సమస్తమును స్వాధీనపరచుకొనుట

సమస్తమును స్వాధీనపరచుకొనుట

VGR COUNT-146 1నేను ఇక్కడ ఉండుటను బట్టి ఎంతగానో కృతజ్ఞత కలిగియున్నాను. నాకు చిన్న ప్రమాదము జరిగిన సంగతిని మీరు విన్నప్పుడు నా కొరకు ప్రార్ధించినందుకు మిమ్మును మెచ్చుకొనుచున్నాను. నిన్ను అవతలి గట్టుకు తీసుకొని వెళ్ళుటకు దేవుని యొక్క సిద్ధపాటు లేకుండా సాతానుడు నిన్ను తీసుకు వెళ్ళలేడు అని అది చూపిస్తున్నది. మీలో అనేకులు అది ఏ విధంగా జరిగిందా… అని తలస్తున్నారని నేను ఊహిస్తున్నాను. నాకు ఎల్లప్పుడు ఇష్టము. మీరెరిగిన విధముగా నా ఆసక్తి, లేక దేనిద్వారా సేద తీరుతానో, చేపలను పట్టుటకు వెళ్ళుట ద్వారా, లేదా తుపాకీతో గురిచూసి పేల్చుట ద్వారా, లేదా వేటకు వెళ్ళుట లేదా ఏదో విధముగా వీటిల్లో ఒకదాని ద్వారా నేను సేదతీరుతాను. దానిని బట్టి నేను సంతోషిస్తాను. ఒకవేళ నేను గోల్ఫ్ ఆడటానికి వెళ్ళినట్లయితే అచ్చటకు వచ్చే స్త్రీలు అర్థనగ్నముగా ఉంటారు. ఒకవేళ నేను బంతి ఆటను ఆడే క్రీడాకారుడనైతే అది ఎలా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి బయట ప్రదేశములలో చేపలు పట్టుట, వేటాడుట మరియు మొదలగువాటిని బట్టి నేను సంతోషిస్తున్నాను.

2మాగ్నమ్ తుపాకీలలో వెదర్బై మేగ్నమ్ తుపాకీ అంటే ఎల్లప్పుడూ నేను ఎంతగానో ఇష్టపడుదును. ఒకవేళ నేను దానిగూర్చి చెప్పినట్లయితే ఎవరో ఒకరు దానిని నాకు కొని ఇస్తారని తెలుసు, అందుకే ఆ రహస్యము నాలోనే ఉంచాను, ఎందుకంటే అది చాలా ఖరీదు. పరిచర్యలో మిషనరీలకు కాళ్ళకు చెప్పులు లేని సంగతి నాకు తెలుసు. ఒక తుపాకీకి ఇంత డబ్బును ఖర్చు పెట్టుట కంటే ఎవరో ఒకరు ఆ పరిచర్య చేయు సేవకులకు దానిని ఖర్చు పెట్టుట మంచిది. 257 రాబర్ట్స్, 70 వెంచెస్టర్ అనే ఒక రకపు తుపాకీని సహోదరుడు ఆర్ట్ విల్సన్ బిల్లీకి కొద్దికాలము క్రితము ఇచ్చెను, కాని ఇదే రకపు తుపాకీని కొంచెం దాని రూపును మార్చి కొన్నింటిని చేర్చి మంచి భద్రత గలిగిన ఒక వెదర్బై మాగ్నం తుపాకీగా మార్చి తక్కువ వెలతో దానిని అమ్ముచున్నట్లుగా శ్రీ. వెదర్బై దానిని గూర్చి ఒక వార్తా పత్రికలో ఈ ప్రకటన వేసెను. కాబట్టి సహోదరుడు రాడ్ని అనే ఆయన ఈ సంఘమునకు వస్తూ వుండేవాడు, ఆ సహోదరుడు రాడ్నీ ఆర్న్స్టాంగ్ 670 వించెస్టర్ తుపాకీని తీసుకొని వెళ్ళి దానిని ఒక వెదర్బై మాగ్నం తుపాకీగా మార్చేశాడు. కాని అది సరిగా అమర్చబడలేదు. కావున నేను దానితో ప్రేల్చాను… వించెస్టర్ కంపెనీ వారు ఆ తుపాకీ యొక్క సామర్థ్యము 6,900 వందల పౌండ్ల ఒత్తిడిని భరించగలదని చెప్పిరి. అది ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు.

3నేను తుపాకీ ఎక్కుపెట్టాను, సహో వుడ్ అక్కడికి నాతో వచ్చాడు. అది నా కంటికి అరంగుళం దూరములో ఈ విధంగా ఉన్నది, దానియొక్క ఒత్తిడి ఆరువేల తొమ్మిది వందల పౌండ్లు గలది. యాభై గజముల వరకు దానిలోని తూటా దూసుకొని వెళ్ళి ప్రేలగలిగే సామర్థ్యం గలది. తుపాకీ గొట్టం యాభై గజముల గీతను దాటింది. మీట ఈ విధంగా వెనక్కి వచ్చిన వెంటనే తుపాకీ నా చేతిలోనే ఏ భాగమునకు ఆ భాగము విడిపోయింది. ఒకటి, రెండు క్షణములు మాత్రమే నాకు తెలిసింది, అంతే. నేను సృహలోకి వచ్చిన తర్వాత రక్తము ఈ విధంగా కారుచున్నది. నేను చనిపోయానని అనుకున్నాను. ఒక్క నిమిషము నా చేతిని ఈ విధంగా ఎత్తి పట్టాను. మరియు సహో వుడ్ ని చూచుటకు ప్రయత్నించాను, కాని ఈ కంటితో చూడలేకపోయాను. అసలు నాకు ఏమి విన్పించలేదు. నాకు గాలిలో నడుస్తున్నట్లు అన్పించింది. సహో వుడ్, ఆ బుల్లెట్ ఎక్కడ పడిందో చూచుటకు లక్ష్యం వైపు వెళ్ళాడు. అతని దృష్టిని ఆకర్షించుటకు నేను ప్రయత్నించాను. అతడు వచ్చిన తరువాత మేము కలసి వచ్చాము. తుపాకీ తూటా ముక్కలు నా కంటి చుట్టూ లోపలికి చొచ్చుకొనిపోయాయి. ఆ పేలుడు నా ముఖముపై కలిగినందువలన, నా ముఖమును చూచుటకు బయటకు విసిరివేసిన హామ్బర్గర్ అనే రొట్టెవలె వాచిపోయినట్లు ఉన్నది. నా కంటి పై భాగమున పెద్ద ముక్కలు గ్రుచ్చుకున్నవి. నుదురు ఎముక, పుర్రె ఎముక మధ్య గుండ్రని వృత్తము వలే అయినది. డాక్టర్ అడయార్ వాటిని బయటకు తీసాడు.

4మరుసటి దినమున ఆ వైద్యుని వైద్యశాల యొద్దకు వెళ్ళాను. అచ్చట డాక్టరుగారు ఉన్నారు. అతడు నా కంటి నిమిత్తము ఒక ప్రత్యేక నిపుణుని నా వద్దకు పంపించారు. కనుగ్రుడ్డు క్రింద కమిలిపోయిన ఒక వృత్తమును కనుగొన్నారు. అచ్చట సుమారుగా ముప్పై పదునైన ఇనుప ముక్కలు చాలా లోతుగా గుచ్చుకొని ఉన్నట్లుగా కనుగ్రుడ్డు దగ్గర చూచిరి. వాటిని బయటకు తీయుటకు కుదరలేదు. కనుగ్రుడ్డుని తప్పించి దాని చుట్టూ ఆ ఇనుప ముక్కలు ఒక వృత్తంవలె గ్రుచ్చుకొని ఉన్నాయి. ఆ డాక్టరు, "నాకు తెలిసినంతవరకు ఒక్క విషయమే గలదు" అని నాతో చెప్పాడు. అతడు డాక్టర్ అడయార్ కు ఒక ఉత్తరము వ్రాసాడు, "ఆ మంచి ప్రభువు తన సేవకుడిని కాపాడుటకు తన సేవకునితో పాటు ఆయన కూడా ఆ బల్లమీదే కూర్చొని వుంటాడు, లేకపోతే ఆ సేవకుని యొక్క తలకూడా మిగిలేది కాదు." సహారో ఉడ్ అచ్చట నాతోనే ఉన్నందువలన వాటన్నింటిని గూర్చి అతనికి తెలుసు. ఆ తుపాకీ ఎంత శక్తితో వెనుకకు పేలింది. అది ఎలా జరిగిందో నాకు తెలియదు. 70 రకపు తుపాకీ యొక్క పెద్ద బోల్టు తుపాకీని పేల్చేటప్పుడు అది ఊడిపోయినందువలన ముందుకు ప్రేలవలసిన తుపాకీ పూర్తిగా వెనుకకు పేలిపోయింది. కన్సర్వేషన్ క్లబ్ ఎచ్చటయున్నదో మీరెరిగినట్లైతే, ఆ జింకలు ఉండే వనము దారి గుండా అలా వెల్తే అది వచ్చును. ఆ తుపాకీలో కొంత భాగమును వెదకిన మేము కనుగొనలేకపోతిమి.

5కాబట్టి అది ఒక సంగతిని చూపిస్తుంది. ప్రభు చిత్తమైతే ఒక దినమున దానిమీద ఒక వర్తమానము చెప్తాను. మార్పులు చేయుట మంచిదే, కాని మీరు ఆ విధముగా మార్పు చేసిన దానిని అతిగా ఉపయోగించకూడదు. ఆ తుపాకీని పేల్చినప్పుడు దానిలోయున్న తూటా నిర్ణయించబడిన గమ్యానికి చేరకపోయినట్లైతే, అది ఈ విధముగానే ప్రేలిపోతుంది. అది నిజము. ఎల్లప్పుడు అసలైనది మంచిది, నకిలీ దానిని ప్రయత్నించవద్దు. [సంఘములోని ఒక సహోదరి మాట్లాడుతుంది.] ఇప్పుడు చూడండి. గ్రహించారా? ఆ విధంగా చెప్పిన సంగతులను మీరు ఊహించవచ్చు.

కాని నాకు తెలిసినంతవరకు అచ్చట ఒక కార్యము కాదు గాని. ఏమో అలాగ ఉండునేమో, నా చెవులు ఏ విధముగా ఉన్నాయో మీరు ఊహించి చూడండి. ఈ మైక్రోఫోను ప్రతిధ్వనిస్తున్నప్పుడు నా చెవులు గింగురుమనుచున్నాయి. అందును బట్టియే ఈ ఉదయం నేను ఇక్కడకు రాలేదు. నీవు మాట్లాడు అదే మాట ముందుకు వెనుకకు విన్పిస్తుంది. వారు నన్ను నిపుణుని దగ్గరకు తీసుకు వెళ్ళారు. "కర్ణభేరి వాయలేదు. మరియు కన్ను నీ కనుదృష్టి ఎప్పటివలె ఉంటుంది," అని అతడు చెప్పాడు. అవి కనుగ్రుడ్డుకు గుచ్చుకున్నాయి. కనుగ్రుడ్డు చుట్టూ వృత్తంగా ఏర్పడ్డాయి. ఆ ముక్కలు ఎల్లప్పుడూ ఉంటాయి," అని అతడు చెప్పాడు.

నేనన్నాను, "నాకు రెండు సంవత్సరముల వయస్సు నుండి ఉన్నాయి. అవి మరొకదాని వలన కలిగినాయి."

సహో రాబర్సన్ అక్కడున్నాడు, అతడిని పిలిచి మరియు ఆ విషయం గూర్చి చెప్పాను. "దానిని గూర్చి ఆలోచించవద్దు, అటువంటి ఇనుప ముక్కలు నాలో రెండు మూడు పౌండ్లున్నాయి" అని అతడు చెప్పాడు. అతడు యుద్ధములో పాల్గొన్న ఒక మాజీ సైనికుడు. "కాబట్టి అటువంటివి నా శరీరములో చాలా వున్నాయి, అవి నన్నేమి చేయవు" అని అతడు అన్నాడు.

6కొద్దికాలము క్రితము వచ్చిన ప్రభువు దర్శనము నాకు జ్ఞాపకమున్నది. ఇచ్చట నేను ఆ దర్శనమును గూర్చి చెప్పినది మీకు గుర్తున్నదా? ఆ ఉదయము మాధుర్యముగా ప్రభువు నాతో చెప్పిన మాటలు ఏమనగా నీవు, "ఎచ్చటకు వెళ్ళినను లేదా ఏమైనా గాని, అది ఏ విషయమైనా భయపడ వద్దు, ఎప్పుడు విఫలమవ్వని యేసుక్రీస్తు యొక్క సన్నిధి నీవెచ్చటికి వెళ్ళినా నీకు తోడుగా యుండును." కాబట్టి వాడు ఏమి చెయ్యలేడు. నా పరిచర్యలో "అది సమాప్తమైనది" అని దేవుడు చెప్పేంతవరకు సాతానుడు నన్ను చంపలేడు, గమనించారా. వాడు దానిని ప్రయత్నించవచ్చును, కాని వాడు ఎన్నడూ దానిలో జయం పొందలేడు.

పిదప క్రొత్త విషయమేమనగా, ఎలాగు ఉన్ననూ నేను కూటములకు వెళ్ళుచున్నా ను. ఎడమ కంటితో నేను చక్కగా చూస్తున్నాను, అందువలన ఏ విధముగానైనా గాని నేను కూటములకు వెళ్ళుచున్నాను. పశ్చిమతీరము నుండి వచ్చేవరకు ఇండియన్ రిజర్వేషన్ కూటములు పెట్టాలనుకొన్న సహోదరుడు, కొద్దికాలము వారు వాటిని వాయిదా వేసుకోవాలి. ఈ సమయములో సాహో ఆర్గాన్ బ్రైట్ దగ్గర కూటములున్నాయి. తర్వాత నేను ఎంతో ఎత్తైన ప్రాంతమగు అంకోరగే, అలస్కా వెళ్తాను.

7ఒక రకపు బూడిదరంగులాంటి తొమ్మిది అడుగుల ఎలుగు బంటిని మరియు ధ్రువప్రాంతపు జింకను కాల్చి చంపిన ప్రదేశమును గూర్చి నాకు కలిగిన దర్శనమును గూర్చి చెప్పిన సంగతి మీలో చాలా మందికి జ్ఞాపకము ఉండవచ్చును. నేను మరొక దర్శనమును కలిగియున్నాను. గుర్తుంచుకొనండి, అది ఇచ్చట టేపు మీద ఉన్నది. నేను పెద్ద గోదుమ వర్ణంలో యుండు ఎలుగుబంటిని చూశాను. బహుశా అది కొడియాక్ దీవిలో ఉండు ఎలుగుబంటు కావచ్చును. అవి కెనడాలో ఉండవు, మీరు గ్రహించారా? కాని అవి ఎచ్చట ఉన్నాగాని, అక్కడ ఖచ్చితముగా ఉంటాయి. అవి ఉంటాయి, అవి ఉండి తీరవలయును, ఎందుకంటే అది "ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు" అవి ఉంటాయి, చూసారా.

మరియు నా కొరకు ప్రార్ధించినందుకు మీకు వందనములు. నాకు గాయం తగిలినది అని తెలియగానే మీలో అనేకులు నా కొరకు ప్రార్థించారు. ఒక చిన్న గుంపు కేవలం. నా కుమార్తె రిబ్కా అచ్చట ఉన్నప్పుడు మన సంఘమునకు వచ్చే సహోదరి డాచ్ కు ఉత్తరం వ్రాసెను. మరియు దానిని గూర్చి ఆమెకు చెప్పెను. కొన్ని రాత్రుల తర్వాత ఆమె మిడాను పిలిచి ఆమెతో ఇలా చెప్పినది. "మా ప్రార్ధన సహాయపడినదో, లేదో తెలియదు గాని, మేమందరము గుంపుగా కూడి ఇక్కడ ప్రార్ధించామని. మెథడిస్ట్ సేవకుడు సహో బ్రౌన్, వారి బంధువులు మరియు అందరూ కలిసి నాకోసం రాత్రంతా ప్రార్ధించారు. "దేవుడు విన్నాడో లేదో తెలియదు గాని, సహో బ్రెన్హాం అనేకమంది కొరకు ప్రార్ధించే ఒక దేవుని సేవకుడని మేమెరిగినవారమై, ఆయన కోసము మేమందరము ప్రార్థించామని," అని అతడు చెప్పాడు. అటువంటి ప్రార్థనలను ఆయన ఆలకించును, చూసారా. అవునయ్యా, అలాటి వాటిని.

1COR 12:26

 

8సహో క్రేస్, ఇచ్చటయుండు మన సహోదరులలో ఒకడు. సాతానుడు అతడిని వెంబడించాడు. ఈ మధ్యనే ఒక చిన్న వంతెనకు గుద్దుకున్నాడు. అది పూర్తిగా అతడిని కోసేసింది. దానిలో నుండి అతడు సజీవుడిగా ఎలా బయటపడ్డాడో నాకు తెలియదు. అతడు వైద్యశాలలో వైద్యము పొందుచూ ఉంటుండగా, న్యూ-అల్బనీ నుండి సహో మెడ్కాల్స్ అనే సామాన్యమైన ఒక సహోదరుడు అచ్చటకు వెళ్ళి, "సహో క్రేస్, నేను వచ్చి నీ కొరకు ప్రార్ధించే యోగ్యత నాకు లేదు, కాని నా ప్రభువు నా హృదయంలో ఆ ప్రేరేపణ ఉంచాడు. దానిని నేను కాదనలేకపోయాను" అని చెప్పి, అక్కడ మోకరించి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. సహో క్రేస్ ను దేవుడు అక్కడికక్కడే స్వస్థపరిచాడు. గమనించారా, అది క్రీస్తు శరీరములోని స్వస్థతా వరము. మీరు గ్రహించారా? ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి,

నీవు ఒక సామాన్యమైన వ్యక్తివని తలంచవద్దు. నీవు కూడా అందరిలాంటివాడివే. నా శరీరములో ఒక వ్రేలు లేక చెయ్యి ఉన్నట్లుగానే మిగతా భాగములన్నియు కూడా ఉన్నాయి, చూశారా. అది కూడా శరీరములో ఒక భాగమైయున్నది. మరి మన మందరము… ఒక సభ్యుడు బాధపడిన యెడల ఆ బాధతో మిగతా సభ్యులందరు కూడా బాధపడెదరు. అది ఒక ఐక్యతగా యున్నది. అది ఎంతటి ధన్యకరమైన ఐక్యతగా యున్నది!

9ఇప్పుడు నేను దాని తర్వాత, నేను మరికొన్ని కూడికలు అంగీకరించాను. మరియు ఒక రాత్రికి నేను కొద్దిగా సమయమును అచ్చట కేటాయించి వుంచాను, ప్రభువు చిత్తమైతే, మరలా గుడారములో ఒక కూడికకు ఉంటాను. ప్రభువు చిత్తమైతే, వచ్చే ఆదివారము ఉదయమున ఈ ఆలయములో "ప్రవక్త యొక్క మార్గము" అనే అంశము మీద ప్రసంగిస్తాను.

రేపు రాత్రి లేక ఆదివారము రాత్రి మన సహోదరులలో ఒకరైన రడెల్ యొక్క సువార్త గుడారములో నేను ఉంటాను. ప్రభువు చిత్తమైతే, "ఒత్తిడిని విడిచిపెట్టుట" అనే వర్తమానమును ప్రసంగించాలని నేను ఆశించుచున్నాను.

తరువాత వచ్చే మంగళవారము, సంపూర్ణ సువార్త వ్యాపార సభ్యుల యొక్క ప్రాంతీయ సభల నిమిత్తము విక్సాన్సిన్ వెళ్తాము. నేను అక్కడ మూడు రాత్రులు ఉంటాను. బిల్లీ ఆ పట్టణము పేరు ఏమిటి? గ్రీన్లేక్, విక్సాన్సిన్, ఎప్పుడు? గురువారము, శుక్రవారము మరియు శనివారము. పదిహేడు, పద్దెనిమిది, పందొమ్మిది తేదీలలో, గ్రీన్లేక్ విక్సాన్సిన్ వద్ద ప్రాంతీయ కూటములు జరుగును.

10తరువాత ఆదివారము, ఇరువదవ తేదీన, నేను చికాగోలో గతసారి ఉన్న అదే హైస్కూల్ ఆడిటోరియంలో ఉంటాను. దానిపేరు మీకు జ్ఞాపకమున్నదా? ఆదివారము మధ్యాహ్నము స్టీఫెన్ మాధర్ హైస్కూల్ ఆడిటోరియంలో ఉందును.

కూటములను నిర్వహించుటకై వారు వచ్చి నాతో సంప్రదించిన స్థలము మరియు చికాగో సేవకుల సమాఖ్య వారి నిమిత్తము ఆ సమయము నందు జరుగబోవు మహాసభల గురించి ప్రభువు నాకు చూపించిన ఆ స్థలము యొక్క పేరును నేను మరచిపోయాను. "ఆ స్థలమును ప్రభువు నాకు చూపించెనని," నేను మీతో చెప్పాను. దానిని మీరెరుగుదురు. అది సహో జోసఫ్ బోజ్ యొక్క వీడ్కోలు కూడికగా యుండును. అందునిమిత్తమై అతడు రేపు విమానము ద్వారా నన్ను చూచుటకు వచ్చుచున్నాడు, అది అతని కొరకు సోమవారము దినమున జరుగబోవు ఒక వీడ్కోలు కూడికైయున్నది.

