానే.” ఓ, అయితే వారు ముందుకు చూసిరి. గొర్రెల బలి అర్పణ క్రింద, అది పాపమును పరిత్యాగము చేయలేదు, అది కేవలము పాపమును కప్పుతుంది. అయితే ఒకరు వచ్చుచున్నాడని వారు నమ్మియుండిరి. వారి విశ్వాసమును బట్టి, ఆ ఛాయకు ఆవల, ఆమేన్, వారు దానిని వాదించిరి. “ఎడతెగక, వారు అరణ్యములలో గొర్రె చర్మములతో, మేక చర్మములతో సంచరించిరి; బాధించబడిరి, దరిద్రులైయుండి, శ్రమపొందుచూ, హింసించబడిరి.” ఓ!

128 ఓ, ఆ ప్రజలు, పునరుత్థానము కొరకు ముందుకు చూస్తున్నారు, మరియు వారు దాని ద్వారా, వారి సాక్ష్యముతో, విశ్వాసములో చనిపోయిరి. ఈ ఈష్టర్ ఉదయమున, వాక్యమును పలికిన యోబు మరియు ఆ ఇతర ప్రవక్తల ద్వారా, దేవుని యొక్క నియమమును బట్టి, వారు మృతులలోనుండి లేచియున్నారు. ఓ, అయ్యో! అక్కడే నీవుయున్నావు. పరిస్థితుల ప్రమేయం లేకుండా!

129 కొందరు ప్రజలు ఎంతో దోషారోపణగా మారతారు, తీర్పును ఎదుర్కొనుట వారికి ఇష్టము లేదు. ఓ, అనేకమంది ప్రజలు! చనిపోవుట కష్టము కాదు. ఎవరైనను మతిభ్రమించిన వారు, అలాటివారు, ఆ రకమైన తొందరపాటు పని చేస్తారు. వారిలో కొందరి శరీరములు కాల్చివేయబడినవి, సముద్రములోనుండి బయటకు తీయబడి, వారి బూడిద సముద్రము యొక్క నాలుగు గాలులు గుండా చిమ్మబడినవి. అది తీర్పును ఆపదు. నీవు తిన్నగా ఆరీతిగానే ముందుకు వస్తావు. అవునండి. చూడండి? లెక్కకాదు, పరిస్థితులతో ప్రమేయము లేదు, ఎక్కడో నీవు దేవునిని కలుసుకొనబోవుచున్నావు. నీవు తన్పక ఆయన యొద్దకు రావలసియున్నది. నీవు తప్పక ఆయనను కలుసుకొనవలసియున్నది. చూడండి?

130 కారణము (ఎందుచేత?) ఆయన మాటను పలికియున్నాడు, మరియు ఆ మాటతో నియమమును ఉంచియున్నాడు, ఆ నియమము ఆయన సొంత నియమము, ఆయన సొంత జీవము దాని వెనుకయున్నది. ఆ కారణమును బట్టియే, ఆయన తనతో తాను ప్రమాణము చేసియున్నాడు; అక్కడ ఆయనకంటె గొప్పవాడు లేడు. చూడండి? ఆయన ప్రమాణము కలిగియున్నాడు, కారణము ప్రమాణము లేకుండా ఏ నిబంధన తప్పక నిర్ధారంచబడదు. ఆయన దానిని చేయగలిగే ఒకే మార్గము, ఆయన దానిని చేయకముందు, తనకై తానుగా దానిని తీసుకొని, స్వయముగా ఆయనే ప్రమాణముగా మారియున్నాడు. ఓ, సోదరుడా! దేవుడు మానవుడుగా మారినపుడు, ఆయనే ప్రమాణమైయున్నాడు, ఆయన స్వయముగా ప్రమాణముగా తయారు చేయబడ్డాడు.

131 ఆయన యొక్క సొంత మరణము, సమాధి, పునరుత్థానము ద్వారా, ఆయన నియమములు సరియైయున్నవని ఆయన రుజువు చేసెను. ఆయన అన్నాడు, “ఈ దేవాలయమును పడగొట్టండి, మూడు దినములలో నేను దానిని తిరిగి లేపుదును.” “నేను,” అనగా వ్యక్తిగత సర్వనామము, “నేను మూడు దినములలో తిరిగి లేపుతాను నేను దానిని పైకి తెస్తాను, దానిని పాడు చెయ్యండి, మరియు ఏమి సంభవిస్తుందో చూడండి.” దేవుని యొక్క నియమమును ఆయన ఎరిగియుండెను. అది ఏమైయున్నదో ఆయన ఎరిగియుండెను. అది దేవుని యొక్క వాక్య ప్రకారము పనిచేయవలసియున్నదని ఆయన ఎరిగియుండెను. “నా పరిశుద్ధుని క్రుళ్ళుపట్టనియ్యనని” ప్రవక్త ద్వారా చెప్పబడియున్నదని ఆయన ఎరిగియుండెను. అది దానిని పరిష్కరించిది, అది దానిని పరిష్కరించింది.

132 అప్పుడు, దేవుని యొక్క నియమము తప్పక వాక్యము ద్వారా పనిచేయవలసియున్నది. ఒక్క నిమిషములో మనము ఒక గొప్ప కార్యములోనికి వస్తున్నాము. చూడండి? చూడండి? అక్కడ, దేవుని యొక్క వాక్య నియమము, దేవుని నియమము, ఆయన వాక్యముతోయున్నది.

133 ఇప్పుడు, కోర్టు ఒక మాటను వ్రాసినట్లైతే, “అది పలానా-పలానా విషయం, పలానా-పలానా దానిని చేసినట్లైతే, దానిని చేసినందుకు ఇంత జరిమానా.” మంచిది. ఇప్పుడు, అది కోర్టు యొక్క మాట, మరియు కోర్టు యొక్క నియమము కోర్టు యొక్క మాటను అమలు చేస్తుంది.

134 దేవుడు ఏదైనా మాట్లాడినప్పుడు, అది ఒక నియమమైయున్నది. మరియు పరిశుద్ధాత్ముడు ఆ నియమమును విశ్వాసికి అమలు చేయుటకు ఇక్కడున్నాడు, ఆమేన్. నీవు దానిని చేయుటకు నిర్దేశించబడాలి. అది ఒక విశ్వాసిని తీసుకొంటుంది. నీవు తప్పక “విశ్వాసి” యొక్క బాడ్జిని కలిగియుండాలి. ఎవరో అన్నారు, “నీవు శక్తిని కలిగియున్నావా?” లేదు. కాని మనము అధికారమును కలిగియున్నాము. అంతమట్టుకే. శక్తి కాదు; కాని అధికారము. ఏది చేయుటకు మన దగ్గర శక్తి లేదు.

135 కొద్దికాలము క్రితము, లూయిస్ విల్ లోని నిలబడియున్న చిన్న పోలీసు గురించి చెప్పియున్నట్లుగాయున్నది. అతడు నా కంటే ఎంతో చిన్నగాయున్నాడు; ఒక చిన్న వ్యక్తి టోపీ అతని చెవులపై వ్రేలాడుచున్నది. అతడు పోలీసు బట్టలు వేసుకొనియున్నాడు. చిన్న పిస్తోలు ప్రక్కన వ్రేలాడదీసికొని, చిన్న కర్రను పట్టుకొని, చిన్న విజిల్ తో, తెల్లని మేజోళ్ళు ధరించుకొని, అక్కడ వీధిలో తిరుగుతున్నాడు, ఆ కారులలో కొన్ని మూడువందల యాభై హార్స్ పవర్ కలిగినవి, మెరుపువలె ఆ వీధులలో సుడులు తిరుగుకొంటూ పెద్ద పెద్దగా వస్తున్నాయి. ఈ దీనుడైన చిన్న వ్యక్తి దేనినీ ఆపలేడు…తన బలముతో పారిపోతున్న చిన్న గుఱ్ఱమును కూడా అతడు ఆపలేడు. ఆ పెద్ద బాడ్జి ప్రకాశిస్తూయుండగా, ఆ విజిల్ ను ఊదుతూ, తన చేతులను ఎత్తినపుడు, సోదరుడా, మూడుందల హార్స్ పవర్ మోటార్లు, కీచుమని బ్రేకులు వేసి సమస్తము ఆగిపోయినవి. అది ఆ మనిషి యొక్క శక్తి కాదు. అది అతడు కలిగియున్న అధికారమైయున్నది. అది అంతే.

136 అదే సంఘమైయున్నది. ప్రసిద్ధిగాంచిన “పరిశుద్ధ రోలర్లు” గుంపుకావచ్చు, లేక నీవు దానిని ఏమని పిలుస్తావో కాని అది అధికారమైయున్నది. హ-హ, హ, హ. అది దాని వెనుకయున్న అధికారమైయున్నది. అదే దానిని చేస్తుంది. పరిస్థితులతో ప్రమేయము లేకుండా, దేవుని నియమము ఆయన వాక్యముతో పని చేస్తుంది. ఇప్పుడు, అది నీ సిద్ధాంతముతో పనిచేయదు. అది వాక్యముతో పని చేస్తుంది. అవును. అది సరిగ్గా వాక్యముతో పనిచేస్తుంది. అంతమట్టుకే, ఇప్పుడు, పరిస్థితులతో ప్రమేయము లేకుండా.

137 మన పాఠ్యాంశములో కొన్ని క్షణముల క్రితము మనము అబ్రాహామును గూర్చి చదివియున్నట్లుగా, అబ్రాహాము యొక్క భార్య తిరిగి పునరుద్ధరించబడవలసియున్నది. ఎందుకు? దేవుడు అబ్రాహామునకు వాగ్దానము ఇచ్చాడు, ఇక్కడ ఒక రాజు ఆమెను భార్యగా వివాహము చేసికొనుటకు సిద్ధముగాయున్నాడు.

138 మంచిది, అతడు ఏమి చేసియున్నాడు? ఒక్క నిమిషములో అబ్రాహామును ఆయన మరణమునకు అప్పగించేవాడు. అదే అబ్రాహాము చెప్పియున్నాడు. “నేను నిన్ను బ్రతిమలాడుచున్నాను, దానిని చెప్పుము…” ఈ ఫిలీష్తీయ రాజు అబ్రాహామును అక్కడ పట్టుకొన్న తరువాత, “అతడు తన యొక్క భార్యతో, నేను నీ సోదరుడని చెప్పుమని ఆమెను బ్రతిమలాడెను. కారణమేమనగా నీవు ఒక అందమైన స్త్రీవి.” “ఇప్పుడు, నీవు అందముగాయున్నావని నిన్ను అతడు చూసినట్లైతే, నేను చంపబడతాను, ’కారణము అతడు నిన్ను తీసుకొని పెండ్లి చేసుకొంటాడు.” అబీమెలెకు ఆమెను చూశాడు అతని మనుషులు ఆమెను లోనికి తీసుకొని వచ్చారు.

139 ఆమె ఒక అందమైన స్త్రీ, అదే విధముగా, ఆమెకు నూట ఇరవై సంవత్సరములు. వారి ద్వారా, దేవుడు మన అందరికి ఏమి చేయబోవుచున్నాడో, సరిగ్గా మనకు చూపాడు. నీకు తెలుసా దేవుని వాక్యము ద్వారా రుజువు చేస్తూ నా అంశములో టేపుల మీద నేను దానంతటి గుండా వెళ్ళియున్నాను, అది ఖచ్చితముగా మొత్తము సంతానానికి, ఆయన ఏమి చేయబోవుచున్నాడో, అబ్రాహాము శారా ద్వారా ఆయన చెప్పాడు. అది నిజము.

140 ఇప్పుడు, అక్కడ ఆమె యున్నది, కాబట్టి అబీమెలెకు ఆమెను తన భార్యగా తీసుకొన్నాడు. అబీమెలెకు, ఇప్పుడు ఆమెను తన భార్యగా తీసుకొనుటకు అంతా సిద్ధపడ్డాడు (ఏమిటి?) దేవుడు అబ్రాహాముతో ఏమన్నాడు, “శారా ద్వారా నీవు ఈ బిడ్డను పొందబోవుచున్నావు.” మరియు ఇక్కడ ఒక యవ్వనస్థుడు ఆమెను తీసుకొనబోవుచున్నాడు. ఇక్కడ అబ్రాహాముయున్నాడు, దరిదాపుగా అతడునూ ఒక నూరు సంవత్సరముల వయస్సుగలవాడు.

141 కాని, దాని ద్వారా, దేవుడు అక్కడ ఏమి చెప్పాడో నీవు గమనించు “అవును, నీ హృదయము యొక్క యథార్థత నాకు తెలుసు. ఆ కారణమును బట్టియే నీవు నాకు వ్యతిరేకముగా పాపము చేయకుండా నిన్ను ఆపియున్నాను. అయితే ఆ స్త్రీని తిరిగి ఇచ్చివేయుము; ఏలయనగా ఆమె భర్త నా ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థించనియ్యు. నీవు ఆలాగు చేయనియెడల, ఈ భూమి మీద నుండి నేను నిన్ను తుడిచివేయబోవుచున్నాను.” అక్కడే నీవున్నావు.

142 ఏమిటి? దేవుని యొక్క మాట నిలబడవలసియున్నది. ఏ మనిషియు శారాను ముట్టజాలడు. కారణము దేవుడు ఒక వాగ్దానము చేసియున్నాడు.

143 శారా, సంఘమునకు ఒక మాదిరి, ఒక నిజమైన సంఘము, స్వతంత్ర సంఘము, ఒక స్వతంత్రమైన బిడ్డతో, స్వతంత్రురాలు, వాగ్దానములో తిరిగి జన్మించిన సంఘమునకు మాదిరి. వారు ఏమి చెప్పాలనుకొంటారో దానిని చెప్పనియ్యండి; “పరిశుద్ధ-రోలర్లు, మూఢత్వము” అని పిలవనియ్యండి. వారు పెంతెకొస్తు నుండి దానిని ఆపుటకు ప్రయత్నము చేశారు, వారు ఎన్నడూ దానిని చేయలేకపోయారు. లేదండి. కారణము దాని నుండి మీ చేతులను దూరముగా యుంచండి, అంతమట్టుకు. నేను ఇక్కడ నిలబడియున్నంత నిశ్చయముగా, దేవుడు దానిని తీసుకొని దానితో ఏదో చేస్తాడు. ఇప్పుడు ఆ యుగము నుండే మనము తిన్నగా క్రిందికి వస్తున్నాము, ఇప్పుడు, కొన్ని నిమిషములలో దేవుడు నాకు సహాయుము చేయును గాక, మనము ఎక్కడయున్నామో, నేను మీకు దానిని రుజువు చేస్తాను, నిజము. వారు ఎన్నడూ దానిని పాడు చేయలేరు. అది పాడు చేయబడదు. అది నిజము.

144 “నీ చేతులను ఆమె మీద నుండి తీసివేయుము.” వారిని విడిచిపెట్టుము, ఎందుచేత? అక్కడ సహజమైన సంతానము వస్తుంది. సహజమైన సంతానము రావలసియున్నది. ఒక వేళ శారా ఆ ఇతర మనిషిని వివాహము చేసికొనియుంటే, సహజమైన సంతానము ఎన్నడూ జన్మించియుండేదికాదు.

145 కాబట్టి దేవుడు సహజ సంతానము యొక్క క్రమమును కాపాడియున్నట్లైతే, ఇంకా ఎంతో ఎక్కువుగా రాజసంతానమైన, ఆత్మసంబంధమైన సంతానమును ఆయన కాపాడును!

146 సాతానా, వాటిని తిరిగి ఇచ్చి వెయ్యి. వారిని విడిచిపెట్టు. సంస్థలు మరియు తదితరమైన వాటితో వారిని ఊపిరి సలపకుండా చెయ్యవద్దు. వారు స్వతంత్రులైన ప్రజలు. నీవు వారిని ఒంటరిగా విడిచిపెట్టు. అవును, రాజసంతానమును విడిచిపెట్టు.

147 ఇప్పుడు, దేవుడు పునరుద్ధరణను గూర్చి యోవేలుతో మాట్లాడుచున్నాడు. నేను మునుపు ఒకసారి దీనిని గూర్చి బోధించాను, ఇప్పుడు దానిని మరొక కోణములో తీసుకొంటాను. ఈ రోజున దానిని నేను సమీపించినట్లుగా, ఎన్నడూ దానిని గూర్చి క్షణ్ణముగా వెళ్ళియుండలేదు, అది తప్పక పూర్తి చేయబడవలసినట్లుగా, పూర్తి చేయుటకు సమయము లేకుండెను. అయితే దేవుడు ఇక్కడ యోవేలులో మాట్లాడుచున్నాడు.

148 దేవుడు ఆయన నాటిన ఫల వృక్షమును గూర్చి మాట్లాడుచున్నాడు. దేవుడు ఒక ఫల వృక్షమును నాటియున్నాడు. పెంతెకొస్తు దినమున ఆయన దానిని నాటియున్నాడు, మరియు ఒక ఉద్దేశము కొరకు ఆయన దానిని తెచ్చియున్నాడు. అది ఆయన ఫలమును ఫలించాలని ఆయన కోరియున్నాడు, వాక్యము,దేవుని యొక్క వాక్యము. ఆయన వాక్యమును పాటించే సంఘము ఆయన కోరుకొనియున్నాడు. యుగములన్నిటి గుండా, దానిని పాటించుటలో హవ్వ తప్పిపోయింది; యూదులు దానిని పాటించుటలో తప్పిపోయారు, ధర్మ శాస్త్రము తప్పిపోయినది, అన్నీ తప్పిపోయినవి, కాబట్టి దేవుడు ఆయనను ఒక చెట్టుగా నాటియున్నాడు. ఒక చెట్టు!

149 ఇప్పుడు గుర్తుంచుకోండి, ఏదెను తోటలో రెండు చెట్లుయున్నవి. మనకు అది తెలుసు. వారు ఎక్కడకు రావాలో అక్కడకు నీవు పిలిచావు, నేను నా ఆలోచనను కలిగియున్నాను, కానీ, ఎలాగైనా, వాటిలో ఒకటి కలుషితమైన చెట్టు. అది కలుషితమైనది. మరొకటి కలుషితము కానిది; ఆ జీవ వృక్షము దేవుని నుండి, పరలోకము నుండి వచ్చియున్నది. ఆయన అన్నాడు, “మీ పితరులు మన్నా తిన్నారు మరియు చనిపోయారు. కానీ నీవు తినే చెట్టు ద్వారా శాశ్వతముగా జీవిస్తావు.” ఏదెను తోట నుండి, దేవుని దూత, ఏదెనులో దానిని కావలి కాసియున్నది. ఇప్పుడు ఆత్మ సంబంధముగా మాట్లాడుచున్నట్లైతే, జీవ వృక్షము ఏదెనులో యున్నది. గమనించండి.

150 ఇప్పుడు, దేవుడు ఆ చెట్టును నాటినపుడు, అది తొమ్మిది వేర్వేరు ఫలములను ఫలించవలసియుండెను, దాని భావము తొమ్మిది ఆత్మ సంబంధమైన ఫలములు, తొమ్మిది ఆత్మ సంబంధమైన వరములతో వెళ్ళు, తొమ్మిది ఆత్మ ఫలములైయున్నవి. అది దేవుని యొక్క వృక్షము. పెంతెకొస్తు దినమున దానిని భూమిలో ఆయన నాటెను.

151 ఇప్పుడు మనము ఆగుదాము. ఎల్లప్పుడు ఎంతో పరిమితమైన సమయము నాకున్నది. కాబట్టి నేను కొన్ని లేఖనములను దాటవేసి, కీర్తన 1వ అధ్యాయములోనికి వెళతాను. ఎంతో కాలము క్రితము దావీదు ఈ చెట్టును చూసియున్నాడు. అతడు వ్రాయుచున్న గీతములలో ఎంతో సంతోషకరమైన దీనిని గూర్చి మొదటిగా అతడు వ్రాశాడు. అతడు ఆ చెట్టును చూశాడు మరియు అది “నీటి కాలువల యోరను నాటబడియున్నది.” ఆ చెట్టు! ఆయనే!

అతడు నీటి కాలువల యోరను నాటబడినదై, దేవుని చెట్టు, కాలువలు యోరను నాటబడియున్నది (ఎక్కడ నాటబడింది?), కాలువలు (బహువచనము), నీటి కాలువల యోర (ఏకవచనము)…

152 ఒక మెథడిస్టు కాదు, బాప్టిస్టు కాదు, ప్రెస్బిటేరియన్ కాదు, లూథరన్ కాదు. అలాటిది ఏదీ కాదు, లేదు, లేదు, హ. హ. ఒకే నీటి యొక్క నదులు; ఒకే ఆత్మ ద్వారా తొమ్మిది కృపా వరములు, అదే కాలువ నుండి తొమ్మిది ఫలములు వచ్చుచున్నవి.

…అతడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలే యుండును.

153 దావీదు దానిని చూసినట్లుగా, అతడు మాట్లాడాడు. అతడన్నాడు, “ఆ మనిషి ధన్యుడు.” గమనించండి, అతడన్నాడు, అతడు చనిపోలేడు. “అతని ఆకులు ఎన్నడూ వాడవు.” లేదు, లేదు, వారు ఏమి చేసినప్పటికీ లెక్క కాదు, వారు ఎన్నడూ ఆ చెట్టును చంపలేరు. ఎందుచేత? అక్కడే అది నాటబడియున్నది. “అతడు నీటి కాలువల యోరను నాటబడి యున్నాడు.” గమనించండి. దావీదు అన్నాడు, “అతని వేర్లు చావవు.”

154 నీకు తెలుసా, ఒక పెద్ద పాత చెట్టును నీవు తీసుకొనుము. నేను ఒక పిల్లవాడిగాయున్నపుడు, పిల్లలమైన మేము బయటకు వెళ్ళి, ఆ పెద్ద అడవి చెట్టు క్రింద కూర్చొనేవారము, పెద్ద అడవి చెట్టు మరియు గాలులు వీస్తూ యుండేవి. నేను ఆశ్చర్యపోయేవాడను. ఆ చెట్టు పైన అంతా చూసినపుడు, చెట్టు పైన గాలి దెబ్బ కొట్టినట్లు యుండేది. అది చెట్టును ఊపి వేసేది, మరియు వేర్లును వదులుగా చేసేది, ఆ ప్రకారము అవి ఇంకా లోతుగా త్రవ్వబడి, ఇంకా మంచి పట్టును పొందుతాయి.

155 ఒక క్రైస్తవునిగా తమాషా చేయుట, వెక్కిరించుట, నవ్వుట ఆ మార్గములోనే యుంటుంది. అది ఏమి చేస్తుందనగా, హింస క్రైస్తవుని కదిలిస్తుంది, అతడు ఎక్కువగా ప్రార్థన చేయునట్లు చేస్తుంది, లోతుగా త్రవ్వునట్లు చేస్తుంది, మంచి పట్టును అతడు కలిగియుండునట్లు చేస్తుంది, ఆ ప్రకారము అతడు, ఆ తుఫానును తట్టుకొంటాడు.

156 ఇప్పుడు, “నీటి కాలువ యోరును,” ఒక మనిషి నాటబడినట్లైతే, అక్కడ ఊటలు, తొమ్మిది వేర్వేరు ఊటలు అతనిని పోషిస్తున్నాయి? ఓ, అయ్యో! ఎలాటి ఏర్పాటును అతడు కలిగియున్నాడు. నీటి కాలువల యోరను నాటబడిన వ్యక్తి, నీటి కాలువలు; ఒకే నీరు, ఒకే ఆత్మ, “ఒకే ఆత్మ ద్వారా అక్కడ స్వస్థతా వరములున్నాయి; ఒకే ఆత్మ ద్వారా ప్రవచించే కృపా వరములు; అన్నియూ అదే ఆత్మ ద్వారా, కానీ ఎన్నో వరములు.” ఇచ్చువాడు ఒక్కడే.

157 ఇప్పుడు, ఈ చెట్టు ద్వారా అతడు నాటబడుటను దావీదు చూశాడు. ఇప్పుడు, అతడు చనిపోలేడు. ఇప్పుడు ఎందుకో గమనించండి. అతడు వేరులలో జీవమును కలిగియున్నాడు. వేరులు ఎక్కడ యున్నాయి లేక, చెట్టు యొక్క జీవము? వేరులలో నిలిచియుంటుంది. నిశ్చయముగా. జీవము పైకి వచ్చి ఫలమును ఫలిస్తుంది.

158 గమనించండి. తన కాలములో అతని ఫలము ఫలించునట్లుగా, అతని యొక్క వేరులలో జీవమున్నది. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఈ చెట్టు దాని ఫలమును రాల్చదు.

159 ఇప్పుడు, నీవు ఆ చెట్టును తీసుకొని నీళ్ళకు దూరముగా యుంచండి. అప్పుడు మొదటి సంగతి మీకు తెలుసా, నీవు చిన్న పాత ఆపిల్ పండ్లను కలిగియున్నావు. అవన్నియూ మురికిగా యుండి, పురుగులు తినివేసియున్నవి. అయితే అది దాని ఫలమును రాల్చివేస్తుంది.

160 ఈ రోజున సంఘములతో వచ్చిన ఇబ్బంది అదియే. నది నుండి మీరు దూరముగా వెళ్ళిపోయారు, ఆత్మ యొక్క ఫలముల నుండి దూరముగా వెళ్ళిపోయారు. వారు ఒక సహజమైన సంఘము కలిగియున్నారు. వారు ఆత్మ సంబంధమైన వరముల నుండి మరియు ఆత్మ సంబంధమైన విషయముల నుండి దూరముగా వెళ్ళిపోయారు, మరియు వారి ఫలమును పడవేసుకొన్నారు. వారు ఏమి చేస్తారు? వారి విశ్వాసులు లోకముతో జీవిస్తారు. లోకము వలే ప్రవర్తిస్తారు, దొంగిలిస్తారు, మోసము చేస్తారు, అబద్ధమాడతారు, పొగ త్రాగుతారు, సారాయి త్రాగుతారు, పేకాట ఆడతారు, బోధకునికి చెల్లించుటకు, సంఘములో బంకో పార్టీలు కలిగియుంటారు, సూప్ సప్పర్ లు, డాన్సులు సమస్తమునూ చేస్తారు. చూడండి? వారి ఫలమును పడవేస్తారు, సరిగ్గా అది లోకము వలే.

161 అవిశ్వాసి చూసి ఇలా అంటాడు, “ఆ వ్యక్తికి మరియు నాకు మధ్య ఏ భేదమును లేదు.”

162 అదే రష్యాలో కమ్యూనిజం లేచుటకు కారణమైయున్నది. ఆ కారణమును బట్టియే వారు కాథలిక్ సంఘమును కాల్చివేసియున్నారు…

163 మెక్సికోలో నేను అక్కడ యున్నప్పుడు, నేను ఆ సున్నం గుంటలను చూశాను, ఆ స్థలములలో వారి సన్యాసినులు జన్మనిచ్చిన చిన్న బిడ్డలను అక్కడ కాల్చివేశారు. మానవ శరీరములే, సంపూర్ణముగా ఎదిగిన మానవ శరీరములు అక్కడ సున్నంగుంటలలో పడియున్నవి. వారు ఏమి చేశారు? వారు వారి పంటను విడిచారు, చూడండి. దేవుడు వారిని చెట్టు నుండి దులిపివేశాడు. అది అంత మట్టుకే. చూడండి? దేవుడు వారిని చెట్టు నుండి దులిపివేశాడు. అది అంతమట్టుకే. చూడండి?

164 కానీ నాటబడిన ఒక మనిషి, అతికించుకొని యుండలేదు, కానీ నీటి కాలువల యొద్ద నాటబడియున్నాడు, అతడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే యుండును (గమనించండి). నీవు దానిని చదువుచున్నావా?

అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, పాపుల మార్గమున నిలువక…యుండువాడు ధన్యుడు.

…అతడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలే యుండును, అతడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే యుండును…అతడు చేయునదంతయూ సఫలమగును.

165 చూడండి? గమనించండి, “దుష్టులు ఆలాగున యుండరు, అతడు అతనితో తీర్పులో నిలబడడు.” చూడండి?

166 ఇప్పుడు, “అతడు తన కాలమందు ఫలమిచ్చును.” “అతడు,” అనే మాటను ప్రతీసారి గమనించండి, అది అక్కడ వ్యక్తిగత సర్వనామము. అది అతని ఫలము, దేవుని ఫలము, అతని ఋతువులో, ప్రవక్త దానిని తెచ్చుచున్నాడు, అది ప్రవక్త యొక్క ఋతువుగా యుంటుంది. దేవుని యొక్క ఫలము, దేవుని కాలములో, ప్రవక్త యొక్క ఋతువు ద్వారా. చూడండి? “అతడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే యుండును.” చూడండి? అక్కడ ఇద్దరు కాదు, “అతడు,” అని అక్కడయున్నది. “దేవుని యొక్క ఫలమును తెచ్చును, చూడండి, వర్తమానికుడు అది వస్తుందని నిర్దేశించిన ఋతువులో.” అతడు వాటిని తెచ్చును. ఇప్పుడు, దానిని గుర్తుంచుకోండి. దేవుని యొక్క ఫలమును తెచ్చు వర్తమానికుడు, దేవుని యొక్క ఋతువులో దానిని తెచ్చును, తెచ్చువాని ఋతువులో. చూడండి? “అతని కాలమందు ఆయన ఫలమును తెచ్చును.” అది వాడిపోదు. ఎందుచేత? అతడు ముందుగా నిర్ణయించిన ఫలమును కలిగియున్నాడు. అది దానిని పాడుచేయలేదు, కారణమేమనగా అది ముందుగా నిర్ణయించబడినది.

167 ఇప్పుడు ఎఫెసీ :5, 1:5, అది ఇంకా చెప్పబడింది, “క్రీస్తుయేసు నందు పరలోకపు స్థలములో కూర్చొండియున్నాము.” ఏమి సంభవించింది? అతడన్నాడు, “దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను.” దేవుడు, తిన్నగా క్రిందకు వరుస ప్రకారము ఏమి సంభవిస్తుందో, ఆయన ముందు జ్ఞానమును బట్టి, సమస్తమును ముందుగా నిర్ణయించియున్నాడు. ఆయన ముందు జ్ఞానము చొప్పున, ఆయన దానిని ముందుగా చూశాడు. అందుచేత ఆరంభము నుండి, అంతము వరకు ఆయన చెప్పగలడు.

168 అందుచేత, ఈ చెట్టు వేరు ముందుగా నిర్ణయించబడిన ఫలమైయున్నది. ఈ చెట్టు ఎండిపోదు, కారణము అది ముందుగా నిర్ణయించబడిన ఫలమును కలిగియున్నది. ఇప్పుడు, ఈ చెట్టు గురించియే యోవేలు మాట్లాడియున్నాడు. చూడండి? అది చనిపోలేదు. పురుగులు దానిని తినివేసినవి, కాని అది చనిపోలేదు. దాని వేరులలో, అది ముందుగా నిర్ణయించబడిన సత్యమును కలిగియున్నది. అది దేవుని వాక్యమును కలిగియున్నది, ఈ చెట్టు కలిగియున్నది. ఈ చెట్టు, అది మాత్రమే ఏదెను తోటలో ఉంచబడినది, అది మాత్రమే మార్గము.

169 చెట్లన్నియూ, స్త్రీ ద్వారా, చనిపోవును. స్త్రీ ద్వారా, మనమందరము చనిపోవుచున్నాము. జన్మ ద్వారా మనమందరము చనిపోతాము. అయితే స్త్రీ ద్వారా మరణము వచ్చింది, ఏలయనగా జన్మ స్త్రీ ద్వారా వచ్చింది. మంచిది. అప్పుడు, పాపమును బట్టి ఇది చనిపోవలసియున్నది.

170 కాని నూతన జన్మ, క్రీస్తు ద్వారా వచ్చు నూతన జన్మ, చనిపోలేదు. అది ఒక చెట్టు, ఇది మరొక చెట్టు. చూడండి? ఈ చెట్టు హింసించబడినను, ఎగతాళి చేయబడినను, ఏదెను తోట ప్రారంభము నుండియే, ఇది చనిపోలేదు. అది ముందుగా నిర్ణయించబడింది. అది కలపబడి, కొట్టబడింది. అయ్యో, సమస్తమూ దానికి చేయబడింది. ఏమి సంభవించింది? అది చనిపోలేదు. అతడు చనిపోడు, అతడు చనిపోలేడు, కారణము అతడు అతనిలో ముందుగా నిర్ణయించబడిన దేవుని వాక్యమును కలిగియున్నాడు. అది ముందుకు రావలసియున్నది, కారణము అది అతని ఋతువులోని అతని ఫలము, ముందుగా నిర్ణయించబడిన ఋతువు. అదేమనగా, ఏదీ లెక్క కాదు…

171 వాటిలో ప్రతీ ఒకటి, తినివేయబడటాన్ని యోవేలు చూశాడు. కానీ అతడన్నాడు, “నేను పునరుద్ధరిస్తాను, అని ప్రభువు చెప్పాడు,” కారణము దేవుని యొక్క ముందు నిర్ణయము చెట్టు యొక్క వేరులలో ఉంచబడియున్నది. అది తప్పక ముందుకు రావాలి, కారణము అది ముందుగా నిర్ణయించబడిన దేవుని వాక్యమును కలిగియున్నది. ఓ, ఎలాటి చెట్టు! అయ్యో!

172 అదే చెట్టు, వెనుక ఏదెను తోటలో ఎదుగుట ఆరంభమైనది. ఏమి సంభవించింది? కయీను యొక్క పిల్లల గుంపు ముందుకు వచ్చింది, కొన్ని పురుగులు వచ్చి దంటు వరకు తినివేసినవి. దానిలోని ఒక పంటను దేవుడు తీసుకొని ఓడలోయుంచాడు, అది దానిగుండా మోయబడింది. నిజము. క్రింద వరకు, అది ఆ మార్గములోనే యుండియున్నది, తీర్పు వరుసలు వరకు; ఇశ్రాయేలు, ఇంకా పై వరకు.

173 తరువాత పెంతెకొస్తు నొద్ద, అక్కడ సంఘము, వధువు వృక్షము కొరకు, ఆయన దానిని పెంతెకొస్తు దినమున క్రమములో యుంచాడు. ఆ చెట్టు దాని యొక్క ఋతువులో, ఆయన ఫలమును తెచ్చుటకు ముందుగా నిర్ణయించబడియున్నది. ఇప్పుడు చక్కగా వెళ్ళుచున్నది, ఫలములు చక్కగా తయారైనవి. అది పెంతెకొస్తు దినమున మొగ్గలు తొడిగినది. పెంతెకొస్తు దినమున ఏమి సంభవించియున్నదో మనము చూద్దాము. యేసు అన్నాడు, “నేను చేయు క్రియలు మీరును చేస్తారు.” వారు రోగులను స్వస్థపర్చారు, అది ఎలా ప్రారంభించబడినదో చూద్దాము. పెంతెకొస్తు దినమున, పునరుత్థానము తరువాత కొన్ని దినములకు, ఈష్టరు తరువాత యాభై దినములకు, అక్కడ వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని పరలోకము నుండి వచ్చియున్నది.

174 ఇప్పుడు, ఈ రోజు, మనము దానిని భిన్నమైనదిగా తయారుచేస్తున్నాము. సేవకుడు నిలబడి ఈలాగు చెపుతున్నాడు, “నీ పేరును నేను పుస్తకములో వ్రాస్తాను.” చూడండి? లేక ఏదో పట్టా కలిగిన వ్యక్తి తన కాలరుతో చుట్టూ తిరిగి, “ఇక్కడకు వచ్చి కోషేరు రొట్టెను తీసుకొనుము, ఆ విధముగా, అప్పుడు నీవు ఒక సభ్యుడుగా మారతావు.” అది వింతగా లేదా? “వచ్చి మా గుంపులో చేరండి,” అని సేవకుడు అంటాడు. ఎందుకు, వారిద్దరూ తప్పుయైయున్నారు.

175 “పెంతెకొస్తు దినమున పరలోకము నుండి,” (వేదిక మీద నుండి కాదు, రోడ్డు మీద నుండి కాదు) “పరలోకము నుండి, ఒక,” (ఏమిటి? ఒక యాజకుడా? [సమాజము “కాదు,” అని చెప్పుచున్నది.—ఎడి.] కాదు. ఒక సేవకుడా? కాదు. అది ఏమైయున్నది?) “వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి దిగివచ్చి, వారు కూర్చొండియున్న స్థలమంతయూ నింపెను. అగ్ని నాలుకలు వారి మీద కూర్చొండెను.” నత్తి పెదవులతో, వారు మాట్లాడలేకపోయారు, వారు ఎంతో సంపూర్ణమైన మహిమతో నింపబడ్డారు. పరిశుద్ధాత్ముడు వారిని పంపెను. వారు వీధులలోనికి తడబడుచూ మాట్లాడుచూ వెళ్ళిరి…

176 గౌరవప్రథమైన సంఘము అక్కడ నిలబడి, “బాగుంది, ఈ మనుషులు సంపూర్ణముగా క్రొత్త మద్యముతో నిండిపోయారు, అన్నది, వారందరూ త్రాగియున్నారు. ఆ స్త్రీలు మరియు పురుషుల వైపు చూడండి. వారు తడబడుచూ ముందుకు వెళుతున్నారు.”

177 ఇప్పుడు, అది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు” యై యున్నది. అది లేఖనమైయున్నది. ఆ విధముగానే సంఘము ఏర్పరచబడినది; ఏర్పరచబడుట కాదు, కానీ నిర్దేశించబడియున్నది, ఈ రెండు మాటల మధ్య ఎంతో తేడాయున్నది. గమనించండి. అక్కడ వారు యుండియున్నారు.

178 కాథలిక్ ప్రజలైన మీరు, ఇప్పుడు, అది ఏమిటో మీకు తెలుసా? ధన్యురాలైన కన్య మరియ వారితో యుండియున్నది. అవును. ఇప్పుడు, దేవుడు పరిశుద్ధాత్మను పొందకుండా మరియను పరలోకము రానివ్వనట్లైతే, దానిలో ఏదైన తక్కువగా, నీవును అక్కడకు ఎలా వెళ్ళగలవు? ఇప్పుడు దానిని గూర్చి ఆలోచించండి. అది నిజము. మరియ వారి మధ్యలో యున్నది. ఆమె తన హోదాను, గర్వమును పోగొట్టుకొని, ఆత్మతో నింపబడు వరకు, ఆమె అక్కడ కనిపెట్టవలసియుండెను.

179 అక్కడ వారు త్రాగిన ప్రజల వలే ప్రవర్తించిరి. వారు ఆ రీతిగా ప్రవర్తించియున్నారని బైబిలు చెప్పింది. “ఈ మనుషులు క్రొత్త మద్యముతో మత్తులైయున్నారు.”

180 కాని పేతురు, వారి ప్రతినిధి, ఆ గుంపులోని సేవకుడు, నిలబడి అన్నాడు, “మీరు ఊహించునట్లు, మీరు మద్యముతో మత్తులైన వారు కారు, ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే.” దాని నుండి నేను చదవుచున్నాను. “అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను క్రుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు, పైన ఆకాశమందు మహాత్కార్యములును క్రింద భూమి మీద సూచనలను కలుగజేసెదను. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారందరును రక్షణ పొందుదురు.”

181 ఇప్పుడు, ఈ రోజున నేను బోధిస్తున్న అదే ప్రవక్త చెప్పిన దానిని గూర్చి, పెంతెకొస్తు నొద్ద పేతురు బోధించాడు; ఈ వృక్షమును నాటుచున్నాడు. అక్కడ అతడు దానిని నాటాడు. అది చక్కగా పనిచేయుచున్నది. వారు బయటకు వెళ్ళారు, ఆత్మ సంబంధమైన వరములను కలిగియుండిరి. వారు రోగులను బాగు చేశారు. వారు బోధించారు. వారు బైబిలులోనికి విసిరివేయబడ్డారు. వారు వాక్యము కొరకు శ్రమననుభవించుటకు ఇష్టపడ్డారు.

182 నీవు మరొక దేశానికి నీరు కలిపినట్లు వెళ్ళినట్లైతే, నీవు ఒక మంచి అమెరికా వాసిగా చేయలేవు, నీవు అక్కడకు వెళ్ళినట్లైతే. ఇప్పుడు జపాన్ దేశము వెళ్ళుతున్నట్లైతే, నీవు దారి వెనుక గుండా వెళ్ళి, “వినండి, సహచరులారా, నేను మీ కొరకు వున్నాను, కానీ నేను మరొకవైపున యున్నాను.” మోసగాడా, నీవు తప్పక కాల్చబడాలి. అది నిజము. నీవు మోసగాడివి. నిశ్చయముగా.

183 అప్పుడు అది ఆ విధముగానే యున్నది, దేవుని యొక్క వాక్యమును ఎరిగిన ఒక వ్యక్తి, ఏదో ఒక సంస్థ ఆ విధముగా అతనిని చేయుమని చెప్పినందువల్ల, అతడు దాని మీద రాజీ పడుచున్నాడు. అది ఒక మోసగాడు, నిజము.

