ఒత్తిడిని విడిచిపెట్టుట
VGR COUNT-150 1రాడేల్ సోదరుడా, వందనములు సువార్త యందు ఒక కుమారుని నేను కలిగియున్నానని తెలిసికొనుటకు ఎంతో సంతోషించుచున్నాను. అవును, మంచిది. నేను నిశ్చయంగా సహో, రాడేల్నుఅభినందించుదును. మరియు ఒకప్పుడు పౌలుకు తిమోతీ అను కుమారుడున్నాడని నేను నమ్ముచున్నాను. అతడు సువార్తయందు పుట్టిన కుమారుడు అని అతనిని పిలచెడివాడు.
మరియు ఖచ్చితంగా నేను చెప్పలేను గాని, ఈమె ప్లాసీ ఫోర్డ్ కాదా? ఆలాగే మామూలుగా ఉండెడిది? ఎంత గొప్ప సంగతి. ప్లాసీ, నేను… చాలా కాలమయింది. అవును, చాలా కాలమయినది. నేను బాలునిగా ఉన్నప్పుడు నాకు గుర్తున్నది; ఆమె సోదరుడు లాయడ్, నేను కలిసి తిరుగుచుండెడివారము. ఆమె పెద్ద కేకులు తయారు చేస్తుండేది, మీకు తెలియును, మేము అక్కడికి వెళ్ళి జబ్బు చేసేటంత ఎక్కువగా తినెడివారము.
2ఒకసారి వారు నన్ను రమ్మని అడిగిన సంగతి గుర్తున్నది, లాయడ్, మేము. ప్లాసీ వండినది. అప్పుడామె చిన్నపిల్ల. ఆమె పెద్ద కేకును తయారుచేసెను - తినీ తినీ ఇక మేము తినలేకపోయాము. "ఇప్పుడు నేను రాత్రంతా లాయడ్తో ఉందును" అనుకొన్నాను. ఒక విధమగు చీకటి పడుట మీకు తెలియును, నేనప్పుడు ఇంటికి ఏలాగో వచ్చాను. వచ్చేయక తప్పలేదు, కనుక నేను చచ్చేభయంతో ఇంటికి వచ్చు ప్రయత్నములో రోడ్డు మీద పరుగిడసాగాను.
మరిప్పుడు ఆమె తండ్రి నాకు గుర్తున్నాడు. మీ తల్లి ఇంకా సజీవముగా యున్నదనుకొంటున్నాను, గదా? సరే, మంచిది. ఆ రోజులలో నుండి ఆ నదిలో ఎంతో నీరు పోతుండెడిది. అవును. ఇక్కడ మేమిద్దరము మధ్యవయస్కులముగా, తాతలుగా యున్నాము. సరే. కాని ఎన్నడునూ ముసలివారము కాని దేశము ఒకటున్నది. చూచారా? ప్లాసీ, నీవు ఆ దేశము కొరకు ఎదురు చూచుచున్నావని తెలిసికొనుటకు నేనెంతో సంతోషించుచున్నాను. మరియు దానిని కనుగొను నిశ్చయత నీకున్నది.
మరియు జిమ్, జిమ్ ఎట్లున్నాడు, అతడు. అది నాకు గుర్తున్నది. జిమ్ ఆమె భర్త నాకు ఆయన బాగా గురుతు. మరియు కొద్దిమంది పిల్లలను కూడా నేనెరుగుదును, మేము. వారు వివాహము చేసికొను సమయములో నేను సేవలో ప్రవేశించాను. మరియు వారి పిల్లలు ఎదిగిపోయిరి. మేము ఒక విధంగా, ఒకరి నుండి ఒకరము దూరమయ్యామని మీకు తెలియును.
అప్పుడప్పుడు సహో, లాయడ్ను నేను చూచుదును, వీధిలో అతనిని చూచి గట్టిగా కేకలు వేసి పలుకరించుదును. వారు నాకు నిజమగు సోదరీ సోదరుల వలె ఎన్నోసార్లు భోజనము తయారుచేశారు.
PS 42:7
3రోడ్డు ప్రక్కనున్న ఇంటిని ప్రభుని గృహముగా మార్చుటకు ఇక్కడ మొదటగా మద్దతు ఇచ్చినది సహో, రాడేల్ ఆయనను చూచుటకు నేను ఎంతో సంతోషించుచున్నాను. అది చాల మంచిది.
మరియు మీకు తెలియును. కొన్నిసార్లు, దేనినయినా ముందుగానే మీరు చూచినయెడల. ఆ తరువాత అది బాగుండును. కనుక ఈయనలో ఏదో ఉన్నదని ముందే మనము చూడగలము. ఈ బాలుడు సిగ్గుపడుచున్నాడు. ఇతని తండ్రీ, నేను కలిసి కొన్ని సంవత్సరముల క్రితము పని చేశాము. ఇతని తండ్రి చక్కగా ముందుకు దూసికొనిపోగల వ్యక్తి, మరి ఈ కుర్రవాడు మాత్రము ఎందుకాలాగు ఉండడు? అతనికి ప్రియమైన తల్లి యున్నదని నాకు తెలియును. కనుక అతని వెనుక మంచిది ఏదో యున్నది. అతడు సరిగ్గా నడిపించబడుచూ యున్నాడు. మీరు చూచారా? ప్రభువును సేవించవలెనను అతని హృదయ ఆకాంక్ష. కరడు కరడును పిలిచినప్పుడు, ఆ పిలుపునకు జవాబునిచ్చు కరడు ఒకటి ఉండవలసియున్నది. మరియు సహో, రాడేల్ ముందుకు కొనసాగుట చూచి నేను ఎంతో సంతోషించుచున్నాను.
4ఇక్కడ అద్భుతమగు జనుల గుంపు యున్నది. మరియు ఈ రాత్రి ఇక్కడికి ప్రయాణము చేసి వచ్చిన ఈ పరిశుద్దుల గుంపుతో మాట్లాడుటకు నేను ఇక్కడకు వచ్చుట నాకు గొప్ప భాగ్యము. మనము కాదు. ఇది మన నివాస స్థలము కాదు, మీకు తెలియును. మనము యాత్రికులము. మనము - మనము - ఇంటియొద్ద లేము.
మరియు నాకు గుర్తున్నది, రాడేల్ సహోదరి, ఎట్లు ఆయనతో వచ్చి కూర్చున్నదో అతడు తన తలను క్రిందికి దించుకొనును. మరియు మీకెంతో నమ్మకమున్నది. వారు నిశ్చయంగా కలిగియున్నారు. అతడు సువార్తను బోధించునని ఆమె విశ్వసించెను. కనుక అటువంటి మంచి భార్యతో తల్లి, తండ్రి అతని కొరకు ప్రార్ధి౦చుచుండగా ఏదో జరుగవలసి యున్నది, రాడేల్ సోదరుడా. కనుక అదిక్కడున్నది. ఇది నీవు నిలబడు స్థలముగా ఉండవలెనని నేను ప్రార్ధిచుచున్నాను రాడేల్ సోదరుడా. సువార్త మహిమ కొరకు నీవు మహోన్నతముగా ఎదిగిపోవలసిన స్థలమిది.
5దాని గూర్చి ఈ రాత్రి సహోదరి మరియు సహోదరుడు రాడేల్, అక్కడ మాక్స్ నిజంగా సంతోషంగా యుందురని నాకు తెలియును. బలిపీఠము మీద బిల్లీ పాల్ నిలబడి యుండగా చూడవలెనని నాకెంతో ఇష్టముగా యున్నది. ఒక దినమున జోసెఫ్ వేదిక మీద నిలబడుట చూచుటకు జీవించెదనని ఆశించుచున్నాను. మరియు అది బహు మంచిది.
మనము యుక్త వయస్సులో నున్న పిల్లలను, యవ్వనులను పెంచుటలో పడిన శ్రమలు, పాటు అప్పుడు చూచి ఎన్నతగినవి కావనుకొందుము. వెనక్కు తిరిగి నీ తండ్రి యొక్క నెరసిన వెడ్రుకలు మొదలగునవి చూచి గుర్తు తెచ్చుకొనుము, మీరు చేసిన కొన్ని పొరపాట్ల వలనే ఆలాగు జరిగినది, అది నిజము.
6సరే, ఇక్కడుండుట మంచిది, మరియు నాకు కొద్దిగా గొంతు బొంగురుపోయినది. నేను బోధించుచునేయున్నాను. నిన్న జిని గోడ్ మరియు నేను కలిసి చిన్న ప్రయాణము అటు దిగువగా చేశాము. చేపలు ఎర తింటున్నవి. మాకు చక్కని సమయము దొరికినది. ఆలస్యంగా వచ్చాము. కొద్దిగా మేము నీటిలో దిగినందున చిన్నగా జలుబు చేసినది, కాని మీరు నా పట్ల సహనము చూపుదురని నమ్ముచున్నాను.
ఇప్పుడు, సుమారు తొంబది దినముల ఎండాకాలపు కూటములకు మేము వెళ్ళవలెనని నిశ్చయించుకొన్నాము. ఆగస్టు చివరిలో గాని లేదా సెప్టెంబరు మొదటలో గాని మేము వచ్చుదుము. ఇప్పుడు మేము వెళ్ళుచున్నాము. ఈ వారము మిషిగాన్లోని, గ్రీన్ బేలో ప్రారంభించుదును. హైస్కూలు నొద్ద జరుగు సమావేశమునకు ఆదివారము మధ్యాహ్నమునకు షికాగో గుండా వచ్చుదుము. విస్కాన్సిన్లోని గ్రీన్ బేలో అసలు క్రైస్తవ వ్యాపారస్తుల కూటములో నేను మాట్లాడనైయున్నాను. తరువాత సోమవారము షికాగోలోని ఒక కన్వెషనల్ కూటములో ఉందును, సహో, జోసెఫ్బోజ్ కొరకు ఒక మిషనెరీ ర్యాలీ నిర్వహించుదుము. అప్పుడు ఇంటికి వచ్చి ఉత్తర కరోలినాలోని సదరన్ పైన్స్లోను, మరియు దక్షిణ కరోలినాలోను, లాస్ ఏంజెల్స్ లోని సౌత్ గేటు యొద్దనున్న కౌ పాలెస్లోను మాట్లాడుటకు వెళ్ళుదును. ఆ కూటమునకు నలుబదికి పైగానున్న ఏకత్వపు సంఘములు మద్దతు నిచ్చుచున్నవి. నా కూటమునకు ఏకత్వము వారు మద్దతు నిచ్చుట ఇదియే ప్రధమము.
అప్పుడు అక్కడి నుండి - కాలిఫోర్నియో మీదుగా ఓరెగాన్, అక్కడ నుండి కెనడాలోనికి అక్కడ నుండి అలాస్కాలోని ఆంకరేజ్కు వెళ్ళి తిరిగి ఆకురాలు కాలమునకు ఇంటికి వచ్చెదను. మరియు సహో, జోసెఫ్ బోజ్కెన్యా, టాంగానియా, ఆఫ్రికాలోని డర్బన్ మరియు దక్షిణాఫ్రికాలకు వెళ్ళి ఆకురాలు కాలముయొక్క అంతమందు జరుగు కూటములను ఏర్పాటు చేయును.
ఈ స్థలములలో ఏ స్థలమునకును వెళ్ళుటకు చెప్పాలంటే నాకు నడిపింపు లేదు. కాని ఎక్కడో ఒక చోట విత్తనములను చల్లుచుండవలెను. పరలోకరాజ్యము కొరకు నేను చేయగలిగినది చేయవలెను.
JOHN 5:24•
JOHN 14:13•
JOHN 15:16
7మరియు ఇప్పుడు, మరల మనము ప్రార్ధి౦చుట కొరకు తలలు వంచుదము, మనము ప్రార్ధన చేయలేదని కాదు, కాని నేను ప్రభువును ఇక్కడ కొన్ని మాటలు మీకు చెప్పుట కొరకు దయచేయుమని అడుగగోరుచున్నాను.
మా పరమ తండ్రీ, ఇప్పుడు ప్రభువైన యేసు నామము ద్వారా నీ కృపా సింహాసనమును మేము సమీపించుచున్నాము, ఆయనే మాకు అనుమతిని ఇచ్చి, రమ్మని అజ్ఞాపించెను. మరియు మేము సమీపించినప్పుడు మేము అడిగిన వానిని పొందుదుము. ఇప్పుడు నీ తీర్పులో నిలబడమని మమ్మును మేము అడుగము, కాని మేము కృపను పొందునట్లుగా కృపా సింహాసనము నొద్ద నిలబడగోరుచున్నాము, మేము తప్పిదములు చేసితిమనియు, మాలో ఏ మంచిలేదనియు ఒప్పుకొనుచున్నాము. కాని ప్రభువా, మమ్మును మేము నీకు సమర్పించుకొనుచున్నాము, ప్రభువా, మరేమియూ అర్పించ జాలము, మా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రార్థనను, ఆయన చెప్పిన ఆజ్ఞను ఈలాగున్నట్లుగా గుర్తుచేసికొనుచున్నాము. "నా మాటలు విని, నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడే నిత్యజవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు." అది మేము నమ్ముచున్నాము. మమ్మును రమ్మని ఆయన చెప్పెను, ఆయన నామములో ఏది అడిగిననూ పొందుదుమని చెప్పెను. అది మేము నమ్ముచున్నాము.
8మా విశ్వాస ప్రాతిపదిక మీద మేము వచ్చి, ఈ సంఘమును మరియు మూ ప్రశస్త్ర సోదరుడు సహో, రడేల్, అతని కుటుంబము మరియు ఇక్కడ చేరిన ప్రతి కుటుంబమును దీవించమని అడుగుచున్నాను.
నేను జనుల వైపు చూచుచుండగా ఇక్కడ శ్రీమతి మోరిస్క్ కనబడినది. గతించిన దినములయొక్క ఎన్నో ఆలోచనలు వచ్చినవి. దేవా, ఆమెతో నేను చెప్పినట్లుగా ఎన్నో నీళ్ళు ఆ నదిగుండా పొర్లిపోయినవి. మరియు ఎన్నో అపాయములు, శ్రమలు, ఉరులు దాటిపోయినవి. ఇప్పటికే వాటిగుండా నీవు మమ్మును తీసికొని వచ్చావు, ప్రభువా, మరియు మార్గంతము వరకు మేము వెళ్ళుదుమను నమ్మకము నీయందు మాకున్నది.
ఈ స్థలమును దీవించుము. ప్రభువా, నీ నామమును ఇక్కడ ఉంచుము, మరియు ఈ చోటునకు నీవు కేటాయించిన శ్రేష్టమగు దానిని వారికి దయచేయుము. ఈ రాత్రి ఇక్కడ సోదరుడు ప్రార్థన చేసిన రీతిగా ఏ కీడును. సమస్త ఆటంకములను నీవు తీసివేయుమని ఈ యువకుడు ప్రార్ధి౦చియున్నాడు. ప్రభూ, అది అనుగ్రహించుము. అతని ప్రార్థనకు జవాబు ఇమ్ము.