తరువాత మేము ఇంటికి వచ్చి, దక్షిణ పైన్స్, దక్షిణ కరోలినా, లేక ఉత్తర కరోలినా వెళ్తాము. అక్కడనుండి కొలంబస్, దక్షిణ కరోలినా, అటు తర్వాత పశ్చిమ తీరంలోయున్న కౌ పాలస్ కు వెళ్తాము. పిదప ఆ మార్గము గుండా గ్రాస్ సిటీకీ మరియు అచ్చట నుండి అచ్చటయున్న స్పోకెన్, కెనడాకు పిదప అలస్కాకు వెళ్తాము. కాబట్టి మా కొరకు ప్రార్ధించండి. మాకు నిజముగా మీ ప్రార్థనలు అవసరమై ఉన్నవి.

ROM 8:28

 

11"దేవుని ప్రేమించువారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని," లేఖనములు మనకు బోధిస్తున్నవి. నేను దీనిని విశ్వసిస్తున్నాను. ప్రజల యొక్క యధార్థతను నేను చూచినప్పటి నుండి.. "అది ఎలా జరిగింది, దేవుడు దానిని ఎందుకు అనుమతించాడని?" ఒకరు అడిగారు. నేను అచ్చటకు వెళ్ళియుండిన యెడల, రోడ్డు మీద వెళ్ళుచుండగా ప్రమాదము ద్వారా నాకు మరణము సంభవించి యుండవచ్చును లేదా వేరే ఏదైనా హాని జరిగియుండవచ్చును. కావున అటువంటి ఆపదలో నుండి నన్ను తప్పించుటకు దేవుడు ఏదైనా ఒకటి చేయవలయును. గుర్తుంచుకోండి, వాక్యము ఎన్నడూ విఫలము కాదు, "దేవుని ప్రేమించువారికి సమస్తమును మేలు కొరకే జరుగును." మరియు నా హృదయమును నేను ఎరిగినట్లైతే, నేను ఆయనను ప్రేమించుచున్నాను. నా హృదయమంతటితో ఆయనను నేను ప్రేమిస్తున్నాను. అది మనలను మరింత సన్నిహితులుగా చేస్తుంది.

12దీనిని గూర్చి ఆలోచించండి, దీనిని గూర్చి వినిన ప్రతి ఒక్కరూ, ఆ విధముగా జరిగిన ప్రేలుడు ప్రమాదములో నా తల లేక భుజము ఎలా మిగిలినదో వారికి అర్ధము కాలేదు. ఏ విధముగా జరిగినదో మీరు గ్రహించారా? ప్రేలుడు యొక్క ప్రభావమంతా నాపై పడెను. అది ఇంత దగ్గరగా జరిగినందువలన ఇంచుమించు రెండువేల పౌండ్లు శక్తివంతమైన పేలుడు నా ముఖముపై తాకినది. గమనించండి, నిన్ను ముక్కలు ముక్కలుగా చీల్చివేయుటకు అది చాలు. అసలు కనబడవు అంతటి బరువైన ఇనుప తుపాకీ ఏబది గజముల దూరము వరకు పేల్చగల ఇనుప గొట్టాలకు అమర్చబడిన ఆ తుపాకీని అసలు నీవు చూస్తేగాని దానిని గూర్చి నీకు తెలియదు. అది ఒక మామూలు తుపాకీ కాదు. అది ప్రేలిన తరువాత దానియొక్క ముక్కలు మాత్రమే దొరికినవి.

ఆ ప్రమాదము నుండి బయటపడిన తరువాత దానివలన నాకు ఎటువంటి అపాయకరమైన హానిని కలిగించలేదు. అందును బట్టి సజీవుడైన దేవునికి స్తోత్రములు! నేను దీనికి ముందు వెళ్ళాలని అనుకున్న ఆ ప్రాంతాలకు వెళ్ళియు౦డినయెడల అచ్చట ఏదో ఒక గొప్ప హానికరమైన ప్రమాదము సంభవించియుండును, కాని దానినుండి దేవుడు నన్ను తప్పించుటకు సాహో ఎడ్డీ నుండి మాట వచ్చువరకు దేవుడు నన్ను ఆపి ఈ చిన్న ప్రమాదము ద్వారా ఆ పెద్ద ప్రమాదము నుండి తప్పించెను, ఎందుకంటే ఆ సమయమందు అసలు నేను అచ్చట యుండవలసియున్నది. "ఆశ్చర్యమైన కృప, అది ఎంత మధురమైన స్వరము. నావంటి పాపిని రక్షించెను." దేవుడు మనతో ఉన్నాడని, ఆయనను స్తుతించునట్లు అది చేస్తుంది. దేవుడు మనతో ఉన్నాడు. మనము ఎంత కృతజ్ఞత కలిగి యుండాలి.

13ఈ ఉదయకాలమందు నేను చెప్పాను, నేనిచ్చటకు వచ్చినప్పుడు నేను తలంచాను, ప్రశస్త సహోదరుడు. ఈ దినమున సహోదరి ఉడ్ తో నేను చెప్పాను. సహోదరుడు నెవిల్ అని నేననుకుంటున్నాను… బిల్లీ నన్ను పిలిచి, "మీరు వినగలిగిన యెడల ఆ వర్తమానమును వినండి" అని నాతో చెప్పెను. ఒక చిన్న ఇనుప ముక్క నా కంటి క్రిందకు వచ్చినదని నేను నమ్ముచున్నాను, అది నాకెంతో నొప్పి కలిగించినది, కాని అది ఇప్పుడు బయటకు వచ్చేసింది, వారు దానిని బయటకు తీసేసారు. ఈ రోజు రాత్రి నేను ప్రసంగిస్తానని తలంచాను. మన ప్రశస్త సహోదరుడు ప్రసంగించినట్లు ప్రసంగించినయెడల, అంతసేపటి ప్రసంగము తర్వాత గొంతు ఏ విధముగా యుండునో నేనెరుగుదును. గొంతులో మంట కలుగుచూ, బొంగురుపోతుంది. కాబట్టి వెళ్ళి కొన్ని లేఖనములు తీసుకొని చదువవలెనని నేను తలంచాను. "సహవాసపు రాత్రి" అని నేను తలంచాను. నేను ఎల్లప్పుడూ ప్రభురాత్రి భోజనములో పాల్గొనాలని ఆశిస్తాను.

ఇక్కడ కొద్దిమంది నా స్నేహితులు ఉన్నారు, వారు ఇక్కడే ఎక్కడో కూర్చుని యున్నారు. నేను ఇంకనూ స్పష్టముగా చూడలేకపోవుచున్నాను. ఇంకా కంటిలో వాపు ఉన్నది. దానివలన మసకగా అన్పిస్తుంది. మహిమలో ప్రవేశించిన సహో ఎఫ్.ఎఫ్. బోస్ వర్త్, బంధువులు, స్నేహితులు ఇక్కడున్నారు. ప్రభువు వారిని ఆశీర్వదించును గాక, వెనుక గదిలో నేను వారి కొరకు ప్రార్ధించాను.

14ఇప్పుడు, మర్చిపోవద్దు, బుధవారము సాయంత్రం మనకు మధ్యవారపు ఆరాధన కలదు. మరియు సహో జాక్సన్ వారి ఆరాధన గురువారము రాత్రి అని తలస్తున్నాను. సహో జూనియర్ జాక్సన్ ఇచ్చట ఉన్నాడను. సహో రడెల్, వారిది బుధవారము రాత్రి, యుటికాలో యున్న మందిరమందు బుధవారము ఆరాధన గలదు… అది గురువారము రాత్రి. ఆరాధన మరల ఆదివారము ఉదయము ఇక్కడ ఆరాధన జరుగుతుంది,

తరువాత, ఆదివారము రాత్రి నేను సాహో రదెల్ ను కలవాలి. దానిని బుధవారమున ఆరాధన జరుపవలెననుకుంటున్నాను, కాని వచ్చే వారము అది కుదరదు కాబట్టి అది ఆదివారము రాత్రి జరుపునట్లుగా మార్చాము. కావున ఈ సంఘమునకు చెందిన జనులు ఆదివారము రాత్రి జరిగే సహో రదెల్ గారి సంఘములో జరుగు కూటమునకు ఎవరూ రావద్దు. అందరూ ఇచ్చటనే వుండండి, అర్థమయ్యిందా, ఆ రాత్రి సహారో రడెల్ దగ్గరకు కేవలము ప్రసంగించుటకు వెళ్తున్నాను, స్వస్థతా ఆరాధన కొరకు కాదు. కాని గుర్తుంచుకోండి, ఈ ఆలయములో మీ బాధ్యతలను మీరు సరిగ్గా నిర్వహించుడి. ఇది మీ స్థలము, గ్రహించారా. కాబట్టి మనము గొప్ప సమయము కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాము. తరువాత మేము వెళ్ళుచుండగా మీరందరు మా కొరకు ప్రార్థన చేయండి.

15సహవాసము ఆరాధనలో మనము పాలు పొందకమునుపు దేవుడు మనలను కలుసుకుంటాడని విశ్వసించుదాము. మనకు తెలిసిన ప్రకటనలు అన్నీ తెలిపారా? [సహో నెవిల్ "అవును" అని చెప్పుచున్నాడు.] రేపు మధ్యాహ్నము భూస్థాపన కార్యము గలదు, ఏమిటి సహోదరుడా? ఓ, అవును. అతడు ఈ ఆలయములో సువార్తికులలో ఒక సహోదరుడు. అతడు ఇక్కడ మనలో ఒకడు. అతడు బయటకు వెళ్లి పరిచర్య చేస్తూ ప్రసంగించేవాడు. అతడు సహో జె.టి. పార్నెల్, అతని ప్రశస్తమైన తల్లి మరణించెను. రేపు మధ్యాహ్నము భూస్థాపన కార్యము కెంటకీలోనున్న ఎడ్మనేటన్లో జరుగుచున్నది. రేపు భూస్థాపన కార్యము జరుగును. మీలో అనేకమంది పుష్పములు పంపాలని తలస్తున్నారు, కాని అది కుదరదు. సంఘమంతా వాటిని పంపించాలని అనుకుంటే దానికి ఒక్క మార్గము కలదు. అదేమనగా, వాటిని అచ్చటకు చేర్చు వారితో ఫోను ద్వారా మీరు సంప్రదించి వాటిని చేర్చవచ్చు. అప్పుడవి రేపటికి వచ్చి చేరును. పుష్పములు అక్కడకు చేరినా, లేకున్నా, అది కొంచెము కష్టం, కాని మనము ఖచ్చితముగా తల్లిని కోల్పోయిన సహో పార్నెల్ తో మన సానుభూతి పంచుకోవాలని ఆశిస్తున్నాము. నేను కూడా ఈ మధ్యనే దానిగుండా వెళ్లాను. సహోదరి స్పెన్సర్, మిగిలినవారు ఈ శ్రమల నుండి వెళ్ళిన వారు, ఆ సానుభూతితో పాల్గొన్నారని తలస్తున్నాను.

16ఆయన సన్నిధిలో మనము ఒక్క నిమిషము తలవంచి ప్రార్ధన చేద్దాము. ఇప్పుడు, మీరు నా కొరకు ప్రార్ధించాలని నేను కోరుచున్నాను. మరియు ఈ రాత్రి చూచుటకు కొంచెం కష్టముగా ఉన్నది, ఆ వెలుగు అస్పష్టముగా ఉన్నది. ఇప్పుడు నా కన్ను పరవాలేదు, కాని ఆ వాపు తగ్గుటకు వారు నా కంటిలో ఔషధమును పెట్టారు. అది ఏమిటో మీకు తెలుసు. అది నా కంటిలో ఆ విధముగా ఆరు రోజుల నుండి ఉన్నది, గ్రహించారా, అది ఇంకా వారం, పదిరోజులు ఉండవచ్చునని అతడు చెప్పాడు. కాబట్టి మీరు నా కొరకు ప్రార్ధించండి. ప్రార్థనా అవసరతలు కలిగినవారు మీ చేతులెత్తి దేవునికి చూపండి. మనము గౌరవముగా ఇక్కడ కూడి తలలు వంచి ప్రార్థించుచుండగా, దేవుడు ఆలకించును.

HEB 10:25

 

17మా పరలోకపు తండ్రీ, ఇక్కడ ఈ రీతిగా కూడుకొనుటకు మీరు మమ్ములను ఎన్నుకున్నారు. ఆ దినము సమీపిస్తుండగా మేము ఈ రీతిగా కూడుకొనుట నీ చిత్తమైయున్నది. ఒకరితో ఒకరు సహవాసము కలిగి నీకు మరింత సమీపంగా జీవించుట, క్రమముగా కూడుకొనుట, ప్రభువా, యేసుక్రీస్తు రక్తము చిందించుట ద్వారానే అది సాధ్యమగును.

ప్రభువా, ఈ రాత్రి మేము ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభువా, నేను ఇంతకుముందు ఇంత కృతజ్ఞతతో లేను. మరియు ప్రభువా, నేను ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రభువా, నేను నా చూపును, వినికిడిని కలిగి ఈ రాత్రి సజీవుల మధ్య ఉండి సువార్తను ప్రకటించుటను బట్టి నేను ఎంత కృతజ్ఞత కలిగియున్నానో దానిని మాటలలో వర్ణించలేను. ప్రభువా, దానిని నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. అది చాలా సమీపముగా వచ్చినది, గొప్ప జ్ఞానము కలిగిన వారు తమ తలలు గీరుకొంటూ, "అది ఎలా సాధ్యమైనది? కేవలము, అది దేవుని హస్తము" అని చెప్పారు. ప్రభువా, ఆ అద్భుతమైన కార్యమును మీరు నా జీవితములో అనుగ్రహించుటను బట్టి వినయముతో నా తలను వంచాను, నీ సేవకుడు నిలబడి యున్నచోట నీవు ఆ అద్భుతము చేశావు. ప్రమాదము నుండి తప్పించుకొని ఇచ్చట ఉన్నందున తండ్రీ, నేను ఎంతో వందనస్తుడను ఇప్పుడు, మరలా నా జీవితమును పునఃప్రతిష్టిస్తున్నాను. నా జీవితములో ఎన్నడూ మరణమునకు అంత సమీపముగా వెళ్ళి జీవించలేదు. ఎంతో వందనములు.

18ఇప్పుడు ఈ రాత్రి చేతులు ఎత్తిన వారందరి నిమిత్తము ప్రార్ధిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఒక విన్నపము కలిగియున్నారు. ప్రభువా, వారిలో సుమారుగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో నీవు చేసిన కార్యమును బట్టి కృతజ్ఞత కలిగియున్నారు.

మేము ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన సందర్భములో కూడియున్నాము. అది "సహవాసము, లేక ప్రభురాత్రి భోజనము"లో పాలుపొందుట. సహవాసము అనగా "మాట్లాడుట లేక సంభాషించుట." ప్రభువా, ఇప్పుడు మేము అదే కార్యమును చేస్తున్నాము. ప్రభువుతో సంభాషించుట, సహవాసము చేయుట, మాట్లాడుట, ఆయన జవాబు నిమిత్తము ఆయన కొరకు కనిపెట్టుట.

తండ్రీ, ఈ రాత్రి మీరు వ్రాయబడిన వాక్యము ద్వారా మాతో సంభాషించండి. ప్రభువా, మా హృదయములతో మాట్లాడండి. ప్రభువా, మా యాత్రను స్థిరపరచండి, ప్రభువా, మాకు క్రొత్త ధైర్యమును ఇవ్వండి. ప్రభువా, మా ప్రియ సహోదరుడు, నీ సేవకుడైన సంఘ కాపరిని, అతడి భార్యను, కుటుంబమును, డీకన్లను, ట్రస్టీలను, ఈ సంఘమునకు హాజరయ్యే ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఓ దేవా, మమ్ములను నీకు సమీపముగా ఆకర్షించుకోండి. కీర్తనాకారుడు చెప్పినట్లుగా, "మా హృదయములను కలిపిన అదే ప్రేమ బంధము ఆశీర్వదింపబడును గాక! మా రక్త సంబంధ సహవాసమును మేము కలిగియుందుము." ప్రభువా, దీనిని అనుగ్రహించండి. ప్రపంచ వ్యాప్తముగా మిమ్మును ఆరాధించు వారిని ఆశీర్వదించండి. తండ్రీ, ఇప్పుడు మేము నీ కొరకు కనిపెట్టుచుండగా, జీవవాక్యమును విరిచి మాకు అనుగ్రహించండి. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.

19ఇప్పుడు అనేకమంది సేవకులు చదివే వాక్యములను రాసుకోవాలని ఆశిస్తున్నారు. ఈ మధ్యాహ్నము నేను, సహోదరుడు వుడ్ మరియు అతని భార్య కలసి సహో గోబెల్ రాబర్సన్ను కలుసుకొనుటకు వెళ్ళాము. మేము అతని ప్రదర్శన గదిలో అతడిని కలుసుకొన్నాము. మేము అక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత, సహోదరి వుడ్, ఈ ఉదయమున మన సంఘ కాపరి ఎంత అద్భుతమైన వర్తమానమును చెప్పాడో దానిని గూర్చి చెప్పినది. నేను ఆ చిన్న వ్యక్తిని గూర్చి ఆలోచించాను. అతని గొంతు బొంగురుపోయి ఉండవచ్చును, నాది కూడ బొంగురుపోయినది. ఒకవేళ అతడు నన్ను మాట్లాడమని కోరినట్లైతే నేను కూడా కొన్ని విషయములు మాట్లాడవచ్చని తలంచాను. కాబట్టి నేను మాట్లాడాలని తలంచిన కొన్ని సంగతులను ఇచ్చట వ్రాసుకొన్నాను.

GEN 14:18,19•

2COR 6:7-10

 

20మొదటిగా II కొరంథీయులు 6:7 నుండి 10 వరకు చూద్దాము. II కొరంథీయులు 6వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనము వరకు మరియు తరువాత ఆదికాండము 14:18-19, ప్రభువు చిత్తమైతే వీటినుండి ఒక అంశము తీసుకోవాలని తలస్తున్నాను. ఇప్పుడు నేను మొదటిగా II కొరంథీ 6:7 నుండి 10 వరకు చదువు తాను.

సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి,

ఘనతా ఘనతల వలనను సుకీర్తి దుష్కిర్తులు వలనను దేవుని పరిచారకులమైయుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము: మేము మోసగాండ్రమైనట్లుండియు సత్యమంతులము;

తెలియబడనివారమైనట్లుండియు, బాగుగా తెలియబడిన వారము; చనిపోవుచున్నవారమైనట్లుండియు, ఇదిగో బ్రతుకుచున్నవారము; శిక్షింపబడిన వారమైనట్లుండియు, చంపబడనివారము;

దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు, అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.

ఆదికాండము 14:18-19

మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.

అప్పుడతడు అబ్రాహామును ఆశీర్వదించి - ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనెను.

GEN 14:19,22•

2COR 6:10

 

21ఇప్పుడు చదివిన లేఖనముల నుండి, "సమస్తమును స్వాధీనపరచుకొనుట" అనే అంశము మీద మాట్లాడగోరుచున్నాను. కొరింధియులలో చెప్పినట్లుగా మనము పేదవారమైనను, సమస్తమును కలిగియున్నామని చెప్పుచున్నది. "సమస్తమును స్వాధీనపరచుకొనుట," దానిని నేను ఇష్టపడతాను. ఇప్పుడు, మనము ఆదికాండములో అబ్రాహామును, గొప్పవాడైన మెల్మీసెదకు కలియుట గూర్చి చదివాము. ఆయన భూమ్యాకాశములను సృష్టించినవాడు. ఆయన సమస్తమును తన ఆధీనములో కలిగినవాడు, ఆకాశమును, భూమిని, అందున్న సమస్తమును తన వశమున కలిగి యున్నవాడు.

GEN 11:2,31•

GEN 12:1•

GEN 20:12

 

22మనకు అబ్రాహాము కథ, మరియు జరిగిన సంఘటనలు మనకు తెలుసు. అతడు ఒక కార్యము నిమిత్తము పిలువబడ్డాడు. కల్దీయుల దేశములోని ఊరు అనే ప్రాంతము నుండి పిలువబడ్డాడు. అతడు తన తండ్రితోను స్వజనులతో జీవించుచున్నాడు. అది షీనారు లోయ ప్రాంతము లోనిది, చాలా సారవంతమైన భూమియై యుండవచ్చును. మనము గ్రహించిన౦తవరకు అబ్రాహాము లోకము దృష్టిలో ఏ ప్రత్యేకత లేని వ్యక్తి, మరొక మాటలో చెప్పాలంటే, అతడు రాజు కాదు, నియంత కాదు, పాలకుడు కాదు. అతడు ఒక సాధారణమైన వ్యక్తి, అతడు తన మారు తల్లి యొక్క కుమార్తెయగు (తన తండ్రి యొక్క రెండవ భార్య కుమార్తె) తన చెల్లెలు శారాను వివాహము చేసుకొన్నాడు. బహుశా ఆమె యవ్వన వయస్సులో ఉన్నప్పుడు ఆమెను అతడు వివాహము చేసికొనియుండ వచ్చును. సేవా జీవితము కొరకు దేవుడు అతడిని డెబ్భై-ఐదవ సంవత్సరములో పిలిచాడు, ఆ పిలుపులో అతడి యొక్క సహచరి (భార్య) కూడా ఉన్నది.