184 కానీ ఈ మనుషులు మోసగాళ్ళు కాదు. సంఘ మర్యాదలు ఏలాగు కొనసాగినవో, వారు వాటిని లెక్క చెయ్యలేదు; కానీ వారు అరుస్తూ, కేకలు వేస్తూ, మొర్రపెట్టుచూ, వారు ఒకరితో ఒకరు అర్థము కానటువంటి భాషలను మాట్లాడుచూ, తత్తరిల్లుచున్నట్లు కనబడుచున్నది. బయట శ్రోతలలోయున్న ఇతర దేశస్థులు, ఇతర భాషలు మాట్లాడేవారు, వారు చెప్పుచున్నదానిని అర్థము చేసికొనిరి. వారు ఏమి చెపుతున్నారో వారికి తెలియదు. వారు తత్తరిల్లుచూ మాట్లాడుచుండిరి. కానీ ఇతర ప్రజలు బయట దానిని గ్రహించిరి. వారన్నారు, “ఈ ప్రజలు నిజముగా మత్తులైరి.”

185 కానీ పేతురు అన్నాడు, “వారు మద్యముతో మత్తులు కాలేదు, కానీ వారు ఆత్మతో నింపబడియున్నారు.”

186 కాబట్టి, వారిలో ప్రతీ ఒక్కరూ, యోహాను తప్ప, హత సాక్షులయ్యారు. యోహానును నూనె తొట్టెలో ఇరువది నాలుగు గంటలు అతడు కాల్చబడ్డాడు, అతనిలోని ఆత్మను వారు కాల్చలేకపోయారు. తరువాత అతడు ఒక్కడే సహజ మరణము పొందాడు. ప్రత్యక్షత దారుడైన యోహాను. ఇప్పుడు అది సత్యము.

187 గమనించండి, ఇప్పుడు ఏమి జరిగింది. దీని మీద, ఆత్మ యొక్క తొమ్మిది ఆత్మ ఫలములు ఫలించుటకు, దేవుడు ఒక చెట్టును నాటాడు. క్రీస్తులో యున్న అదే ఆత్మ. సంఘము పైకి వచ్చియున్నది, వారు నిత్య జీవమును కలిగియుండిరి. ఇప్పుడు, ఆత్మ యొక్క ఫలములు సంఘములో యున్నవి, ప్రతి చోట అది ఫలమును ఫలిస్తూ ముందుకు ఎదుగుచుండెను. వారు వారిని గూర్చి ఆలోచించలేదు. వారు దేనిని సంస్థగా తయారు చేయలేదు. వారు సోదరులుగా కేవలము ముందుకు కొనసాగారు. వారికి ఏమీ లేదు…

188 ఆ చిన్న విషయము అక్కడ యున్నందుకు నేను సంతోషిస్తాను, “క్రీస్తు తప్ప సిద్ధాంతము లేదు, ప్రేమ తప్ప చట్టము లేదు, బైబిలు తప్ప వేరే గ్రంథము లేదు.” నేను దానినే నమ్ముతాను. చూడండి? ఆ విధానములోనే వారు దానిని చేశారు. ప్రపంచమే మన సంఘము, చూడండి, ప్రతి చోట.

189 కాబట్టి గమనించండి, వాళ్ళు ఆలాగున చేస్తున్నప్పుడు, సంఘము ఎంత మహిమకరముగా యున్నదో, దేవుడు వారితో యుండెనని బైబిలు చెప్పింది ఆయన ఆరోహణమునకు ముందు, యేసు వారిని కలుసుకొనెను. ఆయన అన్నాడు, “మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు కనబడును; నా నామమున…” ఇప్పుడు, “ఈ సూచనలు.”

190 ఈ రోజున, ఒక విశ్వాసిని, ఏ రకమైన సూచనలు బట్టి మనము పిలుస్తాము? అతడు సంఘ కాపరితో కరచాలనము చేశాడు. అతడు సంఘమునకు చెందియున్నాడు. అతడు సంఘ పుస్తకముపై తన పేరును కలిగియున్నాడు, కారణము అతని తల్లి ఒక పేరును కలిగియున్నది, లేక తన తండ్రి ఒక పేరును సంఘ పుస్తకములో కలిగియున్నాడు. అయితే యేసు చెప్పినది అది కాదు. యేసు అన్నాడు, “ఈ సూచనలు.” అదే సంఘము, సహజమైనది.

191 ఆత్మ సంబంధమైన సంఘమును గూర్చి మనము మాట్లాడుచున్నాము. మనము ఆత్మ సంబంధమైన వృక్షమును గూర్చి మాట్లాడుచున్నాము, సహజమైన వృక్షము కాదు. కొద్ది క్షణములలో ఆ రెండు చెట్లు యొద్దకు మనము వెళ్ళుచున్నాము. చూడండి? ఒక ఆత్మ సంబంధమైన వృక్షము! యేసు అన్నాడు, “ఆ చెట్టుపై వ్రేలాడుచున్న వారిని ఈ సూచనలు వెంబడించును. నా నామమున వారు దయ్యములను వెళ్ళగొడతారు; వారు క్రొత్త భాషలతో మాట్లాడతారు. వారు సర్పములను ఎత్తి పట్టుకొన్నా లేక మరణకరమైనది ఏది త్రాగినను, అది వారికి హాని చేయదు. వారు రోగుల మీద చేతులుంచినపుడు, వారు స్వస్థత నొందురు.”

192 ఆ విధమైన సూచనలు ఒక విశ్వాసిని వెంబడిస్తాయని ఆయన చెప్పియున్నాడు. ఈ రోజున అది ఎక్కడ యున్నది? విశ్వాసి యొక్క సూచన ఏమైయుంటుందో, ఆయన ప్రపంచమునకు ఒక ఉదాహరణను ఇచ్చాడు. ఆయన అన్నాడు, “నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట అతనికి మేలు, ఏలయనగా వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు చూచుచుందురు.” దూతలు!

193 ఇప్పుడు గమనించండి, వాళ్ళు అక్కడయున్నారు. ఆ చెట్టు నాటబడింది. అది గొప్ప పని చేయుచుండెను. వాళ్ళు ప్రతి చోట సంచరించారని మనకు తెలుసు. ప్రభువు…ఎందుచేత, పెంతెకొస్తు దినమున మూడు వేల ఆత్మలు, బాప్తిస్మము పొంది, చేర్చబడి, సంఘములోనికి వెళ్ళియున్నారు. ఎలాటి గొప్ప సహవాసమును వారు కలిగియున్నారో! వారిలో ప్రతీ ఒక్కరికి ఏ కొదువలేదు. ప్రతీ ఒక్కరు దయగా, మంచి హృదయమును కలిగియుండిరి. ఒకరితో ఒకరు, వారందరు ఒక పెద్ద కుటుంబముగా యుండిరి, అద్భుతము!

194 ఒక చిన్న, పాత, రోతగా కనబడు, లోభపు పళ్ళతోయున్న పురుగు అక్కడకు వచ్చింది, యోవేలు వాడిని చూసినట్లుగా నాలుగు విధమైన దశలలో వాడు జీవించాడు. ఈ నాల్గవ దశలోయున్న పురుగు, ఈ నాశనకారి, ఆ చక్కని దేవుని వృక్షమును నాశనము చేయుటకు వచ్చింది. దానిని ఆలోచించండి. ఇప్పుడు, యోవేలు చెప్పిన దానిని నేను చదువబోవుచున్నాను. యోవేలు 1వ అధ్యాయము. మొదటి సంగతి…ఇప్పుడు, అక్కడ నాలుగు భిన్నమైన పురుగులు యున్నవి, కానీ నిజానికి అది ఒకే పురుగు. అదే ఒకే పురుగు, నాలుగు భిన్నమైన దశలలో యున్నది. ఇప్పుడు గమనించండి. ఈ చిన్న, పాత పురుగు, ఈ గొప్ప చక్కని దేవుని చెట్టు కొరకు వచ్చింది. మనము దానిని ఒక చెట్టు అని పిలుద్దాము, అది సంఘమైయున్నది.

195 మొదటిది గొంగళిపురుగు, ఆ చిన్న పురుగు, ఆ పురుగు యొక్క సూక్ష్మజీవి. వాడు, గొంగళి పురుగు ఏమి చేశాడు? వాడు వచ్చి చెట్టు యొక్క ఫలమును నాశనము చేశాడు. అది మొదటి కార్యము.

196 ఇప్పుము మనము చరిత్రలోనికి వెళ్ళి, ఆ మొదటిది ఏమిటో చూద్దాము; ఒక మర్యాదగల గుంపు, సామాన్య ప్రజల మధ్యకు వచ్చింది. వారన్నారు, “బాగుంది మీరు రోగులను స్వస్థపర్చుట, ఈ కార్యములు చేయుట బాగున్నది. అది అద్భుతము. కాబట్టి, తప్పక మనము ఏమి చేయాలో తెలుసా? మనము తప్పక దీనిని బయటకు పెద్ద వర్గపు ప్రజల యొద్దకు, శ్రేష్ఠమైన తరగతి ప్రజల యొద్దకు, వారు గ్రహించునట్లు; మేయరు, న్యాయవాదులు, పట్టణములో పేరుప్రఖ్యాతలుగాంచిన వారి యొద్దకు తీసుకొని వెళ్ళాలి. మీరు యున్నట్లుగా, మీరు కొనసాగుచున్నంత కాలము, వారు మీ చుట్టూ ఎన్నడూ రాలేరు. వాళ్ళు మీ గురించి భయపడతారు.”

197 [ఎవరో చెప్పుచున్నారు, “వాళ్ళు ఇంకనూ యున్నారు,” అని.—ఎడి.] ఎవరో దానిని చెప్పారు, “వాళ్ళు ఇంకనూ యున్నారు.” అది సత్యమని అనుకోరా, కాబట్టి అది సత్యము. వారు పరిశుద్ధాత్మను గూర్చి భయపడతారు. నన్ను మన్నించండి.

198 నేను ఒక చిన్న పాటను పాడేవాడను:

అది పాత…

నీవు ఎన్నడైనా, ఆ పాతకాలపు మతమును గూర్చి విన్నావా? ఇక్కడయున్న ఎవరైనా ఆ పాటను విన్నారా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.]

’ఈ పాతకాలపు మతము,…

ఇలాటి చిన్న పాటను, కొన్ని సంవత్సరముల క్రితము పాడేవాడను. నేనన్నాను:

అది పాతకాలపు పరిశుద్ధాత్మ,

దయ్యము దాని దగ్గరకు వెళ్ళదు;

ఆ కారణమును బట్టియే ప్రజలు దానికి భయపడతారు,

కాని అది నాకు తగినంతగా చాలు.

అది ఎంతో చక్కనిది నాకు మరొకటి వద్దు,

కారణము అది నా సోదరుని ప్రేమించునట్లు చేస్తుంది,

అది క్రింద దాగియున్న దానిని తెస్తుంది,

కాబట్టి అది నాకు తగినంతగాచాలు. (అది నిజము.)

అది నిన్ను అబద్ధము ఆపునట్లు చేస్తుంది;

నీవు చనిపోవుచుండగా అది నిన్ను రక్షిస్తుంది;

అది దయ్యము ఎగిరిపోవునట్లు చేస్తుంది,

అది నాకు తగినంతగా చాలును.

199 అది నిజము, ఆ కారణమును బట్టియే ప్రజలకు అది ఇష్టము లేదు. ఇప్పుడు, ఇప్పుడు, అది దేవుడైయున్నాడు.

200 యేసు వారికి అవసరము లేదు. “ఈ మనిషా?” ఈ సంఘము, పెద్ద గౌరవనీయమైన సంఘము, “మేము ఎవరమో నీవు చెప్పటానికి వచ్చావా? అన్నారు. మేము ఎవరమో గ్రహించు, మేము డాక్టర్, పి.హెచ్.డి, ఎల్.ఎల్, క్యూ.యు.యస్,” అయ్యో, “అవన్నీ.” లేనిచో, “ఎందుకు, నేను ప్రధాన యాజకుడుగా యుంటాను. నేను అది, ఇది, లేక మరొకటి. నీవు నాకు చెపుతావా? ఎందుకు, నీవు పాపములో జన్మించియున్నావు. నీవు అక్రమముగా పుట్టిన బిడ్డవు తప్ప, మరేమీ కాదు. నీ తల్లి నీ తండ్రిని వివాహము చేసికొనక మనుపే నిన్ను కనియున్నది.”

201 ఆయన అన్నాడు, “నాలో పాపమున్నదని ఎవరు రూపిస్తారు?” చూడండి? “ఎవరు నన్ను నిందించగలరు?” మంచిది. పాపమనగా, “దేవుని యొక్క వాక్యమును నమ్మకపోవుటయే.” మరొక మాటలో, ఆయనన్నాడు, “తలకట్టుతో సహా ఎక్కడ నేను వాక్యమును నెరవేర్చలేదో చూపించండి, అది అక్కడే తప్పక యుండవలసియున్నది. నా దినములు, ఎక్కడో లేఖనములో చూపించండి. నేను నా తండ్రి క్రియలను చేయని యెడల, నన్ను నమ్మవద్దు.” వాళ్ళన్నారు, “ఇప్పుడు, నీవు అదేనని చెప్పుకొనుచున్నావు. ఇప్పుడు నీవు దానిని చేయుట మమ్మును చూడనిమ్ము.” ఓ, అయ్యో!

202 “అప్పటి నుండి వారు ఏమియు ఆయనను అడుగలేదు.” చూడండి? వాళ్ళు ఆయనను ఒంటరిగా విడిచారు. దయ్యము ఆయన యొద్దకు ఎగిరి వచ్చినట్లుగా. నేను దానిని చెప్పాను, ఎలాగైనా ఆయనలోనికి ఎగరవచ్చని వాడు అనుకొన్నాడు. అయితే, ఆ వైరు లక్షల వోల్టులను కలిగియున్నదని వాడు కనుగొన్నాడు. ఎంతో త్వరగా వాడు ఎగిరిపోయాడు, మీరు చూడండి, కారణమేమనగా వాడు దానిని ఎదుర్కొనలేకపోయాడు. అది ఒక్కటి నిశ్చయము.

203 కాబట్టి ఈ చిన్న గొంగళి పురుగు వచ్చి, ఫలములను తీసివేసింది. “ఫలముల” మీద నేను రెండు పేజీలు కలిగియున్నాను. దానిలో కొంత నేను చదవాలనుకొనుచున్నాను, మొదటిది, వాడు తీసివేసిన మొదటి ఫలము, సహోదర ప్రేమ. అది నిజము. సహోదర ప్రేమ లేనప్పుడు, అది సంఘమును అక్కడే తిన్నగా చంపివేస్తుంది. అవునండి. అప్పుడు, వాడు చెట్టు నుండి తీసివేసిన తరువాత ఫలము…మీకు గుర్తున్నదా, ప్రేమయే ఆ చెట్టు మీద యున్న మొదటి ఫలము. “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, సహనము,” అది నిజము. “పరిశుద్ధాత్మలోయున్న” తొమ్మిది ఆత్మ సంబంధమైన వరములు. చెట్టు యొక్క తొమ్మిది ఫలములు. మంచిది. ఇప్పుడు మొదటిగా, చెట్టు ఫలమును తినివేయుచున్నాడు.

204 ఇప్పుడు పెద్ద చెట్టును చిత్రముగా చేద్దాము, దేవుని చెట్టు. అది తొమ్మిది ఆత్మ ఫలములను ఫలించుచున్నది. వారు రోగులను స్వస్థపర్చుచున్నారు. వారు భాషలతో మాట్లాడుచున్నారు. వారు దయ్యములను వెళ్ళగొట్టుచున్నారు. వారు గొప్ప కార్యములను చేయుచున్నారు మరియు కల్తీలేని దేవుని వాక్యమును బోధించుచున్నారు. ఏ సంఘశాఖ వారిని క్రింద కట్టివెయ్యలేదు; వారు స్వతంత్రులు, గొప్ప పనిని చేయుచున్నారు.

205 కాబట్టి, ఈ చిన్న పాత దయ్యము లోనికి వచ్చి వాడి రెండు కొమ్ములతో మిడుత వలే కూర్చొనియున్నది, నీకు తెలుసా, వాడి పాత లోభత్వపు పళ్ళు. అదే వాడి మొదటిది, గొంగళి పురుగు. సహోదర ప్రేమను తినివేయుటకు వాడు వచ్చాడు. వాడన్నాడు, “నీకు తెలుసా, పలానా-పలానా వ్యక్తి పలానా-పలానా, పలనా-పలానా సంఘములో ఇలా చేశాడు. అలాటి ప్రజలను నేను నమ్మను.” చూడండి? అక్కడ వాడున్నాడు, మొదటి విషయము.

206 తరువాత, విశ్వాసపు ఫలమును, వాక్యములోనికి విశ్వాసమును, వాడు తినగోరుచున్నాడు. “ఇప్పుడు చూడండి. అది వాక్యమైయున్నదని నీకు ఎలా తెలుసు? అది ఎన్నోసార్లు అనువదించబడింది!” ఆ చిన్న దయ్యము ఇంకనూ తినుచూనేయున్నది. నిజము. “ఆ వాక్యము చాలాసార్లు అనువదించబడింది అని వాడు అనుచున్నాడు! వాడు ఇది, అది, మరొకటి అంటాడు. ఓ, వాడు అంతా ఇదేయైయున్నాడు.” చూడండి?

207 ఇప్పుడు, వాడు మరొక ఫలమును తినివేయుచున్నాడు: అదే రక్షణానందము. “ష్ ష్ ష్! మీరు ఎక్కువ శబ్దమును చేస్తున్నారు. ఓ, అయ్యో! అయ్యో!”

208 “బ్రెన్హాం సోదరుడా, నీవు ఎలా బోధించగలవు?” అని ఒక స్త్రీ నాతో అన్నది. కాదు, అది ఆమె కాదు. అది ఒక పురుషుడు అన్నాడు. అతడు ఇక్కడ యున్నాడని నేను నమ్ముతాను.అతడు మరొక సంఘమునకు చెందియున్నాడు. కానీ అతడు నాతో అన్నాడు, “మొన్నటి దినమున నేను, నీ మాటలు వింటానికి నేను అక్కడ యున్నాను. కాని నేను నీ మాటలు వినలేకపోయాను, ఎందుకంటే ప్రజలు ఏడుస్తున్నారు.”

నేనన్నాను, “వాళ్ళు…”

అతడన్నాడు, “నీవు లోకములో ఎలా బోధించగలవు?”

209 నేనన్నాను, “వారు దానిని ఆనందించని యెడల, నేను అక్కడ బోధించను.” అది నిజము.

210 నా స్నేహితుడైన జిమ్ పూల్, నేను ఒక ముసలి కుక్కను కలిగియుండేవారము. మేము దానిని ఫ్రిజ్ అని పిలిచేవారము. వాడు ఏ చెట్టులోనికైనా వెళ్ళి ఆశ్రయము తీసుకొంటాడు, కానీ ఉడుము యున్న చోటు కాదు. ఉడుము అంటే వాడికి భయము, కారణము వాడు ఆ రీతిగా వాసన గొడతాడు. కాబట్టి అతనిని ఒక ఉడుముయున్న పొద క్రిందకు తెచ్చాను, నేను చేయవలసిన ఒకే పని యేమనగా వాడిని కొంచెము నిమిరి, ఇలా చెప్పాను, “కుర్రవాడా! వాడిని పట్టుకో, వాడిని పట్టుకో!” వాడు వెళ్ళి ఆ ఉడుమును తెస్తాడు, చూడండి, కారణమేమనగా “వాడిని పట్టుకో!” అని వాడిని నిమురుచూ చెపుతున్నాను.

211 మంచిది, అది సరిగ్గా అదేయై యున్నది…నేను ఎరిగినంత వరకూ బహు దుర్వాసన కొట్టేది దయ్యమే. కాబట్టి, నేను ఈ వాక్యమును బయటకు తెస్తున్నప్పుడు, ఎవరో “ఆమేన్,” చెపుతారు, అదే, “కుర్రవాడా! దానిపై దాడిచేసి పట్టుకో!” మనము వాడిని చెట్లలో యుంచుదాము.

212 కాబట్టి, ఆ సంతోషమును వాడు తీసివేశాడని మనము కనుగొంటాము. నీకు తెలుసా, దావీదు, ఒకసారి, తన రక్షణ ఆనందాన్ని పోగొట్టుకొన్నాడు. అతడు తన రక్షణను పోగొట్టుకొనలేదు, కాని దాని ఆనందమును పోగొట్టుకొన్నాడు. అతడు మొర్రపెట్టాడు, “ప్రభువా, నా రక్షణానందమును నాకు పునరుద్ధరించుము.” చూడండి? సంతోషము!

213 కాబట్టి, ఈ చిన్న గొంగళి పురుగు, సంతోషపు ఫలమును బయటకు తినివేయుట ప్రారంభించింది. “ఇప్పుడు, ఇక్కడ చూడండి. మీరు ఎక్కువ శబ్దమును చేస్తున్నారని అంటారు. నేను చెపుతాను. ఈ కేకలన్నీ, ఆ ‘ఆమేన్’ లన్నీ, ఈ అరుపులన్నీ, వెర్రితనము అని వారంటారు. దానికక్కడ ఏమీ లేదని, వారంటారు.” చూడండి? మొదటి విషయము నీకు తెలుసా? మీరక్కడ కూర్చొన్నారు, వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళు. దేవుని యొక్క ఆత్మ తప్పక ప్రవహించవలసిన స్థలములో, పాత సంఘ సిద్ధాంతాలను ఎక్కించుచున్నారు, ఎంతో ప్రసిద్ధిగాంచిన సిద్ధాంతములను, ఈ శవములను భద్రపరచు రసాయనములను కొందరి నరములలోనికి ఎక్కించుచున్నారు. ఆశ్చర్యము లేదు, వారు చల్లబడిపోయి చనిపోయియున్నారు. తొంభై క్రింద సున్నా అని, ఆత్మ సంబంధమైన థర్మామీటరు చెప్పుచున్నది. ఎవరైనా “ఆమేన్,” అని చెపితే, ఏమి చెప్పబడియున్నదో అని తెలుసుకొనుటకు, ఒక విధమైన బాతు మెడ వలే వారి మెడను త్రిప్పుతారు. అది అవమానము. దేవుని యొక్క ఆత్మ తప్పక సంతోషము, సమాధానము, ప్రేమగా యుండవలసియున్నది. కానీ ఈ చిన్న పాత పురుగు, దానిని తినివేయుట ప్రారంభించింది. వాడు సంతోషమునంతా తినివేశాడు.

214 తరువాత, చెట్టు మీదయున్న ఫలము సమాధానము, మనస్సులో శాంతి, అదే నీవు రక్షించబడియున్నావని ఎరుగుట.

215 వాళ్ళంటారు, “బాగుంది, ఇప్పుడు, నీవు మా సిద్ధాంతమును వల్లించినట్లైతే, నీవు రక్షించబడతావు. నీవు మా సంఘములో చేరినట్లైతే రక్షించబడ్డావు.” “బాగుంది, ఇప్పుడు,” అతడంటాడు, “నీవు అక్కడకు వెళ్ళినట్లైతే, నీవు రక్షించబడలేదు. రక్షించబడటానికి, నీవు మా సంఘములో చేరాలి. నీవు ‘మరియా దండము,’ అనాలి. నీ పేరును ఈ పుస్తకము మీద కలిగియుండాలి, నీవు దీనిని కలిగియుండాలి…” ఓ అయ్యో! అది సంతోషమునంతా బయటకు తీసివేస్తుంది. అయితే అది దేవుని చెట్టుకాదు; నీవు ఎక్కడయున్నావో నీకుతెలుసా. అది ఎల్లప్పడు, సంకరము చేయబడినదైయున్నది.

216 కంచర గాడిదను గూర్చి నా కథ మీకు తెలుసా. వాడు సంకర జాతి. వాడి యొక్క తల్లి ఎవరో, తండ్రి ఎవరో, ఏదీ వాడికి తెలియదు. చూడండి? వాడు ఒక సంకరజాతి. కానీ ఒక వంశ వృక్షము కలిగిన గుర్రము, తరతరముల గుండా వాడి తండ్రి ఎవరో, వాడి తల్లి ఎవరో వాడికి తెలుసు.

217 ఇప్పుడు, పెంతెకొస్తు దినమున క్రుమ్మరించబడిన, పరిశుద్ధాత్మను కలిగిన, ఒక మంచి వంశ వృక్షమును కలిగిన నిజమైన క్రైస్తవునికి కూడా అది తెలుసు. అతడు ఎక్కడ యున్నాడో అతనికి తెలుసు. వెనుక వరకు, అతడు తన తరములను గుర్తించగలడు. అతడు ప్రారంభమైన వంశ వృక్షములను ఎరుగును. పేతురు దానిని కలిగియున్నాడు. దేశము గుండా, జాతుల గుండా, క్రింద వరకు, వారు దానిని కలిగియున్నారు. ఒక మంచి వంశ వృక్షమును కలిగిన క్రైస్తవుడు, అది ఎక్కడ నుండి వచ్చియున్నదో అతనికి తెలుసు.

218 “బాగుంది, నేను లూథరన్,” అంటావు. “హ! నేను ప్రెస్బిటేరియన్ ను.” ఓ, సంకరజాతియైన మీరు! “మీరు కాదా? మీరు కాదా?”

219 “బాగుంది,” నీవంటావు, “అయితే నీవెవరవు—నీవెవరవు?” నేను తిరిగి జన్మించినవాడను. “దేని ద్వారా తిరిగి జన్మించాను?” దేవుని యొక్క ఆత్మ ద్వారా.

220 అందుకే నీవు సంకరజాతి కాదు. నీవు సరియైన రీతిలో పుట్టావు. ఏదో సంస్థ సిద్ధాంతముతో కాదు, కానీ దేవుని యొక్క ఆత్మతో. దేవుడు నీలో నివసిస్తాడు.

221 ఇప్పుడు గమనించండి. ఈ చిన్న పాత పురుగు తినుట ప్రారంభించింది. కాబట్టి, ఓ, వాడు మనశ్శాంతినంతా, ముందుకు, ఇంకా ముందుకు, ఇంకా ముందుకు, ఓ చివరి వరకు తినివేశాడు. వాడు ఫలములన్నిటి మీద ఏమి చేశాడో, నా దగ్గర ఒక పేజీయున్నది.

222 తరువాత, ఈ చిన్నవాడు చనిపోయాడు, వాడు మిడుతగా మారాడు. దాని యొక్క రెండవ దశ, ఒక మిడుతయై యున్నది. ఇప్పుడు, మిడుత ఏమి చేస్తుంది? మిడుత ఆకులను తినివేస్తుంది. అది నిజము. మిడుత ఆకులను తినివేస్తుంది. గొంగళిపురుగు విడిచిన దానిని, వాడు విడిచిపెట్టినది ఆకులు; వాడు చెట్టు ఫలమునంతా తినివేశాడు. తరువాత ఏది లోనికి వచ్చింది? ఈ గొంగళి పురుగు ఏమి చేసింది? ఆకులను పాడు చేసింది. ఆకులు దేని కొరకు? దైవిక సహవాసాన్ని నాశనము చేసింది. అది సత్యము.

223 “ఇప్పుడు, అతను ప్రెస్బిటేరియన్ వాడు. అతనితో మనకు ఏ సంబంధము లేదు. అతడు నజరేనువాడు. అతడు పెంతెకొస్తు వాడు. అతడు ఇది, అది, మరొకటి. అతనితో మాకు ఏ సంబంధము లేదు, కారణము అతడు మా గుంపుకు చెందినవాడు కాదు. రోగుల కొరకు ఇక్కడ ప్రార్థన పెడతారా? హ! మా సంఘము కనీసము దానిని నమ్మదు.” చూడండి? నీవు చేసేది అదే. వాడు, ఈ పాత చిన్న మిడుత ఏమి చేస్తుంది? సహవాసమునంతా వాడు నరికివేస్తాడు, అది నిజము, సహవాసమునంతా తీసివేశాడు.

224 సహవాసమనగా ఏమిటి? ఆకులు ఏమి చేస్తాయి? దానిని చల్లగా చేస్తాయి. ఆ ఆకుల క్రింద పక్షులు ఎగురుతాయి. “హ-హ,” చల్లగా చేస్తాయి. మరలా నీ చెట్టు అక్కడేయున్నది. “అతడు నాటబడిన చెట్టు వలే యుంటాడు.” చూడండి? మంచిది, అక్కడకు ప్రజలు వచ్చి పరిశుద్ధాత్మ సహవాసము క్రింద కూర్చొని, కొంచెము చల్లపర్చబడతారు. నీవు అంతా నిరాశ చెందియున్నావు, ఏమి సంభవించిందో తెలియదు; నీవు చనిపోతావో, లేక నీవు రక్షించబడ్డావో లేదో. ఈ సంఘము సరియైనదా, ఆ సంఘము సరియైనదా నాకు తెలియదు. కొంచెము ఆ చెట్టు క్రిందకు రాగానే, ఆ చెట్టు కొన్ని ఆకులను కలిగియున్నది. అక్కడ కూర్చొంటావు, పరలోకము నుండి వేగముగా వీచు బలమైన గాలులను, ఆకుల గుండా వీచనివ్వండి, నీకు తెలుసా, నీవు కొంచెము చల్లబడుట ఆరంభమవుతుంది.

225 “ఓ, నేను వెళ్ళి, నేను ఆలోచించినట్లు, వారు పరిశుద్ధ రోలర్లు గుంపు అని,” చెపుతాను.

226 నీవు కొంచెము క్రింద కూర్చొన్నట్లైతే, నీవు చల్లబడతావు. అది నిజము. నీకై నీవుగా దానిని చేయలేవు, కారణము, దాని సంగతి ఏమిటి? మిడుత, దానిఆకులన్నిటిని తినివేసియున్నది, నిశ్చయముగా. ఇప్పుడు అది ఎండలోనే కూర్చొన్నట్లుగా యున్నది. కాబట్టి, అక్కడ ఏ చల్లదనము లేదు. మంచిది. కాబట్టి అక్కడ…

227 కాని మనము తప్పక ఏమి చేయాలో నీకు తెలుసా, బైబిలు చెప్పింది, “ముందుగా నిర్ణయించబడిన సంఘము, దేవునిలోని ముందుగా నిర్ణయించబడిన కుమారులు,” (వారు ఏమి చేస్తారు?) “పరలోక స్థలములలో కూర్చొంటారు.” అది ఏమిటి? చల్లదనము, ఆదరణ, ఇంటి యొద్దనున్న భావన. ఆమేన్.

228 అక్కడ ప్రతీ ఒక్కరూ అలంకరింపబడిన వస్త్రములను ధరిస్తున్నారు, ప్రక్క మనిషి మరొక రకముగా, వారిలో కొందరు తక్కువగా చూడబడతారు. “అయ్యో! చూడండి. ఆమె ఎన్నడూ తన జుట్టును చక్కగా యుంచదు. ఆమె భయంకరముగా కనబడుతుంది? ఆమెకు కనీసము మంచి ఈష్టర్ ఫ్రౌన్ గౌను లేదు.” అలాగైతే, నీకు తెలుసా, “ఈష్టర్ ఫ్రౌన్,” అది నిజము, చూడండి, వెనుక కూర్చొని వెళ్ళిపోతుంది, “అయ్యో!” చూడండి? “ఈష్టర్ పండుగ బట్టలు లేవు, ఎందుచేత, బాగుంది, అతని వైపు చూడండి, పోయిన సంవత్సరము కూడా అదే పాత కోటును అతడు వేసుకొన్నాడు! బాగుంది, దానిని గూర్చి నీకు ఏమి తెలుసు?” అక్కడ, సరియైన భావనతో నీవు యుండవు.

229 మొన్నటి దినమున నేను ఒక చిన్న స్త్రీతో చెప్పాను. దయనీయమైన చిన్న స్త్రీ, ఆమె ఒక గొప్ప గౌరవప్రథమైన సంఘమునకు చెందియున్నది. ఆమె కేన్సర్ వ్యాధితో చనిపోవుచున్నది. నేను ఆమె కొరకు ప్రార్థించటానికి వెళ్ళాను. ఇక్కడ ధర్మకర్తలలో ఒకరైన సోదరుడు రాయ్ రాబర్ సన్ అక్కడకు నన్ను పంపాడు. ఆమె అక్కడ కూర్చొని యున్నది, కేన్సర్ వ్యాధితో చనిపోవుచున్నది.

నేనన్నాను, “నీవు ఒక క్రైస్తవరాలువా?”

230 ఆమె అన్నది, “అయ్యా, నేను ఏమి చెప్పాలో నాకు తెలియదు.” “నేను పలానా సంఘమునకు వెళ్ళాను,” అని ఏడ్వడం ప్రారంభించింది.

నేనన్నాను, “విషయమేమిటి?”

231 ఆమె అన్నది, “నేను సరియైన బట్టలు ధరించలేకపోయాను.” “వాళ్ళు నన్ను తక్కువగా చూశారు.” హ, ఓ, అక్కడే నీవున్నావు. చూడండి? నీవు అసౌకర్యముగా యున్నావు. చూడు?

232 కానీ బైబిలు చెపుతుంది, “మనము పరలోకపు స్థలములలో మనలను మనము సమావేశపర్చుకోవాలి.” ఓ, అయ్యో! ఏమిటి? అందరూ అక్కడ ఒకే రీతిగా యున్నారు. ఎందుకు, ఇది ఏమి చేస్తుందో నేను మీకు చెపుతాను. నీవు రోజువారి బట్టలు ధరించినా లేక మంచి సూటు వేసుకొన్నా, మనము ఒకరి చేతులను ఒకరిమీద ఉంచి, ఒక్కొక్కరిని నా సోదరుడా అని పిలవాలి. నిశ్చయముగా దానిని చేయాలి. ఒక ముతక బట్టలు ధరించిన స్త్రీ, ఒక పట్టు బట్టలు వేసుకొన్న లేక సాటిన్ బట్ట వేసుకొన్న స్త్రీని చూసి, “సహోదరీ, ఈ ఉదయమున ఎలాయున్నావు? ప్రభువుకు స్తోత్రము!” అని చెప్పేటట్లు చేస్తుంది. అది సత్యము, అది దానిని చేస్తుంది. అదే సంతోషము, సమాధానము, ప్రేమ, వాక్యములో విశ్వాసము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సహనము. క్రీస్తుయేసులో పరలోకపు స్థలములలో కూర్చొండి, కొంచెము సేపు చల్లపర్చుకొందాము. ఆకులు చేసినది అదియే.

233 అయితే ఆ పాత మిడుత ఏమి చేసినది, వాడు చుట్టూ వచ్చి, ఆకులను తినివేశాడు. వాడన్నాడు, “నీవు మాకు చెందినవాడవైయుండాలి, లేనిచో నీవు ఎవరికి చెందవు.” కాబట్టి వాడు చల్లపరిచే ఆత్మనంతా బయటకు తీసివేశాడు. చూడండి? వాడు తనకు తానుగా ఒక సిద్ధాంతాన్ని నియమించాడు. మంచిది. మనము తప్పక ముందుకు వెళ్ళాలి. మనము దీర్ఘకాలము ఆ పాత మిడుత మీద నిలిచియుండవచ్చును.

234 అయితే వాడి యొక్క మూడవ దశ పసరుపురుగు. ప్రారంభములోనే అది చెడ్డ పేరు కలిగియున్నది, ఈ పసరుపురుగు, ఈ పసరుపురుగు బెరడులోనికి వెళ్ళి, చెట్టు యొక్క ముసుగును నాశనము చేస్తుంది. అదే అక్కడ జీవపునాడి. ముసుగు కప్పునది అదియే.

మతము అనగా ఏమిటి? ముసుగు, కప్పుకొనుట. మతము అనగా భావము అదియే, “కప్పుకొనుట.”

235 కాబట్టి, ఈ చిన్న పసరుపురుగు, సంఘము మధ్యలో ప్రవేశించి, వారందరినీ గౌరవప్రథమైన వారిగా చేసింది; తరువాత వారి మధ్య నుండి పసరుపురుగు రూపములో, సహవాసమును దూరముగా తీసివేసింది. ఇప్పుడు లోనికి వచ్చి, వారి మతమును తీసివేసి, దాని నుండి సిద్ధాంతమును తయారు చేసింది, నిజము, సాంప్రదాయముగా లేని మాటలను నియమించింది. ఒక మతమును తనకైతానుగా ఏర్పర్చుకొన్నది. ఒక గుంపు మనుషులను ఏకముగా చేసి, అక్కడ ఒక సిద్ధాంతమును ఉంచినది. వాడు మతమునే తీసివేసి, దేవుని వృక్షమును చీల్చివేశాడు. సారము దానిలోనికి వచ్చే బెరడునే దూరముగా తీసివేశాడు. అదే పసరుపురుగు! ఆ పురుగును నీవు చూడగలవా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] అది ఖచ్చితముగా. అదే పసరుపురుగు. అదే ఆది సంఘములోయున్న రోము.

236 మొదటిది, పెంతెకొస్తుల గుంపు; పెంతెకొస్తు సంస్థలు కాదు. లేదండి. వ్యవస్థగా మారిన ఏదైనా చనిపోతుంది. లేఖనము ద్వారా ఒక్క నిమిషములో నేను దానిని రుజువు చేస్తాను. చూడండి? అయితే, అది పెంతెకొస్తు అనుభవము. అది ఎవరి కొరకు? అది కాథలిక్ వారి కొరకు, ఇంకా ఎవరికి? మెథడిస్టు వారికి, బాప్టిస్టు వారికి, ప్రెస్బిటేరియన్ వారికి, దానిని కోరుకొన్న ఎవరికైనా. నీకు కావాలా, అది తప్పక అది నీకు కావాలా, నీవు దానిలో ప్రవేశింపలేవు.

237 నేను బ్రెన్హాం కుటుంబములో యాభై సంవత్సరముల నుండి యుండియున్నాను, నేను ఎన్నడూ ఆ కుటుంబములో చేరలేదు. ఎందుచేత? ప్రారంభము నుండియే నేను ఒక బ్రెన్హాంను. నేను ఒక బ్రెన్హాంగా పుట్టియుంటిని.

238 ఆ విధానములోనే మనము క్రైస్తవులమై యున్నావు. దేనిలోనో మనము చేరినందువల్ల కాదు; అలాగైతే అది ఒక సంస్థ. మనము క్రైస్తవులుగా జన్మించియున్నాము, పరిశుద్ధాత్మ ద్వారా పునర్జన్మను పొందాము. ఇప్పుడు గమనించండి.

239 ఇప్పుడు, ఈ చిన్న పసరుపురుగు, బెరడును తినివేయుట ఆరంభించాడు. వాడు ఏమి చేశాడు? దాని యొక్క మతమును, దాని ముసుగును, దాని సిద్ధాంతమును దాని నుండి దూరముగా తీసివేశాడు. మతము ఒక సిద్ధాంతమై యున్నది, ఒక కప్పునది, దేనినైనా అది కప్పుతుంది. ఆ కారణమును బట్టియే మన మతము రక్తము ద్వారాయై యున్న రక్తము. జీవము రక్తములో యున్నది, అదే వాక్యమును కప్పుతుంది. జీవము రక్తములో యున్నది. రక్తము మతమైయున్నది మరియు రక్తములోని జీవమే ఫలితములను తెస్తుంది. ఎందుకు, నీవు చూడగలవా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] చూడు?

240 అది అంజూరపు ఆకుల ద్వారా కప్పబడలేదు. ఒకసారి ఆదాము మరియు హవ్వలు దానిని ప్రయత్నించారు. కయీను దానినే చేశాడు. నీవు దానిని గమనించావా? కయీను కూడా కొంత వృక్ష జీవమును తెచ్చియున్నాడు. చూడండి? కాని అది పనిచేయలేదు. అది ఆదాము హవ్వలతో పనిచేయలేదు. మరియు ఈ రోజున కూడా అది పనిచేయదు. ఆదిలో దేవుడు దానిని నిరాకరించినపుడు, నిత్యత్వమంతటా ఆయన దానిని నిరాకరించాడు. మానవ కల్పితమైన సిద్ధాంతములు మరియు తలంపులు ఎన్నడూ దానిని తీసుకొనలేవు.

241 అది దేవుని యొక్క వాక్యమే దానిని చేయవలసియున్నది, మరియు వాక్యము రక్తము ద్వారాయైయున్నది, క్రీస్తు యొక్క బలి అర్పణ. అది నిజము.

242 “ప్రజలు,” ఒక సోదరుడు ఈ ఉదయమున చెప్పినట్లుగా, “మేకులు లాగుట,” బాగుంది, నీకు తెలుసా, ఈ రోజున పందొమ్మిది భిన్నమైన మేకులు దేశములోయున్నవి, రకరకములైన సంస్థలు వాటిని కలిగియున్నవి, “అదియే ఆయన చేతులలోయున్న అసలైన మేకు,” అని వారు వాదిస్తున్నారు. అదియైయున్నట్లైతే, దానిలోనిది ఏది? దానితో నేను చేయునది ఏదియు లేదు. నిశ్చయముగా.

243 శేషములుగా మరియు ఆనవాళ్ళుగా, దేవుడు ఎన్నడూ దేనిని మన కొరకు విడిచిపెట్టలేదు. ఆయన సజీవమైన పరిశుద్ధాత్మను పంపియున్నాడు, అది నాశనము చేయబడదు. ఒక మేకు నాకు ఏ మంచి చేస్తుంది? ఆయన వ్రేలాడిన అసలైన సిలువ, అది నాకు ఏ మేలు చేస్తుంది? ఒక్క రవ్వంత చేయదు. మేకును ఎరుగుట కాదు, సిలువను ఎరుగుట కాదు, కానీ “ఆయనను ఎరుగుటయే జీవము.” చూడండి?