మా మధ్యనున్న రోగులను బాగుచేయుము. నీతి కొరకు ఆకలిదప్పులు గొనుచున్న ఆత్మలకు రక్షణను ఇమ్ము మరియు ఇప్పుడు, ప్రభువా, ఈ స్వరమును - నీ ప్రయోజకుడగు నీ దాసునియొక్క ప్రయత్నములను శుద్ధిచేయుము. నీ వాక్యమును దీవించుము, అది తిరిగి వ్యర్ధముగా రాకుండునుగాక! కాని - అది ఎందుకొరకు ఉద్దేశించబడినదో ఆ పనిని అది నెరవేర్చును గాక. ఈ రాత్రి దేవుని సంగతులను పరిశుద్ధాత్మ స్వీకరించి చిన్నది మొదలుగొని పెద్దదాని వరకు మా హృదయములను ప్రోత్సహించుము. దీనిని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
9ఈ ఉదయమున చాలాసేపు నేను ప్రసంగించాను. బోధించుట గురించి నాకు తెలియదు. నేను ఒక విధమగు ఆదివారపు బడిపాఠమును బోధించుచున్నాను. ఒక రోజు నేను ఆరు గంటల సేపు బోధించాను. అది ఈ రాత్రికి బాగుండదని నిశ్చయంగా నేనెరుగుదును.
కాని ఇక్కడ నాకిష్టమగు ఒక చిన్న అంశమునుండి కొద్ది వాక్యమును చదువవలెనని కోరుచున్నాను, ఎందుకనగా ఆయన మాటలు తప్పిపోవని నేనెరుగుదును. నా మాటలు - తప్పిపోవచ్చును. నేను ఆయన మాటతో నా మాటను సరిగ్గా జోడించుటకే ప్రయత్నించుచున్నాను. ఆయన వాక్యమును తీసికొని - నా మాటను తీసికొని ఆయన వాక్యము చుట్టూ ఒక అంశమును నిర్మించవలెనని కోరుచున్నాను, ఒక అంశము కొరకు అది వాడుకొందును.
PROV 18:10•
ISA 32:2
10ఈ రాత్రి రెండు స్థలములలో నుండి చదువవలెనని కోరుచున్నాను. సామెతలు గ్రంథము 18వ అధ్యాయము 10 వచనము ఒకటి. యెషయా 32:2 మరొకటి. ఇప్పుడు సామెతలు 18:10:
యెహోవా నామము బలమైనదుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.
యెషయా గ్రంథము 32 అధ్యాయము 1, 2 వచనములు.
ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్యపరిపాలన చేయును. అధికారులు న్యాయమును బట్టి యేలుదురు.
మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను గాలి వానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ళ కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును.
11ఇప్పుడు నేను బోధించబోవు అంశము: "ఒత్తిడిని విడిచిపెట్టట." అది చాలా వింత అంశము. "ఒత్తిడిని వదలుట." నేను దీనిని ఎన్నుకొనుటకు కారణము నేను ఒక కూటమునకు వచ్చు ముందుగా ఎల్లప్పుడును ప్రార్ధి౦చి, ప్రభువు నొద్ద వెదకుటకు ప్రయత్నించుదును. ఆ సంఘము చిన్నదయినా, పెద్దదయినా, ఒక్కరయినా, మిలియను మంది అయినా నా ప్రభువును మహిమపరచుటకు ఏదో చేయకుండా అక్కడ నేను కనబడగోరను, వినిపించగోరను. కాబట్టి, జనులయొక్క అవసరతను చూచునప్పుడు….
ఏదో వినిపించవలెనని ఇక్కడికి నేను రాను, ఎందుకనగా మంచి వ్యక్తను నేను కాను, స్వరము బాగోదు, విద్యగలవాడిని కాను, నా అంశము మీద ఎన్నడూ నిలబడియుండను. ఆదికాండము నుండి ప్రకటన వరకు ఎగురుచుందును. నేను ధారాళముగా చెప్పగల వానిని కాను, కాని ప్రభువును ఎంతో నేను ప్రేమించుచున్నాను. మొదట నేను ఆయన జనులను ప్రేమించనిచో ఆయనను నేను ప్రేమించలేను, చూచారా? నేను ఆయన ప్రజలను ప్రేమించవలసియున్నాను. కనుక ఆయన ప్రజలను నేను ప్రేమించినచో, నేను ఆయనను ప్రేమింతును.
12మరియు అప్పుడు, నేను ఆయన చేసినట్లుగా చేయగోరుదును. నా లక్ష్యములు ఆయన లక్ష్యముల వలెనె యుండునట్లుగా చూచుకొందును. ఎల్లప్పుడూ మేలు చేయుటకు, ఎవరికో సహాయము చేయుటకు ప్రయత్నించుట అందువలననే. మనము జీవించుచున్న ఈ దినమును చూచుచూ, ఇక్కడున్న ఈ సంఘమునకు గొప్ప కాపరి యున్నాడని ఎరిగియుండి.
అది పొగడ్త కొరకు చెప్పుటలేదు. దానిని నా హృదయము నుండి చెప్పుచున్నాను. ఏదైనా వేరుగా నేను చెప్పినచో, వేషధారినవుదును. ఏది వచ్చినా, ఏది పోయినా గాని లెక్కచేయక సత్యము మీద నిలబడు సంఘకాపరిని ఈ సంఘము కలిగియున్నదని నేను నమ్ముచున్నాను. అది నా నమ్మకము. మరియు నా కుమారుని యందు నాకు గల నమ్మకము అది. అది నేను నమ్ముచున్నాను. అతడు ఉండవలసినంత నిర్భయుడు. అతడు ఘనుడగు, పరిశుద్దుడగు, ఈ చివరి దినపు సేవకోరకై దేవుని చేత పంపబడినవాడునై యున్నాడు. నేను ప్రసంగించుచున్న ఈ వాక్య భాగము నుండియే అతడు బోధించును. అనగా ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు, ఏలాగు వ్రాయబడియున్నదో ఆలాగే బోధించును. నాకది ఇష్టము, ఏ రాజీలేదు, వాక్యముతోనే నిలచియుండుడి. అది నాకు ఇష్టము.
13కాని అప్పుడు నేను ఈలాగు తలంచాను అటువంటి మనిషిని కలిగియుండి, నేను అతని వేదిక వెనుకకు వచ్చి ఇంకా యువకునిగా ఉన్న నేను, అతని సంఘమునకు సహాయపడునది ఏది చెప్పగలను? అయితే అతడు అందుకే నన్ను రమ్మని కోరెను. అతడు ఒక సంఘకాపరి, అతడు తన గొర్రెలను కాయుచున్నాడు. అతడు తన ప్రజలకు సహాయపడునది ఏదో కొద్దిగా మార్చి అందించవలెనని ఇప్పుడు అనుకొంటూ యుండవచ్చును. అతడు మీయందు ఆసక్తి చూపుచున్నాడు, మీ సంక్షేమము కొరకు శ్రద్ధ చూపించుచున్నాడు. పగలనక రాత్రనక, ఏ సమయములోనయినా గాని, ఎక్కడికయినా గాని వెళ్ళి తాను చేయకలిగిన సహాయము అందించుటకు వెళ్ళును. మంచిది - అదే నిజమగు దైవదాసుని లక్షణము.
14అతడు నన్ను తొందరపెట్టినట్లుగాను, తెగులుకు గురి చేసినట్లుగాను, వ్యాధికి గురి చేసినట్లుగాను, మరేదో చేసినట్లుగాను చెప్పెను. అటువంటిదేమీ అతడు చేయలేదు. అది అతనిని మరీ ఎక్కువగా నేను ప్రేమించునట్లు చేసినది. "అది నేను ప్రేమించుచున్నాను" గనుక అతడు ఎడతెగక అడుగుచునే యున్నాడు, ఎందుకనగా అతనికి నమ్మకము గలదు. అది. ఒకవేళ నేను బాధకరముగా మాట్లాడినచో అతడు ఆలాగు నాతో చేయించుటకు ఈ గొర్రెల ఎదుట నన్ను తీసికొని రాలేదని గ్రహించండి. లేదు. ఏ కాపరియు ఆలాగు చేయడు. ఎందుకనగా నేను సరి అయినది చేయుదునని అతడు తలంచును. నన్ను రమ్మని అడుగుటకు వచ్చినప్పుడు అతడు నా కొరకు చెల్లించుట గొప్ప భాగ్యము. అతని ఉద్దేశ్యములు నాకు ఇష్టము, అవి జరుగు వరకు అతడు ఆలాగే కనిపెట్టియుండును. అతడు విశ్వాసము గల మనిషి నాకది ఇష్టము.
అప్పుడు నేను ఈలాగు అనుకొన్నాను, "ఈ జనులతో నేనేమి మాట్లాడుదును?" "సరే, వారు అన్ని విషయములలో చక్కగా తర్ఫీదు పొందియున్నారు, సందేహము లేదు." అనుకొన్నాను. కాని నేడు ప్రజలలో ఒక ఒత్తిడి యున్నది. ఆ ఒత్తిడికి ఏ హద్దు లేదు, ఏ శాఖయు గీతలు గీయలేదు. దానికి కాలపు గీతకూడా లేదు. దానికి ఏ వ్యక్తియొక్క భయము లేదు. అది వృద్ధుల మీద, యౌవనుల మీద, మంచివారి మీద, చెడ్డవారి మీద, ప్రతి ఒక్కరి మీద - ఆ ఒత్తిడి యున్నది.
15మనము నరముల తీవ్రత, ఉద్రిక్తతగల యుగములో జీవించుచున్నాము. ప్రతివారు పందెపు రంగములో వలె ఇటు, అటు వెళ్ళుచున్నారు. శూన్యము లోనికి పోవుచున్నారు. ఇది అటువంటి కాలము, అన్నిచోట్ల అనారోగ్యమున్నట్లుగానే ఈ సంఘము కూడా ఆ వ్యాధిలో మొత్తబడియున్నది అని నాకు తెలియును. గుడారము దానితో జబ్బు పడినది. ఎక్కడ చూచినా, ప్రపంచమంతయూ ఆలాగే యున్నది.
ఇది ఒత్తిడి దినము. తొందర, తొందర, తొందర, తొందర, తొందరగా వెళ్ళిపోవుట మరియు కనిపెట్టుట. గంటకు తొంబది మైళ్ళ వేగముతో కారు నడుపుకొని వెళ్ళుట- ఇంటియొద్ద భోజనము చేయుటకు వచ్చి మరియు అది సిద్ధమగు వరకు రెండు గంటలు ఎదురు చూచుట. అది నిజము! ఇది ఆ సమయము. ఆ దూకుడులో, ఆ వేగములో నీకు నరముల ఉద్రిక్తత ఏర్పడును, భార్య ఏదయినా చిన్న మాట వేరుగా చెప్పినచో కోపముతో ఎగిరిపడుదువు. భర్త ఏదయినా చెప్పినచో నీవు నీ కాలు నేలకు గట్టిగా బాదుకొని గదిలోనికి పొమ్మని కసురుకొందువు. చూచారా? "సరే. ఏమండోయ్, భర్తగారూ, ఇప్పుడు మీ మాటలు నాకేమి అక్కర్లేదు. అక్కడికి పొండి."
"భార్యా ఓ! నేను చాలా ఉద్రిక్తతలో యున్నాను" చూడండి. ఎందువలన? ఏమిటి సంగతి? చూచారా?
16ఇదంతా కలిసి ఉద్రికత్తను ప్రోగుచేసి, అప్పుడు దాని ఫలితములను చూపించును. దానివలన ఏదో పొరపాటు చేయుట; ప్రవర్తించరాని రీతిగా ప్రవర్తించుట. అది నిజము! దానివలన అంత నీచ రీతిగా ప్రవర్తించుట జరుగును. పేదవారు ఆలాగు ప్రవర్తించుటకు, మధ్యతరగతి వారు, ధనవంతులు అందరునూ ఆ విధముగా ప్రవర్తించునట్లు చేయునది అదే. ఆ విధముగా తప్పు ప్రవర్తనకు అదే కారణము. మంచి అందమగు ప్రవర్తనకు ఒక్కోసారి అదే కారణము, ఎందుకనగా అది తీవ్రత, ఆవిరి పోగవును. దానిని ఎక్కడో ఒకచోట విడిచిపెట్టవలెను, చూచారా? లేనిచో, నీవు ఆ బాయిలర్ను ప్రేల్చివేయుదువు.
ఇదంతా దానిని మనము కనుగొన్నాము. దినము గడచుచుండగా అది పేరుకు పోవుచుండును. నీవు పని చేయుచున్నచో నీవు నీ యజమానితో "ఓ!మంచిది. అది ఆలాగా!" అందువు. నీవు చిన్నబిడ్డతో మాట్లాడుచున్నచో "ఇక్కడికి రా" అందువు. "అమ్మా నేను ." చూడండి. మీరు ఆ స్థితిలో యున్నారు. అది పెచ్చు పెరుగుచున్నది. హూ! చూచారా? మీరు మీ తల ఊడిపోవునట్లుగా భావించుచుందురు. నాకు తెలియును; నేను ప్రతి దినము దానితోనే ఉంటున్నాను. కనుక అది ఏమిటో నాకు తెలియును. అది వృద్ధిపొందుచున్నది.
17నేను, దీనిని గూర్చి ఒక రాత్రి నేను ఆలోచించాను. నేను ఒక వైద్యశాలలోయున్నాను. మా పాస్టరు గారు జబ్బుపడినారని అనుకొంటాను. కాని ఆయన పూర్తిగా అలసిపోయెను. పరుగు, పరుగు, పరుగు పూర్తిగా అయిపోయేవరకు పరుగెత్తెను. కొందరు ఈలాగు చెప్పారు, వారు పిలిచారు. అక్కడున్న కార్యాలయమునకు వారు ఫోను చేసిరి. ఆఫీసు పిలుపులను నేను చేయవచ్చునా అని అడిగాను. నేను దినమంతా వ్యాపార కార్యకలాపాలలోనే యున్నాను, చాలా స్థలముల నుండి సేవకులు పిలిచారు, మరియు నేను "అవును" అని జవాబిచ్చాను.
ఆయన ఫోను పిలుపులను చేయుటకు నేను వెళ్ళాను. నేను ఒక ప్రత్యేక ఆస్పత్రికి వెళ్ళాను. ఒకామె యొక్క పేరు వారు నాకిచ్చి ఆమె ఎక్కడుండునో ఆ నంబరు చెప్పిరి. నేను ఆ గదికి వెళ్ళుచున్నాను. ఆ స్త్రీయొద్దకు వెళ్ళాను. దర్శించువారిని అనుమతించుటకు ఇంకా దరిదాపు పదిహేను, ఇరవై నిమిషముల సమయమున్నది. కనుక నేను వెళ్ళి ఆమెతో నేను సేవకునిననియు, పలాని స్త్రీని చూడగోరుచున్నాననియు చెప్పాను. ఆమె నా ముఖములోనికి చూచినది- అప్పుడామె ఏదో చేయుచున్నది - మొదట ఆమె చుట్టూ చూచి, "మీకేమి కావలెను?" అని అడిగినది.
"ఈ వార్డులో పలాని, పలాని ఆమె ఎక్కడున్నదో నేను తెలిసికొనగోరుచున్నాను" అనడిగాను.
"నాకు తెలియదు" అని అన్నదామె.
"సరే. నాకు ఒక నంబరు ఇయ్యబడినది, స్థలము చెప్పబడినది, మొదట అది అడగాలనుకొన్నాను." అని చెప్పాను.
"మీ యొద్ద నంబరున్నచో, వెళ్ళి చూచుకొనండి" అన్నదామె.
"వందనములు," అక్కడికి నేను వెళ్ళాను. వారు యొద్దనున్న తలుపు వద్దనున్న వారితో "పలాని పేరుగల ఆమె ఇచ్చటున్నదా?" అనడిగాను.