GEN 2:24•

GEN 18:12,13,15•

1COR 6:16

 

23మనము ఇక్కడి నుండి ప్రారంభించవచ్చును. దేవుడు ఒక వ్యక్తిని సేవకు పిలిచినప్పుడు, ఒకవేళ అతనికి వివాహమై అతనికి సహచరి ఉన్నట్లైతే, దేవుడు అతనితో, అతని భార్యను కూడా పిలుచునని నేను విశ్వసిస్తున్నాను, ఎందుకనగా వారిద్దరూ ఒక్కటై యున్నారు. ఇరువది సంవత్సరముల తరువాత ప్రభువు, అబ్రాహామును సంధించి సింధూర వృక్షము క్రింద కూర్చున్న ఆ దినమందు, శారా త్వరలో తల్లి కాబోతుందని దూత అబ్రాహాముతో చెప్పినప్పుడు, "ముసలిదానినైన నేనా?" అని శారా సందేహించుచూ తనలో తాను నవ్వుకున్నది. ఆమె తొంభై సంవత్సరాల వృద్దురాలు. ఆమె భర్త అబ్రాహాము వంద సంవత్సరాల వృద్దుడు. ఆమె యొక్క గర్భము ఎన్నో సంవత్సరముల క్రితమే ఉడిగి పోయినది, అతడి శరీరము ఇంచుమించు మృతతుల్యమైనది, అలాంటప్పుడు ఆమె తన భర్తతో మరలా సుఖమును ఎలా పొందుకోగలదు? అందుకే శారా తనలో తాను నవ్వుకున్నది. కాబట్టి ఆ దూత యొక్క వర్తమానమును ఆమె సందేహించిన దానినిబట్టి దేవుడు ఆమెను చంపి ఉండవలసియున్నదని కనుగొంటిమి.

అప్పుడు దూత, వీపు వెనుక ప్రక్కన గుడారము ఉన్నది, "శారా ఎందుకు నవ్వింది?" అని ఆయన అడిగాడు.

"నేను నవ్వలేదు" అని ఆమె అబద్దమాడింది. అదే విధముగా వున్నదంటే దేవుని ముఖము మీదే దేవుడిని "నీవంటున్నది తప్పు అన్నట్లుగా వున్నది," గమనించారా. ఆమె చెప్పిన అబద్దమును బట్టి అక్కడ ఆమె తన ప్రాణమును కోల్పోవలసియున్నది. కానీ దేవుడు శారా ప్రాణమును తీయలేకపోయాడు, ఎందుకనగా ఆమె అబ్రాహాములోని భాగము, చూచారా. ఆమె, అతడితో ఆ నిబంధనలో ఉన్నది. కాబట్టి ఆమె అతడితో కలిసి వెళ్ళవలసియున్నది. కాబట్టి ఆయన అబ్రాహామును తీసివేయలేక … లేదా శారా ప్రాణాలను తీయలేకపోయాడు. అబ్రాహాము యొక్క సగభాగము లేకుండా ఆయన దానిని చేయలేడు, ఎందుకనగా వారిరువురు ఏక శరీరమైయున్నారు.

JOHN 3:15

 

24అది ఈ రోజు మనకు ఎంతో అందమైన సాదృశ్యముగా ఉన్నది, అయోగ్యులము, పాపము చేసినప్పుడు మనము మరణమునకు పాత్రులము, కాని దేవుడు మనలను చంపలేడు, ఎందుకనగా మనము క్రీస్తులో భాగమైయున్నాము, గ్రహించారా. అది మనకు అనుగ్రహించబడిన కృప, ఎందుకనగా మనము క్రీస్తుతో ఐక్యమైయున్నాము. క్రీస్తుతో ఐక్యత అది అందమైన భావన కాదా? కాబట్టి మనము చేయు పాపములు, మనము వాటిని చేసినప్పుడు, "అవి తప్పు" అని వాటిని గూర్చి మనము వెంటనే మన తప్పులను ఒప్పుకోవాలి, ఎందుకనగా దేవుడు మన జీవమును తీసివేయును. కాని రక్తము మన స్థానములో జవాబిచ్చుచున్నది. మరియు దేవుడు ఆ రక్తమును దాటిపోలేడు, గ్రహించారా. ఆయన దానిని చేయలేడు, ఆయన ఆ విధంగా చేయనని వాగ్దానము చేశాడు. కాబట్టి ఆయన తన స్వంత వాగ్దానమును ఆయనే విఫలము చేయలేదు, గ్రహించారా. దేవుడు తనను తాను కట్టివేసుకున్నాడు. చూడండి, ఆయన తన వాగ్దానమును తానే భంగపర్చలేడు. ఆ రక్తము ద్వారా ఆయన దానిని వాగ్దానము చేశాడు. ఆయనయందు నమ్మకమును కలిగియున్నవారు నిత్యజీవము కలిగియుందురు మరియు ఆయన ఆ వాగ్దానమును అతిక్రమించలేడు.

GEN 13:8,11,14,15

 

25కాబట్టి మనము చూశాము, ఆ క్రొత్త దేశములో ప్రవేశించుటకు, అబ్రాహాము విధేయతతో తన ఇంటిని, తన దేశమును విడిచిపెట్టాడు. సమస్తము నుండి భూసంబంధమైన హోదా నుండి, ఆస్తుల నుండి తనను తాను వేరుచేసుకున్నాడు. అది సంఘమునకు మాదిరి. క్రీస్తును వెంబడించు క్రమము యందు, ఈ లోకములో ఉన్న సమస్తమును మనము విడువవలసియున్నది.

సంవత్సరము వెంబడి సంవత్సరము అబ్రాహాము దేవుడిని వెంబడించుట మనము చూస్తున్నాము. అతడు తనతో పాటు తన తండ్రిని తీసుకు వెళ్ళాడు. అతడు మార్గ మధ్యలోనే మరణించాడు. అతడు తనతో పాటు తన బంధువైన లోతును తీసుకువెళ్ళాడు, లోతు అబ్రాహాములో భాగమైయున్నప్పటికీ అతడు వివాదమును బట్టి అబ్రాహామును విడిచి సొదోమలో నివసించుటకు వెళ్ళాడు. మరియు దేవుడు దేశమును, దానిలోని సమస్తమును అబ్రాహాముకు ఇచ్చాడు. అతడే సమస్తమునకు వారసుడు. దేవుడు చెప్పాడు, "తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణపు తట్టును చూడుము. ఈ సమస్తమును నీకును, నీ తరువాత నీ సంతానమునకు చెందును. సమస్తము నీదే!"

1THS 5:22•

REV 18:4

 

26ఒక దినమున అబ్రాహాము కఠినమైన మార్గములో నిలిచాడు, లోతు సులువైన పాపపు మార్గములో నిలిచాడు. పాపము ఎంత సులువుగా, ఎంత అందముగా, ఎంత అమాయకముగా కన్పిస్తున్నది. లోతు ఈ విధంగా "నేను దేవుడిని నమ్ముచున్నంతవరకు, నేను దేవునియందు నమ్మకమును కలిగియున్నాను. కావున నేను సొదోములోకి వెళ్ళి జీవించుటలో తప్పులేదు. అదేమి ఫర్వాలేదు. నేను ఒక విశ్వాసిని" అని చెప్పి వుండవచ్చును. కాని అది సరియైన నిర్ణయము కాదు.

ఇచ్చట గమనించండి, అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు, తనకున్న సమస్తము నుండి తనను పూర్తిగా వేరుపరుచుకోమని ఆయన అబ్రాహాముతో చెప్పెను. మనము కూడా అలాగే చేయవలయును. పాపము నుండి మరియు సమస్తము నుండి పూర్తిగా మనలను మనము వేరుపరచుకొని రావలెనని దేవుడు మనలను పిలిచెను. "దానిలోనుండి వేరుపరుచుకొని వెలుపలకు రండి, దానిలో పాలిభాగస్తులుగా ఉండవద్దు" అని ఆయన మనకు చెప్పెను. కనబడే ప్రతి దుష్టకార్యముల నుండి తొలగిపొమ్ము, పూర్తిగా దానిని నిర్మూలము చేసి నిన్నునీవు దానినుండి వేరుపరుచుకో, దానినుండి దూరముగా తొలగిపొమ్ము. నిన్ను అణచివేయు వంటివాటిపై నీవు నిలచి ఉండవద్దు. అవి ఎంత అందముగా కనిపించినను దానినుండి దూరముగా తొలగిపొమ్ము.

GEN 13:8,9

 

27ఇప్పుడు మీరు ఇక్కడ ఈ విధంగా తలంచవచ్చు. సహో బ్రెన్హాం

కొన్నిసార్లు దొంగతనము చేయాలని నాకు వాంఛ కలుగుతుంది, కొన్ని సార్లు పొగత్రాగాలని వాంఛ కలుగుతుంది." లేక స్త్రీలు కొన్నిసార్లు ఇలా తలంచవచ్చు, "నాకు కొన్నిసార్లు లోకస్తులవలె దుస్తులు ధరించాలని అన్పిస్తుంది." "యవ్వన స్త్రీలు, లోకస్తులవలె అసభ్యకరమైన దుస్తులు ధరించాలని అన్పిస్తుంది. మీరు దానిని శోధన అంటున్నారు." అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఒకటి కలదు. ఈ పరిచర్యలోని ప్రతి కదలికను మీరు గమనించవలసియున్నది. కాపరి యొక్క పరిచర్య ఎంత గొప్పదైయున్నది. ఈ పరిచర్య చేసేవారు ఈ విషయములను గురించి మీకంటే ఎంతో ఎక్కువగా జవాబు చెప్పవలసినవారై ఉన్నారు. మీరు మీ ఆత్మలకు మాత్రమే జవాబు చెప్పుకుంటారు, కాని ఈ పరిచర్య చేసే మేము ప్రతి మాటనుబట్టి ప్రతి యొక్క ఆత్మ నిమిత్తము జవాబు చెప్పవలసినవారమై యున్నాము, గమనించారా. కావున సాతాను నిరంతరము… "ఆ పొట్టి వస్త్రములు ఎంత అందముగా వున్నవి కదా, అవి ధరించుకొనుట తప్పే! కాని అవి చాలా అందముగా వున్నవి కదూ! నేనా వస్తాలు ధరించుకొంటే నేను చాలా అందముగా వుంటాను కదూ!" అని నీవు తలంచవచ్చు. అవి ధరించుకొనుట తప్పని నీకు తెలుసు. అది నామట్టుకైతే ఒక సేవకుని దృష్టిలో అది తప్పే. "ఆ సంఘము చాలా గొప్పది. అక్కడ జరుగుచున్న కూటములకు వెళ్ళాలి," అలా తలంచుట కూడా తప్పే, కాని దేవుడు మీతో వెళ్ళు అని చెప్పువరకు నీవు కనిపెట్టుకొని వుండాలి, గమనించారా. అక్కడ వున్న మనుష్యులను కలిసికొనుటకు వెళ్ళుచున్నావా? లేదా ఫలానా, ఫలానా కార్యము గురించి అక్కడకు వెళ్ళుచున్నావా! నీవు దానిని గమనించాలి, జాగ్రత్త, చూశారా. అది చాలా కుయుక్తిగా ఉంటుంది. మరియు మనము ఆ కార్యములను జాగ్రత్తగా కనిపెట్టాలి.

ఇప్పుడు, అబ్రాహాము కూడా కనిపెట్టాలి. కాని అతడు లోతుతో పాటు సొదొమ వెళ్ళుటకు బదులుగా, తనకు తాను వేరుపరచుకొని, అనేకులు తృణీకరించిన ప్రభువు మార్గములో ఆ ఎడారిలోనికి వెళ్ళాడు. మన వైఖరి కూడా ఆ రీతిగానే ఉండాలి. అది కఠినముగా ఉన్నా సులువుగా ఉన్నా, అది ఏ విధంగా ఉన్నా సరే - నీవు దేవుని యొక్క జనులు మార్గములో వెళ్ళాలి. ఇప్పుడు ఆయన నిన్ను ఎక్కడికి పిలిచినా సరే - ఏ సమయమందైనా వెళ్ళుటకు నీవు సిద్ధముగా ఉండుము.

GEN 14:11,12•

ROM 6:23

 

28ఇప్పుడు, దీని తర్వాత, అక్కడికి ఒక రాజు దండెత్తి వచ్చి అక్కడున్న చిన్న చిన్న జాతులందరి మీద యుద్ధము చేసి వారిని జయించెను. ఆ లోయ ప్రాంతములు జయిస్తూ, వాటిని చెరపట్టుచూ, చివరికి సొదొమ రాజ్యము మీదకు వచ్చి, సొదొమ గొమొర్రా రాజులను బంధించి, లోతును అతని భార్యను, అతని కుమార్తెలను, పిల్లలను, అతనికున్న సమస్తమును తీసుకు వెళ్ళాడు. అతడు ఆ దేశములన్నింటిని జయిస్తూ వాటిని ఊడ్చివేశాడు. ఓ, ఎంత భయంకరమైన సంగతి, పాపము యొక్క జీతము మరణము. లోతు అక్కడ వారితో నడుస్తుండగా, బహుశా మెడలో త్రాడు లేక గొలుసు అతని మెడచుట్టూ ఉండగా, ఒక బానిసవలె అతని కుమార్తెలను ఈడ్చుకొని వెళ్ళారు, నిస్సందేహంగా లోతు దానిని గ్రహించాడు. అతని భార్య, అతని వారందరు ఏ క్షణంలో అయినా మరణించవచ్చును. అతడు ఒక ఆజ్ఞకు అవిధేయత చూపించాడు. తన శేష జీవితము అంతా బానిసగా బ్రతుకుటకు మరియొక రాజ్యమునకు తీసుకుపోబడ్డాడు.

GEN 14:14-16

 

29అబ్రాహాము, తన స్వాస్థ్యములోని భాగమైన లోతు చెరగొనిపోయాడని కనుగొనినప్పుడు, మరియు అబ్రాహాము ఈ విధంగా చెప్పి యుండవచ్చును. "దేవా, నేను నీకు లోబడి ఈ దేశంలో సంచరించినప్పుడు, నీవు ఈ దేశమును నాకు ఇస్తానని చెప్పావు. ఇది నాకు చెందినది. దీనిలో లోతుకు భాగమున్నది, నేను అతని కోసం వెళ్తాను. అతడు తన దండును లేక సేవకులను సమకూర్చినాడు. వారికి ఆయుధములు ధరింపజేశాడు. అతడు తన సేవకులను తీసుకొని ఈ చిన్న రాజ్యములన్నింటిని జయించిన ఆ రాజును కలిసే వరకు తరిమాడు. చూడండి, అప్పుడు వారెంత గొప్ప సైన్యముగా ఉన్నారో, కాని ప్రధాన సైన్యాధిపతియైన దేవుని న్యాయకత్వములో అతడు తనను తాను వేరుపరచుకొని, ఆ సైన్యం మీద పడి ఆ రాజులను వధించి, లోతును మరియు ఆ చిన్న రాజ్యములన్నింటిని తిరిగి వారి స్వదేశమునకు తీసుకువచ్చాడు.

ఇక్కడ అబ్రాహాములో క్రీస్తు సాదృశ్యముగా ఉన్నాడు, శత్రువు సమస్తమును చెరగొనిపోయిన తరువాత క్రీస్తు వచ్చి మనలను వెనుకకు తీసుకు వచ్చాడు.

GEN 12:7•

GEN 13:14,15•

GEN 14:17,18,22•

GEN 19:1•

HEB 7:1-3

 

30ఈ గొప్ప కథలో, అబ్రాహాము గొప్ప విజయం సాధించి తిరిగి వచ్చుచుండగా, తన మార్గములో భూమ్యాకాశములను సృష్టించిన రారాజును కలుసుకొనుట చూస్తున్నాము. ఆయన మెల్మీసెదెకు, యెరూషలేము రాజు, షాలేము రాజు, సమాధానపు అధిపతి, నీతికి రాజు. ఆయనకు తండ్రి లేడు, ఆయనకు తల్లి లేదు, ఆయనకు ఆది మరియు అంతము లేదు. కాబట్టి ఆయన సర్వశక్తుడు తప్ప మరొకరు కాదు. అతడు రాజులను వధించి తిరిగి వస్తున్నప్పుడు, మార్గమధ్యములో ఆయనను కలిశాడు. అతడు తిరిగి వస్తుండగా సమస్తమును కలిగియున్న ఆయనను కలిశాడు. అది ఎంతటి మహిమకరమైన సంగతి. ఇప్పుడు అబ్రాహాము….

నేనిది ఇష్టపడతాను. అబ్రాహాము వాగ్దానమును బట్టి అన్నింటికి వారసుడు. కాబట్టి అతడు ఆ దేశమును, దానిలో ఉన్న సమస్తమును స్వతంత్రించుకోగలడు. అబ్రాహాముకు అది వాగ్దానముగా ఇవ్వబడినది. సమస్త దేశములలో వున్నవారికంటే అబ్రాహాము చాలా పేదవాడని ఇప్పుడు మనము గ్రహించాము, ఎందుకనగా అతడు ఎడారిలో నివసించాడు, మరియు దేవునితో సమాధానముగా జీవించాడు. లోతు ధనవంతుడు, పట్టణములో నివసించి, ఆ పట్టణమునకు అధ్యక్షుడయ్యాడు. అతడు గవిని యొద్ద కూర్చున్నాడు. అతడు న్యాయాధిపతి. పట్టణములో తీర్పులు తీర్చాడు. అతడు సమస్త ఐశ్వర్యములను కలిగియున్నాడు. కాని అబ్రాహాము ఎడారిలో ఉన్నాడు, బహుశా ఆ దేశములోనే అత్యంత పేదవాడు. అయినను సమస్తమును కలిగియుండటానికి హక్కు కలిగియున్నాడు. ఆమేన్! అందుకే నేను దానిని ఇష్టపడున్నాను.

31ఓ, ఈ రాత్రి మనము భూసంబంధమైన విషయములలో ధనవంతులము కాకపోవచ్చును, కాని మనము సమస్తమును కలిగియున్నాము. సంఘము సమస్తమును కలిగియున్నది, అయినను పేదది అయినను ధనవంతురాలు మరియు సమస్తమును కలిగియున్నది. నేను దానిని ఇష్టపడుచున్నాను. మనమందరము కొన్ని సంవత్సరముల క్రితము మనము ఒక పాట పాడేవారము. నా తండ్రి రాజభవనములు, పొలములు కలిగిన ధనవంతుడు లోక ఐశ్వర్యమంతటిని ఆయన తన హస్తములో కలిగియున్నాడు. ముత్యములు, వజ్రములు, వెండి బంగారము ఆయన పెట్టెలన్నియు నిండియున్నవి, చెప్పశక్యముకాని ఐశ్వర్యమును ఆయన కలిగియున్నాడు. మనము దానిని కలిగియున్నాము, ఎందుకనగా మనము రాజు పిల్లలము. ఆమేన్. మనకు తెలుసు, పిల్లవాడు ఎల్లప్పుడును వారసుడు. అది నిజము.

అబ్రాహాము వాటిని కలిగియుండగలడు, అయినను పేదవాడు, అతడి పశువులు ఆకలితో ఉన్నవి. లోతు మేలైన భూమిని తీసుకున్నాడు. అతనికి నీరు కొదువగా ఉన్నది. ఎండతో వేడిగా ఉండు దినములు, పశువుల కాపరులు ఇబ్బందులలో ఉన్నారు. మరియు సమస్తము కూడా అబ్రాహాముకు వ్యతిరేకముగా జరుగుచున్నట్లున్నది. అయినప్పటికి అతడు సమస్తమునకు అధిపతి.