244 కాబట్టి, మనము మేకులను పట్టుకొనియున్నాము, మనము శేషములను పట్టుకొనియున్నాము, కొన్ని స్థలములను మనము పట్టుకొనియున్నాము. ఈ రోజున ప్రజలు, యెరూషలేము పట్టణములో పైకి క్రిందికి నడుస్తున్నారు, వివిధమైన స్థలములలో పైకి క్రిందికి నడుస్తున్నారు, శేషములను మరియు కొన్నిటిని పట్టుకొనియున్నారు. అది దానితో చేయునది ఒక్కటి కూడా లేదు, ఒక్కటి లేదు. అవన్నియు మురికి పోయినవి, తప్పుగా ఖండించబడినవి ముందుకు వెళ్ళిపోయినవి.

245 రోమ్ లో ఒక సంఘమునకు నేను వెళ్ళాను. చనిపోయిన యాజకులందరినీ, వాళ్ళు ఆ తోటలో నాటతారు, ఆ క్రింద వారి మాంసమునంతా రాలిపోనిస్తారు. తరువాత ఆ ఎముకలను తీసుకొని వెలుగు దిమ్మలుగా తయారుచేస్తారు, మరియు వారి పుర్రెలను వాటి చుట్టూ ఉంచుతారు. అక్కడకు వచ్చే ప్రజలు, దీవెనలు పొందుట కొరకు, ఆ పుర్రెలు తెల్లగా అరిగిపోవు వరకూ వాటిని రుద్దుతారు. మీరు సెయింట్ పీటర్ గుడిలోకి వెళ్ళినపుడు, అది పేతురు పాదము అని వారంటారు, అది ఒక ప్రతిమ, దానిని తొమ్మిది లేక పది సార్లు ముద్దాడాలి; దానిపై వారు మరొక పాదమును పోత పోశారు. ఎలాటి వెర్రితనము! మూఢ నమ్మకములు, అదంతయూ అంతవరకే, మానవ కల్పిత సిద్ధాంత పద్ధతులు.

246 నీలో యుండుటకు దేవుడు పరిశుద్ధాత్మను పంపాడు, అదియే దేవుని జీవము, ఒక ప్రతిమలోనికి కాదు. దేవుడు జీవించగోరేది నీలోనే, ఒక ప్రతిమలో కాదు, కాని నీలో. “పరిశుద్ధమైన ప్రతిమలు,” అని ప్రజలు పిలుస్తారు. కానీ అక్కడ పరిశుద్ధ ప్రతిమలు లేవు. నీవే దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రతిమవు. బైబిలు ఆ రీతిగా చెప్పియున్నది. అది సత్యము. “నాకు ఒక దేహమును నిర్మించితివి.”

247 ఇప్పుడు, ఈ చిన్నోడు నాశనము చేయుట ప్రారంభించాడు. దేనిని నాశనము చేస్తున్నాడు? పసరుపురుగు బెరడులోనికి వెళ్ళియున్నది. అది ఏమి చేసిందో గమనించండి, అది బెరడును నాశనము చేయుటకు ఆరంభించింది. అది ఏమి చేస్తుంది? ఒక ఆత్మ సంబంధమైన సంఘము కొరకు, ఒక సహజ సంబంధమైన సంఘమును తయారుచేసింది. అవునండి. అది నిజమైన దానిని తినివేసి, అబద్ధమైన దానిని ఇచ్చింది. ఇప్పుడు, గుర్తుంచుకోండి…

248 ఫలమును గొంగళిపురుగు తిన్నది. ఆకును మిడుత తిన్నది. ఇప్పుడు బెరడు, కప్పునది, మతము, సిద్ధాంతము; సిద్ధాంతమును పసరుపురుగు తినివేసింది.

249 బైబిలుకు బయట, ఎక్కడ నుండి ఆ మొదటి సిద్ధాంతము వచ్చింది? చరిత్రకారులైన మీరు, అది ఎక్కడ నుండి వచ్చిందో మీకు తెలుసా, రోము నుండి, ఖచ్చితముగా అక్కడే అది ప్రారంభించబడింది, అక్కడ వారు ఆచారములను అంగీకరించుట ప్రారంభించారు.

250 యోహాను మరణము తరువాత, ఆ విధముగానే ఐరేనియస్, సెయింట్ మార్టిన్, పోలికార్పు యున్నారు. దేవుని వాక్యమును అనువదించుటకు, అతడు పత్మాసు ద్వీపములో యుండియున్నాడు. వాళ్ళు అతనిని సలసలకాగే నూనెలో ఇరవై నాలుగు గంటలు కాల్చారు, అయినను అతడు తిరిగి వచ్చి, ఇంకా బైబిలు వ్రాశాడు. ఈ బైబిలు వ్రాయబడవలెనని దేవుడు తీర్మానించియున్నాడు. అది దేవుని వాక్యమైయున్నది. దాని నుండి మనము ఏదియూ తీసివేయలేము లేక దానికి ఏదియూ కలపలేము. అది ఎలాగు ఉంచబడినదో ఆలాగునే సరిగ్గా యుంచాలి, అది వాక్యము.

251 గమనించండి, వారు వెనుకకు తిరిగి వచ్చినపుడు, ఈ దేవుని పరిశుద్ధులు, వాక్యమును ఎత్తిపట్టుకొనుటకు ప్రయత్నించిరి, రోము తిన్నగా లోనికి వచ్చింది. అప్పుడు వారు వాక్యమునకు బదులుగా ఆచారములను అంగీకరించియున్నారు. ఇప్పుడు ఆమె ఏమి చేసియున్నదో, ఆమె యొక్క కొన్ని తప్పుడు సిద్ధాంతములను చూద్దాము.

252 నీటి బాప్తిస్మము. వారికి ఆజ్ఞాపించబడినది యేమనగా, పెంతెకొస్తు దినమున పేతురు అన్నాడు, పరిశుద్ధాత్మ ప్రభావము క్రింద, దేవుని వాక్యము. “ప్రతివాడు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి.”

253 రోము దానితో ఏమి చేసింది? దానిని ప్రక్కకు త్రిప్పివేసి, ఇలా అన్నది, “‘తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ’ నామములో బాప్తిస్మము పొందండి.” బైబిలుసిద్ధాంతము కాకుండా, దానిని ఒక ఆచారముగా చేసింది. వాడు ఏమి చేశాడు? అదే ఆ పసరుపురుగు తినివేయుచున్నది. ముంచే బాప్తిస్మమునకు బదులుగా “చిలకరించుట,” “తండ్రి నామములో…”

254 “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ” పేరు కాదు. అలాటిది అక్కడ లేదు. “తండ్రి” పేరు కాదు, “కుమారుడు” పేరు కాదు, “పరిశుద్ధాత్మ” పేరు కాదు.

255 “తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మము ఇమ్మని,” యేసు చెప్పినపుడు, అది “ప్రభువైన యేసుక్రీస్తు.” ఖచ్చితముగా పేతురు, వారందరూ, బైబిలులో ప్రతీ ఒక్కరూ ఆలాగునే చేశారు. అక్కడ ఏ ఒక్కరూ…

256 రోమన్ కాథలిక్ సంఘము వచ్చు వరకు, ప్రతీ ఒక్కరు ఎన్నడైనా “యేసుక్రీస్తు నామములో” తప్ప, మరే ఇతర మార్గములో ఎవరైనా బాప్తిస్మము పొందియున్నారేమో, ఒక్క లేఖనాన్ని, ఒక్క చరిత్రను నా యొద్దకు తెమ్మని నేను సవాలు చేయుచున్నాను. దానిని చేయండి. గుర్తుంచుకోండి, ఈ టేపులు ప్రపంచమంతటా వెళతాయి. హ-హ. నేను వందలమంది సేవకుల సమాజాన్ని బిషప్పులను కూటములో సవాలు చేశాను. “మీ పాదముల మీద నిలబడి, మీ బైబిలుతో ఇక్కడకు రండి, లేనిచో మౌనముగా యుండండి.” నీ వెనుకకు వెళ్ళే వరకు వారు మౌనముగా యుండి, తరువాత వాళ్ళు నీ గురించి మాట్లాడటం ప్రారంభించారు. కనీసము వారికి వారి ముఖముపై నిలబడే ధైర్యము లేదు, నీ ముఖము ముందు నిలబడి దానిని చెప్పే సామాన్యమైన సభ్యత వారికి లేదు. దానిని చేయటానికి వారికి భయము. అది తప్పు అని వాళ్ళకు తెలుసు. కానీ దానినే పసరుపురుగు తినివేయుట ఆరంభించింది, చూడండి, నిజమైన దానిని తినివేయుచున్నది.

257 ఇప్పుడు నీవంటావు, “అది అవసరము కాదు. అవును, నేను ఎలా బాప్తిస్మము పొందినా పరవాలేదు.” అదేనా? [సమాజము “కాదు,” అని చెప్పుచున్నది.—ఎడి.]

258 అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయములో పౌలు అన్నాడు, “అతడు ఎఫెసులోని పై ప్రదేశముల గుండా సంచరిస్తూ వచ్చాడు,” బైబిలు చెప్పింది, “అతడు కొంతమంది శిష్యులను కనుగొన్నాడు.” బాప్తిస్మమిచ్చు యోహాను క్రింద వాక్యము నేర్చుకొన్న, అపొలో అను, ఒక బాప్టిస్టు బోధకుడున్నాడు. వారు గొప్ప సంతోషమును కలిగియుండిరి. పౌలు వారిని చూడటానికి అక్కడకు వెళ్ళాడు, అతడన్నాడు, “మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందియున్నారా?”

“ఓ,” “మేము విశ్వాసులము,” అని వారన్నారు.

259 “అయితే నేను అడిగేది అది కాదు. మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందియున్నారా?”

వాళ్ళన్నారు, “పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మాకు తెలియదు.”

260 అతడన్నాడు, “అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందారు?” చూడండి? మరొక మాటలో, “మీరు ఎలా బాప్తిస్మము పొందారు?”

వాళ్ళన్నారు, “మేము బాప్తిస్మము పొందాము.”

అతడన్నాడు, “ఎలా?”

261 “యోహాను ద్వారా,” “యేసుకు బాప్తిస్మమిచ్చాడు. అది సరిపోదా?” అన్నాడు.

262 పౌలు అన్నాడు, “కాదు, ఇప్పుడు కాదు. కాదు.” “మీరు తప్పక తిరిగి బాప్తిస్మము పొందాలి.” అన్నాడు. పౌలు వారికి తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఇచ్చాడు మరియు వారి మీద చేతులుంచగా, పరిశుద్ధాత్ముడు వారి మీదకు వచ్చాడు.

263 పౌలు అన్నాడు, “పరలోకము నుండి దిగివచ్చిన దేవదూతయైనను,” ఏ బోధకుడైనను, “ఒక దూతయైనను,” ఈ పసరుపురుగైనను, “పరలోకము నుండి దిగివచ్చిన దేవదూతయైనను, దీనికి వేరుగా మీకు ఏదైనా బోధించినట్లైతే, వాడు శాపగ్రస్తుడగునుగాక.” అది సత్యము.

264 కాబట్టి మీరు చూడండి, అది దేనిని తినుచున్నదో చూడండి. అది యేసుక్రీస్తు నామములో నీటి బాప్తిస్మమును తినివేసినది.

265 పసరుపురుగు చేసిన తరువాత పని, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును తినివేసినది, ఏలయనగా నీవు పరిశుద్ధాత్మను కలిగియున్నంత కాలము అది వాక్యముపై వెలుగును ప్రకాశింపచేస్తుంది, నీవు అది చేసినంత కాలము. కాబట్టి వాళ్ళు దానిని భిన్నముగా చేయవలసి వచ్చింది.

266 ఈ ఉదయమున ఎంతమంది లూథరన్ లు, ప్రొటస్టెంట్ లు, ఎంతమంది కాథలిక్కులు, వారు పిలిచియున్నట్లుగా, నిర్ధారణను పొంది, వారి మొదటి ప్రభురాత్రి భోజనమును తీసుకొనుచున్నారో కొంచెము ఆలోచించండి. వారు దానిని “పరిశుద్ధ ప్రసాదము” అంటారు, దాని భావము లాటిన్ భాషలో, “పరిశుద్ధాత్మ.” ఒక కాథలిక్ వారి ఆలయమును దాటిపోవుచుండగా తన్ను తాను వంగి ఆ విధముగా ఎలా నమస్కారము చేస్తాడో, నీవు ఎన్నడైన చూశావా? [సహోదరుడు బ్రెన్హాం గారు వివరిస్తున్నారు—ఎడి.] ఎందుచేత? “అది ఆ సంఘములో యున్న దేవుడు.” దేవుడు అనగా ఏమిటి? “అదే ఆ చిన్న రొట్టె ముక్క.” గుండ్రముగా యున్న, సూర్యదేవుని వలేయున్న, ఆ చిన్న రొట్టెను వాళ్ళు ఆరాధిస్తారు, అవి వేదిక మీద యుండగా, అర్థరాత్రి వేళ బొద్దింకలు, ఎలుకలు వాటిని ఎత్తుకు పోతాయి. అది నా దేవుడు కాదు. అది ఇప్పుడు నేను నీకు చెపుతాను. “మొదటి ప్రభురాత్రి భోజనము, అదే సంఘమునకు నిర్ధారణ చేయబడినది.” బుద్ధిహీనత.

267 కానీ వాళ్ళు చేసింది అదియే. పసరుపురుగు చేసింది అదియే. అది ఆత్మను తీసివేసి, ఎవరో యాజకుడు తయారుచేసిన లేక సన్యాసిని తయారు చేసిన చిన్న రొట్టె ముక్కను వారికి ఇచ్చియున్నది. దానినే వాళ్ళు చేశారు. అది అక్షరాలా సత్యము. వెళ్ళి, అడగండి, వెళ్ళి చరిత్రలో వెనుకకు చూడండి, అది నిజమో కాదేమో చూడండి. మీరు మీ గొంతు గుండా దానిని గెంటివేశారు. కాథలిక్కులు మాత్రమే కాదు, ప్రొటస్టెంటు వారు కూడా, మీలో అనేకులు, అదే పని చేశారు, మంచిది. అక్కడ వాళ్ళు చేసింది అదియే. మంచిది.

268 తరువాత ప్రొటస్టెంట్ వారు, పరిశుద్ధాత్మను కలిగియుండుటకు బదులుగా, వాళ్ళు ఏమి చేశారో మీకు తెలుసు? వాళ్ళు వచ్చి సంఘములో చేరి, కరచాలనము చేశారు. పెంతెకొస్తు దినము వచ్చినపుడు, ఎవరో దారి గుండా పైకి వచ్చి కరచాలనము చేయలేదు, “కానీ అక్కడ పరలోకము నుండి, బలమైన గాలి వలే వీచు ధ్వని, వారు కూర్చొన్న స్థలమంతటిని నింపెను,” అది సత్యము. చెట్ల మీద ఆకుల గుండా క్రిందికి దిగి వచ్చి, బెరడుపై క్రుమ్మరించింది. అది సత్యము.

269 ఇప్పుడు, నూతన జన్మ మరియు ఒక మనిషి తప్పక తిరిగి జన్మించాలని, యేసు చెప్పియున్నదానికి బదులుగా, వారు సంఘములో చేరుటను అలవాటు చేసుకొన్నారు. వాక్యమునకు బదులుగా “వచ్చి చేరండి,” అంటున్నారు. అదే, పసరుపురుగు వారికి ఒక ఆచారమును ఇచ్చుచున్నది. నీవు దానిని చూడవా? వాడు ఏమి చేస్తున్నాడో ఇక్కడ చూడు. ఆత్మ సంబంధమైనదానికి బదులుగా సహజమైనదానిని ఇస్తున్నాడు. నీవు దానిని చూడగలవా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.]

270 ఇప్పుడు చూడండి. ఇప్పుడు, మనము కాథలిక్ మార్గములో యున్నాము, కానీ నీకు తెలుసా, తిన్నగా అది ప్రొటస్టెంట్ వారికి కూడా వచ్చియున్నది? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] ఈ రోజున పెంతెకొస్తు సంఘములలో పరిశుద్ధాత్మ యొక్క స్పందనను మనము ఎక్కడ కలిగియున్నాము? ఈ రోజున ఎక్కడ ప్రొటస్టెంటు వారి మధ్యనూ, పెంతెకొస్తు స్పందనను కలిగియున్నాము? మనకు లేవు. లూథరన్ వారిలో యున్నదా? [“లేదు.”] యున్నట్లైతే, నేను దాని యొద్దకు వెళ్ళగోరుచున్నాను. నేను అక్కడకు వెళ్ళి భుజించి ఒక అద్భుతమైన సమయమును కలిగియుండగోరుచున్నాను. ప్రెస్బిటేరియన్ వారి మధ్యలో యున్నదా? ఎక్కడ-ఎక్కడ-అది ఎక్కడయున్నది? చూడండి? సహజమైన దానిని మీరు అలవాటు చేసుకొన్నారు.

271 నేను వెళ్ళిపోయే సమయమైనది, మీకు అది తెలుసు. చూడండి? దీనిని ఎన్నడూ మీ హృదయములో నుండి బయటకు వెళ్ళిపోనియ్యవద్దు.

272 ప్రకృతి సంబంధమైన దానిని తీసుకొనవద్దు. అది మరణము. ఈ ప్రకృతి సంబంధమైన మనిషి మరణము. అది ఏది చేసినా మరణమే. అది ఇక్కడ మరణమునకు లోనైయున్నది. “అది ఆత్మయే సజీవముగా చేసేది.” చూడండి, ఆత్మ జీవమునిస్తుంది, దానిని బ్రతికిస్తుంది. అది ఆత్మయైయున్నది.

273 కాబట్టి, మీరు చూడండి, వాళ్ళు ఏమి చేశారో గమనించండి. “యేసుక్రీస్తు” నుండి నీటి బాప్తిస్మమును తీసివేసి, “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ” కు మార్చారు, అది ఒక బిరుదు, అది ఏ మాత్రము పేరు కాదు.

274 ఇప్పుడు, నీవంటావు, “అది ఏ భేదము చేస్తుంది?” మంచిది. ఇప్పుడు, నీవు దానిని ఇవ్వబోవుచున్నట్లైతే…

275 శనివారమున, ఎవరో నీకు జీతపు డబ్బు, చెల్లించవలసిన వ్యక్తి, నీకు చెక్కును ఇస్తున్నాడు. అతడు తన పేరును దాని మీద వ్రాయుటకు బదులుగా, “‘యజమాని’ నుండి,” అని వ్రాస్తే, అది అదేయైయున్నది…“ఈ వారము పనికి జీతముగా, జాన్ డో కు నేను 150 డాలర్లు చెల్లించమని ఆర్డర్ వేస్తున్నాను, ‘బాస్ నుండి,’” అంటే. అక్కడ బాంక్ కు వెళ్ళండి, ఎలా అది నిరాకరించబడుతుందో. అవును. అవును. అవునండి. అది నిశ్చయముగా నిరాకరించబడుతుంది. నిశ్చయముగా.

276 అది భేదము చేయకపోయినట్లైతే, దేవుని స్తుతిస్తూ, ఎంతో సంతోషముగాయున్న, గొప్ప విషయములు వారి మధ్య జరగుచున్న క్రైస్తవులతో ఎందుకు పౌలు, “మీరు తిరిగి వచ్చి, మరలా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందాలని, వారికి ఆజ్ఞాపించియున్నాడు”? చూడండి? వాక్యమును తీసుకొని సరిగ్గా దానితో నిలబడండి. దానికి భిన్నముగా ఏదీ చెప్పవద్దు. అది ఏమి చెపుతుందో దానినే చెప్పండి. దాని ద్వారానే మనకు తీర్పు తీర్చబడబోవుచున్నది.

277 ఇప్పుడు చూడండి, దానినే వాళ్ళు చేశారు. నూతన జన్మకు బదులుగా వారు సంఘములో చేరుటను కలిగియున్నారు. వాక్యమును తీసుకొనుటకు బదులుగా వారు సిద్ధాంతమును కలిగియున్నారు. “మరియా, దండము” అని బైబిలులో వారు ఎన్నడైనా చెప్పారేమో నాకు చూపించండి. ప్రొటస్టెంట్ వారు, అపొస్తలుల సిద్ధాంతము అని బైబిలులో ఎన్నడైనా ఉదహరించారేమో నాకు చూపించండి. బైబిలులో “పరిశుద్ధులతో మాట్లాడుటను” గూర్చి, అపొస్తలుల సిద్ధాంతమును గూర్చి ఎక్కడ యున్నదో నాకు చెప్పండి. అవి బైబిలుకు వ్యతిరేకమై యున్నవి. బైబిలులో ఎన్నడైనా “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ” బాప్తిస్మము యున్నదేమో నాకు చెప్పండి. అది అక్కడ లేదు. అయినను మీరు దాని కొరకు వెళతారు. హ?

278 సహవాసము మరియు సహోదరుల మధ్య సహోదరత్వమునకు బదులుగా వారు వారికి ఒక గురు పీఠాన్ని, పోపును ఇచ్చారు మరియు నీవు బిషప్పును కలిగియున్నావు, నీవు ఏమి చేయాలో ఏమి చేయకూడదో అతడు నీకు చెపుతాడు. పెంతెకొస్తువారైన మీరు ఒక జిల్లా పెద్ద పాదిరిని కలిగియున్నారు. మీరు ఎవరిని లోనికి రానివ్వవచ్చో అతడు మీకు చెపుతాడు. కానీ సంఘము క్రీస్తును కలిగియున్నది. చూడండి?

279 అక్కడకే మీరు వచ్చియున్నారు. చూడండి? వాళ్లు నీకు ఈ సిద్ధాంతములను, మానవ కల్పితమైన వాటిని నీకు ఇస్తారు, వాక్యము నీ నుండి తీసివేస్తారు. ఆ పసరుపురుగు ఏమి చేసింది? చెట్టునే తిన్నగా తీసివేసి, దీనిని నీకు ఇచ్చింది. “చెట్టును తీసివేసి, దానికి బదులుగా, ఇది నీకు ఇస్తాను. నేను దానిని తీసివేసి, దీనిని మీకు ఇస్తాను.” మీరు ఎక్కడకు వెళ్ళారో చూడండి?

“బాగుంది, బ్రెన్హాం సోదరుడా!” అని నీవంటావు.

280 ప్రతీ ఒక్కరూ, ప్రతి ప్రొటస్టెంట్ సంఘము ఎక్కడ నుండి వచ్చింది? కాథలిక్ నుండి. అదే ప్రకటన 13 లేక ప్రకటన 17వ అధ్యాయము ఆమె దానిని చేస్తుందని చెప్పింది. “ఆమె వేశ్యయని, వేశ్యలకు తల్లి,” అని చెప్పింది. అదే కార్యము. కాబట్టి కుండ, కాగును చూసి నీవు నల్లగా యున్నావని అనలేదు, నీకు తెలుసా, కాబట్టి అది చెయ్యవద్దు. దానిని చెయ్యవద్దు, అది సత్యము.

281 సహోదరత్వము; సహోదరత్వమును తీసివేసింది. మనము తప్పక ఒకరితో ఒకరము సహోదరులుగా యుండాలి. అది మనలను వేరుచేసి, మనలను భిన్నమైన వారుగా చేసింది. మంచిది.

282 ఇప్పుడు గమనించండి. ఇక్కడ ఒక మంచివాడున్నాడు, నేను దానిని తీసుకొంటాను, తరువాత ఈ ఇతరుల వద్ద నేను ఆగిపోతాను. చూడు.

283 బైబిలు చెపుతుంది, మనము తప్పు చేసినపుడు, మన ఆత్మలు పరిశుద్ధాత్మ ద్వారా తప్పక శుద్ధి చేయబడాలి. మోకరించండి. మనము తప్పు అని పరిశుద్ధాత్ముడు మనకు బయలుపర్చనియ్యండి, మన ఆత్మలను శుద్ధిచేసుకొంటూ, మీరు చనిపోవు వరకూ ఆయన ముందు వేచియుండండి.

284 ఇప్పుడు, నీకు వాళ్ళు తిరిగి శుద్ధిచేయు స్థలమును ఇస్తారు. నీవు చనిపోయిన తరువాత, యాజకుడు ఎంతో డబ్బును తీసుకొని నీవు శుద్ధిచేయు స్థలము నుండి బయటకు రావాలని ప్రార్థిస్తాడు. అదే పసరుపురుగు చేసింది నిర్భయముగా. ఎందుచేత, అది బుద్ధిహీనత. “ఈ ఆత్మ కొరకు శుద్ధి చేయు స్థలము నుండి బయటకు వచ్చుటకు చాలా వందల డాలర్లు చెల్లించవలసి వస్తుంది.” “శుద్ధి చేయు స్థలము,” అనునది బైబిలులో, అలాటిది ఏదైనా నాకు చూపించమని అడుగుచున్నాను. అలాటిది బైబిలులో లేదు. లేదండి. అయితే వారు వారికి ఒక శుద్ధి చేయు స్థలమును ఇచ్చారు. చూడండి, నీవు చనిపోయిన తరువాత. ఓ, అవును, నాకు తెలుసు.

285 వాళ్ళు, వాళ్ళు, వాళ్ళన్నారు, “నిశ్చయముగా!” “బాగుంది, పరిశుద్ధ బోనీఫేస్ పలానా-పలానిది చెప్పాడు,” అని వారు చెప్పటం మీరు వింటారు. పరిశుద్ధ బోనీఫేస్ ఏమి చెప్పాడో నేను లెక్క చెయ్యను. “బాగుంది, పలానా పలానా ఆమెను గూర్చి చెప్పలేదా, ఆమె తన భర్త కొరకు ప్రార్థించింది, ఆ గొప్ప సహోదరీ, పలానా-పలానా?” ఆమె ఏమి చేసిందో నేను లెక్కచెయ్యను.

286 అది అనధికారమైన మాట. అది అధికార పూర్వకమైన అపొస్తలులకు వ్యతిరేకమైనది సంఘమును క్రమములోయుంచుటకు, దేవుడు అపొస్తలులనిచ్చాడు, అపొస్తలుల సిద్ధాంతములపై అది నిర్మించబడియున్నది, పరిశుద్ధ బోనీఫేస్ లేక ఎవరో పరిశుద్ధునికి అది నిర్మించబడలేదు. అది వాక్యమునకు విరుద్ధమైయున్నది. పరిశుద్ధ బోనీఫేస్ ఏమి చెప్పాడో, ఇతర పరిశుద్ధులు ఏమి చెప్పారో, పరిశుద్ధ సుసి ఏమి చెప్పిందో, పరిశుద్ధ మరియ ఏమి చెప్పిందో, వారందరు చెప్పిన దానిని నేను లెక్కచెయ్యను. అది బుద్ధిహీనత. అది ఏ ఇతర అబద్ధము కంటె ఎక్కువైనది కాదు. అది దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకముగాయున్నట్లైతే, అది ఒక అబద్ధము. అనధికార పూర్వకమైన మాటలను నేను నమ్మను.

287 ఆ కారణమును బట్టియే ఈ ప్రొటస్టెంట్ సిద్ధాంతములను తదితరమైన వాటిని నేను నమ్మను. అదంతయూ కాథలిక్ సారమైయున్నది. అవన్నియు ఆచారములు. మీకై మీరే వాటిని నిండుగా కలిగియున్నప్పుడు, కాథలిక్ వారు అలాటి ఆచారములను కలిగియున్నారని, వారిని ఎలా పిలువగలవు? ఇక్కడ ఎక్కువ లేదు, కాని ఇది టేపు మీదయున్నది, నీకు అర్థమైనదా, చూడు, ఇవి ప్రపంచమంతటా వెళతాయి. గమనించండి, మీరే బైబిలుకు విరుద్ధమైన మానవ కల్పితమైన సిద్ధాంతములను, ఆచారములను తీసుకొన్నప్పుడు, సరిగ్గా వారు చేసినట్లుగానే, అప్పుడు వారు తప్పని నీవు ఎలా పిలువగలవు? ఎందుచేత? నీవు సంస్థలో వున్నావు అది ఆ ముసలి వేశ్యకు కుమార్తెయై యున్నది. వేశ్య అనగా ఏమిటి? తన భర్తకు అపనమ్మకముగా జీవించే స్త్రీయే ఒక వేశ్య. క్రైస్తవ సంఘమని చెప్పుకొంటూ. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యమును తీసుకొనుటకు బదులుగా, తప్పు సిద్ధాంతములను, తన సొంత సరుకును బయటకు ఇచ్చుచున్నది.

288 సరిగ్గా హవ్వ చేసినట్లుగానే, దయ్యము మాట విన్నది, భూమిని ఎన్నడైనా తాకిన మరణమంతటికి, దుఃఖమంతటికి ఆమె కారణమైనది. హవ్వగుండా వచ్చుట, కారణము ఆయన మాటను సందేహించుట ద్వారా, దేవునికి వ్యతిరేకముగా ఆమె ఆత్మ సంబంధమైన జారత్వమును జరిగించినది.

289 ఖచ్చితముగా సంఘములు ఈ దినమున దానినే చేయుచున్నది, దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ఆత్మ సంబంధమైన జారత్వమును జరిగించుచున్నవి. వారి సిద్ధాంతముతో నీవు సమ్మతింకపోయినట్లైతే, వారు కనీసము నిన్ను సంఘములోనికి చేర్చుకొనరు.

290 సరే, వారు నాకు ఉత్తరాలు వ్రాసి పంపుతారు, “నీవు దీనిని నమ్ముతావా, ఇది రైట్ అని నీవు అంటావా, నీవు…”

291 నేనన్నాను, “నేను మీ దగ్గరకు రాను.” లేదండి. బైబిలు ఏమి చెపుతుందో సరిగ్గా దానినే నేను బోధిస్తాను, లేనిచో అసలు రానే రాను. చూడండి? అది సత్యము.

292 ఆ వాక్యముపై నిలబడండి. సోదరులారా, మనము తప్పక దానినే చేయవలసియున్నది. అక్కడే నిలచియుండాలి. మనము చివరి దినములలోనికి వెళ్ళుచున్నాము, మనకు అది తెలుసు. ఆ ఘడియ ఇక్కడయున్నది.

293 ఓ, వాళ్ళు అది, ఇది, మరొకటి చెప్పుతున్నారని, మనము ఎలాగు చెప్పగలము! అనధికార పూర్వకమైనదేదైనను, దానిని నమ్మవద్దు. దానిని ఎవరు చెప్పినా నేను లెక్కచెయ్యను, ఎవరు చెప్పినా.

ఇక్కడ, ఈ మధ్యనే ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి, ఇలా అన్నది…

294 ఒక నిర్ణీతమైన సేవకుల గుంపుతో, యేసు క్రీస్తు నామములో బాప్తిస్మమును గూర్చి, మూడువందల మంది సేవకులతో మాట్లాడియున్నాను. అనేకమంది ఆ కూటములో కూర్చొనియున్నారు, అక్కడ మొత్తం చికాగో సేవకుల సమాఖ్య నన్ను కలుసుకొన్నారు. వాళ్ళు ఎక్కడయుంటారో, ఏమి సంభవిస్తుందో ప్రభువు నాకు దర్శనమిచ్చి చెప్పియున్నాడు. నేను తిన్నగా పైకి నిలబడి చెప్పాను. మీరు వినగోరినట్లైతే, ఇక్కడ మా దగ్గర టేపులువున్నాయి. బిషప్పులు, డాక్టర్లు, కార్డినల్స్, వారందరూ అక్కడ కూర్చొనియున్నారు.

295 నేనన్నాను, “మీలో ఎవరైనా అది తప్పు అన్నట్లైతే, మీ బైబిలు తీసుకొని ఇక్కడకు రండి.” నేనన్నాను, “మీరు ఎందుకు అంత నిశ్శబ్దముగా వున్నారు?” అక్కడ ఎవరూ ఏమియు చెప్పలేదు. ఎందుచేత? చూడండి, ఆ వాక్యమును బట్టి వాళ్ళు భయపడ్డారు. “అలాగైతే, నేనన్నాను, మీరు దానిని చేయలేనప్పుడు, ఎందుకు మీరు నన్ను తీసుకొనుచున్నారు? మౌనముగా యుండండి, బయటకు వెళ్ళి, ఏదైనా చెయ్యండి, మీరు దానిని వాక్యముతో బలపరచలేకపోయినట్లైతే, అప్పుడు మౌనముగాయుండండి.”

296 కాబట్టి అప్పుడు, ఆ గుంపు మనుషులే ఒక స్త్రీని అక్కడకు పంపారు, “బ్రెన్హాం సోదరుడా, ప్రభువు యొక్క దూత నీకు చెప్పినట్లైతే.” ప్రభువు యొక్క దూత, మీకు తెలుసు, ఆయన చిత్రము ఇక్కడయున్నది. “ప్రభువు యొక్క దూత దానిని నీకు చెప్పినట్లైతే, మంచిది, మేము దానిని నమ్ముతాము.”

297 నేనన్నాను, “ఎవరైనా, ఒక సేవకుల గుంపు అంత బలహీనముగాయున్నారా, ‘ప్రభువు యొక్క దూత చెప్పినట్లైతే,’ ఒక వేళ ప్రభువు యొక్క దూత వాక్యమునకు వ్యతిరేకముగా చెప్పినట్లైతే, అది ప్రభువు యొక్క దూత కాదు.”

298 ప్రభువు యొక్క దూత వాక్యము సత్యమని రుజువు చేస్తుంది. ఖచ్చితముగా ప్రతి యుగములగుండా ఎల్లప్పుడు ఆయన దానినే చేసియున్నాడు. ఆయన ఇంకనూ అదే కార్యము చేస్తాడు. ఆయన వాక్యముతో నిలబడియుంటాడు. పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన ఏ సేవకుడైనా, అదే వాక్యముతో నిలబడియుంటాడు, ఏలయనగా పూర్తి బైబిలు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినదని బైబిలు చెప్పింది.

299 బైబిలు చెప్పిన దానిని నిరాకరిస్తూ, నీవు పరిశుద్ధాత్మను ఎలా కలిగియుండగలవు? అది సరికాదని, నీలోయున్న ఆత్మ సాక్ష్యమిస్తుంది. చూడండి? పసరుపురుగు, దేవుని యొక్క నిజమైన కార్యములను తినివేయుచున్నది, అవునండి. అధికారపూర్వము కాని వాక్యము, అపొస్తలుల సిద్ధాంతమునకు వ్యతిరేకముగా యున్నది. ఓ, అయ్యో!

300 ఇది అపొస్తలిక సిద్ధాంతమైయున్నది. ఇది బైబిలుయైయున్నది. ఇది పరిశుద్ధాత్ముడైయున్నాడు. దీనిలోయున్న ప్రతి మాట సత్యమైయున్నది. నీవు సరిగ్గా దానిని నమ్మి అంగీకరించినప్పుడు, దాని మీద తగ్గకుండాయున్నప్పుడు, ప్రతి వాగ్దానము నెరవేరుటను నీవు చూస్తావు, దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ తిన్నగా హాజరవుతుంది.

301 ఇశ్రాయేలీయులు ఎఱ్ఱ సముద్రమును దాటినపుడు, ఆయన సరిగ్గా, ఎంత దేవుడో ఇప్పుడును అంతే దేవుడు కానట్లైతే, ఆయన దేవుడు కాదు. పెంతెకొస్తు దినమున క్రుమ్మరించబడిన అదే దేవుడు, ఇప్పుడును ఆయన అదే దేవుడు కానట్లైతే, ఈ రోజున, ఆయన అదే దేవుడు కాదు. అక్కడ పునరుత్థానము లేకపోయినట్లైతే, ఆయన అదే దేవుడు కానట్లైతే…ఈ రోజున కూడా ఆయన అదే దేవుడు కానట్లైతే, ఒక చరిత్రలోని దేవుడు నీకు ఏ మంచి చేస్తాడు? చూడండి? దేవుడు అనే సంగతి అక్కడలేనట్లైతే, బోధకులను వేదాంత పాఠశాలలకు పంపి, పొదిగిన కోడి పిల్లలుగా వారిని బయటకు తెచ్చుట ఏ మేలు చేస్తుంది?

302 నీవు ఏమి చేస్తున్నావు, దేవుని వాక్యము నుండి తీసివేస్తున్నావు? నీకు ఆ అధికారము ఎక్కడయున్నది? “సంఘము,” అని నీవంటావు, సంఘమా, అక్కడ తొమ్మిది వందల అరవై తొమ్మిది వివిధమైన సంస్థలుయున్నవి. వాటిలో ఏది సరియైనది? ఏమి చెయ్యాలో ఎవరికీ తెలియదు. నీవు కంగారు పడతావు. అది సత్యము. అయితే దేవుడు సంఘము ద్వారా ప్రజలకు తీర్పు చేయబోవుట లేదు.

303 దేవుడు వారికి క్రీస్తు ద్వారా తీర్పు తీర్చబోవుచున్నాడు, మరియు క్రీస్తు వాక్యమైయున్నాడు. బైబిలు చెప్పింది, “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దయుండెను, వాక్యము దేవుడైయుండెను. మరియు వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను.” సంఘమును, ప్రజలను ఆయన వాక్యము ద్వారా తీర్పు తీర్చుతాడు, అది నిజము, జీవించుచున్న, పునరుత్థానుడైన వాక్యము.

304 అప్పుడు, సజీవమైన, పునరుత్థానుడైన వాక్యము, ఇక్కడ ఈ వాక్యమునకు భిన్నముగా ఏది చెప్పినా, అప్పుడు అది లేపబడిన పునరుత్థాన వాక్యము కాదు. కారణము, ఇది, సత్యమును గూర్చి సాక్షమిస్తుంది. ఆయన ఇక్కడ ఒకటి మరియు అక్కడ ఒకటి చెప్పలేడు.

305 నేను ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి చెపుతాను, కారణము నేను ఒక మనిషిని. నీవును ఆలాగే చేస్తావు. నీవు ఎక్కువ జ్ఞానమును, గ్రహింపును పొందగలవు.

306 కానీ, దేవుడు కాదు, ఆయన అనంతుడు. చూడండి? ఆయన మొదటి నిర్ణయమే, ఆయన మొదటి చెప్పినదే, శాశ్వతముగా నిలబడియుంటుంది. అది ఒకే రీతిగాయున్నది. ఆయన ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట చెప్పలేడు. ఆయన దేవుడిగా యుండుటకుగాను, ప్రతిసారి ఒకే దానిని చెప్పవలసియున్నది.

307 కాబట్టి దేవుని యొక్క ఆత్మ నీలోయున్నట్లైతే, అది ఈ వాక్యము సత్యమని రుజువు చేస్తుంది. దానిలో ప్రతి మాట. అది నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నది. అదే బైబిలు చెప్పియున్నది. అవునండి. మంచిది.

ఇప్పుడు, మనము త్వరపడదాము, మరియు ఈ పురుగు యొక్క రెండవ దశలోనికి వెళదాము.

308 మొదటగా, వాడు గొంగళి పురుగైయున్నాడు, వాడు దేవుని యొక్క వృక్షములో దేనిని తిన్నాడు? [ఎవరో “ఫలము,” అని చెప్పియున్నారు.—ఎడి.] ఫలము.

309 తరువాత దశలో, వాడు లోనికి వచ్చాడు; ఆ దశలో వాడు చనిపోయాడు, మరలా మరొక దశలో వచ్చాడు. వాడు ఇప్పుడు ఏమి చేశాడు? ఈసారి వాడు మిడుతవలె వచ్చాడు. వాడు ఆకులన్నియూ తిని వేశాడు. అది మిడుత యొక్క అలవాటు.

310 ఇప్పుడు, తరువాత వాడు ఏమి చేశాడు? వాడు తిరిగి మరొక దశలో వచ్చాడు, పసరుపురుగుగా, బెరడులోనికి వెళ్ళాడు.

311 ఇప్పుడు నాల్గవదశ, వాడు చీడపురుగుగా వచ్చాడు. ఒక చీడ పురుగు. చీడపురుగు అనగా యేమిటి? వాడు ఒక పీల్చువాడు, జీవమును, ఆత్మను, జీవమును పీల్చువాడు. వాడు అదే చేస్తాడు, తిన్నగా కాండములోనికి వెళ్ళి, కాండమును పట్టుకొని, పీల్చి వేస్తూయుంటాడు. చీడపురుగు, వాడు ఇక్కడయున్నాడు. మనము వాడిని ఏమని పిలవబోవుచున్నాము, సంఘశాఖ. వాడి సరియైన పేరు అదియే. ఎందుచేత? వాడు నాశనకారి, జీవము పీల్చివేస్తాడు.

312 దేవుడు తన ప్రజల మధ్యలోనికి ఒక కదలికను పంపినప్పుడల్లా, వారు దానిని శాఖగా మారుస్తారు, అక్కడు వారు చనిపోతారు, ఎవరైనను సంఘ చరిత్ర తెలిసిన వారు, దానిని తప్పు అని చెప్పవచ్చు. ఎన్నడైనా ఒక సంఘము, ఒక సంస్థగా మారినపుడు, అది అక్కడే చనిపోలేదా, నాకు చూపెట్టండి. పసరుపురుగు దానిని పట్టుకొన్నది, దాని మతమును తీసివేసినది. తరువాత దాని వెంబడి పీల్చివేయువాడు వచ్చాడు, ఆ చెట్టులోనుండి జీవమును తిన్నగా పీల్చి వేశాడు.

