ఒక నిజ ప్రవక్త యొక్క మార్గము

ఒక నిజ ప్రవక్త యొక్క మార్గము

VGR COUNT-363 1స్నేహితులారా, శుభోదయం ఇది చాలా చక్కని ఉదయము. మరియు ఇచ్చట యుండుట ఇదొక మంచి సమయముగా యున్నది. సజీవునిగా యుండి ఈ ఉదయమున ఇచ్చట నేను మరల జనులతో యుండుట నాకు సంతోషముగా యున్నది. కొద్దిపాటి సమయంలో చాలా సంగతులు జరుగగలవు. ఏ పెద్ద న్యాయస్థానమందు మనము జవాబిచ్చుటకై ఏ సమయమందు మనము పిలువబడుదుమో మనకు తెలియదు; కాబట్టి అన్నివేళలా, మనం సిద్ధపడి యుండవలెను, అప్పుడు మనకు సమాధానము దొరకును.

2నేను చెప్పినట్లుగా నేను చాలా కృతజ్ఞత కలిగియున్నాను… ఆదివారం రాత్రి నేను ఇచ్చటే యుండి జనులతో మాట్లాడాను. మనకు సమస్తము యున్నవి అనే సందేశమును నేను ఆదివారము రాత్రి ప్రసంగించితిని, సహోదరుడు రాబర్సన్ మరియు మీరందరూ ఆదివారం రాత్రి వినిన వర్తమానము ద్వారా ఆనందించితిరని ఫోను చేసి చెప్పినందులకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పగోరుచున్నాను. కాబట్టి నేను కొన్నిసార్లు… నేను మాట్లాడెదనని నాకు తెలియనే తెలియదు, వచ్చి నేను సహోదరుడు నెవిల్ వైపు చూచెదను. (అతని గొంతు బొంగురుపోవును), ఆ దీన సోదరుడు ఆ సంగతి నాకు ముందే ఫోనులో చెప్పినప్పుడు నేను సాధ్యమైనంత వరకు సహాయపడగలనని జవాబు ఇచ్చెదను, ఎందుకనగా ఉదయాన గట్టిగా బోధించినచో బాగా అలసట వచ్చి గొంతు బొంగురుపోవును. అందుకే ఆదివారం రాత్రి ఆయనకు బదులుగా నేను మాట్లాడాను. మీ అందరికి కృతజ్ఞతలు!

3ఇప్పుడు, ప్రార్థన కొరకు ఎన్నో విన్నపములు వచ్చినవి, కాబట్టి మొదటగా ఈ అన్ని విన్నపములు బట్టి వారిని గుర్తుచేసికొందము. ఇప్పుడు మన తలలు వంచుదము.

మా పరమతండ్రీ, కృతజ్ఞతా హృదయములతో నీ ఆలయములో మేము ప్రవేశించవలెనని వ్రాయబడియున్నది, పరిశుద్దుల సమాజములో మా మనవులను తెలియచేయవలెను. ఈ ఉదయమున చాలా మనవులున్నవి, వాటినన్నింటిని నీ దృష్టికి ఎట్లు తేవలెనో మాకు తెలియదు, కాని నీవు వాటిని ఎరుగుదువు. ఈ ఉదయమున చెప్పబడనివి మరెన్నో యున్నవి, అనేకము కలవు, వాటిని కూడా నీవు ఎరుగుదువు. చెప్పునివి కూడా ఎన్నో గలవు, వాటిని కూడా నీవెరుగుదువు. కాబట్టి గత ఆదివారం రాత్రి షేపర్డు దంపతుల బిడ్డ కోసం ప్రార్ధించినట్లు, మా పూర్ణహృదయములతో ప్రార్ధించుచున్నాము. అచ్చట ఎప్పుడైతే… మరలా వచ్చి, "ఆమెకు పోలియో వ్యాధి లేదు, ఆమె బాగవును," అని పరిశుద్ధాత్మ చెప్పెను. నీ మాట విన్నప్పుడు మాకెంతో సంతృప్తి కలుగును. వ్యాధిగ్రస్తులు, దుఃఖములో నున్నవారు, తమవారి కొరకు ప్రార్ధించుచున్నవారి విన్నపములను మీరు అనుగ్రహించమని మేము ఈ ఉదయమున అడుగుచున్నాము. తండ్రీ, ప్రతిఒక్కరిని నీవు జ్ఞాపకము చేసికొనుమని ప్రార్ధించుచున్నాను. నీ యెదుట నేనును, ఈ జనులును కలిసి ప్రార్ధించుచున్నాము, యేసు నామములో మేమందరము ఇచ్చట చేరి, ఈ మనవులు సమర్పించుచున్నాము. తండ్రీ, మా ప్రార్ధనాలకించుము. ఆమేన్.

4నా గురించి ప్రార్ధించిన మీ అందరికిని వందనములు చెల్లించుచున్నాను. నాకు ఒక స్వల్పమైన ప్రేలుడు ప్రమాదము అచ్చట సంభవించినదని మీరెరుగుదురు. సాతాను నన్ను చంప ప్రయత్నించినది. మరియు దానిని వాడు చేయలేకపోయాడు - దేవుడు నాకు తోడుగా యున్నందువలన. ఎందుకని, ఆ పని సమాప్తమయ్యే వరుకు వాడు దానిని ఏమాత్రము చేయలేడు; దేవుని పని సమాప్తమైనప్పుడు, అప్పుడు నేను సిద్ధమే. కావున నా మంచి స్నేహితుడగు సహోదరుడు ఉడ్ అచ్చటున్నాడు, అది కేవలము దేవుని కృప. అయిదు లేదు ఆరు టన్నుల ప్రేలుడు నా ముఖం మీద ప్రేలినది. నాకేమీ హాని కలుగలేదు, చూచారా. కొద్దిగా నా ముఖం గీరుకొన్నది, అయితే అన్ని ఇప్పుడు మానిపోయినవి, కాని ఒక్క చిన్న మచ్చ మాత్రం అచ్చట యున్నది.

5డాచ్ దంపతులు, సహోదరుడు బ్రవున్ తదితరులు జనులను సమావేశపరచి నా కొరకు ప్రార్ధించిరని టెలిఫోను ద్వారా నాకు తెలిసినది, వారికి నేను వందనములు చెల్లించుచున్నాను. అది అటువంటిది, మీకు అది ఎదో చేయును. మీరెరుగుదురా, అన్నింటి కొరకు మరియు మరొకరి కొరకు మీరు ప్రార్ధించటం వంటివి. మీకు అది అవసరమై యున్నప్పుడు, ఎవరో ఒకరు మీ కొరకు ప్రార్ధించుచున్నారని ఎప్పుడైతే మీరు కనుగొందురో, అది మీకు ఎంతో బలమును కలుగజేయును. మీలో చాలామంది ఆ విధంగానే చేసిరి. నాకు చెప్పకుండానే ఇదంతయూ చేసినందుకు వందనములు. అది మనకు ఎంతో బలమును కలుగజేయును. అందువలనే నాకేమీ గాయము కాలేదు. దేవుడు నన్ను క్షేమముగా ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను.

6ఈ చిన్న బిడ్డలను ప్రతిష్ఠించు ముందుగా కొన్ని ప్రకటనలు నేను చేయవలసి యున్నాను. ఈ రాత్రికి ఆలయములో ఒక ఆరాధన జరుగును, ఇక్కడికి ఈ గుడారమునకు వచ్చిన వారందరూ, ఇచ్చట జరిగే ఆరాధనకు రావలయును. కావున మేము సహోదరుడు రడెల్ తో నేను ప్రధాన మార్గములో మాట్లాడుదును, ఆయన మన అతిధిగా యున్నాడు. నేను తిరిగి వెళ్ళిన వెంటనే, మరో రాత్రి నాకు ఉన్నచో, నేను సహోదరుడు జూనీ జాక్సన్ యొద్దకు వెళ్ళెదను. అటు తర్వాత నేను సెల్లర్స్-బుర్గ్ లో నున్న సోదరునికి ఒక రాత్రి మేము వాగ్దానము చేశాము. కాబట్టి వెళ్ళి అతనిని చూచెదము. యుటికాలోనున్న సోదరుని యొద్దకు మాకు సాధ్యమైతే ఒక రాత్రి వెళ్ళెదము.

7ఈ వారంలో నేను విస్కాన్సిన్ లోని, గ్రీన్-బే యొద్దకు వెళ్ళెదను. మీరెరుగుదురు, సంపూర్ణ సువార్త పనివారల ప్రాంతీయ సభ అక్కడ జరుగును.

అచ్చట గతసారి నేనుండిన ఉన్నత పాఠశాల యొద్దకు వచ్చే ఆదివారము నేను వెళ్ళెదను. ఆ ఉన్నత పాఠశాల యొక్క సభా మందిరపు పేరును నేను మరచిపోయాను. ఏమిటిది? మేతెర్ర్? స్టిపెన్ మేతెర్ (అవును, మంచిది) ఉన్నత పాఠశాల సభా మందిరము. పిదప, గతసారి షికాగోలో సేవక బృందముతో చర్చించిన అదే స్థలమందు సోమవారమున ఒక సభలో నేనుంటిని. సహోదరుడు జోసెఫ్ బోజ్నకు విడ్కోలు చెప్పే కూటములో యుందుము, అతడు టాంగాన్యికా, (దానిని టాంగాన్యికా అని పిలుస్తారని నేను తలంచుచున్నాను), కెన్యా, డర్బన్ మరియు ఆ విధముగా, దక్షిణ ఆఫ్రికాలోను జరుగబోవు నా కూటములను క్రమము చేయుటకు అతడు వెళ్ళుచున్నాడు. ఈ కూటములన్నింటి కొరకు మమ్మును మీ ప్రార్ధనలలో గుర్తుచేసికొనండి.

8తర్వాత తిరిగి మేము వచ్చెదము… ఇప్పుడు, ఈ ఆలయానికి వచ్చుటకు ఒక రోజయినా వీలగునో లేదో నాకు తెలియదు. నార్త్-కెరోలీనాకు వెళ్ళవలెను, అక్కడ నుండి దక్షిణ కెరోలినాకు వెళ్ళవలెను, అక్కడ నుండి కౌపేలస్, లాస్-ఏంజలస్ లోని, సౌత్-గేట్ కు వెళ్ళవలెను. అక్కడ నేను శ్రీ. వెదర్బైని కలిసికొనగోరుచున్నాను, తుటా పేలిపోయిన తుపాకీని ఆయనే తయారు చేసెను.

ఆ తుటా ముందుకు వెళ్ళుటకు బదులుగా వెనక్కు వచ్చినది, ఎందుకనగా దాని ముందు భాగము ఆ విధంగా చేయబడినది. అది ఒక పాత రైఫిల్, నేనే దానిని అతనికి పంపించితిని, దానిని అతడు బోర్ చేసి, దానిని మరో రకమగు రైఫిల్లా తయారు చేసెను. దానిలో నేను తుటా ఉంచి ప్రేల్చగా, ఆ తుపాకీ నా చేతిలో నుండి ఏబది గజముల దూరములోనికి దూసికొని వెళ్ళి కరిగిపోయినది. దాని పై మూత ఏబది గజముల దూరంలో పడినది, దాని బోల్టు నా వెనుక ముప్పయి లేదా నలుబది గజముల దూరంలో పడినది, దాని భాగములు చెల్లా-చెదురై చెట్లకు తగిలి, చెట్ల బెరడు ఊడి పడినది. అది నా కన్నుకు అతి దగ్గరలో అనగా ఒక అంగుళం దూరము నుండి దూసికొనిపోయినది. ఆ తుపాకీ అరవై-తొమ్మిది వందల పౌండ్ల ఒత్తిడి కలిగియున్నది. కాబట్టి అదెంత శక్తివంతమైనదో మీరూహించవచ్చును. అది నా తలను, భుజములను చీల్చుకొని పోగలదు. మీరు చూచారా, ప్రభువే నిలబడి నన్ను కాపాడెను. అది నాకేమీ హాని కలిగించలేదు. నా ముఖం మీద కొన్ని గీతలు మాత్రం పడినవి. చిన్న ఇనుప ముక్క నా కన్ను సమీపంలో దూసికొనిపోయినది గాని, నా కన్ను బాగానేయున్నది. పుర్రెకు తగిలిన ఒక పెద్ద ఇనుపముక్క కంటి ప్రక్కగా దూసికొని వెళ్ళినది గాని కన్నులోనికి దూరలేదు. కావున… ఓ మై!

9కొంతకాలం క్రిందట ఆయన గదిలో నన్ను కలిసికొని ఏమి చెప్పెనో నేను మీతో చెప్పినది జ్ఞాపకమున్నదా? "భయపడవద్దు, ఎన్నడూ తప్పిపోని యేసుక్రీస్తు సన్నిధి నీతో నిత్యము నిలచియుండును!" కాబట్టి ఆయన తోడుగా ఉన్నాడని ఆయన దానిని రుజువు చేసెను.

లూయిస్-విల్ లో ఒక డాక్టరు నా కన్ను చూచెను, ఆయన చెప్పెను, మా స్నేహితుడగు డాక్టర్ సామ్ అడయార్ కు చీటి వ్రాసి పంపిరి, అందులో ఇట్లున్నది, "ఆ ఉదయమున తన దాసునితో ప్రభువు కూర్చొనియున్నాడు. ఆయన రక్షించకపోతే, ఇతని తల, భుజములు ఎగిరిపోయి యుండెడివి. ఇది మాత్రమే నేను చెప్పగలను." కాబట్టి ఆయన నాకెంతో మేలు చేసెను, మరియు నేను దానిని అభినందించుచున్నాను. ఇందువలన నేను ఇంకా ఆయనకు దగ్గరగా వచ్చుచున్నాను; అది ఎల్లప్పుడూ చిన్న వ్యత్యాసమును తీసుకొనివచ్చును.

10ఆ తరువాత, రెండు రోజులకు పిదప, మూడు రోజులకు తరువాత, కెనడాలో, నాకెక్కడైతే కూటము కలదో, ఆ కూటమునకు నేను వెళ్ళుచుండగా, దీనిని గూర్చి ఏమీ తెలియని ఒక వ్యక్తి నన్ను పిలచి, కూటము వాయిదా వేయమని అడిగెను, చూచారా. ఈ విధంగా జరిగియుండకపోతే నేను మరో విషమ పరిస్థితి ఎదుర్కొనియుందును, చూచారా. అయితే కెనడాలోని కూటమును జరుపుదునని చెప్పాను. జూలై చివరి వారంలో అవి జరుగును. ఆ తరువాత నేను డాసన్-క్రీక్, అక్కడ నుండి ఆంకరేజ్, అలాస్కాకు ప్రభుని చిత్తమైతే, వెళ్ళుదును.

ఇందులో ఏ కూటమునకు వెళ్ళవలెనను నడిపింపు నాకు లేదు, ఒక్కదానికి కూడా. కాని ఈ ఎండాకాలం కూర్చొనియుండుట నాకు ఇష్టము లేదు, జనులు ప్రతి చోటా చనిపోవుచున్నారు. పక్షులు గాలిలో ఎగురుచున్నను, అది ఏమైనా గాని, నేను విత్తనములు చల్లవలెను, ఎందుకనగా ఆయన నాకు చల్లవలసినవి ఇచ్చెను. కాబట్టి ఏమైనాగాని నేను విత్తనములు చల్లెదను.

GEN 17:10,11•

LEV 12:6•

MATT 19:13•

MARK 10:13•

LUKE 18:15

 

11ఇప్పుడు, మాకు ఇచ్చట సమయమున్నది… ఇప్పుడు, అనేకమంది జనులు, చాలా మంది తమ చిన్న పిల్లలను క్రైస్తవ విశ్వాసములోనికి బాప్తిస్మమివ్వమని వారు అడుగుచున్నారు, మంచిది, అది మంచిదే. మీరు దానిని చేయాలనుకుంటే, అది మీ ఇష్టము. నిజంగా వారికి బాప్తిస్మము ఇచ్చుట లేదు. వారి మీద నీరు జల్లుదురు. కాని నా వరుకు, నేను బైబిలు చేయమన్నదే చేయగోరుచున్నాను. వాక్యము ఏమి చెప్పుచున్నదో దానిని మాత్రము, దానినే చేయుటకు నేను ఇష్టపడుదును, అది ఏమి చెప్పుచున్నదో దానిని మాత్రమే. మరిప్పుడు, నేను పరిశుద్ధ గ్రంథమునందు నేనెచ్చటా దానిని కనుగొనలేదు… పాత నిబంధనలో చిన్న మగ పిల్లలను సున్నతి కొరకు వారు తీసికొని వచ్చెడివారు, తల్లి వారి శుద్దీకరణ కొరకు రెండు గువ్వలను గాని, లేదా గొర్రెపిల్లను గాని అర్పించెడిది. కాని క్రొత్త నిబంధనలో ఒక్కచోట మాత్రమే జ్ఞాపకార్థ ఉత్సవము వంటి గొప్ప ఆరాధనను నేను కనుగొనగలను… అది ఒక ప్రతిష్ఠ ఆరాధన. వారు చిన్న పిల్లలను యేసు నొద్దకు తెచ్చిరి, ఆయన వారిని తన చేతులలోనికి తీసికొని వారిని ఆశీర్వదించెను. ఆయన జీవించియున్న దినములలో తల్లిదండ్రులు ఆ విధంగా చేసెడివారు. మనము చేయవలసిన దానికి ఆయన జీవితమే ఒక మాదిరి, చూచారా. ఈ కార్యములను ఒక సాదృశ్యముగా ఆయన చేసెను.

COL 3:17

 

12ఇప్పుడు, చిన్నవారిని మనము తీసికొందము, వారిని మనయొద్దకు వారు తెచ్చెదరు, వారిని మనము దేవుని వైపు ఎత్తుదము, వారిని దీవించమని దేవుని అడిగెదము, వారి తల్లిదండ్రులు దేవునికి వారిని ప్రతిష్ఠించుచుండగా ప్రార్థన చేయుదము. వారు తమ పిల్లలను దేవునికి బహుకరించుచున్నారు, యేసుక్రీస్తు నామములో వారిని ప్రతిష్ఠించుచున్నారు. వారు పెద్దవారై, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుదురు. మనము మాటలోను, క్రియలోను ఏది చేసినా గాని యేసుక్రీస్తు నామములోనే చేయవలెను. కాబట్టి అదే మనము చేయగోరుచున్నాము.

ACTS 10:1-3,5,44

 

13"మరిప్పుడు వారిని లోనికి తెండి," అను పాటను ఇచ్చట మనము పాడుచుండగా, సహోదరి ఈ చిన్న పాటకు సంగీతములను మృదువుగా వాయించుచుండగా… ఇంత వరుకు తమ పిల్లలను ప్రతిష్ఠించని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభువునకు ప్రతిష్ఠించెదరు, జనులు పాడుచుండగా, ఇప్పుడు మీరు వారిని తీసుకొని వచ్చినయెడల, మనము వారి కోసము ఇప్పుడు ఇంపుగా పాడుచు వుండెదము.

వారిని లోనికి తెండి, వారిని లోనికి తెండి,

చిన్నవారిని యేసు నొద్దకు తీసికొని రండి.

ఈ చిన్నవారంటే నాకు ఇష్టము. వారిలో మాధుర్యమున్నది.

నేను అనుకొనుచున్నాను, అతడు ఖచ్చితంగా ఇటాలియన్ వాడు, కదా? మంచిది. ఈ ఇటాలియన్ కుటుంభము [స్పష్టత లేని మాటలు] వేరొక రోజు లేక ఒక చికాగో నుండి ఒక సహోదరి ఇది ఇటాలియన్ కుటుంభము అని అన్నది. అతడి పేరు ఏమిటి? జోనాథన్ డేవిడ్. ఎంత చక్కని పేరు, జోనాథన్ డేవిడ్. అతడు ఇటాలియన్ పేరు కలిగియున్నాడు, అని అనుకున్నాను అని అన్నాడు, అతడు అతడి బిడ్డ ఒక బైబిల్ పేరు కలిగయుండాలని అనుకున్నాడు. మీకు తెలుసా, కోర్నేలి అను పేరు గల ఒకతను బైబిల్ లో ఉన్నాడు, మీకు తెలుసా. అతడు ఒక గుంపును కలిగియుండెను, అతడు మంచివాడైయుండెను, అతడు ప్రజలకు ధర్మాలు చేసేవాడు. అన్యుడైయుండి, అయినను… ఆ కథ మీకు తెలుసు. మరియు ఒక దినము దూత అతడి గృహమునకు వచ్చెను, దేవుని ప్రణాళిక ఎరిగిన ఒక మనుష్యుని కొరకు ఒకని పంపుమని చెప్పెను. మరియు అతడు… ఆ కథ మీకు తెలుసు. ఎందుకు, అతడు దేవుని పట్ల గౌవారముతో ఆ ప్రజలను కలిగియున్నాడు. పేతురు మాట్లాడుచుండగా, పరిశుద్ధాత్మ వారిపై దిగెను. ఈ బిడ్డ కూడా ఆ మాదిరిగానే ఉండును గాక, అని ప్రార్ధన చేయుచున్నాను. అదే మనుష్యునిగా.

ACTS 10:1-3

 

14జోనాథన్ — అందమైనది. నేను తిసుకోవచ్చా? ఇక్కడకు రా, జోనాథన్. మై, ఈ కుటుంభమునకు ఎంత చక్కటి చెక్కర ముద్ద. మన తలలు వంచుదము.

మా పరలోకపు తండ్రి, కోర్నేలి అను గొప్ప మానవుని గూర్చి చెప్పి సంవత్సరాలు గడిచినవి, అతడు మంచివాడు, నీతిమంతుడు. పేదలకు దానధర్మములు చేస్తూ మరియు దేవుని ప్రేమిస్తూ. మరియు దేవుని దూత ఆ మనుష్యుని గృహమునకు వచ్చెను. ఓ దేవా, ఈ ఉదయాన చిన్న జోనాథన్ డేవిడ్ ను మీకు ఇచ్చుచున్నాము. పరలోకపు తండ్రి, అతడిని తన తండ్రి మరియు తల్లి చేతుల్లో నుండి తీసుకోని నీకు సమర్పించుచున్నాను, నేను నీకు ప్రార్ధనా సమర్పణతో ఈ బిడ్డను జీవితాంతము నీ సేవ కోరకై సమర్పిస్తున్నాము. గృహమునకు ఒక దీవెనగా మరియు సంఘమునకు సహకారిగా ఉండును గాక. దయచేయుము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు ఈ చిన్న జోనాథన్ డేవిడ్ ను ఇచ్చుచున్నాను. ఆమెన్.

దేవుని యొక్క హితబోధలో అతడిని పెంచుటకు దేవుడు మీకు కృపను మరియు సహాయమును దయచేయును గాక. దేవుడు నిన్ను దీవించును గాక జోనాథన్.

15ఇప్పుడు ఇది, మీ, అతడు చాలా చిన్నవాడు, లేక అతడా లేక ఆమె? అతడు! మై, మరొక బోధకుడు వచ్చుచున్నాడు అనుకొనుచున్నాను. పేరు ఏమిటి? మీకా? మీకా. ఈ ఉదయము అతడి గురించి నేను మాట్లాడబోవుచున్నాను. మీకా ఎడ్వర్డ్. అది మంచి పేరు. ఇప్పుడు, ఎత్తుకునే విషయానికి వస్తే, నా భార్య ఇంకా మంచిగా చేయును, ఎందుకనగా వారు చిన్నగా ఉన్నప్పుడు వారికి హాని చేయుదునెమో, అని నేను ఎల్లప్పుడూ భయపడుదును. ఎంత చిన్న మధురమైనవాడు. ఆ చిన్న కన్నులతో చుట్టూ చూస్తూ. అతడు ఎంతో చిన్నగా ఉన్నాడు. ఇతడి వయస్సు ఎంత? ఒక నెల. మనము మన తలలను వంచుదము.

పరలోకపు తండ్రి, ఈ యవ్వన జంట మరలా ఇక్కడకు నడచి వారి యొక్క కలయిక యొక్క ప్రతిఫలమును నీకు సమర్పించుచున్నారు. వారి నీవు ఇచ్చిన జీవముతో దేవుని యొక్క హితబోధ క్రింద పెంచుటకు. ఈ చిన్న మీకాను దీవించుము. దేవా, బైబిల్ ఉన్న మీకా వలె నీవు ఇతడిని చేయుమని ప్రార్ధన చేయుచున్నాను. దయచేయుము, తండ్రి. దేవుని యొక్క ఆశీర్వాదములు దయచేయుము. ఇతడి తల్లిని మరియు తండ్రిని దీవించుము, మరియు ఇతడిని ఈ భూమి పై ఒక ప్రేరణగా చేయుము. సంఘము నిమ్మితము ఒక గొప్ప సహాయముగా చేయుము. మరియు ఇప్పుడు, ఆలకించుము, తండ్రి. తల్లి మరియు తండ్రి యొక్క హస్తముల నుండి దేవుని యొక్క హస్తములకు చిన్న మీకా, ఎడ్వర్డ్ ను యేసుక్రీస్తు నామమున సమర్పించుచున్నాను. ఆమెన్. దేవుడు అతడిని దీవించును గాక. దేవిని యొక్క హితబోధలో ఇతడిని పెంచునట్లు దేవుడు తల్లి మరియు తండ్రిని దీవించును గాక. దేవుడు మీతో నుండును గాక. [టేపు పై ఖాళి.]

16ఓ, ఆ చిన్నవారంటే నాకు ఇష్టము. ప్రతీ ఒక్కొక్కరిని… ప్రపంచములోని ప్రతి చిన్న పిల్లవాడు అతి సుందరుడే. నేను చిన్న జోసెఫ్ ను ఇంటికి తీసికొని వచ్చినప్పుడు, నిజాయితీగా చెప్పాలంటే, ఇంతకంటె అందవికారమైనవాడు ఇక లేడు; కాని అతని తల్లి, నేను ఇతడు బొమ్మవలె యున్నాడని తలంచేవారము. ఆ విధంగానే యుండును, మీకు తెలుసా; అందరము ఆ విధంగానే అనుకొందుము.

17ఈ ఉదయమున మన సభ్యులు కొందరు ఇచ్చటున్నారని తలంచుచున్నాను. (ఈ కట్టు వలన నా కన్ను అలికినట్లు కనబడుచున్నది.) సహోదరుడు నాష్ గురించి అతని భార్య అడిగినది. వారిచ్చటనే ఉన్నారా? అతడు క్షేమముగానే యున్నాడు అని అనుకొనుచున్నాను. ఓ, మంచిది, అతడు ఇచ్చట యున్నాడు. ఓ, వారిచ్చట ఉన్నారు. నాష్ సోదరుడా! ప్రభువుకు స్తోత్రము! మంచిది. ఇప్పుడు, సహోదరి ఎడ్వర్డ్, ఆమె ఇచ్చట యున్నది — లేదా షేపర్డు సోదరి యొక్క రోగగస్త్రమగు బాలిక ఎట్లునది? ఇప్పుడామె బాగున్నది. మంచిది. అయిదు నిమిషాల క్రితం నాకు వార్త అందినది. అప్పుడు పట్టణములోని జనులు నన్ను కలిసికొన వచ్చిరి. నేను గది లోనికి వెళ్ళి ప్రార్ధించాను, ఆ పిల్లకు పోలియో వచ్చుచున్నట్లు చెప్పిరి. కాళ్ళు, చేతులు ముడుచుకుపోసాగినది. నేను పరుగున వెళ్ళి ప్రార్ధించి, "నేను కూటము అయిపోయిన తరువాత వస్తాను," అని చెప్పాను; లోయిస్ ని పిలచి ఆమెకు కబురు పంపమన్నాను. చర్చి అయిపోయిన తరవాత ఆమె నన్ను పిలువగోరిన యెడల పిలువ వచ్చునని చెప్పాను. నేను ప్రార్ధించుటకు వెళ్ళినప్పుడు ఆత్మ నాతో ఇట్లు చెప్పెను, "అంతే, పోలియో లేదు, ఆమె బాగవును."

18నేను ఇక్కడికి వచ్చిన తరువాత… ఇచ్చట సంఘములో మేమందరము కలిసి ప్రార్ధించాము, అదే దానిని పరిష్కరించినది. అవును. [సంఘములో ఒక స్త్రీ సాక్ష్యము ఇచ్చుచున్నది.] ప్రార్ధన పరిస్థితులను మార్చును. ప్రభువుకు స్తోత్రము!

(నీ అల్లుడు ఈ ఉదయాన, ఇక్కడ లేడా?)