MATT 5:5

 

32మరియు ఈ రోజులలో నిజమైన విశ్వాసి ప్రజల నుండి వెలివేయబడుచున్నాడు. "మత మూఢుడు, పరిశుద్ధ - దొర్లువాడు, లేదా కొన్ని అవమానకరమైన పేర్లతో మతపిచ్చివాడు" అని పిలువబడుచున్నాడు. అయినప్పటికి, అతడు భూమ్యాకాశములకు వారసుడు. "సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకొందురు." ఓ, మై! నీవు చిన్న గదిలోనికి లేదా వేరే ఎచ్చటికైనా నెట్టబడి యుండవచ్చును, నీకు అద్దె కట్టడానికి చాలినంత డబ్బు లేకపోవచ్చును. అయినను నీవు సమస్తమును కలిగియున్నావు. ఆమేన్. గౌరవప్రదముగా జీవించటానికి, నీ పిల్లల పాదములకు బూట్లు వేయుటకు, వారి చిన్న నోటికి ఆహారమును అందించుటకు, కొన్ని రూపాయలను సంపాదించు నిమిత్తము బహుగా శ్రమపడి, చెమట కార్చవచ్చును. అయినను ఇక్కడున్న సమస్తమును నీవు కలిగియున్నావు. సమస్తమునకు వారసుడవు. "సాత్వికులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిని స్వతంత్రించుకొందురు. ఓ మై, నేను దానిని ఇష్టపడుచున్నాను. భూమిని స్వతంత్రించుకొనుట. ఏమిటి? విశ్వాసి, యేసుక్రీస్తు ద్వారా, హక్కు పత్రమును కలిగియున్నాడు. అది ఏమిటనగా అతడు సమస్త విశ్వమును స్వాధీనపరచుకొనుట." అది నిజము "సాత్వికులు భూమిని స్వతంత్రించుకొందురు."

33దానిలో ఉన్నదానిని బట్టి అబ్రాహాము ఆ దేశమును స్వాధీనపరచుకోగలడు. దానిని దేవుడు అతనికి ఇచ్చాడు. మరియు లోతు ఆ భూమిలో ఒక భాగమైయున్నాడు. కాబట్టి అబ్రాహాము దానిమీద హక్కు కలిగియున్నాడు. "అతడు దానిని కలిగియుండగలడు" అని ఆయన చెప్పాడు. "దేవా, నీవు నాకు వాగ్దానము చేశావు. ఈ దేశము, దీనిలో ఉన్నదంతయు నాది అని నీవు నాకు వాగ్దానము చేశావు. ఇప్పుడు నా రక్తసంబంధి చెరలోనికి వెళ్ళాడు. అతనికున్నదంతయు కొల్లగొట్టబడినది."

మరొక మాటలో, నేను దానిని ఈ రోజుకు అన్వయించినట్లయితే, నేను ఈ విధముగా చెప్పవచ్చును, సంఘము ఈ విధంగా చెప్పవచ్చును, "ప్రభువైన దేవా, ఇక్కడ నా సహోదరుడు, కేన్సరుతో బాధపడుచున్నాడు, ఇతడు క్షయతో బాధపడుచున్నాడు, అతడు ఫలాని సమస్యతో బాధపడుచున్నాడు, నేను వాగ్దానమును పట్టుకొనియున్నాను, ఇది నా స్వాస్థ్యము. నీవు ఆ విధంగా చెప్పావు!" ఆమేన్. నీవు అక్కడున్నావు. అబ్రాహాము ఆ రాజులను వధించి అతని ఆస్తిని వెనుకకు తీసుకువచ్చినట్లుగా, శత్రువైన అపవాదిని నీవు వెంబడించి తరుముకుంటూ వెళ్ళుచూ తరిమి, వాడిని హతం చేయవచ్చును. ఆమేన్. నేను దానిని ఇష్టపడుచున్నాను. అది విశ్వాసికి చెందినది.

34అబ్రాహాము వాగ్దానపు హక్కును కలిగియున్నప్పటికీ మరియు వాగ్దానము అతనికి చెందినదైయున్నది. అయినప్పటికి దానిని స్వతంత్రించుకొనుటకు అతడు పోరాడవలసియున్నది. ఆమేన్. నీవు కూడా అదే కోవకు చెందినవాడవైయున్నావు. మనము సమస్తమునకు వారసులమై యున్నప్పటికీ, మనము సమస్త ఆత్మీయ ఆశీర్వాదములకు వారసులమై యున్నప్పటికీ, ప్రతి శారీరక అశీర్వాదములకు వారసులమై యున్నప్పటికీ, పరిశుద్ధ గ్రంథమునందు, వాగ్దానము చేసిన ప్రతి ఆశీర్వాదమునకు వారసులమై యున్నప్పటికీ, ఈ రోజు విశ్వాసి అందులో ప్రతి అంగుళము కొరకు నీవు పోరాడవలసియున్నది. ఆ విధంగానే దానిని స్వతంత్రించు కొనుటకై అది దేవుని యొక్క విధానమైయున్నది. అది ఎల్లప్పుడూ ఆ విధంగానే యుండును. ఏది నీకు సొంతమైయున్నదో దానిని గూర్చి నీవు ఏదైతే ఎరిగియున్నావో దానిని స్వతంత్రించుకొనుట కొరకు నీవు పోరాడవలసియున్నది. దానిని స్వాధీనం చేసుకొనుటకు నీవు పోరాడాలి. ఇప్పుడు మనము చేయవలసినది అదియే.

MATT 17:20•

MATT 21:21•

MATT 24:35•

MARK 11:23•

MARK 13:31•

LUKE 21:33•

JOHN 14:13•

JOHN 15:16•

JOHN 16:26

 

35"సహోదరుడా బ్రెన్హాం, నాకు స్వస్థత కావాలి" అని నీవు చెప్పవచ్చు.

వాగ్దానము నీది. కాని, నీవు దానిని ఎప్పుడైనా పొందుకున్నట్లైతే, నీవు దానిని సులువుగా పొందుకొనలేవు, నేను దానిని ఎలా పొందుకోవాలో మీకు చెప్తాను. నీవు దానిని సాతాను చేతిలో నుండి తీసుకోవాలి. సాతాను నీ ఆరోగ్యమును చెరపడతాడు. నీవు సాతాను వద్దకు వెళ్ళి, "దానిని ఇచ్చి వేయుము, నా చేతికి అప్పగించుము, భూమ్యాకాశముల అధిపతియైన ప్రభువు నామములో వచ్చియున్నాను, నేను ఆయన వారసుడను. దానిని ఇచ్చివేయుము! నీవు నా బిడ్డను తీసుకొన్నావు. నా కుమార్తెను చెడ్డ స్నేహితుడితో తిరిగే వాడితో కలిపావు. నీవు నా కుమారుడిని తీసుకొని చెడ్డ యువతితో తిరిగేలా వాడిని ఆమెతో కలిపావు. నేను వారిని హక్కు కోరుచున్నాను. అది వాస్తవము. నా పిల్లలను నేను హక్కు కోరుచున్నాను. అవును, సాతానా, నీవు వారిని దేవుని ఇంటి నుండి తీసుకొన్నావు. నీవు అచ్చట వెలుపల వారిని వంచించావు. నేను వారి నిమిత్తం వారిని వెంబడించుచూ వస్తున్నాను. వారు నా వారని హక్కు కోరుతాను."

"మంచిది, నీకు ఎలా తెలుసు?"

"సమస్తమునకు నేనే వారసుడను. ఆమేన్. అది నాకు ఇవ్వబడెను. వాటికి నేనే వారసుడను. దేవుడు నాకు వాగ్దానము చేసిన సమస్తమును నేను హక్కు కోరగలను." ఆమేన్. నీ స్థానము అదే. మై!

36నీవు దానిని ఎలా పొందుకుంటావు. అందుకొరకు నీవు ఏదైనా చేసితివా? లేదయ్యా. అది దేవుడు మనకిచ్చిన షరతులేని కృపగా యున్నది. మరియు అది మనది, అది మనకు చెందినది. లేఖనముల ప్రకారము, వాక్యపు అధికారముతో, విశ్వాసముతో "అది నాది! దానిని విడిచిపెట్టు" అని నీవు చెప్పినట్లైతే సాతానుడు దానిని పట్టుకొనియుండలేడు. ఆమేన్. మహిమ! నేను దానిని ఇష్టపడతాను. "సాతానా, నీవు దానిని విడిచిపెట్టు. నీవు నా దగ్గర నుండి దానిని తీసుకొన్నావు. నేను నీకు నోటీసు పంపుచున్నాను. నీవు దానిని తిరిగి ఇచ్చివేయుము. దేవుని వాక్యముతో వ్రాయబడిన నోటీసు ఇచ్చట నా దగ్గర గలదు. అదేమిటో తెలుసా, "భూమ్యాకాశములు గతించును గాని, ఈ వ్రాయబడిన నోటీసు గతించదు." ఆయన నామములో తండ్రిని ఏది అడిగినా అది నాకు ఇస్తానని యేసుక్రీస్తు చెప్పాడు, దానిని ఆధారముగా నేను నీకు నోటీసు జారీచేయుచున్నాను. నేను ఈ పర్వతముతో, "కదులు" అని చెప్పి నా హృదయములో సందేహించనట్లైతే, నేను చెప్పినదంతా జరుగుతుందని నేను విశ్వసించినట్లైతే, నేను చెప్పిన దానిని నేను పొందగలను. "నాకు చెందిన వానిని వదిలి దానిని క్రిందపెట్టు!" అది అతడిని వణికింపజేస్తుంది. అతడిని వణికించుట మాత్రమే కాదు, వాడిని పరిగెత్తిస్తుంది. "దానిని క్రిందపెట్టు, ఎందుకంటే, నేను వాక్యపు అధికారముతో వచ్చాను. నేను ఒక విశ్వాసిని." దానిని మీరు పొందుకున్నారా? అవునయ్యా. అవునయ్యా.

HEB 11:8

 

37ఈ కార్యము చేయుటకుగాను, అబ్రాహాము క్రమపద్ధతిలో చేయుటకై అతడు మొదట ఏమి చేయవలసి వచ్చినది? అతడు తన విశ్వాసమును కదలని పునాదియైన దేవుని యొక్క వాగ్దానమనే వాక్యము మీద పెట్టవలసియున్నది. చూడండి, అతని దగ్గర ఉన్నది కేవలము కొద్దిమంది సేవకులు మాత్రమే. బహుశా ఒక డజనుమంది. మరి అక్కడ వేలాదిమంది ఆయుధములు ధరించినవారున్నారు. మరియు అతడి మనుష్యులు సైనికులు కాదు. వారు సేవకులు, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు, మందను కాయువారు. బహుశా వారు పాత తుప్పు పట్టిన కత్తులు ఎచ్చటనుండో తీసుకొని యున్నారు. ఆ కత్తుల మీద వర్షము కురిసి యుండవచ్చును, అవి తుప్పుపట్టాయి. కాని అబ్రాహాము తుప్పు పట్టిన కత్తులు, లేక డాలు వైపు చూచుటలేదు. కాని అతడు తన విశ్వాసమును దేవుని యొక్క వాక్యముపై నిలిపియున్నాడు. నీవు కూడా అక్కడనే నిలిచి యుండవలసిన స్థానమైయున్నది. అదియే కార్యమును సాధించును. అది మాత్రమే.

"నీవు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో నీవు ఎలా పోరాడతావు?"

"దానిని గూర్చి నాకు అక్కరలేదు. నేను చేయవలసినదంతా దేవుడు చెప్పిన వాక్యము మీద నా విశ్వాసముంచుటయే. అది నాది, నా సొత్తు కొరకు నేను వెళ్ళుచున్నాను." ఆమేన్. ఇప్పుడు, రోగులైన ప్రజలు ఇప్పుడు మీరు దానిని చూడగలిగినట్లైతే ఆ రోగము, అప్పటికి అప్పుడే విడిచిపోతుంది. ఖచ్చితముగా.

38ఒక పాపి తాను పాపము చేయవలసిన అవసరములేదని చూడగలిగినప్పుడు. చాలా మంది ప్రజలు వారు పాపము చేయుచున్నారు, ఎందుకనగా వారు పాపమును చేయవలసి యున్నది. "నేను పాపము చేయవలసివచ్చినది," అని నీవు చెప్పినప్పుడు, చాలా దయనీయమైన స్థితిగాయున్నది. కాని నీవు ఇక ఎంత మాత్రము పాపము చేయవలసిన అవసరము లేదు, అని నీవు గ్రహించినప్పుడు! అక్కడ కొద్దిమంది ప్రజలు నీకు విరుద్ధంగా లేచి, నీ ముఖము ఎదుట శపించి, నవ్వుతారు. నిన్ను మూర్ఖుడని, మరియు ఇష్టం వచ్చిన పేర్లతో నిన్ను తిడుతారు. వారు ఇష్టపూర్వకంగా పాపమును చేసే పాపులు, చూడండి, వారికి ఏ విధమైన నిరీక్షణ లేదు. కాని ఆ కార్యమును మానుకోలేకపోతూ ఎడతెగకుండా చేస్తున్న వ్యక్తి… అతడు దానిని చేయగోరుట లేదు. అతడు దొంగతనము చేస్తాడు, కాని అతడు దానిని చేయాలని చేయలేదు. అతడు అబద్దమాడును, కాని దానిని చేయగోరుట లేదు. అతడు చేయకూడదు అనుకుంటూనే ఆ కార్యములను చేస్తున్నాడు. కాని అతడు వాటిని చేయాలని ఆశించుటలేదు. అతడు పాపిగా ఉండుట అతనికి ఇష్టము లేదు. అతనికి నిరీక్షణ ఉన్నది, చూశారా. దేవుని వాగ్దానము యొద్దకు వచ్చి, దాని మీద విశ్వాసము పెట్టుము, మరియు శత్రువు యొద్దనుండి దూరముగా తొలగి వెళ్ళిపో. ఇక దానిని అతడు ఎంత మాత్రము పట్టుకొనియుండలేడు, అంతే, ఎందుకనగా అది నీకు చెందినది.

GAL 3:29

 

39ఇప్పుడు, మనము ఈ వ్యక్తిని చూద్దాం. ఇక్కడ అబ్రాహాము చెప్పాడు, "నేను వారసుడను. ఇది నాకు చెందినది. ఈ దేశములో ఉన్న సమస్తము నాకు చెందినది. దేవుడు నాకు ఇచ్చాడు. అయినను ఇంకా నేను దానిని స్వాధీనపరచుకొనలేదు." కాని అతడు దానిని కలిగియున్నాడు, ఏది ఏమైనా అది అతనికి చెందినది.

మనము సమస్తమునకు వారసులము. అది నిజమే కదా? మనము సమస్త కార్యములకు వారసులము. పరిశుద్ధ గ్రంథము అంతా ఇచ్చట ఆ విధంగానే చెప్పుచున్నది. మనము సమస్తమునకు, ప్రతి ఒకొక్క దానికి వారసులమై యున్నాము. మనము ఇంకా దానిని స్వాధీనపరచుకొనలేదు, అయినప్పటికి అది మనది. ఆమేన్. ఓ, మహిమ! ఆ దేశములో ఒక్క అంగుళము కూడా నేను ఇంకా స్వాధీనపరచుకొనలేదు, అయినప్పటికి ఎలాగైనా ఖచ్చితముగా ఆ సమస్త స్వాస్థ్యము నాదే. ఆ సమస్త స్వాస్థ్యము మనది, సంఘమునకు చెందిన జనులకు చెందినది, విశ్వాసులకు చెందినది. క్రీస్తు యొక్క వధువు దానిలోని ప్రతీ అణువుకు యజమానురాలై యున్నది. దానికొరకు రష్యా పోరాడుచున్నది. అమెరికా దానికొరకు పోరాడుచున్నది. దానికోసం ఇటువంటి దేశాలు మరియు అచ్చటయున్న మరొక దాని కొరకు పోరాడుచూ వాళ్ళు మనలను చూచి "పిచ్చివారని" పిలుస్తున్నారు. కేవలము ఊరక కూర్చొని నిలకడగా ఉండుము. ఏది ఏమైన గాని ఆ స్వాస్థ్యము నీకు చెందినది. ఆమేన్. ఏ విధంగా అయినాగాని అది అంతా వారసులకు చెందుతుంది. కాబట్టి వారు ఒకరితో ఒకరు ఎంతగా ఆర్భాటము చేసినా పోరాడుకొనినా గాని, అది మనకు చెందినది. దానిని పొందుకొనేది మనమే. అసలు అలా జరుగుతుందని వారెన్నడూ దానిని గూర్చి ఆలోచించియుండరు, కాని ఏమైనాగాని దానిని మనము సాధించెదము. దానిని చేసెదము!

GEN 14:14-16

 

40అక్కడున్న ఆ పేద వృదుడు, ఎముకల గూళ్ళగా కనబడుచున్న పశువులను కలిగిన ఆ వ్యక్తి, ఆ సమస్తమునకు యజమానుడని ఎవరైనా తలుస్తారా? పాలస్తీనా భూభాగమంతా అతనిదే. అవునయ్యా, అతడు ఒకానొక స్థలమందు తన శత్రువులను ఎదుర్కొనబోవు సమయము ఆసన్నమైనప్పుడు దేవుడు అతడి పక్షముగా ఉన్నట్లు ఋజువు పరచుకున్నాడు. అతడు ఆ కొద్దిమంది మనుష్యులను తనతో తీసుకువెళ్ళి, వారిని తరుముచూ, వారిలో ప్రతి ఒక్కరిని వధించి, తనకు చెందిన స్వాస్థ్యమును అతడు వెనుకకు తెచ్చాడు. ఆమేన్. నేను దానిని ఇష్టపడ్డాను. ఎందుకు? అతడు తన విశ్వాసమును దేవుని యొక్క వాగ్దానమనే బండమీద పెట్టాడు. ఆ విశ్వాసమే దానిని పొందుకోగలిగినది. అతడు వేరొక పునాదిని కట్టలేదు, ఏదో ఒక సంస్థయందు చేరుటయో లేక అటువంటి వాటిని నిర్మించటమో అతడు చేయలేదు. అతడు తన విశ్వాసమును ఆ వాగ్దానముపై వంచెను. ఆమేన్. అవును, అది అలాగే యున్నది. ఆ వాగానమును ఆధారముగా చేసుకొని దానిపైనే అచ్చట అతడు ముందుకు కొనసాగిపోయాడు. అది తుప్పుపట్టని కత్తో లేక తుప్పుపట్టిన కత్తితో, ఏదైతే ఏమి, దానికి అతడు బేధము తెలియనివాడై తన దృష్టిని దేవుడు తనకు వాగ్దానము చేసిన ఆ వాగ్దానము పైనే తన విశ్వాసమును వుంచి ముందుకు సాగిపోయెను.

41నీ కొరకై ప్రార్ధన చేయించుకొనుటకు నీవు ముందుకు వచ్చినప్పుడు, ఒకవేళ నీకు రక్షణ కావాలంటే, నీకు దైవిక స్వస్థత కావాలంటే, అది ఏదైనప్పటికి, నీవు ఒక విశ్వాసివి అయినట్లయితే, నీవు ప్రతీ వాగ్దానమునకు వారసుడవు. కాబట్టి నీ విశ్వాసమును వాగ్దానము మీద నిలిపి, ముందుకు సాగివెళ్ళి, సాతానుడితో, "నాకు చెందిన దానిని నాకు ఇవ్వు - అది నాది, దానిని నాకు తిరిగి ఇచ్చి వేయుము" అని చెప్పుము. సాతానుడు నిన్ను మోసం చేయనీయకు. నీకు చెందినదానియందే, ఆ గీతయందే సరిగ్గా నీవు నిలబడి యుండుము. వాడు దానిని మరలా నీకు తిరిగి ఇచ్చి వేయును. వాడు ఖచ్చితముగా ఇచ్చితీరాలని దేవుడు చెప్పాడు, కాబట్టి వాడు తిరిగి ఇవ్వాలి. అది నీ హక్కు అది నిజము. సమస్త స్వాస్థ్యమునకు నీవే హక్కుదారుడవు!

42దేవుని వాక్యమనే వాగ్దానపు పునాదిపై అతడు (అబ్రాహాము) నిలిచి యుండెను; ఆ స్వాస్థ్యమునకు అతడే వారసుడు. అతడే దానిపై హక్కును కలిగియున్నాడనే దానిని అతడు ఎరిగియుండెను. సరే, అయ్యా, వాగ్దానము అతనికి ఋజువుపరచబడిన తర్వాత అతడికి వాగ్దానము చేసిన ఆయనతో అతడు సహవాసమును కలిగియుండెను. (నేను దానిని ఇష్టపడ్డాను) పిదప గమనించండి. ఇంతకు ముందు ఎదుర్కొనని ఒక పరీక్షను అబ్రాహాము ఎదుర్కొనవలసి వచ్చెను, కాబట్టి అతడు… అటువంటి ఒక విధమైన పరీక్షను ఎదుర్మొనెను. కాబట్టి ఆ సమస్త స్వాస్థ్యమునకు త్రానే హక్కుదారుడనని అతడు ఎరిగియుండెను, ఎందుకనగా ఆ విధముగా అతడికి వాగ్దానము చేయబడి యుండెను. అయినప్పటికి ముందెన్నడూ సైన్యముతో అతడు పోరాడలేదు. దానిని గూర్చి అతడికి ఏమి తెలియదు. ఏ విధముగా యుద్ధము చేయవలయునో ముందెన్నడూ అతడు శిక్షణను పొందియుండలేదు. అబ్రాహాము యోధుడు కాదు, అతడు ఒక వ్యవసాయకుడు. మరియు అబ్రాహాము ఏమి చేయలేడు, ఎందుకనగా అతడు ఒక సైనికుడు కాదు. అతని దగ్గరయుండు మనుష్యులు కూడా సైనికులు కారు. వారు వ్యవసాయదారులు. కాబట్టి అతడు చేయగలిగిన కార్యమేదనగా కేవలము దేవుని యొక్క వాగ్దానమును మాత్రము విశ్వసించుచూ, ఆ విశ్వాసమును తీసుకొని వాగ్దానముపై వుంచి తన శత్రువులను వెంబడించుచూ ముందుకు కొనసాగిపోవుటయేయగును. కాబట్టి అబ్రాహాము ఎప్పుడైతే ఆ రహస్యమును తాను కనుగొనెనో ఆ వాగ్దానమును అతడు పొందుకొనెను, మరియు దేవుడు దానిని అతడికి ఋజువు పరచెనని అతడు కనుగొనెను, దేవుడు తనకు చేసిన వాగ్దానమును ఆయన నెరవేర్చునని…. ఆమేన్! అక్కడే అది ఉన్నది.