"లేరు…''
సరే. నేను వెనుకకు వెళ్ళి నా టిక్కెట్టును చూచుకొన్నాను. అందులో అదే చెప్పబడినది. కనుక నేను మరల వెనక్కి వెళ్ళాను. ఆమె అక్కడే నిలబడియున్నది. "అది తప్పు నంబరండీ" అన్నాను నేను.
"ఆమె పేరు ఏమని చెప్పారు?"అని. "ఆమె ఈ అంతస్తులో లేదు"అని చెప్పెను.
"వందనములు" "పై అంతసుకు వెళ్ళెదను" అని చెప్పాను.
18కనుక నేను మరుసటి గదికి వెళ్ళాను. ఆ బల్లయొద్ద ఒక డాక్టరు కూర్చొనియుండెను. నేను - అక్కడాయన తల గోక్కొనుచూ కూర్చొండెను. "ఎలా ఉన్నారు?" అన్నాను. అతడు పైకి చూచెను, క్రిందికి చూచెను. "సరే," "ఇతని జోలికి పోకుండుటయే మంచిది" అనుకొన్నాను. అప్పుడు నేను ఇంకా క్రిందికి వరుసకు వెళ్ళి చూడగా అక్కడ బల్లయెుద్ద ఒకామె కూర్చొన్నది. ఒక నర్సు. "క్షమించండి" అన్నాను.
"మీకేమి కావలెను?" అన్నది.
"పలాని, పలాని పేరుగల ఒక స్త్రీ ఇక్కడున్నదా?" అనడిగాను.
"నాకు తెలియదు" అని ఆమె జవాబిచ్చెను. మరియు నేను చెప్పాను. ఆమె చెప్పినది.
"నేను వెళ్ళవలసిన గది 321 లేదా221 అని అనుకొన్నాను, "నేను ఆ గదికి వెళ్ళాను గదా. అక్కడెవరూ లేరే?" "ఈక్రింద ఎవరూ ఆ పేరుగలవారు లేరు" అని ఆమె చెప్పెను గదా? బహుశాపై అంతసులో యుండవచ్చును.
"అయితే మీరు గది నెం.321కే ఎందుకు వెళ్ళి చూడగూడదూ?" అని ఆమె అన్నది.
"మీకు వందనములు" అని చెప్పి 321కి నేను వెళ్ళి "పలాని పేరుగల స్త్రీ ఇక్కడున్నదా?" అనడిగాను.
"లేదు."
అక్కడ ఒకామె పరుండియున్నది. ఆమె నాతో, "ఆమె ఆ గదిలో, ఆ 31లో అవతలయున్నది" అని చెప్పెను.
"అమ్మా! మీకు వందనములు." అని చెప్పి నేను నడిచి వెళ్ళాను. "ఇక్కడ పలాని, పలాని స్త్రీయున్నదా?" అనడిగాను.
"లేదు, వారామెను బయటకు తరలించారు. ఆమె క్రింది అంతస్తులో యున్నది" అన్నారు.
19"ఓహో! నేను అనుకొన్నాను. మరల నేను క్రింది అంతస్తునకు వెళ్ళాను. వారు నాకు గది నంబరు ఇచ్చారు. నేను క్రింది భాగమునకు వెళ్ళాను. అంతా చూచాను. మరల నేను ఆబల్ల యొద్దకు వెళ్ళుటకు వెనుకాడాను. కనుక నేను క్రిందికి పైకి చూస్తూ ఆ గది నంబరు కనుగొనుటకు ప్రయత్నించుచున్నాను. వెదికాను. కాని అది కనుగొనలేక పోయాను."
ఈ వైద్యశాలలో వారు చిన్న రెక్కలను, మరేదో దానిని కత్తిరించుచుందురు. కనుక ఒక డాక్టరు తన చేతిలో స్టెతస్కోప్ (stethoscope), సాచెల్ (చిన్న బ్యాగు) పట్టుకొని వచ్చుచుండెను. నాలుగు అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు గల మనిషిని ఎన్నడూ నేను చూడలేదు. కాని అతడు సరిగ్గా సరిపోయినాడు. అతడు అక్కడికి నడచి వచ్చుచుండెను. "శుభసాయంకాలమండీ! పలాని ఆ గది నంబరు ఎక్కడున్నదో కాస్త మీరు నాకు చెప్పగలరా?" అనడిగాను.
"ఈ పైకి వెళ్ళి అటువైపు తిరగండి" అన్నాడు.
"మీరిచ్చిన సమాచారమును బట్టివందనములు" అని నేను అన్నాను.
అది సత్యము, "ఇటు పైకి, అటు వైపుకు" అని ఆయన చెప్పెను.
"వందనములు" అని చెప్పుకొంటూ వెళ్ళుచున్నానుగాని "ఇంకా ఎక్కడికీ రాలేదు గదా!" అనుకొన్నాను.
20నేను వెనుకకు చూచాను. ఒక విధముగా కనబడుచున్న స్త్రీ ఆ బల్లయొద్ద మరల కూర్చొనియున్నది. ఆమె యొద్దకు వెళ్ళి "శుభసాయంకాలము" అని చెప్పాను.
"మీరెట్లున్నారు" అని ఆమె అడిగినది.
"అమ్మా! నేను పూర్తిగా తికమకపడియున్నాను" అని నా గాధంతయూ ఆమెకు చెప్పాను. "ఇక్కడ ఎక్కడో ఒకామె ఉదయమందు శస్త్రచికిత్స కొరకు వచ్చియున్నది, మరియు ఆమె మరణావస్థలో యున్నది. నేను ఒక సేవకునిని. అక్కడున్న మా సంఘ కాపరి ఫోనులకు జవాబు ఇవ్వలేనందున, వారు నాకు ఈ నంబరు ఇచ్చారు" అని చెప్పాను.
"ఒక్క నిమిషము వేచియుండు సహో, బ్రెన్హాం, నేను కనుగొందును," అన్నదామె.
"ప్రభువా, నీకు వందనములు" అని చెప్పాను.
ఆమె అంతయూ పడవేసి అక్కడికి వెళ్ళి కనుగొని. "ఓ" అని ఆమె పలుకగా,"అవును, బ్రెన్హాం సహోదరుడా. ఆమె ఫలాని-ఫలాని గదిలో నీ ఎడమ వైపు, ఇటుగా యున్నది" అని చెప్పెను.
"మీకు చాలా వందనములు" అని చెప్పాను, నేను అటు ఇటు కలియచూచి ఈలాగు అనుకొన్నాను, "ఆవిరిని బయటకు విడిచిపెట్టుట ఇదే."
1PET 5:8
21ప్రతివారునూ. ఇది ఒక నరముల ఉద్రికత్తను కలిగించు యుగమవుచున్నది. ప్రతివారు ఏదో ఉద్రిక్తతతో నిండియున్నారు. సమయము చాలుట లేదు. చివరకు దానివలన కొన్నివిషయములను పగులగొట్టు స్థితికి వచ్చుచున్నాము. దానివలన ప్రజలకు కఠినమగు అనుభూతులు కలిగి వస్తువులను విసిరివేయుట, అనరాని మాటలు అనుట జరుగుచున్నది.
ఇప్పుడు, దానివలన ప్రతివారునూ దోషులే. నేను దోషిని; నీవు దోషిని; మనము చేయరాని క్రియలు ఆ ఒత్తిడి క్రింద చేయుచున్నాము. లేనిచో మనము ఆ పనులు చేయము. కాబట్టి ఒక అతి ఉద్రిక్తత, ఒత్తిడి మనలో పేరుకుపోయి యున్నది. ఇంకా ముందుకు వెళ్ళకముందే నేను ఇది చెప్పవలెను. శత్రువు వచ్చి ఒత్తిడిని కలుగచేయుచున్నదని నేను తలంచుచున్నాను. అది ఒక అపవాది అని నేను నమ్ముచున్నాను.
ప్రభునియొక్క రాకడ సమీపముగా యున్నదని మనకు తెలియును, మరియు చివరి దినములలో అపవాది గర్జించు సింహము వలె తిరుగులాడునని బైబిలు చెప్పెను. వాడు నిన్ను గాని ఒత్తిడి క్రిందకు, తొందర క్రిందకు, దేనికొరకో పరుగెత్తుటకు తీసికొనివచ్చినచో నీవు చేయని తీర్మానములు చేయుదువు. నీవు కూర్చొని ఆలోచించినచో ఆలాగు నిర్ణయములు తీసికొనవు.
22సుమారు మూడు సంవత్సరముల క్రితము నేను ఒక వేట పర్యటనలో యున్నాను. మరియు నాకు ఒక ఇండియను మార్గదర్శి యుండెను. మరియు నేను బహు వేగముగా వేటాడుదును. ఆ ఒత్తిడి ఎక్కువగా కూడియుండు వారిలో నేను ఒకడిని. (మీరు చూచారా?)
నేను ఇండియనుతో కలిసి వేటాడుచున్నాను, నేను గుర్రము దిగిపోయాను. మరియు కొండమీద ఒక ఎల్క్ జంతువున్నది. నేను ఆ మూలకు తిరగనారంభించాను. ఆ ముసలి ఇండియను నా కంటె దాదాపు పది సంవత్సరముల పెద్దవాడు. అతడు కేవలము, నా వెనుక మార్గదర్శిగా వచ్చెను. "ముందుకు రండి. ప్రధానిగారూ, ముందుకు రండి" అని చెప్పాను.
"చాలా త్వరగా, చాలా వేగముగా పోతున్నారు" అన్నాడు.
"ఓ! సరే." అనుకొని "రండి" అన్నాను.
నేను నడవసాగాను. అతడు "చాలా వేగముగా వెళ్ళుచున్నారు" అన్నాడు. నేను వేగము తగ్గించాను. గేరుమార్చాను. "ఇంకా వేగముగా" నేను నడుచుచున్నాను. "చాలా వేగము."
ఓ! "ప్రధానిగారూ, ఆ ఎల్క్ (elk) మృగము ఆ పైన యున్నది" అన్నాను.
"అక్కడే ఉండనీయండి. మనము వెళ్ళుచున్నాము గదా?" అన్నాడు.
"అది నిజమే అనుకొనుచున్నాను" అని పలికాను.
"దానిని అక్కడే ఉండనీయండి. మనము వెళ్ళుచున్నాము" "బోధకుడు చాలా వేగముగా వేటాడుచున్నాడు, జంతువులన్నీ భయంతో చెదరిపోవుచున్నవి." "ఇండియనువలె వేటాడండి. ఒక్కసారి నడక, తొమ్మిది సార్లు చూపు" అని అతడు చెప్పాడు.
23అక్కడికి వెళ్ళి చేరుటకు ఓ! మై నేను ఏ గేరులో వెళ్ళవలెనా అని ఆశ్చర్యపడుచున్నాను. నేనయితే ఆ పర్వతము మీదికి పరుగెత్తేయగలను. కాని ఇతడు "ఒక్కసారి నడు, తొమ్మిది సార్లు చూడు. నీవు మరో అడుగు వేయు ముందు ప్రతిసారి చుట్టూ తొమ్మిదిసార్లు చూడవలెను" అంటున్నాడు. ఓ! మై, కాని మీరు చూడండి. అతడు మాత్రము తొందరలో లేడు.
దానిగూర్చి నేను ఆలోచించాను. నా ప్రశస్త్ర వృద్ధ తల్లి ఈనాడు మహిమలో యున్నది. ఎవరో అన్నారు. "ఈ రోజు నీవు ఒక తెల్లని పూవు ఎందుకు ధరించకూడదు? మీ తల్లి చనిపోయినట్లుగా అర్థమది."
నాతల్లి చనిపోలేదు, నా తల్లి జీవించియున్నది. కనుక నేను ఎర్రని పూవు ధరించుదును. అప్పుడు జనులు చూచి, "మీ తల్లి చనిపోయిందనుకొన్నాము" అందురు. "కనుక వారిని గందరగోళములో ముంచకుండా, మరెక్కువ ఆవిరితో నింపకుండా యుండుటకు అసలు ఏదీ ధరించలేదు" అని చెప్పాను. చూచారా? ఆమె చనిపోలేదు. ఆమె నిద్రించుచున్నది. ఆమె క్రీస్తుతో యున్నది.
24నరముల ఉద్రిక్తతను కలుగచేయు యుగములో మనము జీవించుచున్నాము. మీకు తెలియును, దీనంతటికీ వైద్యులయొద్ద జవాబు లేదు. ఎందుకనగా వారునూ ఆ వ్యాధిలోనే యున్నారు. వారికి జవాబు లేదు. ఏమి చేయవలెనో వారెరుగరు.
"ఓ! వైద్యుడా, నేను - నేను - నా తల పగిలిపోవు స్థితిలో యున్నాను. ఏమి చేయవలెనో నాకు తెలియదు. నేను." అని నీవు చెప్పవచ్చును.
అతడు అందుకీలాగు పలుకును, "సరే. నేనూ ఆలాగే యున్నాను. నీవు చేయవలసినది ఏదియూ లేదు." అతడు నిన్ను శాంతపరచు, నిద్రపుచ్చు మందు ఇచ్చును. అది అయిపోగానే, మొదట నీకుండిన నరముల ఉద్రిక్తత కంటె ఎక్కువైనది నీకు ఏర్పడును. ఒక త్రాగుబోతు తన త్రాగుబోతు తనమును మానుటకు మరెక్కువ సారాయి తీసికొనినట్లుగానే యుండును. మీరు చూచారా? కనుక అది మీరేమీ చేయలేరు. దానికి జవాబు లేదు. వారియొద్ద అది లేదు.
కాని దేవునియొద్ద జవాబున్నది. దానిగూర్చియే మనము మాట్లాడుకొననై యున్నాము. వారికి జవాబు కలదు. దేవుడు జవాబును కలిగియున్నాడు. ఆయనే జవాబు. మనకు వచ్చిన ప్రతి సమస్యకు క్రీస్తే జవాబు.
EXOD 21:24•
LEV 24:17,20•
NUM 35:15,22,23,26,27•
DEUT 19:4,6,21•
MATT 5:38
25ఇప్పుడు, మనము ఆయన గూర్చియే మాట్లాడుకోనైయున్నాము. పాత నిబంధనకాలమందు ఒక వ్యక్తి ఒత్తిడితో నిండియుండు పరిస్థితి ఒకటుండెను. అది ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, ఒకడు నిరపరాధి రక్తమును చిందించినయెడల అతడు పరుగెత్తును. తాను తప్పుగా చంపిన వ్యక్తిని బట్టి, ఆ చంపబడిన వ్యక్తి యొక్క ప్రజలు అతడిని వెంటాడి పటుకొందురు. అక్కడే అతనిని వారు చంపుదురు. అది కంటికి కన్ను పంటికి పన్ను చూడండి. ఆ వ్యక్తి ఆగుటకు చోటు లేదు.
ప్రమాదవశాత్తు అతడు హత్యను చేసినయెడల- ప్రజలు దానిని నమ్మరు - అందుకే అతడు పారిపోవలెను. ఎందుకనగా దీనిని వీడు చేసిన వెంటనే, ఆ చంపబడిన స్త్రీ లేదా పురుషునియొక్క బంధువులు, ఎవరైనసరే, వీనిని పట్టుకొనుటకు వెంటాడుదురు. అతడు గాని దొరికినచో కంటికి కన్ను పంటికి పన్ను ఆ విధంగా వారు జీవించిరి.