313 ఎలాటి జీవము దానిలోయున్నది? పరిశుద్ధాత్మ. అది ఏమి చేసింది? అది పరిశుద్ధాత్మను దానిలో కలిగి, తరువాత ఇంకనూ ఆచారములను కలిగియుండలేదు. పరిశుద్ధాత్ముడు దాని కొరకు నిలబడలేదు. కాబట్టి అది పరిశుద్ధ జీవమును చెట్టులోనుండి తీసివేసి, దానికి ఆచారమును ఇచ్చి, ఒక శాఖగా తయారుచేయును. “ఇది ఏమి చెపుతుందో లెక్క చెయ్యము. మా సంఘశాఖ దీనిని చెపుతుంది.” నీవు అక్కడేయున్నావు. గుర్తుంచుకో, అది శాఖగా మారిన తరువాత, అది ఎల్లప్పుడు చనిపోతుంది, ఎన్నడూ అది తిరిగి లేవదు.

314 మొదటి సంస్థ కాథలిక్ యైయున్నది; అది వెంటనే చనిపోయింది. కారణము అది ఆరంభము నుండియే ఆచారమైయున్నది.

315 దాని నుండి మొదటి సంస్కరణ వచ్చియున్నది, అదే లూథర్, సంస్థగా మారి చనిపోయినది.

తరువాత వెస్లీ వచ్చాడు; సంస్థగా మారి, చనిపోయింది.

తరువాత పెంతెకొస్తు వచ్చింది; సంస్థగా మారి చనిపోయింది.

316 ప్రెస్బిటేరియన్, లూథరన్, ఈ ఇతరులందరే, నజరేన్, పిలిగ్రిమ్ హోలీనెస్, దానిని అనుసరించిన ఈ సంస్థలన్నియు చనిపోయినవి. ఎందుకు? వారు సంస్థగా మారి, వారిని చంపివేశారు. వాళ్ళు ఏమి చేశారు? ఈ ఆచారములను తీసుకొన్నారు. వారి వైపు చూడండి.

317 నజరేనులైన మీరు, పెంతెకొస్తు తరువాత ఒక అద్భుతమైన సంఘము అది ఏమైయున్నది? శుద్ధీకరణయందు మీరు నమ్మికయుంచారు, అది వరముల యొద్దకు, భాషలతో మాట్లాడుట, దేవుని యొక్క గొప్ప శక్తుల యొద్దకు వచ్చినపుడు “అది దయ్యములు,” అని మీరు పిలిచారు, అక్కడే మీరు చనిపోయారు. అది నిజము. ఈ రోజు ఆమె ఎక్కడయున్నది? మృతమైనది. ఓ, ఆమె ఎక్కువ మంది సభ్యులను కలిగియున్నది, కాని ఆమె ఎక్కడయున్నది, ఆమె ఒక శవముగాయున్నది.

318 మొన్న రాత్రి నేను ఆమెను చూశాను, ఆ మొత్తాన్ని, అది నిజము. వారి కాపరి, ఆ పైనయుంచబడిన శవమును ముద్దుపెట్టుకొంటూ, దానికి ప్రేమ చూపిస్తున్నాడు. “ఎలాగైనా, వారికి ఎంతమాత్రము సహాయము లేదు. దానికున్నదంతయూ అదియే.” కాబట్టి, ఏదో సమయములో, టేపు మీద నేను మీకు దానిని ఇస్తాను. చూడండి? మంచిది.

319 ఆత్మ సంబంధమైన ఫలమును ఫలించుటకు దేవుడు ఆయన చెట్టును నాటాడు. అది నిజమేనా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] కాని మనిషి ఏమి చేశాడు? మనిషి ఎల్లప్పుడు, దానిని ఒక కృత్రిమమైన రూపముగా చేశాడు. ఆ వెనుక అతడు చేసింది అదియే, ఇప్పుడు అతడు చేసేది అదియే. ఇప్పుడు మనము దానిని త్వరగా కఠినముగా పేల్చివేద్దాము. మనిషి ఎల్లప్పుడు ఆత్మ సంబంధమైన సంఘమును తీసుకొని, దానిని ఒక కృత్రిమమైన రూపముగా చేయుటకు ప్రయత్నము చేశాడు.

320 లూథర్ ఆత్మ సంబంధమైన సంఘమును కలిగియున్నాడు. ఏమి సంభవించిది? లూథర్ చనిపోయిన వెంటనే, వారు దానిని కృత్రిమమైన దానిగా, ఒక నామకార్థముగా చేశారు.

321 వెస్లీ ఏమి చేశాడు? జాన్ వెస్లీ, ఒక గొప్ప దైవజనుడు! జాన్ వెస్లీ ఒక దైవజనుడు కాదని ఎవరు చెప్పగలరు? అతడు ఏమి చేశాడు? జాన్ మరియు చార్లెస్ చనిపోయిన వెంటనే, వారు దానిని సంస్థగా మార్చారు. ఆమె ఆలాగున చేసినపుడు, ఆమె చనిపోయినది. ఖచ్చితముగా.

322 యుగములన్నిటిగుండా క్రింద వరకు, ప్రతిసారి, ప్రతి ఒక్కరికి అదే సంభవించింది. వారు కృత్రిమమైన దానిని ధరించుకొన్నారు, మంచి క్రియలు, పెద్ద సంఘము, చురుకైన ప్రజలు. “ఆ పట్టణములోనే ఖ్యాతిగాంచిన వ్యక్తి మా సంఘములో చేరాలనుకొనుచున్నాడు.”

323 పెంతెకొస్తు గుంపు వారికి కూడా ఖచ్చితముగా సంభవించినది అదియే. ఖచ్చితముగా సత్యము. మీరు అడ్డముగాయున్న కట్టడాలను దించివేశారు. ఆత్మ నుండి మీరు దూరముగా వెళ్ళిపోయారు. మీరు పెద్ద కట్టడములు, చక్కని వాటిని, గౌరవప్రథమైన కాపరులను మీరు కోరుకొన్నారు. మీరు ఏమి చేశారు? సంఘకాపరులుగా మారుటకు, తల్లులైన మీరు మీ పిల్లలను, ఈ వేదాంత పాఠశాలలకు పంపియున్నారు. వారు వెళ్ళి ప్రజలకు ఏమి బోధిస్తున్నారు? వేదాంతమును మరియు మానవ కల్పితమైన వాటిని బోధిస్తున్నారు. ఈ రోజున అది ఎక్కడయున్నది? వాళ్ళు తిరిగి, రిక్కీలుగా ఎల్విస్ లుగా బయటకు వస్తున్నారు. అది ఖచ్చితముగా సత్యము. ఈ రోజున మీరు ఏమి కలిగియున్నారు? ఒక కడుపు మురిగిపోయిన వారిని, “పైకి భక్తిగలవారిని,” కలిగియున్నారు.

324 బైబిలు చెప్పింది, “చివరి దినములలో వారు పైకి భక్తిగలవారి వలె యుంటారు, కాని దాని శక్తిని, దాని జీవమును ఆశ్రయించరు.” ఎందుకు? చీడపురుగు దానిని పీల్చివేయుచున్నది. నిజము. సంస్థ దానిని తీసివేసియున్నది. 1వ తిమోతి 3వ అధ్యాయములో పౌలు అన్నాడు, “అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్ధ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటె సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగల వారివలె యుండియు దాని శక్తిని ఆశ్రయించని వారునైయుందురు.” పసరుపురుగు దానిని పీల్చివేయుచున్నది. చీడపురుగు దీర్ఘకాలము క్రితమే దానిలో ప్రవేశించియున్నది. కొద్ది సేపటిలో, ప్రభువు చిత్తమైన యెడల, మొత్తమును, ఆ వృక్షమును మీ యొద్దకు తేబోవుచున్నాను.

325 “మాది అతి పెద్ద స్థలము.” ఓ, నిశ్చయముగా. “బాగుంది, నీకు తెలుసా, మా సంఘము గత సంవత్సరము ఎంతో కూడబెట్టియున్నది.” ఓ, నిశ్చయముగా.

326 కాథలిక్ సంఘము మిమ్ములను పదిలక్షల మైళ్ళ దూరములో ఓడించగలదు. నిశ్చయము చేసింది. చివరకు అది రష్యాలో ఎంతగా ప్రవేశించినదనగా, చివరకు వాళ్ళు దానిని బయటకు నెట్టి, కమ్యూనిజంను స్థాపించారు. మెక్సికోలో వారు దానినే చేశారు. ఆమెయున్న ప్రతిచోట, వాళ్ళు తప్పక దానిని ప్రపంచమంతటా చేయవలసియున్నది. అది సత్యము.

327 మీరు ఎన్నడూ కమ్యూనిజానికి భయపడవద్దు. కమ్యూనిజం దేవుడులేని ఒక ఉద్యమమైయున్నది. కాని ఈ బోధకులలో కొందరు, “కమ్మూనిజం! కమ్మూనిజం!” అని వేదిక మీద దానిని ఖండించుచున్నారు. దానిలో ఏదియు నేను నమ్మను. వాళ్ళ సంఘమునకు చెప్పండి, “ఓ, మనము మ్రింగివేయబడబోవుచున్నాము. మొత్తము ప్రపంచము కమ్యూనిజంగా మారబోవుచున్నది,” అని చెప్పవద్దు. అది ఖచ్చితముగా దేవుని వాక్యమునకు వ్యతిరేకము. అది ఆ విధానములో యుంటుందని చెప్పే బైబిలులో ఏ స్థలము లేదు.

328 కాని రోమనిజం కాథలిక్ సంఘము, ప్రపంచమును త్రిప్పివేయునని బైబిలు చెపుతుంది. దానియేలు గ్రంథమును తీసుకొని కనుగొనండి. బంగారు శిరస్సు, నెబుకద్నెజరు, బబులోను సామ్రాజ్యము. మాదీ-పారసీకులు అతని తరువాత వెంబడించిరి; గ్రీకు సామ్రాజ్యము దాని తరువాత వెంబడించింది. రోము అంతములోనికి వెళ్లింది. ఆ పది బొటన వ్రేళ్ళు భూమిమీదయున్న ప్రతి రాజ్యములోనికి వెళ్ళినవి. నీవు ఆలాగు చెప్పవద్దు…

329 అక్కడ ఒక ఇనుప తెరయున్నది. ఒక వెదురు తెరయున్నది. ఒక ఊదారంగు తెరయున్నది. సోదరుడా, నీవు మిగిలిన వాటిని గూర్చి భయపడనవసరము లేదు, కాని ఆ ఊదా రంగు తెరను గమనించుము.

330 ఈ రోజున, ఈ దేశములో తిన్నగా ఆమె సింహాసనము మీద కూర్చొండియున్నది. గుర్తుంచుకోండి, సరిగ్గా ఆహాబు చేసినట్లుగా, యెజెబెలు అతని వెనుకయున్నది. అదే…బైబిల్ కాథలిక్ సంఘమును “యెజెబెలు అని పిలుస్తున్నది; వేశ్య.” ఆహాబు చెడ్డవాడు కాదు. శ్రీ కెన్నడీ మంచివాడు కాదని నేను ఎరిగినది అంతమట్టుకే. అతడు అధ్యక్షుడు. అతడు మంచి అధ్యక్షుడు అవుతాడని నేను నమ్ముతాను. అది అతడు కాదు. అది వెనుకయున్న క్రమము. మంత్రి వర్గములోనికి ఆమె వేడి ఎక్కించు వరకు కనిపెట్టండి, మరియు ప్రతిచోట ఆమె చేయగలదు, తరువాత ఏమి సంభవిస్తుందో చూడండి. ఇతర దేశములో అది ఏమి చేసియున్నదో చూడండి. అది ఎల్లప్పుడు ఏమి చేసియున్నదో చూడండి.

331 ప్రకటన 13వ అధ్యాయములో బైబిలు చెప్పుట లేదా? ఈ దేశము సంఖ్య పదమూడు అది జెండాలో పదమూడు నక్షత్రములను పదమూడు చారలను కలిగియున్నది. జెండాలో పదమూడు చారలుయున్నవి. పదమూడు, ప్రతీదీ పదమూడే, పదమూడు కాలనీలు, సమస్తము పదమూడు. మరియు ఇది ప్రకటన పదమూడవ అధ్యాయములో కనబడుతుంది.

332 బైబిలు చెప్పింది, అదేమనగా, “ఆమె చిన్న గొర్రెపిల్ల వలె పైకి వచ్చింది,” మత స్వేచ్ఛ; “రెండు చిన్న కొమ్ములు,” సాంఘిక మరియు సంఘ పరమైనవి. కొంచెము తరువాత, అవి ఐక్యమైనవి, “అది ఘటసర్పము వలె మాట్లాడుచున్నది, అది ఆ మొదటి క్రూర మృగమునకుయున్న అధికార చేష్టలన్నియు చేయుచున్నది,” మరియు బైబిలు చెప్పింది, “వారు క్రూరమృగమునకు ఒక ప్రతిమను తయారు చేశారు.” అదే ప్రపంచ సంఘముల సమాఖ్య, సరిగ్గా ఇప్పుడే వారు దానిని న్యూయార్క్ పట్టణములో కలిగియున్నారు. అక్కడ అది ఒక పెద్ద శవములను భద్రపరచుగది. మెథడిష్టువారైన మీరందరూ, బాప్టిష్టులు, పెంతెకొస్తువారు, మీలో ప్రతి ఒక్కరు ఐక్య సంఘశాఖా ప్రజలు, అలాటి కార్యములు చేయుటకు ప్రయత్నము చేయుచున్నారు, బబులోనులో చేరుటకు, మీ జన్మ హక్కులను అమ్ముకొనుచున్నారు. మీతో వచ్చిన చిక్కు ఏమిటి? నిశ్చయముగా. కలగూర వంటకము కొరకు, ఏశావు చేసినట్లుగా, మీ జన్మ హక్కులను అమ్మివేసుకొనుచున్నారు. మీరు పొందబోయేది అంతవరకే. అంతే.

333 “మృగము యొక్క ప్రతిమ నిర్మించబడియున్నది.” ఖచ్చితముగా. మీరు కమ్యూనిజానికి భయపడవద్దు. మీరు కాథలిజంనకు భయపడండి, “ఓ,” “అది గొర్రెపిల్లవలె డంబపు మాటలు పలుకుతుంది. కాని,” “దానిని గమనించండి.” దాని వెనుక, అది ఒక తోడేలుయైయున్నది. అది ఒక మోసగాడు. మీరు దానిని గమనించండి. అవునండి. ఏలయనగా అది వాక్యమునకు విరుద్ధమైనది. వాక్యము ఏమి చెపుతుందో అది నెరవేరవలసియున్నది.

334 కమ్యూనిజం చేసేది ఏమీ లేదు, కాని దేవుని చేతిలో తిన్నగా ఒక సాధనముగా పనిచేయుచున్నది. అది ఖచ్చితముగా. వారు ఎందుకు ఆలాగా చెయ్యాలి? ఆయన వాక్యము నెరవేరునట్లుగా, దేవుడు కమ్యూనిజంను అనుమతించియున్నాడు. నిశ్చయముగా, నీవు దానిని గ్రహిస్తావా? నీవు ఎన్నడైనా దానిని గూర్చి ఆలోచించావా? దేవుడు తన మాటను నెరవేరునట్లు చేయవలసియున్నది.

335 చూడండి. ఒక రోజున అక్కడ నాలుగు వందలమంది ప్రవక్తలు, ఆహాబు మరియు యెహోషాపాతు ముందు నిలబడియున్నారు. యెహోషాపాతు ఒక నీతిమంతుడు. అతడన్నాడు, “కానీ మనము రామోతు-గిల్యాదు” పైకి వెళ్ళక ముందు, “ప్రభువును మనము తప్పక సంప్రదించవద్దా?”

336 ఆహాబు అన్నాడు, “అవును, నిశ్చయముగా.” చూడండి? దానంతటి వెనుక యెజెబెలు యున్నది, నీకు తెలుసా. “బాగుంది—బాగుంది…నా దగ్గర నాలుగు వందలమంది ప్రవక్తలు యున్నారు. వాళ్ళను ఇక్కడకు తీసుకొని వస్తాను, అని అన్నాడు.”

337 అందరూ చక్కని ప్రజలు. వాళ్ళను తెచ్చాడు. వాళ్ళందరూ ప్రవచించారు, “వెళ్ళండి, ప్రభువు మీతో ఉన్నాడు.”

338 ఈ దైవభక్తి గల మనిషికి అది చక్కగా అనిపించలేదు. ఇశ్రాయేలు రాజుకు అది చక్కగా అనిపించలేదు, అతడన్నాడు, “అక్కడ మరొక ప్రవక్త లేడా?”

339 “నాలుగు వందలమంది బోధకులు, ఇదివరకే ఒకే మనసుతో, ‘వెళ్ళండి, ప్రభువు మాతో మాట్లాడి, “వెళ్ళండి,”’” అన్నారు.

కానీ అతడన్నాడు, “అక్కడ మరొక ప్రవక్త లేడా?”

340 అతడన్నాడు, “ఒకడున్నాడు, కానీ నేను వాడిని ద్వేషిస్తాను.” నిశ్చయముగా. పరిపూర్ణముగా. అవును, “అతడు ఎల్లప్పుడూ నా మీద అరుస్తూ ఉంటాడు, అతడు ఎల్లప్పుడూ నా మీద చెడుగానే చెబుతూ ఉంటాడు.” దేవుని యొక్క వాక్యము అతనికి వ్యతిరేకముగా యుండగా, దానికి వేరుగా అతడు ఎలా చేయగలడు?

341 కాబట్టి వారు వెళ్ళి మీకాయాను తీసుకొని వచ్చారు. మీకాయా అన్నాడు, “వెళ్ళండి. అవును. అది నిజము. కానీ ఇశ్రాయేలీయులు కాపరి లేని గొర్రెల వలే చెదిరియుండుట నేను చూశాను,” అన్నాడు.

342 అప్పుడు, ఆ పెద్ద బోధకుడు, బిషప్పు, అక్కడకు నడిచి వెళ్ళి, అతని నోటి మీద చరిచాడు, “దేవుని యొక్క ఆత్మ నా నుండి వెళ్ళిపోయినపుడు, ఎక్కడకు వెళ్ళింది?”

343 అప్పుడు అతడన్నాడు, “ప్రారంభము నుండే దేవుని ఆత్మ నీలో లేదు,” “ఈ దినములో ఒక దినమున, నీవు దానిని కనుగొంటావు,” అన్నాడు.

344 “వాడిని లోపట చెరశాలలో వెయ్యండి అని ఆహాబు అన్నాడు. వాడికి దుఃఖమును ఆహారముగా, పానీయముగా ఇవ్వండి.” “నేను తిరిగి వచ్చినపుడు నేను వీడి సంగతి ఏమిటో చూచుకుంటాను.”

345 అతడన్నాడు, “నీవు ఏ మాత్రము తిరిగి వచ్చినట్లైతే, అప్పుడు దేవుని యొక్క వాక్యము నాతో మాట్లాడియుండలేదు.” ఎందుచేత? ఎందుచేత? అతడు తిన్నగా వాక్యముతోయున్నాడు, తిన్నగా వాక్యముతోయున్నాడు.

346 ఏ ప్రవచనమైనా దేవుని యొక్క వాక్యముతో నిలచియుండకపోయినట్లైతే…అది ఖచ్చితముగా. ఆ కారణమును బట్టియే, ఈ రోజున నేను చెపుతాను; అది ఎంత చక్కగా కనబడినప్పటికీ లెక్క కాదు, ఇది, అది, మరొకటి అని ఎంతమంది బోధకులు చెప్పినప్పటికి లెక్క కాదు, “కమ్యూనిజం ప్రపంచమును ఏలబోవుచున్నది అని అంటే, దానిని క్రిందపడవేయండి.” కమ్యూనిజంతో పోరాడటానికి నీవు ఎన్నడూ ప్రయత్నము చేయవద్దు. రోమనిజంతో పోరాడండి. ఏలయనగా, అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుయై యున్నది. రోమనిజం యేలబోవుచున్నదని ప్రభువు చెప్పారు, కమ్యూనిజం కాదు. అది కేవలము ఒక కీలు బొమ్మ.

347 కాని, మీరు చూడండి, అతడు దానిని చేయవలసియున్నదని, ప్రభువు మీకాయాతో చెప్పాడు, “నేను తప్పక ఆహాబును బయటకు పంపవలసియున్నది. ఏలీయా యొక్క మాటలు నెరవేరుటకు గాను, ఆ బోధకులను నేను ఆహాబు నొద్దకు పంపవలసియున్నది.”

348 దేవుడు కమ్యూనిజం ను పైకి లేపవలసియున్నది. వారు ఏమి చేశారు? ఈ శవపేటికలన్నిటిని కలిపి, మృగమునకు ఒక ప్రతిమను చేయుటకు, దానిలో చేరి ఐక్య సంఘముల సమాఖ్యను తయారు చేశారు. వాక్యము సరిగ్గా ఏమి చెప్పిందో అదే సంభవిస్తుంది. దానిని గూర్చి కలతపడవద్దు. అది దాని క్రింద రూపుదిద్దుకొనుచున్నది, మీరు దానిని గమనించండి. అది సత్యము!

349 నేను మిమ్మును క్షీణింప చేయుచున్నానని ఊహిస్తాను. కాని…[సమాజము “లేదు,” అని చెప్పుచున్నది.—ఎడి.] కాని అది సత్యము. మరలా నేను మీతో ఎప్పుడు మాట్లాడతానో తెలియదు. నేను ఎన్నడూ మీతో మాట్లాకపోవచ్చు మనకు తెలియదు. మనము ఎన్నడూ మరలా తిరిగి కలుసుకొనకపోవచ్చును, కాని ఏది సత్యమైయున్నదో మీరు తెలుసుకోవాలని నేను కోరుచున్నాను.

350 ఈ వాక్యమును గమనించండి. అది సత్యమైయున్నది. నేను కాదు. ఇది వాక్యము, ఇది అంతే. నా మాట దీనికి వ్యతిరేకముగాయున్నట్లైతే, అప్పుడు మీరు నన్ను నమ్మవద్దు. మీరు వాక్యమునే నమ్మండి. తరువాత, నీవు ఇలా అంటే, “మంచిది, మేము దానిని కలిగియున్నాము, మరియు నీవు దానికి వ్యతిరేకముగా బోధించుచున్నావు.” అప్పుడు నా దగ్గరకు రావలసిన విధి నీదైయున్నది. అవును. నా దగ్గరకు వచ్చి చెప్పవలసిన బాధ్యత నీదే. చూడండి. కొంచెము రండి, వాక్యము ఏమైయున్నదో మనము చూద్దాము.

351 ఇప్పుడు, అందుచేత, అది కమ్యూనిజమే ఏకముగా ప్రోగైనదని మనము కనుగొంటాము. దేవుడు అన్నాడు, “గోగు మరియు మాగోగు, అక్కడ వారు ప్రోగవుతారు.” నిశ్చయముగా. “యుద్ధమును తెచ్చుటకు,” అది అక్షరాలా సత్యము, కారణము. అది ఈ శక్తులన్నిటిని ఏకముగా తేబోవుచున్నది. అది రావలసియున్నది. అది దానిని చేస్తుందని బైబిలు చెప్పింది.

ఆత్మ సంబంధమైన ఫలమును ఫలించుటకు దేవుడు ఈ చెట్టును నాటాడు.

352 మనిషి ఎల్లప్పుడు దానిని కృత్రిమమైన రూపములో దానిని చేయుటకు ప్రయత్నించాడు, “పైకి భక్తిగల వారివలెయుండియు.” పట్టణములోనే అది పెద్ద కట్టడములు, నిశ్చయముగా, కోట్ల రూపాయలు ఖరీదు చేసేవి! అయ్యో! క్షేమము! యేసు వచ్చుచున్నాడని ప్రజలు బోధిస్తున్నారు, మళ్ళా ఆరు లేక ఎనిమిది మిలియన్ల డాలర్లు ఆ కట్టడ నిర్మాణమునకు ఎక్కడో ఖర్చు చేయుచున్నారు. సువార్త పొలములో యున్న మిషనరీలు, ఒక చెప్పులు జోడులేకుండా, వారమునకు రెండుసార్లు భోజనము చేస్తూ సువార్తను బోధిస్తున్నారు. ఎందుకో, నీవు చూడగలవా సోదరుడా, ప్రజలతోయున్న ఇబ్బంది ఏమిటి? యేసు వచ్చుచున్నాడు అని వారు నమ్ముటను, నేను నిజముగా నమ్మను. నీ-నీ-నీ-నీ మాటల కంటె, నీ జీవితము బిగ్గరగా మాట్లాడుతుంది. నీవు చూడు?

353 ఆ చిన్న మిషనరీలు, నేను నా కూటములకు వచ్చినపుడు, వారి పాదములకు చెప్పులు లేవు; చిన్న ప్యాంటులు చుట్టూ కట్టుకొనియున్నారు, ఆ విధముగా బయట ఈగలతో, నల్లులతో, సూక్ష్మ జీవులతో, అన్నిరకమైన వ్యాధులతో బయట జీవిస్తున్నారు; వారి చిన్న పాత చేతులు తినివేయబడినవి, సూక్ష్మ జీవులు తినివేసియున్నవి, అక్కడ నిలబడియుండగా, అన్నారు, “నీవేనా సోదరుడు బ్రెన్హాంవి?”

నేనన్నాను, “అవును.”

వారన్నారు, “ఓ, నీవు దీవించబడుదువు! నేను ఎల్లప్పుడు నీ కొరకు ప్రార్థిస్తాను.”

354 నేను అనుకొన్నాను, “ఓ, దేవా, వాళ్ళే నా కొరకు ప్రార్థించనిమ్ము. అవును. అతడే, ఆ వ్యక్తియే.”

355 “నేను నీ వ్యాసములు చదువుచున్నాను, బ్రెన్హాం సోదరుడా. నీవు నిశ్చయముగా సత్యమును చెప్పుచున్నావు. మేము తిన్నగా నీతోయున్నాము.” ఓ, సోదరుడా, ఆ కుర్రవాడే. అది అతడే; దీనుడైన చిన్నవాడు.

ఇక్కడ ఎవరో ఈలాగు చెప్పుట వినండి, “అతడు ఎవరో నీకు తెలుసా?”

“ఓ,” చెప్పండి, “అతడు మన సంస్థకు చెందినవాడు కాదు.”

“అది ఆలాగా? అతను ఎవరు?”

“ఎందుచేత, అతడు మనతో లేడా.”

“సరే, అతడు ఎవరు?”

“ఓ, అతడు, ఇండిపెండెంట్ వాడా.”

“ఓ, అతనా? సరే, అతడు ఏమి చేస్తాడు?”

“ఓ, ఆ బయట అతనికి చిన్న సేవయున్నది, అతడు మనతో చేరడు.”

“సరే, అతని గూర్చి నేను తెలుసుకోవాలనుకొనుచున్నాను.”

356 మీకు తెలుసా, నేను చిన్న బాలుడుగాయున్నప్పుడు, ఆపిల్ తోటలో, ఆపిల్ పండ్ల కొరకు వేటాడుతుండేవాడను, దాని క్రింద అంతా అతుక్కుపోయిన చెట్టును నేను కనుగొనే వాడను, నీకు తెలుసా. చక్కగా మరియు కఠినముగా అతుక్కుపోయియుండేవి, అక్కడే మంచి ఆపిల్ పండ్లుయుండేవి.

వాళ్ళంటారు, “మంచిది, అతడు కేవలము ఒక పరిశుద్ధ-రోలరు.”

357 నీకు తెలుసా, ఎక్కడైతే ఒక మంచి చెట్టుయుంటుందో, అక్కడే నీవు భయపెట్టే కాకిని యుంచుతావు. దాని నుండి నిన్ను భయపెట్టటానికి, దయ్యము దానినే చేస్తుంది. నీవు భయపడవద్దు, తిన్నగా ఆ భయపట్టే కాకి వెనుకగా వెళ్ళు.

358 ఒక దినమున, ఒక పంది నేను నాటిన వెన్న చిక్కుళ్ళను తినివేయటాన్ని నేను గమనించుచుంటిని. ప్రతిసారి నేను ఆ చిక్కుళ్ళను నాటిని ప్రతిసారి, వాడు వచ్చి వాటిని తినివేసేవాడు. “నేను వాడి ప్రాణాన్ని భయపెట్టాలనుకొన్నాను.” కాబట్టి నేను ఒక కాగితపు సంచిని తీసుకొన్నాను. నేను ఒక మంచి కళాకారుడను. నీవు తప్పక నన్ను చూడాలి. ఒక భయపెట్టే చిత్రమును గీచానని నేను తలంచాను. ఓ, నేను దానిని గీచినట్లైతే, అది భయముగా కూడాయుంటుంది. నేను దానిని ఒక సంచిమీద యుంచి, దానిలో కొన్ని చిక్కుళ్ళను యుంచి, ఒక కర్రకు వ్రేలాడ దీశాను. గాలి వీచినపుడు, అది ఆ విధముగా కదిలిపోతూయుండేది.

359 ఆ కన్నములోనుండి పంది వచ్చింది, నీకు తెలుసా. తిన్నగా అది ఆ సంచికి ఎదురుగా పరుగెత్తి వాటిని పడగొట్టి, ఆ చిక్కుళ్ళను తినుచుండెను. వాడు వెనుకకు తగ్గి, దాని వైపు చూశాడు. ఆ కాకివైపు ఆ విధముగా చూశాడు. వాడు తిన్నగా వెళ్ళి, “అయ్యో,” దాని మీద దూకాడు, సంచి ఆలాగునే నిలబడియున్నది. వాడు దానివైపు మరలా చూశాడు. తిన్నగా ఆ వరుసలోయున్న చిక్కుళ్ళను చూశాడు. నీకు తెలుసా. అవి చక్కగాయున్నవి. కాబట్టి వాడు చూశాడు, ఆ భయపెట్టే కాకి బొమ్మ వాడి మార్గములోయున్నది. కాబట్టి వాడు పైకి నడిచి, ఇంకా దగ్గరగా వెళ్ళాడు, ఆ విధముగా. [సహోదరుడు బ్రెన్హాం చిన్నగా చప్పుడు చేశారు.—ఎడి.] దానిని భయపెట్టటానికి ప్రయత్నించాడు, అది కదలలేదు. భయపడవద్దు. అది చచ్చిపోయిన కాకి అనుకొన్నాడు. ఆ బయపెట్టే కాకులన్నియూ ఆ విధముగానేయుంటాయి.

360 వాడు ఏమి చేశాడు, వాడి కాలుతో ఆ సంచిని తన్నాడు, దడ దడ మని వెళ్ళాడు. వాడు వెనుకకు దూరి, ఆ విధముగా దాని వైపు చూశాడు. వాడు మరలా దానిని గుద్దాడు, దడ దడ మని శబ్దము వచ్చింది. అంతమట్టుకే అక్కడయున్నది, కేవలము ఒక దడ దడ మని శబ్దము. అది ఆ ఐరిష్ మనిషి తయారుచేసిన గుడ్లగూబ వలెయున్నది, తెలుసా, అంతా రచ్చ వట్టి ఈకలే, కాని గుడ్లగూబ లేదు. దానిని ఆ విధముగా తన్నింది, నాలుగు ఐదుసార్లు దాని దడ దడ మని మ్రోగించింది. వాడు ఏమి చేశాడో నీకు తెలుసా? వాడు తిన్నగా ఆ సంచి వెనుకగా వెళ్ళి, నా చిక్కుళ్ళను తినివేయుట ప్రారంభించాడు. నాకు బాగా తెలిసిన దానికంటె, వాడికి ఎక్కువ తెలుసు. చూడండి. అది ఏమిటి? ఆ భయపెట్టే కాకిని వాడు ఆపనియ్యలేదు. ఆ భయపెట్టే కాకి వెనుక ఏదో మంచియున్నది.

361 “ఓ, వాళ్ళు పరిశుద్ధ రోలర్లు,” అన్నప్పుడు, తిన్నగా ఆ భయపెట్టే దాని వెనుకగా ముందుకు వెళ్ళి లోనికి వెళ్ళుము. చూడండి? ముందుకు వెళ్ళి దానిని నమ్ముము. చూడండి? బహుశ అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడేమో, నీవు చూడు. నీవు చెప్పలేవు. చూడండి? మంచిది.

362 ఓ, ఈ శాఖా సంబంధమైన చీడపురుగు పనిచేయుటను చూడండి. సహజమైన సంఘము; ఆత్మ సంబంధమైన సంఘము. ఇప్పుడు ఈ పాత చీడపురుగు పనిచేయుటను చూడండి, వాడు ఎలా శాఖను చేస్తాడో. వాడు ఇది వరకే బెరడును తిని వేశాడు, ఫలములను తినివేశాడు, ఓ, సోదరుడా, అదంతయూ వెళ్ళిపోయింది. ఆత్మ సంబంధమైన వరములన్నీ వెళ్ళిపోయినవి; దైవిక స్వస్థత లేదు; భాషలతో మాట్లాడుట లేదు, ప్రవచనము లేదు, ఏమీ లేదు, ప్రవక్తలను నమ్మరు. ఈ కార్యములను వారు నమ్మరు. వారికి తెలియదు. అంతా మానవ-కల్పితమైనదే! వారు కలిగియున్న సమస్తమూ మానవ కల్పితమైనదే, కృత్రిమమైనదే. చూడండి? మంచిది. సహజమైన సంఘము, ఇక్కడ ఒక ప్రకృతి సంబంధమైన సంఘముయున్నది. అది మనిషి ద్వారా తయారు చేయబడియున్నది, ఆలాగునే ఆత్మ సంబంధమైన సంఘమున్నది…

363 నీకు తెలుసా, బైబిలు దానిని చెపుతుంది. అవునండి. సహజమైన సంఘము; మరియు ఆత్మ సబంధమైన సంఘము. బైబిలు చెప్పింది, “దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము:” (హాగరు) “ఏలయనగా దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో వారసుడు కానేరడు.” చూడండి?

364 కాబట్టి, సహజమైన సంఘము, దేనిని స్వతంత్రించుకొనబోవుచున్నది, (ఏమిటి?) పనలుగా కట్టబడి, కట్టలుగా కట్టబడి కాల్చివేయబడతాయి. “ఆమె స్వతంత్రురాలితో, వారసురాలుగా ఏమియు స్వతంత్రించుకొనలేదు.” దాసి ఇంకనూ, సంస్థ యొక్క పిల్లలతో దాస్యత్వములో యున్నట్లైతే, ఆమె స్వతంత్రురాలితో వారసత్వము పొందలేదు, కారణమేమనగా స్వతంత్రురాలు యొక్క పిల్లలు ఎత్తబడుటలోనికి వెళ్ళబోవుచున్నారు. కాని దాసి యొక్క పిల్లలు, తీర్పులో నిలబడబోవుచున్నారు, చూడండి, దానిని వెళ్ళగొట్టుము. అవును. ఆత్మ సంబంధమైన వారు స్వతంత్రులు. అవునండి.

365 ఈ చీడపురుగు, శాఖా సంబంధమైన ఏశావులు. ఇప్పుడు, ఏశావు. అక్కడ ఏశావు మరియు యాకోబుయున్నారు, వారిద్దరూ కవలలు, వారిద్దరూ భక్తిగలవారు. ఏశావు శరీరసంబంధి, అతడు ఒక మంచి మనిషి, బయటకు వెళ్ళి దొంగిలిద్దాము, త్రాగుదాము, లేక అలాటివి అతడు చెప్పలేదు. అతడు భక్తిగల మనిషి. అయితే అతడు ఇలా తలంచాడు, “బాగుంది, నేను భక్తిగలవాడిగాయున్నంత కాలము, అది ఏ భేదము చేస్తుంది?”

366 కాని, చిన్న పాత యాకోబు, ఎలాగు దానిని పొందవలసియున్నదో, అతడు దానిని లెక్క చెయ్యలేదు, కాని జ్యేష్ఠత్వాన్నే అతడు కోరియున్నాడు. అతడు దానిని ఎలా పొందాడు, అన్నది లెక్కకాదు, ఎలాగైనా అతడు దానిని పొందాడు. అతడు వేదిక నొద్ద మోకరించి, అరిచి, మొర్రపెట్టి, బో, హా, అని చీమిటి చీదినా పరవాలేదు. మన్నించండి. లేక, నీకు తెలుసా, కళ్ళనిండా నీరు పైకి వచ్చినా పరవాలేదు. అది చెప్పుట నా భావము కాదు. నన్ను మన్నించండి. కాబట్టి వేదిక నొద్ద మోకరించి, అతడు దానిని పొందు వరకు, మొర్రపెడతాడు, ఎందుచేత, అతడు దానిని పొందాడు. చూడండి? అతడు దానిని ఎలా పొందాడో లెక్క చెయ్యలేదు, కాని అతడు దానిని పొందాడు.

367 వారిలో కొందరు అంటారు, “నేను…బ్రెన్హాం సోదరుడా, ఆ ప్రజలు వేదిక నొద్ద, విలపిస్తున్నారు, ఏడుస్తున్నారు, మొర్రపెడుతున్నారు. అలాగైతే అది ఆ మార్గములో నాకు వద్దు.” మంచిది, నీవు దానిని పొందవు.

368 ఆ వృద్ధ నల్లజాతి సోదరుడు, ఒకసారి దక్షిణాన, ఎల్లప్పుడు సంతోషముగాయుండేవాడు. అతని యజమాని ఇలా అన్నాడు, “కుర్రవాడా, ఎల్లప్పుడు ఏది నిన్ను సంతోషముగా యుంచతుంది?”

అతడన్నాడు, “నేను హృదయమును తాకే మతమును కలిగియున్నాను.”

అతడన్నాడు, “అక్కడ అలాటి ఏదీ లేదే.”

369 అతడన్నాడు, “నీవు ఒక తప్పు చేశావు, ‘నీకు తెలిసినంత వరకు అలాటిది అక్కడ లేదు.’” అతడు భిన్నముగా ఎరిగియున్నాడు. “‘నీవు ఎరిగినంత వరకు.’ నీవు ఆ విధముగా చెప్పవలసియున్నది.”

ఒకరోజున అతడన్నాడు, “ఆ హృదయమును తాకే మతము నాకు కొంత కావాలి.”

అతడన్నాడు, “నీకు ఎప్పుడు కావాలి?”

“ఇప్పుడే,” నాకు కావాలి.

అతడన్నాడు, “మంచిది, వెళ్ళి దానిని పొందుము.”

370 వాళ్ళు బయటకు వెళ్ళారు. అతడన్నాడు, “ఇక్కడ గడ్డివాము వున్నది. అది బాగుంటుంది.” అన్నాడు, “అవును, నా భార్య నా మాటలు ఈ బయట వినలేదు;” ఆ మార్గములో ప్రజలు దానిని కోరుకొంటారు, నీకు తెలుసా; వారికి దానిని ఒక పళ్ళెములో పెట్టి ఇవ్వాలి. “మనము మోకరిద్దాం” అన్నాడు.

వృద్ధ సోదరుడు అన్నాడు, “నీవు ఇక్కడ దానిని పొందుము.”

371 సరే, అయ్యా, అతడు కొట్టులోనికి వెళ్ళాడు, “మనము దానిని ఇక్కడ పొందుతామా?” అన్నాడు.

“లేదు,” అన్నాడు

అతడన్నాడు, “మనము జొన్న పొలములోనికి వెళదాము.”

అతడన్నాడు, “వద్దు.”

అతడన్నాడు, “నీవు దానిని ఎక్కడ పొందుతావు?”

372 “నన్ను వెంబడించు,” అన్నాడు. అతడు తన ప్యాంటు’ కాళ్ళను పైకి ఎత్తి, తిన్నగా అతడు నడవగలిగినంత వేగముగా, పందుల దొడ్డిలో బురదలోనికి వెళ్ళాడు. “తిన్నగా ఇక్కడకురా, అని అతనిని పిలిచాడు, ఇక్కడే నీవు దానిని పొందుతావు.”

అతడన్నాడు, “అక్కడికి రావటం నాకు ఇష్టము లేదు.”

అతడన్నాడు, “యజమానుడా, ఇంకనూ అది నీకు అవసరము లేదా, నీకు అది అవసరము లేదా.”

373 నీకు తెలుసా, నయమాను, దానినే తలంచాడు. నయమాను అన్నాడు, “ఇప్పుడు నా యొక్క కుష్ఠు వ్యాధిని పోగొట్టుకోవాలి.”

374 ఎలీషా అన్నాడు, “నీవు యోర్దాను బురద నీళ్ళలోనికి వెళ్ళు, నీళ్ళను, అది మధ్యదరా సముద్రములోనికి ఖాళీ చేస్తుంది.” అతడన్నాడు, “అది ఉండవలసినంత మురికిగాయుంది, ఏడుసార్లు దానిలో మునుగు.”