ROM 3:24,25•

EPH 1:7

 

43నీవు ఇంకనూ పరిశుద్ధాత్మను పొందుకొనకపోతే, దానిని గూర్చి నీకు ఏమి తెలియకపోతే, మరియు నీ హృదయములో ఏదో దానిని కావాలని చెప్పినట్లయితే, నీవు అక్కడే దానికొరకై కాచుకొని యుండుము. అది నిత్యజీవము నీవు పొందుకోవలసిన స్వాస్థ్యము అదియే. అందుకొరకై నీవు అచ్చటనే వేచియుండి, ఆ సాతాను చూచి ముఖము మీదే ఇలా, "నీవు దొంగవు, నీవు దొంగవు అన్నప్పుడు నేను దేనిని కలిగియుండుటకు యేసుక్రీస్తు మరణించాడో, ఆ స్వాస్థ్యమును స్వాధీనపరచుకొనుటకు నేను వచ్చాను. ఇప్పుడు దానిని నాకు తిరిగి ఇవ్వు. నా దారికి అడ్డు తొలుగు!" అని చెప్పుము.

పిదప మొదట సంభవించబోవు కార్యమేదని నీకు తెలుసా, పరిశుద్ధాత్మ నీపై కుమ్మరించబడును. అటుపిదప, ఏదో నీలో సంభవించును. ఏదో ఒకటి సంభవించును. అది ఏమిటిది? ఆయన తన వాక్యమును నెరవేర్చునని దేవుడు ఋజువుపరుచును. అది ఖచ్చితముగా అలాగే జరుగును. పిదప గమనించాలి, తర్వాత నీవు చూడబోయే కార్యమేదనగా, నీవు రక్షించబడినావనియు, నీవు కూడా పరిశుద్ధాత్మను కలిగియున్నావనియు వాక్యము దానిని ఋజువుపరుచుటను. నీవు చూచెదవు. అటు తర్వాత ఏమి జరిగినది? తర్వాత ఏమిటి? అబ్రాహాము విజయము పొందాడు, అచ్చట నుండి అతడు వెనుకకు తిరిగి వస్తున్నాడు. వాక్యముపై అతడు విశ్వామును వుంచి తాను ఏదైతే పోగొట్టుకొనెనో దానిని తిరిగి పొందగలననే ధీమాతో ఆ పోగొట్టుకొనిన దానిని పొందుకొని, వాటితో అతడు తిరిగి వచ్చుచూ, ఠీవీగా విజయోత్సవముతో గంభీరముగా అతడు తన ప్రాంతమునకు తిరిగి వచ్చెను. నీవు కూడా అదే విధముగా దానిని చేయగలవు. నీకు నిత్యజీవము లేకపోతే దేవునిని అడుగుము. నీ పాపములు ఒప్పుకొనుము, దేవుని కుమారునియందు విశ్వాసముంచుము. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును అంగీకరించి ఈ విధంగా చెప్పుము, "దేవా, నేను దాని కొరకు వచ్చాను. దానిని పొందుకొనుటకు నేనిచ్చటకు వచ్చాను." అప్పుడు, నీవు విజయోత్సవముతో తిరిగి వస్తావు. నీవు దానిని పొందుకొంటావు. ఆమేన్. నీవు తేజస్సుతో ప్రకాశించెదవు, పక్షుల రాగాలు భిన్నముగా నీకు వినిపించును, ప్రతి ఒక్కరు నీకు భిన్నముగా కనబడెదరు. పిదప నీవు ప్రతి ఒక్కరిని ప్రేమించగలవు, ఆ పాత ద్వేషము, మత్సరము, పోరాటము నీలోనుండి వెళ్ళిపోతుంది. అందరినీ ప్రేమిస్తావు. ఓ, నీవు గొప్ప సమయమును కలిగియుంటావు. పాడుచూ, అరుస్తూ, దేవుని స్తుతిస్తావు. నీ గూర్చి ఎవరేమన్నా లెక్కచేయవద్దు. అది సరియే, ఖచ్చితంగా జయముతో తిరిగి వస్తావు!

GEN 14:17•

HEB 7:1

 

44తరువాత అబ్రాహామును ఎవరు కలుసుకున్నారు? అతడిని కలుసుకొనుటకు ఎవరు వచ్చారు? మెల్కీసెదకు అబ్రాహాముకు వాక్యమును ఋజువుపరచబడిన తరువాత మెల్మీసెదకు అతడిని కలుసుకొనుటకు వచ్చాడు. అతడికి వాక్యమును ఇచ్చినది మెల్మీసెదకు. ఆ తరువాత తన విశ్వాసమును అతడు ఆ వాక్యము మీద పెట్టి, అతడు విజయమును సాధించి తిరిగి వచ్చుచుండగా, అప్పుడు అతడు ఆయనతో సహవాసమును చేసెను. ఆమేన్. ఇప్పుడు నీవు కూడా ఆయనతో సహవాసము చేయగలవు. ఓ, ఒక్కసారి నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన తరువాత ఆయన వాక్యము నీకు నూతనమైనదిగా ఉంటుంది. ఓ, మై!

ఓ, నీవు చెప్పవచ్చు, "నేను ఈ విషయములను చూడలేకపోవుచున్నాను. కేకలు వేయుటలో నాకు విశ్వాసము లేదు. భాషలు మాట్లాడుటలో నాకు విశ్వాసము లేదు. దైవిక స్వస్థతయందు నాకు నమ్మకము లేదు." నీ మట్టుకే నీవు విజయము పొందుకోలేదని అది నీకు చూపించుచున్నది. అది నిజము. కాని నీవు ఒక్కసారి విజయము పొందిన తర్వాత, అప్పుడు నీవు దానిని పొందుకొంటావు. అప్పుడు నీవు దానిని (పరిశుద్ధాత్మను) కలిగియుంటావు. అవునయ్యా, అప్పుడు నీవు కేకలు వేస్తావు.

2SAM 6:14,15

 

45మీరు చూడండి, నేను ఒకప్పుడు ఆత్మలో నాట్యమాడుట గూర్చి ఆలోచించేవాడిని, ఎవరైనా నిలబడి ఆత్మలో నాట్యమాడుట. ఇప్పుడు, అది ఎగతాళిగా చేయుట నేను చూశాను, కాని నిజముగా ఆత్మలో నాట్యమాడుట నేను చూశాను. కాబట్టి ప్రజలు ఆత్మలో ఎందుకు నాట్యమాడతారో నేను గ్రహించాను. మంచిది, ఒక్కరు కూడా ఆ క్రమమును తప్పిపోవుట నేను చూడలేదు. ఆ విధముగా ఆత్మలో నాట్యమాడుచూ, ఆ సమయమున ఒక్కరు కూడా అనైతికముగ ప్రవర్తించుట నేను చూడలేదు. అది మర్యాదగా, క్రమముగా, మధురమైన రీతిలో జరుగుట నేను చూశాను. ఆత్మలో నాట్యమాడు సమయమునందు పాపులు కూడా ప్రసంగ వేదిక వద్దకు పరిగెత్తి వెళ్ళి రక్షణకొరకై ప్రలాపించెదరు. అది ఎందుకు అలా జరుగచున్నదని నేను ఆశ్చర్యపోయే వాడిని. ఓ, అది విజయమును పొందుకొనుట వలన జరుగుచున్నదని నేను కనుగొన్నాను.

మందసము తన విశ్రాంతి స్థలము యొద్దకు తీసుకొని వచ్చుచున్నప్పుడు, దావీదు ప్రభువు యెదుట నాట్యమాడెను. ఆమేన్. దావీదు వాక్యమును చూసినప్పుడు, అప్పుడు అది రాతిపలకగా ఉన్నది. అది తన విశ్రాంతి స్థలము యొద్దకు తీసుకొని వచ్చుచుండగా, దావీదు సంతోషించి చుట్టూ గిరగిరా తిరుగుచూ నాట్యము చేశాడు. ఎందుకని? వాక్యము మరలా తన స్థానమందు పెట్టబడుటను అతడు చూసి సంతోషించెను. ఆమేన్.

వాక్యమునకు ఏమి కావలసియున్నది? అది వేదాంత కళాశాల నుండి వచ్చినది కాదు, ఏదో కొంత వేదాంతముతో మిళితమైనది కాదు, కాని పాతకాలపు భక్తిని కలిగి, ప్రసంగ వేదిక యొద్ద నిలబడి ప్రసంగించుటకు వాక్యమును కలిగిన తన సేవకుడిని దేవుడు పంపించి అది ఋజువు పరచబడినదిగా చూచునట్లు దేవుడే దానిని ఋజువు పరుచును.

EXOD 15:20,21•

1SAM 13:14•

2SAM 6:14,16,20-22•

ACTS 13:22

 

46అప్పుడు దావీదు చెప్పాడు, "దేవునికి మహిమ, అది ఇదియే!" మరియు దాని చుట్టూ, దాని చుట్టూ, దాని చుట్టూ, తిరుగుచూ గంతులు వేయుచూ నాట్యమాడుచుండెను. శిలగా ఎటూ కదలకుండా నిలబడియున్న దావీదు యొక్క భార్య అచ్చట యుండి దానిని చూస్తున్నది. ఆ రాజు యొక్క కుమార్తె, "ఎందుకు ఆయన ఇలా చేస్తూ నాకు అసహ్యమును కలిగించుచున్నాడు," అని ఆమె అన్నది.

దావీదు చెప్పాడు, "నీవు దానిని ఇష్టపడుటలేదా? దీనిని గమనించుము," అతడు మరలా, మరలా దాని చుట్టూ తిరుగుచూ గంతులు వేస్తూ నాట్యమాడినాడు. అవును! ఓ, మై, అతడు ఎలాటి సమయమును కలిగియున్నాడు!

మీకు తెలుసు, పరలోకము నుండి దేవుడు దానిని తొంగి చూశాడు, "దావీదు, నీవు నా హృదయ చిత్తానుసారమైన మనుష్యుడవు" అని చెప్పాడు, గ్రహించారా. ఎందుకు? అతడు తన గర్వమునంతటిని పోగొట్టుకున్నట్లు చేసికొనెను. అతడు తన స్థితిని, సమస్తము, తనను తాను మరిచిపోయాడు. అతడు ఒక రాజ కుమార్తెను వివాహము చేసుకున్నప్పటికీ అతడు అసలు దానిని గూర్చి పట్టించుకోలేదు. తాను భూమి, ఆకాశములు సృజించినవానిని కలిగియున్నానని, ఇక్కడ మరలా దేవుని వాక్యము తిరిగి వారి మధ్యకు వచ్చుచున్నదని అతడు ఎరిగియుండెను, అందునిమిత్తమై దావీదు ఎంతో సంతోషించాడు, అతడు నాట్యము చేశాడు. అతడు తన శక్తి కొలది నాట్యము చేశాడు.

మిర్యాము, తంబుర తీసుకొని ఆ ఒడ్డు దగ్గరకు వెళ్ళి అవతలి ప్రక్కన నాట్యమాడినది. ఆమె ఎర్ర సముద్రము గుండా బయటకు వచ్చిన తర్వాత, ఆమె తమ శత్రువులు మునిగిపోవుట చూచి అందునుబట్టి ఆమె ఆత్మలో నాట్యమాడినది. ఆమెను హింసించిన శత్రువులు మునిగిపోతూ చనిపోవుట చూచినప్పుడు, ఆమె ఆత్మలో నాట్యమాడినది. అది నిజము. ఇప్పుడు చూడండి. యుద్ధమునందు జయించిన తర్వాత, అప్పుడు దేవుని మహిమ క్రిందకు దిగి వచ్చినది.

GEN 14:17,19,22•

JOHN 3:15•

1COR 12:9,28,30•

GAL 5:22

 

47ఇప్పుడు, అబ్రాహాము ఆయనను కలుసుకొన్నట్లు మనము కనుగొన్నాము. వాగ్దానము ఋజువు పరచబడిన తర్వాత అతడు ఆయనతో సహవాసము చేసెను. అబ్రాహామును ఆశీర్వదించుటకు మెల్మిసెదేకు వచ్చెను. ఆయన, "అబ్రాహాము నీవు ఆశీర్వదించబడుదువు. ఆకాశమునకు, భూమికిని సృష్టికర్తయు, సర్వోన్నతుడైన దేవుని వలన ఆశీర్వదించబడుదువు" అని అబ్రాహాముతో చెప్పెను.

ఓ, దానిని నేను ఎంతగానో ఇష్టపడుచున్నాను. అది విశ్వాసుల యొక్క వాగ్దానమైయున్నది. "దీనిని పొందుకొని యుండుటవలన మాకేమి ప్రయోజనము గలదు?" అని నీవు చెప్పవచ్చును. ప్రతి విశ్వాసికి, విశ్వాసి యొక్క వాగ్దానము నిత్యజీవమై యున్నది. విశ్వాసి యొక్క వాగ్దానము జీవము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, సహనము, ఆత్మ ఫలములు, దైవిక స్వస్థతవంటి పండ్రెండు కార్యములను గూర్చి ఇచ్చట నేను వ్రాసియుంచుకున్నాను. అదియే నీ యొక్క స్వాస్థ్యమైయున్నది. అవి నీకు చెందినవైయున్నవి. కాని నీవు వాటికొరకు పోరాడేవరకు వాటిని పొందుకోలేవు. అవి నీవి. కనబడే ప్రతీది, కనబడే ఐహికమైన ప్రతీది నీకు చెందినది. దేవుడు దానిని నాకు ఇచ్చాడు, ఎందుకనగా క్రీస్తు ద్వారా ఆయన నాకు దానిని ఇచ్చాడు. కనబడని అదృశ్యమైన కార్యములు నాకు చెందినవి. ఆమేన్. నేను దానిని ఇష్టపడుచున్నాను! నీవు దేనిని చూడగలవు, దైవిక స్వస్థతను, మరియు అటువంటి అనేక కార్యములు అది మంచిది, మరియు వాటి నిమిత్తమై మనము వాటిని మెచ్చుకొనుచున్నాము; కాని అవి అదృశ్యమైయున్నవి!

2COR 6:10

 

48ఇప్పుడు, విజ్ఞాన శాస్త్రము, ఇక్కడ దానిని పరిశోధించుటకై వచ్చి మంచిది, మనము చూద్దాము, నేను ఈ వ్యక్తిని తీసుకుంటాను. అతడు స్వస్థపడ్డాడని నీవు చెప్పావు, నేను అతడిని తీసుకు వెళ్ళి పరీక్షిస్తాను. ఏమి జరిగినదో నన్ను చూడనీయండి. ఇక్కడ ఒకప్పుడు కణిత ఉన్నదని మీరు చెప్పారు" అని చెప్పవచ్చును.

"అవును, ఖచ్చితముగా అక్కడే."

"మంచిది, అది వెళ్ళిపోయినదో, లేదా శాస్త్రీయముగా నన్ను పరిశోధించనీయండి. నీవు ఒక గ్రుడ్డివాడివి, ఇప్పుడు చూస్తున్నానని చెప్పుచున్నావు. అది నాకు ఎలా తెలుస్తుంది? నేను శాస్త్రీయంగా దానిని పరీక్షించి చూడనీయండి," అని చెప్పెదరు.

ఇప్పుడు, వారు ఆ వ్యాధి వున్నదా లేదా అని పరీక్షలు చేయవచ్చును. అయినప్పటికి ప్రతీ స్వస్థతకు మరియు ప్రతీ శారీరక సంబంధమైన ఆశీర్వాదములకు నేను హక్కుదారుడను. విజ్ఞాన శాస్త్రము కనుగొనలేని మరియు చూడలేని కార్యములకు కూడా నేను వారసుడనైయున్నాను. ఆమేన్. ఆమేన్. అదృశ్యమైన కార్యములకు కూడా నేను వారసుడనైయున్నాను. ఆమేన్. అవునయ్యా. కనబడే వాటికి కూడా నేను వారసుడను. ఆమేన్. ఈ నిజమైన భూమికి నేను వారసుడను, నీవు వారసుడవు, ప్రతి ఒక్క విశ్వాసి వారసుడు, అతడు దానికి వారసుడు. అది నిజము, తరువాత అదృశ్యమైన దానికి! ఏ స్వాస్థ్యమును కలిగినవాడుగా నీవు యున్నావు? ఆకాశము, మరియు భూమి. ఆమేన్! సమస్త స్వాస్థ్యమును నీవు కలిగియున్నావు. నీవు దానిని నమ్ముచున్నావా?

"సహో, బ్రెన్హాం, నీవు చూడలేని వాటి సంగతి ఏమిటి? నీవు ఎలా ఎరుగుదువు?" అని నీవు అడుగవచ్చు, అది ఇంకనూ నాదే అది వాస్తవము పరలోకము నాది. అది నాకు స్వంతం, అందుకు నేను ఆనందించుచున్నాను. దేవుడు ఆ విధంగా చెప్పాడు. అది నిజము. "మంచిది, దానిని నీవు ఎన్నడూ చూడలేదు. అక్కడ అది ఉన్నదని నీకు ఎలా తెలుసు?" ఏ విధంగానైనా అది అక్కడ ఉన్నదని నాకు తెలుసు, దేవుడు దానిని ఆ విధముగా చెప్పాడు. నీవు దానిని చూడకుండానే, నీవు దానికి వారసుడవని నీకు ఎలా తెలుసు?" నేను, "ఆయన వాక్యము విశ్వసిస్తున్నాను. ఆమేన్. చూశారా? నేను వారసుడను, నాతో కలిసి నీవు కూడా వారసుడవు, క్రీస్తు యేసు ద్వారా మనమందరము వారసులము.

ROM 7:24,25•

ROM 8:9,37•

1COR 15:55,57•

2COR 6:9•

REV 1:18

 

49కొరింథీయుల పత్రికలో ఉన్న విషయమును మీరు గ్రహించారా, II కొరింథీయుల పత్రికలో పౌలు, మనము మరణమును కూడా జయించియున్నామని చెప్పుచున్నాడు. దానిని గూర్చి ఆలోచించండి. మరణముపై జయమును కలిగియుండుటయా? అవునయ్యా, అది మనకు చెందినది. ఆమేన్. మహిమ! ఇప్పుడు నేను ఆ తుపాకీ ప్రేలుడు గూర్చి మర్చిపోయాను, గమనించండి. అది నన్ను ఎందుకు చంపలేదు? ఎందుకనగా అది దానివల్ల కాదు. అందుకనే, దేవుడు సిద్ధంగా లేదు. అతడు (మరణము) ఇష్టమొచ్చినట్లుగా నీ వద్దకు రావచ్చును, కాని నిన్ను తీసుకువెళ్ళలేడు. ఆమేన్. మహిమ! నిత్యము జీవించే, నేను విశ్వసించే యేసుక్రీస్తునందు ఎంతో కాలము క్రితమే నేను నా బాకీ చెల్లించి వేశాను. ఇప్పుడు మరణము మనము చెప్పినట్లు వింటుంది. ఆమేన్.

నీవు చెప్తావు, "మరణముపై జయమును కలిగియున్నాను?"

పౌలు కొరంథీయులలో చెప్పినది అదియే. మరణము, అది కూడా మన స్వాధీనములో ఉన్నది. ఎందుకని? వారు అతని తల నరుకుటకు సమయాన్ని సిద్ధపరచుచుండగా, అతడు, "ఓ, మరణమా నీ ముల్లెక్కడ? నీ ముల్లు ఎక్కడ? నీవు నన్ను ఎక్కడ భయపెట్టగలవు" అని చెప్పాడు.

మరణం చెప్పినది, "నేను నిన్ను బంధించి, నిన్ను సమాధి లోపల పెడతాను, నీవు కుళ్ళిపోయి మురిగిపోతావు."

అతడు చెప్పాడు, "కాని, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి మహిమ." మరణము, నరకము మరియు సమాధి, వాటన్నింటిని నేను జయించితిని, ఎందుకనగా మన నిమిత్తము ఆయన వాటన్నింటిని జయించాడు. అవి మన స్వాధీనములో ఉన్నవి!