గత ఆదివారం, ఇక్కడ నేను బోధించాను. ఆదివారమున ఒక యువకుడు ఇచ్చట కూర్చొనియుండెను. అతని వైపే నేను చూచాను. "ఇతనిని ఎక్కడో చూచానే" అని నేను అనుకొన్నాను. అతడు నా సహవిధ్యార్థియగు జిమ్-పూల్ కుమారుడని తెలిసినది. మేము చిన్న బాలురుగా వున్నప్పటినుండి కలిసి పెద్దవాళ్ళమైనాము. అతనికి కూడా చేతి తుపాకీ ప్రేలి ప్రమాదము సంభవించినది. తదుపరి కాలమందు నాకున్నవారిలో ఇతడు ఒకడున్నాడు, అతడు నా స్నేహితుడు. ఆ బాలుని నేను క్రీస్తు నొద్దకు నడిపించుదునని తలంచాను. అతని తండ్రి విషయంలోను ఎంతగానో ప్రయత్నించాను, ఇంకా ప్రయత్నించుచున్నాను. ఈ యువకుని కూడా నేను నడిపించుదునని తలంచుచున్నాను… అతడు ఒక అతని వైపు నేను చూచుచుంటిని, ఒక మంచి ఆత్మీయ స్పందనను, ఒక మంచి స్పర్శను అతడు (దానిని నేను ఏమందును, ఇప్పుడు; ఈ వ్యాఖ్యను వేరే ఎవ్వరికీ చేయవద్దు, అయితే), కలిగియున్నట్లుగా కనిపించుచుండెను. ఆ బాలుని క్రీస్తు నొద్దకు నడుపుట మరీ కష్టము కాదనుకొన్నాను. కాబట్టి అతని కొరకు ప్రార్ధన చేయుదము. అది మంచిది.

19సహోదరుడా… చూచారా, ఎవరో వ్యాధితో బాధపడుతున్నవారు లేదా ఏదో ఒకదానిని గురించి ప్రయత్నించుచు, నేను ఆలోచించుచు….. .

ఏమైనను, అందరికొరకు ప్రార్థించుదము. ఒక్కొక్కసారి, మీరు ఒక విన్నపమును పంపినప్పుడు, జ్ఞాపకముంచుకొనండి, పొందుకొన్న వెంటనే నేను (నా భార్య ఈ భవనములో ఎచ్చటో యున్నదని నేననుకుంటున్నాను, ఆమెకు తెలియును), మీరు ఒక ప్రార్థన విన్నపము పంపిన వెంటనే నేను నా గుహవంటి గదిలోనికి వెళ్ళి, ఒక అనుభూతి పొందువరుకు ప్రార్థించెదను. సామాన్యంగా విడిచిపెట్టను.

20డాక్టర్ సామ్-అడయార్ నా కంటిలోని దానిని తీసివేసినప్పుడు నాకు చాలా బాధ కలిగినది (అతడు ప్రయత్నము చేయుచున్నప్పుడు), అతడు నా ముఖంపై ఒక తువాలు వేసెను; చెప్పెను, "నేను నా స్నేహితుని రక్తము చూడలేను," చెప్పెను… నేను రక్తంము నిండిపోయాను, మీకు తెలుసా. "నేను అసలు దానిపై పని చేయలేను," అని అతడు చెప్పెను, చూచారా. అయితే అతడు నలుసును బయటకు లాగెను, కాని ఆ మరుసటి రోజు అతడు ఆస్పత్రిలో చేరెను. నేను అతడి కోరకు ప్రార్ధించాను, అతడు బాగయి బయటకు వచ్చెను. ఆ రెండవ రోజు అతని భార్యకు ఏమయిందో వారికి తెలియదు, ఆమెకు పోలియో వచ్చుచున్నట్లుగా తలంచిరి. ఆమె కొరకు ప్రార్ధించాను. ఇప్పుడామె క్షేమంగా ఇంట్లో యున్నది. డాక్టర్… మేము ఆఫీసుకు వెళ్ళి తలుపు తట్టాము. "బిల్ సోదరుడా, ఒక సంగతి అడుగుచున్నాను. నా కొరకు, బెట్టి కొరకు ప్రార్ధించవా?" అని అడిగాడు.

"మనము ప్రార్ధించుదాం," అని నేను అన్నాను.

21ఆస్పత్రిని అతడు ఎక్కడ కట్టవలెనో ప్రభువు నాకు దర్శనంలో చూపించెను. ఆ గాధ మీరెరుగుదురు. మీకు ఎప్పుడైనా ఆ విషయంలో సందేహము కలిగినచో వెళ్ళి ఆయననే అడగండి. అవును, కేవలము చెప్పెను, "ఎవరినైనా లోనికి రానివ్వండి." "నేను దీనిని పదివేలమందికి చెప్పానని ఆయనే అన్నాడు."

22[జనులలోని ఒకరు మాట్లాడుచున్నారు, "సహోదరుడా బ్రెన్హాం."] ఏమిటి సోదరుడా? [ఆ వ్యక్తి చెప్పెను - "ఈ ఉదయం ఇక్కడున్నవారికొరకు ఇది చెప్పుచున్నాను. ఇతరుల హృదయములలో మరింత విశ్వాసము పెరుగుటకు ఇది చెప్పగోరుచున్నాను. ఈస్టరు ఆదివారము ఉదయమున ఒక ప్రశస్తమైన ఆత్మను పిలిచావు, ఆ మూడో వ్యక్తి ఒక మానవుడు. అతడు సీమోర్ నుండి వచ్చెనని పరిశుద్ధాత్మ అభిషేకము వలన నీవు చెప్పావు, "వారు నిన్ను బిల్ అని పిలచెదరని" చెప్పావు. ఆ వ్యక్తిని నేను బాగుగా ఎరిగెదను. నాకు బాగా తెలియును. అతని పేరు ఐజక్. వాళ్ళు కూడా అతనిని బిల్ అని పిలిచెదరు."]

అవును! చూడండి. అతని అసలు పేరు ఐజక్, కాని వారు అతడిని కూడా బిల్ అని పిలచెదరు. పరిశుద్ధాత్మ తప్పు చేయదు. అది తప్పిపోనిది. ఇప్పుడు, ఇది… ఎవరో నాతో మాట్లాడుచూ, చెప్పిరి. నేను ఏబది-మూడేండ్లు కలిగి మరియు ముప్పది-ఒకటి సంవత్సరములుగా ఈ వేదిక వెనుక సేవ చేయుచున్న వ్యక్తిగా వేలాది, లక్షలకొలది క్రియలను ఆయన చేయుటను నేను చూచానని సాక్ష్యమిచ్చెను.

23నిన్న నేను కెంటాకీ దిగువ భాగాన ఉన్నాను, టెన్నీస్ సరిహద్దు అది. సహోదరుడు డాల్టన్ తో కలిసి ఒక నావలో కూర్చొన్నాను, ప్రభువు అతనికి బిడ్డలను ఇచ్చెను. (ఒక ఉదయాన అతడు దాని గూర్చి చెప్పినది గుర్తున్నదా?), అతడు నాతో, "బ్రెన్హాం సోదరుడా, దీనిని నీవు అంచనా వేయుటకు కష్టము," అన్నాడు.

"ఓ, డాల్టన్ సోదరుడా, ఇటువంటివి వేలకొలది, లక్షల కొలది జరిగినవి," అని చెప్పాను.

"అయితే వాటిగూర్చి ఒక గ్రంథము వ్రాయవచ్చు కదా?" అన్నాడు.

"ఓ, మై, డాల్టన్ సోదరుడా! ఆ గ్రంథము ఈ నావంత పెద్దదగును. ప్రభువు చేసినవి నేను ఎన్నో చూచాను, వాటిని వ్రాయవలెనన్న కాగితములు చాలవు. ఒక్కసారి కూడా ఆయన తప్పిపోలేదు. (చూచారా), ప్రతిసారి ఖచ్చితంగా జరిగినది, అయితే ఒక్కసారి తప్పలేదు," అన్నాను.

24ఇప్పుడు నేను నమ్ముచున్నాను, నేను పొరబడుట లేదు, సహోదరుడు షెపర్డ్ బాలిక నారింజ రంగు బట్టలు ధరించినది. ఒక రోజు ఉదయాన ఆమె యొద్ద నేను ఆగాను, ఆమె నడచుచున్నది, నేను చూచుచున్న బాలిక ఆమె కాదేమోననుకొన్నాను, కావున నేను ఆగాను. ఆమె శ్రీ. షెపర్డ్ బాలిక అని ఆగి ఎత్తుకొన్నాను. వారి కారు పాడైపోయినదో లేదా ఏదైన అయ్యిండ వచ్చునని నేను తలంచితిని. మేము బెకీని తీసికొని వచ్చుటకు వెళ్తున్నాము. కాబట్టి నేను తలంచాను. ఆ బాలిక కాదనుకొన్నాను. కాని ఇప్పుడు, అతడు వారితో అచ్చట కూర్చొని యుండుట నేను చూచాను, కావున అది వారి బాలికయే అని నేను నమ్మకలిగాను. కావున నేను ఎత్తుకొని అచ్చటకు తీసుకొని వెళ్ళాను. కాబట్టి…

25అందరూ ప్రభువైన యేసును ప్రేమించుచున్నారా? ఓ, అది అద్భుతము అది చాలా మంచిది. ఆమేన్! [ఒక సహోదరుడు బ్రెన్హాంతో మాట్లాడుచున్నారు.] విల్లర్డ్ సోదరుడా! నీవు మా మధ్య ఉండుట సంతోషము, నీవు చాలా ఆరోగ్యంగా కనబడుచున్నావు. నా దృష్టికి బాగున్నావు. మన ముఖములో కొద్దిగా ముడుతలు పడినవి. నాకు చాలా ముడతలు వచ్చినవి. ఆ రాత్రి నిద్రపోయినప్పుడు సహోదరుడు విల్లర్డ్ ను చూచాను. యధార్థంగా చెప్పుచున్నాను, చాలా భయంకరంగా కనిపించాడు. కాని ఈ ఉదయము చాలా బాగా ఉన్నావు. దాని బట్టి ప్రభువుకు వందనములు, స్తుతి చెల్లించుచున్నాము. ఆమేన్! "ఇప్పుడు రా," అని దేవుడు చెప్పువరుకు అపవాది మనలను చంపజాలడని నీవెరుగుదువు. అప్పుడు మనము వెళ్ళిపోదుము కదా? విల్లర్డ్ సోదరుడా! అప్పటి వరకు వాడు విఫల యత్నములు చేయుచుండును. అంతే! ప్రభువైన యేసు మన సహాయకుడు మరియు ఆశ్రయము.

26ఈ ఉదయము దాదాపు ఆరు గంటలు ఇప్పుడు నేను మాట్లాడాను, చూచారా. ఇప్పుడు మనము తెలియజేయనందువలన, కార్డులు గాని, ప్రకటనలు గాని ఇవ్వలేదు, ఎందుకనగా ఇంతకు ముందే నేనిచ్చట వుండనని ప్రకటించితిమి, కాని ఊరకే వచ్చి మరలా మిమ్ముల్నందరిని చూచి, సహోదరుడు నెవల్ కు సహాయం చేయాలని మరికొద్దిగా సహవాసము చేయగోరుచున్నాను.

గత ఆదివారం రాత్రి సహోదరుడు రాయ్-రాబర్సన్ నన్ను పిలచి వర్తమానము గూర్చి చెప్పెను. (ఆయన ఇక్కడ ఉన్నాడో లేడో నాకు తెలియదు; అంతగా చూడలేకపోతున్నాను) ఎవరో నన్ను పిలచి, "నీవు దేవుడు మనకు అన్నీ ఇచ్చెనని చెప్పినందుకు ఆశ్చర్యపడుచున్నాను," అని అన్నాడు, చూచారా. ఆయన ఇచ్చెను: ఆయన తన ప్రాణమును ఇచ్చెను, దానిని కొనుటకు ప్రయత్నించు ఆయన తన ప్రేమను ఇచ్చెను. దానిని కొనుటకు ప్రయత్నించు ఆయన మనకు సంతోషమును ఇచ్చెను. దానిని కొనుటకు ప్రయత్నించు ఆయన మనకు సమాధానమును ఇచ్చెను. దానిని కొనుటకు ప్రయత్నించు దానిని కొనుటకు మార్గమే లేదు (చూచారా) దానిని కొనలేము. మన కొరకు ఆయన మరణమాయెను," అని నేను చెప్పాను.

1COR 15:55

 

27ఎవరో నన్ను పిలచి, "బోధకుడా! అటువంటి దానితో నీవు ఎట్లు వెళ్ళుచున్నావో నాకు ఆశ్చర్యముగా యున్నది," అని చెప్పెను, "ఓ, ఓ, సహోదరుడు బ్రెన్హాంకు ఏదో అయిపోయినదని, నేను అనుకుంటున్నాను," అని వారు నా గురించి అనుకుంటున్నారు.

అయితే పరిశుద్ధ గ్రంథము ఆ విధముగానే చెప్పుచున్నది, కాదా! చూచారా? మనకు ఆయన మరణమును ఇచ్చెనని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది.

మంచిది, అయితే మరణముతో మనము ఏమి చేయుదము? పౌలు మరణము యొద్దకు వచ్చినప్పుడు "ఓ, మరణమా! నీ ముల్లెక్కడ?" అని అడుగుటను మీరెరుగుదురు. మరణము మనలను వశపరచుకోలేదు, దానినే మనము వశపరచుకొందుము. అది వాస్తవము. సమస్తము మనకు అనుగ్రహింపబడినవి.

NUM 14:8

 

28ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమునకు వెళ్ళుచున్న ఉదాహరణను అప్పుడు నేను చెప్పాను, వారెన్నడూ ఆ దేశము చూడలేదు, దానిగూర్చి వారేమి ఎరుగరు. అక్కడ ఒక దేశమున్నదన్న దేవుని వాగ్దానమును మాత్రమే వారెరుగుదురు. అది పౌలు తేనెలు ప్రవహించు గొప్ప రాజ్యము. మరి అది… వారెన్నడూ దానిని చూడలేదు, ఎవరూ అచ్చటికి వెళ్ళలేదు, లేదా దానిగూర్చి వారికేమీ తెలియదు, కాని దానిని గూర్చి వాగ్దానము వారికున్నది. వారు విశ్వాసము బట్టి ఎడారి గుండా యాత్ర చేసిరి. వారు సరిహద్దు యొద్దకు సమీపించినప్పుడు వారికి యొహోషువా అను ఒక యోధుడున్నాడు. అతని పేరుకు, "యెహోవాయే రక్షకుడు," అని అర్థము. అతడు యోర్జాను దాటి వాగ్దాన దేశములోనికి వెళ్ళి ఆ భూమిని గూర్చిన రుజువును తెచ్చెను. (దానిని నేను ఇష్టపడుదును!) అది ఒక మంచి దేశము. ఒక ద్రాక్షగెలను ఇద్దరు మనుష్యులు మోసుకొని వచ్చిరి. అది ఒక మంచి దేశము. కావున వారు వెళ్ళి స్వాధీనపరచుకొనబోవు దేశము యొక్క రుజువును అతడు అచ్చట నుండి తీసుకొని వచ్చెను.

29ఇప్పుడు, సంఘము గూర్చి చెప్పుచున్నాను, మనము ఒక అమర్త్య లోకమునకు యాత్ర చేయుచున్నాము, ఆ దేశములో మరణము లేదు. అక్కడ మృతులు లేపబడిరి, మన పాలెములో ఒక గొప్ప రక్షకుడున్నాడు, యేసు అనగా "యెహోవాయే రక్షకుడు, ప్రియుడు." ఆయన మరణమను యోర్దానును దాటెను, మరో దేశమునకు వెళ్ళి తిరిగి వచ్చెను, మనము మరణము తరువాత జీవించుదుమును రుజువును తెచ్చెను. ఆమేన్! కాబట్టి మరణము ఎచ్చటున్నది?

JOHN 5:24•

EPH 1:14•

1JN 3:14

 

30పిదప, ఆయన సమస్తము మనకిచ్చెను. మనము మన స్వాస్థ్యమునకు సంచకరువు పొందియున్నాము. (వినండి. ఆ అంశము మీద నాకు బోధించుట ఇష్టము, అయితే ఇప్పుడు అది నాకు చాలా చక్కగా అనిపించుచున్నది, చూచారా.) దానియొక్క సంచకరువు మనము పొందియున్నాము, ఒక రోజున మనము పాపములో నడిచాము. ఆయన నామములో బాప్తిస్మము పొందిన తరువాత పునరుత్థానమందు ఆయనతో కూడా తిరిగి లేచియున్నాము, మనము పాపము నుండి బయటకు తేబడియున్నాము, మరల అందులోనికి ఎన్నడూ వెళ్ళగోరము, చూచారా. మనము పాపము నుండి పైకి రుజువుతో లేపబడియున్నాము, మరియు మనము… సమస్త మరణము నుండి పునరుత్థానము పొందుకొనునట్లుగా మనము శక్యతను కలిగియున్నామనుటకు పాపము నుండి మనము లేపబడితిమనే రుజువును మనము కలిగియున్నాము, చూచారా. ఆయనయందు విశ్వాసముంచుట ద్వారా మనము పాపములో నుండి పైకి లేచియున్నయెడల, అచ్చట పాపమున్నయెడల… మరల పాపపు పెంటలోనికి ఎవరు వెళ్ళగోరుదురు? చూడండి, మనము మరణములో నుండి జీవములోనికి దాటియున్నాము, చూచారా. అదే సంచకరువు (ఆమేన్!) సంపూర్ణ పునరుత్థానమునకు అదే సంచకరువు, శారీరకము గాను, మరియు ఆత్మీయముగాను సమస్త మరణమును, ఆత్మీయ మరణమును మనము జయించితిమి, ఎందుకనగా మనము మరణములో నుండి జీవములోనికి దాటియున్నాము.

2KGS 2:8,9

 

31ఒక రోజున ఏలియా యోర్దాను యొద్దకు వెళ్ళి దానిని కొట్టెను. (ఎలీషా కూడా ఉన్నాడు), అది దారి ఇయ్యగా అతడు దాటిపోయెను; అతడు రెండింతల ఆత్మ శక్తితో తిరిగి వచ్చెను. మనము యోర్దానును (క్రీస్తుతో కూడా) కొట్టినప్పుడు, అప్పుడు మనకు ఒక భాగమేయున్నది, కాని మనము తిరిగి వచ్చినప్పుడు రెండు భాగములతో వచ్చియున్నాము. మనము నిత్యజీవము పొందాము, పాపమునుండి లేపబడి, ఇప్పుడు పరిశుద్ధాత్మతో నీతిమంతులముగా తీర్చబడియున్నాము, క్రీస్తుతో కూడా తిరిగి వచ్చునప్పుడు మనము శరీర పునరుత్థానము కూడా పొందుదుము, ఇప్పటికే మనము ఆత్మీయ పునరుత్థానము పొందియున్నాము, మనకు రెండింతలు దొరికినది. ఏలియా, ఎలీషా, క్రీస్తు, సంఘమునకు ఎల్లప్పుడూ ఒక సాదృశ్యముగా యున్నారు.

ఓ, దానిపై ప్రారంభించాలని నేను ఆశించుట లేదు. ఓహో, ఓహో, ఆరు గంటల వర్తమానమును ఇప్పుడు మనము చేయలేము. [సహోదరుడు నెవిల్ సహోదరుడు బ్రెన్హాంతో మాట్లాడుచున్నారు.] అవును, అది ఎముక మీది మాంసమువలె యున్నది. నెవిల్ సహోదరుడా! ఇంకను అభిషేక్షించబడినదే. మీరు సంతోషించుట లేదా? చూచారా?

JOHN 3:15,16

 

32అక్కడ ఎటువంటి తొందరలు ఉండవు. మరణవు శక్తి లేదు. దానిని మనము పొందుకున్నాము; అది మనదయినది. అది నన్ను నియంత్రించలేదు; నేనే దానిని నియంత్రించుదును. ఏలాగు? ఆయన ద్వారానే, ఆయనే నన్ను జయశీలునిగా చేసెను, ఎందుకనగా ఎప్పుడో నేను మరణమును జయించియున్నాను. ఏలాగు దానిని నేను జయించాను? ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా! పాపము, అవిశ్వాసములోనే మరణమున్నది. నేను అవిశ్వాసిని కాను; నేను విశ్వాసిని. నేను దానినుండి లేపబడి, పునరుత్థానము పొందితిని. అది నా సమస్త శారీరక, ఆత్మీయ పునరుత్థానమునకు అది సంచకరువు. అవునయ్యా! మీరిది పొందితిరా?

EPH 2:6

 

33కావున యేసుక్రీస్తు ద్వారా మనము మరణమును వశములో పెట్టియున్నాము, ఆయన మరణమును, పాతాళమును, సమాధిని, వ్యాధిని, దుఃఖమును, సమస్తమును జయించెను. ఇప్పుడు మనము ఆయనతో కూడా లేపబడి, పరలోక స్థలములందు కూర్చు౦డ పెట్టబడియున్నాము. ఆత్మసంబంధముగా మాట్లాడుచున్నాను, క్రీస్తుయేసును బట్టి సమస్తము మనము మన పాదముల క్రింద కలిగియున్నాము. శారీరక పునరుత్థానము కూడా మన పాదముల క్రింద ఉన్నది, ఏలయనగా మనము క్రీస్తులో యున్నాము. దానిని మీరు గ్రహించారా? గ్రహించినయెడల చేతులెత్తండి. ఆమేన్! మంచిది. మీరది గ్రహించినయెడల మేలు, చూచారా. దానిని వదిలివేయకుండా… ఇప్పుడు, దానిని మీరు మనస్సులో ఉంచుకొనండి, చూచారా. మనము మరణములో నుండి జీవములోనికి దాటియున్నాము. శారీరకముగా, ఆత్మీయముగా అన్ని విధములుగా, మరియు అన్నియూ, మరియు సమస్తము ఇప్పుడు మనకు చెందియున్నవి.

GEN 12:7•

GEN 14:12,14•

2COR 6:10

 

34బయట ప్రపంచము మనలను పిచ్చివారని పిలువవచ్చును, అయినా గాని మొత్తం భూమి మనకే చెందును. దానిని మీరెట్లు స్వంతంత్రించుకొందురు? అబ్రాహాము వాగ్దాన దేశములో యున్నాడని మీకు చెప్పాను. (చూచారా) దానిని దేవుడు అతడికి ఇచ్చెను. లోతు కొన్ని అల్లరిమూకల వలన శ్రమపొందెను. (అతని సోదరుని కుమారుడే.) ఆ దేశములో యున్న సమస్తమూ అబ్రాహాముకే చెందినది. అతడు యుద్ధవీరుడు కాదు; ఎన్నడూ యుద్ధము చేయలేదు. అతనితో ఏ సైనికులు లేరు; అతనికి కొందరు దాసులు మాత్రమే యుండిరి. కాని ఏదో ఒకదానిని అతడు చూచినప్పుడు - అతనికి వాగ్దానము చేసిన వాటినుండి ఒకదానిని అపవాది వచ్చి దొంగలించగా, అతడు సేవకులకు ఆయుధములను ఇచ్చి మరియు తానును ఒక ఆయుధము ధరించెను.

GEN 14:15,16•

HEB 7:1

 

35ఈ రాజులనందరినీ ఎట్లు జయించవలెనో అతనికి తెలియదు, అతని చేతిలో కొందరు దాసులు మాత్రమే యున్నారు. కాని ఎట్లు జయించవలెనో దేవుడే అతనికి చెప్పెను. అతడు రాజులను సంహరించెను, జయముతో తిరిగి వచ్చెను. ఎందువలన? ఆ దేశములోనున్న సమస్తము అతనిదే అనే దేవుడిచ్చిన వాగ్దానముపై తన విశ్వాసమును ఉంచుటవలన, లోతు దానిలో భాగస్వామిగా యుండెను (అది వాస్తవము), ఆ భూమి యందు భాగస్వామిగా యుండెను. ఓ, మై! అక్కడతడు మెల్కీసెదెకును కలిసికొనెను, అప్పటికి యుద్ధము అయిపోయెను. అబ్రాహాము మార్గమందు వచ్చుచుండుటను మీరు చూచుట లేదా? అతడొక యుద్ధ వీరుడని అతనికే తెలియదు, కాని తర్వాత దానిని అతడెరిగియుండెను. అవునయ్యా, కాని వాగ్దానమిచ్చిన మెల్కీసెదెకును అతడు సంధించెను.

36ఇప్పుడు, ఆమోసు గ్రంథము నుండి చదువుదము. "ఒక నిజ ప్రవక్త యొక్క మార్గము," అను అంశము మీద ఈ ఉదయము నేను మాట్లాడగోరుచున్నాను. (ఆరు గంటలు వుండదు; వుండదని నేను అనుకుంటున్నాను, చూచారా) ప్రభుని చిత్తమయితే, ఈ రాత్రికి, "ఒత్తిడిని విడచిపెట్టుట," అను అంశము మీద నేను మాట్లాడబోవుచున్నాను, మరియు కావున… ప్రభువు చిత్తమైతే.

AMOS 3:1-8

 

37ఇప్పుడు, నన్ను విమర్శించేవాడని అంటున్నారని నేనెరుగుదును, కాని నేను విమర్శకుడను కాను. తప్పునే ఎత్తి చూపుదును. మనము తప్పును విమర్శించవలెను. మీరిప్పుడు గదిలో రికార్డులు పెట్టుకొనండి, ఎందుకనగా, మంచిది, అవును, ఆమోసు 3వ ఆధ్యాయము, ఆమోసు 3వ అధ్యాయము నుండి ఒక భాగమును చదివెదను:

ఇగుప్తు దేశమునుండి రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చియు, ఆయన రప్పించిన కుటుంబము వారినందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి.

అదేమనగా భూమిమీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును.

సమ్మతించకుండ, ఇద్దరు కూడి సడతురా?

ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా? ఏమియు పట్టుకొనకుండనే కొదమ సింహము గుహలోనుండి బొబ్బ పెట్టునా?

భూమి మీద ఒకడును ఎర పెట్టకుండ పక్షి ఉరిలో చిక్కుపడునా? ఏమియు పట్టుబడకుండా ఉరిపెట్టువాడు వదిలి లేచునా?

పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా?

తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా ఏమియు చేయడు.

సింహము గర్జించెను, భయపడనివాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండువాడెవడు?

38సమరయ పట్టణమునకు అవతల కొండ మీద ఆ ఉదయమున అతడు నిలబడియుండి కళ్ళు చిట్లి౦చి చూచుచుండెను. అతడు నిలకడగా తన చేతులను తెల్లని గడ్డమును నిమురుట నాకు కనబడుచున్నది, వేడి సూర్యుడు అచ్చట ప్రకాశించుచుండెను. చూచుటకు ఆయనకు సురూపము లేదు. నేటి నవీన సువార్తికునికి ఆయనకు ఎంత తేడా గలదు. ఆయన వస్త్రములు మాసినవి, గడ్డము వికారముగా కనబడుచున్నది.. సమరయ పట్టణమును ఆయన చూచుచుండెను, ఆయన కండ్లు వీక్షించుచున్నవి. ఆయనలో అందము లేదు, కాని ఆయన యొద్ద "యెహోవా సెలవిచ్చుచున్నాడనేది" ఆ దేశము కొరకు యున్నది.

ఈ ఆధునిక కూటములకు దానికి ఎంతో తేడాయున్నది, ప్రభువే ఆయనను సమరయకు పంపెను, మన ఆధునిక సువార్తికులను చూడండి. ఈనాడు ఉజ్జీవ కూటములకు మనకున్న పరికరములు ఆయన యొద్ద ఏమీ లేవు. కాని గుర్తుంచుకొనండి, ఆయన ఒక ఆధునిక సువార్తికుడు కాడు; ఆయన ఒక ప్రవక్త. ఆయన "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అనేది కలిగియున్నందువలన ఆధునిక పరికరములను గురించి ఆయనకు విచారము లేదు.

39ఆయన తానెట్లు కనబడిన దానిగురించి పట్టించుకోలేదు, ఎంతటి నాజూకైన వస్త్రములను ఆయన ధరించెనో, తన తలను సరిగ్గా దువ్వుకోనెనో లేదో, లేదా ఎవరైన తనను చూస్తున్నారో లేదో అని కూడా ఆయన లెక్క చేయలేదు. ఆయన యొద్ద ప్రభువు వాక్కు యున్నది, ఆ ప్రభువు వాక్యమును అందించుటయే, అదే ఆయన యొక్క సంపూర్ణమైన గురియై యున్నది. ఇతడెవరు? ప్రవక్తయగు ఆమోసు. ఒంటరిగా వుంటూ మోటువాడిగా యున్నను గాని అతడెచ్చట నిలబడియుండెనో అతడెరుగును; తానేమి చేయుచున్నాడనే దానిని అతడెరిగియుండెను, అతడు వాక్యమునందు ఒక నిజ ప్రవక్తగా యుండెను.