375 “ఓ,” నయమాను అన్నాడు, “నా, భాగ్యము! ఇక్కడయున్న నీళ్ళకంటె దమస్కులోని నీళ్ళు శ్రేష్ఠమైనవికావా? ఓ…అవి చక్కగా తేటగా యుంటాయి.” మొన్నటి రాత్రి ఫిల్మ్ లో మనము దానిని చూశాము. “ఓ,” అతడన్నాడు, “ఎందుకు, ఎందుకు, అక్కడకు వెళ్ళడం మాకు ఇష్టము లేదు. నేను అక్కడకు వెళ్ళలేను. నేను ఎవరినో నీకు తెలుసా? నేను సైన్యాధిపతిని. నేను సర్వసైన్యాధిపతిని.”

376 “బాగుంది, నీవు నీ కుష్ఠు వ్యాధిని పోగొట్టుకోవాలనుకుంటే, క్రిందకు దిగి వెళ్ళు. కాని దానిని ఊహించుకోవాలనుకుంటే, వెళ్ళు. అతడన్నాడు, వెళ్ళి ‘మునుగు.’”

377 ఆ నీళ్ళలోనికి అతడు నడుచుట నేను చూడగలను. నీవు ఊహించగలవా? ఓ, అది అతని హోదాను గాయపరుస్తుంది. నడినెత్తినుండి అరికాలు వరకు ఆ రీతిగా ముక్కు మూసుకొని, అతడు మునుగుటను నేను చూడగలను, నీకు తెలుసా.

378 ఆ విధముగానే కొందరు ప్రజలు క్రీస్తు నొద్దకు వచ్చుటకు ప్రయత్నిస్తారు. “నేను స్వస్థపడాలి, నేను పరలోకము వెళ్ళగోరుచున్నాను, కాని అయ్యో! మిగిలిన వారందరూ నా వైపు చూస్తే ఎలా.” అంటావా, నీవు వేషధారివి. నీవు దానిని ఎన్నడూ పొందలేవు, ఎలాగైనా అది నిజము చూడు? ఎలాగైనా, నీవు ఎన్నడూ దానిని పొందలేవు. చింతపడవద్దు, అది తగినంతగా నీకు అవసరము లేదు. అది నిజము. నీకు తగినంతగా అది అవసరము లేదు. అది ఖచ్చితముగా సత్యము. నీవు దానిని పొందుటకు సిద్ధమైనపుడు, నీవు దానిన పొందుతావు, మంచిది. నీవు సిద్ధమైనపుడు దేవుడు నీకు దానిని ఇస్తాడు. మంచిది.

379 ఇప్పుడు, సంఘశాఖా సంబంధమైన చీడపురుగులన్నీ, మొత్తాన్ని తినివేసినవి. గమనించండి, ఈ పురుగులలో ప్రతి ఒకటి, వాడు చెట్టుమీద పనిచేస్తూయుండగా, అతనిని వెంబడించబోయే ఇతర పురుగుకు, వాడు మార్గమును తయారుచేశాడు. ఓ, వాడు తెలివైనవాడు. అవునండి. చూడండి? వాడు ఫలములను తీసివేశాడు. చూడండి, ఆత్మ, కాబట్టి (ఏమిటి?) సహవాసమును దూరముగా తీసివేశాడు, ఆకులు.

380 కాబట్టి మరొక వైపు నుండి వాడు వచ్చి, అతని జీవనాన్ని ప్రారంభించాడు, ఆకులను తీసివేశాడు. వాడు ఎందుకు దానిని చేశాడు? అక్కడ చల్లదనము లేకుండా, తాజాదనము లేకుండా, ఇతర ప్రజలు చూడకుండా, ఆ ప్రకారము వాడు బెరడులోనికి వెళ్ళుటకు గాను, వాడు ఆకులను తీసివేశాడు. చూడండి?

381 వాడు బెరడులో ప్రవేశిస్తాడు, శిఖరములోనికి రంధ్రం చేస్తాడు మరియు వారి నుండి సిద్ధాంతమును దూరముగా తీసివేస్తాడు, అదే జీవాన్ని బలపర్చేది.

382 తరువాత, దానిలోనికి రంధ్రములు చేసిన వెంటనే, తరువాత క్రమము, ఈ పీల్చివేయువాడు, చీడపురుగు సంఘశాఖను తీసుకొని, దానిని బాగుగా పీల్చివేసి, నీవు దాని యొద్దకు వెళ్ళకుండా దానిని సంస్థగా మార్చాడు.

383 జీవము ఏమి చేస్తుంది? తిన్నగా వేరులలోనికి క్రిందికి వెళుతుంది అది అక్షరాల సత్యము. తిన్నగా వేరులలోనికి, క్రింది వరకు అది పరుగెత్తుతుంది. మంచిది.

384 ఇప్పుడు, అదే పురుగు, జీవములోనికి వెళ్ళువరకు, గుండెకు రంధ్రము చేసియున్నది. అది ఫలముగుండా, ఆకులు గుండా, బెరడు గుండా, తిన్నగా గుండెనొద్దకు వచ్చు వరకు, అదే జీవపు నాడి, అది ప్రయాణము చేస్తూనేయున్నది. మంచిది.

385 ఇప్పుడు ఆ నాశనకారి పనిచేయటను మొదటగా చూద్దాము. ఇక్కడ నేను కొన్నిటిని దాటి వెళ్ళుచున్నానని నేను నమ్ముతాను; లేదు, దాటుటలేదు. మొదటగా వీడు చేసిన పని, వాడు చెట్టు యొక్క గుండెలోనికి ప్రవేశించిన వెంటనే, వాడిని గమనిద్దాం; అతని యొక్క మొదటి దశలో, వాడు ఎంతో చక్కగా ఎన్నడైనా ప్రారంభించుటకు ముందు, వాడిని గమనిద్దాము. ఇప్పుడు వాడు పనిచేయుటకు గమనిద్దాం. వాడు మొదట తీర్పుచేసినది, నిజమైన ఫలమును, దేవుడు భూమి మీద కలిగియున్న ప్రశస్తమైన ఫలవృక్షమును నాశనము చేయుట.

386 ఇప్పుడు, నాతో పాటు మీరు కొన్ని నిమిషములు సహించగలిగినట్లయితే. దీనిని మీరు ఇప్పుడు గ్రహించాలని నేను మిమ్మును కోరుచున్నాను—నేను మిమ్మును కోరుచున్నాను. లేదు…ఇఫ్పుడు వస్తున్నది, మీ యొక్క ఈష్టర్ సందేశం. ఉ-హ్, ఉ-హ్, ఉ-హ్.

387 వాడు మొదటగా చేసిన పని దేవుని యొక్క ప్రశస్తమైన మొదటి ఫలవృక్షమును నాశనము చేశాడు, క్రీస్తు. ఏదెను తోట మొదలుకొని ఆయనే ఆ చెట్టుయైయున్నాడు. అది సత్యము. ఆ మొదటి ఫలవృక్షమును, వాడు నాశనము చేశాడు. భూమి మీద దేవుడు నాటిన మొదటి చెట్టు, క్రీస్తుయైయున్నాడు. ఆయన ఫలమును ఫలించుచున్న ఆ వృక్షమును వాడు నాశనము చేశాడు. ఇప్పుడు వారు అన్ని రకములైన సంస్థలను కలిగియున్నారు. వాడు అన్నిటిని తన చేతులలో కలిగియున్నాడు. కాని ఆ నిజమైన ఫలమును ఫలించే చెట్టు యొద్దకు వాడు వచ్చినప్పుడు, ఆ రోమా పురుగు దానిలో ప్రవేశించి, ఆ చెట్టును నాశనము చేసింది, చూడండి.

388 చెట్టు? అవును. యేసు అన్నాడు, “నేను నా తండ్రి క్రియలు చేయని యెడల…” యెహాను సువార్తలో, “నేను నా తండ్రి క్రియలు చేయని యెడల, లేక నా తండ్రి ఫలములను కలిగియుండనియెడల నన్ను నమ్మవద్దు.” ఆయన దేవుని ఫలమును ఫలించుచుండెను. ఏ రకమైన ఫలమును ఆయన ఫలించాడు? ఏ రకమైన ఫలము?

389 కొన్న క్షణములు ఆయనను మనము గమనిద్దాము. దాని గుండా మనము ఎన్నోసార్లు వెళ్ళియున్నాము. ఒక చిన్న ప్రాథమికమైన దానిని తీసుకొందాము, కారణము ఇక్కడ కూర్చొన్న ప్రజలు, ప్రార్థించబడుటకు, ఒక్క నిమిషము కనిపెట్టుచున్నారు.

390 మెస్సీయాగా వారు ఆయనను గుర్తించినపుడు, ఆయన చేస్తాడని, వారు ఎరిగియున్న మొదటి విషయము ఏమిటి? పేతురు మొదటగా ఆయన యొద్దకు వచ్చినపుడు, ఆంద్రెయ అతనిని తీసుకొని వచ్చాడు, ఆయన పేతురు వైపు చూసి, ఇలా అన్నాడు, “నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడవు.” లేఖనముల ప్రకారము, ఆయన మెస్సీయాయైయున్నాడని, అప్పుడే తిన్నగా అతడు ఎరిగియుండెను.

391 చరిత్ర ప్రకారము, తమ్మును తాము మెస్సీయాలుగా పిలుచుకొనిన వారు, అనేకమంది దానికి ముందు లేచియున్నారని నీకు తెలుసా? కాని వారిలో ఎవరునూ దీనిని చేయలేకపోయారు. కారణము, “మెస్సీయా,” మోషే చెప్పియున్నట్లుగా (దేవుని యొక్క వాక్యము, మోషే ద్వారా పలుకబడినది, అది తప్పిపోదు.) అతడన్నాడు, “మీ మెస్సీయా నా వలె ఒక ప్రవక్తగాయుంటాడు.”

392 కాబట్టి ఈ క్రొత్త వ్యక్తి యేసు ముందుకు నడిచినపుడు, యేసు అన్నాడు, “ఇదిగో నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడవు,” ఆయన ఎవరైయుండెనో, అప్పుడే పేతురు ఎరిగియుండెను. అది ఆయనయైయున్నాడని అతడు ఎరిగెను.

393 ఫిలిప్పు వెళ్లి, నతనియేలును తీసుకొని వచ్చినప్పుడు, నతనియేలును ఇక్కడకు తీసుకొనివచ్చాడు. నతనియేలు ఒక గొప్ప మనిషి, ఒక గొప్ప మనిషి, చూడండి, భక్తి గల మనిషి ఆయన సీమోనుకు ఏమి చేసియున్నాడో, దారిలో ఫిలిప్పు అతనితో చెప్పుచుండెను. నతనియేలు యేసు సముఖమునకు నడచినపుడు, యేసు ఏమన్నాడు? ఆయన అన్నాడు, “ఇదిగో ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు.”

అతడన్నాడు, “బోధకుడా, నేను నీకు ఎలా తెలుసు?”

394 అతడన్నాడు, “ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే, నీవు ఆ చెట్టు క్రిందయున్నప్పుడే నేను నిన్ను చూశాను.”

395 అతడన్నాడు, “బోధకుడా, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు; నీవు ఇశ్రాయేలు రాజువు.” చూడండి?

396 ఎందుచేత? అది ఫలమైయున్నది. “నేను నా తండ్రి క్రియలు చేయని యెడల…” వారి హృదయములలో యున్న తలంపులను సహితము ఆయన ఎరిగియున్నాడు.

397 ఒకసారి ఒక స్త్రీ ఆయన వస్త్రమును తాకింది, వెళ్ళిపోయి సమాజములో కూర్చొన్నది. యేసు చుట్టూ చూసి అన్నాడు, “నన్ను ఎవరు ముట్టారు?” అందరు మేము ఎరుగము అన్నారు. ఆయన చుట్టూ చూసి, ఆమెను చూశాడు. ఆమె రక్త స్రావమును కలిగియున్నది. ఆయన అన్నాడు, “నీ విశ్వాసము నిన్ను రక్షించినది.” ఓ, అయ్యో!

ఆ చిన్న సమరయ స్త్రీ…

398 ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆయన అన్యుల యొద్దకు ఆ రీతిగా ఎన్నడూ వెళ్ళలేదు. లేదండి, వారి యొద్దకు వెళ్ళ వద్దని ఆయన తన శిష్యులకు చెప్పాడు. అది మనమే. ఇది మన దినమైయున్నది, ఆయన యుంటానని చెప్పినట్లుగా, ఆయన పరిశుద్ధాత్మ రూపములో మన యొద్దకు వచ్చాడు.

399 కాని ఆయన వారి యొద్దకు వెళ్ళినపుడు, ఏమి సంభవించింది? ఆయన సమరయ స్త్రీ యొద్దకు వెళ్ళాడు, “నాకు దాహమునకు నీళ్ళిమ్మని,” ఆయన ఆమెను అడిగాడు.

400 ఆమె అన్నది, “నీవు యూదుడవైయుండి, సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు నీళ్ళడుగుట ఆచారము కాదు.”

401 వారి రంగులను బట్టి వారు వేర్పాటును కలిగియుండిరి. అక్కడ భేదములేవియు లేవని, మనమందరము ఒకే చెట్టు నుండి వచ్చామని తిన్నగా అక్కడే వారిని తెలుసుకోనిచ్చాడు. మనమందరము దేవుని యొక్క కుమారులము మరియు కుమార్తెలమైయున్నాము మనమందరము. చూడండి.

402 ఆమె అన్నది, “మంచిది, మేము మా తండ్రియైన యాకోబును ఆరాధిస్తాము…” చూడండి, అతడు యూదులకు’ కూడా తండ్రి. చూడండి? “మా తండ్రియైన యాకోబు ఈ బావిని త్రవ్వాడు, నీవంటావు, నీవు ఆయనకంటె గొప్పవాడవా?”

403 ఆయన అన్నాడు, “నేను నీకిచ్చు నీళ్ళు నిత్యజీవమైయున్నది.” చూడండి? ఆయన అన్నాడు…

“మేము, సరే ఈ కొండ మీద ఆరాధిస్తాము, మీరు యెరూషలేములో.”

ఆయన అన్నాడు, “నీవు వెళ్ళి నీ భర్తను తీసుకొని ఇక్కడకు రా, అది దానిని పరిష్కరిస్తుంది.”

ఆమె అన్నది, “నాకు భర్త లేడు.”

404 ఆయనన్నాడు, “నీవు సత్యము చెప్పావు,” “నీకు ఐదుగురు భర్తలున్నారు, మరియు ఇప్పుడున్న వాడు నీ భర్తకాడు.”

405 ఆమె అన్నది, “అయ్యా, నీకు తెలుసా, నాలుగు వందల సంవత్సరముల నుండి మాకు ఒక్క ప్రవక్త లేడు, కాని నీవు తప్పక ఒక ప్రవక్తవైయుంటావు. నాకు ఐదుగురు భర్తలున్నారని నీకు ఎలా తెలుసు?” ఆమె అన్నది, “ఇప్పుడు, అది ‘క్రీస్తు’ అనబడిన మెస్సీయా ఇక్కడయుండు సమయమైయున్నది. ఆయన వచ్చినపుడు, ఆయన మాకు ఈ విధమైన సంగతులు చెపుతాడు.” ఓ, అక్కడే ఆయన ఫలములున్నవి.

ఆయనన్నాడు, “నేనే ఆయనను.”

406 ఆమె కుండను, సంస్థ యొక్క పాత నీటి కుండను విడిచిపెట్టింది, పట్టణములోనికి వెళ్ళింది. యాకోబు కలిగియున్న బావి, ఎంత పెద్దదైనప్పటికీ లెక్క కాదు, ఆమె ఒక క్రొత్త ఊటను కనుగొన్నది. ఆమె పట్టణము లోనికి వెళ్ళి, “మీరు వచ్చి నేను చేసినవన్నియు చెప్పిన మనిషిని చూడండి; ఈయన మెస్సీయా కాడా? ఇది ఆయన ఫలము కాదా? ఆయన మెస్సీయా అనటానికి ఇది రుజువు కాదా?”

407 యూదులు దానిని గ్రహించలేకపోయారు. వారన్నారు, “ఈయన ఒక జాతకము చెప్పేవాడు, బయెల్జెబూబు.”

408 యేసు అన్నాడు, “నేను మిమ్మును క్షమిస్తాను, కాని ఒక సమయములో పరిశుద్ధాత్ముడు వచ్చి, ఇదే కార్యాన్ని చేస్తాడు, నీవు దానికి వ్యతిరేకముగా మాట్లాడినట్లైతే, అది నీకు ఎన్నడూ క్షమించబడదు.” చూడండి?

409 ఇప్పుడు “నేను నా తండ్రి క్రియలు చేయని యెడల, నన్ను నమ్మవద్దు.” కానీ ఫలవృక్షము ఫలములను ఫలించుచున్నది.

410 ఇప్పుడు ఏమిటి? ఆయన ఏమి చెప్పాడు? అప్పుడు ఏ రకమైన సంఘమును ఆయన ఏర్పాటు చేశాడు? ఇప్పుడు కాథలిక్ వారైన మీరు యేసు సంఘమును ఏర్పాటు చేశాడంటారు. ఏ రకమైన సంఘమును ఆయన స్థాపించాడు?

411 ఆయన ఎన్నడైనా ఒక సంఘశాఖ పేరును ఒక ఆచారమును ఎన్నడైనా చెప్పాడా? [సమాజము “లేదు,” అని చెప్పుచున్నది.—ఎడి.] ఆయన ఎల్లప్పుడు దానికి వ్యతిరేకమైయున్నాడు. “మీరు సున్నము కొట్టిన సమాధులు, చచ్చిన ఎముకలతోయున్నారు,” అన్నాడు. ఆయన పిలవగలిగే సమస్తమైన మాటలతో ఆయన వారిని పిలిచాడు. అది సత్యము. ఆయన దానికి వ్యతిరేకము అది దేవుని యొక్క ఫలమైయున్నది. ఇప్పుడు, నీవు కోరినట్లైతే, రెండు రెండును నాలుగు చేయవచ్చు. మంచిది. ఆయన వారి సంస్థలకు, సిద్ధాంతములకు వ్యతిరేకమైయున్నాడు. “వేషధారులని, గడ్డిలో పాములని,” “దయ్యములని” వారిని పిలిచాడు. “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, వాడి క్రియలనే మీరును చేస్తారు. నాకు ముందుగా పంపిన ప్రవక్తలలో మీ తండ్రులు ఎవరిని హింసించకుండాయున్నారు?” చూడండి? “తరువాత మీరు వారి సమాధులను నిర్మిస్తారు.” అన్నాడు “ఆ సమాధులలో వారిని ఉంచినవారు మీరే కదా.” ఓ, సోదరుడా, ఆయన వారితో ఏ మాత్రము దయగా లేడు. అది నిజము.

412 అది దేవుని యొక్క ఫలమైయున్నది. అది ఏమిటి? వాక్యముతో నిలచియుండుట, వాక్యమునకు ప్రత్యక్షపరచనిచ్చుటయైయున్నది.

413 ఆయన అన్నాడు, లేనిచో, “మెస్సీయానైన నేను వచ్చినపుడు, నేను ఏమి చేస్తానని లేఖనము చెప్పింది? ఇప్పుడు, నేను వాక్య ఫలమును ఫలించని యెడల అప్పుడు నేను మెస్సీయాను కాదు. కాని మెస్సీయా ఏమి తప్పక చేస్తాడని చెప్పబడిందో, ఆ వాక్య ఫలమును ఫలించినట్లైతే, అప్పుడు నేను ఆయనను.” ఆమేన్. “ఇప్పుడు, నాలో పాపమున్నదని ఎవరు రూపించగలరు,” అని ఆయన అన్నాడు. అక్కడే నీవున్నావు. “మీ సంస్థలు, ఇదే కార్యాన్ని ఏది చేసింది?” అక్కడే నీవున్నావు. “మెస్సీయా తప్పక దీనిని చేయవలసియున్నది. మెస్సీయా తప్పక ఒక ప్రవక్తగా యుండవలసియున్నాడు. ఇప్పుడు మీలో కొందరిని మనము చూద్దాము.” “ఎంతో ఉన్నతమైన నటించే ఆలోచనలతో, మీరు దానిని చేయుట చూడనివ్వండి,” అని ఆయన అన్నాడు. అప్పుడు, వాళ్ళు మౌనముగాయున్నారు. మంచిది. అది ఏమిటి? ఆయన దేవుని యొక్క ఫలమును ఫలించెను. పరిశుద్ధాత్ముడు ఆయనలోయున్నాడు. ఆయన దేవుని యొక్క ఫలమును ఫలించాడు. ఆయన ఎవరు?

414 ఇప్పుడు బాగా వినండి. నేను ఎంత త్వరపడాలో అంత త్వరపడతాను, ఆ ప్రకారము మీ ఈష్టర్ భోజనముకి ఆలస్యము చేయను. చూడండి? కాని మీ ఈష్టర్ భోజనము పునరుత్థానముగాయుండాలి. చూడండి?

415 అయితే ఏమిటి? ఆయన దేవుని పరిపూర్ణమైన ప్రవక్త-వృక్షము, మాదిరి వృక్షము, పెండ్లి కుమారుడు చెట్టు. ఆమేన్. మహిమ! నేను ఒక విషయాన్ని తిన్నగా చెప్పబోవుచున్నాను. ఆయన పెండ్లి కుమారుడైన చెట్టుయైయున్నట్లైతే. (ఏదెను తోటనుండి, నీవు దానిని నమ్ముతావా?) [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] అప్పుడు, పెండ్లికుమారుడు చెట్టు, ఆడది లేకుండా ఫలమును ఫలించదు, కాబట్టి ఆయన తప్పక ఒక వధువు వృక్షమును కలిగియుండవలసియున్నది, వృక్షములో శరీరధారియైన వాక్యము. మీకు అది అర్థమైనదని నమ్ముతాను. ఆ ఆడ వృక్షములో, అది ఒకే జీవమైయున్నది, పెండ్లికుమార్తెలోయున్నట్లుగా, పెండ్లికుమారుడైయున్నాడు. “నేను చేయు క్రియలు మీరును చేస్తారు.” అది నిజమేనా? [“ఆమేన్.”] గుర్తుంచుకోండి, ఆయన పెండ్లికుమారుడైయున్నాడు.

416 నీవంటావు, “అది లేఖనము కాదు.” ఓ, అది లేఖనమైయున్నది. ఇప్పుడే నేను దానిని పట్టుకొన్నాను, చూడండి? ఒక్క నిమిషములో మనము స్వస్థతా కూటమును ఏర్పాటు చేయబోవుచున్నాము. నేను దానిని పట్టుకొన్నాను. ఆయన అదేయైయున్నాడు.

417 దాని రుజువు నీకు కావాలా? ఆయన అన్నాడు, “నేను ద్రాక్షావల్లిని, మీరు తీగెలు.” పరిశుద్ధ యెహాను దానిని చెపుతున్నాడు: “నేను ద్రాక్షావల్లిని, మీరు తీగెలు, మీరు ఫలమును ఫలిస్తారు.” చూడండి? మగ వృక్షము మరియు ఆడ వృక్షము, ఒక దానికి ఒకటి, పుప్పొడిని ఉత్పత్తి చేస్తాయి. కొమ్మ మరియు ద్రాక్షావల్లి ఒకే పనిని చేస్తాయి. చూడండి? అది అక్షరాల సత్యము.

కాబట్టి, ఇప్పుడు ఆయన చెప్పాడు.

418 ఈ మొదటి చెట్టు, ఒక ప్రవక్త వృక్షము, ఒక పరిపూర్ణమైన వృక్షము, ప్రవక్తల యొక్క దేవుడు. ఆయన పెద్ద వృక్షమైయున్నాడు. ఆయన దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రవక్త వృక్షమైయున్నాడు. ఎందుచేత? ఆయన వాక్యమైయున్నాడు. ఇప్పుడు, ఇతరులు చిన్న ప్రవక్తలు. “వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చింది.” కాని ఆయన వాక్యమైయున్నాడు, ప్రవక్త రూపములో ఆయనే స్వయముగా. ఆమేన్.

419 మనము ఇప్పుడు ఒక చోటికి వెళ్ళుచున్నాము. ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు దీనిని తప్పిపోవద్దు. అది ఎంతో బాగున్నది. నేను ఇక్కడ దానిని వ్రాశాను. ఆమేన్.

420 [ఒక వాహనము యొక్క హారన్ వినబడింది.—ఎడి.] బయట ఎవరో వారి హారన్ ద్వారా శబ్దము చేయుచున్నారు. ఓ, బయట మీరు గొప్ప సమయమును కలిగియున్నారని నేను నమ్ముచున్నాను. మనము లోపల మంచి సమయమును గడుపుచున్నాము. మంచిది.

421 ఇప్పుడు, ఆయన దేవుని యొక్క ప్రవక్త వృక్షమైయున్నాడు. ఎందుచేత? ఆయన పరిపూర్ణ వాక్యమునంతా బోధించియున్నాడు, కారణము ఆయన ప్రత్యక్షపర్చబడిన దేవుని వాక్యమైయున్నాడు. ఆయన పరిపూర్ణమైన వాక్యమును బోధించిన, పరిపూర్ణమైన ప్రవక్త వృక్షమైయున్నాడు, అది పరిపూర్ణమైన దేవుని వాక్యము ద్వారా, పరిపూర్ణమైన ప్రవక్త ఫలమును ముందుకు తెచ్చింది. ఓ, సోదరుడా, వృక్షమును గూర్చి మాట్లాడుము! ఒక వృక్షము, ఆయనే ఆ జీవ వృక్షమైయున్నాడు, ఆదాము హవ్వలను ఆ వృక్షమునుండియే కెరూబులు ఖడ్గజ్వాల కావలి కాచియున్నవి. ఇప్పుడు అవే కెరూబులు దానిలోనికి వారిని తరుముచున్నవి, కారణము, వారి కొరకు అక్కడ ఒక మార్గము ఏర్పాటు చేయబడింది. చూడండి? ఇప్పుడు వారు వెనుకకు జరుగుచున్నారు, ఓ, మనుషులారా!

ఇప్పుడు, ఆయన వాక్యమునంతా బోధించియున్నాడు, ఇక్కడ లేదా అక్కడ ఆయన దానిని కత్తిరించలేదు.

422 ఆ గొప్ప పండితుడు, సాతానుడు ఆయన యొద్దకు వచ్చినపుడు, “అది ఈలాగు వ్రాయబడియున్నది,” అని వాడు అన్నాడు…

యేసు అన్నాడు, “అది ఈలాగు కూడా వ్రాయబడియున్నది…”

“అది ఈలాగు వ్రాయబడియున్నది…”

ఆయన అన్నాడు, “అది ఈలాగు కూడా వ్రాయబడియున్నది…”

423 పరిపూర్ణమైన ప్రవక్త. ఆ వృక్షము, పరిపూర్ణమైన సూచనలతో, పరిపూర్ణమైన ఫలితములతో, పరిపూర్ణమైన ఆత్మ ఫలములతో, పరిపూర్ణమైన వాక్యమును బోధించుచున్నది.

424 కారణము ఆయనను వెక్కిరించుటకు, ఆయనను వ్రేలాడదీశారు…నేను త్వరగా వెళ్ళుచున్నాను, ఆయన వాక్యమై యున్నాడు, నీకు తెలుసా. వాక్యపు వృక్షమును, వారు వ్రేలాడ దీశారు; వాక్య వృక్షము, మానవ కల్పితమైన రోమా చెట్టుపై వ్రేలాడ దీశారు. సోదరుడా, అది ఇంటికి వెళ్లిందని నేను నమ్ముతాను. ఆయన, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన పరిపూర్ణమైన వృక్షము, వారు ఆయనను మానవ కల్పితమైన రోమా చెట్టుపై వ్రేలాడ దీశారు. ఆమేన్.

425 ఇప్పుడు అదే విషయము. వారు దేవుని యొక్క పరిపూర్ణమైన వృక్షమును తీసుకొని, వాక్యమును తీసుకొని, దానిని కలగలుపు చేసి, అదిగో దానిని ఒక రకమైన ఆచారముతో వ్రేలాడదీయుచున్నారు. మరణము మరియు జీవము కలవదు. యేసు ఎన్నడూ సమాధి కార్యక్రమమునకు హాజరు కాలేదు. ఆయన మృతులను లేపాడు. ఎందుచేత? జీవము మరియు మరణము ఏకముగా నిలిచియుండలేవు. అవి ఒక దానికి ఒకటి విరుద్ధమైనవి. ఆయన ఏ సమాధి కార్యములను బోధించలేదు. ఆయన వారిని లేపియున్నాడు. ఆమేన్. అవును. ఎందుచేత? జీవము; మరియు మరణము.

426 ఇప్పుడు చూడండి. వారు ఆయనను ఒక చెట్టుకు వ్రేలాడ దీశారు. అది నిజమేనా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] “మ్రానుమీద వ్రేలాడిన వాడు శాపగ్రస్తుడు,” అది నిజమేనా? [“ఆమేన్.”] బైబిలు చెప్పింది, “ఏ మానవ కల్పితమైన చెట్టు మీద వ్రేలాడదీయబడినవాడైనా శాపగ్రస్తుడు.”

427 కాబట్టి, ఈ రోజున నీవు ఒక రకమైన మానవ కల్పితమైన చెట్లు మీద వ్రేలాడదీయుటకు ప్రయత్నించుచున్నావు, దాని నుండి స్వేచ్ఛగా వదలండి. అది ఏదియు అక్కడ నిన్ను వ్రేలాడ దీయనీయవద్దు, కారణము, అది మృతుల కొరకైన స్థలమైయున్నది, ఎవరో మానవ కల్పితమైన లూథర్, బాప్టిస్టు, ప్రెస్బెటేరియన్, పెంతెకొస్తు సంస్థ, అది నిజము. ఏదో మానవ కల్పితమైన చెట్టు. అక్కడ వ్రేలాడదీయవద్దు. అది అక్కడ నిన్నును వ్రేలాడదీయనీయవద్దు. నీలోనుండి జీవము బయటకు వెళ్ళిపోవు వరకు, నీవు వారి సిద్ధాంతమును గుర్తించు వరకు, వారు కోరినట్లైతే నిన్ను వ్రేలాడదీస్తారు. అది నిజము.

428 అయితే పరిపూర్ణమైన వృక్షమును అక్కడే వాళ్ళు వ్రేలాడ దీశారు. దేవుని పరిపూర్ణమైన ఫల వృక్షమును, మానవ కల్పితమైన రోమా చెట్టుపై వ్రేలాడ దీశారు. ఏ మానవ కల్పితమైన చెట్ట మీదయైనా వ్రేలాడదీయుట, శాపమైయున్నది. అది అంతే. అది ఏమిటి? ఆయన ఆ ఫలములన్నిటిని ఫలించిన తరువాత, వారి దృష్టిలోనుండి ఆయనను వదిలించుకొనుటకు ఆలాగున చేశారు.

429 చరిత్ర ప్రకారము మగ్దలేనే మరియ వారి ముందు పరుగెత్తుకొని వెళ్ళి అన్నది, “ఆయన ఏమి చేశాడు? ఆయన ఏ చెడును చేశాడు?” ఆమె ఆ ఊరేగింపును ఆపి అన్నది, “ఆయన ఏ చెడును చేశాడు? బీదలకు సువార్తను బోధించుట తప్ప ఆయన ఏమీ చెయ్యలేదు? రోగులను స్వస్థపరచి, మృతులను లేపుట తప్ప ఆయన ఏమియు చేయలేదు. సజీవ దేవుని యొక్క సూచనలే ఆయనలోయున్నవి, ఆయనను మీరు ఎలా దోషిగా తీర్పుతీర్చుతారు?”

430 వాళ్ళు ఆమె నోటి మీద చరిచి, ఇలా అన్నారు, “యాజకులకు బదులుగా, ఈ అపకీర్తి గల స్త్రీ మాటలు వింటారా?” అక్కడే నీవున్నావు, “నీ బిషప్పు.” అక్కడే నీవున్నావు. ఈ రోజున అదే సంగతి. అది నిజము. అవును.

431 దీనినంతా ఆయన చేసినపుడు, ఆయన ఎవరైయుండెనో ఆయన రుజువు చేసెను, దానిని వారి ముందు ఉంచి, అన్నాడు, “నేను ఆయనను కాని యెడల, మీరు ఎవరు?” “పాపమును బట్టి దోషిగా మీరు నాకు తీర్పు తీర్చితే, నేను వాక్యములో ఎన్నడైనా తప్పుగా యున్నానా? నాకు చూపించండి. ఇప్పుడు మీరు ఎక్కడ తప్పుయైయున్నారో మీకు నేను చూపిస్తాను.” చూడండి? పాపమనగా “అవిశ్వాసము.” మనకు అది తెలుసు.

432 వారి దృష్టి నుండి ఆయనను వదిలించుకోవటానికి! వారు ఆయనను ఎంతగానో ద్వేషించారు, కారణము ఆయన వారి సంస్థలన్నిటినీ చీల్చివేసెను. వారి దృష్టి నుండి ఆయనను వదిలించుకోవటానికి, ఆయనను సమాధి చేశారు. మరియు పెద్ద సంఘశాఖా రాయిని ద్వారము ముందు దొర్లించిరి. ఆ ప్రకారము ఆయన తిరిగి లేవకుండా నిశ్చయపడ్డారు. చూడండి? ఓ, అయ్యో!

433 ఆ పరిపూర్ణమైన వృక్షమును గూర్చి ఆలోచించండి. దావీదు వెనుకకు తిరిగి దానిని చూశాడు. అతడన్నాడు, “నీటి కాలువల యోరను నిలబడియున్నది. అతని ఋతువులో అతడు ఆకులను తెచ్చును. అతని ఫలము రాలదు. అది ఎండిపోదు. అతడు చేయునదంతయూ సఫలమగును.” ఆయన అభివృద్ధిచెందు కుమారుడు.

434 యోసేపు ఆయనకు ఒక మాదిరిగాయున్నాడు. ఆయన యోసేపుకు ఎదురు మాదిరియైయున్నాడు. యోసేపు వెళ్ళిన ప్రతి చోట, అది వృద్ధి చెందింది.

435 యేసుతో, ఆయన వాక్యముతో అదే విషయము. “నా మాట వృద్ధి చెందును, అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాదు. నేను ఉద్దేశించిన దానిని అది నెరవేర్చును.” చూడండి? ఆయన వాక్యమైయున్నాడు. దేవుని ద్వారా, వాక్యము భూమి మీదకు పంపబడియున్నది మరియు ఖచ్చితముగా దేవుడు దేనికొరకు పంపాడో దానిని నెరవేర్చుతుంది.

436 ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది రుచియైనది, దానిమీద మీగడను కలిగియున్నది. ఇప్పుడు గమనించండి.

437 ఇక్కడ ఆయన వస్తున్నాడు, ఆయన నిలబడి అడిగినప్పుడు, అవి దేవుని క్రియలే. ఆయన అన్నాడు, “నేను తప్పక చేయవలసిన దేవుని యొక్క క్రియలను చేయని యెడల, అప్పుడు నేను ఆయనను కాదు; నన్ను నమ్మవద్దు. కానీ నేను వాటిని చేసిన యెడల, అప్పుడు ఆ క్రియలను నమ్మండి. మీరు నన్ను నమ్మని యెడల, ఒక మనిషై యుండి దానిని చేస్తున్నప్పుడు, అప్పుడు నేను చేసే క్రియలను నమ్మండి. అవి నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. నా స్వరము మాట్లాడిన దానికంటే బిగ్గరగా అవి మాట్లాడుచున్నవి.” అది సత్యము.

ఏ సమయములోనైనా అదే అన్వయించబడుతుంది. అవునండి. నిశ్చయముగా.

438 ఇప్పుడు గమనించండి, “నేను నా తండ్రి యొక్క క్రియలు చేయనియెడల, అప్పుడు నన్ను నమ్మవద్దు, నన్ను నమ్మవద్దు. కానీ నేను ఆ క్రియలు చేసిన యెడల, నన్ను నమ్మండి.”

439 అప్పుడు వారు ఏమి చేశారు? ఆ ప్రశస్తమైన చెట్టును తీసుకొని, దానిని నరికి, మానవ కల్పితమైన చెట్టు మీద దానిని వ్రేలాడదీశారు. అది నిజము. దాని నుండి జీవమును నరికివేసి, ఒక ఎగతాళి కొరకు, ఒక మానవ కల్పితమైన చెట్టుపై వ్రేలాడదీశారు.

440 అప్పుడు, అది వారికి నచ్చలేదు. అనేకమంది అక్కడ నిలబడియున్నారు. దానిని గూర్చి ఏడుస్తున్నారు, కాబట్టి వారు ఆయనను అక్కడ నుండి తీసివేశారు. వారన్నారు, “మా సంఘశాఖను మేము ఎంత బిగుతుగా చేస్తామంటే, ఆ పరిశుద్ధ రోలర్లు అక్కడకు చేరుకొనలేరు.” కాబట్టి వారు అరిమతయియ అను యోసేపు సమాధిలో, ఆ రంధ్రములో కుక్కివేసి గొప్పరాయిని పొర్లించారు. ఆ రాయిని దొర్లించుటకు నూరుమంది మనుషులను తీసుకొన్నారు.

441 మీరు ఎన్నడైనా చూశారా, మొన్నటి రాత్రి, చిత్రములో, పెద్ద దారి గుండా వారు వారు ఆ రాతిని పైకి దొర్లించారు? టన్నుల బరువుంటుంది.

442 వారి యొక్క పెద్ద సంఘశాఖారాయిని ఉంచారు, కాబట్టి ఆయన దానిని లేపలేడని వారనుకొన్నారు, కాని అది ఆయనను ఆపిందా? లేదు.

443 “అయితే నేను పునరుద్ధరిస్తానని ప్రభువు అన్నాడు.” ఆ అంశమును మనము తాకి, దానిని నెడదాము. “నేను పునరుద్ధరిస్తానని ప్రభువు చెప్పాడు. మూడు దినములలో నేను ఆయనను పునరుద్ధరిస్తాను, నేను ఆయనను తిరిగి లేపుతాను.” వారు ఆయనను ఆ బండలో దాచలేకపోయారు. వారి దృష్టి నుండి వారు ఆయనను దాచలేకపోయారు. వారి చేతులలో నుండి ఆయనను వదిలించుకోలేకపోయారు. “నేను తిరిగి పునరుద్ధరిస్తానని ప్రభువు చెప్పాడు.” మరియు మూడు దినములలో తిరిగి లేచాడు, పునరుద్ధరించబడ్డాడు.

444 ఈష్టర్ తరువాత, తిరిగి లేస్తూ ఆయన అన్నాడు, “మీరు సర్వలోకమునకు వెళ్ళండి, నేను మీతో వస్తున్నాను. తండ్రి నన్ను పంపిన ప్రకారము, ఆయన నాతోయున్నాడు, నేనును మిమ్మును పంపుచున్నాను మరియు మీలో ఉంటాను. యుగసమాప్తి పర్యంతము నేను మీతో కూడా యున్నాను. నేను చేసిన అవే క్రియలు, నేను మీతో యున్నానని రుజువు చేయుటకు మీరును అవే క్రియలు చేస్తారు.” నాకు అది ఇష్టము.

445 “విశ్వాసులైన వారిని ఈ సూచనలు వెంబడించును,” నటించే విశ్వాసులు కాదు, కానీ విశ్వాసులు. చూడండి? “నేను చేయు క్రియలు, మీరును చేస్తారు మరియు నీవు ఒక విశ్వాసి పని రుజువు చేయబడుతుంది. సరిగ్గా నేను క్రియలు చేస్తున్నట్లుగా, కారణము జీవించుచున్న తండ్రి నాలో జీవిస్తున్నాడు. ఆ కార్యములు చేసేది నేను కాదు, అది నా తండ్రి. అది కార్యములు చేయుచున్నది నీవు కాదు, అది నీలో యున్న నేను, కార్యములను చేయుచున్నాను.” చూడండి? “ఇప్పుడు, మీరు ప్రపంచమంతటిలోనికి వెళతారు.”

446 మరొక విధముగా, “నేను ఎరిగియున్నట్లుగా, ఒక వధువుగా మీరు రూపుదిద్దబడతారు.” చూడండి? మంచిది. “నేను మీతో వస్తాను. మీరు నాలో భాగముగా యుంటారు, మీరు నా వధువుగా యుంటారు. మీ శరీరములో నా జీవము యుంటుంది. సరిగ్గా భార్యాభర్తలు ఒకే వ్యక్తిగాయున్నట్లు, మీరు నేను ఒక్కటిగా ఉండబోవుచున్నాము. ఆ దినమున నేను తండ్రియందును, తండ్రి నాయందును, మీరు నాయందును యున్నామని తెలుసుకొందురు.” నేను దానిని ఎంతో ప్రేమిస్తాను. దానిని చూసి సాతానుకు ఎంతో కోపము. చూడండి, దేవుని యొక్క ఏకత్వము? దేవునిలో యున్నదంతయూ క్రీస్తులో క్రుమ్మరించబడియున్నది; క్రీస్తులో యున్నదంతయూ, ఆయన సంఘములో క్రుమ్మరించబడియున్నది; క్రీస్తులో యున్నదంతయూ, ఆయన సంఘములో క్రుమ్మరించియున్నాడు, అక్కడే నీవున్నావు. అందరిని ఒక్కటిగా చేస్తున్నాడు.