26కనుక ఎక్కడునూ అతడు ఆగలేడు. అతడు దేశదిమ్మరి. ఏమి చేయవలెనో అతనికి తెలియదు. అతడు పారిపోవుచుండును. నేటికి సరిగ్గా సరిపోలియున్నది. అందువలననే ఎంతో ఒత్తిడి ఏర్పడుచున్నది. మనము పారిపోవుచున్నాము. లోకము యొక్క సంగతి అదే. వారు తప్పిదములోయున్నారని ఎరిగి, ప్రభుని రాక సమీపమాయెనని తెలిసికొని, వారిలో ఒత్తిడి పెరిగిపోవుచున్నది. వారు పారిపోవుచున్నారు. రోడు ప్రక్క ఇల్లు, జూద గృహము, సుఖము, పాపము, నైతిక పతనము, దేనికయినా పరుగిడుట, టెలివిజను వినుట, మురికి జోకులు, దేనికయినా చోటు ఇచ్చెదరు. వారు పరుగెత్తుచున్నారు. ఏదో జరుగనైయున్నది. అది వారు ఎరుగుదురు. మరణమగునంతగా త్రాగుచున్నారు. సుఖభోగములు, ఇంకా ఏవేవో - వారిని పరుగెత్తించుచున్నవి.
ఏదో జరుగనైయున్నదని వారికి తెలియును. దానిగూర్చిలోకము చెప్పుచున్నది. ఏదో జరుగనై యున్నదని మనమెరుగుదుము. తెల్లవారకముందే ఈ లోకము బ్రద్దలయి పోవచ్చును. ప్రతి దేశము ఉద్రిక్తతలో యున్నది. ఎందువలన?
27ఒకసారి నేను ఆఫ్రికాలో యున్నాను. ఒక గొర్రెల మంద మేయుట గమనించు చున్నాను. అది ఒక గొర్రెపిల్ల. ఒక మధ్య వయస్సుకు ఎదిగిన గొర్రె. ఆ చిన్నపిల్ల ఎంతో ప్రశాంతముగా మేయుచున్నది. ఆకస్మాత్తుగా అది ఉక్కిరిబిక్కిరి అయిపోసాగినది. తింటున్నది. అటు చూస్తున్నది, మరొకసారి కొరుకుచున్నది. అది ప్రశాంతముగా ఉన్నప్పుడు, నేను చూచాను, అది చాలా ప్రశాంతముగా ఉన్నది, "అప్పుడు ప్రశాంతముగా అది ఉన్నప్పుడు చూడు. ఆ చిన్న గొర్రెపిల్లను చూడు" అనుకొన్నాను. ఆ గొర్రెలను మేపుచున్న కాపరి తిరిగి మరొక చోటకు వెళ్ళెను. నల్లజాతి స్థానికుడు.
ఈ చిన్నదానిని నేను గమనించుచున్నాను. కొద్దిసేపటి తరువాత అది ఉద్రిక్తతో నిండిపోయినది. "ఆ చిన్నపిల్ల ఎందుకిట్లున్నది?" అనుకొన్నాను. బైనాక్యులర్ ద్వారా నేను గమనించుచున్నాను. అది ఎంతో ఉద్రిక్తతతో నిండిపోయినది. అది ఇటు, అటు బిత్తరపోయి చూస్తున్నది. కేకవేయ ఆరంభించినది. దానికి ఏమి చేయవలెనో తెలియలేదు. "సరే, ఉండీ ఉండీ ఒక్కసారే ఈ గొర్రెపిల్ల ఈలాగవుటకు కారణమేమిటి?" అనుకొన్నాను.
28అది చిన్న పచ్చిక పొలములో యున్నది. కాని ఆ వెనుక ఎక్కడో ఏదో పైకి లేచుట, మరల క్రిందికి వంగుట నేను గమనించాను. ఆ గొర్రెపిల్లకు అరమైలు దూరములో, బాగా ఎదిగిన పొదలలో ఒక సింహము దాగియున్నది. మరియు ఆ చిన్న గొర్రెపిల్లలో ఏదో చెప్పుచున్నది. ఒక అపాయము ముంచుకొచ్చుచున్నదని తెలిసిపోయి గందరగోళములో పడుచున్నది. దానిని అది చూడలేదు. కాని సింహము గొర్రెపిల్ల వాసన పసిగట్టినది. ఆ గొర్రెల కాపరి వచ్చి గొర్రెలను తోలుకొని పోకముందే త్వరగా దానిని అది పట్టుకొని పోవలెనని పొంచియున్నది.
అప్పుడు దానిని గమనించుచున్నప్పుడు, ఉద్రిక్తత అలముకొన్నది. ఆ దూరము నుండి ఈ సింహము బహు సులభముగా నక్కి వచ్చుచున్నది. అయినా ఇంకా ఆ గొర్రెపిల్ల దీనిని చూడనే లేదు. కాని దాని అంతరంగమందు ఏదో ప్రమాదము సమీప మందున్నదని చెప్పసాగెను.
నేడును ఆలాగే యున్నది. ప్రజల అంతరంగములో ఏదోయుండి, ఒకటి జరుగనైయున్నదని తెలియచేయుచున్నది. అది మనమెరుగుదుము. క్రైస్తవులు దానిని ఎరుగుదురు. ప్రపంచము అది ఎరుగును. త్రాగుబోతు దానిని ఎరుగును. జూదగాడు దానిని ఎరుగును. వ్యాపారులు, ప్రభుత్వములు, ఐక్యరాజ్య సమితి, అందరునూ ఏదో జరుగనై యున్నదని ఎరుగుదురు. అది ఉద్రిక్తతను నెలకొల్పుచున్నది.
29స్త్రీలు, తల్లులు, సిగరెట్టు మీద సిగరెట్టు ఊదుటను. వారు స్కూలుకు వచ్చు చుండగా నేను గమనించుచున్నాను. వారు మా రహదారి గుండా వస్తూ ఉంటే నేను నా పిల్లలను, కుక్కను జాగ్రత్తగా చూచుకోవలసి వస్తున్నది. ఇరవై మైళ్ళ వేగంతో వెళ్ళవలసిన ఆ మార్గంలో స్త్రీలు తమ పిల్లలను బడికి పంపించుటకు ఒక చేతిలో సిగరెటు పట్టుకొని మరొక చేతితో డెబ్బది మైళ్ళ వేగంతో కారు నడపుకొని వస్తున్నారు. ఒక తలుపు తెరచి యుంచి, పిల్లలతో సరదాగా ఆడుచూ, ఆకస్మిక బ్రేకులు వేస్తూ రోడ్లను పాడుచేస్తు, టైరు అరిగిపోతున్నాయి. వారు ఇక్కడ మరల తిరిగి వచ్చుచున్నారు. అట్టి ఒక నరముల ఉద్రిక్తత కలిగిన తల్లి వలన ఒక రోజున నలుగురయిదుగురు చిన్నపిల్లలు గాలి వీచినందున రోడ్డుమీద పడిపోవుట నేను చూచాను. ఆమె ఎక్కడికి పోవుచున్నది? ఏమిటి సంగతి? ఏదో ప్రత్యేక టెలివిజను కార్యక్రమము వస్తున్నది - ఆమె దానిని చూచుటకు తిరిగి సమయానికి రావలెనని తలంచియుండవచ్చును.
అదే. ఆ ఉద్రికత్తకు నాంది. దానికి ఒక కారణమున్నది. ఇంతకు ముందు వారాలాగు చేసియుండుటకు అలవాటు కాలేదు. ఏదో సమీపించుచున్నది. ఇక్కడి ఈ రోడ్ల మీద మరణము మరియు నాశనము పరుగులెత్తుచున్నవి. అదెంతో దూరము లేదు. ఏదో ముంచుకు వచ్చుచున్నది.
NUM 35:15,20-25•
DEUT 19:2-4
30పాత నిబంధన కాలములో దేవుడు ఈ కొన్ని శ్రమలు ఆకస్మికముగా జరుగుట చూచెను. కనుక నీవు నిరపరాధివయి, నిర్దోషిగానున్నచో నీ కొరకు దేవుడొక మార్గము చూపును.
ఒక మనిషి మరో మనిషిని ముందు పధకముతో, ముందు ఆలోచనతో చంపినచో వాడు నశించిపోవును. వాడు ఈ స్థలమునకు రాలేడు. కాని అతడు దానిని ప్రమాదవశత్తు చేసినచో, ఆలాగు చేయవలెనని అనుకొననిచో, అప్పుడు ఒక ఆశ్రయపురమున్నది. ఒకటి రామోత్గిలాదు యొద్ద ఉన్నది. నాలుగు స్థలములను కొనుచున్నాను, యొహోషువా ఈ ఆశ్రయపురములను ఏర్పరచెను.
ఈ ఆశ్రయపురమునకు ఇప్పుడు ప్రజలు రావచ్చును. ప్రమాదవశత్తు ఏదయినా తప్పు చేసినప్పుడు - ఉద్దేశ్యపూర్వకముగా ఆ తప్పు చేయనిచో - అతడు ఆశ్రయపురమునకు వచ్చి గవిని యొద్దకు వెళ్ళవచ్చును. ఆ గవిని పాలకుడు అతడు ఎందుకు వచ్చుచున్నాడో అడుగవచ్చును - అతడు వచ్చుటకు ఉద్దేశ్యమేమిటో అడుగును. అప్పుడు అతని కేసు విచారించబడును. ఆ గవిని యొద్ద వాదన ప్రారంభమయి, విచారణ జరిగినప్పుడు అతడు నిర్దోషియని కనుగొనబడినప్పుడు, అతడు ఇష్టపూర్వకముగా అది చేయనప్పుడు అతనిని ఆ పట్టణములోనికి, ఆశ్రయస్థలములోనికి తిసుకోనిపోవుదురు. అప్పుడు శత్రువతనిని ఏమీ చేయజాలడు. అతడు అబద్దమాడి తప్పుచేసి ఆశ్రయపురములోనికి వచ్చినప్పుడు, బలిపీఠపు కొమ్ములు పట్టుకొనినా గాని అతని శత్రువు అతనిని బయటకు ఈడ్చి బలిపీఠము మీదనుండి లాగి చంపు హక్కు, అర్హత కలిగియుండును. అవునండీ! అతడు దోషి అయినందున, ముందుగా పధకము వేసి చంపినందున శిక్ష విధించబడును.
31దానితోపాటు ఇప్పుడు మరియొకటి వెళ్ళియున్నది. "ఆ మనిషి వెనుక డజనుమంది యున్ననూ అతడు ఉద్రిక్తతతో యుండును. ఎక్కడో, ఆ స్థలములోని ప్రతి రాయి, ప్రతి కొండ, ప్రతి పొద, శత్రువు, అతని కొరకు సిద్ధముగా నిలబడియుండును. అతడు నరముల ఉద్రిక్తతకు లోనగును. అయితే ఒక్కసారి ఆశ్రయ పురములో ప్రవేశించిన వెంటనే ఆ అందోళనంతయూ పోవును. అతడు క్షేమముగా ఉండును. అతడు బాగుండును. ఎందుకనగా అతని కొరకు ఒక స్థలము ఏర్పాటు చేయబడియున్నది, ఆ నిర్దోషి చంపబడకుండా దేవుడు ఏర్పాటు చేసిన స్థలము, కానీ చంపబడకుండా మినహాయింపును పొందును, ఎందుకనగా దానిని అతడు ప్రమాదవశాత్తు చేసెను.
అది అతడు చేయవలెనని చేయలేదు. ఇప్పుడు, అతడు కావలెనని దానిని చేసినచో - అతడు ఆ పరిస్థితుల మధ్య నిలబడవలెను. ఇష్టపూర్వకముగా చేసినచో అతనికి ఇక తప్పించుకొను అవకాశము లేదు.
32ఈనాడు రెండు తరగతుల ప్రజలున్నారు. దీనిని నేను చెప్పవచ్చును. ఈనాడు లోకమందు స్త్రీలు, పురుషులు ఉన్నారు. రడేల్ సోదరుడా, నిజంగానే వారు తాము చేయుచున్న క్రియలు కావలెనని చేయుట లేదు. ఈనాడు ప్రపంచమందు పాపము చేయగోరని స్త్రీ పురుషులు ఉన్నారు. వారికొరకు నేను చింతించుచున్నాను. వారు తప్పు ఏదియు చేయగోరుట లేదు, కాని వారు చేయుచున్నారు. దానికి వారు త్రోయబడుచున్నారు. ఇప్పుడు, సరి అయినది చేయుటకు కోరిక గలవ్యక్తికి ఒక స్థలమున్నది. ఒత్తిడిని బయటకు విడిచిపెట్టుటకు ఒకచోటున్నది. అది నిజము. కాని లెక్కలేనివారు కొందరున్నారు.
33ఒక రోజున సహో, హికర్సన్ నాకు - లాగ్రాంజ్ కెంటాకీలోని ఫెడరల్ చెరసాల వార్డెన్ యొద్దనుండి ఆ చెరసాలలోనికి వెళ్ళి చేపలు వేటాడుటకు అనుమతిని తీసికొనివచ్చెను. అక్కడ నేను లూయిస్విల్ నుండి వచ్చిన ఒక నల్లజాతి బాలుని కలిసికొన్నాను, అతడు నాతో చెప్పెను. నేనిట్లు అడిగాను. "చక్కగా కనబడుచూ, తెలివితేటలు కలిగిన నీవు ఇక్కడేమి చేయుచున్నావు?"
అతడు చెప్పెను. "అయ్యా! ఇది జరిగిన సంగతి. ఇది ఎవరి తప్పు కాదు. కానీ నాదే." "ఒకప్పుడు నేను ప్రభువుకు చెందినవాడిని." నా పేరు బిషప్పు. "వారు నన్ను పరిశుద్ధ బిషప్పు" అని పిలచుచుండిరి. కారణము నేను ప్రభువును సేవించాను. నేను మరియు నా భార్య మాకు ఒక పాప పుట్టినది. ఒకసారి నేను జయించలేక లోకముతో స్నేహించాను. ప్రభువు నుండి దూరమయ్యాను. నాకు క్రైస్తవ తల్లిదండ్రులున్నారు. నేను నాలుగు సంవత్సరములు కొరియాలో పనిచేశాను. కాని అక్కడ మేము డాన్సులకు, మొదలగువానికి వెళ్ళుచుంటిమి!" అతడు ఎన్ని యుద్ధములు చేసెనో, ఎన్ని పతకములు పొందెనో అవన్నియూ వివరించెను.
34"నేను పాపపు జనాంగముతో కలిసిపోయాను. ఒక రోజున ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి బిషప్పు, మేము క్వేకర్ మైడ్ యొద్దకు వెళ్ళి కొన్ని కాయగూరలు కొనవలెను. మాతో పాటు నీవు వచ్చెదవా?" అనడిగారు. నా భార్య అప్పుడే నన్ను భోజనమునకు పిలచినది. ఆమె నన్ను లోనికి పిలిచి వారితో వెళ్ళవద్దని వారించినది. వారు మంచివారు కారు. వారినుండి మనము దూరమైపోయి తిరిగి చర్చికి వెళ్ళవలెను అని అన్నది. నాకు కూడా వారంటే అసహ్యమే. వాళ్ళు కాయగూరలకు వెళ్ళుచున్నారు. నాకు వెళ్ళాలని లేదు. సరే. వారికి నా కారు ఇచ్చెదను అని చెప్పగా ఆమె, ఆలాగు చేయవద్దు. వారు కారును ముక్కలు చేసెదరు కాబట్టి వెళ్ళి వారిని దించి వెనక్కు రమ్మని చెప్పినది."