ఆ పనితోనే ఈ పట్టణమునకు అతడు వచ్చెను, ఎందుకనగా అతని యొద్దకు వాక్యము వచ్చెను. ఒక నిజదాసుని యొద్దకు ఎప్పుడైతే వాక్యము వచ్చునో, అతడు తప్పక వెళ్ళవలెను. పరిస్థితులను లెక్కచేయడు, లేదా కష్టములను లెక్కచేయడు, ఎట్లైనా గాని అతడు తప్పక వెళ్ళి తీరాలి. అతనికి సిద్ధపాటున్నా లేకపోయినా, ఇష్టమున్నా లేకపోయినా, ఆశించినా - ఆశించకపోయినా," ఏమున్నగాని, ఎట్లైయినను అతడు వెళ్ళక తప్పదు. అది దేవుని మాటయైయున్నది. కాబట్టి ఈ వర్తమానమును అతడు తీసుకొని వెళ్ళి తీరవలయును, ఎందుకనగా ఇది… అతడు బుద్ధిహీనముగా ఎన్నడూ వెళ్ళడు, డబ్బు కొరకు అతడు ఎన్నడూ వెళ్ళడు, పేరు ప్రఖ్యాతుల కొరకు అతడు ఎన్నడూ వెళ్ళడు, అతడు ప్రభువు నామములో మాత్రమే ఒక ఉద్దేశ్యము కొరకు వెళ్ళును. అతడు ఒక పరిచర్యకుడుగా, అతనిని ప్రభువే పంపెను. అతడే దేవుని వాక్యమైయున్నాడు, ఎందుకనగా ప్రభుని వాక్యమును అతడు తీసికొని వచ్చుచున్నాడు. అతడు నిజమగు దేవుని ప్రవక్త. నా అంశము ఏమనగా "దేవుని యొక్క ఒక నిజ ప్రవక్త యొక్క మార్గము."

AMOS 1:1

 

40ఈ గొప్ప నిర్భయుడగు దైవజనుడు యెరోబాము II కాలములో ప్రవచించెను. అతని చరిత్ర నేను వ్రాసి తెచ్చాను. అతడు తన పద మూడేండ్ల సేవలో చాలా ప్రవచించెను. యెరోబాము II ఇశ్రాయేలును పరిపాలించిన రాజులలో ఒక తెలివైన, సామర్థ్యముగల రాజుగా కొద్ది కాలముండెను. అతని కాలములో ఇశ్రాయేలు వర్ధిల్లెను. ఇశ్రాయేలు చాలా అభివృద్ధి చెందుచుండెను, కాని అతనియందు ఎదో ఒక తప్పిదము గలదు; అతడు ఒక విగ్రహారాధికుడు.

ఒకానొక దినమున నేను దీనిని చదువుచుండగా, నేటికిది చక్కగా వర్తించునని నేను తలంచాను. ఒక వ్యక్తి ఎంత తెలివిగలవాడైనాగాని, ఎంత సామర్థ్యమున్నాగాని, ఎంత అభివృద్ధి సాధించినాగాని, అతడు దేవుని నుండి దూరమైనచో, దేశమునకు చాలా ముప్పు వాటిల్లుటకు అతడే బాధ్యుడగును, దేవునినుండి దేవుని వాక్యమునుండి అతడు దూరమైనందువలన. మేమెంతటి తెవినైనవాళ్ళము, మాకెంతటి మేధాశక్తి గలదో అని తమను టెలివిజన్ కార్యక్రమములయందు చూపించుకొనుటకు ఆశించుచుండగా, నేటికిది మనకు వర్తించనిదైన యెడల నాకు ఆశ్చర్యముగా యున్నది. అయితే "ప్రభువు సెలవిచ్చుచున్నాడనే" మాటను విశ్వసించుటకు చాలినంత ధైర్యము వాళ్ళకు లేకపోవుట నాకు ఆశ్చర్యము కలుగజేయుచున్నది.

PROV 14:12•

PROV 16:25•

EPH 3:5

 

41ఇతడును తెలివైనవాడే మంచిదే. కాని ఇశ్రాయేలు వెనుకకు జారిన స్థితిలో యున్నది; ఆమె బోధకులు, ఆమె యాజకులు, ఆమె ప్రభుత్వము కూడా ప్రభుని వాక్యమును విడిచిపెట్టిరి. దానిని వారు నమ్మలేదు. వారు తాము ప్రభువు వాక్యమునే కలిగియున్నామని వారు తలంచిరి, కాని "ఒకనికి తన మార్గము సరియైనదిగానే కనిపించును గాని తుదకు అది మరణమునకు నడుపును." ఎందుకని వారు తప్పిదములో యుండిరి? వారు తప్పిదములో ఉన్నామని ఒక వ్యక్తి ఎందుకు అనుకొనును, దేవుని ఆరాధించుచున్నామనియే ఆ వేలాది బోధకులు, యాజకులు, రాజులు, రాజ్యాధికారులు చెప్పుకొనుచుండిరి, అయిననూ వారందరూ తప్పులో యున్నారు.

అభివృద్ధి కొరకు రాజు వారికి అక్కరలేదు. వారికి కావలసినవాడు ఒక ప్రవక్త మాత్రము, ఎందుకనగా నిజ ప్రవక్త యొద్దకు ప్రభుని వాక్కు, లేదా ప్రభుని వాక్కు ప్రత్యక్షత వచ్చును. కొన్ని సమయములలో అతని విధానము మీరు చూడవలెను. అది ఒక కఠినమైన విధానముగా యున్నప్పుడు యాజకులందరూ, బోధకులందరూ, మరియు దైవజనులందరూ మరియు ప్రభుత్వము కూడా అతనికి విరోధమగుదురు; అయినాగాని, ప్రభువు వాక్యము ప్రవక్త యొద్దకే వచ్చును, అతని యొద్దకు మాత్రమే వచ్చును. అతడే నిజమైన వాక్యముగా యున్నాడు, వారియొద్ద గల అదే పరిశుద్ధ గ్రంథమే అతని యొద్ద గలదు. కాని వాక్యము అతని యొద్ద గలదు; వాక్యము అతని యొద్ద గలదని దేవుడే దానిని నిరూపించుచున్నాడు.

AMOS 2:4

 

42వారికి గొప్ప భవనములున్నవి, గొప్ప మత సంస్థలున్నవి, మరెన్నో గలవు; ప్రతి చోట రకరకముల బలిపీఠములను నిర్మించిరి. మరి అన్ని విధముల కార్యములు గలవు; అయినా గాని వారు యింకా దేవుని వాక్యమునకు పదిలక్షల మైళ్ళ దూరములో వున్నారు. ఈ ఆమోసు గ్రంథమును నేను చదివిన విధముగా నేటికి ఈ పటము చాలా చక్కగా వర్తించునని నాయంతట నేను తలంచుచున్నాను; మీరు యింటికి వెళ్ళి దీనిని తప్పకుండా చదవండి. యాజకులు మొదలు ప్రభుత్వము వరకు అందరూ దేవుని వాక్యమును విడిచిపెట్టిరి.

ఇక్కడ మరియొక వాక్యభాగమును చదువగోరుచున్నాను. వారెచ్చట దీనిని చేసితిరో మీకు చూపించగోరుచున్నాను. ఇప్పుడు, 2వ అధ్యాయము 4వ వచనము ఒక నిమిషము చదువెదము.

యెహోవా సెలవిచ్చునదేమనగా; యూదా మూడుసార్లు, నాలుగుసార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. [అది దేవుని వాక్యము, దానిని వారు విసర్జించినా గాని వారు దానిని కలిగియున్నామనుకొనిరి.] ఏలయనగా వారు తమ పితరుల అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. [ఇప్పుడు, వారికి వాక్యము, పరిశుద్ధ గ్రంథము యున్నాగాని వారు దానికి అబద్ధములను జోడించిరి, అదే వారి తప్పిదమునకు కారణమైనది.]

కారణము చూచారా? ఇప్పుడు వారియొద్ద తప్పున్నది, వారు వాక్యమునకు తమ స్వంత అనువాదములను లేదా అర్ధములను ఇచ్చిరి. అనేకులు అదే విధమైన తమ స్వకీయ భావములను, వాక్యమునకు జోడించుటము వలన మనము ఒక గందరగోళమునకు లోనగుచున్నాము. అందువలననే నేటీకిది వర్తించునని నేను తలంచుచున్నాను. ఈ ప్రవక్త దేవుని యొద్ద నుండి గద్దింపును తీసికొని వచ్చెను.

MATT 3:10•

LUKE 3:9

 

43ఆమోసు దేవుని యొక్క ప్రవక్త, ఒక నిజ ప్రవక్త, ఆమోసు గూర్చి చదివినవారికి ఆ దైవజనుని యొక్క ధైర్యము, నిర్భయము గూర్చి తెలియను. అతడు ఒక చిన్న ప్రవక్తగా గుర్తించబడెను, ఎందుకనగా అతడు ఎక్కువ కాలము రంగము మీద లేడు, కాని అతడు నిశ్చయంగా చెట్ల వేరున గొడ్డలి ఉంచెను. ప్రవక్తలందరిలో అసలు భయపడని వారిలో అతడు ఒకడు, అతడు అభిషేకముతో వచ్చెను. "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో" అతడు వచ్చెను. తాను ఏమి మాట్లాడుచున్నాడో తనకు తెలియును. దేవుని యొక్క వాక్యమును వారికి సరిగ్గా చెప్పగల దేవుని యొక్క అభిషేకము అతని మీద యుండెను.

AMOS 2:4•

EPH 5:26

 

44ఆమోసు ఒక అరణ్య, పల్లెప్రాంతము నుండి అందమగు పట్టణమునకు వచ్చెను. ఇంతకు ముందెన్నడూ అచ్చటికి రాలేదు. అతడు ఒక గ్రామ నివాసి. ఎక్కడో ఆ వెనుక అరణ్యములో ప్రార్ధించుకొనుచుండగా, దేవుడతనిని కలిసికొని, ఆ అందముగా కనబడుచున్న పట్టణము ఎంత చెడిపోయినదో చెప్పెను. యెరోబాము ఏలుబడిలో ఒక ముఖ్య పట్టణముగా సమరయ ఉండెను.

ఆ కొండ శిఖరము మీద ఆ ఉదయము అతడు నిలబడియుండెను. పాతబడిన మురికి పల్లె దుస్తులతో అతడు అటు ఇటు తిరుగుచుండెను, బహుశా పాదములు ధూళితో నిండియుండును. ప్రతి రాత్రి ఆ బట్టలతోనే పరుండికొనుచు వుండెను. మరియు నాకు తెలియదు; స్నానపు తొట్టెలు ఆనాటి కాలములో అతడికి లేవు; కొన్ని దినముల క్రితము బహుశా స్నానము చేసియుండవచ్చు. కాని అది అంతరంగములో యున్న మనిషికి ఏ హాని కలిగించదు! బాహ్యమందు చాలావరుకు అది ఇది వేసుకుంటున్నారు, అంతరంగమునందు చాలినంతగా వుండుట లేదు, ప్రతీదినము స్నానము చేయుట యందు, తలను దువ్వుకొనుటయందు, వస్త్రములను మార్చుకొనుటయందు మరియు సమస్త కార్యములయందు మనము ఎంత శ్రద్ధవహించుచున్నాము, కాని అదే విధముగా అంతరంగమందు వెళ్ళి చూచుటకు మార్గమున్నచో - అదే పాత పాపపు వస్త్రములు ధరించుకొని, పనికిరాని సిద్దాంతములతో మూడభక్తితో, దుర్గంధముతో నిండిన ఆత్మను కలిగియుంటూ దానిగురించి శ్రద్ధలేకుండా యుంటున్నాము. లోక కార్యముల నుండి ప్రత్యేకించబడుటకై దానికి వాక్యపు నీటితో ఉదక స్నానము చేయుట లేదు.

45అతడు ఆ కొండపై నిలబడి ఆ అందమగు పట్టణము వైపు చూస్తుండగా, అతడు కలలో కూడా చూడని ఆధునికమైన వాటిని అచ్చట అతడు చూచెను, ఇశ్రాయేలు గొప్ప ఔన్నత్యములో యున్నది. దాని చుట్టూ యున్న దేశములతో అది స్నేహ బంధములను కలిగియున్నది. ఎంతో అందమైన వస్త్రధారణతో స్త్రీ మరియు పురుషులు గలరు; వారు సుఖభోగములతో తులతూగుచూ, పరుగు పందెములను, ఒలింపిక్స్ ఆటలు, మరియు సమస్తమును అచ్చట నిర్వహించుచుండిరి. అతని కండ్లు చిట్లించుటలో ఆశ్చర్యమేమీ లేదు, ఆ పట్టణము అందముగా యున్నందులకు కాదు, (కొందరు పర్యాటకులు న్యూ-యార్క్ లేదా లాస్-ఏంజలస్ కు చూచుటకు వచ్చెదరు), అర్థనగ్నముతో యున్న స్త్రీలను మరియు పాపములలో పడియున్న పురుషులను చూచుట వలన!

46కొందరు నా స్నేహితులు కొన్ని రోజుల క్రిందట చేపల వేటనుండి వచ్చుచున్నారు. ఒక గొప్ప పేరుగల బైబిల్ కళాశాల. ఆ కళాశాల విద్యార్దులు ఆ రహదారిలో గల పిచ్చి మొక్కలను పీకుచూ అర్థనగ్నంతోయున్న ఆ యవ్వన యువతులు మరియు త్రూగి తూలుతున్న యవ్వన యువకులను చూచినప్పుడు ఎంత భయంకరముగా యున్నది.

క్రైస్తవులని చెప్పుకొనుచున్న ఈ అమెరికా వారు ఆ రుచినే అనుభవించుచున్నారు. నేను విమానములో చూచాను. పర్యాటకులు లాస్-ఏంజలస్ లోని, హాలివుడ్ లేదా ఫ్లోరిడా చూచుటకు వచ్చుచుందురు. (ముందెన్నడూ వారచ్చటకు రాలేదు) క్రిందకు చూచి లాస్-ఏంజల్స్ పట్టణము వచ్చుచున్నదనగా, నేను విమానములో నుండి గమనించుచుండగా, మేము లాస్-ఏంజల్స్ పట్టణము సమీపించుచుండగా అచ్చటి నియాన్ లైట్ల వెలుగు జిలుగులు, ఖర్జుర చెట్లు వారిని ఆకర్షించును. అప్పుడు వారు తమ ముఖములకు రంగులు పూసికొని ముస్తాబగుచుందురు. అది వారెన్నడూ ఇంతకు ముందు చూడని గొప్ప అందమగు పట్టణమనుకొందురు. చక్కగా బట్టలు ధరించి, ముస్తాబయి వీధులలో నడచుచుందురు. ఎంతో ఇరుకు బట్టలు ధరించి త్రిప్పుకొంటూ వీధులలో నడచుచుందురు. అది ఏదో అద్భుతమగు పట్టణమని వారనుకొందురు.

AMOS 3:8

 

47కాని దైవాభిషేకము గల ప్రవక్త యొక్క కన్నులు ఆ యాత్రికుల కన్నులవలె దాని అందమును చూచుట లేదు. దేవుని చేత దీవించబడిన జనులయిన వీరు ఎంత నైతిక పతనావస్థలో యున్నారో చూడండి. ఆ అందమును అతడు చూచుట లేదు, ఆ అందము చూచి అతడు కళ్ళు చిట్లి౦చలేదు, ఆ జనుల యొక్క అసభ్యత, చెడుతనము చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన వారమని చెప్పుకొనుచున్నారు, ఆ విధంగా వారు ప్రవర్తించవచ్చునా? "సింహము గర్జించగా భయపడనివాడెవడు? దేవుడు పలుకగా ప్రవచించని వారెవరు?" అని అతడు ప్రశ్నించుటలో ఆశ్చర్యము లేదు.

చెడుతనమును, దుస్థితిని అతడు చూచెను. అతనికి అదే కనబడుచున్నది. ఇంతటినీ అతడు చూచెను. అది అతనిని ఆకర్షించలేదు, అతని ఆత్మకు జబ్బును అది కలుగజేసినది. ఎందువలన? అతడు ఒక ప్రవక్త, దేవుని ఆశీర్వచనమేమిటో అతనికి తెలియదు, దీవెననగా ఏమిటో అతనికి తెలుసును, ఆశీర్వచనము వలన జనులెట్లు ప్రవర్తించెదరో ఎరుగును. ఆనాడు నిజమగు దీవెనను అపవాది మార్చివేసి అది నైతిక పతనమును ఇచ్చినది, మారుమనస్సు లేని ప్రజల కళ్ళు దానిని చూచి మోసపోయినవి. అది వారి అభిరుచి, దేవుని మార్గమునుండి, చిత్తమునుండి మరియు దేవుని యొక్క జీవము నుండి తొలగిపోయిరి.

48నేటికిది ఎంత సాదృశ్యముగా నున్నది! బోధకులు వేదికల మీద నిలబడి ఈ ప్రపంచము యొక్క పాపమును, చెడును చూచియు, ప్రజల వ్యవహార తీరును గమనించియూ, వారిని ఆశీర్వదించుచున్నారు, ఎందుకనగా వారు వారి సంఘ సభ్యులు, లేదా వారి శాఖ సభ్యులు, నా ప్రాణము దానిని గ్రహించలేకున్నది! దేవుడు మాట్లాడునప్పుడు, ప్రవచింపు!

దేవుని ఆత్మ ఒక నిజ దేవుని ప్రవక్తను తాకినప్పుడు అతడు వాక్యమును ఎత్తిచూపును. నేను విమర్శించుట లేదు, కాని వీటిని చూస్తూ ఎట్లు ఒకడు శాంతముగా యుండగలడు? అటువంటి స్థితిని చూచి, క్రీస్తు దాసుడనని చెప్పుకొనుచున్న వ్యక్తి చెప్పకుండా యుండగలడా? శాఖ ఏమన్నా నాకు లెక్కలేదు, సంఘము ఏమన్నా నాకు లెక్కలేదు; అందుకే నేను వాటికి చెందలేదు. వారు నిన్ను ముందు బయటకు తన్నుదురు. కాని దేవుని వాక్యమే ముందుండును. నీవు వర్తమానికునివయితే, నీవు చెప్పవలసినది ఒకటుండును. ఈ వాక్యమునకు వేరయినది నీవు చెప్పినచో, నీవు దేవుని నుండి వచ్చిన వర్తమానికునివి కావు. నీవు ఒక శాఖతో ఒప్పందము చేసికొనిన, లేదా ఒక సిద్ధాంతము చొప్పున చెప్పు వర్తమానికుడవగుదువు. కాని దేవుని యొక్క వర్తమానికుడు దేవుని వాక్యము కలిగియుండను. ఈ ఉదయము మన స్నేహితుని చూచుచున్నాము, అతని యొద్ద దేవుని వాక్యమున్నది, ఎందుకనగా అతడు ప్రభువు యొక్క నిజ ప్రవక్త.

వాక్య ప్రత్యక్షత తమకున్నదని వారు చెప్పుకొనిరి, "మేమేమి చేస్తున్నామో చూడు," అని వారు అతిశయించుచున్నారు.

49చూడండి, ఈ ఉదయమున అతనిని ఈ కొండపైకి ఎక్కి ఈ పట్టణమును చూడమనండి, అతడు తన తలను ఊపి, కళ్ళు చిట్లి౦చి, చొక్కా చేతులు పైకి లాగి, తన ముఖం మీది చెమట తుడుచుకొని, మురికితో, ఎర్రని సూర్యుడు అతని బట్టతలపై ప్రకాశించుచుండగా, అతని గడ్డము వ్రేలాడుచూ, గడ్డమును సవరించుకొంటూ వేదన వెళ్ళగ్రక్కును. ఆ పట్టణ అందము అతనికి కనబడదు, అతడు పాపమును చూచును! అది అతనికి ఆనందము కలిగించును. అది అతనికి రోత పుట్టించును.

ఇశ్రాయేలీయుడుగా, "నేను నా దేశాభివృద్ధిని చూచి గర్వించుచున్నానని," అతడు ఎందుకు పలుకలేదు? దేవునికి ఒక నిజ ప్రవక్తగాయన్న అతడు ఏలాగు ఆ మాట పలుగగలడు? ఆ కార్యముల నిమిత్తము ఏమి సంభవించబోవుచున్నదో, దాని ఫలితమేమిటో అతడు ముందే ఎరుగును.

50ఈ రోజున అతనిని కొండ మీద ఎక్కించి క్రిందికి చూడనీయండి. క్రైస్తవులమని చెప్పుకొనుచున్న జెఫర్సన్-విల్ వారిని చూడమనండి. క్రైస్తవులుగా చెప్పుకొనుచున్న అమెరికాలోని వారెవరినయినాగాని చూడమనండి. దేవునిచే అభిషేకి౦చబడిన అతని కన్నులు మరల చెమ్మగిల్లును! అతని చేతులు అతని గడ్డమును మరల సవరించును. ఎందువలన? లోకమునకు కనబడిన అందము మరియు అభివృద్ధి అతని కన్నులకు కనబడదు, దేవునినుండి వారు దూరమగుటే అతనికి కనబడును, జనుల యొక్క నైతిక పతనము అతనికి కనబడును. దేశము వెనుకకు జారిన స్థితి అతనికి కనబడును. సంఘములోని చెడుతనము అతనికి కనబడును. అతడు కళ్ళును చిట్లి౦చి చూస్తుండటమే తప్ప ఏదైనా అతడెట్లు చేయగలడు, కావుననే అతడు దానిని ముక్కలు ముక్కలుగా చేయును.

51ఎవరైనా బిషప్పు అతడిని ఒకవేళ సంధించి "ఇప్పుడు, నీవేనా ప్రభువు ప్రవక్తవి? ఇప్పుడు, మంచిది నీవేమి చెప్పాలో మరియు నీవేమి చెప్పకూడదో నీకు నేను చెప్పెదను? అని చెప్పినయెడల అతడు దానిని ఆలకించునని నీవనుకుంటున్నావా?

"వచ్చి మా సంస్థలో చేరుము, నీ కూటములకు మేము సహాయము చేయుదుము," అని అతడు చెప్పినా గాని, దానిని ఆ ప్రవక్త ఆలకించునని నీవను కుంటున్నావా? లేదు, ఆ విధముగా అతడు చేయునని నేను భావించుటలేదు. లేదు, అతడు దేవునిచే పంపబడెను. వారి సహాకారము అతనికి అవసరము లేదు. అతనికి దేవుని వాక్యమున్నది, దేవుని అభిషేకమున్నది, దేవుడు నిర్ణయించిన కాలమున్నది, ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో అతడు వచ్చుచున్నాడు. అతడు నిజ ప్రవక్త, ఆ విధంగానే అతడు పయనించును. ప్రభువు ఈలాగు సెలవిచ్చు చున్నాడుతో తప్ప మరిదేనితోను అతడు పయనించడు.

52సమరయు పట్టణ సౌందర్యమును అనుభవించుచున్న విద్యా గర్వముగల ఇశ్రాయేలీయులు, మెరుగుదిద్దుకొనిన యాజకులు, బోధకులు ఈ దీన అపరిచితుడైన ఇతడిని చేర్చుకొందురా? బహుశా అతని వ్యాకరణము చాలా అసహ్యముగా ఉండి యుండును, అరణ్యములోని ఒక పేద కుటుంబములో నుండి వచ్చినవాడు, ఇల్లు విడిచి, దేవుని పిలుపు విని దేవునిని, దేవుని వాక్యమును చదివి ప్రవక్త యగుటకు అతడు అరణ్యములోనికి వెళ్ళెను. ఆ విధంగా దేవుడతనిని పుట్టించెను. ప్రవక్తలు ఆ కాలమునకు వర్తమానికులుగా జన్మించెదరు. దేవుడు తన ముందస్తు జ్ఞానము ద్వారా ఆ కాలమును ఎరిగి పాపమును ఖండించుటకు తన ప్రతినిధిని ఆయన ఏర్పరచును.

53ఆ సుందర పట్టణము అతనిని చేర్చుకొనునా? అతడు చెప్పిన మాటలను ఆ స్త్రీలు అసలు ఆలకించెదరా? ఆ యాజకులు అతని మూట విందురా? వినరు, ఎందుకనగా సంస్థ నుండియు అతనికి సిఫారసు పత్రము లేదు. "పరిసయ్యులు నన్ను పంపిరని" అతడు చెప్పజాలడు. సద్దూకయ్యులు నన్ను పంపిరని అతడు చెప్పలేడు. ఏ అధికార నియామక పత్రములు అతని యొద్ద లేవు. ఏ గుంపుకు చెందిన సహవాసపు కార్డు అతని యొద్ద లేదు. అతని కూటములు ఏర్పాటు చేయుటకు ముందుకు వెళ్ళిన వారెవరూ లేరు. అతని కూటములు ఏర్పాటు చేయుటకు ఏ పరిసయ్యుల ఐక్యకూటమి ముందుకు రాలేదు, ఏ సేవక బృందము ముందుకు రాలేదు, అతని రాకను గూర్చి ఏవరూ ఎరుగరు. అతడెవరికి తెలియడు. అతనికి ఏ సహవాసపు కార్డు లేదు. ఏ అధికార పత్రము అతనికి లేదు. ఎవరి యొక్క సిఫారసు అతనికి లేదు, కాని అతనికి "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" ఉన్నది, నిజ ప్రవక్త విధానము అదే విధముగా యుండును. అతడు "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడనే" దానిని కలిగియుండును.

54అతడు "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడనేది" కలిగియున్నయెడల, అది ఇక్కడున్న మానవ-నిర్మిత పద్ధతులన్నింటికీ వేరైనది, అతనికి అదే అవసరము. అతడు ఈ విధానమున వచ్చినయెడల, ఒక సంఘము యొక్క నామమున అతడు వచ్చును. అతడు ఈ విధానమున వచ్చినయెడల, అతడు ప్రభువు నామమున వచ్చును. కాబట్టి ఒక నిజ ప్రవక్త ఎప్పుడూ ప్రభువు నామమనే విధానములోనే వచ్చును, ఎల్లప్పుడూ అతడు ప్రభువు నామములోనే వచ్చును.

సహవాసపు కార్డులు అతడు చూపించలేదు, అతని యొద్ద దేవుని వాక్యమున్నది; ప్రజలకు దేవుడే దానిని పంపెను. కాని ప్రజలు, తమకొరకు సంస్థలను స్థాపించుకొనిరి. వారికి చాలా రకముల గుంపులున్నవి, వాటిని ప్రజలే రూపొందించుకొన్నారు. కాని ఆమోసుకు అట్టిది ఏదియూ లేదు, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" మాత్రమే అతని యొద్ద ఉన్నది, దానినే అతడు చెప్పెను.

55ఆ యాజకులు సబ్బాతు ఉదయాన చిన్న ప్రార్థనలు, మొదలగునవి యుండేవారు అని నేను అనుకొనుచున్నాను మరియు ఒక చిన్న ప్రతిష్ఠ ఆరాధనలు, జరిపి మరియు గొప్ప మోషేను గూర్చి కొన్ని సంగతులు మాట్లాడేవారు. ఆ దినములలో జీవించిన గొప్ప వారిలో అతడొక మహా వ్యక్తిగా జీవించెను. "కాని ఓ, ఆ దినములు ఇప్పుడు గతించినవి, మనకు క్రొత్త దేశాధ్యక్షుడు గలడని మీరెరుగుదురు, మనకు క్రొత్త ప్రభుత్వము గలదు మరియు మనకు సమస్తమును మనము కలిగియున్నాము," అని ఏవేవో అటువంటి కొన్ని సంగతులు ముచ్చటించుకొని ఇంటికి వెళ్ళిపోయెడివారు.

కాని వాటిని ఏమీ లెక్కచేయని ఒక వ్యక్తి వచ్చెను; అతడు "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో" వచ్చెను. చూచారా. అది ప్రవక్త యొక్క మార్గము. ఏ సహకారము లేదు. తానేమి ఎదుర్కొనుచున్నాడో ఎరుగును; అందరూ తనకు వ్యతిరేకముగా యుందురని అతడెరుగును, వారందరూ అతనిని విసర్జించుదురని అతనికి తెలియును, వారతనిని తిరస్కరించుదురు. కాని అతడు ప్రభువు పేరట వచ్చుచున్నాడు.

తాను కల్వరిని ఎదుర్కొనుచున్నానని యేసు ఎరుగును, అయినా ఆయన ప్రభుని పేరట వచ్చెను, చూచారా. అది నిజ ప్రవక్త యొక్క మార్గము.

56ఆ దేశమును గూర్చి ప్రభువు పలుకుచున్న వాక్యము అతని యొద్ద ఉన్నది, కాని నిజమగు ప్రభుని వాక్యము ఆ ప్రజలకు వింతగా యున్నది; అయినను వారు తమ యొద్ద వాక్యమున్నదని తలంచిరి. (ఇది మీరు లోతుగా గ్రహించవలెను.) వారు తామెంతో భక్తి, పవిత్రత గలవారమని తలంచిరి, కాని నిజమగు దేవుని వాక్యము వారికి వింతగా నున్నది.