NUM 13:26,27•

NUM 14:6,7

 

50యెహోషువా, కాలేబు, ఆ ప్రజలకు వాగ్దానము ద్వారా ఇవ్వబడిన అదృశ్యమైన ఆ దేశము యొక్క ఋజువులను తీసుకు వచ్చిన మాదిరిగా అది యున్నది. యెహోషువా, కాలేబులు, అక్కడ అలాటి దేశము ఉన్నదని చూపుటకు ఋజువు తెచ్చారు. ఇప్పుడు, అక్కడ వారు ఆ వాగ్దానము కలిగియున్నారు. దేవుడు వారికి వాగ్దానమిచ్చాడు. మరియు వారు ఆ దేశము దగ్గరకు వచ్చారు. కాని వారు దానిని ఎన్నడూ చూడలేదు. యెహోషువా, కాలేబులు ఆ వాగ్దాన దేశములోనికి వెళ్ళి, ఆ దేశము అక్కడ ఉన్నదని, అది సారవంతమైన భూమి అని, పాలు - తేనెలు ప్రవహిస్తున్నాయని ఋజువులు తెచ్చారు. ఆమేన్. అది ఏమిటి? వారు ఆ దేశమును స్వాధీనపరచుకొనబోవుచున్నారు. అందుకొరకై వారు వాగ్దానమును కలిగియున్నారు. వారు అక్కడకు వెళ్ళుటకు మార్గములో ఉన్నారు, వారు రమారమి యోర్దాను వద్దకు చేరుకొన్నారు. మరియు యెహోషువా యోర్దాను దాటి వెళ్ళి, ఆ దేశము మంచిది అని ఋజువును తీసుకు వచ్చాడు.

JOHN 14:16,17,26•

ROM 4:13,14•

2COR 5:17•

GAL 2:20•

GAL 3:29•

GAL 4:7•

GAL 6:15•

EPH 2:1

 

51యెహోషువా ఇశ్రాయేలు సంతతి కొరకు ఏమి చేసియున్నాడో (యెహోషువా" అనగా "రక్షకుడు" అని అర్థము), యేసుక్రీస్తు కూడా సంఘము కొరకు అదే కార్యమును చేసెను. వారు ఆయనను చంపినప్పుడు, ఆయన మరణమును జయించాడు. ఆయన పాతాళమును జయించాడు, ఆయన సమాధిని జయించాడు. ఆయన మరలా పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనే ఋజువుతో తిరిగి లేచాడు. ఎన్నటికీ తరిగిపోని మధురమైన భూమిగా వారు చెప్పుకొనే ఆ నది ఆవల మధురమైన ఆ దేశము కలదు అని అది చూపిస్తుంది. ఆమేన్. ఆయన తిరిగి వచ్చి మనకు బుజువు తీసుకు వచ్చాడు. సహో, బ్రెన్హాం అది ఏమి చేస్తుంది? అది నీవు అబద్ధము ఆడుట, దొంగతనము చేయుట, త్రాగుట, దూషించుట, అనైతికముగా జీవించుట, సమస్తమును నీ నుండి పారద్రోలును. అది నీలో క్రొత్త సృష్టిని చేస్తుంది. ఒకప్పుడు నేను పాపములోను, అతిక్రమములోను మృతుడను. అయినను జీవించునది నేను కాదు గాని, క్రీస్తు నాలో జీవించుచున్నాడు. క్రీస్తు యేసునందు నేను నూతన సృష్టిని, ఆమేన్, వాగ్దానమునకు నేనే వారసుడను. హల్లెలూయా! అవునయ్యా, ఆ దేశము మనకు చెందినది. అది నీకు ఎలా తెలుసు? యెహోషువా (యేసుక్రీస్తు) మరణము నుండి లేచి పరిశుద్ధాత్మ అనే ఋజువును తీసుకు వచ్చాడు. నేను దానిని పొందుకొన్నాను. ఆమేన్. మహిమ! నేను దానికి వారసుడను. పరిశుద్ధ గ్రంథము ఆ విధంగానే చెప్పుచున్నది. అదే దేవుడు, ఇశ్రాయేలీయులకు ఆ వాగ్దాన దేశమును వాగ్దానము చేసిన అదే మారని దేవుని (అది వారు అంతకుముందు చూడనిది). అదే పరిశుద్ధ గ్రంథము, అదే దేవుడు మనకు నిత్యజీవమును వాగ్దానమును చేశాడు, పరిశుద్ధాత్మ దానికి సాక్ష్యమిచ్చుచున్నది. క్రీస్తు సజీవుడు. ఆయన మృతుడు కాదు. ఆయన మన మధ్య జీవిస్తున్నాడు. మనలో మన ద్వారా జీవిస్తున్నాడు. ఆయన మన చుట్టూ వ్యాపించియున్నాడు. ఆమెన్.

52ఒకానొక దినమున సాతాను నన్ను చంపుటకు అవకాశమును ఎదురుచూచినప్పుడు ఆ దినమున ఆయన ఆ బల్ల మీద కూర్చుని నన్ను కాపాడినందువలన వాడు నన్ను చంపలేకపోయాడు. ఆమేన్. నా సమయము సమాప్తమై నేను వెళ్ళిపోయే సమయము ఆసన్నమై, క్రీస్తు "సిద్ధమయినది" అని చెప్పే వరకు వాడు నన్ను ఎన్నడూ ఏమి చేయలేడు. ఆమేన్. నన్ను బంధించి తీసుకొని వెళ్ళాలని వాడు ఎన్నిసార్లు నా దగ్గరకు వచ్చినా గాని, క్రీస్తు అందుకొరకు నా నిమిత్తము ఆజ్ఞ యిచ్చు వరకు వాడు వట్టి చేతులతోనే వెనుకకు తిరిగి వెళ్లాడు. ఆమేన్. వాగ్దానము. దేవుడు దానిని వాగ్దానము చేశాడు. దానిని వాగ్దానము చేసినది దేవుని యొక్క వాక్యము. మనము వారసులము గనుక దానిని మనము విశ్వసిస్తున్నాము.

నేను దైవిక స్వస్థతకు వారసుడను. నేను సంతోషమునకు వారసుడను, ఆనందించుటకు హక్కు గలవాడిని, "అయితే ఏది నిన్ను ఆనందముగా ఉంచుతుంది?" అలా ఉండుటకు నాకు హక్కు ఉన్నది. "నీకు ఎలా తెలుసు?" ఎందుకనగా నేను దానికి వారసుడను. ఆమేన్. ఇప్పుడు నాకు ఎంతో భక్తితో పరవసించుచున్నట్లు అన్పిస్తుంది. అవును నేను ఆనందమునకు వారసుడను, నేను సంతోషమునకు వారసుడను. నేను సమాధానమునకు వారసుడను. నేను నిత్యజీవమునకు వారసుడను. నేను పరిశుద్ధాత్మకు వారసుడను. ఆమేన్. అది కలిగియున్న ప్రతి ఋజువుకు నేను వారసుడను. ఆమేన్. నేను దేవుని అధికారమునకు వారసుడను. ఆమేన్. ఆ విధంగా యుండునట్లు నిన్ను ఎవరు చేశారు? అది నావలన జరిగినది కాదు; ఆయన చేశాడు. మీలో ప్రతి ఒక్కరూ కూడా అదే విధముగా దానికి వారసులు.

2COR 6:10•

EPH 2:6•

COL 3:3•

REV 3:21

 

53నేను ఖంహాసనమునకు వారసుడను! "నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనము మీద కూర్చున్నట్లుగా, జయించువాడు నాతోపాటు నా సింహాసనము మీద కూర్చుండును." ఆమేన్. సమస్తమునకు వారసుడు! కేవలము ఒక్క విషయమునకు కాదు; సమస్తమునకు! సమస్తము నీ పాదముల క్రింద ఉంచబడినది, చివరకు మరణము కూడా నీ పాదముల క్రింద ఉన్నది, సమాది నీ పాదముల క్రింద ఉన్నది, పాతాళము నీ పాదముల క్రింద ఉన్నది, పాపము నీ పాదముల క్రింద ఉన్నది, సమస్తము నీ పాదముల క్రింద ఉన్నది. నీవు వారసుడవు! నీవు మరణిచావు, కాని నీ జీవము యేసుక్రీస్తు ద్వారా దేవునిలో దాచబడి, నిత్యజీవమునకై లేపబడి, క్రీస్తుయేసునందు నీవు పరలోక స్థలములలో కూర్చుండియున్నావు. ఓ, వ్యూ! మీరు మీ ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని పిలువవచ్చు, మీరు మమ్ములను ఇష్టము వచ్చిన పేర్లతో పిలవవచ్చును, కావాలంటే పిచ్చివాళ్ళు అని పిలువవచ్చును, కాని మేము వారసులమైయున్నాము. దేనికి వారసులమైయున్నాము? సమస్తమునకు.

"నీవు బ్రెన్హాం గుడారమునకు వారసుడివా?" "కాదు, నేను సమస్తమునకు వారసుడను. కనబడేవాటికీ, ప్రస్తుతమందున్న వాటికి, రాబోయే వాటికి, సమస్తమునకు నేను వారసుడను."

ACTS 1:4•

ACTS 2:39

 

54యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా ప్రతి పాపమును, దుష్టత్వము నా పాదముల క్రింద ఉంచబడినది. ఆయన మరణమును, పాతాళమును మరియు సమాధిని జయించి, పునరుద్దానపు ఉదయమున తిరిగి లేచాడు. మరియు నన్ను వారసుడుగా చేశాడు. "అక్కడ కనిపెట్టుకొని యుండుడి. నేను వాగ్దానమును ఇస్తాను" అని చెప్పి మరియు ఆయన అభిషేకించిన అధికారము కలిగిన సేవకుడు ఇలా చెప్పాడు, ఆ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, ప్రభువు తనయొద్దకు పిలుచు వారందరికి చెందును." నేను వారసుడను. ఆమేన్. ఆయన పునరుద్దానములో యేసు దానిని ఋజువుపరిచాడు. ఓ, దేవా.

మనము జీవమునకు, మరణమునకు మధ్యగల యుద్ధభూమిలో ప్రవేశించి, "నేను పాపిని, సహో బ్రెన్హాం." నీవు అలా ఉండవలసిన అవసరములేదు. నీ హృదయమందు పాపపు చాయలనే ఇచ్చను కలిగియున్నావు, కాబట్టి నీవు ఒక పాపివి. నీవు అలాగు ఉండవలసిన అవసరము లేదు. వెల ఎప్పుడో చెల్లించబడినది.

"సహో బ్రెన్హాం, నేను సంతోషము కలిగియుండాలని ఆశిస్తున్నాను." నీవు దానిని కలిగియుండవచ్చును. ఏ ఆశీర్వాదములను నీకు ఇచ్చుటకు క్రీస్తు మరణించాడో వాటిని నీవద్ద నుండి సాతానుడు దొంగిలించుటకు నీవే అనుమతించుచున్నావు. నేను దానికి వారసుడను. అది అంతయూ నాది. ఆయన దేని నిమిత్తము మరణించాడో, ఆ సమస్తము నాకు చెందినది. అది అంతయు నీకు చెందినది. మనము ఆయన పిల్లలము. ఆయన దేనికొరకైతే మరణించెనో ఆ సమస్తమునకు మనమే వారసులము.

55ఇప్పుడు, నీవు ఆ యుద్ధ రంగములో ప్రవేశించినప్పుడు. "ఓ, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అనేది లేదు. నీకు తెలుసా, నీవు తమాషాగా ప్రవర్తించబోవుచున్నావు. మరియు ఏదో వ్యత్యాసమైనది జరగబోవుచున్నది." అది ఎంత వ్యత్యాసమో దానిని నేను లక్ష్యపెట్టను. నేను దానికి వారసుడను. అది జీవము మరియు నేను దానిని వెంబడిస్తున్నాను. అది నిజము.

అదియే ప్రతి పాపి యొక్క ఉద్దేశ్యముగా ఉండాలి. "వచ్చి ఆ పరిశుద్ధాత్మను పొందుకొనుడని ఇచ్చటకు నన్ను ఆహ్వానిస్తూ నాతో చెప్పుచున్న మాటలను ఆధారముగా చేసుకొని, ఆ పరిశుద్ధాత్మను పొందుకొనుటకు నేను వచ్చుచున్నాను. అది నాది. నేను దానిని పొందుకొనే వరకు నేను లేచి వెళ్ళను. నేనొక పిచ్చివాడిగా వుండగోరుట లేదు. ఏమైనాగాని దానిని నేను లక్ష్యపెట్టకుండా దానిని పొందుకొనే వరకు నేను ఇచ్చటే కాచుకొనియు౦దును. ప్రభువా, నీవు నాకు పరిశుద్ధాత్మను ఇచ్చునంత వరకు నేను ప్రార్థించుట మానను. నీవు ఇప్పుడే ఇస్తావని నాకు తెలుసు. ఒకవేళ నా జీవితంలో ఏదైనా పొరపాటు ఉంటే దానినిగూర్చి నాతో చెప్పండి, నేను దానిని సరిచేసుకుంటాను, ప్రభువా, అది ఏమైనాగాని నేను వెళ్ళి దానిని సరిచేసుకుంటాను."

ఒకవేళ దేవుడు ఏమీ బయలుపరచకపోతే, "సాతానా, నేను దాని కొరకు వచ్చాను, నీవు అక్కడ ఎంతో కాలముగా నాకు అడ్డుగా నిలబడియున్నావు. ఇక అడ్డుగా నిలువలేవు, నా దారినుండి తొలగి పొమ్ము!" అని చెప్పండి.

56నీ స్థానము అది, సమస్తమునకు వారసుడవు. నిత్యజీవమునకు వారసుడవు. దైవీక స్వస్థతకు వారసుడవు. ఓ!

ఓ రక్షణకు వారసుడవు, దేవునిచేత కొనబడినవాడివి,

ఆయన రక్తములో కడగబడి ఆత్మ ద్వారా జన్మించావు.

ఇది నా కథ, ఇది నా పాట.

దినమంతయు నా రక్షకుని స్తుతియించెదను.

సంపూర్ణ విధేయతతో,

సమస్తము ప్రశాంతముగా ఉన్నది.

నేను రక్షకునిలో ఉన్నాను,

ఆనందము, ఆశీర్వాదము.

పైకి చూస్తూ, నిరీక్షిస్తూ కనిపెట్టుచున్నాను.

మేలుతో నింపబడి, ఆయన ప్రేమలో మునిగిపోయాను.

హల్లెలూయా! నీ స్థానము అదియే. ఇదే నా గాథ. ఇదే నా గానము. నేను రక్షణకు వారసుడను. రక్షణ అంటే ఏమిటి? నీకు ఇవ్వబడే ఒక కార్యము ಅది, బహుమానం. నేను రక్షణకు వారసుడను, నిత్యజీవమునకు, నా ఆత్మకు రక్షణ, నా శరీరమునకు రక్షణ, నా అలసటకు రక్షణ, సమస్తమునకు రక్షణ, క్రీస్తు యేసు ద్వారా సమస్తమునకు నన్ను వారసుడిని చేశాడు. ఆయన మరణించి, తిరిగిలేచి, ఋజువుతో తిరిగివచ్చి దానిని మనమీద కుమ్మరించాడు. మహిమ! ఓ, మై!

MATT 4:4,7,10•

MATT 7:7,8•

LUKE 4:4,8,12•

LUKE 11:9,10

 

57ఇప్పుడు, నీవు ఆ పైకి వెళ్ళి ఏమి చేస్తావు? నీవు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అబ్రాహాము చేసినట్లుగానే అక్కడికి వాగ్దానముతో వెల్లెదవు. "అది నాది," అని మీరు చెప్పారు. నీ వాగ్దానము నందు నాకు విశ్వాసము కలదు. నేను నీ వాక్యము తీసుకువస్తున్నాను. నీవు ఇది వాగ్దానము చేసావు. "అడుగుడి మీకు ఇవ్వబడును. వెదకుడి, మీకు దొరుకును. అడుగుడి, మీకు ఇవ్వబడును. తట్టుడి, మీకు తెరవబడును." "ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను." "నేను ఇక్కడ వున్నాను, నేను తట్టుచున్నాను, వెదకుచున్నాను, అడుగుచున్నాను. నేను దానిని పొందుకోవాలి." నీవు చేయవలసినది అదియే. ఓ, నీవు అక్కడ వాక్యమును పెట్టినప్పుడు, అప్పుడు నీలో ఒక కార్యము జరుగుతుంది.

విద్యుత్ తీగను తాకితే షాక్ కొట్టినట్లుగా, సాతాను ఎగిరి గెంతి అక్కడ నుండి పారిపోతాడు. అవునండీ, ఆ విధముగా అప్పుడు నీవు జయిస్తావు. జయించి తర్వాత ఏమి చేయాలి? ఎలా దానిని నీవు జయిస్తావు? నీయంతట నీవు దానిని జయించగలవా? జయించలేవు. అందుకే నీకు బదులుగా నీకంటే ము౦దే దానిని జయించుటకై ఒకరు వెళ్ళి దానితో యుద్ధము చేసి నా కొరకు ఆయన దానిని జయించెను. ఆయనే క్రీస్తు. అసలు నేనేమి చేయకుండానే కేవలము దానికి వారాసుడనైతిని దానికొరకు నేను చేయవలసినది ఏమియు లేదు. ఆ వాగ్దానమునకు నేనే వారసుడను. మీరది చూచారా?

2COR 5:17•

GAL 6:15

 

58"సహో బ్రె'న్హాం నీవు దానికి యోగ్యుడవా?" లేదు. "నేను యోగ్యడని తలస్తున్నావా?" లేదు. "నీవు, బిషప్ యోగ్యడని తలస్తున్నావా?" లేదు. "యోగ్యుడైన మనుష్యుడు ఎవడైనా ఉన్నాడా?" లేదు. "మంచిది, ఎందుకని?" నీవు ఒక వారసుడివి.

ఒకవేళ నీవు ప్రపంచములోనే భయంకరమైన త్రాగుబోతుగా ఉండి నీ తండ్రి నీకు పది లక్షలు విడిచిపెడితే, నీవు దానిని పొందుకొనుటకు యోగ్యుడవా, కాదా? నీవు, నీ తండ్రి స్వాస్థ్యమునకు వారసుడవు. ఆయన నీకు విడిచిపెట్టినదంతా నీదే. నీవు యోగ్యుడవైనా, కాకపోయినా, ఆయన నీ కొరకు విడిచిపెట్టాడు. ఆమేన్.

నేను ఒకప్పుడు పాపిని, అయినా వారసుడను. నేను మంచివాడిని కాదు, అయినా నేను వారసుడను. నేను మరణించి, నరకమునకు వెళ్ళవలసినవాడను. అయినా గాని నేను వారసుడను. నేను దేనికి వారసుడను? నిత్యజీవమునకు. "నీవు దానిని పొందుకొనబోవుచున్నావని నీకు ఎలా తెలుసు?" నేను దానిని అనుభూతి చెందుతున్నాను. పరిశుద్ధాత్మ దానిని తీసుకు వచ్చెను. యేసు మరణము నుండి లేచెను, కాబట్టి అది వచ్చెను. ఇప్పుడు అది వచ్చియున్నది, అది ఏ విధంగా ఉండును అని చెప్పబడినదో ఆ విధంగా అది ఋజువుపర్చబడినది. నేను మరణమును దాటి జీవములోనికి ప్రవేశించాను. నేను క్రీస్తు యేసునందు నూతన సృష్టిని అయ్యాను. ఇప్పుడు నేను వారసుడను. అవును అయ్యా, ఇప్పుడు నేను ముందుకు సాగుచున్నాను. ఆమేన్. నేను చేసిన క్రియలన్నియు తునాతునకలుగా ఖండించి నిర్మూలము చేయబడినవి. మిర్యాము చేసినట్లుగానే, వెనుకకు తిరిగి అక్కడ చూడుము, అక్కడ వారు మృతిచెంది, పరలోకములో ఉన్న దేవునియొక్క గొప్ప గ్రంథములోని మరపు అనే సముద్రములో వారు పాతిపెట్టబడ్డారు. అది జరిగిపోయినది. నా పేరు ఆ గ్రంథములో ఉన్నది. అది ముద్రించబడి, మరపు అనే సముద్రములో పడవేయబడియున్నది. మరియు క్రొత్త గ్రంధము, మహిమలో క్రొత్త పేరు వ్రాయబడియున్నది. అది నాది. అవును. అప్పుడు, మనము సమస్త స్వాస్థ్యమునకు వారసులమైయున్నాము.

GEN 12:7•

GEN 13:14,15•

GEN 14:15-18•

GEN 15:7,13

 

59ఇప్పుడు అబ్రాహాముకు చేసినట్లుగా, అబ్రాహాము, దేవుడు అతనికి ఏమి చెప్పాడు? ఈ దేశము నీది. ఈ దేశములో ఉన్నదంతయూ నీది. తూర్పువైపున, ఉత్తరము వైపున, పడమర వైపున, దక్షిణము వైపున చూడుము. ఇక్కడున్న సమస్తము నీది. నీవు ఆ క్రొత్త దేశములోనికి ప్రయాణము చేయాలి. నేను ఆ దేశమునకు నిన్ను వారసుడిని చేస్తాను. నేను దీనిని నీకు ఇస్తున్నాను. నీ తర్వాత, నీ సంతానమునకు దీనిని ఇస్తాను. దేవుడు ఇచ్చిన వాగ్దానము పైన తన విశ్వాసమును ఉంచుటయే అబ్రాహాము చేయవలసిన కర్తవ్యమైయున్నది. క్లిష్టమైన సమయము ఆసన్నమైనప్పుడు, అబ్రాహాము తన ఖడ్గమును తీసుకొనివెళ్ళి పోరాడవలసి వచ్చినప్పుడు, దేవుడు అక్కడికి వచ్చి పోరాడినాడు. అతడు యుద్ధముచేసి రాజులను వధించాడు.