అతడు నాతో ఇంకా "నేను వారిని అక్కడకు తీసుకొనివెళ్ళి కారు పార్కు చేయు స్థలములో నా కారును నిలిపియుంచి వారికొరకు కారులో కాచుకొనియున్నప్పుడు, ఆకస్మాత్తుగా అపాయపు అలారములు మ్రోగినవి. ఈ కుర్రాళ్ళు తమ చేతులలో చేతి తుపాకీ (Pistol)ని పటుకొని నావైపుగా వచ్చారు. నేను కారు యొక్క తలుపును మూసి వేస్తూ "మీరు కారులో ఎక్కకూడదు" యని అన్నాను.
వారిలో ఒకడు బిషప్సు తలమీద కొట్టి, అతనిని వెనుకకు త్రోసి చేతి తుపాకీని వాడిముందు చాపుతూ, "మమ్మల్ని తీసుకొని వెళ్ళకపోతే." అని హెచ్చరించాడు. వారు తుపాకీని చూపిస్తూ, "గుండు తొలచి నీకు రంధ్రము పడకుండా వుండాలనుకుంటే. నిన్ను దూరముగా విసిరివేసి, మేము కారును తోలుకొని వెళ్ళిపోదుము" అని అన్నారు.
35బిషప్పు వారితో "మీరు ఎక్కడికి తప్పించుకొని వెళ్ళలేరు. మీరు తప్పక పట్టుబడుదురు. మీరు పోలీసు వాళ్ళతో, నాకు దీనితో ఎటువంటి సంబంధము లేదు. నేను ఈ పధకమును (వ్యూహమును) రచించలేదు. నేనిక్కడ కూర్చొనియున్నాను. నేను నిరపరాధినియని చెప్పండి" అని అన్నాడట. ఆ సమయములో పోలీసులు వారిని పట్టుకొన్నారు.
వారు కేసు విచారించిరి. అతడు నాతో "నేను మొదట ఆ న్యాయవాది చెడ్డవాడని" తలంచాను. ఎందుకనగా. అతని ప్రశ్నలు ఇట్లున్నవి. "ఇది నీ కారు గదా?"
"అవునండీ! కాని నేను" అన్నాను.
నా ప్రశ్నలకు జవాబులు చెప్పు అని అతడు చెప్పెను. ఓ, సోదరుడా! అపవాదికి ఆలాగు చేయు మార్గమున్నది. "నా ప్రశ్నకు జవాబిమ్ము" అనెను."ఈ కారు నీదేనా?" అనడిగాడు.
"అవును" అన్నాను.
"అది నీ లైసన్సు నంబరా?"
"అవును" అన్నాను.
"నీవు ఆ పార్కింగు స్తలములో యున్నావా?' అనడిగెను.
"అవును, గాని నేను. " అన్నాను.
"నా ప్రశ్నలకు జవాబు చెప్పుముందు" అన్నాడు.
"అవునండీ" అన్నాను.
"అయితే నీవే దోషివి" అన్నాడు. పరిస్థితుల రుజువును బట్టి అతనికి పది సంవత్సరముల జైలు శిక్ష - తక్కినవారికి యావజ్జీవ శిక్ష వేసిరి.
అతడిట్లు చెప్పెను, "చూడు, సోదరుడా, నేను కేవలము దుష్ట జనాంగముతో కలిసినందునే ఇది జరిగెను. ఎవరిని నిందించవలసిన పనిలేదు. నన్ను నేనే నిందించుకోవలెను."అది నిజము! అతడు తన ఒత్తిడిని బయటకు వదులుటకు పది సంవత్సరములు వేచియుండవలెను. అతని కొరకు నేను ప్రార్ధి౦చాను. నాతో అక్కడ సహో. ఉడ్ ఉండెను - మేము నీటి యొద్ద కూర్చొనియున్నాము - ఆ కుర్రవాని చేయి పట్టుకొని ఆ నీటి యొద్దనే ప్రార్ధి౦చాము. దేవుడతనికి విడుదల ఇయ్యవలెనని ప్రార్ధి౦చాము. దేవుడిచ్చునని ఇంకా నేను అతని కొరకు ప్రార్ధి౦చుచున్నాను.
ఏమిటది? ఒత్తిడి. అమాయకుడు. ఒక నిరపరాధి. ఆ మనిషికి ఒక తరుణముండవలెను.
36మీరు సరియైనది చేయగోరుచున్నచో, ఒక ఆశ్రయపురమున్నదని చెప్పుటకు నేను ఎంతో సంతోషించుచున్నాను. అది యేసు క్రీస్తే. నీవు తప్పు చేయవలెనని కోరిక లేకుండా, సాతాను నిన్ను తరుముచున్నచో ఒక తప్పించుకొను విధానమున్నది. ఆ తప్పించు దారి యేసు క్రీస్తే. నీవు వచ్చి నీ ఆవిరిని విడిచిపెట్టుకొనగోరినచో ఒక చోటుకు నీవు రావచ్చును. కాని నీవు - పాపము చేయుటకు ప్రేమ కలిగియుండి, దేవుడు వద్దనుకొన్నచో, శత్రువు నిన్ను ఎక్కడో చుట్టుముట్టుకొనును. నీకు, నీవు యేసు యొద్దకు రాలేవు. ఎందుకనగా నీకు కోరిక లేదు.
ఈ మనిషి క్రీస్తు నొద్దకు వచ్చినప్పుడు, ఈ ఆశ్రయపురము నొద్దకు వచ్చినప్పుడు. పాత నిబంధన కాలములో మొదటగా ఈలాగు ఒక వ్యక్తి వచ్చినప్పుడు, తన ఇష్టాఇష్టాల మీద ఆధారపడియే రావలెను. క్రీస్తునొద్దకు ఆ విధముగానే రావలెను.
LUKE 9:62
37మరో సంగతి. నీవు అక్కడ ఉండగా సంతృప్తి కలిగియుండుట అవశ్యము. నీవు. "నేను ఇక్కడ నుండి బయటకు వెళ్ళగోరుచున్నాను. బయటకు వెళ్ళిపోతే బాగుండును" అని ప్రతిరోజూ అనుకొంటూ కూర్చుంటే లాభము లేదు. వారు నిన్ను బయటకు త్రోసివేయుదురు. నీవు ఇష్టపూర్వకముగా అక్కడ నిలిచియుండవలెను. నీవు తప్పక ఆ పట్టణములో ఉండుటకు కోరిక కలిగియుండవలెను.
నీవు క్రీస్తునొద్దకు వచ్చునప్పుడు, తిరిగి లోకము వైపునకు చూడరాదు. "నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టునకు చూచువాడు నాకు పాత్రుడు కాదు" అని బైబిలు చెప్పెను. అక్కడే అనేక మంది క్రైస్తవులమని చెప్పుకొనువారు తప్పు చేయుచున్నారు. చూడండి, వారు నాగటి మీద చేయివేసినట్లుగానే కనబడుచున్నారు, గాని ఒక చిన్న శోధన ఏదైనా రాగానే దానిగూర్చి వారు తలక్రిందులయిపోదురు.
38ఒక రోజున నాకు అటువంటి అనుభవము కలిగినది, మీకందరకు తెలియును. మీప్రార్థనల బట్టి మీకు వందనములు చెల్లించుచున్నాను. నేను వేటాడుచూ, గాలము వేయుచూ, గురి చూచి కొట్టుచూ ఇటువంటి పనులన్నియూ చేయుచుండగా నాకు ఎప్పుడునూ ఒక వెదర్ బై మాగ్నం రైఫిల్ కావలెనని కోరికయుండెడిది. సరే, కొందరు నా స్నేహితులు నా కొరకు దానిని కొని ఇచ్చియుండెడి వారే, నేను చెప్పినట్లయితే వారు సంతోషముగా దానిని చేసియుండెడి వారని జనుల గూర్చి నేను ఎరుగుదును. నిజానికి, ఇద్దరు ముగ్గురు దానిని చేయగోరిరి. కానీ చెప్పులు కూడా లేకుండా మిషనరీలు పనిచేయుచుండగా అంత డబ్బు వారు ఒక రైఫిల్ మీద ఖర్చుపెట్టుట నాకు ఇష్టము లేదు. అది నేను చేయజాలను, మరియు సహో, విల్సన్ పౌల్కు ఒక చిన్న .257 రాబర్ట్స్ ఇచ్చాడు. మరియు ఒక నా సోదర స్నేహితుడు ఇట్లు చెప్పెను, "బ్రెన్హాం సోదరుడా, వెదర్బై (weatherby) తుపాకీ దానికి సరిపోవును, నీవు నన్ను చేయనిచ్చినచో దానిని నేను చవక ధరకు కొని ఇవ్వగలను." సరే, అతనిని నేను అది చేయనిచ్చాను.
తిరిగి వచ్చి తుపాకీలో తుటా పెట్టి, దానినిప్రేల్చ ప్రయత్నించినప్పుడు, అది నా చేతులలో పేలిపోయి చీల్చివేసినది. ఆ గొట్టము దాదాపు ఏబది గజముల లైను లోనికి వెళ్ళిపోయినది, ఆ బోల్టు నా వెనుక పడినది. మరియు అది నన్ను మధ్యకు చీల్చకుండా ఉండుట ఆశ్చర్యమే. అయిదు లేక ఆరు టన్నుల ప్రేలుడు శక్తి నాకు అంత దగ్గరగా యున్నది.
ఒక వైద్యుడు నాతో ఇట్లనెను, "నాకు తెలిసినదంతయూ ఒక్కటే, అది ఏమనగా ఆ మంచి ప్రభువు తన దాసుని రక్షించుటకు అక్కడ కూర్చొనియుండెను."
39నేను ఇప్పుడు ఆలోచించుచున్న సంగతి, ఇదే ఇక్కడ వచ్చుచున్నది. ప్రారంభములోనే ఆ వెదర్బై తుపాకీని వాడియుండినచో ఏమి జరిగియుండెడిది. ఏమిటి సంగతి? రైఫిల్లో ఒక పొరపాటున్నది. పైభాగము పూర్తిగా వదులు అయిపోయినది. మనమార్పు కూడా చాలామంది విషయములో అలాగే యున్నది. మన అసలు పై భాగమే వదలు అయినది. మరియు…
ఆదినుండియూ అది వెదర్భై అయియుండినచో, ఆ గొట్టమును తయారు చేయుటకు ఉపయోగించిన ఆ స్టీలు నుండియే అది చేసియుండినచో అది వెదర్బై మాగ్నము అయియుండెడిది. అది ప్రేలిపోయి యుండెడిది కాదు. కానీ మన మార్పు విషయములో చాలామందిమి ఆలాగే యున్నాము. నిజముగా అది అసలు దానివలె తయారుచేయకుండా, మరొక రీతిగా మార్పు చేసి ప్రయత్నించినందున అది బ్రద్దలయినది. క్రైస్తవుడనని చెప్పుకొనుచూ, నూతన జన్మ విషయములో సరైన ప్రారంభము లేని ప్రతి ఒక్కరునూ ఆలాగే యుందురు. ఎక్కడో ఒక చోట అతడు ప్రేలిపోవును. దానిమీద ఒత్తిడి ఎక్కువైపోయినది. అది దానిని తట్టుకోజాలదు. ఎక్కడో ఒకచోట తాను ప్రేలిపోవునట్లుగా కనుగొనును.
40ప్రజలు పిలుపు లేని ఎవరో ఒకని సేవను అనుకరించ ప్రయత్నించుదురు. చివరకు అది బ్రద్దలయిపోవును. నీవు దేవునిచే నిర్ణయించబడవలసియున్నావు. అది దేవుడే చేయవలెను. ఏదో ఒక కరచాలనము కాదు, ఏదో ఆచార గాధ కాదు, గాని అది చిందించబడిన క్రీస్తు రక్తమును ఆధారము చేసికొనియే రావలెను. మరియు యేసు క్రీస్తు ద్వారా నీకు దేవుడు ఏమి చేసెనో దానియందు నీకు గల విశ్వాసము మీదనే పునాది వేయబడవలెను. లేనిచో, ఎక్కడో ఒక చోట నీవు పేలిపోనైయున్నావు. ఎవరో నీ బొటన వ్రేలు త్రోక్కుదురు, నీవు దూరంగా వెళ్ళిపోయెదవు. చూచారా? చూడండి, ఒత్తిడి నానాటికీ పెరిగిపోయి చివరకు అది బ్రద్దలయిపోవును.
41తప్పక ఆ వ్యక్తి ఆశ్రయపురములో యుండవలెను. సణుగుగొనుచూ అతడు అందులోనికి వెళ్ళరాదు. అతడు తప్పక అందులో ఉండగోరవలెను, దానిగూర్చి ఎట్టి ఫిర్యాదులు చేయరాదు. బయట ఉన్నచో అతడు చనిపోవును; లోపల ఉన్నచో క్షేమముగా యుండును.
క్రైస్తవులు కాని ప్రజలు ఇక్కడున్నచో వారికొరకు ఒక్క సంగతి నేను చెప్పుచున్నాను. సుమారు ముప్పది ఒక్క సంవత్సరముల క్రితము నేను ఈ ఆశ్రయపురమునకు వచ్చాను. సోదరుడా, ఎన్నడూ నేను బయటకు వెళ్ళగోరుట లేదు. ఓ! నేను క్రీస్తులోనికి వచ్చుచున్నాను. నేను నిరీక్షించునదంతయూ ఇక్కడ ఉండగోరుటయే. నేను బయటకు వెళ్ళగోరుట లేదు. అనుదినము ఈలాగు ప్రార్ధి౦చుచున్నాను, "ఓ! దేవా, నేను ఇక్కడ ఎంతో ఆనందముగా యున్నాను. నన్ను ఇక్కడే ఉండనిమ్ము" ఎన్నడూనూ నేను విడిచిపెట్టదలచుకోలేదు, మరియు నాకు తెలుసు ఆయన నన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. మరియు మిమ్మును ఎన్నడూ ఆయన విడిచిపెట్టడని నేనెరుగుదును. ఒకవేళ ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోవుచున్నచో, అది బయటకు పోవు ద్వారము ఆయనే. కనుక దానిగూర్చి - మనము చింతపడవలసిన పనిలేదు.
మీరు బాగా ఒత్తిడితో నింపబడి, ఎక్కడికి వెళ్ళవలెనో మీకు తోచనప్పుడు, మరణము తరువాత ఏమి జరుగునో తెలియనప్పుడు? ఏదో ఒక సమయమున నీవు చనిపోదువని నీకు తెలియును, అది నీవు ఎదుర్కొనవలసి యున్నావు. నీవు చేయవలసిన పని ఆశ్రయపురమగు క్రీస్తునొద్దకు వచ్చి ఒత్తిడిని విడిచిపెట్టవలెను. మరెన్నడూ సమస్య రాకుండా దానినిని వారింపుము.