నేడును ఆ విధంగానే యున్నది. ప్రత్యక్ష్యపరచబడుచున్న నిజమగు దేవుని వాక్యము చాలామంది పెంతెకోస్తు వారికి క్రొత్తగా యున్నది. నిజమగు వాక్యభావము, నిజమగు దీవెనలు, శాపములు, దేవుని యొక్క నిజ ఆశీర్వచనముల వంటివి తాము పరిశుద్దులమని చెప్పుకొనుచున్న చాలామందికి వింతగా కనబడుచున్నవి. సంఘ సభ్యులకు, క్రైస్తవులకు అది క్రొత్తగా యున్నది, దానిని వారెరుగరు. వారికది చెప్పినచో దానిని తామెన్నడూ వినలేదని చెప్పెదరు. అయినను వారి సంస్థలు పెరిగి అభివృద్ధి పొందుచు, అంతకంతకు పెద్దవగుచు, సభ్యులు పెరిగిపోవుచు, ప్రతి సంవత్సరము నూతన సంస్థలు దానితో చేరుచున్నవి. వచ్చిన వారెవరైనా తమ గుంపుల ద్వారానే రావలెనని వారు భావించిరి.

MATT 3:9,10•

LUKE 3:8,9

 

57నిశ్చయంగా వారతనిని చేర్చుకొనరు, నేడును వీరు ఆ విధంగానే చేయుదురు. దేవుడు ఈ రాళ్ళను లేపి నిజ దేవుని ప్రవక్తలనుగా చేయగలడని వారు ఎప్పుడో మరచిపోయిరి. దేవుడు అరణ్యవాసులను లేపగల సమర్దుడు, దేవుడు ఈ రాళ్ళను మానవులనుగా చేసి, ఆయన వాక్యము కొరకు నిలబెట్టుకొని, ఆయన నామములో సత్యము ప్రవచింప చేయగలిగి, చెట్టు వేరున గొడ్డలి పెట్టి ముక్కలుగా చేయును. సహకారమున్నా లేకపోయినా నాకు లెక్క లేదు. నిజ ప్రవక్త మార్గము అదే.

దానిని అతడు తేలికగా పొందియున్నాడని కొందరనుకొందురు. వారేమి మాట్లాడుచున్నారో వారెరుగురు. అతడు మంచి గుర్రపు బగ్గీ ఎక్కి పట్టణమునకు రాలేదు, "గౌరవనీయుడగు డాక్టరు, ఫలానీ ఫలానీ ఆయన వచ్చుచున్నాడు," అని ప్రధానయాజకులు అతనికి వందములు చెల్లించలేదు. అది ఒక సంస్థలో యుండును.

LUKE 2:7•

JOHN 10:33•

JOHN 10:33,37,38•

JOHN 14:10

 

58ఆయన కూడా ఒక పశువుల శాలలోకి వచ్చెను, ఆవులున్న స్థలములో పరుండెను, కీర్తి, ప్రతిష్ఠలతో ఆయన రాలేదు, కాని ఒక దీనునిగా ఆయన వచ్చెను. ఒక శిశువుగా ఆ పాకలో పుట్టెను. ఆమోసు దేవుని వాక్యమై యుండెను. ఏ దేవుని వాక్యమైనా, అది ఏ వ్యక్తిలోయున్నా అదే దేవుడై యుండును!

"ఈ క్రియలు నేను చేయుట లేదు" అని యేసు చెప్పెను.

"నిన్ను నీవు దేవునిగా చేసికొనుచున్నావే," అని జనులనిరి.

"నేను దేవుని కార్యములు చేయనియెడల నన్ను నమ్మకుడి, ఈ క్రియలే నాగూర్చి మాట్లాడుచున్నవి, నన్ను మీరు నమ్మకపోయినయెడల క్రియలను నమ్ముడి, అవి నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి," అని ఆయన చెప్పెను.

దేవుని వాక్యమైయున్న ఆమోసు మార్గమందు నడిచి వచ్చుచుండెను. అతడు మోటుగా యున్నాడు, లోకపు నాజూకులేమీ అతని యొద్ద లేవు. ఆత్మశక్తితో అతడు వచ్చుచుండెను, దేవుని వాక్యము ఆ విధంగానే వచ్చును, సంస్థల ఆచారముల ద్వారా రాదు, వేదిక మీద ఏదో ఆడంగి బోధ బోధించుట వలన రాదు; దేశమునకును, ప్రజలకు దేవుడిని ప్రత్యక్ష్యపరచుటకు అది ఆత్మశక్తితో వచ్చును. అదొక భిన్నమైనది. ఎంత బేధము గలదు!

MATT 3:9•

LUKE 3:8

 

59దేవుడు ఈ రాళ్ళ ద్వారా నిజ ప్రవక్తలను పుట్టించగల సమర్దుడను సత్యమును వారు మరచిపోయిరి. వారి సంస్థ నిజ ప్రవక్తలను లేవనెత్తజాలరు, వారు బహుశా అందుకు ఇష్టపడరు, ఎందుకనగా వారికి గలరు, వారి సంస్థలలో తయారయిన ప్రవక్తలు వారికున్నారు. కాని దేవుడు తన ప్రవక్తను లేపి తనకిష్టమగు పనిని చేయును. ఆయన తన పని జరిగించుకొనుటకు ఎందుకూ పనికిరాని దానిని తీసికొని, తాను దేవుడై యున్నానని నిరూపించుకొనును. ఒక వ్యక్తి తనకు అంతా తెలుసునని గర్వించినయెడల, దేవుడు ఆ మనిషిని ఉపయోగించుకొనజాలడు, ఎందుకనగా ఆ వ్యక్తిలో చాలా అహంకారమున్నది.

ఈనాడు క్రైస్తవ సంఘము ఆ విధంగానే యున్నది. వారు తమకు ఏదో తెలియునని అనుకొనుచున్నారు. ఒకడు తనకు ఏదో తెలియునని అనుకొనుచున్న యెడల, అతడు తాను తెలిసికొనవలసిన దానిని తెలిసికొనలేడు అని బైబిలు చెప్పుచున్నది. మనకు చాలా అహంకారము, చాలా వేషధారణ, చాలా విద్య, చాలా మతము ఉన్నది. అదే నేటి మన సమస్య. దేవుని వాక్యము యొక్క రక్షణ గూర్చి ఏమీ తెలియదు. అది చాలా విచారకరమగు సంగతి.

MATT 3:9•

LUKE 3:8•

JOHN 1:1

 

60అవును! దేవుడు ఈ రాళ్ళవలన అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడనియు, నిజమగు వాక్య ప్రవక్తలను లేపగలడనియు అన్న సంగతిని ఎప్పుడో వారు మరచిపోయిరి. వారు ఏదో ఒక ప్రత్యేకమగు పాఠశాల నుండి రానవసరము లేదు. దేవుడే వారికి విద్యను ఇచ్చును. కళాశాలలోని నాలుగు పట్టములను వారియొద్ద లేవు. వారి యొద్ద వారికి పట్టభద్రుడైనట్టు లేదు, మరియు ఏ డాక్టరు పట్టము మరియు మొదలగునవి ఏమీ లేవు, వారి యొద్ద అటువంటివి ఏమీ లేవు. దేవుడు ఎవరినయినా గాని తీసికొని వారిలో తన వాక్యమును పెట్టగలడు. దానిని ఆయనెట్లు చేయును? దానిని ఆయన బయలుపరచి, మరియు దానిని రుజువు చేయును.

యేసు ఏ వేద పాఠశాల నుండి వచ్చెనో వారికర్దము కాలేదు. ఆయనకు ఏ వేద పాఠశాల విద్య లేదు. ఏ పాఠశాలలో చదివెను? ఏ పాఠశాలకు వెళ్ళలేదు! ఆయన దేవుడు, ఆయనే వాక్యము. ఏ పాఠశాల ఆయనకు ఏమీ నేర్పించజాలదు. దేవుడెన్నడూ తానేర్పరచుకొనబోవు వ్యక్తిని పాఠశాలకు పంపించడు. చరిత్ర చదవండి, ఎక్కడైనా ఆలాగు జరిగేనేమో చూడండి. ఆయన ఎన్నడూ ఆలాగు చేయలేదు. ఆయన ఎందుకూ పనికిరాని వానిని ఏ మూలనుండియో తీసికొని, అతనిలో తన వాక్యము నుంచును, అతనిలో తననుతాను బయలుపరచుకొనును. ఈ ఆమోసులో ఆయన అదే చేయుచున్నాడు. సరి.

61ఆమోసు యొక్క వాక్యము ఆ దినమున దేవుని ద్వారా ప్రత్యక్షపరచబడినది. వారి దినములయందు దేవుడే ఆమోసు యొక్క వాక్యము బయలుపరచెను, అతనికి ప్రభువు యొక్క వాక్యమున్నది. ఇప్పుడు అతడు మనయొద్దకు వచ్చిన యెడల మన దేశము, మన జనులు అట్టివానిని చేర్చుకొందురనుకొనుచున్నారా? బాప్టిస్టులు ఆమోసును చేర్చుకొందురని మీరనుకొనుచున్నారా? మెథడిస్టులు! ప్రెస్బిటేరియనులు చేర్చుకొందురా? పెంతెకోస్తువారు చేర్చుకొందురా? కాథలిక్కులు చేర్చుకొందురా? లేదండీ! లేదు, ఎవరూ ఆయనను చేర్చుకొనరు.

ACTS 12:7

 

62ఒక్క నిమిషము పాటు అతనిని ఇచ్చటకు తీసికొని వద్దాం, వారతనిని చేర్చుకొందురో లేదో చూద్దాం. ఈనాటి మన సంఘములు అతనిని చేర్చుకొనునో, లేదో చూద్దాం.

మొదటిగా అతడు ఒక కార్యమును చేయును; అతడు ఏ సంస్థతోను ఏకీభవించడు, ఎందుకనగా అది వాక్యమునకు వ్యతిరేకము. అవునండీ! మన ఈ వ్యవస్థ యావత్తును అతడు ఖండించును. ఇది నిజము. ప్రతి సిద్దాంతమును, ప్రతి ఆధారమును, ప్రతి శాఖను, ఈ సమస్తమును అతడు ఖండించును. నేను ఉరకే ఊహించుచున్నాను, కొంతమంది పెంతెకోస్తువారు, ప్రెస్బిటేరియనులు ఈ విధముగా చెప్పుటను చూచుచున్నాను, "ఎందుకని, దేవునికి మహిమ. ఎందుకు, అతడిని మా పట్టణములోనికి రానియ్యము," అని చెప్పెదరు.

ప్రెస్బిటేరియనులు, బాప్టిస్టులు ఏమి చేయుదురని మీరు తలంచుచున్నారు? "ఆ విద్యలేని పామరుడు మాకు అక్కర లేదని అందురు. అతడు మతిలేనివాడని అందురు!" అతనిని వీధులలో నుండి తరిమి చెరసాలలో బంధించుటకు కాగితము వ్రాసి సంతకములు పెట్టెదరు. కాని అక్కడతనిని మీరు బంధించగలరా? ఓ, మీరు దేవుని వాక్యమును చెరశాలలో బంధించజాలరు. లేదు, చెయ్యలేరు! ఏలాగయినా అది బయటకు వచ్చును. దానిని ఒకనాడు చెరసాలలో బంధించవలెనని వారు ప్రయత్నించగా, చెరసాల పునాదులు వణికినవి, ఒక వెలుగు వచ్చి అతనిని బయటకు విడిపించెను. లేదు, ఖచ్చితంగా అతడు మన వ్యవస్థతో విభేదించును. ఇది నిజము. మంచిది.

MATT 24:35•

MARK 13:31•

LUKE 21:33

 

63అతడేమి చేయనారంభించును? దానిని చీల్చగోరును! ఎందువలన? అతడు ఒక దైవ సేవకుడు. అతడు తిన్నగా పునాది యొద్దకు వెళ్ళి, తన పనిని చేయనారంభించును, దానిలోని ప్రతి ఆచారమును చీల్చి చెండాడి, పునాదిని బాగుచేయును. పునాది అనగా ఏమిటి? దేవుని వాక్యమే! "భూమ్యాకాశములు గతించును గాని నా వాక్యమెన్నడూ గతించదు."

కాబట్టి అతడు ప్రతి శాఖను, ప్రతి ఆచారమును, ప్రతి సిద్ధాంతమును, దానికి చెందినవన్నింటిని పెరికి ప్రక్కకు విసిరివేయును, దానినతడు పాతాళములో పాతిపెట్టును. పెంతెకోస్తు వారతనిని చేర్చుకొందురని నీవు తలంచుచున్నావా? లేదు! చేర్చుకొనరండీ! బాప్టిస్టులు, ప్రెస్బిటేరియనులు? లేదు, చేర్చుకొనరండీ! నాజరీనులు, పిలిగ్రీం హోలీనెస్ వారు చేర్చుకొందురా? వారతనిని ద్వేషించుదురు. తప్పకుండా!

64వారు వెళ్ళి మరియు అతనికి స్వాగతము పలికి పట్టణములోనికి తీసికొని వచ్పుదురని మీరనుకొనుచున్నారా? అతడు మాడి చావవలెనని వారు సూర్యునికి ప్రార్థించెదరు. పట్టణములో నుండి వారతనిని వెళ్ళగొట్టుటకు జనమును పురికొల్పుదురు. ఎందుకని? మీ జీవితములో ఎన్నడూ చూడనన్ని సేవకుల కూటములను అప్పుడు మీరు చూచెదరు. "ఆ పిచ్చివానిని పట్టణములో నుండి వెళ్ళగొట్టుమని" చెప్పెదరు. కాని అతనికి "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" ఇయ్యబడెను, చూచారా. అది ఒక నిజ ప్రవక్త యొక్క మార్గము.

అతనిని నిశ్చయంగా తృణీకరించుదురు! అతనికి అవసరము లేదు… అతడు తన పనిని పునాది యొద్ద నుండి ప్రారంభించును. "ఇప్పుడు మెథడిస్టులారా మీరందరూ రండి, నాకు సహాయము చెయ్యండి. బాప్టిస్టులారా మీరు కూడా, ఇచ్చట యున్న జనులందరూ నాకు కావలయును. చివరిగా దేవుడు పిలవబోయే గుంపుగా చెప్పుకునే పెంతెకోస్తులారా, మీరందరూ నా యొద్దకు రావలయునని ఆశించుచున్నాను, నా కూటములను మీరు బలపరచవలెనని నేను ఆశించుచున్నాను," అని అతడు చెప్పనే చెప్పడు.

65"మీరెట్లు బాప్తిస్మమిచ్చుచున్నారు? పరిశుద్ధాత్మను పొందినట్లుగా తొలి రుజువు ఏమిటి?" అను ప్రశ్నలను వారతని ముఖము మీద వేయుదురు; అతడు బైబిలు సత్యముతో వచ్చినప్పుడు, వారతనిని త్రోసివేయుదురు. కాని అదే ఒక నిజ ప్రవక్త యొక్క మార్గమైయున్నది. అతడు వాటినన్నిటిని ఎదుర్కొనును, చూచారా.

నిశ్చయంగా, అతనిని మనము చేర్చుకొనము. లేదండీ! అతని కూటములను ఒక్కటి కూడా మన దేశములో జరుగనియ్యము. లేదు, నిశ్చయముగా! మంచిది, అతనిని "మనము రానియ్యము." లేదయ్యా! కాని అతడు వచ్చి సంఘమును మరల వాక్యము నొద్దకు నడిపించును, ఏలయనగా అదే పునాది. ఎవరైనా మరో పునాది వేసినా గాని, అది కూలిపోవు ఇసుకయే. అపోస్తలుల బోధ అను పునాది మీద మాత్రమే దేవుడు తన సంఘమును నిర్మించును.

66ఒక రోజున ఒకరు నాతో పాపపరిహారము గూర్చియు, పరిశుద్ధ ఫ్రాన్సిస్, పరిశుద్ధ సిసీలియాల గూర్చియు ముచ్చటించుచుండిరి, వారు కొందరి జనుల పాపపరిహారము కొరకు ప్రార్థించుచున్నారనియు, అందుకు వారు అధికారము పొందిరనియు చెప్పిరి. అది వాక్యములో లేని అధికారము; వారు అధికారము లేని జనులు! అది అపోస్తుల బోధకు విరుద్ధమైనదైతే, అది ఒక అబద్ధమైనదగును, నా మట్టుకు అది అట్లేయగును.

67పాపపరిహారమును నేను నమ్ముచున్నాను, కాని అది ఇప్పుడే అని నమ్ముచున్నాను. మీరు మీ స్వంత ఆత్మలను శుద్దీకరించుకోవలెను. పాపపరిహారము అనగా, "శుద్దీకరించుకొనుట" అని అర్థము. నీవు ఒక పొరపాటు చేసినప్పుడు దానిని ఒప్పుకొని ఏడ్చి, ఉపవాసముండి ప్రార్ధించి శుద్దీకరించుకొందువు. ప్రభువు వచ్చి చాలా రోజుల క్రితము కాదు గాని, ఒక దర్శనములో, ఆ సర్పమును బంధించుటకే నేను ఎప్పుడూ చూచుచున్నానని నేను చెప్పినప్పుడు కొంతమంది జనులు నవ్విరి. ఏ విధంగా అని నేను ఎప్పుడూ ఆశ్చర్యపడుతూ - ఏ విధముగా నేను దానిని చేయగలుగుదును, నా జీవితంలో నేను అది మాత్రమే చేయగోరుచున్నాను. అప్పుడు నేను ఉపవాసముండి, ప్రార్థించసాగాను. "అదెందుకు చేయుచున్నావని?" నన్ను ప్రశ్నించిరి. "ఇక్కడ నేను నమ్మకముగా లేను అని ఆయన చెప్పెను," అని నేను అన్నాను. ఆయన వచ్చిన తరువాత, అప్పుడు నన్ను నేను శుద్ధిచేసుకోవాలని నేను కోరాను. చనిపోవువరకు ఆగి ఆ తరువాత ఎవరో యాజకుడు వచ్చి నీ ఆత్మను విడివించవలెనని కాదు. ఇప్పుడే నీ ఆత్మను శుద్దీకరించుకొనుము!

అయితే చూడండి, వారు దానిని వాక్యాధికారము నుండి సంగ్రహించి మానవ-కల్పితము సిద్దాంతముగా మలచి సంఘమునకు డబ్బును సంపాదించుచున్నారు, ఎందుకనగా వారు లోక సంగతుల వైపు, లోక సంఘము వైపు, లోకములోని గొప్ప శక్తులవైపు, రాజాకీయాధికారము వైపు చూచుచున్నారు. కాని దేవుడు తన వాక్యము వైపు చూచుచున్నారు. దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్న ఏ మాటయినా గాని తప్పు. నాకు చెందినంతవరకు వాక్యమే సరియైనది. వేరే ఏదీ లేదు. అవునయ్యా! అవునయ్యా!

JOHN 6:37

 

68అతడు తిన్నగా పునాది యొద్దకు వెళ్ళును. దానిని అతడు ముక్కలుగా చీల్చును. అతడా విధంగా చేయవలసియున్నాడు; దానిని తప్ప మరేమీ చేయజాలడు, ఈ రోజున ఆమోసు ఇక్కడున్నచో. అది తప్ప మరేమియూ చేయజాలడు, ఏలయనగా గుర్తుంచుకొనండి, అతడు దేవుని యొక్క ఒక నిజ ప్రవక్త, అతని యొద్దకు వాక్యము వచ్చును. అతడు తిరిగి వాక్యము యొద్దకు వెళ్ళుట తప్ప మరేమియూ చేయజాలడు. దేశములోని పెంతెకోస్తు వారందరూ కలిసి వచ్చి, "ఆమోసు గారు, మీరు ఒక ప్రవక్త అని నమ్ముచున్నాము, కాని మీరు వాక్యము నుండి దూరంగా పోయారు, మేము మిమ్మును సరిచేయ గోరుచున్నాము," అని చెప్పినా, అతడు వాక్యముతోనే నిలచియుండును. అతడు ప్రవక్త గనుక ఇంకేమియూ చేయజాలడు. వారి సహకారము అతనికి అక్కరలేదు. అతడు ఇవ్వవలసిన ఒక వర్తమానము ఒకటున్నది, "తండ్రి నాకనుగ్రహించిన వారందరు నా యొద్దకు వచ్చెదరు," అతడు వాక్యమును అతడు బోధించ వలసియున్నాడు. బైబిలులో యున్నట్లుగానే దానినతడు బోధించవలసియున్నాడు, కాబట్టి అతనిని మనము త్రోసివేయుదుము. ఇది నిజము. ఏమైనాగాని ఫరవాలేదు దేవుని యొక్క వాక్యము, వాక్యము యొక్క అర్థము ప్రవక్త యొద్దకే వచ్చును. అది సరియైన అనువాదమైయుండును.

NUM 12:6•

JER 28:9•

MARK 16:17•

JOHN 14:12

 

69ఇశ్రాయేలు ఎల్లప్పుడూ త్రోవ తప్పిరి, అప్పుడు దేవుడు సూచక క్రియలు, మహత్కార్యములతో ఒక ప్రవక్తను పంపి, వాక్యమును వారికి బోధించెడివాడు; అతనికెట్లు తెలియును? "ప్రవక్త చెప్పినది నెరవేరినప్పుడే అది సత్యమని గ్రహించవలెను," అని ఆయన చెప్పెను. వారు సరైనవారేనని ఆయన యొక్క ప్రవక్తలను రుజువు చేసెను. "నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును. దీనిని బట్టి మీరు తెలుసుకొందురు; నమ్మినవారివలన ఈ సూచకక్రియలు కనబడును," అని యేసు చెప్పెను.

MATT 7:20•

LUKE 6:44

 

70ప్రభుని ప్రవక్తలని చెప్పుకొనినవారు దేవుని వాక్యము నెట్లు కాదనగలరు? యేసుక్రీస్తు నామములోని బాప్తిస్మమును తృణీకరించి బైబిలులోలేని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను బిరుదులలో ఎట్లు బాప్తిస్మము ఇచ్చెదరు? పరిశుద్ధ గ్రంథములో వాక్యానుసారముగా అచ్చట అది లేనప్పుడు ఏ విధముగా వారి సిద్దాంతమునకు సహకరించాలి? నేను చాలా కఠినముగా లేదా విమర్శకునిగా కనబడవచ్చును. కాని ఇది ఆ విధంగా ఉండు సమయముగా యున్నది. నిజము. అన్నింటికీ పరిగెత్తుచూ, ఏ విధముగా ప్రజలు తాము క్రైస్తవులమని నేడు చెప్పుకోగలుగుచున్నారు? స్త్రీలు జుట్టు కత్తిరించుకొని, పొట్టిబట్టలు ధరించుకొని, సిగరెట్టు త్రాగుచూ, సినిమాలకు పరుగిడుచున్నారు, (ఏ సినిమాను వదలరు), కొనసాగిపోతున్నారు. అది పరిశుద్ధాత్మా! నాకు చెప్పండి. ఆలాంటి మాటలెన్నడూ చెప్పవద్దు. నిన్ను చూచి దేవుడు వాంతి చేసికొనుచున్నాడు, మీరు అటువంటి కార్యములను చేస్తూ వుంటుంటే, మీరు నిశ్చయముగా దానిని అర్థము చేసుకోగలరని తలంచుచున్నాను, మిమ్మల్ని మీరు ఆ విధముగా చెప్పుకొనుచూ, ఏ విధముగా మీరు అటువంటి క్రియను చేయుచున్నారు? వారి ఫలమును బట్టి మీరు వారిని గుర్తించెదరు.

71జుట్టు కత్తిరించుకొనిన ప్రతి స్త్రీని అతడు ఖండించును. అతడు ప్రవక్త గనుక దానిని తప్ప అతడు వేరేమి చేయగలడు? అది వాక్యము. "నీవు ఎజెబెలువి!" అని అతడు చెప్పును. అతడు వారితో కరుకుగా మాట్లాడును. ఎందువలన? అతడు ఒక ప్రవక్త, అతడు వాక్యముతో నిలచియుండును. అది వాస్తవము. వారతనిని ఆపగలరని తలంచుచున్నారా? లేదయ్యా, ఆపలేరు! "అతనిని వారు పిచ్చివాడందురు. పరిశుద్ధ గ్రంథములోని ఆ పాత్ర పౌలు వలె అతడు స్త్రీ ద్వేషకుడని వారందురు." వారు అనుకరణ చేయు నామకార్ధ క్రైస్తవులు.

MATT 3:10•

LUKE 3:9

 

72నీవెంత పరిశుద్ధముగా జీవించవలెనని ప్రయత్నించినా గాని దానితో వారికేమి సంబంధము లేదు. దేవుని వాక్యమును నిరాకరించి, దాని వరుసలోనికి నీవు రానంత కాలము పాపివే, ఒక అవిశ్వాసివే." ఆయన అలాగే చెప్పును. అతడు గొడ్డలిని చెట్టు వేరున ఉంచును, దేనిని అతడు లెక్కచేయడు. అతడు ప్రవక్త, ఒక నిజ ప్రవక్త యొక్క మార్గము ఆ విధంగానే యుండును. ఎవరు ఏమనుకొన్నాగాని వారు వాక్యముతో నిలచియుందురు, వారి తల్లి అయినా, తండ్రి అయినా ఏమి వ్యత్యాసమును చూపరు, యేసు ఆలాగే యుండెను. ఆమెను ఒక తల్లిగా కూడా ఎక్కువగా ఆయన పిలవనే పిలువలేదు; ఆమె తల్లి కాదు. ఆయన దేవుడు; దేవునికి ఒక తల్లి ఉండదు. ఆయనకు ఆ విధముగా వుండినయెడల ఆలాగయితే ఆయన తండ్రి ఎవరు?

73అతడు వారిపై మండిపడి ఖండించును. ప్రతి శాఖను అతడు ఖండించును, ఎందుకనగా అవి ఏమియూ వాక్యము మీద నిర్మించబడలేదు. ఏ ఒక్కటి నాకు వాక్యానుసారమైనదిగా కనబడలేదు. వారు శాఖగా మారిన వెంటనే వాక్యమునకు విరోధులవుదురు. కాబట్టి ఏ విధముగా, వాక్యము ఖండించిన దానిని ప్రవక్త ఎట్లు దీవించగలడు? అయినా అతడు తన సోదరుని బాధపెట్టరాదనుకొనును, అయినను అతడు ప్రవక్త గనుక మరే మార్గము లేక దానిని అతడు చేయవలెను. దేవుని యొక్క నిజ వాక్యమునకు అతడు ప్రతినిధి. ఏ విధముగానైనను అతడు దానినుండి తొలగడు. నీతి వెంబండి నీతి, సూత్రము వెంబండి సూత్రము వచ్చును. నా భావము గ్రహించారా? అది నిజ ప్రవక్త యొక్క మార్గము.

"ప్రభువా, ఒక ప్రవక్తగా నీవు నన్ను చేయాలని నేను ఆశించుచున్నాను," అని వచ్చి నాతో చెప్పినా, ఆ విధంగా ఆయన చేయడు. అది ఆయన పద్ధతి కాదు.

74ఆయన ఈ సంఘముల యొక్క నీతిలేని క్రియలను ఖండించును, ఈ త్రాగుడు, విందులు, పేకాటలు, వినోదములు అతడికి నచ్చవు. వారిని అతడు ఖండించును. వారెచ్చటనుండి వచ్చితిరో ఆ పాతాళ అంతము వరుకు వారిపై అతడు మండిపడును. ప్రవక్తను వారు చేర్చుకొందురని మీరనుకొనుచున్నారా? చేర్చుకొనరు! ఈనాటి సంఘము ఆయనను చేర్చుకొనదు. పెంతెకోస్తువారు చేర్చుకొందురా? అతడు నడుచుకుంటూ అచ్చటికి వెళ్ళి, "జుట్టు కత్తిరించుకొనిన యొజెబెలు సమూహమూ, ప్రభువు సెలవిచ్చుచున్నాడనే మాటకు మీకు అర్థము తెలియుట లేదా? ఒళ్ళంతా కనబడునట్లుగా ఒక చిన్న పల్చటి గుడ్డను కప్పుకొని బయటకు నీవు వెళ్తుంటే, ప్రతీరోజు వందలాది పురుషులతో నీవు వ్యభిచరించుచున్నావని నీకు తెలియుట లేదా?" అని అతడు వారిని చూచి గద్దించును. దానినే అతడు చెప్పవలసియుండును.

JOHN 8:44•

1COR 11:5

 

75"ఆ ముసలి కొయ్యను, ఆ బట్టతల వాడిని, వేదిక మీది నుండి క్రిందికి నెట్టివేయండి." ట్రస్టీ బోర్డు వారిని చూద్దాం పదండి, పెద్దలను, అతడిని ఇచ్చటకు బయటకు లాగివేయండి!

"మీరు నీచమైన వేషధారులు?" అది నిజము అని ఆమోసు పిలచును.

పిదప మిమ్మల్ని మీరు ఇలా చెప్పుకుంటారు, "మేము… మేము ఈ గుంపుకు చెందియున్నాము," అని మీరందురు.

"మేము ఆ గుంపుకు చెందియున్నాము."

మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, వాక్యమును వాడు త్రోసివేయును.

"నేను భాషలతో మాట్లాడుచున్నానని చెప్చెదవుగాని," జుట్టు కత్తిరించుకొందువు!

"దేవునికి మహిమ! హల్లెలూయా!"