ఇక్కడ అతడు తిరిగి వస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు సమస్తము సమాప్తమైనది. సహోదరుడా, అతడు కేకలు వేసి ఉండవచ్చును. అచ్చటయున్న యవ్వనస్తులందరూ కేకలు వేస్తూ, ప్రభుని స్తుతిస్తున్నారు, ఎందుకనగా అచ్చటకు అబ్రాహాము వచ్చుచున్నాడు. అతడిని కలుసుకొనుటకు ఎవరు వచ్చారు? మెల్కీసెదెకు, షాలేము రాజు, వారు ఏమి చేశారో చూడండి. యుద్ధము ముగిసిన తర్వాత వారు కూర్చొని రొట్టె మరియు ద్రాక్షారసము తీసుకున్నారు. ఆ రాజు, రొట్టె మరియు ద్రాక్షా రసము తీసుకువచ్చాడు. ఆయన దానిని ఎందుకు చేశాడు? యుద్ధము ముగిసిన తర్వాత, విజయం సాధించిన తర్వాత, దాని తరువాత వారు కలిసి కూర్చొని సహవాస భోజనము తీసుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకొంటూ వారిరువురు కలిసి సహవాస భోజనమును భుజించారు. ఓ, ఈ రాత్రి దేవుడు తన పిల్లలను కూడా అదే రీతిగా చేయాలని కోరుచున్నాడు.

ROM 4:13,14•

GAL 3:29•

GAL 4:7•

HEB 11:19

 

60"సహో బ్రెన్హాం మరి నీ సంగతి ఏమిటి? నీవు మాట్లాడుచున్న నీ సంఘము సంగతి ఏమిటి?" మనము అబ్రాహాము సంతానము. వారు అబ్రాహాము యొక్క రాజ సంతానము. వాగ్దానం బట్టి మనము అబ్రాహాము సంతానమైతిమి, క్రీస్తు యేసు ద్వారా మనము అబ్రాహాము యొక్క సంతానమైతిమి. మరియు వాగ్దానము ప్రకారము మనము అతడితో వారసులము అయ్యాము. అబ్రాహాము వారసుడైతే నేను కూడా వారసుడనగుదును. నేను అబ్రాహాముతో వారసుడను. నీవు కూడా అలాగే వారసుడవగుదువు, అది ఎలా వచ్చినది? ప్రభువైన యేసుక్రీస్తు చేసిన వాగ్దానమును విశ్వాసము ద్వారా విశ్వసించినందువలన మనము ఆ రీతిగా అబ్రాహాము రాజ సంతానమైతిమి, అబ్రాహాము తన కుమారుడిని మృతుల నుండి పొందిన విధంగా పొందాడు. మనము కూడా కుమారుడిని పొందుకున్నాము, ఆయన మనకు కుమారుడు కూడా కాదు. ఆ విధముగా ఒక కుమారుడు ఇక్కడకు వచ్చే మార్గము లేదు. కాని దేవుడు ఆయనను చేసి, ఆయనను మన వద్దకు పంపించాడు. ఆయన వచ్చి తన మరణము ద్వారా మన పాపములకు వెల చెల్లించాడు. ఆయన మరణము ద్వారా నేను వారసుడను అయ్యాను. ఓ, మై. నీవు ఆ విధముగానే వారసుడవైతివి. సాతానుడి దుష్టత్వము అంతా మన వెనుక ఉన్నది. దేవునికి స్తోత్రం.

HEB 4:12

 

61జయించుట! ఈ రాత్రి ఎంతమంది జయించారు? మీ చేతులు చూపించండి. "దేవుని కృప వలన నేను జయించాను." దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము ఏమి చేయాలని తలస్తున్నానో మీకు తెలుసు. నేను ఇప్పుడే ఇచ్చట నుండి ప్రారంభించాను, మిమ్ములను సగము రాత్రి వరకు ఉంచుతాను. మనము మంచి ప్రతిష్టిత ఆరాధన కలిగియుందాము. దేవునికి మన జీవితములను మరల నూతనముగా ప్రతిష్టించుదాము. మీలో ఎంత మందికి అలాగు చేయాలనిపిస్తుంది? ఓ నేను ఇప్పుడు అందరికంటే ఎక్కువగా కలిగియున్నాను. నేను నా రెండు చేతులు ఎత్తాను, నా హృదయమును కూడా. నా జీవితము క్రీస్తును గూర్చి మాట్లాడాలని నేను కోరుచున్నాను. నన్ను క్రీస్తుకు నూతనముగా ప్రతిష్టించాలని నేను కోరుచున్నాను. ఆయన చిత్తము నాలో జరగాలని మరియు నా చిత్తము మరుగైపోవాలని నేను ఆశించుచున్నాను. ఆయన చిత్తము నెరవేరాలి. నేను విజయోత్సపు కవాతు చేయాలి. అది నన్ను బట్టి కాదు. సంఘ శాఖల మానవకల్పిత సిదా౦తములు మరియు వారి సమస్త క్రియలవలన ఆయన ప్రసంగించిన సువార్త నేడు పడుచున్న శ్రమను నేను ఎరిగియున్నందువలన మనము కలిగియుండవలసిన గొప్ప విజయము శత్రువు వద్ద ఆగి పోయినది. దేవా! ధగధగ మెరయుచున్న ఆ ఖడ్గమును నా చేతిలోనికి తీసుకొని దానితో కవాతు చేస్తూ ముందుకు కొనసాగిపోతాను. నా చిత్తము వెనుకకుపోయి, మరుగైపోయి రెండంచుల ఖడ్గము నా మార్గమును సరాళము చేయుచుండగా, ఆ వాక్యము ఆ విధంగా నాకు ముందుగా వెళ్ళును గాక.

మనము నిలబడి, మన జీవితములను నూతనముగా ఆయనకు ప్రతిష్టించుదాము. ప్రతి ఒక్కరూ మీ స్వంత మార్గములో ఆయనకు సమర్పించుకొనుడి. ప్రతి ఒక్కరమూ మనచేతులను ఆయన వైపు ఎత్తుదాము.

JOHN 6:54

 

62మా పరలోకపు తండ్రీ, ఈ రాత్రి మాకు తెలిసిన ఉత్తమమైన పద్ధతిలో మా జీవితములను మీకు సమర్పిస్తున్నాము. మేము సమస్తమునకు వారసులమని మేము ఎరుగుదుము. నీవు దానిని వాగ్దానము చేశావు. ప్రభువైన యేసు, మేము దానిని నమ్ముచున్నాము. ప్రభువా, నీవు చేయలేకపోతే మేము ఎన్నడూ దానిని చేయలేకపోయేవారము. ప్రభువా, నీవు చేసిన వాగ్దానమునందు విశ్వాసము ఉంచకపోతే మేము ఆ కార్యము చేయలేకపోయేవారము. నీవు పరిశుద్ధ గ్రంథములో చెప్పావు, "నా శరీరము తిని, రక్తము త్రాగినవాడు నిత్యజీవము కలిగియుంటాడు. అతడు తీర్పులోనికి రాక మరణము నుండి నిత్యజీవమునకు దాటిపోవును. నా శరీరము తిని, రక్తము త్రాగినవాడు, నిత్యజీవము కలిగియుండును. అంత్యదినమున అతనిని నేను లేపుదును." అది వాగ్దానము. అది నీవు చెప్పినది. దానిని మేము నమ్ముచున్నాము.

ప్రభువైన దేవా, పరిశుద్ధాత్మ మా మీద సంచరించండి. కదలండి. ఓ, దేవా!సంచరించండి. ఓ ప్రభువా, మాలో సంచరించండి. సజీవుడైన దేవుని ఆత్మ మాలో సంచరించండి. ప్రభువా, మమ్ములను అంగీకరించండి. క్రీస్తు నామములో మమ్ములను చేర్చుకొనండి. నన్ను శుద్ధిచేయండి. నన్ను మలచి, నీ రూపంలో రూపించండి, ఓ దేవా, దేవుని కుమారుని సారూప్యములోనికి రూపించండి. ప్రభువా, నన్ను తీసుకొనండి. నేను నీవాడిని. మీకు ఈ సంఘమును ఇచ్చుచున్నాను. ప్రభువా, ఇక్కడున్న ప్రతి ఆత్మను, నా ఆత్మతో కలిసి నీకు అప్పగించుచున్నాను. ప్రభువా, మమ్ములను మలచండి, పాపపు దుష్ట మార్గములను మరచి వాగ్దానము చేయబడిన నీ వాక్యమును విశ్వసించునట్లు మమ్మును రూపించండి. మమ్ములను మీరు జయము నుండి జయమునకు నడిపిస్తారు. నీవు దానిని వాగ్దానము చేశావు.

JOB 1:12

 

63ప్రభువా, సాతానుడు మాకు హాని చేయలేడు. వాడు చేయగలిగినది అంతా వాడు చేస్తాడు, వాడు మమ్ములను తాకలేడు. నీవు ఒకసారి వాడిని యోబు మీదకు విడిచినప్పుడు, "అతని ప్రాణము తీయవద్దని" నీవు చెప్పావు. వాడు అంతా చేశాడు కాని ప్రాణం తీయలేదు. వాడు తీయలేకపోయాడు, ఎందుకనగా నీ వాగ్దానము ఇంకనూ యోబుతో ఉన్నది.

దేవా, నీవు ఇంకనూ ఈ రోజు కూడా అదే దేవునిగా ఉన్నావు. నీ స్వంత వారిని నీవు కాపాడుదువు. అది సత్యము అని మాకు తెలుసు, మమ్ములను నూతనముగా సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, మా విశ్వాసమును ఒప్పుకొనుచుండగా మా పాపపు ఆత్మలను కడగండి. క్రీస్తు యేసు, మమ్ములను స్వీకరించండి. ప్రభువా, మేము ఈ ప్రభురాత్రి భోజనము తీసుకొనుచుండగా, మా హృదయములలో సహవాసము చేయండి. మేము ఎక్కడ తప్పుచేశామో మాతో చెప్పండి. ప్రభువా, మా తప్పు ఎక్కడవున్నదో మాకు చూపించండి. మేము దీనత్వముతో దానిని సరిచేసుకొంటాము. ప్రభువా, దీనత్వముతో మా పాపములన్నింటినీ బలిపీఠము మీద పెట్టుచున్నాము. ప్రభువా, దీనత్వముతో నన్ను నేను నీ వాక్యము మీద పెట్టుచున్నాను. ప్రభువా, నీ దయ కొరకు చూస్తున్నాను.

ప్రభువా, నేను ఇక్కడున్నాను, నీ ఇష్టప్రకారము తగిన స్థానములో నన్ను అమర్చుము, అది ఈ సంఘము యొక్క మొర్ర." "మమ్ములను తగిన స్థానములో అమర్చండి." ప్రభువా, నేను నా గూర్చి మాత్రమే మాట్లాడగలను, కాని ప్రభువా, వారి హృదయములలో కూడా అదే విశ్వసిస్తున్నారని నేను నమ్ముచున్నాను. నీకిష్టమైన రీతిగా మమ్మును నీవు అమర్చుము. మేము నమ్ముచున్నాము. మేము వారసులుగా ఉండగోరుచున్నాము. క్రీస్తు యేసులో మేము నిలిచినంత కాలము మేము వారసులమని మేము ఎరిగియున్నాము. సింహాసనము ఎదుట మేము ఆయనతో వారసులమైయున్నాము.

ISA 40:3,4•

MATT 3:3•

LUKE 3:4,5

 

64ఇప్పుడు మాతో ఉండండి. ప్రభువా, మా మధ్య ఉన్న రోగులను స్వస్థపరచండి. ఇక్కడ ఎవరైనా రోగులుగా ఉండే వారిని ముట్టండి, స్వస్థపరచండి. పూర్తిగా సరిచేయండి. ఒకవేళ రోగియైన ఆత్మ ఉంటే, ఈ రాత్రి స్వస్థపడును గాక. ప్రభువా, వంకరగా ఉన్న ఆత్మ బాగుపడును గాక. బలహీన మోకాళ్ళ బలహీనమైన చేతులు మహిమతో పైకి ఎత్తబడి, దేవుని స్తుతించును గాక. వంకర మార్గములు సరిచేయును గాక. అరణ్యములో దేవుని కొరకు రాజమార్గములు ఏర్పడును గాక.

ప్రభువా, నీవు త్వరగా వస్తున్నావని నమ్ముచున్నాము. ప్రభువా, నీ వాక్యమును ప్రకటించి, అరణ్యములో నీ కొరకు మార్గమును సిద్ధపరచుదుము గాక. ప్రభువు కొరకు వంకర మార్గములు తిన్నగా చేయుదుము గాక. ప్రతీ మతశాఖ వేరును పెకలించి వేయుదుము గాక! ప్రతీ మనస్పర్థలనే వేరును పెకలించి వేయుదుము, అసూయ ద్వేషములనే సమస్త వేర్లను, ప్రతీ కలహమును, సమస్తమును పెకలించివేయుదుము గాక! నిజమైన దేవుని వాక్యము సంతోష నదివలె ప్రవహించును గాక. తండ్రీ, దీనిని అనుగ్రహించండి. ఈ ప్రభురాత్రి భోజనము తీసుకొనుటకు ముందుగా మమ్మును నీకు అప్పగించుకొనుచున్నాము. యేసుక్రీస్తు నామములో. ఆమేన్.

LUKE 13:16

 

65సహోదరి స్పెన్సర్ తన శరీర స్వస్థత కొరకు ప్రార్థించమన్నారు. సహోదరి స్పెన్సర్ దేవుడు నిన్ను దీవించును గాక! పరలోకపు తండ్రి, ఈ పరిశుద్దురాలైన వృద్దురాలు ఇక్కడ కూర్చొనియున్న వంగిపోయిన ఒక స్త్రీని నీవు చూచుచున్నావు. ఈ విధంగా చెప్పావు, "విశ్రాంతి దినమున అబ్రాహాము కుమార్తె స్వస్థత పొందకూడదా?" ప్రభువా, ఆమె స్నేహితులలో ఎక్కువమందికి, ఆమె పాత స్నేహితులకు, ఆమె తన ఇంటి సేవకులకు పరిచర్య చేసేది. వారిలో అనేకమంది మహిమలో ప్రవేశించియున్నారు. ప్రభువా, సాక్ష్యముగా ఆమె ఒంటరిగా మిగిలియున్నది. ప్రభువా, ఆమెకు పిల్లలు తప్ప ఎవరూ లేరు, బహుశా ఒక స్నేహితుడు, ఒక బంధువు ఉండవచ్చును. గొప్ప అడవి కూలిపోగా ఒక చెట్టు మాత్రమే నిలబడియున్నట్లుగా ఆమె ఒక్కటే నిలబడియున్నది, ప్రభువా, ఆమెను దృష్టించమని ప్రార్ధిస్తున్నాను. ప్రభువా, కనికరించండి. ప్రభువా, ఆమె యొక్క వేర్లు చాలా లోతుగా పాతుకొనియున్నవి. కల్వరి పర్వతముపై ఆమె నిలబడియున్నది. ప్రభువా, క్రీస్తులో ఆమె యొక్క విశ్వాసపు వేర్లు లోపలి వరకు చొచ్చుకొనివున్నవి. ప్రభువా, ఈ వృద్ధురాలి మీద నా చేతులుంచి, ఆమె నాలుక క్రింద ఉన్న కణితిని గద్దిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అది విడిచిపోయి ఆమె స్వస్థత పొందును గాక, ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరి స్పెన్సర్ వందనములు, అది జరుగును, ఏమాత్రము సందేహించవద్దు.

నా విశ్వాసము నిన్నే చూచుచున్నది,

కల్వరిలోని గొర్రెపిల్లా,

దైవిక రక్షకుడా;

నేను మొర్ర పెట్టుచుండగా ఆలకించుము,

నా పాపములన్నియూ తీసివేయుము,

ఎన్నడూ నీ నుండి దూరముగా తొలగిపోనియ్యకుము,

వినండి, నాతో కలసి పాడండి,

జీవితపు చీకటి బంధములలో నేను నడుచుచున్నప్పుడు,

నా చుట్టూ విచారము కమ్మినప్పుడు,

నీవు నా మార్గదర్శిగా ఉండుము,

అంధకారమును వెలుగుగా మార్చి,

కన్నీటిని తుడిచి వేయుము,

ఈ దినము నుండి సంపూర్ణముగా,

నన్ను నీవాడిగా ఉండనిమ్ము!

ఇప్పుడు హృదయాంతరంగము నుండి, కేవలము ప్రభువుకే అది తెలుసు. నీ హృదయాంతరంగము నుండి, "ప్రభువా, ఈ దినము నుండి సంపూర్ణముగా నన్ను నీ వానిగా ఉండనిమ్ము" అని నీవు చెప్పుచున్నావా? ఆ చివరి భాగము మరలా పాడుదాము.

ఎన్నడూ నీ నుండి,

దూరంగా తొలగిపోనియ్యకుము.

MATT 6:9-13•

LUKE 11:2-4

 

66ఇప్పుడు అందరమూ కలసి మందయొక్క గొప్ప కాపరి, మేము ఈ విధంగా ప్రార్ధించాలని నీవు బోధించావు, "పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్తులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము; రాజ్యము, శక్తి, మహిమ ఎల్లప్పుడూ నీదైయున్నది. ఆమెన్." మీరు కూర్చోవచ్చును.

67సహోదరి షెపర్డ్ యొక్క బిడ్డ కొరకు ప్రార్థించమని నేను మిమ్ములను

కోరుచున్నాను. అది ఇప్పుడే నాకు జ్ఞాపకము వచ్చినది, కొద్ది కాలం

క్రితం ఆ బిడ్డ కొరకు ప్రార్థించమని కోరారు, నేను ప్రార్ధన చేశాను. నాకు అక్కడ ఒక సమావేశము ఉన్నది, కాని ఆ ఇంటిని దర్శించలేక పోయాను. ఆ బాలిక జ్వరముతో రోగిగా ఉన్నదని వారు చెప్పారు, కొంచెము బిగుసుకు పోవుచున్నది, అది వైరస్ వలన కలిగినది. దానిని గూర్చి మీకు తెలుసు. కొన్నిసార్లు వారి కండరములు బిగుసుకు పోవును, నీవు చేతులతో నొక్కాలి. సహోదరి హేలీ, మరి కొంతమందికి అలా జరిగినది. అది వైరస్ వలన జరుగుతుంది. మేము ప్రార్ధించాము. బిడ్డకు బాగుంటే పర్వాలేదు, తొమ్మిది గంటలకు లేదా ఆరాధన ముగిసే సమయం వరకు బాగుపడకపోతే మాకు ఫోన్ చేయండి. మేము అక్కడికి వస్తామని వారికి చెప్పాను. కాబట్టి సహవాస భోజనము తీసుకొనకముందు దీనత్వముతో ఆ బిడ్డ కొరకు ప్రార్థించుదాము.

68ప్రభువైన యేసు, ఆ చిన్న బిడ్డ వయస్సు నాకు తెలియదు. వారు మాలో ప్రశస్తమైన శిష్యులుగా ఇచ్చట యున్నారు, మీ విశ్వాసులలో ఒకరుగా వున్నారు. సహోదరి షెపర్డ్ మరియు సహోదరుడు షెపర్డ్ గారి కుమార్తెగా యున్నది. ఆ బిడ్డను ఒక ఆభరణముగా నీవు వారికి యిచ్చితివి. ప్రభువా, మేము ప్రార్థించుచుండగా, ఆమెను దృష్టించి, ఆశీర్వదించి, కాపాడి, స్వస్థపరచి, పూర్తిగా బాగుచేయండి. ఇప్పుడే మేము హక్కు కోరుచూ దానిని అడుగుచున్నాము. ఈ వర్తమానము తర్వాత దీనిని మేము స్వాధీనపరచుకొనుచున్నాము. ఆయన వాక్యప్రకారము దేవుని యొక్క మహిమ కొరకు దానిని మేము హక్కు కోరుచున్నాము. యేసుక్రీస్తు నామములో ఆ రోగము ఆ బిడ్డను విడుచును గాక! దేవుని మహిమ నిమిత్తము ఆ బిడ్డ బాగుపడి, ఆరోగ్యవంతురాలు అగును గాక! ఇప్పుడు, అది పలుకబడియున్నది. ఇప్పుడు అది జరుగును గాక. ఆమేన్. మీరు నమ్ముచున్నారా?

69నీ భారము ప్రభువు వద్దకు తీసుకు వచ్చి

అక్కడే దానిని విడిచి పెట్టుము.