447 ఇప్పుడు చూడండి, వధువు ఒకే జీవ వృక్షమైయున్నది. మరొక మాటలో, భార్య మరియు భర్త ఒక్కటిగా యున్నట్లు, క్రీస్తు మరియు ఆయన వధువు ఒక్కటే; ఒక్కటే, ఒకే ఆత్మ. అవే కార్యములు, అవే సూచనలు, సమస్తమూ ఒక్కటే. “ఏలయనగా నేను చేయు క్రియలు మీరును చేస్తారు.” ఎంతకాలము? “ప్రపంచమంతటా.” ఎంతవరకు? “ప్రతీ వ్యక్తికి.” అది నిజమేనా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.]

ఓ, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు మర తుపాకిలో నుండి ఎక్కువ తూటాలు పేల్చబోవుచున్నాము.

448 ఈ రోమా చీడ పురుగు, వధువు వృక్షమును తినివేస్తూ, చివరకు అది వేరులలోనికి వెళ్ళియున్నది. అదే రోమా చెట్టు…క్రీస్తును క్రిందికి నరికినది ఏ రకమైన చెట్టు? [సమాజము “రోము,” అని చెప్పుచున్నది.—ఎడి.] క్రీస్తు యొక్క వధువును క్రిందికి నరికివేసినది ఏ రకమైన చెట్టు? [“రోము.”] వాక్యమునకు కాక దేనినో ప్రత్యామ్నాయముగా చేయుట. కాబట్టి, మీరు చూడండి, దేవుని యొక్క వాక్యమును తీసుకొనని ప్రొటస్టెంటు సంఘము, రోమా సంఘము యొక్క కుమార్తెయైయున్నది. దేవుడు, ఎన్నడూ, ఏ సమయములోనూ సంఘమును సంస్థగా చేయలేదు. రోమన్ కాథలిక్ సంఘమే మొదటి సంస్థ. సంస్థగా మారు ప్రతీవారు, ఆమెకు, కుమార్తెలైయున్నారు.

449 వారు ఆమెతో చనిపోతారు. బైబిలు దానిని చెప్పియున్నది, “ఆమె పిల్లలను ఆయన అగ్నిలో కాల్చివేయును.” మీలో ఎంతమందికి అది తెలుసు? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] బైబిలు ఆ రీతిగా చెప్పింది. మంచిది, చివరి దినము వరకు గోధుమలు మరియు గురుగులు కలిసి పెరుగుతాయి, తరువాత ఆయన గురుగులను కట్టలుగా కట్టి (అది నిజమేనా?) మొదట వాటిని కాల్చివేస్తాడు. [“ఆమేన్.”] మరియు గోధుమలు కొట్టులోనికి వెళతాయి. అది నిజమేనా? [“ఆమేన్.”] గురుగులు తమ్మునుతాము ఏకముగా సంస్థలోనికి, ఐక్య సంఘముల సమాఖ్యలోనికి, అణుశక్తి ద్వారా కాల్చివేయబడటానికి, కట్టలుగా కట్టుకొనుచున్నవి. ఖచ్చితముగా సత్యము. కానీ సంఘము కొట్టులోనికి వెళ్ళుటకు సిద్ధపడుచున్నది. ప్రపంచమున్నంత నిశ్చయముగా, ఆమె ఎత్తబడుటలోనికి వెళ్ళుటకు సిద్ధపడుచున్నది, ప్రపంచమున్నంత నిశ్చయముగా, ఆమె ఎత్తబడుటలోనికి వెళ్ళును, ఏలయనగా స్వతంత్రురాలు దాసితో వారసత్వము పొందదు. ఓ…ఏంటోనీ సోదరుడా!

ఓ, వెయ్యేండ్ల పాలన దినము వచ్చుట కొరకు మనము సంతోషముగా ఎదురుచూస్తున్నాము,

అప్పుడు మన ధన్యుడైన ప్రభువు వచ్చి ఎదురుచూస్తున్న ఆయన వధువును ఎత్తుకొని పోవును;

ఓ, నా ఆత్మ నేను శ్రమించుచుండగా, కనిపెట్టి ప్రార్థించుచుండగా ఎత్తబడుటతో నింపబడుతుంది,

ఏలయనగా ప్రభువు తిరిగి భూమి మీదకు వచ్చుచున్నాడు.

450 హల్లేలూయ! అవునండి. ఓ, ఆయన గురుగులను కాల్చివేయును మరియు గోధుమలను కొట్టులోనికి తీసుకొని వెళ్ళును.

451 రోమా చీడపురుగు. పౌలు కాలములో ఆ చెట్టును తినివేయుట ప్రారంభించింది. అతడన్నాడు, “నేను ఒప్పించబడ్డాను,” లేఖనము ఇక్కడ చెప్పింది, “అదేమనగా, నేను వెళ్ళిపోయిన తరువాత, మీ మధ్య మనుషులు లేస్తారు, పైన వారు గొర్రె చర్మములు వేసుకొంటారు, కాని లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు మరియు వాళ్ళు మనుషులను తమ వెంట ఈడ్చుకు పోతారు. ఏలయనగా ఈ లోకములోనికి రావలసిన క్రీస్తు విరోధి ఆత్మ, ఇదివరకే లోకములో యుండి, ‘అవిధేయులైన’ (ఏమిటి?) పిల్లలలో పనిచేయుచున్నది.” అవిధేయత (దేనికి?) వాక్యమునకు. అక్కడే నీవున్నావు. సంస్థ ఆరంభమగుట ప్రారంభమైనది.

452 స్నేహితులారా, నా భావమును చూశారా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] దానిని చేసే వారందరు “ఆమేన్,” చెప్పండి [“ఆమేన్.”]

453 తినివేయుట ప్రారంభించింది! అది ఏమి చేసింది? ఆ పాత చీడపురుగు, ఆ పాత పసరుపురుగు, యోవేలు దానిని చూశాడు.

ఇప్పుడు వినండి, మనము అంతమునకు సమీపముగా వస్తున్నాము.

454 యోవేలు దానిని చూశాడు. అతడన్నాడు, “గొంగళిపురుగులు విడిచిన దానిని మిడుత తినివేసినది; మిడుత తినివేసిన దానిని పసరుపురుగు తినివేసినది, పసరుపురుగు తినివేసిన దానిని చీడపురుగు తినివేసినది.” అదే అతడు చెప్పింది. అది ఖచ్చితముగా. అది దేవుని యొక్క వృక్షము. ఆ చెట్టు పసరుపురుగు ద్వారా నరికివేయబడింది. మంచిది.

455 రోమా చీడపురుగు ఆ చెట్టును తినివేస్తూ, మార్గమంతటి గుండా వేర్ల వరకు వచ్చింది. వెనుక వరకు సమస్తమును నరికివేసియున్నది! చెట్టును నరికివేసింది, పెండ్లి కుమారుడైన క్రీస్తును నరికివేసియున్నట్లుగా, తిన్నగా పెండ్లికుమార్తెను క్రిందకు నరికివేసి, ఆచారములను సంస్థలను ప్రారంభించింది. అదే పాతపురుగు! కానీ ఏమిటి? ఓ, మహిమ! కానీ దాని యొక్క వేరులలో, ముందుగా నిర్ణయించబడిన విత్తనము, అబ్రహాము యొక్క రాజ సంతానమున్నది. అది చనిపోలేదు. వాక్యము వాగ్దానముతో వేరులలోయున్నది, “నేను పునరుద్ధరిస్తాను అని ప్రభువు అన్నాడు.” ఏమిటి? “చీడపురుగు, మిడుత, మిగిలిన పురుగులు తినివేసిన సంవత్సరములన్నిటినీ, నేను తిరిగి పునరుద్ధరిస్తాను, అని ప్రభువు చెప్పుచున్నాడు.”

456 గత ఆదివారముతో, ఆదివారమునకు ముందు వర్తమానముతో ఈ వర్తమానములను ఇప్పుడు పోల్చండి. మనము ముగింపునకు వస్తుండగా జాగ్రత్తగా వినండి. గమనించండి.

457 “పురుగులు తిన్నదానినంతటినీ నేను పునరుద్ధరిస్తాను. అని ప్రభువు చెప్పుచున్నాడు. నేను తిరిగి ప్రతీ చిన్న దానిని వెనుకకు తెస్తాను.”

458 ఇప్పుడు కొన్ని నిమిషములు, నెమ్మదిగా కూర్చొని, జాగ్రత్తగా వినండి. సిద్ధపడండి మరియు దేవుడు దానిని నీకు బయలుపర్చాలని, నీ హృదయమంతటితో ప్రార్థించుము.

459 కాబట్టి, దేవుని యొక్క వాగ్దానము, పునరుద్ధరించుటను ప్రారంభించుట, ఏలయనగా దానిని పునరుద్ధరిస్తానని దేవుడు చెప్పాడు. సరిగ్గా ఆయన వధువు వృక్షమును లేపియున్నట్లుగానే…పెండ్లి కుమారుని వృక్షము. పెండ్లి కుమార్తె వృక్షమును ఆయన లేపుతానన్నాడు, ఏలయనగా ప్రపంచము యున్నంత నిశ్చయముగా, తిన్నగా అక్కడ మరొకటి యుండబోవుచున్నది. ఇప్పుడు ఏమిటి? మంచిది. కాబట్టి దేవుని యొక్క వాగ్దానము ప్రారంభమైనది. “పసరుపురుగు, మిడుత తినివేసిన దానినంతా, పునరుద్ధరిస్తానని, ప్రభువు సెలవిచ్చాడు.”

మొదటి కాలములో, వారు మొదటి సంఘమును నిర్మించినప్పటి వలే.

460 ఇప్పుడు నేను కొన్ని సిద్ధాంతములను తీసుకొనబోవుచున్నాను. నీవు దానిని నమ్ముట ఇష్టము లేనట్లైతే, మంచిది. కానీ మొదటగా దానిని వెతకండి. చూడండి? గమనించండి.

మొదటి స్థానములో, ఆ చెట్టును ఆయన పెంచాడు? ఓ, అయ్యో!

461 ఇది నాకు మేలు చేస్తుంది. నాకు తెలుసు, అది నాకు ఒక సేవకుడిగా ధ్యానించుట లేదు, ఈ రీతిగా ఇక్కడ నిలబడటం, కానీ నేను ఏమి మాట్లాడుచున్నానో దానిని ప్రేమిస్తాను. చూడండి, నా భావము?

462 ఇప్పుడు గమనించండి, మొదటి కాలములో వలే, ఆయన మొదటి సంఘమును ప్రారంభించినపుడు, రోమా పసరుపురుగు, చీడపురుగు తినివేసియున్నది. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుటను ఆయన ప్రారంభించాడు, బాప్తిస్మమిచ్చు యోహాను.

463 యోహాను 13 లో లేక 17వ అధ్యాయములో, యేసు అన్నాడు, “తండ్రీ, సత్యము ద్వారా వారిని ప్రతిష్ఠించుము; నీ వాక్యమే సత్యము.” సంఘమునకు రెండవ కార్యము శుద్ధీకరణము. నీతీకరణము తరువాత, శుద్ధీకరణము.

464 వారు శుద్ధీకరించబడిన తరువాత, వారు పై నుండి శక్తిని పొందువరకు, యెరూషలేములో వారిని కనిపెట్టమని ఆయన చెప్పాడు, లూకా 24:29, అక్కడ ఆయన ఆ వృక్షమునకు జన్మనిచ్చాడు, పరిశుద్ధాత్మ. పెంతెకొస్తు: నీతీకరణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము.

465 తరువాత ఫలములను తెచ్చుటకు, దానిలో జీవించుటకు క్రీస్తు లోనికి వచ్చాడు. ఆమేన్. అది నిజమేనా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.]

యోహాను నీతీకరణమును బోధించాడు.

466 ఇప్పుడు చూడండి. అది సహజమైన జన్మను కలుగజేస్తుంది. ఒక స్త్రీ బిడ్డకు జన్మను ఇస్తున్నప్పుడు (దీనిని వినండి.), మొదటగా స్త్రీకి సంభవించేది ఏమిటి, ఏది బ్రద్దలవుతుంది? మొదటగా నీరు. “మారుమనస్సు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి,” నీతీకరణము. స్త్రీకి సంభవించే రెండవ కార్యము? రక్తము. అది నిజము? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] రక్తము, శుద్ధీకరణము. అప్పుడు తరువాతది ఏమిటి? జీవము. నీరు, రక్తము, జీవము.

467 పరిశుద్ధ యోహాను లేక మొదటి యోహాను 5:7 లేక 7:5, అని నేను నమ్ముతాను, ఈ రీతిగా చెప్పింది:

…పరలోకములో సాక్ష్యమిచ్చునవి మూడు, తండ్రి, వాక్యము (అదే కుమారుడు) మరియు పరిశుద్ధాత్మ…మరియు భూమి మీద సాక్ష్యమిచ్చునవి మూడు, నీరు, రక్తము, మరియు ఆత్మ, అవి ఒక్కటి కాదు కానీ ఒక్కటిగా సమ్మతిస్తాయి.

సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించియున్నారు.

468 నీవు కుమారుని కలిగియుండకుండా తండ్రిని కలిగియుండలేవు. పరిశుద్ధాత్మను కలిగియుండకుండా నీవు కుమారుని కలిగియుండలేవు. శుద్ధిచేయబడకుండా నీవు నీతిమంతుడిగా తీర్చబడలేదు; పరిశుద్ధాత్మ లేకుండా నీవు శుద్ధిచేయబడలేవు.

469 నజరేను సోదరుని గురించి ఏమిటి? ఒకటిన్నర సంవత్సరముల క్రితమే, పరిశుద్ధాత్మ రాక ముందే, వారు శుద్ధి చేయబడియున్నారు. అది నిజమేనా? యేసుక్రీస్తు ద్వారా వారు శుద్ధిచేయబడ్డారు.

470 ఇప్పుడు, ఆయన వధువు వృక్షమును ముందుకు తెచ్చినపుడు, గొంగళి పురుగు, మిడుత దానిని తినివేసియున్నవి మరియు ఆ ముందుగా నిర్ణయించబడిన వేరుల నుండి, రెండవ వృక్షమును పునరుద్ధరించుచున్నాడు, అది చనిపోలేదు. అవి నదుల యొద్ద నిలబడియున్నవి. అది ఈ నీళ్ళలో జీవించుచున్నది. అది తన్ను తాను చూపుకొనలేదు, కాని ఎలాగైనా అది అక్కడయున్నది.

471 ఇప్పుడు అది ప్రారంభించియున్నది, గమనించండి, అదే పురుగు; ఆయన అదే మార్గములో అదే రీతిగా దానిని పునరుద్ధరించును.

472 మొదటగా, కాథలిజం నుండి ఆ చెట్టు ముందుకు వచ్చుట ప్రారంభమైనపుడు, అది మార్టిన్ లూథర్, అతడు నీతీకరణమును బోధించాడు. రెండవ దూత జాన్ వెస్లీ, అతడు శుద్ధీకరణమును బోధించాడు. లూథర్ నీతీకరణమును బోధించాడు, “నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును.” వెస్టీ శుద్ధీకరణమును బోధించాడు, కృప యొక్క ఖచ్చితమైన రెండవ కార్యము. అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చియున్నాడు. మొదటిసారి, ఆయన వృక్షమును నిర్మించినట్లుగానే, ఇక్కడ ఆయన మరలా పునరుద్ధరించుచున్నాడు, అదే విధానములో, రెండవసారి. [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] దానిని చూడండి?

473 గమనించండి, అదే పురుగు, ఆ చిన్న దుర్మార్గుడు, ఆదిలో ఆ చెట్టును చంపుట ప్రారంభించిన అదే పురుగు, లూథరన్ కొమ్మల వైపు ప్రారంభించింది, కానీ (ఏమిటి?) అది దానిని చంపలేకపోయింది. అది దానిని చంపలేదు, కారణమేమనగా, “నేను పునరుద్ధరిస్తానని,” దేవుడు చెప్పాడు. లూథర్ కొమ్మలన్నింటిని చంపుటకు, ఆ పురుగు లూథర్ మీద ప్రారంభించింది. అది తిన్నగా వెస్టీ మీదికి వచ్చింది. వెస్టీ కొమ్మలన్నింటిని చంపివేసింది. కానీ చెట్టు యొక్క ముఖ్య భాగము పైకి వస్తూనేయున్నది.

474 ఇప్పుడు గమనించండి, పాతకాలములో చెట్టు చనిపోయినపుడు, అది చనిపోయినది. అది వెనుక దానిని చంపినపుడు అది వేర్లు వరకు వెళ్ళినది. కానీ ఈసారి, వాక్యము ముందుగా నిర్ణయించబడియున్నందున, అక్కడ ఏదియు దానిని ఆపబోవుటలేదు. దేవుడు అన్నాడు, “నేను పునరుద్ధరిస్తాను. వారు ఎంతగా దానిని సంస్థగా చేసినప్పటికీ, ఇది, అది, మరొకటి ఎంతగా చేసినప్పటికి లెక్క కాదు, నేను దానిని పునరుద్ధరిస్తాను.” అది దానిని పరిష్కరిస్తుంది. ఎంత నవ్వినప్పటికీ, ఎంత ఎగతాళి చేసినప్పటికి, ఎంత వెక్కిరించినప్పటికీ, “పరిశుద్ధ-రోలర్లు, బుద్ధిహీనత” అని పిలిచినప్పటికి, నీవు కోరినది ఏది చేసినప్పటికీ లెక్క కాదు. దేవుడు ఇంకనూ అన్నాడు, “నేను పునరుద్ధరిస్తానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.” ఆయన యేసును సమాధిలో నుండి లేపినంత నిశ్చయముగా, మూడు దినములలో, మూడు యుగములలో, మూడు భాగములుగా, సంఘమును దాని సంపూర్ణమైన శక్తికి తిరిగి ఆయన లేపబోవుచున్నాడు. “నేను పునరుద్ధరిస్తాను,” అని ప్రభువు చెప్పాడు.

475 ఏమి సంభవించింది? ఆ పాత చీడపురుగు. తినివేయటం ప్రారంభించింది, ఆ రకమైన ప్రభావములనే కలిగియున్నాడు (వాడు ఏమి చేశాడు?) వాడు కేవలము లూథరన్ కొమ్మలనే కలిగియున్నాడు. దానివెనుకయున్న ఆత్మలోనికి, లూథర్ కలిగియున్న ఆత్మలోనికి వాడు ఎన్నడూ వెళ్ళలేకపోయాడు, ఏలయనగా తిన్నగా అది ముందుకు జీవించింది. తరువాత, దాని వెంబడి వెస్లీ వచ్చాడు, వెస్లీ చనిపోయిన తరువాత, ఆ గొప్ప ప్రవక్త, (వాళ్ళు ఏమి చేశారు?) వాళ్ళు సంస్థగా మారారు మరియు కొమ్మలన్నియు చనిపోయినవి. కాని (అతను ఏమి చేశాడు?) సంఘము తిన్నగా ముందుకు జీవించింది. తిన్నగా పెంతెకొస్తులోనికి వచ్చింది. వారునూ సంస్థగా మారినపుడు (ఏమి సంభవించింది?) కొమ్మలు చనిపోయినవి, కాని (ఏమిటి?) సంఘము తిన్నగా ముందుకు కొనసాగింది.

476 ఏమిటి? దానినే పెంతెకొస్తు చేసింది, ఆ పాత ఎత్తుగడ, మొదటి స్థానములో, వధువును వృక్షమును నాశనము చేయుటకు, శాఖా సంబంధమైన ఆచారమును తీసుకొన్నది, మరలా అవే పాత ఎత్తుగడలను, రెండవ చెట్టు మీద దయ్యము చేసినది. అయితే, (ఏమిటి?) దేవుడు దానిని ముందుగా నిర్ణయించాడు. ఏ ప్రమేయము లేకుండా తప్పక ఆమె ముందుకు వెళ్ళవలసియున్నది, ఆలాగు కాకపోతే, లూథర్ సంస్థగా మారినపుడు, అది అక్కడే తిన్నగా విశ్రమించియుండేది; అదంతయూ మరొకటిగా వెనుకకు వెళ్ళింది; అది రెండవ కాథలిక్ సంఘమై యున్నది, రోమన్ కాథలిక్ సంఘము. చూడండి?

477 కానీ, దేవుడు తీర్మానించియున్నాడు. ఆయన తన మాటను పలికియున్నాడు. అది నెరవేరునట్లు ఆయన నియమము దానిని చూస్తుంది, ఎన్ని ఆలస్యపు పొగ మంచులను అది కలిగియున్నప్పటికీ లెక్క కాదు, ఎలాగైనా అది జీవించబోవుచున్నది. మనము చల్లటి తిప్పులను శాఖాసంబంధమైన భేదమును, సమస్తమును కలిగియుండవచ్చు, కాని ఆ చెట్టు సజీవ దేవుడున్నంత నిశ్చయముగా జీవించబోవుచున్నది, దానిని జీవింపచేస్తాడు. అవునండి. “నేను పునరుద్ధరిస్తాను,” అని ఆయన అన్నాడు.

478 ఈష్టర్ యొక్క ఆలస్యపు ఋతువును, ఆలస్యపు వసంత కాలమును మనము కలిగియున్నామని నాకు తెలుసు, “ప్రభువు తన రాకడను ఆలస్యము చేయుచున్నాడని,” వారు సమస్తమును ఆ రీతిగా చెపుతున్నారు. చలిగాలులు ఎన్నో సంఘశాఖా కొమ్మలను చంపివేసియున్నవి, కానీ ముందుగా నిర్ణయించబడిన ఆ జీవమును అది చంపలేదు.

479 “భూమ్యాకాశములు గతించును గానీ, నా మాటలెన్నడును గతించవు.” “ఆయన ముందుగా ఎరిగియున్నవారినందరినీ, ఆయన పిలిచియున్నాడు; ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చియున్నాడు; ఎవరిని నీతిమంతులుగా తీర్చియున్నాడో వారిని మహిమపర్చాడు.” హల్లేలూయ! అది గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో వ్రాయబడియున్నది, అది చనిపోదు.

480 పాతాళము పురుగులన్నిటిని ఆమె మీదకు వదిలినప్పటికి, అది ఎన్నడూ ఆమెను ఆపలేదు. కమ్యూనిజం కాదు, కాథలిజం కాదు, ఏదీ దానిని ఆపలేదు. “నేను పునరుద్ధరిస్తాను,” అని ప్రభువు సెలవిచ్చాడు. మానవ కల్పితమైన రోమను చెట్లు ఎన్నడూ దానిని అక్కడ వ్రేలాడదీయలేవు. సమాధులన్నీ ఎన్నడూ దానిని అక్కడ యుంచలేదు. ద్వారమునొద్ద యుంచబడిన పెద్ద శాఖా సంబంధమైన రాళ్ళు దానిని ఎన్నడూ అక్కడ యుంచలేవు. “నేను పునరుద్ధరిస్తానని ప్రభువు చెప్పాడు. అక్కడ ఒక ఈష్టర్ ఉండబోవుచున్నది. అదే సంఘమును అదే వ్యక్తితో నేను ముందుకు తెస్తాను ఆ వెనుక ఆమె యున్నట్లుగా, అదే సూచనలతో, అదే ఫలములతో, వారు చేసిన అవే కార్యములతో, ఆ వధువును తిరిగి సరిగ్గా ఆ రీతిగానే నేను తేబోవుచున్నాను. నేను పునరుద్ధరిస్తాను అని ప్రభువు చెప్పుచున్నాడు.” (ఏమిటి?) “సంఘశాఖలు తినివేసినదంతా, సంస్థలు తినివేసినదంతా, అదంతా, నేను పునరుద్ధరిస్తానని ప్రభువు చెప్పాడు.”

481 ఇప్పుడు, నీవంటావు, “సంఘ శాఖలోనికి వెళ్ళిపోయిన విషయములు సంగతి ఏమిటి?”

482 దేవుడు మంచి వ్యవసాయదారుడై యున్నాడు, చచ్చిన కొమ్మలన్నిటిని ఆయన చెట్టు మీద నుండి నరికివేశాడు. ఆయన ఏమి చేయబోవుచున్నాడు? అక్కడ కాల్చివేయబోవుచున్నాడు. ఖచ్చితముగా. ఈ చెట్టు యొక్క వ్యవసాయదారుడు దేవుడైయున్నాడు. ఆయన దాని పట్ల శ్రద్ధ వహిస్తాడు. ఆయన తన స్వాస్థ్యమును కాపాడును. ఆయన స్వాస్థ్యము ఏమిటి? ఆయన సొంత మాట. ఆయన తన మాటను నిర్ధారించుటకు కాయును; దానిని కావలికాయును; ఎక్కడ ఆయన పొందునో చూడండి. ఆయన పునరుద్ధరించబోవుచున్నాడు. కాబట్టి ఈ సంఘములు, ఆ రీతిగా సంస్థగా మారుట ఆరంభమైనపుడు, ఆయన ఆ కొమ్మలను నరికివేస్తాడు మరియు సంఘము ముందుకు వెళుతుంది.

483 “మేము ఒక పెద్ద సంస్థగా మారతాయి, అని లూథర్ చెప్పినపుడు, మేము కాథలిక్ అంత పెద్ద సంఘముగా యుంటాయి.” మంచిది. ఆయన ఆ కొమ్మను నరికివేశాడు. వెస్లీ తిన్నగా దానిని ముందుకు తీసుకొన్నాడు, మరొక ప్రవక్త పైకి లేపబడ్డాడు. తరువాత, వెస్లీ ఆ గొప్ప ప్రవక్త, వెస్లీ చనిపోయిన వెంటనే, వాళ్ళు ఏమి చేశారు? దానిని సంస్థగా మార్చారు. పెంతెకొస్తు పైకి వచ్చింది. ఆమె చనిపోయిన వెంటనే, ఆయన దాని కొమ్మలను నరికివేశాడు. అది తిన్నగా పైకి లేచుచున్నది. చూడండి? ఆయన పునరుద్ధరించబోవుచున్నాడు.

484 ఫలము ఎక్కడ పెరుగుతుంది? అది అడుగున ప్రారంభించదు. అది పైన ప్రారంభిస్తుంది. మొదటగా సూర్యుడు చెట్టును ఎక్కడ తాకుతుంది? మహిమ! సాయంకాలపు వెలుగులో, చెట్టుపైన. ఆమేన్. క్రింద కొమ్మల మీద కాదు, కాని చెట్టు పైన, అక్కడే ఫలము పండుతుంది.

ఆమేన్.

నీవు ఆయనను ప్రేమిస్తావా? ఆమేన్!

నీవు ఆయనను సేవిస్తావా? ఆమేన్!

నీవు ఆయనను నమ్ముతావా? ఆమేన్!

నా హృదయమంతటితో నిశ్చయముగా నేను నమ్ముతాను.

485 ఇప్పుడు, అది ఏమిటి? ఆమె పైకి వచ్చుచుండగా, ఆ పాత ద్రాక్షావల్లిలను, ఆ సంస్థల ద్రాక్షావల్లిలను, ఆమె తిన్నగా పైకి శిఖరమునకు వచ్చు వరకు, ఆ పాత చచ్చిన ద్రాక్షావల్లులను ఆయన నరికివేయును. అక్కడే ఆయన తన ఫలమును పొందబోవుచున్నాడు. ఇప్పుడు గమనించండి. దేవుడు ఆమె కొమ్మలను నరికివేయును. మంచిది. అవి మృతమైనవి, దేవుడు సముఖములోనికి రాలేవు, మొదటి పునరుత్థానములోనికి రాలేవు. అసలైన దేవుని ద్రాక్షావల్లి ఫలము, అవి సంస్థాగతమైన గుంపులోనికి వెళ్ళిపోయినవి, అందుచేత అవి ద్రాక్షావల్లి ఫలముతో రావు.

486 ఇప్పుడు చూడండి. దేవుడు ఎన్నడూ ఒక సంస్థను యుంచలేదు. సంఘము, ఒక సంస్థను దానిలోనికి అంటుకట్టినపుడు, దేవుడు దానిని నరికి వేస్తున్నాడు, దాని జీవనాడిని నరికివేస్తున్నాడు. అది సంస్థాగతమైన స్థలమును ఫలిస్తుంది.

487 కానీ ఆ ద్రాక్షావల్లి దాని నుండి వచ్చే ఒక కొమ్మను వేసినట్లైతే, అది ఫలించిన దానినే అది ఫలిస్తుంది. కాబట్టి మొదటిది ఏమైయున్నదో మీరు చూడండి. రోము వారి యొక్క పేడ పురుగులను పంపగా, వాటిని అవి తినివేసినవి, కానీ దేవుడు ఎంతో ఎత్తుగా ఒక దానిని పెంచబోవుచున్నాడు, అది దానిని తాకలేదు. అది పైకి రాబోవుచున్నది. ఆమేన్. మనము వెళదాము. ఈ చెట్టు ఒక స్థలము నుండి మరొక స్థలమునకు వెళ్ళుచున్నది, ఒక యుగములో నుండి మరొక యుగములోనికి వెళుతుంది. అది లూథర్ నుండి వెస్లీలోనికి వెళ్ళింది, వెస్లీ నుండి పెంతెకొస్తుకు వెళ్ళింది; పెంతెకొస్తు నుండి, అది వాక్యములోనికి వెళుతుంది.

488 ఎన్నడూ తప్పిపోని ఆయన వాక్యము యొక్క నిజ విశ్వాసులకు అది మరలా నిజమైన ఈష్టరుయై యున్నది. అది ఒక పునరుత్థానమై యున్నది. దేవుడు ప్రతిచోట ప్రజలను కలిగియున్నాడు. అది వారికి ఈష్టర్ యైయున్నది. ఎందుచేత? వారు తిరిగి లేచియున్నారు, ఆ ఆచారముల నుండి సంఘశాఖల నుండి రాజ సంతానము, వాక్యము, ఎన్నో, ఎన్నో, ఎన్నో సంవత్సరములుగా, వేరులలో దాచబడియున్నది మరియు సరిగ్గా ఇప్పుడు బయలుపర్చబడుట ఆరంభమైనది. ఇది ఈష్టర్ సమయమైయున్నది. జగత్తు పునాది నుండే, నిర్ణయించబడిన, ఈ సంఘము నిలబడుట ఆరంభమైనది. గమనించండి, దేవుడు ఎలా ఆదిలో ఎలా ముందుగా నిర్ణయించియున్నాడో.

బాగుంది, ఎలాగైనా నేను దానిని చెప్పబోవుచున్నాను. మంచిది.

489 ఇప్పుడు, గమనించండి, అదేమనగా, దాని మరణము తరువాత ఈ మొదటి పరిపూర్ణమైన వృక్షము, మూడు దినములలో పునరుద్ధరించబడింది. మొదటి వృక్షము యొక్క మరణము తరువాత, ఆయన దానిని మూడు దినములలో పునరుద్ధరించాడు. అది సత్యమేనా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] దానిని తిరిగి పునరుద్ధరించాడు! ఇప్పుడు వధువు వృక్షము కూడా, మూడు దినములలో పునరుద్ధరించబడబోవుచున్నది లేక మూడు దశలు, మూడు దశలలో అది పునరుద్ధరించబడుతుంది. ఇప్పుడు చూడండి. ఏమిటి? నీతీకరణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము; ఒకటి, రెండు, మూడు.

490 ఇప్పుడు గమనించండి. మూడు దినముల తరువాత, ఆదిలో మొదటి వృక్షము పునరుద్ధరించబడినది, అవే సూచనలు, అవే అద్భుతములను కలిగియున్నది. యేసు తిరిగి వచ్చి, అదే కార్యమును చేయుచున్నాడు. మూడవ దినము యొక్క అంతములో, సూచనలు ప్రత్యక్షమైనవి, మొదటి దినము అంతములో కాదు. ఓ, సోదరుడా! నీవు దానిని పొందుచున్నావని నేను ఆశిస్తాను. మూడవ దినమున, మూడవ దినము యొక్క అంతములో, క్రీస్తు యొక్క నిజమైన ప్రత్యక్షత తెలియపర్చబడింది. చూడండి? గమనించండి. నీవు దానిని పొందుచున్నావా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.]

491 మొదటి దినమున కాదు, మృతమైన రూపము; రెండవ రోజు, అక్కడ ఒక లోకవార్త యున్నవి, చూడండి, లేక రెండవ రోజు, అది ఇంకనూ మృతమైయున్నవి; లూథర్, వెస్లీ, మూడవ దినము యొక్క ప్రారంభములో, అక్కడ చుట్టూ ఒక లోక వార్త యున్నది. మొదటి దినమున ఏమీ లేదు. లూథర్, రెండవ దినమున ఏమీ లేదు. మూడవ దినమున, పరిశుద్ధాత్మ యొక్క యుగములో అక్కడ చుట్టూ ఒక లోక వార్తయున్నది, అదేమనగా, “ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.”

492 మూడవ దినము యొక్క అంతములో, అక్కడే ఆయన తన్నుతాను తెలియపర్చుకొన్నాడు, తిన్నగా వారి మధ్యకు వచ్చి, ఆయన ప్రజల మధ్యకు వచ్చి, “నా వైపు చూడండి, నేను అదే వ్యక్తినై యున్నాను.”

493 మృతమైన రూపములు, వారు పెంతెకొస్తుకు వెళ్ళు వరకు, ముందుకు కొనసాగినవి, తరువాత చుట్టూ లోక వార్త వినపడింది, అదే, “ఆయన ఇక్కడ యున్నాడు.”

494 ఇప్పుడు, ఇక్కడ చివరి దినమున ఆయన తిన్నగా మన మధ్యయున్నాడు, తిన్నగా మన మధ్య కదులుచున్నాడు. మూడవ దినము యొక్క అంతములో, ఆయన ప్రత్యక్షమై, ఆయన జీవించుచున్నాడని, నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని, వారందరికి ఆయన పునరుత్థానము యొక్క సూచనను చూపించెను, ఆయన సన్నిధి యొక్క సజీవ ఫలములు. ఆయన సన్నిధి యొక్క సజీవ ఫలములు! మీరు దానిని పొందుచున్నారా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] ఆయన వారందరికి ప్రత్యక్షమైనప్పుడు, ఆ దినము యొక్క అంతములో, ఆయన సంఘమునకు ప్రత్యక్షపర్చబడ్డాడు. ఆమేన్. ఎందుచేత? మూడవ దినము యొక్క అంతములో, వారందరూ ఏకముగా కూడుకొనియున్నారు, ఓ, ఆమేన్.

495 “సాయంకాలపు వెలుగులు,” “ఈ చివరి దినములలో ప్రకాశిస్తాయని” బైబిలు చెప్పింది, పశ్చిమానయున్న ఆ వెలుగే సాయంకాలపు వెలుగు, మరియు తూర్పునయున్న ఆ వెలుగే పశ్చిమానయున్నది. తూర్పున ప్రకాశించిన అదే వెలుగు. రోము వారి యొక్క అన్య ఆరాధన ద్వారా నరికివేసిన మొదటి సంఘమును ముందుకు తెచ్చింది. సాయంకాలపు వెలుగు అదే వెలుగైయున్నది. ఇప్పుడు గమనించండి, అదే వెలుగు!

496 సాయంకాలపు వెలుగు దేని కొరకు బయటకు వచ్చుచున్నది? సాయంకాలపు వెలుగు దేని కొరకు? పునరుద్ధరించుటకు. అయ్యో! నీకు అర్థమైనదా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] చీకటి యుగముల గుండా, రోము ద్వారా, నరికి వేయబడిన దానిని పునరుద్ధరించుటకు, ఉదయకాలపు వెలుగు ఏ ఉద్దేశముతో యున్నదో, సాయంకాలపు వెలుగును ఆ ఉద్దేశముతోనే యున్నది. సాయంకాలపు వెలుగును ప్రకాశింప చేయుట ద్వారా, (ఏమిటి?), దేవుడు పునరుద్ధరించబోవుచున్నాడు, ఆయన సంఘములో క్రీస్తు యొక్క పూర్తి ప్రత్యక్షతను, సంపూర్ణమైన దేవుని యొక్క వాక్యమును తిరిగి పునరుద్ధరించబోవుచున్నాడు. ఆయన చేసిన సమస్తమూ, ఆయన ఖచ్చితముగా ఏమి చేసియున్నాడో, మరలా సాయంకాలపు సమయములో అది ఆలాగునేయుంటుంది. నా భావమును చూస్తారా? ఓ, అది అద్భుతముగా లేదా? [“ఆమేన్.”] ఖచ్చితముగా ప్రవచనము ప్రకారము, సాయంకాలపు వెలుగును చూచుటకు తిన్నగా ఇక్కడ మనము జీవించుచున్నామని తెలుసుకొంటాము. సాయంకాలపు వెలుగు దేనిని పునరుద్ధరించుటకు వచ్చింది? పురుగులు తినివేసిన దానిని పునరుద్ధరించుటకు వచ్చింది.

497 అది ఎదుగుట ప్రారంభమైంది, తరువాత అది ఏమి చేసింది? అది శాఖగా మారింది, కాబట్టి దేవుడు దాని కొమ్మలను కత్తిరించివేశాడు, వాటిని బంధించి, వెనుక యుంచాడు, వారిని కొంచెము ముందుకు వెళ్ళనిచ్చి, సంస్థగా మారనిచ్చాడు. మరలా తరువాతది పైకి వచ్చినపుడు; ఆయన వారిని బంధించి, అక్కడ పడవేశాడు. వృక్షము ముందుకు వెళ్ళింది. తరువాత ఆయన వాటిని బంధించి ప్రక్కన పడవేశాడు, మరియు ఆయన అన్నాడు, “ఆ దినములలో ఒక దినమున అవి కాల్చివేయబడతాయి.” వారి సంస్థలలో వారిని బంధించివేశాడు.

498 అయితే ఏమిటి? తిన్నగా చెట్టు పై భాగములో, మొదటగా ఫలము పండుతుంది, అది నిజము, తిన్నగా చెట్టు పై భాగమున కాబట్టి అది చెట్టు యొక్క పై భాగమే, సాయంకాలపు వెలుగును చూస్తుంది.

499 ఇప్పుడు, నోవహు తన ఓడలో మూడు గదులను కలిగియున్నాడు. ఒక గది ప్రాకే వాటికొరకు. చూడండి? రెండవ గది, పక్షుల కొరకు, కానీ పై గదిలో అక్కడ వెలుగున్నది. మొదటగా ప్రకాశించిన వెలుగు, మొదటి అంతస్తులోనికి, రెండవ అంతస్తునకి ఎన్నడూ రాలేదు, కానీ పై అంతస్తు, మూడువ అంతస్తులోనికి వచ్చింది.

500 అడుగున, రెండవ భాగమున, చెట్టు ఎన్నడూ తన మొదటి ఫలమును ఫలించదు. అదంతయూ సంస్థలోనికి నరికి వేయబడింది.

501 కానీ చెట్టు యొక్క పై భాగము, అక్కడ, “నేను పునరుద్ధరిస్తానని దేవుడు అన్నాడు. నేను సాయంకాలపు వెలుగును పంపుతాను. అది వాక్యమును తిరిగి వెనుకకు తెస్తుంది, దానిని ప్రత్యక్షపర్చుతుంది. నేను వాగ్దానము చేసినదంతా పునరుద్ధరిస్తాను. నేను వాగ్దానము చేసినదంతా, అదే పరిశుద్ధాత్ముడు తెస్తాడు, అవే సూచనలను అది ఫలిస్తుంది. పెండ్లి కుమారునికి నేను కలిగియున్నట్లుగానే, వధువు కొరకు ఒక పునరుత్థానమును, ఒక ఈష్టర్ ను నేను కలిగియుంటాను.” చూడండి? ఉదయము వలే అవే సూచనలు, అవే కార్యములు ప్రకాశించుచున్నట్లైతే, అక్కడ వారు కలిగియున్న అదే వెలుగు, అదే ఫలమును ఉత్పత్తి చేస్తుంది. ఆమేన్. ఇప్పుడు ఆయన వాక్యము నెరవేర్చబడినదని, అది రుజువు చేస్తుంది. “నేను పునరుద్ధరిస్తాను, అని ప్రభువు సెలవిచ్చియున్నాడు.”

502 ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దీనిని తప్పిపోవద్దు. అక్కడ నలుగురు మరణపు వర్తమానికులు యున్నారు.

503 లేక ముగించమంటారా? మీరు పెందలకడ వెళతారా? [సమాజము “వద్దు,” అని చెప్పుచున్నది.—ఎడి.]

504 ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చూడండి, అక్కడ నలుగురు మరణపు వర్తమానికులు వృక్షమును చంపారు. అది నిజమేనా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] అది ఏమిటి? గొంగళిపురుగు, మిడుత, పసరుపురుగు, చీడపురుగు. అది నిజమేనా? [“ఆమేన్.”] రోమా దయ్యముల యొక్క నలుగురు వర్తమానికులు, ఆ చెట్టును చంపియున్నవి. ఒకటి ఫలమును తీసివేసింది, ఒకటి ఆకులను తీసివేసింది, ఒకటి బెరడును తీసివేసింది, ఒకటి దాని జీవమును తీసివేసింది. అది నిజమేనా? [“ఆమేన్.”] ఆచారముల వర్తమానికులు, చెట్టును చంపివేశారు, వేరులను తప్ప.