స్త్రీలు ఆ విధముగా జుట్టు కత్తిరించుకొని ప్రార్ధించుట అవమానమని బైబిలు చెప్పుచున్నది. అయినా గాని మిమ్మల్ని మీరు క్రైస్తవులని చెప్పుకొనుచున్నారు. మీకు అవమానము! ఏదో మూలకు ప్రాకి వెళ్ళి దేవునితో సరిచేసికొనుము.

MATT 5:28

 

76పాత చిన్న పొట్టిబట్టలు ధరించి అవరణలోనికి వెళ్ళి అందరికి కనబడేలా పరుండుచున్నప్పుడు, నీకు తెలిసో తెలియకుండానో వందలకొలది పురుషులతో ప్రతీ దినము నీవు వ్యభిచరించుచున్నావు. యేసు ఆలాగు చెప్పెను: "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించినవాడగును." ఆవిధంగా ఆమె తన్ను కనుపరచుకొన్నది, నీవు దీనిని నీ జీవితములో చేయుచు… నీవు అట్లు౦డిన..

77మీరు లోక విషయములలో చనిపోయియున్నారు, మీరు దానినుండి పైకి లేపబడియున్నారు, మొదట్లోనే నేనది చెప్పాను. మీరు సిగ్గుతో తలదించుకొనుడి. ఒక స్త్రీని చూచి పాపము చేయుటకు బదులుగా అటువంటి భయంకర పాపపు వేషము చూచి నీ కళ్ళు మూతబడవలెను. "పురుషులారా! మీరు ఆ విధంగా ప్రవర్తించుచూ క్రైస్తవులని ఎట్లు చెప్పుకొనుచున్నారు? అతడు ఆలాగే పలుకును. ఈ ఉదయమున అతని మాటలు నేను తీసికొనుచున్నాను. ఇవి అతని మాటలైయుండును, ఎందుకనగా అతడు నిజ ప్రవక్త అని మరువకుడి; అతడు ఆ వాక్యముతోనే నిలచియుండును. అతని మాటలనే నేనుదహరించుచున్నాను, ఎందుకనగా అతనిని మీరిచ్చటికి తీసికొని వచ్చినయెడల, అతడు వాక్యమైయున్నాడు. వాక్యమే ఇక్కడున్నది. ఆ మనిషి ఇక్కడ లేకపోవచ్చును గాని ఆయన వాక్యమిచ్చటున్నది; ఎందుకనగా అతడు ప్రభుని వాక్యమునే కలిగియుండెను.

78ప్రతి మానవ-నిర్మిత సిద్దాంతమును అతడు ఖండించును, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బిరుదులలోని బాప్తిస్మమును అతడు ఖండించును. అతడు అట్టివాటిని పాతాళములో పడద్రోయును. దానినతడు ఖండించును, దాని వాసన కూడా లేకుండా చేయును. అవునండీ! ఎంతమంది మీరు… ఆ విధమగు వానిని ఈ ఉదయమున ఈ సంఘములోని వారెందరు చేర్చుకొందురు? ఇది యేసు నామము గుంపు అని వారనుచున్నారు, వారు "ఓ, అందువలనే అతడిని మేము త్రోసివేసాము," అని వారు చెప్పెదరు; పిదప మీ సంఘము, దానిలోవున్న నిన్ను అన్నింటిని అతడు చీల్చి చెండాడును. అది నిజము. జుట్టు కత్తిరించుకొనియున్న మీ స్త్రీలపై ఇష్టానుసారముగా ప్రవర్తించుచు, క్రియలను చేయుచున్న మీ పురుషులపై అతడు విరుచుకు పడును.

ఒక ప్రవక్తగా ఉండుట మంచిదని చాలామంది జనులు అనుచున్నారు. లోకములోని కార్యములన్నింటిని, నీ హక్కులన్నింటిని వదులుకొనుటకు నీవు సిద్దపడినట్లైతే దేవునితోను, ఆయన వాక్యముతోను నిలిచియుండు.

నేటి మన శాఖలు, జనులు ఏ విధంగాను అతనిని చేర్చుకొనరు. అతనితో మాకే పొత్తు లేదని అందురు.

79అతడు మండిపడుట చూడండి! "మీరు ఏ దేవునియందు విశ్వాసముంచుచున్నామని చెప్పుచున్నారో ఆ దేవుడే మిమ్మును నాశనము చేయును," అని ఆయన చెప్పెను. దానిగూర్చి మీరేమందురు? పెంతెకోస్తువారు నమ్ముచున్న ఆ దేవుడే వారు జరిగించుచున్న చెడ్డ క్రియలను బట్టి, వాళ్ళు చేయుచున్న క్రియలను బట్టి, వాటిని చేయుటకు వారు అనుమతించుచున్న తీరును బట్టి అదే దేవుడు వారి సంఘశాఖలను తీర్పులోనికి తెచ్చును. అమోసు అక్షరాలా ఆలాగే వారితో చెప్పెను.

"ఓ, మాకు అబ్రాహామున్నాడు, మాకు ఇది ఉన్నది, మాకు ధర్మశాస్త్రమున్నది. మాకు యాజకులున్నారు. మాకు ప్రవక్తలున్నారు," అని వారు చెప్పిరి.

ఓ, సోదరుడా, వారిని చూచి అతని కళ్ళు చెమ్మగిల్లెను, వారికి వాక్యము చెప్పి ఖండించెను. అవునయ్యా! నిశ్చయంగా వారతనిని చేర్చుకొనరు. లేదయా! "వారి మానవ-కల్పిత ఆచారములే వారిని నాశనము చేయునని," చెప్పెను. నేడును అతడు అదే చెప్పును. అప్పుడు చెప్పినదే ఇప్పుడును అతడు పలుకును, "ఏ దేవునికయితే మీరు సంఘ భవనములను నిర్మించుచున్నారో (మిలియనుల డాలర్లు ఖర్చు చేయుచున్నారు), ఏ యెహోవాకయితే మీరు ఆరాధనా స్థలములను కట్టుచున్నారో, ఏ దేవునినయితే మీరు ప్రేమించుచున్నామని చెప్పుచున్నారో, ఆ దేవుడే మిమ్మును నాశనము చేయును; ఎందుకనగా మీరు వాక్యమును విసర్జించిరి."

80నేడును ఆలాగే యున్నారు! అమెరికా ఏ దేవునినయితే సేవించుచున్నామని చెప్పుచున్నదో, ఆ దేవుడే ఈ దేశము మీదికి తీర్పును తీసికొని వచ్చి దీనిని నాశనము చేయును! మీరు విచ్చలవిడిగా తిరుగకుండా యుండుటకు దీనిని ఆలోచించండి. మీరు మీ స్వంత మానవ-నిర్మిత ఆచారములతో జీవించి చెడిపోయియున్నారు, నీతిలేని జీవితం జీవించుచున్నారు, దేవుని వాక్యము నుండి దూరమైపోయినందువలన ఎవరినైతే మీరు ప్రేమించుచున్నామని చెప్పుకుంటున్నారో, ఆయనే ఏదో ఒక దినమున మిమ్మల్ని నాశనము చేయక తప్పదు. అది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడుగా!" యున్నది. మరేమియూ వారికి ఇక మిగలలేదు.

MATT 15:6•

MARK 7:13

 

81వాక్యపు వరుసలోనికి రండి, వారికి సువార్త ప్రకటించుడి, దేశమును దాటండి, వారికి సత్యము ప్రకటించుడి, సేవకులు వ్యర్ధమైన కేకలు వేయుచు గడుపుచున్నారు, ఖండించిన వారిని సంస్థలు త్రోసివేయును. జుట్టు కత్తిరించిన స్త్రీలను చూసి ఎంత చెప్పినా, చెవియొగ్గకుండా తల ఆడించుచు ఆ వెంట్రుకలను పెరగనియ్యటం లేదు, పొట్టి బట్టలను గురించి ఎంత చెప్పినా సంవత్సరమునకు సంవత్సరము అవి యింకా కురచగానే అగుచున్నవి. బాతు వీపు మీద నీరు పోసినట్లే యున్నది. "అయినా వారు దేవుని ప్రేమించుచున్నామని చెప్పుకొనుచున్నారు," అని అతడు చెప్పును.

యేసు ఇట్లనెను, "మీరు మనుష్యుల ఆచారములను తీసికొని దేవుని ఆజ్ఞలను నిరర్ధకము చేసియున్నారు." అదే నిజ ప్రవక్త యొక్క మార్గము, చూచారా. అది తేలికైన మార్గము కాదు. అది అందరూ తలంచుచున్నట్లు యుండదు, క్రిందికి పైకి ఎగురుట కాదు, కేకలు వేయుట కాదు, అందరూ వచ్చి నీ భుజములు నిమురుట కాదు, నీవు ఆలాగున్నచో నిజ ప్రవక్తవు కావని గురుతు. నీవు దేనిగూర్చి మాట్లాడుచున్నావో దానిని నీవు కలిగిలేవని అందువలన అర్థమగుచున్నది.

82వారెప్పుడైనా అతని వీపు నిమిరిరా? అతడి వైపు తిరిగి వారిని చూచి ఎందుకని గద్దించెను? ఆమోసు వీపును వారు నిమరలేదు, ఏలియా వీపు వారు నిమరలేదు, వారి పనికిరాని కార్యములన్నింటిని అతడు సమ్మతించలేదు. లేదండీ! అతడు వారికి దేవుని యొక్క సత్యమును చెప్పెను. ఆ మహా గొప్ప పరలోకములో, అచ్చటకు వెళ్ళబోయే మనము, ఈ చిన్న చిన్న స్వల్పమైన కార్యములనే మనము ఏకీభవించలేక పోయినయెడల, అచ్చటుండే ఆ ఆత్మతో మనము ఏ విధముగా ఏకీభవించగలము? మీరు వాక్యముతో ఏకీభవించవలయును. మరి అదే నిజ ప్రవక్త యొక్క మార్గమైయున్నది. దానిని అతడు చెప్పినందుకు అతడిని ముక్కలుగా చీల్చివేసినను, ఒక దేశమును దానితో అతడు ముక్కలుగా చీల్చవలెను. అది నిజము. అయినా గాని అదే అతని మార్గమైయున్నది.

AMOS 3:9•

2TIM 3:5

 

83దానిని అతడు ఊదును. అతడు వారితో ఏమి చెప్పెనో ఎరుగుదురా? కలహము, ఇప్పుడు మీరిచ్చట గమనించినయెడల, "తప్పు మీ ప్రభుత్వానిది కాదు, మీదేయని!" దానినే అతడు చెప్పును. "సంఘములో కలహములు, పైకి భక్తిగలవారివలె కనిపించుచున్నారు, అదే అసలు సమస్య."

కమ్యూనిజం నేడు లోకమును ఆక్రమించుటకు కారణమదే, అందుకు గల కారణము కమ్యూనిజం కాదు, దానికి కారణము సంఘమే, దానికి కారణము జనులే. నేడు క్రైస్తవులమని చెప్పుకొనుచు, దేవదూతలవలె పాడుచున్నారు. శిక్షణపొందిన స్వరములున్నవి, ఎంతో వాగ్దాటితో కూడిన మాటలు మాటలాడుదురు, చూచుటకు దేవదూతలు యున్నట్లుగా వుంటూ దయ్యములవలె వాక్యమును నమ్మరు. అది నిజము. దేవదూతలవలె పాటలు, దుస్తులు వున్నను… నాకు తెలియుట లేదు మరియు దేవుని వాక్యమును వారు నిరాకరించుచున్నారు.

84ఒక వ్యక్తి, ఒక బోధకుడు వేదిక ఎక్కి నిలడును, అతనిని డాక్టరు, రెవరెండు అని పిలచుదురు, అయితే అతనిని "బాప్తిస్మము ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇవ్వవలెనా లేక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బిరుదులలో ఇవ్వవలెనా" అని అడగండి. అతడు నీ ముందే నవ్వుతూ, "తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలోనే" తీసుకో అని చెప్పును, అయినా గాని నిన్ను నీవు దేవుని బిడ్డగా చెప్పుకొనుచున్నావు! జుట్టు కత్తిరించుకొనుట, లోకస్తులవలె ప్రవర్తించుట, అసభ్యమైన వస్త్రములను ధరించుకొనుట అటువంటి కార్యములను గురించి పరిశుద్ధ గ్రంథము గద్దించుచున్నదని స్త్రీలు బాగుగానే ఎరుగుదురు, అది తప్పని తెలిసి కూడా వాటినే చేయుచున్నాగాని అన్యభాషలలో మాట్లాడుచునే యుందురు, క్రిందికి, మీదికి ఎగురుచూ, కేకలు వేయుచూ భాషలు మాట్లాడెదరు, ముసలి స్త్రీల సమాజములు, కుట్టు కేంద్రములు వారికున్నవి, విదేశములకు మిషనెరీలను పంపుచున్నారు. దేవుని దృష్టిలో వారు చెడు కంపు కొట్టుచున్నారు. "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు," ఆయన సమస్తమును నాశనము చేయును. ఆయన చేయును.

MATT 3:10•

LUKE 3:9

 

85అది అంత తేలికైన పని కాదు, అయినా గాని అదే ఒక నిజ ప్రవక్త యొక్క మార్గమైయున్నది, అతడు ఇతరులకు నొప్పి కలిగించినా గాని తాను చెప్పవలసినదానిని చెప్పవలసినదే.

యోహాను ఒక నిజ ప్రవక్త. "గొడ్డలి చెట్టు వేరున పెట్టబడియున్నది," అని అతడు చెప్పెను. అది అతని మార్గము.

PROV 26:11•

2PET 2:22

 

86నిశ్చయంగా, సమస్య ఆమెలోనే యున్నది. దూతలవలె పాడుదురు గాని దయ్యములవలె నాట్యమాడుదురు, విందులు, వినోదములు, పందెములు, జూదములు వారికి మామూలే. పెంతెకోస్తవారు వినోద స్థలములకు వెళ్ళుచున్నారు, సినిమాలకు పరుగిడుచున్నారు, ఎచ్చటైనా గాని ఏ పాత సినిమా అయినా గాని లేదా ఏదైనా సరే వారు తిన్నగా అచ్చటికి వెళ్ళుదురు. గుర్రపు పందెములకు వెళ్ళెదరు, అటువంటి వాటన్నింటి కొరకు వెళ్ళుచూ, వారు తాము క్రైస్తవులమని చెప్పుకొనుచున్నారు. మరల ఆలయంలో కేకలు వేయుచూ, చప్పట్లు కొట్టుచూ భాషలలో మాట్లాడుదురు. పాదశుద్ధిలోను, ప్రభురాత్రి భోజనములోను వారు పాల్గొందురు. ఎట్టది? అది "ఒక కుక్క తన వాంతికి తిరిగినట్లు," అని ప్రవక్తచెప్పినట్లుగానే వారున్నారు. అది లోకసంబంధమైన క్రియలైన ఎడల, వాటిని నీలోనుండి వెలుపలికి తీసివేయుము, మరల దానివైపు నీవెందుకు తిరుగుదువు? నిజము.

87వీధులలో వారి నడక చూడండి? దానిని వారు రాక్-ఎన్-రోల్ అనుచున్నారు. జుట్టు కత్తిరించుకొని, శరీరము కనబడు దుస్తులు ధరించుచున్నారు. ఓ, వారు తాము క్రైస్తవులమని చెప్పుకొనుచున్నారు. నీవు ఎప్పుడూ వద్దు, దానిని నేను చెప్పకూడదు. అందుకే వారిని నేను ఖండించుచున్నాను. నేను ఈ వాక్యముతోనే నిలిచినయెడల ఈ వాక్యము నాయొద్దకు వచ్చినయెడల, ఈ వాక్యముతోనే నేను నిలచియుందును. వాక్యమే నా యొద్దకు వచ్చినది. వాక్యము. అందుకే ఖండించుచున్నాను. పరిశుద్ధాత్మతో నడిపించబడుచున్నామని చెప్పుచూ ఇట్టి పనులు చేయుచున్నారు.

ACTS 2:38•

ACTS 19:5

 

88పరిశుద్ధాత్మతో నడిపించబడుచున్న స్త్రీ జుట్టు కత్తిరించుకొనునా? మీరు ఆలోచించి చూడండి, అదే పరిశుద్ధాత్మ దానిని ఖండించుచున్నది గదా? అట్లైన పరిశుద్ధాత్మ ఏ విధమైన ఒక వ్యక్తిగా యుండును? మీరూహించగలరా? వేదిక మీద నిలబడిన ఒక బోధకుని మీరు సవాలు చేసి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను బిరుదులలో ఎవరైనా ఎక్కడైనా బాప్తిస్మము పొందిరేమో బైబిలులో చూపించమని అడగండి, నీ ముఖం మీద నవ్వును. యేసుక్రీస్తు నామములో నీవు బాప్తిస్మము పొందినందుకు నిన్ను పిచ్చివాడని అనును, కాని అతడు తాను ఆత్మతో నడిపింపబడుచున్నాననియు, పరిశుద్ధాత్మను కలిగియున్నాననియు చెప్పును. పరిశుద్ధాత్మ తన స్వంత వాక్యమునే కాదనునా? లేదండీ! మీరు చూచారా? దానిని మీరు గ్రహించారని నేను తలంచుచున్నాను.

89ఇంకెంత కాలములో నన్ను మరియొక ప్రేలుడు తాకునో నాకు తెలియదు, కాని అది జరుగు వరకు, నేను వాక్యముతోనే నిలచియుందును. ఆవల తీర్పునొద్ద నేను మిమ్మును కలిసికొన్నప్పుడు, ఆ వాక్యముతోనే నిలబడియుందును; అదే నేను సత్యమని నమ్ముచున్నాను. మీలో పరిశుద్ధాత్మ యున్నయెడల అట్టి క్రియలు మీరు చేయలేరు.

90ఒకసారి ఇక్కడ ఒక బోధకుని భార్య కూర్బనియుండెను, ఆమె వస్త్రములు చూచుటకు చాలా అసభ్యముగా యుండెను. నాకు "ఆలాగు ఖండించే హక్కు లేదని," మీరనవచ్చును. నాకు హక్కున్నది. అది దేవుని వాక్యము. దానిని పూర్తిగా బోధించవలెను. ఆ సంగతులను అంటుకోకుండా చాలామంది పిరికి బోధకులు దాటిపోవుచున్నారు, ఎందుకనగా వాటిని చెప్పుటకు వారికి ధైర్యము లేదు - మొదట ప్రసంగించుటకు వారికి అసలు పిలుపే లేదనుకుంటా. ఆమేన్! కాని నిజమగు దేవుని దాసుడు వాక్యముతో నిలచియుండును. అని నిజము. ఒక సేవకుని భార్య బిగువైన బట్టలు ధరించుకొని, చెవులకు వ్రేలాడుచున్న రింగులు తగిలించుకొని, రంగులు పూసికొని, జుట్టు కత్తిరించుకొని వచ్చినది. అది అసహ్యము, అని దేవుడు ఖండించుచున్నాడు. నీవేమో పరిశుద్ధాత్మను కలిగియున్నానని చెప్పుకొనుచున్నావు!

91కొంత కాలము క్రిందట ఫీనిక్సులో ఇట్లువంటి విషయముల మీద ప్రసంగించుచున్నాను. ఈలాగే మగవారివలె జుట్టు కత్తిరించుకొని, శరీరమంతా కనబడు మెరుపు బట్టలు ధరించుకొని లోపలి బట్టలను కూడా కనపరచుకుంటూ (మోకాళ్ళకు క్రింద వరకు అవి లేవు, నాలుగు లేదు ఐదు అంగుళాల మోకాళ్ళకు పై వరుకు ఆ లంగా ధరించియున్నది) పైకి క్రిందికి ఎగురుచూ పాటలు నడిపించుచున్నది. నేను ఆమె మీద విరుచుకుపడ్డాను. అతడు నన్ను మరల ఎన్నడూ ఆహ్వానించలేదు. అతడు మరల నన్ను పిలచునని నేను అనుకోను, అయితే తప్పు, ఒప్పు అతనికి తెలియును. నేను తీర్పులో నిలబడినప్పుడు, నా చేతులు నిర్దోషముగా ఉండునని నాకు తెలియును. నాకు సాధ్యమైనంత వరుకు అ౦దుకొరకే…

92నేను ఒక పట్టణములో యుండగా నా స్నేహితుల ఎదుటనే ఒక దినమున నా గూర్చి బోధకుడని పిలవబడుచున్న వ్యక్తి ఏవేవో అనెను. (నేను ఆ మాటలు చెప్పకూడదు) ఆ సోదరుని మీరెరుగుదురు. ఆ సహోదరుడు లోపలికి వచ్చి అతడు చెప్పెను…

"ఇక్కడకు ఒకసారి సహోదరుడు బ్రెన్హాం వచ్చెను," అని వారు చెప్పిరి. [అది మన పశ్చిమ తీరాన ఉన్న ఒక పట్టణము.]

"ఓ, "సహోదరుడు బ్రెన్హాం మంచివాడే, కాని ఆయన టేపులు వినవద్దు, ఎందుకనగా అవి చాలా గలిబిలిని పుట్టించును," అని ఈ వ్యక్తి చెప్పెను.

అక్కడ నిలబడియున్న నా స్నేహితుడు ఒకాయన అతనితో, "ఒక్క నిమిషము ఆగండి. నేను ఆ టేపులు విన్న తరువాతనే నాలో గలిబిలి పోయినది," అని చెప్పెను. ఆ తేడా చూడండి. "పరిశుద్దుడగు దేవుడు మీరు చేయుచున్న ఈ పనులనెట్లు చూస్తూ ఊరుకోగలడు?" అని అతడు చెప్పెను.

ఇదే వ్యక్తి మరో చోట ఇంకొక వ్యక్తితో ఇట్లు చెప్పెను, "సహోదరుడు బ్రెన్హాం, ఒక ప్రవక్త; అతడు హృదయములోని సంగతులను ఇంకా అటువంటి కార్యములు చెప్పును, కాని, అతని బోధ వినవద్దు, ఎందుకంటే అది సరి కాదు."

93ఎంత పిచ్చి మాటలో వికారమైన శైలి అది; దానిని మీరెరుగరా - అది ఒక… నేను ప్రవక్తను కాను, అయితే దేవుని యొక్క వాక్యము సత్యమైనయెడల, అది ప్రవక్త యొద్దకే వచ్చును. యెహోవా వాక్కు ప్రవక్తల యొద్దకు వచ్చెను. వారే వాక్యమునకు అర్ధము చెప్పును. అట్లైన మీరు గమనించలేరా - దానిని గ్రహించుటకు జ్ఞానము కూడా లేదా ఇంకా ఆ అల్పమైన ఏదో ఒక సంఘ శాఖ వెనుక దాగుకొనుచు వుంటున్నావు. ఒక దినమున ఇవి బ్రద్దలయి, కరిగిపోయి, పాతాళములో నశించును, కాని దేవుని వాక్యము సదా నిలుచును. ఆ బండపైనే, ప్రభువు యొక్క వాక్యము మీదనే నేను నా నిత్య నిరీక్షణను కట్టుచున్నాను. తక్కినదంతయూ మునిగిపోవును. నేను ప్రతి స్నేహితుని, ప్రతీదీ పోగొట్టుకొనవచ్చును గాని క్రీస్తులోనే నా స్నేహమున్నది.

నీతిగల యేసు మాటల మీద తప్ప,

మరిదేని మీద నా ఆశలు లేవు.

నా ప్రాణమును తీయువారు చుట్టుముట్టిననూ,

ఆయనే నా నిరీక్షణ, నా ఆశ్రయము.

94ఆ రోజు తుపాకీ పేలిపోయినప్పుడు నేను చూచాను… నేను మరణించాననుకున్నాను. ఒక ప్రశాంత అనుభూతి కలిగినది. నేను చుట చూచుచూ, మంచిది, ఇదే అది," అనుకొన్నాను. ఒక శాఖ వలన నాకేమి మేలు కలుగును? ఒక సంస్థ వలన నాకేమి మేలు కలుగును? ఆవల నేను దేవుని యొక్క ప్రచండ తీర్పును ఎదుర్కొనుటకు నిలబడినప్పుడు, ఈ వాక్యమును బట్టియే ఆయన తీర్పు తీర్చును. నేను ఎండిపోయినా, వంగిపోయినా, మెలిదిరిగినా, చాలామందికి దూరమయినా, దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా బోధించుచు, దేవుని యొక్క వాక్యముతో ఒక స్వచ్ఛమైన గింజలుగా తీర్చిదిద్దగలననే నా నమ్మకముతో - ఆత్మలను నిత్యత్వము కొరకు సంపాదించి కట్టుదును. అది నిజము. దేవుడే తనకు లోబడు పిల్లలను తయారు చేసికొనును గాక.

పరిశుద్ధాత్మతో నడిపించబడిన వ్యక్తి ఆలాంటి పనులు ఎట్లు చేయగలడు? లేదా పరిశుద్ధాత్మతో నడిపించబడిన స్త్రీ, అట్టి పనులు ఎట్లు చేయగలదు? లేదు, ఆయన పరిశుద్దుడు; ఆయన జీవము నీలో యున్నయెడల, నీవును ఆలాగే యుందువు. నీవును ఆయనను పోలియుందువు.

95ఇశ్రాయేలీయులు, ఇతరులతో సంధి చేసికొని చక్కగా వర్ధిల్లుచున్నట్లు మనకు కనిపించుచున్నది, దానికి దేవుని అనుమతి యున్నట్లు మనము భావించుదుము. ఇప్పుడు, మీరెరుగుదురా, నేడు మనము ఆ విధంగానే తలంచుచున్నాము! కొద్ది రోజుల క్రితం ఒక హోటలులో కొందరు వ్యక్తులతో నేను మాట్లాడాను. మత ప్రపంచములో వారు గొప్ప పేరున్నవారు. వారు నాతో ఇట్లనిరి, "బ్రెన్హాం సోదరుడా! గత సంవత్సరం కంటె ఎన్నో వందలమంది పెరిగారు. [ఎన్ని వందలోనేను మరచిపోయాను], దేవుడు మాతో యున్నట్లుగా ఇదే రుజువు."

"అది ఏ మాత్రము రుజువు కాదు," అని నేను అన్నాను. ఇది నిజము. గత సంవత్సరంకంటె ఈ సంవత్సరము ముప్పయి శాతము వ్యభిచారము పెరిగినది. దాని అర్ధము దేవుడు వారితో ఉన్నాడనియా? ఆ వాదము మంచిది కాదు. నీవది చెప్పలేవు. లేదయ్యా! దేవుడు తన వాక్యముతోనే నిలచియుండును. ఏ వ్యక్తి అయితే వాక్యముతో నిలచియుండునో, అతడే యధార్థపరుడు. అవును!

96వారితో సంధి చేసుకొనుటచే అంతా చక్కగా యున్నది గనుక అది దేవుని దీవెన అని వారననుకొనిరి. మనము ఇచ్చట ప్రభుత్వ వ్యవహారములను గూర్చి చూద్దాం. ఇశ్రాయేలు వలెనె మన దేశము కూడా దేవుని వాక్యమును త్రోసివేసినది, వారి ప్రజలు, వారి యాజకులు, వారి ప్రవక్తలు మొదలగువారందరూ దేశమునకు అనుకూలముగా ప్రవచించుచున్నారు, మరి వారి… మనము ఏమి చేయగలము, అయితే ప్రవచనము తప్పిపోయినది, ఎందుకనగా అది వాక్యమునకు విరుద్ధమైనది. ఆమెకు శిక్ష విధించబడినది, మన గొప్ప దేశమునకు, మన పూర్వీకుల అనుభవముపై పునాది వేయబడినది, అట్లైన వారు ఏ అనుభవమును కలిగియుండిరో దానియొద్దకు వారు రావలయును.

JOHN 8:44

 

97నిశ్చయంగా, ఇశ్రాయేలు ఒక గొప్ప రాజ్యమే. వారి పితరులను చూడండి, కాని దేవుడు వారిని కూడా విడిచిపెట్టలేదు. బట్టతల ప్రవక్త వారి మీదికి దేవుని వాక్యము విసరుచుండెను, అతడు చెప్పినట్లే అది అక్షరాలా జరిగెను. మీ చరిత్రను యిచ్చట చదివి, అది నిజమా - కాదాయని కనుగొని చూడండి. అతడు చెప్పునట్లుగా అది వచ్చి ఖచ్చితముగా దానిని చేసి ముగించెను. అతడు చెప్పినట్లే ఖచ్చితంగా జరిగెను.

వారిని అతడు గద్దించెను, వారి పరిశుద్ధ యాజకులు పరిశుద్ధ బట్టలు కట్టుకొని జలమును ప్రోక్షించుచూ వారి చేతులను కూడా ఇట్లు అటు ఆడించకుండా అచ్చట నిలబడియుండిరి. వారు తమ చేతులను ఎటూ కదపజాలరు. వారి ఆచారములను మీరలేరు. "మీరు మీ తండ్రియగు అపవాది పిల్లలు, వాని క్రియలే మీరు చేయుచున్నారు," అని యేసు చెప్పెను.