వాటిని అక్కడే విడిచిపెట్టుము.

ఓ. వాటిని అక్కడే దానిని విడిచిపెట్టుము

నీ భారము ప్రభువు వద్దకు తీసుకు వచ్చి

అక్కడే దానిని విడిచిపెట్టుము

మనము సందేహించకుండా దానిని నమ్మినట్లైతే

ఆయన ఖచ్చితముగా దానిని నీకు నెరవేర్చి యిచ్చును

(నీవు చేయవలసినది అదే)

నీ శరీరము నలిగిపోయి నొప్పులతో ఉంటే,

నీవు బాగుపడలేకపోతే,

పరలోకములోని దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చును

అని గుర్తుంచుకొనుము,

ఇప్పుడు, నీ బాధను యేసు ఎరుగును,

ఆయన రక్షించగలడు,

ఆయన స్వస్థపరచగలడు.

నీ భారమును ప్రభువు వద్దకు తీసుకు వచ్చి

అక్కడ దానిని విడిచిపెట్టుము

ఈ చివరి వచనము పాడుచుండగా,

మనము ఒకరితో ఒకరము కరచాలనము చేద్దాము.

అక్కడ విడిచిపెట్టుము,

మీకు తెలుసు, (సహవాస భోజనము)

అక్కడ విడిచిపెట్టు (ప్రభువునికి స్తోత్రం!)

నీ భారమును ప్రభువు వద్దకు తీసుకు వెళ్ళి

అక్కడ దానిని విడిచిపెట్టుము.

మనము విశ్వసించి సందేహించకపోతే,

ఆయన దానిని నెరవేర్చును.

నీ భారమును ప్రభువు యొద్దకు తీసుకు వెళ్ళి

అక్కడ దానిని విడిచిపెట్టుము.

PS 32:5•

JER 31:34•

ROM 10:9•

1PET 1:18,19•

1JN 1:7,9•

REV 1:5

 

70ఓ, ఆయన అద్భుతమైన వాడు, కాదా? ఇప్పుడు, ఇప్పుడు మన ఒప్పుదలతో, మన నమ్మకముతో, మన పాపములను ఒప్పుకొన్నప్పుడు, ఆయన మరపు అనే సముద్రములో ఎవరైతే తన పాపములను ఒప్పుకొనునో దేవుడు వాటిని తుడిచి వేయును. గమనించారా! అవి యేసుక్రీస్తు రక్తపు సముద్రములో పడిపోయాయి. అవి ఎన్నడూ జ్ఞాపకము చేయబడవు. స్త్రీలలో ఎంతమందికి బ్లీచింగ్ గురించి తెలుసు? మీ అందరికి, ఇప్పుడు ఒక పెద్ద తొట్టి నిండా క్లోరాక్స్ తీసుకుందాము. అది ఒక రకమైన బ్లీచింగ్. క్లోరాక్స్ తో నిండిన పెద్ద తొట్టి, ఒక చిన్న ఇంక్ ఫిల్లర్ తీసుకొని ఒక చుక్క నల్లని సిరా తీసుకుందాము. ఆ సిరా నీ పాపములు, ఆ తొట్టి దగ్గర నిలబడి దానిని ఒత్తి, తరువాత ఆ తొట్టిలో చూడు. అది ఏమైనది? సిరా ఏమైనది? అది బ్లీచింగ్ ను తాకగానే, అది శక్తివంతమైనది, వెంటనే ఆ నల్లని పాపమనే రంగును తీసివేస్తుంది. ఆ పాపము ఇక ఎన్నడూ లేదు. అది ఏమిటి? అది కనబడకుండా పోయింది. అది శాశ్వతముగా పోయినదని. అది ఏమిటి? సిరా తానే క్లోరాక్స్ గా మారినది. ఒప్పుకొనిన ప్రతి పాపమును యేసుక్రీస్తు రక్తము అదే చేయును. అది ఏమిటి? అది మరువబడినది. అది కనబడకుండా పోయినది. అది ముగించబడినది. అది తుడిచివేయబడినది. అది పరిత్యజింపబడినది. అది దూరముగా పెట్టబడినది. అది నీకు వ్యతిరేకముగా ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనబడదు.

HEB 4:15•

1PET 2:6,7

 

71ఎక్కడో ఎవరో నా పేరు పలుకుచున్నారు. [సహోదరి అప్పుడే స్వస్థపడినది అని సాక్ష్యము చెప్పుచున్నది.] మంచిది, దేవునికి స్తోత్రము. ఆయన సజీవుడుగా యున్నాడు. ప్రభువుకు స్తోత్రము. మనము ప్రభువుకు కృతజ్ఞలమై యున్నాము. ఓ, దేవా, నీ మంచితనమునకు మేము ఎలా స్తుతించాలి. అక్కడ వెనుక ఉన్న దీనురాలిని ముట్టాడు. ప్రభువు ఆమెను ముట్టాడు. సరే, మంచిది. ఆయన మన బలహీనతలను సృజించకలిగిన ప్రధానయాజకుడు.

గుర్తుంచుకొనండి, ప్రతి వాక్యము ఒక లంగరు, స్థిరమైనది, ఖచ్చితమైనది. నీ విశ్వాసమును దానిమీద పెట్టుము, అక్కడ నుండి కదలవద్దు. నీవు దానిని అక్కడ పెట్టి, మరలా తీసుకొని, "నేను మరలా ప్రయత్నిస్తాను" అని చెప్పవద్దు. అక్కడే విడిచిపెట్టుము. అక్కడే దానితో నిలిచియుండుము. అవునయ్యా. హేబేలు చేసినట్లుగా, నీ స్వంత తలంపులకు మరణించుము. ఇలా చెప్పుము, "దేవా, అది నీ వాక్యము. నేనేమి తలంచుచున్నానో, అది కాదు. అది నీ వాక్యము. అది అక్కడ వున్నది." హేబేలు ఆ బండమీద మరణించాడు. ఆ సహోదరిని తాకినట్లుగా, ఆయన తాకును. అది అంత సామాన్యముగా వుండును.

మనము దానిని చేయాలి… మనము కాదు. మీకు తెలుసు, సాతానుడు దానిని చాలా క్లిష్టముగా మార్చుచున్నాడు. "ఓ, నీకు తెలుసా, అది గడిచిపోయిన దినములకు," అని చెప్పుచున్నాడు. మరియు ఆ విధముగా అవి అప్పుడు జరిగినవి. ఆ తలంపు కేవలము అవిశ్వాసులకే చెందినది,

అయితే విశ్వసించిన మీకు ఆయన ప్రశస్తమైనవాడు. తృణీకరింపబడెను గాని, ఆయన ప్రశస్తమైన బండగా జీవముతో వచ్చిన జీవము కలిగిన రాయి, ప్రశస్తమైన రాయి, ముఖ్యమైన మూలరాయి. ఓ, మై. ఈ రాయిని తాకినవాడు స్వస్థత పొందును. అది అంతే. ఆమేన్.

2SAM 7:28•

PS 119:160

 

72ఇప్పుడు, మనము ప్రభువునకు కృతజ్ఞత కలిగినవారము, కాదా? నేను సంతోషిస్తున్నాను. ప్రభువగు దేవునిని బట్టి సంతోషిస్తున్నాను. ఆమేన్. ఆయన దయకలిగిన తండ్రి, కరుణతో నిండినవాడు. ఆయన తన వాక్యమును ఘనపరుచును. తన నిబంధన నెరవేర్చును. ఆయన దానిని చేయును. ఆయన దేవుడైయున్నాడు. దానిని చేసినది ఆయనే. ఆయనే సర్వసత్యమునకు ఊట, చూశారా. అది ఎప్పుడు దేనితో కల్తి చెందకుండా ప్రతీకాలమందు వుండే స్పష్టమైన సత్యమైయున్నది. ఆయన పలికిన ప్రతీమాట తప్పిపోనిది. మరియు ఇది ఆయన వాక్యము. ఓ, దేవా దీనియందు నా విశ్వాసము తప్పిపోకుండా ఉండును గాక. ఆమేన్. అది తప్పిపోనిదిగా ఉండును. వాక్యము తప్పిపోనిది గనుక, వాక్యమందుంచిన విశ్వాసము, వాక్యము చెప్పిన దేనినైనను దానిని అది ఉత్పత్తి చేయును. ఆమేన్. కాబట్టి ప్రభువా నన్ను శుద్ధి చేయుము, నన్ను ప్రయత్నించుము, నన్ను శుద్ధిచేయుము, స్వస్థపరచుము, కాపాడుము, నన్ను ఆశీర్వదించుము, నీ కృప నాకు అనుగ్రహించమని నా దేవునియందు అదే నా ప్రార్ధనయైయున్నది. ఆమేన్.

1COR 11:23-33

 

73ఇప్పుడు నేను I కొరంథీయులు లోని వాక్యము చదువుతాను. 11వ అధ్యామము 23వ వచనము నుండి.

నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎతుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దానిని విరిచి యిది మీ కొరకైన నా శరీరము. నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని యీ పాత్ర నా రక్తమువలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు.

కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టె తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు, రక్తమును గూర్చియు అపరాధియగును.

కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఆలాగు చేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.

ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు, తనకు తానే శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులనై యున్నారు. చాలామంది నిద్రించుచున్నారు.

అయితే మనలను మనమే విమర్శించుకొనిన యెడల తీర్పు పొందకపోదుము.

మనము తీర్పు పొందినయెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు, ప్రభువు చేత శిక్షించబడుచున్నాము.

కాబట్టి సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చునప్పుడు ఒకనికొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి.

MATT 26:28•

LUKE 22:20•

1COR 11:25,26,29,33

 

74ఇప్పుడు నేను ఇది చెప్పవచ్చునా? యేసు తన మరణమునకు ముందు ఈ ఆజ్ఞ ఇచ్చాడు, ఆయన అక్కడికి వెళ్ళుచున్నానని ఎరిగియుండి, దీనిని వ్రాసినప్పుడు కూడా శిష్యులు ఆయన దేనిగూర్చి మాట్లాడుచున్నాడని ఎరుగక ఆశ్చర్యపడ్డారు. కాని ఆయన చెప్పాడు, "ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిని తిని మరియు త్రాగినప్పుడు నేను వచ్చువరకు నా మరణమును ప్రచురించుదురు." ఓ, ఆ ప్రశస్తమైన మాటలు!

"ఆయన మరణమును ప్రచురిస్తారు," అనే మాటలకు అర్థం ఏమిటి? అని శిష్యులు నిస్సందేహముగా ఆశ్చర్యపడ్డారు. మనము దీనిని ఎలా చేయగలము? వారికి ఇది అంతా మర్మముగా ఉన్నది, కాని ఆయనకు కాదు. ఆయన దేవుడు. ఆయన ఏమి చేయాలో ఆయన ఖచ్చితంగా ఎరిగియున్నాడు. "ప్రచురించుదురు…" ఆయన చెప్పాడు, "మీరు కూడి భుజించుటకు వచ్చినప్పుడు…"

ఇప్పుడు, "అయోగ్యముగా తిని మరియు త్రాగువాడు," నీవు క్రీస్తుకు అవమానము తెస్తున్నావు, కాబట్టి నీవు దానిని తీసుకొనవద్దు. ఈ సహవాసములోనికి వచ్చి ఒక క్రైస్తవుడినని సాక్ష్యమిస్తూ ఇది ప్రభువు శరీరమని వివేచింపక, అందులో పాల్గొని, అటు తరువాత బయటకు వెళ్ళి లోకములో కలసి జీవిస్తూ క్రీస్తును, ఆయన శక్తిని, మరియు ఆయన కార్యములను తృణీకరిస్తూ యుండును. నీవు గొప్ప అవిధేయుడవై, దేవునిని అవమానపరుస్తున్నావు.

JOHN 6:54

 

75ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయములో యేసు చెప్పాడు, "నా శరీరము తిని, నా రక్తము త్రాగినవాడే నిత్యజీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును." ఇప్పుడు ఆ వాగ్దానము, "అంత్యదినమున అతనిని లేపుదును," అది మహిమకరమైనదిగా యున్నది కదా?

నీవు ఇక్కడ ఎందుకు ఉన్నావో ఎప్పుడైనా తలంచితివా? పిల్లలారా, మీరు పాఠశాలలకు ఎందుకు వెళ్ళుచున్నారు? తండ్రీ, నీవు ఎందుకు పని చేయుచున్నావు? తల్లులు ఉదయము లేచి, పిల్లలను పాఠశాలకు పంపి, వారి ముఖములు కడిగి, వంట చేసి, అన్ని పనులు చేసి రాత్రికి అలసిపోయి మరలా మరుసటి ఉదయము అదే పనులు ఎలా ప్రారంభిస్తున్నారు? ఎందుకు నీవు వాటిని చేస్తున్నావు? తండ్రీ, ఎందుకు నీవు ప్రయాసపడుచున్నావు? రాత్రి అలసి ఇంటికి వచ్చిన తర్వాత, కుమారుడు అనారోగ్యముగా ఉంటే, అతని కొరకు ఏడుస్తూ ప్రార్ధించి, ఇబ్బందులు పడటము, వాళ్ళు బాగైన తరువాత మళ్ళీ యధాప్రకారముగా ఆ పనులలో నిమగ్నమైపోతారు. ప్రతీ ఆదివారము వాళ్ళను లేపి స్నానాలు చేయించి వాళ్ళను దేవుని ఆలయమునకు తీసుకొని వచ్చెదరు. మంచిది, ఇది అంతా ఎందుకు? అతడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు? ఇవి అన్నియూ చేయుటకా? ఏ విధంగా అయినా దానిని చేయాలని నీవు ఎరిగియున్నావు. ఓ, అది దుఃఖకరమైనది, చూశారా? ఇది అంతా ఏమిటి?

GEN 14:19,22•

JOHN 6:39,40,44,54

 

76ఓ, సహోదరుడా ఇది పరీక్షా సమయము, ఇది అవకాశ సమయము. దీనిని అంగీకరించే సమయము. దాని స్థానము తీసుకోగల ఏదైనా ఒకటి వుంటే దానిని గూర్చి నాకు చెప్పండి. దానికంటే మేలైనది ఇంకొకటి ఏదైనా ఒకటి వుంటే దానిని గూర్చి నాకు చెప్పండి. ఈ లోకానికి రాజైనా, ప్రపంచమును ఏలే కృశ్చెవ్ గాని, కెన్నడి గాని లేదా అది ఎవరైనా గాని, ఏమైనా గాని, నీవు ఆశించేదేదైనా కాని ఒక రోజు అందరిలాగానే నీవు మరణిస్తావు. నిజము. అది ఏ సమయములో, ఏ నిమిషంలో వస్తు౦దో నీకు తెలియదు. సమస్త సృష్టికి కారణభూతుడగు దేవుడు ఇచ్చిన నిస్సందేహమైన మాటను బట్టి, మరణము నిన్ను తాకినప్పుడు, నీవు చావవు. నిత్యజీవము కలిగియుంటావు. భూమికి ఆకాశమునకు శిల్పి, నిర్మాణకుడగు ఆయన "అంత్యదినమున నేను అతడిని లేపుదును," అని చెప్పెను.

ఓ, దేవా నాకు అవిశ్వాసము లేకుండా నాకు సహాయము చేయండి. నా ఆత్మను నింపండి. నన్ను శుద్ధి చేయండి, నన్ను నింపండి, నన్ను బలపరచి నన్ను బయటకు పంపండి. నన్ను చావనీయవద్దు. ఆ కథను చెప్పుటకు నన్ను జీవించనీయండి. ప్రపంచములోని ప్రతి మూలకు వెళ్ళి వాక్యమును ప్రకటించి, వాక్యపు విత్తనము విత్తనీయండి. (అవునయ్యా.) అంత్యదినమున కల్తిలేని, స్వచ్ఛమైన వాక్యముతో ఉన్న పంట కోతకాలమున ఉండును గాక, క్రీస్తునందున్న విశ్వాసులు ఉందురు గాక!

77ఈ రాత్రి క్రీస్తు యేసునందున్న విశ్వాసము వలన నీ పాపములు రక్తము క్రింద ఉన్నాయా? ఇప్పుడు మనము సహవాసము తీసుకొందాము. భోజనము చేయుట కాదు, మీరు తినుచుండగా ఒకరితో ఒకరు మాట్లాడినట్లు కాదు. కేవలము దేవునితో సంభాషించండి. సహవాసము అనగా రొట్టె, ద్రాక్షారసము కాదు, "దేవునితో నీవు, నీతో దేవుడు సంభాషించుటయే." ఆయన మరణమును, నలిగిన శరీరమును, ఆయన పాతిపెట్టబడుటను, పునరుద్దానమును మనము నమ్ముచున్నామని, దానికి సూచనగా మనము దీనిని తీసుకొనుచున్నాము. మనము పరిశుద్ధాత్మ సన్నిధిని నమ్ముచున్నాము. ఆయన మనకు నిత్యజీవము ఇచ్చినాడని నమ్ముచున్నాము. మనము మరణించము, మనము మరణము నుండి జీవములోనికి దాటియున్నాము. ఒక దినమున ఇక్కడ నుండి ఒకరికి ఒకరము వేరైన తరువాత, మనము మరలా పునరుద్దానములో లేచి యేసుక్రీస్తుతో కలసి ఒక శరీరముగా ఉంటాము. ఆమేన్. వీటి ఆధారముగా నా పాపములను ఒప్పుకొని, దేవుని కుమారునియందు విశ్వాసముంచి, నేను, సంఘము కలసి, ఆయన రాకడ వరకు, ఆయన యొక్క మరణమును ప్రచురించుటకు దేవుడు విడిచి వెళ్ళిన ఈ మాదిరిని ఆచరించెదము.

1COR 11:24

 

78యేసు చెప్పాడు, "ఇది మీ కొరకు విరువబడిన నా శరీరము. దీనిని తినుడి. నా జ్ఞాపకార్ధముగా దీనిని చేయుడి."

మా పరలోకపు తండ్రీ, మా పాపములను ఒప్పుకొనిన తరువాత, నీ వాక్యమును వినిన తర్వాత, మేము అయోగ్యులమని ఒప్పుకొనిన తరువాత, మేము కేవలము దేవుని కుమారుని యొక్క యోగ్యతల మీద ఆధారపడియున్నాము. మేము అయోగ్యులము. ప్రభువా, మా పాపములు అన్నింటిని క్షమించండి. మరియు విశ్వాసము ద్వారా ప్రభువు బల్ల దగ్గరకు వస్తున్నాము. ప్రభువా, ఈ రొట్టె నీ శరీరమునకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, తండ్రీ, ఈ రొట్టెను పవిత్రపరచుమని నేను ప్రార్ధిస్తున్నాను. దీనిలో పాలుపంచుకొనే ప్రతీ వ్యక్తి నిత్యజీవము కలిగియుందురు గాక. దీనిని తీసుకొనే ప్రతి వ్యక్తి శరీరములో స్వస్థత కలిగి, నీవు నిర్ణయించిన సమయము వరకు వారు జీవింతురు గాక. వారు ఈ లోకములో జీవించినంత కాలము నిన్ను సేవించి, అంత్యదినమున క్రీస్తు రక్తముతో విమోచింపబడిన గోత్రములతో కలసి పునరుద్దానమునందు తిరిగి లేచుదురు గాక. ప్రభువా, దీనిని అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్ధిస్తున్నాము. ఆమెన్.

MATT 26:28•

1COR 11:25,26

 

79పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, "ఆయన పాత్రను ఎత్తుకొని, భుజించిన తరువాత, ఇది క్రొత్త నిబంధన పాత్ర, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు."

పరలోకపు తండ్రీ, ఈ రాత్రి ద్రాక్ష ఫలములోని రసమును నీ వైపు ఎత్తిపట్టియున్నాను. పరలోకపు తండ్రి, దీనిని పరిశుద్ధపరచుమని ప్రార్ధించుచున్నాను. అది కల్వరిలో ప్రోక్షించబడిన రక్తమునకు సాదృశ్యముగా ఉన్నది. ముగించబడిన యేసుక్రీస్తు కార్యములో విశ్వాసముంచుట వలన ఈ రక్తము ద్వారా మా పాపములు క్షమించబడినవి. ప్రభువా, మా అందరి అవిశ్వాసమును క్షమించండి. మాకు విశ్వాసమును, గ్రహింపును ఇవ్వండి. మమ్ములను మీ సేవకులుగా చేయండి. ప్రభువా, మా జీవితకాలమంతయు నిన్ను సేవించుదుము గాక. మేము ఈ బల్ల చుట్టూ కూడుచుండగా, తండ్రీ, మాకు తోడుగా ఉండండి. ఈ సహవాసమును దీవించండి. నీవు మా హృదయములతో మాట్లాడి, మేము చేయవలసిన కార్యముల వైపు మమ్మును నడిపించండి. ప్రభువా, దీనిని అనుగ్రహించండి. ఈ ద్రాక్షారసమును ఏ ఉద్దేశ్యము కొరకై ఉన్నదో అందుకొరకు పరిశుద్దపరచండి. యేసుక్రీస్తు నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...