505 నలుగురు మరణపు వర్తమానికులు చెట్టును చంపినట్లైతే, నలుగురు జీవపు వర్తమానికులు చెట్టును పునరుద్ధరిస్తారు. నీకు అర్థమైనదా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] ఆమేన్. ఏలయనగా దేవుడన్నాడు, “నేను దానిని పునరుద్ధరిస్తాను.” ఆయన దానిని పునరుద్ధరించబోవుచున్నాడు. ఎలా? నలుగురు మరణపు వర్తమానికులు దానిని చంపారు, అప్పుడు నలుగురు జీవపు వర్తమానికులు దానిని పునరుద్ధరిస్తారు. మొదట ఎవరు? మార్టిన్ లూథర్, నీతీకరణము. రెండవది ఎవరు? జాన్ వెస్లీ, శుద్ధీకరణము. మూడవది ఎవరు? పెంతెకొస్తు, వరముల పునరుద్ధరణ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము. నాల్గవది ఏమిటి? వాక్యము. అక్కడ నలుగురు గొప్ప ప్రవక్తలు యున్నారు.

506 వారిలో ఒకరు, మార్టిన్ లూథర్, అతడు ఒక వెలుగును ప్రకాశించుట ఆరంభించాడు, అక్కడ కొద్ది వెలుగు యున్నది, నీతీకరణము యొక్క, చాలా చిన్న శక్తి.

దాని వెంబడి వెస్లీ వచ్చాడు, ఇంకా బలముగా, శుద్ధీకరణము.

507 వెస్లీ తరువాత, అతని కంటే బలమైనది, పెంతెకొస్తు, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము, మరొక ప్రవక్త ద్వారా, చూడండి?

508 కానీ చివరి దినములలో మలాకీ 4 ప్రకారము, ఏలీయా వాక్యముతోనే రావలసియున్నది. “ప్రభువు యొక్క వాక్యము ప్రవక్త యొద్దకు వస్తుంది.” సాయంకాలపు వెలుగులు ముందుకు వచ్చి, పునరుద్ధరించి, దానిని వెనుకకు తీసుకెళ్ళాలి. ఏమిటి? “పిల్లల హృదయములను, దేవుని యొక్క విశ్వాసమునకు త్రిప్పుట.” నాల్గవ వెలుగు!

509 నలుగురు హంతకులు దానిని తీసుకొన్నారు. నలుగురు వర్తమానికులు దానిని నాశనము చేశారు. నలుగురు మరణపు వర్తమానికులు, ఆచారములతో దానిని తీసివేశారు.

నీతి యొక్క నలుగురు వర్తమానికులు, ఆమెను తిరిగి పునరుద్ధరిస్తారు.

510 “నరపుత్రుడా, ప్రవచించు. ఈ ఎముకలు బ్రతుకగలవా?” మనకు సమయము యుంటే బాగుంటుంది. నేను ఇక్కడ వ్రాసుకొన్నాను, కాని నేను దానిని దాటవేస్తాను. “ప్రవచించు, ఈ ఎముకలు బ్రతుకగలవా?” ఆ సంఘము పైకి వచ్చుచున్న నాలుగు దశలు ఏమిటి? యెహెజ్కేలు చూసిన ఎముకలు ముందుకు వచ్చుచున్న నాలుగు దశలు ఏమిటి? నరములు, చర్మము దాని మీద యున్నప్పుడు కాదు, కాని వాటి మీద గాలి వీచినపుడు మాత్రమే జీవము వచ్చింది. అది నాల్గవ వర్తమానమైన జీవము తిరిగి వచ్చినపుడు.

511 “నేను పునరుద్ధరిస్తాను, అని ప్రభువు చెప్పాడు.” హల్లేలూయ! మహిమ! దేవునికి స్తోత్రము. నాల్గవ వెలుగు వచ్చి, అవే సూచనలను అది తెస్తుంది. గమనించండి. నీతీకరణము గుజ్జును తెచ్చింది.

శుద్ధీకరణము బెరడును తెచ్చింది, పరిశుద్ధత సిద్ధాంతము.

512 ఆకులను ఏది తెచ్చింది? పెంతెకొస్తులు. అది ఏమిటి? పెంతెకొస్తులు, ఆకులు చప్పట్లు కొట్టుట, సంతోషము, ఆనందించటం, పెంతెకొస్తు.

513 ఏమిటి నాల్గవది దానికై అది వాక్యమైయున్నది. వాక్యము శరీరధారియైనది, పునరుత్థాన సూచన ఫలముల యొక్క రుజువు, క్రీస్తే చివరగా, నీతీకరణము తరువాత, శుద్ధీకరణము తరువాత, పరిశుద్ధాత్మ బాప్తిస్మము తరువాత నాటబడియున్నాడు. సంస్థలు చనిపోయినవి. క్రీస్తు మరలా తన్నుతాను పిరమిడ్ యొక్క కప్పుగా కేంద్రీకరించుకొనుట, మొదట వరుస నీతీకరణము; శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము; తరువాత కప్పు వచ్చుట.

514 అది ఏమిటి? ఆ పరిశుద్ధాత్మ గుంపు సానపెట్టబడింది, ఆ ప్రకారము, ఆయన వెళ్ళిపోయినపుడు చేసిన అదేరకమైన పరిచర్యతో అది ఇముడుతుంది, అదే ప్రకారము ఆయన తిరిగి వచ్చినపుడు, అది మొత్తమును ఎత్తబడుటలో పట్టుకొంటుంది, అక్కడ వారు నీతీకరించబడ్డారు, శుద్ధీకరించబడ్డారు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము నింపబడ్డారు. ఆ పిరమిడ్ మరలా నిలబడుతుంది. జీవ వృక్షము మరలా ఎదుగుచున్నది.

దేశములు బ్రద్దలగుచున్నవి, ఇశ్రాయేలు మేల్కొనుచున్నది,

ప్రవక్తలు ముందుగా చెప్పిన సూచనలు;

బయోత్సాహపు ఋణగ్రస్తములతో;

“ఓ, విడువబడినదానా, నీ యజమాని యొద్దకు రమ్మ.”

విమోచనా దినము సమీపమైయున్నది,

భీతితో మానవ హృదయములు బ్రద్దలగుచున్నవి;

ఆత్మతో నింపబడండి, తేటగా మీ దివిటీలను చక్కపర్చండి,

పైకి చూడండి! మీ విమోచన సమీపమైయున్నది.

అబద్ధపు ప్రవక్తలు అబద్ధమాడుచున్నారు, దేవుని సత్యమును నిరాకరించుచున్నారు,

యేసుక్రీస్తే మన దేవుడైయున్నాడు. (ఆమేన్.)

అపొస్తలులు నడిచిన బాటలో మనము నడుద్దాము.

ఏలయనగా విమోచనా దినము సమీపమైయున్నది,

భయముతో మానవ హృదయములు బ్రద్దలగుచున్నవి (అణు బాంబులు, సమస్తముతో);

ఆత్మతో నింపబడండి, మీ దివిటీలను తేటగా చక్కపరచండి,

పైకి చూడండి, మీ విమోచన సమీపమైయున్నది.

515 ఆమేన్. అన్ని సూచనలు పునరుద్ధరించబడినవి! అంత్యకాలములో లోతు యొక్క సూచన. మనము దానిగుండా వెళ్ళాము, లోతు ఎలా…ఈ దూత, యెహోవా తన ప్రజల మధ్య శరీరధారిగా చేయబడ్డాడు, ఆయన వీపును గుడారము వైపు త్రిప్పి ఇలా అన్నాడు, “నీ భార్యయైన శారా ఎక్కడ?”

“నీ వెనుక గుడారములో యున్నవి.”

516 ఆయన అన్నాడు, “నేను నిన్ను దర్శించబోవుచున్నాను.” శారా నవ్వింది. ఆయన అన్నాడు, “శారా ఎందుకు నవ్వింది?” ఆమె గుడారములో ఉన్నది. ఆమేన్.

517 యేసు అన్నాడు, ఆయన రాకడ నొద్ద అది ఆలాగునే యుంటుంది. ఓ, అప్పుడు సాయంకాలపు వెలుగు, ఎన్నుకొనబడిన వారి మీదకు సాయంకాలపు వెలుగును తెచ్చుటకు, మలాకీ 4, చీకటి గుండా ప్రకాశిస్తూ వస్తుంది, ఆమేన్. హల్లేలూయ! నాల్గవ వర్తమానము ఎలాయుంటుంది? నాల్గవ వర్తమానికుడు ఏమైయున్నాడు? వాక్యముపై వెలుగు ప్రకాశించుట. వాక్యము ముందుగా నిర్ణయించబడింది. అది ముందుకు రావలసియున్నది. ఏదో దానిని చేయవలసియున్నది, ఏలయనగా దేవుడు చెప్పాడు, “నేను పునరుద్ధరిస్తాను, అని ప్రభువు చెప్పాడు. నేను పునరుద్ధరిస్తాను.” నిజము. సాయంకాలపు వెలుగు, ముందుగా నిర్ణయించబడిన వాక్యముపై ప్రకాశించుచున్నది. అవునండి.

ఓ, సాయంకాలమందున వెలుగు కలుగును,

నీవు నిశ్చయముగా మహిమకు మార్గమును కనుగొంటావు;

నీటి మార్గములో, ఈ దినమున ఆ వెలుగున్నది,

ప్రశస్తమైన యేసు నామములో సమాధి చేయబడి.

యవ్వనులు, వృద్ధులు, మీ పాపములన్నిటి కొరకు పశ్చాత్తాపపడండి,

పరిశుద్ధాత్మ ఖచ్చితముగా లోనికి వస్తుంది;

సాయంకాలపు వెలుగులు వచ్చియున్నవి,

అది సత్యము, అదే క్రీస్తు మరియు దేవుడు ఒక్కడే.

518 వారు అక్కడ ఒక్కటిగా, ఏకముగా యున్నారు; మనలో ఒక్కటిగా. అవే సూచనలు మానవాళి చేయలేరు, వాళ్ళు తమ్మును తాము ప్రత్యక్షపరచుకొంటారు, ముందుగా నిర్ణయించబడిన వాక్యమును తెచ్చుటకు, అదిగో ఆ చెట్టు వేరులలో నుండి బయటకు తెచ్చుటకు, వాక్యము వస్తుంది. సంఘశాఖలన్నియూ దానిని నిరాకరించినవి, నిరాకరించినవి. కానీ అక్కడ వెలుగు పైకి లేస్తుంది, ముందుకు రాబోవుచున్నది.

519 యెరూషలేములో ఆచూకీలు? లేదండి. సాయంకాలపు వెలుగులు యెరూషలేములో పైకి లేవవు. సాయంకాలపు వెలుగులు (ఎక్కడ?) పశ్చిమానయున్నవి. వారు వారి దినమును కలిగియుండి దానిని నిరాకరించిరి.

520 కాని సాయంకాలపు వెలుగు పశ్చిమానయుంటుంది (దేని కొరకు?) వాక్యముపై ప్రకాశించుట కొరకు (ఏమిటి?) ఫలమును పండచేయుటకు, వారు ఆదిలో కలిగియున్నట్లుగా, వధువు వృక్షమును అవే సూచనలతో, అద్భుతములతో ఫలములతో ముందుకు తెస్తుంది. “అస్తమయకాలమున వెలుగు కలుగును.” నిజము. ఓ, అప్పుడు వాక్యము దాని ఋతువులో దాని ఫలమును తెచ్చును. “అది ఎండిపోదు, కాని అది ఫలమును తెస్తుంది.” దావీదు అన్నాడు, “తన కాలమందు,” ఆమేన్, అది ఆదిలో కలిగియున్న అదే ఫలము.

521 ఇప్పుడు ఆయన వాక్యముతో, ఆయన ముందుగా నిర్ణయించిన దశలో ఇప్పుడు ఆయన కలిగియున్నట్లుగా, ఈ వాక్యములన్నియు ప్రత్యక్ష పర్చబడుటను మనము చూస్తాము. అది ఏమిటి? ప్రభువు యొక్క రాకడ సమీపమైయున్నదని, అది పరిపూర్ణమైన సత్యమైన రుజువైయున్నది. “పసరుపురుగులన్నియూ, మెథడిష్టులు విడిచిపెట్టినదంతా, చీడ పురుగులు తినివేసినదంతా, అవన్నియూ దానిని చించివేసినవి, కాని సాయంకాలపు సమయములో నేను పునరుద్ధరిస్తానని, ప్రభువు చెప్పాడు.” ఓ, మై, అయ్యో!

ఇప్పుడు నేను యథార్థముగా అంతా బోధించాను

ఓ, నేను యేసును ఎలా ప్రేమిస్తానో,

ఓ, నేను యేసును ఎలా ప్రేమిస్తానో,

ఓ, నేను యేసును ఎలా ప్రేమిస్తానో,

ఏలయనగా ఆయన నన్ను మొదట ప్రేమించాడు.

నేను ఆయనను ఎన్నడూ విడువను,

నేను ఆయనను ఎన్నడూ విడువను,

నేను ఆయనను ఎన్నడూ విడువను,

ఏలయనగా ఆయన నన్ను మొదట ప్రేమించాడు.

522 ఆమేన్. నీవు ఆయనను ప్రేమించవా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] నా హృదయమంతటితో నేను ఆయనను ప్రేమిస్తాను. మనము ప్రార్థనా వరుసను కలిగియుందామా? [“ఆమేన్.”]

523 తండ్రివైన దేవా, ఈ వర్తమానమును నీ చేతులలోనికి అప్పగించుచున్నాను. అది ముక్కలుగా నరికివేయబడినప్పటికి, ఏదో మార్గములో పరిశుద్ధాత్ముడు ఈ టేపులతో దేశముల గుండా వెళ్ళాలని నేను ప్రార్థిస్తున్నాను. నేను ఈ భూమి మీద నుండి తీసివేయబడినట్లైతే, ప్రభువా అవి జీవించును గాక. అది నీ వాక్యమైయున్నది. సాయంకాలపు వెలుగు ప్రకాశింపనిమ్ము, ప్రభువా, ఈ మహిమకరమైన క్రీస్తు వధువును ముందుకు తెచ్చునుగాక. ప్రభువా, దీనిని దీవించుము. అది నిష్పలముగా నీ యొద్దకు తిరిగి రాకుండును గాక. అది దానికి ఉద్దేశించబడిన దానిని నెరవేర్చును గాక. తండ్రీ, దానిని దయచేయుము. స్తుతులన్నియు నీకే చెందును గాక.

524 తండ్రీ, ఇప్పుడు మాకు తెలుసు, మేము ఏమి చెప్పినప్పటికి లెక్కకాదు, అది ఇంకనూ వాక్యమైయున్నదని మేము నమ్ముతాము. ప్రభువా, ఈ ఈష్టర్ ఉదయమున మేము నిన్ను కోరునదేమనగా, బహుశ ఇక్కడయున్న కొంతమందికి, ఇది మొదటిసారి కావచ్చు, నీవు ఇంకనూ అదే యేసువైయున్నావని, నీవు ఒక మృతమైన రూపము కాదని, నీవు జీవించుచున్నావని, నీవు పునరుత్థానుడవైన దేవుడని, ఈ రోజు నీవు మా మధ్య జీవించుచున్నావని, ఈ సంఘమునకు నిన్ను రుజువు చేసుకొనుము. తండ్రీ, దానిని దయచేయుము, యేసు నామములో మేము నిన్ను స్తుతించుచున్నాము. ఆమేన్.

525 ఇక్కడ ఎంతమంది రోగులున్నారు? మీ చేతులను చూడనివ్వండి, సరిగ్గా మీ చేతులను ఎత్తండి. ఓ…

526 బిల్లీ పాల్, మీకు ప్రార్థనా కార్డులను ఇచ్చాడని నేను నమ్ముతాను. అతడు ఇచ్చాడా? [కొంతమంది సహోదరులు “అవును,” అని చెప్పుచున్నారు.—ఎడి.] అవి ఏమిటి? [“E, ఒకటి నుండి వంద వరకు.”] E ఒకటి నుండి వందవరకు. వాళ్లందరిని మనము తీసుకొనలేము, కాని వారిలో కొందరిని తీసుకొందాము. మీరు కోరినట్లైతే, ఇక్కడే నిలబడియుండండి.

527 నంబరు ఒకటిని ఎవరు కలిగియున్నారు? నంబరు ఒకటిని మనము చూద్దాము E, నెంబరు ఒకటి, మీ చేతిని ఎత్తండి. ప్రార్థనా కార్డు; మీ కార్డు మీద చూడండి. మీరు లేవగలిగినట్లైతే మంచిది. నంబరు ఒకటి.

528 మంచిది, నీవు సరియైన దానిని కలిగియున్నావని నిశ్చయతయున్నదా? మంచిది. మనము వెళ్ళి, ఎక్కడో ప్రారంభిద్దాము. [సహోదరుడు నెవిల్, “అది అక్కడ ముగిసియున్నది,” అని చెప్పుచున్నాడు—ఎడి.] ఓ, మంచిది, అలాగే. నీవు పొందినట్లైతే, అప్పుడు అక్కడే మనము ప్రారంభిద్దాము. అలాగే.

529 నంబరు ఒకటి, నీవు నడువగలిగినట్లైతే, ఈ చుట్టూ దారి చేసుకోండి. నీవు నడువలేకపోయినట్లైతే, మేము దానిని చుడతాము. చూడండి? మంచిది. నంబరు ఒకటి.

530 నంబరు రెండు. మీ చేతిని ఎత్తండి, ఇప్పుడు త్వరగా, నెంబరు రెండు, తిన్నగా ఇక్కడకు రండి.

నంబరు మూడు, అయ్యా, ఇక్కడేయున్నారా.

నంబరు నాలుగు, నంబరు నాలుగు.

531 నంబరు ఐదు. ఇప్పుడు, ప్రతి ఒక్కరు సరిగ్గా కొన్ని నిమిషములు కూర్చొనండి. నంబరు ఐదు.

532 నంబరు ఆరు. త్వరగా నీ చేతిని ఎత్తండి. నంబరు ఆరు. ఆరు, ఆరు, దానిని నన్ను చూడనియ్యండి, దయచేసి, ఎవరో వారి చేతిని చూపుచున్నారు. అతడు వెనుక గదిలోయున్నాడు. మంచిది. నంబరు ఆరు. మంచిది. ఇప్పుడు ఒక్క క్షణము.

ఏడు, ఏడు, మంచిది, ఆ వెనుకయున్న స్త్రీ. ఎనిమిది.

533 ఇప్పుడు, ప్రతి ఒక్కరూ ఒక్క క్షణము, చాలా నెమ్మదిగా యుండండి. ఇప్పుడు, ఇది రుజువుగా ఉండబోవుచున్నది. ఇది రుజువు.

534 ఆరు, ఏడు, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. నీవు పైకి వెళ్ళు. మంచిది. ఏడు. అయ్యా, మంచిది, అది చక్కగాయున్నది.

535 ఎనిమిది. [సహోదరుడు నెవిల్ “ఆమెది 8 వది,” అని చెప్పుచున్నాడు.—ఎడి.] ఎనిమిది. ఎనిమిది. మంచిది, సోదరుడా. ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు.

536 బాగుంది, నీవు వచ్చుట ఆగిపోయినట్లు కనబడుతుంది. మంచిది, మనము అక్కడ ప్రారంభిద్దాము. అది సరియే. బహుశ కొన్ని క్షణములలో…మంచిది.

ఇప్పుడు మనము ప్రార్థించుకొందాము.

537 తండ్రివైన దేవా, నీ నుండి వచ్చు ఒక్కమాట ఎంతో అర్థవంతమైనది. ప్రభువా, ప్రజలు దానిని చూచుదురు గాక. నేను యథార్థముగాయుండుటకు ప్రయత్నించాను, నీ వాక్యమును వారికి చెప్పుటకు ప్రయత్నించాను. ప్రభువా, నీ సేవకుని పొరపాట్లను క్షమించుము. నేను ఎన్నో పొరపాట్లు చేస్తున్నాను ప్రభువా. నీ సేవకుని యొక్క పొరపాటును చూడవద్దని, నీకు ప్రార్థన చేయుచున్నాను. అయితే నీవు నీ వాక్యము వైపు చూడుము, దానినే నేను బోధించుటకు ప్రయత్నము చేయుచున్నాను. ప్రభువా దానిని బట్టి నీకు వందనములు. నా హృదయమంతటితో నేను సంతోషముగాయున్నాను. ప్రభువా, అది నాకు జీవము కంటె ఎక్కువైనది. దాని కొరకు ఏ సమయములోనైనా నేను నా ప్రాణము ఇస్తాను, ఏలయనగా అది సత్యమని నాకు తెలుసు. అది నీ వాక్యమైయున్నది.

538 నా బుద్ధిలేని మార్గములను దయతో క్షమించుము, ప్రభువా. అనేకసార్లు నేను తమాషాగా హాస్యముగా మాట్లాడతాను, నేను దానిని తప్పక చేయకూడదు. ప్రభువా, దానిని బట్టి నేను సిగ్గుపడుచున్నాను. నేను సరిగా ఆ రకమైన కుటుంబము నుండి వచ్చియున్నాను. తండ్రీ, దయచేసి నీవు దానిని చూడవద్దు. నీకిష్టమైతే, నీ రక్తములో దానిని కప్పండి. అదే నీవు చేయాలని నేను అడుగుచున్నాను. నేను దానిని ఒప్పుకొనుచున్నాను. నేను దానిని ఒప్పుకొన్నప్పుడు, నీవు దాటిపోక, నీవు నన్ను క్షమించగలవు.

539 ఇప్పుడు నా పాపములను ఒప్పుకొనియున్నాను. ప్రజల యొక్క పాపములు ఒప్పుకొనుచున్నాను. దేవా, వారిలో ప్రతి ఒక్కరిని క్షమించమని ప్రార్థించుచున్నాను.

540 ఒక రకముగా మేము నడుచుటకు మేము ప్రయత్నము చేయుచున్నామని, ప్రజలు తలంచకుందురు గాక. ఇప్పుడే నేను చెప్పియున్నట్లుగా, అది చివరి దినములలోని పరిశుద్ధాత్ముడైయున్నాడు, ఆయన వాక్యమునకు సాక్ష్యమిచ్చుచున్నాడు. కాని, తండ్రీ, నేను కేవలము మనిషిని, అది లెక్కకాదు. అది నేను చెప్పినట్లైతే, “అది అతని అనువాదమని, అతడు దానిని గూర్చి ఆలోచించేది అదే అని,” వారంటారు. కాని, తండ్రీ నీవు మాట్లాడి, అది సత్యమైయున్నదని రుజువు చేస్తే, అప్పుడు దానితో వెళ్ళుటకు, వారు నీ మీదుగా దాటాలి, ప్రభువా. అప్పుడు అది నా అనువాదముగాయుండదు; అది నీదిగాయుంటుంది. ప్రభువా, దానిని దయచేయుము. నేను నీ యొక్క సేవకుడనైయున్నట్లైతే, నా పాపములు క్షమించబడియున్నట్లైతే, ఈ పనికి నీవు నన్ను పిలిచియున్నట్లైతే, అప్పుడు, దానితో మాట్లాడుము, ప్రభువా. నీవు దానిని దయచేస్తావని, నేను ప్రార్థన చేయుచున్నాను. ప్రతి స్థలములోయున్న రోగులను, పీడింపబడుచున్నవారిని స్వస్థపర్చుము, యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను.

541 ఆ స్త్రీతో ఆ బావి దగ్గర నీవు మాట్లాడినప్పుడు, సరిగ్గా అక్కడ నీవు చేసియున్నట్లుగా, ఇప్పుడు నిన్ను నీవు మాకు తెలియపర్చుకొనండి. ఆమెతోయున్న ఇబ్బంది యేమిటో నీవు చెప్పియున్నావు. ఆమె ఐదుగురు భర్తలను కలిగియున్నది. ఇప్పుడు, సాయంకాలపు సమయములో నీవు దానిని చేస్తావని వాగ్దానము చేసియున్నావు. చివరి దినములలో దానిని చేస్తావని నీవు వాగ్దానము చేసియున్నావు. నీవు అన్నావు, “మనుష్య కుమారుని రాకడలోను అది ఆలాగు జరుగును. లోతు దినములలో జరిగియున్నట్లుగా, ఆ ప్రకారమే మరలా జరుగును.” దేవుడు మానవ శరీరములో జీవిస్తూ. ఆయన సంఘము యొక్క రూపములో మన మధ్య పరిశుద్ధాత్మగా కదులుచు, అవే సూచనలను చేయుచున్నాడు. ప్రభువా, దానిని సరిగ్గా ఈ దినమున దయచేయుము. తండ్రీ, దయచేయవా? అలాగైతే, ప్రతి ఒక్కరూ దానిని చూచుదురు గాక, మరియు దేవుని మహిమ కొరకు ప్రతి ఒక్కరూ రక్షించబడి, స్వస్థపడుదురు గాక. ఆమేన్.

542 ఇప్పుడు, కొన్ని నిమిషములు బహు మర్యాదగాయుండండి. నేను మీ గమనమును పిలువబోవుచున్నాను, సరిగ్గా ఎంత నెమ్మదిగాయుండాలో అంత నెమ్మదిగాయుండండి.

543 ఇప్పుడు నేను ఇక్కడయుండియున్న స్థానమును మీరు నిశ్చయముగా గ్రహించారా? నేను ఇక్కడ దేవుని యొక్క వాక్యమును బోధించాను. [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] అదంతయూ సత్యమని నేను చెప్పాను [“ఆమేన్.”] యేసు అన్నాడు, అదేమనగా, “నాయందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలు అతడును చేస్తాడు.”

544 ఇప్పుడు, మిమ్మును ఒక ప్రశ్న అడుగగోరుచున్నాను. జాగ్రత్తగాయుండండి, మీరు “ఆమేన్” చెపుతారో లేదో, ఇప్పుడు యేసు, స్వయముగా ఎవరిని స్వస్థపర్చినట్లు చెప్పుకొనలేదు. అది నిజము. ఆయన అన్నాడు, “అది నేను కాదు అది నాలో నివసించుచున్న తండ్రియే, ఆ కార్యములను చేయుచున్నాడు.” అది నిజమేనా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] యేసు అన్నాడు, యోహాను 5:19లో, “నిశ్చయముగా, నిశ్చయముగా, పరిపూర్ణముగా నేను మీతో చెప్పునదేమనగా, కుమారుడు తనకు తాను…” ఒక మనిషిగా ఆయన దేవుడు నివసించిన ఆలయమైయున్నాడు. చూడండి? “తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, అదేకానీ తనంతట తాను ఏదియు చేయనేరడు, ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.” మరొకమాటలో, “నేను ఏమి చేయాలో తండ్రి నాకు ఒక దర్శనమును చూపిస్తాడు, మరియు సరిగ్గా ఆయన చెప్పిన దానిని నేను చేస్తాను.”

545 ఒక దినమున, అక్కడ ఒక స్త్రీ యున్నది, ఆమె ప్రార్థనా వరుసలోనికి రాలేకపోయినదని కనుగొంటాము. ఆమె ఎన్నో సంవత్సరముల నుండి, రక్త స్త్రావము వ్యాధిని కలిగియున్నది. కాబట్టి, ఆమె తనలో తాను అనుకొని ఆయన వస్త్రమును తాకింది…ఆమె పేరులేనిది, ఆమె పేదది, ఒక చిన్న స్త్రీ, ఆమెకు డబ్బులేదు, ఆ యాజకులతో ఆమె అక్కడ నిలబడలేకపోయింది. ఆ యాజకులు అక్కడ నిలబడియున్నారు, వారు నిలబడుటకు హక్కులు, సమస్తమును కలిగియున్నారు. కాబట్టి అక్కడ ఆమె నిలబడలేకపోయింది, కాబట్టి ఆమె చుట్టూ ప్రాకుకుంటూ అక్కడకు వెళ్ళి, ఆయన వస్త్రమును తాకింది. ఆమె అనుకొన్నది, “ఆయన సత్యమును జీవమును తెస్తున్నాడు, ఆయన దేవుని యొక్క వాక్యమైయున్నాడని నేను నమ్ముతాను, నేను ఆయనను తాకగలిగినట్లైతే, నేను స్వస్థపడతాను.”

546 నీవు నమ్ముచున్నావా? ఆయన దేవుని యొక్క వాక్యమైయున్నాడని, ఆ స్త్రీ నమ్మిన దానినే నీవు నమ్ముచున్నావా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] ఇప్పుడు, ఈ రోజున. “ఆయన మన ప్రధాన యాజకుడైయున్నాడని, బైబిలు చెపుతుంది, ఇప్పుడే తిన్నగా మన ప్రధాన యాజకుడు,” నీవు దానిని నమ్ముతావా? [“ఆమేన్.”] “ఆయన పునరుత్థానము మరియు ఆరోహణము తరువాత, ఆయన ఆరోహణమైనప్పుడు, మనుషులకు ఈవులను అనుగ్రహించెను. మరియు ఇప్పుడు, మనము ఒప్పుకోలులపై విజ్ఞాపనలు చేయుచూ, సర్వశక్తిగల దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొండియున్నాడు.” అది నిజమేనా? [“ఆమేన్.”] “ఆయన ప్రధాన యాజకుడైయున్నాడు…” ఏమిటి? [“తాకబడవచ్చును.”] “తాకబడవచ్చును…” ఏమిటి? “మన బలహీనత ద్వారా తాకబడవచ్చును.” ఇప్పుడు ఆయన ఒకే రీతిగాయున్నాడని నమ్ముచున్నావా? [“ఆమేన్.”]

547 ఇప్పుడు, చూడు, నీవు ఇక్కడకు వచ్చి, దినమంతయు నన్ను ముట్టినప్పటికి, ఒక రవ్వంత భేదము చేయదు. నీవు ఏ సోదరుడినైనా, సహోదరినైనా ముట్టినను, అది ఏ భేదము చెయ్యదు. కేవలము చేతులుంచు క్రమములన్నీ అంతే. కాని నీవు ఆయనను తాకినట్లైతే. నీవు చేయవలసినదంతా అదియే.

548 చూడు, నీవు ఆయనను ఏదో కర్మకాండగా, ముట్టినట్లైతే, వారు చేసినట్లు, “ఓ, గొప్ప బోధకుడు, ఆయన ఒక ప్రవక్త.” అంటే, మంచిది, అప్పుడు ఆయన ఏమీ చెప్పలేదు.

549 కాని ఆ చిన్న స్త్రీ ఒక నిర్ణీతమైన దానితో ఆయనను ముట్టింది; ఆమె విశ్వాసము. ఆమె ఆయన వస్త్రమును తాకింది, ఆయన అన్నాడు, “నన్ను ఎవరు ముట్టారు?”

550 అప్పుడుయుండియున్నట్లుగానే, ఆయన అదే ప్రధాన యాజకుడని బైబిలు చెప్పుటలేదా, మన బలహీనత ద్వారా ఆయన తాకబడవచ్చును అని? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] నీవు ప్రార్థనా వరుసలోయున్నప్పటికి, లేనప్పటికి నీవు ఆయనను తాకవచ్చును. నీవు రోగివైయున్నట్లైతే లేక నీ ప్రియమైన ఒకరు, రోగిగాయున్నటైతే, నీ హృదయములో ఏదైనా యున్నట్లైతే. నీవు గౌరవముగా దేవుని ముందుకు వచ్చి ఇలా చెపుతావా, “అక్కడ నిలబడియున్న మనిషిని గూర్చి నాకు తెలియదు. అతడు ఒక చిన్న బట్టతల గల మనిషి. ఆయన ఏమీ కాదు, కాని ఆయన ఏమి బోధించాడో అది సత్యమైయున్నది. నీవు ప్రధానయాజకుడివైయున్నావని ఆయన సరియైన విషయాన్ని చెప్పాడు. నేను ఇప్పుడు నిన్ను తాకగోరుచున్నాను. ఆయన సత్యము చెప్పినట్లైతే, ఆ వెనుక స్త్రీతో మాట్లాడినట్లుగా, అప్పుడు నాతో తిరిగి మాట్లాడుటకు ఆయన పెదవులను వాడుకొనుము.” చూడండి, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నట్లైతే, దానిని చేయండి. అది ఆయనను నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నవాడుగా చేస్తుంది. అది నిజమైనా? [“ఆమేన్.”]

మంచిది. ప్రతి ఒక్కరు మీ స్థానములోయుండి, గౌరవముగా ప్రార్థన చెయ్యండి.

551 ఏమంటారు? [ఎవరో, “నేను కొన్ని కార్డులను బయట కలిగియున్నానని, చెప్పుచున్నారు.”—ఎడి.] [“ఇరవై-ఐదు బయటకు ఇచ్చారా.”] నేను తిరిగి పదినే కలిగియున్నాను? [“పదునాలుగు.”]

552 పది, పదకొండు, పన్నెండు, పదమూడు, పదునాలుగు, పదిహేను; పది, పదకొండు, పన్నెండు, పదమూడు, పదునాలుగు, పదిహేను, పదహారు, పదిహేడు, పద్దెనిమిది, పందొమ్మిది, ఇరవై, ఇరవై ఒక్కటి, ఇరవై రెండు, ఇరవై మూడు, ఇరవై నాలుగు, ఇరవై ఐదు; వాళ్ళు మంచి వరుసను ఏర్పరచాలి. మిమ్ములను ఎక్కువ కాలము మేము ఇక్కడ ఉంచము. కాని, ఇప్పుడు…

553 [ఒకరు బ్రెన్హాం సోదరుడితో మాట్లాడుచున్నారు—ఎడి.] నీవు దానికి హాజరవుతావా. అది మంచిది…అది మంచిది.

మనమంతా కలసి, వారిని తెచ్చుచుండగా, ఇప్పుడు చక్కగా ఆలపిద్దాము. కేవలము నమ్ముము.

కేవలము నమ్ముము, కేవలము నమ్ముము,

అన్నియూ సాధ్యమే, కేవలము నమ్ముము;

కేవలము నమ్ముము…

ఏమిటి నమ్మేది? ఆయన వాక్యము మరియు వాగ్దానము, దేని కొరకు?

కేవలము నమ్ముము, అన్నియూ సాధ్యమే.

554 కొండమీద నుండి వస్తూయుండగా, అక్కడ శిష్యులు నిలబడియున్నారు. వారు మూర్ఛల కుర్రవాడి విషయములో ఓడిపోయారు. పిల్లవాడి వైపు చూస్తూ తండ్రి నిలబడి ఏడుస్తున్నాడు. శిష్యులు వారి యుక్తులన్నిటిని ప్రయోగించారు, కాని అది పనిచేయలేదు. యేసు నడుచుకొంటూ పైకి వచ్చాడు. వారిలో కొందరు అన్నారు, “ఆయన అక్కడయున్నాడు.” ఎవరో యేసు వైపు సూచించారు; సేవకుల నుండి దూరముగా, యేసు వైపు సూచించారు. అక్కడకే నేను ప్రజలను వ్రేలు పెట్టి చూపగోరుచున్నాను, నా వైపుకాదు, ఏదో సంఘము వైపు కాదు. కాని యేసు వైపు, “ఆయన సమర్ధుడు,” అన్నారు.

555 కాబట్టి తండ్రి పరుగెత్తుకొని వెళ్ళి, ఆయన పాదముల మీద పడి, “ప్రభువా, నా బిడ్డపై కనికరము చూపుము, అన్నాడు. అతడు దయ్యముతో విపరీతముగా బాధపడుచున్నాడు. వాడు కృశించిపోవుచున్నాడు, నోటి వెంబడి నురుగలు గ్రక్కుచూయుంటాడు. అతడు తిప్పులలో పడతాడు,” మూర్ఛవ్యాధి. అతడన్నాడు, “నేను ప్రతి చోటికి తీసుకొని వెళ్ళాను. నీ శిష్యులు సహితము అతనికి ఏమీ చేయలేకపోయారు.”

556 యేసు అన్నాడు, “నీవు నమ్మినట్లైతే నేను చేయగలను, ఏలయనగా నమ్మువానికి సమస్తము సాధ్యమే.”

కేవలము…

నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు. అది అంతా ఇప్పుడే. ప్రతి ఒక్కరూ నెమ్మదిగాయుండండి.

…నమ్మండి,

అన్నియూ…(ఎలాటి సమయము!)

కేవలము నమ్ముము, కేవలము నమ్ముము,

అన్నియూ సాధ్యమే, కేవలము నమ్ముము.

557 ఓ, దేవా, ఇక్కడ వాక్యము చుట్టూ యుంచబడియున్నది. సాయంకాలపు వెలుగు ప్రకాశించును గాక, ప్రభువా దానిని సజీవముగా చేయుము, యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్.

558 ఇప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో, ఆయన మహిమ కొరకు, ఇక్కడయున్న ప్రతి ఆత్మను నా స్వాధీనములోనికి తీసుకొనుచున్నాను.

559 ఈ ప్రార్థనా వరుసను నేను క్రిందకు చూశాను. ఆ ప్రార్థనా వరుసలోయున్న ఒక్కరు కూడా నేను ఎరిగిన వారు లేరు. వారందరూ, ప్రతి ఒక్కరూ, నాకు క్రొత్తవారే, మీ ఇబ్బంది, మీ గురించి నాకు తెలియదు. మీ చేతులను ఎత్తండి, ప్రార్థనా వరుసలోయున్న ప్రతి ఒక్కరూ.

560 ఇక్కడ శ్రోతలలో ఎంతమంది నాకు క్రొత్త వారుగాయున్నారు, మరియు మీ గురించి నాకు ఏమియు తెలియదు. వారు ఇక్కడ చేస్తున్నట్లుగా మీరును ఒకే అధికారమును కలిగియున్నారు. నేను ఒకసారి ఒకే వ్యక్తిని బయటకు తీసుకొనుచున్నాను.

561 ఒక్క నిమిషము, ఇక్కడ, దీనిని చుట్టూ తీసుకొని వెళ్ళనియ్యండి. [బ్రెన్హాం సోదరుడు మైక్రోఫోనును కదిలించారు—ఎడి.] ఇప్పుడు దీనితో మీరు వినగలుగుచున్నారా? [సమాజము “అవును,” అని చెప్పుచున్నది.]

562 ఈ స్త్రీ ఇక్కడయున్నది. ఒక స్త్రీ మరియు పురుషుడు కలుసుకొనుచున్నారు. ఆమె ఎవరో నాకు తెలియదు, ఎన్నడూ ఆమెను చూడలేదు. ఆమె నాకు ఒక క్రొత్త వ్యక్తి. ఎన్నడూ నేను ఆమెను చూసియుండలేదు. ఆమె నాకు క్రొత్త వ్యక్తి. ఒక పరిపూర్ణమైన క్రొత్త వ్యక్తి.

563 నేను వాక్యము యొక్క ఆధారముపై మాత్రమే పనిచేయుచున్నాను. ఆ వాక్యము చెప్పింది, “మీరు నాయందు విశ్వాసముంచినట్లైతే, నేను చేయు క్రియలు మీరును చేస్తారు.”

564 మొన్నటి ఉదయమున, ఆ దర్శనము తిరిగి వచ్చినపుడు, వేలమంది తరువాత, “నీవు ఎటు వెళ్ళినా యేసుక్రీస్తు యొక్క తప్పిపోని సన్నిధి ఎటు వెళ్ళినా నీతోయుంటుంది,” అని చెప్పబడింది. నా హృదయమంతటితో గంభీరముగా నేను నమ్ముతాను, నేను మరలా మిమ్మును చూడకపోయినట్లైతే, అది సత్యమని మీరు నమ్ముచున్నారా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] అది సత్యము.

565 ఇక్కడ ఒక స్త్రీయున్నది, నేను ఎన్నడూ నా జీవితములో ఆమెను చూసియుండ లేదు. ఆమె ప్రార్థనా కార్డును పొందిన ఒక స్త్రీయైయున్నది.

566 సాధారణముగా ఇక్కడ కుర్రవాడు ఏమి చేస్తాడంటే, అతడు ఇక్కడకు వచ్చినపుడు, ఈ ప్రార్థనా కార్డులన్నిటిని ఏకముగా ప్రజలముందు కలిపివేస్తాడు. ఎవరికైనా కోరిన వారికి అది ఎక్కడయున్నా ఎక్కడ నుండియైనా ప్రార్థన కార్డు ఇస్తాడు. ఆ వరుస ఏ సంఖ్య నుండి ప్రారంభించబడుతుందో ఎవరికీ ఏమీ తెలియదు. అందుచేత, “ఓ, ఇప్పుడు ఇక్కడ, నీవు నాకు కొంత ఇచ్చినట్లైతే, నేను నిన్ను ముందు పెడతాను, నిశ్చయముగా నీవు అక్కడయుంటావు,” అని చెప్పలేడు. అది అతనికే తెలియదు. ఎవరికీ తెలియదు.

567 పరిశుద్ధాత్ముడు ఎక్కడ నుండి “పిలవమని” చెపితే, అక్కడ నుండి తిన్నగా మేము పిలవటం ప్రారంభిస్తాము. కొన్నిసార్లు నేను ఇక్కడ యున్నప్పుడు, విశేషముగా, నేను ఎరుగని క్రొత్త వారిని తీసుకొంటాను.

568 ఇక్కడ ఈ స్త్రీ నిలబడియున్నట్లైతే, అక్కడ ఏదో తప్పుయున్నది. ఆమె రోగి కావచ్చు. ఎవరో ఒక రోగిని ఆమె కలిగియుండవచ్చు. ఆమె అక్కడ ఒక రోగినని చెప్పుకొంటూ అక్కడ నిలబడియున్నది. దేనినో బహిర్గతము చేయుటకు, ఆమె అక్కడ నిలబడియున్నది. ఆమె ఆలాగున్నట్లైతే, ఏమి సంభవిస్తుందో గమనించండి. చూడండి? అది ప్రయత్నించబడుట కూడా, మీరు చూసియున్నారా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] అవునండి. చనిపోయిన ఆమెను ద్వారము గుండా మోసుకొని వెళ్ళుటను మీరు చూశారు. చూడండి? కాబట్టి ఇప్పుడు, అది సరియో, కాదో కనుగొనండి. చూడండి? ప్రయత్నించి చూడండి, దానిని.