వారాయనను పట్టుకొనిరి, వారాయన మీద శిక్ష వేసిరి, ఒక చెట్టుకు ఆయనను వ్రేలాడదీసిరి, వారాయనను చంపిరి. ఇది సత్యము. కాని ఆయనను దేవుడు తిరిగి లేపెను. అవును!

98లేదు, వారు అంగీకరించరు… మనము కూడా నేడు ఆమోసును నమ్మము, అమోదించనే ఆమోదించము. నేడు మనమేమి చెప్పుకుంటున్నామో దానిని మనము కలిగియున్నాము… దేవుడు దానిని సమ్మతించెనని మనము అనుకుంటున్నాము, ఎందుకనగా మన సంఘశాఖలు విస్తరించుచున్నవి మరియు అన్ని విధాలుగా వర్ధిలుచున్నాము; దేవుడు దీనిని సమ్మతించెనని మనము అనుకుంటున్నాము. మీరెరుగుదురా, వారిద్దరు ఏకమయ్యిరి, ఇరువది లేదా ముప్పది లక్షలకంటే ఇంకా ఎక్కువమంది ప్రొటెస్టంటులు మరియు ఎనో లక్షలకొలదిమంది కాథలిక్కులు ఏకమయిరని నేను నమ్ముచున్నాను, చూచారా. వారు కాథలిక్కులుగా ఉండుటయే దేవుని దీవెన అని వారనుచున్నారు. తాము ప్రొటస్టెంటులుగా ఉండుటయే దేవుని దీవెన అని ప్రొటస్టెంటులు తలంచుచున్నారు. ఇది బుద్ధిహీనత; అది ఫిరంగుల ధూళి గాను, అణుధూళిగా మారుటకును దారితీయును; దేవుని ఉగ్రత బ్రద్ధలగును. ఇది ఖచ్చితముగా సత్యము.

AMOS 3:3

 

99నా మాట వినండి; ప్రభుని వాక్యము నేను చెప్పుచున్నాను. ఆమేన్! మనవైపు మనము చూచుదము. ప్రపంచము వైపు, మన దేశము వైపు చూడండి. మనము ఐక్యరాజ్య సమితిలో చేరాము. అందులో ఏమున్నది? అది ఒక భక్తిహీనపు గుంపు! మన కార్యక్రమములు ప్రారంభించుటకు ముందు ప్రార్థనలు కూడా చెయ్యుట లేదు. ఇప్పుడే కదా ఇచ్చట నేను చదివాను, "సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా? దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలియచేయకుండా ఏదియూ చేయడు. సమ్మతింపకుండా ఇద్దరు ఎట్లు కూడి నడవగలరు? మహమ్మదీయులు, బుద్ధ, నాస్తికులు, నిర్దేవులు, స్వార్థప్రియులు మొదలగువారందరూ అందులో యున్నారు. అట్టిదానిలో దేవుడుండునని మీరనుకొనుచున్నారా?

"మేము వారితో పొత్తు కలిగియున్నాము. మాకు పాశ్చాత్య రక్షణ ఉన్నది," అని మీరందురు. వారి చుట్టూ ఎన్నో దేశముల రక్షణ వలయమున్నది, కాని ఆ ప్రవక్త ఏమనెను, "దేవుడు మిమ్మును నాశనము చేయును. మీరు సేవించుచున్న దేవుడే మిమ్మును మీ బుద్ధిహీనత బట్టి నాశనము చేయును." ఈ ఉదయమున అతడు అదే పలుకును.

REV 17:1,5,15,16•

REV 19:2

 

100వైట్-హవుస్ మొదలుకొని పేదవారి పొలం వరకు అతడు ఆ విధంగానే గర్జించును. నిశ్చయంగా అతడు ఆ పనిచేయును. దేవుని వాక్యముతో వారిని దండించును. ఖచ్చితముగా దానిని అతడు చేయును. అదే ఒక నిజ ప్రవక్త యొక్క మార్గము.

"మమ్మల్ని, మా సంఘాల వైపు చూడండి! మేము ఆ గొప్ప పరిశుద్ధ రోమను కాథలిక్కు సంఘమైయున్నాము."

వారు వేశ్య అని బైబిలులో చెప్పబడినది.

"మేము మూల పురుషులమగు పితరులము, ప్రొటస్టెంటు సంఘములన్నియూ ఏకమైపోయి దానిని ప్రపంచ సంఘ సమితి అని అందురు."

వీరు వేశ్య కుమార్తెలని బైబిలు చెప్పెను. ఖచ్చితము పరిశుద్ధ గ్రంథము అట్లు చెప్పుచున్నది. అయినను మనము తలంచుచున్నాము, ఇప్పుడు, సంఘములన్నియూ ఏకమగుచున్నవి.

(నా స్నేహితుడగు కాలిన్స్, కాలిఫోర్నియాలో ఉన్నాడు), ఎల్మర్, "మీరు చక్కని మెథడిస్టు చర్చికి వెళ్ళుచున్నారు, కదా," అని నేను అడిగాను.

వారు ఆ ప్రపంచ సంఘ సమితిలో చేరగానే నేను అందులో నుండి బయటకు వచ్చేశాను," అన్నాడు.

"దేవుడు నిన్ను దీవించు గాక! సోదరుడా! నీవు పరలోక రాజ్యమునకు దగ్గరగా యున్నావు," అని నేను అన్నాను.

అవునయ్యా! మానవ సమాఖ్యతో కలిసి మానవ-కల్పిత సిద్ధాంతములను పట్టుకొని, దేవుని వాక్యము విడిచిపెట్టుచున్నారు. అచ్చట వాక్యము నెత్తి గద్దించి చెప్పే ఒక ప్రవక్త ఈనాడు మనకు కావలసియున్నది. అది నిశ్చయముగా కావలయును. నిజము!

101వారిలో వారు ఏదో రక్షణ పద్ధతులు ఏర్పరచుకొనుచున్నారు, "ఓ మేము చేరాము మేము పెంతెకోస్తువారము? నిశ్చయంగా, మనమును ప్రపంచ సంఘ సమితిలో చేరాము, ఎందుకనగా వారితో మనము సహవాసము చేయుచున్నాము. వారిని మనము మార్చవలెనని చెప్పుచుందుము." తన భర్తను దేవుని పైపు త్రిప్పువలెనని ఒక భార్య అతనితో కలిసి సారాయి దుకాణమునకు వెళ్ళి, సారాయి త్రాగినట్లున్నది. మరి ఎక్కువగా, ఈ రోజుల్లో, భర్తలు తమ భార్యలను దేవుని యొద్దకు నడిపించుటకు భార్యతో కలిసి సారాయి దుకాణమునకు వెళ్ళుచున్నారు. బుద్ధిహీనత! దయ్యముల యొక్క స్థలానికి దూరంగా ఉండు! ఏదైతే దేవుని వాక్యమును నిరాకరించునో, దానికి నేను వ్యతిరేకిని. అందుకే సంస్థలన్నీ నాకు విరోధమైనవి, ఎందుకనగా అది వాక్యవిరుద్ధముగా యున్నది. ప్రతి విశ్వాసి దీనిని గమనించవలెను.

"మంచిది, కాని మరచిపోకండి, మాకు…" అని వారు చెప్పుదురు.

అరిజోనా నుండి ఎవరో ఒకరు పంపించిన ఒక పెద్ద పేపరు నా యొద్ద కలదు, అందులో ఈ మూలపురుషుడు ఫలానా - ఫలానా ఒకనాడు "22వ పోపు జాన్ [లేక వారు ఎదో పిలచుదురు] మంచివాడు. కాథలిక్కులను, ప్రొటస్టెంటులను ఏకము చేయవలెనని అతడు మాత్రమే పలికెను," అని ఏ విధముగా చెప్పాడో చూడండి. "అది మన రోజులలో జరుగకపోవచ్చును గాని రాబోవు పదిహేను లేదా ఇరవై సంవత్సరాలలో అది జరుగవచ్చు," అని అతడు చెప్పెను.

"బాలుడా, నీవొక మూలపురుషుడవని చెప్పుకొంటూ, నీవేమి ప్రవచించుచున్నావో నీకె అది తెలియుట లేదు," అని నేను తలంచితిని.

102"మనం తలంచిన దానికంటె అది ముందు జరుగును," దానిని నాకు పంపిన వ్యక్తి ఆ పేపరు పైన పై భాగమున దానిని ఆ విధంగానే దానిమీద వ్రాసెను. మనము తలంచిన దానికంటే అది ముందే జరుగును. అతడు టేపులను కూడా వినుచున్నాడు. అవునండీ! "మనము తలంచిన దానికంటే అది ముందే జరుగును," అని అతడు చెప్పెను. "బ్రెన్హాం సోదరుడా! నీవు ఎన్నో సంవత్సరాల క్రితం దీనిని చెప్పావు కదా?" అని అతడు చెప్పెను.

"నిశ్చయంగా." అది జరుగును, అని నేను చెప్పాను. అవునండీ! అది జరిగే తీరవలయును, ఎందుకనగా అది ప్రభువు వాక్యమైయున్నది, అది జరుగును. నిశ్చయముగా.

"ఈ పరిశుద్ధ పితరుడు అంతకంటె ఎక్కువగా దీనిని గూర్చి తెలిసికొనవలసియున్నాడని నీవు తలంచుట లేదా?" అని వారనిరి.

అతడు దేవుని యొక్క వాక్యమును నిరాకరించినయెడల, అది ఆ విధముగా యుండినయెడల, ఆతడికి ఏమీ తెలియదు. నీవు వాక్యము నుండి తప్పిపోయినట్లైతే, ఎంతమంది పోపులు, ప్రవక్తలు ఏమున్నాగాని, మీ మధ్య ఏదున్నాగాని దానిని నేను లెక్కచెయ్యను. మీరు వాక్యము నుండి తప్పిపోయిరి. అది నిజము.

103దేవుని వాక్యమును త్రోసివేసినవారిని దేవుడెట్లు ఆశీర్వదించగలడు? దేవుడు తన వాక్యమును మాత్రమే దీవించును. తన వాక్యమునకు భిన్నమయిన దానిని ఆయన ఎట్లు ఆశీర్వదించగలడు? అది ఆయన వాక్యమునకు విరుద్ధమైనది, దానినెట్లు ఆయన ఒప్పుకొనును? తినివేయుచున్న కాన్సరును నీవెటు దీవించగలవు? నిన్ను చంపివేయు కరెంటు తీగెను నీవు ఎట్లు పట్టుకొని దీవించగలవు?" ఓ, నన్ను పట్టుకొని కాల్చివేయుము," అనగలవా? అది పిచ్చితనము. దేవుడు తన వాక్యమునకు వేరుగానున్న దానిని ఎట్లు దీవించగలడు? కాబట్టి నీవు వాక్యమునొద్దకు తిరిగి రమ్ము. వేటకుక్కల వలె మొరుగుచున్న బోధకులారా, మీ సంగతి ఏమిటి? ఒక్క పూటి కూటి కొరకు మీరు మీ జన్మహక్కును అమ్ముకొనుచున్నారు. కాడిలాక్ కార్లలో తిరుగుచున్నారు, గొప్ప భవంతులలో జీవించుచున్నారు, మిలియనుల డాలర్ల ఖరీదైన చర్చికి వెళ్ళుచున్నారు, జన్మహక్కును వాటి కొరకు అమ్ముకొనుచున్నారు. మీ సమాజములలోని వారికి దేవుని వాక్యము బోధించుటకు భయపడుచున్నారు, సిగ్గుపడుచున్నారు. మీరు సిగ్గుపడుట లేదని చెప్పగలరా? నీవొక దేవుని దాసునివంటున్నావు, దేవుని ప్రవక్తని చెప్పుకుంటున్నావు, లోకములోని పూట కూటి కోసమని నీ జ్యేష్ఠత్వమును అమ్ముకొనుచున్నావా? మీరు దేనిని పొదుగుచున్నారు? ఏశావు గతే మీకు పట్టును. ఓ, ఎంత అవమానము.

MATT 24:35

 

104ఓ, పరిశుద్ధ దేవుడు తన వాక్యమునకు రుజవుపరచుటకు దానికి కావలి కాయును. ఆయన తన వాక్యమునకు విరోధముగానున్న దానిని ఎట్లు దీవించగలడు? (వినండి! నేను ఆలస్యము చేయుచున్నానని మీరెరుగుదురు. మీకు ఊపిరి ఆడనిచ్చుట లేదు, కాని ఒక సంగతి మిమ్ము అడుగ గోరుచున్నాను.) ఏ విధము ఒక పరిశుద్ధ దేవుడు, ఆయన వాక్యమును పలికి, "భూమ్యాకాశములు గతించును గాని నామాటలే మాత్రమును గతించవు." ఇప్పుడు, దానికి వ్యతిరేకమైన దానిని తీసుకొని దానిని ఆయన ఎట్లు దీవించగలడు? దానిని ఆయన ఏ విధముగా చేయగలడు? గమనించండి! ఆయన తన్నుతాను నిరూపించుకొనును; ఆయన తన వాక్యము సత్యమని నిరూపించును. సభ్యత్వము ద్వారా ఏమీ రాదు, ఆయన ఏది చెప్పెనో అదే సత్యము.

NUM 23:29

 

105మోయాబు వైపు చూడండి. మోయాబునకు కూడా వాక్యమున్నది, ఇశ్రాయేలునకు వాక్యమున్నది. మోయాబునకు పైపై భక్తి యున్నది. వారు ఏడు బల్యర్పణలు అర్పించిరి, ఏడు బలిపీఠముల మీద పవిత్రముగా ఎద్దులను వధించిరి, ఏడు అనగా పరిపూర్ణ సంఖ్య, అది పరిపూర్ణ బలి. అంతేకాకుండా వారు ఏడు పొట్టేళ్ళను వధించిరి, దేవుని కుమారుని రాకయందు వారు నమ్ముచున్నట్లుగా చెప్పుచున్నారు; వారి ప్రధాన బిషప్పు వాటిని అర్పించెను. గొప్ప హోదాలోనున్నవారు, వారి యాజకులు, ప్రధానయాజకులు మొదలగు వారందరూ వారి రాజులతో, అధిపతులు, ఇంకా గొప్పవారు అచ్చట నిలబడి ఎంత భయభక్తులను కలిగియుండాలో అట్లుండి ఇశ్రాయేలీయులకు విరోధముగా బలులను అర్పించిరి. అక్కడున్న ఇశ్రాయేలీయులు వారికి ఒక చిన్న గుంపువలె కనిపించెను. కాని ఇశ్రాయేలీయుల సంగతి ఏమిటి? దేవుడు వారి సమాజములో యుండెను. ఆయన వారితో యున్నట్లు వారికి రుజవు చేసికొనుచుండెను, చూచారా.

AMOS 3:3•

JOHN 1:1

 

106వారికి ఎందరు మూల పురుషులున్నా ఎందరు పోవులున్నా లాభము లేదు. దేవుడు వారితో యున్నట్లుగా రుజవు చేసుకున్న౦త వరుకు ఆయన వారితో యుండలేడు. వారు వాక్యమును విడిచిపెట్టి వాక్యమును నిరాకరించుచున్నంత కాలము ఆయన వారితో ఎట్లు౦డగలడు? సజీవ దేవుని యొక్క గురుతులేవీ వారిమధ్య లేవు.

ఐక్యరాజ్య సమితి మధ్య దేవుడెట్లుండగలడు? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవగలరా? ఇక్కడ చూడండి. నామకార్ధ క్రీస్తు సంఘము పెంతెకోస్త వారితో కలియుచున్నది. పెంతెకోస్తువారు తాము భాషలతో మాట్లాడుటను నమ్ముచున్నామని చెప్పుకొనుచున్నారు. పరిశుద్ధాత్మను పొందినట్లుగా రుజువు భాషలు మాట్లాడుటయేనని వారనుచున్నారు. వారు ఇది, అది, ఏదేదో నమ్ముచున్నామని చెప్పెదరు. అద్భుతములు, సూచక క్రియలు నమ్ముదుమని చెప్పెదరు. క్రీస్తు సంఘము వారు వారిని చూచి నవ్వుచూ, "అజ్ఞాన గుంపులారా, ఆ దినములు గతించిపోయినవి," అని వారందురు. సమ్మతింపకుండా ఇద్దరెట్లు కలిసి నడువగలరు? వారు కలిసి ఏమి చేయుచున్నారు? వారు ఒకరిపట్ల ఒకరు భద్రతను వెదకుచున్నారు. అట్టివాటికి దూరముగా యుండుడి! నా భద్రత క్రీస్తులోను, ఆయన వాక్యములోను మాతమే యున్నది. ఆయనే వాక్యమైయున్నాడు. అది నిజము.

JOHN 10:37

 

107సజీవ దేవుని యొక్క సూచనలే లేవు. అదే యేసు చెప్పెను, "నేను వాక్యమును ప్రత్యక్షపరచనియెడల నన్ను నమ్మకుడి. నా ద్వారా అని చెప్పెను, నా ద్వారా దేవుడు మాట్లాడి ప్రవచించనియెడల, మెస్సియా ఏమి చేయవలసియున్నాడో అవి నేను చేయనియెడల నన్ను నమ్మకుడి." ఆయన దేవునిచే పంపబడినవాడని నమ్మియూ వాక్యమును వారు తిరస్కరించిరి. అటువంటి వారిపట్ల దేవుడు కృప చూపును గాక. ఆ విధంగా దేవుడెన్నడయినా చేయగలడా?

108ఇప్పుడు ఒకటి అడుగుచున్నాను. మరల మీతో నేనెప్పుడు మాట్లాడుదునో నాకు తెలియదు. అది దేవునికే తెలియును. ఒకసారి ఆయన నాకు దర్శనములో చెప్పినట్లుగా ఆహారమును కొట్టులో సమకూర్చుచున్నాను.

"వారికి జరుగవైయున్న దానిని ఆమోసు ఏ విధంగా ముందే చూడకలిగెను?" అని మీరు నన్ను అడుగుదురు. ఎందుచేత, అది బాగానే కనబడినది. గమనించండి! ఇప్పుడు, ఇచ్చట గమనించండి. ఇప్పుడు, జాగ్రత్తగా ఆలకించండి, ఎందుకనగా ఇదంతయూ టేపు మీద ఎక్కి ప్రపంచమంతా వెళ్ళును, చూచారా.

ఇట్లు చూడండి! ఇశ్రాయేలీయుల సెమనరీలు ఎప్పటికంటెను చాలా బాగున్నవి. వారినెవరూ తొందరపెట్టుట లేదు. వారికి వారి స్వంత మతాచారములున్నవి. "మీరు యెహోవాను ఆరాధించకూడదు," అని ఎవ్వరూ చెప్పలేరు, వారిని అడ్డగించలేరు.

"ఆరాధించుకోండి, ఒకరితో ఒకరము మనము ఒప్పందమును కలిగియున్నాము." "అలాగే కొనసాగిపోతూ వుండండి," అని అన్యదేశములు వారిని పోత్సహించెను.

ఆ ప్రవక్త దానిగుండా చూచెను, చూచారా. ఈనాడు కూడా ఆలాగే ప్రవక్త దానిగుండా చూడగలడు, చూచారా. "ముందుకు వెళ్ళండి."

MATT 23:14•

MARK 12:40•

LUKE 20:47

 

109"మనము తిని, త్రాగి, సంతోషించుదుమని," ఇశ్రాయేలీయులు చెప్పుకొనిరి. కాబట్టి వారంతా కలిసికొని ఆచారములను, సంస్థలను, శాఖలను ఏర్పరచుకొనిరి. వారి స్త్రీలు విలాసములలోను, పాపములోను జీవించిరి. క్యాబరే డ్యాన్సులు, అన్ని విధాల దుష్టకార్యములు, అర్థనగ్నపు వస్త్రములు, చిన్న చిన్న సిల్క్ లంగాలు ధరించుచుండిరి. వారే విధముగా యున్నారో వారిని మీరు వారి చరిత్ర దినములలో గమనించి చూడండి, ఓ, ఒకటిలో మూడు భాగం దాదాపు ఈనాడు వలె వారు కూడా చెడిపోయిరి! ఇంతగా చెడిపోలేదనుకొనండి. ఆ జనులు, రాజులు, యాజకలు ఎట్లు చెడిపోయిరో చూడండి. "మీరు విధవరాండ్ర గృహములను మ్రి౦గుచున్నారు. మీరు వేషధారులు," అని యేసు చెప్పెను. ఆయన దానిని చెప్పెను! ఈ క్రియలన్నీ వారు చేయుచున్నారు. ఆ దేశము ఆ విధముగా చెడిపోవుటను అచ్చట నిలబడి ఆ ప్రవక్త చూచినప్పుడు, దానిని బట్టి అతడి హృదయము బ్రద్ధలైపోవుటలో ఆశ్చర్యమేమీ లేదు. అవునండీ!

110జరుగబోవునది అతనికెట్లు తెలియును? దానినెట్లు అతడు ముందుగా చూడగలడు? అదంతయూ మీకు అర్థము కాకపోవచ్చు. వారికి తిండి సమృద్ధిగా యున్నది, వారికి బట్టలు సమృద్ధిగా యున్నవి, వారికి పెద్ద ఆలయములున్నవి, వారు వర్ధిల్లుచున్నారు, ప్రతి చోట డబ్బు చల్లుచున్నారు. విలాసములు, వీధులలో డాన్సులు, అసభ్యత, సమస్త నీచ కార్యములు చేయుచున్నారు, అన్నియూ బాగుగానే జరుగుచున్నవి! ఈనాటి అమెరికావలెనె యున్నది. టెలివిజన్ లో అసభ్య ఛలోక్తులు నిండిపోయినవి, అర్థనగ్న స్త్రీలు దృశ్యమిచ్చుచున్నారు, అన్నీ వున్నవి. అదంతా మీరు చూచిన ఒట్టి పెంట మరియు పాపమే. మీరు టెలివిజన్ను చూడనక్కర్లేదు, మీ కళ్ళను తెరచి చూచిన, ప్రతీచోట మీకు అవే కనబడును. బాలురు, బాలికలు, స్త్రీలు, పురుషులు, పొగాకు, మద్యపానమునకు బానిసలగుచున్నారు. ఆ యొజెబెలులు తాము క్రైస్తవులమని చెప్పుకొనుచున్నారు. అసహ్యమైన దయ్యములు యున్నట్లుగా యున్నవారు మేము మెథడిస్టులము, బాప్టిస్టులము, ప్రెస్బిటేరియనులము, కాథలిక్కులము, పెంతెకోస్తు వారము అని చెప్పుకొనుచున్నారు. ఇదంతా చూచి అతడు మండిపడుటలో ఆశ్చర్యము లేదు.

111అంతా బాగానే కనబడుచున్నది. "ఏ విధముగా అతడు దానిని రక్షించగలడు, మేము దానిని చేయాలని… "దానిని గమనించండీ, మాకు ఒక పది లక్షలమంది కంటే సభ్యులు ఎక్కువగానే యున్నారు. మా భవనములు… మా సంఘములు చాలా పెద్దవి, ఇంకా క్రొత్త సంఘములను మేము కట్టవలెను! మంచిది! మాకు చాలా డబ్బున్నది, దానిని ఏమి చేయవలెనో మాకు తెలియుట లేదు. దేశంలోని మంచి స్థలములందు మా భవనములను నిర్మించుదుము. పెద్ద చర్చిలను మేము స్వంతము చేసికొందుము. ఇంకా మా వద్ద ఎంతో డబ్బున్నది. ఇదంతా దేవుని దీవెన కాదా?" అని అడుగుచున్నారు.

కాదు! మీరు వాక్యము నుండి దూరమైయున్నారు.

"బ్రెన్హాం సోదరుడా! దేవుడు మమ్మును నాశనము చేయునని నీవనుకొనుచున్నావా?"

అవును! ప్రతివారిని ఆయన నాశనము చేయును.

"నీకెట్లు తెలియును?"

ఆమోసూ, నీకెట్లు తెలియును? ఒక వైద్యుడు రోగిని పరీక్షించినట్లేయున్నది. రోగిలో ఏ వ్యాధియున్నదో ఆ వైద్యుడు కనుగొన్నప్పుడు, అతడేమి చేయవలెనో అతడెరుగను, ఆ వ్యాధిగ్రస్తుడికి ఏమున్నదో దానిని అతడెరుగును. ఆ వ్యాధి ఎంతగా ముదిరిపోయినదో అతనికి తెలుసు, దానివలన ఏమి జరుగనైయున్నదో అతనికి తెలుసు. ఒక ప్రవక్త మార్గము కూడా అదే విధముగా యుండును, ఒక నిజ ప్రవక్త, అతడు దానిని చూచినప్పుడు… నీవేమి చేయుచున్నావో నాకు లెక్కలేదు. పాపము పండిపోవుటను అతడు చూచినప్పుడు, అది ఒక కొరుకుడు క్యాన్సరువలె యున్నది, అది పెంతెకోస్తు వారిలోను, మరియు మిగిలినవారందరిలోనూ అది ఎంతగానో ముదిరిపోయినది, అది మరలా, వెనుకకు వెళ్ళదు! అది పెరిగిపోతూ, ముదిరిపోతూ యుండును, వారు నశించిపోయెదరు.

2TIM 3:5

 

112ఆ విధంగానే ఆమోసు వ్యాధిని గుర్తించెను. దేవుని వాక్యమునుబట్టి అతడు దానిని గుర్తించెను. ఒక నిజమగు ప్రవక్త ఆ విధంగానే దానిని గుర్తించి, ఆ స్త్రీలతో "జుట్టు కత్తిరించుకొని తీర్పుకు గురియగుటకు ప్రయత్నించవద్దు, దీనిని తెలుసుకొనటము మంచిది," అని అతడు చెప్పెను. పురుషులగు మీకు, తదితరులకు, బోధకులగు మీకు, పైకి భక్తిగలవారివలె కనిపించువారగు మీకు, సంఘ సంస్థలో చేరిన వారగు మీకు వాక్యమును త్రోసివేయు వారందరికి అతడు ఆ విధముగానే చెప్పును, మీరెరుగుట మంచిదనును. నీవు ఏ వాక్యము వైపు చూచుచున్నావో, నిజ ప్రవక్తలు కూడా దానినే చూస్తున్నారు. ఆ వ్యాధిని గుర్తించి, "మరణము, దేవుని నుండి దూరమగుట," అని అతడు చెప్పును.

ఒక వైద్యుడు రోగమును కనుగొన్నట్లే యుండును. వ్యాధి యొక్క లక్షణములను ఎట్లువంటి వ్యాధి లక్షణములను గలవో అతడెరుగును. ఈ దేశము వైపు చూడండి. "పెంతెకోస్తువారి పని అయిపోయినది," అని నీవు ఆ మాట అన్నావంటే, వారు నిన్ను సంఘములోనికి కూడా రానియ్యరు, ఎందుకనగా వారి స్త్రీలు జుట్టు కత్తిరించుకొనుట గురించి నీవు ప్రసంగించితివి; మరి పరిశుద్ధ గ్రంథము దానిని ఖండించుచున్నది. మరి ఇతర విషయములను నీవు మాట్లాడుదువేమో అని…

ACTS 24:14

 

113పశ్చిమ తీరాన మేము కొన్ని కూటములు ఏర్పాటు చేశాము. (రాయ్ బోర్డర్స్ యున్నాడు) కొందరు సేవకులు అచ్చటికి వచ్చిరి. (నలుబది లేదా ఏబదిమంది వరకు వచ్చారు. అది గొప్ప కూటము) వారిట్లు రాయ్ బోర్డర్స్ ను ప్రశ్నించారు? "సహోదరుడు బ్రెన్హాం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చుట నిజమేనా?"

బోర్డర్స్ చాలా హుందాతనముగా ఉండు వ్యక్తి (మీరు సహోదరుడు బోర్డర్స్ ను ఎరుగుదురు) "సహోదరుడు బ్రెన్హాం ఇట్టి కూటములలో రోగులకు ప్రార్ధించుట మాత్రమే చేయును, ఆయన ప్రసంగించడు," అని వారికి అతడు చెప్పెను.

"నేనడిగింది అది కాదు," అని ఒక పెద్ద అనెను. (వారియొద్ద టేపులున్నవి; వారెరుగుదురు.) "అతడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చునా?" అని అడిగెను.

"అవును, ఆయన స్వంత సంఘంలో మాత్రమే ఆలాగతడు చేయును," అని అతడు చెప్పెను.

"అంతే; మాకు అదే కావలెను. మా ప్రజలకు ఆ దుర్బోధ చెప్పవలసిన అవసరం లేదు. అతడు మాకు వద్దు," అనిరి.

"ఒక రోజున నా మంచి స్నేహితుడగు ఎడ్ డాల్టన్ ఒక బాప్టిస్టు చర్చి నుండి ఉత్తరము అందుకొనెను. అందులో ఇట్లున్నది, "బాప్టిస్టు సహవాసము నుండి మేము నిన్ను బహిష్కరించుచున్నాము, ఎందుకనగా నీవు యేసు నామంలో బాప్తిస్మమిచ్చు దుష్టగుంపుతో చేరియన్నావు."