PS 46:1,7,11•
PS 62:8•
PS 71:7•
JER 16:19
42ఏమి జరిగినా మనకు పరవాలేదు. క్రీస్తే మన ఆశ్రయపురము. మరియు ఆయన యొద్దకు మనము వచ్చినప్పుడు ఆ ఒత్తిడిని మనము బయటకు విడిచి పెట్టుదుము. దానిగూర్చి బాధపడుట నీవు మానగలవు, "నేను చనిపోయినచో నాకేమి సంభవించును? నా భార్యకు ఏమి జరుగును? భర్తకు ఏమి జరుగును? పిల్లలు ఏమవుదురు?" అని బాధపడుట మానుము. క్రీస్తునొద్దకు వచ్చి ఒత్తిడిని విడువుము. కాదు. ఆయన అన్నింటినీ ఇచ్చును. క్రీస్తు ద్వారా అవన్నియూ మనవే, కనుక ఒత్తిడిని వదలండి.
దానిని చేయుటకు నీకు గల ఒకే ఒక మార్గము. ఎవరైనా నీకు ఒక మిలియను డాలర్లు ఇవ్వవచ్చును. దాని వలన ఒత్తిడి పెరుగును. నీవు ఒక చర్చిలో చేరవచ్చును, అదింకా ఒత్తిడిని పెంచును. ఎందుకనగా బాప్టిస్టు వారు తప్పు అని మెథడిస్టు వారు చెప్పెదరు. బాప్టిస్టు వారేమో, "వారు తప్పు మరియు మేమే సరి" అందురు. కనుక అది మరింత ఒత్తిడిని నీలో పెంచును. ఎందుకనగా నీవెక్కడ నిలబడియున్నావో నీవెరుగవు. కాని నీవు ఎప్పుడైనా క్రీస్తునొద్దకు వచ్చినప్పుడు, నీవు ఆ ఒత్తిడిని విడిచిపెట్టగలవు. ఎందుకనగా అప్పుడది సమాప్తమగును, అంతా కుదటుపడును.
PS 46:1,7,11•
PS 62:8•
PS 71:7•
PROV 18:10•
JER 16:19•
JAS 5:15
43అది దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ స్థలము, "యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతులు అందులోనికి పరుగెత్తి రక్షించబడుదురు." అని దేవుడు చెప్పెను. వ్యాధితోనున్న సమయములో, జబ్బు నిన్ను మొత్తినప్పుడు, వైద్యుడు ఈలాగనును, "దానికి నేను ఏమీ చేయలేను. నా వలన కాదు." ఒత్తిడితో నింపబడకుము. ఒత్తిడిని బయటకు విడువుము. నీ పాస్టరును పిలువుము. ఆయనను నీకు నూనె రాసి, ప్రార్ధన చేయనిమ్ము విశ్వాస సహితమైన ప్రార్ధన రోగిని రక్షించును. ఒత్తిడి బయటకు పోవును. చూచారా?
ఆయన మన ఆశ్రయ దుర్గము. నీవు ఈ ఆశ్రయపురములోయుండగా, ఈ ఆశ్రయపురములో ఉన్న దేనినయినను పొందుటకు నీకు హక్కున్నది. క్రీస్తే మన ఆశ్రయపురము. మరియు నీకు కావలసిన సమస్తము ఆయనలో యున్నది. ఆమేన్! వ్యాధియందు ఒత్తిడిని కూడబెటుకొనవద్దు. ఆ ఒత్తిడిని బయటకు విడువుము.
1PET 5:7
44"బ్రెన్హాం సోదరుడా, నేను ఆశ్చర్యపడుచున్నాను" అని నీవనవచ్చును. నీవు అందోళన చెందనవసరము లేదు. నీవు ఒత్తిడిని విడిచిపెట్టము. నీ కేసును దేవునికి అప్పగించుకొనుము. అది అంతా అయిపోయినదని తలంచుము. ఒత్తిడిని పెంచుకోవద్దుద. అది ఒత్తిడిని విడిచిపెట్టును.
"మంచిది." "నేను చాలా అందోళన చెందాను. సహో, బ్రెన్హాం. నాకేమీ తోచుట లేదు." అనవచ్చును. ఒత్తిడిని బయటకు విడువుము!ఆమేన్! ఆశ్రయపురములో ఆయన నీ చింతను తొలగించెను, కనుక నీవు - దానిని కలిగియుండనవసరము లేదు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఏలయనగా ఆయన మీ కొరకు చింతించుచున్నాడు. నీవు నీ చింతల గూర్చి ఆందోళన చెందనవసరము లేదు, అది ఆయన పని.
1PET 5:7
45పది సెంటుల (స్టోర్ పేరు) స్టోరులో ఒకామెను కొన్ని సంవత్సరముల క్రితము ఇక్కడే కలిసికొన్నాను. ఆమె దరిదాపుగా అరవై సంవత్సరముల వయస్సులో యున్నది, ముప్పది సంవత్సరముల వయస్సులో ఉన్నట్లుగా కనిపించినది. "సోదరీ, అది నీవేలాగు చేయగలిగావు?" అని అడిగాను.
"బ్రెన్హాం సోదరుడా, నాకు ఇద్దరు కుమారులున్నారు. వారు వైద్యులు. వారి వయస్సు నీకన్నా ఎక్కువే." అని చెప్పినది. ఆమె యధార్ధత ఎంతగా యున్నదో - ముప్పది సంవత్సరాలకుపైగానున్నట్లు ఆమె కనిపించనే లేదు. ఆమె ఇట్లు చెప్పసాగినది, "అసలు సంగతి ఇది. క్రీస్తు నొద్దకు నేను వచ్చినప్పుడు నా వయస్సు పన్నెండు సంవత్సరములు. దానిగూర్చి నేను కూర్చొని ఆలోచించాను. ఇతర మతములు నేను అధ్యయనం చేశాను. కాని నిజమయిన దానిని నేను కనుగొన్నప్పుడు. "నేను క్రీస్తునొద్దకు వచ్చి నాకేసునుంచాను, నా ఆత్మ నా సమస్తము ఆయనకు ఇచ్చాను. అప్పటినుండియూ చింతించలేదు. ఆయన నా చింతలన్నింటిని తీసికొందునని వాగ్దానము చేసెను. అందుకు ఆయన చాలినవాడు కానిచో, నేను అసలే చాలను అని ఎరుగుదును. కాబట్టి చింతించుట వలన ఏమి ప్రయోజనము?" చూచారా? అదీ సంగతి!
మీ చింతలన్నింటినీ క్రీస్తు తీసికొందునని వాగ్దానము చేసెను. మీ చింతలను ఆయన మీద వేయుడి. కాబట్టి దేనిగూర్చి మీరు చింతించుచున్నారు? చింత వలన ఒత్తిడి ఎక్కువగును. ఒత్తిడి బ్రద్ధలుచేయును. కనుక నీ చింతలను ఆయన మీద వేసి, చింతించుట మానుము. సరే. మంచిది!
1PET 5:7
46ఇప్పుడు. "సరే. అది నేనెట్లు చేయగలను?" అని నీవందువు. కేవలము ఆయన వాగ్దానము నమ్ముము. దానిని చేయుదునని ఆయన వాగ్దానము చేసెను. మరణ సమయములో సహితము, మరణ దూత గదిలోనికి వచ్చినప్పుడు. "ఓ, బ్రెన్హాం సోదరుడా, నేను ఉద్రిక్తతకు లోనవుదునని నాకు తెలియును." ఓ! లేదు! నీవు ఆశ్రయపురములో యున్నావు. లేదు. లేదు! నీవు చనిపోవనైయున్నావని నీవెరుగుదువు. నీవు ఏదో విధంగా వెళ్ళిపోవలసియున్నావు, కనుక ఆశ్రయపురములోనికి వెళ్ళుము, సురక్షితముగా ఉండుము. అది నిజము! ఆశ్రయపురములో ఉన్నంతవరకూ నీవు సురక్షితమే. నీవు గుర్తు౦చుకొనుము, ఆయన నీ కొరకు చనిపోయెను. ఆయన నీ గూర్చి చింతించుచున్నాడు. ఆయన నీ కొరకు చనిపోయెను.
ఇప్పుడు, ఒక్కసారి చూద్దాం. "బ్రెన్హాం సోదరుడా, మరణ దూత ద్వారముల వద్ద నిలుచుండి తట్టుచున్నప్పుడు కూడా ఉద్రికత్తకు లోను కాకుండా ఉండవలెనని నీవు భావించుచున్నావా?" అని మీరడుగ వచ్చును. లేదు, ఏ మాత్రము తొణకము. "సరే. ఎందుకు నీవు అది చేయవలెను?" ఆశ్రయపురము నొద్దకు రమ్ము; అంతే.
EXOD 11:5•
EXOD 12:23,29,30
47"సరే' అని నీవనవచ్చును. "బ్రెన్హాం సోదరుడా…" సరే. ఇప్పుడు ఒక్క నిమిషము ఆగండి. ఐగుప్తులో నున్న ఇశ్రాయేలును మనము తీసికొందము. దేవుడు ఈలాగు చెప్పిన సమయము వచ్చెను, "ఆ దేశముగుండా మరణ దూత సంచారము చేయును. ద్వారము మీద రక్తము లేనిచో కుటుంబములోని పెద్దవారందరినీ సంహరించనైయున్నాను!" అది ఆ గొప్ప పస్కారాత్రి. ఇక్కడ ఒక వాగ్దాన సంతతియగు ఇశ్రాయేలు వారు, వాగ్దాన దేశమునకు వెళ్ళుచున్నారు. వారు…
అది పస్కా రాత్రి. మరణ దూత దేశములో యున్నది. వీధిలో నుండి ఒక కేక వచ్చుటను మనము విందుము. మనము బయటకు చూతుము. రెండు పెద్ద నల్లని రెక్కలు వీధిలో అల్లాడుచున్నవి. ఇశ్రాయేలీయులందరూ ఆశ్చర్యముతో ముంచెత్తబడిరని మీరనుకొందురా? లేదండీ!
మరణము తలుపునొద్దనే యున్నది. చిన్నపిల్లవాడు కిటికిలోనుండి బయటకు తొంగిచూసెను. అతడే ఆ కుటుంబములో పెద్దవాడు. అతడు ఆ పెద్ద నల్లని దూతను చూచెను. అతడు దానిని చూస్తూ ఇట్లడుగుచున్నాడు. "నాన్నా నీవు నన్నుప్రేమించుచున్నావా?"
"కుమారుడా, నిశ్చయంగా నిన్ను ప్రేమించుచున్నాను."
"సరేగాని నాన్నా నేను నీకు మొదటి కుమారుడ్ని కదా?"
"అవును కుమారుడా, నీవే పెద్దవాడవు."
"నాన్నా, అటు చూడు. ఆ దూత పిల్లవానిని పటుకొన్నది. ఆ బాలుని నేను ఎరుగుదును. అతనితో నేను ఆడుకొన్నాను. ఇదిగో, ఆ దూత ఇటు మన ఇంటి వైపే వస్తున్నది.'
"కాని, కుమారుడా, ద్వారబంధపు కమ్ములు చూశావా?" హల్లెలూయా!
"నాన్నా, అతడు నన్ను పట్టుకొనునా?"
"లేదు బాబూ, అతడు నిన్ను పటుకోజాలడు."
"ఎందుకని?"
"అది ఆయన వాగ్దానము. నేను రక్తమును చూచినప్పుడు, నిన్ను దాటిపోవుదును." వెళ్ళి నీ బొమ్మలు తెచ్చుకొని ఆడుకొనుము, కుమారుడా. బాధపడవలసిన అవసరము ఏమియు లేదు. మనము దేవునియొక్క ఆశ్రయపురములో యున్నాము. ఒత్తిడిని బయటకు వదలుము."
48ఇశ్రాయేలు కూర్చొని బైబిలు చదువుచున్నారు. తక్కినవారందరూ కేకలు వేయుచూ, ఉద్రికత్తలో మునిగియుండగా, ఇశ్రాయేలు విశ్రాంతి పొందుచున్నారు. ఎందువలన? మరణము ద్వారము యొద్దనే యున్నది, దానివలన ఏమిటి ప్రత్యేకత? అది వారికి హాని చేయజాలదు.
కనుక మరణము మన గుమ్మము ముందుకు వచ్చినప్పుడు (దేవునికి మహిమ!) దేవునియొక్క ఏర్పాటు, నా హృదయపు కమ్ముల మీద రక్తము ప్రోక్షించబడినంత కాలము దాని వలన నాకేమియూ లెక్కలేదు, అది నన్ను తొందరచేయజాలదు.
రేపు నీవు చనిపోవుదువని వైద్యుడు చెప్పినచో దానివలన ఏమి తేడా కనబడును, రక్తము గడప కమ్ముల మీద యున్నది. ఏలాగయినను నీవు చనిపోయెదవు. కాని ఆ రక్తము అన్వయించబడినచో ఒక పునరుత్థానము నా కొరకు వచ్చుచున్నది. ఆమేన్!
NUM 13:23,27
49ఇశ్రాయేలు నెమ్మదిగా యుండగలదు. వారికి ఏ విధముగానూ ఆవిరి పేరుకొనదు. ఎందుకనగా మరణ దూత వారిని తాకజాలదని వారెరుగుదురు. వారు రక్తము క్రింద యుండిరి. అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గము.
ఇప్పుడు గమనించండి. "దానిగూర్చి నేను నిశ్చయత కలిగియుండగలనా?" అనడగవచ్చును. క్రైస్తవులారా, ఇప్పుడు మనము ఇచ్చటున్నాము. "నేను దానిగూర్చి నిశ్చయత కలిగియుండగలనా?" దాని మీద గత ఆదివారము రాత్రి నేను మాట్లాడాను.
ఇశ్రాయేలీయులు ఒక వాగ్దానము చేయబడిన నిబంధన జనులు, దేవుని ప్రజలు. పాలు తేనెలు ప్రవహించుచున్న ఒక దేశమును వారు వాగ్దానముగా పొందియున్నారు. కనుక వారు, వారెన్నడూ ఆ భూమిని చూడలేదు. అంతలో ఒక్కరు కూడా ఆ దేశములో అంతకు ముందుండలేదు. కాని వారికి ఆ వాగ్దానముండెను. చూడండి, వారెన్నడూ అందులో యుండలేదు. ఆ దేశము గూర్చి వారేమియు ఎరుగరు. కాని వారికి ఆ దేశము గూర్చి వాగ్దానము ఈయబడెను. దేవుని హస్తము ద్వారాను, ఆయన ప్రవక్త ద్వారాను వారు దాస్యములో నుండి బయటకు వచ్చి యాత్ర చేయుచున్నారు. తాము పరదేశులమును, యాత్రికులమునై యున్నామని చెప్పుకొనిరి. వారెన్నడూ చూడని దేశమునకు వెళ్ళుచుండిరి. అందులోని వారెవరునూ దానిని చూచియుండలేదు. దానిగురించి ఆలోచించండి. వారి సరిహద్దు గీతకు దగ్గరగా వచ్చిరి. వారిమధ్య యొహూషువా అను ఒక మహా యోధుడుండెను. యెహోషువా అనగా - "యెహోవా రక్షకుడు" అని అర్ధము. యొహోషువా యోర్దాను దాటి వాగ్దాన దేశములోనికి వెళ్ళి, అది మంచిది అను రుజువుతో తిరిగి వచ్చెను. ఇద్దరు మనుష్యులు మోయవలసి వచ్చిన ఒక ద్రాక్షాగెల గుత్తిని వారు తెచ్చిరి. అది ఖచ్చితంగా దేవుడు ఏలాగుండునని చెప్పెనో ఆలాగేయుండెను. పాలు, తేనెలు అచ్చట ప్రవహించుచుండెను. అది వారినందరినీ ఆనందముతో నింపియుండవలసినది. ఎందువలన? దేవుడు వారికిచ్చుదునని వాగ్దానము చేసిన ఆ దేశము యొక్క రుజువును యొహోషువా ఆ తెలియనివారందరికి తెచ్చి చూపెను. చూచారా? ఎందుకనగా - వారికి ఒక వాగ్దాన దేశమున్నది. దానిని చేరు మార్గములో వారుండిరి.