569 స్నేహితులారా, సంఘములో మనము ఆడుకొనుట లేదు. మనము అంత్యకాలములోయున్నాము. ఫలము చెట్టపైన, పరిపక్వమగుచున్నది. అది నిజము. ప్రభువు వచ్చుచున్నాడు.

570 ఆమె ఎవరో నాకు తెలియదు. ఆయనకు ఆమె తెలుసు. ఆయన ఆమెను ఎరుగును. ప్రపంచమనునది లేకమునుపు. ఆమె ఇక్కడ నిలబడియుంటుందని ఆయనకు తెలుసు. ఏలయనగా, ఆయన అనంతుడు. అది నిజమేనా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] ఇప్పుడు ఆయన అనంతుడైయుండి, దానిని ఎరిగియుంటే, అప్పుడు ఈ స్త్రీ ఎందుకు ఇక్కడ నిలబడి యుంటుందో ఆయనకు తెలుసు. అప్పుడు, దేవుడు…

571 యేసు ఈ భూమి మీద యున్నప్పుడు, దేవుడు ఆయనలో ఉన్నాడు. బావి దగ్గర ఆ స్త్రీతో మాట్లాడి, ఆమె ఇబ్బంది ఏమిటో చెప్పియున్నాడు. అది ఏమైయున్నదో మన అందరికి తెలుసు. మనకు తెలియదా? ఆమె అన్నది, “అయ్యా, నీవు తప్పక ఒక ప్రవక్తవై యుంటావు.” అది ఆమె యొక్క మొదటి ఉచ్ఛరణ. “ఇప్పుడు క్రీస్తు అనబడిన మెస్సీయా, ఇక్కడయుండు సమయమైయున్నదని మేము ఎరుగుదుము.” ఆయన వచ్చినపుడు, ఆయన చేయబోవునది ఆ కార్యమైయుంటుంది.

572 ఇప్పుడు, ఆయన “నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నట్లైతే,” నేను బోధించిన వాక్యము ద్వారా, సాయంకాలపు సమయములో ఆయన ఇక్కడ యుండి అదే కార్యము చేస్తానని వాగ్దానము చేశాడు, అప్పుడు మనము దానికొరకు ఎదురుచూస్తున్నాము. అది కాదా? అది మనము కాదా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] సంఘము యొక్క పునరుత్థానము కొరకు ఎదురుచూస్తున్నాము. ఇప్పుడు, ఆయన ఈ స్త్రీకి ఆమెకు చేసియున్నట్లుగా దానినే చేసినట్లైతే, అది వాక్యమును నెరవేర్చుతుంది, అది నిజమేనా. [“ఆమేన్.”]

573 ఇప్పుడు, మేము ఒకరికి ఒకరము క్రొత్తవారము, ఆమె చేతిని ముడిచియున్నది. నేను ఆమెకును, ఆమె నాకును తెలియదు. నేను నా జీవితములో ఎన్నడూ ఆమెను చూడలేదు. ఆమె ఒక క్రొత్త వ్యక్తి, ఇక్కడ నిలబడియున్నది. ఆలాగుననే మీరును, బయట మీలో అనేకులు.

574 ఇక్కడ కూర్చొన్న కొంతమంది ప్రజలను నేను ఎరుగుదును. అనేకమంది నాకు తెలియదు. ఇక్కడయున్న శ్రీమతి కాలిన్స్ నాకు తెలుసు. అది నిశ్చయము. సహోదరి బెన్ యొక్క భార్య, సహోదరి, సహోదరుడు డాచ్; రిట్ సహోదరి, సహోదరుడు డాచ్, ఆ చివరలోయున్న సోదరుడు. మీలో కొంతమంది నాకు తెలుసు, ఈ చుట్టూ. మీలో ఎక్కువమంది నాకు తెలియదు, ఎందుకంటే, పరిచయముగా యుండటానికి ఇక్కడ నేను ఎక్కువగా వుండను. మనము ఇక్కడ క్రొత్తవారము.

కాబట్టి మీరు ప్రార్థించండి.

575 నేను మీకు క్రొత్తవాడనైతే, సాయంకాలపు వెలుగు వచ్చియున్నదని నేను చెప్పుచున్నాను. సాయంకాలపు వెలుగు, ఉదయపు వెలుగు వంటిదే. అదే మర్మయుక్తమైన దేవుని ఫలమును నేను బయలుపర్చుతాను, ఆత్మ సంబంధముగా మాట్లాడుచున్నాను. అది నిజము. ఆ బావి దగ్గర స్త్రీతో మాట్లాడినట్లుగానే నేను నీతో మాట్లాడుచున్నాను. ఆయన అన్నాడు, “నాకు దాహమునకిమ్ము.” చూడండి? నేను దానినే చెప్పుచున్నాను. అది నేను కాదు. అది ఆయనయైయున్నాడు. అయితే నీవు ఇక్కడ దేనికొరకు నిలబడియున్నావో, ఆయన నాకు బయలుపర్చినట్లైతే, అప్పుడు ఆయనకు నీ జీవితము గురించి అంతా తెలుసు అని నీకు తెలుస్తుంది. ఆయన జరిగియున్న దానిని చెప్పినట్లైతే, అది సరియో కాదో నీకు తెలుస్తుంది. ఏమి జరిగియున్నదో ఆయన ఎరిగియున్నట్లైతే, ఆయన నీకు చెప్పగలడు. నిశ్చయముగా అది ఏమైయుంటుందో, అప్పుడు నీవు ఆయనను నమ్ముతావు. ఇదివరకు సంభవించినది, ఆ వెనుక జరిగినది, దాని ముందు, వెనుక ఆదియు అంతము ఆయన బయలుపర్చినట్లైతే, దానిని సరిచేసుకొనుము.

576 ఆయన దానిని చేసినట్లైతే, సంఘము మీ హృదయమంతటితో ఆయనను నమ్ముతారా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] నేను నమ్ముతాను, నీవు నమ్ముతావు, ఆయన దానిని చేసినా చేయకపోయినా. నీవు ఇంకనూ దానిని నమ్ముతావు, ఇది ఒక్కటి మాత్రమే దానిని బిగిస్తుంది.

577 ఇప్పుడు, నేను ఆ స్త్రీ వైపు చూస్తున్నాను, ఆమె అభిషేకించబడుచున్నది. ఆమె నాకు ఒక క్రొత్త వ్యక్తియైయుండి, ఆమె గ్రహింపు కలిగియున్నది.

578 కానీ నన్ను ఒకటి మీకు ఇప్పుడు చూపనివ్వండి. మీలో అనేకమంది ఆ వ్రేలాడుచున్న చిత్రమును చూస్తారు. ఇప్పుడు, పైన యున్న ఆ వెలుగు కాదు. అది ఖచ్చితముగా ఇప్పుడే నాకు మరియు స్త్రీకి మధ్యలో వ్రేలాడుచున్నది. నీవు దానిని చూడవా? ఒక విధమైన గోధుమ రంగు, పసుప పచ్చ, పచ్చగాయున్న వెలుగు, మనము పిలుచునట్లుగా, అది తిన్నగా సుడులు వేయుచున్నది…అదే ఆమెకు అనుభూతినిస్తుంది.

579 ఇప్పుడు, నేను ఒకటి మీకు చూపిస్తాను. ఒక నిజమైన-తియ్యని దీనమైన అనుభూతి నీకు కలుగుతుంది. అది నిజమైతే, ఓ, స్త్రీ, ప్రజలు చూడగలుగునట్లుగా నీ చేతిని ఎత్తుము. [ఆ సహోదరి “అవును,” అని చెప్పుచున్నది.—ఎడి.] చూడండి? [“హల్లెలూయ.”] అది తిన్నగా అక్కడ యున్నదని. ఆమె దాని నుండి అనుభూతి చెందకుండా యుండలేదు. చూడండి?

580 ఇప్పుడు, అది ఆమెపై బ్రద్దలగుచున్నది. నాకు తెలియదు, అది ఆధారపడియున్నది. అది దేవుడుగా యుండవలసియున్నది. నాకై నేను దానిని చేయలేను. దేవుడు దానిని చేయవలసియున్నది.

581 అవును, ఆ స్త్రీ నిజముగా ఒక ఆపరేషన్ ను వాయిదాలో యుంచింది. వైద్యుడు ఆమెతో చెప్పినది ఒకటియున్నది, “అది తప్పక ఆపరేషన్ యైయున్నది,” కానీ ఆమె వైద్యుని యొద్దకు వెళ్ళుటలేదు. అది నిజము. [ఆ సహోదరి, “లేదు. యేసు నా వైద్యుడు,” అని చెప్పుచున్నది.—ఎడి.] అది ఒక కణితియైయున్నది. ఆ కణితి వెన్నుపూసకు కుడి ప్రక్కనయున్నది. అది నిజము. అది నిజమైతే నీ చేతిని ఎత్తుము, ఆ ప్రకారము ప్రజలు చూడగలరు. [“అది నిజము.”]

582 ఇప్పుడు నీవు నమ్ముచున్నావా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] నీవు దానిని చూచుట లేదు, (చూడు? చూడు?) కానీ నీ హృదయమంతటితో అది సత్యమైయున్నదని నీవు దానిని నమ్ముచున్నావు, మంచిది. మంచిది.

583 నీవంటావు, “బహుశా, నీవు దానిని ఊమించావు, బ్రెన్హాం సోదరుడా.” నీవు దానిని ఊహించలేవు. అది ఒక పదిలక్షల సార్లు పరిపూర్ణమైనది.

584 ఒక్క నిమిషము, ఆమెను అక్కడ నిలబడనియ్యండి, అది తిన్నగా నా యొద్ద నుండి వెళ్ళిపోయింది. [ఆ సహోదరి “అవును,” అని చెప్పుచున్నది.—ఎడి.] ఇప్పుడు ఒక్క క్షణము చూద్దాము, చూడండి, [“హల్లేలూయ.”] ఆమె బాగుగాయున్నట్లు కనబడుతుంది; క్రైస్తవురాలు. ఇప్పుడు, ఆయన ఇంకా ఏదైనా చెపుతాడేమో, మనము చూద్దాము. అవును, అది తిరిగి పైకి వచ్చుచున్నది. [“ఓ, లేదు.”] అవునండి, అవును. అది ఒక కణితి. దానిని వైద్యులు తొలగించాలి. అదే ఆమెను ఇబ్బంది పెట్టేది. కానీ ఆమె దాని కొరకు నమ్మబోవుచున్నది.

585 అది మాత్రమే కాదు. ఆమె ఇక్కడ వ్యక్తి కాదు. ఆమెతో ఎవరోయున్నారు. అది ఆమె భర్త. అతడును బాధపడుచున్నాడు. అది నిజము. నేను ఆమె మనిషి వైపు తిన్నగా దర్శనములో చూస్తూయుండగా, ఆ మనిషి ఇబ్బంది యేమిటో, దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముతావా? [ఆ సహోదరి “అవును,” అని చెప్పుచున్నది.—ఎడి.] మంచిది, వెళ్ళి అతని రాత్రి భోజనం చెయ్యమని చెప్పండి. అతని కడు బాధ అతనిని విడిచిపెట్టింది. క్రీస్తు దానిని చేస్తున్నాడని నీవు నమ్ముతావా? [“అవును.”] నీవు టెన్నెసీ నుండి వచ్చావు [“అవును.”] నాష్ విల్ [“అవునండి.”] అది నిజము. శ్రీమతి బింక్ లే, మంచిది. నీవు గృహమునకు వెళ్ళుము స్వస్థతనొందుము, నీవు, నీ భర్త, దేవుడు మిమ్మును దీవించును.

586 యేసుక్రీస్తును నీవు నమ్ముచున్నావా? [సమాజము సంతోషించుచున్నది—ఎడి.] గతించిన దినములలో ఇక్కడయున్న అదే యేసు, ఈ సాయంకాలపు వెలుగు సంఘములో ఉన్నవాడు ఆయనే కాడా? ఆ స్త్రీని పరీక్షించండి, ఆమెతో మాట్లాడండి, ఆ చెప్పబడిన సంగతులు సత్యమో కాదేమో అడగండి. నీవు నమ్మగలిగినట్లైతే. ఇప్పుడు ఆయన ఒకేరీతిగాయున్న అదే క్రీస్తు అని నీవు తృప్తి చెందియున్నావా? [“ఆమేన్.”] ఇప్పుడు, నీకు తెలుసా, నేను దానిని చేయలేను. నేను ఒక మనిషిని, నేను నీ సోదరుడను, ఆయన దేవుడైయున్నాడు.

587 మనము చూద్దాము. తరువాత వ్యక్తి ఇతడేనా? ప్రార్థనా వరుసలోయున్నది నీవేనా? మంచిది.

588 నిజానికి ఆ అభిషేకము, నన్ను బలహీనపరుస్తుందని, నీవు గ్రహించావా? అది యేమిటో నాకు తెలియదు. ఆ చిన్న స్త్రీ, యేసు యొక్క వస్త్రమును ముట్టినపుడు, ఆయన అన్నాడు, “నాలో నుండి ప్రభావము వెడలిపోయినదని నేను గ్రహించుచున్నాను.” అది నిజమేనా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] దాని భావము, “బలము.” ఆయన బలహీనుడయ్యాడు. దానికై అది, వాక్యమునకే అది సంభవించిన యెడల, వాక్యము ప్రత్యక్షమైనవారికి ఏమి చేస్తుంది? అది ఏమి చేస్తుంది? దేవుని యొక్క కుమారునికి ఆలాగు చేసినయెడల, కృప ద్వారా రక్షించబడిన పాపినైన నాకు అది నాకు ఏమి చేస్తుందో చూడండి. అది సరిగ్గా నా చుట్టూ ఈతకొడుతూ యుంటుంది. చూడండి?

589 కానీ, ఇంకనూ, ఆయనకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడయున్నాను. నేను దీనమైన ప్రతినిధిని. నా పాపములన్నిటి గురించి నేను పశ్చాత్తాపపడ్డాను, కాబట్టి నేను ఏమైయున్నానో నా వైపు మీరు చూడవద్దు, కానీ ఆయన ఏమైయున్నాడో ఆయన వైపు చూడండి, ఆ మార్గములో మీరు చూడండి.

590 ఓ స్త్రీ, ఇప్పుడు నేను నీకు క్రొత్తవాడను. ఈ స్త్రీ ఎవరో కూడా నాకు తెలియదు. మనము ఒకరికి ఒకరము క్రొత్తవారము. అది నిజము. ఇప్పుడు ప్రభువైన యేసు, (నీవు నాకు తెలియదు, నేను నీకు తెలియదు), నాకు ఏదైనను, ఇక్కడ నీవు ఎందుకొరకు యున్నావో నాకు బయలుపర్చినట్లైతే, నీవు చేసియున్నది లేదా నీవు చేయకూడనిది, ఆ మార్గములో, అప్పుడది ఒక విశేషమైన అద్భుతముగా యుంటుంది. అది ఏదో వివరించబడలేనిది. ఒక అద్భుతమనగా అది వివరించబడలేనిది. ఎవరికైనా అది తెలుసు. చూడండి? అది ఒక విశేషమైన అద్భుతముగా యుంటుంది.

591 ఇక్కడ చక్రాల కుర్చీలో, నరముల బలహీనతతోయున్న, కుంపటి మీద పెట్టబడియున్న స్త్రీ కంటే, అది ఎక్కువైన అద్భుతముగా యుంటుంది. “నీవు లేచి నడువుము,” అని నేను చెప్పినట్లైతే, ఇక్కడ నుండి ఆమె నడిచి వెళుతుంది, ప్రతిఒక్కరూ ఆమెను చూసి కేకలు పెడతారు. కానీ, మీరు చూడండి, నిజానికి విశ్వాసపు శక్తి, నమ్మిక ద్వారా, ఆమె లేచి నడుచునట్లు చేస్తుంది.

592 కానీ వెనుకకు వెళ్ళి, ఎక్కడనుండో ఒక జీవితమును బయటకు తెచ్చుట, దానికంటే ఎక్కువ తీసుకొంటుంది. అది దేవునిని మాత్రమే తీసుకొంటుంది, అక్కడ నీవు చూడగలవు, చెప్పగలవు. అది సరియో కాదో నీకు తెలుసు.

593 ఇప్పుడు, ఎక్కడో ఏదో సంభవించింది, ఇప్పుడు కనిపెట్టండి. అది ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. అది శ్రోతలలోనికి, ఎక్కడికో వెళ్ళిపోయినది. ఇప్పుడు అది వెళ్ళిపోయినది.

ఒక్క నిమిషము, ఈ స్త్రీతో మరలా నన్ను మాట్లాడనియ్యండి.

594 ఇప్పుడు, చాలా మర్యాదగా యుండండి, గమనించండి. ప్రార్థించండి, బయట ప్రార్థన చేయుచూయుండండి. మీరు ప్రార్థన చేయాలని నేను కోరుచున్నాను. “ప్రభువా, అది నన్నుగా యుండనివ్వండి.” కొందరు ఆ బయట ప్రార్థనా వరుసలో లేనివారు, ప్రార్థనలో యుండండి, ప్రార్థించండి.

595 మరలా నేను నీతో మాట్లాడుచున్నాను…మీ విశ్వాసము కొరకు. చూడండి? అది ఆ స్త్రీకి జరిగించబడినట్లైతే, అది నీకును జరిగించబడుతుంది. అది నీ యొక్క విశ్వాసమైయున్నది. చూడండి? దానిని జరిగించేది నీవే. అది నేను కాదు. అది దేవుని యందలి నీ విశ్వాసమైయున్నది. చూడండి?

596 “ఓ, నేను ఆ స్త్రీని అక్కడ కలుసుకొనబోవుచున్నానని యేసు ఎన్నడూ చెప్పలేదు.” లేదు.

597 కానీ లాజరు యొక్క పునరుత్థానము వచ్చినపుడు, అదే ఆయనకు దేవుడు చేయమని చూపించినది. చూడండి? దేవుడు అన్నాడు, “దూరముగా వెళ్ళిపో.” ఆయన ఏమైయున్నాడో ఆయన రుజువు చేశాడు. ఆయన దూరముగా వెళ్ళిపోయాడు. మరలా ఆయన తిరిగి వచ్చినపుడు, “లాజరు నిద్రించుచున్నాడు,” అని అన్నాడు. ఆయన తిరిగివచ్చి, లాజరును సమాధిలోనుండి లేపాడు. అతడు వెళ్ళిపోయిన నాలుగు దినములకు, అతని ఆత్మను పిలిచాడు. అక్కడ నేను బలహీనుడనయ్యానని ఆయన ఎన్నడూ చెప్పలేదు. అది దేవుడు తన వరమును వాడుచున్నాడు.

598 కానీ ఈ స్త్రీ, ఆయనను తాకినపుడు, అది ఆ స్త్రీయే దేవుని వరమును వాడుచున్నది.

అది ఇక్కడ అదే కార్యము. అది చేయుచున్నది నీవే.

599 ఈ వేటాడు సమయములో…నేను ఎలుగుబంటిని చూశాను, ఆ వివిధమైన సంగతులు, అవన్నియూ ముందుగా చెప్పబడియున్నవి మరియు మాట వెంబడి మాట నెరవేరియున్నది. అది దేవుడై యున్నాడు. అది నన్ను ఇబ్బంది పెట్టదు.

600 కానీ, ప్రజలు దేవుని యొక్క వరమును వాడుట ఆరంభించినపుడు, నీవు దేవుని యొక్క ప్రజా సేవకుడిగా మారతావు, కారణము నీవు సరిగ్గా మార్గములో నిన్ను తట్టనియ్యవలసియున్నది. చూడు?

అప్పుడు దాని ద్వారా నీవు ఆయనను తాకుతావు, తరువాత ఆయన తిరిగి మాట్లాడును. చూడు?

601 అవును, ఇప్పుడు ఆ స్త్రీ దర్శనములోనికి వచ్చుచున్నది. ఆమె లోనికి వచ్చుచున్నది, దర్శనములోనికి కదులుచున్నది. ఆమె చుట్టూ నీవు చూస్తున్నట్లుగా కనబడుచున్నది. ఆ స్త్రీ వ్యాధితో యున్నది. ఆమె బాగా రోగిగా యున్నది. ఆమె ఒక్కటి, కడుపునొప్పితో బాగా బాధపడుచున్నది. అది నిజమైతే నీ చేతిని ఎత్తుము. నీవు ఎన్నో ఇబ్బందులను కలిగియున్నావు. అది నిజము.

602 నీతో ఎవరోయున్నారు, అది నీ భర్తయైయున్నాడు. అతడు రోగిగాయున్నాడు. [ఆ సహోదరి, “అది నిజము,” అని చెప్పుచున్నది.—ఎడి.] నీ భర్తతోయున్న ఇబ్బంది ఏమిటో, దేవుడు నాకు దానిని బయలుపరచినట్లైతే, ఆయన ప్రవక్తగా నీవు నన్ను నమ్ముతావా? అతడు కన్నులలో, చెవులలో ఇబ్బందితో ఎంతో హీనముగా బాధపడుచున్నాడు. [“అవును. అవును. దేవునికి మహిమ కలుగును గాక! దేవునికి మహిమ కలుగును గాక!”] అవునండి.

603 నీవు ఎవరవో దేవుడు ఎరుగునని నమ్ముతావా? [ఆ సహోదరి, “అవును,” అని చెప్పుచున్నది.—ఎడి.] నీవు ఎవరివైయున్నావో నేను చెప్పినట్లైతే, నేను ఆయన ప్రవక్తగా, ఆయన దీర్ఘదర్శిగా నీవు నమ్ముతావా? [“అవును.”] నీవు నమ్ముతావా? శ్రీమతి రాబర్ట్ సన్, నీవు అలబామాలోని హంట్స్ విల్ నుండి వచ్చావు. తిరిగి వెళ్ళుము, నీ భర్త స్వస్థత నొందుము.

604 నీవు నమ్ముచున్నావా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] “నమ్మువానికి సమస్తమూ సాధ్యమే.” నీవు నమ్మగలిగినట్లైతే, సరిగ్గా నీ స్థానమును తీసుకొని, దేవుడు దానిని చేస్తాడని నమ్ము, ఇప్పుడు సందేహించవద్దు. నీ స్వస్థతను దేవుడు నీకు దయ చేశాడని, నీ హృదయమంతటితో నమ్ముము. అప్పుడు నీవు అడిగినది పొందుతావు.

605 అయ్యా, మంచిది. అయ్యా మనము ఒకరికి ఒకరము క్రొత్తవారమని భావించుచున్నాను. సీమోను అను మనిషి దగ్గరకు యేసు వచ్చి, అతని స్థితినంతా చెప్పాడు, అది సీమోనును అతని హృదయమంతటితో నమ్మునట్లు చేసియున్నది. అది నిన్నును ఆ ప్రకారమే చేయనిస్తుందా? [ఆ సహోదరుడు “అవును,” అని చెప్పుచున్నాడు.—ఎడి.] అది చేస్తుంది. మంచిది, మనము క్రొత్తవారము.

606 ఇప్పుడు, దేవునికి స్త్రీ అని పురుషుడని వ్యత్యాసము లేదు. ఆయన ఒకేరీతిగా యున్నాడు. ఆయన దేవుడై యున్నాడు. చూడండి?

607 నీవు దానిని నమ్ముతావా, (ఆ భావన ఇప్పుడు నీ చుట్టూయున్నది), ఇప్పుడు ఆయన సేవకుడనైన నా ద్వారా, నీవు ఇక్కడ ఎందుకు యున్నావో, నీ ఇబ్బంది ఏమిటో, అది ఏమైయున్నప్పటికీ, నా ద్వారా బయలుపర్చుతాడని నమ్ముతావా? బాగుంది, అది సత్యమో కాదో నీకు తెలుసు. మంచిది. ఆయన దయచేయును గాక.

608 ఇప్పుడు, ఆ మనిషి దర్శనములోనికి వస్తున్నాడు, లేక ఆ దర్శనము మనిషిలోనికి వస్తున్నది. అతడు వ్యాధి కొరకు ఇక్కడ లేడు. అతడు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును వెదుకుచున్నాడు. అదే అతడు వెదుకుచున్నాడు. అయ్యా, అది నిజము. అవునండి. నీవు ఇక్కడివాడవు కాదు, ఇండియానాలోని, సేమర్ నుండి నీవు వచ్చావు. వారు నిన్ను “బిల్,” అని పిలుస్తారు. ఇంటికి వెళ్ళుము, యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుము. నమ్ముము.

609 ఓ స్త్రీ, రమ్ము. ఆయన ప్రవక్తగా నీవు నన్ను నమ్ముచున్నావా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు జీవించుచున్నాడని నీవు నమ్ముచున్నావా? అది సంభవించునట్లు ఆయన దానిని అనుమతించుచున్నాడని నీవు నమ్ముచున్నావా? నీవు దానిని నమ్ముచున్నావా?

610 మనము ఎంతమందిని కలిగియున్నాము? ఏమిటి? చూడండి, నేను మరి ఎక్కువగా బలహీనుడుగా మారగోరుటలేదు. మంచిది.

611 లేదు. అది ఏమీకాదు; ఇక్కడ నీవు నీ కొరకు లేవు. నీవు ఇక్కడ మరొకరి కొరకు యున్నావు. అది మరొకరు, వారు ఇక్కడ లేరు. ఆ వ్యక్తితో యున్న ఇబ్బందిని నేను చెప్పినట్లైతే, నీవు స్వస్థతను అంగీకరించి, నమ్మి తీసుకొని వెళతావా? అది కేన్సర్. వారు స్వస్థపడతారని నీవు నమ్ముతావా? అలాగైతే, యేసుక్రీస్తు నామములో వెళ్ళు, నమ్ముము.

612 మీరందరూ నమ్ముతారా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును నీవు నమ్ముచున్నావా? [“ఆమేన్.”] ఆయన ఆశ్చర్యకరుడు కాడా? [“ఆమేన్.”] నీవు నమ్ముచున్నావా? [“ఆమేన్.”] మంచిది.

613 ఇప్పుడు, మనము ఎంతమందిని కలిగియున్నాము? సాధారణముగా ఇద్దరు లేక ముగ్గురు, ఒక రుజువైయున్నది. [కొంతమంది “ముగ్గుర్ని,” అని చెప్పుచున్నారు.—ఎడి.] ఏమంటారు? [ఎవరో “నీవు నలుగుర్ని కలిగియున్నావు” అని చెప్పారు.] నలుగురా? [“అవును.”] అక్కడ ఐదవ వ్యక్తి నిలబడియున్నాడా? మంచిది.

614 యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడని, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడని, మన హృదయమంతటితో నమ్ముదాము.

615 ఆ బిడ్డ కొరకు నీవు ఇక్కడయున్నావు. ఆ బిడ్డ యొక్క ఇబ్బంది ఏమిటో దేవుడు నాకు బయలుపర్చినట్లైతే, దేవుడు దానిని స్వస్థపర్చుతాడని నీవు నమ్ముచున్నావా? ఆ చిన్నవాడు ప్రమాదకరమైన గుండె జబ్బును కలిగియున్నాడు. అది నిజము. ఆ చిన్న బిడ్డ ఇక్కడిది కాదు, అది వేరే నగరములోనుండి వచ్చియున్నది. వేరే రాష్ట్రము నుండి వచ్చియున్నది. ఆ బిడ్డ ఎక్కడ నుండి వచ్చియున్నదో, దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్మి, స్వస్థతనొందుతావా? తిరిగి కెంటక్కీలోని, ప్రాంక్ లిన్ కు తీసుకొని వెళ్ళుము, అవును, అమ్మా, నీ హృదయమంతటితో నమ్ముము. నీవు నమ్మినట్లైతే, నీవు చేయవలసినదంతా అదియే.

616 ఒక్క క్షణము ఇక్కడకు రమ్ము. ఆ చెడును నేను ఖండించుచున్నాను. యేసుక్రీస్తు నామములో మరణము వెళ్ళిపోయి, జీవము వచ్చునుగాక.

“వారు రోగుల మీద చేతులను ఉంచినపుడు, వారు స్వస్థత నొందుదురు.”

నీవు వెళ్ళి భుజించగోరుచున్నావా? ఆయన నిన్ను బాగుచేస్తాడని తలంచుచున్నావా? వెళ్ళుము, అది నిన్ను విడిచిపెట్టియున్నది. ఆమేన్.

617 ఆ స్త్రీ సంబంధమైన వ్యాధి నిన్ను విడిచిపెట్టబోవుచున్నదని నమ్ముచున్నావా? మంచిది. నీ కుర్చీలోనికి వెళ్ళి, “ప్రభువా, నీకు వందనములు,” అని చెప్పుము.

అయ్యా, నీవు ఎలా ఉన్నావు? ఓ, ఆ దయ్యము, ఆస్తమా!

618 ఒక్క క్షణము, ఇప్పుడు ఒక్క క్షణము. ఏదో తప్పు జరిగింది…ఏదో తప్పులోనికి వెళ్ళలేదు; సరిగానే వెళ్ళింది. ఇప్పుడు, ఆలాటిదే, ఆ మనిషిని ఆ సమయములో పట్టుకొన్నది. అది ఏమైయున్నదో మరలా నన్ను చూడనివ్వండి. ఇప్పుడు నావైపు చూడు. ఏదీ చెప్పవద్దు. ఒక్క క్షణము.

619 అది ఒక నల్లజాతి మనిషి, అక్కడ కూర్చొని, నా వైపు చూస్తున్నాడు. రోగిగాయున్న ఒకరిని అతడు కలిగియున్నాడు. అది నిజము. ఆస్తమా మరియు శ్వాసకోశ వ్యాధిని కలిగియున్నాడు. అది నిజము. నీవు ఆయనను తాకావు. నీవు ఇక్కడవాడవు కాదు. అయ్యా, నీవు తూర్పు నుండి, ఉత్తర తూర్పు నుండి వచ్చావు. నీవు ఈ వైపున, న్యూయార్క్ నుండి వచ్చావు. అవునండి. అది నిజము. నీ పేరు శ్రీ. హంట్. ఇప్పుడు నీవు నమ్ముచున్నావా? మంచిది, అయ్యా. అది బాగుంది.

620 నీ ప్రక్కన కూర్చొన్నది, నీ స్నేహితుడు, ప్రార్థించుచున్నాడు. అయ్యా! దేవుని యొక్క ప్రవక్తగా నీవు నన్ను నమ్ముచున్నావా? [సోదరుడు కోల్ మెన్ నిశ్చయతతో సమాధానం చెప్పాడు.—ఎడి.] నీవు అతనితో ఇక్కడికి రమ్ము. నీ పేరు కోల్ మెన్. [“అవును. హల్లేలూయ!”] నీవు తండ్రి కొరకు ప్రార్థించుచున్నావు. [“అవును.”] ఆయనకు పక్షవాతము వచ్చింది. అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. [“హల్లేలూయ.”] నమ్ముము. వెళ్ళు, ఇప్పుడు నమ్ము, అది నిన్ను విడిచిపెడుతుంది.

621 నీవు నరములతో కూడిన కడుపు బాధను కలిగియున్నావు, అది నిన్ను ఇబ్బందిపెడుతుంది. అది నిజమేనా? వెళ్ళి, భోజనము చెయ్యి. ప్రభువైన యేసు నామములో, ఆయన నిన్ను స్వస్థపరచియున్నాడని నమ్ముచున్నావా? వెనుకకు వెళ్ళి, “ప్రభువైన యేసు, నీకు వందనములు,” అని చెప్పుము. నీ హృదయమంతటితో నమ్ముము.

622 నీవు నరముల బలహీనతతో ఇబ్బంది పడుతున్నావు, అంతా కలవరముగా యుంటావు. నీ హృదయమంతటితో నమ్ముము. వెనుకకు వెళ్ళు, స్వస్థతనొందుము.

623 నరముల బలహీనత. నీ హృదయమంతటితో నమ్ముము. దేవుడు నిన్ను బాగుచేస్తాడని నమ్ము, ఆయన దానిని చేస్తాడు. ఒక్క రవ్వంత అనుమానించవద్దు.

624 నరముల బలహీనత, గుండె జబ్బు. యేసుక్రీస్తు నిన్ను బాగుచేస్తాడని నమ్ముచున్నావా? యేసు నామములో స్వస్థత నొందుము.

625 నరముల బలహీనత, కడుపు జబ్బు, కడుపులోని గాస్ ను బట్టి ఆహారము పుల్లగా మారుతుంది, కలవరముగా యున్నావు. వెళ్ళు, నీ హృదయముతో సందేహించవద్దు. అది నిన్ను ఎంతమాత్రము ఇక బాధించదు, అది నెరవేరుతుంది.

626 నీ వెన్ను నిన్ను బాధిస్తుంది. నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? అలాగైతే వెళ్ళు, దాని నుండి యేసు నిన్ను బాగుచేశాడు.

627 ఒక్క క్షణము, ఒక్క నిమిషము, ఆగండి. ఇప్పుడు ఏదో సంభవించింది. ఈ స్త్రీ క్రొత్త వ్యక్తి. ఈ వెలుగు ఎంతో వేగముగా ఆమె చుట్టూ తిరిగింది, తరువాత వెళ్ళిపోయింది; తిన్నగా తిరిగి వెనుకకు వెళ్ళిపోయింది. ఏదో సంభవించియున్నది. ఒక్క క్షణము. అది ఒక నల్ల జాతి మనిషి. అతడు ఒక నల్ల జాతివాడని నేను నిశ్చయించుచున్నాను. కారణము ఒక్క నిమిషము, అది వచ్చియున్నది, అది ఇక్కడయున్నది (బిల్లీ, వెనుకకు వెళ్ళు.) అది ఇక్కడయున్నది.

628 ఇక్కడ కూర్చొన్నది నల్లజాతి మనిషేనా. నీవు కూడా వెన్నుపోటుతో బాధపడుచున్నావు. అది నిజము. నీవు నాకు క్రొత్తవాడవు. నేను నీకు క్రొత్తవాడను. కానీ ఆ వెన్నుపోటు కంటే శ్రేష్ఠమైనది నీకు అవసరము, నీ హృదయమును క్రీస్తుకు ఇమ్ము, ఒక క్రైస్తవుడవుకమ్ము. నీ రక్షకుడిగా ఆయనను అంగీకరిస్తావా? నీవు ఒహియో నుండి వచ్చావు, అది నిజము. ఒహియో, తిరిగి వెళ్ళు, స్వస్థతనొందుము. యేసుక్రీస్తు నీ పాపములను క్షమించును. నీవు ఇంటికి వెళ్ళుము, స్వస్థతనొందుము. ఇప్పుడు అంతా సమాప్తమైనది. ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళవచ్చు. నీ హృదయమంతటితో నమ్ముము.

629 మంచిది, సహోదరీ, రమ్ము. నరముల బలహీనత, ఎన్నో ఇబ్బందులు, చింతతోయున్నావు. దేవుడు నిన్ను బాగుచేస్తాడని నీ హృదయమంతటితో నమ్ముతావా? నీ కుర్చీలోనికి వెళ్ళి, “ప్రభువైన యేసు, నీవు చేసిన దానంతటిని బట్టి, నీకు వందనములు,” అని చెప్పు.

630 ఆ సర్వశక్తిగల దేవుడు, నిన్ను బాగుచేసి, నీ వెన్నును, నీ మూత్రపిండముల వ్యాధిని బాగుచేస్తాడని నీవు నమ్ముచున్నావా? తిన్నగా నీ దారిని ఆనందించుచు వెళ్ళు, “ప్రభువైన యేసు, నీకు వందనములు,” అని చెప్పు.

631 కుమారుడా, నీవు నమ్ముచున్నావా, నిన్ను ఆయన బాగు చేయును? “ప్రియమైన దేవా, నీకు వందనములు,” అని చెప్పు, దేవుని స్తుతిస్తూ వెళ్ళుము.

632 సహోదరీ, ఇప్పుడు నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? అలాగైతే వెళ్ళు, యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును.

633 ఒక్క క్షణము. లేదు, అది ఆమె కాదు, ఒక్క నిమిషము. అది అక్కడయున్న స్త్రీ కాదు. ఒక్క క్షణము. ఒక్క క్షణము సరిగ్గా.

634 నీళ్ళు చిందుచున్నట్లు చూసియున్నాను. ఇక్కడ ఎవరో సముద్రమును దాటి ఇక్కడకు వచ్చియున్నారు. అది ఒక స్త్రీ, ఆమె హాలెండ్ నుండి వచ్చింది. ఆమె ఎక్కడయున్నది? అక్కడేయున్నది. మంచిది సహోదరీ, నీవు స్వస్థత కొరకు, ఎంతో దూరము నుండి వచ్చియున్నావు. ఆయన ప్రవక్తగా నీవు నన్ను నమ్ముచున్నావా? [ఆ సహోదరి “ఓ, అవును,” అని చెప్పుచున్నది.—ఎడి.] నీవు రొమ్ముపడిశెముతో, నరముల వ్యాధితో బిగుసుకొనుటతో బాధపడుచున్నావు. యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుము, నీ ప్రజలకు వర్తమానమును తీసుకొనివెళ్ళుము. ప్రభువు నిన్ను దీవించునుగాక. అది నిన్ను విడిచిపెడుతుంది, వెళ్ళి స్వస్థత నొందుము. ఆమేన్.

నీవు నమ్ముచున్నావా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.]

635 ఇక్కడ, వెనుక ఒక స్త్రీ కూర్చొనియున్నది, తిన్నగా వెనుక. ఆమె పిత్తాశయపు వ్యాధితో బాధపడుచున్నది. ఓ, ఆమె దాని నుండి తప్పింపబడబోవుచున్నది, దేవా నాకు సహాయము చేయుము. ఆమె ఇండియానాపొలిస్ నుండి వచ్చియున్నది. ఓ, స్త్రీ, నీవు ఎక్కడయున్నావో అక్కడ నిలబడుము. అక్కడే నీవున్నావు. ఆమె పేరు గిల్ బర్ట్. యేసుక్రీస్తు నామములో స్వస్థతనొందుము.

636 మీరందరూ మీ హృదయమంతటితో నమ్ముచున్నారా? [సమాజము “ఆమేన్,” అని చెప్పుచున్నది.—ఎడి.] యేసు మృతులలో నుండి లేచియున్నాడా? [“ఆమేన్.”] ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకేరీతిగా యున్నాడా? [సమాజము ఆనందించుచున్నది.] నేను సహోదరి కెల్లీ కొరకు ప్రార్థించుచుండగా, మీరు ఒకరి మీద ఒకరు చేతులుంచి ప్రార్థించండి.

637 ప్రభువైన యేసు, నీ పరిశుద్ధమైన శక్తి, సంఘములోనికి ఇప్పుడు వచ్చియున్నది! అది దీని గుండా తుడిచివేసి, మా సహోదరి ప్రాణమును కాపాడునుగాక, ప్రభువా. ఆమె కోరుకొన్న గొప్ప స్వస్థతను ఆమెకు ఇమ్ము, ప్రభువా. ఇక్కడ నీ ప్రజలను స్వస్థపర్చుము. నీకు మహిమ తెచ్చుకొనుము. ప్రభువా, దానిని దయచేయుము.

638 ఇక్కడ ప్రజలు, ఒకరి మీద ఒకరు హస్తములను ఉంచియున్నారు.

639 సాతానా…

ఇప్పుడు, మేము చేతి రుమాళ్ళు యొద్దకు వస్తున్నాము; యేసుక్రీస్తు నామములో, ప్రతీ ఒక్కరూ స్వస్థపడుదురుగాక. ప్రభువా, సూచనలను వెంబడింపచేస్తూ నీ వాక్యమును రుజువు చేయుము.

640 ఇప్పుడు, సాతానా, దయ్యపు పక్షి, నీవు ఓడిపోయావు. మీ ఆచారముల ద్వారా మీరు మోసగించిన దేవుని కుమారుడిని ఆయన పునరుద్ధరిస్తానని చెప్పియున్నాడు. సాయంకాలపు వెలుగులు ప్రకాశించుచుండగా, ఆయన సంఘమును దాని యొక్క మొదటి స్థితికి దానిని పునరుద్ధరిస్తానని ఆయన వాగ్దానము చేశాడు. మేము దానిలో జీవించుచున్నాము. పునరుద్ధరించుటకు, మేము హక్కును కలిగియున్నాము, మేము మా ఉత్తరవాదిని, మా న్యాయవాదిని, మా ప్రధాన యాజకుడిని కలిగియున్నాము, మేము దావాను అమలుచేస్తాము. నీవు దీర్ఘకాలము వారిని పట్టుకొనియున్నావు. నీవు ఇక ఎంతమాత్రము దానిని చేయలేవు. యేసుక్రీస్తు నామములో, ఆయన పునరుత్థాన శక్తి ద్వారా, ఇక్కడయున్న పరిశుద్ధాత్మ ద్వారా. నీకు ఆజ్ఞాపించుచున్నాము; శ్రోతలలో నుండి బయటకు రా! [సమాజము గొప్పగా సంతోషించుచున్నది—ఎడి.] 

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...