నేను పౌలుతో నిలబడుటకే ఇష్టపడుచున్నాను, "దేనినైతే లోకము దుర్భోధ అని పిలుచుచున్నదో నేను అదే రీతిలో దేవుడిని ఆరాధించెదను, ఎందుకనగా ఇది దేవుని వాక్యమైయున్నది!" అవునండీ! అవును.

114ఓ, నిశ్చయంగా వైద్యుడు రోగిని పరీక్షించును. అదెక్కడున్నదో చూచును. వాక్యమును బట్టి ఒక నిజ ప్రవక్త రోగిని గమనించును. అతడెవరు? వైద్యుడు రోగ లక్షణములను బట్టి కనిపెట్టును. ఇది నిజమేనా? అతడు రోగ లక్షణములను చూచును, రోగి యొక్క స్థితిని గమనించును, అదెంతవరకు ముదిరినదో చూచును. "ఇంకేమీ చేయలేమని," చెప్పును. ఒక నిజ ప్రవక్తయు దేవుని వాక్యమును తీసికొని రోగమును గుర్తించి, దానికి మందును ఇచ్చును, కాని జనులు దానిని అతని ముఖము మీద కొట్టుచున్నారు. ఏమి జరుగును? నశించెదరు. అంతే! సుఖభోగులు, లోకమును అనుభవించే వేషధారులు వారు! నిజ ప్రవక్త మార్గము ఇదే! ఓ, మై!

AMOS 2:4

 

115అతడు జబ్బును చూచును. వారు వాక్యము నుండి తొలగిపోయిరని చూచును. అతడు వాక్యము చూచును, ఫలితములను ఎరుగును, రాబోవునది ఎరుగును. వారు ఎంత విలాసముగా జీవించుచున్నారో అతడెరుగును, ఆ స్త్రీలు ఎట్లు ప్రవర్తించుచున్నారో అతనికి తెలియును. ఆ యాజకుల తీరును అతడు చూచెను. నిజమగు దేవుని ఆరాధించుట నుండి వారెట్లు దూరమయిరో అతడు చూచెను. అటువంటి కార్యములన్నియూ అతడు చూచును. అది అతడి యొద్ద గలదు… అతడి యొద్ద జవాబు గలదు; "మీరు ఏ దేవుని సేవించుచున్నామని చెప్పుకొనుచున్నారో ఆ దేవుడే మిమ్మును నాశనము చేయును."

"ఎందువలన?"

"మీరు నా ఆజ్ఞలు గైకొనలేదు." అయినా గాని వారు దేవుని ప్రజలమని తలంచిరి. నేను ఇప్పుడు చదువలేదా? 2వ అధ్యాయము 4వ వచనము: "భూమిమీది సకల జనములలో నుండి నేను మిమ్మును ఏర్పరచుకొనియున్నాను, అయినను మీరు నా ఆజ్ఞల ప్రకారము నడుచుట లేదు."

116ఆ బట్టతల ప్రవక్త అక్కడ నిలబడి ఏమనెనో వినండి. అతని గడ్డము నెరిసియున్నది, అతని కండ్లు అగ్నివలె మండుచున్నవి, ఆ యాజకుల గుంపుతో, వారి కార్యములను గురించి అతడు మాట్లాడుచూ ఇలాగు చెప్పెను, "మీరు వేషధారులు. దేవుని ఆరాధించుచున్నామని తలంచుచున్నారు, ఆ దేవుడే మిమ్మును నాశనము చేయును." అతడికి వారు సహకరించుదురని మీరనుకొనుచున్నారా? ఈ రోజు కూడా అంతే! కాని అది నిజ ప్రవక్త మార్గము. అతని యొద్ద వాక్యమున్నది; అదేమిటో అతనికి తెలియును.

1KGS 22:14,17,38•

2CH 18:13,16

 

117ఆనాటి మీకాయాను చూడండి (ఆ పేరుగల చిన్నబాలుని ప్రతిష్ఠించాను), నేను చాలా వరకు దాటి వచ్చాను, ఎందుకనగా చాలా సమయమైనది. మీకాయా ఆహాబు ఎదుట నిలబడియున్నప్పుడు, అతడు వారివైపు చూచెను. అతనికి వాక్యము తెలియును. వాక్యమునే మీకాయా వారికి చెప్పెను. ఎందుకు? మీకాయా తన దర్శనమును పోల్చి చూచుకొనెను. దేవుని వాక్యమే అతడు బోధించెను; తన బోధ మరియు వాక్యము ఒక్కటే అని అతడు ఎరిగియుండెను, ఎందుకనగా దానినే వాక్యము చెప్పెను. ఆహాబు శపించబడునని వాక్యము చెప్పెను. కుక్కలు అతని రక్తమును నాకును అని వాక్యము చెప్పెను.

కాబట్టి మీకాయాకు ఒక దర్శనము వచ్చెను. అతడు ఒక ప్రవక్త, "చూడు ఏ వాక్యము నా యొద్దకు వచ్చెనో," అతడు ప్రార్థించెను, "ఓ, ప్రభువగు దేవా! నేనేమి చేయవలెను? ఇక్కడ నిలబడియున్న ఈ బోధకుల గుంపుకు ఏమి చెప్పుదును? ఈ సంస్థలన్నీ ఇచ్చటున్నవి, దేశములోని వారందరూ నాకు విరోధముగా ఏకమయిరి, ప్రభువా! ఇక్కడ నేను రాజు ఎదుట నిలబడి చెప్పుదును?" అతనికి దర్శనము వచ్చెను, వెళ్ళండి వెళ్ళండి! కాని ఇశ్రాయేలీయులు కాపరిలేని గొర్రెలవలె చెదరిపోవుట నేను చూచాను," అని చెప్పెను.

1KGS 22:24•

2CH 18:23•

ACTS 4:12•

2THS 2:11,12

 

118ఆ జిల్లా పెద్ద వెళ్ళి అతని నోటి మీద కొట్టి, "దేవుని వాక్యము, దేవుని ఆత్మ నాలోనుండి ఎటు వెళ్ళినదో చెప్పుము?" అనడిగెను.

దేవుడేమి చెప్పెనో మీరెరుగుదురా? వారి మధ్యకు ఒక అపవిత్రాత్మను రానిచ్చెను, ఎందుకనగా వారు వాక్యము నుండి తొలగిపోయిరి. వాక్యమును నమ్మనివారిని బలమగు భ్రమపరచు ఆత్మలకు అప్పగించునని బైబిలు చెప్పుచున్నది. వారు అబద్ధమును నమ్మి దాని ద్వారా నశించెదరు. ఈ సంస్థలు మరియు నేటి జనులు నేడు అదే చేయుచున్నారు. అబద్ధమును నమ్మి దానిద్వారా నశించుచున్నారు. "రక్షింపబడునట్లు, ఈ ఆకాశము క్రిందన మరి ఏ నామమున రక్షణ పొందలేము." సంఘశాఖల వలన గాని, దేనివలనైనా గాని రక్షణ లేదు. నిజము.

1KGS 22:3

 

119ఈ ఇతర ప్రవక్తలు దేనివైపు చూచిరి? వారు ప్రవక్తలే. అవునండీ! వారు ప్రవక్తలే, కాని వారు ఆగి వాక్యముతో వారి ప్రవచనమును పరీక్షించుకొనినయెడల, ఈనాడు మెథడిస్టులు ఆగి తమ ప్రవచనమును వాక్యముతో చూచుకొనినయెడల ఇక ఎన్నడూ వారు ఒకరికి చిలకరింపు ఇవ్వరు, వారు పరిశుద్ధాత్మను పొందుదురు, వారు ప్రతివారికి యేసుక్రీస్తు నామములో ముంచుట బాప్తిస్మము ఇచ్చెదరు. అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ వారు ఈనాడు ఆగి తమ ప్రవచనమును వాక్యముతో చూచుకొనినయెడల, వారు తిరిగి వాక్యము యొద్దకు వచ్చెదరు, ఏకత్వము వారు ఆగి ఈనాడు తమ ప్రవచనమును వాక్యముతో పరీక్షించుకొన్నచో వారు తిరిగి వాక్యము యొద్దకు వచ్చెదరు. కాని చూడండి, వారి ప్రవక్తలు ఆగి వారు ప్రవచనమును పరీక్షించుకొనియుండినయెడల… వారు కారణములను చెప్పిరి, "అది మనది, కాబట్టి మనము రామోత్గిలాదు మీదికి పోయి పట్టుకొందము; ఎందుకనగా అది మనదే. యెహోషువా దానిని మనకిచ్చెను" అనిరి.

"అది చాలా హేతుబద్ధంగానే కనిపించును," అని మీకాయా పలికెను.

కాని హేతువును మీరు చూడవద్దు; దేవుడు చెప్పినది నమ్మండి. ఏమీ హేతుబద్ధంగా యుండవద్దు.

120అబ్రాహాము కారణమును వెదికినయెడల ఎట్లు౦డెడిది? తన జన్మస్థలమును విడిచిపెట్టి యుండునా? అతనికి వంద సంవత్సరములు వచ్చినా గాని ఇంకా దేవునిని స్తుతించుచునేయున్నాడు, శారా వలన ఇంకా బిడ్డ కలుగునని ఎదురు చూచుచుండెను, ఆమెకు తొంబది సంవత్సరములు! కారణములను అవతలకు పారేయండి; నీవు కేవలము నమ్ముము.

"సహోదరుడు బ్రెన్హాం ఒక వేషధారి తప్ప మరొకటి కాదు," అని దయ్యము మీకు చెప్పుటకు అనుమతించుదురు.

"ఇప్పుడు, కొంచెం ఆగండి, నన్ను చూడనివ్వండి, అతడు బోధించుచున్నది తప్పో, ఒప్పో నేను పరిశుద్ధ గ్రంథము చూచి చెప్పెదను."

"వద్దు, వద్దు… ఆయన దానిని చేయనివ్వడు. లేదు, లేదు! చూచారా? కాని అతడు నా గురించి ఏదో ఒకటి తప్పుడుగా చెప్పిన దానిని (అది అతడి హక్కు), దానిని నీ మనస్సులో వుంచుకొని, దానిని ఆలోచించుచు కారణములను జోడించెదవు, "అవును! ఆయన ఆ విధంగా చేసియుండరాదు; ఆ విధంగా చేసి యుండరాదు అనుకొందువు."

ISA 7:14•

MATT 1:18,23

 

121నీవు నా వైపు చూడసాగెదవు, నీకు సమృద్ధిగా యున్నది. నీవు యేసువైపు చూడుము, అప్పుడు నీకు సమృద్ధిగా దొరకును. ఒక్క నిమిషము ఆయనవైపు చూడుము. మీ ప్రతి బోధకుని నేను అడుగుచున్నాను. ఆయన భూమిమీద ఉండెనన్న సంగతి మరచిపోవదము. ఈ దేశములోని అనేకులు ఆయన అక్రమముగా జన్మించినవాడని, పెండ్లికాక ముందే ఆమె ఇతనిని కనినదని చెప్పుచున్నారు. అది నిజమే. కాని వారు వాక్యము నొద్దకు వెళ్ళరు, "ఒక కన్య గర్భవతియగును." వారు దేనినైతే విన్నారో దానినే అనుసరించెదరు, చూచారా. ఒక అక్రమ సంతానమని చెప్పెదరు. ఆయన పాపములో పుట్టి వారికెదో చెప్పవచ్చెనని వారనలేదా? చూడండి?

JOHN 1:14•

JOHN 10:33,36

 

122ఆయన ఏమి చేయుచున్నాడో చూడండి. ఆయన ఆ దేశంలోయున్న ప్రతి సంఘమును చీల్చివేసెను. అది నిజమేనా? సంస్థలను మొదలగు వాటన్నింటినీ ముక్కలు ముక్కలుగా చేసెను. ఆయనెవరు? ఎవరో ఒక తిరుగుబోతు కుర్రవాడు అని తలంచిరి, అతనికి ఆ శాఖ లేదు.

"నీవు ఏ సంఘమునకు చెందియున్నావో చెప్పుము. నీ తండ్రి ఎవరు?"

యోసేపు నీ తండ్రి కాడని చెప్పుకొనుచున్నావు గదా?" అనిరి.

"యోసేపు నా తండ్రి కాడు," అని ఆయన చెప్పెను.

"అయితే నీ తండ్రి ఎవరు?"

"దేవుడే నా తండ్రి!"

"అయితే నీవు పిచ్చివాడివి! నీవు మనుష్యునివై యుండి దేవుడు నా తండ్రి అని చెప్పుకొనుచున్నావు కదా?" అనిరి.

వారు వాక్యము ద్వారా దానిని పరీక్షించియుండిన ఎంత బాగుండును… హల్లెలూయా! వాక్యము శరీరధారియగునని వారు చూడలేదు. వారు వాక్యముతో తమ దర్శనమును పరీక్షించి చూచుకోలేదు.

నేడు ఆలాగే యున్నది. మీ దర్శనములను, మీ ప్రవచనములను, మీ బోధలను దేవుని యొక్క వాక్యముతో పరీక్షించి చూచుకొనుట లేదు. ఎవరైనా వచ్చి సత్యమును మీకు చెప్పుటకు ప్రయత్నించినయెడల, మీరు వారిపై పడుదురు. ఆనాడు ఆమోసుకు చేసినట్లు గానే, మీరు కూడా దానినే చేయుచున్నారు.

GAL 1:8,9

 

123ఇప్పుడు, ఇట్లు చూడండి, అతడు ఏ స్థితిలో యున్నాడు? బహుశా మీరాయనను తిరస్కరించియుందురు (అది నిజము), మీరు వాక్యము యొద్దకు తిరిగి వెళ్ళరు. వారు అదే చేసిరి, ఈనాడు కూడా వారు అతనిని నిరాకరించెదరు.

ఇక్కడ జుట్టు కత్తిరించుకొనిన స్త్రీలు… జుట్టు కత్తిరించుకునే మీ ఆలోచన గురించి ఈ వాక్యము ఏమి చెప్పుచున్నదో, దానిని ఎందుకని మీరు పరీక్షించి చూచుకొనుట లేదు? ఎందుకని ఇటువంటి కార్యములు మీరు చేయుట లేదు?

తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే మీ బాప్తిస్మమును మీరెందరు పరీక్షించు కొనుటలేదు; త్రిత్వము అనునది అబద్ధమైనది, దానిని అట్లే అందురు, అది భూమి మీద దేవునికి మూడు కార్యములున్నవనే తప్ప మరేమి కాదు, అవి బిరుదులు మాత్రమే. తండ్రి అనునది పేరు కాదు, అటువంటి పేరనేది ఎచ్చటా లేదు, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ - తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు పేరు ఒకటున్నది. అది ప్రభువైన యేసుక్రీస్తు. బైబిలులో అందరూ ఏ విధంగా బాప్తిస్మము పొందిరో దానితో మీరు మీ బాప్తిస్మమును పరీక్షించుకొనుడి.

వాక్యముతో మీ ఆలోచనను మీరు పరీక్షించి చూచుకొనినయెడల, అప్పుడు మీరు వెనక్కు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుదురు. పౌలు వారికి అదే చేయమని చెప్పెను, దానికి భిన్నంగా ఎవరూ బోధించినా శాపగ్రస్తులగుదురని అతడు చెప్పెను, దేవదూత దిగివచ్చినా…

124చాలాసార్లు దేవదూతలు దిగి వచ్చినవి. పరిశుద్ధ మార్టిన్ అక్కడ నిలచియుండగా, ఒక పెద్ద ప్రకాశమానమగు వ్యక్తి అతనికి కనబడెను. ఇతడు యేసు నామములో బాప్తిస్మము ఇచ్చెను, పరిశుద్ధాత్మను ఇతడు నమ్మెను, వాక్యమును అంగీకరించెను. రోమనులు అతనిని తన్నిరి, ఎందుకనగా అతడు వారి మానవ-కల్పిత సిద్ధాంతములను, ఆచారములను నమ్మలేదు, వాక్యము మీద నిలబడియున్నాడు. అతడు శక్తితో నిండిన వాడు. దయ్యములు అతని యొద్దకు వచ్చి మాట్లాడుటకు ప్రయత్నించెడివి. అతడు వాటిపైపు దృష్టి నిలుపలేదు. ఒకనాడు సాతాను క్రీస్తువలె వచ్చెను, కిరీటము ధరించుకొని, బంగారు చెప్పులు తొడుగుకొని, అచ్చట నిలబడి, "నన్ను గుర్తుపట్టలేదా…" అని చెప్పెను. చుట్టూ అగ్ని మండుచుండెను, "మార్టిన్, నీవు నన్ను గుర్తుపట్టలేదా? నేను నీ ప్రభువును, నన్ను ఆరాధించు!" అని చెప్పెను.

మార్టిన్ అతడి వైపు చూచెను; అక్కడ ఏదో తప్పు కనిపించినది.

"మార్టిన్, నన్ను గుర్తించలేదా? నేను నీ ప్రభువును, రక్షకుడను. నన్ను ఆరాధించుము," అనెను.

ఆ విధంగా అతడు ముమ్మూరు పలికెను, మార్టిన్ చుట్టూ చూచెను; ప్రభువుకు ఆయన జనులే రాకడలో కిరీటము ధరింపచేతురు; ఆయన బంగారు చెప్పులు ధరించడు. అతడు వెంటనే, "సాతానా! నాయొద్ద నుండి పొమ్ము!" అనెను. పెంతెకోస్తవారు ఆలాగే మోసపోయిరి, ప్రకాశమానమగు దూతగా వచ్చెను.

ROM 3:4•

GAL 1:8,9

 

125షికాగో నుండి వచ్చిన స్త్రీ నాతో ఇట్లు చెప్పెను, "బ్రెన్హాం సోదరుడా, యేసు నామములో బాప్తిస్మము ఇవ్వమని ప్రభుని దూత నీకు చెప్పినచో, ఆ సేవకులు అంగీకరించెదరని చెప్పిరి; అయితే ఇది నీ స్వంత ఆలోచన కనుక…

"ఒకవేళ దానికి ప్రభువు దూత ఏదైన వ్యతిరేకముగా చెప్పినయెడల, అది ప్రభువు దూత కాదు," అని అన్నాను, చూచారా.

ఈ వాక్యమునకు విరోధమగు దానిని ఏ దూత చెప్పినా, అది అబద్దమే. తండ్రీ, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము సరి అని ఏ దేవుని యొద్ద నుండి వచ్చిన వర్తమానికుడుగా చెప్పుకుంటూ ఏ వ్యకైనా వచ్చి (దేవుని యొద్ద నుండి వచ్చిన వారు అని చెప్పుకొనును) జుట్టు కత్తిరించుకోవచ్చు, సంఘములో టోపీ పెట్టుకోవచ్చు, అటువంటివి పరవాలేదు చెయ్యవచ్చని ఎవ్వరైనా చెప్పినయెడల, అతడొక అబద్ధికుడు. దేవుని వాక్యము సత్యమైనది. ఇలాంటివి ఏ కార్యములైనా అవి వాక్యమునకు విరుద్ధమైనవి, అవి అసత్యమైనవి. వాక్యమే సత్యము; అది మాత్రమే నిలచును.

MATT 15:6•

MARK 7:13

 

126తన ప్రవచనము దేవుని యొద్ద నుండి వచ్చినదని మీకాయాకు తెలియును, ఎందుకనగా అది దేవుని వాక్కు. అవును! అతని దర్శనము దేవునికి యున్నట్లుగానే అది యున్నది.

ఓ, ఇక్కడ ఆమోసు యున్నచో, అతడు వాక్యముతోనే నిలచియుండును. ఇది నిజము. కాని మీరు చూచారా, మనము వారివలెయున్నాము. అదే నేటి మన సమస్యగా యున్నది. (నేను ముగించెదను.) మనము కూడా వారివలె యుండుటయే సమస్యగా యున్నది. వారికి పునాది నుండి నేర్పవలసి వచ్చెను. వారి ఆచారముల వలన దేవుని వాక్యము నిర్థకమైపోయినదని యేసు చెప్పెను.

అది తప్పు బాప్తిస్మము, పరిశుద్ధాత్మను పొందినట్లుగా తప్పు సూచన ఇచ్చుచున్నారు. "కరచాలనము" చేస్తే చాలనని కొంతమంది చెప్పుచున్నారు.

"భాషలలో మాట్లాడమని" కొందరు చెప్పుచున్నారు.

దయ్యములు భాషలు మాట్లాడుట, కరచాలనము చేయుట నేను చూచాను. అవునయ్యా! అది ఏ గురుతు కాదు. ఇప్పుడు, ఈ సంగతులన్నియూ చూడండి. ఈ సంగతులన్నియు… చూచారా. మీరు దేవుని వాక్యమును తీసివేసి అందుకు బదులుగా ఆచారములను బోధించున్నారు. ఇది నిజము.

127ఇప్పుడు, వాక్యము యొద్దకు అతడు మిమ్మును తిరిగి తీసికొనిపోవును. కాని ఈనాటి మన బోధకులు దేవుని వాక్య పునాదులను జనులకు బోధించుట లేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అప్పుడును వారాలాగే చేసిరి, అదే వారికి ఆమోసు చెప్పెను. "మీరు ఏ దేవుని ఎరుగుదుమని చెప్పుచున్నారో, ఆ దేవుడే మిమ్మును నాశనము చేయును."

మనము ఈనాడు వారికి దేనిని బోధించుట లేదు? ఒక్కసారే పెంతెకోస్తు పితరులకు అప్పగించబడిన విశ్వాసపు పునాదిని బోధించుట లేదు. అదే బైబిలు! తప్పుడు మారుమనస్సును గురించియు, తప్పుడు బాప్తిస్మమును గురించియు బోధించుచున్నారు, అంతా తప్పుడు బోధయే, అసత్యము, అసత్యమునే బోధించుచు - సత్యమైన దానినుండి వేరుపడుచున్నారు. నీవు దానిని నమ్ముటలేదు, తిరిగి బైబిలు యొద్దకు వచ్చి నీ పరిహారమును కనుగొనుము; నీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును, చిలకరించుటను మరియు అటువంటి ప్రతీ కార్యములను తీసివేసి వెనుకకు వచ్చి అది వాక్యానుసారమైనదనో, కాదో చూడుము. అదే మార్గము. పునాది పై అది ఉన్నదో లేదో చూడుము.

EPH 2:20

 

128చూడండి, పరిశుద్ధ గ్రంథములో పౌలు చెప్పిన విధముగా వారు పునాదిని వదిలిపెట్టిరి. దేవుని సంఘము అపొస్తలుల, ప్రవక్తల బోధమీద పునాది వేయబడినదని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ప్రవక్తలు మరియు అపోస్తలులు ఒక్కటే అయి యుండవలసియున్నారు. నిశ్చయముగా మనము వాక్యపునాదిని విడిచి, శాఖ యొక్క పునాదుల యొద్దకు వెళ్ళితిమి.

ముగింపులో వినండి. మీ ఆత్మీయ వినికిడి సాధనమును తగిలించుకొనుడి. వినండి. మనము వాక్యపునాదిని విడిచిపెట్టి శాఖా పునాది మీదికి వచ్చియున్నాము. దానిమీద ఎంతకాలము నేను నిలబడుదును? ఇంకో మూడు గంటలు. వాక్యపు పునాది బదులుగా లోక సుఖములు, లోకత్వము, అనైతికము అనే పునాది సంఘములోనికి ప్రవేశించినవి, వాక్యమునకు బదులుగా ఆచారములు వచ్చినవి. దీని గూర్చినేను మూడు వారములు బోధించుదును. వాక్యమునకు బదులుగా ఒక శాఖలోనికి పోయిరి. సంఘశాఖ మరియు వాక్యము… ఒక సంఘము శాఖగా మారిన వెంటనే, అది వాక్యమును ఆ క్షణమందే తప్పిపోయినది.

129ఒక్కటే ఇక మిగిలినది: ఎక్కడ విడిచిపెట్టితివో, అక్కడికి మరలా తిరిగి రావలెను. వాక్యము నొద్దకు తిరిగి రావలెను. అది నిజము. మారుమనస్సు అనగా "వెనుకకు తిరుగుట." నీవు తప్ప దారిలో వెళ్ళుచున్నావు, వెనక్కు మళ్ళుము.

సుఖమనే సంఘ శాఖ. లోకమును పునాదిని, ఆచారములను పునాదిని వారు వేసికొని అనైతికతను, చెడును, ఆత్మీయ కాలుష్యమును వారు తయారుచేయుచున్నారు.

130ఒక నిజ ప్రవక్తగా అతడు యుండినయెడల, వారిని అతడు ఏ విధముగా చూసెనో మనల్ని కూడా ఇతడు ఆ విధముగానే చూచును. అతనిని ఈనాడు ఈ వేదిక మీద నిలబెట్టి యుంచండి, నేనిట్లు చెప్పెదను, "ఆమోసు సోదరుడా! దేవుని గొప్ప ప్రవక్తా, భయములేని వాడా, ఇచ్చటికి వచ్చి మరియు నా స్థలము ఆక్రమించుము." ఈ వాక్యమునే అతడు బోధించును. అతడు ప్రవక్త గనుక దానినే బోధించవలసియున్నాడు. మంచిది. అది వ్రాయబడియున్న ప్రకారమే ఖచ్చితముగా అతడు దానిని బోధించును, దానినే ఇప్పుడు మనము చెప్పుకొనుచున్నాము. మంచిది. వారిలో అతడు కనుగొనిన విధముగానే నైతిక పతనమునే ఈనాడు అతడు మనలో కనుగొనును.

స్నేహితులారా, చూడండి. ప్రపంచము నైతిక పతనములో యున్నదని ఇప్పుడు ఆలయంలో ఉన్నవారిలో ఎందరు చూచుచున్నారు? మనకు తెలియును. కారణమేమిటి? అది వాక్యము నుండి దూరమైనది. ఇది నిజము. మంచిది.

131ఆమోసు ఎన్నడూ ప్రభుత్వమును నిందించలేదు. (మీరు ఇంటికి వెళ్ళి చదవండి) అతడెన్నడూ ప్రభుత్వమును నిందించలేదు. అటువంటి ప్రభుత్వమును ఎన్నుకొన్న సంఘమునే అతడు నిందించెను. రాజకీయ నాయకులారా! ప్రపంచములో ఉన్న మీ అందరిని చూచి నేను పళ్ళు కొరకుచున్నాను.

యరోబాము వంటి వానిని సంఘము ఎన్నుకొన్నది. మనమును ఆలాగే చేయలేదా? అది మంచి ప్రభుత్వమని మనము చెప్పెదము. ప్రజలు ఇసుక మీది ఇంటిని ఎన్నుకొనగా, ప్రభుత్వము రాతి మీద ఇల్లును నిర్మించజాలదు. నిర్మించగలదా? "మా ప్రభుత్వము, మా ప్రభుత్వము," అని చెప్పవద్దు. నీవే ఆ దేశమైయున్నావు; ప్రజలే దేశముగా ఉన్నారు. ఏ విధముగా మనము…

132ఒక సేవకుడు నాతో ఇట్లనెను, "బ్రెన్హాం సోదరుడా, చూడు! ఆ విషయంలో నీవు చెప్పేది నిజమే, కాని ఆ విధంగా నేను బోధించినయెడల, నా శాఖ నన్ను బయటకు తన్నివేయును. నా ప్రజలు నన్ను సంఘములో నుండి తరిమివేయుదురు. మరెన్నడూ నేను అక్కడ బోధించుట జరుగదు."

"ఏమైనా గాని బోధించు!" అన్నాను.

అవునయ్యా! అది దేవుని వాక్యము. అందుకు నీవు బాధ్యుడవు. నీవు నిజమైన దేవుని ప్రవక్తవైనచో, వాక్యముతోనే నిలచియుందువు; లేనియెడల, నీవు శాఖతో నిలచియుందువు. నీవెక్కడినుండి వచ్చియున్నావో, దాని మీదనే అది అధారపడియుండును.

చూడండి! లేదండి, మనము నిర్మించలేము - ప్రభుత్వము గట్టి పునాది లేదా బండ మీద ఇల్లును నిర్మించజాలదు, ఎందుకనగా జనులు కూలిపోవు ఇసుక మీద సుఖభోగములను ఇల్లు కట్టుటకు ఓటు వేయుచున్నారు.

133మన కోరికను చూడవలెను. ఒక్క నిమిషం చూద్దాం. మిమ్ములను అలసటకు గురిచేయలేదని నేను తలంచుచున్నాను. కాని ఒక్క నిమిషము మన కోరికను చూద్దాం, ఒక్క నిమిషము, దీనిని నేను చెప్పరాదు. మనమేమి కోరుకుంటున్నామో చూద్దాం.