LUKE 24:37,41,43•
JOHN 14:2,3•
JOHN 19:34•
EPH 4:9•
REV 1:18
50ఇప్పుడు, ఒక రోజున మానవ జాతి ఒక ఊరిలో యుండెను. భూమి మీదికి యేసు క్రీస్తు అను పేరుగల ఒకాయన వచ్చెను. యేసు అనగా "యెహూవా రక్షకుడు."ఆయన మరణమను యోర్దానును సమీపించి, అందులోనికి వెళ్ళి, ఆ యోర్దాను మరణములో నుండి ఈస్టరు ఉదయమున మానవుడు చనిపోయిన తరువాత తిరిగి బ్రదుకుదురను రుజువుతో తిరిగి లేచెను. హల్లెలూయా! మరణమే అంతము కాదు. యేసు దానిని రుజువు చేసెను. మనిషి చనిపోయిన పిదప బ్రదకగలడు.
ఆయన వారియెదుట నిలబడెను. ఆయన చెప్పెను… ఎక్కిపోక ముందు ఆయన చెప్పెను, "నా తండ్రి యింట అనేక నివాసములుగలవు. లేనియెడల మీతో చెప్పియుందును. నేను వెళ్ళి ఒక స్థలము సిద్ధపరచి, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరల వచ్చి నా యొద్దకు మిమ్మును కొనిపోవుదును." ఆయన చనిపోయిన తరువాత చంద్ర నక్షత్రములు తమకు తాము సిగ్గుపడినవి, రోమా సైనికుడు వచ్చి ఆయన ప్రక్కలో - ఒక ఈటెతో పొడవగా, నీరు రక్తము వేరుగా వచ్చెను. ఆయన ఎంతగా చచ్చెనో ఇది చూపించుచున్నది. అంతకంటె ఎక్కువగా ఎవరూ చనిపోలేదు. అందరి మానవుల వలెనె ఆయన సమాధిలోనికి వెళ్ళెను. ఆయన ఆత్మ పాతాళము లోనికి పోయెను. ఆలాగు బైబిలు చెప్పెను. కాని ఈస్టరు ఉదయమున ఆయన మరణములో నుండి, పాతాళములో నుండి, సమాధిలో నుండి తిరిగి వచ్చెను. "మృతుడనైతిని గాని, ఇదిగో సదాకాలము నేను జీవించుచున్నాను. మరణము యొక్కయు, పాతాళము యొక్కయు తాళపుచెవులు నా యొద్దనున్నవి. నేను ఒక మానవుడిని." అని చెప్పెను.
"ఆయన భూతము" అని వారు అనిరి.
"నాకు ఒక చేపను రొట్టెను ఇమ్మని" ఆయన అడిగెను. ఆయన ఆ చేపను, రొట్టెను తినెను. చనిపోయినవాడు ఆయనే, భూమిలోనికి వెళ్ళినవాడు ఆయనే, మరియు మానవుడు మరణము తరువాత జీవించగలడను రుజువుతో ఆయన తిరిగి వచ్చెను. మరణము మనలను ఏమి చేయును? ఆమేన్! ఒత్తిడిని బయటకు వదలండి.
JOHN 3:15•
EPH 2:1,6
51ఇప్పుడు, అంతే కాదు గాని ఆయన మనకు వాగ్దానమును ఇచ్చెను. ఏమిటది? మన స్వాస్థ్యమునకు ఆయన సంచకరువును అనుగ్రహించెను."ప్రతి విశ్వాసికి ఇప్పుడు దీనిని రుజువు చేయండి. ఇక్కడ మీరు అవిశ్వాసముతో నడచుచున్నారు. మీరు వాక్యము నమ్ముట లేదు. మీరు పాపములోను, లోక సంగతులలోను నడుచుచున్నారు. కాని నాయందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు. చావులేని జీవితమది." అని చెప్పెను.
ఇప్పుడు గమనించండి, ఆయన ఆత్మను మనము పొందినప్పుడు, ఒకప్పుడు పాపములోను, అతిక్రమములోను చనిపోయిన మనము నూతన జన్మను పొందుదుము. ఆయన మనకు ఒక క్రొత్తజన్మను ఇచ్చును. ఆయన ఏమి చేయును? మనము చనిపోయి యేసునందు పాతిపెట్టబడుదుము. ఆత్మయందు మనము లోక విషయముల నుండి లేపబడి, పరలోక సంగతులను గ్రహించునట్లుగా చేయబడుదుము. ఈ రాత్రి మనము యేసుక్రీస్తు నందు పరలోక స్థలములందు కూర్చొండపెట్టబడి యున్నాము.
GAL 2:20•
EPH 4:30•
COL 3:3
52ఇక్కడున్న క్రైస్తవులలో ఎందరు ఇంకా లోకమును ప్రేమించుచున్నారు? ఆలాగు మీరు చేయుచున్నచో మీరు క్రైస్తవులు కారు. క్రైస్తవ్యమును ఒప్పుకొనుచున్నవాడివే గాని స్వాధీనపరచుకొన్నవానివి కాదు. ఎందుకనగా ఒకసారి క్రీస్తును రుచి చూచినప్పుడు, వాడు లోక సంగతులకు చనిపోవును. ఏ విధముగాను మరల అందులోనికి వెళ్ళుటకు కోరిక యుండదు.
అది ఏమి చేయును? "జీవము." పౌలు చెప్పెను,"ఒకప్పుడు నేను జీవించాను. ఇక నేను ఆలాగు జీవించను. అయినను నేను జీవించుచునే యున్నాను. నేను కాదు, కాని క్రీస్తు నాలోయున్నాడు." ఎందువలన? లోక పాపము అను ఈ క్రింది స్థాయినుండి ఆయన లేపి, ఒక్కసారి వెనుదిరిగి ఎక్కడనుండి మనము వచ్చామో ఆ స్థాయిని చూడగల స్థానమునకు మనలను ఆయన తీసికొని వచ్చెను. (మహిమ!) ఒకప్పుడు ఎక్కడ మనము జీవించామో దానిని చూడగలిగాము. ఇప్పుడు మనము వేరుగా బ్రదుకుచున్నాము. ఏమిటది? మనము చచ్చియున్నామనియు, దేవుని ద్వారా మన జీవితములు క్రీస్తునందు దాచబడి యున్నవనియు, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడినట్లును, ఆ సంగతులకుపైగా లేపబడినట్లును అది నిశ్చయత. అప్పుడు మనము ఆయన మనతో రుజువు చేయుటకు తిరిగివచ్చిన అదే రుజువుతో జీవించుచున్నామన్న మాట.
2KGS 2:1,6,7•
JOHN 5:24
53ఆ దేశము మహిమానిత్వముగా యున్నది. దానికి పూర్తిగా వెల చెల్లించబడినది. ఇది మన రక్షణకు సంచకరువు. ఒప్పందమును నిలిపియుంచు మొదటి బయనా ఇది. (మహిమ!) దేవుని ఒప్పందమును అది నిలిపియుంచును. "నా మాటలు విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు. అట్టివాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడు." సోదరుడా, ఒత్తిడిని విడువుము. అవునండీ! ఆమేన్! అది మీరు గ్రహించారా?
చూడండి, ఆ గొప్ప ప్రవక్తయగు ఏలియా క్రీస్తుకు మాదిరి. ఎలీషా, సంఘమునకు సాదృశ్యము. రెండింతల ఆత్మ ప్రవక్త మీదికి వచ్చెను. ఒక రోజున అతడు యోర్దాను యొద్దకు నడిచి వెళ్ళెను, నేటి దినమునకు మాదిరి, ఈ ప్రభుత్వము, సంగతులు, ఇప్పుడున్నవన్నియు, ఆహాబు, యొజెబెలు మొదలగునవే అని నా యొజెబెలుమతము ప్రసంగములో చెప్పినది గుర్తు౦చుకొనండి. గమనించండి, ఎలీషా ఏలియాను వెంబడించుటకు ఒక కారణమున్నది. ఆమేన్! ఎక్కడికి అతనిని తీసికొని వెళ్ళెను? యోర్దాను యొద్దకు, రామోత్గిలాదు యొద్దకు, ప్రవక్తల పాఠశాల యొుద్దకు, చివరకు యోర్దాను యొద్దకు తీసికొని వెళ్ళెను. అదే రీతిగా ఆయన నిన్ను తీసికొని వెళ్ళును. నీతీకరణము, శుద్దీకరణము, జీవమును పొందుటకు చనిపోవుట. (ఆమేన్) ఏదో ఒక శాఖ, లేదా ఒక సిద్దాంతము యొద్దకు కాదు గాని నీవు తిరిగి జన్మించునట్లుగా నీ ఆత్మ మరణమునకు ఆయన ఆలాగు తీసికొని వెళ్ళును.
2KGS 2:8,9•
JOHN 6:54
54ఎలీషా… ఏలియా నీటిని కొట్టెను, యోర్దాను మధ్యగా నడిచి వెళ్ళేను, మరియు ఎలీషా అతనిని వెంబడించెను. ఎలీషా మరల దేశమునకు, ఈవలి యొడ్డుకు వచ్చినప్పుడు రెండింతల ఆత్మతో వచ్చెను. ఈనాడు మనము యేసును ఆయన మరణము, సమాధి, మరియు బాప్తిస్మములలో వెంబడించుట - మరణము, సమాధి, పునరుత్థానము, బాప్తిస్మము ద్వారా జరుగుచున్నది. ఆయనను మనము నమ్ముచున్నాము; లోకము యొక్క సంగతులకు మనము చనిపోవుచున్నాము. మనము వట్టివారమని ఒప్పుకొనుచున్నాము. ఆయన నామములో బాప్తిస్మము పొందుచున్నాము. బాప్తిస్మములో ఆయనతో పాతిపెట్టబడుచున్నాము, పునరుత్థానమందు ఆయనతో కూడ లేపబడుచున్నాము. మన ఆత్మలు లోకము యొక్క సంగతులకుపైగా జీవించుచున్నవి; అప్పుడు మనము క్రీస్తునందున్నాము. ఇప్పుడు మనము ఒక భాగము పొందియున్నాము.
యోర్దాను మరణ గీతను దాటి మనము తిరిగి వచ్చునప్పుడు, మనము మరో వంతును పొందుదుము. ఇప్పుడు మనకున్న శరీరములు, మనము కలిగియున్న ఆత్మతో, సంచకరువును పొందియున్నాము, పరిశుద్ధాత్మ చనిపోజాలదు. ఎందుకనగా అది దేవునిలో భాగము. నేడు మనము జీవించుచున్న ఈ దేహములలో. "నా శరీరమును తిని, నా రక్తమును త్రాగువాడు నిత్యజీవముగలవాడు, అంత్యదినమున వానిని నేను లేపుదును." ఆమేన్! ఆవిరిని బయటకుపోనీయుడి!
55అణుబాంబులు లేక మరేవి ప్రేలిననూ మనకు ఏమీ తేడా యుండదు. వారికిష్టమైనది వారిని చేయనీయండి. (టేపు మీద ఏదో పొరపాటు జరిగినది - సంపా.)… మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనము నిత్యజీవము కలిగియున్నాము. లోకము ఏమి చెప్పినాగాని మనము లెక్కచేయవలసినది ఏమియు లేదు. ఒత్తిడిని గురించి మనము లెక్కచేయనవసరము లేదు. దాని వలన మనకు ఎట్టి భేదము కలుగదు. ఎందువలన? మనము ఒత్తిడిని విడిచిపెట్టగలము. (టేపు మీద ఖాళీ యున్నది — సంపా.)
…………………
కృపా హిమబిందువులు మొరయుచున్న చోటకి రమ్ము
దివా రాత్రులు మన చుట్టు ప్రకాశించుచున్నవి.
యేసు లోకమునకు వెలుగు.
ఇప్పుడు మనము తలలు వంచి, మన చేతులు ఎత్తుదము
మనము వెలుగునందు నడచుదుము, అందమగు వెలుగు
కృపా హిమ బిందువులు మెరయుచున్నచోటకి రమ్ము
దివారాత్రులు మన చుట్టూ మెరయును.
యేసు లోకమునకు వెలుగు.
56మా పరమ తండ్రీ, సాతాను యుద్ధములో ఓడిపోయినది. సహనము కలిగియుండి, ఎట్టి ఆవిరిని పోగుచేసికొనకుండుట మంచిది. ఆవిరిని బయటకు వదలుటను గూర్చి ఇక్కడ నిలబడి ప్రసంగించాను. మరియు ఈ వేదిక మీదనుండి నన్ను తరిమివేయవలెనని, ఈ వేదిక పిలుపునివ్వకుండా నన్ను దూరపరచవలెనని సాతాను తలంచినది. కాదు, ప్రభువా, నా హృదయములో ఏదో మండుచున్నది, ఈలాగు చెప్పుచున్నది, "ఇక్కడ కొందరున్నారు. బండ కొరకు వెంటాడుచున్న వారున్నారు." జయమును బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము తండ్రీ, ఆ చివరి వ్యక్తి వేదిక పైకి నడిచి వచ్చినప్పుడు లైట్లు వచ్చినవి. వాడు ఓడిపోతినని చూచుకొన్నాడు, గనుక వాడు యుద్ధమును వదిలి వేయవచ్చును.
ఇక్కడ ఈ రాత్రి ఆ కృపా సంఖ్య నిలబడియున్నది. అయిదు ప్రశస్త్ర ఆత్మలు. ఆయిదు; యేసు (J-E-S-U-S), విశ్వాసము ( F-A-I-T-H), కృప (G-R-A-C-E). కృప ఓ! దేవా, నీవే దేవుడవు. నీవెన్నడును తప్పిపోవు. నీ వెల్లప్పుడూ యధార్థవంతుడవు.
MATT 18:20
57ఆ ప్రక్కన నిలబడిన ఆమెను చూస్తున్నాను. ఇక్కడ సోదరి విల్సన్ కుమార్తెయున్నది. ఆ చిన్న బాలికను నేను గుర్తు౦చుకొన్నాను. నీవు ఆమెను పిలచుట నాకు గుర్తున్నది. ఎన్నో సంవత్సరాల క్రితము న్యూ మార్కెట్టు యొద్ద ఆ రాత్రిని నేను జ్ఞాపకముంచుకొనియున్నాను. ఆ రాత్రి అక్కడ ప్రభువా, నాకు గుర్తున్నది.
మాతో యాత్ర చేయుటకు న్యూయార్కు నుండి వచ్చిన ఒక స్త్రీ ఆమె ప్రక్కనే ఇచ్చట నిలబడియున్నది.
బయటనున్న ప్రపంచము అన్ని రకముల అనైతిక డాన్సులు మొదలగునవన్నియూ జరిగించుచున్న ఈ మలుపు దశలో ఒక యువకుడు ఒక యువతి ఇచ్చట నిలబడి యున్నారు. వారు నడిచారు, ఆ బండకొరకు వెదుకుచున్నారు.
వేదిక చివరన ఒక యువకుడు నిలబడియున్నాడు, అతని చేతులు ఎత్తబడి యున్నవి. అతడు ఆ బండను కనుగొనవలెనని కోరుచున్నాడు. యేసూ, ఆ బండ నీవే. నీవీలాగు చెప్పితివి; "ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడియుందురో వారి మధ్య నేను ఉందును." ఆ బండ ఇప్పుడు ఇక్కడే యున్నది.
58తండ్రి, అది చాలా వింతగా, చాలా సూక్ష్మముగా కనబడవచ్చును. మేము తప్పు చేయకుండునట్లుగా నీవు సంగతులను అంత సూక్ష్మీకరించియున్నావు. కాని వారు తమ చోటులో నుండి లేచి, ఆహ్వానమునుబట్టి వచ్చియున్నారు. ఎందుకనగా అది చేయకుండా సాతాను వారిని ఆపుటకు ప్రయత్నించుచున్నది, అది చేయకుండా అది సర్వ విధముల ప్రయత్నించి ఓడిపోయినది. ఇప్పుడు, నీ దాసునిగా, వారిపైన నేను చేతులుంచి, నీ దీవెనలను పలుకబోవుచున్నాను. దేవా, అవి వారిని వెంబడించు గాక! ఎందుకనగా వారు యధార్ధముతో, నిజాయితీతో ఆత్మయొక్క నడిపింపును వెంబడించుచున్నారు, నేనును అదే చేయుచున్నాను.
నా సోదరి యొక్క ఆత్మ ఎన్నడూ నశించకుండునట్లుగా ఇప్పుడు నేను అడుగుచున్నాను, నిత్యజీవము కొరకైన ఆమె హృదయవాంఛను ఆమెకు అనుగ్రహించుము. యేసు క్రీస్తు నామమున.
59నా సోదరి మీద నా చేతినుంచుచున్నాను. మరియు ఆమె పైన ఎన్నో శోధనలు నిలిచియున్నవని నేనెరుగుదును. ఆమె తన ప్రియకుమారుని కొరకు ప్రార్థించుచున్నదని నాకు తెలియును. ఆ తండ్రిని నేనెరుగుదును, ఈ రాత్రి అతడు ఆ చిన్న దశమ భాగమును ఇచ్చినప్పుడు బుగ్గల మీదుగా కన్నీరు కారుట నేనెరుగుదును. ఈ ఉదయమున మేము ప్రార్ధి౦చి, ప్రభువైన దేవునికి అప్పగించాము. ఈ తల్లి, తండ్రి ఆ బిడ్డను ప్రేమించుచున్నారు. ఒత్తిడిని, ఆవిరిని బయటకు విడుచు ఒక స్థలము కావలెనని వారు కోరుచున్నారు. అంతయూ సరియగునని వారికి తెలియును. తండ్రీ! మేము దానిని నీకు అప్పగించియున్నాము. దానిని నీవు దయచేయుము. మాకు భయము లేదు. ఇప్పుడే ఆమెకు ఆ నిశ్చయత దయచేయుము, తండ్రీ, యేసు నామమున ప్రార్ధి౦చుచున్నాను.
60తండ్రి, ఈ యువకుడు, యువతి కలిసి వచ్చిరి, కనుక వారిమీద నేను చేతులుంచుచున్నాను. వారు ఆవిరిని బయటకు వదలుటకు వచ్చిరి. ఇటువంటి యువ దంపతులు, అందమగు యవ్వనులు, సాతాను వాడుకొనుటకు వారికి ఎరలు వేయునని మాకు తెలియును. కాని వారు అగ్నిలోనుండి బయటకు వచ్చినవారివలె తప్పుకొన్నారు. ప్రభువా, వారు వచ్చారు, ఎందుకనగా వారు ఆ నివాసమును కోరుకొనిరి. ఆవిరిని, ఒత్తిడిని, విడిచిపెట్టు ఆ స్థలమునకు వారు వచ్చి, దేవుని యెదుట తమ్మును తాము నిమ్మళపరచుకొనవలెనని వారు కోరివచ్చిరి, ఆయనే దేవుడని వారెరిగిరి. తండ్రీ, ఇప్పుడే వారికి ఆ ధన్యమగు నిశ్చయతను దయచేయుమని నేను ప్రార్ధి౦చుచున్నాను. ఇప్పుడే ప్రతి పొరయు రాలిపోవునుగాక.
JOHN 6:37
61ప్రభువా, ఇక్కడయున్న యువకుడు తన చేతులు పైకెత్తియున్నాడు, ఆ బాగా చివరన ఉన్న వ్యక్తి అతడు వచ్చుటకు లేవగానే లైట్లు వచ్చినవి. నీవు కోరిన సంఖ్య అదే. అది నీ పిలుపు. "తండ్రి నాకనుగ్రహించినవారందరూ నా యొద్దకు వచ్చెదరు." మేము చేయవలసిన ఒకే ఒక పని అక్కడ వాక్యమును పట్టుకొనుటయే. జీవమునకు తండ్రి నిర్ణయించినవారు వెంబడించుదురు. ఇప్పుడు, అతడు వచ్చుచున్నాడు. ప్రభువా, ఆ బండ సందును వారు కనుగొనగోరుచున్నారు. కూర్చొని అక్కడ కొంతసేపు విశ్రాంతి పొందుటకు, దేవా, ఇప్పుడే అతనిని ఆ బండ సందుయొద్దకు నడిపించుము అని ప్రార్ధి౦చుచున్నాను.
JOHN 6:44
62ప్రతి సంకెళ్ళు విరువబడును గాక! వీరిని బాధించుచున్న ప్రతిదియు, ప్రతి అవరోధమును ఇప్పుడే వారియొద్దనుండి పడిపోవును గాక ఆ చిన్నదానిని, చిరు కోపమును, అదెంత చిన్నదయిననూ, చిన్న ఉద్రిక్తత, చిన్న బాధ, ఆ సందేహము, ఆ చిన్న చిక్కుబెట్టు పాపము, వీడునట్లుగావారి సోదరునిగా, నీ దాసునిగా, మృతులకును, సజీవులకును మధ్య నిలబడి ప్రభువా, నేను మధ్యవర్తిగా విజ్ఞాపన చేయుచున్నాను. దేవా, వారి ఆత్మలను విడిపించుచున్నాను. వేదిక పిలుపుకు వారు చూపిన విధేయతను బట్టి వారి జయమును ప్రకటించుచున్నాను. దానిని ఆపుటకు సాతాను ప్రయత్నించినదని మేమెరుగుదుము. కాని వారిని మేము విడిపించాము, నేను ఇప్పుడు నీ దాసునిగా, యేసు క్రీస్తునకు ఆయన జయ సూచకములుగా, కృపా చిహ్నములుగా వారిని ఇచ్చుచున్నాను, ఈ రాత్రి వారు పరిశుద్ధాత్మయొక్క సన్నిధియొక్క జయచిహ్నములు, క్లిష్ట పరిస్థితుల మధ్య పరిశుద్ధాత్మవారిని పిలిచి ఆ బండ యొద్దకు తీసికొని వచ్చెను. వారు ఇప్పుడు ఒత్తిడిని విడిచిపెట్టుదురు గాక, మరియు యేసు చెప్పినది ఎరుగుదురు గాక, "నేను పిలచు వరకు ఎవడును నా యొద్దకురాడు. నా యొద్దకు వచ్చు వారందరికి నేను నిత్యజీవమును అనుగ్రహించి, అంత్య దినమున లేపుదును." ప్రభువా, అది స్థిరపరచబడినది. యేసు క్రీస్తు నామము పేరట వారిని నీకు సమర్పించుచున్నాను. ఆమేన్!
63అక్కడ మీరు నిలబడియుండగా దేవుడు మిమ్మును దీవించు గాక! మీరు మీ చోటులకు తిరిగి వెళ్ళుచుండగా, మీరు ఆశించిన సమస్తము, మీ యొక్క ప్రతి చిక్కులబెట్టు పాపము, సమస్తము, ప్రతి తప్పు రక్తము క్రింద యున్నదని తెలిసికొనుడి. అది ముగించబడినది. అది మీరు నమ్ముదురా? మీరది విశ్వసించుచున్నారా? సోదరుడా, అది నీవు నమ్మొదవా? సోదరీ, అది నీవు నమ్మొదవా? మీరు నమ్ముదురా అది? అది జరుగును అని కాదు, జరిగిపోయినది. అది నిజము. అది భూతకాలము.
దేవుడు మిమ్ము దీవించును! జీవములోను, నిత్యజీవములోను అతి శ్రేష్టమగు దానిని మీరు ఇప్పుడు స్వతంత్రించుకొనియున్నారు. పాపము కంటె పైగామీరు ఎక్కిపోయి యున్నారు. పాపము మీ పాదము క్రింద యున్నది. ఇక్కడ నిలబడి మీకు ఏదయినా పొరపాటు నేను చెప్పినచో నాకేమి మేలు కలుగును? మార్గాంతమున నేను మోసగానిగా లెక్కించబడుదును. చూచారా? మీరు నిత్యజీవము పొందియున్నారు. ఎందుకనగా మీరు ప్రభువైన యేసు క్రీస్తునందు నమ్మికయుంచియున్నారు. ఇప్పుడు, ప్రతి పాపమును, ప్రతి సంకెళ్ళను ప్రక్కకు పెట్టి స్వేచ్చగా, ఆవిరిని విడిచిపెట్టి వెళ్ళండి. నీవు ఒక క్రైస్తవునివి. మీరు పాపమునకు పైగా లేపబడియున్నారు. మీ నిత్య రక్షణకు మీరు సంచకరువును పొందియున్నారు, ఎందుకనగా క్రీస్తు మిమ్మును చేర్చుకొనెను.
JOHN 6:44
64"నా తండ్రి ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. నా యొద్దకు వచ్చిన వారందరికీ నేను నిత్యజీవమును అనుగ్రహించి అంత్యదినమందు లేపెదను," అని ఆయన చెప్పలేదా? అయితే అది అయిపోయినది. ఆమేన్! అది ముగించబడినది. ఇప్పుడు దేవుడు మిమ్ము దీవించును గాక! మీకు దయచూపును గాక! అక్కడున్న మీరు, ఆయనను ప్రేమించుచున్నారా?
నేనాయనను ప్రేమించుదును, ప్రేమించుదును,
ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను;
మరియు నా రక్షణను కొనెను
కల్వరి మ్రాను మీద.
ఒత్తిడి అంతయూ పోయినట్లుగా ఎందరు భావించుచున్నారు?
నా ఆత్మను నేను విశ్రాంతిలో లంగరు వేశాను,
భీకర సాగరములలో ఇక నేను పయనించను
భీకర అగాధములో తుఫాను కొట్టుచున్ననూ,
కానీ యేసునందు నేను సదా క్షేమముగానుందును.
ROM 8:28
65మరియు చార్లెస్ వెస్లీ గాధ ఆలాగే యున్నది. ఒక రోజున అతడు సముద్రము ప్రక్కన ఆగెను. అతడు చదువుచుండెను. కొద్దిగా కలవరముతో నిండియుండెను. ప్రభువు అతనిని అక్కడికి నడిపించెను. మరియు అతడు అధ్యయనము చేయుచుండెను. ఓ! దేవుడు ఒక పాటతో అతనిమీద సంచరించుచుండెను. అతనికి ఏలాగు ప్రారంభించవలెనో తెలియుటలేదు. ఏదో మొదలుపెట్టవలెననుకొనెను. ఆత్మావేశము అతనిని విడచుచుండెను. కనుక అతడు సముద్రపుటోడ్డున నడుచుచుండెను, అలల శబ్దమును వినుచుండెను, మరియు అలలు గంతులు వేయుచుండగా తాను ఏదో ఒక ఆత్మావేశమును కనుగొందునని ఆలోచించుచుండెను. ఆకస్మాత్తుగా ఒక తుఫాను వచ్చెను. ఏదియు దానంతట అది జరుగదు. ప్రతిదియు దేవుని వలన నిర్ణయించబడును. ఏమి జరిగినను, ప్రతిదియు మేలు కొరకే సమకూడి జరుగుచున్నది.
ISA 2:10•
ISA 32:2
66మరియు అతడు తన చిన్న గది వైపు నడుచుచుండెను. ఆ సమయమున, గాలి వడిగా విసరుచుండెను. "ఓ! నేను అక్కడికి వెళ్ళకముందే ఈ దరిని కొట్టబడుదును." అని తలంచుకొని తన కోటును పీకి వేసి పరుగిడసాగెను. అతని భుజములోనికి ఏదో ఎగిరి వచ్చినది. అతడు వెనుదిరిగి చూచెను, అది ఒక చిన్న పిచ్చుక, ఆశ్రయము కోరి వచ్చినది. తుఫాను ముగియు వరకు తన భుజము మీదనే అతడు దానిని పట్టుకొనియుంచెను. సూర్యుడు బయటకు వచ్చు వరకును దానిని ఉంచెను. అతడు తన వ్రేలి మీద ఆ చిన్న పిచ్చుకను కూర్చొండబెట్టుకొని ఎగిరిపోనిచ్చెను. అది ఎగిరిపోయెను, అప్పుడు ఆత్మావేశము అతనికి కలిగినది:
యుగముల యొక్క బండ, నాకొరకు చీల్చబడినది.
నన్ను నీలో దాగుకొననిమ్మ;
ఓ! అది నాకు ఇష్టము. యుగములయొక్క బండ, అలసిన ఎడారిలోని ఆ బండ, తుఫాను కాలములో ఒక ఆశ్రయము. అలసిన భూమిలో ఆ బండ, నన్ను దాచును. నన్ను దాయుము, నా కొరకు చీల్చబడిన ఓ యుగముల బండా!
67ఈనాడు మనము ఆనందించుచున్న ఆ పాటలు, మొదలగు వానియొక్క గొప్ప ఆత్మావేశపు రచయితలు."ఆ పాటలు ఆత్మావేశముతో వ్రాయబడినవా?" అని మీరన వచ్చును. యేసు తాను భూమిమీద నున్నప్పుడు వారిని గూర్చి ప్రస్తావించెను. "కీర్తనలలో వ్రాయబడియుండలేదా? దావీదు కొన్ని కొన్ని విషయములను చెప్పెను." నిశ్చయంగా వారు ఆత్మావేశము పొందిరి. ప్రసంగించుట లేదా తక్కినవాటివలెనె, ఆత్మావేశులయిరి.
నాకు ఒక ఆశ్రయమున్నందుకు నేనెంతో ఆనందించుచున్నాను.
నాకు మరి ఏ ఆశ్రయము లేదు.
అవును, నా ఆశలు దేనిమీద నిర్మించుకోలేదు
యేసు రక్తము, ఆయన నీతి మీదనే తప్ప;
నా ఆత్మ చుట్టూన్నుది క్షీణించుచున్నపుడు,
ఆయనే నా నిరక్షణ, స్థానము
క్రీస్తు అను కదలని బండ మీద నేను నిలబడియున్నాను;
తక్కినదంతయూ కూలిపోపు ఇసుక నేలయే.
(అదేమయినా గాని మనకు అక్కరలేదు)
దేవుడు మిమ్మును దీవించును గాక, ఇప్పుడు మీ సంఘకాపరి, సహో, రడేల్. సాతాను ఆ లైట్లు ఆర్పినందుకు చింతించుచున్నాను, కాని ఏమయినా గాని దేవునికే జయము కలిగినది.