మన టెలివిజను చూడండి. దానినే మనము కోరుచున్నాము. కొందరు హాస్యకారులు నిలబడి ఎవో అసభ్యమైన జోకులను మనకు చెప్పవలెనని కోరుచున్నాము, బుధవారం రాత్రి ప్రార్థన కూటమునకు రాకుండా, ఇంట్లో కూర్చొనుచున్నాము, లేదా మీరు వెళ్ళి దానిని చూచునట్లు బోధకుడు పెందలకడ మిమ్మును విడిచిపెట్టుచున్నాడు. అయిదు లేదా ఆరుసార్లు పెండ్లి చేసుకొనిన అసహ్యమైన, నీచురాలైన వేశ్య సరసోక్తులు చెప్తు౦టే, అసహ్యముగా వస్త్రములను ధరించుకొని, అసభ్యమైన కార్యములన్నింటిని చేస్తు౦టే; దేవుని గృహము కంటే దానినే మీరు ఎక్కువగా ప్రేమించుచున్నారు. మీలో ఎట్టి ఆత్మయున్నదో దానిని బట్టి తెలియును.

134దానిని మనము అనుమతించుచున్నాము, ఈ దేశపు జనులు ప్రభుత్వమునకు ఉత్తరములు వ్రాసినచో ఆ "అసభ్య కార్యక్రమములు," ఆగిపోవును. (వంద లక్షల ఉత్తరములు ప్రభుత్వమునకు వెళ్ళినచో ఎంతో బాగుండును) కాని ప్రజలే ఆ అసహ్య కార్యక్రమములను కోరుకొనుచున్నారు; అందుకే అవి వచ్చుచున్నవి.

రేడియో కార్యక్రమములు చూడండి. ఓ, మై! "యుగముల బండ," "పాత కరకు సిలువ," అను పాటలను రాక్-ఎన్-రోల్ పాటలుగా మార్చివేసిరి. అవును నిజము! మన రేడియోలు, టెలివిజనులు సమస్తము ఇలాగు తయారయినవి.

135ఇక్కడ కొంతకాలం కొందరి బాలికల ప్రదర్శన చూచాను. అది ఎంత అసభ్యంగా ఉన్నది, దానిని మనము ప్రేమించుచున్నాము; దానినెవరు బలపరచుచున్నారు! బీరు, విస్కీ, సిగరెట్టు తయారుచేయు కంపెనీలు, దేశపు డబ్బు వారియొద్దనే యున్నది. వారేమి చేయుచున్నారు? ప్రభుత్వమునకు పన్నులుగా చెల్లించవలసిన డబ్బును ఈ అసభ్య కార్యక్రమములకు వినియోగించుచున్నారు.

పెంతెకోస్తవారు అటువంటి మురికి, అసభ్య సినిమాలు ఇంతకు ముందు చూచెడివారు కారు. దయ్యము ఒకదానిని మీపై పెట్టినది, టెలివిజనును మీ గృహములలో తీసుకొచ్చి పెట్టినది.

ఒక నిజ ప్రవక్త యొక్క మార్గము చాలా కఠినముగా యుండును, అయినా గాని మనము సత్యముతో నిలచియుందుము. అవునండీ!

136మన ప్రకటనా పలకలను (బిల్ బోర్డు) చూడండి. స్త్రీల చేతులలో సిగరెట్లు పొగపీల్చుచున్నట్లుగా నిలబడియున్నారు. యొజెబెలులు ప్రతీ దేశములో పెచ్చుపెరిగిపోయిరి. ఒకనాడు నేను ఒక వింత సంగతి చూచాను: అక్కడ ఒక స్త్రీ ఉండెను, (నేను పిల్లలను బడిలో నుండి తీసుకొని వచ్చుటకు వెళ్ళాను) - గడ్డకట్టుచున్న చలిలో తగుమాత్రము బట్టలు కూడా ధరించకుండా యున్నది. వారిలో ప్రతీ ఒక్కొరు, సిగరెట్లు కొరకు పరుగిడుచున్నారు. [సహోదరుడు బ్రెన్హాం, వారిని ఉదహరించి చూపిరి.] చేతిలో సిగరెట్టుతోనే తలుపు తీయుచున్నారు. నీవు వారికేమీ చెప్పినా వారు లెక్కచేయరు. నిశ్చయంగా!

ఆ రిక్కీలకు, లేదా ఎల్విస్ లకు నీవేదయినా చెప్పినచో, నిన్ను వారు కాల్చివేయుదురు. ప్రభుత్వము వారిని వెనుక వేసికొని వచ్చుచున్నది, ఎందుకనగా వారు యుక్త-వయస్కులు గదా అంటున్నది. "ఓ, అది పరవాలేదు. వారు అర్ధము చేసికొనరు. వారు యుక్త-వయస్కులు; చూచి చూడనట్లు ఉండుము."

ఇప్పుడు, ఒక నిజ ప్రవక్త యొక్క మార్గము ఎట్లు౦డునో మీరు చూచారా? ఆయన మార్గము?

JOEL 2:25•

LUKE 3:8

 

137తమ శాఖా సంఘములలోని ఈ అసహ్య కలలు కనువారిని చూడండి, వారు నేరుగా నీ వీపులో నిన్ను పేల్చివేయుదురు. వర్తమానము బయటకు వెళ్ళుచున్నంతవరకు దేవుని కృప మాత్రమే వారిని ఆ పని చేయకుండా ఆపగలదు. అపవాదికి నీవు చోటిచ్చినచో అది నిన్ను చంపును. వాడు దానిని చేయగలడు. కాని వర్తమానము బయలు వెళ్ళవలెను. "ప్రభువునగు నేను, పునరుద్ధరింతును." అది నిజము. "ఈ రాళ్ళ ద్వారా నేను పుట్టించగల సమర్దుడనని ఆయన చెప్పుచున్నాడు." ఇది నిజము. మంచిది.

138మన సినిమాలు, ప్రకటనా పలకలు, మన పాపపు సుఖభోగులు తమను తాము క్రైస్తవులుగా చెప్పుకొనుచున్నారు, తాము క్రైస్తవులుగా ప్రజలు చెప్పుకొనుచున్నారు. శరీర సుఖము కోరుచూ, పాపము ఆశలు వెదకుచూ, స్త్రీలు అసభ్యంగా దుస్తులు ధరించగా పురుషులు వారివైపు చూచుచున్నారు. వారిని చూచి ఈ ఈలలు వేయుచున్నారు, వీరు తాము క్రైస్తవులుగా చెప్పుకొనుచున్నారు. బయటకు వెళ్ళున….. . ఎందుచేత, వారికి ఇంకా కూడా ఫ్లోరిడా, కాలిఫోర్నియాలలో ఇప్పుడు వారికి క్లబులున్నవి, దీనిని వారు గొప్పగా చెప్పుకొనుచున్నారు. అక్కడ పురుషులందరూ కలిసికొని తమ తాళపుచెవులను అచ్చట విసిరివేయగా - ఒక స్త్రీ వెళ్ళి అందులోని ఒక తాళపు చెవిని పట్టుకొనును. ఆ తాళపు చెవిగల పురుషుడు ఆమెను తన ఇంటికి తీసికొనిపోవును. వారు ఒక వారము కలిసి జీవించి, మరల వచ్చి తాళపుచెవిని విసరుదురు, చూచారా. ఇవి క్లబ్బులు. అక్రమ సంతానము పెరిగిపోవుచున్నది. పంది పందిని, కుక్క కుక్కను తినుచున్నది. ఎందువలన ఈలాగు జరుగుచున్నది? వారు వాక్యము విడిచిపెట్టినందువల్లనే.

MATT 5:28

 

139సభ్యత అంటే వారికి అర్థము తెలియదు. శరీరమును అంటిపెట్టుకొను దుస్తులు ధరించుచున్నారు. వారిని పురుషులు దురాశతో చూచుచున్నారు. తామెంతో సభ్యతగా యున్నామని వీరు తలంచుచున్నారు. సోదరీ, నీవేమీ తప్పు చేసియుండకపోవచ్చును, కాని నేను నీకు ఒక సంగతి చెప్పుచున్నాను; నీవు అపవాది చేతిలో ఒక సాధనమైయున్నావు.

తీర్పు దినమున నీవు వ్యభిచార నేరమునకు జవాబు చెప్పువలసియున్నావు, "ప్రభువు ఈలాగు సెలవిచుచున్నాడు," నీ ప్రాణము నశించును. నీకు బాగుగా తెలియును; ఏది ఏమైనను, ఇప్పుడు నీవు ఎరుగుదువు.

140మన వ్యవస్థ పూర్తిగా చెడిపోయి కుళ్ళిపోయినది. మన ప్రజలే దీనిని కోరుకొనుచున్నారు. మంచి గృహ యజమానివలె. ఎందుకు, ఒకడు ఒక మంచి గృహ యజమానివలె యుండినయెడల, ప్రభుత్వమును నిందించుచు… మనము చెడిపోయినందున మన పిల్లలు తుపాకీ తుటాలకు తయారు చేయుదురు (ఇది నిజము). మనము ప్రభువును ప్రేమించి, ప్రభువును సేవించి సరయిన ప్రభుత్వమునకు వోటు వేసినచో ఇదొక అద్భుతమైన స్థలముగా యుండెడిది. ఇది నిజము. మనకు ఆ యుద్ధములుండవు. దేవుడే మనకు ఆశ్రయముగాను మరియు బలముగాను ఉండును.

మన బాలురను చంపబడుటకు, వధింపబడుటకు పంపుచున్నాము, దీనికి కారణము మన స్వంత క్రియలే. ఆ విధంగా దేవుడు బైబిలులో చెప్పెను, మరియు ఆయన మారనివాడు; ఆయన ఏకరీతిగా యున్నాడు. వారియొక్క స్వంత ప్రజలు ఆ విధంగా కోరుకొనిరి.

GAL 6:7

 

141ఒక మంచి ఇంటి యజమాని ఏమి చేయును? అతడు సరిగ్గా జీవించగోరును, దేవుని కోసము బ్రదుకగోరును, అతని కుటుంబము నీతిహీనముగాను, విలాసవంతముగాను యున్నచో ఏమి చేయును? తన భార్య పొట్టి బట్టలు ధరించి, కామవికారము కలిగించు అలంకరణతో యెజెబెలువలె తిరుగుచున్నచో అతడేమి చేయును? పిల్లలు కూడా ఆ విధంగానే ఉన్నారనుకొందము. ఆ తండ్రి తన పిల్లలను ఎంతో ప్రేమతో, గారాబంగా పెంచెను, వారిని పరుండబెట్టి వారికొరకు చిన్నప్పుడు ప్రార్థించెను. అయితే వారిప్పుడు తమ తండ్రిని చూచి, "మా తండ్రి పిచ్చివాడు; ఎప్పుడూ బైబిలు గూర్చియే తలంచును," అనుచుండగా, ఆ కుటుంబమును గూర్చి తండ్రి ఏమనుకొనును?

మన ప్రభుత్వము, మన ప్రజలు ఆ విధంగానే యున్నారు. ప్రభుత్వమును నిందించవద్దు, వెనుకకు దిగజారిన సంఘములు ఇట్టి రాజకీయములను ప్రోత్సహించుచున్నవి. వాటిని మనము నిందించవలెను. వారికది కావలెను! ఆ కారణము చేతనే వారు దానికి ఓటు వేసిరి. అందుకే వారు దీనిని ఎన్నుకొనిరి, అందుకే వారి మీదికి దేవుని తీర్పు వచ్చును, వారు విత్తినదానినే కోయుదురు. వారిప్పుడు విత్తుచున్నారు. ఆ తరువాత దానిని కోయుదురు.

AMOS 3:7•

ACTS 8:18-20•

EPH 3:5

 

142చూడండి! మనము పిచ్చివారమైపోయాము. (ఓ, అవును!) రష్యా మార్గములోనికి, కమ్యూనిజం దారిలోనికి వెళ్ళవలెనని ప్రయత్నించుచున్నాము… ఎందుచేత, డబ్బుతో… దేవుని వరములను నీవు కొనలేవు!

సీమోను అను ఒకడు ఒకసారి ఆలాగే చేయుటకు ప్రయత్నించెను. "నీ డబ్బుతో నీవు నశించెదవు గాక!" అని పేతురు పలికెను. దేవుని వరములను కొనవలెనని మనము గారడీ సీమోను పాత్రను పోషించుచున్నాము.

వాక్యము యొద్దకు తిరిగి రండి! దేవుని యొద్దకు తిరిగి రండి! క్రీస్తు యొద్దకు తిరిగి రండి! కమ్యూనిజం గూర్చి భయపడవద్దు. మనందరము కలిసి మంచివానిని ఎన్నుకొందము, అబ్రాహాం లింకను, జార్జి వాషింగ్టన్, లేదా మరో అట్టి నిజాయితీపరుడగు వానిని ఎన్నుకొందము. అక్కడున్న ప్రభుత్వమును మనము నిందించుట కాదు, మనలను మనమే నిందించుకోవలెను. ఆమోను అదే పలుకును, నిజమగు ఏ ప్రవక్త అయినా గాని అదే చెప్పును, దేవుని వాక్కు ఎరిగినవాడు అదే చెప్పును. అతడొక నిజ ప్రవక్త అయినయెడల, అతడు వాక్యమును ఎరుగును, ఎందుకనగా దేవుని వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చును.

MATT 24:24•

MARK 13:22

 

143తమ శత్రువులతో ఇశ్రాయేలీయులు సంధి చేసికొనిరి. తమ శత్రువుతో సామరస్యముగా ఉండుటకు ముందు వారు దేవుని వాక్యము నుండి దూరము కావలసియుందురు. మనము మన శత్రువులతో సమ్మతించుటకు ముందు దేవుని వాక్యము నుండి దూరము కావలసియుందుము.

ఇప్పుడును అదే జరుగుచున్నది, రోమ్ ఆక్రమించుకొనుటకు దారి ఇచ్చుచున్నాము. దానికి మనము నిరంతరము దోహదపడుచున్నాము. ప్రభుత్వము ఆమె యొక్క వశమైనది, ఆమె స్థలములను స్వంతము చేసుకొనినది, ఆమె జనములను ఆక్రమించినది. ఇప్పుడు ఆమె సంఘములను వశపరచుకొనుచున్నది. మనమేమి చేయుచున్నాము? నెమ్మదిగా కూర్చొని, వారితో సమ్మతించుచున్నాము. "ఓ, అది ఏ బేధములు కలిగించదు, ఇదైనా లేక అదైనా, ఏదయినా ఒక్కటే, ఏదయినా దేవుడే," అని మనము తలంచుచున్నాము.

నీ నామకార్థ ప్రవక్తలు, దరిద్రులు, దిక్కుమాలినవారు, దిగజారినవారు. మీ సంగతి ఏమిటి? ఈ విషయములలో దేవుని వాక్కు ఏమి చెప్పుచున్నదో వారెరుగరు. వారు వాక్యము చదువరు. వారు గ్రహించరు. ప్రపంచమును కమ్యూనిజం ఆక్రమించునని వారు చెప్పుచున్నారు. కాదు! అది తప్పు! రోమనిజం ప్రపంచమును ఆక్రమించును! క్రైస్తవ్యపు పేరు మీదనే అది జరుగుచున్నది! సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సహితము మోసపుచ్చునంత దగ్గరగా అది ఉండునని బైబిలులో యేసు చెప్పలేదా?

MAL 4:5,6

 

144ఈనాడు మనకు కావలసినది… ఈనాడు మనకు మరొక నిజ ప్రవక్త కావలెను (ఇది చెప్పి నేను ముగించుదును) ఆమేన్! దేవుని వాక్యము వచ్చిన ఒక వ్యక్తి మనకు కావలయును. అవును, సోదరుడా! అతనిని విసర్జించెదరు, తరిమివేయుదురు, త్రోసివేయుదురు, కాని అతడు నిశ్చయంగా బ్రద్ధలు చేయును. దానినే అతడు చేయును. అతడు అట్టి విత్తనములను చల్లును, ఏర్పరచబడినవారు దానిని కనుగొనునంత వరుకు. అది నిజము. మనకు ఒక ప్రవక్త అవసరము! వాక్యమునకు సరయిన భావము వచ్చి చెప్పు ఒక వ్యక్తి మనకు కావలెను; అతని ద్వారా దేవుడు మాట్లాడి, ఆ వాక్యము సత్యమని రుజువుపరుచును. సోదరుడా! అదే మనకు కావలెను, మలాకీ 4 ప్రకారము అది మనకు వాగ్దానము చేయబడెను. దేనిని తిరిగి సమకూర్చును? బైబిలునొద్దకు జనుల విశ్వాసమును త్రిప్పును. ఒకనిగూర్చి మనకు వాగ్దాన మియ్యబడెను; అతడే ఇది చేయును.

HEB 12:17

 

145ఆమోసు ఎరుగును. (అవును!) భక్తిలేనివారివలన ఇశ్రాయేలు నాశనమగునని ఆమోసునకు తెలియును. నేడును భక్తిహీనులు నశించెదరు. సంఘ శాఖల యొక్క ఆచారములతో, వారి కార్యములతో, వారు తమంతట తామే దానితో బంధించుకొనిరి (పెంతెకోస్తువారలారా!) వారి సంఘశాఖ ఆచారములే, వారి సంఘ శాఖయే, అవే వారిని నాశనము చేయబోయేది. మృగము ముద్రతో మిమ్మల్ని మీరే బంధించుకొనుచున్నారు మరియు దానిని మీరు ఎరుగను కూడా ఎరుగుట లేదు, మీ కళ్ళ ఎదుటనే అది యున్నది. నిశ్చయముగా అది ఒక బహిష్కరించుటయే. మీరేమి చేయ ప్రయత్నించుచున్నారు? దేనికి చెందవలెనని చూచుచున్నారు. మీరు ఇంకా వేచియుందురు… మీరు ఇంకా కొద్ది సమయము. "అప్పుడు దానిలోనుండి బయటకు పోదును," అని నీవు అందువు.

కాని నీవు బయటకు రాలేవు; ముందే నీవు అందులోనే యున్నావు; ముందే నీవు ముద్రించబడితివి, ఆ ముద్ర వలన నీవు పట్టబడితివి.

దానిని గురించి ఎరిగినప్పుడు ఏశావు ఎంతో దుఃఖముతో ఏడ్చెను, మారుమనస్సు పొందుటకు ఒక స్థలమును కనుగొనవలెనని ప్రయత్నించినా గాని దానిని కనుగొనలేకపోయెను, కాని ప్రయోజనము లేకపోయెను. అప్పుడు నీవు అక్కడే నిలచిపోతావు. ఇదే నీవు తప్పించుకొని పోవలసిన సమయము!

MATT 7:20

 

146భక్తిలేని ప్రియుల వలన అది నాశనమగునని ఆమోసునకు తెలియును. అతడిని, దేవునిని, దేవుని వాక్యమును, జీవ మార్గమును జనులు, సంఘము కూడా విడిచిపెట్టిరి. వారు దేవుని జీవన మార్గము నుండి తొలగిపోయి తమ కొరకు స్వంత మార్గము ఏర్పాటు చేసికొనిరి. ఓ, వారికి వాక్యము ఒక అడ్డుబండగా యుండెను, నేడును పరిస్థితి ఆ విధంగానే యున్నది. నామకార్థ క్రైస్తవులకు దేవుని వాక్యము అడ్డుబండగా యున్నది. యేసుక్రీస్తు నామములో నీటి బాప్తిస్మము గూర్చి వారికి చెప్పండి. పరిశుద్ధ దేవుని గూర్చి వారికి చెప్పండి…

"మంచిది, మాకు పరిశుద్ధాత్మ ఉన్నదిలే," అని వారందురు.

అయితే ఇంకా నీవెందుకు జుట్టు కత్తిరించుకొనుచున్నావు? ఇంకా నీవెందుకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాస్త్రీస్మమిచ్చుచున్నావు? ఇంకా నీవెందుకు ఆ నమ్మకూడని సంగతులు నమ్ముచున్నావు? చేయరాని క్రియలు చేయుచున్నావు? నీ ఫలములు నిన్ను రుజువు చేయుచున్నవి. "వారి ఫలములను బట్టి వారిని తెలిసికొందురు," అని యేసు చెప్పెను. అవి నిన్ను చూపించును, చూచారా! నీకు తెలియని దానినిగూర్చి నీవు మాట్లాడుచున్నావని అర్థమగుచున్నది. అవునండి!

AMOS 3:8

 

147అవును! ఆమోసు ఇక్కడ ఉండినయెడల ఈ పద్ధతులకు వ్యతిరేకముగా కేకవేసి యుండును! మీకది తెలియునా? ముగింపులో ఒక వచనము నేను చదువుచున్నాను. 3వ అధ్యాయము 8వ వచనము చదువుదము.

సింహము గర్జించగా భయపడనివాడెవడు? యెహోవా సెలవియ్యగా ప్రవచించనివాడెవడు?

వినండి! ముగించుచున్నాను, దీనిని నేను చెప్పవలెనని ఆశించుచున్నాను. అర్థగంట ఎక్కువ సమయము తీసికొన్న౦దుకు చింతించుచున్నాను. ఇది చెప్పవలెను, నేను వేటగాడిని. నేను వేటాడుదును. దేవుడు దానిని నాకిచ్చినందుకు సంతోషించుచున్నాను. ఒక రోజు తుపాకీ పేలిపోయినది. మరల నేను పేల్చగలనో లేదో అని పరీక్షించుకొన్నాను. అది నన్ను భయపెట్టదు. రోడ్డు మీద నాకు ప్రమాదము జరిగినందున నేను కారు నడుపుట ఆపను. కొన్నిసార్లు నేను తివాచీ మీద నడుస్తూ బొటన వ్రేలు చిక్కుకొని పడిపోయెదను, అంతమాత్రాన నడక మానను, చూచారా. కాదు, కాదు. దేవుడు నాకు ఒక పరిశుభ్రమగు వ్యాయామము ఇచ్చెను; అది సాతాను; అది దేవుడు కాదు, చూచారా. అది సాతాను.

148ఆత్మీయంగా ఎట్లు దానికి అన్వయించవలెనో నేనెరుగుదును, అదేమిటో ఎరిగినవారము, ఇప్పుడిక్కడ ముగ్గురమున్నాము. తలమీది వెండ్రుకలు నిలబడును. అయినా అది ఎవరికీ చెప్పను (చూచారా), ఈ ముగ్గురు దానికి సాక్ష్యులు. ఇప్పుడు, అది పరవాలేదు. దేవుడు దాని గురించి పూర్తిగా ఎరుగును, మరియు ముందుగా హెచ్చరించెను; మరియు మేము ఎరుగుదుము అది నా పొరపాటు, మరియు నేను ఒకదానిని కలిగియుండి… నేను తీసికొని వెళ్ళరాని ఒకనిని ఒకసారి నేను వెంట తీసికొని వెళ్ళాను. అతని కాలేయమును బయటకు చీల్చేవాడినే, చూచారా. దానిని చేయుటకు బదులు, నేనే వెల చెల్లించాను. అది పరవాలేదు; అది నేనే, మరియు ఇప్పుడు అది క్షమించబడినది, మనము ముందుకు సాగిపోవుదము, చూచారా.

AMOS 3:8

 

149అవును, ఈ 8వ వచనములో ఆమోసు చెప్పెను: "సింహము గర్జించగా భయపడని వాడెవడు?"

ఆఫ్రికా అడవులలో నేను వేటాడాను. సింహములున్న చోటకు నేను వెళ్ళాను. సింహము మృగములకు రాజు. రాత్రులందు అరణ్యములలో పరుండి సింహ గర్జనలు విన్నాను. వాటి గర్జన విన్నప్పుడు, నీ రక్తము గడ్డకట్టును. చిరుత పులులు, కోతులు, కీచురాళ్ళ ఇంకా అడవిలోని జంతువుల శబ్దములను విన్నాను. ఎటు వెళ్ళినా ఏదో ధ్వని వినబడును, కాని సింహము గర్జించగానే తక్కినవన్నీ నిశ్శబ్ధమైపోవును. అది మరణ కేక వలెయుండును. అవి నెమ్మదిగా ఉండిపోవును. ఎందువలన? వాటి రాజు మాట్లాడెను. ఆమేన్!

AMOS 3:8

 

150సింహము గర్జించగా, భయపడనివాడెవడు? దేవుడు మాట్లాడగా, ప్రవచించనివాడెవడు? దేవుడు మాట్లాడగా, ప్రవక్త పలుకును. నా భావము గ్రహించారా? నిజమగు ప్రవక్త పలుకును. స్నేహితులారా! ఆయన మాట్లాడెను! ఆయన రాజ్యములోని ప్రతి జీవి ఆయన చెప్పుదానిని జాగ్రత్తగా వినవలెను. ఏదో పొరపాటు జరిగెనని సింహము గ్రహించి గర్జించగానే దాని రాజ్యమంతా నిశ్శబ్దమగును, అవి వినును. చిన్న కీచురాళ్ళు, అయితే అవి కూడా సింహపు రాజ్యమునకు చెందినవే. రక్తమును చిందులు వేయు దుమ్ములగొండి (హైనా) కూడా కేకలు వేయక, మౌనముగా ఉండును. తన తొండముతో సింహమును ఎత్తి పారవేయగల ఏనుగు కూడా సింహము గర్జించగానే, మౌనమువహించును. తన నాసికా రంధ్రముల నుండి నిప్పులు కక్కు అడవి దున్న సింహ గర్జనకు నిలబడిపోవును. ఏడు టన్నుల బరువైన ఖడ్గమృగము సింహగర్జనకు ముందుకు అడుగులు వేయక ఆగిపోవును. ఏమిటది? వారి రాజు మాట్లాడెను, చూచారా. చెప్పుచున్న దానిని వినుటకు అవి నెమ్మదిగా ఉండును.

మరియు దేవుడు మాట్లాడగా, ప్రవక్త ప్రకటించును; మరియు అప్పుడు ఆయన రాజ్యవాసులు ఆయన చెప్పుచున్న దానిని జాగ్రత్తగా వినవలెను. దేవుడు మాట్లాడెను; ఆయన రాజ్యములోని ప్రతి జీవి ఆయన మాట వినవలెను. మనము ప్రార్ధించుదము.

AMOS 3:8

 

151ఓ, యూదా గోత్రపు సింహమా, లేచి గర్జించుము! ఈ చివరి దినమున నీవు గర్జించుచున్నావు. నీ కన్నులు చూడలేకున్నవి, నీవు క్రిందికి చూచుచున్నావు. ఈ నామకార్థ క్రైస్తవ దేశము, మరియు ఈ ప్రపంచము యొక్క పాపమును నీవు చూచుచున్నావు. ప్రశస్త రక్తముతో కొనబడిన ఈ దేశపు పాపమును నీవు చూచుచున్నావు. నీ వాక్యమును శాఖలు ఎట్లు తృణీకరించుచున్నవో నీవు చూచుచున్నావు, అబద్ధ ప్రవక్తలు అబద్ధమాడుచున్నారు; దేవుని సత్యమును వారు త్రోసివేయుచున్నారు.

ఓ, యూదా గోత్ర సింహమా, గర్జించు! నీ ప్రవక్తలను కేకవేయనీ! దేవుడు మాట్లాడగా, ప్రవచించని వారెవరు? బైబిలులో నుండి దేవుని వాక్యము బయటకు వచ్చుచున్నది. ప్రవక్త ద్వారా కదలివచ్చుచున్నది. అతడెట్లు ఊరకుండగలడు? నెమ్మదిగా ఉన్నయెడల, అతడు ముక్కలయిపోవును.

152ఓ, దేవా, నీ ప్రవక్తను గర్జించనిమ్ము, ప్రభువా! నీ వర్తమానము గర్జించనిమ్ము దేవా! నీ రాజ్యములోని ప్రతి జీవి జాగ్రత్తపడునట్లు చేయుము. వారు ఆగిపోవుదురు గాక! స్త్రీలు ఆగి తమ్మును తాము పరీక్షించుకొందురు గాక. మగవారు ఆగి, తమ్మును తాము పరీక్షించుకొందురు గాక. ఈ టేపును విను ప్రతి బోధకుడు ఆగి తనను తాను పరీక్షించుకొనును గాక. యూదా గోత్రపు సింహము గర్జించెను, నిజ వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చుచున్నది, "ఆలస్యము కాకముందే వెనుదిరిగి మారుమనస్సు పొందుడి!"

దేవా, ఈ టేపు మీది వర్తమానమును ఈ వినుచున్న జనుల సమక్షములో నీకు సమర్పించుచున్నాను. దానిని నీవు ఈ ఉదయము రుజవు చేసి ప్రతి దేవుని కుమారుని, కుమార్తెను పిలువుమని కోరుచున్నాను. ఈ టేపు స్వరము విని ఆలస్యము కాకముందే మారుమనస్సు పొందెదరు గాక!

ప్రభువా, ఇక్కడికి ఆమోసును నీవు పంపినయెడల, అతడును ఆలాగే కేక వేయునని నేను నమ్ముచున్నాను. అతడు ప్రభువు యొక్క ప్రవక్త అయినయెడల, అతడొక వాక్యమును పంపును. వాక్యము ద్వారా వాక్యముతో అతడిని పంపించును, మరియు అతడే వాక్యమైయున్నాడు. ప్రభువా, యేసుక్రీస్తు నామములో దీనిని జరుగనిమ్ము. ఆమెన్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...